Telugu thummalaseetharamamurthi - anilvaranasi/indianlanguages GitHub Wiki

ఫ్‌ | ణి - శ్‌ ట్‌ 2 . | శ ” క శ / అడే .__ నాగళ్ల గురువప్రసాద ల గ ల . ॥ ను త గంగా నటం. క స న అక్రమాలు నంట సుల ॥ క [షం ర మజ శల యులు క ౧. వ కు . . , | ఇరా గ్‌ టీ. సీ చు | టై శ్‌. [ఎట్లో [1 ల? / వ్‌ న్‌ పరక ఏ ల్‌ న న; లనే చన? నట నా. స్త స. శ స న. స న . నన ల పోష నట. న వ నానా నం చ వ టా” జ లో ః! చామ ప 1 న. అ తే వ నం పు టం కో న . యాన ఆ కతపేయ్‌ + కత స ఎ.

  • ఆంత ల చ స | యా _ ల ను ము , న న టి త ల. శ సయం గా! /| . క్త (సు (| శతు భి ( / తజ. |; | య

తుమ్మల సీతారామమూర్తి

అట్టలోపలి వైపు అచ్చు వేసిన శిల్చంలో కనబడేది శుద్దోదన మహారాజుకు గౌతమ బుద్దుని తల్లిరైున మహారాణి మాయాదేవి కన్న స్వస్నం గురించి జ్యోతిష్కులు వ్యాఖ్యానిస్తూ ఉండిన దృళ్యం. వారికి దిగువున వారి వ్యాఖ్యను న్రాసుకుంటున్న లేఖకుడు కనిపిస్తాడు. భారతదేశంలో లేఖన కళ చిత్ర శిల్చంలో నిబద్దమై లభించే దృష్టాంతాలలో ఇదే ప్రాచీనమైనది.

నాగార్జున కొండ, క్రీశ 2వ శతాబ్దం

(జాతీయ పురావస్తు ప్రదర్శన శాల, న్యూఢిల్లీ వారి సౌజన్యంతో)

భారతీయ సాహిత్య నిర్మాతలు తుమ్మల సీతారామమూర్తి అని నారళ్ల గురుఫప్రసాదరావు స సాహిత్య అకాదెమీ

౫42 వంంిడ గిం01272407040 : నేశీంగింకైణంైనీ 19 10104 09 888ట12 ౮౮౧ కిణ5242 [40 5జగ ఉక2రయాి, 64 0టమ, 2000, 3.25 బటా-ళ2డ ల బ్ర 520102 మరలు! జు దు క 241401 : 2000 గ డు లా న 139౫ : 81-260-0833-4 సాహిత్య అకాదెమీ “రవీంద్ర భవన్‌, 35, ఫిరోజ్‌షా రోడ్‌, న్యూఢ్మిల్టీ - 110 001. విక్రయ విభాగం : 'స్వాతి' మందిర్‌ మార్గ్‌, న్యూఢిల్లీ - 110 001. సెంట్రల్‌ కాలేజ్‌ క్యాంపస్‌, యూనివర్సిటీ లైబ్రరీ బిల్లింగ్‌, బెంగళూరు - 560 001. “గుణా బిల్లింగ్‌, 304-305, అణ్జాసాలై, చెన్నై - 600 018. జీవన్‌దారా బిల్డింగ్‌, 4వ అంతస్తు, 234/4430 డైమండ్‌ హారర్‌ రోడ్‌, కలకత్తా - 700 053. 172, ముంబాయి మరాఠి (గ్రంధ సంగ్రహాలయ మార్ష్‌, దాదర్‌, ముంబాయి - 400 014. వెల:రూ.25. . ల ళహంయ్తో గ్రంఠాలయ ఖర్చు స రు రక శే (స స్నా శం యే బటల లిగాలాలలలం్రి న కణ సెటజణుర/ [06 960095 ౧౧౦౧౫21 - 600 014 వింత ల్లా. వ8క్రై్య్రంం 900660, ౮౧౧౧041

విషయ సూచిక పేజీ నెం. ముందుమాట 6 అంకీతం 8 కుదురూ, కోవా - ఊరూ, నాడూ క్రి విద్యాభ్యాసం - ఉద్యోగం 20 బాపూజీబంటు 30 రచనా వ్యాసంగం 42 కవితా సిద్ధాంత నియమములు 55 గాంధీకవి 66 రాష్ట్రకవి 77 రైతుకవి 89 సామాజికకవి 103 సర్వోదయ విష్ణవకవి 117 కావ్యశిల్బము 132 వ్యక్తిత్వము 14

ముందుమాట

తుమ్మల సీతారామమూర్తి ఇరనయ్యో శతాబ్ది తెలుగు కవులో విలక్షణకవి. శతకాలూ, జంగమకథలూ, హరికథలూ రచిస్తూ కవితా ప్రస్థానం ప్రారంభించిన ఆయన చివరకు ఆంధ్రుల, భారతీయుల హృదయ స్పందనలకు అక్షరరూపం కల్పించినవాడయ్యాడు. స్వాతంత్ర్యసిద్ధి పిదప భారతజాతి మనస్తత్త్వంలో వచ్చిన మార్పులకు సుందర కవితాకృతి కల్గించినవాడయ్యాడు. ఆయన మొదట గ్రామీణ సంస్కృతి కవి. తరువాత నవయుగకవి. పల్లెపట్టుల తీరుతెన్నులతో పెరిగిన సీతారామమూర్తి సాంస్కృతిక పునరుజ్జీవనం రూపొందించిన విశిష్టకవిగా పరిణమించాడు. ఆయన భావ విప్లవాన్ని కోరాడు. భాషా విప్లవాన్ని తిరస్కరించాడు. జీవితం వేరు, కవిత్వం వేరు అనే వాదాన్ని త్రోసివేశాడు. సీతారామమూర్తి జీవితంలోని దైవసంపద, ఆయన రచించిన కవిత్వంలోనూ సాక్షాత్కరిస్తుంది. ఆ కవిత్వానికి గాంధేయ సిద్ధాంతాలు పంచప్రాణాలు. ఆయన కాలధర్మానుగుణంగా భారతీయ సంస్కృతిలో మార్చులు కోరాడే కాని దీనిని తిరస్కరించి విదేశ సంస్కృతులకు స్తోత్రపాఠకుడు కాలేదు. ఆయన కవితా సిద్ధాంతాలూ, మతసాంఘిక రాజకీయార్థిక రాద్ధాంతాలూ భారతీయ సంప్రదాయాలనుండి ప్రభవించాయి. “అన్నివైపులనుండీ ఉదాత్త భావములు మాకు సంక్రమించునుగాక” (ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్చతఖ అనే బుగ్వేదవాక్యం ఆయనకు ప్రమాణం. తానుకోరే నైతిక పునరుజ్జీవనం గానీ జాతీయ వికాసంగానీ ఈనేలనుండే జనించాలని ఆయన వాంభించాడు.

ఇటువంటి సీతారామమూర్తిని గూర్చి “భారతీయ సాహిత్య నిర్మాతలు” అనే గ్రంథమాలక్రింద ఒక గ్రంథం రచింపవలసిందిగా సాహిత్య అకాదెమీవారు అడిగారు. ఈ పిలుపు అదృష్టంగా భావించి అంగీకరించాను. వారికి కృతజ్ఞత ప్రకటించటం నా ప్రథమ విధి. నేను గ్రంథరచనం పూర్తి చేయటానికి కావలసిన సమయాన్ని నాకనుగ్రహించిన సాహిత్య అకాదెమీ కేంద్ర కార్యదర్శి ఆచార్య ఇంద్రనాథ చౌదరిగారికీ, ప్రాంతీయ కార్యదర్శి అగ్రహార కృష్ణమూర్తి గారికీ కృతజ్ఞుణ్ణి.

మొట్టమొదట 1-6-1958వ తేది “ఆంధ్రప్రబొ దినపట్రిక ఆదివారం సంచికలో “నవ్యాంధ్ర కవితా ప్రపంచంలో బాపూజీ సాక్షాత్కారం” అనే వ్యాసం ప్రకటించాను. దీనిలో తుమ్మల సీకారామమూర్తి గాంధీజీని దర్శించిన తీరును వివరించాను. తరువాత 1959 ఏప్రియల్‌ "భారతిలో “రాష్ట్రా నములోని రామణీయకము” అనే వ్యాసాన్స్సీ 13-8-1961 “ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో “సర్వోదయగానము” అనే వ్యాసాన్నీ, 196 జనవరి “భారతి”లో “తుమ్మలవారి కవితా ప్రపంచము” అనే వ్యాసాన్నీ ప్రకటించాను. వీటిల్లోని కొన్ని విషయాలు పరిమితినిబట్టి సంగ్రహంగా ఈ గ్రంథంలో చేరాయి.

1979 జనవరిలో శస్తచికిత్సకొఅకు సీతారామమూర్తిని అప్పికట్ల నుండి విజయవాడ తీసికొని వచ్చాను. ఈకారణంవల్ల ఆయన మాయింట్లో దాదాపు రెండునెలలపాటు నిలిచారు. ఈ సమయాన ఆయన 1940 సం॥వరకూ స్వీయచరిత్రను చెప్పగా వ్రాసికొన్నాను. నేను కళాశాలకు వెళ్లినప్పుడు ఆయనే కొన్ని ఘట్టాలను ద్రాశారు. ఇది నూటనలబై పావురావు పేజీల. ఉక్తలేఖనం.. ఈనాడు ఈ గ్రంథరచనకు అనాడు సీతారామమూర్తి చెప్పిన స్వీయచరిత్ర ఎంతగానో ఉపకరించింది. ముఖ్యంగా బాల్యయౌవన విశేషాలు ' తయన సాహిత్యాన్ని సమగ్రంగా అర్థంచేసికోవటాని కుపయోగపడినాయి.

1930నుండి సీతారామమూర్తి వ్రాసిన డైరీలను అడిగిన వెంటనే వారికుమూరులు తుమ్మల _ శ్రీనివాసమూర్తి, డాక్టర్‌ తుమ్మల రఘునాథరాయలు నా వశం చేశారు. వారిద్దరికీ కృతజ్ఞుణ్ణి. ప్రస్తుతం అడైరీల్లోని కొన్ని అంశాలే ఈగ్రంథాని కెక్కాయి.

ఈగ్రంధం వ్రాతప్రతిని శ్రద్ధగా పరిశీలించిన శిష్యురాలు చిన్నం విజయలక్ష్మికి ఎల్లమేళ్లూ సమకూడాలని దీవిస్తున్నాను. విజయవాడ-10 నాగళ్ల గురుప్రపాదరావు 31-5-1997 60-5-8, సారనాథ్‌

సిద్దారనగర్‌ ధథి

నన్ను తండ్రిమాదిరిగా చూచుకొనే దంపతులు చాక్టర్‌ ఎన్‌. ప్రేమపాగరరెడ్డికీ డాక్టర్‌ ఎన్‌. వెంకమ్మ (శాంతి) రెడ్డికీ యాపిల్‌ వాలీ, కాలిఫోర్నియా, ఉత్తర అమెరికా వాత్సల్యంతో అంకితం

కుదురూ, కోవా - ఊరూ, నాడూ

తొంభైయారేళ్లనాటి మాట. ఇరవయ్యో శతాబ్ది ప్రవేశించి ఒక యేడాది అయింది. రెండోయేడు కూడా డిసెంబరు నెలదాకా దోగాడింది. ఈనెలలోనే తుమ్ముల సీతారామమూర్తి జన్మించాడు. ఆయన తండ్రీ నారయ్య. తల్లి చెంచమ్మ. నారయ్య పూర్చపురుషుల్లో తుమ్మల వీరన్న విఖ్యాతికక్కాడు. ఇతడు విజయనగర చక్రవర్తులకు సామంతుడయిన పెమ్మసాని తిమ్మానాయనికి మంత్రిగా సేనాపతిగా మన్ననలు పొందాడు. తిమ్మానాయడు గండికోట ప్రభువు. కావ్యానికి టీకమాదిరిగా వీరన్న తిమ్మానాయని శంకలకు తీర్చరిగా నేర్చరి అయ్యాడు. అందువల్ల వీరన్నకు టీకన్న అనే మారుపేరు కలిగింది. ఈయన కోవ కాలక్రమాన కృష్ణా గుంటూరుజిల్లాలో కుదురుకొన్నది. వీరన్నకు నారయ్య తొమ్మిదోతరంవాడు. ఈయనకు ముందు ఆరుతరాలనుండి వీరన్న సంతతివారు ఈనాటి గుంటూరు జిల్లాలో రేపల్లె తాలూకాకు చెందిన “కావూరు” గ్రామంలో.నివసిస్తూ వచ్చారు. నారయ్య తండ్రి వేంకటపతి. ఇతడు శాపానుగ్రహశక్తి గలవాడు.

నారయ్య క్రీ.ళ. 153లో కావూరు గ్రామంలోనే పుట్టి పెరిగాడు. కావూరు హైచీనమయిన పల్లెటూరు. క్రీశ 10వ శతాబ్దినాటి బాదప మహారాజు “ఆరుంబాక” శాసనంలో కనబడుతున్నది. ఇది ఈనాడు గుంటూరుజిల్లా రేపల్లె తాలూకా చెఅకుపల్లి మండలంలో ఉన్నది. కాని నారయ్య పెరిగి పెద్దవాడయ్యేప్రొద్దుకు ఇది కృష్ణాజిల్లాలో ఉన్నది. క్రీశ 1904లో గాని ఇప్పటి గుంటూరుజిల్లా ఏర్పడలేదు.

నారయ్యకు ముందే ఈయన తాతముత్తాతలు పగవారి కుత్తుకలు కోసి కత్తులు వదలి, పైరులు కోసీ కొడవళ్లు చేపట్టిన వారయ్యారు. ఈయన కాలానికి కుటుంబం చితికిపోయింది. పెళ్లికి ముందు నారయ్యకు అంతగా ఆస్తి లేదు. కావూరి మాగాణిపొలం సాఠవంతమయిందిగాదు. పైగా దానికి మురుగుదెబ్బ లెక్కువ. కాబట్టి కావూరి కాపులు మెట్టగా ఉన్నగరువులోనే రాగులూ, సజ్జిలూ పండించి పొట్టపోసికొనేవారు. వారిని పేదజికం ఏడాటలాడిస్తుండేది.

10 తుమ్మల సీతారామమూత్తి

చెంచమ్మ నారయ్యకు మేనగోడలే. ఆమె కలవారి కుటుంబంలో పుటి పెరిగింది. పేదవాడయిన బావమతదికి నారయ్యగారి బావ తన కొమార్తెను చెంచమ్మనిచ్చి. పెళ్లి చేశాడు. ఈపెళ్లివల్ల నారయ్య ఏడెనిమిదెకరాల మాగాణి కొండ్రకు ఆసామి అయ్యాడు. ఈకమ్మ దంపతులకు కావూరు గ్రామంలో 25-12-1901వ తేదిని బుధవారంనాడు సాయంకాలం మూడుగంటలకు (ప్లవ సంవత్సర - మార్గశిరమాస ఆ బహుళాష్టమి) సీతారామమూర్తి నాలుగో విడ్డగా పుట్టాడు. ఏసుక్రీస్తు తూడా ఈరోజునే అవతరించాడు.

నారయ్య రామభక్తుడు. ఆయనకు చదువురాదు. అయినప్పటికీ సాంత ఊళ్లో పాలుమాలకుండా ఎప్పుడూ పురాణప్రవచనానికి హాజరయ్యేవాడు. పొరుగూరికి వెళ్లినప్పుడుకూడా సాయంకాల మయ్యేసరికి పురాణం. చెప్పేచోటు 'తెలిసికొని, అక్కడ శ్రోతగా ఉండేవాడు. ఈ యలవాటువల్ల కొన్నేళ్లమీద ఆయనలో భక్త, భాషా పరిచయమూ, ధార్మిక దృష్టీ పెరిగాయి. ఆంధ్రమహాభాగవతంలోని సప్తమ - అష్టమ - దశమ స్కంధాల్లోని అనేక పద్యాలు ఆయన నోటికి వచ్చాయి. అక్షరాస్యుడెవడయినా భాగవతం చదువుతుండగా ఆయన పురాణం చెప్పీ నేర్చు గడించాడు. శబ్దార్థాలూ, తాత్పర్యమూ, ఇతర వోోషాలూ దోషాలు దొరలకుండా వివరించే శ్రుతపాండిత్యం ఆయన సొత్తయింది. వేకువజామున మూడుగంటలకు టేచి దాశరథి శతకం, నరసింహ శతకం మొదలైన శతకాలు పారాయణం చేసేవాడు. చివరకు ఎల్లకర - నరసింహకవి రచించిన “భారతసావిత్రి" అనే లఘువచన గంథం చదివేవాడు. ఈ చదువంతా ఆయనకు కంఠస్థమే.

సంపన్న కుటుంబం నుండి వచ్చిన చెంచమ్మ రుచిగా శుచిగా వంట చేసేది. సుష్టుగా తినటం, పెరవారికి పెట్టటం ఆమె కలవాటు. ఆమెది పెద్ద చేయి. బిచ్చగాడు వాకిలి త్రొక్కినప్పుడు పట్టెడన్నమూ, కూరలూ పెట్టేది. పనిపాట్లకు వచ్చే పేదలు అడిగినా, అడగకపోయినా బట్టలు వారికిచ్చేది. ఎవరయినా నేయి తీసికొనివచ్చి యిస్తే వారు వద్దంటున్నా దానికి సొమ్ము ఇచ్చేది. అమె నారయ్య మాదిరిగా దైవభక్తిపరురాలు గాదు. అయినప్పటికీ ఏనాడూ భర్త భక్తికి అడ్డుచెప్పేది గాదు. అగ్నిశిఖవంటి వీలమూ, సత్యజీవకారుణ్యాలూ ఆమెకు భక్తీ, ముక్తీ అయ్యాయి.

కుదురూ, కోవా - ఊరూ, నాడూ 11 కావూరు. తెనాలి, బాపట్ల, రేపల్లె తాలూకాల పొలిమేరల కూడలిమీద ఉన్న గ్రామం.. దీనికి దక్షిణంగా బంగాళాఖాతం తీరాన నిజాంపట్నం ఉన్నది. పడమటగా ఒకనాడు వెలనాటి చోళుల రాజధాని అయిన ధనదుపురం - ఇప్పటి చందోలు - ఉన్నది. నారయ్య పెరిగి పెద్దవాడయ్యేనాటికి కావూరు గ్రామంలో పెద్దమ్మ చిందులు త్రొక్కు తుండేది. తరతరాలనుండి తరలివస్తున్న గ్రామీణ సంస్కృతి మాత్రమే అయనకు అలవడింది. కాని బయటి ప్రపంచం నూతన సంస్కృతి ప్రాంగణంలో _ ప్రవేశించింది. అక్కడ నవయుగఠిఖలు దట్టంగా అలముకొంటున్నాయి. 1901వ సంవత్సరాంతంలో సీతారామమూర్తి జన్మించే నాటికి అవి వెలుగులు విరజిమ్ముతున్నాయి. తండ్రికి ముందు యాఖైయేళ్లనాడే ఆంధ్రప్రాంతంలో అవతరించిన సాంస్కృతిక పునరుజ్జీవనం కుమూరుడు తలయెగగట్టేనాటికి నిలద్రొక్కు కొన్నది. ఆయనను తిద్దితీర్చింది. దాని విశేషాలు తెలిసికోవటం చాలా ముఖ్యం. ఇంగ్లాండుకు చెందిన “ఈస్ట్‌ ఇండియా కంపెనీ” వారు బేరసారాలు చేసికోవటానికి భారతదేశానికి వచ్చారు. క్రీ.శ 1611 జనవరి నెలలో “గ్లోబ్‌ అనే ఇంగ్లీషువారి ఓడ మచిలీపట్టనం రేవులో లంగరు వేసింది. తూర్పు కోస్తాలో గోలకొండ సుల్తానుల నుండి వ్యాపారం చేసికోవ టానికి అనుమతి పొందటమే వారి లక్ష్యం. మొట్టమొదట మచిలీ పట్టనంలోనూ, నిజాం పట్టనంలోనూ ఆంగ్లేయులు స్థావరాలు ఏర్పరచుకొన్నారు. క్రీ.శ 1811 తర్వాత వారు క్రమక్రమంగా ఆంధ్ర ప్రాంతంలోని కోస్తాజిల్లాలో అన్నింటిలోనూ పేటలు కట్టుకొన్నారు. గిడ్డంగులు నిర్మించుకొన్నారు. తమకంటె ముందు వచ్చిన డచ్చివారికి నిలువనీడ లేకుండ చేసినారు. తమకు పోటీగా వచ్చిన పరాసువారిని ఎదుర్కొన్నారు, మొగలాయి. సాత్రాజ్యం పతనమయిన తర్వాత దక్కనులో అరాజకం పెచ్చు పెరిగింది. అసఫ్‌జాహీ వంశీయులు ఆంధ్రప్రాంతానికి ఏలికలయ్యారు. వీరూ, మహారాష్ల్రులూ, మైసూరు మహమ్మదీయ ప్రభువులూ అంతఃకలహాలతో దేశాన్ని అల్లకల్లోలం చేశారు. వ్యాపార నిమిత్తం వచ్చిన ఇంగ్లీషువారు దూరదృష్టితో దేశీయరాజ్యాల

12 తుమ్మల సీతారామమూర్తి వ్యవహారాల్లో జోక్యం కలుగజేసికొనటం మొదలుపెట్టారు. వారు ఆంధ్రప్రాంతం నుండి ఫ్రెంచివారిని పారదోలారు. క్రీ.శ 1760లో కోస్తా ప్రాంతం వారి కైవసమయింది. క్రీ.శ. 1800 నాటికి నేటిరాయలసీమ వారికి దక్కింది. ఆంధ్రప్రాంతంలో కుంఫిణీ పరిపాలనానికి నాంది పలికి నట్టయింది. శ్రీశ. 1జూవ సం॥లో ఈస్టిండియా కంపెనీవారు భారతదేశంలో వర్హకవాణిజ్యాలకు స్వస్తిపలకాలని ఇంగ్లండు పార్లమెంటు అదేశించింది. అప్పటినుండీ ఆ కంపెనీ వర్తకసంస్థగా అంతరించి పరిపాలక సంస్థగా అవతరించింది.

కుంఫిణీ పరిపాలనం మొదటిరోజుల్లో ఆంధ్రప్రాంతం అశాంతికి ఆలవాలమయింది. ఆంగ్ల పరిపాలనానికి వ్యతిరేకంగా జమీందారులూ, మన్నెదొరలూ, పాలెగాండ్రూ తిరుగుబాటులు చేశారు. పితూరీలు లేవడీశారు. వీటినన్నిటినీ అణచివేసి అంగ్లప్రభుత్వం క్రీ.శ 1840 నాటికి శాంతిభద్రతలు నెలకొల్పింది. సామాన్య ప్రజలకు ఊపిరి పీల్చుకొనే వెసులుబాటు కలిగింది. పరిపాలకులయినప్పటికీ కుంఫిణీ వారు వర్తకుల బుద్ధులను మాత్రం వదల్లేదు. భారతదేశంలో వారు నిరంకుశంగా వ్యవహరించారు. రాజకీయార్థిక రంగాలో వారవలంబించిన విధానాలు భారతీయుల్లో అలజడినీ, అసంతృప్తినీ కలిగించాయి. అవి క్రీ.శ. 1857లో తిరుగుబాటుకు దారితీశాయి. ఈ తిరుగుబాటు తర్వాత భారతదేశ పరిపాలనభారాన్న్ని ఇంగ్లండు పార్లమెంటు, ఇంగ్లండు ప్రభువూ స్వీకరించారు. అనాటి ఇంగ్లండు ప్రఖ్వి విక్షోరియా మహారాళజ్ఞి ఉదార ప్రకటనం గావించినప్పటికీ భారతదేశ పరిపాలకులయిన ఆంగ్లేయులు తమ ప్రకృతిని మార్చుకోలేకపోయారు. తతృలితంగా పాలకులకూ పాలితులకూ నడుము అవిశ్వాస - అఖాతం ఏర్పడింది.

ఆంగ్లేయుల పరిపాలనవల్ల భారతీయులకు పాశ్చాత్య సభ్యతతో సంబంధం కలిగింది. దీనివల్ల భారతీయ సమాజంలో అపూర్వ పరివర్తనం సంభవించింది. దాని రూహేఖలు గుర్తుపట్టటానికి వీల్లేనంతగా మారిపోయాయి. ముత సాంఘిక సాహిత్య క్షేత్రాలో విద్యావంతులయిన భారతీయులు నూతన భావోత్తీజంతో ముందంజ వేశారు. ఈ పరిణామాన్ని చరిత్రకారులు “సాంస్కృతిక పునరుజ్జీవనం” అని

కుదురూ, కోవా - ఊరూ, నాడూ 13 అన్నారు. ఇది చారిత్రిక కారణాలవల్ల మున్ముందుగా వంగదేశంలో పొడసూపింది. తర్వాత మహారాష్ట్రలో తలయెత్తింది. అనంతరం ఆంధ్రప్రాంతంలో అవిర్చవించింది. మామిడిపూడి వెంకటరంగయ్య గారన్నట్లు ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం వల్ల “ఒక మహాయుగము అంతరించి మరియొక మహాయుగము ప్రారంభమయ్యెనని చెప్పవచ్చును.”

ఆంధ్రప్రాంతమన్నప్పుడు సర్కారు జిల్లాలూ, రాయలసీమ అని మాత్రమే అర్థం. తెలంగాణం, అసఫ్‌జాహీ వంశీయుల అధీనంలో ఉన్నది. సాంస్కృతిక పునరుజ్జీవన సమయాన ఆంధ్రప్రాంతం సువిశాలమయిన చెన్నరాష్ట్రలో ఒక భాగం. ఆంధ్రులూ, తమిళులూ, కర్ణాటులూ, 'కేరళులూ ఒకే ప్రభుత్వం క్రింద ఉండేవారు. ఆ ప్రభుత్వ వ్యవస్థ రాజధాని అయిన చెన్నపట్టనంలో నెలకొనియుండేది. చెన్నపట్టనానికే మద్రాసు అని మరో పేరు.

పరిపాలన సౌలభ్యం కొజకు ఇతర ప్రాంతాలమాదిరిగానే ఆంధ్రప్రాంతం జిల్లాలుగా విభక్తమయింది. జిల్లాలు తాలూకాలుగా, తాలుకాలు ఫిర్కాలుగా విభజింపబడినాయి. కావూరు గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, చెఅకుపల్లి ఫిర్కాలో చేరినట్టిదయింది. జిల్లాకు కలక్టరూ, తాలూకాకు తహసీలుదారూ అధికారులు. గ్రామాల్లో మున్సిఫ్‌లూ, కరణాలూ అధికారులు. శాంతిభద్రతలు కాపాడటానికి పోలీసు వ్యవస్థ ఉండేది. ప్రతిజిల్లాకు జడ్జి అనే న్యాయాధీశుడుండేవాడు. తాలూకా కోర్టులూ, జిల్లాకోర్జులూ అభియోగాలను పరిష్కరించేవి. రాజధాని అయిన చెన్నపట్టనంలో హ్టైకోర్టు ఉండేది. స్థానిక పరిపాలన సక్రమంగా కొనసాగటానికి జిల్హా బోర్జులనూ, తాలూకా బోర్జులనూ, మున్సిపాలిటీలనూ ఆంగ్ల ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లోకల్‌ బోర్జులూ మున్సిపాలిటీలూ ఎన్నుకొన్న ప్రజాప్రతినిధులతో కూడిన శాసనసభలు కూడా ఉండేవి. ఇట్టి ప్రజా ప్రతినిధులను మొట్టమొదట మద్రాసు శాసన నిర్మాణ సభకు ఎన్నుకొనే హక్కు క్రీ.శ 1893లో కలిగింది. ఈ సంస్థలవల్ల ప్రజాస్వామ్య విధానంపట్ల ప్రజలకు అఖిరుచి జనించింది. వారిలో నూతన రాజకీయ భావాలు కేకెత్తాయి. ఆంగ్లేయులు నిర్మించిన రైలు మార్గాలూ, నెలకొల్పిన తంతి తపాలా శాఖా పాలకులకూ,

[14 తుమ్మల సీతారామమూర్తి పాలితులకూ ప్రయోజకాలయ్యాయి. క్రీ.శ. 1900లో “మద్రాసు దక్షిణ మహారాష్ట్ర" రైలుమార్గం ఏర్పడింది. దీనిమీదనే బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి మొదలయిన స్టేషనులు నెలకొన్నాయి. 1916లో గుంటూరినుండి తెనాలిమీదుగా రేపల్లెకు ఇనుపదారి పడింది.

రైతుల సమస్యలు చర్చించటానికీ రాజకీయ ప్రయోజనాలు సాధించటానికీ మండల సభలు ప్రారంభమయ్యాయి. శ్రీశ 1892లో కృష్ణామండలసభ ఏర్పడింది. క్రీ.శ. 1895లో గోదావరీ మండల సభ మొదటిసారి సమావేశమయింది. మండల సభలతో సంబంధం లేకుండా రైతులు స్వతంత్రంగా వ్యవహరించి సత్యాగ్రహంచేసి తమ చిక్కులు తొలగించుకొన్న సందర్పాలు కూడా లేకపోలేదు. ఇటువంటి సన్నివేశం క్రీశ 1894-95లో కృష్ణాజిల్లాలో జరిగింది. ఆ యేడు అధికారులు నీటితీరువను నాలుగు రూపాయలనుండి ఐదురూపాయలకు పెంచారు. జిల్లారైతులు ఏలూరులో గొప్పు సభ జరిపి నీటితీరువను తగ్గిస్తే తప్ప సేద్యం చేయమని తీర్మానించారు. అప్పుడు గుడివాడ తాలూకాలోన్సి రైతులు కొందరు బైళ్లకు వెళ్లారు. అయితే మండల సభలు ఎక్కువకాలం మనలేదు.

చెన్నరాషస్త్ర ప్రభుత్వం మొట్టమొదట గుంజాటన పడినప్పటికీ కృష్టా గోదావరీ నదులమీద ఆనకట్టలు కట్టడానికి చివరకు అంగీకరించింది. క్రీశ 1855లో కృష్ణానది ఆనకట్ట కట్టటం పూర్తయింది. దీనివల్ల కృష్ణా గుంటూరు జిల్లాలు సస్యశ్యామలాలయ్యాయి. ఆనకట్టకు ఎగువ కృష్ణా నదినుండి బకింగ్‌హామ్‌ కాలువ మొదలవుతుంది. ఈ కాలువనుండి దుగ్గిరాలదగ్గర చీలిన నిజాంపట్టనం కాలువ కావూరికి పడమటగా చందోలును ఒరసికొని ప్రవహిస్తుంది. దీన్ని పెద్దకాలువ అని ప్రజలు పిలిచేవారు. ఈ కాలువనుండి పంట కాలువలూ మురుగు కాలువలూ ఏర్పడి సీతారామమూర్తి జన్మించేనాటికి నమ్మకంగా వరి పంట పండసాగింది. అయినప్పటికీ కావూరి రైతులు దొరువులక్రింది సాగు వదలకుండా ఏతాలతో నీరుతోడి మెట్టపంటలు పండించేవారు.

ఇంగ్లీషువారి పరిపాలనంవల్ల కలిగిన మార్పుల్లో సాంస్కృతిక పరివర్తనం చాలా ముఖ్యమయింది. ఆంగ్లేయ పాలకులు అనుసరించిన

కుదురూ, కోవా - ఊరూ, నాడూ 15 న్యాయవిధానంవల్లా, _ విద్యావిధానంవల్లా భారతీయ సమాజం పునాదులు క్రక్కదలిపోయాయి. మొదటి విదానంవల్ల ధర్మదేవత సన్నిధిని సర్వవర్దాలవారూ సమానులయ్యారు. దీనివల్ల ఒకే నేరం చేసిన విఖిన్న కులాలవారికి విభిన్నశిక్షలు విధించే ిక్షాస్మృతి రద్దయింది. చమూనవులందరూ ప్రభుత్వదృష్టికి సమానులే అన్నభావం దేశంలో వ్యాపించింది. రెండోవిధానంవల్ల _ అన్నికులాలవారూ చదువు కొనటానికీ, చదువు చెప్పటానికి అర్హులయ్యారు. ఆంగ్లభాష బోధనభాష అయింది, తక్కువగా అయినప్పటికీ ఆంధ్రప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలూ, ప్రభుత్వ కళాశాలలూ వెలశాయి. జైస్త్రవమత ప్రచారకులు కూడా పాఠశాలలూ, కళాశాలలూ స్థాపించారు. కొన్ని వీధిబడులు గ్రాంటుస్కూళ్లతెగలో చేరాయి. ప్రభుత్వోద్యోగాలు ప్రాపించటంచేత ప్రజలకు అఆంగ్లవిద్యమీద మోజు ఎక్కువయింది. ప్రాచ్యవిద్యలు ఉదాసీనత పాలయ్యాయి. స్త్రీవిద్యపట్ల జనులకు ఆదరం జనించింది.

ఆంగ్లవిద్యావంతులకు పాశ్చాత్య సంస్కృతి సంసర్గం నూతన భావలోకాలను సాక్షాత్కరింపజేసింది. వ్యక్తి స్ప్వేచ్భనూ, ఉదారవాదాన్నీ వారు అధికంగా ఆరాధించటం మొదలుపెట్టారు. శ్రుతి, బుషివాక్యం, ఆత్మానుభూతికంటె విజ్ఞానశాస్తాలకు మూలకందమయిన ప్రత్యక్ష ప్రమాణం వారికి విశ్చసనీయమయింది. భారతీయుల మత సంప్రదాయాలూ, ఆచారాలూ, పురాణేతిహాిసాలూ వారి విమర్శకు గురయ్యాయి. లౌకికదృష్టి మానవజీవితానికి ఆధారపీఠంగావాలని వారు సిద్ధాంతీకరించారు. వంగదేశంలో ప్రారంభమయిన సంఘ సంస్కరణమూ, బహ్మసమాజామూ ఆంధ్రప్రాంతంలోని ఆంగ్ల విద్యావంతులను ఆకర్షించాయి. కొందరు దివ్యజ్ఞాన సమాజంవైపు మొగ్గారు, మరి కొందరు స్త్రీలనూ, ఆంత్యజులనూ సముద్ధరించటానికి కంకణం కట్టుకొన్నారు. విద్యావంతుల్లో అపూర్వ్చమయిన జాతీయ భావం అంకురించింది.

ఆంగ్లేయులే ఆంధ్రుల చరిత్ర రచనానికి కావలసిన సాక్ష్యాధారా లను శ్రమపడి పోోషధనాన్ని వ్యయించి సేకరించారు. కల్నల్‌ కాలిన్‌ మెళంజీ క్రీ.శ. 1782లో దక్షిణ భారతదేశానికి వచ్చి చరిత్రమీద

16 తుమ్మల సీతారామమూర్తి ప్రీతిపెంచుకొన్నాడు. కుంఫిణజీ ప్రభుత్వపు సర్వేయరుగా ద్రావిడ సంస్కృత పారశీకాది భాషాగ్రంధాలనూ, శాసనాలనూ, స్థానిక చరిత్రలనూ సేకరించాడు. ఈ నిష్కామ కార్యానికి కావలి సోదరు లాయనకు తోడ్చడినారు. కావలి వెంకటబొల్డియ్య క్రీ.శ. 1800లోనే కర్ణాటాంధ్ర శాసనాలు చదివి శాసనపరిశోధనకు శ్రీకారం చుట్టాడు. క్రీ.శ. 1875లో రాబర్ట్‌ సీవెల్‌ చెన్నరాష్త్రంలోని ప్రాచీన నిర్మాణాలకూ, శిలాశాసనాలకూ పట్టికలు తయారుచేసి. రెండు సంపుటాలుగా ప్రకటించాడు. విజయనగర చరిత్రను “విస్మృత సామ్రాజ్యము” పేరుతో రచించాడు. తర్వాతి కాలంలో ఆంధ్రదేశానికి విజ్ఞానప్రదాతా, వజ్ఞానచంద్రికా గ్రంథమండలి సంస్థాపకుల్లో ముఖ్యుడూ అయిన కొమత్తాజు _ వేంకటలక్ష్మణరావూ, _ చిలుకూరి వీరభద్రరావూ మున్నగువారు తమ రచనల చేత తెలుగుజాతికి ఉత్తేజాన్ని, కల్గించారు.

ఆంగ్లేయాధికారులూ, దేశీయ పండితులూ చేసిన కృషివల్ల ఆంధ్ర సారస్వతం విస్తరిల్లింది. సి.పి. బ్రౌన్‌ ప్రాచీన గ్రంథ పరిష్కరణకూ, నిఘంటు నిర్మాణానికీ అగ్రగామి అయ్యాడు. పోర్ట్‌ సెయింట్‌జార్డి ఆంధ్ర పండితులు కథావచన వాజ్బయాన్ని ప్రకటించారు. క్రీళఈ 1౪7లో పుదూరు సీతారామశాస్త్రి రచించిన “పెద్దబాలశిక్ష! తెలుగునాట మహాప్రచారం పొందింది. తెలుగులో యాత్రాచరిత్రలు బయలుదేరాయి. హేతువాదబద్ధంగా “హితసూచని” రచితమయింది. చిన్నయసూరి నీతిచంద్రికనూ బాలవ్యాకరణాన్నీ అనుపమానంగా సృజించాడు. హిందూధర్మశా స్టాన్ని తెలిగించాడు.

