Telugu vishwa yogi vignana sukthulu - anilvaranasi/indianlanguages GitHub Wiki

లనే స మ ఎ నం కిము ఆ లి సథ? కు! లు స్య గ, న నయ (1. ను న సల లీ సస త షస (5 స యం ను! శ్‌ (ఎ ట్‌ | 1; స్‌ లట స (11 గ్గ ను, న రక | (స్ట ఈ! లం గ? | జ్జ గ వ 0 న | బి న. ర ౧ ధ్‌. రన గ | ల. సటోతటనిన గ. ,/! న చం న / త ఉగ. 7 న. వ. గ్‌ ఇ వ స: సహజి కవి మళ తో సేకరించిన | న... సక గ న న గ క , న. (1 నునసుపది మకే ఖై నుల కోసం . మం, సాహిత్యాణిమొ ర. పం 9! ఈపుసొసి క్రి న. రం పన లి రా ఐబజాన కేం (౯ రు కీ. సుందరయ్య నాం. నే ల ల్ని హూకలిగ్తునలు సంశే ఆనందంతో బ లకుటుంబం | య. | య. | శ ల! ! ్‌ ఇ | 1 ॥ | |. ఎ సక! గ...

  • వల మ ః | . ॥ ' / ," స్‌ | - ॥ | అక. స... న్‌! గా. స్ట జోకు మ , ॥| ? నాళ, మ? గ. (ట్లో జ ౪ “4 . . / వ సఫల న ఫాసళ్ళి న స. మై. | సాం య అం మ టం , ప (నో గ్ల న! స్తా / శ ల య మస మ గ కా ాంసం రేస రాల 0 ల (ఏ: ౧ ౧ | న గే | శ్‌ 1! న్‌

తాం లా నషం ా 8.8 నాార/ సా 38 నా 32. సరం టా న్‌! .. న. . స న న్‌ు త న క. ఇమ ల స ఖీ ఫో | (| శ్ర హా. ఖే ల (| ,. శన ( న్‌ “శ్‌... శ. గా శ (టో ఇ సనా లయను ॥ / శై నరాల రం లాల రాలా్యాడునా * 1 ల అంలషతంరతు అల్‌ ఆ రాజ్య యు. | న్‌ స గ జ! | పా (

విశ్చయోగి విజ్ఞాన సూక్తులు రచన వి. రత్నమోహిని

వఐిశ్వయోగి విజ్ఞాన సూక్తులు వి. రత్న్వమాహిని వర్‌ ౯5 శ రల -౨ిప ప్రధమ ముద్రణ ప్రతులు : 1000 మే, 2005 విశ్వమందిరం ॥ నంగ ణ్‌. ఇ లలు (4 ౩వ లైన్‌, కృష్ణనగర్‌ స యా || ముద్రణ: కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 40, ఎ.పి.హెచ్‌.బి, విద్యానగర్‌, హైదరాబాద్‌ - 44 ఫోన్‌ :2761 8261, 27653348 |

భగవాన్‌ శ్రీశ్రీశ్రీ ఐవిశ్వయోగి విశ్వంజీ దివ్య చరణారవిందాలకు అంకితం

౪

విశ్వ సందేశం

అన్ని జన్మలలోకి మానవజన్మ ఉత్తమమైనది. మానవ జన్మ లభించుటయే దుర్లభము. అద్భృష్టవశముగా దివ్యపరముగా లభించిన మానవ జన్మను మానవుడు సద్వినియోగము చేసికొనుటకు సక్రమముగా యత్నించవలెను. మునుముందుగా మనిషిగా నిలిచి, మనిషిగా మారి, మహాత్మునిగా మహాశక్తి స్వరూపునిగా సాక్షాత్తు మహేశ్చరునిగా మారటానికి దివ్యపధముపై పయనించాలి.

పరిపూర్ణ మానవత్వమే దివ్యత్వము. సనాతన ధర్మం మానవుని పరిపూర్ణ మానవునిగా తీర్చిదిద్దడానికి దోహదపడే మార్గం. ఇది ఒక ప్రాంతానికో, మతమునకో సంబంధించినది కాదు. యావత్‌ మానవజాతికి, యావత్‌ మానవ కళ్యాణమునకు, యావత్‌ మానవజాతి సమైక్యతకు మన సనాతన ధర్మం ఎంతయో అవసరము. ఆచరణీయము అయివున్నది.

“వసుధైక కుటుంబము” అని చాటి చెప్పినది సనాతన ధర్మం. 'ఈశ్వరస్సర్వ భూతానాం అని ఎలుగెత్తి చెప్పినది సనాతన ధర్మం. “ఏకంసత్‌ విప్రాాబహుధావదంతి అని చెప్పినది సనాతన ధర్మం. “మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిధిదేవోభవ” అని మనిషి మనిషికి సందేశమిచ్చింది సనాతన ధర్మం. మనిషిని సంస్కరించి కుటుంబ వ్యవస్థను చక్కదిద్ది, గృహమును ప్రశాంతి నిలయముగా మార్చి తద్వారా యావత్‌ మానవ సమాజమునకు ఒక స్వర్గధామంగా, ఒక కలియుగ వైకుంరముగా ఒక ఆనంద నిలయంగా మార్చడానికి మార్గదర్శకమయింది.

అట్టి సనాతన ధర్మాన్ని విస్మరించి, వ్యక్తిని విస్మరించి, కుటుంబమును విస్మరించి, సమాజమును బాగుచేయాలని ప్రణాళికలు వేస్తున్నాము కాబట్టి అన్నిటిలోను అపజయమును రుచిచూచి ఇప్పుడు యావత్‌ ప్రపంచాన్ని ఒక అగ్నిగుండముగా, ఒక అశాంతి నిలయంగా దిగజార్చడానికి, నాగరికత పేర, విశ్చంఖల స్వతంత్రత పేర, మితిమీరిన తెలివితేటల పేర సహాయపడుతున్నాము. ఇదె విచారించతగ్గ విషయం.

౪

మొట్టమొదటిసారిగా మనిషి సంస్మరించబడాలి. కుటుంబము సంస్కరించబడాలి. తరువాత సమాజము దానికదే సంస్కరించబడుతుంది. సంస్కారము గల వ్యక్తులతో విరాజిల్లే కుటుంబములను, గృహములను కలిగిన సమాజము ప్రశాంత పరిమళములను విరాజిల్లుతూ ప్రకాశవంతంగా వెలుగొందుతుంది. విశ్వమానవ సమైక్యతతో సుసంఘటితంగా జీవిస్తూ విశ్వమానవ కళ్యాణాన్ని రుచి చూస్తుంది. ఇదే, ఇదే ముక్కోటి దేవతల దివ్య సంకల్పం. ఇదే, ఇదే సమస్త యోగుల అవతారమూర్తుల, సిద్ధపురుషుల, మత ప్రవక్తల సంకల్పము. ఇదే ఇదే సమస్త మానవజాతి యొక్క ఆశ, ఆకాంక్ష ఆశయము,

లక్ష్యం. దివ్య ఆశీస్సులతో, విశ్వయోగి విశ్వంజీ

ఛే

ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్త

భగవాన్‌ శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ దివ్యాశీస్సులు

భగవంతుడు మృత్యుంజయుడు. అమృతమయుడు. విశ్వవ్యాపకుడు. విశ్వమే భగవంతుడు. భగవంతుడే విశ్వము. విశ్వ సంకల్పము తిరుగులేనిది. విశ్వ సంకల్పానికి నిదర్శనమే, ప్రదర్శనమే ఈ అనంతమైన విశ్వం. ఆ మృత్యుంజయుని దివ్యాశీస్సులతో మృతత్వము నుండి అమృతత్వమునకు, అనారోగ్యము నుండి ఆరోగ్యమునకు, అశాంతి నుండి శాంతికి, చీకటి నుండి వెలుగునకు, దుఃఖము నుండి ఆనందమునకు, తన జీవిత గమనాన్ని పరిణామం చెందించుకున్నది చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రత్న మోహినీ సూర్యారావు. మనం నిర్వర్తించవలసిన కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా నిర్వర్తించేంత వరకు మన చేత ఏమేమి చేయించదలచుకున్నాడో అవన్నీ సంపూర్ణంగా చేయించుకునేంతవరకు మనల్ని ఈ భూమి మీదకు పంపిన ఆ విశ్వమయుడు, మనల్ని తిరిగి తన దగ్గరకు పిలిపించుకోడు.

చి।ల॥సా॥ రత్న మోహిని సౌశీల్యవతి. సుగుణమణి. అందునా దృఢతరమైన భక్తి విశ్వాసములు గల వ్యక్తి. ఆమె ఆత్మవిశ్వాసమే, ఆమెకు గురువునందుగల దృఢతర విశ్వాసమే ఆమెకు శ్రీరామరక్ష సహజ సిద్ధంగా సాహితీవేత్త. మంచి రచయిత్రి అయిన రత్నమోహిని తన హృదయస్పందనతో జాగృతమైన, మనోభావములతో రచించిన రచనలు యదార్థముగా హృదయమోహనములు. అనుభవైక్య వేద్యములు.

హృదయాన్ని అర్ధంచేసుకోవాలంటే హృదయం కావాలి. అటువంటి సహృదయంతో ఆమె (ప్రేమ భక్తి పూర్వక హృదయాన్ని సహృదయులందరు హృదయ రంజకంగా అర్ధం చేసుకుని ఆనందించగలరని భావిస్తూ ఆశీస్సులనందజేస్తున్నాను. ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో హృదయరంజకమైన రచనలు సమాజమునకు చి॥ల॥;సౌ॥ రత్నమోహిని సూర్యారావు అందించగలదని ఆకాంక్షిస్తూ ఆశీస్సుల నందజేస్తున్నాను.

శుభం భూయాత్‌ లోకాస్పమస్తాసుఖినోభవంతు ఛే

హితోక్తి

“విశ్వయోగి మాట వెలుగు బాట”. సాధకులకు వెలుగుచూపి వారిని జ్ఞానపధంపై నిలుపు సత్యమైన మాట. వారి ప్రతి మాట ఒక సూక్తే. అందుకే “విశ్వయోగి మాట వినిన ఫలము”. వారి మాటలు వినే అవకాశం, అదృష్టం ఉండి, వాటిని అర్ధం చేసుకోగల సామర్థ్యం ఉన్నవారికి ఆ ఫలం దక్కుతుంది. మరి ఇతరుల మాటేమిటి? అటువంటి వారికి తమ మాటలను చదివి అర్ధం చేసుకునే అవకాశం కల్పించాలని విశ్వయోగులు చి॥ల॥సౌ॥ రత్నమోహినిని ఒక ఉపకరణంగా ఎన్నుకుని 'విశ్వయోగి - విజ్ఞాన సూక్తులు” అన్న ఈ (గ్రంధాన్ని వ్రాయించారు.

యోగులు, అవతారపురుషులు చాలా తక్కువగా మాట్లాడుతారు. రమణ మహర్షి వంటి కొందరు ఎక్కువగా మౌనాన్నే పాటిస్తారు. వారు పలికే పలుకులు నర్మగర్భంగా ఉంటాయి. ఆంగ్లభాషలో ఒక లోకోక్తి ఉన్నది. అదేమంటే, 1376౪10 19 6 జ ౦1 లయు:౭53109" అన్నది. తక్కువ మాటలతో క్లుప్తంగా లోతైన విషయాలను వ్యక్తీకరించడం ఒక కళ. ఆ కళ యోగులకు సహజసిద్ధం. విశ్వయోగులు ఆ కళలో నిష్టాతులు. వారి మాటల అంతరార్థం సులభగ్రాహ్యం కాకపోవచ్చు. అందుకని వారి సూక్తులకు వివరణ తోడైతే సామాన్యులకు అర్ధం కావడం సులభతరమవుతుంది. ఈ వివరణనిచ్చే పాత్రను పోషించడానికి చి॥సౌ॥ రత్నమోహిని అన్ని విధాలా అర్హురాలు కనుకనే ఆమెకా పాత్ర ఇవ్వబడింది. ఆ పాత్రపోషణలో ఆమె పూర్ణంగా కృతకృత్యురాలయిందని ఈ రచనను చదివిన ప్రతి ఒక్కరికి పొడసూపక మానదు.

ఇంతుకు మునుపే, విశ్వయోగి తమ అష్టోత్తర శతనామావళికి “విశ్వ రత్నమాల” అన్నపేరుతో ఒక వ్యాఖ్యానాన్ని చి॥సౌ॥ రత్నమోహినిచే వ్రాయించారు. అది భక్తులకెంతో ఉపయుక్తమైన గ్రంథమే కాక, అదొక పారాయణ (గ్రంధంగా రూపొందింది. ఆ విధమైన వ్యాఖ్యాన గ్రంథం రచించగల ఆమె సామర్హాన్ని గుర్తించి విశ్వయోగులు తమ దివ్య ఆశీస్సులతో ప్రోత్సహించి ఆమెచే ఆ గ్రంధ రచన చేయించారు. ఆ విధంగానే మరొకసారి ఆమెలోని సామర్థ్యాన్ని బహిర్గతం కానిచ్చి “విశ్వయోగి - విజ్ఞాన సూక్తులు అన్న ఈ గ్రంథాన్ని రచింపజేశారు. 'విశ్వరత్నమాల వలెనే, ఈ విజ్ఞాన సూక్తులు” కూడా భక్త మహాశయులకు ఎంతో ఉపయుక్త మవుతుందనడంలో ఎట్టి సందేహమూ లేదు.

౪!

చి।సౌః రత్న మోహిని గ్రంధాన్ని గూర్చిన “పరిచయం”లో (గ్రంధ స్వరూపాన్ని చక్కగా ఆవిష్కరించారు. దీని దృష్ట్యా (గ్రంధం యొక్క “వస్తువును” గురించి ఎక్కువగా చెప్పనవసరం లేదు.

విశ్వయోగిది తేనెలొలుకు పలుకు. మృదుమధురమైనది వారి పలుకు. వారి పలుకుల ఈ స్వాభావికతను ఈ రచన రకరకాలుగా వెల్లడిస్తున్నది. శంకరుల అద్వైత సిద్ధాంతం పండితులకు సహితం కొరుకుడు పడదు. అయితే ఆ సిద్ధాంత సారాన్ని తమదైన ప్రత్యేక రీతిలో, హృద్యంగమంగా, మధుర గాన రూపంలో వ్యక్తం చేశారు విశ్వయోగి. మతాలు వేరైనా, కులాలు వేరైనా, జాతులు వేరైనా దేముడొక్కడే అని అద్వైతాన్ని దివ్యంగా గానం చేశారు విశ్వయోగులు. వారి ఈ గాన సూక్తికి చక్కని వివరణ 'దేముడు ఒక్కడే

  • ఆయన సర్వవ్యాపి” అన్న అధ్యయంలో మనకు కనిపిస్తుంది.

“ఉన్నది ఒక్కటే కులం - అది మానవ కులం” అన్న విశ్వయోగి సూక్తి మానవీయత ముఖ్యమని, మతాలు కాదని చక్కగా బోధిస్తుంది. “మానవులందరూ ఒకటేనని ఎటువంటి భేదభావాలు లేవని దత్తాత్రేయ తత్త్వం చెబుతోంది. అందుచేత ప్రతి వ్యక్తి మనవత్వంతో కూడుకున్న మనిషిగా జీవన గమనాన్ని సాగించాలి గాని కులాలపేరుతో, మతాలపేరుతో ద్వేషం పెంచుకోకూడదు. మానవత్వంతో కూడుకున్న మనిషి ఏ కులమైనా, ఏ మతమైనా సమాజ సేవ కర్టుడే. అందుచే ప్రతి ఒక్కరూ కులాల ప్రస్తావన లేకుండా ఉన్నది ఒక్కటే కులం - అది మానవ కులం అన్న స్థితిలో ఉంటూ తోటి మానవుణ్ణి ప్రేమించి ఐక్యత పెంచుకోవాలన్నదే ఈ సూక్తి సారాంశము” అని రచయిత్రి అర్ధవంతమైన వివరణ చేసారు. ఈ రీతిగానే పలు ఇతర సూక్తులకు రమ్యమైన వివరణ నిస్తూ, తద్వారా విశ్వయోగుల తత్త్వాన్ని విశదంగా విపులీకరించారు రచయిత్రి.

విశ్వయోగి సూక్తులు జ్ఞానముక్తావళులు. వాటిలోని ప్రతి అక్షరమూ జ్ఞానంతో వెలుగొందే ఆణిముత్యమే. చాలామంది గురువులు శాస్త్రఠనం ద్వారా తొమార్దించిన జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెడ్తుంటారు. వారి మాటలలో శాస్త్రజ్ఞానం తొణికిస లాడుతుంటుంది. అయితే ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపులు, స్వయందత్త స్వరూపులైన విశ్వయోగికి జ్ఞాన వారసత్వము సహజ సిద్ధమయినదే. అందువలన శాస్త్రాల ఆలంబన వారికవసరం లేదు. ఆ కారణంగానే వారి సూక్తులలో శాస్త్ర ఉటంకింపులు కానరావు.

సగ

జ్ఞానమే భగవత్స్వరూపమని విశ్వయోగులు తమ నిజతత్త్వాన్ని లోకానికి వెల్లడించినట్లు మనం (గ్రహించవచ్చు. విశ్వమంతా నిండియున్న శక్తి ప్రతివ్యక్తిలోని ఆత్మశక్తి వేరుకాదన్న అద్వైత భావనే జ్ఞానం. ఆ జ్ఞానమే భగవంతుడు. ఈ విషయాన్ని తరచుగా తమ ప్రసంగాలలో విశ్వయోగి తరచి తరచి చెప్పంటారు. యోగత్వమనగా విశ్వశక్తితో ఆత్మశక్తి సంవిలీనం కావడమేనని వారు బోధిస్తుంటారు. ఈ విషయాలను రచయిత్రి చక్కగా వివరించారు. “జ్ఞానమే భగవత్స్వరూపం” అన్న అధ్యాయంలో.

ఈ (గ్రంథం సర్వులూ చదువదగినది, చదివి మననం చేసుకోవలసినట్టిది. అర్ధం చేసుకొని, విశ్వయోగి తత్త్వాన్ని ఆకళింపు చేసుకొని వారు నిర్దేశించిన లక్ష్యాన్ని తమ లక్ష్యంగా చేసుకొని దాని సాధనకు కృషి సల్పునట్లు పారకులకు ్రేరణనిచ్చే సద్ధంధమిది. సత్యం, శీలం, పవిత్రత, సమైక్యత అన్నవి వ్యక్తి వికాసానికి తద్వారా కుటుంబ వికాసానికి, ఆ మీదట సమాజ శ్రేయస్సుకు, విశ్వకళ్యాణానికి దోహదం చేసే సనాతన ధర్మ సూత్రాలు. ఇవి “విశ్వయోగి - విజ్ఞాన సూక్తులూలో పుష్మళంగా ప్రతిబింబిస్తున్నాయి. ఇట్టి (గ్రంధాన్ని తమ దివ్య ఆశీస్సులతో చి॥సౌ॥ రత్న మోహినిచే వ్రాయించి ఆమెను ధన్యురాలిని చేశారు దత్తస్వరూపులైన విశ్వయోగి.

తన రచనల ద్వారా భక్త పారకలోకానికి ఎనలేని సేవ చేస్తున్న ధన్యురాలు, విశ్వయోగుల కృపాపాత్రురాలు అయిన చి॥సౌ॥ రత్న మోహినికి భగవాన్‌ తీతీత్రీ విశ్వయోగి విశ్వంజీ మహరాజ్‌వారు ఆయురారోగ్య సౌభాగ్యాలను ప్రసాదించి, ఆమెను ఆమె కుటుంబ సభ్యులనందరిని రక్షించుగాక!

విశ్వయోగులకు వినమప్రణామ సహస్రాలు. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త!!! విశ్వయోగి సేవలో తరించాలనే కాంక్షించే ఫెమ్మరాజు రామగోపాలరావ్య (౧2౫. &ఉ ౦) ౫

దారిబీపం - బీపపు దారి

కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిశేత్‌ శతం సమాః |

ఏవం త్వయి నాన్యధేతః అస్తి న కర్మ విష్వతేనం ॥

మంచి పనులు చేస్తూ, ఈ మనుష్యలోకంలో నూరేళ్ళు బ్రతకాలని మనం కోరుకోవాలి. సత్మర్శ్మల వలన కర్మమాలిన్యం మనలను అంటదు.

మన జీవితానికి అర్థమూ, పరమార్ధమూ ఉన్నదని అర్ధమౌతున్నది. అంతేగాక నూరేళ్ళు బ్రతకాలని కోరుకోవడం వెనుక, ఆనందంగా, ఆరోగ్యంగా, శాంతిగా నూరేళ్ళు జీవించకపోతే ఆ జీవితానికి అర్ధం లేదు. మంచి పనుల వలననే ఆనందాది స్థితులు కలుగుతయ్‌. మంచి పనులు ఎంతగా చేస్తున్నా మనిషి స్వభావసిద్ధంగా ప్రకృతి ప్రభావానికి లోనౌతాడు. ప్రభావం నుండి స్వభావంలోకి మారటమే అధ్యాత్మ! ఈ మారే ప్రయత్నమే అధ్యాత్మ సాధన. అటువంటి సాధన నిరాటంకంగా సాగాలంటే, మనసు- మాట - కర్మ ఏకత్వం సాధించాలి. ఈ మూడింటి మధ్య ఐక్యత లోపించినట్టెతే, సాధన అసంపూర్ణమౌతుంది. మాట, ఆలోచనలనుండి, ఆలోచన సంస్మారంలోనుండీ, సంస్కారం వాసనలలో నుండి, వాసనలు జన్మల నుండి, జన్మలు కర్మల నుండీ, కర్మలు జన్మల నుండీ ......ఈ విధంగా పరస్పరాంగికంగా పుట్టినవే. మాట పుట్టుక, దాని పరిణామం ఎంత లోతైనదో, విస్తృతమైనదో అర్ధమౌతున్నది. మాట, ఆలోచన, ఆచరణ ఎంత విడదీయరానివో తెలుస్తున్నది. సాధన విధానంలో ముందుగా “మాటి ఎంత దివ్యంగా ఉండాలో అవగతమౌతున్నది.

మనసులో పుట్టే ఆలోచనలన్నీ భావవ్యక్తీకరణ వేళ *మాటిగా మారితే, ఆ మాటలకున్న అర్ధం పరిమితమే! మాట ఆ క్షణంలో పుట్టింది, మెట్టింది వెంటనే గిట్టింది. నిలబడినదెక్కడ? ఆ రకమైన మాటలన్నీ సముద్రంమీద, పైపై తేలే గవ్వలు, ముత్యాలన్నీ సముద్రం అట్టడుగులోనే వుంటాయి. అనుభవరససిద్ధులు, ఆ ముత్యాలను ఏరి, మానవాభ్యున్నతికి వైతన్యసాధనాలుగా, హెచ్చరికలుగా సాధకుడికి, అందుబాటులోకి తెస్తారు! బోధకుడి మాటలన్నీ విశ్వజనీనంగా వుంటయ్‌. నిగూఢంగా వుంటయ్‌. సరళంగా

న!

వుంటయ్‌. అందువల్ల వారి నోటినుండి వెలువడే మాటలు, మంచి మాటలుగా వుంటయ్‌. అంటే ఉక్తులు, సూక్తులౌతయి. ఆ సూక్తులన్నీ పైపైన విజ్ఞానాన్ని, లోలోన ప్రజ్ఞానాన్ని ప్రసాదిస్తయ్‌. సూక్తులన్నీ నిత్య జీవితానికి అనుసంధానమై ఉంటయ్‌. బోధగా, ప్రబోధంగా, ప్రకాశమానంగా, పరిశీలనాత్మకంగా, ఆచరణాత్మకంగా గోచరించే సూక్తులు, ఎల్లవేళలా దివ్యౌషధాలు.

మనో, దేహ శక్తులు క్షీణించి, లోపించి యింద్రియ నిగ్రహంలేని వ్యక్తుల వలన, ఆధ్యాత్మిక శాస్త్రం పలచనౌతున్నది. సంకల్పబలం, సౌశీల్యం లోపించినట్లయితే ఆధ్యాత్మ శిఖరాలనధిరోహించేదెలా? ఆ దశలో, ఆ దిశలో ఈ సూక్తులు బెషధగుళికలు. కంరాన ధరించిన ముత్యాల దండలు తదితర రత్నమాలికలు.

సమకాలీన వ్యవస్థ, సమాజం అన్నివిధాల మార్పు చెందుతున్న ఈ విషాద సంధ్యా సమయంలో, శ్రీ విశ్వయోగి విశ్వంజీ, కుటంబ వ్యవస్థను సరిదిద్దుతున్న తీరు, మహదానందదాయకం! ఈ విన్యాసంలోంచి, అడపాదడపా కురిసిన వడగళ్ళ వాన ఈ సూక్తి వర్షం! ఆ వడగళ్ళను ఒడిసిపట్టి, ఒడిని నిలబెట్టి, ఆ ఘనీభూత కరుణార్ధ మహా పరిసత్యాలను తనదైన రీతిలో వ్యాఖ్యానించిన శ్రీమతి రత్న మోహిని ధన్య!

గురు వాక్య మననం,

గురు వాక్య అధ్యయనం,

గురు వాక్య వ్యాఖ్యాబద్ధం. ఆమె సాధించిన సాధనాస్టితి, గురు సేవలో ఆరోగ్యం, ఆయుష్ను ఆనందం లభించటం తధ్యం. శ్రీ, గురుస్వరూపి, విశ్వంజీ ఆమెను గొడుగై కాచుగాక!

మహనీయుల సూక్తులు దారి దీపాలు!

అర్ధంలో మునిగితే అవి దీపపు దారులు!!

సర్వేజనా సుఖినోభవంతు!!! ౫11

మరమేశ్వరునకు పరిమళం హితాహితమ్ములకు తాము అతీతమైనను, లోక కల్యాణార్థమై కొన్ని హితోక్తులను, ఛలోక్తులతో జోడించి చెప్తూ ఉంటారు, మహాపురుషులు, మహితాత్ములు. ఇద్ధరి నుద్ధరింప వచ్చిన దత్తావతారులు శ్రీ, విశ్వంజీగారు. అందరితో కలిసిపోతారు, కాని అంతు చిక్కరు. అందరి సమస్యలు అత్యంత (శ్రద్ధతో ఆలకించి పరిష్కారములను సూచిస్తూ వస్తారు. ఇన్పేన్స వచ్చిందే మికోసం, నిస్సంకోచంగా నన్ను చేరండి, సమస్య ఏదైనా పరిష్కారం నా దగ్గర ఉంది” అంటారు దత్తగురువులు, అభయదాతలు. అప్పుడప్పుడు వారు ప్రసంగాలలో కొన్ని సూక్తులను ఉదహరించటం, మనందరికి అనుభవైక వేద్యమే. ఉదాహరణకి * కృతజ్ఞత అన్నది మానవుని ప్రధమ లక్షణం “పేమ అన్నింటిని సిద్ధింప చేస్తుంది”, “ఆచరణలోపమే అన్ని అరిష్టాలకు మూలం”. సూక్తులు చాలా సులభంగా ఉంటాయి, అనుకుంటాము. కాని శోధించిన కొద్దీ వాటిలో అంతులేని సిరులు, అమృతర్వురులు ఎన్నో దాగి వుంటాయి. అందుకే మహా పురుషుల సూక్తులను వేదవాక్కులతో పోలుస్తారు. ఆత్మాన్వేషణలో, ఆధ్యాత్మిక సాధనలో ఆనంద లహరులలో, శ్రీహరి చరణాలను, చేర్చేదే మహాపురుషుల సూక్తులు. శ్రీ దత్తగురువుల కృపనందిన అమృతరసవాహిని ర్సురియే రత్నమోహిని. వారికి సంక్రాంతి నాడు కలిగిన స్ఫూర్తి, భావప్రాప్తియే, ఈ సరికొత్త రచనకు నాంది. సూక్తుల సమాహారము మిరు ఎక్కడైనా కాంచవచ్చు. కాని, సూక్తులలోని అంతరార్థాన్ని, శోధించి పరిశోధించి, తపనతో తపస్సు నాచరించి, గురుపాద స్పర్శతో పునీతులై, పులకాంకితయై వ్యాఖ్యాన పూర్వకముగా మనముందుంచిన ఈ సూక్తి ముక్తమే, సత్య వ్యక్తము, భావయుక్తము, శారదామతల్లికి తానిచ్చు నీరద నీహారము. కొన్ని సూక్తులకైతే ఎంత వ్రాసినా, దరిచేరవు. భావప్రదీప్తి ప్రజ్బరిల్లిన కొద్దీ, మనపై కురిసేది అమృతవృష్టియే. భావపరిపుష్టి కల్గిన సాహితీ రత్నమే రత్నమోహిని, విశ్వాత్మ కంకితమైన విశ్వమోహిని. వారికి విశ్వవంద్యుని ఆశీస్సులెప్పటికీ ఉంటాయి. శ్రీకరమ్మగు దత్త పదముల చేరి శ్రీల నందిన రత్న సూర్యరత్న | సూక్తులన్ని చేర్చి సూటత్రమ్ముగా మార్చి సుప్రసిద్ధమయ్యె, సుదతిరత్న !॥ శుభం భూయాత్‌ ఆశీః ॥

  • ఆచార్య జ.లస్‌.లస్‌, మూర్తి గ!

నామాట

శ్రీ విశ్వయోగి - విజ్ఞాన సూక్తులు, స్వామి (ప్రేరణతో విశ్వ సంకల్పంతో వెలువడినది. నాకు పునర్జన్మను ప్రసాదించి తిరిగి నన్ను ఒక ఉపకరణంగా చేసి నా చేత ఈ (గ్రంధ రచన చేయించారు విశ్వయోగి. చిన్న చిన్న వాక్యాలుగా కన్పించే ఈ సూక్తులలో నిక్షిప్తమయి ఉన్న లోతైన, గంభీరమైన అర్ధాన్ని అంతరార్జాన్ని నాకున్న స్వల్ప పరిజ్ఞానంతో గ్రహించడానికనుగుణంగా శ్రీ విశ్వంజీ ఆల్ఫా తెలుగు టి.వి. కి అనుగ్రహించిన దివ్యోపన్యాసాలు ఉపకరించినవి. వారు అనేకానెక యోగ రహస్యానికి సంబంధించిన విషయాలు, విశేషాలు వెల్లడిస్తే సుంత మాత్రమే నేను గ్రహించి సందర్భవశాత్తు తమ దివ్యవాణిని, సత్యసాయి దివ్యవాణిని జోడించి పొందుపరచగలిగి నందులకు శ్రీ, విశ్వంజీ మహరాజ్‌ వారి పాద పద్మములకు నమస్కరిస్తూ ప్రప్రధమంగా కృతజ్ఞతలు తెల్చుకుంటున్నాను. సాయివాణి, విశ్వవాణిల సంకలనమే ఈ (గ్రంథమని మనవిచేసుకుంటున్నాను.

స్వామి అమెరికా పర్యటన ముగించుకొని ప్రప్రధమంగా హైదరాబాదు వచ్చినప్పుడు ఏమైనా వ్రాశావా? అని ప్రశ్నించారు. నా స్వానుభవం, నేను బెడ్‌మీద ఉండగానే అడప, దడపా, నా అనుభూతులు వ్రాసుకున్నాను తప్ప ఏమి వ్రాయలేదని మనవి చేసుకున్నాను. “ఏమి వ్రాయాలో వారే చెబుతారులే' అనుకొంటూ కొంత కాలయాపన చేయడం జరిగింది. వారి (ప్రేరణతో విశ్వసూక్తుల్ని గురించి వ్రాయాలన్న ఆలోచన రాగానే పరిచయ వాక్యాలు వ్రాసి చూబిస్తే వారు ఆశీర్వదించి శ్రీకారము చుట్టినారు. ఆవిధంగా నాచేత 21 సూక్తులకు వివరణ వ్రాయించినారు. ఎప్పటి వలెనే నా ఈ రచనకు ప్రోత్సహించి, నేను వ్రాసిన వన్ని శ్రద్ధగా చూసి సూచనలిస్తూ సకాలంలో నాకు అందజేసిన ఆచార్య జి.యస్‌.యస్‌. మూర్తి గారికి కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాను. “ప్పగ్రమేశ్వరునకు పరిమళం” అన్న శీర్షికన పరిచయ వాక్యాలు వ్రాసి ఇచ్చిన మూర్తి గారు శ్రీ విశ్వంజీని పరోక్షంగా భక్తి భావంతో ఆరాధిస్తూ అనేక అనుభూతులు పొందుతున్న ధన్యజీవి.

అధ్యాత్మలో ఉన్నత శిఖరాల నధిరోహించి, ఆంధ్ర దేశమంతటా ఈనాడు ప్రతిరోజు ఏదో ఒక ప్రదేశంలో సాయి సందేశాన్ని వినిపించడంతోబాటు రమణమహర్షి చరిత్ర, ఉపదేశసారం, శంకరుల అద్వైతం - యోగ వాశిష్టం ఇత్యాదిగా అనేకానేక అంశాలు “సత్సంగం” జరుపుతు సత్యసాయి కృపకు, సద్గురువు లందరి కృపకు పాత్రులైన విశిష్ట వ్యక్తి శ్రీ వియస్‌.ఆర్‌. మూర్తిగారు. వారి అమూల్యమైన కాలాన్ని వెచ్చించి నా సందేహాలకు తగిన సమాధానమిస్తూ చర్చ కొనసాగించడంతోబాటు “దేవుడు కలడో లేడో ! గురువు మాత్రం ఉన్నాడు” అన్న సూక్తికి “గౌరవత్వాత్‌ గురుొ అన్న శీర్షికన వివరించినారు. అన్ని సూక్తుల కంటే భిన్నంగా, పాఠకులకు వారి వివరణ ఆసక్తికరంగా ఉంటుందనడం

10

అతిశయోక్తి కాదు. “దారిదీపం - దీపపు దారి” అంటూ సర్వాంగ సుందరంగా తమముందు మాటను సకాలంలో నాకు అందజేసిన మూర్తిగారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు సమర్పించుకొంటున్నాను.

శ్రీ పి.ఆర్‌. రావు గారు, ఈ రచనకు ప్రోత్సహించి కొన్ని సూచనలు చేయడంతోబాటు “హితోక్తి అన్న తమ పరిచయ వాక్యాలలో స్వామి సూక్తుల్ని సూచన ప్రాయంగా వివరిస్తూ స్వామి తత్త్వాన్ని చక్కగా ఆవిష్కరించినారు. వారికి నా కృతజ్ఞతలు. స్వామి ఆదేశం మేరకు అనేక (గ్రంధాలు తెలుగులోనికి అనువదించి వారి కృపకు పాత్రులైనారు. “విశ్వయోగి వాక్కు వేదవాక్కు అన్న విశ్వాసంతో, భక్తి (ద్ధలతో అంకితభావంతో సేవ చేస్తున్న ధన్యజీవి. స్వామికి తృప్తిని కలిగించే ఏ పనైనా తమ ద్వారా జరగాలన్నప్టుడు కష్టాన్ని ్రమని లెక్క చేయకుండా ఆ పని సాధించడంలోనే వారు ఆనందాన్ని పొందుతారు. ఇది వారి భక్తి తత్పరతకు, సేవాభావానికి నిదర్శనము.

మా గురుదేవులు ఆచార్య యం. కులశేఖర్రావుగారు ఈ రచనకు నన్ను ప్రోత్సహించి ఆశీర్వదించినారు. వారికి నా నమోవాకములు.

నా రచనలన్నింటిని సకాలంలో సర్వాంగ సుందరంగా ముద్రించి, అవసరమను కున్నప్పుడు స్వామిపట్ల భక్తి భావంతో మాకోసం ఆదివారం కూడ పనిచేసి సమయాభావం లేకుండా అందించిన శ్రీ కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ వారికి నా ధన్యవాదాలు తెల్పుకుంటున్నాను.

అన్ని విధాలా ఈ రచనకు నాకు చేదోడు వాదోడుగా ఉంటూ సహాయ సహకారము లందించిన నా భర్తగారికి సదా కృతజ్ఞురాలిని.

అమెరికాలో నివసిస్తున్న మా అబ్బాయి చి! శ్రీనివాస్‌ కౌశల్‌ కోడలు రమా కళ్యాణి; స్వామి కృపకు పాత్రులు కావాలని అర్ధిస్తూ...

వి. రత్నమోపొని 2

ర.

ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్త విశ్వనూక్తులు - అరిచయము

సు + ఉక్తి = సూక్తి సూక్తులు - అనగా మంచి మాటలు. భగవంతుడు అనాదికాలం నుంచి వివిధ రూపాలలో దేశ, కాల, మాన, పరిస్థితుల కనుగుణంగా, ఆవిర్భవించినప్పుడు, మానవాళిని అనేక విధములైన పద్ధతుల్లో తీర్చిదిద్దుట పరిపాటి. కుల, మత, వర్ణ, వర్గ, విచక్షత లేకుండా, ఏ అవతార మూర్తులైనా, ఏమత ్రవక్తలైనా, యోగులు సిద్ధ పురుషులైనా, మానవాళిని శ్రేయోమార్గం వైపు పయనింపజేయడానికి, దివ్యవాణిగా తమ నోటితో పలికి దివ్యమైన అమృతవాణి (సువాక్కులు) మన కందించినారు. భగవద్గీత, బైబిల్‌ ఖురాన్‌, గురుగ్రంధ సాహెబ్‌ మున్నగు గ్రంథ రాజములన్నీ అటువంటి సువాక్కులతో నిండి యున్నవే. చిన్న చిన్న పదములతో తేలికైన భాషలో పండిత పామరులందరకు సులభంగా అర్ధమయ్యే రీతిలో ఈ సూక్తులు ఏర్చి కూర్చబడుట విశేషము. ఆ చిన్న వాక్యములో గంభీరమైన లోతైన అర్ధము, అనేక విషయముల సారాంశము చెప్పబడినది. సువిశాలమైన భావం, గంభీరమైన అర్ధంతో కూడుకున్న ఇటువంటి సూక్తులు వల్లె వేయడంతో బాటు, అర్భాన్ని అంతరార్థాన్ని గ్రహించి ఆచరించిన నాడు సమాజ నిర్మాణం జరుగ గలదనుట అతిశయోక్తి కాదు.

చరిత్ర పరంగా ఆలోచిస్తే సంస్కృతంలో, నీతి శాస్త్రమున్నట్లు తెలియుచున్నది. దీనికర్త ఎవరో స్పష్టముగా తెలియదు. చాణుక్యుడు వ్రాసినట్లు ప్రసిద్ధి. “మౌనేని కలహం నాస్తి బ్రాహ్మణోనహంతవ్యః[ “యత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర తిస్టతి దేవతాః” “స్త్రీలు మాతృమూర్తులుగా గౌరవించబడే సంఘములో దేవతలు తలుపు తదతారు. స్రీలు అవమానింపబడే సమాజంలో రాక్షసులు సంచరిస్తుంటారు” వంటి సూక్తులు అక్కడ కన్చించుచున్నవి. నేడు శ్రీ విశ్వంజీ సందర్భవశాత్తు తమ దివ్యోపన్యాసములలోను, ఇష్టాగోష్టి సందర్భంగాను ఇటువంటి సూక్తులు పదే పదే మనకు బోధించుచున్నారు.

కాళిదాసు వంటి మహాకవులు కూడా తమ కావ్యాల్లో నీతి వాక్యాలు వ్రాసి యున్నారు. “శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం” వంటివి. వాల్మీకి మహాకవి రామాయణంలో

2 ఏకపత్నీ వ్రతాన్ని గురుచి చాలా సూక్తులు వివరించినాడు. వ్యాస మహాకవి భారతంలో, ముఖ్యంగా భగవద్దీతలో సమాజానికి పనికి వచ్చే మంచి మాటలు వ్రాసినాడు. “నహి జ్ఞానేన సదృశం” వంటి వాక్యాలు భగవద్గీతలో కన్పించుచున్నవి. ఇంకా అనేకానేక మంది కవులు కావ్యాలలో నీతి వాక్యములు చెప్పినారు. బద్దెన కవి “నీతి శాస్త్రముక్తావళి” అనే (గ్రంథాన్ని వ్రాసినట్లు తెలియుచున్నది. అలనాడు సుప్రసిద్ధ శతకకారుడైన వేమనయోగి చిన్న చిన్న పద్యముల కూర్చ్పుతో నిత్య జీవితములో ప్రతిదినము పరించి విశేషమైన అర్జాన్ని గ్రహించేలా సమాజానికి అందించిన చిరుపొత్తము విశ్వవ్యాప్తమై నేటికిని చిన్నారి బాలబాలికలు మొదలు వృద్ధుల వరకు అందరు పఠించి తరించే విధంగా అందించినారు. ఆ దివ్యమైన వాక్కుల కూర్పు సమాజానికి ఎంతో మేలు చేసినది. మచ్చునకొకటి రెండు తల్లిదండ్రిమీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రులపై (ప్రేమలేని కుమారుడు పుట్టినను చచ్చినను ఒకటే. పుట్టలలో పుట్టి ఎవరికి ఉపయోగము లేక ఆ పుట్టలోనే చచ్చెడు చెద పురుగుల వలె తల్లిదండ్రులపై (ప్రేమలేని కుమారుని జన్మము వ్యర్థము. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల? ఖాండశుద్ధి లేని పాకమేల? చిత్త శుద్ధి లేని శివపూజలేలరా? విశ్వదాభిరామ వినురవేమ. ఆత్మశుద్ధి లేని ఆచారము, పాత్రలు శుభ్రముగా లేని వంటకములు, చిత్తశుద్ధిలేని దేవతారాధనము నిష్ప్రయోజనములని భావము. 'పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ” బుష్పజాతి వేరు పూజ యొకటి

3 దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా విశ్వదాభిరామ వినురవేమ ఆవుల రంగులు వేలు వేజ్రైనప్పటికినీ, పాలరంగు మాత్రము ఒక్కటే ఉండును. పువ్వుల రకములు, రంగులు వేలు వేలుగా యున్ననూ, పూజ ఒక్కటియే యగును. అట్లే దేవుళ్ళ పేర్లు వేరైనప్పటికినీ దేంవుడొక్కడే యని గ్రహించుము” అని భావము. చర్చీలో, మసీదులో, గుడిలో నున్న దేంవుడొక్కడేయని, రూపములు వేరైనా, నామములు వేరైనా శక్తి ఒక్కటేనని, శ్రీ విశ్వంజీ సెలవిచ్చెదరు. భగవాన్‌ సత్యసాయి కూడా ఏ రూపమును ఆరాధించినా, పూజించినా తమకు సమ్మతమే నంటారు. రూపములు వేరు నామములు వేరు - కాని భగవంతుడొక్కడే. అతడు సర్వాంతర్యామి అంటారు. పశువుల రంగులు వేరైనా పాలు ఒక్కటే - శృంగారములు వేరైనా బంగారమొక్కటే అని చెప్పంటారు. మహనీయులందరు వచించే సూక్తులన్ని ఇంచు మించు అనాది కాలం నుంచి ఈ కలి యుగం వరకు ఒకే అర్ధాన్ని ఇచ్చేవిగా దర్శనమిచ్చుచున్నవి. సుమతీశతకం కూడా అనేకమైన చక్కని సూక్తులతో నిండి యున్నది. మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణము సుభటకోటి ధరిత్రిన్‌ బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణము వ్రాలు సిద్ధము సుమతీ

ఓ మంచి బుద్ధి గలవాడా! మాటకు సత్యమే ప్రాణము. ఈ ప్రపంచమున కోటకు ప్రాణము వీరులైన సైనికులే అగుదురు. స్త్రీకి శీలమే ప్రాణము. అట్లే చీటికి సంతకమే ప్రాణము. అనగా సంతకం లేని చీటి వ్యర్ధము.

“అపకారికి నుపకారము నెపమెన్నగ చేయువాడు నేర్పరి సుమతీ!” “నమ్మకు మంగడి వానిని” వంటి అనేకానేక సూక్తులు చెప్పబడినవి. భాస్కర శతకము, దాశరధీ శతకము కూడ నిట్టివే. ఇవేకాదు, అనాది కాలం నుంచీ శతక సంపుటాలను పరిశీలించి చూస్తే అలతి అలతి పదాలతో కూర్చబడిన సూక్తులనేకం దర్శనమిస్తాయి.

శీ

శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానందుడు అవతార కార్యక్రమంలో భాగంగా విశేషమైన సూక్తులను విశ్వమున కంద జేసినారు. “విజ్ఞానము ఐక్యతకు దారితీయును. అజ్ఞానము భిన్నత్వమునకు దారితీయును” (”1ష౦ం౪/16626 16263 (60 ౪౧10; 12012006 10 ౨1౪7ల.) అంటారు రామకృష్ణ పరమహంస. “సత్యం, శీలం, పవిత్రత, ఐక్యత, దైవత్వానికి మూలస్థంభాలు” అంటారు విశ్వంజీ. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాలని మహనీయుల ఉవాచ, “భగవంతునికి మనము ఏమీ ఇవ్వలేము. కాని భగవంతుడు మనకు సమస్తము ఇచ్చుచున్నాడు” అన్నారు విశ్వంజీ. (1/6 020 ౬176 0011082 60 6౦6) 6 81౪7ట 211 10 ౪8.”

భగవంతుడు లేదా గురువు మనకు సమస్తము ప్రసాదించు చున్నాడు. ఒక పనిముట్టు వలె మనల్ని ఉపయోగించి చేయవలసినదంతా తాను చేసి ఖ్యాతిని మాత్రము శిష్యున

కిచ్చుచున్నారు. ఏమి ఆశించక, ఆశీఃవర్నం కురిపిస్తాడు గురువు. శ్రీ కృష్ణ పరమాత్మ అలనాడు అర్జునునకు చేసినదంతా ఇట్టిదే.

కలియుగ అవతారమూర్తి యైన భగవాన్‌ శ్రీ సత్యసాయి బాబా వారు అనేకానేక సూక్తులు లయబద్ధముగా యతిప్రాసలతో ఏర్చి కూర్చి చమత్మరించి తమ దివ్యోపన్యా సములలో సెలవిచ్చుచున్నారు.

"లేం అల మయం! 11ల/ల' ఉపకారం (సహాయం) చేయి. అపకారము చేయకు. ఎవర్ని ద్వేషించవద్దు. _ఎవర్ని ద్వేషించినా, దూషించినా భగవంతుడికే చేరుతుంది. “సర్వదేవ నమస్మారః కేశవం ప్రతిగచ్ళతి” - “సర్వదేవ తిరస్కారం 'కేశవం ప్రతిగచ్చతి”. ఎవరిని బాధించినా కేశవునికే చేరును. అందరిలో భగవంతుణ్ణి చూడు. అన్నినా రూపానికి ప్రతిబింబాలే” నంటారు సత్యసాయి. చెట్టు పుట్ట రాయి రప్ప అన్నింటి యందు సూక్ష్మ రూపంలో నేనున్నాను సర్వంలో సాయిని సాయిలో సర్వాన్ని దర్శించండి”. ఇటీవల శ్రీ విశ్వంజీ అమెరికా పర్యటన సందర్భంలో ఆ దేశంలో, వారిని భారతదేశంలో చెట్లకి పుట్లకి రాళ్ళకి రప్పలకి ఎందుకు పూజలు చేస్తారని ప్రశ్నించినారట. స్వామి ఈ విధంగా చెప్పినట్లు సెలవిచ్చినారు. “ప్రకృతిలో కూడా దేంవుడున్నాడు అని నమ్మి ఆ

క్‌ భగవంతుణ్ణి ఆయా రాళ్ళలో, చెట్లల్లో చూస్తారు. ప్రకృతిలోనున్న చెట్లు పరోక్షంగా మానవులకు ఎంతో ఉపకారం చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యం లేకుండా కాపాడుతున్నాయి. అందుచేత భారతీయులు వాటిని పూజిస్తారు. భగవంతుని శక్తి సర్వత్రా సమస్త జీవుల్లోను వ్యాపించి యున్నది. ఇది సనాతన ధర్మం చెప్పిన విషయము. 1.076 21 5/6 21 “అందర్ని ప్రేమించు అందర్ని సేవించు” అంటారు బాబా. శ్రీ విశ్వంజీ కూడా (ప్రేమను పెంచి పంచు అని తమ దివ్యోపన్యాసానంతరం పాడుతుంటారు. భగవంతుణ్ణి చేరుకోవడానికి అత్యుత్తమ సాధనం (ప్రేమ. గంభీరమైన, విశాలమైన భావంతో కూడుకున్న సూక్తులనేకం సందర్భవశాత్తు త్రీ విశ్వంజీ 'సెలవిస్తూ ఉంటారు. భౌతిక జీవితంలో, వ్యక్తి సంస్కరింపబడడానికి సమాజ సంస్కరణకు, ప్రశాంతతకు, ఆధ్యాత్మలో ఉన్నత స్థాయికి చేరడానికి వారు చెప్పే సూక్తులు కేవలం పరించడమే కాకుండా, ఆచరణలో పెట్టినప్పుడు మానవత్వం గల మనిషిగా మహా మనిషిగా మారి శక్తివంతులౌతారనడం అతిశయోక్తి కాదు. అట్టి సూక్తులలో కొన్నింటిని భగవాన్‌ శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ వారి దివ్యవాణిగా వెలువడిన వాటికి వివరణ క్రమముగా పరిశీలింతము.

6 గణపతి ప్రార్ధన ఓం గం గం గం గం గణనాధా విఘ్న వినాశక గణనాథా విద్యాదాయక గణనాథా సిద్ధి ప్రదాయక గణనాథా విద్యా సిద్ధి బుద్ధి ప్రదాయక విజయగణేశా వినాయకా 1గం॥ వక్రతుందమహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేన ఓం గం గణపతయే ననుః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఈ విధంగా ఓంకారంతో ప్రారంభించి ఆది పూజ్యదేవుండైన గణపతిని స్తుతించ్చి గురువును ప్రార్ధించి, భగవంతుని యొక్క ఉనికిని చెప్తూ విశ్వ విభులమైత్రి శా శ్వతమయి నదని వివరిస్తూ శ్రీ విశ్వంజీ తమ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తారు. ఓంకారమనగా ప్రణవము. ప్రణవ స్వరూపుడు భగవంతుడు. ఓంకారము ఆది శబ్బముగా చెప్పబడినది బుతంచ, సత్యంచ, మీధ్యాతు తప సోధ్యాయు అజాయత తతోరాయు:ః అజాయత తతః సముద్రో అర్జవః ఓంకార బీజము నుండి సత్యము, తపస్సు, ఆయువు, సముద్రములు అరవములు ణ గొప్ప 'మహత్తత్వము'చే జన్మించెనని భావము. (శ్రీసత్యసాయి ఎడ్యుకేర్‌ - శ్రీ యన్‌. బి. యస్‌. రామారావు )

౮

“గం గణపతికి బీజాక్షరము. బుద్ధికి, విజ్ఞానమునకు అధిపతియైనవాడే గణపతి. సర్వగణములకు నాధుడైనవాడు కనుక ఇతనిని “గణనాధుడు అని కూడా అన్నారు. ఇతనికి నాయకుడెవ్వరూ లేరు కనుకనే ఇతనిని “వినాయకుడు” అన్నారు అని భగవాన్‌ సత్యసాయి తమ దివ్యోపన్యాసంలో పేర్కొన్నారు (9-9-94). శ్రీ విశ్వంజీ కుండలినీ శక్తి స్వరూపుడైన గణపతిని “శ్రీ వరసిద్ధి వినాయకుడు” గా విశ్వనగర్‌లో ద్వారానికి ప్రక్శనే ప్రతిష్ట చేసినారు. గణపతిని ఆరాధించి కొబ్బరికాయలు కొట్టి అందరి చేత కొట్టించి విశ్వనగర్‌లో యజ్ఞ యాగాదుల వంటి కార్యక్రమములు ప్రారంభిస్తారు విశ్వంజీ. గుంటూరు పట్టణంలో కృష్ణనగర్‌లో నున్న విశ్వమందిరంలో (శ్రీనిలయం,; శ్రీమతి & శ్రీ ఆకుల కోటేశ్వరరావు గారి స్వగ్భహము) ప్రతి నిత్యము గణపతికి కొబ్బరి కాయ కొట్టి భక్తుల దర్భ్శనార్ధము స్వామి ఆశీనులగుట మనము చూచుచున్నదే. ప్రత్యేకమయిన సందర్భములలో, వచ్చిన భక్తుల చేత గణపతికి కొబ్బరికాయ కొట్టి రమ్మని స్వామి ఆదేశిస్తూంటారు. స్వామి సందర్భానుగుణంగా తనంతట తాను కొబ్బరికాయలు కొట్టి అక్షింతలు చుట్టూ విసరుతూ దుష్టశక్తుల్ని తరిమి కొడుతుంటారు. వారికి మాత్రమే గోచరించు ఆ శక్తుల్ని ఆ సమయానికి తగ్గట్లు శాంతింప జేసి బయటకు పంపిస్తుంటారు.

ప్రతి నిత్యము పాదుకలకు పూజ చేసినప్పుడు విశ్చ్వమందిరంలో ప్రప్రధమంగా నియమ నిష్టలతో లక్ష్మీగణపతి పూజ నిర్వహింపబడుతుంది. ఇది కాకుండా స్వామి ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు ఈ పూజ చేయడం మనము చూస్తాము. కొందరు భక్తులు స్వామి అనుమతితో వారికి స్వయంగా పాదపూజ చేసుకోవాలని భావిస్తే “శ్రీ విశ్వంజీ అష్టోత్తర శతనామావళి పూజ” కు ముందుగా లక్ష్మిగణపతి పూజ విధిగా జరిపిస్తారు. ఈ లక్ష్మీగణపతి ఎవరు? అన్న దానికి స్వామి తమ దివ్య ప్రసంగములో ఈ విధంగా సెలవిచ్చినారు.

“గణపతి ఆది పరాశక్తి యొక్క దివ్యమైన సంకల్పంతో ఆవిర్భవించినటువంటి అవతారము. సృష్టికర్త యైన బ్రహ్మ యొక్క సృష్టితో అమ్మ యొక్కదివ్యమైన సంకల్పంతో ఆ విశ్వజనని యొక్క గర్భము నుంచి ఏ విధముగా విశ్వము ఆవిర్భవించినదో, దివ్యమైన

8

సంకల్పంతో కోటి బిలియన్స్‌ న్యూక్షియర్‌ వెపన్స్‌ విస్ఫోటనమయినప్పుడు ఫలితంగా అనంతమైన విశ్వము ఏర్పడినదో, అలాగే గణపతి ఆవిర్భావం జరిగింది. ఆ విధంగా అమ్మ యొక్క దివ్యమైనటువంటి సంకల్పంతో దివ్యమైనటువంటి (౮01౪ల౫21 2ం*ంం విశ్వశక్తి ఆవిర్భవించింది గనుక దానికి మరణం సంభవిస్తుందా? అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ సంభవించదు. ఇది ఒక రూప కల్పన మాత్రమే. రూపకల్పన జరగడానికి నాందిగా జరిగినటు వంటి ప్రక్రియ.

చిన్నబాలుడుకి తలకాయ నరకడం దేనికి? నరికినప్పటికి ఆ తలకాయనే తిరిగి పెట్టకుండా వనుగు తలకాయను అతికించడమేమిటి? అని అమెరికాలో (స్వామీజీని) ఒకమ్మాయి ప్రశ్న అడిగింది. స్వామి ఈ విధంగా సెలవిచ్చినారు. “గణపతి అంటే దివ్యమైనటువంటి శక్తి, ఆ దివ్యమైన శక్తి (౮11౪౮౩21 *ంఇల) ఏదైతే ఉన్నదో దాని నుంచి విఘ్నములు నివారించడానికి ఆవిర్భవించిన దివ్యమైన వైబ్రేషన్‌. గంగం గం అనేటువంటి అక్షరం వివిధ భాషల్లో వివిధ రకాలుగా వ్రాసినప్పటికినీ, పలికేది మాత్రం గం గం గం. ఆ దివ్యమైన శబ్దాన్ని పలుకుతూ, భావన చేస్తున్నప్పుడు ఆ ఉచ్చ్భారణకి, ఈ విశ్వంలో ఉన్నటు వంటి ఆ “గం” అనే వైబ్రేషన్‌ కి విశ్వవ్యాపకుడయిన గణపతి యొక్క వైబ్రేషన్‌ లో నుంచి దివ్యమైన శక్తి మనలో ప్రవహించి మనల్ని శక్తివంతుల్ని చేస్తుంది. దివ్యమైన యోగ సంబంధమయిన, సాంకేతికమయినటువంటి రహస్యాలు, ఖిశేషార్ధాలు ఉన్న మన పురాణ గాధలలో ఉన్నటు వంటి అంతరార్జ్థాలు గ్రహించడం చాలా ముఖ్యము. ఇది మనవాళ్ళు కధల రూపంలో చెప్పారు. కధల రూపంగా చెప్పినప్పటికినీ విశ్వవ్యాపకమయిన దివ్యమైన శక్తిని గ్రహించి మనము ఏవిధంగా శక్తివంతం కావాలో మనకు వచ్చే విఘ్నాలను పోగొట్టేటువంటి శక్తిని ప్రసరింపజేసు కోవటానికి ఏం చెయ్యాలో చెప్పినట్టి చక్కని పద్ధతి. ఒకానొక విద్యార్థి ఒక సందర్భంలో స్వామిని ఈ విధంగా ్రశ్నించినాడట “లక్ష్మీగణపతి అంటున్నారు, విష్ణుమూర్తి ఉన్నాడు. మరి లక్ష్మీదేవి గణపతి భార్యనా? అంటే స్వామి సమాధానం ఈ విధంగా చెప్పారు.

9

చిత్రకారుడు వేసిన బొమ్మలలో గణపతి ఎడమ తొడమీద లక్ష్మీ అమ్మవారు కూర్చున్నట్లు చూస్తున్నాము. ' క్షీరసాగర మధనం జరుగబోతున్న సమయంలో దేవతలు, రాక్షసులు గణపతిని కూర్చుండబెట్టి పూజ చేసి విఘ్నాలు లేకుండా చెయ్యి మహానుభావా! అని ప్రార్ధించి, నైవేద్యం పెట్టినారు. సంప్రదాయ బద్ధంగా ఏదైనా మహత్తరమైన కార్యం మొదలు పెట్టే ముందు గణపతిని కొలవడం, ఆరాధించడం ప్రార్ధించడం, అలవాటు గనుక ఆ విధంగా చేశారు. ఏదైతే సంకల్పించుకున్నామో అది విఘ్నాలు రాకుండా జరగాలని, అమృతం ఉద్భవించేటట్లు, చేయవలసిందని పూజ చేసి ఒకవైపు దేవతలు, మరొకవైపు రాక్షసులు పట్టుకుని, చిలుకుతున్నారు. ఆ విధంగా చిలుకుతున్న సమయంలో ఒక్కొక్కటి ఆవిర్భవిస్తూంటే ఒక్కొక్కరు వచ్చి తీసుకుని వెడుతున్నారు. కామధేనువు, కల్పవృక్షం ఇలా వచ్చినవన్ని తీసుకుని వెడుతున్నారు. విఘ్నేశ్వరుడికి కోపం వచ్చింది. “నన్ను కూర్చోబెట్టారు. పూజ చేశారు. విఘ్నాలు లేకుండా చెయ్యమని ప్రార్థించారు. ఆవిర్భవించినటువంటివి ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుని వెడుతున్నారు. తగల బెట్టిస్తున్నారు. ఇదేమి బాగాలేదు. ఈసారి ఏదైతే ఉద్భవిస్తుందో అది నాది. నేను తీసుకుని వెడతాను” అన్నాడు. సరే అలాగేలే అన్నారు. ఉద్భవించిన తరువాత చూస్తే లక్ష్మీదేవి. వెంటనే విష్ణుమూర్తి తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు. గణపతి ప్రక్కకు పిలిచి చెప్పాడు. “ఇందాక నేను చెప్పాను కదా, ఏది ఆవిర్భవిస్తే అది నాది అని కాబట్టి ఈ ఆవిర్భవించినటు వంటి లక్ష్మీదేవి నాది. నా సొత్తు. నాకు సొంతమయినదానిని ఎవ్వరూ తీసుకుని వెళ్ళలేరు. నేనే తీసుకుని వెడతానని గొడవ పెట్టాడు. లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి యొక్క సొంతము. విష్ణుమూర్తికే అర్థాంగి కావాలి. ఆయనే తీసుకుని వెళ్ళాలి.

సామాన్యంగా మనం ఎవరైనా చిన్నపిల్లవాడు గొడవ చేస్తే వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళి “మీవాడు గోల చేస్తున్నాడు. కొంచెం సముదాయించమ్మా. సర్ది చెప్పు, అని మొర పెట్టుకుంటాము. అదేవిధంగా ఈ గణపతి చేస్తున్న ఆగడాన్ని పార్వతికి చెప్పి మొరపెట్టుకున్నారు. వెంటనే పార్వతి నవ్వుతూ వచ్చి “నాయనా! ఎందుకు గొడవ చేస్తున్నావు! అంటే గణపతి చూడు నన్ను కూర్చోబెట్టి పూజ చేశారు. ఈసారి ఏది

10 ఆవిర్భవిస్తే అది నాది అని చెప్పాను. ఇప్పుడు లక్ష్మీ ఆవిర్భవిస్తే అది నాది అని చెప్పాను. కాని లక్ష్మిని తీసుకుని వెడుతున్నారు. నాకివ్వటం లేదు అన్నాడు. ఆమె “నేను చెప్పింది విను. నీకు లక్ష్మితో పనేముంది? జన్మతః నీవు లక్ష్మీగణపతివి. నీ యొక్క దృష్టి ఎవరిపై పడుతుందో వారికి అష్టలక్ష్మి ప్రసన్నమవుతుంది. నీకు వేరే లక్ష్మితో అవసరమే లేదు. పనే లేదు. నువ్వు స్వతః లక్ష్మీ గణపతివి. నీకు లక్ష్మి అక్కరలేదు. వాళ్ళకి కావాలి” అన్నది. అమ్మా ! నేను లక్ష్మీగణపతినా! _ నా దృష్టి ఎవరిపై పడితే వాళ్ళు లక్ష్మీ ప్రసన్నులవుతారా? అమ్మ చెప్పింది కదా! నేను లక్ష్మీ గణపతిని అని తాండవం చేస్తూ నృత్యం చేస్తూ నాకు వద్దు అని వదిలిపెట్టేశాడు. ఆనందంగా ఉన్నాడట. అప్పటి నుంచి ఆయనకు లక్ష్మీగణపతి అని పేరు వచ్చింది అంటూ స్వామి చమత్కారంగా మధురమైన, అద్భుతమైన రూపకల్పన చేసి చెప్పినారు. స్వామి ఇంకా విష్ణువు గురించి ఈవిధంగా చెప్పారు. విష్ణువు అనగా సర్వ వ్యాపకమయినటు వంటి దివ్యమైనటు వంటి శక్తి. విష్ణువుకు వ్యుత్పత్తి అర్ధము - సర్వ వ్యాపకుడు (0౫: ౫జల0 అని. అణువణువునా పరిభ్రమిస్తున్నటు వంటి దివ్యమైన శక్తే విష్ణువు. ఆ శక్తే గణపతి. నిర్గుణ నిరాకార మయినటువంటి ఆది దైవమై సమస్త గణములకు అధిపతి అయినటు వంటి గణాధిపతి. పరమేశ్వరి యొక్క దివ్యమైనటు వంటి అంతర్భాగశక్తి యొక్క ప్రాదుర్భావమైనటు వంటి గణపతి ఒక యోగశక్తి అని (గ్రహించండి. సమస్తమైన విఘ్నాలను హరించే దివ్యశక్తి గాబట్టి దానిని “గం గం” అంటూ ధ్యానం చేసినప్పుడు మనలో వచ్చిన మానసికమైన ప్రకంపన విశ్వవ్యాపితమైనటు వంటి దివ్యమైన శక్తితో సంవిలీనమై మనకి శక్తినిస్తుంది. ఆ శక్తి ద్వారా మనం శక్తి వంతమై విఘ్నాల్ని మనమే చక్కగా నివారించుకుంటూ శక్తి సంపన్నుల మవుతాము. ఇంక ఏనుగు తలకాయ అంటే తెలివైనటు వంటి తలకాయ. అద్భుతమైనటు వంటి జ్ఞానముతో కూడుకున్నది. ఏనుగు తన భృకుటి మీద కదలికలతోటి సంకేతాలు పంపిస్తుంది. అద్భుతమైన తెలివితేటలకి అనంతమైనటువంటి విశాల భావాలకి ఏనుగు

11

తల ప్రతీక. తాబేలు తన పిల్లలకి భావతరంగాలను పంపించి ఏ విధంగా శక్తిని ప్రసరింపజేస్తుందో అలాగే ఏనుగు కూడా తన నుంచి భావ ప్రకంపనలతో కూడిన తరంగాలను పంపిస్తుంది.

ఏనుగు ప్రక్కకు నడవదు. 56౯418610౧7జ6 గా నడుస్తుంది. తిన్నగా ముందుకే సాగిపోతుంది. కాబట్టి గణపతి విశ్వ జ్ఞానానికి ప్రతీక అని విశ్వజ్ఞానాన్ని తనలో పెట్టుకున్నటు వంటి ఒకానొక దివ్యమైన శక్తి యొక్క ఆవిర్భావమని పరిపూర్ణమైనటువంటి అవతార తత్త్వమని చెప్పడానికే ఏనుగు తలకాయ పెట్టారు. అంతేకాదు. మరుగుజ్జులాంటి పొట్ట పెట్టారంటే ఆ విశ్వమంతా కూడా ఆ గర్భంలో ఉన్నది గాబట్టి ఆ ఉదరము విశ్వానికి ప్రతీకగా పెద్దదిగా కన్పిస్తున్నది” అంటూ శ్రీ విశ్వంజీ గణపతి తత్త్వాన్ని గురించి లక్ష్మీ గణపతిని గురించి తమ సుదీర్షమైన దివ్యోపన్యాసంలో తెలిపినారు.

మరికొన్ని విశేషాలు :

ఐకమత్యము, సహనము, సానుభూతి, సమగ్రత, సౌభ్రాతృత్వము అనేవి విశ్వకుటుంబములోనే సాక్షాత్కరిస్తాయి. వీరి కుటుంబములో ఈశ్వరుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం అని నలుగురు ఉన్నారు. ఈ నలుగురూ చేరి ఐకమత్యంగా ఉంటున్నారు. ప్రాకృతరీతిగా మనం విచారణ చేసినప్పుడు ఈశ్వరుని వాహనము ఎద్దు. పార్వతి వాహనము సింహము. సాధారణంగా సింహమునకు ఎద్దుకు పరమ విరోధం ఉంటుంది. కాని విశ్వ కుటుంబంలో ఈ రెండూ విరోధం లేకుండా ఐకమత్యంగా ఉంటున్నాయి.

శివునకు శిరస్సుపైన గంగ, ముఖములో అగ్ని ఉంటున్నవి. సాధారణముగా అగ్ని గంగకు విరుద్ధము. కాని ఈశ్వరుని వద్ద వీరు ఎట్టి విరోధాలు లేకుండా ఉన్నారు. విరుద్ధమయిన వాటినన్నిటినీ వకత్వంగావిస్తున్నాడు ఈశ్వరుడు. విఘ్నేశ్వరునిది గజ శిరస్సు. అతని తల్లి వాహనము సింహము. సహజంగా సింహము స్వప్నంలో వచ్చినా ఏనుగు బ్రతకలేదు. అంత విరుద్ధమయినవి కూడా ఈ కుటుంబములో సన్నిహితంగా మెలుగుతున్నాయి. సుబ్రహ్మణ్యుని వాహమనము నెమలి. ఈశ్వరుని ఆభరణములు

12

సర్పములు. ఇవి కూడా ఒకదానికొకటి పరమ విరుద్ధమైనవి. కాని ఈ కుటుంబములో ఇవన్ని కలిసి మెలసి పెరుగుతున్నాయి. ఇవన్నీ లోకానికి ఆదర్శము నందించే చిహ్నములే! విఘ్నేశ్వరుని మొలకు సర్పము ఉంటున్నది. సుబ్రహ్మణ్యము యొక్క వాహనము నెమలి. సాధారణంగా నెమలిని చూస్తే సర్పాలు పరుగెత్తిపోతాయి. ఇంత విరోధం కల్గినవి కూడా ఈశ్వర కుటుంబములో అన్యోన్యమైన సంబంధాన్ని అనుభవిస్తున్నాయి. ఈ విధంగా ఈశ్వరుని కుటుంబం ఐక్యతకు చిహ్నంగా నిలబడి జగత్తునకు ఆదర్శాన్ని చాటుతూ వచ్చింది” అని భగవాన్‌ సత్యసాయి తమ దివ్యోపన్యాసంలో పేర్కొన్నారు. (19-9-93)

ఇటువంటి సమైక్యతను చాటడానికే ఈ అవతారమూర్తులు నరాకారం ధరించి మానవత్వం గల మనుష్యులుగా మానవాళిని తీర్చిదిద్దడానికి భారతావనిలో అవతరించి నారని చెప్పవచ్చును.

13 అమ్మఒడి ప్రథమబడి - గృహమే మొదటి పాఠశాల ప్రతి వ్యక్తికి “అమ్మ ఒడి ప్రధమబడి. గృహమే మొదటి పాఠశాల” అని తరచుగా శ్రీ విశ్వంజీ తమ దివ్యోపన్యాసములలోను తదితర సందర్భములలోనూ చెప్పిన సూక్తి ఇది. భారతీయ సనాతన ధర్మము “మాతృదేవోభవ” అనే సూక్తికి పట్టాభిషేకం చేసింది. భారతీయ సంస్కృతిలో మాతలకు నిర్దేశించిన గౌరవ ప్రతిష్టలు వర్జనాతీతము. శ్రీ విశ్వంజీ, శ్రీ సత్యసాయి, ఇంకా మరెందరెందరో మహనీయులందరు మాతృమూర్తుల్ని గురించి “శక్తి స్వరూపంగా, ఆది పరాశక్తి అని, విశ్వమాత అని అభివర్ణించారు. మాతృదేవోభవ, పితృదేవోభవ అని మాతృదేవికే ప్రధమస్థానము నందించినారు. తండ్రి, గురువు, అతిధి మున్నగు వారందరూ తర్వాత వరుస క్రమంలో చెప్పబడినారు. పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అని మనిషి మనిషికి సందేశమిచ్చింది భారతీయ సనాతన ధర్మం. మనిషిని సంస్కరించి కుటుంబ వ్యవస్థను చక్కదిద్ది గృహమును ప్రశాంతి నిలయంగా మార్చి తద్వారా యావత్‌ మానవ సమాజమును ఒక స్వర్గధామంగా, ఒక వైకుంఠంగా, ఒక ఆనంద నిలయంగా మార్చటానికి మార్గదర్శకమయినది సనాతన ధర్మము అని చెప్తూ తల్లి, బిడ్డ పుట్టగానే “ఈయన మీ తండ్రి” అని తండ్రిని పరిచయం చేస్తుంది. మల మూత్రాదులలో ఏమి తెలియని స్థితిలో కొట్టుకుంటున్నప్పుడు శుభము చేసి మలమూత్రాదులన్ని ఎత్తి ఎంతో శ్రద్ధతో బిడ్డలకు సేవచేసి ఉన్నతమైన స్థితికి తెచ్చేది మాతృమూర్తియే అని శ్రీ విశ్వంజీ చెప్పినారు.

“మాతృదేవోభవ” అన్నటువంటిది సనాతన ధర్మము యొక్క నాగరికమైనటు వంటి నినాదము. ప్రతి వ్యక్తికి మొట్టమొదటి దైవము తల్లియే. కాబట్టీ దైవాన్ని విస్మరించినా లేక ఇతరమైనటువంటి ఆరాధనా పద్ధతుల్ని విస్మరించినా కూడా నిత్యం ప్రతి ఒక్కరు అనునిత్యం కూడా జ్ఞాపకముంచుకొని ఆచరణలో పెట్టవలసింది, “మాతృదేవోభవ” అనేటువంటి నినాదాన్ని. ఇది ప్రతి ఒక్కరు గమనిస్తూ ఆచరిస్తూ జీవితంలో ధర్మబద్ధంగా పాటించి పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. అనంతమైన ఈ విశ్వం మొట్టమొదట మనకు ప్రసాదించిన ఈ విశ్వజననిని, ఆ విశ్వమాతను ఆరాధించాలి. ఆ విశ్వమాత సంతోషంగా

14 సంతృప్తికరంగా ఉండేటట్లు చేయాలి” అంటూ శ్రీ విశ్వంజీ తమ దివ్యోపన్యాసంలో వచించినారు.

“ప్రతి మనిషికి తల్లియే మొదటి గురువు. గృహమే మొదటి పాఠశాల. తల్లి పెంపకంలో పైకి వచ్చిన వ్యక్తి శివాజీ అవుతాడు. ఈ వ్యక్తి ఉదయమే లేచివెళ్ళి తల్లికి నమస్మారం చేసి ఆశీస్సులు పొందుతాడు. ఆమెకంట నీరు పెట్టినా, భార్య కన్నీరు కార్చినా, తోబుట్టువు దుఃఖించినా అతనికి కలిసి రాదు. ఎందుకంటే ఎక్కడ స్త్రీలు సంతోషంగా ఉంటారో అక్కడ దేవతల ఆశీస్సులుంటాయి. అక్కడ స్వర్ణం ఉంటుంది. మాతృదేవి బుణం తీర్చుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి కర్తవ్యం” అని శ్రీ విశ్వంజీ హెచ్చరిస్తుంటారు.

తల్లి తన బిడ్డలను పోషించుకొనే నిమిత్తం రక్షించుకొనే నిమిత్తం, తనను తాను అర్పితం గావించు కుంటుంది. మాతృమూర్తి తన సర్వస్వాన్ని త్యాగం చేయగలదు. గర్భస్థ శిశువు న్థాయి నుండి తన బిడ్డ విద్యాబుద్ధులు నేర్చి జీవితంలో మంచి పేక్రు ప్రఖ్యాతులు పొంది ప్రయోజకుడయ్యేంత వరకు తన శక్తి సామర్థాలను బిడ్డల కొరకు ధార పోస్తుంది తల్లి. వేద సారాన్ని ఉగ్గుపాలతో రంగరించి ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలిపాటలు పాడుతూ అందిస్తుంది తల్లి. ఆటలలో పాటలలో కూడా దైవట్రీతిని ఆస్వాదింప జేస్తుంది. శాశ్వతమైన ఆనందాన్ని అందుకునే అర్హతను, యోగ్యతను తల్లులే తమ పిల్లలకు కలిగించగలరు. తల్లుల హృదయాల నుండి ఉప్పొంగే వాత్సల్య ప్రవంతిని (గోలుతూ పిల్లలు పురాణ ఇతిహాస చరిత్రలలోని నైతిక విలువలు గల గాధలను, పాటల ద్వారా నేర్చుకొనేవారు. జాతి గర్వించదగిన వీరులను, శూరులను, జ్ఞానులను, యోగులను, ధార్మిక ప్రవర్తనాశీలురను రూపుదిద్దగల్లిన శిల్పులు మాతృమూర్తులే, “త్రల్లిప్రేమ దివ్యత్వం స్థాయికి చెందినటువంటిది. అట్టి తల్లులుగా తయారు కావడం అత్యవసరము. మంచి భార్య భర్తకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మంచి హృదయం గల మాతృమూర్తి ప్రపంచానికే ఆదర్శము. వివాహిత అయిన స్త్రీని సత్యసాయి

ఎంతో గౌరవంగా “గృహలక్ష్మి” అని సంబోధిస్తారు. ఈనాడు ధర్మము ఈ మాత్రమైనా మిగిలి ఉందంటే అందుకు మహాపతివ్రతామ తల్లుల ప్రభావమంటారు” సత్యసాయిబాబా.

తల్లి ఒడి - ప్రథమ బడి అన్న శీర్షికన శ్రీ సత్యసాయి ఈ క్రింది పద్యము చెప్పినారు.

15

కౌసల్య వరశుక్తి గర్భమౌటను కదా

రాముడు దేవుడై రమణగాంచె సీతామహాసాధ్వి చెలగిపెంచుట కదా

కవలు లవకుశలు ఘనులు అగుట జిజియాలలామ చెలగి పెంచుట కదా

వీర శివాజియు పేరు గాంచె పుతలీబాయి రంజిల్లి పెంచుట కదా

గాంధీ మహాత్ముడై ఘనత గాంచె ఈశ్వరాంబా సాధ్వి ఎత్తిపెంచుటకదా

సత్యనారాయణునకు విశ్వఖ్యాతి కలిగె ప్రాణకోటి ఈరీతి పరిమళించె అహరహంబును బ్రోచెడి అమ్మకంటే ఆదరంబగు వ్యక్తులు ఈ అవని గలరే? అమ్మ ప్రధమాక్షరంబు - ఆద్యక్షరంబు.

“రామో విగ్రహవాన్‌ ధర్మః - మూర్తీభవించిన ధర్మమే శ్రీరాముడు. అట్టి శ్రీరాముని తీర్చిదిద్దిన తల్లి కౌసల్య. చిన్నారి ప్రాయంలో బాలరామునికి ఎన్నో సుద్దులు బుద్ధులు నేర్చినది. “కౌసల్యా సుప్రజారామా అంటూ ప్రతినిత్యం సుప్రభాతవేళ మానవాళిచే స్తవనీయుడైన శ్రీరామచంద్రుని కన్నతల్లి కౌసల్య ప్రాతఃస్మరణీయురాలు.

