Telugu vaalu Aarugulu - anilvaranasi/indianlanguages GitHub Wiki

. వాళ్లు ఆరుగురూ ్లీ. జని క్ల; స భు ॥ ష్‌ | ఇకా తీ ణాలు--వొఫ్లీ ్టా ఇఫ్‌ ట్ల “క ఉల్లా.. . ల కన

వాళ్లు ఆరుగురూ చలం ఫెమినిస్టు స్టడీ సర్కిల్‌ హైద్రాబాద్‌.

౪% (/.గ్నా7న్ని2 వాళ్లు ఆరుగురూ అతాయ ప్రయోగాత్మక నాటిక చలం== మా ప్రధమ ముద్రణ : మే, 1995 హా

శలటలొ 9 గ వ ఠి" ఆల రా ఠి సౌరిస్‌ సందే వం . ల ల జ! గ లగి ని వెల :10 రూ॥ ఖ్‌ లో శు స్వా జా నీ క 4 వేను... ప్రతులు : వె 6 య్యి శో గ్రా ప్రతులకు : /

  • నవోదయ బుక్‌ హౌస్‌ (/ అర్య నమాజ్‌ ఎదురుగా, కాచిగూడ, హైదరాబాద్‌ - 27.
  • అస్మిత రోడ్‌ నెం. 2, వెస్ట్‌ మారేడ్‌పల్లి, సికింద్రాబాద్‌ - 3. ముద్రణ : చరిత గ్రాఫిక్స్‌ - ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌, చిక్కడపల్లి, హైదరాబాద్‌ - 20.

నూరేళ్ల చలం వ్‌

చలం గారి శతజయంతి నభలు 1984 బుద్ధపూర్ణిమ రోజున మొదలై 1995 బుద్ధపూర్ణిమ వరకూ జరగాలని “నూరేళ్ల చలం” కమిటీ 1994 జనవరిలో యిచ్చిన పిలుపుకి ఆంధ్రదేశమంతటినుంచీ ఎంతో నందన వచ్చింది. మరికొందరు కూడా శతజయంతి జరపటానికి సంఘాలుగా యేర్చడ్డారు. ఆంధ్రదేశమంతా ఒక నూతనోత్సాహం ఉప్పొంగింది. ఎంతో ఉత్తేజంతో, గొప్ప శ్రేరణళో సభలు జరిగాయి.

నూరేళ్ల చలం కమిటీ యేర్చడటంలోనూ, సభలు జరపాలని తలపెట్ట టంలోనూ ఒక ప్రత్యేకోద్దేశం వుంది. ఏదో తెలుగులో ప్రసిద్ధ రచయితగా, సాహిత్య శిల్చకారుడిగా మాత్రమే చలాన్ని గుర్తించి గౌరవించే పరిమితికి లోబడి ఈ కమిటీ యేర్చడలేదు. సమాజంలో నిరంతరం పురోగామి భావాల వ్యాప్తికోసం, మానవాభ్యుదయం కోసం, మానవుల సుఖ సంతోషాల కోసం, అనందం కోనం, శాంతి కోసం అరాటపడి, పరితపించి, వాటికోసం తను స్వయంగా జీవితపు కొలిమిలో కాలి, జీనిత రథచక్రాల కింద నలిగి, అనంద విషాద తీరాల పారం చూసి, దానిని లోకానికి పంచటం కోసం సమాజంతో సూటిగా సంబంధం పెట్టుకున్న ఒక భావ విప్ణవకారుడిగా చలాన్ని గుర్తించింది “నూరేళ్ల చలం”.

ఆనాడు చలం రేపిన భావాలకు యివాల్చి సామాజిక నేపథ్యంలో ఎలాంటి స్థానం వుందో, ఆ ఆలోచనలకు యివాళున్న అర్థం యేమిటో, వాటిని కొనసాగించటానికున్న అవకాశాలేమిటో వీటన్నిటిని పరిశీలించి ఒక అంచనాకు రావాలనే బాధ్యతతో “నూరేళ్ల చలం' యేర్చడింది.

ముందుగా మేం చేసినపని ప్రీవాద భావాల నేపథ్యంలో చలాన్నీ ఆయన సాహిత్యాన్నీ పరిశీలించటం. ఆ పరిశీలనలో అప్పుడు చలం రేపిన

శ ప్రశ్నలూ, అడిగిన డిమాండ్స్‌ అన్నీ యివాళ స్త్రీవాదులు అడుగుతున్నవనే విషయం తెలిసి ఎంతో సంతోషించాం. స్త్రీల గురించి అంత బాధ్యత, (ప్రేమ చూపిన చలం గారిపై మా గౌరవం రెట్టింపయింది. ఐతే మేం అంతటితో ఆగలేదు. మరింత లోళుకు వెళ్లే సహస ప్రయత్నం చేశాం. చలాన్ని చాలౌ యేమించి గౌరవించేనాళ్లలో కొందరు ఆయనను ఒక సౌందర్యారాధకుడిగొ; కేవలం ఆర్టిస్టుగా, రామాంటిక్‌ వ్యక్తిగా, సమాజంతో స్రీలతో పెద్దగా సంబంధం లేనివాడిగా చూసే వాళ్లున్నారు. వాళ్ల వాదనల గురించి మేం సీరియస్‌గానే ఆలోచించాం. అసలెందుకీ విభజన జరుగుళోంది, దీని మూలం ఎక్కడుందీ అని పరిశీలించాం. ఆ పరిశీలనలో మాకు ఎన్నో కొత్త విషయాలు అర్థ మయ్యాయి. ఆ విషయాలను గుర్తించటం మా జీవితాల్గొ ఎంతో మార్చుని తీసుకొస్తుందని మాకనిషించింది. ఆ విషయాలను అందరితో సంచుకోవాలనే ఈ ప్రయత్నం. ఈ సంవత్సర కాలంలో ఎన్నో సభల్లో, ఎందరో మమ్మల్నడిగిన ప్రశ్నా మాటలోనే ఎంతో ఆలోచననీ, అంతర్మధనాన్ని కలిగించిన అతి ముఖ్యమైన ప్రశ్న - 'స్వేచ్చ'. స్వేచ్చ అంటే ఏమిటి? ఎలాంటి స్వేచ్చ చలం కోరాడు? మీకు కావాల్సింది ఎలాంటి స్వేచ్చ? - యిలాంటి ప్రశ్నలు చైటినుంచీ మౌ లోపలినుంచీ కూడా మమ్మల్ని చుట్టుముట్టాయి. వీటిని మేం ధైర్యంగా ఎదుర్కొన్నాం. చలం, చలం సాహిత్యం, అందులో నాయికలూ వీటిద్వారా పరిచయమైన "స్వేచ్చ చాలామందికి అర్థం లేనిదిగా, గమ్యం లేనిదిగా, కేవలం 5000160॥%/ తో కూడినదిగా ఏవేవో వైరుధ్యాలతో నిండి వున్నదిగా కనిపిస్తుంది. చలం, చలం నాయికా నాయకులు కూడా ఎంతో శక్తివంతంగా, జీవబలంతో వుంటూ ఏవో పనులు, మనకు 20916గా వుండేవీ, మనదృష్టిలో “పనికొచ్చేవి” అనిపించేవి కొందరి దృష్టిలో “పనికిరానివి" అనిపించేవి ఏవేవో చేస్తుంటారు వీటికి ఒక క్రమం వున్నట్టు కనిపించదు. అది అర్థం కాక, అర్థం చేసుకోలేక, అర్ధం చేసుకోవాలనే కోరిక లేక “ఏం స్వేచ్చ” యిది” అనీ, ఏం సాధిస్తారు దీనితో” ననీ విసుగుతో, కోపంతో అక్కడే ఆగిపోతారు.

శ

కానీ అసలు ఆలోచన అక్కడే మొదలుకావాలి. మనందరికీ స్వేచ్చ ఆంటే ముందే ఏర్పడిన ఒక [౫౭6 001౧100, గట్టి అభిప్రాయం, తిరుగులేని నిర్వచనం వుంది బైటి ప్రపంచం ముఖ్యంగా పాలకులు తమ సౌఖ్యం కోసం సామాన్య జనజీవిత గమనాలకు ఏవో కట్టుబాట్ట్లూ, నిబంధనలూ విధిస్తే అవి మన భౌతిక జీవితానికి యిబ్బందిని కలిగించి దుర్భరం చేస్తే

  • ఆ కట్టుబాట్లను ఉల్లంఘించటం కోసం మనం పడే ఆరాటాన్ని స్వేచ్చ కోసం కోరికగా అర్ధం చేసుకుంటున్నాం. ఇందులో పొరపాటేమీ లేదు. ఇది చాలా అవసరం. ముఖ్యం. అత్యంత కీలకం. ఐతే యిక అక్కడే ఆగిపోయి ఆ పరిమితార్భానికి లోబడి మాత్రమే 'స్వేచ్భను నిర్వచిద్దామనుకోవట౦ పొరపాటు. ఇంకా లోతైన, గాఢమైన అర్థం వుంది "స్వేచ్చకు. నిజానికి ఈ సమాజం విధించిన కట్టుబాట్లన్నీ ఆ విశాలమైన అర్భాన్ని దాచటం కోసమే యేర్పడ్డాయి.

స్వేచ్చ ఎంత బైటదో, అంతకన్న ఎక్కువగా మన లోపలిది, మన లోపల అనివార్యంగా పుట్టుకొచ్చే ఒక కాంక్షా లాలసత్వం, ఆనందం కోసం కోరిక వుంటాయి. దాన్ని మనం సామాన్యంగా గుర్తించం. గుర్తించకుండా వుండేలా మనల్ని కండిషన్‌ చేస్తారు. అది మన మనసులోనే అవ్యక్తంగా గుర్తింపు లేకుండా ఐపోతుంది. ఎన్నడైనా అది వ్యక్తమవబోతే దాన్ని మనం నిరాకరించే ప్రయత్నం గట్టిగా చేస్తాం. అట్లా గుర్తించనీయకుండా, నిరాకరింప చేసే ప్రయత్నాన్ని ఈ అణచివేత సమాజం మళ్లీ మళ్లీ కొనసాగిస్తుంటుంది ఈ అవ్యక్తమైన, అర్థంకాని 'స్వేచ్భాకాంక్షను చంపేసుకున్నపుడే మనుషులు బాధ్యతాయుతంగా వుంటారనీ, అలా కానప్పుడు ఆ లోపలి ఆపుకోలేని కోరికల్ని బైటికి రానిస్తే అరాచకం, బాధ్యతా రాహిత్యం ఐపోతుందంటారు. మన లోపలి వూహలూ, ఆకాంక్షలంటేనే మనం భయపడేలా చేస్తారు. చలాన్ని కూడా యిట్లా అరాచకత్వానికీ, బాధ్యతా రాహిత్యానికీ అంటగబ్టే ప్రయత్నాలు చాలా జరిగాయి. దానికి చలం బైటి ప్రపంచంలో ఏ ఆధారాన్నీ పట్టుకోటానికి నిరాకరించటం ఒక కారణం కావచ్చు. ఆయన జీవిత పోరాటాన్ని సాగించి

ఇ

నన్నాళ్లూ దేనికీ కండిషన్‌ కాకుండా ఆధార రహితంగా వుండే ప్రయత్నం చేశాడు. ప్రతి ఆధారాన్నీ ప్రశ్నించి, నిరాకరించి వదిలివేశాడు. దేవుడు, బ్రహ్మ సమాజం, నిరీశ్వరవాదం, నాస్తికత్వం, జాతీయోద్యమం, కమ్యూనిజం అన్ని ఆధారాలనూ పరీక్షించి చూశాడు. కొన్నింటి లోపలి దాకా వెళ్తే మరి కొన్నింటిని పైన చూసే తెలుసుకున్నాడు. వీటిలో ఏ ఒక్క ఆధారాన్ని చలం పట్టుకున్నా, ఏ ఒక్క ఆధారానికి కట్టుబడి వున్నా చలం మనకు తేలికగా అర్థమయ్యేవాడు. దేనినైనా సరే ఒక ఆధారాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటే అంత కమిటెడ్‌, ఆంత గొప్ప ఆదర్శవంతం అనుకుంటుంది లోకం. నిజానికి అది చాలా తేలిక - ఏదో ఒక విశ్వాసానికి కట్టుబడి వుండటం సులువు. మతానికైనా, విప్ల్ణవానికైనా, పొతివ్రత్యానికైనా - కానీ దేన్నీ ఆధారం చేనుకోక తన స్వంతంగా బయలుదేరటం చాలా సాహసం. గొప్ప ధైర్యం కావాలి దానికి చలం అలాంటి సాహసంతో చేశాడు జీవనయానం. ప్రశ్నలను అడుగుతూ అణచివేతలను గుర్తిస్తూ వెళ్లాడు. అన్ని అణచివేతలలోకీ ప్రాథమికమైనది, మిగిలిన అణచివేతలకు ఆధారమై బలాన్నిచ్చి కొనసాగించేది స్రీలమీద అణచివేతగా గుర్తించి దానికి తన రచనల్లో ఎక్కువ న్థానం యిచ్చాడు. ఆంతటితో ఆగక స్రీ పురుషులను తమమీద తాము స్వయంగా విధించు కుంటున్న అణచివేతల నుండి వైటపడమని కోరాడు. ఇది చాలామందికి అర్థం కాలేదు. ఇది మాత్రమ అర్ధమైన వారికి బైటి ప్రపంచం గురించీ, స్త్రీల గురించీ ఆయన చెప్పినవి అంత అవసరం లేనివిగా కనిపించాయి. ఈ రెంటినీ సమతుల్యం చేసుకోగలిగితేనే మనం చలాన్ని అర్ధం చేసుకో గలుగుతాం,

చలంలో గందరగోళం వుందంటారు కొందరు విమర్శకులు. మన లోపల బలంగా కలిగే అనుభూతులలో అనివార్యంగా ఒక గందరగోళం వుంటుంది. అవి 2 ౫ 2 = 4 అన్నట్ట్లుండవు. కానీ ఆ గందరగోళాన్ని ఈ సమాజం అనుమతించదు. దానికి విలువనివ్వదు. మనలోపలి ఆకాంక్షా లాలసత్వం, మనం అనే గుర్తింపుకూ స్పృహకూ, మన లోపల బలంగా

ఇష

కలిగే అనుభూతుల గందరగోళానికి మధ్య వున్న ఒక రేఖ. ఆ రేఖకు అటూ యిటూ సంచరించగల నేర్చును, అధికారాన్నీ సంపాదిస్తే, ఆ సంచారంలోని ఆనందాన్ని అనుభవిస్తే, ఆ తృప్తిని పొందితే జీవితం నుంచి మనం ఎంతైనా పొందవచ్చని తెలుసుకోగలుగుతాం. ఆ తెలివిడే స్వేచ్చ = మన లోపల కలిగే గందరగోళాన్ని పరిచయం చేసి, దాన్నించి ఈ స్వేచ్చకు ప్రయాణం చేయమనే చలం తన జీవితంలోనూ, సాహిత్యంలోనూ చెప్పాడు. అట్లాగే స్వేచ్చ 'దేనినుండి?" అనే ప్రశ్న ఎంత ముఖ్యమో 'దేనికి? అనే ప్రశ్న కూడా అంతే ముఖ్యమనేది తన రచనలన్నింటిలోనూ వివరించాడు.

మనం జీవితంలో ఎన్నో పనులు చేస్తుంటాం. ఏం పనులు చేస్తున్నా మన్నది ఎంత ముఖ్యమో అవి చేయటంలో ఎంత సూక్ష్మంగా, సున్నితంగా, సంపూర్ణంగా అనుభూతి చెందుతున్నామనేది అంతకంటే ముఖ్యం. ఏ సమాజంలోనైనా వున్న దారుణం, భయంకరత్వం యేమిటంటే మనుషులు చేసే పనులనూ, సాధించే విజయాలనూ మానవ అవసరాల దృష్ట్యా కాకుండా లాభాల దృష్ట్యా నిర్వచించుకోవటం. మళ్లీ మానవ అవసరాలంటే కేవలం భౌతికమైన అవసరాలనే దృష్టిలో పెట్టుకుని ఆ అవసరాల్లోని మానసికమైన, ఉద్రేక వుల్లాసాలతో కూడిన భాగాలను నిర్లక్ష్యం చేయకూడదు. కానీ యిప్పుడు అట్టాగే జరుగుతోంది. ఇట్లా జరిగినప్పుడు మనం చేసే పనుల్లోని ఒక సున్నితమైన విలువ పోతుంది. జీవనశక్రే, పరిపూర్ణతే లోపిస్తుంది. పనంటే మనకోనం మనవాళ్లకోనం తిండి సంపాదించే ఒక బాధ్యతగానే మిగిలి పోతుంది. అది మనలోని స్వేచ్భాకాంక్షను రూపుమాపుతుంది. ఈ రకంగా పనులను మొనాటనస్‌గా, రొటీన్‌గా నీరనంగా చేయటాన్సీ, అట్లా చేసి సాధించే లాభాలనూ ద్వేషించి, పనులను ఆనందంగా, ఉత్సాహంగా, ఆర్టిస్టిక్‌గా చేయాలనే డ్రేరణనిన్తుంది చలం సాహిత్యం. ఆ పనులు ఉద్యోగాలైనా, కళలైనా, విప్ణవమైనా.