గ్రంథ ముద్రణం సాంస్కృతిక పునరుజ్జీవనానికి అధికంగా దోహదం చేసింది. కైస్తవ మత ప్రచారకులు దీనికి నాంది పలికారు. మొట్టమొదట తెలుగు గ్రంథాలు క్రీశ 1746, 1747 సం॥లో జర్మనీలో అచ్చుకెక్కాయి. క్రీశ 1810 నాటికి తెలుగక్షరాలు పోతపోయటం మొదలయింది. క్రీ.శ. 1807నుండి మనదేశంలో ఆంధ్రగ్రంథ ముద్రణం ఆరంభమయింది. ఆంగ్ల ప్రభుత్వోద్యోగులూ ఆంధ్రపండితులూ, వ్యాకరణాలూ, నిఘంటువులూ, ప్రాచీన కావ్యాలూ, గద్యగ్రంథాలూ

కుదురూ, కోవా - ఊరూ, నాడూ 117 తామరతంపరగా ప్రకటించారు. పందొమ్మిదో శతాబ్దిలో చెన్నపట్టనంలో ఎన్నో్తీ గ్రంథ ప్రచురణ సంస్థలు రూపొందాయి. వావిళ్ల సంస్థ చేసిన సేవను ఏనాడూ తెలుగువారూ మరచిపొోలేరు. ఇరవయ్యో శతాబ్దిలో కూడా ఎన్న్న్నో గ్రంథమాలలు ఏర్పడి సారస్వతసేవ చేశాయి.

ఈ సందర్ప్చంలోనే పత్రికా ప్రచురణాన్ని గూర్చి చెప్పాలి. వార్తాపత్రిక నవయుగ చిహ్నమయింది. ద కర్నాటిక్‌ క్రానికల్‌ సత్యదూత మొదటి తెలుగు పత్రికలు. క్రీ.శ. 1892 నుండి వర్తమాన తరంగిణి, తత్త్వబోధిని, పురుషార్థ ప్రదాయిని మొదలయిన పత్రికలెన్నో వెలువడినాయి. సుజనరంజనితో సాహిత్య పత్రికల ప్రకటన (ప్రారంభమయింది. అముద్రితగ్రంథ చింతామణి సాటిలేని సాహిత్య సేవ చేసింది. కాకీనాథుని నాగేశ్చరరావుగారు క్రీ.శ 1908లో ప్రారంభించిన ఆంధ్రపత్రిక, క్రీ.శ. 1924 నుండి ప్రకటించిన భారతి ఆంధ్ర సాంస్కృతిక పునరుజ్జీవనానికి అనితరసాధ్యంగా దోహదం చేశాయి. ఈ సందర్భం లోనే శారద, సరస్వతి, గ్రంథాలయ సర్వస్వం, హిందూసుందరి, ఆంధ్రసాహిత్య పరిషత్పత్రికు త్రిలింగ ప్రతిభ, ప్రబుద్ధాంధ్ర మొదలయిన పత్రికలను గుర్తుకు తెచ్చుకోవాలి. 1902లో పక్షపత్రికగా ప్రారంభమై 1908నుండి వారపత్రికగా రూపొందిన కృష్ణాపత్రిక తెలుగువారి చైతన్యానికి ప్రతీక అయింది. ఆంధ్రప్రాంతంలో కులజాగృతి కారణంగా కులసభలూ, శాఖాసభలు జరుగుతుండేవి. ఆయాకులాలవారు కులపత్రికలను ప్రారంభించారు. చెన్నరాష్ట్రంలో బ్రాహ్మణేతరోద్యమం క్రీశ 1917లో ఆరంభమై రాజకీయంగా “జస్టిస్‌ పార్టీ” రూపం ధరించింది. ఆంధ్ర ప్రకాశిక సమదర్శిని వంటి పత్రికలు ఈ ఉద్యమం భావాలు ప్రచారం జేశాయి.

తెలుగులో (గ్రంథాలూ, పత్రికలూ పెొచ్చుగా వెలువడటంవల్ల ప్రజలో పఠనాభిలాష పెరిగింది. విద్యావనంతులూ జమీందారులూ మొదట [గ్రంధాలయాలు స్టాపించారు. క్రీశ. 1886లో విశాఖపట్టనంలో శ్రీమంతిన ఆదినారాయణమూర్తి స్థాపించిన శ్రీ సరస్వతీ నిలయం అంధ్రప్రాంతం లోని మొట్టమొదటి గ్రంధాలయం. 1900 లోపల

18 తుమ్మల సీతారామమూర్తి పులివెందల, ఒంగోలు, ఉండి, రాజమండ్రి మొదలయిన చోట్ల (గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. తర్వాత శ్రీళృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం (హ్టైదరాబాదు), వర్థమాన సమాజం (నెల్లూరు), సారస్వత నికేతనం (వేటపాలెం), రాజరాజ నరేంద్ర భాషానిలయం (హనుమకొండ) మొదలయినవి రూపొందాయి. 1914లో "ఆంధ్రదేశ గ్రంధాలయ సంఘము” అవతరించింది. అనాటినుండీ ఈసంఘం గావించిన నిర్చ్వారామకృషివల్ల ఆంధ్రప్రాంతంలో వాడవాడలా గ్రంథాలయాలు తలయెత్తాయి. కావూరిలో క్రీ.శ 1918 సం॥ శ్రీరామనవమి పర్వంనాడు శ్రీసీతారామాంధ్ర గ్రంధాలయం స్థాపింపబడింది.

సాంఘిక పునరుజ్జీవనం మూర్తీభవించిన నవీన మానవుడు కందుకూరి వీరేశలింగం. మొదట సంప్రదాయ సాహిత్యాన్ని సృష్టించి నప్పటికీ ప్రజాహిత దృష్టివల్ల ఆయన దానికి స్వస్తి చెప్పాడు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను మెచ్చిన వీరేశలింగం సాంఘిక సంస్కరణంవైపు మెొగ్గి దానికి సాహిత్యాన్ని సాధనంగా చేసికొన్నాడు. పత్రికలు స్థాపించి సంఘంలోని అనాచారాలనూ, దుర్నీతినీ తీవ్రంగా ఖండించాడు. స్త్రీసముద్ధరణానికి తన ధనశక్తియుక్తులన్నింటినీ వెచ్చించాడు. ఆంగ్లభాష లోని కొన్ని సాహిత్య ప్రక్రియలు ఆంధ్రభాషలో అవతరించటానికి అద్యుడయ్యాడు. వీరేశలింగం రచించిన ఆంధ్రకవుల చరిత్ర ప్రమాణ పూర్న్షకంగా, శాస్త్రీయంగా రూపొంది ప్రసిద్ధి కెక్కింది.

పందొమ్మిదో శతాబ్ది ఉత్తరార్థంలో నాటకరచన బహుళంగా కొనసాగింది. కన్యాశుల్కం, ప్రతాపరుద్రీయం, చిత్రనళలీయం, విషాద సారంగధర, గయోపాఖ్యానంమొదలయిన ప్రసిద్ధ నాటకాలు అప్పుడే వెలుగు చూశాయి. క్రీ.శ. 1899లో నవ్యాంధ్ర విమర్శకు వీజావాపం జరిగింది. విద్యార్థి అయిన కట్టమంచి రామలింగారెడ్డి ఈయేడే “కవిత్వ తత్త్వవిచారము” నకు ఆదిమరూపం అయిన వ్యాసం రచించాడు. ఈ సంవత్సరంలోనే “ముసలమ్మ మరణము” రచించి బహుమానం పొందాడు.

కుదురూ, కోవా - ఊరూ, నాడూ 19

వీరేశలింగం గద్యతిక్కన అయి, సారస్వతక్షేత్రంలో కొత్సపుంతలు తొక్కుతుండగా తిరుపతి వెంకటకవులు నానారాజ సందర్శనాలు చేస్తూ అవధానాలద్వారా, స్వీయకావ్యాలద్వారా కవిత్వాన్ని ప్రజాపరం చేశారు. వారు భాషా ప్రయోగానికి దేశకాలోచితమయిన మార్పులు చేశారు. తెలుగును ఈసడించే సంస్కృత పండితుల నోళ్లు కట్టివేశారు. ఆంగ్ల విద్యాధికుల మనస్సులను తెలుగువైపు మళ్లించారు. పింగళి లక్ష్మీకాంతంగా రన్నట్లు తిరుపతి వెంకటకవులు ప్రాచీన కవిత్వానికి భరతవాక్యమూ, నవీన కవిత్వానికి నాందీ పలికారు. ఎందరో శిష్యులకు గురువులై '“అద్యతనాంధ్రకఏి ప్రపంచ నిర్మాత” లయ్యారు.

ప్రజల్లో విజ్ఞానం విస్త్రతంగా వ్యాపించాలంటే వ్యావహారిక భాష అమిత ప్రయోజనకారి అని గిడుగు వెంకటరామమూర్తి భావించి 1910 నాటికి వ్యావహారిక భాషోద్యమ నాయకుడయ్యాడు. ఆయనకు వ్యతిరేకంగా గ్రాంథిక భాషారక్షణార్థం 1911లో ఆంధ్రసాహిత్య పరిషత్తు ఏర్పడింది. ఆంధ్రప్రాంతంలో ఉభయవాదుల మధ్య ప్రచండవాదోప వాదాలు ప్రవర్తిల్లాయి. వ్యావహారిక భాష అంగీకారయోగ్యం గావడానికి తర్వాత రెండు దశాబ్బులకు పైగా పట్టింది.

చెంచమ్మ నారయ్యలు సీతారామమూర్తికి భౌతిక జన్మం ప్రసాదించారు. సాంస్కృతిక పునరుజ్జీవనం ఆయనకు నవయుగ భావసంస్కార జన్నాన్ని అనుగ్రహించింది. ఆయన ద్విజన్ముడయ్యాడు.

విద్యాభ్యాసం - ఉద్యోగం

“కల్ల కసటులేని పల్లెలో నాగలి

దున్నువారు నన్ను గన్నవారు

మడికి నొక్కపూంట బడి కొక్కపూంటగా

దాంటినాండం జిన్నతనము నేను” అని సీతారామమూర్తి “నేను” అనే కావ్యంలో మొట్టమొదట చెప్పికొన్నాడు. ఈపద్యం బాల్యంలో ఆయన చదువు సందెలు ఏవిధంగా సాగాయో వెల్లడిస్తున్నది.

సీతారామమూర్తి రైతుకుటుంబంలో జన్మించాడు. ఆయన బాల్యకాలానికి కావూరిలో గానీ చుట్టుప్రక్కలయూళ్లలో గానీ ఆంగ్లవిద్యను బోధించే పాఠశాలలు లేవు. ఎక్కడో ఉన్న నగరానికి పంపి కుమారునకు ఆంగ్లవిద్య ప్రాప్తించేటట్లు చేయటం నేలతల్లిని నమ్ముకొన్న నారయ్యకు గిట్టదు. పైగా రామభక్తుడై వైష్ణవ శతకాలకూ, అంధ్ర భాగవతానికీ సంబంధించిన శ్రుతపాండిత్యం పుష్కలంగా ఆయన అర్జించాడు. పరంపరాగతమయిన గ్రామీణ సంస్కృతి ఆయనలో గూడుకట్టుకొన్నది. ఉన్న ఊళోనే కొడుకునకు చదువు చెప్పించాలని నారయ్య నిర్ణయించాడు. ఆరోజుల్లో పల్లెల్లో వీధిబడులుండేవి. బాహ్మణులే గురువులై గణితమూ, సంస్కృతాంధ్ర సాహిత్యాలూ బోధించేవారు. నారయ్య కీచదువు నచ్చింది. దీన్నే కొడుకునకూ చెప్పించాడు.

1906లో _ అయిదోయేడు నిండకముందే సీతారామమూర్తికి అక్షరాభ్యాసం జరిగింది. దాన్ని చేసినవాడు కావూరి శ్రీరాములు. ఆయన ఉత్తమశీలరాశి. హరిభక్తిపరాయణుడు. శ్రీరాములుగారి. బడి చెన్నరాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ వారి గ్రాంటు పొందుతుండేది. సీతారామమూర్తి ఈ బడిలో చేరేనాటికి దేశంలో పలకా, బలపమూ, కలమూ, కాగితమూ పొడసూపాయి. అయినా ఆయన నేలగుంటల్లోనే అక్షరాలూ, గుణితమూ దిద్దాడు. గణితాన్ని మాత్రం పలకమీదనే నేర్చుకొన్నాడు. శ్రీరాములు గారి బడిలో చెప్పే తెలుగు పాఠాలవల్ల

విద్యాభ్యాసం - ఉద్యోగం 21 కొడుకునకు సాహిత్యశక్తి సమకూడదని నారయ్య గ్రహించాడు. ప్రత్యీకంగా అమరకోశమూ, _ ఆంధ్రనిఘంటువులూ శతకాలూ సీతారామమూర్తికి చెప్పించాడు. ఈ శ్రమకు ప్రతిఫలంగా ఆయన శ్రీరాములుగారికి అదనంగా ఒక అర్ధరూపాయ ముట్టజెప్పేవాడు. పదేళ్లలో సీతారామమూర్తి సాహిత్య సంస్కారం అఖివృద్ధి చెందింది. అందువల్ల నారయ్య తన పురాణ ప్రవచనానికి కుమారుణ్ణి (గంథపారకుడుగా చేసికొనేవాడు. ఆయన వ్యాఖ్యానం గావించేవాడు.

సీతారామమూర్తి శ్రీరాములుగారి బడిలో తరగతులన్నీ పూర్తిచేశాడు. నారయ్యకు కొడుకునింకా చదివించాలని బుద్ధి పుట్టింది. కావూరికి ఉత్తరాన ఆరుమైళ్లదూరంలో పెదపూడి అనే గ్రామమున్నది. ఆ గ్రామంలో జాస్తి సుబ్బయ్య అనే ఆయన ఉండేవాడు. ఆయన నారయ్యకు మేనల్లుడూ, అల్లుడూ. సుబ్బయ్య ప్రాచీన పద్దతిని పురాణం చెప్పేవాడు. అందువల్ల ఆయనకు పురాణం సుబ్బయ్య అనే పేరు వచ్చింది. నారయ్య పదకొండోయేడు వచ్చిన సీతారామమూర్తిని బావ దగ్గరకు పంపించాడు. ఆయన అక్కడ మనుచరిత్రమూ, వసుచరిత్రమూ చదివాడు. ధనంజయ నిఘంటువు వల్లించాడు. ఇంతలో సుబ్బయ్యకు భార్య వియోగం సంభవించింది. సోదరి మరణం తర్వాత పెదపూడిలో చదువు సాగకపోవటంచేత సీతారామమూర్తి కావూరు చేరాడు.

సాంత ఊరు చేరిన సీతారామమూర్తికి చదువు రంధి తగ్గలేదు. నారయ్య కుమారుణ్ణి చిన్న చిన్న పొలం పనులకు తోడుచేసికొనేవాడు. కాని సీతారామమూర్తి వీలయినపుడెల్లా ఆంధ్రకావ్యం ఏదోయొకటి చదివేవాడు. పెదతండ్రి కొడుకు దగ్గణ ఉన్న ఆంధ్ర మహాభారతమూ, ఆంధ్ర _భాగవతమూ, ఉత్తర రామాయణమూ చూటిమాటికీ పఠిస్తుండేవాడు. వీరేశలింగంగారి ఆంధ్రకవుల చరిత్ర రెండోభాగం చదివి, దానిలోని పద్యాలు కంఠస్థం చేశాడు. కవుల చరిత్ర చదవటంచేత ఆయనకు ఆంధ్రదేశ చరిత్రమీద వలపు పుట్టింది.

ఈ చదువు సీతారామమూర్తికి తృప్తి కలిగింపలేదు. అప్పుడు కావూరిలో ఒక ఆసామి తన బిడ్డలకు సంస్కృతం బోధించటానికి ఒక పండితుణ్ణి నియమించాడు. ప్రతి బాలుడూ ఆ పండితునికి నెలకు

22 తుమ్మల సీతారామమూర్తి ఐదురూపాయల జీతం చెల్లించాలి. సీతారామమూర్తికి సంస్కృతం చదవాలనే ఉబలాటం హెచ్చింది. కాని నారయ్య ఇష్టపడలేదు. వడ్లబస్తా మూడు రూపాయల ధర పలికే ఆరోజుల్లో నెలకు ఐదురూపాయలు జీతం కట్టటానికి ఆయన అంగీకరింపలేదు. సీతారామమూర్తిలో రోజురోజుకూ సాహిత్యపిపాస భరింపరానివిధంగా పెరుగుతున్నది. కృష్ణాజిల్లాలోని అంగలూరు గ్రామంలో నివసిస్తున్న దుగ్గిరాల పురుషోత్తంగారు వారాలు చేసికోగలిగిన విద్యార్థులకు సంస్కృతం బోధిస్తున్నాడనేమాట సీతారామమూర్తి చెవిని బడింది. ఒకనాడు అర్థరాత్రం పండుకొన్న పడుకకుకూడా చెప్పకుండా బయలుదేరి, ఎనిమిదిమైళ్లు నడచి, కావూరికి తూర్పుగా గుంటూరు - కేపల్లె రైలుమార్గం మీద ఉన్న భట్టిప్రోలు చేరుకొన్నాడు. అక్కడ రైలెక్కి, తెనాలి వెళ్లి బెజవాడ మీదుగా అంగలూరు చేరాడు. కాని అంగలూరులో వారాలు సంపాదించటం ఆయనకు చేతకాలేదు. ఇంటిమొగంపట్టి కావూరు చేరక తప్పలేదు.

విధి వక్రించి 1917వ సం॥ జూలై నెలలో నారయ్య విష్ణుసాయుజ్యం పొందాడు. సీతారామమూర్తికి పౌలంపనులమోపు హెచ్చింది. అన్నగారితోపాటు అనుకొన్నవేళకు పొలం వెళ్లక తప్పలేదు. అయినప్పటికీ ఆయన విద్యాతృష్ట చల్గారలేదు. ఈ సమయాన ఆయన మిక్రుడొకడు ప్రతిదినమూ కావూరికి పడమట నాలుగుమైళ్ల దూరంలో ఉన్న చందోలు వెళ్లి సంస్కృతం చదువుతుండేవాడు. అతనికి మహా విద్వాంసుడు తాడేపల్లి వేంకటప్పయ్యశాస్ర్రీ సంస్కృతం బోధించేవారు. సీకారామమూర్తికి కూడా శాస్త్రిగారి దగ్గర సంస్కృతం పఠించాలనే సంకల్పం జనించింది. పగలంతా సెిద్యపుపనులు చేసికొని సాయంకాలం ఆరుగంటలకు భోజనంచేసి ఆయన నడచి చందోలు వెళ్లేవాడు, దారి మట్టిరోడ్డు. చీకటిపడిన తర్వాత మనుష్య సంచారం తక్కువ. దారిలో నిజాంపట్నం కాలువ తగులుతుంది. సీతారామమూర్తి బిక్కుబిక్కుమనే గుండెతో ముందడుగు వేసేవాడు. బల్లకట్టు మీదగానీ, అదీలేకపోతే ఈదిగానీ నిజాంపట్నం కాల్వ దాటి వేంకటప్పయ్యశాస్రిగారి యిల్లు చేరేవాడు. రాత్రి పదిగంటలలోపల సంస్కృతపాఠం చెప్పించుకొని,

విద్యాభ్యాసం - ఉద్యోగం 23 శాస్త్రిగారి పంచలోనే పండుకొనేవాడు. వేకువజామున లేచి తెల్లవారేసరికి ఇంటికి వచ్చి పాలం పనులు చూచుకొనేవాడు. ఆయన శాస్త్రిగారిదగ్గర శబ్బమంజరీ, కువూర సంభవమూ, మేఘసందేశమూ చదివాడు. సంస్కృత శ్లోకాన్ని అన్వయించుకొనే శక్తి సంపాదించుకొన్నాడు. కాని సేద్యానికీ చందోలు చదువుకూ పొత్తు కుదరలేదు. విధిలేక శాస్త్రిగారికి తన చిక్కులు విన్నవించుకొని సీతారామమూర్తి చందోలు చదువు చాలించాడు.

కావూరిలో రామలింగేశ్చరస్వామి ఆలయం ఉన్నది. దానికి రావూరి వారీ కుటుంబం అర్చకత్వం నిర్వహించేది. చందోలు చదువు మానివేసిన సీతారామమూర్తికి ఈకుటుంబంతో పరిచయం ప్రాప్తించింది. ఈ కుటుంబానికి చెందిన లక్ష్మీనారాయణకూ, ఇతని సోదరుడు రామకృష్ణశర్మకూ సంగీత సాహిత్యాల తగినంత చొరవ ఉండేది. ఈ అన్నదమ్ములిద్దరూ భజనకీర్హ్సనలూ, త్యాగరాజకృతులూ, అధ్యాత్మ రామాయణ కీర్తనలూ, ధేనువుకొండవారి విరాటపర్వ యక్షగానమూ రాత్రులందు పాడుతూ మృదంగతాళాలతో సంకీర్సనం గావించేవారు. రామకృష్ణశర్మ తిరుపతి వెంకటకవులు రచించిన శ్రవణానందం మొదలయిన కావ్యాల్లోని పద్యాలనూ, ఆకవులకూ ఇతరకవులకూ సాగిన సాహిత్య సమరాల్లో వారు ప్రయోగించిన అస్త్రాలవంటి పద్యాలనూ చతుర మధురంగా పఠించేవాడు. రావూరి సోదరుల సాంగత్యంవల్ల సీతారామమూర్తి సాహిత్య సంస్కారం పెరిగింది. ఆయన తిరుపతి వెంకటకవుల యుగంలో ఫ్రవేశించాడు.

(గ్రంథాలయోద్యమ ముద్రపడిన కావూరి పెద్దలు కొందరు 1918 ఏప్రియల్‌ నెలలో శ్రీ సీతకారామాంధ్ర గ్రంథాలయాన్ని స్థాపించారు. దాన్ని నిర్వహించేభారం సీతారామమూర్తి భుజాలమీద పడింది. పురాణేతిహాసాలూ, ప్రాచీన నవీనకావ్యాలూ, వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీనరసింహం మొదలయినవారు. రచించిన గ్రంథాలూ, విజ్ఞాన చంద్రికాగ్రంథ మండలీ ఆంభ్ర ప్రచారిణీ గ్రంథమాల మొదలగు గ్రంథమాలలు ప్రకటించిన సారస్వతమూ శ్రీ సీతారామాంధ్ర (గ్రంథాలయానికి చేరాయి. ఈ గ్రంథజాలాన్ని పఠించిన సీతారామమూర్తి విజ్ఞానపరిధి విశాలమయింది. వీరేశలింగం సారస్వతం చదివిన ఆయనకు

24 తుమ్మల సీతారామమూర్తి ఆ నవయుగపురుషుని సంఘసంస్కరణవాదం సమంజసమని తోచింది. గ్రంథాలయానికి వస్తున్న ఆంధ్రపట్రిక కృష్ణాపత్రిక, దేశాభిమాని, గ్రంథాలయసర్వస్వం మొదలయిన పత్రికలు చదవటం చేత సీతారామమూర్తిలో రాజకీయ చైతన్యం అంకురించింది. అప్పుడే మొట్టమొదటిసారిగా కాంగ్రెసును గుర్తించాడు. మోహనదాస్‌ కరంచంద్‌ గాంధీ పేరు విన్నాడు. శ్రీ సీతారామ గ్రంథాలయం ప్రతి సంవత్సరమూ వార్షికోత్సవం నిర్వహించేది. పెద్దలెందరో వచ్చి ఈ వార్షికోత్సవాల్లో ప్రసంగించేవారు. ఈ ప్రసంగాలు వినటంవల్తా, పరిసరగ్రామ గ్రంథాలయ వార్షికోత్సవాలకు వెళ్లటం చేతా సీతారామమూర్తి వ్యుత్పత్తి విస్తృత మయింది.

సీతారామమూర్తి 1921 చూర్చి నెలలో జాస్తి సుబ్బయ్యగారి పుత్రికా, మేనగోడలూ అయిన రాఘవమ్మను వివాహమాడాడు. సెండ్లినాటికి ఆయన వయస్సు ఇరవైయేళ్లు. మేనగోడలి వయస్సు ఎనిమిదేళ్లు. క్రీ.శ 1926లో గాని ఆమె కాపురానికి రాలేదు.

1917లో తండ్రి నారయ్య చనిపోయినప్పటినుండీ సీతారామమూర్తి అన్నగారితోపాటు ఇంటిసేద్యం చేయవలసి వచ్చింది. ఆ అన్న పగలూ రేయీ అనకుండా పాటుపడే దిట్ట. సీతారామమూర్తి కూడా ఆయనవెంట పొలం వెళ్లాలి. ఆయన వెంబడే తిరిగి ఇంటికి రావాలి. ఈ కట్టుపాటును మీరిపోవటానికి వీల్లేదు. సాహిత్య రాజకీయ కార్యక్రమాలవల్ల అన్నగారితోపాటు పాలం పనులు చేయటం సీతారామమూర్తికి దుస్సాధ మయింది. అప్పుడు అన్నగారు తమ్ముని ప్రాల్మాలికను ఓర్చుకోలేక మందలించేవాడు. బయటిపనులవల్ల సీతారామమూర్తికి పాలం పనులు మానక తప్పలేదు. ఈ సంకట స్థితి ఐదేళ్లు కొనసాగింది. చివరకు 1922లో అన్నదమ్ములిద్దరూ వేరుపడ్డారు. సీతారామమూర్తికి ఇంటా బయటా పనులయొత్తిడి ఎక్కువయింది.

జాతీయవిద్య జాతీయోద్యమానికి ఒక ముఖ్య లక్షణమయింది. ఈవిద్యను ప్రజలకు బోధించాలని జాతీయ నాయకులు ప్రబోధించారు. వీరి సందేశాన్ననుసరించి కావూరిలోని కొందరు కాంగ్రెసు పెద్దలు 1923 సం॥ ఫిబ్రవరి 28వ తేదిని “తిలక్‌ జాతీయ పాఠశాల”ను స్టాపించారు.

విద్యాభ్యాసం - ఉద్యోగం 25 ఆనాడు జాతీయ విద్యాలయాల్లో “బ్రాహ్మణ కోడూరు పాఠ్య ప్రణాళికాను ఒకటో తరగతినుండి ఎనిమిదో తరగతిదాకా బోధించేవారు. ఈ పాఠ్య ప్రణాళికలో దేశీయ సంస్కృతిని తేటతెల్లం చేసే ప్రామాణికాంధ్ర [గ్రంథాలు ఎన్నో చేరాయి. తిలక్‌ జాతీయ పాఠశాలలో ఆంధ్ర సాహిత్యాన్ని బోధించుటకు ఆంధ్రోపాధ్యాయుడుగా చేరవలసిందని కావూరి పెద్దలు సీతారామమూర్తిని బలవంతపెట్టారు. సిద్యానికి జీతగానిని పెట్టుకొమ్మనీ, అతనికయ్యే ఖర్చును మేము భరిస్తామనీ వారు మాట యిచ్చారు. పెద్దల మూటను కాదనలేక సీతారామమూర్తి ఆంధ్ర పండితుడయ్యాడు. తెలుగునేకాక చరిత్రను బోధించటంకూడా ఆయన వంతయింది. పాఠ్య ప్రణాళికనుబట్టి తిక్కన, పోతన, చిన్నయసూరి రచించిన కావ్యాలను సీతారామమూర్తి విద్యార్థులకు బోధించేవాడు. తిక్కన తెలుగుసొరూ, చిన్నయసూరి గద్యసౌందర్యమూ ఆయనను పరవశింఫజేసాయి. నిజమయిన తెలుగు ఆ యిద్దరి రచనల్లోనే ఉందనీ, కవిత్వం చెప్పినప్పుడు వారి మాదిరిగా తెనుగుదనం గుబాళింపజేయాలనీ ఆయన _ నిర్ణయించుకొన్నాడు. ఆనాటినుండి తిక్కనా, చిన్నయసూరీ సీకారామమూర్తికి ఆరాధ్య రచయితలయ్యారు. చరిత్ర విభాగం క్రింద చిలకమర్హివారి రాజస్థాన కథావళినీ, కొమత్తాజు వేంకటలక్ష్మణరావుగారి మహమ్మదీయ మహాయుగాన్నీ, చిలుకూరి వీఠభద్రరావుగారి ఆంధ్రుల చరిత్రనూ ఆయన శిష్యులకు బోధించాడు. దీనివల్ల ప్రాచీనకాలంలోని ఆంధ్రుల, భారతీయల శౌర్య త్యాగ సాహసాలూ, మాతృదేశాఖిమానమూ సీతారాతుమూర్తి దేశభక్తిని అతిశయింపజేశాయి.

[925వ సం॥లో సుప్రసిద్ధ తర్క వేదాంత పండితుడు పరిమి నరసియాశాస్త్రి కావూరు. వచ్చారు. తిలక్‌ జాతీయ పాఠశాలా ప్రధానోపాధ్యాయుడు శాస్త్రిగారిని ఆపి, గ్రామస్థులను ఒప్పించి, వారిచేత వాథ్ళీకి రామాయణం, పురాణంగా చెప్పించారు. ఈ పురాణ ప్రవచనం నాలుగు నెలలు సాగింది. రామాయణ శ్రవణంవల్ల సీతారామమూర్తి అదికని కవితా సౌందర్యాన్ని దర్శించి తన వైదుష్యానికి మెజుగులు శద్దుకొన్నాడు.

26 తుమ్మల సీతారామమూర్తి

తిలక్‌ జాతీయ పాఠశాలలో గురుత్వాన్ని కొనసాగించేటప్పుడే సీతారామమూర్తి మద్రాసు -విశ్చవిద్యాలయం నిర్వహించే విద్వాన్‌ (బి) పరీక్షకు హాజరు కావాలనుకొన్నాడు. 1926 ఉగాది తర్వాత పరీక్షలు జరిగాయి. సీతారామమూర్తి పరీక్ష వ్రాశాడు. కాని వ్యాకరణంలో తగిన మార్కులు రాక పరీక్ష తప్పాడు. 1926లో స్థాపించిన ఆంద్ర విశ్చవిద్యాలయం ప్రాచ్యభాషా పరీక్షలను నిర్వహించటం ప్రారంభించింది. అయితే మద్రాసు విశ్చవిద్యాలయం నిర్వహించే విద్వాన్‌ (బి) తరగతికి “ఉభయభాషా. ప్రవీణ' అని పేరు పెట్టింది. 1927లో కూడా సీతారామమూర్తి రెండోసారి పరీక్షకు హాజైై విజయం సాధింపలేక పోయాడు.

ఇక లాభం లేదనుకొని జాతీయపారశాలా పండిత పదవికి మూడునెలలు సెలవుపెట్టి సీతారామమూర్తి కృష్ణామండలంలో బందరు సమీపాన ఉన్న చిట్టి గూడూరు చేరాడు. అక్కడి సంస్కృత కళాశాలలో అపరచిన్నయసూరి. దువ్వూరి వేంళటరమణశాస్త్రిగారు విద్యార్థులకు బాలప్రొఢ వ్యాకరణాలను బోధిస్తున్నారు. ఆయన సన్నిధిని సీతారామమూర్తి వ్యాకరణ రహస్యాలను పూర్తిగా ఆకళిందుకొన్నాడు. బందరులో ఉభయభాషాప్రవీణఐ ప్రథమ పరీక్ష దబ్రాీ విజయం సాధించాడు. ,

అనాటి విశ్చవిద్యాలయ నియమాన్నిబట్టి ఉభయ భాషా ప్రవీణ ప్రథమ పరీక్షలో విజయం పొందిన విద్యార్థి రెండేళ్ల విరామం తర్వాతగాని అంతిమ పరీక్షకు కూర్చోలేడు. సీతారామమూర్తి 1929 జులై నెలలో తిరిగి చిట్టి గూడూరుచేరి అంతిమ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఈ పరీక్షా పాఠ్యప్రణాళికలో నిర్ణయించిన వ్యాకరణ [గగ్రంథాలయిన అకర్వణు కారికావళినీ అహోబలపండితీయాన్నీ ఆయన దువ్వూరి వారి చగ్గర చదివాడు. అంతేగాకుండా ఆ _మహావిద్వాంసుడు బోగించే “కళాపూర్ణోదయము” కవితా శిల్చమర్మాలను గ్రహించాడు. పాఠ్య గ్రంథమయిన కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని మొదటినుం్ని చివరిదాకా అక్షరం ముక్క పొల్లుపోకుండా కంఠస్థం జేశాడు.

విద్యాభ్యాసం - ఉద్యోగం 27

1930 సం॥లో జనవరి నెల గడచి ఫిబ్రవరి నెల ప్రవేశించింది. సీతారామమూర్తి మార్చి నెలలో జరుగబోయే ఉభయభామై ప్రవీణ అంతిమ పరీక్షకు విడుపులేకుండా గట్టిగా చదువుతున్నాడు. ఈ సమయాన గుండె బ్రద్దలయ్యే కీడు మూడింది. ఆయన యిల్లాలు రాఘవమ్మ ఫిబ్రవరి 15వ తేది ప్రాంతంలో మరణించింది. ఈవార్త విని సీతారామమూర్తి తల్లడిల్లిపోయాడు. ఎట్టకేలకు తేరుకొని కావూరు చేరి, పదేనురోజులుండి, అర్థాంగి పారలౌకిక క్రియలు ముగించి చిట్టిగూడూరు చేరాడు. మార్చినెల చివర ఉభయ భాషాప్రవీణ అంతిమపరీక్ష వ్రాసి ప్రథమశ్రేణి సంపాదించాడు. ఉభయ భాషా ప్రవీణ తుమ్మల సీతారామమూర్తి అయ్యాడు.

1930 మార్చి పన్నెండో తేదిని గాంధీ ఉప్పు సత్యాగ్రహం గావించటానికి డెబ్బై యెనిమిదిమంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుండి దండికి బయలుదేరాడు. భారతదేశమంతా అట్టుడికినట్టుడికి పోతున్నది. పరీక్ష వ్రాసి వచ్చిన సీతారామమూర్తి ఉప్పు సత్యాగ్రహం నిర్వహించటానికి కావూరు గ్రామం ఉప్పాంగిపోవటం కనులారా చూచాడు. ఆయనకూడా ఉప్పు సత్యాగ్రహానికి ఉద్యుక్తుడయ్యాడు. ప్రథమ కళత్రం మరణించి, మోడుగా నిలిచిన ఆయనను తల్లి చెంచమ్మ అదలించీ బెదరించీ నివారించింది. ద్వితీయ వివాహానికి ఒప్పించింది. 23-5-1930వ తేదిని సీతారామమూర్తి బాపట్ల తాలూకా చేబ్రోలు సివారు తోట్టప్రాలెం నివాసి రామినేని చినజోగయ్యగారి రెండవకూతురు

వివాహమయినదేగాని సీకారామమూర్తిలో పెళ్లిపొంగు వీసమయినా కనబడలేదు. అంతకుముందు పదేళ్లనుండీ ఆయన కాంగ్రెసువాదిగ త్రికరణశుద్ధితో గాంధీసిద్ధాంతాలను వాడవాడలా ప్రచారంచేస్తూ వచ్చాడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనటం తన విధి అని భావించాడు. కాని తల్లి ఆయనను బలవంతంగా ఆపింది. అందువల్ల సీతారామమూర్తికి కావూరిలో నివసించటానికి మొగం చెల్లలేదు. చేతిలో ఉభయభాషా ప్రవీణ విద్వత్పట్టం ఉన్నది కాబట్టి గుంటూరుజిల్లా బోర్డు ఉన్నత పాఠశాలల ఆంధ్ర పండిత పదవికి దరఖాస్తు పెట్టుకొన్నాడు.

28 తుమ్మల సీతారామమూర్తి

ఆనాడు జాగర్లమూడి కుప్పుసామి చౌదరి గుంటూరుజిల్లా బోర్డు అధ్యక్షుడు. దరఖాస్తు పెట్టుకొన్న తర్వాత సీతారామమూర్తి ఆయన నొకసారి దర్శించాడు. కుప్పుసామి చౌదరి కవిత్రయం తెలిగించిన మహాభారతాన్ని పిండికొట్టినట్టుగా చదివినవాడు. ఆయన తిక్కన భారతపద్యాలు చదివి వాటిల్లోని తిల్పాన్ని వివరింపుమని సీకారామమూర్తిని ప్రశ్నించాడు. ఆయన వెల్లడించిన కవితా పోశేషాలు విని తృప్తిపడిన కుప్పుసామి చౌదరి ఉద్యోగం ఇచ్చాడు. సీతారామమూర్తి 4-8-1930వ తేదిని దుగ్గిరాల బోర్డు ప్పాస్కూల్లో ఆంధ్ర పండితుడై కాపురం పెట్టాడు. ఈనాటినుండి ఆయనకు దినచర్య బభబాయటం అపరిహార్యమయిన విధి అయింది.

దుగ్గిరాల బోర్డు ష్టాస్కూలు పండితపదవి తాత్కాలికం. ఇది 1931 సం॥ ఏప్రియల్‌ నెలతో సమాప్తమయింది. మరలా ఎక్కడ ఉద్యోగం వస్తుందా? అని ఎదురుతెన్నులు చూస్తున్న సీతారామమూర్తికి బాపట్ల బోర్డు ప్టైస్కూల్లో ఒక సుస్థిర ఉద్యోగం ఉన్నదని తెలిసి దరఖాస్తు పెట్టుకొన్నాడు. 7-7-1931వ తేదిని ఈ హైస్కూలు పండిత పదవికి నియుక్తుడయ్యాడు. ఈ ఉన్నత పారశాలలో వేదాంత శిరోమణి ఇనుపకుతిక శంకరశాస్త్రి సంస్కృత పండితుడుగా ఉన్నారు. ఆయన ఆదరంవల్ల _ సీతారామమూర్తి తన సంస్కృత _ సాహిత్యశక్తిని పెంచుకొంటూ “లఘుసిద్ధాంత కౌముది పఠించాడు.