సీత మహాపతివ్రత. ఆదర్శమాత. శ్రీరామచంద్రునిచే పరిత్యక్త అయి వాల్మీకి ఆశ్రమంలో కష్ట నిష్టూరాలకు ఓర్చి ధైర్యంతో రఘువంశ కుల దీపకులుగా కవలలయిన లవకుశులను సర్వ విద్యా కుశలురుగా రూపొందించింది. యుద్ధ విద్యలలో శిక్షణ గరపి, వీరులు, శూరులు, అయిన లవకుశులు - తల్లి దీవెనల వలన లోకోత్తర పరాక్రమశాలియైన శ్రీరాముని సహితము, రణరంగంలో మూర్చిల్లునట్లు చేసినారు. రామాయణంలో సుమిత్ర, లక్ష్మణుని ధర్మపత్ని ఊర్మిళ మున్నగు వారు త్యాగశీలురైన సాధ్వీమ తల్లులు. సుమిత్ర సీతారాములతోబాటు లక్ష్మణుడు అరణ్యమున కేగే వేళ

16 “లక్ష్మణా! నీవు శ్రీరామునితో అరణ్యములకు పోవుటకే జనించితివి. నీ వాతనిని ఒక్కక్షణమైనా వదలి ఉండవలదు. అతనిని 'సేవింపుము. అతడే నీకు శరణ్యము. “రామందశరథంవిద్ధి మాంవిద్ధి జనకాత్మజామ్‌ ! అయోధ్యామటవీం, విద్ధి గచ్చతాత యథాసుఖమ్‌” నీ తండ్రి శ్రీరాముడు. నీ తల్లి సీతమ్మ. అడవి అయోధ్య. నీవు వారిరువురితో ఉండు. శుభం చేకూరుతుంది” అని పలికింది. కౌసల్య దుఃఖమును కూడా ఉపశమింప జేయుటకు శక్తి యుక్తులన్ని ప్రయోగించింది. వీరమాత జిజియాబాయి శైశవంలోనే శివాజీలో దైవాఖిమానం, ధర్మాభిమానం, దేశాఖిమానం పటిష్టముగా పాదు కొల్పినది. ఆమె తన తనయునికి ఉగ్గుపాలతో రామాయణ, భారతాది పురాణేతి హాసాల కధలు, ప్రధానంగా హనుమంతుడు అర్జునుడు, అభిమన్యుల వీర గాధలను రంగరించి పోసింది. హైందవ ధర్మాలు, భారతీయ సంస్కృతి పరిపూర్ణంగా బాల్యంలోనే శివాజీలో ప్రతిష్టితమయ్యాయి. గాంధీజీ జనయిత్రి పుతలీబాయి. వైష్ణవ భక్తురాలు. పూర్వాచార పరాయణ. నిత్యం ఆచారించే ఆరాధనలలో పుతలీబాయి గాంధీని తన దగ్గరనే ఉంచుకొనేది. ఆ విధంగా గాంధీ గారిలో దైవభక్తి, పాపభీతి అనే పవిత్ర భావాలు బాల్యంలోనే నాటుకున్నాయి. ధృడ సంకల్పం, సత్యవ్రత దీక్ష ధర్మాచరణ గాంధీలో పుతలీబాయి పెంపకంలో అలవడ్డాయి. తన కుమారుని ప్రవర్తనలో ఎటువంటి లోపాన్ని ఆమె సహించేది కాదు. భగవాన్‌ సత్యసాయి జన్మకు కారకురాలైన శ్రీమతి ఈశ్వరాంబ, అద్భుత బాలునిగా, బ్రహ్మజ్ఞాని, బిడ్డల గురువు అని అందరిచేత గుర్తింపబడిన సత్యం యొక్క మాతృమూర్తి. అసాధారణ బాలుని తల్లిగా ఆమె ఏనాడు గర్వించలేదు. సహజమైన మాతృ వాత్సల్యంతో ఎవరి దృష్టీ తన బిడ్డకు తగులకూడదనీ అసూయపరుల నుండి ఎటువంటి కీడు తన పుత్రునికి రాకూడదని దైవ ప్రార్ధనలు చేసేది. పవిత్ర నిర్మల (ప్రేమ మూర్తి అయిన ఈశ్వరాంబ తన పుత్రుని క్షేమం కొరకై నిరంతరం పడిన తపనయే తపస్సు. ఇటువంటి మమతామూర్తి పర్యవేక్షణలో లీలానాటక సూత్రధారి బాల్యజీవితం గడిచింది. తదుపరి

1/7 బాబా దివ్యత్వాన్ని గ్రహించి, వచ్చినవారికి మేలు చేయమని ప్రార్టించేది. కుగ్రామమయిన పుట్టపర్తిలో విద్యకు పారశాల, వైద్యము కొరకు వైద్యశాల, దాహార్తి తీరడానికి నీరు కూడా కావాలని కోరుకున్నది. ఆనాడు ఆ గ్రామానికి, చుట్టు ప్రక్కల (గ్రామాలకు మాత్రమే పరిమితమైన విద్య, వైద్యము, నీటి సరఫరా ఈనాడు విశ్వ వ్యాష్తమై పుట్టపర్తి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మ కేంద్రముగా భారతదేశపు పటములో (420) ప్రముఖమైన ప్రదేశముగా విరాజిల్లుచున్నది. ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ని సంఘ సంస్కర్తగా తీర్చిదిద్దింది ఆతని తల్లియే. “మానవ సేవే మాధవసేవ” అని విశ్వసించి ఆచరణాత్మకంగా నిరూపించిన మహనీయుడు. ఆతని గుణములలో మాతృభక్తి మహత్తరమయినది. ఈశ్వర చంద్రునిలో దీనజన సేవాపరాయణత నిరాడంబరత, స్వయంకృషి ఉదాత్త భావ గాంభీర్యం మొదలయిన గుణములు పోషించిన ఘనత ఆతని తల్లికే దక్కినది. ఆవిధంగా ఆమె ఆదర్శవంతమైన మాతృమూర్తి. నరేంద్రుని విశ్వ విఖ్యాత మనిషిగా, వివేకానందునిగా రూపొందగల శక్తి సామర్ధ్యములు అలవరచినది ఆతని తల్లి భువనేశ్వరీదేవి. భారతీయ సంస్కృతికి మూలాధారమైన సనాతన ధర్మము పట్ల ప్రగాఢ విశ్వాసం కలిగేటట్లు పెంచినది. పసితనముననే నరేంద్రునికి పురాణీతి హాసములలోని వీరుల గాధలను వినిపించినది. దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి అనే మౌలిక విలువలను అలవరచినది భువనేశ్వరీదేవి. అద్వైతాన్ని చాటి చెప్పిన ఆది శంకరాచార్యుల వారు కూడా తల్లి అనుమతి ఆశీస్సులతోనే ప్రపంచాన్ని ఉద్ధరించినారు. ఇటీవల శ్రీ విశ్వంజీ తమ దివ్యోపన్యాసములో ఈ విధంగా అన్నారు. “కర్మభూమి, యోగభూమి, జ్ఞానభూమి అయిన పృథ్వీ మాతకు హృదయమైన భారత భూమిలో వివిధ మయినటువంటి, విభిన్నమయి నటువంటి పద్ధతుల తోటి ఇంకా ఇంకా ఎన్నో రకాలుగా కూడా మన భారతీయ సనాతన ధర్మాన్ని ద్వేషిస్తూ ఒకళ్ళ నొకళ్ళు ద్వేషించుకుంటున్న సమయంలో ఒక దివ్యమైన సంకల్పంతోటి సాక్షాత్తూ శంకర స్వరూపమైనటు వంటి దివ్య శక్తి ఆది శంకరులుగా 'కాలడి' అనే గ్రామంలో ఆవిర్భవించింది. పుట్టుక నుంచి అద్భుతమైనటువంటి శక్తులతో ఆదిశంకరులు అతి చిన్న వయస్సులోనే అమితమయినటు వంటి జ్ఞాన సముపార్దన చేసి జ్ఞాన స్వరూపుడై

18 సమస్తమైన వేద వాజ్బయాన్ని ఒంట బట్టించుకుని వేద స్వరూపుడై, తేజోరూపుడై వాళ్ళ అమ్మను “అమ్మా ! సన్యాసం తీసుకొంటాను” అని అడిగితే ఆమె సంకోచించినది. ఆ మాతృప్రేమ అటువంటిది. సంసారికమయిన జీవితాన్ని గడుపుతూ సుఖంగా ఉండాలని ఆమె కోరిక. అందుచే శంకరుడి తల్లి కూడా సన్యాసం తీసుకుందుకు ఇష్టపడలేదు. వారు నదీ స్నానం కొరకు కొలనులోనికి వెళ్ళి “మొసలి కాలు పట్టుకొని లోపలికి లాగుతోంది, చచ్చిపోతాను, ఈ చనిపోయే సమయంలోనైనా నా కోరిక మన్నించి నాకు సన్యాస దీక్ష తీసుకునేటువంటి వరాన్ని ప్రసాదించు. అనుజ్ఞనియ్యి” అంటే, పిల్లవాడు మరణావస్థలో ఉన్నాడు అన్న భావంతో అలాగే నీవు “సన్యాసదీక్ష తీసుకో” అన్నది. వెంటనే మొసలి బారి నుండి బయట పడతాడు. “అమ్మా నీవు అనుజ్ఞ ఇచ్చావు కదా. నేను సన్యాన దీక్ష తీసుకొని నమన్త లోకాల్లోనూ మనుష్యుల్ని ఉద్భరించి పరిపూర్ణమయినటువంటి మానవత్వపు విలువలు బోధిస్తూ, నళిస్తున్నటు వంటి సమైక్యతను చాటి చెప్పడానికి నేను లోకంలోకి వెడుతున్నాను. లోక సంచారం కోసం, లోకోద్ధరణ కోసం వెడుతున్నాను. అనుజ్ఞ నిమ్మని చెప్పి తల్లి పాదాలు పట్టుకుని నమస్కారం చేసి “నీవు ఎప్పుడు దేహం వదిలితే అప్పుడు తప్పక వస్తాను” అని మాట ఇస్తారు. ఇచ్చిన మాట ప్రకారం అంత్యకాలంలో వచ్చి తదుపరి ఆమెకు అంత్యక్రియలు స్వయముగా జరిపిన మహనీయులు శంకరులు. లోక కళ్యాణార్ధం వచ్చిన మహనీయులు కూడా తల్లిని గౌరవిస్తూ తల్లి అనుమతి లేనిదే ఏ పని చెయ్యలేదు. శ్రీ విశ్వంజీ కూడా తాము ఇల్లు వదిలి సాధన చెయ్యడం ప్రారంభించినప్పుడు తల్లి శ్రీమతి వరలక్ష్మమ్మ గారి అనుమతి ఆశీస్సులు పొంది తమ సాధనతో విశ్వయోగిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్న దత్తమూర్తి అలనాడు జద్బ్చర్లలో గురువు గార్ని సేవిస్తూ ఆరాధిస్తూ తన గమ్యం చేరడానికి చేసిన కృషి అంతా తల్లి ఆశీర్వాదంతో చేసినదే. ఈనాడు “గురుపూర్ణిమ దినము మాతృదినముగా పరిగణించి ప్రతి ఒక్కరు మాతృమూర్తులను గౌరవించాలని పూజించాలన్న ఆదర్శాన్ని వ్యక్తం చేస్తూ స్త్రీ శక్తి స్వరూపంగా ఆరాధింపబడాలని విశ్వమాతను గౌరవించి (పేమించి సేవించాలని గృహాల్ని ప్రప్రథమంగా ప్రశాంతి నిలయాలుగా మార్చుకోవాలని బోధిస్తున్న ఉత్తమ బోధకుడు శ్రీ విశ్వంజీ. జడ్బ్చర్లలో దత్తమూర్తి ఆలయంలో ఈ మహాయోగికి జన్మనిచ్చిన తల్లి తన్మయత్వంతో పాటలు పాడుతూ చిన్ననాడే ఈ “విశ్వం” సామాన్యమైన బాలుడు కాడని ఇతని వల్ల ప్రపంచానికి మేలు జరగాలని కోరుకున్న స్వాధ్వీమతల్లి. సహజంగా అందరు

19 మాతృమూర్తులవలె తనకు కూడా బిడ్డపట్ల వాత్సల్యం, (ప్రేమ, మంచి ఉద్యోగం చేస్తూ సుఖపడాలని వివాహం చేసుకోవాలని తాపత్రయ పడ్డప్పటికి చిట్టచివరకు వారి లక్ష్యం, ధ్యేయం, గమ్యం వైపు పయనించడానికి ఆశీః వర్షం కురిపించిన ఆదర్శమాత శ్రీమతి వరలక్ష్మమ్మ.

గీతాచార్యుడు “స్త్రీలలో గల సప్త శక్తులు నేనే” అని ప్రకటించినాడు.

“మృత్యుస్సర్వహరచ్భాహముద్భవశ్చభవిష్యతాం

కీర్తిశ్శీర్వాకృనారీణాంస్మ లతిర్మేధా ధృతిక్షమా

అనే శ్లోకంలో రెండవ పాదంలో సప్త ధర్మగుణములు పేర్కొనబడినవి. కీర్తి జ్ఞాన సంపద, మృదువైన వాక్కు జ్ఞాపకశక్తి, ధారణాశక్తి, ధర్మ కార్యములలో గల ధైర్యము ఓర్పును నేను అగుచున్నాను” ఇది భగవంతుని దివ్యవాణి. కావున స్త్రీలు ఈ సప్త గుణాలను రక్షించుకోవాలి. అదే వారి ధర్మం. సకార, తకార, రకార సమ్మిళితం స్తీ స్వరూపం. 'సకారము - సాత్విక గుణ సూచకం. సానుభూతి, సహనం, (ప్రేమ, క్షమ, మొదలగు గుణాలతో కూడినది.

“త కారము తమోగుణ సూచకం. సోమరితనం ఉదాశీన వైఖరి, సిగ్గు, బిడియములకు సంబంధించినది. లజ్జ స్త్రీకి భూషణం. కోమలత్వం, సాధుత్వం, మధురత్వం - వీటి విచిత్ర సమ్మేళనమే లజ్జ. ఈ లక్షణం గల స్తీ బెచిత్య భావన చేస్తుంది. ఇది ఆమె ఘనతకు, శక్తికి గుర్తు. ఈ పవిత్ర గుణము స్త్రీని దివ్యమైన పవిత్రమైన, పూజనీయమైన ఉన్నత స్థానాన్ని అధిరోహింప జేస్తుంది.

“రకారము రజోగుణ సూచకం. ధైర్యం, సాహసం, త్యాగం, పౌరుషం మొదలగు గుణములతో కూడినది. ఈ తత్వం మానాభిమానములను, సంరక్షించుకునేటందుకు తోడ్పడుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమాజ; దేశకీర్తి గౌరవములను కాపాడుటకు ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సంసిద్ధులు కాగలరు స్రీలు.

ఒక తల్లిగా స్త్రీకి మాతృత్వము భగవంతుడు ప్రసాదించిన గొప్ప విలువైన కానుక. ఒక జాతి అదృష్టానికి గాని, దురదృష్టానికి గాని, తల్లులే కారకులు. పాపభీతి, సద్గుణముల పట్ల ప్రీతి అనే రెండు పాఠాలు వారు తమ పిల్లలకు తప్పక నేర్పాలి, ఆ రెండూ దైవ విశ్వాసము పైననే ఆధారపడి యున్నవి.

20 తల్లిగర్భము నందున్న తరుణమందు శిశువునకు గణపబడియెదు శిక్షయే. జీవితాంతము దనుకను భావుకముగ సౌఖ్యమగునను సద్వాక్కు సత్యమనగ. లలిత (ప్రహ్షాదసొభద్రులిలను సాక్షి స్రీలు గర్భవతులుగా నున్నప్పుడు తమ కాయాన్ని కాలాన్ని పవిత్రంగా గడపాలి. జన్మించిన తరువాత పిల్లలకు మంచిబుద్ద్ధులు సుద్దులు నేర్పాలి. గర్భవతులైన స్రీలు ఆ సమయంలో పవిత్ర [గ్రంధ పారాయణ చేయాలి. పవిత్రమైన దృశ్యాల్నే చూడాలి. చలన చిత్రములు, భయానక దృశ్యాలు చూడకూడదు. ఆ విధంగా చేస్తే పుట్టే పిల్లలు కొన్నిసినిమాలలో చూపే అవాంఛనీయ ్రవృత్తులతో జన్మిస్తారు” అని బాబా సెలవిచ్చెను. ఇదే విషయాన్ని శ్రీ విశ్వంజీ కూడా వివరించారు. తల్లి గర్భవతిగా నున్నప్పుడు మంచి విషయాల్నే వినాలి. ఉల్లాసంగా హాయిగా, ప్రశాంత చిత్తముతో సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఆప్యాయతను పంచి పెట్టే వారి మధ్యలో గడపాలి. ఇవన్నీ కడుపులో పెరుగుతున్న బిడ్డపై చక్కటి ప్రభావాన్ని కల్గిస్తాయని చక్కటి సత్సంతానము కలుగుతుందని తమ దివ్య ప్రసంగంలో వచించినారు. భర్త కూడా ఆ సమయంలో భార్యపట్ల అనేకవిధముల శ్రద్ధతో సహకరించి అనుగుణంగా వర్తించాలని సెలవిచ్చారు. పూర్వకాలం తల్లులు తమ బిడ్డలను ఊయలలో పరుండబెట్టి బ్రహ్మతత్త్వం, రామతత్త్వం, కృష్ణతత్వం, ప్రబోధించే లాలిపాటలు పాడి నిద్రబుచ్చెడి వారట. ఓంకారమనియేటి తొట్టి గావించీ నాలుగు వేదాల గొలుసుల మరించి “తత్త్వమసి” యని మేటి పరపు పరచి ఎజుకనే పాపణ్జి పరుండ బెట్టి వదులోకముల వారు ఉయ్యాలలూచ లాలీ అనసూయ పాతివ్రత్యమునకే తలమానికము వంటిది. (త్రిమూర్తులు ఆమెను పరీక్షించిన తదుపరి అనుగ్రహించదలచి వరము కోరుకొమ్మని పలికినారు. “మీ

21 త్రిమూర్యాత్మక స్వరూపంతో నాకు ఒక కుమారుని ప్రసాదించమని ప్రార్ధించినది. ఆ విధంగా దత్తాత్రేయుని ఆవిర్భ్బావం జరిగింది. “ఈ సృష్టి, స్థితి లయ కారకమైనటు వంటి మహాశక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తిని దత్తము చేసుకున్న మహాపతివ్రతా శిరోమణి అనసూయ. ఊగుమా, ఊగుమా, ఊగుమాదత్తా | ఊపెద ఊయల ఊగుమాదత్తా (2) సత్యం ధర్మం శాంతి ప్రేమలను గొలుసులు ఊయల కట్టినా నయా 1121 ప్రశాంతి పరిమళం వెదజల్లే భక్తి వీవెనే వీేచెదనయ్యా (2) 1ఊగుమా॥ హృదయమే, పర్తుపుగ, పరచినానయా మనసునే, తలగడ, జేసినానయా (2) వేదన పాటగ, మార్చినానయా ఆ వేదన తీర్చగ వేగ రావయా 11 ఊగుమా॥ కామం, క్రోధం, లోభం, మోహం మద, మాత్సర్యం బుస గొట్టెనయా (2) అహమను సర్పము పడగ విప్పెను పదకగ మార్చి పవళించవయా 1 ఊగుమా॥ అంటూ సాకారంగా నేడు మన మధ్య తిరుగుతున్న దత్తగురువు అనసూయా మాతను గురించి, అసూయలేని స్థితిని గురించి చెబుతూ ఈ జోలపాట పాడుతూ మన చేత పాడిస్తున్నారు. ఇట్టి మహాతల్లుల ఒడులన్నీ పసిపాపల బడులే. ఇలాంటి ప్రశాంతి నిలయాలైన గృహాలన్నీ పసిపిల్లలకు పాఠశాలలే! తల్లి ఒడిలో నేర్చిన తత్త్వాలన్ని విని తత్త్వవేత్తలయిన వారు, గృహమనే బడిలో నేర్చుకున్నవన్నీ ఆచరిస్తూ జీవితాల్ని గడిపిన వారంతా నేడు మేధావులై భారత దేశానికి, ప్రపంచానికి కూడా కీర్తి తెచ్చినవారే!

22 జాతి యావత్తును సన్మార్గంలో నడిపించ గల శక్తి స్తీ జాతికి ఉన్నది “అమ్మజఒది ప్రధమబది గృహమే మొదటి పాఠశాల” అన్న సూక్తిలో మాతృమూర్తులు సమస్తం ధారపోసి పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి చక్కటి ఉన్నతమైన ఆదర్శాల్ని బోధించి జగత్తులో పేరు ప్రఖ్యాతులతో వర్ధిల్లడానికి కారణభూతులయినట్లు తెల్సుకున్నాము. ఈ సూక్తిలో జాతియావత్తును సన్మార్గంలో నడిపించ గల శక్తి స్త్రీ జాతి కున్నదన్న విషయం క్లుప్తంగా తెల్సుకుందుకు ప్రయత్నించెదము. వేద కాలంలో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా అన్ని హక్కులను, అర్దతలను అనుభవించారని వేద వాజ్బయము చాటుచున్నది. విద్యాభ్యాసం, ఉపనయన సంస్కారం కలిగి ఉండటం, యజ్ఞ యాగాదులలో పాల్గొనటం, విద్వత్సభలలో తర్మించటం, లలిత కళలలో ప్రావీణ్యం కలిగి ఉండటం ఆనాటి స్రీల ఉన్నత స్థాయిని తెలియజేయుచున్నది. (బ్రహ్మచారిణులుగా ఉండటానికి, సన్యాసాశ్రమ స్వీకారానికి, జీవిత భాగస్వామిని నిర్ణయించు కోవడానికి అనాటి స్రీలకు స్వేచ్చ వుండేది. గార్గి మైత్రేయి, లోపాముద్ర మొదలగు స్త్రీల చరిత్రలు ఇందుకు నిదర్శనం. (భగవాన్‌ సత్యసాయి స్తీ ధర్మ ప్రబోధం

  • శ్రీమతి ఆర్‌. సీతాలక్ష్మి.) భారతీయ సంస్కృతిలో, భారతీయ సనాతన ధర్మంలో ప్రీ జాతి సమాజాన్ని సంస్కరించే విధంగా, దేశ ప్రగతికి తోడ్పడే విధంగా దేశం కోసం ప్రాణాల్ని కూడా అర్పించడానికి వెనుదీయని వీరుల్ని ఈ దేశానికి ప్రసాదించింది. అధ్యాత్మ పరంగా, చరిత్రపరంగా, 'సంఘనీతి' ని అమలు పరుస్తూ అనేకానేక మంది పతివ్రతామ తల్లులు, వీరాంగనలు, సంఘ సంస్కర్తలుగా పేరొందిన మహిళలు వెలసిన పుణ్యభూమి ఈ భారతదేశము. సనాతన ధర్మము ప్రతి వ్యక్తిలోనూ ఉన్న త్రివిధ శక్తులను స్త్రీ తత్తంగా నిర్దేశించినది. “మధుర భావం బేది మన దేశమందన్న మాతృ భావము కంటే మాన్యమెద్ది? పవిత్రమైన భారతదేశంలో మాతృ భావనకు మించిన మధుర భావమేది లేదు. వాల్మీకి మహాకవి రచించిన రామాయణ కావ్యంలో స్రీ పాత్రలు పరిశీలించినప్పుడు అధ్యాత్మికత, ఉదాత్తమైన గంభీరమైన భావనతో కూడుకన్న త్యాగనిరతికి పాతివ్రత్యానికి,

23 ధర్మానికి ప్రతీకలుగా ఆయా పాత్రలు మనకు దర్శనమిచ్చుచున్నవి. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క ఆదర్శాన్ని నిరూపించినది. కౌసల్య రాముడిని భభవదవతారమూర్తిగా గుర్తించ లేకపోయినప్పటికి కొన్ని బాల్య లీలలు తాను అనుభవించినది. ఒక సన్నినేశములో రాముణ్ణి తదేకదృష్టితో ఆమె చూస్తూ ఉండిపోయినప్పుడు (బ్రహ్మాండమంతా ఒక్క క్షణకాలం ఆమెకు కన్పించెనట. ఇటువంటి దివ్యానుభూతికి లోనయినప్పుడు రాముడికి ఒంటరిగా ఎవరూ లేని సమయంలో ఆమె నమస్మరించెడిదట. విశ్వామిత్ర మహర్షితో రామలక్ష్మణులు యాగ సంరక్షణార్థం తరలి వెళ్ళే సమయంలో మొదట సంశయించినా, దుఃఖించలేదు. ఆలోచించి ఆశీర్వదించినది. ధనుర్భాజణాలను అందించి పంపించినది. శ్రీరాముడు వనవాసమేగే సమయంలో ఆమె శ్రీరామునికి మంత్ర పూరితమైన రక్షాబంధం ఇస్తూ “నీవు పరమధార్శికుడవు. పరాక్రమోపేతుడవు. సర్వ దేవతలు, ధర్మము, విశ్వామిత్ర మహర్షి అనుగ్రహించిన దివ్యాస్తములు, సర్వభూతములు, వన్య మృగాలు నిన్ను రక్షించుగాక! అని దీవించెనట. రావణ వధానంతరం రామ పట్టాభిషేక మహోత్సవం కన్నులార చూచి తరించిన సాధుశీల కౌసల్య, సుమిత్ర : రామాయణంలో దశరధుని పత్ని సుమిత్ర సుగుణవతి. ఆమె పరిణత చెందిన శీలము గలది. సుమిత్ర నడవడి ప్రత్యేకమయినది. దశరధుని సతులలో సుమిత్ర అధ్యాత్మిక జ్ఞాన సంపన్న. శ్రీరాముని శీలమును చక్కగా గ్రహించి మెచ్చు కొనెడిది. ఆమెకు ఎటువంటి వాంఛలూ లేవు. మితభాషిణి. పేరుకు తగ్గ ప్రవర్తన గలది. ఆమె తనకుమారులిద్దరిని సేవా మార్గంలో ప్రవేశపెట్టి యావత్‌ ప్రపంచానికే గొప్ప ఆదర్శాన్ని అందించింది. తన కుమారునకు రామసేవే ప్రధానమని భావించింది. “రామ సేవలో లక్ష్మణుడు తరించాలి, శతృఘ్నుడు భరతుణ్ణి సేవించాలి” అని ఆశించింది. సీతారామలక్ష్మణులు అరణ్యాని కేగెడివేళ “లక్ష్మణుడు రాముని సేవ చేయడానికే పుట్టాడు. అతడు రాముని చేతిలో ఒక పనిముట్టు. కాబట్టి తన పనిముట్టును తన వెంట తీసుకుని వెడుతున్నాడు. అది నేను పంపడమూ కాదు; లక్ష్మణుడు వెళ్లడమూ కాదు. లక్ష్మణుణ్జి తన వెంట తీసుకుని వెళ్ళడానికి రామునికి అధికారమున్నది. అది అతని హక్కూ అని భావించింది. నిత్య సత్య శాశ్వతమైన అధ్యాత్మ స్థితిని బోధించిన స్థిత ప్రజ్ఞురాలు సుమిత్ర. సీత: అరణ్యమే అయోధ్యగా భావించి రాముని అడుగు జాడలలో అన్యోన్యంగా కష్ట సుఖములను సమరీతిలో అనుభవించిన పతివ్రతా శిరోమణి సీత. అరణ్యంలో

24

రావణుని బెదిరింపులు, చుట్టూ చేరిన రాక్షస స్త్రీల మాటలు ఆమెను దుఃఖ సాగరంలో

ముంచి వేసినప్పటికీ, నిరంతరం రాముణ్ణి ధ్యానిస్తూ అటువంటి విషపూరితమైనటువంటి

వాతావరణాన్ని దివ్యమైనదిగా మార్చుకుని ఓర్పుతో, సహనంతో కాలాన్ని గడుపుతూ

సకల భారము భగవంతునిదేనన్న ఉదాత్తమైన భావంతో అరణ్య వాసాన్ని అనుభవించింది

సీతా సాధ్వి

ఊర్మిళ : శ్రీరామ చంద్రుని అనుంగు తమ్ముడు సుమిత్రా నందనుడైన లక్ష్మణుని

సతి ఊర్మిళాదేవి. శ్రీరామ చంద్రునితో తన భర్త వన వాసానికేగే సమయంలో ఆమె

దుఃఖించలేదు. ఆయన వెంట వెళ్ళాలని భావించలేదు. సీతారాముల్ని సేవించే భాగ్యం

తన భర్తకు మాత్రమే లభించినందులకు ఆనంద పడినది. క్షణం కూడా ఆలస్యం

చేయకుండా సీతారాముల వెంట బయలు దేరమని ప్రోత్సహించినది. లక్ష్మణుడు

బయలుదేరే ముందు ఈ విధంగా అన్నాడు “ఊర్మిళా! ఇంక పధ్నాలుగు సంవత్సరాల

పాటు నీవు సీతారాములను దర్శించడానికి వీలుకాదు. కనుక, ఒక్కసారి వెళ్ళి

సీతారాముల్ని దర్శించి” రమ్మన్నాడు. ఆమె కదలలేదు. సమాధానంగా “నీవ క్పీత్రా

రాముల వెంట వెళ్ళడానికి నావలన ఏమైనా అభ్యంతరము కలగవచ్చును. క్రన్సక

ఆలస్యం చేయక బయలుదేరమన్నది. ఇది విని లక్ష్మణుడు లోకంలో ఇంతటి త్యాగ

భావం కలిగిన పత్నులు కూడా ఉంటారా? అని ఆశ్చర్య చకితుడయినాడు.

ఇంతటి ఉదాత్త భావాలు కలిగిన మాతృమూర్తులు, ధర్మపత్నులు రామాయణ

కాలంలో దర్శన మిచ్చారంటే, వారి త్యాగ నిరతి ఉన్నతమైన అధ్యాత్మస్థితి ఈ రెండ్రు పాత్రలలో మనకు గోచరించుచున్నది. సత్యమార్గంలో పయనిస్తూ ధర్మాన్ని ఆచరింల్చి ఆచరింప జేస్తూ (శ్రేయోమార్గం వైపు పయనింప జేసే ఆదర్శ మాతృమూర్తులు, ధర్మపత్నులు యావత్‌ ప్రపంచాన్ని శక్తివంతం చేయగలరనుట అతిశయోక్తి కాదు.

సావిత్రి, అనసూయ మున్నగు స్త్రీలు తమదైన దైవశక్తితో అనేక విజయములు సాధించినారు. సతీ సావిత్రి మృత ప్రాయుడైన భర్తను (బ్రతికించుకున్న వృత్తాంతము చరిత్రలో శాశ్వతముగా నిలచినది. పాతివ్రత్యమునకే తలమానికమైన అనసూయ మాత (అసూయలేని స్థితి అనసూయ

మాతగా చెప్పబడినది) తన పాతివ్రత్యమునకు భంగము కలుగకుండుగాక! అని పతి అయిన అత్రి మహామునిని స్మరించి వివస్తయై వడ్డన చేయవలసిందని కోరిన బ్రహ్మ విష్ణు మాహేశ్వరులపై తన భర్త కమండలంలోని నీళ్ళు జల్లి, వారిని పసిపాపల్ని చేసి

25

స్తన్య మిచ్చి ఊగుమా, ఊగుమా, దత్తా! ఊపెద ఊయల ఊగుమా దత్తా అంటూ మాతృవాత్సల్యంతో వారిని సంరక్షించినది.

సరస్వతి, లక్ష్మి, దుర్గ (పార్వతి) పతుల జాడ తెలియక సతమతమగుచుండగా నారద మహాముని ద్వారా అత్రి మహాముని ఆశ్రమంలో అనసూయ వీర్ని పసిపాపల్ని చేసిన సంగతి తెలుసుకుని అనసూయ కడకు వచ్చి పతి భిక్ష పెట్టమని వేడుకొన్నారు. అనసూయ వెంటనే పసిబాలురుగానున్న బ్రహ్మ విష్ణు మాహేశ్వరులపై మంత్ర జలము చల్లినది. వారి సహజ స్థితిని పొందిన బ్రహ్మ విష్ణు మాహేశ్వరులు అనసూయ పాతివ్రత్యమును కీర్తించి వరము కోరుకొనమన్నారు. అనసూయ భక్తి ప్రపత్తులతో “మీ త్రిమూర్యాత్మక స్వరూపంతో నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించమని ప్రార్ధించినది. ఆ విధంగా కొంత కాలమునకు దత్తాత్రేయుడు ఆవిర్భవించినాడు.

లోక కళ్యాణార్థం ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం ఇంతటి మహనీయుడు అవతరించవలసి ఉంది, అట్టి దివ్యమైన మహా సంకల్పమునకు తిరుగు లేదు గనుక ఈ కధంతా జరిగిందని శ్రీ విశ్వంజీ తమ దివ్యోపన్యాసంలో అనసూయా మాతను గురించి చెప్తూ ఈ విధంగా అన్నారు. “బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సృష్టి స్టితి లయకారకులు, అనసూయా మాతవద్దకు వచ్చి వివస్తయై వడ్డించమన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యమేమి లేదు. నీచమైన విషయముగా కన్ఫట్టినప్పటికి ఒక మహానుభావుడు లోక కళ్యాణం కోసం ప్రపంచాన్ని ఉద్దరించడం కోసం రావాలి గనుక ఆ విధంగా నాటకమాడవలసి వచ్చింది. వీరు అత్రి మహాముని ఆశ్రమానికి రావాల్సి వచ్చింది. వీరి పత్నులు సామాన్యమైనవారు కాదు. సరస్వతి, లక్ష్మి, దుర్గ ముగ్గురమ్మలు. ఈ ముగ్గురమ్మలకు మూల పుటమ్మ (జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి క్రియా శక్తుల ఏకైక రూపము) మహాశక్తి యొక్క దివ్య సంకల్పము ఆ విధముగా నున్నది. ఆద్యంతములు లేని అద్భుతమైన శక్తి అనాది కాలం నుంచీ వివిధ రూపాలలో ఆవిర్భవిస్తోందని శ్రీ విశ్వంజీ సెలవిచ్చినారు. ఆ శక్తే విశ్వశక్తిగా పరిణమించి దేశాన్ని ముందుకు నడిపిస్తోందని భావము.

ఇంతటి భక్తి కలిగిన పతివ్రతలతో బాటు సబలులై తమధీశక్తిని చాటిన స్రీ మూర్తులు తర్మవిద్య ప్రావీజ్యతతో విజయము సాధించి గెలచిన మహిళలు, చెరసాల కేగిన స్రీలు, అగ్ని గుండాన్న దూకిన ధీరవనితలు ఆ కాలంలోనే వెలసినారు. స్త్రీలు అబలలు కారు సబలలే అని చెప్తూ భగవాన్‌ సత్యసాయి ఒక పద్యము చెప్పినారు.

సీ। యజ్ఞావల్క్యునితో తర్కించి

తనధీశక్తిని నిరూపించిన గార్గి అఐలనా?

26 జనక మహారాజును పరీక్షించిన సులభ అబలనా? భౌతిక సంపద వలదంచు ఆత్మజ్ఞాన సంపత్తినే ఆశించిన మైత్రేయి అబలనా? పతికి వైరాగ్య పారముల్‌ నేర్చిన మహారాజ్ఞి చూడాల అబలనా? నాథుడు మూర్చిల్లిన వేళ నరకు నెదిరించి పోరాడిన సత్యభామ అబలనా? శంకరాచార్యునితో తర్మము సలిపి సహధర్మచారిణి బిరుదును, నిలిపిన ఉభయభారతి అబలనా? ప్రాణంబు కంటే మానము ఘనమని నిరూపించి జోహార్‌ అగ్నిగుండాన దూకిన రాణి పద్మిని అబలనా? పాశ్చాత్య సీమ నుండి తరలి వచ్చి భారత దేశమునకై శక్తి యుక్తుల ధారపోసిన అనీబిసెంటు అబలనా? స్వరాజ్య సిద్ధికై సర్వస్వమును అర్పించి మహిళాస్ఫూర్తికై చెరసాల కేగిన కస్తూరిబాయి అబలనా? మాతృదేశ విముక్తికి పోరాడి కలమును గళమును సమర్పించిన సరోజినీదేవి అబలనా? గార్గి ఉభయభారతి, మైత్రేయి, రాణి పద్మిని, ఆనీబిసెంటు, కస్తూరిబాయి, సరోజినీనాయుడు, విక్టోరియా మహారాణి, మున్నగు వారందరు అబలలు కారు సబలలే అని నిరూపింపబడుటయే కాక వీరాంగనలుగా చరిత్రలో ప్రసిద్ధి చెందినారు. “నారీమణులు కూడా వాదించగలరు, యుద్ధభూమిలో శత్రుసేనలతో పోరాడి విజయాన్ని సాధించగలరు. చక్కటి పరిపాలనా దక్షత గలవారుగా వ్యవహరించగలరని” వారి చరిత్రలు చదివినప్పుడు స్పష్టమగుచున్నది. వీరాంగనలు, విప్లవ వనితలు కూడా భారతదేశంలో ఆనాదే దర్శనమిచ్చినట్లు చరిత్ర చెప్పుచున్నది. ర్లూన్సీ లక్ష్మీబాయి విప్లవ వనిత. ఆమె జీవించినది 28 సం॥లు మాత్రమే అయినా ఆమె వీరగాధ తరతరాల ప్రజల గుండెలలో మారు మోగుతూనే వుంటుంది. శత్రువులు కూడా ఆమె ధైర్య సాహసాలను వ్యక్తిత్వమునూ ప్రశంసించినారు. సర్‌ హ్యూరోజ్‌ తన డైరీలో “ఉచ్చకులము, నీచకులము అనే బేధం లేకుండా ఆశ్రితుల

27

ఎడల సైనికుల యెడల, ఆమెకు గల అపారమైన ఉదారత, క్లిష్ట సమయములో ఆమె చూపు ధైర్య సాహసముల వలన ఆమె అజేయురాలయినది. ఆమె సర్వశ్రేష్ట నాయకురాలు” అని వ్రాసుకున్నాడు. నాటికి, నేటికి, ఏనాటికీ ఆమె భారత దేశ చరిత్రలో ఒక మహోజ్వల వీరాంగన.

రాణి చెన్నమ్మ : _ భారతదేశ చరిత్ర పుటలలో సువర్దాక్షర లిఖితమైన నారీమణుల మణి హారములో రాణీ చెన్నమ్మ సానలు తీరిన “జాతి రత్నం”గా పేర్కొనబడినది. మైసూరు రాష్ట్రంలోని కేలడి సామ్రాజ్యాన్ని ఆమె భర్త మరణానంతరం 25 సం॥లు, సమర్థవంతంగా పరిపాలించిన ధీరవనిత. సాధుశీల. దైవభక్తి పరాయణురాలు. విద్యా సంస్థలను నెలకొల్పినది. దేవాలయాలను నిర్మించినది. గొప్ప వివేకవతి. సుశీల. రామేశ్వరం శ్రీశైలం, తిరుపతి, కాశీ వంటి పుణ్య క్షేత్రాలలో అనేక ధర్మ సంస్థలను నెలకొల్పినది.

దుర్దావతి, తారాబాయి, రుద్రమాంబ, అహల్యాబాయి మున్నగువారందరు కూడా రాజనీతిజ్ఞతతో బాటు, రణ విద్యలను నేర్చిన వీరాంగనలుగా ప్రసిద్ధి చెందినారు.

ఇంకా ఎందరెందరో స్త్రీ మూర్తులు తమ ధీశక్తితో ప్రపంచ చరిత్రలో శాశ్వతమైన కీర్తి నార్జించి “ప్రాణంబు కంటె మానంబె ఘనము భారతీయ సంస్కృతి యందు” అన్న రీతిలో శీలాన్ని రక్షించు కోవడానికి ప్రాణాలు అర్పించడానికి వెనుదీయని త్యాగమూర్తులుగా నిలచినారు. సరోజినీనాయుడు, అవిశ్రాంతంగా స్త్రీల హక్కుల కోసం, మహిళాభ్యుదయం కోసం, యువజనోద్ధరణ కోసం, మత సమైక్యత కోసం శ్రమించి జాతి యావత్తు తద్వారా లబ్టి పొందుటకు కృషి చేసి మహత్తరమయిన చరిత్రను సృష్టించినది. ఆధునిక యుగంలో కూడా అనేకానేక మంది మహిళలు దేశాభ్యుదయం కోసం, సంఘ సంస్మరణ కోసం పాటు పడడమే కాక అంతరిక్షంలోనికి కూడా పయనించి ప్రాణములు కోల్పోయిన ధైర్యవంతులు లేకపోలేదు. విదేశంలో నివసించిన భారత దేశపు వనిత శ్రీమతి కల్ప్చనాచావ్లా ధైర్య సాహసాలతో అంతరిక్షమునకేగి ప్రాణములు కోల్పోయిన చరిత్ర మనకు విదితమే. ఒక స్రీ మూర్తిలో ఉన్న బెదార్యాన్ని చక్కగా ఆవిష్కరించిన మహిళల చరిత్ర ప్రపంచానికే ఆదర్శము. అధ్యాత్మ విషయాలు ఎక్కువగా తెలియకపోయినప్పటికి “మానవసేవే మాధవసేవా అన్న రీతిలో అధ్యాత్మను నిత్య జీవితంలో ఆచరించి ఆచరింప జేసిన ఉదాత్త మహిళలుగా చరిత్రలో నిలచిపోయినారు. సమాజ సేవకు అంకితమయి అనేకానేక విధముల అనేక కోణములలో కృషి చేసిన మదర్‌ థెరిస్సా ప్రశంసనీయురాలు. మహనీయుల మన్ననలను, ఆశీస్సులను పొంది,

28 నిగర్విగా వినయ భావంతో సమాజానికి ఎంతో మేలు చేసిన సేవా పరాయణురాలుగా చరిత్ర పుటలలో లిఖించబడినది.'

నైటింగేల్‌ : అనేక విధముల క్షతగాత్రులకు సేవ చేసినది. యుద్ధ వీరులందరికి రాత్రిపూట క్రావ్వొత్తి తీసుకుని గాయాలు తుడిచి శుభం చేసి (౩108) గాయాల్ని మాని, వాళ్ళందరితో కూర్చుని ప్రేమ పూర్వకమైన మాటలు చెప్పి వారికి ధైర్యాన్ని నూరిపోసింది. వాళ్ళకి గాయాలు మానే వరకు సేవలందించి, మంచి ఆహారాన్ని కూడా అందించి అలసట తీర్చినది. ఆచరణ పూర్వకంగా అధ్యాత్మను నిరూపించిన ఆదర్శ మహిళలు వీరు. జీసెస్‌ చెప్పినట్లు ప్రేమతో పొరుగు వారికి సేవ చేయి” అన్న పద్ధతిలో సేవల నందించిన మహిళల జీవితములు ధన్యము.

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భారత నారీమణులను గురించి విపులంగా విశదీకరించాలంటే ఒక ఉద్ధ్రంధమవుతుంది. అక్కడక్కడ కొన్ని పాత్రలు మచ్చునకు ఉదహరిస్తూ 'జాతి యావత్తూ సన్మార్గంలో నడవడానికి స్త్రీ మూర్తులే కారకులు, అట్టి శక్తి వారిలో నిండి నిబిడీక్సృతమయి ఉందని చెప్పడానికి క్లుప్తంగా వ్రాసిన వ్యాసము మాత్రమే ఇది. సీలు అబలలు కారు సబలలే' శక్తివంతులే. విశ్వశక్తి స్త్రీలలో దాగి ఉంది అని మహనీయులు బోధించిన విషయములు ప్రతి ఒక్కరు గమనించి స్తీ జాతికి తగిన గౌరవ (ప్రపత్తులు అందించాల్సిన అవసరమెంతేని గలదని ఈ సూక్తికి అర్ధము. భగవాన్‌ శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ వారి బోధలలో స్త్రీ మూర్తుల్ని గురించి అనేకానేక విషయములు బోధిస్తూ, స్త్రీలు పురుషులు కలిసిమెలసి అన్యోన్యంగా ధర్మబద్ధంగా సమైక్యతతో జీవించిన నాడు విశ్వమే ప్రశాంతి నిలయమై అశాంతికి తావు లేకుండా ఉందే రోజు ఆసన్నమవుతుందని సెలవిచ్చుచున్నారు.

29 దేహమే దేవాలయం - హృదయమే దైవపీఠం దేహమే దేవాలయం; హృదయమే దైవమందిరం కురిపిస్తే ప్రేమ మకరందం గోచరిస్తుంది సత్యం, శివం, సుందరం అప్పుడవుతుంది జన్మ సాఫల్యం 1! (శ్రీ తులసీరాం)

దేహమే దేవాలయం. * 06/13 126 ల00016 0 606 ” నిష్కామమైన కర్మలాచరిస్తూ పవిత్రమైన భావాలకు నిలయంగా నిస్వార్థమైన సేవ చేసే మానవుని దేహము దేవాలయము అని భావము. బాహ్యశుద్ధితోబాటు అంతఃశుద్ధి కూడా చాలా అవసరము. భగవంతునికి పూజ చేయాలంటే చుట్టూ ఉన్న పరిసరాలను ఏ విధంగా శుభ్రం చేసి, రంగవల్లులతో, మామిడాకుల తోరణాలతో అలంకరించి, శుభ్రము చేస్తామో, అదే విధంగా మన హృదయాన్ని పవిత్రంగా మంచి ఆలోచనలతో, సత్‌ సంకల్పములతో నింపుకొని మలినాన్ని తొలగించి భగవంతుడు కూర్చుందుకు అనుగుణంగా దైవపీఠంగా మార్చుకోవాలన్నదే ఈ సూక్తికి అర్ధము. ఈ దేహాన్ని మలినపు కొంప కాకుండా కాపాడుకోవడం ప్రతి మానవుని కర్తవ్యము.

“దేహము శాశ్వతమైనది కాదు. కాని దేహం దేవాలయం. అది కదిలే దేవాలయం. దేహం ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు అందులో ఉంటాడు. మార్కెట్‌కు వెళ్ళినా, బస్సులో కూర్చున్నా ఆఫీసుకు వెళ్ళినా, దేహంలో దేవుడు మనవెంటనే, జంటనే, ఉంటూ కాపాడుతూనే ఉంటాడు. అందుచేతనే శ్రీ విశ్వంజీ “నేను అక్కడే ఉన్నాను. అంతా నాకు తెలుసు అంటుంటారు. ప్రయాణం చేస్తున్నా అమెరికాలో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఆఖరికి బాత్‌రూమ్‌లో ఉన్నా నేను మీ వెంటనే ఉన్నాను” అని చెప్పడంలో అంతరార్థమిదియే. ఈ జడమైన దేహాన్ని కదిలించేదేమిటి? అందులో ఉన్న ప్రజ్ఞానమే దానిని కదిలింప జేస్తుంది. చలింప జేస్తుంది. సంచరింప జేస్తుంది. దీనికే చైతన్యమని పేరు పెట్టారు.”

30

చైతన్య మున్నంతసేపు శివం. చైతన్యము బయటకు వెళ్ళిపోతే శవం. హృదయమనే మందిరాన్ని శుభ్రపరచటంలో లక్ష్యం, హృదయములో ప్రతిస్టితుడైన దేవుని పవిత్ర భావంతో చూడాలి. లోపల ఉన్న శివాన్ని లక్ష్యమందుంచుకోవాలి. అంతవరకే ఇది జీవితం. శవాన్ని లక్ష్యములో పెట్టుకుంటే అది జీవితం కాదు. శివం మన లక్ష్యం అంటూ బాబా తమ దివ్యోపన్యాసంలో చెప్పినారు

“ద్రేహో దేవాలయః ్రోక్తోజీవో దేవస్సనాతనః ఈ దేహమనే దేవాలయంలో హృదయం జీవునికి మందిరము. “దేవాలయం వంటి ఈ దేహంలో, సృష్టి, స్ధితి, లయ, కారక మైనటువంటి (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మనలోనే దాగియున్నారు. యోగశాస్త్ర ప్రకారం అనుభవ పూర్వకంగా చూస్తే మన దేహంలోనే విష్ణుగ్రంధి, (బ్రహ్మ (గ్రంధి, రుద్రగ్రంధి ఉన్నవి. విష్ణు గ్రంధి స్థానము హృదయము. బ్రహ్మగ్రంధి స్థానము మెదడు. రుద్రగ్రంధి స్థానము వెన్నుపాము. వీటినే హృద్దంధి, చిత్‌గ్రంధి, ఆత్మ గ్రంధి అంటారు. హృద్ధంధిలో ఇచ్చాశక్తి, చిద్ధంధిలో జ్ఞాన శక్తి, ఆత్మ (గ్రంధిలో క్రియాశక్తి నిక్షిప్తమై యున్నవి.

విష్ణు గ్రంథి న్థానము హృదయము. ఇచట అధిష్టాన దేవత లక్ష్మి. ఇచట ఇచ్చాశక్తి యుండును. (ప్రేమకిది స్థావరము. ఇది భక్తి మార్గము.

బ్రహ్మ గ్రంథికి స్థానము మెదడు. ఇచట అథిష్టాన దేవత సరస్వతి. ఇది ఆలోచనల కేంద్రము. ఇందు జ్ఞాన శక్తి యుండును. ఇది జ్ఞాన మార్గము.

రుద్ర గ్రంథికి స్థానము వెన్నుపాము. ఇచట అధిష్టాన దేవత పార్వతి. ఇచట (క్రియాశక్తి యుండును. కర్శకిది కేంద్రము. ఇది కర్మ మార్గము. ఈ మూడును ఒకదాని కొకటి లొంగియుండి పనిచేయవలెను” అంటూ శ్రీ విశ్వంజీ బ్రహ్మ విష్ణు శివాత్మకమైన శక్తులన్ని మనదేహంలో నిక్షిప్తముయి ఉన్నాయని తెలిపినారు. ఈ పూజలూ, ఆరాధనలూ, నీలో ఉన్న దైవశక్తిని వికసింప జేసుకోవడానికే గాని ఆ భగవంతుదేదో చేసి పెడతాడని గాదు. నీలో ఉన్న చైతన్య శక్తిని పరమాత్మ శక్తితో అనుసంధానం చేసుకున్నట్లయితే నీవే ఒక శక్తి కేంద్రంగా మారిపోతావు అని శ్రీ విశ్వంజీ దేహమే దేవాలయం - హృదయమే దైవ పీఠం అన్న శీర్షికన (10-5-88) తమ దివ్యోపన్యాసంలో వచించారు.

31

సృష్టి , స్థితి లయ కారకమైనటు వంటి శక్తి ఆవిర్భవింపబడి సమైక్యమై మనల్ని ఒక దివ్యమైనటు వంటి శక్తి స్వరూపంగా మార్చే తత్త్వము దత్త తత్త్వము. అధ్యాత్మ పరంగా ఈ శక్తునల్ని మనలో దాగి ఉంటే భౌతికంగా కూడా దేహము అద్భుతమైన శక్తులతో కూడుకొని యున్నదన్న విషయాన్ని స్వామి తమ సందేశంలో చెప్పినారు.

“విచిత్రాతి విచిత్రమైనటువంటి అద్భుతాల్లోకి అత్యంత అద్భుతమైనది ఈ దేహము. 06 ౧౧౦5 ౪006ల] 1108 00 16 జరి 1 118 *ఇ0%164 1 ౧00020 006/ మనిషి యొక్క ఈ దేహమే అద్భుతమైనటువంటి పరమాద్భుతమన్న మాట. ఈ విశ్వానికి ప్రతీకయే ఈ దేహము. విశ్వము, దేహము, ఆటమ్‌ (2000), ఈ మూడు కూడా 16౧60210” 6౦౮2] . ఈ దేహములో ఉన్నటువంటి విచిత్రాతి విచిత్రమైనటువంటి రహస్యాలు కనుగొనడానికి భారతదేశంలోని యోగులు సిద్ధ పురుషులు, తాపత్రయపడ్డారు. తపన పడ్డారు. తపస్సు చేశారు. లోపల ఉన్నటువంటి రహస్యాల్ని కూడా కనుక్కుని ఈ శరీరాన్ని శక్తిమంతం చెయ్యడం ఎలాగో మనకు యోగ శాస్త్రము అనే మహత్తరమైనటు వంటి, ఒక 00101121 01264021 50141066 ని ౮౧1౪761321 501ల0606 ని మన కందించి పోయినారు. యోగము మనం అర్ధం చేసుకుందుకు ప్రయత్నం చేద్దాం. యోగ శాస్త్రము సరైన రీతిలో అర్ధము చేసుకుని యోగము కలిగి యోగులుగా మారి ఈ శరీరాన్ని అమృతమయం చేసుకుందుకు ప్రయత్నం చేద్దాం. మృత ప్రాయమైనటువంటి మనం అమృత ప్రాయులుగా మారడానికి [/401121గా ఉన్నటు వంటి మనం 11100121 54056206 గా మారడానికి ప్రయత్నం చేద్దాం. అది కలగజేసేది యోగం. “శ్రీ మహావిద్య” విశ్వయోగం 4వ భాగం (్రంధావిష్క్మరణ సభలో శ్రీ విశ్వంజీ మాట్లాడుతూ రచయిత గుప్తా రహస్యాతి, రహస్యమైన “ధాతువిద్య” “నాద యోగాన్ని” మరికొన్ని విషయాలను, ఈ గ్రంథం ద్వారా మానవాళి ప్రయోజనం కోసం, ఆహార విహారాల లోపాలతో నానాటికి దుర్భరమవుతూ, రోగగ్రస్తమవుతున్న నేటి సమాజానికి అందించడం అదృష్టమని అన్నారు. యోగ క్రియ వలన సంయమనం సాధించి ప్రతి మనిషి కోపాన్ని జయించవచ్చు. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, మూడు కలిసి ఒక్కటైతేనే యోగం. యోగం వల్ల మనిషికి భోగం లభిస్తుంది. లేనియెడల రోగం లభిస్తుంది. ప్రతి మనిషికి కావలసిన శాంతి

32 సౌఖ్యాలు, పరిపూర్ణ ఆరోగ్యం వల్లనే లభిస్తాయి. యోగాభ్యాసం ద్వారా మీ శరీరాలను పటిష్టంగా ఆరోగ్యవంతంగా మలచుకోండి అని స్వామి సెలవిచ్చినారు. దేహమే దేవాలయ మంటూ అత్యద్భుతమైన, మధురమైన కంరస్వరంతో స్వామి

పాడారు. ఆ పాట చూద్దాం.

దేహమే దేవాలయం. హృదయమే దైవపీరం

పంచ కోశముల పంచ ప్రాణముల

పరిపరివిధముల పరుగులు తీయుటే 1దే॥

సమ్మిణశ్రితమై; సమ్మేళనమై

మూడు పురముల ముచ్చటగా

ముద్దులు ఒలికే మోహనరూపం ॥దే॥

త్రిగుణాతీతం త్రిభువన రూపము -

విశ్వానికి ప్రతిరూపం విశ్వసించిన, విశ్వమే దేహం.॥1దే॥

మనసును కలిగి మర్మము తెలిసిన

నీవే దైవము, ఇలలో నిజము

నీలతోయద మధ్యస్థ దిద్యుల్లేఖేవ భాస్వరా

అన్నరీతిలో మెరపుతీగల

మిలమిల మెరిసే త్రిపుర సుందరీ నీలో ఉన్నదీ ॥

దేహమే దేవాలయం హృదయమే దైవపీరం.

అని ఒక రచయిత ఒక కవి ఈ విధంగా పాడుకుంటాడు. దీంట్లో ఎంతో

అర్ధముంది. ఇది త్రి-ఇన్‌-వన్‌. ౧౧166 11 0౦01ల అంటే మూడు పురములు. మూడు దేహాలు, ఒక శరీరం మనకి కనిపిస్తుంది. స్థూల సూక్ష్మ కారణ శరీరాలని మూడు శరీరాలుంటాయి. పంచ కోశములు - అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే పంచ కోశాలతో నిర్మింపబడింది ఈ శరీరం. త్రిగుజాలకి అతీతమై ఉంటుంది. సత్వ గుణము, రజో గుణము, తమో గుణము ఈ మూడు కలిపి ఉన్నాయి. సప్త ధాతువులతో కూడినటు వంటిది. సప్త ధాతువులతో

33

సమ్మిశితమైనటు వంటిది, నిర్మింపబడినది ఈ శరీరము. సప్త ధాతువులతో నిర్మింపబడి, మూడు ప్రాకారములతో, మూడు పురములతో ఉండి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కలిగి పంచ కోశములు కలిగి మనో బుద్ధి అహంకార సమ్మిభ్రిత మైనటు వంటి ఈ శరీరం లోపల ఎంతో చక్కగా నిర్మింపబడింది. ఈ దేహం యొక్క పరిణామక్రమంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎన్నో విధముల మార్పు చెందుతూ ఉంటుంది. మాంసము, రక్త నాళములు, నాడీ కేంద్రాలు అనేకమైనవన్ని ఈ శరీరంలో అవయవాలు చిత్రాతిచిత్రంగా నిర్మింపబడినవి. యోగులు అంతర్జ్భృష్టితో లోలోపలకు పయనించి అనేకమైన రహస్యములు కనుగొన్నారు”.

దీనిని బట్టి పవిత్రమైన దేహమును ఆరోగ్యవంతంగా, పటిష్టముగా, శక్తివంతం కావడానికి సాత్వికాహారం తింటూ కాపాడు కోవాలని ప్రతి ఒక్కరు గ్రహించే విధంగా ఈ సూక్తిని ఇంత చక్కగా స్వామి వివరించినారు.

మరొక సందర్భంలో శ్రీ విశ్వంజీ తమ దివ్యోపన్యాసంలో దేహమే దేవాలయం అన్న సూక్తి కనుగుణంగా “శరీరాన్ని పటిష్టంగా, ఆరోగ్యవంతంగా ఉంచుకొని మీ రోగ నిరోధక శక్తిని పెంచుకొండి. మనిషి యొక్క మనస్సు, శరీరం పటిష్టమైన స్థితిలో ఉంచుకోకపోతే మనిషి పతనానికి గురి అవుతాడు. మన పూర్వులు “ఇదం బ్రాహ్యం, ఇదంక్షాత్రం” అని చెప్పారు. దీన్ని అందరు ఇష్టపడరు కాని *గీ 3040642206 2 806164 0060” అని చెబితే బాగుందంటారు.

పటిష్టమైన వజతుల్యమైన శరీరంలో మేధాశక్తి నిక్షిప్తముయి ఉంటుంది. బ్యాటరీ లైటులో మంచి బ్యాటరీ సెల్స్‌ వేస్తే ఎంతో కాంతి వస్తుంది. మనస్సు 4201 00- 016౧ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. దీన్నిబట్టే కంప్యూటర్‌ వచ్చింది. ఇది ఒక మంచి [66ట108, 20501008 ౦00%044టల 562600. అన్ని మన దేహంలోనే ఉన్నాయి. అందుకే మనవాళ్ళు “దేహమే దేవాలయం, హృదయమే దైవ పీరం”. ఇదే ఇంగ్లీషులో 067 13 116 ౦ల0016 021064. 625 3 10 12 01 46 1016. నీ దేహమంటే అది ఒక నడుస్తున్న దేవాలయం. చర్చి, మసీదు, గురుద్వారా, బౌద్దారామం - దీన్ని గురించి ఎవరూ శ్రద్ధ తీసుకోవటం లేదు. ఇది నా మసీదు, ఇది నా చర్చి, ఇది నా బౌద్దారామం అని మనుష్యులు, నిర్మించిన కట్టడాలు గురించి

34 పోట్లాడుకోకుండా, సఖ్యతతో మత సామరస్యంతో ఉండేవారు కావాలి. ఇదే విశ్వంజీకి ముఖ్యమని గుర్తు పెట్టుకోవల్సిందని హెచ్చరించారు.

భగవాన్‌ సత్యసాయి ఇదే విషయాన్ని తమ దివ్యోపన్యాసంలో “ఈ పవిత్రమైన దేహమును, సనాతనుడైన దేవునకు, నూతనమైన మందిరముగా నిర్మించుకోవాలి. కనుక మీ మనస్సుతోపాటు దేహమును, దేహముతో పాటు మనస్సును పవిత్రము, పరిశుద్ధము గావించుకొని మార్గదర్శకమైన అనుభూతిని అందుకొనటానికి పూనుకోవాలి. ఈ పవిత్రమైన మార్గమునకు క్రమశిక్షణ అత్యవసరము. ఈ డిస్సిప్లిన్‌తో బాటు డివోషన్‌ కూడా అవసరము. డిస్సిప్లిన్‌, డివోషన్‌ రెండింటి ద్వారా మనము డ్యూటీని ఆచరిస్తూ రావాలి.

0౮) 0150111006 60601 - ఇది డకార త్రయము. ఈ డకార త్రయాన్ని మన శరీరంతో పోల్చారు బాబా. డివోషన్‌ తల వంటిది. డ్యూటీ మొండెము వంటిది. డిస్సిప్లిన్‌ పాదాల వంటిది. డివోషన్‌ ద్యూటీతో కలపాలి. డిస్సిస్లిన్‌తో ముందుకు సాగాలి. అప్పుడు జీవితంలో విజయం తధ్యమంటారు బాబా. డ్యూటీ శరీరానికి సంబంధించినది. డిస్సిప్లిన్‌ మనస్సుకు సంబంధించినది. డివోషన్‌ హృదయానికి సంబంధించినది. మనస్సులోని యోచన, మాటలోని సూచన, క్రియలోని ఆచరణ ఏకం కావాలంటారు సత్యసాయి.

ఈ విధమైన పవ్‌త్రతను, నిష్కామకర్మను ఆచరిస్తూ మంచి భావాలతో నిరంతరం మానవుడు మెలగిననాడు, శరీరాన్ని పటిష్టంగా ఆరోగ్యంగా పెట్టుకున్ననాడు హృదయం తప్పక దైవపీఠంగా మారుతుంది. అట్టి హృదయంలో భగవంతుడు తప్పక కలకాలము ఆశీనుడై కూర్చుందుకు సిద్ధపడతాడు. హృదయాన్ని దైవపీరంగా, దత్తపీరంగా మార్చుకున్న ప్రతివ్యక్తి దైవ స్వరూపుడే. నీలోనున్న దైవాన్ని గుర్తించు అని స్వామి చెప్పడంలో అంతరార్థమిదియే.

చెత్తాచెదారము తీసి పారవైచి శుద్ధముగా కర్మలాచరిస్తూ సద్దురు సన్నిధిలో జీవితాల్ని గడపిన వారందరూ ధన్యులే. శ్రీ విశ్వంజీ తరచుగా మనందరకు “శిల్పి బండరాయి” కధ చెప్పి బండరాయను, ఒకానొక శిల్పి ఉలితో కొట్టి, చెడు పదార్థాన్నంతా తొలగించి దివ్యమైన కృష్ణ విగ్రహంగా మార్చినట్లే మానవాళి తమలో దాగియున్న దుష్ట

35

సంకల్పములు, చెడ్డ ఆలోచనలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే అరిషద్వర్గములను దూరం చేసుకుంటూ సంస్కరింపబడాలన్న తపనతో “విశ్వశాంతి అనే గమ్యాన్ని చేరడానికి ఒక ఉపకరణంగా ప్రతి మానవుడు తయారు కావాలన్న ఆదర్శాన్ని బోధించడానికే ఈ కధ స్వామి మనకు తరచుగా చెప్పెదరు.

ఎందుకూ పనికి రాకుండా పడి ఉన్న ఒక రాతిని శిల్పి దివ్యమైన విగ్రహముగా మార్చి పలువురు తరించే విధంగా చేసినట్లే మానవుడు తనలో దాగియున్న చెడ్డగుణాల్ని తొలగించు కుంటూ రావాలని దీని అంతరార్ధము. ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క ముక్క ఎగిరిపడి చక్కటి విగ్రహము తయారయినట్లే క్రమక్రమంగా మనిషి తనలోనున్న ఒక్కొక్క చెడ్డ గుణాన్ని తొలగించుకుంటూ ముందుకు సాగిన నాడు తన దేహం దేవాలయంగాను, తన హృదయం దైవపీరంగాను మారగలుగుట తధ్యము.

36 దయగల హృదయమే దైవమందిరం దయతో కూడుకున్న హృదయము దైవ మందిరము. “ ౧౧6 621 111166 ఇగళు 0000235100 13 106 1ల0016 01 606 ” ఈ విషయాన్ని అనేక మంది మహనీయులు చాటుతూ వచ్చారు. దయ, హద్దులు లేనిది. దయా స్వభావమే వ్యక్తుల్ని మహనీయులుగా, మహాత్ములుగా, అవతార మూర్తులుగా, యోగులు సిద్ధ పురుషులుగా మార్చి వేసినది. దయామూర్తిగా దర్శనమిస్తున్న దత్తమూర్తి శ్రీ విశ్వంజీ చరిత్ర చూస్తే తన హృదయమే

మందిరంగా మార్చుకుని చిన్న నాటి నుంచి దయ, (ప్రేమ, కరుణ, త్యాగము మున్నగు గుణములన్ని పెంపొందించు కొని నేడు విశ్వగురువైనారు. సాధన చేత, శోధనచేత, సద్‌ గ్రంధ పఠనం వలన అన్ని మతముల సారమొక్కటే, అందరి భగవంతుడొక్కడేనని తోటి మానవులంతా భగవత్‌ స్వరూపులేనని భావించినారు. అపారమైన దయా స్వభావంతో యోగీశ్వరేశ్వరుడై విశ్వభావనతో “విశ్వనగరొ”లో విశ్వమానవ సమైక్యతా స్థూపాన్ని నిర్మించి విశ్వానికే ఆదర్భప్రాయులై నిలచారంటే దయా స్వభావమే దీని కంతకు కారణమని భావించాలి. హద్దులు లేని ఆ దయ, ఆ (ప్రేమ, విశ్వమాతగా విరాజిల్లునట్లు చేసిన దనడం అతిశయోక్తి కాదు. శ్రీ తులసీరాం గారు విశ్వ సూక్తావళి అనే చిరుపొత్తముల్రో శ్రీ విశ్వంజీని ఈ విధంగా అభివర్ణించినారు.

దేవుడు దయగల వాడికి మిత్రుడు

త్యాగికి నిరంతరం సంరక్షకుడు.

సహనశీలుడికి మార్గదర్శకుడు

ఆత్మనిగ్రహం గలవాడికి పరమాస్తుడు!

అన్నింటిలో తనను చూచుకుంటూ

తనలో అన్నింటిని సందర్భ్శించుకుంటూ

3/7

నిత్యం బ్రహ్మ భావనతో ఉండేవాడే

అవధూత - విశ్వయోగి జీవన్ముక్తుడు.

ఇటువంటి భావాలు కలిగాయంటే దయ, కారుణ్యం (ప్రేమ వంటి సద్దుణాలకు చిన్ననాడే పునాది వేయబడింది. విశ్వయోగిగా మారడానికి దోహదం చేసినది. మానవోద్ధరణకు, ధర్మ సంస్థాపన కొరకు భగవంతుడు పలుమారులు పలు రూపములలో ఆవిర్భావం చెంది, నశించిపోతున్న ధర్మాన్ని ఉద్ధరిస్తూ అడుగంటి పోవుచున్న భారతీయ సనాతన ధర్మ విశిష్టతను బోధిస్తూ మానవతా విలువల యొక్క ప్రాముఖ్యత, విశిష్టతను ఎరుక పరుస్తూ మానవాళి నుద్ధరించుటకు అపారమైన దయతో శరీరం ధరించి ఈ భూమి మీదకు రావాలనుకోవడం మానవాళి పట్ల దయతోడనే, (ప్రేమను పెంచి పంచడం కోసమే, సమైక్యతను సాధించడం కోసమేనని గ్రహించాలి. విశ్వశాంతి, విశ్వ కళ్యాణం జరిపించడం కోసమే నరాకారం ధరించి నారాయణుడు కాలానుగుణంగా అనేక రూపములు ధరించడం మానవాళి పట్ల దయతోడనే.

ఇటీవల శ్రీ విశ్వంజీ తమ దివ్యోపన్యాసంలో “మానవుడు జన్మరాహిత్యం కోరడం కన్న మనిషిగా పుట్టి సద్గురువు సన్నిధిలో ఒక పనిముట్టువలె లోక కళ్యాణార్థం ఉపయోగపడాలని, మనిషి మనిషిగా మహామనీషిగా సంస్కరింపబడి గృహాన్ని ప్రశాంతి నిలయంగా మార్చుకుని, దేశ ప్రగతికి సమైక్యంగా కృషి చేయాలని, తద్వారా విశ్వశాంతి సాధనకు మహనీయులు (అవతారపురుషులు, యోగులు, సిద్ధ పురుషులు) చేయుచున్న కృషికి తానొక ఉపకరణం కావాలని బోధిస్తున్నారు. అందుచేతనే “శరీరమాద్యంఖలు ధర్మ సాధనం” అన్నారు. ఈ శరీరమనే పనిముట్టు ద్వారా మానవుడు దేనినైనా సాధించ గలడు. అవతారమూర్తి కూడా ప్రతియుగంలోనూ ధర్మమునకు గ్గాని సంభవించినప్పుడు దివ్య సంకల్పంతో మానవోద్ధరణకు, విశ్వ కళ్యాణం కోసం అనేక రూపాలతో అవతరిస్తున్నప్పుడు, మానవుడు జన్మరాహిత్యం కోరడం సముచితం కాదని స్వామి చెప్పినారు. ప్రతి యుగములోనూ భగవదవతారముతో కలిసి జీవించడం మానవాళి

368 చేసుకున్న పుణ్యము. గురువు సన్నిధిలో జీవిస్తూ వారి ఆజ్ఞను పాటిస్తూ, సేవ చేసుకుని సద్భాగ్యానికి నోచుకున్న వారందరు దయా స్వరూపులుగా మారి సమాజాన్ని ఉద్ధరిస్తూ “పరులు పరులు కారు పరమాత్మ స్వరూపులే” నన్న ఎరుకతో మెలగగలగడం థ్రేయస్మరము. శో అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమ దుఃఖ సుఖఃక్షమీ॥ కేవలం తోటి మానవుల పట్ల దయ చూపడమే కాదు; సర్వభూతముల పట్ల దయతో మెలగ వలయునన్న విషయాన్ని భగవద్గీత కూడా బోధించినది. ఎంతటి విద్యావంతుడైనప్పటికిని ఎంతటి శక్తిసామర్ధ్యములు కలిగిన వాడైనప్పటికిని, భూతదయనే లేకుండిన వాని సర్వస్వము శూన్యమవుతుంది. భూతదయ మానవునికి ప్రధానమైన సద్దుణము. ఇట్టీ భూతదయ యందు కొంత విచక్షణా జ్ఞానాన్ని విజ్ఞతను ప్రదర్శించాలి. భతదయ అనగా బాధపడుచున్న వ్యక్తులను, జీవులను చూచి, సాధ్యమయినంత చేతనైనంత వారికి సహాయము చేయటానికి ప్రయత్నించాలి. వారి బాధలు, వారి దుఃఖములు వారి కష్టములు నివారణ చేయుటకు తగిన కృషి చెయ్యాలి. దయ, దయ యని మాటలు వల్లించినంత మాత్రమున ప్రయోజనము లేదు. ఆచరణ రూపంగా దీనిని ప్రకటించాలి. దయగల హృదయమే దైవ మందిరమని విశ్వసించాలి. ప్రతి ఒక్కరు సర్వభూత దయాపుష్పం అనే దానిలో ఉండిన అంతరార్థమును గుర్తించాలి. అష్ట పుష్పములలో దయా పుష్పమునే భగవంతుడు అంగీకరిస్తారు. దేనిని పుచ్చుకుంటాడు? దేనిని మెచ్చుకుంటాడు? దయా పుష్పమును మాత్రమే. (ప్రేమవుష్పమును మాత్రమే. హృదయ పుష్పమును మాత్రమే మెచ్చుకుంటాడు. పుచ్చుకుంటాడు. దైవము సర్వజీవుల యందు వుంటున్నాడనే సత్యాన్ని గుర్తించాలి. దయ అభ్యాసముచే లభించేది కాదు. హృదయ పరివర్తన కావాలి. అందరి యందుండిన దైవత్వము ఒక్కటే అనే సత్యమును గాఢముగా విశ్వసించాలి. అప్పుడే తన దుఃఖమును తాను అనుభవించినట్లుగా తన ప్రతి బింబమును తాను చూచినట్లుగా పరుల

39

దుఃఖమును, పరుల బాధను తాను గుర్తించును” అంటూ గీతోపన్యాసములలో శ్రీ సత్యసాయి శెలవిచ్చినారు.

పూల గుత్తులెన్ని పూజలో నుంచినా,

మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు

హృదయ కలశమొసగ సదయుదై గ్రహియించు

శాంతి ప్రేమ దాయి సత్యసాయి

అంటూ శ్రీ విశ్వంజీ సత్యసాయి - శాంతి పప్రేమదాయి శతకంలో వ్రాసినారు. అదే విషయాన్ని సత్యసాయి తమ దివ్యోపన్యాసములో చెప్పినారు. హృదయ కమలమిస్తేనే భగవంతుడికి ప్రీతిపాత్రమని దయగల హృదయంలోనే దైవం నివసిస్తాడని ఇద్దరు అవతారమూర్తులు శెలవిచ్చిన ఈ సూక్తిని చదివిన వారు హృదయంలో పరివర్తన తెచ్చుకుందుకు ప్రయత్నించాలని భావము.

బుద్ధుడు, జీసెస్‌ క్రీస్తు, షిర్డి సాయినాధుడు, భగవాన్‌ సత్యసాయి మున్నగు ఎందరెందరో అవతారమూర్తులు ఈ అనంతమైన విశాలమైన విశ్వంలో దయా దాక్షిణ్యాలు కరువైన ఈ కలికాలంలో ఆవిర్భవించడానికి కారణం వారి దయా స్వభావమే. ఈ అవతార మూర్తులందరూ దయా స్వభావానికి ప్రతీకలే. దయామూర్తి అని, దయా సారమని భగవాన్‌ సత్యసాయి సహస్ర నామాలలో క్షీర్తిపబడుతున్నారంటే దయా స్వభావమే దీనికి కారణము. వెంకావధూత ప్రార్ధించగా దయతో రత్నాకర వంశంలో అవతరించి శ్రీమతి ఈశ్వరమ్మ, వెంకమరాజుల ముద్దు బిడ్డగా సత్యన్నారాయణుడన్న నామంతో వ్యవహరిస్తు అనతి కాలంలోనే “సాయిబాబా” నని అవతార ప్రకటన చేసి బాల్య లీలలతో, భజనలతో, మహిమలతో అద్భుత బాలుడుగా ప్రసిద్ధి చెంది, పుట్టపర్తి పుణ్యక్షేత్రంగా, ఉన్నతమైన అధ్యాత్మ కేంద్రంగా మార్చి అన్ని రంగాలలో అభివృద్ధి సాధించారంటే మానవాళి పట్ల తనకున్న దయయే కారణమని భావింపనగును. “దైవం ఎక్కడో కాశీ రామేశ్వరాలలోను, బద్రీనాధ్‌లోనూ లేడు. సర్వత్రా ఉన్నాడు. దైవం

త0 యొక్క (62656 ౦09121 266033) అత్యంత సమీష్యమైన తపాల చిరునామా నీ హృదయమే. అతడు హృదయవాసి, వృదయమంటే ($033022] ౧62గ 101 051021 162%.) అన్నారు బాబా. అలనాడు వస్తాపహరణ సందర్భంలో (ద్రౌపది శ్రీ కృష్ణుణ్ణి, శ్రీ కృష్ణా ! గోపాలా ! యశోదానందనా ! అంటూ ఎన్ని విధాల పిలిచినా పలుకలేదు. హృదయ నివాసి అనగానే తక్షణం వచ్చి ఆమెను కాపాడి రక్షించిన ఉదంతంలో నున్న అంతరార్థము కూదా హృదయమే, (3011121 62%) అతని నివాసమని సృష్టమయినది. సహజంగా మానవుడు దైవాంశ సంభూతుడు. మానవత్వం దైవత్వంతో వేరైనదని భావించక దైవత్వము మానవత్వము ఏకత్వమైన బింబప్రతి బింబములే” అని విశ్వసించాలి. ఆత్మ సత్యం, హృదయం శివం, భావం సుందరం. ఇవన్ని మన హృదయమందే ఉన్నాయి. మన శ్వాసయే మంత్రం. మన దేహంలోనే అంతర్వాణి క్షణక్షణం సోహం సోహం అని దినమునకు 21,600 పర్యాయములు బోధిస్తున్నది. కాని (కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు) అరిషడ్వర్ణములు మానవుని ఆవరించి అతనిలోని దైవత్వమును (ప్రకాశించకుండా అద్దుపడుతుంటాయి. వాటిని సాధన ద్వారా తొలగించు కున్నప్పుడు దివ్యత్వాన్ని పొంద గల్గుతాడని భగవాన్‌ సత్యసాయి సెలవిచ్చినారు. త్యాగము, నిర్మలత్వము, పవిత్రత, ఐక్యత, దివ్యత్వము, (ప్రేమ జనితమైన త్యాగము, (014560 పరప 0 యసుుధ చిత్త శుద్ధిని కలుగజేసి పవిత్రతకు దారి తీస్తుందని అట్టి పవిత్రత ఏకత్వాన్ని సాధించి దివ్యత్వాన్ని పొందుతుందని బాబా పేర్కొంటూ దైవత్వం - మానవ ప్రయత్నం ఈ రెండూ కూడినప్పుడే దివ్యత్వమును అనుభూతికి తెచ్చుకొనవచ్చు నని చెబుతూ “దయ గల హృదయమే దైవమందిరము” అన్నారు. గౌతమ బుద్దుని జీవిత చరిత్ర పరిశీలించి చూస్తే సిద్ధార్థడుగా అంతఃపురంలో భోగభాగ్యాలనుభవిస్తూ భోగియై జీవితాన్ని గడిపి బయట ప్రపంచంలో దుఃఖము, బాధలు, హింస మున్నగునవన్ని చూచి సర్వము త్యజించి సాధన చేత, శోధన చేత, తపస్సు చేసి హింసని అరికట్టడమే కాకుండా త్యాగమూర్తిగా మారి దయతో నిండిన హృదయంతో

త]

అహింసాతత్త్వాన్ని ప్రవేశ పెట్టి అనేకమంది శిష్యులతో, భక్తులతో చేరి బౌద్ద మతాన్ని విశ్వ వ్యాప్తం చేసిన మహనీయుడుగా ప్రసిద్ధి చెందినాడు. బుద్దుని జోధలు అందరు ఆచరించి నేటికిని అనేక దేశములలో ధ్యానము ఆరాధన సల్పుతు హింసా తత్త్వానికి దూరంగా ఉండి దయతో నిండిన హృదయంతో దుఃఖితులకు చేయూతనిస్తూ ఆయన్ని అనుసరించేవారు ప్రపంచంలో అన్ని మూలల వ్యాపించి యున్నారు.

జీసెస్‌ కూడా (ప్రేమతో బాటు దయా స్వభావానికి ప్రతీకగా నిలచి చక్కటి బోధలను విశ్వమున కందించిన మహనీయుడు. ఈనాటికి శ్రీ సత్యసాయి, శ్రీ విశ్వంజీ మొదలగు అవతార మూర్తులందరు క్రీస్తు బోధల్ని మనందరకు అందిస్తూ క్రిస్టమస్‌ పండుగను జరుపుతూ దయకు ప్రేమకు ప్రతీకయే జీసెస్‌ అని తెలియజేయుచున్నారు.

ఇంతటి దయా స్వభావంతో కూడుకున్న మహనీయులను గన్న మాతృభూమి భారతదేశము. అట్టి పవిత్రమైన పుణ్యభూమిలో జన్మించిన వారందరు హృదయాల్ని పవిత్రం చేసుకుని దయగల హృదయంగా మార్చుకుని అదే దైవ మందిరమని విశ్వసిస్తూ వారి అడుగు జాడలలో నడవడమే కర్తవ్యమని భావించమని బోధిస్తున్నది ఈ సూక్తి. ఆచరించిన వారికి ఆనంద ప్రాప్తి చేకూరగలదని చెప్పుట అతిశయోక్తి కాదనుకుందును.