స్వేచ్భతో దగ్గరి సంబంధం వున్న మరో భావం ఆనందం. ఆనందం పొాందటమంటే అదేదో నేరం చేసినట్లుగా భావించే వాతావరణం ఒకటి

ఇట్ల

సమాజంలో వుంది. అసలు నున శరీరాలతో, మనసులతో ఎంత ఆనందం పొందగలమో మనకు తెలియదు. తెలుసుకోవాలంటే భయం. దాన్ని బైట పెట్టాలంటే మరింత భయం. ఆ భయాన్ని తీసేసుకోమని చెప్పి, మన మనశ్శరీరాల ద్వారా మనం పొందగల ఆనందాన్ని మొట్టమొదట గుర్తించి చెప్పిన ఆధునిక తెలుగు రచయిత చలం. మనం పొందగల ఆనందాన్ని గురించిన జ్ఞానం మనకెంతో శక్తినిస్తుంది. మనమీద మనకు అధికారాన్ని యిస్తుంది. ఆ శక్తి, అధికారాల అర్థాన్ని మన జీవితాల్లో నిజాయితీతో పోల్చి చూసుకోమని బలవంతపెడుతుంది. ఇది నిజంగా చాలా పెద్ద బాధ్యత. అది మనమీద మనం విధించుకునే, కల్పించుకునే బాధ్యత. భద్ర జీవితంలో, సౌఖ్యపు నీడలో, సంప్రదాయబద్ధమైన జీవితాన్ని క్షేమంగా గడపటానికి మనల్ని అనుమతించదు, “బెను - ఇది నాకు బాగుంది. ఆనందాన్నిస్తుంది. ఈ పని చేస్తాను. ఈ పని చేయాలనే ఆపుకోలేని కాంక్ష పుట్టుకొస్తోంది” అని చెప్పటానికి మనకేదో బిడియం. అది మన ఆనందం కోసం కాక బాధ్యతతో, త్యాగం పేరుతో చేస్తున్నామని, అట్లా చేయటానికి అలవాటుపడి ఆ పనిలోని అనందాన్ని చంపేసుకుంటాం. స్వేచ్చకు, బాధ్యతకూ, ఆనందానికీ, త్యాగానికీ వున్న దగ్గరి సంబంధాన్ని తీసేసి వాటిని ఒకదానికొకటి వ్యతిరేక భావంలో. విరుద్ధ విషయాలుగా నిలబెట్టటం మనకు బాగా అలవాటైపోయింది. దొన్నించి చలం బైటపడ్డాడు. చలం ఆ రోజుల్లో తన హృదయపు పిలుపుల్ని నిర్భయంగా విని అంతే నిర్భ్వయంగా వాటిని లోకానికి చాటి మనందర్నీ కూడా మన హృదయపు పిలుపుల్ని గురించి పట్టించుకోమనీ, వినమనీ భయపడవద్దనీ చెప్పాడు. అంత గాఢమైన కోరికల పిలుపుల్నీ మనం లక్ష్య పెట్టినపుడు ఆచరణలోకి దిగకుండా వుండటం అసాధ్యం. అందుకే తన అవసరాలకూ, ఆచరణకూ, కోరికలకూ, జ్ఞానానికీ ఒక సమతూక్రప్పు సంబంధాన్ని కల్పించుకోవాలనే ప్రయత్నంలో నలిగిపోయాడు. స్వేచ్భ గురించిన నిరంతరాన్వేషణ చేస్తూనే వెళ్లిపోయాడు. అది మనం చలం నుంచి నేర్చుకోవాలి.

ష్‌

ఇప్పటి మన సమాజంలో, ఆలోచనల్లో ఒక పెద్ద మూర్ధపు లోపం యేర్చడి స్థిరపడింది. అదేమిటంటే మన ఆత్మీయమైన అవసరాలూ, మానసిక మైన కలలూ, వూహలూ, కోరికలూ - వీటికీ, రాజకీయాలకూ ఏమీ సంబంధం లేదనుకుంటున్నాం. రెండూ వేరు వేరు విషయాలనుకుంటున్నాం. ఈ ఆత్మసంబంధమైన విషయాలూ, (54060178 1861005, 501144 ౧66౮9) రాజకీయాలూ వేరువేరనుకుని ఆ రెంటినీ వేరుచేసి చూడటం, అవి ఒకదానికొకటి విరుద్ధం అనుకోవటం అలవాటై దాంట్లోనే కూరుకుపోయాం. అందుకే చలం గొప్ప భావుకుడైన విష్లవకారుడంటే, భావుకుడైన మేధావి ఆంటే చాలామందికి అర్ధం కాదు. ఆత్మీకమైన అవసరాలంటే, శాంతి అంటే, ఆత్మశోధన అంటే, మన గురించి మనం లోపలికి చూసుకోవటమంటే మనకు మతంతో మాత్రమే ప్రమేయం వున్న ఆధ్యాత్మికత అనే అర్ధం స్థిరపడి పోయింది. దాన్నించి మనం బైటికి రావడానికి నిరాకరిస్తాం. కల్పించుకున్న అర్థాలను ధిక్కరించి టైటపడటమే స్వేచ్చ చలం అట్లా ధిక్కరించి బైటపడే అవసరాన్ని గుర్తుచేశాడు. రాజకీయాలకూ, ఆత్మీయమైన అవసరాలకూ మధ్య వున్న విభజన చాలా కృత్రిమంగా జరిగింది. మన లోపలి అవసరాల్ని గుర్తించక వాటిపై శ్రద్ధ పెట్టకపోనటం వల్ల జరిగింది. చలం చాలాసార్లు “నేనిది మంచిదనుకుంటున్నాను, నాకిపుడిది మంచిదనిపిస్తుంది” అని అనేక విషయాల గురించి అంటే” ఆది మనకు వైరుధ్యంలా కనిపిస్తుంది. కానీ నిజమైన జ్ఞానసాధనలో బలం అక్కడినుంచే వన్తుంది. దేన్ని గురించి అవగాహన కావాలన్నా ఆ అనుభూతి, విశ్వాసం, ఆ సంశయం యివే మొదట దారిచూపే శక్తిగల కాంతి అన్నమాట. మన లోపలెక్కడో దాగివున్న జ్ఞానాన్ని పోషించేది, పెంచేదీ ఈ స్వేచ్చా ప్రియకత్వమే.

చలం చెప్పిన మరొక ముఖ్యమైన విషయం మనం బైటి ప్రపంచపు పిలుపులను లోపలకు తీసుకోవటమే కాక మన లోపలి పిలుపులతో బైటి ప్రపంచంతో సంబంధం పెట్టుకోవాలి. ఆ పీలుపులతో, మనం చేసే పనులతో, ఆలోచనల్లో ప్రపంచాన్ని వెలిగించాలని చూసినపుడు మనం బాధ్యతాయుత

జ మైన 'స్వేచ్చతో వున్నట్టు. బైటి అణచివేతకు వ్యతిరేకంగా మనం చేసే చర్యలు మన ఆత్మలతో మమేకమై మన లోపల్నించి పుట్టుకొచ్చి, అంత అనివార్యంగా అధికారాన్సీ శక్తినీ సంపాదించుకునేవి కావాలి, అ ప్రయత్నం గురించి రాజకీయాలకూ, జీవితానికీ అన్వయించి సాహిత్య రూపంలో మొదట చెప్పినవాడు చలం. అట్లాంటి లోపలి శక్తి, లోపలి యుద్ధం, యిది వున్నపుడు అసలైన నిజమైన మార్పు ఈ ప్రపంచంలో తేగలుగుతాం. అది బేనంతకాలం ఈ' తిరుగుబాట్టూ, పోరాటాలూ, విష్ణవాల్తూ వందల సంవత్సరాల నుంచీ జరుగు తున్న పౌరాణిక నాటకాల్లానే వుంటాయి. పాత్రలు మాత్రమే మారుతుంటాయి. ఒక అధికారం పోయి మరో అధికారం, ఒక ఆధిపత్యం పోయి మరో ఆధిపత్యం, ఒక బానిసత్వం పోయి మరో బానిసత్వం. ఇది తప్పదు. స్వేచ్చ అనేది దొరకదు, ఇంకా చలం ఎన్నో ప్రశ్నల్ని రేపాడు. మన ప్రయాణం ఎటు అని, ఒకే గాడిలో మూసలో పడి కొట్టుకుపోతున్న మనల్ని ఒక క్షణం ఆపి ఆలోచనలో పడేశాడు. అసలు మనం దేనికి విలువ యిస్తున్నాం? ఏది యిపుడు జ్ఞానంగా చలామణీ బెతోంది? ఏ సంస్కృతికి, ఏ తెల్ల చొక్కాలకు మనం విలువ యిస్తున్నాం? మనం తెల్ల చొక్కాలు వేసుకోవాలనే ఆరాటంలో పడాలా? తెల్లచొక్కాలకున్న విలువను నిర్మూలించాలా? శరీర శ్రమతో పనిలేని మెదడు యిచ్చే జ్ఞానాన్నీ యాంత్రిక పురోగతినీ చూస్‌ అదే ఆసలు విలువ, గౌరవం, హోదా అనుకుని నాటినెంట పరుగులు తీస్తున్నామా? నాటిని పూర్తిగా నిరొకరించటం కొక వాటిని అందుకోవటంలో పందెం వేసుకుని మన ప్రయాణారంభాన్నీ, గమ్యాన్నీ మర్చిపోయి వికృతపరుచుకోవాలా? ఈ ప్రశ్నల గురించి ఆలోచించమంటాడు చలం దళితులనూ, స్రీలనూ - ప్రకృతితో సహజీవనం ఎట్లా? తోటి మనుషులతో సహజీవనం ఎట్లా? మానవ సంబంధాలలో శాంతి ఎట్లా కుదురుతుంది? మన ప్రత్యేకతల్సీ, శర్తుల్నీ మనం గుర్తిస్తూ మన పరిమితుల్ని అర్థం చేసుకుంటూ యితరులకు

4!

చోటూ, గౌరవం, (ప్రేమా యివ్వటం ఎట్లా? వ్యక్తికీ సమూహానికీ మధ్య వున్న సంబంధంలోని వ్యతిరేక భావాన్ని పోగొట్టి, వ్యక్తి సమూహంలో భాగమనీ, సమూహం వ్యక్తి కోనం వుందనే స్పృహ కలిగించటం ఎట్లా?

ఇవన్నీ చలం అడిగిన ప్రశ్నలే కాదు - స్రీ వాదులుగా మేం అడుగుతున్న ప్రశ్నలు కూడా - స్రీ వాదులంటే పురుష ద్వేషులనీ - యింకా ఏదేదో అని అనుకుంటున్న వాళ్లకు సమాధానం చెప్పటం నుంచి మేం చాలా ముందుకి వెళ్లాం. చలాన్ని అర్ధం చేసుకోవటం ఎంత కష్టమో, ఎంత వక్రీకరించే అవకాశం వుందో, స్రీవాదాన్ని అర్థం చేసుకోవటం అంతే కష్టం. దాన్ని వక్రీకరించటానికీ అంతే అవకాశం వుంది. మేం మా స్రీవాదపు విశ్లేషణలో చేస్తున్న ప్రయాణంలో పై ప్రశ్నలు మమ్మల్ని మళ్లీ మళ్లీ కలవర పెట్టాయి. సమాధానాలు వెదకమని వెన్నుతట్టాయి. ఈ ప్రశ్నలు యివాళ బీజ రూపంలోనే వుండొచ్చు. సరిగా అర్థం కాకపోవచ్చు. కొత్త ప్రశ్నలు చేరవచ్చు.

కానీ పాత ప్రశ్నలతో, పాత సమాధానాలతో నంతృప్తిపడి అందర్నీ దబాయించి బతకగల రోజులకు కాలం చెల్లింది. కొత్త ప్రశ్నల్నీ కొత్త అన్వేషణల్నీ మొదలుపెట్టక తప్పనిస్థితి వచ్చింది.

ఆ కాలంలోనే ఆ సందర్భంలోనే చలం శతజయంతి రావటం యాదృచ్చికం కావచ్చేమోగానీ, మేం యిలా దానికౌక అర్భాన్సీ సందర్భాన్నీ కల్పించాలనుకోవటం మాత్రం యాదృచ్చికం కాదు.

చలం ఈ అన్వేషణకు ఆద్యుడు. సంతృప్తిపరచని సమాధానాలతో రాజీపడవద్దని జీవితమంతా చెప్పిన గొప్ప మేధావి.

ఓలా 1995

211 చలం గారి 101వ పుట్టినరోజు (బుద్దపూర్ణిమ చంద్రోదయ సమయాన 14-5-95 నా॥ ఆరు గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లిలో మనందరం కలిసి జరుపుకుందాం రండి! శతజయంతి ముగింవు నందర్హంలో మీ అందరితో తమ ఆలోచగలు వంచుకునేవారు శశిరేఖ అరుఐ, తఆలనీ, రాజేశ్వరి, దధ్గెకతి సుందరక్కు మ్‌రు తప్పక రావలసిందిగా కోరుతున్ల్నవారు “మూరేళ్ల చలం” (శత జయంతి కమిటి ఓల్గా కసంతలక్ష్మి ఐంధ్య హేకూ పరిబు, ఆదిలక్ష్మి కసంత కన్నభరాన్‌, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, నా.

ఈ నాటకం గురించి ...

చలం గారి శతజయంతి ముగింపు నభ రొటీన్‌గా, ఉపన్యాసాలతో జరగకుండా కొత్తగా ఏదైనా చేద్దాం అనుకున్నాం. ఆలోచించగా, ఆలోచించగా ఒక “నాటకం వేద్దామనిపించింది. చలం నవలా నాయికలలో వ్రధానమైన ఆరుగురినీ రంగస్థలంపై సజీవం చేసి వాళ్లమధ్య సంభాషణ నడిపిస్తే ఎలా వుంటుందా అని యోచించాం. వాళ్లు ఒకరి గురించి ఒకరు తెలుసుకునే క్రమంలో తమ గురించి ప్రేక్షకులకు తెలియజేస్తారనిపించింది. దానివల్ల మేం చెప్పదల్పింది యింకా బలంగా, సూటిగా చలం మాటల్లోనే చెప్పే అవకాశం వస్తుందనిపించింది.

చలం నవలల్లోని స్త్రీ పాత్రలు, తమచుట్టూ సమాజం కల్పించిన అవరోధాల్ని, విధించిన పరిమితుల్ని అధిగమించి (చివరికి ఎంత ట్రాజిక్‌గా అయినా సరే) సంఘర్షించిన సజీవమూర్తులుగా మన హృదయాల్లో నిలిచి పోతారు. ఆయన మాసవుత్రికలంతా ఒకవైపు తమ ఒంటరి పోరాటాల గాథలతో మన మనసుల్ని ఎంతో నున్నితంగా తాకుతూనే, మరోవైప్తు మన మేధకు పదునుపెట్టే సవాళ్లను విసిరి పోయారు.

చలం శతజయంతి సందర్భంగా సంవత్సరంపాటు ఆయన జీవితాన్ని, రచనల్ని, ఇవాళ స్ర్రీవాద చైతన్యం అందిస్తూన్న పరికరాల తోడ్పాటుతో పునః పరిశీలించినప్పుడు, మా దృష్టి రచయిత నుండి రచనల వైపు, ముఖ్యంగా నవలల్లోని స్త్రీ పొత్రలవైపు, వాళ్లు చేసిన సంఘర్షణల నుండి లేవనెత్తిన ప్రశ్నల వేపు, ఇవాళ ఆ ప్రశ్నలకున్న సమకాలీనత వైపు మరలడం అనేది సహజక్రమంగా జరిగింది.

అయితే చలం సృష్టించిన ఆరు స్త్రీ పాత్రలు (సుందరమ్మ, శశరేఖ, పద్మావతి, రాజేశ్వరి, అరుణ, లాలస) ఒకేచోట తారసపడి తమ జీవితాను భవాలనూ, అన్వేషణలనూ ఒకరితో ఒకరు పంచుకోవడం అంటూ జరిగితే ఆ ఉద్వేగభరిత సందర్భం మనకు కొత్త పాఠాలను మిగిల్చి పోగలదు; తాము చేసినవి ఒంటరి పోరాటాలు కావనీ, లేవనెత్తిన ప్రశ్నలు ఈనాటికీ మౌలికమైనవే అనీ వారంతా గుర్తించినపుడు పాఠకుల హృదయాల్లో వారు దిగవిడిచిన విషాదానికి చారిత్రకమైన ఓదార్చు లభిస్తుంది; ఇవాళ్టి యువతరం చేస్తున్న పోరాటాల్లో, అవి రాజేస్తున్న చైతన్యంలో చలం మానసపుత్రికలు భాగస్వాములై

77 పోతారు. ఇదీ “వాళ్లు ఆరుగురూ” అనే ప్రయోగాత్మక నాటిక చేయబూనిన సాహస ప్రయత్నం,

ఈ నాటికలో చలం తన జీవితకాలంలో చేసిన అన్వేషణ, అక్షరాల్లోకి కుదించిన వ్యధ, ఎంతో వాత్సల్యంతో తీర్చిదిద్దిన స్రీ పాత్రలు, పుస్తక ప్రపంచాన్ని అధిగమించి. సమకాలీన వాస్తవ ప్రపంచంలో ఉద్యమరూపం ధరిస్తాయి. విషాదం ఆశగానూ వ్యక్తిగతానుభవం సమిష్టి స్ఫూర్తిగానూ మారగల పరిస్థితులు ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్నాయి చలం భవిష్యవాణి నుమారు అర్థ శతాబ్దం తరవాతైనా అది ఎవరికైతే ఉద్దేశించబడిందో వాళ్లని ఉవ్వెత్తున సమీపిస్తున్నది.

