Telugu v.pradama kathalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

జో వి. ప్రతిమ ఎ

న మనసుపడి మక్కువతో సేకరించిన _ | ఉ జ ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోనర్‌ హో భి న్య అ / సుందరయ్య విజ్హాన కేంద్రానికి _. . ౩౪ గ వ. ఆనంచంతో బహూకరిస్తున్నాం. -.” .

ము న య.

ఇ వ్‌ రే

శేజఖవట పీనోతుతై) గ౫ాతిళై సమస్ములలాధ) ఏ. దతిశం

అలి వి. ప్రతిమ కథలు ఉం. షె ర్ర్య్య్క శి గ మత్‌ 1 / (| త 4 శీ న నళ న వేసా ఇళ " (గ కా స ల్ని % న్‌ ని ట్‌ స లం న్నే. బా! భం. ల గో ॥ | చే న నన గ్‌ ల నై లో కా యీడు జం వా సంఖ భో స న మం న. టా / ॥ క్‌ వన: (7 గ (|. ల ల ఖీ జ క్ష [0 1.

తి ౮ ౯|| లిక (3 ||

  • నిగ 6౫8010౧ 0౧ కొంగ కొంగం నా 8561100౧: క8019గ0ఈ 2004 0౮౫ గిరరగర్రా ౧6౮౦౦ ౧ంంగం & 8. ౧౦౦౧౦, సంచయం రొంటు ఇంగం 010 ౧0౮/ నో ల రిణాంైం: ఉదగం0 0906084 గ ఛ్‌ శీరంగంవ న్‌ . ఏ0110౧00, 81 “9౧661980 * 610 త్తి (| ప్రాదరాబాద్‌" 6110698, గం164న91 - 524 126. ర60౫0ఈ ౫౦౦౦6 ౮ ౪18616౧6౧6 800% ౫౦౪86, గ [1/౮9/0006 6౧౮ 19 00౧006; గో కి?6|6800611| కిం0% గ౦౮6, 1 ౪/66/0006 0౧౮ 13 0/0౧0%69 క్‌ సీంళ0ర6౪6 8601150100 గ౦౮86 (7 510/6 ౧౦౮౦౮, ౪1|0౪06060 90180 గ౪౮:10%6 గంగిర?06గా, 0౧1406౧01౪, 1౪66[0006 జీం౪0ంర0676 కం00% జ౦౪౮86, గం0గ10060606. ౫౪/66/0006. సంగ! కిం0!& $10611, 1611076 రలగా౦౦య౫896 రో శగం[00 06166105, గరఆంం౮0, (౮౪0006. ౧౧౦౧9 : 2324408606 గ౧196౮ 6 ఆ౧౦గ1౦ 1౧౧౫10౧8, సుంాంం06 క0వో॥0 46౦, 10. ౧) . 55295078 ౫. 50,

(ప్రపంచం చాలా పెద్దదిగా ఉన్న కాలంలో ఒక ఊరికి మరో ఊరు దూరంగా ఉన్నప్పుడు మా కుటుంబాల్లో ఆడపిల్లలకి చాకలిపద్దు చదువులే శరణ్యమైన అ రోజుల్లో ఈ చిన్న వూరి మండీ విజయవాడ మారిస్టైల్లా దాకా నడిపించి నాకు ప్రపంచాన్ని పరిచయం చేసిన నాతండ్రి తుర్లరైం వెయట రాఘరెట్టి గారికి (ప్రేమపూర్వకంగా...

సాహితీ జాడలేని బాల్యం నుండి... ప్రతిమ ఉద్యమ రూపాల్లోకి వేలు పట్టి నడిపించిన పెద్దలెవరూ నాకు లేరు... సాహిత్య చర్చలూ, పాహిత్య వాతావరణమూ, కవులూ, రచయితలూ ఎటువంటి వాసనలూ లేని బాల్యంలో అనుకునో, అనుకోకుండానో పుస్తకం నా నేస్తం... వాకు మునుపటి మూడు తరాలలో సాహితీ జీవులెవ్వరూ లేనప్పటికీ అత్యంత అధికంగా అధ్యాత్మిక (గ్రంధాలు చదివే నా తండ్రి నుండి విష్పృతంగా చదివే ఈ అలవాటు నాకు అబ్బి వుండొచ్చు... "ఇంటికొచ్చిన అతిథులకు కొసరి కొపరి వడ్డించడం కాదు వాకిటి ముందు నిల్చుని ఆకలి అన్న వ్యక్తికి గూష్టెడు మెతుకులు పెట్టడం నేర్చుకొమ్ము'౦టూ పెంచిన నా తండ్రి మూలంగా ని అసమానతలు ఒక మేరకు ఆవగాహన కొచ్చి వుండొచ్చు. అదే సమయంలో సమాజంలోని మంచిచెడులనీ, జీవితపు విలువలనీ తెలియజెప్పిన నా తల్లి నాకు “ఐడియల్‌ షీ... ఉంటున్నది నాలుగ్గోడల నడుమే అయినప్పటికీ ఊళ్ళోని పంచాయితీలన్నీ సగభాగం ఈ యింట్లోనే జరుగుతుండడంతో ఒక విశాల ప్రపంచాన్ని చూసే అవకాశం కలిగింది, అ వాళ్ళ కు కష్టాలు, కొట్లాటలూ, బాధలూ, వేడికోలూ ఇవన్నీ కూడా నా పనిలో నేనున్నప్పటికీ వెంటాడి, వేటాడి వేదనకు గురిచేసేవి... ఆ తపనలో నుండి... స్పందనలో మండి... జీవితాల్లో నుండి పుట్టినవే ఈ కథలు... అలా... వ్యక్తిగత జీవితాల్లో నుండి పుట్టి సార్వజనీనమై, సమాజ ఆర్థిక, రాజకీయ పరిణామాలను పట్టుకోవడానికి వెనుక పాహిత్యం ఒక కిటికీలా వాకు ఉపకరించి వుండొచ్చు. ఏది ఏమయినా... మూలమూలలా వుండిపోయిన నా కథలన్నింటినీ వెలికితీసి బూజు దులిపి మొత్తం కంపోజ్‌ చేసి ఇచ్చిన మిత్రుడు, సహచరుడు కుమార్‌రెడ్డిగారికి ప్రేమపూర్వక కృతజ్ఞతలు. ఎప్పట్నుండో కథలు (వ్రాస్తూ కూడ పుస్తకం వేయాలన్న ఆలోచన లేని నాకు కథా సంపుటి ప్రచురణకు ఆర్థిక పురస్కారాన్నందించి ముందుకు నడిపించిన సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్‌ శ్రీయుతులు సి నారాయణరెడ్డిగారికి సి. గంగగారికి. వివమ్రపూర్వక ళీ

అనేకానేకమంది సాహితీమి(త్రులు... నా కథల పట్ల అభిమానంతో త్వరగా పుస్తకం వేయమని (ప్రోత్పహించినప్పటికీ నా గురించి శ్రమ తీసుకుని కధలన్నింటినీ చదివి అమూల్యమైన అభిప్రాయాన్ని (వ్రాసి యిచ్చిన ఆత్మీయ మిత్రులు శ్రీసింగమనేని వారాయణగారికి నా పాదయపూడ్ధక కృతజ్ఞతలు... ఇంతకంటే పెద్దపదమేదయినా ఆం(ధ్ర నిఘంటువులో ఉన్నట్టయితే ఎంత బావుండేది?... అలాగే అడిగిన వెంటవే ఆత్మీయంగా అట్టవెనుక తన ఆలోచనలను (వ్రాసి యిచ్చిన ప్రియ నేస్తం పి. సత్యవతి గారికి స్నేహాంబలి. మూలకారణంబెవ్వడు..? వేనెక్కడో ఆం(ధ్రదేశపు మారుమూల కూర్చుని ధ్వనితరంగాల మీద వెంటపడితే ఏమాత్రం విసుగూ, విరామం లేకుండా పుస్తకం ఈ రూపం తీసుకోవడానికి మూల కారణమైన (ఫ్రెండ్‌ ఆఫ్‌ ది హోల్‌ వరల్డ్‌... వాసిరెడ్డి నవీన్‌ గారికి స్నేహపూర్వక కృతజ్ఞతాంబలి. చివరగా నిజానికి ముందుగా నా సాహితీ సాహనయా(త్రల్లో అర్థరాత్రయినా, అపరాత్రయినా నాకోసం కరకట్టల కాడ కాచుకుని వుండే టింకు, బుల్లి యిరువురికీ కృతబ్దతాశీస్సులు... బాబీ, డాలీకి అభినందనలు, పమన్త సాహితీలోకావికి (ప్రతిమ నా మానస పుత్రిక, సాహితీ బంధువు అంటూ నాకు అవేకానేకమంది సాహిత్తీమిత్రుల్నీ. పాహితీ సభలనీ, పాహితీ గ్రంధాలనీ వరిచయం చేసిన కధక చక్రవర్తి కీ॥శే! మధురాంతకం రాజారాంగారిని ఈ సందర్భంగా కన్నీళ్ళతో గుర్తు చేముకుంటున్నాను.

త్త

న!

విలాపాగ్నులూ, విషాదాశ్రులూ... సింగమనేని నారాయణ

“*వా2ంత మేధావియైనాగాని, పండితుడైనాగాని, శా(స్తజ్ఞుడైనాగాని, రాజకీయవేత్త అయినాగాని, సంస్కర్త అయినాగాని, సాహితీవేత్త అయినాగాని, దేశాధినేత అయినాగాని, ప్రవక్త అయినాగాని, వాడెవడైనాగాని, ఆడదాని ఉసురు పోసుకోని మగవాడు ఈ భూమండలం మీద ఇంకా పుట్టలేదు...”

ఎప్పుడో ఎక్కడో చదివిన ఈ వాక్యం ప్రతిమగారి కధలుచదువుతున్నంతసేపూ గుర్తు వస్తూనే ఉంది. ప్రతిమగారి కథల్లో అధికభాగం వస్తువులన్నీ ఆడవాళ్ళు పోసుకున్న ఉసురే! వాళ్ళనంచుకు నెట్టివేసిన మగ (ప్రపంచమే! ఆమె కధల్లో వ్యవస్థాగతమైన దుర్నీతికి తోడు, వైయక్తికమైన మగవాడి కుసంస్కారానికీ, ఆహంకారానికీ, దోపిడీకీ, అణచివేతకు గురైన ఆడవాళ్ళు బహుముఖాలుగా కన్పిస్తారు.

నీచుడూ, దుర్మార్గుడూ, బాధ్యతారహితుడైన తండ్రివల్ల మాత్రమేగాక, డబ్బు దాహం పట్టి వేధించే భర్త వల్లా, జీవితాంతం హింసకు గురైన నిత్య (ఈవ్‌ మళ్లీ చచ్చిపోయింది), కొడుకు మానసిక వికలాంగుడిగా పుట్టిన కారణంగా, భర్త పుట్టింటికి తరిమివేయగా, సంఘర్షణతో నలిగిపోయిన (ప్రత్యూష (నెత్తుటి గులాబి), స్త్రీని ప్రాణమున్న వ్యక్తిగా కాక, ఇంట్లోని మిగిలిన అన్ని విలాస వస్తువులతో సమానంగా చూసే, భాగ్యశాలి అయిన భర్త వల్ల, అన్ని సృజనాత్మక శక్తులనూ అంతరింప చేసుకున్న చిన్ని (శిథిలాలు), ఆర్థిక దుస్థితి కారణంగా పుట్టింట్లో పురుడు పోసుకోడానికి కూడా నోచుకోలేక, అత్తారింటి ఆరళ్లతో క్షోభ నమభవించే వసంత (నాన్నకో ఉత్తరం), భర్త అయ్యప్పమాల వేసుకున్నపుడు బయట చేరిందని ఇంటి నుండి గెంటివేయగా పుట్టింటికి చేరిన భారతి, ఆడపిల్లను కన్నందుకు తన తప్పేమీ లేకపోయినా పుట్టింట్లోనే ఉండిపోవాల్సిన కస్తూరి (మాక్కొంచెం నమ్మకమివ్వండి), ఎన్నికల్లో నిలబడి గెలిచి, తము తనుగా కాకుండా, రాజేంద్రరెడ్డి భార్యగానో, వీరరాఘవరెడ్డి కోడలిగానో మాత్రమే గుర్తింపుకు నోచుకున్న మాధవీ (గంగజాతర), పంచాయితీ ఎన్నికల్లో తన భర్త తప్పనిసరిగా ఓటమి అంచుల్లో ఉన్నాడని గ్రహించి, సానుభూతి ఓటుతోనైనా భర్తను గెలిపించాలని ఆత్మహత్యకు నెట్టివేయబడ్డ రాజేశ్వరి (రాచపుండు), తనతోపాటు తన చెల్లెల్ని కూడా పెళ్లి చేసుకొని, సుఖాలకు

ఈ

దూరమై, మరణ పర్యంతమూ భర్త వల్ల మానసిక హింనకు గురైన జయ (అక్కఈగ), తాగుడికీ, ముండలకూ సంపాదనంతా ఖర్చు పెట్టే భర్తను భరిస్తూ తన సొంత రెక్కలతో, అత్తనూ పిల్లల్నీ సాకి సంరక్షించే బుజ్జమ్మా (అడవిలో మొక్క), బతికినంత కాలమూ అత్తింట్లో అత్తకు అణకువైన కోడలిగా, భర్తకు బదులు చెప్పని భార్యగా నడచుకొని భర్త నిష్కరుణతో, కోడలి నిరాదరణతో, హిస్టీరిక్‌గా మారి, మంచంలో మరణయాతన అనుభవించిన సుఖవేణమ్మా (ఇల్లాలి సుఖం), తాగుడూ, పేకాటా మరిగి రోజూ ఆలస్యంగా వచ్చే భర్తను 'ఇంత ఆలస్యంగా వస్తున్నారేమిటి?' అని అడిగే హక్కును కోల్పోయి, జీవితమంతా నిరీక్షణలో భర్త కోసం జాగారం చేసే వసంతలక్ష్మీ (జాగారం)... ఇలా ఈ సంపుటిలోని ఎన్నో కథల్లో హక్కులు కోల్పోయిన భార్యలూ, అణచివేతకు గురైన (స్త్రీలూ, నిరాదరణతో క్షోభించే ఇల్లాళ్లూ, సుఖాలను అంతరంగాలలోనే దాచి పెట్టుకున్న యువతులూ, స్వేచ్చ కోసం పరితపించే అబలలూ, (ప్రాణశక్తులన్నీ కోల్పోయి జీవనోత్సాహం వశించి కట్టెలా మిగిలిపోయిన సుకుమారులూ, నిళ్ళబ్దాన్ని నిలువునా చీలుస్తూ ఆర్తనాదాలు చేస్తారు, గుండెలు పగిలేలా విలపీస్తారు, కన్నీటిచుక్క బయటకు కన్పించకుండా పెదవులపై నిర్జీవమైన మందహాసాన్ని ఒలికిస్తారు, అంతరంగంలో శాప వార్జాలు పెడతారు... ఆశ్చర్యమేమిటంటే ఎవరూ ఎక్కడా, ఎప్పుడూ ఆ దుర్గమారణ్యాలను బద్దలుకొట్టే ప్రయత్నమూ, ఆ చెరసాల ఇనుపచువ్వలను లాగిపారేసే దారుధ్యమూ, తమ జీవితాల్ని తమ చేతుల్లోకి తీసుకొనే తెగువనూ, ప్రదర్శించినట్టు పాఠకులకు పైపైకి కనిపించరు. (మాక్కొంచెం నమ్మకమివ్వండి' కథలో భారతి ఒక్కతీ మినహాయింపు), అయితే ప్రతి కథలోనూ రచయిత్రి కంఠస్వరం, పురుషాధిక్యతనూ, పితృస్వామిక అహంకారాన్నీ, మగవాడి బాధ్యతారాహిత్యాన్నీ. క్రూరత్వాన్నీ, దురన్యాయాన్నీ ప్రతిఘటిస్తూ ఖంగుమని ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆణచివేతకూ, దోపిడీకి, కుటుంబ హింసకూ, లైంగిక వివక్షకూ గురౌతున్న (స్త్రీల పక్షాన నిలబడి పురుష ప్రపంచాన్ని నిలవరిస్తుంది. మగవాడి కుసంస్కారంపై దాడి చేస్తుంది. ఆ(గ్రహంతో మండిపోతుంది. వ్యంగ్య అరిక్షేపాలతో చీలుస్తుంది. ఆసలు వ్యాయమేమిటో ధ్వవిస్తుంది. “ఇది పురుషాధిక్య ప్రపంచం. మగాడు ఏం చేసినా, ఏం చెప్పినా ఆడది తల వంచాల్సిందే (వా?)” “ఎక్కడయినా మొగుడు పెళ్ళాం కోసం వెన్నెల ముక్కల్ని ఏరుకొస్తాడా?” “బ్రతుకంతా (ప్రతినిమిషం పాటలాగ సాగాలి... పాటలాగా పాగుతుందా బ్రతుకెక్క డయినా, థూ వీయవ్వ...”

0

“వరుడి బతుకు నటనా... మొగుడి (ప్రేమ నటనా...”

“వద్దు వద్దు! ఇక జన్మజన్మలకు... ఏ జన్మలోనూ మొగుడిగా నువ్వు నాకొద్దు...”

“పెళ్ళి కాకముందున్న ప్రాణశక్తులు చిత్రంగా మారిపోయాయి”

“మగాళ్లు ఎక్కడయినా ఇంతే... తాము మొదటిబాతి వాళ్లం, భార్యలు రెండో జాతి

వాళ్లు.”

“ఏం ఆడదానికి మాత్రమే ఎందుకుండాలి? మగాడికక్కరలేదా పట్టూ విడుపులు...”

“యుద్ద విరామపు రాత్రులలో శవాలను వెదుకుతూ మౌనంగా రోదిస్తున్న ద్రాపదికి

వారసురాలిగా వుంటాను”

“అమ్మా! నీకీనాడయినా, కాలునొచ్చినా, కన్నునొచ్చినా, బ్వరమొచ్చినా వాడు పట్టించు

కున్నాడా?”

“అతడికి వీ శరీరంతోనూ, మనసుతోనూ ఆడుకోవడమైతే తెలుసుగానీ వీ గుండెల్లో

దుఃఖాన్ని చదవడం తెలీదు. దుర్మార్గుడు...”

ఇలా అనేక సన్నివేశాలలో, సందర్భాలలో రచయిత్రి స్వరం, పాత్రల గొంతుల మండీ

వ్యక్తమైన తీరూ, అధిక్షేపమూ, ఆ(గ్రహమూ కసీ, అనేకానేక (ప్రశ్నల్ని లేవనెత్తడమే

కాకుండా ఈ మగ (ప్రపంచం, ఎక్కడికి పయనిస్తోందన్న తీవ్రర్వనీ, పాఠకుల్లో కట్టలు

తెంచుకునేలా నింపుతుంది.

అయితే రచయిత్రి తన పాత్రల సమస్యలకు పరిష్కారాలనెందుకు ఇవ్వలేకపోయింది?

పాత్రలు తమ పరిధిని బద్దలుకొట్టినట్టుగా ఎందుకు చిత్రించలేకపోయింది? వెంటనే

కలిగే సందేహాలు ఇవి,

ఇక్కడే ఉంది రచయిత్రి కథానిర్మాణ కౌశలం. కథాశిల్ప వైదగ్ర్యం...

నిజానికి ఏ కథలోనైనా పరిష్కారాలు చెబుతూ, ముగింపు ఇవ్వటం చాలా సులువు

కూడా, కొత్తగా కలం పట్టిన ఏ కథకుడైనాా సమస్యనూ, పరిష్కారాన్నీ రెండు రెళ్ళు

నాలుగు అన్నంత సులువుగా చిక్కుముడి విడదీయగలడు... ('మాక్కొంచెం నమ్మక

మివ్వండి' అనే, తొలిదినాల కథలో (ప్రతిమ కూడా ఈ పనే చేశారు. ఈ కధల్లో కూడా

పరిష్కారాలు తటాలున చూపించే ముగింపులు ఇవ్వటం చాలా సులభమైన పని కూడా!

ఇల్లు విడిచి సూట్‌కిన్‌ చేతబట్టి నడిచినట్టుగానో, తాళి తెంచి మొగుడి ముఖాన కొట్టి

నట్టుగానో, కుటుంబ బంధాలన్నిటినీ పుటుక్కున వదిలించుకొని ఒంటరి ప్రయాణం

సాగించటానికి ఉద్యుక్తురాలైనట్నగానో ముగింపులు ఇచ్చి పరిష్కారాలు చెప్పటంలో శ

ఎంత సౌకర్యం ఉంటుందో, కాని అలాంటి లౌల్యానికి రచయిత్రి ఈ కథల్లో ఎక్కడా పాల్పడలేదు.

అమాయకులైన పాఠకులూ, విమర్శకులూ మాత్రమే కథల్లో పరిష్కారాలను అభిలషిస్తారు. కధానిర్మాణ కీలకాలూ, శిల్ప రహస్యమూ తెలిసిన వారెవ్వరూ కథల్లో పరిష్కారాలను హర్షించరు. అలాగని, తప్పని పరిస్థితుల్లో కథల్లో పరిష్కారాలు చెప్పటాన్ని కూడా, తప్పుగా భావించకూడదు. కథలో సమస్యలను చిత్రించే (క్రమంలోనే, సంఘర్షణల్ని, వైరుధ్యాల్ని వెల్లడిచేసే (క్రమంలోనే, సామాజిక వాస్తవాల్ని ప్రతిబింబించే (క్రమంలోనే, అందుకు అవసరమైన పరిష్కారాంశాలను తన కథన శిల్పం ద్వారా ధ్వనిలోనూ. వ్యంగ్యంలోనూ, అధిక్షేపంలోనూ, కథనునడిపే క్రమంలోనూ, ఆతి సహజంగా కథకుడు పాఠకుడికి అందిస్తాడు. పాఠకుడి ఆలోచనలకూ, ఉద్వేగాలకూ పని కలిగిస్తాడు. ప్రతిమగారి చాలా కథల్లో ఇవన్నీ అంతర్లీనంగా నిబిడీకృతం కావటం వల్లనే పరిష్కారాలు స్పష్టంగా బయటపడవు. అయితే అవి అందులోనే దాగి ఉంటాయి. కథారచన పట్టుపడటం వల్లనే రచయిత్రి ఈ కౌశలాన్ని సాధించగలిగారు.

ఈ సంపుటిలోని కథలన్నీ కూడా, స్రీలు కేంద్రకంగా, స్త్రీల దృష్టి మండే, రూపుదిద్దు కుంటాయి. స్త్రీల కోణం నుండే కుటుంబాన్నీ, పమాబాన్నీ వీక్షిస్తాయి. సహజంగా సున్నితమైన స్త్రీల భావజాలం విశ్లేషిస్తాయి. స్త్రీల పక్షానే జీవితదృష్టి ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతాయి. కుటుంబంలోని ఇల్లాలి అంతరంగాన్ని ఆవిష్కరించినా, రాజకీయాల కల్మషాన్ని ఎత్తి చూపినా, ఎన్నికల కుతం(త్రాల ఎత్తుగడల్ని ఎండగట్టినా, వస్తువ్యామోహ సంస్కృతిలోని డొల్లతనాన్నీ, మిథ్యా విలువల్నీ బయటపెట్టిన, రైతుల ఆత్మహత్యలను సామాజిక, వ్యావపాయిక సంక్షోభ పర్యవసానాలుగా నిరూపించినా, వేతపవివారల దయనీయ జీవన దృశ్యాలకు మూలకారణాలను అన్వేషించినా, ఇలా అన్నీ కూడా స్రీ దృక్కోణం నుండే సాక్షాత్కరింప చేయటం ఈ కథల విశిష్టత! (ప్రధానంగా ఈ కథలు స్త్రీల జీవితాలకు సంబంధించినవే అయినప్పటికీ, అంతకు మించిన విశాల పరిధి కూడా వీటికి ఉంది. ఈమధ్యకాలంలో పెచ్చు పెరిగిపోయిన వస్తు వ్యామోహ దాహం. మానవ సంబంధాలలో డబ్బు కీలకపాత్ర వహించటం, అభిమానాలూ, ఆప్యాయతలూ (క్రమంగా అంతరించిపోవటం, పల్లెలకూ పట్టణాలకూ అంతరాలు పెరిగిపోవటం, రాజకీయాలలో, ఎన్నికలలో స్వార్థం, అధికారదాహం పెరిగి, విలువలు నళించిపోవడం, వ్యవసాయ సంక్షోభ కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం, వేతవృత్తులు చితికిపోవటం, ఇలాంటి ఎన్నో సామాజిక ఆర్థిక పరిణామాలను కూడా ఈ కథలు పపిగట్టగలిగివాయి. ఈ అన్నింటినీ కథారూపంలో ఇమిద్చటానికి, కథల ఎత్తుగడ, నడక, ముగింపు, ఏకసూత్రత, క్లుప్తత, కంఠస్వరం లాంటి కథా నిర్మాణ

న

సూత్రాలను, చాలా జా(గ్రత్తగా గడుసుగా వాడుకోవడం, రచయిత్రి కథారచనలో పాధించిన పరిణతిని సూచిస్తాయి. దళాబ్దకాలానవికి పైగా తెలుగు కథానికలో విస్తరించిన (స్త్రీవాద భావజాల ప్రభావం కూడా రచయిత్రిపై ఉన్నది. అయితే తన కథల్లో చర్చలు, వాదనలు, ఉపన్యాసరూపాల్డో, పనిగట్టుకొని వాటిని పెట్టి శిల్ప్బభంగానికి పాల్పడకపోనటం రచయిత్రి నైపుణ్యం. తాను స్వీకరించిన కధావస్తువులోనూ, పా(త్రచిత్రణలోమా ఆ భానజాలం విడదీయరానంతగా అంతర్లీనం చేయటం ద్వారా, ఆ స్ఫూర్తిని కలిగించటం రచయిత్రి చాతుర్యం. ఇందుకు అసలైన కారణం కథలన్నీ జీవితం నుండీ పుట్టుకొచ్చినవి కావటం! వాదాల కోసం అల్లినవి కాకపోవటం! బహుకోణాల నుండీ జీవితాన్ని అర్థం చేసుకునే క్రమంలో నిర్మితమైనవి కావటం. అందువల్ల ఈ కథలు పాఠకుడి మనసుపై ఆలోచనలపై, ఉద్వేగాలపై, సంస్కారంపై, గొఢమైన ముద్ర వేయగలవని నేను నమ్ముతున్నాను.

అనంతపురం, 6-3-2004

న

ఈ సయుదిలో కటు.

1 మాక్కొంచం నమ్మకమివ్వండి అ కేర్‌

ఓ ఇల్లాలి సుఖం 2

ఇ. నెత్తుటి గులాబి అ 37

4 శిథిలాలు అ శ్‌

ర్‌ బతుకు భాగహారం ఆ కర్‌ ఈ. నాన్నకో ఉత్తరం ఆ ర్‌ 7. అక్క ఈగ వ న & గతుకు జ 79 కి జాగారం అ €7 10%... ఈవ్‌ మళ్ళీ చచ్చిపోయింది ఒం 97 11 సర్పదోషం జ కేర్‌ 12 అడవిలో మొక్క ఆం [13 13. గంగజాతర అ 123 14 పొదరిల్టు అ 137 15. రాచపుండు అ కటి 14 హాలాహలం అ 157 17 పాలెగూడు అ. 167 18 పక్షి ఆ. 81

షా!

మాక్కొంచెం నమ్మకమివ్వంది

కక,

వదినా నా పింక్‌ కాటన్‌ చీర ఐరన్‌ చేయమన్నాను చేసిపెట్టావా?” బాత్‌రూమ్‌లో నుండే కేకేసింది సరోజ,

“నిన్న కరెంటు లేదు... ఉదయం నుంచీ చూస్తు వ్నావుగా, చెయ్యి తీరకలేదు” ఇడ్లీలు తీసి గిన్నెలో సర్దుతూ చెప్పింది భారతి. మనసు కన్నీళ్ళు కారుస్తోన్నా ఆమె పెదవులు మాత్రం నవ్వుతూనే వున్నాయి.

“ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి కాలేజీకి” మరో కేక.

“రాత్రి కరెంటు లేకపోడమేంటి? పదింటికి వచ్చిందిగా చేసిపెట్టి పడుకోకూడదూ... ఉదయం నుండీ ఏదో చాకిరీ చేసేస్తున్నట్లుగా పెద్ద ఫోజు” సాధిస్తున్నట్లుగా అంది అత్తగారు. అప్పుడే వంటగది గుమ్మంలోకి వచ్చిన భర్తని చూసింది భారతి. ఆమె కళ్ళు అతడి సాను భూతి కోసం ఎదురు చూస్తున్నట్లుగా వున్నాయి.

కానీ ఆతడిదేమీ పట్టనట్లుగా ఆమె మీద చిరాకు పడ్డాడు.

క్‌!

“యింకా ఏం చేస్తున్నావు? ఏమిటింత ఆలస్యం? త్వరగా చేయడం చేతకాకపోతే ఓ గంట ముందు లేవడం అలవాటు చేసుకోవాలి... ఛీ! ఎప్పుడో పాతరాతి యుగంలో పుట్టాల్సిన దానివి. కొంచెంకూడ స్పీడు లేదు” విసుక్కున్నాడు. దెబ్బతిన్న ఆమె హృదయం మెదడుకు నంకేతం పంపి కళ్ళను అతడి వంక తిరగేలా చేసింది.

“ఉదయం నుండీ కరెంటు లేకపోవడంతో చెట్నీ చేత్తో రుబ్బుకొచ్చానండీ' అంటూ చెప్పలేదామె. 'రాత్రిళ్ళు మీరు ఒంటిగంటకు కాకుండా కాస్త ముందు రావటానికి ప్రయత్నిస్తే నేను త్వరగా పడుకుని యింకా కొంచెం ముందు లేవడం నేర్చుకుంటానండీ' అంటూ నిష్ణురపడలేదామె. అయితే భారతి లోపల వున్న భారతి మాత్రం భారతిని తెగ కోప్పడు తోంది. మరీ అంత సహనంగా వున్నందుకు.

చివరికి భారతే గెల్బింది. మౌనంగా భర్తకి యిడ్డీ వడ్డిస్తోందామె. లోపలి భారతి ముడుచుకుపోయింది. సాధారణంగా ఈ లోపలి భారతి విప్లవాత్మకంగా భారతితో పోట్లా డినా ప్రతీసారి తానే ఓడిపోయి ముడచుకుపోతూంటుంది. హద్దులు లేని భారతి సహనాన్ని తిట్టుకుంటూ వుంటుంది.

“అమ్మాయ్‌ భారతీ! వడ్డించేస్తావా పదయిపోయింది” మామగారి హడావుడి,

“ఆ అప్పుడే మీకు వడ్డించి వుంచింది. మీరు రావడమే తరువాయి” ముందరింట్లో కాళ్ళు బార్లజాపుకుని. ఆవేల్చి పేపరు తిరగేస్తూ అత్తగారు ఓ విసురు విసిరింది. ఆమె అలా తీరిగ్గా కూర్చుని పేపరు చూడకపోతే కనీసం భర్తకి వడ్డన కార్యత్రమం చూడొచ్చుకదా మళ్ళీ లోపలి భారతి నిద్ర లేచింది.

అవిడ నోరు నొక్కి - “ఒక్క క్షణం మామయ్యా... అయిపోయింది వచ్చేన్తున్నాను” హడావిడిగా భర్తకి మంచి నీళ్ళందిన్తూ జవాబిచ్చింది భారతి.

“ఏవిటొక్క క్షణం... నేను షాపు ఓనర్ని కాదమ్మా... గుమస్తాని. ఇంకా ఆలస్యంగా వెళితే నన్నక్కడ మాలవేసి ఆహ్వానించరు. అయినా త్వరత్వరగా వంట చేయడం రాకపోతే ఎలా?” విమరుగా బయటిళళ్ళి పోయాడతడు భోజనం చేయకుండా. అత్తగారు తనవేపే కోపంగా చూస్తోంది.

హతాశుతురాలైంది భారతి.

“వెళ్లే వెళ్ళాడులే ఒక్కరోజు కడుపు మాడిందంటే రెండో రోజిలా వినగ్గా వెళ్ళడు” లోపలి భారతి ఉవాచ.

వీరరాఘవులు ఓ బట్టల కొట్లో గుమస్తాగా పనిచేన్తున్నాడు. తాను ఇంటా, బయటా ఎక్కడా ఎవరి మీదా చూపించలేని అధికారాన్నీ, అజమాయిషీనీ యింటి కోడలి మీదా, అప్పుడప్పుడూ కొడుకు మీదా ప్రదర్శిస్తూ వుంటాడు. భార్య అతడిని ఎప్పుడూ లెక్కచేయదు. ఆ అనహనమే కోడలి మీద చిరాకుగా మారుతుంటుంది అతడిలో.

“అమ్మానా క్యారేజీ సర్లేశావా?” ఆరేళ్ళ కొడుకు పిలుపులాంటి అరుపు. గర సాలా వినకమిస్తండ్శ్యి

పక్షి శి మి. ప్రతిన కథలు

“ఇదుగో నాన్నా అయిపోయింది” అప్పుడు కూడా నహనాన్ని కోల్పోలేదామె

“అమ్మా నువ్వెప్పుడు లేటే... న్కూలుకి ఒక్క రోజు కూడా నేను టైముకి వెళ్ళడం లేదు”

అప్రతిభురాలై కొడుకుని చూసినా మరుక్షణంలో నవ్వేసింది భారతి.

అరవై ఏళ్ళవాళ్ళే ఆమె పని ఒత్తిడినీ, రణరంగంలాంటి ఆ వంటగదినీ, ఏ మాత్రం 'సైనిక నవాయం లేకుండా ప్రపంచయుద్దాన్ని ఎదుర్కుంటున్నట్టుగా వున్న తన స్థితినీ అర్ధం చేసుకోలేనప్పుడు ఆఫ్టరాల్‌ ఆరేళ్ళ పిల్లవాడు... వాడు తనని అర్థం చేసుకోలేదని వాపోవడంలో అర్ధం లేదన్పించింది భారతికి. అందుకే ఆమె నవ్వింది.

అమ్మ నవ్వులో నుండి ముత్యాలు రాలిపడ్డట్టగా అన్పించింది అళోక్‌కి,

అమ్మ చాలా అరుదుగా నవ్వుతుంది. కారణాలు తెలుసుకుని విశ్లేషించే వయసు లేకపోయినా అమ్మ నవ్వంటే వాడికిష్టం. అందుకే తృప్తిగా వెళ్ళిపోయాడు!

“వదినా ఈ రోజు నేను రాను మధ్యాహ్నం. ప్రొద్దుటే చెప్పాను కదా నాకూ క్యారేజీ సర్దలేదా” రెండు ప్లేట్లలో తనకీ, తల్లికీ యిడ్డీ పెట్టుకుంటూ ప్రళ్ళించింది నరోజ,

“ఏం తల్లీ వండివార్చి పెట్టాక క్యారేజీ సర్దుకోవడం కూడా బద్దకమేనా?' లోపలి భారతికి మళ్ళీ మెలకువ వచ్చింది.

“వేను విన్లేదమ్మూ సరోజా ఎప్పుడు చెప్పావు?” తను చీర యిస్తీ చేయనందుకు శిక్షగా మొన్న పండక్కి అమ్మ పంపిన కొత్త చీర మాటవరసకయినా తనకి చెప్పకుండా కట్టేసుకున్న మరదలినే చూస్తూ ప్రశ్నించింది భారతి.

“ఇప్పుడు చెప్పాగా సర్దకుండా ఆ ప్రశ్నలేవిటి”

“నువు టిఫిను తినేలోగా పెట్టేస్తానమ్మా”

“మామగారిని అభోజనంగా పంపించింది. నువ్వూ క్యారేజీ తీసుకోకుండా వెళ్ళి పోయినట్లయితే దానికేవిటమ్మా బాధ, నా కడుపు రగులుకుపోతుంది కానీ” కూతురి ఈల నిమురుతూ భర్త మీద అపారమైన ప్రేమను వ్రదర్శించింది అత్తగారు.

“నువ్వసలు మనిషివేనా? సిగ్గుందా అసల్నీకు?' లోపల్పుండి భారతి మళ్ళీ పైకి లేచింది ఆడనాగులా.

మౌనంగా క్యారేజీ సర్ది సరోజను పంపించింది భారతి.

శ శః శ్ష

“అబ్బాయి అయ్యప్పస్వామి మాలవేసుకుంటున్నాడు.. ఇంట్లో శుచిగొనూ, మడి గానూ వుండాలి...నీకు బయటుండే సమయమేమొ. మాత్రలూ అవీ ఏదో వుటాయటగా... తెప్పించుకుని వేసుకో. మళ్ళీ చెప్పలేదనుకునేవ్‌?” మీదపడి కొడుతున్నట్లుగా వున్నాయా మాటలు. మృదువుగా మాట్లాడ్డం అత్తగారికి అలవాటే లేదు.

ఛైగాళచం నమ్మకమివ్వండి గగ పక్షి 9 వ. ప్రతిమ కథలు

భారతి మనసు బాధతో మూలిగింది.

“ఆయన అయ్యప్పస్వామి మాల వేసుకుంటున్నారా? ఒక్కమాట తనతో చెప్పాచ్చు కదా... తన భర్త మాల వేసుకుంటున్నట్లుగా మూడో వ్యక్తి ద్వారా వినడం... మనసు చివుక్కుమంది.

అయితే ఇప్పటి ఆమె సమన్య పెద్ద గీత ముందు చిన్న గీతగా భర్త తనని చేసిన నిర్లక్ష్యాన్ని చెరిపేసింది. భారతికి నెలసరి వచ్చి నెలమీద పదిరోజులు అయింది. నెల తప్పిందేమోనని అనుమానంగా వుందామెకు. భారతికి ఆడపిల్లలంటే చాలా యిష్టం.

స్త్రీగా జన్మించినందుకు 'ఆడదై పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం మేలు' అన్న సామెతను తన జీవితం బుజువు చేసినా చిత్రంగా భారతికి మళ్ళీ ఆడపిల్లే శావాలని వుంది. అందుకే నెలమీద నాలుగురోజులు గడిచినప్పటి నుండీ బుల్లి పట్టలంగా, జాకెట్టు వేసుకుని బుడిబుడి నడకలతో తనవైపు వచ్చే చిన్ని పాప ఆలోచనలతో అమె మనసు మూలుగుతోంది తియ్యతియ్యగా.

ఇప్పుడు తను నెల తప్పినట్లా? లేనట్టా?

అత్తగారు చెప్పినట్లుగా మాత్రలు వేసుకోవడమా, వేసుకోకపోవడమా? ఆలోచించి మానివేయడాన్నే సమర్దించిందామె మనను.

అయితే భారతి సహనాన్ని, జీవితొన్నే సవాలు చేస్తున్నట్లుగా ఆ తరువాత నాలుగు రోజులకే బయటుంది భారతి. ఆమె గుండె పగిలిపోయింది. ఆడపిల్ల పుట్టనందుకు కాదు. భర్త మాల వేసుకుని వుండగా బయటున్నందుకు... భయంతో వణికిపోయిందామె.

“వా మాటంటే ఎంత నిర్లక్ష్యమే నీకు?” గద్దించింది అత్తగారు.

“ఇందులో నా తప్పేముందత్తయ్యా? నేను మాత్రమేం చేయగలను చెప్పండి” అమాయకంగా ప్రల్నించింది భారతి.

“అవునే! ఇందులో నీ తప్పేమీలేదు. ఆంతా వా తప్పే నేను నీకు ముందే చెప్పలేదూ మాత్రలూ, గట్రా వాడుకోమని. నా మాట పెడచెవిని పెట్టింది చాలక “ఇందులో నా తప్పే ముందత్తయ్యా' అంటూ ప్రళ్నిస్తున్నావా నంగనాచిలా, ఎంత ధైర్యమే నీకు?” ఉగ్రురాలై పోయిందావిడ.

“అత్తయ్యా! మీరు చెప్పి నాలుగైదు రోజులే కదా అయింది. అప్పట్టుండీ వాడినా ప్రయోజనం టేకపోయింది. వాకు ఆయన ముందే చెప్పివున్నట్లయితే బావుండేది మాల వేసుకుంటున్నట్లుగా” అబద్దమే అయినా “ప్రాణ, మాన... బొంకవచ్చు నధిపా' అన్న నానుడిని జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంగానే చెప్పింది భారతి.

“ఏవిటీ! వాడు నీకు ముందే చెప్పి వుండాల్సిందా? అవునూ నువ్వు మవోరాణివి కదా. * అనుమతి లేందే మాల వేసుకోడం తప్పేమరి... అందుకని కొవాలనే ఈ పని చేస్తావా? గ్రని వన్వకమిత్యండి

పక్షీ * మి. ప్రతిను కథలు

నీ నిర్లక్యం రోజురోజుకీ మితిమీరిపోతోంది. అయ్యప్పస్వామి యింట్లో వుంటే నామాట పెడచెవిని బెట్టి నువు బయట చేరుతావా? పైపెచ్చు నేను మాత్రలు వాడానూ అంటూ అబద్దమాడుతావా? నువ్వు బుద్దిలేక చెప్పినా నేను నమ్మొద్దూ.”

రోజంతా ఆమె సాధింపు కొనసాగుతూనే వుంది అదేదో పెద్ద నేరం చేసినట్లు తన మీద ఉన్నవీ లేనివీ కల్పించి ఇరుగుపొరుగు వారికి చెప్తూనే వుందామె. భారతికి అర్ధ మయింది, అదేదో ప్రళయంగా మారేట్లుందని.

“నన్ను క్షమించండత్తయ్యా” భారతి ఆంధ్రదేశపు ఆడవడుచు. తన తప్పేమీ లేని చోటయినా క్షమాపణ కోరడానికి ఏ మాత్రం వెనుకాడని స్త్రీమూర్తి, నర్దుకుపోవడమే జీవిత పరమావధిగా నమ్మి బ్రతుకుతోన్న ఉత్తమ యిల్లాలు. అప్పటికే మావయ్య మండిపడుతున్నాడు.

“ఇందులో క్ష్రమించడానికేమీ లేదు. నువు వెంటనే ఇల్లు విడిచి వెళ్ళు. భర్త పూజ కోనం ఏ మాత్రం సహకరించని దానివి నువు కాపురమేం చేయగలవు? వెళ్ళు... వెళ్ళిపో... ఎక్కడికెళతావో నీయిష్టం.. ఇక నువు రానవసరం లేదు ఎప్పటికీ” మామగారు తాను ఆ యింటి యజమానినని హఠాత్తుగా గుర్తుచేసుకున్నట్లుగా వున్నారు. అధికారాన్ని ప్రదర్శించారు.

అప్రతిభురాలై పోయింది భారతి. తాను చేయని తప్పుకు యింత పెద్ద శిక్షా? ప్రళయం ఒక్కసారిగా ముంచుకు వచ్చి తనను భూమిలోనికి నెట్టివేస్తున్నట్లుగా తోచింది భారతికి. హఠాత్తుగా ఆమెకు గుర్తుకొచ్చింది మామగారిలో పెళ్ళినాడే కనిపించిన కట్న కానుకల ఆశ. కట్నకానుకల విషయంలో రాక్షసుడతను - కొడుకుకి రెండో పెళ్ళి చేస్తే కట్నం కానుకలు మళ్ళీ వస్తాయన్న ఆశ అతనికుంది. చాలాసేపటి తర్వాత నోరు విప్పిందామె.

“మామయ్యా మీరు కూడానా! ఇందులో నా తప్పేమీ లేదని తెలిసినా నన్ను వెళ్ళి పామ్మంటున్నారా? ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే వెళ్ళిపోతాను. ఇక్కడుండి స్వామి మడికి భంగం రానివ్వను. కానీ... కానీ స్వామి కొండకి వెళ్ళిన తర్వాత వస్తాను మామయ్యా” ప్రాధేయపడింది భారతి.

“ఆ! అదండీ సంగతి. స్వామి యింట్లో వుంటే బోలెడంత పని వుంటుంది కదా... తెల్లవారురూమునే లేచి స్నానం చేయడం, స్వామి పూజలూ, స్వామికి వేరేగా వంటా యిదంతా బోలెడంత పని కదా అందుకని ఈ వేషం వేసింది. ఆ పని ఎగ్గొట్టడం కోసం యిలా పుట్టింటికి వెల్తోంది. సిగ్గులేకపతే సరి... పైగా స్వామి వెళ్ళాక వస్తుందట” అబాంఢం వేసింది అత్తగారు.

“అత్తయ్యా! కాదత్తయ్యా! పనికోసం కాదిలా” బాధగా చెప్పింది భారతి.

“ఇంక మాటలనవసరం వెంటనే బయల్దేరి వెళ్ళు బయటికి” లోపల్నుండి భారతి సూట్‌కేస్‌ తెచ్చి బయటికి విసురుతూ చెప్పాడు వీరరాఘవులు.

“ఇక నువు రావటానికి వీల్లేదు” శాసించింది అత్తగారు “ఇప్పటికయినా మా యింటికి పట్టిన పీడ విరగడవుతుంది! అంతే చాలు మాకు”

ఈ బాకళచం నమ్మకమివ్వంది ణా పక్షి క మి, ప్రతిను కథలు

మాల వేసుకున్న స్వామి యింట్లోనే వుండి గంట నుండీ జరుగుతోన్న వాద సం వాదాల్ని వింటూనే వున్నాడు. తండ్రి ఆమెను ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మనడం కూడా తెలుస్తూనే వుంది. అయినా స్వామి పెదవి విప్పలేదు. మాల వేసుకున్నపుడు స్వామి కోపం తెచ్చుకో కూడదు కదా అందుకని. కోపాన్ని అణచుకోవడం కోసం పిగరెట్బ కాలుస్తూ పెరట్లోనికి వెళ్ళిపోయాడు 'స్వామి'.

అంత రాత్రి వేళ ఆడదాన్ని, అందునా ఏకవస్తని, యింటి నుండి తరిమివేస్తే గానీ అయ్యప్పస్వామి మీది భక్తి నిరూపింపబడలేదా యింట్లో.

ఆ అర్ధరాత్రి నిద్రపోతున్న కొడుకుని లేపాలన్న ఆలోచన కూడ లేకుండా, రుద్ర వీఐలు విషాద గీతాలాలపిస్తోన్న వేళ భయంకరంగా వున్న చిక్కటి చీకటిలో భయమన్న పదాన్నే మర్చిపోయి నిరామయంగా, మూగ(పేక్షకురాలిలా వెళ్ళిపోతోన్న భారతిని చూసి భరతమాత సిగ్గుతో తలవంచుకుంది.

శ్ష శు శ

హఠాళ్తుగా అంత తెల్లవారురూమున వచ్చిన భారతిని చూసి మొదట ఆశ్చర్య పోయినా తరువాత సంతోషపడ్డారు కుటుంబం సభ్యులంతా.

“ఏవిటమ్మా భారతీ! ఆయన మాల కూడ వేసుకున్నాడేమో కదా. ఇప్పుడు నిన్ను రావిచ్చారా?” ఆతృతగా ప్రశ్నించింది పార్వతమ్మ.

“నేను బయటున్నానమ్మా! స్వామి యింట్లో వున్నాడు కదా... అందుకని” చెప్పింది వారతి ఉబికి వస్తోన్న కన్నీళ్ళనాపుకుంటూ.

భారంగా నిట్టూర్చాడు ఆనందరావు. ఆయన స్టేట్‌ బ్యాంక్‌లో క్షర్కుగా పని చేస్తున్నారు. ఏద్దలు సంపాదించిన ఆస్థిపాస్టులేమీ లేకపోయినా తన సంపాదనలోనే ఎంతో కష్టపడి ఇద్దరి కూతుళ్ళకీ పెళ్ళిళ్ళయినా యన్సించాడు.

మూడునెలలుగా చిన్నకూతురు ప్రసవించి యింట్లోనే వుంది.

హఠాత్తుగా యిలా పెద్దకూతురు ఊడిపడడంతో అతడి హృదయం వణికింది, ఏమైందోనని. మధ్యతరగతి జీవితావేశంతో. ఏమీలేదని తెల్సుకుని భారంగా ఊపిరి పీల్చు కున్నాడాయన.

“పెద్దమ్మా” పరిగెత్తుకుంటూ వచ్చి కావలించుకుంది కస్తూరి పెద్ద కూతురు శ్రావ్య. “అప్పుడే నిద్రలేచావురా” అంటూ ఆత్మీయంగా పైకెత్తుకుంది భారతి.

హఠాళ్తుగా అళోక్‌ ఆలోచనలు గొంతుకడ్డం పడ్డట్లుగా అన్పించాయామెకు.

“అళోకన్నయ్య రాలేదూ?” ముద్దుముద్దుగా ప్రశ్నించింది శ్రావ్య.

“స్కూలుంది కదూ అందుకని రాలేదు” చెప్పింది. చపానా!

భారతి మెడ చుట్టు చేతులు వేసి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుందా పాప. 'పెదతల్లి కన్పించిన ఆనందాన్ని దాచుకోవాలన్న ప్రయత్నమేమీ చేయలేదా పని హృదయం,

భారతి మనసులో ఎంతో ఊరట కలిగినట్లయింది. హఠాత్తుగా ఆమె హృదయం గాలిలో తేలిపోతున్నట్టుగా అన్పించింది.

“ఏవిటీ పెద్దమ్మను లోపలికి రానివ్వవేమే?” కూతుర్ని కోప్పడింది కస్తూరి.

“ఏం కస్తూరీ ఆరోగ్యం బావుందా?”

“బాగానే వుందే” కస్తూరి ముఖంలో నీలినీడలు క్షణకాలం భారతిని కదిలించాయి.

“పెద్దమ్మా! అమ్మకి చెల్లి పుట్టింది తెలుసా” ఇంటి లోపలి మరో వ్యక్తి ఉనికిని గుర్తు చేసింది శ్రావ్య.

అంతా ఫక్కుమన్నారు.

“చెల్లి పుట్టింది నీకు శ్రావ్యా” నవరించింది భారతి.

“పుట్టింది అమ్మకే కదా” ఆ చిన్ని బుర్రలో లా పాయింటు.

టిఫిన్లూ , కాఫీలు అయి తండ్రీ బ్యాంక్‌కి వెళ్ళింతర్వాత తల్లి వంట చేస్తూండగా చెల్లి కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించింది భారతి.

“కస్తూరీ పాప పుట్టి మూడునెలలయింది కదూ! నువ్వెప్పుడు వెళ్తున్నావు ఆయన దగ్గరికి”

మౌనమే సమాధానమయింది.

“కస్తూరీ! మీ ఆయన రాలేదా?”

కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా తలవంచుకుంది కస్తూరి.

“ఏమైంది చెల్లాయ్‌!” చెల్లిలి భుజం మీద చేతులు వేసి ప్రేమగా వ్రల్నించింది మళ్ళి.

“అక్కా పాప పుట్టడం నా తప్పా? కొడుకు పుడ్తేనే కానీ రావద్దని ముందే చెప్పి పంపారు. శ్రావ్య పుట్టినప్పుడే గొడవైంది. నాన్న వెళ్ళి కాళ్ళావేళ్ళా పడ్డంతో అప్పుడేదో మొదటిసారి కాబట్టి నా తప్పు క్రమించేశారు. ఇప్పుడు ముందే చెప్పేశారు. ఈసారి కూతు రైతే తిరిగి రావాద్దని. పాప అని తెలియగానే నాకు స్పృహ తప్పినంత పనైంది. అమ్మా, నాన్నా యిద్దరూ వరేసరి కృంగిపోయారు. నాన్న వెళ్ళి ఎంతో చెప్పిచూశారు. ఆఖరికి ఆ రెండో పాపని మేము వుంచుకుంటామని కూడా ప్రాధేయపడ్డారు నాన్న”

“ఏమన్నారు?”

“ఏవంటారక్కా! తెలిసిన వాళ్ళక్రైతే తెలియజెప్పాచ్చు, అనలే ఏమీ తెలీకపోయినా తెలియజెప్పాచ్చు... తెలిసీ తెలీని మూర్చులకి ఎవరు మాత్రం ఏం చెప్పగలరు? మూర్థంగా నాన్నను గెంటేశారు. ఈసారి మాత్రం మీ అమ్మాయి కొడుకువి కంటుందని నమ్మక మేమిటి? నాకొద్దు విడాకుల కాగితాలు పంపిస్తాను సంతకం చేసి పంపండి” అన్నారట. మా అత్తగారు కూడా ఆయనకు తోడైంది. మామగారు చెప్పినా వీళ్లు వినరు. అక్కడ్డుండి వచ్చాక నాన్న

ఈళచం నమ్మకమివ్వండి ల్లా పక్షి* మి ప్రతిను కథలు

మరీ కృంగిపోయారు. నాక్కూడా ఏదో తప్పు చేశానన్న భావం... ఒక్కోసారి చచ్చిపోదామని కూడా అన్సింస్తోందక్కా” అక్క ఒడిలో తలదాచుకుని బావురుమంది కస్తూరి. చెల్లి తల మీద చేతులు వేసి నిమురుతూ నేత్రాంచలాలలో ముత్యాల్లా నిలచిన కన్నీటి బొట్లని కొనగోటితో చెరిపేసుకుని నిటారుగొ అయింది భారతి.

చెల్లెలని ఓదార్చే ప్రయత్నమేమీ చేయలేదామె. ఏడవన్విడమే మంచిదన్సించింది భారతికి.

జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్ల్టుగా వుంది భారతికి. ఇప్పుడు యిలాటి పరిస్థితుల్లో తన విషయం తల్లిదండ్రులకు తొందరపడి చెప్పకూడదని నిర్ధారించుకున్న దామె. భారతి యిక తిరిగి వెళ్ళదని తెలిస్తే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదనుకుంటారు వారిరువురూ.

“అక్కా! నువ్వు చెప్పు ఇందులో నా తప్పేమైనా వుందా?” ఏడుస్తూ ఏడుస్తూ సగంలో ఆపి మౌనంగా వున్న అక్కని అనుమానంగా చూస్తూ ప్రశ్నించింది కస్తూరి.

“ఛ...ఛ లేదు కస్తూరీ... ఇందులో నీ తప్పేమీలేదు. తప్పంటూ ఏదైనా వుంటే ఈ పురుషాధిక్య ప్రపంచానిది... తప్పంటూ ఏదైనా వుంటే పూర్తిగా నీ భర్తది” ఖచ్చితంగా జవాబిచ్చింది.

ఆశ్చర్యంగా అక్కవైపు చూసింది కస్తూరి.

“అవును కస్తూరీ! ఏదైనా తప్పంటూ వుంటే అది పూర్తిగా మీ ఆయనదే అంటే మగాడిది. అవును పురుష బీజకణంలో వున్న 'వై' శ్రోమోజోముది.”

“అంటే ఏంటక్కా?”

“స్తీ అండంలో కేవలం '“ఎక్స్‌' క్రోమోజోము మాత్రమే వుంటుంది. పురుషుడిలో అలా కాకుండా కొన్ని వీర్యకణాల్లో 'వై' వుంటుంది. స్తీ పురుష నంయోగంలో పురుషుడి తాలూకూ 'ఎక్స్‌' క్రోమోజోము వున్న వీర్యకణం ద్షీని చేరుకుంటే స్త్రీలో వున్న 'ఎక్స్‌'తో కలిసి “ఎక్స్‌ ఎక్స్‌' అవుతుంది. అప్పుడా దంపతులకి ఆడపిల్ల పుడుతుంది. అలా కాకుండా పురుషుడిలోని 'వై' వున్న వీర్యకణం స్త్రీని చేరుకుంటే ఆమెలో వున్న 'ఎక్స్‌'తో కలిసి “ఎక్స్‌ వై అవుతుంది అప్పుడు మగపిల్లవాడు పుడతాడు... మీ ఆయనలోని 'వై' క్రోమోజోమ్‌ కాకుండా తన 'ఎక్స్‌' క్రోమోజోమ్‌ మాత్రమే నిన్ను చేరుకుని వుంటుంది... ఇందులో నీ బాధ్యతేముంది? అందుకే అన్నాను ఏదైనా తప్పంటూ వుంటే మీ ఆయనదేనని” చిరు నవ్వుని మొహంమీదికి తెచ్చుకుంటూ వివరించింది భారతి.

ఆమె కాలేజీ చదువులు చదవలేదు. జెనెటిక్స్‌ నేర్చుకోలేదు. అయిన చిన్ననాటి నుండీ ఆమెతో పాటే నడిచి వచ్చిన సాహిత్యాభిలాష ఆమె చేత ఎన్నో ఎన్నెన్నో పుస్తకాలు చదివించింది. ఆ పుస్తకాల్లో జీవితాన్ని చదువుకుంది. అందుకే అంతటి సహనం. ఎంతటి బాధనైనా నిబ్బరంగా ఎదుర్కునే గుండె ధైర్యం. దద ిమనసుాం

ఆరాధనగా భారతినే చూస్తొంది కస్తూరి.

“అక్కా ఆ తప్పు నాది కాదంటే వాళ్ళు ఒప్పుకుంటారంటావా”

జాలిగా చెల్లెల్నే చూస్తూ నవ్వింది భారతి.

“పిచ్చి కస్తూరీ! యమ్‌.ఎస్సీ, చదివి కాలేజీలో లెక్చరరుగా వుద్యోగం చేస్తోన్న అతడికీ విషయం తెలీదంటావా? ఇది పురుషాధిక్యస్వామ్య ప్రపంచం. మగాడు ఏం చేసినా, ఏం చెప్పినా ఆడది తలనంచి వుండాల్సిందే, బాధగా అన్నది భారతి.

“ఏం చేస్తున్నారే యిద్దరూనూ, పాప అలా గుక్కపట్టి ఏడుస్తూంటే” పార్వతమ్మ వంటగదిలో నుండి కేక పెట్టడంతో యిద్దరూ ఈ లోకంలోకి వచ్చారు.

శు శ శ

వారం రోజుల తరువాత -

“అమ్మా భారతీ, ఇంకేమ్మా అబ్బాయి ఇబ్బంది పడ్తుంటాడేమో మాల కూడ వేసుకున్నాడేమో కదా, నువ్వు ఇక్కడ వుండడం మాకేమీ భారంకాదు. అంతగా కావాలను కుంబే ఆయన కొండకి వెళ్ళేక వచ్చి వుందువుగాని” అనునయిస్తూ అన్నాడు ఆనందరావు,

ఒక్కక్షణం తటపటాయించినా “వేను వెళ్ళడం లేదు నాన్నా” ఖచ్చితంగా తన నిర్ణయాన్ని తెలిపింది భారతి.

“అదేం మాటమ్మా?”

“నాన్నా! మీరు నిబ్బరం తెచ్చుకోవాలి” అంటూ జరిగిందంతా చెప్పుకొచ్చింది భారతి.

“చూడు భారతీ! ఏదో ఆవేశంలో నిన్నలా వెళ్ళిపామ్మన్నారేమో కానీ అబ్బాయి కొండ నుండి తిరిగొచ్చాక తప్పకుండా నీకోనం వస్తాడమ్మా, నాకా నమ్మకముంది అనవ సరంగా శొందరపడి నిర్ణయాలు చేయకు” అల్లుణ్ణి సమర్థిస్తూ కూతుర్ని మందలించింది పార్వతమ్మ,

“అమ్మా! అతడు రావాచ్చుకానీ నేనే వెళ్ళనమ్మా! వెళ్ళకూడదని నిర్ణయించు కున్నాను.”

“వైళ్ళొద్దే యిద్దరూ వెళ్ళకండి... అవమానంతో మేం లోకం ముందు తలొంచు కునేలా చేయండి... ఇక రేపట్నుండి “ఇద్దరూ యింట్లోనే వున్నారా?' అంటూ అడిగే వాళ్ళకి నేనేమని సమాధానం చెప్పను” కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అన్నది పార్వతమ్మ అసహాయతతో.

“ట్రాంద్రరపడకు భారతీ” అంటూ అనునయించాడు ఆనందరావు.

నాన్నా! మీరెప్పుడూ అనేవారు నేను చాలా సహనవంతురాలినని. నిజమే నాన్నా! ఆ సహనంతోనే యిన్నాళ్ళూ జీవితంతో రాజీపడ్డాను. ఆ యింటిలోని ప్రతి ఒక్కరితోనూ, ఆఖరికి నేను కన్న నా కొడుకుతో కూడా సర్హుకుపోవాలనే చూశాను నాన్నా. కొనీ నేను చేయని తప్పులకీ.. ప్రకృతిసిద్దంగా వచ్చే నెలసరికి నన్ను బాధ్యురాలిని చేసి యింటి నుండి వెళ్ళగొడ్తూంబే “ఇదేమిటీ?' అంటూ తల్లిదండ్రుల్ని ప్రల్ళించలేని వ్యక్తి దగ్గర నాకు రక్షణ ఎక్కడిది నాన్నా?

ఎకరా నను 20

ఆ తప్పు నాది కాదంటే వినకుండా ఘోరంగా తన్ని తగిలేశారు వాళ్ళు. అలాటి యింట్లో నేను మళ్ళీ వెళ్ళి ఎలా కాపురం చేయగలను?”

“భారతీ నామాట వినమ్మా" ప్రాధేయపడింది పార్వతమ్మ,

“వద్దమ్మా! నాకు యిక మీరేమీ చెప్పకండి... నేను ఓపెన్‌ యూనివర్సిటీలో బి.ఎ.కి అసైై చేశాను. చదువుకుంటాను. టైపూ, షార్ట్‌హ్యాండూ నేర్చుకుని ఏదైనా ఉద్యోగం చూను కుంటాను. నేనూ, నా సంసారం నా యిల్లూ అనే సంక్లిష్టత నుండి నా ఆలోచనలను కొంచెం విసతం చేసుకోనివ్వండి నాన్నా! ప్లీజ్‌! నాక్కొంచెం నమ్మకమివ్వండి” తండ్రికి అర్ధమయ్యేలా చెప్పాలని చూసింది భారతి.

ఎక్కడో మనసు పారల్లో దాగివున్న లోపలి భారతి ఆత్మాభిమానంతో తలెత్తుకుని లేచి ఒళ్ళు విరుచుకుంది. ఈసారి లోపలి భారతి గెలిచి విజయగర్వంతో భారతిని వెన్నుతట్టి నడిపించసాగింది.

! శ శ

రెండు నెలలు గడిచిపోయాయి.

భారతి అత్తింటికి వెళ్ళకుండా వుండిపోయినందుకు పార్వతమ్మ అప్పుడప్పుడూ సాధిస్తూనే వుంది. ఇదేమీ పట్టించుకోకుండా భారతి కష్టపడి చదువును కొనసాగిస్తోంది జీవితధ్యేయంగా భావించి.

కొండ నుండి తిరిగివచ్చిన తర్వాత చంద్రశేఖరం కబురు చేశాడు భారతిని రమ్మన మని. రానని చెప్పి పంపింది. అతడే తరలి వచ్చాడు భారతిని వెంటబెట్టకుని తీసికెళ్ళడానికి, తల్లిదండ్రులిద్దరూ కూతురికి ఎంతగానో నచ్చజెప్పడానికి ప్రయత్నించారు.

ఉహూ! భారతి నిర్ణయంలో, ఇసుమంతయినా మార్చు లేదు.

నిరాశతోనూ, కొంచెం కోపంగానూ తిరిగి వెళ్ళిపోయాడు చంద్రశేఖరం.

కావ్యకి ఇప్పుడు అయిదో నెల వచ్చింది.

కస్తూరి ఈ మధ్య బాగా డీలాపడి కన్పిస్తోంది. తల్లి వినుర్లు కూడా అప్పుడప్పుడూ ఆమెను బాధిస్తూ వున్నాయి.

ఆ రోజు సాయంత్రం ఆనందరావుతో పాటు పూలమొక్కల్లో కెళ్ళి కూర్చుంది భారతి.

“ఏమ్మా చదువుకోలేదా?” కూతుళ్ళిద్దరూ యిలా వచ్చి వుండిపోవడం ఆయనకీ ఎంతో బాధగానే వున్నా ఎన్నడూ వాళ్ళను బాధించేలా మాట్లాడడాయన. అందునా భారతికి మొదట్నుంచీ తండ్రి వద్ద చనువెక్కువ.

“నాన్నా! కస్తూరికి ఒక మిషను కొనిపెడదాం నాన్నా! ఏదో ఒక వ్యాపకం లేకపోతే అది నిస్సహతో మరోలా ఆలోచించవచ్చు.” బళ నుం

“ఏం కల్లీ! దాన్నికూడా కాపురానికి వెళ్ళనివ్వవా? మిషను కొనిపెడ్తుందట మిషను” కాఫీ పట్టకొస్తూ విసురు విసిరింది పార్వతమ్మ కూతుళ్ళిద్దరూ కాపురాలు లేకుండా యిలా పుట్టింటికి చేరడంతో అసహనమూ, బాధా ఆమెను కమ్ముకుంటున్నాయి.

తల్లిని చూసి మృదువుగా నవ్వింది భారతి. ఆమె బాధ తను అర్ధం చేనుకోగలదు. “అమ్మా! కూర్చోమ్మా నీతో మాట్లాడాలి”

అయిష్టంగానే కూర్చుంది పార్వతమ్మ

“అమ్మా! కస్తూరి వచ్చిన తర్వాత అతడొక్కసారి కూడ రానేలేదు. పోనీ నువ్వు చెప్పు కస్తూరి ఆడపిల్లను కనడం దాని తప్పా? మగపిల్లాణ్లి కనడం దాని చేతుల్లోని పనేమీ కాదుగా? ఇంత చిన్న విషయం ఏ మాత్రం శాస్తజ్ఞానం వున్న వారికైనా అర్ధమవు తుంది. అలాంటిది అంత చదువు చదివిన ఆ మనిషి నేరాన్ని కస్తూరి మీదికి నెట్టి దాని ముఖం చూడ్డం మానేశాడు. అయినా ప్రయత్నలోపమేమీ లేకుండా నాన్న వెళ్ళి అతడికి ఎంతో నచ్చచెప్పాలనీ చూశాడు. అయినా అతడు వినలేదు. ఇంకా బలవంతం చేసి కస్తూరిని తీసికెళ్ళి అతడి వద్ద వదలి వస్తే పరిస్థితేమిటో బాగా అలోచించమ్మా? అతడు మరింత పేట్రేగిపోతూ దాన్ని బానిసలా చూస్తోంటే మనం యిక్కడ మనశళ్శాంతిగా బ్రత గ్గలమా?” తల్లికి నచ్చజెప్పాలని చూస్తోన్న కూతురివైపు ఆదరంగా చూస్తున్నాడు ఆనందరావు. తన కూతురు తన కళ్ళముందే ఎంతో ఎదిగిపోయి నట్టుగా తోచిందతడికి.

“నువ్వెన్నన్నా చెప్పు భారతి! అది ఎలా బ్రతికినా ఫర్వాలేదు. అసలంటూ అతడు తీసికెళ్ళితేచాలు. ఇద్దరు కూతుళ్ళు యింటికి వచ్చేశారా పార్వతమ్మా?” అంటూ “ఈ ప్రపంచ మంతా వేలెత్తి చూపుతోంటే నేను సిగ్గుతో చితికి పోతున్నాను భారతీ!” దాదాపుగా ఏడ్చేస్తోంది పార్వతమ్మ

పార్వతమ్మ అవస్థ చూసి భారతి మనసు జాలితో మూలిగింది.

“అమ్మా... అదేనమ్మా ఈ మధ్య తరగతి తల్లిదండ్రులకున్న లోపం. కూతురు అక్కడ బానిసలా చూడబడ్డా. ఆఖరికి కిరోసిన్‌ పోసి చంపబడినా ఫర్వాలేదు. పుట్టింట్లో వుండిపోవడాన్ని మాత్రం సహించరు. ఈ సమాజానికి భయపడి కూతుర్ని చంపుకోవడానికి కూడా వెనుకాడరు.”

“భారతీ! ఏమిటే యిదంతా? నువ్వేం చెబుతున్నావు” పార్వతమ్మ దీనంగా ఏడుస్తోంది.

“అమ్మా! ప్లీజ్‌ ఏడవకమ్మా... మీరలాంటి తల్లిదండ్రులు కాకూడదనే అమ్మా నేనింత దూరం చెప్పింది... తలవంచుతూ పోతే యింకా యింకా మొట్టాలనే చూస్తుందీ సమాజం... ధైర్యంతో ఎదురు నిలిస్తే భయపడి పారిపోతుంది... మధ్యతరగతి తల్లిదండ్రులు చాలా మారాల్సి వుందమ్మా... గుండె ధైర్యాన్ని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో మరేమీ లేదు... వా మాట వినండి. కస్తూరిని బలవంతంగా అతడి వద్దకు పంపి కిరోసిన్‌ చావును పేపర్లో చూసేలా చేయకండి”

“అయితే ఇప్పేడేమంటావే?”

ఆక్షహ్యా మనూ

తల్లిలోని అ స్వల్పమైన మార్పే భారతిలో గొప్ప ఉత్సాహాన్ని నింపింది.

“దానికెలాగూ చదువబ్బలేదు కాబట్టి టైలరింగ్‌ నేర్పిద్దాం. మెల్లగా ఓ మిషను కొనిద్దాం... దానికో వ్యాపకం ఏర్పడ్డట్టుంది... మనసుకి మంచి డైవర్షన్‌ కూడాను... కొన్నాళ్ళు యిలా గడవనివ్వండి... అతడిలో పరివర్తన కలిగి అతడంతట అతను కస్తూరిని పంపమని అడిగినట్లయితే తప్పక పంపేద్దాం.

“అమ్మా! మాక్కొంచెం నమ్మకమివ్వండమ్మా... మాక్కొంచెం చేయూత నివ్వండి. ఆత్మగౌరవం దెబ్బతిని పుట్టింటికి వచ్చిన ఆడపిల్లల్ని బలవంతంగా తిప్పి పంపించేయాలని చూడకండి... అత్మ విశ్వాసాన్ని నింపండి... నిల దొక్కుకునేలా ధైర్యాన్నివ్వండి. ఈ సమాజానికి భయపడి నీతి పాఠాలు వల్లించకండి - బానిసల్లా బ్రతికే ఈ దుస్థితి నుండీ, ఈ పురుషాధిక్య వ్యవస్థ విషపు శోరల్నుండీ మమ్మల్ని కాపాడండి... మాక్కొంచెం చేయూత నివ్వండి” చేతులెత్తి దణ్ణం పెడుతూ ప్రాధేయ పడింది భారతి.

పార్వతమ్మ అవాక్కయి కూతుర్నే చూడసాగింది.

“నువు ఎంతో ఎత్తుకు ఎదిగి పోయావమ్మా భారతీ!... ఈ వ్యవస్థకి భయపడి అణిచి పెట్టబడ్డ నా ఆశయాలన్నింటినీ పుణికి పుచ్చుకున్నావు. నేను గర్విస్తున్నానమ్మా... నిన్ను కన్నందుకు నేవెంతో గర్విస్తున్నాను... జన్మభూమి మీది అభిమానంతో ఆనాడు నేను 'భారతి' అని పేరు పెట్బకున్నందుకు భరతమాత గుండె ధైర్యాన్ని సంతరించుకున్నావు. నా కళ్ళు తెరిసించావు” ఆప్యాయంగా కూతురి తల నిమురుతూ మరో చేత్తో ఆనందంతో వర్పిస్తోన్న కళ్ళని తుడుచుకున్నాడు ఆనందరావు.

భారతి లోపల భారతి ఉప్పాంగిన గోదావరే అయింది.

రచన సచిత్ర మానపత్రిక, జులై 1993

జ ఇల్లాలి సుఖం

“అత్తకి నిండా బాగలేదు తెలుసా? పగమైపోయి వుంది... కాళ్ళు ,చేతులు పుల్లల్లా ఉన్నాయి. ఒంటికి కరుచుకు పోయిన చర్మంతప్ప ఒంట్లో ఎక్కడా కండలేదు. ఒకటే ఆయా సం, దగ్గు. నన్ను చూడగానే ఏడ్చేసింది” చెప్పింది అరుణ దిగులుగా.

వాకు గుండె గొంతులో కొచ్చినట్లుగా అయింది. అయినా దుఃఖాన్ని పంటి నందున అదిమి పెడుతూ

“అత్త ఎప్పుడు మాత్రం లావుగా ఉందనీ” అన్నాన్నేను. నన్నగా తెల్లగా, చెక్కబొమ్మలా ఎప్పుడూ వెంకటగిరి జరీ చీరల్లో ఉండే అత్తను గుర్తు చేసుకుంటూ

అరుణ నాకేసి గుర్రుగా చూసింది. “లావుగా ఉండక పోవడం వేరు, అనారోగ్యంగా ఉండడం వేరు నన్ను చూసింది మొదలు ఒకటే గొడవ అఖిల రాలేదా? అఖిల ఎలా ఉంది, దాని మొగుడిప్పుడు కోపం తగ్గించుకున్నాడా? సుఖంగా ఉంది కదూ... అంటూ” దాచుకుందామన్నా నిష్టురం దాగడం లేదు అరుణ గొంతులో.

ఇర్హాలి నుఖం స్య భమ ఇం ల?

అరుణ నా తరువాత పుట్టిందే అయినా, ఈ సాంసారిక, లౌకిక విషయాల్లో అత్యంత పెద్దదానిలా, ఆరిందాలా ప్రవర్తిస్తుంది. చిన్ననాడే తల్లిని కోల్పోవడంతో నేనూ, అరుణ సుఖ వేణత్త పెంపకంలోనే పెరిగి పెద్దవాళ్ళమయ్యాం. అత్త మమ్మల్ని ప్రాణం కన్నా మిన్నగా చూసుకునేది.

ముగ్గురు పిల్లల్సీ, భర్తను, పదెకరాల సేద్యపు భూమిని, సంసారాన్నీ వదిలి అనాధలైన అన్న పిల్లల కోసం నెలలో సగం కాలం పుట్టింట్లోనే గడిపేది సుఖవేణత్త. ఇందుమూలంగా భర్త తరపు నుండీ అత్తగారి వైపు నుండీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవలసి వచ్చేది ఆమె. సుఖవేణత్త తోడు, ఆదరణ లేకపోయినట్టయితే తండ్రి తమను సవ్యంగా పెంచగలిగేవాడు కాదేమో,

అపురూపంగా పెంచి పెద్దజేసి, అన్నివిధాలా గొప్పస్థాయిలో ఉన్నవాళ్ళతో మా పెళ్ళిళ్ళు జరిపించి తమనో స్థానంలో నిలబెట్టిన సుఖవేణత్తని యింతటి అవారోగ్య పరిస్థితుల్లో వెళ్ళి చూడాలన్న ఆలోచన నాకు రాకపోవడం నిజంగా ఎంత 'హైన్యం. అరుణ అన్నట్లు నా సంసారం, నా పిల్లలు, నా జీవితమే తప్ప ప్రక్కన ఏం జరుగుతుందో కూడ పట్టించుకోని ఈ మనస్థత్వం నాకెలా అబ్బింది?. సుఖవేణత్త కూడా ఇలానే తన స్వార్థం చూసుకున్నట్లయితే తాము అనాధల్లా దిక్కూ, మొక్కూ లేకుండా పోయేవారం కదూ?

“అత్తకి నిన్ను చూడాలని వుంది...” నాకు తలకి నూనె రాస్తూ మెల్లిగా చెప్పింది అరుణ. అరుణకి మాత్రం అత్త పెంపకంలో చాలా లౌక్యం అబ్బింది. అది కూడ అత్తలాగే అందరి బాగోగులూ కోరుకుంటుంది. పెళ్ళయిన తన సంసారం తను చేసుకుంటూ కూడ అప్పుడప్పుడూ వీలు కల్పించుకుని వెళ్ళి అత్తను చూసి వస్తుంటుంది... ఆడపడుచుకు తన నగలన్నీ పెట్టి పెళ్ళి చేసి పంపించింది. అత్తమామల్ని న్వంత తల్లిదండ్రుల్లా భావించి తన వద్దే ఉంచుకొని మంచిచెడులన్నీ చూసి సాగనంపింది.

మరి నేనో?

ఎంతసేపటికీ ఆయన ప్రమోషను గురించీ, బాబిగాడి ఇంజినీరింగ్‌ సీటు గురించి, పదేళ్ళు కూడా నిండని పాప భవిష్యత్తు గురించీ, ఇదేదీ కాదంటే ఇన్నాళ్ళ జీవితంలో కట్టుకోలేక పోయిన సొంత ఇంటి గురించీ, నిరంతరం ఎడతెగని ఆలోచనలే తప్ప మరో విషయం తనకు తెలీదు, పట్టదు. శ్లేష్మంలోపడ్డ ఈగలాగా ఈ నాలుగ్గోడల నడుమా కొట్టుకుపోతుంటాను. అంతలా ఇంటి కోసమే బతుకుతున్నా నిరంతరం ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపి ఆయన నన్ను నతాయిస్తూనే ఉంటారు. అది వేరే సంగతి...

నన్ను గురించి, మా చుట్బపక్కలంతా ఏమనుకుంటారో నాకు తెలీదు గొనీ అరుణ ఇలా ఎన్నడూ ఎత్తిచూపి ఉండలేదు.

“అఖిలా... ఏంటే ఆలోచనలో వడ్డావు. నేను చెప్పేది వింటున్నావా లేదా? చిన్నప్ప ట్నుంచీ అత్త మనవి ఎంత అపురూపంగా 'పెంచుకొచ్చిందో మనం మర్చిపోకూడదు. తన

ఇల్లాలి సుఖం బం విజనే

పిల్లల్ని, సంసారాన్ని కూడా కాదని మన కోనమేనన్నట్లుగా బతికింది. అదే ఇప్పుడు నాన్న బతికి ఉన్నట్లయితే అత్తని అలా వదిలేసే వారేనా...” నాకు జడవేయడం పూర్తిచేసి, పక్కనే కూర్చుని నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంది అరుణ మౌనంగా కళ్ళు మూసుకుని. మూసిన దాని కనురెప్పల వెనుక నాన్న ఆలోచనలు నుళ్ళు తిరుగుతున్నట్టుగా గమనించాను. నాన్న జ్ఞాపకాలతో నాకూ గుండె బరువెక్కింది.

అరుణ హైదరాబాద్‌లో ఉంటోంది. దాని భర్త అక్కడి ఎజి ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు. నేనుంటోన్న నెల్లూరికి అత్త ముష్ఫయి మైళ్ళ దూరంలో ఉంది అంత దూరం నుండి అరుణ అత్తని చూడ్డానికి వచ్చింది. అలాగే నన్నూ ఒక చూపు చూసిపోడానికి వచ్చినట్టుంది. ఆరోజంతా అత్తని గురించి మాట్లాడుతూనే నా ఇల్లంతా సర్జిపెట్టింది. నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ, వింటూ ఉండిపోయాను. సాయంత్రం పిల్లలొచ్చాక వాళ్ళతో ఒక గంట గడిపి ఎంత చెప్పినా వినకుండా, హైదరాబాద్‌ ఎక్స్‌(పెస్‌కి వెళ్ళిపోయింది.

అరుణ నాకు సూటిగా ఏమీ చెప్పకపోయినా, నేను గట్టిగానే నిర్ణయించుకున్నాను వెళ్ళి అత్తను చూసి, నా వద్దకు తీనుకురావాలని.

“పిల్లల్ని స్కూలుకి పంపి, ఇంట్లో పని చూసుకుని నువ్వటూ, నేనిటూ ఆఫీసులకి వెళ్ళడమే గగనమవుతోంది కదా. మీ అత్తను తీసుకొచ్చి ఎలా అట్టి పెట్టుకుంటావిక్కడ నువ్వే ఆలోచించుకో” చెప్పారాయన కోపమూ, కోపం కాని స్థితిలో.

నాకు కడుపులో పేగెక్కడో కదిలినట్లుగా అయింది.

ఆయన వెళ్ళిన వైపే ఆశ్చర్యంగా చూస్తుండిపోయాను.

వాళ్ళమ్మగారికి గుండె జబ్బు చేసినప్పుడు నేనిటు ఆఫీసుకి వెళ్తూనేకదా ఇంట్లో ఆవిడకి వానా చాకిరీ చేశాను. ఆయన తరపున వచ్చిపోయే బంధువులందరికీ ఏ మాత్రం విసుగు పడకుండా వండి వడ్డిస్తూనే ఉన్నాను కదా. అసలు తన కోసమంటూ ఈ ఇంటికి ఎవరొస్తారు... వేనే ఆయన అన్నట్టుగా బతికేన్తున్నాను. కానీ ఆయనలా అనుకుంటున్నట్లుగా లేదు. మఖవేణత్తని తీసుకురావడానికి ఆయనేమన్నారూ

“నీ ఇష్టం ఆలోచించుకో... ఆవిడొస్తే చాల ఇబ్బందవుతుంది. అన్నారా?” నిజమే నసుఖవేణత్త నాకెక్కువయితే కావొచ్చు కానీ ఆయనకెక్కువెలా అవుతుంది.. ? మరి ఆయన తరపు బంధుమిత్రుల గురించి నేనెన్నడూ ఇలా పరాయిగా భావించినట్టులేదే? ఒక రోజుంతా ఆలోచిస్తూనే ఉండిపోయాను.

ఆయన కిష్టం లేకపోయినా, నేనెన్ని ఇబ్బందులు పడ్డా సుఖవేణత్తని నా వద్దకు తీసుకురావడానికే నిశ్చయించుకున్నాను. ఆరోజు ఆఫీసుకి సెలవు పెట్టి, బ్యాంకుకెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని తెలిసిన టాక్సీ ఒకటి మాట్లాడుకుని అత్త దగ్గరికి బయల్దేరాను.

ఊరి మొదట్లో ఉన్న వేపచెట్టు కింద రచ్చబండ మీద కూర్చుని ఊరివాళ్ళతో చర్చలు చేస్తున్నాడు మామయ్య. ఆ వేపచెట్టుని చూడగానే నా గుండె కంజరి ఆలపించింది. ఆచెట్టకీ,

షా

నా బాల్యానికీ అవినాభావ సంబంధముంది. శని, ఆదివారాల్లో సుఖవేణత్త అరుణనీ, నన్నూ, లలితనీ, శ్యాంబాబునీ తీసుకుని ఈ ఊరొచ్చేది. మేమంతా ఈ వేపచెట్టు కిందే బస్సు దిగేవాళ్ళం. అరుణ బుద్దిగా అత్తతో ఊళ్లోకి నడిస్తే నేనూ, శ్యాంబాబు మాత్రం చేతులు పట్టుకుని చెట్టా పట్టాలేసుకుంటూ వేపచెట్టు కిందికి పరుగు తీసేవాళ్ళం. కానీ తరువాత తరువాత అత్త నన్నలా వెళ్ళనిచ్చేదికాదు నా చేయి పట్టుకుని

“అభీ! మామయ్య ఇంటికొస్తార్లే...నువ్వలా వెళ్ళకూడదు” అనేది అత్త.

“శ్యాంబాబు వెళ్ళొచ్చా ? నేను మాత్రం ఎందుకెళ్ళ కూడదేం?' అనాలన్పించినా అత్త మాటకి ఎదురు చెప్పడం ఇష్టంలేక మౌనంగా అత్తతో పాటు నడిచేదాన్ని. అప్పట్లో ఇలా ఊళ్లోకి దారులుండేవి కాదు. పచ్చటి పంట పాలాల మీది నుండి వచ్చే మట్టి వాసన పీలుస్తూ గట్ల వెంబడి వరుసగా క్యూలోలా నడిచేవాళ్ళం. కాళ్ళు గెనాల మీద కదుల్తున్నా మనసు మాత్రం వెనక్కి వేపచెట్టు కింది రచ్చబండ మీదకి పరుగుతీసేది. శ్యాంబాబుతో కలిసి దాగుడు మూతలు ఆడ్డం అంటే చెప్పలేనంత ఇష్టంగా ఉండేది తనకి. ఆ వేపచెట్బ పూర్వజన్మలో నాకు పరిచయస్సురాలిలాగా, బాల్యంలో నన్ను వదిలి పెట్టిపోయిన “అమ్మ'లాగా తోచేది. శ్యాంబాబూ, నేనూ స్నేహంగా ఉండటం చూసి అత్త ఎన్నోసార్లు కళ్ళనీళ్ళు పెట్టుకునేది.

“వీడు నీకన్నా కాస్త ముందు పుట్టి ఉన్నట్టయితే ఏ దిగులూ లేకుండా నిన్ను నాకోడల్ని చేసుకుని ఉందునే అఖభిలా” అంటూ, అప్పట్లో అత్త మాటలకి అర్థం తెలీకపోయినా, ఇప్పుడా లోచిస్తుంటే అత్త మనసు అర్థమై నా గుండె నరాలనెవరో కొనగోటితో మీటినట్లుగా అన్పిస్తుంది.

మేమంతా వేపచెట్టు వద్ద బన్సు దిగి పాలం గట్లవెంబడి నడుచుకుంటూ ఊరి చివరనున్న ఇంటికి వెళ్ళేవేళకి వాళ్ళ అత్తగారు తిట్లతోనూ, శాపనార్ధాలతోనూ ఆహ్వానం పలికేది.

“అయినా ఇట్టా ఎక్కడా చూళ్ళేదమ్మా... ఎంత అన్న పిల్లలయితే మాత్రం...ఇల్లూ, వాకిలీ మొగుడూ, మొద్దులూ వదులుకుని ఈ విధంగా చాకిరీ చేసేవాళ్ళని నేనేడా చూళ్ళేదు... ఈ చంటిదాని గోడు నేను చూడలేకుండా ఉన్నాను...అంటూ ఏడవని రూన్సీని అదేపనిగా ఏడ్పించేది... అడ్డూఆపూ లేకుండా అపారంగా సాగిపోయే అవిడ సణుగుడు కార్యక్రమంలో సగానికి సగం నాకర్థమయ్యేదికాదు. అత్త ఎన్నడూ నోరు తెరచి మాట్లాడ్డం నేను చూడలేదు. ఆమె నహనం నాకు వింతగా ఉండేది.

అయికే అత్త తన పుట్టింటి నుండి వారానికి నరిపడా తెచ్చిన వస్తువులన్నీ ఇంట్లో అమరుస్తూంటే ఆవిడ నోరు కొంత మూతబడేది.

శనివారం మధ్యాహ్నం మేము ఊళ్ళో దిగితే ఆ రోజంతా మామయ్య అత్తతో మాట్లాడే వాడు కాదు...ఇల్లూ, వాకిలీ అంతా శుభ్రం చేసి పశువులూ, పాలెగాళ్ళనీ అందర్నీ పలకరించి రాత్రి పదిదాకా చాకిరితోనే సరిపోయేది అత్తకి. ఆదివారం మధ్యాహ్నం మామయ్య కొంత మెత్తబడి అత్తతో ఆ మాటా, ఈ మాటా కలిపేవాడు. ఆరోజు రాత్రి మాత్రం అత్త పెద్దహాల్లో మా అందరితోనూ పడుకునేది కాదు.

సుఖం హన

శ్యాంబాబూ, నేను పండరి భజనకి వెళ్ళి “పాండురంగా విఠలా...పండరినాథా విఠలా” అంటూ పాడుకుంటూ ఇంటికి వచ్చే వేళకి లలిత, అరుణ, రూన్సీ హాల్లో పడుకుని ఉండే వాళ్ళు. అత్త అత్తగారు సణుక్కుంటూ తలుపు తీసేది.

తెల్లవారకముందే నిద్రలేచి అయిదుగంటల బస్సుకి మళ్ళీ అంతా పోలోమని బయళ్లేరే వాళ్ళం. మామయ్య బస్సుదాకా తోడొచ్చేవాడు. బస్సెక్కి మామయ్యతోపాటు వేపచెట్టుకి కూడా టా...టా... చెప్పేదాన్ని.

పిల్లలందరమూ బస్సులో మాటల్లో పడిపోతే అత్త యోగినిలా మౌనంగా ఉండి పోయేది. ఆ విధంగా అత్త పుట్టింటికీ, అత్తింటికీ నడుమ అరవచాకిరీ చేస్తూ కండలు కరగ దీసుకునేది. ఆ ఇంటికోసం, ఈ ఇంటి కోసం అహర్నిశలూ శ్రమపడిన అత్తని, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రాత్రింబవళ్ళూ నిద్రకాచిన అత్తని, స్వార్థం అన్నమాటకి అర్థమే తెలీని అత్తని తలచుకుంటే నా గుండెల్లో కన్నీటి చెమ్మ.

“ఎబెల్లాలండీ?” టాక్సీ డ్రైవర్‌ ప్రశ్నతో ఒకింత సర్దుకుని అత్త వాళ్ళ ఇల్లు చూపించాను. వాకిట్లో దిగేప్పటికి ఏమిటో అంతా బోసిగా అన్పించింది అత్త (ప్రేమగా పెంచిన జూకామల్లె తీగ గేటుకి పైన పూర్తిగా అల్లుకుపోయి ఉండేది ఆ తీగ జాడ కూడ లేకపోవడమే ఆ బోసి తనమని క్షణం తరువాత కానీ స్ఫురించలేదు నాకు. ఆరుబయట మొక్కలేవీ లేవు.