1941వ సం॥ సెప్టెంబరు నెల దాకా బాపట్లలో ఉద్యోగం చేసి, తర్వాత సీతారామమూర్తి నిడుబ్రోలు బోర్డు *+ప్టాస్కూలులో ఆంధ్ర పండిత పదవి నలంకరించాడు. ఈప్పాస్కూలులో 18-9-1941 గురువారం నాడు ఆయన చేరి దాదాపు ఆరేళ్లు పనిచేశాడు. తర్వాత 16-7-1947వ తేది బుధవారంనాడు అప్పికట్ణ ఉన్నత పాఠశాలలో ప్రవేశించాడు. ఈపాఠశాలలో ఉన్నప్పుడే 4-5-1957వ తేది శనివారంనాడు ఉద్యోగ విరమణం గావించి ఉపాధ్యాయభృతి అందుకొనటం ఆరంఖించాడు.

రైతువిడ్డగా పుట్టిన సీతారామమూర్తి ఎన్నో యిబ్బందులుపడీ చదువుకొన్నాడు. ఆంగ్లవిద్యను అభ్యసించే అవకాశం ఆయనకు కలుగలేదు. చదివిన చదువెల్లా సంప్రదాయబద్ధమయిన సంస్కృతాంధ్ర

విద్యాఖ్యాసం - ఉద్యోగం 29 సాహిత్యాలకే పరిమితం. ఒక కుగ్రామంలో పుట్టిపెరిగినా, ఛాదస్తానికి మారుపేరుగా లోకులు అనుకొనే ఆంధ్రపండిత పదవి చేపట్టినా ఆయన తిరోగమనవాది గాలేదు. ఏమీ నష్టపోలేదు. ఆయన సాంస్కృతిక పునరుజ్జీవన సంస్కారాన్ని సంపాదింపగలిగాడు. యుగధర్మాన్ని గుర్తింపగలిగాడు. నవీనాంధ్ర సాహిత్య ప్రపంచంలో స్వతంత్రమార్గాన ప్రయాణింపగలిగాడు. సీతారామమూర్తి ఈవిధంగా తన వ్యక్తిత్వాన్ని తిద్ది తీర్చుకొనటానికి ఇరవయ్యో శతాబ్టీలో అఖండభారతదేశంలో ప్రచలితమయిన ఒక మహోద్యమం ప్రబలహీతువయింది. అదే గాంధీ సారథ్యం వహించిన స్వాతంత్ర్యోద్యమం.

బాపూజీ బంటు

ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని అంతమొందించి. స్వరాజ్యాన్ని స్థాపించుకోటానికి భారతీయులు చరిత్రలో కనీ వినీ యెరుగని ఉద్యమాన్ని నడిపారు. ఈ ఉద్యమానికి భారత స్వాతంత్ర్యోద్యమం అని పెరు.

భారతదేశానికి విదేశీయులు రావటంగానీ, ఇక్కడ సామ్రాజ్యాలు స్థాపించటం గానీ క్రొత్తీమీగాదు. క్రీస్తు పూర్వకాలంనుండీ విదేశీయులు వస్తూనే ఉన్నారు. అయితే వీరికీ ఆంగ్లేయులకూ ప్రధానమయిన ఖేదం ఉన్నది. ఆంగ్లేయుల కంటెముందు వచ్చిన విదేశీయులు భారతదేశంలో స్థిరపడి భారతీయసభ్యతను అలవర్చుకొన్నారు. భారతీయ సంస్కృతికి వన్నాలూ చిన్నాలూ తిద్దారు. అయితీ ఆంగ్లేయుల తీరుతెన్నులు వేరుగా ఉన్నాయి. వారు వ్యాపారంకోసం వచ్చారు. భారతీయుల సహాయ సహకారాలతో భారతదేశాన్ని జయించారు. వారీదేశాన్ని పరాయివారు గానే పరిపాలించారు. పరాయివారుగానే ఈదేశంనుండి నిష్క్రమించారు.

వర్షకులుగా వచ్చి పరిపాలకులయినారు కాబట్టి ఆంగ్లేయులకు స్వలాభాపేక్ష ప్రధాన లక్షణమయింది. వారు భారతదేశాన్ని ఉద్ధరించటానికి భగవంతుడు పంపిన దూతలయినట్లు వ్యవహరించారు. భారతజాతిని హీనజాతి క్రింద జమకట్టారు. ఆంగ్ల ప్రభుత్వపాలనవల్ల భారతదేశం ఆర్థికంగా చితికిపోయింది. చివర కీదేశం ముడిసరకులను ఎగుమతి చేసి, ఆంగ్లదేశంలో ఉత్పత్తియైన వస్తువులను విక్రయించే విపణివీధిగా రూపొందింది. భారతీయ సమాజంలోని సర్వవర్గాలవారూ ఆంగ్ల ప్రభుత్వంవల్ల దెబ్బతిన్నారు. బాధలు భరింపలేని భారతీయులు క్రీశ 1857లో తిరుగుబాటు చేశారు. కాని అది అనేక కారణాలవల్ల ఆపజయాంతమయింది. తర్వాత భారతదేశం ఇంగ్లండు ప్రభువుల ప్రత్యక్షపరిపాలన క్రిందికి చేరినప్పటికీ ఇక్కడి పరిపాలకుల మనస్సులేమీ మారలేదు. ఆంగ్లవిద్యాధికులయిన భారతీయ మేధావులు ప్రధాన నగరాల్లో రాజకీయ సాంస్కృతిక సంస్థల్ని స్థాపించి అంగ్ల ప్రభుత్వానికి ఎన్నిమహజర్లు పంపినా, ఎన్ని విన్నపాలు చేసినా కలగవలసినంత మేలు కలగలేదు,

బాపూజీ బంటు 31 క్రీశ 1885లో “ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌” అవతరించింది. ఆ సంవత్సరం డిసెంబరు 25వ ేదిని ఈసంస్థ మొదటి సమావేశం జరిగింది. దీనికి భారతదేశంలోని సర్వరాష్ట్రాల ప్రాజ్జులూ హాజరయ్యారు. విద్యావంతుల జాతీయ భావానికి ఇండియన్‌ శేషనల్‌ కాంగ్రెస్‌” చిహ్నంగా నిలిచింది. ప్రతి సంవత్సరమూ ఒక ప్రధాన నగరంలో సమావేశం జరిపి రాజకీయార్థిక సమస్యలను చర్చించటం కాంగ్రెస్‌ సంప్రదాయమయింది. క్రీ.శ. 1885-1905 సం॥ మధ్య కాంగ్రెస్‌ సంస్థను స్థాపించిన వారి లక్షం స్వాతంత్ర్య సంపాదనం గాదు. ఆంగ్ల ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ రాజకీయార్థిక సంస్కరణలను సాధింపవచ్చునని వారు విశ్వసించారు. విజ్ఞాపనలవల్ల భారతదేశం ముందంజవేయలేదని వాదించేవారు కూడా ఆనాడు బేకపోలేదు. ఆంగ్ల ప్రభుత్వాన్ని ఏవిధంగా నయినా భయపెట్టి కాళ్లబేరానికి దిగి వచ్చేటట్టు చేయాలని వీరి సంకల్పం. దీనికి హింసావాదాన్ని చేపట్టినా తప్పుగాదని వీరియభిప్రాయం. ఈసిద్ధాంతభేదాన్ననుసరించి కాంగైసులో అతివాదులూ, మితవాదులూ బయలుదేరారు. 1905లో లార్డ్‌కర్ణన్‌ వంగరాష్రైన్ని రెండుముక్కలు చేయటంచేత స్వాతంత్ర్యోద్యమం గొప్పమలుపు తిరిగింది. భారతదేశంలో రాజకీయ చైతన్యం రవళించింది. 1906లో కాంగ్రెస్‌ మహాసభ స్పారాజ్యమే భారతీయుల లక్ష్యమని ప్రకటించింది. విదేశవస్తు బహిష్కారమూ, స్పాదేశవస్తు పురస్కారమూ, జాతీయ విద్యా అనే మూడుకార్య క్రమాలను స్వీకరించింది. 1907లో బిపిన్‌చంద్రపాల్‌ ఆంధ్రదేశంలో పర్టుటించి గంభీరోపన్యాసాలు చేశాడు. ఆయన పర్య్మటనంవల్ల తెలుగువారు దేశభక్తి పూరితులయ్యారు. విద్యార్థిలోకంనుండి గాడిచర్ల హరీ సర్వోత్తమరావు నాయకుడుగా ఎలమీదికి వచ్చాడు. బాలగంగాధరతిలక్‌ మహారాష్ట్రంలో “స్వరాజ్యం నా జన్మహక్కు” అని గర్జించాడు. 1916లో తిలక్‌ మహారాష్ట్రలోనూ, అనిబిసెంట్‌ మద్రాసులోనూ “హోంరూల్‌ ఉద్యమం” ప్రారంభించారు. జాతీయోద్యమం భిన్న రూపాలతో సాగుతున్న యీ సమయంలో విద్యారంగంలోనూ, ఇతర క్షేత్రాల్లోనూ వృద్ధి పొందాలనే లక్ష్యంతో కులమహాసభలు

32 తుమ్మల సీతారామమూర్తి

ఆంధ్రదేశంలో అవతరించాయి. వీటిల్లో “కమ్మ మహాజనసభ” ఒకటి. అనిబిసెంట్‌ హోంరూల్‌ ఉద్యమం బ్రాహ్మణేతరోద్యమానికి విత్తు నాటింది. ప్రభుత్వ వ్యవస్థలో బ్రాహ్మణుల ఆధిక్యానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలయింది. మహాంధ్ర చరిత్రకారుడు కీ.శే. మల్లంపల్లి సోమశేఖరశర్మ వక్కాణించినట్లుగా “ఈ యుద్యమము విద్యావిషయకము గను, రాజకీయముగను బ్రాహ్మణేతరులకు గొంతయుపకృతి కలిగించి వారిని పురోభివృద్ధిమార్గమున బెట్టినది*. 1916-1937 సం॥ల మధ్య చెన్నరాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన “జస్టిస్‌ పార్టీ” బ్రాహ్మణేతరోద్య మానికి రాజకీయరూపమే.

1915 సం॥ జనవరి తొమ్మిదో కేదిని గాంధీజీ భారతదేశంలో కాలుమోపాడు. అంతకుముందు దక్షిణాధ్రికాలో భారతీయుల బాధలు నివారించటానికి ఆయన సాగించిన సత్యాగ్రహం భారతదేశంలో ప్రశంసలు పొందింది. 1919 నుండి గాంధీజీ కాంగ్రెసు నాయకుల్లో ఒకడయ్యాడు. సత్యాగ్రహమే స్వాతంత్ర్య సమరానికి అమోఘమయిన అస్త్రమని ఆయన కాంగ్రెసువారిని ఒప్పించాడు. 1920లో కలకత్తాలో జరిగిన ప్రత్యేక కాంగ్రెస్‌ సమావేశకాలంనుండీ కాంగ్రెసువారికి గాంధీజీ సిద్ధాంతాలు శిరోధార్యాలయ్యాయి. గాంధీజీ ప్రతిపాదించిన సత్యాగ్రహంలో రెండుభాగాలున్నాయి.. వీటిల్లో మొదటిది సహాయ నిరాకరణం. రెండోది నిర్మాణ కార్యక్రమం. పన్నులు కట్టకుండటం, ఉద్యోగాలకు రాజీనామా చేయటం, న్యాయస్థానాలనూ విద్యాలయా లనూ _బహిష్కరించటం సహాయ నిరాకరణంలోని అంశాలు. రాట్నుంమీద నూలుతీయటం, ఖద్దరు ధరించటం, మద్యపాన నిషేధం, హిందూ మహమ్మదీయ సఖ్యం, హరిజనోద్ధరణం నిర్మాణ కార్యక్రమ లక్షణాలు. గాంధీజీ రాకతో స్వాతంత్రోద్యమంలో సత్యాగ్రహశకం ప్రారంభమయింది. జాతీయోద్యమం అచ్చమైన ప్రజలయుద్యమమయింది.

క్రీ.శ 195 నుండీ ఆంధ్రులు కాంగ్రెసు సభల్లో పాలొంటూ గజణనీయమయిన పాత్ర నిర్వహిస్తూనే ఉన్నారు. వారిలో ఒకడైన పనషప్పాకం ఆనందాచార్యులు నాగపూరులో జరిగిన యేడవ కాంగ్రెసు మహాసభకు అధ్యక్షుడయ్యాడు. స్పదేశి ఉద్యమంలో పాలొని

బాపూజీ బంటు 33 తెలుగువారు విదేశవస్తు బహిష్కారాన్ని ' విరివిగా కొనసాగించారు. ఆంధ్ర నాయకుల్లోనూ అతివాద మితవాదవర్గాలు' ఏర్పడ్డాయి. ఈరెండువర్గాల వారూ హోంరూల్‌ ఉద్యమంలో పాల్గొని ప్రబలమయిన ' ప్రచారం గావించారు. ఎస్‌. సుబ్రహ్మణ్య అయ్యర్‌ -ఆంగ్ల' ప్రభుత్వ దుర్నీతులను వివరిస్తూ ఆమెరికా అధ్యక్షుడు విల్సన్‌కు "వ్రాసిన లేఖలో సంతకాలు చేసిన వారిలో ఆంధ్ర నాయకులూ ఉన్నారు." బయటి ప్రపంచంలో జాతీయోద్యమజ్వాలలు చెలరేగుతున్నప్పటికీ ఆంసెగ ఇంకా కావూరికి సోకలేదు. 1918లో సీతార్తామాంధ్ర గ్రంథాలయం స్ఫాపించిన నాటినుండీ ఆ గ్రామానికి ఆవేడి తగలటం మొదలయింది. ఈ సంవత్సరం జులై ఎనిమిదోతీదిని రాజకీయ సంస్కరణలకు సంబంధించిన మాంటేగు - ఛెమ్స్‌ ఫర్జ్హుల నివేదిక విడుదలయింది. 1919 ఏప్రియల్‌ 13వ తీదిని జలియన్‌ వాలాబాగ్‌లో నరమేధం జరిగింది. ఈ *యేడాదినుండీ సీతారామ మూర్తిలో రాజకీయ జాగృతి మొగ్గతొడగటం మొదలయింది.

1919 నవంబరులో మూంట్‌ఫర్డ్‌ రాజకీయ సంస్కరణలు పనికిమాలినవని _ ప్రచార్తర్శ చేస్తున్న గాడిచర్ల హరిసర్వోత్తమరావు చందోలు వచ్చాడు. జలియన్‌వ్లాలాబాగ్‌ మారణహోమాన్ని ధూర్చీ, ఖిలాఫత్‌ సమస్యను గూర్చీ ఉద్రేకపూరితంగా ఉపన్యసించాడు. మర్షా డు చందోలు దగ్గరగా ఉన్ను" ఖాజీపాలెకలో గూడా" ఆయన ప్రసంగించాడు. సీతారోమమూర్తి ఈ రెండుసభలకూ వెళ్లి, హరిసర్వోత్తమ రావు ప్రసంగాలు విని ఆనాటి రాజకీయ'చరిత్రను కొంత అవగాహన చేసికొన్నాడు.

1920 ఆగష్టు 23వ' తేదిని గాంధీజీ షొకతాలీని, ఆయన తల్లి వీ అమ్మను వెంటబెట్టుకొని బెజవాడు"వచ్చాడు. ఆయన అక్కడ జరిగిన మహాసభలో అసహాయోద్యమాన్ని _ గూర్చి _ భావావేశంతో ప్రసంగించాడు. ఖిలాఫత్‌ సమస్యను వివరించి, టర్కీకి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించాలని ప్రబోధించాడు. ఈసభలో షాకతాలీ, బీ అమ్మకూడా ఉపన్యస్‌ంచారు. .సీతారామమూర్తి బెజవాడవెళ్లి ఈ ముగ్గురి ప్రసంగాలు -విని పరవళించాడు. - ఈ' యేడే*ఆగష్టు 1వ చేది ఆదివారం అర్థరాత్రం బొంబాయిలో బాలగంగాధరతిలక్‌ నిర్యాణం చెందగా

34 తుమ్మల సీతారామమూర్తి

ఆయన సంతాప పధ్యాలు /రచించి ఫత్రికల్లో ప్రకటించాడు. ఈ సంవత్సరం ఆక్షోబరులో. శిష్టా -పార్వతీశం, పోలిసెట్టి ఆదినారాయణ గుప్త జనాబ్‌ గౌస్‌ బేగ్‌ సాహెబ్‌ కావూరు వచ్చి సహాయనిరాకరణోద్యృమాన్ని గూర్చి ప్రసంగించారు. _. సీతారామమూర్తి కూడా కావూరి ప్రజలు కాంగ్రెసు కనుక్రూలంగో ప్రవర్తించటం ధర్మమని ఉపన్యసించాడు. ఆ ముగ్గురు పెద్దలవెంట .రేపల్లైెతాలూకా .గ్రామూలు పర్యటించి ప్రసంగాలు చేస్తూ, తాను గాంధీజీమీద రచించిన పద్యాలు చదివాడు.

1920 నవంబరు 'వ తేదిని మాంట్‌ఫర్డు రాజకీయ సంస్కరణల ననుసరించీ ఎన్నికలు జరిగాయి. ఆ 'ఎన్నిక్రల్లో పదిరూపాయలు భూమిళిస్తు చెల్లించే పట్టాదారులే ఓటువేయటానికర్తులు., అటువంటివారు కావ్రూరులోనూ, పరిసరగ్రామాల్లోనూ దాదాపు ఆరువందలమంది ఉన్నారు. కావూరిలో ఒక పోలింగ్‌ స్టేషన్‌, ఏర్పడింది. రెండుఓట్లు మాత్రమే ఎన్నికలపెట్టెలో పడ్డాయి. ఈ ఎన్నికల్లో బ్రాహ్మణేతరోద్యమ పక్షమయిన “ జస్టిస్‌పార్టీ: విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఈ ప్రభుత్వంలో శ్రీకాళహస్తి జమీందారు' పానుగింటి రామారాయణింగారు ప్రజారోగ్యం స్థానిక స్ప్వపరిపాలనం శాఖల మంత్రి అయ్యారు.

ఈ సహాయ - నిరాకర౭కోద్యమ సమయంలోనే చీరాల-పేరాల సత్యాగ్రహం జరిగింది. చెన్నరాష్త్ర ప్రభుత్వం ఈ రెండు గ్రామాలనూ చేర్చి మున్సిపాలిటీగా చేసింది. ప్రజలకిది ఇష్టంగాలేదు. 1921 ఫిబ్రవరిలో స్థానిక పరిపాలన శాఖామంత్రి పానుగంటి రామారాయణింగారు చీరాల వచ్చినపుడు ప్రజలు వారికి తమ బాధలు విన్నవించుకొన్నారు. కాని ఆ శ్రీకాళహస్తి ప్రభువు వారిని లెక్కచేయకుండా బెదరించ్వాడ్తు. ప్రజలు దుగ్గిరాల్ల గోపాలక్షష్టయ్య నాయకత్వాన ఇళ్లూ, వాకిళ్లూ వదలి, సమీపాన ఉన్న పోరంబోకు ఇసుక దిబ్బలమీద _.గుడిసెలు వేసికొన్నారు. మండుటెండలకూ, జడివానలకూ పడరానిపాట్లు పడ్డారు. సితారామమూర్తి అక్కడకు వెళ్లి ఆ ప్రజల రాజకీయ చైతన్యాన్ని కనులారా చూచ్చి, గోపాలకృష్ణయ్య ప్రసంగాలను చెవులారా విని తన జాదీయతా -ప్రీతిని ఇబ్బడిగా ముబ్బడిగా పెంచుకొన్నాడు. గాంధీజీని

బాపూజీ బంటు 35 గూర్చ్‌, ఆయన నిర్మాణ కార్యక్రమాన్ని గూర్చీ, భారతమాతను గూర్చీ పద్యాలు రచించి, ఆంధ్రపత్రిక, దేశాఖిమాని, గ్రామపరిపాలన మొదలయిన పత్రికల్లో ప్రకటించాడు.

నాగపూర్‌ కాంగ్రెసు మహాసభ తర్వాత మొదటిసారి అఖిలభారత కాంలైసు సంఘం 1921 మార్చి ౩31వ, ఏప్రియల్‌ 1వ కేదుల్లో బెజవాడలో సమావేశమయింది. ఈ సమావేశానికి గాంధీజీ మోతీలాల్‌నెహూ, చిత్తరంజనదాస్‌, విఠల్‌భాయ్‌ పటేల్‌ వల్లభాయ్‌పటేల్‌ లాలాలజపతి రాయ్‌ మొదలయిన అఖిలభారత నాయకులు వచ్చారు. సీతారామమూర్తి బెజవాడ వెళ్లటానికి నిడుబ్రోలు చేరాడు. రైల్వేస్టేషన్‌లో టికెట్‌ దొరకలేదు. అప్పుడు ఆయన ఇంటిమొగం పట్టకుండా రైలు కట్టవెంట ముప్పైమైళ్లు నడచి బెజవాడ చేరాడు. జాతీయనాయకులను చూచి జన్మం ధన్యమయిందని పౌంగిపోయాడు.

బెజవాడ కాంగైసు సమావేశంలో తిలక్‌ స్వ్పరాజ్యనిధికి కోటిరూపాయలు సమకూర్చాలనీ, కోటిమంది కాంగ్రెసు సభ్యులను చేర్చించాలనీ, ఇరవై లక్షల రాట్నాలను నెలకొల్పాలనీ తీర్మానాలు చేశారు. వెంటనే గ్రామ-ఫిర్కా-తాలూకా-జిల్లా కాంగైసు సంఘాలు రూపుదాల్చాయి. సీతారామమూర్తి కావూరు గ్రామ కాంగ్రెసు సంఘ కార్యదర్శి అయ్యాడు. కనగాల ఫిర్కా కాంగ్రెసు గౌరవ ప్రచారకు డయ్యాడు. జిల్లా కాంగైసు సంఘ సభ్యుడయ్యాడు. ఆయన కాంగ్రెసులో సభ్యులను చేర్చించటం, రాట్నాలు పెట్టించటం, మొదలయిన పనుల్లో మునిగిపోయాడు. స్ప్వాయంగా నియమం తప్పకుండా రాట్నుంమీద నూలు తీస్తుండేవాడు. 1921 మే నెలలో గుంటూరుజిల్లా కాంగ్రెసు సభ పొన్న్నూరులో జరిగింది. తాను సొంతంగా వడికిన నూలుపెట్టి నేయించిన ఖద్దరు బట్టలు ధరించి ఈ సభకు సీతారామమూర్తి హాజరయ్యాడు. నూలు వడుకుపోటిలో పాల్గొని ఒక గంటకు నాలుగువందలగజాల 22వ నంబరు నూలుతీసి ఒక రాట్నాన్ని ప్రథమ బహుమానంగా సంపాదించాడు.

1921నుండీ సీతారామమూర్తి గాంధీజీ ప్రవచించిన బహిష్కార కార్యక్రమం, నిర్మాణ కార్యక్రమం, శాసనోల్లంఘనం అనే మూడు సూత్రాలనూ చిత్తశుద్దితో పాటించాడు. ఆయేడు మహాశివరాత్రినాడు

36 తుమ్మల సీతారామమూర్తి గోవాడ తిరునాళ్ళలోనూ, కృష్టా పుష్కరాల సమయాన వెల్లటూరు లోనూ భక్తులకూ తైర్ధికులకూ గాంధీజీ సిద్ధాంతాలను వివరించాడు, శేపల్లె వెళ్లి కల్లుపాటలు పాడవద్దని పాటదారులను నిలువరించాడు. దీనికి కినిసిన ప్రభుత్వోద్యోగులు ఆయనను జైలులోపెట్టి, కల్లుపాటలు ముగిసిన తర్వాత విడుదల చేశారు. బయటి ఊళ్లలోనే కాకుండా సీతారామమూర్తి స్వగ్రామంలోనూ ప్రచార కార్యక్రమాన్ని నిర్నర్తించేవాడు. ప్రతిరోజూ రాత్రిపూట మిత్రులతో కలసి వడ్డాది సీతారామాంజనేయులూ, పూడిపెద్ది కాశీవిశ్చనాథశాస్త్రీ రచించిన

“దండాలు దండాలు భారతమాత;।!

అవి

అందుకొని దీవించు భారతమాత!” అనే దాదాపు రెండువందల చరణాల పాటను పాడుతూ ఊరంతా తిరిగేవాడు. బొంబాయిలో గాంధీజీ విదేశవస్త్ర దహనం గావించినవార్త పత్రికల్లో చదివి, సీతారామమూర్తి గ్రామమంతా తిరిగి విదేశవస్తాలను పోగుచేసి దహనం చేశాడు. ఈకాలంలోనే "శ్రీ మహాత్మాగాంధి తారావళి” ఆయన రచించాడు. దీనిని ముద్రించటానికి ఏ ఆచ్చుకూటము వారూ అంగీకరింపలేదు. చివరకు సీతారామమూర్తి గుంటూరు వెళ్లి జాతీయకవిగా పేరుపాందిన బలిజేపల్లి లక్ష్మీకాంతంగారి చంద్రికా ప్రెస్‌లో దీనిని ముద్రింపగలిగాడు. తపాలాఖర్చులు భరింపగలిగినవారికి ఉచితంగా పంపుతానని ఈ లఘుకావ్యం చివర ప్రకటించాడు.

సమస్త భారతదేశాన్నీ తనవైపునకు ఆకర్షించిన పెదనందిపాడు సత్యాగ్రహం 1922లో జరిగింది. పెదనందిపాడు గుంటూరు జిల్లాలోని ఒక ఫిర్కా. గుంటూరు జిల్లాలోని పన్నుల నిరాకరణోద్యమం ఆంగ్ల ప్రభుత్వపు పునాదులనే కదలించిందని ఆనాటి చెన్నరాష్ట్రం గవర్నర్‌ వెల్లింగన్‌ అన్నాడు. ఈ ఉద్యమం ఇంగ్లండు పార్లమెంటులో కూడా అలజడి కలిగించింది. పెదనందిపాడు సత్యాగ్రహం బార్జోలీ సత్యాగ్రహం కంటె ముందే జరిగింది. అనాడు ధార్మికావేశంతో గామోద్యోగులు తమ పదవులను గడ్డిపోచ మాదిరిగా -వదలిపెట్టారు. పెదనందిపాడు సక్యాగ్రహయోధుడు పర్వతనేని వీరయ్యచౌదరి. ఈయనను

బాపూజీ బంటు ౩7 “ఆంధ్రశివాజీ'”' అని ప్రజలు పిలిచేవారు. ఈ సత్యాగ్రహ సందర్భంగా గుంటూరుజిల్లా కాంగ్రెసు సంఘం పొన్నూరిలో సభ జరుప నిశ్చయించింది. జిల్లా కలెక్టర్‌ దానిని నిషీధించాడు. నాయకులు శాసనోల్లంఘనం గావించాలని నిర్ణయించారు. అయికి పన్నెండుమంది మాత్రమే ఈపని చేయాలని తీర్మానించారు. ఆ పన్నెండుమందిలో తన్నుకూడా చేర్చుకోమని సీతారామమూర్తి నాయకులను బతిమాలాడు. “నీవంటి యువకులు గ్రామాల్లో నిర్మాణ కార్యక్రమం చేపట్టటం మంచి” దని గొల్లపూడి సీతారామశాస్త్రి ఆయనను నివారించాడు. కన్నీరు కారుస్తూ నిరాశా నిస్పృహలతో సీతారామమూర్తి శాస్త్రి మాట తలదాల్చి కావూరు చేరాడు.

కాణాచి చేరిన సీతారామమూర్తి ఏవిధంగానయినా కారాగారానికి వెళ్లాలని నిశ్చయించాడు. వెంటనే ఆయన హరిజనులవాడకు వెళ్లి ఒక తప్పెట తెచ్చాడు. దానిని మోగిస్తూ పన్నులు కట్టవద్దని కావూరిలో చాటటం మొదలుపెట్టాడు. ఊళ్లో ఉన్న రెవిన్యూ ఇన్స్‌పెక్టర్‌ వద్దని వారించినా ఆయన వినలేదు. పైగా రెవిన్యూ ఇన్స్‌పెక్టర్‌ నివారిస్తున్నాడని ఆంధ్రపత్రికకు వార్త పంపాడు. అతని రిపోర్టు ననుసరించి పోలీసులు వచ్చి సీతారామమూర్తిని చందోలులో మకాంచేసిన జిల్లా కలెక్టరు రూథర్‌ఫర్డ్‌ దగ్గరకు తీసికొని వెళ్లారు. కలెక్టరు విచారణ జరిపి సీతారామమూర్తికి యాఖభైరూపాయల జరిమానా విధించాడు. జైలుకు ష్షే భాగ్యం కలుగలేదు కదా అని ఆయన ఎంతో విచారించాడు.

1923 డిసెంబరులో కాంగ్రెసు మహాసభ కాకినాడలో జరిగింది. దీనికి మహమ్మదాలీ అధ్యక్షుడు. ఈ మహాసభ సమయాన ఆంధ్రుల ఉత్సాహం వర్షకాలంనాటి గోదావరి మాదిరిగా ఉప్పొంగింది. సీతారామమూర్తి కాకినాడ వెళ్లి నాయకుల ప్రసంగాలు విని, కాంగ్రెసు సేవాదీక్షను ఇనుమడింపజేసికొన్నాడు. అందువల్లనే 1924లో కావూరి తిలక్‌ జాతీయ పాఠశాలలో ఆంధ్ర పండితుడయినప్పటికీ గ్రామ కాంగ్రెసు కార్యదర్శిత్వమును ఆయన వదల్లేదు. కాంగ్రెసులో సభ్యులను చేర్చించటం, రాట్నాలు పెట్టించటం, మధ్య మధ్య జిల్లా కాంగ్రెసు సభలకు వెళ్లిరావటం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ కాలానికి

38 తుమ్మల సీతారామమూర్తి కాంగ్రెసుసభ్యుని చందా పావలా అనే నియమం అంతరించింది. దానికి బదులు ప్రతిసభ్యుడూ సంవత్సరానికి రెండువేల గజాల నూలు వడికి ఇయ్యాలనే కట్టుబాటు ఏర్పడింది. కాంగ్రెసు సభ్యులచే నూలు వడికించి సేకరించటం, ఆ నూలుకట్టలను జిల్లా కాంగ్రెసు సంఘం వారికి పంపటం సీతారామమూర్తికి నిత్యకృత్యాలయ్యాయి. ఈయేడే కనగాలలో రేపల్లె తాలూకా కాంగ్రెసు సభ జరిగింది. దీనికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అధ్యక్షుడు. సభా కార్యకర్తలలో ఒకడుగా సీతారామమూర్తి మిక్కిలి శ్రమించాడు. అధ్యక్షుణ్ణి గూర్చి ప్రశంసాపద్యాలు రచించి సభలో చదివాడు. తర్వాత గోపాలకృష్ణయ్య కోరికమేరకు ఆయనవెంట సీతారామమూర్తి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెసుసభ జరిగే ఆలమూరు వెళ్లాడు. ఆ సభకు అనుబంధంగా అస్పృశ్యతా నివారణ సభ కూడా జరిగింది. ఈసభలో కావ్యకంఠ గణపతిశాస్త్రి వేదపురాణేతిహాస ప్రమాణాలతో అంటరానితనాన్ని ఖండిస్తూ ఉదాత్తమయిన అధ్యక్షోపన్యాసం గావించాడు. ఆలమూరు సభలవల్ల సీతారామమూర్తి మూపులు మూడయ్యాయి.

సీతారామమూర్తి నెలకు పదహారు రూపాయల వేతనం మీద తిలక్‌ జాతీయ పాఠశాలలో ఆంధ్రపండితుడయ్యాడు. జాతీయతారక్తీ, కాంగ్రెస్‌ సేవా తత్పరతా కలిగిన తాను సంబళం తీసికొని జాతీయ పాఠశాలలో ఉద్యోగం చేయటం ధర్మమా? అని ఆయన మథనపడ్డాడు. తల బరువు అవుతున్న ఈ అప్పు తీర్చుటెట్లా? అనే మీమాంస ఆయనలో పుట్టి నానాడూ. పెంపొందుతున్నది. ఇంతలో దీపావళి వచ్చింది. ఈ పర్పకాలంలో విద్యాలయాలకు చందాలు వసూలు చేయటం ఆరోజుల్లో ఒక సంప్రదాయం. దాన్ననుసరించి తిలక్‌ జాతీయ పాఠశాలాపాలక వర్గంవారు కూడా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. సీతారామమూర్తి తక్కినవారు తిరిగిన ఊళ్లకంటె ఎక్కువ ఊళ్లు తిరిగి చందాలు ఎక్కువగా పోగుచేసి పాఠళాలా పాలకవర్గంవారికి అప్పగించేవాడు. ఇంతేకాకుండా గుంటూరుజిల్లా ఖద్దరు బోర్డుకు వెళ్లి తన _ప్రాంతంవారికి నచ్చే ఖద్దరు బట్టలు తెచ్చి. వాటిని మూటగట్టి నెత్తిమీద పెట్టుకొని ఊరూరూ. తిరిగి అమ్మేవాడు. బోర్జువారు ఖద్ధరమ్మినందులకు రూపాయకొక అణాచొప్పున సీతారామమూర్తికి

బాపూజీబంటు 39 రుసుమిచ్చేవారు. ఈవిధంగా- సంపాదించిన సొమ్మును కూడా ఆయన పాఠశాలా పాలకవర్గంవారికే ముట్టజెప్పేవాడు: ఏడాది ' తిరిగేటప్పటికి మొత్తంమీద తాను తీసికొంట్లున్న నూట తొంభైలెండు రూపాయల జీతానికి ఇంచుమించుగా సరిపోయే సొమ్మును గడించి పాలకవర్గంవారి కిచ్చేవాడు. పాఠశాలాబుణంనుండి విముక్తుణ్ణయాక్థను -గదా! "అని ఆయన పరమానందం అనుఖవించేవాడ్ను

ఉత్తరప్రదేశ్‌లోని చౌరీ చౌరాలో జరిగిన పోలీస్‌స్టేషన్‌ దహనానికి మనస్తాపం పొందిన గాంధ్రీజీ సహాయనిరాకరణోద్యమానికి. .స్వాస్తి చెప్పాడు. అంగ్ల ప్రభుత్వం ఆయనను అరెస్టుచేసి అరేళ్ల కారాగారకిక్ష విధించింది. కాని అనారోగ్యకారణంగా ఆయనను శిక్ష గడువు పూర్తి కాకముందే విడుదల చేసింది. గ్లారిధీజీ ఆరోగ్యం కొఆఅకు దేవాలయాల్లో అఖిషేకాలూ, అన్నదానాలూ జరిగాయి. 'కావూరిలో అన్నదానం పెద్దయెత్తున జరిగింది. ఈసందర్భంగా కావూరిపెద్దలను అభినందించ టానికి గొల్లపూడి సీతారామశాస్త్రి వచ్చాడ్డు ఆయన మొదట రేపల్లెలో ప్రసిద్ధ "న్యాయవాది. తరువాత గాంధీజీ పిలుఫుమేరకు వృత్తికి తిలోదకాలిచ్చాడు: గుంటూరుజిల్లాలో ముఖ్యకాంగ్రెసు నాయకు డయ్యాడు. న్యాయస్థాన బహిష్కార సూత్రాన్ననుసరించి శాస్త్రి కావూరు వచ్చి వివాదాలు పరిష్కరించేవాడు. సీతారామమూర్తికి కాస్త్రితో గాఢ సంబంధమేర్చడింది. వాదప్రతివాదుల వాజ్మూలాలు వ్రాయటం, శాస్త్రితీర్చులకు నకళ్లు తీయటం, వివాదాల లెక్కలు కేల్చటం సీకారామమూర్తివంతయింది. ఈ పనివల్ల ఆయనకు వ్యావహారికానుభవం అబ్బింది. ఇంతేకాకుండా కాస్త్రి సన్నిధిని సీతారామమూర్తి గాంధీజీ జీవన పరమార్థాన్ని గ్రహింపగలిగాడు. -

ఖద్దరునిధికి. ఆంధ్రదేశంలో పర్య్కటిస్తూ- గాంధీజీ 1929 ఏప్రియల్‌ నెలలో .కావూరు వచ్చాడు. ఊరిపైద్దలు. ఉత్తముడయిన. ఒక నిరుపేద: చేతులమీదుగా ఆయనకు వేయిన్నూటపదార్లు .సమర్చించారు.. సీతారామమూర్తి తన వంతు చందాగా ఇఠవై అయిదు రూపాయలిచ్చాడు. ఒక సన్మానపత్రం వచనంగా రచించి గాంధీజీకి'సమర్పించాడు. ఆయనకు గాంధీజీ దర్శనం భగవత్సాక్షాత్కారమయింది. గాంధీజీ ప్రారంభించిన