ఇక ఒకటే ఉత్సాహం... ఉద్రిక్తత - మాలో

ఎట్లా చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఎవరే పాత్ర వెయ్యాలి?

అందరికీ అన్ని పాత్రలూ చెయ్యాలని వుంది కానీ పరిమితులు” చాలనికాలం - సరిపడాలేని శక్తులు - ఇది కొంత అర్ధవయ్య్యి, కాకా గందరగోళపడి మొత్తానికి ఒక ప్రయోగానికి సిద్ధపడిపోయాం.

నాటకరంగం యివాళ్ళికీ పురుషుల చేతుల్లోనే వృంది. స్త్రీ పాత్రలు లేని నాటకాలే ఎక్కువగా రాసుకునే స్థితీ ఒకటో రెండో స్త్రీ పాత్రలుంటే వాటికోసం చాలా కష్టాలు పడాల్సిన స్థితీ వుంది స్రీ పాత్రల్ని పోషించడానికి, గతంలో సభ్య సమాజ ప్రాంగణానికి ఆవలగా ఉండే ప్రీలే అక్కరకు వచ్చారు (ఇందుకు బెంగాలీ, మరారీ నాటక రంగాలు త్వరలోనే మినహాయింపు పొందడం గమనార్హం). స్రీ పాత్రల్ని పోషించిన ప్రతిభావంతులైన పురుష నటులు, వారిచుట్టు అల్లుకున్న కధలు ఆంధ్ర నాటకరంగ చరిత్రలో ఇవాళ విడదీయలేని భాగాలు. “స్రీపాత్రలు లేని" ఏకాంకిక నాటికలక్రై బెత్సాహికులు చేస్తూ వచ్చిన అన్వేషణ ఈనాటికీ కానసాగుతున్నది

ఈ నేవధ్యంలో పురుషులు లేని ఏకాంకి నాటిక “వాళ్లు ఆరుగురూ, ఆంధ్ర ప్రేక్షకుల ముందుకి రావడం అనేది నాటక కళా రంగంలో స్త్రీలు సాధించుకున్న చారిత్రక విజయం. అది చలం పాత్రలతో కూడుకొని ఉండడం యాదృచ్చికం కానేకాదు

రంగస్థలం గురించి, నటన గురించీ ఓనమాలు తెలియని మాకు - ఎవరి

జ

మాటా వినని, ఎవర్చీ లక్ష్యపెట్టని, ఎవర్నీ గురువులుగా, నాయకులుగా అంగీకరించని మాకు అఆలు దిద్దించబూనుకోవటం ఎవరికైనా అగ్నిపరీక్షే అక్కినేని కుటుంబరావు అ పని మొదలుపెట్టి మమ్మల్ని ఒక తాటి మీదకు తీసుకురావటంలో, మా పరిమితుల్ని మాచేత గుర్తింప జేయటంలో కత్తిమీద సాము చేశారు. నూ వ్యక్తిగత యిష్టాయిష్టాలకూ, రాగద్వేషాలకూ రంగస్థలం మీద చోటులేదని, అదొక పబ్లిక్‌ రెస్పాన్సిబిలిటీ అనీ, టీమ్‌వర్క్‌ వుండాలనీ చెప్పారు అవసరమైనప్పుడు మందలించి, కోప్పడి ఒక దారికి తెచ్చారు మానుంచి చాలా బాధపడ్డారు. ఆయనకి సహకరిస్తూ, నాగమల్లేశ్వరరావు కూడా ఈ బాధలో పాలుపంచుకున్నారు. ఈ నాటక ప్రయత్నంలో భాగమయ్యాడు.

ఇక చివరి రెండు రోజులూ, వసంత కన్నభిరాన్‌ మాతో పొటు నాటకంలో భాగమయ్యారు మా శరీరాన్ని గురించీ, దాన్ని తేలికగా కదిలించటం గురించి, ఇన్‌హిబిషన్స్‌ లేకుండా వుండటం గురించి చెప్పి అవనరమైన ఎక్సర్‌సైజులు చేయించారు. రంగస్థల ధర్మాలు చెప్పి, అక్కడ ఏదీ వాస్తవం కాదనీ, మనం నటించాలనీ, నటించకపోతే నీరసమవుతుందనీ చెప్పారు. రంగస్థలం మీద ఒకర్నొకరు తోసుకోకుండా ఎలా కదలాలో చెప్పారు.

చివరికి ఆరోజు రానే వచ్చింది మా ప్రయోగం మేం అనుకున్న దానికంటే విజయవంతమయింది

చలం గారి శతజయంతి సందర్భంగా అందరం స్తీలమే నటించిన ఈ నాటకం ఆయనకు మంచి నివాళి అని మేం సంతోషించాం

నాటకం చూసినవారంతా మమ్మల్ని అభినందనలతో ముంచెత్తారు. ఈ నాటకం మళ్లీ మళ్లీ వెయ్యాలన్నారు. ముందు పుస్తకరూపంలో ప్రచురించ మన్నారు.

ఆ అభినందనలే ఈ పుస్తక ముద్రణకు మమ్మల్ని ఉత్సాహసరిచాయి.

  1. నా = “నూరేళ్ల చలం

౫! ఈ నాటకం మొదట (14-5-95న ౫ ప్రదర్శించినపుడు ఆయా పాత్రలలో . . నటించినవారు :; శశిరేఖ _... నేకున కసంతలక్ష్మి రాజేశ్వరి కొండేపూడి నిర్మల పద్గెనచి .. వొడ్రేప్రు ఏఠలక్షీదేఐ అరకు _.. కృుజాళిని లలన ౨ పౌకూ పరిమి _ ' సుందరక్న ఓట్ల ఈతరం ప్పిలు .. ఐంధ్య శాం౭ప్రుయ, రాధిరాతి, . ఛాయశ్తీ, పూరీ సుమిత్తు ఉష ఇంకా సెంట్రల్‌ యూనికర్సిటీ

వాళ్లు ఆరుగురూ!

(అరుణ పాడుతూ వస్తుంది) రూప్‌ నగర్‌ మే దిల్‌ ముసాఫిర్‌ గ్రేమ సౌదా కరిలే .. (అరుణ పాడుతోండగా శశిరేఖ ప్రవేశం).

శశిరేఖ = ఎంత మంచిపాట! ఢ్రేమ సౌదా కరిలే - నా జీవితమంతా అదేగా చేశాను.

అరుణ : నువ్వు శశిరేఖవా?

శశిరేఖ 2 బెను! ఈ పాట పాడేది అరుణ. నువ్వు అరుణవే కదూ,

అరుణ . బెను అరుణనే - కానీ శశిరేఖా - ఈ (గ్రేమాన్వేషణలో నీకేమన్నా ఆనందం దొరికిందంటావా?

శశిరేఖ - నీకు తెలియదా? ప్రతిసారీ ఎంత అనందమో అంత బాధ. కృష్ణుని మీద గ్రేమను మర్చిపోయి. సుందరరావు మీద మహోధృతంగా నాలోంచి పొంగిన గ్రుమను గుర్తించి అ ప్రేమనందుకోవటంలో ఎంత నలిగాను! నా హృదయం ఎలా బద్దలైంది అ సుందరరావు మీద గ్రేమ క్రమంగా క్రమంగా నశిస్తే ఆ (ప్రేమ రాహిత్యంలో బతకటం ఎంత కష్టమయింది! (రాజేశ్వరి ప్రవేశిస్తుంది) రామారావుకి నా ఢ్రేమ నందిద్దామంటే అతను “పెళ్లి అంటాడు. (నవ్వుతుంది) పెళ్లి ఎందుకు? (నవ్వులు)

రాజేశ్వరి " మరి పెల్లి చేసుకోకపోతే (ప్రేమకోసం - పోనీ కామం కోసం

2

  • లేచిపోవటం ఎట్లా కుదురుతుంది? (గట్టిగా నవ్వుతుంది). (ముగ్గురూ నవ్వుతారు)

అరుణ బాల వితంతువులు లేకపోతే వితంతు వివాహాలు కుదరనట్టా

  • నువ్వు రాజేశ్వరివి కదూ... (పద్మావతి వస్తోంది)

రాజేశ్వరి. :; జను - పెళ్లిలోని నీచత్వం, (ప్రేమలోని అమరత్వం రెండూ చూసినదాన్ని.

పద్మావతి : నేను పెళ్లిలో భద్రత వుంటుందనుకున్నా, ఢ్రేమ తత్వాన్నీ, సారాన్నీ సంపూర్ణంగా అర్థం చేసుకున్నదాన్ని!

శశిరేఖ “ పద్మావతీ - నేను - శశిరేఖను.

అరుణ ఏ ఇవాళ యిక్కడ అనుకోకుండా అందరం ఒకచోట చేరాం. ఏమిటిది - ఎందుకిట్టా వచ్చాం? (లాలన వస్తుంది)

లాలస * ఎందుకేమిటి? వినిపించటంలేదూ ఏడాది నుంచీ ఆంధ్రదేశ మంతా మన పేర్లతో హోరెత్తిపోతుంటే. మనల్ని తిట్టేవారు - మనల్ని గౌరవించేవారు - వారి వాదాలు, చర్చలూ, మనల్ని చీల్చి, చెండాడి - మనం పలికిన మాటల్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి, వాటికేవో అర్థాలు కల్పించి, మనం తప్పులు చేశామనీ, మనకు గమ్యం లేదనీ ఒకపక్కా మనం తిరుగుబాటుదారులమనీ, స్రీ లోకపు ఆశయాలా, ఆకాంక్షల ప్రతినిధులమనీ మరోపక్కా - ఇదంతా మీరేమీ విన్నేలేదా?

రాజేశ్వరి : ఎందుకు వినలేదు - ఆవి ఇవాళ కొత్తా. మనం పుట్టినప్పటి నుంచీ ఆ తిట్టు వింటూనే వున్నాంగా - నన్నేమంటారు వాళ్లు - లేచిపోయినానని - లేచిపోయానట. (నవ్వుతుంది)

ర!

అరుణ ; నేను నలుగురు మగాళ్లతో ఒకేసారి (నవ్వుతుంది) మగాళ్లని గురించి, నా అభిప్రాయం ఎంత స్పష్టంగా చెప్పినా సరే - పందులని తిట్టినా సరే - మగాళ్ల కోసమే నేను జాతీయోద్య మంలోకి వెళ్లానని అన్నారు. ఇంకా అట్టాగే అంటున్నారా? బైటికి వచ్చి సంఘపు పనుల్లో పాల్గొందామన్న స్త్రీల వెనక చొంగలు కార్చుకుంటూ తిరుగుతూ యింకా మనల్నే అంటున్నారా?

శశిరేఖ . ఇప్పటికైనా నా ప్రశ్నకు సమాధానం యిచ్చారా ఎవరైనా?

అరుణ *" ఏంటో ఆఅ ప్రశ్న

శశిరేఖ (పేమ వున్నచోట పెళ్లి ఎందుకు?

అరుణ ; ఈ ప్రశ్న వాళ్లకు అర్ధం కావాలంటే మరో వంద సంవత్సరాలు పడుతుంది.

రాజేశ్వరి ఇంకా హడలి చస్తూనే వున్నారు నీ ప్రశ్నకు.

పద్మావతి : కానీ శశిరేఖా - గ్రేమ మారుతుందనీ, గ్రేమలేని తర్వాత యిక ఆ సంబంధంలో వుండటం నీచమని అన్నావు. అది నిజమేనా? నా ఢ్రేమ మారలేదు రాధాకృష్ణ మీంచి. నీ అనుభవం గురించి చెప్పవా?

శన్తిరేఖ * చెప్తాను. కానీ నమ్ముతారా? ఎదుటి వ్యక్తీ పలికే మాటలకు విలువ యిచ్చి, వాళ్ల అనుభవాలను గౌరవించి అ మాటలను విశ్వసించే వాళ్లున్నారా? (అందరూ శశిరేఖ దగ్గరగా వస్తారు.)

లాలన - శశీ - మేం నీ తోటి స్రీలం. నీలాగే అనుభవాల కొలిమిలో కాలిన వాళ్లం. అనుభవాల ఆనందామృతాన్ని తాగిన వాళ్లం.

శ

మనుషుల మీద విశ్వాసాన్ని తప్ప మరో ఆధారాన్ని దేన్నీ పట్టుకోటానికి నిరాకరించిన వాళ్లం. మనందరం అంతే శశీ

  • ఈరోజిక్కడ - మనం మనసులు విప్పి మాట్లాడుకుందాం ఈ మాటల ద్వారానైనా అర్థం చేయిద్దాం.

రాజేశ్వరి అర్ధం చేసుకుంటారా? నాకు నమ్మకం లేదు. వీళ్లకి - మన లాంటి స్రీలు వున్నారా అని సంశయం. వుంటారేమో అని భయం. వుండకూడదని శాసనం మనమంతా ఎవరో ఒక మతిలేనివాడు కల్పించిన వూహాచిత్రాలమంటారు. మీరు నిజంగా వున్నారా - మీలాంటి వాళ్లు యిప్పుడు వున్నారా అని అడుగుతారు.

అరుణ ఎందుకు లేరు? ఉన్నారు వాళ్ల చుట్టు ప్రతి యింట్లో, వీధిలో వున్నారు. చూసే దృష్టి లేదు వీళ్లకు. ఒకవేళ పొరపాటున మనవంటి స్త్రీలు వీళ్ల కళ్లపడ్డారా - ఆ స్రీలకు గాయాలు చేస్తారు. వాళ్ల సౌందర్యాన్ని నాశనం చేస్తారు. ఆ స్త్రీల హృదయ సౌకుమార్యాన్ని ఈ ప్రపంచం తన కాళ్లకింద వేసి తొక్కివేస్తుంది. భరించలేరు మనలాంటి వాళ్లను దగ్గరగా

  • అందుకని అసలు మనం లేనే లేమని నిశ్చింతగా నిద్ర పోతారు

లాలన : మెదడుకి పక్షవాతం వచ్చిన ముసలి మోడులు అన్ని శక్తులూ వుడిగిన జీవచ్చవాలు,.

పద్మావతి :; ఉండండి. శశిరేఖను చెప్పనివ్వండి.

శశిరేఖ ప్రేమించడమనేది సహజమైన కోర్కె. నా హృదయపు లోతు ల్నించి వచ్చిన కోరిక - సౌందర్య డ్రేమికురాలిని నేను అందం కోసం ఏమన్నా యిచ్చేస్తాను. ఈ లోకంలో వున్న

వె

అందమైన మనుషులందర్తో స్నేహం చెయ్యాలని వుంటుంది కృష్ణుడి సౌందర్యాన్నీ, నుందగర్రావు గొన మాధుర్యాన్సీ, రామారావులోని సత్యాన్నీ (డ్రేమించాను. ఇవన్నీ సుందర మైనవే - వీటిని ప్రేమంచటం నేరమా? చెప్పు! స్వార్ధమా! చెప్పండి. ఆది నీచం, స్వార్థం అంటే మాత్రం నేను మార తానా? మారను.

అరుణ * కృష్ణుడి సొందర్యాన్ని డ్రేమించి తృప్తిపడితే యిన్ని బాధ లుండేవి కావేమో - ఆ సుందరరావుతో ఎందుకంత గాఢమైన బంధం పేంచుకున్నావు?

శశిరేఖ ; అతని సంగీతం - ఆ సంగీతం ఏం చెప్పందనుకున్నావూ....? ఈ లోకంలో సౌందర్యాన్ని మించింది లేదని, వెయ్యి నోళ్లతో చెప్తుంది. ధ్రేమించు, (ప్రేమించు, ఒక్క నిమిషానికైనా సరే నీ సర్వస్వాన్నీ శుమ హోమంలో దగ్ధం చెయ్యమంటుంది ఆ గానం. ఆ సంగీతం నాలో ఎక్కడో లోపల దాక్కొని వున్న కోర్కె లన్నిటినీ వైటికి తెచ్చింది. ఆ స్వరాల సౌందర్యం, ఆ వెన్నెల మెత్తదనం, మేఘాల తేలికదనం, ఆకాశపు నీలం, ఆ పచ్చిక లావణ్యం, ఆ చెట్ల నీడల నిశ్శబ్దం, ఆ పూల పరిమళం అన్నీ మోసుకొచ్చింది సుందగ్రావు పాట. ్రేమించకుండా వుండటం ఎట్లా సాధ్యం? ఈ సౌందర్యం కన్నా ఈ దేహ సౌఖ్యం కన్నా అధికమైనదీ, శాశ్వతమైనద్‌ ఏదో కావాలని నా నరనరాల్గోంచీ కోరిక వుప్పాంగుతుంటే ఎలా నిగ్రహించు కోను?

