Telugu vana kadigina cheekati - anilvaranasi/indianlanguages GitHub Wiki
. | | శ |
వ. ట్స! స న. క |
వాన కడిగిన చీకటి కనికా పంపుటీ ఎన్. గోపి జిష్టు ప్రచురణలు హైదరాబాద్ 2009
212 క2ర12012 ౮911024 బభ్ల౭ల7?గ ౮00/6020% 6౧౨౦౭౫బా |! . శ్చ సప - వొాగాగ లలిగూలండు 2009 ౧౦౯7 విబాజ్రిగ 20212 ఆ స స్ గ్ 6న కర య... | | వొంగ 007టా? క సాయము? క తలు2 ఇటాలి వదరబార్ యయ 13-1/59, వయహాడూా2ైంము 1! గ్ట కంుబురు2ంంక మ్వైరేల2026-13 ) ణి గ విష0[6: 040-27037585 4. ల! శంణ! మగడ వంకంనకై 0456 మకరేంయ046 206 1 211 91110060. ఎ౨గ॥44 4౬ 1012 ౧౦౧0466౯ వటాలీఆ5్ ఉుబాగ్రాాంగూ ఉ 444/0000/6047 6గాల 07/25 64002024, ఈూడం/4ర044 - 00 044 *4. 276౮4003, 276769/0 27677076 తాగాడు ఒసైజాటాంగ ట్రై 007
అంకితం తెలుగు, కన్నడ భాషలకు సేతువు కట్టిన ఉభయకవిమిత్రుడు అఖిల భారత, ప్రపంచ తెలుగు ఉద్యమాలకు దోహదం చేసిన సాంస్కృతిక యోధుడు స్నేహానికి హృదయాన్ని తాకట్టు పెట్టే మంచిమనిషి నాకెంతో ఆత్మీయుడు.
డా! ఎ. రాధాకృష్ణరాజు (బెంగుళూరు) గారికి
ఆయన షష్టిపూర్తి సందర్భంగా ...
విషయసూచిక క్ష వర్షంలో ఇద్దరం... 62006006 ఐవలరలలలలలవలలలవవవవవవలవమదవవంటంంలంంలం ౯ 2 అక్షరాలు 40000000 ం0 కరం వలలను వం రరరలర వలవల వందల వరల వచనలవ వలం లలల ర్తి శ సహాయక క్రియ ......౨౨౨౨౨౨౦౦౦౦౦౨౦౦౦౦ వల లంలంవవలలవవంలలలటలలలలల కతి 6 నిక్షిప్తం ........44040200006000 2వ వెలటవవవల చవల వర వివదవవివలవవనవ. వదవవంంమలలలలు క్షే 7 గియాస్ మతీన్ స్మృతిలో ......... 000000 కేరి 8 వీధిలో వృద్దుడు.......౨౨౨౨౨౨౦౦౦౦ంలంరంలంలదదందంంలలలంంలంలంంంజ లం బరి 98 కాస్త.ంంంటలంంంలలటలలలదదలలదదవవలవవచరచవంచలవదలలవలవవటమవంంలం జక 10 పేలని బాంబులకు నమస్మారం !1.......౨౨౨౨౨౨౨౨ ౨౦౨౭౭౦౭౦42 లంలంలలటం బైటై 11. వైమానికం......౨౨౦౦౦౦౦౦ ౦౦వ లలంరలరదరందరచచరరచరచరరచటటటలలల లలల లైరి 12 విశాఖ పట్టణం ......౨౨౨౨౦౦౦౦ 406606 కటవల లవలలవలలలరరవ వనం వలలంల వంటల బైక్తీ 13 ఆవిష్కారం .....౨౨౨౨౨౨౦౨౦4౦44002 00 వర వటరలవల చద వరచదంలవవలవంలంలం220224224424 వైర్ 14 భీమ్‌లీ ....౨౨౨౦౦౦౦౦౨౦వ రంల లల లదవలవలచవలలలవనలవవనంలంలలవవలలలంలంలైటి 15 అప్పుడప్పుడు ....౨౨౨౨౨౦౦౦౦౦౦౨౦౦౦౦౦౦౦౦లరంచంలలం లలల 227 168 అరకు ప్రయాణం... ౦౦౦౦ల లం రం లం లం లం లంరందవలం లంట లంవవవంలలం బరి 17 అఖండ భారత్..........4400000వలలవ నవవ లంకల వలం 4300002222 లైర్రి 18 మిగిలిపోయిన పాట ....౨౨౨౨౨౨౨౨4422 22 02టవం వల వటట వ వంం 64844 460622222= తైక్షే 198 మరోసారి సముద్రం .......౨౨౨౨౨౨౨౨ ౨౦౦౦౦౦౦౦ ర వరం వలలలటరలవంలలంలంటటంంలటు ట్రెక్తీ 20 డిజరైడ్ విలేజ్:......ంంం00ంంంంంంంంలంరంం లలల వంం4న తీర్ లై. స్ఫటిక బంగారం .......2404460 26062202 కల వదద వలన వనర వట వలల 6660000000 తి? 22 కాలం ఒక శూన్యం వటట తి టట వచిచరి విద వళ వలల రద లిచిరరవవవలడరదలల ఏం వ వటటం ఎం440 వికి 28 జీవయాత్ర ......౦౦౦౦౦౦౦౦౦౦ 000 0రరంవటరవంటటం రవం టలవటలటం 40 24 “భూమిని ముద్దు పెట్టుకుంటాను" ........౨ లల కే 25 అపరిజణామం.........2222220222 20006600 6060406000 0 రకల వటం ం4 వలం 002 త్తీలై
౭6 గాలికొండ....౨౦౨౦౭ ౭౨౨౦౦౭ రచదరదలవరరరరనదనర వల లవద రట వంవటటదటంలలలలలలరల లర లాం ల్తీల్మే 28 పరావర్తనం ........24-24౭౦౦౭౭౦౦౦౭౭రరవ2 వన లరరదంనంవవంవ వవ లలలదం లం ల త్తి ౨9 అసంగీతం........౨౨౨౦౦౦౦ ౭౦ వవదంద దరద రరచలం రల వంపి టటటటటటంంటంవలంలలలం కీర్తీ 30 చోర్ కౌన్ హై? ....24౦౨౦౦4౦౦౦౦౭౦౦౦ల౦౦ ౦౦వ చలమలలటలు వలల కీర న... 32 సెప్టెంబర్ కవ ౩౧. 88 ఆలాపన...........౨౨౨౨౦౭౭౨౦౦ ౭వ వలలందదలం వరం వంటల ర్‌కి న. 85 చపలుడు.......౨౦౦౦౦౦౦లంలలలలదలతవలచవలంంల్6.. 86 మిగిలిన అక్షరాలు ......౨౨౨౨౨౨౨౦౨౨౦౨౦౦౦౦౦౦ ౦౦ మరలటలలలలల ర్‌కి 87 చలన గీతం........౨౨౦౦౦౦౦౦ల౦లలలవలలరలదలంలవలటల వలల 60 88 అడవి కథ...........౨౦౦౦౦౦౦౦ ౬౦౦౦ రరవరంంవంలలలలటలంం తినే 89 సింవాసనం..........౨౨౦౦౦౦౦౦ రరర లలలలలలంలలలలటల 68 త్తం | సంకల్పం .......౨౨౨౨౦౦౦౨౭౭౭ ౨౭౭౦6 రరర దరద వవ చలం చడం టరవ వలల వం వవ టటటలవవచతవతలలంం 65 41 అసహజం...........4౦౦౦౦౭వ లలల లరర దల వలవ నవల లళం నవవ 66 42 న్యాయానికి నివాళి ......౨౨౨౨౦౦౦౦౦౦౨౨౦ ౨౦౦౦ల చటమలలల ఈ 48 పితృసూక్తం..........౨౨౨౨౨౦౦ ౦౦౦౦౦౦౦౦౦౦ లలల ఈ ఢీ _ ఏకంసత్.................౨౦౦౦౦౦౦౦లం లలల 70 46 బీచేతులు......౨ టి తీ7 _ ఫోటో గ్రాఫర్...........౨౨౨౨౨౨౨౦౨౦ ౨౦౭2 వవల 020 వం లంద లలల గ్ తరి. ఆత్ముంంుంటంటలంంంలరలదదరరరలలదదదరదదదననలవవం వదం చదవ వకవ టవ వవ వవలల నటనల 78 49 మరోసారి తంగెడుపూలు........౨౨౨౨౨౨౨ ౨౦౦౦ల లంటటటటంటల 79 50 విరోధాభాసం ......౨౨౨౨౨౦౦౨౦4 4460062000 00 వరటంవవటంలలటటటటంంంంంం రే 51 వాన కడిగిన చీకటి...................0ం0టటంటంటంటటుం ల తిర్
వర్షంలో ఇద్దరం
వర్షమూ నేనూ తప్ప రోడ్డు మీద ఎవరూ లేరు. వీధి దీపాలు చినుకుల్ని ముత్యాలుగా మార్చి
హారాలు పేనుతున్నాయి.
కాలువలు వేస్తున్న చిత్రాలు
చూపులు పట్టుకునేంతలో మారిపోతున్నాయి. ఆకులూ చినుకులూ కలబడుతున్నాయి ఆకుల చలన విన్యాసాల ముందు చినుకులేం ఆగుతాయి?
రాజ్‌కపూర్ నర్జీస్
మెరిన్ డ్రైవ్ పై ముసురును వేదెక్కిస్తున్నారు దూరంగా ఎక్కడో
మెరుపు పెళ్లలు విరిగి పడుతున్నాయి.
నా చేతిలో గొడుగు లాక్కొని
దూరంగా విసిరేసింది వాన
ఇప్పుడు వర్షమూ నేనూ చీకటీ తప్ప రోడ్డుమీద ఎవరూ లేరు
ఒక పురాతన ఆకాశవాసన
ఒళ్లంతా ముంచెత్తింది.
పొదల ముంగురుల్లో
ఒక విచిత్ర కలకలం.
ఇంతలో ఎక్కడో తీగతెగింది
ఇప్పుడు లోపల కూడా వర్షం 1
వదో జరుగకూడనిది జరిగినట్టు
ఒక అసహజ వికృత శీతవాయువు పరుగులు పెద్దుంది.
ఎన్, సోపి 7
ప్రవాహంలో ఒక రక్తపు జీర
ఇటే కొట్టుకొస్తుంది.
నీటిలో మునిగిన పాదాలు వొణుకుతున్నాయి
ఇది నిన్న తూటాలకు కూలిన
వీరుని నెత్తురు కాదు గదా !
ఇప్పుడూ అతడూ నేనూ తప్ప
రోడ్డు మీద ఎవరూ లేరు.
కేకల? చినుకు 8 వాన కడిగ్‌నీ చీకటి
అక్షరాలు పిల్లలు పిల్లలే కాని పెద్దలు పసిపిల్లలవడం కవిత్వం. ఓనమాలను అన్నిసార్లు ఎందుకు దిద్దారి? పొరలు పొరలుగా పునాదు లేర్చడి భవిష్యత్తును నిర్మించాలనా? ప్రణాళికలో ఒదగకపోవడమే కవిత్వం అక్షరం నిజంగా ఒక బుజ్జి కుక్కపిల్ల ఎగిరొచ్చి సీ పక్కలో పడుకుంటుంది తిరిగిరాని బాల్యాన్ని స్వప్పించడమే కవిత్వం. షిల్లాంగ్ పర్వతాల్లో వేలాది సీతాకోక చిలుకలు ఎగురుతుంటాయి పడిపోతాయేమో ననే మన అదురాయే కవిత్వం. ఈ మధ్య నాకు అక్షరాల జ్వరం పట్టుకుంది జ్వరం నిండా భాస్వరమ్ స్మశానాల నిండా కొరివి దెయ్యాల బూచి కధలు చెప్పి నీన్, సోపి |
పిల్లలను పడుకోబెట్టొచ్చు!
