Telugu yogavashista hrudayam - anilvaranasi/indianlanguages GitHub Wiki
| యోగవాశిళ్ట హృదయము . . సదు, 0294 తృతీయ భాగనం - స్థితి ప్రుకకణనం న! గ్! వ ఈర ఈ న! 1 . | | సహజకవి మల్లెమాల 0! 1 ౫... మనసుపడిమక్కునతో సేకరించిన . | 1 స. ఈ పుస్తకాన్నిసాహిత్యాభిమానుల కోసం " . “గరా సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి 4, | . ఈ... ఆనందంతో బహూకరిస్తున్నాం న ర - మల్లెమాల కుటుంబం = 1 న! = షు శ క గ్ , కుప్పా వేంకట కృష్ణమూర్తి
క. రిలే త) ల్తలికే లాగ యోగవాశిష్ట హృదయము 01 (ప్రథమ ముద్రణ ; శ్రీగురుదేవుల జన్మదినోత్సవాలు మే, 2006 ప్రతులు క్ 2000 సర్వస్వామ్యములు వ (గ్రంథకర్తవి ముద్రణ(౨.13) వ 1-5చగాతి కార్యాలయము, 11-18-279, రోడ్డు.8 అలకాపురి, హైదరాబాదు-035 ఫోను నెం.040-24085018 గ2ల76 ; ఇగాగాం5ల/త66ే1.0102 తాగోణగ ; "తజ అంలలం621.018 ప్రింటింగు ; పట్టాఖి ఎంటర్ప్రైజెస్, మైసూరు ప్రచురణ ; రాగరాగిణీ ట్రస్టు, మైసూరు గి జన్మతరణానికి ఉపాయంగా న్ ఈ (గ్రంథాన్ని ముద్రించి స గురుదేవులు / శ్రీశ్రీశ్రీ గణవతి నచ్చిదానంద స్వామీజీవారి (/ పాదపద్మాలకు సమర్పిస్తున్నవారు లయ కమాయవిన్యాలాంద్ లేబరేటరీస్ (హైదరాబాదు) అధినేత డంయ గ్రంరాలయూ్నా న్నర్ష్యా। డిఆరోక వరు ౧45022. వారి సతీమణి | _ శ్రీమతి విజయ _ ల్ లం దంపతులకు “ ౨ -వీరీక్స వీరి కుటుంబానికి, శ్రీస్వామీజీ ఆశీస్సులు ఎల్లవేళలా వర్షించుగాక
టీ గ య హా.
అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు పరమపూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి నచ్చిదానంద స్వామీజీవారి అనుగ్రహ వచనములు
యోగవాశిష్టర్తుంధము ఆథ్యెల్సిడ రంగంలో చాలా ఐిషాయాలు తెలిసినవారికి 5మీ తెలియనికారిక్సి ఆ దంగంలో వ్రువేశించాలి అనుకునేకారిక్ కూడా, ఉతయోగవడే గ్రుంథం. ఆధభ్యెల్హిడతను గూర్చి తెలియడం వేదు. అనుభఐబంచడం వేదు. ప్రియ భక్తుడు కుప్పాకృర్ణకూర్రి సద్గుడు నన్నిభికల్ల అభ్యిత్ధిడ దసాన్ని కూడు ఐథిలా అనుభఐంచాడు. కనుకనే మీ స్వామీజీ ఆయనతో తకుకు, తకు భక్తులకు, సమస్త మానవాళికి కావలసిన ఐధంగా ఈ కుఠత్తదీ దుంధెనికి వికదీఐ ౧౫లో చెప్పించు కొంటున్నారు. వ్నో యా దుంధథంగా రొంంంచుకొన్నదు.. దినిని శుద్ధగా అధ్యయనం చే కుననం చేప్పి, దత్తకృథకు పొత్తులు కంఓ,
మీ స్వామీజీ 11.
మూడవ భఖాగానికి రచయిత మనవి గత నాలుగేళ్ళుగా జెమినీ టెలివిజన్‌లో వస్తున్న యోగవాశిష్ట 'ప్రవచానాలు, ఇప్పటివరకూ వెలుగు చూసిన యోగవాశిష్ట హృదయ ప్రధమ, ద్వితీయ భాగాలు, వాటి ఆంగ్లానువాదాలూ కూడా పాఠకులనుంచి విశేష ఆదరాన్ని చూరగొంటున్నై. సునిశితమైన తార్మిక ధోరణిలో జగమిథ్యాత్వాన్ని ప్రతిపాదించే ఈ [గ్రంధాన్ని ఆదరించేవారిలో ఎందరో ౫7. యువతీ యువకులు గూడా వుండటం, ఎంతో సంతోషకరం. ఇప్పుడు యోగవాశిస్టంలోని “స్థితి ప్రకరణం” ఈ (గ్రంధపు మూదవ భాగంగా మీ చేతుల్లో వుంది. నిజానికి స్థితిప్రకరణాన్నీ ఉపశమ 'ప్రకరణాన్నీ కలిపి ఒకే భాగంగా ప్రకటించాలని నేను భావించాను గాన్సీ, పారకమిత్రులు అంత ఆలస్యాన్ని సహించక, స్థితిప్రకరణ ప్రవచనం పూర్తయింది కనుక, దానిని ప్రకటించమని నిర్చంధించటం మూలానే, ఆకారంలో కొంచెం చిన్నదైనా సారంలో బలిష్టమైన ఈ తృతీయ భాగాన్ని వెంటనే ముద్రించటం జరిగింది. గత రెండు భాగాలను ఆంధ్రంలోనూ, ఆంగ్లంలోనూ గూడా ముద్రింప జేసిన వదాన్యులు డా॥ డి.ఆర్, రావు, శ్రీమతి విజయ దంపతులే ఈ భాగాన్ని గూడా ముద్రించి, శ్రీగురుదేవులు పరమపూజ్య శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీవారి 65వ జన్మదినోత్సవ కానుకగా, భక్తులకు సమర్పిస్తున్నారు. వారిక్తీ వారి కుటుంబానికీ పుత్రపౌత్ర పరంపరగా సద్దురు కృప చేదోడు వాదోదై వర్థిల్లుగాక, శాస్త్ర జన్యమైన వేదాంత పరిచయానికి జ్ఞానమనీ, ఆ జ్ఞానం అనుభవంలోకి వస్తే అప్పుడు దాని పేరు విజ్ఞానమనీ, కొందరు గ్రంథకర్తలు పేర్ళొన్నారు. భౌతిక విషయాల గురించిన సమాచారం విజ్ఞానమనీ, మోక్షప్రాప్తిని కలిగించే విద్యావిశేషాల పేరు జ్ఞానమనీ, మరికొందరు క”
(గ్రంథకర్తలు వివరించారు. ఇలా పరస్పరం తల్లకిందులుగా జ్ఞాన విజ్ఞాన శబ్బాలను వాడడం ఎందుకు జరిగిందంటే, నిజానికి జ్ఞానమే విజ్ఞానంగా పరిణమిస్తుంది. విజ్ఞానమే జ్ఞానంగా పరిణమిస్తుంది 3 పర్యవసానంలో- జ్ఞాన విజ్ఞానాలు ఏకీభూతాలౌతాయి. ఈ రహస్యాన్ని తెలిసిన గురుదేవులు శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీయొక్క అజ్ఞాబలం చేత “వేదాంగ విజ్ఞాన శోధన” (11560164 0₹50160050 269అూండ 00 66425 - 1-52) అనే సంస్థ నా ద్వారా స్థితిలోకి వచ్చి, భౌతిక విజ్ఞాన ముఖంగా పరతత్త్వ విజ్ఞానం వైపు పరుగులు తీయాలని ప్రయత్నం చేస్తోంది. ఆసక్తి కలవారికి ఈ విషయం తెలియాలనే ఉద్దేశ్యంతో ఆ సంస్థ వివరాలను కూడా ఈ పీఠిక పక్కన జత చేస్తున్నాను. ప్రథమభాగానికి నేను వ్రాసిన పీఠికను గూడా దీనిలో చేరుస్తున్నాను. దీనివల్ల పఠితలకు మూలగ్రంథం గురించి అవగాహన ఏర్పడుతుందని ఆశిస్తున్నాను. నేనూ ఈ ప్రవచనాలకు ఒక (శ్రోతనే! ఈ సంకలనానికి పఠితనే॥! లోపల వుండి పలికేవాడూ, కలంలో దూరి గిలికేవాడూ, ఎవడో ఉన్నాడు!!! వాడి కరుణను ఆత్మానుభూతిగా మాకందరికీ పంచమని గురుదేవులు శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీవారిని వేడుకొంటున్నాను. జయగురుదత్త మైసూరు ఇట్లు శ్రీగురుదేవుల జన్మదినోత్సవాలు తమ విధేయుడు మే - 2006 కుప్పా వేంకట కృష్ణమూర్తి ఇ7
మొదటిభాగానికి రచయిత మనవి
కవి తన హృదయాన్ని ఎందుకు దాచుకుంటాడు?
దొరికినవారికి అది మరింత మహోజ్జ్వలంగా ప్రకాశించేందుకోసమే దాచుకుంటాడు!
అందుకనే కవి తన హృదయాన్ని ఇనప పెట్టెలో దాచడు, పదాల పూరేకుల్లో దాస్తాడు!
తన హృదయం పఠితలకు అందాలి. కానీ, కొంత కృషి చేసినవారిక్తే అది అందాలి. ఇది మహాకవుల దృష్టి! వారి సృష్టిలోని అంతర్జ్భృష్టి!!
యోగవాశిష్టం విషయంలో నా కృషి చాలా స్వల్చ్పమే అయినా, శ్రీగణపతి సచ్చిదానంద గురుదేవుల కృపాబలం, వాల్మీకి మహాకవి హృదయాన్ని నాకు అనాయాసంగా తెరిచి చూపించిన అనుభూత్రి అడుగడుగునా వుంది. ఇది నా అదృష్టం. దీన్నినా సోదరులందరితోన్లూ కలసి పంచుకోవాలనే ఆశయంతోనే జెమినీ ౫.1” లో యోగవాశిష్ట ప్రవచనాలు జరుగుతున్నాయి.
“మధుమయ ఫణితీనాం మార్గదర్శీ మహర్షి” అన్నాడు క్రవిక్రుల గురువైన కాళిదాసు, వాల్మీకి మహాకవిని గురించి ప్రస్తావిస్తూ. క్ర వాక్యం అసలు రామాయణ విషయంలో కంటే, వాశిష్టరామాయణ విషయంలో మరింతగా అక్షర సత్యం.
శ్రీరాముడు లాంటి మహానాయకుడ్డి, రావణవధవంటి మహాకధన్సీ, ఎంచుకున్నప్పుడు, సామాన్య కవికైనా సరే, కవిత్వాన్ని పండించటం పెద కష్టం కాకపోవచ్చు. కానీ, సాక్షాత్తుగా శుష్మవేదాంతాన్ని విషయంగా తీసుక్షాని, దాని అతినిశితమైన శాస్ర్రచర్భలతో నింపి, 382 వేల శ్లోకాలకు సాగదీసి, అయినా కూడా దానిలో కావ్యత్వాన్ని కవితాత్మనూ, సజీవంగా నిలబెట్టగలగటం వాల్మీకి మహాకవికి ఒక్కడికే చెల్లింది. ఆయనతో ప్రోట్రీడి అలాంటి పని సాధించగల కవి మరొకడు ఇంతవరకూ పుట్టలేదు,
గ్గ
గురుదేవుల కృపతో ఈ గుర్తింపు కలగటంవల్ల, ఈ మహాగ్రంథంలో ఆ మహాకవి హృదయమేమిటని అన్వేషించాలని ఆరాట పడ్డాను. ఈ విషయంలో నన్ను నిజంగా “పదే పదే” ఆదుకొన్న మహానుభావుడు “పరమహంస శ్రీమదానంద బోధేంద్ర సరస్వతీ యతివరుడు. ఆయన రచించిన “తాత్పర్య ప్రకాశ వ్యాఖ్య నాలాంటి మరిగుజ్జును సాలప్రాంశువుగా మార్చి, యోగవాశిష్ట రసాల ఫలాలను చేతికందించింది. ఆ బలంతోనే యోగవాశిష్ట హృదయాన్ని అందుకొనే ప్రయత్నం నేను చెయ్యగలిగాను. ముందుగా ఈ యోగావాశిష్టమంటే యేమిటో పరితలకు పరిచయం చెయ్యటం సముచితం. ఈ రోజుల్లో పరిచయాలన్నీ “ఫార్మాటో రూపంలో వుండటం పరిపాటి కనుక, నేనూ అలాగే చేస్తాను. యోగవాళిష్ట వరిచయము: ్షు రచయిత - వాల్మీకి మహర్షి 2, రచన కాలం - రామాయణ రచన పూర్తి అయిన తరువాత కొద్ది కాలానికి తి. (గ్రంథానికి ఇతర పేర్లు - జ్ఞానవాశిస్టము, వాశిష్ట రామాయణము, ఉత్తర రామాయణము, మహారామాయణము, వాళిష్టము, వాసిష్టము మొదలైనవి. 4. _ (గ్రంథ వరిమాజణము - 32 వేల శ్లోకాలు.
(అసలు రామాయణం 24 వేల శ్లోకాలే) ర్. విషయం - పరమాత్మ తత్త్వ విచారణ, 12 సంవత్సరాల శ్రీరాముడికి విశ్వామిత్ర మహర్షి వశిష్ట మహర్షి చేసిన తత్త్వ బోధలు. సృాదయంలో తత్త విజ్ఞానం కలవాడు మరింత వ్యవహార దక్షుడు అవుతాడని నిరూపణ.
- రచనా శైలి, ప్రత్యేకతలు - ఎ) చెప్పదలచుకొన్న సిద్ధాంతాన్ని ముందు సంగ్రహంగా చెబుతారు. బి) _ అదే విషయాన్ని మళ్ళీ అందమైన కథ ద్వారా వివరిస్తారు. సి) _ ఈ కథలోని సంకేతాలను మళ్లీ గ్రంథ కర్తే వివరిస్తారు. స.
డి వ్ సిద్ద్ధాంతాన్నీ ఖండించడం వుండదు. అ) వాద ప్రతివాదాలు వుండవు. ఎఫ్) అనేక రకాల సందేహాలను లేవదీసి సమాధానాలు చెబుతారు. జి) విషయం శుష్మమైన వేదాంతం అయినప్పటికీ, రచనలో అడుగడుగునా కవితా సౌందర్యం ఉట్టిపడుతూనే వుంటుంది. హెచ్ అడుగడుగునా ఊహకందని ఉపమానాలంకారాలు విందులు చేస్తూ ఉంటాయి. " 7. _ నంగ్రవాలు - ఈ గ్రంథం చాలా విస్తారమైనది అవటంచేత ఉత్తర భారతంలోనూ, దక్షిణ భారతంలోనూకూడా, దీనికి కొన్ని సంగ్రహ (ప్రతులు ఏర్చడ్డాయి. వీటిలో (ప్రసిద్ధమైనవి. ఏ) కాళ్ళీర దేశీయుడు అభినందన పండితుడి సం(గ్రహం,. ఇది ఆరు వేల శ్లోకాలు. బి కాళహస్తి శుక (బ్రహ్మ అఆ(శ్రమ అధిపతి శ్రీవిద్యాప్రకాశానందగిరి స్వామివారి సంగ్రహం. దీని పేరు వశిష్ట గీత. సుమారు 8వేల శ్లోకాలు 8. అనువాదములు - అన్ని జాతీయ భాషలలోనూ దీనికి అనువాదాలున్నాయి. తెలుగులో 5 వచనానువాదాలను, ఒక పద్యానువాదాన్ని, నేను చూశాను. వీరందరికీ నా కృతజ్ఞతలు. 8. _ పెద్దల అభిప్రాయాలు - ప్రాచీనులు మాత్రమే గాక నవీన సద్గురువులు కూడా ఈ గ్రంథాన్ని విశేషంగా అభిమానించారు. ఉదాహరణకు ఎ) శ్రీస్వామి రామతీర్థ ఇది ప్రంపంచంలోని ఆధ్యాత్మిక (గ్రంథాలన్నిటిలోకీ "40367/006లగు11"” అన్నారు. బి) ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతులు శ్రీమళయాల స్వామివారు ఈ గ్రంథాన్ని విశేషంగా ఆదరించారు. సి, శ్రీ గాయత్రీ పీఠాధిపతులు తత్త ప్రతిపాదక గ్రంథములలో ఇది మొదటిది అన్నారు. సక!
- (గంథంలోని వ్రకరణూలు - ఇవి ఆరు.
క్ష వైరాగ్య ప్రకరణము (1,500 శ్లోకాలు)
-
_ ముముక్షు వ్యవహార ప్రకరణము (1,000 శ్లోకాలు)
-
ఉత్పత్తి ప్రకరణము (7,000 శ్లోకాలు)
త్స స్థితి ప్రకరణము (3,000 శ్లోకాలు)
ర్. ఉపశమ ప్రకరణము (5,000 శ్లోకాలు)
- నిర్వాణ ప్రకరణము (14,500 శ్లోకాలు)
వైరాగ్య ప్రకరణంలో శ్రీరాముడికి కలిగిన వైరాగ్య ప్రకరాన్ని వివరంగా వర్ణించారు.
రెండవదైన ముముక్షు వ్యవహార ప్రకరణంలో -ముముక్షువుకు వుండవలసిన సాధనా సంపత్తిని గూర్చి విస్తారంగా చర్చించారు. దీనిలోనే మోక్షం కోసమై పురుష ప్రయత్నం చేయ్యాలా? అకల్లేదా అని విచారణ చేసి, పురుషప్రయత్నం చెయ్యాలి - అని సిద్ధాంతం చేశారు.
ఉత్పత్తి ప్రకరణంలో - కనిపించే ఈ ప్రపంచానికి ఉత్పత్తి వున్నదా? లేదా? అనే విచారణ చేశారు.
స్థితి ప్రకరణంలో జగత్తుయొక్క స్థితిని వివరించారు.
ఉపశమ ప్రకరణంలో జ్ఞానం ద్వారా ప్రపంచోపశమనం కలిగించే విధానాలను వివరించారు.
చిట్ట చివరిది, నిర్వాణ ప్రకరణం. ఇది చాలా పెద్దది. దీనిని రెండు భాగాలుగా విభజించారు. నిర్వాణం అంటే మోక్షం. మోక్ష ప్రాప్తిని గూర్చి దీనిలో కూలంకషంగా చర్చించారు. 11. _ వ్యాఖ్యానాలు - దీనికి సంస్కృతంలో అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయని ప్రసిద్ధి ఉన్నప్పటికీ, ఆనందబోధేంద్ర సరస్వతీ యతి రచించిన తాత్పర్య ప్రకాశికా వ్యాఖ్యానం మాత్రమే ముద్రితమై లభిస్తోంది. దీనిని 1987లో నిర్ణయ సాగర్ ్రెస్వారు ముద్రించారు. ఈ వ్యాఖ్యానం బహు విపులమై పండిత ప్రశంసలు అందుకొంది.
నెర
ఈ వాల్మీకి ఎవరు?;
యోగవాశిష్ట రచయిత అయిన వాల్మీకీ, సుప్రసిద్ధ రామాయణ రచయిత అయిన వాల్మీకీ, ఒకరు కాదని కొందరు ఉత్సాహంగా వాదిస్తున్నారు. అలా వాదించే వారిలో రెండు రకాలవారున్నారు.
అద్వైత సిద్ధాంతాన్ని అతి స్పష్టంగా (ప్రతిపాదించే ప్రాచీనతర (గ్రంధాలలో యీ యోగవాశిష్టం చాలా ప్రబలమైనది. అందువల్ల అద్వైత సిద్ధాంత వ్యతిరేకులు కొందరు దీని (ప్రామాణ్య బలాన్ని తగ్గించేందుకోసం ఇది వాల్మీకి రచన కాదని ఆరాటంతో పోరాటానికి దిగుతూ వుంటారు. వీరు ఒక రకం,
ఇక రెండవ రకంవారు - “ఆధునిక విమర్శ దృష్టితో గ్రంథాలను పరిశీలించాలే గానీ, సాంప్రదాయక దృష్టితో కాదు”- అని భావించేవారు. మొదటి రకం వారుగూడా, అటుతిరిగి, ఇటుతిరిగి, యీ రెండవ రకం వారి అండకే చేరుతూ వుంటారు కనుక, వీరి వాదన యేమిటో కొంచెం పరిశీలిద్దాం. ఈ వాదనలో ముఖ్యమైన అంశాలు రెందే.
తెలి విషయంలో మామూలు రామాయణానికీ, యోగవాశిష్టానికీ, పెద్ద భేదాన్ని ఎవరూ ఆపాదించలేరు. విమర్శకు లెవరూ ఆ విషయంలో పెద్దగా వాదాలు చెయ్యటం లేదు. కానీ, *“ఈ యోగ వాశిష్టం గురించిన ప్రసక్తి అసలు రామాయణంలో నామ మాత్రంగా గూడా లేదు కదా! ఎందుకు లేదు?” -అని నవీన విమర్శకులు 'ప్రశ్చిస్తున్నారు. దీనికి విపులమైన సమాధానం అసలు గ్రంథంలోనే 2,3,4 పుటలలో వుంది. దయచేసి పరిశీలించండి.
ఇక రెండవ ముఖ్యాంశం! “ఈ గ్రంధంలో అనేకచోట్ల వ్యాసుడి ప్రసక్తి, శుకుడి ప్రసక్తి, భగవద్గీత, అర్జునుడు, కృష్ణుల, ప్రసక్తి విస్పష్టంగా వున్నాయి కదా! వీటిని బట్టి యీ గ్రంథం భగవద్దీతానంతర రచన అని ఖాయం కావటం లేదా?” అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇందులో వ్యాస శుకుల ప్రసక్తి గురించి, ప్రశ్న సమాధాన రూపమైన చర్చ మూలగ్రంథంలోనే వుంది. దీన్ని శ్రీరామ వశిష్టుల చర్చగా వాల్మికి మహర్షి నిర్వహించాడు. ఈ ప్రస్తుత గ్రంథంలో 58,108 పేజీలలో పరిశీలించండి.
ఏ1
ఇక భగవద్గీత ప్రసక్తి గురించి ఆలోచించేముందు, ఒక ముఖ్య విషయాన్ని పారకుల దృష్టికి తీసుకు రావలసి వుంది.
ఇది భగవర్గీతానంతర రచన అని గదా, మనం ఆలోచిస్తున్నాం! అంటే, భగవద్గీతానంతర కాలంలో ఎవడో ఒక కవి వాల్మీకి శైలిని ఎంతో కొంత అభ్యాసం చేసి, ఆ శైలిలో అద్వైత ప్రతిపాదన చేసే గ్రంధాన్ని వ్రాసి, దానికి విలువ పెరిగేందుకోసం వాల్మీకి మహాకవి పేరున ఆ గ్రంధాన్ని ప్రచారంలోకి తెచ్చాడు - అని గదా మన ఆలోచన!
అలా తన గ్రంధానికి వాల్నీకి పేరు పెట్టిన కవి పేరు గూడా వాల్ళీకే అయి వుండవచ్చు; కాకపోనూవచ్చు. పేరేదైనా, ఆయన వేదాంత శాస్త్రంలో గట్టి పండితుడు. చెయ్యి తిరిగిన మహాకవి, 32వేల శ్లోకాల గ్రంథాన్ని అందంగా పూర్వాపర విరోధం లేకుండా, నిర్వహించగల సమర్శడు. యుక్తి యుక్తంగా విషయ ప్రతిపాదన చెయ్యగల తార్మికుడు! ఇలాంటి వ్యక్తి ఒక (గ్రంధం రచించి, దాన్ని వాల్మీకి కృతంగా లోకానికి అందించాలని సంకల్పించాడు. అలాంటివాడు లోకులకు అనుమానం కలిగే ఘట్టాలను తన గ్రంధంలో చేరుస్తాడా? “ఆయనకు అంత ఆలోచన వచ్చి వుండదు” అనుకుందామంటే, ఆ వ్యక్తియొక్కసామర్థ్యం ఎటువంటిదో ఇపుడే చెప్పుకున్నాం కదా! అంతటి సమర్థుడు, తెలిసి తెలిసీ, ఇలాంటి లొసుగు పనులు చేస్తాడా? అది అసంభవం. కనుక భగవద్ద్గీతానంతరం కవులలో ఎవడో ఒకడు ఇలాంటి పని చేశాడని ఊహించటం మన తెలివి తక్కువ తనమే అవుతుంది.
“ఐతే, రామాయణ వాళ్ళీకే యీ యోగవాశిష్టాన్ని రచించివుంటే, ఎప్పుడో ఒక యుగం తరువాత, ద్వాపరయుగాంతంలో రాబోయే భగవద్గీత ప్రసక్తిని యీ [గ్రంథంలోకి ఎందుకు తెస్తాడు? ఎలా తెస్తాడు?” అంటారా? వాల్మీకీ న్వభావం;
వాల్మీకి మహాకవి న్వభావంలోనే అలాంటి గుణం వుంది. ఎలాగంటారా? చూడండి.
పూర్వరామాయణంలో వాల్మీకి మహాకవి తన కావ్యావతరణ ఘట్టాన్ని స్పష్టంగా వర్ణించాడు. దైవయోగంగా ఆయన నోటి వెంట కవితాధార మొదలైంది. ఈ కవిత్వంతో ఏం చేయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా,
న!
నారద మహర్షివచ్చి అప్పటికి రాజ్యపాలన చేస్తూ వున్న శ్రీరామచంద్ర ప్రభువును గురించి పరిచయం చేసి, “ఇక మిగిలిన కథా వివరాలన్నీ నీ దివ్య దృష్టితో నువ్వే దర్శించి, ఒక మహాకావ్యం రచించు" అని ప్రోత్సహించి వెళ్ళిపోయాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడి ప్రోత్సాహం కూడా తోడైంది. దాంతో ఉద్దీపన పొందిన వాల్మీకి మహర్షి తన దివ్య దృష్టితో రామకథలోని ప్రతి అంశాన్నీ పరిశీలించి చూశాడు. ఆ వరుసలో వరుసగా, భవిష్యత్ ఘట్టాలను కూడా ఆయన దర్శించాడు. తను దర్శించింది దర్శించినట్లే కావ్యంగా వ్రాశాడు. అదే శ్రీమద్రామాయణ మవాోకావ్యం. అందుకే ఆ కావ్యంలోని మొట్టమొదటి సర్గలోనే, వాల్మీకి మహాకవి కొంతవరకూ భూతకాల క్రియా పదాలను ప్రయోగించి, ఆ పైన వర్తమానకాల క్రియా పదాలను, ఆ పైన భవిష్యత్ కాల క్రియా పదాలను, ప్రయోగించాడు. చూడండి. నంది గ్రామే జటా హెత్వా భ్రాత్చభిస్సహితోద నఘః రామస్పీతా మనుప్రాప్య రాజ్యం పునరవాస్తవాన్ || (బాలకాండ 1వ సర్గ 89వ శ్లోకము) (తా॥ రాముడు తమ్ములతో గూడిన వాడై, నందిగ్రామ ముందు జడలను విడిచి, సీతను చెంతకు దీసికొని, మరల రాజ్యమును పొందెను.) దీనిలో “అవాప్తవాన్” (= పొందెను) అనే భూతకాల క్రియ వుంది. న చాగ్నిజం భయం కించి న్నాప్సు మజ్జన్తి జన్తవః (బాలకాండ 1వ సర్గ 92వ శ్లోకము) (తా॥రాముడు రాజ్యం చేస్తూ వుండగా ప్రజలకు అగ్ని భయం లేదు. ఎవరూ నీళ్ళల్లో మునిగి మరణించటం లేదు.) ఇక్కడ “న” మజ్జన్తి (ఆ మునగటం లేదు) అని వర్తమాన కాల క్రియా పదం వుంది. రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిప్యతి రాఘనః (బాలకాండ 1వ సర్గ 96వ శ్లోకము) (తా॥ శ్రీరాముడు వందలకొలదీ రాజవంశాలను స్థాపించగలడు.) ఇక్కడ “స్థాపయిష్యతి” (= స్థాపించగలడు.) అని భవిష్యత్ కాల క్రియా పదం వుంది. క!
ఇలా తన దివ్య దృష్టితో చూసిన ప్రకారంగా, భూతకాల కథను భూతకాలంగానూ, వర్తమానకాల కధను వర్తమాన కాలంగానూ, భవిష్యత్కాల కథను భవిష్యత్ కాలంగానూ, యథాతధంగా ప్రతిపాదించే అలవాటు వాల్మీకి మహర్షికి స్వతస్సిద్ధంగానే వుందనే విషయం పూర్వ రామాయణంలోనే మనకు తెలుస్తోంది.
రామాయణంలోనే ఉత్తర కాండలో మరో ఘట్టం వుంది. సీతాదేవి భూప్రవేశం చేసినాక, శ్రీరాముడు దుఃఖంతోనూ, క్రోధంతోనూ, ఉడికిపోగా, బ్రహ్మదేవుడు స్వయంగా (ప్రత్యక్షమై, ఆయన్ని ఓదారుస్తూ ఇలా అన్నాడు-
ఏతదేవ హి కావ్యం తే కావ్యానా ముత్తమం శ్రుతమ్ః
భవిష్యదుత్తరం చైవ సర్వం వాన్మీకినా కృతమ్:
శేషం భవిష్యం కాకుత్స్థ కావ్యం రామాయణం త్రుణు!
న ఖల్వన్యేన కాకుత్స్థ కాన్యం శ్రోతవ్యమిదముత్తమమ్ః
(బాలకాండ 98వ సర్ద, 16నుంచి 22దాకా శ్లోకాలు)
(తా॥ రామా! నీ గురించి రాసిన ఈ కావ్యాన్ని నువ్వు విన్నావు. ఇది చాలా గొప్పది. దీనిలో వాల్నీకి భవిష్యత్ కధ కూడా చెప్పాడు. ఆ భాగాన్ని పూర్వమే నేను విన్నాను. రామా! నువ్వు ఇప్పుడు ఆ రామాయణంలో మిగిలిన భవిష్యత్ భాగాన్ని విను. ఇది నువ్వు తప్ప ఇతరులు వినరాదు.)
(బ్రహ్మదేవుడు ఇలా ఆజ్ఞావించగా , శ్రీరాముడు కొద్దిమంది బ్రహ్మర్నులతో కలిసి, తన భవిష్యత్ కధను విన్నాడు - అని అక్కడ వుంది, ఈ ఘట్టం కూడా వాల్మీకియొక్క భవిష్యత్ కధారచన శీలాన్ని వ్యక్తం చేస్తోంది.
వాల్మీకి మహర్షి మహాకవికి ఇలాంటి స్వభావం వుంది కనుకనే, యోగవాశిష్టంలో కూడా కొన్ని సందర్భాలలో ఆతి ప్రాచీన పూర్వగాథలను, మరికొన్ని సందర్భాలలో సుదూర భవిష్యత్ కథలను కూడా, ఆయన పొందుపరచటం జరిగింది. అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు పఠితలకు సందేహాలు వస్తాయని ఆయనకు ముందే తెలుసు. అందుకే, ఆయా
ఎల!
సందర్భాలలో శ్రీరాముడిచేతనే ప్రశ్నింప చేసి, ఇది ఎప్పటి కధో , ఇది ఇక్కడ ఎలా అతుకుతుందో తనే వివరించాడు. వ్యాసమహర్షి ఘట్టం వచ్చినప్పుడు అలాగే చేశాడు. ఈ ఘట్టం ఈ భాగంలోనే 108వ పేజీలలో వుంది. భగవర్గీతాఘట్టం వచ్చినప్పుడు కూడా ఆ కవి దాన్ని అలాగే వివరించాడు. ఆ ఘట్టం నిర్వాణ ప్రకారణంలో రాబోతోంది. అందువల్ల ఈ భాగంలో లేదు.
ఇలా భవిష్యత్ ఘట్టాలను, సుదూర భూతకాల ఘట్టాలను, ప్రస్తావించే పద్ధతి మహర్షులైన ఇతర కవుల రచనలలో కూడా కనిపిస్తూనే వుంటుంది. బుషుల రచనాశైలితో బాగా పరిచయం వున్నవారికి ఇది కొత్తగా వుండదు. అగస్త్య సంహితలో పుట్టబోయే రాముడ్డి గురించి అగస్త్యమహర్షి సుతీక్ష్ణమహర్షికి వివరించాడు. ఈ విషయం ఈ (గగ్రంథంలోనే 17,18 పేజీలలో ప్రస్తావనకు వచ్చింది. వ్యాస భగవానుడి రచనలలో పురాణమని ప్రత్యేకంగా ఒక పురాణమే వుంది.
లోకంలో ఈనాడు మనకు తెలిసివున్న కవులంతా సాంసారిక కవులే. ఆర్ష వాంజ్మయాన్ని బాగా వంటపట్టిచ్చుకోవటం ద్వారా, వారిలో బుషిత్వ రేఖ తాత్కాలికంగా ప్రవేశించి, మహాక్రావ్యాలు ఉద్భవిస్తూ వుంటాయి. వాల్మీకి వ్యాసాదులు స్వతస్సిద్ధంగా మహర్షులు. కవిత్వం వారిని తాత్కాలికంగా ఆవేశించగా, వారిలోంచీ విశ్వజనీన, విశ్వకాలీన, మహో కావ్యాలు ఆవిష్ఫతములవుతూ వుంటాయి! మామూలు కవులను కొలిచే కొలబద్ధలతో బుషి కవులను కొలవాలనుకోవటం, మూరలతో పిమాలయాన్ని కొలవాలనుకోవటమే కాగలదు.
కనుక ఈ విధమైన, ఆర్నశైలీ పరిచయ సంపన్నమైన, విమర్శన దృష్టితో పరిశీలించి చూసినప్పుడు, ఈ యోగవాశిష్టం రామాయణ కర్తయైన వాల్మీకి రచించినదే అనటంలో సందేపహించవలసిన పని వుండదు. ఆర్షశైలితో పరిచయం వుండి కూడా, అద్వైత సిద్ధాంతం మీద వ్యతిరేకతతో దీన్ని అవాల్ళీకి కృతంగా నిరూపించాలనే పట్టుదలతో వున్న వారికి మౌనంగా నమస్కరించటమే ఉత్తమం.
7
వృాదయము;
ఇంతకూ చెప్పవచ్చిందేమిటంటే, ఈ గ్రంథ రచయిత వాల్మీకి ఈయన మహాకవి. అంతకుమించి మహర్షి బుషి అంటే తత్వాన్ని దర్శించేవాడు. కవి అంటే కాంతా సంమితంగా పలికేవాడు. ఈ రెండు లక్షణాలూ వాల్ళీకిలో కలిసి వున్నాయి కనుకనే, పైకి మామూలుగా కనిపిస్తూనే లోపల అంతులేని రత్నాలను దాచి వుంచగల వాక్యశైలి ఆయనకు నంటబట్టింది. రామాయణంలో అడుగడుగునా ఆ లక్షణం వుంది. గోవిందరాజ వ్యాఖ్యానమే లేకపోతే, ఇక్కడ శ్లేష వుంది. ఇక్కడ అర్భాంతరం వుంది, ఇక్కడ అంతరార్థం వుంది, అని మనం కలలో కూడా ఊహించం. ఆ మహాకవే ఈ యోగవాళిప్వాన్ని రచించాడు. కనుక, ఇక్కడ గూడా ఆ లక్షణమే వుంటుంది. ఆ నిగూఢ కవి హృదయాన్ని వట్టుకుంటేనే ఆయన దర్శించిన తత్త్వాన్ని మనం అందుకోగలుగుతాం.
ఈ దృష్టితోనే ఈ (గ్రంధాన్ని, దీని వ్యాఖ్యానాన్నీ కూడా, నేను అధ్యయనం చేశాను. పెద్దలనడిగాను. గురుదేవులను ్రార్ధించాను. పూర్వాశమంలో మాకు పితృపాదులు, 'ప్రస్తుతాశ్రమంలో బ్రహ్మవిద్యా గురుదేవులు అయిన ప్రాస్స్మరణీయులు శ్రీశ్రీశ్రీ జనార్జనానంద నరన్వతీ యతీం(ద్రుల బోధలను అనుసంధానం చేసుకొన్నాను. నేను గ్రహించగలిగినది జెమిని టెలివిజన్ వారి ప్రాతఃకాల ప్రవచనాల్లో ప్రజలకు విన్నవించాను. దానినే ఇప్పుడు ఈ [గ్రంథంగా మీ ముందు వుంచుతున్నాను. అందుకే దీని పేరు “యోగవాశిష్ట హృదయము.” వాశిష్టమా? వాసివ్ళమా? :
ఈ [గ్రంథంలో వశిష్ట వాశిష్ట పదాలు వచ్చినప్పుడు నేను “మెలిక శొని (శివలోని “శి”ని) వాడాను. కొందరు గ్రంథకర్తలిక్కడ దంత్య *స కారం” (సీతలోని సకారం) వాడారు. రెండూ ఒప్పే, రండూ ఒకటే. శబ్ద కల్పద్రుమంలో ఈ రెండు శబ్దాల వ్యుత్పత్తినీ విస్పష్టంగా ప్రదర్శించారు. అక్కడ ఇలా వుంది -
వపశవతాం - వశినాం శ్రేస్టః ఇత్యర్థే ఇష్టన్ప్రత్యయః - విన్మతోర్లుక్ ఇతి లుక్ - వట”
ఆ శబ్ద కల్పద్రుమంలోనే, మహాభారత శ్లోకం వొకటి ఉదహరించారు-
వశిష్టత్వాచ్చ వాసాచ్చ వసిష్ట ఇతి విద్ధి మామ్,
ఇది 13వ పర్వ- 63వ అధ్యాయం - 96వ శ్లోకం -అని అక్కడే చేప్పారు. ఇంద్రియనిగ్రహం గలవాళ్లలో శ్రేష్టుడు గనుక వశిష్టుడనీ, గృహస్టులలో (శ్రేష్టుడు గనుక వసిష్టుడనీ, రెండూ నా పేళ్లే - అని ఈ శ్లోకంలో వశిష్టుడే స్వయంగా చెపుతున్నాడు. కనుక ఆ రెండు పేర్లల్లో దేన్ని వాడుకున్నా తప్పులేదు. వేదాంత విద్యలో ఇంద్రియ జయం (ప్రధానం కదా అని, నేను వశిష్ట పదాన్ని (మెలిక శ వున్న పదాన్ని ఎక్కువగా అభిమానించాను. కృతజ్ఞతలు వ
గురదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారి ఆజ్ఞనన్నీ అధ్యయనానికీ, ప్రవచనానికీ, పురిగొలిపింది. తద్వారా ఇతరుల మాట ఎట్లా వున్నా నా మటుకు నాకు తత్త్వ పరమైన అవగాహనను దృఢతరం చేసింది వారి ఆజ్ఞవల్లే ఇపుడీ గ్రంథాన్ని అవధూత దత్తపీఠంలోని రాగరాగిణీ టస్టు ప్రచురిస్తోంది. శ్రీగురుదేవులకు కృతజ్ఞతలనటం పై పై మాట. వందన సహస్రాలు అనటం తక్కువ మాట, వారి మేలు మరువలేననటం పొల్లుమాట. ఇంకేమనాలో నాకు తోచటం లేదు. మాటలు మాని ఈ (గ్రంధాన్ని శ్రీగురుదేవులకు అంకితం చేస్తున్నాను.
ఇంకా సరీగా తెల్లవారక ముందే జెమినీ టెలివిజన్ లో జరిగే ఈ (ప్రవచనాలను ఎక్కువమంది వింటారని మొదట్లో నేను అనుకోలేదు. కానీ, క్రమంగా జెమినీ టెలివిజన్ వారికి అందుతున్న ఉత్తరాల శర పరంపరను బట్టి, నన్ను పలకరిస్తున్న కొత్తముఖాలను బట్టి, కొన్ని లక్షల మంది విద్యావంతులు ఎంతో (ద్ధగా, నిశితంగా, వాటిని వింటున్నారని తెలిసి ఆశ్యర్యపోయాను. కఠినమైన తత్త్వ ప్రవచనాలను ఎవరూ వినరనే తేలిక మాటను హృదయంలోంచి తొలగించుకున్నాను. ఈ రోజుల్లో ప్రజల మేధాశక్తి విస్తరిస్తోందని, విశ్లేషణాత్మకమైన విషయాలను ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో సమన్వయించి, పక్షపాతం లేని యుక్తితో అందిస్తే, వారు ప్రీతి పూర్వకంగా స్వీకరిస్తారని తెలుసుకున్నాను.
గగ
అలాంటి శ్రోతలలో హైదరాబాదు భక్తులు, న్యూలాండ్ లేబరేటరీస్ అధినేత, డొ॥। డి.ఆరొరావుగారు, వారి నతీమణి శ్రీమతి విజయగారు, ఒక రోజున నా దగ్గరకు వచ్చి, ఈ ప్రవచనాలను వింటున్నామనీ, వీటిని పుస్తక రూపంలోకి తీసుకురమ్మనీ, ఆ ముద్రణ వ్యయాన్ని తామే స్వీకరిస్తామనీ, చెప్పినప్పుడు నేను చకితుడ్డయ్యాను. వారితో అదే కొత్త పరిచయం. అయినా వారి ప్రోత్సాహంవల్ల నేను తయారు చేసుకొని వున్న నోట్సులను ఈ (గ్రంథ రూవంగా తీనుకు రాగలుగుతున్నాను. ఆ దంవతులకు నా కృతజ్ఞతలందిస్తున్నాను. శ్రీ గురుదేవుల కృప వారిపైనా, వారి కుటుంబం సైనా, సదా వర్షిస్తూ వుండాలని ఆది గురుమూర్తి శ్రీ దత్తదేవులను ప్రార్ధిస్తున్నాను.
ఈ ప్రవచనాల ద్వారా యోగవాశిష్టాన్ని అశేషజనానీకానికి అందిస్తూ వున్న, జెమినీ టెలివిజన్ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ (ప్రవచనాల రూప కల్పనలోనూ, ఈ [గ్రంధ సంవిధానంలోనూ, పైకి కనిపించని మరో అద్భశ్యహస్తం హైదరాబాదు భక్తులు శ్రీ ఎ. రాజారావుగారిది. ఆయనకు కృతజ్ఞతలు చెపితే నాకు నేనే చెప్పుకున్నట్లవుతుంది.
యోగవాశిష్టంలోని 6 ప్రకరణాలలోనూ, మొదటి రెండు ప్రకరణాలు “యోగవాశిష్ట హృదయ ప్రథమ భాగంగా” ఇప్పుడు మీ చేతులలో వున్నాయి. శ్రీగురుదేవుల కృపతో మిగిలిన భాగాలు క్రమంగా మీ ముందుకు వస్తాయని ఆశిస్తున్నాను. విషయ ప్రతిపాదనలో, సర్గల సంపుటీకరణంలో, ఆధునిక విజ్ఞాన సమన్వయంలో, కొన్ని కొత్త దారులు తొక్కాలని ప్రయత్నించాను. ఈ విషయంలో నేనెంతవరకు కృతకృత్యుడినో విజ్ఞులైన పఠితలే నిర్ణయించాలి. ఎక్కడైనా దోషాలు కనిపిస్తే దయచేసి తెలుపండి. ఉత్తరోత్తరా వాటిని సవరించుకుంటాను. అయితే, ఈ గ్రంథాన్ని మూల గ్రంథానికి అనువాదంగా గానీ, సంగ్రహీకరణంగా గానీ, దయచేసి దర్శించకండి. కవి హృదయాన్ని అందుకునే ప్రయత్నంగా మాత్రమే దర్శించండి-అని మరోసారి మనవి చేస్తూ-
జయగురుదత్త మైసూరు ఇట్లు వృష శివరాత్రి తమ విధేయుడు 12-8-2002 కుప్పా వేంకట కృష్ణమూర్తి 2
శకుప్పా వేంకట కష్ణమూర్తిగారి సారథ్యంలో వేదాంగ విజ్ఞాన శోధన 15209
ఆధారము: విజ్ఞానాన్వేషణలో ఈనాటి మనిషి ఆధునాతన విజ్ఞాన శాఖలతో పాటు, అనాది మానవ సంపదలైన వేదాల వంక గూడా దృష్టి సారిస్తున్నాడు. అలనాటి భారతీయ సంస్కృతిలో ఆశ్చర్యకరమైన విజ్ఞాన శాఖలు విలసిల్లిన దాఖలాలు కనిపిస్తున్నాయి. కాని, వాటికోసం పరిశీలిస్తుంటే, ఆశించినంత ఫలితాలు చేతికి అందడంలేదు. అందుకు ఏకైక కారణం, మనకు అలనాటి సంస్కృత భాషలోని సాంకేతిక పారిభాషిక భాష తెలియక పోవటమే! సరిగ్గా ఈ కారణం వల్లనే సంస్కృత భాషలో వున్న ఎన్నో పురాతన విజ్ఞానశాస్త్ర ర్ధంథాలు ఈ నాటీ మన సంస్కృత విద్వాంసులకు సమగ్రంగా అర్ధం కావటం
దు. ఒక ఇంగ్లీషు ప్రాఫెసరుకు కెమిర్టీ పుస్తకం ఇచ్చి అర్లం చెప్పమన్నట్లుగా వుంది మన సట్ ప్ర లనిం ఇచ్చి అరం చెప్బవన్న (యేరణ: వేదాలు విశ్వాసాల వుట్టలు - అనేది కొందరి వాదం. వైజ్ఞానికాంశాలు అధునాతన విధానంలో నిరూపితాలయ్యాక, ఇవి వేదంలోనే వున్నాయనటం కొందరి నినాదం. నోబుల్ పురన్మార గ్రహీత “ప్రోడింగర్” మాత్రం తన సిద్ధాంతాలకు వేదాలలోని ఉపనిషత్తులే ్రేరణలని ప్రకటించి, ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచాడు. వృక్షాలు కూడా జీవులే అని నిరూపించిన వైజ్ఞానికుడు శ్రీ జగదీశ చంద్రబోసుకు కూడా వేదాలే ్రేరకాలు కావడం గమనార్హం. శివతాండవ వర్ణనలవల్ల స్ఫూర్తిపొంది. అణుఖండాల చలన ప్రక్రియను నిర్ణయించిన పాశ్చాత్య పరిశోధకులు కొందరున్నారు. ఇలాంటి సంఘటనలన్నీ - మన పూరి గుడిసెలోనే అడుగున మహానిధి వున్నదనీ, దాని మీదనే మనం నులక మంచం వేసుకొని గుర్రుపెట్టి నిద్రపోతున్నామనీ, తట్టి చెపుతున్నాయి. ఇప్పటికే పొద్దెక్కింది. ఇకనైనా మనం మేలుకోవాలి. మన నిధిని మనం వెతుక్నోవాలి - మన స్వార్థం కోసం కాదు, ప్రపంచమంతటికీ పంచిపెట్టటం కోసం! కర్తవ్యం :ఈ పని జరిగితేగాని, మనను ఆవరించుకొనివున్న చీకటి పొరలు విచ్చిపోవు - అందుకే...
- అలనాటి సంస్కృత సైన్సు గ్రంథాలను విస్తారంగా సేకరించటం.
- వాటిలోని వైజ్ఞానిక సాంకేతిక పదాలను ఈ నాటి సాంకేతిక పదజాలంతో సరిపోల్చ్బటం.
రగు!
- ఇతర డీకోడింగ్ టెక్నిక్‌లన్నీ వినియోగించటం.
- సనాతన పారిభాషిక పదాలకు నిర్వచనాత్మకంగా అర్థనిర్ణయాలు చెయ్యటం.
- తద్ద్వారా పూర్వ సంస్కృత సైన్సు గ్రంథాలనూ, తత్సంబంధిత వేదభాగాలనూ, మళ్లీ పరిశోధించటం- వంటి కార్యక్రమాలను చేపట్టటం మన తక్షణ కర్తవ్యం.
కార్య్యవజూళికః ఇటువంటి అనేకానేక ప్రక్రియల ద్వారా వేదాలలోను, వేదాంగ శాస్తాలలోను, గల వైజ్ఞానిక శాఖలన్నిటినీ పరిశోధించి, ఆ విజ్ఞానాన్ని మానవాళికంతటికీ జాతి మత కుల ఖేదాతీతంగా అందించాలనే పవిత్ర సంకల్పంతో సద్గురు శ్రీశ్రీశ్రీ గణవతి నచ్చిదానంద స్వామీజీవారి దివ్యాజ్ఞ మేరకు దత్తపీవ విద్యాధికారి శ్రీ కుప్పా వేంకట కృష్ణమూర్తిగారి అధ్యక్షత్వంలో ఆవిర్భవించింది ఈ 52372. (60161650 6862800 01 86259) వేదాంగ విజ్ఞాన శోధన సంస్థ. కృషివలితాలు ; ఈ కృషి ఫలిస్తే అధునాతన విజ్ఞానవేత్తలకే కొంగ్రొత్త విజ్ఞాన మార్గాలు తెరుచు కొంటాయనటంలో సందేహం లేదు. అంతే గాక ఈనాటి సైన్సుకు భిన్నంగా కాలుష్యరహిత వైజ్ఞానిక పరికరాలను, వైజ్ఞానిక ఫలితాలను, రూపొందించే వీలు కలుగుతుంది. అందుకే ఈ పరిశోధన ఫలితాలను ఇంటర్నెట్ ద్వారా యావత్ ప్రపంచానికి అందించాలని, అలాగే సగటు పారకుడి కోసం సులభశైలిలో గ్రంథాలుగా ఆవిస్కరించాలనీ, ఈ సంస్థ తపన పడుతోంది.
ఇక్కడ ఏనుగు తొండమంత వత్తి ఉంది. చెరువంత కుంది ఉంది. ఈ వత్తికి పది వత్తులు జత కావాలి. ఈ కుందిలో నూనె ఎప్పటికప్పడు నిండాలి. సంస్కృత శాస్త్రవేత్తలు, ఆధునిక విజ్ఞానవేత్తలు, విశ్వవిద్యాలయాల ఆచార్యులు వంటి వారెందరో కలిసి చర్చించాలి. మథించాలి. ఇది మేధావుల బాధ్యత. ఇది మీ బాధ్యత. 2006 ఏవప్రీయల్ వరకు జరిగిన కృషి :
- ఈ పరిశోధన సంస్థ 2004 అక్టోబరు 24న శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారి చేతుల మీదుగా హైదరాబాదులోని దిండిగల్ ఆశ్రమంలో ప్రారంభోత్సవ సంరభాలు జరుపుకున్నది.
ఆనాటి సభకు అప్పటి జె. ఎన్. టి.యు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సిలర్ ప్రా.డా. వేంకటరామిరెడ్డిగారు, జాతీయ సలవోామండలి సభ్యులు, పూర్వ
ఎద
స్తానింగ్ కమిషన్ సభ్యులు విద్యావేత్త ప్రొా.డా. స్వామినాథన్‌గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్వసలహాదారు శ్రీ హనుమాన్చౌదరిగార్లు గౌరవ అతిథులుగా విచ్చేశారు. వారిని కేంద్రప్రభుత్వ రిటైర్డ్ ఐ ఏ.ఎస్ ఉన్నతాధికారి, శ్రీ బి.కే.రావుగారు సభకు పరిచయం చేశారు. సర్వ్ సంస్థ ఛైర్మన్ శ్రీ కుప్పా వేంకట కృష్ణమూర్తి సంస్థ ఆశయాలు,వాటి సాధన మార్గాలు, మొదలైన వాటిని వివరిస్తూ, ఈనాటి ఆధునిక విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, దానివల్ల సంభవించే విషపరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని, ఆధునిక వైద్యానికి ప్రత్యామ్నాయంగా మానవుడు నూతన వైద్యవిధానాన్ని వెతుక్కుంటున్న రీతిలో, ఏ మాత్రమూ విషపరిణామాలు లేని వేదవిజ్ఞానాన్ని బయటకుతీసి మానవాళికి అందిస్తే, ఈ జీవరాశి మనుగడ మరికొన్నాళ్ళు శుభప్రదంగా జరుగగలదనే ఆశయంతో ఈ సంస్థ ఆవిర్భవించిందనీ, ఈ ప్రాచీన విజ్ఞానం మూలంగా ఆధునిక విజ్ఞానపు తలుపులు మూయవలసిన అవసరం లేదనీ, ఏది బాగుంటే దాన్ని సామాన్య ప్రజ అదరిస్తుందనీ,ఈ వేద నిక్షిప్త విజ్ఞానాన్ని బయిటకి తీయడం ప్రతి వ్యక్తి బాధ్యత అనీ, దీనికి వేద పండితుల, ఆధునిక వైజ్ఞానికుల, దాతల, సహాయ సహకారాలు చాలా అవసరమనీ, ఈ పరిశోధన ఫలితాలు జాతి, మత, కుల, లింగ వివక్షత లేకుండా ప్రపంచమానవాళి కళ్యాణానికి, శ్రేయస్సుకి, వాడటం ఈ సంస్థ ముఖ్యోద్ధేశ్యమనీ, పునరుద్దాటించటం జరిగింది. అనంతరం శ్రీస్వామీజీ తమ దివ్యసందేశంలో యీ 5.2% ౫౧౫. సంస్థ తమ (ప్రేరణతోనే ప్రారంభింపబడినదనీ, యిది దత్తపీఠంలోని ఒక భాగమేననీ, ఇది మానవాళి కళ్యాణానికై పుట్టిందనీ, ఇక దీన్ని పెంచే బాధ్యత, పోషించే బాధ్యత, (ప్రతి ఒక్కరిదీ అనీ, ప్రారంభ అవసరాల నిమిత్తంగా దత్తపీఠం కొంత ధనం విరాళంగా యిచ్చిందనీ, చేతనయినవారు చేయగలిగిన సాయం చేయాలనీ, చేతకానివారు నిర్వాహకుల్ని నిరుత్సాహ పరచే విధంగా ప్రవర్తించకుండా దూరంగా ఉండాలనీ, యిదో దివ్య కార్యమనీ, జ్ఞాన యజ్ఞమనీ, హితవు పలికారు. అనంతరం గత 8 నెలల్లో సేకరించిన 37 మూల గ్రంథాలను వాటి పరిశోధన నిమిత్తం ప్రొఫెసర్లకు, తదితర విద్యా విజ్ఞాన వేత్తలకు, అందింపజేశారు. 2. ఆ తరువాత 29.11.2004 నాడు మరొక స్టానిక కాన్ఫరెన్సు జరిగింది దీనిలో స్థానిక సంస్కృత పండితులు, యూనివర్శ్సిట్ ప్రొఫెసర్లు కలిసి చర్చించి 522.08. సంస్థ తన కరపత్రంలో ప్రకటించిన పరిశోధనా ప్రణాళికను అభినందన పూర్వకంగా ఆమోదించారు. ఎటట
- ఆ తరువాత 3-4-2005 న హైదరాబాద్‌లోనే కేవలం సంస్కృత
పండితుల సమ్మేళనం జరిపి,సంస్కృత పండితులకు తగిన సంభావన
వుంటుందనీ, గ్రంధాన్వేషణలోనూ, అధ్యయనంలోనూ సహకరించమనీ, పిలుపు
నివ్వటం జరిగింది.
శీ. ఈ నాడు నాలుగు బృందాలు ఆంధ్ర రాష్ట్రంలోను, రెండు బృందాలు
తమిళనాడులోను, రెండు బృందాలు కర్ణాటకలోను, మహార్యాష్ట్ర ,
మధ్యప్రదేశ్‌లలో చెరో బృందమూ (గ్రంథాన్వేషణకై. సంచరిస్తున్నాయి.
- మరో ప్రక్క 9 గ్రంధాధ్యయన బృందాలు వివిధ ప్రోజెక్టులను నిర్దేశించుకొని
వాటికి అనుబంధించిన గ్రంథాలను అధ్యయనం చేస్తున్నాయి.