40 తుమ్మల సీకారామమూర్తి లవణ సత్యాగ్రహంలో పాల్తొనాలని సీతారామమూర్తి ఉబలాటపడ్డాడు. కాని విధురుడయిన ఆయనను ఇంటిపట్టుననే. ఉండాలని తల్లి నిర్బంధించింది. విధిలేక "ఆయన సత్యాగ్రహ ప్రయత్నం విరిమించు' కొన్నాడు. 191 మార్చి నాలుగోకీదిని గాంధీ-ఇర్విన్‌ ఒడంబడిక జరిగింది. కారాగారాలకు ,వెళ్లిన సత్యాగ్రహులు విడుదలయ్యారు. భారతదేశంలో నవనవోత్సాహం వెల్లివిరిసింది. గొల్లపూడి సీతారామశాస్త్రి ఫప్రోక్సాహంవల్ల కావ్లూరి పెద్దలు గాంధీజీ విజయస్తంభం ప్రతిష్టించాలని నిశ్చయించారు. వారు ఎత్తయిన సిమెంటు స్తంభమూ, దానిమీడి గాంధీజీ విగ్రహము, స్తంభంచుట్టూ “1విశ్చసందేశము”” అనే పేరుగల వేదికా ,సిద్ధం చేశారు. 2-10-1931వ తేదిని కాశీనాథుని నాగేశ్చరరావుపంతులు ' విజయస్తంభాన్ని ప్రతిష్టించాడు. ఆనాటిసభకు ఆచార్య రంగా అధ్యక్షుడు. ఈ నాయకుల కిద్దరికీ సీతారామమూర్తి పద్యరూపాన స్వాగతపత్రాలు సమర్పించాడు. "

7-7-1931వ . _తేదిని బాపట్ల బోర్జు హైస్కూలులో అంధ్రోపాధ్యాయుడుగా _ చేరినప్పటికీ సీతారామమూర్తి. కాంగ్రెసు సేవనూ, గాంధీస్సీర్మాణ కార్యక్రమాన్నీ మానలేదు. ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత ' గుంటూరుజిల్లా కాంగ్రెస్‌ సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేశాడు. ఆయన కావూరిలో జరిగే గాంధీజీ జయంతుల్లో పాలొంటుండేవాడు. 2-12-193వ తేదిని గాంధీజీ నిర్మాణ కార్యక్రమం లక్ష్యంగా కావూరు-రాంభట్లపాలెం పొలిమేరలో ““వినయాశ్రమం'' స్థాపితమయింది. దీనికే “'కల్యాణకావూరు” అని పేరు. ఆంధ్రదేశంలో హరిజనయాత్ర ' చేస్తున్న" గాంధీజీ వినయాశ్రమ ప్రారంభోత్సవం గావించాడు. కావూరిలో ఉన్న రామలింగేశ్వరస్వామి దేవాలయంలో హరిజన ప్రవేశం జరిపించాడు. ఆంధ్రదేశంలో హరిజన ప్రవేశాన్ని అంగీకరించిన దేవాలయాల్లో _ కావూరి దేవాలయం మొదటిది. సీతారామమూర్తి సందు దొరకినప్పుడెల్లా కావూరువెళ్లి వినయాశ్రమ వాసులతోపాటు గాంధీజీ నిర్మాణ . కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. హరిజన వాటికలూడ్చి శుభం చేయటం, హరిజనవృద్ధులకు అభ్యంగనన్నానాలు నిర్వహించటం మొదలయిన పనులు ఆయన గావిస్తుండేవాడు:

బాపూజీ బంటు ప! 190 నాటికి సీతారామమూర్తి నూటికి నూరుపాళ్లూ బాపూజీ బంటూ, కాంగ్రెసు సేవకుడూ అయి రాటుదేలాడు. ఏ కార్యక్రమాన్నయినా సకే అది గాంధేయవాదానికీ, కాంగ్రెస్‌ సిద్ధాంకాలకూ వ్యతిరేకం గానప్పుడే ఆయన చేపట్టేవాడు. 1931లో చెన్నరాష్టానికి జస్టిస్‌ పార్టీ ప్రధానమంత్రి అయిన బొల్లిని మునిసామినాయడు గుంటూరుజిల్లా పర్యటనకు విచ్చేశాడు. జిల్లాబోర్డు అధ్యక్షులయిన జాగర్లమూడి కుప్పుసామి చౌదరి వారిని బాపట్లబోర్డు ష్టైస్కూలుకు తీసికొని రావటానికి నిశ్చయించాడు. ఈ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు కొమరవోలు రాజయ్య పంతులు. వీరిని కుష్పుసామి చౌదరి పిలిపించి, ప్రధానమంత్రిరాక _ తెలిపి, సీతారామమూర్తిచే స్వాగతపద్యాలు వ్రాయించండని ఆదేశించాడు. రాజయ్య పంతులు సీతారామమూర్తి కీవార్త చెప్పాడు. కుప్పుసామి చౌదరి ఆయనకు జీవనోపాధి కల్పించినవాడు. అయినప్పటికీ సీతారామమూర్తి “అయ్యా: ఎంత చెడినా నేను కాంగ్రెసువాణ్ణి. గాంధీజీ అనుచరుణ్ణి. ఆంగ్లప్రభుత్వం కాంగైసువారిని నేలబెట్టి కాలరాస్తున్నది. మునిసామినాయడుగారు ఆ ప్రభుత్వాన్ని సమర్థించే ప్రధానమంత్రి. జస్టిస్‌పార్టీ నాయకుడు. వారిమీద నేనేవిధంగా పద్యాలు రచిస్తాను. క్షమించండి” అని సవినయంగా పలికాడు. ప్రధానోపాధ్యాయుడు సీతారామమూర్తి నిష్టాగరిష్టతను మెచ్చుకొంటూ “నిన్ను అధికారులు మన్నిస్తారా?”” అని ప్రశ్నించాడు. వెంటనే సీతారామమూర్తి నవ్వి “నా ఉద్యోగం ఊడితే నానాగలి నాకు ఉండనే యున్నది. అదే నాకు రక్ష" అని అన్నాడు. ఈఘట్టం సీతారామమూర్తి కాంగ్రెసు భక్తినీ, ఆత్మబలాన్నీ, నైతికస్టైర్యాన్నీ నిరూపిస్తున్నది. అయితే ఆయనే “'రాష్ట్రగానము"”లో మునిస్తామినాయణ్జి కొనియాడాడు. ఆ ఘట్టమూ, ఆకారణమూ వేరు.

రచనా వ్యాసంగం

చెఅకుపల్లి కావూరికి తూర్పున ఉన్న గ్రామం. ఇదికూడా పురాతనమయిన ఊరే. బాదప మహారాజు శాసనంలో దీని ప్రస్తావన చూడవచ్చు. 1911లో చెఅకుపల్లిలో ఒక అష్టావధానం జరిగింది. అవధాని పేరాల వాస్తవ్యుడూ, గద్వాల మొదలయిన సంస్థానాల్లో శతావధానాలు చేసి సన్మానాలు పొందినవాడూ అయిన కారెంపూడీి రాజమన్నారుకవి. ఈయన అష్టావధానం చేసే సభలో పదేళ్లుకూడా నిండని ఒక బాలుడున్నాడు. ఏకాగ్రతతో అవధాన కార్యక్రమాన్ని పరికిస్తున్నాడు. సమస్య నిచ్చే పృచ్చకుడు “శునకమ్మయ్యెను విష్ణుదేవుడహహా! చోద్యంబుగా నత్తఠినో” అనే సమస్యను ఇచ్చాడు. అవధాని రాజమన్నారుకవి ఈ సమస్యను త్రిపురాసుర సంహారకథకు ముడిపెట్టి ““ఈశున కమ్మయ్యెను విష్ణుదేవు డహహా! చోద్యంబుగా నత్తతిన' అని పూరించాడు. సభలో ఉన్న బాలుని ఆశ్చర్యానికీ, అనందానికీ అవధుల్లేవు.

ఈ బాలుడు అవధానాన్ని గూర్చి అలోచిస్తూ స్వగ్రామం చేరుకొన్నాడు. మర్నాడు ఎనిమిదిమంది మిత్రులను ఒకచోట చేర్చి, ఆఅవధానలక్షణాలు వారికి వివరించి, తాను అవధానం చేయటానికి పూనుకొన్నాడు. ఈ బాలావధాని చెఅకుపల్లి అష్టావధానంలోని సమస్యనే పూరించాడు. రాజమన్నారుకవి పూరణం కొంతకుకొంత గుర్తున్నప్పటికీ ఈ కుజ్జవాడు దానిజోలికి పోలేదు. కథను మాత్రమే స్వీకరించి క్రొత్తపద్యం చెప్పాడు. విచిత్రమేమిటంటే ఈ బాలావధానికి అనాటికి ఛందః పరిజ్ఞానం శూన్యం. వ్యాకరణ వాసన లేనేలేదు. కేవలం పద్యగమనజ్ఞానం ఆధారంగా సమస్యను పూరించాడు. చెప్పిన పద్యంలో గణాలూ, యత్‌ప్రాసలూ తప్పలేదు. కాని వ్యాకరణదోషాలున్నాయి. ఈ బాలావధాని ఎవడో కాడు. తుమ్మల సీతారామమూడ్తే.

ఆనాటినుండి ఆజీవమానమూ సీతారామమూర్తి కవిత్వం రచిస్తూనే ఉన్నాడు. ఆయన 1917లో గాని “సులక్షణసారము”' అనే ఛందో గ్రంథాన్ని చూడలేదు. అది చేతికి వచ్చినప్పుటినుండీ బుద్ధికి

రచనా వ్యాసంగం జప

అందినంతవరకు ఛందస్సు గుట్టును గుర్తించాడు. కాని వ్యాకరణానికి సంబంధించినంతవరకూ ప్రాథమిక పరిజ్ఞానాన్ని కూడా పొందలేక పోయాడు. అయినా కవిత్వం కట్టటం మానలేదు. ఈ సంవత్సరం తండ్రి నారయ్య నూతనగృహాన్ని నిర్మించాడు. గృహప్రవేశ ముహూర్తం నిశ్చయించి కొడుకుచేత బంధువులకు లేఖలను వ్రాయించాడు. సీతారామమూర్తి ఆలేఖలను పద్యాల్లో వ్రాశాడు.

ఇక్కడ ఒక ముఖ్యవిషయం చెప్పాలి. సీతారామమూర్తి మేనల్లుడు జాస్తి వేంకటనరసయ్య ఒక సందర్భంలో మేనమామ రచనలను గూర్చి బ్రాస్తూ “1911-18 మధ్య 5, 6 శతకములు, 4 హరికథలు, 2 నాటకములు, 1 జంగం కథ, 1 ప్రబంధము వ్రాసిరి. ఆ పుస్తకములు తృప్తికరములుగాక అణగిపోయినవి. వ్రాతప్రతుల్లు లేకపోలేదు. ఇవియన్నియు పౌరాణిక _ ములు” అని అన్నారు. నేను ఈ వ్రాతప్రతులను సీతారామమూర్తి కుమారులనుండి సంపాదించి పరిశీలించాను. అవి కరక్కాయ సిరాతో వ్రాసినట్టివి. దురదృష్టవశాత్తు శిథిలావస్థకు చేరుకొన్నాయి. వాటిలో పురాంతక శతకం, అన్నదాన మాహాత్మ్యం - సాత్రాజితీపరిణయం అనే నామాంతరం కలిగిన నీలాపనిందాపహరణం అను రెండు హరికథలూ, హనుమద్విజయం, గిరికాపరిణయం అను రెండు నాటకాలూ, కొన్ని పాటలూ కనబడుతున్నాయి. వీటిని సీతారామమూర్తి ముద్రింపలేదు. 1919నుండీ రచించిన గ్రంథాలను మాత్రమే ఆయన అచ్చువేయించాడు.

సీతారామమూర్తి మొట్టమొదట రెండు శతకాలు ముద్రించి ప్రకటించాడు. వాటిలో మొదటిది “"రామశకకము”. రెండోది “రామలింగేశ్వర శతకము” వీటిని చెఅకుపల్లిలో సబ్‌రిజిష్టైరుగా ఉన్న భువనగిరి కోదండపాణి బి.ఏ. గారు పరిష్కరించారు. ఈరెండూ దేవతాస్తుతీ, నీతిబోధా అనే లక్షణాలు కలిగిన ప్రాచీనాంధ్ర శతకాలను షోలి ఉంటాయి. ఈ సమయంలోనే గుంటూరుజిల్లా నిడుబోలులో కమ్ము మహాజనసభ జరిగింది. ఈసభలో సీతారామమూర్తి కమ్మవారి ప్రాచీన వైభవాన్నీ, నాటి దుర్దశనూ వర్ణిస్తూ నూటయాభై చరణాల తేటగీతిమాలను రచించాడు. ఇది ఇంతవరకూ లఖింపలేదు. 1920 మే నెలలో ఆయన “జల్లణీయము” అనే జంగం కథను రచించాడు. కాని దీనిని ముద్రింపలేదు. దీని వ్రాతప్రతికూడా నష్టమైపోయింది.

త తుమ్మల సీతారామమూర్తి

1921 నాటికీ సీతారామమూర్తి చిత్తశుద్ధి గల కాంగ్రెసు సేవకు డయ్యాడు. ఆయనకు గాంధీజీపట్ల అచంచలభక్తి జనించింది. ఈభక్తిని ప్రకటిస్తూ “శ్రీ మహాత్మాగాంధి తారావళి రచించాడు. ఇరవైయేడు పద్యాల సముదాయానికి తారావళి అని పేరు. ఈ లఘుకావ్యంలో ప్రతిపద్యం చివర “మహాత్మా; గాంధినామ ప్రభూ” అనే మకుటం ఉన్నది.

ఆదినుండీ సీతారామమూర్తి హరికథలు రచిస్తూనే ఉన్నాడు. ఆ అనుభవంతో 1922 సెప్టెంబరు మాసములో "వామదేవ చరిత్రము” అనే హరికథను వ్రాశాడు. “భక్తిరసపూరితంబును, నిహపర సౌఖ్యదాయ కంబును నగువిష్ణు భక్తాగ్రేసరుని చరిత్రమొకదానిని' హరికథగా రచింపుమని మిత్రులు కోరినమీదట దీనిని రచించినట్టు ఆయన పీఠికలో చెప్పాడు. శ్రీపాద సుబహ్మణ్యశాస్త్రి రచించిన “శ్రీ మహాభక్టవిజయము”' నుండి నామదేవ చరిత్రలోని ముఖ్యాంశాలు స్వీకరించి, కీరనలూ - తోహరలూ - పద్యగద్యాలు చేర్చి దీన్ని పూర్తిచేశాడు. కావూరి రామలింగేశ్చరస్వామి ఆలయంలో అర్చకత్వం నిర్వహించే రావూరి సోదరులు దీనిలోని కీర్సనలకు రాగతాళాలు నిర్ణయించారు. 1923 మే నెలలో సీతారామమూర్తి “ఆంధ్ర భజగోవిందము” రచించాడు. ఇది శంకర భగవత్పాదులూ, ఇతరులూ రచించిన సంస్కృత భజగోవిందానికి అనువాదం. భజగోవింద శ్లోక పఠనాసక్తిచేత దీన్ని తెలిగించినట్టు ఆయన “విజ్ఞాపన”లో పేర్కొన్నాడు. అనువాదమంతా వృత్తపద్యాలతో సాగింది. రచయితపేరుకు ముందు ““బాలకవి” అనే బిరుదు చేరింది.

1922న్న' సం[లో అంధ్ర భజగోవిందంతోపాటు సీతారామమూర్తి మరి రెండు గ్రంథాలు రచించాడు. వీటిలో “"మాహేంధ్ర జననము” అనే నాటకం ఒకటి, దీనిలోని కథ ఆంధ్రదేశంలోని మేదర్ల చరిత్ర. ఈ కథను స్వీకరించి నాదెళ్ల పురుషోత్తమకవి ““మాహేంద్ర పురాణము” అనే పద్యకావ్యం రచించాడు. ఈ పురాణం ఆధారంగా సీతారామమూర్తి ఐదంకాల నాటకాన్ని సృష్టించాడు. కథ స్వల్పం కావటంచేత ఆయన మొదటి మూడంకాల్లో దక్షాధ్వరధ్వంస కథను చేర్చాడు. చెఅకుపల్లి లోని మేదర్ల కోరికమేరకు ఈ నాటక రచనం కొనసాగింది. దీన్ని మేదర్లు అక్కడక్కడా ప్రదర్శించారు. ఇక 'రెండోకావ్యం "రామకృష్ణస్యృతి” అర్చక

రచనా వ్యాసంగం 45 మిత్రుల్లో ఒకడయిన _ రామకృష్ణశర్మ అకాలమరణం చెందగా సీతారామమూర్తి ఈలఘు కావ్యాన్ని రచించాడు. స్మ్కృతికవిత భావ కవిత్వంలో చేరుతుంది. ఆంగ్లభాషలో దీన్ని “ఎలిజీ' అని పేర్కొంటారు. ఇది ఆత్మాశ్రయ కవితాకోటికి చెందుతుంది. సీతారామమూర్షి భావకవితా తత్స్వం తెలిసికొనీ, స్మృతికావ్య లక్షణం గగ్రహించీ “రామకృష్ణ స్మృతి" రచించాడని _ నిర్ణయించటానికి సాక్ష్యాలేమీ లేవు. కేవలం మిత్రవియోగజనితమయిన విషాదం భరింపలేక ఆయన ఈ కావ్యాన్ని రచించాడు. దీనిలో హృదయాన్ని ద్రవింపజేసే పద్యాలెన్నో ఉన్నాయి.

1924 అక్టోబరులో "ఆంధ్రలక్ష్మీనృసింహసప్తోత్రము” రచించి మరుసటి సంవత్సరం ఆంధ్ర పత్రికలో ప్రకటించాడు. 1925 డిసెంబరులో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీపగ్రామం అయిన మల్లాయపాలెంలో వేమన జయంతి జరిగింది. జయంతి నిర్వాహకులు వేమన్ననుగూర్చి ఒక తారావళి రచించే పొటీపరీక్ష పెట్టారు. ఆ పోటీలో నిలచిన సీతారామమూర్తి "వేమన తారావళి” రచించి జయంతి సభకు వెళ్లి చదివాడు. కాని బహుమానం పొందలేకపోయాడు. 1926 ఆగష్టు 28వ తేదిని బెజవాడలో తొమ్మిదో కమ్ము మహాజనసభ జరిగింది. ఈసభలో పాల్గొన్న సీతారామమూర్తి *““కమ్మకుల ప్రబోధము” పేర తొమ్మిది సీసపద్యాలు రచించాడు. ఇవి ఆహ్వానసంఘంవారు ప్రకటించిన సంచికలో చేరాయి.

ఇంతవరకూ సాగిన సీతారామమూర్తి రచనా వ్యాసంగాన్ని సమీక్షిస్తి రెండు మూడు ముఖ్యాంశాలు తేటతెల్లమవుతున్నాయి. 1919 నుండీ ఆయన ప్రతిసంవత్సరమూ రచనలు ్రకటిస్తూనే ఉన్నాడు. అవి గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే పౌరాణిక రచనలూ, భక్తి వేదాంత రచనలూ అయ్యాయి. ఆయన కమ్మ మహాజనసభల్లో చదివిన పద్యాలు మాత్రం అనాటి సాంఘిక పరిణామాన్ని సూచిస్తున్నాయి. నాటకాలూ, హరికథలూ, జంగం కథలూ రచించినప్పటికీ సీతారామమూర్తి ప్రముఖంగా పద్యకవిగా మాత్రమే పరిణమించే లక్షణం కొట్టవచ్చినట్టు కనబడుతున్నది. రైతుకుటుంబాలో పుట్టి సాహిత్యక్షేత్రంలో వ్యవసాయం చేసిన మొట్టమొదటితరం -కవులందరూ పద్యకవిత్వాన్నే ప్రధానంగా

46 తుమ్మల సీతారామమూర్తి రచించటం డీనికొక కారణం. 1925 తర్వాత మూడేళ్లపాటు సీతారామ మూర్తి దాదాపు కవిత్వం రచింపలేదనే చెప్పవచ్చు. 1928 నుండి ఆయన సాహిత్య _ జీవితంలో ఒక ఘట్టం ముగిసి మజొకఘట్టం ్రారంభమయినదని స్పష్టంగా నిర్ణయింపవచ్చు.

1928 మే నెలలో ఒకరోజున సీతారామమూర్తి మిత్రులతో కూడి షికారుకు వెళ్లి ముచ్చట్లలో మునిగోజీలుతున్నాడు. అప్పుడు ఒక యెణుకవాడు మామిడిచెట్టుమీద చెరలాడే పెంటిగువ్వను వింటితో పడగొట్టాడు. ఈసంఘటనం సీతారామమూర్ష్ణి హృదయాన్ని కలచి వైచింది. ఆయనకు వెంటనే తిక్కన మహాభారత శాంతిపర్వ తృతీయా శ్యాసంలోని “లుబ్ధకపోతోపాఖ్యానము”” గుర్తుకు వచ్చింది. ఈ ఉపాఖ్యానం అహింసా త్యాగ ప్రధానమయిన గొప్ప కథ. గాంధీజీ సిద్ధాంతాలు ప్రేరేపింపగా భారతకథనే స్వీకరించి ఆయన పదేనురోజుల్లో కావ్యం రచించాడు. దీని పేరు “ఆత్మార్చ్పణము”. ఇది 1928 నవంబరునుండి సాహిత్య మాసపత్రిక అయిన “భారతి” మూడు సంచికల్లో ముద్రితమయింది. అందువల్ల ఆంధ్రదేశంలో (హాస్తి౭క్కింది. ఈ కావ్యరచనం వాల్మీకి రామాయణ సృష్టిని తలపిస్తుంది. దీనిలో చిన్నయసూరి గద్యరితులనూ, తిక్కన పోకడలనూ, ప్రబంధ్దూలినీ పాఠకులు చూస్తారు. కాళిదాసు రచించిన కుమారసంభవ, మేఘ సందేశాల్లోని శ్లోకాలభావాలను గుర్తిస్తారు.

1932 అక్టోబరు రెండోతేదిని కావూరిలో గాంధీ జయంతి జరిగింది. సీతారామమూర్తి ఈ జయంతికి బాపట్లనుండి వచ్చాడు. జయంత్యుత్సవం ప్రవర్తిల్లుతుండగా ఆయన “'విశ్చసందేశ వేదికమీద ఒక మూల కూర్చుండి గాంధీజీ ఆత్మకథను కావ్యంగా రచించాలని నిర్ణయించుకొన్నాడు. ఐదారు పద్యాలు రచించి చదివి, సభ్యులకు తన సంకల్పం తెలియజేసి వారి ఆశీస్సులూ శుభాకాంక్షలూ చూఆఅగొన్నాడు. గాంధీజీ ఆత్మకథకు “సత్యప్రయోగ చరితము” అని పేరు. దీనిలో అయిదుభాగాలున్నాయి. ఈగ్రంథాన్న్ని వేలూరి శివరామశాస్త్రి వచనంగా తెలిగించాడు. సీతారామమూర్తి శాస్త్రిగ్రంథం ఆధారంగా ఆత్మకథా కావ్యరచనానికుపక్రమించాడు. 1934 ఏప్రియల్‌ నెలకు ప్రథమ భాగాన్ని

రచనా వ్యాసంగం పీ

చంపూకావ్యంగా రచించాడు. దీన్ని "బాపూజీ ఆత్మకథ” పేరుతో 1936 అక్టోబరులో ప్రకటించాడు. నవీనాంధ్ర విమర్శకు పితామహుడయిన డాక్టర్‌ కట్టమంచి రామలింగారెడ్డి ఈ కావ్యాన్ని చదివి, పరవళతించి అయాచితంగా ప్రశంసిస్తూ లీఖ పంపాడు.

బెజవాడలో తొమ్మిదో కమ్మ మహాజన సభ జరిగినపుడు సీతారామమూర్తికి వెలగపూడి దానయ్య చౌదరితో సాంగత్యం - ఏర్పడి చిరకాలం కొనసాగింది. వీరిద్దరూ “వీతికునుమావళ” పేరుతో నాలుగు భాగాలు ప్రకటించారు. ఇవి నీతులు బోధించే లఘు కావ్యాలు. భాష సులభంగానేకాక సుందరంగా కూడా ఉంటుంది.

“ప్రాణి హింసకు మించు పాపంబు లేదు.

భూతదయకు మించు పుణ్యంబు లేదు”. వంటి నీతులు ఈ నాలుగుభాగాలోనూ ఉన్నాయి.

అంధ్రసాహితీ ప్రపంచం 'సీతారామమూర్తిని రాష్ట్రకవిగా గుర్తించటానికి హేతువయిన కావ్యం "“'రాష్ట్రగానము” తెలుగునాట ఈకావ్యానికి అఖండప్రచారమూ, అధికప్రశస్తీ లభించాయి. దీనిసృష్టికి అంధ్రోద్యమం మూలకారణం. 1937 అక్టోబరు 30వ తేదిని బెజవాడలో ఇరవై అయిదవ ఆంధ్రమహాసభా, ఆంధ్రమహాసభ రజతోత్సవమూ పెద్దయెత్తున జరిగాయి. సీతారామమూర్తి ఈ ఆంధ్రమహాసభోత్సవాలకు వెళ్లాడు. బెజవాడనుండి వచ్చిన వెంటనే పదిపద్యాలు చించి ప్రకటించాడు. 1938 మార్చిలో తెలుగు యుగాదినాడు బాపట్లలో ఆంధ్రమహాసభాశాఖ పక్షాన ఒక రాష్ట్ర సభ జరిగింది. సీకారామమూర్తి ఈ _సభలో రాష్ట్రకవిత్వం కొంత రచించి పఠించాడు. సదస్కులు సెబాసన్నారు. ఏప్రియల్‌ నెలలో డెబ్బైయారు పద్యాలతో "రాష్ట్రగానము" మొదటి ముద్రణం వెలువడింది. ఈ కావ్యాన్ని సీతారామమూర్తి బెజవాడ ఆంధ్రమహాసభ రజతోత్సవానికి మూలస్తంభంగా నిలిచిన చల్లపల్లి రాజా శ్రీమంతు యార్లగడ్డ శివరామప్రసాద్‌ బహద్దరుకు అంకితం చేశాడు. రాష్ట్రగానం ఎప్పటికప్పుడు క్రొత్త క్రొత్త పద్యాలతో ఎన్నో ముద్రణలు పొందింది. ఈ కావ్యం ఆంధ్రోద్యుమ ఘట్టాలకు కవితారూపం.

48 తుమ్మల సీతారామమూర్తి

సత్యవ్రతుడూ, ధర్మమూర్తీ, సీతారామమూర్తి తండ్రీ అయిన నారయ్యకు ఒక వైశ్యమిత్రుడున్నాడు. ఇతడు చందోలు నివాసి. ఈ వైశ్యుడు నిజాంపట్నం కాలువ తవ్వుతున్న ఒడ్డెవాండ్రకు దొరకిన పుత్తడిని ఇత్తడి అని చెప్పి తక్కువవెలకు కాజేకాడు. ఈ బంగారం ఈనాటి తూకాన్నిబట్టి 14 కిలోల బరువుంటుంది. సర్కారువారి బెడద తప్పించుకోటానికి దాన్ని దాచిపెట్టమని నారయ్యకు వైళ్ళ మిత్రుడు అప్పగించాడు. ఆయన ఈ బంగారాన్ని రెండేళ్లు కాపాడి తిరిగి ముద్దరసుద్దిగా వైశ్ళమిత్రునకిచ్చివేశాడు. వైశ్యుడు పరమానందభరితుడై కొంత బంగారం తీసికొమ్మని నారయ్యను అర్థించాడు. కాని ఈయన ససేమిరా ఒప్పుకోలేదు. ఆనాటికి నారయ్య ఇల్లుగడవని నిరుపేదవాడు. ఈడు ముదిరినా పెళ్లికానివాడు. సీతారామమూర్తి తండ్రి ధర్మతత్పర తనూ, అపరిగ్రహాన్నీ లోకానికి వెల్లడించటానికి ఒకకావ్యం రచించాడు. ఇదే "ధర్మజ్యోత'” ఈ కావ్యం 1942 ఏప్రియల్‌ నెలలో వెలుగు చూచింది. ఈ సమయానికి ఆంధ్రదేశంలో మార్క్సు సిద్ధాంతాలు మెల్లమెల్లగా వ్యాపిస్తున్నాయి. వీని ఛాయలు “ధర్మజ్యోతి” కావ్యంలో గోచరిస్తాయి.

1920 నుండీ సీతారామమూర్తి ఖండకావ్యాలు రచిస్తూనే ఉన్నాడు. వీటిల్లో కొన్ని కాలక్రమాన ఉత్పన్నమయిన దేశ సమస్యలతో ముడిపట్టినవి: ఆ సమస్యాపరిష్కారాలను సూచించటానికి ఆయన చరిత్రలోని సన్నివేశాలను వస్తువుగా స్వీకరించాడు. కాళిదాసాదులు రచించిన కావ్యాల్లోని కథలను తెలిగించాడు. ఈ ఖండకావ్యాలోో మయళఠతికొన్ని దేశనాయకుల ప్రాచీన నవీనాంధ్రకవుల, కళాకారుల, సాంఘికసీవా ఫపరాయాణుల, ఆధ్యాత్మికవేత్తల ప్రశంసలు. సీతారామమూర్తి “మాలికా కవిత్వం” రచించటంలో దిట్ట. ఇది కూడా ఖండకావ్యాల్లో కనబడుతుంది. ఈ ఖండకావ్యాలన్నీ ఏడుసంపుటాలుగా వెలువడినాయి. వీటిల్లో మొదటిది "వజిగపంట". ఇది మొదటిసారి 1943 నవంబరులో అచ్చయింది. తర్వాత దీనిలో ఇతర లఘుకావ్యాలను చేర్చి పెంచి ఆయన 1952 మార్చిలో రెండోసారి ముద్రించాడు. 1948 మే నెలలో ప్రకటించిన "పెద్దకావు" అనే ఖండకావ్య సంపుటి దీనిలో చేరింది. 1948 జనవరి ౩0వ తీదిని హత్యకు గురైన గాంధీజీని గూర్చి రచించిన “అమరజ్యోతి""నీ

రచనా వ్యాసంగం తం 26-1-1949వ తేదిని నిడుబోలిలో తనకు కనకాఖిషేక గజారోహణాది సత్కారాలు జరిగిన పిదప రచించిన “తవస్పిద్ధి"నీ సీతారామమూర్తి ఈ రెండో ముద్రణంలో లీనం జేశాడు. తర్వాత ఆయన 1955 మార్చిలో "శబల"నూ, 1964 ఫిబ్రవిలో "పైరవంటోనూ, 1987 ఆగష్టులో "నమదర్శి”నీ, 1983 నవంబరులో "కదంబఐకైతనూ ప్రకటించాడు. సీతారామమూర్తి మరణానంతరం ఆయన కుమారులు 199 ఫిబ్రవరిలో "చక్కట్లు" 1994 మార్చిలో “దివ్యజ్యోతి అనే ఖండకావ్య సంపుటాలను ముద్రించారు. సీతారామమూర్తి పెక్కుచోట్ల అవధానాలు చేశాడు. ఖండకావ్యాలో ఆయన అవధానకవిత్వాన్ని చూడగలము. సీతారామమూర్తి 1936 అక్టోబరులో “బాపూజీ ఆత్మకథ'' ప్రథమభాగం ప్రకటించాడు. కేషించిన నాలుగు భాగాలనూ కావ్యంగా దిద్దితీర్చటానికి ఆయనకు పదేనేళ్లు పట్టింది. అయితే ఈ పదేనేళ్లలోనూ ఆయన ఆ నాలుగు భాగాలనూ చంపూకావ్యంగా రచించటానికి 554 రోజులు మాత్రమే శ్రమించి ఎట్టకేలకు 1951 జనవరి 26వ తేదికి ముగించాడు. ప్రథమ భాగంలోని పద్యాలను సంస్కరించి, మొత్తం అయిదు భాగాలను కలిపి ఆయన బృహతక్కావ్యంగా 1951 మార్చిలో ప్రకటించాడు. ఈ సందర్బంగా ““బాపూజీ ఆత్మకథ'"కు ముందు చేర్చిన “మనపొలో “ఈ కృతిసంపూర్తికితవిలంబనము జరుగుటలో నేను గొంత బాధపడినను దానికి మించిన యానందమును సైతమిపుడనుభవించుచున్నాండను. మొదటి యూయపులోనే యిది ముగిసినచోం గాలక్రమమునం బెరిగిన నాకవితా సంస్కారమున కిందుందా వుండెడిది కాదుగదా! నాకృతులన్నింట నుత్తమము పవిత్రమునైన యీకావ్యము నా సారస్వ్పతానుభూతికి నాతెనుంగుందనమునకు మూదలగా రూపెత్తుట నాభాగ్యమని తలంతును". అని పేర్కొని తృప్తి వహించాడు. మహావీర పొట్టి శ్రీరాముల బలిదానంతో ఆంధ్రరాష్ట్రం సిద్ధించింది. నూతనరాష్ట్రంలో ఎన్నో సమస్యలు తలెత్తాయి. ఎన్నో వివాదాలు పొడసూపాయి. వీటన్నిటినీ కళాత్మకంగా వర్ణిస్తూ సీతారామమూర్తి “ఉదయగానము"” రచించి 1955 జనవరిలో ప్రకటించాడు. “ఈ కృతి

50 తుమ్ముల సీతారామమూర్తి రాష్ట్రగానమునకు: జెలియలు. అక్కగారికి దక్కినకీర్ణి యీమెకును దక్కునుగాకి' అని ఆయన పీఠికలో ఆకాంక్షించాడు.

భగవద్గీత జాతీయోద్యమానికి ఎంతో బలాన్ని చేకూర్చింది. విష్ణ్లవపథం పట్టినవారుకూడా ఈ యుపనిషత్తును స్వాతంత్ర్యాన్ని సిద్ధింపజేసి శరణాగతిశాస్త్రంగా అంగీకరించారు. బాలగంగాధరతిలక్‌, అరవిందఘోష్‌ మహాత్మాగాంధీ మొదలయిన జాతీయ నాయకులు కాలానుగుణంగా భగవద్గీతకు వ్యాఖ్యలు చేశారు. ఇదేవిధంగా వినోబాభావే “గీతాప్రవచనము” గావించారు. దీనిని వెంపటి సూర్యనారాయణ తెలిగించాడు. ఈ అనువాదానికి సీతారామమూర్తి భాషా సంస్కరణం గావించి మెజలుగుపెట్టాడు. జాతీయోద్యమానుసారీ, గాంధేయ సిద్ధాంతవాదీ అయిన ఆయనకు భగవద్గీతపట్ట ఆనురాగం జనించింది. దానిలోని ముఖ్యశోకాలను పద్యాల్లో తెలిగించి ఆయన “గీతాంగణము” పేరుతో 1959 ఫిబ్రవరిలో ప్రకటించాడు. తర్వాత మొత్తం భగవద్గీతను ఆంధ్రీకరించి "రీకాదర్శము"” అనే నామధేయంతో 1963 డిసెంబరులో వెల్లడించాడు. ఈ పూర్ణగ్రంథంలో గితాంగణం లీనమయింది.

ఆర్థిక సమస్యలను పరిష్కరించటానికి, సర్వోదయం సాధించ టానికీ గాంధీజీ ప్రతిపాదించిన సూత్రాల్లో ధర్మకర్తృ సిద్ధాంతం ప్రధానమయింది. మహాత్ముని నిర్మాణ కార్యకర్తల్లో వినోబాభావే అగ్రగణ్యుడు. పేదఠికాన్ని నిర్మూలించటానికి ఆ తత్త్వజ్ఞాని భూదానోద్యమాన్ని సాధనంగా స్వీకరించాడు. అహింస, ప్రేమ స్త్రర్వోదయానికి ఆధారపీఠాలు. సీకారామమూర్తికి సర్వోదయ సిద్ధాంతం నచ్చటం వింతగాదు. సర్వోదయయాత్రల్లో కూడా పాలొన్న ఆయన “"వడర్వోదయగానము” రచించి 191 మార్చిలో ప్రకటించాడు. ఈ కావ్యంలో ఆయన భూదానోద్యమ ప్రారంభాన్నీ భావే చెప్పిన నీతులనూ, సర్వోదయ కార్యకర్తల కథలనూ, అర్థిక సమస్యా పరిష్కారాలనూ మనోహరంగా వర్ణించాడు.

భర్హృహరి రచించిన నీతిశతకాన్ని చిన్న చిన్న తెలుగు పద్యాలతో తెలిగించి "శెనుగునీతి” అనే పేరుతో సీతారామమూర్తి 1961 జూన్‌లో

రచనా ఆహర్టయమలా. గ్‌. న గా ఘా / ప్రకటించాడు. తేటగీతి, ఆటవెలది, కందా క్షీకై వ్ర్యాలచ్‌ స్తోత ఆయన ఈ అనువాదానికి స్వీకరించాడు. న వెలువరించిన “నేను” అనే కావ్యం రాశినిబట్టి చిన్నదయినా గుణాన్ని బట్టి చాలా విలువయింది. దీనిలో సీతారామమూర్తి సాహిత్య సిద్ధాంతాలూ, జీవిత నియమనిష్టలూ గోచరిస్తాయి.