త2 పవిత్రత అన్నవోట పరమాత్తుడుంటాడు

  • గలం 0ల61 ౧060 గ౧ల౦ యెషటి) 13 1110/” ఎక్కడ పవిత్రత నెలకొంటుందో అక్కడ పరమాత్ముడుంటాడు. “పవిత్రత ఉన్నచోట పరమాత్ముడుంటాడు” అని తరచుగా శ్రీ విశ్వంజీ ప్రస్తావిస్తుంటారు. త్రీ విశ్వంజీ విశ్వకళ్యాణ నిమిత్తం తాము తలపెట్టిన మహా యజ్ఞానికి పునాది వేస్తూ నాందిగా సత్యం, శీలం, పవిత్రత, సమైక్యత, అను నాలుగు ప్రధాన లక్ష్యాలతో విశ్వమానవ సమైక్యతా పతాకమును విశ్వమందిరములో వారు ఆవిష్కరించినారు. దివ్యత్వంతో కూడినప్పుడు పవిత్రత సమైక్యతకు దారి తీస్తుంది. సమైక్యతతో అనేక పనులు సాధించవచ్చును. హృదయం నిండా మానవత్వాన్ని నింపుకొని తద్వారా పవిత్రత సాధించవచ్చు నంటారు విశ్వంజీ. భగవంతుడున్నాడు; కాని హృదయ పరిశుద్ధత లేనప్పుడు కనిపించుట లేదు. కుండలో నీరున్నంతవరకు సూర్యుని ప్రతిబింబము కనిపించును. కాని నీరు లేనప్పుడు అది కనిపించదు. మానవ దేహము, ఒక కుండ (00 వంటిది. దేహమనే కుండలో (ప్రేమ అనే నీరు ఉన్నంతవరకు దివ్యత్వం చక్కగా ప్రతిబింబిస్తుంది. కాని, పేమ అనే నీరు లేకపోతే ప్రతిబింబము కనిపించదు. ఈ ప్రేమ హృదయ సంబంధమైనది. ఒక్కక్షణంలో పెరిగిపోయి మరుక్షణంలో తరిగిపోయేది (ప్రేమ కాదు. “చావు పుట్టుక లేనట్టి జీవు హృదిలో నిత్య నిర్మల జ్యోతియైనెడగు ప్రేమ”. ఇట్టి ప్రేమను పెంచుకోవాలి. మానవుడు కూడా ఆహార నిద్రా భయ మైధునాలత్రో జీవిస్తుంటే తనకు, పశువులకు వ్యత్యాసముండదు. తను మానవత్వాన్ని నిలుపుకోవాలి. ఇంద్రియాలకు లోబడడం చేత అవధూతలుగా మారవలసిన మానవులు యమదూతలుగా మారుతున్నారని, ఇది సరియైనది కాదని భగవాన్‌ సత్యసాయి పేర్కొన్నారు.

“సర్వలోక హితేరతళా - అందరూ కూడా లోకహితాన్నే కోరేవారు. “సర్వే నముదితాగుణైః అందరూ మంచి గుణములతో ఉండాలని ఆశించేవారు. “సర్వేజ్ఞానోపసంపన్నః హృదయంలో జ్ఞానాన్ని నింపుకోవాలి. సేవలలో దేహాన్ని పవిత్రము గావించుకోవాలి. వాగ్లోషము లేకుండా సత్యహక్కును అభివృద్ధి పరచుకోవాలి. దేహమును

తం

పాపకార్యములలో ప్రవేశ పెట్టవద్దు. పవిత్రమైన దేహము, పరిశుద్ధమైన హృదయము, స్వచ్చమైన వాక్కు మూడింటి సమ్మేళనమే మానవ స్వరూపము. దీనినే * [6౫౦౫ల 506 0€00201006 15 02) ” అన్నారు.

పరమ పావనమైన భారతావని యందు

సహనమన్నదే మనకు చక్కదనము

వ్రతములన్నిటి యందు వన్నె గాంచినయట్టి

ఘన సత్య శీలమే కరినతపము.

భారతదేశము అనాది కాలం నుంచి సహనంతో, శీలమే కరినతపముగా ఆచరిస్తూ, ఎందరెందరు దండెత్తి వచ్చినను ఓర్పుతో సహించినది. అటువంటి పరమ పవిత్రమైన భారతావని పుణ్య భూమిలో దత్తావతారము విలక్షణమయిన రీతిలో కొన్ని కోట్ల సంవత్సరముల నుంచి దేశ కాలమాన పరిస్థితుల కనుగుణంగా మానవాళి నుద్ధరించడానికి మానవుడిలో దాగియున్న దుష్ట గుణాల్ని మాత్రం సంహరించి ఉత్తమ మానవుడుగా తీర్చి దిద్దడానికి శరీరం ధరించి భూమి మీద అవతరించడం విశేషం. దీనికి పరిసమాప్తి లేదని నిత్య సత్య శాశ్వతమైనదని స్వామి సెలవిచ్చినారు. ఆయుధములు లేని విశ్వ సామ్రాట్టు వలె అవతరించి దుష్ట గుణములను బలహీనతలను (ప్రేమతో పోగొట్టి మనిషి మనిషిగా మారుటకు దోహదము చేయునట్టిదీ దత్తావతారము.

పరమపురుషుల, అవతారమూర్తుల, యోగుల, సిద్ధప్రురుషుల యొక్క ఉనికితో భారతదేశం పవిత్రత సంతరించుకొని పరమ పావనమైన పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందినది. వారి ఉనికి వలన, దివ్యత్వము సంతరించుకొని యోగ భూమిగా పేరు గాంచినది. యజ్ఞ యాగాది క్రతువులు, దేవాలయాలలోని నిత్యపూజలు ఆరాధనలు, పవిత్రమైన నదులలో స్నానమాచరించుట పుణ్యమూర్తులందరు పలు ప్రదేశములలో నడయాడుట వలన పవిత్ర భూమిగా చెప్పబడినది. త్యాగమూర్తులు పలువురు అనేక రకములుగా త్యాగము చేసి స్వాతంత్రోద్యమములో పాలు పంచుకొని దేశము కొరకు అసువులు బాసిన అమరజీవు లెందరో ఈ భారతావనిలో వెలయుట వలన త్యాగ భూమిగా మారినది. సమస్త ఐశ్వర్యములకు నిలయమై ఎందరెందరో ఈ దేశముపై దండెత్తి సరి సంపదలన్ని దోచుకున్నప్పటికి అధ్యాత్మకు నిలయమై నిలచిన భారత మాత సహనము కొనియాడ దగినది.

టీ ఇన్ని విధముల పవిత్రత సంతరించుకొని భారతభూమి పవిత్రతకు పట్టుగొమ్మై నిలచిన కారణముగా పరమాత్మకు నిలయమైనది. మిగిలిన దేశములకు ఆదర్శముగా నిలచినది ఈ పుణ్యభూమి. ప్రపంచ దేశాలన్నిటికి హృదయస్థానము భారతదేశము అని స్వామి తమ దివ్యో పన్యాసములలో భారతదేశమును కొనియాడుచున్నారు. వేదములకు నిలయము గనుక వేదభూమిగా, ఎందరెందరో మహనీయులు తపమాచరించిన కారణంగా తపోభూమి అనే పేరు కూడా ఈ మాత సంపాదించుకొన్నది. పవిత్ర కర్మల నాచరించుట వలన కర్మభూమియైనది. ఇట్టి పవిత్రమైన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు పృధ్వీమాతను ఆరాధిస్తూ, ఈ దేశ గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలను కాపాడడం ధర్మమని మహనీయులందరు బోధించుచున్నారు. “భారతదేశం భవిష్యత్తులో ఉపాధ్యాయ స్థానంలో ఉంటుంది. అన్ని దేశముల వారిని ఆదేశించే స్థితికి వస్తుందని” శ్రీ విశ్వంజీ సెలవిచ్చినారు. 2020 నాటికి అగ్రదేశంగా విరాజిల్లుతుందని భారతదేశం హృదయం లాంటిదని అమెరికా దేశం మెదడు వంటిదని మిగిలిన దేశములన్ని ఒక్కొక్క అంగము వంటివని, భారతీయ సనాతన ధర్మం ఎన్నటికీ మార్చు చెందేది కాదని అందరూ ఆచరించ తగ్గదని, స్వామి తమ అమెరికా పర్యటన సందర్భంగా అక్కడ తమ దివ్యోపన్యాసంలో పేర్శొన్నారు. గొప్ప విశిషమయిన భారతీయ సనాతన ధర్మము చెప్పిన విషయములు పరమ పవిత్రములని, అర్ధములతో అంతరార్ధములతో కూడి యున్నవని ప్రతి ఒక్కరు ఆ ధర్మాన్ని ఆచరించిననాడు (ప్రపంచ మంతా ప్రశాంతి నిలయమై విరాజిల్లగలదని వచించినారు. ప్రపంచంలో ఏ మత ప్రవక్త చెప్పినా అది సనాతన ధర్మంలోనిదే. అది ఒక మహా సముద్రంలాంటిది. అట్టి పవిత్రతకు నిలయమైన భారతావనిలో పరమాత్ముడుండుట తధ్యమే కదా! ఇచట వెలసిన పరమాత్మ ఈ దేశమ్సన్సక్తే పరిమితము కాక విశ్వ వ్యాపియై అన్ని దేశముల యొక్క విశిష్టతను చాటి చెప్పుచున్నాడు. ఈనాడు శ్రీ విశ్వంజీ వంటి మహనీయులు విదేశములలో పర్యటిస్తూ భారతీయ సనాతన ధర్మము యొక్క విశిష్టతను చాటి చెప్పుచున్నారు. అనేకమంది అనేక దేశముల వారు అధ్యాత్మ కేంద్రమైన పరమ సవిత్రమైన పుట్టపర్తికేతెంచి మానవతా విలువల అర్ధము తెలునుకుని ఆచరించుటకు యత్నించుచున్నారు. శ్రీ విశ్వంజీ నిర్మించిన “విశ్వనగరొకు కూడా అనేకమంది విదేశీయులు విభిన్న మతముల వారు విచ్చేసి విశ్వ సందేశమును వినీ ముగ్భులగుటచూచుచున్నాము. “సంస్మరణ మనగా మన నిత్య జీవితంలో ఉన్న దోషములను నిర్మూలన గావించి పవిత్రతను సద్భావములను, అభివృద్ధి గావించు కోవడమే” అంటారు భగవాన్‌ సత్యసాయి.

4ీ5్‌ జగ | అలి ప్రార్థన పర్వతాలను కదిలిస్తుంది 4 నామస్మరణే ముక్తికి మార్గం

భక్తునికి, భగవంతుని అనేక నామములు, జీవితానికి ఆభరణముల లాంటివి. మానవాళి వాటిని ఉచ్చరిస్తూ ఎంతో ఆనందాన్ని పొందగలదు. దుమ్ముతో నిండిన అద్దమును తుడిచినట్టు ఆత్మనావరించిన అంధకారము నామ సంకీర్తనము వలన తొలగిపోయి ప్రకాశవంతము చేయును. భక్తుడైన రోగికి భగవంతుని నామ సంకీర్తనే రోగనివారణ. ఎడతెరపి లేకుండా భగవంతుని నామ సంకీర్తనము, సామూహిక భజనలు భగవద్భక్తి అనే మత్తు వల్లనే చేయగలరు. భాగవతములో తొమ్మిది రకములయిన భక్తి విధానములు వివరింపబడినవి.

(శ్రవణం కీర్తనం విష్ణుః స్మరణమ్‌ పాదసేవనమ్‌.

అర్చనం వందనం దాస్యం సఖత్వమాత్మ నివేదనమ్‌.

భగవంతుడు ఈ తొమ్మిదింటిలో అతి సాధారణమైన దానితో కూడా తృప్తి చెందగలడు. నామ సంకీర్తన అన్నింటికంటే సులభతరము. సురక్షితము. అధిక (ప్రభావము కలది. భగవంతుని అనుగ్రహము పొందుటకు ఇది సక్రమమైన దారి. భగవంతుని ముందు భక్తుడు తన మూఢ నమ్మకాలను, ద్వేషము, గర్వము, మున్నగునవి వదులుటకు పరికరము వంటిది నామస్మరణ.

భగవంతుని గురించి వినటం ద్వారా పరిక్షిత్తు, సంకీర్తనము వలన ప్రహ్లాదుడు, పాదసేవనము వలన లక్ష్మి అర్చన వలన ్రిధు, అక్టూరుడు, ఆంజనేయుడు దాస్యము వలన, ఆత్మనివేదనము వలన బలి చక్రవర్తి, భగవంతుని అనుగ్రహమునకు పాత్రులైనారు.

మూకం కరోతి వాచాలం

పంగుం లంఘయతే గిరిం

యత్కృపా తమహం వందే,

పరమానంద మాధవం॥।

46 మూగవాడు పలుకగలిగినా, కుంటివాడు నడువ గలిగినా, ఏ రకమయిన శాస్త్ర విజ్ఞానము లేని ఒక బోయవాడు (రత్నాకరుడు) సప్తబుషుల సంపర్మముచే “మరామరా” అని జపిస్తూ జరుగబోయే రామాయణాన్ని ఊహించి దివ్యమైన సంకల్పముతో రచించి ఒక వాల్మీకి మహాకవిగా ప్రసిద్ధి చెందిన వృత్తాంతము ప్రార్ధన ఫలితాన్ని, నామస్మరణ విశిష్టతను తెలియజేస్తోంది. రామనామము ఉచ్చరించటం చేత రాముని తేజస్సు ప్రతిబింబించింది. తేజోమయ స్వరూపుడుగా ప్రకాశించాడు. ఆ ప్రకాశం నుండే రామాయణం ఉద్భవించింది అని సెలవిచ్చారు స్వామి. నిరంతరం నారాయణ నామ స్మరణచే ప్రహ్లాదుని రూపము తేజోమయంగా మారిపోయినది. నామస్మరణ కేవలం తాత్కాలిక ఆనందమునే కాదు, శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైన నిరంతరానందమును చేకూరుస్తుందని సత్యసాయి బాబా చెప్పారు. ఓం నమో నారాయణ అనే నామాన్ని జపించడం వలన ప్రహ్లాదుడు అనేకానేక కష్టముల నెదుర్శొని రాక్షసుల బారి నుండి కాపాడ బడడమే కాకుండా ఆ రాక్షసులు కూడా ఈ నామ స్మరణతో తన్మయత్వము చెంది మైమరచి రాక్షసరాజు ఆనతి మేరకు ప్రహ్సాదుణ్ణి శిక్షించడానికి బదులు ఆతని నోటి వెంట వెలువడిన మంచి మాటలతో తరుణోపాయం చెందారని చెప్పవచ్చును. భగవన్నామానికున్న శక్తి అట్టిది. ఇనుమయనస్మొంత సన్నిధినెట్లు భ్రాంత మగు; హృషీకేశు సన్నిధి నా విధమున గరగుచున్నది దైవయోగమున జేసి బ్రాహ్మణోత్తమచిత్తంబు భ్రాంతమగుచు. “ఇనుము అయస్కాంత సన్నిధికి ఎట్లు చేరుతున్నదో, అలాగే భగవత్సాన్నిధ్యమున తన చిత్తము పరవళించుచున్నది” అని ప్రహ్లాదుడు తెలియజేసినాడు. ఈ మహాశక్తియే ప్రహ్లాదునితో క్రోథమనే హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి, అంశావతారమైన నృసింహుని

స్‌

ఆవిర్భావానికి కారణ భూతమయినది. తద్వారా దుష్ట శిక్షణ జరిగి ధర్మము సుస్థాపితమయినది. అనాదికాలం నుంచీ భారతదేశపు అధ్యాత్మ చరిత్రలో ఇటువంటి సంవుటనలు కోకొల్లలు. నామతత్వము చాలా పవిత్రమైనది; దివ్యమైనది. భగవన్నామంతో విషం కూడా అమృతంగా మారిపోయినది. విషషముయమైన పాలను త్రాగుతూ “కృష్ణా !? అని మీరా నామస్మరణ చేసినపుడు ఆ పాలు అమృతమయంగా మారిపోయినవట. త్రికరణశుద్ధితో నామస్మరణ గావించినప్పుడు ఎంతటి అసాధ్యమయిన పనినైనా సాధించవచ్చును.

“నామస్మరణ చెయ్యటం రెండు విధాలు. మొదటిది జపమాలనుపయోగించి, దానిమీద దృష్టి లేకుండా ఒక క్రమ పద్ధతిలో నామస్మరణ చేయుట. రెండవది మొత్తం ఎన్నిసార్లు స్మరించాలి అని లెక్కించకుండగా, ఆ సంఖ్యపై మనస్సు లేకుండగా నాలుకపై నామస్మరణము, మనస్సులో రూపధ్యానము చేస్తూ ఆ మాధుర్యములో ఓలలాడుతుండుట. మీలోవేదన ఆర్తి ఉంటేనే కాని మీరు ఆ నామ మాధుర్యాన్ని గ్రోలలేరు. (ప్రాపంచిక వ్యవహారాలలో తలమునకలుగా ఉన్న మీకు నామము, రూపము లనేవి ఎంతో ఊరట కలిగిస్తాయి. “భగవంతుని గుణ గణములను వర్ణించుటకంటే, లీలలను గానం చేయటం కంట్వే తత్వములను భావములను కీర్తించుట కంటే నామమును ఉచ్చరించుటయే పవిత్రమైనది. ఒకే నామమును అందరూ ఒకేసారి ఉచ్భరించినప్పుడు, దైవత్వమనే ప్రకాశము అందరి యందూ వెలుగుతుంది”. (బాబా)

అధ్యాత్మిక బోధనకు నామస్మరణయే పునాది. హరేర్నామ హరేర్నామ, హరేరామ, హరేర్నామైవ కేవలం “కస్వెనాస్వెవనాలౌవ నాస్యేవ నాస్యైవగతిరన్యధా.” కాబట్టి ఈ కలియుగంలో నామానికి మించినది లేదు. కలియుగమున నామ సంకీర్తనమే తరుణోపాయము.

అన్ని నామములు పరమాత్మునివే. మనస్సు అనే మదపుటేనుగును నామస్మరణ అనే పగ్గముతో కట్టి వేయవచ్చును. తనలో నివసించే పరమాత్మను గుర్తించి

48 నిత్యానందమును పొందవలెనన్న నామస్మరణము అత్యవసరము. పరమాత్మను సులభముగా కట్టి వేయగలది ఒక్క నామమే. నామస్మరణతో పరమాత్మను పొందవచ్చును. పరమాత్మలో లీనం కావచ్చును. భగవాన్‌ సత్యసాయి 1961 లో తమదైన ఒకానొక దివ్యోపన్యాసంలో “నామస్మరణ వల్ల ప్రారబ్ధం కరిగిపోతుంది” అన్న శీర్షికన ఒక కథ చెప్పారు. కేరళలో 500 సంవత్సరాల క్రితం బిల్వ మంగళుడనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు కృష్ణుణ్జి పిలువగానే కృష్ణుడు సాక్షాత్కరించేవాడు. అతని భక్తి సాధనలు అటువంటివి. ఒకసారి చాలాకాలంగా కడుపునొప్పితో బాధపడే ఒక వ్యక్తి బిల్వ మంగళుని దగ్గరకు వచ్చి తన బాధ తగ్గుతుందో లేదో కృష్ణుణ్ణి కాస్త అడగమని అన్నాడు. సరేనని కృష్ణుడు కనిపించి నప్పుడు బిల్వ మంగళుడు ఈ విషయం అడిగాడు. అది విని కృష్ణుడు “అతని ప్రారబ్ధం అతడు అనుభవించవలసిందే. కాని దార్లటం ఆగితే మాత్రం తగ్గిపోతుంది” అన్నాడు. ఆ దురదృష్టవంతుడు దానిని అర్ధం చేసికొనలేక “దొర్లటం అంటే బాధ కలిగినప్పుడు దొర్లటం” అని అనుకున్నాడు. కాని ఆ బాధ కలిగినప్పుడు అతడు దొర్లకుండా ఉండలేకపోయేవాడు. బిల్వ మంగళుడు మాత్రం కృష్ణుడన్న మాటకు “ఒకజన్మ నుంచి మరొక జన్మకు దొర్లకుండా ఉంటే తగ్గుతుందని అర్ధం కాబోలునన్స కున్నాడు. ఆ బాధపడే వ్యక్తి కేరళ వదిలిపెట్టి వేరేచోటుకు వెళ్ళి ఇంతకన్నా గొప్పవాగ్రిన్సి కలిసికొని సలహా పొందాలని భావించాడు. అతడు కాశీకి వెళుతుండగా దారిలో ఒకచోట కరూరమ్మ అనే ఒక ఆమె ఒక సత్రం నిర్వహిస్తూ ఉచితంగా భోజనం పెడుతున్నది. ఆమె అతని దీనస్థితిని చూసి జాలిపడి విషయం తెలిసికొన్నది. అతడు ఆమెతో మాటల సందర్భంలో పూర్వజన్మల కర్మలను తప్పించుకొనటం సాధ్యం కాదు. కనుక తాను గంగలో దూకి మరణించదలచి నట్లు చెప్పాడు. కరూరమ్మ అతని తెలివి తక్కువ తనానికి నిందించి అతనికి “గోపీ జనవల్లభాయనమః” అనే మంత్రం ఇచ్చి దానిని మననం చేయమని చెప్పింది. ఆ

శ్రి నామమే అతనికి పూర్తి ఆరోగ్యం ఇస్తుందని ఆమె అన్నది. ఇక ఆ వ్యక్తి ఆ మంత్రాన్ని స్మరించసాగాడు. ఆశ్చర్యంగా అతని బాధ అదృశ్యమైపోయింది. అనుమానం వచ్చి పొట్టమీద కొట్టుకున్నాడు కూడా. అయినా ఆ బాధ మరల రాలేదు.

అతను కాశీ యాత్ర పూర్తి చేసుకొని కేరళ వచ్చి బిల్వ మంగళుణ్ణి కలుసుకున్నాడు. బిల్వమంగళుడు అతనిని కడుపునొప్పి ఎలా ఉన్నదని అడిగాడు. అతడు జరిగిన విషయం చెప్పి తన కడుపునొప్పి అదృశ్యమయిపోయిందని అన్నాడు. అందుకు బిల్వ మంగళుడు ఆశ్చర్యపడ్డాడు. వెంటనే కృష్ణుణ్ణి పిలిచి “దొర్లటం మానితే నొప్పి పోతుందని అన్నావు కదా, అంటే అర్ధం ఏమిటి”? అని అడిగాడు. ఒక జన్మ నుంచి వేరొక జన్మకు దొర్లటం మానుకోవాలని బిల్వమంగళుడు భావించాడు. నొప్పి వచ్చినప్పుడు దొర్లకూడదని కృష్ణుడు చెప్పినట్లు ఆ రోగ (గ్రస్తుడు భావించాడు. కాని కృష్ణుడు “ప్రాపంచిక మైన విషయాలలో మనస్సు దొర్లకుండా ఉంటే తగ్గుతుంద”ని తాను చెప్పినట్లు వివరించాడు. అతడు ఎప్పుడైతే అన్యచింతన లేక భగవన్నామం స్మరిస్తూ ఉన్నాడో, అంటే 'ప్రాపంచికమైన విషయాలలో మనస్సును దొర్లనీయకుండా ఉంచాడో అప్పుడు అతని బాధ తొలగిపోయింది. నామస్మరణ చేసినప్పుడు సూర్యకిరణాలకు మంచు కరిగినట్లుగా ప్రారబ్ధం కరిగిపోతుంది. బిల్వ మంగళుని కధలోని “పరమార్ధం ఇదే అని చెప్పినారు.

“ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్తొ అనుకుంటు ఉండండి, లేదా మీకిష్టమైన ఏ నామమునైనా తల్చుకోండి” అని శ్రీ విశ్వంజీ తమ దగ్గరకు వచ్చే వారికి చెప్పెదరు. ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్త నామం చేయడం ద్వారా ఎందరెందరో కష్టాల నుంచి, రుగ్మతల బారి నుండి, లేదా ఇతరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడిన సంఘటనలు యోగి చరిత్రలో కోకొల్లలు. తీవ్రాతితీవ్రమైన అనారోగ్య పరిస్థితి సంభవించినప్పుడు “ఓం శ్రీసాయిరాం గురుదేవ దత్త మహా మంత్రం దివ్య బెషధంలా పని చేసి రుగ్మత తొలగి పరిపూర్ణమైనటు వంటి ఆరోగ్యం చేకూరిన సంఘటనలు ఎన్నో

650 ఉన్నవి. అసాధ్యాల్ని సుసాధ్యం చేసే అద్భుతమైన మంత్రం “ఓం శ్రీ సాయిరాం గురు దేవదత్త” పెట్రోలు లేకుండా జనసంచారం లేని ప్రదేశాలలో పెట్రోలు దొరికే చోటుకు చేరుకునే వరకు నామజపం చేయడం వలన వాహనము కదిలిన సంఘటన ఇందుకు నిదర్శనముగా చెప్పవచ్చును. 1995 గురుపూర్ణిమ సందేశంలో శ్రీ విశ్వంజీ “ఓం శ్రీ సాయిరామ్‌ గురుదేవదత్తొ మంత్రం మీకు రక్షగా, కవచంలా, ఛత్రంలా ఉండి, ఎల్లప్పుడూ మిమ్ములను కాపాడుతూ ఉంటుంది. ఆ మంత్రాన్ని మీరు జపిస్తూ ఉంటే ఒక “బులెట్‌ ప్రూఫ్‌” కారులో మీరు ప్రయాణం చేస్తున్నట్లే! ఎన్ని బుల్లెట్లు మీ మీదకు వచ్చినా అవి మిమ్మల్ని ఏమి చేయలేవు” అని అన్నారు. నామస్మరణ చేయటం వలన ప్రతి మానవుడు ప్రప్రథమంగా పొందేది ప్రశాంతత. ద్వాపర యుగంలో గోపికలు రోమరోమమున, కణకణమున, అణువణువునా కృష్ణ నామాన్ని నింపుకొని హృదయంలో కృష్ణుణ్ణి ప్రతిష్టించుకొని పునీతులైనారు. మధుర భక్తికి ప్రతీకలుగా నిలిచారు. దీపంలో ఒక గోపిక కృష్ణుణ్జి దర్శించి, పరవశించిపోయి తన్మయత్వము చెందడం వల్ల శ్రీ కృష్ణ పరమాత్మ ఆ గోపిక యొక్క భర్తకు అత్తగారిక్రి కూడా దీపంలో దర్శనమిచ్చి వారిలో పరివర్తన తీసుకుని వచ్చినాడు. ఆ విధంగా ఆ యొక్క గోపికను ఆమె భక్తితో చేసిన, నామానికి తగిన ఫలితము నందించి ఆవ్వై జీవితమును సుఖమయము గావించినాడు. (శ్రీ సత్యసాయి మధురభక్తిని శ్రీకృష్ణ తత్త్వాన్ని గురించి చెప్పినప్పుడు తమ దివ్యోపన్యాసంలో ఈ సంఘటన వివరించినారు.) “నామస్మరణతో నాలుక పవిత్ర మవుతుంది. జీవితారణ్యంలో మృగాల నుంచి మిమ్ములను కాపాడగల తుపాకీ భగవన్నామం. గుండు వదిలినప్పుడు తుపాకీ పెద్ద ధ్వని చేస్తుంది. నామమనే ధ్వనితో బాటు భావమనే గుండును వదిలి గురిచూచి కొట్టండి. నామమంటే కేవలం కొన్ని శబ్దముల సముదాయమే గదా అంటారు. సాయి పలుకులు కూడా శబ్దముల సముదాయమే కదా! కాని అవి మీ వృదయంలో ప్రవేశించగానే మీకు సంతృప్తిని ఉత్తేజాన్ని ఎందుకు కల్గిస్తున్నాయి? మాటలకు మహత్తర

శక్తి ఉన్నదని, ఉద్రేకాలను రెచ్చగొట్ట వమ్ము శాంత 'పరచగలవని, సత్యావిష్కరణ చేయగలవని భగవాన్‌ సత్యసాయిబాబా వారు శెలవిచ్చినారు.

భవసాగరాన్ని దాటించడానికి దివ్యమైన నౌక వంటిది భగవన్నామం. ఎవరి కిష్టముయిన నామాన్ని వారు భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో, విశ్వాసంతో త్రికరణ శుద్ధితో జపించిన నాడు ఆ నామమే మనల్ని ముందుకు నడిపిస్తూ చక్కని రాచబాటయై శ్రేయో మార్గం వైపు పయనింప జేస్తుందనడంలో ఎట్టి సందేహమూ లేదు. *న్హాన్స స్మరణ ముక్తికి మార్గము” అని స్వామి చెప్పడంలో అంతరార్థమిదియే.

భగవంతునితో గాఢమైన సంబంధమును పెంచుకొనుటయే ప్రార్ధన. భగవంత్రుక్తైక మనకు జీవనదాత. ప్రాణశక్తి ప్రదాత, ప్రకృతి సంపదనంతయూ మన జీవితావసరముల కొరకై మన శ్రేయస్సు కొరకై కల్పించి మన కందించిన మవాదాత. అట్టి భావంతునిక్రి మన విశ్వాసము తెలియజేయుచూ మన భావములను ప్రకటించుట బ్రజానబన్సి శ్రుతఖన్ని స్తోత్రములని అనవచ్చును.

(ప్రార్ధన అను పదము “ప్రార్ధ అను ధాతువు నుండి పుట్టినది. 'ప్రార్ధ్‌ అనగా వేడుకొనుట. దేనికొరకైనా నారాయణుని గట్టిగ అర్ధించుట అని అర్ధము. మానవుడు అర్థింపదగినవి పురుషార్ధములు. వాటిలో మిన్నయైనది మోక్షము. కావున మోక్షము కొరకై భక్తి భావముతో భగవంతుని వేడుకొనుటయే ్రార్ధనము. ప్రార్థనలో భక్తి ప్రధానము. వేద వాబ్బయము లందు ప్రార్థనలను 'బృహమ్‌' అని పిలిచెదరు. ఆ పదము *బృహ్‌” అను ధాతువు నుండి పుట్టినది. బృహ్‌ అనగా ఉన్నత స్థితికి చేర్చుట అని అర్ధము. “లోకాస్సమస్తాస్సుఖినో భవంతు” (లోకములో అందరూ సుఖముగా నుందురుగాక) అనునది ఉదాత్తమైన ప్రార్ధన. విశ్వజనీనమైన ఈ ప్రార్ధన పూజానంతరము, భజన ముగిసిన తరువాత మూడు మారులు చెప్పుట సర్వమానవాళి యొక్క సర్వభూతముల యొక్క శ్రేయస్సు కొరకే.

52 మన శరీర పోషణకు ఆహారమెంత అవసరమో, మన మనస్సు, ఆత్మ పోషింపబడు టకు ప్రార్ధన అంత అవసరము. ప్రార్ధన మనము తినే ఆహారమును పావనమును పరిశుద్ధమును చేయును. అందుచేతనే శ్రీ విశ్వంజీ బ్రహ్మార్చణం” చెప్పి భుజించండి అని చెప్తుంటారు. శ్రీ సత్యసాయి ఫలహారశాలలో ప్రతినిత్యము వడ్డన చేయుటకు ముందు “బ్రహ్మార్చణము” చెప్పి వడ్డన ప్రారంభింతురు. ఈనాడు కలుషితమైన పదార్ధములు మనకు లభ్యమగుచున్నవి. పాత్ర శుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి అవసరము. ఈ మూడింటిలో ఏది లోపించినప్పటికినీ కాలుష్యము వలన అనారోగ్యము పాలగుదురు. అందుచేత ప్రార్ధన చేసి భగవదర్పితంగా ఆ ఆహారాన్ని భావించి దైవనామంతో పవిత్రమైన తదుపరి భుజిస్తే అది ప్రసాదమై మానవుణ్ణి శక్తివంతం చేస్తుంది. ప్రార్ధన ఫలితము అత్యున్నతమైనది. ప్రార్ధనలు, స్తుతులు, మానవుని మనస్సును పవిత్రము చేయును. బుద్ధిని ప్రకాశింప చేయును. ఇంద్రియములను ఉన్నత స్థితికి గొనిపోవును. చిత్తమును పరిశుద్ధము చేయును. ఉత్తమ సంస్కారములను మేలుకొల్పును. భగవంతుని సన్నిధానము చేరుటకు తోడ్పడును. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రుగ్మతలను తొలగించుటకు (ప్రార్ధన " దివ్యాషధము. ప్రార్ధనలు, భగవన్నామముల్పు, మహాశక్తి వంతములైన మంత్రములతో వకాగ్ర చిత్తముతో ఆత్మార్బణ భావముతో, శ్ర్యజ్మ్య పప్రపత్తితో భగవంతునికి సమర్పింపవలెను. మన మహర్షులు, యోగులు, ప్రవకలు తమ జీవిత సర్వస్వముగా భావించిన స్తోత్ర వాజయమును, ప్రార్ధనా సాహిత్యమును మనకు వారసత్వ సంపదగా అందించినారు. “విశ్వానిదేవ సవితర్భు వితాని పరాసువ యదృ్భద్రం తన్న ఆసువ. నాలోని చెడ్డ గుణములను పోగొట్టుకొను బలము నిమ్మని కోరాలి. హృదయము నుండి వచ్చే ప్రార్ధన లోపల శుభ్రం చేస్తుంది. “హృదయము లేని ప్రార్ధన కంటే మాటలు లేని హృదయమే మేలు” అన్నారు భగవాన్‌ సత్యసాయి. హృదయంలో నుండి ఆవేదన రావాలి. పృాదయాంతరాళముల నుండి వచ్చేదే నిజమైన ప్రార్ధన. అట్టి

53

ప్రార్ధనకే భగవంతుడు వశుడవుతాడు. ప్రార్ధన యాచించటం కాదు అది ఆత్మ పడే తపన. ప్రార్ధన అనగా మాటల పరి్థభ్రమ కాదు. హృదయములోని దివ్యత్వమును మేలు కొలిపేందుకు పడే తపన. తన ఆర్తిని తన బాధను, పరమాత్మునితో చెప్పుకోవటమే నిజమైన ప్రార్ధన. ఆర్తితో పిలిచినప్పుడు ఆయన తప్పక పలుకుతాడు.

శ్రీ విశ్వంజీ ఇదే భావాన్ని తరచుగా ఒక చిన్నపద్యంలో చెప్తుంటారు.

“పిలచిన పలికెడు దైవము

కలదా? యను సందియమ్ము కలిగిన యెడలన్‌

పిలిచి, పరీక్షింపుడు మీ

పిలుపు హృదంతరము నుండి పెగలగ వలయున్‌”

అలనాడు సాధనా దశలో శ్రీ విశ్వంజీ సత్యసాయిబాబా వారు చేస్తున్న ధర్మ ప్రచారానికి ఆకర్షితులై బాబా గారిని సాక్షాత్తూ తమ గురు స్వరూపమైన దత్తాత్రేయ స్వామిగా భావించి, గేయాలు రచించారు. భజనలు చేయించేవారట. భజన పూర్తయిన తరువాత వేలూరి శివరామ శాస్తి గారు ఎప్పుడో ఆశువుగా చెప్పిన పై పద్యాన్ని ఉచ్చెస్వరంతో పలికి భజనకు స్వస్తి చెప్పే వారని శ్రీ విశ్వగురు చరిత్ర వివరించినది. దైవము ఉన్నాడా లేడా అనే సందేహము కలిగినప్పుడు హృదయాంతరముల నుండి పిలచిన దైవం తప్పక పలుకుతాడని “నేనున్నాను అంటూ తప్పక రక్షించి కాపాడతాడు అని భావము. పిలుపు మాత్రము హృదయాంతరాళముల నుండి రావాలి. ఉపనిషత్తులలో ప్రార్ధనలు వా

  1. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్చతే.

పూర్ణస్యపూర్ణ మాదాయ పూర్ణ మేవా వ శిప్యతే. (ఓం శాంతిః శాంతిః శాంతి;

5్‌4ీ 2) ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాంజగత్‌ తేనత్యక్తేన భుజ్జీదా మా గృధః కస్య స్విద్దనమ్‌. సై రెండు సృతులు, ఈశావాస్య ఉపనిషత్తులో శాంతి పాఠమున ప్రథమ మం(త్రముగా నున్నవి. వీటితో ఆ ఉవనిషత్తు ఆరంభమగును. ఈశావాన్య “ఉపనిషత్తులోని, ఆ మొదటి మంత్రము హిందువుల మనస్సులలో మరుపునకు రాక నిలిచియున్నచో హిందూ ధర్మమంతయూ శాశ్వతముగా నిలువగలదు” అని గాంధీ మహాత్ముడు ప్రశంసించినారు. మన నిత్య జీవితములో ప్రార్ధనతో దిన చర్య ప్రారంభము కావలయునన్నదే మహనీయుల ఉవాచ. పై రెండు శ్లోకములు మనకొక సత్యమును బోధించు చున్నవి. భగవంతుడు సర్వ వ్యాపి అనుభావమును మనమెల్లప్పుడును మననము చేసికొనవలెను. సర్వజీవుల యందును, సర్వ వస్తువుల యందును, అతడు నిండి యున్నాడు. కావున స్వార్థమును, అసూయను విడనాడి సర్వమానవుల యందు 'స్నేహభావమును, (ప్రేమను పెంపొందించుకొనవలెను. సర్వ వ్యాపియైన భగవంతుని పట్ల శరణాగత ప్రపత్తియే మనమలవరచు కొనవలసిన జీవనమార్గము. అదియే సత్య దర్శనము. ప్రార్ధనల పరమ ప్రయోజనము.

భక్తి భావంతో “నీవు తప్ప ఇతః పరంబెరుగ” నన్న నాడు శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షించినట్లు గజేంద్రుడు నాథా కావరావా! వరదా! అని శరణు వేడినప్పుడ్డు, శ్రీకృష్ణపరమాత్మ ప్రత్యక్షమయి కాపాడిన ఉదంతము భగవద్దీత మనకు అందించినది. నేడు కలియుగ అవతారమూర్తియైన శ్రీ విశ్వంజీ మనకు ప్రసాధించిన ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్త మహామంత్రం మహిమాన్వితమైనది. భౌతికంగా మానవునికి సంసారికమైన బాధలన్ని తొలగిస్తూ “బోధలు వినాలి ఆచరించాలి” అన్న జిజ్ఞాస కూడా కలిగించే కలిదోష నివారక మంత్రం అని కూడా చెప్పుకొనవచ్చును. ఈ మహాశక్తి వంతమైన మహా మంత్రమే భౌతిక జీవితంలో శక్తిని ప్రశాంతతను, ఆరోగ్యాన్ని ప్రసాదించే అభయ ్రదాయినిగా తల్పినంత మాత్రమున తనువు పులకరింపజేస్తే, ఆధ్యాత్మలో ముక్తి

55

పరంగా ఆలోచిస్తే ఆ నామ జపం వల్ల మోక్షం ప్రాప్తిస్తుంది. నామ జపం చేయగా చేయగా మానవుడు “నామి” గా మారతాడు. ముక్తి మార్గాన్ని సులభంగా పొందగలుగుతాడు.

మానవుని స్థితి గతుల కనుగుణంగా ఆ సమయానికి ఆ మంత్ర జపం చేయడం వలన శరీరము పవిత్రమై అణువణువు పవిత్రమై దివ్యత్వానికి కూడా దారి చూపగల దివ్య మంత్రము స్వామి మనకు ప్రసాదించిన ఓం శ్రీ సాయిరామం గురుదేవదత్త.

అదేవిధంగా ఏ అవతారమూర్తి చెప్పినా యోగులు సిద్ధపురుషులు చెప్పినా వారి దివ్యవాక్కు మహిమ వలన ఆ మంత్ర సిద్ధి వలన భగవన్నానుం ఇన్ని విధాల మానవుని జీవితంలో ఎనలేని మేలు చేకూర్చుచున్నది. మంత్రం మనిషిని శక్తివంతం చేస్తుంది అంటారు విశ్వంజీ. భగవన్నామాని కున్న శక్తితో ఎట్టి కార్యమునైననూ సాధించవచ్చును. అందుచేతనే “ప్రార్ధన పర్వతాలను కదిలిస్తుంది. నామస్మరణ ముక్తికి మార్గం” అన్నారు. కేవలం ముక్తికి మార్గమే కాక పవిత్రతను ప్రశాంతతను చేకూరుస్తూ మానవాళి చేసే సేవకు నామంతోడైతే మానవులు శక్తివంతులై ఉత్సాహంగా అధ్యాత్మ మార్గంలో ముందుకు సాగగలరనుట తథ్యము.

56 దేముడు ఒక్కడే - ఆయన సర్వవ్యాపి దేవుదెక్కడనుచు దేవులాడగనేల? పహృదయమందె లేదడె ఈశ్వరుండు. ఇచ్చుకొనుము సేవ పుచ్చుకొనుము ప్రేమ అటులె ఆత్మతత్వమనుభవింపు దేవుడు ఒక్కడే - ఆయన సర్వ వ్యాపి. “ఇందు గలడందు లేడను సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు” అని అలనాడు ప్రహ్లాదుడు తండ్రికి స్థంభంలో దేవుణ్ణి చూబించి నిదర్శనపూర్వకంగా నిరూపించినాడు. స ణ్‌ తిలలలో తైలము, పాలలో వెన్న పుష్పములలో పరిమళము, ఫలములో రసము కట్టెలలో అగ్ని ఏ విధంగా దాగియున్నవో అదేవిధంగా, ఈ విశ్వమందు దివ్యత్వం సర్వత్రా నిండియున్నది. చ్‌ పరమాత్మ తత్త్వాన్ని గుర్తించడానికి అనేక సాధనలు అక్కరలేదు. భగవంతుడు సర్వత్రా ఉన్నాడనే సత్యాన్ని గుర్తించడమే నిజమైన సాధన. ఏ వ్యక్తిని చూచినా ఆ వ యందున్న దివ్యత్వం, మీ యందున్న దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తిం ్యక్తి అందరిలోని ఆత్మ తత్త్వం ఒక్కటే. ఇవి కేవలం ఉపాధులు, పనిముట్లు, తారు గాలి. మీరు కేవలం బాహ్యమైన రూపములను ఆధారం చేసుకొని ఆరాధనలు సల్పుతు న అందరియందున్న దివ్యత్వమే ఈ దేహమునందున్నది. ఈ దేహమందున్న ఆత్మ ల తే అన్ని దేహములందున్నది. కానీ, ఇట్టి సత్యాన్ని గుర్తింప చేయటానికి ఒక ఆధాయి అవసరం. ప్రమిద, నూనె, వత్తి కలవు. దీపము ముట్టించేవాడు ఒకడుందాలి బంగారము, రత్నములు కలవు. సొమ్ములు నిర్మాణం చేసే కంసాలి ఒకడుండాలి. పూలు, సూది, దారము ఉన్నప్పటికీ, పుష్పమాలను తయారు చేసేవాడు ఒక లి అదేవిధంగా అన్ని దేహములందున్న ఆత్మ తత్వం ఒక్కటే అయినప్పటికీ ఇదంతా ఒక్కటే అని చెప్పటానికి ఒకరు అత్యవసరం. అందుకోసమే అవతారాలు రావటం. అవతారాలు దేనికోసం వస్తున్నాయంటే కేవలం తన స్వరూపాన్ని, దివ్యత్వాన్ని పవిత్రతను, ఏకాత్మ తత్వాన్ని పవిత్రతను, అందరికీ ప్రకటింప చేయడం కోసమే.

57

మనోవికారాల సుఖదుఃఖాలలో

జీవితం పతనమయ్యేలా చూడకు

నీలో నాలో అన్ని జీవరాశులల్లో

వెలిగే ఆ దేవుణ్ణి దర్శించడం మానకు!

“అణోరణీయాన్‌. మహతోమహీయాన్‌” అణువణువులో కణకణములో వ్యాపించి యున్న భగవత్‌ తత్వాన్ని సర్వే సర్వత్రా చర్చిలో, మసీదులో, గుడిలో, గురుద్వారాలో అంతటా నిండియున్న భగవంతుడు ఒక్కడేనని చెబుతూ శ్రీ విశ్వంజీ తమ దివ్యోపన్యాసా నంతరం ఈ విధంగా పాడుతుంటారు.

ఒక్కడు ఒక్కడు దేముడు ఒక్కడు

జగమున కంతా దేముడు ఒక్కడు

ఏమతమైనా, ఏ కులమైనా ఒక్కడు ఒక్కడు దేముడు ఒక్కడు. రాముడన్నా రహీమ్‌ అన్నా, జీసెస్‌ అన్నా,

నానక్‌ అన్నా అల్లా అన్నా బుద్ధుడు అన్నా,

అమ్మా అన్నాా నాన్నా అన్నా, ఒక్కడు ఒక్కడు దేముడు ఒక్కడు జగమునకంతా దేముడు ఒక్కడు.

ఏ మతమైనా, ఏ కులమైనా మనుషులమ్హూ మనుష్యులమూ మనుషుల మంతా కలవాలి, మనసులనంతా కలపాలి. మనిషిని మించిన దైవం లేడు

మనస్సుకు మించిన శక్తే లేదు.

మనుషులమంతా కలవాలి

మనస్సులనంతా కలపాలి

ఒక్కడి కోసం అందరు కలసి

అందరికోసం ఒక్కడు నిలచి

మనషులమంతా కలవాలి

మనసులనంతా కలపాలి

58 ఒకే మనసుగా చేయాలి విశ్వశాంతినే తేవాలీ!! అంటూ దివ్యాంశ సంభూతుడు మానవుడు అని చెబుతూ సమైక్యతా భావం,

అందరూ కలిసి ఒకే మనస్సుతో విశ్వశాంతి లక్ష్యసాధనకు కృషి చెయ్యాలన్న భావం ఈ గేయంలో స్వామి వెలిబుచ్చారు. “ఏ మతమైనా, ఏ కులమైనా, నామాలు వేరుగా ఉన్నా ప్రార్ధనాలయాలు వేరైనా, దేవుడు మాత్రం ఒకృడేనని వచించారు. “ఏకంసత్‌వి(ప్రా బహదానడంతి” ఉన్నది ఒక్కటే అనేక రూపాలుగా, నామాలుగా కన్పిస్తున్నది. ఒక మహాశక్తి ఉనికితో ఈ (ప్రపంచమంతా ఈ విధంగా నడుస్తున్నదన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో ప్రబలిననాడు దివ్యత్వంలోనున్న గొప్ప తనాన్ని అర్ధం చేసుకోగలరు. సర్వత్రా వ్యాషించియున్న తత్త్వాన్ని కాదనడానికి ఎవ్వరికీ అధికారం లేదు అంటూ భగవాన్‌ సత్యసాయి 1986 గురుపూర్ణిమ సందర్భంలో తమ దివ్యోపన్యాసంలో ఈ విధంగా సెలవిచ్చినారు. “ఈ గురుపూర్ణిమ సందర్భంలో ఏ అష్టాక్షరిని గాని, పంచాక్షరిని గాని ఉపదేశించదలచలేదు. ఏ ఉపనిషత్తునో, ఏ భగవద్గీతనో, ఏ బ్రహ్మ సూత్రాలనో చదువమని నేను (బాబా) బోధించటం లేదు. “దేవుడున్నాడు - ఈ ఐదు అ క నామాన్నీ మీరు ప్రధానంగా తీసుకోండి” దినమంతా దీనినే చింతిస్తూ అందరికీ అ ిక్షరాల ఉంటే ఇంతకంటే లోక కళ్యాణం మరొకటి లేదు. ఈ మంత్రాన్నే ఈనాటి ఉపదేశ; ల భావించి ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే 'దేవుడున్నాడు” అనే విశ్వాసాగై బలపరచుకొని పాపభీతి, దైవప్రీతిని పెంచుకొని జీవన సంగ్రామ రంగంలో ముందట సాగి పొమ్మనమని చెబుతూ స్వామి “దేవుడున్నాడు అని పాడుతూ అందరి వ్వ పాడించినారు.

ఉన్నాడయా దేవుడున్నాడయా

కనులకు కనుషించకున్నాడయా

లోకాల చీకట్లు పోకార్బ

రవిచంద్రు దీపాలు గగనాన త్రిప్పు చున్నాడయా।

లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల

నేలరాల్పక మింట నిల్పుచున్నాడయా

ఈ ధారుణీచక్రమిరుసు లేకుండగా

59

ఎల్లవేళల (త్రిప్పుచున్నాడయా

జీతభత్యములు లేక ప్రీతితో మనకొరకు

గాలిలో సురటీలు విసరేనయా

ఆధారమే లేక అలరారు చున్నట్టి

ఆకాశమును ఆపుచున్నాదయా

పొంగిపొరలుచు వచ్చి పృథ్విపై పడకుందా

కడలి రాజును కాలుముడిచాదడయా

కనిపించకేమి చేస్తున్నాడయా

తెరచాటుతానుండి తెరముందు (ప్రజనుంచి

తైతక్కలాడించు చున్నాడయా!

సమస్త సృష్టికి కారణభూతుడై ఈ విశ్వాన్ని నడిపిన్తున్న విభుడు, తెరచాటున తానుండి తెరముందు మానవాళి నుంచి మహాశక్తితో ముందుకు నడిపించుచున్నాడు. “దేవుడున్నాడు” అనే పంచాక్షరీమంత్రం, రామమంత్రం, కృష్ణమంత్రం, శివమంత్రం కంటే 'ఉన్నాడు' అన్న మంత్రమే చాలా బలమైన మంత్రమని, అది లేకుండా ఎన్ని మంత్రాలు చెప్పినా ప్రయోజనం లేదు; ఉన్నాడయా అన్న విశ్వాసమే (బ్రవ్మాస్తంగా మారుతుందని సెలవిచ్చినారు. ఉన్నాడు, ఉన్నాడు అనేధృధమైన విశ్వాసమే మానవుణ్ణి ముందుకు నడిపించగలదని వచించారు బాబా. సమస్త సృష్టికి కారణభూతుడై ఈ విశ్వాన్ని నడిపిస్తున్న విభుడు, తెరచాటున

తానుండి తెరముందు ప్రజల నుంచి మహాశక్తితో నిస్వార్ధంగా జీతభత్యములు లేకుండా వేలకొలది నున్న నక్షత్రములను క్రింద పడకుండా ఆపుచున్నాడు. ఆకాశమును కూడా ఆపి శుద్ధ చైతన్యంలో సమస్త సృష్టి కార్యాన్ని నిర్వర్తిస్తున్నది భగవంతుడే. ఈ విధంగా భగవంతుని సర్వ వ్యాపకత్వమును ఆనాటి గురుపూర్ణిమ సందేశంగా అందరూ భావించాలని స్వామి సెలవిచ్చినారు. “ఉన్నాడు అన్న విశ్వాసమే లోకం నిత్య కళ్యాణం పచ్చతోరణాలతో కళకళలాడుతు కిల కిల నవ్వుతుండడానికి ఆధారమవుతుంది.”

60 మరొక సందర్భంలో శ్రీ సత్యసాయి ఈ విధంగా వచించారు. ఒకానొక సమయంలో త్యాగరాజు రామ వి[గ్రహాన్ని కోల్పోయి చాలా బాధలకు గురియైనాడు. అన్ని వైపులా వెతికాడు కాని ఎక్కడా రామ విగ్రహం కనిపించలేదు. అప్పుడు తనలో తాను అనుకున్నాడు. “అయ్యో, ముందు, వెనుక, ఇరుప్రక్కల, ఉన్న భగవంతుడు లేడని అనుకోవటం నా తప్పు కదా! భగవంతుడు నా వెంటనే, జంటనే ఉన్నాడు. నాకంటనే ఉన్నాడు నా నుండి ఎప్పుడూ దూరంగా లేడు.” అతనిలో ఒక్కసారి విశ్వాసం వచ్చింది. తక్షణమే కావేరీ నదికి పోయి స్నానం చేశాడు. కాలికి ఏదో గ్రుచ్చుకున్నట్లయినది. ఏమిటి ఇది అని చూస్తే రామ విగ్రహం. రారా మా ఇంటిదాకా రఘువీర సుకుమార నే మొక్కెద రారామా ఇంటి దాకా రారా దశరథ కుమారా నన్నేలుకోరా నేతాళ లేరా ! రారా మా ఇంటిదాకా దిక్కు నీవనుచు తెలిసే నన్ను బ్రోవ గ్రక్కుననురారా! నిన్నే నమ్ముకున్నాను “రారా మా ఇంటిదాకా” అని పాత స్నేహితుణ్ణి పిలిచినట్లు పిల్చాడు. క్రొత్త స్నేహితుడు ఎవరైనా మన ఇంటికి వస్తే “రండి దయచేయండి” అన్పి కృర్చీ వేస్తాం అవన్నీ పైపై మర్యాదలే గాని హృదయంలో అతనికి స్థానం లేదు. కొత్త స్నేహితుణ్ణి పదములతో మాత్రమే గౌరవిస్తాము గాని అతనితో సన్నిహిత సంబంధ ముండదు. కాని పొత స్నేహితునితో హృదయ సంబంధముంటుంది. కనుక్షనే “ర్రార్రా మా ఇంటిదాకా” అని ఎంతో స్నేహంగా, ఎంతో స్వేచ్చగా, ఎంతో పవిత్రంగా, ఎంతో ఆర్తితో పిలిచాడు. పాత స్నేహితుడు గౌరవ మర్యాదలు ఏ మాత్రమూ ఆశించడు. కనుక భగవంతుణ్ణి మీ పాత స్నేహితుడుగా భావించాలి. అనేక జన్మల నుండి మీ వెంట వచ్చే వానిగా విశ్వసించాలి. భగవంతుడు అన్ని జన్మలలోనూ, మీవెంట, జంట, ఇంట కంట ఉండి కంటికి రెప్పవలె చూచుకుంటాడు. అలనాడు త్యాగరాజుగానం చేసిన “రారా మా ఇంటి దాక” అన్న కీర్తన ఈనాడు శ్రీ విశ్వంబీని ఉద్దేశించి భక్తి పారవశ్యంతో అనేకమైన పాటలు వ్రాసిన శ్రీదాస్‌ గారు “రారా మా ఇంటిదాక” అని మృదుమధురంగా అద్భుతంగా స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ సంకీర్తన పాడినప్పుడు మాకందరకు కూడా తన్మయత్వం కలుగుతోంది.

61

సాక్షాత్తూ దత్త గురువు చెంత ఆ పాట విన్నప్పుడు మేమందరము దివ్యానుభూతికి లోనవుతున్నామని ఇక్కడ సందర్భవశాత్తు చెప్పడం సముచితమనిపించింది. .భగవంతుణ్ణి గురించి బాగా పాడగలిగినవారు భగవంతుని గుణగణాల్ని కీర్తించినప్పుడు కలిగే దివ్యానుభూతి వర్ణనా తీతము. ఆ అనుభూతి మానవుణ్ణి ఏదో లోకాలకి తీసుకుని వెళ్ళి అలౌకిక స్థితిని కలిగిస్తుంది. అదే భగవన్నామంలోనూ, సంక్తీర్తనలోనూ ఉన్న గొప్పతనము. ఒక దివ్యత్వములోనే ఇటువంటి అనుభూతులు, అనుభవాలు తీపి గుర్తుల వలె మళ్ళీ మళ్ళీ మననం చేసుకుందుకు, ఆ దత్తమూర్తిని కనులముందు సాక్షాత్మరింప జేసుకుందుకు మంచి అవకాశం లభిస్తోంది. గురువు సన్నిధిలో “విశ్వాష్టకమ్‌” పఠించినా ఇదే అనుభూతి కలుగుతోంది. “గురుసన్నిధ్రౌ” అని సద్గురువు నోట పలికిన దివ్యవాణి గనుక భౌతికంగాను, పరోక్షంగాను ఎప్పుడు చదివినా గురువు మన కనుల ఎదుట సాక్షాత్మరిస్తాడు.

“నిరంతరం దేన్ని గురించి ఆలోచిస్తామో అదే ధ్యానం” అంటూ శ్రీ విశ్వంజీ తమ దివ్యోపన్యాసంలో చెప్పినారు. “మనం ఆరాధించే రూపాన్ని ధ్యానంలో నిలుపుకొని మనకిష్టమయిన నామాన్ని తల్చుకుంటూ ప్రారంభించిన ధ్యానం రూప, నామ రహితమైన స్థితిలో శుద్ధ చైతన్యాన్ని అనుభూతి పొంది, నిరాకార నిర్గుణపర (బ్రహ్మగా మానవ రూపం దాల్చి సశరీరంతో దర్శనమిస్తున్న గురు స్వరూపాలశక్తి మనకు గోచరమవుతుంది. ఆ శక్తే ఈ విశ్వాన్ని నడిపిస్తున్నది. మానవుని దేహంలో ఉన్న అవయవాలన్ని సక్రమమైన పద్ధతిలో అమర్చబడడం, సృష్టిలో సమస్త జీవరాశులు, చెట్లు, చేమలు, మున్నగువన్ని వాటి ధర్మాన్ని అవి నిర్వర్తించడానికి కారణం ఆ విశ్వ చహాశక్తియే యని చెప్పవచ్చును. సూర్య చంద్రాదులు క్రమం తప్పకుండా .నిర్దిషుయిన సమయంలో ఉదయించడం, అస్తమించడం జరుగుతోందంటే భగవంతుని శక్తియే దీనికి కారణము: గతి తప్పకుండా ఉదయించడం, అస్తమించడమే కాక తమ యొక్క శక్తిని ప్రపంచంలో అందరిపైన సమంగా ప్రసరింప చేయడంలో సమదర్శనమే సర్వత్ర మనకు గోచరమగుచున్నది. జాతి వర్ణ వర్ద విచక్షత గాని, ఒక ప్రాంతానికే సూర్యుని కాంతి, చంద్రుని చల్లదనం పరిమితం కాకుండా సమస్తమైన విశ్వంలోనూ, అందరికి తమ శక్తిని ఒకే విధంగా ప్రసరింప చేయడంలోనే భగవంతుని సమదృష్టి నిస్వార్థమైన సేవ, ప్రేమ తత్త్వం, అనంతమైన, విశాలమైన తత్త్వం గోచరించు చున్నది. -*“ఉన్నది ఒక్కడే అతడు సర్వ వ్యాపి” అన్న చిన్న సూక్తిలో ఇంత విశాలమైన భావం ఇమిడి 'ఉండడం విశేషము. అనంత శక్తి స్వరూపునకు శతకోటి ప్రణామంబులు! "

62 ఉన్నది ఒకటే కులం - అది మానవ కులం కలం ఓ 0%స్‌ 606 1546 - |%6 య56 0 టుం2మ1ఏ- అన్నింటి కంటే ఉన్నతమైనది మానవ కులము. మనల్ని మనం మనమెవరు? అని ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు మానవులము. మానవ - అనగా మా - లేదు; నవ -కాదు ఇది క్రొత్తది కాదు. పాతదే. మీరు ఎక్కడి వారు? ఎప్పటి వారు? అని అడిగినప్పుడు నేను ఫలానా, నా పుట్టిన తేది ఇది అని జవాబు చెప్తాము. 84 లక్షల జీవరాశి చక్రం దాటి ఈ మానవ శరీరం ధరించాము. భగవద్గీతలో కృష్ణభగవానుడు చాతుర్వర్హ్వ్యం మయా సృష్టం గుణకర్మ విభాగనః తస్యకర్తార మపిమాం విద్య కర్తార మవ్యయమ్‌. “గుణములను బట్టి, కర్మములను బట్టి నాలుగు వర్ణముల వారిని నేనే సృజించితిని. నేను వాటికి కర్తనైనను నన్ను అవ్యయునిగ, అకర్తునీగ గ్రహింపుము” అని భావము. ఇవి లౌకికమైన కులములు కావు. యజ్ఞయాగాదులు చేస్తున్నప్పుడు ధర్మాచరణ చేస్తున్నప్పుడు మీరు బ్రాహ్మణులు. లోకనిమిత్తమై నీవు ఉద్యోగం చేస్తున్నప్పుడు నీవు వైళ్యుడివి. ఇంకొకరికీ నీవు సాయం అందించినప్పుడు నీవు క్షత్రియుడివి. ఎవరైనా ఒంట్లో బాగాలేని వారికి అవసరమైనప్పుడు నిద్రకాచుకొని సేవలందించినప్పుడు న్వు శూద్రుదవు. కింకరుడవు. కాబట్టి ఈ నాలుగు కులాలు నీలోనే ఉన్నాయి. మానవత్వం పరిధి దాటి ఏ కులము లేదు అని చెప్పడమే ఇందులోని భావము. శ్రీ విశ్వంజీ సిద్ధాంతములకు సరిగ్గా సరిపోయే విషయము కూడా ఇదే. కులములన్ని కలిస్తే ఏర్పడినదే మానవకులము. ఆ పేరుతో అన్ని కులముల వారు వర్షముల వారు, జాతుల వారు, వర్ణముల వారు పిలవబడుదురు. ఇది శ్రీ విశ్వంజీకి అత్యంత ప్రీతిపాత్రము.

ఏ కులంలో పుట్టినా, ఏ వర్ధానికి చెందినా, ఏ మతస్థులైనా, అందరూ భగవంతుడి బిడ్డలే. అందుచేత భగవంతుడు కుల వర్ణ వర్గ మతములకతీతుడు. మానవత్వం గల మనిషిగా మెలగిన వారందరు భగవంతుడికి ప్రీతిపొత్రులే. భగవంతుడికి కావలసింది ఐక్యత. “మనిషి మనిషిగా మసలిన నాడు మహియే వెలుగును శాంతి నిలయమై” అని ప్రతినిత్యము, ప్రతి ప్రసంగంలోనూ, శ్రీ విశ్వంజీ ఎలుగేత్తి పాడుచుందురు.

63

మాది ఆ కులము, ఈ కులము, ఈ వర్గము, ఆ వర్గము, ఈ మళము, ఆ మతము, ఆ వర్ణము, ఈ వర్ణము అని చెప్పడంలో కొంత వైవిధ్యము కనబడుచున్నది. కుల, మత, వర్ణ, వర్గ మత విచక్షత లేవీ లేనీనాడు “అంతా ఒక్కటే మనమంతాబఒక్కటే” అనుకున్న నాడు ఏ విధమైన వైవిధ్యము లేకుండా సమైక్యత ఏర్పడును. అన్నీ కులముల వారు, మతముల వారు సమైక్యతతో మెలగుతూ మానవత్వం గల మనుష్యులతో కూడిన సంఘము చాలా అవసరము.

“ప్రపంచంలో కులాలు వేర్వేరుగా ఉన్నాయనుకుంటున్నారు. కాని ఉన్నది ఒకటే కులం - అది మానవ కులం అన్నారు విశ్వంజీ. అందరి మానవుల్లో నున్న రక్తమాంసములు ఒక్కటే. తోటి మానవుణ్ణి ప్రేమించి మానవత్వం గల మనుషులుగా మారిన నాడు సమభావన ఏర్పడుతుంది. ఆ సమభావనే సమైక్యతకు దారి తీస్తుంది. సమైక్యంగా అందరు కలిసి మెలసి సమాజానీకి తమ వంతు సేవ తొము అందించి కృతకృత్యులు కావాలన్నదే శ్రీ విశ్వంజీ తపన. కులాలు మతాల పేరుతో ఘర్షణలు చెలరేగకుండా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా అందరిలో నుండే ప్రధానాంశము మానవత్వం గనుక మానవుడు, మానవత్వంతో అన్ని సాధించాలి తప్ప కుల మత వర్ణ వర్గ విచక్షణ పేరుతో సంఘ నీతికి విరుద్ధంగా ప్రవర్తించ కూడదన్నదే మహనీయుల ఉవాచ. కుల మతాల కతీతంగా విశ్వమానవ సమైక్యతకు అందర్ని ఒక త్రొటిపై నడిపించేదే దత్త తత్త్వం అన్నారు శ్రీ విశ్వంజీ. మానవులందరూ ఒకటేనని ఎటువంటి భేద భావాలు లేవని, దత్తాత్రేయ తత్వం చెబుతోంది. అందుచే ప్రతి వ్యక్తి మానవత్వంతో కూడుకున్న మనిషిగా జీవన గమనాన్ని సాగించాలి గొనీ, కులాల పేరుతో, మతాల 'పేరుతో ద్వేషం పెంచుకోకూడదు. మానవత్వంతో కూడుకున్న మనీషి ఏ కులమైనా, ఏ మతమైనా సమాజసేవ కర్షడే. ఏ సేవా కార్యక్రమంచేయాలన్నా మానవత్వం ప్రధానం తప్ప కులమతాలు కాదన్న విషయం స్వామి తమ దివ్యోపన్యాసంలో స్పష్టం చేశారు. ప్రజలందరు ప్రేమ తత్వాన్ని అవలంభించి “మానవులంతా ఒకే కులమని” ముక్తకంఠంతో ఉద్దోషిస్తూ విశ్వశాంతికి కృషి చెయ్యండి" అని కూడా వారు వచించారు. అందుచేత ప్రతి ఒక్కరు కులాల ప్రస్తావన లేకుండా ఉన్నది ఒకటే కులం + అది మానవకులం - అన్న స్థితిలో ఉంటూ తోటి మానవుణ్ణి ప్రేమించి ఐక్యత 'పెంచుకోవాలన్నదే ఈ సూక్తి సారాంశము.

64

ఉన్నది ఒకటే మతం - అది (ప్రేమ మతం

కలాం పే 02ప” ౧06 00118100 - 06 ౯0118108 0£1076 దత్త స్వరూపులు ప్రేమమూర్తులు అవతరించిన సమయంలోనే సమకాలీనులమై జీవన గమనాన్ని సాగిస్తున్న మనబోటి మానవులందరు (ప్రేమ భావంతో మెలగుతు “పరులు పరులు కారు పరమాత్మ స్వరూపులే” నన్న నానుడి కనుగుణంగా నడచుకోవలసిన ఆవస్యకత యున్నది. కులమతాల కతీతులై విశ్వమానవ సమైక్యతను బోధించు కలియుగ అవతారమూర్తులు (ప్రేమ స్వరూపులై (ప్రేమను పెంచి పంచుచున్న శుభతరుణమిది. (పేమ మూర్తుల ననుసరిస్తూ వారి ఆదేశాలను వారు బోధించిన మానవతా విలువలను ఆచరించినప్పుడు మనందరి మతము (ప్రేమమత మవుతుంది. (ప్రేమ లేని మతము పిచ్చిగా మారుతుంధని గ్రహించవలెను. హిందు మతము, జైన మతము, జైస్తవమతము అని ఇన్ని మతము లేర్ప్చడుటకు కారణము ఆయా కాలముననుసరించి ఆ మహనీయుల బోధల్ని అనుసరిస్తూ వచ్చిన వారందరు ఆ బోధల్ని ఆచరించిన వారందరు ఆయా మతస్టులుగా పేర్కొన ఐడినారని మతములంటూ వేరే ఏవీ లేవని శ్రీ విశ్వంజీ అమెరికా పర్యటన సందర్భముగా తమ దివ్యోపసన్యాసములో చెప్పినారు. అన్ని మతములు బోధించేది (పేమ తత్త్వాన్నే (ప్రేమను పెంచి పంచడమన్నది మహనీయుల సాన్నిధ్యములో నేర్చుకొనదగినది. _ వారి జీవితాలే మానవాళికి సందేశాలు. (క్రేమను సర్వత్రా పెంపొందించు జీవులందరికి ప్రేమను పంచు, (శ్రేమతోనే పని ప్రారంభించు, ్రేమనే మనసారా ఆస్వాదించు. దైవం (క్రేమ స్వరూపం. “నాయనా నీ ప్రేమను ఈ విధంగా వెల్లడి చేయాలి. ఈ" విధంగా పంచుకోవాలి. ఈ విధంగా ప్రసరింప చేయాలి, (ప్రేమను అందరూ అనుభవించాలి” అని నిరూపించే నిమిత్తమై స్వామి దేవిన్ని ధరిస్తున్నారు. ఈ (ప్రేమ యొక్క విశిష్టత ఏమిటి, ఇది ఏ స్థాయిలో ఉన్నది అని గనక విచారణ చేసినట్టైతే స్వార్థరహితమైన స్థాయిలో ఉన్నదని స్పష్టమగుచున్నది. స్వార్ధరహితమైన (ప్రేమ తత్త్వమే దైవత్వం. స్వార్ధము అనాత్మ. శ్రీ విశ్వంజీ 24-12-97 దివ్యోపన్యాసంలో “ఆరాధనలు, ప్రార్ధనలు వేరైనా సర్వ మతాల సారాంశం గమ్యం ఒక్కటే. . అదే ప్రేమ: తత్వం. .ఇతరులకు సహాయపడటమే మానవత్వం. మానవుల్లో మానవత్వం నశించినప్పుడు దేశంలో అరాచకం పెల్లుబికి అశాంతి అపింసా

ప్రజ్వర్తిల్లుతుంది” అన్నారు.

హృదయాన్ని కదిలించేది, కరగించేది (ప్రేమ ఒక్కటే. హృదయం కరగకుండా ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ఉపన్యాసాలిచ్చినా అవన్ని అడవిగాచిన వెన్నెల వలె

65

నిరుపయోగమైపోతాయి. హృదయ వేదనను పెంచాలి పదిమందికి పంచాలి. మాట హృదయం నుంచి రావాలి. పెదిమల నుంచి కాదంటారు బాబా. ((1%1) హృదయం ముఖ్యం - (జాళగం120 తెచ్చి పెట్టుకున్నదిగా ఉండకూడదు.) హృదయంలోంచి రావాలి. అట్టి హృదయంలో (ప్రేమ నింపుకొని, కోటితల్లుల (ప్రేమ కురిపిస్తున్నారు స్వామి. అదే నిస్వార్ధ (ప్రేమకు నిదర్శనము. నిష్కామ ప్రేమ భగవంతునిలో మనము చూచుచున్నాము. భగవంతుడు మానవ రూపం ధరించి అందరి పట్ల మాతృప్రేమను ప్రదర్శిస్తూ విశ్వమాతగా దర్శనంబిచ్చుట ఈనాడు మనము చూచుచున్నాము.

(ప్రేమకు మించిన అధ్యాత్మిక సాధన వేరొకటి లేదు. (ప్రేమ యొక్క పరాకాష్ట సేవ. సేవ యొక్క స్ఫటిక రూపం త్యాగం. “ఏసుక్రీస్తు విశ్వప్రేమైక మూర్తి సౌజన్య మూర్తి. శాంతి సాధన కర్త, క్రీస్తు జన్మ దినాన్ని మానవత్వానికే జన్మదినంగా పరిగణించాలి. నేటి కలుషితమైన సమాజంలో మంచిని పెంచి, శాంతిని స్థాపించడం ప్రతీ వ్యక్తికీ ముఖ్యోద్దేశం కావాలి. ఆరాధనలు, ప్రార్ధనలు వేరైనా సర్వ మతాల సారాంశం గమ్యం ఒక్కటే. అదే ప్రేమతత్త్వం. ఇతరులకు సహాయపడటమే మానవతత్త్వం. మానవుల్లో మానవత్వం నశించినపుడు దేశంలో అరాచకం పెల్లుబికి అశాంతి, హింసా ప్రజ్వరిల్లుతుంది. అప్పుడే మహాత్ములు, అవతారమూర్తులు, యోగులు, సిద్ధపురుషులు ఉద్భవించి ప్రశాంతతను చేకూరుస్తారు. “నిన్ను నీవు (ప్రేమించుకున్నట్లే ఇతరులను కూడా ప్రేమించు” అనే జీసెస్‌ సిద్ధాంతాన్ని అందరూ పాటిస్తే మానవ సమాజంలో శాంతి ప్రేమలు శోభిల్లుతాయి. ప్రపంచంలో మతాలన్నీ విశ్వ మానవ కళ్యాణం కోసమే వెలసినాయి. సర్వమత సమన్వయం, సమైక్యత, మత సామరస్యం సోదర భావాలతో ప్రజలందరు కలిసి మెలసి జీవించాలి అంటూ శ్రీ విశ్వంజీ (24-1-97) తమ క్రిస్‌మస్‌ సందేశంలో ప్రేమను గురించి, (ప్రేమ మతమే ఉన్నతమైనదని ఉద్బోదించినారు. -

ఇంతటి (ప్రేమ మూర్తులైన వారు నరాకారం ధరించి ప్రేమతో మనల్ని ముంచెత్తి (పేమ బంధంతో మనకు సేవ చేస్తూ మనల్ని ఉత్తమ మానవులుగా తీర్చి దిద్దుటకు కృషి చేయుట మన పూర్వ పుణ్యము. మానవతా విలువలలో అత్యున్నతమైన విలువ ప్రేమ. మిగిలిన విలువలన్నిటిలో ప్రేమ అంతర్వాహినియై ప్రతి విలువతో ముడిపడి యున్నది. అందుచే ఆ మతము ఈ మతము అనుకోకుండా అందరిది “ఒకటే మతం - అదే (ప్రేమ మతం” - అనుసూక్తిని ఆచరిస్తూ మన ప్రేమను విస్తరిస్తూ విశ్వ (ప్రేమైక మూర్తి (ప్రేమకు పాత్రులగుట, మన కర్తవ్యము.

66 ఉన్నది ఒకే ధర్మము - అది కర్తవ్యము ఉన్నది ఒకే ధర్మము. అది కర్తవ్యము ఉన్నది ఒకే దేంవుడు అన్నట్లు గానే ధర్మము ఒకే ధర్మము. వేరు వేరు దేశములలో వేరు వేరు ధర్మములు లేవు. అందరూ ఆచరించదగినది, ఎవరి కర్తవ్యమును వారు నిర్వహించునది ధర్మము. “ధృజ్‌ ధారణిొ” అను ధాతువు నుండి ఏర్పడినదే ధర్మము. అనగా ఈ పదమునకు - సమస్త విశ్వమునూ, నిలకడగా నుంచునదని భావము. అసత్యముతో దోహదము కాని వాక్కు రాగ ద్వేషములచే కలుషితము కొని మనస్సు, హింసాదులచే భూషితము కాని కాయము, అనునవే మానవత్వపు విలువలు. వీటి ఆచరణయే సదాచారము. ఈ విలువలకు ధర్మము అంతర్భూతమై యుండును. అలనాడు శ్రేతాయుగంలో అవతార పురుషుడైన రాముడు “రామో విగ్రహవాన్‌ ధర్మః అన్న పేరుతో ధర్మాన్ని ఆచరించి, జీవితంలో ప్రతి పాత్ర ధర్మాన్ని దృష్టియందుంచు కొని ధర్మ బద్ధుడై ప్రజా రంజకుదైన రాజైనాడు. రాముడు దేంవుడు అని గుర్తించిన వారు ఆ కాలంలో చాలా తక్కువ మందేనని చరిత్ర చెప్పుచున్నది. తల్లిదండ్రుల పట్ల, భార్యపట్ల, తమ్ముల పట్ల, సైన్యం పట్ల ప్రతి ఘట్టంలోనూ ధర్మానికి బద్ధుడై మూర్తీభవించిన ధర్మమే తానై నిలచి ప్రపంచానికే ఆదర్శ ప్రాయుడైనాడు. ధర్మాచరణకే ప్రతిరూపము తానైనాడు రాముడు. ద్వాపర యుగములో భగవద్గీతలో కృష్ణుడు 14వ అధ్యాయములో చెప్పిన ధర్మమందు “నేను మోక్షస్థానమును”, (అమృత స్థానమును) సనాతనమను ధర్మ స్వరూపమును, ముఖ్యమైన నిత్యానంద స్వరూపమునగు బ్రహ్మమున కాశ్రయ భూతుడను అని తెలిపెను. శ్లో బ్రహ్మణోహిప్రతిష్టా౭ హమమృతస్యావ్యయస్యచ। శాశ్వతస్య చ ధర్మస్య సుఖ స్యైకాన్తికస్యచ।॥ ఈ అమృత తత్వమునే ఉపనిషత్తులలో అనేక స్థలములలో ప్రతిపాదించటమైనది. ఉపనిషత్సారమే గీత యగుట వల్ల, ఈ అమృతత్వమును గీతలో పలుసార్లు నిరూపించ

67

డమైనది. కావున ధర్మకర్మ అనునది సామాన్యము కాదు. ఆత్మసారమే. దీనిని ఆచరించిన వారు భగవంతున కత్యంత ప్రీతి పాత్రులు. భగవత్‌ ప్రీతికి పాత్రులు కావలెనన్న సత్య ధర్మ కర్మల నాచరించవలెను. మచ్చునకొక శ్లోకము.

యేతు ధర్య్యామృత మిదం యథోక్తం పర్యుపాసతే.

(శద్దాధానా మత్పరమా భక్తాస్తే. తేవమే ప్రియాః

(ఎవరైతే శ్రద్ధావంతులై, నేనే పరమ గతియని భావించిన వారై, నేను ఇంత వరకు తెలిపిన విధముగ ఈ ధర్మ స్వరూపమైన అమృతమును సేవించుచున్నారో వారు నాకత్యంతప్రియులు.) ధర్మము నుండి తొలగనిదియు, అమృతమూ ద్వేషము లేకుండుట, మొదలుగా గల ధర్మ సముదాయము నందు శ్రద్ధగలిగియు, పరమాత్మయే పరమగతిగా తలంచుచు ఎవరుందురో, అట్టివారే నా కత్యంత ప్రీతిపాత్రులని పలికెను. అందులో “ధర్య్యామృతం” అని ప్రయోగించటంలో అంతరార్థము యోచించిన భగవద్ధర్మమును, అనుష్టించువాడే భగవద్ధర్శనమును పానము చేయుటకు అర్హుడగును. సామాన్య మానవులు తమకు భగవంతుని యందు భక్తి యున్నదని తలంతురు. అంతటితో తృప్తి పడక తమపై భగవంతుడు ట్రీతి కలిగి యున్నాడా అని యోచించవలెను. ఆ కీలకమైన విషయమిందు వివరింపబడినది.

భౌతికమైన, లౌకికమైన జగత్తులో మానవుడు తన కర్తవ్యము తాను దైనందిన జీవితములో నెరవేర్చుట కూడ ధర్మమే. కేవలము దాన ధర్మములు చేయుట ధర్మమునకు సరైన నిర్వచనము కాదన్నారు స్వామి. గృహస్థ ధర్మము, వానప్రస్థ ధర్మమని, సన్యాస ధర్మమని, బ్రహ్మచర్య ధర్మమని అనేక ధర్మ రూపములు కలవు. లోతుగా పరిశీలించి చూస్తే ఇవన్ని విడిపోవునట్టి దేహ ధర్మములే. కడకు మిగిలేది ఆత్మధర్శ్మమే.