ఆ (ప్రణాళికలు ;---
-
అథర్వ వేదాధ్యయన ప్రణాళిక
-
శ్రీ చక్రాధ్యయ /
-
ఖగోళాధ్యయన ఇ
-
వర్షపాతాధ్యయన ల
+భూగర్చ్భ ఉపద్రవాధ్యయన
ఫీ ర వాట ౫
- కృషి శాస్తాధయన -
ఫా పశుశాస్తాధ్యయన జి
- సనాతన గణిత శాస్రాధ్యయన ”
- ఇవిగాక మరో 7 అధ్యయన ప్రణాళికలు పరిశీలనకై సిద్ధంగా వున్నాయి. 2005 జూన్ 16 నుంచి 18 దాకా “వేదవిజ్ఞానము: నమకాలీన
ఉవయోగిత” అనే అశంమీద అఖిల భారతస్థాయి నమ్మేళనం జరిగింది.
దీనిలో అఖిల భారతస్థాయి ప్రోఫెసర్లు పరిశోధన వ్యాసాలు సమర్పించారు.
వీటిని సమ్మేళన ప్రారంభం నాటికే పుస్తకంగా ప్రకటించటమే గాక, అనంతరం
మా ౪60518: శాగాాంల?లా66ే2.01%8 లో వుంచటం గూడా
జరిగింది. అందరూ. చూడవచ్చు. ఈ సమ్మేళనం ప్రొఫెసర్
డా॥ డి.స్వామినాధన్‌గారి 3145 అనే సంనృతో సంయుక్తంగా
నిర్వహింపబడింది.
౯. ఇక సనాతన భారతీయ శాఖలను ఒకటొకటిగా తీసుకొని, లోతయిన
పరిశీలన జరపాలనే (ప్రణాళికలో భాగంగా, ఈ నాటి మానవ లోకానికి
అత్యవసరంగా ఆవశ్యకమైవున్న సజీవ సనాతన విజ్ఞాన శాఖ అయిన
ఆయుర్వేదం గురించి, అధునాతనావసరాల దృక్కోణంనుంచి పరిశీలన
జరిపేందుకుగాను “ోత్యుణా+6616 కెడ్ంతి!1ండ6 25 21646006 క8566
ఫశ!
వ4ంయంటుల అనే జాతీయ కాన్పరెన్స్, 2006 ఫిబ్రవరీ 16,17 తేదీలలో - హైదరాబాదులోని భారతీయ విద్యాభవన్ హాలులో జరిగింది. ఆయుర్వేద అధునాతన వైద్య విధానాలు రెండింటా తగిన కృషిచేసిన విజ్ఞులు, రాష్ర్టానికి ఇద్దరు చొప్పున, పది రాష్ట్రాలనుంచీ పాల్గొన్నారు. 8 ఈ కాన్ఫరెన్సుద్వారా ఒక నూతన పరిశోధ నాధ్యయనానికి స్వాగతంపలకాలనే లక్ష్యంతో ఒక ఆయుర్వేద పరిశోధనా కేంద్రాన్ని దానికి అనుబంధంగా ఒక ఉచిత ఆయుర్వేద వైద్యశాలను గూడా ]-5.2.2.202. కార్యాలయంలో ప్రారంభించటం జరిగింది. అవి నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. 9. 26.83.2006 "₹0గ3%009 01 186410 5010106” అనే పేరుతో 5.2.2.02. కార్యాలయంలలో జరిగిన చర్చావేదికలో ప్రముఖ వైజ్ఞానికులు పాల్గొన్నారు. దీని పరిసమాపనోత్సవానికి శ్రీ గణపిత సచ్చిదానంద స్వామీజీవారు స్వయంగా వచ్చి ఆశీర్వదించారు. " 10. 1.042006 నాడు దుండిగల్ లోని అమ్మవొడి ప్రాంగణంలో “ఆంధ్రసాహిత్యంలో విజ్ఞానశాస్త్ర ప్రసక్తులు” అనే చర్చావేదిక (సింపోజియం) జరిగింది. దీనిలో ఆంధ్రరాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు పాల్గొన్నారు. 11. 30.04.2006 నాడు 1-5.2.2.1.2 కార్యాలయంలో “కృష్ణయజుర్వేదం”పై సెమినార్ జరిగింది. 12, చేపట్టిన ఇతర ప్రణాళికల విషయంలో అధ్యయన బృందాల కృషి కొనసాగుతోంది. ఈ విధంగా, ఒక అపూర్వమైన ప్రణాళికతో సనాతన భారతీయ విజ్ఞాన శాస్త్ర శాఖల అన్వేషణ కోసం నిరంతర పరిశోధన చేస్తున్న ఈ ]-5.8 ౫.172. సంస్థకు అన్ని విధాలా పుష్టి నిచ్చి ప్రోత్సహించమని, భారత దేశాఖిమానులైన విజ్ఞలకు, దాతలకు విజ్ఞప్తి చేస్తున్నాము. జయగురుదత్త. నే టం 11-13-279, 2026 08, శ1జం2౧8ర, గ్వరేలురి&6ే - 35 వ[006 (040) 24035013, 2-012411 . ౪6646471 అ5ల౧/6౪7662.078 ₹/6009116 2 ఇ 5ల676642 018. టాక్సు మినవోయింవులు కల్పించారు. తిలకించ ప్రారన 4!
విషయనూచిక శే అనుగ్రహ వచనములు అ ల 2, మూడన భాగానికీ రచం౮త నునీని ఎ కా ఏ వెందటీ భాగానికీ రచయిత మనీని అ సనగ! త 1-5 3. 72. = ఎరగు-)00 5. న్వరూస లక్షణనం క ౮ తటస్థ లక్షణనం క ళు పుంధ ప్రుణాళక 3 8. వుకరణ స్తొోరంభం = క్ లి. విత్తు చెట్టు ఆ 8 10. జగత్డవేశ్సరులు అ 10 11... ఛార్లవోసాఖ్యానం అ (2 12. ఇక్కడై వున్నాడు కానీ లక్కడు తిరుగుతున్నాడు 15 13. అసలు శరీరం అ 19 14. నృుత్కుదోధ అ 21 415. కోసరు శరీరం ణం 25 16. అదిగో పాతజీహం ణం 27 17. కొత్రదేహంలోంబి సాత దేహంలోకి ఎ 31 18. _ తనీదేవోన్ని తనే తగల బెట్టాడు - 32 19, సంకల్ప సిద్ధి అ 37 20. పైనికుల స్తస్తపైన్వాలు = ఏలి 24 రెండు మునోరాజ్యాలు కలుస్తాయా అ బీ! 22, నాలుగు అవస్థలు ఎ ఉప 23. అవస్థలకు మూలం మనస్త ణి జీ7 24. నివధ సిడ్ధాన్తాలు + 50 (0) కపిలనుతం (సాంఖ్యం ఎ ఏ2 (1) వేదాంతనుతీనం - 53 (1). విజ్హాన నాదనం - 53 (1 ఆర్హతానాదనం ఐం వడా య
- చిత్త శుద్ధికి పడు మెట్లు ౨ 56
- దానున్నాలయటోపాళ్ళూనం అ 59
- బ్రహ్మదేవుడి ఉపాయం అ 63
- వ్రలిని చూసి నక్క వాత ౧ ఈ6
- లే ని సత్తా వ కూ.
- నుననూ అటువంటి నాళ్ళమే య 764. 34 కథాశీషం ఎ 77 32, అహంకారాలు నూడు అ 80
- భన భాసదృఢులు 83
- సింహావలోకనం ఎ 88
- బంధమోక్ష చర్చ అ లిగా
- లేని ప్రుసంచానికి ఉనికీ ఎలా వబ్చింది? ఎ 100 37... కర్తృత్వం అంటే ఏమిటీ ఒ 104
- దుఖాన్ని కలిగించేవి ఏని? అ 106 39, _ జీవుల ఉరత్సత్తిప్రుకియ యు. 111
- నూటం గారడీ (నాక్ట్రమ్రపంచం) అ 13 4ఓ శీనానరరణం అ $17 42, ఎందరో హిరణ్బగర్భలు అ ౪20
- దాశూరోసాట్యానను ఆఅ 123 44 కథలోకథ ఐం 429 45, సంకీల్పాలను తుడిబినేసక్తో * 135 త6 శాస్త్ర చర్చ అ 139 త? వాసనాక్షయోసాయాలు ఐ 145 48, నూక్ష్మత్వీం లోంబి స్టూలత్వం లోకి అ 149
- స్థితి ప్రుకరణన- సించోనలోకనవం ఆ 15! 20ర్లా/
యోగవాళిష్టహృదయము స్థితి పావరణనం ఏ వస్తువు గురించి అయినా తెలుసుకోవాలంటే దాని లక్షణాలను అధ్యయనం చేయాలి. లక్షణాలు రెండు రకాలు. ఒకటి స్వరూప లక్షణము, రెండు తటస్థ లక్షణము. న్యరూసలక్షణవం;
ఒక పదార్ధానికి స్వస్వరూపంగా వుండే లక్షణం స్వరూప లక్షణం. ఉదాహరణకు - ఆకాశంలో కనిపించే వెలుగు చుక్కల్లో పెద్ద వెలుగు ముద్దే చంద్రుడు.
ఇక్కడ వెలుగు ముద్దతనమనేది చంద్రుడికి స్వస్వరూపం, అంటే, చంద్రుడు ఉన్నంతసేపూ అది వుంటుంది. అది లేకపోతే చంద్రుడు లేడు. తటస్థలక్షణనం!
ఆ పదార్థంలో అప్పుడప్పుడూ వచ్చిపోయే లక్షణంపేరు, అనగా అప్పుడప్పుడూ అన్వయించే లక్షణంపేరు, తటస్థలక్షణం. ఉదాహరణకు “అదుగో, ఆ కాకి వాలిన ఇల్లే వెంకయ్యది!”
ఇక్కడ ఆ కాకి ఎల్ల కాలమూ ఆ ఇంటి మీదే కూర్చోదు. ఒకే. రకంగా వున్న అనేక ఇళ్లల్లో వెంకయ్య ఇంటిని చూపించడంకోసం, ఆ సమయానికి అక్కడ వాలి వున్న కాకిని
క నన మా చూపించారు. ఆ కాకి ద్వారా ఆ ఇంటిని గుర్తు పట్టిస్తున్నారు. ఇలా గుర్తు పట్టిన బాలుడు, ఆ కాకి ఎగిరిపోయిన తరువాత కూడా, వెంకయ్య ఇంటిని గుర్తు పట్ట గలుగుతాడు.
ఏదైనా ఒక నూతన వదార్దాన్ని గరించి, తెలునుకోదలచుకున్నవ్పుడు, దాని న్వరూవ లక్షణాలనూ తెలుసుకోవాలి, దాని తటస్థలక్షణాలనూ తెలుసుకోవాలి. పరబ్రహ్మయొక్క స్వరూపలక్షణం సత్, చిత్, ఆనందాలు, ఆయనయొక్క తటస్థలక్షణాలు సృష్టి స్థితి లయలు. పర(బ్రహ్మను తెలుసుకోవాలంటే, ఈ రెండు రకాల లక్షణాలను తెలుసుకోవాలి. పరబ్రహ్మ విషయంలో సూటిగా స్వరూపలక్షణాలను తెలుసుకోవటం, బోధించటం, చాలా కష్టం, అందుకే, వేదమాత అనేక స్థలాలలో తటస్థలక్షణాల ద్వారా (బ్రహ్మ స్వరూపాన్ని ముందుగా బోధించి, ఆ తరువాత స్వరూపలక్షణాల ద్వారా బోధించింది. వేదంలో పరబ్రహ్మయొక్క తటస్థలక్షణాలను చెప్పే ఘట్టాలలో తైత్తరీయ ఉపనిషత్తులోని ఘట్టం ముఖ్యమైనది. అక్కడ, - “యతో వా ఇమాని భూతాని జాయన్తే యేన జాతాని జీవన్తి యత్ర్రయన్త్యభి సంవిశన్తి” - అని వుంది. అంటే, దేని నుంచి ఆకాశాది మహా భూతాలన్నీ జన్మిస్తున్నాయో, అలా జన్మించినవన్నీ దేనిచేత జీవుస్తున్నాయో, అలా జీవించేవన్నీ దేనిలోకి ప్రవేశించి ఏకీభావాన్ని పొందుతున్నాయో అదే పరబ్రహ్మ = అని అర్థం.
య2ఎ -నాానాాకానాళకోలాయాలళరునయలలయునాయలాయయి... ్రేంధీ ప్రుడాభక్త
సృష్టి స్థితి లయలనేవి బ్రహ్మకు ఎల్లకాలం ఉండే లక్షణాలు కావు. అవి వస్తూ పోతూ వుంటాయి కనుక అవి (బ్రహ్మకు తటస్థలక్షణాలు. ఈ లక్షణాలను దృష్టిలో ఉంచుకొనే వశిష్ట మహర్షి వాల్మీకిమహర్షి కూడా, తమ (ప్రబోధ (ప్రణాళికను తయారు చేసుకొన్నారు.
ఉత్పత్తి ప్రకరణ ప్రారంభంలో ఈ గ్రంథ ప్రణాళిక ఏమిటి అని మనం ్రశ్నించుకొన్నాం. కానీ, సమాధానం మున్ముందు వస్తుంది అని అక్కడ చెప్పుకొన్నాం.
ఉత్పత్తి ప్రకరణంయొక్క చివరలో ఆ ్రకరణానికి సారాంశమేమిటని విచారణ చేశాం. ఈ (ప్రపంచోత్పత్తి అంతా మనస్సు చేసే గారడియే అని, ఈ ప్రపంచానికి నిజమైన అస్తిత్వం లేదనీ, కనుక పరమాత్మయొక్క స్వచ్చస్వరూపం నిష్కియమని, నిరూపించడమే ఉత్పత్తి ప్రకరణానికి సారాంశమనీ, అక్కడ మనం తేల్చుకొన్నాం. అంతేగాక ప్రపంచస్థితియొక్క పరిశీలనద్వారా గూడా ఈ నత్యాన్ని మనం నిరూపించవచ్చునని కూడా అక్కడ చెప్పుకొన్నాం.
ఈ మాటలనుబట్టి యోగవాశిస్టగ్రంథ ప్రణాళిక ఏమిటో మనం (గ్రహించవచ్చు. మొదట వైరాగ్య ప్రకరణం, ముముక్షు వ్యవహార ప్రకరణం చెప్పారు. ఈ రెండూ ఈ (గ్రంథానికి పీరికాప్రాయాలే. వీటిలో అసలు విషయం మొదలు కానే లేదు.
అసలు విషయం ఉత్పత్తి ప్రకరణంతో ప్రారంభమైంది. దీనిలో ప్రపంచోత్చత్తి మనస్సు చేసే గారడీయే అని నిరూపించారు.
క న... మఖా ఆ తరువాత స్థితిప్రకరణం చెప్పబోతున్నారు. దీంట్లో గూడా ప్రపంచస్థితి అంతా గారడీ వంటిదే అని చెప్పబోతున్నారు. దీని తరువాత ఉపశమ (ప్రకరణం చెపుతారు. దానిలో గూడా ఇలాంటి నిరూపణే చేస్తారు.
కాగా ఈ మూడు ్రకరణాలూ కలిపి పరబ్రహ్మయొక్క తటస్థ లక్షణాలైన సృష్టి స్థితి లయలను వరుసగా చర్చిస్తున్నాయి. ఆ తరువాత రాబోయే నిర్వాణ ప్రకరణంలో పర(టబ్రహ్మయొక్క స్వరూపలక్షణాలనూ, (బ్రహ్మవిద్యా ప్రయోజనాన్నీ నిరూపిస్తారు.
ఇదే గ్రంథ ప్రణాళిక. మొదటి రెండు ఉపోద్దాత ప్రకరణాలు పోతే, ఆ పై మూడు ప్రకరణాలు, 'యతోవా ఇమాని భూతాని” అనే మంత్రం చెప్పిన వరుసలోని తటస్థలక్షణాలనూ, ఆ తరువాత ఆరవదైన నిర్వాణ (్రకరణంలోని స్వరూలక్షణ విద్యా ప్రయోజనాలనూ, నిరూపిస్తారు.
కాగా, మొదటి రెండు ప్రకరణాలు ఒక గుంపు. తరువాత మూడు ్రకరణాలు ఒక గుంపు. మిగిలిన ఇక్కటి ఒక గుంపు. ఇదీ ఈ (గ్రంథంలో వరుస.
మనం రెండవ గుంపులో మొదటి ప్రకరణం పూర్తి చేసుకొన్నాం. ఈ గుంపులో గడ్డు అయిన ప్రకరణం ఇదే. అసలు విషయమంతా ఉత్పత్తి ప్రకరణంలో చాలా మటుకూ చెప్పేశారు. స్థితి ప్రకరణ, ఉపశమ ్రకరణాలలో ఈ విషయాలనే మళ్లీ తిప్పి తిప్పి చెప్పబోతున్నారు. తిప్పి తిప్పి చెప్పడం ఎందుకంటే, వచ్చిన సందేహాలే మారువేషాలలో మళ్ళీ వస్తూ వుంటాయి, అందుకోసం!
అదీ గాక, సంగీతం పొదేవారు పాడిన పల్లవినే పదిసార్లు మళ్ళీ మళ్ళీ పాడుతూ వుంటారు. ఇదేమిటయ్యా మళ్ళీ
లకూ -వానాానానాలలమునాలయావాయలాయాలయాయలా ప్రకరణ స్తోరంభం పాడుతున్నావంటే, దానికీ దీనికీ సంగతిలో తేడా వుంది అంటారు. ఆ తేడాలేమిటో, వాటిల్లో ఉండే కష్టాలేమిటో సంగీత శాస్రజ్ఞులకే తెలుస్తుంది. అలాగే, తత్వశాస్రానుబంధియైన తర్మశాస్తంలో కూడా స్వల్పభేదాలతో వచ్చిన వాదనలే మళ్ళీ వస్తూ వుంటాయి. ఆ భేదాలు స్వల్పంగదా అని అశ్రద్ధచేస్తే అవి అసలు సిద్ధాంతానికే ఎసరు పెట్టగలవు. శ్రీరాముడు స్వయంగా మేధావి. పైగా బహుశాస్తాలు చదివినవాడు. అలాంటివాడికి ఎక్కడలేని సందేహాలూ పొడుచుకువస్తూ వుండటం సహజమే, అందువల్లే, వశిషస్టమహర్ని భిన్న భిన్న కోణాలలో సమాధానాలను చెప్పుకొంటూ, ఈ ప్రకరణాలను పెంచుకొంటూ వెళ్ళాడు. ఆ ప్రక్రియలో ఈ స్థితి ప్రకరణం 3000 శ్లోకాల గ్రంథంగా రూపొందింది. మనం ఈ వాదభేదాలను తగ్గించుకొంటూ, వీలైనంత సం[గ్రహంగా ఈ (ప్రకరణాన్ని మననం చేసుకొందాం. వశిష్టులవారు తన బోధను ఇలా ప్రారంభించారు. వళిమ్థుడు: రామా! ఈ ప్రపంచం అంటని పదార్థమే పరబ్రహ్మ - అని పరబ్రహ్మకు ఒక లక్షణం చెప్పవచ్చు. అలాగే సచ్చిదానంద స్వరూపమైనదే పరబ్రహ్మ - అని మరొక లక్షణం గూడా చెప్పవచ్చు. నిజానికి ఈ రెండూ వేరు వేరు లక్షణాలు కావు. ఐనా మన మనస్సు నిండా ఈ ప్రపంచ వాసనలు నాటుకుపోయి వున్నాయి గనుక, మొదట ఈ వాసనలను తొలగిస్తే గానీ బ్రహ్మస్వరూపం పట్టుబడదు. దీని కోసం “పరబ్రహ్మ ప్రపంచాతీతమైనది” అనే లక్షణం ద్వారా
యోవ్యాట్టిత ఆలలలతలాులాతణంణణా. టై
(బ్రహ్మపరిశీలన చేయటమే ఎక్కువ మంచిది. దీనినే సంగ్రహంగా నిష్ప్రపంచబ్రహ్మానుసంధానం అంటారు. ముందర దీన్ని స్వాధీనం చేసుకొంటే, బ్రహ్మ సచ్చిదానంద స్వరూపమనే విషయం సులభంగా అవగతమవుతుంది.
నిష్ప్రపంచబ్రహ్మబోధ కలగటం కోసమే (శ్రుతి 'యతోవా ఇమాని భూతాని జాయన్తే” ఇత్యాది వాక్యాలను చెప్పింది. ఆ వరుసలోనే నేను నీకు ఉత్పత్తి ప్రకరణం బోధించాను.
రామా! వేదమాత “యతోవా ఇమాని భూతాని జాయన్తో అని వూరుకోలేదు. “యేన జాతాని జీవన్తొ అని గూడా అంది. అంటే, జన్మించిన భూతాలన్నీ ఆ పరబ్రహ్మ్హవల్లే జీవిస్తున్నాయి- అంది. అలాంటి వాక్యాలు ఇంకా చాలా వున్నాయి, ఉదాహరణకు- 1 “యేన ద్యా పృథివీ దృథధా” - ఈ భూమి ఆ పరమాత్మ వల్లే గట్టిగా వుంది. ల “కోహ్యెవాన్యాత్ - కు ప్రాణ్యాత్ - యదేష ఆకాశ ఆనందో నస్యాత్” న ఆ పరబ్రహ్మ కనుక లేక పోతే, ఈ లోకంలో ఎవడు (బ్రతుకుతాడు? త. “భిషాస్మాద్వాతః పవతే” - ఆ పరమాత్మకు భయపడి గాలి కదులుతోంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, అగ్ని ఇంద్రుడు, యముడు, మొదలైన వారంతా తమ తమ విధులు నిర్వహిస్తున్నారు.
ఇలాంటి వాక్యాలన్నీ జగత్తు యొక్క స్ట్తిని (్రవ పరుస్తున్నాయి. వీటికితోడు-
- “సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్
ఈ ప్రపంచం అంతా సృష్టికి పూర్వం సద్రూపంగానే వుంది.
లై ఆజాలానాలాయాలలయలలంటుంలయాలంయాాణయలా ప్రకరణ స్తారంధం 2, “అత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్”
ఈ ప్రపంచం అంతా సృష్టికి పూర్వం అద్వితీయమైన ఆత్మగానే వుండింది- అని ఇలాంటి వాక్యాలన్నీ ప్రళయ సమయంలో గూడా ఈ (ప్రపంచం సద్రూూపంగా వుందని బోధిస్తున్నాయి.
ఇలా అనేక (శ్రుతి వాక్యాలు ప్రస్తుకాలంలో ఈ జగత్తు ఉన్నదనీ, ప్రళయం తరువాత గూడా సూక్ష్మరూపంగా, సద్రూపంగా దీనికి సత్త వున్నదనీ బోధిస్తూవుంటే, మనం ఉత్పత్తి ప్రకరణంలో “జగత్తుకు ఉత్పత్తే లేదు, అసలు జగత్తే లేదు అని నిరూపించాం. మానవబుద్ధి మీద ఆధారపడేవాళ్లకు దీనిమీద అనేక సందేహాలు తోస్తూ వుంటాయి. కొందరు ఏవేవో సిద్ధాంతాలు కూడా చేస్తూవుంటారు. కానీ, రామా! అవి ఏవీ మంచి సిద్ధాంతాలు కావు, ఈ దృశ్య జగత్తంతా -
భవిష్యత్పుర నిర్మాణం
చిత్తసంస్థమివోదితమ్।
మర్మటానలతాపాన్త
మసదేవార్థసాధకమ్!॥ _ (సర్గ 1ళ్లో 4
ఈ ప్రపంచమంతా మనస్సులోంచి బయటకు పొడుచుకు వచ్చిన భవిష్యత్పట్టణ నిర్మాణం మాత్రమే! చెట్టు కొమ్మలో కోతి కల్పించుకొన్న నిప్పువేడి వంటిది. (ఈ దృష్టాంతం ఉత్పత్తి (ప్రకరణంలో వచ్చింది. చెట్లకొమ్మలు రాసుకోగా కారుచిచ్చు పుట్టటం చూసిన కోతులకు, కొన్ని కొమ్మల్లో నిప్పు ఉంటుందనే విశ్వాసం కలుగుతుంది. అందువల్ల, వాటికి చలి వేసినప్పుడు ఆ కొమ్మలను గట్టిగా కౌగిలించుకొంటాయి. వాటి భావనాతీవ్రతవల్ల ఆ కొమ్మలు నిజంగానే వేడి అనిపించి, వాటికి చలిపోతుంది - అని అక్కడ
యోవాన్దితి పలానా చెప్పిన విషయాన్నే ఇక్కడ పరామర్శిస్తున్నారు. ) ఆ కోతికి కొమ్మలోని నిప్పు లాగా ఈ ప్రపంచమంతా లేనిదిగా వుంటూనే, అజ్జులకు సుఖ దుఃఖాది కార్యాలను సాధించి పెడుతుంది. రామా! ఇదే అసలైన సిద్ధాంతం. రాముదో: గురుదేవా! గింజలో చెట్టువుంది. అలాగే, మహాప్రళయంలో ఈ ప్రపంచమంతా బీజరూపంగా వుందంటే యుక్కియుక్తంగా ఉంటుంది - “మహాకల్పక్షయే దృశ్యమాస్తే బీజ ఇవాంకురణ౯”. అంతేగాక, అనేకమంది పెద్దలు గూడా ఇలాంటి సిద్ధాంతాలే చెపుతున్నారు. వాళ్లు అంత తెలివితక్కువ వాళ్ళా? వళిమ్చుడు: రామా!
“బ్రూతేయ పఏవమజ్ఞత్వ మేతత్తస్యాస్తి వైశవమ్” ఇలా చెప్పేవాళ్ళకి అజ్ఞానంతోపాటు పిల్లతనం గూడా లేకపోలేదు అని తెలుసుకో. నువ్వు చెప్పిన విత్తూ, చెట్టూ ఉదాహరణలో విత్తుకు ఆకారం వుంది. అందువల్ల దానిలో సాకారమైన చెట్టు సూక్ష్మంగా ఉండవచ్చు. మరి పరబ్రహ్మకు ఆకారం లేదే!
మనష్ప్నష్టేంద్రియాతీతం
యత్ స్యాదతితరామణు;
బీజం తద్ధవితుం శక్తం
స్వయంభూర్జగతాం కధమ్;
ఆ బ్రహ్మ ఇంద్రియాలకూ, మనస్సుకూ గూడా అందదు. అంత సూక్ష్మమైనది. పైగా అది స్వయంభువు. అంటే అది చెట్టునుంచో పుట్టే గింజ లాంటిది కాదు. అది ఏ వికారాలూ లేని
తై లాలా. విత్తు చెట్టు అద్వితీయ వస్తువు. అది మరొక పదార్ధానికి విత్తు ఎలా అవుతుంది? కనుక (బ్రహ్మలో (ప్రపంచం లేదనటమే సత్యం. అదీ గాక రామా! ఈ ప్రపంచం పరిణామ విధానంలో
జన్మించడం లేదు. వివర్త విధానంలో జన్మిస్తోంది. అంటే, భ్రాంతివల్ల తాడు మీద పాము జన్మించినట్లుగా జన్నిస్తోంది. భ్రాంతి కలుగక ముందు పాము సూక్ష్మరూపంలో తాడులో లేదు కదా! అలాగే, ఈ ప్రపంచం కూడా ప్రళయకాలంలో (బ్రహ్మలో లేదు.
రాముడు; గురుదేవా! ఈ ప్రపంచం హిరణ్యగర్భుడి మనో రాజ్యమని మీరు పూర్వం చాలాసార్లు చెప్పారు. అందువల్లే ఈ ప్రపంచోత్పత్తికి సహకార కారణాలు ఏమీ అవసరం లేదని కూడా మీరు చెప్పారు. కాబట్టి ప్రళఉయసమయంలో ఈ ప్రపంచం అంతా హిరణ్యగర్భుడి మనస్సులో స్కృతి అనబదే సంస్కార రూపంగా నిలబడే వుందని చెప్పక తప్పదు. కనుకనే ప్రళయం పూర్తికాగానే ఈ ప్రపంచం హిరణ్యగర్భ స్మృతిరూపంగా మళ్లీ మొలకెత్తుతోంది - అనటంలో తప్పేమిటి?
వళిమ్టుడు: నీకు స్వప్నం కలిగిందయ్యా! ఆ స్వప్నంలో కనిపించే వస్తువు స్వప్నకాలంలోనే లేదు. అలాగే నీ సంకల్పంలో ఒక వస్తువు కనిపించింది. అది నీ సంకల్ప సమయంలోనే లేదు. నీకు ఒక స్పృతి కలిగింది. స్మరింపబడే వస్తువు సృృతిసమయంలోనే లేదు. నీ అనుభవాలు ఇలా వుంటే, వీటిని ఆధారం చేసుకుని హిరణ్యగర్భుడి సృృతిరూపమైన ప్రపంచం ప్రళయకాలంలో సత్యంగా వుందని ఎలా కల్పన చేస్తావయ్యా?
రాముడు: అదేమిటండీ? నేను సుషప్తిలోకి వెళ్లాను. అజ్ఞానంలో పడిపోయాను. అంతమాత్రంచేత నా సంస్కారమంతా
యోవ్నాస్త్రదై. ఆలాలలాంంనారాాయయురాయుననుమనాణముుాడుంా నశించిపోయిందా? లేదే! జాగ్రదవస్థ వచ్చేసరికి మళ్లీ సంస్కారాలు మొలుస్తున్నాయి. స్మృతి కలుగుతోంది. అలాగే ప్రళ్రయసమయంలో హిరణ్యగర్భుడు మాయలో లీనమైపోయాడు. కానీ, ప్రళయం పూర్తయ్యేసరికి అతని స్కృతి అతనికి వచ్చేసింది - ఇందులో తప్పేమిటి?
వళిమ్ణుడుః: రామా! నువ్వు సుషప్తిలోకి వెళ్ళి మళ్లీ జాగ్రత్తులోకి వచ్చే లోపల మధ్యలో నీకు మోక్షం వచ్చేసెయ్యలేదు. అక్కడా ఇక్కడా నువ్వే వున్నావు. అందువల్ల నీ స్మృతి నీకు మళ్లీ వచ్చేసింది. కానీ హిరణ్యగర్భుడియొక్క మహాప్రళయ సందర్భంలో పరిస్థితి ఇది కాదు. నేను చెప్పేది హిరణ్యగర్భుడి దైనందిన ప్రళయం గురించి కాదు. అతడి మహాప్రళయం గురించి చెపుతున్నాను. ఆ సమయంలో ఆ హిరణ్యగర్భుడికి ముక్తి వచ్చేసింది. ఇక ఆయన లేడు. అంటే అప్పటి సృతికర్త ఇక లేడు. పై సృష్టికి కొత్త హిరణ్యగర్భుడు వచ్చాడు. ఆయన వేరు, ఈయన వేరు. ఆయన స్కృతి ఈయనకెలా కలుగుతుంది? అందుకే నీ సిద్ధాంతం కుదరదు. అందుకే ఇందాక ఉదహరించుకొన్న ప్రళయ ప్రతిపాదక సృతి వాక్యాలన్నింటికీ, అంటే, “సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్”- వంటి వాక్యాలన్నిటికీ, తాత్పర్యం ఏమిటంటే, ప్రళయ సమయంలో ప్రపంచం (బ్రహ్మస్వరూపంగా వుంది - అని చెప్పడమే.
ఇలా చెప్పడంవల్ల బయటకు వచ్చే మరో ఉపసిద్ద్ధాంతం
ఏమిటంటే - జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, అనే ఈ ముగ్గురూ కూడా చిన్నాత్ర స్వరూపులే - అని. వీటిలో ప్రపంచాన్ని ప్రపంచంగా
న చూడటం బంధం. ప్రపంచాన్ని (బ్రహ్మగా చూడటం ముక్తి. జీవుడ్జిగానీ, ఈశ్వరుడ్డిగానీ, పట్టుకొని వీళ్ళలో వున్న సత్యాంశ ఏమిటని పరిశోధన చేస్తే, మిగిలేది పరిశుద్ధ పరబ్రహ్మమే.
కనుక రామా! బంధ మోక్షాలనేవి మనం చూసే చూపునిబట్టి వున్నాయి. ఈ దృశ్యప్రపంచం లేదనుకుంటే గానీ, మనస్సు అనే పిశాచం పోదు. అయితే మనస్సేమో లోపల వుండేది. దృశ్య ప్రపంచమేమో బయట వుండేది. బయట వుందే దృశ్యప్రపంచానికి చికిత్స చేస్తే లోపల వుండే మనస్సనే వ్యాధి ఎలా తొలుగుతుంది? - అని సందేహపడతావేమో. నీకు పూర్వమే చెప్పా, లోపలా బయటా అనే భేదం మనస్సు చేసే గారడీ మాత్రమే. లోపలా బయటా అనేవి లేనే లేవు.
పరస్పరం త్వవిరహితే సదైవ హి।
తయోర్హ్యయోర్మనసి నిరంతరంక్షితే
క్షితం జగ-న్నతు జగతి క్షితేమనః ॥॥ (సర్గ 4, ళ్లో 15)
మనస్సే ప్రపంచం. ప్రపంచమే మనస్సు. అవి విడివిడిగా లేనే లేవు. ఐనా, ఆ రెండింటిలో మనస్సు నశిస్తే ప్రపంచం నశిస్తుంది. ప్రళయాదులవల్ల ప్రపంచం నశిస్తే మనస్సు మాత్రం నశించదు. రాముడు ఇందుకు దృష్టాంతం చెప్పండి. వళిమ్ధుడు: దృష్టాంతాలకు ఏమిలోటయ్యా? ఇదివరకటిలో చెప్పుకొన్న *“ఐందవోపాఖ్యానం' దీనికి దృష్టాంతవే! ఇం(ద్రజాలోపాఖ్యానం' అనే పేరు గల లవణచరిత్ర దీనికి దృష్టాంతమే!! ఐనా, ఆ రెండూ ఉత్పత్తి అనే దృష్టిలోంచి చెప్పినవి
యోంవాన్హితి. రాజా ఆ గనుక, ప్రపంచస్థితి అంతా మనస్సుమీదే ఆధారపడి వుంది అని చెప్పేందుకు ప్రత్యేక దృష్టాంతంగా'భార్గవోపాఖ్యానం' చెబుతాను విను.
కల్పాలు, ప్రళయాలు, మహాప్రళయాలు, ఎలా వస్తాయో నీకు తెలును గదా! ఆ వరుసలోనే ఒక మహాప్రళయం జరిగిపోయింది. ఒక బ్రహ్మగారి ఆయుష్యం తీరిపోయింది. కొత్త బ్రహ్మగారు వచ్చాడు. ఆయనగారి మొదటిరోజు సృష్టి ప్రారంభం అయింది. ఆ సృష్టిలో భృగువు అనే మహోత్తమ జీవి పుట్టాడు.
నీకు తెలుసుగదా, రామా! వెనుకటి కల్పాలలో ఉత్తమోత్తమ తపస్సాధనలు చేసి, కైవల్యస్థితిని అందుకోబోతూ వుండగా, కల్పాంతం రావడంవల్ల తవన్సు ఆగిపోయిన జీవులు కొందరుంటారు. అలాంటి జీవులు పై కల్పాలలో మనువులు, సప్తర్నులు, దేవతలు, మొదలైన అధికార పురుషులుగా జన్మలెత్తుతూ వుంటారు. ఇలాంటివారి జన్మలు, వీరి జీవిత చరిత్రలు, మామూలు సంసారపక్షపు సాదా జీవితాలుగా వుండవు. వాళ్ల తీరే వేరుగా వుంటుంది. ఆ కోవకు చేరినవాడే భృగువు. అతడు ఆ కల్పంలో రాబోయే రోజుల్లో సప్తబుషులలో ఒకడు కావలసి ఉన్నవాడు.
భృగువు అంటేనే కొండ చరియ అని అర్థం. ఈ భృగువు మందర పర్వతపు చరియలమీద భార్యాసహితుడై ఎక్కువకాలం తపస్సమాధిలోనే కాలం గడుపుతూ వుండేవాడు.
తపోమయ జీవనులైన ఆ దంపతులకు శుక్రుడు అనే కొడుకు పుట్టాడు. యౌవనదశ వచ్చేసరికి ఆ కుజ్జివాడు మన్మథుడి
ఆ “వాానాానాలానాలోనలయంయయులాయాలయాలాం.. భార్లనోపాస్త్యూసం అంత అందగాదుగా, బృహస్పతి అంత మేధావిగా, తన తండ్రి అంత తపస్విగా, తేలాడు. వాళ్ళది ఏకాంత జీవనం! అడవిలో నివాసం !! తండ్రి ఎప్పుడు చూసినా రాతిబొమ్మ లాగా సమాధిలో వుంటూ వుందేవాడు. ఎప్పుడైనా ఆయన సమాధి విడిచి బయటకు వస్తే, శుక్రుడు ఎంతో (ప్రేమగా ఆయనకు శు(శూష చేసేవాడు. ఆ సమయంలో తండ్రి చేసే బోధలవల్ల పరమాత్మ తత్వం పట్టుబడి, అతను గూడా తపస్సమాధుల్లోకి ప్రవేశిస్తూ వుండేవాడు. అతని సమాధి ఎక్కువసేపు నిలిచేది కాదు. అతను సమాధిలోంచి బయటకు వచ్చేసరికి, తండ్రి రాతిబొమ్మ లాగా బిగుసుకుపోయి ఉండేవాడు. ఈ కుర్రవాడు, శుక్రుడు, చేసే పని ఏమీ లేక కొండ చరియల వెంట, సెలయేళ్ల వెంట, అలా అలా తిరిగి వస్తూ వుండేవాడు. శుక్రుడు సహజంగా భావుకుడు, సరస హృదయుడు, కవి. ఆ అడవిలోని ప్రకృతి సౌందర్యాలకు అతని మనస్సు పొంగిపోతూ వుండేది, ఆ నెమలి కూతలు, ఆ పూల పాన్సులు, ఆ వెన్నెల జల్లులు, అతనికి మత్తెక్కిస్తూ వుండేవి. కానీ, ఇంతలో తండ్రిగారు చెప్పిన తత్త్వజ్ఞానం గుర్తు వచ్చేది. “ఇంత సుస్థిరంగా కనిపించే పర్వతమే నిత్యం కాదంటుంటే, ఈ పూలపాన్సుల విలువెంత? మరో మగ నెమలి గనివిస్తే చిర్రుబుర్రులాడే ఈ నెమళ్ల కూతల విలువెంత? రోజు రోజూ క్షీణించిపోయే ఈ చంద్రుడు కురిపించే వెన్నెల విలువెంత?” - అని అతడు ఊగిసలాడిపోయేవాడు.
యయోవొస్టిత తనావనాలులా ప్రపంచం సత్యమనే ఊహ, మరో పక్క ఆత్మతత్త్వ వివేకం. ఒక పక్క సౌందర్యం కోసం తపన, మరో పక్క సమాధి కోసం ఆరాటం. ఇలా నిరంతరమూ మనస్సులో ఊగులాటలై, ఆ శుక్రకుమారుడికి మనశ్చాంతి దక్కక, అతని పరిస్థితి ఎటూ కాని త్రిశంకు స్వర్ణంలా అయిపోయింది. శుక్రుడు ఇలా గిల గిలా కొట్టుకొంటున్న రోజుల్లో, ఒక నాడు, అతను తన తండ్రి ప్రక్మనే కూర్చొని, సమాధి కోసం కృషి చేస్తున్నాడు. తండ్రి అప్పటికే సమాధిలోకి వెళ్ళిపోయాడు. కొడుకుకు సమాధి కుదిరీకుదరకుండా వుంది. ఈ దశలో ఆకాశంలో కిలకిలరావాలేవో వినిపించాయి. శుక్రకుమారుడు తల ఎత్తి చూశాడు. అప్పటికే కొన్ని దివ్యశక్తులు సాధించి ఉండటం వలన, శుక్రుడికి ఆకాశంలో సంచరిస్తున్న దేవకన్యలు కనిపించారు. వాళ్ళు వట్టి కన్యలు కాదు. దేవ వేశ్యలు. అప్సరసలు. ఆ అందాలకు, ఆ విలాసాలకు, శుక్రకుమారుడు పరవశళించిపోయాడు. సంస్కార విశేషంవల్ల వారిలో ఒక పిల్లదాని సౌందర్యం ఇతనికి మర్ మత్తెక్కించింది. ఆ పిల్ల ఎంత ఎత్తులో, ఎంత దూరంలో వుందో ఏమో గానీ, ఈ కుర్రవాడికి ఆ పిల్ల తన కళ్ళముందే తిరుగుతున్నట్లు, ఆ శరీర సువాసనలు తన ముక్కులకు తగులుతున్నట్లూ, ఆ అందెల చప్పుళ్ళు తన చెవులకు సోకుతున్నట్లూ, తోచసాగింది. ఇలా చూన్తుండగానే అప్పరసల గుంపు ముందుకు వెళ్ళిపోయింది. అప్రయత్నంగా శుక్రకుమారుడు గూడా లేచి ఆ దారినే నడవబోయాదు.
యకం జలాలు. భకృడే వున్నాడు కాని లక్కడీ తిరుగుకున్నాడు
ఇంతలో శుక్రుడిలోని తత్ష్వబ్ఞుడు నిద్ర లేచాడు. ఆ తత్తజ్వుడు బలాత్మారంగా వివేకాన్ని లు దానికి న. తీసుకువచ్చి ముడిపెట్టాడు. వెళ్ళబోయిన శుక్రకుమారుడ్డి వెనక్కు నడిపించి, మళ్ళీ తండ్రి ప్రక్మనే కూర్చోబెట్టి మనస్సును ఏకాగ్రం చేసుకోమని నిర్బంధించాడు.
శక్రుడు ఏకాగ్రతా ప్రయత్నం మళ్ళీ మొదలు పెట్టాడు. ఇతర ఆలోచనలన్నీ త్వరలోనే తొాలగవోయాయి. ఇంకేముంది, మనస్సు ఖాలీ అయిపోతోంది అనుకొంటూ వుండగా, ఎప్పుడు వచ్చిందో, ఎలా వచ్చిందో, తెలియదుగానీ, ఇందాకటి ఆ కులుకులాడి వచ్చేసి, మనస్సులోకి దూరి, మనసంతా తనే అయిపోయి, నిండి కూర్చుంది. కొద్ది క్షణాలు అయ్యేసరిక్షి పరిస్థితి ఎలా వుందంటే, ఆ శుక్రుడు తనను తానే మరచిపోయాడు. మరచిపోయి ఊరుకోలేదు. తనే ఆ కులుకులాడి అయిపోయాడు. తన్మయుడు అయిపోయాడు. ఇక్కడే వున్నాడు కాని అక్కడ తిరుగుతున్నాడు
ఆ దశలో శుక్రుడు ఎంతసేపు వున్నాడో అతనికే తెలియలేదు. క్రమంగా అతని ఊహలు తీగలు సాగుతున్నాయి.
ఆ అప్సరసల బృందం ముందుకుపోతోంది. కొంతసేపయ్యేసరికి బృందం లేదు. తను వలచిన పిల్ల ఒక్కతే వుంది. ఆమె ముందు నడుస్తోంది, వెనకాల శుక్రుడు నడుస్తున్నాడు. ఆమె స్వర్గ్ణలోకంలోకి ప్రవేశించింది. ఆ లోకం, ఆ మనుషులు, అద్భుతంగా వున్నారు. ఆ పూదోటలు, ఆ భవనాలు, ఆ క్రీడాసరస్సులు, అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్కటీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్రమంగా దిక్పాలకులు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ
య నన వాహనాలు, వాళ్ళ విలాసాలు, వాళ్ళ విహారాలు, వాళ్ళ గానాలు, వాళ్ళ గానాలు, వాళ్ళ నాట్యాలు, వాళ్ళ విమానాలు, వాళ్ళ కల్చపృక్షాలు అందరూ కనిపిస్తూ వున్నారు.
అప్సరస ఇంకా ముందుకు సాగుతోంది. సాగి సాగి ఆమె ఇంద్రసభలోకి ప్రవేశించింది. దేవరాజ సింహాసనంలో కూర్చున్న దేవేంద్రుడ్డి చూడగానే, అప్సరస వెనుక నడుస్తున్న శుక్రుడు ఆదరంగా నమస్కరించాడు. దేవేంద్రుడు అంతే ఆదరంతో ఎదురు వచ్చి, స్వాగతం పలికి, తన అర్ధ సింహాసనంలో కూర్చోబెట్టుకున్నాడు.
శుక్రుడి ఆనందానికి అంతు లేకుండా వుంది. ఇంతలో దేవేంద్రుడు శుక్రుడికి ఒక విడిది ఏర్పాటు చేశాడు. ఆ విడిదిలో కొంచెంసేపు విశ్రమించిన శుక్రుడు, ఊరు చూడటానికి బయలు దేరాడు. దారిలో ఎందరెందరో సుందరాంగులు కనిపించారు. ఒక చోట తాను వలచిన ఆ అప్సరస మళ్ళీ కనిపించింది. ఇద్దరూ పరస్పరం మోహంలో పద్దారు.
తక్షణమే చీకటి పడాలని శుక్రుడు సంకల్పించాడు. చిత్రం, అలాగే జరిగింది. ఆ చీకటిలో, ఆ తోటలో, దేవేంద్రుడు పంపిన అమృతం కానుకగా అందింది. ఆ తరువాత శుక్రుడు ఆ అప్పరసతో విహరిస్ఫూ ఇంచుమించు కృతయుగంలో సగం కాలంపాటు ఆనందంగా గడిపేశాడు.
ఆ దీర్ధరాత్రి గడిచాక, శుక్రుడు మళ్ళీ ఇంద్రపురం చేరాడు. అక్కడ మరో నాలుగు యుగాలపాటు సుఖంగా విహరించాడు.
పుణ్యక్షయానుసంధానాత్ తతశ్చావని మండలే,
తమైన సహ మానిన్యా పపాతోపహతాక్యతిః, (సర్గ8ి-శ్లో, 15)
ఇప్పటివరకూ మనోరాజ్యంలో సుఖభోగాలనుభవిస్తున్న
తై -జాజాాజలానా ఇక్కడే వున్నాడు కాని అక్కడ తిరునుతున్నాడు శుక్రుడికి పుణ్యక్షయం అయిపోయినట్లుగా ఒక భావన మనస్సులో అనుసంధానమైంది. దానితో అతను తన ప్రియురాలితో కలిసి భూమిమీద పడ్డాడు. ఆ పడిన విధానం వమిటంటే- పుణ్యం నశించిపోయిందనే అనుసంధానం వుండటంవల్ల, అతని దివ్యశరీరం కూడా చితికిపోయింది. దాంతో ఆ జీవులిద్దరూ సూక్ష్మశరీరాలతో, గూడు లేని పక్ష్టుల్లాగా, ఆకాశంలో తిరుగుతూ, మెల్లిగా చంద్రకిరణాలలోకి చేరారు. ఆ కిరణాలద్వారా ఆహారయోగ్యమైన గింజలలోకి చేరారు. వాటిల్లో ఒక గింజ దశార్ణదేశానికి చేరింది. అక్కడ ఒక బ్రాహ్మణుడు గింజను అన్నంగా వండుకు తిన్నాడు. ఆ గింజలోని జీవుడు, ఆ బ్రాహ్మడిద్వారా అతని భార్య గర్భంలోకి చేరి కొడుకై పుట్టాడు. ఈ జన్మలో గూడా అతని పేరు శుక్రుదే. జన్మలు జన్మలుగా సాగే జీవుల చరితలను చెప్పుకొనేటప్పుడు, పురాణాలలో, సామాన్యంగా ఆ జన్మలన్నింటి లోనూ, ఆ జీవుడ్డి, ఒకే పేరుతో వ్యవహరిస్తూ వుంటారు. కథా సౌకర్యం కోసం ఇలా చేస్తారు. వేరే వేరే జన్మల్లో వేరే వేరే పేర్లు ఉండి ఉండవచ్చు. కానీ, ఒకే జీవుడి జన్మాంతర ప్రయాణం ఎలా సాగుతోందో చూపించటానికి వచ్చే కథలు గనుక, ఇలాంటి కథల్లో ఆ జీవుడికి అన్ని జన్మల్లోనూ అదే పేరు ఉన్నట్లుగా మహర్షులు చెపుతూ వుంటారని మనం గమనించాలి. ఇంతకూ భృగుకుమారుడైన శుక్రుడు, దశార్ణదేశంలో బ్రాహ్మణ కుమారుడిగా జన్మించాడు. అక్కడ అతనికి మళ్ళీ తపస్వి జనుల సాంగత్యం లఖించింది. ఆ సహవాసంబలంవల్ల అతను తపోవిధులను నేర్చుకొని, తపోనిష్టుడై, ఒక మన్వంతర కాలం పాటు జీవించాడు. కానీ, ఇంత తపస్సులో ఉన్నవాడికీ ఒక విచిత్రమైన సన్నివేశం ఎదురైంది. ఆ నాడు
యోోన్నాన్హాతి. .ాలతారోతంకాతుకాతుకారంలలునాణయండా స్వర్ణంనుంచి రాలిపడిన అప్సరస ఈ నాడు ఒక ఆడ లేడై పుట్టి, ఈ శుక్రుడు తపస్సు చేసుకొనే వనంలో ఇతని ముందు తిరగ సాగింది. మన్వంతర కాలంపాటు, అంటే 71 దివ్యయుగాలపాటు, తపోనిష్టలో ఉన్న నూతన శుక్రుడికి మనస్సు చలించింది, ఆ లేడికి మానాకారంలో ఉన్న కొడుకు ఒకడు పుట్టాడు.
ఈ పిల్లవాడు పుట్టిన దగ్గరినుంచీ నూతన శుక్రుడి పద్దతే మారిపోయింది. వాడిమీద అంతులేని మోహంతో తన ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయని విచారణ మొదలు పెట్టాడు. వాడికి అంతులేని డబ్బు ఉండాలనీ, సాటిలేని పాండిత్యం ఉండాలనీ, మచ్చలేని సద్దుణాలు వుండాలనీ, శాశ్వతమైన ఆయుష్యం ఉండాలనీ, ఒకటే తపన బయలు దేరింది. ఈ మనళశ్చింతతో అతని తపోనిష్టంతా (భష్టుపట్టి, తపోబలం అడుగంటింది. ఇలా నూతన శుక్రుడు పుత్రచింతలో మునిగి ఉండగానే మృత్యువు అతన్ని మింగేసింది.
పుత్రుడి కోసం భోగచింతనలో పడ్డ నూతన శుక్రుడు, పై జన్మలో మధుర దేశపు రాజుగా పుట్టాడు. అక్కడ చాలా కాలం భోగాలనుభవించి, కీర్తిని సంపాదించి, చివరికి వానప్రస్థధర్మంలో వుంటూ శరీర త్యాగం చేశాడు.
ఈ తపోవాసనవల్ల ఆ పై జన్మలో అతడు “సమంగా” మహానదీ తీరాన తాపసపుత్రుడై జన్మించాడు.
రామా! ఈ జన్మలో మాత్రం అతనికి పూర్వపు చెడు సంస్మారాలన్నీ తొలగిపోయి, సుస్థిరమైన వైరాగ్యం కలిగి, సమాధిస్థితి అంది, ఆ నదీతీరంలోని చెట్టు లాగానే నిశ్చలంగా ఉండిపోయాడు,
_వనంరడంనంరంనరానంరందాడంరాశంయయయలయయిలయింయియం.. అనరు శరీరం
రామా! ఈ కథా పరంపరలో మొదటి మాట మరచి పోయావో ఏమో, ఈ జన్మ పరంపర అంతా ఎక్కడ జరిగింది? మందర పర్వతం మీద తండ్రి ప్రక్కన కూర్చొని చిత్తైెకాగ్రత కోసం కుస్తీ పడుతున్న శుక్రుడి మనోరాజ్యంలో జరిగింది. ఆ నాటి ఆ శుక్రకుమారుడు అలా ఆలోచిస్తూ, ఒళ్ళు మరచిపోయి కూర్చోగా, వేలకు వేల సంవత్సరాలే దొర్లిపోయాయి. ఇన్ని వేల ఏళ్ళ మధ్యలోనూ తిండీ, నీళ్ళూ లేక, ఆ శరీరం శుష్కించి పోయి, ఒక రోజున ఎండుటాకల్లే రాలిపోయింది. మొదలు నరికిన చెట్టల్లే పక్కకు ఒరిగిపోయింది.
ఈ శరీరం ఇలా కూలిపోయినా, అతని మనస్సు మాత్రం కోడెవయస్సులో ఉన్న లేడిపిల్ల లాగా గంతులు వేస్తూనే వుంది. అది అలా లక్షల సంవత్సరాలు గంతులు వేసి వేసి, చివరికి “సమంగా నదీతీరంలో విశ్రాంతి చెందింది.
అనంత వృత్తాంత ఘనాం పేలవాం సుద్భధా మపి తాం సంసృతిదశాం శుక్రో విధేహో2. నుభవన్ స్థిత (సర్గ 9-శ్లో 5) ఎన్ని లక్షల సంవత్సరాలుగానో ఆ శుక్రుడు దేహం లేకుండానే, ఇన్ని జన్మల సంసార దశనూ అనుభవిస్తూ వచ్చాడు. దేనివల్ల ఇలా చేయగలిగాడు అంటే, జీవులు ప్రస్తుతదేహమే సత్యమనే (భ్రాంతి వల్ల పాత దేహాలను మరచిపోతూ వుంటారు. ఆ మరపువళ్లే ఈ సంసారం ఇంత దృఢంగా ఉంటుంది. దీంట్లో ఉండే సంఘటనలన్నీ ఇంత ఘనంగా ఉంటాయి. అయినా ఇవన్నీ
యో్మోన్నార్టుత. ఆవరాలలోయనారంనారంంరంలయునంరాలు. మనస్సు చేసే కల్పనలు మాత్రమే గనుక, ఈ మొత్తం సంసారమంతా కలిపితే అది నిస్సారమే. ఇప్పుడు భృగు కుమారుడు చేసినది కూడా మానసిక కల్పన మాత్రమే గనుక, అతడు శరీరం లేకుండానే ఇన్ని జన్మలూ అనుభవించగలిగాడు.
ఇంతటి సంసార కల్పనకు మూలకారణమైన అతని మనస్సుకు ఒకనాడు ఆధారంగా వున్న ఆ భృగుపుత్ర శరీరం, ఆ నాటి స్ట్థూలదేహం, ఇప్పుడు పూర్తిగా శిథిలం అయిపోయి వుంది. దానిలోని రక్తమాంసాలు ఎండిపోయాయి. ఎముకలు, చర్మం, మాత్రం మిగిలాయి.
ఇలాంటి నీచదశలో దిక్కులేని శవం పడి వున్నా అక్కడ వున్న పశుపక్ష్యాదులేవి ఆ శరీరాన్ని పీక్కు తిననే లేదు. దానికి కారణమేమిటంటే, ప్రక్కన సమాధిలో కూర్చొని వున్న భృగువు. ఆయన రాగద్వేషాలు లేని మహాతపశ్శాలి. ఆయన తపోబలం వల్ల అక్కడ వుందే పశువులు, పక్షులు, కీటకాలు గూడా ఆ శరీరం పట్ల స్నేహభావంతో ప్రవర్తించాయి.
ఇలా ఉండగా, భృగుమహర్షి లెక్కలో వేయి సంవత్సరా లయ్యాక, ఒక రోజున, భృగుమహర్షి తపస్సమాధినుంచి లేచాడు. లేచేటప్పటికి, ఎముకలు, చర్మమూ మిగిలి, ఎండిపోయి ఉన్న కొడుకు శవం తన ్రక్కన కనిపించింది. అంత మహా తపస్వి అయిన భృగుమహర్షికి కూడా, పుత్రశోకం ముంచెత్తు కొచ్చేసింది. ఆ శోకం క్రోధంగా మారి - “అరెరే! నా తపస్సుకు భయపడి ఇక్కడి పశువులు, పక్షులు, కీటకాలూ కూడా, నా కొడుకు శవాన్ని ముట్టుకోవడానికి సాహసించలేదే! ఆ పాడు మృత్యుదేవతకి ఎంత ధైర్యం? నేను బ్రతికి
యై ఆాజాాాాలాలాలాలలాలానానాలా. నృతృ్చుబోధ వుండగానే నా కొడుకు ప్రాణాలు తీసుకుపోతాడా? వాడ్డి ఇప్పుడే శపించి పారేస్తాను” - అని తనలో తనే ఉగ్రంగా ఆలోచించసాగాడు.