“నేను మహాత్ముని ఆత్మకథను పద్యరూపమునం దీర్చి 1951లో సమగ్రముగా వెలువరించితిని. ఇందు మనముందు బాపూ సాగించిన సత్యాగ్రహ సమరముల చరిత్రలు, మనకై నలంగి నలంగి బలిపోయిన జాతిజనకుని జీవనగాథలు లేమింజేసి యెట్లేని శ్రమించి మహాత్ముని మనుగడ నూంచముట్టుగా నభివర్ణించి యాంధ్ర శారదకు నుడుగరవెట్టవలయు ననుకోరిక నాలో నపుడ యుదయించె”నని సీతారామమూర్తి పేర్కొన్నాడు. కాని యాయన కోరిక నెరవేరటానికి పదిహేనేళ్లు పట్టింది. చివరకు “మహాక్ష్మకథ'“'. 1968 మార్చిలో సాహిత్య ప్రపంచంలో అవతరించింది. బాపూజీ శతజయంతి సంవత్సరంలో జౌచిత్యాన్ని గుర్పించి కేంద్రసాహిత్య అకాదెమీ '““మహాత్మకథ"”కు పురస్కార ప్రదానం చేసింది. ఈ మహావీరకావ్యంలో గాంధీజీ నాయకుడయిన స్వాతంత్రోద్యమం ఇతివృత్తం. 1919 నుండి నిర్యాణం -చెందేవరకూ జాతిపిత స్వాతంత్ర్య సిద్ధికై శ్రమించిన తీరుతెన్నులను సీతారామమూర్తి కళాకమనీయంగా ఈ కావ్యంలో వర్ణించాడు. వస్తువంతా బాపూజీ చుట్టూ పరిభ్రమిస్తుంది. జాతీయోద్యమంలో పాల్గొని త్యాగమూర్తులయిన తెలుగువారి కథలుకూడా దీనిలో అక్షరరూపం ధరించాయి. గాంధీజీని గూర్చి వివిధభాషల్లో వెలువడిన గ్రంథాలనుండి సేకరించిన సమాచారానికి, స్వపరిజ్ఞానాన్న్ని మేళవించి ప్రామాణికంగా కాలక్రమానుసారిగా సీతారామమూర్తి ''మహాత్మకథ'"ను రచించాడు. ఇది ఆయన స్వతంత్రసృష్టి

"నా కథలు” అనే కావ్యం సీతారామమూర్తి రచించిన సంపూర్ణ స్వీయచరిత్రగాదు. తన జీవితంలోని కొన్ని ఘట్టాలను మాత్రమే ఆయన దీనిలో వర్ణించాడు. వీటికి నాందిగా కులపురుషుల చరిత్రనూ, తాతతండ్రుల _ జీవితాల్లోని కొన్ని సన్నివేశాలనూ చేర్చాడు.

52 తుమ్మల:సీతారామమూర్తి సీతారామమూర్తి వ్యక్తిత్వాన్ని “నా కథలు” కావ్యం నితూపిస్తున్నది. ఇది 1973లో వెలువడింది.

స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత భారతదేశం గాంధీజీ చికాభస్మంతోపాటు ఆయన సిద్ధాంతాలనుకూడా గంగలో కలపింది. భారతీయ సమాజంలో ధర్మం దారితప్పింది. సత్యం సమసిపోయింది. నీతి నిప్పచ్చరమయింది. పదవీ వ్యామోహం పట్టపగ్గాలు లేనిదయింది. ధన తృష్ణ తాండవం చేస్తున్నది. జాతీయోద్యమకాలంనాటి - త్యాగం కలికానికయినా కానరాకుండాపోయి, భోగం యోగమయింది. నాటి యీనాటి స్థితిగతుల తారతమ్యాన్ని సమచిత్తంతో కనులారా చూచిన సీతారామమూర్తి అహింసనూ, నీతిదయాసత్యశాచాదులన్తూ, వ్యక్తి ధర్మాలనూ, సామాజిక బాధ్యతలనూ రమణీయంగా బోధిస్తూ, 1976 జులైలో “ఎక్కట్టు* అనే లఘుకావ్యాన్నీ 1981 జులైలో "“సందేశ సప్తశతి” అనే కావ్యాన్నీ ప్రకటించాడు. మకుటం లేకపోయినప్పటికీ ఈరెండు కావ్యాలూ వేమన కవితా లక్షణాలను పుణికి పుచ్చుకొన్నాయి. సీతారామమూర్తిని మహాప్రజాకవిగా నిరూపిస్తున్నాయి.

సీతారామమూర్తి ఆస్తికుడు. అయితీ ఆయన అస్తికత హేతువాద బద్దమయినది. మూఢాచారదూరమయినట్టిది. చూనవతామయమయి నట్టిది. డెబ్బయ్యోపడిలో పడినప్పటినుండీ ఆయన భగవద్గీతా జ్ఞానయజ్ఞాలకు _ వెళ్లుతుండేవాడు. గుంటూరుజిల్లా కారంచేడు “హరేరామజప యజ్ఞసమాజము”” వారి వార్డికోత్సవాలలో చాలా సారులు పాల్గొన్నాడు. వేదాంత సమాజాలవారు నిర్వహించే ప్రార్ధనా సమావేశాలో గోస్వామి తులసీదాసు రచించిన “హనుమాన్‌ చాలీసా” గానం చేయటం విడిచిపెట్టటానికి వీలులేని విధి. “ఈ చాలీసా తెలుంగునకు వచ్చుచోం దెలు(గువారికి మిగుల నుపకరించును గదా” అనే అభిప్రాయంతో “హనుమాన్‌ చాలీసా” తెలుగున గేయంగానూ, పద్యం గానూ సంతరించాడు. పద్యగితికలలో అభిరుచిననుసరించి దేనినయిననూ భక్తులు పరించుకోవచ్చునని ఆయన అభిప్రాయం. దీనిని ఆయన 1978 మార్చిలో ప్రకటించాడు.

రచనా వ్యాసంగం ర్‌3

ఏతరం తెలుగువారికయినా -* పఠింపదగినడే: అని, తలంచి సీతారామమూర్తి గాందీజీ చరిత్రను సంగ్రహంగా సరళమయిన భాషలో గానయోగ్యంగా ““గాంధిగానము” అనే పేరుతో రచించి 1987 మార్చిలో వెల్లడించాడు. పాడుకోటానికి పనికి వస్తాయనే భావంతో ఆయన ఈ కావ్యంలో ముత్యాలసరాలూ, మంజరీ ద్విపదలూ, ““నవాక్కర'"లూ అనే ఛందస్సులను మాత్రమే స్వీకరించాడు. వీటిలో ““నవాక్కరి' త్రీ వ! జే జ సతారామమూర్తి నూతనంగా స్వతంత్రించి సృష్టించిన ఛందస్సు. దీనికి నాలుగుపాదాలుంటాయి. ప్రతిప్తాదంలోనూ ఐదు ఇంద్రగణాల తర్వాత ఒక సూర్యగణం కుదురుకొంటుంది. ఐదవగణం మొదట యతి ఉంటుంది. ప్రాస నియమమూ ఉంటుంది. ఆయన ఈకావ్యాన్ని ఎనఖై అయిదవయేట రచించాడు.

క్రీ.శ. 1928 నుండీ సీతారామమూర్తి రచించిన కవిత్వానికీ ఆంధ్రత్వమూ, భారతీయ ధర్మమూ, విశ్చమానవ కల్యాణమూ జీవంగా నిలిచాయి. గాంధేయ సిద్ధాంతాలే భారతీయ ధర్మస్పరూపాలనీ, సర్వోదయ సిద్ధాంతాలే విశ్చ్వమానవాభ్యుదయ దాయకాలనీ ఆయన గట్టిగా నమ్మాడు. ఆయనకు కవిత్వమే ఊపిరి. అదే ఆరోగ్యాన్ని ప్రసాదించింది. ఇరవయ్యో శతాద్దీ సీతారామమూర్తిని మహాకవిగా ఆఅంధ్రసాహితీ ప్రపంచంలో ప్రతిష్టించింది. ఆంధ్రుల, భారతీయుల హృ దయ స్పందనలను గుర్తించి ఆయన కావ్యాలు రచించాడు. వీటిల్లో యుగధర్మం విరాడ్రూపంతో సాక్షాత్కరిస్తుంది. ఆయన వాణి యుగవాణి. అందువల్లనే సీతారామమూర్తి యుగకవి.

అంతస్తత్వాన్నిబట్టి సీతారామమూర్తి కావ్యాలను ఈవిధంగా విభజింపవచ్చు.

  1. శతకములు : పురాంతక శతకం, రామశతకం, రామలింగేశ్వర శతకం,
  2. జంగం కథలు : విల్లణీయం. ౩. నాటకాలు : గిరికా పరిణయం, హనుమద్విజయం, మాహేంద్ర జననం.
  3. హారికధలు : అన్నదాన మాహాత్మ్యం, సాత్రాజితీ పరిణయం,

నామదేవ చరిత్రం.

ర్‌4 తుమ్ముల సీతారామమూర్తి 5. _ వృృతికావ్యము : రామకృష్ణస్కృతి. 6. కథాకావ్యాలు : ఆత్మార్సణం, ధర్మజ్యోతి. ళా రాష్ట్రకావ్యాలు వ రాష్ట్రగానం, ఉదయగానం 8. _ గాంధీకావ్యాలు : శ్రీ మహాత్మగాంధి తారావళి, బాపూజీ - అత్మ కథ, మహాత్మకథ, అమరజ్యోతి, సర్వ్పోదయగానం, గాంధిగానం. 9. ఖండకావ్యాలు : పతిగపంట, పెద్దకాపు, శబల, పైరపంట, సమదర్శి, కదంబకైత, చక్కట్టు, దివ్యజ్యోతి. 10: వేదాంతకావ్యాలు : ఆంధ్ర భజగోపిందం, ఆంధ్రలక్ష్మీ నృసింహ స్తోత్రం, గితాదర్భ్శం, హనుమాన్‌ చాలీసా. 11. పొమాదక కావ్యాలు : ఎక్కట్ట్లు, సందేశసప్తశతి. 12. నీతికావ్యాలు : తెనుగునీతి. 13. ప్వీయచలిత్ర కావ్యాలు : తపస్సిద్ధి, నేను, నా కథలు.

కవితా సిద్ధాంత నియమములు

కవిత్వం లలితకళలో ఒకటి. కొందరు విమర్శకుల నిర్ణయాల ప్రకారం ప్రధానమయింది కూడా. దీన్ని నిర్షచించటానికి మహామనీషు లెందతో ప్రయత్షించారు. అయినప్పటికీ ఇది ఎవ్వరికీ అందకుండా నిర్వచనాలకు దూరంగానే నిలిచింది. శ్రీమాన్‌ రాళ్లపల్లి అనంతకృష్ణ గారు “వేమన''లో (పుట. 189)

“సామాన్యముగా ఒక వస్తువును గూర్చి తనకుంగలుగు భావములను భాషమూలమున ఇతరుల మనసు కెక్కునట్లు వెలువణు చుట కవిత్స్వమనవచ్చును. అనంగా భావించువాండు, అతని భావము, దానికి విషయమయిన వస్తువు, దానిని వెల్లడించు ఖాష్క దానిని విని గ్రహించు సభ్యులు - ఈ ర్హైదును కవిత్వ్స సృష్టియందలి పంచమహా భూతములు. ఈ య్బైదింటిలో ఏది లేకున్నను కవిత్వము కొఆగాదు”' అని వక్కాణించారు. ఈ వివరణలో భావించువాడంటే కవి అని అర్థం. కవీ, ఇతడు స్వీకరించే వస్తువూ. దీనివల్ల జనించే భావాలను ప్రకటించేభాషా అనేవి చాలా ముఖ్యమయిన కవిత్వాంగాలు.

'ప్రాచీనకాలంనుండీ తెలుగు కవులు తమ తమ కవితా సిద్దాంత నియమాలనూ, తమ తమ కవితా లక్షణాలనూ అవతారికల్లో చాటు కొంటూ వచ్చారు. నన్నయ, నన్నెవోడుడూ, పాల్కురికి సోమనాథుడూ, తిక్కనా, శ్రీనాథుడూ, పింగళిసూరనా, చేమకూర షేంకటకవీ మొద లయిన మహాకవులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తమ కావ్యాలను పరిశీలించటాని కుపయోగించే సిద్దాంతాలనూ లక్షణాలనూ ప్రకటించారు. వీటివల్ల విమర్శకులకు ఉత్తమమయిన పఠనమార్తాలు ప్రాప్తించాయి.

సీతారామమూర్తి పూర్వకవులదారినే త్రొక్కాడు. ప్రత్యక్షంగా తన కవితా సిద్ధాంతాలనూ, కవితా లక్షణాలనూ ప్రకటించాడు. వినోబాభావే ప్రవచించిన కవితా సిద్ధాంతాల నంగీకరించాడు. వీటిని వివరించటానికి ముందు ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి. సీతారామమూర్తి పద్యకవి. నవ్యాంధ్ర సాహిత్యంలో భావవ్యక్తీకరణం పలుపోకడలు పోయింది. కాని

56 తుమ్మల సీతారామమూర్తి ఆయన వాటినేమీ పట్టించుకోలేదు. ప్రక్కదారులు పట్టకుండా పద్యకవితామార్గంలోనే ప్రయాణం చేశాడు. గాంధీజీ శతజయంతి సందర్పంగా సీతారామమూర్తి ఒక వచన కవితాఖండాన్ని సృష్టించాడు. దీనికి వెనుకా ముందూ ఆయన ముత్యాలసరాలు అనే ఛందోఖేిదాన్ని స్పీకరింపకపోలేదు. అయినప్పటికీ పప్రాధాన్యాన్నిబట్టి ఆయనను పద్య కవినిగానే సంభావించాలి. పద్యకవిత్వం అనగానే నియమాలధికంగా ఉంటాయని వేరే చెప్పనక్కల్లేదు. వీటిని సీతారామమూర్తి తు.చ. తప్పకుండా పాటించాడు. ఈవిషయంలో ఆయన కాలాని కెదురీదిన స్వతంత్రుడయ్యాడు. ఇంతేగాకుండా తన కావ్యాలను అంకితం చేసేటప్పుడు కఠోర నియామాల ననుసరించాడు. కళా, కవీ, కవిత్వమూ, భాషా పాఠకుడూ మొదలయిన పద్దులక్రింద సీతారామమూర్తి పాటించిన కవితా నియమాలనూ, చేసిన సిద్ధాంతాలనూ సమీక్షించటం సమంజసం. 149వ సం॥ లోనే సీతారామమూర్తి “తపస్సిద్ధి అనే కావ్యంలో తన కావ్యసృృష్టిని గూర్చి ఈవిధంగా చెప్పికొన్నాడు. చం. కళకొలకే కవిత్వ మని గంతులు వేయక, రోంతరోంతగా వలపులు నింపి కబ్బములు బ్రాయక, విశ్చజనీనబోద్ధృతా లలిత, ముదారవృత్తము, క లా కమనీయము, సంస్కృతి ప్రభా మిళితము నైనసృష్టి నెద మెచ్చితి జాతికిం గాన్క లిచ్చితిన్‌ ఆయన కవితాకళ కళకొఅకే అనే సిద్ధాంతాన్ని త్రోసిరాజన్నాడు. విశ్చజనీనమయిన సందేశమూ, ఉదాత్తమయిన వస్తువూ, కమనీయమయిన శిల్చమూ, స్వదేశ సంస్కృతి లక్షణమూ కలిగిన కవితా సృష్టి గావించటం ఆయనకు ట్రీతిపాత్రం. పచ్చి వలపుల కవిత్వాన్ని వ్రాయటం ఆయనకు గిట్టలేదు. “నేను” అనే కావ్యంలో కూడా ఆయన

కవితా సిద్ధాంత నియమములు 5్‌7 తీ. _ వీరమును మెత్తుంగాని సింగారమును గ ణింప నోడెద వస్తువున్‌ నెమకు పట్ల అని అన్నాడు. ఇక్కడ వీరం అంటే వీరరసమనీ, సింగారం అంటే శృంగార రసమనీ అర్థాలు చెప్పికోవాలి. శృంగార రసప్రధానమయిన కావ్యాలను ఆయన రచింపలేదు. వీరరసం అంటేనే ఆయనకు మహాప్రీతి. అందువల్లనే మహాకవి కాటూరి వేంకటేశ్వరరావు ““యుద్ధవీరముకంటె దానవీరమూ, ధర్మవీరమూ అంటే చౌదరిగారికి మజీ యిష్టము. అక్క్మార్చణమునేమి, ధర్మజ్యోతినేమి, ఆత్మకథనేమి రచియించుటకు చౌదరిగారి ఈ వీరరసపరతంత్రతయీ కారణం. కావ్యానికి నాడూ నేడూ శృంగార రసమే ప్రధానాత్రయం. కవులలో శృంగారరసమును విడిచినవారూ, విడువక మాట దక్కించుకొన్నవారూ అరుదు. చౌదరిగారొక్కరే దానిజోలికి వెళ్లకుండా ఉత్తమ కావ్యములను రచింపగల్లిరి. స్వభావముచేతనే వారు వీరకరుణరసలుబ్ధలు”' అని పూర్వపక్షం లేకుండా తీర్మానించారు. ఇంకా సీతారామమూర్తి తన కవితా లక్షణ సిద్ధాంతాలను “నేను” కావ్యంలో ఈవిధంగా వివరించాడు. కం. నైతిక పునరుజ్జీవన జాతీయ వికాస, విశ్చజనతా శ్రేయః ప్రీతము మచ్చేతము; నా వైతము తద్దర్చణమ్ముగా నుదయించున్‌ కం. ఉపద్రైక పరాయణ, మపవర్ణిత లాభలోభ మస్మత్కవనం; బపథ ప్రతిరోధక మీ తప మని భావించి పట్టందప్పక నిలుతున్‌ ఆ.వె. కృతిని జీవగజ్డగతి నుపదేశమ్ము కుదురుకొనుట మేటిగుణము గాన జాతి కుపకరించు సందేశమును గళా న్వితముగా వచించువితము నాది

58 తుమ్మల సీతారామమూర్తి ఆ.వె. నేల విడిచి సాము నెణపినయట్లుండు సంఘగతికి దవ్వు సాగి వ్రాంత; యుక్తి చణతగాదు యుగలక్షణము గుబా ళింపవలయు. గావ్యలేఖనమున నైతిక పునరుజ్జీవనాన్నీ, జాతీయ వికాసాన్నీ, విశ్వమానవ కల్యాణాన్నీ వాంఛించిన సీతారామమూర్తి అవి ప్రతిబింబించే కవిత్వాన్ని అధికంగానే సృష్టించాడు. ఆయన చెప్పికొన్నట్టు కళాత్మకమయిన నీతికవిత్వం ఆయన కావ్యాలనిండా జాలువాళతింది. కం. మన కాంధ్రత్వము ప్రాణము; తనువు సుమీ భారతీయధర్మము; యావ న్మనుజాభ్యుదయ ప్రవణత యనుజూ! విను, వజ్రకవచమై దిట వొసంగున్‌ అని ప్రబోధించిన ఆయన యుగలక్షణానుకూలంగా కవిత్వం ఉద్బ్పవించాలని వక్కాణించటం వింతగాదు. క కలుషితములైన విషయవాంఛలను రేంపి ప్రజలం బశువులం గావించు ప్రజ్ఞ కాదు. రాగవైరాదులను ద్రోసి రాముదెసకు నడుపు కౌశలమే కళ నాం జెలంగు అని సీతారామమూర్తి కళను నిర్వచించాడు. సాహిత్యాన్ని గూర్చి ఆయన చెప్పిన మాటలు ఉదాత్తంగా ఉన్నాయి. “సాహిత్యం ఎప్పుడూ సత్యాన్ని అనుసరిస్తుంది. సత్యసమన్వితమై అది, చంద్రునివెంటనంటి చరాచరాత్మకమయిన విశ్వానికి వైతన్యం ప్రసాదించే వెన్నాలవంటిది. కవి ఆత్మానుభూతితో గావించే సృష్టియే సాహిత్యం. అది ప్రాణికి పవిత్రతను సమకూరుస్తుంది. లోకాన్ని కరగిస్తుంది. రోగి వైద్యునిదగ్గర దాచుకోకుండా తన తప్పులన్నీ వెల్లడిస్తాడు. అదేవిధంగా సాహిత్యకర్త భగవంతుని ప్రతిబింబదమయిన ప్రజాసమూహం ముందు ఎటువంటి సత్యాన్నయినా ప్రకటిస్తాడు” అని ఆయన అంటాడు.

కవితా సిద్ధాంత నియమములు 59 కవికీ, సత్యనిష్టకూ అవినాభావ సంబంధమున్నదని సీతారామ మూర్తి వక్కాణించాడు. లోకానికి సాధుమార్నాన్ని నిర్దేశించేకవి సత్యవంతుడయియుండటం విడిచి పుచ్చటానికి వీలులేని ధర్మమే. సీతారామమూర్తి గాంధీజీ బంటు. ఆయన సత్యాన్ని పరమధర్మంగా భావించటం ఆశ్చర్యంగాదు. అందువల్లనే కం. తక్కిన పెంపెటులున్నను నిక్కముపైం గవికి దృష్టి నష్టయు వలయున్‌; టక్కరి, కవితారచనకు మక్కువపడు6గాక, లోకమాన్యుండగునా? కం. మది వేలు, మాట వేటై (బ్రదుకీడ్చు పిసాళి పల్కు పసలేని దగున్‌ బదిమందిని గదలించెడి చదు రానుడి కబ్బదెంతసంకటపడినన్‌ కం. త్రికరణశాచత్రీ, లే నికవులు పత్రంబులెన్ని నింపిన నేమౌ నకలంకము కవితారస మొకబిందువుపాటిర్టైున నూరద యందున్‌ అని ఆయన వినోబాభావే వాళక్కులనే అనువదించాడు. “సందేశ సప్తశతి?లో కూడా ఆ.వె. సత్యనిష్టనుండి జాతినకవి కూర్చు కృతి సమాజమునకు నిడదు తృప్తి యుప్పు లేనికూర, యుసులు లేనిశరీర, మది కృపీట శూన్యమైన తటిని” అని ఆయన చెప్పాడు. “కవీ, బుషీ సమానులే. ఇద్దరూ నిర్చికారులై దుర్చికారాలతో కూడిన లోకానికి ఉపదేశకులై మేలు చేకూరుస్తారు. రాజు బాహ్యప్రకృతికి భయంకర శాసనాలను సృజించి సమాజాన్ని సంరక్షిస్తాడు. కవి ఆంతర ప్రకృతికి కాంతాసమ్మితంగా హితోపదేశం చేసి

60 తుమ్మల సీతారామమూర్తి లోకాన్ని కాపాడుతాడు. ఒకని కోరికకు వంగిపోయి, మరొకని ఆజ్ఞకు లొంగిపోయి కవి 'కవిత్వం రచింపడు. తన హృదయవీణ మైోగినప్పుడే అతడు అమరకవిత్వాన్ని సృష్టిస్తాడు. పిల్లనగ్రోవిగా రూపొందే వెదురు, కోతలనూ గంటులనూ ఓర్చుకొంటుంది. సభాప్రశంసలు సంపాదింప గోరే కవి పెక్కు ఇక్కట్లు సహించాలి. పతివ్రత సౌందర్యాన్ని కోరదు. కర్మయోగి లాభాన్ని కాంక్షింపడు. ఉత్తమ కవిత్వాన్ని సృజించేకవి అల్బబుద్ధిమాదిరిగా ప్రశంసలకు ఆరాటపడడు””' అని కూడా ఆయన సిద్ధాంతీకరించాడు. ' ఆ.వె. ప్రజల మేలుగీళ్లం బాల్‌ొను వారికే భావనాబలమ్ము బలసియుంటం బంటకాయు, చేతిపనివాండు, ఖైరాగి తక్క నొరుండు పల్కందగండు శకైత అని వినోబాభావే చెప్పిన మాటలను సీతారామమూర్తి అంగీకరించాడు. “కవిత్వం ఒక రసావేశం. అది చెలరేగినప్పుడు కవి పగలూ-కేయీ, ఆహారమూం-నిద్రా మరచిపోతాడు. చివరకు అపూర్వ సమాధిలో మునిగిపోయి, తన్ను తాను విస్కరిస్తాడు” అని సీతారామమూర్తి స్వానుభవాన్నే వెల్లడించాడు. ఇంకా ఆయన కవితాతత్తాాన్ని వివరిస్తూ చీ. మచ్చరమ్ముల మంటల రెచ్చంగొట్టి నరుని దయ్యముంగా మయూర్చువెరవు గాదు ప్రేమ నెసంగించి, కృపను అంపిల్లంజేసి త్యాగి(గాం దీర్చు నెఅవాది తనమె కైత ఆ.వె. నరుల సురలంజేసి నందన సుమన స్స ముత్ధ సారభముల ముంచియెత్తు. దత్త్వవిదులంజేసి తనియించు నక్షరా నందపదము దెసకు నడిపి కవిత కం. గిఆిగీచుకొన్న కవికృతి చిరకాలము నిల్వ; దెల్లసిద్ధాంతములన్‌

కవితా సిద్ధాంత నియమములు 61 దరియించి, విష్ణవముదెస కరిగిన కృతి సత్యదర్శిర్దై రాణించున్‌ అని ఎదురులేని తీర్చు చేశాడు. సీతారామమూర్తి కఠోర నియమాలతో కూడిన భాషనే కావ్య నిర్మాణానికి ప్రయోగించాడు. తన కవిత్వం ““సాధుశీలం, అభిజాత్యం, సౌందర్యం ముప్పిరిగొన్న వనితవంటిది* అని ఆయన పేర్కొన్నాడు. రచయిత జీఏితనిష్టను ఆతని వాక్కు ప్రచురిస్తుందనీ, కవి జీవితమూ, అతని భాషా సూర్యుడూ అతని కాంతీ వంటివని చెప్పాడు. ఆ.వె. సంఘమునకుం బుష్టి సంతుష్టి నొదవించు వెలంది పల్కు వాడవలయు.గృతులం జిత్తశుద్ధి తపము జిజ్ఞాస నేర్వని కవి కుదాత్తవాణి కానంబడదు తీ. నియమబద్ధమ్ము మధురమ్ము నిపుణమైన పలుకుతో సాహితీసృష్టి సలుపవలయు రాగరోషాది దుర్వికారములు లేని కవులకే తోం నిట్టిచక్కని వచస్సు ఆనే పద్యాల్లో కవిశీలానికీ అతడు ప్రయోగించే భాషకూ గలపాొత్తును ఆయన చక్కగా నిరూపించాడు. ఆయనకు సాహిత్యప్రీతి జనించేనాటికి ఆంధ్రదేశంలో గిడుగు వేంకటరామమూర్తిగారి వ్యావహారిక భాషోద్యమం బయలుదేరింది. సీతారామమూర్తి ఆ ఉద్యమాన్ని ఆఅంగీకరింపలేదు. అయన నియమబద్ధ భాషను సంరక్షించటానికి కంకణం కట్టుకొన్న ఆంధ్రసాహిత్య పరిషద్నార్షిక సమావేశాలకు వెళ్లుతూ ఉండేవాడు. మొట్టమొదటిసారి క్రీ.శ. 1919 ఏప్రియల్‌ నెలలో నెల్లూరిలో, జరిగిన పరిషద్నార్షిక సమావేశానికి స్వగ్రామమిత్రులతో కూడి వెళ్లాడు. ఆయన పరిషక్కార్యవర్గ సభ్యుడుగా కూడా చేరాడు. సీతారామమూర్తి భావ విప్లవాన్ని ఎంతగా వాంఛించాడో అంతగా భాషా విప్లవాన్ని వ్యతిరేకించాడు. “నేటి పాఠకులకు నేర్చులేదంటూ కవులు దారితప్పి జారిపోవటం, త్రాడు పొడవుగా లేదని బావిని

62 తుమ్మల సీశారామమూర్తి పూడ్చటం వంటిదే. చదువులేనివారి మనస్సుల కెక్కాలని భాషా నియమోల్లంఘనం చేస్తున్నామనే వారి రచనలు నిరక్షరాస్యమయిన జనానికి అర్ధమవుతున్నవా?” అని ఆయన ప్రశ్నించాడు. ఇంతటితో ఆగకుండా చివరకు ఆ.వె భావవిప్లవమ్ము పచరించు కవి శాబ్ద విప్ణవమున కంగవీంపడేని గెలువండని వీథీషికలు గొట్టువారు నా సృష్టిజూచి యేమి సెప్పంగలరొ అని సవాలు చేశాడు. ఇంత భాషానిష్ట గల సీతారామమూర్తికి చిన్నయసూరి ఆరాధ్య దైవమయ్యాడు. బాలవ్యాకరణం బ్రహ్మసూత్ర తుల్యమయింది. దువ్వూరి వేంకటరమణశాస్త్రి ఆయనకు ప్రత్యక్ష దేశికుడు కాగా చిన్నయసూరి “పరోక్షాచార్యుడు” అయ్యాడు. కం. నన్నయ తిక్కన యెజ్జన మున్నగు నాచార్యకవులముద్ర వడని ప ల్కెన్నండు మెచ్చను; నాలో. జిన్నయ కొల్పున్నవాండు జీవాత్మవలెన్‌ కం. తిక్కన్నకుం జిన్నయ్యకు మొక్కెద; నాపాలి తెనుగు ముద్రకు వీకే దక్క్కైరి; యెంత పలుకుం జక్కన మెఅయించె సూరి శాస్త్రమునందున్‌ అని అన్నాడు. అయితే చిన్నయసూరి ఆర్య వ్యవహారాలో గోచరిస్తున్న పద ప్రయోగాలు లక్షణ విరుద్ధాలయినప్పటికీ (గహింపవచ్చునని ప్రవచించాడు. సీతారామమూర్తి ఆ మాటలంగీకరించాడు. అందువల్లనే చిన్నయసూరి తన వ్యాకరణాల్లో తడవని మహాకవి ప్రయోగాలను ఆయన ఆమోదించాడు. ప్రాఢవ్యాకరణాన్ని కూడా సీతారామమూర్తి పిండికొట్టినట్టు పఠించాడు. తదనుగుణంగా భాషా . ప్రయోగం

కవితా సిద్ధాంత నియమములు 63 గావించాడు. ఇంతీకాకుండా వ్యవహారంలో ఉన్న తెలుగు మాటలను సంస్కరించి ఆయన ఉపయోగించాడు. ““ఇంటెల్లపాదు” వంటివానిని దీనికి తార్కాణంగా చూపవచ్చు.

సీతారామమూర్తికి భాషాప్రయోగంపట్ల ప్రభవించిన ఇంతటి పట్టుదలకు మూడు కారణాలు కనబడుతున్నాయి. ఆయన కేవలం పద్యకవి కావటం ఒక కారణం. ఇక రెండో కారణం ఆయనకు సాహిత్యోపదేశం చేసిన గురువుల భాషానిష్టు తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రిగారు తన యింటిలో వారు మాటాడేటప్పుడు అన్యదేశ్యాలు దొరలితీ ఆగ్రహోదగ్రుడయ్యేవారు. గాంధేయవాదిగా సీతారామమూర్తి పాటించిన నియమనిష్టలు మూడోకారణం. అవే ఆయన భాషా ప్రయోగంలో కుదురుకొన్నాయి. *'రచయిత జీవితనిష్టను బ్రచురించును వాక్కు” అని ఆయన చెప్పనే చెప్పాడు. అందువల్లనే జాబులు ద్రాసినప్పుడు కూడా నియమబద్ధమయిన భాషనే ప్రయోగించాడు. కం. నా చెప్పెడి కబ్బమునన్‌ బైచేయిగ నుండు, దెనుంగుంబ; ల్కది శౌచ శ్రీ చిక్కణమై పున్నమ పూచిన జాబిల్లి వెలుంగు పాలుపుం దెలుపున్‌ చం... 4, తెనుంగుంగబ్బ మం దలువది పాళ్లపాటి తెలులైనను నిల్పుట కారటించుకై సరుండను నేను; దిక్కనకుం జాంగిలి మొక్కుదు నేను...” అని సీతారామమూర్తి చాటుకొన్నాడు. కావూరిలోని తిలక్‌ జాతీయ పాఠశాలలో ఆంధ్రపండితుడయి విద్యార్థులకు తిక్కన భారతమూ, చిన్నయసూరి నీతిచంద్రికా బోధిస్తున్నప్పుడే ఆయనకు వారిద్దరూ ఆదర్శరచయితలయ్యారు. “ఒక తిక్కన చాలండె యీసకలాంధ్రమున కును జీవసంపద నొసంగన్‌' అని “మహాత్మకథ'” అవతారికలో ఆయన తీర్చు చేశాడు. ““తెనుగునదుర్గము చిన్నయ” అని “నేనూ” కావ్యంలో ప్రశంసించాడు. తెలుగు మీది వలపు బలుపుగావటం చేత ఆయన నిఘంటువుల్లో మాత్రమే నిల్చిన మారుమూల తెలుగు మాటలను

వాడటానికి కూడా వెనుకంజ వేయలేదు. “నేనేం తప్పు చేస్తున్నాను? తెలుగువాడు మరచి పోయిన తెలుగును తిరిగి అతనికి గుర్తు చేస్తూ నేర్చుతున్నాను'" అని ఆయన తన్ను తాను సమర్థించుకొన్నాడు. బుంగపోతగా సంస్కృత పదాలను కావ్యంలో గుప్పించటం సీతారామమూర్తికి గిట్టదు. ప్రాచీన కాలంలో అ.వె. ఏను వేలు, తెనుంగు మానిసి వేఅను వాండు సొచ్చె6దెనుంగువాడ లోని కతండు పొంచి పొంచి యందాలవెల్లి నా తెలుంగు తల్లి వెలంది వెలుంగుడించె అ.వె. వెట్టి ముదిరి ముదిరి వెలగల తెల్లును మఆచినారు పెక్కుముంది కవులు కవులయుట్టి లోక మవమతి పాల్‌సేయ నకట! నేతివీర యయ్యెందెనుంగు అని ఆయన విచారించాడు. అయితీ ఆయనకు సంస్కృతం పొడగిట్టదని ఎవరయినా నిర్ణయిస్తే అది కచ్చితంగా పొరపాటని చెప్పాలి. సీతారామమూర్తి సంస్కృత మహత్త _గ్రహించినవాడే. అది సర్వాంగీణంగా సమృద్ధి సాధించిన భాష అని తెలిసినవాడే. తెలుగు భాషకు దాని అక్కర ఎంతయినా ఉన్నదని ఎఆిగినవాడే. కాని ఆ.వె. జీడిపప్పు వలయు, జేజేల బాసయు చలయు. బాసెమునకుం దెలుగునకును దూలి దూలి దేనిపాలు హెచ్చించిన రుచు లడంగి రెంట రోంత పుట్టు అని చివరకు చెప్పాడు. తెలుగువారినోళ్లలో నలిగిన అఆంగ్గాది భాషాపదాలను ప్రయోగించిన ఆయన సంస్కృత భాషను ఎలా కాదనగలడు? జౌచిత్యాన్ని బట్టి సంస్కృతభాషను స్వీకరించటం సమంజసమని ఆయన సిద్ధాంతం. తన కావ్యాలను అంకితం చేయటానికి కూడా సీతారామమూర్తి దృఢవ్రతాన్నే అనుసరించాడు. ఆయన ఏకావ్యాన్నీ భగవంతున కంకితం

కవితా సిద్ధాంత నియమములు 65 చేయలేదు. కృతిపతిత్వం కీర్షికి కారణం. భగవానుడు క్రీర్షిమయుడు. ఆయన కింకా కావ్యాలర్చించటం దేనికి? పైగా దేవుడు శమదమాది సద్గుణసంపత్తి వల్లనే సంతోషించే కల్యాణగుణనిలయుడు. కావ్య సమర్పణం చేసినా ఆయన అనుగ్రహం లభింపదు. భగవంతుణ్ణీ కృతిపతిని చేయటం బంగారు కొండకు గవ్వును సమర్పించటం వంటిది. ఇదీ ఆయన తర్కం. అందువల్ల విశ్చశ్రేయస్సును సంధించే సత్పురుషునకు కావ్యాన్ని అంకితం చేయటం సముచితమని ఆయన సిద్ధాంతం చేశాడు. ““కాంతులకుం బరార్థఘటనా వ్రతులకుం గావ్యంబులిత్తు"నని చాటు కొన్నాడు. వారి సామ్మును ఆకింపనన్నాడు. మథతి నిష్కామ కర్మయోగి కృతిపతిత్వాన్హు కాంక్షింపడు కాబట్టి అయనే అటువంటి వానిని అన్వేషించి. కృతిపతిని చేసికొన్నాడు. సంఘబుణంనుండి విముక్తుజ్ణయ్యాను గదా అని సంతోషించాడు. ఆయన కృతిపతులందరూ మంచి పనులు చేసి మానవశ్రేయస్సుకు మార్గాలు నిర్మించినవారే. వారిలో దండి సత్యాగ్రహసమయాన గాంధీజీ వెంట వెళ్లిన ఎర్నేని సుబ్రహ్మణ్యం, పారశాలకై తన ఆస్తినంతా వెచ్చించిన కొసరాజు లక్ష్మయ్య, గాంధేయ వాదియై వినయాశ్రమస్థాపనకు తన ఆస్తినంతా దానం చేసిన తుమ్ముల బసవయ్య. సర్వోదయవాది వెంపటి సూర్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు వెలువోలు సీతారామయ్య, లాల్‌పహద్దరుకాస్త్ర, మార్టిన్‌ లూథర్‌. కింగ్‌ మహాకవి కాటూరి వేంకటేశ్వరరావు మొదలయిన వారున్నారు.