వారి ఉచ్చాస నిశ్వాసాలే కవిత్వం.
పగుళ్లు పగుళ్లుగా ఉదయించే సంధ్య
రగిలే సూర్యుడవుతుంది.
పాపం సూర్యుడు
మష్లర్ కట్టుకున్నాడు
చలిని జయించడమే కవిత్వం.
పల్లెల్లో
చితుకుల మంటల చుట్టూ కూచొని
కాపుకుంటున్న అక్షరాలు
ఇక పొలిమేరలు దాటడమే కవిత్వం.
4 12 ౧7 చినుకు 10 నానీ కడిగిన భీకటీ
రాలిన కవిత
రోజూ కనిపించే ఆకు ఇవాళ లేదు శూన్య మహాసాగరంలో ఈదులాదే చేపలా రశ్శి అంచును చుట్టుకున్న హరిత మేఘ శకలంలా
కదలాడే ఆకు
ఎక్కడి కెళ్లిందో 1?
బంధం తెంచుకొని పోయిందా?
చెట్టే వదిలేసిందా?
ఇన్ని ఆకులున్నా
అదిలేకుండా చెట్టు
కొమ్మల ఎముకలతో మిగిలినట్టు. విప్పుకున్న అరచేతిలో
ఈనెల పందిరి మధ్యలో
ఎవరూ చిత్రించలేని
చారల అల్లిక.
చెట్టు
ఈ ఆకు ద్వారానే
నాతే మాట్లాడేది.
పక్షుల కలరవాలను
తన రక్తంలోకి ఎక్కించుకున్నట్టు సంగీతాన్ని
మౌనంగా అనువదించే పండితురాలిలా
తల ఊపేది.
వన్, గోసి 11
రాలిపోవడం
తప్పకపోవచ్చు
కాని ఈ లోటును
తట్టుకోవడం కష్టం
ఇది నా హృదయంలో
ము(ద్రించుకపోయింది
ఇప్పుడా చోటును కత్తిరించి
చెట్టు కతికిస్తే
అది ఆకవుతుందా?
శతిడి 07 ఆంధ్రజ్వోత్సి సందే 12 నానీ కడీగీనీ తకటి
సహాయకక్రియ భాషలో సహాయక క్రియలాంటిదే ఆమె కూడా పెద్ద ఉనికిని చాటక పోవచ్చు. నిశ్శబ్దంగా తలవంచుకొని పనిచేసే గృహిణిలా వుంటుంది. నీ మాటకు కుడి ఎడమల అండగా నిలుస్తుంది కోపం వచ్చిందా (ప్రశ్నను ఎక్కుపెడుతుంది. కరుణ కలిగిందా కాలిక స్పృహను కలిగిస్తుంది. అయినా బికారిలా ఫంక్తి ఆఖరున ముడుచుకొని కూచుంటుంది కవులు కూడా తక్కున వాళ్లు కారు సంగీతానికి బలి పెడతారామెను ఛందస్సుల అంచుల్లోంచి గెంటేస్తారు అయితే మిగిలేది నిస్తేజమే పరివ్యాప్తమయ్యే చీకటిలో అక్షరాల కిటికీ లోంచి ఆమె చూపు చంద్రరేఖలా గుచ్చుకుంటుంది. ఎన్ నో 13
కనపడకున్నా వినపడుతుంది ఆమె ఒక నిబ్బరమైన అస్మిత నా కవితాలతకు పువ్వులా వేలొదే వినూత్న పరిమళ వ్యధ. 22408 వార్త సందే 14 వాన కడిన్‌నీ చీకటి
భూమి కావాలా ? భూమ్ కావాలా? అయితే తీసుకో. నిన్ను పూడ్చిపెట్టదానికి జండా పట్టుకుంటావా? ఎన్ని గుండెలురా నీకు. పాటలు పాడతావా? బుల్లెట్లతో రక్షపద్యం రచిస్తా చదవడానిక్కూడా నువ్వుండవు. బిచ్చమడుగు బత్తెమడుగు ఉద్యమం పేరుతో రోడ్డెక్కుతావా రోడ్డు నీ అబ్బసాత్తా! తప్పదురా నీకు బతికే అర్హత లేదు ఊరూ నోరూలేని వాడివి అబ్బో ఇన్ని నినాదాలా ! మాకే వేలాది ఎకరాలు సరిపోవడం లేదు. నీకు పనివ్వటానికే మా ఫ్యాక్టరీలు. ఆదవాకళ్లు తలదాచుకోడానికి 50 గజాలా? పేదవాళ్లకు జెండరేమిట్రా. భూమి మాదే ఆకాశమూ మాదే మధ్యలో వేలాడే గబ్బిళానివి నువ్వు, కాదంటే బీన్, గోసి 165
చం('ద్రమండలమూ మాదే. అందుకే భూమి అడగకురా అడిగితే భూమి ఫక్కున నవ్వుతుంది ఆకాశం బాధ పడుతుంది. నువ్వన్నట్టు నువ్వు మట్టిలోనే పుట్టావు అంతమాత్రాన అది నాదే అంటే మేం సరే! మట్టికూడా మెచ్చదు. మట్టీ నిన్ను వెనక్కి పిలుస్తుంది వెళ్లు నాన్నా వెళ్లు ధనా ధన్ 1 ' (భూమి కోసం పోరాడుతున్న ముదిగొండ (వజలు కాబ్సుల్లో మరణించినవ్టుడు ) వడి 07 (న్రజాశక్తే 16 నాన కడినీన ఛీకటీ
నిక్షిప్తం
ఎంతకాలాన్ని ధారబోస్తే
ఒక శిల్పం !
ఎంత ధ్యానాన్ని ఒడిసి పడితే
ఒక బాప్పం !
మనసులో మెరిసిన
ఒక క్షణికాకృతి
శాశ్వతమయ్యే మహా ప్రక్రియ.
అవసరంలేని ముక్కలు తొలగించడమే
దాని ఆవిష్కృతి.
నర్తకి మరణిస్తుంది
నర్తనం మరణించదు
శిలలో ప్రవేశించి
చిరంజీవి అవుతుంది.
శిల్పానికి రంగుల్లేవు
రాతిరంగే దాని పొంగు
ఉలి ముక్కులోంచి ఎగిసిపోయిన కాలమా!
ఎటు వెళ్లిపోయావు?
ఎటూ వెళ్లలేదు
ఈ బొమ్మలోనే భద్రంగా వున్నాను
ఓ సరదోవరమా
ఆకాశమా!
ఈ శిల్పం ఆభరణమై
ఇప్పుడు మిమ్మల్నీ వెలిగిస్తుంది
౧807 అంధ్రన్రభు సందే వీన్, గోసీ 17
గియాస్ మతీన్ స్పృతిలో మూడువందల రోజుల్ని నిర్విరామంగా పంచుకున్నాం పదివేల మాటల పువ్వుల్ని తెంచుకున్నాం వందలాది భావాలనీ వాటి ఛాయల సమ్మేళనాలతో ఆహా ఓహోలతో అలరించుకున్నాం మతీన్ ! నిన్నీ ఐస్ పెట్టెలో చూస్తుంటే అక్షర తల్పం మీద సేద దీరుతున్నట్టే ఉన్నావ్ ! గోపీ ప్యారే | అన్న నీ కేక మా ఇంటిచుట్టూ పరిభ్రమిస్తూనే వుంది పాతికేళ్ల మన స్నేహంలో ఒక్క సమీకరణం లేదు. నీకెంత తెలుగొచ్చ్ నాకంతే ఉర్జూ. ఇద్దరమూ కలిసి కవిత్వాన్ని విశ్వభాషగా మలిచాం అసూయాపరులు ఎప్పుడూ వుంటారు. అక్షర చైతన్య కాంతులముందు వాళ్లు క్రీనీడలు. చాలా కాలంగా కవిత్వం రాయడం మానేశావ్ అందుకే దానిలోని తీపి నీ దేహంలో కెక్కినట్టుంది పేదరికం నుంచి పెద్ద సార్ దాకా 18 వాన కడిగిన చీకటీ
నీయాత్ర సుదీర్హం
చరమసంధ్యలో ఓ మేడ కట్టావు
ఇప్పుడా గూడులోంచి
పావురంలా ఎగిరిపోయావ్
ఇటు చూడు
నా అక్షరాల్ని కన్పీళ్లుగా మార్చి
నీ పై వెదజల్లు తున్నాను.
(ప్రముఖ ఉర్జూకవి, నా కవితలను ఉర్జూలోకి అనువదించి గ్లోలీకే సౌ
నజ్‌మ'” పేరుతో (గగ్రంధరూవంలో తీసుకొచ్చిన చిరకాల మి(తుడు ప్రాఫెనర్
గియాన్ మతీన్ వృతికి నంతావంగాా
౨22౬07 దా॥/ ఫాతిమా వర్వీన్ చేసిన దీని ఉర్దూ అనువాదం 'మున్సిథ్” దినవ(తిక లో (ప్రచురితం,
వీన్, గోపి 19
వీధిలో వృద్ధుడు
అడుక్కుంటున్నాడు కాబట్టి వబిచ్చగాడంటున్నాను గాని
అయినవాళ్లు వదిలేసిన వృద్దుడు.
ప్రతి శనివారం
ఇంటి ముందు నిలబడతాడు.
ఎలుగెత్తి అరవడు
ఇంట్లోకి నిశ్శబ్ద ప్రసారం చేస్తుంటాడు.
మా ఆవిడకు ఎలాగో
అతని ఉనికి తెలిసి పోతుంది
ఇరవై మెట్లు దిగి
(ఎంతో అవసరముంటే గాని దిగదు)
ఐదు రూపాయల బిళ్ల
అతని రుమాలు దోసిట్లోకి విసిరేస్తుంది.
ఓ రోజు దిక్కులు కూడా వణుకుతున్న చలిలో నింగి నేలను ఏకం చేసిన
పొగమంచులో లీనమై...
మా ఆవిడకు టెలీపతి ఉంది కాబోలు గబాలున ఓ శాలువా తీసుకొని
కింది కురికింది.
అతని ఒంటి పై పొగమంచును తొలగించి దానిని కప్పింది
అప్పుడు తెలిసింది
శాలువా వొట్టి ఒడియాల గుడ్డ కాదని నిజానికి ఈ శాలువా వేదిక పై నాకు లభించిన గౌరవ బిచ్చమే కదా! శతి 2 08 నేటినిజం
20 నొనీ కడినీన చీకటి
జి
కాస్త పద్యానికి కాస్త నిశ్శబ్దాన్ని జత చేస్తున్నాను. అది పలికే ధ్వనులకు చెవియొగ్గుతున్నాను సందేహం లేదు మనసుకు మాతృభాష కవిత్వమే! పద్యాన్ని కాస్త ఉద్వేగంతో నింపుతున్నాను కొండచుట్టూ కండువాలా జలపాతం రెపరెపలాడుతుంది ప్రాణి ఉనికి లేకుండా ఎంత వైశాల్యమైనా నిస్తబ్బమే. పద్యాన్ని కన్నీళ్లతో తదుపుతున్నాను. కొంచెం ప్రేమ, కొంచెం దయ కళ్లు విశదసుందరమై శుభ్రదృక్కుల్ని ప్రసరిస్తున్నాయి. ఇప్పుడు పద్యానికి ఇంకేమీ అక్కర్లేదు కాస్తంత కొత్త ఊపిరి తప్ప. విత 207 విక
నన్ నాసి 21
పేలని బాంబులకు నమస్కారం !