మహర్షి ఆలోచనా తరంగాలు మృత్యుదేవతను తాకాయి. వెంటనే ఆ మృత్యుదేవత భృగుమహర్షి ఎదుట సాక్షాత్కరించి ఇలా ప్రసంగించసాగాడు -
“మహర్షీ! లోకన్సితి తెలిసినవాళ్ళు, తత్త్వజ్ఞానాన్ని అందుకున్నవాళ్లు, ఇతరుల దగ్గర తప్పులు వున్నా కోపం తెచ్చుకోరు. తప్పు లేని చోట కోపం తెచ్చుకోరని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మీరు తపస్వులు, మేము పదవులలో వుండి విధి నిర్వాహణ చేసే అధికారులం. ఒకరికి భయపడి మా విధులు మానుకోము. పెద్దలంటే గౌరవిస్తాం గానీ భయపడం. ఓ తెలివితక్కువ మహర్షీ నన్ను శపించాలనుకొని నీ తపస్సు పాడు చేసుకోకు.
“నేనెవరిని అనుకుంటున్నావు? నేను కాలాన్ని ఇప్పటికి కొన్ని కోట్ల (బ్రహ్మాండాలను మింగేశాను. కోట్ల కోట్ల బ్రహ్మలను, విష్ణువులను, మహేశ్వరులను, మింగేశాను. మీ బోటివాళ్ళు నాకో లెక్కా? వాళ్ళెవరూ నన్ను శపించలేదే! నువ్వు శపిస్తావా?
“ఇందరిని మింగుతున్నానంటే ఇది నా రాగద్వేషాలవల్ల గాదు. ఇది సృష్టిలో నాకొరకు ఏర్పడ్డ నియతి. నీరు పల్లానికి పోయినట్టుగా జీవులు కాలం నోట్లో పడతారు. నీకూ ఒక నియతి వుంది, నాకూ ఒక నియతి వుంది. అజ్ఞానంలో పడి నీ నియతిని నువ్వు పాడు చేసుకోకు.
యోన్నాసాతై. .ఆయంనలానలననారంయకాంంలలలాణలా.. (22౫ “ఐనా, నీ తెలివి ఏమైంది? నీ తపస్సు ఏమైంది? నీ దివ్యదృష్టి ఏమైంది? నీ తత్త్వజ్ఞానం ఏమైంది? కొడుకు మరణంచాడని ఇంత గందరగోళపడతావేమిటి? నీకు తెలియదా, జీవికి స్టూలదేహంకన్నా సూక్ష్మదేహమే పప్రబలమని? సూక్ష్మదేహ మంటే ఏమిటి? సంకల్పమే సూక్ష్మదేహం. మనస్సే సూక్ష్మదేహం.
, “నువ్వు తపస్సమాధిలో వుండగా, నీ కొడుకు యొక్క సంకల్ప శరీరం, మనోరథాలనే మార్గంలో చాలా దూరం వెళ్ళింది. అలా వెళ్ళేటప్పుడు మొదట కొంత సేపు భృగుపుత్ర శరీరంతోనే వెళ్ళింది.
“ఆ తరువాత అది స్వర్గలోకానికి చేరి, దేవతా శరీరాన్ని ధరించింది. ఆ శరీరంతో నాలుగు యుగాల కాలం గడిపింది. అక్కడినుంచి భూమి మీదపడి, దశార్ణదేశంలో బ్రాహ్మణశరీరాన్ని ధరించింది. ఆ పై జన్మలో కోసలదేశ రాజశరీరాన్ని ధరించింది. ఆ పై జన్మలో అడవిలో పల్లెటూరివాడు అయింది. ఆ తరువాత గంగాతీరంలో హంస అయింది. ఆ తరువాత సూర్యవంశంలో ఒక రాజైంది. ఆ తరువాత సౌర సాళ్వ దేశాలలో మంత్రాలు ఉపదేశించే గురువైంది. ఆ తరువాత విద్యాధరలోకంలో ఒక విద్యాధరుడైంది. తరువాత భూమి మీద ఒక మునిపుత్రుడైంది. ఆ తరువాత మద్రదేశ రాజైంది. ఆ తరువాత ఇప్పుడు నీ కొడుకు వాసుదేవుడనే బుషికి పుత్రుడై 'సమంగా” నదీ తీరాన తపస్సు చేసుకొంటున్నాడు.
“మహర్షీ! నీ కొడుకు మానసికంగా ఎత్తిన జన్మలన్నీ చెప్పలేదు. కొన్ని మరచిపోయాను. ఒకసారి వింధ్యపర్వతంమీద కిరాతుడయ్యాడు. మరో సారి సౌవీర దేశంలో మండలేశ్చ్వరుడయ్యాడు. మరోసారి త్రిగర్తదేశంలో గాడిదగా
యా “ాాాాాలలులలంలనాలానులావాలా. మృత్యుదోధ పుట్టాడు. మరోసారి కిరాత దేశంలో వెదురు పొదగా పుట్టాడు. మరో సారి నీళ్ళు లేని చోట జింకగా పుట్టాడు. మరో సారి తాటిచెట్టు మీద పాముగా పుట్టాడు. మరొక సారి మద్దిచెట్ల దగ్గర అడవికోడిగా పుట్టాడు. మరొకసారి మాంత్రికుడిగా పుట్టి విద్యాధరత్వాన్ని సాధించాడు.
“ ఆ విద్యాధర శరీరంతో ఒక కల్పకాలం పాటు వెలిగిపోయి, కల్పాంత సమయంల ప్రళయాగ్నిలో పడి మిడత లాగా భస్మమై పోయాడు. ఆ తరువాత మళ్లీ సృష్టి ప్రారంభమైనప్పుడు, వాసుదేవుడనే బ్రాహ్మడికి పుత్రుడిగా పుట్టాడు. అంటే, నీ పుత్రుడి మనస్సు ఇప్పుడు వాసుదేవవుత్రుడిగా రూపొంది, తపస్సు చేసుకొంటోంది. నీకు కావాలనుకొంటే నీ దివ్యదృష్టితో ఒకసారి చూసుకో.” గమనిక: ఇందాక వళిష్టముహర్ని స్వయంగా భృగుకుమారుడి కథ చెప్పేటప్పుడు ఇన్ని జన్మలు చెప్పలేదు. ఇప్పుడు మృత్యుదేవత ద్వారా చాలా జన్మలు చెప్పిస్తున్నాడు. ఈ కథా గమనంలో ఈ వివరాలు అవివక్షితాంశాలు. అంటే అప్రధానాంశాలు. అనేక జన్మలు, సుదీర్ధక్షాలమూ, గడిచాయి అన్నంతవరకే ఈ వాక్యాల తాత్పర్యంగా మనం స్వీకరించాలి. ఇక ఆ కాలానికీ, ఈ కాలానికీ , పొంతన లేదు. ఇక్కడే కీలకాంశం వుంది. భృగుమహర్షి లెక్కలో అది వెయ్యేళ్ళు, కాగా ఈ శుక్రుడి మనో రాజ్యపు లెక్కల్లో అది లక్షల యేళ్ళు - అనేది ఇక్కడి కీలకాంశం. ఈ విషయాన్ని ఉత్పత్తి ప్రకరణంలో లీలోపాఖ్యానంలో బాగా వివరించారు. గమనించండి. ఇక మనం మళ్లీ కథలోకి ప్రవేశిద్దాం.
అప్పటిదాగా హుంకరించిన భృగుమహర్షి ఈ మాటలతో
యో్కోవ్నాస్టాత. నాాతలరాతాతందాతననారనావంాుంండంంనా మెత్తబడిపోయి, చేతులు జోడించేసి, కాలదేవతను “భగవన్ అని పిలిచి, ఇలా అన్నాడు-
“భగవన్! మృత్యుదేవా! నీముందు మేమెంత? నియతి బలం వల్లనే నేను పుత్రవ్యామోహంలో పడిపోయాను. నీ నియతిని గమనించక నిన్ను శపించాలని చూశాను. తప్పు చేశాను. నేను శిక్షార్డుడ్డి. నువ్వు చెప్పినట్లుగానే దివ్యదృష్టితో చూశాను. సమంగా నదితీరంలో నా కొడుకు తపస్సు చేసుకొంటున్నాడు. ఇప్పుడు నాకు బాగా నిశ్చయమవుతోంది. ఈ శరీరంవల్ల మనస్సు రావటం లేదు. మనస్సువల్లే శరీరం వస్తోంది. పంచభూతమయంగా ఇంత గట్టిగా కనిపించే ఈ శరీరం మనస్సువళ్లే తయారు అవుతోంది.
మనో జగతి భూతానాం
ద్వే శరీరేత్ర సర్వగమ్ ;
మన ఏవ శరీరం హి
యేనేదం బావ్యతే జగత్! (సర్ద11- శ్లో18)
“కనుక ప్రతిమనిషికీ ఒకటికాదు రెండు శరీరాలు వున్నాయి. ఒకటి ఈ స్ఫ్టూలశరీరం. రెండవది ఆ మనస్సు. ఈ స్టూలశరీరం పరిమితమైనది. మనస్సనే శరీరం సర్వవ్యాపకమైనది. ఈ జగత్తు మొత్తాన్నీ సృష్టించేది అదే! ఇలా రెండు శరీరాలున్నట్లు కనిపిస్తున్నా, ఈ రెండు శరీరాలూ గూడా మనస్సే. మనస్సుకంటే వేరు కాదు. కాలదేవా! ఈ విషయం చాలా అద్భుతంగా వుంది.” మృత్యుదేవత: మహర్షీ! బాగా చెప్పావు. కానీ, జీవుడికి మనస్సు, శరీరము, అనేవి రెండు దేహాలన్నావే, అది అంత గట్టి మాట కాదు. నిజమైన గట్టి మాట ఏమిటంటే, ఈ మనస్సు చేసే మననంవల్ల జరిగే నిర్మాణమే లోకత్రయం-
యు లాలాలావయయలాకసరు శరం
“మ్రనో మనన నిర్మాణ మాత్ర మేతజ్ఞగత్రయమ్” (సర్గ1ే1- శ్లో29)
దీన్నిబట్టి ఏమి తెలుతోందంటే, ఈ ప్రపంచంలో “జడంగా కనిపించేదీ, చేతనంగా కనిపించేదీ,”- రెండూ కూడా మనస్సు చేసే నిర్మాణాలే. అంటే మనస్సు యొక్క రూపాంతరాలే. ఇది ఎలా కుదురుతోందంటే, జడాలనీ చేతనాలనీ ఇలా భేద వాసనలన్నీ రూపుగట్టిన ఈ మనస్సు యొక్క అసలైన శక్తి , దానికి అధిష్టానమైన సన్నాత్రం కావటం వల్లనే. అంటే, మనస్సుకు అధిష్టానంగా వున్న సన్మాత్రమే జడవస్తువుగానూ అస్తిత్వాన్ని పొందుతోంది. చేతన వస్తువుగానూ అస్తిత్వాన్ని పొందుతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అడుగున ఉన్న విత్తే కాండంగా, కొమ్మలుగా, ఆకులుగా, పువ్వులుగా, పళ్ళుగా, రూపాంతరం చెందినట్లే, అధిష్టానమైన ఆ సన్మాత్రమే, ఆ పరబ్రహ్మ పదార్థమే, సువిశాలమైన ఈ ప్రపంచంగా విజృంభిస్తోంది.
ఉన్నది ఒక్కటే అధిష్టానం. అదే సన్మాత్రం, అదే పరబ్రహ్మ. ఆ ఒక్కదాంట్లోంచే చిత్రవిచిత్రాలైన మనశ్చక్తులు కోటానుకోట్లుగా ఉద్భవిస్తున్నాయి. ఆ మనశ్శక్తుల్లో కొన్ని దేవతలైనాయి. కొన్ని మనుష్యులైనాయి. కొన్ని కీటకాలైనాయి. ఇలా జీవులలో అనేక రకాల తరగతులు ఏర్పడ్డాయి. క్రమంగా గురువులూ, శిష్యులూ ఏర్పడ్డారు.
మహర్షీ! ఇవన్నీ మనస్సు చలించటంవల్ల ఏర్పడిన వికారాలే. ఆ వికారాల్లో ఒక వికారం ఇప్పుడు సమంగా నదీతీరాన వుంది . పద, ఇద్దరం వెళ్ళి చూసి వద్దాం.
యోార్హత భృగు కాలదేవులిద్దరూ సరే అంటే నదే అనుకొని, ఆకాశమార్దాన ప్రయాణం చేసి, సమంగా నదీతీరానికి వచ్చి, కొంచెంసేపు వెతికి, నవీన భృగుపుత్రుడి దగ్గరికి చేరారు. నిర్వికల్పసమాధిలో వున్న ఆ కు(రవాడ్డి చూస్తూనే మృత్యుదేవత ఊరంత గొంతు చేసుకొని, “ఏమయ్యో! ఇదిగో నీ కొడుకు- అని బిగ్గరగా అరిచాడు. ఆ గావుకేకలకి సమాధి భంగమై, ఆ మునికుమారుడు మెల్లగా కళ్లు తెరిచాడు.
ఎదురుగా పవిత్రులైన బ్రాహ్మణులిద్దరు కనిపించేసరికి, మునికుమారుడు సగౌరవంగా నమస్కరించి, దగ్గరలో వున్న ఒక రాతిబండమీద కూర్చోబెట్టి, ఇలా మనవి చేసాడు-
“'బ్రాహ్మణోత్తములారా! మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా వుంది. ఎన్నివేల సంవత్సరాలుగానో తపస్సు చేస్తున్నా తొలగిపోని మనోమోహం మీ దర్శనంతో తొలగిపోయిన అనుభవం కలుగుతోంది. ఇంతకూ తమరు ఎవరు?”
ఈ మాటలు వినేసరికి భృగుమహర్షికి కళ్ళల్లో నీళ్ళు తిరిగినంతపనైంది. ఆయన త్వరగానే తేరుకొని -
“నాయనా! వెనుకటి జన్మలో నువ్వు నా పుత్రుడివి. నువ్వూ తపస్వివే కదా! ఒక సారి దివ్యదృష్టితో చూసుకో” అన్నాడు.
ఈ మాటలతో ఆ మునికుమారుడికి కళ్ళు లోపలికి తిరిగి, వాటిల్లో తన గత చరిత్రంతా చక్రాలు తిరిగినట్టుగా తిరిగిపోగా, గబగబా చూసేసుకొన్నాడు. కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చి, సంతోషంగా తండ్రికి నమస్కరించాడు. ఆశ్చర్యంవల్ల అతని నోటివెంట త్వరగా మాట రావటం లేదు. అతను మెల్లగా తనను తానే సంబాళించుకొని, ఇలా అన్నాడు-
యై ాాాలాాలాాలాయాలాా అదినో పాత దేహం
“రా! పరమాత్మ యొక్క నియతి చేసే పనులు ఎంత విచిత్రమైనవి?! నియతివల్ల కదా ఈ (ప్రపంచం అంతా చక్రం తిరిగినట్లు తిరుగుతోంది. ఆహా! ఎన్ని జన్మలను అనుభవించాను?! అన్నీ గుర్తు వున్నాయో, లేదో! ఎక్కడెక్కడో తిరిగాను. ఏమేమో అనుభవించాను. మంచీ, చెడూ, రెండూ చూశాను. ఇక ఇప్పుడు తిరుగుళ్ళు ఆగిపోయాయి. భ్రమలు తొలగిపోయాయి.
నాన్నగారూ! ఇంక లేవండి. మందర పర్వతం మీద ఆ నాడు నేను వదలివచ్చిన శరీరాన్ని చూద్దామని వుంది. ఇప్పుడది ఎండుటాకు లాగా ముడుచుకుపోయి వుండి వుంటుంది. నాకిప్పుడు ఏదీ కావాలనీ లేదు, వద్దనీ లేదు. కేవలం నియతిచేసే ఈ రచనను చూస్తున్నాను అంతే. అది చూడటం కోసమే ఉన్నాను. అంతకు మించి వేరే పని లేదు. పదండి బయలుదేరుదాం”,
ముని కుమారుడిలా అనడంతోటే భృగు కాలదేవులు సంతోషించి, సరే అని బయలుదేరారు. ముగ్గురూ జగత్తత్త్వాన్ని గురించి మాట్లాడుకొంటూ, ఆకాశమార్దాన ప్రయాణంచేసి, మందరపర్వతం మీద వున్న భృగుమహర్షి ఆశ్రమానికి చేరారు. అక్కడ శుక్రుడికి తన పాతశరీరం కనిపించింది.
అస్థిపంజరమై పడివున్న పాతశరీరం కనిపించేసరికి, అప్పటిదాకా వేదాంత వాక్యాలు వల్లిస్తున్న నవీన శుక్రుడికి ఎక్కడలేని దుఃఖమూ పొంగుకువచ్చింది. అతను కళ్ళనీళ్ళు కుక్కుకుంటూ, “నాన్నగారూ ! ఇదే నా పాతదేహం. ఎలా అయిపోయిందో చూడంది"
- అన్నాడు ఏడుపు గొంతుతో.
యోోన్నాస్తాత్రు. ఆదదనరానంరనరతందంావుదలండాతురాలతంననుంంనా భృగువు, కాలదేవుడు, బజెననలేదు, కాదనలేదు. నవీన శుక్రుడే దుఃఖం ఆపుకోలేక మళ్ళీ తనే మాట్లాడసాగాడు-
“నాన్నగారూ! చూశారా! ఆ నాడు మీరు ఆటపాటలతో ఆలించి, లాలించి, పెంచిన ఈ దేహం, ఇప్పుడెలా వుందో చూస్తున్నారా? మీ పెంపకంలో ఆ నాడు ఈ దేహం మదగజం లాగా పెరిగింది. ఆ తరువాత దేవలోకంలో దేవతాస్రీలతో విహరించింది కూడా ఈ దేహమే. ఆ తరువాత ఇది ఎప్పుడు మారిపోయిందో గుర్తు రావడం లేదు.
“క శదిరమా! ఎన్ని దశలు అనుభవించావు? నేను నీతో ఎన్ని విలాసాలు చేశాను? అలాంటి నువ్వు ఈ నాడు అస్థిపంజరమై పడి ఉన్నావా ?
“నిన్ను చూస్తేనే వైరాగ్యం పుట్టేటట్లుగా వుంది. కానీ ఇప్పుడు నాకు వైరాగ్యం ఎందుకు? నేను ఇప్పుడు చిత్తమనే పిశాచాన్ని వదలగొట్టుకొని ఆనందంగా ఉన్నాను. నాకు దుఃఖాలు లేవు, సుఖాలు లేవు, సందేహాలు లేవు, సంకల్పాలులేవు, నేను మనోనాశస్థితిలో వున్నాను. నేను జీవన్ముక్తస్థితిలో వున్నాను. ఇప్పుడు నువ్వు కూడా మననక్రియ లేకుండా, ఆలోచనా స్పందన లేకుండా, పడివున్నావు. అందుకు సంతోషంగా వుంది.
“దిష్ట్యా పశ్యామ్యమననాం- వనే తను మిమామహమ్ ”
(సర్ద 15-శ్లో26)
ఈ కథనం వింటున్న శ్రీరాముడు కొద్దిగా మొహం చిట్లించి ఇలా అడిగాదు- రాముడు: గురుదేవా ! ఈ శుక్రుడు బాధపడుతున్నాడా? సంతోష పడుతున్నాడా? అదీగాక, అతనికిప్పటికి చాలా శరీరాలు గడిచినాయి
అదిగో సాతదేహం గదా! ప్రస్తుతం జీవించి వున్న శరీరం ఒకటి బాగానే వుంది గదా! ఎప్పుడో రాలిపోయి, ఎండిపోయిన, ఆ పాతశరీరం మీద ఇంత ప్రేమ ఎందుకు? భృగుమహర్షి అంతటి గొప్పవాడికి పుట్టిన దేహమనే అభిప్రాయంతోనేనా?
వశిమ్టడు: అదేమీ కాదు. జీవుల రాగద్వేషాలన్నీ కర్మలను బట్టే నడుస్తూ వుంటాయి. ఈ శుక్రుడు అనే జీవుడు పూర్వకల్పంలో గొప్ప తపస్సుచేసి, పై కల్పంలో (గ్రహోధిపత్యాన్నిరాక్షస గురుత్వాన్నిి పొందాలని ఆశించాడు. ఆ నాటి ఆ కర్మలన్నీ ఈ కల్పంలో భృగు శరీరం ద్వారా, శుక్రకుమార శరీరంగా రూపొందాయి. వెనుకటి కల్పం నాటి శుక్రజీవుడు, ఈ నాటి భృగుపుత శరీరంద్వారా, ఆ కర్మఫలాలు అన్నీ అనుభవించవలసి వుంది.
ఆ ఫలాలు, రేకులు విచ్చుకున్నట్టుగా విచ్చుకొనే లోపలే యువశుక్రుడికి మానసిక సంక్షోభం కలిగి, ఆ సంక్షోభంలలో కలిగిన మనోబలంవల్ల పాతదేహం రాలిపోయి, కొత్తదేహాలు బోలెదన్ని పుట్టాయి.
అయితే, ఈ కొత్తగా పుట్టిన దేహపరంపరకు వెనుకటి కల్పం నుంచి తరుముకొని వస్తున్న కర్మపుంజాల బలం లేదు. ఇవన్నీ ఇప్పుడిప్పుడే కొత్తగా పుట్టిన కర్మలవల్ల తయారై, వాటికి తగ్గ ఫలితాలను అనుభవింపజేసేసి, అంతటితో ఆయువు తీరిపోయి, రాలిపోతూ వచ్చాయి.
“సమంగా నదీతీరాన మునికుమార శరీరం ఒకటి వుంది. అది ఇంకా జీవించే వుంది. అది ఇంకా కొంచెం కర్మ ఫలాన్ని ఇవ్వవలసి గూడా వుంది. కానీ ఇది చాలా స్వల్పఫలం.
అల నాటి భృగుకుమార శరిరం వుందే , అది ఇవ్వవలసిన
యోవాన్టతి కర్మఫలాలు ఇంకా కోటానకోట్లుగా వున్నాయి. ఈ కల్పాంతం దాకా అది కర్మఫలాలు అందించవలసి వుంది. ఆ కారణంవల్లే దాంట్లోంచి (ప్రాణం ఎగిరిపోయినా, అది పూర్తిగా చివికిపోలేదు. పురుగులు గూడా దాన్ని కొరకలేదు.
అంత (ప్రబలమైన కర్మఫలం దాంట్లో వుండటం చేతనే, శుక్రజీవుడికి దానిమీద మోహం వదిలిపోకుండా వుంది. ఎంతటి విరాగులకైనా, ఎంతటి జ్ఞానులకైనా, దేహధారులకు ఇది సహజం. దీన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు. అజ్ఞానులకే కాదు, జ్ఞానులకు కూడా దేహం విషయంలో ఈ నియమం తప్పదు.
ఆకాశంలో వుండే సూర్యబింబం సుస్థిరంగా వున్నా, చెరువులో ప్రతిబింబంగా వుండే సూర్యబింబం కదులుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే, జ్ఞాని అయినవాడు లోకవ్యవహారంలోకి వచ్చేసరికి, అజ్ఞాని లాగా, చలిస్తున్నవాడి లాగా, కనిపిస్తాడు.
“ఐతే ఎవడు జ్ఞాని? ఎవడు అజ్ఞాని వాళ్ళను గుర్తు పట్టడం ఎలా? అని అడుగుతావేమో, చెపుతా విను. ఎవడికి కర్మేంద్రియాలు పనిచేస్తున్న సమయంలో కూడా జ్ఞానేంద్రియాలు నిస్సంగంగా వుంటాయో వాడు జ్ఞాని. వాడు జీవన్ముక్తుడు. ఎవడికి కర్మేంద్రియాలు పని చేయని సమయంలో కూడా, జ్ఞానేంద్రియాలు సంగసహితంగానే వుంటాయో, వాడు అజ్ఞాని. వాడు బద్భుడు. దీనిని బట్టి ఏమి తేలుతోందంటే, సుఖదుఃఖాలకు, బంధమోక్షాలకు, కారణం జ్ఞానేంద్రియాలే కానీ కర్మేంద్రియాలు కావు.
కనుక, అప్పటికి శుక్రుడు ముక్తుడదైనప్పటికీ, అతని జ్ఞానేంద్రియాలకు విషయాలతో సంగం లేనప్పటికీ, కర్మఫల శేషాన్ని బట్టి పూర్వదేహం మీద అభిమానమనే వ్యవహారం నడిచిపోతోంది. రామా! ఇక పై కథ విను.
కనా క్రొత్త దీహంరోంబణి పాఠ దేహాంలోకీ
మునికుమారుడి రూపంలో వున్న శుక్రుడు తన పాత దేహాన్ని చూసి, ఆ విధంగా తొట్రుపడుతుండటం గమనించిన కాలదేవత గంభీర స్వరంతో ఇలా అన్నాడు-
“భృగుపుత్రా! సమంగా నదీతీరాన తపస్సుకు పనికి వచ్చిన ఈ శరీరంతో పని అయిపోయింది. ఇక దాన్ని విడిచిపెట్టి ఈ పాతశరీరంలోకి ప్రవేశించు. ఇది సుదీర్ధ్హతరమైన తపస్సులకు అర్హ మైనది. దీనితో తపస్సు చేసి, రాక్షసగురు పదవిని పొంది, జీవన్ముక్తుడవై కల్పాంతం వరకూ జీవించి, అప్పుడు ఈ శరీరాన్ని కూడా పరిత్యజించి, విదేహకైవల్యం పాందు. మీ ఇద్దరికీ శుభమగుగాక! నేను వెళ్లి వస్తాను.”
ఇలా అంటూనే కాలదేవత అంతర్భ్థానమైపోయాడు. ఈ జరిగిన సంథుటనల వరంపరలో కాలదేవుడి కరుణాబుద్ధిని తలచుకొని , తండ్రీకొడుకులిద్దరూ ప్రేమతో కంటతడి పెట్టుకున్నారు.
అంతలోనే ఇద్దరూ తేరుకున్నారు. నవీన శుక్రుఢు అప్పటికే యోగసిద్ధులను సాధించినవాడు గనుక, తన మనస్సును బంధించి, పరకాయ ్రవేశ విద్యను ఆశ్రయించి, మునిపుత్ర దేహాన్ని వదిలిపెట్టి, తన పాతదేహంలోకి ప్రవేశించాడు. సరిగ్గా అదే సమయానికి భృగుమహర్షి నీళ్ళు అభిమంత్రించి, తన కుమారుడి పాత శరీరంపై చల్లాడు. దాంతో ఎండుకట్టె వున్నట్టుండి చిగురించినట్లుగా, శుక్రుడి పురాతన శరీరంలోని నాడులన్నీ (ప్రాణశక్తితో నిండి, రక్త మాంసాదులన్నీ సమంగా పేరుకొని, ఆ శరీరం నవనవలాడుతున్న యువక శరీరంగా మారిపోయింది.
క న ననా మా
ఒక పక్క ప్రాణం తొలగిపోయిన మునికుమారుని శరీరం పక్కకి ఒరిగిపోతూ వుండగా, మరో పక్కకొత్తగా ప్రాణం పోసుకొన్న భృగుకుమార పురాతన శరీరం చిరునవ్వులు చిందిస్తూ లేచి నిలబడి, తండ్రికి సాష్టాంగ వందనం చేసింది.
పుత్రప్రేమ ఎంతటి వారినైనా ఊపేస్తుంది. భృగుమహర్షి అంతటివాడిని కూడా అది తలక్రిందులు చేసేసింది. ' ఈ శదీరం నా వల్ల పుట్టిందనుకోవటం ఏమి తెలివిరా!? అనుకొంటూ ఆయన తనలో తనే నవ్వుకుంటున్నాడు. ఐనా! “వీడు నా కొడుకు' అనే ప్రీతి ఆయనను ముంచెత్తేసింది. ఆయన పుక్రుడ్డి గట్టిగా కౌగిలించుకొని దీవించాడు.
త్వరలోనే వారిద్దరూ తేరుకొని మామూలు స్థితికి వచ్చేశారు. వచ్చేసరికి ఒక సమస్య వారి ఎదురుగా వుంది. సమంగా నదీతీర మునీశ్వరుడి పీనుగే ఆ సమస్య!
ఆ శవాన్ని చూసేసరికి, ఇద్దరి ప్రేమల పొంగూ కొంచెం తగ్గింది. ఒక్కక్షణం ఇద్దరూ ఆలోచించారు. ఇద్దరూ ఒకే నిర్ణయానికి వచ్చారు. లోకాచారాన్ని పాటించి తీరవలసిందే అనుకొన్నారు. ఇద్దరూ కలిసి ఎండు పుల్లలు పోగేసి, ఆ శరీరానికి దహనం చేశారు.
ఆ తరువాత తండ్రీ కొడుకులిద్దరూ తపస్సు చేసుకొంటూ అక్కడే వుండిపోయారు. క్రమంగా భృగుమహర్షి సప్తర్షులలో ఒకడైనాడు. శుక్రుడు రాక్షస గురువయ్యాడు.
ఇక్కడితో భార్గవోపాఖ్యానం పూర్తయింది. ఈ కథలోని సంకేతాల గురించి, సిద్ధాంతాల గురించి వశిష్టమహర్షే వివరణ
యు. ాలాలలనజయముంచయుాయాాాయానా. తనీ దేవోన్ని తనే తసంబెట్టాడు ఇవ్వబోతున్నాడు. బాగా అర్ధం కావడంకోసం ఈ కథను మన పద్ధతిలో మనం కొంత విశ్లేషణ చేసుకొందాం.
ప్రపంచంయొక్క స్థితి మనస్సు మీద ఆధారపడి వుంది- అని నిరూపించటానికి వశిష్టుడు ఈ కథ మొదలు పెట్టాడు. ఈ నిరూపణకు వెనుక చెప్పిన లీలోపాఖ్యాన, లవణోపాఖ్యానాలే చాలు. ఐనా కొత్తది చెబుతాను అంటూ, ఈ కథ చెప్పాడు. ఆ రెండు కధలకు మించి ఈ కథలో విశేషమేమిటి?
భృగువు అంటే కొండ చరియ. అంటే బండరాతి పలక, దాంట్లోంచి ఏ మొక్కా మొలవదు. కానీ, చిత్రంగా అక్కడ శుక్రుడు జన్మించాడు. శుక్రం అంటే వీర్యం. అంటే విత్తు. విత్తు మొలవటానికి తల్లి గర్భమో , నేలగర్భమో అలాంటిది ఏదైనా కావాలి. కానీ, ఈ శుక్రుడు అలాంటి గర్భాలతో పని లేకుండానే, ఒక స్వర్గలోకాన్ని ఉనికిలోకి తెచ్చాడు. చివరికి వేల సంవత్సరాలు తపస్సుచేసి సమంగా నదీతీర మునికూమారుడి శరీరాన్ని ఉనికిలోకి తెచ్చాడు.
కథాగమనంలో వీటికి ఉత్పత్తి ఎక్కడ వుందో కనిపించదు. ఉనికి మాత్రం కనిపిస్తుంది. ఎంత గట్టి ఉనికి అంటే, చివరికి సమంగా నదీతీర మునికుమారుడి శరీరం అనేది తగలబెడితేగానీ పోలేదు. ఎవరు తగులబెట్టారు? ఎవడు దాన్ని సృష్టి చేశాడో వాడు, వాడిని సృష్టి చేసినవాడు. ఇద్దరూ కలసి తగులబెట్టేశారు అంతటి ఉనికిని, అంతటి స్థితిని, సాధించగలిగింది ఎవరంటే శుక్రుడి మనస్సే,
కథాగవునంలో మనం గమనించవలనీన మరో ముఖ్యాంశం, పాతశుక్రుడి మరణం. మరణమంటే ఏమిటి? అందరూ చెప్పేమాట నిజమైతే శరీరంలోంచి ప్రాణం లేచిపోవటమే మరణం. ఇక్కడ శుక్రకుమారుడు పాతశరీరంలో వుందే స్వర్గసుఖాల
యయోవాస్టిది లాలు ఫ్రై భావన మొదలుపెట్టాడు. ఒక స్వప్న ప్రపంచం లాగా, ఒక పగటి కలల గాలిమేడ లాగా, ఆ స్వర్గలోకంయొక్క ఉనికి ప్రారంభమైంది. అతడు దాన్ని సృష్టి చెయ్యాలని సంకల్పించలేదు. అందుచేతనే దాన్ని సృష్టి చెయ్యలేదు. అప్పటికే వున్న అప్సరస వెంటబడి నడుస్తూ, అప్పటికే వున్నదని తను భావిస్తున్న స్వర్గలోకంలోకి ప్రవేశించాడు. సుఖాలను అనుభవించాడు. ఈ ప్రక్రియలో ఆ భావన ఎప్పుడు గట్టి పడ్డదో, దానికి యే యే పాత సంస్కారాలు జోడై జన్మ పరంపర ఏర్పడిందో అతనికే తెలియదు. అక్కడ ఆ భావన గట్టిపడుతున్న కొద్దీ ఆ మనస్సుకీ, దానిని ఆశ్రయించుకొని ఉన్న ప్రాణానికీ, పాత శరీరంతో పని తగ్గిపోయింది. అందువల్ల అది మరుపున పడిపోయింది. ఆ ప్రాణం ఎప్పటికప్పుడు కొత్త శరీరాలవెంటే పరుగులు తీసింది. అందువల్ల ఆ ప్రాణం పాత శరీరాన్ని పట్టించుకోకుండా వదిలేసింది.
మామూలు లోక పద్ధతి ప్రకారం జీవీకి కాలం తీరిపోయాక మృత్యుదేవత వచ్చి ప్రాణాలు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ జీవికి పాత శరీరం వదిలి పెట్టటం ఇష్టంలేక గింజుకొంటూ వుంటాడు. చివరికి మృత్యుదేవతే గెలిచి (ప్రాణాలను పీక్కుపోతుంది. ఈ లెక్కలో ఆలోచిస్తే శుక్రకుమారుడి పాత శరీరం దగ్గర జరిగింది మరణమా? కాదా?
ప్రాణం పోవటమే మరణమయ్యేటట్లైతే అది మరణమే. కానీ, ప్రాణం వట్టిగా ఎందుకు పోతుంది? మృత్యుదేవతో, కాలదేవతో, ఎవరో ఒకరు లాక్కుపోతేనే పోతోంది- అనేటట్లైతే అది మరణం కాదు. కానీ, మృత్యువూ, కాలమూ, దేవతా, అనే పదాలు ఉపయోగించారే, వాటికి అర్ధం ఏమిటి?
ఆఖై “ాానాానాానానాజయాయా. శీనీ దేహార్ని తనే తగంటెట్టాడు
ఈ విచారణ ఎవరూ చేయరు. భృగుమహర్ష్నీ చేయలేదు. కానీ, అక్కడ జరిగింది మరణమే అని ఖాయం చేసుకొని, దానికి కారణం మృత్యుదేవతే అని నిశ్చయం చేసుకొని, ఆ దేవతను శపిస్తానని బయలుదేరాడు. ఇది క్రోధక్రియ. ఇది పుత్రశోకంవల్ల పుట్టింది. పుత్రశోకం ప్రేమవల్ల పుట్టింది. కాగా ప్రేమ, శోకము, (క్రోధము అనే వాటికి భృగుమహర్షి యొక్క పూర్వపుణ్యంతోడై, మృత్యువు అనే శక్తి అక్కడ సాకారంగా ్రకాశించింది. అలా ప్రకాశించింది గనుక అది దేవత (దేవత= స్వయంగా ్రకాశించేది) అదే మృత్యుదేవత. అదే కాలదేవత.
ఆ కాలదేవత వచ్చి “వ్పీ కొడుకుది మరణం కాదంది. నీ కొడుకు ఫలానా చోట బ్రతికే వున్నాడు, చూసుకో” అంది. తీరా చూస్తే అది నిజమే. భృగుమహర్షి ఆశ్చర్యపోక తప్పలేదు.
బ్రహ్మదేవుడు శరీరాలను సృష్టిచేస్తాడనీ, జీవులు వాటిలోకి ప్రవేశిస్తారనీ, ప్రవేశించిన జీవులను కొంతకాలానికి కాలదేవుడు జుట్టు పట్టుకొని బయటికి లాగేస్తే అప్పుడు అది మరణం అవుతుందనీ, లోకంలో అందరూ చెప్పుకొనే సిద్ధాంతం. ఇక్కడ అది కదిలిపోయింది.
ఇక్కడ ఈ సమంగా నడీతీర మునికుమారుడి శరీరాన్ని బ్రహ్మ దేవుడు తన పంచభూతాలతో సృష్టి చేశాడనేందుకు వీలులేదు. పోనీ ఇది శుక్రకుమారుడి స్వప్నలోక శరీరనునీ, ఊహామాత్రమనీ తీసి పారేసేందుకు వీలులేదు. ఇది స్వప్నం వంటిదే, కానీ స్వప్నం కాదు. ఇది ఇంద్రజాలం వంటిదే. కానీ ఇంద్రజాలం కాదు. తర్మం ప్రకారం ఇది స్టూలశరీరం కావటానికి వీలులేదు. కానీ, ఇది పూర్తిగా స్టూలమే. దీని వెనకాల జన్మపరంపరను పరిశీలిస్తే, దానికి ఆది ఎక్కడో, ఆ మొదటి జన్మను ఎవరు సృష్టించారో అర్ధం కావటం లేదు. ఐనా దీని ఉనికి సుస్థిరమైనదే.
యోోన్యాస్టిత ఆలాలుంంుంరుతునాలననలనులులా ఈ పరస్పర వైరుధ్యాలకు భృగుమహర్షి దగ్గర తాత్విక సమాధానాలే తప్ప, లౌకిక సమాధానాలు లేవు. అందుకే ఆయన తత్వదృష్టితో తోకముడిచి కాలదేవుడి వెంట నడిచాడు. ఒక జీవి తను విడిచిపెట్టిన శరీరాన్ని తానే తగల బెట్టుకోవడమనేది ఈ కథలో పతాక దృశ్యం. నిజానికి అది తను సృష్టి చేసిన శరీరం అనడం కన్నా తనవల్ల స్థితిలోకి వచ్చిన శరీరం అనడం మేలు. ప్రతివాడూ, ప్రతిరోజూ తన స్వప్న శరీరాన్ని మాయం చేసేస్తున్నాడు గానీ, తగులబెట్టటం లేదు. శుక్రకుమారుడు మునికుమారుని శరీరాన్ని మాయం చేయలేక తగలబెట్టవలసి వచ్చింది. ఎందుకంటే, దాని స్థితిలోని స్థూలత్వం అంత గట్టిగా వుంది. పూర్వం లీలోపాఖ్యానంలో సూక్ష్మ శరీరానికీ, స్టూలశరీరానిక్రీ మధ్య పెద్ద తేడా లేదనీ, ఏ భావనైతే సూక్ష్మప్రపంచాన్ని కలిగిస్తుందో, ఆ భావనే ఇంకా ఇంకా దృఢపడితే, ఆ ప్రపంచం క్రమంగా స్థూలమైపోతోందని చెప్పారు. ఆ సిద్ధాంతానాన్నే ఇక్కడ మునికుమార శరీరానికి కూడా మనం అన్వయించుకోవాలి. ఐతే, ఇలాంటి స్టూలశరీరాలను సృష్టి చేయగలిగినంతటి మనోబలం శుక్రుడు లాంటి కొద్దిమందికే వుంటుందా? మనబోటి సామాన్యులందరికీ వుంటుందా? అనే ప్రశ్న ఒకటి వుంది. దానికి వెంటనే మనం “ఆ శక్తి అందరికీ వుండదు. ఎవరో కొందరు తపశ్శాలులకు మాత్రమే వుంటుంది”- అని సమాధానం చెప్పాలని ఉరకలు వేస్తాం. అయితే, ఈ ప్రశ్న రామ వశిష్టుల చర్చల్లో రాబోతోంది గనుక, వళిస్టడేమంటాడో అక్కడ గమనిద్దాం. ఇప్పుడు మనం రామా వశిష్టుల చర్చలోకి ప్రవేశిద్దాం.
(౩ సంకర్పి సిద్ధి రాముడు: గురుదేవా! కథంతా విన్నాను, చాలా బాగుంది. మీ శుక్రుడు చాలా గొప్పవాడు. అప్సరస కనిపిస్తే దాని వెనకాల స్వర్గంలోకే వెళ్ళిపోయాడు. స్వర్గలోక సుఖాలను అనుభవించాలనుకొంటే అనుభవించేశాడు. రాజ్యాలు ఏలాలనుకుంటే ఏలేశాడు. చివరికి తపస్సు చేయాలనుకొంటే అదీ చేసి, జీవన్ముక్తుడిపోయాడు. అతను ఏది సంకల్పిస్తే అది జరిగిపోయింది. అందరి సంకల్పాలూ అలా ఫలించవేమిటి?
వశివ్చుడం: రామా! సంకల్పాలు థలించటానికి రెండు పద్ధతులున్నాయి. ఒకటి చిత్తశుద్ధివల్ల లభించే సంకల్పసిద్ధి. దీనినే సత్య సంకల్పసిద్ధి అంటారు. రెండవది ప్రాణం గొంతులోంచి పైకి లేచే సమయంలో ఏ కర్మవాసన పైకి పొంగుకు వస్తుందో అది సత్యం అవుతుంది. వీటిలో మొదటిది సత్యసంకల్పసిద్ధి. ఇది శుక్రుడి లాంటి ఉత్తమ జీవులకు లభిస్తుంది. మరణకాలంలోని సంస్మ్కారాన్నిబట్టి, పరిమితమైన సత్యసంకల్పత్వం ఇతరులకు లభిస్తుంది.
రాముడు: శుక్రుడూ అందరిలాగే పుట్టాడు, అతనికి ప్రత్యేకసిద్ధి కలగటానికి కారణమేమిటి?
వశిమ్ణడు: ఈ శుక్రుడు జరిగిపోయిన కల్పంలో తీవ్రమైన కర్మోపాసనలు చేశాడు. అందువల్ల అతని చిత్తంలోని దోషాలన్నీ అడుగంటిపోయాయి. అటువంటి మనస్సుతో ఆ జీవి ఈ కల్పంలో మొట్టమొదటిసారిగా పుట్టాడు. అందుచేత ఇప్పుడు ఈ జీవికి కొత్తగా దోషాలేమీ అంటలేదు. ఈ జీవి జన్మలో బీజదోషాలు లేవు. అంటే,
తండ్రివల్ల నచ్చే దోషాలు లేవు. జాతి దోషాలు లేవు. అంటే, వంశంవల్ల వచ్చే దోషాలు లేవు. కాబట్టి ఈ జన్మ పవిత్రమైనది. అందుకే ఇతనికి సత్య సంకల్పసిద్ధి లభించింది. ఇప్పటి (బ్రహ్మగారు ఇతనికి (గ్రహాధికార పదవికి, రాక్షసగురు అధికార పదవికి ఎంపిక చెయ్యటానికి కారణం కూడా ఇదే. అందువల్ల ఇతను సంకల్పించినది ఏదీ అసత్యం కావటానికి వీలులేదు.
ఇక సామాన్య మానవులంటావా, వాళ్ళ జన్మల్లో ఇందాక చెప్పిన దోషాలలో కనీసం ఒక్క దోషమైనా వుంటుంది. అందువల్ల వాళ్ళు సత్యసంకల్పులయ్యే సావకాశం లేదు.
వాళ్ళల్లో కొంతమంది మళ్ళీ తపస్సాధనలు చేని, రాగద్వేషాలు పోగొట్టుకొని, చిత్తశుద్ధిని సాధించుకుంటారు. అప్పుడు వాళ్ళు సత్యసంకల్పులౌతారు,
ఇక సామాన్యమానవులు వున్నారే, వాళ్ళకు మరణకాలంలో ఏ సంస్కారాలు మొలకెత్తుతాయో, అంటే స్మరణకు వస్తాయో అలాంటి వాసననుబట్టి, పై జన్మలో సుఖదుఃఖాలను అనుభవిస్తూ వుంటారు. శుక్రుడు కల్పించుకొన్న జన్మ పరంపరలో ఇలాంటి జన్మలు కూడా వున్నాయి.
దీన్నిబట్టి ఏమి తెలుస్తుందంటే -
స్వష్నసంకల్పనగర వ్యవహారాః పరస్పరమ్:
పృథగ్యథా న దృశ్యన్తే తదైతే సంసృతి బ్రమాః (సర్గ 17-శ్లో10)
ఈ కనిపించే నంసార రూవమైన (పవంచాలన్నీ స్వప్నలోకాలవంటివి. పగటి కలల గాలిమేడల వంటివి. అందువల్లే ఎవడి ప్రపంచం వాడిదే. ఎవడి భ్రాంతి వాడిదే. ఎవడి సుఖదుఃఖాలు వాడివే.
యు వాజజాజవాలనాంవాలంనాలానాంాలా... సైనికుల స్త్రస్న పై్భాలు రాముడు: గురుదేవా! అన్నీ భ్రాంతులే. ఒప్పుకొన్నాం. కానీ ఈ (భ్రాంతులు ఎలా వస్తాయి? వాసనలవల్ల వస్తాయి. వాసనలు ఎలా వస్తాయి? పూర్వానుభవాలవల్ల వస్తాయి. మీ శుక్రుడు ఈ కల్పంలో పుట్టింది ఇదే మొదటిసారి గదా! అతను ఇంతకు ముందు స్వర్గలోకాన్ని చూడలేదు గదా! కనుక, అతనికి స్వర్గలోకానికి సంబంధించిన వాసనలు ఉండటానికి వీలులేదు గదా! అలాంటప్పుడు అతడు ఊహా (ప్రపంచంలో స్వర్గలోకానికి వెళ్ళటం, అక్కడ న్వర్దభోగాలు అనుభవించటం, అక్కడి పుణ్యం క్షీజించి, జన్మ పరంపరలను పొందటం- ఇది అంతా ఎలా కుదురుతుంది? వశిష్ణడు: రామా! వాసనలు పూర్వానుభవాలవల్ల మాత్రమే కాదు, విన్నమాటలవల్ల, చదివిన గ్రంథాలవల్ల గూడా కలిగే సావకాశం వుంది. శుక్రుడి విషయంలో తండ్రి చెప్పేమాటలు, ఆయన బోధించిన శాస్త్రాలు అతనికి స్వర్గవాసనను, జన్మ పరంపర వాసనను కలిగించాయి. లోకంలో అనుభవం గూడా ఇలాగే వుంది. మనం కంటితో చూడకపోయినా, చెవితో విన్న విషయాల గురించి కలలు కంటూనే వున్నాం గదా !
అదీగాక, (ప్రతివాడూ మెలకువలో ఒక (ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఇలా చూసేవాళ్ళందరూ కలిసి మేమంతా ఒకే ప్రపంచాన్ని చూస్తున్నాం - అనుకుంటున్నారు. ఇది నిజానికి సైనికుల స్వప్న భ్రాంతి లాంటిది. అంటే -
పెద్ద యుద్ధం నడుస్తోంది. రాత్రిపూట సైనికులందరూ నిద్ర పోతున్నారు. అందరికీ యుద్ధం గురించిన కలలే వస్తున్నాయి.
యోవాస్టైతి వడా 'ప్రతివాడి కలలోనూ ఒక సైన్యం యుద్ధం చేస్తోంది. నిజానికి ఎవడి స్వప్పసైన్యం వాడిదే. కానీ మెలకువలోకి వచ్చి, వాడు పక్కవాళ్ళతో “మన సైన్యం యుద్ధం చెయ్యటం నాకు కలలో కనిపించిందరా” అంటాడు, వీడికి కలలో కనిపించింది మన సైన్యం కాదు. మన సైన్యం వంటి మరో సైన్యం. కానీ, ఆ సైనికుడు ఆ భేదాన్ని గుర్తించడు. లోకంలో జనమంతా చూసే ప్రపంచ పరిస్థితి కూడా అదే. అందుకే 'ఈ ప్రపంచం ఒక దీర్ధ స్వప్నం” అని పెద్దలు అంటూ వుంటారు - “దీర్ధస్పుప్పస్విదం జగత్", (సర్గ 17-శ్లు 28) రాముడు: గురుదేవా! ఈ మాట మీరు పూర్వం గూడా అన్నారు. ఇది నన్ను ఆలోచనలో పదేస్తోంది. ప్రతివాడూ తన ప్రపంచాన్ని వేరు వేరుగా కల్పించుకొంటున్నాడు. ఎవడి కల వాడిదే. అలాగే ఎవడి ప్రపంచం వాడిదే. అని గదా మీరంటున్నారు. అలా ఐతే ఇద్దరు వ్యక్తుల ప్రపంచాలు ఎప్పుడైనా, ఒక్క సారైనా, ఒకదానితో ఒకటి కలుసుకుంటాయా? కలుసుకోవా? ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే, ఈ ప్రపంచం కలలాంటిదైతే, ఈ ప్రపంచంలో నాకు తారసపడి నాకు జ్ఞానోపదేశం చేసే గురువు కూడా, ఆ కలలోని భాగమే గదా! అలాంటప్పుడు ఆ గురువు, ఆయన చేసే ఉపదేశం సత్యం ఎలా అవుతాయి? ఆ ఉపదేశమే అసత్యం అయితే నాకు మోక్షం ఎలా వస్తుంది? నాకే గాదు ప్రపంచంలో ఎవరికీ మోక్షం రావడానికి వీలులేదు. మీ సిద్ధాంతం ఒప్పుకొంటే ఇదీ చిక్కు
అడధిరిదాణలధరరాణంధిందాంధిదాజంం0దాంం00దా. ర్రెైండ్రు నునోరాజ్యాలు కలుస్తాయా వశిష్టుడు: రామా! నీ ప్రశ్నకు సమాధానం మెట్లు మెట్లుగా చెబుతాను. నీ ప్రశ్నకు సారాంశమేమిటంటే, రెండు మనో రాజ్యాలు కలుస్తాయా, కలవవా?- అని. రెండు మనస్సులు పూర్తిగా కలసపోవటం మనకు ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తోందా? ఎక్కువగా కనిపించవు గానీ, నూటికి నూరుపాళ్ళు శుద్ధంగా వున్న మనస్సులు రెండు దొరికితే, అవి మాత్రం కలిసి తీరుతాయి. ఎందుకంటే, ఆ రెండు చిత్తాలలోనూ ప్రపంచాలే వుండవు. రెండూ పరిశుద్ధ పరమాత్మ స్థితిలోనే వుంటాయి.
ఇక మలిన చిత్తులు వక్కవారి మనోరాజ్యాలను గుర్తించేందుకు రెండు ఉపాయాలు వున్నాయి. ్రతిజీవి అంతః కరణలోనూ, అంతర్గతంగా, అధిష్టానరూపంగా పరమాత్మ చైతన్యమే వుంది. కనుక ఒకడు తనలో గల పరమాత్మ చైతన్యం మీద ఏకా(గ్రతను సాధిస్తే, అప్పుడు ఆ చైతన్నాన్ని ఇతర మనస్సులలో గల చైతన్యాలతో అనుసంధానం చేయవచ్చు. అలా చేస్తే ఆయా మనస్సులలో వుండే మనోరాజ్యాలు వీడికి గోచరిస్తాయి.
అలా అన్ని ఉపాధులతోనూ అనుసంధానం చేతకాకాపోతే, తను కోరిన ఒక ప్రత్యేక ఉపాధితో అనుసంధానం చేసుకోవచ్చు. ఇది రెండవ ఉపాయం.
ఈ రెండూ ఎవరో యోగీశ్వరులు మాత్రమే అనుసరించే ఉపాయాలేనేవమో అనుకుంటున్నావేమో?! యోగీశ్వరులు అనుసరించేదీ ఈ ఉపాయాలే! మామూలు జీవులు అనుసరించేదీ ఈ ఉపాయాలే!!
యోనాస్హతి
మామూలు సామాన్య జీవుల విషయుంలో ఏం జరుగుతోందంటే, ఒక జీవికి ఏ వస్తు సముదాయం కర్మానుభవాను గుణంగా వుటుందో, అలాంటి లోకము, అలాంటి ప్రదేశము, అలాంటి వస్తువులు, మాత్రమే అతని చుట్టూ రూపొందుతాయి. అంటే అలాంటి ప్రపంచం మాత్రమే అతనికి గోచరమవుతోంది. అంటే, అలాంటి ప్రపంచాన్ని మాత్రమే అతను తన జ్ఞానేంద్రియాలతో తెలుసుకోగలుగుతాడు. మిగిలిన లోకాలూ, ప్రదేశాలూ, వస్తువులూ, లేవని గాదు. ఉన్నా వీడికి తెలియదు.
మరో జీవికి ఇలాంటి లోకము, ఇలాంటి ప్రదేశము, ఇలాంటి వస్తువులు అనుభవానికి పనికి వచ్చే కర్మశేషం వుంటే, అప్పుడు ఆ జీవి గూడా ఈ ప్రపంచంలోకే చేరుతాడు. అంటే, ఆ ఇద్దరు జీవులూ తమ కర్శశేషాలలో వుండే సామాన్యాన్నిబట్టి, ఒకరి ప్రపంచంలోకి ఒకరు ప్రవేశిస్తున్నారు. అంటే, ఆ రెండు మనస్సులకు పరస్పర సంబంధం ఏర్చడుతోంది. ఐతే, ఇది పాక్షిక సంబంధమే గానీ పరపూర్ణ సంబంధం కాదు.
ఇలాంటి సామాన్య జీవుల్లోనే కొందరు పై తరగతి వాళ్ళుంచారు. వాళ్ళు హఠయోగాది అభ్యాసంచేత మనస్సును కొంత శుద్ధం చేసుకొని పరకాయ ప్రవేశాది విద్యలను సాధిస్తారు. ఆ విద్యవల్ల వాళ్ళు ఇతరుల శరీరంలోనూ, ఇంద్రియాలలోనూ, మనస్సులలోనూ, ప్రవేశించి వాళ్లు చూడదగ్గ ప్రపంచాన్ని వీళ్ళు చూస్తారు.
ఇన్ని రకాలుగా రెండు మనస్సులు ఏకీభావాన్ని పొందే సావకాశం వుంది, గనుక, జీవన్ముక్తుడైన ఒక గురువుకి కర్మశేషంచేత మిగిలివున్న ఒక ప్రపంచము, ఒక బద్ధజీవుడి యొక్క
మూ నాలుగు అవస్ధలు ప్రపంచము, ఏకీభావాన్ని పొందే సావకాశం తప్పకుండా వుంది. అప్పుడు ఆ రెండు ప్రపంచాలూ మిథ్య అయినప్పటికీ, గురువు మనస్సులోగల పరిశుద్ది శిష్యుడి మనస్సుకి సంక్రమించి, అది పరిపూర్ణంగా పరిశుద్ధమయ్యే సావకాశం నిశ్చయంగా వుంది. రాముడు: గురుదేవా! బ్రహ్మ చైతన్యమే సత్యమనీ, దానిమీద వివర్త విధానంలో ప్రపంచం ఉత్పన్నమైందనీ, వివేకమూ, ఇం(ద్రియ జయమూ, వైరాగ్యమూ, అనే వాటిద్వారా సాధకుడు చిత్తాన్ని పరిపక్వం చేసుకోవాలని, ఆ చిత్తపరపాకాన్నిబట్టి, జ్ఞానసిద్ధి లభిస్తుందనీ, మీరు చాలా సార్లు చెప్పారు. ఈ సిద్ధాంతాలేవీ నేను కాదనను. కానీ, మనం భార్గవోపాఖ్యానం ద్వారా ప్రపంచస్థితి యొక్క తత్త్వాన్ని పరిశీలిస్తున్నాం గదా! భార్గవుడికి కలిగిన జన్మపరంపరానుభవమంతా జాగ్రత్తులోకి వస్తుందా? స్పస్నంలోకి వస్తోందా? ఎందుకడుగుతున్నా నంటే, పదార్థాలన్నీ జాగ్రద్దశలో ఎలా ప్రత్యక్షంగా కనిపిస్తాయో, అలాగే స్వప్న దశలో గూడా కనిపిస్తూ వుంటాయి. ప్రత్యక్ష దర్శనం రెండు చోట్లా సమానంగా వున్నప్పుడు, ఇవి రెండూ వేరు వేరు అవస్థలని చెప్పటం ఎట్లా? అందులోనూ ఒకటి సత్యమనీ, మరొకటి అసత్యమనీ, భేదం చెప్పటం ఎట్లా? ఇది తేలితేగానీ భార్గవుడి అనుభవాలలో ఏది సత్యానుభవమో చెప్పలేం. అందుకోసం అడుగుతున్నా!