కావ్యం అచ్చయి వెలుగు చూచేవరకూ సీతారామమూర్తి కృతిపతి ఎవరో ఎవరికీ చెప్పివాడుకాడు. చివరకు కృతిపతికి కూడా తెలియజేసీవాడు కాడు. రహస్యం పొక్కకుండా నానావస్థలూ పడి కృతిపతి ఛాయాపటాన్ని సంపాదించేవాడు. అన్ని హంగులూ సంతరించు కొన్న తర్వాత కావ్యప్రతులు అతనికి పంపేవాడు. “పెద్దకాయపు” కావ్యాన్ని ఎర్నేని సుబ్రహ్మణ్యంగారికి అంకితమిచ్చి సీతారామమూర్తి ఆయనకు రెండుప్రతులు పంపాడు. ఆయన తానే కృతిపతినని గ్రహింపకుండానే కావ్యాన్ని పఠించి ప్రశంసిస్తూ లేఖ పంపాడు. తర్వాత నాలుగు నెలలకుగాని సుబహ్మణ్యంగారికి నిజం ఇలియలేదు. అప్పుడు ఆగున పశ్చాత్తాపపడుతూ మరోలేఖ పంపాడు.

గాంధీకవి “తుమ్మల సీతారామమూర్తి మహాత్మునియొక్క ఆస్థానకవి. ఈస్థానము శాశ్చ్వతము.? అని విమర్శకాగ్రేసరుడు కట్టమంచి రామలింగారెడ్డి వక్కాణించాడు. ఈపట్టం ఏ నవీనాంధ్రకవికీ లభింపలేదు. ఇది సీతారామమూర్తికే దక్కటానికి అనేక కారణాలున్నాయి. యౌవనదశకు చేరినప్పటినుండీ సీతారామమూర్తి గాంధేయవాది. 1920 నుండీ ఆయన గాంధేయసిద్ద్ధాంతాల ప్రచారానికి పూనుకొన్నాడు. బ్రతుకును తిద్దితీర్చుకోటానికి యత్నించాడు. ఉప్పుసత్యా గ్రహంలో పాలొనాలని ఉవ్విళ్లూరాడు కాని. ఆనాటికి ప్రథమకళత్రాన్ని కోల్పోయిన ఆయనను తల్లి బెదరించి అడ్డగించింది. 1930 ఆగష్టు నాలుగో తేదిని ఆయన దుగ్గిరాలబోర్డు హైస్కూల్లో ఆంధ్రపండితు డయ్యాడు. ఉప్పుసత్యాగ్రహవార్తలు పత్రికల్లో చదివి తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. మనశ్శాంతికి దూరమయ్యాడు. సత్యాగ్రహుణ్ణి కాలేకపోయానే అని క్రుంగిపోయాడు. '““ఇక నాకర్తవ్యమేమి?” అని లోలోపలా మథనపడసాగాడు. చివరకు అంతరాత్మ “ఓయీ! గాంధీ నాయకత్వాన సాగుతున్న సత్యాగ్రహంలో పాలోలేకపోయానే అని నీవు పరితపింపవద్దు. కాంగ్రసుసివ గావించటానికి ఎన్నో మార్గాలున్నాయి. నేటి నుండీ గాంధేయసాహిత్య నిర్మాణానికే నీ కవిత్వాన్ని అంకితం చెయ్యి. ఈ సేవ సామాన్యంగాదు. కవితాసృష్టి కారాగార నివాసాని కేమాత్రమూ తక్కువగాదు.” అని ప్రబోధించింది ఆనాటినుండీ గాంధేయ సాహిత్య సృష్టియే ఆజన్మాంతమూ అపరిహార్య మయిన విధి అని సీతారామమూర్తి నిశ్చయించుకొన్నాడు. తర్వాత ఆయన ఏది రచించినా గాంధేయవాదమే చుక్కాని అయింది. అందువల్లనే కం. చేసిన సేవయు ద్యాగము వీసమ యగుంగాని కన్నువిచ్చిన పిదపన్‌ వ్రాసిన దంతయు నీకథ, నీసందేశంబ యని వినీతుండ నగుదున్‌

గాందీకవి 67 ఆని ఆయన చెప్పగలిగాడు. గాంధీజీ చితాభస్మాన్ని తీసికొని వచ్చే నైలును చూచి సీతారామమూర్తి మూర్చలో మునిగిపోయాడు. తేరుకొన్న తర్వాత ఆత్మసమీక్ష గావించుకొని ఈవిధంగా చెప్పాడు.

_ ఇ౮| నీబూదిన్‌ గొనితెచ్చు రైలుం గనుచో నేత్రమ్ము లంధమ్ములై బాబూ! మూర్చకుః జిక్కినాండ; మనయీ బంధమ్ము నేమందువో? నా బా గోగు సమీక్ష చేసికొనుచున్‌ నాండెల్ల వేసారితిన్‌; నీబంధుత్వము నాదుభాగ్య మను కొంటిన్‌ భక్తినమ్రుండనై. సీతారామమూర్తి “బాపూజీ ఆత్మకథ” :“మహాత్మకథ'” అనే రెండు మహావీర కావ్యాల్లో సంపూర్ణంగా గాంధీజీ చరిత్రను ఆవిష్కరించాడు. ఈ చంపూకావ్యాలు రెండూ ఆయన జీవిత తపస్సుకు ఫలాలని అతిశయోక్తి దోషం లేకుండా చెప్పవచ్చు. ఇవి రాశినిబట్టి కాకుండా గుణాన్నిబట్టి కూడా మహాకావ్యాలు. ఆత్మకథ అయిదుభాగా లున్నట్టిది. మహాత్మకథ _నాల్గుభాగాలున్నట్టిది. సీతారామమూర్తి “ఆత్మకధ'ను 3800 గద్యపద్యాల్లోనూ, ““మహాత్మకథ”ను 4500 గద్యపద్యాల్లోనూ రచించాడు. ఈరెండు మహావీరకావ్యాల్లోనూ ఆత్మకథా రచనం క్లిష్టం. గాంధీజీ తన ఆత్మకధకు "'సత్యప్రయోగచరితము'”' గ|6 5600 058) అలుల టి ఇథ్సు అని నామకరణం గావించాడు. ఆయన “నేను సత్య స్పరూపుండగు పరమేశ్వరుని పూజారిని. అతం డొకండే సత్యము. మిగిలిన దెల్లమిథ్య"” అని తన స్వీయ చరిత్రకు ముందు చెప్పాడు. అందువల్లనే ఈ గ్రంథంలో అంతటా సత్యానికి సంబంధించిన ప్రయోగాలే ఎక్కువగా గోచరిస్తాయి. ఇంతే గాకుండా గాంధీజీ తన రచనంగూర్చి చెప్తూ “ఇందు సత్యము కన్న ఖిన్నములనంబడు అహింసా బ్రహ్మచర్యాది నియమము లును, వీని శోధనములును రాగలవు. కాని సత్యమే నాకన్నిటీకన్న దొడ్డది. మజియు దీనియందు పెక్కువస్తువుల సమావేశము కలదు. ఆ

సత్యము. స్తూలముగా వాక్సత్యమే కాదు, భావ సత్యము కూడ. ఆసత్యము కేవల మస్మ్కత్కల్పనాగతసత్యమేకాదు; అది స్వతంత్రము సనాతనము :- అనగా సాక్షాత్‌ పరబ్రహ్మము.” అని అన్నాడు. ఆయన ఆత్మకథలో తన తప్పులను కూడా మూసిపెట్టకుండా లోకంముందు ఉంచాడు. ఇటువంటి ఆత్మకథను సత్యానికి క్షతి సంభవించకుండా కావ్యధర్మాలను పాటిస్తూ రచించటం కత్తిమీదిసాము.

రమణీయార్యాన్ని ప్రతిపాదించే శబ్దమే కావ్యం. దీనికి రసధ్వని అత్మ. కవి కావ్యాన్ని రచించేటప్పుడు పదప్రయోగంలో, సన్ని వేశకల్పనలో, పాత్ర పోషణలో, రసనిర్వహణలో బహుముఖమయిన, ఆపూర్వమయిన చాతుర్యాన్ని ప్రదర్శిస్తాడు. అతని భావనాశక్తి జౌచిత్యంతో అనేక విధాలుగా విహరిస్తుంది. ఆలంకారికమయిన వైలికూడా కావ్యనిర్మాణానికొక ముఖ్యాంగం. ఈ విధమయిన కావ్యతత్త్వానికీ, ఆత్మకథా తత్తాానికీ సహజంగానే అంతర్చేదం సిద్ధించింది. కవిభావనా శక్తి విశ్చంఖలంగా విహరిస్తే మొదటికే మోసం ముంచుకొని వస్తుంది. కవి మూలగ్రంథ తాత్పర్యం మీద చూపు చెదరకుండా నిల్పి తన రచనను సుందరకావ్యంగా రూపొందించవలసి ఉంటుంది. దీనికి తోడు మజకొకయిబ్బంది కూడా ఉన్నది. గాంధీజీ రచన 'అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని ఆవిష్కరిస్తుంది. తెలుగుకవి కూడా తదను ;గుణంగానే కావ్యాన్ని రచించాలి.

“మహాత్మకథః' అత్మకథవంటిదిగాదు. ఇది సీతారామమూర్తి స్వతంత్రసృష్టి ఆయన గాంధీజీ సారథిగా సాగించిన జాతీయోద్యమ చరిత్రను సికరించి, కాలక్రమా న్ననుసరించి రచించిన మహావీర కావ్యం. దీనిలో కవిభావనా శక్తికి స్వేచ్భ సిద్ధించింది. అయితే అది అతిచారంగా పరిణమింపకూడదు. గాంధీజ్సీ ఆయన అనుచరులూ ఆడినమాటలనూ, నడచిన నడతలనూ సత్యంమీద కన్నుంచి వర్ణించాలి. ఇరవయ్యో శతాన్టీ ఇతివృత్తం కాబట్టి కల్చనలకూ, అతిశయోక్తులకూ దానిలో తావులేదు. భారతీయభాషాకవులు రామాయణ మహాభారత కథలపట్ల స్వాతంత్ర్యాన్ని ప్రదర్శించి, కథామార్గాన మార్పులు చేసినట్టు, జాతీయోద్యమ కథకు కల్పనలు చేర్చి వన్నెలూచిన్నెాలూ పెట్టటం సాధ్యంగాదు. దీనికి ప్రయత్నిస్తే మహాపచారమవుతుంది.

గాంధీకవి 69 సీతారామమూర్తి ఆగర్చకవి. సహజంగా సత్యనిష్ట గలవాడు. త్రికరణశుద్ధిగా గాంధీజీ సిద్ధాంతాలను కలలో కూడా తప్పనివాడు. జాతీయోద్యమంలో శక్తియున్నంత మేరకు నలగినవాడు. అందువల్ల స్వాతంత్రోద్యమానికి సంబంధించిన భావనాశక్తి పుష్కలంగా పొంది, తాను స్వీకరించిన వస్తువుతో తాదాత్మ్యం చెందినవాడు. సంస్కృతాం ధ్రాల్లో పటిష్టమయిన పాండిత్యం సంపాదించినవాడు. తెలుగు పలుకు గుట్టుమట్టులు తెలిసిన అచ్చమయిన తెలుగునోరు గలవాడు. కాబట్టి వస్తునిర్వహణలో _ తారసిల్లిన అవరోధాలనన్నింటినీ అతిగమింప గలిగాడు. సామాన్యంగా కవులు, ప్రత్యీకంగా ఒక కథతు. తాము స్వీకరించటానికి కారణాలు వివరిస్తారు. కథానాయకుని జౌన్నత్యాన్ని ఆవిష్కరిస్తారు. సంస్కృత సాహిత్యంలో మురారి మొదలయినవారూ, తెలుగులో తిక్కన్న మున్నగువారూ ఈదారి క్రొక్కిన వారే. సీతారామమూర్తి ఆమహాకవుల ఆచారాన్ని అనుసరించాడు. తాను గాంధీజీ జీవిత చరిత్రను వస్తువుగా ఎన్నుకోటానికి హేతువులు చూపాడు. నాయకుడయిన గాంధీజీ ఘనతను కమనీయంగా వర్ణించాడు. “ఆత్మకథ'' “కృత్యాది”లో గాంధీజీ చరిత్రను ఇతివృత్తంగా గ్రహించటానికి కారణాన్ని ఈక్రింది విధంగా పేర్కొన్నాడు. సీ. ఏసూరినో పేరినో సుబ్చినో నిల్చి పచ్చిసింగారంబు పల్కుకంటిె, హేతువాదమ్మున కింత నిల్వంగ లేక బూతులబుంగలై, జాతివైర ములకు మతద్యేషముల కుపాధ్యాయులై, యౌదార్యమునకు దవ్వగుచు, నీతి రతులకెంతయు రోంత రాంజేయునట్టి పు రాణమ్ములన్‌ బూని వబ్రాయుకంటెం తీ. గాసులకు దాసుం డగుచు ముక్కడిని బొగడి కల్లకైతల నల్లుట కంటె, నిట్టి గుణగరిష్టుల దేశభక్తుల చరిత్ర చెప్పుట జగద్ధితం బైనచేంత గాదె.

70 తుమ్మల సీతారామమూర్తి ఈపద్యంలో సీతారామమూర్తి వ్యంగ్యంగా సమకాలిక కవుల పోకడలను చాటి తన విలక్షణత్వాన్ని వెల్లడించాడు. “మహాత్మ కథ" ““కృత్యాది*లో కూడా ఆయన కం. రాముని సత్యము, కృష్ణుని ప్రేమము, గౌతముని కరుణ పెనంగొని యోగి గామణి బాపూబతుకై మామక కవితాలతాసమాశ్రయ మయ్యెన్‌. అని చెప్పాడు. ఎన్నో యేళ్లు మహాత్ముని అనుచరులో ఒకణ్జిగా పని చేసిన వాణ్ణి కాబట్టి ఆయన జీవిత కథను కావ్యంగా రచించే దీమసం తనకు అబ్బిందని చెప్తూ చివరకు ఆయన కం. పరభాషా పరసంస్కృతి పర పరిపాలన విధా నిబర్లణ గాథా కరమైన గాంధిజీవిత మరిదికదా తెన్గుబాస నఖివర్ణింపన్‌. అని అన్నాడు. పోతన మహాకవి పోకడపోతూ కం. పలికెడిది గాంధికథయంు, పలికించెడివారు తెనుంగు బ్రజలంట, దీనిం బలికిన నూఅట యౌనంట పలికెద నింక నొండు మజచి బాపు చరిత్రన్‌. అని చాటుకొన్నాడు, కథానాయకుడయిన గాంధీజీ లోవెలుగునూ, జీవన తత్తాాన్నీ ఈరెండు మహావీర కావ్యాలోనూ, ఇతర కావ్యాల్లోనూ ప్రకరణానికి తగినట్లు సీతారామమూర్తి వర్చించాడు. ఎందరో విద్వాంసులు ఈ విశాలప్రపంచంలో బహుభాషల్‌ గాంధీజీ జీవితచరిత్రలు రచించారు. ఆయన సిద్ధాంతాలకు భాష్యాలు చేశారు. వీటిలో రచయితల చూపులను బట్టి భిన్నత్వం బహుళంగా గోచరిస్తుంది. సీతారామమూర్తి గాంధీజీని గూర్చి త్రాసినపద్యాల్లో ఆయన భక్తి భావం దోబూచులాడుతుంటుంది మయహాత్కుణ్ణీ ఆయన ఆత్మకథలో ఈక్రింది విధంగా వర్ణించాడు.

గాంధీకవి భే సి ఎవని పుట్టువు మహాకవిగేయవిఖ్యాతి సంధించె ష్టాందవ సంఘమునకు నెవని రూపంబులో రవణించె నద్వితీ యంబు సనాతనం బార్షకీజ మెవని సేవాత్యాగసవనంబు భారత మాతృదాస్యము. దూల్చుమంత్ర మయ్యె నెవనిధర్మంబు సర్వవసుంధరా ప్రజా సంతానమునకు మేల్చంతి యయ్యె తీ. విశ్చమానవ కల్యాణ విధివిధాత యీాతయే యంచు జయపెట్టె నెవని జగతి యట్టిగుణకంధి గాంధి మహాత్ముచరిత నాతలంపున మెఆసె. బుణ్యంబు విరిసె. మహాత్ముని చరిత్రం మనస్సులో మెదలేసరికి ఆయన “'పెన్నిధిం గనిన యర్థ్ధివలెం బులకాంకితుం” డయ్యాడట! దానిని పద్యకావ్యంగా రచించాలని నిశ్చయించి సరసాతీదేవికి మొక్కుకొన్నాడటః! అయితే “మహాత్మకథ""లో సీతారామమూర్తి దర్శించిన గాంధీజీమూరర్తి వేణు. కాలం గడచినకొలదడీ ఆయనకు బాపూజీ బాహ్యాభ్యంతర తేజస్సులు సంపూర్ణంగా సాక్షాత్కరించాయి. ఒక మహాభాష్యకర్త మాదిరిగా ఆయన గాంధీజీ జీవితానికి వ్యాఖ్యానం గావిస్తూ అత్యద్చుతమయిన ఈదిగువ పద్యం రచించాడు. దీనిని మొదట “శబల” _ ఖండకావ్యంలో చేర్చినప్పటికీ, తరువాత రచించిన, ““మహాత్మకథ' "లో కూడా స్వీకరించాడు. సీ. ఉత్తమవాగ్శి నా నొప్పారె, నురక గ ర్దించియా కాదు వర్జించి నుడులు అతిలోక బలసమంచితు. డయ్యె. గండలు పెంచియా కా దలయించి యొడలు చిరజయత్రీధురంధరు. డయ్యె, రిపుల ఖం డించియా కాదు పండించి కృపలు

72 తుమ్మల సీతారామమూర్తి అమృతత్వమందె యాగము లాచరించియా కాదు నిష్కామ యోగము వరించి తే. అతండు సామాన్యుం డెట్లు? వీరత కపూర్వ్చ జీవములు వోసి వాసి దెచ్చిన మహాత్ముం డతని నడచినబాటల యందు నడిచి పందయును విక్రమక్రమాస్పందు. డయ్యె, మహాభారతంలోని శ్లోకాన్ని. తెలిగించి ఆయన గాంధీజీ కార్య శక్రమలక్ష్య్యాన్ని స్పష్టం జేశాడు కూడా. తే. రాజదండము వలదు, స్వార్గంబు వలదు జనన మరణాదు లంటని జగము వలదు తెజపీ లేనిదిగుళ్లతో దేవురించు జనుల. దేర్చుట వలయు నాకనియె నతండు. బుద్ధభగవానుడూ, బాపూజీ సమానులే యని సీతారామమూర్తి అభిప్రాయం. అందు వల్లనే ఆయన ఈరీతిగా వక్కాణించాడు. కం. ఆకాలమ్మున గౌతముః డీ కాలమునందు గాంధి యిద్దణు హింసా వ్యాకులజగతికి శాంతి శ్రీకరులు దయా విధేయజీవన నిరతుల్‌. సమయం వచ్చినప్పుడెల్లా సీతారామమూర్తి తనకావ్యాలో అన్నింటి లోనూ మహాత్ముని స్వరూప స్వభావాలను వర్ణిస్తూనే వచ్చాడు. ఆయన ఏది చెప్పదలచినా ముందు ఆయనకు గాందధీజీయే. గుర్తుకు వస్తాడు. గాంధీజీ నాయకత్వం క్రింద సాగిన స్వాతంత్రోద్యమ లక్షణాలకు కవితారూప మిచ్చిన ““అమరజ్యోతి” కావ్యంలో తే. ఇతండహింసారణ వ్రతుం డితం డఖిద్యు సత్య కవచుండు, భువనైక శాంతిదూత యుగయుగమ్ములు కల్చముల్‌ ముగియుంగాక తరణియైై మింట మెజయు నీతని పతాక.

గాంధీకవి 73 తీ. మనుజుండవు గావు, నీవు కోమటివి గావు బడలిపోయిన భారతీయుండవు గావు కావు గాంధివి. లోకలోకముల వెల్గు. జూపు నిరవధి కామరజ్యోతివోయి! అని ప్రశంసించాడు. ఇక “సందేశ సప్తశతి” కావ్యంలో తే. గుడుల కేగలేదు, గుహలకుం బోలేదు ప్రజల నడుమ. గడపె బదుకు నెల్ల ఒడలు దేశసీవ, కెడంద రాముని సేవ కప్పగించి ముక్తినందె గాంధీ అని ఆ కర్కయోగిని ఆయన వర్ణించాడు. ఈ పద్యం బాపూజీ జీవిత సారానికి అక్షరరూపం.

““అత్మకథ'' ““మహాత్మకథ'"ల అవతారికలు కొద్ది మార్పులతో ప్రాచీన కావ్యావతారికలను పోలినటువంటివే. ఆత్మకథా ప్రారంభంలోనే సీతారామమూర్తి

ఉ. ఎవ్వనికొల్వు భద్రముల

కెల్ల నిదాన, ముదారతామయుం డెవ్వండు, సర్వలోకముల నేలు మహఃపరిపూర్ణమూర్తిమై చెవ్వండు వాబ్బునః క్రియల కేర్పడ రానిమహాత్ము6 డాద్యుండై యెవ్వం డెసంగు, సత్యమన నెవ్వండు వాని భజింతు నిచ్చలున్‌. అని సత్య స్వారూపుడయిన భగవంతుణ్ణి సేవిస్తానన్నాడు. ఆత్మకథ సత్యప్రయోగ _ చరితమనీ, గాంధీజీ భగవంతుణ్ణి సత్యరూపిగా సంభావించాడనీ మనం గుర్తుకు తెచ్చుకొంటే ఆయన ఈపద్యంలో కావ్యవస్తువును నిర్దేశించాడని "గమనిస్తాము. కావ్యాదిని వస్తుసూచన గావించటం ప్రాచీనమహాకవుల సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని

74 తుమ్మల సీతారామమూర్తి

సీతారామమూర్తి పాటించాడు. ఆత్మకథ శైలిలో ఎక్కడా సడలింపు కనబడదు. ఇది వస్తువుకు దీటుగా ఉన్నది. కట్టమంచిరామలింగారెడ్డి సీతారామమూర్తి శైలి “ఇంచుమించు ఆంద్రమహాభారత ప్రతిబింబము” అని నిర్ణయించాడు. ఈనిర్ణయం వాస్తవం. తిక్కన భారతంలోని పద్యాల పోకడలు ఆత్మకథలో గోచరిస్తాయి. ఒక్కొక్కచోట సీతారామమూర్తి పట్టుపట్టి తెలుగు మాటలను బహుళంగా ప్రయోగించాడు. ఆయన ఎల్జిసముద్రాన్ని “కెంగడలి”' అన్నాడు. 'కోర్టును “తీర్పునెలవు” “పాడిపట్టు” అన్నీ ష్టైకోర్టును ““జగాపాడిపట్టు'” “నెణాపాడిపట్టు” అనీ తెలుగు మాటల్లో చెప్పాడు,

“మహాత్మకథ'” జాతీయోద్యమ చరిత్ర కాబట్టి పాఠకులను పరవశింపజేస్తుంది. ఇతివృత్తంతో తాదాత్మ్యం చెందిన సీతారామమూర్తి వరవనా శిల్బంచేత పాఠకులుకూడా తాదాత్మ్యం అనుభవించేటట్టు

గాడు. జొ; బట్టి జాతీయోద్వ్యమఘటాలను కొన్నిటిని సంగ్రహంగానూ, అ ల పల వర్ణించాడు. సు సత్యాగ్రహఘట్టాన్ని ఆయన విస్తృతంగానే చిత్రించాడు. 19%7లోన్‌ వృత్తాంకాలను 96 గద్యపద్యాలో తీర్చితీద్దాడు. ఆంధ్రుల స్వాతంత్ర్య సమరగాథలను భావావేశంతో గానం చేశాడు. కన్నాగంటి హనుమంతు తెల్లదొరలతో _ ప్రలికినపలుకుల్లో ఈ _ లక్షణం కొట్టవచ్చినట్టు కనబడుతుంది. పాంచాల దురంతాలు, విదేశవస్తదహనం.. గాంధీజీ భారతదేశపర్యటనం, ఆమహాత్కుడు 1947లో సాగించిన బీహారు బెంగాలు ప్రాంతాల సంచారం మొదలయిన సన్నివేశాలను సీతారామమూర్తి రసవంతంగా వర్ణించాడు,

పత్రికా సంపాదకుడూ, రచయితా అయిన కీ.కే. నార్ల వెంకటేశ్చరరావ మైసూరు విశ్చవిద్యాలయ భాగమయిన "1196002 01 కం2క 506169 సంస్ల ప్రకటించిన "6జ6్కు! 2 164120 సలుల" అను వ్యాస సంపుటిలో తెలుగు సాహిత్యం మీద గాంధీజీప్రభావాన్ని గూర్చి ఓక వ్యాసం రచించాడు (పుటలు 257-272). దానిలో ఆయన బతారామమూర్తి రచించిన ఆత్మకథనూ; మహాత్మకథనూ ప్రస్తావించి చివరకు ఈవిధంగా అన్నాడు (పుట 263).

గాంధీకవి 75 కంట 0 అలుంం:ంం0౧ 206 జ(60/ 0% 14100 జాం 116 98008 90106 0512020051, 631 [౧6 15 8600ల ౪62% 11 00660 81082600". ఈ వాక్యంలో మొదటి భాగం సత్యం. రెండోభాగం అసమ్మతం. సీతారామమూర్తి వస్తుతత్తాన్షన్ని బట్టి రచన గావించాడని ఈ రెండు మహావీరకావ్యాలను సూక్ష్మంగా పరించిన సహృదయు డెవడయినా గ్రహిస్తాడు. కవిభావనా శక్తి ప్రకరణోచితంగా భాసిల్లుతుంది. ఇది కావ్యంలో అనేకవిధాలుగా ఆకృతి వహిస్తుంది. ఒక ఉదాహరణం చూస్తే దీని తత్త్వం బోధపడుతుంది. మిత్రుడొకడు గాంధీజీని వేశ్యాగృహానికి చేర్చాడు. ఈ సందర్బంగా మాతృకలో “ఈపాపగుహలో నాకు కనులు కనంబడలేదు. నోటమాట రాలేదు. నేను పణుపుమీద కూర్చింటిని గాని నాన్లోరు బిగిసికొని పోయెను. ఆమె ఎంతోసేపు ఓపిక పట్టలేక తిట్టుచు తిమ్ముచు ద్వారము చూపెను. దానితో నా మగతనమునకు కళంకము కలిగినటులు సిగ్గుపడి “భూమి తనలోనికి దారి యీరాదా?” అనుకొంటిని” అని మాత్రమే ఉన్నది. సీతారామమూర్తి సత్యానికి భంగం వాటిల్లకుండా భావనా శక్తితో ఈఘట్టాన్ని ఈవిధంగా తీర్చిదిద్దాడు. (ఆత్మకథ, పుట 36) సీ. ఆ పాప కందరమం దేమి సెప్పుదు6 గన్నులం జీంకటుల్‌ క్రమ్ముకొనియె మందునకే నొక్కమాట వెల్వడ దయ్యెం జెమరుచే నొడలెల్లం జెమ్మగిల్లెం గంపమ్ము హెచ్చె, నగ్గల మయ్యె గగ్గోలు సెజ్జపై బోగపుం జెలువ కెలన నధివసించితిం గాని యంకిళ్లు బిగువయ్యె; నాకొమ్మ తడ వోర్వలేక తిట్టి

76 తుమ్మల సీతారామమూర్తి తే. నెట్టివాకిలి సూపె; నప్పుట్టునందు వచ్చె నాపుంస్త్వ్రమున కయో! మచ్చయనుచు సిగ్గువడి। తల్లి! వసుమతీ! శీఘ్రముగను దారి నొసంగుము నా కంచు. దల్లడిలితి. మూలం కంటె ఈపద్యం మిన్నగా ఉన్నదని సహృదయుడు తప్పక గ్రహిస్తాడు. రామాసక్తుడై వేశ్యాగృహానికి వెళ్లినప్పటికీ కామాశక్తు డయిన గాంధీజీ ఆకారాన్ని సీతారామమూర్తి కన్నులకు గట్టేటట్లు చేశాడు. ఆయన కావ్యాలను చదివి ఆనందించటానికి ముందు పాఠకునకు గాంధీజీపై గౌరవం కలగాలి. '““మహాత్మకథి*కు భరతవాక్యం పలుకుతూ సీతారామమూర్తి చం. పతిత జగ త్సముద్ధరణ భారము నౌదలం దాల్చి, ధాత్రిపై బ్రతికినయన్నినాళ్లు పలు భంగులం గర్మము లాచరంచి, తు ట్టతుదకు నిర్మమత్వము క డల్కొన బంధము లూడ్చి, భారతీ యతకు మెణుంగు పెట్టిన మ హాత్మ; భవత్కథ మమ్ము. దేర్చుతన్‌. అని అశాంక్షించాడు. పతిత సముద్దరణం గావించీ, కర్మయోగం ఆవలంబించి, నిస్సంగత్వం పాటించీ గాంధీజీ భారతీయత్నానికి వన్నైపెట్టాడని ఆయన చాటాడు. మహాత్మునకు దైవసంపదగా ఉన్న ఆమూడూ భారతీయసంస్కృతి లక్షణాలని ధ్వని. ' ఆమహాత్ముని జీవిత చరిత్రను రెండు చహావీరకావ్యాలుగా రచించి సీతారామమూర్తి త్తే గాంధియుగమునం బుట్టితి, గాంధినడుపు నుద్యమంబుల నలంగితి నోపినంత గాంధి నీక్షించితిని, గాంధి కవిత వ్రాయం గంటి, నీజన్మమునకు నీపంట చాలు. అని పరమసంతృష్టి పొందాడు.

రాఫ్ట్రకవి సీతారామమూర్తి ఒకసారి ఏదోపనిమీద ఒక విశ్చవిద్యాలయకుల పతి దగ్గరకు వెళ్లాడు. శాంతమూర్తి అయిన ఆ కులపతి ఆయనను “మ్సీరెవరండీ?”' అని ప్రశ్నించాడు. వెంటనే సీతారామమూర్తి ఆశువుగా అ.వె. రాష్ట్రసిద్ధికొఅకు రక్టమ్ము గార్చిన కవిని నేను, గాంధికవిని నేను బడలి బడలి తల్లిబాసకూడెము సేయు కవిని నేను, దేశికవిని నేను. అని పద్యంతో బిగువు సడలకుండా సమాధానం చెప్పాడు. ఈపద్యం సీతారామమూర్తి తన కావ్యవస్తువునూ, కవితాభాషనూ సమీక్షించి వ్యక్తీకరించిన సారానికి స్వరూపం. ఆయన గాంధికవితను రాష్ట్రకవితకంటె పూర్వమే రచించినప్పటికీ, మొదట రాష్ట్రకవిగా తర్వాత గాంధికవిగా రాణించాడు. సీతారామమూర్తి _ రాష్ట్రకవితకు తార్కాణాలుగా. నిలిచిన కావ్యాలు. రెండు. వాటిల్లో మొదటిది “రాష్టగానము”.. రెండోది “ఉదయగానము*”'. ఆంధ్రులు రాష్ట్రం సిద్ధించటానికి పడినపాట్ట్లూ, ఇంటా బయటా వారికి ఎదురయిన ఇబ్బందులూ ప్రథమకావ్యంలో కవితా రూపాన్ని పొందాయి. రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలుగువారు ఎదుర్కొన్న సమస్యలు ద్వితీయకావ్యానికి ఇతివృత్తనుయినాయి. సీతారామమూర్తి రాష్ట్రగానం గావించేనాటికి తెలుగు సాహిత్యంలో రాష్ట్రకవిత లేకపోలేదు. రాయప్రోలు సుబ్బారావు 1914లోనే ప్రాచీనాంధ్ర ప్రాభవాన్ని వర్చిస్తూ పద్యాలు రచించాడు. సీతారామమూర్తి. ఆపద్యాలు చదివి. ఆంధ్రుల వైభవాన్ని గహింపగలిగానని “సందేశ సప్పశతి"లో ఆ.వె. నాతెనుంగు జాతి నడతలోం బలుకులోః గడిమిలోం గడింది గౌరవమ్ము సంతరించుకొన్న జాతిరా యనుకొంటి రాయప్రోలు వారి రచన లరసి

78 తుమ్మల సీతారామమూర్తి అనే పద్యంలో స్పష్టంగా చెప్పాడు. రాయప్రోలు వారి మాదిరిగా ఇతరకవులూ ఆంధ్రుల ప్రశస్తిని ప్రకటించారు. అయినప్పటికీ రాష్ట్ర భక్తి కవిత్వం రచించిన ఇతరకవుల పోకడలు వేరు. సీతారామమూర్తి ధోరణివేరు. ఆయన అన్యకవుల మాదిరిగా పురాతనాంధ్రవైభవాన్ని పుష్కలంగా కొనియాడిన వాడే. కాని అంతటితో ఆయన ఆగిపోలేదు. సమకాలిక మయిన ఆంధ్రోద్యమాన్ని వస్తువుగా స్వీకరించి అత్యధికంగా రాష్ట్రభక్తి కవిత్వం రచించాడు. ' ఈపని ఇతరకవులు చేయలేదు. ఇదే సీకారామమూర్తిని ఇతరకవులనుండి వేరు చేసింది. ఇండీ కాకుండా ఆయన మాదిరిగా ఇతరకవు లెవ్వ్చరూ ఆంధ్రదేశంతో తాదాత్మ్యం భజింపలేదు. “రాష్టగానము” “మనవి”లో

“తెలుంగు దేశము, తెలుంగుభాష్క, తెలుంగు చరిత్ర, తెలుంగు ప్రజ, తెలుంగు సంస్కృతి అని నంతనే నాయొడలు పులకరించును. ఇవి నాకు ప్రాణకల్ప విషయములు. “నేను తెలుంగు వాండను"” అను నహంకారము నా కెక్కువ. ఈ యహంకారమేనన్ను, కవిని చేసినది. ఇట్టి నాజాతియిి, నాభాషయు పరతంత్రములై పరకీయసంస్కారము నాశ్రయించి ప్రాచీన గౌరవమును కోల్పోయినపి కదా। ఇది-నామనస్సులో అనుక్షణముగా కేంగునట్టి యారాటము. ఈయారాటమునకు నాజీవుండు కదలినాండు. ఆకదలికయే రాష్ట్రగానము”.

అని వక్కాణించాడు. ఈవిధంగా ఏయితరాంధ్రకవీ చెప్పికోలేదు. ఈ పలుకులు అతివేలమయిన అంధ్రాఖిమానంతో కూడిన సీతారామమూర్తి భావావేశాన్నీ జీవుని వేదననూ పట్టి చూపిస్తున్నవి. అందువల్లనే ఈ రెండు తత్త్వాలనూ రాష్టగానంలోని ప్రతి పద్యంలోనూ పాఠకులు పసిగట్తారు. ఆ పద్యాలు చదివి వారుకూడా భావావేశానికి వశులవుతారు. వేదనను అనుభవిస్తారు. సీతారామమూర్తి వీరకవియ్లై రాష్ట్రగానం రచించాడని నిర్ణయిస్తారు.

మతి “ఉదయగానము”' త్తీరు వేరు. ఇది రాష్ట్రసిద్ధి తరువాత జనించిన కావ్యము. సీతారామమూర్తి ఈకావ్యమును గూర్చి

“తలుగు నాటి యభ్యుదయముపట్ల దెలుంగువారి కెల్లరకు నాదరానురాగము లుంట సాజము. అది ధర్మము కూడను. నేనీ

రాష్ట్రకవి 79 ధర్మమును గవితారూపమునం _ బాలింపం జూచితిని. రాష్ట్రసిద్ధికై పరితపించుచు నానాండు రాష్ట్రగానము నాలాపించితిని. రాష్ట్రవృద్ధికై యువ్విళ్లూరుచు నీనాం డీయుదయగానమును బాడితిని.

మహావీర పొట్టి శ్రీరాములుగారి బలిదానముతో రాష్ష్రోదయ మైనది. దీనితో నుదయగానమును సాగినద్హి- కావున నాంటినుండి మొన్నమొన్నటి (25-10-54) దనుక మనగడ్డలో. దలయెత్తిన రాష్ట్రీయ సమస్యలు కొన్నింటి యౌంగాము లిందుం దడవితిని. దేశవికాసమునకై నాకుం దోంచిన సూచనలును గావించితిని. మనరాష్త్రము భాషామూలక్ష మగుటం దెనుంగుబాస పెంపు సొౌంపులంగూర్చియు నిందుం జర్చించితిని. ఈకృతి రాష్టగానమునకుం జెలియలు. అక్కగారికి దక్కిన కీర్తి యీమెకును దక్కును గాక"?

అని చెప్పాడు. రాష్ట్రావతరణం జరిగింది కాబట్టి ఈకావ్యం రచించేనాటికి సీతారామమూర్తిలో భావావేశపు పొంగులు చల్ల్తారినవి. రాష్ట్రం సిద్ధించటానికి ఆనాడు ఆంధ్రుల అఖినివేశముతోపాటు ఇతరుల సుహృద్చావముకూడా కావాలి. ఈ రెండింటిలో లోటు వాటిల్లినపుడు సీతారామమూర్తి నిప్పులు చెరుగుతూ కవిత్వం రచించాడు. ఈనాడు రాష్ట్రం వృద్ధిపొౌందటానికి ఒక్కతెలుగువారే కారకులు. దీనిలో ఇతరుల ప్రమేయం లేదు. తెలుగువారు క్షుద్రభావాలకు స్వస్తి చెప్పి, వివేకంతో త్రికరణశుద్ధిగా ప్రయత్నిస్తే రాష్ట్రం సర్వతోముఖంగా అభ్యుదయాన్ని సాధిస్తుంది. ఉదయగానంలో సీతారామమూర్తి చేసిన ప్రబోధ మంతా ఇదే. ఆయన అనాడు అహంకారంతో కూడిన. ఆవేశపరుడు. ఈనాడు ఆలోచనతో కూడిన అంతర్ముఖుడు.