అసలా ఆలోచనే వికృతం
ఎవరైనా సరే ఖతమైతే చాలా?
అసలా పధకమే పరమనీచం
అది నెరవేరడం మహాదౌర్భాగ్యం
శవాలతో పండుగ జరుపుకునే
కిరాతక పూజారులకు
అసలు దేవుడనే వాడున్నాడా?
ఏ కావాలిరా నీకు
ఎందుకిదంతా చేస్తున్నావ్
అన్నీ నువ్వన్నట్టే జరగాలా
లేకుంటే లేపేస్తావా?
హైదరాబాద్ గుండెల్లో
మరోసారి బాంబులు
ఎన్నడూ భయపడని నగరం
ఈసారి వొణికి పోయింది.
ఓ చోట లేజర్ కిరణాలే
మృత్యు పాశాలయ్యాయి
మరోచోట తినుబండారాలు
నగరంలో వానకు బదులు
రక్తం వర్షించింది
ఈ సారి భాగ్యనగరి
మూసీ ఒడ్డున కాదు
కన్నీటి సాగరతీరాన
తట్టుకోవడం కష్టం
పేలని బాంబులకు నమస్కారం
మిగిలిన ప్రాణాలకు అభినందన.
(గోకుల్ చాట్ పేలుళ్లకు మనసు చెదిరి)
విథ&07 న ఆంధ్రజ్యోతి మందే 22 నాన కడినినీ చీకటీ
వైమానికం
అహంకరిస్తాం గాని ఆకాశంలో మనమెంత? మేఘాల దూది పరుపుల మీద కిరణాలు ఒళ్లు విరుచుకుంటున్న వేళ బద్దకించకు
ఈ మహాజాగృతి ముందు
నీ నిద్ర బరువెంత?
భూగోళం మందుబిళ్లను
ఖగోళం మింగుతున్న వేళ
తూర్పు పెయింటింగ్‌ను ప్రదర్శించే ఆర్ట్ గ్యాలరీల కోసం వేట.
ఏ దృశ్యానికైనా అనుభూతే భాష్యం ఇంతటి స్వాప్పిక విస్తీర్ణం
ఈ రెండు రెక్కల చలవే
శూన్యాన్ని కలవర పరిచే
పక్ష చాలనం ముందు
సృష్టి సమస్తం విస్మయ దిగంతం. ఉన్నదీ కనబడుతున్నదీ ఒక్కటేనా? మట్టి అనంతంలోకి ఎగిసినప్పుడు కాస్త కాస్త కరుగుతున్న అపరిచితం అహంకారం కాదుగానీ
ఊరు చిన్నదై ఉనికి పెద్దదైనప్పుడు విరాట్ పురుషుడు
మనిషే
తి౦ 02 05 చినుకు
ఎన్, గోసి 23
విశాఖ పట్టణం
ఆ కొండల్లోంచి ఓ కొండ
ఎగిరొచ్చి సముద్రంలో వాలినట్టు.
అది చేపముక్కులా ఉండొచ్చు గాని
దానిచుట్టూ ఈదేది మాత్రం కెరటాలే.
దిగులుకు కారణం ఎవరు చెప్తారు?
పొగమంచులో పచ్చదనం బందీ అయ్యింది
సృష్ట్యాదినుంచీ నిరంతరంగా
కురుస్తున్నట్టు ముసురు.
ప్రపంచ వైరుధ్యాలను
తుడిచి పారేసేది వర్షమే.
ఆఫ్రికా మేఘాలు
అనంతపురం మబ్బులు అంటూ వుండవు.
పైనుంచి చూస్తే
అంతా ఓ మట్టి ముద్ద
సృష్టికాంతులే దాని ముద్ర.
విశాఖ సముద్రాన్ని
హైదరాబాద్ తీసికెళ్లాలని ఆరాటం
అందుకే గుండెనిండా కెరటాలో..
యారాడ కొండతో
ఎంతసేపు సంభాషించినా తనివి తీరదు
అనుభూతిని భరిణెల్లో నింపి
సంచిలో కుక్కే మిత్రులున్నారు
విశాఖలో వీళ్లే లేకుంటే
సముద్రమున్నా దండగే.
2207 సాపొత్వ (వ్రస్థానం 24 వాన కడిగ్‌న చీకటీ
ఆవిష్కారం
ఎంతని ఆశ్చర్య పడతాం !
కళ్లు ఎంత విస్ఫారితమైనా
అవి కరళ్లు తొక్కే చిట్టి సముద్రాలే
మాటల్ని ఎంతని వెదజల్లుతాం !
అవి నిశ్శబ్ద తీరంలో
గిలగిలా కొటుకునే చేప పిల్లలే.
సుదీర్హ జీవయాత్ర సమస్తం
ఒక నిరర్ధక గీతమైనప్పుడు
రాగం ఒంటరిదై పోతుంది.
వైశాల్యాల్లో ఎంత వెతికినా
మిగిలేవి పరిధులే.
స్వార్ధం బురద నుడుగులో
పాపం మురికి చంద్రుడు.
దిగంతాల పూరి గుడిసెలకు
జాజులు పూస్తున్న విశ్వ గృహిణి ఉదయం
నొక్కులు నొక్కులుగా
ఎరుపెక్కుతున్న మేఘాల ముంగురుల్లో
ఎ(ర్ర గులాబి.
ఆకాశానికి చేతులు లేవనుకున్నాను
భూమి కప్పుకున్న
చీకటి దుప్పటిని లాగేసింది.
ఇంతటి అద్భుతమైన ఆవిష్కారం
రాత్రి చేసిన ఉపకారమే.
సూర్యుడికి స్వాగతమే కాని
చంద్రుడికి కృతజ్ఞతలు,
తై 2.06 వార్త నందే ఎన్, గోపి 25
భీమ్‌లీ
తన నీళ్లను తానే
చెంబులతో గుమ్మరించుకుంటూ
వర్షంతో తలంటుకుంటున్న సముద్రం.
తీరం వైపు పాకుతున్న ముంగురుల్లో
కుంకుడుకాయ కెరటాలు.
ఇశాళ సముద్రం
నన్ను తనవైపు లాక్కుంటున్నది
ఎన్నిసార్లుకలిసినా
మళ్లా ఏదో కొత్త.
కొత్తదనం అలలదా |!
నాలోని కలలదా 1
ఇసుకలోని వెండితనం
కిరణాల చురుకుదనం
ఏ సుదూర కెరటమో
ఇక్కడ అస్తిత్వాన్ని కోల్పోయింది.
నిజానికి వివిధ అస్తిత్వాల మధ్య
నలిగిపోతున్న మహా వ్యవస్థ సముద్రం
తీర్ధపురాళ్లకు విసుగు లేదా?
అసలవి మెలుకువతో ఉంటే గదా
నిశ్చల సమాధిని
నీళ్లు ఏమీ చేయలేవు.
తీరాన కూచొని కళ్లు మూసుకున్నాను.
ఇప్పుడు సముద్రం ఒక బిందువై
నాలోకి ఇంకిపోతుంది.
౨2 07 వార్త నందే 26 నాన కడిగిన చీకటీ
అప్పడప్పుడు వెలుతురు కష్టమే చీకటే నయం. సీరం(ధ్ర బాహువుల్లో నిలువెల్లా కౌగిలించుకుంటుంది. కిరణాలు రెటినా పై దాడిచేసి ఎన్ని భయంకర దృశ్యాలు చూపించాయో బలహీనుల్ని అగాధంలోకి తోసి కొండలా వికటాట్టహాసం చేసే పట్టపగటి ఊష్ణ జ్వాలలను గద్దిస్తాను. బాకుల్లా నీడలు దూసే చెట్ల కొమ్మల్లో సూర్యుడితో కష్టమే. మండటమే తప్ప తన వెలుగులపైన అదుపులేని నిస్సహాయుడు ముట్టుకుంటే చీకటి వెచ్చగా తగుల్తుంది. నల్లని పొడిని బుగ్గలపై రాస్తుంది కనుగుడ్లతో స్నేహం చేస్తుంది చీకటే నయం అంతర్ నేత్రాలను తెరుస్తుంది కలలను (ప్రసాదిస్తుంది తొ2ఓ 1.085 నవ్వ ఎన్, గోపి 27
అరకు ప్రయాణం
కొండచుట్టూ
కదిలే చారల్లా జలపాతాలు.
లోయలో నది
మాయలా ప్రవహిస్తుంది.
వినిపిస్తుంది గాని
కనిపించదు,
ఒక్కద్భగంచలంతో
ఈ మహాలోయను పీల్చేశాను.
ఇప్పుడిక
మెదడు నిండా అరణ్యం.
విరిగిపడే చరియలు
శిఖరాల దుందుడుకు చర్యలు.
అవి ఎంత ఆకాశవృకళ్లాలైనా
వేళ్లు మాత్రం భూమిలోనే.
భూమిలోని రహస్య ప్రక్రియ
శూన్యానికి అర్ధం కాదు.
వైతన్యం
తోకతొక్కిన పాములా
సొరంగంలో ప్రవేశిస్తుంది
చీకటి పెళ్లలు పెళ్లలుగా
విరిగి పడుతుంది
టనెల్ ముగింపు మాత్రం సూర్య ప్రభా కావ్యంలా ఎదురొస్తుంది. తి&07 వీనాకిని
28 నానీ కడిగిన చీకటి
అఖండ భారత్
ఒక చిన్న ఇంట్లో ఆమె రొట్టె కాలుస్తుంది అందరూ చుట్టూ కూర్చున్నారు బయట కేకలు వినబడుతున్నాయి
కింద పొయ్యి మండుతుంది
బయట
విద్వేష జ్వాలలు.
ఆ గొడవలేవీ
అమ్మకు అర్జంకావు.
ఇంత విశాల అఖండ భారతంలో వ్యాపారాలూ
రాజకీయాలూ వుంటాయని తెలియదు. అవును కదూ!
సెంటిమెంటు కూడా వుంటుంది
సారా జవాంసే అచ్చా
మరి మధ్యలో ఈ ముష్మరు దెవడు? హిమాలయమా!
నీ మంచు ఏడుపు నువ్వేదువు
పేర్లు పెట్టుకున్న సముద్రాల్లారా! మూల్గుతూ ఘోషించండి
నదులారా!
('ప్రవహించండి పేదల కళ్ళల్లోకి. పొట్టచేత పట్టుకున్న వాణ్ణి
ఎన్, గోపి 29
ఈ (గ్రహంనుంచే తరిమెయ్యండి
సారా జహాంసే అచ్చా
హిందూ సితా హమారా.
(ముంబయి ప్రవాస వ్యతిరేక అల్లర్లకు కలతపడి)
22209 సాపొత్వ ్రస్థానం 30 నాన కడిగిన భకటీ
మిగిలిపోయిన పాట
సర్వమూ కోల్పోయిన మనిషి కూడా
ఒక్కసారైనా పాట పాడతాడు
మోటు చర్మంపైన
పాతకాలపు మచ్చలు బయటపడతాయి.
చెదిరిపోయిన జీవన యానాన్ని
పంకిలమైన అతని ఉదాసీన నేత్రాలు దర్శిస్తాయి.
అవసాన దశలోని దేహంభిత్తికపై
ధనుస్సులా వంగిన వెన్నెముక
దారిలో ఎదురైన బండలను
తొలగించలేని అశక్రహస్తాలు
ఏ ఆశించిన గమ్యానికీ చేర్చలేని
జీవన లయ
నిశ్శబ్దానికి అర్ధం ఏమిటో?
అతని చుట్టూ ధ్వనిస్తుంది.