ప్రతి మానవుడికి మానవతా ధర్మము చెప్పిన విషయము “మాతృదేవోభవ.” తల్లిని భగవత్‌ స్వరూపంగా ఆరాధించడం ్రతి మనిషి కర్తవ్యము. తర్వాత తండ్రి వివాహమయ్యే

68 వరకు అనేక విధముల సంరక్షిస్తూ కాపాడి నందుకు తండ్రిని భగవత్‌ స్వరూపుడుగా భావించి సేవించు. అది వ్యక్తి ధర్మము. గురువు జ్ఞానాన్ని అందజేసి జ్ఞానవంతుల్ని చేస్తున్నాడు. గురువు మనకు అన్ని నేర్పుతున్నాడు. గురువునుదైవంగా భావించు “ఈశ్వర సర్వ భూతానాం” అని సనాతన ధర్మము మనకు బోధించినది. నీ ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను గౌరవించి దైవ స్వరూపులుగా భావించి మర్యాద నందించు మన్నది సనాతన ధర్మము. అన్ని భూతాల్లోను, అందరిలోను దైవాన్ని చూడమని బోధించింది విశ్వధర్మము. ఈనాటి మానవుడు అనేక భ్రమలకు లోనై అధికారమును, ధనమును ఆశించి 'పెడమార్గం పడుతున్నాడు. ఇవి ఎక్కువ కాలము నిలిచేవి కావు. “మాకురుధనంజన యౌవన గర్వం, హారతి నిమేషాత్కాలః సర్వం” క్షణ భంగురమైన యౌవనాన్ని చూచుకొని ఆశలను పెంచుకొని జీవితాన్ని వ్యర్థం గావించుకోకూడదు. మీరు జీవితాన్ని సారకంగావించుకునే నిమిత్తం జన్మించారు గాని, వ్యర్థం గావించుకునే నిమిత్తం కాదు. దేహం ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినది. ధర్మాన్ని గుర్తించడమే జీవిత మర్మం. మానవునకు నచ్చినదంతా మానవధర్శ్మం కాదు. అంతరాత్మను అనుసరించడమే నిజమైన ధర్మము. అంతరాత్మను విస్మరించి బయట కనిపించే ప్రతిబింబాన్ని ఆశించి మాయలో పడకుండా మూలాధార తత్త్వమును పట్టు కోవాలి. మూలస్టానాన్ని చేరుకోవాలి. (26-8-2001 సనాతన సారధి బాబా ఉగాది సందేశము నుంది) “భయంకరమైన యుద్ధభూమిలో విచిత్రమైన వాతావరణంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను అర్జునునకు ఉపదేశించి జగద్దురువైనాడు. తన కర్తవ్యంగా భావించి

69

శాశ్వతమైన చక్కటి బోధను తరతరములకు నిత్యమై సత్యమై నిలచిన బోధామృతాన్ని అర్హత గల తన శిష్యుణ్ణి పరికరంగా తీసుకుని ఉపదేశించి నాడు. గొప్ప అధ్యాత్మ తత్త్వమును గురువు శిష్యునకు కర్తవ్యంగా భావించి బోధించినప్పుడు, సామాన్య మానవులు తమతమ కర్తవ్యములను నియమము తప్పకుండా ఆచరించిననాడు ధర్మమునకు వాని కలుగకుండా సమాజము మూడు పూవులు ఆరు కాయలై ప్రశాంతి నిలయంగా మారగలదు. అందుచే ధర్మము నాచరించుట (ప్రతి ఒక్కరి కర్తవ్యము.

“ధర్మము ఎక్కడో అక్కడ కృష్ణుడుండును. ధర్మమూ కృష్ణుడూ ఎక్కడ ఏకస్వరూపు లగుదురో అక్కడ జయముండును.”

ఇది భగవద్గీత చెప్పిన సందేశము. ధర్మాన్ని ఆచరించిన నాడు ధర్మము నిన్ను రక్షించును. ఇది శ్రీ విశ్వంజీ తమ దివ్యోపన్యాసంలో పేర్కొన్న విశేషము.

70 ఉన్నది ఒకటే భాష - అది హృదయ భాష గలం పే 00% ౧06 [200226 - 016 2090226 01 6221 బయట కనిపించేది స్వామి యొక్క భౌతిక రూపము. హృదయ వాసియైన భగవంతుడు లోపల ఉండి అన్ని వీక్షిస్తుంటాడు. భాషకు, భావాలకు కూడా అతీతమైన స్థితిలో అసలు స్వామి (అనగా నిరాకార నిర్గుణమైన స్థితి శుద్ధ చైతన్యము) పంచ కోశముల కావల ్రతిష్టితుడై ఉన్నాడు. హృదయాంతరాళాలలో పరమాత్మ మౌనం వహించి తనదైన కార్యాన్ని తాను చేసుకుంటూ వస్తున్నాడు. హృదయానికి భాష లేదు. అది మౌనమే. హృదయమనే గుహలో నిశ్శబ్దం తారాడుతున్నది. గురువు మనతో సంభాషించడం, వారి ఆదేశం మేరకు మనము పనులు నిర్వహించడం ఒకరు మాట్లాడితే (సత్సంగము) మరొకరు వినడం ఇత్యాదివన్ని పంచ కోశముల బయట జరుగుచున్నది. పంచ కోశాల కవతల ఏమి జరుగుతోంది అని యోచన చేసినప్పుడు 'ఏమీ లేదు! మౌనమే” అని సమాధానము చెప్పుకొనవచ్చును. బయటకు కనపిస్తున్నది స్వామి రూపము అసలు “ఆసామి” లోపల ఉన్నాడు. అన్నారట రమణ మహర్షి “హృదయాన్ని అర్ధం చేసుకోవాలంటే హృదయం కావాలో అంటారు శ్రీ విశ్వంజీ. “ హృదయం లేని మాటల కంటే మాటలు లేని హృదయమే మేలు” అన్నారు భగవాన్‌ సత్యసాయి. భగవంతుని మాటలు మనము టేపు చేసుకుంటాము. ఆ టేపులో పదములు వినాలంటే టేపుకు, కరెంటుకు కనెక్షన్‌ పెట్టాలి. అప్పుడే ఆ ప్రతిధ్వనులన్ని ఆనందముగా వినవచ్చును. అదే “శబ్ద బ్రహ్మము అంతేగాని, మనం చేసే శబ్దాలన్నీ బ్రహ్మము కాదు. నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మం. నీవు ఏకాంతమైన స్థానములో కూర్చున్నప్పుడు అక్కడ ఒక విధమైన శబ్దం (ప్రారంభమవుతుంది. అదే నిశ్శబ్దములోని శబ్దము.” (బాబా)

71

రామకృష్ణ పరమహంస భగవంతుడు ఎప్పుడు వచ్చి తనను అనుగ్రహిస్తాడో అనే ఉద్దేశ్యంతో, చాలా నిశ్శబ్దంగా భగవంతుని రాకకై ఎదురు చూసేవాడు. ఒకానొక సమయంలో రాణి రాసమణి రామకృష్ణుని ఉద్దేశించి “రామకృష్ణా! మీరెందుకు ఇంత నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు?” అని ప్రశ్నించింది. అప్పుడు రామకృష్ణుడు చెప్పాడు. “భగవంతుడు అతి సూక్ష్మ స్వరూపుడు. అతడు అణువులలో అణువు వంటివాడు. గొప్పవారిలో గొప్పవాడు. మనము అనేక శబ్దాలు చేస్తుంటే, భగవంతుడు వచ్చే శబ్దము మనకు వినిపించదు. మనం నిశ్శబ్దంగా ఉంటే భగవంతుడు వచ్చేటప్పుడు చేసే శబ్దాన్ని వినవచ్చును.” అని తెలిపాడు. రామకృష్ణుడు తాను నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వస్తున్నాడేమోనని తక్షణం లేచి చూసేవాడు. ఆ నిశ్శబ్దంలోని శబ్దమే “దైవ శబ్దం” అని భావించాడు.

అందుచేత నిశ్శబ్దాన్ని పాటిస్తూ, భగవంతునిపై ఏకాగ్రత సాధించాలి. “నిశ్ళబ్దంలోనే దైవ వాణి వినిపిస్తుందొ అని కూడా చెప్పారు. నిశ్శబ్దమంటే ఆంతరంగిక మౌనము. మౌనంగా ఆ రూపాన్ని ధ్యానించినప్పుడు విశ్వ శబ్ద తరంగాల ద్వారా సర్వజ్ఞుడయిన భగవంతుడికి మన భావాలు చేరతాయి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక గురువుతో గాని భగవంతునితో గాని సంబంధ బాంధవ్యములున్నప్పుడు కొన్ని అనుభూతులు తప్పక కలుగుతాయి. అట్టి అనుభూతులన్ని హృదయ భాషకు సంబంధించినది. భగవంతుని అనుగ్రహంతో ఆశీర్వాదబలంతో దివ్యమైన సత్‌ సంకల్పముతో మన సత్‌ సంకల్పాలు కలిసినప్పుడు ఒక యోగము ఏర్పడినది. ఆ దివ్యమైన యోగమే మాటలలో చెప్పలేని హృదయ భాష,

హృదయ వాసియైన భగవంతుడు విశ్వసాక్షియై చుట్టూ ఏమి జరుగుతున్నది, ఈ గమనంలో మానవుడు ఏ స్థాయిలో పయనిస్తున్నాడన్నది వీక్షించి మానవుణ్ణి సన్మార్గం వైపు మౌనంగానే పయనించేటట్లు అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు.

72 నా అదుపు పొదుపు మనిషికి అత్యంత ఆవశ్యకము ప్రతి మానవుడు జీవితంలో అదుపు - పొదుపు పాటించాలి. అదుపు - అనగా మనలో నున్న కొర్కెలను అదుపు చెయ్యడం. పొదుపు - ఏ వస్తువైనను (ధనము, కాలము, ఆహారము, శక్తి ఇత్యాదివన్ని) ఒక హద్దును నియమమును దాటి ఖర్చు చెయ్యడం మంచిది కాదు. ఏది అవసరమో, ఎంత ఆవస్యకమో, సమయానుకూలంగా, వివేకంతో, విచక్షణతో ఆలోచించి మనల్ని మనమే అదుపులో పెట్టుకుంటూ జీవన విధానం సాగించడం అత్యవసరమని, అత్యంత ఆవశ్యకమని ఈ సూక్తికి అర్ధము : ఈ విధమైన పద్ధతినే భగవాన్‌ శ్రీ సత్యసాయిబాబా వారు (6618౦౧ 6163) “కోర్కెలపై అదుపు” అన్న పేరుతో అందరూ ఆచరించవలెనని సత్యసాయి సేవా సంస్థల వారికి పిలుపు నిచ్చిరి. అందరి చేత ఆచరింప చేస్తూ సమాజ సేవ పేరిట ఈ 'సీలింగ్‌ ఆన్‌ డిజైర్స్‌” కార్యక్రమాన్ని వ్యాప్తి గావించడం జరిగింది. కోర్కెలపై; ఆశలపై అదుపు విధించుకోవాలన్న స్వామి ఆదేశాన్ని త్రికరణ శుద్ధిగా పాటించవలెను. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవటం, ఆశలపై అదుపు - ఆహార పదార్ధములను పొదుపు చేయాలన్నారు బాబా. అదుపు- పొదుపు అన్న అంశము కేవలము ధనమునకే పరిమితిము కాక తదితర విషయములలో కూడా ఈ పద్ధతి అమలు జరుపవచ్చునని దైనందిన జీవితములో నిత్యావసర వస్తువుల వాడకము మొదలు కొని డబ్బు, ఆహారము, కాలము, శక్తి మున్నగునవేవి మానవుడు వృధా చేయరాదని ఈ నాలుగు అంశములు ఈ పధకము క్రింద వివరించడం జరిగింది. 0 101 ౪72548 గెశీం%ల్లా - దబ్బును వృధా చేయవద్దు. 0 804 72546 2026 - కాలాన్ని వృధా చేయవద్దు. 0 ౨0 ౪2548 కం064 - ఆహారాన్ని వృధా చేయవద్దు. 0 104 72504 99టిల్చై - శక్తిని వృధా చేయవద్దు.

73

౨0 106 ₹256 గక00ట” - డబ్బును వృధా చేయవద్దు: కోర్కెలను అరికట్టుకోవడం వలన కొంత ధనాన్ని నిల్వ చేసుకోగల్గుతాము. ఆ ధనముతో తోటి మానవులను ఆదుకోవడానికి అవకాశముంటుంది. అనుక్షణం మనస్సును గమనిస్తూ ఉండి వాంఛల నుండి మరలించు కుంటూ ఉండాలి. ధ్యానమనే ఎరను చవి చూపించి మనస్సును భగవంతుని యందే లీనం చెయ్యడం వలన కోర్కెలను తగ్గించుకుందుకు అవకాశమున్నది.

ప్రతి ఒక్కరు లక్ష్మీ స్వరూపమైన ధనము పట్ల లక్ష్యము కలిగి వృథా చెయ్యరాదన్న భావంతో జీవించాలి. ప్రతి ఒక్క పైసా విలువ తెలుసుకొని గుర్ర్తించాలన్నదే శ్రీ సత్యసాయి బాబా వారి శ్రీ విశ్వంజీ మహరాజ్‌ వారి ఆశయము. బిందువు, బిందువు చేరి మహానదులై మహాసముద్రమైనట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కపైసా వందలు, వేలు, లక్షలుగా మారి సమాజంలో అనేకానేక మంచి కార్యక్రమములు, కరువు కాటకములను తీర్చుటకు ఉపయోగపడును. పవిత్రమార్దంలో ఉపయోగపెట్టిన వారమవ్లుతాము. కుటుంబములో ఏర్చడే అవాంతరాలను సమస్యలను తీర్చుకొని శాంతిని పొందగల్దుతాము. దీనివలన మానవునకు తృప్తి ఆనందములతో బాటు మానసికంగా శాంతి ఏర్పడగలదు.

ఇచట గమనించవలసిన మరొక విశేషము ఈ కార్యక్రమము క్రింద ఆశలను అరికట్టు కోవడానికి ప్రయత్నించకుండా కేవలం కోర్కెల అదుపు పేర కొంత ధనాన్ని మాత్రం బ్యాంకులో దాచి పెట్టుచున్నారు. ఇదికాదు “మీ ఆశలను అరికట్టుకొని వైరాగ్య మార్గములో దివ్యానందాన్ని అనుభవించాలనేదే నా ఆశయము” అని హెచ్చరించినారు. బాబా. కోర్కెల అదుపు చెయ్యకుండా తన అలవాట్లు ఆ విధంగానే కొనసాగుతూ సమాజోద్ధరణకు ధనము నిల్వ చేసి ప్రయోజనము లేదని, నీ కోర్కెలు తగ్గించి, దాని కయ్యే ఖర్చుతో సత్కార్యములు చేయడంతో 'కోర్కెలపై అదుపు” అనే లక్ష్యం నెరవేరుతుంది గాని చెడు అలవాట్లు అధిక ధన వ్యయం అరికట్టకుండా ధనం కొంత నిల్వ చేసి సమాజాన్ని ఉద్ధరించాలనుకోవడం సమంజసం కాదని ఇచట భావము.

ఇదే భావాన్ని శ్రీ విశ్వంజీ తమ దివ్యోపన్యాసాలలో పలుమారులు వెలిబుచ్చినారు. ప్రతి ఒక్కరు తాము ఆర్జించిన దాంట్లో కొంత శాతము ఐదు లేక పది శాతము మంచి

74

కార్యాలు చేయడానికి ప్రక్కకు పెట్టినట్లైతే అద్భుతమైన రీతిలో దివ్యమైన కార్యక్రమములు సాధింపబడగలవని ఉద్దాటించినారు. ఒక త్రాగుమోతు క్రమక్రమంగా తన దురలవాటుకు స్వస్థి చెప్పి ఆ డబ్బును సేవా కార్యక్రమములకు సమాజానికి మేలు చేసే పద్ధతిలో ఉపయోగించిన నాడు సమాజము మూడు పువ్వులు ఆరు కాయలుగా వెల్లి విరుస్తుందని, అందరూ కలిసి ఇటువంటి మహత్తరమయిన సేవకు పూనుకొన్ననాడు పేదవారి పెనుబాధలు తొలగి ప్రశాంత జీవనం సాగించవచ్చునని వచించినారు. ప్రతి ఒక్కరు అదుపు, పొదుపు పాటించి, దాచిన సొమ్ముతో బీదల సహాయార్ధం వినియోగించండి. ప్రస్తుతం రాజకీయాల్లో నైతిక విలువలు, నీతి, పూర్తిగా లోపించినాయి. ప్రతి వ్యక్తీ మంచి మనస్సున్న మనిషిగా మెలగాలి. మానవత్వాన్ని విస్మరిస్తే దేశంలో అరాజకం తాండవం చేసే ప్రమాదం ఉన్నది. హింసాతత్వాన్ని విడనాడి, శాంతియుత

వాతావరణంలో సుఖ సంతోషాలతో సహజీవనం గడపండి” అని అన్నారు. భాగ్యనగరంలో శ్రీ విశ్వంజీ “శ్రీ విశ్వశాంతిధామం” భవంతి శంకుస్థాపన మహోత్సవ సభలో మాట్లాడుతూ తమ దివ్యోపన్యాసంలో ఈ విధంగా అన్నారు. “్రత్తి ఒక్కరు మీకు వచ్చిన దాంట్లో పది శాతం లేదా కనీసం ఐదు శాతం ధనం, దెవ కార్యాల నిమిత్తం, దీనమానవ సేవ నిమిత్తం ప్రక్కకు పెట్టినట్లెతే ఆ విధంగా కూడ బెట్టిన ధనంతో అద్భుతమైన (462016) మహిమలు చెయ్యవచ్చునని, లోకకళ్యాణం కోసం ప్రతి ఒక్కరు ఈ విధంగా కృషి చేసిన నాడు ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రోత్సపొంచిననాడు “విశ్వశాంతి” వెల్లువిరుస్తుందని ఈ భూమి స్వర్గధామంగా మారుతుందని శెలవిచ్చినారు. శక్తికి మించి చెయ్యనవసరము లేదని, ఆ విధంగా చేసిన వారి దగ్గర తీసుకునేది లేదని వారు హెచ్చరించినారు. “ఉన్నది దాచుకుంటే (ధనముగాని శక్తిగాని) దొంగతనమవుతుంది. శక్తికి మించి చేస్తే అహంకార మవుతుంది. కాబట్టీ అహంకారీ కావద్దు దొంగ కావద్దు” అన్నారు భగవాన్‌ సత్యసాయి. ఎవరు ఎంతవరకు చేయగలరో అంతవరకు మాత్రము అదుపు-పొదుపు రెండూ పాటిస్తూ విశ్వ కళ్యాణం కోసం కృషి చెయ్యాలన్నదే స్వామి తపన. వారు ఆచరించి అనేకానేక మన కార్యములు సాధించి విద్య, వైద్యము దరిద్ర నారాయణ సేవ ఇత్యాది కార్యక్రమములు నిర్వహించి లోకంలో అందరూ ఈ విధంగా పాటిస్తే బావుంటుందని

75

వారి జీవితాలే జగతి సందేశాలు అన్న రీతిలో మానవసేవ చేస్తూనే ఉన్నారు. శ్రీ విశ్వంజీ నిర్మించిన “విశ్వనగరొలో జరుగుచున్న వైద్య శిబిరములు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ కట్టడానికి దోహదమవుతూ త్వరలోనే చక్కటి వైద్య సంస్థ ఉచితంగా మానవాళి రుగ్మతలు తొలగించడానికి వర్పడబోతున్నది. శ్రీ విశ్వంజీ ఆశ్రమం చూచుటకు వచ్చిన వారందరి సౌకర్యార్ధము ఉచిత రీతిలో ఆహారాన్ని అందించుటకు అన్నపూర్ణాలయం వెలసింది. ప్రతి వ్యక్తి పైసా, పైసా కూడ బెట్టి తానొక్కడే అనుభవించ వలెనన్న పద్ధతిలో ధనాన్ని భద్రపరచిన నాడు అనేక ప్రమాదములకు అనర్ధములకు, భయ ఆందోళనలకు గురి చేస్తుంది. అందుచేతనే దుద్దు (34006) బ్లడ్డు (31004) సర్క్యులేషన్‌ లో ఉండాలంటారు భగవాన్‌ సత్యసాయి. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోయినటెతే శరీరం రోగ గగ్రస్తమయినట్లే డబ్బు నిల్వ చేసి మురిగిన నాడు మానవుడికి మనశ్శాంతి కరువై అనుక్షణం ఆ డబ్బును గురించి చింతిస్తూ దొంగలు అపహరిస్తారన్న భయం పీడిస్తుంది. ఆదాయపు పన్ను వారు (100006 ౪9 దాడి చేయగలరేమోనన్న భీతి కూడా పీడిస్తుంది. ఇటువంటి మానసిక సంక్షోభానికి గురియగుటకంటే ప్రతి ఒక్కరు సమాజ సేవకు సత్మార్యములకు ధనాన్ని వారి వారి శక్త్యానుసారం వ్యయం చేసిన నాడు ఇతరమైనటువంటి భయాందోళనలు తొలగిపోయి ప్రశాంతంగా తృప్తిగా ఆనందంగా జీవించగలుగుతారని బోధిస్తున్నారు బాబా. “16:3 10828290 0016 00౧101 102106 ౪2౪౦1 2016256” అని ఇండియన్‌ రైల్వేస్‌ వారు బోర్డు వ్రాసి పెట్టెదరు. అదే విధంగా మానవుడు జీవితం అనే ప్రయాణంలో కోరికలనే బరువు తగ్గించుకుంటూ తక్కువ సామానుతో ప్రయాణం చేస్తే రైలు ప్రయాణం ఏ ఇబ్బందులు లేకుండా సుఖంగా సాగుతుందో అదే విధంగా మానవుడు కోర్కెలు అన్న బరువు తగ్గించుకున్ననాడు "సేవా కార్యక్రమాలకు ఖర్చుపెట్టినప్పుడు జీవితం సుఖమయంగా ఆనందంగా సాగిపోయి మానవత్వం గల మనిషిగా విరాజిల్లగలడు.

సహజంగా ప్రతి మనిషికి కోరికలుంటాయి. కోరికలు లేకుండా మానవుడు లేడు. కాని మితిమీరిన కోరికలుండరాదని మహనీయుల ఉవాచ. సమాజమునకు గాని, ఇతరులకు గాని హాని కలుగకుండా ఉండే న్యాయమైన (6౪0200) కోర్కెలుండాలి. భగవాన్‌ బాబా అంటారు “నాకు కూడా కోరిక ఉన్నది. మీరందరు చక్కటి సేవలలో

76 పాల్గొని మానవత్వంతో కూడిన మనుష్యులుగా తయారవ్వాలని, దీన మానవ సేవ, ఉచితమైన రీతిలో కార్యాలు నిర్వహించడం” వంటివి నా కోర్కెలు” అదే విధంగా శ్రీ విశ్వంజీ “నాకు కూడా ఒక పిచ్చి ఉన్నది. మనుషుల నడుమ చిచ్చు రేపడం కొందరికి పిచ్చియైతే, మనుషుల్ని మనుషులుగా నిలపడం విశ్వయోగి యొక్క పిచ్చి ఇది ప్రతి ఇంటిని ఒక ప్రశాంతి నిలయంగా రూపొందించే పిచ్చి ఇది కూడా కోరికే. అన్నింటికంటే పెద్ద కోరిక” అంటూ తనకీ కోరిక ఉన్నదని వెల్లడించినారు. శ్రీ విశ్వంజీ” మానవులు తమ జీవిత కాలంలో లోకానికి ఉపయోగపడాలి. తమ వలన ఇతరులకు మేలు కలిగేటట్లు మెలగాలి. తమ పొట్ట తాము నింపుకొంటూ సమాజంలోని మిగతా వారికి ఏ మాత్రం పనికి రాకుండా చివరికి చచ్చిపోయి, పరమాత్మలో లీనం కావటమే జీవిత పరమావధి అనుకోవడం శుద్ధతప్పు” అంటూ విశ్వగురుచరిత్రలో తెలియబరచినారు దిన దినానికి పెరిగి పోతున్న ఈ కోర్కెలను ఈ అదుపు పొదుపు గురించి చెప్పుకున్నప్పుడు భౌతిక ప్రపంచంలో కోర్కెలను అదుపు చేసుకోవడం పొదుపుగా భద్రంగా మితమైన ధన వ్యయంతో జీవించడం అనుకుంటే మన దేహ పరంగా ఆలోచించినప్పుడు ఇంద్రియాల మీద అదుపు కూడా మానవుడికి చాలా అవసరము. ఏది వినాలో అది వినాలి ఏది చూడాలో అదే చూడాలి. నాలుకకు ఎంత ఆహారాన్ని అందివ్వాలో అంతే ఆహారం మితంగా అందించాలి. సాత్వికాహారం మితాహారం మానవుడి ఇంద్రియాలను అదుపులో పెట్టుకుందుకు సహకరిస్తుంది. పెదవులతో ప్రార్ధిస్తూ చేతులతో సేవ చేస్తే సమస్తమూ పవిత్రమై దేహంలో ఉన్న ఇంద్రియాలన్నీ వాటి పనిని అవి చక్కగా దివ్యంగా నిర్వహిస్తాయి. ఈ విధంగా ఇంద్రియాలపై అదుపు మానవుడికి అత్యంత ఆవశ్యకము. సామాన్య మానవుడు ఏ విధంగా అదుపు చెయ్యాలి లన్న దానికి శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో సెలవిచ్చిన విషయాన్ని పరిశీలిద్దాము. ఈ కోరిక అనేటువంటిది ఏనాటికీ కూదా తృప్తి కలిగించేటువంటిది కాదు. భగవద్గీత యందు “మహానలము” అని పేరు పెడుతూ వచ్చాడు శ్రీకృష్ణుడు. అనగా అగ్నికి ఎన్ని విధములైనటువంటి ఆహూతి వేసినప్పటికినీ అది “చాలును” అని చెప్పదు. ఎంత వేసినప్పటికీ “ఇంకా కావాలి ఇంకా కావాలి” అంటూ ఉంటుంది. మరింత అభివృద్ధి అవుతుందే కాని చల్లారదు. దీనిని సంస్కృతములో 'అనలమూ అని పిలుస్తూ వచ్చారు. అనగా చాలదు అని భావము.

77

“'అలమూ అనగా “చాలును అని అర్ధము. ఎన్ని విదములైనటువంటి అనుభవములు, అనుభవించినప్పటికిని, ఎన్ని కోరికలు తీరినప్పటికినీ, “ఇంకా కావాలి; కావాలి, అనే అనంతృవ్లి గానే తాను దానిని అనుభవిన్న్తుంటుంది. రావణుడు ఎన్ని విధములయినటువంటి సౌఖ్యముల' అనుభవించి నప్పటికిని తనకు ఇంకను తృప్తి అనేటటువంటిది లేక కట్ట కడపటికి ఈ కోరిక అనేటువంటి దాని యందే తన జీవితమును అంతము గావించుకున్నాడు. “రావణ (బ్రహ్మ అను పేరు గాంచి “ఓం నమఃశ్శివాయ” జపించినప్పటికిని ఈ కోరిక అను బలీయమైన దానవ గుణముతో అంతమొందినాడు. దైవము పేరు చెప్పగానే సరిపోదు) దైవాన్ని అనుభవించాలి. అన్నము విస్తరి ముందు పెట్టుకుని అన్నము, అన్నము అని చెప్పడం కాదు. దాన్ని అనుభవించాలి. అప్పుడే అది సర్వాంగములను పుష్టివంతం చేస్తుంది. కనుక ౨౫42౫ 0501621156 604. 566 606. గమ 6064 2210 606. 1013 15 10 కు6 ౯018007 దైవాన్ని అనుభవించటం చేత దివ్య శక్తులన్నియు కూడా బయలుదేరు తుంటాయి. ఇట్టి అనుభవానికి మొట్టమొదట కామమనే ఈ కోరికలను హత మార్చాలి. చీకటిని చూచి మనం చీకటితో ఎంత పోట్లాడినప్పటికిని, చీకటిని ఎంత నిందించి నప్పటికిని చీకటి పోదు. ఆ చీకటి ఉన్నటు వంటి ప్రదేశము నందు ఒక జ్యోతిని వెలిగిస్తే చాలు. చీకటి పారిపోతుంది. అదే విధముగనే ఈ కామము అనేటు వంటి చీకటి మన హృదయము నందు ప్రవేశించినప్పుడు జ్ఞానము అనేటు వంటి జ్యోతిని వెలిగిస్తే చీకటి పోతుంది.

“ప్రభావ శీలమైన ప్రాణశక్తితో ఇచ్చాశక్తి (౫11 00*అలు కూడినప్పుదే సంకల్ప ప్రభావం సరైన స్థితిలో ఉంటుంది. 1) నిర్ణయశక్తి 2) మేధాశక్తి 3) విచక్షణా శక్తి 4) (గ్రహణ శక్తి 5) వాక్‌ శక్తి 6) ఆలోచనా శక్తి 7) క్రియా శక్తి. ఈ సప్త శక్తులు “ఇచ్చాశక్తి లో లీనమై ఉంటాయి. ఈ శక్తులన్నింటిక్షి రాజు వంటిది ఇచ్చాశక్తి. ఈ ఇచ్చాశక్తి పెరగాలంటే కోరికలు తగ్గించుకోవాలి. ఎంతో కాలముగా వస్తున్న అలవాట్లను విసర్జించినప్పుడు వాటిపై ప్రసరిస్తున్న కామనాశక్తి ఇచ్చాశక్తిలో లీనమై పోతుంది. అప్పుడు ఇచ్చాశక్తి బలపడుతుంది. ఈ విధముగా ఇచ్చ్భాశక్తిని పెంచుకుంటూ పోతుంటే ఇంధ్రుడుగా కూడ మారవచ్చును. దేనినైనను సాధించవచ్చును. ఈ రహస్యమును

78

గుర్తించిన ప్రాచీన మహర్షులు “వైరాగ్యం”అనే పేరుతో సర్వ ఆశలను, సమస్తమైన కోర్కెలను అదుపులో పెట్టేవారు. కోరికలు ఎంత తగ్గితే అంత ఇచ్చాశక్తి పెరుగుతుంది. ఈ ఇచ్చాశక్తిని మనం దైవం వైపు మరల్చాలి. లేకపోయినట్లెతే అది నిరుపయోగ మైపోతుంది. కనుక మనం ఇచ్చాశక్తితోబాటు క్రియాశక్తిని, క్రియా శక్తితోబాటు జ్ఞానశక్తిని పోషించుకుంటూ రావాలి. అప్పుడు మానవుడు సర్వమూ సాధించవచ్చును”. (బాబా)

ఇట్టి సాధన చేత కోర్కెలను నిర్మూలము గావించుకుంటూ మనిషి తనకు తాను సంస్మరించుకొని సమాజాన్ని సంస్మరించడానికి ప్రయత్నించాలి. మహనీయులు, అవతార మూర్తులు, యోగులు, సిద్ధపురుషులు తల పెట్టిన “విశ్వశాంతి” అనే మహాయజ్ఞంలో తనవంతు తాను ప్రతి వ్యక్తి ఉదడుతాభక్తిగా కృషి చేస్తూ జీవితాన్ని కోర్కెల వలయం నుంచి తప్పించుకుంటూ సుఖమయం చేసుకోవాలి. “అదుపు పొదుపు పాటించడం అత్యంత ఆవశ్యకము” అను చిరు వాక్యములో ఇంతటి అర్జాన్ని అంతరర్దాన్ని అవతారమూర్తులు మనకు బోధించినారు.

“కాలాన్ని వృధా చేయవద్దు”. (9౦ 101 ₹248 3182ల కాలాన్ని వృధా చేస్తే జేవితమును వృధా చేసినట్లే. (౬6 ౪1546 ఓ 1.108 ₹2(8) గడచిన కాలం తిరిగి వాదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. అవతారమూర్తులు యోగులు మాత్రమే భవిష్యత్తును తెలుసు కొనగలరు. భూత భవిష్యత్‌ వర్తమానములన్ని వారికి కరతలామకములే. కావున వారు మానవాళిని వర్తమానమొకటే దృష్టి యందుంచుకొని కాలాన్ని వృధా చేయకుండా ముందుకు సాగమని బోధిస్తున్నారు.

కాలాయనమః; కాల కాలాయనమః, కాల కంఠాయనమః కాలదర్పదమనాయనమః కాలఖైరవాయనమః, కాలాతీతాయ నమః అనునవి భగవంతునికి పేర్లు. కాలానికి

అతీతుడు భగవంతుడు. దేశ కాలముల కతీతుడైన భగవంతుని తత్త్వము విశ్వవ్యాప్తము. కాలాన్ని శాసించే అధికారం ఎవ్వరికిని లేదు అంటారు సత్యసాయి. కాల నియమితుడు భగవంతుడు. సూర్య భగవానుడు ఎట్టి పరిస్థితుల యందును గతి తప్పకుండా ఆయా కాలములలో ఉదయాస్తమయాలు కొనసాగించుట సృష్టాది నుండి జరుగుతునే యున్నది. అదే ఆదర్శాన్ని మానవుడు పాటిస్తూ ఏ సమయమున కేది చేయాలో నిర్దిషుయిన

79 పద్ధతిలో ప్రణాళిక ప్రకారము దైనందిన కార్యక్రమములు చేయడం వలన ఒక విధమైన క్రమశిక్షణ అలవడుతుంది. ఆ క్రమ శిక్షణ అన్ని విధాలా మానవుడ్ని ముందుకు నడిపించగలదు. క్రమబద్ధమైన జీవన విధానం వలన దేహదారుధ్యము పెరిగి శక్తివంతమై నియమిత వేళల్లో దైవప్రార్ధన, ఆహార విహారాది కార్యక్రమములు, నిర్వర్తించడం వలన దివ్యత్వానికి చేరువౌతాడు మానవుడు. బ్రాహ్మీ ముహుర్తంలో లేచి దైవనామంతో పనిని ప్రారంభించి శారీరక వ్యాయామము దివ్య నామ సంకీర్తనతో కొంత దూరము నడిచినప్పుడు శరీర ధారుడ్యముతో బాటు, మానసిక ప్రశాంతత చిక్కి రోజంతా తాము చేసే కార్యక్రమాలకి శక్తి నిస్తుంది. తెల్లవారు రూమున (బ్రాహ్మోముహూర్తము 4 గంటల నుండి సాత్త్విక కాలము ప్రారంభము. ఈ సాత్విక కాలములో మన సాధన (దైవ నామము చేయుట, నంకీర్తన, సద్ధంథ పఠనము ఇత్యాది) ప్రారంభించాలి. అప్పుడు పవిత్రమైన స్థితి నెలకొని ఉంటుంది. స్నానము కూడ చేయనక్కరలేదు. ఆ సమయంలో ఇంద్రియాలు చాలా శాంతంగా ఉంటాయి. ఇటువంటి విశ్రాంతిలో దేనిని చింతించినప్పటికీ చాలా సూటిగా చేరిపోతుంది. భగవతత్త్వము. మరిచిపోయిన విషయములు కూడా అప్పుడే జ్ఞాపకమొస్తాయి. ఇటువంటి సాత్విక మైనకాలములో (ప్రార్ధనలు ప్రారంభించవలెను. సాయంకాలము 6 గం॥ల సమయములో రెండు లేక ఐదు నిమిషములు ధ్యానము చేయుట మంచిదని భగవాన్‌ సత్యసాయి విద్యార్థులకి బోధించినారు. ఆ విధంగా చేస్తే పవిత్రత, ఆనందము, తేజస్సు అభివృద్ధి చెందుతాయి. మధ్యాహ్న సమయంలో ఎవరి వృత్తులలో వారు నిమగ్నమై యుందురు. వృత్తిని ప్రవృత్తిగా మార్చుకునే ప్రయత్నంలో అన్ని కర్మలు భగవదర్పితముగా చేసిననాదు. ౨0” 1 6064 అన్న పద్ధతిలో భగవదను గ్రహ ప్రాప్తి సిద్ధించును. ఉదయం - మధ్యాహ్నం - రాత్రి - నిరంతరం కూడాను చిత్త వృత్తులను అరికట్టిన వారుగా ఉండాలి. ఇదియే దివ్యమైన భావము. “సర్వం భగవత్‌ ప్రీత్యర్ధం” అనే భావములో మనం మునగాలి. ఏ పనైనా చేయి. నీ ఉద్యోగం నీవు చేసుకో. విద్యావంతుడుగా నీవు చదువు. నీవు అధ్యాపకుడుగా బోధించు. ఏ కర్తవ్యాలను నీవు

80 నిర్వర్తించు కున్నప్పటికీ ఇవన్ని భగవత్‌ ప్రీత్యర్ధం చేస్తున్నాననే సుఖమైన, సులభమైన దివ్యమైన భావముతో నీవు చేస్తే అదియే అర్పితము. మనస్సు సులభంగా అరికట్టడానికి ఇదే మార్గము. * ఈ దేహము భగవంతునిది” అనుకున్నప్పుడు ఈ దేహముతో పాపకార్య ములు ఏ మాత్రము చేయవు. కనుకనే దేహార్పిత భావమంటే అంతా భగవంతునిదే. నీ ధనమూ భగవంతునిదే అనుకుంటే అప్పుడు ధనాన్ని దుర్వినియోగము చేయవు. సదుద్దేశములోపల, సత్ర్రవర్తన లోపల దీనిని నీవు ప్రవేశ పెడతావు” నా శక్తి అంతా భగవంతునిదే' అనుకొన్నప్పుడు ఈ శక్తిని కూడా దుర్వినియోగము చేయవు. ఈ విధంగా కాలము యొక్కవిలువను గుర్తించి ప్రతి ఒక్కరు కాలాన్ని వృధా చేయకూడదన్న విషయాన్ని అవగాహన చేసుకుని కాలము కూడా భగవత్‌ స్వరూపమే నన్న స్థితిలో కాలానికి చాలా ప్రాముఖ్యత కలదన్న విషయాన్ని గుర్తించి వర్తించాలి. ఆహార పదార్ధములను వృధా చేయవద్దు (౧00 ౧06 2916 క₹0060): "004 ఓ 604 ఆహారము పరమాత్మ ప్రసాదము. అట్టి ప్రసాడమును వృధా చేసిన యెడల, మన ధనము వృధా యగుటతో బాటు అది మరి యొకరికి ఉపయోగపడి కడుపు నిండుతుంది. అందుచేత సామూహికముగా ఏదైనా శుభకార్యములు చేసినప్పుడు వృధాగా పడవేసిన ఆహారము మరో కొంత మంది కడుపు నింపడానికి ఉపయోగ పడగలదు. ఈ విధంగా ఆహార పదార్ధములను వృధా చేయక ఎవరు ఎంత తినగలిగితే అంత మాత్రమే తినిన యెడల కొంతమందికి నారాయణ సేవ చేసిన పరమాత్మ తృప్తి చెందును. ఒకానొకప్పుడు బాబా శివం ప్రాంగణంలో హైదరాబాదు నగర పర్యటన సందర్భంగా మాట్లాడుతూ “దరిద్ర నారాయణూడంటున్నారు. అటువంటి దరిద్రునికి కడుపు నిండా అన్నము పెట్టి తృప్తి పరిస్తే నారాయణుడు తృప్తి పడినట్లే నన్నారు. అన్నదానము అనకుండా ఈ కార్యక్రమానికి స్వామి “నారాయణ సేవ” అని పేరు పెట్టారు. దరిద్రుల్లోనే నారాయజణ్ణి మీరు చూస్తున్నారు కాబట్టి ఆ దరిద్రుడు సంతృప్తి చెందితే నారాయణడు తృప్తి చెందినట్లే నన్నారు. “నరుని సేవయే నారాయణ సేవ” అన్నారు బాబా. ఈ శరీరము (004) ఆహారముతో ఆవిర్భవించినదే. తల్లిదండ్రుల ఆహారము

యొక్కస్వరూపమే ఈ దేహము. తల్లి నవ మాసములు బిడ్డను కడుపులో తన రక్తమును, తను తినే ఆహారాన్ని తను పీల్చే గాలిని అందించి రక్షించి కాపాడుతుందని శ్రీ విశ్వంజీ

81

తమ దివ్యోపన్యాసంలో చెప్తుంటారు. కాబట్టి అన్నము (బ్రహ్మ. 00641504 - దీనిని వృధా చేస్తే భగవంతుని యొక్క శక్తినే మనము వృధా చేసిన వారమవుతాము. నీ శక్తిని (మేధస్సును కూడా) వృధా చేయవద్దు (100 101 ౪2546 ౮౦౪౯ పంజా):

ప్రతి మానవుడికి “శక్తి ప్రదాత భగవంతుడు. అట్టి భగవంతుడు ప్రసాదించిన శక్తి బహు జాగ్రత్తగా వాడుకొనవలసిన అవసరమున్నది. మేధావులందరు తమ మేధస్సు నంతా ఉపయోగించి అనేక రంగములలో కృషి సల్పుతూ, “విశ్వశాంతి - విశ్వ కళ్యాణం” అనే మహా యజ్ఞంలో తమ వంతు కృషి తాము ఛద్ధగా భక్తి భావంతో చేస్తూ ముందుకు సాగాలన్నదే శ్రీ విశ్వంజీ ఆశ. ఆశయము. విశ్వశాంతి - విశ్వకళ్యాణం - మేధావుల పాత్ర అంటూ ప్రత్యేకముగా విశ్వనగర్‌లో తమ జన్మ దిన వేడుకల సందర్భంగా ఒక దినము మేధావులందర్ని సమావేశ పరచి వారి విలువైన అభిప్రాయములు, సలహాలు సేకరించి అనేక విధముల వార్ని ప్రోత్సహిస్తూ 'విశ్వశాంతికి ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని సూచించుచున్నారు.

వాక్కు ప్రధానమైనది. వాక్కు వలన ఎంతటి కార్యమునైనను సాధించవచ్చును. నేర్పుతో, ఓర్పుతో హితంగా మితంగా మాట్లాడే వారికి శక్తి వృధా కాకుండా మిత భాషణము వలన మౌనంగా ఉంటూ క్రియలలో శక్తి చూపుతూ చేసే వారందరు దీర్ధ జీవితము గడుపుట కవకాశమున్నదని మహనీయుల ఉవాచ. నాలుక వశమందున్న లోకమే వశమగును. వాక్‌శుద్ధి ఉంటే వాక్‌ సిద్ధి లభిస్తుందంటారు విశ్వంజీ. కార్యసిద్ధికి శక్తివంతమైన మిత భాషణము దోహదము చేయగలదు. “అతి భాషమతివాని; మితభాష అతిహాయి”

దీనిని బట్టి వాక్కును ఏవిధంగా ఉపయోగించుకోవాలో మనకు విదితమగుచున్నది.

5౦6 [10 6౪11; 366 ౪04613 8004 - మంచినే చూడు. చెడు చూడవద్దు.

కండ ౧౦ ఆ - ₹ంఖ *12115 8006 - చెడు వినవద్దు చెడు కనవద్దు.

2000 ఆశ - 280 ౪0401 80064 - చెడు మాట్లాడవద్దు మంచినే మాట్లాడు

0౦ అత - ₹0ముం ౪4213 క్రం౦డే - చెడు ఆలోచనవద్దు మంచి ఆలోచనలు చేయి

82

౨0 10 6౪|| - ౦ *1411 800% - చెడు చెయ్యవద్దు - మంచినే చేయి- లేదా ఉపకారము చేయి - అపకారము చేయవద్దు. ఈ విధంగా చేసిన నాడు శక్తిని సద్వినియోగము చేసిన వాడవగుదువు. అదే సాధన. అదే భగవంతుని సేవ ఈ విధంగా చేసిననాడు మనస్సు యొక్క ప్రభావము తగ్గుతుంది. మనో లయమవుతుంది అన్నారు భగవాన్‌ సత్యసాయి.

స్వామి ప్రతిపాదించిన పై నాలుగు పొదుపు సూత్రాలను ఆచరిస్తే దేశం సస్యశ్యామల మవుతుంది. ఆర్థికంగా పురోభివృద్ధి గాంచుతుంది. ఈ పొదుపు విషయమై బాబా మరొక చక్కని సందేశాన్ని తన భక్తులకు ఇచ్చారు. మనం ప్రతి రోజూ కాలాన్ని ధనాన్ని ఆరోగ్యాన్ని శక్తిని వృధా చేస్తుంటాము. పొదుపు చేయటం ఎప్పుడూ చాలా అవసరమైన ఆధ్యాత్మ సాధన. చివరకు పరమేశ్వరుడు సృష్టించిన పంచ భూతాలను కూడా పొదుపుగా వాడకపోతే అది పరమేశ్వరుని తృజీకరించినట్లే అవుతుందంటారు. పంచ భూతముల, పంచ కోశముల, పంచ ప్రాణముల పంచేంద్రియముల పంచ వాయువుల సమ్మిశ్రితము ఈ దేహము గనుక దీనిని శక్తివంతంగా దేవాలయంలా పటిష్టంగా అట్టి పెట్టుకోవాల్సిన బాధ్యత (ప్రతి ఒక్కరిది అంటారు విశ్వంజీ.

“కనుక ప్రతివారు విద్యుచ్చక్తి, నీరు, వంట చెరకు, గ్యాస్‌, పెట్రోలు, డీజిలు మొదలైన వాటిని కూడా పొదుపుగా వాడటం నేర్చుకోవాలి. దేశ సంపదను ఏ మాత్రం దుర్వినియోగం చేయరాదు. పొదుపు అంటే పిసినారి తనమని భావించరాదు. అవసరానికి మించి వాడుకోవడం మహాపాపము. దేశ సంపదను దుర్వినియోగ పరిస్తే దేశంలో కరువు - కాటకాలు ఏర్పడతాయి. నిత్య జీవితావసర వస్తువుల ధరలు తారాన్థాయి నందుకుంటాయి. సామాన్య మధ్య తరగతి ప్రజలు నానా ఇక్కట్లకు గురి అవుతారు. కనుక ్రతి ఒక్కరు ప్రతి విషయంలో పొదుపును పాటించి విజ్ఞతను ప్రదర్శించడం నేర్చుకోవాలి” (బాబా).

83 కాలమును, కాయమున నిర్లక్ష్యం చేయకు కాలము, కాయము ప్రతి మనిషి జీవితంలోనూ అత్యంత ప్రాధాన్యత వహి ంచు

చున్నవి. కాలము - పరబ్రహ్మ స్వరూపము. కాయము - మహేశ్వర స్వరూపము. కాలాన్ని కాయాన్ని, నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. కాలాన్ని వృధా చేస్తే జీవితమే వృధా అయినట్లని, కాయమును ఆరోగ్యవంతంగా శక్తివంతంగా నరైన స్థితిలో ఉంచుకోకపోతే దేహమనే ఈ కదిలే దేవాలయం మానవుడు సాధించవలసిన లక్ష్యాలను నెరవేర్చలేడని స్వామి చెప్తంటారు. “దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి” అన్నట్లుగానే ఈ దేహమనే పనిముట్టు శక్తివంతంగా ఉన్నప్పుడే ఈ క్షణంలోనే ఇక్కడే “ఇహమేవ”. ఇప్పుడే చేయవలసిన పనులన్ని ముగించుకొని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుందుకు తగిన ప్రయత్నము చేయవలెను. ఆత్మ జ్ఞానమనగా నేను ఆత్మను అన్న ఎరుకలో ఉండటమే, ఆత్మజ్ఞానమును అనుభవించుట. ఈవిధంగా చెప్పడానికి కాయము కావలెను. “శరీర మాద్యంఖలు ధర్మసాధనం” శరీరమే లేకపోతే విచారణ చెయ్యలేము. సంక్తీర్తన సత్సంగం సద్గోష్టి మున్నగువన్ని నిర్వర్తించుటకు కాయము చాలా అవసరము. అందుచేత కాలమును కాయమును నిర్లక్ష్యము చేయరాదు. కాయము, అనగా దేహము కూడా కదిలే దేవాలయమని “దేహమే దేవాలయమ”న్న సూక్తి ద్వారా తెలుసుకున్నాము. “అదుపు పొదుపు పాటించు” అన్న సూక్తిలో నాలుగు అంశములలో కాలాన్ని గురించి వివరంగా తెలుసుకున్నాము. ఈ సూక్తిలో కాలానికి కాయానికి తగిన ప్రాధాన్యత నిస్తూ నిర్లక్ష్య భావంతో చూడకుండా శ్రద్ధ వహించి విలువ తెలుసుకుని మెలగవలయునన్న హెచ్చరిక ధ్వనించుచున్నది.

భగవాన్‌ సత్యసాయి కాలం - కాయం అన్న అంశాన్ని వివరిస్తూ ఈ క్రింది పద్యం చెప్పారు.

పాంచభౌతికము దుర్చలమైన కాయము

శత వర్షాల దాక మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున బాల్య మందో లేక ప్రాయమందో లేక

84 ముదిమి యందో లేక ముసలి యందో ఎప్పుడో విడిచేది ఎరుక లేదు మరణమే నిశ్చయము, బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తా తెలియవలయు ఎన్ని విధములుగా కాపాడు కొన్నప్పటికీ ఈ కాయము ఏదో ఒకనాడు

కూలిపోక, రాలిపోక, కాలిపోక, తప్పదు. క్షణ క్షణం మానవుడు మృత్యువు వైపు పయనిస్తున్నాడు. మృత్యు భయం నీడ వలె వెంటాడుతూనే ఉంది. “జాతస్యహి (ధ్రువో మృత్యుర్హువం జన్మమృతస్యచ తస్మాద పరిహార్యే ర్ధే నత్వం శోచితుమర్దసి॥”

జన్మించిన వారికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మమును తప్పదు. అనివార్యమగు ఈ విషయమున నీవు శోకించుట సరికాదు అని భావము. (తాత్పర్యము)

దేహము అశాశ్వతమని ఏదో ఒకనాటికి అది కూలక తప్పదని దేహి నిరామయుం దని బాబా చెప్పుచునే యున్నారు. ఒక సందర్భంలో శ్రీ విశ్వంజీ ఇష్టాగోష్టి మాట్లాడుచూ “అందరు పోవలసిందే. ఎవ్వరూ ఉండరు. శరీరం ధరించిన తర్వాత పోవలసిందే” అని అన్నారు. ఈ విధంగా మరణం తథ్యమని చెబుతూ “దేహాన్ని దేవాలయంగా మార్చుకోమని పవిత్రత సంతరించుకొన్న హృదయంలో దేముడుంటాడని హృదయమే దైవ పీఠమని బోధిస్తూనే చావు తప్పదన్న నగ్న సత్యాన్ని అవతారమూర్తులందరూ అనాది కాలం నుంచి చెప్పుచునే ఉన్నారు.

అయినప్పటికీ ఏ విధంగా నయినా చావు తప్పదని ఆహార విహారముల విషయంలో (థద్ధ వహించక ఏది పడితే అది ఎప్పుడు పడితే కాలంతో నిమిత్తం లేకుండా తింటూ తిరుగుతూ దేహాన్ని రోగగ్రస్తం కావించరాదు. దేహమున్నంత వరకు తగిన శక్తి సంతరించుకొని, శక్తివంతంగా ఆరోగ్య విషయంలోనూ ఆహార నియమాన్ని పొటిస్తూ (శద్ధతో యోగాభ్యాసం, వ్యాయామం మున్నగునవన్ని చేస్తూ శరీరాన్ని పుష్టిగా చక్కని స్థితిలో శక్తివంతమగునట్లు కాపాడుకోవాలని శ్రీ విశ్వంజీ హెచ్చరించుచున్నారు. ఇదొక దేవాలయం. పవిత్రమైన కర్మలాచరించే పని ముట్టు వలె ఈ దేహాన్ని సేవలలో (ప్రవేశ పెట్టవలెనని, మనిషి గృహాన్ని ప్రశాంతి నిలయంగా మార్చుకుని సమాజాన్ని కూడా ఆ

85 విధంగా మార్చడానికి కృషి చెయ్యాలంటే ఇంతకంటే శక్తివంతమైన పనిముట్టు మరొకటి లేదని విశ్వ యోగులు సెలవిచ్చుచున్నారు. ఆ విధంగా కాయాన్ని శక్తివంతమైన పనిముట్టువలె ఉపయోగ పెట్టడం ప్రతి మనిషి కర్తవ్యము. పుట్టినందుకు జీవిత నాటక రంగంలో మానవుడు తన పాత్ర తాను సక్రమంగా నిర్వహించి దేశ ప్రగతికి విశ్వశాంతికి మహనీయులు చేయుచున్న కృషిలో భాగస్వాములు కావాలని అదియే వారి భక్తి ప్రపత్తులకు నిదర్శనమని, కాలాన్ని సద్వినియోగం చేయడం కూడా ప్రతి మనిషి కర్తవ్యంగా భావించాలని భగవాన్‌ సత్యసాయి కూడా యువతకు ఇచ్చిన సందేశములలో కాలం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. కాలాన్ని సద్వినియోగం చేయడానికి కాయము సహకరించాలి. ఈ రెండు ఒకదానికొకటి అవినోభావ సంబంధముతో కృషి చేసినప్పుడే లక్ష్య సిద్ధి జరుగగలదు. కాలం యొక్క గమనం, వేగం తెలుసుకోవడానికి మీరు చేతికి వాచీ ధరిస్తున్నారు. కాలాన్ని ఏ విధంగా పవిత్రం చేసుకోవాలో వాచి చెబుతున్నది. ఇగరాం1 ₹/ - 210% 0౪ ౪0163 మీ - ₹/200% ౪౦౮ 20400 “- ₹2401 90౦0? 1౦3814 ౮- 72601 ౪౦౯ యజ1ం(% క - 210% ౪౦౪౯ 1681 మీరు “టైమ్‌” తెలుసుకోవటానికి వాచీ కేసి చూసినప్పుడల్లా ఈ పంచాక్షరీ సందేశాన్ని గుర్తు చేసుకుంటూ ఉండండి. పశు పక్షి మృగాల వలె ఆహార నిద్రా భయ మైధునాదులకే మీ జీవితాలను అంకితం చేస్తూ కాలాన్ని దుర్వినియోగం చెయ్యకుండా దివ్యమై మీ నిజతత్వాన్ని గ్రహించి మీ జీవిత పరమావధి సాధించే ప్రయత్నంలో కాలాన్ని పవిత్రంగా వినియోగంచండి. సత్సంభాషణతో, సత్మర్మలతో, సదాలోచనలతో, సచ్చీలముతో విశాల హృదయంతో పరమాత్మ స్వరూపమైన కాలాన్ని పవిత్రంగావిస్తూ మీ జీవితాల్ని సార్థకం చేసుకోండి” అని సందేశమిచ్చారు సత్యసాయిబాబా.

86 “ప్రాచీన కాలంలో, సదాచార సంపన్నులైన వ్యక్తులు అన్నమును భుజించే సమయంలో “అన్నం (బ్రహ్మ రసో విష్ణుః భోక్తా దేహా మహేశ్వరళొ అని ప్రార్ధించేవారు. దీని అంతరార్థం 'నేను తినే ఆహారం రస స్వరూపమై శరీర వ్యాప్తంగా ప్రసరించి శక్తిని అందించు గాక! ఈ శక్తిని సద్వినియోగ పరచుకొనే నిమిత్తమై, నాకు చక్కని మనస్సును ప్రసాదించు గాక! ఈ మనస్సుకు తగినట్లుగా నా వాక్కును శుద్ధి పరచుగాక! కనుక మనం తినే ఆహారంలో స్టూలమైనది - దేహానికి శక్తి నందిస్తున్నది, సూక్ష్మమైనది - మనస్సుగా మారుతున్నది. అత్యంత సూక్ష్మమైనది వాక్కుగా మారుతున్నది. ఈ మనో వాక్కాయముల స్వరూపమే నిజమైన బుద్ధి యొక్క తత్వము. ఈ మూడింటినే వ్యర్థం చేయరాదు. వీటిని సరైన మార్గంలో ఉపయోగించాలి అంటూ మనో వాక్కాయ కర్మలపై ఆహారము ప్రభావము ఏ విధంగా ఉంటుందో భగవాన్‌ బాబా చెప్పారు. ఆహారమంటే కేవలం అన్నమే కాదని పంచ భూతములలో ప్రతి ఒక్కటి శరీరానికి ఆహారంగా పనికి వస్తుందని ఆచరణ పూర్వకంగా నిరూపించి అదే సందేశాన్ని మనకి పదే పదే విశ్వంజీ బోధిస్తూ శరీరాన్ని శక్తివంతం చేసుకోమని హెచ్చరిస్తూ కాలము యొక్క ప్రభావము మానవునిపై ఏ విధంగా పనిచేస్తుందో ఏ సమయంలో ఏది చెయ్యాలో నిర్దేశిస్తున్నారు. సమయానుకూలంగా కర్మలనాచరిస్తూ పవిత్రమైన రోజులలో పవిత్ర కర్మలాచరించడం ద్వారా మానవాళి తరిస్తారని చెబుతూ ఆ విధంగా కాలాన్ని కాయాన్ని నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. బ్రహ్మ విష్ణు మాహేశ్వరులు దేహంలోనే నివసిస్తున్నారని “నీలోకి నీ పయనం” ద్వారా వారిని దర్శించి దత్తాత్రేయ తత్వాన్ని అర్ధం చేసుకుందుకు ప్రయత్నించమని ఆ తత్వమే నిత్య సత్య శాశ్వతమని అన్నట్లుగా కాయం, కాలం, కలిసి వచ్చినప్పుడే నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకొని జీవిత కాలంలో సత్మర్మలు మానవతా విలువలు ఆచరించి ఆదర్శవంతులు కావాలని ఆళీర్వదిస్తున్నారు. కాయం కాలం నిర్లక్ష్యం చేయకుండా కర్మలన్ని చేసుకుందుకు ప్రయత్నిద్దాం. ఈ సూక్తిని ఆచరణలో పెట్టడానికి కృషి చేద్దాం. ఇట్టి మహత్తరమైన మంచి సూక్తుల నందించిన మహనీయునకు శిరస్సు వంచి నమస్మరిద్దాం.

8/7 గురువు అనుగ్రహం ఉంటే సకల జన్మల కార్మిక దోషం కరిగిపోతుంది :-

జీవితంలో ప్రతి మనిషికి “గురువు ఆవశ్యకత తప్పక ఉంటుంది. అంధకారాన్ని పోగొట్టి జీవితంలో వెలుగును ప్రవేశపెట్టేవాడు గురువే. అంధకారమంటే అజ్ఞానము. అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి సుజ్ఞానమును కలిగించేవాడు గురువే. భగవంతుడు లేడని చెప్పే వారుండవచ్చును గాని గురువు లేడని చెప్పే వారుండరు! ప్రప్రధమంగా శ్రీ విశ్వంజీ చెప్పినట్లు ప్రతి వ్యక్తికి పుట్టగానే పాఠశాలకు వెళ్లేవరకు పిల్లలకు ఏమి తెలియని స్థితిలో మాటలు నేర్చునప్పుడు నిప్పు కాలుతుందని, పిల్లి పాలు త్రాగుతుందని కుక్క మొరుగుతుందని ఇత్యాది పదాలన్ని తల్లి చెప్తూ మంచి మంచి కథలు, పాటలు, పద్యాలు, శ్లోకాలు నేర్పి మంచి చెడు విచక్షణా జ్ఞానం చెప్తూ పాఠశాలకు వెళ్ళక ముందే తల్లి బోధిస్తుంది గనుక ప్రతి వ్యక్తికి తల్లి ప్రథమ గురువని స్వామి చెప్తుంటారు.

తల్లి తండ్రిని చూపితే తండ్రి గురువును చూపుతాడు. గురువు దైవాన్ని చూపుతాడు. అదేవిధంగా అధ్యాత్మిక మార్గమునందు కూడా భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వము అనే పదములు వరుసలో చూస్తుంటాము. భక్తి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. జ్ఞానము వైరాగ్యాన్ని చేకూరుస్తుంది. వైరాగ్యము తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ నాలుగు సోపానములను సరిగ్గా అనుసరించిన ముక్తిని పొందవచ్చును.

అ, ఆలు దిద్దించే ఉపాధ్యాయుడు తొలి గురువైతే భౌతికం నుంచి ఆధ్యాత్మ వైపు పయనింప జేసేవాడు సద్దురువు. సత్‌ పదార్థాన్ని ఎరుక పరచి కేవలం భౌతిక విద్యలు విద్యలు కావని ఆధ్యాత్మ విద్య నిజమైన విద్యయని బోధించేవాడు గురువు. “అధ్యాత్మ విద్యావిద్యానాం” అని ఎరుక పరచింది భగవద్దీత. అమితమైన దుఃఖాన్ని కలిగించే వాటిని కోరుకుంటూ కోరికల వలయంలో చిక్కుకొని పయనిస్తున్న మానవాళికి నిత్య సత్య శాశ్వతమైన మార్గం వైపు పయనింప జేసేది గురుతత్త్వము.

ఏది ఎరిగిన సర్వంబు ఎరుక పడునో ఏది తెలియక సర్వంబు ఎరుకపడదో

88 అట్టి పరవిద్య నేర్పెడు నతడే గురుడు సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా!

అన్నారు సత్యసాయిబాబా గారు. ఏది తెలుసుకుంటే సర్వము ఎలుకపడునో అట్టి పరవిద్య (విద్యలలో కెల్ల ఉత్తమమైనది. నిత్య సత్య శాశ్వతమైనది) నేర్చేవాడే గురువు. ఇంతటి ఉన్నత స్థానంలో ఉన్న గురు స్వరూపాలు అనేకం ఈనాడు ఈ కలియుగంలో అధర్మం నుంచి ధర్మం వైపు నడిపించడానికి శరీరం ధరించి వచ్చియున్నారు. ఎందరు గురువులున్నప్పటికి ప్రతి వ్యక్తి, *నా గురువు నాకు ఎక్కువ, గొప్పవాడు” అన్న భావం, నమ్మకం, విశ్వాసం అభివృద్ధి పరచుకున్ననాడు అతని పరిపూర్ణమైన అనుగ్రహంతో మనలోనున్న కార్మిక దోషాలన్నీ తొలగిపోతాయి. ఇది గురువు యొక్క విశిష్టత.

గురుర్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

గు అనగా అంధకారము. రు అనగా నిర్మూలించేది. అదే గురుత్వము మానవోద్ధరణ కావించే దివ్యశక్తికి “గురుత్వం” అని పేరు. గు కారము - గుణాతీతము. రు కారము = రూపవర్జితము. గుణాతీతమైన, రూపవర్ణితమైన దివ్యత్వమే గురుత్వము. నీ ఆత్మ తత్వమే గురుత్వము. ఇంకా గురువు యొక్క విశిష్టతను గురించి భగవాన్‌ బాబా ఈ విధంగా సెలవిచ్చినారు. “గురువు దగ్గర నీవు సంపూర్ణ శరణాగతి చెందినప్పుడే నీలో ఉన్న భగవంతుణ్ణి వెలికి తీసి నీ యందుంచ గలుగుతాడు గురువు. బాహ్యంగా నీ కర్తవ్యాన్ని నీవు చేస్తూనే ఆత్మబంధం మాత్రం గురువుతోనే ముడి వేసుకోవాలి. వీలైనంత ఎక్కువగా గురుబోధలు వింటుంటే, నిన్ను నీవు సక్రమమైన మార్గంలో నడిపించుకోగల్లు తావు. అఖండమైన భగవంతుడు నీకోసం ఆత్మ స్వరూపుడిగా మారి గురు రూపంలో నీ ముందు నిలుచున్నాడు. నీ అల్పత్వాన్ని నీడి, అఖండ తత్వంలో లీనం కావటానికి నీకు గురువే మార్గ దర్శకుడౌతాడు. “ప్రపంచం నిన్ను భ్రమింప జేస్తుంది. బంధాలు, బాధలు, భయాలు, సుఖదుఃఖాలు ఇవేవీ నీ స్వరూపాలు కావు. నీవు అఖండత్వంలోని అంశానివి అని నిన్ను నీవు తెలుసుకునేలా చేయగలిగేది ఒక్క గురువు మాత్రమే”.

89

మహాయోగులు, పుణ్య పురుషులు, అవతార మూర్తుల యొక్క అనుగ్రహంతో జన్మజన్మల పాపాలు నశిస్తాయని గురువులు బోధించు చున్నారు. కర్మ చేసినప్పుడు పుణ్య కర్మలు పాపకర్మలు అనేకం జన్మజన్మలుగా మానవులు చేస్తూ ఉంటారు. మంచి కర్మలకి మంచి ఫలితం దుష్ట కర్మలకి చెడు ఫలితం అనుభవించాల్సి ఉంటుందని చెప్తుంది భారతీయ ధర్మము. ప్రారబ్దం కారణంగా మానవుడు జన్మ జన్మలలో చేసుకున్న కర్మల కనుగుణంగా ఈ జన్మలో పాప పుణ్యాల ఫలితాన్ని అనుభవిస్తున్నప్పటికీ సద్గురువు నాశ్రయించి వారి అడుగు జాడలలో నడుస్తూ గురువాక్యం వేదవాక్యంగా భావించి జీవన గమనాన్ని సాగించిన నాడు ప్రారబ్ద కర్మల యొక్క దుష్ఫలితాలు అనుభవించే శక్తినిచ్చి, కొంత ప్రారబ్దాన్ని కూడా గురువు పరిపూర్ణమైనటు వంటి అనుగ్రహంతో తొలగించ గలడు. “నగురోరధికం, నగురో రధికం” అంటూ బోధించింది గురుగీత. గురువు కంటే మించిన దేదీ ఈ ప్రపంచంలో లేదు. ఉన్నత స్థానం గురువుదే. గురువు సంకల్పిస్తే, అనేక జన్మల కార్మిక దోషం కరిగిపోతుంది. తొలగి పోతుంది. లేదా ఏ భారము లేకుండా చిటిక కాలంలో ఆ కష్టాన్ని తనకు తెలియకుండానే తాను అనుభవించి విముక్తుడవుతాడు మానవుడు. అలనాడు షిర్ది సాయి బాబావారు డాక్టరు పిళ్ళే యను భక్తుణ్ణి ప్రేమతో బహు (అన్నా) పిలుచు చుండెడి వారట. ఒకనాడు అతడు గినియా పురుగుచే బాధపడుచు, ఆ బాధ భరింపలేక కాకా సాహెబ్‌ దీక్షిత్‌తో తానా బాధ భరించ లేకున్నానని, మరణించ గోరుచున్నానని, గత జన్మ కర్మమును ఈ ఒక్క జన్మలోనే అనుభవింప జాలనని దానిని పది జన్మలకు పంచమని బాబాను ప్రార్థింతుననెను. దీక్షిత్‌ ఈ వార్త బాబాకు దెల్బ బాబా మనసు కరిగి దయార్ధ హృదయుడై పది జన్మల వరకేల? పది దినములలో గత జన్మ పాపములనే హరింతునని బల్కి వానిని తన యొద్దకు దోడ్కొని రమ్మనమనెను. పిళ్ళే బాబా దరికి వచ్చినంతనే వానిని గాంచి శాంత వచనములతో నోదార్చి గత జన్మకర్మల ఫలముల ననుభవించి విముక్తుడవు గావలె గాని, మరు జన్మములు కోరరాదని, కష్ట నుఖములకు హేతువు నంచిత ప్రారబ్ధంబులేననియు దెల్సి, “భగవంతుడు దయామయుడు”, నిన్ను తప్పక కాపాడునని, భగవంతుని ధ్యానించి వానిపై నీ సర్వ భారముల నుంచుమని ' బోధించెను. నానాసాహెబ్‌ కట్టుకట్టెదనని దెల్బ ఆ కట్టును త్వరగా విప్పుము, లేకున్న చచ్చెదవని బల్కి ఒక కాకి

90 వచ్చి ఆ పుండుపై పొడుచునని వెంటనే బాధ నివారణ యగునని దెల్పెను. ఇంతలో మసీదు బాగుచేసి అబ్బుల్‌ దీపములు వెలిగించుచు కానరాక పాదమును పిళ్ళే కురుపుపై వైచెను. వెంటనే కురుపు చితికి గినియా పురుగులు బయటికి వచ్చి బాధ నివారణయ్యెను. అంత బాబా “చూడుడు. అన్నా జబ్బు కుదిరినది. నవ్వుచున్నాడని” పల్కెను. అంత పిళ్ళే కాకి రాలేదేమి అని అడిగెను. అంత బాబా “అబ్బుల్లేకాకి” అని చమత్కరించిరి. బాభా అబ్బుల్‌ను నా కాకి అనుచుందెడివారట. అచట నున్న వారందరు వినోదించిరి. ఊదిని కురుపుపై రాచి లోనికి సేవించుట వలన కురుపు పది దినములలో పూర్తిగా మానిపోయెను. (శ్రీ షిర్ది సాయి సచ్చరిత్ర ఆధారముతో వ్రాసిన విషయము) గురువు అనుగ్రహం అంతగొప్పది” అని ఈ సంఘటన మనకు తెలియజేస్తోంది. గురువు అనుగ్రహంతో సమస్తమైనటు వంటి ప్రారబ్ధ కర్మల ఫలితాలు, క్షణకాలంలో ఆ దివ్యమైన సంకల్పంతో తొలగి పోతాయనడానికి పై ఉదాహరణ ఒక నిదర్శన. ఒక్కషిర్దిబాబాయే కాదు, శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ అరవిందో, శ్రీ రమణ మహర్షి జిల్లెళ్ళమూడి అమ్మ, శ్రీ సత్యసాయి, శ్రీ విశ్వంజీ ఇంకా, ఇంకా అనేకానేక మంది గురు స్వరూపాలు, విశ్వ మాతలు యోగి పుంగవులు అందరు కూడా మానవాళిని కష్టాలు, బాధలు దుఃఖాల నుంచి విముక్తి కలిగించి మనిషిని మనీషిగా మార్చి గృహాన్ని ప్రశాంతి నిలయంగా మార్చుకునే శక్తి యుక్తి ప్రసాదించి, సమాజ సంస్కరణకు తద్వారా “విశ్వకళ్యాణం” కొరకు ఆయా మహనీయులు చేసే కృషికి ఆయా వ్యక్తులందరు పనిముట్లు వలె ఉపయోగపడేలా అనుగ్రహిస్తూ ఆశీః వర్షం కురిపిస్తున్నారు. ఇది వారి అవతరణలోని భాగమే ఈ అనుగ్రహమని భావింపనగును, లోకకళ్యాణం వారి ధ్యేయమైనా, అట్టి ఉన్నతమైన ఆశయాన్ని నెరవేర్చడానికి వ్యక్షిలో పరివర్తన తీసుకుని వస్తూ ముందుకు సాగుతూ చెయ్యి పట్టుకుని కూడా మానవుణ్ణి తనతో బాటు నడిపిస్తాడు గురువు. అట్టి గురువు సహాయ సహకారాలు మానవున కత్యంత ఆవశ్యకము. అది లేనినాడు ఈ జీవనయాత్ర నిస్సారంగా, నిరుత్సాహంగా సాగుతుంది. గురువు అనే వెలుగు జీవితంలో వ్రవేశించేసరికి బ్రతుకు సుగమమై తేజోవంతమవుతుంది. గురువు పాత్ర ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ, జీవిత లక్ష్యాన్ని సాధించడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది. గురువు యొక్క బోధలను, నమ్మకంతో, విశ్వాసంతో ఆచరణలో పెట్టి సద్దురువుల యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులై జీవితాలను ధన్యం చేసుకోవాలిని శ్రీ విశ్వంజీ

91

తెలిపినారు. డాక్టరు రుగ్మతతో బాధపడుతున్నప్పుడు ఇచ్చిన మందులను వారు చెప్పినట్లు ప్రతి దినము వాడితే ఆహార నియమం కూడా పాటిస్తే రోగము తగ్గి అనారోగ్యము నుంచి బయట పడినట్లే, ఈనాడు మానవులు అనుభవిస్తున్న అసూయ, గర్వము, ద్వేషము లోభము స్వార్ధము మున్నగు భయంకరమైన రోగములతో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బాధవడుతుంటే, ఈ రోగాలకు నివారణోపాయము చెప్పడానికి నద్గురువు అవతారమూర్తిగానో, యోగి గానో, సిద్ధ పురుషుని గానో అవతారమెత్తి సశరీరంగా మన మధ్యకు వచ్చి యున్నారు. అటువంటి సద్దురువు బోధలు వింటూ ఒక్కొక్క దుర్గుణాన్ని తొలగించుకుందుకు ప్రయత్నిస్తూ ఉత్తమ మానవుడుగా మానవత్వంతో మెలగు" స్థితికి తీసుకుని వచ్చిన భవరోగ వైద్యునకు ఎంతో బుణపడి ఉండాలి. భౌతికంగా శరీరానికి వచ్చిన రోగాన్ని తగ్గించిన వైద్యునకు కృతజ్ఞత తెల్పినట్లే, సద్గురువుకు ప్రతి వ్యక్తి అనేక విధముల కృతజ్ఞత చెప్పవలసిన అవసరమెంతేని గలదు. ఇదే శ్రీ విశ్వంజీ గురుబోధలోని సారాంశము. ఆది గురువైన వ్యాసుడు మహోన్నతమయిన మహాకావ్యాలు మన కందించడమే కాక, బ్రహ్మ సూత్రాలు ఆత్మ తత్త్వాన్ని దివ్య లీలల గాథలను కూడ మనకందించినాడు. అటువంటి వ్యాస మహర్షికి కృతజ్ఞతలు తెల్చుకునే పరమ పవిత్ర మైన దినమే “గురుపూర్ణిమ” లేదా వ్యాసపూర్ణిమ. అందుచేత ఈ పూర్ణిమను ప్రపంచంలో అనేకచోట్ల, ముఖ్యంగా భారత దేశ మంతటా జరుపుతు మన గురువులు మనకు చక్కటి దివ్య సందేశము నిచ్చుటతో పాటు వ్యాసుని గొప్పతనమును అధ్యాత్మ తత్త్వమును బోధిస్తున్నారు. వ్యాసుడు క్రీస్తు పూర్వం 3800 సంవత్సరాల నాటి వాడు. ఆయన వశిష్టుని మునిమనుమడు; పరాశరుని కుమారుడు; బుషులలో రత్నము వంటి వాడైన శుక మహర్షికి తండ్రి. ఆయన జీవిత చరిత్ర అద్భుతమైనది. దివ్యమైనది. ఆయన వాసుదేవుని నుంచి వచ్చి వాసుదేవుని దివ్య లీలలు లోకానికి ప్రకటించి, వాసుదేవునిలో లీనమయ్యాడు. వ్యాసుడు నామ పారాయణ శకమును ఆరంభించి భగవంతుని నామ మాధుర్యమును అందరూ గ్రహించేలా చేశాడు ” అని వ్యాసుణ్ణి గురించి భగవాన్‌ సత్యసాయి సెలవిచ్చినారు.

అజ్ఞానాన్ని పోగొట్టేవాడు గురువు అని మనలాంటి మానవులు భావిస్తే పామరుడైన వ్యక్షి గుర్తు తెలిపేవాడు గురువు - ఏది గుర్లో అది గురువు. 'గురి ఏర్చడడమే గురుతత్వమని భావిస్తాడు. గురి - నమ్మకము. గురి చూపి గుర్తు తెలిపే వాదే

92

గురువు. గురువు స్మావింజర్‌ (562౪710860) వంటివాడు. మనలోనున్న మాలిన్యాన్ని తొలగించి శుభ్రం చేసి చైతన్యవంతులుగా తీర్చి దిద్దుతూ మనకి సేవ చేస్తాడు గురువు. ఇచట మాలిన్య మనగా హృదయంలో చేరి ఉన్న కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యము లనెడి అరిషడ్వర్ల్ణములు హృదయాన్ని (ప్రేమ భరితం చేసుకుని, ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ నిర్మలమైన, నిశ్చలమైన భక్తి (ద్ధలతో, ఆరాధనా భావంతో మానవుడు సంస్కరింప బడేలా ఆశీస్సులిచ్చేదీ, ఆ స్థాయికి తీసుకుని వెళ్ళేదీ గురువే. తుప్పు, కిలుము చేరిన పాత్రను పదే పదే చింతపండుతో, రకరకాల పొడులు (00౪663) వేసి తోమి శుభ్రము చేసినట్లే మనలో నున్న (మాలిన్యాన్ని) దుర్గుణాలను, దుష్ట భావాల్ని పోగొట్టే విధంగా గురువు స్మావింజర్‌ రూపం దాల్చి సంస్కరిస్తాడు. మనిషి తనలోని మాలిన్యాన్ని దివ్యమైన ఉపనిషత్తులలోని మంత్రోచ్చారణ ద్వారా రూపుమాపుకోవాలి. సంధ్యా వందనం, గాయత్రీ మంత్ర జపం ద్వారా మనిషి పగలు రాత్రి చేసిన దోషాలు నివృత్తి అవుతాయి. మనం గురువును సేవిస్తున్నామని అనుకుంటాము. కాని “గురువే మనకి సేవ చేస్తున్నాడు” అంటూ శ్రీ విశ్వంజీ తమ దివ్యోపన్యాసంలో సెలవిచ్చారు.

ళా పే 2 8౭౬166 - గురువు మార్గదర్శి

(౪౮ ఏ 2 %80900%ల - గురువు తత్వవేత్త

68౧ ఏ 2 ౫127200౯ - గురువు సూత్రధారి

6౫ ఓ లారుమ - సర్వమూ గురువే.

తల్లి తండ్రి గురువు దైవం అన్నీ తానే. “కోటి తల్లుల (ప్రేమను చూపును. కోటి తండ్రుల కఠినత చూపును” అంటూ గొంతెత్తి పాడతారు విశ్వంజీ. ఉక్కుకన్న కఠినంగా ఉన్నట్లు మనకు కన్పిస్తూ చక్కటి మార్గంలో నడిపించడానికి సహకారి అవుతాడు గురువు. వెన్నకన్న మెత్తని మనస్సుతో ఆదరించి ఆప్యాయతతో వెన్ను తట్టి, ఉత్సాహ (ప్రోత్సాహాలతో మనం చేసే పనులకు ఆశీస్సు లిచ్చి అనుగ్రహం కురిపించేది తానే. మానవాళికి మంచి మార్గం వైపు పయనించడానికి శిక్షణ నిచ్చేది తానే.

జ్ఞానవంతుడైన ప్రతి వ్యక్తిని గురువుగా భావించవచ్చును. దత్తాత్రేయుడు జ్ఞానానికి ప్రతీక. జ్ఞాన ప్రదాత. ఆయన యావత్‌ విశ్వానికీ ఆది గురువు. ఇది విశ్వంజీ ఉవాచ. ఏ యోగిని గాని ఏ అవతార మూర్తిని గాని, లేదా ఒక శక్తివంతమైన వ్యక్తిని గాని - ఎవరిపట్ల గురి కుదిరితే అతడే గురువు - అతని వాక్కు వేదవాక్కు, అతడ్ని అనుసరించడమే వారి ధ్యేయం. అటువంటి భక్తి విశ్వాసాలతో గురువును సేవించాలి.

93 మంచి చెడు విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదించి ఆ మార్గంలో నడిచేలా అనుగ్రహించేదే గురుతత్త్వము.