రూన్సీ కానీ, లలిత కానీ వచ్చిన జాడలేవీ లేవు. అవును ఎవరి సంసారాలు వాళ్ళవి. ఎవరి కష్టాలు వాళ్ళవి. ఎవరు మాత్రం వచ్చి ఎల్లకాలం మన కష్టసుఖాలు తీర్చగలరు అత్తలాగా.

మెల్లిగా లోపలికడుగు పెట్టాను.

“కారు' అగిన శబ్దం విని శ్యాంబాబు భార్య 'ఇందు' వాకిట్లోకి వచ్చింది.

మోకాళ్ళదాకా ఎగదోపిన చీర, జారిపోతున్న పమిట కొంగూ, తలస్నానం చేసి జారుముడి వేసి ఉన్న ఆరని జుట్టు, వెరశి అమ్మాయి ఏదో చాలా పనిలో ఉన్నట్లుగా ఉంది.

“రండి” అంటూ నవ్వీనవ్వనట్లుగా అని లోపలికెళ్ళిపోయింది.

అనుకోని వేళ అతిథుల రాక పల్లెటూళ్ళలో కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. నేను ఇందుని అనుసరించాను.

ఎందుకో తెలీదు గానీ లోపలికి అడుగు పెట్టగానే ఓ విధమైన శ్మశాన నిళ్శబ్దం నా గుండెల్ని ఒణికించింది. హాల్లోనే ఒక మూల కిటికీ ప్రక్కగా ఉన్న నులక మంచం మీద మూటలా పడి వున్న ఆ ఆకారం సుఖవేణత్త అని తెలుసుకోవడానికి నాకు రెండు క్షణాలు పట్టింది. తెలిసిన తరువాత జీర్ణించుకోవడానికి మరికొంత సమయం కావలసి వచ్చింది.

అత్త అటు వైపుకు తిరిగి పడుకుని ఉంది.

ఆయాసంతో అమె భుజాలు ఎగిసెగిసి పడుతున్నాయి. వీపు ఎగిరిపడ్తోంది. ఎప్పుడూ వెంకటగిరి, పాటూరు జరీ చీరలు మాత్రమే కట్టే ఒంటి మీద వెలసిపోయిన పాత గులాబీ రంగు టెరీన్‌ చీర అస్తవ్యస్తంగా కప్పబడి ఉంది జాకెట్టు స్థానభ్రంశం చెంది ఉంది. ప్రక్కమీద దుప్పటి నల్లగా మాసి కమురువాసన వేస్తోంది 'రుం' అనే నాదం చేస్తూ మంచం మీద, అత్త ఒంటి మీదొ కూడ ఈగలు ముసురుకుంటున్న్హాయి. ఆ నిశ్శబ్ద మధ్యాహ్నం వేళ ఆ

ఇల్లాలి సుఖం శవ? మ ప్రమణం చ

శబ్దం మృత్యువు ఆలపించే విషాదగీతికలా తోచింది నా చెవులకి. తనపైన వాలుతున్న ఈగల్ని తోలుకునే శక్తి కూడ లేనట్లుగా, బలహీనంగా మంచానికి కరుచుకుపోయి వుంది అత్త. నాకళ్ళల్లో ఊరిన నీళ్ళు అత్త ఆకారాన్ని అస్పష్టం చేస్తూండగా

“ఇదిగోండీ” అంటూ మంచినీళ్ళ గ్లాసందించింది ఇందు.

'వద్దు' అనడానికి గొంతు పెగలక మౌనంగా గ్లాసు అందుకున్నాను.

పాతకాలం నాటి ఓ బరువైన చెక్క కుర్చీని మంచం దగ్గరగా లాగి

“కూర్చోండి కాఫీ తెస్తాను” అంటూ ఆ అమ్మాయి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది... నిస్త్రాణగా ఆ కుర్చీలో కూలబడ్జాను

అత్తను చూస్తుంటే అట్టడుగుపారల్లో ఎక్కడి నుండో గేలంవేసి లాగినట్టుగా ఆర్టత మనసంతా నిండి గొంతులో అడ్డుపడ్డట్ట అయింది. అత్త భుజంమీద చేయివేస్తూ “అత్తా ” పిలిచాను.

ఒక్క ఏిలుపుతోనే అత్త నాగుపాములా చటుక్కున తలెత్తింది.

“ఎవరూ ... అఖిలా” అంటూ... మాట్లాడడంతోనే ఎక్కడుందో ఆ దగ్గు ఊపిరి ఆగి పోతుందేమోనన్నంత దొరుణంగా అత్తని చుట్టముబట్టేసింది. నా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆతృత ఉంది ఆ గొంతులో.

“అత్తా ” మళ్ళీ పిలిచాను కళ్ళనీళ్ళు గొంతుకడ్డం పడుతూండగా.

“అఖీ.... నా బంగారు తల్లీ వచ్చావా అమ్మా... నిన్ను చూడకుండానే పోతానేమో అనుకున్నానే బంగారూ... అత్తని చూడ్డానికొచ్చావా తల్లీ” నారెండు చేతులూ తన చేతుల్లోకి తీనుకుందత్త. నేను బాగా దగ్గరగా జరిగాను అప్రయత్నంగా...

“అత్తా ఎలా ఉంది నీకు?” ప్రల్నించాను ఎలాగో గొంతు పెగుల్చుకుని అత్త తన కళ్ళల్లో ఊరుతోన్న నీటిని భయం భయంగా గబగబా తుడిచేసుకుంది. ఇందుగాని, మామయ్యగాని వస్తోమోనన్నట్లుగా.

అత్తని చూస్తుంటే చెప్పలేనంత జాలేసింది. ఒకప్పుడు ఇదే ఇంట్లో యువరాణిలా ఒకే చేత్తో చక్రం తిప్పిన అత్త, తన అత్తగారికి ఏనాడూ పల్లెత్తుమాట ఎదురు చెప్పని అత్త ఈనాడు తన కోడలిని చూసి భయపడ్తోంది...

గునగునగా ఏదో రహస్యం చెప్తున్నట్లుగా చెప్పింది అత్త

“నాకు బాగలేదే అభీ నేనింక బతకను... మీమామయ్య నన్ను డాక్టరు దగ్గరికి తీసికెళ్లరట...” చెప్పింది.

“ఛ...ఛ... అదేమిటత్తా అలా అంటావు... ఎందుకు చూపించరూ” చెప్పాను నేను నా సహజ ధోరణిలో.

“నీకు తెలీదే తల్లీ డబ్బులయిపోతాయట... ఎలాగూ చచ్చేదానికి డబ్బులెందుకూ ఖర్చు చేయడం అంటున్నారే” చెప్పింది బాధగా. కనుకొలకుల్లోని నీళ్ళు బయటకు ఊరకుండా తొ౭ పా

ఉండడం కోనం నేను విశ్వప్రయత్నం చేస్తున్నాను. అదిమిపట్టిన ఉద్వేగంతో నా గుండెలూ, భుజాలు ఎగిసెగిసిపడ్తున్నాయి.

“అఖిలా నా తల్లీ... మళ్ళీ ఇదంతా నువు చెప్పాద్దే మీ మామయ్యతో 'వా పరువు తీన్తున్నావా?' అంటూ మళ్ళీ నన్నే కోప్పడుతారు” అంటూ క్ర్షణమాగి 'అఖీ... నాకో వెయ్యి రూపాయిలిస్తావా డొక్టరుకి చూపించుకుంటాను” అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అమాట అడగడానికి ఎన్నో శక్తుల్ని కూడదీసుకున్నట్లుగా ఉంది అత్త. అత్త దీనస్థితికి బాధతో గుటకలు వేస్తున్నాన్నేను.

“ఈ ఆయానం, దగ్గూ తట్టుకోలేకుండా ఉన్నానే...” ఇదంతా మాట్లాడుతూ అత్త ఎడతెరపి లేకుండా దగ్గుతూనే ఉంది.

“ఇదిగోండి కాఫీ... ఆవిడిది రోజు ఉండే భాగోతమే లెండి” తేలిగ్గా తీసిపారేసినట్లుగా అంటూ నా చేతికి కాఫీ అందించింది ఇందు.

“శ్యాంబాబూ, మామయ్యలేరా?” మామయ్యని రచ్చబండ కాడ చూసి కూడ ఏదో మాట్లాడాలన్నట్టుగా అడిగాను.

“ఈయన టవున్లో పనుందని వెళ్ళారు... మామయ్య వేపచెట్టు దీగ్గరున్నట్టున్నారు. టాక్సీ రావడం చూశారుగా వస్తూంటార్లెండి” ఇందు ఆంటూండగానే

“ఏమ్మా అఖిలా నువ్వాక్కదానివేనా వచ్చావు?” అంటూ లోపలికి వచ్చారు మామయ్య.

“అవును మామయ్యా అరుణొచ్చి అత్తకి చాల బాగలేదని చెప్పింది. అందుకే చూసి నాతోపాటు తీసుకెళ్ళామని వచ్చాను... డాక్టరుకి చూపించి నాలుగు రోజులుంచుకుని తీసుకొచ్చి వదుల్తాను” చెప్పాన్నేను నిశ్చయించుకున్నట్లుగా.

“ఏం వేను డాక్టరుకి చూపించడంలేదనీ, మందులిప్పించడం లేదనీ చెప్పిందా? ఇంతకాలం ఎవరు చూశారట?” విసురుగా కోపాన్ని నిగ్రహించుకుంటూ అన్నాడు మామయ్య. విస్తుపోయాన్నేను. మంచం మీద దీనస్థితిలో ఉన్న భార్య మీద ఇంత పట్టరాని కోపమెందుకో వాకర్ధం కాలేదు. మగాళ్ళు ఎక్కడయినా ఇంతేనా. తాము మొదటిజాతి వాళ్ళం, భార్యలు రెండోజాతి వాళ్ళు అన్నట్టుగా ఏమిటీ ఆధిక్యత. మా ఆయన, మామయ్య, ఎదురింటి సుజాత భర్త... అంతా మగాళ్ళు.

“వేను రాను... నేను రానంటే రాను...వేనెక్కడికీ రాను కడుపున పుట్టినబిడ్డలే ఈ దినాల్లో పడక మీద పండబెట్టి చేయాలంటే విసుక్కుంటుంటారు... నీకేం పట్టింది నువ్వెందుకు చేస్తావు...?” ఒకవైపు దగ్గుతూ, ఆయాసపడుతూనే హిస్టీరిగ్గా అరుస్తోన్న అత్తకేసి జాలిగా చూశాను.

“పడక మీదున్నా కూడ నోరు ఏ మాత్రం తగ్గలేదే నీకు, ఆ నోటిపాగరుతోనే ఇంత తెచ్చుకున్నావు” అంటూ దూకుడుగా మంచం మీదకెళ్ళాడు మామయ్య. మూమయ్యలోని మగాడికేసి జుగుప్పగా చూస్తున్నాను.

+బసపనారం

అత్త దణ్ద్గం పెడుతూ దీనంగా ఏడ్చేసింది.

“ఏడవకత్తా ప్లీజ్‌.. నిన్ను నేను ట్రతికించుకుంటాను” ధైర్యంచెప్తూ నేనూ ఏడ్చేశాను నిగ్రహించుకోవడం సాధ్యంకాక,

“ఆ అవును ఇక్కడ మేమంతా చంపేస్తున్నాం ఈవిడ తీసికెళ్ళి బతికించుకుంటుంది...” వ్యంగ్యంగా అంటూనే “అఖిలా నేనూ ఈ రోజో, రేపో టవునుకి తీసికెళ్ళి డాక్టర్‌కి చూపిద్దామనే అనుకుంటున్నాను... నాకు నింద రావడానిక్కాకపోతే నువు తీసికెళ్ళి చూపించేదేమిటి?” నాపెళ్ళాన్ని గురించి నువ్వు జాగ్రత్త చెప్పేదేమిటి అన్నట్లు విసుగ్గా అరిచాడు మామయ్య.

“నేను రాను-నువ్వెవరు నన్ను తీసికెళ్ళటానికి?” హిస్టీరిగ్గా అరుస్తోంది అత్త దగ్గుతూ, ఆయాసపడుతూనే. నేనాచ్చి అనవసరంగా ఆమె శరీరానికి లేనిపోని శ్రమా, మనసుకి యాతనా కల్గించానేమో అన్పించింది.

విసురుగా లేచి పైగుడ్డ విదిలిస్తూ బయటికి నడిచాడు మామయ్య. నిస్సహాయంగా నిలబడిపోయాను నేను...

“అభిలా” అత్త ఏడుస్తూనే ఉంది.

“అఖిలా... నన్ను డాక్టరు దగ్గరకు తీసికెళ్ళరే వీళ్ళు... డబ్బయిపోతుందని చూపించ కుండానే చంపేస్తారే... నన్ను చంపేస్తోో అఖిలా...అందుకోసమే చూస్తున్నారు వీళ్ళు నేను నా పుట్టింటి నుండి ఎంతెంత డబ్బు తెచ్చిపెట్టానే వీళ్ళకి. ఎంత చాకిరీ చేశానే ఈ ఇంటికి...?” ఏడుస్తూనే ఉందత్త, ఈసారి ఇందు వచ్చి నిల్చున్నా లెక్కచేయకుండా.

ఆ క్షణం ఆమె ప్రాపంచికశక్తులకు అతీతురాలిలా, జీవితాన్ని లొంగదీసుకోలేక అశక్తు రాలయి, అసహాయంగా ఆగిపోతున్న ఊపిరిని కూడదీసుకుంటూ శూన్యంలో కలిసిపోవడానికి సిద్దంగా ఉన్నట్లుగా ఉంది.

నిజమే అత్త ఈ ఇంటికి ఎంత చాకిరీ చేసింది? తన అన్న ఇచ్చిన డబ్బంతా మామయ్యకి కొంచెం కూడ కష్టం కలగనీయకుండా, ఈ ఇంటికే ఖర్చు చేసింది. వాళ్ళత్తగారు మంచాన పడితే సొంత కూతురిలా సేవ చేసింది. అటు అన్న సంసారాన్ని చక్కబెడ్డూనే, ఇటు తన పిల్లలకి ఏలోటూ రానివ్వకుండా పెంచి పెద్దచేసి పెళ్ళిళ్ళుచేసి ఒకింటివాళ్ళను చేసింది.

అన్ని విధాలుగానూ దోపిడీకి గురయిన ఆ ఇల్లాలికి ఈ మునిమాపు వేళ జబ్బుచేస్తే డాక్టరు వద్దకి తీసికెళ్ళడానికి డబ్బులేదా...? డబ్బు లేకపోవడం వేరూ, ఖర్చయిపోతుందని వెనుకాడ్డం వేరూ. ఈ పరిస్థితుల్లో నేను అత్తని తీసిశెళ్ళాలా? వద్దా? మామయ్యకి ఇష్టంలేకుండా తను తీసుకెళ్ళడం బావుంటుందా? మామయ్యకి కోపం వస్తుందేమో .

ఛీ... లలిత, రూన్సీ వాళ్ళు ఆత్తని ఈ పరిస్థితుల్లో వదిలిపెట్టి ఎలా వెళ్ళారు? వాళ్ళు కొంచెం గట్టిగా దభాయించి ఉంటే మామయ్య మాత్రం ఒప్పుకుని ఉండేవాడు కాదా? తండ్రికి నచ్చజెప్పో, కోప్పడో తల్లిని తీసికెళ్ళి చూపించాల్సిన బాధ్యత లేదా కూతుళ్ళకి...? తళ పకా

పరిపరివిధాలుగా పోతున్న మననుని అదుపులోనికి తెచ్చుకుంటూ, భోజనం కూడ చేయకుండా లేచి నిల్చున్నాను .

“అత్తా వెళ్ళొస్తాను” అంటూ.

“అఖభిలా” అంటూ బిగ్గరగా ఏడ్చేసింది అత్త .

ఆ ఏడుపు హృదయవిదారకంగా నన్ను చుట్టముట్టేసింది. నేనూ జలజలా రాలి పోయాను. పదినిముషాల తరువాత బయటికొచ్చి మామయ్యకి దండంపెట్టి చెప్పాను భయపడ్డూనే “ప్లీజ్‌ మామయ్యా... అత్తయ్యకి మంచిమంచి మందులిప్పించండి.” నవ్వాడు మామయ్య.

“ఇంకేమీ లాభంలేదమ్మా... లేదంటే నేను మాత్రం చూపించనా చెప్పు...” అన్నాడు ఒకింత దుఃఖంతో .

అలా అంటుంటే మామయ్య బుగ్గలు సాగి కళ్ళు కుంచించుకుపోయి భుజాలు ఎగిసిపడ్తున్నాయి. అంబే మామయ్య కూడా బాధపడుతున్నాడా? లేక నటిస్తున్నాడా? ఛ...ఛ... బాధలేకుండా ఎలా ఉంటుంది? నిజంగా ఉంటే మరి అత్తనిలా బాధించడమెందుకు. అత్త తృప్తికోసమయినా డాక్టరువద్దకి తీసికెళ్ళొచ్చుకదా... అదే చెప్పాను మామయ్యతో కొంచెం శక్తి కూడదీనుకుని.

“అలాకాదు మామయ్యా... మీకు తెలీదని కాదు... మన వ్రయత్నం మనం చేయాలి కదా... ఎలాగూ అవిడ బతకదు కదాని నిర్లక్ష్యం చేయగలమా? ఒక్కసారి తీసికెళ్ళి డాక్టరుకి చూపించితే అత్తకి మోరల్‌సపోర్చ. ఒకవేళ మీరు చెప్పినట్లు ఆవిడ బతక్కపోయినా ప్రశాంతంగా నయివా కన్నుమూన్తుంది. మీకు వేను చెప్పగలిగేదాన్నికాదు. ఒక్కసారి ఆలోచించండి మామయ్యా”

చెప్పాను నేను. 'అరె. నాక్కూడ కర్ర విరక్కుండా , పాము చావకుండా మాట్లాడ్డం చేతనవునే' అనుకున్నాను .

“అలాగేనమ్మా.. నువు చెప్పినట్లే ఒకసారి చూపించేద్దాం” అన్నాడు మామయ్య కమిటవుతున్నట్లుగా. “నేనూ అనుకుంటూనే ఉన్నాను. రేపే వస్తాం నేనూ మీ అత్తయ్యా” ఆ మాటలెందుకో చాల బలహీనంగా తోచాయి.

టాక్సీలో తిరిగి వస్తుంటే అత్తింటికీ, పుట్టింటికీ నడుమ అరవచాకిరీ చేస్తూ కండలు కరిగించుకున్న అత్త తనని గురించి తాను పట్టించుకోని అత్త దీనంగా కళ్ళముందు కన్పిస్తూనే ఉంది.

ఆ మరునాడు, మూడోనాడు కూడ అత్త, మామయ్య వస్తారని చాలా ఎదురుచూళాను. రాలేదు. నాలుగోరోజు ఉదయం వేనే అత్తని తీసుకువద్దామా అన్న ఆలోచన పూర్తికాకముందే పోస్టుమాన్‌ టెలిగ్రాం తెచ్చాడు .

అత్త చనిపోయిందన్న వర్తమానాన్ని మోసుకోచ్చిన టెలిగ్రామ్‌ అది .

ఇల్లాలి సుఖం శన వయ ణంచల్‌

నిజాన్ని స్వీకరించక నా మెదడు నరాలు వెట్టేస్తున్నాయి .

బరువెక్కిన గుండెలు ఏడవాలన్న ఆలోచనని కూడ మరిచి విలువుగుడ్డేసుకున్నాయి. మామయ్య సాధించాడు. డబ్బు ఖర్చు చేయకుండానే అనుకున్నది సాధించాడు .

విజయగర్వంతో ఉన్న మామయ్య ముఖం నా కళ్ళముందు కదలాడింది.

అత్త సుఖపడిపోయిందనుకున్నాన్నేను. ఎన్నోవిధాలుగా దోపిడీకి గురయిన అత్తకి మరణంలోనే సుఖం దొరికింది .

అత్త మరణంతో చప్పున నాకో నగ్నసత్యం తెలిసొచ్చింది .

“ఇల్లాలి సుఖం' చావులోనే ఉందని.

భూమిక, జనవరి-మార్చి 1995 వర్లాలి

తరసా

నెత్తుటి గులాబి

“అమ్మామీ టికెట్‌” వ్రల్నించాడు కండక్టర్‌:

ఎడమచేతిలో ఏడుస్తోన్న నాలుగేళ్ళ బాబుని సము దాయిస్తూ మరో చేతిని బస్‌లోని నిలువు రాడ్‌ చుట్టూ వేసి బ్యాలెన్సవుతూ, భుజానికి వేలాడుతోన్న వైర్‌ బ్యాగుని సరిచేసుకుంటూ పర్పులో వున్న సీజన్‌ టిక్కెట్టు తీయడానికి ప్రయత్నిస్తోందామె ఆ కదులుతోన్న బస్సులో.

అలా వేగంగా కదులుతోన్న బస్సులో నిల్చుని ప్రయా ణించడం ఆమెకి కొత్తేమీ కాదు.. గత రెండు సంవత్సరాలుగా ఆమె ఉదయం, సాయంత్రం సిటీబన్సులో ప్రయాణిస్తూనే వుంది.

“కొంచెం వుండరా తేజా! వచ్చేసింది వెళ్ళిపోదాం” చెప్పింది కొడుక్కి. వాడు వినలేదు... పైపెచ్చు ఆవేశంగా తల్లి జుట్టు పట్టి లాగుతూ వెనక్కెనక్కి వంగుతున్నాడు విరుచు కుంటూ.... ఆమె బేలన్స్‌ తప్పి తట్టుకుని వెనక్కి పడబోయింది... ఇదే అదనుగా ఆమె వెనకున్న కాలేజీ కుర్రాడామె భుజాలు పట్టుకుని ఆపాడు.

నెత్తుటి గులాణ ఈమ ప్రదం చ

సిగ్గుతోనూ, ఆవమానంతోనూ, అయిష్టంతోనూ ఆమె ముఖం ఎర్రబడింది. ఆమె కనుకొలనుల్లో నీటిబొట్టు... తేజ ఏడువు ఆసకపోగా ఆమెని పిడిగుద్దులతో సత్కరించాడు. బస్సు బస్సంతా మాటలు ఆపేసి ఆమెకేసి వింతగా, జాలిగా చూడసాగింది.

భూకంపంలాంటిదేదో వచ్చి తనూ, ఈ బస్సూ, ఈ మనుషులూ అంతా అందు లోకి కూరుకుపోగలిగితే బావుండునన్చించింది ప్రత్యూషకి. ఆమె మనసంతా పరమ చేదుగా వుంది. జరుగుతోన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని దైన్య స్థితి అది. అవమానాగ్నితో జ్వలిస్తోన్న ఆమె మెదడు విపరీతమైన టెన్షన్‌కి గురయి అచేతనావస్థకు చేరువవుతోంది.

“తేజా నామాట వినరా నాన్నా” బతిమాలుతోందామె అ స్థితిలోకూడా నహనాన్ని కోల్పోకుండా, ఉహు చెప్పింది విని అర్ధం చేసుకునే మామూలు అందర్హాటి కుర్రాడు కాడు వాడు. మెంటల్లీ రిటార్జెడ్‌. వాడికి వినిపించదు. అందుకని వాడి జేబులో వినికిడి మిషను వుంటుందెప్పుడూ. అది చిరాగ్గా లాగి లాగి పడేస్తుంటాడు అప్పుడప్పుడూ.

ప్రత్యూష ఎట్టి పరిస్థితుల్లోనూ నహనాన్ని కోల్పోడానికి వీల్లేదు. వాడిని ఏమీ అనకూడదు. పిల్లాడి కంటే ముందు డాక్టర్లు తల్లికి వైద్యం చేస్తారు. సూచనలిస్తారు. బరువెక్కిన ఆమె మననుకి తరచుగా ఏకాంతంలో జలజలమని రాలిపోవడం తప్ప మరోమార్గం లేదు. వాడు పుట్టిన సంవత్సరానికర్థమయింది వాడికి విన్చించదని, వినిపించదు కాబట్టి తెలివితేటలూ, అవసరమైన జ్ఞానమూ పెరగలేదు. 'మెంటల్లీ రిటార్డెడ్‌ స్కూల్లో జాయిన్‌ చేసి ప్రతిరోజూ వాడిని తీసికెళ్ళడమూ, తీసుకురావడమూ... ఎంత ప్రయత్నించినా రోజు రోజుకీ ఆమె సహనం పలచబడి పోతూంది.

బన్సు దిగిన తరువాత దాదాపు అరమైలు దూరం వున్న ఇంటిదాకా నందుల్లో, గొందుల్లో తేజనేసుకుని నడవడమన్నది మరో యజ్ఞం. ఇంటికి రాగానే వాడిని విసురుగా కిందపడేసి, ఒళ్ళో ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడవసాగింది ప్రత్యూష...

కిందపడిన తేజ మరింత బిగ్గరగా ఏడుస్తున్నాడు.

అక్కడే సోఫాలో కూర్చుని పేపరు చూస్తోన్న సత్యనారాయణగారు లేచి హడా విడిగా కూతురి వద్దకు వచ్చారు.

“అమ్మా ప్రత్యూషా! ఏమిటమ్మా నువు చేస్తున్నది?” అన్నారాయన కూతురి తల నిమురుతూ... ఆయనకీ కూతురి పరిస్థితి అర్థమవుతూనే వుంది .

“నాన్నా” అంటూ ఆయన ఒడిలోకి వాలిపోయింది ప్రత్యూష.

“ఏంటండీ, ఏం జరిగింది?” ఈ హడావిడికి లోపలి నుంచి వచ్చిన తల్లి గుక్కపట్టి ఏడుస్తూన్న మనవడిని చేతిలోకి తీసుకుంటూ ప్రల్నించింది. తండ్రి ఒడిలోంచి తల తిప్పకుండా వెక్కుతూనే వుంది ప్రత్యూష.

“తల్లీ! ఏమయిందమ్మా... చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? కూతురి తల నిమురుతూ బాధగా వ్రల్హించారాయన.

రై గులాబి తాబ

“నాన్నా... నాన్నా... నాకు వీడొద్దు నాన్నా. నేను చచ్చిపోతాను. ఈ ప్రపంచంలో వాడయినా వుండాలి... వనేనయినా వుండాలి... ఎన్నాళ్ళు వీడితో నేనిలా కొలువు చేయను? నావల్ల కాదు నాన్నా. ప్లీజ్‌... వేను చచ్చిపోతాను నాన్నా” హిస్టీరికల్‌గా ఏడుస్తోన్న కూతురి వంక జాలిగా చూశాడాయన ,

ఎంతో అల్లారుముద్దుగా, అపురూపంగా పెరిగిన ప్రత్యూష అలా హృదయవిదారకంగా, దీనంగా ఏడుస్తూంటే ఆయన హృదయం తరుక్కుపోయినట్లయింది....

“నాన్నా వీడినెక్కడయినా అనాధాశ్రమంలో చేర్చించేద్దాం... నాకు వీడొద్దు నాన్నా. ప్లీజ్‌ వీడొద్దు... ఆ సిటీబన్సుల్లో నేనిక ప్రయాణం చేయలేను నాన్నా”

“అంతమాటనకు తల్లీ. లే, లేచి ముందు స్నానం చేసిరా... తేజ చూడు ఎలా అయి పోయాడో... వదినలంతా చూడు ఎలా చూస్తున్నారో”

తలెత్తి చుట్టూ చూసిందామె . పెరటి వాకిట్లో నుంచి పెద్దొదినా, వంట గదిగుమ్మం నుంచి చిన్నాదినా తొంగితొంగి తనకేసి జాలిగా చూస్తున్నారు... ఆ జాలిలోనే ఓ విధమైన ఆత్మసంతృప్తి. తీసేసిన ముసుగుని హడావుడిగా మళ్ళీ కప్పుకుని “ఛి... ఛీ... ఏమిటిలా బయటపడిపోయాను' అనుకుంటూ గబుక్కున కళ్ళు తుడుచుకుని లేచి బాత్‌రూమ్‌లోకి నడిచింది ప్రత్యూష,

స్నానం చేసి, అమ్మ ఇచ్చిన కాఫీ తాగి తన గదిలోకెళ్ళి పడుకుండిపోయింది.

“అమ్మా... మా.....మా” అంటూ చిట్టిచిట్టి చేతులతో తేజ తల్లి బుగ్గలను తాకుతుండగా గబుక్కున మెలకువ వచ్చిందామెకి. తన హృదయంలోలాగే గదినిండా చీకటి పేరుకుపోయింది. చప్పున ఆమె కళ్ళల్లో నీళ్ళూరేయి. “మా...మ్మా... పిలుస్తూనే వున్నాడు తేజ .

“పాపం ఇలా పుట్టడం వాడి తప్పా? కానేకాదు ఇదంతా తన దురదృష్టం. ముత్యాల్లాంటి పిల్లలు మానస, మందార పుట్టిన తరువాత ఇకచాలు, ట్యూబెక్టమీ చేయించుకుంటానని ఎంత గొడవపెట్టింది తను'

“ఇదెక్కడి చోద్యమే తల్లి... నాకు ఒక్కగానొక్కడు... వాడికి ఇద్దరూ ఆడపిల్లలే అయితే ఎలా... ఒక మగనలును లేకుండా కుదరదు” అంటూ రాగాలు తీసింది అత్తగారు.

“అలా కొదత్తయ్యా! మళ్ళీ ఆడపిల్ల పుడితేనో...? నా ఆరోగ్యం కూడా అంతంత మాళత్రంగావే వుందికదా” నచ్చచెప్పాలని చూసింది ప్రత్యూష.

“ఇద్దరికే ఇలా డీలాపడిపోతే ఎలానే? మా కాలంలో ఎంతెంతమందిని కనేవాళ్ళం?... నాకు ఏటా కానుపు తెలుసా? గర్వంగా చెప్పిందావిడ ఏదో ఉమన్‌ అడ్మినిస్టేటర్‌లాగ. ఆవిడకి అయిదుగురాడపిల్లల తరువాత తన భర్త చివరివాడు. అలాగే తనకూ ఒక మగపిల్లాడు కావాలని వాదిస్తుందావిడ .

ఆడయినా, మగయినా ఒకటేనని చెప్పినా ఆవిడ అర్ధంచేసుకోదు. పైపెచ్చు భర్త కూడా అవిడవైపే మొగ్గుచూపుతున్నాడు. తన శరీరాన్ని చీల్చుకుని వేరే జీవితాన్ని ఈ లోకంలోకి

గులాఐ అహ ్నాతళ

తీసుకొచ్చే విషయంమీద తనకి ఏమాత్రం అధికారంలేదన్న విషయం అర్ధమైపోయింది ప్రత్యూషకి .

ఫలితంగా ఈ తెలివిహీనుడూ, వినికిడి లేనివాడూ అయిన వంశాంకురం తన ఒడిలో పడ్డాడు. అది కూడా తన తప్పేనంటుంది అత్తగారు. ఇటు ఏడు తరాల్లోనూ, అటు ఏడు తరాల్లోనూ మా వంశంలో ఎవరికీ ఇటువంటి బిడ్డ పుట్టలేదు అంటుంది గుచ్చుతూ. అంటే మీవాళ్ళకే ఎవరికో ఇటువంటి దోషం వుంది అన్నట్టుగా ప్రసవించినపుడు చూడ్డానికి రావడం తప్ప, మళ్ళీ ఆవిడ కేజని చూడలేదు భర్త లోకం కోసమో, బయొలాజికల్‌ నీడ్‌ కోసమో, లేక భార్యన్న ప్రేమతోనో వారం వారం వచ్చినా వాడిని దగ్గరికి తీసుకోడు.

నిజమే వాడు తల పెద్దదిగా, కాళ్ళూ చేతులూ పుల్లల్లా, నల్లగా వికృతంగా వుంటాడు. అంతమాత్రాన తమ రక్తం పంచుకు పుట్టినబిడ్డ కాదూ... మరి ఎందుకంత అసహ్యం ఆయనకి? వాడు పుట్టడానికి కారణం ఆయనకాదూ... తన మూలంగా కాదూ మూడోసారి తను పురిటి కొచ్చింది. ఇప్పుడు వాళ్ళకేం? వాళ్ళంతా బాగానే వున్నారు.

ఎటొచ్చీ తనే ఇద్దరు బంగారు బొమ్మల్లాంటి ఆడపిల్లల్ని హాస్టల్లో వుంచి... భర్తకి, సంసారానికీ , స్వేచ్ళకీ దూరంగా ఇలా తల్లిదండ్రులవద్ద, వదివెల విసుగులూ, చిరాకులూ భరిస్తూ సిటీబస్సుల్లో జీవిస్తూ...

పగలంతా గడిచిపోయిన తర్వాత

రాత్రి రెక్కల మీద ఒత్తిగిలే నిశ్శబ్దపు పారలని నెమ్మదిగా కదిలిస్తూ ఆనీరవ నిశ్శబ్దంలో... ఏకాంత తపస్సులో నిమగ్నమైతే ఎన్నో జ్ఞాపకాలు వర్షంలా కురవడం మొదలెడతాయి.

మానస, మందార... ఆయన, తన ఇల్లూ, సంసారం, ఎన్నెన్నో అనుభూతుల పరి మళాలు, ఆ తరువాత అనంతమైన నిళ్ళబ్దం... అదృశ్యమైన బంగారుస్వప్పాల సౌధాలు ఆమె హృదయపు వాకిట్లో దిగులు మేఘాలై కురున్తూ వుంటాయి .

“ప్రత్యూష చెప్పినట్బగా ఆపిల్లాడ్ని అనాధాశ్రమంలో చేర్పించడం మంచివని... ఆ తరువాత ఆ అమ్మాయి భర్త దగ్గరికెళ్ళిపోతుంది. మనం మాత్రం ఎంతకాలమని భరిస్తాం” చెప్తోంది పెద్దాదిన.

“అవునక్కా! ఇటువంటి బిడ్డలు పుట్టినా అయిదారునెలల కంటే ఎక్కువ బతక రంటారు కదా... వీడేమిటీ ఇన్నేళ్ళు నెట్బకొచ్చాడు” చిన్నాదిన అనుమానం వెలిబుచ్చింది.

“ఏమయినా ప్రత్యూష రోజూ వాడిని స్కూలుకి తీసికెళ్ళడం, తీసుకురావడం... చాలా శ్రమతో కూడుకున్నది. ఆ సిటీబస్సులో ప్రయాణం నిజంగా ఒక యజ్ఞం” పెద్దన్నయ్య జాలి చూపిస్తున్నాడు.

“అంత జాలివుంటే రోజూ వెళ్ళి దిగబెట్టి రాకసోయారా?” పెద్దొదిన వెటకారం చేస్తోంది.

ప్రక్కగదిలో నుండి వినిపిస్తున్న బాలాల్లాంటి మాటలను వింటూ కొడుకుని మరింత గాఢంగా గుండెలకు హత్తుకుంది .

గులాబి ఈ0 వహ డ్న్లా+

“అమ్మో! వీడిని వదిలి తను వుండగలదా? కన్నతల్లి తనకే వీడి విషయంలో ఇంత విసుగ్గా వుంటే, అనాధాశ్రమంలో వీడిని ఎవరు చూస్తారు [్రేమగా' తల్లిధ్రేమలో వుక్కిరి బిక్కిరవుతూ తన బుల్లి బుల్లి వేళ్ళతో తల్లి బుగ్గలమీద రాస్తున్నాడు వాడు.

శః శ శ

“ఏమండీ! ఎంతకాలమిలా? నేనిక్కడా మీరక్కడా, పిల్లలెక్కడో చెట్బకొకరూ, పుట్ట కొకరూగా... ఇక నేను మిమ్మల్నాదిలి వుండలేనండీ ప్లీజ్‌... ఈ సిటీబస్సుల్లో ప్రయాణమూ చేయలేను . మనం ఇక్కడ ఫ్యామిలీ పెడదామండీ ప్లీజ్‌... స్కూలుకి దగ్గరగా ఇల్లు తీసు కుందాము... అప్పుడయితే నేను వీడిక్కొంత న్యాయం చేయగలనేమో” వీకెండ్‌కి వచ్చిన భర్త గుండెలమీద వాలి కళ్ళనీళ్ళు పెట్టుకుంది ప్రత్యూష.

“ఏంచేద్దాం ప్రత్యూ... మనం ఇంతవరకే తెచ్చుకున్నాం... ఇంకొన్నాళ్ళు ఓపికపట్సు... అక్కడి పాలాలన్నీ బేరం పెడ్తున్నాను. అది సెటిల్‌ చేసి ఫ్యాక్టరీ పెద్ద బావగారి మీదాదిలి మనం ఇక్కడే ఏదయినా వ్యాపారం చేసుకుందాం... అందాకా నీకీ ఇబ్బంది తప్పదు... అయినా ఇదంతా మన ఖర్మ...” బాధగా చెప్పాడు సురేష్‌.

గత మూడేళ్ళుగా భర్త ఇలానే చెప్తున్నాడు... అతడా పాలాలు అమ్మడు... తల్లిదండ్రుల్నీ, ఇల్లువాకిళ్ళనీ, వ్యాపార సాపారాలనీ, పుట్టిన వూరినీ వదిలి ఆయన దృష్టిలో ఒక వికృత శిశువు కోసం ఇంత దూరం రావడానికి సిద్ధంగా లేడతడు... కాకుంటే తను అడిగినప్పుడల్లా ఆవిధంగా చెప్పి మభ్యపెడ్తుంటాడు.

అయిదు నిముషాలు మౌనం వహించి

“సిట్రీబస్సుల్లో ప్రయాణం కష్టంగా వుంది... మరెవరితోనయినా పంపుదామంబే తల్లి తప్ప మరెవరూ తీసుకురాకూడదని షరతు పెట్టారు వాళ్ళు. తల్లుల్ని కూడా ఎడ్యుకేట్‌ చేస్తా రక్కడ"” చెప్పింది ప్రత్యూష.

“నిజమే ఈ మెంటల్లీ రిటార్టెడ్‌ స్కూలు మనూళ్ళో లేకపోవడం మన దురదృష్టం... ఎనీవే ఇంకా కొన్నాళ్ళు మనకీ ఎడబాటు తప్పదు... నీకీ ఇబ్బందీ తప్పదు” భార్యని దగ్గర తీసుకొని నచ్చచెప్పి ప్రయాణమయ్యాడు సురేష్‌ ....

భర్తని సాగనంపి ఇంట్లోకి వస్తూండగా విన్పించాయా కేకలు... తల్లి ఎందుకో పెద్ద పెద్దగా అరుస్తోంది.

“అబ్బబ్బ పిల్లాడు కాదు వీడు... అది ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో శాపమై పట్టుకు పీడిస్తున్నాడు. వీడు లేకున్నా హాయిగా వుండును... దాని జీవితం బాగుపడి పోను”

భయం భయంగా లోపలికొచ్చింది ప్రత్యూష.

గులాబి “సీ మాళ/

పెద్దొదిన గదిలో ఫ్లవర్‌వాజు పగులగొట్టి, ఆ గాజుపెంకులు చేతుల్లో గుచ్చుకోగా, ఆ రక్తం కారుతూంటే నొప్పి కూడా తెలీని స్థితిలో చప్పట్లు కొడుతూ అమ్మమేసి చూస్తున్నాడు తేజ... వాడికి అమ్మమ్మ తనని తిడుతోందన్న సంగతి కూడా తెలీడంలేదు.

“ఒకనాటితో వదిలే పీడకాదు ఇది... ఏలిన్నాటిశని, ఎల్లకాలమూ ఎవరివల్లనవుతుంది భరించడానికి. అది మా అన్నయ్య ఫారిన్నుంచి తీసుకొచ్చిన ఫ్లవర్‌వాజు...” ప్రత్యూషకి విన్సిం చాలని పెద్దగానే అంటోంది వదిన. ప్రత్యూషనలా గుచ్చడం వలన పగిలిపోయిన ఫ్లవర్‌వాజు తిరిగివచ్చినంత ఆనందంగా వుందామెకి. ప్రాణం చచ్చిపోయింది ప్రత్యూషకి. దాదాపుగా ప్రతి రోజూ ఇటువంటి సంఘటనలు ఎదురవుతూనే వువ్నాయామెకి.

వదిన గదిలోకి వెళ్ళి శుభ్రంగా ఆ ముక్కలన్నీ ఏరి, తుడిచివచ్చింది. చిన్నాదిన చిన్న కొడుక్కి కూడా ఆ ముక్కలు గుచ్చుకోవడంతో వాడి చేతికి ప్లాష్టరేస్తూ సణుక్కుంటోంది చివ్నాదిన.

“ఏమిటమ్మా మరదలా... ఎప్పుడొచ్చినా ఆ హడావుడి... నాలుగురోజులుండి వెళ్ళొచ్చు కదా... తమ్ముడిగార్పి వదిలి వుండేలాలేవే” అంటూ తనని ఆటపట్టించి, వుండమని బతిమాలిన వదినలేనా వీళ్ళు అనుకుంటూ ఆశ్చర్యపోయింది ప్రత్యూష

“మా....మా” అంటూ నెత్తురోడుతున్న చేతుల్ని ప్రత్యూష కట్టుకున్న చీరకి రుద్దుతూ పిలిచాడు తేజ. వాడికి శారీరక బాధ కూడా తెలుస్తున్నట్లుగా లేదు.

కోపంగా చెంప మీద ఒకటిచ్చింది. ఆతర్వాత కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ వాడివెత్తుకుని గదిలోకి వెళ్ళిపోయింది .

“వీడినేం చేయాలి? ఎలా చెప్తే వీడర్ధం చేసుకుంటాడు” దిండులో తలదూర్చి వెళ్ళి వెక్కి ఏడ్చింది ప్రత్యూష.

“మేమంతా ఒకరూ, ఇద్దరుతో సరిపెట్బకున్నాం. ముగ్గురు పిల్లల్ని కనడం దేనికి ? ఇలా వూళ్ళోవాళ్ళ మీదపడి వేధించడం దేనికీ?” 'పెద్దొదిన నిర్భయంగా, నిర్దాక్షిణ్యంగా మాటల తూటాలను వదులుతూవే వుంది. అవి ప్రత్యూష గుండెల్లోకి సూటిగా దూనుకుపోతూనే వున్నాయి.

వంశాంకురం కావాలంటూ పట్టబట్టిన అత్త, వీడు పుట్టాక 'హాస్పిటల్లోనే వదిలి వెళ్ళిపోదాం. మనకొద్దు వీడు' అంటూ తనతో సంఘర్షించిన భర్తా... వీళ్ళు ఇప్పటి తన పరిస్థితి చూస్తే ఏమంటారు?

“వాడు పుట్టకపోయినా బాగుండును. దాని జీవితం బాగుపడిపోను' పదేపదే తల్లి మాటలు జ్ఞప్తికి వచ్చి మనసును పొడుస్తున్నాయి. ఏడ్చిఏడ్చి అన్నం తినకుండానే నిద్రపోయారు ప్రత్యూషా, రేజా కూడా.

! శ శః గులాబి 42న డ్నాా+

ఆరోజు ప్రత్యూష త్వరగా తయారయింది స్కూలుకి వెళ్ళడం కోనం.

కొడుక్కి మొన్న వుట్టిన్రోజుకి కొన్న కొత్త బట్టలు వేసింది. అనేకానేక అవమానాలనీ, బాధలనీ నహించాక, ఎన్నెన్నో సందేహాలని అధిగమించిన తరువాత ఓ ప్రగాఢమైన నిర్ణయం తీసుకున్నట్ట తేటగా వుందామె ముఖం.

కొడుకునెత్తుకుని తల్లిదండ్రుల వద్దకెళ్ళి వెళ్ళొస్తానని చెప్పింది రోజూలాగే...

“తేజా... టాటా” చెప్పాడు తాతయ్య.

వాడికి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్ధమవుతోంది. తాఠతయ్యశేసి చూశాడు... కల్లి వాడి చేతిని పట్టి తాతయ్యకూ, అమ్మమ్మకూ టాటా చెప్పించింది.

బస్టాపు వరకూ నడవడం ఈరోజెందుకో పెద్ద కష్టంగా అనించలేదు ప్రత్యూషకి, బస్సు కూడా రోజూలాగ ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే వచ్చేసినట్లనిపించింది. బస్సులో కూర్చుని కొడుకుని చూస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఈరోజు వాడిని అవాధాశ్రమంలో చేర్చించ డానికే నిశ్చయించుకుంది ప్రత్యూష

భర్త, తండ్రి తనని ప్రశ్నిస్తే...

తను బాత్‌రూమ్‌లో వుండగా వాడెక్కడికో వెళ్ళిపోయాడనీ. ఎంత వెదికినా కన్పించ లేదనీ చెప్పాలనుకుంది. చెప్పి నమ్మించుదామనే అనుకుంది. భర్త కెలాగూ కొడుకుపట్ల సహజాత్మీయతలు లేవు కాబట్టి దీన్ని పెద్ద సీరియస్‌గా పట్టించుకోడు. తండ్రికూడా అంతర్గ తంగా కూతురి క్షేమాన్ని కోరుతున్నాడు కాబట్టి తేలిగ్గా నిట్టురుస్తాడు. ఆమె గుండె గొంతులో కొచ్చినట్టయింది. మిగిలిన ఎవ్వరూ తేజాని గురించి గట్టిగా ప్రశ్నించేవాళ్ళు లేరు.

బస్సు అనాధాశ్రమాన్ని సమీపిస్తుండగా, మరోసారి కొడుకుని గాఢంగా గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టకుంది ప్రత్యూష.

“మ్మా... మ్మా” పిల్చాడు వాడు తల్లి బుగ్గల మీద చేతులు వేస్తూ. వాడికదొక్క పదం మాత్రమే వచ్చు.

ఆమె గుండెల్లో నీటిచెమ్మ... కళ్ళల్లో నీటి అలలు...

“భగవాన్‌... ఏ తల్లికీ ఇటువంటి పరిస్థితి రాకూడదు...' ఆమె హృదయం మూగగా రోదిస్తోంది. కొడుకువి వదలలేనట్ట్లుగా గట్టిగా హత్తుకుని వుంది. బస్సు అనాధాశ్రమం ప్టాసింగ్‌లో ఆగింది.

ప్రతిరోజూ ఎన్ని వేలవేల క్షణాలు గడిచినా రాని గమ్యం, ఈవేళ అతిత్వరగా వచ్చేసి నట్టుగా అన్పించిందామెకు. నిజానికీ తేజ స్కూలుకంటే అనాధాశ్రమం చాలా దగ్గర.

బరువెక్కిన హృదయంతో భారంగా లేచి నిల్చుందామె. ఒకవైపు తేజ కోసం కొన్న తినుబండారాల ప్యాకెట్టూ, వాడి బట్టల బ్యాగూ, తన హేండ్‌బ్యాగూ, వాడి కోనం కొన్న దిండూ అన్నీ అస్తవ్యస్తంగా పట్టకుని మరోచేత్తో 'తేజి'ని ఎత్తుకుని ప్రత్యూష జనాల్ని దాటు కుంటూ, వెట్టకుంటూ బస్‌ దిగుతూండగా జరిగిందది.

గులాజి అబ వేసా 43

హడావిడిగా బస్సెక్కబోతూన్న ఆ నడివయస్కుడి బ్యాగ్‌ తగిలి చప్పున జారి తేజ కింద పడ్డాడు. అదుపు చేయడం ప్రత్యూష శక్యం కాకుండా పోయింది. సరిగ్గా అదే క్షణంలో కదిలింది ప్రక్కనే ఆగివున్న బస్సు. కింద నిలుచున్న వాళ్ళకి కూడా ఆబిడ్డని ఇవతలకి లాగే ఆవకాశం లేకుండొపోయింది. ఆబస్సు ముందు చక్రం తేజ మీది నుండి వెళ్తూంటే నిన్సహా యంగా, అగమ్యంగా, వోట మాటరానిదానిలా దిగ్భాంతిగా చూస్తుండిపోయింది ప్రత్యూష. రెప్పపాటులో జరిగిపోయిన అ సంఘటనకి, రోడ్డు చలనం లేవి చిత్తరువులా నిళ్ళబ్దంగా అయిపోయింది.

కన్నెర్ర రంగు పాముకున్నట్టు రోడ్డంతా రక్తం... ఎర్రైగ్రని రక్తం... మృత్యువు నల్లగా వుంటుందనుకువే వాళ్ళు ఎర్రవైన ఆ భయంకర ప్రళయార్గిని చూసి అప్పుడప్పుడూ చావు ఎర్రగా కూడా వుంటుంది సుమా అనుకువేలా...

తూరుపు ఆకాశప్పటమ్మీద బంగారు పెన్సిళ్ళతో రంగులు పూస్తోన్న బాలసూర్యుడు సిగ్గుపడేలా వుందా ఎగ్రవైన మృత్యువు.

అయిపోయింది... అంతా అయిపోయింది... అనాధాశ్రమంలో వుండీ ఆ తల్లిని నిందల పాలు చేయడం ఇష్టంలేక, తల్లిని అవమావార్ని నుండి కాపాడడంకోసం ఆ పిల్లవాడీ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు శాశ్వతంగా. జరిగిన వాస్తవాన్ని జీర్ణించుకోలేని ప్రత్యూష అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది.

అయితే ఆమె ఆశించినట్టుగా భర్త, పిల్లలతో ప్రశాంతంగా జీవించడంలేదు ప్రత్యూష వ్రన్తుతం ఆమె కీల్పాక్‌ మెంటల్‌ హాస్పిటల్లో వుంది. “నేవే చంపేశాను... నా బిడ్డను నేనే చంపేశాను... చేతులారా చంపేశాను” అని కేకలేస్తూండే ప్రళ్యూషని అదుపులోకి తీసుకోవడం అస్పత్రివర్గాల నశంకావడం లేదు... .... ఆమె భర్త సురేష్‌ అప్పుడప్పుడూ వెళ్ళి భార్యని చూసి వన్తున్నాడు.

ఆంధ్రజ్యోతి దీపావళి వ్రత్యేక నంచిక, 1995 గులాబి

ఉళ సక్న్లా+

శిథిలాలు

చెరువుగట్బకానుకుని వున్న ఆ మట్టిరోడ్డు మీదికి కారు మలుపు తిరగ్గానే నా గుండె ఉద్వేగంతో వేగంగా కొట్టకోసాగింది. ఈ చెరువుగట్టు మీదా, కిందా నా బాల్యపు బుడీబుడి నడకలూ, పరుగులూ, గెంళులూ, ఆటలూ, అమ్మకు తెలీకుండా చెరువులో ఈతకొటట్టడం... తడిపిన తలా, ఒంటిమీది గౌనూ ఆరేదాకా యింటికి వెళ్ళకపోవడం, అంతసేపు యింటికి రాకుండా కంగారు పెట్టినందుకు దాదావుగా ప్రతిరోజూ అమ్మచేత తన్నులు తినడం అమ్మమ్మ అడ్డురావడం, తాతయ్య అమ్మని కోప్పడ్డం అంతా పూర్వజన్మలోలా నా గుండె

మాళిగలో నిక్షిప్తమైవున్నాయి. కారు లక్షిందేవి మాను దాటుతుండగా, చప్పున గుండెల్లో నుండి గేలం వేసిలాగినట్లుగా దు:ఖం ఎగదన్నుకు వచ్చింది. ఈ వూళ్ళో లక్షిందేవి మానుకి ఓ పత్ర్యేకతుంది. ఆ చెట్టు ముందు నిల్చుని మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా జరిగి తీరుతుందని వూరివాళ్ళ నమ్మిక. అమ్మమ్మ

శిఖరాలు

ఈవై ఇయ ఇన ళ్‌

ఈ లక్షిందేవి చెట్టు గురించి తనకి కథలు కథలుగా చెప్పేది. ఈ వూరి ఆడపడుచు అత్తింట్లో కష్టాలు తట్బకోలేక అర్థరాత్రి ఒంటరిగా పుట్టిల్లు చేరితే పరువుకెరిచిన ఆ తండ్రి “తన యింట్లోకి రావడానికి వీల్లేదనీ, తిరిగి అత్తింటికే వెళ్ళమనీ, భర్తతో కలిసి గౌరవంగా రమ్మనీ' శాసించాడట. అవిడ తిరిగి అత్తింటికి వెళ్ళడాని కిష్టపడక ఈ చెరువుగట్బ మీదకొచ్చి మానైపోయిందని అంతా చెప్పుకుంటూ వుండేవారు.

తనూ, చినమావయ్యా, గిరిజా, లలితా, రాజేశ్వరీ అంతా కలిసి ఈ చెట్టుకింద ఎన్ని

మొక్కులు మొక్కుకున్నారు, ఎన్నెన్ని కోరికలు కోరుకున్నారు... 'ఏం కోరుకున్నావు మామయ్యా! అంటే 'నువ్వు నా పెళ్ళానివి కావాలని” అని చినమామయ్య అమాయకంగా అన్నాడని తను సిగ్గుతో కూడిన కోపాన్ని ప్రదర్శిస్తూ మామయ్యని యొంకతెంత దూరం తరుముకుంది...న్చ్‌ లం

“అమ్మా... ఎటు?” డ్రైవరు పిలుపుతో వులిక్కిపడ్డాను.

అప్పటికే కారు చెరువుకట్ట రోడ్డు దాటి గుడివద్దకు చేరుకుంది. అక్కడినుండి నేరుగా ఒకదారి 'మాదిగాడ'లోకి, గుడికి ఎదురుగా వున్న రోడ్డు వూర్ణోకి దారితీస్తుంది. డైవరుకి దారి చూపించి వెనక్కి జారగిలబడ్డాను.

గుడి నామరూపాలు లేకుండా శిథిలమైపోయి వుంది. ఈ గుడితో నా అనుబంధం చెప్పాల్పొస్తే చరిత్ర పాఠమవుతుంది. ప్రతి రాత్రి పనులయ్యాక ఊళ్ళ జనమంతా గుడివద్ద చేరి భజన కార్యకమ్రం జరిపిం చేవారు.

“పాండురంగ విళలా... పండరినాథ విళలా' అంటూ హృదయరంజకంగా సాగే ఆ భజనకి యే ఒక్కరాత్రి మిస్సయ్యేవాళ్ళం కాదు నేనూ, చినమామయ్యా. భజన తర్వాత దొరికే గుగ్గిళ్ళ ప్రసాదం కోసం గుడ్డుకూరా, గడ్డపెరుగూతో బతిమాలి, బామాలి గోరుముద్దలు తిన్చించే అమ్మమ్మకి మస్కాళొట్టి, అందరికంటే ముందు లలితా, గిరిజలతో కలిసి గుడికి చేరుకువేవాళ్ళం. అయితే తిరిగి నేను యెలా యింటికి చేరుకునేదాన్నో గుర్తుండేది కాదు. మెలకువ వచ్చేసరికి అమ్మమ్మ పక్కలో వుండేదాన్ని తాతయ్య స్వయంగా వచ్చి మామయ్య ఒడిలో తలపెట్టి నిద్రపోతున్న తనని భుజాన వేసుకుని తీసుకొచ్చేవాడని అమ్మ వినుక్కుంటే తప్ప అర్ధమయేది కాదు.

గుడి వక్కగా వున్న బావి పూడ్చివేయబడి దాని స్థానంలో “బోరు” బిగించబడి వుంది. ఆ 'బావి'ని అంతా 'గుడిబాయి' అని పిలిచేవాళ్ళు. అమ్మ గుడిబాయి నీళ్ళుతప్ప మరే యితర బావి నుండీ నీళ్ళు తెచ్చినా తాగేది కాదు. అమ్మమ్మ ఈ విషయమై అమ్మని ఎప్పుడూ ముద్దు ముద్దుగా కసురుకుంటూ వుండేది. పనివాళ్ళు రానిరోజునయినా సరే చినతాతయ్యా వాళ్ళ సేద్యగాడితో ఒక బిందె గుడిబాయి నీళ్ళు తెప్పించేవాడు తాతయ్య కూతురి కోసం.

ముగ్గురన్నదమ్ముల నడుమ ముద్దుగా పుట్టిన అమ్మ ఆ రోజుల్లోనే రాకుమార్తెలా పెరిగింది. తన పదో ఏట 'వడ్డాణం' కావాలని మారాం చేసిందని తాతయ్య అప్పటికప్పుడు మద్రాసు వెళ్ళి చిన్ని వడ్డాణం చేయించి తీసుకొచ్చాడని వూరు వూరంతా విచిత్రపోయి వచ్చి

శిధిలాలు భల వ్య? బమజవో

చూసెళ్ళిందట. కనిపించకుండా పోయిన 'గుడిబాయి'లాగే అతి చిన్నవయసులొనే అమ్మ కూడ వెళ్ళిపోయింది. అమ్మ ఆలోచనలతో నా గుండెల్లో నీళ్ళూరేయి.

ఆ వూరు వూరంతా మొత్తం కలిసి పొడవాటి ఆ వీధి ఒక్కటే వెనుకగా కొన్ని యిళ్ళున్నా అవన్నీ దాదాపుగా పూరిళ్ళు. చెరువుకట్ట రోడ్డు నానుకుని వున్న ఈ శిథిల దేవాలయం వూరికి ఆరంభం అయితే ఈ వీధికి దొదాపుగా చివర వున్న “ఇల్లు అమ్మమ్మ వాళ్ళది. అమ్మమ్మ యింటికి యింకా కొంచెం చివరగా వున్న మిద్దె శ్రీరంగారెడ్డిది. రంగారెడ్డిగారమ్మాయి రాజేశ్వరి నాకత్యంత సన్నిహిత మిత్రురాలు. 'సెలవులొస్తాయంటే చాలు నాకోసం ఆతృతగా ఎదురు చూసేది. పూర్తయి వెళ్ళిపోతానంటే తన చిన్నిచిన్ని కళ్ళను చికిలించుకుంటూ కళ్ళనీళ్ళను దాచుకునేది. ఇప్పుడంతా ఎక్కడెక్కడున్నారో మరి? అమ్మమ్మ తన పెళ్ళికొచ్చినప్పుడు దొడ్లో రమ్మాయి 'శాంత' తిరుపతిలో వుందని, దాని మొగుడు యాక్సిడెంట్లో పోయాడనీ చెప్పింది.

ఇదిగో ఈ యిల్లు మిదిర్దటోళ్ళ గిరిజది. వీళ్ళింటి పేరు పరిటాల అయినా అంతా వీళ్ళని మిద్దింటోళ్ళని పిలిచేవాళ్ళు. ఆ వూళ్ళో అప్పటికి యిదొక్కటే డాబా యిల్లట. అందుకే అంతా ఆ పేరుతో వ్యవహరించేవారని, అది అలా వాళ్ళింటి 'పేరుగా మిగిలిపోయిందనీ అమ్మమ్మ వివరించి చెప్పేది. ఇంటి నిండుగా మనుషులతో, యెప్పుడూ కొత్తగా వేయించబడిన రంగులతో మిలమిలా మెరిసిపోతూండే మిద్దిల్లు... వెలిసిపోయిన గోడలతో అక్కడక్కడ పాచివట్టి, పగుళ్ళలో నుండి మొలచిన మర్రిచెట్లతో కేవలం పూర్వవైభవానికి ప్రతీకలా నిలిచి వుంది. పాత మిద్దింటి వైభవం మనోచిత్రం మీద నిలిచి గుండె కదిలినట్టయింది. అప్పటికే కారు మిద్దింటిని దాటిపోయింది.

ఒక్కరోజు... ఒక్కరోజంటే ఒక్కరోజు సెలవొస్తే చాలు ఆదివారం కలిసేలా నాలుగు రోజులు సెలవు పెట్టేసి అమ్మమ్మ వద్దకు పరిగెత్తుకొచ్చేదాన్ని... అన్నయ్య మాత్రం మేనత్త వద్దకి విజయవాడ వెళ్ళేవాడు. అప్పట్లో కార్లూ, బస్సులూ వూళ్ళొకి వచ్చేవి కావు. నెల్లూరులో బస్సెక్కి మద్రాసులో దిగి, అక్కడ బస్సు మారి కీళానూర్లో బస్సు దిగి కాలినడకన విష్ణువాక, “పేరత్తూరు అన్నీ దొటుకుని వూళ్ళోకొచ్చేవాళ్ళం. నాన్న ఎప్పుడూ ఈ వూరికి వచ్చినట్లుగా తను చూళ్ళేదు. అమ్మ మాత్రం అప్పడప్పుడూ వొచ్చేది. మిగిలిన సమయాల్లో పనివాళ్ళని పెట్టి నన్ను పంపించేవాళ్ళు.

చెరువు కట్ట దగ్గర్నుండే మొదలయ్యేవి పలకరింపులు.

ముసలాళ్ళు కళ్ళకు అరచేతిని అడ్డం వుంచుకుని

“ఎవురాయమ్మి? శ్యామలమ్మ కూతురు దానే?” అనేవాళ్ళు.

ఎప్పుడూ చంద్రశేఖరంగారన్మూయిగా మాత్రమే వ్యవహరింపబడే నేను యిలా యిక్కడ మాత్రం శ్యామలమ్మ కూతురుగా పిలవబడ్డం చిత్రంగా, హృద్యంగా, యిష్టంగా తోచేది నాకు.

+ఖపమణా?

“ఎన్నమ్మా చిన్నమ్మా... అమ్మా వర్గియా?” అంటూ పలకరించేవాళ్ళు పాలాల్లో పనిచేస్తున్న సేద్యగాళ్ళు.

తమిళనాడులోని మారుమూల వున్న ఆ చిన్న పల్లెటూళ్ళో ఆంతా మాట్లాడేది తెలుగే అయినా, పూర్తి అరవంలో కలగలిసిపోయిన తెలుగు. తమిళవాసన మిళితమైన ఆ తెలుగంటే ఎందుకో చెప్పలేను కానీ వా కెంతో యిష్టంగా వుంటుంది. ఇన్నాళ్ళ తర్వాత ఈ నేలనీ, ఈ వీధిన, ఈ తెలుగునీ చూమ్తంటే అమ్మని చూసినట్లుగా, అమ్మని కౌగలించుకున్నంత ఆనందంగా వుంది నాకు.

వేనున్న బొంబాయి మహానగరంలో ఎన్నడయినా, ఎక్కడయినా అరవ వాసన తగిలినా, తమిళమాట విన్పించినా నా హృదయం వుష్పాంగిపోతుంది. అప్పుడప్పుడూ నేను తెలుగుదాన్నో, తమిళియన్నో అన్న అనుమానం కూడ కలుగుతుంటుంది నాకు.

బొంబాయి... బోంబే, ఢిల్లీ, కలకత్తా వంటి మహానగరాల్లో జీవించాలని, ఆటాచ్చ్‌ బాత్‌రూముల్లోనే స్నానం చేయాలనీ, ఆఫీసర్‌ భార్య హోదా వెలగబెట్టాలనీ, బంగళాల్లో నివసించాలనీ తను ఎన్నడూ కలలు గనలేదు.

తమ్ముడితో తన పెళ్ళి జరిపించాలని అమ్మకీ, తనని కోడల్ని చేసుకోవాలని అమ్మమ్మకీ చాలా కోరిగ్గా వుండేది. చినతాతయ్య తనని ఎప్పుడూ “మనవరాలు కోడలా' అంటూ కలగలిపి ముద్దుగా పిలిచేవాడు.

అయితే 'మట్టి ఏసుక్కునేవాడికి నా కూతుర్నిచ్చేది లేదని' నాన్న గట్టిగా చెప్పేశాడు. చినమామయ్య ఎక్కువగా చదువుకోలేదు. మట్టే తన సర్వస్వమని నమ్మిన తాతయ్యకి అసలైన వారసుడు చినమామయ్య.

ఈ మట్టి పిసుక్కోవడంలో వున్న ఆనందం, మట్టితోనూ, ఈ గొడ్డతోనూ చినమామయ్య కున్న అనుబంధం, ఆత్మీయత సూట్లు వేసుకునే వాళ్ళని మాత్రమే మనుషులుగా లెక్కించే నాన్నకి ఎన్నటికీ అర్ధంకాదేమో. నేను పెద్దదాన్నయింది మొదలు నన్నీ వూరికే పంపించడం మానేశాడు నాన్న శలవులొస్తే చాలు నా మనసు విలవిల్తాడిపోయేది .

అమ్మమ్మ, తాతయ్య ఎంత మొత్తుకున్నా వినకుండా నన్ను మా మేనత్త కొడుకు మధుకర్‌ కిచ్చి పెళ్ళి చేసేసి బొంబాయి పంపించి తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు నాన్న. తన మొండితనంతో యింటిల్లిపాదినీ యువరాణిలా ఏలిన అమ్మ భర్త విషయంలో మాత్రం అసహాయురాలిగా, బేలగా చూస్తుండిపోయింది. ఆ దిగులుతోనే కృంగి, కృళించి వా పెళ్ళయిన ఆరునెలలకే అమ్మ వెళ్ళిపోయింది.

అమ్మ లేకపోవడం, అన్నయ్య రెండో మేనత్త కూతుర్చి పెళ్ళి చేసుకుని ఫారిన్‌ వెళ్ళి పోవడం, నాన్న దేశదిమ్మరిలా వూళ్ళు పట్టి తిరుగుతూండడంతో, నాకు ఆంధప్రద్రేశ్‌కి వచ్చే అవసరమే లేకుండా పోయింది. ఒకటి , రెండుసార్లు అత్తగారింటికి వచ్చినా హైదరాబాదునుండి మద్రాసు వెళ్ళి అమ్మమ్మను చూసేందుకు వీలుపడింది కాదు.

శిధిలాలు ఈర వధవ

అమ్మ మరణం తరువాత దాదాపుగా రెండు కుటుంబాల నడుమా సంబంధం తెగిపోయినట్ట్లుగా అయింది.

“అమ్మా! వూరు దాటి వచ్చేశాం” చెప్పాడు డ్రైవరు ఆదుర్దాగా.

ఆలోచనా స్రవంతి నుండి చటుక్కున బయటపడి చుట్టూ చూశాను. శ్రీరంగారెడ్డిగారి యింటి బయటి అరుగులు కూలిపోయి... అవి తీసే వారి రాకకోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇంటిగోడలు రంగులు వెలిసిపోయి కళతప్పి రాచరికాన్ని కోల్పోయిన రాచ కుటుంబంలా వుంది.

“ఏమిటిది? ఊరు ఊరంతా ఎందుకిలా శిథిలమైపోయింది? ఊర్లోని మనుషులంతా ఏమయిపోయారు? ఆ పలకరింపులేమయినాయి?' మనసులోనే తలపోస్తూ అమ్మమ్మయిల్లు చూపించి కారాపమని డైవరుతో చెప్పాను.

కారు శబ్దం వినగానే ఎదురింటి అంగడి మునెమ్మ తలెత్తి నాకేసి చూస్తూ గుండు కళ్ళద్దాలు సవరించుకుంది...

“ఈవిడ యింకా బతికేవుందా?' పలకరిద్దామన్పించి ఆ ఒక్కక్షణం ఆలస్యాన్ని కూడ సహించలేనట్లుగా, హేండ్‌బేగ్‌తోపాటు చినమామయ్య కిష్టమని కొన్న చిన్న ద్రాక్ష కవర్షి చేతిలోకి తీసుకుని గుండెల కానించుకుని, మెల్లిగా గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టాను. కాంపౌండు లోపలికి చూసి మరోసారి విస్తుపోవాల్సివచ్చింది నేను. నా చిన్నప్పుడు పచ్చని పర్షియన్‌ కార్పెట్లా రకరకాల మొక్కలతో నిండుగా నిండి వుండే ఆ పరిసరాలు పూర్తిగా ఎండిపోయి అక్కడక్కడా బండరాళ్ళు పోగయి వున్నాయి.

ఇంటికి ఆనుకుని వున్న పెద్దరుగునెక్కి పైనున్న వాకిలికి కట్టిన మైకుని అందుకోబోయి తొను కిందపడ్డం మామయ్యలూ, అమ్మమ్మ, తాతయ్యా నేను చనిపోయినంత ఎక్కువగా గాభరాపడ్డం నా మనో యవనిక మీద చిత్రమై నిల్చింది. వేసవిలో అమ్మమ్మ ఈ అరుగు మీద కూర్చునే పూలజడ వేసేది. అదీ ఈ దొడ్లో విరిసిన మల్లెమొగ్గలతో. మరి, యిదేమిటి? ఈ యిల్లూ... ఎవరో మెలి తిప్పినట్లుగా గుండెల్లోనుంచి దు:ఖం ఎగదన్నుకు వచ్చింది. జ్ఞాపకాలు గాయాలై నా గుండెల్ని సలపరిస్తున్నాయి.

“చిన్నీ... నువ్వా? ఇదేనా రావడం? ఒక్కదానివే వచ్చావా?” దాచుకుందామన్నా చిన మామయ్య ముఖంలో ఆనందం దాగడం లేదు. కన్నీళ్ళు అడ్డం పడుతోన్న గొంతుని గట్టిగా అదిమి

“లేదు మామయ్యా, ఇద్దరం వచ్చాం... మద్రాసులో ఆయనకేదో మీటింగుంటే...నన్ను కారిచ్చి పంపించారు...” చెప్పాన్చేను.

“రా...రా... సమయానికొచ్చావు... అమ్మనిన్ను చూసిందంటే లేచి కూర్చుంటుంది...” అంటూ లోపలికి దారితీశాడు.

శిధిలాలు ఈ? మ హాదచదో కో

“అయితే అమ్మమ్మకు ఒంట్లో బాగోలేదన్నమాట' అనుకుంటూ ఒణుకుతున్న కాళ్ళతో లోనికి అడుగుపెట్టాను. అన్నీ సవ్యంగా వుండి అనుకున్నట్టుగా జరిగివున్నట్లయితే కుడికాలు పెట్టివుండేదాన్ని.

ఛ...ఛ.. .యిదేమిటి? యిలా ఆలోచిస్తున్నాను. నాకు పెళ్ళయింది. చినమామయ్య కూడ పెళ్ళయి హాయిగా కాపురం చేసుకుంటున్నాడు. ఇక యిటువంటి ఆలోచనలు కూడదు అనుకుంటూనే వెనుక నుండి మామయ్య కేసి చూశాను... మామయ్యలో ఇదివరకటి దారుఢ్యం లేదు. మనిషి బాగా కృంగిపోయినట్లుగా వున్నాడు. ఇదివరకటి రంగుకూడా లేదు. నల్లకప్పేసి నట్టున్నాడు. ఆలోచనతోనే అమ్మమ్మ పడుకున్న నాలుగు తలుపుల యింట్లోకి అడుగుపెట్టాను.

మంచానికి కరచుకుపోయి వున్న ఆ శాల్తీ మహారాజ్ఞిలా ఈ యింటినంతటినీ శాసిస్తూం డిన అమ్మమ్మ అనుకుంటే చినమామయ్యని చూసినప్పట్పుండీ ఆతి ప్రయత్నం మీద అదిమి 'పెట్టకున్న దు:ఖం తన అవుట్‌లెట్‌ని వెతుక్కుంది. కల్హార సరస్సులయిన నా కళ్ళనీ, నన్సు కౌగిట్లొ పొదివి పట్టుకుని లోలోపలే వెక్కుతున్న అమ్మన్మునీ చూస్తూ భారంగా కుర్చీలో జారగిలబడి వెనక్కి వాలాడు చినమామయ్య.

ముగ్గురి గుండెలూ గునగుపగా యెన్నెన్నో మాట్లాడుకుంటున్నాయి. మౌనం నుండి యిన్ని సంభాషణలు జరుపవచ్చని వాకు తెలీదు. వేను ఏడుస్తూనే వున్నాను. పదిహేనేళ్ళనా హృదయభారాన్ని తీర్చుకోవడానికి యింకా, యింకా కొంచెంసేపు ఏర్చివుందునేమో మనసారా... ఆ గర్జన విన్పించక పోయివున్నట్టయితే.

ప్రధానోపాధ్యాయుని అడుగుల చప్పుడు విని అల్లరిమానేసిన విద్యార్థిలా అమ్మమ్మ చప్పున ఏడుపాపేసింది.

“ఏమిటా ఏడుపులూ... పెడబొబ్బలూనూ... ఇప్పుడే శవం లేచినట్లుగా... ఇంకా టయిముందిలెండి..” అమ్మమ్మ కౌగిలి నుండి నన్ను వేను విడిపించుకోకుండానే దెబ్బతిన్నట్లుగా అటుకేసి చూశాను... చినమామయ్య భార్య అయివుండాలి.

పెద్దత్తలిద్దరూ తనకు బాగా తెలును. తన పెళ్ళయిన తరువాత రెండు మూడేళ్ళకి జరిగిన చినమామయ్య పెళ్ళికి మా ఆయన నన్ను పంపించనేలేదు.

ఆ గర్జన విన్న మామయ్య మెల్లిగా లేచి భారంగా అడుగులు వేసుకుంటూ బయటి శెళ్ళిపోయాడు.

“ఎవరావిడ?” చినమామయ్య వి వెంటాడినట్లుగా వెళ్ళి ప్రశ్నిస్తోందామె. మామయ్య ఏం చెప్పాడో తనకి విన్చించలేదు. కానీ...

“ఓహో ఈవిడేనా? ఇప్పుడెందుకొచ్చినట్టై?” ఒక విధమైన అనసూయ ఆ గొంతులో.

“అమ్మమ్మా” పిలిచాన్నేను.

“వూ” కల చెదిరిపోతుందేమోనన్నట్లు గాభరాగా నన్ను దగ్గరికి పాదుపుకుని మౌనంగా

వుండీపోయిందామె. శిధిలాలు చస

“పెద్ద మామయ్య, శేఖరం మామయ్య, అత్తలూ అంతా ఏరి?” అంటూ ప్రశ్నించాను.

భారమైన నిట్టూర్పుతో ఒకింత లేచికూర్చుంది.

“వాళ్ళంతా యింకా యాడుండారమ్మా... ఎప్పుడో పట్నం పోయినారు కడుపు చేత్తో పట్టుకుని... ఇదిగో ఈ ఎర్రిబాగులోడు మాత్రం యింకా ఈ యింటినీ, నన్నూ, ఈ వూరినీ వొదల్లేకుండా పాఠకులాడ్డుండాడు' చెప్పింది అమ్మమ్మ చిన్న కొడుకుని తలచుకుంటూ జాలిగా.

ఆమాటా, ఈమాటా... అమ్మమ్మ ఆరోగ్యం... మా ఆయన ఉద్యోగం, పిల్లల చదువులూ అన్ని విశేషాలూ ఒకరినొకరం పరామర్శించుకుంటూ... అరగంట గడిచేక.

“భోజనానికి లేవండి” పిల్చిందామె. ఈసారి యిదివరకటి గర్జింపులేదు. ఒకింత సౌమ్యంగా వుందామె గొంతు.

భోజనం చేస్తుండగా వచ్చాడు మామయ్య.

“ఇదిగో గడ్డపెరుగు... చిన్ని పెరుగులేందే అన్నం తినదు... మిద్దింటి శారదక్కనడిగి తెచ్చాను... వెయ్యి” అంటూ భార్య కందించాడు. అంతదాకా సరళంగా వున్న సుజాత ముఖం కందగడ్డయిపోయింది.

అలా ముఖం గంటు పెట్టకునే నాకు పెరుగు వడ్డించింది.

వా భోజనమయ్యాక పైకి వెళ్ళిపోయాను అమ్మమ్మతో కొంచెంసేపు మాట్లాడి.

ఎప్పుడు నిద్రపట్టానో కానీ అయిదింటికి చినమామయ్య పిలుపుతో కానీ మెలకువ రాలేదు. మామయ్య చేతిలో కాఫీ కప్పు.

“అదేమిటి చినమామయ్యా? నువు తీసుకొచ్చేవు. నేనే వచ్చేదాన్నిగా...”

“ఫ్లేదులే... లేచి ముఖం కడుక్కుని కాఫీ తాగేయ్‌... కొంచెం సేపలా బయటిళెళ్ళాద్దాం. మన పాలాలు యిప్పుడెలా వున్నాయో చూద్దువుగాని” చినమామయ్య భలే హుషారుగా వున్నాడు. మధ్యాహ్నం నేను చూసినప్పటి చినమామయ్యకీ, ఇప్పటికీ చాలా తేడా వుంది.

కాఫీ తాగుతూ చినమామయ్య కేసి చూశాను.

“లే మరీ” తొందరచేశాడు చినమామయ్య నన్ను.

“వద్దులే మామయ్యా... ఇక నేను బయళ్దేరేస్తాను. ఆయన త్వరగా వచ్చేయమన్నారు. ఎదురుచూస్తుంటారు కూడ” చెప్పాను దిగులుగా.

“ఏంటి? అప్పుడేనా? నాలుగు రోజులుండవా?” దిగాలుగా ప్రశ్నించాడు మామయ్య.

“కుదరదు... రేపు రాత్రికే తిరుగు ప్రయాణం. అమ్మమ్మని చూడాలని పట్టుబడితే తప్పనిసరిగా పంపించారు... ఊ... సుజాత ఏం చేస్తోందీ... అమ్మమ్మ లేచిందా?” మాటమారుస్తూ

“సుజాత లేదు... ఊరెళ్ళిపోయింది”

“అదేం?”

లతో. నన భాభ జగ ౧.8. నటు 1 జ నక గ.

“అది తనకు అలవాటే. కోపమొచ్చినప్పుడల్లా అలా పుట్టింటికి వెళ్ళిపోతుంది అమ్మ పోరుతో మళ్ళీ నేను వెళ్ళి బతిమాలి, బామాలి తీనుకొస్తే వస్తుంది” నవ్వుతూనే చెప్పాడు.

“ఇంతకీ ఏమిటి అసంతృప్తి? చినమామయ్య భార్య కూడ అసంతృప్తిగా వుంటుందా?” అన్నాను ఆశ్చర్యంగా. వా కళ్ళల్లో ఒకింత ఆరాధన కూడ తొంగిచూచి వుండొచ్చు.

“తృప్తీ అసంతృషప్తీ అనేవి వాళ్ళ వాళ్ళ మన:ఃప్రవృత్తులను బట్టి వుంటాయి. చిన్నీ...” ఆంటూ రెండు మడత కుర్చీలు తీసికెళ్ళి ఆరుబయట వేశాడు మామయ్య. ఇద్దరం వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాం.

ఆహారం కోసం బయటిళెళ్ళి తిరిగి గూళ్ళకు చేరుకుంటున్న పక్షుల కిలకిలారావాలతో ఆ వేసవి సాయంత్రం ఆహ్లాదంగా వుంది.

మామయ్య కేసి తిరిగాను చెప్పమన్నట్లుగా.

“పెద్దన్న, శేఖరన్న టవున్లో కాపురాలు పెట్టారుగా. వాళ్ళేదో డబ్బుదోచుకుంటున్నారనీ, నుఖాలన్నీ బావుకుంటున్నారనీ సుజాత వుద్దేశ్యం. మనం కూడ టింగురంగా అంటూ టవున్లో కాపురం పెడదామంటుంది మంచంలో వున్న అమ్మ తాలూకూ సేవలు చేయడానికి తను సుముఖంగా లేదు. పెద్దకోడళ్ళిద్దరికీ లేని బాధ్యత తనకు మాత్రమెందుకని లా పాయింట్లు తీస్తుంది. పెళ్ళాం, పిల్లల భవిష్యత్తునే ముఖ్యంగా ఎంచక తల్లికోసం పాకులాడే నాలాంటి చేతకాని వాడికి భార్యనయినందుకు పదే పదే చింతిస్తుంది. నీకు తెలీందేముంది? ఈ ఇంటినీ, ఈ నేలనీ, నాకీ జీవితాన్నిచ్చిన కన్నతల్లినీ యిప్పుడు శిథిలావస్థలో వున్నారు కదాని వదిలిపెట్టి వెళ్ళిపోయేంత మూర్ధత్వం, స్వార్థం నాలో లేకపోవడం నిజంగా సుజాత దురదృష్టం....వ్స్‌...” మామయ్య ఆగాడు...

వేను కల్పించుకున్నాను.

“పోనీ మామయ్యా... సుజాత కోరినట్లుగా అన్ని సౌకర్యాలూ, యిక్కడే, ఈ యింట్లోనే అమర్చుకోవచ్చుగా... అమ్మమ్మ అవసరాలకోసం ఒక మంచి పనిమనిషిని పెట్టుకోవచ్చు...”

నవ్వాడు మామయ్య చిన్నగా...ఆ నవ్వులో కోటి అర్థాలు తొంగిచూస్తున్నాయి. “నిజమే అమర్చుకోవచ్చు. బొంబాయి మహానగరంలో పదివేల జీతగాడి భార్యగా నీకవన్నీ చాలా తేలిగ్గా కన్చడొచ్చు. కానీ అవన్నీ అమర్చే స్థితిలో నేను లేను. ఆ స్థితి లేకే కదా చిన్నీ అన్నలంతా వలసపోయారు. ఈవూళ్ళో మగాళ్ళంతా ఎవరూ పాలంబోవటం లేదు. ఖాళీగా గోళ్ళు గిల్లు కుంటూ యింట్లో కూర్చుని వుంటున్నారు...” దీనంగా వుంది మామయ్య గొంతు.

“అదేం?” ఆశ్చర్యంగా ప్రశ్నించాన్నేను.

“చిట్టత్తూరు నీళ్ళు వచ్చినంతదాకా పాలాలన్నీ బాగా పండేవి చిన్నీ... నా చిన్నప్పుడు నాన్నతో కయ్యిల కాడికి పోతే పచ్చంగా... ఎంత అందంగా వుండేవనీ. ఒకపక్క ఏతకొచ్చిన నారుమళ్ళూ, నాటడానికి సిద్దంగా దున్ని పెట్టిన పాలాలూ... కయ్యల నిండా ఆడా, మొగా కూలోళ్ళూ... ఎన్ని రోజులయినా అన్నం,నీళ్ళూ లేకుండా అక్కడే వుండిపోవాలన్పించేది. ఆ

శీధిలాలు వదా

దృశ్యం తలచుకుంటే యిప్పటికీ నాకు కడుపునిండిపోతుంది... ఏనాడైనా ఈ వూళ్ళొ నీటియెద్దడి ఎరుగుదుమా... నీళ్ళులేక గొడ్లు చనిపోయిన మాటవిన్నామా... పశువులకి మేత లేక కసాయి వాళ్ళకి అమ్ముకున్న విశేషాలు జరిగాయా? పెద్దపెద్ద యిళ్ళనీ, వందల ఎకరాలనీ వదిలి కడుపు చేత్తో పట్టుకుని వూరోళ్ళంతా పట్నందారులు పట్టడం మనకు తెలుసా...” మామయ్య కళ్ళు చెమరించాయి.

“మరి చిట్టత్తూరు నీళ్ళు యిప్పుడు రావడంలేదా మామయ్యా?” చిన్నప్పుడు చిట్టత్తూరు వేల దగ్గర నేలబావిలో ఈతకొట్టే చినమామయ్యని గుర్తు చేసుకుంటూ ప్రశ్నించాను.

“లేదు చిన్నీ, ఆ వూరి సర్పంచ్‌ వెంకటరెడ్డి కేసు పెట్టి ఆ నీళ్ళతో మనూరికేమీ సంబంధం లేదని కోర్టులో వాదించి కింద నుండి పైదాకా చేతులు తడిపి మొత్తం నీళ్ళు తమ వూరికి పారేలా తీర్చు చెప్పించుకున్నాడు.”

“అన్ని నీళ్ళు అతను మాత్రంమేం జేసుకుంటాడు?”

“వూరంతా సరిపోగా మిగిలిన నీళ్ళు సిటీకి అమ్ముకుంటున్నాడు. సిటీ బాగా పెరిగి పోతున్నట్టల్లా యెక్కడికక్కడ బోర్లు వేయడంతో నహజంగా ఈ నేలలో వున్న నీళ్ళు కూడ దాదాపుగా యింకిపోతున్నాయి. మన చిన్నప్పుడు అరవయి అడుగుల్లో పడే నీళ్ళు యిప్పుడు రెండు వందల అడుగుల లోతుకి పోయినా నీటి జాడ కన్పించడం లేదు...ఇదిగో యిటువంటి పరిస్థితుల్లో మగాళ్ళంతా యిదుగో యిలా... నాలాగే... అలా... అలా...” విషాదం నిండిన మామయ్య మొఖం చూడ్డానికి నాకు చాలా భయమేసింది.

చినమామయ్య ఎందుకిలా సగమైపోయాడో, ముఖం కళ తప్పిపోయిందో వాకు ఒకింత అవగాహనకొచ్చింది.

“నిజానికి నుజాతని కూడ తప్పు పట్టడానికి లేదు. తను పెరిగింది అటువంటి వాతావరణంలో, ఆర్భాటాలూ, ఆడంబరాలూ, శక్తికి మించి జీవించడం, ఆదే జీవితమని నమ్మడం తనకి అలవాటు. అటువంటి జీవితాన్ని యివ్వలేకపోయినందుకు నామీద అసంతృప్తి. దానికి తోడు... ఇటువంటి జీవితంలోకి మరో జీవిని ఆహ్వానించడం యిష్టంలేని నేను తనకి చెప్పకుండా వేసెక్టిమీ చేయించుకు వచ్చానని నామీద కసి...”

“మామయ్యా...?”అన్నాను 'నిజమా?' అన్నట్టుగా.

అవునన్నట్టుగా తలూపాడు మామయ్య, కళ్ళు మూసి తెరుస్తూ,

నా గుండె గొంతుకలోకొచ్చినట్టుగా అయింది.చాలా సేపు నేను మాట్టాడలేకపోయాను. పది నిముషాలు మౌనం రాజ్యమేలాక “మామయ్యా మరి సుజాత అలా వెళ్ళిపోవడం వీకు బాధగా వుండదా?” వాతావరణాన్ని తేలికపరచడానికన్నట్లుగా టాపిక్‌ మార్చాను.

ఒక్క క్షణం మాట్లాడలేదు మామయ్య... ఆ తరువాత మెల్లగా చెప్పాడు.

“మామూలుగా అయితే బాధగానే వుంటుంది...ఈ రోజు మాత్రం లేదు...”

“ఎందుకని?”

+న్మపమణం వ్‌

“నీతో ట్రీగా మాట్లాడుకోవచ్చునని”

గొంతుకేదో అడ్డంపడ్డట్బగా అయింది. భగవంతుడు ఎందుకిలా జీవితాలని మార్చి మార్చి కూరుస్తాడు.

చినమామయ్యవంటి గొప్పవ్యక్తితో జీవితం మూడుపువ్వులూ, ఆరుకాయలుగా మార్చు కోవచ్చు. అటువంటి చినమామయ్యతో సుజాతకి అసంతృప్తి... ఎప్పుడూ మౌనంగా వుండి “అది కావాలి ఇది కావాలి'అంటూ పేచీపెట్టనని, జీవితంలో రాజీపడ్డట్లుగా వుంటాననీ నా పట్ల మా ఆయనికి అసంతృప్తి...

ఆయనకి తనంటే యిష్టమే .వయసుతో పాటు శరీరాన్ని పెరగనివ్వనందుకు... తననెప్పుడూ పాగుడుతుంటాడు. తనేది కోరినా తెచ్చివ్వగల స్టోమతా, మనసూ వుంది. అయితే నేను వేరెవరితోనూ మాట్టాడ్డం, సోషల్‌గా మూవ్‌ కావడం ఆయనకి యిష్టముండదు. చిన మామయ్యని గురించీ, అమ్మమ్మని గురించీ, ఎప్పుడైనా అమ్మని గురించీ మాట్లాడినా సహించ లేడు. చేదుగా మొహం పెడ్తాడు పోనీకదాని శ్రీశ్రీ గురించో, చలాన్ని గురించో, మంచి సాహిత్యాన్ని గురించో మాట్లాడబోతే 'బోర్‌... బోర్‌ అంటూ అరిచి చెవులు మూసుకుంటాడు. పిల్లలకి ఆంగ్లభాష నేర్చుదామని వాళ్ళతో కంటిన్యువస్‌గా యింగ్లీషులో మాట్లాడితే ఓర్వలేడు. తెలుగు మీడియం డిగ్రీ తీసుకుని నక్కని తొక్కినట్టుగా బాంబేలో ఉద్యోగం సంపాదించిన అతడికి యింగ్లీషు భాషలో ప్లూయెన్సీ లేదు. తను ఎక్కువగా మాట్లాడ్డం అతడికిష్టంలేదు... అలాగని అసలు మాట్లాడకుండా వూరుకున్నా ఒప్పుకోడు.