నిలువనీడ లేని మిట్ట మధ్యాహ్నాన
మండిపోతున్న ఎండలో
పగుళ్లు వారిన ఫుట్‌పాత్ మీద
కృష్ణచూడా వృక్షం కింద
రగిలి చల్లారిన బూడిదగా మారిపోతాడు.
సంధ్యా సమయాన
వైశాఖ కాలిమలో
అనుకోని వర్షం మొదలౌతుంది.
చినుకులు కొట్టే దెబ్బల్లో
మరింత సొమ్మసిల్లి పోతాడు
చిన్న వర్షమే కాని రోడ్లన్నీ మునిగిపోతాయి నిన్, గోసి 31
ఫుట్‌పాత్ నివాసం వరదలో కొట్టుకుపోతుంది. దురాశా పూరితమైన వాయువులు మనుష్యులపై బురద చల్లిపోతాయి సర్వమూ కోల్పోయిన మనిషి ఒక్కసారైనా పాటపాడాలను కుంటాడు కాల్చిన వేసవి దినాలు
గాయపరిచిన బురద చినుకుల గురించి జీవన శబ్దాలు క్రీడలాడుతాయి. ధ్వనితరంగాలై
పడుకొనీ, కూర్చొనీ, ఎగురుతూ దిగంతాలవైపు పరుగులు పెడతాయి. కవిత్వమై
కధానికలై
ఇంకా పెద్ద కధలై
నవలలై
పరిభ్రమణం చేస్తూ ఆగిపోతాయి. ఎదురుచూపుల కిటికీ ముందు
కృష్ణ చూడా పుష్పాలు రాలిపడతాయి ఒకటి రెండు పక్షులు వచ్చి వాలతాయి
వానకడిగిన చీకటిలో
వెన్నిల ఉదారంగా కురుస్తుంది.
చలనం లేని కళేబరం
మకిలిపట్టిన కంటిపాపలు
వేడిబువ్వ జ్ఞాపకాలు,
కలలు కన్నదీ లేదు
వాటితో లావాదేవీలూ లేవు
అయినా
32 వాన కడిగిన బీకటీ
రాలుతున్న పువ్వులు
ఒకటి రండు పిట్టలు
తెల్లని వెన్నెల
సాయంకాల వర్షం.
ఫుట్‌పాత్‌పైన
జీవన ప్రతిధ్వనులను వింటూ
సర్వమూ కోల్పోయిన మనిషికూడా
ఒక్కసారైనా
అప(్యశ్రుతి అయిజే మాత్రమేమి
శబ్దాలు లేకపోతేనేమి
పాట నెత్తుకుంటాడు
అదే అతని
మిగిలిపోయిన అపురూప గీతం
ఆకాశవాణి జాతీయ కవినమ్మేళనంలో చదివిన అనువాద కవిత
(25-1-2008 20 80 ౯||) ఫిబ్రవరి 2008 మూనీలో వ్రచురితం జెంగాలీ మూలం థదీవ్ చంద్రబఐను
నన్. గోపి 33
మరోసారి సముద్రం
ఇది రాతి కొండ కాదు
ఊపిరులతో ఉబ్బిన రబ్బరు బండ
సూర్యుడి కోసం కెరటాలు చేతులు చాస్తున్నాయి
నిలువెత్తు మేఘాలు
ఉదయాన్ని ఎంతసేపు అడ్డుకుంటాయి?
అడ్డు తెరలకు రంగులుపూస్తూ
ఆరోహణుడై
భళ్లున విచ్చుకున్న
తీక్ష పుష్పమౌతాడు సూర్యుడు.
ఇది కదలని కొండ కాదు
వందల పదవలుగా మారి
కవిత్వ చరణాల కోసం
వల విసిరిన కైదండ
ఎప్పుడో ఎక్కడో
విడిపోయిన పాతనేస్తమీ సముద్రం.
ఘోష పురాతనమే
భాషమాత్రం నిత్యనూతనం
ఆకాశానికి గర్వం కావచ్చు గానీ
సముద్రంలో దూకమనండి చూద్దాం
నీరు సనాతనమే అయినా
క్షణక్షణ జీవలక్షణ సమన్వితం
వెళ్లేటప్పుడు వేగంగా సాగిన కాళ్లు
వెనక్కి మరలి పోమని దిగబడిపోతున్నాయి
సముద్రం ముందు కొండ చిన్నదే కాని
ఇప్పుడది కొండలో ఇమిడిపోయింది.
(చీరాల నముదతీరంలో దాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్రి గారితో కలిని
(ఖాత వేళు
272 08 నేటినిజుం 34 నానీ కడినినీ జీకటీ
డిజర్దెడ్ విలేజ్ నాలుగు దశాబ్ధాల అనంతరం ఆనాటి మిత్రులు కలిశారు అదో గొప్ప అనుభూతి! అప్పటి వీధులు అరుగుల మీద కబుర్లు ఆ సందులో పట్టనంత పెద్ద ఆకాశం పేదరికం ఆప్వ్యాయతల ఇచ్చిపుచ్చుకొవటాలు నిజంగా వర్తమానం జారుడు బండ మీద నుంచి గతం ఇసుకలోకి జారిపోతున్నట్టు ఆశ్చర్యం! మామధ్య ఉద్వేగాలకు మాటల్లేవు. ఉన్న కొన్ని మాటలూ ఒకే వలయం చుట్టు తిరుగుతున్నాయి (గ్రామ్‌ఫోన్ ముల్లు ఒకే చరణం దగ్గర తట్టుకున్నట్టు ఇక నుంచి రోజూ మేం కలవగలమా? మారిపోయానా నేను వాళ్లూ మారిపోయారు ఎండలో పడి ఎన్నో బస్సులు మారుతూ వాళ్లు మా ఇంటిని వెతికి పట్టుకున్నారు. నేను కనిపించాను కాని వాళ్ల మనస్సుల్లో ఉన్న నేనేనా?
వన్, గోసి 3ర్
కుశల (ప్రశ్నలూ
కాలం తెచ్చిన మార్చులూ
'ప్రయోజకత్వాలూ
అన్నీ కాసేపట్లో కరిగిపోతాయి
కాలం కూడా నదిలాంటిదే
గంగానదికి
అనేకచోట్ల పేర్లు మారుతాయి
త్రికాలాల మధ్య ప్రవాహం లేకుంటే
అది అకాలమే.
అవిచ్చిన్న గీతమే గతం
తీగ తెగిందా
పాత బావిలోంచి చేదుకునే మంచినీళ్లు
నిజంగా అవి
మానవజాతి కన్పీళ్లే"
17409 నవ్వు 36 వాన కడిననీ చీకటీ
స్పటిక బంగారం
ఆమె
జాషువా కూతురే కావచ్చు
గోరా కోడలే కావచ్చు
లవణం భార్యే కావచ్చు
ఆమె హేమలత కూడా
హేమలతే!
సంస్కరణల మట్టిలో పూచిన
పరిపూర్ణ పుష్పం.
చెల్లి కోసం తపించి పోయిన
నులివెచ్చని బాష్పం.
కేద దొంగల తలల్ని
కుంకుడు రసంతో
కడగిన మహాతల్లి
జోగినుల నుదుట రాసిన
పంకిలాన్ని తుడిచిన కల్పవల్లి.
దళితమన్నాా జ్వలితమన్నా
ఏ పేర్లు పెట్టినా
మౌలిక మానవీయ స్పందన ఆమెది
ఎంత బాగా నవ్వేదో!
ఎంత హుందాగా నడిచేదో !1
జాషువా బాణీలో
ఆమె ఫద్యం పాడుతుంటే
ఆయన నింగి నుండి దిగివచ్చినట్టుండేది. బీన్, గోసి 37
విజయవాడలో ఒక చలనశీల దృశ్యం ఆగిపోయింది హైదరాబాద్‌లో ఒక పల్లీయ పవనం స్తంభించింది బాధితుల కన్నీళ్లు తుడిచీ తుడిచీ ఆమె కళ్లే కాదు వేళ్లూ తడి తడిగా వుండేవి తెల్లచీర కట్టుకొని ఆమె సచివాలయం కారిడార్లో నడుస్తుంటే ఫైళ్లకు కట్టిన నల్లని దారాలు గిజగిజలాదేవి. “'సంస్మారొ అనే మాటను పరమ లూజ్‌గా వాడే ఈ లోకంలో ఆమె వ్యక్తిత్వమే ఓ సంస్కారం ఆమె సన్నిధిలో గడిపిన ఉత్తేజకరమైన క్షణాలు పేదల పట్ల రగిలిన జీవకణాలు ఆమె టప్పుమని చిట్లిపోయిన బుడగ కాదు ఉక్కుగోడలతో అలిసిపోయిన వైతన్య గోళం ఆమె హేమలతా లవణమే కావచ్చు మానవతా భవనం కూడా. తూ) (వముఖ నంఘనేనిక రచయిత్రి దా హేమలతా లవణం వృతికి బాధపడు 188 08 మన వత్రిక 38 వాన కడిగీనీ చీకటీ
కాలం ఒక శూన్యం కాలాన్ని తామే మారుస్తున్నామని అనుకుంటారు కొందరు. కాలం ఆకాశమా కాదు భూమి! భూమి బెడిసికొడితే ఆకాశ శూన్యాన్ని ఆశ్రయిస్తారు. మట్టీ మట్టీ అని అరుస్తారు గాని మట్టిలోని మాధుర్యం తెలుసా అని? ఆకాశం అంతర్జాతీయం కదూ మట్టి అంతటా మట్టే సముద్ర ఘోష మానవ శ్వాస లాంటిది. పాపం కృష్ణుడు కాలి గాయంతో చనిపోయాడు. అలెగ్దండరూ అంతే చిన్న జ్వరంతో. ప్రకృతి ఒక అనివార్య లీల. ఈ కెరటం తరువాతి కెరటాల్ని ప్రేమించాలి కదా అన్నీ గమ్యం చేరుకునేవే నిన్నటి దూరం సకల సంవేదనల తీరం. మట్టిలో నుంచే కదా నీళ్లు రావాలి. 284 04 వత్రిక ఎన్, నోసి 39
జీవయాత్ర
ప్రయాణాన్ని అనుభవించక పోతే
గమ్యంకూడా నిరనుభూతే
తీరంలో హాయిగా ఈదకపోతే
కొత్తసముద్రాల నెలా కనిపెడతాం?
కిటికీ నన్ను చూస్తున్నదా
నేనే కిటికీనై పోతున్నానా
నాలోని గవాక్షానికిది ప్రతిబింబమా!
రెండు మహా ప్రపంచాలకు
ఫ్రేం కడితే ఎలా వుంటుంది?
రోడ్డు నాలోకి ప్రవహించి
మడతలుగా చుట్టుకుంటున్నట్లు.
పల్లెలు నన్ను తల్లుల్లా పిలుస్తున్నాయి.
ఈ కోడిరెక్కల కింద
బుజ్జి పిల్లనైపోనా?
ఇంత ఉల్లాసంలోంచి
ఏదో ఒక మానవయాతన ఉబుకుతుంది.
ఈ కన్నీళ్లలో వున్నది
మెరుపో చరుపో అర్థంకాదు.
పవనమా
ఆకాశమా
యావత్ అరణ్యహరితమా
ఇవన్నీ ముద్దగా మారి
హృదయానికి అడ్డుపడుతున్నాయి.
ఇప్పుడిక కవిత్వం తప్ప
గత్యంతరం లేదు.