ఇంక పండితులైన వారు అధ్యాత్మ స్థాయిలో గురువును గుజాతీతుడుగా, నామ రూపరహితమైన స్థితిలో నిరాకార నిర్గుణ పరబ్రహ్మయే గురువని కేవలం ఈ రూపం అసలైన గురు స్వరూపం కాదని భావిస్తారు. సత్వరజస్తమో గుణాలకి అతీతమైనవాడు గురువు. ఒక వేషానికి మాత్రమే పరిమితం కాదు గురువు. గురువు శుద్ధ మహా చైతన్యంలో ఉంటాడు. కేవలం జ్ఞానమూర్తి. ఆ జ్ఞానము (12071666) అంతు లేనిది. దానిని మించినది లేదు. సుఖ దుఃఖములకతీతుడు. అచంచలమైన స్థితి ఆయనది. నిత్యుడు - 63 ఈల౫2| బ్రహ్మవిత్‌ బ్రహ్మైెవభవతి - బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపుడు. భక్తుని మనో భావముల నెరిగి భక్తుని ప్రవర్తనలో పరివర్తన తీసుకు రాగల ప్రతిభావంతుడే నిజమైన సద్దురువు.

ఈ విధంగా అనేక కోణాల్లో “గురువుకు వివిధ రకములయిన నిర్వచనములు ఎవరి స్థాయీ భేదమును బట్టి వారు చెప్పుకున్నప్పటికీ గురు తత్వమొక్కటే, అందరి పట్ల వారికున్న భావన ఒక్కటే.

గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితోః గురుః

గురుర్విశ్వం - నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః

అని గురువుని కీర్తిస్తూ పాడతారు విశ్వంజీ. ఎవరైతే సమస్త విశ్వమును గురువుగా సంభావన చేసి ఆరాధిస్తుంటారో వారే విశ్వ గురువు. యావత్తు విశ్వమును గురువు నందు, గురువును విశ్వము నందు భావన చేసి ఆరాధించడమే విశ్వ గురు తత్వము. విశ్వగురు తత్వమును సొంతం చేసుకొన్న వాడే విశ్వగురువు అని భావము. ప్రతి మానవుడికి విశ్వమే గురువని భోదిస్తారు విశ్వంజీ. విశ్వమే తనకు కూడా గురువని అదే అన్నిటికన్నా పెద్దదని విశ్వమే విష్ణు స్వరూపమని, విశ్వాన్ని పాలించే విభుడే పరమ గురువు లందరికి ఆది గురువని, విశ్వ విభులమైత్రి విడదీయరానిదని శాశ్వతమైనదని పై పద్యంలో తెలిపినారు. శ్రీ విశ్వంజీ ఈ నాటికీ తనలో దత్తుణ్జి దర్శించి శక్తి నంతా ధారవోసి మంత్రోపదేశం చేసిన సద్దురువులు శ్రీ దత్తాత్రేయ వాడేకర్‌ మహరాజ్‌కి

94 సవినయంగా సాష్టాంగ దండ ప్రణామంబు చేయడమే కాక వినయ భావంతో గురుభక్తి ముప్పిరి గొనునట్లు వారి ఆజ్ఞను తూ.చ. తప్పక పాటిస్తూ విశ్వానికే ఆదర్శప్రాయులై నిలచినారు. గురువు పట్ల వారికున్న భక్తి శ్రద్ధలు ఆరాధనా భావం గొప్పవి. “ఈయన భగవంతుడు, అనర్హమణి, సాక్షాత్తూ దత్తమూర్తి” అని వారిచే కొనియాడబడిన శిష్యవత్సలుడు శ్రీ విశ్వంజీ. సమస్తమైన సౌకర్యములు ఆ గురువుకు ఎట్టి లోపం లేకుండా సమకూర్చడంలో వారికి వారే సాటి.

“దుస్తరమైన భవసాగరాన్ని దాటించడానికి వచ్చాను” అని గురువు అంటున్నాడు. మన అర్హత, మన యోగ్యతల్ని అనుసరించి గురువు మనల్ని చేరదీస్తాడు. అనేకానేక జన్మలు ఎత్తి వచ్చిన మనకు, గురువు కూడా ఈ అవనీ సంచారానికి వచ్చిన వేళ. “ఇవేళే అవడం మన పూర్వజన్మ పుణ్యమని చెప్పవచ్చును. ఈ సద్దురువుకి సమకాలీనులమై తాను అవతరించిన శుభతరుణంలో పూర్ణ ప్రజ్ఞామూర్తులమై అధ్యాత్మ సాధనలో గురువు అనుగ్రహంతో ఎదగాలి. ఆయన పాదాలు వదలకుండా ఉంటే ఆయన మనకొక నిర్దిష్టమైన గమ్యాన్ని చేర్చడానికి, అధ్యాత్మలో ఉన్నత స్థితికి ఎదగడానికి తగిన సాధన చేయిస్తాడు గురువు. అందుకే గురువు మనకు జన్మ జన్మలతో వచ్చిన కార్మిక దోషం తొలగిస్తాడు. పాపాల్ని దగ్ధం చేసి ముందుకు సాగేలా ఆశీః వర్షం కురిపిస్తాడు అంటారు విశ్వంజీవారు.

95 దేవుడు కలడో లేడో! గురువు మాత్రం ఉన్నాడు గౌరవత్వాత్‌ గురుః

ఈశ్వరోగురురాత్మేతి ॥

మూర్తి త్రయ విభాగినే 1

ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఒక్కటే ! అయితే తనను తాను మూడు మూర్తులుగా విభజించుకున్న స్థితి. ఇందులో ఈశ్వరుడు అవ్యక్త, నిర్షుణ పరబ్రహ్మ తత్త్వం.

ఆత్మ అనుభవానికి, అనుభూతికి చెందిన బ్రహ్మానంద, నిరామయ స్థితి. ఈశ్వరుడూ, ఆత్మ అనబడే రెండు స్థితులూ ఆధ్యాత్మిక స్థాయిలో అనుభవించవలసిన పరమస్థితులు. కనబడవలసిన ఈశ్వరుడు, కనుగొనవలసిన ఆత్మ, సంయోగించి, ఒకే మూర్తిగా, చర్మ చక్షువులకు గోచరిస్తూ, మనసును స్పృశిస్తూ, లోక సహచరంగా మానవ శరీరంలో, మహనీయంగా సంచరించు అనర్హచిద్ధన రసం గురువు ! ఈ గురువు దృగ్గోచరము కాని ఈశ్వర, ఆత్మ స్థితిని, గతిని, అనుభవైక వేద్యం చేయగల ఉపదేశ వాహిక! బోధ ద్వారా, సేవ ద్వారా సాధకుని అహంకారాన్ని నివారించి, మమకారాన్ని (ప్రేమగా మార్చి, మనసును హృదయంవైపు నడిపించు రధికుడు. భావసారధి. గత, ఆగత జన్మల వారధి.

ఎవరు నిరంతరము ఆత్మయందు సంస్థితుడై, ఎరుక కలిగియూ, ఎరగనట్లుండునో, ఎవరి సన్నిధానమున మనసు, చిత్తము అణగి యుండునో, ఎవరు ఎల్లవేళలా సమస్థితిలో నిలకడ చెంది వుండునో, ఆయనే నిజ గురువు.

ఎవరు జన్మ జన్మాంతరముల నుండీ సాధకుని అంతరంగమున నిలిచి, జన్మల వలన కలిగిన కర్మలను, కర్మానుభవాలను నియంత్రిస్తూ, మానవ జన్మ లభించిన సాధకునికై, తానూ మానవాకారం ధరించి ఉద్ధారణ వైపు నడిపించునో, ఆతడే గురువు.

వారివారి ప్రాప్తిని బట్టి, పరిపాకమును బట్టి, యోగ్యతను బట్టి, గురువు ఆయా స్థితులలో, సాధకుని జీవితంలో ప్రవేశించి, సన్మార్గంలో నడిపించి, కడకు ఆత్మబోధ చేస్తాడు!, భౌతిక స్థితిలో మంచి చెడ్డలు వివరిస్తూ, ద్వంద్వాలలో సాధకుని నిలబెట్టి,

96 చివరకు అధ్యాత్మ మార్గంలోకి మళ్ళించు వాడే గురువు. కానీ, మానవుడు మనో దౌర్బల్యం వలన, గురువును కామితం తీర్చే కామధేనువుగా మాత్రమే గ్రహించి, పరిమిత లబ్ధిని పొంది, తన జన్మను వృధా చేసుకుంటారు. ఈ సన్నివేశంలో గురువు, ఆత్మవలె సాక్షీ భూతుడు. అధి భౌతిక స్థాయిలో, గురువు సాధకునికి విచారణ నేర్చి, యింద్రియాతీతమైన మహానుభవాలను ప్రసాదించి, ఆత్మానాత్మల మధ్య గల సంబంధాన్ని తెలియపరుస్తాడు. కానీ, మానవుడు సాత్వికాహంకారం వలన తానెరిగిన లోక విద్యల నాధారం చేసుకుని, శాస్త్రజ్ఞానమే ప్రజ్ఞానంగా ్రమిస్తాడు. దాని చుట్టూ పరిభ్రమిస్తాడు. తాను అందుకోవలసిన స్థాయిని అందుకోలేక కొమ్మనుండీ పట్టు విడి, నిస్సహాయుడవుతాడు. ఈ స్థితిలో గురువు, ఈ ప్రమాదం నుండి రక్షించి, విజ్ఞానానికున్న పరిమితిని తెలియపరచి, సాధకుణ్ణి, మళ్లీ నిలబెడతాడు. ఈసన్నివేశం కీలకం. వెలుపల, లోపల గురువు ఏకకాలంలో, సాధకుణ్ణి జుగరూకుణ్జి చేస్తాడు. అందుకోవలసిన స్థితి సాధకుడిదే! అధ్యాత్మస్థాయిలో గురువు, అంతర్జ్యోతి! ఆత్మ బోధ చేసేవాడే అసలు గురువు. లోపల నుండీ, వెలుగై, ఎలుగై నిరంతరమూ నడిపిస్తూ అంతర్భోధ చేస్తూ, సాధకుణ్ణి దివ్యత్వం వైపు, ఆల్మ్మెక స్థితి వైపు ప్రయాణం చేయిస్తాడు. ఈ స్థితిలో ద్వంద్వాలు లేవు. అంతా అద్వయంగా వుంటుంది. అన్నీ ఒకటిగా అనుభవంలోకి వస్తాయి. విజ్ఞాన మంతా ్రజ్ఞానంగా పరిణామం చెందుతుంది. భౌతికస్థాయిలో, కర్పూరం వెలిగించటమే “హారతి. అధ్యాత్మ స్థాయిలో హారతి అంటే “జ్ఞాన జ్యోతిలో మనసును దహించటమే”. భౌతిక స్థాయిలో కుంకుమ అంటే కేవలం అలంకార వస్తువు. అధ్యాత్మలో, శక్తి తత్వానికి, కుంకుమ సంకేతం! భౌతిక స్థాయిలో “విభూతి” కేవలం బూది. అధ్యాత్మ స్థాయిలో, విభూతి అంటే శివతత్త్వం. ధరించేది అని అర్ధం. ఆత్మ, దేహాన్ని ధరించింది అని విశేషార్ధం; అపరావిభూతిగా ఉన్నపుడు భరించింది. పరావిభూతిగా ధరించిందని అర్థం.

97

ఈ విన్యాసాలన్నీ గురువు వెలుపల చేస్తాడు. సాధకుడు ఆగిపోయేది భౌతిక స్థాయి అయినపుడు, గురువు హెచ్చరిస్తాడు, విన్నవాడు తరిస్తాడు. వినని వాడు అంతరిస్తాడు. ఈశ్వర మహా వైభవాన్ని మహిమగా, దివ్యశక్తిగా, దూరదృష్టిగా, దూర (వణంగా, భూత, భవిష్యత్కాల దర్శనంగా హెచ్చరికగా ఉపదేశంగా బోధిస్తూనే వుంటాడు.

ఆత్మగా ఎన్నో సందర్భాలలో సాక్షీభూతంగా, కొన్ని చోట్ల ప్రత్యక్ష సాక్షిగా, మరికొన్ని వేళల్లో భాగస్వామిగా వుంటాడు. కానీ దేనినే అంటించుకోడు. ఈశ్వర, ఆత్మల సుందర సమ్మేళన మూర్తి గురువు. విషయాతీతంగా వుంటాడు.

గురువు రక్షిస్తాడు. శిక్షిస్తాడు.

గురువు, పాషాణము వలె కరినుడు. వెన్నవలె మృదుశాలి.

గురువు ఎంత రహితుదో, అంత సహితుదు.

గురువు హితుడు, సన్నిహితుడు.

గురువు మార్గదర్శి. ఆచార్యుడు.

గురువే తల్లి ! గురువే తండ్రి ! గురువే దైవం ॥!

గురు రూపమే ధ్యానం. గురు పాదమే పూజ. గురు వాక్యమే మంత్రం. గురు కృపే మోక్షం.

కంచి పరమాచార్య, “శివుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు. గురువు కోపిస్తే ఎవరూ రక్షించరు అంటారు. కోపం” అంటే ఆగ్రహం కాదు. సాధకుడు, తన జాడ మరుస్తున్నపుడు కలిగే, అంతస్సంచలనం.

గురు బోధను పాటించకపోతే, గురువు పట్ల సాధకుని గౌరవం ఏపాటిది?

గురువు లోకంలోనే వుంటాడు. గురువు లోకంతోనే వుంటాడు.

గురువు ద్వంద్వాల కలయికగా వుంటూ, అద్వయం వైపు నడిపిస్తాడు.

గురువు సాధనాశీలి. సాధనాతీతుడు.

98 గురువు, తన అనుగ్రహాన్ని నెమ్మదిగా కానీ, అకస్మాత్తుగా కానీ, సహజంగా కానీ వర్షిస్తాడు. ఎవరిపై ? ఎవరు తీవ్ర అంతరంగ సాధనలో తస్తులో, తీవ్ర కాంక్షలో ముక్తిని కోరుతారో వారిపై! మానవ శరీరం ధరించిన గురువు, సాధకుని సాధనను అన్ని వేళలా అన్ని వైపుల నుంచీ తీవ్రతరం చేస్తాడు. అధ్యాత్మ మార్గంలోకి ప్రవేశించటమూ గుర్వనుగ్రహమే. తీవ్ర విచారణలో, ఆత్మోన్నతిలో గురువు సహాయకుడై నడిపిస్తాడు. “ల్పున్రాపాశ వినాశన చతురం కోశ పంచకాతీత మనన్తం కారణమకారణ మనేకం కాలకాల కలిదోష విహీనం” అంటూ గురుమూర్తిని కీర్తిస్తారు, సదాశివ బ్రహ్మేందులు. గురువులో ఈశ్వరుణ్ణి చూడాలి. గురువులో ఆత్మను అనుభవించాలి. గురువు “మూడు బొమ్మలో సమాహారం. గురువు కట్టెదుట, కనులకు తోచు కమనీయ కల్పతరువు. చింతామణి, జ్ఞానదీపం వెలుగు స్తంభం. లోకాలన్నిటి బింబం. ఆయనే మూలం. ఆయనే మధ్యం. ఆయనే అంత్సం. ఆయన అవనీ సంచారంచేసే అద్భుతమూర్తి ! అమదానంద స్ఫూర్తి. దేవుడున్నాడా లేడా అని కాదు. ఉన్నాడు! ఆయనే గురువు. ఆత్మ వున్నదా లేదా అని కాదు. ఉన్నది! అది గురువే!

99 సత్యం, శీలం, పవిత్రత, సమైక్యత, దైవత్వానికి సోపానాలు

శ్రీ విశ్వంజీ సంస్కరణోద్యమానికి మూల స్థంభాలు సత్యం, శీలం, పవిత్రత, సమైక్యత. “ఇది ఏ గురువుకి ఏ మతానికి గాని వ్యతిరేకం కాదు. అందర్ని సమన్వయం చేసే పని ఇది” అని స్వామి తమ దివ్యోపన్యాసంలో చెప్పినారు.

సనాతన ధర్మం అంటే విశ్వ ధర్మము. దానిని ఆచరణ యోగ్యం చేసి మానవతకు పరిపూర్ణత సిద్ధింప చేయటానికి సత్యం, శీలం, పవిత్రత ఐకమత్యం అనే సోపాన పరంపర ద్వారా వ్యక్తులను సంస్కరించి మహోన్నత శక్తులుగా మార్చటమే తమ లక్ష్యమని శ్రీ విశ్వంజీ వచించినారు.

నిజమైన భారతీయ సంస్కృతి అనే భవంతి సత్య, ధర్మ, శాంతి ప్రేమలనే నాలుగు స్తంభములపై కట్టబడి ఉంది. సనాతన ధర్మానికి సత్యం, శీలం, పవిత్రత, ఐక్యత మూలస్తంభాలు. ప్రపంచ మానవాళి శాంతి సౌఖ్యాల కోసం వేలకొలది సంవత్సరాల నుంచి ప్రార్ధించే ప్రజలున్న దేశం భారతదేశం” అన్నారు భగవాన్‌ సత్యసాయి. శ్రీ విశ్వంజీ పేర్కొన్న మానవతా విలువలలో ప్రేమ, ధర్మము శాంతి అంతర్వాహినిగా ప్రవహిస్తూ అహింసా తత్త్వం కూడా చోటు చేసుకుంటోంది. అదే విధంగా శ్రీ సత్యసాయి శీలాన్ని గురించి, పవిత్రత, సమైక్యతల గురించి అనేకానేక విషయములు క్రొత్త క్రొత్త నిర్వచనములు ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేకానేక కోణములలో సందర్భ వశాత్తు బోధించుచునే ఉన్నారు. అందుచేత కలియుగ అవతార మూర్తు లిరువురు ఏకకాలంలో మానవత్వాన్ని చాటడానికి మనిషి, మనిషిగా జీవించటానికి అనుగుణంగా దివ్యత్వం వైపు నడిపించే ఉన్నతమైన విలువల్ని బోదిస్తున్నారు.

రూపాలు వేరు - శక్తి ఒక్కటే

పశువుల వన్నెలు వేరు - పాలు ఒక్కటే

పుష్పాలు వేరు - పూజ ఒక్కటే

శృంగారంబులు వేరు - బంగారమొక్కటే (సత్యసాయి)

అన్న రీతిలో మహాశక్తి రాశీభూతమై నరాకారాము ధరించుట మానవాళి నుద్ధరించి సమాజ సంస్కరణ ద్వారా “విశ్వ కళ్యాణం” సాధించాలన్న తపనతోనే అని భావింపనగును.

100

వేద వేదాంగములలోని విశేషాలు ఉపనిషత్తుల సారము మున్నగునవన్ని తేలికగా అర్హ్వమయ్యే రీతిలో మనకు బోధించుచున్న పుణ్య పురుషులు వీరు. క్షమా మూర్తులు. సత్యం, శీలం, పవిత్రత, ఐక్యత, శాంతి ధర్మాల సమైక్య రూపంతో వెలసిన (ప్రేమ మూర్తులు. ఈ విలువలు విద్యా విధానంలోనూ, దైనందిన జీవితంలోనూ ప్రవేశ పెట్టి, ఆచరించి నందు వలన పరిపూర్ణ మానవత్వం సిద్ధించును. ఆ విలువల క్రమమును

పరిశీలింతము. సత్యము ఫ= అనగా యదార్ధము, నిజము, అని ఈ రకమయిన అర్ధములు చెప్పుకొనవచ్చును. లౌకిక సత్యము, పరమార్ధిక సత్యము అని విడమరచి ఆలోచన చేసినప్పుడు లౌకిక సత్యము భౌతిక ప్రపంచములో అప్పటి కప్పుడు మాత్రమే సత్యముగా భాసించును. పరమార్ధిక సత్యము త్రికాల బాధ్యము అని చెప్పబడినది. నిత్య సత్య శాశ్వతమైనది ఈ పరమార్ధిక సత్యము. మార్చు చెందనిది. ఈ జగత్తులో నున్నటు వంటి సర్వ పదార్ధములు ఏదో ఒకరోజు నాశనమయ్యేవే. నశ్వరమైనట్టి ఈ జగత్తు నందు మనము చూచినది, మనము చేసినది, మనము విన్నది ఇవన్ని సత్యములు కావు. ఈ రోజు ఒకామె ఒక రంగు చీర ధరించినది. ఆ దినమునకు అది సత్యమే. అది అప్పటికి మాత్రమే సత్యము. ఇది కేవలం ప్రాకృతమైన సత్యము. చూసింది చూసినట్లు విన్నది విన్నట్లు, చెప్పడం సత్యమనడానికి వీలులేదు. దీనికి భగవాన్‌ బాబా మరొక ఉదాహరణ చెప్పారు. ఒక చోరుడు ఒక రాత్రి ఒక శ్రీమంతుని ఇంటికి వెళ్ళి వస్తువులను అపహరించినాడు. పోలీసులు గుర్తించి అతనిని పట్టుకున్నారు. తప్పించు కునే నిమిత్తమై తాను ఆ ఇంటికి వెళ్ళ లేదని అబద్ధ మాడినాడు. కాని అతని అంతర్వాణి “రాత్రి నీవు ఆ శ్రీమంతుని ఇంటికి వెళ్ళి దొంగతనం చేశావ” అని చెబుతున్నది. అంతర్వాణిని మరుగు పరచడానికి ఎంత మాత్రమూ వీలుకాదు. అంతర్వాణికి ద్రోహం చేయకుండా ఉపయోగ పెట్టే పదమే సత్యము. ఎటువంటి పరిస్థితి యందైనా అంతర్వాణికి భంగము కలుగకుండా చూసుకోవాలి. ఇదే ప్రధానమైన మానవతా విలువ”. (బాబా) అందుచే మానవాళి నిత్య జీవితములో భౌతిక స్థాయిలో సత్యవాక్కును వ్రతముగా పాటిస్తూ అధ్యాత్మ స్థాయిలో “లర ఏ 60% అన్న పద్ధతుల్లో “భగవంతుడు సత్య స్వరూపుడు”, “అతడే నిజమైన స్నేహితుడు. పొతము కోరే వాడు భగవంతుడే అందుచేత అతడే సన్నిహితుడు. ఆ సన్నిహితత్త్వము పెంపొందించుకొన్ననాడు మానవుడిలో పశు గుణములు పోయి పశుపతి స్థాయికి ఎదగ గలడు. సర్వత్రా వ్యాపించి యున్న భగవంతుని

101

సమక్షములో, లేదా పరోక్షములో మంచి కర్మలాచరించి దైన ప్రీతి పాపభీతి, సంఘనీతి అలవరచుకున్న వారి జన్మ ధన్యమే! సత్యమే రూపు దాల్చి వచ్చిన మహనీయులు కరోరమయిన నియమములు పాటించి సత్యమే ప్రప్రధమమైన మానవతా విలువగా పేర్కొన్నారు.

రెండవది శీలము :- మంచి సంస్కారం, మంచి గుణం, మంచితనం కలుపుకుంటే శీలమని చెప్పవచ్చును. శీలమే జీవునికి అలంకారము. శీలము లేని వాడు పశువుతో సమానము. శీలము లేని బ్రతుకు చిల్లుకుండ వంటిది. శీలము మనిషికి ప్రాణము వంటిది. విద్యార్థులకైనా యవతీ యువకులకైనా, విద్యాధికులకైనా 'శీలము” చాలా ప్రధానమైనది. విద్య యొక్క లక్ష్యము శీల నిర్మాణమే.

శీలాన్ని గురించి తమ దివ్యోపన్యాసంలో శ్రీ విశ్వంజీ ఈ విధంగా సెలవిచ్చినారు. “శీలేన శోభతే విద్యా” అని చెప్పెదము. ఆ విద్య వల్ల మనం సంస్కరింపబడి శీలవంతుల మవుతావము. అందుకనే (012201౪) శీలము గనుక లేకపోయినటెతే చాలా ప్రమాదము దాపురిస్తుందని మన మహాత్ములు చెబుతారు. కాబట్టి బ్రహ్మ చర్యము వల్ల ఒక విధమయిన టువంటి మానసికమైన ధృడత్వము, ప్రశాంతత, శక్తి వస్తుంది. శరీరము వజ్ర తుల్యమవుతుంది. మనస్సు కూడా ఎంతో శక్తివంతమై, తేజోవంతమవుతుంది. హృదయము ప్రేమతో నిండి పోతుంది. బ్రహ్మచర్యం వల్ల మనలో ఉన్నటువంటి ఆ దివ్యమైన ప్రాణశక్తి జాగ్భతమై విశ్వ వ్యాపకమయినటువంటి విశ్వశక్తితో అనుసంధానం చేసుకుని మనల్ని ఒక శక్తివంతమయినటువంటి ఆయుధంగా, సాధనంగా మారుస్తుంది.

(బ్రహ్మము నందు చరించడమే బ్రహ్మచర్యము. బ్రహ్మమంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ ఏది సత్యమైనదో, ఏది అనంతమై ఈ విశ్వమంతా వ్యాపించి యున్నదో ఆ దివ్య జ్ఞానమందు మనస్సును రమింప జేసి సంపర్మము (000966యిు పెట్టుకుంటే మనలోకి శక్తి ప్రవహిస్తూ వస్తే మనము బ్రహ్మమందు చరించినట్లు, బ్రహ్మచర్యం వల్ల మానవుల్లో తేజస్సు కలుగుతుంది. ఓజస్సు కలుగుతుంది. అంతేకాకుండా (బ్రహ్మచర్యం పాటించడం వల్ల మనలో నున్నటు వంటి శక్తిని మనము దుర్విర్యం చెయ్యకుండా, వృధా చెయ్యకుండా భద్రపరచుకుని, నిల్వ చేసుకున్నట్లైతే ఆ శక్తి ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్లడానికి దోహదం చేస్తుంది. ఆహార విషయంలో కూడా జాగ్రత్త పాటిస్తూ శరీరంలో పరిశుద్ధత, రక్తము పరిశుద్ధముగా నుండు స్థితిని సంపాదించు

102 కొనుటకు సాత్వికమైన ఆహారము చాలా ముఖ్యము. ఆహారంలో మూడు గుణాలు, మూడు రకాలయిన ఆహారాలు మూడు రకాలైన పద్ధతుల్లో ఉన్నది. ఏ రకమయిన ఆహారం తీసుకుంటే ఆ రకమయిన గుణములు మనలో ఉత్పన్నమవుతాయి. ఆ విధమైన స్థితి మనకు వస్తుంది. ఎటువంటి ఆహారమో అటువంటి మనస్సు. ఎటువంటి మనస్క్సో అటువంటి ఆలోచనలు . ఎటువంటి ఆలోచనలో అటువంటి పనులు. ఎట్టి పనులు చేస్తామో అటువంటి ఫలితము.

ఆహారము కేవలము నోటితో తీసుకునేదే కాదు. పంచేంద్రియముల ద్వారా తీసుకునేది కూడా ఆహారమే. కళ్ళతో తీసుకొనేది, చెవులతో తీసుకొనేది, ముక్కుతో తీసుకునేది, స్పర్శతో తీసుకునేదీ ఆహారమే. కాబట్టి కళ్ళతో చూసేవి సాత్వికమైనవిగా ఉండాలి. వినేవి సాత్వికమైనవే వినాలి. మనలో ఉన్నటు వంటి దైవికశక్తిని జాగృతం చేసేవి మనకు ఆనందాన్ని సంతృప్తిని, శాంతిని ఇచ్చేవి మనలో (ప్రేమను పెంచేవి వినాలి. అలాంటివే చదవాలి. అలాంటి పరిసర ప్రాంతాలు ఉన్న వాతావరణంలోనే మనం సంచరించాలి.

ఈ విధంగా పంచేంద్రియాల ద్వారా తీసుకునే ప్రతీదీ పవిత్రంగా, పరిశుద్ధంగా, సాత్వికంగా ఉంటే అప్పుడు మన రక్తం శుద్ధమవుతుంది. కలుషితం కాకుండా శుద్ధమైన రక్తము నరనరాలకూ పోయి శరీరాన్ని శుద్ధంగా ఉంచి మనస్సుని శుద్ధం చేస్తుంది. మనస్సును తేజోవంతం చేస్తుంది. శక్తివంతం చేస్తుంది. శక్తివంతమైన మనస్సుతోటి, దైవికమైన శక్తితోటి జాగృతమైన స్థితికి వస్తాము. కాబట్టి మానవుని యొక్క జీవిత సొధమునకు పునాది గోడ శీలము” అంటూ స్వామి శీలాన్ని గురించి వివరించినారు.

శీల నిర్మాణంలో (012201 34049 బ్రి ముఖ్యమైనది. 1-3 - 6౮౦11౬.

& - ఊ/016 - 3 - క24- ౮- 0౦౫02090 (ఊఉం16 3464 0౦%02%)0 అనగా చెడు సహవాసమును త్రుంచి పొరవేయాలి. చెడు అలవాట్లు దావాగ్ని (౪/14 10) వలె వ్యాపిస్తాయి. ఒకడు బ్రాందీ త్రాగాడు గదా అని తాను కూడా త్రాగితే వ్యసనంగా మారి చిట్ట చివరకు మనిషినే మందు (మ్రంగుతుంది.

“త్యజ దుర్దన సాంగత్యం” అన్నారు భగవాన్‌ సత్యసాయి.

“త్రికరణ శుద్ధి మానవుని శీలానికి మూలం. శీలము జీవితపు పుష్పానికి సుగంధం

103

వంటిది. మనస్సు నిర్మలంగా ఉంటేనే మానవుని శీలం ఉదాత్తంగా వెలుగొందుతుంది.” అంటారు సత్యసాయిబాబా. భగవంతుని దృష్టిలో శీలమే ధనము, సదాచారమే సంపద, సత్ర్రవర్తన పేరుప్రతిష్టలను తెచ్చి పెడుతుంది. మానవ జీవితానికి విలువ నిచ్చేది ఒక్క శీలము మాత్రమే. ప్రతి ఒక్కరు తమ శీలాన్ని పోషించు కోవాలి. ఆదర్శవంతమైన మచ్చలేని జీవితాన్ని గడపాలి.

పవిత్రత :- బాహ్యంగా, ఆంతరంగికంగా పవిత్రతను ఆపాదించుకుంటూ నిర్మలమైన నిష్కామమైన నిశ్చల హృదయంతో సత్‌ సంకల్పంతో, సదాలోచనతో సహృదయంతో ఆచరించే కర్మలు గాని, దృధమైన విశ్వాసంతో మానవత్వంతో మెలగే వారందరు పవిత్రమైన భావాలు పెంపొందించుకొన్న వారంతా పరమాత్మ స్వరూపులని భావించిననాడు అట్టి వాతావరణంలో పవిత్రత చోటు చేసుకుంటుంది. పవిత్రత ఉన్నచోట పరమాత్ముడుంటాడు. పవిత్రత అనేది శారీరక పవిత్రత, మానసిక పవి[త్రత, వాతావరణంలో పవిత్రత ఇలా పవిత్రత ఎన్నో రకాలుగా ఉంటుంది. కాబట్టి మనం దేహాన్ని పవిత్రం చేసుకోవాలి. పతంజలి యోగ శాస్త్రంలో అష్టాంగ యోగాన్ని వివరించినాడు. యమ, నియమాలు - యమ మంటే శరీరాన్ని చక్కగా పటిష్టం చేసుకోవటం. శక్తివంతం చేసుకోవటం. నియమం అంటే మనస్సుని శక్తివంతం చేసుకోవటం. ఈ శరీరము మనస్సు రెండూ కూడా పవిత్రమై పటిష్టమై శక్తి వంతమైతేనే ధ్యానము, సమాధి లభ్యమవుతుంది లేకపోతే కావు. కాబట్టి శరీరాన్ని పవిత్రం చెయ్యాలి. బాహ్య శుభ్రతతోపాటు మనస్సు, సూక్ష్మ శరీరం కూడా పరిశుభ్రం చెయ్యాలి. మనస్సుని శుభ పరచటానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్ని అసూయ, ద్వేషాల్ని దూరం చేసుకోవాలి. మనస్సు చాలా ముఖ్యమైనది. విలువైనది. భగవంతుడు ప్రతి ఒక్క అవయవాన్ని వదిలిపెట్టినా, మెధడు మనస్సు ఈ రెండింటిని ఇనుప పెట్టెలో మనము విలువైన బంగారు నగలు దాచుకున్నట్లు, ఈ రెండింటిని భద్రపరచి ఉంచాడు.

దేహపరంగా ఆలోచిస్తే స్నానము చేయడం చక్కటి ఉతికి ఆరవేసిన బట్టలు ధరించడం ఇత్యాదికర్మలన్ని బాహ్యశుద్ధిని చాటును. అంతరంగికం ఆలోచిస్తే అంతః కరణ శుద్ధి చెయ్యడం చాలా అవసరము.

“అంతర్‌ బహిశ్ళతత్సర్వం వ్యాప్యనారాయణస్థితః

104 అంతరంగము నందు, బాహ్య ప్రపంచములోను, సర్వత్రా వ్యాపించి అణువణువునా కణకణమున గోచరించేది దైవమే గనుక, అట్టి దైవాన్ని మన చుట్టూ, మనప్రక్మన, మనవెనుక, మన ముందు ఉన్నాడు అన్న విశ్వాసంతో కర్మలాచరించడం మొదలు పెడితే అన్ని పవిత్రమైన కర్మలే ఆచరిస్తాము, బాహ్యంగాను, ఆంతరంగికంగాను పవిత్రతను నిలువెల్లా నింపుకుంటాము. పరాత్పరుని సన్నిధానంలో భౌతిక స్థాయిలో కాకుండా అధ్యాత్మ స్థాయిలో ప్రతిక్షణం మన వెంట జంట ఉన్నాడను కున్నప్పుడు మన వాక్కు శుద్ధిగా ఉంటుంది. చేసిన పనులు సిద్ధిస్తాయి. పరమ పావనమైన భారతావని యందు “పవిత్రత సర్వత్రా వ్యాపించి యున్నది. ఈనాడు ఎక్కువ మంది మనస్సు పరిశుద్ధముగా లేకపోవుట వలన బాధపడుతున్నారు. వత్తిడి, అలసట, ఆత్రుత (5[655 50౯20 ఖబుంంట) ఇటువంటివి తగ్గించు కుంటూ ్రశాంతతో పవిత్రమైన భావాలు, సత్‌ సంకల్పాలు, 'పెంపాందించుకోవాలని భావము. “మనువవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోవ” మనస్సే బంధించబడటానికి కాని, విడివడడానికి గాని మూలకారణమై యున్నది. అటువంటి మనస్సును శక్తివంతం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలని, మనస్సుని మనము వినూత్నమయిన రీతిలో శక్తివంతమైన పద్ధతుల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. “ఈశ్వరః స్సర్వభూతానాం” ప్రతి భూతములోనూ ఈశ్వరుడున్నాడు. ఆయన ఉనికిని సర్వే సర్వత్రా సర్వకాలముల యందు నిల్పుకోగలగడం పవిత్రతకు చిహ్నము. పవిత్రమైన భావాలకు పట్టుగొమ్మ భారతదేశము. అటువంటి పవిత్రమైన దేశంలో ప్రతి ప్రదేశంలోనూ, పరమాత్మకు నిలయాలైన దేవాలయాలు పవిత్రతతో విరాజిల్లుట విశేషము. యోగులు, సిద్ధపురుషులు, అవతారమూర్తులు తమశక్తిని విగ్రహము ప్రతిష్టాపన చేస్తున్న సమయంలో అడుగు భాగంలో మంత్ర గర్భితమైన ఒక యంత్రాన్ని మహాశక్రివంతం చేసి ప్రాణశక్తిని ప్రవేశపెట్టి విగ్రహానికి ప్రాణం పోసి శక్తివంతం చేస్తున్నారు” అంటూ శ్రీ విశ్వంజీ తమ దివ్యోపన్యాసంలో కలియుగంలో దేవాలయాలను పవిత్రతతో సందర్శించే వారికి చక్కటి దివ్యానుభూతి కూడా కలుగుతుందని సెలవిచ్చినారు. అందుచే “పవిత్రత ఉన్నచోట పరమాత్మ ఉంటాడు” అనే మరో సూక్తిని కూడా వారు వచించినారు. ఈ విధంగా స్వామి తమ దివ్యోపన్యాసంలో “పవిత్రత” మానవ జీవిత సౌధమునకు మూడవ గోడ అన్నారు. పరమాత్ముని స్థానము పవిత్రమైన హృదయమే.

105

సమైక్యత : అనగా ఐకమత్యము. అ,ఆ లు దిద్దే రోజుల్లో బాల్యావస్థలో ఇంటిలో అన్నదమ్ములు అక్క చెల్లింద్రతో ప్రారంభమయిన ఈ ఐకమత్యము పెరిగిన తర్వాత సమాజంలో సమైక్యతగా రూపుదిద్దుకోవాలి. ఇంట్లో మొట్టమొదట పిల్లలకు తమ వస్తువుల్ని ఇతరులతో తోటి అన్నలతో అక్క చెల్లెండ్రతో పంచుకోవటం అన్న పేరుతో ప్రారంభం కావాలి. ఈ ఐకమత్యము పెంపొందడానికి తల్లిదండ్రులు దోహదం చేయాలి. పారశాలలో పార్యాంశాలు బోధించే ఉపాధ్యాయులు కూడా ఐకమత్యత బోధిస్తూ కలసిమెలసి తిరుగుతూ కలిసిమెలసి పనులు సాధించడానికి పునాది వెయ్యాలి. ఈ ఐక్యత సమైక్యతగా మారి కుల మత ద్వేషాలు పెంచుకోకుండా “భాయిభాయి” అన్నట్లుగా సమాజ సేవకు నడుం కట్టాలి. వేదములో చెప్పబడిన

సహనావవతు సహనౌభునక్తు;

సహవీర్యం కరవావహై

తేజస్వినా వధీతమస్తుమావిద్వి షావవౌ

అనగా - కలిసి మెలసి పెరుగుదాం - కలసిమెలసి తిరుగుదాం

కలసిమెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.

కలసిమెలసి కలత లేక చెలిమితో జీవించుదాం అని భారతీయ సంస్కృతి బోధించినది. చిన్ననాడే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఈ ఐక్యత సమైక్యతకు దారి తీసే విధంగా శిక్షణ నిస్తూ ప్రతి యువతీయువకులు సమైక్యతకు కృషి చెయ్యాలన్న బీజాన్ని నాటాలి. సత్యం, శీలం, పవిత్రతలతోబాటు సమైక్యత చిన్ననాడే అలవరచుకుంటే కులమతవర్ణ వర్ణముల కతీతమైన స్థితిలో శ్రీ విశ్వంజీ ఆశయ సిద్ధి కనుగుణంగా చిన్ననాడు వేయబడ్డ ఈ బీజము పెద్ద వృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించి సంఘసేవ ద్వారా సమైక్యత సాధించడానికి దోహదం చేస్తుంది.

ఈ విధంగా ప్రారంభమయిన కార్యక్రమాలు సమాజం నుండి దేశానికి వ్యాపించి, దేశ సౌభాగ్యాన్ని కాంక్షించేదిగా “సమైక్యత” యువత ద్వారా సాధింపబడాలి. ఒక్కరుగా చేయలేని పనిని, పదిమంది సమైక్యమై హృదయాలు కలుపుకొని హృదయ పూర్వకమై నిష్కామమైన నిస్వార్ధ సేవలు అందించిన నాడు మానవుడు తన వంతు కర్తవ్యాన్ని తాను నిర్వహించినట్లుగును.

106 ఈ విధంగా నిర్వర్తించడానికి మానవుడు కొంత సాధన చెయ్యాలి. “సాధనద్వారా పనులు సానుకూలమవుతాయి” అన్న పద్ధతిలో ముందుకు సాగడానికి మొదట వ్యక్తి సంస్కరణ జరగాలంటారు విశ్వంజీ. వ్యక్తి, సమాజము, దేశము, విశ్వము అన్న వరుస క్రమములో సమైక్యత సాధించిన నాడు స్వామి తలపెట్టిన యజ్ఞానికి సమిధలుగా ఉపయోగపడుతూ పనిముట్టు వలె “మానవసేవే మాధవసేవ” అన్న రీతిలో దివ్యమైన సేవగా రూపొందగలదు. మనం ఏ సమాజంలో నివసిస్తున్నామో ఆ సమాజాన్ని నిర్లక్ష్యం చేయరాదు. (గ్రామాలలోని ప్రజలు కక్షలు, కార్చణ్యాలు, ఈర్చ్యాద్వేషాలు లేకుండా సమైక్యంగా సహజీవనం సాగించినప్పుడే జాతి అభివృద్ధి చెందుతుంది అని చెబుతూ స్వామి ఇంకా “మనలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజలందరు విభేదాలను విస్మరించి సమైక్యంగా ఉండాలి. మన సనాతన ధర్మాన్ని భారతదేశ గౌరవాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది” అంటూ 'సెలవిచ్చినారు. కేవలం ఇద్దరు, ముగ్గురు కలిసినప్పుడే కాక సమైక్యత అనేది ఒక్కరు ఉన్నప్పుడు కూడా ఉంటుందని స్వామి తమదైన మరొక దివ్యోపన్యాసంలో ఇటీవల చెప్పినారు. మనలోని శక్తి పరిపరివిధాల ఇంద్రియాలలో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా పోయేదాన్ని పోకుండా చేసి మనస్సుని ఇంద్రియాలను అదుపులో పెట్టి, మన యొక్క (౪11 0*జు పట్టుదలని ఆధారంగా సమస్తమైనటు వంటి జీవన క్రమాన్నంతా అదుపు చేసినట్టెతే సమైక్యం చేసుకుని మన అధీనంలో పెట్టుకున్నట్లైతే అది మనలో సాధించవలసిన సమైక్యత. సమైక్య భావాలతో ఉండి సత్యము, శీలము, పవిత్రత, సమైక్యత అను నాలుగు గోడల మీద పరిపూర్ణ మానవత్వము అనే దివ్యమైన సౌధాన్ని దివ్యత్వంతో మిళితం చేసి కట్టినట్లైతే అది పరిపూర్ణ మానవత్వము. దివ్యత్వం గల వ్యక్తి శక్తిగా మారతాడు” అని స్వామి అన్నారు. వివేకం లేని జ్ఞానం విచక్షణ లేని పాండిత్యం విజ్ఞత లేని స్నేహం వినయములేని విద్య ఐకమత్యం లేని సమాజం నిరుపయోగములు (బాబా) వివేకం లేని జ్ఞానము, మంచి, చెడు అన్న విచక్షణ లేని పాండిత్యము అధ్యాత్మ జ్ఞానము లేని స్నేహము (విద్య వినయముతో కూడుకొని ఉండాలి.) వినయము లేని

107

విద్యయు, ఐకమత్యము లేని సమాజము నిరుపయోగ మని భావము (0110 1 6010- 160 ఐక్యతతో కూడిన సమాజము దివ్యత్వముతో సమానము.

మంచి చెడు విచక్షణా జ్ఞానాన్ని మహనీయుల చరిత్రల ద్వారా సద్గురువుల ద్వారా తెలుసుకుని వివేకంతో, నత్సాంగత్యంలో మెలగుతూ, వినయముతో కూడిన సంస్కారవంతమైన విద్యను నేర్చుకుంటూ సమైక్యమై సమాజానికి సేవ చేయాలన్నదే అవతారమూర్తుల ఆశ, ఆశయము. ఉన్నతమైన మేధావులతో కూడిన సమాజము అన్ని విధముల అభివృద్ధి సాధించగలదు. అందుచేతనే శ్రీ విశ్వంజీ మేధావులందరు కూడి వారిలో నున్న మేధస్సును వివిధ రంగాలలో కృషి చెయ్యడానికి సమాజోద్ధరణకు ఉపయోగపడే విధంగా కృషి చెయ్యాలని బోధిస్తున్నారు.

మార్చు చెందని త్రికాల బాధ్యమైన సత్యము, విద్యకు పరమావధి మైన శీలమును పవితత్రతకు అనాది కాలం నుంచి నిలయమైన భారతీయ సనాతన ధర్మము సమైక్యతకు కూడా పెట్టినది పేరుగా నిలచింది. అనేక మతముల వారు, అనేక కులముల వారు, అనేక వర్గములవారు, నానా జాతుల వారు అనాటి నుంచి నేటి వరకు భారత భూమ్‌ మీద సమైక్యంగా నివసిస్తున్నారంటే పరమత సహనమే దీనికంతకు కారణమని చెప్పవచ్చును.

ఈ విధంగా సత్యం, శీలం, పవిత్రత సమైక్యతలు దైవత్వానికి మూలస్థంభాలుగా నిలచాయి.

108 అ ఆలి చ్‌, సుత్య ధర్మాలను విస్మరిన్త మానవజాతి చుతనం మానవతా విలువలలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న విలువలు సత్యధర్మములు. అనాది కాలం నుంచి భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మం చెప్పినట్లుగానే ఏ విధమైన మార్పు లేకుండా ఒకే సత్యము, ఒకే ధర్మము ఆచరణీయములై వెలుగొందుచున్నవి. కృతయుగంలోనూ, శ్రేతాయుగంలోనూ రామాయణకాలంలోనూ అందరూ సత్యధర్మాల్ని తూ.చ. తప్పక ఆచరిస్తూ జీవించే వారని అధర్మ వర్తనులు లేరని, అసత్యము పలుకుట కూడా ఆనాడు లేదని తెలియుచున్నది. రామాయణ మహాకావ్యంలోని పాత్రలన్నీ ధర్మమూర్తులవే. ధర్మాచరణ వారి జీవిత లక్ష్యము. 'సత్యం* ఏవిధంగా ఆధారభూతమైనదో (సత్యన్నాస్తి పరోధర్మళ) రామాయణ పాత్రలకు కూడా “సత్యం” మూలాధారమైనది. “రామం సత్యపరాక్రమం' అన్న ఆదర్శమును రామాయణం నిరూపించింది. రామరాజ్యంలో “ధర్మం” నాలుగు పాదాల ఆచరింపబడినది. శ్లో! లోకేయస్య పవిత్రతో భయవిధాదానం తపస్య దయాచత్వారచ్చరణః శుభానుసరణః కళ్యాణమతన్వతే యఃకామధ్యభి వర్షణాద్‌ వృషపవు బ్రహ్మర్షి రాజర్నిఖి వృష్ట శూదైరపితంద్యతే సజయతద్ధర్నోజగద్ధారణః (సత్యసాయి ఎడ్యుకేర్‌ - శ్రీ యన్‌.బి.యస్‌. రామారావు) వృషభ స్వరూపంగా ధర్మం వర్ణించబడినది. అట్టి వృషభమునకు నాలుగు కాళ్ళు (1) దానము (2) దయ (3) తపస్సు (4) పవిత్రత అను వాటి ఆచరణగా చెప్పబడినవి. ఆ కాలంలో బ్రహ్మర్చులు, రాజర్నులు, శూద్రులు అను భేదములు లేకుండా ప్రజలందరూ సమానముగా గౌరవింపబడిరి. అట్టి ధర్మాచరణ శక్తియే జగత్తును సమత్వ స్థితిలో ధరించి, విశ్వములో సుఖశాంతులు కల్లించినది.

109

రామరాజ్యంలో - తల్లిదండ్రులుండగా పుత్రులు అకాల మృత్యువు వలన మరణించేవారు కారు. రామరాజ్యంలో - అగ్ని వలన కాని, వరదల వలన కాని, రోగముల వలన కాని భయము లుండేవి కావు. రామరాజ్యంలో - ఆకలి చావులు కానీ, దొంగల భయం కాని ఉండేవి కావు. రామరాజ్యంలో - దేశం ధన ధాన్యములతో తులతూగుతూ ఉండేది.

భారతీయ సంస్కృతిని, కుటుంబ ధర్మములను పితృవాక్య పరిపాలన, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, భ్రాత్రుధర్మము, స్త్రీ ధర్మము, రాజధర్మము మొదలగు ఎన్నో ఆదర్శములను మనకు ప్రసాదించింది రామాయణం. “వేదో౬ ఖిలోధర్మమూలం” ధర్మమునకు వేర్లు వేదములే. వేర్లు కొట్టి వేస్తే వృక్షం నశించిపోతుంది. వేర్లు సజీవంగా ఉంటే వృక్షం మరల పెరుగుతుంది. కాని ఒకసారి వేర్లు ఎండిపోతే ఇక ఆశలేదు. భారత దేశానికి వేదములు, శాస్త్రములు, రెండూ రెండు కళ్ళ వంటివి. ఈనాడు పాశ్చాత్య సంస్కృతిని గ్రుడ్డిగా అనుకరించడం వల్ల ఈ రెండు కళ్ళు మసకగా ఉన్నాయి. దృష్టి సరిగ్గా లేకపోతే మరొకరి సహాయం అవసరం. వేదాలను శాస్త్రాలను తిరస్కరిస్తే ఏర్పడే స్థితి కూడా నట్టిదేనంటారు భగవాన్‌ సత్యసాయి.

మానవత్వమే ధర్మము. అది లేక పోవుటయే పశుత్వము. చెక్కరకు తీపి ఎట్లు స్వభావమో, విచ్చిన గులాబీ పువ్వుకు సువాసన ఎట్లు స్వభావమో, మానవునికి మానవత్వము అట్లు సహజము. అభ్యుదయమునకు శ్రేయస్సాధనమైనది ధర్మమే. ధర్మ స్వరూపమును తెలిసికొనుటకు ప్రత్యక్ష ప్రమాణములు వేదములే! హేతువాదులకు గాని, నాస్తికులకు గాని, చార్వాకులకు కాని చికృనిది ధర్మమే!

భగవాన్‌ శ్రీ సత్యసాయి “ఎడ్యుకేరొ (అంతర్భావముల ఆచరణ) కార్యక్రమంలో వేదములందలి ఉత్తమ విలువ శీర్షికన ఈ విధంగా సెలవిచ్చినారు. “ధర్మము సర్వత్ర ఉన్నప్పటికినీ నిప్పును నివురు, నీటిని పాచిపొర కప్పినట్లు 'సత్య ధర్మములను అహంకార మమకారములు కప్పి ఉంటాయి.” వాటిని తొలగించి నిజ స్వరూపాన్ని సమాజానికి విశ్వమునకు ఆచరణలో చూపించుటయే 'ఎడ్యుకేరొ.

110 “సత్యమనే విద్యుత్తు ధర్మమనే తీగె ద్వారా శాంతి అనే బల్చులో ప్రవేశించి ప్రేమ అనే కాంతిని ప్రసరిస్తుంది. సత్యమే విశ్వ వ్యాపకమయిన ఆత్మశక్తి. సత్యాన్ని ఆలంబనంగా చేసుకొనకపోతే మానవ జీవితం సంసార సముద్రంలో చుక్కాని లేని నావలాగ గమ్యాన్ని చేరుకోలేక మున్నీటనే ముక్కలై పోతుంది. కాబట్టి మానవుడు అజ్ఞానంతో ఆవరింపబడిన ఆత్మను సత్యజ్ఞానంతో సోధించి సాధించి దివ్యుడు కావటానికి యత్నించాలి” అని బాబా ప్రబోధించారు. రాముడు సత్య నిష్ట కొరకై రాజ్యాన్ని త్యాగం చేసి అడవులకేగినాడు. బలి చక్రవర్తి

ఇచ్చిన మాట నిలుపుకోవటానికి వామనునికి మూడడుగుల నేలగా ముల్లోకాల నిచ్చి అతని పాదానికి తన శిరాన్ని అంకితం చేశాడు. ఆపద్ధర్మంగా అబద్ధం ఆడవచ్చునని శుక్రనీతికి ఆచార్యుడైన శుక్రుడు చెప్పినా బలి సత్యవ్రతాన్ని వీడలేదు. ధర్మరాజు

ఆపద్ధర్మంగా “అశ్వత్థామ హతఃకుంజరః” అని అసత్యాన్ని పలకటం చేతనే కొన్ని క్షణాలైనా

నరకాన్ని చూడవలసి వచ్చింది. సత్యమే మాట్లాడడం వలన చిత్తశుద్ధి ఏర్పడుతుంది.

చిత్తశుద్ధి సత్రవర్తనను కలిగిస్తుంది. సత్రవర్తన శీల సంపదను పెంపొందింప చేస్తుంది.

శీలమే జీవితసారము. ఈ విధంగా మానవతా విలువలు సత్య ధర్మ శాంతి ప్రేమలు

శీలం పవిత్రత సమైక్యతలన్ని ఒకదాని కొకటి ఒక గొలుసువలె అల్లుకుని ఏది విస్మరించినా

మానవుడు సత్యమైన జీవితమును గడపలేడు. త్యాగము, అహింస కూడా ఈ విలువలతో

ముడిపడినవే. మరొక విశేషము - మానవుడు ఇందులో ఏ ఒక్కటి ఆచరించడానికి

ప్రయత్నించినా మిగిలినవన్ని ఒకదాని వెంట ఒకటి ఆచరించక తప్పదు ఈ వలయంలో

నుంచి బయటకు రాకుండా అనుసరించిననాడు ఉత్తమ మానవుడుగా రూపు దిద్దుకొన గలడు. ఇందుకు ఆధారంగా సత్యవ్రతుడు కధ మున్నగునవెన్నో పిల్లలకి చెప్పుకుందు కనుగణంగా శ్రీ సత్యసాయి బాల వికాస్‌లో చెప్పబడినవి.

ఏ యుగంలోనైనా సత్యాధర్మాలను విస్మరిస్తే మానవజాతి పతనమగుట తథ్యము. కలియుగంలో సత్యధర్మాల ఆచరణ శక్తి క్షీణించిన కారణంగానే భగవానుడు ఆనాడు గీతలో సెలవిచ్చినట్లు ఈ యుగంలో దర్శపరిరక్షణ కొరకు అనేక రూపాలలో అనేక ప్రాంతాలలో అవతరించి ధర్మ పరిరక్షణ, సత్యాచరణ అమలు పరచి ఆచరించి మానవాళి చేత ఆచరింప జేయుచున్నాడు. తత్ఫలితంగా వచ్చినదే శ్రీ సత్యసాయి అవతారము,

111 శ్రీ విశ్వంజీ ఆవిర్భావము. మానవతా విలువల రూపంలో విద్యలో కూడా నిత్యమైన శాశ్వతమయిన సత్య ధర్మాలను ప్రవేశపెట్టి వాటిని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి కలదని బోధిస్తూ అవి నశించి పోకుండా, వాటికి విపత్తు సంభవిస్తున్న సమయంలో ఈ మహనీయుల ఆవిర్భావం అత్యంత ఆవశ్యకమయినది.

“ఒక నాటకములో పాత్రధారుని వలె, నీవు నీ వ్యక్తిత్వానికి దూరంగా ఉండి నీ భావాలకు అంటుకొని పోకుండా నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు; ఈ జగత్తు అంతా ఒక నాటకమని, ఆ నాటకంలో భగవంతుడు నాకొక పాత్ర ఇచ్చాడనీ గుర్తు పెట్టుకో. నీవు నీ పాత్రను బాగా పోషించు అంతే. అదే నీ కర్తవ్యం దానిని చూచి ఆనందించేది ఆయనే.” (బాబా)

భగవాన్‌ విశ్వంజీ ఇటీవల తమ దివ్యోపన్యాసంలో సత్యమును ఈ విధముగా నిర్వచించినారు. “ఈ అనంతమైనటు వంటి విశ్వంలో అణువణువునా పరిభ్రమిస్తున్న దివ్యమైనటు వంటి అనంత జ్ఞాన తరంగ మేదైతే ఉన్నదో ఆ విశ్వశక్తి, ఆ విశ్వజ్ఞానము సత్యము. సత్యం శీలం పవిత్రత సమైక్యత అను విలువలు పునాది గోడల వంటివని అందు ఒక గోడ సత్యమని చెప్పారు స్వామి. మానవుని యొక్క జీవితం వికాసం చెందాలంటే మానవుని యొక్క జీవిత సౌధానికి ఒకానొక పునాది గోడ సత్యము. ఆ విశ్వ శక్తిని మనము (గ్రహించి విశ్వజ్ఞానాన్ని గ్రహించి, ఆ విశ్వ జ్ఞానాన్ని యదార్ధమైన వాక్సుద్ధితో వాక్సిద్ధి సంపాదించే స్థితిగా ఏర్పరచుకోవాలి!”

ఇంతటి ఉదాత్తమైన సత్యాధర్మాలను ఆచరిస్తూ నిత్య జీవితంలో మానవుడు మానవత్వం గల మనిషిగా వెలుగొందాలన్నదే మహనీయుల ఆశ, ఆశయము. అటువంటి సత్యధర్మాల్ని త్రికరణ శుద్ధితో ఆచరించిననాడు అవి మనల్ని రక్షిస్తాయి. కాపాడతాయి. ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడడానికెంతేని ఉపయోగ పడతాయి అనడం అతిశయోక్తి కాదు.

112 సత్యము బ్రహ్మాస్రముకన్న శక్తివంతమైనది భగవంతుడు సత్యస్వరూపుడు. సత్యం, జ్ఞానం, అనంతంగా వెలుగొందే మహాశక్తికి తార్మాణము భగవత్‌ తత్వము. సత్యము నిత్యము. శాశ్వతము. అనాది కాలం నుంచి సత్యము మార్చులేనిదిగా ఒకే స్వరూపంతో విరాజిల్లుచున్నది. (గగ 15 లం2)). మానవతా విలువలలో ప్రథమస్థానములో నున్నది సత్యము. మహాభారతంలో చెప్పబడిన “బ్రహ్మాస్తము ఆ కాలంలో మహాశక్తివంతమైనది. అటువంటి బ్రహ్మాస్తమును కర్దుడు ఒకే పర్యాయము ఘటోతృ్కజుడ్ని చంపడానికి వినియోగించినాడు. అణుశక్తి (41001090౪0) కంటే శక్తివంతమైనదిగా వర్ణింపబడినది బ్రహ్మాస్తము. అట్టి (బ్రహ్మాస్తము కంటే కూడా మహాశక్తివంతమైనది సత్యము. ఈ సత్యము వివిధ దేశములలో వివిధ రకములుగా నుండదు. ఉదాహరణకు రష్యా సత్యము, అమెరికా సత్యము, జపాన్‌ సత్యము అని ఉండవు. సత్యమనేది సర్వకాల సర్వావస్టల యందు దేశకాలమాన పరిస్థితుల కతీతమైన స్థితిలో మహాశక్తివంతమై విరాజిల్లుచున్నది. సత్యంబు నందుండి సర్వంబు సృష్టించె సత్యంబు నందణగె సర్వసృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్త్వ మిదియే చూడరయ్య (సత్యసాయి) సత్యము నాశరహితమైనది. బుతము అని సత్యమునకు మరియొక పేరు. భగవంతుని నామములలో సత్యాయనమః, సత్యస్వరూపాయనమః; సత్య సంకల్చాయనమః అను నామములు కనబడుచున్నవి. శ్రీ విశ్వంజీ అష్టోత్తర శతనామావళిలోనూ, శ్రీ సత్యసాయి నామావళిలోనూ, తదితరమైన అష్టోత్తర శత సహస్ర నామాలలో సత్యముతో ప్రారంభమయిన నామములు కలవు. సత్యమే తానై ఆవిర్భవించిన అవతారమూర్తికి సత్యమను పేరు సార్థక నామధేయమే. “ఏకం సత్‌ విప్రాః బహుధావదంతి” ఉన్న సత్యము ఒకటే అయినప్పటికీ బుషులు దీనిని బహు విధములుగా పిలిచినారు. సత్యమే ధర్మము. సత్యమే తపస్సు. సత్యమే యోగము; సత్యమే పరబ్రహ్మ సత్యమనగా నీవే అని చెప్పబడినది అనగా ఆత్మ. ఆత్మ

113 ఎప్పటికీ ఉండునది. శరీరము చాలించినను మార్పు లేకుండా ఉండేది ఆత్మ. ఆత్మకు చావులేదు. వేద శాస్తములన్నియు సత్యము నుండే ఆవిర్భవించినవి. ధైర్యము, దయ, సాహసము, నిపష్పక్షపాతము, వైరాగ్యము, న్యాయము, అహింస అనునవి సత్యమునకు పర్యాయ పదములు. సత్యము ఎవరి సొత్తూ కాదు; సత్యము ఏ యొక్క మతమునకు చెందినది కాదు. సత్యము దేశకాల వస్తువులతో మార్పు చెందనిది. సత్యవ్రతుడే సరియైన మానవుడు.

సత్యముతో లోకమును, దానముతో దీనులను, సేవలతో గురువులను; ధనస్సుతో యుద్ధమును జయించవచ్చును. ఎంతటి కష్టకాలములోనైనా సరే సత్యమునే పలకాలి. సత్య హరిశ్చంద్రుడు - సత్యం కోసం భార్యా బిడ్డలను రాజ్యాన్ని వదులుకున్నాడు. సత్యాన్నే ఆచరించాడు. “సత్యమేవ జయతే” చిట్టచివరకు సత్యమే జయించింది.

ఈ విధంగా సత్యవ్రతాన్ని ఆచరించిన వారిలో మహాత్మా గాంధీ అగ్రగణ్యులు. “అసత్యమాడకూడదు. ఈ సత్యాన్నే వ్రతంగా జీవితాంతం ఆచరించాలొ అని శపధం చేసి తల్లికి మాట ఇచ్చి వాగ్దానం చేసిన గాంధీగారు ఆజన్మాంతం దానిని ఆచరించి చూపిన సత్యవ్రతుడు.

గాంధీగారి తల్లి పుతలీబాయి ఒక బుతువులో కోకిల వ్రతాన్ని పాటించేది. ప్రతిరోజూ కోయిల కూత వినిపించిన తర్వాతనే ఆమె భుజించేది.

గాంధీ పసివానిగా ఉన్నప్పుడు ఒకసారి, తన తల్లి కోయిల కూతకై చాలాసేపు వేచి ఉండడం చూసి బాధపడ్డాడు. తనతల్లి భోజనం చేయడానికి కాలాతీతమవుతున్నదనే భావంతో తోటలోనికి వెళ్ళి కోయిల లాగా కూతపెట్టాడు. వెంటనే తల్లి దగ్గరకు వచ్చి “అమ్మా! కోయిల కూసింది. నీవు ఇంక అన్నం తినమ్మా” అన్నాడు. అసలు విషయాన్ని (గ్రహించిన పుతలీబాయి ఎంతో దుఃఖించింది, గాంధీని రెండు చెంపలపైనా కొట్టి “దుర్మార్లుడా! నీలాంటి అసత్యవాది నాకు కుమారుడుగా పుట్టడం నా దురదృష్టం” అని పలికి అంతులేని ఆవేదన చెందింది. ఆ తల్లి ఆ క్షణంలో పడిన ఆవేదనను చూసి గాంధీ చలించి పోయాడు. ఆ దృశ్యం గాంధీ హృదయాన్ని కదిలించి వేసింది. ఆనాటి నుండి మరెన్నడూ అసత్యమాడనని ప్రతిజ్ఞ చేసాడు. దృఢ సంకల్పం సత్యవ్రత దీక్ష ధర్మాచరణ గాంధీలో పుతలీబాయి పెంపకంలో అలవడ్డాయి.

ఎందరెందరో మహనీయులు, మేధావులు సత్య వాక్చరిపాలన అనుసరించి సత్యమే తమ జీవిత లక్ష్యముగా ధ్యేయముగా, చిట్టచివరకు అదే గమ్యంగా భావించి జీవితాల్ని గడిపి భారతదేశ చరిత్రలో ప్రసిద్ధులై నిలచినారు.

114 ఇందుకు దృష్టాంతము శకుంతలా దుష్యంతుల చరిత్ర కూడ చెప్పుకొానుట సముచిత మనిపించినది. కణ్వాశ్రమంలో పెరిగిన శకుంతలను మోహించి దుష్యంతుడు తనను గాంధర్వ వివాహం చేసుకోవలసిందిగా కోరాడు. శకుంతల కొంత సందేహించినా “నాకు జన్మించే కుమారుని హస్తినాపుర రాజ్యాఖిషిక్తునిగా చేయునట్లు వాగ్దానం చేస్తే వివాహానికి సమ్మతిస్తాను” అని పలికినది. దుష్యంతుడు సంతోషించి ఆ విధంగా వాగ్దానం చేశాడు. శకుంతలను వివాహం చేసుకొని దుష్యంతుడు రాజధానికి తిరిగి వెళ్తూ, కణ్వ మహర్షి అనుమతితో శకుంతలను అంతఃపురానికి రప్పించుకొనుటకు తగిన ఏర్పాట్లు చేస్తానని విశ్వసనీయంగా చెప్పి నిష్ఫృామించాడు. కణ్వమహర్షి ఆజ్ఞలేకనే వివాహం చేసుకున్న శకుంతల భయగ్రస్తురాలయింది. కానీ, కణ్వ మహర్షి శకుంతల వివాహ విషయం (గ్రహించి ఆమె చేసిన కార్యం ధర్మ సమ్మతమేనని పలికి, ఆమెను ఒక వరం కోరుకొనమన్నాడు. అప్పుడు శకుంతల, “తండ్రీ! వంశకర్త, దీర్చాయుష్మంతుడు, ధర్మబుద్ధి కలిగిన పుత్రుని ప్రసాదించండి అని అర్ధించింది. కొంత కాలానికి శకుంతలకు సర్వ చక్రవర్తి లక్షణ సంయుక్తుడయిన కుమారుడు జన్మించాడు. పసితనంలోనే క్రూర మృగములను సహితం మచ్చిక చేసుకొని ఆటలాడుకునే ఆ బాలునుకి “సర్వదమనుడు” అని నామకరణం చేశారు. కణ్వమహర్షి పుత్రునితో తన పుత్రికను, దుష్యంతుని వద్దకు కొందరు శిష్యులను తోడిచ్చి పంపించాడు. సామంత, మంత్ర పురోహితులతో కూడిన మహాసభలో దుష్యంతుని సమక్షంలో పుత్రినితో నిలిచింది శకుంతల. దుష్యంతుడు శకుంతలను గుర్తించనట్లు నటించాడు. ఆమె దుఃఖితురాలయినది. అయినప్పటికీ దుష్యంతుని అసత్య భాషణకు రోషావేశముతో చలించిపోయింది. దుష్యంతునకు, తనకు జరిగిన వివాహ వృత్తాంతం, తన పుత్రుని యువ రాజ్యాఖభిషిక్తుని చేస్తాననే వాగ్దానం, ఎన్నో గుర్తు చేసింది. దుష్యంతుడు “నీవెవరో నాకు తెలియదు. అనుచితమైన మాటలు పలుకనేలొ అన్నాడు. శకుంతల ధైర్యము తెచ్చుకొని “పంచభూతాల సాక్షిగా, నవగ్రహాల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా నాడు నా కుమారుని యువరాజుని చేస్తానని మాట ఇచ్చావు. ఇప్పుడు వివాహ ప్రసక్తే విస్మరించావు. ఇది న్యాయం కాదు. “సత్రియును, గుణ; వతియు, ప్రజా

115 పతియునను వ్రతము నైన వనిత నవ జాన్విత దృష్టి జూచు నతి దుర్మతికిహముం ఐబరము గలదే”? అని ప్రశ్నించింది. భార్యను నిరాదరించుట, నిరాకరించుట ధర్మం కాదు. భార్య అంటే ఎవరు? “ధర్మార్థ కామ సాధనకుపకరణంబు, గృహనీతి విద్యకు గృహము, విమల చారిత్ర శిక్షకాచార్యకంబు, అన్వయస్థితికి మూలంబు, సద్గతికి ఊత, “గౌరవంబునకేక కారణంబు, ఉన్నత స్థిర గుణములకు ఆ కరము, హృదయ సంతోషమునకు సంజనకము అటువంటి అర్ధాంగిని, నీ పుత్రునకు తల్లినైన నన్ను స్వీకరించు” అని పలికి సత్య భాషణము యొక్క మహత్త్వాన్ని తెలియజేస్తూ - “సత్యం నాస్తి పరోధర్మొ అని ఆ సభాస్థలిలో ఎలుగెత్తి వక్కాణించింది. “నుతజలపూరితంబులగు, నూతులు నూజథిటికంటె సూన్ఫత వ్రత యొక బావి మేలు, మటి, బావులు నూరిటి కంటె నొక్కస తతు వది మేలు తతృతుశతంబు కంటె సుతుండు మేలు త త్సుత శతంబు కంటె నొక సూన్ఫత వాక్యము మేలు సూడగన్‌”, “వెలయంగ నశ్వమేధం బులవేయును నొక్క సత్యమును నిరుగడలం దులనిడితూపక సత్యము వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్‌.” సర్వతీర్థాభిగమనంబు సర్వ వేద సమధి గమము సత్యంబుతో సరియుగావు ఎజుగు మెల్లధర్శ్మంబులు కెందు బెద్ద యంద్రు సత్యంబు ధర్మ్శ్మజ్ఞులైన మునులు (మహాభారతం, ఆదిపర్వం; 4-94-496)

116

ఆత్మాఖిమానముతో శకుంతల “క్షతవరుదైన విశ్వామిత్రునకు, పవిషత్రురాలైన మేనకకు పుత్రికనైన నేను అసత్యాన్ని ఎందుకు పలుకుతాను? నేను ఇంత ధర్మేతరనే? అని ప్రశ్నించింది.

ఇన్ని మాటలు విన్నప్పటికీ దుష్యంతుడామెను స్వీకరించడానికి నిరాకరించి, తిరిగి ఆశ్రమానికి వెళ్లమని పలికాడు. ఆ సమయంలో శకుంతల తన దుస్థితిని తలుచుకొని, “పుట్టిన క్షణంలోనే తల్లి దండ్రులు నన్ను వదిలివేశారు. ఇప్పుడు పతిచేత విడువబద్దాను. దైవ సంకల్పం ఈ రీతిగా ఉందొ అని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కుమారునితో వెనుతిరిగింది.

ఆ సమయంలో ఒక దివ్యవాణి! “శకుంతల మహా పతివ్రత, సాధ్వి ఓ రాజా! శకుంతల చెప్పినది నిజము. ఈమె నీ భార్య ఇతడు నీ పుత్రుడు. వారిని స్వీకరించు” అని పలికింది.

సభాసదులందరు ఆశ్చర్య భరితులయినారు. అప్పుడు దుష్యంతుడు, “దేవతలు కూడా శకుంతల యొక్క పతివ్రతా ధర్మాన్ని ప్రశంసించారు. నేను ఈమెను వివాహం చేసుకున్న మాట సత్యమే. అయితే లోకాపవాద ఛీతి చేత, ఎరుగనట్లు నటించాను. ఆకాశవాణి - ఇప్పుడు అందరికీ తెలియునట్లు పలికింది కాబట్టి నేను వీరిరువురిని స్వీకరిస్తున్నాను” అన్నాడు. శకుంతలకిచ్చిన మాట ప్రకారం దుష్యంతుడు, సర్వదమనుని (భరతుని) యువ రాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేశాడు.

కాళిదాస మవాోకవి తన అభిజ్ఞాన శాకుంతలములో మహాభారతంలోని శకుంతలోపాఖ్యానంలో పేర్కొనబడిన ఈ అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించినాడు.

ఈ సన్నివేశంలో సత్యమునకున్న మహాశక్తివంతమైన తత్త్వము చెప్పబడినది.

ధర్మబద్ధమైన సత్యవాక్కును విని శకుంతలను రక్షించడానికి ఆకాశవాణి దివ్యవాణిగా “ఇది సత్యమే సుమా అని సభాముఖంగా అందరూ వినేటట్లు పల్కిన దివ్య వాక్కులే (బ్రహ్మాస్తము కంటే శక్తివంతంగా పనిచేసి దుష్యంతుడు అసత్యము వదలి సత్యాన్ని అంగీకరించి శకుంతలను, ఆమె కుమారుణ్ణి తిరిగి స్వీకరించునట్లు చేసినది. భగవంతుడు కూడా సత్యం పలికే వారిపట్ల కరుజామయుడై వారిని రక్షించడానికి “ఇది సత్యమే సుమా” అని ధృవపరుస్తాడు. తాను సత్య స్వరూపుడు కదా! దివ్య వాక్కు ఆకాశవాణి ద్వారా వినిపించి శకుంతలను రక్షించినది. అందుచేత “సత్యము (బ్రహ్మాస్తము కంటే శక్తివంత"మైనది.

117 ప్రేమ అన్నిటినీ సిద్దింప చేస్తుంది గా న్ని భే ౮్రె। చిత్తశుద్ధిని జేకూర్చు సేవ కొరకు జీవితము నంకితము జేసి; చెలగు నరుడ! పరులకొసగుచు నీ శక్తి; బలము తుదకు చివరి శ్వాసను వీడు మా (ప్రేమలోనె ॥ (బాబా) ప్రపంచంలో (ప్రేమతో ఏదైనను సాధించవచ్చును. అందుచేత “*శ్రేమ అన్నిటినీ సిద్ధింప చేస్తుంది” అన్న ఈ సూక్తిలో సమస్తము ప్రేమలో ఇమిడి యున్నదని చెప్పబడినది. “సత్య ధర్మమహింసయు శాంతి ప్రేమ మానవుని పంచ ప్రాణాలు మహిని వెలయు పంచ ్రాణాలలో ప్రేమ ఎంత హెచ్చు కాన హృదయాన (ప్రేమను గట్టి పరచు” (ప్రేమను సర్వత్రా పెంపొందించు! జీవులందరికి (ప్రేమను పంచు - - -! ప్రేమతోనే పని ప్రారంభించు. (ప్రేమనే మనసారా ఆస్వాదించు. మదిని నిండుగా, శాంతిని నింపు ఎదను మెండుగా, ప్రేమను పెంచు శాంతి ప్రేమలు, పెంచీ పంచు పెంచి పంచుటే, మానవధర్శం మానవతా, మానవతా అదియే విశ్వంజీ మాట సమైక్యతా, సమైక్యతా అదియే విశ్వంజీ బాట అంటూ శ్రీ విశ్వంజీ తమ దివ్యోపన్యాసానంతరం, సమైక్యతా గీతాన్ని పాడి ముగిస్తారు. “ప్రేమను పెంచి పంచు” మన్నదే అవతారమూర్తుల బోధలలోని

1186 ముఖ్యాంశము. మానవతా విలువల్లో “ప్రేమ” అంతర్వాహినిగా అన్ని విలువల్లోనూ గోచరిస్తోంది. భౌతికం మొదలు అధ్యాత్మ వరకు ప్రతి దశలోనూ (ప్రేమ గోచరిస్తోంది. అన్నింటికి మూల సూత్రము (ప్రేమ. సృష్టిలో అనాది కాలం నుంచి ప్రేమ వివిధ భూమికల్లో వివిధ రకాలుగా ప్రదర్శింపబడుతోంది. 'ఫలాపేక్షరహితం విశ్వప్రేమ స్వరూపమ్‌”. (ప్రేమయే భగవంతుడు. భగవంతుడే (ప్రేమ. (పేమను ప్రేమతోనే పొందవలెను. ప్రేమ శాశ్వతమైనది. అనంతమైనది. అమరమైనది. అమృతమైనది. (ప్రేమ అప్పు తెచ్చుట ఇచ్చుట వంటిది కాదు. ప్రేమ సమర్పణ వంటిది. ప్రేమ నిష్కపటమైనది. (ప్రేమ (ప్రేమ కొజకే. (్రేమ భగవంతుడినే బంధించును. సమస్త జీవరాసులను (ప్రేమించుటయే దివ్యప్రేమ. నిస్వార్ధప్రేమ హృదయ విశాలతను పెంచును. పరిశుద్ధి చేయును. సముద్రము నుండి అవిరై, వర్షించి సముద్రమున జేరిన జలము, సముద్రములో ఏకమైనట్లు; దైవమును పొందవలెనన్న, దైవమును అనుభవించవలెనన్న నీవును (ప్రేమను ప్రకటించుచూ (మేమ సాగరములో చేరుము. స్వచ్చమైన ప్రేమయే ఆనందము, మధురము. సర్వులను ్రేమించుచూ, హృదయముతో మాట్లాడగలుగునదే ప్రేమ. (ప్రేమ తత్వమే మానవత్వం - మానవత్వమే (పేమతత్త్వం - (బాబా) పరిపూర్ణ మానవత్వంతో మెలగుతూ మానవుడు (ప్రేమను పెంచుకుంటూ, తోటి వారిని కూడా ప్రేమించినప్పుడే మానవత్వం - (ప్రేమ తత్త్వమవుతుంది. జీవులపై నున్న (ప్రేమతోనే భగవంతుడు అవతరించుచున్నాడు అని షిర్దిసాయి సచ్చరిత్రలో చెప్పబడినది. కాబట్టి మానవాళిని రక్షించేది దివ్యప్రేమ. శిక్షించేది కూడా దివ్య (ప్రేమయే. సద్గురువు లేక భగవంతుడు మనకి శిక్షణ ఇస్తూ ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళడం కోసం అవలంభించే మార్గమే శిక్షణ. ప్రేమ మార్గమే, ప్రేమ తత్త్వమే భగవంతుని వద్దకు వేగముగా చేర్చగలదు. అన్ని అవతారములు (ప్రేమనే మూలాధారముగా తీసుకుంటాయి అని భగవాన్‌ సత్యసాయి బుద్ధపూర్ణిమ దివ్య సందేశములో పేర్కొన్నారు. బుద్దుని తత్త్వము, జీసెస్‌ తత్త్వము, కృష్ణ తత్త్వము సాయి తత్త్వము, విశ్వంజీ తత్త్వము. ఈ (మేమ తత్త్వాన్నే అందరు అలవరచుకొని సమాజాన్ని నంన్మరించాలని

119

బోధించుచున్నారు. ఆంతరంగికంగా ప్రతి వ్యక్తి ఈ పేమను పరిపూర్ణంగా అనుభవిస్తూ తన ప్రేమను కేవలం తన కుటుంబానికి మాత్రమే కాకుండా అందరికి పంచుతూ విస్తృతం చేస్తే (20203100 0107ల) ప్రేమ ద్వారా సకలము సిద్ధిస్తవి. ఈ విధమైన పేమ తత్త్వాన్ని అలవరచుకుందుకు గురువు యొక్కపరిపూర్ణమైన అనుగ్రహము కావాలి. మళ్లీ ఆ అనుగ్రహం ప్రేమ ద్వారానే మానవులు సంపాదించగలరు. గురువుతో మనకున్న సంబంధ బాంధవ్యము దివ్యమైన ప్రేమయే. (01౪106 10౪) దివ్యమైన (పేమతో జీవించాలి దివ్యమైన (ప్రేమ ద్వారానే మానవుని జీవితం పరిసమాప్తి కావాలి. భగవంతుని పేమకు పాత్రులు కావాలంటే ఆ (ప్రేమకు తగిన పనులు చేయాలి. (ేమకు తగిన పనులు చేయకుండా (ఢ్రేమ లభించాలంటే అది అసాధ్యము. ఫలాపేక్ష రహితంగా మానవుడు కార్యములలో ఆనందముగా పాల్గొనాలి. ఆనందమే ఫలము. అంతేగాని దైవాజ్ఞకు విరుద్ధంగా నడుచుకుంటే అన్నీ విరుద్ధంగానే జరుగుతాయి. “యద్భావం తద్భవతి”.