మొత్తం మీద తనలోని విశ్వాసాన్ని, శక్తినీ గుర్తించి వాటిని అభివృద్ధిపరచుకుని తనను తాను వికసింపజేసుకునేటటువంటి స్రీల పట్ల చదువుకుని సూటుబూటు వేసుకుని ఆర్థికంగా ఉన్నత స్థితిలో వున్న తన భర్తకి ఎటువంటి సదభిపాయమూ లేదు. అసలు స్త్రీని ప్రాణమున్న వ్యక్తిగా కాక ఇంట్లోని మిగిలిన అన్ని విలాస వస్తువులతో సమానంగా చూసే భాగ్యశాలి...

ఏమిటో జీవితాలు ఎందుకిలా తారుమారవుతాయో మరి? ఎక్కడో ఏదో తేడా వున్నట్లుగా తోస్తోంది. ఆ తేడా ఏమిటో అర్ధమయ్యి, కానట్లుగా వుంది. నేనే అయితే అమ్మమ్మని ప్రాణంలా చూసుకుంటూ, ఈ యింటిని నందనవనం చేసి వుండేదాన్నా..? అమ్మమ్మ మీద నాకున్నంత (ప్రేమాభిమానాలు పరాయి అమ్మాయి సుజాతకి వుండాలని కోరుకోవడంలో వ్యాయముందా? ఏమిటీ ఎక్కడ తప్పటడుగు పడింది.

మామయ్యే నన్ను దగ్గరికి తీసుకున్నాడో, లేక నేనే కిందికి జారి మామయ్య ఒడిలో తల పెట్టుకున్నానో తెలీదు కానీ మరుక్షణంలో వెక్కివెక్కి ఏడవసాగాను. చినమామయ్య నా వీపుమీద చేయివేసి నిమురుతున్నడు ఓదార్పుగా.

ఆ స్పర్శలో ఎటువంటి ఉద్వేగమూ, ఆవేశమూలేవు. ఓ జ్ఞానవృద్దుడు పసిపాపను లాలిన్తున్నట్లుగా, ఓదార్పు చెప్తన్నట్లుగా వుంది. ఆ స్పర్శలోని అనునయాన్ని వదులుకోవడానికి ఏమాత్రం యిష్టంలేని దానిలా చినమామయ్యకి మరింత దగ్గరగా జరిగొన్నేను.

మందాఃివి, నవంబరు 1995 శిధిలాలు వళ వమా

బతుకు భాగహారం

“బన్సు ఆరను గొడ్తుండొదయ్యా... యింకా లెయి కుండా ఏంది నువ్వు... ఎట్టాస్తాది నీకు మొద్దునిద్ర...” భుజూల మీద చేతులు వేసి కుదుపుతూ హడావిడి పెట్టేస్తోన్న భార్య పిలుపుతో గబుక్కున ఉలిక్కిపడ్డట్టుగా లేచి కూర్చున్నాడు వెంకురెడ్డి.

భర్త బేవడం చూసి ఆ నులక మంచం మీదున్న చిల్లుపడ్డ పాత గొంగళిని చకచకా మడత పెట్టేసి.

“నేం బోయి పాలు దీసుకొస్తా...నువు కానియ్యి అయితే బిన్నా” అంటూ పెద్దెనుము దగ్గర పాలు పితకడానికి పెరట్లో కెళ్ళింది నర్నమ్మ

“ఏందే నీ తొందర... యింకా కోడి కుయినే లేదు... ఆరుగంటల బండికి యింత లోపలేమి? అన్నీ తొందరే నీకు...” లోపల ఆనందంగానే వున్నా, పైకి ననుగుతున్నట్లుగా అని పంచె లాగి రెండు చేతుల్లోనూ సరిగ్గా సర్డుకున్నాడు వెంతురెడ్డి.

బతుకు అ కసాలల

నిజానికి వెంకురెడ్డి రాత్రంతా నిద్రపోనేలేదు. పడుకున్న కాడ్నించి నాలుగయి పోతుందేమోనని తాతలనాటి గోడ గడియారాన్ని చూసుకుంటూనే వున్నాడు కళ్ళు చికిలిస్తూ, ఒకాళకాడ చినుకులు పడితే నరసమ్మ లేచి కురున్తున్న కాడ గిన్నెలు పెట్టడం చూస్తూనే వున్నాడు తీరా మూడప్పుడు చల్లగా కునుకు పట్టింది. ఇంతలో పెళ్ళాం తొందర చేయడంతో చటుక్కున నిద్రలేచాడు.

గూట్లో నుంచి పల్టోం పుల్ల తీసుకుని నోట్లో వేసి నములుతూ పెరట్లోకి వచ్చాడు ఈను కూడ.

రాత్రి పడ్డ నాలుగు చినుకులకి కాబోలు దొడ్లో పేడ, మట్టి కలగలిసి చిత్తడి చిత్తడిగా ఒక విధమైన గత్తు కంపు గాలిలో తేలి వస్తోంది. గుడ్డి దీపాన్నొకదాన్ని ఆధారం చేసుకుని తాటాకు సాలలో సపెద్దెనుము కాడ పాలు పితుకుతోంది నరసమ్మ కొట్టానికి కొంచెం దూరంలో గోడవారగా కొంచెం కట్టి పేళ్ళుండాయి. ఎప్పుడూ ఆమెని హెచ్చరిస్తూనే వుంటాడు. అయినాసరే ఒక వేళాపాళా, రాత్రీపగలూ లేకుండా పని చేస్తూనే వుంటుంది నరసమ్మ కదిలిస్తే చాలు... “ఓయమ్మా... యిప్పుడేముండాది పని... మా యిద్దురు మనుషులికి. అత్తా, మామ, మరుదులూ, ఆడబిడ్డలూ అంతా వున్నప్పుడు ఎంతెంత చాకిరీ చేసేవోళ్ళం... అదొక సందడిగా వుండేది” అంటూ చరిత్ర విప్పుతుంది.

అప్పటికే పెరట్లోనూ, వాకిట్లోనూ చిమ్మి, కళ్ళాపి జల్లి ముగ్గుపెట్టేసి వుంది... అదేమంటే “పాచి వాకిలి చిమ్మకుండా మొగోడు యిల్లుదాటి పోకూడదయ్యా నీకేం తెలుసు. ఎట్ట బళకతావో ఏమో” అంటూ భర్త మీద జాలి చూపిస్తుంది.

“బతికిందంళా చాల్లే... ఇంక బతికేదే ముండాది” చెప్తాడు వెంకురెడ్డి ముడతలు పడ్డ ఏభయ్యెనిమిదేళ్ళ శరీరాన్ని తేరిపార చూసుకుంటూ.

ఆ తెల్లవారురూము వేకువ నిళ్ళ్శబ్దంలో నరసమ్మ పాలు పితుకుతోన్న శబ్దం ఎవరో అజ్ఞాత రాకుమారి వీణ సాధన చేస్తున్నట్లుగా వుంది. పలుదోము పుల్లని బ్రష్‌లా నమిలి నోట్లో నాలుగు వైపులా పోనిచ్చి శుభ్రం చేసుకంటూ చుట్టూ చూశాడు వెంకురెడ్డి. పెరట్లో ఓ పక్కన మూడు రాళ్ళ పాయ్యి మీద తెల్ల దబర్లో నీళ్ళు కాగుతున్నాయి. నిండుగా పుల్లలేసిన పొయ్యి అ చీకట్లో దగదగా నుండుతోంది. ఆ మంటల నీడలో ఎర్రగా మెరుస్తోన్న వెంకురెడ్డి ముఖం దోరమగ్గి మెత్తబడిన మామిడిపండులా వుంది.

“ఇంకా పళ్ళు దోమడం కూడా అవనే లేదా? ” పాల చెంబు పట్టుకుని యింట్లోకి వెళ్తూ ఒక్క కేక బెట్టింది నరసమ్మ

“అయిపోయిందే వచ్చేస్తుండా... నువు కాఫీ బెట్ట... బస్సుకింకా టయిముండాది లేయే... వాడూర్కే ఆరను గొడ్డుంటాడు అట్ట... అందర్సీ బిన్నాగా రమ్మని” నోట్లో నీళ్ళు పోసుకుని తుపుక్కున వుమ్మి, తాపీగా మొహం కడుక్కుంటూ చెప్పాడు వెంకురెడ్డి.

ఐకుకు భాగహారం వలా ముతో

నెల్లూరు జిల్లా ఉత్తర ప్రాంతంలోని ఓ మారుమూల పల్లెటూరది. తొలికోడి కూసే వేళకే ఆ వూరు వూరంతా నిద్రలేస్తుంది..

ఆరుగంటల బండికి టవున్లోకి పాయ్యి మళ్ళీ రాత్రి పదిగంటల బండికి వచ్చేవాళ్ళు చాలామందే వుంటారా వూళ్ళో. అందుకే అరుగంటల బండి ఎప్పుడూ రద్దీగా వుంటుంది.

పాలవాళ్ళతోనూ, కూరల వాళ్ళతోనూ, చదూకోడానికెళ్ళే విద్యార్థులతోనూ, టవున్లో పనికి వెళ్ళే వాళ్ళతోనూ రద్దీ ఎక్కువ.

“కొంచెం ముందుగా బొయ్యి వుంటే ఏమి? కరెట్టుగా ఆరుగంట్లకి బోవాల్హా? మొదులే నిలబడే కూచోలేవు. కూచ్చుంటే నిలబళ్ళేవు...” నసుగుతూనే పాలు పాయ్యిమీద పెట్టి ముట్టించింది నరనమ్మ

“నేను బాగానే వుండా... నువ్వే నడుం వంచకపోయి వుండావు” మాటకిమాట అంటిస్తూ తుండుగుడ్డ విదిలించి పైనేసుకుని స్నానానికి వెళ్ళాడు వెంకురెడ్డి,

“ఊ మూడు కాళ్ళొచ్చినా రోసానికి మాత్రం తక్కువ లేదులే” అనుకుంటూ పాలగిన్నె కేసి చూసింది.

“అబ్బయ్యకి ఎర్రంగా కాగిన పాలంటే శానా యిష్టం... ఈ పొద్దు మిద్దింటామె పాలుబాయి లేదని తిట్టబోతాదేమొ... పెద్దెనుము పాలియ్యలేదని చెప్తేసరి...” అనుకుంటూ ఎర్రగా కాగిన పాలను స్టీలు క్యానులోకి వొంచి మిగిలిన కొంచెం పాలతో భర్త కోనం కాఫీ కలిపి వుంచింది.

పెరట్లో పండిన కూరగాయల్ని, అరిటిపండ్లనీ, జామపండ్లనీ ఒక బుట్టకి సర్ది వుంచింది ముందురోజే. ఈ పాలక్యాను కూడా అందులోనే యిమడ్చాలని ప్రయత్నించి కూరలు నలిగి పోతుండడంలో ఆ ప్రయత్నం మానుకుని విడిగానే వుంచేసింది.

భర్త ఆలస్యం చేస్తున్నాడన్పించి

“బిన్నా కానియ్యయ్యో... ఈ పొద్దు కూడ రుద్ది రుద్ది పాయిబళ్ళ. రుద్దింది చాల్లె యింకరా” అంటూ పెరట్లోకొచ్చి స్నానం చేస్తూన్న వెంకురెడ్డిని తొందరపెట్టింది.

“ఎన్నాళ్ళయిపోయింది అబ్బయ్యని చూసి... వోడెమొ పన్గుండాయని ఈ వూరికే రాకపాయ... మనం బోయి అడుండాలంటే వుండలేకపోతిమి. కోడలికి అసలు ఈ వూరంటేనే పడదు. పెళ్ళయిన మరవలకి వచ్చిందేమొ... అంతే అ తర్వాత రానేలేదు” మనసులోనే తలపొసుకుంటూ, ముప్ఫయి రెండోసారి తలచుకుంటూ వాకిట్లోని అరుగుమీద గూటి పక్కన్నే కూర్చంది నరసమ్మ

“'వోడిక్కడే కదా కూర్చుని చదూకునేవాడు' అనుకుంటూ... ఆ చోటంబే నరసమ్మకి చానా యిష్టం... చిన్నప్పుడు కొడుకుని అ గూటి కెదురుగా కూర్చోబెట్టి అన్నం తిన్పించేది... ఆ అరుగు మీద నిల్పోబెట్టి వీపు మీద ఎక్కించుకుని ఉప్పుమూట ఆట ఆడేది. ఆ అరుగు మీదే కూర్చుని కాళ్ళు వేళ్ళాడేసి ఆ పాదాల మీద వాడి నిల్చోబెట్టి ఐతాంబయితాం ఆడించేది...

ఐతుకు భాగహారం కరర

అమాట కొస్తే యింకా చిన్నపుడు వాడికా అరుగు మీద తూర్చునే పాలిచ్చేది.

ఆ తర్వాత వోడు పెద్దోడయిన పాట అచ్చరాభ్యాసం చేయించింది కూడా ఆ అరుగు మీదే. పదోక్సాసు పానయ్యేదాకా వాడు అ అరుగు మీద కూచునే బుడ్డి దీపపు వెలుతురులో చదూకునేవాడు, పదయిన తర్వాత వెల్లూరికి పోయినాడు చదవను. బాగా చదూకున్నాడు. ెద్దోడయినాడు... పెద్ద ఉద్యోగంలో చేరినాడు. అంతా బాగానే వుండాది. అన్ని తెలువులూ వుండాయి అందర్లో మంచి "పేరు తెచ్చుకుంటా వుండాొడు.. అదేందో మరి అమ్మా నాయినా ఎట్బండారో అని మాత్రం అనుకోడు. పాపం ఏం జేస్తాడులే బిడ్డ మాత్రం పెళ్ళానికీ, నాకూ పందన నలిగి సావలేక పాయ్యుంటాడు.

“మన్లేముండాది.. ఈ పాద్దుండి రేప్పాయ్యేవాళ్ళం... వోళ్ళిద్దురూ లచ్చనంగా వుంటే అంతే సాలు' అనుకుంది.

అంతలోనే 'అబ్బయికి జున్నంటే ఎంతిష్టం... పాపం ఆడ వోడికి దొరకతాదో, దొరకదో... మూడో యింట్లో వున్న మునెమ్మకాడున్న బప్కెనుము నిన్ననే ఈనింది... సరే ఒక పావుశేరు పొస్తాదేమో అబ్బయికిచ్చి పంపిస్తామంటే, డబ్బాశ బట్టిన ముండ బడి అయ్యోరికి ముందే చెప్పేసిందంట... మూడో యింటి మునెమ్మని ముచ్చటగా ముప్పయ్యారోసారి తిట్బకుంది నరసమ్మ “ఏందే ఏం జేస్తుండావీఉ?” కొడుకు న్నృతుల్లో పూర్తిగా మునిగిపోయిన నరసమ్మ భర్త పిలుపుతో ఉలిక్కిపడింది. “పాయ్యేసాొస్తా అయితే” చలువ లాల్చీ వేసుకుని, పొందూరు, ఖద్దరు పంచెని గోచీ పోసి కట్టి పెళ్ళి కొడుకులా తయారయిన భర్తకేసి సిగ్గుపడుతూ చూసి నవ్వింది నరసమ్మ, వెంకురెడ్డి ఏనాడూ ఒంటిమీద చొక్కా వేసుకోడు. బనీనుతోనే తిరుగుతుంటాడు... ఏదయినా పక్కూరికి పోవాల్పొస్తే తప్ప లాల్చీ బయటికి తీడు... ప్రతీ నెలా పాల డబ్బులు చేతికొస్తానే చెప్తాది నర్స్పమ్మ “ఈనెల ఓక చొక్కొ కుట్టించుకోవయ్యా” అంటూ “నాకెందుకే గుడ్డలు... వుండేటివి జుల్లే... నువ్వింకా ఒక వెంకటగిరి కోక తెచ్చుకో మిద్దింటామెనడిగి. బాగుంటాధి నువు కట్టుకుంటే. ఎప్పుడయినా అబ్బయి దగ్గరికి పాయ్యే టప్పుడు కట్టుకోవచ్చు” చెప్తాడు వెంకురెడ్డి, “ఆ. నేంబోతుండా అబ్బయ్య కాడికి. ఆ మదరాసేడుందో తూర్పు, పడమర తెలీదు గొన్యా నాకు...” అంటూ నిష్టురపడుతుంది నరసమ్మ “జాగర్త... బుట్ట సుబ్బమ్మ కొడుకు తెచ్చి బన్సులో పెడ్తాడ్డే... నేను చెప్పినా... ఈడ ఫర్వాలేదు గానీ.. ఆడ నెల్లూళ్ళో బ స్పెక్కేప్పుడు జాగర్త... మన దొడ్డోరి సిలగొడు కండక్టరుగా వుండే బస్సులోనే సూస్కొని ఎక్కు. ఆ బస్సు ఎనిమిది గంటలకంట నెల్లూర్లో. వాడైతే నిన్ను గుర్తుగా తీసుకపోయి అబ్బయ్యోళ్ళింటి కాడ దింపుతాడు. మర్చిగెన నిద్దరబోతొవేమో. బస్సెక్సినా బతుకు భాగహారం వరన పంత

వంటే సాలు నీకు ఒకటే నిద్దర... మాయిదారి నిద్ర. అబ్బయ్యని అడిగానని చెప్పు...” తడిక గేటు కానుకుని భర్త కదిలేంత వరకూ ముద్దుముద్దుగా నసుగుతూ, జాగర్తలు చెప్పూనే వుంది నరసమ్మ,

శః శ శ

వెల్లూర్లో దొడ్డోరబ్బయ్య కండక్టరుగా పనిచేసే బన్సు పట్టుకోటానికి చాలానే శ్రమ పడ్డాడు వెంకురెడ్డి.

ఒక చేతిలో బరువుగా వున్న కూరల బుట్టా, రొండో చేతిలో పాలక్యానూ, జారిపోతూన్న పైగుడ్డా, కిర్రుకిర్రుమని శబ్దం చేయడమే కాకుండా గట్టిగా అడుగేసినప్పుడల్లా అరికాల్లో గుచ్చుకుంటున్న మేఠూ... నవంబరు నెలలోని ఆ ఉదయం ఏడుగంటలకే చెమటలు పట్టేలా చేసింది వెంకురెడ్డికి. దొడ్డోరబ్బయ్యని బస్టాండులో కనిపెట్టేక సాక్షాత్తూ ఆ ఏడుకొండలవాడే కొండ దిగి తనకోసమొచ్చినట్లుగా అన్పించిందతడికి. మద్రాసు బస్సు ఎప్పి కూర్చున్నాక లండన్‌ వెళ్ళే విమానం నునాయానంగా ఎక్కి కూర్చున్నంత గర్వంగా ఫీలయ్యాడు వెంకురెడ్డి.

ఎక్కి సీటు చూనుకుని కుదురుగా కూర్చున్నాక బస్సు కదలిన కొంచెంసేపటికి చెమటలు తగ్గి స్థిమితపడి... హఠాత్తుగా కొడుకు గుర్తొచ్చాడతడికి. అప్పుడే వాడ్ని చూసి రెండేళ్ళయిపోయింది. వాడేమో రాడు... తనకేమో చీటికీ మాటికీ మదరాను వెళ్ళాలంటే మాటలా? కుదరదు, మంచి, చెడ్డలన్నీ దొడ్లోరబ్బయ్య ద్వారానే తెలున్తుంటాయి.

చిన్నకిష్టయ్య ఎట్టుండాడో?... అప్పుడోడికి రెండేళ్ళు... ఇప్పుడించోడై బడికి పోతుం టాడేమో... దొడ్గోరబ్బయ్య మళ్ళీ పాప పుట్టిందని చెప్పాడు. అ బుడిగి ఎంతయిందో...? తను తాతనని తెలీనే తెలీదు వాళ్ళకి.

మనమనుకోగూడదుగానీ వాళ్ళకెట్ట తెలస్తాది? వాళ్ళకేనాడైనా యింత చొక్కాగుడ్డ తీసుచ్చుంటే గదతను. ఏనాడయినా బిస్కెత్తులు కొనిచ్చి ముద్దు చేసుంటే గద... కోడలికయినా "పెళ్ళయి పదేళ్ళయితే యింత జాకెట్ట ముక్కకొనగలిగానా? ఇంక ఆయమ్మకి పేమ, అభిమానం రమ్మంటే యాడ్డుంచి వస్తాది? అబ్బాయికి మాత్రం అ చదూకునేప్పుడు ఏం కొనిచ్చి నామో కడుపు కట్టకుని మంచిగుడ్డలు... మళ్ళీ ఏనాడయినా యింద నాయినా ఈ పది పైనలు నీకేం ఖర్చులుండాయో అని చేతుల్లో పెట్టగలిగామా?... ఇహన చోడికి కోపమోస్తాదంటే రాదా?

ఈ ముసల్లి ఎంత సేపయినా నన పెడ్తాది కానీ కోడల్ని, వోళ్ళు మాత్రం ఏ జేస్తారు?... ఈ బస్తీలలో ఎంతెంత జీతాలొచ్చినా చాలకపోయే.

ఆ పల్లెటూళ్ళో కూరలు పండించి అమ్ముతా... పాలుబోస్తా... యింటి బాడిగ లేకా తమ యిద్దరి పొట్టలు ఎల్లమారడం లేదే... ఇంక మదరానులాంటి మహానగరంలో వాళ్ళు మాత్రం ఏం మిగల్చగలరు... వాళ్ళనీ అనుకోడానికిల్యా పాపం... వెంకురెడ్డి కళ్ళు చెమ్మగిల్లాయి.

బతుకు అపనన్సువళ

“వాయినా... నీకెందుకు గమ్మనుండు... ఇట్టాటెకరాలు పది కొనుక్కుందాం నీకు పాలంచాకిరీ తప్పిందనుకో... నేను సంపాదించి పదెకరాలు కొని మంచి సేద్దిగాణ్ణి పెడతాను. నువు అజమాయిషీ చేద్దూగాని, ఈ ఎకరం నేల కోసం నువు బాధ పడబాక” కొడుకు చదువు శోసం చివరి ఎకరా అమ్మినపుడు కొడుకు తనని ఆర్తిగా ఓదార్చినప్పటి దృశ్యం.

“ఇంకెంతమ్మా... ఆరునెలలే.. చదువయిపోద్ది... నాకుద్యోగం వస్తే మాత్రం నాయిన్ని ఏ పనీ చేయనీయను... గమ్ముగా యింట్లో కూర్చోవాల్సిందే. నువ్వు మాత్రం? నిన్నసలు వంట చేయనిస్తానా? మంచి పనిమనిషిని పెడ్తాను. ఈ వూళ్ళో పాలం లేకపోతేనే మంచిదమ్మా మనికి... మీ యిద్దర్నీ నాతో తీసికెళ్ళిపోవచ్చు.” అంటూ అమ్మతో పరాచికాలాడుతూ వెంట వెంటనే తిరిగేవోడు.

“అప్పుడిన్ని మాటలు జెప్పి యిప్పుడెలా మొండి చెయ్యి చూపించాడో చూడయ్యా” అంటూ ఏడుస్తుంటుంది నరసమ్మ నరసమ్మ ఏడుపు తనకు నచ్చదు. వాడి యిబ్బందులు వాడీవి... వాడి ఆలోచనలు వాడివి. మనం చెయ్యాల్సింది చేశాం మన ధర్మం.

ఈ ముసిల్పానికి మొదట్సుండీ కూడా అంతే... అబ్బయ్యంటే వల్ల మాలిన అభిమానం, (పేమ... ఆ యిదిలో ఒక్కోసారి తన్ని కూడా పట్టించుకునేదే కాదు. ఒక్కగానాక్కడయిపాయె. పంచ(ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకుని పెంచుకొచ్చింది. అందుకే అలా దూరమయ్యేసరికి తట్టుకోలేక పోయింది... జబ్బున పడింది... లేచింది... మళ్ళీ జబ్బు పడింది. మళ్ళీ లేచింది. కొంత కాలానిగ్గాని రాటుదేల్లేకపోయింది.

ఇప్పుడు కూడా నర్స్ఫమ్మేతనని బలవంతం చేసి ప్రయాణం చేయించింది... దూరంగా వుంటుండబట్టి యిలా మనుతల్లేకుండా పోతుండాయేమో... ఒవ్కసారెళ్ళి కన్చడితే అబ్బాయికి మనను కరుగుద్దేమో... మన్ని రమ్మన్నా రమ్మంటాడు.

అబ్బయ్య అనకపోతే మాత్రమేందయ్యా... నువ్వే కదిలించు కావలిస్తే నా మీదే చెప్పు. నాకేం భయం? మీ అమ్మ మునల్లియి పోయిందిరా నాయినా. చేసుకోలేకుండా వుండాది. ఇద్దరం ఎవరికేమొచ్చినా అ పల్లెటూళ్ళొ చూసే వోళ్ళివరు? నీకాడికొచ్చి ఆయిగా కృష్ణా, రామా అనుకుంటా వుంటాము. ఏల్లల్ని చూసుకుంటా పడుంటాం అని చెప్పు.

వోరు తగ్గిందని కూడా జెప్పు... అబ్బయ్య, కోడలు ఎట్టచేసుకున్నా కూడా మనం మంచీ, శెబ్బరా అడగమని చెప్పు అంటూ చెప్తూ చెప్తూనే భోరున ఏడ్చేసింది.

నాలుగు దినాలుగా దీని కోసరమే తన్ని తొందర చేసి ప్రయాణం చేసిందా? రాత్రేమో మళ్ళీ ఒకేళకాడ.

“వాద్దులేయ్యా... నువ్వియన్ని ఏమీ అడగబాక. మనకి ఎట్సో ఈడ జర౦ిగిపొతా వుండాది కదా. అబ్బే మంచొచ్చివా, చెర్జొచ్చినా దేవుడుండాడు... ఈ వూరోళ్ళుండారు...

“పాపం వోణ్ణి మనమూ సతాయించి, అట్ట కోడలూ సతాయించి ఎట్ట చెప్పు?”

అంటూ గొంతు గరగరలాడుతుంటే లేచి పెరట్టోకెళ్ళింది.

ఐతుకు భాగహారం రల హి పవోా

వెంకురెడ్డికి అర్ధమయిపోయింది. కళ్ళు తుడుచుకోడానికే నరసమ్మ లేచి బయటి కెళ్ళిందని. దానికీ తనకీ యిద్దరికీ తెలుసు. ఇంతన్నం కోసరం వాడి కాడికి పోవాలనుకోవడం లేదు తాము. ఒక్కడంటే ఒక్కడు. ముసలితనంలో వాడి కాడుండాలని, పిల్లల్ని ఆడించుకోవా లనీ కోరిక. ఎంత అణచుకోవాలన్నా అణచుకోలేకపోతిమి.

పిచ్చిది... దానికోసమయినా కొన్నాళ్ళు కొడుకు దగ్గిర వుంటే బావుండునని వుంది వెంకురెడ్డికి. కొడుకేమంటాడో? కోడలేమంటుందో? అయినా తను నోరు తెరచి అడగ్గలడా?

వెంకురెడ్డి అంతరంగం ఆలోచనల సముద్రంలా ముందుకీ వెనక్కీ ఆటుపోటు లేసుకుంటూ కదం తొక్కుతోంది. వెంకురెడ్డితోనూ, అతడి ఆలోచనల పరంపరతోనూ యే మాత్రం నంబంధం లేనట్లుగా ఒంటిగంట ప్రాంతంలో మద్రాను చేరుకుంది బస్సు.

“అప్పుడ్నేవొచ్చేసినా మంటయ్యా” దొడ్డోరి సుబ్రహ్మణ్యాన్ని వుద్దేశించి ప్రశ్నించాడు వెంకురెడ్డి.

“వొచ్చేసింది పెదనాయినా... నువ్వప్పుడే దిగబాక. వీళ్ళందర్ని దిగనీయ్‌... నేనీ టిక్కెట్ల సంగతంతా అప్పజెప్పేసి మెల్లింగా వచ్చి నిన్ను దీసుకుపోతా... అప్పటిదాకా యిక్కర్నే వుండు” చెప్పాడు సుబ్రమణ్యం.

శు శ శ

నాలుగు రోజులు గడిచిపోయాయి.

భర్తని ఒక్కరోజు కూడా వొదిలి వుండడం అలవాటులేని నరసమ్మకి నాలుగు యుగాలు గడిచిపోయినట్లుగా, పెద్ద వరదొచ్చి తమ వూరంతా కొట్టుకుపోయినంత దిగులుగా వుండాది.

చీకటి పడే వేళకి.

వనంతా చేనుకుని, వాకిట్లో నులక మంచం వేసుకుని తడిక గేటు తీసి వుంచి పది గంట్ల బస్సు వొచ్చేదాకా మనకచీకట్లో ఎవరొచ్చినా ఎడమ అరచేతిని నుదుటి మీద కళ్ళకి అడ్డం పెట్టి నిక్కనిక్కి చూస్తుంది. పదిగంటల బస్సు వచ్చిపోయి నందడి తగ్గిన తర్వాత గానీ లోపలికెళ్ళి తలుపేసుకుని పడుకోదు.

ఆసుబోసినట్లుగా యింట్లోకీ, వాకిట్లోకీ తిరుగుతుంది.

“అయినా నా పిచ్చిగానీ, వాడప్పుడే రానిస్తాడా? ఇంత దూరం పోయివాయిన పోవద్దా? రావద్దా?” అంటూ మరుక్షణంలో తనకు తాను నచ్చజెప్పకుంటుంది.

“అబ్బయ్య వుణ్లాడో, లేదా ఏ బయటూరికయినా పాయ్యుండాడో, వాడొచ్చేదాక సూస్కోని గద రావాల” అనుకుంటుంది.

“ఈయయ్య ఎట్ట బోయినాడో ఏమో, మొదులే చూపు తక్కువయింది. ఈడ ఊళ్ళో నడిచేదే కనాకష్టం...ఆడెట్టబోయినాడో... అయినా దొడ్లోరి సుబ్రమణ్యం అంత మాటలెక్కలేని మనిషి కాదులే... కూడానే వుండి తీసుకు పాయ్యుంటాడులే...” అనుకుంటుంది మళ్ళీ.

బతుకు భాగహారం ఈషఫ వ ప్రామజం లీల

“రొండే రెండు చొక్కాలుండాయి. ఆడెవురో జెప్పినట్లు ముడ్డీమీది కొకటి, బండమీద కొకటి... ఈడంటే చొక్కా లేకుండా తిరిగినా ఎల్లిపోతాది... ఆడెట్టాకుదురుద్ది... నాలోజుల్నుండీ ఎట్ట చేస్తుండాడో యేమో... కోడలు వుతికియ్యాలంటే మాటలా”

“ఏందో పాపిష్టిదాన్ని ... గమ్మునుజ్ఞాయన్ని పోపామ్మని పోరు పెట్టేస్తిని. ఏంజేస్తుండాడో ఏమో” అనుకుంటుంది.

“భీ. ఈటివల్ల గదా వేను ఎల్లలేక పోయింది... ఇయ్యి లేకుంటే యింకే ముండాదీడ బాదరబందిర... ననూ ఆయయ్యతో గూడ పాయ్యుండనా? నాఖర్మ.." అంటూ తన కోపమంతా పాలిచ్చే గేదెల మీద చూపించుతుంది, వాటి మూలంగానే తను ఆగిపోయినట్టు.

ఎప్పుడూ యజమానురాలి ఆప్యాయతనీ, అభిమానాన్నీ తప్ప కోపాన్ని చవి చూడని మూగజీవులు విస్తుపోయి చూస్తున్నాయి నర్సమ్మ కేసి,

నరసమ్మని యింకా యింకా అనహనంతో కూడిన ఎదురెదురు చూపులుకి గురి చేయడం యిష్టంలేక ఆ ముని మాపువేళ ఆరుగంటల బస్సులో దిగి, ఖాళీ బుట్ట చేతబట్టుకుని కాళ్ళూగించుకుంటూ చికిలించి చూస్తోన్న నర్చమ్మ కళ్ళకి మెలిమెల్లిగా స్పష్టమవుతూ వచ్చాడు వెంకురెడ్డి.

“వాచ్చావా?... అదే అనుకుంటుండా... ఈ పూటన్నా వొస్తాడా రాడా ఈ మనిషి... వేనుండేది మర్పిపాయ్యి కొడుక్కాడ్నే వుండిపోతాడా? అని... మంచినీళ్ళిచ్చేదా?” అంటూ లోపలికి పరిగెత్తి చెంబుతో నీళ్ళు తెచ్చిచ్చి.

“ఎట్టండాడయ్యా అబ్బయ్య... నన్నడిగాడా? కోడలూ, పిలకాయిలూ బాగుండారా?... ఇదిగో ఈ ఎదవముండలు లేకపోతే నేనూ రాశపోయానా? ఆమాట నువు చెప్పినావో లేదో. ఎంత బాధపడ్డాడో కన్నడు....” తన ధోరణిలో తాను చెప్పుకుపోతూ వుంది నరసమ్మ భర్తకేసి చూడకుండా.

భార్యవంక చూడ్డానికి భయపడ్డున్నట్లుగా, యింట్లోకి రావడానికి కాళ్ళాడక వాకిట్లో వాల్చి వున్న కుక్కి మంచం మీద కూలబడ్డాడు వెంకురెడ్డి. చేతిలోని బుట్ట కిందపెడుతూ.

“నీళ్ళు కాగుండాయి. మళ్ళెందుక్కూనుంటుండావు. కాఫీ సెడ్తుండాను తాగి నీళ్ళు పోస్కోని రాపో... అవతల అన్నీ చెప్పువు కాని”

క్షణంలో కాఫీ కలిపి తీసుకొచ్చి భర్తకిచ్చి, పక్కనే కింద నేలమీద చతికిలబడింది నర్చమ్మ “ఏందయ్యా” అంటూ

కాఫీ మింగుడుపడనట్లుగా గుటక, గుటకా తాగి తాగి చాలాసేపటికి నోరు విప్పాడు వెంకురెడ్డి.

“వోడు చాలా మారిపోయాడే”

ఆమాటకి ధర్ధంగా నిట్టూర్చింది నరసమ్మ........

బతుకు భాగహారం చచ

“ఓస్‌ యింతేనా?... యింకా ఏందో అనుకున్నా... వోడు మారిపోక అట్స్నే వుండాడని ఎవరు జెప్పారిప్పుడు... మారిపోబట్టేకదా మనమేడుండామని కూడా తలవంది... అదేదే కొత్తగా కనిపెట్టినట్లు యింత దూరం పోయి ఈ వార్త మోసుకొచ్చావా?” అంది... భర్త చెప్పిన విషయం తను ఎదురు చూసిందే నుమా అన్నట్లు తేలిగ్గా తీసిపారేస్తూ.

“అట్టగాదే... మారిపోయ్యేడంటే. ॥ వోడసలిప్పుడు యింటికాడగూడ వుండడం లేదు... కోడలు పాపం ఆ సిల్లల్ని బెట్టుకుని ఒంటిగా యాతన పడ్తావుండాది... ఒకటే ఏడుపనుకో...” బాధగా చెప్పాడు వెంకురెడ్డి.

“ఏందయ్యా యిది...యింటికాడుండక యింకేడుంటాడు” విస్తుపోతూ ప్రల్నించింది నర్పమ్మ

“వాడు సన్టేసే కంపెనీలోనే ఒక రూముంటాదంట. అన్ని సౌకిరాలు చేనుకుని అడ్నే పొడుకుని ఆడ్చే ఆఫీసు పని చేసుకుంటాడంట. ఎప్పుడయినా రెండు మూడు దినాలకోపారి వచ్చి కనపడతాడంట. పిలకాయలు కూడా భలే దిగులుగా వుండారు”

“ఏందయ్యా నువు చెప్పేది? అట్ట వుండేదేందని అడగలా కోడలు?”

“అడిగితే ఏదో ఒకటి చెప్తుళ్ళా? ప్రయివేటు కంపెనీలో పని జాస్తి. వచ్చేవోళ్ళు, పాయ్యే వోళ్ళు ఎక్కువగా వుంటారు. వాళ్ళందరూ యింటికి రావాలంటే కష్టం... అంటాడంట. ఇంతకు ముందు పొద్దుబోయినా యింటికొచ్చే వాడంట దినుమ్మూ ఈ నడమీనడమ రాత్రిళ్ళు కూడా రాకుండా ఆడ్నే పాడుకుంటాడంట. అదేందని అడిగిడే రాత్రి వొచ్చిననోళ్ళతో మాట్లాడతా పొద్దుపోయింది అంటాడంట. మరీ గట్టిగా నిల్టీసిందని ఈ మధ్య కోడల్ని కొట్టాడంట కూడా”

భార్యని కొట్టడమనే అనాగరికమైన చర్యని దిగమింగలేనట్టుగా వుంది వెంకురెడ్డి పరిస్థితి.

“నువ్వడగలే మరి?”

“ఎందుకడగలా? అడిగితే జవాబు సరిగ్గా చెప్తండాడా? ఇప్పుడేం కొంపలు మునగ లేదులే అని కసిరాడు. సిటీబస్సులు రెండు మారి దినుమ్మూ యింటికి పోవాలంటే కష్ట మన్నాడు.అట్టయితే కాపరం ఈడ్చే బెట్టు అన్నా. ఈడ యిల్లు దొరికేది కష్టమన్నాడు. ఇహన్నేనేం జెప్పేది? అసలు పది మాటల కొక్క మాట మాట్లాడ్తుండాడా? మవునంగా వుండాడు. అడ్జాల్పాటి టిడ్డా చెప్పు నేను కసిరి చెప్పేదానికి...అందుకే అ కోడలి గోష్ట చూళ్ళేక గమ్మున వచ్చేసినా” కళ్ళు చెమరుస్తుండగా చెప్పాడు వెంకురెడ్డి.

నరసమ్మ చాలాసేపు విభ్రాంతిగా చూస్తుండిపోయింది.

వెంకురెడ్డి చెప్పిందేమీ ఆమెకు కొరుకుడు పడ్డం లేదు.

“తల్లిదండ్రి సరే అల్లం అయిపోయినామనుకున్నా ఏదో దూరంగా వుణ్ణూ కూడ కొడుకు, కోడలు అన్నోన్నంగా వుంటే చాల్లే అనుకుంది తల్లి మనసు యిన్నాళ్ళూ. ఈయనేంది యిట్ట చెప్పండాడు?'

ఐకుకు అ నవములక

ఇదంతా ఏదో అసహజంగా, భిన్నంగా, విభ్రమంగా తోస్తోంది నరసమ్మకి. ఆమె మట్టి బుర్రకి యిదెంత మాత్రమూ మింగుడు పడ్డంలేదు. సంగతులన్నీ చిక్కుబడిపోయిన వెంట్రుకల్లా అస్తవ్యస్తంగా వున్నాయి. తన చిన్నప్పుడు నాయినా, నలుగురు చిన్నాయిన్నూ, చినమ్మలూ నాయినమ్మా తాతయ్యా, పన్నెండేళ్ళకే మొగుడు చచ్చిపోయి పుట్టింటి కొచ్చిన మేనత్తా... అంతా కలిసే వుండేవాళ్ళు. ప్రతిరోజూ ఒక తిరణాలలా వుండేది. ఇంట్లో ఎవరికేం ఆపదొచ్చినా, కన్ను నొచ్చినా, కాలు నొచ్చినా యిల్లు యిల్లంతా కదిలిపోయేది. కొడుకులు తమంత వాళ్ళయినా కూడా నాయినా, చిన్నాయిన్లు తాత మాట జవదాటే వోళ్ళు కాదు అవ్వా, తాతా పోయిన పాట కూడా నాయినా, చిన్నాయిన్లు ఒకరినొకరు ఎంత బాగుండేవాళ్ళు, మేనత్త రామలచ్చమ్మని అంతా ఎంత అబ్బురంగా చూనుకునేవాళ్ళు. తనుమాత్రం...? పదమూడేళ్ళకి పెళ్ళి చేసుకోనొచ్చి ఈ యింటికి ఎంతెంత చాకిరీ చేసింది. అత్తా, మావా, యిద్దరు ఆడబిడ్డలూ, మరుదులూ... అందరి మంచి చెడ్డలూ చూసి వంపించింది. మావ పుణ్యాత్ముడు ఒకరిచేత ఒక్కపని చేయించుకోకుండా ఎల్లిపోయాడు. అత్తని ఆర్నెల్లు మంచాన పెట్టి ఉచ్చా, దొడ్డికీ కూడా ఎత్తి పోసింది తను. ఊరు ఊరంతా “అబ్బా నర్సమ్మ జేసిందమ్మా... తల్లిని చూసినట్టు చూసింది అత్తని" అన్నారు. అట్టంతా వుండేవాళ్ళం... ఇప్పుడు కొడుకిలా తమని దూరంగా వుంచేయడమే పెద్ద ఆశ్చరేకంగా వుంటే... యిప్పుడిదేంది ఆఫీసులో వుండేదేంది. ఒక్కడే...? రెండు మూడు దినాలకొకసారి వచ్చి పెళ్ళాం పిల్లల్ని చూసేదేంది...? ఈయన తెలిసి చెప్తండాడా, తెలీక చెప్తండాడా, అసలేందో అన్నట్టు భర్తకేసి చూసింది ఆతృతగా చేతులు తిప్పుతూ ...... అయితే వెంకురెడ్డికి మాత్రం పూర్తిగా అర్ధం కాకుండా ఏమీలేదు. తను మాటల్లో చెప్పలేక పోయినా యాభయ్యెనిమిదేళ్ళ జీవితం నేర్చిన కొద్దిపాటి జ్ఞానంతో మానవుడి పరిణామ క్రమాన్ని గురించిన ఆలోచనలో పడ్డాడతడు. ఉమ్మడి కుటుంబాల్లో నుండి విడివడి వేరు కాపరాలు పెట్టడం ఈప్పుగానూ, నేరం గానూ వుండేది తమ దినాల్లో. సరే మనిషి నాగరికత తెలిసి చదువుకోవడం మొదలెట్టేక కొన్నాళ్ళకి ఉద్యోగాలనీ, వ్యాపారాలనీ వేరుగా వుండటం అలవాటు చేసుకుని అందులోవే సుఖం చూసుకున్నాడు ఇప్పుడింకా ఆ వేరు కాపురాల మీద గూడ విసుగుపుట్టి పెళ్ళాం పిల్లలూ గూడ వుండొద్దు ఒక్కడే, తనొక్కడే స్వేచ్చగా వుండాలనుకుంటున్నాడు. ముందుతరాల పతినిధిలా అవుపిస్తోన్న తన కొడుకుని గురించి ఆలోచిస్తూ భారంగా కళ్ళు మూసుకున్నాడు వెంకురెడ్డి. తేళ్ళ కుటుంబాన్ని మింగినట్టుగా వుందతడి కంఠం. సాహిత్యనేత్రం, ఏటప్రిల్‌-జూన్‌ 1996 సాహితీ వేదిక - చీరాల వారు నిర్వహించిన కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ ఐళుకు భాగహారం ల్‌ళ్నం ఎహుట్‌వో

నాన్నకో ఉత్తరం

“ోఇయ్యాలయినా అమ్మికి జాబు రాసివావా లేదా?” వీధి చివరి నుండి మోసుకొచ్చిన మంచినీటి బిందెను పాయ్యి పక్కనే దించుతూ కొంచెం బిగ్గరగా ప్రశ్ళించింది జానకి.

చాలాసేపట్టుండీ కుళాయి వద్ద పోరుకులాడినట్లుగా ఆమె జుట్టు చెరిగివుంది. నుదుట పట్టిన చెమటకి బొట్టు చెమరి వుంది.

తనంత బరువున్న బిందెను మోనుకురావడం వల్ల ఆయాసంతో ఆమెగుండె ఎగిసెగిసి పడ్తోంది. చీర చిరుగుల్ని మట్టసంగా లోపలికి మడుచుకొని పాయ్యి దగ్గర వాంగుతూ భర్తకేసి చూసిందామె.

అప్పుడే ఆఫీసు నుండి వచ్చి అరజగ్గు నీళ్ళతో మొహం, కాళ్ళు చేతులు కడిగేసుకుని పుస్తకాలు మందేసుకుని కూర్చుని వున్నాడు మనోహరం.

పాయ్యిలో రెండు తాటాకు మట్టలు బెట్టి మంట చేస్తూ పొద్దుట మిగిలి వున్న టీ నీళ్ళని వెచ్చకేస్తూ వుంది జాన&.

అబ ఫోక్‌ షారన

“ఇనపడ్డాదా?” పుల్లల్లాటి చేతుల్తో పాయ్యెక్కేస్తూనే రెట్టించింది.

“ఊ” కాడ విరిగిన కళ్ళజోడుని దారం కట్టి రిపేరు చేస్తూ జవాబిచ్చాడు. మనోహరం తప్పదన్నట్లుగా.

“దేనికి ఊ కొట్టినట్టు... ఇనపడ్డాదనా? జాబు రాశాననా?” విసుక్కుంది జానకి టీ నీళ్ళందిస్తూ.

కప్పందుకుంటూ భార్యకేసి చూశాడు మనోహరం. క్షణకాలం పాటు అతడు హృదయం చుట్టూ కట్టుకున్న ఇనుపగోడ ఒకింత సడలినట్టయింది. ఈ జానకి తమ పెళ్ళయిన కొత్తల్లో ఎంత అందంగా, నాజూగ్గా వుండేది మరెంత నాజూగ్గా మాట్లాడేది?

మకరందపు భారంతో మత్తెక్కి తూగుతోన్న పువ్వులా... అలా అలవోగ్గా... మరి యిప్పుడో.. జీవితపు అనేకానేక అనుభవాల తాకిడితో... అవమానాల పరంపరతో బరువెక్కి వడలిన పండుటాకులా వుంది.

బాధ్యతలు భావుకత్వాన్ని మింగేస్తాయా? ఆర్థిక ఇబ్బందులనేవి మనిషిలో లోపలి సహనాన్నే కాకుండా అందాన్ని, నాజూకుతనాన్ని, వీణలాంటి గొంతునీ హరించి వేస్తాయా? ఆరోగ్యం సరే ఎలాగూ హరించుకుపోయింది. గుంటలు పడ్డ జానకి కళ్ళనీ, ఎండుకుపోయి రొప్పుతూన్న జానకి గుండెల్ని పరికిస్తూ మౌనంగా కప్పు నోటి కానించాడు మనోహరం. అతడికి తెలుసు తనకి మాత్రమే సాయంత్రం పూట '“టీనీళ్ళు' జానక్కి వుండవు. అయినా అదేమీ గమనించనట్లుగా నటిస్తాడతడు.

పాయ్యి మీద ఎసరు పడేసి చాట్లో బియ్యం పోసుకుని తెచ్చి మనోహరం పక్కనే వాకిట్లో చతికిలబడింది జానకి. ఉన్న ఒకే ఒక గూడులాంటి గదిలోపల ఎప్పుడూ చీకటే. విల్లు కట్టలేదని ఆ ఉన్న ఒక్కలైటూ పెరికేశారు కరెంటోళ్లు. అయితే జీవితంలోని చీకటితో పోల్చుకుంటే గదిలోపలి చీకటి పెద్ద నల్లగా ఏమీలేదు.

తలొంచుకుని బియ్యం ఏరుతోన్న జానకి కళ్లూ, గుండే కూడ బరువెక్కాయి. ఉద్వేగాన్ని ఆపుకోవడం కష్టంగా వుందామెకి. ఒక్కగానొక్క కూతురు వసంతని తమకు తిండి వుండి తిన్నా, లేక పన్తున్నా యెంతో గారాబంగా పెంచుకున్నారు. ఏదోలే గంతకు తగిన బొంత అనుకోకుండా తమకి మించినట్లుగానే యిచ్చి చేశారు. అబ్బాయి శ్రీరాములు ఒంగోల్లో టీచరుగా పన్చేస్తున్నాడు. ఆ సాంగ్యాలూ, ఈ సాంగ్యాలూ అంటూ అత్త బాగానే లాగింది. అయితే మాత్రం తమకది భారమయితే అయ్యుండొచ్చు గానీ, వాళ్ళ తాహతుకది ఎక్కువేమీ కాదు. ఏదో బాగానే వున్నారు. అట్టా జరిగి పోతావున్నది కదొని మొదులు పట్టించుకోకపోతే ఎట్ట? బిడ్డ గర్భంతో వుందని తెలిసి కూడా ఒక్కసారయినా పోయి రాలేకపోతేమి? అయిదో నెల్లో సారెబెట్టి ఘనంగా తీసుకురావల్సింది. అదేమంటే ట్రాన్స్‌ఫర్‌... ట్రాన్స్‌ఫర్‌... ట్రాన్స్‌ఫర్‌ మనం ఛస్తూంటే ఏందే సారె పెట్టేది... గీర పెట్టేది అంటూ కొట్టి పారేసె, ఇదంతా వాళ్ళకెట్టా తెలుస్తాయి. లేవలేని బిడ్డ అత్తా ఆడబిడ్డల కాడ ఎట్టుందో ఏమో, ముక్కు ఎగబీల్చుకుంటూ లోలోపలే గొణుక్కుంటూ వుంది జానకి.

నాన్నకో

రర న్‌ా

జానకి గొణుగుడు చెవులకి స్పష్టంగా విన్చించకపోయినా ఆమె చెప్పేదేమిటో మనసు కయితే స్పష్టంగా తెలుస్తూనే వుంది మనోహరానికి.

కూతురుకి తొమ్మిదో నెల వచ్చింది ఎప్పుడో అయిదో నెల్లోనే వెళ్ళి సారెబెట్టి తీసుకొచ్చి సీమంతం చేసుండాల్సింది. కానీ అదే సమయానికి తనకి ట్రాన్స్‌ఫరవడం, ఎంతో కాలంగా వుండిపోయిన చిట్టమూరు నుండి ఈ వూరు రావడం... కుటుంబాన్ని అటు నుండి యిటు తరలించడం యిదంతా శక్తికి మించిన భారమైపోయింది తనకి.

చిట్టమూర్లో రెండెకరాల నేలవుందనే అప్పట్లో చిట్టమూరు మండలమవగానే కావాలని పెద్దోళ్ళందరి కాళ్ళావేళ్ళా పడి బతిమాలుకుని అక్కడికి వేయించుకున్నాడు. కొన్నాళ్ళు బాగానే గడీచింది.

ఇంటిల్లిపాదీ అష్టకష్టం చేసి ఆ నేలలో చెనగ యేస్తే తొలినాళ్ళలో కొంత ఫర్వాలేదు అసలుకి అసలయినా అయ్యేది. ఆ తరువాత ఎండాకాలం నీళ్ళు లేక వానాకాలం వరదొచ్చేసి పంట చేతికొచ్చేదే కాదు. అధవా నచ్చినా ధర పలికేది కాదు. ధర ఎక్కువగా వున్నా దళారుల క్రింద నలిగిపోయేది. ఇట్టనే నలిగి నలిగి బతుకెళ్ళ మారుస్తా పదేళ్ళు తిరిగేటప్పటికి అమ్మేసిన ఒకటిన్నరెకరా పాలం పోగా మిగిలిన అరెకరాతో పాటు యిరవైవేల అప్పు మిగిలింది. ఇహన ఆ వూళ్లో వుండి కట్టెైలమ్మ లేక మళ్ళీ ఆ పెద్దోళ్ళ కాళ్ళనే పట్టుకుని యిదిగో ఈ వూరు వచ్చేసాడు.

ప్రభుత్వం కూడ చిత్రమైందే అదేంటో కానీ... రెవిన్యూ ఇంజనీరింగు డిపార్ట్‌మెంటుల్లో వున్నట్లుగా పై ఆదాయాలు, ప్రమోషన్లూ ఈ మండలాఫీసుల్లో పెద్దగా వుండవు. అటెండరుగా చేరి మండలాలయిన తరువాత అతికష్టం మీద రికార్లసిస్టెంటయ్యాడు తను. ఆ వచ్చే జీతం లోనే భార్యాబిడ్డల్నీ, తల్లిదండ్రుల్నీ సాకుతూ నెట్టకొచ్చాడు. ఎట్నో నాయిన తిరుగులాడ్డూ, తిరుగులాడ్తా వుండంగానే రెడ్డుళ్ళ చెరుకుతోట దారిన వస్తావుంటే పాము కరిచి చచ్చిపోయినాడు. జరిగేవన్నీ మనమంచికే అనుకున్నాడు మనోహరం.

అమ్మని ఆమాట ఈ మాటా చెప్పి తమ్ముడితో పంపించేసినాడు. పెద్దకోడలు వద్ద నుండి వెళ్లడానికి ఏమాత్రం యిష్టంలేక వెళ్తూ వెళ్తూ తల్లి చూసిన చూపుని మనసు చుట్టూ ఏర్పరుచున్న వలయం దాటి లోపలికి రానీయలేదు. అప్పటికే ఆ వలయం పటిష్టతను సంతరించేసుకుంది.

నాయిన పోయేనాటికి నేల అమ్ముకోలేదు అప్పటికి ఒక్క పైసా అప్పులేదు. చిల్లికానీ చేతిలో లేదు. అవతలవతల ఎప్పుడు ఏం జరుగుతున్నది తెలీకుండా చాప కింద నీరులా జరిగిపోయింది. ఎప్పటికప్పుడు “ఇదిగో ఈ ఒక్కసారికేలే... రేపు పంటొస్తానే యిచ్చేస్తే పోతాది' అంటూ అంచెలంచెలుగా అప్పు జమవుతూ వచ్చింది.

కొడుకు రవికి తాము జీవించే దుర్భరజీవితం పట్ల ఏవగింపు. చేతకాని తండ్రీ మూలం గొవే తమ జీవితాలీ విధంగా తయారయ్యాయని హేళన. తెలీని కసి, ఈ వూరికొస్తానే చదువు

అవ్‌ డనాల7

మాన్పించి శెట్టంగట్లో పనికి కుదిర్చ్బాడనీ, తండ్రి మీద రేగిన కోపంతో పాపం రవి మంచి అబ్బాయి కాబట్టి తండ్రిని ఏమీ అనలేక ఇల్లు వదిలి పారిపోయాడు.

అదీ ఒకందుకు మంచిదే. ఈ యిరుకు యింట్లో కన్నా సువిశాలమయిన ప్రపంచంలో జీవితాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా అవకాశాలుంటాయని... ఏదో ఒక నాటికి తన కొడుకు ప్రయోజకుడయి తిరిగి వస్తాడనీ గట్టి నమ్మకం మనోహరానికి.

భార్య ముక్కెగబీలుస్తూ ఛర్రు ఛర్రున బియ్యం చెరుగుతోన్న శబ్దంతో చప్పున ఈ లోకంలోకొచ్చి పడ్డాడు మనోహరం.

'మూసిన ముత్యం... పాసిన పగడం మాట్లాడితే యాడ ముత్యాలు రాలిపడిపోతాయో ఏరి మూటగట్టుకుంటామనుకుంటాడు... యాడా జూళ్ళేదమ్మా యిట్టాటి మొగుణ్ణి...” ఒక వంక బియ్యం చెర్పుగుతూనే సణుగుతోంది జానకి.

మనోహరానికి జానకిని చూస్తుంటే చెప్పలేనంత జాలివేసింది. తన నిస్సహాయత మీద కోపమూ కలిగింది. అవును తను వసంతకి జాబు వ్రాయలేదు. రూపాయి పెట్టి కవరు కొనలేక అన్నదొక్కబే సత్యంకాదు... ఒక్క రూపాయే అయితే అప్పు దొరక్కపోదు. ఆ రూపాయితో కవరు కొసేసి అందులో వ్రాయాల్సిన విషయాలు చాలా ధర పలుకుతాయి మరి. వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తానని రాయాలి. తీసుకొచ్చి కానుపు చేయించాలి. పురుడు చేయాలి. కల్లీబిడ్డల్నీ మూడో నెలదాకా వుంచుకోవాలి ఈలోపల అల్లుడు పదే పదే వచ్చిపోతాడు. అత్తా ఆడబిడ్డలూ వస్తారు. ఇదంతా ఒక్క రూపాయితో తేలేది కాదు. అందుకే జానకి మాట ఖాతరు చేయకుండా వాయిదా వేస్తూ వచ్చిందిన్నాళ్లూ

జానకి సన్నగా ఏడుస్తోంది.

గర్భవతి అయిన కూతురి చూసుకోవాలని, దగ్గరుండి సేవలు చేయాలనీ ఆమెకు చాలా యిష్టంగా, ఆశగా వుంది. అదీకాక మనసు బలహీనపడినప్పుడల్లా కొడుకు ఎక్కడున్నాడో నన్న దిగులు ఆమెను చుట్టేస్తుంది. రెండూ కలిసి కలగాపులంగా ఆమె గుండెను బలంగా

“ఏడుపాపు...” గద్దించాడు మనోహరం. అతడు అప్పుడప్పుడూ తన నిస్సహాయతను పెత్తనం రూపంలో బహిర్గతం చేసి ఆమె నోరు మూయిస్తుంటాడు చాలా మంది మొగాళ్ళలాగే.

“ఎవరు చచ్చారనిప్పుడు...? రాస్తాన్లే... రేపు రాస్తానన్నాను కదా. నోరుమూనుకో” విరుచుకుపడ్డాడు.

గుడ్డలో నీటిని గుడ్డలోనే, గుండెల్లో బాధని గుండెల్లోనే అణిచేసుకుని చప్పున లేచి చేటతో లోపలికెళ్ళిపోయింది జానకి.

ఈసారి జానకిని చూస్తుంటే గుండె గొంతులో కొచ్చినట్లుగా అయింది మనోహరానికి. ఆ రాత్రి ఆభోజనంగా పడుకుని నిద్రలేమితో బాధపడ్తోన్న జానకిని ఓదార్బాలని ఎంతగానో అన్పించినా... చాల గట్టిగా బెట్బగా వుండిపోయాడు మనోహరం. జానకిని దగ్గరికి తీసుకుని చనువిస్తే ఏమవుతుందో అతడికి బాగానే తెలుసు. పట న

కరిగి నీరయి ఆ తడిలో మొదలయిన లేలేత నిష్టూరాలు తమ పెళ్ళయిన్నాటి నుండీ పడిన అష్టకష్టాల జాబితాతో సుదీర్చ రామాయణమై కొడుకు వెళ్ళిపోయిన్నాటి సంఘటనతో ముగుస్తుంది. ఇదే అవకాశంగా తన అసమర్ష్హతని ఆమె ఏకరువు పెడ్తుంటే వినడానికీ, ఒప్పుకోవడానికి సిద్దంగా లేడు. అలాగని ఆమెని సంతోషపెట్టడం కోనం కూతుర్ని తీసుకొచ్చి లోకం కోనమే అయినా కానుపు చేయించడానికి సుముఖంగానూ లేడు. ఏం చేయాలో తెలీనితనంతో రాత్రిని తెల్లారిస్తూ వేకువన ఒక నిర్ణయానికి కొచ్చాడు మనోహరం... ఆ రోజు ఎలాగైనా కూతురుకి ఉత్తరం వ్రాయాలని.

ఈ మండలం చాలా పెద్దది. సీనియారిటీ ప్రకారం మరొకరికి రావాల్సిన ట్రాన్స్‌ఫర్‌ ఈనకి రావడంతో ఆ సదరు వ్యక్తి రిపోర్చ మేరకు తనని మళ్ళీ మరోచోటికి మారున్తున్నారనీ, ఆ గొడవలో తిరుగుతూ తను కూతుర్ని తీసుకురాలేక పోతున్నాననీ, త్వరలోనే రావడానికి ప్రయత్నిస్తాననీ వ్రాసి పోస్ట్‌ చేయాలనుకున్నాడు. ఆ తరువాత అతడికి ప్రశాంతంగా నిద్ర పట్టేసింది.

ఆ మరునాటి సాయంత్రం...

మౌనంగా, అసలేమీ పట్టనట్లుగా టీ అందిస్తోన్న జానకిని చూసి చప్పున గుర్తొచ్చింది మనోహరానికి. ఆఫీసులో రద్దీగా వుండడంతో పూర్తిగా చదవకుండానే లోపల పేట్టేశాడు. కూతురి ఉత్తరం చూడగానే తను వ్రాయాలనుకున్న ఉత్తరాన్ని మళ్ళీ వాయిదా వేశాడతడు.

తొపీగా టీ త్రాగి కూతురి ఉత్తరం విప్పాడు.

“పూజ్యులు నాన్నకీ,

వసంత నమస్కరించి వ్రాయునది... ఇక్కడంతా బాగానే వున్నారు. అక్కడెలా వున్నారని చేనడగను. ఎందుకంటే మీరెలా వున్నారో నాకు తెలుసు కాబట్టి. మొన్న డాక్టరమ్మకి చూపించు కుని వస్తుంటే సెంటర్లో రామచంద్ర మామ కన్పించి చెప్పాడు. 'అమ్మ నిండా తగ్గిపోయి నీర్చంగా వున్నాదని నాయిన ఎప్పటి మాదిర్నే ఎండుకుపోయి వుండాడనీ, తమ్ముణ్ణి చదువు మాన్చించి శెట్టంగట్లో సపెట్టారనీ...' అన్ని విషయాలు చెప్పాడు... వాన్న జాబు వ్రాయలేదని వేను బాధపడ్తోంటే సర్దిచెప్పాడు.

నాన్నా! కూతురు గర్భవతి అని తెలిస్తే కూడ సంతోషించడానికి డబ్బుతెర అడ్డ మొచ్చేస్తుంది నాన్నా మధ్యతరగతి తల్లిదండ్రులకి. అయిదోనెలలో నన్ను సారె పెట్టి తీసికెళ్ళ లేదనీ, అచ్చటా, ముచ్చటా తీర్చలేదనీ మా అత్తగారు చాలా కోపంగా వుంది. ఆడబిడ్డకి నా పుట్టింటోళ్ళు ఏమీ జరపలేదనీ అన్నీ యిక్కడే జరిపించుకుంటున్నాదనీ ఎగతాళిగాను, కంట గింపుగానూ వుంది, నాన్నా నువ్వు నాకు లోకజ్ఞానం నేర్చితే, అమ్మనాకు ఎంతో సహనాన్నిచ్చింది నాన్నా. అంతనిండు నహనమూ ఈ యింట్లో తేలిపోతోంది.

నాకు తెలుసు నాన్నా నువ్వేమంటావో ఏం చేయనమ్మానా జీతం అంతంత మాత్రమే అంటావు. పంట చూస్తుంటే వానాకాలం నీటి ముల్లు గుచ్చితే ఎండాకాలం కరెంటు పురుగు

ఉత్తరం అనో షారళ

తివేస్తోంది అంటావు. అవన్నీ వీళ్ళకెందుకు వాన్నా?... సారె పెట్టి పురుడు పాయాల్చిన బాధ్యత వీది. నువ్వు అప్పే చేస్తావో, అడివే నరుకుతావో వీళ్ళకనవసరం. వాన్నా... కన్నకూతురు గర్భవతి అయినపుడు ఎంతటి గడ్డుస్థితిలోనయినా తండ్రే కానుపు చేయించి తీరాలన్న గొప్ప పాంప్రదాయాన్ని యివ్పటికిప్పుడు నువ్వూ, వేనూ ఏం చేపి మార్చగలం వాన్నా? వెంటవే ఐబయత్దేరి వచ్చి నన్ను తీసికెళ్ళాల్సింది.

నాన్నా ఎవరయినా చుట్టాలు మనింటికొస్తామని వ్రాసినపుడు నాకు ట్రాన్స్‌ఫర్‌ అవుతోం దనీ, వేనువుండననీ, రావాద్దనీ, ఏమీ అనుకోవద్దనీ ద్రాసేవాడివి ఖర్చులు తట్టుకోలేక. మొన్న అయిదో వెల్లో నువ్వు ట్రాన్స్‌ఫర్‌ సంగతి వ్రాసినపుడు నిజాన్ని వాలోవే మింగుకువ్నాను. మరి యిప్పుడు కానుపు సమయంలో ఏసాకు చెప్పగలవు వాన్నా...?

మెత్తబడుతోన్న మనసు వలయాన్ని తిరిగి గట్టి వరచడం కోపం ముందరున్న జి.కె. పువ్తకం తీశాడు మనోహరం.

“ఈ జీవితం మనది... దీన్నుండి మనం పారిపోవడానికి ప్రయత్నిస్తాం... కావీ ఆది మనల్ని వదలదు... వ్యక్తి తన వుట్టుకనుండీ చివరి శ్వావ వరకూ అతని సంపూర్ణ క్రియలకు అళడి జీవితం నమాధానమవుతుంది... మరెందుకు మనం పారిపోవడానికి ద్రయత్తించడం?”

గట్టిగా చప్పుడయ్యేలా పుస్తకాన్ని మూసేశాడు మవోహరం. ఆంధ్రజ్యోతి వారపత్రిక, 1997 70 ఇడ్లా+

అక్క ఈగ

అబ్బ! యిప్పుడు నాక్కొంత రిలీఫ్‌గా వుంది. నాతల, వీవు, నడుము, కాళ్ళు ఈ మంచం మీద ఆనిన తర్వాత. ఈ వెలరోజులుగా నేను పడుతుండిన శారీరక బాధంతా ఎక్కడికో ఎగిరిపోయినట్లుగా ఒకింత తేలిగ్గా వుంది... సంజీవనీ వర్వత సానువుల్లో నిలబడి మరణాన్ని పిలుస్తున్నట్లు ఆనందంగా వుంది... మరణమంటే...? ఎవరో అన్నట్లుగా రెండు జన్మల నడుమ నిద్రా?..నిర్ర...నిద్ర హాయిగా నిర్ర పడితే ఎంత బావుంటుంది? వట్టదు... ఎందుకు వడ్తుందీ మనమూ, శరీరమూ యమయాతన వడ్డ్తూంటే మనిషి కెక్కడయివా నిద్ర వడ్తుందా?... మరి మనిషికెప్పుడు నిద్రపడ్డుంది?... పక్కింటి లక్ష్మి ఎంత హాయిగా నిద్ర పోతున్నట్లుగా వుంది?... అపలు లక్ష్మి నిజంగా మరణించిందా?... అంతా కలలా వుంది...అప్పటి దాకా బాగా మాట్లాడీ వెళ్లిన లక్ష్మి అరగంట తరువాత శవమై కన్పించినపుడే కదా జీవితానికీ, మరణావికీ నడుమ వ్యత్యాసం

నన్నగా వువ్నట్లు అర్థమైంది... తనకి...

ఈగ

ఈం వేదవ 20

జీవితమంటే ఏమిటి?...అవును ఈ మంచం మీదే తొలిసారిగా తనకి జీవితమంటే ఏమిటో కొంత తెలిసింది .. అప్పటిదాకా నిజంగా తనకి ఏమీ తెలీదు... జీవితమంటే రంగు రంగుల రమ్యమైన సీతాకోకచిలుక. . జీవితమంటే అరవిరిసిన పూలతోట... జీవితమంటే చదువు, (ప్రేమ, స్నేహం, అర్తి, ఆత్మీయత, కబుర్లు, నవ్వులు... అలా ఎగురుకుంటూ వచ్చి సీతాకోకచిలుక అందంగా ఈ మంచం మీద వాలింది. చాలాకాలం తరువాత తిరిగి చూసు కుంటే దాని రెక్కలు తెగ్గొట్టబడ్డాయి అయ్యో రెక్కలు విరిగిన సంగతే తెలీనంతా సమ్మగా... అరెరె తను గమనించనే లేదే... అప్పుడెపుడో భరించరాని నొప్పేస్తే పోనీలే అని సర్దుకుంది, సరిపెట్టకుంది... ఒక్కసారా తనికి నొప్పేసింది?... ఒక్కొక్కసారీ సరేననుకుంది. అప్పుడే విరిగి పోయుండాలి రెక్కలు...

ఇదంతా తనదే అనుకుంది...అసలెవరూ పరాయివాళ్ళు లేరనుకుంది... పరాయి వాళ్లెవరు?... ఒకరిలో ఒకరికి రక్తం కలిసిపోయాక ఎవరయినా పరాయివాళ్ళవుతారా?... అవునూ రక్తం మనుషుల్ని కలుపుతుందా?... మరి శరీరాలు కలుపుతాయా?... మనసు కలుపుతుందా?... అభిప్రాయాలు? వాటినెక్కడ పాతిపెడదాం?... వాటిని పాతి పెట్టడమంటే మనుషుల్ని పాతి "పెట్టడమే కదా... మనుషుల్ని ఎక్కడ పాతి పెడతారు? స్మశానంలోనా?...స్మశానంలో ఒంటరిగా వుండాలంటే భయమేయదూ? ...ఛ ..ఛ... అక్కడ మనుషులుండరు,

భయమెందుకు?... వేస్తే గీస్తే యింట్లోనే వేయాలి... ఈ యింట్లో... ఈ యిల్లు తనెంత కష్టపడి కట్బకుంది?... రెక్కలు ముక్కలు... ముక్కలెప్పుడో గాలికెగిరిపోయాయి. ఇల్లు కావాలని తను... వద్దని అతడు... అసలు ఆలోచనలూ, అభిప్రాయాలూ కలిసిందెన్నడు?... ఆ వెరుధ్యంలోనే తండ్రినడిగి కొంతా, ఆలోనూ, ఈలోనూ పెట్టి కొంతా అల్హాడల్లాడి ఈ కప్పేసుకుంది... తన రక్తంతో కట్టుకుందీ యిల్లు.

మనుషులెందుకిటువంటి పిచ్చి పనులు చేస్తారో అర్థంకాదు... సొంత ఆస్తి వుండడానికీ, పోవడానికీ నడుమ జరిగే సంఘర్షణ గురించి ఆయనెవురో ఎంత బాగా చెప్పాడు?... మార్క్‌ని చదువుకుంటాం...ఎంగెల్స్‌ని చదువుతాం... వర్గపోరాటాల గురించి వైన వైనాలుగా తెలును కుంటాం... అయినా సరే సొంత యిల్లూ... ఆ యింటికి రెండు గేట్లూ... ఒకటి మనుషుల కోసం... రెండోది వాహనాలు నడపడానికీ, అన్నీ తెలుసుండీ బుద్దిలేకుండా అందరి మనుషుల్లో కప్పేసుకుంది... ఇల్లంటే యిష్టమే మరి... యింట్లోని మనుషులంటేనో... మనుషులు... మనసులు... మనసులు... వర్గాలు... ఈయింట్లో మనుషులు కాదు... మొత్తం మాటలే... మాటల సూదులు, శూలాలు... మనిషికి మనసుందనేది తెలీని మనుషులు.

చెప్పులోని రాయి, చెవిలోన జోరీగా... కాలిలోని ముల్లు, యింటిలోని పోరు వెర్రి బాగులోడు వేమన ఎంత బాగా చెప్పాడు?... పోరు...పోరు ఎక్కడ చూసినా పోరే... ఉదయం లేస్తే పాలున్నాయో లేదో చూసుకుని కాఫీ కలిపే లోపలే ఒకపోరు... గ్యాస్‌ అయిపోయిందంటే ఒక పోరు... కూరలో ఒకింత ఉప్పు తక్కువయినా, ఎక్కువయినా పోరే... చీకట్లో నిద్ర లేస్తే పక్కలోకి తక్కువని పోరు... నిద్ర లేపకపోడే కంచంలోకి తక్కువని పోరు...

ఈగ

72వ

ఇంటికి స్నేహితులొస్తే, వాళ్ల ముందుకొస్తే ఒక పోరు... రాకుండా వంటింటి కతుక్కు పోతే మరో పోరు... అంతా వెరసి తను ఉద్యోగన్తురాలు కాదనేది మొదటి పోరు... ఉదయం పడక మంచం మీది నుండి లేచింది మొదలు రాత్రి తిరిగి మంచమెక్కే వరకూ కూడా పోరాటమే... ఒంటరి పోరాటం...మౌనపోరాటం. ఛ..ఛ...స్వేచ్చగా, హాయిగా, గునగునా, పరుగులెత్తుతూ తిరిగే కుందేలికి తనతో కంపారిజనేమిటి?...సిగ్గు... సిగ్గు... కుందేలు సిగ్గుపడుతోంది. తనని ఆడదానితో పోల్చినందుకు... అ మాటకొస్తే ఈగ కూడా సిగ్గుపడి ఎగిరిపోతోంది. ఎక్కడెగుర్తోంది పిచ్చి ఈగ...తెలిసి తెలిసీ వచ్చి శ్లేష్మంలో పడ్తోంది లేకుంటే తన చెల్లి ఈగ ఎలా చిక్కుకుంది... చెల్లి ఈగయినా, అక్క ఈగయినా సరే మగ గాలంలో చిక్కుకు తీరాల్సిందే... యిదే మంచం మీద తన చెల్లెలు డేగ గాలంలో తగులుకుంది... ఆ నిజాన్ని కళ్ళారా చూసినపుడే కదా జీవితమంటే యింకా యింకా బాగా అర్ధమైపోయింది తనకి... మనను ఆలోచించడం అలవాటు లేనిదానిలా మొద్దుబారిపోయింది... జీవితం అంటే యిప్పుడు గుండ్రాళ్ల మీద గలగలపారే సెలయేరు కాదు... చుట్టూరా వేయి నాల్కలు చాస్తోన్న జ్వాల. చెల్లి ఈగ నిజంగా సుభాషిటే... బాషణమే భూషణం దానికి, అందంలో ఎవరికెరూ తీసికట్ట కాకపోయినా అది కెరీర్‌ ఈగ... పదిరాళ్ళు సంపాదిస్తోంది... ప్రస్తుతం మగాడి క్కావల్సిందదే. కెరీర్‌ వుమన్‌... మేధావియై తన తిరుగుళ్ళనీ, తాగుళ్ళనీ పరిపూర్ణంగా అర్థం చేనుకోగల్లిన భాగస్వామి... ఆ మేధావితనం బయటి వాళ్ళకి చూపించుకోవడానికే తప్ప మళ్లీ తనముందు ప్రదర్శించకూడ్తదు.... కూడదంటే కూడదంతే... ఒకవేళ పారపాటున అప్పటికే శెరీర్‌ లెస్‌, విసడమ్‌ లెస్‌, టాలెంట్‌ లెస్‌ ఆడదాన్ని భాగస్వామిగా పొంది వున్నట్టయితే...మరో కెరీర్‌ ఈగని తన జీవితంలోకి ఆహ్వానించే హక్కు కలిగి వుంటాడిక్కడ మగాడు... చట్టాలు చట్టాలుగానే వుంటాయి కాగితాల్లో... సెక్షన్లు చెక్క భజన చేనుకుంటే ఆ వివాహం చట్ట బద్దం కాదు అంటాయి కాగితాలు... చట్టబద్దమైతే ఎంత? కాకపోతే ఎంత?... పది హేనేళ్ళుగా వివాహం కొనసాగుతూనే వుంది... అవునూ ఆడదెందుకు రెండో పెళ్ళి చేసుకోకూడదు.. కూడదని ఎవరు చెప్పారు?... మగాడే చెప్పి వుండాలి... ఇద్దరు మగాళ్లతో కాపురం చేస్తే ఎలా వుంటుంది?... ఛ...ఛ... అటువంటి అవకాశం స్రీకుండకూడదు. ప్చ్‌ ఆడదానికి అసలేముంది కనక యిక్కడ?.. ఏం లేకపోయినా బతాకల్సిందే... ఏం లేకపోయినా ఏది లేకపోతే? (ప్రేమ లేకపోయినా, ఆప్యాయత లేకపోయినా... మాటల్లేక పోయినా... ఆఖరికి మొగుడు దగ్గరికి తీసుకోకపోయినా... ఏ సుఖమూ లేకపోయినా సరే... యిదంతా నా ఖర్మ, నాకిట్ట రాసిపెట్టుంది అని పదేపదే అనుకుంటూ అయినా సరే బతకా ల్సిందే... కనీసం ఛావడానిక్కూడ వీలుండదంతే... ఈగ అబన

(పేమా?... అదెక్కడుంది?... సమాజంలో సంపాదన స్థాయిని బట్టీ స్రీ పురుష సంబంధాలుంటాయి... ఆ సంబంధాల్ని బట్టే ప్రేమ నిర్వచించబడుతుంది. మన కుటుంబాల్లో దాని జాడే లేదు... ఇక్కడ ఏ మొగుడూ, పెళ్ళాన్ని శ్రేమించడం లేదు... ఒకవేళ పెళ్ళాం ఢేమించినా అది భద్రతకోసమో, లేక సమాజం కోసమో నటన... నటన...

నరుడి బతుకు నటనా . మొగుడు (పేమ నటనా ఆరెంటి నట్టనడుమా నీకెందుకింత తపనా. తపన...తపన... ఈ శరీరానికెందుకంత తపనగా వుంటుంది? తపన... తపన... అవునూ? మొగుడెందుకు దగ్గరికి తీసుకోడు?... దానికి సవాలక్ష కారణాలు చెప్తాడు సమరం... అసలు వాత్సాయనుడేం చెప్పాడో తెలీకపాయ సమరం చెప్పిందే వేదం... ఏం... అతను మాత్రం పెళ్లానికి సుఖమివ్వాద్దన్నాడా?

చెల్లి ఈగ మంచమెక్కిన్నాటి నుండీ తనే అతన్ని పన్సెత్తి పలకరించలేదు... ఆ తర్వాత తనకి తాను సరిపెట్టకుని తపనగా అతడికి దగ్గరవాలని చూస్తే అతడు కన్నెత్తి చూడలేదు... అసలు తనికి తెలీకడుగుతుంది కానీ పెళ్ళాన్ని వేధించి, రేస్‌ చేసే మగాళ్ళని గురించి తెగ రొసేస్తుంటారు కానీ, మొగుడ్డుంచి సుఖం లేక, మరో మగాడితో పంచుకోవడం యిష్టంలేకో, అవకాశం లేకో అల్లాడిపోయే ఆడదాన్ని గురించి ఒక్కడూ రాయడేం?... ఆ ఆడదాని కెందుకు లేబ్బా సుఖం?... మనకుంటే చాల్లే ..శక్తి లేకపోయినా సరే ఓజోమెన్లూ, వయాగ్రాలూ రెడీగా వుంటాయి... ఒంట్లో శక్తి లేకపోతే సరే మనసుకి శక్తి లేకపోజే ఏం మింగించాలి? వాడు వద్దనుకుంటే వద్దే... వాడి చేత ఏమీ మింగించలేం.. అంతగా అయితే ఆవిడెనరో అన్నట్లు మనసింకిపోవడానికి తనే మాత్ర వేసేసుకుంటే సరిపోతుంది. ఎన్ని నిద్రలేని సుదీర్చ రాత్రులు ముండమోసిన దానిలా బతికింది తను... అమరాన్నడిగి విషం(?) మింగుండాల్సింది...

అసలీ ఆడముండలికి బొత్తిగా బుద్దిలేదబ్బా?... ప్రపంచంలో మరెక్కడా మగాడే చొరకనట్లు సెకండ్‌ హ్యాండ్‌ మగాడ్ని తగులుకుంటారెందుకో? ఎంత చదువులుండి, వూళ్లేలు తుంటే మాత్రం ఏం లాభం?.. ఆడదాని ఆలోచనలు ఆ స్థాయిలోనే వుంటాయి. మంచి అందమైన, చదువుకున్న, ఢిల్లీలో పెద్ద కేడర్లో వున్న వరుడి మాట్లాడాడు తన తండ్రి... ఈలోపుగా చెల్లి ఈగ వీడ్ని తగులుకుంది... తండ్రికి తెలీకుండా పెళ్లి కూడా చేసేసుకుంది... ఫ్న్‌ ఎవరి జీవిత మార్గాన్ని ఎవరు మళ్లించగలరు? ఈ సెకండ్‌ హ్యాండ్‌ మనిషిలో ఏం సుఖం చూసిందో మరి? మళ్లీ ఏదయినా గట్టిగా మాట్లాడితే తనికి అనూయంటుంది.

అసూయేంటే పిచ్చి మొహమా?... నన్నూ చేసుకుని, నిన్నూ చేసుకుని వాడు సుఖపడి పోతున్నాడే అన్నివిధాలా... నువ్వు డబ్బు సంపాదించిపెడ్డావు, అన్ని ఆడంబరాలకీనూ... షోగ్గా అలంకరించుకుని పార్టీలకూ, ఫంక్షన్లకూ వెళ్తావు వాడితో కలిసి... అక్కడ పనికిమాలిన మేధావులందిరితోనూ ఆస్‌ బీస్‌ మంటూ యింగీలీషులో మాట్లాడేస్తావు... ఇంకా వీలయితే అతడి పై ఆఫీసర్‌తో చనువుగా మెసిలి ప్రమోషన్‌ సంపాదించిపెట్టగలవు... ఇకపోతే నేనో? యింట్లోనే వుండి హాయిగా యిల్లంతా సర్దిపెడ్తాను. ఒక చిన్న వస్తువయినా బయటికి పోకుండా

ఈగ

76వ

కాసలా కాస్తాను. మీరొచ్చేసరికి కమ్మగా వండిపెడతాను... నువు బయటా, నేనింట్లో హాయిగా కూర్చోబెట్టి మేపుతున్నామే వాడ్ని అంటే ఆర్ధం కాదేమే నీకు? ముందు నువ్వే అసూయలో పడికొట్టుకుపోతూ నన్నర్థం చేసుకోకపాతివి. . ప్‌ నువ్వా అవకాశం యివ్వబట్టే కదా, మనిద్దర్నీ కీలుబొమ్మల్ని చేసి ఆడించాడు. కీలుబొమ్మ. . బొమ్మ... మూగబొమ్మ... ఒక బొమ్మకి ఏ కీలుకాకీలు వూడగొట్టేశాడు... ఊపిరి మాత్రం ఎక్కడో కాస్త ఆడుతోంది... అది కూడా రేపో, మాపో ఆగిపోతుంది... ఆగిపోవాల్సిందే అంతే... అన్ని సినిమాల్లోనూ అదే కదా చూపెడ్తారు. చిన్నిల్లో, పెద్దిల్లో ఏదో ఒకటి అంతమవాల్సిందే, అదీ ఎండింగే... యిద్దరు పెళ్తాలతో చివరి దాకా ధ్రిల్లింగా, నుఖంగా, ఎంజాయింగ్‌గా చూపించేసి చివరాఖరికి మాత్రం ఒకదాన్ని లేపేస్తాడు... లేదా దూరంగా పంపిస్తాడు .. అసలెందుకెళ్లాలి! హీరోనే లేపేస్తే పోలా?... అమ్మో సినిమా ఆడదు... ఆయ్యేమి సినిమాలో, ఎత్తు భారాలో అర్ధమే కావడం లేదు... నారీ నారీ నడుమ మురారి, ఏమండీ అవిడొచ్చింది, ఎదురింటి మొగుడూ... పక్కింటి పెళ్లాం, అవిడా మా అవిడే.... అబ్బబ్బ... ఈ యిద్దరు హీరోయిన్ల సినిమాలు చూసి చూసి అదే యిప్పటి సంస్పృతి అన్నట్లుగా మారిపోతుంది యువతరం. ఆ సంస్పృతితోనే చిన్నాన్న కూతురు వసుమతి ముందే పెళ్తామున్న మగాడి తెలిసో, తెలీకో ప్రేమించేసింది... ఛ... ప్రేమన్న పదానికి నిర్వచనం మారిపోయిందీ తరంలో... వాడ్ని పెళ్ళి చేసుకోమని అడిగితే నాకు పెళ్లయింది, కావాలంటే నిన్నుంచుకుంటాను అన్నాడట... ఆరాత్రే కిరసనాయిలు డబ్బా ఖాళీ చేసేసింది వనుమతి... అబ్బ ఛావాలనుకుంటే మరో మార్గమే లేదా? అంత దారుణంగా మంటల్లో మండి ఛావాలా?... అబ్బర్డ్‌... ఏం వాడికి రెండో పెళ్ళాంగా పడుండకపాతే త్భూ... ఎదవనాయాల అని వుమ్మేసి హాయిగా వేరేవాడ్మి పెళ్లాడగూడదూ... అహ (ప్రేమ... ప్రేమించేసింది... వాడే కావాలి... వాడొద్దంటే మరణమే శరణ్యం... రెండో చేయి మనుషులు రెండో చేయి మనుషులని ఛీ...ఛీ....

అరెరె ఎప్పబెప్పటివో సంఘటనలు యింత క్షియర్‌గా జ్ఞాపకానికొస్తున్నాయేమిటి?... తనికి బాగయిపోతోందా?... నెలరోజులుగా హాస్పిటల్లో పడుండి యింటికెళ్తేనయినా గాలి మార్చొన్తుందని వచ్చేస్తే... అయ్యో ఈ మంచం మీది కొచ్చాక కొంత తేలిగ్గా వుందేమిటి?... గాలి మారిపోయిందా? అంటే తను చచ్చిపోదా?... ఊపిరిగదా... అయ్యో జీవితపు పాటల న్నింటినీ సమాధిలో దాచి వుంచుకువ్నానే.. సమాధి వరకూ ఎవరయినా చేయిపట్టి నడిపిస్తే బావుఖ్బు. అక్కడ అమ్మ వుంది... తనని ఒళ్ళో దాచుకుంటుంది... అమ్మంటే అదే కదా...

..అమ్మబుణం ఎలా తీర్చుకోవాలి... బుణం తీర్చుకోవాలంటే అమ్మకి పుట్టాలట... అమ్మ తన కడుపులో పుట్టిందా?... ఉహూ షర్మిల కడుపులో పుట్టింది...

షమ్మి షమ్మి వస్తావా? నేనెళ్ళే లోపుగా వస్తావా తల్లీ ?

మమ్మీ... మమ్మీ... నేను నీ పక్కనే వున్నానమ్మా... చెప్తన్నారెవరో వీణలాంటి గొంతుతో... అమ్మా . నీకేమీ అవదమ్మా... నేను నిన్ను నాతో పాటు అమెరికా తీసుకెళ్తాను... అక్కడ పెద్ద డాక్టర్లకి చూపిస్తానమ్మా... వెక్కుతోంది షమ్మి...

ఈగ ఈబా పనా 22

పిచ్చి షమ్మి నాకేమీ లేదని నువు చెప్తే మాత్రం, డాక్టర్లు కీమోరాథెరపే గురించి మాట్లాడుకోవడం నేను విన్లేదనుకున్నావా? నాక్కూడ కొంచెం కొంచెం తెలుసే తల్లీ... అను కుంటూ నివి ఏదీ అడిగినట్టుంది తను. నివీ....నివి బుజ్జీ... రామ్మా అమ్మమ్మ పిలుస్తోంది చూడు అంటున్నారెవరో. మ్మమ్మీ.... మ్మమ్మీ... బుజ్జి గొంతు... అబ్బ ఎంత హాయిగా వుంది... వదిలి ఎలా వెళ్లాలి... ఏడుస్తున్నారెవరో... ఎవరో కాదు అంతా ఏడుస్తున్నారు. అక్కా .... ఎట్లా వుందక్కా చెల్లి ఈగ వెక్కిళ్ళు. అరెరె ఒకవైపు దిగులు, ఏడుపుతో పాటు చెప్పలేనంత నవ్వాచ్చేస్తోందేమిటి?...నవ్వు... అహ్హహ్హ ...నవ్వు నవ్వు... ఎవరో చట్చిలిగింతలు పెట్టినట్లుగా... మనుషులు జీవించి వున్నపుడు చూపించుకోలేని ప్రేమానురాగాలు, ఆత్మీయతా బంధాలు, చనిపోయేక ఫోటోలు పెట్టి పూజిస్తే మాత్రమేం లాభం?... అన్నీ తెలిసీ ఎందుకిలా అజ్ఞానంలో పడుతున్నారు మనుషులు. అజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం లేకపోవడం... ఎరుకలేకపోవడం. జీవితాన్ని గురించీ, ప్రకృతిని గురించీ, పరిణామాన్ని గురించీ, ఈ నమాజంలోని మనుషుల గురించీ, వాళ్ళు మగయినా, ఆడయినా సరే... అసలు మనిషికి తన గురించి ళఈనకు ఎరుకలేకపోవడం. ఆ ఎరుకనేది ఏర్పడ్డాక అంతా పేలవంగా వుంటుంది. ఇన్నేళ్ళూ... ఏ పారపొచ్చాలు లేనట్టుగానే... పైకి ఎంతో గంభీరంగా ఈ జీవితమింతేనని సరిపెట్టుకుంటూ గడి పేసింది లేదా... ఇప్పుడెందుకీ బాధ, ఆలోచనలు...తెలివి.. ఛావు తెలివి... అరె యిట్ల చేసి వుంటే బావుండేదే... అట్లా ప్రవర్తించి వుండాల్సిందే అంటూ చర్విత చర్వణం చేసుకుంటోంది సంధ్యా సమయాన. జయమ్మా.... ఎట్టుందిరా?... అత్తమ్మ వలకరిస్తోంది దయగా... ఆవిడ గొంతులో ఎంతో జాలి, (పేమ, ఆర్తి దిగులు... పాపం ఆవిడా అంతే... తనికి పిల్లలు పుట్టలేదని, గొప్ప త్యాగశీలిగా, గొప్పకుపోయి తన చెల్లెల్ని తెచ్చి మొగుడికిచ్చి చేసిందంట... అటు పెళ్ళి చేసి చెయ్యంగానే ఇటు ఈవిడ నీళ్ళోసుకుంది... ఈవిడ్ని పుట్టింటికి పంపేసి రెండో పెళ్ళాంతో మావగారు ఎంజాయింగు... ఆరు నెలలు ఈవిడా, ఆరు నెలలు ఆవిడా... వంతుల కాపురం... ఛీ...ఛీ... అసహ్యమెయ్యలేదేమో. జయమ్మా... తల్లీ మాట్లాడరా అత్తమ్మా... మెల్లిగా కళ్లు తెరిచింది తను... నేను వెళ్లిపోతున్నానత్తమ్మా అతి కష్టంగా అన్నట్టుంది. ఛ...ఛ... అట్ల అనకూడదమ్మా... నాతల్లివి కదూ... నీకు బాగుంటుందిరా... ఇదిగో నీ ఫ్రెండొచ్చింది చూడు శమంత... చాలసేపట్పుంచీ కాచుక్కూచుంది. ఈగ 76వ

జయా... జయా మైడియర్‌ పిలున్తున్నదీ శమంత తన చెవి దగ్గరికొచ్చి వెక్కిళ్ళ గొంతుతో... బలవంతంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నట్బంది తను... విడివడ్డంలేదు... తెరుస్తుంటే మల్లీ మూతలు పడిపోతున్నాయి... అబ్బా ఒక్కసారి తెరవాలి... శమంతొచ్చింది... ప్రాణం... తన ప్రాణం... కష్టంలోనూ, సుఖంలోనూ తన హృదయమై స్పందించిన శమంత... ప్రాణమా ఏమయిపోయావే యిన్నాళ్ళు? ఆ (పైవేటు కాలేజీకి, ఇంటికి చాకిరీ చేసి కండలు కరగబెట్టుకునే క్రమంలో ఈ స్నేహితురాలు గుర్తురాలేదా?... వచ్చే వుంటుంది... అయితే ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళోందని బహంళా తెలిసివుండదు.