రాష్ట్రగానంలోని కవిత్వ మంతా ఆఅంధ్రుల పర సంస్కృతి వ్యామోహం, ఆంధ్రోద్యమ స్థితిగతులూ అనే రెండంశాలను ఆశ్రయించి ఆవిర్చవించింది. ఇతరకవుల మాదిరిగా సీతారామమూర్తి అనేక సీస పద్యాల్లో ప్రాచీనాంధ్ర ప్రశస్తిని పరమరమణీయంగా వర్ణించాడు. ఆసీస పద్యాల నిర్మాణంలో ఎన్నో సాగసులు చూపించాడు. ఈ శతాబ్దిలో ఇంగువ కట్టిన గుడ్డ మాదిరిగా అయిన ఆంధ్ర దేశంలో ఇంకా ఆపాత వాసనలుండటం ఆయన _ గుర్తించాడు. ఆంధ్ర మేధావులనూ, ఆంధ్రనాయకులనూ కొండాడి తుదకు

80 తుమ్మల సీతారామమూర్తి “తారకావర్తి కుముదబాంధవునియట్లు వెలుగు నెచ్చోట నున్న మాతెలుంగువాండు"” అని గడకట్టి గంట వాయించాడు. అయిడీ తెలుగువాడు తనచరిత్రను విస్కరించాడు. తనభాషను త్రోసిరాజన్నాడు. తన కట్టూబొట్టూ మరచి పోయాడు. తనవారి పాడ గిట్టని వాడయ్యాడు. పరాయివారి చరిత్రల, భాషల మోజులో పడిపోయాడు. చివరకు పౌరుష చిహ్నాలయిన మీసాలను గొరిగించి “ఫ్రెంచి కటింగు”గా తిద్దించుకొన్నాడు. ఈ అనాంధ్రత్వం _సీతారామమూర్తికి మనస్తాపం కలిగించింది. ఇక అక్కడనుండి ఆయన చెలరేగాడు. సీ పాటలీపుత్రమ్ము కోటకొమ్మలమీందం 'దెలుంగు జెండాలు నర్చించునాండు డీల్టీశు నెదిరి చెండిన తెల్గు విలుకాండ్రు నవలక్ష లోరుంగల్‌ కవియునాండు రాచూరు కదనమం దేచి తళ్‌తళమంచుం దెలుంగు జోదులకత్తి వతిరుగునాండు అల చోళపాండ్య భూముల దెల్లుసరకార్ల పనుపు సూయాణమై ప్రాంకునాండు తే. చూచి సంతోషభారంబు మోచి, శిరము నూయ భాగ్యంబునకు నింత నోంచలేక యేల పుట్టితి నిపుడిసీ! యేటి బ్రతుకు కటకటా! దాంటిపోయె బంగారుయుగము. ఇదీ ఆయన వేదన. ఇంకా తెలుగు తల్లిని సంబోధిస్తూ బిడ్డలకు ప్రాచీన చరిత్రనంతా బోధింపుమని కోరాడు. సీ. ఖండించెనా ఘోరఖడ్గధార నితండు మగధ సినావ్యూహ మండలంబు నడిపించెనా ఆల్గునాంటి శిల్బ్పము మోయు నౌక లీతండు రోము నగరమునకు శ్రమియించెనా యితం డమరావతీకళా

రాష్ట్రకవి. త పరిషత్తులో కాస్తపాఠములకు' ఆర్చ్పించెనా పద్యహారావళి నితండు కనకాఖిషీకంబు గన్నకవికి, తీ. త్రాగెనా రామభక్తిమైం ద్యాగరాజు క్రుమ్మరించిన గీతామృతమ్ము నితండు పూర్వ సంస్కార దూరుండై పుట్టుకతన, వేండు చున్నాండు వివరింపవే: సవితి! తెలుగువాడు తనవేషభాషలను ' విసర్టంపరాదని సీతారామమూర్తి తపించాడు. ఆంధ్రకళాకారులను గుర్తింపకపోవటం ' అధర్మమని అక్రోళించాడు. కులభేదబుద్ధితో యోగ్యులయిన మనీషులను మన్నింపక పోవటం దుర్చరమన్నాడు. ఆంధ్రసంస్కృతి నాదరింపని జాతికి రాష్ట్రసిద్ధి కల్ల అని ఎలుగెత్తి చాటాడు. ఆంధ్రరా మ్రైద్యమ చరిత్రను సూక్ష్మంగా పరోలిస్తే తమిళుల రాజకీయ చాతుర్యమూ, జాతీయ నాయకుల ఉదాసీనత్వమూ, ఆంధ్రుల అనైకమత్యమూ _ ప్రధానకారణాలని పక్షపాతబుద్ధి లేని పరిశోధకు డెవడయినా గ్రహిస్తాడు. ఇక సీకారామమూర్తివంటి. రాష్ట్రకవి తెలిసికొనటం ఆశ్చర్యంగాదు. ఉమ్మడి చెన్నరాష్ట్రంలో ఒదిగియుండటం వల్ల తెలుగువారికి ఒరిగేదేమీ లేదన్సి ఆయన నిర్ణయించుకొన్నాడు. తమిళప్రాంతాభివృద్ధీ ఆంధ్రాభ్యుదయమూ ఒకటిగావన్నాడు. తమిళుల పొత్తు వలదని వాదించాడు. సీ. తిరుచునాపలి తంజవురులందు రేడియో పెట్టిన మనకేమి యుట్టిపడును పైకరా మెట్టూరు ప్రాజెక్టులను లెస్స. కట్టిన మనకేమి పొట్టనిండు అయ్యర్లు మొదలియా ర్లధికారములు నిర్వ హించినంతనె మనకేమి యొరగు ద్రవిడభాషా నిఘంటువు సిద్ధమైనచో బాపురే! మనకేమి పండువగును

త. అణ్జమల' విశ్చవద్యాలయమ్ము మివ్లులం బుష్టినందిన మనకేమి ప్రోగువడును. చెప్పుకొననేలు యస్పిరోః సిగ్గుచేటు సైంపలే మింక నుమ్మడి,కాళురంబు. సీతారామమూర్తి తమిళులపట్ల ఏమా'త్రమూ మోమోటం చూపలేదు. ఆయన వారిని పరిహసించాడు. చెన్నపట్టనం 'తెలుగువారిదే అంటూ చారిత్రిక సాక్ష్యాలు త్రవ్వి' తలకెత్తాడు. నెల్లూరు మాదే అని వాదించిన తమిళులకు తెలుగుర్తాజులు పాలించిన మధుర తంజావూరులు మాకిచ్చి నేల్లూరున్లు మీరే త్తీసికొనండని సమాధానం చెప్పాడు. "= “ఏవేవో కుంటిసాకులు 'ఇెప్తూ ఆంధ్రరాష్ట్ర నిర్మాణాన్ని వాయిదా వేయటం - మంచిదని " బుజ్జగించిన జాతీయ నాయకులను కూడా సీతారామమూర్తి వదలిపెట్టలేదు. ఆయన సుభాస్‌ చంద్రబోసునూ, వల్లభాయ్‌ పటేలున్తూ _వ్యంగ్యంగా విమర్శించాడు. ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి ఆంధ్రనాయకులు జాతీయ నాయకుల, దగ్గరకు ద్దేవురిస్తూ రాయబారాలు నడపటం _ఆయన కెంతమాత్రమ్లూ ఇష్టం లేదు. -= “యాచనాదైన్య మెణుంగని యాంధ్రజాతి

  • యింత దిగజాజునే యెంత వింత పుట్టె? అని - ఆయన ముక్కుమీద వ్రేలు వేసికొన్నాడు. ఒకానొక ఆంధ్రనాయకునకు అన్యాయం జేశాడని నిశ్చయించిన సీతారామమూర్తి గాంధీజీని కూడా తూర్చారబట్టాడు. కాని తర్వాత ఆయాంధ్రనాయకుని స్వభావాన్ని చక్కగా తెలిసికొని మహాత్ముణ్ణి విమర్శించినందులకు పశ్చాత్తాప పడ్డాడు. ఆంధ్రరాష్ట్రసిద్ధికి ఆంధ్రనాయకు లేనాడూ ఒక త్రాటిమీద నిలబడి ప్రయత్నింప లేదు. వారిలో చిత్తశుద్ది కొరవడింది. ఉమ్మడి చెన్న రాష్ట్రంలో తమిళనాయకులతో తుల్యింగా వారు -వ్యవహరింపలేక పోయారు. అఖిల భారతదేశంలో జాతీయ నాయకుల మాటల కెదురాడలేకపోయారు. ఒక్కొక్కసారి స్వప్రయోజనాలను రాష్ట్ర నిర్మాణంకంటె ముఖ్యంగా సంభావించారు. దత్తమండలాల వారికి

రాష్ట్రకవి వ! కోస్తాజిల్లాల నాయకులపట్ట్ల నిరాధారమయిన సందేహాలు జనించాయి. వెంటనే అప్రుతులు వినిపించాయి. వారు ప్రత్యేకరాష్త్రం కావాలన్నారు. సీతారామమూర్హి అవధుల్లేని ఆవేదనతో పదవీవ్యామోహం గల ఆంధ్ర నాయకులను దుయ్యబట్టాడు. సర్కారు జిల్లాలవారిపట్ల సందేహాలు పెంచుకోవద్దని సోదర పశ్చిమాంధ్రులకు సుద్దులు చెప్పాడు. సమస్తాంధ్ర దేశమూ రాయలసీమయే అని సహేతుకంగా వివరించాడు. దత్తమండలాలు ప్రత్యీకరాష్ట్రంగా అవతరిస్తే, అర్థికపుష్టి సమకాూడ దన్నాడు. ఆంధ్రేతరుల కుతంత్రాలకు బలికావద్దని హెచ్చరించాడు.

ఈరీతిగా సీతారామమూర్తి రాష్ట్రసిద్ధికి ప్రయత్నించిన ఆంధ్రజాతి ఆకాంక్షలూ, ఆవేదనలూ ప్రతిబింబించేటట్లు రాష్టగానం రచించాడు. ప్రఖ్యాత పత్రికా సంపాదకుడూ, సాహికీవేత్తా శ్రీకోలవెన్ను రామకోటేశ్వరరావు అణ్యామలై విశ్వవిద్యాలయ రజతోత్సవ సంచికకు (9-2-1956) వ్రాసిన ““నవ్యాంధ్రకవిత్వంలో జాతీయవాదం” అనే వ్యాసంలో (పుట 87) రాష్ట్రగాన కావ్యాన్ని ప్రస్తావించి ఈవిధంగా అన్నాడు.

“06 షం082 జాజులు 0 గంముంజ& 5648 సజు వచంం[0/ 0|౦౪ర20/ 15 2 06246గ1 అం10096 0116 ౧261060 1961088 ౦€646 శరము 206 04162 662013 107 6 మరుల. రాష్ట్రగానాన్ని ఇంతకంటె మిన్నగా ఎవ్వరూ తూకంవేయలేరు.

“ఉదయగానము”' ఆంధ్రరాష్ట్రకొఅకు ఆత్మార్చణం గావించిన మహావీర పొట్టి శ్రీరాములకు సీతారామమూర్తి చేసిన పద్యపూజతో ప్రారంభమవుతుంది. ఆంధ్రరాషైావతరణకై ఆదినుండీ_ పాటువడిన సేవాశీలురను ఆయన భక్తి భావంతో స్మరించాడు. నలఖైయేళ్లపాటు కష్టపడిన తెలుగువారికలలు ఫలించి ఆంధ్రరాష్ట్రం అవతరించినప్పటికీ నాయకులు సుస్థిర ప్రభుత్వాన్ని ప్రతిష్టింపలేకపోయారు. ఈ చేతగాని తనాన్ని చూచిన సీతారామమూర్తి మనస్సు చివుక్కుమన్నది. పట్టుదలలకు పోవద్దనీ, పదవీ వ్యామోహంతో జాతికి మచ్చలు తేవద్దనీ, రాజుకూ బంటుకు ఒకనీతియే ఉండాలనీ, గాంధీజీని గుర్తుంచుకొనండనీ ఆయన ఉద్దాటించాడు.

84 తుమ్మల సీతారామమూర్తి అ,వె. దొడ్డతలథతు లున్నండ్డిళైనను, మాల బిడ్డకైన నిమ్ము పెత్తనమ్ము కులము లింక నిల్వంగల వటోయీ! వేరు పురువు షడియె వాని పరువు సెడియె. అని ధర్మోపదేశం చేశాడు. అంటరానివా డెవడో ఈక్రింది విధంగా నూతన నిర్వచనం గావించాడు మ. మతమేలా కులమేల కల్పితము లీ మర్యాద లీశాస్త్రముల్‌ కతలంచుం బ్రవచించి పెత్తనము .రాంగా నాకు నామామకున్‌ వితకున్‌ బిడ్డకు బావకున్‌ మజందికిన్‌ వీఠంబు దె చ్కుంచుసి బ్పితివో నాడినవా6 డొకండ మన కస్పృశ్యుం డవాచ్యుం డింకన్‌ కం. అచ్చపు రాగము త్యాగము రెచ్చిన నాండే కదా తరింతురు తెల్లుల్‌ అని హితోక్తులు పలికాడు. రాజధాని, నదుల ప్రాజెక్టులు మొదలయిన వానిని నిర్ణయించటానికి సమబుద్దితో వ్యవహరించండని వక్కాణిం చాడు, మహిళలకు మంత్రి పదవులు కల్పించండని కోరాడు. రాష్ట్రం పాలిమేరల తగాదాలను మెలకువతో పరిష్కరించండని హెచ్చరించాడు. ఆంధ్రరాష్ట్ర సీమావివాదాల సందర్బంగా సీతారామమూర్తి చెప్పిన మాటలు ఆయన హృదయపరివర్పనాన్ని రుజువు చేస్తున్నాయి. కర్ణాటులు బళ్లారి మాదన్నారు. తమిళులు చిత్తూరుజిల్లాలో మాగ్రామాలున్నా యంటూ తిరుత్తని మాదే నన్నారు. సీతారామమూర్తి బళ్లారిని ఆంధ్ర రాష్ట్రంలో కలిపివేయాలని ప్రాయోపవేశం ప్రారంభించిన తేతల్‌ కామిరెడ్డిని కొనియాడాడు. దానిని మైసూరు రాష్ట్రంలో చేర్చటాని కంగీకరింపమని పట్టుపట్టిన బసప్పనీడునూ, గంగప్పునూ మెచ్చుకొన్నాడు. ఇక ఆయన తమిళుల నుద్దేశించి '“వెనుకటిసుద్దులన్నీ నడివీధిలో పెట్టను. మనం పరస్పరానురాగంతో జీవించాలి. మీరూ, మేమూ, కర్ణాటులూ, కేరళులూ

రాష్ట్రకవి 85 మొనమొన్నటి దాకా ఒక పంచనే ఉన్నాం. మనం మూరకూ బారకూ చెట్టుకూ. గుట్టకూ మొత్తులాడు కోవద్దు. రేపు మొగమొగాలు చూచుకోవాలి'” అని మంచిమాట చెప్పాడు. ఇంకా ఈవిధంగా అన్నాడు.

చం. తడికలు పెట్టి ప్రాయ్యి నొక దానిని బెంచిన మాత్ర నన్న త మ్ముండు సెడం దమ్ము. డన్నసెడ ముచ్చటంజూపునె? మీకు నూక లె ద్దడి గద, కోక లెద్దడి గదా చుఆతి మాకుం బరస్పరాదరం బడంగిననాండు లగ్గుగలదా మన? కన్నలు పాఅం జూడుండీ తమిళులకు తెలుగువారి బియ్యం కావాలి. తెలుగువారికి తమిళుల బట్టలు కావాలి. పాలకులకే కాకుండా పాలితులకు కూడా సీతారామమూర్తి నీతులు చెప్పాడు. నడుమంత్రపుసిరివచ్చి, అప్పుడప్పడే పల్లెటూళ్లలో పెత్తందారులయిన వినాయకులను ఆయన గుర్తించాడు. విద్యార్థులు చదువుసందెలు గాలికి వదలి నాయకుల మాటలు నమ్మి ఎందుకూ కొరగాకుండా చెడిపోతున్నారని చింతించాడు. ఆ.వె. దేశభక్తి యన్న తెరతీసి, పగటి వే సాలు కట్టి, తందనాలు పాడి గద్దెవలచు నాయకమ్మన్యు లీనేలం జెఆశిచినారు విద్య గఆఅచువారి ఆ.వె. చదువు సన్నగిల్లె, సంస్కారమా చెడెం బనికి రాని విరుసు పాదుకట్టె వెళ్టి ముదిరె నేంటి విద్యార్థి; కేమికా నున్నవాండొ వీండు తెన్ను దప్పి. అని బాధపడ్డాడు. నాయకులు వచ్చి నీతులూ ధర్మాలూ వల్లిస్తారనీ, వారి “మాటలు నమ్మి మోసపోవద్దనీ, మీపెంపునకు మీరే పాటుపడాలనీ ప్రజలను హెచ్చరించాడు.

86 తుమ్మల సీతారామమూర్తి కం. కారాగారములకుంజని గారెలు మెక్కిన వలంతికా? క్రిమిరాసుల్‌ పేరిన పులుసుంద్రావిన వీరునకా? విరులదండ వేయుట సెపుమా? అని వారిని ప్రక్నించాడు. కం. మేడకు మిద్దెకు గుడిసెకు నూడల వ్రేలాడుచున్నయుట్టికిం గల దీ నాం డోటు; తత్‌ కృషార్ణులు గూడెమ్ముల వారిసీవకుం జనవలయున్‌ అని ఓట్లు కావలసిన వారు పేదవారిసీవ చేయాలన్నాడు. ఒకానొకప్పుడు కొమ్ములు మొలచిన మొనగాడై, తర్వాత దారితప్పిన నాయకుణ్ణి మెచ్చుకోవద్దనీ, ఇక్కడ పూర్వవాసనలు పనికిరావనీ సీతారామమూర్తి తెలుగు వారికి కర్తవ్యాన్ని గుర్తుచేశాడు. ఊఉ. చీంకటిబేర మెందనుకం జేసిరొ లంచము లెన్ని మెక్కిరో వాకున కెక్కరాని యల వాటుల కెన్నిటికిన్‌ దెగించిరో లేకులు పాకలన్‌ గెడపి లేపిరి మేడలు, చంద్రకాలకున్‌ బాతిరి, కొయ్యమోర నడి బాటల నెత్తిరిశేమి సెప్పెదన్‌ అని రాజకీయనాయకులగుట్టంతా మోమోటం లేకుండా రచ్చ కెక్కించాడు. తమిళనాడులో ఉన్న తెలుగువారి చరిత్రనంకా విప్పి చెప్పి, ఎడాది కొకమైరర్పునా అఆబలగాన్ని పల్కరించి రమ్మని ఇక్కడి తెలుగు బిడ్డకు చెప్పాడు. గాంధేయ వాదిగావున ఉ. నీకు రుచించు మార్గమున నీవు ప్రయాణము సేయవచ్చుం గా నీ: కల నైన సత్యము న హింసయు లేబరమైన త్రోవకున్‌

రాష్ట్రకవి 87 బోకుము, నిల్వనేర దవి పోయిన సంఘము, గెల్నునేర దా రేకలు లేని సంస్కృతి, చరిత్ర వెలార్చిన పాఠ మీనుడుల్‌ అని బోధించాడు. చిట్ట చివరకు:

కం. దేవుండనమాతృదేశమ,

దేవత లనం బ్రజల, యజ్ఞదీక్ష యనంగా

సేవావ్రత నిష్టయ, యివి

జీవనసూత్రములుగాః బ్రసిద్ధిం గనుమూ అని నవయుగ బుషిగా ప్రవచించాడు.

“ఉదయగానము”లో భాషాసంబంధమయిన కావ్యఖండాలు రెండున్నాయి. అవి “తెనుంగు తీపి” “వాడుకబాస”. ఇవి సీతారామమూర్తి భాషాసిద్ధాంతాలను వ్యక్తీకరిస్తున్నాయి. 'ఆంధ్రభాషామాధుర్యం చవి చూడని తెలుగువాడు నాయకత్సానికి- అనర్హుడని ఆయన అభిప్రాయం. అందువల్లనే

ఆ.వె. తల్లిబాసతీపి తగులని మానిసి

దేశికవితనిగ్గు తలియనతండు

జాతిరుచులు కానంజూలని యంబేద

కాండు కాండు నాయంకరము వడయ అని తీవ్రంగా శాసించాడు. నియోగికవులు తెలుగునకు చేసిన సేవను ఆయన గుర్దించాడు. తిక్కన్నను మిక్కిలి కొనియాడాడు. నవనాగరకులు ఈసడించే పల్లీయులే దేశొతెనుగునకు అండగా నిలిచారని నిరూపించాడు. జానపదవాజ్బయంలోని తెలుగు పలుకుబళ్లను గుర్తించాలని అఖిల” షించాడు. మాతృభాషపట్ల తమిళుల కున్న పట్టుదలను మెచ్చుకొన్నాడు. ఊరికొక భాషాసేవకుడు బయలుదేరి అక్కడ వాడుకలో ఉన్న మాటలనూ, జాతీయాలనూ, చమత్కారాలనూ ఫ్రోగుచేసి గ్రంథస్థం చేయాలని సూచించాడు. పూర్వకాలం నుండీ సంస్కృతం తెలుగు మీద సాగించిన పెత్తనాన్ని విమర్శించాడు. సంస్కృత భాషా మహత్తను ప్రస్తుతించాడు.

88 తుమ్మల సీతారామమూర్తి పద్యకవి అయిన సీతారామమూర్తి వ్యావహారిక భాషోద్యమాన్ని అంగీకరింపలేదు. ఆయన దానిలోని లొసుగులను బయట బెట్టాడు. వ్యావహారిక భాషావాదుల ముఖంమీద కొరడా పెట్టి కొట్టినట్టు చం. పిలిచి బవారునన్‌ నిలువం బెట్టి, సవా లోసరించి, “యేది మీ తెలివి? యలంతి గద్యమును దిన్నని తెల్లన వ్రాయు” డంచు జ గ్గులు సెడ6 దెల్లుయత్రికలం గూర్చు" వలంతుల నిగ్గందీసినన్‌ వెలవెలంబోని, గుండె గల వీరులు నూటికి నల్లురుందురా? అని ఒక విసురు విసిరాడు. న్లానాడూ తెలుగు నేర్పే. గురువుల పాండిత్యం," సన్నగిల్లటం చూచి నిట్టూర్పులు విడిచాడు. రాష్ట్రకవిగా సీతారామమూర్తి శెద్దమనసు కలవాడుకాడని ఎవైనా భావిస్తే వారు పారపడ్డారని చెప్పక తప్పదు. వీరాంధ్రకవిగా గోచరించే రాష్ట్రగానంలోనే ఆంధ్రత్వము' లేనినాండయ కలదా మన కించుకయేని భారతీయత్వము?' అని ప్రశ్నించాడు. ఆ కావ్యంలో కం. _అంధ్రుండవై జన్నించితి, వాంధ్రుండవై యనుభవింపు మాయుర్చిాభవం, బాంధ్రుండవై మరణింపుమి, ఆంధ్రత్వము లేనిబ్రతుకు నాసింపకుమీ అని అన్నమాట నిజమే. కాని ఆ సీతారామమూర్తియే “ఉదయగానము”" కావ్యంలో కం. మన కాంధ్రత్వము ప్రాణము, తనువు సుమీ భారతీయ ధర్మము, యావ న్మను జాభ్యుదయ ప్రవణత యనుజా! విను, వజ్రకవచమై దిట వొసంగున్‌ అని నిర్ధ్వంద్వంగా చాటాడు.

రతుకవి స.

రైతుకుటుంబాల్లో. జన్మించి. సేద్యం చేస్తూ సాహిత్యట్రీతి పెంచుకొని, కవిత లల్లిన కృషీవలకుమూరులు రైతునుగూర్చి కవిత్వం భబ్రాయకుండా ఉపేక్షించటం దుస్సాధం. “కృషీవలుండు” కావ్యం రచించి రైతు కవిత్వానికి దారు లేర్చరచిన దువ్వూరి రామిరెడ్డి హాలికుడే. ఇతని కోవలోని వాడే సీతారామమూర్తికూడ. ““ముప్పదేండ్లు సేద్యమున ముస్లి తేలిన బ్రతుకు” ఆయనది. ఒకపూట బడికీ, రెండోపూట మడికీ వెళ్లటంతో చిన్నతన మంతా కడచిపోయిందని ఆయనే చెప్పికొన్నాడు. తండ్రి నారయ్య ఈరెండో కొడుకును వెంటబెట్టుకొనిపోయి పాలంపనులు చేసేవాడు. తండ్రి చనిపోయిన తర్వాత సీతారామమూర్తికి, దిట్టంగా సేద్యపుపనులు దిద్దే అన్నతో కాడిగలపక తప్పలేదు. వేరుపడినపిదప సొంతకమతం సాగించాల్సిన అక్కర ఆయనకు కలిగింది. _

మొదటనుండీ సీతారామమూర్తి సాటిరైతులు ఇద్దరు చేసిపనిని తానొక్కడే చేసేవాడు. ఈనాడింత పని చేయాలని ఆయన ముందుగానే అనుకొనేవాడు. ఆపని పూర్తయితే పెందలకడ ఇల్లుచేరేవాడు. కాకపోతే రాత్రి ప్రాద్దుపోయినదాక నయినాసకే కొనసాగించి పని పూర్తిచేసేవాడు. ఒకసారి తెల్లవారుజామున నారుమడిలో కాలుమోపి, సాయంకాలం మూడుగంట లయ్యేసరికి నాలుగుంబాతిక యెొకరాలకు సరిపోను నారుపీకి కట్టలు కట్టాడు. ఇంకొకసారి ఆయన కలుపుదీయటానికి ఊరికి విసరివేసినట్లున్న పొలం పోయాడు. పౌలంలో దూరంగా ఉన్న తుమ్మపీ3దాకా కలుపుదీయాలని ముందుగా ఒకమాట అనుకొన్నాడు. అయితీ కలుపు దట్టంగా ఉన్నది. తాననుకొన్న మేరకు వరిదుబ్బులకు దెబ్బతగలకుండా చూచుకొంటూ కలుపు దీసేసరికి రాత్రి పదిగంట లయింది. కలుపు కట్టలను గట్టుమీదికి చేర్చి, గూళ్లుపాడిచి, అప్పుడు రెండు మైళ్లునడిచి ఇంటికి వచ్చాడు. మరొకసారి ఉదయంనుండి సాయంకాలందాకా రెండువందల నలఖైగడ్డిమోపులు కట్టాడు. ఏటేటా సాట్టైతులకంటె ఎక్కువ పంటదిగుబడి తీయాలని పట్టుదలతో పాటువడి ఆయన నెగ్గుతుండేవాడు.

90 తుమ్మల సీతారామమూర్తి సీతారామమూర్తి సొంత ఊళ్లో ఉపాధ్యాయవృత్తి సాగిస్తున్నా, కాంగ్రెసుసేవ గావిస్తున్నా, కావ్యాలు రచిస్తున్నా, సాహిత్యసభలకు వెళ్తున్నా ప్రాణంతో సమాన మయిన సేద్యాన్ని వదలి పెట్టలేదు. కాడిపారవేయలేదు. సెలవురోజు రాగానే జీతగానితోపాటు ఆయాకారులకు తగిన కమ్మతంపనులు గావిస్తుండేవాడు. ఎటు తిరిగ్లీ ఊరుదాటి 1930 నుండీ బోర్జుహైస్కూళ్లలో పండితుడయిన తర్వాత పాలం పనిపాట్లపాత్తు బొత్తిగా తప్పిపోయింది. దీనివల్ల ఆయన తెగుళ్లకూ నెగుళ్లకూ. చిక్కాడు. పరిణామశూల ఆయనను పట్టుకొని ఆజ్రీవ మానమూ టొధపెట్టింది. దీనిని మట్టుపెట్టాలనుకొని ఆయన మద్రాస్సు వెళ్లినప్పుడు ఒక వైద్యుణ్ణి సంప్రతించాడు. ఆ వైద్యుడు “నీవు మొట్టమొదట ముమ్మరంగా సేద్యం చేశావు. ఇప్పుడు ఒబ్దవై కుర్చీకి కరచుకొనిపోయావు. ఒళ్లు అలవటం లేదు. ఇదే నీ అనారోగ్యానికి కారణం” అన్నాడు. '*'శబలి” లోని ““సంజక్రాంతి తలపులు” అనే ప్రథమ ఖండంలో ఆయన జవసత్త్వాలు కోల్పోయిన తీరును హృద్యంగా వర్ణించాడు. , శా॥ ఊరుంగాయలు, పచ్చడుల్‌, పులుసు లేవో కూర లైదాణు, సాం బారున్‌, మీంగడ, లప్పడాలు, వడియాల్‌ వడ్డించినన్‌ నేయడిసీ! చేరెండన్నము లోనికిన్‌ దిగు దహో! చిన్నప్పు డేనొక్క గోం గూరన్‌ గుండెండు కూడు మెక్కితి; నెలా గోతాలతో దూశిలిన్‌. ఊ గట్టితనమ్ము చిందంభిడి కట్టకు సాగిన దెబ్బదెబ్బకున్‌ బుట్టెండు రాలి రాకివడెం బో! కుసుమల్‌ కడియమ్ముమీందికిన్‌ బట్టినగడ్డి నొడ్డి పన పంజినచోంబదిమోపులుండు; నా

.రైతుకవి 91 రెట్టబలమ్ము నేండు సయి రింపదు వీసెండుకూర లెత్తంగన్‌. ఆ.వె. అంబ పులిసి గిత్త యంకెవైచిన తఆి నడుము గట్టి పట్టె మెడకు దార్చి యూవబిలోనిబండి నూథి లేపినమొన గాండ వెణతు నిపుడు కడవందోడ. ఆంధ్రోపాధ్యాయత్వానికి అంకితమైపోయిన సీతారామమూర్తి పౌలందున్నేవాణ్ణీ, కోతకోసీవాణ్ణో, కుపష్పనూర్చేవాణ్డీ, బండి తోలేవాణ్డో చూచి పారవశ్యం చెందేవాడు. ఆయన అప్పికట్లలో ఆంధ్రపండితుడుగా ఉన్న సమయమది. కుప్పనూర్చిళ్లు ముమ్మరంగా కొనసాగే ధనుర్మాసమది. ఒకనాడు బంతితోలే పాలేరు గొంతెత్తి పొలిపాటు పాడుతుంటే ఆది ఆయన చెవినిబడింది. ఒళ్లు పులకరించింది. ఇక అండ! బడికి సెలవుపెట్టి ఒకకుప్పదగ్గరకు వెళ్లాడు. తాడు పేను కొన్నాడు. బల్ల ఊగిపోయేటట్టు పిడికట్ట కొట్టాడు. కళ్లం నలిగిన తర్వాత గడ్డిని వామికి చేర్చాడు. ఎడ్లను బాదకుండా బంతితోలాడు. అవి పడుగులో వేస్తున్న పేడను చేతులతో పట్టుకొని కళ్లంలో పడకుండా జనుము లేని చోటికి విసరి వేశాడు. విస్తరాకులో వడ్డించటానికి ఒప్పుకోకుండా దోసిట్లో పెట్టించుకొని కూరన్నం తిన్నాడు. బొటనవ్రేలితో మిరపకాయ అదిమిపట్టి నంజుకొంటూ దోసిట్లో పోసిన మజ్జిగబువ్న బుజ్టాడు. ఈవిధంగా పొలాన అన్నం తినటం ఆయనకు అంతులేని సంతృప్తి నిచ్చింది. “సంక్రాంతి తలంపులు” లో ఊఉ. బట్టన ్రేళ్లతో నదిమి పట్టిన మిర్యపుంగాయ నంజుచున్‌ దెట్టలు తెట్టలై మిసిమి దేలిన మజ్జిగబువ్వ దోసిటం బట్టి బుభుక్ష తీవ్రతలు పాయఃగ జుల్జీననాంటి తృప్తి నా పొట్టకు ముట్ట దీముదిమి ప్రాద్దుల సాపడు పిట్టమేంతలన్‌

92 తుమ్మల సీతారామమూర్తి ఈవిధంగా సీతారామమూర్తి మరలా ఒకసారి కుప్పనూర్చిడిలో పాల్చంచుకొని కుతి దీర్చుకొన్నాడు. ఇటువంటి ప్రకృతి కలిగిన సీతారామమూర్తి కృషీవల కవిత్వం రచింపకుండా ఉండగలుగుతాడా? 1929లోనే మైథిలీశరణగుప్త రచించిన “కిసాన్‌” ఛాయలతో ఆయన "రైతుమొఆు” రచించాడు. 1934లో అఖిల లోకానికీ అన్నదాత అయిన హాలికుని కష్టాలను “కర్షకుండు” అనే కావ్యఖండంలో గుండెకు హత్తుకొనేటట్టు వర్ణించాడు. 1940లో నవనాగరకతకు _ బానిసకావలదని _ క్షేత్రజీవిని హెచ్చరించాడు. ఈభూమ్మిమీద పాలేరే కర్షకునకు చుట్టమని నిరూపించాడు. ఈలోకంలో స్వతంత్రు డనదగినవా డెవడైనా ఉంటే అతడు ఒక్కకృషివలుడే అని సీతారామమూర్తి ఆఖిప్రాయం. రైతు తాను తింటున్నాడు. పదిమందికీ పెట్తున్నాడు. అతని ఆకారం అనాగరకం గావచ్చు. హృదయం మాత్రం తత్స్వజ్ఞతకు ఆలవాలం. _కివుణ్తి కర్షకుడుగా చి(బ్రించటం సీతారామ మూ ర్హ్‌తే చెల్లింది. $ జ యె సీ. చదలేటి నీటిసంపద రిత్తవోనీక సిగముడి నానకట్టగ నమర్చి యలజాహ్నవీముఖ్యములు చిన్నపెదకాల్వ లఅఖిలభారతభూమి నల్గుకొల్ప్చి ముక్కారు పంటల ముద్దుటెక్కెం బన గేల ముమ్మొనల ముల్కోల నూంది మెడమువ్వపాటలో నొడలంబుల్కలురేంగ , బసవన్న నసివాయి పనికియనిచి తి. యిల్లు వెండియు, బంగారు విల్లుగాంగం బండి కైబ్రాలిన జగమ్ము పంటపాలము కావలికి ఘోరసర్చ్బకంకణము గట్టు శివుని మా పెద్దకాంపు నర్చింప రండు. “పజిగపంట” “పైరపంట” అనే కావ్యనామధేయాలద్వారా ఆయన తన కర్షక ప్రకృతిని ప్రకటించుకొన్నాడు.

రైతుకవి 9 రైతుకూ పశువులకూ తండ్రివిడ్డల పొత్తు హత్తుకొని ఉంటుంది. సీతారామమూర్తి కీమాట తెలియనిదిగాదు. 1930లోనే దిలీపమహారాజు నందినీధేనువును సేవించినకథను ““సేవాధర్మము” అనేపీరుతో కాళిదాసు ననుసరించి ఆయన తెలిగించాడు. ఈరచనకు కారణం ఆయనకు పశువుల పట్ల పాదుకొన్న ప్రణయమే అని చెప్పాలి. ఆయన అమ్మతల్లుల వంటి ఆవులను కొనియాడాడు. అవి నక్షత్రాలుగా అవతరిస్తా యని కూడా ఆయన ఊహించాడు. కం. అమృతప్రసువులు, యజన కమ కర్ష్ణణమూలములు, సురధ్యేయము, ల గ్నిమయమ్ములు ధేనువు లీ " రమణీయాకృతులు రా విరాజిల్లునొకో? ఇంకా ఆయన గోసేవ గొప్ప దన్నాడు. పశువైద్యులను భూతదయా మయులనీ, కర్టకబాంధవులనీ ప్రశంసించాడు. పురాణకథలను ప్రస్తావించి ఈ విధంగా వ్యక్తీకరించాడు. ఊఉ. మీంగడ మెక్కుచున్‌ బసుల మేపెను మాపెదవేల్పు, మూయపుపై నాంగలిమోపి శాత్రవగ అమ్ము నదల్బె నొకయ్య, గిత్తపై సాగుచు నొక్కవేల్పు జల సంపద పంచును సేద్యగాండ్ర, కీ భోగము యోగమున్‌ భరత భూమికి దక్క నగణ్యు, పుణ్యమై.

““పైరపంట'లో సీతారామమూర్తి రైతుకవిత్వపుపంట రాసుఖై మిన్ను దన్నింది. తొలకరివానలు వంగగానే కృషీవలులకు కూడలి అయిన గ్రామసీమలో కదలిక మొదలవుతుంది. దుక్కులు దున్నటానికి రైతులు నడుంగట్టారు. సర్వవృత్తుల వారికీ చేతినిండా పని ఉంటుంది. ఈ దృశ్యాన్ని సీతారామమూర్తి మనోహరంగా “జడికారు' అనే కావ్యఖండంలో వర్ణించాడు.

94 తుమ్మల సీతారామమూర్తి సీ. ఊపిరాడకపోయె నూరివండ్రంగికి( బగలు కే నాగటి పణతందీర్చ కల్టు, చెక్కుడు పా గాల్చుచో నెగసిన పాగలోనం గమ్మరి బ్రుంగువడియె కేపిమిటని రైతు కోపింప నెట్టెటో వాజెనల్‌ గొడగరి వాండు పెనంచె చేతితో నోటితో సెనగవిత్తులుడుల్చి గాసిల్లెం జిన్నారికాంపువెలంది

తే. పలుపు పగ్గాలు సంతనపయిచు పనికిం

జిక్కి చిడిముడిపడసాగె జీతగాండు కర్తకునిపాట్లు వివరింపంగా బనేమి యతనితలమీంద నుండె. గొండంతబరువు.