అన పేక్షశ్ళుచిర్ధక్ష్య ఉదాళీనోగతవ్యధః

సర్వారమృపరిత్యాగీయోమద్భక్తస్సమే ప్రియః

ఈ గుణములు కలవారిని భగవంతుడు (ప్రేమిస్తాడు. అనపేక్ష అనగా ఎట్టి అపేక్షలు ఉండుటకు వీలుకాదు. ఎట్టి అపేక్ష ఉండాలి అంటే కృష్ణుడు “ధర్మ సమ్మతమైన కర్మలన్నీ నా రూపములే” అన్నాడు. త్యాగమయమైన, ధర్మమయమైన అపేక్షలు చాలా ముఖ్యము. అనపేక్ష కలిగిన వానిని భగవంతుడు (ప్రేమిస్తాడు.

“శుచి” శుద్ధము - ఇత్తడి పాత్రలో కళాయిలేకుండా పులుసు వండితే విషపూరిత మవుతుంది. మన దేహమనేది ఇత్తడి పాత్ర. ఇందులో [్రేమ అనే కళాయి వేయాలి. అప్పుడు వండిన పదార్ధము చెడకుండా ఉంటుంది.

“దక్ష - అనగా దీక్షను పాటించుట. ఏది చేయాలన్నా దానిని సాధించేవరకు విశ్రాంతి లేకుండా కృషిచెయ్యాలి. “దక్షు భగవంతుని పొందాలి, చూడాలి అనుగ్రహాన్ని

120 అందుకోవాలనే దీక్ష దృఢంగా పట్టినవాడు. అట్టి దీక్ష కలిగిన వానిని భగవంతుడు ప్రేమిస్తాడు.

“ఉదాశీనొ - ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయాలి. జయాపజయములను సమముగా భావించి జీవితాన్ని గడపాలి. గతవ్యధః - గడచిన దానికి చింతించక, రాబోయే దానిని ఆలోచించకుండా వర్తమానంలో వ్యవహరిస్తూ జీవితం గడపాలి. గతానికి (020, భవిష్యత్తుకి (౪4౦) మూలాధారం వర్తమానం (6990.

“సర్వారమృపరిత్యాగీ” - ఎలాంటి పనుల యందైనా, ఎప్పుడూ నిశ్చలంగా ఉండాలి. ఆడంబరముల కవకాశ మీయరాదు. ఆడంబరము రజోగుణానికి సంబంధించినది. కోరికలు ప్రారంభమయ్యేది ఈ స్థితిలోనే. “ఆడంబర రహితమైన వారే నాకు ప్రియము” అన్నాడు కృష్ణుడు. ఆడంబరముల వలన ఆత్మానందము లభ్యము కాదు. అందుచే ఇటువంటి భగవదనుగ్రహము, భగవంతుని (ప్రేమను పొందే కర్మలనే మానవుడు ఆచరించాలి. “ప్రేమ అమృత స్వరూపము - అన్నాడు నారద మహర్షి మానవుణ్ణి అమృతస్యపుత్రః - అన్నారు. అమృతత్త్వమే మానవునిలోని ప్రేమతత్త్వము. (ప్రేమయే దైవము అని చెప్పుకున్నాము. మన కర్మల ఫలములు ఉన్నప్పటికినీ, (మందులకు క5010/ 0146 వలె) మీ కర్మ ఫలితములను - మన స్నేహ భావమును - (ప్రేమ తత్త్వమును చూసి భగవంతుడు నీవనుభవించవలసిన కర్మలను రద్దు చేస్తాడు.

అధే సద్గురువు లేక భగవంతుడు చేసే రోగ నివారణ. “మనకున్న రోగం పోయింది" అంటారు గురువు గారు. ఆ వ్యక్తి యొక్క సేవ; త్యాగ నిరతిని ప్రేమను బట్టియే. ఆ విధంగా నివారణ చేసే అధికారం భగవంతునికున్నది.

ప్రేమ రూపంబు; బ్రహ్మంబు ప్రమమయము

(ప్రేమను ప్రేమతో సంధింపనియమ మగును.

కొన (ప్రేమను గట్టిగా కలిగియున్న

అద్వితీయము పొందంగ అర్జుడగును. (బాబా)

121

ఈ విధంగా భగవంతునికి భక్తునికి మధ్య నున్న దివ్య (ప్రేమతో కర్మ ఫలితములు కూడా కరిగిపోయి శక్తివంతులై తమకున్న రోగములు కూడా ఆ దివ్య ప్రేమ వలన ఆ దివ్యానుగ్రహం వలన నివారింపబడుటకు మూలకారణము ప్రేమ. ఆ ప్రేమ స్వరూపుజ్జి పొందుటకు (ప్రేమ తప్ప మరొక మార్గము లేదు. ప్రేమ మానవుని యందు ఆత్మ స్వరూపముగా నిలచి ఉంటుంది. కృష్ణ తత్త్వమును చక్కగా అర్ధము చేసుకొన్న గోపికలు కృష్ణుని వేణుగానము విన్నంత మాత్రముననే అర్ధరాత్రి కూడా బృందావనములో ప్రవేశించేవారు. చెట్టు, తీగ, పొద, అనే భేదభావము లేకుండా వారు అన్నింటియందు కృష్ణుడున్నాడని చెప్పి ఆ పాదలను ఈ విధంగా అడిగేవారట. భాగవతంలోని పద్యము చూతము.

“నల్లనివాడు - పద్మనయనంబుల వాడు, కృపారసంబుపై

జల్లెడువాదు - మౌళి పరిసర్పిత ఫించము వాడు నవ్వురా

జల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెనో

మల్లియలార మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే.

వారి పరిస్థితిని ఉద్ధవుడు” కృష్ణ సందేశమును వినే దానికే మీకు తీరిక లేకపోతే ఇక మీలో భక్తి ఏమి ఉంది? మీ భక్తి స్వరూపమేమి? అని గోపికలను ప్రశ్నించాడు. అప్పుడు గోపికలు యోగము యొక్క సారాన్ని ఒక్కమాటలో చెప్పారు. ఓ ఉద్ధవా! మాకు ఉన్నది ఒకే మనసు. ఆ మనసు కూడా ఇప్పుడు మాతో లేదు. కృష్ణునితో మధురకు వెళ్ళింది. మనసే లేని అమనస్కులము. నీ యోగము ఎట్లా వినగలుగుతాం? ఎక్కడుంది మా మనసు? ఒకవైపు కృష్ణుని చింతించటము, ఒకవైపు నీ భక్తుల ఆజ్ఞలను చింతించటము. మరొకవైపు అత్తగార్ల ఆజ్ఞలను పాలించటము జరుపుటకు నీ వలె మాకు పది మనసులు లేవు” అని సమాధానము చెప్పారు. ఈ సమాధానాన్ని బట్టి వారి మనస్సు కృష్ణునిపై ఎంత గాఢముగా లగ్నమయినదో తెలియుచున్నది. నిశ్చలమైన దృఢమైన ఏకమనస్సుతో సాధించతగినదే “దైవప్రేమ”, మానవత్వపు విలువలలో మొట్టమొదట సాధించవలసింది “దైవ ప్రేమ” అన్నారు సత్యసాయి. శాంతిలో నిమగ్నమైన

122 హృదయం నుండి మాత్రమే పవిత్రప్రేమ ఉద్భవిస్తుంది. (00610౪6020 అంఖ2(6 00% గంగు & ఏంటా పంులుం66 10 "06206 “శాంతీ (ప్రేమలు పెంచీ పంచు, పెంచి పంచుటే మానవధర్మం” అంటారు శ్రీ విశ్వంజీ. ఢేమ లేక శాంతి లేదు. (ప్రేమ లేక సత్యము లేదు. ప్రేమ లేక ధర్మమూ లేదు, పవిత్రత, ఐక్యత లేవు మానవతా విలువలన్ని (ప్రేమతో సాధించేవే. (ప్రేమే అన్నిటిని సిద్ధింపజేస్తుంది. అన్ని బంధాలకు మూలకారణం (ప్రేమయే. అధ్యాత్మలో దైవంతో సంబంధ బాంధవ్యాలు విశ్వప్రేమ స్థాయిలో విశ్వమే అవతారమూర్తులకు సంసారము. విశ్వ (ప్రేమైక మూర్తులు వారు. తన (ప్రేమను చాలా విస్తృతమైన రీతిలో ప్రపంచ మానవాళి కందరకు పంచి అందర్ని ఒకే త్రాటిపై నడిపిస్తూ విశ్వశాంతి - విశ్వ కళ్యాణ సాధనకు ప్రేమతో బోధలు చేసి ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడం వారి అవతారంలో కీలకమైన భాగమే. మనం మన కుటుంబంలోనూ, సమాజంలోనూ వ్యక్తుల్ని ప్రేమించినట్లు, వారు విశ్వంలో నున్న మానవాళి నందర్ని సమదృష్టితో, సమభావంతో చూస్తూ సమానంగా హెచ్చు తగ్గులు లేకుండా ప్రేమిస్తారు. తన పర భేదము లేదు. ఏ దేశమేగినా, ఏ మతస్థులతో మాట్లాడినా ఆ దివ్యమైన (ప్రేమ అందరి పట్ల చూపుతారు. అది దివ్యత్వంలో నున్న గొప్పతనము. ఈ విశ్వ(ప్రేమే విశ్వమానవాళికి ఆదర్శమై వ్యక్తి తనను తాను ్రేమించుకున్నట్లు తన కుటుంబమును ప్రేమించడంతో బాటు ఇతరుల్ని కూడా (ప్రేమిస్తూ సమాజసేవకు పూను కున్ననాడు “అందర్ని (ప్రేమించు అందర్ని సేవించు” (1౬0౪6 211 840/6210) అని భగవాన్‌ బాబా చెప్పిన దాని కనుగుణంగా తన సేవలో ఆనందంతో బాటు అన్నిటిని సిద్ధింప జేసుకోగలుగుతాడు. వారు తలపెట్టిన కార్యక్రమంలో పాలు పంచుకుని నిష్మాను సేవ చేసే వారికి, స్వామి సర్వవేళలా అన్ని అనుకూలాలు చూస్తు వారికి తాను సేవ చేయడానికి వెనుకాడరు. ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా అవన్ని తన సంకల్పంతో చక్కబరుస్తారు. ఒక భక్తురాలు శ్రీ విశ్వంజీ ఆశ్రమంలో సేవ చేయడానికి వచ్చిన సమయంలో ఇంటి వద్ద ఆమె దగ్గర బంధువుకు అనారోగ్య పరిస్థితి ఏర్పడితే తాను గుంటూరులో ఉండి ఆమెను కాపాడిన ఉదంతము చూచినాము. అదేవిధంగా మరొక కుటుంబం వారు (దంపతులు) అక్కడ సేవ కొరకు వెళ్ళిన సందర్భంలో

123 వారి మనుమడికి తీవ్రమైన గాయాలు తగిలితే మర్నాటికి ఏమి లేకుండా ఆ పిల్లవాడు చక్కగా వాళ్ళ మామ్మ తాతయ్యలకు స్వాగతం పలకడం వారి ద్వారా స్వయముగా విన్నాము. భగవాన్‌ సత్యసాయి చరిత్రలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. విదేశంలో ఫ్యాక్టరీ నడుపుతున్న ఒక ఉన్నతాధికారి స్వామి సేవలో నిమగ్నమయి ఉండగా, అక్కడ ఫ్యాక్టరీలో కాపలాదారుడు నిద్రపోతుంటే మేల్మొల్సి జరగబోయే విపత్తు నుంచి ఆ ఫ్యాక్టరీని బాబా కాపాడినారు. ఆయనే స్వయంగా పుట్టపర్తి వచ్చినప్పుడు స్వామి వారిచేత ఈ సంఘటన చెప్పించినారు. ప్రేమతో నిష్కామ సేవ నిస్వార్థంగా చేసినప్పుడు మన కార్యక్రమములన్ని భగవంతుడే చూసుకుంటాడు. దానికి ఎటువంటి ఆటంకములు కలుగవు అనడానికి ఇవన్ని తార్మాణాలే. అందుచేతనే ప్రేమ అన్నిటిని జయిస్తుంది. భౌతికంలో కూడా పవిత్రమైన ప్రేమను ప్రదర్శిస్తూ పరస్పరం అనురాగం, అన్యోన్యత, ఆప్యాయతలను పంచుకొని బిడ్డలను కన్న తల్లిదండ్రులంతా (ప్రేమమూర్తులే. కేవలం కుటుంబ సభ్యుల్ని (ప్రేమించడం తల్లిదండ్రుల్ని బిడ్డలు (ప్రేమించడం, భార్యాభర్తలు పరస్పరం ఒకరికొకరు ప్రేమించుకోవడమే కాక సమస్త జీవరాశుల్ని కూడా (ప్రేమిస్తూ భూతదయ నలవరచు కోవాలన్నదే మహనీయుల ఉవాచ.

“మన బుషులు తమ ఉపదేశాలలో ఏమి చెప్పారో పరిశీలిస్తే “విశ్వమే విష్ణువు” అన్నారు. భగవంతుడు ఈ ప్రపంచ రూపంలో ఉన్నాడు. కనుక ఈ ప్రపంచాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. విశ్వాన్ని ఇందలి సృష్టిని (ప్రేమిస్తే, ఆరాధిస్తే విష్ణువును ఆరాధించినట్లే అవుతుంది. “ఆత్మవత్‌ సర్వభూతాని” అని సర్వభూతములను నీతో సమానంగా చూచుకోమన్నారు.” “ఈశ్వర సృర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి” సర్వభూతముల హృదయములందు తాను నివసిస్తున్నానని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. వీటి ద్వారా, ఈ సృష్టిలో గల సకల ప్రాణులనూ, మనుష్యులనూ భగవంతుని రూపంగా పరిగణించమని తెలియుచున్నది. సర్వభూత హితము కొరకు, సమాజ (శ్రేయస్సు కొరకు పాటు పడుతున్నందున సమాజ దృష్టి లేకుండా భారతీయ ధర్మము రూపొందదని బోధపడుతున్నది.

124

ఏ ఆశ్రమములో చూచినప్పటికి అనేకమయిన జంతువులు పరస్పరం ప్రేమతో మెలగుట సహజీవనం చేయుట మనము చూచుచున్నదే. జీవులను బాధిస్తూ దేవతలను పూజిస్తే ఏమి లాభం లేదన్నారు సత్యసాయి. గుడిలోపల నందిని చూచి (మొక్కుకు బయటకు వచ్చిన తరువాత పశు పక్ష్యాదులను ఎద్దులను చితకబాదడం భావ్యం కాదని హెచ్చరిస్తూ ఈ విధంగా శెలవిచ్చారు బాబా.

సేవ చేయునట్టి సేద్యపు పశువును

చేరి చితక గొట్టు చిత్రముగను

రాతి ఎద్దును చూసి, నందియనుచు

తానే భక్తితో పూజించు మానవుడు

(ప్రేమ స్వరూపులారా! లేక ప్రేమమూర్తులారా! అని సంబోధిస్తారు విశ్వంజీ. “ప్రేమ అన్నిటిని సిద్ధింప జేస్తుంది” అన్న సూక్తి ద్వారా అవతారమూర్తుల దివ్య (ప్రేమ ఎట్టిదో (గ్రహించినాము. ఆ విధమైన ప్రేమనే ప్రతి మానవుడు తోటి వారి పట్ల చూపగలగాలని అన్నిటిని సాధించాలని ఈ సూక్తి బోధించుచున్నది.

125 ప్రపంచంలో అశాంతికి మూలకారణం వాతావరణ కాలుష్యం

ఈనాడు ప్రపంచంలో '“శాంతి' కరువైనది. అశాంతి అంతటా వ్యాపించిపోయినది. ఆవహించియున్నది. ఈ అశాంతికి మూలకారణం వాతావరణ కాలుష్యం అని ఈ సూక్తి భావము.

అశాంతిని దూరం చేయడానికి మానవుడు ఏమి చెయ్యాలి? శాంతిని కైవసం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఈనాడు “నాకు శాంతి కావాలి” "1 ౪202620 అనడం మనము వింటున్నాము. నాకు, కావాలి అనే పదాలు తీసివేస్తే మిగిలేది శాంతియే అన్నారు భగవాన్‌ సత్యసాయి.

“శాంత” చూడడానికి రెండక్షరములతో కూడిన చిన్న పదమే అయినప్పటికీ “శాంతిని సాధించాలంటే ప్రతి ఒక్కరు కొంత సాధన చేయాలి. “శాంతి అనగా తిట్టినా, కొట్టినా మౌనం వహించేది కాదు. తనలో లేనటు వంటి తప్పులను గురించి ఎవరు చెప్పినా ఉద్రేకపడక సంతోషంగా కృతజ్ఞత నందించేది శాంతి. సర్వ సంకల్ప, వికల్పములను అరికట్టుకోవాలి. మలినజలములో ఏమియూ ప్రతిబింబించదు. చలించే జలములో ప్రతిబింబము కూడా చలించును. అచంచల జలములో అలలుండవు. ప్రతిబింబము స్పష్టముగా కన్పించును. తమోగుణమే మలిన జలము. రజోగుణమే చలించే జలము. సాత్విక గుణమే ఆచంచల జలము". . (బాబా)

శాంతి పొందాలంటే ముందుగా అశాంతి నుండి దూరం కావాలి. అశాంతిని జయించాలి. అశాంతికి మూలం అదుపులేని ఆశలు. కళ్లాలు లేని కోరికలు. వాటిని అదుపు చేయాలి. కోరికలను అరికట్టడానికి ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇంద్రియ సుఖాలను మరిగి దీనుడైనవాడు శాంతుడు కాలేడు. “ఇంద్రియ ని[గ్రహమే నిశ్చల శాంతి నిచ్చును. ధనముతో గాని, విద్యతోగాని, గుణముతో గాని శాంతి లభించదు. త్యాగముతో శాంతి లభించగలదు. ప్రేమతో కూడా శాంతిని పొందవచ్చును. ఈ (ప్రేమను, త్యాగమును పెంచుకోవలెను. ఈ (్రేమా, త్యాగము మనోరథానికి రెండు చక్రాల వంటివి. ఈ (ప్రేమా, శాంతీ అనేవి పక్షి యొక్కరెండు రెక్కల వంటివి. వాటితో

126 ఎంత దూరమునైనా ఎగరటానికి ప్రయత్నము చేయవచ్చును. ఈ రెండు చక్రములలో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఎగరలేము.

“శాంతి నీవు చేయు ప్రతి పనిని పవిత్రము చేయును. కరడు గట్టిన హృదయమును కరిగించివేయును. భగవంతుని సన్నిధికి నిన్ను గొనిపోయి భగవత్‌ సాక్షాత్మారమును కలుగజేయును. దానికి తారతమ్యములు లేవు. శాంతి వలననే భక్తి విశాలమగును. జ్ఞానము వికసించును. శాంతి వలన ఉదయించిన జ్ఞానము వలననే నీవు పరిపూర్ణజీవితము గడుపగలుగుదువు” అని శాంతి సాధన గూర్చి భగవాన్‌ సత్యసాయి విపులీకరించినారు.

ప్రపంచంలో నలుమూలలా దావానలంలా వ్యాపించియున్న కాలుష్యము తొలగాలంటే అశాంతి నుంచి శాంతి సాధనకు ప్రతి ఒక్క మానవుడు కృషి చెయ్యాలి. మహాభారతం అనుశాసనిక పర్వములో “యద్‌ పృధ్వియా - - - - - షోడ శీకలమ్‌”

  • అను శ్లోకము ద్వారా కోర్కెలను త్యజించిననే శాంతి లభించునని చెప్పబడినది. పృథ్విపై గల సమస్త ధనము, ధాన్యము, సువర్ణము, పశువులు, స్త్రీలు, సర్వ సంపదలను కలిపి ఒకే పురుషునికీ ఇచ్చినను అతని కోర్కెలు తీరవు. ఆశ, కోర్కెలు అటువంటివి. మనస్సును కోర్కెల నుండి, మళ్లించి ఇంద్రియ విషయ వాసనల నుండి విరమింపజేసి భగవంతునివైపు మళ్ళించినచో సుఖమైన అమృతత్వము లభించును. అదియే శాంతి. కోర్కెలను త్యజించుట ద్వారానే శాంతి లభించును. “త్యాగాత్‌ శాంతి రనంతరం”.

“త్యాగేనైకే అమృతత్వ మానసుః - ఇది తెలుసుకొని సాధన చేయుటయే మానవధర్శ్మము. తద్వారా లభించినదే మనో నిశ్చలత - నిర్మలత్వము - ఆత్మశాంతి. శాంతిని గూర్చి తెలుసుకోవడమేగాక అది ఆచరించిన నాడే వాతావరణ కాలుష్యం నివారణగుట కవకాశముండును. ఒక సమయములో తులసీదాసు గోస్వామి ఇలా అన్నారు. “ఇంటిలోపల వెలుపల కూడా వెలుతురు కావాలంటే గడపపైన దీపం పెట్టుకోవాలి”. అదేవిధంగా నీలోనూ, నీ వెలుపలా శాంతి ప్రకాశము ప్రసరింప వలెనంటె నీ జిహ్వాగ్రమందు (నాలుకపై) 'నామ” మను దీపమును నిలుపుకో! అనగా

“భగవన్నామస్మరణ” సదా చేయుటయే శాంతి సాధన. ఇట్టి నామస్మరణ తనకే కాకుండా ప్రపంచమునకే తేజమును ప్రసాదించును.

12/7

అధ్యాత్మపరంగా చూసినప్పుడు శాంతి లభించుటకు నామస్మరణయే తరుణోపాయ మని స్పష్టమయినది. నామము చేయడం వలన మానవుడు తాను తరించుటయేకాక చుట్టుప్రక్కల వాతావరణంలో కూడా పవిత్రతోబాటు కాలుష్యం తొలగిపోవును. అశాంతికి బదులు ప్రశాంత చిత్తముతో మానవుడు తన గృహాన్ని ప్రశాంతనిలయంగా మార్చు కోగలుగుతాడు. విశ్వయోగులు తపిస్తున్నది దీనికోసమే. (ప్రశాంతి అనే పదానికి బాబా చక్కటి అర్ధము చెప్పినారు. '్ర = అనగా వికసింపజేయుట. శాంతి అనగా కామ క్రోధ రాహిత్యము. కామక్రోధ రాహిత్యమును వికసింపజేయుటయే ప్రశాంతి.

ఒక సందర్భంలో (2001 ఏప్రిల్‌ సనాతన సారధి) భగవాన్‌ బాబా “శాంతి మీలోనే ఉంది” అంటూ ఈ విధంగా సందేశమిచ్చినారు.

“మానవుని మనస్సు ఇరవై నాల్దు గంటల లోపల ఊసరవెల్లి మాదిరి ఎన్నో రకాలుగా మార్పు చెందుతోంది. ప్రొద్దున్న చూస్తే యోగము. మధ్యాహ్నం చూస్తే భోగము; రాత్రి చూస్తే రోగము! బయట చూస్తే ఆనందము; లోపల గమనిస్తే విషయవాసన! యోగమంటే చిత్తవృత్తి నిరోధము. అన్ని వృత్తులనూ పరమాత్మునికే అర్పణ చేయాలి. ఇంట్లో పోగొట్టుకున్న సూది కోసం, ఇంట్లో చీకటిగా ఉందని, వీధి దీపం క్రింద వెదకటం వెళ్ళితనమే కదా! ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతికినప్పుదే పోయిన వస్తువు దొరుకుతుంది. అట్లనే, అంతర్ముఖంలో అజ్ఞానంతో పోగొట్టుకున్న మనశ్శాంతిని అక్కడే వెతికి సంపాదించాలి. బహిర్ముఖంలో వెతికితే అది ఏనాటికీ లభ్యం కాదు. మట్టిలో మాణిక్యమున్నట్లు మానవునిలో పరమాత్మజ్యోతి ఉంది, దానిని అజ్ఞానంతో మూసిపెట్టి, అక్కడ చీకటిగా ఉందనుకోవడం పొరపాటు. అజ్ఞానాన్ని నిర్మూలించుకుంటే మానవుడే మాధవుడౌతాడు.

భౌతిక దృష్టిలో శాంతి అంటే తృప్తి వలన కలిగే మానసిక శాంతి. ఇది కోరికలను తగ్గించుకోవటం వలన సాధ్యమవుతుంది. ఆధి భౌతిక దృష్టిలో శాంతి అంటే ఇంద్రియ నిగ్రహం వలన లభించేది. మనస్సును విషయ సుఖాల నుండి పరమాత్మ వైపు మరలించడం ద్వారా ఇది సాధ్యం.

1286 *12గ1లఅ6 13 ౧120(608516538 10 16 ౧01౬ 1ల6 ౪/11 006 06240” 10 0124016 కోటిలం 13 06200/ 10 00420161, అలం ౪111 06 ఏజయం0ు/ ఓ 16 ౧00౧ల ఇాసలల ళులల 19 9బంం0) 10 ళ6 10016 కౌసలం ౪111 0606ల 1 16 4601 సలు లం 18 0164ల 1 116 312600, నలం ౪11 0696206 19 6 ఇంగే6." అంటూ భగవాన్‌ సత్యసాయి ప్రపంచ శాంతికి తీసుకోవలసిన పరిణామక్రమమును విశదీకరించినారు. మనస్సులో ధార్మిక చింతన ఉంటే శీలంలో సౌందర్యం ఉంటుంది. శీలంలో సౌందర్యం ఉంటే, గృహములో అన్యోన్యత ఉంటుంది. ఇంటిలో అన్యోన్యత ఉంటే దేశంలో క్రమశిక్షణ ఉంటుంది. దేశంలో క్రమశిక్షణ ఉంటే ప్రపంచంలో శాంతి ఉంటుంది.” శ్రీ విశ్వంజీ సత్యం శీలం, పవిత్రత, సమైక్యతల గురించి బోధిస్తూ ప్రతి వ్యక్తి తన్ను తాను సంస్కరించుకొని ప్రశాంత చిత్తంతో గృహాన్ని ప్రశాంతి నిలయంగా మార్చి సమాజాన్ని కూడా ప్రశాంతి నిలయంగా తీర్చిదిద్ది దేశాన్ని ప్రపంచాన్ని కూడా శాంతి నిలయాలుగా తీర్చి దిద్దాలని అదే ప్రతి మానవుడి లక్ష్యం, ధ్యేయం కావాలని కలుషితమైన వాతావరణాన్ని దివ్యమైన సంకల్పబలంతో ప్రశాంతతను సాధించాలని బోధించుచున్నారు. ఈ విధంగా మారడానికి వ్యక్తి సాధన చాలా అవసరమని ప్రతి వ్యక్తి మానవత్వం గల మనిషిగా సమాజోద్ధరణకు పాటు పడాలని యువకులు తమ సేవల్ని సమాజాని కందించాలని తద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ప్రయత్నించాలని

129 ఉద్దాటించుచున్నారు. భూదేవికి ప్రతి ఒక్కరు ఎంతో బుణపడి ఉన్నారని ఆమె కంటి నీరు కార్చకుండా అధర్మవర్తనను, అవినీతిని అరికట్టే స్థితిలో మేధావుల దగ్గర నుంచి, అందరు అన్ని రంగాలలో కృషి చేసి ప్రపంచాన్ని ప్రశాంతి నిలయంగా మార్చాలని కూడా వారు హెచ్చరించినారు. అలనాడు సనాతన ధర్మంలో చెప్పబడిన మానవతా విలువల యొక్క విశిష్టతను అందరూ అర్ధం చేసుకుని ఆచరణలో పెట్టాలని స్వామి చెప్పుచున్నారు. 51 113*4%%1 542166 13 417106 ]4జాంస 101 ఖం! 6812401 206 ౧6206 206 16 21686 ౪191166 ఉణులఃం& 1 41 0012606401; 2064 9016264008 ౧13 ఈ17106 653286 &] ౦౪౪ ౮.5. 101 ౪1/ఆం21 10082401 2064 */0గే6 ౧౦౬ ఈ సందర్భంగా స్వామి దివ్యోపన్యాసములు విని అమెరికా దేశంలో నివసించే భారతీయులతోబాటు అనేక జాతుల వారు, వర్గముల వారు, ఇతరమైన వారందరు, ఉన్నతమైన స్థితిలో అక్కడ ఉద్యోగము చేయుచున్న అధికారులందరు, ఈ విశ్వ సందేశమును విని ఆనందపడినారు. స్వామి భారతదేశస్థులు, అమెరికా దేశస్థుల హృదయాలతో, హృదయాలు కలుపుకొని సమైక్యమై కలిసికట్టుగా ప్రపంచ శాంతి కొరకు, విశ్వ సమైక్యత కొరకు కృషి చేయాలని పదేపదే హెచ్చరించినారు. ఈ నినాదాన్ని ఆధారంగా చేసుకుని కృషి సల్పిననాడు ప్రపంచశాంతి సాధన సులభ తరమగును. పృథ్వీమాత “విశ్వశాంతి” అనే బిడ్డను కనడానికి పడుతున్న ప్రసవవేదనగా ఈ సమయాన్ని శ్రీ విశ్వంజీ అభివర్ణించారు. తల్లి బిడ్డను కనడానికి ముందు వేదన అనుభవించినా బిడ్డను చూసేసరికి ఆవేదన మర్చిపోయి ఆనందపడినట్లుగానే భూమాత విశ్వశాంతి అనే బిడ్డను కనడానికి ప్రసవ వేదన అనుభవిస్తున్న సమయమని త్వరలోనే ప్రసవమయి విశ్వశాంతి స్థాపన జరుగ గలదని స్వామి అమెరికాలో ఒకానొక వనిత “ప్రపంచం ఈ రకంగా ఉన్నది కాదా! మీకేమి అనిపిస్తోంది? అని అడిగిన ప్రశ్చకు ఆ విధంగా సమాధానమిచ్చినారట. వాతావరణము అనగా నిత్య జీవితంలో మనకు కన్పిస్తున్న బుతువుల మార్చు, కాలమానము ప్రకారము వర్షాకాలము, శీతాకాలము, ఎండాకాలముగా గోచరించేది ఒకటి. రాజకీయ వాతావరణము కూడా ఈనాడు అశాంతికి గురి చేస్తూ మానవాళిని కలవర పెట్టుచున్నది. ఆరోగ్యమైన స్థితిలో, రక్తపాతముతో సంబంధము లేకుండా, ఏ

130 మతమైనా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, అందరూ కలసిమెలసి సమైక్యంగా దేశప్రగతికి, దేశ సౌభాగ్యానికి కృషి చెయ్యడం ప్రధానమని మహనీయులు ఉవాచ. చట్టబద్ధమైన, ధర్మబద్ధమైన పద్ధతిలో రాజకీయ నాయకులు దేశ సమైక్యత, విశ్వశాంతి దృష్టి యందుంచుకుని స్వార్ధరహితమైన సేవలు చేసిననాడు వాతావరణ కాలుష్యము తొలగిపోయి. శాంతియుతమైన పద్ధతిలో సమస్యలు పరిష్కరింపబడును. దీనికి కలిసికట్టుగా ప్రతి మానవుడు తనవంతు కృషి తాను చేయాలని శ్రీ విశ్వంజీ సెలవిచ్చుచున్నారు. మానవతా విలువలలో 'శాంతి” చాలా విలువైనది. కష్ట సమయాలలో పతివ్రతా శిరోమణులైన స్రీలు తమ భర్తల క్షేమము కొజకు, తమ ఆత్మకు, మనస్సుకు నిర్మలత్వము, శాంతి లభించుటకు భగవన్నామస్మరణ స్తోత్రముల రూపములలో పఠించెడి వారట. సీతాదేవి రామ-రావణ సంగ్రామ కాలమున అశోకవనమున కూర్చుండి తన భర్త జయమును కోరినదై, తన మనో వ్యాకులత పోయి శాంతి లభించుటకై ఈ క్రింది గౌరీ ప్రార్ధన చేసినది. సీతాదేవి సతీదేవిని ప్రార్ధించిన విధానము. వరాహమిహిరుని బృహత్సంహితలోని గౌరీ స్తోత్రము. శ్లో పురుషాణాంచ సహస్రంచ సతీస్త్రీంచ సముద్ధరేత్‌

పతిః పఠీవ్రతానాంచముచ్యతే సర్వపాతకాత్‌

నాస్తితేషాం కర్మభోగః సతీనాం వ్రతతేజసా

తధా సార్ధంచ నిష్కర్మమోదతే హరిమందిరే

పృథివ్యాంయానితీర్థాని సతీపదేఘతాన్యపి

తేజశ్చసర్వదేవానాం మునీనాంచ సతీష్‌తత్‌ ॥

పతివ్రతయైన స్రీ 'సతి' అనబడును. ఈమె సహస్ర పురుషులను ఉద్ధరించగలదు.

పతివ్రతామతల్లియైన స్రీ యొక్కభర్త సమస్త పాపముల నుండి విముక్తుడగును. సతుల యొక్కప్రభావము చేత వారి వారి భర్తల ఖర్మఫలములను అనుభవించవలసిన పనిలేదు. వారు సర్వకర్మ బంధముల నుండి విముక్తులగుదురు. అట్లు విడివడి సతీసమేతముగా

131

విష్ణులోకమును చేరుదురు. భూమిపైనున్న పుణ్య తీర్ధములు ఎన్ని గలవో అవి అన్నియును పతివ్రతల పాదముల యందే నిక్షిప్తమై యున్నది. సంపూర్ణ దేవతా తేజములు, మునీశ్వరుల తేజములు అన్నియూ పతివ్రతకు స్వభావ సిద్ధమై యొప్పుచున్నవి. స్రీలు ఇట్టి పతివ్రతా ధర్మము ప్రాప్తింప జేసికొనుటకు “సతీ” దేవిని (గౌరీదేవిని) ప్రార్ధించెడి వారు. ఇట్టి భగవన్నామస్మరణయే శాంతి నొసగును. శాంతిని మించిన తపస్సు లేదు.

6120615 &3101టల5 00620 - 11 916 180164(100010ట046 ౪0164. (అవధులు లేని కడలి శాంతి. అది కాంతియై విశ్వమును ప్రకాశింపజేయును).

ఉత్తమమైన మానవతా విలువగా ప్రసిద్ధి గాంచిన “శాంతిని కైవసం చేసుకుందుకు అశాంతి నెలకొన్న యుద్ధ వాతావరణంలో, రాక్షసులకు స్థావరమైన లంకాపురిలో కాలుష్యం ఆవరించుకొన్న ప్రదేశంలో మహాపతివ్రతయైన సీతాదేవి త్రికరణశుద్ధిని పరిపూర్ణంగా తనలో నింపుకొని నిష్కామ హృదయంతో ఈ విధంగా ప్రార్ధన చేసినదంటే ఆ భూమి యావత్తూ కాలుష్యాన్ని పోగొట్టుకొని దివ్యభూమిగా మారినది.

ఈనాడు ఇంతటి మహత్తరమైన మానవతా విలువల ద్వారా అశాంతి ఆవరించిన ప్రపంచాన్ని శాంతియుతంగా మార్చడానికి, కలుషితమైన వాతావరణాన్ని శుద్ధ మొనర్చటానికి, వాతావరణ కాలుష్యాన్ని తొలగించి ప్రపంచాన్ని ప్రశాంతి నిలయంగా మార్చటానికి అడుగంటి పోవుచున్న మానవతా విలువల్ని వెలికితీసి మనకు బోధించడానికి భగవంతుడు నరాకారంధరించి ఈ భూమి మీద అవతరించి యున్నాడు. అందుచే స్వార్ధరహితమైన నిష్కామ కర్మల ద్వారా, సేవల ద్వారా, సద్దోష్టి సత్సంగముల ద్వారా సద్ధంధపరనం ద్వారా, శాంతి మంత్రముల ద్వారా రాజకీయ వాతావరణాన్ని ప్రకృతిలో చెట్టు నాటడం ద్వారా మన పరిసరాల్ని శుద్ధ మొనర్చి కాలుష్యాన్ని తప్పక తొలగించు కోవచ్చునని ప్రపంచాన్ని ప్రశాంతి నిలయంగా మార్చుకొనవచ్చునని, పృథ్వీమాతను శాంత పరచవచ్చునని శ్రీ విశ్వంజీ చెప్పుచున్నారు.

132

2-8-98 నాడు విశ్వనగర్‌లో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా శ్రీ విశ్వంజీ “ఒక చెట్టును నాటండి” - ఒక చెట్టును ఇంటికి తీసుకుని వెళ్ళండి” అనే నినాదంతో 1000 చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. వృక్ష సంపదను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. (ప్రభుత్వపరంగా చేపట్టే సమాజహిత కార్యక్రమాలన్నింటిలో అన్ని వర్ణాల ప్రజలు చేయూత నివ్వాలి. ఇక్కడ ఒకటి రెండు ఎకరాలలో బెషధాలకు పనికి వచ్చే మొక్కలు పెంచి త్వరలోనే వాటి నుండి రోగ నివారణకు పనికి వచ్చే మందులు తయారు చేసే “రీసెర్చి కేంద్రము” (జయం! ౮60౯0) కూడా ఏర్పాటు కాబోతున్నదని తెల్పినారు. కాలుష్య వాతావరణంలో అస్తవ్యస్తమయిన జీవితాలను గడుపుతున్న నేటి మానవాళికి సుఖవంతమైన, సౌభాగ్యం, ఆరోగ్యమయిన జీవితాలను ప్రసాదించే శక్తి ఒక్క ప్రకృతికి మాత్రమే ఉందని గుర్తించబట్టే ఇక్కడ విశ్వసమైక్యతా స్ఫూపాన్ని నిర్మించడం జరిగింది. అందర్ని సమభావంతో, అందరిలో దైవత్వాన్ని చూడగలిగే స్థితికి ప్రతి ఒక్కరు చేరుకోవడానికి కృషి సల్పాలి. సనాతన ధర్మం భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, శాంతి మార్గమైనవి. మనస్సులో సంకుచిత భావం ఏర్పడితే మత ఘర్షణలకు దారి తీసి, ప్రపంచ శాంతికి అవి భంగం కలగజేస్తాయి. ప్రతి ఒక్కరు విశాలమైన భావాలను అలవరచుకొని, ప్రేమతో సోదరభావం కలిగి ఉండాలి. యోగులు, అవతార మూర్తులు, సిద్ధపురుషులు ప్రకృతిని కూడా శాసించగలరు” అని శ్రీ విశ్వంజీ సెలవిచ్చినారు.

మానవాళి ఈ విధమైన సన్మార్గంలో నడచిననాడు ప్రకృతి వైపరీత్యములు వాటంతట అవే పరుగు తీయగలవు. అశాంతి కారణంగా, అన్యాయం, అధర్మం కారణంగా ప్రకృతి కూడా విలయ తాండవం చేయడం ఈనాడు మనము స్వయముగా చూచినాము. సునామి వంటి విపత్తు సంభవించిందంటే అనేకానేక మంది ప్రాణములు బలికొనడమే కాకుండా, అనేకమంది అనాధలై నిలువ నీడ లేక, తినడానికి తిండి లేక అలమటిస్తూ వారి పశు సంపదను, ఇతరమైన జంతుజాలమును కూడా కోల్పోయి రోదించుట చూస్తే అశాంతి వలన వాతావరణ కాలుష్యం వలన ఎంతటి విపత్తులు సంభవిస్తున్నాయో

133

స్పష్టమగుచున్నది. “లోకాస్సమస్తాసుఖినోభవంతు” అన్న విశ్వ ప్రార్ధనను అనుక్షణం ప్రతి మానవుడు జపిస్తూ ఇదే తనకు తన వారికి ప్రపంచానికి రక్ష అని భావించిన నాడు కరుణాంతరంగుదైన భగవంతుడు సమస్తము ప్రసాదించి మానవాళిని రక్షించి కాపాడుట తథ్యము. భగవంతుడికి ప్రీతిపాత్రమైన కర్మలాచరిస్తూ మానవాకారం ధరించి ఈ భూమి మీద నడయాడుతున్న సాక్షాత్తూ దైవాంశ సంభూతులైన అవతారమూర్తుల అండదండలు సర్వకాల సర్వావస్థల యందు అందరికి ఉంటాయని ఆ దివ్యమైన ఆశీస్సులే సర్వ మానవులకు రక్ష అని భావింపనగును. అందుచేత అశాంతికి మూలకారణమైన వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరు ట్రికరణ శుద్ధితో కృషి చెయ్యడం ప్రారంభిస్తే ముందుకు నడిపించేది భగవంతుడే, మానవాకారంలో నున్న ఆ గురుమూర్తి విశ్వంజీయేయని, వారి అనుగ్రహం, ఆశీస్సులు ప్రపంచ శాంతి కోసం కృషి చేసే ప్రతి ఒక్కరిపైన దివ్య తరంగాల వలె ప్రసరింప గలవని ఆశిస్తూ కాలుష్యం తొలగిపోయి అశాంతి స్థానంలో శాంతి సుస్థాపితం అవుతుందని ఆశిద్దాం!

134 కృతజ్ఞత అన్నది మానవుని ప్రథమ లక్షణం మానవుడు జీవితంలో అనేక విధముల కృతజ్ఞతా భావంతో మెలగవలసిన ఆవశ్యకత ఉన్నది. అదే తన జీవిత ధ్యేయంగా భావించి ప్రకృతిపట్ల, తల్లిదండ్రుల పట్ల, పంచమాతల పట్ల అనేకానేక విధాల కృతజ్ఞతతో మెలగాలి. “జంతునాం నరజన్మదుర్లభం”. మానవజన్మ ఉత్తమోత్తమమైనది. ఎనఖై నాలుగు లక్షల జీవులలో మానవ జన్మ లభించడం ఎన్నో జన్మల పుణ్య భాగ్యంగా భావించాలి. భగవదనుగ్రహం వలన ఈ మానవ జన్మ తనకు ప్రాప్తించినందులకు భగవంతుడికి ప్రప్రధమంగా మానవుడు కృతజ్ఞత తెల్పుకోవాలి. శ్రీ విశ్వంజీ తరచుగా చెప్పే మాట; తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతాభావంతో మెలగుతూ, తొమ్మిది నెలలు మోసి, తను తిన్న ఆహారాన్ని తన రక్తాన్ని పంచి ఇచ్చి పునర్జన్మ అనబడే విధంగా బిడ్డల్ని కన్నందుకు తల్లి పట్ల కృతజ్ఞతతో మెలగుతూ, ఆమె బుణం తీర్చుకోవాలని “మాతృదేవోభవ” అన్న సూక్తికి సార్థకత చేకూరే పద్ధతిలో మెలగాలని స్వామి హెచ్చరి స్తుంటారు. విద్యాబుద్ధులు నేర్పి అనేక విధాల పుట్టినప్పటి నుంచి విద్యాభ్యాసం పూర్తయి పెండ్లి చేసే వరకు తండ్రి బాధ్యత వహించి (ప్రేమతో సమస్తం చేకూర్చినందుకు తండ్రి పట్ల కృతజ్ఞత చూపాలి అంటారు. గురువు భౌతిక స్థాయిలో విద్యను నేర్చి చక్కగా తీర్చిదిద్దుతాడు. అధ్యాత్మస్థాయిలో నువ్వు నమ్ముకున్న యోగి, అవతారమూర్తి ఎవరైనా సరే తల్లి తండ్రి గురువు తానై జీవితంలో సమస్తమూ చేకూరుస్తాడు. ఆయన నిత్య సత్య శాశ్వతుడు కన్న తల్లిలా నిను లాలించి, కన్న తండ్రిలా నిను కోపించి వెన్న కన్న మెత్తటి హృదయంతో నిను ప్రేమించి, వేయి తల్లుల (ప్రేమను కురిపించి అవసరమైనప్పుడు కోటి తండ్రుల కఠినత చూపుతూ నీకు శిక్షణ నిచ్చి మానవత్వం గల మనిషిగా తీర్చి దిద్దుతాడు. అందుచేత తల్లి, తండ్రి, గురువు దైవం పట్ల కృతజ్ఞతతో మెలగాలన్నదే స్వామి ఆశ, ఆశయము. భగవాన్‌ సత్యసాయి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ఒకానొక దివ్యోపన్యాసంలో ఈ విధంగా అన్నారు. “పిల్లలు తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతాభావంతో మెలగాలి ఎందుచేతనంటే “నీవు తినే తిండి (006), నీ శరీరంలోని రక్తం (2310064), నీ మెదడు

135

(16౭6), నీ ధనం (3408ల ఈ నాలుగు తల్లిదండ్రులు నీకు ఇచ్చిన కానుక (21600 61%0 అందుచేత వారిపట్ల జీవితాంతం నీవు కృతజ్ఞతాభావంతో మెలగుతూ (ప్రేమను పంచుతూ, ఆత్మీయంగా వారి కోర్కెలు తీరుస్తూ బుణం తీర్చుకోవాల”ంటారు బాబా.

కృతజ్ఞత అనునది మానవుడికి జీవమని మానవుడు జీవిస్తున్న సమాజానికి ఆ మానవుడు కృతజ్ఞత అందించడం కనీస ధర్మమని, ఏ మనిషి కూడా ఇతరులు చేసిన మేలు మరువరాదని హెచ్చరిస్తుంటారు.

మానవుడు చేయు ప్రతి పనియు, ఉలియై మానవ జీవితమను శిలకు ఆకృతి దిద్దును. ఆ ఉలిని దారి తప్పి ఉపయోగింతుమా, హానికరమే కాక, జీవిత శిలయు చెడిపోవును.

మానవుడు, ఇంత సృష్టి చేసి, పంచ భూతాల్ని ప్రసాదించి ప్రతి ప్రాణికి నీడనిచ్చే చెట్లను, మనకు మంచి గాలినిచ్చి, మనం వదిలిన గాలిని స్వీకరించే వృక్షాలు, నీరు, జంతు జాలము - ఆవులు గడ్డి తిని మనకు చక్కటి, చిక్కటి పాలను ఇచ్చుచున్నందులకు ప్రకృతి పట్ల, జంతువుల పట్ల కృతజ్ఞతతో మెలగాలి. అనేక బెషధములు తయారీకి అనేక రకములయిన చెట్ల ఆకులు ఉపయోగ పడినందుకు, ప్రకృతి మాతను, ప్రసాదించిన విశ్వమాతను, పృథ్వీ మాతను, గోమాతను, దేశమాతను, జన్మనిచ్చిన తల్లిని గౌరవించవలసిన బాధ్యత, కృతజ్ఞత చూపుట ప్రతి మానవునకు అత్యంత ఆవశ్యకమని శ్రీ విశ్వంజీ అనేకనేక మారులు తమ దివ్యోపన్యాసములలో చెప్పుచున్నారు. తోటి స్నేహితుడు నీకు ఒక ఏదైనా కానుక ఇచ్చిన నీవు వెంటనే కృతజ్ఞతలు చెప్పినట్లే భగవంతుడు సమస్త ఐశ్వర్యములను ప్రసాదించినందులకు అనేకానేక విధముల కృతజ్ఞతలు చెప్తూ సక్రమమైన పద్ధతిలో ప్రకృతిలోని ఖనిజ సంపదను, తదితరమైన వస్తువులను వాడుకోవాలి. ఇవన్ని అనుభవించడానికి మనకొక మానవ జన్మ బుద్ధి మేధస్సులతో కూడిన అద్భుతమైన దేహమును ్రసాదించినందులకు ఈ శరీరాన్ని మంచి కర్మలు చేయడానికి ఉపయోగపెడుతూ భగవంతుడు ఈ దేహాన్ని ఇచ్చినందులకు ప్రప్రధమంగా ఆయనకు కృతజ్ఞత నందజేయాలి! సమాజ సేవ చేస్తూ పదిమందిని ప్రభావితం చేసి (పేమమూర్తులుగా మార్చి సంఘ సంస్కర్తగా మానవుడు తన జీవితాన్ని తీర్చి దిద్దుకునే అవకాశం కల్పించినందులకు ఆ విశ్వమాతకు కృతజ్ఞతలు చెప్తూ ఈనాడు విశ్వశాంతి

136

  • విశ్వసమైక్యతకు కృషి చేస్తున్న మహాపురుషులు శ్రీ విశ్వయోగి విశ్వంజీ వంటి మహనీయులకు, మనల్ని తీర్చిదిద్దినందుకు వారి లక్ష్యం మన లక్ష్యం చేసుకుని వారి ధ్యేయం మన ధ్యేయంగా మార్చుకుని వారి అడుగులలో అడుగులు వేస్తూ ముందుకు సాగే పద్ధతిలో జీవితాల్ని మలచుకొని ధన్యులవ్వాలన్న స్వామీజీ కోర్కెను నెరవేర్చాలి. ఇదే ప్రతి మానవుడు వారి పట్ల చూపవలసిన కృతజ్ఞత; గురు దక్షిణ అని భావించాలి. అలాగే భగవాన్‌ సత్యసాయి అనేక రంగాలలో, అనేక ఉన్నతమైన కార్యక్రమములు డబ్బుతో నిమిత్తం లేకుండా తన జీవితమే జగతికి సందేశమన్న పద్ధతిలో ప్రేమమూర్తిగా నిలచి ప్రేమతో అన్నీ సాధించి అందర్ని ఆ బాటలో పయనించ వలసిందని అనేక సంవత్సరములుగా మానవాళికి హితబోధ చేయుచున్నారు. అందుచే ఇటువంటి మహనీయుల్ని ప్రసాదించినందులకు పృధ్వీమాతకు ప్రతి ఒక్కరు తమ కృతజ్ఞత నందజెయ్యాలి. పృధ్వీమాత సహనము కొనియాడదగినది. అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు అన్ని భరిస్తూ అధర్మ వర్తనులైన వారందర్ని క్షమించి అందరికి ఆధారభూతమై నిలచింది భూమాత. క్షమ, సహనము, ఓర్పు ఎనలేని (ప్రేమ, జాతి యావత్తూ ఎంతో బుణపడి యున్న భూమాతను సంతోషపెట్టే పద్ధతిలో (ప్రతి వ్యక్తి (స్త్రీలు, పురుషులు) కృతజ్ఞత చూపాలి, పరమ పవిత్రమైన భారత భూమిలో మాతృభావము గొప్పది. ఈ విషయం సందర్భవశాత్తు కొన్ని సూక్తులలో చెప్పుకున్నాము. కర్మభూమి, యోగభూమి, త్యాగభూమి, తపోభూమి యైన భారతదేశం హృదయం వంటిదని, అమెరికా దేశం మెదడు వంటిదని, మిగిలిన దేశములు, ఇతరమైన అంగములని శ్రీ విశ్వంజీ అభివర్ణించారు. ఇతర మైన అంగములు, బ్రెయిన్‌ సరిగ్గా పని చెయ్యాలంటే హృదయం సక్రమంగా పనిచేయాలి. గుండె సక్రమంగా పనిచెయ్యకపోతే మానవుడికి జీవితమే లేదు. అదేవిధంగా హృదయస్థానమైన భారతదేశం శక్తివంతమై ఇతర దేశాలకు ఆదర్శం కావాలని అధ్యాత్మ సంపదకు పుట్టినిల్లై అనేకమంది యోగులు, సిద్ధపురుషులు, అవతార మూర్తులు, యతులు, మున్నగు వారికి జన్మనిచ్చి యావత్‌ ప్రపంచాన్ని నడిపంచగల సామర్ధ్యము భారత దేశమున కున్నదని విశ్వంజీ సెలవిస్తుంటారు. పూర్వకాలంలో అనేకమంది మనదేశముపై దండయాత్రలు సల్సి ధనమును, ఇతరమైన సంపదలను దోచుకుని పోయినప్పటికి ఈ విధంగా నిలబిడగలగిందంటే భారతదేశం పేద దేశము కాదని (0%44613 02 ౧00 ౧౦౪26౫ కలీజ2[13 2006000060 పవిత్రమైన దేశమని స్వామి సెలవిచ్చినారు. మరొక విషయం కూడా స్వామి ఈ సందర్భంలో హెచ్చరిక చేసినారు. గత వైభవాన్ని తల్చుకుని

13/7

మురిసిపోవటం కాదని మనదేశ గౌరవాన్ని ఆదర్శాలను, సనాతన ధర్మము చెప్పిన విశేషములను గమనిస్తూ ఈనాడు అధర్మము, అవినీతి పెచ్చు పెరిగిన సందర్భములో మతకలహాలకు చోటివ్వకుండా కులాల పేరుతో కొట్లాడుకోకుండా భారత జాతి గౌరవాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నదని, యువత ఈనాడు గ్రామ "సేవలు చేస్తూ ఉన్నతమైన ఆదర్శాలు బోధిస్తూ తగిన సేవలందించి దేశ ప్రగతికి కృషి చెయ్యవలసిన అవసరమెంతేని గలదని శక్తివంతులు కావాలని అందర్ని శక్తివంతుల్ని చేయాలని ఆవేశంతో, ఆవేదనతో తమదైన ఒకానొక దివ్యోపన్యాసంలో శ్రీ విశ్వంజీ ఇటీవల సెలవిచ్చినారు. వారు అమెరికా దేశానికి వెళ్ళడంలో అంతరార్థాన్ని కూడా బోధించారు. భారతీయ సనాతన ధర్మము యొక్కవిశిష్టత, ఆచారములు వేదము బోధించిన ఉన్నతమైన విలువలు ఆనాడు యోగశాస్త్రం చెప్పిన రహస్యాతిరహస్యమైన విశేషములు చాటి చెప్పడం ఒకటి; రెండవది ఆ దేశంలో నివసిస్తున్న భారత దేశపు కుటుంబముల వారందరికి, అక్కడ అమెరికా దేశస్థులతో హృదయాలు కలుపుకుని అందరూ కలిసి (అమెరికా దేశస్థులు, భారతీయులు) విశ్వ సమైక్యతకు ప్రపంచ శాంతికి కృషి చెయ్యాలని ఆదేశంలో నివసించే భారతదేశపు కుటుంబాల వారిని తాను కోరేది ఇదేనని ఈ లక్ష్యం ఈ ధ్యేయం సాధించాలని గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు. శ్రీ విశ్వంజీ కేవలం అక్కడ నివసించే భారతీయులనేకాక విభిన్న మతస్థులను, మత ప్రవక్తలను, క్రైస్తవ మతస్థులను, ఇంకా ఇతరమైన వివిధ జాతుల వారందర్ని కలిశానని అనేక విషయాలు మాట్లాడడం జరిగిందని అన్నారు.

అక్కడ ఆ దేశంలో నివసిస్తూ యాంత్రిక జీవనం గడుపుతూ వారు నిత్య జీవితంలో గురుభక్తి భావంతో భగవంతునితో సంపర్శం పెట్టుకుని ఆడమొగ ఏ భేద భావం లేకుండా ఐక్యతతో, అన్యోన్యంగా సాగిస్తున్న జీవన విధానాన్ని శ్రీ విశ్వంజీ మెచ్చుకున్నారు. ఒక సందర్భంలో ఆ దేశంలో తమ దివ్యోపన్యాసంలో స్వామి ఈ విధంగా అన్నారు “అక్కడ నివసించే భారతీయులు పండుగలు ఆయా తేదీలలో చేసుకోకుండా, తమకు- సెలవు ఉన్నప్పుడు శని ఆది వారాలలో జరుపుకుంటున్నాము” ఇది మంచి పద్ధతేనా? అని అడిగితే చాలా మంచి పద్ధతి అన్నారు స్వామి. ఏదో ఒక మిషతోటి పండగ లేక పుట్టిన రోజు మరచిపోకుండా జ్ఞాపకముంచుకుని, నలుగురు కలిసి విందు భోజనము చేయడంతో బాటు పూజాది కార్యక్రమం నిర్వహించడం, ఒక చోట కలవడం విశేషం; ఇది తప్పు కాదు అని జవాబిచ్చినారు. వారిలో నున్న మంచిని, నిజాయితీని క్రమశిక్షణను గ్రహించి అలవరచుకుని ఆ విధంగా జీవన విధానం సాగిస్తే బావుంటుందని స్వామి వచించారు.

136

అన్ని పద్ధతులు మంచివేనని వారు సెలవిస్తూ, మరొక ప్రక్కభారతీయ సనాతన ధర్మము యొక్క విశిష్టత భారత దేశపు గొప్పతనము, కొనియాడదగినదని కూడా స్వామి చెప్తూ భారతదేశంలో తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ ఆప్యాయత పంచి ఆదరిస్తారు. బిడ్డలు, వృద్ధా (ఛమాల సంఖ్య అమెరికాతో పోలిస్తే తక్కువేనని కూడా స్వామి వచించినారు. ఈ విధంగా ప్రతి చోట నుంచి మంచిని గ్రహించాలి అన్న ఆదర్శాన్ని స్వామి నిరూపించినారు.

శ్రీ విశ్వంజీ గోమాతను పూజించడాన్ని గురించి ఇలా అన్నారు. “గోమాతను పూజించడం భారతీయ సంప్రదాయములో మొదటి నుంచి వస్తున్న ఆచారము. గోవుపాలతో బాటు, గోవు పంచకము, గోవు మూత్రము మున్నగునవన్ని ఆయుర్వేదము మందుల తయారీలో ఉపయోగింతురు. గోపంచకముతో అలికి ముగ్గు పెట్టినప్పుడు క్రిమి కీటకాదులు నశించి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉపయోగకారి అగుచున్నది. గోహత్య మహాపాతకమని పరమపూజనీయమైన గోవును చంపు వారు కిరాతకులని చెప్పబడినది. అందుచేత గోవును పూజించి, దానము చేసిన పుణ్యము, అన్న భావంతో గోదానం దానములలో ఉన్నతమైనదిగా కూడా చెప్పబడినది.”

మాతృదేవిని ఆరాధించి పూజించి ఆమె ఆశీస్సులు లేకుండా భారతదేశంలో మహనీయులెవ్వరూ కూడా తమ కార్యక్రమము ప్రారంభించలేదు. వెళ్ళి వస్తానమ్మా! అన్న మధురమైన పిలుపే అందరికి అభ్యాసమైనది గాని వెళ్ళివస్తాను నాన్న అని అనడం చూడము. తండ్రి కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి అయినప్పటికి కన్నతల్లి తర్వాతనే తండ్రిని చెబుతారు” అని శ్రీ విశ్వంజీ సెలవిచ్చినారు.

శ్రీ విశ్వంజీ పూజానంతరము సమస్త అవతార మూర్తులకు, సాయినాధ్‌ మహరాజ్‌కు, సమస్త దేవతామూర్తులకు, సమస్త మానవతా మూర్తులకు జేజేలు చెప్పడంతో బాటు విశ్వజనని, పృథ్వీమాత, భారతమాత, గోమాత, మాతృశ్రీ జననీలకు కూడా జేజేలు పలుక వలసిందని ఆదేశించినారు. ఈ ఆదేశం మేరకు ఆ విధంగా చెప్పడం అభ్యాసమయినది. చెప్పగా చెప్పగా ఏదో ఒకనాటికి “ఇది మనం ఆచరిస్తున్నామా?” అన్న ప్రశ్న రాక మానదు. ఆ విధంగా మానవాళి సంస్కరింపబడతా రన్నదే ఇందులోని అంతరార్థమని తోచుచున్నది.

ఈ విధంగా “కృతజ్ఞత అన్నది ప్రతి మానవుని ప్రధమలక్షణం” అన్న సూక్తి ద్వారా స్వామి దివ్యవాణిగా వెలువడిన ఉదాత్త భావాలను వ్యక్తీకరించడం జరిగింది. ఈ కృతజ్ఞతే ప్రథమ లక్షణంగా (్రతి మానవుడు భావించి ముందుకు సాగాలన్నదే ఈ సూక్తి యొక్క అర్ధము.

139 ఆచరణ లోపమే అన్ని అరిష్టాలకు మూలం జీవితంలో చెప్పినవి ఆచరించేవారు బహు తక్కువ మంది ఉంటారు. ఆచరణ లోపించడం వలన అనేకమయిన అనర్థాలు, అశుభాలు జరగడానికి కారణమవుతోందని భావము. చెప్పుట సులభము చేయుట కష్టము దాతకైన వాని తాతకైనా వినుము భారతీయ వీరసుతుడా | ఈ పద్యము భగవాన్‌ సత్యసాయి కొన్ని సందర్భాలలో తమ దివ్యోపన్యాసం ప్రారంభించే ముందు చదువుతుంటారు. చెప్పుట సులభము - ఎన్నెనా సులభంగా నోటితో చెప్పవచ్చును. చేయుట కష్టం - చెప్పిన విధంగా చేయడం ఆచరించడం ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో చాలా కష్టము. ఎన్నెన్నో చెబుతారు. ఒక్కటి కూడా చెయ్యరు. దాతకైనను, వాని తాతకైనను - ఎంతటి వారికైనా చెప్పింది ఆచరించాలంటే కష్టతరంగా అనిపిస్తుంది. భగవాన్‌ సత్యసాయి చిన్ననాడు బాలసాయిగా, సత్యన్నారాయణగా, రాజుగా అందరి చేత పిలువబడుతున్న కాలంలో 12 సం॥ల ప్రాయమందు పాఠశాలలో చదువుతున్న రోజులలో శ్రీ తమ్మిరాజు అను ఉపాధ్యాయుని ఆదేశం మేరకు తెలుగు భాషలో చక్కని నాటకమును రచించినారు. ఆ నాటకము పేరు “చెప్పినట్లు చేస్తారా? మానవుడు మనో దౌర్చల్యమును వీడవలెనని ప్రబోధించు నాటకమును రచించి అందు ముఖ్య పాత్రను తానే నటించి ప్రేక్షకులకు అపరిమితానందము కల్గించినారు. నాటకము విజయ వంతమయినది. కుప్తముగా నాటకమును గురించి తెల్సుకుందము. ప్రధమ రంగమున తెర ఎత్తగానే ఒక వనిత శ్రీ మద్భాగవతమును చదువుచు శ్లోకార్ధములు విపులముగ (శ్రోతలుగా నున్న స్త్రీలకు చెప్పుచున్నది. “సోమరి పోతులగు దృఢకాయులకు బిచ్చము పెట్టక కుంటి, గ్రుడ్డి, ముదుసలి, వ్యాధిగ్రస్థులైన వారికి, అశక్తులకు మాత్రమే అన్న వస్తదానముల నాచరించుట గృహిణులకు కర్తవ్య మను ధర్మమును బోధించినది. పురాణము అయిన వెంటనే స్రీలు అందరు వారి వారి ఇండ్లకు పోగా కుమారుడు, ఆమె మిగిలినారు. ఇంతలో ఒక అంధుడు ఖిక్షమునకై

140 వచ్చి ఎంత ్రార్ధించినను ఆయమ్మ మనసు కరుగక ఆ భిక్షకుని తిట్లు తిట్టి పంపివేసినది. మరుక్షణము ఆరోగ్యవంతుడు, పంగనామములు ధరించిన నొక విప్రుడు తంబూరా మీటుచు కీర్తనలు పాడుచు శుభ్రముగా తోమిన రాగి అక్షయ పాత్రతో రాగా ఆయమ్మ భక్తితో వాని నాహ్వానించి బియ్యము, డబ్బులు ఇచ్చి పాదనమస్కారము చేసి ఆశీస్సుల నర్ధించినది. పుత్రుడు తల్లి చేష్టలు తిలకించి “ఏమిటీ విచిత్రమైన నడవడి? అమ్మా! పురాణము చెప్పినప్పుడు బోధించిన బోధ ఒకటి. ప్రస్తుత సందర్భమున ఆచరణమరొకటి. నాకేమి బోధ పడుట లేదు” అని అడిగితే కోపముతో “నోరు మూయుము. ఎవరు గాని చెప్పినట్లు చేస్తారా? అంతటి పిచ్చి వారెవ్వరును లోకమున లేరు” అని తిట్టి, తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళి తండ్రి కూడా పిల్లవాణ్ణి మందలించునట్లు చేసినది. రెండవ రంగములో - ఉత్తమ ్రేణికి చెందిన గుమాస్తా ఉద్యోగమున నుండి తన గదిలో ఆఫీసుకు సంబంధించిన రికార్డు కట్టలతో సతమతమగుచుండు తండ్రి, కుమారునికి విద్యావిషయకమైన గంభీరోపన్యాసమొసగుచు ఎన్ని బాధలు పడియైన విద్య నభ్యసించుచు, పరీక్షల యందుత్తీర్డుడు కావలెననియు, విద్య లేనివాడు వింత పశువనియు, ఏవేవో శ్రీరంగ నీతులు చెప్పుచున్న సమయమున బీద విద్యార్ధి యొకడు, కిటికీలో నుండి తొంగి చూచుచు నేను కడు బీదవాడను. మీ వంటి పుణ్యాత్ములను యాచించి స్కూలు జీతము కట్టి చదువుకొనుచున్నాను. ఈ నెల జీతము కట్టుటకు నొక రూపాయి తక్కువగ నున్నది. ఈ పూట కట్టకపోతే పేరు కొట్టి వేయుదురు. ధర్మాత్ములు, మహారాజులు మీరీ దీనుని మొరాలకించి సహాయము చేయుడు” అని ప్రార్ధించెను. ఆ బాలునితో నిర్దాక్షిణ్యముగ తన యొద్ద దమ్మిడీయైన లేదని డబ్బు దాచుకొని, ఖాళీ సంచిని చూపి ఆ బాలుణ్ణి పంపివేయును. ఈ గుమాస్తా మిత్రులు గుంపుగా రాబోవు నూతనాధికారికి అల్పాహార విందు కొరకై చందాలు ప్రోగు చేసి తెచ్చి ఈయన ముందు పెట్టిరి. నూతన అధికారి మెప్పు పొందుటకు భారీ ఎత్తున వైభవముగా ఆతిధ్యమిచ్చుటకు ్రోగుచేసిన ధనమది. ఈతడు తనవంతు ఇరువై రూపాయలనిచ్చినాడు. బాలుడు ఈ వింత జూచి బీదవిద్యార్ధికి చిల్లుగవ్వ లేదని కోపముగా పంపించిరి. డబ్బులేదని అసత్యమాడినారు. విద్యా సంపాదనమును గూర్చి అంతకు ముందే ఉపన్యాసమిచ్చిరి! ఇది ఏమి అని అడిగితే “చెప్పినట్లు చేస్తారా? లోకమున నెవ్వరును చేయరు. నోరు మూసుకుని స్కూలుకి పో అని గద్దించినాడు. మూడవ రంగము - కృష్ణుడను పేరుతో పుత్రుని పాత్ర ధరించి మన కధానాయకుడే (బాలసాయి) పాఠశాలలో ప్రవేశించును. స్మూళ్ళ ఇన్‌స్పెక్టరు వచ్చునన్న గాబరాతో

141

ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రక్కకు పిలచి వారితో 238వ పాఠమునకు బదులు 32 పాఠములు పూర్తియైనదని అబద్ధమాడమని బలవంతము చేసి 38వ పాఠము (సత్య హరిశ్చంద్రుని చరిత్ర) పరిక్షాధికారి సమక్షములో చెప్పి తాను క్రొత్త పాఠము బోధించు చున్నట్లు నటింతునని, చెప్పిన విషయములనే ఆయన సమక్షములో అడుగుదునని, వెంట వెంటనే జవాబులు చెప్పవలెనని పాత పాఠమును అయ్యవారు బోధించుచున్నారన్న రహస్యము నెవ్వరూ బయట పెట్టకూడదని అట్లు చేసిన కఠినముగా దండింప బడుదురనియు విద్యార్థులకు చెప్పి ఆనాటికి పిల్లలనింటికి పంపినారు. పిమ్మట ఆ బాలుడు ఒంటరిగా మాష్టరును కలసికొని “సత్యమును హరిశ్చంద్రుని కథా మూలమున బోధించనెంచి, అసత్యపు నాటకమును ఇన్‌స్పెక్టరు ముందు మా చేత ఆడింపద్రలచు చున్నారే! ఇదేమి విపరీతము అని అడుగ “చెప్పినట్లు చేస్తారా?” అని ఉపాధ్యాయుడా విద్యార్థిని మందలించును.

చతుర్ధ రంగములో - కృష్ణుని గృహము. మరునాడుదయమున కృష్ణుడు పుస్తకములు పారవైచి, స్కూలుకు పోనని మొండి పట్టు పట్టును. తల్లిదండ్రులు స్కూలు మాష్టరునకు కబురు చేయుదురు. మాష్టరు రాగానే కృష్ణుడు మువ్వరి సమక్షమున “మీరు నాకు వ్రాయను, చదువను నేర్చించినారు. చదివిన చదువు ఆచరణలో బెట్టక సర్వమును మరచి పోవలసిందేనా? ఇదేనా మీరు నాకు బోధించునది? ఇట్టి చదువులు నాకు వద్దు. ముమ్మాటికి వద్దు” అని వారి మనసులకు నాటినట్లు చెప్పగా వారు ముగ్గురికిని బుద్ధి వచ్చి తమది తప్పేనని ఒప్పుకొని నాటి నుండి తమ గుణమును మార్చుకొని సత్యమైన ్రవర్తనముననే కాలము గడుపుదురు.

దీనివలన మానవులకు కనువిప్పు తప్పక కలుగును. దైనందిన జీవితంలో సామాన్యంగా ప్రతి చోటా జరిగే విషయాన్ని తీసుకుని చిన్న నాటనే ఈ విధమైన నాటకమును రచించి ఆనాడే చెప్పింది చెయ్యాలి, ఆచరించాలి అన్న భావాలు తనలో నాటుకొన్నవి ప్రపంచానికి కూడా తెలియాలన్న ఉన్నత ఆదర్శంతో (వ్రాసిన నాటకము ఇది.

ప్రతి విషయము చెప్పే ముందు ఎవరికి వారు “నేను ఆచరిస్తున్నానా? ఇది చెప్పే అర్హత నాకున్నదా?” అని యోచన చేయవలెను. చెప్పినవి మనం ఆచరిస్తున్నామా లేదా అన్నదానికి మన అంతరాత్మయే సాక్షి మనం ఎదుటివారిని నమ్మించడానికి ప్రయత్నించినప్పటికీ అంతర్‌ సాక్షి అనేది ఉండడం వలన ఆచరించని విషయాలు

142 చెబితే అంతరాత్మే మనల్ని వేధిస్తుంది. మన ఎదుట నున్న గురువు తనకి అన్నీ తెలుసున్నప్పటికి ఏమి తెలియని వాని వలె నటిస్తూ సమయమొచ్చినప్పుడు మన భావాలను (గ్రహించినట్లు సూచన ప్రాయంగా నొప్పించకుండా తెలియబరచి మనల్ని చక్కదిద్దుతాడు. ఆచరణ లేని అధ్యాత్మ వృధా అంటారు సత్యసాయి. అధ్యాత్మ సాధనలో ఆచరణ అనేది ఒకేసారి అభ్యాసము కాకపోయినా ప్రయత్నము చేత నిరంతరము కృషి చేయడం వలన ప్రతి మానవుడు కొన్నైనా ఆచరించగలుగుతాడు. ప్రతి విషయము మనము ఆచరించినప్పుడే పిల్లలకి గాని ఇతరులకు గాని చెప్పే అర్హత పొందుతాము. శ్రీరామకృష్ణ పరమహంస కాలములో జరిగిన ఒక సంఘటనను శ్రీ విశ్వంజీ తమ దివ్యోపన్యాసములో ప్రస్తావించారు. “ఒక వనిత తన మనుమణ్ణి ఒకరోజు శ్రీ రామకృష్ణ పరమహంస దగ్గరకు తీసుకుని వచ్చి ఈ విధంగా చెప్పినది. స్వామి! ఈ పిల్లవాడు స్వీట్లు అమితంగా తింటున్నాడు. ఆ విధంగా తినడం పనికి రాదని, మాన్పించమని డాక్టర్లు చెబుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా స్వీట్లు తింటూనే ఉన్నాడు. ఏమిచెయ్యలేక పోతున్నాము. ఇంట్లో ఎవరి మాటా వినిపించుకోవటం లేదు. మీరు చెబితేనయినా విని ఈ అలవాటు మానతాడని ఆరోగ్యం బాగుపడుతుందన్న ఆశతో తీసుకుని వచ్చాను. దయచేసి మీరు చెప్పండి” అని మొరపెట్టుకున్నది. రామకృష్ణ పరమహంస ఇది విని ఒక వారం రోజులు పోయిన తరువాత తీసుకుని రా చెబుతాను” అన్నారు. అదే విధంగా ఆమె ఒక వారం తరువాత తన మనుమణ్ణి స్వామి వద్దకు తీసుకుని వచ్చింది. అప్పుడు కూడా ఆయన మరొక వారం తరువాత రమ్మని చెప్పారు. మూడవ పర్యాయము తీసుకుని వస్తే తిరిగి ఒక వారం ఆగి రమ్మన్నారు. ఈ విధంగా ఆరువారాలు ఆమె మనుమజణ్ణి తీసుకుని రామకృష్ణుల వారి దగ్గరకు వస్తూనే ఉన్నది. ఆరవ వారం ఆ అబ్బాయి నమస్కారం చేసిన తదుపరి శ్రీరామక్భిష్ణుల వారు ఆ పిల్లవాడికి తీపి పదార్థాలు (3౪663) తినవద్దని, ఇదేవిధంగా తిన్నట్లైతే ఆరోగ్యము చెడిపోయి ఎంతో బాధ పడవలసి వస్తుందని మానేయమని చెప్పారు. ఆ వనిత ఈ మాట చెప్పడం కోసం ఆరు వారాలు ఎందుకు తిప్పాలి? వెంటనే అప్పుడే చెప్పి యుండవచ్చును కదా అనుకున్నది. శ్రీరామకృష్ణుల వారు తనకు తీపి పదార్థాలు తినే అలవాటు ఉందని, ఆ అలవాటు తను మానుకుంటే తప్ప, తాను ఆచరిస్తే తప్ప ఈ పిల్లవాడికి తినవద్దని చెప్పే అర్హత,

143

అధికారము తనకు లేదని, అందుచేత తాను స్వీట్లు తినే అలవాటు పూర్తిగా మానడానికి ఆరు వారాలు సమయం పట్టిందని, తాను స్వీట్లు తినడం ఆపివేసిన తరువాతనే ఆ పిల్ల వాడికి స్వీట్లు తినవద్దని చెప్పడం జరిగిందని చెప్తారు. అంతటి మహనీయులు మంచిమాటలు, మంచి పనులు, మంచి అలవాట్లు అమలు పరచటానికి సమయం తీసుకున్నప్పుడు, సామాన్య మానవులమైన మనబోటి వారికి ప్రతిదీ ఆచరించడానికి నిరంతరం సాధన కావాలి. ఒకనాటికి ఆచరించడం నేర్చుకోవాలని అభ్యాసమే మంచి గురువు అన్న పద్ధతిలో త్రికరణ శుద్ధితో మనసు మాట క్రియ ఒకే విధంగా ఉండే విధంగా సాధన సలిపినప్పుడే ఆచరించడం అలవడుతుందని స్పష్టమయినది.

ఆచరణ లోపించడం వలన కేవలం మాటలు చెప్పడం భగవద్గీత వంటి గ్రంధాలు పారాయణ చేయడం, గురు చరిత్ర మున్నగు సద్‌ గ్రంధాలు పారాయణ చేయడం వలన ఏమి ప్రయోజనం లేదని కనీసం కొన్నెనా ఆచరించాలని శ్రీ విశ్వంజీ తమ ఉపన్యాసములో చెప్పినారు. వారి బోధలు ఆచరణలో పెట్టినప్పుడు పరిపూర్ణ మానవత్వం సిద్ధిస్తుందనడం తధ్యము. వారు మరొక విశేషం కూడా చెప్పారు. “భారతీయ సనాతన ధర్మము దేనిని గుడ్డిగా నమ్మమని చెప్పలేదు. అనుసరించమనీ అనలేదు. మీ అంతరాత్మని ప్రశ్నించుకోండి. లేదా మీ గురువును అడగండి. మేధావుల్ని ప్రశ్నించండి. సత్యాన్ని ఆస్వాదించమని చెప్పిందే గాని తెలుసుకోకుండా నమ్మమని ఆచరించమని చెప్పలేదు. స్వానుభవం ద్వారా తెలుసుకొనవచ్చునని, దానికి శ్రద్ధ సాబూరి అవసరమని విశ్వంజీ తమ సందేశంలో తెలియబరచినారు.

భగవాన్‌ సత్యసాయి త్రికరణశుద్ధిని గురించి ఈ విధంగా చెప్పారు. “హృదయంతో పరిశీలన చేసి, తదుపరి చేతితో ఆచరించాలి. ఇదే విద్య ప్రధాన ప్రయోజకత్వము. ఇ. హెచ్‌.వి (24302602 11 00జ0 7213ల) కాదు ఇక్కడ కావల్సింది. త్రీ, హెచ్‌.వి అనగా మూడు 'హెచొలు (1686, 21, 1214 ) మొదట తల, తరువాత హృదయం, ఆ తర్వాత చెయ్యి ఆలోచన, పరిశీలన, ఆచరణ - ఇదే త్రికరణ శుద్ధి.”

ఏ విషయమైనా సరే తలలో ఆలోచన రావటం తోనే దానిని తొందరపడి అమలు పరచరాదు. మొదట తలతో ఆలోచన చేయాలి. హృదయంతో దానిని పరిశీలించాలి. తరువాత చేతిలో ఆచరించాలి. ఈ మూడు 'హెచ్‌ లకు చక్కటి ఉపమానం బాబా చెప్పారు.

144 'తడం వబ ; మంటంటవెం0య4; పటురంట2012". శంకరుని మేధస్సు, బుద్ధుని హృదయము; జనకుని హస్తం; - మీ సొంతం చేసుకోండి! పూర్ణ మానవులు కండి” అన్నారు సత్యసాయి. “ఈనాడు ప్రపంచంలో భగవద్గీత ప్రచారము గాని, పారాయణము గాని అధికంగా జరుగుతున్నది. కాని భగవద్గీతలో తెల్పబడిన విషయాలు ఏ ఒకటి రెండైనా ఆచరించేవారు లేరు. ఆశించడంలో హీరోలు - ఆచరించడంలో జీరోలు. రామాయణం ఎన్నిమార్లు పారాయణ చేసినా పితృవాక్య పరిపాలన సాగించే వాడొక్కడూ లేడు. బైబిల్‌ ఖురాను, మున్నగునవన్ని పరించడంతోబాటు ఆచరించాలని జీవితమంతా తెలుసుకోవడానికే ప్రయత్నిస్తే ఫలితము లేదని, ఆచరణ వలననే ఫలితము లభిస్తుందని ఆవేదనతో శ్రీ సత్యసాయి పలికినారు. భగవద్గీతలో “మానవతా విలువలు” అన్న అంశము పరిశీలించినప్పుడు ఎన్నో

విలువలను భగవద్గీత మానవులకు అందించినది. భగవద్గీతలో ముఖ్యమైన, ఆచరించదగిన విశేషములు భక్తి యోగములో 18వ శ్లోకము నుండి 19వ శ్లోకము వరకు శ్రీకృష్ణుడు వివరించిన 85 లక్షణములను, అందులో కొన్నింటినైనను ఆచరించిన మానవుడే భగవదనుగ్రహము బడయ గలడని చెప్పిన వాటిని తెలుసుకుందాము. దీనికి “ధర్యామృతం” అని పేరు. 20వ శ్లోకములో ఈ విషయము చెప్పబడినది.

  1. అద్వేష్టా సర్వభూతానాం - ఏ ప్రాణిని కూడా ద్వేషింపకుండుట.