శమంతా... పెదవులు కదిలాయి...

నిళ్ళ్శబ్దంగా వెక్కిళ్ళు పెడుతోన్న చప్పుడు...చెవులు బాగానే పనిచేస్తున్నాయి... శమంతా... ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మాట్లాడినట్టే వుంది తను... మరి దానికి విన్సించిందో, లేదో... శమంత... శమంత... దాని బాల్యం మంచుముద్దల నడుమ ఎంత దారుణంగా గడిచిందో తనకి బాగానే గుర్తు. దొని తల్లి అతడికి రెండో భార్య. మొదట్లో భార్యా, పిల్లలూ, శమంతా, దాని తల్లీ అంతా కలిసి వుండేవాళ్ళు... ఇంట్లో వాళ్ళ డామినేషన్‌ చాలా ఎక్కువగా వుండేది... తండ్రి వడిలో కూర్చోవాలన్నా శమంత జంకేది... సాధ్యమైనంత వరకూ స్కూల్లోనూ, ట్యూషన్లోనూ, తనతోనే ఎక్కువ భాగం బయటే గడిపేది... ఎన్నోసార్లు నాన్న తనతోపాటే శమంతకి కూడ ఫీజులు కట్టేవారు... తర్వాత దాని తండ్రి పోయినపుడు నిర్టాక్షిణ్యంగా తల్లీ కూతుళ్ళనిద్దరినీ నడిరోడ్డు మీదికి విసిరేశారు వాళ్ళు.

ఛ...ఛ... యిద్దరాడవాళ్ళకి సమానంగా జీవితాన్ని ప్రేమనీ పంచుతానంటూ భుజాలు విరుచుకునే మగాళ్ళని నడిరోడ్డో నిలబెట్టి కాల్చిపారేయాలి. ఈ 'సెకండ్‌ హ్యాండ్‌ మనిషి మాకొద్దంటూ ఆడవాళ్ళు బహిష్కరించేయాలి...

“జయా... జయా' అబ్బ అపిలుపుతో పేగు కదిలింది ఎట్లా వుంది? కరకర చప్పుడవు తోంది.

“జయా' ఎన్నో యుగాల తర్వాత విన్సించిందా గొంతు... జీవముండి తను తిరుగు తున్నంత కాలం అవసరం లేకుండాపోయింది... యిప్పుడీ మనిషి లేకుండా పోతోందని తెలిసి ఎంత (ప్రేమ... ఎంత (ప్రేమ... ఎంత అత్మీయళ... అంతా నటన... నరుడి బతుకు నట...

“జయా...'

తఈతనకిందుకో కళ్ళు తెరవాలన్పించలేదు... జీవిత పర్యంతం నువు చూపిన నిర్లక్ష్యం నా హృదయ కవాటాల నిండా పేరుకుపోయి అదేదో అటాకన్నారు, స్ట్రోక్‌ అన్నారు... యిప్పుడు తీరా కేన్సరంటున్నారు... ఆ నిర్లక్ష్యాన్నంతా తట్టుకోవడం కోసం మరణాన్ని మందు అడుగుతున్న దానిలా పడివున్నానీ మంచం మీద.

అతడికేమీ విన్పించినట్లు లేదు.

“జయా... ఎట్లా వుంది?” అనంతమైన జాలి.

ఈగ ఈ భవం 27

ఒక్కసారి చివరిసారిగా కళ్ళు తెరచి అతడి కేసి చూసింది తను. అళతడి కళ్ళ నిండా నీళ్ళు. వద్దు... వద్దు ఇక జన్మజన్మలకీ, ఏజన్మలోనూ మొగుడిగా నాకు నువ్వొద్దు.... నిజ్జంగా చెప్తున్నాను... జీవిత పర్యంతపు నా 'పేవకి ఫలితంగా నువ్వు నాకేదయినా యివ్వదల్బుకుంటే, నా చివరి కోరికేమిటని ప్రల్శిస్తే... నేను నిన్ను ఒకే ఒక్కటడుగుతాను. వచ్చే జన్మలోనే కాదు... యిక ఏ జన్మలోనూ యిద్దరాడవాళ్ళకి జీవితాన్ని, ప్రేమనీ, హృదయాన్నీ పంచకు. అతడు బాగా పరిశీలించగలిగితే తన కళ్ళల్లో ఈ భావాలు పట్టకోగలిగి వుండేవాడు... తనకేదో అవుతోంది... ఒళ్ళంతా బరువుగా... కాస్త తేలిగ్గా ఎక్కిళ్ళు వస్తూ, పోతూ... గాలిలో తేలుతున్నట్లుగా... తన కళ్ళు మూతలు పడనే లేదు...అలాగే నిశ్చలంగా నిలిచి పోయాయి... అతడి సమాధానం కోనం ఎదురుచూస్తున్నట్లుగా. ఆదివారం అంధ్రజ్యోతి, 1999 ఈగ 77 ఇషా విపచనో

గతుకు న! ఎ౦.ఆరో సైకిల్‌షావు నుండి బాడుక్కి రిక్షా తీసుకుని గడియారం స్థంభం కొడి కొచ్చేటప్పటికీ ఏడుకీ, ఎనిమిదికీ నడుమ రెండు ముళ్ళు "పెనవేసుకున్నాయి. గుండె జారి పోయింది చెంగయ్యకి. అసలే ఎండాకాలం... అరపూట బళ్లూ, మార్షింగ్‌ స్కూళ్ళూ అంటూ పిలకాయలంతా చీకట్లో ఎళ్ళిపోతుండారు బళ్ళకి. ఊరికి దూరంగా వున్న మొగపిల కాయల బడికి పొద్దన్నే అయితే రెండు మూడు గిరాకీలు తగిలేవి. అప్పుడెప్పుడో పూర్వకాలాన బోయిస్‌ స్కూలుగా వున్న దాన్ని జిల్లా పరిషత్‌ హైస్కూలు చేసినా, యిప్పుడది కో-ఎడ్యే కషనే అయినా అంతా దాన్ని మొగపిలకాయల బడి అనే పిలుస్తుంటారు. అక్కడికి రెండు, మూడు ట్రిప్పులు గాని వేయ గలిగితే బాడుగ గిట్టుబాటవుతాది. ఆపైన పదకొండు దాకా బయట బాడుగలు తోలుకుని... అప్పట్పుంచీ ఎండకీ గమ్మున మూడు దాకా చెట్టుకింద పడుండొచ్చననుకున్నాడు అతను. అయితే ఈ మాయదారి నిద్ర మెలకువాచ్చింది కాదు. గతుకు అవ ప్రమ నం “క

“అంత మొద్దునిద్ర దేనికొచ్చింది? ఆ దేనికొస్తాది? ఊరికే తిని పడుకుంటే ఎందు కొస్తాది? తాగి పడుకుంటే వస్తాది తన మీద తనకే కోపమొచ్చేసింది చెంగయ్య కి. ఈ నడవంతా హాయిగా వుణ్ణింది... యాడా మందు దొరక్కుండా... ఇప్పుడు కొంచెం కనపడేతలికి నాలిక పీకతా వుంది. తాగ్గూడదని ఎంతనుకున్నా ఒల్లకావడం లేదు. రంగమ్మ మూడుదినాల్పుంచీ తనతో మాట్లాడ్డం మానేసింది. దానికి తాగుడంటే మంట. తాగే మనుషులంటే అసహ్యం.

రంగమ్మ శానా తెలివయింది. చిన్నప్పట్నుండీ పెద్దరెడ్డింటి కాడ పన్లో వుండి మంచి, చెడ్డలన్నీ తెలుసుకుంది. మనిషి, కూడా బాగా తీరింది. తమ మాదిగిళ్ళల్లో మనుషులంతా నల్లటి నలుపు. రాళ్ళెత్తనూ, నాట్లకి పోనూ... ఎండా, గాలికి తిరిగి మరింత పీక్కుపోతాయి మొహాలు. అయితే రంగమ్మ అట్టా కాదు... మొదట్టుండీ నీడ పట్టునుండడంతో నలుపు కమురొదిలింది. రెడ్డెమ్మ కట్టినట్టే చీరకడ్డాది. ఆమేసుకున్నట్టే జడేసుకుంటాది. వాళ్ళింట్లో తిండి తిని చామన్నాయగా జేలింది. మొహం నున్నగా వుంటుంది. ఆ మొహం చూసేకదా మోజుపడి తాను పెళ్ళి చేసుకున్నాడు చిరుసిగ్గుతో మెలికలు తిరిగిపోతున్నాడు చెంగయ్య.

“ఏయ్‌ రిక్షా వొస్తావా?” ఎవరో పిలుస్తున్నారు. చప్పున స్పృహలో కొచ్చి అటుకేసి చూశాడు. తను అవునూ, కాదూ అనే లోపుగానే పక్కనున్న మల్లిగాడు రిక్షా లాక్కెళ్ళి ఎక్కడికీ, ఏందని కూడ అడక్కుండా “ఎక్కండమ్మా ” అనేశాడు.

నిట్టూర్చి గడీయారంకేసి చూశాడు చెంగయ్య. అప్పటికే అరగంట గడిచిపోయింది. బేరమేదీ రాలేదు. ఇస్కూలు పిలకాయలంఠతా వెళ్ళిపోయినట్టుండారు.

చెంగయ్య ఆలోచనలో వుండగానే గడియారం స్థంభానికి పక్కనున్న పొలీస్‌స్టేషన్లోప ల్పుండి ఒక కానిస్టేబిల్‌ బయటికొచ్చాడు... వస్తూనే చెంగయ్య ని చూసి దబాయిస్తూ “ఏరా ఎన్నిసార్లు చెప్పాల్రా....ఈ బజారు సెంటర్లో రిక్షాలు పెట్టాదని. ఫో...ఫొ పక్కకి ఫో” అంటూ లారీ తాటి౦చాడు. మెల్లిగా రిక్షాని గడియారం స్థంభం వెనకాల సందులోకి మళ్ళిచ్చి పెట్టు కున్నాడు చెంగయ్య.

ఎనిమిదిన్నరయ్యేటప్పటికీ గడియారం కాడుండే కూలోళ్ళ గుంపంతా చెదిరిపోయి బజారుకీ, అంగళ్ళకీ వచ్చేవాళ్ళ రద్దీ ఎక్కువయింది. ఆలస్యంగా మెలకువ రావడంతో గంజి నీళ్ళు కూడా తాగకుండా వచ్చేశాడు రంగమ్మ మీది కోపంతో. నీరసంతో కాళ్ళు లాగుతున్నాయి. ఎక్కి రిక్షా సీటు మీద కూర్చున్నాడు గునుస్తూ,

“ఏయ్‌ రిక్షా వస్తావా?” పిలిచాడు హార్డువేర్‌ షాపు సోంబాబు.

“అయ్యా” అంటూ రిక్షా దిగి ముందుకి లాగాడు చెంగయ్య.

“బష్టాండుకి పోయి సరుకు తీసుకుని మళ్ళీ యిక్కడికి రావాలి. ఎంత తీసుకుంటావు?”

“మీకు తెలీదంటయ్యా”నసిగాడు.

“చెప్పవోయ్‌”

“పది రూపాయిలిప్పించండయ్యా”

“ఆశ జాస్తయిపోయిందిరా మీరిక్షావాళ్ళకి... ఇంతకు ముందు బస్టాండుకి పోతే రెండు రూపాయలుల్లీసుకునే వాళ్ళు.”

గతుకు

లలా వనన

“అయ్యా సరుకు దీసుకోని రావాల గదయ్యా” తల గోక్కున్నాడు చెంగయ్య.

“ఎనిమిదిస్తా-పా” అంటూ చెంగయ్య మాట్లాడ్డానికి వీల్లేకుండా రిక్షా ఎక్కి కూర్చున్నాడు సోంబాబు.

చేసేదేమీ లేక పైగుడ్డ తీసి దులిపి నడుముకి కట్టుకుని సీటు మీదికెక్కాడు చెంగయ్య. బస్టాండుకి బస్సాచ్చి సరుకు సర్దుకుని తిరిగొచ్చేసరికి పదయిపోయింది.

“మంచి బేరమే ..వృధాగా ఎంతయినా ధారపోస్తారు కానీ రిక్షావోడికి మాత్రం ఒక్క రూపాయి జాస్తివ్వాలంటే ఏడ్చి ఛస్తారు” మనసులో గొణుక్కున్నాడు చెంగయ్య. సోంబాబిచ్చిన ఎనిమిది రూపాయల చిల్లరా లెక్క చూసుకుంటూ-

రిక్ష పక్కన పెట్టి 'టీ' త్రాగి వచ్చాడు. అక్కడ కుళాయి వద్ద మొహం కూడ కడుక్కున్నాడు.

నీరసం కాస్త తగ్గినట్లుగా అన్పించింది.

ఇందాకటి కానిస్టేబిల్‌ స్టేషన్లోపల్పుండి బయటికి వస్తూ

“ఏయ్‌ మళ్ళీ అడ్డం బెట్టావా? అయ్య వస్తుండారు...” అన్నాడు హెచ్చరిస్తున్నట్టుగా.

చప్పున లేచి రిక్షాని పోలేరమ్మ గుడి వెనకాలికి తీసికెళ్ళి పెట్టుకున్నాడు చెంగయ్య... ఈ లోపుగా సి.ఐ., ఎస్‌.ఐ. బయటికొచ్చారు. మరో నలుగురు కానిస్టేబిళ్ళని ఎక్కించుకుని, సర్రున దూసుకుపోయింది జీపు జనం రద్దీని కూడ లెక్కచేయకుండా. గుడి వెనకాల నుండి జీపు వెళ్ళిపోవడం తొంగి తొంగి చూసిన చెంగయ్య, మాసిన తుండుగుడ్డతో ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ, మళ్ళీ రిక్షాని మెల్లిగా లాక్కుంటూ తీసికొచ్చి గడియారం స్థంభం పక్కన పెట్టాడు. ॥

హార్డ్‌వేర్‌ అంగడి సోంబాబు తెచ్చిన సామానంతా సర్దేసినట్ట్లున్నాడు. కౌంటర్లో కూర్చుని లెక్కలు చూసుకుంటున్నాడు.

కుదవంగడి మార్వాడీ ఆయన కస్టమర్లతో వచ్చీ రాని తెలుగులో ఏదో మాట్లాడు తున్నాడు.

రెడ్డోళ్ళ సినిమా బండి సెంటర్లో ఆపి, మంచి పాట వేస్తూ మధ్య మధ్యన మైకు చెప్పన్నాడు బండ్లో కూర్చుని మణిగాడు.

రంగమ్మకి సినిమాల పిచ్చి, ప్రతి సినిమాకీ పోదామంటుంది. ఆ సినిమాలు చూసి, వాటిల్లో ఆడోళ్ళ మాదిరిగా పేషన్లు చేస్తాది.

తమ మాదిగిళ్ళల్లో కంతటికీ రంగమ్మంటే సినినూ ఈరోయినే. అంతా బాగానే వుంటాది గానీ, తను తాగితే మాత్రం ఒప్పుకోనంటాది. తనక్కూడ తాగ్గూడదనే అన్పిస్తాది. మళ్ళీ ఏందో...? పినిమా పాటలు వింటూ అలోచనలో పడ్డాడుచెంగయ్య.

“రేయి చెంగా” ఎవరో జబరస్తీగా పిలుస్తున్నారు.

ఉలిక్కిపడి రిక్షా దిగి నాలుగువైపులా చూళౌడు చెంగయ్య.

పోలీస్‌ స్టేషన్లోపల్నుండి బయటికొచ్చి లాఠీతో పిలుస్తున్నాడు హెడ్డు గంగయ్య. అకగాడి లావుపాటి బొజ్జ ఖాకీ చొక్కాలో యిమడలేక బజారుని తొంగి తొంగి చూస్తోంది.

గతుకు క పక్షిశి వి. ప్రతిమ కథలు త్‌ /

“శేయి చెంగా” మళ్ళీ పిలిచాడు హెడ్డు.

“ఛచ్చాన్రా దేవుడా, ఉదయాన్నే వీడి కంటబడ్డాను' తనలో తాను తిట్టుకుంటూ పైకి మాత్రం “అయ్యా” అంటూ అప్పుడే హెడ్డు పిలుపు విన్నవాడిలా పోలీస్‌స్టేషన్‌ కేసి నడిచాడు. ఒంగి ఒంగి దణ్ఞాలు పెడుతూ, ఆ పోలేరమ్మ గుడెనకాలే వున్నా సరిపోయేది... జీపులో వీడు కూడ సచ్భాడనుకున్నాడు తను. జీపు అటు వెళ్ళగానే రిక్షా తీసుకొచ్చి గడియారం పక్కృవే పెట్టినందుకు తనని తొను తిట్టుకుంటున్నాడు చెంగయ్య.

“ఏరా పిలుస్తుంబే యినపట్టంలా? కళ్ళు నెత్తికక్కాయేంటి?” గర్జించాడు గంగయ్య.

“అయ్యా సూళ్ళేదయ్యా .. ఈ సినిమాబండి గొడవలో యినపళ్ళేదయ్యా... ఏందయ్యా” తలగుడ్డ తీసి చేతిలో పట్టుకుని ఒంగి ఒంగి అడిగాడు చెంగయ్య.

“దొంగ నాయాళ్ళయిపోయార్రా మీరు... యినపడ్డాగాని యినపడనట్టే వుంటారు... బండిట్టా తీసుకురా పో” గంగయ్య మాటే గర్జనలా వుంటుంది.

తప్పదన్నట్టు పోయి బండి తీసుకొచ్చాడు చెంగయ్య.

“లోపల టి.వి. వుందిగానీ తెచ్చి బండిలో పెట్ట” బండి సొంతదారు కూడ అంత దర్జాగా, దౌర్జన్యంగా చెప్పడేమో...! మౌనంగా స్టేషను లోపలికెళ్ళాడు చెంగయ్య. లోపలి గదిలో కన్పించింది బొమ్మల పెట్టి... మామూలుగా తమ కాలనీలో చూసే బొమ్మల పెట్టికన్నా చానా పెద్దదిగా వుంది. దగ్గరికెళ్ళి పైకెత్తభోయాడు. ఉదయం నుండి ఏమీ తినకపోవడంతో కళ్ళు తిరిగినల్టయింది చెంగయ్యకి.

“తీయ్యా కొంచెం సాయం పట్టండి” అంటూ స్టేషన్లోపలున్న మరో కానిస్టేబుల్ని పిలిచాడు.

“అరె అది మొయ్యలేవా? వడ్డ మూటలయితే ఎత్తుతార్రా మీరు” అంటూ చెంగయ్య డొక్కలో పొడిచాడతడు. ఇద్దరూ కలిసి టి.వి.ని రిక్లాలోకి చేరవేశారు.

“శీనూ జాగ్రత్త... టి.వి. రిపేరుకిచ్చి గంటలోపలే వచ్చేస్తా నువ్వెక్కడికీ వెళ్ళొద్దు” అంటూ కానిస్టేబుల్‌ “శీను'కి స్టేషనప్పగించి చెంగయ్య రిక్షాలో ఎక్కి కూర్చున్నాడు హెడ్డు, టి.వి.ని ఒక చేత్తో పట్టుకుంటూ. రిక్షా ఒణికింది ఒక్కక్షణం పొటు. సీటు మీద కూర్చుని 'పెడలు మీద కాలు పెట్టి ఒక్క వూపుతో ముందుకు సాగాడు చెంగయ్య. ఎంత వూపుతో ళొక్కుతున్నా బండి చాలా మెల్లిగా కదుల్తోంది.

“ఏందిరా చెంగా ఏంది విశేషాలు?” సిగరెట్టు వెలిగిస్తూ ప్రశ్నించాడు హెడ్డు.

“యాముండాయయ్యా మీకు తెలీనవి” నవ్వాడు చెంగయ్య నవ్వలేక.

“ఎట్టుండాయిరా రిక్షా బేరాలు... ఎంతిన్తుండావు బాడుగ”

“ఖర్మ! ఈయనగారి కాలక్షేపానికి తన బతుకే దొరికిందా?” అనుకుంటూ

“ఏం బేరాలయ్యా...పొద్దుట్టుంచీ కాసుకోనుండాను..ఒక్కరంటే ఒక్కరు కూడా ఎక్కలేదు...ఆ పెయింట్లంగటాయన బస్టాండుకి పోయొచ్చి ఎనిమిది రూపాయలిచ్చాడు. ఈడ బేరాలు దొరికినా, దొరక్కపోయినా ఆడ బండి బాడుగ మాత్రం టంచనుగా కట్టాల యిరవై రూపాయలు. బాడుగేం కట్టేది... నేనేం తినేది? పిలకాలయలకేం పెట్టేదయ్యా?”

గతుకు రాజానో

“అయితే పలకలాయలంట్రా నీకు? ఎంత మందేం?” సిగరెట్బ దమ్ము పీలుస్తూ అడిగాడు హెడ్డు.

“ఉండారయ్యా .దరిద్రుడికి డజను మందని వూరికే అంటారా బాబూ... వుండారు ముగ్గురు పిలకాయలు” నీరసంతో చెప్పాడు చెంగయ్య

“అదేందిరా చెంగా అట్టంటావు... మీ యిళ్ళల్లో ఎంతమంది పిలకాయలుంటే అంత మంచిది కదా...అంతా కూలికి పోతారు” అంటూ అటునుండి యిటు సర్దుకు కూర్చున్నాడు గంగయ్య. రిక్షాకి కళ్ళుంటే తప్పకుండా నీళ్ళు కార్చి వుండేది. అయితే రిక్షా అతి కష్టం మీద నడుస్తోన్న ఆ తీరు చూస్తుంటే అది ఏడుస్తున్నట్టే వుంది.

“ఆ యాడ పోతుండారయ్యా పనికి. మాయింటిదానికి పిలకాయల్ని చదివించాలని బుద్ది పుట్టింది. మనకెందుకే చదువులు ముందు బతికేది నేర్చుకోవాల, యాడ్న్డో ఒకరి దగ్గర పనికి పెడ్తే వాళ్ళ పొట్ట కెళ్ళిపోతాది. ఇంకా మిగిల్తే రెండు చిల్లర డబ్బులు మిగల్తాయి. అని ఎంత చెప్పినా యినదయ్యా. నాలుగిళ్ళల్లో పాచిపని చేసి ఆ డబ్బుల్తో పిలకాయల్ని నదివిస్తా వుండాది. వాళ్ళ గుడ్డా, గోచీ, తిండీ, పుస్తకాలూ ఎన్నో తంటాలు పడ్డా వుండాది” చెప్పుకొచ్చాడు చెంగయ్య తన చరిత్రనంతా.

“అందరికీ చదువులు కావాల్రా... గవుర్మెంటు మాత్రం యాడ్డుంచి తెస్తాది వుద్యోగాలు...? అవునూ నీ పెళ్ళాం చదువుకుందా?'' కుతూహలంగా ప్రశ్నించాడు హెడ్డు.

“లేదయ్యా... సదూకున్న మీబోటి పెద్దోళ్ళింట్లో పనిచేసింది చిన్నప్పట్నుండీ అందుకని దానికన్నీ పెద్దోళ్ళ బుద్దులే” భార్య విషయమొచ్చేటప్పటికీ తెగ మురిసిపోతూ రిక్షా ఒకింత వేగంగా లాగాడు చెంగయ్య.

“జాగ్రత్తరేయి...మరీ స్పీడయి పోతున్నావు” హెచ్చరించాడు హెడ్డు.

“మొదులే మనూరి రోడ్డు అంతంత మాత్రం”

“అవునయ్యా ఈ రోడ్లలో రిక్షా దోలడం కష్టంగా వుందయ్యా. దానికి తోడు ఎండా కాలంలో వానలేందయ్యా... వారంరోజులు వాన కురిసి వున్న గుంటలు మరీ పెద్దవై పోయాయా? మొన్నట్నుండీ కొంచెం తెరిపిచ్చింది కదా అనుకుంటే చూడయ్యా ఎండ ఎట్ట మిడిసి కాస్తా వుండాదో...”

“జాగర్త... జాగర్త... పదారువేల రూపాయిల టి.వి. అసలే రిపేరు వొచ్చిందనే బాధపడి ఛన్తున్నా...” హెడ్డు నోట్లో మాట నోట్లో వుండంగానే కాన్వెంటు నుండి యింటికెళ్తున్న చిన్న పిలగాడు తెల్లటి పువ్వులాంటి బట్టలేసుకుని టర్నింగులో నుండి రిక్షాకి అడ్డం పరిగెత్తాడు. వాడ్ని తప్పించే ఆలోచనలో పక్కనే వున్న పెద్ద గోతిలో రిక్షాని దింపేశాడు చెంగయ్య... ముందు చత్రం గోతిలో పడంగానే రిక్షా పక్కకి ఒరిగిపోయింది. టి.వి. అమాంతంగా ఎగిరి రిపేరు కోసం రోడ్డువారగా తోలివున్న గులకరాళ్ళ గుట్టమీద పడి, అపై గంగయ్య పడడంతో ముక్కలయి వూరుకుంది. అంతా సినిమాలలో సీన్లా జరిగిపోయింది. కిందపడ్డ చెంగయ్య దోక్కు పోయిన మోచేతినీ, మోకాలి చిప్పల్పుండి కారుతున్న రక్తాన్నీ కూడ లెక్కచేయకుండా హెడ్డు గంగయ్య కాడికి పరిగెత్తాడు. ఆ మాటకొస్తే గంగయ్య హెడ్డు కూడ తనకి తగిలిన

గతుకు శభ పహబఇద లల

దెబ్బల గురించేమీ లెక్కచేయలేదు. పట్టించుకోలేదు. మెల్లిగా లేచి కూర్చుని తన బొన్ముల 'పెట్టికేసి చూసుకున్నాడు.

అందులో నుండి 'యిక బొమ్మలు రావు' అన్న నగ్న సత్యాన్ని జీర్ణించుకోలేని ఆవేశం గంగయ్యని నిలవనిచ్చింది కాదు వెంటనే చుట్టపక్కల వాళ్లెవరో తనని మెల్లిగా పైకి లేపడానికి ప్రయత్సిస్తున్నా పట్టించుకోకుండా తనే ఒక్క ఉదుటున లేచి ముందూ, వెనుకా ఆలోచన చేయకుండా చెంగయ్య జుట్టు పట్టకున్నాడు.

“బాడ్కోవ్‌! కళ్ళు నెత్తినెక్కి ఉండాయిరా మీకు... ఎక్కినప్పట్పుండీ చెప్తానే వుండా... జాగ్రర్తొారేయ్‌ అని. పదారు వేలు ఎవరు కడ్తార్రా నీయబ్బ... ఎవరొస్తారో రానీయి...వొచ్చి డబ్బు కట్టి నిన్నిడిపించుకుపోవాల బంచత్‌. పద స్టేషనుకి నాకొడకా...” అంటూ మరో రిక్షా పిలిచి చెంగయ్య ని దాంట్లోకి తోసి తనూ ఎక్కి కూర్చున్నాడు హెడ్డు అతడికి తెలిసిన వాళ్ళెవరో గంగయ్యని వారించాలని చూసి అతడి ఆవేశం అణిచిపెట్టిన ద్పింగులా మరింత పైకి లేస్తుండ డంతో ఆ ప్రయత్నం మానుకుని నేలపాలయిన టి.వి.ని రిక్షాలోకి చేర్చి రిపేరు షాపుకి తీసికెళ్ళారు.

స్టేషన్లో ఎవరూ లేకపోవడంతో తాపీగా కూర్చుని ప్రియురాలికి ట్రేమలేఖ వ్రాసు కుంటున్న శీను, హెడ్డు ఇంత త్వరగా తిరిగి రావడాన్ని జీర్ణించుకోలేక చప్పున కాగితాలు దాచేసి రక్కున లేచి నిలబడ్డాడు.

“ఏం జరిగింది సార్‌!” అంటూ

చెంగయ్యని లోపల్లోసి మరోసారి కాలితో తన్ని వచ్చి కుర్చీలో కూలబడ్డాడు గంగయ్య తలని రెండు చేతుల్లో యిరికించి.

అప్పటికే దాదాపుగా స్పృహ తప్పిపోయాడు చెంగయ్య. వాడికి నోట మాట రావడం లేదు. జరిగిన నంఘటన ఎంత ప్రయత్నించినా బుగ్రకెక్కడం లేదు. హెడ్డు గంగయ్యకి కూడా టి.వి. పగిలిపోయిన సంగతి జీర్ణించుకోవడం కష్టంగా వుంది. నానా గడ్డీ తిని కొన్న టి.వి. పిల్లలకీ, పెళ్ళానికీ అదంటే ప్రాణం. ఒక్కరోజు రిపేరు కొచ్చినా భరించలేని వాళ్ళు ఇప్పుడిహ టి.వి.యే ఇంటికి రాదంటే ఎట్లా ఫీలవుతారు. అనలు తనేవని జవాబు చెప్తాడు వాళ్ళకి. గంగయ్యకి ఆలోచించే కొద్దీ మతిపోతున్నట్లుగా వుంది. చెంగయ్యకి దాదాపుగా మతే పోయింది ఫిచ్చెక్కినట్లుగా వుంది ఇద్దరికీ.

సాయంత్రమై పోయింది. చెంగయ్య తిండీ, తిప్పలూ కనీసం తాగడానికి మంచి నీళ్ళయినా లేకుండా ఆ నాలుగ్గోడల నడుమా పడి వున్నాడు. నిజానికి గంగయ్యకి రూడ ఆ మధ్యాహ్నం తిండి నహించలేదు . టీల మీద టీలు, సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చేస్తున్నాడు.

ఎస్‌.ఐ., సి,ఐ.లు స్టేషన్లో లేకపోవడం, మరే యితర కేసులూ ఆ రోజుకి రాకపోవడం ఒక విధంగా మంచిదే అయింది హెడ్డు గంగయ్యకి.

చీకటిపడే వేళకి రంగమ్మ యేడుస్తూ పెద్దకొడుకుని తోడు తీసుకుని స్టేషన్లోకి అడుగు పెట్టింది. మధ్యాహ్నం మొగుడు ఇంటికి రాకపోతే బేరాలు బాగా దారికుంటాయి లెమ్మని

గతుకు ర్‌ వరన

సరిపెట్టకుంది. ఒక్కోసారి దూరాభారాలు వెళ్ళినపుడు, మధ్యాహ్నం పూట మొగుడు ఇంటికి రాకపోవడం మామూలే.

ఆరుగంటలకి పాచిపని చేసుకుని ఇంటికొచ్చేతలికి వాబుగిళ్ళవతల వుండే వెంకటయ్య వచ్చి చెప్పాడు “అక్కా బావ యిట్టా స్టేషన్లో వుండాడంట అని అదిరిపోయింది. రంగమ్మ రాగానే హెడ్డుకి దణ్ణం పెడుతూ

“అయ్యా నా మొగుడు అమాయకుడయ్యా అసలేమీ తెలీనోడు. ఎట్టయినా ఈ ఒక్క తప్పూ మన్నించండి” అంది.

ఒక్క క్షణం రంగమ్మ కేసీ నిశితంగా చూశాడు హెడ్డు. అసలే చిన్నవయిన అతడి కళ్ళు మరింత చిన్నవయ్యాయి. ముదురు నుదురు మడతలు పడింది. క్షణం తరువాత క్రమంగా అర్ధమయిందతడకీ ఆ వచ్చింది రిక్షా చెంగయ్య భార్య అన్న విషయం.

రంగమ్మని చూసి విస్తుపోయాడు హెడ్డు.

చానునఛాయలో నున్నగా మెరిసిపోతున్న ముఖంలో కదలాడే కళ్ళు... నన్నటి లేత గులాబీ రేకుల్లాటి పెదవులూ, పైకి బఫ్‌లా దువ్వి పిన్నులెట్టి వేసుకున్న జడా, షేప్‌ జాకెట్లో అందంగా ముందుకు సాగి నిలిచిన ఎదా, కూర్చినట్లుగా వున్న చీరకట్టు ఎవరో మధ్యతరగతి చదువుకున్న గృహిణిలా వుందే తప్ప మాదిగ చెంగయ్య భార్యలా లేదు. రిక్షా చెంగయ్యకి ఇంత అందమైన పెళ్ళామా? మింగుడుపడలేదు హెడ్డుకి, -

చప్పున నల్లగా, భారమైన శరీరంతో కదల్లేకుండా తుమ్మమొద్దులా వుండే తన భార్య గుర్తొచ్చింది హెడ్డుకి. వెంటనే వెగటూ కలిగింది.

ఉదయం నుండి ఏర్పడ్డ దిగులూ, నిస్సహా అంతా రంగమ్మని చూడగానే క్రమంగా మాయమయిపోయి పెదాల్లోకి చిరునవ్వు ప్రాకింది. కళ్ళల్లోకి వెలుతురు వచ్చింది. మెల్లిగా కుర్చీలో నుండి లేచి టేబిలు దాటి మృదువుగా అడుగులు వేస్తూ యినతలికి వచ్చాడు హెడ్డు గంగయ్య.

“ఎవరు నువ్వు? ఏం కావాలి” అన్నాడు ఏమీ ఎరగనట్టుగా.

“అయ్యా నేను రిక్షా ఏసే చెంగయ్య భార్యని నాపేరు రంగమ్మ వుండి తిన్నా లేక పన్తులున్నా ఏదో మా బతుకు మేము బతుకుతున్నోళ్ళమేగాని ఎవ్వరి జోలికీ పోయేవాళ్ళమే కాదయ్యా. దయవుంచి వదిలేయండయ్యా ఈ ఒక్కసారికీ మన్నించండి” బతిమాలుతున్నట్లుగా అడిగింది రంగమ్మ

అలా బతిమాలుళూ, వేడుకుంటోన్న రంగమ్మ కేసి నిశితంగా చూస్తూ “ఏం శీనూ వదిలెయ్యమంటోంది... వదిలేద్దామా?” కన్ను గీటుతూ నవ్వాడు గంగయ్య హెడ్డు.

“ఏంది వదిలేది? అయ్యగారి టి.వి. ఒకటా, రెండా పదారు వేలది ఒక్క నిముషంలో బద్దలు చేశాడు నీమొగుడు, అదేమంటే గతుకులో పడ్డాదంటాడు. గతుకులుంటే మాత్రం చూసుకు నడపద్దా? ఇప్పుడు పోయిన వస్తువు తిరిగి రమ్మంటే వస్తాదా? నీ మొగుడు చేసింది మంచిపని కాదు” హెడ్డుగారి మెప్పు కొట్టేయాలని మరీ విజృంభించేశాడు కానిస్టేబుల్‌ శీను.

గతుకు శన? ఇ ప్రబజన లన్‌

ఇంతలో మరో కానిస్టేబుల్‌ సెల్‌లో నుండి చెంగయ్య ని తీసుకొచ్చి హెడ్డు ముందర నిలబెట్టాడు చెంగయ్య మెడ వాలిపోతూ, ఆ నమయంలో అక్కడ రంగమ్మని చూడగానే ఏదో జరగరానిది జరిగినట్లుగా స్టడీ అయిపోయింది.

“ఏరా చెంగా నీ పెళ్ళామొచ్చింది” హెడ్డు గొంతులోని వ్యంగ్యానికి కడుపులో రేగిన కసిని అణుచుకుంటూ తలవంచుకుని కళ్ళు మూసుకున్నాడుచెంగయ్య.

చెంగయ్యకి దు.ఖం ఆపుకోవడం కష్టంగా వుంది రంగమ్మ చెంగయ్యకేసి హెడ్డుకేసి మార్చి మార్చి చూస్తూ కళ్ళలో తిరుగుతున్న కన్నీళ్ళనీ తుడుచుకుంటూ మరోసారి బతిమాలు కోనడానికి సిద్దపడ్తోంది గడ్డం తడువుకుంటూ అటు, ఇటు పచార్లు చేస్తోన్న హెడ్డు హరాత్తుగా ఆగాడు. ఒక్కసారిగా భరించలేని నిశ్శబ్దం... ఒక్క నిముషం తర్వాత అన్నాడు హెడ్డు ఆలోచిస్తున్నట్లుగా.

“పొద్దుట్నుండీ ఈ చెంగయ్య దగ్గర పదారు వేలూ ఎట్టా రాబట్బగోగలనా అని చింతపడ్తుండాను. ఇప్పుడు దొరికిందిరా చెంగా” ఈ పదాలని ఒత్తి ఒత్తి పలుకుతూ వెటకారంగా ధ్వనించిందతడి గొంతు.

“మా దగ్గిర అంత డబ్బ్చేదయ్యా? వంద రూపాయిలే ఏనాడూ చూళ్ళేదు. వేలంటే మాటలా? ఈ జన్మంతా పనిచేసినా మేము కేలేము. దయవుంచి మీరే "పెద్దమనసు చేసుకుని వదలాలి” ఉదయం నుండి చెప్తోన్న మాటలే అయినా మళ్ళీ మళ్ళీ మరోసారి చెప్పాడు చెంగయ్య. అతడి కళ్ళల్లో తడి లేదు. గుండెల్లోనూ తడారిపోయినట్లుగా వుంది. మెల్లిగా తలెత్తి భార్య మొహంలోకి చూశాడు. ఆమె ఎందుకోగాని బాధని అణచుకోబోతూ, అణచు కోవడం చేతకాని దానిలా వెక్కివెక్కి ఏడవసాగింది. మళ్ళీ అంతలోనే దుఃఖాన్ని లోలోపలే దిగమింగుకుంటూ ఏడుస్తోన్న కొడుకు తల నిమిరి సముదాయిస్తూ హెడ్డుకేసి ఆతృతగా చూస్తోంది రంగమ్మ.

“ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని డబ్బు లేడ తెచ్చేదంటావేమిరా పిచ్చి చెంగా... సెంటర్లో నిలబడమను రాసులు కురుస్తాయట్నే. నాబాకీ ఆరునెలల్లో తీర్చేయొచ్చు. ఆరు వెలలు కూడ పట్టలేదులే" రంగమ్మ కేసి చూస్తూ కన్ను గీటాడు హెడ్డు. అంతటితో ఆగక చెయ్యి పట్బకుని దగ్గరికి లాక్కున్నాడు.

“నీ యమ్మ... నాకే ఆపుకోవడం కష్టంగా వుందే ...ప్ప్‌” అన్నాడు.

అంత నీరసంలోనూ చెంగయ్య కళ్ళు ఎర్రబడ్డాయి.

గంగయ్య తన బొమ్మలపెట్టి కోసం... రంగమ్మని అంగడి బొమ్మగా నిలబడమంటున్నా డన్న సంగతి అర్థమయ్యాక ఎక్కడలేని శక్తిని తెచ్చుకుని ఎగిరి రెండు కాళ్ళతో హెడ్డు గుండెల మీద తన్నాడు చెంగయ్య.

అ తర్వాత చెంగయ్య ఏమయ్యాడు? రంగమ్మ దీనస్థితి ఏమిటి? అనే విషయాన్ని మనం మాట్టాడుకోకుండా వుండడమే మంచిది. ఆదివారం అంధర్రజ్యోతి, 1998 గతుకు రల షా వమనవో

జాగారం క్క ధడ్‌... ధడ...ధడ్‌డ్‌. ధగా...ధడ్‌...యిస్స్‌...స్స్‌” వాకిట్లో బండేదో ఆగిన శబ్దమై చప్పున మగతనిద్రలో నుండి మెలకు వొచ్చింది వసంతలక్ష్మికి... కనురెప్పలు బిరుసుగా, కనుగుడ్డు ఎర్రగా అయి విపరీతమైన మంట పెడుతున్నాయి. నిద్రొస్తుం టుంది... కన్నుమూస్తే ఆయనా చ్చేస్తాడేమోనని గబుక్కున తిలివొచ్చేస్తుంది. ఇది ప్రతిరోజూ జరిగేదే. బండి శబ్దం వినగానే, దుప్పటి తొలగించి దూకినట్టుగా మంచందిగి తలుపు వద్దకి పరిగెత్తింది వసంతలక్ష్మి ముందూ వెనుకా చూడకుండా తలుపు తెరిచేసిందిగానీ నిజానికి బయబెవరూ లేరు. మోటర్‌సైకిలెవర్టో ఆగినట్లు ఆగి వెళ్ళిపోయినట్లుంది. అంతటా నిళ్ళబ్దం నిండిన చీకటి. ఎక్కడో దూరంగా అక్కడక్కడా వీధిదీపాలు వెలుగుతున్నాయి. మినుకు మినుకుమంటూ. ఆరిపోతున్న ఆశల్ని వెలిగించడానికి ప్రయత్నించే చిరు ధైర్యంలా. ఖాన్‌?

చాలా సేపట్టుండీ కురిసి వెలిసిన వాన మట్టివాసనల్ని మోనుకొస్తోంది. తేమని నింపుకున్న చలిగాలి రివ్వుమంటూ వసంతలక్ష్మి మొహాన్ని తొకి దూసుకుపోయింది. 'పూలయ్యావు సుమా ' అంటూ గాలి వెక్కిరించి వెళ్ళినట్లుగా అన్చించిందామెకు. గబుక్కున తలుపు మూసి గడీయపెట్టి అదే తలుపుకి వీపానించి దీర్చ నిశ్వాసమొకటి వొదిలింది. హాల్లో పరుచుకున్న ఆకుపచ్చరంగు దీపపు కాంతిలో, కోకిల కంఠపు గడియారంలో ని రెండు ముళ్ళూ వన్నెండు దగ్గర కౌగిలించుకుని పడుకున్నాయి. చిన్నముల్లుని వదల్గానికిష్టం లేనిడానిలా "పెద్దముల్లు కదలడం మానేసినట్టుంది. వాటివంక తదేకంగా చూస్తూంటే అసూయేసింది వసంతలక్ష్మికి. అవే నయం... న్చ్‌... నాజూకయిన తన శరీరాన్ని, సున్నితమైన ఆత్మనీ కౌగిలించు కోవడానికిక్కడెనరూ లేరు... ఆమాటకొస్తే ఈ ప్రపంచంలో ఎవరికీ ఎవరూ వుండరు... ఎవరో వున్నారు, ఎవరో వస్తారు అనే భ్రమలో బతికేస్తుంటాం... ఆ భ్రమే జీవితాన్ని నడిపిస్తుంటుంది. నీటి ప్రవాహం మీది కొయ్యముక్కల్లా ప్రయాణం సాగుతుంటుంది .

“అబ్బాయింకా రాలేదమ్మా?” బాత్‌రూమ్‌కి కాబోలు లేచిన మామగారు ప్రల్నించారు వసంత తలుపుకానుకుని నిల్చునుండడం చూసి.

“లేదు మామయ్యా వచ్చినట్లన్పిస్తేనూ” నవ్వడానికి ప్రయత్నించింది. ఉదయం లేచిం దగ్గర్నుండీ యిలాంటి ముసుగులు అప్రయత్నంగానే తొడుక్కుంటూ వుంటుంది వసంతలక్ష్మి

“ఏవిటమ్మాయిది? ఎప్పుడొస్తాడో తెలీనివాడికోసం తిండీతిప్పలూ లేకుండా ఎదురు చూస్తావు... బయటికెళ్ళిన వాళ్ళు సవాలక్షసార్లు కాఫీలు, టీలు తాగుతుంటారు. వాడొచ్చిందొకా నువ్విట్లా పస్తుండండం ఏం బాగాలేదమ్మా...” కోడల్ని మందలించి 'మరీ పద్దతి లేకుండా పోతున్నాడు ' గొణుక్కుంటూ బాత్‌రూమ్‌ వైపుగా సాగిపోయాడాయన.

మామగారి మాటల్సి పెద్దగా పట్టించుకోనిదానిలా గదిలోకొచ్చి మంచంమీద కూర్చుంది వసంతలక్ష్మి నిటారుగా... నిద్రలో వున్న బాబిగాడు కదిలి ఒక్కసారి తల్లికేసి చూసి, తిరిగి శళ్ళు మూసుకున్నాడు. చల్లనిగాలి గదంతా పరచుకోవడంతో, లేచి వెళ్ళి కిటికిరక్కలు మూసి కర్టెన్లు సరిచేసింది. కిటికీలు వేసేస్తే అతడొస్తే విన్నించదేమో! విన్సించకపోవడానికి తనకనలు నిద్రపడితేగా? అనుకుంటూ బాబిగాడికి దుప్పటి సరిచేసింది. వాడికి వూరికే జలుబు చేసేస్తుంది. ఈ చల్లగాలికి వాడి ఊపిరితిత్తుల్లో నెమ్ము చేర్తేయింకేమయినా వుందా? నిద్రపోతున్న బాబిగాడి వీపుమీద (ప్రేమగా జోకొట్టి వాడ్ని మరింత నిద్రలోకి నెట్టింది.

చిన్న లైటార్సి గదిలో ట్యూబ్‌లైటేనుకుని పాత పత్రికని తెరిచింది. అక్షరాల వెంట కళ్ళు పరిగెడ్తున్నాయే గాని, భావమేదీ మెదడులోకి ఎక్కడంలేదు. విసుగ్గా పత్రికని పక్కన పడేసింది.

“ఏమైందీయనకి?... ఛ...ఛ రోజూ యింతే... జీవితమంతా యిలానే ఎదురుచూస్తూ గడిపేయాలేమో... ఎదురుచూపుల్లోని తియ్యదనాన్ని ఏ కవి వర్షించాడో, తనముందుగ్గాని మ న

వస్తే చెంపలు వాయిగాొడ్డుంది. 'తీపంట తీపి, పులుపు కాదూ' తనలో తనే విసుగ్గా నవ్వుకుంది వనంతలక్ష్మి చిన్నప్పుడు తన క్లాస్‌రూమ్‌లో డ్రాయింగ్‌ మాస్టారు గీసిన 'నిరీక్షఐ' అన్న చిత్ర ముండేది. క్లాసులో పాఠం జరిగినంత సేపూ తనా బొమ్మనే చూస్తూండేది. అంత అద్భుతంగా వుండేదా బొమ్మ దాన్ని చూసిచూసి తన మనసులో ముద్రించుకుపోయి చివరికి తన జీవితమే నిరీక్షణామయమైపోయింది. ఇప్పుడుగానయితే ఆ బొమ్మని ముక్కలుముక్కలు చేనుం డేదేమో... నిరీక్షణంట... నిరీక్షణ... వ్చ .... బెడ్‌ మీద పడేసిన పాత పుస్తకాన్ని మళ్ళీ చేతిలోకి తీసుకుంది .

“ఏమిటలా తడిసి ముద్దయ్యావు?' ప్రల్నించిందామె భర్తని .

“ఈ రాత్రి చంద్రుడు వెన్నెలని కొలనులో ఆరబెట్టుకున్నాడు.... నీకోసం రెండు వెన్నెల ముక్కల్ని ఏరుకొద్దామని కొలనులో దిగాను' చెప్పాడతడు.

“షిట్‌ '... పుస్తకాన్ని విసిరికొట్టింది వసంతలక్ష్మి ఎందుకిట్టాటి అభూతకల్పనలు వ్రాసి పాఠకుల్ని మభ్యపెడతారీ రచయితలు. ఎక్కడయినా మొగుడు పెళ్ళాంకోసం వెన్నెల ముక్కల్ని ఏరుకొస్తాడా?.... తెస్తేగిస్తే ప్రియురాలి కోసమేమయినా తెస్తాడేమో... అదీ అందేదాకే...

వంటగదిలో నుంచి పిల్లి గిన్నె తోసిన చప్పుడుతో లేచి అటు పరిగెత్తింది వసంతలక్ష్మి పాలు వొలికిపోయి వున్నాయి. చకచకా అవన్నీ తీసి, తుడిచి మిగిలిన పాలల్లో తోడుపెట్టి, బియ్యపు డబ్బాలో పెట్టింది.

ఇంకా నయ్యం... తను మేలుకుంది కాబట్టి సరిపోయింది... లేదంటే ఉదయాన్నే అత్తగారు క్లాస్‌ తీసుకునేది... ఆవిడెప్పుడూ 'యిదేంటి యిట్లా చేశావు?' అంటూ వేరుగా అడగదు.

వేనొచ్చేటప్పటికి పిల్లి పాలు దొర్లించి వంటిల్లంతా పాడుచేసి వుంటే మొత్తం తుడిచా నమ్మా... అదిగో ఆ గిన్నెలు తీసి అంట్లల్లో పడేసి 'స్టో' తుడిచి పాలు కాళాను... పాలబ్బాయొచ్చి బెల్‌ కొడితే అటుపోయి చూద్దునుగా తలుపు తీసేవుంది... ఇంకెందుకని తలుపేసి వచ్చాను... ఇప్పుడు... అయిదుగంటలప్పుడు' అంటుంది నొక్కినొక్కి. తనకి ఈడ్చి చెంపమీద కొట్టినట్టన్ని న్తుందా వ్యంగ్యం. అంతకన్నా “రాత్రి పాలల్లో చేవిరి పెట్టలేదా వసంతా? తలుపు వేయడం మర్చిపోయినట్టున్నావు?” అంటూ డైరెక్టుగా అడిగితే బావుణ్ణన్పిస్తుంది తనకి.

బయట కారాగిన చప్పుడయి మళ్ళీ హాల్లోకి పరిగెత్తింది వసంతలక్ష్మి అప్పుడప్పుడూ అతడి పేకాట మేట్ట్లూ యిట్లా కార్లో తీసుకుచ్చి డ్రాప్‌ చేయడం అలవాటే. తలుపు తెరవబోయి మానుకుని పక్కనేవున్న కిటికీ తీసి చూసింది.

'పైవాళ్ళు మెట్లు దిగుతున్నారు. వాళ్ళమ్మాయిని కాబోలు ఒంటిగంట మెయిలు ఎక్కించడానికి వెళ్తున్నారు... 'న్చ్‌ ఛీ' అంటూ విసుగ్గా వచ్చి మళ్ళీ పడగ్గదిలో కూర్చుంది.

శాగారం ఈన్వ ౮ మప్రద తంలో

గూడూర్లో వున్నప్పుడే నయం... తనాక్కర్తీ వుంటుందని కొంత కన్సిడరేషన్తో పదకొం డింటికే వచ్చేవాడు... ఇప్పుడా సానుభూతి కూడ కోల్పోయింది. పట్టుబట్టి ట్రాన్స్‌ఫర్‌ చేయించు కుని జిల్లా కేంద్రమని యిక్కడ తెచ్చి ఉమ్మడి కుటుంబంలో పడేశాడు. అరవచాకిరీతో నిండిన పగళ్ళు, నిద్రపోవడానికి వీల్లేని సుదీర్ధరాత్రులూ... ఛి... ఛీ... సుఖమవేది లేకుండా పోయింది... ప్ప్‌...

బావగారు చాలా పద్ధతయిన మనిషి... నాలిగింటికి లేచి యోగా చేస్తాడు. ఆ తర్వాత అ రోజుటి పేపర్లు చూసి, భార్య చేతి కాఫీ తాగి తల్లితోనూ, తండ్రితోనూ ఒక అరగంట కబుర్లు చెప్తాడు. వారి ఆరోగ్యాన్ని గురించీ, వారిక్కావల్సిన మందులూ, పండ్లు అన్నీ ఎంక్వ యిరీ చేసి కనుక్కుంటాడు. ఆతర్వాత స్నానంచేసి కుటుంబసభ్యులందరితో కలిసి టిఫిన్‌ తిని కంప్యూటర్‌ సెంటర్‌ కెళ్తాడు. అదివరకు అతడేదో గవర్మెంటాఫీసులో కంప్యూటర్‌ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ఈ మధ్యనే ఉద్యోగాన్ని వదిలేసి ఇంటర్‌నెట్‌ పెట్టాడు. జిల్లాలో అతడిదే మొదటి ఇంటర్‌నెట్‌ కొవడంతో బాగానే జరుగుతోందంటున్నారు. బాబీగాడికీ, బావగారి ఒకే ఒక కొడుకు అభిషేక్‌కీ అతడు ఇంట్లొనే కంప్యూటర్‌ నేర్పుతున్నాడు. సాయంత్రం ఎంత ఆలస్యమయినా ఎనిమిదీ ఎనిమిదిన్నరకల్లా యింటికి చేరుకుంటాడు.

గంటసేపు పిల్లల చదువు విషయం చూసి ఆతర్వాత భోజనం చేసి భార్యతో కలిసి గదిలో కెళ్ళిపోతాడు. అంత పెందలాడే లోపలికెళ్ళి ఏంచేస్తారు వాళ్ళిద్దరూ. భార్యాభర్తలిద్దరూ గదిలో కెళ్ళి ఏంచేస్తారు... తనేనాడయినా అంత పెందలాడే పడుకుందా భర్తతో కలిసి... ఎప్పుడూ అర్ధరాత్రి దాటాక రోజు మారిపోయాక అతడొస్తాడు. అప్పటిదాకా కలతనిద్రతో వేగిపోయిన శరీరం విశ్రాంతిని కోరుతుంది. తనకా ఆసక్తి వుండదు. యింటికొచ్చాక అతడికి 'ఆ శక్తి వుండదు.

ఆలోచనలోనే నిద్రలోకి జారుకుంది వసంతలక్ష్మి

నిద్రలోనే ఒక విధమైన మత్తులో, అతడు (ప్రేమగా తనని దగ్గరకి తీసుకుంటున్నాడు... అతడి చేతులు తన శరీరం మీది సున్నిత భాగాలను ఆర్తిగా సృృశిన్తున్నాయి... గిలిగింతలూ, పులకరింతలూ, కలవరింతలూ... వెరశి ఆర్గాజమ్‌... ఆ అద్భుతమైన ఆనందాన్ని చీల్చుకుంటూ మళ్ళీ దర్‌... దఢ్‌... ధడామంటూ కాలింగ్‌బెల్‌ చప్పుడు... చటుక్కున లేచి కూర్చుని పరిగెత్త బోయి ఆగిపోయిందామె. ఈ బండి శబ్దమూ, కాలింగ్‌ బెల్‌ మోత ఇవన్నీ నిజానికి బయటి నుంచి విన్పించడం లేదని, మాటిమాటికీ తన గుండె చేస్తోన్న శబ్భాలేననీ అర్ధమయింది వసంళలక్ష్మికి,

అప్పటిదాకా కనురెప్పల మీద విరబూసిన న్వప్పపుష్పాల్ని చేతుల్లోకి తీసుకుని, తడుముతూ ఆలోచనలో పడిందామె. ఆతర్వాత ఎంతసేపటికీ నిద్రపట్టలేదు. మెల్లిగా లేచి

జాగారం

కావ ఆవిఇవో

వెళ్ళి చిన్న సౌండ్‌తో టి.వి.ఆన్‌ చేసింది... బజ్‌... బర్రుమన్న శబ్దంతో అందమైన హీరో, హీరోయిన్లు తెరమీదికొచ్చేశారు గంతులేస్తూ....

“మాయదారి మాయదారి అందమా

ఉయ్యాలాటకిక సిద్ధమా..."

ఒళ్ళు భగ్గుమంది వసంతలక్ష్మికి. ఉయ్యాలాటంటా ఉయ్యాలాట విసుక్కుంటూ ఛానల్‌ మార్చింది .

'ప్రతి రాత్రీ వసంతరాత్రీ ... ప్రతిగాలి వైర గాలి

ట్రతుకంతా ప్రతి నిముషం పాటలాగ సాగాలి......'

“పాటలాగ సాగుతుందా బతుకెక్కడయినా... త్పూనీయవ్వ' అంటూ కసిగా టి.వి ఆఫ్‌ చేసింది.. ఛ...ఛ... ఏమిటి తన నోట్లోనుండి యిట్లాంటి మాటలొన్తున్నాయి...

'పెళ్ళికాక ముందు వసంతలక్ష్మి ఎలా వుండేది” వసంతబుతువులాగే కదా... ఉదయపు అందాలనూ, సాయంనంధ్యలోని పసుపు వచ్చదనాన్ని, పచ్చనిచెట్లలోని హరితవర్గాన్నీ, ఏటి ఒడ్డున మర్రిచెట్టుకింద కూచున్నప్పటి హాయి గురించీ, అమ్మ గురించీ తెరలు తెరలుగా జ్ఞాపకం చేసుకుంది వసంతలక్ష్మి పెళ్ళికాక ముందు యివన్నీ ఆమె ప్రాణశక్తులు. పెళ్ళయిన మర్నాటినుంచీ చిత్రంగా మారిపోయింది వనంతలక్ష్మి ఆయన యిష్టాలు, రుచులూ, అభిరుచులూ, అతడి కోనమే, అతడితోడిదే జీవితం, ఆతడు వేరు, తను వేరూ కాదు అనే ఒక అలౌకిక (ప్రేమలో పడిపోయింది వనంతలక్ష్మి సాహిత్యాన్నీ, సంగీతాన్నీ, సారవంతమైన అలోచనలనూ అన్నింటినీ వరుసగా తనకే తెలీని శ్రు౦లో మరిచిపోయింది. అతడి సంరక్షణా భారాన్నంతా గుత్తకు తీసుకున్నదానిలా బతకడం మొదలుపెట్టింది.

ఇంట్లోని ప్రతికూల పరిస్థితుల్లో తన అస్థిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ హడావిడిలో తనలోని సొకూమార్యాన్ని, మార్దవాన్నీ, స్పందననీ క్రమంగా వదిలేసింది.

పెళ్ళి... పెళ్ళి... ఆడపిల్ల పెళ్ళికోసమే పుడుతుందా?... పెళ్ళి లేకపొతే జీవితమే లేదా?

పుట్టినప్పట్పుండీ ఆ పిల్లకి పెళ్ళిచేయాలనే ధ్యాస తప్ప మరో ఆలోచన , అభిప్రాయం వుండవు ...జీవితం కంటే పెళ్ళే ముఖ్యమన్నట్లుగా పెంచబడ్డుంది... వసంతలక్ష్మి వాళ్ళమ్మ కూడ యిందుకు భిన్నమేమీ కాదు. అమ్మాయిని ఏదో ఒక అయ్య చేతిలో పెట్టేస్తే నిశ్చింత అనుకుంది. కూతుర్ని యిష్టప్రకారం చదివినంత వరకూ చదివించుదాం, ఆమెకి నచ్చిన మార్గంలో వెళ్ళే స్వేచ్చనిద్దాం అనుకోలేదు. అందుకే వసంతలక్ష్మి డిగ్రీలో చేరాలన్న కోరిక కోరికగానే వుండిపోయింది. ఇంటర్మీడియెట్లో వచ్చిన డిస్టింక్షన్‌ మార్కులు పసుప్పచ్చ బూజు పట్టి వూరుకున్నాయి.

పూ 4

ఇప్పుడా చదువు చాకలిపద్దు వ్రాసుకోడానికీ, పాఠ పత్రికలు తిరగేయడానికి పని కొస్తుంది. ఆ పత్రికలయినా మంచివి చదువుదామని రాజేశ్వరినడిగితే 'వనితా మార్గం' 'భూమిక' “ప్రీశక్తి పుస్తకాలు పంపించింది. ఆ పత్రికలు చూసి యింట్లో పెద్ద గొడవే జరిగింది. అటువంటి పుస్తకాలింకోసారి చూస్తే యింట్లోనుండి బయటికి గెంటేస్తానన్నాడతడు. అర్హంకాక విస్తుపోయి చూస్తుంటే “వనితామార్గం' 'భువనతార' పత్రికలు యింట్లో వుంటే పోలీసులు అరెస్ట్‌ చేస్తా రన్నాడు. నుంచి పత్రికలు చదివి జ్ఞానం పెంచుకుంటే పోలీసులెందుకు అరెస్ట్‌ చేస్తారో అర్దం కాలేదొమెకి. ఆ విధంగా చైతన్యం అనేది యింట్లోకి రాకుండానే గడపలో నుండే వెళ్ళిపోయింది వనంతలక్ష్మికి,

పది వసంతాలు గడిచిపోయాక యిప్పుడాగి చూసుకుంటే జీవితం ఉన్నచోటే ఉన్న దున్నట్టుగా వుందన్న సంగతి అర్హమై దుఃఖం తన్నుకొచ్చింది .

“డింగ్‌ డాంగ్‌... డింగ్‌డాంగ్‌ ' అంటూ పెద్దమోతతో గుండెలమీద రెండు బాదులు బాదింది గడియారం. ఉలిక్కిపడింది వసంతలక్ష్మి

'ఏమైందీయనకి?... ఇవ్వాళ మరీ లేటయినట్టుంది... డ్రింక్‌ మీదే బండి నడుపుతారు. ఎక్కడయినా ఏదయినా ప్రమాదమేమీ జరగలేదు కదొ. అటువంటిదేదయినా జరిగి ఆయన శేమయినా ఆయితే తన పరిస్థితేమిటి? ఎలా జీవిస్తుంది? ఇటు చదువూ లేదు... అటు చేతి వృత్తులూ రాక తనెలా విలదొక్కుకుంటుంది? ఆయన తరపున ఆస్థిపాన్తులు కూడా ఏమీ లేవు. మామగారు తన జీవితమంతా శ్రమించి ఈ యిల్లు మాత్రం నిలబెట్టారు. కొడుకు లిద్దర్బీ చదివించి ఉద్యాగస్తుల్ని చేశారు. ఆడబిడ్డకు శక్తికి మించి పెళ్ళిచేసి పంపించాడు.

ఆలోచిస్తోంది ననంతలక్ష్మి... భర్తకేదయినా అయితే తవెలా బతుకుతుంది? బొట్టు కొటుక పెట్టకుంటుందా? మంచి చీరలు కట్టుకోదా?... వివాహాది శుభకార్యాలకు వెళ్ళదా?

అందుగురించేనా తనకి బాధ?... అంతకుమించి అతడితో తనకింకేమీ బంధం లేదా?

“ఉంది... ఉంది' పెద్దగా అరిచింది వనంతలక్ష్మి అతడు తనకి కావాలి. అతడంటే తనకి చాలా యిష్టం. అతడు లేకపోతే తను జీవించలేదు. ఎందుకో ఏడుపొచ్చింది వసంతలక్షికి.

గడియారం మళ్ళీ మరోసారి అరిచింది అరగంట గడిచిపోయినట్లుగా.

ఛీ...నీ... ప్రతిరోజూ ఆతడు బయటిశెళ్ళింది మొదలూ, యింటికి తిరిగొచ్చేదాకా యివే ఆలోచనలు. అతడికెళ్కడో ప్రమాదం జరిగినట్టు, దెబ్బలు తగిలినట్లూ, లేదొ అసలు మరణమే సంభవించినట్లు... ఏదేదో మధన... ఇటువంటి నెగటివ్‌ ధాట్స్‌ వుండకూడదని భగవాన్‌ ట్రీచింగ్స్‌లో చెప్తారు కదా... ఈ మధ్యనే అత్తగారితో కలిసి ఒక బాబాగారి ప్రీచింగ్స్‌కి పెళ్ళింది వనసంతలక్ష్మి కాసేపు మనను గట్టి చేనుకుని మెదడులోకి ఎటువంటి నెగటివ్‌ ధాట్స్‌ రాకుండా ఉగ్గబట్టుకుంది. అయిదు పెకండ్లు గడిచాక మళ్ళీ అంతా మామూలే.

అగారం

ఈలా వన

ఈరోజు సాయంత్రం ప్రక్కవీధి సెంటర్లో పాత పెద్దాసుపత్రి ఎదురుగా కమ్యూనిస్టు లీడరు మాలకొండయ్య హత్య జరిగింది. నడిరోడ్డు మీద అతడిని నరికి పారేశారట. వూరంతా అట్బడికినట్లు వుడికిపోతోంది. అక్కడెక్కడయినా యిరుక్కుపోయాడా భర్త అని ఆలోచించింది.

పోలీసులేమయినా అరెస్టు చేయలేదు కదా... ఛ...ఛ... పోలీసులు పేకాడితేనూ, తాగి డ్రైవింగ్‌ చేస్తేనూ, పెళ్ళాన్ని వెయిటింగ్‌లో పెడితేనూ అరెస్ట్‌ చేయరు. అటువంటి చట్టాలేమీ లేవు. కానీ 'భువన తార' చదివితే మాత్రం పట్టుకుంటారు.

మెయివ్‌రోడ్డు మీది నుండి ఒక లారీ భయంకరమైన శబ్దం చేస్తూ దూసుకుపోయింది. దాని,తొలూకూ శబ్దం చాలాసేపటివరకూ వసంతలక్ష్మి గుండెను వొణికిస్తూనే వుంది.

బావగార్ని, మామగారి నిద్రలేపి ఆయనింకా రాలేదని చెప్పామా అనుకుంది ఒక్కక్షణం. ప్రతిరోజూ చచ్చేవాళ్ళకి ఏడ్చేవాళ్ళెవరుంటారు? అయినా యింత రాత్రివేళ వాళ్ళని లేపి కంగారు పెట్టడమెందుకులెమ్మని నరిపెట్టకుంది. తోడికోడలు తనవంక చూసే జాలిచూపుల్ని భరించడం చాలా కష్టంగా వుంటుంది వసంతలక్ష్మికి.

మెల్లిమెల్లిగా టిక్కు టిక్కుమని శబ్దం చేన్తూ నిమిషాల్ని గంటలుగా మారుస్తోంది గడీయారం. కళ్ళుమూతలు పడుతున్నాయి. మళ్ళీ వాటంతటవే తెరుచుకుంటున్నాయి ఆప్రయత్సంగా. నిద్రో, కాదో తెలీని స్థితి. వసంతలక్ష్మికి చెప్పలేనంత విసుగూ, కోపమూ వచ్చాయి భర్తమీద. వచ్చాక గట్టిగా పోట్లాడాలని నిర్ణయించుకుంది.

“రానంత సేపూ విరహమా... వేను రాగానే కలహమా?' అతడు దగ్గరకి తీసుకుని అడుగుతున్నాడు తనని. ఒక్కసారిగా సిగ్గూ, సంతోషమూ ముప్పిరగొన్నాయి వసంతలక్ష్మిని. ఆనందపు అంచులకు చేరుకోబోతూ... బాబిగాడు నడుంమీద కాలేయడంతో ఒక్కసారిగా తెలివిలోకొచ్చింది .

హయ్యోరామ... అంతద్భష్టం కూడానా? అతగొచ్చాక యిదేమిటి యింతాలస్యమైంది అంటూ ప్రళ్నించే చనువు తనకుందా?

నీకా హక్కులేదు. నేను బయట పనిచేసి సంపాదించి తెస్తున్నాను. నిన్ను పోషిస్తున్నాను. ఆ పనిచేసే క్రమంలో అలిసిపోయి రిలాక్సేషన్‌ కోసం 'పేకాడుతాను. పేకాటలో ఓడిపోయి నపుడు గెలవడం కోసం కొంచెం మందు తీసుకుంటాను. అ కిక్కులో ఎవరిమీదయినాసరే చెయ్యేస్తాను. అదంతా నా యిష్టం నీకు ప్రశ్శించే హక్కులేదు. నేను మగాడ్ని. నీకు లేని అవయవమొకటి నాకు ఆదనంగా వుంది. అహ్హహ్హ... అంటూ కాలరెగరేస్తాడు సప్టయిలుగా.

ఈ మాటలన్నీ ఒక్కొక్కసారి అతడు నేరుగానూ, మరి కొన్నిసార్లు పరోక్షంగానూ వవంతలక్ష్మికి అవగాహనకొచ్చేలా చేస్తాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో జరిగిపోయాక

అమన క్‌

“ఇంత ఆలస్యంగా వస్తున్నారేమిటి?' అని అడిగే హక్కు తనకి లేదని తెలుసుకుందామె.

'బైట పని చేస్తున్నాను... బైట పవి చేస్తున్నాను అంటూ ఎప్పుడూ ఎందుకతడు బెదిరిస్తాడు? ఎందుకంటే ఆ శ్రమకి విలువుంది. డబ్బాస్తుంది. తను యింట్లో చేసే చాకిరి ఉత్పాదక శ్రమ కాదు కాబట్టి తమ పనికిమాలింది. మొదట్లో అతడిలా బానిసను నిలబెట్టినట్లు నిలదీస్తుంటే, అభిమానం పాంగుకొచ్చేది. ఆవేశం విరుచుకొచ్చేది. ఆయితే వాటివల్ల ఎంత మాత్రం ఉపయోగంలేదవి తెలుసుకుంది వసంతలక్ష్మి అందుకని ఆ తర్వాత ఎప్పుడయినా అతడు కేకలేస్తూంటే...

“వేను పిగ్గులేనిదాన్ని... వేను అభిమానంలేనిదాన్ని... ఎన్ని మాటలయివా పడడానికే వుట్టాను...' అంటూ లోలోపలే జపం చేసుకుంటూ సహనాన్ని అరువు తెచ్చుకువనేదామె.

ఆలోచనలు కలగాపులంగా ఆమె మెదడును తింటున్నాయి. ఎందుకో మాటిమాటికీ దుఃఖం తన్నుకుస్తోందామెకు. ఆ తెల్లవారురూమున అలా కూర్చుని ఒంటరిగా భర్తకోసం ఎదురుచూస్తుంటే తన మీద తనకే జాలిగా వుందామెకి. తఈన మనసు విప్పి పరవడానిశెవరూ లేరక్కడ... అన్న భావం మబ్బు మింగిన చంద్రుడిలా ఆమె గుండెను కమ్మేసింది.

వపంతలక్ష్మికి మధ్యవ పెల్ఫ్‌పిటీ ఎక్కువయిపోతోంది. ఆ పమయంలో ఆమె నెవర యినా పలకరిస్తే చాలు కళ్ళనీళ్ళు టపటపా పడిపోతాయి.

ఈన తోడికోడలూ బావగారూ, ఈ వయమలో ఆత్తగారూ మామగారూ జంటగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూంటారు. ఆటువంటి కుటుంబంలో పుట్టిన తన భర్త 'ఎముం టాయి నీతో మాట్లాడ్డానికి అంటూ ఒక్క కమురు కసురుకుంటాడు. యింట్లో వుండమని

తన జీవితంలో జీవితం, హృదయంలో హృదయం, మనసులో నునమా అయిన జీవిత సహచరితో మట్టాడ్డానికి మాటలే వుండవా?... వుండవు... ఆదే పరాయివాళ్ళతో అయితే విసుగూ, విరామం లేకుండా నవ్వుతూ మాట్లాడుతాడు ముప్పయిరెండు పళ్ళూ కన్పించేలా...

మరో గత్యంతరంలేక, వేరే ధారి కన్పించక ఉన్నాడో లేడో తెలీని దేవుడి కాళ్ళు పట్టుకుంది వసంతలక్ష్మి చప్పున లేచి పూజగదిలోకి వెళ్ళి లైటు కూడా వేమకోకుండా, ఆ గుడ్డి వెలుతురులోవే దేవుడి పటాల ముందు మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్ధించింది.

“భగవావ్‌ ఆతడి నిర్లక్షాన్ని భరించే శక్తిలేదు. వాకాయన కొవాలి. కానీ యిలా కాదు. అయన్ని నాకమకూలంగా మార్చు. వేమ శత్రువుని కొను... తవ స్పేహితురాలినవి ఎరిగించు...” అంటూ ప్రార్ధిమ్తంటే వనంతలక్ష్మికి హళాత్తుగా రెండురోజుల క్రితం భగవావ్‌ ద్రీచింగ్స్‌లో చాపాజీ చెప్పిన విషయం గుర్తొచ్చింది .

“మీరంతా మీ జీవిత భాగస్వాముల్నో లేక మీకు అనుకూలంగా లేవి మరొకరివో మార్చడానికి ప్రయత్నిమ్తంటారు. వీలు కానప్పుడు భగవంతుని పాయం ఆర్థిస్తుంటారు...

వాణారం

కడం పవద ఇదో

బహుశా ఆప్రయత్నం మీదవే మీరిక్కడకి వచ్చి వుండొచ్చు కూడా... అయితే మనుషుల్ని అమాంతంగా మార్చేయడానికి యిక్కడ మంత్రదండాలేమీ లేవు. మీకు ఆర్ధం కావాల్సింది ఒకటే... మీరు ఎవరినో మార్చడానికి ప్రయత్సించే ముందు మార్పు అవేది మీ లోపలి మండే (ప్రారంభం కావాలన్నది గుర్తించరు... మొదట నిన్ను నువ్వు మార్చుకో...”

బయటెక్కడో కుక్కలు భయంకరంగా అరుస్తున్నాయి...

తన మంత్రందండం ప్రార్ధన కుక్కల అరుపులతో కలిసి తనకే గందరగోళంగో అన్పిం చింది వసంతలక్ష్మికి. విసుగ్గానూ, బెన్నన్‌గానూ అన్పించింది. వెంటవే లేచి చప్పుడు చేయకుండా తవ బెడ్‌ మీదికొచ్చి పడింది. అప్పటికి కోడి కూసింది గొంతెత్తి... తనని తామ మార్చుకోవడం గురించి కొంచెంపేపాలోచించింది వపంతలక్ష్మి

ఉదయం లేచిందగ్గర్నుంచీ భర్తకి అన్నీ వనమయానికి అమర్చి పెట్టడంలోనూ, అత్త మామల సేవలోనూ, తోడికోఢడలుతో పారపాచ్చాల్లేకుండా సామరస్యంగా మెలగడంలోనూ, బాబిగాడి చదువు సంధ్యల విషయంలోనూ ఎందులోనూ ఏ లోటూ రాకుండా చూసుకోవడం తోవే రోజు పూర్తవుతుంది వసంతలక్ష్మికి.

తనవి తాము ఏ యాంగిల్‌ నుంచి మార్చుకుంటూ రావాలో బోధపడలేదామెకి. అసహనవాన్నీ, వస్తోన్న దుఃఖావ్నీ అణుచుకుంటూ మెల్లిగా లేచి వెళ్ళి కంప్యూటర్‌ ముందు కూర్చుంది.అ మధ్య బావగారు పిల్లలకీ నేర్చుతూంటే తనూ సరదాగా బేసిక్స్‌ నేర్చుకుంది. కాపేపు కాలాన్ని చంపడం కోపం రెండు, మూడు గేమ్స్‌ ఆడింది. ఎంత ప్రయత్సించివా టివ్స్‌ కోటలోపలికి చేరుకోలేకపోతున్నాడు. ఆడి ఆడి విసుగొచ్చి ఆగేమ్స్‌ అన్నీ చెరిపేపీంది . ఆ తరువాత

ఈఈ 2006 ౯66... ౧౦గగింటంోంి

పెట్‌వి అన్‌ చేపింది తన భావాలు ఇంప్లిమెంట్‌ చేస్తూ... కొంచెంపేపు వసంతలక్ష్మి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. తన చుట్టూ ముపిరివున్న చీకట్లను పారద్రోలడానికి ఒకింత వేకువకోపం అర్చిస్తున్నదావిలా కంప్యూటర్‌ ముందు కూర్చుంది. కుర్చీలో ముందుకి వంగి ఆసక్తిగా.

వెంటనే ట్కీవ్‌ మీద...

'హాయ్‌ లక్ష్మీ... హహిహ్‌...

అమాహ్యరీతిలో అభివృద్ది చెందిన కమ్యూనికేషన్‌ రంగం ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. సాంకేతిక రంగంలో ఆవేశ మార్పులొచ్చి ప్రపంచ రహస్యాలన్నీ వట్టింట్లో తలలు విరబోసుకుంటువ్నాయి. కొత్త మిలీనియంలోకి అడుగుపెట్టి వై 2 కె యిచ్చిన ఆనందంతో జగమంతా అభివృద్ధి దశగా ప్రయాణీస్తోంటే మవ్వింకా ప్రబంధాల్లోని అభిపారికలా మొగుడీ

జాగారం ఈసా వభ జం న్‌

కోసం ఎదురుచూస్తూ గడుపుతున్నావా?... వ్వెవ్వెవ్వె... హిహిహీ... రాబయటికి... ముందు నీ సర్టిఫికేట్ల పసుష్పచ్చ బూజు దులిపేయ్‌... మార్చుకో... నిన్ను నువ్వు మార్చుకో... అని వచ్చింది.

బయట మోటార్‌సైకిలాగిన చప్పుడయింది .

అప్పటికి పూర్తిగా తెల్లవారిపోయింది .

చిత్రంగా నిన్స సాయంత్రం పడమరకి విసిరివేయబడ్డ సూర్యుడు మళ్లీ తూర్పు నుండి మొలకెత్తుతున్నాడు...

ఆదివారం ఆంధ్రజ్యోతి, 2000 జాగారం ల సకుననే

లగ వక్షీతి వి. ప్రతిమ కథలు

ఈవ్‌ మళ్ళీ చచ్చిపోయింది అవును ఈవ్‌ చచ్చిపోయింది. నేనే చంపేశాను. ఒకప్పుడు తల్లిని చంపిన పరశు రాముణ్ణి పదిరకాలుగా తిట్టిన నేను ఇప్పుడు ఆడ పరశురాముణ్ది అమ్మని ముచ్చటగా అది మానవి అని పిలుచుకునే దాన్ని అయ్యో నేనే ఇప్పుడు ఆ అమ్మనీ, ఈవ్‌ని చంపేశాను. ఈనోటితో, ఈ మాటల్లో చంపేశాను! నువ్వింకా వురాణయుగంలోలాగా మౌనంగా వుంటే కుదరదన్నాను. వ్రఖల్లంచడం చేతకాకపోతే నమాధానం దొరకదన్నాను. ఇవ్పటికయినా నేర్చుకోకపోతే ఏ కొన్న విషం అయివా మింగమన్నాను. '“ఈవ్‌' ఆధునిక స్రీలాగే రోషపడింది. అవ్యో అమ్మా! ఇమ్చుడు ఈ వయనులో ఇదేమిటమ్మా! ఈ పని నువ్వెప్పుడో చేసుండాల్సిందే! నిన్నీ భూమ్మీదికి తెచ్చిన హడావిడిలో మీ అమ్మ చెప్పకుండా వెళ్లిపోతే నీ దురదృష్ట జాతకాన్ని తిట్టుకుంటూ కూర్చోకుండా అప్పుడే ఎవరయినా వీ వోట్లో ఓ వడ్డ గింజ ఈవ్‌ +కసమనా??

వేసుండాల్సింది. నిన్ను సాకడమనే సాకుతో మీ నాన్న రెండో పెళ్లి చేనుకున్నపుడూ నీ సవతి తల్లికి నువ్వు కంట్లో నలుసువయినపుడూ చావు దెబ్బలూ, తిట్లూ అలవాటే కదమ్మా! చదువూ, సంధ్యా లేకండా ఇంటిచాకిరీతో నువ్వు సతమతమవుతూంటే నిన్ను స్వర్గపు అంచులకు తీసికెళ్తానంటూ జీవితపు శిఖరాల మీద నిలబెడ్తానంటూ వాగ్ధానాలు చేసిన నీ వాడనుకున్నవాడు... లక్షల కట్నం కోనం అర్భాంతరంగా నీ చేతిని ఒదిలేసినపుడు ఆ పసిమనసుతోనే ఒంటరి అఘాతాన్ని తట్టుకున్నావు కదమ్మా! ఎదురుకట్టం కోసం నీ సవతి తల్లి నీ గొంతు కోసినపుడయినా నువ్వు బదులు పలికావా? పెళ్ళయిన మూడో రోజే పేకాటకని వెళ్లిన నీ మొగుడు తెల్లవారురూమున తిరిగొచ్చి నప్పుడు ఇదేమిటని నువ్వు నవ్వుతూ ప్రల్నించబోతే విసుక్కుని నీకు ప్రశ్నించే హక్కులేదని బోధపరిచినపుడూ ఎలా వూరుకున్నావమ్మా మౌనంగా. నేను కడుపున పడినపుడు నీనుండి సుఖం లేదనే సాకుతో అతగాడు రోజుల తరబడి బయటే తిరిగినపుడే చేసుండకూడదామ్మా! ఈ పని... మనిద్దరం బతికిపోయుండే వాళ్ళం కదా? ఇప్పుడెందుకు చేశానమ్మా ఈ వని, ఈ పిచ్చిపని?! అతడు వద్దని శాసించిన ఆడపిల్లనే కన్నందుకు చాలా రోజులు పుట్టింటి కంకితమయి పోయావే. అభిమానాన్ని చంపుకుని రోజులు వెళ్లబుచ్చావే! మీ అన్న్మయ్యల అసహనాన్నీ వదినల ఆరళ్లనీ భరించడానికప్పుడు చిరునవ్వుని అరువు తెచ్చుకున్నావు కదామ్మా? అప్పుడంతా బిగపట్టుకున్న దానివి ఇప్పుడూ అలాగే భరించలేకపోయావా? ఇంట్లో నువు లేకపోతే జరక్క, అతడొచ్చి నిన్ను రమ్మంటే చంకలు గుద్దుకుంటూ నన్ను భుజానేసుకుని వెళ్లానే! మీ మామయ్య కొడుకొస్తే క్షేమ సమాచారాలడిగావని రంకు అంటించి, గొడ్డును బాదినట్టు బాదినపుడయినా నువ్వు ఊ' అన్నానా? మీ పక్కింటబ్బాయి ఏదో పనిమీద ఈవూరొచ్చి నిన్ను చూడ్డానికొచ్చినపుడు మాత్రమో? ఎవరితోనమ్మా అతడు రంకు అంటగట్టనిది? నా మార్కులు తెలుసుకోవడానికి బడికొస్తే అయ్యోరితో రంకు. అతడింట్లో లేనపుడు గ్యాసొస్తే సప్పయర్‌తో రంకు. మనకెవరూ రాసే వాళ్ళులేరనుకో, ఎప్పుడో నూటికీ కోటికీ ఒక జాబొస్తే పోస్టమ్యాన్‌తో రంకు. పక్కింటాయన తాళాలడిగితే అతడితో రంకు. ఈవ్‌ బావన

ఉదయాన్నే రంకు అంటించి చావగొట్టి రాత్రి పక్కలోకి రమ్మంటే మొగుడితో నవ్వు తూనే బతికావు కదా ఇన్నేళ్ళు!

ఇప్పుడేమయిందమ్మా నీకు?

అయ్యో అమ్మా! నేనే నిన్ను చంపుకున్నట్లున్నానే!

ఈ మునిమాపు వేళలో నేనే నీకు ప్రశ్నించడం నేర్చబోయాను. నా వేలితోనే నా కన్ను పొడుచుకున్నాను!

నువ్వు లేకుండా నేనెలా బతకనమ్మా? నాకు నువ్వు కావాలమ్మా

అమ్మా నీకేనాడయినా కాలునొచ్చినా, కన్ను నొచ్చినా, జ్వరమొచ్చినా వాడు పట్టించు కున్నాడా?

అంట్ట్లుతోముకుంటూ ఇల్లలుక్కుంటూ బతికేదానివని గదా, నువ్వంటే అతడికి లోకువ. అదే అతడు తాగొచ్చి పడిపోతే నువు సేవలకు సిద్దమయిపోతావు. ఏడ్చుకుంటావు. దిగులు పడతావు. రెండు చేతులూ ఎత్తి కనిపించని దేవుణ్ణి ప్రార్ధిస్తావు. అదే జీవితమంటావు.

నువ్వెప్పుడూ ఆత్మీయతా నృర్శలేని బీటలు వారిన నదివేకదా ఇప్పుడేమిటమ్మా ఇది కొత్తగా?

ఒళ్ళు మండిన సంఘటనల్లో నేనెప్పుడయినా నాన్నని ద్వేషిస్తే “ఛ! అలా అనకూడదు నిత్యా! నాన్న చాలా మంచివారు. కాకుంటే కొంచెం కోపమెక్కువ. కొంచెం తాగుతారు. కొంచెం తిరుగుతారు. మగాడికామాత్రం అహం సర్వసాధారణం. మనమే సర్దుకు పోవాలి తల్లీ, భార్యాభర్తల్లో ఆ మాత్రం సర్దుబాటు లేకపోతే సంసారమెలా గడుస్తుంది? అయినా ఆడదానికి పట్టవిడుపు లుండాలి” అంటూ నాకు నచ్చచెప్పపోయేదానివి.

“ఏం ఆడదానికి మాత్రమే ఎందుకుండాలి. మగాడికక్కర్లేదా పట్టవిడుపులు” అన్న వా ప్రశ్నని దాటేసేదానివి.

నువ్వు నిజంగా భూదేవివమ్మా మట్టికెక్కడయినా కోపమొన్తుందా.

ఎంత సహనం లేకపోతే నీకు తెలీకండా ఓ అర్థరాత్రి తన పై ఆఫీసర్షి నీ పడగ్గదిలోకి పంపినపుడూ, వాడు ముళ్ళపందిలా నీ మీదపడి నిన్ను లొంగదీసుకోవడానికి ప్రయత్నించి నపుడూ, వాడితో పెనుగులాడి మౌనంగా బయటకొచ్చావే గానీ, అప్పుడయినా ఇదేమిటని ప్రల్శించావా? నీ మొగుణ్లి చంపడానికి ప్రయత్నించావా?

అబ్బే నువ్వు మహా పతివ్రతవి కదా? సీతకీ, సావిత్రికీ, సుమతికీ వారసురాలివి గదా?

నీ గదిలో నీబెడ్‌మీద, అతడు బజారు మనుషుల్ని తీసుకొచ్చి పండబెడితే ఎట్లా ఓర్చుకున్నావమ్మా?

అంతటి దు:ఖాన్ని దిగమింగుకుని నీ గుండె పగిలిపోకుండా ఎట్లా వుండగలిగింది? అయ్యో అది అప్పటికే ముక్కలు చెక్కలుగా చీలిపోయిందా?

ఈవ్‌ వనముల

ఆతడి పేకాట ఫెండ్స్‌కి నీ ఇష్టం, నా ఇష్టం లేకుండానే హరిశ్చంద్రుడు భార్య నమ్మేసినట్లుగా నన్నిచ్చి పెళ్ళి చేసేస్తే దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకున్నదానివి.

అతడికి నీ శరీరంతోనూ, మనసుతోనూ అడుకోవడమైతే తెలుసుకానీ నీ గుండెల్లోని దుఃఖాన్ని చదవడం తెలీదు.

దుర్మార్డుడు...

ఆ మాటంటే మళ్లీ నీక్కోపమొచ్చేస్తుంది. నువ్వెంత మంచిదానివమ్మా? నిన్ను ద్వేషించే వాళ్ళనీ, హింసించేవాళ్లసి కూడా ఎంత నిండుగా (ప్రేమిస్తావు ? నీ గుండెల్లో ప్రేమ తప్ప మరేమీ లేదా? గంపెడు దు:ఖం ఎక్కడ దాచావు?

తమ్ముడు సత్య. పదిహేడేళ్ళకే పనికిమాలిన చదువాదిలేసి పక్కూరి స్రవంతిలో లేచి పోయినపుడు పక్షికి రెక్కలొచ్చేశాయని నువ్వు కుమిలిపోతూ వుంటే ఎట్లా పెంచావీ కొడుకు నంటూ ఊరంతా నీ మొహం మీద ఉమ్మేస్తూంటే...

ఎక్కడ దాచుకున్నావమ్మా అవమాన రేఖలు నిండిన నీ ముఖాన్ని?

ఏ కన్నతల్లయినా సరే కొడుకుని పరాయమ్మ కన్సబిడ్డని లేపుకు పొమ్మని సలహా ఇస్తుందా? నువ్వొక ముద్ద అన్నం తినబోతే ఎట్లా సయిస్తోందే నీ కడుపుకి? అంటూ నీ అత్తా, మొగుడూ నీచేతిలో ప్లేటు లాగేసినపుడూ అప్పుడెప్పుడూ రాని రోషం ఇప్పుడెందుకొచ్చిందమ్మా? అయ్యో నా తల్లీ ఎంత పని చేశావమ్మా?