వసిష్టుడు: రామా! ముందు జాగ్రత్, స్వప్నాలను పరిశీలిద్దాం. నిజానికి ఆ రెంటికీ పెద్దగా ఖేదం లేదు. అవి కొంచెం ఎక్కువసేపు స్థిరంగా వుంటే వాటిని జాగ్రత్ వస్తువులు అంటాం. అంత
యోవాన్ధిం ఎక్కువసేపు స్థిరంగా లేకపోతే వాటిని స్వప్న వస్తువులు అంటాం. అలాగే ఇది నిన్న చూసిన వస్తువే అని గుర్తు పట్టేందుకు వీలుంటే (ప్రత్యభిజ్ఞకు వీలుంటే), అప్పుడు వాటిని జాగ్రత్ పదార్థాలు అంటాం. అలాంటి గుర్తుకు సావకాశం లేకపోతే వాటిని స్వప్న పదార్థాలు అంటాం,
అంతకు మించి ఖేదమేమీ లేదు. వీటివల్ల కలిగే సుఖదుః ఖానుభవాలన్నీ సమానమే.
ఐతే, అవస్థలు జాగ్రత్స ్వప్పాలని రెండు మాత్రమే కాదు. జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయాలనే పేర్లతో అవస్థలు నాలుగు వున్నాయి. ఇవి జీవుడికి సంబంధించినవి. దేహానికి కాదు. ఈ అవస్థలని గురించి కూడా కొంచెం చెపుతాను విను.
ఈ శరీరం ఉంది. దానిలో ఇంద్రియాలు వున్నాయి. వాటి వెనకాల నాడులు వున్నాయి. వాటి వెనకాల మనస్సు వుంది. దానిలో జీవచైతన్యం వుంది. దీన్ని పూర్వకర్మవాసనలు ప్రేరేపిస్తూ వుంటాయి. ఆ ్రేరేపణకు ప్రాణాపానాది పంచవాయువులు సహకారం చేస్తూ వుంటాయి. ఇదీ మన శరీరంలో వుండే సామాన్య స్థితి,
పూర్వకర్మలు, ప్రాణాదివాయువులు కలిసి జీవచైతన్యాన్ని కొద్దిగా ప్రేరేపిస్తే అప్పుడు అది మనస్సును దాటి, ఇంద్రియాల వెనుక వున్న నాడులదాకా వెళ్ళి, అక్కడ ఆగిపోతుంది. ఆ దశలో ఒక ప్రపంచం కనిపిస్తుంది. సుఖదుఃఖాలు అనుభవానికి వస్తాయి. కానీ, ఇది ఎక్కువ సేపు వుండదు. ఈ దశ పేరు స్వప్నం.
పై (ప్రేరణ ఇంకొంచెం పెరిగి జీవచైతన్యం నాడులను దాటి ఇంద్రియాలలోకి వచ్చేస్తే, అప్పుడు మళ్ళీ కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి.
వ నాలుగు అవస్థలు ఒక ప్రపంచం, సుఖదుఃఖాలు అనుభవంలోకి వస్తాయి. ఇవి కొంచెం ఎక్కువ సేపు వుంటాయి. ఈ దశ పేరు జాగ్రత్.
ఈ తిరుగుడుతో జీవచైతన్యానికి విసుగు పుడుతుంది. లోపలి (పేరణ గూడా తగ్గుతుంది. పూర్వకర్మవాసనలేవీ తల ఎత్తవు. (ప్రాణాది వాయువులేవీ కదలవు. ఆ దశలో జీవచైతన్యం పూర్తిగా స్తబ్ధం లాగా పడి వుంటుంది. ఇంచుమించు వైతన్యమాత్రంగా వుంటుంది. ఆ దశ పేరు సుషుప్తి.
ఈ జీవచైతన్యమే జాగ్రద్దశాకాలంలో కొంత తత్త్వ విచారణ చేస్తుంది. కొంత యోగాభ్యానం చేన్తుంది. అదృష్టం కలిసివచ్చినప్పుడు ఆత్మసాక్షాత్కారాన్ని అందుకుంటుంది. ఇది అందుకొంటే, ఆ తరువాత ఆ జీవచైతన్యం కర్మ శేషవశాన జాగ్రద్దశలో వున్నా, లేదా, స్వప్నదశలో వున్నా లేదా, సుషుప్తి దశలో వున్నా గూడా, ఆ ఆత్మసాక్షాత్కారస్థితి చెదరదు, చెరగదు. ఇలా నిలబడి వున్న ఆత్మసాక్షాత్మారదశ పేరే తురీయావస్థ. ఇదే ఉత్తమావస్థ.
ఈ నాలుగు అవస్థలు ఒకదాంట్లోంచి ఒకదాంట్లోకి మారే విధానాన్ని మరో రకంగా కూడా వర్ణించుకోవచ్చు.
మొదట సుషుప్తి దశ తీసుకో. ఈ దశలో ప్రాణాది వాయువులకు చలనం వుండదని చెప్పా గదా. చలనానికి తగిన పూర్వ కర్మసంస్మారం ఉద్బుద్ధం కాకఫోవటమే దానికి కారణం. కొంతసేపటికి ఆ పూర్వసంస్మ్కారం మొలకెత్తుతుంది. దానివల్ల ప్రాణాదివాయువుల్లో ఒక విషమస్థితి ఏర్పడుతుంది. దానివల్ల జీవవైతన్యంలో ఒక సంచలనం ఏర్పడుతుంది. దానివల్ల ఆ జీవచైతన్యం చిత్తం అనే రూపాన్ని పొందుతుంది. ఆ రూపాన్ని పొందినప్పుడు ఆ జీవచైతన్యానికి 'నేను అనే ఒక స్ఫురణ ఏర్పడి,
యోాన్ధత కొత్తగా ఏర్పడిన చిత్తాన్ని తనకంటే భిన్నంగా దర్శిస్తుంది. ఈ నేను అనే స్ఫురణనే 'అహంకారం' అంటారు. నేను అనే స్ఫురణ చిత్తాన్ని భిన్నవస్తువుగా దర్శించటాన్నే “సంక్షోభం అంటారు.
ఈ సంక్షోభం క్రమక్రమంగా పెరుగుతుంది. అది పెరిగిన కొద్దీ ఆకాశం వున్నదనే భావన ప్రారంభం అవుతుంది. దీనినే “ఆకాశ విహారం” అంటారు.
ఆకాశం వుందనుకొనే సరికి, ఇటూ అటూ తిరిగేందుకు చోటు ఏర్పడుతుంది. తిరుగుడు ప్రారంభం అవుతుంది. ఆ తిరుగుడు మెల్లిగా నాడుల్లోకి వ్యాపిస్తుంది.
ఆ నాడుల్లో ఏవేవో రసాయనాలుంటాయి. అక్కడ వుండే శ్లేష్మద్రవాన్ని చూసినప్పుడు నీరు అనే స్ఫురణ కలుగుతుంది. చీము, నెత్తురు వగైరాలను చూసేసరికి ఎండలు, వానలు వగైరాలు అనుభవానికి వస్తాయి. ఇలాంటి అనుభవాలన్నీ కలిపితే అది స్పష్నావస్థ అవుతుంది. అప్పటికి జీవుడు ఇంకా నాడులను దాటి ఇంద్రియాలలోకి ప్రవేశించడు. ప్రవేశిస్తే ఇంద్రియాల బలంవల్ల బయటి విషయాలు అనుభవంలోకి వస్తాయి. ఇదే జాగ్రదవస్థ.
ఈ చెప్పిన వరుసనుబట్సి ఏమి జరుగుతోందంటే, స్వప్పానుభవాలు, జాగ్రత్ అనుభవాలు కూడా, స్ఫురణలే తప్ప సత్యాలు కావు. ఈ మాట బుద్ధికి బాగా పట్టితే అది తురీయావస్థ.
రామా! ఈ అవస్థల గురించి ఇంత ఎందుకు చెప్పానంటే మనస్సు యొక్క స్వరూపం ఏమిటో తెలియటం కోసం చెప్పాను.
ఈ మనస్సే స్వప్న వస్తువులను తయారు చేస్తోంది. జాగ్రద్వస్తువులను తయారు చేస్తోంది. తయారైన ఈ వస్తువులు కనిపించి సుఖదుఃఖాలను ఇస్తున్నాయి గనుక, లేవనదానికి వీలులేదు.
అనస్థలకు మూలిం మునస్తే అసత్తులనడానికి వీలులేదు. వీటి తయారీకి వేరే ముడి సరుకు లేదు గనుక, ఇవి వున్నాయనడానికి వీలులేదు. సత్తులు అనడానికి వీలు లేదు. అందుచేత ఈ పదార్థాలను, వీటికి కారణమైన ఈ మనస్సును కూడా, పెద్దలు 'సదసద్ విలక్షణం” అన్నారు. అంటే, సత్తూ కాదు, అసత్తూ కాదు పొమ్మన్నారు. ఆ రెండిటికంటే విభిన్నమైన విచిత్రస్థితి అన్నారు.
అంతేగాక, ఇనుపగుండును తీసుకువెళ్ళి నిప్పులో పారవేస్తే అది నిప్పుగుండే అయిపోతుంది. అలాగే జీవుడు మనస్సును తీసుకువెళ్ళి బలంగా దేనిలో పారవేస్తున్నాడో, ఆ మనస్సు త(ద్రూూపమయిపోతుంది. మనస్సే జీవుడు గనుక అదే వీడు అయిపోతున్నాడని చెప్పవచ్చు. అంటే, దేన్ని భావన చేస్తున్నాడో ఆ రూపాన్ని వీడు పొందుతాడు.
ఇలాంటి ఈ మనస్సులో రెండు అంశలు వున్నాయి. ఒకటి వ్యష్టిఅంశ. రెండు సమష్టిఅంశ. వ్యష్టిఅంశ అంటే వ్యక్తిగత మనస్సు. సమష్టిఅంశ అంటే సృష్టిలోని మనస్సులన్నీ కలిపిన సామూహిక మనస్సు. చిత్రమేమిటంటే, ఈ ప్రపంచమనే భ్రాంతిమయ ఘటానికి, సమష్టి మనస్సు మట్టిముద్ద ఐతే, వ్యష్టి మనస్సు కుమ్మరివాడు. అంటే, వ్యష్టి మనస్సు కర్త, సమష్టి మనస్సు ఉపాదాన కారణం. ఆ కర్తవల్ల ఈ కారణంలోంచి పుట్టే కార్యమే ప్రపంచం.
మనింట్లో కుండలు ఎక్పువ అయిపోయినాయి అనుకొంటే, మట్టిముద్దతో పోట్లాడి లాభం లేదు. కుమ్మరివాడిని గదమాయిస్తే కుండల తయారీ పద్ధతి మారిపోతుంది. అలాగే, జీవుడు మనస్సును
చ న యనా నియమిస్తే, అదుపులో పెడితే ఈ ప్రపంచ భ్రాంతి తగ్గి, యోగసిద్ధులు పెరుగుతాయి. ఆత్మతత్వజ్ఞానం కలుగుతుంది.
మనస్సును నియమిస్తే ఆత్మతత్ప్వజ్ఞానం ఎలా కలుగుతుందని సందేహిస్తావేమో?! అలాంటి అవసరం లేదు. మనస్సే జీవుడు (లేక పురుషుడు లేక ఆత్మ) పురుషుడే మనస్సు. అంతేగానీ పురుషుడంటే దేహం కాదు,
సత్యం ఇది గనుకనే శుక్రుడు తన మనస్సుతో అనేక జన్మలను పొందగలిగాడు. అతను వాటిని తన శరీరంతో పొంతలేదు. మనస్సుతో పొందిన అనుభవం ఏదైనాసరే చిదచిద్విలక్షణమే! (భ్రాంతిమాత్రమే!!
భార్గవుడి అనుభవం “స్వప్నమా? జాగ్రత్తా?” అని అడిగావు. ఆ రెంటికీ కాలపు పొడుగుని బట్టి తప్ప వేరే భేదమేమీ లేదని చెప్పుకొన్నాం గనుక, ఆ చర్చ అనవసరం. అది స్వపష్పమైనా మిధ్యే, జాగ్రత్ ఐనా మిథ్యే, నీ మనస్సును సత్యవస్తువుమీద లగ్నం చెయ్యి. రాముడు: గురుదేవా ! మీ చర్చ అంతా మనస్సును కేంద్రం చేసుకొని నడుస్తోంది. మొట్టమొదట వున్నది పరిశుద్ధ ఆత్మ ఒక్కటే గదా! దానిలో ఏ రకమైన కాలుష్యాలు లేవు కదా. దాంట్లోంచి ఈ మనస్సు అనే మచ్చ ఎలా పుట్టింది?
ఈ ప్రశ్నను బట్టి రాముడికి భార్గవోపాఖ్యానం మీది ప్రశ్నలు ఐపోయాయనీ, అందువల్ల చర్చను మరో పక్కకు మళ్ళిస్తున్నాడనీ అర్ధమైంది. కానీ, రాముడు ఆశించిన చర్చను వశిష్టుడు రాబోయే నిర్వాణ ప్రకరణంలో చేయదలచుకొన్నాడు. అందువల్ల ఆయన ఒక ఎదురు ప్రశ్నతో తన సమాధానాన్ని ప్రారంభించాడు.
ండరందారధందాయరరయాయ0దయయయయయియిలా.. అనీస్థలమీ నరారిం నుస్రస్త్రే వళిష్ణుడు: రామా! నీకు ఒక్కసారైనా పరిశుద్ధ ఆత్మ అనుభవం కలిగినాక ఈ ప్రశ్న వేస్తే బాగుండేది. అది నీ అనుభవంలో లేనే లేదు. అనుభవంలో లేని దాన్ని ఆధారం చేసుకొని ప్రశ్న వేయటం దేనికి? నీకు ప్రస్తుతం అనుభవంలో వున్నది మలిన చైతన్యమే. కనుక ఈ అనుభవాన్ని ఆధారం చేసుకొనే మన చర్చ సాగాలి. ఈ చర్చకు కేంద్రం మనస్సు, ఇది ఎలా వచ్చిందని మనం విచారిద్దాం. మాలిన్యంతో కూడిన చైతన్యం జనసామాన్యానికి అనుభవంలో వుంది. అంటే, చైతన్యం వికారాన్ని చెంది (మార్చును చెంది), ప్రకృతిరూపంగా మారింది. (ప్రకృతి రూపం అంటే వమిటి? రాబోయే వికృతులన్నింటికీ మూలమైన మొదటి వికారమే ప్రకృతి. అదే చైతన్యం మనన ధర్మానికి ఆశయం ఇస్తే, అప్పుడు ఆ చిత్తు మనస్సు అవుతుంది. (మనన ధర్మమంటే ఆలోచించుట). చూచుట అనే ధర్మానికి ఆశయమిస్తే, అది నేత్రేంద్రియం అవుతుంది. వినుట అనే ధర్మానికి ఆశయమిస్తే , అది క్డీంద్రియం అవుతుంది. ఇలాగే ఇతర ఇంద్రియ ధర్మాలకు ఆయం ఇవ్వటంవల్ల, ఆ చైతన్యం ఆయా జ్ఞానేం(ద్రియాలుగా, కర్మేంద్రియాలుగా తయారు అవుతోంది. అంతేకాదు, ఒక్కొక్క వ్యక్తి ఈ చైతన్యం గురించి ఒక్కొక్క రకంగా భావన చేస్తాడు. భావనలన్నిటికీ మూలమైనది పరిశుద్ధ చైతన్యమే. కానీ, ఎవరు ఏ రకంగా భావన చేస్తే, వారికి ఆ రకంగా కనిపిస్తుంది అది. మల్లే తోటలోకి వెళ్ళిన గాలి మల్లెల వాసనే కొడుతుంది. పారిజాతాల తోటలోకి వెళ్ళిన గాలి పారిజాతాల వాసనే కొడుతుంది. గాలి ఒకటే. దానికి ఏ వాసనా లేదు. అలాగే
యోన్నొన్సితి. ఆంాజలాతరతంరయురాతుంనురురారంరాుంంం0దా ఈ చైతన్యం కూడాను! చైతన్యం ఇలాంటిది గనుకనే, ఈ చైతన్య తత్వాన్ని గురించి రకరకాల సిద్ధాంతాలు ఏర్పడ్డాయి.
రాముడు: ఉన్న వస్తువు ఎవరికైనా ఒకే రకంగా కనపడాలి. అలా కనిపిస్తే సిద్ధాంతం ఒకే రకంగా వుండాలి. ఇన్ని సిద్ధాంతాలు ఎలా వచ్చాయి?
వశిష్టుడు: రామా! ఉన్న వస్తువు అందరికీ ఒకే రకంగా కనపడాలనే నియమం లేదు. ప్రతివాడికీ వాడి పూర్వజన్మ కర్మ వాసనలబట్టి వాడి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు తయారవుతాయి. ఆ ఇంద్రియాలను బట్టే వాడి ఆలోచనలు, వాడి వనులు, రూపుదిద్దుకుంటాయి. దానివల్ల మళ్ళీ పుణ్యపాపాలు ఏర్పడుతూ వుంటాయి. అంటే, మొదట మనస్సుకు కారణం కర్మ అయింది. తర్వాత కర్మకు కారణం మనన్సు అయింది. ఇది ఎలా కుదురుతుందంటే కర్మ, మనస్సు, అనేవి పువ్వు, వాసనల వంటివి. వాటికి విడివిడిగా సత్త(ఉనికి) లేదు. అందువల్ల కర్మ (ప్రేరితమైన మనస్సులు గల జీవులు తము కర్మలకూ, మనస్స్పులకూ, అనుగుణంగానే వస్తువులను దర్శిస్తూ వుంటారు. తాము దర్శించిందే ధర్మమనే పట్టుదలతో, ఆ వస్తువులను దర్శిస్తూ వుంటారు. తాము దర్శించిందే ధర్మమనే పట్టుదలతో, వస్తువు కోసం వాళ్ళు మరింత కృషి చేస్తూ వుంటారు. ఆ కృషివల్ల వారికి అదే రకం కర్మ ఇంకా పెరిగిపోతుంటుంది. దానివల్లే పట్టుదల కూడా పెరుగుతుంది . దానివల్లే కొత్త సిద్ధాంతాలు, కొత్త ప్రచారాలు మొదలవుతూ వుంటాయి. ఇవన్నీ కూడా వారి వారి మనస్తత్తాన్నిబట్టి ఏర్పడిన
నూ . ఆ ఆల త్రము శ్యి...వివిధ సిద్దాన్తాలు " పలిలా నో ”
సిద్దాంతాలే అనటానికి కాన్టాజచాహోరణకు చెపుతాను విను.
ఇలాంటి వాదాలలో, ఉన్నంతలో, కపిలమతం కొంత పవిత్రమైనది. (కపిలమతమంటే సాంఖ్యం.) ఆ మతం వారియొక్క మనస్సు వివేకం గలది. అది తత్వమసి అనే వాక్యంలోగల తత్ (అది), త్వం (నీవు) అనే పదాలయొక్క అర్ధాన్ని గురించి విచారణచేసి, నీవు అనే పదానికి అర్ధం మాత్రం వేదానుసారంగానే నిర్ణయించారు. అది (తత్) అనే పదం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వేదమార్గాన్ని పూర్తిగా అంగీకరించలేక దాంట్లో కొద్దిగా మార్పులుచేసి, ప్రకృతి వేరనీ, పురుషుడు వేరనీ, ఆ రెండూ సత్యమే అనీ, ఈ విషయం (గ్రహించడమే మోక్షం అనీ నిర్ణయాలు చేసుకొని సిద్ధాంతాలు తయారు చేశారు.
ఇక వేదాంతవాదులున్నారు. వీరికి వేదమే పరమ ప్రమాణం, తమస్వంత ఆలోచనలు ప్రమాణం కాదు. వారు ఈ వేదాన్ని ఆధారం చేసుకొని, ఈ కనిపించే ప్రపంచమంతా బ్రహ్మే అని నిశ్చయం చేశారు. ఈ సత్యాన్ని అనుభవ పూర్వకముగా తెలుసుకోవటమే ముక్తి అనీ, వేరే బ్రహ్మలోక ప్రాప్తి అంటూ లేదనీ, వీరు సిద్ధాంతాలు చేశారు. వీళ్ళదాంట్లో స్వంత సిద్ధాంతమంటూ ఏమి వుంది? - అంటావేమో. గమ్యమైన పరబ్రహ్మ విషయంలో స్వంత సిద్ధాంతం లేదు. కానీ, దాన్ని పొందే ఉపాయాల విషయంలో ప్రక్రియా భేదాలు, వాటిల్లో మతభఖేదాలు, ఇలాంటివన్నీ వీరు రూపొందించినవే,
ఇక విజ్ఞానవాదులున్నారు. వీరు బుద్ధభగవానుడి బుద్ధిధారలలోకి (వ్రవేశించటమే మోక్షం అన్నారు. దానికి అంతరింద్రియ, బాహ్యేంద్రియ నిగ్రహమే మార్గమన్నారు.
ఇక అర్హతులు మొదలైన వారున్నారు. ఆర్హత్రులు అంటే
క న ననా.. మా జైనులు, వీళ్ళందరూ ఎవరికి తోచిన మోక్ష నిర్వచనాలను వారు చెప్పి, మోక్షోపాయాలను గూడా తమ సిద్ధాంతాను సారంగా నిర్ణయించి సిద్ధాంతాలు చేశారు. గమనిక; ఇక్కడ మూలంలో కపిల, వేదాంత, విజ్ఞానవాద, ఆర్షత మతాల పేర్లు చెప్పి, ఇవన్నీ గూడా మానవులు కల్పించిన మతాలే అని తేల్చి చెప్పారు. దేనిమీదా పక్షపాతం చూపించలేదు.
స్వాందృష్టిం ప్రవివృణ్వన్తి
స్వైరేవ నియమభ్రమైః | (సర్ద 21- శ్లో 29)
తమతమ భ్రాంతులవల్ల ఏర్పడిన నియమాలతో, తమ తమ స్వంత దృష్టులనే వాళ్లంతా సిద్ధాంతాలుగా వివరిస్తున్నారు - అని వల్లవిగా మళ్ళి మళ్ళి పాడారు. దీన్నిబట్టి మూలకర్తకు వేదాంతమతంలోని ప్రక్రియా భఖేదాలపట్ల గూడా పక్షపాతం ఏమీ లేదని మనకు స్పష్టం అవుతోంది.
ఇదిలా వుండగా ఈ 21 వ సర్గలో మూలకర్త నాలుగు మతాల పేర్లు (ప్రస్తావన చేసినప్పటికీ, ఆ మతాల మూల సిద్ధాంతాలను ప్రస్తావించ లేదు. అందువల్ల వ్యాఖ్యాత శ్రీశ్రీ ఆనంద బోధేంద్ర సరస్వతీ స్వామివారు ఆయా మత సిద్ధాంతాలను సం(గ్రహంగా వివరించారు. మనం వాటిని గూడా తెలిసికోవటం మంచిది.
కపింనుతనం (సాంఖ్యనలం) : వీరి మతంలో పురుషుడు, ప్రకృతి, జీవుడు, అని ప్రధాన తత్త్వాలు మూడు. వీరిలో పురుషుడు జ్ఞానస్వరూపుడు, చేతనుడు, కానీ నిష్కియుడు, సాక్షి ప్రకృతి త్రిగుణమయము, జడము, కానీ సృష్టి
లక “ాాానానాడలావాలములాయులలవాలలాంా.. నీనిధీ సిద్దాన్తాటు చేసేది ఇదే. ఈ రెండూ గూడా నిత్యపదార్థాలే. జీవుడు ప్రకృతి సంబంధంచేత తాను వేరుగా ఉన్నాను అనుకొంటూ వుంటాడు. ఇట్టి జీవులు అనేకులు. యోగాదిసాధనల ద్వారా వివేక జ్ఞానాన్ని పొందిన జీవుడు, ప్రకృతిబంధాన్ని వదిలి, తాను పురుషుడికంటే అభిన్నుడిననీ, పూర్వకంగా (గ్రహించటమే మోక్షం. వేధదాంతముతనం;
దీనిలో పరబ్రహ్మ ఒక్కటే నిత్య సత్యవస్తువు. దానినే ఆశ్రయించుకౌని, దానినే కమ్మివేసేది అజ్ఞానం, లేక అవిద్య, లేక మాయ. ఈ మాయ సత్తు కాదు, అసత్తూకాదు. సదసద్విలక్షణం. ఈ మాయవల్లనే వివర్త విధానంలో జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, అని ముగ్గురు ఏర్చడుతున్నారు. వివేకజ్ఞానంవల్ల అజ్ఞానం తొలగిపోతే, జగబ్జీవేశ్వరులు ముగ్గురూ ఒకే సారి తొలగిపోయి, జీవుడు పరటబ్రహ్మలో పరిపూరణంగా ఏకీభావాన్ని పొందుతాడు. ఇదే మోక్షం. జ్ఞానమే దీనికి సాధనం. జ్ఞానానికి సాధనం ఆత్మవిచారణ. దానికి సాధనం చిత్తశుద్ధి. చిత్తశుద్ధికి సాధనం సత్మర్మలు, యోగం. నిజ్ఞాననాదనం (బాద్ధినాదనం) ;
ఈ వాదంలో విజ్ఞానమే పరమార్ధ సత్యం. ఇతర పదార్థాలన్నీ క్షణికాలు. ఈ సత్యాన్ని గ్రహించక పోవటమే బంధం. బుద్ధ భగవానుని బుద్ధిలో (జ్ఞానంలో) ప్రవేశించటవే మోక్షం. తీవ్రసాధనలే ఇందుకు మార్గం. ఈ సిద్దాంతాంలో అనేక మత భేదాలున్నాయి. వైభాషికులు, సౌత్రాంతికులు, యోగాచార్యులు, మాధ్యమికులు, హీనయానులు, మహాయానులు, విజ్ఞానవాదులు, మొదలైనవారంతా బౌద్ధంలోని శాఖలే,
యోాన్హత ఆ
అర్హత నాదనం;
వీరి సిద్ధాంతంలో ఏడు ప్రధాన భాగాలున్నాయి. అందుచేత వీరు
తమ సిద్దాంతాన్ని 'సప్త్రభంగీనయము” అని పిలుచుకొన్నారు. ఆ
ఏడు ఏమిటంటే-
-
జీవుడు - ఇతడు శరీరం ఎంత పరిమాణంలో వుందో అంతపరిమాణంలో వుంటాడు.
-
అజీవము - అనగా రాళ్ళు మొదలైనవి.
-
ఆస్రమము - అనగా ఇంద్రియాలు.
-
సంవరము - అనగా యమ నియమాదులు.
-
నిర్జ్ణరము - అనగా గుండు గీయించుకొనుట మొదలైన తపస్సులు.
6 బంధము - అనగా జనన మరణాలు.
') మోక్షము - అనగా లోకాతీతమైన ఆకాశంలో ఎప్పుడూ పైకి వెళ్ళిపోతూ వుండటం.
వీళ్ళదే మరొక సప్తభంగీనయం వున్నది.
- స్యాదస్తి - అనగా ఉండవచ్చు, లేదా అతికష్టం మీద ఉండవచ్చు.
(అక్కడ 'స్యాత్' అనేది క్రియా పదం కాదు. అవ్యయం. దీనికి కొంచెం
అని గానీ, ఎలాగోలా అని గానీ, అతికష్టంగా అని గానీ, అర్ధం.
స్యాదస్తి అంటే పైన చెప్పిన జీవాది సప్తభంగులలో దేన్ని గురించీ
గూడా స్పష్టంగా చెప్పలేమనీ, ఉంటే ఉన్నది కావచ్చు, లేకపోతే లేనిది
కావచ్చు, అని వారి భావం. ఇలాగే రాబోయే పదాల దగ్గర గూడా
అన్వయం చేసుకోవాలి.)
యై అజాజాలాలాలాలాతవుంంయుంలాంంాయాలంయా.. నిని సిద్ధాన్హారు 2) స్యాన్నాస్తి - అనగా లేకపోవచ్చును.
-
స్యాదస్తి చ నాస్తి చ - అనగా ఉండవచ్చును. లేక పోవచ్చును.
-
స్యాదవక్తవ్యః - అనగా చెప్పటానికి వీలు లేక పోవచ్చును.
-
స్యాదస్తి చా వక్తవ్యశ్చ - అనగా ఉండవచ్చును, కానీ చెప్పటానికి వీలులేక పోవచ్చును.
-
స్యాన్నాస్తి చా వక్తవ్యశ్చ - అనగా లేకపోవచ్చును, కాన్ చెప్పటానికి వీలులేక పోవచ్చును.
-
స్యాదప్తి నాస్తి చా వక్తవ్యశ్చ - ఉండవచ్చును, లేకపోవచ్చును, అయినా చెప్పటానికి వీలులేక పోవచ్చును.
ఈ వాదాలన్నీ తత్వం అతి సూక్ష్మమనీ, దానిని గ్రహించటం కష్టమనీ చెప్పటం కోసం బయలుదేరినవే కానీ, వీటి ప్రతిపాదనలన్నీ పై విధంగా రకరకాలుగా ఉండటంవల్ల , ఇవన్నీ చిత్రవిచిత్రాలైన బుద్దికల్పనలు అని వశిష్టముహర్ని అంటున్నాడు,
ఇలాంటి వాదాలన్నీ అనాదిగా వస్తున్నవేననీ, కొంతకాలం మరుగున పడిపోయి, మళ్ళీ కొంత కాలానికి కొన్ని వాదాలు పైకి లేస్తుంటాయనీ, మొదటి ప్రకరణంలోనే వివరంగా చెప్పుకొని ఉన్నాం కనుక, ఇవ్చుడు ఆ చర్చ అవనరం లేదు. ఇలాంటి బుద్ధికల్పితవాదాలను గురించి ప్రస్తావించిన తరువాత వశిష్టమహర్షి తన బోధను ఇలా కొనసాగిస్తున్నాడు.
న
వశివ్థుడు : రామా!
స్వాం దృష్టిం ప్రవిష్ఫల్వన్తి
స్వైరేవ నియమ భ్రమైః 1 (సర్జ 21-శ్లోకం 29)
వీళ్ళంతా తమ తమ భావాలనే సిద్ధాంతాలుగా చేసి, ఇతరుల నెత్తిమీద రుద్దుతున్నారని నేను నీకు పూర్వమే చెప్పాను. ఇవన్నీ మతిభ్రమలని గూడా నిరూపించాను. ఈ మతి(భ్రమలన్నింటికీ కారణం ఏమిటంటే, మలినమైన చిత్తంతో చైతన్యాన్ని భావన చెయ్యటమే. చిత్తం మలినంగా వుంది గనుక, చైతన్యం స్వతహా శుద్ధమే అయినప్పటికీ, వీళ్ళకు మలినంగా కనిపిస్తుంది. అందుచేత శుద్ధ వస్తువును శుద్ధంగానే దర్శించాలని కోరుకొనేవాడు ముందుగా తన చిత్తాన్ని శుద్ధం చేసుకోవాలి.
కనుక రామా! నీ మనస్సును నువ్వు శుద్ధం చేసుకో దానికి మెట్లు ఏమిటంటే--
- చిత్తవృత్తులను తగ్గించుకోవాలి.
- అజ్ఞానభూమికలను విడిచిపెట్టాలి.
- జ్ఞానభూమికలను అందుకోవాలి.
- కనిపించే దృశ్య ప్రపంచమంతా చిన్మాత్ర స్వరూపమని స్మరిస్తూ
వుండాలి.
- వైతన్యంకంటే భిన్నవస్తువు లేదని (గ్రహించాలి. 6 భోగాసక్తి పూర్తిగా పోవాలి. ') వీటన్నిటి ద్వారా వాసనాక్షయాన్ని సాధించు కోవాలి. రామా! ఇలాంటి స్థితికి చేరినవాడు జ్ఞాని అవుతాడు. వాడికి జననమరణాలు గూడా ఉండవు.
యా ాాాాాాాాాాాాలాలా బిత్రకుద్ధికీ పడు మెట్టు వాలాగ్రసూక్ష్యభాగాత్తు
కోటిశ పరికల్పితాత్।
అహం సూక్ష్మ ఇతి వ్యాపీ
యః పశ్యతి స పశ్యతి | (సర్ణ22-శ్లో26)
తోకవెంట్రుక చివరిముక్కను లక్షభాగాలుచేసి, అందులో ఒక ముక్కను కోటిభాగాలు చేస్తే ఎంత సూక్ష్మమైన పదార్థం వస్తుందో, నేను అంత సూక్ష్మమైనవాడ్డి, అలా సూక్ష్మంగా వుంటూనే, సర్వత్ర వ్యాపించి వుండేవాడ్డి అని ఎవడు చూస్తున్నాడో, వాడే నిజంగా చూస్తున్నాడు. అంటే ఎవడికి ఇలాంటి జ్ఞానం వుందో, ఎవడికి ఇలాంటి అనుభవం వుందో, వాదే నిజమైన జ్ఞాని- అని భావం.
ఇక్కడ వశినృమవార్ని “యః పశ్యతి న పశ్యతి” అనే మకుటంపెట్టి, జ్ఞాని లక్షణాలను సర్గ చివరి దాకా వర్ణించేశారు. ఈ విషయాలను ముముక్షు వ్యవహార ప్రకరణంలో శమవర్ణన దగ్గర గూడా చెప్పి వున్నారు. గనుక, మనం ఇప్పుడు వాటిని చెప్పుకోవటం లేదు.
ఆ తరువాత 28వ సర్గలో జీవన్ముక్తుడియొక్క లక్షణాలను వర్ణించిన సందర్భంలో, జీవన్ముక్తుడనే రాజుకి ఈ శరీరమే నగరం అంటూ, శరీరాన్ని నగరంతో పోలుస్తూ, ఎక్కడికక్కడ జీవన్ముక్త లక్షణాలతో సమన్వయం చేస్తూ, కవితామయంగా అద్భుతమైన వర్టన జరిగింది.
ఆ తరువాత 24వ సర్గలో వశిష్టమహర్ని మళ్లీ మామూలు సాధకుడి దగ్గరకు వచ్చాడు. జీవన్ముక్తి లేని మామూలు మనిషికి ఈ శరీరమే ఒక మహా నరక సామ్రాజ్యమనీ, ఇంద్రియాలే అక్కడ
యోాన్ధిత శత్రువులనీ, వర్ణన ప్రారంభించాడు. ఈ వర్ణన మొత్తానికీ తాత్పర్యం ఏమిటంటే, పరిశుద్ధమైన మనస్సే సాధకుడికి మిత్రుడు, మలినమైన మనస్సే సాధకుడికి శత్రువు- అని.
స్థితిప్రకరణంలో భార్గవోపాఖ్యానం 16వ సర్గతోనే పూర్తయి పోయింది. 17వ సర్గ నుంచి 24వ సర్గదాకా- ఈ కథను విశ్లేషిస్తూ వశిష్టమహర్షి చాలా రకాల చర్చలు చేశాడు. ఈ చర్చ మొత్తానికి సారాంశంగా-24వ సర్గ చివరికి వచ్చేసరికి, వశిష్టుడు సూటిగా రాముడ్డి సంబోధిస్తూ, “రామా ! మామూలు పామరుడి లాగా మనస్సుకు పరాధీనుడవు కాబోకు. ఇంద్రియాలనే శత్రువులను జయించి, మనస్సునే నీ స్వాధీనంలోకి తెచ్చుకో. ఈ ప్రయత్నంలో “నీకు దామవ్యాలకటోపాఖ్యాన న్యాయం'” పట్టకుండుగాక! 'ఖ్మ భాసదృఢోపాఖ్యాన న్యాయం' నీకు పట్టుగాక [౯ - అన్నాడు.
ఆ నాటి రచనల్లో రాబోయే విషయాన్ని ప్రవేశబెట్టే ప్రక్రియల్లో ఇది ఒకటి. ఈ ప్రక్రియ ప్రకారం ఆ ఉపాఖ్యానాలేమిటని రాముడు అడగటం, ఇదిగో చెపుతున్నానని వశిష్టుడు అందుకోవటం జరుగుతుంది. ఈ పద్ధతిలోనే 25వ సర్గలో దామవ్యాల కటోపాఖ్యానం ప్రారంభమైంది.
౨00 రాంర00దానంరంఅచంందారయలాశంయంలంంం:లా. (గానున్యాలకీటోపాల్లూనం
సాధనలో ఒక స్టాయికి చేరి మనస్సు చాలా మటుకూ నిర్మలమైన తరువాత కూడా, సాధకుడు అహంకారానికీ, ఇంద్రియ వ్యామోహానికీ చోటు ఇస్తే, వాడు క్రమంగా అట్టడుగుదాకా పతితుదైపోతాడనీ, అహంకారస్పర్భ లేకుండా ఎన్ని పనులు చేసినా చిత్తానికి మాలిన్యం అంటదనీ, రెండు పరస్పర విరుద్ధాంశాలను నిరూపించేందు కోసం వశిష్టమహర్షి ఈ కథను చెప్పబోతున్నాడు. అది దృష్టిలో పెట్టుకొనే మనం ముందుకు సాగాలి.
పూర్వం పాతాళలోకంలో “శంబరాసురుడు అనే రాక్షసుడు వుండేవాడు. శంబరం అంటే నీరు అని అద్ధం. మాయలే మణులు అనుకొంటే, ఆ మణులకు వీడు సముద్రం వంటివాడు. వాడి బలానికీ, ఐశ్వర్యానికీ, సుఖభోగాలకూ అంతు లేదు.వాడిదగ్గర ఒక చందన వృక్షాల తోట వుందేది. దాంట్లో పాములు మాత్రం లేవు. వాడి పట్టణంలో అమావాస్యనాడు గూడా పూర్ణచంద్రుడు ఉదయించ వలసిందే.
ఇతడు ఒక సారి దేవతల మీద దండెత్తి వెళ్ళి, వాళ్ళను చిత్తుగా ఓడించి, అక్కడి సంపదలన్నీ గూడా దోచి తెచ్చుకొని, ఆ ఐశ్వర్యంతో తన రాక్షస సైన్యాన్ని పెంచుకొని, నిర్భయంగా సుఖభోగాలలో మునిగిపోయాడు.
శంబరుడు సుఖభోగలాలసుదై ఏమరుపాటుగా ఉన్న సమయం చూసి. దేవతలు ఎదురుదాడి చేశారు. దేవతలు దాడి చేసినా శంబరుడికి మత్తు దిగక, సేనాపతులను యుద్దానికి పంపించి, తాను విలాసంగా కాలక్షేపం చేశాడు. దానితో దేవతలు రెచ్చిపోయి,
యోనా. ంలాాునాయందావనుదతునతురనాతంాయంనా శంబరుడి సేనాపతులందరినీ సమూలంగా నిర్మూలించేశారు.
అప్పటికి కళ్ళు తెరుచుకొన్న శంబరాసురుడు మహోగ్రుడై, వంటరిగా, సరాసరి స్వర్ణరాజ్యం మీదికి దూకాడు. అప్పటిదాకా రాక్షస సేనాపతులమీద పేట్రేగి పోయిన దేవతలు, శంబరాసురుడు తమ ఊరిమీద పడ్డాడనేసరికి గదడగడలాడిపోయారు. ఎందుకంటే, వొడి మాయాసముద్రపు లోతెంతో రాక్షసులకన్నా దేవతలకే బాగా తెలుసు.
దేవతలు “ఏంచేయాలా?” అని ఆలోచించి, ఊర్లో ఒక్క పురుగు కూడా కనిపించకుండా అంతా మాయమైపోయారు, శంబరాసురుడికి ఏం జరిగిందో అర్ధం కాలేదు. ఇల్లిల్లూ తిరిగాడు. ఒక్క దేవతా కనిపించలేదు. దాంతో శంబరాసురుడికి ఒళ్ళు మండిపోయి. ఇళ్ళల్లో విలువగల వస్తువులన్నీ దోచుకొని, ఆ తరువాత ఇళ్ళన్నీ తగుల బెట్టేశాడు. అప్పటికి వాడి కోపం కొంత చల్లారింది.
ఆ తరువాత కొన్నాళ్ళు చూశాడు. ఎక్కడా దేవతల జాడ కనిపించలేదు. దాంతో శంబరుడు తన సైన్యంలోనే కొత్త సేనాపతులను తయారుచేసి, వాళ్ళకు దేవతల పట్టణాలను అప్పచెప్పి, తాను పాతాళానికి పోయాడు.
అతను అలా పోయాడో, లేదో, ఇక్కడ దేవతలు మూకుమ్మడిగా స్వర్గపట్టణాల మీదకు దాడిచేసి, అక్కడ అధిపతులుగా ఉన్న రాక్షస సేనాపతులను సంహరించి మళ్ళీ పారిపోయారు.
శంబరాసురుడికి ఈ వార్త తెలిసి, ఒళ్ళు మండిపోయి గొంతంతా చించుకొని, దేవతల కోనం గాలింపు చర్యలు మొదలుపెట్టాడు. ఏమీ ఫలితం కనిపించలేదు. కొంత కాలం చూసి,
పలతాలచనాాలలా.. దామన్యాంకటోసాఖ్యానం మళ్ళీ రాక్షస సేనాపతులను దేవపట్టణాలలో నియమించాడు. మళ్ళీ దేవతలు అదనుచూసి, వాళ్ళందరినీ నరికేశారు. ఈ తంతు చాలా సార్లు జరిగింది. ఈ సంక్షోభంలో శంబరాసురుడి సైన్యం క్రమక్రమంగా క్షీణించిపోతోంది.
ఈ పరిస్థితిని గమనించిన శంబరాసురుడు బాగా ఆలోచించి, తన శక్తి అంతా కేంద్రీకరించి, తన మాయా విద్యలబలంతో ముగ్గురు కొత్త రాక్షసులను సృష్టి చేసేశాడు.
-
మొదటి వాడికి దాముడు అని పేరు పెట్టాడు. దామ అంటే తాడు. వీడు శత్రువులను తాడుతో కట్టినట్టు కట్టిపదేసి నిర్వీర్యులను చేస్తాడని, శంబరుడి అభిప్రాయం. *దమయతీతి దామసిః - అని వ్యుత్పత్తి.
-
_ రెండవ వాడికి వ్యాలుడు అని పేరు పెట్టాడు. వ్యాలం అంటే పాము. వీడు పాము లాగా తన శత్రువులందరినీ కరిచి చంపేస్తాడనీ శంబరుడి భావం. “విశేషేన ఆ సమంతాత్ ఆలతీతి వ్యాలః- ఆల పరివ్యాస్తే-అని వ్యుత్పత్తి.
-
మూడవ వాడికి కటుడు అని పేరు పెట్టాడు. కటం అంటే చాప. లేక జల్లేడవంటి డాలు. వీడు శత్రువుల ఆయుధాలనుంచి తనవాళ్ళను కమ్ముకొని కాపాడుతాడని శంబరుడి భావం. “కటతి ఆవ్ఫణోతీతి కటఫో - అని వ్యుత్పత్తి.
శంబరుడు వీళ్ళ ముగ్గురినీ తన సేనకు కొత్త సేనాపతులుగా నియమించాడు.
రాక్షససేనలో ఇప్పటికే చాలా మంది సేనాపతులు వున్నారు. కానీ, వాళ్ళకీ,దోమకు ఏనుగుకూ ఉన్నంత భేదం వుంది ఎలాగంటే-
- _ వీళ్ళకు పూర్వకర్మలూ లేవు, కర్మవాసనలూ లేవు.
యోనాన్టితి 2) మరైతే వీళ్ళు ఎలా జన్మించారు? అంటే - పూర్వకర్మల శేషంవల్ల శంబరుడు జన్మించాడు. వాడి మాయా విద్యా బలంవల్ల వీళ్ళు జన్మించారు. అంటే వీళ్ళు ఐం(ద్రజాలకుడు సృష్టి చేసిన మానవులవంటి వాళ్ళు. ఐంద్రజాలిక జీవుల ఆయుష్యం స్వల్పం. వీళ్ళు ఆయుష్యం కొంచెం ఎక్కువ. అంతే తేడా. కాగా, వీళ్ళు శంబరాసురుదనే నిప్పుమంటలలోంచి లేచి వచ్చిన రవ్వల వంటివారు. 3) పూర్వకర్మ శేషం లేకపోతే వీళ్లు ఈ జన్మలో పనులు ఎలా చేస్తారు? అంటే, అంధపరంపరా న్యాయంగా చేస్తారు. అంటే, చుట్టూతా వున్నవాళ్ళు ఏది చేస్తే అది చేస్తారు. కాకతాళీయంగా చేస్తారు. అంటే , ఇంగ్లీషులో ౧71116 (పూక్) అంటారే, అలా చేస్తారు. అరనిద్దరలో చిన్నపిల్లలు లేచి నడుస్తారే, అలా చేస్తారు. త్త వీళ్ళకి యుద్దాలు, దాడులు, ఎదురుదాడులు, పారిపోవటాలు, చంపుకోవటాలు వంటివి తెలియవు. జయాపజయాలు, ధర్మాధర్మాలు, అవునా, కాదా, అనే సందేహాలు, భయాలు, ఇలాంటివేవీ వీరికి లేవు. కానీ, శంబరాసురుడి యొక్కమనస్సులో ఏ సంకల్పం ఉందో, దానికి అనుగుణంగా ప్రవర్తించటం అనేది వీరికి జన్మసిద్ధమైన గుణం గనుక, శంబరాసురుడి శత్రువులు ఎవరైనా కనిపిస్తే మాత్రం వాళ్ళలో వైరభావన మొలకెత్తి, మాయా విద్యలు గుర్తువస్తాయి. 5) యోగులు యోగబలంచేత అనేక శరీరాలను సృష్టి చేసుకొని, వాటిద్వారా ఏకకాలంలో కర్మక్షయం చేసుకొంటూ వుంటారు. శంబరాసురుడు ఇప్పుడు చేసింది గూడా అటువంటి ప్రక్రియే. కానీ, ఇవి క్రోధద్వేష వాసనలవల్ల పుట్టిన దేహాలు కావటంవల్ల, ఇని
632 “ఆాాలలయులడుదాతయుాంయాాాయాంణా... బ్రహ్మదేవుడి ఉపాయం కర్మక్షయానికి ఉపయోగపడవు. కర్మల వృద్ధికే ఉపయోగపదతాయి.
శంబరాసురుడు తాను సృష్టి చేసిన మహావీరులు ముగ్గుర్నీ చూసుకొని, వాళ్ళ శక్తులను కూడా పరీక్షించి చూసుకొని, చాలా సంతోషపడ్డాడు.
వెంటనే సేనా విభాగంచేసి, దామవ్యాలకటులను ప్రధాన సేనాపతులుగా ఏర్పాటుచేసి, మొత్తం రాక్షస సైన్యాన్ని దేవలోకం మీదకి యుద్దానికి పంపించాడు.
అనుకొన్నట్టుగానే దాముడు దేవతా సైన్యాన్ని చుట్టచుట్టి, కట్టకట్టి పడవేశాడు. తరువాత వ్యాలుడు కత్తులతో కాట్లు వేశాడు. కటుడు తన సైన్యం నష్టపోకుండా కాపాడుకొన్నాడు.
దేవతలు ఓడిపోయి వరుగు లంకించుకొన్నారు. దామవ్యాలకటులు వెంటపడ్డారు. కానీ, దేవతలు వాళ్ళకు అందకుండా మాయమైపోయారు. కొంత కాలం వాళ్ళకోసం వెతికి రాక్షసులు పాతాళానికి వెళ్ళిపోయారు.
చావు తప్పి కన్నులొట్టబోయిన దేవతలు “ఏం చేయాలా” అని ఆలోచించి, బ్రహ్మగారి దగ్గరకి వెళ్ళారు. బ్రహ్మగారు వాళ్ళగోడు విని, ఇలా చెప్పాడు. (బ్రహ్మదేవుడు : దేవతలారా! మీరు జాగ్రత్తగానే యుద్ధం చేస్తున్నారు. ఐనా దామవ్యాలకటులు ఓడిపోవటం లేదు. దానికి కారణమేమిటో అర్ధం అయితే గానీ, వాళ్ళను జయించే ఉపాయం మీకు అర్ధం కాదు. కనుక, ఆ కారణమేమిటో చెప్పుతాను వినండి.
యోోన్నొస్టిత. ఆారడుదతరాననలయనకాడననాలంలా ఎవడికి హృదయంలో వాసనలనే దారాల ముళ్ళు లేవో, అలాంటివాళ్ళ బుద్ధి సర్వసమంగా వుంటుంది. వాళ్ళకు సంతోషం ఉండదు. విషాదం ఉండదు. అలాంటివారిని జయించటం ప్రపంచంలో ఎవరి తరమూ కాదు. దీనికి భిన్నంగా వాసనలనే దారాల ముళ్ళలో బిగుసుకుపోయినవాడు, ఎంత పండితుడైనా సరే, వాడ్డి పసిపిల్లవాడు కూడా అల్లల్లాడించి పారేస్తాడు. అలాంటివాడ్డి జయించటం ఎప్పటికో ఒకప్పుడు సాధ్యం అవుతుంది. పూర్వ జన్మలనుంచి వచ్చే వాసనలలో “దేహమే నేను” అని తోచే వాసన చాలా గొప్పది. దీన్నే “దేహతాదాత్య వాసని అంటారు. “దేహాత్మాధ్యాసి అంటారు. పేర్లు ఎన్ని చెప్పినా విషయం ఇదే. ఈ దేహమే నేను అనుకోవటం. ఇదే పునాది వాసన. దీనిని ఆధారంగా చేసుకొని, ఈ ఇంద్రియాలు నేనని, ఈ భార్యా పిల్లలు నావారని, ఇలాంటి వాసనలన్నీ పెరిగిపోతూ వుంటాయి. వాసనలు ఉంటే తప్పేమిటండీ - అంటారేమో?! పరమాత్మ కంటే భిన్నంగా వేరే ఏదైనా సత్యవస్తువు ఉండి ఉంటే, దాని మీద “అదే నేను” అనే వాసన కలిగితే, తప్పు ఏమీ ఉండి ఉందేది కాదు. కానీ పరిస్థితి అలా లేదే. పరమాత్మకంటే భిన్నమైన సత్యవస్తువే లేదు. కనుక వాటిమీద నేను అనే వాసన తప్పుకాక ఒప్పు ఎలా అవుతుంది? ఇంతకూ చెప్పవచ్చింది వమిటంటే, అసత్యాన్ని ఆధారంగా చేసుకొన్న వాసనలు ఎవరికి ఉంటాయో, వాళ్ళకి మాత్రమే ఓటమి సాధ్యమవుతుంది. మీరు చెప్పిన దామవ్యాలకటులున్నారే వాళ్ళకు పూర్వ వాసనలు ఇంచుమించుగా లేనే లేవు. అందువల్ల వాళ్ళకు నేను,
లత ఆాాాానాానాజలాయలలలాలా.. ద్రహ్మదేవుడి ఉపాయం నాది, అనే భావాలే లేవు. ఎప్పుడు ఏ సన్నివేశం వస్తే ఆ సన్నివేశానికి తగ్గట్టుగా వాళ్ళ ఇంద్రియాలు ్రవర్తించేస్తున్నాయి. వాళ్ళు సాక్షి మాత్రులుగా చూస్తూ ఉండిపోతున్నారు. అందువల్ల వారి అంతః సారానికి అవధి లేకుండా పోతోంది.
ఈ పరిస్థితి మారాలంటే ఉన్న ఏకైక ఉపాయం ఏమిటంటే, మీరు పైనా క్రిందా పడి, ఏదైనా ఒక ఉపాయం చేసి, వాళ్ళ ముగ్గురికీ వాసనలు కలిగేటట్లు చెయ్యాలి రెండో మార్గమే లేదు. దానికి ఉపాయం ఏమిటంటే, మీరు ఇకనుంచి దామవ్వాలకటులకు లోకవ్యవహారం గురించి, లోకులు దేహరక్షణ కోసం తీసుకొనే జాగ్రత్తల గురించి, ఇంద్రియ సుఖాలవల్ల కలిగే లాభాల గురించి, కొత్త కొత్త ఆలోచనలు వచ్చేటట్లుగా, యుద్ధాలు ఆపకుండా చేస్తూ వుండండి.
వాళ్ళల్లో కొత్త ఆలోచనలు గట్టిగా పుట్టటానికి, మరో లక్ష సంవత్సరాలు పడుతుంది. శంబరాసురుడి ఆయుష్షు కూడా అప్పటిదాకా గట్టిగానే వుంది. ఆ సమయం వచ్చేసరికి వీళ్ళ ముగ్గురిలో కొత్త ఆలోచనలు బలిసి, వాళ్ళ వాసనలు ప్రబలం అవుతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు అర్ధం అయింది కదా!
ఇలా వివరిస్తూనే (బవ్మాదేవుడు అంతర్భానం అయిపోయాడు. దేవతలు విషయం బాగా అర్ధం చేనుకొని, కొంతకాలం విశ్రాంతి తీసుకొని, ఆ తరువాత సరియైన సమయం చూసుకొని, రాక్షసులమీదకు విరుచుకు పద్దారు. ఈ మాటు చాటుగా కాదు - బహిరంగంగానే యుద్ధభేరి మోగించారు.
ఎక్కడెక్కడి రాక్షసులూ పోగ, దామవ్వ్యాలకటుల
యోవాస్ధతి నాయకత్వంలో ఎదురు దాడికి దిగారు. యుద్ధం (బ్రహ్మాండంగా సాగుతోంది. నెత్తురు వరదలై పారుతోంది. దేవతలదే పైచేయిగా ఉందేమో అనిపిస్తున్న తరుణంలో, దేవతలు ఉన్నట్టుండి యుద్ధం ఆపేసి తెల్లజెందా ఎత్తేసి, సంధి సంధి అంటూ గొప్ప గొప్ప కానుకలను దామవ్యాలకటుల దగ్గరకు పంపించారు. దామవ్యాలకటులు సంధికి సుముఖంగా స్పందించారు. కానీ, సంధి చర్చలు త్వరలోనే వాగ్యుద్ధాలుగా మారిపోయి, మళ్ళీ అసలు యుద్ధం మొదలైపోయింది.
ఈ మాటు దేవతలు ప్రచ్చన్నయుద్దాలు మొదలు పెట్టారు. దాంట్లో కూడా ఓడిపోయి పారిపోయారు. పారిపోయారు గదా అనుకొంటుంటే , మళ్ళీ అప్సర స్త్రీలను కానుకలుగా పంపించారు.
కొంతకాలం యుద్ధం ఆగిపోయింది. మళ్ళీ అనుకోకుండా మొదలైంది. ఒకరినొకరు మోసం చేసుకొనే ప్రయత్నాలు జరిగాయి.
ఇలా వేలకు వేల సంవత్సరాలు యుద్దాలు ఆగకుండా సాగుతుండే సరికి, దామవ్యాలకటుల్లో నిజంగానే కొత్త ఆలోచనలు మొదలైనాయి. దేవతలంతటి వాళ్ళు, అమృతం తాగినవాళ్ళు, తమ శరీరాల రక్షణ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారో అర్ధమైంది. దాంతో “ నునం గూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి” అనే ఆలోచన వీళ్ళకు మొదలైంది.
దేవతలు ఇంద్రియ సుఖాల కోసం ఎంత వెంపర్లాడుతున్నారో అర్ధమైంది. వీళ్ళకి గూడా అలాంటి కోరికలే పుట్టాయి. దేవతలు ఎలా మోసం చేస్తున్నారో అర్ధమైంది. వీళ్ళకు
6౭ “ానాలాలనానలాలానాలంలాలవాా... పులిని చూసి నక్క వాతీ గూడా మోసపు బుద్ధులు మొదలైనాయి. ప్రాణభయంతో దేవతలెలా పారిపోతున్నారో అర్ధమైంది. వీళ్ళకు కూడా మరణ భయం మొదలైంది.