రాజేశ్వరి మరి అంత థ్రేమను అతనెలా నాశనం చేశాడు?

శశిరేఖ సుందర్రావు పాటంటే నాకంత ప్రేమా? నా భావుకత్వాన్ని

శ

చూస్తే అతనికి వెక్కిరింత, ప్రకృతిని చూసి నేను పులకరించి, పలవరిస్తే ఎందుకట్టా వాగుతావంటాడు. ఎట్లా నిలుపుకోనూ నా మీద గౌరవం లేనివాడి మీద థేమను? నన్నూ నా (ప్రేమనూ చవక చేశాడు. కృష్ణుణ్సి నా విటుడన్నాడు అతని కాలిగోరుకి సరిపోవు నువ్వంటే నన్ను కొట్టబోయినాడు. నన్ను

  • కొట్టటం - ఎట్టా (ప్రేమించగలను అతన్ని? (్రేమందే నా అర్ధమే వేరు నాది వాంఛ కాదు వాంఛ ఒక నిమిషంలో చల్లారే చిన్న వేడి (ప్రేమ జీవితాన్నంతా వెలిగించే సూర్య కాంతి (పేమ కోరింది నా దేహం కాదు. ఆత్మ - అది సుందర్రావుకీ ఈ లోకానికీ అర్థమే కాలేదు.

లాలస * మరి రామారావు? అతనేమంటాడు? నిన్నెట్లా అర్థం చేసు కున్నాడు? అసలు నీ ఉద్దేశమేమిటి?

శశిరేఖ నన్నెంతో ప్రేమించే కృష్ణుణ్ణి ఒదలటం, సుందర్రావు మీద (పేమ పోవటం, యివి నాకు బాధే - కాదనను. కానీ ఈ అనుభవాన్ని అసహ్యించుకోమంటాడు రామారావు. అదంలౌ తప్పు, పాపం అంటాడు. నాకెప్పుడూ అట్టా అన్పించదు. నా తప్పులన్నీ క్షమించి సపెళ్లాడుతాడట. నా మొదటి భర్త పోయాడు గాబట్టి అభ్యంతరం లేదట - రామారావే చెప్పాడు నా భర్త పోయాడని ఆ మాట వినగానే నాకంత నవ్వాచ్చిందో - నేనింకా అతని భార్యగానే వుంటే వెంటనే నన్ను వెధవముండని చేసేవాళ్లు జుట్టూ గిట్టూ గొరిగేవాళ్లు అప్పుడిక రామారావొచ్చి “నే పెళ్లి చేసుకుంటాలే జుట్టు పెంచుకో పాపం ఆఅనేవాడన్నమాట. ఎంత నవ్వో నాకు యిదంతా వూహించుకుంటే (నవ్వులు అందరూ).

ఖ్‌ పోనీ రామారావుని పెళ్లి చేసుకుందామా అని ఆలోచించా. కానీ అ పెళ్లయిన వాళ్లను చూస్తే వాళ్లలో జీవమన్సది కన్చించటం లేదు ఏదో పతివ్రతలంటారు - కానీ ఆ పతివ్రతలు పాపం ఒక్క పాతివ్రత్యమనే అసహజమైన గుణం కోసం ఎన్ని మంచి గుణాల్ని చంపేసుకున్నారో గదా - ధైర్యం: స్వేచ్చ, సత్యం, ధీరత్వం, ఉదారత్వం, లోకజ్ఞానం, విద్య, ఆరోగ్యం, చాతుర్యం అన్నీ పోయాయిగా స్త్రీలలో క్రేవలం బానిసలయ్యారు. నేను . నేనేం చేశాను? ప్రేమలేని పెళ్లి వద్దని వెళ్లిపోయాను. ప్రేమలేని సహజీవనం కూడా వద్దనుకుని వెళ్లిపోయాను. ప్రేమ సంబంధం ఎండి రసహీనమై భారమైన రోజున ఏదో నియమాలనీ, నంశయాలనీ, వాగ్షత్తాలనీ అట్లాగే పడి వుండటం మూర్థమన్నాను గ్రేుమ పోదని, కొత్త గ్రేమలు రావని వాదించేవాళ్లను చూస్తే నాకు జాలేస్తుంది, భయ మేస్తుంది జీవితాంతం ఒకళ్లనే గ్రుమించాలని శాసనాలు చేసేవాళ్లు మనుషుల జోలికి రాకుండా ఏ కొండనోో, కోననో ప్రేమించడం ఉత్తమం. “ఈ డ్రేమ క్షణభంగురం, ఈశ్వరుని ప్రేమే. శాశ్వతం' అని చెప్పేవాళ్లకు నాదెప్పాడూ ఒకటే సమాధానం - “అ గ్రుమకు జీవనము లేదు. అందుకనే శాశ్వతము జీవించే [ప్రేమ ఎవ్వుడూ పెరుగుతుంది మారుతుంది అందుకనే అశాశ్వతము చంచలము”. ప్రకృతిలో ప్రతీదీ మూరేటపుడు మానవ ప్రకృతిలో మార్చు రాకుండా ఉండడం ఎలా సాధ్యం? ప్రకృతిని, పువ్వుల్సి సంగీతాన్ని ఢ్రేమించిన నుందర్రావు నన్నింకా ఎక్కువ

8

'ప్రేమిస్తాడని ఆశించడమా నేను చేసిన పొరపాటు? అతనిలో నేను (్రేమించిన లక్షణాలు పోయాక అతనింకా నేను (ప్రేమించిన సుందర్రావు ఎలా అవుతాడు? అతడు మారాక మరి నా గ్రేుమ మారదా? అయినా ఆడదాన్ని ఏదో ఒకరకంగా ఒక మగాడికి కట్టి పడేయాలనే తాపత్రయం వీళ్లకెందుకు? అలా కట్టిపడేశాక, ఎవరో ఒకరితో శాశ్వతంగా బతకాలని శాసించాక గ్రేమ ఉంటుందా? డ్రేమనే స్వేచ్భా విహంగాన్ని పెళ్లి పంజరంలో బంధించాలని చూడడమే నా దృష్టిలో నీచం, ఘోరం (శ్రేమ ఉన్నపుడు పెళ్లి ఎందుకనేదే నా ప్రశ్న అది న్యాయమైన ప్రశ్న కాదా? రామారావుకు నా ప్రన్నే అర్ధం కాలేదు. ఇంక జవాబేం చెపుతాడు?

అరుణ వ నువ్వు టబ్రహ్మసమాజాన్ని దగ్గరగా చూశావు గదా శశిరేఖా - వాళ్ల పద్ధతులు బాగున్నాయా? వాళ్ల స్నేహం వల్ల నీలో ఏ మార్చయినా వచ్చిందా?

శశిరేఖ రాకేం? మంచి మార్చే వచ్చింది (ప్రేమ వున్న పెళ్లి కావాలని బయళ్టేరినదాన్ని ప్రేమ వున్నపుడు యింక పెళ్లి దేనికి? అనే ప్రశ్న అడిగేంతగా ఎదిగాను. గోవిందాపురం నుంచి కలకత్తా వరకూ ప్రయాణం చేశాను గదా - కానీ ఈ బ్రహ్మసమాజికులున్నారే వాళ్లు హిందూ మత ధర్మాన్ని మాత్రమే ప్రశ్నిస్తారు. మత మూఢాచారాల్నీ బైటి (ప్రపంచపు పాత పద్ధతుల్నీ మార్చుకుని తృప్తిపడదామని చూస్తారు. ఇళ్లల్లో స్రీ పురుషుల మధ్య సంబంధాలలో

య

మార్పుని మాత్రం సహించలేరు. అక్కడ కూడా ప్రశ్నలు అడగాలనీ మార్పులు కోరాలనీ నేనే వాళ్లకు నేర్పాను.

పద్మావతి నువ్వేం నేర్చుకోలేదంటావు?

శశిరేఖ + నేర్చుకున్నాను. కుల భేదాల్ని పాటించటం మానుకున్నాను. కుట్టుపని నేర్చుకుని డబ్బు సంపాదించి నన్ను నేను పోషించు కోవటం నేర్చుకున్నాను. ఆ నవజీవనదాసు ఎంతో మంచివాడు. కానీ ఎప్పుడూ పాపం పాపం అంటాడు. నా మటుకు నాకు చిన్నప్పటినుంచీ బుద్ది పూర్వకంగా చేసిన పాపం ఒక్కటీ జ్ఞాపకం లేదు. అట్టా అంబే అంతరాత్మ పరిశుద్ధం కాలేదంటాడు చేసే పనులన్నీ పాపాలయితే గాని అంతరాత్మ పరిశుద్ధం కాదేమో - వాళ్ల పాపాలకూ, నా పొపాలకూ బోలెడంత తేడా - ఇష్టం లేని వాణ్ణి పెళ్లి చేసుకోవడమంత పాపం ఈ లోకంలో యింకే _ మన్నా వుందా? అంతకన్నా అసహ్యం వుందా?

అరుణ - కలకత్తా ప్రయాణం ఆ అనుభవం ఎలా వుంది శశిరేఖా?

శశిరేఖ ; ఎంతో బాగుంది. అక్కడి స్రీలు ఎంతో అందంగా ఉన్నారు. ఎంతో మధురంగా పొడారు. వాళ్లతో కలిని వుండాలని పించింది. కానీ వాళ్లంతా నన్ను పాపినంటారు. పెళ్లి చేను కుంటేనే గాని నాకు మర్యాద యివ్వరు. వాళ్లను చూసి నేను భయపడాలన్నట్ట్లు, తల వాంచాలన్నట్లూ చూస్తారు. కానీ నిజానికి వాళ్లకెప్పుడూ లోకభయమే. నంఘ భయమే. ఇంకొకళ్లని చూస్‌ నిరంతరం భయపడే బతుకెందుకు? ఆ భయం వదలనంతకాలం న్యాయం యేమిటో విచారించే శక్తి వాళ్లకెట్లా వన్తుంది?

కే

జీవితంలో నియమాలుండాలంటారు కానీ లోకమంతా వాళ్లు పెట్టిన నియమాల ప్రకారమే బతకాలట. నా నియమాలు నావి అవి నాకు గొప్ప. వాటిని నేనెందుకు వదులు కుంటాను? ఆ నవజీవనదాసు - ఎంతో మంచివాడూ, గొప్పవాడూ అను కున్నాను గదా - అతని రంగుకూడా బైటపడింది చివరికి నేను అతని యింట్లో వున్నాను గాబట్టి, అతనితో కలిసి కలకత్తా వెల్లాను గాబట్టి యిక నామీద అధికారమంతా అతనిదేనట. ఈ అధికారాన్ని నేను - నేను ఒప్పుకుంటానా? అతని యింట్లో నా యిష్టప్రకారం స్వతంత్రంగా వున్నానను కున్నాను. అతని అధికారం కింద నన్ను నేను ఎన్నడూ పెట్టుకోలేదు. అట్లా అనుకుంటే అక్కడ ఒక్క నిమిషం వుండేదాన్ని కాదు స్రీ ఎవరి అధికారం కిందా వుండకుండా స్వతంత్రంగా వుండవచ్చనే అభిప్రాయం యింకా బ్రహ్మ సమాజీకుల్లో ప్రవేశించలేదు.

పద్మావతి : కానీ ఎంత గొప్పవారూ సంఘపు ఆజ్ఞల్ని ధిక్కరించలేక పోయారుగా?

శశరేల్లు సంఘం ఎవరు మనని అజ్ఞాపించటానికి? ఎప్పుడూ దాని ఆఅధికారానికే ఎందుకు లోబడాలి మనం? బానిసలైన భార్య లను పశువులకన్నా నీచంగా చూసే భర్తలను గౌరవిస్తుంది కదా సంఘం. ఆ సంఘాన్ని నేనెట్టా ఎందుకు గౌరవించాలి? తనకు భయపడే పిరికివాళ్లను వెలివేస్తుంది సంఘం. అట్లాంటి సంఘానికా నేను భయపడతాను, నా నైజమే స్వేచ్చ! నిజానికి నేను అ కాలంలో వుండదగినదానిని కాదేమో - అందుకే వెళ్లిపోయాను ఎక్కడ (ప్రేమకు అంతం లేదో,

క్షే

అంతా డ్రేమమయమో, ఎక్కడ 'పేమకు నీతి, దుర్నీతీ అనేవి లేవో అ లోకాన్ని వెదుక్కుంటూ వెళ్లాను నేను, కానీ ఇవాళైనా నాలాంటివాళ్లకు ఈ లోకంలో స్థానం వుందా? (థ్రేమ నిలుపుకోవటం కోసం, ఎల్లప్పుడూ (ప్రేమించడం కోసం, ఎవరి అధికారానికీ, శాసనానికీ తలవంచని స్వేచ్చ కోసం, పెల్లి మానేనుకున్న నాలాంటివాళ్లు ఎవరైనా వున్నారా?

పద్మావతి. : పెళ్లి మానేసినవాళ్లు లేరుగాని పెళ్లిని వదిలేసి వెళ్లినవాళ్లు వున్నారు. రాజేశ్వరీ! లేచిపోయినావని నిన్ను ఎన్ని మాటలంది లోకం.

రాజేశ్వరి. : ఏం లేచిపోవటం లోభత్వంకన్నా ఎక్కువ నేరమా? వడ్డీ వ్యాపారం కంటే నీచమా?

లాలస ; (నవ్వుతూ) రాజేశ్వరీ - నువ్వు “హాయిగా భర్త నంపాది స్తుంటే తిని కూచుని, పతివ్రతగా పేరు సంపాదించుకోక ఎందుకు పడ్డావు ఈ కష్టాలన్నీ” -' అనీ ఆశ్చర్యం నిన్ను చూస్తే ఈ లోకానికి,

రాజేశ్వరి. : (నవ్వుతూ) - కష్టాలా - నావి కష్టాలా? ఆ పతివ్రతలు పడ్డారే అవీ కష్టాలు. భర్త యోగ్యుడై సంసారం సుఖంగా జరిగిపోయిన ఒక్క పతివ్రతను చూపించు నాకు. పతివ్రతల మొహాలు చూస్తేనే గట్టిగా బుద్దిపుడుతుందనుకుంటాను, భర్తలకీ దేవుళ్లకీ - వాళ్లని బాగా ఏడిపించాలని. హింసలూ, ఏడుపులూ, అసహ్యాలు, బాధలూ యివేగా పతివ్రతలకు దక్కింది - నాకేం ఖర్మ పతివ్రతనవటానికి? నేను ఆనంద సుందర లోకాల్లో విహరించి విహరించి మత్తెక్కిపోయినదాన్ని, హృదయాన్ని కాల్చే బాధాగ్నిలో పవిత్ర స్నానాలు చేసినదాన్ని.

క్ష2

అరుణ = కానీ నీమీద ఎంత కోపం, ద్వేషం లోకానికి?

రాజేశ్వరి నాకు తెలుసు నామీద ద్వేషం ఎక్కడ రేగుతుందో, నన్ను ప్రన్నించేవారి ముందు నా గొంతులో కొంత దిగులు కనపర చాలి తప్పు చేశానని పశ్చాత్తాపం సూచించాలి అప్పుడు స్నేహం పాొందగలను కానీ నా అవినీతికి, అసాంప్రదాయా నిక్సీ నా ఏకత్వానిక్రీ నా దురదృష్టానిక, నేను గర్వపడితే భరించ లేరు కానీ నా జీవితాన్ని చూసుకుంటే, ఈ సమాజం మీదా దాని కపటత్వం మీదా, దొంగ నీతుల మీదా నేను చేసిన తిరుగుబాటుని చూసుకుంటే గొప్ప గర్వం. అసలు నాలోని భావుకత యేమిటో వీళ్లకు అర్ధమవుతుందా? మధ్యాహ్నపు సోమరి గాలి తాకితేనే ఒళ్లు పులకరించే నాకు మాత్రమే అమీరు (ప్రేమ అర్ధమవుతుంది ఆ (ప్రేమ గురించి నేను ఎంతెంత సాహసాలు చేశానో, అవి ఎలా చెయ్యగలి గానో నేను మాటల్లో చెప్తే మాత్రం ఈ జీవచ్చవాలకి ఎలా అర్ధమవుతుంది?

పద్మావతి : మరి అమీర్‌మీద అంత (్రేమైతే, అ చిన్నికుర్రాడు మీరా... అతను ఎలా వచ్చాడు నీ జీవితంలొకి?