నీ అల్లుడు డబ్బు దాహం పట్టి నన్ను వేధిస్తుంటే ఆ హింసని భరించలేక తాళి తెంచి వాడిముఖాన కొట్టి నేను నీదగ్గరకొచ్చినపుడూ,

మన బంధుమిత్రులంతా నాదే తప్పనీ, వాడెంత హింన పెట్టినా మొగుడు కాబట్టి ఓర్చుకోవాలనీ నాకు బోధించినపుడూ, నీమొగుడు మనిద్దర్నీ బయటికి నెట్టేసి తలుపేసు కున్నపుడూ, అప్పుడెప్పుడూ రాని కోపం ఇప్పుడెందుకొచ్చిందమ్మా నీకు?

వీ జీవితమంతా బాధల జలపాతాలే కదమ్మా?

ఒకే ఒక్క భ్రాంతిలో బతుకుతున్న నిన్నూ, జీవితంతో పోరాడుతున్న నన్నూ ఎప్పడో బహిష్కరించింది కదమ్మా ఈ లోకం. మనమూ అలాగే చేశాం కదా! అదే భావంతో అలాగే గట్టిగా నిలబడుంటే కాలం గడిచి పోయేది కదమ్మా!

జీవిత పార్వ్వాల్లో నిన్ను అవేక సార్లు నానా గడ్డీ కరిపించి ఇప్పుడు నువ్వెల్లిపోగానే ముచ్చులా నీ శవం పక్కన కూర్చుని ఎట్లా ఏడుస్తున్నాడో...

నిజమే మరి! నువ్వు లేకపోతే ఎట్లా గడుస్తుందతడికి?

చకచకా తిరిగి ఇంటినంతటినీ చక్కబెట్టేదానివి.

బాధ్యతలన్నీ నీ నెత్తినేసుకుని,హక్కుల్ని మాత్రం అతడికి అప్పగించిన దానివి.

ఇంటి నాలుగు మూలలా నాలుగు రూపాలై విస్తరించిన దానివి.

ఈవ్‌ న

అయ్యో అమ్మా! నిన్న ఈ పాటికి నువ్వు హాయిగా ఇంట్లో తిరుగుతున్నావే? ఆ క్షణం ఒక్కటీ అట్లా గడిచిపోయుంటే ఎంత బావుండేది?

శేవలం కాఫీలో కొంచెం చక్కెర తక్కువయినందుకు, అతడితో చచ్చేట్లు తన్నులు తింటూంటే ఎందుకమ్మానీ బతుకు ఎందులోనయినా దూకి చావరాదూ? అన్నాను కోపంతో.

అంతే నా మాట మీరలేదు నువ్వు.

అయ్యో నా నోట్లోంచి ఆ మాటెందుకొచ్చిందో, నా నాలుక మీద ఏ శని ఆడిందో.

అంతా నాదురదృష్టంనా ఖర్మ... నాకింకెవరున్నారమ్మా?

తాగొచ్చి నీ మొగుడూ ముండలతో నా మొగుడూ గడుపుతుంటే నన్ను దేవతలా గుండెల్లో దాచుకున్నావే!

ఇప్పుడెవరున్నారమ్మా నాకు తోడు?

అమ్మా! నువ్వసలు నిజంగా చచ్చిపోయావా? కళ్లు మూసుకుని నిద్ర నటిస్తున్నావా? లేదు లేదమ్మా నువ్వు చచ్చిపోలేదు. నువ్వింకా చచ్చిపోలేదు గదూ!

“నిత్యా కాఫీ తొగమ్మా”

“నిత్యా పాపకి పాలు పట్టావా ?”

“నిత్యా పాపకి స్నానం చేయించనా ? ”

“నిత్యా...నిత్యా ....నిత్యా” అంటూ ఎప్పట్లా (ప్రేమగా పిలున్తున్నట్లే వుందమ్మా ఇంక నన్నెవరు పిలుస్తారమ్మా. అట్లా నోరారా... అమ్మా నాకు నువ్వు కావాలమ్మా. వచ్చేయమ్మా ప్లీజ్‌ నన్ను క్షమించి వచ్చేయమ్మా

“అమ్మ కావాలి. నాకు అమ్మకావాలి” పైకే ఏడుస్తున్నానేమో!

“నిత్యా ఏమిటిది చిన్న పిల్లలా? అమ్మ యికరాదు. నువ్వు నిజంగా దురదృష్టవంతు రాలివే” అంటూ దుంఖాన్ని ఆపుకోవడం కోసం పైట చెంగు నోట్లో దోపుకుంది శకుంతల పిన్ని. ఆ తరువాత నన్ను దగ్గరికి తీనుకున్నట్టుంది.

“పిన్నీ చూశావా అమ్మ ఎంత పని చేసిందో? అయ్యో పిన్నీ అమ్మని నేనే చంపేశాను. మీ అక్కని నేనే చంపేశాను. పిన్నీ అమ్మకెంత దయలేదో చూశావా? నన్నాంటరి దాన్ని చేపి వెళ్ళిపోయింది నేనాంటరిదాన్ని ఒంటరిదాన్ని ఇక నాకెవ్వరూ లేరు.”

పిచ్చిపట్టిన దానిలా బావురుమన్నాను.

“అమ్మానిత్యా... నిత్యా నా తల్లీ నిత్యమ్మా... ఏడవబోకమ్మా! నీకు నేనున్నాగా...అమ్మ లేకపోతేనేం? నేను లేనూ?” మా నాన్న నన్ను దగ్గరికి తీసుకుని అందరూ చూసేలా ఓదారు మ్లన్నారు. రెండు కాళ్లు, రెండు చేతులున్న మృగమేదో నన్ను కావలించుకున్నట్లుగా అయి విసురుగా విదిలించేశాను.

మనిషా వీడు? మనిషంటేనే అర్ధం మారిపోయింది. మనిషంటే ఇప్పుడు పైకి నిగ నిగలాడుళూ, లోపల కంపుకొడుతున్న కోడిగుడ్డు. మనిషంటే ఇప్పుడు జడలు విరబోసుకున్న దయ్యం.... మనిషంటే ఇప్పుడు రెండు కొమ్ములూ, శోరలూ వున్న మృగం...

కన్‌ చచ్చిపోయింది అన రు. సులల

మానాన్న మళ్ళీ నన్ను దగ్గరికి తీసుకుని తల నిమురుతున్నాడు. నా తల్లిని చంపేసిన హంతకుడు. నరరూప రాక్షసుడు.

చిత్రంగా అతడి కళ్లల్లో నుండి నీళ్లు.

పరిణామ క్రమంలో మృగం మనిషిగా మారడానికి వేల సంవత్సరాలు పట్టిందట. అయితే ఈ ఒక్క శతాబ్దపు చివరి దశలోనే మనిషి మల్లీ మృగంలా మారిపోయాడు. జంతువు... మృగం... క్రూరమృగం... పెద్దగా నవ్వుతూ చప్పట్లు కొడ్తూ చూశాను.

అంతా విస్తుపోయి నాకేసి చూస్తున్నారెందుకూ!

నాన్న తలకి రెండు కొమ్ములూ, నోట్లోంచి రెండు కోరలూ వచ్చి అదేదో టివి యాడ్‌ లోలా వున్నాడు.

నాకు ఒళ్లు జలదరిస్తోంది . కళ్లు తిరుగుతున్నాయి. ఏడుపాస్తోంది .... నవ్వు కూడా వస్తోంది. ఈ వా పరిస్థితిని ఎలా సమీక్షించుకోవాలో తెలీని దానిలా కళ్లు మూసుకుని వెనక్కి గోడకి జారగిలబడ్డాను.

మనిషి ముందుకు నడుస్తున్నాడా? వెనక్కి నడున్తున్నాడా? కాలమానం మనం ముందుకు నడుస్తున్నట్లు సూచిస్తూ నూతన సహస్రాబ్దిలోనికి అడుగు పెట్టింది. మనిషి ఈ స్థితికి చేరుకోవడానికి ఎన్ని వేల మైలురాళ్లు దాటి వచ్చాడు!

ఓ 'ఆడమ్‌' నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ కీర్తి శిథిలాలనధిగమించావు. ఆకాశాన్ని అందుకున్నావు. చివరికి సృష్టికి ప్రతిసృష్టి చేసే క్లోనింగ్‌ బ్రహ్మవయ్యావు. బాగానే వుంది. అయితే 'ఈవ్‌'ని మాత్రం నీతోపాటు చేయిపట్టి నడిపించకుండా దారిలోనే నిర్దాక్షిణ్యంగా వదిలేశావు. ఎదగనీయకుండా నొక్కి తొక్కి పారేశావు.

ఆడమ్‌ ఫస్ట్‌ సిటిజన్‌... ఈవ్‌ సెకండ్‌ సిటిజన్‌. విశ్వమంతటా ఇదే కథ!

ఓ నా ఈవ్‌ ఎక్కడున్నావమ్మా! పడుతూ లేమ్తూ ఎక్కడాగిపోయావ్‌?

ఈ జీవితారణ్యంలో నీ కాళ్లకి మాత్రమే ముళ్లు గుచ్చుకున్నాయా?

గండశిలలడ్డం పడ్డాయా?

మాయమాటలు చెప్పి ఏ కొండ శిఖరం మీది నుండి తోసేశాడు నిన్ను ఆడమ్‌.

నువ్వు పతివ్రతవి కాదని చాకలోడెవరో అంటే అరణ్యానికి తోలేశాడా?

శీలపరీక్ష పేరిట అగ్ని స్నానాలు చేయించాడా?

అప్పులు తీర్చుకోవడం కోనం నిన్ను నడివీధిలో నిలబెట్టి అమ్మేశాడా?

రాత్రికి రాత్రి నిన్నాదిలి పెట్టేసి లోళాన్నుద్దరించడం కోసం చెప్పా పెట్టకుండా వెల్లి పోయాడా?

విచ్చుకళ్తుల వంతెనల పహారా కాశాడా?

అర్థం పర్థం లేని ఆవేశంతో నిన్ను నడిబజారులో వివస్త్రను చేశాడా.

బిడ్డ పాలను నీరొమ్ముల్నుండి పిండి తీశాడా?

క్‌ వనమా

నువ్వు (పేమించనన్నావని క్లాసు రూములో కొచ్చి కత్తితో నరికేశాడా?

నవ్వుతూ నవ్వుతూ కాఫీలో నిద్రమాత్రలు కలిపిచ్చాడా?

సందడి, చప్పుడు లేకుండా గ్యాస్‌నాబ్‌ తిప్పేశాడా?

కిరవవాయిలు డబ్బా ఖాళీ చేశాడా?

కాఫీలో చప్కెర తక్కువయిందని కొట్టి చంపేశాడా? లేక అత్తింటివారి గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక. వుట్టింటి వారికి భారం కాలేక నువ్వే ఆత్మహత్యే శరణనునుకున్నావా?

ఓ వా ఈవ్‌ ఎక్కడున్నావమ్మా?

ఎక్కడో లోయల్లో, కొండల్లో కోనల్లో ఈవ్‌ ఈవ్‌ నువ్వెందుకట్లా వెనకబడి పాయావ్‌? ఆడమ్‌ తినకుండా అ పండు నువ్వు మాత్రమే ఎందుకు తిన్నావమ్మా!

ఎక్కడో ఒక ఈవ్‌ పైలట్‌ అవుతుంది. మరోచోట ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఎక్కుతుంది.

ఇంకొక ఈవ్‌ అంతరిక్షంలోకి వెళ్తుంది. మరోచోట భారతరత్న పొందుతుంది.

అంతా చంకలు గుద్దుకుంటాం. అంతేగానీ మిగిలిన తొంభయితాొమ్మిది శాతం, మననులో రగులుతున్న ఆలోచనల నంఘర్షణని బయట పెట్టలేక అట్టడుగు స్థితిలో హింస పడుతువ్నారన్న పంగతి గుర్తించం.

హయ్యో! కొత్త శతాబ్దిలోనయివా నువ్వు ఆడమ్‌తో సమానంగా నడుస్తావా? ఇంకా ఎప్పటికి తల్లీ నువ్వు ప్రల్నించడం వేర్చునేది?

“ఏదో పాపం. హళాత్తుగా వాళ్లమ్మ చనిపోవడంతో నిత్యకి మెంటల్‌ షాకయిపోయింది”

“మాకా... ఏచ్చిపట్టేసినట్టుంది... ఏదేదో మాట్లాడుతోంది.”

“్రాడు్కి చెప్పారా లేదా? కొడుకొచ్చేదాకా వుంచేస్తాగా? ఇప్పటికే చూడు ఎట్లా అయి పోతోందో బాడీ. మామూలు చావుకాకపాయె! ప్ప...” రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

“అయివా ఈ వయసులో ఈ పని చేసుండాల్సింది కాదు. బిడ్డ మొహమయినా చూసుండాల్సింది.”

హయ్యో! ఇప్పుడు కూడా అమ్మనే తిడుతున్నారు అంతా. నేవేం చేయాలి?

పోగొట్టుకున్న జీవితాన్ని ఉదయం నుండీ వెతుకుతూనే వున్నాను. సాయంత్రానిగ్గాని చెప్పలేమ వా విర్ణయమేంటో...

“విత్యా... విత్యా...”

“విత్యా... ఇక లేమ్మా అమ్మ కాళ్లకి దజ్ఞం పెట్టుకో” పిలున్తున్నారెవరో.

భయం....భయంగా కళ్లు విప్పాను.

అప్పటికే జీవం లేవి అమ్మ శరీరాన్ని వాకిట్లోకి పట్టేశారు. అంతే! ఆ గుక్కెడు పొతే వీధిలోకి ఈడ్చి పారేస్తారు. ఒక్క రోజు కూడా ఇంట్లో వుంచుకోరంతే.

నాన్న ఏడుస్తున్నాడు. అది నిజమైన ఏడుపో లేక అంతా తనవి నిందిస్తారవి దొంగేడు పేన్తున్నాడో!

ఈవ్‌ చచ్చిపోయింది అనరమనా/4ూ

అమ్మకి తల కొరివి పెట్టడం కోసం సిద్దమవుతున్నాడతడు... ఇప్పుడు కొత్తగా పెబ్టేదే ముంది. ఎప్పడో పెట్టేశాడు కదా.

తడి తలా, తడిసిన పంచెతో ఒంటిమీద చొక్కా లేకుండా మెడలో తెల్ల పీలికలాంటి జంధ్యం వేసుకుని దిగాలుగా ఏడుస్తూ ఒంగి అమ్మ మెడలో తాళి కడ్తున్నాడు.

“అయ్యయ్యో! ఒకసారి కట్టిన ఉరితాడు చాలదా? ఇప్పుడు మళ్ళీ శ్మశానంలో కూడా అమ్మని ప్రశాంతంగా బతకనివ్వరా?”

ఏడుస్తున్నానో లేదో నాకే తెలీడం లేదు. అంతా నన్ను లేవదీసి అమ్మ వద్దకు తీసుకు వెళ్లారు.

అమ్మ గుడిలోని అమ్మవారిలా అలంకరింపబడి వుంది.

మొహానికి పచ్చగా పనుపు రాశారు. నుదుటి మీద పెద్ద కుంకం బొట్టు పెట్టారు. పూలమాలలు వేశారు. బండెడు పసుపూ, కుంకం అంటే ఇదేనా? హయ్యో! బతికున్నపుడు లేని అలంకారాలు, అపుడు లేని గౌరవాభిమానాలూ ఇప్పుడు ఎన్ని పూలమాలలేస్తే మాత్రం అమ్మక్రేం తెలుస్తుందీ?

జీవించి వున్నపుడు లేని అస్థిత్వం ఇప్పుడెందుకు?

నేను కళ్ళు మూసుకున్నాను. అమ్మని ఆ స్థితిలో చూడలేక... కానీ ఈవ్‌ నా కళ్లముందు ప్రత్యక్షమయింది.

అయ్యో! ఈవ్‌ ఎన్నిసార్లిలా శ్మశానానికి తరలించబడ్డావ్‌ బలవంతంగా.

మొదటిసారి చనిపోయినపుడే బాధంతా, తపనంతా, ఆ తర్వాత ప్రతీసారి ఆది యాంత్రికమయిపోతుంది. చాలా మామూలు విషయమైపోతుంది. ఇలా ఆత్మ మల్లీ మళ్లీ నీ ఆత్మహత్యలు (?) చూసి చూసీ పేపర్లో చదివి చదివీ అలవాటయిపోయిందీ సమాజానికి ఇలా ఎన్నెన్ని సార్లు వెనక్కి వెళ్ళి వెళ్లి నువ్వు ఆడమ్‌ని కలుసుకోలేశ పోయావో? ఎద్దేవాలకు గురవయ్యావో భూమిలోకి అణగదొక్కబడ్డానో! మట్టిలోకి తొక్కబడ్డ విత్తనమెక్కడయివా చచ్చిపోతుందా? లేదు లేదు... నా తల్లి ఈవ్‌ మళ్లీ మొలకెత్తుతుంది.

ఈను కూడా మీబోటి మనిషేనని చాటి, తనలోని లక్ష ఆలోచనల నంఘర్షణని బయటపెట్టి, ఆకసపు చిట్ట చివరి అంచుదాకా స్వేచ్చను విస్తరిస్తుంది.

అయితే అమ్మా

ఈసారి వస్తూ వస్తూ చేతిలో ఆయుధంతో సహా రావడం మాత్రం మర్చిపోకు. లేదంటే నువ్వు ఎందుకూ వనికిరావు, బానిసగా తప్ప! ఆయుధమే నీకు అండ!

చేజారిపోయిన జీవితాన్ని వెతికి పట్టుకోవడం కోనం, అమ్మా నువ్వు మళ్లీ పుడ్తావు. పుడ్తూ పుడ్తూ అయస్కాంతం లాంటి ఆయుధాన్ని తీసుకొస్తావు. అప్పటిదాకా నీకోసం నీటిబొట్టు కార్చడానికి నా దగ్గర రెండు కళ్లున్నాయి. నీ గురించి ప్రార్థన చేయడానికి నాకు... నాకు నోరుంది.. నాలుక ఉంది ... ఉందమ్మా. ఉంది!

విపుల, ఆగన్ఫ 2000

ఈవ్‌ మళ్ళ చచ్చిపోయింది

౧ ఇమాం

| ఆలి సర్పదోషం “ఏ ॥

ల్లో దబ్బా... ఈ సృండ... విసుగ్గా ఆవులింతని పూర్తికానివ్వకుండానే అపుకున్నాడు నారాయణ. “దేవుడి మీద నమ్మకమే. పోయేట్బగా వుండాది...” అప్పటికి ఎన్నిసార్లు అవు లించాడో తెలీదుగానీ, ఇలా అనుకోవడం మాత్రం ఇరవైయ్యోసారి. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌లా కిరణాల్ని కదిలిస్తూ చురుక్కుమనిపిస్తోన్న ఎండనీ, అప్పటి తన అవస్థనీ తెగ తిట్బకుంటూ భార్యకేసి చూశాడతడు.

దూరంగా వున్న మండపంలోని నీడలో కూర్చుని, యెంతకీ కదలని క్యూనీ, అందులో నిలబడి తఈకబికలాడుతోన్న భర్తనీ, జాలిగా గమనిస్తోంది రుక్మిణఖమ్మ.

“ఎందుకొచ్చిన బాధయిదంతా? పుట్టిన్నాటినుండీ మనకి దోషాలే లేకుండా వున్నాయా? అప్పుడంతా గడిచిపొలా... ఇప్పుడు కొత్తగా సర్పదోషమేంది ? నాగదోషమేంది? నా తలకాయ దోషం... పొద్దన్లేస్తే మట్టి పినుక్కుంటూ, బరైలు తోలుకుంటూ, పేడెత్తుకుంటూ, పని, పని... అని పన్గ్లోబడి దొర్లేవాళ్ళకి ఈ పూజలెందుకు?... పునస్కారాలెందుకు?...

ర య!

ఎవురేది చెప్తే అది నమ్మేసేదే' భర్త అమాయకత్వానికి లోలోపల విసుక్కుంటూ వున్నచోటనే పక్కకి జరిగి కూర్చుంది రుక్మిణమ్మ గుళ్ళో ఏ మూల ఏ విగ్రహాల్ని కడుగుతున్నారోగానీ ఆ నీళ్ళన్నీ మండపం మీదుగా వచ్చి కాళ్ళని తడుపుతున్నాయి.

అప్పటిదాకా ఆ నీళ్ళల్లో తపతపమంటూ ఆడుకుంటున్న ఐదారేళ్ళ పిల్లాడొకడు హడావిడిగా వచ్చి కొబ్బరి పెట్టమని తల్లిని వేధిస్తున్నాడు. 'ఏమో చూడాల ఇప్పుటిక్రైనా మన పరిస్థితి బాగుపడతాదేమో' భర్తతో మాట్లాడుతూనే ఆ తల్లి కొబ్బరిచిప్ప నేలకేసి కొట్టబోయి చేతిని కొట్టుకుంది. చీలిన కొబ్బరిచిప్పలో యిరుక్కుపోయిన ఆమె అరచేతి చర్మం నుండి రక్తం కారుతోంది.

నవ్వాచ్చింది రుక్మిణమ్మకు .

ఇట్టాటియన్నీ ఎన్ని చూళ్ళేదు బతుకులో... దోషాలూ, దొమ్మలూ సుట్టి సుట్టి అయిపో యిందంతా. అంకమ్మ, అంకమ్మ అని నమ్ముకుంటినా?... చెంగాళమ్మ చుట్టూ తిరిగితినా... పోలేరమ్మకి పొట్టేలుతో పాంగలి ఫెడితినా... కావమ్మ తిరణాళ్ళకి నిప్పులగుండం తొక్కితినా? కనుపూరు జాతరలో మొక్కితినా? కాలి నడకన తిరపతి కొండెక్కితినా? ఏ అమ్మా అయ్యా దేనికీ అడ్డుపడనే లేదు ... జరిగేది జరిగిపోతానే వుండాది . ఏదీ ఆగల్యా... అప్పుట్లుంచే యిహన మనకి ఏ దేవుళ్ళూ, దెయ్యాలూ అడ్డుపడవని అర్ధమైపోయింది తనకి... పని... పని... తఈన పనేమో తనేమో.

లేకుంటే లోకానికి కొడుకులేమైనా కొత్తా? వోళ్ళకి రెక్కలొచ్చేది కొత్తా... ఈ దినాల్లో ఎవురి బతుకులోళ్ళవి... కన్నందుకు పెద్దచేసి, చదువుచెప్పించాల... వయసాస్తే ఒక పిల్లన్నూస్‌ పెళ్ళి చెయ్యాల... అవతల వోళ్ళ బతుకులోళ్ళవి... అంతే మన బాద్దిత... అవతల వోడిపెళ్ళాం, వోడి పిలకాయలు... వోడి సంసారం... కాటికి కొళ్ళు చాచుకుని కూర్చోని మనల్ని చూళ్ళేదంటే ఎట్ట? .. అదేవంటే మనుమంతా జూళ్ళేదా పెద్దోళ్ళని అంటాడు... అదంతా ఒక కాలం. ముందు మాదిరిగా వుండాయా ఇప్పుడు దినాలు? అంతా పరుగులు, బాదలుగా వుండాది... పల్లెల్లో మాదిరుంటాయా పట్లాల్లో.. ఆ బ్రమ్మంగారు చెప్పినట్టు మంచినీళ్ళు గూడా డబ్బులిచ్చి కొనుక్కోవల్సిందే... చాలీచాలని బతుకులు... ఎంతసేపైనా బొయి కొడుకింట్లో వుండాలం టాడు... మగ మనిషికేం తెలస్తాది... కోడలు పాొమ్మనకుండానే పాగబెట్టేస్తాది.. ఆయమ్మినీ అనుకునేదానికిల్యా... అట్టుండాయి బాదలు...

మా బాబుకి నే పాడే లాలిపాట లోకాలకన్నిటికీ జోలపాటా... ఎప్పుటెప్పుటివో జ్ఞాపకాలు మనసుని పిండిపిండి గుండెల్లో చెమరు... కళ్ళుమూసుకుంది రుక్మిణమ్మ కళ్ళల్లో పారలా పరుచుకున్న నీటిబొట్ట్బ రెప్పల తాకిడికి చెలించి కొలకుల్లోనుండి పక్కకు జారి వీడ్కోలు పలుకుతోంది. గొప్పతత్వవేత్తలా నిర్లిప్తంగా కూర్చుంది రుక్మిణమ్మ.

“ఇంకలెయి... రావుకాలానికింకా పదినిమిషాలేవుండాది. టిక్కెట్టు మూడొందలంట. ఒక టికెట్టు మీద ఇద్దర్నే పంపిస్తారంట. పద్మయ్యకి వేరే ముప్పయిరూపాయల టికెట్టు కొన్నా...” తప్పు చేసినవాడిలా జంకుతూ రుక్మిణమ్మ కేసి చూశాడు నారాయణ.

రోట్లో తలదూర్చి రోకటిషోటుకువెరవడమేమిటన్నట్న భారంగా నిట్టూర్చింది రుక్మిణమ్మ ఇద్దరూ కలిసి రెండడుగులు వేశారు పద్మయ్యశేసి ..... ఇంతలో అక్కడున్న పూలంగడి వాళ్ళు కాకుల్లా నారాయణని, రుక్మిఐమ్మనీ చుట్టేశారు. =

సర్పదోషం /రర వక్ష ౯ న ప్రతిమ ధట

“రండీ... రండి... సర్పదోషం పూజకి ఈ పూలన్నీకూడా కావాల, లోపలడుగుళారు”

“ఏం పూలయ్యా ” విసుక్కుంది రుక్మిణమ్మ.

“అమ్మా తుమ్మిపూలు స్వామివారికిష్టం, నాగమల్లిపూలు సర్ప్బదోషానికి. మీకుతెలీందే ముంది... బిల్వపత్రాలు స్వామివారికి ప్రీతిపాత్రాలు...” అదరగొబ్టేశారు. ఈ మాటలు టేప్‌చేసి పెట్టినవాటిలా వాడివాడి అరిగిపోయున్నాయి.

ఈమ దొడ్లో విపరీతంగా పూసి వాడిపోయే తుమ్మిపూలు అరపిడికెడు ఒక ఆకులో చుట్టి పదిరూపాయలన్నాడు. నాలుగు నాగమల్లిపూలు ఇరవై రూపాయలంట. మూడు తామర పూలు పాతిక. ఇన్ని మారేడుదళాలు సరిక్కాయతంలో పోసి పది రూపాయలన్నాడు. ఇవన్నీ కొని తీసుకెళ్ళకపోతే లోపల పూజార్లు పూజ చెయ్యరన్నాడు.... రుక్మిణమ్మ నారాయణ కేసి చూసింది. ఇంకా నడివయసు వీడని నారాయణ ముఖంలో ఇవ్వాల్టి ఉదయం నుండి రెండు ముడతలు ఎక్కువైనట్టు అన్పించింది... గతంలో రెండుమూడు మాత్రమే కన్పించే తెల్లవెంట్రుకలు ఇప్పుడు నాలుగైదు తయారయ్యాయి.

చచ్చినట్టు పూలన్నీ కొని సర్బదోషం తాలూకు కవర్లో వేసుకుని , హడావిడిగా నర్పదోషం పూజ జరిపించే హాలువైపుకి పరిగెత్తినట్టుగా నడిచారు........ అసలే ఓజోన్‌ పార చిట్లిన ఎండ ........ ఆ విశాలమైన అలయ ప్రాంగణంలో పరిచిన రాతి బండలమీద అరికాళ్ళు అంటుకుపోతున్నాయి ....... అప్పటికే అక్కడికి చేరుకున్న పద్మయ్య "రండి రండి ” తొందర పెడుతూ నారాయణ చేతిలోనుండి టికెట్లందుకుని ద్వారం వద్దనున్న వ్యక్తికందించి లోపలికి తీసుకెళ్ళాడు .

ఆ సువిశాలమైన మండపంలో అప్పటికే అనిపోయి వున్నారు భక్తులు .... భోజనాల బంతికి కూర్చున్నట్ట వరుసలు , వరుసలుగా బారులు తీరి కూర్చుని వున్నారు .... అంతా బాగా డబ్బున్నవాళ్ళలా కన్పిస్తున్నారు ....... ఇంతమందికి ఒకేసారి సర్బదోషం ఎందుకొచ్చిందో అర్ధంకాలేదు రుక్మిణమ్మకి .

ఆ హాల్లో ప్రవేశించి దాదాపు చివరగా కూర్చున్నారు రుక్మిణమ్మ , నారాయణా =. వారి వెనుక పద్మయ్య .... అప్పటికింకా రాహుకాలం రావడానికి ఐదు నిమిషాలుంది

కూర్చుని సర్దుకుని కళ్ళుమూసుకుని శివధ్యానం చేయసాగాడు నారాయలు ...... ధ్యానం చేస్తున్నాడో, కారిపోతున్న చెమటని తిట్టుకుంటున్నాడో అర్ధం కావడంలేదు... ఆ హాలుకి తూర్పు మూలగా వున్న చిన్న వేదిక మీద శివలింగమూ, దాని ఎదురుగా వెలుగు తోన్న ఇత్తడి దీపపు సెమ్మే.. ఆ దీపపు కాంతిలో మెరుస్తోన్న శివుడి మూడో కన్నూ. ఆ వేదిక పక్కనే నించుని భక్తులందరినీ సావధానంగా పరికిస్తోన్న ఒక ముసలి పూజార్‌...

ఆ హాలునంతటినీ ఒకసారి కలియచూసింది రుక్మిణమ్మ. ధ్యానం చేసుకుంటోన్న భర్తనీ, ఇంకా దోషనివారణకై విచ్చేసిన అశేష జనావళినీ జాలిగా చూస్తోందామె... ఆ భక్తుల్లో ఒక రాజకీయ నాయకుడున్నట్టుంది... అతడి వెనుక చాలా హంగామా వుంది...

మూసిన భర్త కనుల వెనుకనున్న ఆలోచనల పరంపరని అంచనా వేయడానికి ప్రయత్నిస్తోందామె... ఏం మొక్కుతున్నాడితడు? తమిద్దరినీ తొందరగా ఒడ్డున పడెయ్యమనా?

సర్పదోషం ఈ? ప్రయణం “లోగ

ఊహూ... ఒడ్డున పడేసేదానికైతే ఈ పూజలూ, పునస్కారాలూ, దోషనివారణలూ ఎందుకంట? అయితే ఏం మొక్కుతున్నాడు? తిరపతిలో కాపురముండే కొడుకింటికీ చేర్చమనా? ఊహూ... అయ్యుండదు... మరేంది? ఆ... యాపారం గురించే అయ్యుంటాది... ప్ప... ఇట్టనే వ్యవ సాయం చేసుకుంటాపోతే ఆ రెండెకరాలు కూడా మిగిలేట్టగా లేదు... అందుక దాన్ని తెగ నమ్మి అప్పులు తీర్చి, మిగిలిందాంతో ఏదైనా యాపారం చెయ్యాలనుకుంటుండాడు...

పుట్టిన్నాటినుండీ మట్టి పిసుక్కుంటూ బతికిన మనిషికి యాపారంలో ఒడుపులేం తెలుస్తాయని. తరతరాలుండీ తమకింత తిండి పెట్టిన నేలని అమ్ముకోడానికతడికి మనసాప్పడం లేదు... రెండు విధాలుగా ఏం చెయ్యాలో తెలీక కొట్టుమిట్టాడుతున్నాడతడు. ఆ బాధ చూళ్ళేక పద్మయ్య చెప్పాడు... సర్పదోషం పూజ చేయిస్తే అన్ని దోషాలూ, బాధలూ తీరి వ్యాపారంలో బాగా కలిసాస్తాదని... వ్యాధాచ్చినోడూ, బాధొచ్చినోడూ వకటే గదా... 'హూ' దీర్ధంగా నిట్టూర్చింది రుక్మిణమ్మ భర్త వంక చూస్తూ,

అప్పటికి మైకు సవరించబడింది.

ధ్యానాల్లోనూ, మాటల్లోనూ నిమగ్శమైవున్న భక్తులు అంతా నర్హుకు కూర్చున్నారు...

“శుక్తాంబరధరం... విష్ణుం... శశివర్ణం”

వినాయకుడ్ని ఆవాహన చేస్తూ పూజ మొదలు పెడుతున్నాడు పూజారి. అందరు భక్తులూ గొజిగినట్ట్లుగా అతడితో గొంతులు కలిపారు. శ్లోకం పూర్తయ్యాక పూజారి గొంతు సవరించుకుని చెప్పాడు.

“ఎల్లారుమే కవర్లో ఇరుంద రెండు తేంగా ఎడ్తి పక్కత్తిలో వెయ్యింగు... ఒఖ్జు సామికి... రెండావదు అమ్మణ్ణికి”

“అంతా మీ మీ కవర్లలో వున్న కొబ్బరికాయల్లో రెండు తీసీ పక్కన పెట్టండి... ఒకటి స్వామివారికి, రెండోది అమ్మణ్ణికి” చెప్పాడు పూజారి. ఒకసారి తమిళంలోనూ, రెండోసారి అచ్చ తెలుగులోనూ...

శ్రీకాళహస్తి దేవాలయం ఆంధ్రదేశానికి చెందిందే అయినా వున్నది తమిళనాడు సరిహద్దుల్లో కావడంతో తమిళులు కూడా విరివిగా సర్చదోష పూజకి వస్తుంటారు . అందుకే ఇరువురికీ అర్ధమయ్యేలా రెండు భాషల్లో మైకుని అదరగొట్టేస్తున్నాడు పూజారి ....... పూజారికేసి నిశితంగా చూసింది రుక్మిఐమ్మ....... లావుగా , నల్లగా , ఎత్తి కట్టిన మాసిన తెల్ల పంచతో , పొట్ట ముందుకొచ్చి , తెల్లటి ఎత్తు పళ్ళతో , నాలుగు రోజుల్నాటి నలుపు +, తెలుపు కలగలసిన గడ్డంతో చేసి పెట్టిన నల్లరాతి విగ్రహంలా వున్నాడతడు గొంతు కూడా బండగా వుంది . ఏం చెపుతున్నాడో అర్ధమైఛావడం లేదు .

భక్తులంతా ప్లాస్టిక్‌ కవర్లు చప్పుడయ్యేలా అందులోని పూజా సామగ్రి తీసి బయటపెట్టి _..- పూజారి చెప్పినట్టు చేయడానికి హడావుడి పడుతున్నారు... అర్ధం కాని వాళ్ళు పక్క వాళ్ళని గమనిస్తున్నారు .

అప్పటికే నారాయణ కవర్గోవున్న ఎరుపు, నలుపురంగుల గుడ్డ ముక్కల్ని కింద పరచి, పూజారి చెప్పిన నల్లధాన్యం, తెల్ల ధాన్యం పొట్లాలని రెండింటిమీదా విడివిడిగా /0్‌ ఇం రావజే

కుమ్మరించాడు... ఒక్క తల నాగేంద్రుడ్నీ అయిదు తలల నాగేంద్రుడ్నీ పూజారి చెప్పినట్లుగానే కెల్ల ధాన్యంమీదొకటి, నల్ల ధాన్యంమీదొకటీ వుంచాడు. . వెనుకనుండి పద్మయ్య సూచనలు తీసుకుంటూ. రుక్మిణమ్మ తాను వూరికే కూర్చోవడం బాగోదన్నట్టు అ పూజాసామగ్రి పాట్లాల న్నింటినీ ఒక్కొక్కటీ విప్పి పక్కన పెడుతోంది.

“నాగ పడగతలలు మీవైపు వుండేట్లుగా చూసుకోండి” అరిచింది మైకు...” ఇప్పుడు వాటికి పసుపూ, కుంకుమా పెట్టండి”

“రెండు నాగంకు మంజిల్‌, కుంకుమ్‌ వెయ్యింగో”

అరవ భక్తులూ, తెలుగు భక్తులూ కూడా పూజారి చెప్పినట్టే చేశారు...

“అగరొత్తులు కూడా వెలిగించి పెట్ట” పక్కవాళ్ళనడిగి అగ్గిపెట్టి తీసి అందించాడు పద్మయ్య నారాయణకి... పద్మయ్య నారాయణకి చిన్ననాటి 'స్నేహితుడు... పండిత పుత్రుడు... తాత కవిత్వం రాశాడంట... తండ్రి జ్యోతిష్యం చెప్పేవాడు... ఆ పాత వాసనలతోవే ఇతడు పదిమందికీ మంచీ చెడూ చెప్తూ వూళ్ళో పేరు తెచ్చుకున్నాడు.

నారాయణ ఏం వ్యాపారం చేయాలో అర్ధంకాక ఎప్పుడు మొదలుపెట్టాలో తెలియక పద్మయ్య వద్దకు మంచిరోజు చూడమని వెళ్ళినపుడు ఈ సర్పదోష పూజ చేయిస్తే అంతా వరిపడిపోతుందని స్పేహితుడ్ని దగ్గరుండి శ్రీకాళహస్తి గుడికి తీసుకొచ్చాడు పద్మయ్య...

మైకు బిగ్గరగా స్వామివారి అష్టోత్తరాన్ని పరిస్తోంది.

భక్తులంతా కూడా ఏదో గొణుగుతూ, మంత్రాలు వల్లిస్తూ తుమ్మిపూలు చేతిలోకి తీసుకుని ఒక్కొక్కటి నాగపడిగలమీదికి జారవిడుస్తున్నారు. రుక్మిణమ్మ కూడా ఏంతోచక వాగమల్లి పూలని అందంగా రెండు వెండి నాగపడిగల చుట్టూ అలంకరించింది.

ఏవేవో రెండు అప్టోత్తరాలు చదివి ఎట్టకేలకు పూజని పూర్తిచేశాడు పూజారి... రెండు భాషల్లోనూ భక్తులకేవో సూచనలు చేస్తున్నాడు...

రుక్మిణమ్మ యాధాలాపంగా తమ ఎదురుగా కూర్చుని వున్న జంట కేసి చూసింది... అతడెంతో విసుగ్గాపెట్టాడు ముఖం... బలవంతపు మాఘస్నానంలా తామర పూరేకుల్ని వాగ పడిగల మీదికి విసురుతున్నాడు వినుగా... ఆమె భర్త వంక భయంగానూ, భగవంతుడి వంక భక్తితోనూ చూస్తూ ఏక నమయంలో రెండు పాత్రలు నిర్వహిస్తోంది.

“భక్తులంతా ఆ పడమర మూలకి వెళ్ళి బెంకాయల్ని కొట్టి తీసుకొచ్చి పెట్టండి” మైకు బొంగురుగా అరవడంతో భక్తులంతా బిలబిలా లేచి వెళ్ళి రప ఠప మంటూ టెంకాయలు

కొట్టారు. నారాయణ కూడా కొబ్బరికాయ పట్టుకుని లేచి వెళ్ళాడు. ఎదురుగా కూర్చున్న కౌసిక సామ్రాట్‌ మాత్రం లేచి వెళ్ళలేదు అతడి భార్యే లేచి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి తెచ్చి పూజ చేసిన నాగపడిగల ముందు పెట్టింది.

ఇంతలో హారతి కర్పూరం వెలుగుతూ భక్తులందరినీ దాటుకుంటూ వస్తోంది.

“అంతా నాగదేవతకి హారతిచ్చి దణ్ణం పెట్టుకోండి”

భక్తులంతా శ్రద్ధగా మాస్టారికి భయపడే బడిపిల్లల్లా పూజారి చెప్పినట్లే చేస్తున్నారు... ఈ లోపుగా పూజారి భక్తులందరి తరపునా భగవంతుడికి మనవి చేస్తూ దీవెనలందిస్తున్నాడు.

శవ? ౬ప్రమణం “లో

“వా, వీళ్ళందరికీ వాళ్ళవాళ్ళ కార్యసిద్ధి కోసం తోడ్పడు... ఇక్కడికి విచ్చేసిన భక్తుల్లో ఏల్లల్లేని వారికోసం పిల్లల్నీ, పెళ్ళికాని వారికి పెళ్ళినీ, విద్యార్థనకోసం వచ్చిన వారినీ, కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలను కుంటున్నవారినీ, ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్నవారినీ అందరికీ కూడా దయ చూపు. వాళ్ళు కోరిన కోరికలు తీర్చి కరుణించు శివా...' అంటూ మళ్ళీ ఇవే వాక్యాల్ని తమిళంలో నివేదిస్తున్నాడో సర్వాంతర్యామికి... ఒక్క భాషలో చెప్తే అర్ధకాదేమో ఆయనకి. లేక ఏ ఏ భక్తులకు ఏమేం వరాలివ్వాలో చెప్తేనే కాని తెలియదా? ఏందో... బాబాలూ... అవధూతలంటే మనుషులు కాబట్టి డబ్బు గుంజుతుండారనుకుంటే... ఈ దేవాలయంలో కూడా... అంతా డబ్బు మయమైపోయింది.

అందరూ శ్రద్ధగా దణాలుపెట్టడం పూర్తయ్యాక... పూజారి గొంతు మళ్ళీ ఖంగు మంది... ఈ సారి అతడు మైకును ఉపయోగించకుండా నమ్రత నిండిన న్వరంతో గట్టిగా చెప్తున్నాడు... మైక్రోఫోను కంటే స్పష్టంగా వుందతడి గొంతు.

“ఇప్పుడు అయ్యవారు మీ అందరి వద్దకూ ఆశీర్వదించడానికి వస్తాడు... భక్తులంతా ముప్ప్ఫైయ్యొక్క రూపాయలు పూజ చేసినందుకు దక్షిణగా యివ్వండి... పూజార్లకు భోజనాది కొల కోసం, బియ్యమూ, పప్పులూ, ఉప్పులూ ప్రత్యేకంగా మీరు తీసుకురాలేదు కాబట్టి ముప్ఫైయ్యొక్క రూపాయలూ, అంతకుమించి వారివారి ఇష్టంతో దక్షిణలు నమర్చించు కోవలసినదిగా కోరుతున్నాము...”

అదే విషయాన్ని మళ్ళీ తమిళ భక్తులకు వివరిస్తున్నాడు.

రుక్మిణమ్మకి చెడ్డ చిరాకొచ్చేసింది... భక్తుల్ని ఇంత పెట్టండి, అంత పెట్టండి అంటూ వేధించడమేమిటి? బయట తను మండపంలో కూర్చుని 'క్యూ'లో వున్న భర్తకోసం ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ గుడిగోడకి వేళ్ళాడుతుండిన బోర్డు మళ్ళీ గురొచ్చింది... 'భక్తులు ఎటువంటి కానుకలైనా, దక్తిణలైనా హుండీలోనే వేయవలెను... పూజార్లు కోరినప్పటికీ వారికివ్వద్దు.. ఆటువంటిదేమైనా జరిగితే వచ్చి ఫిర్యాదు చేయగలర... ఇట్లు కార్య నిర్వహణూధికారి' అని వ్రాసి వుంది.

రుక్మిణమ్మ ఆలోచలోనుండి తేరుకుని చూసేటప్పటికి ఆ విశాలమైన హాలులో వున్న దాదాపు వెయ్యిమంది కూడా తమ పర్సుల్లోనుండి ముఫ్ఫైలూ, యాభైలూ, వందలూ తీసిపెట్టుకుని ఆశీర్వదిస్తూ వస్తోన్న పూజారి కోనం వినమ్రంగా ఎదురు చూస్తున్నారు.

ఈ పాపమంతా ఇచ్చేవాడిదో, తీసుకునేవాడిదో అర్ధంగాక చూస్తోన్న రుక్మిణమ్మకి ఒళ్ళు మండిపోయింది.

పాద్దుట్నుండీ చూస్తోంది... ఏందీ దోపిడీ...

నలుగురితోపాటు నారాయణ కూడా ముప్ఫైయ్యొక్క రూపాయలు రుక్మిణమ్మ అడ్డు పడుతున్నా వినకుండా పూజారికిచ్చేసి ఆశీర్వాదం పాందాడు. కుతకుతలాడిపోయిందామె.

“ఇప్పుడు రెండు నాగపడిగల్నీ చేతిలో వుంచుకుని ఆత్మప్రదక్షిణ నమస్కారం చేసుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడున్న హుండీలో ఈ నాగపడిగల్ని జారవిడవండి” మైకు మళ్ళీ అరిచింది.

వర్చదోషం 7/0 షా ఎఆవజడోే

కుతకుతలాడిపోతూనే రుక్కిణమ్మ పైకి లేచింది .

అంటే... ఈ నాగపడిగలు హంండీలోనుండి బయటపడి, మళ్ళీ నర్చదోష కవర్లర్లో దూరి కొత్త భక్తుల చేతిలోకి వెళ్తాయన్నమాట. విసుగ్గా నారాయణకోసం, పద్మయ్యకోసం కూడా ఎదురుచూడకుండా, ఊపిరాడనట్లుగా వున్న ఆ హాల్గోనుండి తోసుకుంటూ బయట పడిందామె. "

గుంపులు గుంపులుగా స్వామివారి దర్శనానికి పరిగెడుతోన్న జనాల్ని విస్తుపోయి చూస్తోంది.

“ఈ గుళ్ళో ఇంతకుముందంతా ఇంత రష్‌ లేదు. ఇప్పుడే ఇట్లుంది... ఈ నడమ ఆ గంగూలీ, నగ్మా ఇద్దరూ వచ్చి సర్పదోష పూజ చేయించుకుని పోయారంట. అప్పుడ్డుండీ మరీ ఇంత పబ్లిసిటీ వచ్చేసింది ఈ పూజకి

దుక్మిణమ్మకి కొద్దిదూరంలో నిల్చుని ఎవరి గురించో ఎదురు చూన్తున్న ఒక జంట... వారిలో వారే ఇసుక వేస్తే రాలని జనాల వత్తిడిని తిట్బకుంటున్నారు.

“అదేంది?... నువ్విక్కడుండావా?... నీ కోనం వెతుక్కుంటుండాము... రా... రా స్వామివారి దర్శనానికి వెళ్దాం... అప్పుడే చూడు ఎంత “క్యూ వుందో...” చెప్పాడు నారాయణ భార్యని వెతుక్కుంటూ వచ్చి...

“నేన్రాను... మీరిద్దరెళ్ళండి”

ఖచ్చితంగా వున్న భార్య గొంతువిని నివ్వెరపోయాడు నారాయణ... ఈ తంతంతా భార్యకి చాలా కోపం తెప్పించిందని అర్ధమవుతూనే వుంది. భార్యకి అంత భక్తి లేదని తెలుసు కానీ, అసలు దేవాలయాల్లోనే భక్తి లేదన్న సంగతి యిప్పుడే అర్ధమయింది నారాయణకి.

అయినా భార్య మాటల్ని పట్టించుకోకుండా.

“లదిచానా పేరుగల్ల గుడి... కొన్ని వందల ఏళ్ళనాడు తమిళ రాజులు కట్టించిం దంట... అప్పట్లోనే ఎనిమిది కోట్టయిందంట... లోపల శిల్పాలూ, స్తంభాలూ అన్నీ చాలా బావుంటాయి...

“అవునమ్మా చాలా బావుంటుంది గుడి... రా పోదాం” పిలిచాడు పద్మయ్య...

“వొద్దు పద్మయ్యా, నేన్రాను... మీరెళ్ళండి. . ఈలోపుగా నేను బొయ్యి అ కార్య నిర్వహణాధికారెవురో తెలుసుకుని ఫిర్యాదు చేసాస్తాను... ” స్థిరంగా వున్న రుక్మిణమ్మ స్వరాన్ని విని నిర్ధాంతపోయి చూస్తున్నాడు పద్మయ్య,

“ఏమనీ?” విస్తుపోయి ప్రశ్నించాడు నారాయణ .

రుక్మిణమ్మ ప్రవర్తన యిద్దరినీ ఆశ్చర్యపరుస్తోంది .

“అవునయ్యా నేను పోయి కంప్లయంటిచ్చాస్తా... భక్తుల్ని దక్షిణలు పెట్టమని వేధిస్తుం డారని...”

“ఏందమ్మా నువ్వు ? ఇట్టాటివన్నీ యిక్కడ మామూలే!”

“అయితే ఎందుకా బోర్డు?”

ఈ ధషం/ ళల

“బోర్లు పెడతారు... నిజాయితీగా వుండామని తెలపడానికి. అంతమాత్రాన భక్తలు వెళ్ళి ఫిర్యాదు చేస్తారా?... చేసినా... వాళ్ళు పట్టించుకుంటారా ? వాళ్ళకీ, వీళ్ళకీ ఎన్నో లింకులు... అదరికీ భాగాలుంటాయి... ఇదంతా పెద్ద వలయం లాంటిది...” పద్మయ్య నవ్వాడు వెటకారంగా...

“ఇట్టాటియన్నీ శానా వుంటాయిలే,పోదాంపద” రుక్మిణమ్మ చెయ్యి పట్టకున్నాడు వారాయణ. భర్తకేసి తీక్షణంగా చూసింది రుక్మిణమ్మ...

“ఇదంతా యిప్పుడు మామూలే... ఎక్కడలేదు చెప్పమ్మా! ఈ గుడికి మాత్రమే వరిమితనూ?... తిరపతి కొండమీద కళ్యాణం చేయించాలంటే లేదా?... అన్నవరంలో సత్యనారాయణ వ్రతం చేయాలంటే లేదా?... భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో లేదా?... శ్రీశైలంలో లేదా? ఎక్కడలేదు చెప్పమ్మా! ప్రతీచోటా వుంది...” రుక్క్మిణమ్మకు నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తూనే అన్నీ ఏకరువు పెట్టాడు పద్మయ్య.

“అదేంది పద్మయ్యా, అట్టంటావు... అంతా యిట్స్నే వుండాదని అందురూ చూసీ చూడకుండాపోతే ఎట్ట పద్మయ్యా ? చదువులూ, వైద్యం సరే మనమాదిరోళ్ళకి అందుబాట్లో లేకుండాపోతుండాయి... ఆఖరికి దేవుడ్ని కూడా మామూలోళ్ళకి అందకుండా చేసేస్తే ఎట్ట చెప్పు?” తీవ్రంగా ప్రశ్నించింది రుక్కిణమ్మ

చిరాకేసింది నారాయణకి “ఆ... లే... ఇప్పుడీమె బొయ్యి అంతా సరిచేసేస్తాది” పద్మయ్య ముందు ఇదంతా పెద్ద అవమానంగా అన్పిస్తోంది నారాయణకి.

న! న! శ

నారాయణ, పద్మయ్యల మాటవిని రుక్మిణమ్మ ఫిర్యాదు చేయడం మానుకుందా, లేక చేసిందా? చేసినా ఆ కార్యనిర్వహణూధికారి పట్టించుకున్నాడా లేదా అన్నది మనకి తెలియదుగానీ, కొన్నాళ్ళ తర్వాత నారాయణ ఆ దేవాలయం ముంగిట్లో బెంకాయల వ్యాపారం మొదలుపెట్టడం మాత్రం నిజం...

దొడ్డో పూసే తుమ్మిపూలనీ, మారేడుదళాలనీ ఆకుల్లో చుట్టి గుళ్ళో అమ్మే దాంట్లో వగంఖరీదుకే విక్రయిస్తోంది రుక్మిణమ్మ.

ఇప్పుడు... రాహుకాలాల్లోనే కాకుండా నర్చదోష పూజ రోజంతా చేస్తున్నారా దేవాలయంలో.

72

అడవిలో మొక్క

గుడిసె ముందరి నిద్రగన్నేరు చెట్ట వడదెబ్బకి నీరసించిపోయిన పసిపిల్లాడిలా వడలి పోయిఉంది. మట్టితో అలికిన వాకిలి మే నెల ఎండకి పగుళ్ళిచ్చిపోయి ఉంది.

“ఆ ఎన్టీవోడొచ్చి రెండ్రూపాయల బియ్యమంటే, సారాయి లేదంటే, ఇదుగో అల్లు డొచ్చి డాశ్రాలు, పొదుపులక్ష్మీ అంటే నంబరపడిపోతిమి. మనంగూడ వోళ్ళతో పాటుగా దిగులూ, యిచారం లేకుండా బతకొచ్చనుకుంటిమే... ఆ ఏమీలేదబ్బా ఎవుడొచ్చినా, ఏం చేసినామన్నా మన బతుకులు మాత్రం యింతే. యిట్టనే ఎలబారాల్సిందే... అమెరికా వోడొచ్చి మాత్రం ఏంజెయిబోతాడు”

వాకిట్లోని మట్టి అరుగు మీద గొంతుక్కూచుని సమయం, నంధర్చం లేకుండా మాట్లాడుతోన్న తల్లికేసి మింగేసేలా చూసింది బుజ్జ్వమ్మ

“'ముసల్వునికి దినదినానికీ తెలివిలేకుండా పోతుండాది.

అడవిలో అనం? 5

ఈడ మనుం మాట్లాడకునే విషయమేంది... ఈమి మాట్లాడే మాటలేంది?...' అనుకుని ఏదో విసురుగా అనబోయి ఒకవేళ మనవరాలికి మన బతుకుల గెతి, గతుకులూ ఎత్తి చూపీడం కోనం యిట్లా అర్ధం వర్ధం లేకుండా మాట్లాడుతోందేమోనని అర్ధమయి తటపటాయిస్తూ మౌనం వహించింది. అప్పటికి వాకిలి చిమ్మడం పూర్తికావడంతో చీపురు పక్కన పడేసి, గుడిసె గుమ్మంలో కొచ్చి లోపలికి తొంగిచూసింది బుజ్జమ్మ ఒంటినిట్రాటి గుడిసె లోపల ఒకపక్కగా కూర్చుని వుంది జ్యోతి. పావడా కొనని పాదాల కింద తొక్కిపట్టి, మోకాళ్ళ చుట్టూ చేతులు బిగించి మోకాలి చిప్పల మధ్య గడ్డం అనించి, మేనత్త వైపూ, వాయినమ్మ వంకా పులుకూ పులుకూ చూస్తోంది. బయట బరబరామంటోన్న చీపురు శబ్దం ఆగడం, అటుపిమ్మట అత్త గుమ్మం వంక వస్తున్నట్లుగా నీడ కదలాడ్డంతో గబుక్కున మొహాన్ని మోకాళ్ళలో దాచేనుకుంది. అప్పటికే బుజ్జమ్మ గుమ్మంవద్దకి రావడంతో, మేనకోడలి చేష్పచూసి మరింత ఒళ్ళుమండి అరవసాగింది. “మే. ఇదే అఖరుసారిగా చెప్తుండా... నేన్చెప్పినట్టుగా యిన్నావా సరే వుంది, లేదంటే మీ అమ్మకాడికి పార్సిలు జేసేస్తా...” కుడిచేయి తర్జని చూపిస్తూ బెదిరిన్తున్నట్టుగా అంది బుజ్జమ్మ జ్యోతి గుండె గుబగుబలాడింది... వణుకుతూ గట్టిగా కళ్ళు మూసుకుని అట్లాగే వుండిపోయింది... ఏం మాట్లాడకుండా. ముప్పయి దినాలుగా ముగ్గురి నడుమ నలుగుతోన్న నమన్య ... మూడు దినాలుగా ముడివడి మధ్నాన్నానికి ముట్టిమోపు కొచ్చింది. ఒంటిగంటకి రెడ్డోరింటి కాడ్నించి ఒచ్చింది మొదలు ఒకటిగానే ఎత్తుకుంది బుజ్జమ్మ... ముందు వస్తానే మంచినీళ్ళు పట్టిపెట్టనందుకు శాపనార్జాలు పెట్టింది. ఆ తరువాత వాకిలి చిమ్ముకోలేదని ఎగిరిపడింది. ఇక అప్పట్సించీ జ్యోతి తను చెప్పిన మాట వినడం లేదని మొదలుపెట్టింది. నీళ్ళు పట్టుకొచ్చి పెడుతూ తిట్టింది. వాకిలి చిమ్ముతూ చెప్పి చూపింది. అయివా జ్యోతిలో కదలిక లేదు. విజానికి బుజ్జ్వమ్మ తమ ఎరికల కులంలో తప్పబుట్టిందని అంతా అనుకుంటారు. మాటతప్పనితనం, యాజమాని కాల్లో చెప్పిన పని చేత్తో చేసుకుపోవడం ఎప్పుడయినా రెడ్డ మ్మలు నోరు చేసుకుని అరిచినా పన్ఫెత్తి మాట్లాడకపోడం, వాళ్ళు చేయి ముట్టిపెడితే తప్ప అది కావాలి, యిది కావాలి అంటూ షరతులు పెట్టకపోవడం, ఒకరు వేలెత్తి చూపించలేని వనితనం, పని, పని, పని అంటూ పనిరాక్షసిలా మూడిళ్ళలో చాకిరీ చేసొచ్చి తిరిగి తనింట్లో పనంతా తనే చూనుకుంటుంది బుజ్జ్వమ్మ అరవిలో 7/6 ఎపవ్యము+

“మొదులాయమ్మిగ్గాన యింత బిన్నా పెళ్ళికాకుండా వుంటే, ఏ బాదాలే... మిమ్మ ల్నంతా అడగబోయేది లే...” చేతులు తిప్పుతూ మనవరాల్ని అదిలిస్తున్నట్టుగా గొయుక్కుంటోంది సుబ్బమ్మ

తల్లికేసి కొరకొరాచూసి -

“ఇంటొయనుంటే మంగలాయన్ని పిల్చునన్నట్టుగా వుండాది. నా బిడ్డుంటే ఈ లంజిని అడిగేదేముండాది. ఆయమ్మి లేకనే కదా ఈ బాధంతా. అయినా చేసి పెట్టినట్టల్లా తినికూచోవి కొవ్వు బట్టుండాదీటికి.” తాను కష్టంజేసి అదితెచ్చిపెడితే తిని, తిరుగుతోన్న మేనకోడళ్ళ మీద చెప్పలేనంత ఆవేశంగా వుంది బుజ్జమ్మకి.

ఎండిపోయిన రొమ్ముమీద పట్టు దొరక్కుండా జారిపోతోన్న పాఠ బెర్లిన్‌ చీరని మాటి మాటకీ నర్దుకుంటూ ఆవేశంగా అరుస్తోన్న అత్తకేసి జాలిగా చూసింది జ్యోతి. చిన్నరెడ్డమ్మంత వయనుంటాది అత్తకి. ఆయమ్మ మాదిర్తో కిరిములూ, ఫేరండ్లన్లీలూ పూసి, జ్యూసులు తాగిస్తే అత్త రెడ్డమ్మ కంటే కూడా అందంగా వుంటాది. అక్కలు, చెక్కులుతో కూడా ఎండుకుపోయి వున్న అత్త మొహాన్ని బుగ్గలతో వూహించుకుంటూ ఆనందిస్తోంది జ్యోతి.

జ్యోతి చాలాసార్లు అత్తతో కలిసి రెడ్డమ్ముల యింటికి వెళ్ళివుంది. పని చేయడం కోనంకాదు. రెడ్డమ్మలు ఏం తింటుండారు, ఏం తాగుతుండారు, మొహానికి ఏం పూసు కుంటారు... ఎట్లా మాట్లడ్తారో యివన్నీ పరికించడం కోసం... వాళ్ళ యింట్లోని పెద్దపెద్ద అద్దాల్లో తననితాను చూసుకోవడం కోసం. ఒకసారి చిన్నరెడ్డమ్మ పారేసిన పెయిరండ్లన్లీ ట్యూబు తీసుకొచ్చి, చీల్చి దానిలోపల క్రీము నాలుగయిదురోజుల పాటు మొహానికి రాసుకుంది జ్యోతి. అది వాడొక అద్దంముక్కలో చూసుకుంటే తన మొహం తేటంగానూ, తెల్లగానూ అన్పించింది. అప్పట్నుంచీ అవ్వని అట్టాంటిది కావాలని వేధించసాగింది. ఒళ్ళుమండి అవ్వ వీవు సాపు చేసిందే తప్ప అట్టాటి ట్యూబు కొన్లేదు.

“మే జ్యోతా... రా...రా... ఆడ సినిమా బండొచ్చింది. కొత్త సినిమా మార్చినారంట. కాగితాలిస్తుండారు. సిరంజీవి సినిమా మే...” బయట్టుండి పరిగెత్తుకుంటూ వొస్తూ వొగరుస్తూ చెప్పింది చిట్టి, జ్యోతి తరవాతది.

సెట్‌...ఫెట్‌... ఫెడేల్మంటూ నాలుగుబాదులు బాదింది బుజ్జ్వమ్మ చిట్టి వీపుమీద.

“లమ్మీముండల్లారా... నా కండలు కరిగించి తెచ్చిందంతా మీ యదాన గొడ్తుండాను గదే. యింత చిన్నపనికి సాయమేమన్నా వుండాదా? సిరంజీవి సినిమా అంట సిరంజీవి సినిమా... ఫొండే పోయి సిరంజీవి సంకనాకుబోండి...” ఉద్వేగాన్ని ఏంచేసుకోవాలో అర్ధంకాక పిడిగుద్దులు గుద్ది, చిట్టివి జుట్బపట్టి లాగిలోసింది బుజ్జమ్మ

ఎదురుచూడని ఈ దెబ్బలతో ఒక్క నిముషం షాక్‌లో వుండిపోయి ఆ తరువాత నోరంతా తెరిచి బిగ్గరగా ఏడవసాగింది చిట్టి .

శయ మొ వం క రాదషా న్‌

“చంపేసిందమ్మా... చంపేసింది బిడ్డని. ఈ ముండా గన్నా బిడ్డలు దెబ్బలు తిని తినే సావబోతారు...” చిట్టిని దగ్గరకి లాక్కుని వీపు నిమురుతూ శాపవార్థాలు పెడుతోంది సుబ్బమ్మ ఆ తిట్టడంలో ఎక్కువభాగం కూతురి మీద నిష్టూరాలే.

దాంతో బుజ్జ్ఞమ్మకి మళ్లీ శివమెత్తింది.

“మొ... నేను పెట్టింది తినేసి, చెప్పిందిని గమ్మన పడుంటారా వుండండి. లేదంటే బయటికి పాండి... మీ వల్ల మా మొగుడూ, పెళ్ళాల సందు దినుమ్మూ తగువే కదా... ఎంత తమ్ముడి పిలకాయిలయితే మాత్రం ఓపికుండాదా నాకు చేసి పెట్టడానికి. గోసంగులు మాదిరి ఎదిగుండాయి. యింకా పనికి పోకపోతే ఎట్లా జరగతాది?”

“యాందిమే నువు జెప్పేది వేను గాన ఒద్దంటుండానా? ఆయమ్మి పనికిపోతానంటే... పామ్మనేగదా చెప్తా వుండాను. నువు గూడ యింటానే వుంటివే” సాగదీసింది సుబ్బమ్మ

“మొ... అదంతా నాకు తెలవదు. రెడ్డెమ్మ రేపు బుధారం నాటికి మద్రాసుకి పోతా దంట, సుజనమ్మ దగ్గరికి. అ పాద్దువాటికి ఈయమ్మిని కూడా అంపితే తీసకపోయి కూతుర్హగ్గిర వదిలిపెట్టాస్తాదంట...” చెప్పింది బుజ్జ్వమ్మ

తల్లి మౌనంగా వుండడం చూసి మళ్ళీ “మొ... నాకు తెలవకడగతానుగావ్యా మనిళ్ళ కాడ కంటే వోళ్ళిళ్ళ కాడ బాగ జరగదా? మనం రెండు పూట్లా రెండేసి కూరల్తోగిన తింటుండామా చెప్పు?” అంది.

“ఆ... నాకెందుకి తెలవదా? రేత్రి కూరలు పొద్దునా, పొద్దటి కూరలు రేత్రే గదా పెట్టేది రెడ్డోరింట్లో...” మనమలోనవే గొణుక్కుందిగానీ, పైకి అనడానికి ధైర్యం చాల్లేదు మబ్బమ్మకి.

“మొ... యిన్ని మాటలు బళ్ళే. బుధారం నాటికి ఆయమ్మికి ఏం జెప్తావో చెప్పుకో... గుడ్డలు రెండు జతలూ వుతికి ఆజరుగా బెట్టు. రెడ్డెమ్మతో పంపించేది పంపించేదే. జ్యోతిని పంపిస్తానంటేనే కదా మొన్న మనింట్లో పెళ్ళికి అయిదేలిచ్చిందామె. మనమీద (ప్రేమ పుట్టిగాన యిచ్చిందా? పన్చేసుకోపోకపోతే ఎట్ట తీర్చాలని? బుధారం ఆయమ్మి పాయ్యిందా సరే లేదంటే పీలకాయలిద్దర్నీ తీసుకుని నువ్వు వూరికి పో... నేను మేసలేను మిమ్మల్పందర్నీ... నా వల్ల గాదు” ఖచ్చితంగా చెప్పి తల ముడేసుకుంటూ, పైటని ఎగేనుకుంటూ బయటికి నడిచింది బుజ్జమ్మ యింక పనాళయిపోయిందనుకుంటూ.

“పద్మమ్మింటి! నేన్నోతాలేమ్మే... నీవు రెడ్డోరింట్లో చేనుకో ” కూతురు మళ్ళీ రెండో పూట పనికి పోతుంటే సుబ్బమ్మకి జాలేసింది.

“ముందు నువ్వసలు యింట్లో వుండేదా, బయటకు పోయేదా తేల్చుపో అవతల బోదువు పద్మమ్మింటికి..” ఏవయినా తను తిరిగొచ్చేలోపుగా తేలిపోవాల్సిందిగా చెప్పి విసవిసా రెద్డోరింటి వైపుగా సాగింది బుజ్జమ్మ

అడవిలో క్‌

ఆ ఉదయం ఇటుక శూల నాయుడోళ్ళింట్లో తిన్న మూడు యిడ్డీలే... రెడ్డోరింట్లో తాగిన టీనీళ్ళ. నడుస్తూంటే కళ్ళు తిరుగుతుండాయామెకి. కాళ్ళులాగతుండాయి. రెండిళ్ళల్లో పెట్టిన సద్దన్నమంతా దెచ్చి మేనకోడళ్ళకీ, తల్లికీ పెట్టింది మొగడు చీకట్లో శూలపనికి పోయినా డంటే రేత్రిగ్గానీ రాడు. ఎంత సంపాదిస్తాడో ఏమో. తాగుడికి, ముండలకీబోను మిగిల్తే బుజ్జమ్మ చేతికిస్తాడు.

లేకపోతే అడిగేదానికి లేదు... బుజ్జమ్మ ముసలిదయిపోయింది వాడి దృష్టిలో. వాడు మాత్రం అట్లనే వుండాడు ఆ పాద్దుట్పుండి ఈ పాద్దుటిదాకా. నడుస్తోందేగానీ బుజ్జ్వమ్మ ఆలోచనలన్నీ గందరగోళంగా వున్నాయి. సుజనమ్మేవడిగిందీ నడవ. “ఈ బుజ్జ్ఞమ్మని నిల్చే యండి మమ్మీ... వాలుగు రోజులయినట్టుంది స్నానం చేసి. ఇదే చీరతో వస్తోంది. మా అత్తింట్లో అయితే ఎంత మాత్రం ఒప్పుకోరు, యిట్లాంటి పనోళ్ళని వుంచుకోవడానికి. మా యింట్లో వుండే లక్ష్మి పనిపిల్ల ప్రతిరోజూ స్నానం చేయందే వూరుకోరు మా అత్తమ్మ...” అత్తింటి గొప్పలు చెప్తూ తనకి దూరంగా జరిగింది.

ముక్కుమాత్రం మూసుకోలేదంతే. నిజమే... తను నాలుగు దినాలుగా యిదే చీరతో వుంది. నీళ్ళు పోసుకున్నా కూడా మళ్ళీ యిదే కట్టుకుంటాది. సుజనమ్మ మాదిర్తో నాకేవన్నా

బీరువానిండా చీరలుండాయా? మోటారు నిండా నీళ్ళుండాయా పొద్దనా, సాయంత్రం యిష్పిన చీరలు ఉతికేయడానికి పనోళ్ళుండారా? నీళ్ళు పోసుకోని తిప్పటానికి.

ఉబ్గెమ్మ ఏ కొప్పయినా పెడ్తాది.. ఏ మాటయినా అడగతాది. ఇంత అన్నానికి గతిలేక వోళ్ళింట్లో పాచిపని చేసేప్పుడు వాళ్ళేమన్నా పడాల. వాళ్ళేం పెట్టినా తినాల. ఎందుకోగాని కళ్ళలో నీళ్ళూరాయి బుజ్జమ్మకి. ఒక్కగానాక్క కూతురు పెళ్ళయేదాకా తనతోపాటు పనికీ బాటకీ వచ్చేది . ఏ యింట్లో ఏయమ్మ తొందరపడి ఒక మాటన్నా పన్నెత్తి మాట్లాడేవాళ్ళు కాదు తనూ కూతురు. ఆ మంచితనం మీదే కదా నమ్మి అయిదేలిచ్చింది రెడ్డెమ్మ, ఆయమ్మ మాట దక్కిచ్చాల్నా పళ్ళేదా? ఇన్ని యిళ్ళల్లో పని చేస్తుండాదిగాని ఆయమ్మంత మంచోళ్ళు యాడా వుండరు. ఆయన్ము మాదిరి ఎవురూ పెట్టరు.

వూడిపోయిన జుట్టుని మళ్ళీ ముడేసుకుని పైట సర్దుకుంది బుజ్జమ్మ ఈ దినాల్లో ఎవరు? అంత బాగా మాట్టాడేవోళ్ళు. పాచిపని చేసుకునేదాన్ని నమ్మి డబ్బులిచ్చేటోళ్ళు. రెడ్డెమ్మ మంచితనాన్ని పదేపదే జ్ఞాపకం చేసుకుంటోంది బుజ్జ్బమ్మ

ఈ రోజుల్లోనే పనివాళ్ళని యిదివరకటంత నీచంగా కాకుండా బాగా చూసుకుంటున్నా రనీ, నాటికాలం నుండీ పని చేసి చేసి ఎర్రబడిని పనోళ్ళ కళ్ళని చూసి ఒకింత జంకుతున్నారనీ, తమ పనికీ, చేతులకీ అంత విలువ వుందనీ బుజ్బమ్మకి తెలీదు. ఎవరయినా చెప్పినా అర్ధం కాదు.

అడవిలో

  • ఫపవ్యవ్నూ//7

రెడ్డెమ్మ చానా మంచిది. అంతే... ఎంత మంచిది కాకపోతే ఐదేలిస్తాది. తను జ్యోతిని పంపిస్తానంటే మాత్రం ఒప్పి ముందుగా డబ్బులీయడమంబే గొప్పే కదా... ఈ పిల్లగ్గాకపోతే అర్ధంగావడం లేదు గాన్యా...

సుజనమ్మ అతల్తోళ్ళు యింకా గొప్పోళ్ళంట. పనోళ్ళని అంతబాగా నూస్తారంట. దినుమ్మూ నీళ్ళు బోసుకోవాలంట. పనిపిల్లకి యేరేగా ఒక సబ్బిస్తారంట. వాళ్ళ పిలకాయిలు బిస్కెట్లు దింటే బిస్కట్లు, కేకులు దింటే కేకులూ యిప్పిస్తారంట పనోళ్ళగ్తూడ. అట్టాటి తిండి తినడానికయినా దీనికి ప్రాప్త్రముండొద్దా? అన్నీ అమ్మ బుద్దులూ... భోగమేషాలు.

అయినా ఈపిల్ల పోనని మొండికేస్తే ఏంజెయ్యాలి ? తనకొచ్చే ఈ జీతం డబ్బుల్లో ఎప్పటికి అప్పుదీర్చాల? అప్పుతీర్చకుండా సచ్చిపోతే యిహనేమయినా వుండాదా? బుజ్బమ్మ దెయ్యమై పుడ్డాది.

అలవాటుపడ్డ కాళ్ళు అప్పటికి పద్మమ్మ యింటికి తీసుకుపోవడంతో బుజ్జమ్మ ఆలోచనల బండికి అంతరాయం కలిగింది.

“యాంబుళ్లీ పొద్దున మొగిచ్చేసినావు? అవున్లే రెద్దోరిళ్ళల్లో అయితే ఒక్కనాడు గూడ మొగిచ్చకుండా జేస్తావు. ఆ శముంతలమ్మ యిచ్చినట్లు నేనీగలనా వేలకువేలు? తను చేయలేని పని శకుంతల చేసినందుకు అక్కసుగా వుంది పద్మమ్మకి. దాదాపు ప్రతిరోజు యిదే రకమయిన స్వాగతం లభిస్తుంది బుజ్జ్బమ్మకా యింట్లో. అయితే తిట్ల ధండకంలో మాత్రం కాన్త తేడా వుంటుంది.

|! శ క

కూతురి నోట్లో నుండి తమని యింట్లో నుండి బయటికి నడవమన్న వార్త వినగావే నుబ్బమ్మ గుండె వాణికింది...

మొగుడి మింగి, పెద్దకొడుకుని మింగి, మూడో కూతుర్ని మింగి... తను మాత్రం శిలేనుకుని నిలబడ్డాదీ భూమ్మీద. యిదిగో యియ్య న్నీ చూడ్డానికే గావాల.

నలభయి రెండేళ్ళనాడు తనీ వూరికి కోడలయి వచ్చినపుడు ఈ వూరిట్లా లేదు. బజారు వీధిలోని పదిపదిహేను యిళ్ళు మాత్రమే మొత్తంవూరు. వూరు మొత్తానికీ కలిపి శెట్టంగడొకటే వన్తువులకి. ఊరికి ఒక చివరగా గాంధీ మండపముండేది. ఇక ఆ తర్వాత కాళాస్ర రోడ్డు పొడుగూతా మొత్తంపంట పాలాలే. అక్కడే తమకి మావగారిచ్చిన రెండెకరాల మాగాణి వుండేది. రెండు కార్లు పైరు పెట్టేనాళ్ళప్పుడు. మొగుడితో పాటు తనూ పాలానికెళ్ళి ఒక రాత్రిపగలూ లేకుండా రెక్కలు ముక్కలు చేసుకొనేది. ఆదాయం కూడా బాగానే వుండేది.

అడవిలో 7/5 ఇనప

అ తరువాత నాలుగయిదేళ్ళకి చనగ, జొన్న, సజ్జ పంటలు చాప కింద నీళ్ళ మాదిర వచ్చేశాయి వూళ్ళోకి. ఉత్తరాది నుండొచ్చిన ఒక రైతు జొన్నేసి సంపాయిచ్చేసినాడని అంతా దానికే మళ్ళుకున్నారు,

దాని ఆనుపానులు సరిగ్గా తెలుసుకోలేక రవణయ్య చేతులు కాల్చుకున్నాడు. అదే మొదలు అప్పుడెయ్యడం. ఆంతకు ముందుగా అప్పంటే ఏందో తెలీని తమకి రెడ్డోరి కొడ వెయ్యిరూపాయిలు అప్పు నిల్చిపోయింది.

తెచ్చిపెట్టిన పెట్టబడి తుడిచి పెట్టుకు పోనడమేగాకుండా అ సంవత్సరం పాడుగుతా గింజలు కొనాల్సిరావడం, మళ్ళీ పెట్టబడికి డబ్బవపరం అంతా తడిసి మోపడయింది. ఆ తర్వాత యిహన కోలుకునిందే లేదు.

ఊరికి మరో కొసన టూరింగు టాకీసొకటి వుండేది. జది ఆరునెలలు నడిస్తే ఆరు వెలలు మూతబడేది. పావలా, అర్ధరూపాయి వుండేవి టికెట్లు. ఊరంతటికీ గాదిరెద్దోళ్ళ అద్దకపు కొట్ట తప్ప మరేరకమయిన గుడ్డలు దొరికేవి కావు. రెడ్డెమ్ములు మాత్రం పట్నం నుండి ఏం తెచ్చుకునేవాళ్ళో ఏమో వూళ్ళో మిగిలినోళ్ళంతా ఆ అద్దకం చీరలే కట్టేవోళ్ళు. అదీ ఒకటి రెండు మించి వుండేవికావు. మొగోళ్ళకి మల్లుపంచెలు.

ఆ మరుసటేడు గాంధీ మందిరం పక్కనున్న అమరాశెట్టి పాలాలన్నీ దక్షాది నుండొచ్చిన ఇెడ్డెవరో కొన్నాడనీ, లక్ష రూపాయిల్లో సినిమాహాలు కడ్తుండాడనీ వూరంతా ఆగుబ్బుగా చెప్పు కున్నారు.

రవణయ్యకి వూసిరొచ్చింది. అమరాశెట్టి పొలంపక్కనే ఈమ కయ్యిలుండేది. అప్పటికే పుట్టి పెరుగుతోన్న కొడుకులిద్దర్నీ బుజ్జమ్మనీ, చిన్నమ్మనీ చూపించి కాల్లావేళ్ళా పడి ఏడ్చినా, "పెళ్ళాం మాట ఏమాత్రం లెక్కచేయకుండా ఆ రెండెకరాలూ దక్షాదిరెడ్డి కమ్మేళాడు.

అదేమంటే వడ్డీ పెరుగుతూ పోవడంకన్నా అప్పు తీర్చడమే మంచిదన్నాడు. ఆ మిగిలిన డబ్బుతో యాపారంజేసి కుటుంబాన్ని ఎక్కేస్తానని ఆడంబరపు మాటలు జెప్పాడు. చెప్పినట్లు గానే గుడ్డలంగడి పెట్టి అప్పులిచ్చేసి, సంవత్సరం తిరక్కుండానే దివాళా తీశాడు.

పశువులు మేపుకుని, పాలం దున్నుకుని మట్టి పిసుక్కుని బతికేటోళ్ళకి యాపారాలెట్ట దెలస్తాయి.

పిలకాయల్ని అన్యాయం చేశానన్న దిగుల్తోనే మంచంపట్టి పోయాడు రవణయ్య, అప్పటికి పెద్దోడు పద్నాలుగేళ్ళవాడు. దక్షాదిరెడ్డి కమ్మేసిన తమ పొలంలోనే సేద్దిగాడిగా కుదిరిపోయాడు. ఆమాటకొస్తే ఆ దినాల్లో తను మాదిరి చిన్న రైతులంతా కూడా కయ్యిలమ్మేసు కుని కూలోళ్ళుగా మారిపోయారు.

అడవిలో

  • నప //ళ

పెద్దోడికి ముందుది బుజ్జమ్మ, ఎనకటోళ్ళు చిన్నమ్మి, చిన రవణడు చెనగ్గీతకీ, జొన్న ఒలుపుడుకీ, సజ్జీతకీ పోవడం మొదలుపెట్టారు. తనేమొ అదే రెడ్డింట్లో పాచిపనికి కుదిరి పోయింది. ఇప్పుడు రెడ్డోరివే రెండిళ్ళయినాయి. అ రెండిళ్ళలోనూ బుజ్జమ్మే పని చేస్తోంది.

పెద్దోడికి పెళ్ళయి, యిద్దురాడ పిలకాయిలు పుట్టినాపాట చెరుకుతోటలో పాము కర్చి చచ్చిపోయినాడు. ఇదే చాలన్నట్టు కోడలు ఎదురింట్లో బాడిక్కుంటున్న ఇమ్కూలు అయివోరితో లేచిపోయింది. ఆ పొద్దుట్నుండీ తను మనవరాళ్ళిద్దరితో బుజ్జి పంచన చేరి పోయింది. చిన్నకొడుకు, చిన్నకూతురు తన్యాడుండాదని కూడా తలవరు. తిట్టినా, పలకాయిల్ని చావబాదినా బుఖ్జమ్మే గెతి తనకి. ఈ ముండా గన్న ఏలకాయిల వల్ప ఈ పాద్దునాటికి ఆయమ్మి చేత కూడా గెంటించ్చుకునేట్టుగా వుండాది... వ్ప్‌...ఇస్‌...

“అవా...అవా...అన్నం బెట్టువా” చిట్టి అవ్వని వూపేస్తూ అడిగింది. పాత ఆలోచనల్లో నుండి బయటపడ్డ సుబ్బమ్మకి మండిపాయ్యింది.

“అ..ఆ.. వాండి పెట్టండాను రండి... బాగ సెప్పిన మాటినే పిలకాయిలయి పోతిరి” కసురుకుంటూ పైకి లేచిందామె. కూతురొచ్చే యాళయిందనుకుంటూ,

“అవో... అన్నం బెట్టవా...” ఆపకుండా అరుస్తోంది చిట్టి ఆదో పాటలాగ రాగం తీస్తూ. “అత్త రాల్యా యింకా” అత్త మధ్యాహ్నం తనని బాదిన సంగతి మర్చిపోయి అడిగింది. ఆ పిల్లకి బాగా తెలును అత్తొస్తేనే తనకిన్ని మెతుకులని,

“మే జ్యోతా...” పిలిచింది నుబ్బమ్మ హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు.

“ఏంవా?” అత్త అటు పని కెళ్ళగావే తనూ యిటు సినిమాబండి కాడికి పరిగెత్తి, సావానగత్తెలతో ఆటలాడి తిరిగొస్తూ పలికింది జ్యోతి.

“మే జ్యోతా... యాడకి బోయినావుమే... యిట్టగదా మీరు తన్నుల్లింటుండేది... అంతా వా కర్మ, ఇట్రాండిమే చెప్తాను” అవ్వ ఆ విధంగా పిలవడం ఆదివరకెన్నడూ లేకపోవడంతో అశ్చర్యంగా యిద్దరూ అవ్వవద్దజెళ్ళారు.

వాకిట్లోని అరుగు మీద కూర్చుని యిద్దర్నీ చెరో పక్క కూచోబెట్టుకుంది సుబ్బమ్మ,

“మే... జ్యోతా ఆత్త లేకపోతే మిమ్మలిద్దర్నీ యానాడో బాయిలో యేసి నేను దూకే నుందునుమే... నాకు శక్తుండాదా చెప్పు మిమ్మల్నిద్దర్నీ సాకడావికి. మీరు బతికినన్నాళ్ళు వేను బతకబోతానా? అత్త చెప్పినట్టిని సుజనమ్మోళ్ళూరికి బోమే... నాయమ్మగద. లేకుంటే మన ముగ్గుర్నీ బయటికి దోసేస్తాదిమే...” కళ్ళనీళ్ళు పెట్టకుంటూ వాబికే గొంతుతో అవ్వ జ్యోతి గెడ్డం పట్టుకుని బతిమిలాడ్డం చూస్తుంటే చిట్టికి ఏడుపొచ్చింది.

“పో యేం మే...” అన్నది అక్కనుద్దేశించి. అడవిలో “0 ఇసషద్నూ

జ్యోతి చిట్టికేసి ఒకసారి గుర్రుగా, నిశితంగా చూసింది. అ చిరుచీకట్లో జ్యోతి చూపుల్లోని అర్థాన్ని పట్టుకోవడం కష్టమైపోయింది సుబ్బమ్మకి. అయినా “ఏందిమే...” అడిగింది మనవరాల్ని రెట్టించినట్బగా.

జ్యోతి కాసేపు మౌనంగా వున్న తరువాత దిగులు గొంతుతో

“అవ్వా... నువ్వు, నీ తర్వాత అత్తా, రాజక్క అందరూ పాచివని చేసేకదా బతకతా వుండారు. నన్ను గూడ మీ మాదిర్తో పాచిపనిలోకి దించతారా అవ్వా” అన్నది దీనంగా.

మనవరాలి మాటల్లో కడుపు తరుక్కుపోయింది సుబ్బమ్మి. కానీ వేరే మార్గం లేదు. కూతురొచ్చేలోపుగా ఎలాగయినా జ్యోతిని ఒప్పించితీరాలి. అందుకే మళ్లి బతిమాలసాగింది. అవ్వ అలా అడుగుతూంటే ఏడుపొచ్చింది చిట్టికి. పైకే ఏడుస్తూ...

“అవ్వా ఈయమ్మి కాకపోతే నేన్సోతానవ్వా పనికి. నాకేం భయంలేదు. నుజనక్క నాకు తెలవకపోతేగద... నుజనక్క కొడుకునెత్తుకోడం ఒక పనా? నువు బాధపడబాకవ్వా. నేన్సోతానంటే పోతానంతే” అన్నది చిట్టి అవ్వకి ఒట్టేసినట్టు చెపుతూ.

దిగులుతో ముడుచుకు పోయిన అవ్వ గుండెల్లో ఒక కొత్త ఆశ పొడ చూపింది.

శ న! శు

అనుకున్నట్లుగానే బుధవారం రానే వచ్చింది. తెల్లారడాని కింకా కొంత సమయముంది. అకాశం నిండా మబ్బులు గొరైల మందల్లా ఎడాపెడా కదులుతున్నాయి. బుబ్బమ్మకి నిద్ర పట్టలేదు. లేచి మొగుడికి టీ పెట్టడం కోసమని పాయ్యి రాజేసి ఆ తర్వాత చిట్టి కోనమని స్నానానికి నీళ్ళకాగు ఎక్కించింది. అంట్లన్నీ బయట తొట్టి ముందేసుకుని నీళ్ళు తెచ్చి పోసుకుంది. వాటిముందు కూచుని తోముతూండగా విన్చించిందామెకా గావుకేక,

“ఒయమ్మా... అమ్మా... సచ్చినానమ్మా... అత్తా అవ్వా” అంటూ కేకలు పెడ్తున్నది జ్యోతా లేక చిట్టా ఒక్క నిమిషం అర్దం కాలేదు బుబ్జమ్మకి.

పిల్లలిద్దరి గొంతులూ యించుమించు ఒకేలా వుంటాయి. తను యింట్లోనుండీ అంట్లు తీసుకుని బయటికొచ్చేటప్పటికి యిద్దరూ లేవలేదు. ఇంతలో ఏమయింది. కాళ్ళూ చేతులూ వాణుకుతూంటే తోముతున్న అంట్లు పక్కన పడేసి యింటి గుమ్మంకేసి పరిగెత్తి అవాష్కయిపోయింది.

జ్యోతి పాయ్యిలో కణకణలాడుతోన్న కొరివి కట్టెని లాగి చిట్టి అరచేతుల్లో వాతలు వేస్తోంది. చిట్టి పెడుతోన్న ఆర్తనాదాొన్ని లెక్కచేయకుండా.

“పోతావుమే.. పనికి బోతావా పనికి. యిహనబో ఎట్టబోతావో” అంటూ కసిగా చిట్టి రెండు అరచేతుల్నీ కదలకుండా కాలేసి నొక్కిపట్టి కొరివి కట్టెతో గట్టిగా అయిస్తోంది.

అడవిలో అవవ /2/

చిట్టి పెడుతున్న గావుకేకలు ఆ గుడిసెను దాటి, వాడలోకి, వాడను దాటి ఊళ్ళోకి, ఊరిని దాటి సమాజంలోకీ వలయాలు వలయాలుగా ప్రవహిస్తోన్నాయి.

అప్పటిదాకా గొర్రెలమందల్లా అటు ఇటు కదులుతోన్న మేఘాలు హఠాత్తుగా వర్షించడం మొదలుపెట్టాయి. ఆ యింట్లోని సంఘటనలకి, జీవితాలకీ సాక్షీభూతంలా నిలబడి వుంది నిద్రగన్నేరు చెట్టు.

రచన, నవంబరు 2000 అడవిలో మొక్క.

వళ కాళ

ళ్‌ బా పక్షీశి వి, ప్రతిను కథలు

గంగజాతర ఊోళ్ళు జాతర చాటింపు జరిగింది. గంగజాతర ఈ వూళ్ళో చాల ప్రత్యేకమైనది. ఏడుచోట్ల ఏడు గంగల్సి నిలిపి దున్న పోతుల్ని వూరేగించి చివరిరోజు బలియిస్తారు. గంగలు వూరేగే వీధులన్నింటిలోనూ కుంభాలు పోస్తారు. వేయికళ్ళ కుండల్లో దీపాలు పెట్టుకుని కొందరాడవాళ్ళు, పిల్లలూ వేపచీరలు కట్టుకుని యింటి వద్ద నుండి గంగలు నిలిపిన చోటుకి వూరేగింపుగా వస్తారు. “మావూరిని నీటి ఎద్దడి నుండి రక్షించమనీ, పిల్లలకు అంటువ్యాధులు సోకకుండా కాపాడమని... వూళ్లోని చిన్నా,పేద వర్గాలను ఈతిబాధల్లేకుండా చూడమనీ' గంగల్ని ప్రార్థించి వారివారి శక్తివేరకు కోళ్ళని, వేటల్ని, దున్నపోతుల్ని బలియిస్తారు. జాతర రెండురోజులూ వూళ్లోని ప్రతీ యిల్లూ చుట్టపక్కా లతో నిండిపోతుంది. గతంలో అయితే చాటింపు వేశాక వూళ్ళో నుండి ఎవరూ బయట ఊర్లకి వెళ్ళటానికి వీల్లేదు...ఇప్పటి కుర్రకారుకి గంగతాతర కట!