ఇలా కొంతకాలం జరిగేసరికి దామవ్యాలకటులు ఇతర రాక్షస సేనాపతులతో సమానమైపోయారు. అందువల్లే ఈ మాటు జరిగిన యుద్ధంలో వాళ్ళూ ఓడిపోయి ఎటో పారిపోయారు. వాళ్ళ సైన్యం చెల్లాచెదరైపోయింది. బ్రహ్మదేవుడు చెప్పిన లక్ష సంవత్సరాల కన్నా ఎంతో ముందుగానే చామవ్యాలకటుల్ని జయించగలిగామని దేవతలు మురిసిపోయారు.
దామవ్యాలకటుల పరాజయనవార్త తెలిసిన శంబరాసురుడు మండిపడ్డాడు. తన మాయాశక్తులన్నీ ధారపోసి సృష్టిచేసిన ముగ్గురు వీరులూ ఇలా వెళ్టివాళ్ళై పోయారని తెలిసేసరికి, అతను మహోగ్రుడై “ఎక్కడ? వాళ్ళిక్కడ? ముందు వాళ్ళను బంధించండి” అని పెడబొబ్బలు పెడుతూ, దిక్కుల వెంబడి పరుగులెత్తాడు.
ఈ అరుపులకు బెంబేలెత్తిపోయిన దామాదులు మరింత వేగంగా పరిగెత్తారు. ఎటుపోవాలో వాళ్ళకు అర్ధం కాలేదు. కానీ, చిరకాల రాక్షస సాంగత్యంవల్ల కలిగిన సంస్కారంతో, వాళ్ళు నరకలోకం వైపు పరిగెత్తారు.
అక్కడ తమ లాగానే భయంకరాకారులుగా ఉన్న యమకింకరులు, వీళ్ళకు ఆత్మబంధువులు లాగా తోచారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టకొని శరణువేడారు. వాళ్ళు వీళ్ళకి అభయమిచ్చి తమ ఇళ్ళల్లో దాచేసి, వీళ్ళను శంబరాసురుడి నుంచి రక్షించారు.
ఆ తరువాత దామవ్యాలకటులకు ఎలా జీవించాలనే సమస్య ఎదురైంది. ఈ లోగా దైవం కలిసి వచ్చి, యమకింకరులకు వీళ్ళు
యోన్నాస్టితీ బుద్ధిమంతులుగా తోచారు. అందువల్ల వాళ్ళల్లో ముగ్గురు పెద్దమనుషులు తమ కూతుళ్ళను వీళ్ళకిచ్చి వివాహంచేసి, ఆ లోకంలోనే వృత్తి ఏర్పాటు చేశారు.
ఇలా పదివేల సంవత్సరాలు గడిచేసరికి, దామవ్యాల కటులకు దేహబంధాలకు తోడు సంసార బంధాలు, దేశ బంధాలు, బంధు బంధాలు, వంటి దుర్వాసనలన్నీ తామర తంపరగా పెరిగిపోయాయి.
ఇలా వుండగా, ఒక రోజున యమధర్మరాజు రాజ లాంఛనాలు లేకుండా, మారువేషంలో నగర పరిశీలన కోసం వచ్చాడు. అంటే, ఇన్స్ పెక్షన్ కోసం వచ్చాడు. ఆ సమయానికి మామగార్ల స్థానంలో దామవ్యాలకటులు విధి నిర్వహణ చేస్తున్నారు. కాన్నీ , వచ్చింది యమధర్మరాజని తెలియక, వీళ్ళు మామూలు ప్రకారంగానే తలపొగరుగా మాట్లాడారు.
దాంతో యమధర్మరాజు అగ్గిమీద గుగ్గిలమై, వీళ్ళెవరని ఆరాతీసి, వీళ్ళు చేసిన తప్పులకి వీళ్ళనీ, వీళ్ళ బంధువులనీ గూడా, రౌరవ నరకంలో పారేయించాడు.
ఆ శిక్షలు ఒక రకమా? నడుములోతు నిప్పులగుంటల్లో శరీరాలను తగులబెట్టేవారు. ఇంత జరిగినా చావు వచ్చేది కాదు. మరిగే నూనెల్లో వేయించారు. రాళ్ళ మీద వేసి కొట్టారు. ఇలా ఎంతకాలం జరిగిందో లెక్కే తెలియదు.
పుట్టటమే రాక్షస వంశంలో పుట్టారు. యమకింకరులకు బంధువులయ్యారు. చివరికి యమలోక శిక్షలూ అనుభవించారు. ఈ అనుభవాల వాసనలు ఊరికే పోలేదు, దామవ్యాలకటులు ముగ్గురూ పై జన్మలో ఖైదీలను శిక్షించే రాజభటులుగా జన్మించారు.
ఎిందాలరంలాలడంనాజంంలాజరంయ0లఎయ:ఐ4005=... వ్రులెని సూసి నక్క వొతీ ఆ జన్మలో కొన్ని అన్యాయపు పనులుచేసి పై జన్మలో కాకులయ్యారు. ఆ పై జన్మలో గ్రద్దలయ్యారు. ఆ పై జన్మలో చిలకలయ్యారు. ఆ పైన పందులయ్యారు.ఆ పైన గొరైలయ్యారు. ఆ మీద పురుగులయ్యారు. రామా! ఈ విధంగా వాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి, ఇప్పుడు కాళ్ళీర దేశంలో, ఒక కీకారణ్యంలో, తరుచుగా కారుచిచ్చులు పుట్టే చోట, ఒక బురదనీటి గుంటలో చేప పిల్లలుగా, బతికీ బతకక, చచ్చీ చావక, జీవచ్చవాలుగా జీవిస్తున్నారు. రామా! దామవ్యాలకటులకు ఇలాంటి దుర్దశ ఎందుకు వచ్చిందంటే, వివేకానుసంధానం లేకపోవటం వల్లే! ఇంచుమించు వాసనా రహిత స్థితిలో, జీవితం ప్రారంభించిన దామాదులకు ఎలాంటి దుర్గతి పట్టిందో, చూపించటం కోసమే ఈ కథ చెప్పాను. దేవతలనే గడగడలాడించిన రాక్షస 'సేనాధిపత్య మెక్కడ? బురదగుంటలో చేపజన్మ ఎక్కడ? అహంకారమే లేని అంతఃకరణ సత్వం ఎక్కడ? అహంకారపరులై పాపిష్టి జన్మలను తెచ్చుకొన్న దుర్చుద్ధి ఎక్కడ? ఇలాంటి పతనానికి కారణం ఏమిటంటే, వివేకానుసంధానం లేకపోవటమే! ఏమటా వివేకం? అహంకారమనే మొలకలోంచే సంసారమనే మహావృక్షం జన్మిస్తుంది - అని తెలియటమే వివేకం. అహంకార పిశాచార్వా దామ వ్యాళ కటాస్త్రయః; గతా స్పత్తామసన్నోలి. పి మాయామాహాత్మ్యదానవాః ॥ (సర్జ 31-ళశ్లో 9)
యోన్నాన్టితి
దామాదులు ముగ్గురికీ మొదట ఉనికే లేదు. వాళ్ళకు స్థితి లేదు. కానీ, మాయా మహిమవల్ల , వాళ్ళ ముగ్గురికీ సత్త వచ్చింది. ఒక స్థితి కలిగింది. కానీ, అహంకారమనే పిశాచం ఆవరించటంవల్ల వాళ్ళు ముగ్గురూ ఆర్తిలో పడిపోయారు. అంటే సంసార ప్రవాహంలో పడిపోయారు. కనుక, నీకు రామా! అలాంటి పరిస్టితి అలా కలగరాదని హెచ్చరించటానికే ఈ కథ చెపుతున్నాను. అందుకే నీకు దామవ్యాలకట న్యాయం కలుగకుండు గాక ! - అని దీవిస్తున్నాను. రాముడు: గురుదేవా! మీరు మాట్లాడుతూ-గత స్పత్తా మసన్లోం_ పి మాయా మాహాత్వదానవాః ॥ అన్నారు. అంటే, మొదట సత్తే లేని ఆ రాక్షసులకు తర్వాత సత్త వచ్చిందన్నారు. ఇదెలా కుదురుతుంది?
నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ॥
అని కదా, మీ సిద్ధాంతం?
అంటే, సత్తు లేని దానికి ఎప్పటికీ సత్తు లేనే లేదు. సత్త ఉన్నదానికి ఆ సత్త ఎప్పటికీ రాదు. ఇంకా తేలికగా చెప్పాలంటే, లేనిది ఎప్పటికీ లేదు. ఉన్నది ఎప్పటికీ పోదు- అని గదా మీ సిద్ధాంతం. అలాంటప్పుడు సత్త లేని ఆ రాక్షసులకు సత్త ఎలా వచ్చింది? గమనిక: “నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః”, అనే వాక్యం భగవద్గీతలో కూడా యథాతథంగానే వుంది. త్రిమతాచార్యులకూ ఈ వాక్యం గడ్డెన వ్యాసఘట్టాలలో ఒకటి కూడా. ఐనా వీరి దగ్గరి నుంచి వారు గానీ, వారి దగ్గరి నుంచి
లా త్ సత్ర వీఠు గానీ, ఈ వాక్యాన్ని కాపీ కొట్టారనుకొనే వీలులేదు. ఒకే రకమైన వాక్యాలు వస్తూ వుండటం వేదాంత (గ్రంధాలలో మామూలే. ఇక వళిష్ట మహర్షి రాముడి ప్రశ్నకు చెప్పే సమాధానంలోకి ప్రవేశిద్దాం. వశిషృడు: నిజమేనయ్యా! అదే మా సిద్ధాంతం. ఉన్న వస్తువే మొదట సూక్ష్మంగా వుండి, తర్వాత కొన్ని కారణాలవల్ల అది స్టూలమైతే, అప్పుడు దానికి పుట్టింది అనే వ్యవహారం వస్తుంది. మొదట స్థూలంగా ఉన్న వస్తువు కొన్ని కారణాలవల్ల సూక్ష్మంగా మారిపోతే, అప్పుడు దానికి పోయిందనే వ్యవహారం వస్తుంది. మా ఉద్దేశ్యంలో * పుట్టింది, పోయింది” అనే మాటలకు ఉన్న అర్ధం ఇంత మాత్రమే. దీనికి భిన్నంగా నిజంగా లేనిది కొత్తగా ఏదైన పుట్టి వుంటే, నువ్వు ఏదైనా ఉదాహరణ చూపించు. లేదా ఉన్నది వూర్తిగొ నశించిపోయి ఉంటే, ఉదాహరణ చూపించు, ఒప్పుకొంటాను.
రాముడు: ఉదాహరణ నేను చెప్పటం దేనికి? మీరే చెపుతున్నారు కదా! ఎలాగంటే మనబోటి వాళ్ళమంతా ఉన్నవాళ్ళమనీ, దామవ్యాలకటులు మాత్రం మాయా రాక్షసులనీ, అంటే లేనివాళ్ళనీ, మీదే కదా చెప్పారు. మీరు చెప్పింది గూడా న్యాయంగానే వుంది. మనమందరం ఉన్నామనే మాట ప్రత్యక్షంగా తెలుస్తున్న విషయం. దామవ్యాలకటులు మాయవల్ల పుట్టారు అంటే, లేనివాళ్ళని అర్ధమే కదా! లేనివాళ్ళ పుట్టుకను మీరు కథలోనే చూపించారు కదా! దీనివల్ల మనకూ వాళ్ళకూ తేడా ఉందని తేల్చినట్లే అయింది కదా! కనుక, మీ స్వంత ఉదాహరణ కన్నా వేరేమి కావాలి?
వశిష్ణుడు: రామా! దామవవ్యాలకటులు మాయవల్ల జన్మించారని నేను చెప్పినమాట నిజమే. కానీ, మనబోటివాళ్ళమంతా ఎలా
యోనొాస్హతి ౬౩౭2౭ జన్మించామో నేను ప్రస్తావించ లేదే? ఎండమావుల్లోకి నీరు ఎలా వచ్చిందో అలాగే ఈ ప్రపంచంలోకి వచ్చారు దామవవ్యాలకటులు. నువ్వూ, నేనూ కూడా అలాగే వచ్చాం.
ఐజే ఈ మాట నేను ప్రస్తావన చేయలేదు. ఎందుకంటే , తత్త్వజ్ఞానం మీద సరియైన అవగహన కుదిరే లోపున గురువు తొందరపడి * బ్రహ్మసత్యం, జగం మిథ్య” అని ఉపదేశం చెయ్యరాదు. అలా చేస్తే అజ్ఞాని దశలో ఉన్నవారు తలకెక్కించుకోరు సరి కదా, అపహాస్యం చేస్తారు.
ఇప్పుడు మనం చేస్తున్న తత్వచర్చవల్ల నీకు ప్రశ్న పుట్టుతోంది. విమని? “దామవ్యాలకటులు మాయవల్ల పుట్టినవాళ్షెతే, మనం దేనివల్ల పుట్టిన వాళ్ళం?”- అని .
నీకు ఈ ప్రశ్న పుట్టింది గానీ, సమాధానం తెలియలేదు. ఈ దశలో ఉన్నవాడ్డి 'కించిద్జ్జుడు అంటారు. అంటే కొంచెం తెలిసినవాడు. ఇలాంటివాళ్ళ కోసమే నేను ప్రస్తుతం ఈ భోధ చేస్తున్నాను. ఈ విషయాన్ని నీకు వైరాగ్యప్రకరణంలోనే చెప్పాను. అక్కడ ఏమన్నానంటే, “న్యాంత మజ్టో నోతజ్ఞుసో-స్మిన్, శాస్త్రేధికారవాన్”
- _ అన్నాను. అంటే, పూర్తిగా తెలియనివాడూ గాదు, పూర్తిగా తెలిసినవాడూగాదు. అలాంటి వాడికే ఈ బోధ- అన్నాను.
నీకు ప్రశ్న పుడుతోంది గనుక సమాధానం చెపుతాను విను. దామవ్యాలకటులు ఎటువంటివారో మనమూ అటువంటి వారమే. మనం ఎంత మాత్రం పుట్టామో, వాళ్ళు అంత మాత్రమే పుట్టారు. (శ్రుతులు, యుక్తులు, బ్రహ్మర్నుల అనుభవాలు - ఈ సత్యాన్ని నిరూపిస్తూనే వున్నాయి.
కనా ల రాముడు: మనమందరం దామవ్యాలకటుల లాంటి వాళ్ళమే అయితే, మనకు నిజంగా పుట్టుకలేకపోతే, ఈ ప్రపంచం, ఇంతమంది జీవులు, ఇన్ని వంశవృక్షాలు, ఇన్ని జన్మ పరంపరలు, ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి. వశిష్ణుడు: ఒకడికి నిద్రలేచి కళ్లు తెరిచిన దగ్గరనుంచీ ఆకాశంలో ఏవేవో వెంట్రుకల ఉండలు గాలిలో తేలిపోతున్నట్లు, తన చుట్టుతా అలాంటి ఉండలే ఉన్నట్లు కనిపించింది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు జడలు వేనుకొని వెంట్రుకల ఉండలను ఇంటి నిండా వదలిపెడుతున్నారని వాడు తిట్టిపోయసాగాడు. వాళ్ళు వీడి పిచ్చి అరుపులు వినీ వీనీ, చివరరికి వీడ్డి కంటి వైద్యుడి దగ్గరికి, తీసుకుపోయారు. వైద్యుడు వీడి కళ్ళకు * రేచీకటి" వచ్చిందనీ, అందుకనే వీడికి ఆకాశంలో వెంట్రుకల ఉండలు తేలిపోతున్నట్టుగా కనిపిస్తోందనీ నిగ్గు దేల్చాడు.
ఇప్పుడు ఈ అనుభవాన్ని ఆ నేత్రరోగి కోణంలోంచి విశ్లేషించు. వాడికి చుట్టూతా వెంట్రుకల ఉండలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. కనుక అవి సత్యాలని వాడంటాడు. కానీ, వైద్యుడి వంటి ఆప్తులు దాన్ని అంగీకరించరు. ఆకాశంలో ఉన్నట్టుండి వెంట్రుకల ఉండలు పుట్టుకురావడమనేది యుక్తికి కూడా సమ్మతం గాదు. చుట్టుప్రక్కల ఉన్న ఆరోగ్యవంతుల అనుభవం కూడా దాన్ని ఆమోదించటం లేదు. కనుక , నేత్రరోగికి ప్రత్యక్షానుభవంలో ఉన్నా సరే, వాడికి కనిపించే వెంట్రుకల ఉండలు అసత్యాలని చెప్పక తప్పదు.
అలాగే, అజ్ఞానమనే వ్యాధిలో పడి వున్న సామాన్య మానవులందరికీ, ఈ ప్రపంచం ప్రత్యక్షంగా అనుభవంలో
య్స్కోన్నాస్టాత. దలాంతతంతరతంనంతనలనాడాలుం. ఉన్నప్పటికీ, అందరికీ అత్యంత ఆప్తమ్రైన వేదం దాన్ని అంగీకరించటం లేదు. దాని అస్తిత్వం యుక్తికి గూడా అనుకూలంగా లేదు. ఆత్మజ్ఞుల అనుభవం గూడా అలా లేదు. కనుక, ఈ ప్రపంచం లేని వస్తువై ఉండి గూడా ఉన్నట్టు కనిపిస్తోందని అంగీకరించక తప్పదు.
కనుక , రామా! దామవ్యాలకటులు ఎటువంటి వాళ్ళో మనం కూడా అటువంటి వాళ్ళమే.
మనం దామవ్యాలకటులనే ముగ్గురినీ ఒక గుంపుగాను, రామ వశిష్టులనే వారిని మరో గుంపుగా చేసి, ఈ రెండు గుంపుల్లో ఏది సత్యమని విచారణ చేస్తున్నాం. ఈ విచారణను నీకు ఇంకా దగ్గరగా తెచ్చుకో. రాముడు, వశిష్ణుడు అని ఇద్దరున్నారు. రాముడు ఏమనుకొంటాడంటే * ఒక వేళ అబద్ధమైతే వశిష్టుడు అబద్ధం కావాలి, నేను మాత్రం నిజమే” - అనుకొంటాడు. వళశిష్టుడూ ఇట్లాగే అనుకొంటాడు. ప్రపంచంలో ప్రతి జీవీ ఇట్లాగే అనుకొంటే, సత్యాన్ని నిగ్గుదేల్చేదెలా? ఇక్కడే యుక్తిని ఉపయోగించాలి
అది మండు వేనవి. అది ఎడారి భూమి. అది మిట్టమధ్యాహ్నం. దూరాన నది లాగా కనిపిస్తోంది. అనుభవజ్ఞుడైన బాటసారి అది నది కాదనీ, ఎందమావనీ, నిశ్చయం చేశాడు. కాని కంటికి జలప్రవాహం కనిపిస్తూనే ఉంది. పక్క్మనవున్న కుర్రవాడు ఈ ఎండమావిలోకి నీళ్ళెలా వచ్చాయి? *- అని ప్రశ్నించాడు. వాడికేమి సమాధానం చెపుతావు నువ్వు? “అక్కడ నీళ్ళనేవి లేనే లేవురా. ఉన్న ఎండే నీళ్ళు లాగా కనిపించింది. అంతే” - అని
ల) ాజజాాాాలలాలనాలాలాలనా... నుననమూ అిటునంటే వాళ్లమే అలాగే, ఈ ప్రపంచంలో రాముడుగా, వశిష్టుడుగా, వెంకయ్యగా, పుల్లయ్యగా, నేనుగా, నువ్వుగా, ఇన్ని రకాలుగా కనిపిస్తున్నది శుద్ధచైతన్యమే గానీ, మరో వస్తువు లేనే లేదు. ఆ శుద్ధచైతన్యమే బాహ్య పదార్థాలుగా కనిపిస్తే , అప్పుడు దానికి 'ప్రపంచం' అని పేరు పెట్టాం. ఆ కనిపించే దశను బంధం అన్నాం. అదే శుద్ధచైతన్యం ఏ బావ్యారూపాలూ లేకుండా, కేవలచిదాకారంగా వున్నప్పుడు, దానికి శుద్ధ చైతన్యమనీ, అధిష్టాన చైతన్యమనీ పేర్లు పెట్టాం. ఈ దశను మోక్షం అన్నాం.
ఈ చెప్పిన వరుసనుబట్టి, బంధమోక్షాలు నిజంగా రెండు దశలా? కావు. అవి కల్పిత దశలు. ఎందుకీ కల్చన? ఎండమావిలో నిజంగా ఉన్నది ఎండే- అని బోధించటం కోసం! ఎలాగైతే ఎండ, నీరు అని విభాగం చేసి చెప్పామో, అలాగే ఇక్కడ కూడా అవస్థా కల్చనచేసి, ఆత్మబోధ చేస్తున్నాం. కనుక రామా !
సర్వత్ర సర్వమిదమస్తి యధానుభూతం
నో కించన క్వచిదేహాస్తి న చానుభూతమ్ |
శాన్తం సదేక మిదమాతత మిళ్ధ మాస్తే
సంత్యక్త శోకభయ భేద మతస్త్వమాస్వ$। (సర్ద 31-శ్లో 47)
సత్యవస్తువును దర్శించటానికి రెండు దృక్కోణాలు వున్నాయి. ఆ పరబ్రహ్మే మనకు కనిపించే ఈ ప్రపంచంగా ఉంది అనేది ఒక దృష్టి . అంటే, పరమాత్మ మీద మాయా సంసర్గం వల్ల అవ్యక్త మహదహంకార పంచభూతాది పరంపరను ఆరోపణ చేసుకొంటూ పోగా, ఈ ప్రపంచం ఏర్పడుతోంది. అంటే, ఈ ప్రపంచరూపంగా అన్ని చోట్లా, అన్ని విధాలా, మనచేత అనుభవింపబడేది పరబ్రహ్మే దీని పేరు అధ్యారోపద్బష్టి .
రెండో దృక్కోణంలో ఎక్కడా ఏ వస్తువూ లేనే లేదు. ఏ అనుభవమూ లేనే లేదు . అంటే, దృశ్య ప్రపంచంగా కనిపించే భౌతిక పదార్థాలన్నింటికీ కారణం పంచభూతాలనీ, కార్యంతో పోలిస్తే కారణం సత్యం గనుక, దృశ్య ప్రపంచం అసత్యమనీ, పంచభూతాలు సత్యమనీ ఒక మెట్టు అపవాద చేస్తారు. అపవాద అంటే అసత్యాన్ని వదిలి సత్యం దగ్గరకు రావటం. పంచభూతాలతో పోలిస్తే, “హిరణ్యగర్భ అహంకారం సత్యం . ఇది రెండో మెట్టు. ఇలాగే వరుసగా మహత్తు, అవ్యక్తం అనే వాటిని గూడా తొలగించు కొంటూపోతే చివరికి నిర్వికారమైన (మార్చులు లేని) పరిశుద్ధ పరబ్రహ్మ మిగులుతుంది. దీనీ పేరు అపవాదదృష్టి .
కాగా అధ్యారోపదృష్టితో చూసినా, అపవాదదృ్భష్టితో చూసినా, ఎలా చూసినా, చిట్టచివరికి మిగిలేది ఒకే ఒకటి. అదే పరబ్రహ్మ, అదే సర్వవ్యాపకం . అదే పరిపూర్ణం. అదే ఉన్నది. కనుక, రామా! నువ్వు శోక భయ భేదాలను వదిలిపెట్టి, ఆ పరిపూర్ణభావంతో ఉండటం నేర్చుకో, రాముడు: గృరుదేవా! ఈ ప్రపంచం ఎలా కనిపిస్తోంది? అని అడిగితే , త్రిర్తుగ్వలేని సమాధానాలు చెప్పారు. అయితే, ఈ నాడు దామవ్యాలకటులు ఏ దశలో ఉన్నారో , నేనూ అలాంటి దశలోనే ఉన్నాను. ఇలాంటివాళ్ళకు ఈ సంసార దుఃఖం తొలగిపోయే ఉపాయం ఏమైనా ఉంటుందా? ఉండదా? వశిషృడు: నేనూ ఈ విషయం చెప్పాలనే అనుకొంటున్నాను. దీని కోసే దామవ్యాలకటుల చరిత్రలో ఒక భాగాన్ని చెప్పకుండా అట్టేబెట్టేశాన్స. ఇప్పుడు ఆ కథా భాగం చెపుతాను విను,
వన న
యమధర్మరాజు ఆగ్రహానికి గురై దామవ్యాలకటులు ముగ్గురూ రౌరవ నరకంలో పడి, నానాయాతనలూ అనుభవిస్తున్న రోజుల్లో, వీళ్ళ మామగార్లకి వీళ్ళ మీద జాలిపుట్టి, యమధర్మరాజు ప్రసన్నంగా ఉన్న సమయం చూసుకొని, దగ్గరకు చేరి * మావాళ్ళు ముగ్గురికీ కష్టాలు పోయే ఉపాయం చెప్పండి స్వామీ” - అని ప్రార్థించారు.
యమధర్మరాజు కొంచెం ఆలోచించి, * మీ వాళ్ళు ముగ్గురూ తమ స్వంత జన్మ కథను పూర్తిగా ఎప్పుడు వింటారో, అప్పుడు వాళ్ళకు మోక్షం వచ్చి తీరుతుంది. ఆ పైన ఇక వాళ్ళకు కష్టాలే ఉండవు”- అన్నాడు, అది విని ఆ మామగార్లు సంతోషించి వెళ్ళిపోయారు. రాముడు: మహర్షీ ! దామవ్యాలకటులు ముగ్గురూ ఇప్పటికి కొన్ని వేల జన్మలెత్తి బురదగుంటలో చేప పిల్లలుగా ఉన్నారని మీరే చెప్పారు. ఇలాంటి ఈ జీవులకు తమ కథ వినిపించేదెవరు? విన్నా వీళ్ళకు తెలిసేదేమిటి? వళిష్ణుడు; రామా! జన్మ పరంపర అప్పుడే అయిపోయిందనుకోకు. ఇక పై జన్మలో వాళ్ళు హంసలై పుడతారు. అక్కడ వివేకంతో ఆలోచించే గుణం వాళ్ళకు అబ్బుతుంది.
ఆపై జన్మలో వాళ్ళు అధిష్టానము అనే నగరంలో జన్మిస్తారు. ఆ నగరం ప్రక్కన ప్రద్యుమ్నము అనే చిన్న కొండ ఉంటుంది. ఆ కొండమీద చిన్న ఇల్లు . ఆ ఇంటి ఈశాన్యపు గోడలో ఒక చిన్న గూడు. ఆ గూట్లో ఒక పిచ్చుకై పుడతాడు వ్యాలుడు .
యోవాస్టితి “తడననితాతంనిరిదాతంరరిదోతదరిరడోతంధనినాతంంనిడాతంధరినాశంంధిరాశదదినంర00నా
ఈ ఇంట్లోనే ఒక స్తంభం. ఆ స్తంభం చివర్లో ఒక చిన్న పగులు. ఆ పగులులో కొన్ని దోమలు నివసిస్తూ వుంటాయి. వాటిలో ఒక దోమగా పుడతాడు దాముడు.
కటుడు ఎక్కడో గోరువంకగా పుట్టి దైవవశాన ఆ ఇంటి పంజరంలో చేరుతాడు.
ఆ ఇంట్లో యశస్కరుడనే రాజు దగ్గర పనిచేసే మంత్రి నివసిస్తూ ఉంటాడు. ఆ మంత్రి పేరు నరసింహుడు, అతను దివ్యజ్ఞాన సంపన్నుడు, తత్త్వవేత్త, అతను ఒక రోజున పంజరంలో ఉన్న గోరువంకను చూసి, తన దివ్యదృష్టితో దాని చరిత్రంతా తెలుసుకొని, ఆ చరిత్రనే పాటగా కట్టి పాడతాడు. దామవ్యాలకటులు ముగ్గురూ మాయాకల్చిత జీవులనీ, వాళ్ళ జీవత్వం కల్పితమనీ, ఏ వాసనలులేని అద్వితీయ చైతన్యమే వాళ్ళయొక్క అసలు స్వరూపమనీ, ఈ జన్మపరంపర అంతా భ్రాంతి కల్పితమనీ ఆ పాటలో ఆ మంత్రి స్పష్టం చేస్తాడు.
ఆ పాటను రోజూ వింటున్న గోరువంక రూపంలో ఉన్న కటుడికి, క్రమంగా తన జన్మ కథంతా గుర్తుకు వచ్చి, దాన్నే భావనచేస్తూ, తద్భావనా భావితుడై, పరబ్రహ్మ మయుడై ముక్తి పొందుతాడు.
ఇంతలో ఆ పాట ఆ ఇంటి పరివారానికంతటికీ నోటికి వచ్చి, అందరూ పాడుకొంటూ ఉండగా, గోడ గూటిలోని పిచ్చుక, స్తంభపు తొర్రలోని దోమ గూడా ఆ పాటను విని, తమ కథను గుర్తు తెచ్చుకొని మోక్షస్థితికి చేరుతారు.
కనుక, రామా! మంత్రి అనే సత్సురుషుడి సాంగత్యం వల్ల. తమ జన్మ కథలను నెమరువేసుకోవడమనే రూపంలో జరిగిన ఆత్మవిచారణవల్ల, వాళ్ళ ముగ్గురికీ మోక్షం లభించబోతోంది.
తా కధా డేషం ఇలాంటి శుభప్రయత్నం చేసేవాళ్ళ కృషి ఎన్నటికీ వ్యర్ధం కాదు. దీనికి మంచి నిదర్శనాలు ఎన్నేన్నో ఉన్నాయి. శుభప్రయత్నాలలో ఉత్తమోత్తమమైనది ఆత్మజ్ఞాన ప్రయత్నం. దీనికి మొదటి మెట్టు వైరాగ్యం. వైరాగ్యమంటే భోగ్య వస్తువులలో గల దోషాలను కనిపెట్టటం.
ప్రతి చోటా దోషాలను కనిపెట్టి, అప్పటిదాకా అనుభవిస్తున్న వస్తువులను వదిలిపెట్టమంటే, అది ఒక దుఃఖమే. మొదట ఈ దుః ఖానికి తలవొగ్గితే గానీ వైరాగ్యం పట్టుబడదు. వైరాగ్యం పట్టుపడ్డాక, భోగ వస్తువుల పరిత్యాగం కష్టంగా వుండదు గానీ, మొదట్లో ఈ కష్టాన్ని సహించుకోక తప్పదు. ఈ సహనం కావాలంటే, శమము అనే గుణాన్ని సాధించాలి.
శమము అనేది మనస్సు యొక్క ధర్మాలలో (గుణాలలో) ఒకటి. అందుచేత ఇది పరబ్రహ్మ స్వరూపమైనది కాదు. ఆ దృష్టితో చూస్తే శమము, అశమము (శమం లేకపోవటం) రెండూ కూడా దృశ్యకోటిలో చేరినవే. సమానమైనవే. కానీ, బ్రహ్మానందాన్ని అభివ్యక్తంచేసే శక్తి శమానికి మాత్రమే వుంది.
ఈ శమము కలగటానికీ, వృద్ధి పొందటానికీ కూడా ముఖ్యసాధనం సజ్జన సాంగత్యం. సజ్జనులంటే అహంకారాన్ని జయించినవారే. అహంకారమే జీవులను సంసారంలో పడదోసే శత్రువు. అలాంటి అహంకారాన్ని జయించినవారే సత్పురుషులు. రాముడు; మహర్షీ! అహంకారాన్ని జయించే ఉపాయం ఏమిటి? వశిష్ణుడు: ఆత్మానుసంధానమే.
కక లల రాముడు : మహర్షీ! అహంకారం రెండు రకాలుగా వుంటుందని నేను విన్నాను. స్టూలశరీరం మీద నేను అనే భావన ఏర్పడితే అది సశరీరాహంకారమనీ, సూక్ష్మంగా వుందే బుద్ది మొదలైన వాటి మీద నేను అనే భావం ఏర్పడితే అది అశరీరాహంకారమనీ, నేను విన్నాను. ఈ రెండూ పోవలసినవేనా?
అలాగే, జాగ్రద్దశలో వుండే అహంకారమే సశరీర అహంకారమనీ, స్వప్నాలలోనూ, పగటికలలలోనూ, కోరికల పొంగులలొనూ, వుందే అహంకారాన్ని అశరీర అహంకామనీ, కొందరంటున్నారు. దీని మాటేమిటి? వశివ్థుడు : రామా! ఈ విభాగాలేవీ మన చర్చకు పనికి వచ్చేవి కావు.
త్రివిధో రాఘవాస్తీహ త్వహంకారో జగ త్రయే
(సర్ణ౭౩-శ్లో49)
మన లెక్కలో మూడు రకాల అహంకారం వుంది. మనం పైనుంచి క్రిందికి వద్దాం. ఒకటి, రెండు అహంకారాలు మంచివే. మూడవది చెడ్డది. దాన్ని తొలగించుకోవాలి.
అహం సర్వమిదం విశ్వం
పరమాత్త్మాహ మచ్యుతః।
నాన్యదస్తీతి పరమా
విజ్హేయా సాహ్యహంకృతిః ॥ (సర్ణం౭-శ్లో50)
ఈ దృశ్య ప్రపంచమంతా నేనే. చ్యుతి లేని పరమాత్మను నేనే. నాకంటే భిన్నంగా ఎక్కడా ఏదీ లేదు - అనే భావం కూడా
అంధింరాలకరందాశయందాతంరంంాతంలిలుంంయంణంయిం... అసాంకారాలు మూడు ఒక అహంకారమే. కాని ఇది ఉత్తమ అహంకారం. ఇది జీవన్ముక్తులకు వుంటుంది. ఇది వస్తే మోక్షం వచ్చినట్లే. దీన్ని పోగొట్టుకోమని ఎవరూ చెప్పలేదు.
దీనికి భిన్నంగా మరో అహంకారం వుంది.
సర్వస్తాద్వతిరిక్తోల. హం
వాలాగ్రశత కల్పతః
ఇతియా సంవిదేషాసా
ద్వితీయాహంకృతిశ్శుభా ॥ (సర్ణం8-శ్లో52)
ఈ దృశ్యప్రపంచంలో ఏదీ నేను కాను. దేనికీ అంటను. నేను అన్నిటికంటే సూక్ష్ముడ్డి, అణువుకంటే అణువుని- అనే భావన గూదా ఒక అహంకారమే. ఇది రెండవది. ఇది గూడా మంచిదే. ఇది గూడా మోక్షాన్ని ఇచ్చేదే. కొందరు జీవన్ముక్తులు ఇలా గూడా భావన చేస్తారు, దీన్ని గూడా పోగొట్టుకోవలసిన పని లేదు. రాముడు; ఈ రెండు భావాలనూ * అహంకారాలు అనవచ్చునా? వశళిమ్థడు: మంచి ప్రశ్నే ఇది. ఈ రెండు అహంకారాలూ సప్తజ్ఞాన భూమికల్లో వుందేవారి అనుభవాలే. నిజానికి ఏడవ భూమికలో వున్న జ్ఞానుల దృష్టితో చూస్తే, అహంకారమనేది సత్యవస్తువు కాదు. కానీ, ఆరవ భూమికలో వున్నవారికి ఇంకా దేహం మిగిలి వుంటుంది. అంటే, వారింకా జీవించే వుంటారు. ఏదో ఒక రకమైన అహంకార బంధం లేకపోతే, వాళ్ళకు ప్రాణబంధం నిలిచి వుండటం కుదరదు గనుక, ఆ దశలో వాళ్ళకు వున్న అనుభూతికే అహంకారమని పేరు పెట్టారు. ఇది పేరు మాత్రమే! నువ్వు గమనించవలసినది ఏమిటంటే, అంతా నేనే అన్నవాడిది, ఏదీ నేనుకాదన్నవాడిది, వేరు వేరు దారులు కావు. ఒకే అనుభూతిని
యో,వ్నాస్టత్ర. ఆంాలంంతునంనులునా ఇద్దరూ విభిన్న భాషలతో వ్యక్తం చేస్తున్నారు, అంతే. రాముడు: చక్కగా చెప్పారు మహర్షీ! ఇంక మూడవ అహంకారాన్ని గురించి చెప్పండి. వళిష్ణడు:; ఇది లౌకిక అహంకారం . ఈ దేహమే నేనని బోధించే అహంకారం. నువ్వు దాన్ని సశరీర అహంకారమను, లేదా అశరీర అహంకారమను. ఎన్ని పేర్లు పెట్టినా, దేహమే నేననే తాదాత్మ్యస్థితిని కల్పించే అహంకారం మానవులకు పరమ శత్రువు. దీనిచేతనే గదా, దామవ్యాలకటులు ఉచ్చస్థితినుంచి నీచస్థితికి దిగజారారు! రాముడు; ఈ మూడవ అహంకారాన్ని పోగొట్టుకొనే ఉపాయం ఏమిటి? వళివృడు: మొదటి రెండు అహంకారాలను బాగా భావన చేసి, వాటిల్లో ఏదో ఒక దానిని సంపాదించుకోవటమే దీనికి మంచి మార్గం. ఇదే (బ్రహ్మ నిష్టులకు సమ్మతమైన మార్గం. రాముడు; గురుదేవా! లౌకిక అహంకారాన్ని పోగొట్టుకొన్న వాడి స్వరూపం ఎలా వుంటుంది? అతడు పొందే ఫలం ఏమిటి? వళిషృడు: ఆరవ భూమికలో వున్న జీవన్ముక్తులెలా వుంటారో వీడలా వుంటాడు. ఫలితం మాట వేరే చెప్పాలా? పరమాత్మలో ఐక్యమే ఫలం,
నాహం న తేన మమ కించిదపీతి మత్వా
సర్వం చ మే సకలమస్త్యహమేవ చేతి;
లబ్భాస్పదం మనసి సంవిదమేవనమీద్యాం
నీత్వాస్థితిం పరముపైతి పదం మహాత్మా ॥ (సర్గం3-ళ్లో 71)
ఈ దృశ్యప్రపంచం నేను కాదు. ఈ దేహం అసలే నేను కాదు. వీటితో నాకేమాత్రం ప్రయోజనం లేదు- అని మొదట
న భావించాలి. ఆ తరువాత ఈ ప్రపంచమంతా నాదే, అందరూ నావాళ్ళే అనుకోవాలి. అది గూడా దాటిన తరువాత ఇది అంతా నేనే అనుకోవాలి. ఇలా భావన చెయ్యగా చెయ్యగా, మనస్సులో ఒక (ప్రశస్తమైన జ్ఞానం చోటు చేసుకొంటుంది. అప్పుడు దానికి దృఢమైన స్థితిని కల్పించాలి. అలా చేసిన మహాత్ముడు పరమ (బ్రహ్మపదాన్ని చేరుతాడు.
రామా! ఇదీ క్రమం- ఈ దారిలో నువ్వు నడువు.
ఇక పోతే, దామవ్యాలకటోపాఖ్యానంలో నేను చెప్పదలచు కొన్నది కొంత వుంది. అది కూడా వింటే గానీ, నీకు నా భావం స్పష్టం కాదు.
మనం దామవ్యాలకటుల జన్మల వెంట పరుగెత్తుకు పోయి, అసలు నాయకుడు శంబరాసురుడి మాట మరచి పోయాం. మనమే కాదు. ఆ నాటి దేవతలూ అదే తప్పు చేశారు. ఆ తప్పే శంబరుడికి వరమైంది.
తన సైన్యం అంతా చెల్లాచెదురై, తన రాజ్యం విచ్చిన్నమై, తాను పరాజయం పాలైన తరువాత, శంబరుడు మొదట మండిపద్డా, (క్రమంగా చల్లబడి, తన పరాజయానికి కారణాలేమిటిని విశ్లేషణ మొదలుపెట్టాడు. దామవ్యాలకటులు చేసిన తప్పేమిటో అతనికి అర్ధమైంది.
వెంటనే అతడు కసితో రెచ్చిపోయి, ఇలా ఆలోచించాడు--
“ ఇప్పుడు మళ్ళీ మరో ముగ్గురు మాయా రాక్షసులను సృష్టి చేస్తా. వీళ్ళ పుట్టుకకీ కారణం మాయే. వాళ్ళ పుట్టుకకీ కారణం
యోనస్తాతి. ాాాలాయాతుాననాననానయంలనా మాయే. కానీ ఈ కొత్తవాళ్ళ మాయలో కొంచెం తత్వజ్ఞానం, కొంచెం వివేకం కలుపుతాను. అందుచేత ఇప్పుడు పుట్టబోయే వాళ్ళకి మిధ్యా భావనలు (తల్ల క్రిందుల ఆలోచనలు) రావు. దురహంకారం పుట్టదు. కానీ, ప్రాప్తకాలులై ప్రవర్తిస్తారు. అంటే, ఎప్పటికి ఏ సన్నివేశం ఎదురైతే, దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ వుంటారు. వాళ్ళ జీవసంపుటిలో నా ద్వారా ప్రవేశించిన యుద్ధ సంస్కారం, వాళ్ళచేత సమయానుకూలంగా యుద్ధాలు చేయించేస్తూ వుంటుంది. దేవతలు వీళ్ళను మోహపెట్టటానికి ప్రయత్నించినా, వీళ్ళల్లో వివేక సంస్కారం వుంది గనుక, వాళ్ళు దానికి లోబడరు. అప్పుడు దేవతలు నశించి తీరుతారు,” శంబరుడు ఇలా ఆలోచించి- మాయయోత్పాదయామాస బుద్దుదానిన వారిధిః ॥ (సర్ణంఉ-ళ్లో7) మళ్ళీ మాయతో ముగ్గురు కొత్త రాక్షసులను సృష్టి చేశాడు- ఎలా? సముద్రం బుడగలను సృష్టి చేసినట్లుగా సృష్టి చేశాడు. రామా! ఈ ఉపమానం ముఖ్యమైనది. గుర్తు పెట్టుకో . తరువాత ఉపయోగిస్తుంది. కొత్తగా పుట్టిన ఆ రాక్షసులకు భీముడు, భాసుడు, దృథుడు అని పేర్లు పెట్టాడు శంబరాసురుడు. భీముడు అంటే శివుడు. భాసుడు అంటే కాంతి. దృఢుడు అంటే ఎల్లకాలం స్థిరంగా వుండేవాడు. శంబరుడు ఆశించినట్టుగానే ఈ ముగ్గురూ తత్తవేత్తలై, మహావీరులై, వెలుగొందారు. అనుకున్నట్లుగానే దేవదానవ యుద్ధం మళ్ళీ మొదలైంది. దేవతలు మొదట్లో దిమ్మెర పోయినా, త్వరలోనే తేరుకొని, పూర్వం (బ్రహ్మగారు ఉపదేశించిన ఉపాయాలనే ప్రయోగించటం మొదలు పెట్టారు.
పలాతావంాలు.. భనుభాసద్భఢులు
భీమభాసదృఢులకు కూడా కొత్త ఆశలు చిగురించేవి . కానీ ఇంతలోనే వాళ్ళలో దాగి వున్న వివేకం మేలుకొని “ఇది నాకు కావాలి. ఇది నాది. వీడు నా శత్రువు . వీడు నాకు వద్ద - అంటున్నావు కదరా? “ఇది” అన్నావే ఆ “ఇది” ఎవరు? “నేను” అన్నారే ఆ 'నేనూ ఎవరు?- అని ప్రశ్నించటం మొదలు పెట్టేది.
వెంటనే లోలోపలే విచారణ ప్రారంభమయ్యేది. ఆ విచారణలో ఏ ఒక్కపదార్థము సత్యంగా కనిపించేది కాదు. అందువల్ల కోరికలూ, భయాలూ, మొదలైనవన్నీ తుడిచి పెట్టుకు పోతూ వుండేవి. నిత్యశుద్ధమైన చైతన్యం ఒక్కటే “సత్యం”? అనే అనుభవం ఎప్పటికప్పుడు మళ్ళీ నవనవలాడుతూ చిగురులెత్తుతూ వుండేది.
ఇంతలో దేవతలు విరుచుకు మీద వడేవారు. భీమభాసదృఢులు ప్రాప్తకాలులు కనుక, వెనుకాముందూ ఆలోచించకుండా, జయావజయాల శొంకలు లేకుండా, శంబరుడిమీద రాగం గానీ, దేవతల మీద ద్వేషం గానీ లేకుండా, ఎదురు దాడికి దిగేవారు. ఏది ఎలా జరుగుతోందో దాన్ని అలాగే జరుగనివ్వటమే వీళ్ళ ప్రధాన లక్ష్యంగా వుండేది. (ప్రాప్తకాలత్వం అంటే ఇదే.
రాక్షసుల పక్షాన యుద్ధం చేయటం కోసం తాము పుట్టారు గనుక, ఆ పక్షాన యుద్ధం చేయటం తమ కర్తవ్యం అనే భావనతో ఆ ముగ్గురు రాక్షనులూ యుధ్ధం చేన్తుంటే, దేవతలకు దిమ్మతిరిగిపోయి, తలోపక్కకూ పారిపోవలసి వచ్చేది. మెల్లిగా అందరూ ఒక చాటు ప్రదేశానికి చేరి విచారించుకొంటే, బ్రహ్మగారు చెప్పిన లక్ష సంవత్సరాలూ ఇంకా పూర్తి కాలేదనీ, తాము తొందరపడి
దామావ్యాలకటులను పారద్రోలటం పారపాటైందని అర్థమైంది. ఇక ఈ సారి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిటానికి మొహం చెల్లక, దేవతలంతా కలిసి, విష్ణుమూర్తి కాళ్ళమీద సడి శరణు వేడారు.
విష్ణుమూర్తి వాళ్ళను సన్న సన్నగా మందలించి, “పుట్టిన మాయా దానవులను చంపితే లాభం లేదయ్యా , అసలైన మొదటి మాయ ఆ శంబరాసురుడు. వాడ్డి సంహరిస్తే గానీ, మీ సమస్య తీరదు. అది మీకు మించిన పని. కనుక, మీ కోసం నేనే ఆ పని చేసి పెడతాను, అప్పటిదాకా నా లోకంలోనే దాక్కొని ఉండండి” - అని ఓదార్చి, తనే స్వయంగా బయలుదేరి, సరాసరి శంబరాసుడితో తలపడ్డాడు.
ఆ యుద్ధంలో భీమభాసదృఢులు ముగ్గురు వచ్చి, శంబరుడికి అండగా నిలబడ్డారు. కానీ, విష్ణుమూర్తి పరాక్రమం ముందు వాళ్ళంతా మిడతల్లాగా అయిపోయారు.
ఆ యుద్ధంలో తన పరివారంతో సహా శంబరుడు శమించి పోయాడు. అంటే అణగారి పోయాడు. రామా! ఈ పదం గుర్తు పెట్టుకో.
గాలిలో వెలిగే దీపాలు గాలివల్లే ఆరిపోయినట్లుగా, భీమభాసదృఢులు ముగ్గురూ ఆ యుద్ధంలలో, విష్ణుమూర్తి వల్ల ఆరిపోయారు. వీళ్ళలో ఏ వాసనలూ మిగిలి లేవు గనుక, ఆరిపోయిన దీపాల కాంతి ఆ చుట్టు పక్కల్లోనే అణగారి పోయినట్లుగా, వీళ్ళ ముగ్గురుకీ గమనమనేదే లేకుండా పోయింది. వాళ్ళకు లోకాంతర గమనం లేదు. జన్నాంత గమనంలేదు.
వాళ్ళు దేహం పోకముందు ఏ సర్వాత్మ భావనలో వున్నారో, అలాంటి సర్వాత్మ స్థితిలోనే దేహం పోయిన తరువాత కూడా వున్నారు.
పవన... మభాసద్భథులు రామా! వాసనా రహితులైన జీవన్ముక్తుల మరణం ఇలా వుంటుంది. దీనిబట్టి తెలుసుకో-
తస్మాద్వాసనయా బద్ధం
ముక్తం నిర్వాసనం మనః॥। (సర్గ 34- శ్ 27)
వాసన వుంటే, మనస్సుకు బంధం వస్తుంది. వాసన పోతే, మనస్సుకి ముక్తి వస్తుంది.
నిజానికి మనస్సనే దీపానికి వాసనలే నూనే. సత్యమైన, సమీబీనమైన (కపటాలు లేని) ఆలోచనలు చేస్తే, ఈ వాసనా తైలం ఇంకిపోతుంది. అదిపోకే మనస్సనే దీపం అణగారి పోతుంది.
ఈ కనిపించే ప్రపంచంలో సత్యం అణువంతైనా లేనే లేదని భావించటమే సత్యభావనం. ఆ కారణంవల్ల, అసలు భావించవలసిన అవసరమే లేదని గ్రహించటమే సమీచీన భావన, ఇదే సమ్యగీక్షణం. ఇదే చక్కటి చూపు.
రామా! శంబరాసురుడికి మాయాశక్తులు, వివేకజ్ఞానం, రెండూవున్నా కూడా, ఈ చక్కటి చూపు లేక పోవటంవల్ల, అతనికి ఇలాంటి సర్వాత్మ భావన లభించలేదు. కానీ, సాక్షాత్తుగా విష్ణువు చేతిలో మరణించాడు గనుక, విష్ణులోక ప్రాప్తి మాత్రం దక్కింది. విష్ణుమూర్తి యొక్క ప్రభావం ఏమిటో నీకు తెలుసు కదా!
కనుక రామా! పిల్లవాడు పిశాచాన్ని చూశానని భ్రమలోపడితే, వాడికి పిశాచం అనే ఆలోచనను క్రమక్రమంగా తొలగించుకొంటూ రావాలి. దాని కోసం ఆ పిల్లవాడి వివేకాన్ని పెంచుంటూ రావాలి. అలాగే, మనస్సుకు వాసనలు, అహంకారము, పడితే వాటిని దావమువ్యాలకటాదుల చరిళతను బోధించటం ద్వారా తొలగించుకొంటూ రావాలి. అసలైన శుద్ధ చైతన్యం ఎలా వుంటుందనే విషయాన్ని
యోన్నాస్టితై ఆంలాలలలనాతననావురతనులనుంాంులా భీమభాసద్భఢాదుల చరిత్రల ద్వారా బోధించాలి. అహంకారంవళ్లే దామాదులు నరకానికి పోయారనీ, అహంకారరాహిత్యం వల్లనే భీమాదులు ఎన్ని వ్యవహారాలు చేసినా చివరికి ముక్తినే పొందారనీ, మన మనస్సుకు మనమే బోధించుకొంటూ వుండాలి. ఈ మాట చెప్పటం కోసమే నీకు ఇంత కథ చెప్పాను - అంటూ, వళిష్టుడు ఈ ఉపాఖ్యానాన్ని ముగించి, పై చర్చలోకి ప్రవేశించబోతున్నాడు. ఇక్కడ మనం ఒక్కక్షణం ఆగి, ఈ ఉపాఖ్యానం మొత్తాన్నీ సింహావలోకనం చేసుకోవలసి వున్నది.
ఈ కథ పేరు దామవ్యాలకటోపాఖ్యానం, దామ అంటే దారం. వ్యాలం అంటే పాము. కటము అంటే చాప. వేదాంతంలలో (భ్రాంతికి రెండు ఉదాహరణలు (ప్రధానాలు. తాడు వున్న చోట పాము కనబడితే అది ఒక పెద్ద భ్రాంతి. అదే రజ్జు సర్పభ్రాంతి. దానికే మాటలు మారిస్తే దామవ్యాలభ్రాంతి.
ఈ దామాన్నే (దారాన్నే) పడుగు పేకలుగా అల్లితే వస్త్రం వస్తుంది. లేదా చాప (టం) వస్తుంది. ఈ వస్త్రం అంటే ఏమిటి? అని విశ్లేషణ ప్రారంభించాం. చర్చ తేలక మళ్ళి దారాలన్నీపీకి చూశాం. పీకికే ఏముంది? వస్త్రం లేదు పడుగులు లేవు. పేకలు లేవు. వట్టి దారం వుంది. ఈ దారాన్నే పోగులు పోగులుగా వుంటే దారం అంటున్నాం . ఉండగా వుంటే, దారపు ఉండ అంటున్నాం. పడుగు పేకలుగ మలచుకొంటే వస్త్రం అంటున్నాం. కనుక, వస్త్రం అనేది ఎక్కడినుంచో కొత్తగా వచ్చిన సత్యవస్తువు గాదు. తాడు
-ంంనింటతంజతతరందాలురరనాలశరదాయగంనాశిరవవాంయంంా... సీంహానలోకీనం మీద పాము లాగానే ఇది గూడా ఒక భ్రాంతే . ఇది దామకటభ్రాంతి (దారమే చాప అయిన భ్రాంతి).
మనం చూసే ఈ ప్రపంచం అంతా, ఈ రెండు రకాల బ్రాంతిమయ పదార్థాలతోనే నిండి వుంది. అందుచేత ఈ దృశ్య (పపంచం యొక్క తత్వాన్ని బోధించటానికి, వళశిషమహర్షి దామవ్యాలకటులనే ముగ్గురు మాయా జీవులను తీసుకున్నాడు.
ఇప్పుడు చెప్పుకొన్న (భ్రాంతులలో దారం (దాము సత్యం అన్నట్లుగా మనం మాట్లాదాం. ఇది ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు. నీళ్ళు- అలలు- బుడగలు-- నీళ్ళు. ఇదే ఆ ఉదాహరణ. సామాన్యుల దృష్టిలో నీరు వేరు, బుడగ వేరు. దేని ఆకారం దానిది. ఐనా, లోతుగా చూస్తే నురగే బుడగ. బుడగే అల. అలే నీరు. కనుక అన్నింటికీ మూలకారణమైనది జలం. జలానికి మరో పేరు శంబరం. వశిష్టమహర్షి తన కథానాయకుడికి ఈ పేరే పెట్టాడు. తను ఈ దృష్టిలోనే పేర్లను పెట్టాననే విషయాన్ని-
మాయాముత్పాదయామాస
బుద్దుదానివ వారిధిః || సముద్రం బుడగలను సృష్టించినట్లుగా, శంబరుడు భీమాదుల సృష్టి చేశాడు అనే చోట వ్యక్తం చేశాడు. అలాగే-(7)....
దామ వ్యాల కటాకారై
నేత పరిణతం యధా ॥ (సర్గం4-శ్లో 84) (మనస్సే తాడుగా, పాముగా, చాపగా పరిణామం చెందినట్లుగా, ఆత్మే దృశ్యరూపంగా కనిపిస్తోంది) - అనే చోట గూడా వ్యక్తం చేశాడు.
యోంవ్వానతి
నీరు అనటానికి సంస్కృతంలో అనేక వదాలుంటే
వశిష్టమహర్షి శంబరరి అనే పదాన్ని తీసుకొన్నాడు. ఎందుకంటే- “శం వృణోతి ఆవృణోతీతి శంబర?” అని వ్యుత్పత్తి.
శం అంటే శాంతి. దాన్ని ఆవరించేవాడు శంబరుడు. శాంతిని ఆవరించేది మాయే. అందుకే శంబరుడు మాయావి.
ఈ శంబరుడు తొలగిపోతే ఏం మిగులుతుంది అంటే, “శం” మిగులుతుంది. అంటే శాంతి మిగులుతుంది. దీన్ని సూచించటానికే కవి శంబరాసుర సంహార ఘట్టంలో శమించి పోయాడు (శశామ) అని ప్రయోగించాడు.
ఇం[ద్రియ విషయాల జ్ఞానం, తత్త్వవిషయాల జ్ఞానం- ఈ రెండూ కూడా మాయలో భాగాలే. ఎందుకంటే బంధమోక్ష వ్యవస్థ అనేది అవిద్యలో వున్నప్పుడు మాత్రమే వుంటుంది కనుక. అందుకే శంబరానురుడు దామవ్యాలకటులను మాధత్రవే గాక, భీమభాసదృ్భఢులను గూడా సృష్టించ గలిగాడు.
భీముడంటే శివుడు. కవి ఇక్కడ ఈ పదాన్ని సత్యవస్తువు అనే అర్ధంలో ఉపయోగించాడు. భాసుడు అంటే వెలుగు. కవి ఈ పదాన్ని జ్ఞానం అనే అర్ధంలో ఉపయోగిచాడు. దృఢుడు అంటే ఎల్లకాలం వుండేవాడు. కవి ఈ పదాన్ని అనంతం అనే అర్ధంలో ఉపయోగించాడు. “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” అనే వేదవాక్యం ఏర్పడుతుంది.
“సత్యమూ, జ్ఞానమూ, అనంతమైనదే పరబ్రహ్మ అని ఆ వాక్యం చెబుతోంది. అందువల్లనే భీమభానదృధులు దేహం చాలించినప్పుడు, ఏ లోకానికీ వెళ్ళలేదనీ, ఎక్కడ వున్నారో అక్కడే వుండిపోయారనీ చెప్పారు.