  2. మైత్రి - స్నేహభావము.

  3. కరుణ - దయ, భూతదయ, జాలి.

  4. నిర్మమ - మమకారము లేనివాడు.

  5. నిరహంకారః - అహంకార స్వభావము లేకుండుట

6 సుఖదుఃఖ - సుఖదుఃఖములందు సమభావము కలవాడు

  1. క్షమీ - ఓర్పుకలవాడు

  2. సంతుష్టస్సతతం - ఎల్లప్పుడూ సంతోషం కలవాడు.

  3. యోగీ - యోగసాధన యందు అనురక్తుడు

  4. నియతాత్మ - నియమింపబడిన మనస్సు కలవాడు (మనో నిగ్రహము) క్ర ధృడ నిశ్చయం - పట్టుదల, ధృడ నిశ్చయము గలవాడు

145 12) మయ్యర్పిత మనోబుద్ధిః - భగవంతుడు సమర్పించిన మనోబుద్ద్ధులు కలవాడును 18) యస్మాన్నోద్విజతేలోకాా - లోకాన్నో ద్విజతేచయః

  • లోకము వలన తాను గాని తనవలన లోకము, గాని అసహ్యించుకొనకుండుట (సత్యపధవర్తనునికే ఇది సాధ్యము)
  1. హర్షమర్షభయోద్వేగై - హర్షము, క్రోధము, భయము మొదలగు గుణముల గ్గ నుండి విడువబడినవాడు.
  2. అనపేక్ష - కోరికలు లేనివాడు
  3. శుచిః - బాహ్యంతర శుచి గలవాడు.
  4. దక్షః - కార్య సమర్హుడును.
  5. ఉదాసీనో - దేనియందు (ప్రాపంచిక విషయములందు) తగలని మనస్సు గలవాడు; స్థిరమైన లేక తటస్థమైన
  6. గతవ్యధః - దుఃఖము, దిగులు లేనివాడు, మనోవ్యాకులత లేనివాడు
  7. సర్వారంభ పరిత్యాగి - సమస్త కార్యము లందు కర్షృత్వము వదల గల్లినవాడు లేదా సమస్త కార్యకర్మలను, శాస్త్ర నిషిద్ధ కర్మలనుత్యజించినవాడు.
  8. నహృష్యతి - హర్షము లేనివాడు (ఉప్పొంగి పోవుట లేనివాడు)
  9. నద్వేష్టి - ద్వేషము లేనివాడు
  10. నశోచతి - శోకము లేనివాడు
  11. న కాంక్షతి - కోరికలు లేనివాడు. (15 . 24)
  12. శుభాశుభ పరిత్యాగి - శుభాశుభములను సమముగా చూచువాడు.
  13. సమశ్ళత్రౌచ మిత్రేచతథా - శత్రువునందు, మిత్రుని యందు సమభావము కలవాడు

క్‌ యయ 0) $ 742 ళ్ళ రా ఈ టక2ా22222 మూనవ మానయో - గొరవమో, యవాయా. న్యా నా సుఖ దుఃఖిషు - సుఖ దుఃఖములను సమముగా దర్శించువాడు. /| /॥ | తెర సంగపస్టితః - దేనియందును ఆసక్తి మనస్సంబంధము లేనివాడు. |! || . | తి1) తుల్యానిందా స్తుతి - నిందా స్తుతులను సమభావముతో స్వీకరించువాడు . | | 32) మౌనీ - మౌననియమము కలవాడు / . | 38) యేనకేనచిత్‌ సంతుష్ట - దొరికిన దానితో సంతుష్టి పడువాడును. . కళ) అనికేతః - నిర్దిష్టమగు నివాసము లేనివాడు, గృహముల యందు ఆసక్తి లేనివాడు. 1 తేల స్థిరబుద్ధి - నిశ్చయమైన బుద్ధి కలవాడు; భక్తిమాన్‌-భగవంతుని యందు భకీ | పైన చెప్పబడిన 85 గుణములలో ఏ కొద్ది గుణములనైననూ ఆచరించు జనుడు

  1. నాకిప్పుడు అని గీతాచార్యుడు చెప్పుచూ, అట్టి ఆచారణ ద్వారా సాధన చేసిన వానికి 1 మాత్రమే భగవదనుగ్రహము కల్గును” అని అర్జునుని ద్వారా కృష్ణుడు మనకీ ఆదర్శ | |, విలువలను “దార్యమృతమ్‌” అను పేర అందించినాడు అని శ్రీ సత్యసాయి బాబా 1 వారు వివరిస్తూ ఒక సందర్భంలో ఈ శ్లోకాన్ని ఉదాహరణలతో ఇంకా ఇలౌ . | శ్లో; సత్త్వం సుఖేన జ్ఞాయతి రజః కర్మణి భారత ఓ ఇ జ్ఞాన మావృత్యుతు తమః ప్రమాదే సజ్బయత్యుత (గీ॥ 149) / _ సత్వగుణము సుఖము నందును, తమో గుణము వివేకమును సహితము కప్పి వైచి గ ప్రమాదము నందు జీవుని చేర్చుచున్నది. తమో గుణము అధికముగా గల వాడు శ్బాబున్నా( | వ నీచకర్మలాచరించి నీచ జన్మల పొందుచున్నాడు. రజోగుణము అధికముగా గలవాడు | ప్రాపంచిక విషయాసక్తుడై మరల మరల జన్మించుచున్నాడు. సాత్విక గుణమఖభివృద్ధి క. యైనవాడు భగవంతుని చేరి మోక్షమును పొందుచున్నాడు. | .

147

ఈ విధంగా అధ్యాత్మ ఆచరణ దైనందిన జీవితంలో మానవుని కత్యంత ఆవశ్యకమని, ఆ విధంగా ఆచరించుటకు తగిన సాధన చెయ్యడం కోసమే శ్రీ విశ్వంజీ వంటి మహా గురువులు ఇటువంటి సూక్తులు వచించడంలోని అంతరార్థము.

భౌతికంలో కూడా మానవుడు తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూ కుటుంబము పట్ల సమాజము పట్ల సేవాభావం పెంపొందించుకొని జీవనయానం సాగిస్తూ అన్నమాట నిలుపుకోవడం అభ్యాసం చేసుకుని దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి, అలవరచుకొని మానవత్వం గల మానవుడుగా పరిపూర్ణమైన దైవకృపకు, గురుకృపకు పాత్రుడు కావలెనన్నదే మహాయోగుల అవతార పురుషుల ఆశయము. అందుచేత ఆచరణ జీవితంలో అభ్యాసం చేస్తూ ఆచరణలోపం జరుగకుండా ఏ అరిష్టాలు కొని తెచ్చుకోకుండా జీవించాలన్నదే ఈ సూక్తిలోని అర్ధము, అంతరార్థము.

146 27) మానవ మానయో - గౌరవము, అగౌరవములందు సమభావము కలవాడు. 28) శీతోష్ణ - శీతలము, ఉష్ణములను సమముగా దర్శించువాడు. 29) సుఖ దుఃఖేషు - సుఖ దుఃఖములను సమముగా దర్శించువాడు. 30) సంగవర్ణితః - దేనియందును ఆసక్తి మనస్సంబంధము లేనివాడు.

  1. తుల్యానిందా స్తుతి - నిందా స్తుతులను సమభావముతో స్వీకరించువాడు
  2. మౌనీ - మౌననియమము కలవాడు
  3. యేనకేనచిత్‌ సంతుష్ట - దొరికిన దానితో సంతుష్టి పడువాడును.
  4. అనికేతః - నిర్దిష్టుగు నివాసము లేనివాడు, గృహముల యందు ఆసక్తి లేనివాడు.
  5. స్థిరబుద్ధి - నిశ్చయమైన బుద్ధి కలవాడు; భక్తిమాన్‌-భగవంతుని యందు భక్తి కలవాడును పైన చెప్పబడిన 85 గుణములలో ఏ కొద్ది గుణములనైననూ ఆచరించు జనుడు నాకిప్పుడు అని గీతాచార్యుడు చెప్పుచూ, అట్టి ఆచారణ ద్వారా సాధన చేసిన వానికి మాత్రమే భగవదను[గ్రహము కల్లును” అని అర్జునుని ద్వారా కృష్ణుడు మనకీ ఆదర్శ విలువలను “దార్యమృతమ్‌” అను పేర అందించినాడు అని శ్రీ సత్యసాయి బాబా వారు వివరిస్తూ ఒక సందర్భంలో ఈ శ్లోకాన్ని ఉదాహరణలతో ఇంకా ఇలా వివరించినారు. శ్లోః సత్త్వం సుఖేన జ్ఞాయతి రజః కర్మణి భారత జ్ఞాన మావృత్యుతు తమః ప్రమాదే సబ్బ్వాయత్యుత (గీ॥ 149) సత్వ గుణము సుఖము నందును, తమో గుణము వివేకమును సహితము కప్పి వైచి ప్రమాదము నందు జీవుని చేర్చుచున్నది. తమో గుణము అధికముగా గల వాడు నీచకర్మలాచరించి నీచ జన్మల పొందుచున్నాడు. రజోగుణము అధికముగా గలవాడు ప్రాపంచిక విషయాసక్తుడై మరల మరల జన్మించుచున్నాడు. సాత్విక గుణమఖభివృద్ధి యైనవాడు భగవంతుని చేరి మోక్షమును పొందుచున్నాడు.

14/7

ఈ విధంగా అధ్యాత్మ ఆచరణ దైనందిన జీవితంలో మానవుని కత్యంత ఆవశ్యకమని, ఆ విధంగా ఆచరించుటకు తగిన సాధన చెయ్యడం కోసమే శ్రీ విశ్వంజీ వంటి మహా గురువులు ఇటువంటి సూక్తులు వచించడంలోని అంతరార్థము.

భౌతికంలో కూడా మానవుడు తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూ కుటుంబము పట్ల సమాజము పట్ల సేవాభావం పెంపొందించుకొని జీవనయానం సాగిస్తూ అన్నమాట నిలుపుకోవడం అభ్యాసం చేసుకుని దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి, అలవరచుకొని మానవత్వం గల మానవుడుగా పరిపూర్ణమైన దైవకృపకు, గురుకృపకు పాత్రుడు కావలెనన్నదే మహాయోగుల అవతార పురుషుల ఆశయము. అందుచేత ఆచరణ జీవితంలో అభ్యాసం చేస్తూ ఆచరణలోపం జరుగకుండా ఏ అరిష్టాలు కొని తెచ్చుకోకుండా జీవించాలన్నదే ఈ సూక్తిలోని అర్ధము, అంతరార్థము.

148

అహంకారమే మనిషి పతనానికి మూలం

అహంకారము - అనగా నేను; నాది అంటే మమకారము. తనకంటే గొప్పవారు, తనకంటే మంచివారు ఎవ్వరూ ఈ జగత్తులో లేరు అని భావించడమే అహంకారము. తాను చేసినదే సరియైనది; ఇతరులు చేసిన పనులేవి తన పనికి సాటిరావు; తాను ఏది చెబితే అది అందరూ వినాలి; అన్నీ తనకే తెలుసును ఇత్యాది లక్షణములన్నీ అహంకారమునకు గుర్తులే. ఈ విధమైన అహంకార పూరితమైన భావాలు మనిషి పతనానికి మూలమని ఈ సూక్తి యొక్క భావము.

ఈ అహంకారము ఒక్కరోజులో మాయమయ్య్యేది కాదు. క్రమక్రమంగా మనలో పాతుకొనిపోయి ఉన్న ఈ అహంకారాన్ని సాధన ద్వారా నిర్మూలించుకుందుకు ప్రయత్నించాలి. దశలు వారీగా మానవులు చేస్తున్న సాధన, ఆచరణల ద్వారా అహంకారమును నిర్మూలించుకొనవచ్చును.

అహంకారము నుండి పుట్టినవే అసూయ, కోపము. ఆ రెండింటిని నిర్మూలించి అహంకారంలోని కారం తీసివేస్తే ఇంక మిగిలింది 'అహం” ఒక్కటే. అప్పుడు మీరు ఆ ఉపకరణంతో “అహం బ్రహ్మాస్మి” అనే అనుభూతి పొందగలరు. ఆ స్థాయికే, ఆ బెన్నత్యమునకే మానవులు చేరవలసింది. అహంకారంలోని 'కారం' చిన్న గింజవంటిది. దానిలో నుంచి మొక్కపుట్టి, వృక్షమై, శాఖోపశాఖలై, మరల అటువంటి గింజలే, బస్తాల కొద్దీ ఏర్పడటానికి కారణమవుతుంది. అందుకని దీనిని మొదటి దశలోనే నలిపి వేయాలి. అప్పుడు అహం అనే విశ్లేషణ “అయమాత్మ బ్రహ్మ అనే భావనలోనే పుట్టి అందులోనే అంతమవుతుంది. ఈ అహమే ఆత్మ. అదియే బ్రహ్మము.

(ప్రప్రథమంగా మానవుడు “నేను” నుండి 'మనము' అను స్థితికి రావాలి. వ్యష్టి నుంచి సమష్టికి రావడానికి ప్రయత్నము చేయవలెను. ఒక్కకీర్తన పాడితే తానొక్కడే ఆ ఆనందాన్ని అనుభవించి ప్రశాంత చిత్తుడౌతాడు. అదే క్తీర్తన నలుగురు కలిసి పాడినప్పుడు సంక్తీర్తనగా మారి వాతావరణాన్ని దివ్యముగా మార్చగలదు. కలిసి గానం చేస్తే కలిగే దివ్యానుభూతి గొప్పది. ఒక్కరే పాడి వారే ఆ ఆనందాన్ని అనుభవించకుండా, అదే అనుభూతి ఈ విధంగా నలుగురితో వారి ఆనందాన్ని పంచడమే ప్రేమ. (నీవు నిన్ను

149 'ప్రేమించుకున్నట్లే ఇతరులను కూడా (ప్రేమించు. అదియే సమైక్యతకు తార్మాణము.) “నీ కుటుంబ సభ్యుల్ని పిల్లల్ని భార్యని 'ప్రేమించినట్లు ఇతరులను కూడా సమానంగా (పేమించడం నేర్చుకోవడమే (పేమను విస్తృతం చేయి అనడంలో అంతరార్ధము (౫020630 10*ల. భగవంతుడు (ప్రేమ స్వరూపుడు. (ప్రేమ పరమాత్మ స్వరూపము. మీరు మీ హృదయాన్ని ప్రేమతో నింపితే అసూయ, ద్వేషము, అహంకారములు లోపలకు ప్రవేశింపలేవు. (డేమనిండిన భూమిపై ప్రకఖయము ఉండదు.”

ఈ (పేమను అభివృద్ధి పరచుకున్ననాడు “సేవాభావం నీలో రేకెత్తడానికి అవకాశమున్నది. సేవ చేస్తూ పోతే అహంకారం నశిస్తుంది. (ప్రేమను పెంపొందించుకొని “మానవసేవే మాధవసేవాయని “దీనజన సేవయే దివ్యమైన సేవ” అన్న భావంతో పరులకు సేవలందించినప్పుడు అహంకారం నిర్మూలనమవుతుంది. “ఇచ్చుకొనుము 'సేవ పుచ్చుకొనుము ప్రేమ”. “అందర్ని సేవించు. అందర్ని ప్రేమించు” (10౪6 211 561౪76 211) అని భగవాన్‌ సత్యసాయి చెప్పినట్లు కాలాన్ని కాయాన్ని వృధా చెయ్యక నమాజాన్ని ప్రశాంతి నిలయంగా మార్చటానికి మానవాళి సేవా మార్గంలో పయనించినప్పుడు అహంకారము నశించి, అహం స్ఫురణ గల వ్యక్తులుగా తయారగుదురు. అహం స్ఫురణ ఉన్నప్పుడు అహంకారానికి తావు లేదు. అహం స్ఫురణ అనగా నేను ఆత్మను అన్న ఎజుకతో నుండడమే! నేను యజమానిని, నేను నౌకరును అన్న భావం చంపుకొని అసలు “నేన్స కనుగొందుకు ప్రయత్నించి సాధన చేత శోధనచేత నేనెవము? అని రమణ మహర్షి చెప్పినట్లుగా “నేనెవరు?” అన్న విషయాన్ని కనుగొనడానికి ప్రతి మానవుడు కృషి చేయవలెను. ఇటువంటి ఆత్యేక స్థితిలోకి వెళ్ళడానికి ప్రాపంచిక బంధనాలు తగ్గించుకోవాలి. మనము అనేక వాసనలు జన్మ జన్మల నుంచి ఉన్న వాటిని ప్రపంచం లోనికి మోసుకుని వచ్చాము. అటువంటి బంధనలను జన్మాంతరంగా మనతో వచ్చిన వాసనలను తగ్గించుకొందుకు ప్రేమను 'పెంపొందించుకుంటూ సాధన చెయ్యవలెను. హస్తమున అణుబాంబు ఉంచుకొని అరచుచుందురు. శాంతి శాంతి అని అరచినంత మాత్రమున లభ్యమయ్యేది కాదు శాంతి. అంతర్గతంగా ప్రతిమానవుడు తనకు తాను శాంతిని పొంది అనుభవించడానికి తగిన కృషి చెయ్యాలి తప్ప బయట ప్రపంచంలో వెతికితే దొరికేది కాదు శాంతి అంటారు

150

భగవాన్‌ బాబా. మానవుడు నామం ద్వారా, ధ్యానం ద్వారా నిస్వార్థమైన సేవ ద్వారా అంతర్గత మౌనాన్ని సాధిస్తూ తాను శాంతిని హృదయంలో నింపుకొని ప్రపంచ బంధనాల నుంచి తప్పించుకుంటూ తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూ దైనందిన జీవితంలో తాను ఆచరించే కర్మలన్ని భగవదర్చితం గావిస్తూ జీవించిన నాడు శాంతి వెల్లివిరిసి నిరహంకార పూరితుల్ని చేస్తుంది. అహంకారము వలన సంకుచితమైన ఆలోచనా విధానం నలన మానవుడు స్వార్ధంతో జీవించిననాడు తన అహంకారమే తన పతనమునకు మూలకారణమవుతుంది.

“ప్రతి మనిషి నైతిక విలువలతో, మానవత్వం కలిగి ఉంటే అతనిలో దైవత్వం ఇహిర్గతమై సమాజ (శ్రేయస్సుకు దోహదపడుతుంది. మితిమీరిన అహంకారమే, మానవుని పతనానికి హేతువు. నేడు సమాజంలో మానవుడు అహంకారంతో ఎంతో నీచంగా ప్రవర్తిస్తున్నాడు. మానవులలో ఉన్న పశుత్వాన్ని తొలగించేందుకు యజ్ఞ యాగాదులు దోహదపడగలవు” అని శ్రీ విశ్వంజీ అయ్యప్పస్వామి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మాట్లాడిన దివ్యోపన్యాసంలో చెప్పినారు (18-4-98)

ప్రపంచంలో అందరూ విశ్వశాంతి కోసం సమైక్యంగా కుల, మత బేధాలు విస్మరించి సోదర భావంతో ఉండి మానవ హక్కుల సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి మనిషికి మానవత్వం ఎంతో ముఖ్యమని దాన్ని పరిరక్షించుకొని, (పేమ తత్త్వాన్ని అలవరచుకొని సమస్త జీవరాశుల యందు కరుణ, దయ కలిగి ఉండాలని ఉద్భోదించారు. అహంకారము మనిషి పతనానికి మూలకారణము దాన్ని విస్మరింపోొమని వక్కాణించారు.

మానవుడు తాను తీసుకునే ఆహారాన్ని బట్టి గుణాలు ఏర్పడతాయి. “సాత్వికాహారం ద్వారా మీ గుణాలను సరిదిద్దుకుంటూ వెళితే అహంకారం దానంతట అదే నిర్మూలమై పోతుంది. తమో గుణంలో ఏమీ తెలియని మొద్దులాగ ఉండి ఇతరులు చెప్పింది విన గలుగుతాడు. రజో గుణంలో మాత్రం అన్నీ నాకే తెలుసుననే అహంకారం ప్రవేశిస్తుంది.

ఈ గుణం మానవుణ్ణి పై స్థాయికి తీసుకు వెళుతున్నట్లు భ్రమింపజేస్తూ, పతనానికే దారి తీస్తుంది. ఈ గుణంలో మాయ తన పూర్తి స్థాయిలో విజృంభిస్తుంది. రజోగుణాన్ని

151

దాటటానికి సాధనా బలాన్ని తోడు తీసుకోవాలి. రజోగుణం బుసలు కొట్టే పాము పడగలాంటిది. అందువల్ల దీనికి సాత్వికమనే నాగస్వరాన్ని ఊదుతూ ఉండాలి. అపుడు ఇది అహంకారమనే మాయను వదిలేసి, సాత్వికమనే నాగ స్వరానికి లోబడుతుంది. రజో గుణాన్ని ఇలా వదిలేస్తే పరమాత్ముడిని మరపించి, ప్రపంచాన్ని కబళించే గొప్ప శత్రువుగా మారుతుంది. అందుకనే రజోగుణంలో ఉన్నప్పుడు తీవ్రమైన సాధన ద్వారా సాత్వికం లోకి అడుగు పెట్టాలి. తమోగుణంలో పతనం వుండదు. పై స్థాయికి వెళ్ళలేడు. రజోగుణంలో మాత్రం వీలైనంత వరకు నిన్ను పతనావస్థకు తీసుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. ఇదే తీవ్రమైన సాధన ఉంటే సాత్వికంలోకి అడుగుపెట్టే ద్వారంగా మారుతుంది. రజోగుణ స్వభావమే అహంకారంతో నిండి ఉందే గని లాంటిది. మీ నిరంతర ప్రయాణంలో అహంకార నిర్మూలనే మీ ముఖ్యోద్దేశంగా మారాలి. అప్పుడే మీకు భగవంతుడు చేయూత నందించి జన్మ సాఫల్యానికి తోద్పడతాడు”. (భగవాన్‌ సత్యసాయి దివ్యోపన్యాసం నుండి, శ్రీ సత్యసాయి జ్ఞాన రత్నాకరము, పుట 59)

“ఆంతూనాం నరజన్మ దుర్లభం”. మానవజన్మ వచ్చినందులకు సార్ధకముగావించు కొనే నిమిత్తమై బుద్ధి విచక్షణా జ్ఞానం, వివేకం కలిగి సంచరిస్తూ సాధనా మార్గంలో ముందడుగు వేస్తూ మానవతా విలువల్ని పరిపోషిస్తూ అందున్న అర్ధం, అంతరార్థం (గ్రహించి ఆచరణ ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్నదే మహనీయుల ఆశ, ఆశయము. “పశు భావంబులు వీడి పశుపతియగుట” కొరకే మనకీ మానవజన్మ భగవంతుడు ప్రసాదించినాడు. పశు భావాల్ని అభివృద్ధి పరచుకున్ననాడు అహంకార పూరితమైన మనస్సుతో అహంకారాన్ని పెంపొందించుకుంటూ పోతే మానవుడికి పతనము తప్పదన్నదే ఈ సూక్తి భావము.

“నేను సాధించాను” అనుకునే దాని కంటే భగవంతుడు, నాకీ అవకాశాన్ని ఇచ్చి, నాచేత ఈ విజయాన్ని సాధింప జేశాడు. గురువు అనుగ్రహం లేనిదే ఈనాడు నేను ఈ విధంగా ఉండేవాడిని కాదు అన్న భావమే మానవుణ్ణి ముందుకు నడిపిస్తుంది. ఎంతటి ఉన్నత స్థితి సంపాదించినప్పటికీ, ఎన్ని పదవుల నేలినప్పటికినీ, అంతా భగవంతుని ప్రసాదమే. ఆయనే వెంట లేకపోతే ఇవన్ని నాకు జీవితంలో సాధ్యమయ్యేవి కాదు కదా. ఆ గురువు కరుణా కటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించకపోతే నాకీ సంపదలు

152

గాని, ఈ పదవులు గాని వచ్చేవి కాదు కదా! అందుచే నాచేత ఏదైనా కార్యం ఆయన ఉద్యమంలో కూడా, చేయిస్తే బావుండును అన్న భావం ఎంత మధురమైనదో కదా!

శ్రీ విశ్వంజీ ఈనాడు మేధావులకు, ఇతరమైన వృత్తులలో ప్రావీణ్యత పొంది ప్రత్యేక విభాగములలో వివిధ రంగములలో పనిచేయు వారందరకు కూడా సమైక్యమై అహంభావమును వదలి ఆత్మ తత్త్వమును తెలుసుకుని ప్రపంచ శాంతికి కృషి చెయ్యాలని పదే పదే హెచ్చరించుచున్నారు. వారి ధ్యేయం, వారి లక్ష్యం, వారి గమ్యం వైపు అందరూ వారితో బాటు కృషి చెయ్యాలని ఉద్దాటించుచున్నారు.

అందుచేత ఎన్ని ఉన్నప్పటికి, ఎంత సాధించినప్పటికి ఎంత నేర్చినప్పటికి, భగవంతుని ముందు తలవంచ వలసిందే! ఆ వినయభావమే మనిషిలో అహంకార రాహిత్యము కలిగించి పతనావస్థకు గురి కాకుండా కాపాడుతుంది. వారి అవ్యాజమైన కరుణకు, అనుగ్రహానికి, దయకు, (ప్రేమకు మించినదేదీ ఈ జగత్తులో లేదు. అదే మనందరికి ఆశీర్వాద బలం; ఆశయం, ఆనందం, అధగమ్యం, అభిరమ్యమ్‌.

153 జ్ఞానమే భగవత్‌ స్వరూపం

జ్ఞానమనగా ఆత్మజ్ఞానము. ఈ ఆత్మ జ్ఞానమే భగవత్‌ స్వరూపము. ఈ విశ్వములో నిండియున్న మహాశక్తి భగవంతుడు. ఆ శక్తినే ౦9౧0 616౦6౮౦ ౧280060 10806 గా శ్రీ విశ్వయోగి అభివర్ణించారు. “కణ కణమ్ము నందు కలడురా పరమాత్మ అంటూ ఆ మహాశక్తి విశ్వమంతా నిండియున్నదని కూడా స్వామి చెప్పారు. ఈ విశ్వ మహాశక్తియే వ్యక్తిలోని ఆత్మ. ఈ రెండింటికి భేదము లేదన్న అద్వైత భావన, ఆ ఎఅుకయే జ్ఞానము. ఆ జ్ఞానమే భగవంతుడు.

భగవంతుడనగా ఎవరు? అన్నదానికి భగవాన్‌ సత్యసాయి తమదైన ఒకానొక దివ్యోపన్యాసంలో ఈ విధంగా తెల్పినారు. ఐశ్వర్యం, ధర్మం, పూర్ణత్వం, యశస్సు, జ్ఞానం, వైరాగ్యం - ఈ ఆరు గుణములకు “భగము” అని పేరు. ఈ భగమును కల్గినవాడు కనుకనే పరమాత్మునికి “భగవాన్‌” అని పేరు. భగవంతుని నామములన్నీ ప్రత్యేక ప్రమాణములతో కూడినవే గాని కేవలం భక్తుల (ప్రేమోన్మాదము చేత ఉచ్చరించినవి కాదు. భగవంతుడు నాల్గు విధములైన విభూతులతో ఆత్మ స్వరూపుడుగా భాసిస్తున్నాడు. ఇతనికే “చతురాత్మ” అని పేరు. 1) వాసుదేవ 2) సంకర్షణ 3) అనిరుద్ధ 4) ప్రద్యుమ్న వీటి యందు మొదటి మూడు తత్త్వాలను చక్కగా గుర్తుంచుకుంటే నాలుగవదైన ప్రద్యుమ్న తత్త్వం మనకు సులభంగా అర్ధమౌతుంది.

వాసుదేవ - *ఈశావాస్యమిదం జగత్‌”. జగత్తులో అంతటా నివసించిన వాడు వాసుదేవుండు. ఈ జగత్తంతయు తన వశము చేసుకొన్నవాడు వాసుదేవుడు. కనుక వాసు దేవుడనగా - సర్వభూతముల యందు ఆత్మ స్వరూపుడుగా ఉంటున్నవాడు. కేవలము అందరి యందు మాత్రమే కాక సర్వత్రా వ్యాపించిన వాడు వాసుదేవుడు. అందు చేతనే - “అంతర్చహిశ్చతత్సర్వం వ్యాష్య నారాయణ స్థిత అన్నారు. మనలోపల వెలుపలా సర్వత్రా ఉండినవాడు ఈ వాసుదేవుడే. సర్వత్రా వ్యాపించినవాడు కనుకనే ఇతనికి “వాసుదేవుడు” అని పేరు.

సంకర్షణ - సర్వజీవులను తనవైపు ఆకర్షింప జేసుకొనేవాడే సంకర్షణుడు. అంతేగాక, ఇతడు సర్వజీవులను తననుండియే ఆవిర్భవింపజేసి నటువంటి వాడు.

154 “సంకర్షణ” అనే పదంలో, సం - అనగా పవిత్రత. కనుక, సంకర్షణుడనగా - పవిత్రతను ఆకర్షించే వాడు అని అర్ధము. అంతేగాక ఈ సంకర్షణ తత్త్వం సాలోక్య, సారూప్య, సామీష్య, సాయుజ్య తత్త్వములకు సంబంధించినది.

అనిరుద్ధుడు - అనిరుద్ధ - సర్వశక్తిమయుడు, సర్వ వ్యాపకుడయిన తత్త్వానికే “అనిరుద్ధత్వముూ" అని పేరు. ఇతని అనుగ్రహం చేతనే ఇతనిని సాధించవచ్చును గాని, వేరొక మార్గంలో అతనిని సాధించుటకు ఎవ్వరికీ వీలుకాదు.

ప్రద్యుమ్న - అనంతమైన ఐశ్వర్యం కలిగినవాడు ప్రద్యుమ్నుడు. భగవంతుని ఆశ్రయించిన వారికి, ఆరాధించిన వారికి, ప్రేమించిన వారికి సర్వ సుఖములను, ఆనందములను అనుగ్రహిస్తూ, వారి అభీష్టములను నెరవేర్చుతుంటాడు. ఈ ఐశ్వర్యము అనగా ధన, కనక, వస్తు వాహనాదులు మాత్రమేకాదు. ఆరోగ్యం, విద్య, బుద్ధి, గుణం

_ ఇవన్నీ ఐశ్వర్యములే. కనుక, ఇతడు సకలైశ్వర్య స్వరూపుడగుట చేత ఇతనికి “ఈశ్వరుడు” అని మరొక పేరు కలదు.

ఇటువంటి సకలైశ్వర్య స్వరూపుడైన జ్ఞాన సంపన్నుడైన భగవంతుణ్ణి “సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ” అంటూ స్వామి నిత్యసత్యమైన అనంతమైన జ్ఞానాన్ని గురించి తెలియజేస్తూ పాడతారు. ఆ పాటనే శ్రీ విశ్వంజీ కూడా తమ దివ్యోపన్యాసం తరువాత కొద్దిగా మార్పు చేసి ఈ క్రింది విధంగా పాడినారు. ఏ విధంగా పాడినా భగవత్‌ స్వరూపం జ్ఞానం అన్న విషయమే ఇందులో కూడా చెప్పబడినది.

జ్ఞానం బ్రహ్మ, జ్ఞానం సత్యం జ్ఞానమనంతం

బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ సత్యం, బ్రహ్మ అనంతం.

ఈ విధంగా అనంతమైన విశ్వశక్తిని, జ్ఞాన స్వరూపంగా భావించి సత్యమే జ్ఞానమని, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మసత్యం, బ్రహ్మ అనంతం అని సాక్షాత్తూ జ్ఞాన సరస్వతీ దేనికి హృదయ స్థానమైన (బ్రహ్మం జ్ఞానంగా, సత్యమే జ్ఞానంగా అనంతంగా వెలుగొందుతోందని, ఆ విధంగా వెలుగొందే శక్తియే జ్ఞానమని ఆ జ్ఞానమే భగవత్‌ స్వరూపమని ఇచట భావము.

155

సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు

మేటి వస్తువునందున మేటియగుచు

అంతటను సర్వసాక్షియై యలరునట్టి

ఆత్మయే బ్రహ్మ బ్రహ్మమే ఆత్మయగును. (శ్రీ సత్యసాయి దివ్యోపన్యాసముల నుండి)

“ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్త్వమసి, అహం బ్రహ్మాస్మి అనే నాలుగు మహావాక్యాల ద్వారా సత్యము, జ్ఞానము ప్రకటితమగుచున్నవి.

“ప్రజ్ఞానం బ్రహ్మ” యే అండం, పిండలింగముగా సంకేత రూపంలో చెప్పబడినది. ఒకే ఏకత్వము అనేక విధములైన తత్త్వములతో కనిపిస్తున్నది. వ్యక్తిపరమైనది విశ్వాత్మకంగా వ్యాప్తి పొందటం జరిగింది. నేను అనేది విస్తరించి “ఆయన, మనము అయినాము. ప్రజ్ఞానం బ్రహ్మ “నేను వెలుగులో ఉన్నానూ అన్న విషయం తెలియబరచినది.

రెండవ వాక్యము “అయమాత్మ బ్రహ్మ” అనునది “వెలుగు నాలో ఉన్నది” అని తెలియజేయుచున్నది. క్రమంగా సత్య ప్రభావం మనస్సుపై పడుతుంది. నన్ను చుట్టి ఉన్నట్లుగా నేను భావించిన వెలుగే ప్రజ్ఞానము. అది ఈ కనిపించే దానికంతటికీ మూలమని నేను గుర్తించాను. ఆ ప్రకాశమే నాలో కూడా ఉన్నది. నాలోని అంతరాళాలలో ఉన్న సత్యము కూడా ఆ ప్రజ్ఞానమే, ఆ వెలుగే. సదాశివలింగంగా సూచింపబడినది. సాధకుడు తన సాధనలో యుగాల నుంచి ఆవరించి యున్న అంధకారమును చెదరగొట్టే కాంతిని దర్శిస్తాడు. “నీవే కాంతివి తప్ప మరొకటి కాదు” అనే ప్రబోధమును అతడు (గ్రహిస్తాడు.

“తత్త్వమసి” “నీవు అదే” అతడప్పుడు తన తత్త్వాన్ని తాను మరచిపోయేలా చేసిన అజ్ఞానం నుంచి విముక్తి పొందుతాడు. వయోలిన్‌ నేర్చుకొనే క్రొత్తలలో పనికి రాని శబ్దాలు పలికించినట్లుగా సాధకుడు మొదట అసంతృప్తి అసూయలనే అపమారాలకు లోనవుతాడు. చివరకు ఆ బాధ భరించలేనిదయినప్పుడు స్పృహ కోల్పోతాడు. అదే అతనికి ఓదార్పు. అదేవిధంగా ఈ గుర్తింపు ఏర్పడిపోతే మరే ఇతర వ్యాపకము పైకి మనను పోదు. అప్పుడతడు ప్రవంచ నృహ కోల్పోతాడు అనగా నది సముద్రంచేరిందన్నమాట. ఈ “తత్త్వమసి” అనేది జ్ఞానలింగంగా సూచింపబడినది.

156 జ్ఞాన లింగం అనేది నీవు సర్వభూత స్వరూపుడవు, సర్వభూతాలు నీలో ఉన్నాయి అనే జ్ఞానాన్ని సూచిస్తుంది. జ్ఞానం బ్రహ్మము. జ్ఞానమనేది బ్రహ్మము యొక్క గుణము కాదు, బ్రహ్మమే ! బ్రహ్మమునకు గుణమనేది లేదు. అది గుణాతీతము. జ్ఞాని ఈ (ప్రపంచంలో ఉన్నప్పటికీ అతనికున్న అంతగ్రుష్టి వల్ల అతడు ఎండిపోయిన ఆకు చెట్టు నుంచి విడిపోయినట్లుగా ఈ ప్రపంచంతో ఎటువంటి అనుబంధం లేకుండా ఉంటాడు. జ్ఞానలింగం అనేది చివరిదైన “అహం బ్రహ్మాస్మి అనేది ఆత్మలింగంతో అనుబంధం కలిగి ఉంది. చివరి స్థాయిదైన “ఆత్మలింగం” స్వర్ణదశ వంటిది. ఆ దశలో ఆభరణముల నామములు రూపములు పోయి బంగారమే మిగులుతుంది. చల్లదనానికి నీరు మంచుగడ్డగా గట్టిపడుతుంది. అలాగే ఆత్మ శక్తి వ్యక్తిగా అవుతుంది. సముద్రపు నీటితో ఉన్న కుండను అదే సముద్రపు నీటిలో ఉంచటమే ఆత్మ లింగం. (భగవాన్‌ సత్యసాయి గీతోపన్యాసములు) కనబడని ఆత్మ, కనబడని ఈశ్వరుడు ఈ రెండింటిని తనలో ఇముడ్చుకుని గురు స్వరూపమై గురువు జగత్తులోనికి వచ్చినాడు. ఆ గురువే ఈశ్వరుడు. గురువే ఆత్మ సామాన్య మానవులమైన మనము ఆత్మను తెలియగలగాలి అంటే మనకు ఆ దారి చూపే వారొకరు కావాలి. ఆదారి చూపే వాడే గురువు. గురువే అత్మ గురు పరమాత్మ గురువే దైవం తెలియుమురా! గురువే నిత్యం తెలియుమురా గురువే జ్ఞానం తెలియుమురా గురువే సత్యం తెలియుమురా అంటూ శ్రీ విశ్వంజీ తమ ఉపన్యాసానికి ముందుగా గురువును గురించి పాడతారు. “గురువే ఆత్మ గురు పరమాత్మ అన్నప్పుడు గురువు యొక్క దివ్యమైన తత్త్వమే జ్ఞానమని స్పష్టమయినది. గురువే సత్యం, గురువే నిత్యం గురువే దైవం అంటూ భగవత్‌ స్వరూపంగా భావించే గురువు మహాజ్ఞానమే అని బోధపడుచున్నది.

157

భగవంతుడు ఎలా ఉంటాడు అన్నప్పుడు “భగవంతుడు ఈ విధంగా ఉంటాడు అని చెప్పే వారొకరుండాలి. ఆవిధంగా చెప్పగలిగేవాడు గురువే. “తల్లితండ్రిని చూపుతుంది. తండ్రి గురువును చూపుతాడు. గురువు దైవాన్ని చూపుతాడు. దైవ సన్నిధికి చేరుస్తాడు” అని పెద్దలు చెప్పిన మాటలననుసరించి గురువు దైవాన్ని చ్తూపి దివ్యత్వం వైపు పయనింపజేస్తూ శ్రేయోమార్దాన్ని సూచిస్తాడు. అందుచేత కర్మ, భక్తి మార్గాలలో పరిణతి చెందిన తరువాత జ్ఞానబోధ చెయ్యడానికి అర్హత సంపాదించుకున్న నాడు గురువు మన యోగ్యతను బట్టి ఆ మార్షాన్ని మనకు బోధిస్తాడు.

సమ్యక్‌ జ్ఞానము - సమ్యక్‌ దృష్టి అలవరచు గురువు మనల్ని తీర్చి దిద్దుతాడు. నాలో అందర్ని అందరిలో నన్ను చూడు. ఏది మినహాయించవద్దు. ఈ సమ్యక్‌ దృష్టి శ్రీకృష్ణుడు కూడా చెప్పినాడు.

సమ్యక్‌ జ్ఞానం ; కర్మయోగం గొప్పదా, భక్తి యోగం గొప్పదా, జ్ఞానయోగం గొప్పదా అని ప్రశ్నించుకుంటే ఈ నాలుగు విడివిడిగా కన్చించినప్పుటికీ ఈ యోగములన్ని ఒక్కటే. కర్మనియోగంలోనికి ప్రవేశింపజేస్తే కర్మ యోగమైనది. భక్తిని ప్రవేశింపజేస్తే భక్తి యోగమైనది. జ్ఞానం యోగంలోనికి ప్రవేశింప జేస్తే జ్ఞానయోగమయినది.

విచక్షణ, వివేకం అనే జ్ఞానం లేకపోతే ఆ కర్మ పూర్ణత్వాన్ని అందుకొనదు. కాబట్టి మానవుడు కర్మయోగంలో కర్మిస్టి అయి ఉన్నాడు. గాంధీ మహాత్ముడు చేబట్టినది ఈ కర్మయోగమే. కాని ఆయనలో భక్తి లోపించలేదు. సత్యాన్ని గురించినటువంటి బలీయమైన విశ్వాసాలు ఆయనకున్నవి గాబట్టి, ఈ రెండింటిని దీనితో మిళితం చేశారు. సత్యమే జ్ఞానమన్న రీతిలో జ్ఞానయోగాన్ని కైవసం చేసుకున్న మహాత్ముడు గాంధీ.

భక్తి లేకపోతే కర్మయోగం లోనికి మానవుడు ్రవేశింపజాలడు. భక్తి యోగంలో ఉన్నవారు కూడా కర్మలాచరిస్తున్నారు. “సర్వ కర్మలు భగవత్‌ ప్రీత్యర్థం” అన్న భావంతో కర్మలాచరించినప్పుడు అన్ని కర్మలు పవిత్రంగా మారతాయి.

భక్తి యోగంలో భక్తుల కధలు గమనిస్తే అందరూ భగవంతుణ్ణి వశం చేసుకుందుకు కఠినమయిన పరీక్షలకు గురయి సర్వమూ భగవంతుడే అన్యధా ఏమి లేదు అని శరణాగతులైన భక్తులెందరో చరిత్రలో దర్శనమిచ్చుచున్నారు.

158

మహాజ్ఞాన స్వరూపంగా దర్శనమిచ్చిన రమణమహర్షి కూడా భక్తుల కొరకు అనేకానేక కర్మలాచరించినారట. జ్ఞానయోగంలో ఉన్నాను కదా అని కర్మలన్ని వదులుకోలేదు. ఆవిధంగా కర్మలన్ని వదిలిన వాడు కర్మయోగి కాలేడు. భక్తి భావంతో, భక్తి యోగంలో లేకపోతే కర్మలాచరించలేడు. కర్మలన్ని వదులుకుంటే కర్మయోగీ కాడు, జ్ఞానయోగీ కాలేడు. ఈ మూడింటిని భక్తి కర్మ జ్ఞానముల యొక్క సమ్యక్‌ స్వరూపంగా పరిపూర్ణత్వాన్ని ఎవరు అనుభవిస్తారో, అనుభవిస్తున్నట్లు మనకి కనిపిస్తారో, తాను ఏదీ అనుభవించకుండా ఉన్నాడో వాడు పూర్ణయోగి. అతడే జ్ఞానయోగి. మూర్తీభవించిన జ్ఞానమే తాను. ఈ విధంగానే యోగులందరు జ్ఞాన సముపార్దన చేసి మహాయోగులై కర్మలు ఆచరించీ ఆచరించనట్లు భక్తులుగా నున్నట్లు కనిపిస్తూ ఏ కర్మతో గాని సంబంధం లేకుండా తామరాకుపై నీటి బొట్టు వలె నున్న వాడే పూర్ణ యోగి. అటువంటి పూర్ణ యోగత్వం సంపాదించుకున్న వారంతా భగవత్‌ స్వరూపులే. వారే జ్ఞానమే భగవంతుడు అన్నదానికి ఆదర్శము. అటువంటి మహాజ్ఞానుల్ని మనం చూసినప్పుడు భగవంతుడంటే ఈయనే అని నమ్మకం కలుగుతుంది. రాముడు అనే సరికి కోదండం పట్టుకున్న దృశ్యము మన కనుల ఎదుట కనిపిస్తుంది. కాని సర్వకాల సర్వావస్థల యందు ఆయన కోదండం పట్టుకునే ఉండలేదు. యుద్దానికి, సభకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన కోదండం పట్టుకున్నాడు. కాని ఆ కోదండం పట్టుకుని ఉన్న దృశ్యాన్నే మనం చూడటం వలన ఆయనే రాముడని, దేవుడని భావించి రూపకల్పన చేయబడిన దృశ్యాన్ని ఆధారం చేసుకుని అదే రూపాన్ని మనస్సులో ముద్రించుకుని ఆరాధనలు సల్పుతున్నాము. ఈ కలియుగంలో ధర్మ సంస్థాపన కొరకు దత్తుడు అనేక రూపాలలో అవతరించి విశ్వ కళ్యాణానికి కృషి సల్పుతున్నారు. ఆ విధంగా అవతరించి మన కనుల యెదుట కనిపించుచున్న యోగి పుంగవులు శ్రీ విశ్వంజీ మహరాజ్‌ ప్రపంచ శాంతి, విశ్వ సమైక్యత, విశ్వ కళ్యాణం సాధించడానికి తాము చేస్తున్న కృషిలో భాగస్వాములుగా మానవాళిని తీర్చి దిద్దు చున్నారు. ఈ “విశ్వకళ్యాణం” అనే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు తమ వంతు కృషి తాము చేయాలని మేధావులు మేధస్సునంతా తమ తమ రంగములలో ఉపయోగిస్తూ అధ్యాత్మసాధనలో భాగంగా దేశప్రగతి - ప్రపంచ శాంతి విశ్వకళ్యాణం

కోసం కూడా తమ వంతు కృషి చేయాలని శ్రీ విశ్వంజీ హెచ్చర్నించినారు.

159

అదేవిధంగా రక్షణశాఖ, న్యాయశాఖ, వైద్యవృత్తిలో ఆరితేరిన డాక్టర్లు గ్రామసేవకు నడుము కట్టడానికి యువత, ఎవరికి తోచిన సేవ వారు చేయాలన్నదే స్వామి ఆశ ఆశయము. దేశానికి పట్టు గొమ్మలైన గ్రామాలు ఆరోగ్యవంతమైన రాజకీయంతో, చక్కటి పారిశుద్ధ్యము, విద్యుత్తు వైద్య సౌకర్యము, మున్నగు (ప్రాథమికావసరాలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా సమాజసేవ చేసే విధంగా వార్ని తీర్చి దిద్దాలని స్వామి ఉద్దాటించినారు. మహాజ్ఞానంతో విరాజిల్లే అవతారమూర్తులు తమదైన ఆనందంలో తాము గడపకుండా సామాన్య మానవుల నుద్ధరించుటకు (పేమ స్వరూపులుగా తీర్చిదిద్ది ధర్మాచరణ పరాయణులుగా తయారు చేయుటకు వారు దిగి వచ్చి పిల్లలలో పిల్లవాడుగా, స్త్రీలలో స్రీగా, పురుషులలో పురుషుడుగా ఈ మహాపురుషులు సంచరిస్తూ తమవంతు కృషి తాము సల్పడం గొప్ప విశేషము. ఈ కలియుగ మానవాళి చేసుకున్న పుణ్యము. అట్టి పుణ్యమూర్తులంతా జ్ఞాన స్వరూపులే. జ్ఞానమే భగవత్‌ స్వరూపం దాల్చి అవతరించి నరాకారంతో మనమధ్య సంచరించి మనకు శిక్షణ నిచ్చుట విశేషము!

160 వైద్యుని చేతిలో కత్తి ప్రాణం పోస్తుంది. హంతకుని బేతిలో కత్తి ప్రాణం తీస్తుంది. మానవుని దృష్టి, భావములు, ఆలోచనలు పవిత్రముగా సక్రమమైన పద్ధతిలో నుండుట చాలా ముఖ్యము. ఈ విధమైన చక్కటి భావాలు కలిగిన (డాక్టరు) వైద్యుడు తన చేతిలో నున్న కత్తితో ఒక రోగిని బ్రతికించి ప్రాణం పోస్తాడు. తన వృత్తికి న్యాయము చేశాను గదా అన్న ఆనందంతో పొంగిపోతాడు. హంతకుడు తన చేతిలోనున్న కత్తితో ఎవర్ని హత్య చేయాలా అని ఆలోచిస్తూ, దానికి తగిన ప్రాతిపదిక వేస్తూ తన నైపుణ్యాన్ని ప్రక్కదారికి మళ్ళించి ఆ కత్తితో ఒక మనిషి ప్రాణాన్ని బలిగొంటాడు అని ఈ సూక్తికి భావము. ఉన్నత స్థితి, నీచమైన స్థితి రెండింటికి కారణము ఒకే ఒక పనిముట్టు అని తెలియుచున్నది. జీవితంలో ప్రతి వ్యక్తి ఒక పనిముట్టుని సమాజోద్ధరణకు, దేశ ప్రగతికి ఉపయోగపడే విధంగా ఆలోచించి విచక్షణా జ్ఞానంతో తన మేధస్సును అత్యుత్త్రమమయిన కార్యానికి ఆ పనిముట్టును ఉపయోగించాలన్నదే ఆమోద యోగ్యము. వైద్యుడు తాను నిర్వహించు శస్త్ర చికిత్సకు ఆతడు భీతిల్లడు. కారణం తాను చేసేది మంచి పని గనుక. విచక్షణతో తాను ఆర్టించిన విజ్ఞానంతో ఒక రోగిని బ్రతికిస్తాడు. దైవీశక్తి ప్రతి వ్యక్తిలో నిక్షిప్తముయి ఉంటుంది కనుక ఆ శక్తితో తన విజ్ఞానాన్ని జోడించి శస్త్రచికిత్స చేస్తాడు వైద్యుడు. దైవ భావానికి మించిన దేదీ ఈ జగత్తు నందు కానరాదు. “వైద్యో నారాయణో హరిఃొ అన్నారు పెద్దలు. రోగి రుగ్మతతో బాధపడుతున్నప్పుడు దానికి తగిన చికిత్స చేసి రోగాన్ని మటుమాయం చేసిన వైద్యుడే నారాయణుడు. వైద్యునిలో నారాయణున్ని దర్శిస్తాడు రోగి. హంతకుడు తొను హత్య చేస్తున్నప్పుడు భయానికి గురియౌతాడు. పశు ప్రవర్తనతో విచక్షణా రహితంగా నిర్దాక్షిణ్యంగా ఒకవ్యక్తి ప్రాణాలు తీయడానికి కత్తిని ఉపయోగిస్తున్నాడు గనుక భయాందోళనలతో దాగి యుండడానికి ప్రయత్నిస్తాడు. కత్తి అనే పరికరానికి ఎటువంటి దోషము అంటదు. దానిని ఉపయోగపెట్టే వారి మనోభావముల కనుగుణంగా ఆ పరికరం పనిచేస్తుంది.

161

భగవంతుడు మానవునకు బుద్ధి, విచక్షణా జ్ఞానము, మంచి, చెడ్డ తెలుసుకునే వివేకము, మేథస్సు, తెలివితేటలను ప్రసాదించినాడు. శ్రీ విశ్వంజీ చెప్పినట్లుగా ఈ దేహము ఒక చక్కని పనిముట్టు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, బ్రహ్మ విష్ణు రుద్ర (గ్రంధులు, నాడీ మండలము అన్నింటికి కీలక న్థానమైన చక్కటి హృదయము మనస్సు మున్నగు వాటిని ప్రసాదించి అత్యద్భుతంగా ఈ శరీరాన్ని నిర్మించినాడు. అటువంటి దేహమనే పనిముట్టును పవిత్ర కర్మలలో ప్రవేశ పెట్టవలయునన్నదే శ్రీ విశ్వంజీ తపన. తాపత్రయము. శ్రీ విశ్వంజీ తమ దివ్యోపన్యాసంలో మానవుని శరీరాన్ని గురించి ఈ విధంగా అన్నారు. “ఒకసారి ఈ శరీరాన్ని గనుక పరిశీలించినట్లెతే, అవయవ నిర్మాణాన్ని గురించి గనుక ఆలోచించినట్లెతే, వైద్య శాస్త్రంలో ఎనాటమీ అను పేరుతో శరీరం యొక్క నిర్మాణాన్ని వైద్య విద్య నభ్యసించే విద్యార్థులకు బోధిస్తున్నారో అది ఏనాడో మనయోగులు తమ యొక్క దివ్యమైన దృష్టితో కనుగొని చెప్పారు. అదే ఈనాడు వైద్య శాస్త్రము అంగీకరించుచున్నది.”

ప్రపంచంలో అందరు వ్యక్తులు డాక్టర్లు కాలేకపోవచ్చును. కాని ఇంకా అనేక వృత్తులు, లేదా సంఘ సంస్కరణ కావించే పవిత్రమైన కర్మలెన్నో ఉన్నాయి. కనీసం ఆ పవిత్రమైన కర్మల నాచరించి జన్మించి నందులకు పుడమి తల్లికి భారము కాకుండా జీవితాన్ని ధన్యం చేసుకోవాలన్నదే మానవుని ప్రథమ కర్తవ్యం కావాలి. జీవితంలో అత్యంత పవిత్రమైన కార్యానికి ఉపయోగపడిన పనిముట్టే మనిషి ప్రాణం తీయడానికి కూడా ఉపయోగపడుతోంది. కాని విచక్షణా జ్ఞానంతో ఆ పరికరాన్ని ప్రాణం తీయడానికి కాకుండా చక్కగా ప్రకృతిలో పెరుగుతున్న గడ్డి, మొక్కలు, ఇతరమైన అనవసరపు మొక్కలు పెరికి వేసి అందమైన తోటగా తయారు చేయడానికి కూడా ఆ పరికరం ఉపయోగపడు తుంది. అందుచే తన నేర్పు, నైపుణ్యం సమాజోద్ధరణ పనికి వచ్చే విధంగా ఉపయోగ పెట్టాలి తప్ప విధ్వంసక చర్యలకు ఆ పరికరాన్ని వాడరాదు.

కర్మ సిద్ధాంతం చెప్పే విషయాన్ని శ్రీ విశ్వంజీ ఈ విధంగా చెప్పారు. “నీవు చేసే ప్రతి పనికీ ఫలితముంటుంది. ఆ ఫలితాన్ని నీవు అనుభవించకుండా తప్పించుకోలేవు” అని చెబుతున్నది. మంచిపనికి మంచిఫలితం, చెడ్డపనికి చెడ్డఫలితం ఉండి తీరుతుందని కూడా కర్మ సిద్ధాంతం చెబుతున్నది. కనుక మంచి పనులు చేసి జీవితాన్ని ధన్యం

162

చేసుకోమంటుంది. అంతేకాని ఏ పని చెయ్యకుండా అంతా విధి ప్రకారం జరుగు తుందని నిష్కియుడవై కూర్చోమని హిందూమతం చెప్పదు. అలా అని చెడ్డ కర్మల నాచరిస్తూ హత్యలు చేస్తూ సమాజంలో మనిషిగా ఎవరికి ముఖం చూపకుండా, సమాజానికే ముప్పు తెచ్చే పనులు చేయరాదు. అన్ని పవిత్రమైన కర్మలు అధ్యాత్మతో ముడిపడే విధంగా ఆచరించినప్పుడు (90171116 చేసినప్పుడు) దైవప్రీతి పెంపొంది, పాపఖీతికి దూరమై, సంఘనీతిని పాటించిన ఉత్తమ మానవుడుగా, పరిపూర్ణమైన మానవత్వంతో మనిషి విరాజిల్లగలడు.

శ్రీ విశ్వంజీ ఉపాధ్యాయ వృత్తిలో నున్నప్పుడు ఒకసారి తన సహాధ్యాపకుడైన అయ్యన్న మాష్టారును వెంట తీసుకొని పుట్టపర్తి వెళ్ళిరి. అక్కడ విశ్వంజీకి జ్వరము వచ్చెను. మూడు రోజులు జ్వరముతో బాధపడిరి. ఆ జ్వరములోనే ఒకరోజు ప్రశాంతి నిలయములో నున్న ఫలహారశాలకు పోయి మజ్జిగ త్రాగిరి. వెంటనే వాంతియయ్యెను. వాంతిలో రక్తము పడుట జూచి అయ్యన్నగారు భయపడిరి. అప్పుడు విశ్వంజీ “భయము లేదు. ఎవరికో ఇది జరుగవలసి యున్నది. నన్ను నమ్ముకొన్న వారి బాధ స్వీకరింపక తప్పదు గదా!” అని పలికిరి. “ఇది ఎవరి కర్మమో మనకెట్లు తెలియు?”నని అయ్యన్న గారనగా శ్రీ విశ్వంజీ నవ్వి “మనము గుంటూరు వెళ్ళిన తరువాత అంతయు నీకే బోధపడగలిదని చెప్పిరి. రెండు రోజులచ్చట యుండి విశ్వంజీ గుంటూరు వచ్చిరి. మరునాడు వారి గదికి ఒకాయన వచ్చి “మూడు రోజుల క్రిందట మా ఇంటికి ఒక వ్యక్తి వచ్చి మీ గురువుగారెవరు? మీరే మంత్రముపాసించు చున్నారు! ఎవరో నా దగ్గరకు వచ్చి మీకు చాతబడి చేయమని కోరగా అట్లు చేసితిని. కాని అది మీమీద పనిచేయక నాకు త్రిప్పి కొట్టినది. నాకు రక్త వాంతులగు చున్నవి. దయచేసి మీ మంత్ర శక్తితో నన్ను రక్షించూడని ప్రాధేయపడెను. నాకు ఆశ్చర్యము వేసినది. “నాకేమియును మంత్రములు తంత్రములు తెలియవు. కాని నేను ప్రతి రోజు రైలుపేట మాష్టరు గారి గదికి వెళ్ళి వచ్చుచుందును” అని ఆయనతో చెప్పితిని. అప్పుడాయన “నన్ను మీ మాష్టారు దగ్గరకు తీసుకొని పొండి! ఆయనను వేడుకొనొదనని ప్రతిరోజూ వచ్చి నా ప్రాణము తీయుచున్నాడు. మీరనుజ్ఞనిచ్చిన ఆయనను మీ దగ్గరకు తీసుకొని వచ్చెదొనని ఆ వ్యక్తి విశ్చంజీతో విన్నవించెను. విశ్వంజీ తమ ప్రక్కనున్న అయ్యన్న

163 గారి వైపు చూచి నవ్విరి. అయ్యన్న గారికిది అంతయు అద్భుతముగా నుండెను. తరువాత విశ్వంజీ తమ కడకు వచ్చిన ఆ చాతబడి చేసిన వ్యక్తిని మందలించుచు “ఆర్జించిన శక్తితో లోకహితమునకై పాటు పడవలయును గాని నాశనమునకై ప్రయత్నించిన ఇట్టిగతియే పట్టునని బుద్ధి చెప్పి పంపి వేసరి.

ఈ సంఘటన విశ్వగురుచరిత్ర వివరించినది. శ్రీ విశ్వయోగిగా పరిణామము చెందక ముందే యోగశక్తులన్ని కైవసం చేసుకుని తాను నమ్ముకున్న వారి బాధలన్ని స్వీకరించి వారిని కాపాడిన సన్నివేశమిది. చిన్ననాటి నుంచి వారి దృష్టి సమాజ సేవకు తాను కంకణము కట్టుకొన్నట్లు వారి చరిత్ర ద్వారా తెలియుచున్నది. ప్రతి మనిషి తనలోనున్న శక్తిని లోకకళ్యాణార్ధం ఉపయోగ పరచాలన్న దృక్పథంతో తాను ఆచరించి కృషి చేసి మహనీయుడుగా విశ్వంజీ దర్శనమిన్తూ అదే మార్గాన్ని అందరు అవలంబించాలని బోధించుచున్నారు.

విధ్వంసక శక్తుల నెన్నడు వారు ప్రోత్సహించలేదు. సమాజంలో వ్యక్తులు శక్తివంతులై వారి రంగాలలో వారు కృషి చేస్తూ తోటి మానవులకు సేవచేసి ధన్యులు కావాలని, అట్టి వ్యక్తులతో కూడుకొన్న సమాజము మూడు పువ్వులు ఆరుకాయలై విరాజిల్లి దేశ ప్రగతికి దోహదము చెయ్యవలెనన్న ఉన్నతమైన ఆశయాన్ని తాను ఆచరించి మానవాళిచే ఆచరింప జేయాలన్న తపనతో ముందుకు సాగుతున్న పరిపూర్ణమయిన దత్తావతారము.

కరెంటు, నీరు, మున్నగువన్ని ఎంత ఉపయోగమో అంత ప్రమాదకరము. అందుచే ఆ వస్తువుల్ని వాడుకునే తీరులో మానవుడు తన మేధస్సునుపయోగించి శక్తివంతమై నలుగుర్ని శక్తివంతులుగా చేసి వాటి ద్వారా అనేకమయిన ఉన్నతమైన కార్యక్రమములు సాధించి సమాజాన్ని బాగు చేయాలి గాని, విధ్వంసక చర్యలకు ఉపయోగించరాదని, అది ప్రమాదకరమని ఇచట భావము. పరస్పరం విరుద్ధ్రమయిన ఇద్దరు వ్యక్తులు ఒక పనిముట్టును ఉపయోగించడంలో ఎంత వ్యత్యాసము కనబడుచున్నదో ఈ సూక్తి వివరించినది.

164 ఒకరు అందరి కోసం - అందరు ఒక్కరి కోసం కలవాలి

ఒక్కరి కోసం అందరు కలిసి

అందరి కోసం ఒక్కడు నిలచి

ఒకే బాటలో నడచినమేలు

మానవతా మానవతా అదియే విశ్వంజీ మాట

సమైక్యతా సమైక్యతా అదియే విశ్వంజీ బాట.

అన్న విశ్వంజీ ప్రబోధంలోనే ఈ సూక్తి కనిపించుచున్నది. మానవుడు సంఘజీవి. ఒకరు అందరి కోసం, అందరు ఒక్కరి కోసం కలవాలి. కలిసి మెలిసి, కలిమి, చెలిమి పెంచుకుని ముందుకు సాగాలి. అందరిది ఒకే బాట, ఒకే మాట అయిన నాడు ఐక్యత ఏర్పడి అదే సమైక్యతగా పరిణతి చెందుతుంది. అందర్ని ఒకచోట సమావేశ పరచి సమైక్యం చేయడమే విశ్వంజీ సంస్క్మరణోద్యమంలో ప్రధానాంశము. అందరు ఆయన బాటలో నడిచి సమైక్యత సాధించాలన్నదే వారి లక్ష్యం. ఆ లక్ష్యంవైపు నడిపించడానికి మానవత్వం గల మనుషులుగా మానవాళిని తీర్చి దిద్దుతున్నారు విశ్వంజీ.

“వ్యక్తి అంటే శరీరం కాదని ఆ శరీరంలో దాగియున్న “శక్తే వ్యక్తి అని బోధిస్తున్నారు విశ్వంజీ. ప్రజల్లో సమైక్యత రావాలంటే అందరి భావాలు మనస్సులు ఒక్కటిగా చేసుకొని మానవత్వాన్ని పెంచుకొని హృదయం నిండా (ప్రేమ కల్లి ఉండాలి. ప్రజల్లో సంస్మరణ తీసుకొని వస్తే సమైక్యత వస్తుంది గాని, సమానత్వం రాదు. ఎందుకంటే సృష్టిలోనే అనేక అంశాలలో సమానత్వం లేదు. నేడు వాతావరణ కాలుష్య ప్రభావం వల్ల మంచి మనష్యుల మనస్సులు కూడా కలుషితమై, చెడుగా మారిపోయి అశాంతికి హింసా మార్గానికి దారి తీస్తోంది. క్రమశిక్షణా వాతావరణం కల్గిన కుటుంబ వ్యవస్థను స్థాపించుకొని ప్రశాంత జీవనం గడపాలి” (1997 జన్మదిన వేడుకల సందేశం నుండి)

పరమాత్మ అనేక రూపాలలో అందరి కోసం తాను అవతరించి అందర్ని తీర్చి దిద్దుతున్నాడు. పరమేష్టి లేక సృష్టి లేదు. సృష్టి లేక సమష్టి లేదు. సమష్టి లేక వ్యష్టి

165

లేదు. కాబట్టి సర్వమూ పరమేష్టి నుండి వచ్చినవే. పరమేష్టియందే సృష్టి సమష్టి, వ్యష్టి ఉన్నవి. ఇవియే (్రికరణముల యొక్క స్వరూపము.

“త్రి దళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం

త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్‌”

మానవుడు ఒక్కడుగా ఉన్నప్పుడు వ్యష్టిగా ఉంటాడు. అనేకమంది చేరినప్పుడు అది సమష్టి స్వరూపమవుతుంది. ఆ సమష్టి స్వరూపాన్ని చక్కగా విచారణ చేసినప్పుడు అందరి యందున్న ఆత్మ తత్త్వమనే పరమేష్టి తత్త్వం అర్ధమవుతుంది. కనుక, వ్యష్టి వ్యష్టిగా ఉండకూడదు. సమష్టితో ఏకం కావాలి. ఒక చెట్టు వనం కాదు. ఒక గృహం (గ్రామం కాదు. అనేక చెట్లు చేరినప్పుడే వనమవుతుంది. అదేవిధంగా ఈనాడు మీరు సమష్టి స్వరూపకంగా ఏకం కావాలి. ఒక్కొక్క వ్యక్తి ప్రత్యేకంగా విడిపోకూడదు. అందరిలో నున్న ఏకత్వాన్ని గుర్తించినప్పుడే మీరు సమష్టి స్వరూపకంగా ఏకం కావాలి. నలుగురు కలిసి పని చెయ్యడంలో ఆనందం ఉన్నది. నలుగురు కలిసి సంకీర్తన చేస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. వ్యష్టిగా చేయలేని పనులెన్నో ఉన్నాయి. సమష్టిగా కలిసి చేసిననాడు అదుపుపొదుపు పాటింపబడి, సామూహికంగా చేయడం వల్ల సమైక్యమై అందరూ ఏకాత్మ భావంతో పనులు చేసినప్పుడు అవన్నీ భగవంతునికి ప్రీతిపాత్రములే. ఈ విధమైన సమైక్యత (12100 ఉన్నప్పుడు మానవునిలో (0%) పవిత్రత అభివృద్ధి అవుతుంది. పవిత్రత అభివృద్ధి అయినప్పుడే ప్రతి ఒక్కరికీ దివ్యత్వం (411197) ప్రాప్తిస్తుంది.

ఈనాడు సైంటిష్టులు అణు స్వరూపం గురించి ఆలోచిస్తున్నారు. ప్రతి దానికి “అణువు అంటున్నారు. కాని, వేదాంతులు ప్రతి దానికి “దైవం” అంటున్నారు. గాలి ఉన్నది. కాని కంటికి కనిపించడం లేదు. “ఉన్నాడయా దేవుడున్నాడయా” బాబా పాడినారు. అదే విషయం మరొకచోట చెప్పుకున్నాము. “ఉన్నాడు అనడానికి విశ్వాసమే ప్రధానము. “నమ్మకమను రెండు నయనమ్ములే లేని అంధులైరి అవనియందు” అంటూ నమ్మకము, విశ్వాసము అను రెండు కళ్ళు లేని (గ్రుడ్డి వారున్న సమాజమిది. ఇటువంటి సమాజంలో నున్న అవినీతి, అలజడి తగ్గించడానికి దానవ గుణాన్ని నశింప జేయటానికి మనిషి మనిషిగా మహామనీషిగా రూపు దిద్దుకునేటట్లు అనుగ్రహించడానికే వచ్చారు

166

అవతారమూర్తులు. అందున దత్తావతారము దరికి చేరదీసి బాధలు పోగొట్టి బోధలు చేసే ప్రేమావతారము.

నేడు ఆ ప్రేమమూర్తి భారతీయ సనాతన ధర్మంలో చెప్పబడ్డ యోగ శాస్త్రానికి సంబంధించిన అనేకానేక రహస్యాలు మనకు బోధిస్తున్నారు. అలనాడు మహాయోగులంతా కూడా యోగ ప్రక్రియ ద్వారా అనేకానేక నిగూఢమైన విషయాలు చెప్పారని శ్రీ విశ్వంజీ తమ దివ్యోపన్యాసంలో పేర్కొన్నారు. శరీర నిర్మాణం, అవయవాల యొక్క స్థితిగతులు ఈనాడు చేస్తున్న ఆక్యూ (ప్రెషర్‌ వంటి వైద్య విధానం మున్నగునవన్ని ఆనాడే కనుగొన బడ్డాయని తెలిపారు విశ్వంజీ.

సమైక్యతను గురించి చెప్పుకున్నప్పుడు భగవంతుడు మన శరీరంలో అవయవాలన్ని ఏ పనికి ఎంత అవసరమో ఆ విధంగా సృష్టించి ఈ అంగాంగీ భావంలో కూడా సమైక్యత ధ్వనించునట్లు అమర్చినాడు. రెండు కళ్ళు, రెండు కాళ్ళు, రెండు చెవులు, ఒక ముక్కు ఒక నోరు, రెండు చేతులు ఈ విధంగా ప్రసాదించినాడు.

మన దేహమనే “గృహము నందు మనస్సు, వాక్కు క్రియ అనే ముగ్గురు వ్యక్తులున్నారు. ఈ ముగ్గురు ఏకంగా ఉన్నప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది. ఈ శాంతి, సమైక్యత వలననే సాధ్యమవుతుంది. చేతులను ఇచ్చినదెందుకు?

చేతులనిచ్చినదెందుకో తెలుసా?

నోటికి ముద్ద నందించుటకా?

కాదు కాదు. పనులు చేయటానికే చేతులు ఈయబడినవి. భగవంతుడు మనకు రెండు చేతులనిచ్చాడు. ఒక్క కడుపును మాత్రమే ఇచ్చాడు. మనం రెండు చేతులతో బాగా పనిచేస్తే ఒక్క కడుపు నిండుతుంది. రెండు చేతులతో సోమరితనం వలన నిండుగా ఈనాడు పనిచెయ్యటము లేదు. కడుపు నిండ లేదని బాధపడుతున్నాము. ఈ దోషము మనదే. సోమరితనంతో పని చెయ్యని మానవుడికి తినడానికి అధికారం లేదు. “మానవుడికి కర్మాధికారం ఉన్నది” - “కర్మాను బంధీ మనుష్యలోకే” కనుక మనం సత్‌ కర్మల నాచరించాలి. పొట్ట కూటికై ఆచరించే కర్మలతో బాటు సేవాధర్మంగా

16/7

సత్మర్మ లాచరిస్తూ సేవాయోగంలోనికి ప్రవేశించాలి. “ప్రార్ధన చేసే పెదవుల కన్నా సేవచేసే చేతులు మిన్న” అన్నారు సత్యసాయి.

నయనాల్ని రెండింటిని స్వామి ప్రసాదించి నందులకు ఒక కంటితో ప్రపంచాన్ని చూస్తూ మరొక కంటితో నీలోనికి నీవు చూసుకుంటే నీకు గోచరమయ్యేది దివ్యమైన పరతత్త్వమే. ఆ పరతత్వమే కనబడకుండా కాలిగోటి మొదలుకొని తలవెంట్రుక వరకు తిరుగుతున్నది. ఆత్మని వెతకాలి అన్నాన్ని కాదు అన్నారు బాబా. శరీరము అనే పనిముట్టులేకుండా ఆత్మను వెతక లేము గనుక శరీరము చాలా ముఖ్యమైనది.

మనందరి కోసం సద్దురువు శరీరం ధరించి వచ్చారు. వారొక్కరి కోసం మనం అందరం చేరి వారి బోధలు వింటూ, ఆచరిస్తూ జీవితంలో ముందుకు సాగిపోవాలన్నదే మానవుడి లక్ష్యం ధ్యేయం కావాలి. చక్కటి గమ్యాన్ని సద్దురువులు నిర్దేశించిన దానిని అనుసరిస్తూ శ్రేయోమార్గం వైపు పయనించడమే ప్రతి మానవుడు చెయ్యవలసిన పని.

168 పునర్జన్మను ప్రసాదించిన పుణ్యమూర్తి (స్వానుభవము) చాలాకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్న నన్ను అనేకానేక మారులు సంక్షిష్టముయిన పరిస్థితి నుంచి బయటపడవేశారు స్వామి. అనారోగ్యంతో బాధపడుతున్న నాకు అనేక సలహాలు సూచనలు, ఆహార నియమాన్ని గురించి చెబుతూ నా బాధ తగ్గించి నన్ను బయట పడవేసిన మంచి డాక్టరు విశ్వంజీయే. మహిమలనేవి లేవని, ఏ వృత్తిలో నిపుణత సంపాదించిన వారు ఆ రంగంలో రాణిస్తారని శస్త్రవైద్య నిపుణుడైన డాక్టరు నిపుణతతో కొన్ని వందల ఆపరేషన్లు అతి సున్నితంగా, సునాయాసంగా చేస్తాడని, ఇతరులు అలా చెయ్యలేరని, అలా చేయలేని వారికి అది ఒక మహిమగా కనబడుతుందని అంటారు విశ్వంజీ. ఎంత నైపుణ్యం సంపాదించినా, ఎన్ని డిగ్రీలు తీసుకున్నా ఏంత అనుభవం ఆ రంగంలో సంతరించు కొన్నా భగవదనుగ్రహం కావాలి. భగవంతుడు లేదా సద్దురువు తన యోగ శక్తితో వైద్యులకు అంతబట్టని రోగాలు నయం చేయగలరు. “యోగశక్తి అణుశక్తి కంటె గొప్పది అన్న సూక్తి యొక్క అంతరార్థమిదియే.” ఇటీవల 2004 సంవత్సరము మే నెల 10వ తేదీ హైదరాబాదు నాంపల్లి కేర్‌ హాస్పిటల్‌లో నాకు జరిగిన గుండె ఆపరేషను విజయవంతమవడానికి, ఈ విధంగా నేను మామూలు మనిషినవ్వడానికి కారకులు భగవాన్‌ శ్రీ విశ్వయోగి విశ్వంజీయే. వారి అపారమైన దయాసారమే నేనీవిధంగా ఈనాడు జీవించదానికి కారణమయినది. వారి వాత్సల్యమే నేను పునర్జన్మ ఎత్తడానికి, తిరిగి దైనందిన కార్యక్రమములన్ని యదావిధిగా నిర్వర్తించు కుందుకు రచనా వ్యాసంగం సాగించడానికి వీలు కలిగించింది. పునర్జన్మను ప్రసాదించిన స్వామికి కృతజ్ఞతలు ఎన్ని విధముల ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే అవుతుంది. చాలాకాలం క్రితమే 1997 ప్రాంతంలో ప్రప్రధమంగా నాకు గుండె కవాటము మార్చాలని మరొక కవాటము సరిచేయాలని (1028) డాక్టరుగారు సూచించినారు.

169

ఆనాడు నేను పుట్టపర్తి వెళ్ళి అక్కడ సూపర్‌ స్పెషాలిటీస్‌ హాస్పిటల్‌లో చూపించు కుంటానని చెప్పినప్పుడు “వెళ్ళు” అని నన్ను ప్రోత్సహించి పరీక్ష చేయించు కుందుకు దివ్యమైన ఆశీస్సులిచ్చి పంపించారు శ్రీ విశ్వంజీ. ఆ సమయంలో అక్కడ డాక్టర్లు నన్ను పరీక్షించి ఆపరేషను అప్పట్లో అవసరం లేదని మందులు వేసుకుంటూ మరొక్కరెండు సంవత్సరాలు గడపవచ్చునని చెప్పారు. అదే సమయంలో భగవాన్‌ సత్యసాయి కూడా దివ్యమైన ఆశీస్సులిచ్చి నా ఉత్తరం అందుకుని, నాతో మాట్లాడి పంపించినారు. ఆ విధంగా పుట్టపర్తి నుంచి బస్సు ప్రయాణం చేసి హైదరాబాదు తిరిగి వచ్చి ఏ విధమయిన ఇబ్బంది లేకుండా నా పనులన్ని నిర్వర్తించుకున్నా నంటే స్వామి పరిపూర్ణమైన అనుగ్రహము ఆశీర్వాద బలమే. ఆ విధంగా ఆ సమయంలో కొద్ది సంవత్సరాలు ఆపరేషను అవసరం లేకుండా ఏ మాత్రం తేడా చేసినా స్వామి నాకు ఆశీస్సు లిస్తూ, ప్రమాదాల్ని తప్పించి కాపాడినారు.

ఇటీవల 2008 సంవత్సరం ఒక పర్యాయము నవంబరు నెలాఖరున స్వామి దివ్యమైన ఆశీస్సులు పొంది మేము పుట్టపర్తి వెళ్ళడం తటస్థించింది. ఆ సమయంలో స్వామి హైదరాబాదులో మకాము చేసి యున్నారు. నాకు రక్ష కట్టి, ఆశీస్సు లిచ్చి కొద్ది సేపటికి బయలు దేరతామనగా కూడా ఎక్కువ సమయం '“విశ్వారామం' (శ్రీ విశ్వంజీ ఆరామస్థలి, లకడీకాపూల్‌, టెంపుల్‌ వ్యూ రెసిడెన్సీ - హైదరాబాదు) లో నన్ను కాస్సేపు మాట్లాడమని ఆదేశించి, చివరగా గుడ్‌లక్‌ అంటూ ఆశీర్వదించి పంపించినారు. అక్కడకు చేరిన తరువాత హాస్పిటల్‌కు వెళ్ళి డాక్టరును కలిస్తే, వారు మరొక డాక్టరుకి నా రిపోర్టు కాగితం చూపి, ఇప్పుడే ఆపరేషన్‌ అవసరం లేదని ఆరు నెలల తరువాత రావచ్చునని తిరిగి పంపించినారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు ఉత్తరం వ్రాసుకుని శ్రీ సత్యసాయిబాబా వారికివ్వాలని మావారు లైన్లో కూర్చుంటే బాబా అటువచ్చినప్పుడు మావారు కొద్దిగా ముందుకు జరిగి *నా భార్య ఆపరేషను వాయిదా వేశారు తిరిగి డాక్టర్లు” అని చెబితే ఆ మాట విని బాబా వెనుకకు వచ్చి ఎప్పుడు రమ్మన్నారు? అంటూ ప్రశ్నించారు. జూన్‌లో రమ్మన్నారు స్వామి అని అంటే మా వారి ఉత్తరం అందుకుని విభూతి సృష్టించి మా వారికిచ్చి జూన్‌లో రమ్మన్నరా? అంటూ ముందుకు సాగినారు.

170

సరే, మన విషయం స్వామి దృష్టికి వెళ్ళింది కదా అన్న ఆనందంతో విభూతి బెషధంలా స్వీకరిస్తూ కాలం గడిపాము. ఆ సందర్భంలోనే మా ప్రయాణం రోజు కృతజ్ఞతాభావంతో స్వామికి నేను ఉత్తరం వ్రాశాను. నాకు మొదటి లైను రావడం, బాబా నడచే త్రోవకి చాలా సామీష్యంలో కూర్చోవడం జరిగింది. అదేరోజు స్వామి సహస్ర నామం లక్ష చదవడం పూర్తయినది. అది వారి పాదాలకి సమర్పించడానికే నాకు మొదటి లైను వచ్చిందని ఆనందపడ్డాను. స్వామి దగ్గరగా వచ్చారు. “స్వామి మేము ఈ రోజు వెడుతున్నాము అన్నాను రెండు అడుగులు వెనక్కి వచ్చి స్వామి “ఈరోజు వెడుతున్నారా? చాలా సంతోషం వెళ్ళి రండి అంటూ నా ఉత్తరం అందుకుని ముందుకు సాగారు స్వామి. మీ అనుగ్రహం స్వామి అని మాత్రం అనగలిగాను. అకృడే వంగి నమస్మరించాను ఆ క్షణంలో. మనస్సులోనే నేను చదివిన సహ(్రం మీ పాదాల వద్ద సమర్పించుకుం టున్నాను అనుకున్నాను. తృప్తిగా ఆనందంగా తిరిగి వచ్చాము. డాక్టరు మళ్ళీ 6 నెలల తర్వాత రమ్మనడానికి కారణమేమిటో మాకు అంతుపట్టలేదు. ఇదే విషయం శ్రీ, విశ్వంజీకి విన్నవించుకున్నాము.