రాజేశ్వరి * మీరానా? అవును పద్మావతీ - నా నంతోషం కోసం అమి తంగా దిగులుపడ్డవాడు. మీరాని బాధపెట్టలేననిపించింది. అతని సంతోషం కోసం ఏమయినా - అఖరికి నానుంచి సౌఖ్యాన్ని కోరితే అది యివ్వడానికి కూడా సిద్ధపడగలిగే వాత్సల్యం కలిగింది అతనిమీద. కానీ అమీరుని చూస్తేనే నా రక్తం పొంగుతుంది. నా సమస్త కాంక్షలూ అమీరువల్ల సఫలం కావడం నాకు తెలుస్తూనే వుంది. అందుకే కదా గర్భం తీయించుకోమని అమీరు అడిగినప్పుడు కాదన్నా

శే

అతన్ని వదిలిపెట్టలేకా గర్భాన్నే వదిలేసుకున్నాను. మీరా సాహచర్యం వంటరితనాన్ని పోగొట్టినా, ఏ వెన్నెలరాత్రో అమీరు జ్ఞాపకం బాధపెడ్రే, నాకీ జీవితం ఎంతో ద్భురంగా అనిపించేది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అప్పటి ఆ వికారంతో డోకులతో నాలోని మాతృభావం అడుగంటడం కూడా నిజమే. నేను గర్భం తీయించుకున్నానని ఎంత కోపం వీళ్లకి - కానీ అసలు గర్భం తీయించుకోవాలా ఒద్దా అన్న (ప్రశ్న ఎదుర్కొన్న మొదటి స్త్రీని నేనేగా - స్త్రీలందరూ సమాజ శాసనానికి కట్టుబడి, యిష్టం వున్నా లేకపోయినా, గతిలేక, పిల్లల్ని కంటుంటే నేను నా యిష్టంళో, స్వేచ్చతో నిర్ణయం తీసుకున్నాను. ఎవరు తీసుకోగలరట్లా నిర్ణయాలు?

శశిరేఖ నువ్వు అమీరునూ, మీరానూ యిద్దరినీ ఒక్కసారే ఎలా ప్రేమించగలిగావాని ఈ ప్రపంచానికి పెద్ద సందేహం. ఏ స్త్రీ అలా ప్రేమించలేదనీ, నిన్ను సృష్టించిన ఆ పిచ్చివాడు ఎంతో పొరపాటు చేశాడనీ అంటున్నారు.

రాజేశ్వరి బెను - ఇద్దర్నీ ఢ్రేమించాను - ప్రేమ మారుతుందని నువ్వంటే ఒప్పుకుందా శశిరేఖా - ఇట్లా గుమ మారడమూ, ప్రేమలో సందేహాలు రావడమూ ఒకేసారి యిద్దరిమీద ప్రేమ వున్నట్లు తోచడమూ, ఆ ప్రేమే చెరొకరిమీద, చెరొక విధంగా కలిగినట్టుండమూ - ఇదంతా వారు ఒప్పుకోరు. “ఒళ్లు కావ్వెక్కితే అలాగే వుంటుందిలే అంటారు. పశు కామం అంటారు”. అట్లా యిద్దరిమీద వుండటం అసంభవమని తమ నీతి శాసనాలతో సృష్టినే, ప్రపంచంలోని హృదయాల్నే పాలించి అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు రాస్తారు -

క్షత

కొందరు పుస్తకాల్లో - వీళ్లవి గాలి మాటలు - నావి రక్తపు అనుభవాలు. నా అనుభవాన్ని విశ్వసించని వాళ్లను, నన్ను గౌరవించని వాళ్లను ఒక్క చూపుతో తృణీకరించి నా అనుభవాలను చూసుకు గర్వపడగల ధైర్యం, శక్తీ నాకు కావలసినంత వుంది!

అరుణ రాజేశ్వరీ - హాయిగా మంచి పరిమళాలు వెదజల్లే భోజన సౌఖ్యాన్ని ఒదిలి ఆ అడవిలో తిండీ తిప్పలు లేకుండా ఎట్లా వున్నావనీ - ఏం తిని బతికావనీ వెక్కిరిస్తారు నిన్ను - అట్లా బతకటం అసాధ్యం, అసహజం అంటారు.

రాజేశ్వరి . తిండా? భోజనమా? భోజనమంటే ఒకరికెదురుగా ఒకరం కూచుని ఒకరినాకరం కళ్లతో తాగెయ్యటమన్నమాట - మెతుకుల మీద బతికామా - ఆనందం మీద కానీ - రుషులు వాయుభక్షణ చేసి జీవించినట్టు ఏం తిన్నానో, ఎట్లా తిన్నానో ఆ భోజనం ఎట్లా సయించిందో నాకు జ్ఞాపకం లేదు. అర్ధం కాదు. ఇక మీకేం అర్థమవుతుంది? సకల అంతఃపుర సౌఖ్యాలు ఒదిలి సీతారాములు అడవుల్లో కందమూలాలు తిని ఆనందంగా బతికారంటే అర్థం బౌతుంది. అది ఆదర్శ దాంపత్యమంటారు - ఈ సమాజం మీద తిరుగుబాటు చేసి అడవుల్లోకి వెళ్లి పోరాటాలు చేసే విప్లవకారులు గంజీ గట్కా తాగి తమ ఆదర్శం కోసం బతుకు తున్నారంటే అర్థమవుతుంది - ఆ ఆదర్శానికి అందరి ఆమోదం వుంది. కానీ నేను ప్రేమకోసం సమస్త సొకర్యాల్నీ ఒదిలి మైదానంలోకి వెళ్తానంటే వీళ్లకు అర్థం కాదు - కోపం - ఎందుకంటే

కేవ్‌

వీళ్లకు పేమ తెలియదు వివాహంలో నీచత్వం తెలియదు (ప్రేమ కోనం, స్వేచ్చకోసం వివాహం మీద తిరుగుబాటు చేసిన విప్లవం తేవాలనుకున్న స్త్రీని నేను. నా ఆదర్శాలకు నన్ను ఒదిలి మీరు హాయిగా భార్యలు ఒండిపెడితే తిని ఒళ్లు కొవ్వెక్కించుకోండి

అరుణ ; అమీరు కోసం యింత చేశావు కదా - చివరికి అతను కోరాడని మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చావు గదా - మరి మీరా విషయంలో అమీరు ఏం చెయ్యగలిగాడు?

రాజేశ్వరి : ఏం చేశాడా? రెండు రవికలు కొనుక్కొచ్చి నా మొహాన పడేశాడు. మీరాని ఎంతమాత్రము సహించలేకపోయాడు. వాళ్లిద్దరి మధ్యా స్నేహం తీసుకు రావాలన్న నా ప్రయత్నం వ్యర్థమే అయింది. అమీరు నన్ను తన స్వంత ఆస్తిగా భావించుకోవడం నుంచి బైటపడలేక పోయాడు. ఆ భావం నుంచి అతను బైటపడగలిగి వుంటే మేమిద్దరం కలిసి ఎంత గొప్ప ప్రేమలోకాన్ని నిర్మించి వుండేవాళ్లం.

లాలన వ బెను - దేశికాచారి చెయ్యగలిగాడా పని!

శశిరేఖ . పద్మావతీ నువ్వు రాధాకృష్ణను చిన్నతనం నుంచి ఎంతో పేమించావు గదా - మరి పెళ్లెందుకు చేసుకోలేదు? నువ్వు ఎంతో ధైర్యం, తెలివి, సాహసం గలదానివి - అట్లా ఎందుకు చేశావు?

పద్మావతి నిజం - నాకు ధైర్యం, తెలివి, సాహసం అన్నీ వున్నాయి చిన్నకనం నుంచీ నా పద్ధతే వేరు. గోళలికాయలు సూటిగా కొట్టేదాన్ని. చెట్ల చిటారు కొమ్మలు ప్కేదాన్ని మగపిల్లలతో సమానంగా దెబ్బలు కొట్టేదాన్ని. రక్తం కారాల్సిందే నాకు కోపం

కేర్‌

వచ్చి రక్కానంటే - అట్లాంటి నన్ను పెళ్లి చేసుకోమంటాడు రాధాకృష్ణ. నీ మొగుడు గొప్పవాడయితే నువు గొప్పదానివి అవుతావు ఆంతేగాని ఆడదానివి నీకు గొప్పేమిటి? అన్నాడు. చిన్నప్పుడే అనుకో - ఐతే మాత్రం - నన్ను పెల్లి చేసుకుంటా నని అంటాడా? చెంప ఛెళ్లుమనిపించాను. కిక్కురు మన కుండా వెళ్లిపోయాడు. (నవ్వులు)

లాలస : అసలు నీ గురించీ, నీ జీవన విధానం గురించీ మాకు చెప్పవా పద్మావతీ?

పద్మావతి : నేను నాదాన్నే అయివుండాలనుకున్నాను. ఒకరిదాన్నవటం నాకు యిష్టం లేదు. ఎందుకట్టా కావాలి? నా జీవనం నేను జీవిస్తా. అతని పని ఆతను చూసుకుంటాడు. నామీద ఎవరికీ అధికారం యివ్వను. ఎవరి సొమ్మునీ అయిపోను. ఎవరి వస్తువునీ కాను. ఎప్పుడూ పొద్దునా సాయంత్రం ఒకరికే కనపడుతో, రాత్రంతా వాళ్లతో వుండి, వాళ్లకి పాతదాన్నయి

  • అసహ్యం అయిపోతానా?

శశిరేఖ: ప్రేమ వున్నప్పుడు అలా పాతగా, అసహ్యంగా ఎందుకవుతారు పద్మావతీ?

పద్మావతి : (పేమ వుంటే? ఆ ప్రేమగలవాళ్లు నన్నేం చేసినా వూరు కోవాలా? నన్నెలా అంటే అలా ఉపయోగించుకుని అసహ్య పెట్టి, అక్కర్లేనప్పుడు నా మొహం చూడక, మూల పారేసి కావలసినపుడు దౌర్దన్యం చేసి - అదా (ప్రేమ? నేనెన్నడూ ఒప్పుకోను, రాధాకృష్ణ అడిగినట్టు అతనో వెళ్లిపోతే ఏం జరుగుతుందో తెలుసా?

క్షే

ఒక్క నెలలో మా (ప్రమ మాయమై పోతుంది. వంటలో, పాగలో, దుమ్ములో, పిల్లల వుచ్చలో, నడుం కట్టుకుని, జుట్టురేగి, కంపుగొట్టుకుంటూ, పెద్ద పొట్ట వేసుకుని - వీటివల్ల నేనేమవుతాను? అతని హృదయేశ్వరిని, గాంధర్వ కన్యని, చివరికి అతని దాసీదాన్నీ నౌకరునీ అయిపోనూ? నేను అతనికెప్పుడూ నూతనంగా, విచిత్రంగా, అద్భుతంగా కనపడాలి. నిర్మలమైన నీళ్లల్లో శుభ్రమై అపుడే పైకి వచ్చిన నాగకన్యలా వుండాలి.

అరుణ : కొనీ ఈ లోకంలో అలా వుండటం కుదురుతుందా ఎవరైనా అలా వుండగలుగుతున్నారా?

పద్మావతి : లోకమూ? లోకం సంగతి నాకెందుకు? లోకంలో కలిసివుండే ఈ శవాలన్నిటికీ శ్రేమే - డ్రేమ వుంటే వాళ్ల మొహాలెందుకు యేడుస్తూ అలా వుంటాయి. మొదట గ్రేమవున్నా - చీకటి గదుల్లోనూ, వాంట యిళ్లలోనూ ప్రేమ వూపిరాడక చచ్చి పోతుంది. ఏమైనా సరే - వీళ్లలా వెధవ బతుకు బతకను (ప్రేమ పేరుతో! (పేమ లేకపోతే పోయింది గానీ ఢ్రేమని చంపుకోలేను నా చేతులతో - నేను గొప్పదాన్ని కావాలి. రాధాకృష్ణ కళ్లని మెరిపించి మనను లాగేసి, కోర్కెని మండించి, ఆరాధింప జేసుకునే మహాశక్తిని కావాలి. నేను వంటదాన్నయి, అతను పోషించే వాడయితే వంటదానిమీద అతనికి పేమ వుంటుందా? వంటదాని మొగుడిమీద నాకు (పేమ వుంటుందా? పెళ్లాం కోనం, పిల్లల కోసం మాత్రమే బతకడం మగాడికి కూడా చాలా నీచం. రాధాకృష్ణ అట్లా కాకూడదని నా ఆశ.

లాలస వ పద్మావతీ - ఎంత బాగున్నాయమ్మా నీ ఆలోచనలు,

కేశి

పురుషులకు కూడా నవజీవనం యివ్వాలనే ఆశా, అట్లా చెయ్యగల నీ శక్తీ - నా ఒళ్లు పులకరించి పోతోంది నీ మాటలు వింటుంటే.

పద్మావతి ఏ ళొను! స్త్రీలు ఎందుకనుకున్నావు వుంది? జీవితమంటే ఎంత గాఢమైందో, ఉన్నతమైందో పురుషులకు తెలియజెప్పేందుకు. వాళ్లని ప్రోత్సహించాలి. స్వర్గానికి ఎత్తెయ్యాలి. గొప్ప పనులకీ, గొప్ప ఆదర్శాలకీ, గొప్ప వూహలకీ ఉత్సాహమివ్వాలి. అగ్నితో నింపెయ్యాలి. నిర్జీవమైన బతుకులోంచి రక్షించుకోవాలి. అట్లా చెయ్యాలనుకున్నాను రాధాకృష్ణను. కానీ నేనేమీ లెక్కచెయ్యని, విలువ యివ్వనీ పెళ్లీ భర్త - యివే పెద్ద బంధాలయిపోయాయి.

రాజేశ్వరి. : అందుకే నేను భర్తను ఒదిలి, ఇల్లు విడిచి నా అమీర్‌తో మైదానంలోకి వెళ్లిపోయాను.

పద్మావతి : నేనట్లా చెయ్యలేదు. ఎవరితోనైనా ఎందుకు వెళ్లాలి అను కున్నాను. ఇద్దరిలో ఎవరో ఒకరిని ఏరుకోవాలా ఏమిటి? ఎందుకు ఏరుకోవాలి? ఎవరో ఒకరు వుండి తీరాలా యేమిటి నాకు మొగనాధుడు. వాళ్లిద్దరూ నన్ను కోరుకునే పద్దతిలో నాకు యెవరూ అక్కర్లేదు. నేను న్యాయమూర్తి పదార్థాన్ని కాదు. రాధాకృష్ణ వస్తువును కాను. పద్మావతిని. ... ఒక వ్యక్తిని . అది అర్థంకాక నా కోసం బొమిక ముక్క కోసం కుక్కల్త్లాగా కొట్టాడుకున్నారు. చీల్చి పంచుకోవాలని చూశారు. చివరికి భయమంటే తెలియని నన్ను, దిగులంటే తెలియని నన్ను, ధైర్యానికీ సాహసానికీ మారుపేరైన నన్ను ఏడిపించిగానీ వదలలేదు రాధాకృష్ణ. ఏడ్చాను అతనిముందు. దిగులుతో బాధతో - నా కొంటెతనాన్నీ, గర్వాన్నీ - నవ్వునీ ఒదిలి

శేఖ

లాలస * ఒద్దు పద్మావతీ - నువ్వలా దిగులుగా వుంటే ఏమీ బాగోలేదు నువ్వు హాయిగా ఆనందంగా వుండాలి. ఆ ఆనందాన్ని శాశ్వతం చేసుకోవాలి.

పద్మావతి : నేనే ఆనందమైపోయిన ఆఅ చివరి అనుభవాన్ని గురించి చెప్పనా? ఆ రోజు - ఆఖరుసారి నేనూ, రాధాకృష్ణా కలిసిన వెన్నెల రాత్రి - ఆ నృష్టి సౌందర్యంలో ఒకరం యింకొకరి సౌందర్యంలో లీనమైపోయినాము. ఒకరినొకరు తాకనన్నా లేదు. తాకాలని బుద్ధే లేదు. తాకనక్కరలేదు. ఈ భౌతిక శరీరాలకు అతీతమైన ఆనందం అనుభవించాము. ఆ తర్వాత నాకింక అసహ్యమైన లోకంలో వుండబుడద్ధి కాలేదు. గొప్ప శాంతి కావాలనిపించింది. నిర్మలమైన లోకం చూడాలనిపించింది. ఎన్నటికీ చెదరని అందమైన ప్రపంచం లోకి వెళ్లాలనిపించింది. వెళ్లిపోయాను. ఈ మురికిలోంచి, చీదరలోంచి, యిరుకులోంచి గొవ్ప వెలుగులోకి, గాలిలోకి, సాందర్యంలోకి వెళ్లిపోయినాను!

లాలస : అదిసరే గాని అరుణా - నువ్వు - నువ్వెందుకలా అదృశ్యమై పోయావు? ఒక్క చూపుతో అందరినీ - నీ పాదాల ముందు మోకరిల్లించుకున్న దానివి - ఆ అందర్నీ కాదని, అన్నింటినీ ఒదిలేసి ఎందుకు - ఎందుకు - ఒక్క గంతుతో అవతలకు వెళ్లావు... వెళ్లిపోయావు? ఏదీ నిన్ను 01314) చేసింది అరుణా? వీళ్లందరూ నిన్ను - “పలాయనవాదివి” అనేలా అవకాశం ఎందుకిచ్చావు? నీ జీవితానికి అర్ధం లేదనీ, గమ్యం లేదనీ అంటున్నారు వీళ్లు; నువ్వు ఏ విజయమూ సాధించ లేదంటున్నారు!?......