సీంహానలోకనం
పరబ్రహ్మతో తాదాత్మ్యాన్ని పొందిన బ్రహ్మవిద్యాద్వరిష్టులకు (ప్రాణోత్మమణం వుందదనీ, వాళ్ళు సర్వాత్మ భావాన్ని పొందుతారనీ, ఉపనిషత్తులలో పలుచోట్ల నిరూపించిన విషయాన్నే వశిష్టమహర్షి ఇక్కడ కథారూపంగా పెట్టాడు.
ఇక విష్ణువు అనే పదానికి సర్వవ్యాపియైన పరమాత్మ అని అర్ధం. ఆయన శంబరుడితో తలపడ్డాడు అంటే, మాయతో తలపడ్డాడు. మాయ పరమాత్మని ఆశ్రయించుకొని వుండి పరమాత్మనే కమ్మి వేస్తుంది. అది మాయ స్వభావం. అందుకే ఉత్పత్తి ప్రకరణంలో బంధం ఈశ్వరుడికే అని వశిషమహర్షి చెప్పాడు.
ఈశ్వరుడి కృప ఎవరిమీద ప్రసరిస్తుందో, ఆ జీవుల విషయంలలో మాయ పూర్తిగా లేనిదైపోతుంది. వాళ్ళు పూర్తిగా ముక్తులౌతారు. భీమాదులకు జరిగింది అదే.
మరి ఆ పెద్ద మాయ ( అనగా శంబరాసురుడు ) ఏమౌతుంది? అది పూర్తిగా పోదు. అణగి ప్రళయంగా పడి వుంటుంది. అందుచేతనే కవి శంబరుడు శమించాడు అన్నాడు. తరువాత మళ్ళీ కొత్త కల్పం వచ్చినప్పుడు మాయ మళ్ళీ తల ఎత్తుతుంది. ఈ చక్రం అనాది.
ఈ కథలో దేవతలంటే ఇంద్రియ శక్తులు. బ్రహ్మ అంటే సృష్టి చెయ్యాలనే ఆసక్తిలో వున్న రజోగుణం. అందువల్లనే రజోగుణ సహకారంతో ప్రవర్తించిన ఇంద్రియ శక్తులు కొంతవరకే జయాన్ని సాధించి, తరువాత ఓడిపోయాయి. ఆ తరువాత తప్పు తెలుసుకొని, విష్ణుమూర్తి రూపంలలో వున్న సత్త్వగుణాన్ని ఆశ్రయించినప్పుడు, విష్ణుమూర్తే వాళ్ళ కోసం శ్రమచేసి విజయం సాధించి పెట్టాడు.
యోలవాన్టిది. రలాలాలాలాలాాలాలాలా య్రా కాగా, సామాన్యంగా రజోగుణ తత్పరులై వుండే సామాన్య మానవులు మొదట భక్తితో సత్తమూర్తిమైైన భగవంతుడిని ఆరాధించాలనీ, ఆ తరువాత ఆయననే విశ్వవ్యాపిైన పరమాత్మగా గుర్తించాలనీ, దీనికి ఆత్మవిచారణే మార్గమనీ, మనస్సుకు గల బంధాలను పోగొట్టే మోక్షోపాయం ఇదేననీ, వశిష్టమహర్ని ఈ కథలో సంకేతపరుస్తున్నాడు.
(ప్రతి జీవీ మాయవల్లే జన్మ ఎత్తుతున్నాడు. వాడి వంశవృక్షానికి మొదటి విత్తు మాయే. కానీ ప్రతివాడూ ఆ మాట మరచి, తన శరీరం పుట్టిన దగ్గరినుంచీ, అది మరణించేదాకా వుండే కధను తన కథ అనుకొంటున్నాడు. అలా కాక, తనకు మొదటి బీజమైన మాయ దగ్గరనుంచీ ఇప్పటి దాకా కథను తెలుసుకొంటే, అదే నిజమైన ఆత్మకథ అవుతుంది. ఈ కధ తెలిసినవాడికి మాయవల్లే తనకు ఇన్ని శరీరాలు వచ్చాయనీ, తనయొక్క అసలు స్వరూపం శుద్ధవైతన్యమేననీ, తెలుసుకొంటాడు. అదే మోక్షం. ఈ విషయాన్నే దామ కథలో యమధర్మరాజు ఇచ్చిన వరంగా వశిష్టమహర్షి సంకేత పరచాడు.
ళవ్చీ వాళ్ళు ముగ్గురూ తమ స్వంత జన్మ కధను పూర్తిగా ఎప్పుడు వింటారో, అప్పుడు వాళ్ళకు కష్టాలు పోతాయి” అన్నాడు, యమధర్మరాజు.
పూర్తిగా కష్టాలు పోవడమంటే మోక్షమే. పూర్తిగా జన్మకథను వినటం అంటే, ఇప్పుడు చెప్పుకొన్న ఆత్మవిచారమే. ఇలాంటి ఆత్మవిచారణ చేస్తే, ఎంతటి నీచుడికైనా సరే, మోక్షం వచ్చి తీరుతుంది- అని చెప్పటానికే వశిష్టమహర్షి పిచ్చుకకు, దోమకు, గోరువంకకు, మోక్షం వచ్చినట్లుగా వర్ణించాడు. దోమకే ఆత్మవిచారణ
లతా +ాాాాాంనాలందంలాతందాతనరనికాతనరంాతందతతాలందందలంండా సింహానలోకనీం వల్ల మోక్షం లభిస్తే మానవజాతిలో ఒక జాతికి లభించి, మరొక జాతికి లభించక పోవటం ఉంటుందా?- అనేదే వశిషుహర్షి ఆకూతం. (ఆకూతం అంటే, మనసులోని మాటు).
అలాగే, ఆ జీవులకు తమ జన్మ కథలు చెప్పినవాడు మంత్రి కుమారుడు అన్నారు. మంత్రి అంటే మంత్రం కలవాడు, మంచి ఆలోచన గలవాడు, జ్ఞాని అని అర్ధం. అతడే సద్దురువు అనేది ఇక్కడి సంకేతం.
ఇవి గాక కథలో ఎక్కడికక్కడ కొన్ని సంకేతాలను (ప్రస్తావించుకోవటం జరిగింది. పాఠకులు మరొక్క సారి వెనుకటి కథను ఈ సంకేతాల దృష్టితో మననం చేస్తే , కథ హృదయానికి బాగా హత్తుకొంటుంది.
ఈ విధంగా నంకేతమయమైన కథను వినిపించిన వశిష్టమహర్షి తన చర్చను ఇలా ముందుకు సాగిస్తున్నాడు. వశిమ్రడు: రామా! పరిశుద్దాత్మలోంచి మనస్సనే మాలిన్యం ఎలా పుట్టిందని నువ్వడిగావు. ఆ చర్చకు ఇది సమయం కాదనీ, ముందు మనస్సనేది ఎలా వచ్చిందో విచారించాలనీ, నేనన్నాను. దానిమీద ఈ విషయంలో వివిధ మతాలవారు ఏమి చెబుతున్నారో తెలుసుకొని, వారి దృష్టులన్నీ భ్రమలనీ, వేదమార్గం ఒక్కటే సత్యమార్గమనీ, మనం నిర్ణయించుకొన్నాం. ఆసందర్భంలో సామాన్య మానవుడికి జీవన్ముక్తి సాధనలో నిజమైన సాధనం మనస్సే అనీ, దాన్ని అజా(గ్రత్తగా ఉంచుకొంటే పైకి వెళ్ళినవాడు గూడా పడిపోతాడనీ, అదే మనస్సును జాగ్రత్తగా ఉంటుకొంటే సూటిగా మోక్షమే వస్తుందనీ, చెప్పుకొన్నాం. అందుకు నిదర్శనంగా దామవ్యాలకటోపాఖ్యానాన్నిి భీమభాసదృఢోపాఖ్యానాన్ని గూడా చెప్పుకొన్నాం
యో్కోవ్నాన్టాత. .ఆంానాతయతాతంలతాతడుంలనయలంులా
రామా! ఇక బంధ మోక్షాలకు రెండింటికీ కారణమైన ఈ చిత్తం శమించి పోయే ఉపాయాలేమిటో విచారించవలసి ఉంది. ఇక ఆ ప్రయత్నం చెద్దాం . - అన్నాడు వశిష్ట మహర్షి.
ఇక వళిష్ట మహర్షి తన బోధను “దాశూర వర ప్రదానము
- అనే ఒక కథవైవు నడిపించ దలచుకున్నాడు. దానికి పూర్వ రంగంగా, ఆయన 85 వ సర్గ నుంచి 46 వ సర్గ దాకా, అంటే 12 సర్గల పాటు సుదీర్ధమైన సైద్ధాంతిక చర్చ జరిపాడు. ఈ చర్చ ఒకింత సాంకేతిక పద సమ్మిశ్రితమై, ఒకొక్క చోట పునరుక్తి లాగా కనిపిస్తూ, కొంచెం జటిలంగా సాగింది. అందువల్ల, ఈ సర్దల సారాంశాన్ని కొంచెం వెనుక ముందులకు అన్వయించుకొంటూ వీలయినంత సం(గ్రహంగా చెప్పుకుందాం.
ఈ చర్చను వశిష్టుడే ప్రారంభించాడు. ఆయన ఇలా అన్నాడు - వశిష్ణుడు: రామా బంధం తొలగిపోయి మోక్షం రావాలంటే, చిత్తం (అనగా మనస్సు) శమించి పోవాలని నేను చెప్పాను.
బంధ మోక్షాలకూ - మనస్సుకూ సంబంధం ఏమిటంటా వేమో! ఇక్కడే జ్ఞాన సారాంశం వుంది.
శత్రూయతాం జ్ఞాన సర్వస్వం
శృత్వా చై వావధార్యతామ్
భోగేచ్చామాత్రకో బంధః
తత్త్యాగో మోక్ష ఉచ్యతే ॥ (సర్ద 35 శ్లోకం 3)
మకా, బంధమోక్ష చర్చ
భోగాలమీది కోరికే బంధం;
ఆ కోరికను వదిలి పెట్టడమే మోక్షం
కోరిక, కోరికను వదిలి పెట్టడం - ఇని రెండూ మనస్సు పనులే. కనుక మనస్సుకూ బంధమోక్షాలకూ ఉన్న సంబంధం యిదే. రామా! ఈ విషయాన్నే మరో రకంగా గూడా చెప్పుకోవచ్చు.
సర్వగే స్వాత్మని స్వచ్చే
ఏవాహ మితి భావనా!
ఏతత్ తత్ బంధనం లోకే
స్వవికల్పోప కల్పితమ్ 1 (సర్గ 35 శ్లోకం 39)
ఆత్మ సర్వవ్యాపి అయివుండగా ఆ మాట మరచిపోయి, తనలో తనే ఏవో వికల్పాలు కల్పించుకుని, “ఇదిగో ! ఈ దేహంలో వున్న వాడ్డే నేనూ” - అనే భావన ఏదైతే వుందో అదే బంధం.
రామా! గమనించావు గదా ! ఈ నిర్వచనంలో గూడా భావనేబంధమని చెబుతున్నాం ! దీనికి వ్యతిరేకమైన భావనే మోక్షం!
“*అనంతోస్తీ శ్వరోస్తీతి
నిశ్చయేన విలీయతే ”(సర్గ 35,శ్లోకం 38)
అనంతుణ్ణి నేనే!
సర్వేశ్వరుణ్ణి నేనే! - అనే నిశ్చయంతో పరిమితత్వ కల్పనా రూపమైన బంధం నశిస్తుంది. అంటే - మోక్షం లభిస్తుంది.
ఇప్పుడు గూడా, బంధ మోక్షాలనేవి, మనన్సుకు సంబంధించినవే అని చెప్పినట్లే అవుతోంది. రాముడు: ఇంతకూ మనస్సంటే ఏమిటి గురుదేవా?
యోన్నాస్తాతి. ాలరారరవాతుంనావునావనులలనుయింా వళిష్ణుడు:
దృశ్య దృష్టి స్కుటా యేయం
సాహ్యవశ్య మసన్మయీ!।
తన్మయత్వం చ మనసః
స్వరూపం విద్ధి నేతరత్॥ (సర్గ 35, శ్లోకం 47)
మన చుట్టూతా రకరకాల దృశ్యాలు కనిపిస్తున్నాయి. “ఈ కనిపించేవన్నీ నిజంగా వున్న వస్తువులా, లేక అవి లేకపోయినా మనకు కనిపిస్తున్నాయా? నిజంగా లేకపోతే ఎలా కనిపిస్తాయి?” - అంటావా ? నిజంగా లేకపోయినా స్వప్నంలో పర్వతాలు కనిపించటంలేదా? ఇవి అలాంటివి కాదండీ స్థిరంగా చాలా కాలం కనిపిస్తున్నాయి - అంటావా? చాలా కాలం కనిపిస్తున్న మాట నిజమే గానీ, వీటికి ఒక మొదలు, ఒక చివర, ఉన్న మాట ఖాయమే గదా! అంటే, మొదటికి వెనకాల అవి లేవు - చివరికి తరువాత అవి లేవు. ఇటూ అటూ లేక, మధ్యలో మాత్రం కనిపించేవి సత్యం కావటానికి వీలు లేదు! కనుక, మనకు కనిపించే ఈ దృశ్యాలన్నీ “దృశ్య దృష్టలే” గానీ, సత్యమైన దృశ్య పదార్థాలు కావు! దృశ్య రూపంలో వుండే ఈ దృష్టులన్నీ - “అసన్మయములు” అంటే - లేని పదార్ధాన్ని ఉన్నట్లు చూపించేవి!
అయితే చిత్రమేమిటంటే - లేని పోని ఈ దృష్టులవల్ల, ద్రష్టకు ఒక “తన్మయత్మం” ఏర్పడుతుంది. అంటే - ఆ దృశ్య దృష్టులతో తాదాత్మ్యం ఏర్పడుతుంది. అంటే ఆ దృశ్య దృష్ప్టులయొక్క వాసనలు గడ్డ కట్టినట్లవుతుంది. ఈ దృశ్య దృష్టి తాదాత్మ్యమే మనస్సు యొక్క అసలైన స్వరూపం;
- ఇదే మనస్సు యొక్క నిర్వచనం॥
నయ
అంటే తేలిందేమిటంటే - వెనుకటి జన్మలలో ఈ జీవికి ఏర్పడిన వాసనలు గడ్డ కడితే, ఆ గడ్డ పేరే మనస్సు - అని తేలింది.
నువ్వు మేల్మొని వుండగా, నీకు కొన్ని అనుభూతులు కలిగాయి. వాటిలో కొన్ని గడ్డ కట్టగా, నీ కొక స్వప్నం వచ్చింది. ఆస్వప్నంలో నీవాక రాజువయ్యావు. ఆ రాజుకొక మనస్సు వుంది. నిజంగా మాట్లాడితే, ఆ మనస్సే ఆ రాజు! ఆ స్వప్ప్షమనస్సు ఎక్కడ్డించి వచ్చింది.? మెలకువలోని నీ వాసనల గడ్డే ఆ రాజు మనస్సు అయింది. అలాగే - వెనుకటి జన్మల ద్వారా సంక్రమించిన వాసనల గడ్డే ఇప్పటి నీ మనస్సు అవుతోంది! కనుక రామా! “నీ వాసనలే నీ మనస్సు” అని గ్రహించు!
ఇందాక బంధం అంటే రెండు నిర్వచనాలు చెప్పుకున్నాం. ఆ నిర్వచనాలకూ సారాంశం ఏమిటంటే, వాసనలను పెంచు కోవటమే బంధం - వాటిని తుంచు కోవటమే మోక్షం - అని!
మనస్సాక విత్తనం వంటిది. విత్తనాన్ని మామూలుగా నాటితే, ఏ విత్తనం నాటావో ఆ చెట్టే వస్తుంది. కానీ, నాటేముందు, ఆ విత్తనానికి కొంత సంస్కారం చేస్తే దానివల్ల పుట్టే చెట్టు మామూలు చెట్టు లాగా వుండదు.
అమ్లం మధురసాసిక్తం
మధురం మధురంజితమ్ :
జీజం ప్రతివిషాకల్మ
సిక్తంచకటు జాయతే 1 (సర్గ 35, శ్లోకం 29)
పుల్లగావుండే చింతగింజను చెరుకు రసంలో బాగా నానబెట్టి, అనగా కొన్ని రకాల ప్రక్రియలు చేసి తర్వాత దానిని నాటితే, అప్పుడు పుట్టే చెట్టు చింత చెట్టు లాగానే వున్నా, దాని పళ్ళు మాత్రం పుల్లగా
యోోన్నాస్టితి. .ాలరాడరాలావనునాలునాలదునాతనుంలతరనరంననా కాక తియ్యగా వుంటాయి. అలాగే , అదే చింత విత్తును, చేదుగా వుండే వేప రసంలో నాన బెట్టి (కొన్ని రకాల ప్రక్రియలు చేసి) నాటితే, అప్పుడు పుట్టే చెట్టు చింత చెట్టులాగే వున్నా దాని పళ్ళు పుల్లగా గాక చేదుగా వుంటాయి.
రామా! వృక్ష శాస్త్రంలో ఈ వివరాలన్నీ నువ్వు చదువుకున్నావు. ఈ అనుభవం కూడా నీకు వుంది.
వాసనల గడ్డ అయిన ఈ మనస్సు కూడా చింత గింజ లాంటిదే! దీన్ని సద్భావనా రసాలలో నానబెడితే, అది ఉత్తమ మనస్సు అవుతుంది. అప్పుడది మోక్షానికి కారణం అవుతుంది.
పాఠకులు (శ్రోతలు) ఇక్కడ ఒక వైజ్ఞానిక విషయాన్ని గమనించ వచ్చు. హైటబ్రీడు మొక్కల తయారీని పోలిన ఒకానొక బొటానికల్ టెక్టిక్ ఏదో ఒకటి ఇక్కడి దృష్టాంతంలో ప్రసక్తమయింది. ఇది వృక్ష శాస్త్రం కాదు కనుక ఇంతకన్నా వివరాలు చెప్పే సావకాశం యోగవాశిష్టంలో వుండదు. కాని, ఆనాటివారికి ఇలాంటి సీడ్ మానిప్యులేటివ్ టెక్నిక్కులు తెలుసునని దీనివల్ల మనకు తెలుస్తోంది. దీన్నిలా వుంచి అసలు విషయంలోకి వెళదాం. వశిష్టుడు అంటున్నాడు-
కనుక రామా! నువ్వు సద్భావనం అభ్యసించు! ప్రతివాడికీ, నేను పరిమితుడ్డి అనీ, నాకు మార్పులు వున్నాయనీ, ఒక తప్పుడు నిశ్చయం అప్రయత్నంగానే ఏర్పడుతోంది. దాన్ని మళ్లీ మనస్సుతోనే తిరగ దిప్పుకోవాలి.
నేను అనంతుణ్ణి! నేను సర్వేశ్వరుణ్ణి ! అని భావన చేయాలి. ఇదే సద్భావన!
ఈ సద్భావనవల్ల క్రమంగా మనస్సనేదే లేకుండా పోతుంది!
_తలనాాంరాలాయరాణయకాయయలాయింాయణయిలయలా.. ౦ధీమోక్షీ చీర
మనసోభ్యుదయో నాశః
మనో నాశో మహోదయః।
జ్ఞమనో నాశమభ్యేతి
మనో-జ్ఞస్య వివర్ధతే 1 (సర్గ 35 , శ్లోకం 18)
రామా! ఈ మనస్సు ఒక విచిత్రమైన పదార్థం. మనస్సు వృద్ధి పొందిందంటే - అది నశించిపోయినట్లే! మనన్సు నశించిందంటే - అది నిజంగా పెరిగినట్లే !!
నిజంగా తెలిసిన జ్ఞాని మనస్సు నశించిపోతుంది. ఏమీ తెలియని అజ్ఞాని మనస్సు తెగ పెరిగి పోతుంది. రాముడు; గురుదేవా! మీ మాటలు చిత్రంగా వున్నాయి. పరస్పర విరుద్ధంగా వున్నాయి. మీరేదో భావాన్ని మనస్సులో వుంచుకొని “పాడుపుకథ” లాగా ఈ మాటలు చెబుతున్నారు. దయచేసి కొంచెం వివరించండి. వనివ్థుడు: రామా! పెద్ద రహస్యమేమీ లేదు. మనస్సంటే వాసనల గడ్డ అని చెప్పాం ! వాసనలంటే సంకల్ప వికల్పాలు! అవి వుంటే ఆ మనస్సుకు ప్రశాంతి వుండదు. ప్రశాంతి లేక పోవటం - నాశనమే గదా! (నాశనం అంటే, యథాపూర్వస్థితి లేక పోవటం)
అలాంటి మనస్సు ఇంకా వృద్ధి పొందితే, అశాంతి ఇంకా పెరిగిపోతుంది. అంటే, ఆ మనస్సు మరింత పాడైపోతుంది. అందుకే మనస్సు వృద్ధి పొందటమే - దానికి నాశం అన్నాను.
ఇక - మనస్సు నశించటమంటే “సంకల్ప వికల్పాలు” అణిగి పోవటం! అవి అణగిపోతే, ఇక వనస్సనే దేముంది? అది లేదు! కానీ సంకల్ప వికల్పాలు లేవు గనుక, ఆ దశలో అపారమైన ప్రశాంతి వుంది. ఆ ప్రశాంతియే నిజమైన అభివృద్ధి! కనుక, మనస్సు నశించటమే అభివృద్ధి అన్నాను.
యోోవాట్టిటి. ఆవుానకావలాయలారా ఈ విషయం చెప్పడం కోసమే జ్ఞానికి మనస్సు ఉండదని చెప్పాను. వాడిలో అది నశించి పోతుందన్నాను. అజ్ఞానికి మనస్సు మరింత పెరిగి పోతుందన్నాను. ఈ ఉదాహరణను బట్టి వెనుకటి నా మాటలను సమన్వయించుకుంటే, ఏ విరోధమూ వుండదు. కనుక రామా! నువ్వ సంకల్ప వికల్పాలను తొలగించుకునే కృషి చెయ్యి. రాముడు: గురుదేవా ఈ దృశ్యదృష్టులన్నీ అసన్మయాలు, అసలే లేనివి, అంటున్నారు గదా! అంటే, ఈ కనిపించే ప్రపంచం అంతా, బొత్తిగా లేనిది. ఆ పరమాత్మేమో నిజంగా ఉన్న పదార్థం. లేని ప్రపంచానికి ఉన్న పరమాత్మలో స్థితి ఎలా వచ్చింది? ఇది పూర్వం మీరు చెప్పిన విషయమే. కానీ ఇప్పటి మీ చర్చ వల్ల మళ్లీ కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనుక, దయతో మళ్లీ వివరించండి. వళశివృడు: రామా! పరమాత్మ అనేవాడు చైతన్య రూపుడు. ఈ చైతన్యం రెండు రకాలుగా వుంటూ వుంటుంది. జ్ఞానులలో ఈ చైతన్యం శుద్ధ ప్రకాశ రూపంగా వుంటుంది. ఇదే చైతన్యం అజ్ఞానుల దగ్గరకు వచ్చేసరికి, ఈ సంసార చక్రాన్ని కల్పిస్తుంది. రాముడు: శుద్ధ చైతన్య రూపమంటే యేమిటి? సంసారమంటే యేమిటి? వళిషుడు: జ్ఞానులకు, అజ్ఞానులకూ ఇద్దరికీ గూడా ఈ సువిశాల ప్రపంచం కనిపిస్తూనే వుంటుంది. తాతకీ మనవడికీ ఇద్దరికీ అలలు, బుడగలు , నురగలు కనిపిస్తూనే వుంటాయి. కాని, తాత మాత్రం ఆ కనిపించే అలలు, బుడగలు, నురగలు, అన్నీ నీరే అని
ంయందలయింయింంలయాలంంా... లేని ప్రపంచాని ఉనికి ఎలా నద్చంది? (గ్రహించ గలుగుతాడు. మనవడు ఆ మాట గ్రహించలేక అవన్నీ వేరు వేరు అనుకొంటూ వుంటాడు.
అలాగే, జ్ఞానికి ఇన్ని రకాల ప్రపంచ పదార్థాలు కనిపిస్తున్నా వాటన్నింటిలోనూ, ఒకే శుద్ధ చైతన్యం అనుస్యూతంగా, సర్వ వ్యాపిగా, కనిపిస్తూ వుంటుంది. ఇది తాతయొక్క దృష్టివంటి దృష్టి. “వైతన్యం శుద్ధ ప్రకాశ రూపంగా వుండటం” అంటే ఈ స్థితి అనుభవంలోకి రావటమే .
ఇక, బాలుడికి అలలు, బుడగలు, నురగలు - అన్నీ వేటికవే వేరని తోచినట్లుగా, ఈ ప్రాపంచిక పదార్థాలన్నీ వేటికవే (విభిన్న సత్య పదార్దాలుగా అనుభవంలోకి వస్తే - ఆ స్థితి పేరే సంసారం.
ఇంతకూ, చెప్ప వచ్చిందేమిటంటే, జ్ఞానుల దృష్టిలో శుద్ధ చైతన్యంగా వున్న పరమాత్మే, అజ్ఞానుల దృష్టిలో సృష్టికర్త అవుతున్నాడు. కాని, విశేషమేమిటంటే, ఇది మామూలుగా కుమ్మరివాది కుండల కర్భత్వం వంటి కరృ్ఫత్వం కాదు. ఇక్కడ ఆ శుద్ధ చైత్య రూపుడైన పరమాత్మే పృథివ్యాది పంచ భూతాలుగా, వాటిలోంచి వచ్చే భౌతిక పదార్థాలుగా, విజ్బంభిస్తున్నాడు. కుమ్మరివాడు తనే కుండ అయిపోడు. పరమాత్మ మాత్రం తనే ప్రపంచం అయిపోతున్నాడు. కుమ్మరివాడి కర్ఫత్వానికీ పరమాత్మకు ఉన్న కర్భత్వానికీ గల ఖేదం ఇదే.
ఐతే , తనే దృశ్య పదార్ధంగా మారిపోవటాన్ని కరృత్వం అనవచ్చునా? అనరాదా? - అంటే, అది నీ యిష్టం. అది దృష్టి భేదం! అది గూడా ఒక మార్చే గనుక, ఆ మార్పుకు కర్త అతడే గనుక, పరమాత్మే ఈ ప్రపంచానికి కర్త అంటావా? అను. కానీ, ఈ రకమైన కరృత్వము, కుమ్మరివాడి కరృత్వము, ఒకటి కాదు.
యోనాస్టితి అనంందుతరరరరా శరండాతింంరిరాశింధరరాశండరధాణంధంటాణిధతిధిదాతిశరరకాశిం0దంా-
కర్త అంటే, వాడికి ఒక సాధనం ఉండాలి. ఉపాదాన పదార్ధం వుండాలి. సంకల్పం వుండాలి. క్రియ వుండాలి. ఇంకా ఏవేవో వుండాలి. అప్పుడే వాడు కర్త కాగలుగుతాదు. పరమాత్మకు ఇవేవీ లేవు. కనుక ఆయనను కర్త అనటానికి వీలు లేదు. ఆయనకు కరృత్వం వుండే వీలు లేదు, అంటావా?- అను. ఆ దృష్టిలో పరమాత్మ కర్త కాదు,
ఇవి రెండు దృష్టులు. విభిన్న దృష్టులు. కానీ, ఈ రెండిటికీ ఒక సమన్వయం గూడా వుంది. ఎలాగంటే -
అకర్త అయిన చిదాత్మ ప్రతి పదార్ధంలోనూ అంతర్యామిగా వుండి, ఆయా పదార్థాలచేత ఆయా పనులు చేయిస్తూ, తాను ఏదీ అంటకుండా ్రకాశిస్తునే వుంటాడు.
ఒక ఉదాహరణ తీసుకుందాం. నేలలో ఒక విత్తు పడ్డది. ఆ విత్తులో ఒక్ర చిదాత్మ ఉన్నాడు. అందువల్ల ఆ విత్తులో గల మొక్క బయటకు రావాలని ప్రయత్నం చేస్తుంది. ఆ విత్తు చుట్టూ మట్టి ఆవరించుకొని వుంటుంది. కానీ, ఆ మట్టి రేణువుల సందుల్లో చిల్లులు చిల్లులుగా ఆకాశం వుండి, ఆ మొక్కబయటకు రావటానికి అవకాశం ఇస్తుంది. అవకాశం ఇచ్చేదే ఆకాశం అని నిర్వచనం కదా! అంటే, ఆ చిదాత్మే ఆకాశంలో అంతర్యామిగా వుండి ఆ మొక్క బయటకు వచ్చేందుకు సహాయం చేస్తున్నాడన్నమాట.
ఇక గాలివుంది. దానిలో అంతర్యామిగా వున్న చిదాత్మ స్పందాత్మకుడై, ఆ మొక్కను అకర్షిస్తాడు - అంటే, పైకి లాగుతాడు. ఇక్కడ గాలి అంటే, చెట్లు చేసే శ్వాస ప్రక్రియలో ప్రాణ రూపంగా వున్న వాయువు. ఆయన ఆ మొక్కను బయటకు గుంజుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి.
అపర రాశరుంంంయియంలలయిల.. లేని ప్రపంచాలి ఉనికి ఎలా నచ్చింది?
తరువాత జలం వుంది. అది జడమే అయినా, దానిలో అంతర్యామిగా వున్న చిదాత్మ ఈ మొక్కలో రసత్వాన్ని ప్రవేశపెట్టి, దాన్ని మెత్తబడేటట్లు చేస్తున్నాడు.
ఇక భూమిలో వున్న అంతర్వామి తన గట్టితనాన్ని ఆ మొక్క వేళకు అందించి, అది పడిపోకుండా నిలబెడుతున్నాడు.
- ఇక మిగిలింది అగ్ని ఈ అగ్ని సూర్య కిరణాల ద్వారా మొక్కలోకి (ప్రవేశిస్తుంది. ఆ అగ్నిలో వున్న అంతర్యామి ఆ మొక్కకు ఒక రూపాన్ని - షేప్‌ను - కల్పిస్తాడు. ఆ రూపంవల్ల , “ఇది ఫలానా మొక్క అనే వ్యవహారం ఏర్పడుతోంది.
ఈ విధంగా, వంచభూతాలలో (వతిభబూతమూ, వ్రవంచంలోని (ప్రతి కార్యానికీ తన వంతు నవాకారం అందిస్తూనేవుంది.
అలాగే “కాలం”అనే అంశం గూడా తన వంతు సహకారాన్ని జోడిస్తూనే వుంటుంది. కాలాత్మకుడైన అంతర్యామియొక్క ప్రభావం మదింత ప్రబలమైనది. ఇది యుగ యుగాలుగా, కల్ప కల్పాలుగా, వివిధ సృష్టి ప్రక్రియలను ఆవిష్కరిస్తూనే వుంటుంది.
రామా! ఈ చెొప్పిన (వ్ర(క్రియవల్ల తేలుతున్న విషయమేమిటంటే - ప్రతిచోటా అంతర్యామిగా వున్న చిదాత్మే ఇన్ని రూపాలనూ పొందుతున్నాడు. అంటే, చిదాత్మలోనే ఈ సృష్టి దృష్టులన్నీ కనిపిస్తూ వున్నాయన్నమాట! ఎవరికి కనిపిస్తున్నాయి? చిదాత్మకే కనిపిస్తున్నాయి. ఇది ఎలా కుదురుతుందంటావేమో! బాగా తాగి మత్తెక్కినవాడికి, తనే మరో మనిషి లాగా కనిపిస్తూ వుంటాడు. అలాగే, మాయావృతుడైన చిదాత్మ తనకు తనే జడ
యోనాస్టితి శరం అ రరింరానరరదులాజంధంకాం0 కాజ యననాణంంరాణాం00ాశంరింటతందలా. దృశ్య దృష్టి అనీ, నేను వ్యవహరిస్తున్నాను. దీన్నే మామూలు వేదాంత పరిభాషలో చెప్పాలంటే, ఈ దృశ్య ప్రపంచం అంతా చిదాత్మయొక్క వివర్తం! వివర్తం అంటే ఏమిటో చెప్పాను కదా - తాడు పాముగా కనిపించినట్లు , చిదాత్మే ఈ ప్రపంచంగా కనిపిస్తోందన్నమాట! కనుక, మొత్తంమీద తేలిందేమిటంటే, ఈ ప్రపంచం
మొత్తంలో ఆత్మకంటే భిన్నంగా వేరే వస్తువేదీ లేదు. నీకంటే భిన్నమైన వస్తువే లేకపోతే, నీవు దేన్నయినా కోరటమనేది ఎలా కుదురుతుంది? దేన్నయినా సృష్టి చేయటమనేది ఎలా కుదురుతుంది? దేన్నయినా ఫలంగా పొందటం ఎలా కుదురుతుంది? కాబట్టి రామా! నువ్వే పని చేసినా , కరృత్వాఖినివేశాన్ని వదిలిపెట్టి, ఆ పని చెయ్యి. అప్పుడు నీకు ఏ దుఃఖమూ అంటదు.
రాముడు: గురుదేవా! అసలే లేనిదైన ఈ ప్రపంచం ్రపంచాతీతుదైన చిదాత్మ యందు ఏ విధంగా స్థితిని పొందింది - అని నేనడిగాను. ఇది పాత ప్రశ్నే! దీనికి మీ సమాధానం కూడా పాత సమాధానమే! కానీ, నేనీ ప్రశ్న ఎందుకు వేశానో దాన్ని కనిపెట్టి, దానికి తగిన ప్రక్రియలో మళ్లీ పాత సమాధానాన్నే లాక్కొచ్చారు. దానికి పొడిగింపుగా అకర్భత్వాన్ని సాధించమని నాకు బోధిస్తున్నారు. ఇంతకూ అకర్తగా వుండటం ఎవరికైనా సాధ్యమా? అదీగాక ఉత్తమ తత్వవేత్తలైన పెద్దలు కూడా కొన్ని లౌకిక కర్మలు, కొన్ని సాథనా పరమైన కర్మలు, చేస్తూనే ఉన్నారు కదా. చేస్తున్నారంటే వారికి కరత్వం ఉన్నట్లే గదా! వాళ్లే వదిలి పెట్టని కర్షత్వాన్ని నేనెందుకు వదిలి పెట్టాలి?
ఆఅిరిదలందినాశింధందాశంందాశంంయిశంంందిలింంలియిల... క్రీర్ర్యర్తం అంటీ ఏమిటి? వళిష్ణుడు; రామా! కరృత్వం అంటే ఏమిటి? నిద్దర పోతున్నవాడు నిద్రలో ఇటూ అటూ దొర్లగా, అనుకోకుంఢా నేలమీద మట్టి కదిలి, ఏదో ఒక బొమ్మ ఆకారం ఏర్పడింది. వీడా బొమ్మకు కర్త అవుతాడా? అవుతాడని నువ్వు అనేటట్లయితే, వాడు మళ్లీ మళ్లీ అలాటి బొమ్మ వెయ్యమంటే వెయ్యగలగాలి. అది సాధ్యం కాదు. కనుక, కేవలమూ శారీరికమైన క్రియను బట్టి కర్భత్వం అంటదు. ఒకానొక ఫలితం మీది కోరికతో, ఇచ్చా పూర్వకంగా, చేసే పని వలన మాత్రమే కరృత్వం అంటుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఒక క్రియకు వెనకాల జ్ఞానము, ఇచ్చ, ప్రయత్నము అనే మూడు మెట్లు వుంటేనే, ఆ (క్రియవల్ల ఆ వ్యక్తికి కర్చత్వం అంటుతుంది.
జ్ఞానము అంటే ఫలానా ఫలితము వున్నది అనే ఎరుక! ఇచ్చ అంటే దాన్ని పొందాలి అనే కోరిక! ప్రయత్నము అంటే దానికోసం జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను కదిలించటం!
ఈ మూడు మెట్లూ వుంటే, ఒక క్రియ ఏర్పడుతుంది.
ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే బయటకు క్రియ కనిపించక పోయినా, ఈ జ్ఞానేచ్చా ప్రయత్నాలు మూడూ మనస్సులో గనక వుంటే, ఆ మనస్సులో క్రియ జరిగినట్లే లెక్క కనుక వాడికి కర్భత్వం అంటినట్లే లెక్క!
ఈ మూడు మెట్టూ లేకుండా, ఒక బహిరంగ క్రియ జరిగినా సరే, ఆ వ్యక్తికి కర్భత్వం అంటే సావకాశమే లేదు.
జ్ఞానుల విషయంలో జరిగేదిదే! వాళ్లు లౌకిక కర్మ చేసినా, యోగపరమైన కర్మ చేసినా, ఏమి చేసినా, ఆ క్రియ వెనకాల జ్ఞాన, ఇచ్చలలో ఏ ఒక్కటీ ఉండదు. ఇంద్రియ చలన రూపమైన ప్రయత్నం మాత్రం పూర్వాభ్యాస బలంవల్ల జరిగిపోతుంది. అందువల్ల వాళ్లకు
యోవ్నాన్టత కర్ఫత్వం రవ్వంత కూడా పట్టదు.
ఇక అజ్ఞానులు బైటకు కదలకుండా కూర్చునివున్నా, లోపల జ్ఞానేచ్చలు నిరాఘాటంగానే సాగిపోతుంటాయి. ప్రయత్నం గూడా మానసిక స్థాయిలో జరుగుతూనే వుంటుంది. కనుక, కదలకుండా కూర్చున్నప్పటికీ గూడా కరృత్వం వాళ్లని వదిలి పెట్టదు,
కర్భత్వం వున్నవాళ్లకి, భోకృృత్వం తప్పదు!
కనుక రామా! మనస్సులో జ్ఞానేచ్చలు లేకుండా తుడిచేసుకుంటే అదే అకర్భత్వం! ఇది సాధ్యమే! తత్వవేత్తలయిన పెద్దలు సాధించిన అకర్భత్వం ఇదే! దీన్నే నువ్వు సాధించాలి! గమనిక; ఇది 38వ సర్గ. ఇక్కడ వాల్మీకిమహర్షి పద్యం పక్కనపెట్టి- గద్యంలో చక్కటి శాస్త్ర చర్చను నడిపాడు.
“మనో యత్మరోతి, తత్కతం భవతి; యన్న కరోతి తన్న కృతం భవతి; అతో మన ఏవ కర్ఫ-న దేహ ఇత్యాదిగా ఆ వాక్యాలు సాగాయి. సరే, ఇక వశిష్టుడి బోధ విందాం! వళిష్ణుడు: రామా! ఇంతకూ నువ్వీ ప్రశ్న ఎందుకు వేశావో గాకు తెలుసు!
అకర్శత్వం అనేది పరమాత్మకు గూడా అసాధ్యమే - అని చెప్పాలన్నది, నీ ఉద్ధేశం! దాన్ని అలా వుంచి, నేనొక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు.
ఈ ్రపంచంల్లో ఉన్న పదార్థాలలో కొన్ని స్వీకరించ
దగినవి- కొన్ని పరిత్యజించదగినవి ! ఇది నిజమేగదా? ఈ రెంటిలో దుఖాన్ని కలిగించేవి ఏవి? చెప్పు!
ఎంధందారనధరిరారంధిందాలందదాయంయియయయయింయ. మృష్ణ్యూల్న కలిగించీని ఏని రాముడు: పరిత్యజించవలసిన వస్తువులవల్ల దుఃఖం వచ్చే ప్రసక్తిలేదు. పరిత్యజించవలసిన వస్తువు అంటే ఏమిటి? ఒకప్పుడు అది మనదగ్గర వుండి, అది మనకు దుఃఖాన్ని కలిగిస్తుంటే, అప్పుడది పరిత్యజించవలసిన వస్తువవుతుంది! ఇది పరిత్యజించవలసిన వస్తువు అని తెలిసిందంటే ఇక దాన్ని ముట్టుకోము. కనుక, దానివల్ల ఇకమీదట మనకు దుఃఖం వచ్చే సావకాశం లేదు.
ఇది పరిత్యజించ దగినది అని తెలియక ముందు, మన దృష్టిలో అది స్వీకరించదగినదే! కనుక, స్వీకరించదగిన వస్తువులు రెందు రకాలు. 1. నిజంగా స్వీకరించదగిన వస్తువులు, 2. మనకు తెలియక పోవటంవల్ల స్వీకరించిన వస్తువులు.
వీటిలో మొదటివాటివల్ల దుఃఖం వస్తే రావచ్చునేమో గానీ పరిత్యజించ దగిన వస్తువులవల్ల దుఃఖం వచ్చే వీలు లేదు. వళిష్ణుడు: అదీ కుదరదు. ఎందుకంటావా? నువ్వు చెప్పే రెండు రకాల స్వీకరింప దగిన వస్తువులూ గూడా, నశించే శీలం కలిగినవా, లేక శాశ్వతంగా వుందేవా? రెండు పక్షాలుగా ఆలోచిద్దాం,
అవి నశించి పోయేవే అనుకుందాం. తనను తనే కాపాడుకోలేని వన్తువు, మరొకరికి న్చిరమైన దుఃఖాన్ని తెచ్చిపెట్టగలదా? అసంభవం! కనుక, స్వీకరింపదగిన వస్తువులలో, నశించిపోయే స్వభావం గలవి, దుఃఖాన్ని కలిగింపజాలవు!
పోనీ స్వీకరింపదగిన వస్తువు శాశ్వతమే అనుకుందాం. వేదం ఏం చెపుతోందంటే “అతోన్యదార్తం” అంటోంది. అంటే, ఆత్మకంటే భిన్నమైనదంతా నశించిపోయే శీలం కలది - అని అర్ధం! కనుక, స్వీకరించదగిన వస్తువులలో నాశరహితమైన జాతి ఉండడమే అసాధ్యం! కాబట్టి, స్వీకకించ దగిన వస్తువులలో నీవనుకున్నట్లుగా
యోవాన్ధితి రెండుజాతులు లేవు! నశించిపోయే జాతి ఒకటే వున్నది! అది దుఃఖాన్ని కలిగింపజాలదని తేల్చుకున్నాం గదా.
కాగా, పరిత్యజిందగినదీ దుఃఖాన్ని కలిగించ జాలదు - స్వీకరించ దగినదీ దుఃఖాన్ని కలిగించ జాలదు!
అంటే, లోకంలో దుఃఖాన్ని కలిగించే వస్తువే లేదు- అని తేలుతోంది
ఆత్మకు దుఃఖం కలగడం లేదంటే అతనికి కర్ఫత్వం లేదని వేరే చెప్పనక్కర్లేదు. దాన్ని బట్టి భోకృత్వం కూడా లేదు - అని నిశ్చయమౌతోంది. “మరి కర్త లాగా కనిపిస్తున్నాదే” - అంటే, ఆ కర్భత్వం ఆత్మయందు అజ్ఞానుల చేత ఆరోపింపబడింది - అని మనం అర్ధం చేసుకోవాలి.
ఈ ఆరోపిత కర్ఫత్వం జ్ఞానులకైనా తప్పదు. అది ఉన్నంత మాత్రాన జ్ఞానియొక్క తాత్విక స్థితిలో మార్పురాదు.
కనుక రామా! వరమాత్మకు కూడా అకర్శత్వం అసాధ్యమనుకోబోకు. పరమాత్మలోనూ, తత్వవేత్తల లోనూ, కనిపించే కరృత్వం ఆరోపిత కరృత్వం అని గుర్తించు. రాముడు: గురుదేవా! మీరు అటు తిప్పీ ఇటు తిప్పీ పరమాత్మే పరిపూర్ణుడై అంతటా నిండి వున్నాడనీ, బంధ మోక్షాలనేవి అజ్ఞానావస్థలో వుండే మానసిక కల్పనలనీ, నిరూపిస్తున్నారు. మీరు చెప్పింది నిజంగా నిజమైతే - బంధ మోక్షాలు కూడా లేని వస్తువులే అయితే - ఏమీ లేని చోట ఇంతటి సృష్టి ఎక్కడి నుండి వచ్చింది? ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది.? గోడే లేని చోట బొమ్మకు స్థితి రాగలదా?
ఈ ప్రశ్న విని వశిష్టుడు కొంచెం ఆలోచించాడు. వచ్చిన
ఎడందాలనరదాముదయంయలయయయయయయయయిలా. దులల్న కలిగించని ఏని (ప్రశ్నలే మళ్లీ వస్తునాయి. “తాను చెప్పే నిర్గుణ పరబ్రహ్మ విషయం అందుకోలేక ఇలా మాట్లాడుతున్నాడా? నచ్చక ఇలా మాట్లాడుతున్నాడా? ఇటూ , అటూ ఊగిసలాడుతున్నాడా? - ఏది ఏమైనా, ఇతని స్థితి ఏమిటో తెలుసుకోకుండా, సమాధానం చెప్పరాదూ - అని ఆలోచించి, ఆయన ఇలా అన్నాడు. వశిష్టుడు : రామా! పరబ్రహ్మ సర్వ శక్తి సంపన్నుడు. ఆయన ఎలా కావాలంటే అలా పరిణామం పొందగలడు. ఆయనకున్న అనంత శక్తులలో ఒక శక్తి ఏమిటంటే, పరస్పర విరుద్ధ ధగ్మాలు ఆయనను అథశ్రయించి, ఏక కాలంలో, ఏక స్థానంలో, సహజీవనం చేయగలవు.
“ఉనికి - లేకపోవుట, ఏకత్వము -బహుత్వము, ఆదిత్వము- అంతత్వము,” మొదలైనవన్నీ ఆయనలో అవిరోధంగా నిలబడి వుంటాయి. అలాంటి విచిత్ర శక్తివల్లనేే ఈ ప్రపంచం తయారు అవుతోంది. ఆయన శక్తి చిత్రాతి చిత్రం, కనుక “గోడ లేకుండా బొమ్మలు ఎలా గీస్తాం?” అనే ప్రశ్న ఆయన దగ్గర కుదరదు, రాముడు: గురుదేవా! మీరు పరిణామ మార్గాన్ని ఆశ్రయించి సమాధానాన్ని చెబుతున్నారు. ఈ పద్ధతిలో ఏ పదార్ధానికి ఏది గుణమో, అది మాత్రమే, దానిలో వుండాలి. నిప్పులో ఉష్ణత్వమే వుంటుంది గానీ శీతత్వం ఉండదు. మంచులో శీతత్వమే వుంటుందిగాని ఉష్ణత్వం వుండదు - అది అసాధ్యం!
అలాగే, మీరు చెప్పే ఇంద్రియాతీత పరబ్రహ్మ తత్వంలో, నశించిపోయే గుణం వుండటానికి వీల్లేదు. ఇంద్రియాలకు కనిపించే పదార్థాలలో శాశ్వతత్వం వుండటానికి వీల్లేదు. ఒక కారణంనుంచీ ఒక కార్యం పరిణామ రూపంగా పుట్టింది అంటే, కారణంలోని
యోనాన్ధితి గుణాలు కార్యంలోకి రావాలి. మట్టిలోని గుణాలు కుండలోకి రావటం లేదూ- అలాగే, పరిశుద్ధ చిదాత్మలోనించి ఈ ప్రపంచం పుట్టింది అనేటట్లయితే, చిదాత్మలో వండే “నిత్యత్వం” ఈ ప్రపంచానికి కూడా పట్టాలి! చిదాత్మలో వుండే “నిర్వికారత్వం” ఈ ప్రపంచానికి కూడా పట్టాలి - ఇది లోకానుభవ విరుద్ధం! కనుక, ఈ ప్రపంచం పరమాత్మలోంచి పరిణామ ప్రక్రియలో జన్మించిందనటం కుదరదు. కుదరక పోతే “పరబ్రహ్మ వేరు, ప్రపంచం వేరు-అని చెప్పాలి! అలాగయితే, పరమాత్మకంటే భిన్నంగా ఒక జడసత్య పదార్ధం వుందని చెప్పినట్లు అవుతోంది. అలా చెబితే, సర్వవ్యాపి అయిన పరమాత్మకు ఒక కళంకం అంట గట్టినట్లే గదా!కనుక మీ సమాధానం ఏ రకంగానూ కుదరటంలేదు. వళిమృడు: రామా! బాగా చెప్పావు. నువ్వు ఏ స్థాయిలో వున్నావో తెలుసుకుందామని పరిణామ వాదాన్ని ఆశ్రయించి సమాధానం చెప్పా! దానిలో వున్న లొసుగులు నువ్వు పట్టేశావు కనుక అసలు విషయం చెబుతా విను! ఈ ప్రపంచమూ, ఆ బ్రహ్మ, అనే రెండు పదార్థాలు లేవు. ఆ రెండూ కలసి ఒకటే! నిప్పు వేరు, వేడి వేరు కాదు! అలాగే, ప్రపంచం వేరూ, పరమాత్మ వేరూ కాదు! రాముడు: దీనివల్ల మాత్రం తేలిందేముంది ? మీరు చెప్పే పరబ్రహ్మలో దుఃఖ స్పర్శ లేదు - ద్వంద్వ స్పర్శ లేదు! ఈ ప్రపంచంలో ఆ రెండూ వున్నాయి. ఆ బ్రహ్మమూ, ఈ ప్రపంచమూ ఒకటే ఎలా అవుతాయి? వశిష్టుడు: రామా! ఇది నీ అనుభవంతో నువ్వే తేల్చుకోవాల్సిన ప్రశ్న ఒకవేళ శాస్త్ర పద్ధతిలో దీనికి సమాధానం చెప్పాలనుకున్నా చిట్ట చివరికి సిద్ధాంతం చెస్పే సమయంలో దీనికి సమాధానం చెప్పాలి
ఈం ాజాాజాంలనంాలయాలాయలాయాలాలా జీవుల ఉద్హర్తి ప్రుక్రియ్ గానీ - యిప్పుడు కాదు. ప్రస్తుతానికి పరమాత్మను ఒక గొప్ప ఐంద్రజాలకుడిగా ఊహించుకో! గారడీవాడు చెట్టును పుట్టగానూ మార్చ వచ్చు, పుట్టను చెట్టుగానూ మార్చవచ్చు! అలాగే పరమాత్మ కూదా - ఏదైనా చేయగలడు.
సముద్రం తరంగాలను సృష్టి చేయటం లేదు, సముద్రజలమే ఒక భంగిమలో వుంటే దాన్ని తరంగం అని మనం అంటున్నాం, అలాగే పరమాత్మే ఒక భంగిమలో వుంటే - దాన్ని ప్రపంచం అని మనం అంటున్నాం. అందువల్ల, ఈ ప్రపంచ నిర్మాణానికి కర్తా లేడు, భోక్తా లేడు. రాముడు: గురుదేవా! మీరు మళ్లీ సగుణ బ్రహ్మ మార్గంలో సృష్టి ప్రక్రియను భావించమంటున్నారు. అలా అయితే, ఆ పరబ్రహ్మనుంచి ఎంతమంది జీవులు పుడుతున్నారు? ఎలా పుడుతున్నారు? ఎప్పుడెప్పుడు పుడుతున్నారు? ఈ వివరాలు కొంచెం చెప్పండి. వశిమ్ణుడు: ఈ రకమైన జీవులయొక్క ఉత్పత్తి ప్రక్రియను వర్ణించేది కూదా, ఈ సమస్త ప్రపంచమూ, దానిలో వుండే జీవులూ, అందరూ కూడా పరమాత్మ స్వరూపులే - అని నిరూపించేందుకోసమే ! అంతే గానీ, అది వేరు , ఇది వేరు అని చెప్పేటందుకోసం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని, జీవోత్పత్తి ప్రకారాన్ని విను.
మొదట పరిశుద్ధమైన చిచ్చక్తి వుంది. ఆ చిచ్చక్తికి సృష్టి జరగాలనే సంకల్పం ఉదయిస్తోంది.
ఈ సంకల్పానికి కారణం పూర్వ కల్చంలోని కర్మ శేషాలే, అవి రక రకాలు - చిత్ర చిత్రాలు! అందువల్ల, ఈ సంకల్పం,
యోనా యాలాల ప్రి ఎప్పుడు ఏలా ఉద్బుద్ధమౌతుందో నిర్ణయించి చెప్పడం కష్టం! అందుకనే పెద్దలు, దైవికంగా,(యథాలాపంగా- అనుకోకుండా) “యదృచ్చయా ఆ సృష్టి సంకల్పోద్చోధం జరుగుతుందని చెప్పారు.
ఆ సంకల్పం గడ్డకట్టి, నేననే స్ఫురణ ఏర్పడుతుంది. దీని పేరే “అహంస్ఫురణ” లేక “అహంకారం”!
ఈ “అహంస్ఫురణ” గట్టిపడి “మనస్సు” నేది రూపొందుతుంది.
ఈ మనస్సు జీవుడికి “ఉపాధి”గా ఏర్పడుతుంది.
జీవుడితో కలిసిన ఈ మనస్సు, క్షణాలలో గాలిమేడలు కట్టినట్లుగా, ఈ మహా ప్రపంచాన్ని కల్పన చేస్తుంది. ఈ కల్పనలో మొదట తన శుద్ధ చైతన్య స్ధితిని, తన దృగ్రూప స్థితిని, విడిచిపెట్టినట్లు నటిస్తుంది.
ఆ స్థితిలో ఆ జీవుడికి తన శుద్ధ చైతన్యం ఏమిటో అవగతం గాక, అర్ధంగాక, శూన్యం లాగా కనిపిస్తుంది. దాన్నే అతడు “అకాశం” అంటాడు.
ఆ “ఆకాశంలో ఒక సృష్టికర్త, ఒక చతుర్ముఖ బ్రహ, తన సంకల్ప బలంతో సృష్టి చేస్తున్న అనుభూతి ఈజీవికి కలుగుతుంది. ఇక అక్కడ్జించి ఈ పధ్నాలుగు లోకాలు పెరిగిపోతాయి. ఇదంతా ఎక్కడ్డించి వచ్చింది.? కేవలం మనస్సులోనుంచి వచ్చింది. అది గుర్తు పెట్టుకో!
ఇక ఈ సృష్టిలోని జీవుల సంగతి చూద్దాం. ఈ జీవులను ప్రస్తుతం మన చర్చకోసం మూడు రకాలుగా విభజిస్తున్నాను.
- మహా మోహులు, 2. జన్మ వివేకులు, 3.వైరాగ్య రహితులు
ఉత్త లా గారీ
మహా మోహులంటే, నూటికి నూరుపాళ్లు అజ్ఞానులు. జన్మ వివేకులంటే, పుట్టుకతోనే పరిపూర్ణ వివేకం కలవారు. వైరాగ్య రహితులంటే మోక్షం కోసం సాధన చేస్తూ వున్నా, ఎప్పటికప్పుడు ఊగిసలాడుతూ వుండేవాళ్లు. వీళ్లలో మొదటి రెండు తరగతులవాళ్లకీ జ్ఞానంతోనూ, సాధన తోనూ పనిలేదు. మొదటివారికి అవి చచ్చినా అంటవు! కనుక వాళ్లకు వాటితో పని లేదు. రెండవ వారికి అవి అంటడం పూర్తి అయింది గనుక ఇక వాటితో పనిలేదు!
ఇక మూడవ వారున్నారే, ఊగిసలాడే వారు, వారికోసమే జ్ఞాన బోధలూ, సాధన ప్రక్రియలూ!