ఆరు నెలలకు వారు రమ్మంటే మేము ఇంచుమించు 2004 జనవరి వరకు పుట్టపర్తి వెళ్ళడానికి సాధ్యపడలేదు. 2004 జనవరి 27వ తేదీ పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీస్‌ హాస్పిటల్‌లో నా గుండె ఆపరేషను కోసం డాక్టర్లు పరీక్ష చేస్తానంటే స్వామి దివ్యమైన ఆశీస్సులతో వెళ్ళడం జరిగింది. డాక్టరు (2000024100) ఎక్కో కార్డియోగ్రామ్‌ తీసి రిపోర్టు తీసుకుందుకు కాచుకుని కూర్చున్నప్పుడు కౌంటర్‌లో కూర్చున్న అమ్మాయి రిపోర్టు కాగితం మా చేతి కిస్తూ “డాక్టర్లు ఆపరేషను చేస్తామంటున్నారు. దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేస్తారట. మీరు సిద్ధమేనా? అని అడిగినది. ఆ సాయంకాలమే (ఇంకొద్ది సేపట్లో) హైదరాబాద్‌ మా తిరుగు ప్రయాణానికి టిక్కట్లు రిజర్వు చేయించుకున్నాము. అందుచేత, నేను తిరిగి ఇంటికి వెళ్ళి అన్ని సర్దుకుని వస్తాము ఆపరేషను చేయించు కుందుకు సిద్ధమేనని విన్నవించుకున్నాను. హాస్పిటల్‌ మంచి తిరిగి రాగానే గుంటూరు శ్రీ విశ్వయోగి విశ్వంజీకి ఫోను చేసి విషయం చెప్పాము. 'సర్కే బయలుదేరి వచ్చేయండి; ఇప్పుడు కాదు కదా ఆపరేషను” అని అన్నారు.

171

ఆ విధంగా పుట్టపర్తి నుంచి తిరిగి వచ్చిన తరువాత 2004 సం॥ ఫిబ్రవరి నెలలో శ్రీ విశ్వంజీ హైదరాబాదు వచ్చినప్పుడు నేను మా అబ్బాయి గురించి స్వామిని ఏదో అడగబోతుంటే స్వామి “నువ్వు ఏమి ఆలోచించకు. ముందు నీ ఆరోగ్యం సంగతి చూసుకో” అని సెలవిచ్చినారు. సర్వజ్ఞులు గనుక ఆరోగ్య పరిస్థితి క్షీణించబోతున్న విషయం వారికి ముందుగానే అవగతమయినది. ఆ దివ్యమైన మహావాక్కు వృధా కాలేదు. ఎప్పుడైతే ఆ విధంగా స్వామి చెప్పారో అప్పటి నుంచి నెమ్మదిగా నా గుండె వాల్వు పని చెయ్యడం క్షీణిస్తున్న కారణంగా ఒంట్లో శక్తి తగ్గడం మొదలయినది. ఆ సందర్భంలోనే నేను, “స్వామి! నా ఆరోగ్యం గురించి రెండు నిమిషాలు మాట్లాడాలి అన్నప్పుడు, స్వామి ఏం మాట్లాడతావు? అంటే ఆపరేషను విషయం స్వామి అన్నాను. “నేను నీకు ఎప్పుడో చెప్పాను చేయించుకోమని. నీకు ఆపరేషను కూడా చెయ్యలేని స్థితి (చెయ్యకూడని) వస్తే చాలా కష్టం అన్నారు. “త్వరలో వెడతాము స్వామి పుట్టపర్తి” అని నేనంటే, వెళ్ళండి అని, ఈ ఫంక్షన్‌ (షష్టిపూర్తి వేడుకలు) అయిన తర్వాత వెడుదు గాని అన్నారు సరే అలాగేనని అన్నాము.

అదే నెలలో తిరిగి స్వామి హైదరాబాదు వచ్చినప్పుడు “అమృతవర్షిణి” పుస్తకానికి సంబంధించిన కాగితాలు డి.టి.పి. చేయించినవి వారికిచ్చాను అనుకోకుండా స్వామి హైదరాబాదులో అనుకున్న దానికంటే కొద్ది రోజులు ఎక్కువగా ఉండిపోయిన కారణంగా ఆ కాగితాలు చూసి పుస్తకము ప్రింటు చేయించడానికి అనుమతినిచ్చారు. ఇంక ఏదైనా వ్రాయి అన్నారు. విశ్వాష్టకమ్‌ వివరణ అన్న అంశాన్ని కూడా వ్రాసి, వారికి చదివి వినిపించి వారి అనుమతితో అదికూడా చేర్చడం జరిగింది. పుస్తకమునకు ఆశీస్సులిమ్మని అడిగితే చదువుతూ కూర్చుని ఉండమని ఆదేశించినారు. అదే రోజు ఒక భక్తురాలికి మద్రాసులో ఒంట్లో బావుండక పోతే దోష నివారణార్ధం ఏవేవో పూజలు నిర్వహించి, చాలాసార్లు కర్పూరహారతి స్వామి లోపల వెలిగించినట్లు బయట కూర్చున్న మాకు అనిపించినది. ఆ విధంగా నేను చదవడం పూర్తి చేసి శ్రీ రాజేష్‌ గారింట్లో భోజనము చేసిన తరువాత సాయంకాలం 4.80 గం॥లకు లోపలికి పిల్చి భోజనం చేశావా? అంటూ దయతో, వాత్సల్యంతో అమ్మ వలెనన్ను కనుక్కున్న పిదప ఆశీస్సులు పుస్తకానికి మీరు చెప్పాలి అని అడిగితే దివ్యమైన ఆశీస్సులు ఇచ్చారు. ఆ ఆశీస్సులు వారు

172

చెప్పినప్పుడు నేను వ్రాస్తూంటే అపారమైన కరుణతో వారు చెప్పిన కొన్ని వాక్యాలు నన్ను కదిలించివేశాయి. నా కంటి వెంట నీళ్ళు వచ్చాయి. అదొక గొప్ప మధురమైన దివ్యానుభూతి మాటల్లో ఆ అనుభూతి నేను వర్ణించి చెప్పలేను. వ్రాసుకోవడం పూర్తయిన తర్వాత అర్హత ఉందా నాకు స్వామి అన్నాను. ఆ సమయానికి మావారు కూడా ఆఫీసు నుంచి వచ్చారు. ఇద్దరం స్వామికి నమస్మరించుకున్నాము. బొట్టు పెట్టి విభూతి ప్రసాదము ననుగ్రహించి బిహెచ్‌ఇఎల్‌ వాళ్ళు వస్తారు “నువ్వు కూర్చుని ఉండూ” అని ఆదేశించినారు. అనుకున్న ప్రకారం బిహెచ్‌ఇఎల్‌ శాస్త్రి గారి కుటుంబం అందరు వాళ్ళమ్మాయి మంగళకు పెండ్లి సంబంధం నిశ్చయమైన కారణంగా స్వామి దివ్యమైన ఆశీస్సులు పొందడానికి వారి దివ్య సమక్షంలో అన్ని మాట్లాడుకుందుకు వచ్చినారు. స్వామి కాబోయే నూతన దంపతులిద్దరికి నిశ్చితార్ధం దివ్యంగా అనూహ్యంగా జరిపించి, మర్నాడు కాక మూడవ రోజు గుంటూరు విశ్వ మందిరంలో పెండ్లి జరుపుకుందుకు దివ్యమైన ఆశీస్సులిచ్చినారు. ఆ కార్యక్రమమంతా తిలకించే భాగ్యం నాకు ప్రసాదించి

రాత్రి 9 గం॥లకు నాకు ఇంటికి వెళ్లమని ఆదేశించినారు. మరొక విశేషము, స్వామి

సమక్షములో ఎంత సమయం కూర్చున్నా, చదివినా, ఏ విధమైన అలసట గాని, థమ

గాని ఉండవు. ఇది కేవలం అక్కడ ఆవరించి యున్న దివ్యమైన విశ్వశక్తే అని చెప్పవచ్చును.

వారి దివ్యమైన ఆశీస్సులతో “అమృతవర్షిణి” పుస్తకము ఫిబ్రవరి 29వ తేదీ తమ

దివ్య హస్తములతో ఆవిష్కరించినారు. ఎన్నో విషయాలు చెప్పాలనుకున్న నాకు వేదిక

మీద మైకు ముందు నిలబడే సరికి ఏమి స్ఫురించక తడబడ్డాను. క్షమామూర్తి

దయాసాగరుడు అయిన శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ “డ్రేమ పొంగి పారలిన

హృదయాలతో నిండిన రచయిత్రులు ఏమి మాట్లాడలేకపోయారు” అంటూ తమ

దివ్యోపన్యాసంలో సమర్ధించారు. షష్టిపూర్తి వేడుకల సందర్భంగా విశ్వనగర్‌లో ప్రతిరోజు ఉదయం స్వామి దర్శనం, శ్రీ లలితా పారాయణ, హోమములు, యజ్ఞయాగాది క్రతువులు అన్ని తిలకించే భాగ్యం కలిగించారు స్వామి. అప్పటికే నాకు ఆరోగ్యం అంతా బాగాలేదు. స్వామి దివ్య సమక్షంలో ఉన్నాను కదా అన్న ధైర్యంతో గడిపాను. ఇలా ఉండగా మార్చి శవ తేది ఉదయం స్వామిని దర్శించి నమస్మరించినప్పుడు “ఎలావున్నావు?” అని స్వామి

173

ప్రశ్నించారు. బాగాలేదు స్వామీ అని “విశ్వనగరొ ఆవరణలో ఉన్నాను గాబట్టి ఈ మాత్రంగా తిరగ గలుగుతున్నాను. మీ అనుగ్రహం” అన్నాను త్వరలోనే 11వ తేదీ కాగానే (11వ తేది మా వారి పుట్టిన రోజు కారణంగా స్వామిని మా ఇంటికి ఆహ్వానించాము,, పుట్టపర్తి వెడతాము అన్నాను.

మరుసటి రోజు మార్చి 5వ తేదీ అవభృత స్నానం, తులాభారం జరిగిన తరువాత భక్తులతో బాటు మేము కూడా వరుసలలో నిలబడి వేదిక మీదకు వెళ్ళి స్వామికి నమస్మరించుకుంటున్న తరుణంలో మావారు స్వామిని మార్చి 11వ తేదీన జరుగబోయే 60వ పుట్టిన రోజు షష్టిపూర్తికి ఏమైనా చెయ్యాలా? మీకు పాదపూజ మాత్రం చేసుకుందా మని అనుకుంటున్నాము. పిల్లలు ఇక్కడ లేరు కదా! అని అడిగారు. అప్పుడు స్వామి “వెయ్యాలి. శాస్త్రం ఉంది కదా! పిల్లలు లేకపోతే నేమి? పురోహితుడు, శాస్రిగారితో మాట్లాడు. ఆయన ఎలా చెబితే అలా చేయి. ఇవన్ని ఇక్కడ ఎందుకు చేయించాననుకున్నావు? అన్నారు. నేను కూడా హైదరాబాదు వచ్చేది ఉంది అన్నారు స్వామి. 11వ తేదీ తప్పక మా ఇంటికి రావాలని ఆహ్వానించాము. స్వామి దయతో ఆరోజు మా ఇంటికి రావడానికి అంగీకరించినారు.

అన్న మాట ప్రకారం 11వ తేదీ ఉదయం స్వామి మా ఇంటికి వచ్చి పాదపూజ స్వీకరించినారు. అదే రోజు కొంతమంది (బ్రాహ్మలు (పురోహితులు) వచ్చి మావారి షష్టిపూర్తి జన్మ దినోత్సవం సందర్భంగా వినాయకుడికి పూజ చేసి నాలుగు రోజులపాటు జపాలు చేసి ఆఖరు రోజున పూర్చాహుతి కార్యక్రమంచేయడానికి నిర్ణయించడమయినది.

పూర్ణాహుతి కార్యక్రమానికి తిరిగి వస్తానని స్వామి చెప్పారు. కాని ముందు రోజు సాయం కాలం అకస్మాత్తుగా గుంటూరు బయలుదేరి వెళ్ళవలసి వచ్చింది. మేము కొంత నిరుత్సాహపడ్డాము. స్వామి దర్శనార్థం వెడితే దివ్యమైన ఆశీస్సులిచ్చి “నేను ఉన్నట్లే. ఏమి ఫర్వాలేదు. చేసుకోండి. నా బదులు పి.ఆర్‌.రావు చేస్తాడు పూర్ణాహుతి” అని శెలవిచ్చారు.

మర్షాడు ఉదయమే పూజా సామాగ్రి అంతా తీసుకొని అహోబిలమళానికి బయలు దేరినాము. శ్రీ విశ్వంజీ ఫోటో శ్రీ సత్యసాయి ఫోటో, వినాయకుడి ఫోటో తీసుకుని

1/74 వెళ్ళి మంటపాని కెదురుగా అమర్చాము. స్వామి సాక్షాత్తూ తమ అభయాస్తంతో చూస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లే అనిపించింది. పూజ పూర్తయిన తర్వాత హోమం దగ్గర చెయ్యవలసిన కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని పూర్ణాహుతి సమయంలో శ్రీమతి మరియు శ్రీ పి.ఆర్‌ రావు గార్లు (మా అక్క బావగారు) ఆ మూటను హోమగుండంలో వేసి, తదుపరి అందరం ప్రదక్షణలు చేసినాము.

గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నాకు ఆ రోజు ఏ ఆయాసం గాని శ్రమ గాని లేకుండా, అనాయాసంగా ఇంత కార్యక్రమం స్వామి నాచేత చేయించారు. వారి పరిపూర్ణమైన అనుగ్రహ బలంతో ఆనాడు ఆవిధంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూర్పోవడమే కాకుండా అన్ని పనులు నిర్వర్తించ గలుగుట విశేషంగా భావించాను. శక్తి ప్రదాత విశ్వంజీ.

2004 మార్చి 18వ తేది పుట్టపర్తిలో సూపర్‌ స్పెషాలిటీస్‌ హాస్పిటల్‌లో కార్డియాలజీ విభాగంలో నాకు వైద్య పరీక్షలు జరిపి, ఆపరేషను విధిగా చేయించుకోవాలని చెప్తూ, ఆ ఆపరేషను చేసే విధానం, అందులో నున్న సాధక బాధకాలు (౫౩19 మున్నగు విషయాలు మా దంపతులకు డాక్టరు వివరించి చెప్పారు.

శ్రీ విశ్వంజీకి, హాస్పిటల్‌ నుంచి బయటకు రాగానే ఫోను చేశాము. “సరేలే. ఆపరేషను ఇప్పుడు కాదు కదా” వచ్చిన తర్వాత వివరంగా మాట్లాడండి అని అన్నారు. ఉగాది చూసుకుని బయలు దేరతామని స్వామికి చెప్పాము.

డాక్టరు చెప్పిన విషయాలన్ని విన్న తరువాత భగవాన్‌ సత్యసాయిబాబా వారికి మావారు లేఖ వ్రాశారు. ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితి మాకు ఏర్పడినందుకు ఆయనే సక్రమమైన మార్గం వైపు మమ్మల్ని నడిపించాలని వేడుకున్నాము. మమ్మల్ని ఈ స్థితిలో చక్కగా గైడ్‌ చేయాలని వ్రాసిన లేఖ భగవాన్‌ సత్యసాయి కారు ఆపి మా వారి దగ్గర

నుంచి స్వయంగా అందుకున్నారు. తారణ నామ సంవత్సరం ఉగాది వేడుకలు తిలకించి స్వామి దర్శనం చేసుకుని అదేరోజు సాయంకాలం పుట్టపర్తిలో రైలు ఎక్కి మర్నాడు ఉదయం హైదరాబాదు చేరాము.

175

పుట్టపర్తి నుంచి వచ్చిన కొద్ది రోజులకే 2004 మార్చి నెలాఖరు లోపున శ్రీ విశ్వంజీ హైదరాబాదు వచ్చినారు. శ్రీ విశ్వంజీకి పుట్టపర్తిలో నా వైద్య పరీక్షలు గురించి, డాక్టరు చెప్పిన విశేషాలన్ని చెప్పినాము. స్వామి అన్ని విని “ఇక్కడ కూడా డా॥ సూర్య ప్రకాళ్‌ (౮11610108130 కి కూడా చూపించి ఎక్కో కార్డియోగ్రామ్‌ ఇ.సి.జి. తీయమన్నానని చెప్పు” అన్నారు. స్వామి ఆదేశం మేరకు డా॥ సూర్యప్రకాశ్‌ గారి దగ్గరకు వెళ్ళాము. మే నెలలో తప్పకుండా ఆపరేషను చేయించుకోమని ఎండల గురించి ఆలోచించవద్దని, ఎ.సి. లో ఉంటారు గనుక ఏమి సమస్య ఉండదని చెప్పారు. అప్పటికి కూడా పుట్టపర్తి వెడతామేమోనన్న అభిప్రాయం ఉంది.

కాని భగవన్నిర్ణయాలు వేరుగా ఉంటాయి. డా॥ ఉమేష్‌ చంద్ర గారి వద్దకు కూడా వెళ్ళి పుట్టపర్తిలో జరిగిన విషయాలు చెప్పాము. ఆయన అంతా విని త్వరలో ఆపరేషను చేయించుకోవాలి ఇంక వాయిదా వేయడానికి వీలు లేదని చెప్పారు. తిరిగి కొద్ది రోజులకు మేము హైదరాబాదులోనే ఆవరేషను చేయించుకుందామని నిర్ణయించుకున్న తర్వాత స్వామి దివ్యమైన ఆశీస్సులతో డా॥ ఉమేష్‌ చంద్ర గారి వద్దకు వెళ్ళాము. డా॥ ఉమేష్‌ చంద్ర గారు శ్రీ విశ్వంజీ దర్శనార్థం విశ్వారామం (శ్రీ విశ్వంజీ ఆరామస్థలి; లకడీకాపూల్‌, హైదరాబాదు) వచ్చారు. స్వామి వారి దంపతులిరువరికి దివ్యమైన ఆశీస్సులిచ్చారు. ఆ సందర్భంలో డాక్టరు గారు నా గురించి “ఆమెకు ఆపరేషను చేయించుకోమని చెప్పండి అన్నారు. స్వామి మావార్ని ఉద్దేశించి “అడుగు సూర్యారావుని. నేను ఎప్పుడో చెప్పాను చేయించుకోమని” అన్నారు స్వామి. దా॥ ఉమేష్‌ చంద్ర గారు వెడుతూ “స్వామి కూడా చెప్తన్నారు. ఇంక చేయించుకోండి మీరు” అన్నారు.

కేర్‌ (నాంపల్లి) హాస్పిటల్‌లో డా॥॥ ఉమేష్‌ చంద్రగారు వ్రాసిన పరీక్షలన్ని చేయించాము. రక్త పరీక్షలు చేసిన తరువాత టి.ఇ.ఇ. (టెస్ట్‌) పరీక్ష కూడా చేశారు. ఈ పరీక్ష చేస్తున్నంత సేపు స్వామి నామం “ఓం శ్రీ సాయిరాం గురు దేవదత్త జపించుకున్నాను మనస్సులో. ఈ పరీక్ష నాకు చాలా బాధ కలిగించింది. మధ్యలో

176 దగ్గు రావడం, డాక్టర్లతో సహకరించ గలగాలి స్వామి మీ దయవల్ల అనుకున్నాను. మొత్తం మీద స్వామి ఆశీః ప్రభావం వలన ఆ పరీక్ష విజయవంతంగా చేయించు కోగలిగాను. నేను వెంటనే గుంటూరు స్వామికి ఫోను చేసి నాకు హాస్పిటల్‌లో జరిపిన పరీక్ష చాలా బాధాకరంగా ఉందని చెప్పాను. డాక్టర్లు ఏమన్నారు? అన్నారు. అంటే ఈ రిపోర్టు సాయంకాలం వస్తుందని మిగిలిన రక్తపు పరీక్ష రిపోర్టు మాత్రం తెచ్చుకుని వచ్చామని చెప్పాను. మీవారు ఉన్నారా అక్కడ అని అడిగి ఫోను వారికిమ్మన్నారు స్వామి. మావారి కిస్తే వారు, అన్ని వివరంగా స్వామికి చెప్పారు. ఆ రిపోర్టు వచ్చాక తిరిగి ఫోను చెయ్యమని, ఈ లోపల డా॥ సూర్యప్రకాశ్‌ని ఆ రిపోర్టు చూడమని ఆదేశించారు. మావారు ఆ రిపోర్టు తీసుకుని డా! ఉమేష్‌ చంద్రగారి దగ్గరకు వెళ్ళారు. వారు టి.ఇఇ. రిపోర్టు చూసి కొంత ఆందోళన పడి శస్త్ర చికిత్స వైద్య నిపుణులైన డా॥ ప్రసాదరావు గారితో మాట్లాడతానని ఏ సంగతి సోమవారం సాయం కాలం (ఆ రోజు శనివారము) చెబుతానన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నేను స్వామికి ఫోను చేస్తే “నువ్వు హుషారుగా ఉండు” అంటూ దివ్యమైన ఆశీస్సులిచ్చారు. ఆ సమయంలో వారి దివ్యమైన ఆశీస్సులే నాకు ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాయి. అనుకున్న ప్రకారం సోమవారం సాయంకాలం (నేను, మావారు, మా అక్క బావగార్ని తీసుకుని) డా ఉమేష్‌ చంద్ర గారు నన్ను పరీక్షించి, తదుపరి డా॥ ప్రసాదరావు గారు ఆపరేషను చేస్తానన్నారని చెప్పారు. ఎంజియోగ్రాం చేయించుకుందుకు ఒకరోజు ముందుగా హాస్పిటల్‌లో జేరమని సలహా చెప్పినారు. స్వామి ఆదేశం మేరకు మా ఇంటికి దగ్గరలో నున్న శివాలయంలో అశ్వినీ దేవతల జపాలు, నక్షత్ర జపము, మహామృత్యుంజయ జపము, హోమము మున్నగునవి నాలుగు రోజులపాటు జరిపించినాము. మొదటిరోజు మహాగణపతి పూజ నాచేత చేయించినారు. తదుపరి ప్రతిదినము తీర్ధము తెచ్చి ఇచ్చేవారు. నాల్టవ దినము మాచేత స్వయముగా

177 హోమము, పూర్ణాహుతి చేయించి శివసన్నిధానములో తీర్ధ ప్రసాదములిచ్చినారు. హాస్పిటల్‌లో ఎప్పుడు చేరాలి? అని స్వామిని మావారు అడిగారు. స్వామి “వురోహితుణ్జి శాస్త్రి గార్ని అడిగి కొన్ని తేదీలు చెబితే దాన్ని బట్టి నేను చెబుతానని శెలవిచ్చినారు. మావారు పురోహితుణ్ణి కనుక్కుంటే 2004 ఏప్రిల్‌ 24వ తేదీవరకు నేను ఇంటి నుంచి కదిలి హాస్పిటల్‌కి వెళ్లడానికి మంచి ముహుర్తం లేదని చెప్పారు. ఈ విషయం స్వామికి చెబితే అంతకంటే ముందు వీలుకాదా! అని ప్రశ్నించారు.

స్వామి దివ్యమైన ఆశీస్సులతో 24వ తేదీ స్వామి ఆదేశం మేరకు ఇంటి నుంచి బయలు దేరే ముందు కొబ్బరి కాయ కొట్టి నాంపల్లి కేర్‌ వాస్పిటల్‌లో జేరాను. 26 ఉదయం 6-80 గం॥లకు నన్ను తయారుగా ఉండమని ఎంజియోగ్రాం తీయడానికి ఆ రూమ్‌కు తరలించినారు. డా॥ ఉమేష్‌ చంద్రగారు, డా॥ సూర్యప్రకాశ్‌ గారు ఇద్దరు వచ్చి 7 గం॥లకు ఎంజియోగ్రాం తీయడం ప్రారంభం చేశారు. టెప్టు ప్రారంభమయ్యే ముందు “ఓం శ్రీసాయిరాం గురు దేవదత్త” నామం చేసుకుని పడుకున్నాను.

బల్లమీద పడుకున్న తర్వాత ఒక ప్రక్కభగవాన్‌ సత్యసాయి, ఒక ప్రక్కశ్రీ విశ్వయోగి విశ్వంజీ నిలబడి టెప్టు జరుపుతున్నట్లు అనిపించింది. గత నలఖై సంవత్సరాలుగా శ్రీ సత్యసాయి భక్తులుగా డా॥ ఉమేష్‌చంద్ర గారు స్వామి అనుగ్రహంతో వృత్తిని ప్రవృత్తిగా చేస్తూ కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొన్న వైద్య నిపుణులైతే, డా॥ సూర్యప్రకాశ్‌ శ్రీ విశ్వయోగి విశ్వంజీ భక్తులుగా ఉంటూ ప్రతినెల మూడవ ఆదివారము విశ్వనగర్‌లో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరమునకు విధిగా హాజరై ఎందరెందరికో తమ చేతులతో మందులిస్తూ ఉపశమనం కల్గిస్తున్న వైద్య నిపుణులు. అచంచలమైన భక్తి విశ్వాసం) గురువు పట్ల వారికున్న ఉన్నతమైన భావం గొప్పది.

ఆ పరీక్ష పూర్తయిన తరువాత, డా॥ ఉమేష్‌ చంద్ర గారు మావార్ని పిలచి రిపోర్టు నార్మల్‌గా ఉంది ఏవిధమైన తేడా లేదని చెప్పారు. ఆ విధంగా నాకు చెయ్యవలసిన శస్త్ర చికిత్స (34260) కు ఆటంకాలన్నీ స్వామి తొలగిస్తూ వచ్చారు. 2004 మే నెల 5వ తేదీ హాస్పిటల్‌లో జేరాలని 7వ తేదీ ఆపనేషను జరగాలని అనుకున్నాము. ఇంతలో

176

4వ తేదీ ఉదయం విపరీతమైన కడుపునొప్పి ప్రారంభమయి యూరిన్‌కి వెళ్ళడం కష్టమయి, రక్తం పడడం మొదలయినది. వెంటనే యూరిన్‌ దగ్గరలో నున్న లేబొరేటరీకి పంపించాను. డా॥ ఉమేష్‌ చంద్ర గారికి ఫోన్‌ చేసి విషయం చెప్పాను. దానికి సంబంధించిన యాంటీబయాటిక్‌ చెప్పి వాడమన్నారు. వెంటనే మందు తెప్పించి వాడడం మొదలుపెట్టాను. యూరిన్‌కి వెళ్ళినప్పుడల్లా విపరీతమైన నొప్పి తట్టు కోలేనంత బాధ “ఓం శ్రీసాయిరాం గురుదేవదత్త” అనుకుంటూనే ఉన్నాను. రెండు మూడు సార్లు చాలా పెద్ద పెట్టున నొప్పి వచ్చి సాయంకాలానికి క్రమంగా నొప్పి తగ్గినది. సాయంకాలం యూరిన్‌ రిపోర్టు వచ్చింది. ఆ రిపోర్టు తీసుకుని డా ఉమేష్‌ చంద్ర గారి దగ్గరకు వెళ్ళాము. ఆ రిపోర్టు చూసి వారు డా॥ రమణ రాజు గారికి (వృాద్రోగ శస్త్ర చికిత్సా వైద్య నిపుణులు ) ఫోను చేస్తే వారు ఆపరేషన్‌ ధియేటర్‌లో నున్న కారణంగా ఫోను అందక పోవడం వలన, నన్నే ఆయనతో మాట్లాడమని ఫోను నెంబరు ఇచ్చారు. ఈ సందర్భంలో మేము చాలా ఆందోళన చెందాము. కారణం, మర్నాడు మే 5వ తేదీ నేను హాస్పిటల్‌లో జేరడానికి నిర్ణయించడమైనది. 7వ తేదీ మంచి రోజు గనుక ఆ రోజు ఆపరేషను జరగాలని (ప్రోగ్రామ్‌) అనుకుని స్వామికి తెలియబరచి దివ్యమైన ఆశీస్సు లందుకోవడం జరిగింది. అనుకున్న విధంగా జరగకుండా ఈవిధమైన పరిస్థితి ఏర్పడినందుకు ఏమి చెయ్యాలో తోచని స్థితి ఏర్పడినది. మా అబ్బాయి కొద్ది గంటలలో నా ఆపరేషను నిమిత్తం అమెరికాలో న్యూయార్క్‌ నగరం నుంచి బయలు దేరడానికి సిద్ధమయి స్వామి ఆశీస్సులందుకున్నాడు. ఒక విఘ్నం కలుగబోతోందన్న విషయం మమ్మల్ని కలవర పరచింది.

“ఎప్పుడు ఏది జరగాలో ఎలా జరిగితే బావుంటుందో అన్నీ మీరే చూసుకోవాలి అంతా మీదే భారం” అని నమస్కరించుకుని “ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్త” నామం జపిస్తూనే ఉన్నాను. డా॥ రమణరాజుగారికి (హృద్రోగ శస్త్ర చికిత్స నిపుణులు) ఫోను చేసి నా యూరినరీ ఇన్‌ఫెక్షన్‌ సంగతి చెప్తే వారు “ ఇలా ఉండగా సర్జరీ వద్దని, వాల్వు మార్పిడి చెయ్యాలి గాబట్టి శరీరంలో ఏ విధమైన ఇన్‌ఫెక్షన్స్‌ ఉండడానికి వీల్లేదని, మర్నాడు కేర్‌ హాస్పిటల్‌కి వస్తే, అక్కడ నెఫ్రాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఒకామె చూస్తారని, ఆమె నన్ను పరీక్షించిన తర్వాత ఆపరేషను చెయ్యడానికి నిర్ణయిస్తామని, మర్నాడు

1/79

హాస్పిటల్‌కు వచ్చి వార్ని కలవమని చెప్పారు. ఇది విన్న తర్వాత మా అబ్బాయికి తన ప్రయాణం వాయిదా వేసుకోమని చెప్పాలా, ఊరకుండాలా? అనే సందేహం కలిగింది. నాకు వెంటనే ఆ సమయంలో స్వామి మాత్రమే సక్రమంగా (6414ల మార్గదర్శనం చేయగలరని వెంటనే స్వామికి ఫోను చేసి అకస్మాత్తుగా కలిగిన ఈ మార్పులన్ని తెలియబరచాను. “డాక్టర్లు ఎలా చెబితే అలా చేయండి. రేపు కేర్‌ హాస్పిటల్‌కి వెళ్ళు” అన్నారు. మా అబ్బాయిని ప్రయాణం వాయిదా వేసుకోమని చెప్పమంటారా స్వామి? అని అడిగాను. దానికి స్వామి సమాధానం “వాడ్ని రానీ” అని ఆదేశపూర్వకంగా చెప్పారు. అప్పుడునా మనస్సులోని శంకలన్ని తొలగిపోయాయి. “ఇంక అంతా ఆయనే చూసుకుంటారులే” అన్న ధైర్యం కలిగింది. “వాడ్ని రాని అని మా అబ్బాయి (ప్రయాణం గురించి స్వామి అన్నారంటే అతని రాకకు ప్రయోజనం ఉండకుండా పోదులే' అన్న ధీమా మాలో కలిగింది.

మర్నాడు ఉదయం అనుకున్న ప్రకారం 9 గం॥లకు నాంపల్లి కేర్‌ హాస్పిటల్‌కు వెళ్ళాము. నెఫ్రాలజీ డిపార్ట్‌మెంట్‌లో నన్ను పరీక్షించి యూరిన్‌ పరీక్ష కల్చరు, రక్తం పరీక్ష అల్రా సౌండ్‌ టెస్ట్‌ వగైరా అన్నీ వ్రాసి ఇచ్చారు. అన్ని పూర్తి చేసుకుని తిరిగి ఆ జాక్టరు దగ్గరకు వెళ్ళి ఆ రిపోర్టు చూబించాము. అంతా బాగానే ఉందని కేవలం యూరినరీ ట్రేక్‌ ఇన్‌ఫెక్షన్‌ తప్ప ఇతరమైనవన్ని బాగానే ఉన్నాయని, యూరినరీ ఇన్‌ఫెక్షన్‌కి నేను అప్పటికే వాడుతున్న ఏంటీబయాటిక్‌ మాత్రలు ఇంకా 5 రోజులు వాడాల్సి ఉంటుందని తన తరపు నుంచి నాకు జరుగబోయే (5షగ్టాల్సు ఆపరేషనుకు ఏ విధమయిన అభ్యంతరం లేదని (01621006 101 కళ్యూంంగ) వ్రాసి ఇచ్చారు.

2004 మే నెల 6వ తేదీ ఉదయం 11 గం॥లకు మా అబ్బాయి న్యూయార్క్‌ నుంచి వచ్చాడు. స్వామి అంతకు ముందు రోజు గ్‌వ తేదీ రాత్రికి హైదరాబాదు వచ్చారు. స్వామికి ఫోను చేశాను “మీరు హైధరాబాదు వచ్చినా నేను మీ దర్శనానికి రాలేక పోతున్నాను అని స్వామి వెంటనే “ఏం ఫర్వాలేదు. నేనే నీ దగ్గరకు వస్తాను రేపు” అని దివ్యమైన ఆశీస్సులిచ్చారు. 6వ తేదీ రాత్రి గురువారం స్వామి మా ఇంటికి వచ్చారు. పూజ అది ఏమి లేదు. హారతి ఇయ్యి చాలు. పాట కూడా పొడవద్దు

180

అన్నారు స్వామి. ఒక చరణం పాడండి అన్నారు. మాతృ హృదయానికి బిడ్డ శక్తి సామరాలేమిటో తెలిసినట్లే విశ్వమాతకు అంతకంటే వేయిరెట్లు మనశక్తి సామర్థ్యం అన్నీ తెలుసు. మా అబ్బాయిని పలుకరించారు.

మర్నాడు అనగా 7వ తేదీ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మందులు వాడుతున్నాను గాబట్టి హాస్పిటల్‌లో జేరాలా వద్దా అన్న సంశయం మమ్మల్ని పీడిస్తోంది. అదే మాట స్వామితో చెప్పి “మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను” అన్నాను. దానికి స్వామి *నేను ఎలా చెబితా అలా చేసే టట్లయితే క్రితం సంవత్సరమే ఆపరేషను చేయించుకునే దానివి! అని మందలించారు. మా వారికి కాలుకి రెండు పర్యాయాలు (20016600 దుర్ధటన జరగడం వలన దీన్ని గురించి ఆలోచించలేదు అంటూ క్షమార్పణ కోరుకున్నాను. కొంత జాప్యం జరిగినందు వల్ల గుండెల్లో కూడా కొంత మార్చు కనిపించిన మాట వాస్తవమే! చివరగా స్వామి ఇలా అన్నారు. “నువ్వు రేపు హాస్పిటల్‌లో చేరడం వలన నష్టమేమి లేదు. ఏదైనా తేడా ఉంటే వాళ్ళు ఆపరేషను చెయ్యరు. ఇంకో రెండు రోజులు అక్కడ ఉండడంలో నీకేమి నష్టం లేదు కదా” అన్నారు. మర్నాడు విశ్వారామంకి వచ్చి హాస్పిటల్‌కి వెడతానని మా ఇంటికి వచ్చినప్పుడే స్వామికి విన్నవించుకున్నాను.

నేను వేసుకుంటున్న ఏంటి బయెటిక్స్‌ నిలిపి వేయమని డా॥ ప్రసాదరావు గారు చెప్పినట్లు నాకు హాస్పిటల్‌ వారు చెప్పారు. అందుచేత ఆ సాయంకాలం హాస్పిటల్‌కు వెడదామని నిర్ణయించుకున్నాము.

మర్నాడు శివం గుడికి, షిర్ది సాయిబాబా గుడికి దర్శనానికి వెడదామని బయలుదేరుతుంటే ఆచార్య జి.యస్‌.యస్‌. మూర్తి గారు సత్యసాయి భక్తులు నన్ను చూద్దామని హాస్పిటల్‌కు వెళ్ళేముందు ధైర్యం చెప్పాలని వచ్చారు. వారు నేను ఏది వ్రాసినా చదివి సరి చేసి ఇస్తుంటారు. నేను చేసే ప్రతి రచనకు వారి ప్రోత్సాహం నాకు లభిస్తుంటుంది. వారికి కొద్ది సంవత్సరాల ముందు బైపాస్‌ ఆపరేషను జరిగింది. బహుశ బాబాయే ఆ సమయంలో వార్ని మా ఇంటికి పంపించారేమో అనిపించింది. వారు నా ఆపరేషను గురించి ఐ.సి.యు లో తీసుకోవలసిన జా(్రత్తను గురించి అనేకానేక విషయాలు నాకు సమగ్రంగా వివరించి చెప్పారు. ఇదంతా కేవలం స్వామి సంకల్పమే.

181

శివం గుడికి వెళ్ళి వినాయకుడు దగ్గర నేను మా అబ్బాయి కొబ్బరి కాయలు కొట్టి లోపల స్వామి దర్శనం చేసుకుని భజన మందిరంలోనికి వచ్చాము. తోటి సేవాదళ్‌ సభ్యురాలు శ్రీమతి శారదర పూజ ముగించి కూర్చున్నది. నన్ను చూడగానే “స్వామి మీ కోసం వెయిట్‌ చేస్తున్నారు. హారతి ఇవ్వండి అన్నది. ఆనందం ఆశ్చర్యం ఏకకాలంలో కలిగాయి. స్వామి నాకు కలిగించిన మహద్భాగ్యంగా భావించి హారతి ఇచ్చాను. “అంతా బాగా జరిగి తిరిగి మీ సేవకు శివం గుడికి వచ్చేలా అనుగ్రహించండి” అంటూ నమస్మ్కరించాను. షిర్డి బాబా దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాము. మా వదినగారు వస్తే మాట్లాడి ట్రైమయిపోయింది అంటూ లేచి సత్యసాయికి, శ్రీ విశ్వంజీకి హారతినిచ్చాను. కొన్ని సంవత్సరాల క్రితం మా అబ్బాయికి స్వామి పుట్టపర్తిలో సృష్టించి ఇచ్చిన విభూతి నాకు బొట్టు పెట్టుకోమని ఇచ్చాడు. విభూతి పెట్టుకుని నోట్లో వేసుకుని వెళ్ళి వస్తామంటూ మా అత్తగారికి చెప్పి బయలు దేరబోతుంటే కొబ్బరి కాయ కొట్టి బయలు దేరాలా అన్న శంక మా వారికి కలిగింది. మా అత్తగారు కూడా అలాగేనన్నారు (ఇదివరకు ఏంజియోగ్రాం తీయించుకుందుకు వెళ్ళే ముందు స్వామికి ఫోను చేస్తే కొబ్బరికాయ కొట్టి బయలుదేరమని చెప్పారు) కాని నాకు స్వామి ఇప్పుడు ఆవిధంగా చెప్పలేదు గనుక అలా కొట్టి బయలు దేరడం ఇష్టం లేదు. వారు చెబితే వారి ఆదేశం మేరకు ఏ పనైనా చెయ్యాలి గాని మనంతట మనం అలా చెయ్యకూడదన్న భావన నాది. అందుచే వెంటనే స్వామికి ఫోను చేసి బయలుదేరితే బావుంటుందన్న ఆలోచన నాకు కలిగింది. వెంటనే స్వామికి ఫోను చేసి “విశ్వారామం వచ్చి మీ దర్శనం చేసుకుని హాస్పిటల్‌కు బయలు దేరి వెడదామనుకుంటున్నాము. ఇప్పుడే బయలు దేరుతున్నామని చెప్పాను. స్వామి “అలాగే రండి బయలుదేరండి” అన్నారు. అప్పుడు అందరి సందేహాలు పటాపంచలయినాయి. మా తమ్ముడు వెంకటేశ్వర్లు ఇంటి దగ్గర 65 ని॥లు ఆగి టీ త్రాగి విశ్వారామం బయలుదేరాము. ఆ క్షణంలో నా బుర్రలో ఏ విధమైన ఆలోచనలు లేవు. నా మందులు, ఒక కవర్లో వేసుకుని స్వామి ఫోటోలు పెట్టుకుని బయలు దేరాము. మీ దయవల్ల కులాసాగా ఇంటికి రావాలి అనుకున్నాను. ఉదయం లేచినప్పటికి ఇప్పటికి నా ఆలోచనలలో మార్చు వచ్చింది. ప్రతిక్షణం ధైర్యాన్ని ప్రసాదిస్తున్నారు

స్వామి.

182

“విశ్వారామం” చేరేటప్పటికి హాల్లో కూర్చుని భక్తులందరు స్వామి ఆదేశం మేరకు “కిం శ్రీ సాయిరాం గురుదేవదత్తు నామజపం చేస్తున్నారు. స్వామి అప్పటి వరకు హాల్లో కూర్చుని అప్పుడే లోపలికి వెళ్ళినారట. వారందరితోబాటు మేము కూడా నామం చేస్తుంటే, మేము వచ్చినట్లుగా విని లోపలికి రమ్మన్నారు స్వామి. నేను మావారు, మా అబ్బాయి పాద నమస్కారం చేసుకున్నాము. “ఎలా ఉన్నావు?” అన్నారు స్వామి. బాగానే ఉన్నాను. కాని నేను వేసుకుంటున్న (4001040) యాంటీ బయోటిక్‌ మధ్యలో ఆపేయమన్నారు. తిరిగి ఆ లక్షణాలు, యూరినరి ఇన్‌ఫెక్షన్‌ వస్తాయేమో నన్న సందేహం ఉంది. ఆ విషయమే వారికి చెప్పాను. హారతి ఇయ్యి అన్నారు. పాట పాడవలసిన అవసరం లేదన్నారు. నామం ఆపకుండా హాల్లో చేస్తున్న వాళ్ళని అలాగే కొనసాగించమని ఆదేశించారు స్వామి. అలాగే హారతి ఇచ్చాము స్వామికి. హాల్లో పాదుకలకు కూడా ఇచ్చాము. దివ్యత్వంతో నిండి ఉంది. అక్కడ వాతావరణం. (101106 10128009) తిరిగి నమస్కరించి వెళ్ళి వస్తామని చెప్పాము. స్వామి శ్రీ కిషోర్‌ బాబు గార్ని పిలిచి షాలు తీసుకుని రమ్మన్నారు. కిషోర్‌ బాబు గారు వెంటనే షాలు తీసుకుని వచ్చారు. ఆ షాలు నాకు స్వయంగా స్వామి కప్పారు. మావార్ని అబ్బాయిని కూడా రమ్మని ముగ్గురికి కలిపి కప్పారు. అదే నాకు రక్షణ కవచమయింది. అదొక మధురమైన దివ్యాను భూతి ఆ క్షణంలో. మా అబ్బాయిని ఉద్దేశించి “నువ్వు గుంటూరు రా. ఇంకా వుంటావు కదా” అన్నారు. అలాగే వస్తాడు స్వామి అని మేము అన్నాము. మా అబ్బాయి కొంచెం తడబడుతుంటే స్వామి “ఇప్పుడు కాదు. అమెది అంతా అయి మంచిగా ఉండి ఇంటికి వచ్చాకనే” అన్నారు. ఆ మాటల్లో కులాసాగా తిరిగి వస్తానన్న ఒక అభయం, ఒక ధ్వని, గోచరించాయి. వెళ్ళి వస్తాము స్వామి అని స్వామి మరొక్క మారు నమస్కరించాను. నేను గది బయట నిలబడ్డాను. స్వామి ఎదురుగా వారి గదిలో ఉన్నారు. “వెళ్ళి రా” అంటూ ఒక చూపు చూశారు. ఆ చూపు ద్వారా నాలో ఎంతటి మహాశక్తి తరంగాలు ప్రవేశపెట్టారో (2090210 ప్రసాదించారో తెలియదు. కాని, ఆ క్షణం నుంచి ఎంతో ఉత్సాహం ధైర్యం నాలో కలిగాయి. జరుగబోయే శస్త్రచికిత్సకు కావలసినంత ధైర్యాన్ని, ఎదుర్శొనే శక్తిని, బాధను భరించగలిగే ఒక మానసిక మైన అద్భుతమైన ఓర్పును నాలో స్వామి ఆ క్షణంలో ఆ చూపు ద్వారా ప్రవేశపెట్టారు.

183

అనంత కోటి విశ్వశక్తి కిరణాలు ఆ చూపు ద్వారా నాలో ప్రసరింపజేశారు స్వామి. ఆ క్షణంలో నాకు కావల్సింది అదే. ఆ విధంగా స్వామి దివ్యమైన ఆశీస్సులు పొంది నాంపల్లి కేర్‌ హాస్పిటల్‌కు చేరాము.

హాస్పిటల్‌కు వెళ్ళగానే డా॥ రమణ రాజు గారు నన్ను పరీక్షించి గుండె వాల్వులు, గురించి వాటి వివరాలన్ని మా అబ్బాయితో మాట్లాడినారు. మంచి వాల్వు వెయ్యడం ముఖ్యమని మా అబ్బాయి చెప్పాడు వారికి. ఇంతలో హాస్పిటల్‌లో జేరడానికి అన్ని ఫార్మాలిటీస్‌ పూర్తిచేసుకుని మావారు పైకి వచ్చి రూమ్‌లో ప్రవేశించిన తరువాత అన్ని విశేషాలు మావారు స్వామికి చెప్పారు. “మంచి వాల్వు వెయ్యమనండి ఆమెకు ఏమీ ఆలోచించవద్దు” అంటూ స్వామి సెలవిచ్చారు.

మావారు స్వామి దర్శనార్ధం “విశ్వారామం” వెళ్ళారు. స్వామి కొన్ని ఫోటోలు, పుస్తకాలు, 200 రూ॥ ప్రత్యేకంగా డా ప్రసాదరావు గారికి అందజేయమని ఇచ్చి పంపించారు. దాః ప్రసాదరావు గారు మా అబ్బాయిని, మావార్ని పిలిచి మాట్లాడారు. ఆపరేషను గురించి వివరాలు సాధక బాధకాలు (110 అన్ని సమగ్రంగా వివరించారు. సోమవారం 2004 మే 10 వ తేదీ ఆపరేషను చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. శివం నుంచి ఆరుగురు రక్తదాతలు భక్తి శ్రద్ధలతో సేవా భావంతో నాంపల్లి కేర్‌ వాస్పిటల్‌కు వచ్చి రక్తాన్ని ఇచ్చి, పైకి వచ్చి ఆపరేషను విజయవంతమగునట్లు ఆశీర్వదించి వెళ్ళారు.

మావారు స్వామికి ఫోను చేసి మర్నాడు శస్త్ర చికిత్స జరగడానికి తగిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు చేప్పారు. ఆశీస్సులర్ధించారు. నేను కూడా ఫోను తీసుకుని “ఇప్పుడే ఆశీస్సు లివ్వండి. మళ్ళీ రాత్రి నాకు మత్తు కలిగించే మందు ఇవ్వచ్చు. [0౪3 గా ఉంటానేమో” అన్నాను. స్వామి “ఇప్పుడే ఆశీస్సులిస్తున్నాను” అన్నారు. అంతకు ముందే మా తమ్ముడు వెంకటేశ్వర్లు ఆపరేషను జరగడానికి అన్ని విధములయిన ఏర్పాట్లు పూర్తయినాయని: చెప్పినాడుట. అప్పుడు స్వామి “1 ఇ/111166 ౪0 4 0జలొ . (యల) ట్రాన్స్‌లోకి వెడతాను. నేను 00౧0001116 చేస్తాను” అంటూ సెలవిచ్చినట్లు చెప్పాడు.

184 ఆ రోజు ఉదయం నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం భోజనాలయిన తరువాత ముఖ్యంగా ఒకరి తరువాత మరొకరు నన్ను చూసి ఆపరేషను విజయవంతంగా జరగాలని చెప్పడానికి (3ఆ[014640 తండోపతండాలుగా (1౧31106) సందర్శకులు వస్తూనే ఉన్నారు. సాయి బంధువులు, విశ్వ కుటుంబ సభ్యులు, సాహితీ బంధువులు, స్నేహితులు నాతో చదువుకున్న సహాధ్యాయినులు, బంధు వర్గానికి చెందిన వారు, ఎందరెందరో ఆత్మీయులు వచ్చి నన్ను ఆశీర్చదిస్తూంటే, వారందర్ని కృతజ్ఞతా పూర్వకంగా నవ్వుతూ సాగనంపాను తప్ప బాధ కలుగలేదు. దుఃఖం రాలేదు. సహానుభూతితో వారు పలికే పలుకులకు కన్నులు చెమర్చ లేదంటే దీనికంతకూ మూలకారణం స్వామి ప్రసాదించిన ధైర్యము దివ్యమైన ఆశీస్సులే. ఇది అక్షర సత్యము. ఆ రోజు మా మరిది కూడా బాంకాక్‌ (3208801) వెళ్ళవలసిన ప్రయాణం రద్దు చేసుకుని హైదరాబాదు వచ్చాడు మావారికి తోడుగా ఉండడానికి. సోమవారం ఉదయమే డా॥ ఉమేష్‌ చంద్ర- గారు నా రూమ్‌కి వచ్చి 360 1001 చెప్పి వెళ్ళారు. “స్వామి పువ్వుల్లో పెట్టినట్లు మిమ్మల్ని తీసుకుని వెళ్ళి తిరిగి పువ్వుల్లో పెట్టినట్లు తీసుకుని వస్తారు ఏమి ఖంగారు పడకండి. అంతా బావుంటుంది” అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి వెళ్ళారు. మా అక్కయ్య, మా అబ్బాయి నాతో పాటు లోపలికంటా వచ్చారు. గుడ్‌లక్‌ అమ్మా అన్నాడు మా అబ్బాయి. సాయిరాం. భోజనం అది చెయ్యండి అని చెప్పాను. బాబాకు టెలిగ్రాం ఇవ్వండి అని చెప్పాను మా వారితో అలాగే అన్నారు. ఓం శ్రీసాయిరాం గురుదేవదత్త అనుకుంటూ ఉన్నాను. ఇదంతా ఆయన ప్రసాదించే శక్తి తప్ప అన్యధా ఏ శక్తి నాకు లేదు. మీరే నన్ను బయట పడెయ్యాలి అని ఆయన ఫోటో ముందు ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. ఒక సందర్భంలో స్వామికి వ్రాశాను “డాక్టర్లు నిమిత్త మాత్రులు రెండు మూడు నిమిషాల పాటు గుండె ప్రక్కకు పెట్టి ఆపరేషను చేస్తున్న సందర్భంలో నిజంగా కాపొడాల్సింది మీరు మాత్రమే (04 2006022 5276౫6") ఏ డాక్టర్లు ఏమి చెయ్యలేరు. వారికున్న నైపుణ్యాన్నంతా ఉపయోగపెట్టి రోగిని కాపాడడానికి అనేక విధాల వారు ప్రయత్నిస్తారు. కాని భగవదనుగ్రహం తోడు కావాలి. నిజంగా జరిగింది కూడా అదే.

185

మధ్యాహ్నం 2 గం॥ 40 ని॥లకు డాక్టరు గాంధీ గారు మావారి సెల్‌కి ఫోను చేసి ఆపరేషను విజయవంతమైనదని చూడవచ్చునని చెప్పారట. వారు చెప్పిన తర్వాత మావారు వచ్చి నన్ను ఆ స్థితిలో చూసి బాధపడ్డారట. మా అబ్బాయి కూడా చూసి బాధపడ్డాడని తర్వాత నాతో చెప్పారు. రాత్రి నాకు స్పృహ వచ్చింది. కొద్ది సేపటికి డా॥ ఉమేష్‌ చంద్ర గారు కనిపించారు. తర్వాత మావారు, మా అబ్బాయి, మా మరిది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి నన్ను చూశారు.

మర్నాడు ఉదయమే డా॥ ఉమేష్‌ చంద్ర గారు “ఎలా ఉన్నారమ్మా? అంటూ ప్రశ్నించారు. అలాగే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? మీ వాళ్ళంతా బావున్నారా? అంటూ ప్రశ్నించాను. వాళ్ళ కుటుంబంలో ఎవరికో బాగా లేని కారణంగా డాక్టరుగారు ఆ రోజు నన్ను చూడ్డానికి రారు అన్న ఊహ నాకు కలిగింది. అప్పటికి అది యదార్ధమే అని నాకు అనిపించి వార్ని ఆ విధంగా ప్రశ్నించాను. మత్తుమందు (40269013) ఇవ్వడం వలన ఇటువంటి వన్ని ఐ.సి.యు లో ఉన్నప్పుడు ]16130104801%3 ఆ రకంగా వస్తాయిని వారు చెప్పారు. భౌతికంగా ఆహారం విషయంలోనూ, ఇతర విషయాలలోనూ అనేకానేక రకములయిన ఆలోచనలు, మా వాళ్ళంతా మాట్లాడుకుంటున్నట్లు వాళ్ళ మాటలు వినపడుతుందేవి.

స్వామి ఫరంగా ఆలోచిస్తే అనేక రకాలయిన మంచి మంచి దృశ్యాలు స్వప్నాలు స్వామి నాకు (ప్రసాదించారు. ఐ.సి.యు లో కాలం గడవడానికి, బాధ భరించడానికి శక్తి ప్రసొదించడానికి వారు సాక్షాత్మరించారేమోననిపించింది. ఒకనాటి రాత్రి ఐదు స్వప్నాలు సత్యసాయికి సంబంధించినవి, శ్రీ విశ్వంజీకి సంబంధించినవి వచ్చాయి. సత్యసాయి అవతార వైభవమంతా కనబడింది, ఆ తాలూకు వైభవమంతా రంగు రంగుల కాంతులతో, అలంకరణలతో విశ్వనగర్‌లో కనబడినది. ఆ దృశ్యాలు ఈనాటికి మరువకుండా నా హృదయఫలకముపై చెరగని ముద్ర వేసినవి. విశ్వనగరమంతా సర్వాంగ సుందరంగా కనిషించింది. యజ్ఞశాల వైపు ప్రాంగణంలోనే ఇదంతా నాకు కనబడినది. శ్రీమతి ఈశ్వరిగారు రాధాకృష్ణుల విగ్రహం వైపు నడచి వెడుతున్నట్లు ఆ స్వప్నంలో దృశ్యం కనబడింది. ఒకానొకప్పుడు 'సర్వాంతర్యామి' పుస్తకం శ్రీ విశ్వంజీ

186 నాచేత వ్రాయించిన సందర్భంలో “ఆయన అవతార వైభవం చెప్పాలి నువ్వు” అన్నారు నాతో. ఆ వైభవాన్ని ఈనాడు ఈ సందర్భంలో ఈ స్వప్నంలో స్వామి నాకు సాక్షాత్మరింపజేసినారు. అంతా ఒక్కటేనని మరొక మారు చెప్పినట్లనిపించింది నాకు. అనంతమైన, అద్భుతమైన, అజరామరమయిన, అఖండ పరిపూర్ణ సచ్చిదానంద

మూర్తి యైన భగవాన్‌ సత్యసాయి అవతార వైభవము, మహిమలు, లీలలు, వారి ఉపన్యాసములలో చిన్ననాటి నుంచి ఈనాటి వరకు చెప్పిన అనేకానేక విషయాలు, విశేషాలు, అవగాహన, అవతార తత్త్వమును గురించి ఎవరైనా 10వ వంతు వ్రాయగలిగినా జన్మ ధన్యమే కదా! పరిపూర్ణ (్రేమావతారి యొక్క గుణగణాలు వర్ణింపనలవి కాదు. అంతులేని అనంత తత్త్వాన్ని వర్ణించడానికి ఎవరికైనా సాధ్యమవుతుందా? అంటూ అనేకానేక విషయాలు సత్సంగము మాట్లాడుకుంటున్నాము. భగవాన్‌ విశ్వంజీ కనిపించారు. శాంతి (ప్రేమ దాయి - సత్యసాయి శతకంలో ఈ క్రింది పద్యం చదివారు.

నిన్ను నీవే మజచి నీలోకి జూడగ

కామమంత కరగి కారిపోవు

కామము నశియింప గాంతియే కనుపించు

శాంతి ప్రేమదాయి - సత్యసాయి.

కామమంతా నశిస్తే చివరకు మిగిలేది కాంతియే. ఆ కాంతియే ప్రశాంతి. అదే

పరంజ్యోతి అంటూ స్వామి ఏదేదో మాట్లాడినారు. తర్వాత కేర్‌ హాస్పిటల్‌లో వినాయకుడి గుడిచుట్టూ ఉన్న స్థలంలో ఒక గార్డెన్‌ ఛైర్‌ లో శ్రీ విశ్వంజీ ఆశీనులై ఉన్నారు. వారి చుట్టూ అందరం కూర్చుని అష్టోత్తర శతనామావళి ఓం త్రీ గం గణపతియే నమః ఓం త్రీ గురవేనమః అంటూ ప్రారంభించి తదేకంగా పారాయణ చేస్తున్నాము. డా॥ సోమరాజు గారు వస్తారని స్వామి వారి కోసం అక్కడ వేచి యున్నట్లు భావన. “డా॥ సోమరాజుకి చూబించుకో” అని ఆపరేషను ముందు స్వామి ఆదేశించినారు. కాని మేము వెళ్ళినా వార్ని కలవలేకపోయాము. మా కజిన్‌ సోమరాజుగారికి ఐ.సి.యు. లో నా బెడ్‌ నెంబరు చెబితే నన్నువారు వచ్చి చూసి పలకరించినారు. ఈ విధంగా స్వామి వినాయకుడి గుడి

187

దగ్గర రెండు మూడు స్వష్నాలలో సాక్షాత్కరించినారు. తెల్లవారేసరికి మొత్తం ఐదు స్వప్నాలు వచ్చాయి. ఆ రాత్రంతా ఆ విధంగా గడచింది. ఐ.సి.యు.లో నాకు రాబోయే ఉపద్రవాలన్నింటిని స్వామి స్వీకరించి తాను అనుభవించి నన్ను సురక్షితంగా కాపాడారు. ఆరోజుకారోజు నా పరిస్థితి మెరుగవుతోంది. శుక్రవారం 14వ తేదీ నా ఒంటి మీద అమర్చిన ట్యూబులు చాలావరకు తొలగించారు. అదే రోజు ఐ.సి.యు నుంచి స్టెప్‌ డౌన్‌ ఐ.సి.యు కి నన్ను మార్చినారు. ఆ నాలుగు రోజులు నేను ఏ విధంగా గడిపానో తల్చుకుంటే భయంకరంగా అనిపిస్తోంది. అనుక్షణం నాకు అక్కడ తోడుగా నిలబ్దిది స్వామి. వారి నామం తల్చుకుంటూ ఉండేదాన్ని ఎటు తిరగాలన్నా కష్టంగానే ఉండేది. కదలలేని స్థితి. మావారు ఒకపూట, మా అబ్బాయి ఒకపూట కేవలం 2ని॥లు మాత్రం వచ్చి నన్ను చూసి వెడుతుండేవారు. స్వామి సూక్ష్మరూపంలో వెంట నిలిచారు. అంతా స్వామే కనిపిస్తున్నారు, అన్యధా నాకు ఏమి కన్పించటం లేదు. మా అబ్బాయి, మావారు, గుమ్మం దగ్గర నుంచే నిలబడి నన్ను చూస్తున్నారు. “స్వామికి ఫోను చెయ్యండి" అని చెబుదామంటే ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళు నా దగ్గరకు రావటం లేదు. (ఆ ద్వారం గుండా డాక్టర్లు తప్ప ఐ.సి.యు. లోనికి మిగిలిన వారెవరు రావడానికి వీల్లేదని తర్వాత చెప్పారు.) నేను ఎదురుగా కనిపిస్తున్నాను గదా అని ద్వారంకి దగ్గరగా నా బెడ్‌ ఉందని అక్కడే నిలబడి చూస్తున్నారు.

ఇది ఇలా ఉండగా పడుకుని ఉండగానే నాకు ఇసి.జి. తీశారు. డా॥ ఉమేష్‌ చంద్రగారు వచ్చి చూసి రిపోర్టు అంతా బావుందని చెప్పి వెళ్ళారు. నన్ను రూమ్‌కి తరలించారు. స్వామికి ఫోను చేసి రూమ్‌కు తీసుకుని వచ్చారని చెప్పారు మావారు.

“మీ దివ్యమైన ఆశీస్సులతో ఈ విధంగా తిరిగి వచ్చాను” అన్నాను. “ఆశీస్సులు” అంటూ వారు తిరిగి ఆశీః వర్షం కురిపించారు. ఆ అపారమైన అనుగ్రహమే లేకపోతే ఆ విధంగా ఆ వారం రోజులు ఐ.సి.యు లో గడిపి రాగలిగేదాన్ని కాదు. అనుక్షణం క్షణక్షణం దగ్గరుండి కంటికి రెప్పలా, నన్ను కాపొడారు స్వామి. చాలా నొప్పిగా ఉన్నా అదంతా భరించే శక్తి ప్రసాదించారు స్వామి. తిరిగి ఎక్స్‌రే, ఇసి.జి. ఎక్కోకార్జియోగ్రాం

188 మొదలైన పరీక్షలన్ని చేసి అంతా నార్మల్‌గానే ఉందని డాక్టర్లు చెప్పారు. ఒక సందర్భంలో నేను కేర్‌ హాస్పిటల్‌ వరండాలో నడుస్తుంటే (౦4 జ 1061001008 1166 22 0౮౬/6 92%ల0) “మీరు ఆపరేషను జరిగిన రోగివలె కన్పించడం లేదు అన్నారు. 11136203 కళ 61206 స్వామి అపారమైన అనుగ్రహం ఇదంతా అనుకున్నాను ఆ క్షణంలో. గురువుకృప, గురువు ప్రసాదించిన శక్తికి మించిన దేదీ ఈ జగత్తులో కానరాదు. 0616 1000108 1106 ౮౮౪౫9 ౮1106౬ ఆ వారంలో నన్ను ఇంటికి పంపక ముందే స్వామి ఆదేశం మేరకు మా అబ్బాయి గుంటూరు వెళ్ళి వస్తే బావుంటుందని 18వ తేదీ మంగళవారం మధ్యాహ్నం పలనాడులో బయలు దేరి స్వామి దర్శనార్థం వెళ్ళాడు. వెళ్ళగానే వినాయకుడికి విశ్వమందిరంలో కొబ్బరికాయ కొట్టమన్నారట. తదుపరి కొద్దిసేపు కూర్చున్న తర్వాత పిలిచి మాట్లాడారు. ఆ రాత్రి మాకు మా అబ్బాయి ఫోను చేసి “స్వామి మాట్లాడతారుటొ అంటూ మా వారితో చెప్పాడు. ఆశీస్సులు చెప్పారు మా ఇద్దరికి. స్వామి నాకోసం రెండు మూడు రోజులు చాలా బాధపడినట్లు, ఎవరు ఫోను చేసినా జవాబు చెప్పక, ఒకవేళ చెప్పినా ఆశీస్సులు అంటూ పొడిగా మాట్లాడి పెట్టేసేవారని అక్కడ గుంటూరులో చూసిన వారందరు చెప్పారు. ఎవరికి దర్శనం కూడా ఇవ్వలేదని చెప్పారు. మా కుటుంబం తరపున స్వామికి కృతజ్ఞతలు తెల్పుకొని చాలా తృప్తిగా ఆనందంగా మా అబ్బాయి ఆ రాత్రి నర్భాపూర్‌ ఎక్స్‌(ప్రెస్‌లో బయలుదేరి హాస్పిటల్‌కి వచ్చాడు. నాకు మావారికి కూడా మా అబ్బాయి ఆ విధంగా వెళ్ళి రావడం చాలా సంతృప్తిని కలిగించింది. మే నెల 2004, 20వ తేదీ నన్ను డా॥ రమణరాజుగారు చూసి అంతా బావుందని చెప్పి గురువారం సాయంకాలం 480 గం॥లకు నన్ను (0136082080) విడుదల చేశారు. వినాయకుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్మరించుకొని కొబ్బరికాయలు కొట్టి ఇక్కడే కదా స్వామి కన్పించారు అని మననం చేసుకుని ఇంటికొచ్చాము. మా కుటుంబ సభ్యులందరు ఎంతో ఆనందించిన అద్భుత సన్నివేశమిది. మా అబ్బాయి అనుకున్న ప్రకారం 22వ తేదీ ఉదయం బయలుదేరి తిరిగి అమెరికా వెళ్ళాడు. గుంటూరులో స్వామి మా అబ్బాయిని అమెరికా తీసుకుని వెళ్ళమని 50

189

షాలువాలు, 6 పుస్తకాలు ఇచ్చారు. అవన్ని ఒక బేగ్‌లో సర్దాము. దుబాయిలో మా అబ్బాయి న్యూయార్క్‌ విమానం లండన్‌ మీదుగా వెళ్ళేది మిస్‌ అయ్యాడు. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌లో దుబాయి నుంచి న్యూయార్క్‌ ప్రయాణం చేశాడు. న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టులో దిగేసరికి లగేజీ ఒకటి రాలేదు. ఆ ఒకటి స్వామి పంపించిన షాల్సుతో ఉన్నది. మర్నాడు వస్తుందిలే, లేక త్వరలోనే వస్తుందిలే అనుకుని ఇంటికి వెళ్ళాడు. ఎన్ని రోజులయినా ఆ బేగ్‌ ఆచూకీ తెలియలేదు. తను చాలా బాధపడ్డాడు. స్వామి ఇచ్చినవి అందులో ఉన్నాయి కదా. అది పోకుండా ఉంటే బావుండేది అనుకుని మేము, మా అబ్బాయి కూడా చాలా బాధపడ్డాము. మా అబ్బాయికి [038 ఉహూజం వారు 00౫93260 కి అప్లికేషన్‌ పెట్టుకోమంటే పెట్టాడు. ఇటీవల అనగా జనవరి 2005 స్వామి హైదరాబాదు పర్యటన సందర్భంగా విశ్వారామంలో నన్ను మాట్లాడమంటే నా స్వానుభవం చెప్పాను. అప్పుడు స్వామి బేగ్‌ మాట చెప్పవేమి? అన్నారు. అప్పుడు ఈ విషయం కూడా నేను చెబితే కొన్ని దోషాలు పోవడానికి ఆ విధంగా జరిగింది అన్నారు. అది ఎందుకు పోయిందోనని, స్వామి సంకల్ప బలం వలన దొరకాలని ప్రార్థించినా దొరక లేదంటే “అంతరార్థం ఇది అన్నమాట” అని వారి మాటలవల్ల బోధపడింది. మనకి అంటిపెట్టుకుని ఉన్న దోషాల్ని తొలగించటమే వారు చేసే పని. ఆ బేగ్‌లో ఉన్న ఇతర వస్తువుల్ని గురించి మా అబ్బాయి కాని మేము కాని బాధపడలేదు. స్వామి ఇచ్చిన షాలువాలు, పుస్తకాలు పోయాయి, వాటికి విలువ కట్టడానికి ఎవరి తరమూ కాదు, అని భావించాము. దోష నివారణార్ధం స్వామి ఆవిధంగా చేశారు.

నా ఆపరేషను జరిగిన తరువాత హైదరాబాదు వచ్చినపుడు మా ఇంటికి స్వామి స్వయంగా వచ్చి నన్ను చూసి ఆశీస్సు లిచ్చి వెళ్ళారు. మా అక్కయ్య శ్రీ విశ్వారామంలో శ్రీ విశ్వంజీని దర్శించి “మా చెల్లెల్ని బయటపడేశారు. నిజంగా పెద్ద గండం తప్పించారు. మీ దయ వలన కులాసాగా ఇంటికి వచ్చింది” అంటూ నమస్కారం చేసినప్పుడు స్వామి “నేను మూడు రోజులు పడుకుని ఉన్నాను. నేను ఏమైపోయానో అనుకున్నారు ఆందరూ గుంటూర్లో అని సమాధాన మిచ్చినారట. మా అక్కయ్య ఈ విషయం నాకు స్వయముగా చెప్పింది. పునర్జన్మను ప్రసాదించి మా కుటుంబానికి ఎనలేని మహోపకారం చేశారు అన్నాను. తదుపరి 2004 జూన్‌ 8వ తేదీ స్వామి హైదరాబాదు వచ్చినప్పుడు, మేము

190

క్రొత్తగా తీసుకున్న ఫ్లాటులో పాదం పెట్టవలసిందిగా అర్ధించాము. అప్పుడు కూడా స్వామి దయతో మా క్రొత్త ఇంటికి వచ్చి పాదం పెట్టి కొబ్బరికాయలు కొట్టి పునీతం చేశారు. మేము ఉంటున్న ఇంటి ప్రక్కనే మా క్రొత్త ఫ్లాటు అందుచేత 2 ని॥లు రావాలి స్వామి అంటే తిరిగి వచ్చి నన్ను చూసి వెళ్ళారు. దివ్యమైన ఆశీస్సులిచ్చారు. “ఇంక ఏమి ఫర్వాలేదు. అంతా బావుంటుంది” అని దీవించారు. ఆపరేషను జరిగి ఇంటికి వచ్చిన తరువాత మూడు, నాలుగు వారాలపాటు నాకు కొద్దిగా జ్వరం వచ్చేది. మేము డాక్టర్‌ క్లినిక్‌ నుంచి తిరిగి వస్తూంటే శ్రీ జానకిరామ్‌ గారు మా వారికి ఫోను చేసి సెల్‌లో మాట్లాడుతూ స్వామి జరం ఎలా ఉందో కనుక్కోమన్నారు అంటూ చెప్పారు. మా వారు ఇంటికి వచ్చిన తరువాత స్వామికి ఫోను చేసి చెప్పారు. ఆహారంలో నియమాలు పాటించాలని జాగ్రత్తలన్ని స్వామి చెప్పారు. స్వామి ఆ సమయంలో గుంటూరు నుంచి హైదరాబాదు వస్తున్నారు. తర్వాత జ్వరం గురించి పట్టించు కోవద్దని తగ్గుతుందని స్వామి చెప్పారు. ఒక వారం తర్వాత కేర్‌ హాస్పిటల్‌కి (160100) చూబించుకుందుకు వెడితే డా॥ సూర్య ప్రకాశ్‌ గారు చూసి గుంటూరు వెడితే స్వామి అంతా మీ గురించే మాట్లాడారని, ఆపరేషను ఎలా జరిగిందో చెప్పు అంటూ నా చేత

చెప్పించారు” అన్నారు. మరికొన్ని విశేషాలు! ఇటీవల డిశంబరు నెలలో కొంతమంది భక్తులు అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. విశ్వారామంలో శ్రీ విశ్వంజీ దివ్య సన్నిధిలో అందరం కలుసుకోవడం జరిగింది. వారందరు నన్ను ఎలా ఉన్నారు? అని ప్రశ్నించారు. బాగానే ఉన్నాను స్వామి దయవలన అని చెబితే శ్రీమతి స్వర్ణగారు (శ్రీ కోట నారాయణమూర్తిగారి శ్రీమతి) ప్లారిడా నుంచి వచ్చారు. ఆమె మీ ఆపరేషన్‌ సమయంలో మేము గుంటూరు స్వామికి ఎన్నిసార్లు ఫోను చేసినా ఎత్తేవారు కాదు. ఎప్పుడైనా ఫోను ఎత్తినా “ఆశీస్సులు” అని వెంటనే పెట్టేసేవారు. ఏదైనా పొరపాటు చేశామా, స్వామికి మనమీద కోపం వచ్చిందేమోనని అనుకునేవాళ్ళము” అన్నారు. శ్రీమతి సుధా బాలక్రిష్ణ చికాగో నుంచి చేస్తే కూడా అలాగే జరిగింది. చివరకు ఆమె ఏమి అంతుబట్టక శ్రీమతి ఈశ్వరి గారికి ఫోను చేసి, ఎందుచేత స్వామి ఫోను ఎత్తటం లేదు? అని అడిగినారట. అప్పుడు అమ్మగారు “రత్నమోహినికి ఆపరేషను జరుగుతోంది” స్వామి దీక్షలో నున్నారు అని

191 జవాబు చెప్పినట్లు శ్రీమతి సుధా బాలకృష్ణ స్వయంగా చెప్పినారు. శ్రీమతి సుధా బాలకృష్ణ గారి ద్వారా తెలిసింది స్వామి ఫోను ఎత్తక పోవడానికి కారణం, అంటూ నాకు స్వర్దగారు కూడా చెప్పారు.

2005 జనవరి నెలలో ఒక సందర్భంలో స్వామి హైదరాబాదు పర్యటన సమయంలో శ్రీమతి ఈశ్వరి గారు గుంటూరు నుంచి వచ్చారు. ఆ సమయంలో ఆంటీ నన్ను ఎలా ఉన్నారు? అని ప్రశ్నించారు. నేను ఆపరేషను జరిగిన తర్వాత ఇంకా గుంటూరు వెళ్ళని కారణంగా ఆమెను కలువలేదు. బాగానే ఉన్నాను అని చెప్పాను. స్వామి చాలా (38కొల) బాధపడ్డారు రెండు మూడు రోజులు. మేము అక్కడ ఆ సమయంలో స్వామిని చూశాము కదా! పోనీ మీరు బావున్నారు కదా! ఆయన పాపం చాలా బాధపడ్డారు అంటూ అమ్మ చెప్పినప్పుడు నా కంటి వెంట నీరు వచ్చింది.

నా బాధంతా వారు స్వీకరించి, నాకు ఏ విధమైన ఇబ్బందులు (00%0104%4003) లేకుండా నన్ను బయట పడేశారు. ఆ అపారమైన కృపా కటాక్షానికి సర్వవేళలా కృతజ్ఞతతో మెలగడం కంటే చేయగలిగిందేమి లేదు. “గురువు మీకు సేవ చేస్తాడు అని స్వామి చెప్పడంలో అంతరార్ధ మిదియే కదా అనిపిస్తోంది. ఆపరేషను విజయవంత మవడం ఒక ఎత్తు అయితే సృహ రావడం, తదుపరి శరీరంలో అన్ని లెవెల్స్‌ సరిగ్గా ఉన్నాయో లేదో అనుక్షణం డాక్టర్లు చూసినా, గురు కృప వలన, అనుగ్రహం ఆశీర్వాద బలం వలన మంచి ఫలితం కనిపించిదని నా నమ్మకము. దానికి నిదర్శనం కూడా అనేక మంది చూశారు.

స్వామి మా ఇంటికి నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు ఈ విధంగా అన్నారు. “డాక్ట్లే భయపడ్డారు నీకు ఆపరేషను చెయ్యడానికి ఫోటో జేబులో పెట్టుకుని చేశాడు ప్రసాదరావు. చెయ్యవలసిన టైము దాటింది, తర్వాత నీకు హార్ట్‌ లంగ్‌ మిషన్‌ పెట్టారు. ఒక వాల్వు మార్పు చెయ్యడంతో బాటు మరొకటి రిపేర్‌ చేశారు. హార్ట్‌ రిథమ్‌ (16౫1ుయిు) సరి చెయ్యడానికి కూడా ప్రయత్నం జరిగింది” అన్నారు. స్వామి గుంటూరు ఫోను చేసి

శ్రీమతి ఈశ్వరి గారితో మాట్లాడి నాకు ఇచ్చారు. ఎలా ఉన్నారు? అని ఆమె అడిగితే

192 “స్వామి పునర్జన్మ ప్రసాదించారు. మహోపకారం చేశారు మా కుటుంబానికి అన్నాను. చాలా సంతోషం అన్నారు ఆమె.

ఆపరేషను ముందు ఇంక కొద్దిరోజుల్లో హాస్పిటల్‌లో జూయిన్‌ అవుతాననగా స్వామిని దర్శించుకుందుకు మావారు గుంటూరు వెళ్ళారు. “స్వామి క్రిందకు వెళ్ళు అమ్మలో కూడా మాట్లాడించు” అన్నారట. నేను మా వారితో వెళ్ళేటప్పుడు చెప్పాను. స్వామి ఆశీస్సులు అమ్మగారి ఆశీస్సులు కూడా తీసుకుని రండి అని. స్వామి సర్వజ్ఞులు అందుచే క్రిందకి వెళ్ళి మాట్లాడించు అని చెప్పారు. మా తమ్ముడు వెంకటేశ్వర్లుతో కూడా స్వామి అన్నారట. “ప్రసాదరావు ఆపరేషను ఫోటో జేబుతో పెట్టుకుని చేశాడు” అని.

ఈ విధంగా పునర్జన్మను ప్రసాదించిన పుణ్యమూర్తికి శతకోటి వందనాలతో బాటు కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాను. విశ్వగురువు కృపాకటాక్షములు సర్వులకుండుగాక! “లోకాసమస్తా సుఖినోభవంతు”.

ఓం శ్రీసాయిరాం గురుదేవదత్త టాలీ న లుల,

గల ల్‌ ఉతర. , ॥

న్‌ =౯ ౧ శే ్‌ో టా? జాం మ ద

జట్‌ మూలో సాన ఖానా సాస్‌ నా మాయమాయే మా గా క * వ జ వాటా సం / " క. ॥ =. మర న్‌ (గై నం (1 1 కి య. న ళ్‌ ణ్‌ న! న! ణన | ల టో నన టి కా ( ఎ వాక్‌ చ. భీ న! ష్య గ లక . క్ట జ ఖం. ళల న థి హం. శే? | నే ఇ య " న్ను ॥| క్ట / ౮ న. | ॥ శా | , లీ * శా! టర నే స్‌. || న్న శభ గ శ హే. | క గ | ఆ జ ట్ట. | / /| (= జ || (./ . గ ॥ ల ౮: శీ గ ణీ క క మ; ఖే --ఖటీ కం. ప క లు (| చ్‌ ల శ . | ల్ల తలు మ. (న! | ఓ / న్‌ ము ని ల్‌! య ను "1 న స్స నో! / శం స్తం 1. న ర. ే హా కీ తను? తభ మ ( జరా ను న్‌ ఆ అస్త మనన న ష్‌ క సే గ్‌ న్‌ | స్తే | | న 4. /. 1 ల గ | " షు _ నోస్‌ న యం! తి ల యో న్‌ శ్‌ అ కః మాట న్న. న గ్గ ల న.

లా. (మీ (| సట ఉంచ | 4 గ్గ | శ “ ర భభ ౮౫ గు " (్స) గలి సల ॥ | /| . స్ట్‌ "| లు ॥ ః స ం | జ థ్‌ నే గ్‌ నఖ ళ్లు 4 ల్‌ క! ల్‌ క లీ / క సం శన "౩ / | న మ . | | నహ. కా! +] ( జీ 'ఇట్ష శై / ధా ఖై గ . మే. 1 2! కీ న జా ని . ఈ ( / ॥ . ॥ (1 క + ॥ ॥ "మ, 7 వ. "ఈ... అ. ల , అ.” న య ట్రై. !