జాతర హడావిడే తప్ప స్థిమితం లేదు.

మా అత్తగారున్నంత కాలం మా యింట్లో కూడా జాతర తాలూకూ పూజలు జరిగేవి. ఆవిడ పోయాక సాంప్రదాయాలూ, పండుగల సందడీ కూడా చాలా వరకూ తగ్గిపోయాయి.

“అమ్మా... పది కాఫీలు” సురేషాచ్చి బిగ్గరగా అరవడంతో ఉలిక్కిపడి స్టా మీద నుండి పాలు దించాను.

“అమ్మా... ఇడ్లీ పెట్టి చెట్నీ చేశాను, చాలా, యింకేమయినా చేయాలా? కూరలు ఏం చేయాలో చెప్తే నేను మార్కెట్టుకెళ్ళి తెచ్చుకుంటాను” వంటమనిషి రవణయ్య తొందర పెడ్తున్నాడు...చెప్పకుండాగాని నేను బయటకెళ్ళిపోతే ఏం చేయాలో తెలీక గింజుకుంటాడు. అదీ వాడి హడావిడి. నాకేమో వూపిరాడ్డంలేదు.

మా యింట్లో ప్రతిరోజూ జాతరే... రాజకీయ జాతర... పంచాయితీ ఎన్నికల ప్రకటన వెలువడింది. నామినేషన్ల పర్వం కూడా పూర్తయింది. ఇంటినిండా మనుషులు... అందరికీ అన్పీ సకాలంలో జరిగిపోవాలి. మాటిమాటికీ టీలు, కాఫీలు... కొందరికి భోజనాలూ... ఇల్లంతా చెప్పలేనంత హడావిడిగా వుంది. ఎవరు ఎవరితో ఏంమాట్లాడుతున్నారో అర్థంకావడంలేదు ఒక్కోసారి నాయింట్లో నేనే పరాయిదానిలా...

కప్పుల్లో కాఫీ పోస్తుంటే దిగులుతో గుండె, నీటితో కళ్ళు వొణికాయి.

“అరె అదేంటి మాధవీ యింకా నువు రెడీ అవలేదా? ఇట్లాంటప్పుడు కూడ వంట గదిలో ఏంటి? మీ ఆడపడుచు, తోడీకోడలూ వచ్చారు కదా చూసుకుంటారు... మనకిక ఎక్కువ సమయం లేదు. తిరగాల్సిన ఏరియా ఏమో చాలా వుంది. యిట్లా అయితే గెలుపు అసాధ్యమవుతుంది...” హడావిడి పెట్టేసింది రాగిణి రాగానే. రాగిణి తండ్రి వాళ్ళూర్లో పెద్ద రాజకీయవేత్త. చిన్ననాటి నుండీ రాజకీయాల్లో పుట్టి పెరగడంతో రాజకీయాల పట్ల ఆసక్తీ, అభినివేశమూ వున్నాయామెకి. ఇదిగో అయిపోయింది... మీరంతా టిఫిన్లు చేయండి... చెప్పాన్నేను. కాఫీ కప్పులు నిండిన ట్రేని సురేష్‌ కందిస్తూ. మా బృందంలో కొంతమంది టిఫిన్లు చేసాచ్చామనీ, మరికొందరు చేస్తామనీ లేచారు. రవఇణయ్యని పిలిచి వాళ్ళందరి బాధ్యత అప్పగించి నేను హడావిడిగా బాత్‌రూమ్‌లోకి దూరాను. మురికి పట్టిన శరీరాన్ని, మనసునీ కూడా ప్రక్షాళన చేసుకోవడానికి. ఇక్కడ జీవితమంటే ఉరుకులూ, పరుగులూ... ఒక్కక్షణం ఆలస్యమైనా ఒక జీవితకాలం వెనుకబడి పోతుందేమోనని భయం.

వ్ల శ వ

“రాజేంద్రరెడ్డి భార్య...వీర్రాఘవరెడ్డి కోడలు...పంచాయితీ ఎలక్షన్లలో సర్పంచ్‌గా నిలబడింది. మీకు రాకేంద్రరెడ్డి కొత్తకాదు... ఆయన ఈ వూరికి చేసిన సేవ మీకంతా తెలుసు. మీ ఓట్లన్నీ ఆమెకే ఏసి గెలిపించాల... మర్చిపోకండమ్మా... మీ ఎన్నికలగుర్హు ట్రాక్టర్‌... ట్రాక్టర్‌...”

గంగతాతర బళ షం వఫునడో

“వద్దు నాకు గెలవాలని లేదు...” పెద్దగా అరవాలన్న కోరికని ఆతి బలవంతం మీద అణుచుకున్నాను.

“నాకు పేరు లేదు... జీవితం లేదు... గెలుపులేదు ఫలానా ఆయన కూతురి, ఫలావా ఆయన భార్యని... యింకా...యింకా ఫలానా ఆయన అమ్మని అంతే... వద్దొద్దు నాకు గెలుపొద్దు... ఈ విజయం కూడా అతడిదే...”

“ఓమే... రమాదేవా రారా పరుగెత్తు. రాజేంద్రరెడ్డి భార్యొస్తే చెపమంటివే. వచ్చిందొ చ్చింది రా....ా” సుబ్బలమ్మ కేక విని వెనకింట్లో వున్న సదరు రమాదేవి చేస్తున్న పనినాదిలేసి వా బృందంతో ఆమె యింటివైపుకి కదిలే లోపలే ఎదురొచ్చింది.

వేను నవ్వుతూ చేతులు జోడించాను.

గత పదిరోజులుగా వీధి వీధి తిరిగి ప్రతీ ఓటర్నీ వ్యక్తిగతంగా కలున్తున్నానేమో నా పెదవులు సాగి సాగి అలాగే వుండిపోయాయి. జోడించిన నా చేతులు రెండూ అతుక్కు పోయాయి విడివడకుండా...అసూర్యంపశ్యయైన నా చర్మ సొందర్యం ఒక్క సారిగా ఎక్స్‌పోజ్‌ అవడంతో కమిలి నల్లబారిపోయింది. పాదాలు పదిరోజుల నుండీ నా బరువుని మోపి మోసి వొప్పులతో మొద్దుబారి మొరాయిస్తున్నాయి. అంతా వీధివీధిలో రాజేంద్రరెడ్డి భార్య... రాజేంద్ర రెడ్డి భార్య అంటూ 'జూ'లో వింత జంతువుని చూసినట్లు చూస్తున్నారు. అత్మాభిమానం లేని వా శరీరం సిగ్గు తెరలనాదిలేసినట్లుగా వుంది. వాఆలోచనలు వేరు... అభిప్రాయాలు వేరు... వేను జీవిస్తున్న జీవితం వేరు.

“మా ట్రాక్టర్‌ గుర్తుకే మీ ఓటు... మర్చిపోవద్దు... ట్రాక్టర్‌ ....ట్రాక్టర్‌... మీకే నమస్య వచ్చినా అయ్య చూసుకుంటారు...” బతిమాల్తున్నాడు సిద్దయ్య. అప్పుడప్పుడూ దబాయించి నట్లుగానూ అరుస్తున్నాడు.

అవునవును! ఓట్లేసి అమ్మని గెలిపిస్తే అన్నీ అయ్య చూసుకుంటారన్నమాట. అన్నీ అయ్యే చూసుకుంటారు... అమ్మకేమీ తెలీదు... తెలియనివ్వరు. ఏం వ్యాపారం చేస్తున్నారో తెలీదు... ఎంత అదాయమొస్తుందో చెప్పరు. అంతెందుకు, నామినేషను వేయడానికి పది విముషాల ముందు వరకూ కూడా నేను ఎలక్షన్లలో నిలబడబోతున్నట్లు నాకు తెలీదు.నా అభిప్రాయమెవరూ అడగలేదు నేను యింట్లో సంతకం పెట్టిన నామినేషను కాగితాల్ని తీసుకుని అశేష ప్రజానీకంతో, జేజేల నడుమ అమిత అట్టహాసంగా అతడెళ్ళి దాఖలు చేసి వచ్చాడు. ఆ రోజు కూడా వంటపని వేనే చూసుకున్నాను, నామినేషన్‌ వేసి అతడు తిరిగొచ్చేసరికి వందమందికి భోజనాలు రెడీ అయ్యాయి. ఆ తర్వాత కానీ అర్ధం కాలేదు. ఈ పంచాయితీ లేడీ రిజర్వుడు అయిందని, అతడెప్పుడూ నాకో ప్రహేళిక. బహుశా నా మౌనం అతడిని ఛేదించలేని ప్రశ్న కావొచ్చును.

నామినేషన్‌ వేసిన రోజునుండీ వా పుట్టింటి వైపు నుండీ,నా "స్నేహితుల నుండీ ఫోన్‌ కాల్స్‌ రాసాగాయి.

గంగజాతర శం వకముణం ఈల్‌

“ఏంటి నువ్వు సర్బంచ్‌గా నిల్చున్నావా? ఏవిటే ఈ పని?”

“నీ ప్రవృత్తికి రాజకీయం ఎంత మాత్రం సరిపడదు. ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా?...”

“అతడు చెప్తే మాత్రం నీ న్వంత బుద్దేమయింది?. అతడేం చెప్తే అదేనా? మరీ డూ...డూ బసవన్నవయిపోతున్నావు...”

“కంగ్రాట్స్‌ డియర్‌”

అభినందలనీ, మందలింపులనీ బేరీజు వేస్తూ నాలో ఆలోచన మొదలైంది. తప్పు చేయటం లేదుకదా... ఎందుకిటువంటి నిర్ణయం తీసుకున్నాను. సంతకం పెట్టండాల్సింది కాదా?... ఈ మధనని భరించలేక ఆ రాత్రి రవీంద్రకి ఫోన్‌ చేశాను... రవి నాకు మా అమ్మ తరపు బంధువు. ఒకవిధంగా చిన్ననాటి మిత్రుడు. నన్ను నాకంటే కూడా బాగా అర్థం చేసుకున్న వాడు. హైదరాబాద్‌లో డి.ఎస్‌,పి.గా పనిచేస్తున్నాడు. చాలా సిన్సియర్‌ ఆఫీనరని పేరు తెచ్చుకున్నాడు. ఈ సమయంలో నాకు సరయిన సలహా యివ్వగలిగింది తవే. ఒకవేళ రవి వద్దంటేనో? నామినేషన్‌ విత్‌డ్రా చేసుకుంటుందా? ఉహు...

“మాధవీ, రాజేంద్ర మంచి నిర్ణయమే తీసుకున్నాడు. అంతా ఎవరికి వాళ్ళు నాకు రాజకీయం వొద్దు వొద్దు అంటూ దూరం దూరంగా జరిగిపోతే ఎట్లా?... మన జీవితం వరకూ మనకి ప్రశాంతంగా జరిగిపోతోంది చాలులే అనుకుంటాం అది చాలా తప్పు... రాజకీయం బురదగుంట, బురదగుంట ఆంటూ ముక్కు మూసుకుని కూర్చోకపోతే ఒక్కరయినా,దిగి బాగు చేయొచ్చుకదా... కనీసం ప్రయత్నించొచ్చు కదా... ఎలాగూ, సంతకం చేసేశావు కాబట్టి, డోన్ట్‌ స్టెప్‌ బ్యాక్‌... నీవూరిని బాగుచేసుకోవడానికీ, పేదవర్గాలకు సాయం చేయడానికీ యిదొక అవకాశంగా తీసుకో... లైఫీ జె ఛాలెంజ్‌... ఫేసిట్‌... బి బ్రేవ్‌...” అంటూ ధైర్యం చెప్పాడు.

నాలో ఒక కొత్త ఉత్సాహమొచ్చింది.

“రండి... రండమ్మా...తమరొస్తారని వాలుగుదినాలుగా ఎదురుచూమ్తుండ్తా... నిన్నంతా అయితే ముంజలు బలిచి పెట్టుకోని చూసిచూసి మీరు రాకపోయేతలికి పక్కింటి ఏిలగాడి కిచ్చేసివా... రామ్మా కూర్చోమ్మా తల్లా... నువు నాకంటికి ఎప్పుడూ కనపడబోతావా అనుకుం టుండా”

అవిడెవరో తెలీక వింతగా చూన్తున్నా... వా చేతులు మాత్రం జోడించే వున్నాయి. వాపెదవులు సాగే వున్నాయి. బహుశా నా నుదురు ముడతపడిందేమో కుతూహలంతో.

“మనింటి కొన్తుళ్ళా అమ్మా ధర్మన్న అని... ఆ ధర్మన్న భార్య... ధర్మన్న యాక్సిడెంట్లో చనిపోయినపుడు రెడ్డిగారు చాలా పాయం చేశారీయమ్మకి... అందుకే అన్నంటే ప్రాణం” గొప్పగా చెప్పాడు వెంకటేశ్వర్లు.

“మనుషులకి సాయం కూడా చేస్తుంటటాడా?" నా కళ్ళల్లో కదిలిన ఆలోచనలని గమనించినట్లుగా

గంగణాతర /బల్‌ ఇం ఎటునోే

“అవునక్కా అన్న దేవుడు... భాస్కర్రావోళ్ళ వూళ్ళో గొడవలయితే వాళ్ళన్నదమ్ములందరి నుండి భాస్కర్రావుని కాపాడాడు... అప్పట్పుండీ భాస్కర్రావు అన్ననాదిలి పోడనుకో...” చెప్పాడు సురేష్‌. నిజమే, నురేష్‌ తల్లికి జబ్బు.చేసినప్పుడు అతడు తన తల్లికే జబ్బు చేసినట్లుగా డాక్టర్లకి ఫోన్‌ చేసి... హాస్పిటల్‌ ఖర్చు భరించడం జ్ఞప్తికొచ్చింది.

మాదిగ చిన్నోడి కూతురి పెళ్ళి అన్న స్వయంగా దగ్గరుండి ఎలా జరిపించాడో కథలా చెప్పుకొస్తున్నాడు నురేష్‌. నాకు ఏవేనో కొత్త విషయాలు తెలున్తున్నాయి. కోటివిద్యలూ ఓటు కొరకే అధికారాన్ని సాధించడానికీ, నిలుపుకోవడానికి మనుషులు అవలంభించే మార్గాలు అవగతమవుతున్నాయి. పదవీ కాంక్ష... ఎంత వారినయినా కీర్తికాంత ఎలా వశపరచు కుంటుందో... ఆ కాంత మందు సొంత కాంత దిగదుడుపే. నా అడుగులతో, నహనంతోనూ వీధివీధినీ, వాడవాడనూ కొలుస్తూనే ఉన్నాను. ఆ శ్రమంలో...

“అమ్మా. కాఫీ” అందించాడు వెంకటేశ్వర్లు.

“మాధవక్కా వీళ్ళు మాలోళ్ళు. నీళ్ళింట్లోనేంది మనం కాఫీ తాగేది... వొద్దు” గుసగునగా చెప్పింది. నాతో వచ్చిన పట్టాభిరెడ్డి భార్య. మనుషుల్ని వాళ్ళ ముఖాలతోనూ, వ్యక్తిత్వాలతో గాక, కులంతోనూ, డబ్బుతోనూ మాత్రమే గుర్తిస్తారు. కొంతమంది. ఈ విషయంలో రాజేంద్ర ఆలోచనలు కొంత ఉన్నతంగా వుంటాయి. నేను ప్రచారానికి కదలబోయే ముందు మొట్ట మొదటి రోజు అతడు ప్రత్యేకించి చెప్పాడు నాతో.

“శేవలం నీ స్నేహితురాళ్ళనీ రెడ్డు, నాయుళ్ళ భార్యల్ని మాత్రమే నీ పక్కన పెట్టుకోకు. వాగయ్య భార్య, నురేష్‌ వాళ్ళమ్మ, చిన్నోడి భార్య జయ అందరినీ నీతో సాటు తీసుకెళ్ళు. మనకందరూ కావాలి. ఆ విషయంలో ఏ మాత్రం తేడా కన్చించకూడదు”... ఇది అతడు ఒకవేళ ఓట్ల కోసమే చెప్పి ఉండొచ్చునేమో... నిజంలో కూడా అతడికి కులం పట్ల చిన్నచూపు లేదు. కొన్ని కొన్ని విషయాల్లో అంత సమున్నత భావాలు గల వ్యక్తి మరికొన్నింటిని అనలే పట్టించుకోనట్లుగా ఎందుకుంటాదో అర్ధంకాదు.

“అక్క కాఫీ తాగరు” చెప్తోంది విజయ వెంకటేశ్వర్లుతో. అతడు చిన్నబుచ్చుకున్నట్లుగా అయి “నిమ్మరసం తాగుతారా?” అన్నాడు.

“లేదు... లేదు తిరిగి తిరిగి అలసటగా వుంది. ఇప్పుడెలాగూ భోజనానికి వెళతాం ఏమీవద్దు.... మంచినీళ్ళివండి చాలు...” అన్నాన్నేను కర్ర విరక్కుండా, పాము చావకుండా, వాకిట్లో చెట్టుకిందున్న మంచం మీద కూర్చొంటూ చూట్టూ పరికించాను. మా అలికిడికి ఆ చెట్టమీదున్న చాలా పక్షులు ఒక్కసారిగా గోలగోల చేస్తూ ఎగిరిపోయాయి. వాటిని చూస్తుంటే ఒకింత ఈర్వ్యగానూ, హాయిగానూ అనిపించింది. దూరంగా పంట పాలంలోని మోటార్లు శబ్దం చేన్తూ నీళ్ళను పారిమ్తున్నాయి. ఆ నీళ్ళలో పశువులు కాసే పిల్లలు నలుగురైదుగురు ఎగిరెగిరి దూకి స్నానం చేన్తున్నారు. అలా వాళ్ళను చూస్తుంటే చిన్నప్పుడు మా తోటలో రవి,

గంగజాతర నా

వేను, శారద, చిన్ని అంతా ఈత కొట్టిన సంగతి జ్ఞప్తికొచ్చింది. నోస్టాల్టియా... మాటిమాటికీ నవన్నావహించి యిబ్బంది పెడుతుంటుంది... ఇప్పుడు మరీ ,

పదేళ్ళుగా ఈ ఊరిలో వుంటున్నానే కాని నాకీ పరిసరాలన్నీ కొత్తే ఇది అటు పల్లె, ఇటు పట్నమూ కాని ఊరు. ఈ చుట్ట పక్కలన్నింటిలోకి ఇది మేజర్‌ పంచాయితీ. నాకు తెలిసినప్పటి నుంచి ఈ ఊరికి సర్పంచ్‌ రాజేంద్రరెడ్డే.. ఈ పంచాయితీని మరొకరి చేతుల్లోకి అప్పగించడానికతడు సిద్దంగా లేడు...

“అమ్మా ... బయళ్టేరుదామా?” ప్రల్చించాడు సిద్దయ్య. ఉలిక్కిపడి లేచి వారితో అడుగేశాను. ఈ రోజెందుకో నా కాళ్ళు ముందుకు సాగనంటున్నాయి. నా ఆలోచనలళోపాటు వెనక్కు నడుస్తున్నాయి. అది మాత్రమే అలవాటైన వాటిలా. ఈ సర్వం సహా సామ్రాజ్యానికి వారసుడొక్కడు చాలంటూ అతడు నా గర్భకోశాన్ని నియంత్రించినప్పుడూ, ఉన్న ఒక్కగానొప్పడ్నీ దగ్గరుంచుకొని చదివిద్దామంటే 'రాజకీయాల్లో ఉండేవాళ్ళు పిల్లల్ని దగ్గరుంచుకోవటానికి లేదంటూ' అతడు సాకేతని ఊటీ స్కూల్‌కు పం పేపినపుడూ అర్ధమైంది నా కాళ్ళకు ముందుకు నడిచే శక్తి లేదని.

పగలంతా ఓట్లడుక్కొని, అరిగిపోయిన అరికాళ్ళను గోరువెచ్చటి నీళ్ళకప్పగించి బల్లమీద అన్సిన రెండు చేతుల్లోనూ నేను ముందుకు తలవాల్చినప్పుడు,యుద్ద విరామవు రాత్రులలో శవాలను వెదుకుతూ మౌనంగా రోదిన్తున్న ద్రౌపదికి వారనురాలిలా వుంటాను. జీవితం నిండా అనేక రకాల యుద్దాలు... మనం యుద్దం చేయాలని ప్రారంభించక పోయినా, అని వార్యంగా యుద్దంలోకి నెట్టబడుతున్నాం. ఏమాత్రం ఆసక్తి లేని రాజకీయాల్లోకి నేను వెట్టబడ్డట్లు... ఎవరో బెత్తం పట్టుకొని నాకిష్టం లేని పనిని చేయమని అదిలిస్తున్నట్లుగా వుందిది.

న! శ !

“ఏ మొహం పెట్టుకొని ఓట్లడగటానికి వచ్చావు?.... మీ ఇంటాయన బాగ జేసినాడు... ఆ కొరవా సరవా నువు జేస్తావు. ఇట్ట చూడమ్మాచూడు మా ఇంటి ముందర మురిక్కాలవ... వాకిట్లోకి రావడానకి నువ్విప్పుడెంత బాధపడ్డావు? ఒక్కనాటికే నీకట్లుంటే...దినుమ్మూ మేమెట్టా ఛస్తున్నామో ఆలోచించు, మా బాధలు పట్టించుకునే వాళ్ళెవురమ్మా? ఈ పొద్దు నాటిక్కన్నడతాం మేము ఓట్లేసేదానికి.. ఇదయిపోతే నుళ్ళీ మామొహం చూసేదెవరు? చాల్చాలు పోవమ్మా... ముందీ కాలవ పని చేయిస్తేనే మేమంతా ఓట్లేసేది... లేకుంటే మా వీధంతా ఓట్లకి రాదు...” మొహం మీద ఉమ్మేసినట్లయింది నాకు.

రాజగోపాలపురం రెండోవీధిలోనికి అడుడు పెడుతూ నల్లటి, బురద నీళ్ళని తప్పించు శోవడం కోనం తెల్లటి, నున్నటి నా లేత పాదాల్ని చీరకుచ్చెళ్ళతో పాటుగా ఎత్తెత్తి వేయడం, నాతో వచ్చినవాళ్ళంతా ముక్కులు మూసుకోవడం జ్ఞప్తికొచ్చింది. ఒకింత విస్తుపోయి తేరు కున్నాను.

గంగజాతర 20 వం వఫుజనో

ఆడశినంగిలా దూసుకొస్తున్న ఆమెను చూన్తుంటే నాకు చాలా ఆనందమైంది. ఈ పది పదిహేను రోజులుగా నాకీ వూరి ప్రజల మీద ఒక అభియోగముంది. ఈ పంచాయితీ యింత ఘోరంగా వుంటే ఓట్లడగటానికి నాయకులు తిరిగి తమ ముందుకొచ్చినపుడు “ఊరికి ఏం చేశారనికానీ, కొళాయిల్లో నీళ్ళేవని గానీ, ఈ డ్రైనేజీ మాటేమిటని గానీ' ఒక్కరయినా ప్రశ్శించరేమిటి?.... ఈ వూరి ప్రజలకు (ప్రశ్నించడం చేతగాదా అని... ఇప్పుడు ఈవిడిలా దులిపేయడంతో ఈ వూరిప్రజలకు ప్రశ్నించడం చేతనవునని చాలా సంతోషమేసింది. డ్రైనేజి పని తప్పకుండా చేస్తామని ఆమెకు వాగ్దానం చేసి నమాధానపరచి మరో దిక్కుకు మరలాం. ఆమె వెనుక నుండి నవ్వుకుంటున్నట్లుగా అన్పించింది నాకు.

మేము బజారువీధిలో నడుస్తుండగా ఆ కూడలిలో గుమికూడిన జనం మీదుగా శుష్క వాగ్పానాల మైకు ప్రవహిస్తోంది. రాజేంద్ర వాగ్దానాల పరంపరతో జనాన్ని ఆకట్బకుంటు న్నాడు. మాటలు చెప్పడంలో రాజేంద్రనెవరూ బీట్‌ చేయలేరు. అతడి నాలుకకు రెండు వైపులా పదునుంది. గంభీరమైన గొంతుతో అతడు మైకు ముందు నిలబడితే అపోజిషన్‌ పార్టీ వాళ్ళు కూడా పన్లు మానుకుని నోళ్ళు వెళ్ళబెట్టాల్సిందే. మాట్లాడిన మూట మాట్లాడకుండా గంటసేపు తానీ వూరికి చేసిన పనులన్నింటినీ ఏకరవు పెట్టగలడు. వాదనలో అతడినెవరూ గెలవలేరు... లాయరు కాబోయి వ్యాపారం, రాజకీయాలలోకి దిగిన వ్యక్తి.

అలాగే మరో కూడలిలో మరో నాయకుడు. ఒకవైపు జాతర గంగల వూరేగింపు... ఊరంతా మైకుల సందడితో హోరెత్తుతోంది. ఆడవాళ్ళు గడపగడపకీ బొట్టుపెడుతూ ఓట్లర్థిస్తూ ఎడాపెడా తిరిగేస్తున్నారు బృందాలు బృందాలుగా. చాలా రోజులుగా దాచి వుంచిన చీరలన్నిం టినీ ప్రదర్శించానికో అవకాశమొచ్చినట్లుగా వున్నారు పెద్దింటి ఆడవాళ్ళు.

“ఎట్లా అయినా మీ ఓట్లన్నీ వేసి అక్కను గెలిపిన్నాల... నాకోసం నా మొహం చూసయినా సరే... అక్క గెలిస్తే వేను గెలిచినట్లే అనుకోండి...” వాళ్ళవీధిలోని ఓటర్లని బతిమాలు తున్నాడు కృష్ణారెడ్డి... ఈ మధ్యన రెండు మూడేళ్ళుగా దూరంగా వుండి ఇప్పుడే ఎన్నికల సమయంలో రాజేంద్రవద్దకొచ్చి చేరాడు కృష్ణారెడ్డి... పంచాయితీలో వున్న కాంట్రాక్స పనులన్నీ తనకే కట్టబెట్టాలని అప్లికేషన్‌ వేస్తున్నాడు... అందుకే కష్టపడి తిరుగుతున్నాడు నా గెలుపుకోసం...

“రాజేంద్ర రెడ్డికీ జై... వీర్రాఘవరెడ్డికీ జై ...ట్రాక్టరు గుర్తుకే మీ ఓటు మన పొలాలు దున్నేది ట్రాక్టర్‌... మనకి తిండి గింజలనిచ్చేది ట్రాక్టర్‌... మీ పవిత్రమైన ఓటు ట్రాక్టర్‌ గుర్తుకే... మీ ఓటు చెట్టుకేసి గెలిపించండీ....” ఎదురుగా వస్తోన్న అపోజిషన్‌ బృందంతో మా బృందం తాలూకు జేజేలు కలిసిపోయి ప్రజల్ని ఒక అయోమయంలోకి నెడుతున్నాయి.

“రాజేంద్రరెడ్డి భార్య.. ఎప్పుడూ ఎండకన్నెరుగనిది... కార్పెట్ట మీది నుండి కార్లోకి తప్ప అడుగుపెట్టనిది... ఈ ఎర్రటి ఎండలో... ఈ మురికిలో మీముందుకు వచ్చింది. ఆ యమ్మని చూసయినా దయళల్చండమ్మా... మీఓటు ట్రాక్టరు గుర్తుకే వేయండి... " దండాల మీద దండాలు.

గంగణాతర ఈ; పంజా లర

ఈ పరిచయాలేమిటో , ఈ దయతలిచే గొడవేమిటో నా కెంతకీ అర్థంకాదు... చేయగలిగిన పనుల గురించీ, ఊరి బాగోగుల గురించీ చెప్పకుండా యిదేమిటి? అయితే ఒకవిధంగా వీళ్ళే నయమేమో ఊరి బాగోగుల గురించి చెప్పకపోయినా తమను తాము పరిచయం చేసుకుంటూ ఓట్టడుక్కుంటున్నారు. అవతలి పార్టీ వాళ్ళట్లాకాదు... అపోజిషన్ని తిట్టడంతోనే సరిపోతోంది... ఆ విధంగా ఎన్ని ఓట్లు రాల్తాయో మరి... ఓట్లడుక్కోవడంలో కూడా నెగటివ్‌ మేనరిజమ్స్‌.

శ శ శ

“అంతా బాగుండాదన్నా... ఎక్కడికి పోయినా మంచి రెస్పాన్స్‌... మనం వస్తుండామంటే చాలు జనాలు గుమికూడి ఎదురు చూస్తున్నారు. ఇంత రెస్పాన్స్‌ అపోజిషనోళ్ళు వచ్చినపు డుండటం లేదు. మనమే ఈసారి కూడా విన్‌” గొప్పలు చెప్తూ గాలిలో రెండు వేళ్ళు నిలబెడ్డు న్నాడు శేఖరయ్య.

ఎందుకిటువంటి పిక్చరిచ్చి ఉబ్బపెడ్డారో అర్థంకాదు. ఓటర్ల నాడి పట్టుకోవడం అంత తేలికయిన పనేమీకాదు. వాళ్ళు రాజేంద్రరెడ్డి భార్యొచ్చినా నవ్వుతూ “అచ్నేలేమ్మా” అంటున్నారు. మరో రామినాయడు భార్యొచ్చినా అహ్వానిస్తున్నారు. ఇంకో బి.జె.పి. సోమశేఖరాన్నీ వాళ్ళలాగే రిసీవు చేసుకుంటున్నారు. ఓటర్ల ముఖాన్నిబట్టి మనం గెలుపోటములు నిర్ణయించడం సాధ్యం కాదు... మొన్నటి శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో అంతేశదా... అంతా నిశ్శబ్ద విప్లవంలా సాగింది... అనుకోని ఫలితాలాచ్చాయి.

“అయినాసరే మనం ఎంత మాత్రం అజూగ్రత్తగా వుండటానికి వీల్లేదు... రాజగోపాల పురం అంతా సుబ్రమణ్యం చూసుకుంటాడు. పిచ్చిరెడ్డి తోపులో నువ్వున్నావు... బాలాజీనగర్‌లో లక్ష్మయ్య చూస్తున్నాడు... ఆ పక్క బేరిపేటలో బాలయ్య వున్నాడు... ఎక్కడికక్కడే ఎప్పుడూ చాలా జాగ్రత్తగా వుండాలి మనం... డబ్బేదయినా కావాల్సివస్తే మురళినడిగి తీసుకోండి... తనే క్యాష్‌ చూస్తున్నాడు” సూచనలిస్తున్నాడు రాజేంద్ర అందరికీ అతడి గొంతు చాలా ఖచ్చితం గా వుంది. కుటుంబ సంబంధాల్లో కూడ అతడి గొంతు యిలానే వుంటుంది.

“అన్నా... మందు అడుగుతుండారు"” నసిగాడు శివకోటి.

“మందు సంగతి తర్వాత చూద్దాం... మనమిప్పుడెంత చేసినా అఖగ్రోజిచ్చే పది రూపాయలే వాళ్ళకి రుచి... చేద్దాం... తప్పకుండా చేద్దాం... ఎంత డబ్బు ఖర్చయినా ఫర్వాలేదు... పంచాయితీ మూత్రం మనచేతుల్లో నుండి మరొకరి చేతుల్లోకి పోవడానికెంత మాత్రమూ లేదు”

ఒక సువిశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి జరుగుతున్న యంత్రాంగంలా వుందది. ఈ మొత్తం యంత్రాంగంలో నేనో చిన్న పనిముట్టుని మాత్రమే. ఇక్కడ డబ్బు,

గంగతాతర ఇం జజ

మందు మంచినీళ్ళ ప్రవాహమై గెలుపోటములను నిర్ణయిస్తుంది. అంత డబ్బు ఈ విధంగా ఎన్నికల "పేరుతో కుర్చీ కోసం ఖర్చు చేయకపోతే కడుపునిండా తిండికి నోచుకోని పేదలకు పంచరాదూ... పంచుతున్నారు... ఎందుకు పంచరూ...? ఓటర్లకి పంచుతున్నారు. ప్రతీ యింటికీ గుర్తింపు చీటీలతో పాటుగా ఓటుకు ముప్పయి, యాభై, వందా... ఆయా ప్రాంతొలనుబట్టీ, ఎన్ని ఓట్లుంటే అంత డబ్బు కవర్లో పెట్టి పంపేస్తారు. వచ్చిన వాళ్ళందరికీ అడిగినన్ని సారా ప్యాకెట్లు. ఈ మదుపు పెట్టిందంతా రేపు రెట్టంపుగా సంపాదించ బడుతుంది... రాజకీయమంటే యిక్కడ వ్యాపారమే కదా... వ న! వ్ల వేపచీర కట్టకుని దీపాన్నుంచిన వేయికళ్ళ కుండని చేతిలో పట్టకుని ట్రాక్టరు మీద వూరేగుతున్నాన్నేను... ఆయనొక్కరి ముందు కూడా తెగ గింజుకునే నేను అంతమందిలో బట్టల్లేకుండా వేపాకు చుట్టుకుని ఎలా నిల్చున్నానో అర్ధం కావడం లేదు... జన ప్రవాహం మధ్యలో నుండి ట్రాక్టరు కదల్లేక కదులుతోంది... నా ప్రక్కనే రాకేంద్ర నిలబడి చేతులు జోడించి జనాన్ని చూస్తున్నాడు నవ్వుతూ... ట్రాక్టరులోని మైకు మాటలు మాటలుగా జనాన్ని తాకుతోంది. గంగలు నిలిపిన కూడలి వద్దకు అనేకానేమంది ఆడవాళ్ళు వేపచీరలు కట్టుకుని వేయి కళ్ళ కుండలతో నడచి వన్తున్నారు...ప్రతీ కూడలి వద్దా పాట్టేళ్ళు, కోళ్ళు నరకబడు ళలలుతెగి రక్తం ఏరులై పారుతోన్న జీవాల్ని చూసి కొంతమంది ఆడవాళ్ళు వేస చీరలతోనే స్పహ తప్పి నేలమీద పడిపోయి వున్నారు. మధ్యమధ్యలో మైకుని తన చేతిలోకి తీసుకుని రాజేంద్ర ఓట్ల అర్థింపుని కొనసాగిన్తు న్నాడు. కళ్ళు తిరుగుళున్నట్టయి బలవంతం మీద నిలదొక్కుకుని నిలబడి వున్నాన్నేను. కొంతమంది పెద్దిళ్ళ వాళ్లు మేడల మీద నిల్చుని నన్నూ, నా వూరేగింపునీ జూలిగా చూస్తున్నారు. దూరంగా జనంలో నిలబడి రవి నాకేసి వింతగా చూస్తున్నాడు కళ్ళల్లో భావాల్ని పట్టుకోవడం కష్టమైపోతోంది. అసలు రవీంద్రా కాదా అన్నది గట్టి తేల్చుకోబోయి అలాగే పక్కకి ఒరిగి పోయాను ట్రాక్టర్లో. హఠాత్తుగా మెలకువొచ్చేసింది వాకు. ఊరేగింపు తాలూకు కలవరం నుండీ, ఆ ఉద్వేగం నుండీ తేరుకోవడానికి పది నిముషాలు పట్టింది. రాత్రి బాగా పొద్దుపోయిందేమో ఏడింటిదాకా మెలకువ రాలేదు... ఇవ్వాళే పోలింగ్‌... హడావిడిగా బాత్‌రూమ్‌లోకి దూరాను. “ఆ టీచర్స్‌ కాలనీ పైపులైన్ల పని పూర్తయిందా?.. వాళ్ళంతా గొడవ పెట్టేస్తున్నారు... సురేష్‌ ఏడి?... హైస్కూలు వీధిలో స్లిప్స్‌ పంచడం మర్చిపోయారంట... అవసరానికి లేకుండా ఎక్కడ చచ్చారంతా?...” అరుస్తున్నాడు రాజేంద్ర అందరి మీదా. గంగణాతర ఈష్మ ఇటమణం 2/0

“ఊరికీ నీళ్ళు కావాలి... కాదు కాదు ఓటర్లకి నీళ్ళివ్వాలి... పైపు లైన్లేయించాలి...అదీ ఎన్నికలలోపే జరిగిపోవాలి ఊరికి నీళ్ళు తెచ్చే హడావిడిలో వున్నావు గానీ... నీ హృదయంలో తడిలేకుండా పోతోందన్న సంగతే గుర్తించడం లేదు ప్రియతమా” ఒంటి మీద నీళ్ళు దిమ్మరించు కుంటూ ఆలోచనలోపడ్డాను.

“అమ్మా రెడీ అయ్యారా?...అడగమంటున్నారు” పిలిచింది పనిమనిషి

“ఆ... ఆ... వచ్చేస్తున్నాను” హడావిడిగానే పనివాళ్ళందరికీ మందళ్ళు చెప్పి బయట పడ్డాను.

“అమ్మా... ఈ అంకమ్మ మున వూరి గ్రామదేవత... మనస్పూర్తిగా నమ్మి మనమేది కోరుకుంటే అది జరిగితీరుతుంది... అంత సత్యమైన దేవత... మీక్కూడా దైవభక్తి చాలా ఎక్కువ కదా దణ్ణం పెట్టకోండమ్మా...”

చాలా రోజుల తరువాత నాకు చెప్పలేనంత నవ్వొచ్చింది.

“నిజమే తనకి దైవభక్తి చాలా ఎక్కువ... ఎందుకెక్కువయింది?... ఇదివరకు లేదే... అతడి నీడలో ఈడ్చే బతుకు చప్పదనాన్ని, అతని నిర్లక్ష్యాన్ని తట్బకోవడం కోసం, విలువల ముళ్ళ కిరీటాన్ని జాగ్రత్తగా ధరించే క్రమంలో నేను దేవుడ్ని ఆశ్రయించాను. నా ఆలోచనల వ్నింటినీ మౌన కందకాల్లో దాచివుంచి ఆ ఒత్తిడిని హిస్టీరియా రూపంలో వెళ్ళగక్కడం కన్నా భక్తి సుగమమైన దారి అన్పించింది... మరో దారి లేక దేవుడి మీద నమ్మకం పెంచుకున్నానేమో...

“అమ్మా వెళ్ళవా?”

“*“ఊ ” అంటూ ఉలిక్కిపడి అంకమ్మకేసి నిశితంగా చూశాను.

మనస్పూర్తిగా కోరుకున్నాను అసంకల్పితంగా నన్ను ఓడించమని. రాజేంద్ర ఓవర్‌ కాన్ఫిడెన్స్‌కీ, అహానికీ నా ఓటమి పెద్ద దెబ్బ కావాలి. పోరాటం ఎంత గొప్ప విషయమో ఓటమి అంత సహజమైనది అని తెలియాలి. పోరాటం చేయలేక పోవడంలోని అశక్తత నన్ను కృంగదీస్తోంది. నా మనసొక నిశ్చింతను కోరుకుంటోంది.

అంకమ్మగుడి నుండి పోలింగ్‌ బూత్‌లవైపుగా కదిలింది కారు.

“రాత్రి తోపులో పిల్లథాయలంతా నిద్రపోలేదమ్మా... అపోజిషనోళ్ళు డబ్బు, సారాయి పంచుతారని కాసుకోనుణ్లారు...” చెప్పాడు చంద్ర ఉత్సాహంగా.

“మరి మీరూ పంచారుగా” అనబోయి ఊరుకున్నాను.

“అందర్నీ తరిం తరిం కొట్టామక్కా ... ఒక్కడు వాడుండాడే మున్రాజా వాడు మాత్రం దొరికిపోయాడు.. వాయించి పారేశారనుకో మనోళ్ళు... నడుం యిరిగిపోయింది వాడికి... ఈ పొద్దు ఓటేసే దానిక్కూడా రాడోడు...” తొము చేసిన ఘనకార్యాన్ని నా ముందుంచాడు చంద్రశేఖరం.

“అదేంటి చంద్రా...ఎలక్షన్లంటే ప్రచారం చేనుకోవాలి... ఓట్లడగొచ్చు... గెలవాలని అనుకోవచ్చు కానీ ఈ కొట్లాటలేంటి? దెబ్బలేంటి... మనిషిని మనిషి కొట్టుకోవడం అమానుషం కదా” చెప్తంటే వూరికే వుండలేక ప్రల్నించ్చాను.,.

గంగేజాతర దాచ వపు

“అక్కా మంచితనంతో ఓట్లు రాలవక్కా... అదంతా ఆ కాలం. . ఇప్పుడంతా ఏవంటే ఏవని ఎదుర్కొనేటట్టండాల...అసలు రాజకీయమంటేనే ధనాధన్‌ ఫటాఫట్‌... అంతే”... ఉద్వేగంతో చెప్పాడు మళ్ళీ అతడు. ఉదయం ఓట్లేసి వస్తుంటే మన ఫ్యామిలీ డాక్టర్ని రామి నాయుడు మనుషులు అడ్డగించారు. అంతే మన పిల్లకాలయలు దెబ్బల్తోనే సమాధానం చెప్పారు. పారిపోయారు దొంగనాయాళ్ళు.

చంద్ర మొహంలోని విజయగర్వం చూస్తుంటే నాకు ఆశ్చర్యమైంది.

నిజమే రాజకీయమంటేనే గూండాయిజం.

గూండాయిజం ప్లస్‌ డబ్బు ప్లస్‌ సారా - రాజకీయం - వ్యాపారం.

మగాడికి యింట్లో, బయటా కూడా బంధమనేది వ్యాపారయమయమైపోయింది.

మాట్లాడే మాటల్ని, నిముషాల్ని కూడా డబ్బుతోనే కొలుస్తున్నారు.

“ఇది పదో నెంబరు పోలింగ్‌ బూత్‌ అమ్మ దిగండి"

నాతోపాటుగా వచ్చిన రాగిణి , సౌజన్య, విజయ, విమల అంతా దిగారు.

“మాధవక్కా... ఈసారి మనం కారెక్కినపుడు ఆ లేబరోళ్ళని మనతోపాటు ఎక్కొద్దని చెప్పండి... మా జీప్‌లో రమ్మనండి...” సాధించినట్లుగా అన్నది విజయ... నేను విజయకేసి వింతగా చూశాను. ఆ లేబరోళ్ళ ఓట్లు పోగేసుకుని మనం అందలం ఎక్కాలి కానీ వాళ్ళతో కలిసి ఒకే కార్లో మాత్రం కూర్చోరాదు. బావుంది...ప్ప్‌...

“మాధవెందుకో దిగులుగా వుందీ రోజు” నా మౌనానికి పరిపరి విధాలుగా ఆలోచనలు పోతున్నారు నాస్పేహితురాళ్ళు. నిజానికి వీళ్ళు నా స్నేహితులు కారు, మా వారి స్నేహితుల భార్యలు. వీళ్ళెవరితోనూ నా ఆలోచనలు కలవవు.

“ఓడిపోతామని భయమేమో...” మెల్లిగా అంటున్నది విమల.

“కాదు కాదు ఓడిపోతామని నాకు భయం లేదు” గొంతెత్తి పెద్దగా ఆరవాలన్చించింది. కానీ మనకి అన్పించినవన్నీ చేసుకుంటూ పోతే మరీ అబ్బర్జ్‌గా వుంటుంది.

పిచ్చిరెడ్డి తోపు, కరెంటాఫీసు, బోర్డు న్కూలు, హైస్కూలు బూత్‌లన్నీ వరుసగా చూసుకుంటూ, గర్ట్‌ హైస్కూల్‌ వద్దకి రాబోతుండగా ఓక 'సుమో' సర్రున దూసుకు వచ్చి వా ముందాగింది... అది మాకారే... ఎ.పి.26..2223... అందులో రాజేంద్ర వున్నాడు.

“అన్న పిలుస్తున్నాడు” సురేష్‌ పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు ఒగరుస్తూ... నేను మెల్లిగా అటుకేసి నడిచాను. అప్పటికే రాజేంద్ర కూడా కారుదిగి నావైపు రెండడుగులువేశాడు.

“ఎట్లావుంది ?” ప్రశ్నించాడతడు.

“నేను చూసినంత వరకూ బాగావే జరుగుతోంది...” చెప్పాన్నేను నిజమో, అబద్దమో తెలీక సందిగ్దంగా.

“ఊ...మూడో నెంబరు బూత్‌ వద్ద గలాటా జరుగుతోందట... నువ్వింక యింటిళెళ్ళి పో... తిరిగింది చాలు... నేన్బూనుకుంటాను "చెప్పాడతడు సిగరెట్టు వెలిగించుకుంటూ. నేను విస్తుపోయి చూస్తున్నాను అతరడికేసి.

గంగవాతర ఈసా? వ ప్రమజబ దద

“ైప్పంది చెయ్యి” అన్నట్లుగా చూసి, అతడు తన కారుకేసి నడిచాడు.

బండెడు సామాన్లతో, బస్టాండులో బస్సు కోసం ఎదురు చూస్తున్న బాటసారిని ఎవరో “వరిచితుడు 'సొమాన్లు జాగ్రత్తమ్మా అంటూ హెచ్చరించి వెళ్ళిపోయినట్లుగా వుంది.

“పృ” నాలుకెగరేసి వేనూ అతడిని పట్టించుకోనిదానిలా వెళ్ళి కారులో కూర్చున్నాను. వా కొరు మూడో నెంబరు బూతువైపుగా సాగిపోయింది.

“అక్కడ రామినాయుడు భార్యని కొట్టారు మనవాళ్లు... చాలా గందరగోళంగా వుంది... అక్కడికొద్దమ్మా.. ” చెప్పాడు డ్రైవరు.

“ఫర్వాలేదు... వేను ఓటేయ్యాల్సింది అక్కడే” చెప్పాన్నేను ఖచ్చితంగా. నాతో వచ్చిన మిగతా వాళ్ళంతా కొంచెం భయపడుతున్నారు అక్కడికి రావడానికి. ఏదో గుపగుసపోతూ మాట్లాడుకుంటున్నారు.

అయితే మేము వెళ్ళేసరికి అక్కడ చాలా ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతోంది. గొడవ తాలూకు శకలాలేమీ కన్పించలేదు.

వేను కారుదిగగానే ఆ బూతువద్ద వున్న నాగరత్నం పరుగెత్తుకుంటూ ఎదురొచ్చాడు. లోవలికెళ్ళగానే నాతరవు పోలింగ్‌ ఏజంట్లు గౌరవ సూచకంగా లేచి నిల్చున్నారు. వారిని కూర్చోమని సైగచేసి వేలికి చుక్క పెట్టించుకుని బ్యాలెట్‌ పేపరు తీసుకుని చేతిలో స్టాంపుతో లోపలికి నడిచాన్నేను.

“ఫర్వాలేదమ్మా మీరిక్కడే వేసెయొచ్చు” అన్న పోలింగాఫీనరు మాటల్నిపట్టించు కోకుండా. ఒక్కసారి బ్యాలెట్‌ పేపర్ని పైనుండి కింది దొకా చూశాను. నాకెందుకో నవ్వొచ్చింది నా పేరు చూస్తుంటే... ట్రాక్టరు గుర్తు మీద ఓటుని ముద్రించాను. ఒకసారి సాలోచనగా చూసుకున్నాను. ఆ తర్వాత నిదానంగా చెట్టమీద, యింకా రెండాకుల మీద, గంటమీద, విమానం మీద, పొట్టేలు మీదా అన్నింటి మీద సమానంగా ముద్రించేశాను.

పట్టరాకుండా వున్న నవ్వుని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ నిటారుగా బయటికి నడిచాన్నేను. ఆ రాత్రే జాతర ఊరేగింపు ముగిసింది. గంగల్ని ఊరేగించి తీసుకెళ్ళి ఏట్లో శలిపేశారు. వూరంతా ఆదమరచి నిద్రపోయింది.

శ క్షు శ

అయితే అనుకున్నదొక్కటీ...అయినది ఒక్కటీ...బోల్తా కొట్టిందిలే...

“ఎప్పుడూ అడుగుపెట్టని దొరసాని ఈ విధంగా ఆఫీసుల చుట్టూ తిరగడమంటే మాటలా? అయినా యియ్యంతా ఆడోళ్ళు చేసే పన్లు కాదులే” ఆడవాళ్ళు చేసే పనులంటూ వేరే వుంటాయా? బహుశా వాళ్లదృష్టిలో వంటా, ఇంటి సంరక్షణ, పిల్లల పెంపకమూ కావొచ్చు.

గంగతాతర దాసా

“అయినా యిదంతా ముప్పయిమూడు శాతం రిజర్వేషను మహిమ స్స్‌” పెదవి విరున్తున్నారు కొంతమంది. హయ్యో... ఆ బిల్లు లోక్‌సభలో ప్రవేశ పెట్టడానికే ఈ మధ్యన ఎంత గొడవయిందో గుర్తొచ్చింది.

“ఆ ఆడవాళ్ళేం చేస్తార్లేయ్యా... వచ్చినా వాళ్ళేం పాటుపడ్తుండారు. వాళ్ళ వల్లేమవు తుంది?... కాకుంటే ఓట్లు రాబట్టుకోవడం కోపం మహిళల్ని ఉద్దరించినట్లు, చేసినట్లు ప్రభుత్వం జీమ్మిక్కులే గానీ, రాజ్యమేలడం ఆడవారి వల్లేమవుతుంది” వ్యంగపు బాణాలు.

నిజమే డిక్లరేషన్‌ ఫారమ్‌ అందుకోవడానికి కౌంటింగ్‌ ఆఫీసుకి స్వయంగా వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ ఈరోజు పన్నెండుగంటలా అయిదు నిముషాలకి మంచి ముహూర్తం కావడంతో ప్రమాణ స్వీకారం చేయడం కోనం పంచాయితీ ఆఫీస్‌కి వెళ్ళాను. అప్పుడు వా వెన్నెముక నిటారుగా వుందేమో.

“ఆ ఈ రోజంటే ప్రమాణ స్వీకారం చేయడానికొచ్చింది కానీ అమెదేముంది అంతా రాజేంద్రరెడ్డిదే కదా... ఆయన రానిస్తాడా ఈమెని ఆఫీసుకి... సంతకాలు మాత్రం చేయించు కుంటాడింటికాడ...” తెలీనితనంతో స్వచ్భంగా అంటున్నాడో, తెలిసి వ్యంగ్యంగా అన్నాడో కానీ అతడన్న మాటలు క్లియర్‌గా నా చెవినపడ్డాయి నిజమే యివాళా రేపు ప్రతిచోటా జరుగుతున్న భర్త చాటు భార్య రాజకీయాలు గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దీని గురించి తప్పు పట్టడానికేమీ లేదు.

అందుకు తగ్గట్టు ఉన్నత పదవులంకరించిన చాలా మంది స్రీలు సమస్యల పట్ల దృష్టి కేంద్రీకరించకుండా (ప్రారంభోత్సవాలతోనూ, సన్మానాలతోనూ సరి పెట్టుకుంటున్నారు. అట్టా కాకుండా వేరు పురుగులాంటి సమస్యల పట్ల దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నా న్నేను.

శ శ శః

గౌఢ నుషుప్తిలో వున్న లోకానికి సుప్రభాతం పాడుతోంది కోడ్‌ ఎక్కడో. రాత్రంతా మావగారూ, రాదేంద్ర యిద్దరూ పంచాయితీ గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. అందులో భాగంగా నేను పంచాయితీ ఆఫీసుకి వెళ్ళాల్సిన అవసరం లేదని చర్చించి నిర్ణయం తీసు కున్నారు. నేను వాళ్ళ మాటల్లో ఏమీ కల్పించుకోలేదు.

ఏ మహిళ అయినా పార్టీ పేరు చెప్పుకుని భర్త చాటు రాజకీయం చేస్తూ మనుగడ సాగించడం కంటే చురుగ్గా వ్యవహరిస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోగలగాలి. కొత్త వెలుతురులోకి వెళ్తున్నట్లుగా నాలో ఏదో మార్పు.

వందల వేల ఏళ్ళ నుండీ మగాడు రాజ్యమేలుతున్న సింహాసనాన్ని స్రీ గెలుచుకోవడం ఎంతో బావుంది. ఆదర్శాలు వల్లించడం స్త్రీకి చేతగాకపోయినా సమానత్వం, న్యాయం, నిజాయితీలను ఆమె (ప్రేమిస్తుంది.

గంగతాతర శబ? ఇ హబజం చల్‌

అకౌంటెంట్‌కి ఫోన్‌ చేసి పంచాయితీ పాత అకౌంట్‌ పుస్తకాల్ని, మిగిలిన అన్ని లెక్కల్ని తీసుకుని ఉదయం పదింటికల్లా ఆఫీసుకొచ్చేవయమని చెప్పాను. నాగొంతులోని ఖచ్చితత్వా వికీ, లెక్కల్ని తిరగదోడాలన్న నా ఆలోచనకీ ఖంగు తినుంటాడతడు బహుశా...

కొత్తగా వేలికి తొడిగిన రాజముద్రికతో అవినీతిని సాధికారికంగా రయుళిపించగలగడం ఎంత బావుంది?... సుధీర కాలంగా జరిగిపోయిన గొథల్నీ, దు:ఖాల్ని తిరగరాయడం కోసం ఈ ప్రపంచాన్ని మన చేతుల్లోకి తీసుకోగలగడం ఎంత బావుంది?...

పోరాటమిచ్చే ఆనందపు అనుభవాన్ని తడుముతూ నేను దుప్పటి తొలగించాను...

లోకాన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టకోవడం కోసం ఆ రోజు సూర్యుడు అయిదున్నరకే మబ్బుమాయల్ని ఛేదించుకుని వెలుగురేఖల్ని ప్రసరిస్తున్నాడు.

ప్రజాశక్తి అదివారం సంచిక, మే 2000

(ల్‌ షా ఇవో

పొదరిల్లు

సొంఠ యిల్లు అన్నది నా జీవితానికో కల. నాతండ్రి ఎడ్యుకేషనల్‌ డిపార్ట్‌మెంట్లో యి.వో.గా పనిచేసేవాడు. అతడికి తన తండ్రి నుండి నంక్రమించిన గొంధేయవాదం, నిజాయితీ పాళ్ళు ఎక్కువగా వుండేవి. దాంతో అటునుంచి ఇటు, ఇటునుంచి అటు ఎక్కువ భాగం

బదిలీల్లోనే గడపాల్పొచ్చేది.

ఒక వూరిలో దిగి ఆయింటికి ఆ వాతావరణూనికీ, ఆ వూళ్ళోని మనుషులకీ అలవాటు పడేలోపుగా మరోవూరికి విసిరి వేయబడే వాళ్ళం. రెకమెండేషన్స్‌తో బదిలీల్ని ఆపుకోవడం నా తండ్రీ సిద్దాంతానికి విరుద్దం. దాంతో ఒక వూళ్ళో స్థిరంగా లేకపోవడంతో సాంత యిల్లు, కనీసం అద్దె యిల్లయినా సరె

యిది వాది అనుకునే అవకాశమే లేకుండా పోయింది. పెళ్ళయింది... అతడు బ్యాంకాఫీసరు. మళ్ళీ షటిల్‌ షరా మామూలే... ఈ వూరి నుండి అవూరికి, ఆవూరి నుండి మరో వూరికి... యిలా వూళ్ళు తిరగడంతోనే జీవితమంతా నడ

జరిగిపోయింది. జీవితమెప్పుడూ ఆంతే... మనం ఒకవైపు నుండి దాన్ని బంధించాలని చూస్తుంటాం. మరోవైపు నుండి మెల్లగా అది జారిపోతూ వుంటుంది. అయితే అది ఒక్కొక్క ప్పుడు అనుకోని మలుపులు కూడా తిరుగుతూంటుంది.

కుమార్‌కి ఏ పురుగు తొలిచిందో తెలీదుగానీ సడన్‌గా వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుని యిదిగో ఈ వూళ్ళో రొయ్యల గుంటలు మొదలుపెట్టాడు. ముందు ఉద్యోగం అర్భాంతరంగా వొదిలేసినందుకు చిరాకన్పించినా క్రమంగా కుమార్‌ తీసుకున్న నిర్ణయం సరయిందేనని తెలిసొచ్చింది. రొయ్యలు చంటి బిడ్డల్లాంటివి... మన పసిబిడ్డల్ని అయినా ఓ గంట నిర్లక్ష్యం చేయొచ్చుగానీ, రొయ్య పిల్లల్ని మాత్రం దగ్గరుండి చూసుకోవాల్సిందే. ఇందులో పోతే అంతా వూడ్చి పెట్టుకుపోతుంది. వస్తే అమితంగా పార్గుకొస్తుంది అని అంతా అన్నట్లుగానే తొలిసారే మంచిలాభాలొచ్చి పడ్డాయి. కొంత డబ్బుతో మరో రెండు పాండ్స్‌ స్టార్ట్‌ చేసి మిగిలిన డబ్బుతో యిల్లు మొదలుపెట్టాడు కుమార్‌. నేను చిన్నపిల్లలా ఎగిరి గంతేశాను దగ్గరుండి నాకు నచ్చిన రీతిలో, మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నదీ కాక కంపాక్ట్‌గా మూడు పడగ్గదు లొచ్చేలా అందమైన యిల్లు కట్టించుకున్నాను.

కింద వరండా, పెద్దహాలూ, కిచెన్‌, డైనింగ్‌రూమ్‌, ఒక బెడ్రూమూ వచ్చాయి. హాల్లో ఒక మూలగా వున్న మెట్లెక్కి పైకి వెళ్తే చిన్న సిటిన్‌, రెండు బెడ్రూములూ... అన్ని బెడ్‌రూమ్‌లకి అటాచ్‌డ్‌ బాత్‌రూమ్స్‌, వాటికి గ్లేజ్‌డ్‌ టైల్స్ఫూ, గోడలకి పింగాణీ అద్దాలూ, అదే కలరు వాష్‌ బేసిన్సూ అంతా నేను కోరుకున్న రంగుల్లోనే తయారయ్యాయి.

వా నిజాయితీపరుడయిన తండ్రి మూలంగా జీవితం రెండు కొసలూ కలపడమే కొంత కష్టంగా వుండేది. ఇక ఇటువంటి కోరికలు తీర్చుకోవడమవేది కలలో మాట. కుమార్షి వేను (ప్రేమించి పెళ్ళి చేసుకుని మంచిపనే చేశాను. మితిమించిన నిజాయితీతో నాప్రాణం తీయడు. అతడికి జీవితావసరాలు తెలుసు. భార్యాబిడ్డల్ని సుఖపెట్టడం తెలుసు అందుకే వా కల నిజమయింది.

మరి యింత బాగా యిల్లు కట్టించుకుని నలుగురిని పిలిచి గృహప్రవేశం చేయకపోతే ఎలా? ఆందరినీ ఆహ్వానించడాలూ, ముఖ్యమయిన వాళ్ళందరికీ బట్టలు కొనడం... యిదంతా ఈడిసి మోపెడయింది. అనుకున్నట్లుగానే గ్రాండ్‌గా గృహప్రవేశం జరిగిపోయింది. పిల్లలిద్దరూ కోచింగ్‌ సెంటర్ల నుండి యింటికి పిలిపించబడ్డారు.

మేడమీద తనకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన పడగ్గదులను చూనుకుని విక్రమ్‌, వినుత యిద్దరూ కూడా చాలా ఆనందపడిపోయారు. మేమింతకాలంగా బదిలీలతో గడుపుతూండడంతో పిల్లలు చిన్నప్పట్పుండీ హాస్టళ్ళలోనే వుండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడిలా యింట్లోనే వుండి చదువుకోవచ్చునన్న ఆలోచన బహుళా వాళ్ళకంత ఆనందాన్ని కలిగించి వుండొచ్చు. నాక్కూడ ఫిల్లలిలా కంటికెదురుగా వుండడం బావుంది. ఈ ఇప

రెండోసారి రొయ్యల గుంటలు క్లియర్‌ చేసినపుడు యింటికి సోఫాసెట్టు, డబుల్‌డోర్‌ ధ్రిడ్డ్‌, మూడు బెడ్‌రూముల్లోకి మూడు టి.వి.లూ వచ్చి చేరాయి.

ఇంకా యింటి గోడలకి మంచి మంచి వాల్‌ పోస్టర్సూ, యింటి నిండా ప్రతి మూలా అందమైన ప్లవర్‌ వాజులూ, జీవమున్న మొక్కలూ, షోకేసుల్సిండా కొత్త కొత్త బొమ్మలు, నగిషీలు చెక్కబడ్డ పెద్ద డైనింగ్‌ టేబుల్‌ ప్రక్కనున్న షోకేసులో అందమైన వెలగలిగిన శ్రోకరీ.

ఆరు బయట ఎక్కడెక్కడి నుండో కొని తీనుకురాబడ్డ క్రోటన్సూ, గులాబీలూ, మందారాలూ... ఇవన్నీ మొత్తం సేకరించి ఎక్కడివక్కడ అమర్చేసరికి సంవత్సరకాలం నాకు తెలీకుండానే జరిగిపోయింది. అప్పటికి యింటికి మొత్తం నేను కోరుకున్న ఒక పేప్‌ వచ్చింది. తోటలో లవ్‌ బర్హు, యింట్లో గ్లాసు కేసుల్లో రంగు రంగుల చేప పిల్లలూ, ఈ యింటినంతటినీ కాపలా కాయడం కోసం ఒక జర్మన్‌ షెపర్టూ అదనంగా మాతో కలిశాయి. జర్మన్‌ షెపర్డ్‌డాగ్‌కి ప్రతిరోజూ మాంసం కొంటున్నప్పుడల్లా నా తండ్రి పదేపదే జ్ఞప్తి కొచ్చేవాడు...

“ఈగొప్పవాళ్ళంతా ఈమ తమ సాంత ఆన్ముల్ని కొపాడుకోనడం కోనం పెట్టుకున్న కుక్కల గురించి ఖర్చు చేసేదాంట్లో సగమయినా పేదజనాల కోసం ఖర్చు పెట్టరు... చివరికి వెళ్ళేటప్పుడిదంతా తమతోనే కట్టకు పోతారని భావిస్తారు' ఆంటూండేవాడు. అతడి రక్తమూ, అతడి వాసనలూ యింకా నాలో మిగిలి వున్నందుకు ఒక్కొక్కసారి విసుగ్గా వుంటుంది.

నా యిల్తూ, నా కుటుంబమూ, నా పిల్లలూ ఏర్పడ్డాక ఈ పాత ఆఅలోచనలన్నింటినీ కట్టకట్టి ఏట్లోకి వినరాలి.

పిల్లలిద్దరూ ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ వ్రాసి, యిద్దరికీ సీటు రాకపోవడంతో యిదే వూళ్ళో డిగ్రీ కాలేజీలో చేరారు. యిద్దరూ పక్కనే కంప్యూటర్‌ కోర్చులు తూడ చేస్తున్నారు. వాళ్ళ చదువులేమొ, వాళ్ళేమొ గదిని వదిలి బయటకి రారు.

శ శ ల!

“మమ్మీ కాఫీ కావాలి...” పైన సిటిన్‌కొచ్చి కేక పెట్టి మళ్ళీ లోపలి కెళ్ళిపోయింది వినుత.

నేను వంటావిడ్ని పిలిచి కాఫీ కలిపి తీసికెళ్ళమని చెప్పాను. చాలా కాలం తరువాత వచ్చిన నా స్పేహితురాలు సునీతతో నేను కబుర్లలో వున్నాను... సునీత, నేను ప్రాణ స్పేహితులం. బాల్యం నుండే సునీత నాకు పరిచయం. సునీత నా జీవితానికో దిక్సూచి వంటింది అనేకానేక సమయాల్లో, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ నాకు సరయిన సలహాలనిచ్చి స్పేహాన్నీ, ప్రేమనీ, ఆప్యాయతనీ కూడ పంచింది. ఎన్నేళ్ళు గడిచిపోయినా మా స్నేహం పాతబడలేదు.

“సునీ... ఏంటే అట్లా చూస్తున్నావు?” ఉలిక్కిపడింది సునీత.

నూ 55

నాతో ఏదో చెప్పాలని నోరు తెరచి వంటావిడ కాఫీ తీసుకురావడంతో ఆగిపోయింది... సుబ్బమ్మ మా యిద్దరికీ కాఫీ అందించి, వినుత కోసం ఒళ కప్పు పట్టుకుని పైకెళ్ళింది.

సుబ్బమ్మ మెట్లేక్కంత వరకూ కాఫీ చప్పరిస్తూ వుండిపోయాన్నేను. సునీత సాలోచనగా టి.వి. వంక చూస్తూ వరుసగా ఛానెల్స్‌ మారుస్తోంది. కాఫీ తాగుతున్నట్లుగా నటించి తిరిగి కప్పుని టీపాయి మీద పెట్టింది.

“సునీ” పిలిచాన్నేను మళ్ళీ.

సునీత చప్పున పైకిలేస్తూ “రా తోటలోకి వెళ్ళాం” అంది. నేను మాట్లాడకుండా లేచి సునీతను అనుసరించాను.

ఇద్దరం మొక్కల నడుమ నడుస్తూండగా అంది సునీత “ఇల్లు చాలా బావుంది పుష్పా"

ఉదయం నుండీ సునీత ఆమాట అనలేదేవిటా అని ఆతృతగా ఎదురు చూస్తున్నా న్నేను. ఇంతసేపటికి సునీత నోటి నుండి ఆ మాట రావడంతో సంతోషమన్సించింది.

“ఇంట్లో ఫర్నిచర్‌ కూడా బాగా అమర్చావు... మూలమూలా ప్లవర్‌వాజ్‌లూ, అవసరమై నంత మేరా ఎలక్షానిక్‌ గూడ్స్‌, ఎక్కడా యింత దుమ్ము కూడ లేకుండా ఎంచక్కా మెయిన్‌ టెయిన్‌ చేస్తున్నావు. హేట్సాఫ్‌”

“థాంక్యూ... థాంక్యూ వెరీముచ” నా ఆనందం హద్దులు దాటింది. “కానీ పుష్పా మనిషి జీవించడానికి యింత యిల్లు అవసరమంటావా?”

నా ముఖం నల్లగా మాడిపోయింది.

“అంటే... మనుషులు యిల్లు కట్టకోవడం తప్పంటావా?” కొంత నిష్టురం ధ్వనించింది వొ గొంతులో.

“తప్పుకాదు... మనిషికి బతకడానికే కాకపోయినా కనీసం ఛావడానికయినా ఒక కప్పుండాల్సిందే... అయితే యింత పెద్దదిగా, యింత ఆడంబరంగా యిన్ని సౌకర్యాలతో అంత అవసరమంటావా? ఇల్లు బావుంది. పేరు కూడా బాగావే పెట్టావు. (ప్రశాంతి నిలయం'... కానీ పుష్పా నువ్వు మనళ్శాంతితో వున్నావా లేదా తెలీడం లేదు... నీకీ యింట్లో నిద్ర పడ్తోందా?”

సునీత హఠాత్తుగా యిలా అనడంతో ఆశ్చర్యపోయాను. నిజమే యింటికి అనుకున్న దానికంటే ఎక్కువే అయింది.

ఆ తర్వాత ఫర్నిచరు ఆంతా తడిసి మోపెడయింది. అప్పు తీసుకురాక తప్పలేదు... మూడోసారి శ్రాప్‌ తుడిచిపెట్టకు పోవడంతో ఆ అప్పు తీర్చలేక అదంతా కలిసి వడ్డీలతో పెరిగి పెరిగి పిల్లలు పెడుతోంది.

దాంతో నేనూ, కుమార్‌ కొంత డిసస్టబ్‌డ్‌గా వున్నాం. అయితే కుమార్‌ మీద నాకు నమ్మకముంది. చాలా పట్టుదల గల మనిషి. ఇదంతా తప్పక క్లియర్‌ చేయలడు.

0 వామి

“ఏంటి పుష్పా మాట్టాడవ్‌” రెట్టించించి నునీత.

“అదేం? అట్లా అని కాదు నువ్వు హాయిగా వున్నావు కదా”

“ఊ” అన్నాను అవునూ, కాదూ అన్న విషయాన్ని తేల్చకుండా.

“ఏమో బాబూ నాకు మాత్రం ఏదో తేడా కన్పిస్తోంది. నీకు గుర్తుందా. విద్యానగర్లో మీరున్నపుడు నేను వస్తే నువ్వు, కుమార్‌ స్కూటర్‌ మీదొచ్చారు నన్ను రిసీవ్‌ చేసుకోవడానికి. వచ్చేప్పుడు మనిద్దరం రిక్షాలో వస్తూ ఎన్నెన్ని కబుర్లు కలబోసుకునే వాళ్ళం. ఈరోజు స్టేషన్‌కి డ్రైవర్లో కారు పంపించావు. అతనెవరో వెదుక్కోవటానికి పది హేన్నిముషాలు పట్టింది నాకు. సరే నేనాచ్చేప్పటికే కుమార్లేడు. ఇదివరకయితే నేను రాగానే పిల్లలు, కుమార్‌ ఎంతగా ఆనందించేవారు... అందరం కూర్చుని కబుర్లు చెప్తుంటే నువ్వు వంట చేస్తుండేదానివి. నీచేతి కాఫీ ఒకసారి రుచి చూసిన వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో మర్చిపోగలరా చెప్పు”

గిల్టీ ఫీలింగ్‌తో నా హృదయం కదిలిపోయింది. నిజమే సునీతకి నేను చేసే కాఫీ అంటే చాలా యిష్టం. దానికి ఉదయం నుండీ వంటావిడ చేతి కాఫీయే గతయింది.

నిజమే గతంలో నేనే వూళ్ళో వున్నా సునీత నన్ను విజిట్‌ చేసేది. దానికి వూళ్ళు తిరగా లంటే చెప్పలేనంత యిష్టం. వాళ్ళాయన వ్యాపారంతో మద్రాసు నుండి కదలాలంటే కుదరదు. అందుకని నేనెక్కడున్నా సరే వచ్చేసేది. పిల్లలు సునీతంటే చాలా యిష్టపడేవారు. అటు వంటిది పిల్లలు ఉదయం సునీతకి జస్ట్‌ 'హలో' చెప్పి వెళ్ళిపోవడం తప్ప సునీతతో అసలేమీ మాట్లాడలేదనుకుంటే యిప్పుడు ఆశ్చర్యంగా వుంది.

పిల్లలు హోటల్‌ గదుల్లో రెసిడెంట్స్‌ లాగ భోజనం వేళకి వచ్చి భోజనం చేసి వెళ్ళి ప్రోవడం... ఇది వరకయితే కనీసం టి.వి. గురించయినా హాల్లో కూర్చునేవాళ్ళు. ఫోన్‌ కోసమ యినా కిందికి దిగొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరి గదుల్లో వాళ్ళకి టి.వి.లూ, పి.పి.లూ, సెల్‌

గతంలో అయితే?

“మమ్మీ నీకు ఫోన్‌”

“మమ్మీ ప్లీజ్‌ క్రికెట్‌ పెట్టుకుంటాను... సీరియల్లో ఏముంది?”

ఇంట్లో వున్నంత సేపూ మమ్మీ మమ్మీ అంటూ నా చుట్టూ తిరిగేవాళ్ళు. ఇప్పుడా గదుల్లో ఎవరేం చేస్తున్నారో. యింత పెద్ద యింట్లో ఎవరే మూల వుంటున్నారో అర్ధంకాదు. అర్ధరాత్రి నేను నిద్రలో కదిలితే పక్కనే వుండి మెల్లిగా జోకొట్టే నా తండ్రి గుర్తొచ్చాడు. అమ్మా వాన్న, నేను, అన్నయ్య అంతా ఒకే గదిలో నివసించేవాళ్ళం. అప్పుడా గది చాలా యిరుగ్గా అన్పించేది. ఇప్పుడాలోచిస్తే అర్ధమవుతోంది. గది యిరుకే గానీ మనసులు చాలా పెద్దవి నా యింట్లో జరిగిన ఈ మొత్తం మార్పుని నునీత వచ్చి చెప్పేదాకా వేను సమీక్షించు కోలేక పోవడం నిజంగా శోచనీయం.

“హిశా4/

ఆ రాత్రి మాస్టర్‌ బెడీరూమ్‌లోని నా బ్పింగ్‌కాట్‌ మీద పడుకుని అలోచనలో పడ్డాన్నేను. కుమార్‌ డ్రింక్‌ తీసుకుంటూ టి.వి. చూస్తున్నాడు. వేనతడ్చే నిశితంగా గమనిస్తున్నాను.

గతంలో బ్యాంకాఫీసరుగా వున్నపుడు సాయంత్రమయితే చాలు నేరుగా యింటి కొచ్చేసేవాడు. వన్తూ వస్తూ మల్లెపూలు తీసుకొచ్చేవాడు. ఎంత ఒత్తిడిలోనయినా నరే నాతో కలిసి గడపడంలోనే రిలాక్సేషను వుందనేవాడు. అతడితో గడిపిన ఆనందమయమైన సాయంత్రాలూ, సుఖమైన రాత్రులూ జ్ఞప్తికి వచ్చి ఒక్క క్షణం నా మనసు మత్తుగా మూలిగింది.

వెంటనే చెప్పలేనంత దిగులు నన్నావరించింది. ఇప్పుడు డబ్బుతో వచ్చిన టెన్మన్‌ని ఈట్టుకోవడానికి డ్రింకూ, టి.వి.ల్లో రిలాక్సేషన్‌ దొరుకుతోందతడికి.

నా ఉనికిని గుర్తించి కుమార్‌ ఎప్పుడు నా దగ్గరికొస్తాడా అని యిష్టంగానూ, అసహనం గొనూ ఎదురు చూన్తున్నాన్నేను. స్రింగ్‌కాట్లోని డన్‌లప్‌ బెడ్‌లో నుండి ఏవో వనసన్నటి ముళ్ళు నా వీపుని గుచ్చుతున్నాయి.

భంథాలయ వర్వన్వం, నవంబరు 2000

2 వాపా

రాచపుండు

తోరౌజ్షేశ్యరీ... .. రా... కేశ్వ..6 ” రెండో పిలువు విరుపుల్లో కఠినంగా వుంది. వంట గదిలో సాంబారుకి తాళింపు పెడ్తోన్న రాజేశ్వరి ఆ గర్జనకి గజగజా వణికిపోయింది.

ఒక భూకంపమేదో ఫెళఫెళమంటూ కొళ్ళకింది నుండి పాక్కుంటూ వెళ్ళింది. ఎన్నో ఏళ్ళక్రితం మామగారు కట్టించిన యింటిగోడలు నెర్రెలు వారినట్టయింది. వంటింట్లోకాక నిప్పులగుండంలో నిలబడ్డట్టుగా వుంది రాజేశ్వరికి .

తాళింపుకని పెట్టిన బాణలి మాడిపోతోంది. స్టా ఆర్బాలన్న ఆలోచన కూడ రాలేదామెకి.

“రాజేశ్వరీ... జేశ్వరీ... ఈశ్వరీ” భర్తపిలుపు వలయాలు వలయాలుగా అ హాల్లో రీ సొండ్‌లో విన్చిస్తోంది. పది హేనేళ్ళ వైవాహిక జీవితంలో భర్త అంత కోపంగా వుండడం ఎప్పుడూ చూడలేదు రాజేశ్వరి. అంటే చంద్రారెడ్డికి కోపం రాదని కాదు. అతడికి కోపమెక్కువయినపుడు మౌనమనే ఆయుధంతో

ఇప పజ 4

వేధిస్తాడే తప్ప తీవ్రమయిన మాటలతో కాదు. ఇంటా బయటా ఎవరిమీద కోపమొచ్చినా అతడంతే... అటువంటిది ?

అయితే యిటువంటి ఒక పరిస్థితి గురించి గత మూడురోజులుగా సిద్ధపడే వుందామె. భర్త హైదరాబాదు నుండి ఈ ఉదయం దిగినప్పటి నుండీ మరీ ఎక్కువగా...

“విజయుడు నామినేషనేశాడా?” గర్జించాడు చంద్రారెడ్డి.

నేలకంటుకుపోయిన పాదాల్ని పెకలించి హాల్లొకెళ్చామని రాజేశ్వరి అనుకుంటుండగానే పెద్దపెద్ద అంగలతో వంటగది గుమ్మంవద్ద కొచ్చేశాడతను. భార్య మౌనం మరింత రెచ్చగొట్టి నట్టుగా కళ్ళు పెద్దవిచేసి కోపంగా అదే మాటల్ని పునశ్చరణ చేశాడు రెడ్డి. అతడి దవడ నరాలు ఉబ్బివున్నాయి. గొంతులో అంతులేని కాఠిన్యం విన్చించింది...

తెలీదంటే అతడు నమ్మడు. తెలుసునంటే అన్నీ నీకు తెలిసే జరగతుండాయన్న మాట అంటాడు. గమ్మునుంటే ఊరా పేరా అని? పంచాయితీ ఎలక్షన్లాచ్చాయి. రాకపోతే పార్టీలకీ, వాటిని నమ్ముకున్న నాయకులకీ జరుగుబాటయ్యేదెట్లా? ఖర్మ... ఈ ఎలక్షన్లు తన చావుకొచ్చి నట్టుండాయి అనుకుంది రాజేశ్వరి .

అయితే రాదేశ్వరి అదృష్టమో, దురదృష్టమో తెలీదుకాని, ఆమె సమాధానం కోనం ఎదురుచూడకుండా వచ్చినంత పెద్ద అంగలతోనూ హాల్లోకి వెళ్ళాడతడు... ఎదురుచూసిన ఉత్పాతమేదో ఎవరో అరచేయిపెట్టి ఆపినట్లుగా పెద్దగా ఊపిరితీసుకుంది రాజేశ్వరి. అయితే అతడలా మౌనంగా తిరిగి వెళుతూంటే ఆమె గుండెలు దిగులుతోనూ, బాధతోనూ వేగంగా కొట్టుకున్నాయి. మాడిపోయిన బాణలి నుండి కమురువానన ఆమె శ్వాసకోశాల్లో చేరి పాడి దగ్గుతో ఇబ్బందిపెట్టింది.

చంద్రారెడ్డి హాల్లోకి రావడంచూసి, అక్కడ కూర్చొన్న హరిబాబు, రామిరెడ్డి, బుజ్ణిశెట్టి లేచి నిల్చున్నారు. రామిరెడ్డి చనువుగా అతని వెనుకనే పడగ్గది వరకు నడిచాడు.

గుమ్మంవద్ద క్షణకాలం ఆగి, భావం లేకుండా రామిరెడ్డికేసి చూశాడు చంద్రారెడ్డి...

“నన్ను... నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి” ఈ మాటలు అనడానికి సర్వ శక్తులూ కూడతీసుకున్నట్లుగా ఉన్నాడతడు. ఆ తర్వాత తన ముఖంలో భావాలని రామిరెడ్డి గమనించకుండా లోపలికెళ్ళి తలుపేసుకున్నాడు .

“ఇన్నేళ్ళనుండీ తెలుసు మనకు. అన్ననీ మాదిరిగా ఎప్పుడూ చూడలేదు” దిగులుగా అన్నాడు హరిబాబు.

“అయితే చిన్న విషయమా? ఎక్కడో పల్లెటూర్లో ఉన్నోడిని టౌన్‌కు పిలిపించి, క్యాసెట్లు అంగడి పెట్టించాడు అన్న. వాడు ముందు మ్యూజికల్స్‌ అన్నాడు వెనక కాంట్రాక్టులన్నాడు. ఆ తర్వాత రొయ్యలగుంటలు పెట్టినాడు” ఈఈ ఇవా

“సర్రే... రే... దేనికైనా ఉండాలండీ... సారాయి అంగట్లో మాత్రం తక్కువ సంపాయిచ్చి నాడా? దేంట్లో చెప్పు నాడికి కలిసిరాంది? రూపాయి పెడితే పదిరూపాయలుగా తిరిగి వచ్చేన్తుండే... అన్ని యాపారాల్లోనూ పార్టనర్సే మళ్ళీ...” రెట్టించాడు బుజ్జిశెట్టి.

“అందుకే కదా... ఆ బటువు చూసుకునే అన్న మీదనే నామినేషన్‌ ఏసేసినాడు... ఒక్కొక్క మాటా విరిచి విరిచి కసిగా అన్నాడు రామిరెడ్డి. రామిరెడ్డి చంద్రారెడ్డి తండ్రి రాఘవరెడ్డి హయాం నుండి కూడా ఈ కుటుంబాన్నే కనిపెట్టుకుని మంచిచెడుల్లో భాగమైనవాడు. అందుకే చంద్రారెడ్డిని వదల్లేక వెళ్ళి సోఫాలో కూలబడ్డాడు.

చంద్రారెడ్డి లోపలికెళ్ళి తలుపుమూసుకున్నాడే కానీ మనసు తలుపులు వేయలేక పోయాడు.

తను నీళ్ళుపోసి, ఎరువేసి పెంచిన మొక్క మహావృక్షమై తనమీదకే పెళపెళా విరుచుకుపడ్డట్టుగా వుంది. తను పాలుపోసి పెంచిన కుక్క తనమీదళే మోరెత్తి మొరుగు తున్నట్టుగా వుంది. రాజకీయాల్లో నీతి, అవినీతి, మంచిచెడ్డా, అన్నా తమ్ముడూ, ముందువెనకా ఏమీ లేవని ఎంత సరిపెట్టుకో చూసినా అతడివల్ల కావడంలేదు.

కలగాపులగమైన ఆలోచనలతో నిండిపోయిన మెదడు వత్తిడికి తట్టుకోలేక పేలడా నికి సిద్దంగా వుంది. ఎప్పటెప్పటివో సంగతులు దృశ్యాలు దృశ్యాలుగా ముందుకూ వెనక్కూ కదులుతున్నాయి. ఏదీ నిలకడగా వుండడంలేదు. మనసులో అల్బపీడనమేదో ఏర్పడట్టుగా వుంది.

ఐతే ఇవన్నీ కూడా ఓ అయిదు పదినిమిషాలు మాత్రమే. వెంటనే తనకు తాను నచ్చచెప్పుకుని సెట్టైట్‌ అయిపోయాడు రెడ్డి... మనసు లోపల మహానదులు పోటెత్తుతున్నా పైకి తొాణక్కుండా వుండడాన్ని రాజకీయాల్లోకి వచ్చాకే నేర్చుకున్నాడతడు. లోపలి భావాలేవీ ప్రతిబింబించనీకుండా మొహం కడుక్కుని చిరునవ్వుతో బయటికొచ్చాడతడు చివరికి .

హాల్లోనూ, వరండాలోనూ, కాంపౌండ్‌లో మల్లగుల్లాలు పడుతున్న జనాలంతా అన్న రాకతో మౌనం వహించారు. అసలేమీ జరగనట్ట్లుగానే వచ్చి సోఫాలో కూర్చొని మాటలు కలిపాడు రెడ్డి. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని రాజేశ్వరికి పురమాయించాడు.

“అన్నా మద్యాహ్నం మూడుగంటలా ముప్పైఅయిదు నిమిషాలకు బాగుండాదంటన్నా నామినేషనేయడానికి. పద్మయ్యస్వామి చెప్పంపిచ్చాడు” చెప్పాడు హరిబాబు.

అప్పటికి రెండోసారి నంట ప్రయత్నాలు కొనసాగిస్తోన్న రాజేశ్వరి గుండె వేగంగా కొట్టుకుంది భర్త నిర్ణయం కోసం.

క్షణకాలపు మౌనం తర్వాత

“అలాగే వేద్దాం” తలూపాడు చంద్రారెడ్డి హుందొగా.

అనా

బావమరిది విజయకుమార్‌ రెడ్డి చెప్పాచెయ్యకుండా నామివేషనేయడంతో చంద్రారెడ్డి విలబడతాడో, లేదోనని మధనపడుతోన్న చంద్రారెడ్డి మనుషులంతా హర్షా౭రేకంతో కేరింతలు కొట్టారు.

“అయినా ఈ బజారులో నా కొడుకులంతా కలిసి ఎక్కబెట్టేశారులేన్నా. లేకుంటే విజయన్న అంత ధైర్యం చెయ్యడు” విజయకుమారిరెడ్డిని సమర్ధిస్తూ చంద్రారెడ్డిని ఓదార్చడానికి ప్రయత్సించాడు సిద్ధయ్య.

“ఆ... అవును పాపం నోట్లో ఏలుపెడితే కొరకలేడు. కుర్ర వాకొడుకులు చెబితేమాత్రం ముందూ, ఎనకా చూడాల్నా పళ్ళేదా? పది రూపాయలు నంపాయిచ్చుకుని ప్రశాంతంగా బతకతుండాడు గదా అనుకుంటే రాజకీయాల్లోకి లాగిపారేసినారు. ఈ కాలం ఎక్కడబట్టినా ఇదే దరువు. నాలుగురాళ్ళు ఎనకేస్తేచాలు, రాజకీయాల్లోకి దిగాలనుకుంటుండారు”

చంద్రారెడ్డికి ఒక్కక్షణం పిల్లకాకితో పోటీపడ్డం ఇబ్బందిగా అనిపించినా, ఉండేలు దెబ్బని రుచి చూపించాలనుకున్నాడు.

ఇన్నేళ్ళుగా తననీ, తన రాజకీయాన్నీ నమ్ముకుని ఈ ఇంటినే అంటిపెట్టకుని జీవి స్తున్న తన మనుషులంతా దిక్కులేని పక్షుల్లా కళావికలైపోవడాన్ని అతడు ఊహించలేకపోతు న్నాడు. అందుకే ఈ నిర్ణయం. బుజ్జిశెట్టి చెప్పినట్లు ఏనుగు బతికినా చచ్చినా వెయ్యిరూపా యలే.

చంద్రారెడ్డి నిర్ణయంతో

“చంద్రారెడ్డికీ జై... చంద్రన్నకీ జై” అన్నకేకలతో ఆ కాంపౌండ్‌ అంతా మార్మోగిపోయింది. ప్రమేయం లేకుండానే చంద్రారెడ్డి గుండెలుప్పాంగాయి... ఆనందమూ, దిగులూ కలగలపిన భావమేదో రాజేశ్వరి మనసుని కదిలించింది.

శు న! న!

“అన్నా! విజయుడు మరీ దూకుడుమీదుండాడన్నా, నామినేషన్‌రోజే యాభైవేలు ఖర్చుపెట్టేశాడు. అది జనం కాదనుకో రోడ్డు పట్టలేదు” చెప్పాడు హరిబాబు,

“అవునవును. మనిషికో సారాయి ప్యాకెట్టు, సాయంత్రానికో వందనోటు... రాక చస్తారా జనం...” ఎద్దేవా చేశాడు నారాయణ .

“అసలు భలే స్పీడు మీదుండాడులే నారాయణా. డబ్బు చిల్లపెంకుల మాదిరి చల్లిపారేస్తుండాడు. అప్పుడే కాలనీలన్నీ చుట్టేసొచ్చినాడు. చాకలి కాలనీలో గుడి కట్టిస్తానని ప్రమాణం చేసినాడు. మాలాయకోటలో మసీదుకి రాళ్ళు తోలించేసినాడు. బీడీ కాలనీలో ఖబరస్తాన్‌కి డబ్బులిచ్చేసివాడంట. రాజీవ్‌గాంధీ కాలనీలో రామమందిరం కట్టిస్తానన్నాడంట” ఈల ఇనా

“ఆ కాలనీల్లో విజయుడంటే ఎవరికి తెలవదు కాబట్టి చుట్టేసొచ్చినాడు. చంద్రన్న పది హేనేళ్ళనుండీ తిరగతానేవుండాడు కదా కాలనీల్లో .. కాలనీ జనాలకి చంద్రన్నేమైనా కొత్తా...” బొంయ్‌ మంటూ వరస కార్గశబ్దంతో యమ్‌.యల్‌.ఏ. వచ్చినట్లు అర్ధమైందందరికీ. తొగుతోన్న కొఫీగ్గాను పక్కనబెట్టి మెల్లగా లేచి గుమ్మంవైపుగా రెండడుగులు వేశాడు చంద్రారెడ్డి. మంత్రిపదవి పోయినా సెక్యూరిటీని వదలకపోవడంతో బూట్లశబ్టాలు ధనధన మంటూ యమ్‌.యల్‌.ఏ. కంటే ముందే లోపలికొచ్చేశాయి. గంజిపెట్టిన ఖద్దరు బట్టలతో పాటుగా మణెయ లోపలి కడుగుపెట్టాడు . - అప్పటికే కాఫీలు తాగుతూ చంద్రారెడ్డితో మంతనాలాడుతుండిన రామిరెడ్డి , బుజ్ఞశెట్టి వగైరాలంతొ మర్యాదపూర్వకంగా లేచి నిల్చుని మళ్ళీ యమ్‌.యల్‌.ఏతో పాటుగా కూర్చున్నారు. చంద్రారెడ్డితో ఏకాంతంగా మాట్లాడాలని వచ్చిన యమ్‌.యల్‌.ఏకి ఆసరికే అక్కడ వీళ్ళంతా ఉండడంతో ఒక నల్లని నీడ అతని ముఖంమీద తారాడి కదలిపోయింది. అందరివంక చూసి నవ్వుతూనే చంద్రారెడ్డి భుజంమీద చెయ్యివేసి మెల్లిగా లోపలికి నడిపించాడు యమ్‌.యల్‌.ఏ.