ప! చినుకు 4 నానీ కడినీనీ బీకటీ
“భూమిని ముద్దు పెట్టుకుంటాను” _ పాబ్లో సారూడా చిన్నారి గులాబి చిన్ని చిన్ని మొగ్గ కొన్సిసార్లు అచ్చాదన లేకుండా స్వచ్చంగా నా చేతిలో ఒదిగిపోతున్నట్టు సుతారంగా నిన్ను నా మోమువైపు తీసుకుంటుంటే హటాత్తుగా నీ మొక్కకాళ్లు నా పాదాలనూ నా పెదవులు నీ అధరాలనూ స్పృశిస్తాయి. ఎంతగా ఎదిగిపోయావు ! నీ భుజాలు కొండల్లా ఎదిగాయి నీ వక్షోజాలు నా ఛాతీని నిమురుతున్నాయి. నీ సన్నని నడుంచుట్టూ నా బాహువులు అల్లుకుంటున్నాయి (పేమ తమకంతో స్వెట్టర్‌లా సాగి నన్నల్లుకున్నావు భారంగా నేను ఆకాశ నేత్రాల వైశాల్యాన్ని కొలుస్తాను. అప్పుడిక నీ పెదవుల పైకి వాంగి భూమిని ముద్దు పెట్టుకుంటాను. 141209 వార్త నందే రచన ఎన్, గోసి 41
అపరిణామం
అంగన్ టేడాహై
అందుకే అక్షరం
జారిపడి గాయపడింది. అక్షరానికి నరాలజబ్బు
కళ్లు తిరిగినట్టున్నాయి.
ఎన్ని కష్టాలు మింగి బరువెక్కిందో!
నడకేకదా
పురోగతికి నిదర్శనం
వేళ్లకింద నలిగే
హార్మోనియం మెట్లుకాదు కాళ్లకింద కదలని రాతిమెట్లు. అక్షర గర్భం నిండా
అలవిగాని తలపోతలు విమానంలో దూరిన
నార్త్ ఈస్ట్ హిమాలయాల్లా అక్షాంశరేఖలకు
వేలాడిన అంతరిక్ష స్వప్పాలు ఓనా పేరాచూట్ !
నేలమీద దిగేటప్పుడు జాగ్రత్త ! శూన్యం దేనినీ మొయ్యుదు ధరాతలమే చరమ గమ్యం. తనను స్పర్శించిన అక్షరాన్ని మట్టి ఆప్యాయంగా ముద్దాడింది
జ2ై నాన కడిగిన చీకటీ
తనేకదా అక్షరంగా మారి ఆకాశంలో విహరించి వచ్చింది ఇన్నాళ్లకు తిరిగి తనను చేరుకుంది. అయితే మట్టిలో పుట్టిన అక్షరం మళ్లీ మట్టిగా మారదు అదిప్పుడు బంగారం. ఎన్, గోస 43
గాలికొండ
ఎంత చదివినా
అర్ధంకాని కొండలు
ఎంత తొలగించినా
కప్పుకునే నీదల్లో
మడతల్లో
నలిగిపోయే ఎండలు.
పొగమంచులో చిక్కుపడ్డ
ప్రాబీన మృగంలా కొండ
కడలి చలనానికీ
కొండ నిశ్చలనానికీ మధ్య
స్తంభించిన ఊపిరి.
ఓక్ చెట్ల ఎత్తును కొలవటానికి
నడినెత్తిన కళ్లుంటే బాగుండేది.
శిఖరాన్ని ఎగరేయటానికి
చూపులను
చరఖాకు చుట్టడం మంచిది
కొండ ఆకాశమైతే
నేను అగాధం.
పైకీ కిందికి ఊగే
సందిగ్ధడోల
అస్తినాస్తుల కల్లోలహేల
పక్కన సహచరి లేకుంటే
అగమ్య గమనాల్లో అయోమయ సంచారం
ఇప్పుడిక
ఆమే నా ప్యారాచూట్
తతి ౧7 అం(ధభూమి శీత నానీ కడిగిన చీకటీ
కుమ్మరి
- పాబ్లో సరూడా నీ మేనంతా ఓ పూర్ణ పాత్రికై నాకోసం ఓ మృదు మధురిమను సిద్ధం చేస్తుంది. నేను చెయ్యి విదిలించాన్లా అన్నివైపులా పిట్టలు లేస్తాయి నా కోసమే నిరీక్షిస్తూ అవి నన్నొక ఇక నా కుమ్మరి చేతులదే ఆలస్యం. సే నునుపైన మోకాళ్లు వట్రువల వక్షోజాలు పల్చని నడుము దప్పిక గొన్న ధరిత్రి అగాధాల్లో నిద్రిస్తాయి. అక్కడ మరో అకృతిని ధరిస్తాయి. అప్పుడిక నువ్వూ నేనూ ఒక నదిగా మారుతాం ఇసుక రేణువులై కదులుతాం. 61209 భూమిక ఎన్, గోసీ 45
పరావర్తనం ఆకలైతున్నప్పుడు అన్నం దొరక్కపోతే పదిమైళ్ల దూరం వెళ్లవలిసి వచ్చి బస్సుకు పైసలు లేకపోతే తీరా వెళ్లిన ఊళ్లో ఇంటికి తాళం వేసివుంటే మండుటెండలో మర్రిచెట్టు కింద రాలిన ఆకుల ఎండుతల్పం మీద సోలిపోయిన నిద్రలోంచి చెలరేగిన అక్షర తుఫానులే నా కవిత్వం. యాదగిరి గుట్టనుంచి భువనగిరి దాకా నరసింహ స్వామి నా వేలు పట్టుకొని నడిపిస్తున్నట్టే వుందేది. మంచినీళ్ల బాయికి చేద గిరక చప్పుడు నా సమస్త సంగీతానికి అదే మూలం. నీళ్లలోని తాబేలు ఇప్పటికీ నా గుండెలో తేలుతుంటుంది. నా భావచిత్ర రేఖలు మా అమ్మవేసిన ముగ్గులోంచి మొలిచినవే. తీ నానీ కడిగీవీ చీకటీ
ఎవరైనా ఏదైనా
తినదానికిస్తే
కన్నీటి సముద్రమంత కృతజ్ఞత !
మర్రిచెట్టు కింద
ఆనాటి ఆకులు లేవు
చెరువుగట్టు గుర్తుపట్టింది గాని
అదీ భూమిలోకి అణిగి పోయివుంది.
ఒకే జీవితంలో
ఎంత ఆర్తి!
ఎంత దిగులు ॥1
ఇన్ని శబ్దాలు
ఆ ఒక్క మౌనంలోకి దగ్ధమైనట్టు
ఇన్ని వెలుగులు
ఒక్క చీకటిలో ఇమిడిపోయినట్టు
ఇంత సాఫల్యం
ఒక్క మానవ యాతనలోకి నిష్కమించినట్టు
ఇంత భావ శబలిత వర్ణసంచయం
ఒక్క బాల్యనైర్మల్యం ముందు
బీరువోయి నిలబడ్డట్టు.
నిజానికి
యావజ్జీవితానికీ
గతమే ఒక మౌలిక వ్యాఖ్యానం.
గడ 08 విశాలాంద్ర మందే ఎన్, సోపి 47
అసంగీతం కంటికీ చెవికీ దూరం బెత్తెదే ఇప్పుడు యోజనాలు. దృశ్యాన్ని శబ్దం మోసం చేస్తోందా? సంగీతం ఒక ఆహదం హృదయభారం కూడా. చెట్ల ఆకుల్లోంచి పుట్టిన సంగీతం పిల్లల వడుపుల్లోంచి పుట్టిన సంగీతం మానవ సంబంధాల అపథశుతుల్లో నలిగిన సంగీతం ఇప్పుడు కాసుల గలగలలకు లేసులల్లుతోంది దృశ్యం ఒక నీడ సంగీతం దాని ఆత్మ ఆత్మకు చీడ పడితే మిగిలేది శ్రీనీడే. బిచ్చమడుక్కొని పొడారు నాటి గాయకులు ఆ బిచ్చంలోంచి బిర్యానీ వండుకుంటున్నారు నేడు ఒరే నాయనా ! ఒక మాటడుగుతాను నువ్వు పాడేది రాగ సంచలన బాష్పాలా ! క | కస్నటి కన్నీళ్లు / విశాలాంధ్ర మండే
చోర్ కౌన్ హై? గుండెలదిరి ఉవ్వెత్తున లేచిన పావురాలు మళ్లీ తాజ్‌పై వాలడానికి భయపడుతున్నాయి మృత్యువును మోసుకొచ్చిన అరేబియా కెరటాలు తలెత్తి చూడటానికి సిగ్గు పడుతున్నాయి. తెగిన ఊపిరులు పొగలై సెగలై కిటికీలోంచి దూకేస్తున్నాయి. ఎక్కడో రిమోట్ నొక్షితే ఇక్కడ ముంబయి మహానగరం స్టిల్ ఛాయా చిత్రమైంది. నిజంగా వాడికేం కావాలి? ఇదెక్కడి ఉగ్రనీతి! విధ్వంసం మాంసం ముద్దల రూపంలో పిశాచ తాండవం చేస్తుంది రాజకీయాలు అల్లిన సాలెగూటిలో మానవత్వం విలవిల 1 ఏ నాయకుడు కార్చినా అవి మొసలి కన్నీళ్లే ! వీరిలో వీరుడెవడు? ముష్మరుదెవడు? ఎన్, గోపి త్రి
వ్యూహాల గడుసు దయ్యాలు
ఆకాశంలో గద్దల్లా తిరుగుతున్నాయి
స్టాపిట్ !
ఇకనైనా స్వార్ధం చొంగలు తుడుచుకోండి
భయంలోనైనా ఏకం కండి.
ముంబయి ఒక నమూనా మాత్రమే.
బీటలు వారిన సమాజంలో
(ప్రమాదాల ఊటలు
ఇదిలాగే కొనసాగితే
శతాబ్దాల సమన్వయ వీణ
తీగలు తెగి వేళ్లాడితే
అంతే మరి !
అప్పుడిక మేరా భారత్ మహాన్ !
రక్షా కరో భగవాన్ ॥1
(నవంబర్ 26 నుండి ౩౨౦ వరకు ముంబయిలో జఉ(్రవాదుల
వృత్యుకాందకు కలత చెంది)
28 21.08 ఆంధ్రజ్యోతి, మందే 50 వాన కడినీనీ చీకటీ
ఎరుక
వాన కురిసి నప్పుడు తెలుస్తుంది
రోడ్డేదో రాంపేదో.
ఎండ కొట్టి నప్పుడు తెలుస్తుంది
చెట్టేదో మట్టేదో
రాత్రి అతిధిగా వచ్చి వెళ్లిపోతుంది
తెల్లబోయి చూడటం ఉదయం వంతు.
విమానానికి గర్వం ఎంతసేపు
గమ్యం నేలకే అయినప్పుడు.
కాలానికి రూపం లేదు
కదలికలోనే దాని ఉనికి.
నిన్న తెలిస్తే బాగుందేదా
కాని ఇవాళే తత్వం బోధపడింది
మనలోకానికీ
మనోమయ లోకానికీ మధ్య
ఓ వెలుగు వంతెన మొలిచింది
అదే ఎరుకకు నాంది.
9408 ఆంధ్రవ్రదేల్
గ లంలో శ "త న్ / మంలో ళ్. ప క స ్ట క్ష న ల ఎన్, గోపి 51
సెప్టెంబర్ 8
- పాబ్లో సెరూడా ఇవాళ ఇదొక నిండిన పాత్ర విశాలమైన కెరటం, వ్యాపించిన పృధివి ఇవాళ తుఫాను సముద్రం అలల ముద్దులతో మమ్మల్ని పైకి లేపేసింది. ఎంత ఎత్తంటే గర్జించే మెరుపుల్టాకా చేరుకొని కంపించి పొయ్యాం ఒకటిగా పెనవేసుకొని కిందికి రాలిపోయి కడలిలో కలిసిపొయ్యాం. ఇవాళ మా దేహాలు బృహద్రూపాలుగా విస్తరించాయి జగత్తు ఆవలి తీరందాకా వ్యాపించాయి ఒకరిలోకి ఒకరం కరిగిపోయి కొవ్యొత్తి బిందువుగా మారిపొయ్యాం. రాలిన నక్షత మయ్యాం. అవును! మా మధ్య అపూర్వ కవాటమేదో తెరుచుకుంది. ఏదో ముఖంలేని ఆకారం మాకోసం నిరీక్షిస్తుంది, 22 22 08 విశాలాంధ్ర, నందే ర్2 వాన కడిగిన చీకటీ
ఆలాపన
షికాయతులు మారుతున్నాయి
ఆకాంక్షలు కూడా.