వీళ్లకు వైరాగ్యం కలిగేందు కోనమే భగవంతుడు సుఖదుఃఖ పరంపరలను కల్పిస్తున్నాడు. వాటి ఆటు పోట్లవల్ల వీళ్లలో సాత్విక రాజసిక తామసిక ప్రవృత్తులు రకరకాలుగా రూపు దిద్దుకుంటున్నాయి. ఈ గందరగోళమంతా మహా సముద్రంలో మహాతరంగాల కల్లోలం లాగా వుంటుంది. అఖండ మహా సముద్రం లాగానే అఖండమైన సత్త , అతుకులు లేని ఉనికి -ఒకటి వుంది! దానిలో కొంత భాగం జీవభావాన్ని పొందితే ఈ సృష్టి అనే చలనం ఏర్పడుతుంది. ఈ విషయం అంతా ముందు ముందు ఇంకా ఎక్కువగా వివరిస్తాను. రాముడు: గురుదేవా! కొంచెం ఆగండి! ఒక ప్రక్క అతుకులు లేని ఉనికి - అఖండ సత్తా - అంటున్నారు. మళ్లీ దాంట్లో కొంతభాగానికి చలనం అంటున్నారు. ఈ రెండు మాటలూ ఎలా కలుస్తాయి.? వశిమ్ధడు: బాగా అడిగావు రామా! ఉన్నమాట చెబుతా! ఏమీ
యోన్యాస్తాత్రై. .ఆలాయంరాలంనాలందంరాళనరరాలరరంారంరాలయంనాంంంకాంనా అనుకోకు! ఆ రెండు మాటలూ ఎన్నటికీ అతకనే అతకవు. కానీ శాస్త్రాలు అలాంటి మాటలు చెబుతూనే వుంటాయి. ఇది అసత్యమని తెలిసినా సరే, శాస్త్రాలు ఇలాటి మాటలు చెబుతూనే వుంటాయి - ఇలాంటి కల్పనలు చేస్తూనే వుంటాయి.
పూర్వం ఒక చోట నేను “ఒక దీపంనుంచి మరొక దీపం పుట్టినట్లుగా పరమాత్మనుంచి ఈ ప్రపంచం పుట్టిందని” చెప్పాను. అది కూడా ఇలాంటి కల్పనలో ఒకటే!
రెండు దీపాలున్నట్లుగా రెండు పదార్థాలున్నాయా అక్కడ? పరమాత్మ దేనినైనా పుట్టించే జనక పదార్ధం కాగలదా?
“అయితే ఇలాంటి మాటలు ఎందుకు చెప్పారు?” - అంటావేమో!
శిష్యుడు మందన్థాయిలో వున్నప్పుడు, వాడి దృష్టిని తత్వం వైపు లాగడం కోసం ఇలాంటి వాక్ష్రవాహం అవసరం.
వాక్షపంచం వినా త్వేతత్
లఅజ్జానమతులం తమః ।
భేత్తు మన్యోన్యముదితం
యత్నం కర్తుం న శక్యతే (సర్గ &1, శ్లోకం 12)
రెండు రకాల అజ్ఞానాలున్నాయి. ఒకటి సాధనల గురించిన అజ్ఞానం, రెండవది హృదయ సంపుటిలో వున్న మూలాజ్ఞానం ! ఈ జంట ఒకదాన్ని ఒకటి పోషించుకుంటూ, పెంచుకుంటూ వుంటుంది! ఈ జంటను ఒకేసారి నరికే ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం నా వాక్ష్రవాహం లేనిదే సాగదు. రాముడు: గురుదేవా! మీ వాక్ష్రవాహం అసత్యమని మీరే
ఈక. -ాాజనానాలాలవడాతడురాతరరాతలాతయాయలుల.. మాటల గారడీ చెబుతున్నారు. ఈ అసత్యంవల్ల ఏదైనా జ్ఞానం పుడితే, అది కూడా అసత్యమే అయి తీరాలి! అజ్ఞానంలో భాగమే అయి తీరాలి!!
ఒక అజ్ఞానం , మరొక అజ్ఞానానికి విరోధి ఎలా కాగలదు? కనుక మీ వాక్ష్రవాహంవల్ల అజ్ఞాన నాశనం ఎలా జరుగ గలదు? వశిష్టుడు: లోకంలో పతివ్రతలు కొందరు భర్తతో సహగమనం చేస్తూ వుంటారు. ఇలా చెయ్యటంవల్ల తమ శరీరం నశించిపోతుందని వాళ్లకు తెలియదా? తెలుసు! తమ శరీరం నశించిపోయినా, తమ ఆత్మకు హితం జరుగుతుందనే నమ్మకంతో వాళ్లు అలా చేస్తున్నారు. అలాగే, అవిద్యలలోనే (అజ్ఞానాలలోనే) కొన్ని ఉత్తమ - అవిద్యలుంటాయి. ఇవి ఆ జీవి బహు జన్మలలో చేసుకున్న పుణ్యాల పరిపాకంవల్ల వాడి హృదయంలోకి ప్రవేశిస్తాయి. ఇవే సాత్విక - అవిద్యలు! వీటికి తమ యజమానియైన ఆ జీవుడికి మేలు చెయ్యాలనే కోరిక ప్రబలంగా వుంటుంది. అందునల్ల ఆ జీవుడి హృదయంలోకి పరిశుద్ధమైన విద్య రావాలని గట్టిగా కోరుకుంటూ వుంటాయి. అక్కడికి విద్య ప్రవేశించకుండా అద్దుపడేది ఎవరు? తామే! అవిద్యలే విద్యకు అడ్డం! అందువల్ల, ఈ సాత్విక- అవిద్యలు మహా పతివ్రతల లాగా తమ శరీరాన్ని పూర్తిగా తగలబెట్టేటటువంటి ఆ పరిశుద్ధ విద్యను ఆహ్వానించి కోరి తెచ్చుకుంటాయి. ఇలాటి సాత్విక అవిద్యలు, నా వాక్ష్రవాహంవల్ల పుట్టి పెరుగుతూ వుంటాయి. రాముడు: గురుదేవా ! అవిద్య, మాయ, అంటున్నారు గదా - మాయ అంటే ఏమిటి? వశిమష్ణుడు: అప్రేక్షమాణా స్పురతి
ప్రేక్షితాతు వినశ్యతి 1 (సర్గ 41-శ్లోకం 17)
యోవా్టితి రాలా. రామా! నువ్వు చూడకుండా వుంటే ఇది కనిపిస్తుంది. నువ్వ దాని వంక చూస్తే అది కనిపించకుండా పోతుంది! ఈ మాయ చాలా చిత్రమైనది. దాన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కుతో జాతేయమితి తే రాము మాస్తు విచారణా। ఇమాం కధమహం హన్నీ త్యేషా తేస్తు విచారణా ॥ (సర్గ 41, శ్లోకం 31, 32) రామా! ఈమాయ ఎక్కడ్జించి పుట్టింది? ఎందుకు పుట్టింది? ఎలా వుట్టింది - అనే విచారణ నీకు వద్న. దీనిని నేను పోగొట్టుకునేదెలాగా? అనే విచారణ మాత్రమే నువ్వు చెయ్యి ! “అవిద్యా వితతవ్యాధేః బెషధంశృణురాఘవగి (సర్ద 42, శ్లో 1) రామా! ఇక అవిద్యా వ్యాధికి మందేమిటో చెబుతా విను. వశిష్టమహర్షి ఇక ఆరు నర్గలలో అవిద్యా వ్యాధి నివారణోపాయాలను విస్తారంగా వివరించాడు. ఈ విషయాలన్నీ ఇంచుమించు పూర్వం చెప్పినవే. అయినా ఎక్కడికక్కడ కొద్ది కొద్ది మార్పులు చేస్తూ ప్రపంచ స్థితి యొక్కఅవగాహనలో కొత్త కోణాలను సూచిస్తూ ఈ బోధను ఆయన కొనసాగించాడు.
భా: ౨రరిరిదాజంరదిరానింధిరిుతరరిధివాశంరందాణరవంయాల శంక ల00ల400బ00బ6005- టీనొనుతరలం
42వ సర్గలో ఆయన జీవావతరణ ప్రక్రియను వివరించాడు. దీనిలో కేంద్రబిందువు ఈ శ్లోకంలో వుంది.
క్రమేణ పాకవశతః
ఫలమేతి యధాన్యతామ్ ।
అవస్థయైవ నాకృత్యా
జీవో మలవశాత్తధా!! (సర్గ 42, శ్లోకం 27)
చెట్టుమీద పిందె పుట్టింది. అది క్రమక్రమంగా పరిపాకం పొంది పండు అయింది. ఇక్కడ ఒక వస్తువు పోయి కొత్త వస్తువు రాలేదు. ఉన్న వస్తువుకే అవస్థ మారింది - అంతే! అయినా పిందె వేరు, పండు వేరు అనే వ్యవహారం ఏర్పడుతోంది. అలాగే! జీవుడికి కూడా అజ్ఞాన సంపర్మం చేత అవస్థ మారిపోతోంది, వస్తువు మారడం లేదు. అయినా మారిపోయినట్టు లోకవ్యవహారం యేర్చడుతోంది. ఎలాగంటే -
ఒకే చైతన్యం వుంది. ఆ చైతన్యానికి వాసనాబలం వల్ల ఒక క్షేతంమీద, అంటే ఒక శరీరం మీద, “నేన అనే అభిమానం యేర్చడుతుంది. అప్పుడు ఆ చైతన్యాన్ని క్షేత్రజ్ఞుడు అంటారు. వాడిలో వాసనలు మరింత గట్టి పడితే, అప్పుడు అదే చైతన్యాన్ని “అహంకారము అంటారు. ఆ అహంకారమే నిశ్చయాత్మక వృత్తితో గట్టి పడితే, దాన్ని “బుద్ధి అంటారు. దీనిలో సంకల్ప వికల్పాలు చేరితే, అప్పుడు దాన్ని “మనస్సు” అంటారు. దానిలోని సంకల్పాలు మరింత గట్టి పడితే, అప్పుడు అదే ఇం(ద్రియాల ఆకారాన్ని చెందుతుంది. అది ఇంకా గట్టి పడితే, స్థూల దేహం యేర్ప్చడుతుంది.
యోోన్నాట్టిత్రి అంలలునవుంాుాునావుా
ఇది అంతా “పిందె - “పండు” గా పరిణామం చెందటం వంటి ప్రక్రియే కాని మరొకటి కాదు - అని వశిష్ట్రమహర్షి ఈ సర్గలో నిరూపించాడు.
ఇలా నిరూపించడంలో ఆయనకు జీవపరిణామం అంతా వాసనాబలం వల్లనే జరుగుతూ వుంటుందని ప్రతిపాదించడం కుదిరింది. ఆ వరసలోనే ఆయన 48 వ సర్గలోకి ప్రవేశించి - అక్కడ జీవుల యొక్క కర్మ గతినీ, దానివల్ల వాళ్లకు కలిగే జన్మల గతినీ, ప్రతిపాదించాడు. ఆ వరసలో చివరకు జీవులంతా 'ప్రళభయ సమయంలో బీజభూతమైన ప్రకృతిలో లీనమైపోతారని ఆయన చెప్పాడు.
దీనివల్ల 44వ సర్గ ఒక కొత్త ప్రశ్నతో మొదలైంది. “ప్రళయంలో జీవులంతా (ప్రకృతిలో లయించిపోతే, వాళ్లకు మోక్షం వచ్చినట్లే గదా, ఇక మళ్లీ సృష్టి ఎలా జరుగుతోంది” - అని!
ఈ (ప్రశ్నకు వశిష్టుడు కొంచెం విసుక్కున్నాడు. దీనికి సమాధానం పూర్వమే చెప్పాగదయ్యా! చెప్పకపోతే మాత్రం న వ్వర్థం చేనుకోలేవా? “*శ్రేముష్షీ క్వ గతా తవ” “నీ తెలివి ఎటు పోయింది?” అన్నాడు. అని కూడా, తను వివరించదలు ఏకున్న వరసలో మళ్లీ వివరణ మొదలుపెట్టి, ఈ మాటు 'ప్రపంచావకరణం ఎలా జరిగిందో ఆ ప్రక్రియను ప్రతిపాదించాడు. ఆ వరసలో ('యన- “పూర్వ కల్పంలోని ఒకానొక ఉత్తమ జీవికి కర్మ పరిపాక జరిగి, ఈ కల్ప ప్రారంభంలో అతనికి చతుర్ముఖ బ్రహ్మ శరీరం యేర్చడింది. అతని సంకల్ప బలం చేతనే ఈ ప్రపంచమంతా (కమంగా రూపొందింది,” - అని ప్రతిపాదించాడు.
_ఆడరరమలరడరతలారరినికాశనరరతాశరపయూశ00రకా 400 నా ౨4006600=46006446005- శ్రీనొనతరణం
దీనిమీద “ఏ జీవికైనా సరే దేహ నిర్మాణం జరిగే ప్రక్రియ ఏమిటి?” - అనే (ప్రశ్న వచ్చింది. దానిమీద వళశిషమహర్షి సమాధానం చెబుతూ, లింగ శరీరాన్ని పుర్యష్టకంగా వర్ణించాడు. “పుర్యష్టకము” అంటే ఎనిమిది భాగాలు కలిగిన పురము! ఈ భాగాలను వ్యాఖ్యాత ఇలా వివరించాడు.
కర్మ జ్ఞానేంద్రియగణొ భూతప్రాణ మనో గణాః।
అవిద్యాకామ కర్మాణి లింగైః పుర్యష్టకం విదుః || అంటే 1. కర్మేంద్రియాలు 2. జ్ఞానేంద్రియాలు 3. సూక్ష్మ వంచమవోాభూతాలు 4. పంచ (ప్రాణాలు ర. మనోబుద్ధి, చిత్తాహంకారాలు 6. అవిద్య 7. కామము 8. కర్మము
ఈ ఎనిమిదీ కలిస్తే “సూక్ష్మ దేహం లేక '“లింగదేహంి వుతుంది. ఇలా చెప్పటంవల్ల ఈ లింగ శరీరంలోని సూక్షభూతాలే పంచీకరణ ప్రక్రియ ద్వారా ఘనీభవించి స్థూలదేహం ఏర్పడుతోందని చెప్పటం సులభమయింది. అంతేగాక సూక్ష్మభూతాల పంచీకరణం వల్ల ఏర్పడే స్థూల ప్రపంచం మిథ్య అని నిరూపించడం కూడా సులభమయింది. వళిష్టమహర్ని ఈ నిరూపణను 45వ సర్గలో చేశాడు.
ఇలా చెప్పడం వల్ల ఈ ప్రపంచం రజ్జుసర్పభ్రాంతి వంటిది అని, ఈ విషయాన్ని గుర్తించిన జీవన్ముక్తులు జన్మ జరామరణాది దుఃఖాలను దాటిపోతారని చెప్పటం కూడా సులభమయింది. అందువల్ల వశిష్టమహర్షి 46వ సర్గలో జీవన్ముక్తుల గుణాలను 32 శ్లోకాలలో మనోహరంగా వర్ణించాడు.
శ్రీరాముడు ఆ వర్ణన విని దానిలో కొట్టుకు పోలేదు. ఆయన ఇలా అడిగాడు- “గురుదేవా! మీరు పూర్వం హిరణ్యగర్చుడి ఉత్పత్తిని
యోంవాన్తితి ాలాలలాాలాంనా
గురించి వర్ణిస్తూ అతని సంకల్పం ప్రకారమే ఈ ప్రపంచ సృష్టి అంతా జరుగుతుంది అన్నారు. కానీ ఆ మాటను అంతగా వివరించలేదు. దయచేసి వివరించండి”.
ఈ ప్రశ్న వశిష్టుడికి చాలా అనుకూలంగా అంది వచ్చింది. దాంతో ఆయన 47వ సర్గలో 90 శ్లోకాలు తీసుకుని కల్పకల్పంలోనూ సృష్టులు ఎలా మారిపోయే అవకాశం వుందో వివరించి తద్వారా కూడా ఈ ప్రపంచం మిధ్యే అని మరోసారి నిరూపించాడు. ఈ విషయాలను కొంచెం విపులంగా చెప్పుకోవడం అవసరం. వశిష్థడు: రామా! హిరణ్యగర్భుడు అంటున్నావు. ఏ హిరణ్యగర్భుడి ఉత్పత్తిని గురించి చెప్పేది? ఏ హిరణ్యగర్భుడి సంకల్పాలను గురించి చెప్పేది?
ఇప్పటికి కొన్నివేల (బ్రహ్మలు గడిచి పోయారు. కొన్ని వందల విష్ణువులు, శివులు గడిచిపోయారు. కొన్ని లక్షల ఇంద్రాదులు గడిచిపోయారు. ఇక వీరికి సంబంధించిన బ్రహ్మాండాలు ఎన్ని కోట్లు గడిచిపోయాయో! వాటిల్లో ఎన్ని కోట్ల కోట్ల జీవులు, కోటాను కోట్ల తరాలు గడిచిపోయాయో!
వీళ్లందరూ గారడీలో జన్మించిన పదార్జాల్లాంటి వాళ్లే! గారడీలలో పదార్థాల ఉత్పత్తికిగానీ, స్థితికి గానీ, ఒక క్రమమేమిటి?
ఇదీ అంతే ! ఈ సృష్టుల్లో కొన్ని బ్రహ్మ సృష్టులు. ఒక్కొక్కప్పుడు అవి విష్ణు సృష్టులు - మరొకప్పుడు అవి శివసృష్టులు! ఇంకా గట్టిగా మాట్లాడితే, కొన్నిసార్లు అవి మునుల సృష్టులు!
ఇలాటి సృష్టులు ఎన్ని వున్నాయంటావు?
ఆజ -బాానాానానాలాలలానలాననాలాలాా సందరో హిరణ్బనర్భులు
యధాతరంగా జలధొ
మృగతృ్భష్టా మరొ యధా।
కుసుమాని యధా చూతే
తథా విశ్వశ్రియఃపరే | (47వ సర్గ, శ్లోకం 15)
సముద్రంలో ఎన్ని తరంగాలో, ఎడారిలో ఎన్ని మృగ తృష్ణలో, విరగబూసిన మామిడి చెట్టుమీద ఎన్ని పువ్వులో, అన్ని బ్రహ్మాండా లున్నాయి ఆ పరమాత్మలో .
వీటిలో బ్రహ్మసృష్టులైనా అన్నీ ఒకే రకంగా ఉంటాయనే నియమం వుందా? అదీ లేదు! ఒకప్పుడు బ్రహ్మ పద్మంలోంచి పుట్టాడు. మరోసారి నీటిలోంచి పుట్టాడు. ఇంకోసారి ఒక గుద్డులోంచి పుట్టాడు. వేరొకసారి వట్టి ఆకాశంలో పుట్టాడు.
ఒక బ్రహ్మాండంలో శివుడే సర్వాధికారి. మరో బ్రహ్మాండంలో విష్ణువే సర్వాధికారి. ఇంకో బ్రహ్మాండంలో ఇంద్రుడే వీళ్లిద్దర్నీ మించిన అధికారి.
ఒక సృష్టిలో భూమినిండా మొదట్లో చెట్లు వుండేవి. మరో సృష్టిలో భూమి పర్వతాలతో (ప్రారంభమై క్రమంగా జీవులతో నిండింది. ఇలా ఎన్ని రకాల తేడాలో చెప్పలేం. ఇలా ఎన్నిరకాల సృష్టులున్నా వాటిల్లో శాశ్వతంగా నిలిచివుండేది ఒక్కటీ లేదు.
యధా మశక జాలాని
వర్షా దిష్వాకులాని తు।
ఉత్పత్త్యోత్సత్య నశ్యంతి
తథేమా లోకసృష్టయః 1 (47 నం క్షే శ్లోకం)
“వర్షాకాలంలో దోమలు ఏ రోజుకారోజే పుట్టి వరోజుకారోజే పోయినట్టు ఈ లోక సృష్టులన్నీ పుడుతూ, గిడుతూ వుంటాయి.
యోన్నాష్ట్రతి మూ “ఒకోసారి, ఒకో కల్పంలో, మొదట ఆకాశం జన్మిస్తుంది. దాంట్లోంచి ఇతర రూపాలు వస్తుంటాయి. మరో కల్పంలో మొదట వాయువు ఏర్పడి, దాంట్లోంచి ఇతర భూతాలు జన్మిస్తుంటాయి. ఇలా భూతాల ఉత్పత్తిక్రమం గూడా మారిపోతూనే వుంటుంది. “ఒకోసారి ప్రజాపతి యొక్క నోటినుండి శబ్దం వెలువడి, దానిద్వారా సృష్టి జరుగుతుంది. మరొకసారి ఆయన కాలినించి సృష్టి జరుగుతుంది. మరోసారి కంటినించి జరుగుతుంది. ఇన్ని రకాల భేదాలు ఎందుకు వస్తున్నాయంటే, ఈ సృష్టిలో (బ్రహ్మ కాదగిన ఉత్తమ జీవుడు, వెనుకటి సృష్టిలో జరిపిన ఆలోచనలలో ఉపాసనలలో, వుండే భేదాలను బట్టి వస్తున్నాయి.” రాముడు; “గురుదేవా! నారాయణుడి యొక్కనాఖి కమలంనుంచి బ్రహ్మదేవుడు పుట్టాడని ఎక్కువగా వింటూ వుంటాం. ఒక్కొక్కసారి అలా గూడా జరుగ వచ్చునని మీరంటున్నారు. నారాయణుడంటేనే పరిశుద్ధ సతదార్ధ స్వరూపుడు గదా! ఆ సత్పదార్దానికి 'నాభి ఏమిటీ
- దాంట్లో కమలం యేమిటి? దాంట్లో (బ్రహ్మ పుట్టడమేమిటి? ఇదంతా పరస్పర విరుద్ధంగా లేదా?” వశిష్టుడు: “స్వష్నానికి నియమాలేమిటయ్యా? ఈ సృష్టి అంతా ఒక స్వప్నం! ఏనాటి స్వప్నం ఆనాటిదే! అందుకే పురాణాలు బ్రహ్మాండోత్పత్తులను అనేక రకాలుగా వర్ణించాయి. ఒక చోట శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్ప బలం చేత బంగారు గుడ్డు ఒకటి యేర్చడిందని, దానిలోంచి హిరణ్యగర్భుడు జన్మించాడనీ చెప్పాయి. మరోచోట ఆ పరమ పురుషుడే అంతటా వ్యాపించి వున్న నీటిలో సారాన్ని విడిచి పెట్టాడనీ , దాంట్లోంచి బ్రహ్మాండం పుట్టిందనీ చెప్పాయి. మరోచోట పూర్వ కల్పంలోని సూర్యుడే ఈ కల్పంలో
యా దాగూకోసాఖ్యానము బ్రహ్మ అయ్యాడన్నాయి. మరోచోట వెనుకటి వరుణుదే ఇప్పటి బ్రహ్మ అన్నాయి.
గక వాక్యాలన్నీ సమన్వయం చేస్తే మనకు తెలిసేదేమిటంటే, ఈ ప్రపంచం అంతా, మనో విలాసమే తప్ప మరొకటి కాదని! దీన్ని నిరూపించడానికే ఈ సృష్టి క్రమబోధ అంతా చేస్తున్నాను.
“కనుక రామా! ప్రతి కల్చ్పంలోనూ సృష్టి తర్వాత ప్రళయం, ప్రళయం తర్వాత సృష్టి, ఇలా ఈ చక్రం తిరుగుతూనే వుంది. ఇది ఒక పెద్ద గారడీ చక్రం!
కిమేతస్మిన్ మహామాయా-
దంబరే దీర్దశంబరే।
రామ సత్యమసత్యం వా
నిర్ణేయం యది హోచ్యతే ॥ (47 సర్గ, 88 శ్లోకం)
ఈ గారడీ చక్రంలో, ఈ దీర్హ భ్రమలో రామా, సత్యమని అసత్యమని నిర్ణయించేందుకు ఏముంది? ఏమీ లేదు! ఈ విషయం విస్పష్టం కావటం కోసం నీకు “దాశూరోపాఖ్యానము” అనే కథ చెబుతాను విను. రామా! మగధ దేశంలో ఒకప్పుడు కడిమి చెట్లు ఎక్కువగా వుండేవి. ఆ దేశంలో ఒక కొండమీద ఒక కడిమిచెట్టు క్రింద “శరలోమ” అనే మహర్షి తపస్సు చేస్తూ వుండేవాడు.
ఆయనగారి ఏకైక పుత్రుడు దాశూరుడు. ఇతనుగూడా తండ్రిలాగానే మరో కడిమి చెట్టు క్రింద కూచుని తపస్సు చేస్తూ వుందేవాడు.
యోవ్యాస్ణాత. ఆరలంతాతుకాలనుతంనానడునుతనుంా. కొంతకాలానికి “శరలోమ” మరణించాడు. ఆయన భార్య సహగమనం చేసింది. దీంతో ఆ పెద్ద అడవిలో ఒంటరి వాడుగా మిగిలిపోయాడు - దాశూరుడు! ఆ దుఃఖం తట్టుకోలేక, అతను బావురుమని ఏడవసాగాడు. అలా చాలా కాలం ఏడ్చాడు.
చాలా రోజుల తర్వాత ఆకాశమార్గాన పోతున్న ఒక దేవత ఈ కు(ర్రముని ఏడువులకు జాలివడి , దగరకు వచ్చి, అదృశ్యరూపంలో ప్రక్కన నిలబడి ఇలా ఓదార్చింది-
“ఓ మహర్షి పుత్రా! ఎందుకయ్యా ఈ ఏడుపు? ఈ సృష్టిలో (బ్రహ్మకే నాశనం తప్పదు! నీ తండ్రికి తప్పుతుందా? ఈ ప్రపంచమే అస్థిరమని నీకు తెలియదా? తెలివి తెచ్చుకో! ఏడుపు ఆపు!
ఈ మందలింపుకీ, ఈ బోధకీ, దాశూరుడి మనస్సు తేలికపడింది. చదివిన శాస్త్రాలు గుర్తుకు వచ్చాయి. అందువల్ల దుఃఖాన్ని ప్రక్కకు నెట్టి, తల్లిదండ్రులకు చేయవలసిన ఉత్తర క్రియలన్నీ చేస్తి మళ్లీ తపస్సు మొదలు పెట్టాడు.
తండ్రిగారి సలహా సంప్రదింపులు లేకపోయేసరికి, అతనికి తపస్సు సరిగా సాగలేదు. కానీ పట్టుదలగా వేద పారాయణం చేసుకుంటూ, దాని అర్ధ విచారణ చేసుకుంటూ కాలం గడపసాగాడు. ఆ విషయంలో అతనికి మంచి నిష్ట కూడా కుదిరింది. కాని వేదాల అంత భాగాలలో వుండే ఆత్మ తత్వం అంతు బట్టేది కాదు. అందు వల్ల అతని మనస్సు శమించలేదు.
తన మనస్సు శమించి పరమాత్మలో లయించిపోకుండా వుండటానికి కారణం ఈ స్థలంలో వున్న అపవిదత్రతే అని అతనికి
తోచింది. దాంతో అతను చోటు మార్చి చూద్దామని భూమి అంతా తిరిగి వచ్చాడు. ఎక్కడా పవిత్ర ప్రదేశమే కనిపించలేదు. మళ్లీ తన పాత కడిమి చెట్టు దగ్గరకే చేరాడు.
ఆతు “ాాాలాాానాలవలాలమనాతులవాలాలుణా .. దొశూరోపాట్యూననం
అతను చాలా ఆలోచించాడు “ఈ భూమే పవిత్రమైనది కాదు. ఇది అపవిత్రం! దీనిమీద నివాసమే అపవిత్రం! కనుక, ఆకాశంలో పక్షిలాగా ఈ చెట్టు చివర నేను నివాసం వుండి అక్కడే తపస్సు చేస్తాను ” - అని అతను ఒక నిశ్చయానికి వచ్చాడు.
ఏ మనిషికైనా భూమిమీద స్థితి వుంటుంది. గానీ, చెట్టు చివరన వుంటుందా? స్థితి వుండటానికి వీలులేని చోట, తనకు స్థితి కావాలని ఆ జీవి కోరు కున్నాడు.
అందువల్ల అతను ఘోరంగా ఆలోచించి, తీవ్రమైన సాధన మొదలు పెట్టాడు. నేలమీద అగ్నిని వెలిగించి, తన మాంసమే కోసి అందులో హోమం చేయసాగాడు. కండరాలు వుంటే మనిషి వుంటాడు. మనిషంటూ వుంటే వాడికి ఎక్కడో అక్కడ స్థితి వుంటుంది. చెట్టుచివర తనకు స్థితి కావాలని కోరుకునే ఈ మనిషి తన కండరాలే తగలబెట్టు కుంటున్నాడు.
ఈ ఘోర సాధనకు అగ్నిదేవుదే కంగారు పడ్డాడు. ఈ (బ్రాహ్మణోత్తముడి మాంసం తీసుకెళ్లి దేవతలకందిస్తే , దాన్ని వాళ్లు తింటే, ఆ దేవతలే మాడిపోతారేమో అని భయపడ్డాడు. అందువల్ల ఆయన దాశూరుడి ఎదుట ప్రత్యక్షమై “నీకేం కావాలో కోరుకో, పెట్టెలోంచి సొంత మణిని తీసుకున్నట్లుగా నా దగ్గరనుంచి వరం పుచ్చుకో -, “కోశాకాశాత్ మణిం యధా ” - అన్నాడు.
ఇక్కడ కవి అందమైన ప్రయోగం చేశాడు. వట్టిగా పెట్టెనుంచి మణి తీసుకో అనలేదు. పెట్టెలోపలి ఆకాశంలోనుంచి మణిని తీసుకో అన్నాడు. పెట్టెలోనిదైనా, బైటదయినా, ఆకాశంలో మణికి స్థితి వుంటుందా, ఎక్కడైనా? కానీ కవి ఈ ఉపమానం ద్వారా మళ్లీ స్థితి ఉండటానికి వీల్లేని చోట వస్తు స్థితిని మనకు
యోనవ్నాష్ట్రతి రిరకోలనందాతద౦రసాజరరిరిోోతనరరనాతరిధ౦దాతధరరిదాశరురనాజరరిందాతయందా-
ప్రదర్శిస్తున్నాడు. ఈ దాశూరోపాఖ్యానంలో అడుగడుగునా కనిపించే కేంద్ర బిందువు ఇదే! ఇక కథలోకి పోదాం -
దాశూరుడు చాలా సంతోషించి, ఇలా అన్నాడు - “అగ్నిదేవా! ఈ భూమిమీద పవిత్రమైన ప్రదేశమే కనిపించటంలేదు. అందువల్ల “వృక్షాణాముపరి స్టితిరస్తుమే” చెట్లపైన నాకు స్థితి లభించుగాక !౫
అగ్నిదేవుడు తక్షణమే “తథాస్తు అనేసి అంతర్జానమై పోయాడు.
వెంటనే దాశూరుడు అక్కడే వున్న కడిమి చెట్టు చివరకు చేరాడు. అక్కడ స్థితి ఎలా వుందంటే, ప్రళయకాలంలో సృష్టి అంతా జలమయమై వున్నప్పుడు బాలకృష్ణుడు వట వృక్షాగ్రానికి చేరినట్లుగా వున్నది.
ఇక దాశూరుడు ఆ చిటారుకొమ్మన ఒక చిగురాకు చివర పద్మాసనం వేసుకొని తపస్సాధన మొదలు పెట్టాడు. కడిమిచెట్టు మీద కూర్చోటంతో క్రమంగా అదనికి “కదంబ దాశూరుడు” అన్నపేరు స్థిరపడిపోయింది. “కదంబం” అంటే కడిమి చెట్టు.
తపస్సాధనలో అతని మనస్సు ఆత్మ తత్వం మీద లగ్నం అయ్యేది కాదు. కర్మ మార్గం మీదే మనస్సు నిలిచేది. కానీ కర్మలు చేద్దామంటే తను నేలమీద లేడే! ఏం చెయ్యాలి? అందువల్ల అతను మానసిక యజ్ఞాలు మొదలు పెట్టాడు. మానసిక దేవతా పూజలు మొదలు పెట్టాడు.
ఇది చాలా ప్రబలమైన సాధనామార్గం. నిజాయితీగా ఈ మార్గాన్ని అనుసరించేసరికి, కొంతకాలానికి అతని మనస్సు
ఆం. “వాానాాజలలంాతుదునాతయంంతదాంయలలలా... దోశూరోపాబ్సూనను నిర్మలమై , పాత జన్మలలో పొందిన గురూపదేశాలు గుర్తుకు వచ్చి, ఆత్మజ్ఞానం సాక్షాత్కరించింది.
అతను ఈ స్థితిలో వుండగా, ఒకనాడు ఒక వనదేవత ఆయన దగ్గరకు వచ్చి, ఆ కడిమి చెట్టుకు ప్రాకుతున్న ఒక తీగను ఆధారంగా చేసుకుని దీనంగా నిలబడింది.
అది చూసి ఆ ముని “ఎవరివి నువ్వు? ఎందుకిలా దీనంగా వున్నావు?” - అని అడిగాడు.
ఆ సుందరాంగి ఇలా చెప్పింది. -
“క్షీ ముని ్రేష్ట! మహాత్ములను దర్శిస్తే అసాధ్యమైన కోరికలు కూడా తీరుతాయని పెద్దలు చెబుతారు. నేను కొత్తగా ఇక్కడకు రాలేదు. ఈ చెట్టు చివర నువ్వుంటున్నావు. ఈ చెట్టుతీగ మీద నేను ఎప్పటినుంచో వుంటున్నాను.
“మొన్న చైత్ర శుద్ధ త్రయోదశినాడు దేవలోకంలో నందనవనంలో వన మహోత్సవం జరిగింది. అక్కడికి నేనూ వెళ్లాను. నా స్నేహితురాళ్ళందరూ వచ్చారు. నా స్ప్నేహితురాళ్లలో పుత్రసంతానం లేని గొడ్రాలిని నేనొక్కతెనే. ఈ విషయాన్ని గమనించేసరికి నాకు దుఃఖం పొంగు కొచ్చింది. కడిమిచెట్టుమీద కల్పతరువులాగా మీరు నా పక్కనే వుండగా నేను అనాథనెలా అవుతాను? పుత్రుడు లేనిదాని నెలా అవుతాను.? అనే ఆశతో ఇక్కడికి వచ్చాను. కనుక నాథా! నాకో పుక్రుడ్డి ప్రసాదించు! లేకపోతే నీకు మళ్లే కండలు కోసి నిప్పులో వేయటం కాదు. - ఈ దేహం మొత్తాన్ని ఒకేసారి హోమం చేస్తాను".
ఈ మాటలు విన్న కదంబ దాశూరుడు చలించలేదు. కోపగించుకోనూ లేదు. నవ్వి , తన చేతిలోవున్న పువ్వు ఒకటి
యోోన్యాట్టాత్రి. ఆంలోలతలతుతంలతుననరుంనతునలుంంనా సుతారంగా ఆమె చేతిలోకి విసిరి, ఇలా అన్నాడు- “సుందరీ! ఏడవకు! ఈ పువ్వు తలలో పెట్టుకో. ఒక్క నెలయ్యే సరికి నీకు కొడుకు పుడతాడు. కానీ, నువ్వు మరణావేశంతో నాదగ్గరకు వచ్చావు. అందువల్ల నీకు పుట్టే కొడుకు తత్వజ్ఞుడాతాడు”
ఆవిడ సంతోషించి , ఇక నుంచి మీకు పరిచర్యలు చేస్తానంది. అయినా ఆ ముని అందుకు అంగీకరించక ఆమెను పంపించేశాడు.
ఆ తర్వాత 12 సంవత్సరాలు గడిచాయి. ఈ మధ్య కాలంలో ఆమె ఆలోచనే రాలేదు ఈయనకు! ఆ తర్వాత ఒకనాడు ఆ వనదేవత 12 సంవత్సరాల కు(ర్రవాడ్డి తన వెంటపెట్టుకుని ముని ఎదుటకు వచ్చి నమస్మరించి ఇలా విన్నవించింది.
“భగవన్! వీడు మనిద్దరి పుత్రుడు. వీడికి వేదశాస్త్ర విద్యలన్నీ నేర్చించాను. కానీ సంసార దుఖ నిర్మూలనంచేసే బ్రహ్మవిద్య మాత్రం ఇంకా అబ్బలేదు. దయతో మీరే ఉపదేశించాలి.
“కో హై నామ కులేజాతం పుత్రం మౌర్ధ్వేణ యోజయేత్ ”
(51 సర్గ, శ్లోకం 28)
ఏ తండ్రి అయినా సొంత కొడుకును మూర్ష్తుడుగా వుంచుతాడా?” దాశూరుడు గంభీరంగా చూసి, “ఈ శిష్యుడ్డి ఇక్కడ వదిలిపెట్టి నువ్వు వెళ్లిపో” అన్నాడు. ఆ తరువాత దాశూరుడు ఆ పిల్లవాడ్డి శిష్యుడిగా చూశాడే గాని పుత్రుడిగా చూడనేలేదు. ఆ పిల్లవాడు కూడా తండ్రిని గురువుగానే భావిస్తూ , మిక్కిలి థమకు ఓరుస్తూ, గురు శుభ్రూష చేస్తూ ఉండి పోయాడు. ఇలా చాలాకాలం గురు శుశ్రూష చేసినాక, ఆ తండ్రి మెల్లిగా నోరు విప్పటం మొదలు పెట్టాడు. ఆ బోధలవల్ల కుర్రవాడికి క్రమంగా శాస్త్రాల వల్ల కలిగే పరోక్ష జ్ఞానం కలిగింది.
యయంనాలానంళాలనంలారరారయనారయలాజయలాయలాయయలయాయిలా.. కీనీలో వర్గు
దాశూరుడు ఇంత కాలంగా ఏకాంతవాసమే చేస్తున్నాడు. కాని, బహుకాలంగా వేదార్థభావన చేస్తున్నాడు కనుక ఆత్మ తత్వజ్ఞానాన్ని చిన్న చిన్న కథలుగా చెప్పటం ఆయనకు కుదిరింది. ఆయన వందల కొద్దీ కథలు చెబుతూ వుండేవాడు. ఆ కథల ప్రభావం వల్ల ఆ కుగర్రవాడికి క్రమంగా అపరోక్ష ఆత్మ జ్ఞాన నిష్ట కూడా కుదిరింది.
రామా! నేనేదో కల్పిత కథ చెబుతున్నాను- అని నువ్వను కుంటున్నావేమో - అది నిజం కాదు! నేను చూసిన కథే చెబుతున్నాను.
ఒక సారి నేను హిమాలయ పర్వతం మీద వున్న గంగోత్రిలో స్నానం చేయడానికి వెళుతూ, ఒక నాటి రాత్రి ఒక కడిమి చెట్టు క్రింద ఆగాను. ఆ రాత్రి కొంత సేపు అయినాక చక్కటి తుమ్మెద రఖుంకారం వంటి మానవ కంఠన్వరం ఒకటి నాకు వినిపించసాగింది. నాదం బాగుండే సరికి, “ఏమిటా” అని జాగ్రత్తగా విన్నాను. ఆ చెట్టుమీద, ఎవడో మరొకడికి , ఒక వింత కథ చెబుతున్నాడు. ఆ కథేమిటంటే-
ఒక గొప్ప రాజుగారుండేవాడట! ఆయన పేరు “స్వోళ్టుడు.” స్వోళ్టుడు అంటే తన నుంచి పుట్టినవాడు అని అర్ధం. అతని పరాక్రమం ఎంత గొప్పది అంటే, అతని ఆజ్ఞను మానవులేకాదు, బ్రహ్మేంద్రాది దేవతలు కూడా శిరస్సులమీద పెట్టుకుని మోసేవారు. అష్ట దిక్పాలకులు గూడా అతన్ని ఎదిరించలేకపోయేవారు.
యోయాస్టత లాలా దీనికి కారణం ఏమిటంటే, అతనికి ఒకటి గాదు మూడు దేవాలుండేవి. ఆ దేహాలతో అతడు ముల్లోకాలనూ ఆక్రమించేవాడు. ఈ మూడు శరీరాలతోనూ అతను ఎల్లప్పుడు ఆకాశంలోనే తిరుగుతూ వుండేవాడు. నిజానికి అతను పుట్టింది కూడా అక్కడే అంతే కాదు - అదే ఆకాశంలో అతను ఒక పెద్దనగరం నిర్మించాడు. ఆ నగరంలో విషయ వ్యామోహాసక్తులైన సంసార జీవులను కొంతమందిని సృష్టి చేశాడు. వాళ్లను తలొక చోటా పెట్టాడు. వాళ్లల్లో కొంతమందిని దీర్ధక్షాల జీవులుగానూ, కొంతమందిని అల్పకాల జీవులుగానూ, చేశాడు. వీళ్లలో అల్పకాల జీవులకు “అపవరకులు” అని పేరు పెట్టాడు. వీళ్లను కాపాడేందుకు కొంతమంది రక్షకులను ఏర్పాటు చేశాడు. దీర్హకాల - అల్బకాల జీవుల మధ్య వ్యాపార లావాదేవీలను ఏర్పాటు చేశాడు. అయితే ఈ రాజుగారు ఇన్ని రకాల వ్యవస్థలు చేస్తున్నా , దేన్నీ స్థిరంగా ఉండదనిచ్చేవాడు కాదు. అతను సహజంగానే చపలచిత్తుడు. ఎప్పుడు ఏమి ఆలోచన వస్తుందో ఎవరూ చెప్పలేరు, ఉన్నట్లుండి కొత్త కొత్త పట్టణాలు కట్టించాలని సంకల్పించేవాదు. వెనువెంటనే ఆ కట్టబోయే పట్టణాల్లోకి ప్రవేశించేసేవాడు. కొంతకాలం వాటిల్లో వుందేవాడు. కొంతకాలం అయ్యాక వాటిని తనే కూలగొట్టిస్తూ వుండేవాడు. ఒకో పట్టణంలో తను మహారాజుగా వుండేవాడు. మరో చోట ముష్టివాడుగా వుండేవాడు. మరో చోట రోగిష్టివాడుగా వుండేవాడు. మరో చోట ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ వుండేవాడు. చివరికి ఆయన ఒకసారి పూర్తిగా నశించిపోయి , ఎవరికీ కనిపించలేదు.
ఆ కథలో కథ
ఒక ముదురు గొంతు ఇలా కథ చెప్పుకు పోతూవుంటే, ఒక లేతగొంతు మధ్యలో అడ్డంపడి, ఇలా ప్రశ్నించింది. - “నాన్నగారూ! మీరు చెప్పే ధోరణి చూస్తుంటే , ఈ కథ వెనకాల ఏదో అంతరార్థం ఉన్నట్లు తోస్తోంది. అసలు మీకు ఈ కథ మీద గాక ఆ అంతరార్థం మీదే మక్కువ వున్నట్లు కూడా తోస్తోంది. ఎందుకంటే- ఆ రాజు “కట్టబోయే పట్టణాల్లోకి ప్రవేశించేవాడు” అంటున్నారు మీరు. “ప్రవేశించేవాడు” అనేది వర్తమాన కాలాన్ని బోధిస్తోంది. “కట్టబోయే పట్టణం” అంటే భవిష్యత్ కాలాన్ని బోధిస్తోంది. ఈ రెంటికీ ముడిపెట్టేస్తున్నారు. దీని వెనకాలవున్న మీ అసలైన తాత్పర్యం ఏమిటో బయట పెట్టండి.”.
ఆ (ప్రశ్నకు తండ్రి సంతోషించి,ఇలా సమాధానం చెప్పాడు- “నాయనా! ఆ రాజు పేరు స్వోళ్టుడు అన్నాను. “స్వాత్ ఉళ్ధః స్వోళ్ళగ్ - తననుంచి తనే పుట్టినవాడు. సృష్టిలో తననుంచి తనే పుట్టేది ఏది? - మనస్సు ఒక్కటే! అది అవ్యాకృత ఆకాశం నుంచి జన్మించి, మళ్లీ అక్కడే లయిస్తుంది. ఆ మనస్సునే “రాజు” అన్నాను. ఈ ప్రపంచమంతా మనోమయం. సంకల్పం వుంటే ప్రపంచం వుంది
- సంకల్పం లేకపోతే ప్రపంచం లేదు! బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులతో సహా జీవులందరూ ఈ సంకల్పం అనే మహా వృక్షపు కొమ్మలను పట్టుకు వేళ్లాడుతున్న వారే!
ఇలాంటి ఈ ప్రపంచాన్ని మనస్సు దేనిమీద ఆధారపడి నిర్మించింది? ఆ పరిశుద్ధ పరబ్రహ్మ చైతన్యాన్ని అధిమ్టానంగా చేసుకునే మనస్సు ఈ ప్రపంచ రచన చేస్తోంది. అధిష్టాన చైతన్యానికే మరోపేరు “శూన్యాకాశం”! అందుకే ఈ కథలో రాజు ఆకాశంలో పట్టణం కట్టాడని చెప్పాను. ప్రపంచం మొత్తానికి సరిపోయేటట్లుగా ఆ నగర వర్ణన చేశాను.
యోాస్తం లా యా
సృష్టిలో అల్బకాల జీవులు మానవులు! దీర్ధకాల జీవులు దేవతలు! వీరిలో మానవులను “అపవరకులు” అన్నాను. “అపవరకం” అంటే “గది*! గది ఆకాశాన్ని కప్పి వేస్తుంది. మానవుడు తను పరమాత్మలోనే వుంటూ, పరమాత్మ తనకు కనిపించకుండా తన నెత్తిన తనే ముసుగు వేసుకుంటాడు. అందుకే వాడిని “గది” అన్నాను.
మానవుడు దేవతోపాసన చేసిన ఫలితాలు పొందాలని చూస్తూ వుంటాడు. దేవతలు మానవుల ద్వారా యజ్ఞయాగాదులు చేయించి హవిస్సులను పొందాలని ప్రయత్నిస్తూ వుంటారు. అందుకే దీర్ధక్రాల అల్పకాల జీవుల మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయి అన్నాను.
“వత్సా! ప్రతి జీవి శరీరంలోనూ ఒక అహంకారం వుంటుంది. కాని ఇది అన్ని వేళలా ఒకే రకంగా వుండదు.
యథా కుసూలేమార్జాలో
భస్తాయాం భుజగో యథా!
ముక్తాఫలం యధా వేణా
అహంకారస్తథా తనౌ।; (53 సర్గ, 28 శ్లోకం)
ఒక్కొక్కసారి ఈ అహంకారం గాదెలో పిల్లి లాగా పడివుంటుంది. ఈ పిల్లిలోపల ఆలోచనలు ఉంటాయి గానీ, అవి పని చెయ్యవు. ఇది తామసాహంకారము. ఇదే సుషుప్తిలో వుండే అహంకారము. ఇక్కడ అహంకారమంటే గర్వమని కాదు సుమా- అహంకారమంటే నేననే స్ఫురణ- అని గుర్తుంచుకో!
ఒక్కొక్కసారి ఈ అహంకారం కొలిమితిత్తిలో పాములాగా చాటుగా వుండి చేయివేసి వత్తంగానే కాటు వేస్తుంది. కొలిమితిత్తి
ఈ “ాజాానాలానాులలయంతవాలమలాయలామాాాలాా.. ప్రర్సుల్రో ప్రీ అంటే ఈ రోజుల్లో వాళ్లకు వెంటనే తెలియకపోవచ్చు. పాతకాలంలో ఇనప పని చేసే కమ్మరివాడు తన బొగ్గుల కుంపటి క్రింద గొట్టానికి ఒక తోలు సంచీని తగిలించి, దానిని నొక్కడం ద్వారా కుంపటి లోకి గాలిని వేగంగా పంపేవాడు. దీనినే కొలిమితిత్తి అని, తిత్తి అని, పిలిచేవారు. కొలిమి అంటే నిప్పుల కుంపటి. రాత్రిపూట పనివాళ్లు వెళ్లిపోయాక పాములు ఈ తిత్తిలో చేరికూర్చునే సావకాశం వుంది. ప్రొద్దున వచ్చిన పనివాళ్లు చూసుకోకుండా తిత్తిని నొక్కితే, లోపలి పాము బుస్సునలేచి, కస్సున కాటువేసే ప్రమాదం వుంది. అలాటి అహంకారాన్ని రాజసాహంకారం అంటారు. స్వప్నదశలో సుఖదుః ఖాలను కలిగించే అహంకారం ఇలాటిదే!
ఒకొక్కప్పుడు ఈ అహంకారం వెదురు బొంగులో ముత్యం వున్నట్లు ఉంటుంది. వెదురు బొంగు అంటే విలువు తక్కువ పదార్థం. కానీ ఒకోసారి దాని కణుపుల్లో ముత్యాలు మొలుస్తూ వుంటాయి. వాటి విలువ గొప్పది. అలాగే విలువలేని శరీరంలో, ఒకోసారి విలువైన సాత్వికాహంకారం మొలకెత్తుతూ వుంటుంది. సామాన్యంగా జా(గ్రద్దశలో వుండే అహంకారం వివేకాన్ని కలిగించటానికి సమర్ధ్థమైనది కనుక, దాన్ని స్వచ్చమైన అహంకారం, లేక సాత్వికాహంకారం అంటూ వుంటారు. ఈ మూడు రకాల అహంకారాలూ మారుతూ మారుతూ వుండటాన్నే నేను ఈ కథలో రాజుగారి చపలచిత్తంగా వర్ణించాను.
ప్రతి జీవీ ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు. అందరూ ఒకే (ప్రపంచాన్ని చూస్తూ ఉన్నట్లు కనిపిస్తూ వుంటుంది. కానీ ఎవడికి వాడు తాను సంకల్పించిన పదార్థాలనే చూస్తున్నాడు. ఎలా సంకల్పిస్తే అలాగే చూస్తున్నాదు. ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడే
య న చూస్తున్నాడు. అందుకే ఈ రాజు క్షణకాలంలో భవిష్యన్నగరంలోకి (ప్రవేశించాడని నేనన్నాను.
భవిష్యష్యన్నవ నిర్మాణం
స వ్యాప్కోత్రి తథా పురం ।
యథా సంకల్పితం వస్తు
క్షణాదేవ ప్రపశ్యతి _ (53 సర్గ, 25 శ్లోకం)
నీ స్వష్నమే నీ భవిష్యన్నగరమనుకుంటే,దాంట్లోకి నువ్వు ప్రవేశించటం లేదా? అలాగే, ఈ ప్రపంచమే స్వప్నమని అంగీకరిస్తే దింట్లోకి నువ్వు ప్రవేశించటంకూడా ఒక భవిష్యన్నగర (ప్రవేశమే! ఇక్కడ వర్తమాన కాల, భవిష్యత్ కాలాలు విరుద్ధంగా ఉన్నాయి. నిజమే! కానీ ఆ ప్రవేశం జరిగి పోతూనే వున్నది. సంకల్పించడం నిర్మించడం, ప్రవేశించడం, అన్నీ ఒకే ఒక క్షణంలో జరిగి పోతున్నాయి కనుక అందరూ ఈ కాలవిరోదాన్ని అంగీకరించేస్తున్నారు. దీనినే నీ కథలో రాజుగారి భవిష్యన్నగర ప్రవేశంగా వర్ణించాను.
జీవుడిలా సాత్విక రాజసిక తామసిక అహంకారాలలో చక్రం తిరిగినట్లు తిరుగుతూ తిరుగుతూ వుండగా, రాజుగా, మధ్యముడిగా, ముష్టివాడిగా, అనేకరకాల జన్మలు వస్తూ వుంటాయి. దీనినే నేను కథలో ఆ రాజు వివిధ పట్టణాలలో వివిధ రూపాలతో ఉండటంగా వర్ణించాను.
ఈ చక్రం ఇలా తిరుగుతూ వుండగానే ఎక్కడో ఒకచోట అదృష్టం కలిసి వచ్చి, వైరాగ్యం అందుకుని, సమాధి కుదిరి, ఆత్మజ్ఞానం వంటబట్టి, ఆ జీవికి మోక్షం లభిస్తుంది. కధలోని రాజుగారు నశించిపోయి ఎవరికీ కనిపించలేదు అంటే - దాని
ఈక -ాాావాలలవాలలాాంనాా.... సంకల్పాంను తుడిబి వేసుకో అర్ధం యిదే! మోక్ష గతికి చేరుకున్న జీవుడు, పరమాత్మలో లీనమైపోతాడు గనుక, వాడు విడిగా ఎవరికీ కనిపించడు. కనిపించక వోటాన్నే “నాశం” అంటారు. “నశ అదర్శనే” అని ధాతువు. అంతేగానీ, నశించడం అంటే చావటం కాదు.
కనుక వత్సా! నా కధకు సారాంశం యేమిటంటే , నీ మనస్సే నా కథలోని రాజు! ఈ మనస్సుయొక్క సంచారం ఎలా వుంటుందో ఈ కథలో చెప్పాను. ఈ మనస్సుకి సంకల్పంవుంటే సంసారం వస్తుంది. జాగ్రత్ సంసారమైనా, స్వప్నసంసారమైనా - ఏదైనా సంసారమే! సంకల్పాలు తాత్కాలికంగా పోతే, సుషుప్తి లభిస్తుంది. ఇది సంసారం లాగా కనిపించదు. కానీ యిది కూడా సంసారమే! ఈ మూడింటికీ భిన్నంగా, నీ మనస్సులోగల సంకల్పాలను సంపూర్ణంగా కోసివేసినట్లయితే, అప్పుడు శాశ్వతమైన ముక్తి లభిస్తుంది. ఆ ప్రయత్నం చేసుకో!”
“సంకల్పనాశం చాలా కష్టమండీ - సులభోపాయం యేదైనా చెప్పండి అంటావేమో! హరిహర (బ్రహ్మాదులు దిగి వచ్చినా, సంకల్పనాశం మినహా మోక్షానికి రెండో ఉపాయం చెప్పలేరు. నువ్వు నిప్పులో దూకినా కూడా, నీకు మరో ఉపాయం దొరకదు. కనుక పిచ్చి ఆలోచనలు మాని, సంకల్పనాశంకోసం కృషి చెయ్యి!”
“రామా! ఈ ఉపదేశం విని కొడుకు చాలాసేపు ఆలోచించి, చివరికి ఇలా అడిగాడు- “హే ప్రభో! సంకల్పం అంటే ఏమిటి? అది ఎలా పుడుతుంది? ఎలా పెరుగుతుంది? ఎలా నశిస్తుంది?”
యోోన్నాట్టిట్రై ాలాోయంాలురావాడుంాలునాలునాు.
గంభీరమైన ఈ ్రశ్చవిని, తండ్రి అంతకంటే గంభీరమైన సమాధానం ఇలా చెప్పసాగాడు. తండ్రి: (దాశూరుడు) వత్సా!
అనంతస్యాత్మ తత్వస్య
సత్తాసామాన్యరూపిణః।
తత్సంకల్పాంకురం విదుః ॥ (54 సర్గ 2శ్లోకం)
పరమాత్మ తత్వం ఒకటి వుంది. అది అనంతమైనది. ఈ (ప్రపంచంలోని పదార్థాలన్నింటిలోనూ గల ఉనికియే దానికి స్వరూపం! ఇలాంటి వునికినే సత్తాసామాన్యం అంటారు. దీని యొక్క అసలైన స్వరూపం చైతన్యం! దీనికే మరోపేరు చిత్తు! మరో పేరు దృక్!
చైతన్యాన్ని “దృక్” అనేటట్లయితే ఈ ప్రపంచం అంతా దృశ్యం. చైతన్యాయన్ని “చిత్ అనేటట్లయితే ప్రపంచానికి మరో పేరు “చేత్యం”. దృక్ - దృశ్యాలు, చిత్ - చేత్యాలూ - ఇవి జంట పదాలు! వీటిలో దృక్ - దృశ్యాలకు యథార్థమైన సంబంధం లేదు. కొంచెం మాటలు మారిస్తే, దీనినే చిత్ -చేత్యాలకు సంబంధం లేదు అని చెప్పవచ్చు.
నిజంగా సంబంధంలేని “చిత్”- “చేళ్యం” వైపు అంటే “దృశ్యం” వైపు మొగ్గు చూపిస్తే, ఆ మొగ్గుదలపేరే “సంకల్పం”!
ఈ దశ సంకల్పానికి మొలకవంటి దశ! అది పుట్టే విధానం కూడా అదే!
“తొ సత్యమైనది. “చేత్యం” తద్భిన్నమైనది. అంటే అసత్యమైనది. చిత్తు చేత్యంవైపు మొగ్గుచూపింది అంటే, సత్యం
ఆయు చాాాాాాలాాలాూా... సంకల్పాందు తుడిబి వేసుకో అసత్యంవైపు మొగ్గు చూపింది. అప్పుడు జన్మించేది అసత్యమే అవుతుందిగాని, సత్యం కావాటానికి వీల్లేదు. కనుక, సంకల్పం అనేది ఏదైనా సరే, అసత్యమే కాని సత్యం కావటానికి వీల్లేదు! అలాటి సంకల్పపు మొలకే పెరిగి పెద్దదై “నువ్వు-నేను-వీడు-వాడూ అనే భేదాలను కల్పించి, ఈ మహా ప్రపంచాన్నే నీకు చూపిస్తోంది. కనుక ఈ ప్రపంచంమంతా అసత్యమే!