లోపల డైనింగ్‌ టేబిల్‌ మీద అందరికీ టిఫిన్లు రెడీ చేస్తోన్న రాజేశ్వరి మటెయ్యని చూడగానే చేతులు జోడించి చిరునవ్వు నవ్వింది. డావిన్సీ చిత్రించిన చిత్రపు నవ్వులా అందులో భావాల్ని పసిగట్టడం కష్టమైంది యమ్‌.యల్‌.ఏకి. తనూ అర్ధంలేని నవ్వొకటి విసురుతూ కుర్చీ లాక్కున్నాడు “బావున్నారా అమ్మా” అంటూ.

ఈ యమ్‌.యల్‌.ఏ. రాజకీయాల్లోకి రాకముందు నుండీ తన భర్తా, మామగారూ పార్టీలో ఉన్నారు. రామారావు తెలుగుదేశం పెట్టినప్పుడే మూనుగారు పార్టీలో చేరిపోయారు. అప్పటినుండీ ఇప్పటివరకూ తండ్రీ కొడుకులిద్దరూ ఈ ఊరికీ, ప్రజలకీ ఎంతో సేవచేశారు. ఈ యమ్‌.యల్‌.ఏ.కి రాజకీయాలు నేర్పించి టిక్కెట్టిస్పించింది మామగారు. నియోజకవర్గం లోని వ్రతిఊరికీ తిప్పి, కార్యకర్తల్ని పరిచయంచేసి గెలిపించింది మామగారు. తొలిచాన్సులొనే మంత్రిపదవి రావడానికి కారణంకూడా మామగారేనని అంతా చెప్పుకుంటార . అటువంటిది నిన్నగాక మొన్న కొంభైన్‌లో నుండి అధికారపార్టీలోకి ఎగిరి దూకిన మాల్యాద్రినాయుడు ఎక్కువైపోయాడిప్పుడీ యమ్‌.యల్‌.ఏకి.

అవును మాల్యాద్రి దగ్గైతే డబ్బులుండాయి కట్టలుకట్టలుగా... మనదగ్గరే ముండాది? ఉణ్జిందంతా ఊడ్చి ఎలక్టన్లకీ, పోలిస్టేషన్లకీ... మిగిలితే పేదోళ్ళకీ పెట్టనే సరిపోయె... దీర్ధంగా నిట్టూర్చింది రాజేశ్వరి.

అటు తమ్ముడికీ, ఇటు భర్తకీ జరగబోయే యుద్ధం ఆమెని కుంగతీస్తోంది. నాయ కులు యుద్ధం కోరుకుంటే, ప్రజలు శాంతి కావాలనుకుంటారు అంటారు కదా. మరేమిటో

అబే 47

ఇప్పుడు నాయకులూ, జనాలూ కూడా యుద్దాన్నే కోరుకుంటున్నారు. వ్ప్‌... ఇన్నేళ్ళుగా రాజకీయం చేసిన తన భర్త బామ్మర్షికి భయపడి విత్‌డ్రా చేయడమన్నది మింగుడు పడడం లేదామెకి. ఇదిలా ఉంటే పార్టీని రెండుగా చీల్చేసి మాల్యాద్రినాయుడిని వేదికమీదికి తెచ్చేశాడీ యమ్‌.యల్‌.ఏ.

ఛీ..ఛీ.. ఈ యమ్‌.యల్‌.ఏ. వచ్చిన తర్వాతనే ఈ ఊరి రాజకీయమంతా ఇట్టయి పోయింది. పార్టీలో ఒకటిగా ఉన్న మనుషులందరినీ విడివిడిగా వేరు చేసేసినాడు. గ్రామాల్లో కార్యకర్తల మధ్యవుండే మిత్రవైరుధ్యాల్ని శత్రువైరుధ్యాలుగా మార్చేశాడు. ఇంతకు ముందంతా ఎన్నికలు, గెలుపోటములు, మనస్పర్ధలు ఊరికే పరిమితమైవుండేవి. ఇప్పుడిక్కడ నాయకుల ఆధిపత్యం జిల్లాకు విస్తరించింది. ఇంకా అవసరమైతే రాష్ట్రస్థాయిలో కేంద్రీకృతమౌతుంది.

వంటగదిలోకి, డైనింగ్‌ టేబిల్‌ దగ్గరకి షటిల్‌ ఆడుతోన్న రాజేశ్వరి భర్తకీ, యమ్‌.యల్‌.ఏ కి మధ్యజరుగుతోన్న సంభాషణని వింటూనే ఆలోచిస్తోంది .

“వేను చెప్పేది అర్ధంచేసుకోండనా... పరిస్థితి బాగులేదు. మీరసలు జిల్లా నాయకులు. పంచాయతీకేందనా మీరేసేది... నా మాటినండి” భర్తని ఐస్‌ చేస్తున్నాడు యమ్‌.యల్‌.ఏ. “ఖర్చుకూడా చాలా అయ్యేట్టుందన్నా. ఇప్పుడు మీరుండే పరిస్థితుల్లో ఇది విత్‌డ్రా చేసుకోడమే మంచిది”

చంద్రారెడ్డి మౌనంగా మటెయ్యకేసి చూస్తున్నాడు సాలోచనగా. ఒకప్పుడు యమ్‌.యల్‌.ఏ కాకముందు తన తండ్రి ఎదురుగా చేతులు కట్టుకుని నిల్చునుండే మణెయ్య రూపం పదేపదే జ్ఞప్తికొచ్చిందతడికి,

“ఖర్చౌతుందట ఖర్చు' మనసులోనే కసిగా అనుకుంది రాజేశ్వరి. ఇతడి శాననవభ ఎన్నికల కోసం భర్త, మామగారు ఎంత శ్రమపడిందీ, ఎంత ఖర్చు చేసిందీ అప్పుడే మర్చిపోయా డేమో... అంత అభిమానమున్నవాడైతే ఒక రెండు లక్షలివ్వొచ్చుగదా... మణెయ్య చేతికి కాఫీ అందిస్తూ మధనపడింది రాజేశ్వరి.

“ఖర్చు లేకుండా ఏముండాదిలే మఖెయ్యా” అప్పుడే లోపలికొచ్చిన రామిరెడ్డి అందు కున్నాడు. “ఎలక్షన్లలో ప్రజాస్వామ్యమేడుంది? ఇప్పుడు సర్పంచి సీట్లు గూడా ఇంత లెక్కన యాలామేసి అమ్మేస్తుంట్రి. ఈ వక్క అత్తలపాళెం, రోసనూరూ పంచాయతీలంతే కదా. లక్షా లక్షా యాలైవేలకి బేరం కుదిరిపోయాయి. అంతంత చిన్నూర్లలోనే అట్బంటే, ఈ మేజర్‌ పంచాయతీ సంగతి చెప్పాలా? డబ్బు లేకుండా ఏది జరగతాది చెప్పు”

రాఘవరెడ్డి, చంద్రారెడ్డిల ప్రాసకంతో యమ్‌.యల్‌.ఏ అయ్యి కోట్లు సంపాదించుకుని ఇప్పుడు అన్నని నిర్లక్షం చేస్తన్న మణెయ్య అంటే చంద్రారెడ్డి మనుషులందరికీ ఒళ్ళుమంటే.

“ఒక పంచాయతీ అనేముండాది? మొత్తం రాజకీయమే అట్టుండాది. ప్రజల్యాడ ఎన్నుకుంటా వుండారు నాయకుల్ని, డబ్బుకదా ఎన్నుకునేది. ఎన్ని లక్షలు ఖర్చుపెట్టగలిగితే, వాపా

వాడే కదా నాయకుడు. డబ్బుంటే చాలు బోరవిరుచుకుని రాజకీయాల్లోకి దిగొచ్చు అసలు నాకు తెలవకడగతాను గాన్యా ఎలక్షన్లు దేనికినా? జనాలకోసమా? పోటీచే సేవాళ్ళకోనమా? 'పేదోళ్ళకి తిండి. గుడ్డ, నీడ కల్పించేదానికోనమా? లేకపొతే పెద్దోళ్ళు పదవులు పంచుకునే దానికా? అహ... ఎందుకనీ ?” చంద్రారెడ్డి చిన్నాయన కొడుకు మురళిరెడ్డి అడిగినదానికి సమాధానం చెప్పలేక 'అహ..హ్హ' అంటూ నవ్వి తేల్చేశాడు యమ్‌.యల్‌.ఏ. అందరూ ఇలా తలోపక్క నుండీ తగులుకుంటారని అతను ఊహించలేదు.

బయటున్నవాళ్ళంతా ఒక్కొక్కరే మెల్లిగా లోపలికి చేరుతుండడంతో చవ్వునలేచి చంద్రారెడ్డి దగ్గరగా వంగి “అన్నా ట్రయాంగిల్‌ ఫైట్‌ కష్టమౌతాదన్నా... ఇటు మీ కుటుంబం లోనూ, అటు పార్టీలోనూ చీలిక... రెండువిధాలుగా దెబ్బే... ఆలోచించుకోండి...” మెల్లిగా చెప్పి “నరే నేను రాత్రికొస్తానన్నా” అంటూ చేయందించి అందరినీ విష్‌చేసి సరానఠా వెళ్ళిపోయాడు మణెయ్య. అప్పటికి ఖద్దరుబట్టల గరగర కొంత తగ్గింది.

“అవును... పార్టీలో చీలిక... ఎవరివల్ల వచ్చిందిదంతా? వీడి వల్లగాదూ... ఏం ఆ మాల్యాద్రినాయుడికే చెప్పి విత్‌డ్రా చేయించొచ్చుగదా? చంద్రన్న ఎందుకుచేయాలి?” నంటి ఎన్నో ప్రశ్నలు చంద్రారెడ్డి మనుషుల్ని తొలిచేస్తున్నాయి.

చంద్రారెడ్డి పైకి అచేతనంగా ఉన్నట్టున్నాడుగానీ లోపల తన బలాన్నీ, మాల్యాద్రి వాయుడు బలగాన్నీీ ఇటు విజయుడి డబ్బునీ, తులాల కింద బేరీజు వేస్తున్నాడు.

వ శ శ

“విలేఖరి రానేంద్ర కూడా విజయుడివైపే తిరుగుతున్నాడంట గదా” భర్తకి మంచినీళ్ళ గ్లాను అందిస్తూ కదిపింది రాజేశ్వరి. మధ్యాహ్నం వదిన ఫోన్‌ చేసి ఎగతాళిగా ఈ విషయం చెప్పినప్పటి నుండి కాళ్ళూచేతులూ ఆడ్డంలేదామెకి. రాజేంద్ర 'అక్కా అక్కా' అంటూ ఇంట్లో మనిషిలా తన వెనకే తిరుగుతుండేవాడు. వాడి భార్య కిరోసిన్‌ పాసి తగలబెట్టుకున్నప్పుడు శేసు లేకుండా చేయడం కోసం భర్త యస్‌.పి. చుట్టూ సొంతఖర్చులతో తిరగడం ఇంకా గుర్తుంది.

అప్పుడే ప్రచారాన్నుండి వచ్చిన చంద్రారెడ్డి నిర్భావంగా భార్యశేసి చూశాడు. అసలే మే నెల ఎండ బారినపడి వడలిపోయిన మొహం మరింత నల్లబారిపోయింది. నలిగిపోయిన ఖద్దరు చొక్కా అతడి స్టితిని, అలసటనీ ప్రతిబింబిస్తోంది.

(ప్రచారంలో మల్లికార్డునరెడ్డి, గోపాలరెడ్డి కొడుకూ, ఇందిరమ్మ టీచరు భర్త అంతా విజయుడి కోసం ఓట్లడగడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇంటికి రాగానే భార్య రాజేంద్ర గురించి చెప్తోంది. వీళ్ళంతా తననుండి ఎంతెంత సాయం పొందారు. డబ్బునీ, సమయాన్నీ కూడా లెక్కచేయకుండా, వాళ్ళది న్యాయమా కాదా అని కూడా ఆలోచించకుండా వాళ్ల

శభ ఇ ప్రియం ళల

తరపున ఎంతెంత పోరాడాడు తను. అటువంటిది వాళ్ళంతా ఇప్పుడు విజయుడి చుట్టూ తిరగడానికి కారణమేమిటి? ఛా... ఛా... డబ్బు మరీ ఇంత నీచంగా పనిచేస్తుందా? అవునవును ఇప్పుడు రాజకీయాల్లో అదేగదా ముఖ్యంగా పనిచేసేది...

ఒక్క పదవితో లక్షలు దోచేయాలనుకుంటారు నాయకులు. ఒక్క ఎలక్షన్‌తో 'పెకొచ్చాయాలనుకుంటారు కార్యకర్తలు. ఆఅ ఒకటి, రెండురోజులైనా కడుపునిండా తిండి తినాలనుకుంటాడు పేద ఓటరు. అందుకే నాయకులు, ప్రజలు అంతా యుద్శాన్నే కోరు కుంటున్నారు.

“అన్నా, ఓటుకు వందరూపాయ లెక్కన పంచుతుండాడంటన్నా విజయుడు” హడావుడిగా పరుగెత్తుకొచ్చాడు నారాయణ.

వంద రూపాయలా?... అదిరిపడ్డాడు చంద్రారెడ్డి. ఈ పంచాయతీ చరిత్రలో ఇప్పటికి లేదు ఓటుకి వందరూపాయలివ్యడం. ఏదో ఓటుకి ముప్పై, నలభై యిచ్చేవాళ్లు. ఎంత బ్రాందీ షాపుంటే మాత్రం సాయంత్రమయ్యేసరికి ప్రతి కాలనీలో కేసులు కేసులుగా దింపేస్తుండా డంట. ఎందుకని విజయుడిట్లా పరుగు మీదుండాడు? అటు మాల్యాద్రి కూడా ఇలాగే మంచినీళ్ళలా ఖర్చు పెడుతున్నాడు. వాళ్ళిద్దరితో పరుగు సాధ్యపడే విషయమేవా? ఇట్టయితే ఇంకా రెండు మూడు లక్షలు చూసుకోవలసి వస్తుంది తను.

కార్యకర్తలు డీలాపడ్డం బాధగా వుంది చంద్రారెడ్డికి... అనుకున్న డబ్బు చేతి కందక పోవడంతో పరిస్థితంతా అయోమయంగా వుంది. ఓట్లకి పంచడానికీ, మందుకీ డబ్బు వెదుక్కోవాలి.

నిజంగావే విజయుడు గెలుస్తాడా? తన దగ్గరుంటూ పరిచయాల్నీ, ప్రాబల్యాన్సీ, ఈన పలుకుబడితో డబ్బునీ పెంచుకున్న విజయుడు, ఈరోజు ఆ డబ్బుతోనే తన మనుషు అందర్నీ ఒక్కొక్కర్నీ కొనేస్తున్నాడు.

ఇప్పుడు రాజకీయాల్లో ఎవరికీ సిద్ధాంతం లేదు. ఆధిపత్య రాజకీయాలూ, డబ్బూ, కులమూ, కక్షసాధింపులూ ఇవే రాజకీయంగా పరిణమించాయి. ముఖ్యంగా ఈ మండలాల ఎన్నికలొచ్చాక ఊరే చాలా మారిపోయింది. ఒక్కమాట మీద కట్టుగా వుండడమన్ను పద్ధతే లేకుండాపోయింది. వీధివీధికీ నాయకులైపోయారు.

ముళ్ళకంచె మీద అతుక్కుపోయిన పాతపంచెలాగా వుంది చంద్రారెడ్డి మనను. బలహీనపడుతున్నట్లుగా కూడా వుంది. ఇన్నేళ్ళుగా తన చేతికింద ఇంతమందిని పెట్టుకుని ఊరినే శాసించిన వాడికి ఈ జంకేంది? భయమేంది?...

నిత్యం వచ్చిపోయే జనాలతో నిండుగా వుండే ఇల్లు, ఎన్నో ఏళ్లుగా మంచికీ చెడుకీ ఆలవాలమైన ఇల్లు మనిషికాడ లేకుండాపోతుందా? స్మశానం కళ్ళముందు నిలిచింది రెడ్డికి...

ఆలోచనలు ఒక కొలిక్కిరావడం లేదు. బం వా

అనలు ఓటుకి డబ్బివ్వడమనే ఆచారం ఎప్పుడు ఎక్కడ మొదలైంది. తనకి గుర్తు న్నంతవరకూ తన తండ్రి హయాంలో ఏనాడూ ఓటుకి డబ్బిచ్చిన జ్ఞాపకంలేదు. చివరి సమితి ఎలక్షనప్పుడు మాల్యాద్రినాయుడి మేనమామ ్రిష్ణమూర్తినాయుడు ఓటుకి ఇరవై లెక్కన డబ్బిచ్చి కొన్నాడని అంటారు. పోలింగు రోజు ఓటేయడానికొస్తే పనికిపోవడానికుండదనీ, కూలీడబ్బులు రావనీ చాలామంది జనం పోలింగుకి వచ్చేవాళ్లు కాదు. అందుకని ఆరోజుకి కూలీడబ్బులు మేమిస్తాము, వచ్చి ఓటేయండని వాళ్ళని బతిమాలి, బామాలి పోలింగుకి తీసుకొచ్చేవాళ్ళు అభ్యర్థులు. అలా మొదలైన ఈ సాంప్రదాయం క్రమంగా ఓటుకి డబ్బివ్వడంగా మారిపోయుండొచ్చు. ఇప్పుడీ మొత్తం క్రమమంతా మళ్ళీ వెనక్కెలా తిరిగొస్తుంది?

“అయినా ఈసారి ఎలక్షన్లు పంచాయతీ ఎలక్సన్ల మాదిరిగా లేవు. యమ్‌.యల్‌.ఏ. ఎలక్షన్ల మాదిరుండాయి...” భర్త చేతినుండి గ్లాసందుకుంటూ తనలో తాను గొణుక్కుంది రాజేశ్వరి. మళ్ళీ పెద్దగా అనడానికామెకి ధైర్యం చాలలేదు. భర్త తననీ, తన పుట్టింటినీ, విజయుడ్నీ అందరినీ తూర్చారపడతాడేమోనని సంకోచించింది.

శ శః శః

“కాలనీల్లో వండగమాదిరుందన్నా. విజయుడు చీరలు తెచ్చి పంచతుండాడు. మాల్యాద్రి కుర్చీలు చిన్నవి తెచ్చి ఇస్తుండాడు ఇంటింటికీ. ఆయన గుర్తు కుర్చీ కదా అందుకని. ఒక పంచాయతీకి వాళ్ళు ఇంతింత ఖర్చుపెట్టి గెలవాలనుకుంటుండారంటే వాళ్ళు దాంట్లోంచి ఎంత తినెయ్యాలనుకుంటుండారో అర్ధంచేసుకోమని కాలనీ జనాలకంతా విడమర్చి చెప్పాచ్చి వానన్నా” చెప్పాడు సిద్ధయ్య,

“జనాలకి అంత దూరం ఆలోచనుంటాదా సిద్ధయ్యా... ఈరోజు వచ్చే డబ్బులే కదా వాళ్ళకి. అందులో ఈ నడమ వానల్లేక, పనుల్లేక దాహానికల్లాడిపోతుండారు జనం... వాళ్ళు వద్దనలేనంత డబ్బులాస్తుంటే ఎట్టా కాదనగలరు చెప్పు?”... ఇందులో లేబర్‌ తప్పేమీ లేదన్పట్టుగా అన్నాడు చంద్రారెడ్డి. కూడుకుపోయిన రొయ్యల డబ్బు, సారాయి డబ్బు ఏదో ఒక మార్గంలో పేద ప్రజలకి చేరడమే న్యాయమన్నట్టుంది అతడి ధోరణి.

ఊళ్ళో ఎక్కడచూసినా ఇవే మాటలూ, ఇవే ఆలోచనలూ, టీలు తాగుళూ బీడీలూ, సిగరెట్లు కాలుస్తూ ప్రతి సెంటర్లోనూ ఇవే చర్చలు... ఊరంతా ఎన్నికల వాతావరణంతో గుబగుబలాడిపోతోంది.

కొంతమంది అటో వస్తాదంటే, మరి కొంతమంది ఒకటి రెండు ఓట్లతోనైనా క్యారమ్‌బోర్డు గెలస్తాదని పందేలు కట్టుకుంటుండారు. కుర్చీ మాత్రం మూడోస్థానంలోనే వుంది. యమ్‌.యల్‌.ఏ.కూడా కుర్చీలోనే ఊరేగతుండాడు. అయినా కుర్చీ మూడోస్థానంలో వుందని అందరూ ఎద్దేవాగా చెప్పుకుంటుండారు.

ఈవ్మభ బత్రిమ ణు వల

“త్సూ... వాడూ ఒక మనిషా?... అన్న పలుకుబడితో, అన్న డబ్బుతో గెలిచి కులక తుండాడు... ఈరోజు అన్న పంచాయతీకి నిలబడితే సపోర్టు చేయాల్సిందిపోయి, మాల్యాద్రి నాయుడితో తిరగతుండాడు . పార్టీని ఇట్టా చీల్చి చితుకులు చేస్తున్నాడని ముఖ్యమంత్రికి రిపోర్టియ్యాల... ఇంటికిపోతాడెదవ” కాలో నేలని తన్ని ఆవేశంగా బయటికెళ్ళిపోయాడు సిద్ధయ్య.

సిద్ధయ్యకి టీచరు పోష్టింగిప్పించింది పెద్దాయన రాఘవరెడ్డి. అయితే మొదటినుండీ రాఘవరెడ్డినద్ద, చంద్రారెడ్డివద్దా సాయంపాందిన వాళ్ళంతా వచ్చి స్వచ్చందంగా ఓట్లేస్తే ఈరోజు చంద్రారెడ్డి డబ్బుకోసం వెతుక్కోవలసిన అవసరమే వుండేదికాదు.

పున్నమిచంద్రుని రాకతో హఠాత్తుగా చల్లబడిన ఆ వేసవి సాయంత్రం తగిన అభ్యర్థికి ఓల్లేయమని ఆ ఊరి ప్రజల్ని అడుగుతున్నట్టుగా వుంది.

శ శః క్ష

చాకలి తెచ్చిన చంద్రారెడ్డి బట్టలు బీరువాలో సర్దుతున్న రాజేశ్వరి ఉలికిపడింది... బయటేదో రచ్చ జరుగుతోంది. కొట్లాటలైన చప్పుడు... ఎంతోమంది జనాలు అటూ, ఇటూ దబదబా పరుగెడుతోన్న శబ్దాలు... చేస్తున్న పనినాపి గుమ్మంవైపుగా నడిచిందామె.

అప్పట్‌కే గసపోసుకుంటూ పరుగెత్తుకొచ్చిన శంకరయ్య “అక్కా మన డాక్టర్ని ఆ వాయుడి మనుషులు కొట్టేసినారక్కా, మంఛి దెబ్బలు... నెల్లూరు ఆసుపత్రికి తీసుకపో తుండారు... మనోళ్ళింకా ఎంతమందికి దెబ్బలు తగిలినాయో తెలియడంలేదు”... భయం భయంగా చెప్పాడు .

“ఎల్లుండి ఎలక్షన్లు జరగనీరంటక్కా... రిగ్గింగ్‌ చేసయినా గెలస్తానని వీడూ... శవాలు లేపైనా గెలిచితీరతానని వాడూ అంటుండారు” అపోజిషన్‌ అభ్యర్భలిద్దరినీ ఉద్దేశించి బూతులు తిట్టసాగాడు రొప్పుతూనే... ఇదంతా వినీ వినకుండానే అత్త శోకాలు తీన్తూ శాపిస్తోంది.

“మూడు దినాలకొకసారి ఈ ఎలక్షన్లు మాకోనమే వస్తావుండాయి... అయిపుట్ల వడ్డన్నీ అమ్మి అమ్మి దీనికి బెట్టను నరిపోయె... యాపారంలో వచ్చేదంతా చాలకపోయె... ఇంత డబ్బు పెట్టిగూడా ఎప్పుడేమోనే... ఏం జరగతాదోనే అని వణికిసచ్చేట్టుగా వుండాది. ఆ డాక్టరు ఆ సక్కనెందుకొస్తున్యాడో వంటిగా... ఆ సచ్చినోళ్ళకిదేం పోయేకాలమో... ఎందుక్కొట్టినొ రంటమ్మా?

అయ్యో అప్పుడంతా ఎలక్షన్లంటే ఇట్ట్యాడుణ్జిందితల్లా... ఏందో పొయ్యి దేని మీదెయ్య మంటే దాని మీద గుద్దేసాచ్చేవాళ్ళం... ఇప్పుడు ఓటేయను పోవాలంటే కూడా భయంగా వుంది... ఇట్టంతా అయితే పెద్దాయనెట్ట చేనుణ్డు రాజకీయం. ఎంతెంతనుందికి ఈ చేతుల్తో వండి పెట్టంటాను... దినానికి ఎన్ని టీలు, కాఫీలు పెట్టుంటాను... ఈ కంటితో ఎన్ని ఎలక్షన్లు (2 వం ఇవువ

చూసుంటాను, ఇట్టంతా ఎప్పుడూలేదు తల్లా... ఈయ్య న్నీ చూసేదానికంచే యామైనా మింగి నచ్చేది మేలుగా వుండాది”

అత్త పెడుతోన్న శోకాలు రాజేశ్వరి గుండెల్లోకి దిగుతున్నాయి... దిగులుతోను, భర్తకి ఏ ఆపద రానున్నదోననే భయంతోనూ, జీవితం ఏంకానున్నదోనన్న మధనతోనూ ఆమె వణికి పోతోంది.

నిజమే. తన చిన్నప్పుడు ఎన్నికలంటే ఇంత ఆవేశకావేషాలుండేవి కావు... ఎవరి ఓటు వాళ్లు ప్రశాంతంగా వెళ్ళి వేసాచ్చేవాళ్ళు. దాదాపు సాయంత్రందాకా పోలింగు జరుగుతూనే వుండేది... అంటే బహుశా తొంభైశాతం పోలింగు కావచ్చు. అయినా ఒక్క దొంగఓటు కానీ, రిగ్గింగుకానీ, గొడవలుగానీ జరిగేవి కావు.

ఇప్పుడేమిటో డబ్బు, మందు, దొంగోట్లు, కాదంటే గొడవలూ, వీటితోనే రాజకీయాలు నిండిపోయాయి.

డబ్బు చేతికందక భర్త పడుతోన్న మధన ఆమె గమనిస్తూనేవుంది. సాయంత్రమయితే అన్ని కాలనీలవాళ్ళూ వచ్చేసి డబ్బుకోసం భర్తని జలగల్లా పీక్కుతినడం చూస్తోంది. విజయుడు డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెట్టడాన్ని గురించి వైనవైనాలుగా వింటోంది. పుట్టింటి తరపువారు ఫోన్లు చేసి ఎగతాళిగా మాట్లాడుతూంటే తట్బకోలేకపోతోంది. ఎన్నోఏళ్ళుగా భర్తని కనిపెట్టు కునివున్న పెద్దమనుషులంతా ఒక్కొక్కరుగా జారిపోవడాన్ని తెలుసుకుని బాధపడుతోంది. భర్తని చూస్తుంటే ఆమెకి జాలిగా వుంది. రాత్రిపగలూ నిద్రలేక, వేళకి తిండిలేక, ఎండనిబడి ఇల్లిల్లూ తిరిగి డీలాపడిపోయాడు. ఆరోగ్యం పొడయిపోయింది. ఈ పాడు రాజకీయం కోసం, ఈ ఊరి వ్రజల కోసం డబ్బునీ, ఆరోగ్యాన్నీ, జీవితాన్నీ కూడా పణంగా పెట్టాడతడు.

ఏరోజూ కుటుంబ విషయాలు పట్టించుకున్నోడు కాదు. అయినా సంతోషంగా అవన్నీ తన బాధ్యతలుగా స్వీకరించింది. తను ఆరోగ్యం బాగలేక పడుకుంటే 'ఏమైందని' అడగడు. ఆయివా సర్దుకుంది. నెలలతరబడి భార్యగా కూడా దగ్గరకి తీసుకోడు. అయినా ఓర్చుకుంది. పిల్లల్నెక్కడో దూరంగా వెల్లూరు హాస్టల్లో వుంచాడు. సర్లెమ్మనుకుంది. వ్యాపారం సరిగా పట్టించుకోక గుమాస్తాల పాలవుతోంది. నావాటికీ కుటుంబం దిగజారిపోతోంది.

ఎప్పుడూ జనం... జనం... జనం... వాళ్ళ అవసరాలూ, వాళ్ళ ఇబ్బందులూ, వాళ్ళ మంచిచెడ్డలూ. ఇదే జీవితం... మంచిదే నిస్వార్ధంగా జనాలకోసం పాటుపడడం, కాదని ఎవరం టారు? ఆయితే ఇటువంటి వాళ్ళకి సంసారాలూ, భవబంధాలూ వుండకూడదు... ఇటువంటి వాళ్ళు మంచి వాయకులైతే అయివుండొచ్చుగానీ, మంచి భర్తలు కొలేరు, మంచి తండ్రులు కాలేరు.

మొత్తం జీవితాన్నీ, భర్త పరిస్థితినీ బేరీజు వేసుకుంటూ మధనపడుతూ అతడి కోసం ఎదురుచూస్తోంది రాజేశ్వరి. పెళ్ళెన్నాటి నుండీ కూడా భర్తనుండి ఎనలేని ప్రేమాభిమానాలను

న టే

పొందలేకపోయినా, అతడ్ని తను నిజాయితీగానే ప్రేమించింది. ఎన్నెన్నో స్పర్శల్ని కోల్పోయి జీవితమంతా ఒక అలవాటుగా బ్రతికేస్తూ వచ్చిన రాజేశ్వరికి ఇప్పుడీ సన్నివేశంలో అనుభవ సౌంద్రత మరింత తీవ్రంగా వుంది.

ఇప్పటి భర్త పరిస్థితి ఆమెని మరింత బాధిస్తోంది. ఎప్పుడూ ఓటమిని చవిచూడవి వాడు ఈసారి ఎన్నికల్లో ఏదైనా అయితే... అందునా తన బావమరిది చేతుల్లో ఓడిపోతే ఆయన తట్బకోగలడా? పుట్టింటివైపు జనాలంతా తమని చిన్నచూపు చూస్తారా? నిజంగా ఇటువంటి ఒక పరిస్థితిని తను భరించగలదా?

డబ్బు పంపకం, ఎడతెగని మందు సరఫరా, ఆడవాళ్ళకి చీరల పంపిణీ... ఇటువంటి అపమార్గాలతో అవతలి ఇద్దరు అభ్యర్దులూ పరుగులు తీస్తుంటిలి... ఈ పరుగు తన భర్త ఆందుకోగలడా? అందుకోకపోతే ఏమౌతుంది? ఉలిక్కిపడింది రాజేశ్వరి. లేదు లేదు అట్ల జరగడానికి వీల్లేదు. తన భర్త ఓడిపోగూడదు... గెలవాలి... గెలవాలి... అందుకు తనేం చేయగలదు? ఏం చేయాలి? లోలోపలే మధనపడుతోందామె. ఏదైనా ఒక అద్భుతం జరిగిపోయి భర్త గెలిస్తే బావుఖ్జు. తాము ఆశ్రయమిచ్చి పెద్దవాణ్ణి చేసిన విజయుడు చేసిన పనికి తన భర్త గెలుపో పెద్ద దెబ్బ కావాలి.

కానీ ఏం జరుగుతుంది? ఈ రాత్రికి రాత్రి ఏ అద్భుతం జరుగుతుంది?

భర్త పరువుకోసం, కుటుంబగౌరవం కోసం, ఇలా ఆలోచిస్తోంది కానీ నిజానికి రాజేశ్వరికి రాజకీయాలపట్ల ఎనలేని ఏవగింపు.

పరస్పర విరుద్ధమైన ముళ్ళేవో ఒకదాన్నాకటి ఎదుర్కొంటున్నట్టుగా వున్నాయి... ద్వైదీ భావంతో ఆమె మనను కొట్బమిట్టాడుతోంది.

! శు శ

పోలింగ్‌కి అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. ఊరంతా ఊపిరాడనంత ఉత్కంఠతో వుంది... ఆ రాత్రి కుర్చీ వాళ్ళూ, ఆటోవాళ్ళూ ఇద్దరూ కూడా అనుమానంతోనూ, గెల్బితీరాలన్న ఆసక్తితోనూ రెండోవిడత నోట్లు పంచారు ఓట్లకి... ఊరంతా మూలమూలా కాలనీల్లో డబ్బు విలయతాండవం చేస్తోంది. చంద్రారెడ్డి మనుషులు గూడా కొంత డబ్బూ, మందూ పంచినా అవతలివాళ్ళతో పోలిస్తే అది చాలా తక్కువ.

అ రాత్రి గడిచి పోలింగ్‌రోజు వచ్చింది.

చంద్రుడెందుకో వెళ్ళలేక వెళ్ళలేక దిగులుగా మబ్బుల చాటుకెళుతున్నాడు. పొద్దు పాడవడాని కిష్టంలేనట్టుగా గునుస్తోంది... ఆ తెల్లవారురూమున చంద్రారెడ్డి ఇంట్లో పెద్దపెట్టున ఏడుపులు ఊరంతటినీ నిద్రలేపాయి. షమ

“అయ్యో నాళల్లా ఎంతపని చేశావే... నేను మీ వాళ్ళకంతా ఏంచెప్పేదే అమ్మా... అంటూ అత్త శోకాలు పెడుతోంది.

“ఈ పాడుబడ్డా రాజకీయాల కోసం ఎవరైనా ఇట్టా చేసుకుంటారా?” అంటూ ఎన్నెన్నో గత విషయాల్ని, కోడలి మంచినీ, ఓర్పునీ చెప్పి రాగాలు తీస్తూ ఏడుస్తోందామె.

“కష్టంలో సుఖంలో నన్నంటిపెట్టుకుని, నా నిర్లక్ష్యాన్ని భరించి, నా బాధ్యతలన్నీ వెత్తి నేసుకుని, ఈ ఇంటికి జీవంలా వున్న నువ్వు, ఇంత హరాత్తుగా వదిలివెళ్ళిపోతే నేనెట్లా వుండగలననుకున్నావు? నా రాజకీయాల గొడవలో, ప్రజాసేవనే కీర్తికండూతితో, నేను నిన్ను పట్టించుకోలేక పోయినా, నిజానికి నువ్వే నా ప్రాణవాయువ్వి. ఈ తుచ్చ రాజకీయం కోసం, ఈ బురదగుంటలో నుండి నన్ను బయటికి లాగడం కోసం, నీ ప్రాణూలర్పించావా రాజేశ్వరీ... ఇక తరతరాలకీ ఈ ఇంట్లో రాజకీయపు గొడవొద్దని కోరావు... వాగ్దానం చేస్తున్నాను. నువ్వు కోరినట్లే జరుగుతుంది' చంద్రారెడ్డి రోదిన్తున్నాడు లోపలా బయటా కూడా...

ఇంక మనకెన్నటికీ రాజకీయం వద్దని కోరుకుంటూ దీనంగా రాజేశ్వరి వ్రాసిపెట్టిన చివరి ఉత్తరం రెపరెపలాడుతూ చంద్రారెడ్డిని దహిస్తోంది. వాన్టల్పుండి పిలిపించబడ్డ కొడుకులిద్దరూ తండ్రిని నేరన్తుడిలా చూస్తూ తల్లిమీద పడి రోదిస్తున్నారు... ఆ రోదన రాతి గుండెల్ని కూడా కరిగించేట్లుగా వుంది.

ఆరోజు చంద్రారెడ్డి కుటుంబం నుండి ఎవరూ ఓటేయడానికి వెళ్ళలేదు...

చితిలో రాజేశ్వరి కాల్లూంటే చింతతో చంద్రారెడ్డి కాలుతున్నాడు. ఎప్పటెప్పటివో సంఘటనలు ఒకదాని తర్వాత మరోటి జ్ఞప్తికొచ్చి అతడ్ని దహిస్తున్నాయి. గత మూడురోజులుగా విద్ర లేని కళ్ళు, దుఖంతో మండుతున్నాయి.

కంటి మీదికి కునుకు రావడంలేదు. అంత్యక్రియలు జరిగిన తర్వాత కూడా చంద్రా రెడ్డిని వదిలినెళ్ళలేక ఆత్మీయులు ఒకరిద్దరు కనిపెట్టుకుని వున్నారు.

అప్పటికి రాత్రి ఒంటిగంటయ్యింది. ఒంటరితనాన్ని కలిగించే విచిత్రమైన నిళ్ళబ్దమేదో చంద్రారెడ్డి చుట్టూ అలుముకుంది.

ఉన్నట్బండి ఆ నిళ్ళబ్బ్దాన్ని ఛేదిన్తూ ఎక్కడినుండో, కలగాపులగమైన కేకలు, మహోత్సాహం, జేజేలు, క్రమక్రమంగా కాంపౌండ్‌లోనికి ప్రవేశించి చంద్రారెడ్డిని ముంచెత్తాయి.

“చంద్రారెడ్డి సింహపురి సింహం”

“చంద్రన్నకీ జై”

ఇంటిచుట్టూ, ఊళ్ళో మూలమూలలా బెట్లు పేలుతున్నాయి.

స్వీట్లూ, మాలలూ, హర్షాతరేకంతో పేలుతున్న బెట్లూ, అడ్డుకోలేనంత వేగంగా వుంది జన(వ్రవాహం... అందులో గోపాల్‌రెడ్డి, మల్లికార్డునరెడ్డి, హరిబాబు, వీరినాయుడు అంతా వున్నారు మళ్ళీ...

నాద్‌

ఆ రోజు ఆ ఇంట్లో శవం లేచిన జాడలేమీ లేవు.

అళోకుడెపుడు బౌద్ధం స్వీకరించాడు? వందల, వేల మరజాల మీదుగా బుద్ధం శరణం గచ్భామి.

ఇరుకైన సందుదారి గుండా రాజేశ్వరి బయటికెళ్ళిపోయిందేగానీ, రాజకీయం మాత్రం ఆ యింట్లో నుండి బయటికెళ్ళలేదు.

అమెరికా భారతి, సెస్టెంబరు 2002 రాచపుండు వనాల చల్‌ వలు

హాలాహలం

తెల్లటి మంచు కప్పబడ్డ ఆ శవాలు... ఒక్కొక్కటే పైకి లేచి వరసగా రోబోట్లలా అడుగులు వేసుకుంటూ మాకు ఎదురొస్తూంటే అవన్నీ ఎక్కడ మా కారుని చిదిమేస్తాయో, మమ్మల్ని మింగేస్తాయోనని భయంతో వణికిపోయాన్నేను. చిత్రమేమిటంటే ఈ శవాలన్నీ బక్కపలచగా, వికృతంగా 'పేగులెండుకుపోయి... మింగడానికి కాకుండా దోచుకోడానికి వన్తున్నట్టన్నాయి... దెయ్యాలు, భూతాలూ వినడమే తప్ప చూడ్డమైతే ఇదే మొదటిసారి...

“ఏయ్‌ ఏంటిది?... హేమా ప్లీజ్‌... కొంచెం కంట్రోల్‌ చేసుకో” సురేష్‌ ఏదో పలకరిస్తుంటే ఏడుస్తున్నానని అర్ధమై మగతలో నుండి బయటపడ్డాను.

మెలకువలోకి రావడం మరింత భయంకరంగా వుంది. మనసు కాలుతోంది... దయాకర్‌ ఇటువంటి పనిచేస్తాడని, చేయగలడనీ నేనెప్పుడూ ఊహించలేదు. నూ కుటుంబంలో ఎవరూ ఇలా అర్జాంతరంగా చనిపోయిన జ్ఞాపకంలేదు... అందునా ఆత్మహత్యల జాడే కనిపించదు... ఛ... ఛ... దయ ఇట్లా చేస్తాడనుకోలేదు...

హాలాహలం ఈం మజా వ

తెల్లవారురూము మంచు శరీరాన్నీ, మనసునీ కూడా ముద్దచేస్తోంది... ఎప్పుడూ ఎడాతెరిపీ లేకుండా సాగిపోయే వాహనాలతో వుండే మెయిన్‌రోడ్డుమీద మంచు ప్రభావానికి కాబోలు, అప్పుడొకటి, అప్పుడొకటీ బండ్లు ఎదురొస్తున్నాయి వాటి లైట్లు కొరు అద్దంమీద పడి కిరణాలు కిరణాలుగా పరావర్తనం చెందుతున్నాయి దట్టమైన ఆ మంచుని చీల్చుకుని వెళ్ళడం కారులో కాకుండా మేఘాల్ని దాటుకువెల్తోన్న విమానంలో వున్నట్టుగా వుంది. అయితే... ఇవేవీ కూడా నా మనసుని తాకడంలేదు... గుండెల్లో సన్నగా మంట... అలజడి... ఆపుకోడం సాధ్యంకాని టెన్షన్‌. “డైవర్‌ కొంచెం త్వరగా పోనీ” టాక్సీ అతన్ని తొందరపెట్టాను. “షి... డెబ్చైమీద పోతున్నాడు”... విసుక్కున్నాడు సురేష్‌. అప్పటివరకూ బిగబట్టుకున్న దు:ఖం చప్పున బయటికి తన్నుకొచ్చింది... వా ఒళ్ళో నేనే తల పెట్టుకుని ఏడవసాగాను. సురేష్‌ చేయి నా వెన్ను నిమురుతూ సముదాయించడానికి ప్రయత్నిస్తోంది... వ్చ్‌... ఎంతకీ నమాధానం కుదరడంలేదు. మా మేనత్త కొడుకులు ముగ్గురులోనూ దయాకర్‌తోనే నాకు అనుబంధం ఎక్కువ... మిగిలిన ఇద్దరూ నాకంటే పెద్దవాళ్ళు కావడం... ఎప్పుడూ చదువే ధ్యేయంగా వుండడంతో వాళ్ళిద్దరితో అంత చనువులేదు. దయాకర్‌, నేనూ ఒకే ఈడువాళ్ళం కావడం, ఒకే బడిలో ఒకే తరగతిలో వుండడంతో, చిన్నప్పట్నుండి ఇద్దరిమధ్య స్నేహమూ, చనువూ ఎక్కువ. దయాకర్‌ ఆసక్తిలేక చదువు మానేయాలనుకున్నప్పుడూ, జ్యోతిని పేమించినపుడూ కూడా తల్లితో, అన్నలతో కాకుండా ముందుగా నాతోనే చెప్పి తల్లికి చెప్పమని బతిమాలాడు. చదువు పూర్తిగాకుండావే పెళ్ళేమిటని అన్నలూ, తల్లీ విసుక్కుంటున్నా తనే అత్తని ఒప్పించి పెళ్ళి జరిపించింది. పెద్దకొడుకులిద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఒళరు మద్రానులోనూ, మరొకరు హైద్రాబాదులోనూ వుండడంతో అత్త ఎక్కువగా వాళ్ళతోనే వుంటుంది... తనెప్పుడూ నవ్వుతూ అత్తని దెప్పిపాడిచేది. . పల్లెటూరి కోడలి మీద ప్రేమలేదంటూ... దయాకర్‌కి చదువబ్బకపోవడంతో ఊళ్ళోనే వుండి పాలాల్ని దున్నుకోవడం మొదలు పెట్టాడు. దయాకర్‌కి మా ఊరన్నా, మామ పండించిన ఆ పాలాలన్నా అమితమైన (ప్రేమ. అయికే అన్నలు కూడా పాలంలో వాటా కావాలని పేచీపెట్టక తమ్ముడు స్థిరపడితే చాలను కున్నారు. దయాకర్‌ ఎప్పుడైనా ఎరువుల కోనమో, మందుల కోనమో టౌన్‌కి వచ్చినప్పుడు వ్యవసాయం ఇంతకుముందులా కాదనీ, చాలా కష్టమైపోతోందనీ వాపోయేవాడు. వర్షాలు లేకపోవడం, అకాలవర్వం, కొత్తకొత్త తెగుళ్ళు వాటికి కొత్త పేర్లు పెడుతోన్న ప్రభుత్వమూ, నకిలీ పురుగులమందులూ, బలంలేని ఎరువులు... ఇలా నాకర్థమైనా కాకపోయినా దయాకర్‌ చెప్తూంటే శ్రద్ధగా వినేదాన్ని. గడ్డి లేదని ఎద్దుల్ని అమ్మేశానని కళ్ళల్లో నీళ్ళు తొబికినలాడుతూ చెప్పాడో రోజు... “అ నేల కూడా అమ్మిపారేయ్‌... పీడా వదలద్ది ... ఇక్కడికొచ్చి ఏదన్నా వ్యాపారం పెట్టకుందువుగానీ” 'పెరుగుగిన్నె తీసి దయాకర్‌ ముందు పెడుతూ యాదాలాపంగా అనేశాను హాలాహలం చ్‌ వం పదే

చేతిలో ముద్దని ప్లేట్లో పెట్టేసి ముందు సీరియస్‌గానూ, ఆ తర్వాత దీనంగానూ నా కళ్ళల్లోకి చూశాడు నా మాటల్లోని వ్యవసాయ వ్యతిరేకత దయని బాగా బాధించినట్లుంది. “అవునవును... అమ్మని కూడా అమ్ముదామనే చూస్తిని ఆ నడుమ రొయ్యల కాంట్రాక్ట ర్లొచ్చి పాలాలు కావాలంటే. తీరా చూస్తే నా తల్లిగుండెల్లో కన్నీళ్ళే తప్ప ఉప్పునీళ్ళు పడవంట"” జీరబోయిన గొంతుతో పెరుగేసుకోకుండానే లేచి చేయి కడిగేసుకున్నాడు దయాకర్‌... నేలతల్లంటే నీకెంత (ప్రేమ దయా?... అటువంటి తల్లిమీద క్రమంగా నమ్మకం పోగొట్టకోవలసి రావడం... అట్లాంటి పరిసితుల్లోకి నెట్టబడ్డందుకు నీలో నువ్వే ఎంత మధన పడ్డానో నాకిప్పుడు తెలుస్తోంది... క్షమించు దయా, నేనిప్పుడు ఆకులు పట్టుకుని ఏంచేయను? తలబాదుకుని ఏడవాలన్న ఆలోచనని బలవంతాన అపుకొన్నాను. ఊళ్ళు ఒకదాని తర్వాత మరొకటి గుడ్డిగుడ్డిగా కనిపించి కనుమరుగౌతున్నాయి. మా ఊరికి దగ్గరయ్యేకొద్దీ... గ్రామాలు వెలవెలపోతున్నాయి... నా చిన్నప్పుడయితే ఈవేళకే ఊళ్ళు కళకళలాడుతుండేవి... పాలు తీసేవాళ్ళూ, పేడ జవిరేవాళ్ళూ, బర్రెలకి మేత పెట్టేవాళ్ళూ, మోకులు భుజానేసుకుని పాలానికి పాయ్యేవాళ్ళూ, పాలు పోసుకుని పోవడాని కొచ్చినవాళ్ళ సైకిల్‌బెల్‌లు, నిద్రలేచినవాళ్ళ కలగాపులమైన మాటలూ, కొక్కొరకో అంటూ కోడి పిలుపులూ... ప్రతిదినం ఒక పండగమాదిరుండేది. మరీ పండగ నెల్లో అయితే చెప్పేదానికేల్యా.. అట్లాటిది ఇప్పుడు ఐదున్నరైనా ఎక్కడా ఏ సందడీలేదు... ఏ ఇంటిదొడ్డిలోనూ అంత గడ్డివామి లేదు. పళువులసలే లేవు.. ఉండేటి వాకటి రెండు బక్కచిక్కిపోయున్నాయి . కొట్టాలన్నీ చెదలుపట్టిపోయి కూలిపోయేట్టుండాయి... మా ఊళ్ళో గ్రామదేవత అంకమ్మగుడి కూడా గోడలన్నీ పెచ్చులూడిపోయి, ఉప్పుదేలి... వెల వెలపోతోందిప్పుడు. అంకమ్మ గుడిలో వుందో, వెళ్ళిపోయిందో తెలీడంలేదు. పల్లెటూర్లలో కూడ జీవితం ఇంతకుముందుకీ, ఇప్పటికీ ఎంత తేడా అయిపోయిందో ఆలోచిస్తూ కారు ముందు సీటు మీదికి తలవాల్బాను. ష్ష్‌.మంటూ భారమైన నిట్టూర్చొకటి నన్నాదిలి వెళ్ళింది. శ్వ శ శ పడుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నట్టగా వున్నాడు దయాకర్‌. నాతో తీసుకెళ్ళిన పూలమాలని వెయ్యాలన్న సంగతికూడా మర్చిపోయి, దయ ముఖంలోకి చూస్తుండిపోయా న్నేను... మూసుకుని వున్న కనురెప్పలు నలిగివున్నాయి. జీవితంలో ఎప్పుడూ ఒక్కమాట కూడా పెద్దగా, పరుషంగా మాట్లాడి ఎరగని పెదవులు నలుపు తిరిగి వున్నాయి. బుగ్గలు లోతుకిపోయి, ఆ గుడ్డిబల్బు వెలుతురులో దయని కాకుండా వేరెవరినో చూస్తున్నట్లుగా వుంది నాకు... పూర్తిగా తెల్లారకపోవడంతో ఇంకా ఎవరూ వచ్చినట్లుగా లేదు. జ్యోతి పక్కన మా పెద్దమ్మ... ఇంకా జ్యోతి తల్లి, ఆమె తాలూకు బంధువులాక అయిదారుమంది కూర్చుని వున్నారు. అత్త కూడా ఇంకా రాలేదు... చార్మినార్‌లోగాన దిగతారేమో శవం పక్కన పేరుకుపోయివున్న ఆ తెల్లవారురూము నిళ్ళబ్ధం మంచుకన్నా చల్లగా మననుని కోస్తోంది. హాలాహలం ఈసా, దణ వో

అప్పటిదాశా దయాకర్‌ పక్కనే సోలిపోయి పడివున్న జ్యోతి పైకిలేవాలని ప్రయత్సిం+ పడిపోబోయి, ఎట్టకేలకు నిలదొక్కుకుంది... నిన్న ఎప్పుడు దువ్వుకున్న తలో అంతా ఊ॥ పోయి వెంట్రుకలు చిగర్రుచిర్రుగా వేళాడుతున్నాయి... రంగుపోయి మాసి వున్న నైలెక్స్‌చీ వంటిమీద సగం, నేలమీద సగం జీరాడుతోంది.

రెండుచేతులూ పైకెత్తి నన్నుచూసి బిగ్గరగా ఏడుపందుకుంది జ్యోతి... ఇటువంటే సమయాల్ని ఎదుర్కోవడం నాకెప్పుడూ కష్టమైన విషయమే... నా దుఖాన్నే మరెవరైనా దోసిలిపట్టి పంచుకుంటే బావుండునని వున్న ఈ స్థితిలో జ్యోతికి నేనేం చెప్పగల్డును ?... అప్రయత్నంగా ఆమెపక్కనే కూలబడి వీపుమీద చెయ్యేశాను.

కదిలిపోతోంది జ్యోతి...

“ఎంత పనిచేసిపోయినాడో చూడక్కా.. నేనేం తప్పుచేశాననీ... నా కెట్టబతకాలో చెప్ప కుండా పోయినాడే కష్టాలు మనుషులిక్కాకపోతే మానులకొస్తాయా?... తనొక్కడే సుఖపడిపోతే చాలుననుకున్నాడు .. నాక్కూడా ఇంత పెట్టుండకూడదా పెరుగుబువ్వ... హయ్యో నేనేం చేసేదక్కా... ఈ బిడ్డల్ని పెట్టుకుని ఎట్టబతికేది.. మమ్మల్ని దిక్కులేనోళ్ళని చేసిపాయినాడే...” తలబాదుకుంటూ, వాళ్ళిద్దరి నడుమా జరిగిన అనేకానేక నృృతుల్ని ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకుంటూ, నెమరేసుకుంటూ ఏడుస్తోంది.

జ్యోతి ఏడుపుతో దుఖం నిండిన నా గుండెలు ఎగిసిపడుతున్నాయి... ఆమెని పట్టుకున్న నా చేతులు వణుకుతున్నాయి... ఏడుపుని బలవంతంగా ఆపుకోవడంతో గొంతు విపరీతంగా నొప్పెడుతోంది...

అసలేం జరిగిందో తెలియక పెద్దమ్మనంక చూశాను...

దయాకర్‌కి అటువైపుగా కూర్చునివున్న పెద్దమ్మ మౌనంగా లేచి మా ఇద్దరి పక్కగా వచ్చి కూర్చుంది.

“నిన్న మధ్యాన్నం కయ్యికాడికి పొయ్యేటప్పుడు కూడా అంతబాగా మీ 'పెదనాయన్ని ఎచ్చరించుకోని పాయినాడమ్మా... రాత్రి ఎప్పుడు తిరిగొచ్చిందీ నేను చూడల్యా... వది గంట లప్పుడు చిన్నోడొచ్చి 'అమ్మమ్మా అమ్మ పిలున్తుండాదంటే' పరిగెత్తినా... అప్పుటికే యాముం డాది... రిక్నా ఏల్చుకోని ఏస్కోని పరిగెస్తిని... డాక్టరుకాడికి పాయ్యేలోపల్నే అంతా అయి

పాయ్యింది... కల్తీ మందులంటారు... నకిలీ మందులంటారు... పురుగేమో చావడంలేదు... మనుషులు మాత్రం నిమిషాలమీద ఎగిరిపోతుండారు... అయ్యేం మందులోతల్లా” రాత్రి నుండి టెన్షన్‌లో పడి ఏడుపు మర్చిపాయ్యినట్లుగా హరాత్తుగా పెద్దమ్మ ఏడవసాగింది...

'పెదమ్మ చెప్పింది సంపూర్ణంగా లేదన్నట్లు జ్యోతి కొనసాగించింది... “రాత్రి ఎనిమిది గంటలకొచ్చినాడకా పాలంకాడ్నుండీ. ఒకమాదిరిగా, మౌనంగా వుణ్లాడు... అయితే మామూలు గానే అన్నం తిన్నాడు పక్కింటోళ్ళ రవివస్తే కాసేపు మాట్లాడినాడు... పిలకాయలతో ఆడతా వున్యాడుకా... నేను వంటింట్లోంచి అన్నీ సర్దుకుని వచ్చేతలికి దేవుడి ముందు కూచుని ధ్యానం చేసుకుంటున్యాడు... ఎంతసేపైనా లేచి రాకపాయ్యేతలికి పాయ్యి చూసేలోపల పక్కకి పడిపాయ్యుండాడు... పక్కనంతా ఈ గుళికలమందు పాడిపాడిగా రాలుంది... నా నడుములిరిగిపాయ్యాయనుకో...”

హాలాహలం ఉస నా

రాత్రి నుండి ఈ సంఘటనని ఎన్నిసార్లు గుర్తుకుతెచ్చుకందో, ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పిందోకానీ అరిగిపోయివుంది జ్యోతి గొంతు... ఏడుపు, దుఖమూ, అన్నీ అపి భర్త ముఖం లోకి తదేకంగా చూడసాగింది... క్షణాలు గడుస్తున్నాయి... చిరుచీకట్లు తొలగి వెలుతురు కిరణాలు లోపలికి ప్రసరిస్తు న్నాయి... పక్కింట్లో, ఎదురింట్లో వాకిళ్ళు ఊడ్చి కళ్ళాపు చల్గుతున్న చప్పుడు నిశ్శబ్దాన్ని చెదరగొడుతోంది. అప్పుడే నిద్రలేచిన దయాకర్‌ కూతురు రెండేళ్ళ దివ్య తప్పటడుగులేసుకుంటూ వచ్చి “మా...మా... నానా... నానా” అంటూ దాని భాషలో ఏదో ప్రల్నించింది. జ్యోతి మళ్ళీ గట్బతెగిన ప్రవాహమైపోయింది. చిన్నప్పుడు నేనూ, దయా కలిసి చదువుకున్న ఇంగ్లీషు పాఠం “ది డెడ్‌ వారియర్స్‌ వైఫ్‌” గుర్తొచ్చి హరాత్తుగా గొంతుని బిగబట్టుకున్నాన్నేను . ఇక్కడ్చుండి ఎక్కడికైనా పారిపోగలిగితే ఎంత బావుణ్జు?... మనిషెప్పుడూ పరిస్థితు ల్నుండి పారిపోడానికే ప్రయత్నిస్తాడు... దయ కూడా అదే చేశాడేమో. “నాయినా. నా నాయినా... దయా” వాకిట్లో నుండే అరుచుకుంటూ పరుగెత్తు కొచ్చింది అత్త... అత్తని చూడగానే ఇల్లంతా ఏడుపుల్తో హోరెత్తిపోయింది. ” “నాయినా ఎంత పనిచేసినావురా దయా... ఈ ముసిలి ముప్పందానా నాకీ కడుపుళి శోకం పెట్టిపోయినావేందయ్యా. నన్ను తీనుకుపోగూడదా ఆ దేవుడు... మీ నాయిన్హోకూడా పాయ్యుంటే నాకీ ఖర్మలన్నీ చూసేది లేకుండా పాయ్యుణ్లే . అయ్యోనాయినా... నీకేం కష్టం వచ్చిందిరా... ఒక్కమాట నాతో చెప్పుండకూడదా?.. అప్పులుంటే తీర్చుకోగూడదా? దానికి ఇట్టా పని చేసుకుంటారా ఎవురైనా? ప్రపంచంలో ఎవురికైనా అప్పుచెయికుండా, కన్ను కారకుండా బతుకు గడస్తాదా?. నీ కేం నాయినా... కోటిసూర్య ప్రకారంగా వుండారే మీ అన్నలు... ఒక్కమాట వాళ్ళకి చెప్పుకునుంటే వాళ్ళు నీ అప్పులు తీర్చకపాయ్యుందురా?... నాయినా... నా దయా...” శోకాలు పెడుతూ ఏడుస్తోన్న అత్తని చూస్తుంటే జాలిగా వుంది నాకు... పైకి అలా అంటోందే కానీ అత్తకి బాగా తెలుసు ఎవరి బతుకులు వాళ్ళవి... తమ్ముడు చేసిన మూడేళ్ళ అప్పులూ తీర్చి, వస్తుందోరాదో తెలియని కొత్త పెట్టబడి పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. పొలంలో వాటా అడక్కపోవడమే తాము చేసిన గొప్పత్యాగమని వాళ్ళు భావిస్తూ వుంటారు. నిజానికి ఈరోజు వ్యవసాయం ఎంత కష్టమైపాయ్యుందో, దేశమంతా అక్కడక్కడా ఎంతమంది రైతులు నేల తల్లినీ, కుటుంబాలనీ వదిలి ఆత్మహత్యలు చేసుకుంటుండారో వాళ్ళకి తెలీ కుండా ఏంలేదు... ప్ప్‌.. ఎవరి బతుకులకీ, ఎవరి చావులకీ ఎవరు జవాబు చెప్తారు... “దయాకర్‌ తెంపుచేసుకుని ముందు పాయినాడు. రేపో ఎల్లుండో మనం కూడొ ఈ పని చేయాల్సిందే” మొరటుగా కసిగా వున్న అ గొంతు ఎవరిదో తెలియడం లేదుగానీ... దయాకర్‌ తోటి రైతుదన్న సంగతి అర్ధమౌ తోంది. బయటి వరండాలో నుండి మాటలు చాలా పెద్దగా విన్సిస్తున్నాయి “వానల్లేకపోవడం, కాలంగాని కాలంలో వానలుపడ్డం, ఇవేనా రైతు నష్టపోవడానికి కారణాలు? వాళ్ళు బ్రతకొలన్నారూడా ప్రభుత్వం బతకనిచ్చేట్టుగాలేదు. రాష్ట్రస్థాయిలో రక్షణ హాలాహలం య కా లీ

శోసం వియమింపబడ్డ పజాదతివిరుల ప్వంతజిల్లాలోలే రైతులు పబ్పడీ విత్తవాలడిగివందుకు, ముందూ వెచకా. రళండా లాశీభార్టీలు జడుపుతాడు.

కరెంటు-ధార్ట్‌ తగ్గించమత్నా. విత్తవాలడిగివా. పాగువీరడిగివా. అఖరికి తాగువీరడిగివా శరే బావగొట్టి చెవులు మూస్తారు... మరొకరైతు వాపోతుచ్చాడు.

నిజమే. అమద్య కరెంటుభార్జీ కట్టలేదవి ఆఫీసర్లు మీటర్లు పెరుక్కు పోయారవి దయ బెప్పిచ విషయం గుర్తొచ్చింది... దయ చెప్పూవే వున్నాడు... వాకే అర్థమైందికాదు.

శేచేమూలోచిస్తుండావో వోళే తెలియడం లేదు... జ్యోతి పెదనాన్న కూతురు షువీత ఐప్‌గడ్డలు తెచ్చి దయాకర్‌ పక్కగా, కింద. పొట్టమీద పెడుతోంది... కాసేపటికే అవన్నీ వీరుకారి దాపకింద చేరుతున్నాయి... దయాకర్‌ కింద వేసిన పరుపు తడిపి ముడ్డవుతోంది... నల్లగా కమిలిపోయివ పెదాలమధ్య తులపాకు ముద్ద విళ్ళృతంగా కనిపిస్తొంది... సమయంగడిచేశొద్దీ ముక్కుల్లోమండి వల్లటి ద్రవం బయటి కొస్తోంది. మవిషి బతికుంటే సరేగానీ, అ గుటికెడు ప్రాణం కొప్తా పోయిందంటే, ఒక్కరోజు కూడా ఇంట్లో ఉంచుకోం.

“వాయివా... వాయివా... దయమ్మా” అంటూ దయాకర్‌ ఒళ్ళు, మొహమూ అంతా తడిమి తడిమి ఏడుస్తోంది అత్త... మధ్యమధ్యలో కారుతున్న ముక్కును పమిటచెంగుతో తుడుచుకుంటోంది...

అసలే నల్లగా వున్న అత్త ముఖం మరింత నల్లబడి పీక్కుపోయింది... దూరపు ప్రయాణం వల్లవో, కడుపుశోకం వల్లవో మరి... అత్త చిన్నతనంలో బాధలుపడ్డా పెళ్ళయ్యాక మామయ్య (ప్రేమలో వైభవంగావే బతికింది... మామయ్య ఇదే పాలంలో అప్పచెల్లెళ్ళ పెళ్ళిళ్ళు జరిపించి, పుట్టింటి సారెలు జరుపుతూ, పెద్దకొడుకులిద్దరివీ చాలా పెద్దచదువులు చదివించి... ఊరికంతా మొదటి కుటుంబంగా జీవించాడు... మామయ్య మరణం తర్వాత అత్త కొంత కుంగిపోయినా పెద్దకొడుకులిద్దరూ మంచి ఉద్యోగాల్లో వుండడంతో వాళ్ళ వద్ద కొంత ప్రశాంళంగానే వుంటోంది... ఇంతలో పూడ్చలేవి ఆగాధం.

“*వాయివా... నీ మనసులో ఏంబెట్టుకున్నావో కదా... మొన్నీ నడమ వేవొచ్చినపుడు కూడా తెంపుగా లేడమ్మా బిడ్డ ... ఏం కష్టమొచ్చిందో ఏమో”

అత్తకి అన్నీ తెలుసు... కేవలం దిగజారిన ఆర్థిక పరిస్టితులు... వర్గాల్లేక, వివిధ కారణాలవల్ల మూడేళ్ళుగా పంట దిగుబడి లేకపోవడం, పెట్టిన పెట్టుబడి... తాలూకూ వడ్డీ... వడ్డీలు నునిషిని తినేశాయని. ఆయినా ఇందులో తన కొడుకు తప్పేమీలేదనీ, ఆ నిందని ఎవరో ఒకరి మీదకి వెట్టాలని చూస్తోంది.

ఆత్త ఏడుపాపడంలేదు... చనిపోయిన కొడుకుని ఏ ఆవద్భాంధవుడో వచ్చి ఊపిరిచ్చి హళొత్తుగా బతికిస్తే బావుండునని పరితపిస్తోంది. ఆమె ఏడుపు చూసి అక్కడున్న వారందరి గుండెలూ చెరువులవుతున్నాయి.

“అమే రత్పమ్మా. ఏందిది. వచ్చినప్పుట్టుండీ ఏడస్తానే వుండావు... మన చేతుల్లో ఏం వుండాది చెప్పు?... నీకసలే వళ్ళు బాగాలేదు గమ్మునుండు...” మా పెద్దమ్మ అత్త భుజం

హాలాహలం /ర2 షా వండలో

మీద చెయ్యేసి ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది... అయితే ఆమె మూటలు ఆమెకే పీలగా వుండాయి.

“ఒదినా నన్ను కొంచెంసేపు కొట్బకోనీండమ్మా. నా బిడ్డను మళ్ళెప్పుడు చూడ బోతాను... అప్పుల కోసమైతే భయపడ్డమ్మా... ఇంకేందో జరిగుండాది.” అంటూ పెదమ్మ మీద పడి గుండెలు బాదుకుంటోంది.

ఏందో జరిగుండాది అన్న అత్త మాట నిజ్జంగానే నిజమని నాకప్పటికి అర్థంకాలేదు.

“అఆ ఆ .. జరిగింది చట్టుబండలు... మీ అబ్బయ్యశకేం కష్టమొచ్చిందమ్మా... గుట్టగా ఇంత గొంతులో పోసుకుని నా బిడ్డను అన్యాయం చేసి పోయినాడు... ఇంక జీవితాంతం పడాల్పిందంతా నా బిడ్డే కదా... ఏదో చదువులేకపోయినా మంచిపిల్లోడు, మంచి కుటుంబం అంటే సరేననుకున్నామమ్మా. ఇట్టా ముంచేసిపోతాడనుకోలేదు...” అత్త మాటలకి రిటార్చులా జ్యోతి వాళ్ళమ్మ తన చుట్టుపక్కల కూర్చునివున్న తమ ఊరివాళ్ళతో చెప్పుకుని తన కూతురు భవిష్యత్తును తలచుకుని తలచుకుని శోకాలు తీస్తోంది... ఆమె చెప్తోన్నది కూడా న్యాయమే నన్నట్లుగా అందరూ తలలూపుతూ ముక్కులెగబీలుస్తున్నారు.

ఈ మొత్తం గందరగోళానికి జ్యోతి మళ్ళీ బరస్ట్‌ అయిపోయింది... -

“అప్పులుంటే మాత్రం ఏంమ్మా?... అమ్మి అప్పులు తీర్చేస్తే కూలీ చేసుకునయినా బతికుంటాంగదా? ఏది పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చుగానీ ప్రాణంపోకే తిరిగి తేగలమా? అయ్యో ఎంత పని చేశావయ్యా...” అంటూ.

జ్యోతి ఏడుపు విని ఆమె తండ్రి పరిగెత్తినట్టుగా లోపలికొచ్చాడు...

“అమ్మి ముందు ఎవురయినా ఏడ్చినారంటే చూడండి” అంటూ అందర్సీ ఒకసారి హెచ్చరించినట్లుగా గదమాయించి వచ్చినంత హడావుడిగానూ బయటి౭ెళ్ళిపోయాడు.

యజ్ఞకుండంలో నుండి ద్రౌపది పుట్టిందంటారు.

జ్యోతిని చూన్తుంటే దుఖపుజ్వాలల్లో నుండి ప్రభవించిన ఆకారంలా వుంది. అ అమ్మాయి దుఖాన్ని దయపట్ల ఆమెకున్న పేమని, అనుబంధాన్నీ ఆపడం ఎవరికి సాధ్యం? ప్ప... ఏమైనా ఈ మగవాళ్ళు దయలేనివాళ్ళు. ఆడవాళ్ళని సుఖ పెట్టాలన్నా, దుఖంలోకి నెట్టేయా లన్నా వాళ్ళకే సాధ్యమౌతుంది. తను వెళ్ళిపోయాడు అప్పుల్ని తప్పించుకుని. జ్యోతి ఎక్కడి శెళ్ళగలదు ఈ బిడ్డల్నాదిలి...

పొద్దుట్పుండీ ఒకేస్టితిలో కింద కూర్చుని వుండడంతో పట్టుకుపోయిన మోకాళ్ళని సడలించుకుంటూ మెల్లిగాలేచి వెనక వరండాలోకి వెళ్ళాను. నేను బాత్రూమ్‌లో నుండి బయటికొచ్చేసరికి పెద్దమ్మ, అత్త పెద్దకోడలు శారద మాట్టాడుకుంటుండారు. దయాకర్‌ చేసిన తొందరపాటుపనినీ, జ్యోతి జీవితాన్నీ తలచుకొని బాధపడుతున్నారిద్దరూ. నన్ను చూడగానే శారద వంటగదిలో కెళ్ళింది కాఫీ కలుపుకొస్తానంటూ.

“పెదమ్మా అమ్మావాళ్ళేరీ? ఇంకారాలేదు” పొద్దుట్పుండీ అర్ధంకాకుండా వున్న ప్రశ్నని నంధించాను.

పెద్దమ్మ నాకేసి దిగాలుగా చూసింది .

“అయ్యో ఎందుకు చెప్తావులేమ్మా... మొన్పటిరేత్రి మీ నాయన కూడా ఇదేపని...

హాలాహలం

పురుగులమందు డబ్బా ఎత్తుకున్నాడంట. మీ అమ్మచూసి లాక్కుని ఒకటే ఏడుపు... నేల అమ్మేస్తానని మీ అన్నా, వద్దనేవద్దని మీ నాయన... అప్పులోళ్ళ బాధపడలేక ఇద్దరూ ఇంట్లో ఒకటే తగువులూ, రచ్చలూ.. మీ అమ్మ నలిగి ఛస్తా వుండాదనుకో... నేను నిన్న పాొద్దన్నే ఊరికి బొయి మీ అమ్మనీ, నాయన్నీ ప్రయాణంచేసి తిరుపతికి అంపించినా. పాయ్యి దేవుడి దర్శనం చేసుకుని నాలుగుదినాలుండి రొబోండి అని”

పెద్దమ్మ కూతురు మంజులక్క తిరుపతిలో వుంటుంది. మేమంతా ఒకేచోట ఒక తల్లి పిల్లల్లా పెరగడంతో ఏమాత్రం తేడాలుండవు.

“ఒకేఒక్క నిమిషమే చినమ్మే.. మీ అమ్మగాన చూడకుండా వుండుంటే ఈ పొద్దు చిన్నదినమై పోయుణ్ను... పెద్దోళ్ళూ అదే సనైపోయా... చిన్నోళ్ళూ ఇదే పవైపోయా... ఏమి వ్యవసాయమో పోమ్మా అప్పులెచ్చి పంటలు పెట్టడమేగానీ పైసా చేతికి రాకపోయ... ఎట్ట తట్బుకోని ఎట్ట నిలబడాల చెప్పు... మీ అన్న చెప్పినట్బ నేల అమ్మేసి యాడైనా బాయ్యి ఏదో ఒకటి చేసుకునేది మేలుగా వుండాది...”

రైతు కుటుంబాలన్నీ నేలమీద నమ్మకాన్ని కోల్పోవడం ఎంత దీనమైన పరిస్థితి...

“అందురూ యాపారాలుచేస్తే వడ్డు పండించేదెవరు పెద్దమ్మా. తిండిగింజలెట్టా మనకి?” నీరసంగా అని వేగంగా కొట్బకుంటూన్న గుండెతో వెళ్ళి వరండాలో వున్న కుర్చీలో కూలబడ్డాను.

అప్పుటికే అక్కడ దయాకర్‌ పెద్దన్న, చిన్నన్న, మా అన్న రఘు, సురేష్‌ ఆంతా కూర్చుని దయాకర్‌ పెద్ద సేద్దిగాడు వెంకటయ్యతో మాట్లాడుతుండారు.

“అంత బాగుణ్గిందయ్యా ఈసారి చెనిగ... మూడేళ్ళ అప్పులన్నీ తీరిపొాయినాయిబో అబ్బయ్యకి అనుకున్నా... ఇంక ఇరవై దినాలుంటే సాలు పెరికేసుండొచ్చు... ఇంతలోపల అదేం తెగులో కొత్తరకం తెగులు... అది పట్టింది. నిలవన ఆకులన్నీ రాలిపోయి పుల్లలు నిలబడ్డాయి. అప్పుటికీ మళ్ళీ ఆ మల్లికార్జున దగ్గర పురుగులమందులూ, బలానికి మందులూ అన్నీ తెచ్చేసినాడు. అన్నగచాట్లూ పడి నీళ్ళు పెడ్తిమి... పురుగు చావనేలేదు, పంట ఎక్కిరావే లేదు. ప్చ్‌... ఈ ఒక్కసారి పండుంటే అబ్బయ్య ఈ పని చేసుండడయ్యా...” కళ్ళనీళ్ళు పెట్ట కుంటున్నాడు వెంకటయ్య. వెంకటయ్య ఆ ఇంట్లో రెండు తరాల సేద్యానికి సాక్షి. మామయ్య వున్నప్పట్టుండి ఈ ఇంటినీ, పాలాన్నీ కనిపెట్టకుని వున్నాడు. ఇదే పాలంలోని ఫలసాయంతో ఈ ఇల్లు ఎలా పాలుపాంగినట్టు పాంగిందో వైనవైనాలుగా వెంకటయ్య చెప్తూంటే గతంలో చాలాసార్లు విని వున్నాను.

“ఏమైనాన్నా ఈ గవర్నమెంటు ఆర్థికనూత్రాలన్నీ రైతుల్ని ముందుగా దెబ్బకొడు తున్నాయి. రకరకాల పధకాల పేరుతో కోట్లు ఖర్చుచేసే ప్రభుత్వం రైతు సబ్సిడీల్ని తగ్గించి పారేసి, కరెంటుఛార్జల్ని పెంచేసె... పేదరికం పెరిగిపోతుండాదేకానీ అభివృద్ధి ఏడ జరగ తుండాదినా? పోయిన సంవత్సరం వెయ్యమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మొన్న చూసినావుగదా, రైతులు సాగునీరడిగినందుకు రోడ్ల మీద నిలబెట్టి లారీలతో కొడితిరి. మళ్ళీ ఇప్పుడు ఆటలకి ఐదొందలు కోట్లు ఖర్చు చేసి జాతీయక్రీడలంటిరి. అకలికంటే ఆటలే ముఖ్యంనా ప్రభుత్వానికి. ఆకలికంటే ఇప్పుడు అభివృద్ధే ముఖ్యంబో” దయాకర్‌

హాలాహలం /లో వం వాతో

చిన్నన్న కసిగా అంటున్నాడు. భాస్కర్‌ హైదరాబాద్‌లో వుంటోన్నా అక్కడి హైటెక్‌ అభివృద్ధిపట్ల అతడికెప్పుడూ నిరననే.

“నేనా నడమ హైదరాబాద్‌ వచ్చినప్పుడు చూస్తినే... కంప్యూటర్లూ, సైబర్‌కేఫ్‌లూ, హైట్‌క్‌ సిటీ మద్రాసునీ, బొంబాయినీ మించిపాయ్యుండాదనుకో...” నవ్వడానికి ప్రయత్నించి దిగాలు పడ్డాడు ప్రభాకర్‌... దయాకర్‌ పెద్దన్న.

నాకు కడుపులో దేవినట్లుగా అయింది అక్కడెక్కడో పత్తి రైతుల అత్మహత్యలు. మరెక్కడో మరో రైతూ వినడమే తప్ప ఇప్పుడా వైరస్‌ ఇక్కడికి కూడా పాఠకుతోందా? నాన్న విషయం విన్నప్పట్టుండీ నా వంట్లో రల్తిన్నంతా ఎవరో తోడేసినట్లు నీరసంగా అయి, చమటలు పడుతోంది. నన్ను నేను సంభాళించుకోవడం కష్టంగానూ వుంది నేను ఉద్యోగస్తురాలిననీ, ఎప్పుడూ ఇంటాబయటా పనులవత్తిడిలో వుంటాననీ చాలా విషయాలు నాకు తెలియనివ్వరు అమ్మావాళ్ళు.

నిజమే ఎన్నెన్నో కోట్లు రకరకాల పనులమీద ఖర్చుపెట్టే ప్రభుత్వం రైతుల్సీ, సాగునీటినీ మాత్రం పట్టించుకోదు. ఇది చివరికి ఎట్టవుతాదో. వ్యవసాయంమీద పడిన దెబ్బ మెల్లిగా టౌన్లోని అన్ని వ్యాపారాలమీద కూడా ప్రభావం చూపిస్తోంది చుట్టూ వల్లెటూర్ల నుండి కష్ట మర్లైెవరూ రాకపోవడంతో నెల్లూరులో వస్త్ర వ్యాపారులు, పప్పులంగడివాళ్లూ మందులంగళ్ళూ, చివరికి రిక్ళావాళ్ళు కూడా ఇదివరకంటే తమ రాబడి తగ్గిపోయిందని వాపోతున్నారు.

ఇది మొత్తం మన ఆర్థికవ్యవస్థని ఎంత దెబ్బతీస్తుందో, చివరికి ఎంత ప్రమాదకరమో ఎవరికీ అర్థంకావడంలేదు. పేదోళ్ళు పెరిగిపోతారు. జనాలంతా వర్గాలువర్గాలుగా విడగొట్ట బడ్తుండారు

ఒకపక్క భాస్కర్‌, ప్రభాకర్‌ వంటివాళ్ళు కార్పొరేట్‌ కంపెనీల్లో, ఏ.సి గదుల్లో కంప్యూటర్ల ముందు కూర్చుని వేలు సంపాదిస్తారు ఈ కొత్త కార్మికవర్గాన్ని అభివృద్ధిగా అంతా గౌరవిస్తుంటారు. మరొకపక్క దేశానికి వెన్నెముకలని పాగడబడ్డ రైతులంతా స్వచ్చ్భమైన గాలి లోనే, నకిలీ పురుగులమందులతో ఊపిరాడక గిలగిలా తన్నుకుంటుంటారు. అంతా అయిపోతుంది.

వాళ్ళ కన్నీళ్ళకు, కష్టాలకు, అప్పులకూ మొత్తం సమస్యలకూ కారణాల్ని వెతక్కుండా శవాలమీద నాలుగు డబ్బులు చల్లి తృప్తి పెట్టాలని చూస్తుంటుంది ప్రభుత్వం

“కన్సల్టెన్సీలూ, సైబర్‌ కేఫ్‌లూ, ప్రపంచబ్యాంకూ పంటలు పండిస్తాయా? పిజ్ఞాలూ, బర్గర్లూ, రోటీలూ మామూలు మనిషి ఆకలి తీరుస్తాయా?” సురేష్‌ అంటున్నాడు.

గుండెల్లోనో, కళ్ళల్లోనో తెలీకుండా నీళ్ళు ఊరుతూనే వున్నాయి. ఉద్వేగాన్ని ఆపు కోడానికి ప్రయత్నించి పెదవులు వణుకుతున్నాయి. ఇది ఇట్లానే ... ఇట్లానే కొనసాగుతుందా?

“అయ్యా మీకు చెప్పకూడదనుకున్నాను కానీ .. నిన సాయంత్రం మల్లికార్జున, బుజ్జి శెట్టి వాళ్ళు వచ్చి అప్పు ఇప్పటికిప్పుడు కట్టమని అబ్బయ్య నెత్తిన కూర్చున్నారు. సాధించేసి నారనుకో... నిన్ననే కాదయ్యా బుజ్జిశెట్టి ఈ నడమ ఆరునెలల నుండీ ఇంటికాడుంటే ఇంటికాడికీ, కయ్యకాడుంటే కయ్యకాడికీ వచ్చి వేధించిపారేసినాడు...

హాలాహలం ఈవ్వ ఇ వపముణం లీన్‌

పురుగులమందులూ , ఎరువులంగడి మల్లికార్జున మాత్రం చిన్నంగా మాట్టాడీనాడా? ఈసారి కానూరి రాజు ఇత్తనాలు యీనంటే యీనని పట్టుబట్టేసినాడు... బతిమాలి బామాలి తలతాకట్టు పెట్టి తెస్తిడి... వీళ్ళందరికీ ఏమని జవాబుచెప్పాలో తెలీక అబ్బయ్య మనేధ పడిపాయినాడు. నిన్నయితే బుజ్జిశ₹ట్టి ఎంత సర్దిచెప్పినా ఇనకుండా... అయ్యా నేనెట్ట చెప్పేది నా నీ పెళ్ళాన్యాడైనా పండబెట్టయినా మా అప్పు తీర్చమన్నారయ్యా... ఆ మాటతో కూడా అబ్బయ్య ఇరక్తి చెందిపాయినాడు... అప్పుటికీ కనిపెట్టుకోని ఇంటిదాకా వదిలిపెట్టి పాయినా నయ్యా... ఈ పాద్దువాళ్ళు మళ్ళా వస్తామని చెప్పి పాయినారు... రాత్రికిరాత్రి ఇంత పని చేస్తాడనుకోలేదయ్యా...” గుసగుసగా అన్నలతో చెప్పి ఏడుస్తున్నాడు వెంకటయ్య. నా గుండెలవిసిపోయాయి. నా శరీరం కుర్చీకి అతుక్కుపోయినట్టుంది. మంచులా గడ్డ కట్టకుపోయింది ఏందో జరిగుండాదమ్మా అంటూ అత్త ఏడవడం వెనక ఇంత పెద్ద నిజంవుంటుందని ఎవరూ ఊహించలేదు . చాలాసేపు ఆ నిశ్శబ్దాన్ని ఎవరూ ఛేదించలేదు... చివరికి పెదమ్మ వచ్చి ఎత్తుబడికి ప్రయత్నాలు జరగతుండాయని పిలిచేదాకా ఎవ్వరి కాళ్ళల్లోనూ, వంట్లోనూ శక్తిలేదు. ఎవ్వరి నోట్లోనూ చెమ్మలేదు. అప్పటికి మూర్యుడు పడమటి కొండల్లోకి దిగబాకుతుండాడు. ! శ శ ఆ రాత్రి తిరిగొన్తూంటే రోడ్డుమీదనున్న శవాలన్నీలేచి కారుకు ఎదురొచ్చినా నాకు దిగులే తప్ప భయమేయలేదు. ఇప్పుడవి శవాల్లా, దయ్యాల్లా అన్పించలేదు నాకు. జీవితం వెక్కిరించిన ఎంతోమంది దయాకర్‌లు అర్భాంతరంగా వదిలి వెళ్ళిపోయిన తమ కుటుంబాల “ గురించి ఏడుస్తూ ప్రశ్నిస్తూ ఎదురొస్తున్నట్లుంది. నాదగ్గర ఎటువంటి సమాధానం లేకపోవడంతో విర్భావంగా వారికేసి చూడసాగాను. ఎక్కడో పామునోట్లో చిక్కిన కవ్ప ఒకటి విడిపించుకోలేని వరిస్థితుల్లో దీనంగా, హృదయవిదారకంగా మూలుగుతోంది. ఆదివారం ఆంధ్రజ్యోతి, ఆగవు 2003 హాలాహలం /ల్‌ల్‌ "వక్ష" మి ప్రతమ కథలు

సాలెగూడు ఆకాశవీధిలో స్వేచ్చగా ఎగురుతోన్న పాలపిట్టల దండొకటి అవాక్కయి ఆగి చూసింది. తాము మామూలుగా ఎగిరే ఎత్తులో అకాశాన్నంటుతూన్న అ భవంతుల్ని చూసి విన్తుబోయి వెనుదిరగబోయి, మళ్ళీ ఆ వైభవాన్ని చూడాలన్నట్టుగా మరింత పైకెగిరింది. పెద్దపెద్ద గాజుకిటికీలతో కూడిన అందమైన భవంతులూ, అ కిటికీల్లో నుండి వెదజల్లబడి మిరిమిట్లు గొలుపుతున్న నియాన్‌లైట్ల కాంతి, ఆ భనంతుల్ని ఒక పద్ధతిలో బారులుబారులుగా చీలుస్తూ తెల్లటి, నున్నటి సీమెంటురోడ్లూ, వాటికిరువైవులా పూలగుత్తులతో కూడిన పేరు తెలీని క్రోటన్‌మొక్కలూ, అ రోడ్లమీద అటు ఇటు ఎటువంటి శబ్దకాలుప్యమూ లేక పరిగెడ్డూన్న పడవల్లాటి విదేశీకార్లూ, ఆకాశహర్మ్యాల మీదుగా సాగుతోన్న విమావాలూ. ఆ భవంతి లోపలభాగం ఎవ్పుడో కురుక్షేత్రం సివిమాలో చూసిన మయపభని గుర్తుకు తెస్తోంది. చిన్నపిల్లలా సాలెగూడు యాన

ఎగిరి గంతేయాలన్న కోరికని అతిబలవంతం మీద ఆపుకుంటూ మెల్లిగా పైకెక్కడం మొదలుపెట్టాను.

పై అంతస్థుమీది నుండి చూస్తూంటే చుట్లూ కనుచూపుమేర దాకా అన్నీ ఆకాశ హర్మ్యాలే తప్ప ఎక్కడా చిన్న పెంకుటిల్లు లేదా పూరిళ్ళు కన్పించడంలేదు. పేదరికాన్ని తొలగించేశారో లేక రాత్రికిరాత్రి పేదవాళ్ళంతా ఎక్కడికయినా పంపివేయబడ్డారో అర్థంకావడం లేదు. “న్స్‌” నాలుకెగరేస్తూ, అనవసరపు ఆలోచనల్లోకి జారకుండా ఆ స్వర్గాన్ని అనుభూతించ డంలో మునిగిపోయాను.

| శ క

ఎక్కడో ఎవరో ఏడుస్తోన్న శబ్దం నా కలల దారాల్సి తెంపింది. ఎవరో ఏడుస్తున్నారు పెద్దగానే. భయమో, బాధో, ఏళ్ళ సహనాన్ని ఎవరో తూట్లు పొడిచినట్లుగా... చిక్కనిచీకట్లు తొలగి వెలుగురేఖలేవో ప్రసరించినట్లు అన్పన్టంగా రేఖలు రూపాన్ని సంతరించుకున్నాయి.

నేనెక్కడున్నదీ నాకు చప్పున స్పురించలేదు .

“అమ్మా... ఏడవాద్దమ్మా... కొత్తవాళ్లు యింట్లో వున్నప్పుడు మనం ఏడిస్తే ఏం బావుంటుంది చెప్పు?” ఎవరో ఓదారున్తున్నారు దుఃఖాన్ని. అది ఓదార్పో లేక పరాయివాళ్ళ ముందు బయటపడ్డున్నందుకు విసుగో అర్థంకావడం లేదు.

“అవునమ్మా... భాస్కరన్న ఫెండొచ్చింది. మనకిదేం ఈరోజు కొత్తకాదు గదా ఏడవ బాశమ్మా” భాస్కర్‌ చెల్లెలు తల్లికి నచ్చచెప్తోంది.

అయినా అమ్మ ఏడుపాపలేదు .

ఒక వేదన, ఒక తపన, ఏళ్ళ తరబడి లోపల దాగి ఊపిరాడకుండా వుండిపోయిన దుఃఖమేదో బయటదారి వెతుక్కుంటున్నట్లుగా వుందామె రోదన,

కడుపులో దేవినట్లుగా అయింది .

మనుషులిలా రోదిస్తారా? ఎవరయినా ఆత్మీయులు పోయినపుడో, ఆస్తులు ఓడిపోయి నపుడో, పెద్ద దెబ్బతగిలినపుడో, మనుషులు కళ్ళనీళ్ళు పెట్టుకోవడం తెలుసుగానీ, యిటువంటి దుఃఖపు పొరలు నాకిదివరకిన్నడూ పరిచయం లేదు.

“అమ్మా... అమ్మా” పిలుస్తోంది భాస్కర్‌ చెల్లి కరుణ.

దుఃఖాన్ని అతి ప్రయత్నంమీద ఆపుకోవడానికి ప్రయత్నిస్తోన్న వెక్కిళ్ళతో “ఈ నెల నేనేం జేసేదిరా భాస్కరా?” అంది అమ్మ

“ఎట్టోకట్ట జరగతాది లేమా నువు లెయ్యి... ఏడవబాక”

“అమా నువ్వేడవబాకమా... నాక్కూడా ఏడుపాస్తుండాది” కరుణ గొంతులో దుఖపుజీర.

“ఒరే ఏందిరా అందరూ... ఇంట్లో ఏందో శవం లేసిపోయినట్లు ఆ ఏడుపులేంది, ఆ ఆరుపులేంది? యిషప్పుడేం జరిగి పాయ్యిందని. ఇంట్లోకి యింతకాలానికి ఒక టి.వి. తెచ్చు

సాలెగూడు

/రల్‌ వవ

కున్నాము. అదిగూడా ధరలు తగ్గుండాయికదాని తెచ్చినాను. దానికి యింత రాద్ధాంతం చెయ్యాలా?” భాస్కర్‌ తండ్రి కిష్టయ్య అందర్నీ గదమాయించాడు.

కరుణ సర్రున పైకి లేచింది.