20

అరుణ ఏ విజయాలా? మన అనంతోద్రేకపు ఊహలూ, అర్థంలేని కలలూ, ఫలించని ఆశలూ, పగిలిన అనుభవ శకలాలూ - యివి... యివే మనం సాధించిన విజయాలు. విజయాలంటే ఏమిటి? అస్తులా? డిగ్రీలా? అధికారాలా? హోదాలా? నగలా? ఎవరికి కావాలవి? సమాజాన్ని ఒక కుదుపు కుదిపి మనం జ్ఞాపకం వస్తే చాలు - నిద్రపట్టక, అశాంతితో, కోపంతో, అలజడితో కొందరూ - అనందంళలో, ఆరాధనతో కొందరూ ఊగిపోతారే - అట్లాంటి మన జీవితా లకా అర్ధం లేనిది? కీర్తి మర్యాదల్ని డిగ్రీలతో పోల్చుకునే పారసైట్లా మనల్ని జడ్జి చేసేది. ఇందాకేమన్నాన్‌. గమ్యం లేదా? గమ్యం అంటే ఏమిటి? ఏమిటి వీళ్ల గమ్యాలు - నా జీవితం సఫలమయింది. నా గమ్యాన్ని చేరుకున్నాను అన్న ఒక్కణ్ణి..... ఒక్కణ్ణి చూపించు. అందరూ

  • ఎంత గొప్పవారూ తాము చేరుకున్న గమ్యాలు తాము వూహించినదానికి ఎంత విరుద్ధంగా వున్నాయో చూసి కుమిలి పోవటం లేదూ? మనం నిరంతర ప్రయాణీకులం. నిరంతరం ముందుకి - యింకా ముందుకి ముళ్ళూ, రాళ్లూ అవాంతరా లెన్ని వున్నా యింకా యింకా ముందుకి వెళ్లే ఆ నిరంతర గమనానుభవాన్ని భరించలేక, చేతకాక వీళ్ల (పప్రలాపనలు మనల్ని చూసి. మనం జీవితం నుంచీ, నంఘాన్నించీ, అపజయాన్ని ఆంగీక రించలేదు ఎన్నడూ - మరణంలో, మర్యాదలో, జడత్వంలో, మామూలులో శరణ్యం పొందలేదు ఎన్నడూ.

2 రణభూమిలోకి వెళ్ళాం నేరుగా - గాయమయిందా? అవయ వాలే ఖండాలైపోయినాయా? రక్తమంతా నేలపాలయిందా? హృదయమే ముక్కలయిందా? ఫరవాలేదు. ఆ సంసార మృత్యువుకన్నా యిదే నయం. పద్మావతి . కానీ ఆ సంసారాల్డో మీకే లోపం జరిగింది అని అడుగు తున్నారు మనల్ని - మనల్నే కాదు ఇవాళకూడౌ భర్తలొద్దు, సంసారాలాద్దు అని వచ్చేస్తున్న స్త్రీలను కూడా అడుగు తున్నారు. ఏం లోపం మీకక్కడ అని. అరుణ - లోపమా? లోపం కానిదేమిటి ఆ సంసారాల్లో? కానీ ఆ లోపాలను లోపాలుగా ఒప్పుకుంటుందా సమాజం? ఈ కొత్త కాలంలో, కొత్త వూహల్లో, కొత్త పిలుపుల్లో, కొత్త వాతావరణంలో, ఆత్మని నలుదిక్కులకీ కొత్త ఆశలు పెట్టి అశాంతిపరిచే కొత్తకాంతుల్లో - స్త్రీని పాతగూళ్లలో, తుక్కు పురాణ నీతుల్లో, నవీన జీవితానికి ఏ సంబంధమూ లేక పుచ్చిన నీతి నిబంధనల్లో, కుళ్లిన ముసలమ్మల శాసనాల్లో, దుర్భలమైన గృహాల్లో కళ్లు మూసి బంధించి వుంచాలని చూసే నేర్చుగల ధూర్త లోపం. కులగిరులే, దేవతలే, భూమే మారుతూ వుంటే స్త్రీని మాత్రం జీవనం తీసేసి శిలని చేసి మూల దాచాలని చూస్తే మూర్థపు లోపం. వాళ్లని చిగిరింప జేసే వసంతోత్సవం లోక కళ్యాణంగా జరుగుతుంటే తలుపులు బిగించి ప్రీని “నా మొహం చూడు. నొ బొర్ర చూడు” అని కులుకుతో ఎదురుగా నుంచున్నల్లోపం. ఈ భర్తలు లోపాల పు య లా హ్‌ ధం రాజేశ్వరి. : భర్తలు సరే అ ల్‌ జీవితంలో ఎందరో పళ [ ఇష్యార్గోటు స & [న ళో ల్‌ 2౧౧ ౧&రీం

22

(ప్రేమించామంటూ నీవెంట బడ్డారు గదా - ఏ ఒక్కరినైనా నువ్వు డ్రేమించావా?

అరుణ : లేదు - నేను ఎవర్సీ ప్రేమించలేదు. నా హృదయంలో గొప్ప (ప్రేమ వుంది. ట్రేమించాలనే ఆశ అపారంగా వుంది. అందువల్లనే యివన్నీ కానీ నా ఆదర్శమే అతి వున్నతం. ఈ మనుషుల్ని చూస్తే వాళ్ల లోపాలు అన్నీ కనపడతాయి. ఈ మొగాళ్లు - ఈ మొగాళ్లేమిట్లే అందరూనూ. నాకూ, నీకూ అంటూ దాచుకుంటారేం - కరుచుకునీ, పీక్కునీ చీల్చు కుంటారేం. ఏదో తినేద్‌ అయిపోయేదీ అయితే అనుకోవచ్చు. తమ యింట్లో పెద్ద దీపం పొరుగింటి గోడమీద పడుకుందని కిటికీలు మూసేసుకుంటారు. తమకి గాలిరాక చచ్చినా సరే. ఆ కాంతి మాత్రం యింకొకళ్లకి ఎందుకు దక్కాలి. కొందరు దీపం ఆర్పేసుకునే వాళ్లుకూడా వున్నారు. వెన్నెట్టైో కూచుని చంద్రుడు అస్తమిస్తాడే అని యేడ్చే నిర్భాగ్యులు. చంద్రుడెంతసేపు వెలుగుతాడు? ఆ వెలిగినంత సేపూ వుండలేరే - నిద్రపోతారు. మూర్ములు.

పద్మాపతి : కానీ నువ్వు చాలామందిపట్ల దయగానే వున్నావు?

అరుణ వ బెను - వున్నాను. వాళ్లు అట్లా నాకోసం బాధపడుళతో, ప్రాధేయపడితే భరించలేను. పరమ అసహ్యం నాకు వాళ్లని చూస్తే. కానీ వాళ్లనించి ఏదో గొప్పగా ఈ పాడు శరీరాన్ని దాచుకుంటే నామీద మరీ అనహ్యం. ఇది ఎవరికన్నా అర్థమవుతుందా? ఈ మొగవాళ్లు మనల్నేదో ఆకర్షిస్తున్నామనీ కులుకుతారు - మనల్ని - వెర్రివాళ్లు.

శశరేఖ : కానీ ఇప్పుడైనా మారలేదా స్త్రీ పురుషులు - ఈ చదువులు, ఉద్యోగాలూ, నాగరికతా, అభివృద్ధి.

23

రాజేశ్వరి. : ఈ చదువులు, ఉద్యోగాలూ, స్త్రీలకు 'స్వేచ్చనిస్తాయంటే నాకు నమ్మకం లేదు.

లాలస - స్వేచ్చ - స్వేచ్చంటే ఏమిటి అని కొట్టుకు చస్తున్నారు యిప్పటి విద్యావంతులు స్వేచ్భంటే ఏమిటో, ఎందుకో, దాన్ని ఏం చేసుకోవాలో తెలియక సభలు పెట్టుకుని మరీ కొట్టుకుంటున్నారు - చివరకు - ఆస్తుల్నీ స్రీలనూ స్వంతం చేసుకునే హక్కుల కోసం అడగటమే - అదే 'స్వేచ్భ అనుకుంటున్నారు.

అరుణ ; మన ఆత్మ లోపల్నించి పుట్టుకొస్తున్న కోరికలకూ, ఆశలకూ, కలలకూ, ఉద్రేకాలకూ భయపడకుండా - మనలోపల్నించి ఉబికి వచ్చే ఆ జీవజల ధారల్ని వెలికి రానిచ్చి వాటితో మన జీవనదాహం తీర్చుకోవటమే స్వేచ్చ - అదే అభివృద్ధి

  • కలలకు కూడా భయపడి, సందేహించి మన్నుతిన్న పాముల్లా పడివృండి, మురుగునీళ్లతో దాహం చల్లార్చు కుంటారు చాలామంది. వారి శరీరాలూ, ఆత్మలూ మురికె, యిరుకై పోతాయి. ఈ ఇనుపగోడల సమాజాన్ని మరింత గట్టిపరిచి కరినం చేయడానికి తప్ప ఎందుకూ పనికిరావు వాళ్ల జీవితాలు ఎప్పుడైతే మన కొత్త పనులతో ప్రయోగాలతో మన ఆత్మ పిలుపుతో ప్రపంచంలోకి వస్తామో అప్పుడు మనమీద మనకెంతో బాధ్యత. ఆదే స్వేచ్చకు అసలైన అర్ధం. ఇట్లాంటి స్వేచ్చ గురించి ఎవరూ ఆలోచించరు. అర్థం చేసుకోరు.

శశిరేఖ ; స్వేచ్చ సంగతి పోనీ - స్త్రీల జీవితాల్లో ఈ నాగరికతవల్తా, అభివృద్ధి వల్లా ఏమైనా మార్చులాచ్చాయంటారా?

రాజేశ్వరి రాకేం - చాలా గొప్ప మార్చులొచ్చాయి. నా కష్టసుఖాలు

ర!

ఆలోచించుకుని, పరిస్థితులు ్రేరేపిస్తే గర్భస్రావం చేయించు కున్నందుకు నన్నెంతో కోపగించుకుంటారు గదా యిప్పటికీ ఈ ప్రజలు - ఇప్పుడు - ఈ అభివృద్ది వైపు పోతున్నా మంటున్న, వీళ్లు ఏం చేస్తున్నారో తెలుసా?

చన్చిదేళ్లు వ ఏం చేస్తున్నారు?

రాజేశ్వరి. : నేను చెప్పలేను. అది తల్చ్బుకున్నంత మాత్రాన నా రక్తం మరిగిపోతుంది.

అరుణ : నే చెప్తాను. గర్భంలో వున్న శిశువు ఆడా, మగా అని కనిపెట్ట టం నేర్చుకుని ఆడపీల్ల అయితే అక్కడే, జవ్వుడే చంపేస్తున్నారు

లాలస న హుం “ప్రపంచశాంతి సాధనలో యిదో మార్గం కనిపెట్టా రన్నమాట.

పద్మావతి : ఈ రోజుల గురించి నేను వినలేకపోతున్నాను లాలసా. ఎట్లా వస్తుంది స్త్రీలకు ధైర్యం - వాళ్లలో మార్చు - వాళ్లకు స్వేచ్చ. -. ఎవరితో ఎట్టా యుద్ధం చెయ్యాలి - అసలు యుద్ధం చెయ్యాలా?

లాలస : స్త్రీని తమ న్వంతమైన అస్తి అనుకుని చాలా గట్టిగా విశ్వసించే వాళ్లని ఎదిరించి బైటపడితేనే గాని స్త్రీకి స్వేచ్చ ఎట్లా దొరుకుతుంది? కులాల్నీ మతాళ్నీ, పెద్దల్నీ ధిక్కరించి

  • వాదితో యుధ్దం చెయ్యనిదీ - పాత ఆచారాల్ని, ఆలోచనల్ని ఎలా కూలదోస్తారు? ఆస్తి తమ స్వంత మనుకునే వాళ్లని ఖండించి, నాశనం చేస్తేనే గాని ఈ దాచుకోవడాలు, దోచుకోవడాలూ ఎట్టా అంతమవుతాయి?

25

రాజేశ్వరి. : లాలసా! నిన్ను స్వంత ఆస్తి అనుకుని, దాన్ని దాచుకోవాలని చూసిన భర్త గురించి నీకు బాగా తెలుసుగా - పురుషుల్లో అతి హీనత్వాన్సీ, గొప్ప ఆదర్శాన్నీ చూసినదానివి - నీ జీవితానుభవం ఏమిటి లాలసా?

లాలస , నేను అనుభవాలే జీవితం అనుకుని ప్రయాణం ప్రారం భించినదాన్ని గొప్పదీ్‌, గాఢమైనదీ, ఏ అనుభవమైనా సరే కానీ స్త్రీకి ఏ అనుభవమూ వుండగూడదనే సమాజంలో అనలు అనుభవాల గురించిన ఆసక్తే స్రీకి నిషేధమైన సమాజంలో కుటుంబ మర్యాద కాపాడటం తప్ప యింకేద్‌ స్రీకి ముఖ్యం కాదనే సమాజంలో - నేను - నేను అనుభవాల కోసం అన్వేషించాను. పేమ, ఉద్యమం, పెళ్లీ, లేచిపోవడం, ఎక్కడో ఏ మూలో ఎవరికీ తెలియకుండా బతకటం - అన్నింటినీ అపురూపం గానే స్వీకరించాను. ఒక గొప్ప గాఢమైన అనుభవం దారకబోతుందనుకుంటే యిక నన్ను నేను మర్చిపోతానదు. అదేమిటో, దాని ఫలితమేమిటో, విడమర్చీ, చీల్చి, తర్మించీ, తెలుసుకునీ ప్రయోజనం లేదు. అంతే.......

అరుణ ; మాల్వంకర్‌ వంటి నీచుడితో వెళ్లిపోవటం కూడా గొప్ప అనుభవమేనంటావా?

లాలస * మాల్వంకర్‌ నీచుడో కాదో నాకేం తెలియదు. అసలతను నాకు తెలియదు. నేనతనితో వెళ్లిపోలేదు.

పద్మావతి : మరి?

లాలస : మాల్వంకర్‌ సంగీతంతో వెళ్లిపోయాను. ఆ సంగీత ప్రవా

26

హంలో కొట్టుకుపోవటం తప్ప నాకేం తెలియదు అలా నన్ను నేను మరచి ఆ సంగీత జలపాతాల మీంచి దూకుతూ, సెలయేళ్లలో ఆడుకుంటూ, గాన సరిత్తులలో అలా అలా తేలుతూ చివరకు - చిట్టచివరకు అ గానామృత సాగరాన్ని, ఆ స్వర జలధిని చేరుకునే అనుభవం వుందే - అదీ - ఆ అనుభవం కోసం నేను వెల్లింది. అట్లాంటిది మాల్వంకర్‌ సంగీతం. మనల్ని సూటిగా పిలుస్తుంది. అతని హృదయం లోకి కౌగిలిలోకి. ఆ సమయాన అతనూ, అతని పాటా ఒకటే ఐపోతారు. అప్పుడతన్ని డ్రేమించకుండా వుండటం కుదరదు. అతనిమీద నాకేమీ నమ్మకం లేదు. కానీ అతని సంగీతం మీద నన్ను నేను నిలువరించుకోలేనంత తీవ్ర మోహం. ఆతని సంగీతాన్ని నేను ఆరాధిస్తే అతని గొంతు యింకా గొప్పగా పలుకుతుంది. కానీ నాకు కొత్త అనుభవం కావాల్సినట్లే అతనికి కొత్త ఆరాధకులు కావాలి వాళ్లని చులకన చెయ్యకుండా వుండటం అతనికి చేతకాదు. ఆ గుణం వల్ల ఎంతో అమూల్యమైన మనుషుల్ని పోగొట్టు కున్నాడు. ఇదంతా - అతని సంగీతాన్ని తాగటం, అతన్ని అర్థం చేసుకోవటం ఆ ఆనందంలో తేలటం, ఆ బాధలో కాలటం యిదంతా నాకు మంచి అనుభవంగానే కనిపిస్తుంది. ఇది లేకపోతే నా జీవితంలో ఏదో వెలితి వుండేదే - అనుభవ మంటే - సంతోషమే కాదు - బాధకూడా.

పద్మావతి : నువ్వు ఉప్పు సత్యాగ్రహంలోకి కూడా వెళ్లావు కదూ?

లాలస = వెళ్లటం కాదు - దూకాను ఆ ఉద్యమంలోకి. మద్రాసులో బీచి ఒడ్డున ఆ అనుభవం. ఇప్పటికీ నా రక్తం ఉప్పాంగు తోంది ఆ దృశ్యం తల్చుకుంటే - నా చుట్టూ పెద్ద గుంపు.