మన పిల్లల రేపటి ప్రపంచం
ఎలా వుండబోతుందో !?
జీవితంలో పొందే దానికీ
కోల్పోతున్నదానికీ పొంతన లేదు.
తుపాకి మొనతో
గులాబీని పూయమన్నట్టు
(పేమ పక్షనే (ప్రేమోన్నాదం.
మార్క్స్‌కూడా విస్తుపోయేంత
ఆర్దిక సంక్షిష్టత
(ఫ్రాయిడ్ కూడా తెల్లమొహం వేసే
వైకృత మానసికత.
నిరాశపడుతున్నానా
అలసిపోతున్నానా
లేదు
(ప్రేమతో ఆలోచిస్తున్నాను.
12408 టగ్రజాసొవొతీ ఎన్, గోసి ర్‌ం
తేడా ఒక్కరోజులో శిల శిల్పంగా మారదు. సుదీర్హ్షాలం ఓపికే దీపంగా తపస్సు చెయ్యాలి. చేతులకు గాయాల మొగ్గలు పూయొచ్చు కర్మశస్వరాలు చెవికి ఆభరణాలైపోవచ్చు మనోనేత్రంలోని మనోహరాకృతే లక్ష్యం. ఇది ఒకప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు చెక్కడానికి కూచున్నాను. అడ్డువచ్చిన బండరాతిని అలలు చెక్కుతున్నట్టు. ఎలా!? నిమురుతున్నంత మృదువుగా. దీనికి పట్టేకాలం మరీ ఎక్కువ. అనుకున్న రూపం కాదిది అలా అలా ఏర్పడుతుందంతే! మూడు దశాబ్దాల్లో ఎంత తేడా పట్టుదలకంటే పట్టు విడుపులకే ప్రాధాన్యం మాటల కన్న మౌనమే గొప్ప. నిశ్శబ్దం గోడలకు తాత్విక చిత్రాలు. 54 వాన కడిగిన చీకటీ
వయస్సు కురిపిస్తున్న మంచువానలో
కోపం శీతల పవన మయ్యింది.
నయాగరాలా దూకిన జలపొతం
నదీ మైదాన గీతంగా సాగుతుంది
వయస్సు ఏదైనా
దేని సొగసు దానిదే
ఆశించటం కన్నా
ఆశీర్వదించడం వైపే మనసు మొగ్గు.
గతంతో పాటు
వర్తమానానికీ నమస్కారం
భవిష్యత్తుకు ఆహ్వానం
22.408 నూర్చ్య మందే నేన్, సోపి ర్
చపలుడు
- పాబ్లో సెరూడా ఆ నల్ల పిల్లను నా కళ్లు వెంటాడుతున్నాయి. రక్తవర్ణ 'ద్రాక్షలతో రూపొందిన నీలి ముత్యాల తల్లి ఆమె. అగ్ని కొసలతో నా రక్తంపై కొరడా ర్సులిపిస్తున్నది. నేను మిగతా ముద్దు గుమ్మల్లో వెళ్తున్నాను. శ్వేతాంచలంతో నడిచే అపరంజి మొక్కలా యవ్వన నిక్షేపాలను కదిలిస్తూ వెళ్తుందామె. అలా అలా తెరుచుకున్న నా నోరు ఆమె వక్షోజాలను చేరుకొని నెత్తుటి పిడుగుల్ని వర్షిస్తూ ... నేను అమ్మాయిల్లో కలిసి వెళ్తున్నాను. కాని నువ్వు 1? నేను నీ వంకకు రాకున్నా కన్నెత్తి చూడకున్నా నీకు దూరమైనా నా రక్త స్పందనలు సుతారపు ముద్దులు నిన్ను చేరుతూనే వుంటాయి. 56 వాన కడినిన చీకటీ
ఓనా అందాల నల్లపిల్లా !
పొడవైన దానా
చిన్నారి కూనా
నిందైన భామా
నడుం సన్నని లేమా
నువ్వు నా అనాకారి గిత్తవు
సొగసు కత్తెవు
మెరుస్తున్న రజత కాంతివి
గోధుమ రంగుతో తళతళలాదే
భూశకలానివి
కడలి కెరటాలతో
రూపొందిన సాలభంజికవు
ఇవన్నీ
నీ ఆలింగనం కోసమే
చుంబనోధృతి కోసమే
అవును
నా ఆత్మానందం కోసమే
22208 వత్రిక ఎన్, గోపి 57
మిగిలిన అక్షరాలు ప్రకాశం జిల్లాను యావదాంధ్ర పటం పైన మరింత ప్రకాశమానం చేసిన నిరంతర సారస్వత జ్వాలవు నువ్వు మట్టిలోంచి గుండ్ల కమ్మలా ఉబికిన భావుకత నీది నాగ ఖైరవా ! నిన్నివాళ చూస్తుంటే అంపశయ్యపైన భీష్ముడు గుర్తుకొస్తున్నాడు. ఎక్కడ రెండుగా చీలిందో అ వెదురు కొమ్మ ఇప్పుడు మురళి గాయాల్లోంచే మాటలు వినపడుతున్నాయి చిన్నబుచ్చుకోకు పెద్దాయనా! నీ కవన విజయం ఒక గొప్ప భువన విజయం కూదా. ఎంతో ఎత్తుల కెదిగావు యువ కవుల హృదయాల్లో హాయిగా ఒదిగావు కుభేరుణ్ని పరిహాసిస్తూ అడగని వారికి గుప్త సాయం చేసే కుచేలుడివి. నీ గళం ఆగింది గాని 58 వాన కడిగిన చీకటీ
నీకలం వెదజల్లిన అక్షర ప్రభలు అజరామరం (నాగభైరవ చనిపోయినప్పుడు) నం! వార్త సందే ఎన్, గోపి 69
చలన గీతం
అలల్ని వ్యాఖ్యానించలేం
కొన్ని కలల్ని కూడా.
గాలి కత్తెరకు చిక్కిన
కొమ్మల్లో నలిగే
ఆకాశం ముక్కల్ని పట్టుకోలేం.
చలనానికి
స్థిరత్వం కలిగే దాకా
చరాచరాల మధ్య
సరిహద్దురేఖను గీయలేం
భావశబలత కల్లోలినిలో
అక్షరాల, గాలం వెయ్యలేం
జీవితం
కాలానికి బందీయే
కాదనలేం
కాని కొన్ని ఉద్రిక్త క్షణాలు
జైలుకందని స్వేచ్చా విహంగాలౌతాయి
నిర్జీవ గగనాలకు
అవే ప్రాణ తరంగాలు
అణువులో అనంత శక్తి దాగి ఉన్నట్టు
అంత చిన్న తీక్హానుభవాలు
జీవితానికి తాత్త్విక బాష్యాలు.
౨8 &08 ఆంధ్రభూమి, నందే 60 నానీ కడిగిన చీకటీ
అడవి కథ ఈ అడవి నా మస్తిష్కంలో పుట్టి నీ దాకా వ్యాపించింది దీనిలో ఎన్ని అనుమానాల పులులున్నాయో !? ఎన్ని సందేహాల ఎలుగుబంట్లున్నాయో మనకు తెలియదు. ఎన్నికుతంత్రాల నక్కలున్నాయో కూడా మనకర్ణంకాదు చుట్టూ వంచనల సింహాలు గర్జిస్తున్నాయి వాటి గుహలెక్కడో మనకు తట్టదు. ఎన్ని ఉల్లాసాల మయూరాలు (ప్రేమ నిండిన పావురాలు ఎన్నెన్ని హృదయ పూర్ణమైన కొండపక్షుల కలకూజితాలున్నాయో మనమనసుల కక్కడు. మనలో మనం సందిగ్ధ సంధ్యలోకి జారుతూ గందరగోళగహన స్థితిలోకి మునిగిపోతూ ఒక మహారణ్యంగా మారిపొయ్యాం, ఒకరినొకరం మరిచిపొయ్యాం
వీన్, గోపి 61
అతి దగ్గరగా వుంటూ దూరంగా
మసలుతున్నాం
ఎక్కదో
ఈ అరణ్య మమతాను బంధంలో
ఎ(ర్రైర్రని బెర్రీ కాయలు
తియ్యని జామలు, పేర్ ఫలాలు
నిండా పక్వానికొచ్చే వుంటాయి
సొభ్రాత్రుత్వాల
దానిమ్మల్తూ, ద్రాక్షలూ, స్ట్రాబెరీలు
కమనీయ తరు శాఖల్లో
రమణీయ చాలనం చేస్తూనే వుంటాయి.
అయిజే
ఆ సంగతి స్పష్టంగా తెలియదు మనకు.
మనకు తెలిసిందల్లా
నీకూ నాకూ మధ్య
ఓ సింహం సదా గర్జిస్తుంటుంది.
ఎందుకలా గర్జిస్తుందది?
ఏమో! మనకెప్పుడూ అర్ధంకాదు.
(ఆకాశవాణి నిర్వహించిన ౨009 జనవరి 25 రాత్రి నేషనల్
సీంపోజబీయంలో చదివిన కవిత మూనీ* లో థచురితం
విడ 2. 08 రాజేంద్ర భందారి నేపాలి కవితకు అనువాదం 62 వాన కడిగిన జశకీటీ
సెంహాసనం కొయ్యకుర్చీ ఒక పదార్ధము (ద్రవ్యరాశి ఉండును స్టలము నాక్రమించును మరి బరువు? కూర్చున్న వాడిని బట్టి ఉంటుంది ప్రాణం? దాని పై ప్రవహించే చైతన్య నదిని బట్టి. చాలనాళ్లుగా కుర్చీ నిర్దీవరమ్యంగా పడి వుంది ఒకప్పటి చిగురు కలలు లేవని కాదు రక్తంలో ఇంకిపోయిన చెరగని కలకూజితాలు స్మరణకు రావని కాదు. ఈనెల గీతలతో వేసుకున్న చిత్రమాలికలు, కళ్లల్లో మొదలుకావని కాదు కాని ఇప్పటి శూన్యం దుర్భరమై తనలోని ఖాళీ ఒక మానని గాయమై వేధిస్తుంటే ఒకప్పుడు ఆకాశాన్ని శోభితం చేసిన సువిశాల ఛత్రసీమ నిశ్శబ్దానికే ఆశ్చర్యం కలిగేంత మౌనముద్రను దాల్చింది. బరువు మెయ్యటానికి సిద్దమే అరిగిపోవటానికి కూడా. తన కోసం గతంలో ఎన్నియుద్ద్ధాలు జరిగాయో తెలుసు. ఎన్, గోస 63
అందుకే
ఒక విశ్వాత్మను వెలిగించే
అపూర్వ శక్తికోసం
తీవ్రమైన నిరీక్షణ.
7209 నేటినిజం 64 నాన్ కడిగీనీ శీకీటీ
సంకల్పం
చెట్టు
వేర్తలోకి ప్రసరిస్తున్నట్టు
తాజా (ప్రయాణం.
నిజానికిది వెనక్కి కాదు
ముందుకే.