“లేదు నాయినా... టి.వి. తెచ్చుకోవడం తప్పుగాదు. ఎటొచ్చీ కృపత్తకాడ అమ్మ అప్పు చేసి తెచ్చిన డబ్బుల్తో టి.వి. కొనడం మాత్రం తప్పే. టి.వి ల ధరలు తగ్గినాయని నువ్వంటుం డొవు... నిజమే... యిక్కడ రేషను బియ్యం, కిరసనాయిలు, ఉప్పులూ, పప్పులూ అన్నిటి ధరలూ పెరిగిపోయినాయి. మనకి యియ్యి ముఖ్యంగానీ టి.వి.లు, ధ్రిజ్ఞలూ కాదుగద

అదెట్టన్నా బౌాయ్యింది... పండగ నెలొస్తుండాది గదాని, ఈ నెల్లో అయితే బాగా బేరాలుంటాయని అమ్మ అప్పుచేసి నీశాడ డబ్బులిచ్చి పంపింది... కొత్తరకాల చీరలు వేస్తే పదిరూపాయలొస్తాయి కదా... ఒక చిన్న అప్పన్నా తీర్చుకుందామని ఆశపడింది. అట్టాటిది నూలు తెమ్మని అమ్మ డబ్బులిస్తే నువు టి.వి. తేవడం తప్పుగాదా” ఆక్రోశంతో కొంచెం పెద్దగా మాట్లాడ్డం మూలంగా కరుణ గొంతు పీలగా అయి దుఃఖంలోకి దిగింది. ఆ దుఖంలోని అనేకానేక అర్భాలనీ, దిగుళ్ళనీ కప్పిపుచ్చుకోవడం కోసం ధైర్యాన్ని అరువు తెచ్చుకుంటోందామె.

అమ్మ ఏడుస్తూనే వుంది సన్నగా... “నేనా కృపమ్మకి ఏం చెప్పేదిరా దేవుడో” అంటూ.

“ఏదో ఒకటి చెప్తాంలేయే... మొగుడు చచ్చినట్టు ఏడవబాక. ఏదో ఆ పెద్దింటి ఆడపిల్ల మనోడ్ని ప్రేమించానంటూ వచ్చింది. మనింట్లో కూర్చోను రెండు కుర్చీలు, టి.వి, తెచ్చినాను. అదిగూడా తప్పంటనే... అసల్పీకెందుకే... ఆ రాజారెడ్డి బిల్లులొస్తానే నాకు యాభయి వేలిస్తానన్నాడు. ఆ డబ్బుల్లెచ్చి ఈ అప్పులన్నీ తీర్చేస్తాన్లేయే” నిర్లక్తంగా అని కిష్టయ్య బయట వసారాలోకి వెళ్ళిపోయాడు 'పైగుడ్డ చేతిలోనికి తీసుకుని విదిలించుకుంటూ.

“చూస్తుండావు గదా భాస్కరా... టి.వి. వుంటేనే ప్రేమిస్తాదంట్రా ఆయమ్మి నిన్ను... ఈ చిన్నప్పులన్నీ దీర్చడంకోసం పెద్దప్పు చేస్తాడంట... ఎట్ట జేసేదిరా మీ నాయన్లో... ఎల్లకాలం యియ్యే బాధలుగదా... చేతలో అంత పని బెట్టుకుని నాలుగు కోకలు నేసుకుందామని లేకుండా బతికినంతకాలం యిట్నే అప్పులు అప్పుల్లో గడి పేస్తినే...” చిన్న పిల్లాడు పారేసుకున్న వస్తువుని గుర్తుతెచ్చుకుని గుర్తుతెచ్చుకుని ఏడుస్తున్నట్లుగా వుందామె .

“అఆదేందిమా అట్టంటావు? నాయిన మాదిరి నేతగాళ్లు ఈ ఆరు మండలాలకి లోపల ఎవరుండారో ఒకర్ని చూపించు. కాకుంటే నేతచీరలు అడిగేవాళ్ళు లేక అట్టయిపోయినాడు గొవ్యా” తండ్రి పనితనాన్ని, తండ్రి చేతిలో తీరిన చీరల గొప్పతనాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటోంది

కరుణ.

నాకు చప్పున ఆ ముందురోజు సాయంత్రం కరుణ చూపించిన చీరలు గుర్తొచ్చాయి. వాటిలోని నైపుణ్యం, అందం, వాడిన నూలు, అ చీరల డిజైన్లు రూపొందించిన తన తండ్రి గురించి కరుణ వైనవైనాలుగా చెప్పడం గుర్తొచ్చింది.

సాలెగూడు శస, 5 త్రమణం “లక

నిజమే చేతిలో యింత పనితనమున్న వ్యక్తి, ఈ నాలుగ్గోడల నడుమా, ఈ పల్లెటూర్లో అనామికంగా... న్న...

బయట ఆరుగుమీద గొంతుక్కూచుని వీధికేసి దృష్టి సారించి, బీడీ పీలుస్తూ తనలో తాను గొణుక్కుంటోన్న కిష్టయ్యకేసి నిశితంగా చూశాను.

కాసేపటికి అమ్మ దుఃఖం కొంత ఉపశమనాన్ని పొందింది.

నేను అప్పుడే నిద్రలేచినట్లుగా చాపమీద లేచి కూర్చున్నాను. ఎడమ అరిచేతిని అడ్డం పెట్టుకుని రాని అవులింతని ప్రదర్శించాను.

“గుడ్‌మార్షింగ్‌ వర్షా” తల్లి వద్దనుండి పైకిలేస్తూ పలకరించాడు భాస్కర్‌. కరుణ కూడ నాకేసి చూసి పలకరింపుగా నవ్వింది. అమ్మ చివరగా మిగిలిన కన్నీళ్ళని తుడుచుకుంటూ వెనక వసారాలోకి వెళ్ళింది చుట్టానికి కాఫీ కలపడం కోవం కాబోలు... ఆమెను చూస్తుంటే నాకెందుకో ఆశ్చర్యంగాను, జాలిగానూ అన్పించింది .

మన ఆంధ్రదేశంలోకి టి.వి, ప్రవేశించి దాదాపు ముపష్పయ్యేళ్ళు గడిచాక యిప్పుడు యింట్లోకి టి.వి. తెచ్చినందుకు భర్త మీద ఆగ్రహంతో వుందామె. తమ యింట్లో ఎప్పట్లుండో కలర్‌ టి.వి. వుంది. వార్తలు, సీరియల్స్‌, సినిమాలు, క్రికెట్‌ అన్నీ క్లాషవుతున్నాయని బెడ్‌రూము లోకి వేరే టి.వి. కొనమని పోరు పెడ్తుంటుంది మమ్మి సిటింగురూములో సోఫాసెట్టు కాకుండా యింకా వైరుకుర్చీలే వున్నందుకు అసంతృప్తిగా వుంటుందామె. బీరువానిండా చీరలున్నా ఎవరయినా అమెరికానుండి వచ్చారంటే చాలు ఇంపోర్టెడ్‌ వస్తువుల కోసం వెంపర్లాడుతుంది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అల్లుడి కోసం వెతుకుతుంటుంది.

మమ్మీ, అమ్మా యిద్దరూ కూడా తల్లులే.

కాలేజీ చదువులు పూర్తయి ఎవరి జీవితాల్లోకి వాళ్ళు విడిపోవల్సి వచ్చినపుడు [్రేమ సంగతి బయట పెడితే భాస్కర్‌ పనిగట్టకుని నన్నీ వూరెందుకు తీసుకొచ్చాడో కొంచెంకొంచెంగా తెలుస్తోంది.

మెల్లిగా లేచి దుప్పటి మడతేసి పెట్టి వెనక వసారాలోకి వచ్చాను. కట్టెలపాయ్యి మీద కాఫీ కలుపుతోన్న భాస్కర్‌ తల్లి, బతుకును భారంగా వెడుతోన్న స్నేహితురాలిలా వుంది. ఆమె దుఃఖపు మేఘాల్ని పగలగొట్టి ఎవరయినా ఆనందపు వర్షం కురిపించగలిగితే బావుండు నన్చించింది.

ఆమె అందించిన కొఫీగ్లాసుని పట్టుకుని యాంత్రికంగా వెళ్ళి బావిగట్టున కూర్చున్నాను. కాసేపటికి కరుణ కూడా కాఫీగ్లాసుతో వచ్చి నా ప్రక్కనే చోటుచేసుకుంటూ

“సారీ ... మా యింట్లో మీకు ఇబ్బందిగా వుందనుకుంటాను” జరిగిన సంఘటనకి ఒకింత సంజాయిషీగానూ, నేనెలా స్పందిస్తున్నానో తెలుసుకోవడానికన్నట్లుగానూ పలకరింపుగా నవ్వింది కరుణ.

“అబ్బే అదేంకాదు కరులూ... టి.వి. తెచ్చినందుకు అంటీ ఎందుకింత బాధపడ్డున్నారా

సాలెగూడు 770 ఇం వభదతవో

అని...” మాటమాట కూడుకుంటూ నసిగినట్లుగా అనలు విషయాన్ని ప్రస్తావించాన్నేను. రెండు నిముషాల మౌనం తరువాత మాట్లాడింది కరుణ.

“నిజమే ఎందుకూ అంటే... ఆ సంగతి తెలియాలంటే మీకు చాలా తెలియాలి” జీవిత రహస్యాన్నేదో విప్పిచెప్పడానికి సిద్దపడ్డదానిలా వుందామ్మాయి.

“మా కుటుంబం తాతముత్తాతల నుండీ నేతపని మీదే ఆధారపడి బతుకుతోంది. మా ముత్తాత చేత్తో నేసిన చిలకల చీరలు వేరే దేశాలక్కూడ పంపించేవారంట. మాతాత తను నేసిన చీరల్ని ఎలా అమ్ముకోవాలో తెలీక గూడూళ్ళోని కోమటిశెట్లని అడుక్కుంటే వాళ్లెలా ఈయన్ని మోసంచేసి పెద్దోళ్ళయిపోయారో మానాన్న కతలుకతలుగా చెప్తుంటాడు. అయినా మాకు భుక్తికి లోటుండేదికాదు. ఉండటానికో పెంకుటిల్లుండేది.

మా నాయినమ్మ ఉదయం పదకొండుగంటలకి వాకిట్లో గంవ పెట్టుకుని కూర్చునేది. వచ్చినోళ్ళందరికీ లేదనకుండా ఒక యిగరపు ముద్దా, లోటాడు మజ్జిగా పోసేది. ఎక్కడెక్కడి బిచ్చగాళ్ళంతా లచ్చుమమ్మ యింటికి పోతే ముద్ద దొరుకుతాదని ఆశపడేవాళ్ళు. అట్టంతా బతికిన కుటుంబం మాది.

అయితే యిప్పుడు చేనేత పనికి విలువనేదే లేకుండాపోయింది. నేతచీరలడిగే వాళ్ళే అరుదయిపోయారు కరెంటు మగ్గాలొచ్చి చేతిమగ్గాల నడుములిరిచేస్తే... యిప్పుడింకా వాటి అమ్మా మొగుళ్ళు జెట్‌ మగ్గాలాచ్చేశాయనుకో... ”

ఊపిరి తీనుకోడానికన్నట్టుగా ఆగింది కరుణ.

ఆమధ్య ఆప్కో సంస్థ దివాలా తీసినట్లు, బకాయిలూ చెల్లించక సొసైటీల్లో గుట్టలు గుట్టలు బట్టలు మూలుగుతున్నట్లూ... మొత్తం నేత కార్మికుల జీవితాలే ప్రశ్నార్థకమై పోయి నట్లూ వార్తల్లో చూసిన విషయం గుర్తొచ్చింది నాకు. మనం ప్రతిరోజూ అలవోగ్గా చదివి పక్కకి తిప్పేసే వార్తల వెనక యిన్ని అగాధాలా? బరువెక్కిన గుండె, భావంలేని చూపుల్లో కరుణ కేసి చూడసాగాను.

ఇదేమీ పట్టనట్లుగా కొంచెం ముందుకు వంగి కాఫీ తాగుతోంది కరుణ. ఆమె కళ్ళల్లో చుక్కనీళ్ళు లేవు. గుండెల్లో వూరుతున్నాయేమో తెలీదు.

“ఏవమ్మే కరుణా మీ నాయిన టి.వి. తెచ్చినాడంటవే "” పక్కింట్లోని వెనుక వాకిట్లో నుండి చెత్త పారేయడానికి బయటకొ చ్చిన రావమ్మ కరుణని పలకరించింది.

“అవునత్తా ...”

“అయినా మీ నాయినకి వయసొచ్చేకొందీ మరీ యిరం పరం లేకుండా పోతుండాది. మొదలు ఈ పూట ఎట్టా గడవపోతాదా బగవంతుడా అని అల్లాడుతుంటే టి.వి. దేనికంట టి.వి...”

చేతిలోని చెత్తపోగుని దూరంగా పారబోసి ఖాభీ చాట సట్పకుని వూపుకుంటూ, మళ్ళీ కరుణవద్ద కొచ్చిందామె. మాసిన లేతరంగు చేనేతచీర ఒక కొంగు బొడ్గోఎత్తి దోపుకుని

సాలెగూడు యాయ

వేలాడుతోన్న పైటచెంగుతో కరుణ మీదికి యుద్దానికొచ్చినట్లుగా వుందామె .

“అమే( నాకు తెలవకడగతా గాన్యా? మీ నాయన్సంగతి చూస్తానే వుండావు గదా. మీ నాయిన్లగ్గరీకపోతే నువ్వూ, మీ యమ్మా బాయ్యుండగూడదా... పోనీ భాస్కరుడొచ్చుండాడు గదా వోడ్ని పంపీగూడదా... మీరు గూడా అంతే లేమ్మే” తప్పంతా కరుణదీ, వాళ్ళమ్మదే అన్నట్లుగా అంది.

చప్పున అందుకుంది కరుణ.

“భాస్కరన్న కిట్టాటియన్సీ తెలీదుగదత్తా ...” చుట్టం ముందు ఈ చర్చ కరుణకి నచ్చినట్లుగా లేదు.

“భాస్కరన్న కిట్టాటియి తెలీదు... పెద్దోడు జూస్తే అట్టయిపాయ... వీళ్ళ చదువులకే ఉబణ్గిందంతా ఊర్చిబెబ్టేస్తిరి... నీ పెళ్ళి యాంబెట్టి జేస్తాడంట మీ నాయిన...” గొణుక్కుంటూ చేట తీసుకుని వాళ్ళింటివైపుగా వెళ్ళిపోయింది.

ఆమె వాళ్ళింట్లోకి వెళ్ళేదాకా సాలోచనగా చూసి ఆ తర్వాత నాకేసి చూసి తిరిగి చిరునవ్వు నవ్వింది కరుణ,

“నిజమే ఒకపక్క పని సరిగ్గా లేకపోవడం, మరోపక్క అన్నల చదువులూ... దీంతో అప్పులు యింతై... అంతై అన్నట్లుగా...” చేతులూపుతూ నవ్వింది కరుణ.

కరుణ నవ్వు చూస్తూంటే ఆశ్చర్యంగా వుంది నాకు. నవ్వు అన్నది బాధ అనే నాణాని కున్న రెండో పార్వమేమో... “మామూలుగా అయితే ఇప్పటి పరిస్థితుల్లో నేతచీరలు అడిగేవాళ్ళు, కొనేవాళ్ళు లేరు. ఇక్కడ గూడూరులో రెడ్డెమ్మలిద్దరు చిలకల జరీచీరలు కావాలని అడిగారు. సరే వెంటనే డబ్బులు చేతిలో పడిపోతాయి కదా, ఒక చిన్న అప్పు తీర్చుకోవచ్చుననుకుంది అమ్మ పాతప్పు తీరడం పోయి కొత్తప్పు చేరుకుంది” మళ్ళీ నవ్వింది కరుణ. ఆమె నవ్వుని విశ్లేషించడానికి మాటలు వెతుక్కుంటూ నిర్భావంగా చూస్తున్నాను.

“ఇంతకుముందైతే నేసిన చీరలు నిమిషాలమీద మద్రాసెళ్ళిపోయేవి. దళారి బల రామయ్య వచ్చి అందరివద్ద చీరలు తీసుకెళ్ళి పట్పంలో అమ్మి మళ్ళీ వారం డబ్బులిచ్చేసేవాడు. బలరామయ్యకు చీరలమ్మించడంకోసం పని ఊపిరితిరిగేదికాదు. ఊరంతా మగ్గాలమోతతో ఓరెత్తిపోయేది. ఇప్పుడెక్కడా చిన్న శబ్దం కూడా లేకుండా వల్లకాడైపోయింది” కరుణ నవ్వుతూనే లేచి నా చేతిలో గ్లాసందుకుని రెండు గ్లాసులూ బకెట్లోని నీళ్ళలో తొలిచి యింటివైపు తిరిగింది.

“కరుణత్తా... కరుణత్తా టి.వి, బిగించేశారు ... రా చూద్దాం” భాన్కర్‌ అన్న కొడుకు ఎనిమిదేళ్ళ రాంప్రసాద్‌ పరిగెత్తుకుంటూ వచ్చాడు... కరుణ కూడ 'హై' అని కేరింతలు కొడుతూ వాడితోపాటు లోపలికి నడిచింది. కోటి రూపాయల లాటరీ తగిలినట్టున్న వారి ఆనందాన్ని గమనిస్తూ నేనూ లోపలి కడుగేశాను.

అప్పుటికే చుట్టపక్కల పిల్లలంతా ఆ రెండు నిట్రాళ్ళ యింటిలో నిండిపోయివున్నారు. భాస్కర్‌, రాంప్రసాద్‌తో కలిసి సరదాపడ్డూ కొత్తకుర్చీల మీద కూర్చొని వున్నాడు. గౌజు ఫలకం

సాలెగూడు ౮72 వం ముఖే

లోంచి దూసుకుపోయిన ధవళ కాంతి రంగురంగులుగా రూపాంతరం చెందినట్లుగా యిల్లు రంగరంగ వైభోగంగా వుంది .

చిన్నతెర మీద బొమ్మ వ్రత్యక్తమైంది.

ఏదో ఫ్రిడ్జ్‌ల కంపెనీ యాడ్‌ అది. ్రిడ్ధ్‌ తలాడిస్తూ తల్లిలా కుశలప్రశ్చలేస్తోంది యింటి యజమానిని. చిరాకేసింది నాకు. మనిషి యంత్రంలా మారిపోతూంటే యంత్రం మనిషిలా ప్రవర్తిస్తోంది .

  • ఊపిరాడనట్టయి సోపూ టవలూ పట్టుకుని వెనక వసారాలో కొచ్చాను.

అ టి.వి మొహం చూట్టానికి ఏమాత్రం యిష్టపడనిదానిలా పాయ్యిముందు కూర్చుని

వంటచేస్తోంది భాస్కర్‌ తల్లి. ఆ వెలుతురు పడి ఆమె మొహం ఎర్రగా మండుతోంది. శ శ న!

“వర్వా ఈ కొంచెం వేసుకో” చెప్పాడు భాస్కర్‌ చికెన్‌ చేసిన గిన్నె అందుకుంటూ...

“వద్దొద్దు . ప్లీజ్‌ చాలు” అరిచాన్నేను ప్లేటు లాగేసుకుంటూ.

“మన కూరలు నచ్చలేదేమో” నవ్వింది కరుణ.

నేను మాట్లాడలేదు... చికెన్‌ 65, జింజర్‌ చికెన్‌, చిల్లీ చికెన్‌... చికెన్‌ మంచూరియా... ఈ ఒక్క చికెన్‌లోనే పదిరకాల డిషెస్‌ చేస్తుంది మమ్మీ, నిజానికి వాటితో పోలిస్తే ఈ కూర కాస్త ఇబ్బందిగానే వుంది. ఎన్నో రకాల కేకులు, పుడ్డింగులు, ఐస్‌క్రీములు మమ్మీ చేతిలో కొత్త రుచులు పోతూ నోరూరిస్తుంటాయి.

వేను మమ్మీడాడీలతో కలసి బయటికెళితే తప్పనిసరిగా స్టార్‌ హోటలే. పిజ్ఞాలు, బర్గర్లు, హాట్‌డాగ్స్‌ వాటి పేర్షుకూడా వినివుండరేమో వీళ్ళు.

“వాకు త్రీస్టార్‌, ఫైవ్‌స్టార్‌ అంటే ఏమిటో నిజంగా తెలియదు. అంతెందుకూ నేను కాలేజీకొచ్చేదాకా కూడా ఐస్‌క్రీమ్‌ చూడలేదు. ఇక్కడికొచ్చాక స్నేహితుల ఒత్తిడితో ఫ్రూట్‌సలాడ్‌ రుచి తెలుసుకున్నాను...”

ఒకసారి మాటల్లో భాస్కర్‌ చెప్పిన విషయం గుర్తొచ్చింది. పరిచయమైననాటి నుండి భాస్కర్‌ తన తెలియనితనాన్ని గురించి తెలియజెప్తూనే వున్నాడు. నాకే అర్ధమైంది కాదు.

“ఎన్ని దినాలైందమ్మా నువ్విట్లా రాగి సంగటి , కోడికూర చేసి...” లొట్టలేసుకుంటూ తింటోంది కరుణ.

అమ్మ మొహం చాలా పొడవుగా వుంది.

“మీ నాయన్ని పిలవండి” చెప్పిందామె వుండీ వుండి.

నాగుండె వేగంగా కొట్టుకుంది ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాను. భావాల్ని బయట పడనీకుండా ఆమె కనురెప్పల్ని కిందికి వాల్చివుంది.

సాలెగూడు శభ ప్రమ ౯ 22

ఆత్మగౌరవాలతోనూ, వ్యక్తిత్వాలతోనూ, నిటారైన వెన్నుపూసలతోనూ మమ్మీ, డాడీ తరచుగా మాటామాటా పెంచుకోవడం, ఆ తర్వాత రోజుల తరబడి మౌనయుద్ధం మధ్యన నేను శాండ్‌విచ్‌లా నలిగిపోవడం... యిది మాత్రమే తెలిసిన నేను అమెకేసి విస్తుపోయి చూస్తున్నాను. నిజంగా వీళ్ళెంత గొప్ప (ప్రేమికులు. పెద్దవాళ్ళు ప్రేమని ఎగ్జిబిట్‌ చేస్తే పేదవాళ్ళు ప్రేమతో జీవిస్తారు. వేలంటైన్స్‌ డే నాడు భాస్కర్ని వెతుక్కుంటూ వెళ్ళి గిఫ్టిచ్చి ప్రేమసంగతి చెస్తే అతనే మన్నాడు “ఏమిటి వర్షా ఈ పిచ్చిపనులు... కేలండర్‌ ప్రేమలు... జీవితాన్ని, మనుషుల్నీ అనుక్షణం (పేమించేవాడికి ప్రేమికులరోజేమిటి? జీవితాంతం ప్రతీక్షణం కలిసుండే దంపతు లకి భార్యలరోజేమిటి? భర్తల రోజేమిటి... విదేశాల్లో అంటే వాళ్ళ కుటుంబంగా కలిసుండేది చాలా తక్కువ. ఎప్పుడో సంవత్సరానికోసారి కలుసుకోవడం కోసం వాన్నలరోజు, మదర్స్‌ డే అంటూ ఏర్పాటు చేసుకున్నారు. మనం ఎంత గుడ్డిగా వాళ్ళననుకరిస్తున్నామో చూడు... పిచ్చిపిల్లా... ” ఆరోజు భాస్కర్‌ అన్నమాటల్లో అతడి జడత్వాన్ని మాత్రమే చూశాన్నేను. ఇప్పుడా లోచిన్తుంటే ఆ మాటల్లోని లోతు తెలుస్తొంది. అమ్మకేసి, ఆమె వడ్డిస్తూంటే ఆవురావురుమంటూ తింటోన్న ఆమె భర్తకేసి నిశితంగా చూస్తూండిపోయాను. శ్ర న! శ మట్టిరోడ్డు మీద కరుణ, నేను కబుర్హాడుకుంటూ నడున్తున్నాం... ఊరు మొత్తం పొడవాటి ఈ రోడ్డు మాత్రమే. రోడ్డుకు అటూ యిటూ దూరదూరంగా, అక్కడక్కడా ఒక పూరిలు. ఊరంతటికీ కలిపి ఒక చిన్న బంకు. ఊరి చివర గ్రామదేవత గుడి. మేము ఆరోడ్డు మీద నడుస్తుంటే మనుషులు వింతగా, కొత్తగా నాకేసి చూస్తున్నారు. వాళ్ళు నల్లటి ఎత్తు చెప్పుల్లో పచ్చగా నున్నగా ఉన్న నా పాదాలనీ, నా వంటికి నప్పినట్టుగా వున్న లేత ఆరంజిరంగు చుడీదార్సీ, నా చర్మపు రంగులో కలిసిపోయి కన్పడీ కన్పడకుండా మెరుస్తోన్న బంగారుగాజుల్నీ, నా మొహంలో ఉత్సాహంగా కదుల్తోన్న కళ్ళనీ మార్చిమార్చి చూస్తున్నారు... చూస్తూ వాళ్ళల్లో వాళ్ళే గుసగునలాడుకుంటున్నారు. బహుశా వా ఎత్తు వాళ్ళ నాకర్షించి ఉండొచ్చు. నేను హఠాత్తుగా కరుణకేసి చూశాను కొత్తగా తను నా భుజాలదాకా ఉండి, చామన చాయతో, మ్యాచింగ్‌ లేని లంగా ఓణీలతో, చెప్పుల్లేని కాళ్ళతో, చాలా సాదాసీదాగా వుంది. సాలెగూడు తట యా

“రాత్రి ఎక్కడినుండో టిక్కుటిక్కు శబ్దాలు వినిపించాయన్నావుగదా... ఇదిగో ఈ ఇంట్లో నుండే ... ఊరంతా పనిమానేసినా ఈ శేషన్నింట్లో, మా యింట్లో అప్పుడప్పుడు ఈ శబ్దాలు... వ్చ్‌” చెప్పింది కరుణ.

“అవునూ రాత్రిపూట కూడా నేస్తారా?” విస్తుపోయాను నేను.

“అవును, రాత్రివేళల్లోనే ఎక్కువ నేస్తారు... ఎందుకంటే ఆనమయంలో అయితే పోగులు తెగకుండా వస్తుంది నేత... మరీ నూరో నంబరు దారమైతే అమిత సన్నగా వుంటుంది. పోగు తెగిందనుకో అది మళ్ళీ మరో పని... బూడిద చేత్తో వాటిని కలుపుకోవాలి వుంటుంది” తెగిన పోగులు ఉరితాళ్ళవుతున్నాయన్నట్లుగా చెప్పింది కరుణ,

“కరుణా, ఒకసారి లోపలికెళ్ళి చూద్దామా?” ఉత్సాహపడ్డాన్నేను

“ఒద్దొద్దు” కంగారుపడుతూ “మనింట్లో నేసేవ్పుడు చూద్దువులే” అన్నది కరుణ, మళ్ళీ నా మౌనాన్ని ఏ విధంగా అర్ధంచేసుకుందోగానీ చెప్పసాగింది మెల్లిగా

“ఏంలేదు వర్షా, శేషన్నా వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా ఉండాది. ఒకప్పుడు పముజుల వీరాస్వామి అంటే ఊరంతటికీ గొప్ప. ఆ వీరాస్వామి కొడుకే ఈ శేషన్న. ఈరోజున భార్యా భర్తలిద్దరికీ ఉండేది ఒకటే గుడ్డ శేషన్న గుంటలో దిగితే ఆ గుడ్డ తీసి భార్యకిస్తాడు. ఆమె గుంటలో దిగితే శేషన్న బయటికొస్తాడు. ఇదీ వాళ్ళ పరిస్థితి" కళ్ళనీళ్ళు పెట్టకుంది కరుణ.

ప్రపంచానికే బట్టకట్టడం నేర్చిన నేతన్నకి ఒంటిని కప్పుకోడానికి నూలుపోగు లేదు. “హూ” భారంగా నిట్టూర్చాను.

అ తర్వాత ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు చాలాసేపటి దాకా.

శ శ శ

కిష్టయ్యా... ఓకిష్టయ్యా... మళ్ళీ ఈ పొద్దు యింకొకరు ఉరేనుకుని చచ్చిపోయ్యా ఉంట...” పేపరు పట్టకుని అరుస్తూ వచ్చాడతడు, చిరుచీకట్లు విచ్చుకోకముంద...

చప్పున లేచి కూర్చున్నాన్నేను .

నిన్న అక్కడెక్కడో కరీంనగర్‌ వద్ద చేనేత కార్మికుడొకడు అప్పులతోనూ, ఆకలితోనూ బతకలేక సకుటుంబంగా విషంతాగి మరణించిన సంగతి పేపర్లో చూసి నిన్నంతా యిరుగూ, పారుగూ కలిసి కిష్ణ్టయ్యుతోనూ, భాస్కర్తోనూ చర్చించారు...

ఎక్కడచూసినా చేనేత కష్టాలు ఒకేలావున్నాయంటూ కష్టసుఖాలు కలబోసుకున్నారు. ఒక్కొక్కరూ తగినంతపని లేకా, గిట్టుబాటు ధరల్లేకా ఏవిధంగా అప్పులపాలయిందీ తలషాసు కున్నారు.

మళ్ళీ తెల్లారకముందే మరో నేత కార్మికుడి మరణవార్త. “అయినా కిష్టయ్యా మనూళ్ళో ఎన్ని కుటుంబాలుండేయి కైకాలోళ్ళవి. అందరూ చెట్టకొకరూ, పుట్టకొకరూ అయిపోతిరి... పొట్టకూటికి లేకుండా ఎంతకాలం పని చేస్తారు?” సాలిగూడు శ్వ? మ పమణం 2బ్‌

కుటుంబాల, కుటుంబాలుగా వూరాదిలి వెళ్ళిపోయిన సహనేతగాళ్ళని తలుచుకుంటూ వారి గుండెల్లో తడి...

ఎవరి గుండెల్లో ఎన్ని విషాదాలు గూడుకట్టుకున్నాయో ఒకరివెంట మరొకరు ఒకదారి ఏర్పడ్డట్లుగా ప్రయాణం కడ్డున్నారు...

“మంత్రి ఏవన్నాడో చదివినా...” పేపరు చూస్తూనే ప్రస్తావించాడు కిష్టయ్య...” ఈ చేనేత పనోళ్ళంతా ప్రభుత్వం యిచ్చే డబ్బులకోసమే ఆత్మహత్యలు చేసుకుంటున్నారంట. వు “ఆకలి ఎట్టుంటాదో తెలిస్తే యిట్టా మాట్లాడతారంట్రా ఎదవ నాయాళ్ళు?” చుట్ట నోట్లో పెట్టుకుని కొరుకుతూ అన్నాడు పెద్దాయన.

ఎండుటాకుల్లా రాలిపోతూన్న నేతన్నల మీద మన వేతలు యిటువంటి హీనమైన వ్యాఖ్యలెందుకు చేస్తున్నారో అర్ధంకాదు... వ్చ్‌... ప్రపంచానికే బట్టకట్టడం నేర్పిన ఐదువేల ఏళ్ళనాటి మన భారతీయ సంస్కృతి సిగ్గుతో తలదించుకుంది.

పెద్దాయన మళ్ళీ నోరువిప్పాడు.

“ఆ రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడే నయం. జనతావస్తాలు అన్దెప్పి మన చేనేతపనికి అడ్వాన్సులిచ్చి పని కల్పించాడు. ఆయన పోయినాడు. యిప్పుడుండే వోళ్ళు మన మంచీ చెడ్డా చూడకపోతిరి”

“అయినా రోజూ ఎంతమంది నేతన్నలు ఆకలితో చచ్చిపోతుండారో చూడు. న్స్‌...

చేనేతరంగం మన ఆర్ధికవ్యవస్థకు రెండో గుండె అన్న మహాత్మాగాంధీ మాటలు, గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నాకు. ప్రపంచానికే తలమానికమైంది మన చేవేత పరిశ్రమ. ఇవాళ ఆకలి కడుపుల్లో, అప్పుల్లో చేనేత కార్మికుల ఆత్మహత్యల పరంపర...

మామూలుగా అయితే నేనీ వార్తలు పేపర్లో చదివో, టి.వి.లో చూసో ఛానల్‌ మార్చే సుండే దాన్ని. ఇప్పుడు ఈ కుటుంబంతో కలిసి యిక్కడ యిలా చూస్తూంటే నా నరాల్ని ఎవరోలాగి వదిలినట్లుగా అయింది .

“అక్కా... లే... యివ్వాళ శివాలయానికి వెళ్ళామనుకున్నాం” తొందరపెట్టాడు రాంప్రసొద్‌ కరుణ వారిస్తున్నా వినకుండా.

దిగులు దిక్కున తెల్లవారింది.

శః శ క్ష

“కరుణ చాలా తెలివైంది... కాలేజీలో చేరిస్తే బావుంటుందేమో” ఏటిఒడ్డున శివా లయం గట్టున కూర్చుని నీళ్ళలోకి రాళ్ళు విసురుతున్నాడు భాస్కర్‌... కరుణ, రాంప్రసాద్‌, పక్కింటి మువిరాజా ఇసుకలో పరిగెడ్తూ ఆడుకుంటున్నారు... వాళ్ళకేసి చూస్తూ కరుణని గురించి ప్రస్తావించాన్నేను.

సాలిగూడు /7ల ఇం వభుతనో

దూరంగా వూళ్ళో పూరిళ్ళకవతల సూర్యుడు రంగులు కుమ్మరిస్తూ వెలుగుతున్నాడు. నీరెండ, కుంచెతో సృష్టి చిత్రాన్ని ఆవిష్కరిస్తోన్న చిత్రకారుడిలా వుంది.

భాస్కర్‌ మాట్లాడకపోవడం చూసి రెట్టించాన్నేను.

మేమిద్దరం కూర్చున్న గట్టుచివర్లో గులకరాళ్ళ మీద ఏటి జాలు గలగలమంటూ వింతశబ్దంతో పారుతోంది.

“నిజమే( కరుణ తెలివయిందే... అమ్మానాన్నా తనని చదివించలేదని తిట్ట్బకుంటూ కూర్చోక టెయిలరింగ్‌, పెయింటింగూ నేర్చుకుంది. సర్టిఫికేట్‌ కూడా వుంది. షాప్‌ వోపెన్‌ చేయాలని కోరిక. లోనుకి అపెచేసి ఆఫీసుల చుట్టూ తిరగడమే తప్ప ఫలితం కన్పించడంలేదు. వేను ఉద్యోగంలో చేరితే తన పెళ్ళి నా మొదటి బాధ్యతవుతుంది.”

బాధ్యతగా చెప్తున్నాడో, బరువుగా అంటున్నాడో అర్ధంకాలేదు భాస్కర్ని చూస్తుంటే.

“జాగ్రత్త... జాగ్రత (ప్రేమిస్తున్నావా? ప్రేమని నమ్మబాకు... ప్రెభుత్వాన్ని అసలే నమ్మ బాకు... ప్రేమ, లేని ఆస్తుల్ని పొందాలంటే... ప్రభుత్వం మన ఆస్తులన్నిట్నీ (ప్రైవేటు వ్యక్తుల కమ్మేస్తుంది... నమ్మబాకు నమ్మబాకు” వేపమండల గుత్తితో నా మెడ మీద రాస్తూ అతడు నా మీదిమీదికొచ్చాడు. గుండె రుల్లుమంటూ బెదిరినట్లుగా భాస్కర్‌ పక్కకి జరిగాన్నేను.

వేపాకు మా మొహాలమీద రూడిస్తూ అవే మాటల్ని మళ్ళీమళ్ళీ గొణుక్కుంటూ నీళ్ళలోకి దిగి కరుణ వాళ్ళున్న వైవుగా నడిచాడతడు. తేరుకోని భయంతో పళ్నార్ధకంగా భాన్కర్‌ కేసి చూశాన్నేను.

అతడి కళ్ళల్లో వూరిన నీళ్ళని ప్రయత్నంమీద వెనక్కి నెడుతూ చెప్పాడు భాస్కర్‌ “మా అన్న”

స్థాణువయ్యాన్నేను.

“అవును... ఎమ్మెస్సీ చదివి ఉద్యోగం కోసం తిరిగితిరిగీ చివరికి ఒక ధ్రిడ్డ్‌ల కంపెనీలో చిన్న పనికి కుదిరాడు. వదినా, తనూ తిరుపతిలో వుండేవాళ్ళు.

జీతం చిన్నదీ... వదిన ఆలోచనలూ, ఆశలూ చాలా పెద్దవి... పక్కవాళ్ళలా చీరలూ, నగలూ లేవవే అసంతృప్తి. ఇంటిని బోలెడన్ని వస్తువులతో నింపాలన్న ఆతృత... ఇద్దరూ ఎప్పుడూ ఘర్షణపడుతూ వుండేవాళ్ళు. అన్న కష్టపడి వదిన అడిగిన చీర కొనిపెట్టినా ఆ గొడవ అంతటితో ఆగేదికాదు. మరొక వస్తువుకోసం తపన.

ఒక విధంగా అది ఆమె తప్పుకూడ కాదేమో అన్పిస్తుంది యిప్పుడాలోచిస్తూంటే... మనకి అవసరమైనవీ ఆనవసరమైన వీకూడ సరుకులు బజార్లోకొచ్చి మనల్ని వూరిస్తూన్నాయి. మన ఆలోచనలనీ, జీవితాల్నీ పక్కదారి పట్టిస్తున్నాయి...”

వ్చ్‌ సరుకుల విశ్వరూపాన్ని ప్రజల మెదళ్ళలోకి జొప్పిస్తోన్న ఈ ప్రచారసాధనాల మీద విరక్తి కలిగింది.

“మరి మీ అన్నయ్య యిలా?”

+ావమిం/77

“ఏముందీ యిలా జీవితంతో ఘర్షణ పడుతూన్న సమయంలోనే అన్న పని చేస్తూన్న కంపెనీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దాంతో వున్న ఆధారం కూడ తెగిపోయింది. వదిన భర్తనీ, కొడుకునీ వొదిలి మంచి జీవితాన్ని (?) వెదుక్కుంటూ వెళ్ళిపోయింది. అప్పట్పుండీ అన్న జీవితమే భ్రమించిపోయింది అప్పట్లుండీ యిలాగే తిరుగుతున్నాడు. ఆకలేస్తే యింటి కొస్తాడు. లేదంటే యిదిగో ఈ శివాలయంవద్దే . ఎంతో ప్రయత్నించి చూశాం... వ్చ్‌( ఇక యిదింతే...” భాస్కర్‌ గొంతులోని విషాదం నన్ను కదిలించింది.

హఠాత్తుగా నాకు తరచుగా వచ్చి స్వర్గలోకాల్లో విహరింపజేస్తూన్న కల గుర్తొచ్చింది. అదే కల అన్నిసార్లు ఎందుకొస్తుందో ఎంతాలోచించినా అర్ధంకాదు.

ఆ కలలో భవంతులు తప్ప పూరిళ్ళులేవు. నిజంగొ అటువంటి రాజ్యమొకటి వుంటుందా? వుంటే ఎంత బావుండును. భాస్కర్‌కీ, నాకూ నడుము వున్న ఈ అంతరాలు హఠాత్తుగా మాయమైపోతే ఎట్లా వుంటుంది? అప్పర్‌మిడిల్‌ క్లాసులో జీవిస్తోన్న నేను యిటువంటి జీవితంతో రాజీపడగలనా?

శూన్యంలోకి చూస్తూన్న నాచేతి మీద చేయివేసి ప్రేమగా, యిష్టంగా నొక్కాడు భాస్కర్‌ నవ్వుతూ...

ఉలిక్కిపడి అతడి కేసి చూశాన్నేను .

అస్తమిస్తోన్న సూర్యుడి కిరణాలు భాస్కర్‌ మొహం మీద కొషాయవర్ణంలో మెరు స్తున్నాయి. మూడేళ్ళ మా పరిచయంలో భాస్కర్‌ ఎప్పుడూ నన్నలా ముట్టకోలేదు. ప్రేమ (పేమంటూ నేను వెంటపడినా తను దూరదూరంగానే వుండేవాడు.

నాకెందుకో హరాత్తుగా నేనెవరో గుర్తురాలేదు.

మొత్తం అస్థిత్వాన్ని మర్చిపోయినట్లుగా వుంది. నేను నడవాల్సిన దారి కన్పించడంలేదు.

“వర్భా' పిలిచాడు భాస్కర్‌ “మా యిల్లు, నా తలిదండ్రులూ, కుటుంబం , బాధ్యతలూ, మా లోక్టాస్‌ జీవితాలూ యివన్నీ చూపించడానికే నిన్నిక్కడికి రమ్మన్నాను... నీకిదంతా చాలా వింతగా వుంది కదూ” మెల్లిగా పైకి లేచాడతడు.

అవునూ, కాదూ అని నమాధానం చెప్పకుండా నేనూ లేచి నిల్చున్నాను. దూరంగా శరుణ, రాంప్రసాద్‌, మునిరాజా మావైపుగా నడిచి వస్తున్నారు.

శివాలయం ముందు కూర్చున్న ఒక వృద్భుడికి పదిరూపాయలు తీసి యిన్తూ “బాగున్నావా మామా?” అంటూ పలకరించాడు భాస్కర్‌. ఎముకలగూడుకి చర్మం అంటించి నట్లుగా వున్నాడతడు.

“బాగుండాను భాస్కరయ్యా. నువ్వెప్పుడొచ్చా ?”

మోకాళ్ళదాకా పంచె, చేతులున్న మాసిన బనీనూ, పండబారిన నేరేడుపండులా వున్న ఆ వృద్ధుల, భాస్కర్నీ మార్చిమార్చి చూస్తున్నాన్నేను...

సాలెగూడు

775 షం యో

కొద్ది దూరంలో నిల్చుని కరుణ, మునిరాజా, రాంవ్రసాద్‌ ముగ్గురూ అప్పుడు ఆడిన ఆటలో మొండితనాన్ని గురించి వాదించుకుంటున్నారు.

అప్పటికి సూర్యుడు పూర్తిగా పడమటికొండల్లోకి కుంగిపోయాడు.

“అతడి పేరు చిన్నోడు... " మా వద్దకి నడుస్తూ చెప్పాడు భాస్కర్‌.

“కానీ చాలా పెద్దోడిలా కన్చిస్తున్నాడే ” భాస్కర్తోపాటు అడుగులేస్తూ నవ్వాన్నేను.

“చిన్నోడు... ఒకప్పుడు మా నాయినకి ధీటుగా రకరకాల జరీచీరలు నేసినోడు. ఎటువంటి చదువుసంధ్య ల్లేకపోయినా కళ్ళు చెదిరే డిజైన్లు, అద్భుతమైన రంగుల కలనేతలు రూపాందించేవాడు. అమిత చీపుగా అందుబాటులోకొచ్చిన విదేశీవస్తాల ధాటికి తట్టుకోలేక మావూరి నేతగాళ్ళంతా పొట్ట చేతబట్స్బకుని వెళ్ళిపోయారు. వెళ్ళలేనివాళ్ళు పెద్ద రెడ్డవద్ద సేద్దిగాళ్ళుగా, కూలోళ్ళుగా మారిపోయ్యారు. చివరికి ఆ కూలిపని కూడ చేయలేక శివాలయం ముందు కూర్చుని అడుక్కుంటున్నాడు చిన్నోడు. ఆత్మహత్య మాత్రం చేసుకోలేదు” భాస్కర్‌ గొంతు వాణీికింది.

“హూ నిట్టూరుస్తూ “ఎందుకిట్లా అఆయిందంటావ్‌?” ప్రశ్చించాన్నేను.

“మామూలే... మిషన్ల రాకతో చేతివృత్తులు ఎక్కడ నిలుస్తాయి. అదీకాక రాజీవ్‌గాంధీ జౌళి విధానం మూలంగా చేనేత బాగా దెబ్బతింది. అప్పుడిలాగే నేతన్నల ఆత్మహత్యల పరంపర కొనసాగింది. ఆ తర్వాత రామారావు ప్రభుత్వంలో కొంత నయం... చేనేత కార్మికులకు ఉపాధి దొరికింది. మళ్ళీ ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రపంచబ్యాంకు ఆదేశిత విధానాల మూలంగా వేతపని వూపిరి ఆగిపోతోంది”

వాతావరణం బరువెక్కిపోయింది. అందరం మౌనంగా ముందుకి అడుగులేస్తున్నాం. శివాలయం కాంపౌండు గోడనానుకుని వున్న వేరేడుచెట్టు మీది నుండి చల్లని గాలి తెమ్మెర మమ్మల్ని రాసుకుంటూ వెళ్ళింది.

“శ్రపుదయం వూరెళ్ళామనుకుంటున్నాను” చెప్పాన్నేను చాలా మెల్లిగా, తాపీగా.

చప్పున కళ్ళు చికిలిస్తూ వా కళ్ళల్లోకి చూశాడు భాస్కర్‌. ఆ చూడ్డంలో అతడి గుండె ల్లోని బాధని దాచలేకపోయాడు. అయినా “ఏం నిర్ణయించుకున్నావంటూ అతడు నన్ను ప్రశ్నించలేదు. నిజానికతడు ఆ ప్రశ్నకి జవాబు వెతుక్కోనవసరం లేనట్లుగా వున్నాడు.

శ శ న!

తెల్లవారు రూమున మూడయింది.

ఎక్కడో పాలాలమీది కాపలాకుక్కల అరుపులతో చప్పున మెలకువొచ్చింది నాకు. చప్పుడు కాకుండా లేచి మెల్లగా వెనక వసారాలొకెళ్ళి బావిగట్ట మీద కూర్చున్నాను.

మళ్ళీ అదే కల. అనే ఆకాశహర్మ్యాలు. అదే లైట్ల కాంతి. అవే సిమెంటురోడ్డు. అవే విదేశీ కార్లు. అంతా అద్భుతమైన దృశ్యం.

సాలెగూడు శన్వభ మహమ ౯ 2ఈ

అయితే కల వచ్చిన యిన్నిసార్లుగా గుర్తించని ఒక విషయం పసిగట్టానీసారి.

ఇంత అద్భుతమైన రాజ్యంలోనూ ఎక్కడా మనుషులే లేరు. అంతా ఏమయిపోయారో అర్ధంకాక పరికిస్తే సుదూరంగా ఒకచోట రకరకాల కరెన్సీ కాగితాలు ఎత్తుగా కుప్పబోసి వున్నాయి. ఆ రాశిచుట్టూ వందల, వేల, లక్షల జనాలు నిల్చుని గుంజిళ్ళు తీస్తున్నారు.

అందమైన అ భవంతుల ముంగిళ్ళలో చిత్రంగా పచ్చగడ్డి బదులు ఎండుగడ్డి 'సెరుగుతోంది.

రంగు రంగుల కల చెదిరిపోయి నేనూ, చీకటీ మిగిలిపోయాం.

“కశథొకేళి' నెల్లూరు జిల్లా రచయితల వంఘం సాలెగూడు

మం ననా

౯ త్‌ గ్ర పక్షీశ వి, ప్రతిమ కథలు

పక్షి

“*ోజురగనంతవరకూ జరగతాదిలే చిన్నాయినా... యింక మాత్రం నన్నాడికి పొమ్మని చెప్పబాకండి... నాకా సొకిర్యాలూ వద్దు... వోళ్ళమాటలూ వద్దు...” ఖండితంగా వున్న కొండమ్మ గొంతు విని డీలాపడ్డాడు తిరిపాలు.

మొదులే కొత్త పండక్కి అమ్మిని తీసళరావాల... అల్లుడికి కొత్తగుడ్డలు కొనియ్యాల... ఎట్ట ఎల్లబోద్దా ఈ పండగని నస్తావుంటే ఈయమ్మి నీలుగుడు మాటలూ... ఈయమ్మి కతా ఆ వాయుడోళ్ళింట్లోగూడా పదిరూపాయలు పుట్టేట్బగా లేవు. కూర్చున్న నులకమంచంమీది నుండి పైకిలేవాలని ప్రయత్నించి నరాలు గుంజినట్టయి అట్నే వెనట్కి వాలుకున్నాడు తిరిపాలు.

గుడిసె బయటున్న పాయ్యిమీద అన్నంకింద ఎక్కేస్తా కుతకుత వుడికిపోయింది మీరమ్మ

“యాందివే. నువుజెప్పేది? పెద్దోళ్ళు, నీకు తిండిబెట్టేవోళ్ళు ఒకమాటనకుండా వుంటారా? మీ అమ్మయినా

+వ్మవ పీజు /ల/

ఒకమాటనదా? ఒక దెబ్బగొట్టదా? నువ్వు చిన్నమనిషివిగాదులే, ఆ నాయుడమ్మని ఎట్టంటే అట్ట మాట్లాడుంటావు... తక్కవైనదానివా? ఇక్కడ ఒకమ్మినే పెట్టకోని చెయిలేక చస్తావుంటే నీ బుడ్డబెదిరింపుల్యాందిమే. ”

అప్పుటికి సద్దికూట్యాళయింది బర్రెల్నిప్పి సిచ్చిరెడ్డితోపుసాయ తోలకపోవాల్సిన రంగమ్మ పనిమర్చి చినమ్మసాయా, అక్కసాయా మార్చిమార్చి చూస్తావుంది. అక్క నాయు డోళ్ళింటికాడ పని చెయిలేనంటుంటే చినమ్మా, చిన్నాయినా పామ్మని తొందరచెయిడం ఆ పిల్లకి బాధగా, దిగులుగా వుంది. అక్కకి అసలే కాలు అయిపు అ యింట్లో బండచాకిరి. ఎంత చేసినా నాయుడమ్మ తిడతానే వుంటాది. “నేను పోనని' గట్టిగా చెప్పమని అక్కకి సైగ చేసింది రంగమ్మ.

“కొండమ్మా నేన్చెప్పేదినుమే... ఆ నాయుడోళ్ళింట్లో వుండేగదా నువ్విన్ని ప్యానన్లు నేర్చినావు... మనవనుకుందాం... గుడ్జెట్ట కట్టుకోవాలో, తలెట్ట దువ్వుకోవాలో, బాట్టెట్ట పెట్టకోవాలో అన్నీ ఆయమ్మ దగ్గరేగదా నేర్చినావు... దినుమ్మూ నీళ్ళు పోసుకుంటుణ్ఞామా మనింటికాడ... ఇదిగో తాగను సుక్కనీళ్ళు ల్యాక సస్తావుండాము... నువ్వన్నా లచ్చనంగా పెద్దోళ్ళింట్లో బతికిపోతావనుకుంటే మల్లిదేందిమే... మంచి యిల్లూ, మంచి తిండీ... నా మాటిని పదాంబా” మంచంమీద లేచి కూర్చున్నాడు తిరిపాలు.

రంగమ్మ అక్కమోచేతిని పాడస్తా ఎక్కేసింది వెళ్ళనని చెప్పమంటూ. కొండమ్మ గొంతు బిగబట్టుకుని ధైర్యాన్ని ఎరువు తెచ్చుకుంది.

“ఇదిగో చిన్నాయినా ... నువు మళ్ళీగన నన్నంపించాలని చూసినావంటే నేన్నెప్తండా... చెరువుకట్ట మీద యాపచెట్టుకన్నా వురేసుకుంటా... ల్యాకపోతే పురుగులమందన్నా తాగేస్తా...”

“అవున్లే దూకిసావడానికి చెర్లో చుక్కనీళ్ళు ల్యాకపోయ...” అన్నం వారుస్తూ దెప్పి పొడిచింది మీరమ్మ... మీరమ్మకి వొళ్ళంతా సెగలు రేగినట్లై మంటలు పెడుతోంది... తన కూతుర్ని తొడకొచ్చి ఉగాదికి అన్నీ పెట్టి అంపించాల. ల్యాకపోతే అత్తోళ్ళింట్లో ఆయమ్మికి మాట... ఈ నడమ వూళ్ళొ పనుల్లేక చేతిలో చిల్లి పైసా అన్నాలేదు. సరే... కొండమ్మ పనిచేసే కాడికిబొాయి అయిదొందలడిగి తెచ్చుకుందామనుకుంట్రి మొగుడూ పెళ్ళాలు...

ఈయమ్మి గబక్కన చెప్పాపెట్టకుండా వచ్చేసిందిగాక మూడుదినాల్నుండీ రాయి మాదిరి తిని కూర్చోనుండాది, మాటాపలుకూ లేకుండా... యిహనేమి యీబోతారోళ్ళు.

అసహాయతతో, ఏమీ చేయలేనితనంతో ఉద్రేకం పెరిగిపోయింది మీరమ్మకి.

“మీయమ్మా, నాయినా కని నా ఎదాన దోసిపాయినారే లంజిల్లారా... తిని కూసో నుండండి చేసిపెడ్తాను. నాకు మాత్రముండాది కండల్లో నత్తవ...” ఇద్దరి మొహాలమీదా మెటికలు విరుస్తూ పైపైకి దూకింది మీరమ్మ.

అయితే కొండమ్మకీ, రంగమ్మకీ ఊహ తెలిసిన్నాటినుండీ మీరమ్మ ఈ మాటలంటానే వుండాది... ఈ పొద్దు కొత్తేంగాదు... కళ్ళు తుడుచుకుంది రంగమ్మ... కొండమ్మ మాత్రం స్పందనలేని స్థంభంలా నిలబడివుంది. రల షష

మీరమ్మ నోరునొప్పిపుట్టే దాకా అరిచి అరిచి గుడిసె లోపలికిబాయి ఎరగడ్డల పులును కలుపుకొచ్చి పాయిమీద పెట్టింది... అసలు అన్నం వార్చింది మొదలు ఇప్పుటిదాకా ఉత్త పాయి పోవడం ఈ ముండల వల్చే అంది.

పొద్దట్నుండీ ఈ తిరణాలలోపడి బరైలకాడ పేడ జవరనందుకు తన్నుతాను తిట్టుకుంటూ పాతరేకుతో బరబరా కసువూ, పేడా లాగడం మొదలుపెట్టింది. నోరు మాత్రం ఆడలానే వుంది.

“మీ అమ్మా నాయినా పోతాపోతా మిమ్మల్ని కూడా తీసుకుపాయ్యుంటే ఇట్లా మాటి మాటికీ ఈ బాధల్లేకుండా పాయ్యుండునన్నది. వీళ్ళిద్దరివల్లే తన ఒక్కుగానొక్క కూతుర్చీ సరిగ్గా చూడలేకపోయానన్నది. ఈ రెండు పొట్టల్నీ అదనంగా నింపాల్సివచ్చినందువల్ల ఒక గుడ్డపాత కూడా కొనుక్కోలేకపోయానన్నది ముగ్గురాడపిల్లలు ఇంట్లో వుండారని చిన్నప్పుడే మొగుడి పక్కన పడుకోవడం మానేశానన్నది. బతుకులో ఎన్నెన్నో పోగొట్టుకున్నవన్నీ ఏకరువుపెట్ట పాగిందామె.

మంచంమీద వెల్లకిలా పడుకుని చింతచెట్టు సందుల్లోనుండి ఆకాశానికేసి చూస్తున్న తిరిపాలుకి కూడా మీరమ్మ మాటల్లో పొల్లు కన్పించలేదు. అన్నా, వదినా వీళ్ళిద్దర్నీ తన మీదాదిలి ఈ లోకాన్నొదిలి పెట్టిపోయినప్పుట్లుండి ఎన్నెన్ని బాధలుపడితే, ఎన్ని పన్తులుండి వాళ్ళ పొట్టలు నింపితే యింత పెద్దోళ్ళయినారు కాలు అయిపు పిల్ల అని మరీ ఈ కొండమ్మని వెత్తిన పెట్టుకునేకదా సాకినాడు తను కూలీనాలీ చెయిలేదని, బరైల కాడుండి బండచాకిరీ అనలే చెయిలేదని, ఈడుంటే వోళ్ళ చినమ్మ పిండేస్తాదే అనేగదా పేటలో యిటికసూల వాయుడోళ్ళింటికాడ పెట్టింది. ఆడకుబొయినాకే గదా ఇంత బాగ తీరింది పిల్ల. ఏదో నాయుడమ్మ దగ్గిర పనీబాటా నేర్చుకుంటాది, ఇంక రెండేళ్ళట్ట వుణ్గిందంటే పెళ్ళిగూడా నాయుడమ్మే దేశాస్తాది, మనికి ఒక బాద్దిత తప్పినా తప్పతాది అని ఎంత ఆసపడ్నాడు. అట్టాటిదీయమ్మి ఒక్కమాటైనా చెప్పకుండా పరిగెత్తేసింది వోళ్ళ నాయినయినా, మా నాయి నయినా ఈడేమయివా లిబ్బి పెట్టేసి పాయ్యుండారా? ఎంతెంత కష్టపడితే ఈ సంసారం లాగతుండాము.

ఏవన్నా పాలమూ పుట్రా వుండాదా? ఎంతసేపు అ కూలికి పోతేనే గదా పొట్టకూటి$. లేకుంటే పస్తులు పడుండాల్సిందే. ఆ కూలి పనైనా యాడ దొరకతా వుండాది. ఊరంతా తిండిబెట్టే పంటలు గాకుండా చెరుకేసేస్తిరి. ఆ చెరుకుతోటల్లో పని చేయడానికి అరవదేశా న్నుండి కూలోళ్ళాస్తుంటిరి. గవుర్మెంటు స్టలాలంటిరి. అయ్యి మనదాకా రాకపాయ. పనికి బియ్యవన్నారు. పనికి పిలవకుండానే మిషన్లతో పన్ల్గయిపాయ. కరువు బియ్యమంటిరి కంటికే కనబడకపాయ. ఆఅఖరికాఖరికి తాగనుకూడా చుక్కనీళ్ళు లేకుండాపోతుండాయి.

నులక మంచంమీద వెనక్కివాలుకుని, బతుకులోతుల్లో నుండీ అలోచిస్తోన్న తిరిపాలుని పెద్దదగ్గు తెర కమ్మేసింది. అట్లే ముందుకులేచి కూర్చుని దగ్గసాగాడు శక్తిలేనట్టుగా.

యా

అసలే పీక్కుపోయివున్న తిరిపాలు బుగ్గలు మరింత లోతుకుపోయి, మొటికలు మొటికలుగా పెరిగిన తెల్లగడ్డంతో ముఖం భయంకరంగా కన్పిస్తోంది. ఎండుకుపోయిన డొక్కలు దగ్గు తీవ్రతకి ఎగిరెగిరిపడుతున్నాయి.

'మూడుదినాల్నుండి గమనించలేదుగానీ, చిన్నాయిన మరీ తగ్గిపాయ్యుండాడు" దిగులుగా తనలోతనే గొణుక్కుంది కొండమ్మ చిన్నాయిన వైపు చూస్తూ, ఎంత కాదనుకున్నా నాయిన తమ్ముడు... చిన్నప్పుట్పుండి తనని సాకినోడు... అట్టాటి చిన్నాయిన మాటకాదని బాధపెడ్తుండానేమోనని, ఒక్కక్షణం ఆలోచనలోపడింది కొండమ్మ. ఆ క్షణాన్ని వినియో గించుకుంటూ మీరమ్మ ఎత్తుకొనింది... ఈసారి అనునయంగా.

“అమే ఈ ఒక్కసారికి నా మాటినుమే... పదాంబా నేనుగూడొస్తాను. నాయుడు భార్యకి చెప్పి వదిలిపెట్టాస్తాను. ఇదిగో మీ అక్కని పండక్కి తొడకరావాలని డబ్బులడిగి తెచ్చు కుంటాను” అంటూ బతిమాలుకుంది.

మీరమ్మ మాటలకి క్షణంపాటు కొండమ్మ మనసు కరిగింది. చినమ్మతోగూడా పాయి వాయుడోళ్ళనడిగి డబ్బులిప్పిస్తామా అన్పించింది. మరుక్షణంలో ఏమనుకుందో ఏమో విసురుగా లేచి చిన్న కానుగచెట్టు దాటి వాళ్ళ అత్తోళ్ళ యిళ్ళవైపు నడిచిపోసాగింది.

జారిపోయిన కోకని ఎగేసుకుంటూ మీరమ్మ నోరు తెరుచుకుని చూస్తుండిపోయింది. వెళ్ళిపోతూన్న అక్కనీ, నిర్దాంతపోయి నిలుచున్న చినమ్మనీ చూస్తూ నంధిగ్ధంలో పడింది రంగమ్మ

తిరిపాలు ఎడ్డాతెరిపీ లేకుండా దగ్గుని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ దగ్గు తాలూకూ బాధామయ శబ్దం దూరంగా వెళుతోన్న కొండమ్మ చెవుల్లో నుండి పాకి గుండెల్ని చుట్టేస్తోంది.

శ శః ళ్లు

నక్కలకాలనలో చుక్కనీళ్ళు లేవు. నుద్దంగా ఎండిపోయి బాతులోళ్ళు కావరాలు పెట్టేసుండారు. నేలంతా బీటలుపడి పిట్టలు తాగడానిక్కూడా బొట్టు నీళ్ళుండడంలేదు. తన చిన్నప్పుడు ఈ కాలవ ఎంత నిండుగా పొంగిపారేది. ఈ కాలవలోనే తనూ, పక్కింటి, రవణమ్మా ఈత నేర్చుకునింది. బర్రెల్ని తోట్లోదోలేసి ఎంతసేపూ ఎండకి ఈ కాలవలొోనే ఈదులాడుతుండే వాళ్ళు రవణమ్మా, తనూ.

దేశమ్మ చెరువులో కూడా నిండా నీళ్ళుండేవి. మెట్టనేలలే అయినా చెరువు ఏటా రెండుసార్లు నిండీ పదహారొందల ఎకరాలకి బతుకయి వుండేది. అట్టాటిదిప్పుడు చెరువుల 'సేద్యాలే లేకుండా పోతుండాయి. బోర్లు, బోర్లని ఎంతెంత పొడుగు గొట్టాల్తెచ్చి నేలతల్లి గుండెల్లో దించినా గూడా చుక్కనీళ్ళు పైకిరాకపాయ. వానలాస్తేనేగదా నీళ్ళుండేదానికి. ఇంకా ఇంకా కొన్నేళ్ళుపోతే వానంటేనే తెలీకుండా పోతాదేమో... /ళ వామన

వానవున్నా, లేకపోయినా ఈ తంగేడు చెట్లు మాత్రం యిరగబూసి వున్నాయి. వాటిమీద రంగు రంగుల సీతాకోకచిలకలు వాలి పులకరిస్తూ , రాగాలు తీస్తూ ఒక పూవుమీది నుండి మరో పూవు మీదికి, ఒక చెట్టు మీదనుండి మరో చెట్టు మీదకి పారాడుతున్నాయి. వాటిని చూస్తూ వుంటే తను కూడా ఏదో ఊపిరాడని చోటు నుండి వచ్చి హాయిగా యిక్కడ తిరుగు లాడుతున్నట్లుగా వుంది కొండమ్మకి. లేచి ఆ చెట్టు దగ్గరికి, ఈ చెట్టు దగ్గరికీ వెళ్ళి పలకరించింది.

కొండమ్మ చిన్నప్పుడు సావాసగత్తెలంతా తంగేడు చెట్టను దేవతగా భావించేవాళ్ళు. అ చెట్ట్బ కనవడితే చాలు ఒక్కవూవ్వయినా కోసి తల్లో పెట్టకోకపోతే అ ళల్లికి కోపమొన్తుందనుకునే వాళ్ళు. ఇప్పుడు తలుచుకుంటే కొండమ్మకి నవ్వాన్తుంది. అయినా తంగేడుచెట్టు దగ్గరగా వెళ్ళి రెండు పూలు కోసి తల్లో పెట్టుకుని, రెండు చేతులూ జోడించింది.

దూరంగా పైరు కోసిన కయ్యిల్లో బర్రెల్ని మేపుతోన్న రంగమ్మ అక్క చెట్ల సందుల్లో నుండి పరుగులు పెట్టి తిరగడాన్ని, అక్క ఆనందాన్నీ ఆశ్చర్యంగా గమనిస్తోంది... అయినా చినమ్మ అక్కనిక్కడుండనీదు. మరుక్షణంలోనే నల్లగా వున్న రంగమ్మ ముఖం మరింత నల్లబడిపోయింది.

రాధామాధవ తీగల్లోనుండి రంగుపూలు కోన్తున్న కొండమ్మకి హఠాత్తుగా ప్రతిరోజూ దేవుడి కోనం పూలుకొపే నాయుడమ్మ గుర్తొచ్చింది. అక్కడ రాధామాధన తీగని వడగ్గది కిటికీకి అల్లించారు. దీని పేరు రాధామాధవ తీగని నాయుడమ్మే చెప్పింది తనకి. నాయుడమ్మ యింకా చాలా చెప్పింది... చానా నేర్పింది. ఇంగ్లీషు పదాలు కూడా నాయుడమ్మ వద్దే నేర్చుకంది తను. రోజూ శుబ్రంగా స్నానంచేసి వుతికిన గుడ్డలేసుకోడం, సబ్బుతో వళ్ళు రుద్దుకోడం, కాళ్ళకి చెప్పులేసుకోడం, తలకి పిన్నులేసుకోడం, గోళ్ళకి రంగు పెట్టుకోడం యివన్నీ కూడా వాయుడమ్మని చూసే నేర్చుకుంది తను. అయితే మాత్రం తనేవన్నా పన్టేయకుండా డబ్బులు తీసుకుంటుండాదా?

కాలు ఇట్ట పెట్టకోనిగూడా పాద్దనలేసింది మొదలూ, రాత్రి పదిగంటలదాకా వాయుడమ్మ ఏ పని చెస్తే ఆపని చేసేది. ఒక్క నాయుడమ్మేనా? యింట్లో ఎంతమందుంటే అంతమంది... ఎన్ని పక్కలకి పిలిస్తే అన్ని పక్కలకీ పరిగెత్తాల్సిందే. పాలుమాలేదానికే లేదు . యిల్లూ వాకిలీ పాొద్దనా, సాయంత్రం చిమ్మాలి. యిల్లంతా రూమురూముల్లో తడిగుడ్డతో శుభ్రంగా తుడిచి సర్దాలి. పైన చిమ్ముకురావాల. ముందు వెనకా వుండే చెట్లకీ, లానుకీ దండిగా నీళ్ళుపట్టాల. గుడ్డలుతకాల. యింత చేస్తే గూడా అత్తా, కోడళ్ళిద్దరూ దేనికోవకదానికి నన పెడ్డానే వుంటారు. ఎంత చేసినా యింకా అది చెయిలేదు, యిది చెయిలేదు అంటా వెంటపడతారు. మాట్లాడితే ఎదురుతిరిగి మాట్లాడిందంటారు. పలక్కపోతే జవాబు చెప్పవేమని గదమాయిస్తారు.

యా

పిల్లలుకూడా అంతే. ప్రతిదానికీ దబాయిస్తారు. రాపాడతారు. మాట్లాడేదానికిల్యా మాట్లాడకుండా వుండేదానికీల్యా. ఈ నాలుగుదినాల్పుండీ లానుకి నీళ్ళావురు పడ్తుండారో బాత్రూములెవురు కడగతుండారో. వాకిట్లో ముగ్గు ఎవురేస్తుండారో.

ఇదంతా అట్టుంటే అప్పుడప్పుడూ నాయుడమ్మ తమ్ముడొస్తాడు. పనున్నా, లేకపాయినా బెడ్రూములోకి పిలుస్తుంటాడు ఏదోవక సాకు పెట్టి. వాడొస్తుండాడంటేనే భయం. తప్పిచ్చుకు తప్పిచ్చుకు తిరగతుండాల. డబ్బు లేకపోతే, కాలు లేకపోతే మనిషికి మననుండదా, నీతి వుండదా? త్భ్ఫూ... నాయుడమ్మ నసే భరించలేక సస్తుంటే వీడొకడు ప్రాణానికి. ఎందుకొచ్చిన బాధ ఎంత తిండిపెట్టి గుడ్డలిస్తే మాత్రం మనిషికి మించి చాకిరీ చెయ్యాలంటే అవతాదా? చేసీగూడా ఏమన్నా వూరా పేరా? మెచ్చుకోకపోగా వకటే నసపెడ్డానే వుంటారు. ఒకపూట అన్నం లేకపోయినా పడుండొచ్చుగానీ వక్కమాటంటే పడదు తను.

అట్టని ఈడ్నే వుండాలంటే అవతాదా? తనకేవయినా అమ్మ, నాయినా వుండారా? కూచనబెట్టి పెట్టడానికి. ఎప్పుడో చచ్చిపోయిన తల్లితండ్రులు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళూరాయి శొండమ్మకి. రంగమ్మ నొకదాన్నే చూడ్డానికి చినమ్మ ఎన్నెన్ని మాటలడగతాది ? చిన్నాయిన చూస్తే శక్తి తగ్గిపాయి పనికి పోలేకుండా వుండాడు. చినమ్మ మాత్రం ఎంతకని చేస్తాది. పొనీ ఈర్చే వుండి రవణారెడ్డోరింట్లో పనికి కుదిరితే పాద్దనబొయి సాయంత్రమొచ్చేయొచ్చు.

“రంగమ్మా రవణారెడ్డోరింట్లో ఎవురుండారు పనికి? ఆ రెడ్డెమ్మ నన్ను పనికి రమ్మన పిలిచేది అంతకుముందు... ” చెల్లెలి దగ్గరగా వెళ్ళి ప్రల్నించింది కొండమ్మ,

రంగమ్మ పెదవి విరిచింది. చేతులు తిప్పుతూ...

“ఇంక్యాడ రవబణారెడ్డికా... మందు తాగి సచ్చిపాయినాడు. రెడ్డెమ్మ యిప్పుడిక్కడ లేదు. కొడుక్కాడికెళ్ళిపాయింది. పాపం చెనిగేసినాడుకా. బాగా వచ్చుణ్ణింది. నీళ్ళు చాలక మందు కొట్టినా తెగులు చావనే లేదంట. మొత్తం ఎనిమిదెకరాలూ నిలవనెండిపోయింది. ఏం చేస్తాడు చెప్పు? పోయినేడుగూడా పంట చేతికిరాల్యా. మందుతాగి అదుగో ఆ కయ్యిలోనే పడిపాయినాడు. పాపం పెదరెడ్డి ఎంత బతుకు బతికినాడు?. ఎట్టంతా అవునన్పించుకున్నాడు” ఆరిందాలా చెప్తూ కళ్ళు తుడుచుకుంది రంగమ్మ

విర్ణాంతపోయి చూస్తోంది కొండమ్మ...

“మనం చెయ్యాలన్నా కూడా పనుల్లేవుకా... వానలు పడితేగదా కయ్యలు దున్నేదానికి. టవున్లోనే మేలుపో, హే... హే... హే...” పక్కకి పోతోన్న బర్రెల్ని మల్లిస్తూ మళ్ళీ దూరంగా వెళ్ళింది రంగమ్మ ఆలోచనలోపడింది కొండమ్మ

ఏం చెయ్యాల?

నాయుడమ్మ పిలకాయిల్ని తను రోజూ బడికి తీసకపాయ్యేది. ఆ టీచరమ్మ తనని ఆయాగా వచ్చి చేరమని చానారోజులుగా పిలస్తుండాది. ఆమె దగ్గరికెళ్ళాల్సిందే... యింక్యాడికి /5ల ఇవీ

బొయినా ఈ కాలు చూసి పనీయరు అక్కడికిపోతే పని మరీ జాస్తిగా వుండబోద్ది. జాస్తయినా పర్వాల్యా.. ఎంత పనయినా చేస్తాది. మాటంటే మాత్రం వోర్చుకోలేదు.

కొండమ్మ కలగాపులమైన ఆలోచనలని అడ్డుకుంటూ “పాద్దుపోతా వుండాది, యిహన పోదాంరాక్కా” పిలిచింది రంగమ్మ,

బయిటి ప్రపంచానికి వెలుతురుగా వున్న ఆ సాయంత్రం ఆ అడవిలో మాత్రం తొందరగా చీకట్లని కమ్మేసింది.

! శ శ

సూర్యుడు భూలోకం మీదికి విహారానికొస్తున్నందుకు సాక్షిగా ముందుగా సననన్నటి వెలుగురేఖలు లోకంమీదికి పాఠరాడుతున్నాయి.

“లరే తిరిపాలా... కొండమ్మ యాడ్రా వుండేదిప్పుడు? అ నాయుడోళ్ళింట్లోనేనా...” మూడో యింట్లో వుండే వెంకటయ్య హాడావుడిగా వచ్చి ప్రల్నించాడు.

చిన్నదూడ మూతికి చిక్కం కడుతూన్న తిరిపాలు మెల్లిగా మోకాళ్ళు నవరదీసు కుంటూ లేచి నిలబడ్డాడు.

“వాయుడోళ్ళింట్లో లేదు వెంకటన్నా... ఎంతచెప్పినా యినకపోయె... బడి సాయిత్రమ్మ టీచరు కాడుండాది. ఏిలకాయిల్ని బడికి తొడకరానూ, వదిలెపెట్టనూ, ముడ్డి కడగనూ, బడి చిమ్మనూ చెయినూ... చస్తా వుండాదనుకో... చెయిలేకుంటుండాదని ఆడ్యాడ్నో బేరిపేటలో పెద్ద మిస్సమ్మ కాడ పెడతాణంటుణ్జింది సాయిత్రమ్మ” తాపీగా చెప్తొన్న తిరిపాలు కేసి చూస్తూ...

“యిహనేమి కొండమొగరే ... ఆ బేరిపేట్లో పెద్ద మిన్సమ్మ, అదేన్రా సాందాయమ్మ పనికి, పనికని పెట్టుకోని ఎడ పిలకాయల్ని అయిదారాబాదులో అమ్మేస్తుండాదంట. ఆమె మొగుడే ఈ పన్లన్నీ చేయిస్తుండాడంట. ఈ పొద్దు పేపర్ల నిండా అదేనంట. వాయుడుపేటంతా గబ్బుపుట్టి పాయ్యుండాదనుకో. రెడ్డోరింటికాడ చెప్పుకుంటుంటే యిని ఇట్ట పరిగెత్తినా కొండమ్యాడుండాదా అని”

తిరిపాలుకి కాళ్ళూ, చేతులూ ఆడలేదు. ఊపిరి తిప్పుకోనీయని దగ్గుని లెక్కచెయ్య కుండా, పై గుడ్డ వుందో లేదో చూసుకోకుండా, బనీను జోబులో చిల్లరుందో లేదో గమనించు కోకుండా బస్టాండుకి పరుగెత్తాడు.

పేరు తెలీని పక్ష్తేదో వికారంగా అరుచుకుంటూ ఆకాశంలో పడమటివైపు నుండీ తూర్పుమూలగా పరుగెత్తుకుంటూ వెళ్ళింది.

బరైలకాడ పేడ జవురుతుండిన రంగమ్మ 'ఓ'మంటూ ఏడుపుకెత్తుకుంది అర్ధమయ్యి కాకుండానే. కొళాయినీళ్ళు పట్బకొచ్చి సిమెంటు తొట్టిలో నింపుకుంటూండిన మీరమ్మకి కూడా దిక్కుతోచలేదు. నాయుడింటినుండి వచ్చేసిన కొండమ్మని తిట్టి, తిట్టి మళ్ళీ పనిలోకి

  • వీల?

పంపినందుకు తనలోతానే నొచ్చుకుంది. ఇక్కడే వుండనిచ్చివుంటే ఏదో వొక పనీపాటా చేనుకు నుండేదికదా అనుకుంది. ఏడుస్తోన్న రంగమ్మని వోదార్బాలనికూడా తోచలేదామెకి. బస్సు కాడికి పరుగెడుతోన్న మొగుడికి యిది బస్సు టయిము కాదనికూడా చెప్పాలనిపించలేదు. నిండు బిందె చంకనుంది. దాన్ని దించాలన్న ఆలోచనకూడా లేకుండా వాంటికతుక్కుపోయిన తడి చీరతో, కొండమ్మ తాలూకూ పళ్చాత్తాపచింతనతో నిరామయంగా చూస్తుండిపోయింది మీరమ్మ

రంగమ్మ ఏడుపుతో యిరుగు పారుగూ అంతా యింటి ముందు చేరారు. మనుషుల్ని వస్తువుల మాదిరి అమ్మేసే యిటువంటి ఉదంతాన్ని వాళ్ళిదివరకెన్నడూ వినివుండకపోవడంతో అంతా నివ్వెరపోయి రంగమ్మని ఏం చెప్పి వోదార్పాలో తెలీక తికమకపడసాగారు.

“అడ్యాడ్నో యిట్ట జరగతాయని యిన్నాంగానీ మనూళ్ళో, మన పేటలో కూడా యిట్టాటిది జరగతాదని అనుకోల్యా. మనోళ్ళ చెంగమ్మ కొడుకు నాయుడుపేటలో సూల పని చేయడానికి దినుమ్మూ పాయ్యేసాస్తాడు. ఆ మిస్పమ్మ... పెద్ద మిస్పమ్మకి ఎంత పేరుండాది అందర్లో... మంచి వుద్యోగం చేస్తా గొప్పగా బతుకుతుండె ఆయమ్మకిదేం బుద్దో?...”

“అ పాయ్యేకాలమొస్తే కుక్కమూతిపిందెలు పుడతాయంటారు ఇదే గదా... ల్యాకుంటే అ నాయుడోళ్ళింటికాడ లచ్చనంగా పడుండకుండా ఈ మిస్పమ్మింటికి దేనికి పాయినట్ట ఈ కొండమ్మ...”

“అయ్యో నా కల్లా కొండమ్మా ఎంతపని జరిగిపొాయిందమ్మే... ఇంత పొట్టకూటికి గతిలేక నువ్వాడ్యాడ్నో ఎందుకుండాల... నా కాడుండు... నువ్వెవురి యిళ్ళకాడా వుండబళ్ళే దంటినే... నా మాటినకుండా పోతివే. కొండమ్మా నా కోడలా ఎంత పని జరిగిపోయిందమ్మే” కొండమ్మ మేనత్త శవంమీద పడి ఏడిచే ఏడుపు రాగంతో పరుగెత్తుకొచ్చింది.

మీరమ్మకి దిగులుపోయి వళ్ళుమండుకొచ్చింది. ఈ పిలకాయల అమ్మానాయినా పాయ్యినప్పుట్టుండీ యా పాద్ధూ రంగమ్మనీ, కొండమ్మనీ యిటుకుండ రమ్మని పిల్చెరగదు. ఆమద్దిన గవుర్మెంటు అయిపు కాలోళ్ళకి డబ్బులిన్తుండాదని అప్పుడు తీసకపాయ్యి నాలుగు దినాలుండిచ్చుకుంది. గవర్మెంటు డబ్బులిచ్చేది నీళ్ళమీద రాసుకున్నాక వదిలిచ్చేసుకుంది. అట్టాటి మేనత్త కొండమ్మ కోసం యాడస్తా రావడం మీరమ్మని దోషిని చేయడానికేనని అందరికీ అర్ధమవుతానే వుంది.

రంగమ్మ ఏడస్తానే వుంది నన్నగా...

ఆ ఏడుపు వున్న ఒక్కగానొక్క బంధాన్ని పుటుక్కున తెంచేసిన ఎవరిమీదో తెలీని కోపాలాపనలాగుంది.

ఎవురి బాధల్నీ, సంతోషాలనీ పట్టించుకోని సూర్యుడు ఆరోజు కూడా మామూలుగానే పశ్చిమకొండల్లోకి వెళ్ళిపోయాడు.

శః శ్ష శ 755 ఇమాని

నాలిక గొంతులోకి దిగబీకతావుంది. కళ్ళు ముచ్చిన గుంటలోకి ఈడ్చుకుపోయాయి. మూడుదినాల్నాడు వెంకటయొ్యచ్చి కొండమ్మ మాట చెప్పకముందు తాగిన దాహం. మొన్న పాద్దట్నుండీ కొండమ్మకోసం తిరిగి తిరిగీ అరిగిపోయిన కాళ్ళు, మన సారంతులోనే లేకుండా పేట బస్టాండులో బెంచిమీద వడున్న తిరిపాలుని నెల్లూరు నుంచి బన్సు దిగిన రాగయ్య చూసి నీళ్ళు చల్లి, సోడా తాగించి మెల్లిగా బస్సెక్కించి వూరికి తీసుకొచ్చాడు.

బస్సులో వచ్చినంత సేపూ కొండమ్మమాటే కలవరిస్తుండాడు తిరిపాలు.

తాళాలు బిగించేసిన సాయిత్రమ్మ బడి చుట్టూ... పోలీసులు చుట్టముట్టిన సాందా యమ్మయింటిచుట్టూ ఆసుపోసినట్లుగా ఎట్ట తిరిగిందీ చెప్పాడు. పక్కనా యిక్కనా ఒక్కరన్నా ముండాగుంపు కొండమ్మ పోపిడి యివ్వలేదనీ, టవున్లో మనమాటినే వోళ్లెవురన్నాడు. పోలీను లుండేది పేదోళ్ళకోసం కాదు పెద్దోళ్ళకోనవన్నాడు. పోలీసులు తనమాట పట్టిచ్చుకోకుండా ఎట్ట తరిమికొట్టిందీ చెప్పాడు. అది రాగయ్యా అన్నాడు... యిది రాగయ్యా అన్నాడు...

ఏడ్చి ఏడ్చి నీళ్ళే లేకుండాపోయిన కళ్ళల్లో యింక నెత్తురుబొట్లు కారతాయేమోనని వూరుకున్నాడు. ఆ నెత్తురు కూడా తన వొంట్లో లేదన్న ఆలోచనయితే రాలేదు తిరిపాలుకి.

నాలుగురోజుల ముందు నెల్లూరుకి పోయిన రాగయ్యకి విషయం పూర్తిగా తెలీక పోయినా కొంత కొంత అర్ధమయి తిరిపాలుని వోదార్పాడు.

శు శు శ

“ఓయమ్మో... నా దేవుడికేవయిందమ్మో” రాగయ్య భుజానికతికించుకుని వేళాడు కుంటూ తీనుకొస్తోన్న తిరిపాలుని చూసి మీరమ్మ మతిపోయింది. నడుస్తున్న శవంలాంటి తిరిపాలునీ, రాగయ్యనీ మార్చిమార్చి చూస్తూ ఏడుపుకెత్తుకునింది.

తిరిపాలుని మెల్లిగా వాకిట్లో వున్న నులకమంచంమీద కూర్చోపెట్టాడు రాగయ్య. పేట బస్టాండులో తిరిపాలుని ఏ పరిస్థితుల్లో తాను చూసిందీ క్లుప్తంగా చెప్పి మంచినీళ్ళు పట్రమ్మ న్నాడు. మీరమ్మ మంచినీళ్ళు తెచ్చిచ్చి

“యాందయ్యా యాడకు బొయినావు. ఆయమ్మి మాట అట్టుండిచ్చి నిన్ను గురించి యాడవను సరిపాయనే నాకు. ఎట్టబొయినావో ఏమోనని” ఒకవైపు మొగుడి దబాయిస్తూనే మరోవంక పమిటచెంగుతో ముక్కును ఎగబీలుస్తోంది మీరమ్మ

పెళ్ళాం మాటలేవీ విన్పించుకోకుండా ఆలోచనలోవున్న తిరిపాలుకి హరాత్తుగా రంగమ్మ జ్ఞాపకానికొచ్చింది. అక్క కన్చడలేదని ఈయమ్మి ఎట్టబొయ్యిందో, ఏమయిపోయిందో అనుకుంటూ చుట్టూ కలయచూళశాడు.

అప్పటికి పొద్దు గూట్లో పడతావుంది.

దూరంగా బరైల్ని అదిలిస్తూ యింటికి తోలుకొస్తావుండాది రంగమ్మ తేలిగ్గా వూపిరి పీల్చి అటే దృష్టి సారించిన తిరిపాలు వీధిచివర కన్పించిన దృశ్యాన్ని చూసి విచిత్రపాయ్యాడు.

హా

వీధిచివర... అటు వూరికీ యిటు మాలాడకీ పాదువుగా వున్న చింతచెట్టు కింద అరుగుపక్కన బంకులో కూర్చుని అంగడమ్ముకుంటా వుంది కొండమ్మ,

మసక చీకట్లో కొండమ్మా కాదా అనుకుంటూ కళ్ళు చికిలించిన తిరిపాలుని గమనిస్తూ

“మన కొండమ్మే... సాయిత్రమ్మ టీచరుకాడ్నే వుణ్ణిందంట. పెద్ద మిస్సుకాడికి బోలే. యింత లోపల పోలీసులొచ్చి సాందాయమ్మనీ, మొగుడీ పట్టకపాయినారు. దాంతో లింకుండా దేమోనని అనుమానంతో సాయిత్రమ్మని కూడా టేషనుకి పిల్చ్బకపాయినారంట... నరే బడి మూసేసినారు. ఎట్లో వోళ్ళనీ, యీళ్ళనీ డబ్బులడిగి బస్సెక్కి వచ్చేసింది. మనదృష్టంబో... ఈ లోపల్నే నువ్వుబొయ్యి అన్ని దేశాలూ చుట్టేసొస్తివి" వెటకారంగా అంది మీరమ్మ

మళ్ళీ తనే చెప్పింది

“వాయుడమ్మ తీసిచ్చిన కమ్మలు కుదవబెట్టి నేనే మాధనయ్య బంకు కొనిచ్చివా. యింక్యామయినా యీయాల్సుంటే తర్వాతిస్తాదన్నా...”

మాట మాత్రమే కరుకయిన మీరమనేసి ఆదరంగా చూశాడు తిరిపాలు. కృతజ్ఞతా భావంతో అతడి గుండె కదలబారింది. ఒక భారమైన, దీర్ధమైన నిట్టూర్పు విడిచి మళ్ళీ వీధి చివరకేసి దృష్టి సారించాడు తిరిపాలు. ఒకప్పుడు అంగడి పెట్టిస్తానంటే మొరాయించిన కొండమ్మ ఊరికి చివరగా మాలాడ మొదట్లో వున్న ఆ చింతచెట్టు కింద కొండమ్మ ఆలోచనలు ననలెత్తి ఆమె భవిష్యత్తు కొత్తబట్టలు తొడుక్కుంటూంది. సాయింత్రం ఏడైపోయినా వేసవికాలం కానడంతో పల్చటి వెలుతురు కిరణాలు ఆ మాలాడ మీద ప్రసరిస్తున్నాయి.

ఇక యింటికెళ్ళే ససుయమైందని కాబోలు చింతచెట్టు మీదనున్న సీతాకోకచిలుకల గుంపొకటి ఉవ్వెత్తున విశాలమైన ఆకాశంలోకి ఎగిరింది.

అంధ్రవ్రభ నచిత్ర వారపత్రిక, ఆగన్టు 22, 2003 గ గయీ గలితొలలు న క్ష ట్రీ వైచమార్‌ ”

750 ఇ మీన

జ | . ( [ 'ప్రవాహవేగంతో ప్రపంచవ్యాప్తంగా వచ్చిపడుళున్న

  • పరిణామాలు, అవి ప్టానిక జనజీవనాన్ని సంక్లిష్టం ; ళా చేస్తున్న తీరును, తనదైన ప్రోపంచిక, తాత్విక దృకృథం ళన ఇ తో విశ్లేషిస్తూ దానికి స్రీ దృష్టికోణాన్ని జోడిస్తూ మంచి సు ః కథలు వ్రాస్తున్న వర్తమాన రచయిత ప్రతిమ. ళ్వి లో పితృస్వామ్య భావజాలంతో సహా అన్ని వివక్షలనూ , కాపాడడానికి కంకణం కట్మకున్న సమాజం, రాజ్యం...
  1. ఆ వివక్షల్ని ఎదుర్కొని ఈమ ఉనికిని స్థిరపరచుకోవ వ... . డానికి స్రీలు చేన్తున్న అవిశ్రాంత పోరాటం, ఆ (| క్‌ | | | పోరాటంలో ఒక్కొక్కసారి వారు పొందిన పరాజయాలు, క! ఆ పరాజయాలకు కారణమైన పరిస్థితులూ, అంశాలూ, చే! | ఎంతో సూక్ష్మంగా చిత్రితచ గలిగింది. స్త్రీలతో సహా, . .. సామాన్య జనులందరి ఈ పోరాటంలో వారి విజయం చ || - శ: పట్ల లీ ఆశావహ దృక్పథం కన్పరుస్తుంది. సామాజిక ఎక్సు... |) -... = పరిశీలనలోనూ, శిల్పంభోనూ ఈ దశాబ్దంలో ఆమె . =. | | సాధించిన ప్రగతికీ, పరిటతికీ అద్దంపట్టే కథలు ఇవి. [1,1 ” ఫ్‌ [ | న్‌ తెలుగు రచయిత్రుల మంచి మంచి కథలు అందించిన | నఖ . క | | | ఈ దశాబ్దంలో గట్టిగా రివీసించిన ఒక గొంతు ప్రతిమ. [1 . [| | . ఈ గొంతు అలా వినబడుకూనే వుండాలని కోరుతూ... 11 [11 111 అత్తియంగా . నంటు న లెల్ల కి | బత శ.