27 చుట్టూ గుర్రాలమీద పోలీను దళం. అక్కడ కుండలో అప్పుడే ఒండిన ఉప్పు. ఎట్లాంటి ఉప్పు అది? అమూల్యమైన భారత వీరుల రక్తంలోని ఉప్పు. దాన్ని అమ్మాను. ఉత్సాహంతో కొన్నారు ప్రజలు. అంతే - ఈలలు, గుర్రపు దాడి, గుర్రపు కాళ్లీ విజృంభణ, కోలాహలం, మూలుగులు, ఎత్తిన లారీలు, తప్పుకుంటున్న తలలు, పరుగెత్తుతున్న కాళ్లు ఏమి క్షణాలవి! బ్రిటీషు సింహం జూలు పట్టుకు వూగించాం. నన్ను అరెస్టు చేశారు. 9 నెలల వైలుశిక్ష వేశారు. జైల్లో నిరాహారదీక్షలకు నేనే నాయకురాలిని. గొప్ప రోజులవి. శశ్చిరేల్లు : మరి జాతీయోద్యమంలోంచి మధ్యలోనే ఎందుకువచ్చేశావు? లాలస ; ఆ ఉద్యమ నాయకుల కపటత్వాన్నీ అసత్య వర్తననూ భరించలేక. ఆత్మశుద్ధిలేదు వాళ్లకు. నాతో జైలుకి వచ్చిన నాయకుల్ని ఒకసారి చూస్తే తెలిసేది నీకు. ఒక సత్యం కోసం 'లా'ని ధిక్కరించే మనిషికి 'లా' మీద ఎంత గౌరవం ఉండాలి? ప్రభుత్వాన్ని బైట యింత ధిక్కరించి జైళ్లలోకి వచ్చి అక్కడ వీళ్ల దేవురింపులు, లంచాలూ, మోసాలు. వీళ్లవల్లా, వీళ్ల నాయకత్వం వహించే సత్యాగ్రహాల వల్లా స్వరాజ్యం రాదని తెలిసిపోయింది నాకు. పద్మావతి : మరి స్వతంత్రం ఎలా వన్తుందనుకున్నావు లాలసా? లాలస 2 సాయుధ విషప్ణవంతోనో, లేక ఉత్త రక్తపాతం, బలం వల్లనో లేక ఏ ప్రపంచ పరిస్థితుల వలనో మనకి స్వతంత్రం రావాలి గాని ఈ సత్యాగ్రహం ఏమాత్రం ఉపయోగం లేదనిపించింది. అరుణ ఏ ఇది గాంధీగారికి తలియదంటావా?

28

లాలస : అందుకు సందేహమేముంది? మానవుడిలో, అతని సత్య స్వతంత్రాన్వేషణలో ఆయనకి వున్న గొప్ప విశ్వాసం ఆయన బలం. కానీ ఆ విశ్వాసం ఏ పదిమంది శిష్యుల మీదో తప్ప (ప్రజా నమూహం మీద పనిచేన్తుందనుకోవటం మూర్థమనిపిస్తుంది. ఇవాళ చూడు - గాంధీగారి శిష్యులు. ఆయన పేరు చెప్పుకుని ఆయన విగ్రహాలు పెట్టించి, దండలు వేసి ఎట్లాంటి పనులు చేస్తున్నారు? ప్రజల రక్తం పీలుస్తున్నారే

  • ప్రజల స్వేచ్చా స్వతంత్రాన్ని కాలికింద వేసి తాక్కుతున్నారే దేశ స్వాతంత్ర్యాన్ని అమ్మకానికి పెడుతున్నారే -

రాజేశ్వరి. : పోనీలే లాలసా - దేశం సంగతి కాసేపు అట్లా వుంచినీ సంగతి చూద్దాం. ఇన్ని అనుభవాల తర్వాత నీ స్థితి ఏమిటి?

లాలన ఏ: ఈ అనేక అనుభవాలనుంచి నేను ఒక గొప్ప స్థితికి చేరు కున్నాను. నన్నే నా జీవితాన్నే - అందులోని ప్రతి నిముషాన్నీ ఒకే అనుభవంగా చేసుకున్నాను. ఇక ఆ అనుభవాద్వెతంలో తొందర లేదు. ఉద్రేకం లేదు. శాంతి, దయ. స్థిమితం. మనుషులపట్ల నిర్లిప్తతో కూడిన దయ. ఎంత గాఢత్వం! ఇది ఎవరికీ అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే జీవితపు చివరి విలువల్లోకి వెళ్లి చూడగలిగితే మన మామూలు లెక్కలు చాలా తారుమారవుతాయి. మనకి ఏ ఐశ్వర్యాలు వున్నాయని కాదు. నిమిషానికి నిమిషం ఎంత లోతుగా, గాఢంగా గడుస్తోందని. మనుషులు, తమని తాము అదృష్టవంతులం అనుకునే వాళ్లు - జీవితపు పై పొరల్ని తప్ప అనుభవించ లేరు. జీవితపు ఈ నిమిష పరంపర - హృదయానికి ఏమిచ్చి పరిగెత్తుతుందనేదే అసలైన విలువ.

29

ఆ విలువ గురించే తెలియదు స్రీలకు. తెలుసుకోవాలనే దృష్టే లేదు. వంటా, సేవా, చివాట్లు - ఆనుదినమూ భరిస్తో పిల్లల చదువులో, పెళల్లిళ్లల్లో, వియ్యవురాలి మన్ననల్లో తృప్తిని వెదుక్కుంటారు. ఒక్క చూపుతో రాయిని కరిగింపజేసే మహాశక్తి - ఒక్క పలుకుతో లోహాన్ని మెత్తపడజేసే మాధుర్యం, గానంతో సమస్త దోషాల్నీ కడగగల ఆత్మ బెన్నత్యం - అంతా వ్యర్థమై, లోపల లోపల కాలి నశిస్తుంది స్త్రీలలో - ఎందుకిట్లా - మనని మనం - మన చేతులతోనే ఈ గతికి తెచ్చుకున్నామా? మనుషులా? సంఘమా? కర్మా? దేవుడా? ఎవరు? ఏది? ఏమిటి కారణం? గుడ్డితనం పరిపాలిస్తోందా లోకాన్ని. క్రౌర్యం కాలికింద తొక్కుతుందా హృదయాన్ని - ఎక్కడ గతి? ఏది విముక్తి? ఒక్కటే సాధనం! సాహసం. జీవితంలో విశ్వాసం. మూఢత్వం మీదా, కర్మమీదా, శాసనం మీదా తిరుగుబాటు, భవిష్యత్తును గురించిన నిర్భయం, ఆత్మలో దైర్యం; పర్యవసానాల గురించిన నిర్లక్ష్యం - అదే మన జీవిత విధానం. (ఇంతలో చాలా దిగులుగా సుందరమ్మ వస్తుంది.)

శశిరేఖ * ఎవరో వస్తున్నారు.

పద్మావతి : ఎవరామె.

రాజేశ్వరి ; ఎక్కడో చూసినట్టుంది.

30

అరుణ ; బెను నాకు బాగా తెలిసినట్టుంది.

లాలస ; ఎవరమ్మా మీరు?

సుందరమ్మ . (భయంగా, దిగులుగా) మేము - మేము బ్రాహ్మలం.

అందరూ : సుందరమ్మ సుందరమ్మ,

అరుణ వ సుందరమ్మను కదూ నువ్వు?

సుందరమ్మ : నుందరమ్మనా? నేనా? బెనా? అది నాపేరా? నేను మర్చిపోయాను. నా పాప. నా చిన్నిపాప జబ్బుతో బాధపడీ, బాధపడీ చచ్చిపోయింది. నేనే చంపుకున్నాను. ఆ పాప నాకు పుట్టకపోతే హాయిగా పెరిగేది - నాకు చేతకాక, తెలియక చంపేసుకున్నాను. (ఏడుస్తుంది).

లాలస : ఊరుకో నుందరమ్మా - నువ్వేం చేస్తావు?

సుందరమ్మ : ఏం చేస్తాను? ఏం చెయ్యటానికైనా నాకేం తెలుసని - అబ్బా

  • నా చుట్టూ చీకటి - ఏమీ దారీ తెన్నూ తెలియని చీకటి, నేనెందుకిట్లా చీకట్లో వున్నాను. ఎవరు కారణం నా అజ్ఞానానికి, ఏముంది నా జీవితంలో? వూరగాయ జాడీలకు అంటు తగలకుండా, మా మున లమ్మల మడిబట్టలను ఎవరూ ముట్టుకోకుండా కాపలా కాయటంలో నా బాల్యం గడిచిపోయింది. నేను ఎవరి కష్టాన్నీ చూడగలిగేదాన్ని కాదు. అదే నా దౌర్చల్యం. ఆఖరికి చిన్న చీమ నీళ్లల్లో పడ్డా సరే, ఎట్లానన్నా దాన్ని పైకి తేసేవరకూ నా ప్రాణం కొట్టుకుపోయేది. అట్ట్లాంటిది నా చిన్నిపాప నొప్పితో గిలగిలలాడుతుంటే గుంద్వె పగిలేలా ఏడవటం తప్ప ఏమీ చెయ్యలేక పోయాను.

వక

ఆరుణ 2 చిన్నతనం ఎట్లా గడిచినా యవ్వనంలో నీ భర్తతో సుఖంగానే వున్నావుగా సుందరమ్మా?

సుందరమ్మ : యవ్వనం - అదేమి యవ్వనం. అదేమి ఉద్రేకం. నాకు జరుగుతున్నదేమిటో, నా దేహమేమిటో, ఆ ఆనందమేమిటో, దాని పరిమితులేమిటో తెలుసుకోటానికి క్షణకాలం వ్యవధి నిచ్చాడా నా భర్త - ఊపిరాడనిచ్చాడా? ఒక్క నిమిషం - ఒక్క నిమిషం కూడా అతన్నించి దూరంగా వెళ్లనివ్వక, పీల్చి పిప్పి చేసి ఆ ఆనంద యాతనలో ఆ స్వర్గనరకంలో ప్రాణాలు విడిచాడు. అతను బంధించిన గదిలోంచి బైటికి వస్తే ఈ కుళ్లు ప్రపంచం - నాకేం తెలుసు దాని సంగతి? ఎప్పుడు బైటికి వచ్చానని?

శవ్చిరేల్లు ; మరి ఎట్లా బ్రతికావూ? డబ్బు ఎట్లా?

సుందరమ్మ : నా భర్త ఆస్తి వుంది. కానీ దానికోసం ఎవరినడగాలో, ఎట్లా తెచ్చుకోవాలో తెలియదు. మా ఇంటి చీకటి మూలల్నించి కదిలి ఎట్లా బైటికి రావాలో తెలియదు. అన్నాళ్లూ పూజలు చేశామే ఆ దేవతలే ఆదుకుంటారనుకున్నాం. కానీ వున్నారా ఆ దేవతలు? లేరు. లేనే లేరు. ఇన్ని తరాలుగా వూరికే అర్థంలేని సేర్షకీ, ఏ శక్తీ లేని బొమ్మలకే పూజలూ, ప్రార్ధనలూ, నైవేద్యాలూ, ధనమూ, శక్తీ కాలమూ అన్నీ ధార పోశాం. మూర్చులం. చివరకు ఏ దిక్కూలేక మా మేనమామ పంచన చేరాం నేను మా అమ్మా

రాజేశ్వరి : అక్కడైనా కాస్త భద్రత, శాంతి, సుఖం దొరికాయా?

సుందరమ్మ : అక్కడ శాంతా? చంద్రశేఖరం, ఆ నీచుడు వున్నాడక్కడ. వాడికి లాంగిపోయినాను. వాడి దొంగమాటలూ, ఏడుపులూ తెలుసుకోలేక పోయాను -

32

అతనితో సెళ్లి - నాకు యిష్టం లేదు. నా గొంతు పిసికి చంపటం తప్ప మరో మార్గం లేక ఆ పెళ్లి నిర్ణయించాడు మా మేనమామ. కానీ ఆనాడే నా గొంతు పిసికి చంపేస్తే ఎంత హింస తప్పేది నోకు - నా అంతట నేనే చచ్చిపోవటం పాపమని ఆగాను. దానంతటదే చావు వస్తే బాగుండను కున్నా. నన్ను చంపమని ముక్కోటి దేవతల్ని ప్రార్థించా - అపాయకరమైన స్థలాలకు వెళ్లా - బావి అంచున నడిచా

  • ఎట్లానన్నా అందులో పడాలి. కత్తిపీట మీద పడబోయా గొంతు తెగిషపోవాలని - దీపం మీదకు కుచ్చిళ్లు విసిరా తగలబడి పోతానని - ఏదీ జరగలేదు. పెళ్లి మాత్రం నిశ్చయమైంది. ఎవరూ ఒక్కమాట నన్నడగ లేదు. నాకు సలహా చెప్పేవారూ లేరు. ఒంటరిగా, భయంతో ఒణీకిపోతూ రెండోసారి పెల్లికూతురునయ్యా. ఎందుకు? ఎందుకా నీచమైన పెళ్లి చేసుకున్నానూ? నా పొట్టలో ప్రాణం పోసుకుంటున్న పసిగుడ్డు కోసం. ఆ చిన్నారి కూనను ఈ లోకంలోకి రప్పించటం కోసం ఆఅ నీచమైన పెళ్లి చేసు కున్నాను. కానీ - కానీ - నా పాపాయి. ఏదీ నా పాపాయి (ఏడుస్తుంది).

లాలన వ ఊరుకో సుందరమ్మా - ఎంత ఏడ్చినా చనిపోయిన పాపాయి రాదుగా - అనలెందుకు చనిపోయింది పాపాయి? చంద్రశేఖరం నిన్ను సరిగా చూడలేదా? ఇరుగు పొరుగు వాళ్లు సాయం చెయ్యలేదా? ఏం జరిగింది?

సుందరమ్మ : నన్నెవరు పట్టించుకుంటారు? అనాథను. దిక్కులేనిదాన్ని. తల్లిదండ్రులు లేరు. ఉన్నా పట్టించుకోరు. ఇరుగు పొరుగు వారందరూ వెలివేశారు. ఇక నా భర్త చంద్రశేఖరమా? నేను

వక!

అతనికి పరిచయమైన మొదట్లో సుందరమ్మ గారూ అని పిలిచాడు. మోహించిన తర్వాత సుందరీ - త్రిలోక సుందరీ, మృదు పద్మగంధ సుందరీ అని కవిత్వం కట్టాడు. పెళ్లి అయిగఎాత్తలా ఒసేయ్‌ అన్నాడు. వారం రోజులయ్యే సరికి గాడిదా కళ్లు లేవటే - ఈ పచ్చట్లో యింత కారం తగలేశా వేమే - నీ తెలివి తగలడ అని యింకోరకం కవిత్వం మొదలెట్టాడు. నేనెంత తెలివితక్కువ దొన్నయినా నాకూ అర్థమైంది. తాను ఆఫీసులో బానిస. ఇంట్లో నేను అతని బానిసను. అంటే బానిసకు బానిసను. లోకమంతా ఒకే పద్ధతి మీద నడుస్తోంది

  • అధికార్లూ, తాబేదార్లూ. ఇంట్లో కూడా అంతే - భర్తల స్వభావమే అంత, అగ్నికి వేడి, తేలుకి కుట్టే స్వభావం ఒకరు కల్పించినవి కావు. భర్త స్వభావమూ అంతే.

పద్మావతి : ఆ పాడు భర్తల నంగతి పోనీ గానీ నీ మాతృత్వ అనుభవం ఏమిటి సుందరమ్మా?

సుందరమ్మ ' నా మాతృత్వాన్ని ఎవరు గౌరవిస్తారు? పెళ్లయిన రెండు నెలలకే ఆరునెల్ల గర్భంతో వున్న నన్నెవరు పలకరిస్తారు, ఎవరు ఆదరిస్తారు? సీమంతవు వేడుకలు, నరదాలూ, ముచ్చట్లూ లేవు. అవేవీ నాకు ఒద్దు. నాకిష్టం లేదు. కానీ పొట్టలో పిండం పెరుగుతుంటే నాకు అకలి ఎక్కువైంది. నా ఆకలి కనుక్కుని సరైన తిండి పెట్టేవారు కూడా లేరు, చాలినంత తిండి వుంటే నా పాప ఆరోగ్యంగా పుట్టేదేమో అనే నా బాధ. పురుడికి మంత్రసాని తప్ప ఎవరూ లేరు. నేను చాలా కాన్పులు చూశాను. ప్రసవించిన స్త్రీకి చూపే ఆదరణ, అమె

వె4

గర్వం, అందరూ అమెమీదా, బిడ్డమీదా చూపే కదా, రేమా ఏమీ లేవు. ఒంటరితనం, బాధా, ఏడుపు యివే నాకు. బారసాల చేసుకోవాలంటే ఒక్క బ్రాహ్మడు నాయింటికి రాలేదు. ఎవరూ నా పాపను ఎత్తుకోలేదు - ముద్దు పెట్టుకో లేదు. చూడమని ఆందిస్తే ముఖాలు తిప్పుకుని, తలుపులు వేసుకున్నారు.