ఇప్పుడు నీకు నేను సంకల్పం వృద్ధి చెందే విధానం కూడా చెప్పినట్లయిపోయింది! ఇక అది నశించే ఉపాయాలు చెప్పాలి.
సంకల్పేనైవ సంకల్పం
మనసా స్వమనో మునేః
ఛిత్వా స్వాళ్మని తిష్టత్వం
కిమేతాపతి దుష్కరం ॥॥ (54 సర్గ, 18 శ్లోకం)
సంకల్పం ఏదైనా సరే , అది అసత్యమని గుర్తించు. ఇకపైన దేన్నీ సంకల్పించకు! పూర్వం అనుభవించిన సుఖ దుఃఖాలను స్మరించకు! - ఇదే సంకల్ప క్షయానికి మంచి ఉపాయం!
“నేనింకా ఏమీ సంకల్పించను” - అనేది కూడా ఒక సంకల్పమే! దీన్ని “అసంకల్పన సంకల్పం” అంటారు. ఇది ఇతర సంకల్పాలను అన్నింటినీ నశింపచేయగలదు. అంతే కాదు. ఇది తనను తానే నశింప చేసుకోగలదు.
కొద్దిపాటి తేడాతో మరో ఉపాయం వుంది. నీకు మనస్సుంది గదా. మనస్సంటే, మననం చేసేది! నీ మనస్సులో నువ్వు ఆపకుండా ఆత్మ తత్త్వమననం చెయ్యి. ఈ మననం మనన్న్సును తుడిచిపెట్టివేయగలదు. ఇందులో కష్టమేముంది?
సంకల్పాలను ఆపుకునేందుకు మరొక ఉపాయం వుంది.
యోోన్నాస్తాత ఆంలలంావలనవోుననరుంనలంలులులా మొదట ఈ జగత్తు మిథ్య అని బాగా భావించు. ఎందుకంటే పూర్వం నువ్వు ప్రపంచం సత్యమని సంకల్పించావు. ఈ ప్రపంచం ఉన్నదని సంకల్పించావు. అందుకే అది నిజంగా వున్న పదార్ధం అయిపోయింది, నిన్ను నానా బాధలూ పెడుతోంది. ఇప్పుడు లేదనుకోవటం మొదలు పెట్టు. లేదని గట్టిగా అనుకో - చాలు ! అది లేనిదై పోతుంది.
ఎక్కువ దూరం పోవకృళ్లేదు. ఈ ప్రపంచం మిథ్య అని వేద వాక్యాల ద్వారా, యుక్తుల ద్వారా, అనుభవాల ద్వారా, నువ్వు అనుసంధానం చెయ్యటం మొదలుపెడితే చాలు! నీలో రాగ ద్వేషాలు తగ్గి పోతాయి. సుఖ దుఃఖాల తీవ్రత తగ్గుతుంది. చివరికి ఈ ప్రపంచం లేనిదే అయిపోతుంది”. దాశూరవుత్రుడు: గురుదేవా! ఈ ప్రపంచాన్ని తయారు చేసేదీ, తుడిచిపారేసేదీ కూడా మనస్సే అయితే, నా మనస్సు ఈ ప్రపంచం మొత్తాన్ని తనకు అనుకూలంగా మాత్రమే వుండేటట్లు ఎందుకు తయారు చేసుకోదు? ఎవరైనా తమకు అపపకారం చేసే కల్పనను తామే చేసుకుంటారా? దాశూరుడు: ఎందుకు చేసుకోరు? చపలచిత్తులు అలాగే చేసుకుంటారు! అడవిలో కోతి, కొమ్మల మధ్యలో తనే కాలు ఇరికించుకుని, తనే కుంటిది కావడం లేదూ? నీ మనస్సుందే, దానికి పూర్వ జన్మల వాసనలు కమ్ముకున్నాయి. అందువల్ల నీ మనస్సు మకిలి బట్టిన అద్దంలాగా తయారు అయింది. కానీ, దానికి సహజ సిద్ధంగానే అధిష్టాన చైతన్యంతో సంబంధం వుంది. అయితే ఏం ప్రయోజనం? పట్టిన మాలిన్యం యొక్క ప్రభావంవల్ల ఈ చైతన్య సంబంధం విషయాలు స్ఫురించే శక్తిగా మారి, నీ
లాుతులంయలాయయయలాా.. సంకల్పాలు తుడిలి వేసుకో మనస్సుకి చాంచల్యం అనే కొత్త దోషాన్ని అంటగడుతోంది. అందువల్ల నీ మనస్సు అడవిలో కోతిలాగా చపల చిత్తంగా వ్యవహరిస్తూ, తనకు తనే అపకారం చేసుకుంటోంది.
రాగి చెంబుకు పట్టిన చిలుము, తోమితే పోతుంది. అలాగే మనస్సు పట్టిన మాలిన్యం సంకల్ప నిర్మూలనాభ్యాసంచేత పోయి తీరుతుంది.
నాయనా! ఇది పెద్ద కష్టమైన పనికూడా కాదు. ఎందుకంటే నువ్వు నిజంగా ఉన్నదాన్ని పోగొట్టాలని ప్రయత్నం చెయ్యటం లేదు. నిజంగా లేకుండానే, ఉన్నట్టు కనిపించే దానిని పోగొట్టాలని ప్రయత్నం చేస్తున్నావు. “క్వాసద్వస్తు చిరం స్థితం” (సర్గ 54, 39 శ్లోకం) లేని వస్తువు ఎక్కువ కాలం ఉండటం ఎక్కడైనా కద్దా? కనుక సంకల్ప నాశం కోసం గట్టిగా ప్రయత్నించు”. వశిష్టుడు: రామా! ఈ విధంగా ఆ రాత్రిపూట చిటారు కొమ్మలమీద కూర్చుని తండ్రీ కొడుకులు చేసుకుంటున్న ఆ చర్చ విని నేను సంతోషపడి దాశూరుడికి ఎదురుగా వెళ్లి నుంచున్నాను. దాశూరుడు నన్ను చూసి సగౌరవంగా స్వాగత వచనాలు పలికాడు. ఇక నేను కూడా ఆ యిద్దరితో చేరి కొన్ని వింత వింత తత్వ కథలు చెప్పి ఆ రాత్రల్లా సత్మాలక్షేపం చేసి, తెల్లవారు రూము కాగానే నా దోవన నేను వెళ్లాను.
రామా! దాశూరుడు తన కొడుకుకి చెప్పిన కధ చెప్పాను. ఏ తందైనా కొడుకులకు అబద్ధంచెప్పడు కదా. ఆయన తన అనుభవాన్నే తన కొడుక్కి చెప్పాడు. అదే సిద్ధాంతం!
తస్మాద్వికల్పం మలమాత్మనస్వం
యోన్నాస్టిత. ఆంారనుంనుంతనవతనానకాలలంా
నిర్ధాయ పశ్యామలమాత్మతత్వమ్
ఆసాదయిష్యస్యచిరాత్సదం తత్
భవిష్యసీజ్యో భువనేషు యేన ॥ (సర్గ 55, 40 శ్లోకం)
కనుక రామా! సంకల్పమే నీ మనస్సుకి పట్టిన మాలిన్యమని గుర్తించు. దాన్ని తొలగించుకొని నిర్మలమైన ఆత్మతత్వాన్నీ దర్శించు. దాన్ని దర్శిస్తే చాలు - అదే నువ్వైపోతావు!
ఆ స్థితి లభిస్తే నువ్వు లోక పూజ్యుడివవుతావు.
ఇక్కడితో వశిష్ట మహర్షి ప్రపంచ స్థితిని గురించి చెప్ప దలుచుకున్న విషయాలు పూర్తి అయినాయి. కానీ ప్రపంచంయొక్క ఉపశమం గురించి ఇంకా చెప్పవలసి వుంది. అంతేగాక సంకల్ప రహిత తత్వ స్థితిని సాధించే విధానాల గురించి ఇతోధికంగా బోధించి ప్రపంచోపశమంతోపోటు మనస్సు యొక్క ఉపశమంకూడా లభించేటట్లుగా పై ప్రకరణంవైపు తన బోధను అనుసంధానం చేయవలనివుంది. దీనికోసం వశిష్టమహర్ని ఏడు సర్గలు తీసుకున్నాడు. 56వ సర్గ నుంచి 62 వ సర్గ దాకా ఈ చర్చనే నడిపాడు. వీటిలో ఎక్కువగా పూర్వోక్త విషయాలనే శాస్త్ర సాంకేతిక భాషలో చర్చించాడు. అందువల్ల మనం వీటిని వీలైనంత సంగ్రహంగా చెప్పుకుందాం.
వెజదటగా 56వ నర్గలలో వశిష్టుడే ఒక (ప్రశ్నను లేవదీశాడు.
లాలా. శస్త్రచర్చ వళశివృడు: “రామా! ఈ ప్రపంచంమీద నీకు అనురాగం వుంది కదా? ఏ దృష్టితో దీనిని నువ్వు ్రేమిస్తున్నావు? ఇది “సత్” అనా? “అసత్” అనా? “సదసత్” అనా? ఏది అనుకుంటే ఏమౌతుందా! చూద్దాం.
ఈ ప్రపంచం “సత్. అనుకో - అంటే అది సత్య పదార్ధం
- నువ్వూ సత్య పదార్థానివే! నువ్వు ద్రష్టవు - అది దృశ్యము! ఈ రెండూ సత్యాలే అయితే - ఈ దృశ్య ప్రపంచం నీ మీద ఆధారపడి వుందా? స్వతంత్రంగా వుందా? నీ మీద ఆధారపడి వుంటే దానిని స్వతంత్రమైన సత్పదార్థం అనటానికి వీల్లేదు. స్వాతంత్ర్యం లేని సత్యత్వం సత్యత్వమే కాదు! అసత్యమైన దానిమీద అనురాగ మెందుకు?- అనుబంధమెందుకు? అన్నీ వదిలి పెట్టు!
పోనీ, దృశ్య ప్రపంచం నీకంటే భిన్నంగా స్వతంత్రంగా సత్యమైనదే అనుకుందాం ! ఇదే నిజమైతే నీకూ దానికీ ఏ సంబంధమూ లేదు. సంబంధం లేనిదానిమీద అనురాగమెందుకు? దానిలో కొంతభాగం మీద “నేను” అని, మరికొంత భాగంమీద “నాది” అని, అభిమానాలు ఎందుకు? కనుక ఈ పక్షంలో అవన్నీ వదిలేసెయ్యి!
ఇక ఈ ప్రపంచం “అసత్” - అసత్యమైనది - అని ఒప్పేసుకుంటావా? అయితే దీనిమీద అనురాగం వ్యర్ధమే గదా - వదిలిపెట్టు!
పోనీ ఈ ప్రపంచం *సదసత్" - “సత్యాసత్యం”- అంటావా? దాని స్వభావమే అనిశ్చితంగా వుంటే దానిమీద నీకు (ప్రేమ ఏమిటి?
యోవ్నాన్టితి.ఆనలాలాలంలలుతనలనాలుునా కనుక ఈ పక్షంలోనూ ప్రపంచానురాగం తగనిదే! ఇక పోతే, ఈ ప్రపంచానికి కర్త ఉన్నాడా ?కర్త లేడా? అంటే, ఇది సకరృకమా - అకర్భకమా? లేక కర్ర కర్భ్చ సాధారణమా? ఇక్కడ గూడా పైన చెప్పుకున్నట్లుగానే ఏ పక్షంలోనూ ప్రపంచంమీద అనురాగం తగదు! రాముడు; గురుదేవా! ఇక్కడ అంత తేలిగ్గా విషయం తెగటంలేదు. ఎందుకంటే “యతో వా ఇమాని భూతాని జాయంతే”, “విశ్వస్య కర్తా భువనస్య గోప్తా”- ఇత్యాదిగా (శ్రుతులు పరమేశ్వరుడే ఈ ప్రపంచానికి కర్త అని చెపుతుంటే ఈ ప్రపంచం అకర్భకం అనటం ఎలా కుదురుతుంది? వళిమ్ణడు: (శ్రుతి ఆ రెండు వాక్యాలే చెప్పి ఊరుకోలేదు. “యత్తదద్రేశ్యమగ్రాహ్య మవర్ధమచక్షుఃశ్రోత్రం తదపాజణిపాదం నిత్యం విభుం సర్వ గతం సుసూక్ష్మం తదవ్యయం తద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః ॥ అని ఇలాటి వాక్యాలు కొన్ని వందలు చెప్పింది. వీటిల్లో పరమాత్మ అసంగుడు, ఉదాశీనుడు, అకర్త అని స్పష్టంగా వుంది. రాముడు; ఈ రకం వాక్యాలు ముఖ్యమని చెప్పాలా? ఆరకం వాక్యాలు ముఖ్యమని చెప్పాలా? వళిమ్ధడు: ఏ ప్రకరణంలో ఏ వాక్యం వచ్చిందో చూసుకోవాలి. ఆ పరిశీలన చేస్తే , నువ్వు చెప్పిన “విశ్వస్య కర్తా మొదలైన వాక్యాలన్నీ ఈ ప్రపంచం మిథ్య అనే సత్యం నిరూపించటం కోసం బెపచారిక విధానంలో చెప్పిన మాటలే అని నిరూపణ అవుతుంది. కనుక ప్రపంచం అకర్భకమని నిర్ణయించటమే సముచితం. అలాటి
ఈఆహం ాాాాాాాాానాాానాాాలానానాాాా. శాప్త్రచర్చ ప్రపంచంమీద అనురాగం పెంచుకోవటం ఏమి తెలివి? రాముడు; పరమాత్మ ప్రకాశ స్వరూపుడని మీరే చెబుతూ వుంటారు గదా. వస్తువులు ప్రకాశించటానికి సూర్యుడు కర్త అయినట్లుగా ఈ సృష్టి జరగటానికి పరమాత్మ ఎందుకు కర్త కాకూడదు. వళిషముడు: లోకంలో సూర్యుడు ప్రకాశకుడు అనే వ్యవహారం వుంది. అంటే సూర్యుడు ప్రకాశన క్రియా కర్త అని వాళ్ల ఉద్దేశం. కానీ అది ఎంతవరకూ సత్యమో విచారిద్దాం. సర్వేచ్చారహితేభానౌ యథా వ్యోమని తిష్టతి: జాయతే వ్యవహారశ్చ సతి దేవేతథా క్రియా ॥ (56 సర్ద 29 శ్లోకం) వస్తువును (ప్రకాశింప చేయటంలో, నూర్యుడి కేదైనా ప్రయత్నం వుందా? పోనీ దీన్ని ప్రకాశింప జేయాలనే కోరిక వుందా? దీన్ని ప్రకాశింప జేసేవాడిని నేనే అనే అహంకారం వుందా ? ఈ వస్తువున్నది. దీన్ని ప్రకాశింప జేయాలి అనే మమకారం వుందా?
- ఇవేవీ లేవు. అహంకార, మమకార, ఇచ్చా, ప్రయత్నాలేవీ లేని సూర్యుడు ఆ వస్తువును ప్రకాశింప జేయటంలో కర్త యెలా అవుతాడు? సూర్యుడు తన దోవన తను వున్నాడు. ప్రక్కన వస్తువు చేరింది. వెంటనే అజ్ఞులు కొందరు సూర్యుడు ప్రకాశకుడయ్యాడని వ్యవహరిస్తున్నారు. అంటే ప్రక్కన వుండి ప్రకాశిస్తున్న వస్తువుని బట్టి, వారు సూర్యుడికి ప్రకాశకత్వాన్ని ఆరోపిస్తున్నారన్నమాట! సరీగా అదే విధంగా, ఆత్మ విషయంలో గూడా జరుగుతోంది. ఆత్మ స్వయం ప్రకాశకం. గమనికే దాని స్వరూపం
య్ళోన్నాస్తిదై .లలోలులతోనోడావానంకావనరులలంనునరునా. (దీన్నే దృగ్రూపం అంటారు.) దానికి ఏ రకమైన మార్పులూ లేవు. అది సమస్త బుద్ధులకూ సాక్షిగా వుంటుంది. అయినా సరే, ప్రక్కన బుద్ధి వంటి ఒక దృశ్యం చేరేసరికి “ఆత్మే దానికి కర్త” అని వ్యవహరిస్తారు, అజ్ఞ్జులు! అంటే ఇది గుణాల అధ్యాసవల్ల కలిగిన వ్యవహారమే నన్నమాట! అంటే పరమాత్మకు పరమార్ధతః కరృత్వం లేనే లేదన్నమాట!
కనుక నువ్వు ఈవిధంగా నేర్చుగా ఆలోచిస్తే, ఈ ప్రపంచం మీద అనురాగం వుండటానికి తగిన కారణమే కనిపించదునీకు!
కనుక ఓ రామా! నువ్వు మూడు రకాలుగా అనుసంధానం చేసే సావకాశం వుంది.
కర్తానాస్మిన చాహమస్మిస ఇతి జ్ఞాత్వైనమంత: స్పుటం
కర్తా చాస్మి సమగ్రమస్మి తదితి జ్ఞాత్వాథవా నిశ్చయమ్।
కోప్యేవాస్కి న కించిదేవమితి వా నిర్దీయ సర్వోత్తమే
తిష్ట త్వం స్వపదే స్థితాః పదవిదో యత్రోత్తమాః సాధవః
(సర్గ 56 శ్లోకం 49)
“కర్తానాఫ్మిన చాహమస్మి స ఇతి జ్ఞాత్వైవమంతః స్పుటం”
“నాకు కర్ఫత్వాన్ని అంటగట్టే దేహాదులు నేను కాదు. ఈ ప్రపంచంలో ఏ పదార్థమూ నేను కాదు” - అని భావించవచ్చు.
“కర్తా చాప్ఫి సమగ్రనుస్కి తదితి జ్ఞాత్వాథవా నిశ్చయమ్”
ఈ వాక్యంలో కవి ఒక మెలిక బెట్టాడు. “సమగ్రం అనే పదాన్ని రెండు సార్లు అన్వయించేటట్లుగా వాడాడు. “సమగ్రమ్ కర్తా చాస్య అని ఒక అన్వయం. ఇక్కడ సమగ్రమనే పదం ద్వితీయా విభక్తి ఏకవచనం- “సమగ్రం తదస్మి” అని మరో అన్వయం. - ఇక్కడ సమ(గ్రం అనే పదం ప్రధమా విభక్తి ఏక వచనం ! దీనివల్ల
శాంరితానరంలాలకుంిాతవింశాశంకాశలంలాలయంలాంా న్రారనాక్షయోసాయాలు వచ్చే విశేషార్థం ఏమిటంటే, రామా! ఈ ప్రపంచంలో కొంత భాగానికే గాదు - మొత్తానికీ నేనే కర్తను! అంతే కాదు - సర్వ సమష్టి స్వరూపమైన ఈ బ్రహ్మాండమంతా నేనే! అనేనిశ్చయంలో వుండు, ఇది రెండో పద్ధతి!
“కోప్యేవాస్సి న కించిదేవమితి వా నిర్జీయ సర్వోత్తమే”
లేదా, నేను అదీ కాదు ఇదీ కాదు. నేనిలాటివాడ్డని నిర్ణయించి చెప్పేందుకు వీల్లేదు - అని భావించు! ఇది మూడో పద్ధతి.
రామా! ఈ మూడిట్లో ఏ రకంగా భావన చేసినా సరే, నువ్వు సర్వోత్తమమైన పరిపూర్ణ ఆనంద చిదాత్మ స్వరూపంలోనే వుంటావు. పూర్వం సాధన చేసిన బ్రహ్మవేత్తలైన ఉత్తమ సాధకులంతా యిలాగే భావన చేశారు. నువ్వు గూడా అలాగే చెయ్యి.
వశిష్టమహర్షి ఈ విధంగా 56 వ సర్గను పూర్తి చేసే సరికి, శ్రీ రాముడు ఆత్మ తత్వభావనలో కొంత కొంత లీనమై ఇలా (ప్రశ్నించాడు. శ్రీరాముడు: గురుదేవా! నాకిప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. మీరు చెప్పిందే సత్యం! ఈ ప్రపంచంలో సత్యత్వం ఎంత మాత్రమూ లేదు. కానీ నిత్య సత్య స్వరూపుడైన పరమాత్మ విషయంలో ఆయన ఉన్నాడనీ, లేడనీ, కర్త అనీ, అకర్త అనీ, పరిమితుడనీ, వ్యావకుడనీ, ఇలాటి వరన్పర విరుద్ధ కల్పనలు ఎలా మొదలయ్యాయి.? సూర్యుడిలో మంచు వుండదు కదా! పరమాత్మలో
కక లా. భేదకల్పన వుండగలదా? - ఈ సందేహం తెగటంలేదు. తమరే తీర్చాలి. వశిష్టుడు: రామా! నాకు సంతోషంగా వుంది. నీకు విషయం అర్ధమైంది. కానీ వాసనాక్షయం ఇంకా కాలేదు. అందుకే ఈ ప్రశ్న నీకు కలుగుతోంది. అందుచేత దీనికి సరియైన సమాధానం రాబోయే నిర్వాణ ప్రకరణంలో, సిద్ధాంతోపదేశ సమయంలో, చెబుతాను. కనుక ఇప్పుడు వాసనాక్షయం లభించే ఉపాయాల గురించి మాట్లాడుతా.
రామా! “బంధో హి వాననా బంధో మోక్షస్వ్యాత్ వాసనాక్షయః॥ "(57 సర్ద 19 శ్లోకం) వాసనా బంధమే బంధము! వాసనాక్షయమే మోక్షము!
యోగశాస్త్రంలో చెప్పిన “మైత్రీ, కరుణా ముదితా, ఉపేక్షులనే నాలుగు వాసనలను అలవాటు చేసుకో. సుఖంగా వుందేవారి విషయంలో మైత్రిని భానవ చేయాలి. దుఃఖంగా వుందేవారి విషయంలో కరుణను భావన చేయాలి. పుణ్యాత్ముల విషయంలో సంతోషాన్ని భావన చేయ్యాలి. పొపొత్ముల విషయంలో ఉపేక్షను భావన చేయాలి! ఉపేక్ష అంటే పట్టించుకోకపోవటం! ఈ విధంగా భావన చేస్తే మనస్సుకు ఒక ప్రసన్నత ఏర్పడుతుంది. దానివల్ల సమాధి నిష్ట కుదురుతుంది. అది బాగా కుదిరినాక, ఈ భావనలనుకూడా విడచిపెట్టి, స్థిరమైన అసం(ప్రజ్ఞాత సమాధిలో వుండు! “శేషీ స్థిరసమాధానే యేన త్యజసి తత్త్యజ” (22 శ్లోకం 57 సర్గ) అప్పుడు నీయొక్క పరమార్ధ స్వరూపం యేమిటో నీకే గోచరమవుతుంది.
రామా! దీన్ని సాధించేందుకు మరో ఉపాయం వుంది.
నలలంచంాడామంలానాలంకాలకాలలణాలంలా.... నాసనాక్షయోసాయాలు ఇం(ద్రియ జయాన్ని సాధించిన మహానుభావులను మనం ఉపాసించాలి.
మరో ఉపాయం వుంది. ఎన్ని ప్రపంచాలున్నా , వాటిల్లో వుండేవి పంచభూతాలే! ఆరోది లేనే లేదు! ఈ పంచభూతాలు కూడా వాటికి అధిష్టానంగా వున్న బ్రహ్మ మీద అధ్యాసగా యేర్పడినవే! ఈ విషయాన్ని విచారణ మార్గం ద్వారా అనుసంధానం చేస్తే భూలోక సుఖాలమీద గాని, స్వర్గలోక సుఖాలమీదగాని, పాతాళలోక సుఖాలమీదగాని, ప్రీతి పుట్టనే పుట్టదు.
వళిష్టమహర్ష్ని ఈ విధంగా శ్రీరాముడు చేయవలసిన సాధన గురించి కొంత వివరించి, ఇక 58వసర్గలో ఇలా అన్నారు. వళిషృడు: రామా! ఇలాంటి బంధరహితమైన, సర్వాత్మ భావ సహితమైన, అనుభూతి అసలు ఎవరికైనా ఉంటుందో వుండదో అని నువ్వు సందేహిస్తావేమో!
పూర్వం బృహస్బతి కుమారుడైన కచుడు ఈ రకమైన అనుభూతిని పొంది, అప్రయత్నంగా పాడిన పాటలు ఎలా వున్నాయో చూడు.
బృహస్పతి కుమారుడైన కచుడు “సంజీవినీ” విద్యకోసం పడిన పాట్లన్నీ కధలు కథలుగా అందరూ చెప్పుకుంటూనే వున్నారు. ఆ తరువాత అతడు ఏమయ్యాడో ఎవరూ పట్టించుకోరు. ఆ మహానుభావుడు గురుకులం వదిలిపెట్టినాక, అరణ్యంలో ఏకాంత వాసం చేస్తూ , చాలా కాలం (బ్రహ్మ విద్యా సాధన చేశాడు. కొంతకాలానికి, అతనికి అద్భుతమైన అత్మ సాక్షాత్మారానుభూతి లభించింది. ఆనందం అగ్గలమై, గొంతు గద్దదమై, ఒక విధమైన ఆవేశంతో ఆయన అప్పుడు కొన్ని పాటలు పాడాడు.
యయోన్నాస్టాతి. ఆలాలారలరలరలవాలయ కింకరోమిక్వ గచ్చామి కిం గృహ్టామి త్యజామి కిమ్; ఆత్మనా పూరితం విశ్వం మహా కల్పాంబునా యఖథాః। (58ిసర్గ 5వ శ్లోకం మొదలుగా) “ఏెమ్రిచేసిద ఎందుపోయెద ఏమి పట్టెద ఏమి విడిచెద విశ్వమంతయు నేనె నిండితి ప్రకయకాలపు నీటిలా” “స్పఖ్లము దుఃఖము రెండు నేనే అనుభవించెడి జీవి నేనే జగతి సాధనలన్ని నేనే అన్ని విధముల నేను నేనే” “పైన నేనే క్రింద నేనే వెనుక ముందులయందు నేనే ఇచట నేనే అచట నేనే నేను కలుగని చోటు లేదే” “అణువు అణువు నేనే ఉంటిని జగము లన్నీ కలవు నాలో నిండు సంద్రపు పొంగు లాగా నేను పూర్ణానందమైతిని” రామా! ఆ కచుడు ఈ విధంగా తన అనుభవాన్ని పాటలుగా పాడేవాడు. కనుక ఇలాంటి అనుభవం సత్యం అనటంలో నువ్వు సందేహించ నవసరం లేదు.
నశరరాతశంందలనంనాశంంనాయయంలాలంందా.. స్రాక్ష్యీత్తం లోంబి స్పూలిత్వం లోకి కనుక నువ్వు నిశ్చిత బుద్ధితో భోగ ప్రీతిని వదిలి పెట్టి, సర్వాత్మ భావాన్ని అభ్యసించు”. ఇది విని రాముడు కొంచెం ఆలోచించాడు. తను పరమార్ధ సత్యమైన పరబ్రహ్మను గురించి సిద్ధాంత భాగ ్రశ్చను వేస్తే గురువుగారు నీకింకా ఆ సమాధానం వినే అర్హత రాలేదని తేల్చారు. కనుక వ్యావహారిక బ్రహ్మ గురించి మరిన్ని వివరాలు సేకరిద్దామనే ఉద్దేశంతో ఒక ప్రశ్న వేశాడు. రాముడు; గురుదేవా! హిరణ్యగర్భుడు అంటే పూర్వ కల్పంలో వున్న ఒకానొక మనస్సే గదా! మనస్సు అంటే సూక్ష్మ పదార్థం గదా. అది ఈ కల్పంలో హిరణ్యగర్భత్వాన్ని పొంది సృష్టి చేస్తాంది గదా! ఇలాంటి సూక్ష్మ పదార్ధంలోనించి స్థూలపదార్థమయమైన ఈ ప్రపంచం ఎలా ఏర్పడుతోంది.? ఆ హిరణ్యగర్భుడు పదార్థాలకు సూక్ష్మృత్వంనుంచి స్టూలత్వాన్ని ఎలా తీసుకు రాగలుగుతున్నాడు.? ఆ వివరాలు కొంచెం చెప్పండి. వళివుృడు: అంతా సంకల్ప బలంయొక్క ప్రభావమేనయ్యా! సంకల్పజాలరూపస్య మనసా కల్పితాకృతేః। అకరోత్తస్య సంకల్ప లక్ష్మీ పదనుథోత్తరే।! (సర్గ 569 శ్లోకం 15) రామా! పూర్వ కల్పంలోని సంకల్పాలే ఆయన స్వరూపం. వాటి వల్ల ఆయన మనస్సుతో కల్పించుకున్నదే ఇప్పటి ఈ రూపం, అందువల్ల ఆయనకున్న సంపదే సంకల్ప సంపద. ఆ సంకల్ప
యోన్నాట్టిత. .ఆలదులతునుతారనునానడానా. లక్ష్మియే ఎప్పటికప్పుడు పైమెట్టులో అడుగులు వేసింది.
ఉదాహరణ చెప్పు కోవాలంటే, ఆయనకు తేజస్సును గురించిన సంకల్పం వచ్చింది. ఆ సంకల్పంలోకి తనే ప్రవేశించాడు. దాంతో ఆ సంకల్పానికి ఒక ఆకారం యేర్పడింది. అదే సూర్యుడు! ఆ సూర్యుడే ఇప్పటికీ ప్రతి రోజూ మనకు కనిపిస్తున్నాడు. ప్రతి పదార్థం విషయంలోనూ సూక్ష్మత్వంనుంచి స్టూలత్వం వికసించే విధానం ఇదే!
అని ఈ విధంగా మొదలుబెట్టి వశిష్ట మహర్షి, మళ్లీ సృష్టి విధానాన్ని వర్ణించాడు. ఈ మాటు (తిగుణాత్మకంగా సృష్టిని విశ్లేషించటం కోసం ఈ వర్ణనను రెండున్నర సర్గలకు పైగా పెంచాడు.
వీటిల్లో మళ్లీ ఎక్కడికక్కడ సాధానోపాయోలను కూడా ప్రస్తావించాడు. ఈ విషయాలన్నీ పూర్వం చెప్పుకున్నవే గనక ఆ వివరాల్లోకి పోవటం లేదు.
త్రిగుణాల సృష్టిలో చేసిన సృష్టి వర్ణనను, సాధనా వర్ణనను కూడా 62 వ సర్గలో వశిష్టమహర్షి ఏకీకృతం చేస్తూ, దాంతోనే ఈ స్థితి ప్రకరణాన్ని కూడా ముగింపుకు తెస్తూ , చివరికి ఇలా అన్నాడు.
హితం మహాసత్వతయాత్మతత్వం
విధాయ బుధ్యా భవ వీతశోకః ;
తవ క్రమేణైవ తతో జనోయం
ముక్తో భవిష్యత్యథ వీతశోకః॥ ( శ్లోకం 20 సర్గ 62)
రామా! నీలో నత్వగుణం పెంచుకో, నీ చిత్తం సత్వమయమైతే, నీకు ఆత్మ తత్వమే అత్యంత హితం అవుతుంది. సన్నిహితమౌతుంది. అనుభవ సిద్ధమౌతుంది. శోకం
6కు “జాలా... స్థికిప్రకరణను- సింహానలోకననం తొలగిపోతుంది. నువ్విలా చేస్తే , నిన్ను ఆదర్శంగా పెట్టుకుని ఇతరులు కూడా ఇలాగే శోకరహిత ముక్తి స్థితిని చేరు కుంటారు.
ఈ విధంగా వశిష్టమహర్ని స్థితి ప్రకరణాన్ని ముగించి, ఉపశమ (ప్రకరణంలోకి ప్రవేశించబోతున్నాడు. మనంకూడా ఆయనతోపాటు ఆ ప్రకరణంలోకి ప్రవేశించే ముందు, ఒక్కసారి ఈ స్థితి ప్రకరణంలో వశిషుహర్షియొక్క ప్రబోధ సోపానాలు ఎలా పేర్చ బడ్డాయో సింహావలోకనం చేద్దాం!
(ప్రపంచంలో ఏ వస్తువుకైనా సరే ఆరు రకాలైన వికారాలు ఉంటాయని, ఇంచుమించుగా అందరు శా(స్తకారులూ అంగీకరించారు. వీటినే “షడ్భావ వికారాలు” అని, వ్యవహరిస్తూ వుంటారు. అవి ఏమిటంటే, 1.జాయతే, 2.అస్తి 8.వర్ధతే 4.విపరిణమతే 5.అపక్షీయతే 6. వినశ్యతి” వీటినే తెలుగులో చెప్పాలంటే 1.పుడుతోంది 2.ఉంది 3. పెరుగుతోంది 4 మార్పు చెందుతోంది 5.క్షీణించిపోతోంది 6. నశిస్తోంది
ఈ ఆరురకాల వికారాలు (మార్చులు) ఏపదార్థానికైనా తప్పవు. సులభంగా అర్థమయేందుకోసం ఒక ఉదాహరణ చెప్పుకుందాం.
చెట్టుమీద ఒక వువ్వు వూచింది. మర్నాటికి అది ఎండిపోయి, అక్కడ కాడలో కొంచెం ఉబ్బు వచ్చింది. దాన్ని గమనించిన రైతు “ఏదో పుడుతోంది -పుడుతోంది” అంటాడు, “జాయతే” అంటే ఇదే!
యోన్యాస్టిత. ఆలలాలయలవాయాయాణలల. (ఫ్తేక్తైలు
ఆ మర్నాటికి కొంచెం పిందె వంటి ఆకారం తేలింది. రైతు దాన్ని “ఇదిగో పిందె వుంది అంటాడు. 'అస్తి అంటే ఇదే!
ఇక రోజు రోజూ రైతు దాన్ని గమనిస్తూనే వున్నాడు. ఏ రోజు కారోజు అది పెరుగుతోంది. “వర్ధతే” అంటే ఇదే!
కొంతకాలానికి పెరగడం ఆగి పండుతుంది. 'విపరిణమతే? అంటే ఇదే.ఇంకా కొంత కాలం పోయేసరికి, అది క్రమంగా ఎండి, దాని ఆకారం కృశించిపోతోంది. “అపక్షీయతే” అంటే ఇదే! చివరికో-రోజున అది రాలిపోతుంది. “వినశ్యతి” అంటే ఇది!
ఈ ఉదావారణలో లాగా ఇంత నృవ్చంగా కనిపించకపోయినా, ప్రపంచంలోని ఏ పదార్ధానికైనా ఈ ఆరు రకాల మార్పులూ తప్పనే తప్పవు.
వీటిలో “జాయతే అన్న స్థితిని, “ఉత్పత్తి” గానూ, “నశ్యతి” అనే స్థితిని “సంహారం” గానూ లోకంలో అందరూ గర్తిస్తూనే వుంటారు. ఈ మధ్యలో నాలుగు దశలున్నాయి. “అస్తి -(ఉన్నది) వర్భతే (పరుగుతోంది) వివరిణవుతే(వండుతోంది) అపక్షీయతే(తగ్గిపోతోంది) - అని! ఈ నాలుగింటినీ కలిపి, లోకులు సామాన్యంగా “స్థితి” అనేస్తూ వుంటారు. వశిష్టహర్షికూడా ఈ పదాన్ని ఈ అర్ధంలోనే తీసుకున్నాడు.
ప్రపంచంలో ఏ పదార్ధానికైనా సరే, ఉత్పత్తి లేనిదే, స్థితి ఉండదు! నాశనం అయిపోయిన తరువాత, మళ్లీ వెనకాల దానికి స్థితి వుండదు! ఇది లోకంలో అందరూ గట్టిగా విశ్వసించే విషయం!
ఈ విశ్వాసం ఎంతవరకు సత్యం?- అనేదాన్ని చర్చించేందుకు మాత్రమే వశిష్టమహర్షి ఈ స్థితి ప్రకరణం మొదలు పెట్టాడు.
ఆపు. “బాలల... స్టేక్రప్రకరణనూ సింహావలోకనను
వెనుకటి ప్రకరణంలో ఈ ప్రపంచానికి ఉత్పత్తే లేదు అని ఆయన నిరూపించాడు. ఉత్పత్తే లేనిదానికి “స్థితా ఎక్కడ నుంచి వస్తుంది? లేని దానికోసం చర్చ ఏమిటి? -అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ ్రకరణాన్ని “భార్గవోపాఖ్యానం” తో ప్రారంభించాడు.
ఈ కథలో శుక్రకుమారుడు భూలోకంలో కొండమీద తపస్సు చేసుకుంటూ వుండగా, స్వర్ణ లోకంలో అతనికి రెండో శరీరంతో భోగానుభవం ప్రారంభమైంది. ఈ రెండవ శరీరానికి ఉత్పత్తి ఎప్పుడు జరిగింది? దానికి ఉత్పత్తి లేదు. “జాయతే” అనే మాట లేదు. “అస్తొతో ప్రారంభమైపోయింది. “స్థితి కొనసాగింది. ఈ స్థితి ఏమైనా కలవంటిదా? “గారడీ” వంటిదా? కాదే! ఆ శరీర స్థితికి కొన్ని జన్మల కథ నడిచింది. చివరికి శుక్రకుమారుడు మృత్యు దేవతయొక్క ఉపదేశబలంవల్ల, తన పాత శరీరంలోకి (ప్రవేశించి, తన కొత్త శరీరాన్ని తనే తగలబెట్టాడు. అంటే-'అస్తి తో (ప్రారంభమైన శుక్ర కుమారుడి రెండవ శరీరం “వర్ధతే” - “విపరిణమతే”, “అపక్షీయతే” అనే దశలను దాటి, “నశ్యతి”- నశించిపోయింది- అనే చివరి దశ దాటి నాక కూడా, అసలు శుక్ర కుమారుడు ఇంకా “అస్తి”, లోనే. వున్నాడు. అంటే, నాశనం తర్వాత మళ్లీ స్థితి కనిపిస్తోంది. ఇది మేధావులంతా ఆలోచించవలసిన చిక్కు సమస్య,
వేదాంతులు ఈ ప్రపంచం “మిథ్య” అని చెప్పడం కోసం, ఎంతసేపటికీ, స్వష్నాన్నీ గారడినీ, భ్రాంతినీ, ఉదాహరణలుగా చూపిస్తూ వుంటారు. ఎప్పుడు చూసినా ఇవే ఉదాహరణలా అని ఒకోసారి శిష్యులకు సందేహం కలుగుతూ వుంటుంది. అలాటి
యోవ్యాట్టాత. .ఆలతదాలోురనాలనానుంతంనాంంనా సందేహాలకు తావు లేకుండా వుండటం కోసమే వశిష్టముహర్షి ఈ కల్ప ప్రారంభంలో జరిగిన ఒక యథార్థ సంఘటనను, ఉదాహరణగా తెచ్చి శ్రీరాముడి ముందు ఉంచాడు. కల్పం ప్రారంభంలో ప్రప్రథమ కృతయుగ ప్రారంభంలో, అనేకమంది విచిత్ర జీవులు జన్మించారనీ, అందులో శుక్రకుమారుడి విచిత్ర జీవిత చరిత్ర ఇలా వుందనీ ఆయన
ఈ కథ ద్వారా ఆయన మనకు “ఆవ్వేరాను “జూమ్” చేసి, ఒక విచిత్రమైన స్థితిని “ఫోకస్” చేసి, “ఎన్లార్ట్ో చేసి, పెద్దదిగా చూపిస్తున్నాడు. అదే “ఉత్పత్తి” లేని “స్థితి. ఉపశమం తరువాత కూడా కొనసాగుతున్న స్థితి. వెనకా ముందూ కూడా లేని స్థితిని ఏమనాలి? “మిథ్యా స్థితి అనాలి- అంతకంటే మరో మార్గం లేదు. ఈ “స్థితి ప్రకరణం” మొత్తానికి సారాంశమైన భాగమంతా ఈ కథలోనే ఇమిద్చేశాడు వశిష్టమహర్షి
ఆయన ఇమిడ్చినంత మాత్రాన ప్రశ్న్చలాగుతాయా? ఇలాటి స్థితి ఎలా సంభవిస్తుంది? అది ఎలా సాథ్యం అవుతుంది? అనే ప్రశ్నలు శిష్యుణ్ని వేధిస్తూనే ఉంటాయి.
ఈ ప్రశ్నలకు సమాధానంగానే వళిష్టమహర్షి “దామవ్యాల కటోపాఖ్యానం” చెప్పాడు. ఈ కథలోగల అంతరార్థాలగురించి అప్పుడే వివరంగా చెప్పుకున్నాం.తాడుమీద వ్యాళానికి (పాముకు) స్థితి వచ్చింది. మరోసారి, అదే దారం మరొరకంగా మెలికలు పడ్డప్పుడు, దానిమీద కటానికి (చాపకు) స్థితి వచ్చింది. దీనినే ఆయన దామవ్యాల కటోపాఖ్యానంగా చెప్పాడు. కానీ ఇక్కడ కూడా కల్పించిన కథ చెప్ప లేదు. జరిగిన కథే చెప్పాడు. ఈ కథలో ఆయన మళ్లీ ఉత్పత్తిలేని స్థితినే వర్ణించాడు. అయితే ఇది పరాధీనమైన స్టితి .
అయలాయనాయులణలంలల.... స్థితిప్రువరణనూ సింహానీలోకీననం శంబరుడనేవాడి యొక్కస్టితిమీద ఆధారపడి దామ, వ్యాల, కటులనే ముగ్గురియొక్క స్థితి యేర్పడింది. అదే శంబరుడియొక్క స్థితి మీద ఆధారపడి, రెండవసారి భీమ, భాస, దృఢులు అనే వారి స్ధితి ఏర్పడింది.
అయితే ఈ కధలో వశిష్టమహర్షి ఉత్పత్తి లేని స్థితిని నాశనం తరువాత కొనసాగే స్థితిని ఫోకస్ చెయ్యలేదు. ఇలాటి ఉత్పత్తిలేని స్థితి ఎంతకాలం కొనసాగుతుంది? అది ఎప్పుడు పోతుంది?అది ఎలా పోతుంది? అనే అంశం మీద ఆయన ఫోకస్ చేశాడు. అందుకనే ఈ కథ తరువాత జరిగిన చర్చలో ఆయన శ్రీరాముడికి ఇలా బోధించాడు.
కుతో జాతే౭ యమితి తే
రామ మాస్తు విచారణా
ఇమాం కధమహం హానీ
త్యేషాతేస్తువిచారణా॥ (సర్గ 41, శ్లోకం 31,32)
రామా! ఈ మాయ ఎక్కడ్జించి పుట్టింది? ఎందుకు పుట్టింది? ఎలా పుట్టింది ? అనే విచారణ నీకు వద్దు. దీనిని నేను పోగొట్టుకునేదెలాగ? అనే విచారణమాత్రమే నువు చెయ్యి”,
ఈ బోధకు అనుగుణంగానే “దామవ్యాళ కటుల” యొక్క దుఃఖ పరంపర సమూలంగా నశించిపోవాలంటే, వారియొక్క చరిత్రంతా ఆమూలాగ్రంగా తెలిస్తే చాలు- అని యముడి చేత చెప్పించాడు. చరిత్ర ఆమూలాగ్రంగా తెలియటమంటే -“తమయొక్క స్థితి అంతా ఆ “శంబరుడి” మీద ఆధారపడివున్న స్థితి మాత్రమే అని, ఆ మాట మధ్యలో మరిచిపోవటంవల్లనే తమకు ఇన్ని జన్మలూ వచ్చాయనీ” - అని అర్ధం!
కయ
దామవ్యాలకటులయెొక్క న్ఫితి శంబరుడిమీద ఆధారపడివుంది. మరిమనలాటి సామాన్య జీవుల స్థితో?! అది “మూలావిద్య” మీద ఆధారపడి వుంది. అంటే “అజ్ఞానం” మీద ఆధారపడివుంది. ఈ మాట తెలుసుకుంటే చాలు, ఆజ్ఞానం తొలగిపోతుంది! మనం సంసార బంధ నిర్ముక్తులమై పోతాం. ఇదే వశిష్టమహర్న్షి దామవ్యాళ కటోపాఖ్యానంలో కేంద్రీకరించి చెప్పిన మాట!
అందుకే ఈ కథానంతర చర్చలో, ఆయన మనస్సు శమించపోయే ఉపాయాల గురించి ఎక్కువగా వివరించాడు. మనస్సు శమించి పోవటం అన్నాా మూలావిద్య శమించి పోవటం అన్నా - ఒకటే! దీనికి ఉపాయం, ఆత్మ విచారణమే! ప్రపంచ మిథ్యాత్వ విచారణమే! దీనిని నొక్కి చెప్పేందుకే వశిష్టుహర్షి “కదంబ దాశూరోపాఖ్యానం * చెప్పాడు.
కదంబ దాశూరుడు- ఈ పేరే విచిత్రమైన పేరు! “కమ్ - వాయుమ్- దమయతీతి కదంబః” వాత రోగాలను కుదిర్చేది కదంబవృక్షం! ఇది మామూలు అర్ధం! వాతం అనగా వాయువును శమింప జేసేవాడు. అంటే, ప్రాణాయామం ద్వారా ఉచ్చ్వాస నిశ్వాసలను తగ్గించుకునేవాడు - అని ఇక్కడ 'ప్రకరణార్థం,
“చలేవాతే చల చిత్తం - నిశ్చలేనిశ్చలం భవేత్” - అని యోగశాస్ర సిద్ధాంతం! అంటే, మనిషిలో గాలి కదులుతుంటే, మనస్సుగూడా కదులుతుంది, గాలి నిలిచిపోతే మనస్సు గూడా నిశ్చలమౌతుంది
- అని అర్థం.
ఈ దాశూరుడు అటువంటి నిశ్చల మనస్థితిని సాధించినవాడు కనుక, ఆయన “కదంబ దాశూరుడు”. కథలో
ఆ చానాాాాలా.... స్టితిప్రకరణనుూ- సింవోవరోకనను ఆయన కదంబ వృక్షంమీద కూర్చున్న దాశూరుడు.
దాశూరుడు అంటే ఏమిటి? ఇక్కడ కవి కొంచెం మెలిక పెట్టాడు. “దాశ దానే” అనే ధాతువు వుంది. దాన్ని బట్టి “దాశు” అంటే దానము అని అర్ధము, దీన్ని బట్టే, విష్ణువుకు “దాశార్హ్డుడు” అనే పేరు వచ్చింది. “దాశార్హసాత్వతాంవతి:”' అని విష్ణుసహ(స్రనామం! దానమునందు శూరుడు “దాశశూరుడు” అతడే “దాశూరుడు”
దానమంటే ఏమిటి? తనకు ఉన్నదాన్ని వదిలి పెట్టడమే దానము! దీనికే మరోపేరు త్యాగము! మరో పేరు సన్వ్యాసము! అన్నిటినీ పరిత్యజించటంలో శూరుడు దాశూరుడు! మన కథలోని దాశూరుడు, కామంతోపాటు క్రోధాన్ని కూడా పరిత్యజించిన శూరుడు! అందుకే వనదేవతవచ్చి నంతానం ఇమ్మని ప్రార్ధించినప్పుడు కోప పడనూ లేదు, వ్యామోహపడనూ లేదు. అందుకే అతను త్యాగశూరుడు. అతడే దాశూరుడు.
దానం అంటే విద్యోపదేశం కూడా! విద్యలలో గొప్పది బ్రహ్మవిద్య! దానిని కథలు కథలుగా, నేర్చుగా, ఉపదేశించగల విద్యా దానశూరుడు, దాశూరుడు!
ఈ ఉపాఖ్యానం చివరి భాగంలో అతని విద్యా దాన విధానాన్ని చూసి వశిష్ట మహర్షే మెచ్చుకున్నాడని కథలో ప్రన్తావించడం జరిగింది.
ఈ కథ ద్వారా వశిష్టమహర్ని స్థితికి సావకాశంలేని వృక్షాగ్రభాగంమీద దాశూరుడి యొక్క స్థితిని ప్రస్తావించినా, ఆ అంశాన్ని ఇప్పటికే రెండు సార్లు బోధించాడు గనుక, ఈ మాటు దానిమీద కేంద్రీకరణం పెట్టుకోలేదు. మూలాజ్ఞాననివృత్తి కోసం
య్కోన్యాస్తితే. ఆరలారకులోలారకుంకాయనావంనుంగలంలుంా సాధకుడు అనుసరించవలసిన చిత్త శమన ఉపాయాల గురించి, జగన్నిథ్యాత్వ విచారణ గురించి, మాత్రమే కేంద్రీకరణ చేశాడు - అంటే ఫోకస్ చేశాడు.
ఇలాటి అజ్ఞాన రహిత జీవన్ముక్త స్థితి 'పెద్దల అనుభవంలో వుంది అని చెప్పటం కోసం, వశిష్టమహర్షి బృహస్పతి పుత్రుడైన కచుడియొక్క బ్రహ్మవిద్యాసాధనను ప్రస్తావించి, అక్కడ్డించి మళ్ళీ జగత్ స్థితి యొక్క వరుసను సత్వరజస్తమోగుణాలనే త్రిగుణాల దృష్టితో మరోసారి విశ్లేషణచేసి, చిత్తానికి సత్వగుణాన్ని వృద్ధి పొందించు కోవటం ద్వారా, చిత్తరహిత స్థితిని, శోకరహిత స్థితినీ, అందుకోమని బోధిస్తూ , ఈ స్థితి ప్రకరణాన్ని ముగించి ఇక “ఉపశమ ప్రకరణం” లోకి ప్రవేశిస్తున్నాడు.
మనం కూడా వెనుకటి కథా ఘట్టాలను గ్రంథాలద్వారా మరొకసారి పర్యాలోచన చేసుకుని, ఈ సింహవలోకనాన్ని కూడా బాగా మననం చేసుకుని, ఇక వశిష్ట మహర్షితోపాటు “ఉషపశమో ప్రకరణంలోకి ప్రవేశిద్దాం.
జయగురుదత్త
శ్రీ దత్త స్తవము శీ గశోశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీపాదవల్లభ నరసింహసరస్వతి శ్రీగురు దత్తాత్రేయాయ నమః దత్తాచేయం మహాత్మానం వరదం భక్త పత్సలం ప్రపన్నార్తి హరం వందే స్మర్తృగామీ సనోవతు లకే దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం సర్వ రక్షాకరం వందే స్మ రృగామీ ననోవతు ంం2ై శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనోవతు వె సర్వానర్ద హరం దేవం సర్వ మంగళ మంగళం సర్వక్లేశ హరం వందే స్మర్తృగామీ సనోవతు డీ బ్రహ్మణ్యం ధర్మ తత్త్వజ్ఞం భక్త కీర్తి వివర్ధనం భక్తాభీష్ట ప్రదం వందే స్మ ర్భగామీ సనోవతు ఎర్ శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః తాపస ప్రశమనం వందే స్మ ర్సృగామీ సనోవతు 6 సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం విపదుద్ధరణం వందే స్మర్తృగామీ సనోవతు ఎలో జన్మసంసార బంధఘ్నం స్వరూపానంద దాయకం నిశేయస పదం వందే స్మర్త్శృగామీ సనోవతు కీ జయ లాభ యశః కామ దాతు ర్దత్తస్య యస్తవం భోగమోక్ష ప్రదస్యేమం ప్రపఠేత్ స కృతీ భవేత్ లలి
అష్టలక్షి 2 స్తుతి రథమధ్యా మశ్వపూర్వాం గజనాద ప్రబోధినీం సామౌాజ్య దాయినీం దేవీం గజలక్షీ శం నమామ్యహమ్ ...1 ధనమగ్ని ర్ధనం వాయుః ధనం భూతాని పంచచ ప్రభూతైశ్వర్య సంధాత్రీం ధనలక్ష్మీం నమామ్యహమ్ ఒడ పృథ్వీగర్భ సముద్భిన్న నానావ్రీహి స్వరూపిణీం పశుసంపత్ప్వరూపాం చ ధాన్యలక్షీ శం నమామ్యహమ్ ఎంతే న మాత్సర్యం న చ క్రోధో న భీతి ర్నచ భేదధీః యదృ క్తానాం వినీతానాం థైర్యలక్ష్మీం నమామ్యహమ్ ...4 ,వుత్ర పొత్ర స్వరూపేణ పశు భృత్యాత్మనా స్వయం సంభవంతీం చ సంతానలక్ష్మీం దేవీం నమామ్యహమ్ ద్ _నానావిజ్ఞాన సంధాత్రీం బుద్ధి శుద్ధి ప్రదాయినీం అమృతత్వ ప్రదాత్రీం చ విద్యాలక్ష్మీం నమామ్యహమ్ 6 నిత్య సౌభాగ్య సౌశీల్యం వరలక్ష్మీ దదాతి యా ప్రసన్నాం స్త్రైణ సులభాం ఆదిలక్ష్మీం నమామ్యహమ్ _ ...? సర్వశక్తి న్వరూపాం చ సర్వసిద్ధి ప్రదాయినీం సర్వేశ్వరీం శ్రీ విజయలక్ష్మీం దేవీం నమామ్యహమ్ కీ అష్టలక్ష్మీ సమాహార స్వరూపాం తాం హరిప్రియాం మోక్షలక్ష్మీం మహాలక్ష్మీం సర్వలక్ష్మిం నమామ్యహమ్ తి దారిద్య్యు దుఃఖహరణం సమృద్ధి రపి సంపదాం సచ్చిదానంద పూర్ణత్వం అష్టలక్ష్మిస్తుతే రృవేత్ ఎకే0
సద్గురు స్తనము సిద్ధి బుద్ధి మహాయోగ వరణీయో గణాధిపః | యస్స్వయం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహమ్ ॥ యస్య దత్తాత్రేయ భావో భక్తానా మాత్మ దానతః। సూచ్యతే సచ్చిదానందం సద్దురుం తం నమామ్యహమ్ ॥ యోగా జ్ఞోతి స్పముద్దీప్తం జయలక్ష్మీ నృసింహయోః అద్వయం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహమ్ ॥ యోగవిద్యా చిత్రభానుం చిత్రభాను శరదృవమ్ | జ్ఞానదం సచ్చిదానందం సద్దురుం తం నమామ్యహమ్ ॥ గణేశ హోమే£౬_ర్శదినే నిత్యం శ్రీచక్ర పూజనే 1 దిక్షితం సచ్చిదానందం సద్దురుం తం నమామ్యహమ్ ॥ అగస్త్యముని సంక్రాంత నానావైద్య దురంధరమ్ । భవఘ్నం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహమ్ ॥॥ వాద్యోదంచ ద్దివ్యనామ సంకీర్తన కళానిధిమ్ 1 నాదాబ్టిం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహమ్ ॥ దత్త పీరాధిపం ధర్మ రక్షణోపాయ బంధురమ్ । సత్మవిం సచ్చిదానందం సద్గురుం తం నమామ్యహమ్ ॥ విధూత భక్త సమ్మోహ మవధూతం జగద్గురుమ్ । స్వాళయం సచ్చిదానందం సద్దురుం తం నమామ్యహమ్ ॥ సాధుత్వం భక్తి మైశ్వర్యం దానం యోగ మరోగతమ్ । సన్మతిం జ్ఞాన మానందం సద్గురు స్తవతో లభేత్ ॥
థి "ఈ గ్రంథం గురించి పన్నెండేళ్ళ శ్రీరాముడిలో పెల్లుబికిన తత్త్వ విచికిత్సా కల్లోలానికి అత్మతత్త్వావగాహనకై కురిపించిన యుక్తుల వర్షం కవితోరసమయంగా: రూపోరీదిన తాత్త్విక కావ్యం ః. థీకుట్నొనేంతటిళృష్ణమూర్తిగారు. _ జెమినీ ౧17 లో చేస్తున్న ప్రవచనాలలో - స్థిత ప్రుకీఠణా?కి - ఈ | అక్షరరూపమే శం ఈ ఇ స్థ యమమాటెసన్ట షృాముమము 12) . ప్రావ్రిస్థానము " శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమము దత్తనగర్, ఊటీరోద్డు, మైసూరు - 500025 వంగల 0821 - 2486486, 2480424, బం0821-2487487 తాలాాలి కాాారేరంందయుం.000 శారాంటి జ 964గషైంంయు.000 ( స్నా