ఆకాశాన్ని ధిక్కరించే
హరితారుణ శోభతో
రుణం తీర్చుకునే దిశగా
మళ్లీ తూర్పుకే
మట్టి గర్భంలో
చీకటి తపస్సు చేసిన ఫోచల్లో
మరోసారి శక్తిని నింపుకోవాలి
దారి పాతదే
గోదారి కొత్తది,
గమ్యం తెలిసిందే
గమనం కొత్తది.
చెట్టుకి రక్తమాంసాలిచ్చిన
గాలీధూళీ సూర్యరళ్ళి,
అయితే వేర్లు బయటపడి చాటుకోవు
చాన్నాళ్లకు తిరిగి అమ్మ దగ్గరికి వెళ్తున్నాను
నన్ను డిస్టర్చ్ చెయ్యకండి
రేప్పొద్దున తొందరగా లేవండి
తల్లి గర్భంలోంచి
రెండోసారి ఉదయిస్తున్నాను.
(వదవీ విరమణ నందర్భంగా)
3.708 అంధ్రజ్యోత్మి సందే ఎన్, గోసి 65
అసహజం
అంతా తొందర తొందర !
దేనికో ఎవరికీ తెలియదు.
మైకుల నిండా
వివేక భ్రష్ట సంపాతములే.
అరిషడ్వర్లాలు
స్వార్ధానికి పుట్టిన వికృత శిశువులే.
ఎక్కడికా పరుగులు
శిఖరం చిటారుకా?
కింద మవాలోయ
కొండకది ఉత్తరీయం కాదా
శిఖరాన్ని పట్టుకొని వేలాడుతారా?
ఉద్యానాలు ఉయ్యాలలూగవు
అఆకాశమూ, మబ్బులూ, పక్షులూ
పరిస్థితిని చూసి పరిహసిస్తున్నాయి
అయినా సరే.
ప్రభుత్వం గట్టెక్కింది.
10708 .. నేటినిజుం 66 వాన కడిగిన చీకటీ
న్యాయానికి నివాళి
పదవికే కాదు
ఆయన సమాజానికీ న్యాయమాూత్తే.
బి సి ఎస్సీ అనే మాటలు విని
ఉలిక్కి పడుతున్న కాలంలో
ఆయన న్యాయం వైపు చక్రం తిప్పాడు.
అంబేద్కర్ జ్యోతిబాఫూలేల
అంగవస్తాలను ముడివేశాడు,
న్యాయవ్యవస్థలో వుంటూ
అన్యాయం చెప్పటం సులభం
జస్టిస్ జస్టిస్ జస్టిస్‌గానే బతికాడు
ప్రలోభాలు లేవు
'ప్రత్వేకతలూ లేవు
ఆయన గుండె ఆగిపోతేనేం
ఆ ఊపిరుల తుఫానులో
భారతీయ సమతా జెండా
రెపరెపలాడుతూనే వుంటుంది
(నముఖ సామాజిక న్యాయవేత్త జన్టీన్ బీ ఎన్ ఎ స్వామి గౌరి మృతికీ
నంతావంగా,
2.208 మనవ(్రిక ఎన్, గోసి 67
పెతృసూక్తం ఇద్దరు కూతుళ్లు ఇద్దరు కొడుకులు షేదరికంలోనే వీళ్లను కన్నాడు. ప్రిక్ట్‌గానే పెంచాడు పిల్లల దృష్టిలో సహజంగానే విలన్ అయ్యాడు. ఆడపిల్లల పెళ్లిళ్లకోసం కొడుకుల్ని మరీ తరిమాడు కొడుకుల్లో గొణుగుడు ప్రారంభమైంది. కొత్తతరం నది లాంటిది ప్రవాహానికి వేగమే తప్ప ఉద్వేగం తెలియదు. (డ్రిల్ మాస్టర్‌కు భయపడతారు గాని భక్తి వుండదు. కొత్తకోడళ్లు స్వీయ ప్రయోజనాల మీసాల్ని మెలేస్తారు నలుగురిని కన్న భార్య మోకాళ్ల నొప్పుల్లో బాధపడ్తుంది ఇప్పుడిక సమీకరణాల సంరంభం ఉమ్మడి కుటుంబం చెత్త కుండీలో దర్శనమిస్తుంది (ప్రపంచదేశాల్లాగే అందరూ ఆత్మ రక్షణలో పడతారు. పాత సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైట్ తో వెలవెలబోతాయి. 68 నాన కడినీనీ చీకటీ
గతానికి తవియదు
వర్తమానం ఇలా వుంటుందని.
డబ్బులూ సెంటిమెంట్లూ
కలగలిసిపోతాయి.
ఇంతటి సంక్షిష్టత కూడా
వాది వారి మమకారాలలో
సంగమించాల్సిందే
లేదంటారా
అందరికీ ఆశీస్సులు.
272708 నది ఎన్ గోపి 69
పఏకంసత్
ఏదైనా
ఒకటి అనుకున్నప్పుదే సాధ్యం
శకలాల్లో పలు ముఖాలు
హార్మోనియం మెట్లు వేరు వేరు
స్వరాలకు
(శుతి కుదిరినప్పుడే గతి.
సముద్రాలకు పేరు పెట్టాం
ఉన్నది ఒకే ఒక మహార్దవం
ఆకాశాన్ని గుడ్డలుగా చించి
దేశానికో అంగీ కుడితే 1?
మేఘాన్ని ఫలానా ఊళ్లోనే కురవమనండి
నేలతప్ప అన్యం తెలియని
జలరాగం దానిది
వందలాది జాతులు
ఒకే మైదానంలో కూడినప్పుడు
ఒకే ధ్యేయం
ఒకే ఏకాగ్రత
ఒకే విజయాకాంక్ష
ఒకే తపః ఫలిత దీక్ష
వసుదైక కుటుంబానికి
పెద్ద వేదాంతం అక్కర్లేదు
రెండు కాళ్లకు ఒకే దశ
రెండు చేతులకు ఒకే దిశ
చీలిన ఊపిరికి ఒకే శ్వాస
తల్లి కడుపులో రూపుదిద్దుకున్న స్వప్నం
నిజానికి దాని గమ్యం ఒకే విశ్వం.
విగత ఆం(్రసభ మందే 70 నాన కడిగిన చకదీ
ద్వైథీ నీకు నాకూ వినపడటానికే కవిత్వం మాట్లాడతాను నాకు మాత్రమే వినపడితే కలవరపడిపోతాను,. నా ఒంటరికేకను నేనే పోల్చుకోలేను నువ్వు విన్న తర్వాతే నాకది అర్ధమౌతుంది నా మాటలకు నువ్వు కంగారుపడితే నేనూ అంతే ! కంగారు పడకపోతే మరీ కంగారు పడతాను అక్షరం అక్షరం తలకిందులుగా నడిచొస్తాయి నా వైపు నీ వైపు విసిరేసే టప్పుడే కాళ్లు మొలుస్తాయి వాటికి. నేను నాలాగే చూస్తాను గాని నీ చూపులూ కొన్ని తీసుకుంటా. సే కన్నీటి బొట్టూ నా బాష్ప బిందువూ ఒకేసారి రాలిన చప్పుడు నాకిష్టం మట్టికి ఈ భాష అర్థమౌతుందని నాభ్రమ ! నిజానికి భ్రమ నాకిష్టమే కాని రకరకాలు భ్రమల్లో అది ఎన్, గోసి 71
సీతాకోకై ఎగిరిపోతుంది.
నీకోసమే
కవిత్వం నాకవసరం
అసలు ఆ మార్మిక ధ్వనులు
నీతో సంభాషణకోసమే
నువ్వులేని ఏకాంతంలో
నాలో నేనున్నాను గదా
ఇంక కవిత్వమెందుకు?
(నేతారాం కువ్చుం కవితలు” చదివి)
వత్రగ్త0 కవితా 72 నానీ కడినీన చీకటీ
నీ చేతులు = పాబ్లో నారూడా ఎప్పుడైతే నీ చేతులు నా వైపు ప్రేమగా చాస్తాయో ఏం తీసుకొన్తాయవి? నా పెదాల దగ్గర ఆగిపోతాయి. వీటి స్పర్శ తెలిసిందేనని హటాత్తుగా స్ఫురిస్తుంది. అవి అప్పటికే ఉన్నట్లు నుదురు మీదా నడుంచుట్టూ లాలనగా నిమురుతాయి. ఆ చేతుల సౌకుమార్యం నా దాకా ఎగిసి వస్తుంది. కాలానికి ఆవలి తీరాన అపార పారావరం పైన మంచు పొగల అంచుల్లో వసంతానికి అటు వైపు నువ్వునా ఛాతిపైన చేతులు వేసినప్పుడు ఆ సొగసు పిట్టల పసిడి రెక్కలనూ గోధుమ రంగు మట్టిసీ గుర్తు పట్టాను. బీన్ గోసి 73
ఇన్నేళ్ల నా జీవితంలో
వెతుకులాటే నా భ్రమణం.
ఎన్ని మెట్లెక్ళాను
ఎన్ని రోడ్డు దాటాను
రైళ్లలో పయనించాను
అగాధమైన జలాల్లో ఈదాను.
(ద్రాక్షచర్మంలాగా
నిన్ను సృశించిన అనుభూతి.
హటాత్తుగా
చెట్టు నీ స్పర్శను మోసుకొచ్చింది.
బాదాం పలుకు
నీ రహస్యమార్దవాన్ని స్ఫురింపించింది
నీ చేతులునా చుట్టూ
రెక్కల్లా అమిరి
ఆఖరికి ఈ యాత్రను ముగించాయి.
822 09 సాపొత్య(నన్థానం 74 నాన కడినీనీ చీకటీ
ఫోటో గ్రాఫర్
నడిచేవి దృశ్యాలా? అతని పాదాలా ?? కొండను పట్టుకోవాలని ప్రయత్నం అద్దం సిద్ధంగానే వుంది. సాంబశివుడి మెడలో పాము పడగ విప్పింది పడగ నీడలో ఏడేడు పధ్నాలుగు లోకాలు కన్నూ కన్నూ కలిసినట్లే వుంది చూపులకు చిక్కిందెంత? ఆత్మ ఎక్కడుంది దేహానికి లోపలా? బయటా? అణువూ అణువూ కలిసి ఆకృతి వర్పడ్డట్టు రంగులు మహాంధకారాన్ని సృష్టీంచినటులు దిక్కుతోచని గుడ్డికళ్లతో ఫోటోగ్రాఫర్.
వలలు జ్ఞాపకాల పెట్టెలో మణులు మసక బారలేదు. అప్పటి నూనూగు మీసాలు తెల్ల బడలేదు ఆమె తోక జడలు ఇంకా నా చేతిలోనే.
ప!
వీన్, గోపి 75
సాంబళివునికి తీరని అసంతృప్తి ! వంకర టింకర జాజు చారలతో పాత గోడలు,
రాలుతున్న పెచ్చులు
లెన్స్‌లో తుఫానులు రేవుతాయి. ఆ అందగాడు
ఇంత వికృతంగా ఎప్పుడూ నవ్వలేదు అతని నిజ స్వరూపమదే
పట్టుకో సోదరా!
శర
ఆమె నీ వైపే చూస్తుందా భవిష్యత్తు లోనికా?
ఫోటో మాత్రం
ముగ్ధ మనోహర సుమహారం
" పెళ్లి చేసుకుంటావా అయిజే కాపురం మాత్రం బ్లాక్ అండ్ వైట్ సుషున్లు
సాంబశివుడికి కుతి తీరదు మూడో కొలత కోసం
మునిలా తపస్సు
బుట్టలో చుట్టుకున్న రీళ్లు
ఒకటే రొదచేస్తుంటాయి. మూడోకన్ను ఇంకా తెరుచుకోదు వెలుపలి దృశ్యాల్లో వదో వెలితి
76 నాన వడిన్‌నీ ఉకటీ
ఇంత చిన్ని (థఫేములో
ప్రపంచాన్ని బంధించాలని.