లాలస : పోన్లే - ఈ లోకం అంతే - నీ పాపాయికి నీ (ప్రేమ చాలులే-

సుందరమ్మ : నా డ్రేమ - నా మూఢ (ప్రేమ - నాకు పిల్లల్ని పెంచటం రాదు. ఎవరూ చెప్పలేదు. నేర్చలేదు. శిక్షణ లేదు. పాప గురించి నాకేం తెలియదు. ఆ బిడ్డ ఏడ్చినా భయమే - ఏడవక పోయినా భయమే - ఆవలిస్తే ఏదో భయం. ఎక్కిళ్లు వస్తే ఏదో జబ్బని నిశ్చయం. నాలాంటి తల్లులు దిక్కులేక, విద్యలేక, ధైర్యంలేక, వుత్తి గుడ్డి ప్రేమతో భయాలు కల్పించుకుని బాధపడతారు, ఎండాకాలం నోరు ఆరుతుందని అరగంట, ఆరగంటకీ పాలిచ్చి అజీర్ణం తెప్పించాను. కక్కులు - జ్వరం. బాధ పడుతోంది. వైద్యం చేయించటం తెలియదు. మందు కొనటానికి డబ్బులేదు. నా పాపాయికి మందు కొనాలని మళ్లీ ఆ నీచుడికి లాంగాను. వాడు - నన్ను - నా శరీరాన్ని మలినంచేసి డబ్బు యివ్వనేలేదు - నేను ఆనాడే చచ్చి పోయాను. అతనెవరో రామయ్యట. డాక్టరనుకున్నాను. వాడు నా పాపాయిని రక్షిస్తాడని ప్రార్థిస్తే - వైద్యం చేసి నా పాపకు ప్రాణం పాయ్యమంబటే ప్రతిఫలంగా నన్ను కోరాడు. నేనేం

వెవ్‌ చెయ్యను? నాకు నా పాపాయి బాధతవృ మరిం తెలియటంలేదు. అదొక్కటే వాస్తవం. నిన్నరాత్రి మందుకోసం భర్త అనే మగవాడు, ఇవాళ ఇంజక్షన్‌ కోసం వీడెవడో యింకో మగవాడు. ఏమైతేనేం? ఏం జరిగితే నేం? ఇది ఆత్మలేని ఒట్టి కట్టె. తల వంచాను. చావుబతుకుల్లో వున్న నా పొపాయి - పక్కనే ఆ చీకట్లోనే నన్ను కావలించుకున్నాడు. నాకు ప్రాణముందా లేదా అనేది కూడా అతనికి పట్టలేదు. నేను ఈ లోకంలోనే లేను. ఆ హింసా క్షణాలు గడిచాయి. పిల్లకు ఇంజక్షను చెయ్యమన్నాను. అతనేమన్నాడు? నేనేం విన్నాను? అతను డాక్టర్‌ కాదట, వైద్యం రాదట. ఏం చెయ్యాలి నేను. అతన్ని చంపాలా? మీద దూకి చీల్చాలా? చూపుల్లోనే దహించాలా? నేను ఆ క్షణాన మనిషిని కాదు. రాక్ట్షనిని. దెయ్యాన్ని. వుహమ్మారిని. మహిషాసుర మర్ధనిని - శక్తిని - మహంకాళిని. ఆ నా మహాశక్తిలో ఆ నీచుడు నిలువునా భస్మమైనాడు. (మళ్లీ దుఃఖంతో) ఏమైకేనేం - ఆతనెలా చస్తేనేం - నా పాపాయి ప్రాణం పోయింది. చచ్చిపోయింది. నా చేతులారా చంపుకున్నాను. నాకు డబ్బుంటే, తెలివుంటే నా పాపాయి బతికేది. (ఏడుస్తుంది) ఆడవాళ్లందరూ అంతేనా? డబ్బు కోసం, భర్తల దగ్గర

36

పురుషుల దగ్గర యాచించాల్సిందేనా? అడుక్కోవాల్సిందేనా? శరీరాల్ని అప్పగించాల్సిందేనా? అమ్ముకోవాల్సిందేనా? (నెమ్మదిగా) కానీ - కాని - నా పాపాయిని నేను అ పాడు పెల్లి ప్రసక్తి లేకుండా కనగలిగితే - పాపాయిని పెంచుకో గలిగితే - ఆ జ్ఞానం నాకుంటే - ఎంత బాగుండేది జీవితం. నా పాపాయి - నేనూ - ఎంత సుందర స్వప్పం. ఈ పొడు ప్రపంచం జోలి లేకుండా మేమిద్దరం మా లోకంలో వుండ గలిగితే - పెళ్లితో సంబంధం లేకుండా పిల్లల్ని కనకూడదా? పిల్లల్ని కంటానికి పెళ్లి ఎందుకు? పెళ్లి ఎందుకు పిల్లల్ని కంటానికి?

లాలస. : డ్రేమకు పెళ్లి ఎందుకు? మాతృత్వానికి పెళ్లి ఎందుకు? ఎంత అమాయకంగా అడిగారు ఈ ప్రశ్నల్ని మీరు. ఎంత గొప్ప ప్రశ్నలివి! ఈ సమాజాన్నే సంపూర్ణంగా మార్చేసే ప్రశ్నలు.

రాజేశ్వరి : ప్రపంచం గడగడా ఒణికి ఈ ప్రశ్నలడిగిన వాళ్లను వెంటనే ప్రపంచంలోంచి తరిమేసే ప్రశ్నలు.

అరుణ వ ఈ ప్రశ్నల్ని ఆమోదిస్తే - సమాధానాలు వెదికితే - మనకు ఎంత (ప్రేమ కలుగుతుంది ప్రపంచంమీద! మన లోపలి పేమ ఎంత అవ్యాజంగా ప్రవహిస్తుంది! అపుడు లోకం ఎంత సుందరమవుతుంది!

పద్మావతి : అపుడీ ఆస్తులు, పంచుకోవటాలూ, స్రీల కోసం, అస్తుల కోసం కుక్కల్లా కొట్లాటలు అన్నీ పోయి ఒక గొప్ప లోకం

  • ఓహ్‌-గొప్ప కార్యాలకీ సాహసాలకీ గ్రేరేపించగల సమాజం.

భాలన వ గొప్ప శాంతితో నిండిపోయే ప్రపంచం. నిజంగా ఎట్లాంటి ప్రశ్నలడిగాం మనం. ఎంత స్పాంటేనియస్‌గా, ఎంత

క్‌ అమాయకంగా, ఎంత సిన్సియర్‌గా - (పేమ వుంటే పెళ్లెందుకు? పిల్లల్ని కనటానికి పెళ్లెందుకు? మానవ సంబంధాల నిండా ఈ స్వంతమనే కాపీనం, కోరికా ఎందుకు? కానీ ఎంత భయం ఈ ప్రశ్నలంటే - ఈ ప్రపంచమే నాశన మవుతుందని భయం. గ్రేమలో ఈ బలవంతమూ, మామూలూ అనే రెండూ పోతే యెన్ని నూతన నుందర లోకద్వారాలు వాళ్ల కళ్లముందు తెరుచుకుంటాయో కలలో నన్నా తెలుసుకోలేరు. మనం చెబుతున్నా వినరు. నమ్మరు. అరుణ " వీళ్లు కల్పించుకున్న కాపరాలు, వివాహాలు, చట్టాలు, బంధాలు, అన్నీ మేఘాల వలే చెదిరిపోయి [్రేమ భాస్కరో దయం అవుతుందనే విశ్వాసాన్ని యిన్ని సంవత్స రాలుగా మనం యిస్తూనే వున్నాం. అందుకే మనమంటే నిరంత రాకర్షణ వీళ్లకి. మనల్ని మర్చిపోలేరు. వదలలేరు. మనల్ని ఆరాధిస్తూనో, ద్వేషిస్తూనో మళ్లీ మళ్లీ మనల్ని తల్చుకుంటూనే వుంటారు. రాజేశ్వరి. . కానీ ఎప్పటికైనా మానవజాతి మనం అడిగిన ప్రశ్నల్ని అంగీకరిస్తుంది. మన తిరుగుబాట్లను గౌరవిస్తుంది. లాలస : సుందరమ్మా - భవిష్యత్తులో మనలాంటి స్రీలు తమంత తాము నిర్ణయం తీసుకుంటారు పిల్లల్ని కనాలా ఒద్దా అని. సుందరమ్మ : నిజంగానా - నిజంగా అలా జరుగుతుందా ఎన్నడైనా? ఇంకొక తల్లికి కూడా నాకొచ్చిన కష్టం రాదంటే నేనునా ప్రాణాన్నయినా యిచ్చేస్తాను.

తెగి

(తెర వెనుకనుంచి నినాదాలు విన్పడ్తాయి)

స్త్రీకి శరీరం వుంది దానికి వ్యాయామం కావాలి.

మెదడు వుంది దానికి జ్ఞానం కావాలి.

హృదయం వుంది దానికి అనుభవం కావాలి

(నినాదాలిస్తూ కొందరు స్రీలు రంగస్థలం మీదికి వస్తారు) నినాదాలు ; కుటుంబ హింస నశించాలి

జెండర్‌ వివక్ష నశించాలి

స్త్రీలపై అత్యాచారాలు నశించాలి

వరకట్న హత్యల్ని ఖండించండి

ఆడది అబల కాదు ఆదిశక్తి

'పెల్లికాదు సహజీవనం కావాలి

భార్యాభర్తల సంజంధం కాదు సహచర్యం కావాలి

స్త్రీల లైంగికత్వం అమ్మకపు సరుకు కాదు

'పెల్లిలో మా టైంగికత్వాన్ని అమ్ముకోం, అమ్ముకోం

గర్భంలోనే అడశిశువుల హత్యా షేమ్‌ షేమ్‌

మాతృత్వ నిర్ణయం స్రీల హక్కే

పిల్లల్ని కనాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు ముమ్మా

టికీ స్రీలదే.

పురుష నాయకత్వాలకు కాలం చెల్లింది

అన్ని ఆధిపత్యాలు నశించాలి

ఆవాజ్‌ దో హమ్‌ ఏక్‌ హై

39 లాలస = ఇవన్నీ మనం కోరుకున్నవే కదా - రాజేశ్వరి. : అనాడు మనం ఒక్కొక్కరుగా కోరినవి, ఇవాళ స్త్రీలు సమూహంగా అడుగుతున్నారు. పద్మావతి : మనం పడ్డ హింసనూ, బాధనూ, ఇళ్లలోంచీ, పుస్తకాల లోంచీ బజార్లలోకి తెచ్చారు. అరుణ . ఎంత బాగుంది ఈ స్రీల సమూహం. (అందరూ వాళ్ల దగ్గరకు వెళ్లారు). నాపేరు అరుణ, ఈమె శశిరేఖ, ఈమె లాలస, నేను రాజేశ్వరిని, ఈమె సుందరమ్మ నేను పద్మావతిని. శశిరేఖ * మా గురించీ మా జీవితాల గురించీ ఏదో మాట్లాడు కుందామని మేమిక్కడికి వచ్చాం. మా రోజుల్లో మేం ఒక రకంగా ఒంటరి పోరాటాలు చేశాం. ఆ రోజులే అట్టాంటివి. ఈ ప్రశ్నలకు ఏమీ విలువలేని రోజులవి. మా జీవితాల్లో తిరుగుబాటుకే సరిపోయింది మా కాలం. లాలస ; మేం ఉద్యమాల్లోకి వచ్చినా పురుషుల వెనకే నిలబడ్డాం. పద్మావతి. : పురుషుల్ని ఉద్యమాలలోకీ, గొప్ప పనులలోకీ పంపగలిగితే చాలనుకున్నాం. అరుణ . ఇవాళ మీరంతా యిలా కలిసి అన్యాయాల్ని మగవాళ్ల దౌర్జన్యాల్నీ ప్రశ్నిస్తుంభే, ప్రతఘ్టుటిస్తుంటే ఎంతో సంతోషంగా వుంది లు హౌ క్ష స లి | ళా ఒక - బతకడం ేతృక్లాక అత్మహత్యలు చేసుకున్నారనిన్యమిమ్ముల్నా అమ్మాయి ఈ సమాజైం వెక్కిరించింది! ,” ?. క్ష న గో గ ( జు తా జ్‌ ల స స న స కు న

ఉష మరో ; ఈ ధూర్తలోకంలో బతకలేక చచ్చిపోయినందుకు మీ అమ్మాయి సానుభూతి చూపడం పోయి, మిమ్మల్ని గౌరవించాల్సింది పోయి ఎదురు ఈ అవహేళనలా? జీవం చచ్చిన ఇల్లాళ్లు? వందేళ్లు బతకడం కంటే యిలాంటి ప్రశ్నాక్కటి అడి మరణిస్తే మాత్రమేం? ఇంకో వ పురుషుడిలో, కుటుంబంలో, సమాజంలో వున్న రాజ అమ్మాయి. స్వభావాన్ని అధికారాన్ని, పెత్తందారీతనాన్ని మొట్టమొడ " గుర్రించినవాళ్తు మీరు. దాని విలువ మీకు తెలియకపోయి; మాకు తెలుసు. ఇవి వ్యక్తిగత ప్రశ్నలు కాదు రాజకీయ ప్రశ్నలు. మొదటి. : ఆనాడు మీరు చేసిన ఒంటరి పోరాటాలూ, ఒక్కొక్క రుగ అమ్మాయి మీరు చూపీన థెర్యం: సాహసం, చేసిన తిరుగుబాటు అడిగి, ప్రశ్నలూ యివే మాకు ఉత్తేజకాలు, ప్‌ : మాకెంతో డ్రేరణ మీ జీవితాలు. ఎన్నేళ్లు గడిచినా మిమ్మల్ని మర్చిషోం మేము- మీరడిగిన మౌలికమైన ప్రశ్నలకు సమాధానం వతకటమే ఇప్పుడు మేం చేస్తున్న పని. (అందరూ కలిసి " “ఆవాజ్‌దో హం ఏక్‌హై” నినాదంళో వెళ్లూండగా తెర) దర *॥ (గళధా. సుందర్‌ నని గంటా. నన్నె ఖీ య్‌ ల తగ ఖో | (౮ గం, ణో ల ఓ + గేటు సు శాత న స్క మమ

చలం శతజయంతి సందర్భంగా సంవత్సరంపాటు ఆయన | జీవితాన్ని రచనల్ని ఇవాళ స్త్రీవాద చైతన్యం అందిస్తూన్న పరికరాల తోడ్డాటుతో పున: పరిశీలించినప్పుడు, నూ దృష్టి రచయిత నుండి

  • రచనల వైపు, ముఖ్యంగా నవలల్లోని స్త్రీ ఎంత్ర వపు, వాళ్లు చేసిన సంఘర్షణల నుండి లేవనెత్తిన ప్రశ్నల వేపు, ఇవాళ ఆ ప్రశ్శలకున్న సమకాలీనత వైపు మరలడం అనేది ఎహజక్రమంగా జరిగింది.

అయితే చలం నృష్టించిన ఆరు స్తీ పాత్రలు (సుందరమ్మ,

.అరేఖ, పట్మావతి, రాజేశ్వరి. అరుణ. లాలను ఒకేచోట తారసపడి

సాగా తమ జీవితాను భవాలనూ, అన్వేషణలనూ బకరిశో బకరు

పంచుకోవడం అంటూ జరిగెతే ౪ ఉద్వేగభరిత సందర్భం మనకు కొత్త

పాఠాలను మిగిల్సి పోగలదు; తాము చేసినవి ఒంటణ పోరాటాలు

కావనీ, లేవనెత్తిన ప్రశ్నలు ఈనాటికీ మౌలికమైనవే అన్‌ వారంతా

గుర్తించినపుడు పాఠకుల హృదయాల్లో వారు దిగవిడిచిన ఖషాదానికి .

ల చారిత్రకమైన ఓంంల్పై లభిస్తుంది; ఇవాళ్టి యువతరం చేస్తున్న పోరాటాల్లో, అవి రాజేన్తున్న చైతన్యంలో చలం మానసపుత్రికలు భాగస్వాములై పోతారు. ఇటి “వాళ్లు ఆరుగురూ” అనే ప్రయోగాత్మక __- నాటిక చేయబూనిన సాహస ప్రయత్మం. . మ”

ఈ నొటికలో చలం తన జీవితకాలంలో చేసిన అన్వషణ” వ | అక్షరాల్లోకి కుదించిన వ్యధ, ఎంతో వాత్ళల్యంతో తీర్చిదిద్దిస్గస్తీ పాత్రలు, న పుస్తక ప్రపంచాన్ని అధిగమించి, సమకాలీన వాస్తవ సపంచంలో . . ఉద్యమరూపం ధరిస్తాయి. ఏషాదం ఆశగానూ, వ్యక్తిగతానుభవం_

. సమిష్టి స్టూర్తిగానూ మారగల పరిస్థితులు ఇప్పడిప్పడే పర్దర్డుతున్నాయి మ

చలంభవిష్తవాణి సుమారు అర్ధ శతాబ్దం తరవాతైనా దిఎఐవంక్రైకే

( ఉద్దేరించబడిందో వాళ్లని ఉవ్వెత్తున సమ్‌పిస్తున్నది. ॥