సైజు క్రైెటీరియా కాదని
తెలిసేదెప్పుడు?
నే
అలవిగాని కట్టెల మోపుతో
ఓ లంబాడీ లలన
జవ్వాడే నడుములో
యవ్వన లాస్య లహరికలున్నాయి గాని
రాయి తగిలి
లయ చెదిరిన దేహంపై
(బ్రహ్మాండమంత భారం
ఇప్పుడు చెమట బిందువులు
నవమౌక్తికాల్లా తళ తళలాడవు
మూడోకన్ను జిగురు
కాస్త కాస్త కరుగుతుంది
శివుడి కిప్పుడు
హిమాలయాలు కూడా
గోలికాయల్లా కనిపిస్తాయి
ఉద్వేగభరిత హృదయాల్లో
పామూ శివుడూ
ఒకే (్రుతిలో నాట్యం చేస్తారు.
(ఫా యళోభరరావుకు (మతో)
42 09 కనితా /” ఎన్, గోస 77
ఆత్మ ఆకు కదుల్తుంది ఆవరణ అంతా కదుల్తుంది - కదిలించే గాలి కనపడదు. జెండాకెంత పొగరు! రేగుతున్న జుట్టుతో తల ఎగరేస్తుంది లాగుతున్న వేళ్లు కనపడవు బుగ్గలకింత కాంతి ఎలా వచ్చింది గుండెలో చందమామలున్నాయా పెదవుల మీంచి జారే వెన్నెల చేతికి చిక్కదు. ఈ పువ్వు నాట్యం స్వాభావికమా ఎవరైనా ఆడిస్తున్నారా? ఎండపొడలోంచి రాలుతున్న అణు దుమారాన్ని పీల్చుకుంటున్న దెవరు? అర్థంగాని దృశ్యాలతో అవనతమైన కళ్లు, మరింత లోతుకు దిగిన చూపులకు ఏదో మెత్తగా తగిలింది అదే అన్నిటికి మూలం. 22209 ఆంధ్రజ్యోతి నందే 78 వొనీ కడినీన చీకటీ
మరోసారి తంగిడుపూలు
నలభై సంవత్సరాలు అంటున్నాను గాని
ఇవి నాలో విచ్చుకోని దెప్పుడు?
ఇంగ్లాండులో
డెఫడిల్స్‌తో మాట్లాడి నప్పుడుకూడా
ఇవి నా వెంటే రెపరెసలాడాయి.
రెండు పక్కల్లో దీపశిఖల్లా
తంగెడుపూలు లేకుంటే
తారు రోడ్డంతా కారుచీకటే
త్రీడైమన్నన్ బతుకమ్మను చిత్రించిన
గొప్ప కళాకారిణి మా అమ్మ.
ఏమేమి పువ్వొప్పినా
గౌరమ్మకు ఈ పువ్వే ఓ చిరునవ్వు,
బతుకమ్మలు విహరించే
మావూరి చెరువు
ఒక సజీవ సజల మహాకావ్యంలా
ఉందేది.
ఇప్పుడెక్కడుంది?
తేలిన రాళ్లు
చూపులు లేని కళ్లె
జ్ఞాపకాలు పిండినా
చుక్కరాని కన్నీల్లై
చెరువుల్ని చంపిన
జల వ్యవస్థ పై పిడికిళ్లు బిగుసుకొని...
పట్నం వైపు పారిపోతున్న
నా వెనుక తంగెడుపూల పిలుపులు. ఎన్, గోసి 79
అవి నా కలల పారిజాతాలు
బాల్యం ఆవరణలోని మార్మిక గీతాలు
అడుగులు హరాత్తుగా ఆగిపోతాయి
కూలబడిన నేలలోంచి
ఆర్తనాదాలు వినపడతాయి.
లంబాడీలు అంగట్లో కూచొని
ఎదతెగని దుఃఖాన్ని కురిపించినట్టు,
అన్నీ వుండి
తంగెడు పూలు లేని నేను
వికల విహాయసంలా.
282 09 చినుకు 80 నాన కడిగీనీ శకటీ
విరోధాభాసం
58 ఉగాదులు చూశాను కవిజీవితం లెక్కయిది. వసంతాలు లెక్కిస్తూ బతికేవాడే కవి. వస్తువు లేకుండా పద్యం ఉండనట్టు ఉగాది లేకుండా సంవత్సరం వుండదు. 58 ఉగాదులు చూశాను గానీ (ప్రతి ఉగాదినీ కొత్తగానే చూశాను. ప్రతిసారీ మొదటిసారే చూశాను కొత్తగా చూడట మంటే ఏమిటి? కొత్తదనం చూపులోనా ఉగాదిలోనా? పాతబదకపోవడమే కొత్తదనమంటే. రోజూ మూడుపూటలు అన్నం తింటున్నాం ప్రతిసారీ అన్నమేనా? ఒక్కసారయినా గడ్డితినాలనిపించదు. ఎందుకంటే అన్నం పాతదే ఆకలి మాత్రం కొత్తది. అలాగే చూపులోనే కాదు ఉగాదిలోనూ కొత్త ఊపిరులున్నాయి ప్రతియేటా కొత్తపేరే ఈసారి విరోధి పైగా శ్రీవిరోధి విరోధి కెందుకండీ గౌరవం? గౌరవించడం మన సంస్కృతి కవిని కాబట్టి విరోధం వద్దంటాను
ఎన్ నోస్ 81
గింజ గింజ మీద తినేవాడి పేరున్నట్టు అక్షరం అక్షరం మీద చదివేవాడి పేరు రాసి విసిరేస్తాను. విరోధం వద్దూ వద్దని ధ్వనిగా కాదు వాచ్యంగానే రాస్తాను అర్ధయుక్తి కోసం కవిత్వాంశను కాస్త త్యాగం చేస్తాను. అయినా ఎవరు వింటారు? అలా రాస్తే విరోధిస్తారేమో కూడా. గత విరోధిలో నేను లేను వచ్చే ఏిరోధికి నేనుండను. జీవితంలో ఒకేసారి చూడగల అపురూపమైన ఉగాది నాకిది అందుకే చక్కెరను పొట్లంగా కట్టి ఉపాయనంగా సమర్పిస్తున్నాను. అంతా చక్కెరే అనుకునేరు చేదు దినుసులు కూడా కలిశాయి విరోధీ | సీ పేకే ఒక సందేశం ఇంతకూ శత్రువంటే ఎవరు? లోపలి శత్రువులను జయించవే మనసా! వర్గశత్రువులను కాసేపు పక్కన పెడదాం అరిషడ్వర్గాల పని పట్టాలి ముందు. ఇవాళటి ప్రధాన శత్రువు డబ్బు. వసుధైక కుటుంబకంలో కుటుంబం ముక్కలై పోతున్నది.
82 నాన కడిగీనీ శీకటీ
ఈ యేడు వర్షం పడొచ్చూ పదడకపోవచ్చూ రక్త వర్షానికి మాత్రం రుతువుల తేడా లేదు. 'పేమపై యాసిడ్ పోసి కసి తీర్చుకోవచ్చు జగత్తు ముద్దమనోహర సుందరం సమాజం మాత్రం విదోధాభాస బంధురం. ఇంతకు ఎవరయ్యా శత్రువులు? ఒకప్పుడు అబద్ధమాడితే ఆత్మలో వెలక్కాయ అడద్దుపదేది. ఇవాళ అబద్దాలకు వ్యాఖ్యానాల కొదువ లేదు మల్లినాధసూరి మళ్లీ పుట్టనక్కర లేదు. ఆడపిల్లలు తగ్గిపోతారని చెప్పటానికి (బ్రహ్మంగారే దిగి రావాలా? తులారాశిలో సంతులనం కరువైంది రాశులనిండా వృశ్చికాలతోకలు కదుల్తున్నాయి. వస్త్రదానం చెయ్యాలనే వుంది గాని నేతన్నల ఉరితాళ్లు దయ్యాలనోళ్లలో నానుతున్న బాధ అన్నదానం చెయ్యాలనే వుంది గాని పొలాల్లో విగతశ్వాసలు గాలిగా వీస్తున్న స్ఫురణ. నగరాల్లో పల్లెను మళ్లీ మొలిపించుకోవాలని వుంది గాని ఇప్పుడు పల్లెల్లోనే పల్లె లేదు యేదాది కొక్కసారైనా వేపపూతలా పరిమళించే నిసద్ద రమణీయ కవిత్వం రాయక ఏమిటండీ ఈ (ప్రేలాపనలు !. విషఫలాలుంటాయి గాని
ఎన్, సోపి 83
మామిడి పిందెలను కొనియాడొచ్చుగదా! శుక్రుడు వక్రంగా చూస్తున్నాడా ఆ చూపును సరళరేఖగా సరిచేస్తేనో!. ఉగాదికి సరైన ప్రాస విరోధి ఇది శబ్ద సౌష్టవానికి పునాది తెలుగుభాష ఎంత గొప్పది! ఉగాది శిరస్సు పై తెలుగు అక్షరాల ముత్యాలు పోద్దాం నేనిప్పుడు చేస్తున్నది అదే పని (దూరదర్భన్ నిర్వపాంచిన జీగాది కవి నమ్మేళనంలో (27-3-2009) చదివిన కవిత) 84 నానీ కడిగిన చీకటి
వాన కడిగిన చీకటి ఒకటే ముసురు లోపలా బయటా చిత్తడి భూమికి వ్యాఖ్యానం రాస్తున్నట్టుగా ఆకాశం విశ్వశోకానికి ప్రతీకగా నిలిచిన యావత్ హరిత ప్రపంచం. ఇది కరుణరసమా? కల్లోల రసమా?? విడి విడిగా వేరు కాపురం పెట్టిన ధూళి కణాలు మట్టి మమతగా రూపాంతరం. ఇది నిశీధి అంతర్గత విరోధి ఇదొక మహా నిస్సహాయ నిశ్శబ్ద సంగీతం విరాట్ స్తబ్దత. నీరవాత్మలు మిణుగురులై చీకటికి చిల్లులు పొడిచే ఎదురీత. రోడ్లు నదులై నదులు సముద్రాలై జలం తప్ప మరేదీ లేనట్టు. అయితే ఏదీ కనపడదు చీకటి కదలని కొండలా వుంది స్పందనలేని గుండెలా అప్పుడప్పుడు నన్ గోసి 85
మెరుపుగా చీలిన కళేబరం. కళ్లు చించుకొని వెలువడ్డ చూపుల సూదులతో గాయపడ్డ కలవరం. దేనినీ లెక్కచేయని తెంపరితనం అంతటా ఒక జధశీతల నైరాశ్యం ముసురు నిబ్బరంగా కురుస్తుంది కీటకమంత విమానం దృగావరణాన్ని మరింత విశాలం చేస్తుంది. ఒక్కొక్క చినుకే లోకాన్ని ఆవరించిన సన్నివేశం ఇంకాసేపట్లో చీకటిలో కదలిక ప్రారంభమౌతుంది. వెలిసిపోతున్న అనంత వస్త్రం నుండి చీకటి మరకలు కారిపోతాయి. ఇక నా కవిత తూర్పుకొండ మీద సిద్ధంగా వుంటుంది తి1-=8-2009 నవ్వ ఉసటలబాం ల న ఫలాన చో న 86 వాన కడిగిన ణీకీటీ
1 (| డగ ౬61102 0౧66126 . ప 60॥60400 01 ౧౦౪౪౫/ ౫ ం 6౧.8001 యము, / గ లలల ల న ల