“వరినాటు” “సంక్రాంతిముచ్చటలు”' సేద్యకాండ్ర (బ్రతుకుతో పెనవైచికొని మయిన ఘట్టాలను వర్ణిస్తున్నాయి. భాషావిప్లవాన్ని తిరస్కరించిన సీతారామమూర్తి సాధుసరళ సుందర మయిన భాషను ప్రయోగించి, పదిమందీ అర్ధంచేసికొనేటట్లు ఛందో బద్ధకవిత్వాన్ని సృష్టింపవచ్చునని రుజువుచేయటానికే ఈశెండు కావ్యఖండాలను రచించాడు,

కర్షకులూ, కార్మికులూ పొత్తుపొందికలు కుదుర్కొంటానికి వీలు లేనిరెండు తెగలవారని రాద్ధాంతాలు చేయటం సీతారామమూర్తికి గిట్టదు. “కాపులు కూలివాండ్రు నొకకాండికిం గట్టిన రెండుగిత్త'లని ఆయన స్పష్టంగా చెప్పాడు. “వరినాటు” కావ్యఖండంలో రైతుబిడ్డకూ, కూలిమగువలకూ నడుమ నడచిన సరససల్లాపాలనూ, సందడించిన సౌహార్దాన్నీ ఆయన పరమరమణీయంగా వర్ణించాడు. కుప్పలు నూర్చేరైతు చిరునవ్వుతో జీతగానికి కళ్లం ఇయ్యటం. గాజుల కని అడిగిన పాలేరు భార్యకు గంపలు గంపలు ధాన్యం ఎత్తించటం ఆయన చేసిన పనులే. కనులారా చూచిన ఘట్టాలే. “సందేశసప్తశతి*లో కర్షక కార్మిక జీవితాలు రేయిపగళ్లవంటి వృత్తులనీ, వీరిని విభజించి పాలించటానికి

రైతుకవి 95 ప్రయత్నించేవారు గెలువలే రనీ అంటూ ఆయన ఈవిధంగా తన లోకానుభవాన్ని వెల్లడించాడు.

ఆ.వె. కాంపు వేలు, కర్మకరుండు వేఆనువారు

(గుడ్డివారు తెలివి సెడ్డవారు కాయ జాఆి కర్మకరుండుగా నగుం గర్మ కరుండు పెరింగి కాయుగా నెసంగు

1917లోనే ఒక పర్వదినాన నిజాంపట్టనం వెళ్లి సముద్రస్వ్నానం చేసివస్తూ దారిమీద ఉన్న గోకర్ణమఠంలో ఒకప్పుడు తమపనులు చేసిన కూలివాని కూతురు గృహంలో ఆయన భోజనం చేశాడు. రైతుల కూలీల ఆత్మబాంధవ్యాన్ని చాటే కథను గైకొని సీతారామమూర్తి “ ఆమంచిరోజులు” అనే లఘుఖండకావ్యాన్ని రచించాడు. ఇది నిజంగా జరిగిన కథ.

ఒక ఊళ్లో ఒక ఆసామి ఉన్నాడు. ఆయన ఉలుకకుండా పలుకకుండా చేయదలచుకొన్న పని చేసే మనిసి. ఒక రోజున కమతగాడు తన కూతురు పెళ్లికోసం అరైతును అప్పుగా డబ్బు అడిగాడు. రైతు జీతగానికి కావలసిన సౌమ్ము ఇచ్చాడు. కూతురు పెళ్లిచేసిన జీతగాడూ, అతనియిల్లాలూ ఒళ్లుదాచుకోకుండా ఆపనీ ఈపనీ చేసి అసలు సొమ్ము గడించారు. దాన్ని తెచ్చి జీతగాడు తనదొర కిచ్చాడు. ఆయన ఏమీ మాటాడకుండా ఆడబ్బును అవతలకు నెట్టివేశాడు. కమతగాని గుండెలో అాయి పడింది. వడ్డీ లేకుండా అసలు మాత్రమే ఇస్తున్నానని అఆసామికి ఆగ్రహం కలిగిందేమో అని అత డూహించుకొన్నాడు. దిగాలుపడి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆఅలుమగ లిద్దరూ కూడబలుకు కొని, రెక్కలు ముక్కలు చేసికొని వడ్డీకి కూడ సరిపోయేసామ్ము కూడబెట్టారు. జీతగాడు వడ్డీ అసలూ తెచ్చి యజమానున కిచ్చాడు. వెంటనే రైతు అతణ్జీ గొడ్డును బాదినట్టు బాదటం మొదలుపెట్టాడు. ఇంతలో ఇరుగు పౌరుగువారందరూ చేరి ఏం జరిగిందని రైతును అడిగారు. అప్పుడు ఆరైతు వారితో “వీడు చిన్నప్పటినుండీ నాగొడ్లు కాచాడు. నాకొట్టం ఊడ్చాడు. నాపాలంపనులు చేశాడు. పిల్ల పెళ్లికోసం

96 తుమ్మల సీతారామమూర్తి అడిగాడు గదా అని వీడికి కొంత సౌమ్ము ఇచ్చాను. నే నెంతమంధదికి దానధర్మాలు చేశానో మీకందరకూ తెలుసు. వీడికి తెలియదా? ఇప్పుడు వీడు ఆసలనీ, వడ్డీ అనీ లెక్కలుగట్లూ పెద్దషావుకారుమాదిరిగా తిరిగి ఇస్తానంటా డేమిటి? మొట్టమొదట ఇచ్చేటప్పుడే నేను ఖరాఖండిగా చెప్పినట్లయితీ ఇప్పుడు నలుగురినోళ్లలో నానే యోగం తప్పిపోయేది” అని అన్నాడు. ఈ మాటలు విన్న కమతగాడు తెల్లపోయి తన తలియనితనాన్ని తిట్టకొన్నాడు. చివరకు సీతారామమూర్తి తీ. “ఏమి యిచ్చితి” నని సామి, “యింతయీవి నంద లే” నని లెంకయుం గుందిరపుడు; “ఏమి యిచ్చితి”' 'వని లెంక, ““యింక నెంత యిత్తు” నని సామియున్‌ గలహింతు రిపుడు. తే. సేవకుని పట్ల సామియు, సేవ్యునెడల లెంకయును, సర్వదా కుట్ర లేని మమత నించుకొని కేజి బదుకు నామంచిరోజు లెప్పటికి వచ్చునో మన కప్పటియును. అని కథను ముగించాడు. ఇతర హాలికకవులమాదిరిగా రైతుల బ్రతుకుల్లోని చేదునూ తీపినీ వర్ణించి సీతారామమూర్తి ఆగిపోలేదు. స్వాతంత్ర్యం సిద్దించిన తర్వాత లైతుకుటుంబాలవారు ఆడుతున్న ఆటలూ, కర్షక కార్మికుల మనస్సుల్లో వచ్చిన మార్పులూ, పల్లెటూళ్లల్లో ప్రభవించిన పరిణామాలూ ఆయనకవిత్వానికి వస్తువు లయినాయి. జీవితమంతా గ్రామసీమలోనే కడపిన ఆయనకు అరచేతిలోని ఉసిరికకాయవలె మంచిసెబ్బరలన్నీ; అవగతమయ్యాయి. రైతు బిడ్డలు ఏ అవతారా లెత్తుతున్నారో ఆయన ప్రత్యక్షంగా చూచాడు. పరితాపం చెంది వారిని ప్రబోధించి, మంచిదారి పట్టండని సదుపదేశం గావించాడు. గ్రామాల్లో స్వాతంత్ర్యం సిద్ధించినపిదప భూయాజమాన్యం గొప్పమార్చులకు లోనయింది. మొదటి నుండీ పెద్ద రైతులుగా రాణించిన వారు సంతు పెరగటం వలా, పంపకాలవల్లా చిన్నరైతులయ్యారు. విడ్డల

రైతుకవి 97 చదువులకని ఆస్తులమ్ముకొన్న రైతులు చితికిపోయారు. తండ్రుల తరంపోయి.. కొడుకులతరం వచ్చేసరికి పాలంపనులు చేయటం అనాగరకలక్షణ మయింది. కష్టపడి పనిచేసి కూలివార్‌కే క్రమక్రమంగా భూయాజమాన్యం దక్కుతున్నది. సీతారామమూర్తి ఈ అర్థిక పరిణామాన్ని అద్బుతంగా వర్ణించాడు.

ఆ.వె. తరతరాన సంతు పెరింగినదే కాని పెరుంగ లేదు పొలము బెత్తిడైన దొరల మన్నమాట మఆచి ఖామందులు మేండిపట్టకున్న మెతుకుసున్న, ఆ.వె. నేండు కుప్పవేయ నిచ్చెనతోంబని లేకపోయె రైతులోకమునకు సంతు పెరింగి పెరింగి యింతచేసినదయా! శరణ మిం మతొక్క సాధువృత్తి. ఆ.వె. మిడిసి పడిన కాంపు మెరకలు పల్లము లమ్మి యమ్మి దీనుం డయ్యెం దుదకు౮ గాసువిలువ గన్నకార్శ్మికులే చుండీ! కొన్నవారు వేలు క్రుమ్మరించి. ఒకానొకప్పుడు రైతుల యింటెల్లపాదూ పొలంపనులు చేసేవారు. కూలివారితో పాటు చేలల్లో వంగి పాటుపడేవారు. ఈనాడు కష్టపడే కాపుబిడ్డలు కానరావటం లేదు. వారు కాయకష్టం సహింప లేకున్నారు. పైగా సప్తవ్యసనాలకూ బానిసలయ్యారు. రైతులూ కూలిలూ కాడిగలిపి కష్టపడ్డతరానికి చెందిన సీతారామమూర్తికి ఈమార్చు మనస్తాపాన్ని కలిగించింది. ఆయన ఈమనస్తత్త్వ పరిణామాన్ని ఈవిధంగా కవితలో ప్రదర్ధ్శించాడు. కం. మితి మీజిన వెచ్చముతో నతుకులబొంతగ నిరంతరార్హికరముగా మతిలేని కాపు బిడ్డల బతుకు కనంబడెడి నేండు పరిహాస్యముగన్‌.

06 తుమ్ముల సీతారామమూర్తి కం, ఇడ్డెనలు దోసె లఆిసెలు లడ్డులు తెగమెక్కి మెయినలంపని కాంపా? గడ్డిదిని బండి నీడ్పెడి గొడ్డా? తగుజంతు వెద్ది కొనియాట కిటన్‌. ఆ.వె. కమ్మతంపుబరువు కార్మికుతల మోపి చెలువుగుల్కు మడుంగువలువ లూని రచ్చబండ కెక్కి రగడలు సాగించు కాంపు బాగుపడుట కల్ల కల్ల. ఆ.వె. ఒకట రెంటం గాదు సకలదురభ్యాస ముల నపేక్ష చూపు హలికుం డిపుడు చిన్న చిన్న పదవి కెన్ని యుద్ధములైనం జేయనోర్చు నొరు లిసీ! యనంగ. ఆ.వె. పల్లెటూర మన్ను బంగారుగా మూర్చ్పం చగినయునలు చేనిదరికిం. జనక తప్పం ద్రాగి కేంగి తందనాల్‌ పాడిన నేమి పండు నచట లేమిగాక? పోనీ; కూలివాళ్డి చూద్దామా ఆంటే వాడూ రైతుబాటనే పట్టాడు. నీతి విరుద్ధ మయిన వ్యయం చేస్తున్నాడు. ప్రొద్దుటిపూట కాఫీ త్రాగి కాని వాడు పనికి బయలుదేరడు, తే. మద్యము దురోదరాదులు మరగి పతితుం డాయె నీనాండు కూభివా6 డాయ మెంత వచ్చినను దారపుత్రుల కిచ్చుపైస అస్తువిస్తగు గంజికి నైన నకటః! ఒకనాటి పల్లెటూళ్లు వేరు. ఈనాటి పల్లెటూళ్లు వేరు. కులాలు ఖిన్న మయినప్పటికీ వావివరుసలతో గ్రామీణులు ఒకరినొకరు ఒకప్పుడు పిలుచుకొనేవారు. సౌజన్యమూ పౌమనస్యమూ సామరస్యమూ అనాడు పల్లెల్లో బలీయంగా గోచరించేవి. కాని ఈనాడు అక్కడ మయంచిలక్షణా లన్నీ పటాపంచలయ్యాయి. అందువల్లనే సీతారామమూర్తి

రైతుకవి 89 ఆ.వె. పల్లెిపట్టు శాంతి కిల్లని యొకనాండు చెప్పుకొంటి, మిపుడు నిప్పులేక మండందొడంలె నూరు మదమత్సరక్రోధ నిలయ మగుచు విలయ వలయ మగుచు. “వరినాటు'' కావ్యఖండంలో రైతు చెప్పినట్లుగా పల్లెల్లో స్వార్ధమూ, తలవీఅుసూ పెరిగాయి. ఈర్ద్యాదురఖిమానాలు చెలరేగాయి. కుట్రా కువాడమూ పెచ్చు పెరిగాయి. ఇది మంచిదిగాదనే పెద్దల మాటకు అవగింజంత విలువ లేకుండా పోయింది. అసలు చిన్న పెద్ద అని అలో చించే వాడేలేడు. రాజకీయాలు గ్రామాలను కురుక్షేత్రాలుగా చేశాయి. వన్నెల విసనకజ్జ్దలవతె తయారై గ్రామనాయకులు రచ్చబండల కెక్కి తలక్రిందుగా పత్రికలు పఠిస్తుంటారు. కం. గడ్జితిని మేరదప్పిన వడ్డీలు గడించి కన్నవా రుష్పరిగల్‌ ' గుడ్డము లిడ, సిరిపొంగొక (రుడ్డితనంబిడ నటించు క్రోంతులు వీరల్‌ అని వీరిని సీతారామమూర్తి వర్ణించాడు. ఈ వినాయకులు బావిలోని కప్పలనీ, తరుగులేని పొగరుతో పెత్తనాలన్నీ గుత్తగొంటానికి చూస్తారనీ అయన వెల్లడించాడు. వీరికి “శాంతి ప్రాణాంతక” మట! “పండి పైకొన్న పొందికల్‌ గుండెబరు”' వట! దుర్మతులయిన వీరు మతాలను ఎత్తి చూపి, ధనపరిమాణాలను వివరించి, కోవలను వెదకి, కులాలను తడవి, వీదులనూ ఊరుసివార్లనూ పేర్కొని, అమాయికలోకాన్ని వంచించి నాయకత్వాన్ని సంపాదించి గ్రామాలకు చేటు పతెస్తున్నా రని సీతారామమూర్తి అభిప్రాయం. ఆయన కం. పంచాయతి సభ్యతకై కంచము నముంచమ్ము నమ్మంగా వలయునె? రె డంచులకత్తులు వలయునె? కొంచెపు బ్రదుకునకు నియ్యకొనంగా వలెనే? అనీ ప్రశ్నించాడు. ఇంతటితో ఆగకుండా

100 తుమ్ముల సీతారామమూర్తి ఆ.వె. ఒకని గోడ ప్రక్క నొకండు పుల్లెలు వైచి కులుక రాదు గెలుపు గొంటి ననుచు వాని వీని కంపు వాడల కెగంబ్రాంకి వెతలంగూర్చు నూరిబ్రతుకు నార్చు అని గ్రామవాసులకు జ్ఞానబోధ గావించాడు. సంక్రాంతి రైతుల పండుగు. ఈపర్వాన్ని గూర్చి సీతారామమూర్తి ఏడు కావ్యఖండాలను రచించాడు. వీటి ధోరణి ఒకే తీరుగా ఉండదు. 1941లో రచించిన సంక్రాంతి పద్యాల్లో ఆయన పంట యింటికి వచ్చిన వ్రైతుల విందులూ, వినోదాలూ ఆచారాలూ వర్ణించాడు. తర్వాత వ్రాసిన కావ్యఖండాల్లో దేశపరిస్థితులను సమీక్షించి సన్మార్గోపదేశంగావించాడు. రాష్ట్రరాజకీయాలగత్తరము ప్రకటించాడు. కండబలిమితో సేద్యం చేసిన తనకు ఆంధ్రపండితుడయిన తర్వాత దాపురించిన దౌర్పల్యాన్ని అవిష్కరించాడు. 1958-60 సం॥ల మధ్య రచించిన పద్యాల్లో ఆయన క్రొత్త సంక్రాంతిని కోరాడు. ఆ.వె. బోగిమంటలందుం గోంగుయిల్లలంగాదు కామరోషములను గాల్బవలయుః గొత్త పబ్బమందుం గోడిపుంజులంగాదు దురభిమానములను ద్రుంపవలయు నని ఉపదేశించాడు. మార్క్సు సిద్ధాంతాల ఛాయలను ఈ క్రొత్త సంక్రాంతి పద్యాల్లో మనం చూస్తాము. సీతారామమూర్తి రైతుకుటుంబంలో పుట్టి కవియైనవాడు. కాబట్టి థైతుల పనిపాట్లను పరామర్శించినపుడూ, గొడ్డుగోదలను వర్జించి నపుడూ కాపులనుడికారానికి పెద్దపీట వేశాడు. ఇది కావాలని పట్టుదలతో ప్రయోగించినట్లుండక అప్రయత్నంగా సహజంగా దొరలి నట్టుంటుంది. ఆయనకావ్యాల్లో హాలికులు తమభాషతోనే మాటాడ తారు. “సంక్రాంతి ముచ్చటలు''లో రైతు కోడెదూడల జంటను చర్జిస్తాడు. ఈవర్జ్ణనమంతా రైతులభాషతోనే నడిచింది.

రైతుకవి 101 సేద్యంలో రాటుదేలిన సీతారామమూర్తి తనకావ్యాల్లో దానికి సంబంధించిన ఉపమాలంకారాలను ఉపయోగించాడు. ఇవి ప్రకరణానికి సహజసిద్ధంగా ఉండి శోభను చేకూర్చాయి. “నిక్క మైన సేవ నెఆపెడి పిన్నలు కంటంబడరు సెనగపంటవోలె'” అని “ఉదయగానము''లో పలికాడు. వేరుసెనగకాయలు నేలలోపలనే ఉంటాయిగదా। ఫైకి కనబడవు గదా! పంజాబులో సభ్యతా సంస్కారమూ కలిగిన పౌరులను పట్టుకొని కట్టివేసి ఆంగ్ల ప్రభుత్వం బజార్లలో త్రిప్పింది. ఆసన్నివేశాన్ని సీతారామమూర్తి చం. నెంకిగల వారింబట్టికొని నేరము సెప్పక పండ్లు అివ్వునన్‌ గొయికుచుం గుప్పనూర్సిడికి గొడ్లను బోలె బిగించి, మేళముల్‌ మొరయ బజార్ల కీడ్చి నలు మయూలలంద్రిప్పిరి; దానంబోవక గ్గయణయవలం ద్రొక్కి తాళములు కట్టిరి తుల్పలు పాకిదొడ్లకున్‌ అని వర్ణించాడు. రైతులు కుప్పలు నూర్చేటప్పుడు పడుగులో బంతి తోలటానికి పశువులను వరుసగానిలిపి కట్టివేస్తారు. అదే విధంగా ఆంగ్లప్రభుత్వం పారులను కట్టివేసి తిప్పింది. "చాలా సాగసయిన ఉపమాలంకారం. రాజకీయనాయకులు భావిపొరులయిన విద్యార్థులను బజార్లకీడ్చి వారిని చెడగొట్టుతున్నారని సీతారామమూర్తి భావించాడు. ఆ సందర్బంలో ఆయన ఈక్రింది పద్యం చెప్పాడు. ఆ.వె. వసుధ కెట్టి చెట్ట వచ్చినం బసివాని ముట్టరాదు రెచ్చంగొట్టరాదు విలువ పౌచ్చుంగాక విలయంబయగుంగాక విత్తనాలసంచి విప్పరాదు.

102 తుమ్మల సీతారామమూర్తి ఏది యేమయినా విద్యార్థుల జోలికి పొోగూడదు. ధర హెచ్చుగా పలుకుతున్నది గదా అని విత్తనాలుగా కట్టిన ధాన్యాన్ని అమ్ముకోగూడదు. విద్యార్థులు భావిపొరులు. వారు పతనమయితి దేశభవిష్యత్తు దెబ్బ తింటుంది. రాబోయే ఏడాదిలో విత్తనాలు సెద్యావికి ఉపయోగ పడతాయి. వాటిని అమ్మితే వచ్చేయేడు సిద్యమే ఉండదు. అందమయిన దృష్టాంతాలంకారము. ఇటువంటిదే ఈక్రింది పద్యంకూడా. ఆ.వె. కలుపుదీయకున్న గరసె నిండదు; లోభ మోహ రాగ వైర ముఖ్యరిపుల మద మడంపకున్న బదుకు పండదు; రహ స్సిది యెబుంగువాని కొదవు శాంతి. కలుపు దీయక పోతీ పంటపండక గరినె నిండదు. లోభాదులను నిర్మూలింపక పోతే బ్రతుకు పండదు. శాంతి సమకూడదు.

సామాజిక కవి కం. ఈమే నెంత నలంగిన నామనుగడ లోకసివనమ్మున కిడెదన్‌ సామాజిక కల్యాణము, కామించెద నవ్యభవ్యకవితాసృష్టిన్‌ ఆ.వె. కాసుకొఅకు నేను గైతపల్కను బ్రజా సేవ కర్థిమై వచింతుంగాని ఇవి సీతారామమూర్తి మాటలు, లోకసేవ చెయటానిక్సీ సామాజిక కల్యాణము సాధించటానికీ ఆయన కవిత్స్యాన్ని సాధనంగా స్వీకరించాడు. అయితే సేవాఖిలాషకు తుల్యంగా సీతారామమూర్తికి ఆరోగ్యం. అబ్బలేదు. కీళ్లనొప్పులూ, కడుపునొప్పీ ఆయన పాలిటికి కాపా అయ్యాయి. కవితారచనమే వాటికి జాషధ మయింది. ఆ.వె. కవిత నాకు మందు, కవిత నా కాపోక నొసంగువిందు, పద్య మొకటి వ్రాసి మంచిరచన యని తలంచితినా నన్నుం గడియు నపుడు భద్రగజబలమ్ము అని ఆయన చెప్పికొన్నాడు. అందువల్లనే ముదిమి మూగి నప్పటికీ ఆయన కవిత్సాన్ని వదల లేదు. మరణించేదాకా దానిని మానలేదు. “ఇంత వృద్ధతన్‌ మైోయుచు నస్సురుస్సు రని మూల్గుచునుండియుం గైతమానః నాయాయువు సర్వ మిప్పనికి నప్పన చేసితి" నని ఆయనయే “చక్కట్లు” ఖండకావ్యంలో చాటుకొన్నాడు “దివ్వజ్యోతి"లో కూడా చం. నెతఆి చడియుందుంగాక విడ నేర సమాజ వికాసకృత్‌ కృతిన్‌; మటి నను నొంచు నొవ్వులను మార్కొను జెట్టీ కవిత్వ సృష్టి అని ఆయన చెప్పాడు. సమాజాభ్యుదయంపట్ల అఆవిర్చవించిన అతివేల మయిన అనురాగం వల్ల-అనారోగ్యాన్ని కూడా ఆయన లెక్కచేయలేదని చెప్పటం అతిశయోక్తిగాదు.

104 తుమ్మల సీతారామమూర్తి ఆస్తికుడయిన సీతారామమూర్తి దేశాన్ని దేవుడుగా సేవించాడు. ““ఉదయగానము” లోనే ఆయన కం. దేవుండన మాతృదేశమ, దేవతలనం బ్రజల, యజ్ఞదీక్షయనంగా సేవాద్రత నిష్టయ, యివి జీవనసూత్రములుగా. బ్రసిద్ధిం గనుమా! అని తెలుగు వారికి బోధించాడు. “చక్కట్లు”" కావ్యంలో కూడా “నిజదేశ మీశ్వరప్రాయముగా భజించితి” నని చెప్పికొన్నాడు. మానవ సేవయే మాధవసేవ అనే సిద్ధాంతమే ఈమాటలకు పునాది. ఇవి గాంధీజీ జీవన తత్త్వానికి అక్షరరూషాలు. వీటిని నమ్మిన మనుష్యుడు ప్రపంచాన్ని పరిత్యజింపలేడు. కాషాయ వస్తాలు కట్టుకోలేడు. ఈలోకవ్యవహారాల్లో మునిగి కేలుతూ మానవసేవ చేస్తాడు. గాంధీజీ చేసిన దిదే. బాపూజీ బంటయిన సీతారామమూర్తి కవితారచనం ద్వారా మానవసేవ గావించాడు. సాంఘిక కల్యాణ కారకము లయిన కావ్యాలు సృష్టించాడు. సాంఘిక శ్రేయస్సుకే కవిత్వాన్ని ముడుపుగట్టిన సీతారామమూర్తి ఆసంఘం మార్చులేకుండా గిడుసబారిపోయే లక్షణం గలదిగాదనీ, ఎప్పటి కప్పుడు అది మంచిచెడ్డలు కలగలుపుగా కనబడేమార్పులు పొందుతుందనీ అంగీకరించాడు. “కృతయుగం ఇకరాదు. మనుస్కృతి రాజ్యంచేయదు. ఏటి కెదురీదేమనుష్కులు పతితులూ పరిహాస్యులూ అవుతారు. జగత్తు పరిణామశీలం'”” అని చెప్పాడు. “మనువు చెప్పా డనీ, మాకాతమేనత్త పాడిందనీ మొండిపట్టు తగదు. మనువుమాట అతని సమాజానికి ఉపయోగపడింది. మనమాట మన సమాజంలో చెల్లాలి” అని ఆయన అన్నాడు. ఆ.వె, తాత చెప్పుంగాక, తండ్రి వాకొనుంగాక ప్రగతి కడ్డువచ్చు పలుకువలదు. నరుండు కొయ్యకాండు నవనవచేతనల్‌ పొసంగ మరల మరలం బుట్టుప్రాణి.

సామాజికకవి 105 ఆ.వె. చొంగ కార్చునాటి చొళ్కాయ కుజ్జికు నడక నేర్చినపుడు తొడుగం జిరుంగు తాతనాంటి సంఘనీతి మన్మనివేళ నడుపంజూతురేని బెడిసికొట్టు. వ్యక్తుల సమూహమే సమాజం. వ్యక్తుల మంచి చెడ్డలే సమాజం మంచి చెడ్డలు. సమాజంలో చెలరేగే చెడ్డను తొలగించే తెరువులను తలియజేయటం సామాజిక కవి కర్తవ్యం. వీటిని తెలియజేయటానికి ముందు సామాజిక దుర్లక్షణాలను అతడు గుర్తించాలి. అప్పుడుగాని సామాజిక కవి తరణోపాయాలను నిర్టేశింపలేడు. పరిణామవాది అయిన సీతారామమూర్తి భారతీయసమాజంలోని అవలక్షణాలను అవగాహన చేసికొన్నాడు. వాటిని నిర్మూలించే విధానాలను వివరించాడు. పాలకులకూ, పాలితులకూ ప్రయోజనకరందా ఉండే పలుకులను కవికారూపాన స్పష్టంగా వెల్లడించాడు. భారతీయసమాజం పతనం గావటానికి మూల కారణాలను గుర్తించటంలో సీతారామమూర్తి కృతకృత్యు డయ్యాడు. ఈ మాటకు ఈక్రింది పద్యాలే సాక్ష్యాలు. ఆ.వె. శక్తుం. డయినవా. డశక్తుల్ల హింసించి కుట్రగా6 డమాయికులను ముంచి నిక్కిపడుట తక్క నేంటిసమాజమం దెన్నం దగిన మేల్మి యేమి కలదు. కం. చీలుట, చీల్చుట, వెడవెడ ప్రేలుట, దబ్బఅకుం వీంయ పెట్టుట, తృష్టా జాలమునం జిక్కి విప జ్ఞాలమునం బడుట నేంటి సభ్యత యయ్యెన్‌. ఆ.వె. క్రిందినుండి మీందికిన్‌ గొల్ల గొట్టుటే పాటి యయ్యెం బారుపత్తి మొదవ మంచి వాండు వందమందిలో నున్న నెంతలగ్గువొడము నితనికతన.

106 చుమ్మల సీతారామమూర్తి ఆ.వె. పెద్దవారి బుద్ధి పెడవోయి యీనేల నాల్గు ముక్కలయ్యె నరసమాజ; మెవండు దీని మరల నేకము చేయునో చేయకున్నం గడింది చెట్ట పుట్టు. ఆ.వె. దిగులు వొడము నేడు దేశాన వీచెడి తీండ్ర మయిన గాడ్చుతీరు చూడ ప్రాంతవిలువ చచ్చుపడెం గాని సరిక్రొత్త విలువ పుట్ట దయ్యె వేండ్ర మడంప. కం. తూర్పును బడమర యనుటే నేర్చని భావించు వారు నిండిరి మహి; వీ రేర్చణుచు సమాజమునకు నార్చులు పెడబొబ్బలే కదా నిత్యవిధుల్‌ ఆ.వె. పాపపుణ్యములను బాటింప నొల్లని రాజనీతితో, సమాజ కష్ట సుఖసమీక్ష కిచ్చసూపని మతముతో నరుండు దారితప్పినాండు నేండు. గాడిదకూ గుల్టానికీ వార లేకుండా పోయిందనీ, బూడిదకూ సిమెంటుకూ భేదం కనబడదనీ, షపాపానికీ పుణ్యానికీ వాసి సమసిపోయిం దనీ సీతారామమూర్తి గ్రహింపగలిగాడు. ఆ.వె. గాంధితో నడంగెం గర్హవ్యనిష్టు మ హాత్ముతో వివేక మస్తమించె; భారతోర్వినిపుడు పదవుల కాట్టాట తక్క నేమికలదు నిక్కమరయ? అని ఆయన అన్నాడు. సమాజం ఎంతగా మారిపోయిందో మోమోటం లేకుండా ఈవిధంగా వక్కాణించాడు. ఆ.వె. ఒకడు జందె ముంట, నొకండు జందెము లేమి నొకడు కులము వర్ణ మొప్పకునికి న! నొకండు చీమునెత్తురుండిన కతన నే ర్పెంత యున్న గద్దెకెక్కలేండు.

సామాజికఠకవి 107 కం. తక్కడవలె నల్చుని ఖై కెక్కించి, గరిష్టుంగ్రింది కీడ్చెడి దొర లే దిక్కునం జూచినం గలరీ తక్కిడిపని దురభిమానదాసుల కించున్‌. కం. లంచము నిచ్చినంగాకియు నంచయగున్‌ నేండు మనకు; నధికారము నా ర్హించుట కేవెరవైన రు చించు నహో। లేవు మంచి చెడ్డల చర్చల్‌. సత్యమూ, ధర్మమూ, నీతీ, సమత్వమూ సర్వనాశమయిన సమాజాన్ని చూచి ఒక కొంత నిరాశతో మరణించిన జయప్రకాశ నారాయణ నుద్దేశించి సీతారామమూర్తి ఈవిధంగా అన్నాడు. తే. మంచిపని చేసితివి మహామతిః; జయప్ర కాశ నారాయణా! కుళ్లి గౌలు గొట్టు నీతి కిరవైనదేశాన నిన్నువంటి యోగి నిల్చి ఘటించు నభ్యుదయ మెద్ది? గాంధీజీ శతజయంతి సంవత్సరంలో వ్రాసిన వచన కవితలో కూడా ఆయన “నిజ మాడినవాని కీదేశములోనేండు నిట్రుపాసెములు తప్పుటలేదు” అని అన్నాడు " ఇంతకంటె దేశంలో వ్యాపిస్తున్న చార్వాక సిద్ధాంకాలు సీతారామమూర్తిని అశ్చర్యపరిచాయి. భోగలాలసత్వమూ, స్పాద్భా కామమూ నానాడు ఈకర్మభూమిలో వరిల్లుతున్నా యన్నవాక్కులు సత్యసమ్మతాలి కదా! ఇదంతా పారమార్ధిక ద్చుష్టి లేని జాతి మనస్తత్త్వంలో వచ్చినపరిణామం. దీనిని సీతారామమూర్తి తే. సంతతత్యాగ సాధ్యంబు సౌఖ్య మనుచు విశ్చసించుట నేం డవివేకమయ్యె నిరవధికరాగ భోగ ప్రణీయ మైన సుఖము పొంగులు వాజు నెచ్వ్పోటంగన్ను;

106 తుమ్మల సీతారామమూర్తి ఆ.వె. జగ మనీశ్చరమ్ము:ు మగువయు మగవాండు గదియ నిది జనించు6 గామ మొక(డె హేతు వగును దీని కితరమ్ముగా; దను పలుకు లిపుడు క్రొత్త పాటలయ్యె. అనే పద్యాల్లో వర్ణించాడు. ఈరెండో పద్యంభగవద్గీతలోని దైవాసుర సంపద్విభాగ యోగంలో ఉన్న శ్లో అసత్య మప్రతిష్టంతే జగదాహు రనీశ్చరం అపరస్పర సంభూతం కి మన్య త్కామహైతుకమ్‌ అను ఎనిమిదో శ్లోకానికి భావాను వాదం. భారతదేశం విఖిన్నమతాలకు ఆశ్రయం. ఆ మతాలు కూడా కాలక్రమాన స్వర్గానికి ఆలవాల మయినాయి. పరమార్శాన్ని పరిత్య జించాయి. మతాలను గూర్చి సీతారామమూర్తి యీవిధంగా పలికాడు. తే. మొదట నెల్లమతమ్ములు ముక్తికొణకుం బుట్టినవి గాని రాన్‌ రాను భుక్తి కయ్యె బల్లికిని బిల్లికిని భయంపడుట నేర్చి జలగలుం బలె నివి ప్రజాస్రమును బీల్చె. తే. మొఅకు నమ్మకములకుం గైమోడ్చులిచ్చి తడిపి రీనేలం బ్రజలరక్తమ్ముతోడ నడిపి రొయ్యన వెన్క్మకు నరునిపెంపు చెజిపి రనవద్య మైనసంస్కృతిని జడులు. సత్యాన్నీ, కరుణనూ, ప్రేమనూ. చాటని మతమంటూ లేదనీ, కాని మనుష్యుడు అహంకారాన్ని వర్షింపలేక ధర్మదూరు డయ్యాడనీ ఆయన నిగ్గుతేల్చాడు. సీతారామమూర్తి నూటికి నూరుపాళ్లూ హిందువు. అందువల్లనే హిందూమతంలోని లొసుగులు ఆయనకు తేటతెల్లంగా తలిసివచ్చాయి. కాబట్టే హిందూమతాన్ని గూర్చి ఈ విధంగా చెప్పగలిగాడు.

సామాజికఠవి 109 త. బుక్కు లొకనికి, నొకనికిశెక్కభజన ప్రభుత యొకనికి నొకనికి బానిసమ్ము గ్రామమొకనికి నొకనికిం గసటు గూడె మేమి సౌభ్రాత్ర! మేమి హిందూమతమ్ము! తే. మనుజు నొక్కని దేవతా మౌళియేసి యొకని నస్పృశ్యతాదోష నికృతుంజేసి నారి నవమానభారావనతను జేసి దారిదప్పెను హిందూమత ప్రవక్త. బుద్ధుడు భారతదేశంలో జన్మించి నీతినీ, అహింసనూ, కరుణనూ, మైత్రినీ బోధించి సంస్కృతి పతనాన్ని నివారించాడని సీతారామమూర్తి నిర్ణయించి ఈవిధంగా అన్నాడు. తి, బుద్ధుం డీభారతమ్మునం బుట్టండేని మేంక లావుల మందలు గాక నరులు నెందంకో చావు మూడెడి దింద్రలోక సుఖము నర్థించు వెడంగుల సురియచేత. ఇంతగా _ భారతీయసమాజం _ భ్రష్టమైపోయిందని సీతారామమూర్తి గుర్తించాడు. ఒకనాడు విదేశీయుల పొగడ్తలు పొందిన భారత దేశ సుస్థితిని స్మరించి ఆశ్చర్యపడి, ఆవేదనచెంది ఈరీతిగా పలికాడు. తే. తలుపునకు దాళము బిగింపు, తస్కరత్వ, మనృత మాడుట, సోమరితనములేని పుడమి యని మున్ను పెజవారిపొగడు గన్న భారతం బెంత చెడియెనిప్పటికి నదిర! ఆ.వె. కొన్న చేనిలోనం గన్నబంగారమ్ము నమ్మినట్టివాని కప్పగింపం బెనంగినట్టికాయపు పెరింగినగడ్డలో హంత]! హంత! పాపమెంతరెచ్చె. సీతారామమూర్తి చింత అంతా గ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన దైవసంపద సమస్తమూ సమసిపోయిందనే. సత్యమూ, అహింసా,

110 తుమ్మల సీతారామమూర్తి త్యాగమూ, _ కాంతి, కారుణ్యమూ, అజక్రోధమూ, ఇంద్రియ సంయమనమూ, అద్రోహమూ, శాచమూ ధృతీ, క్షమూ మొదలయిన వన్నీ దైవసంపద క్రిందికే వస్తాయి. దేశదౌర్పాగ్యస్థితిని వర్ణించి తనపని ముగిసిందని చేతులు కడుక్కొని సీతారామమూర్తి ఆత్మసంతృప్తి పొందలేదు. దేశ పునరుజ్జీవనానికి తగిన తత్త్వాన్ని కూడా ఆయన ఉపదేశించాడు. ఆతత్తాన్షనికి గాంధేయవాదం'. పునాది. సకలమత సారమూ ఆలంబనం. భారతీయ సంస్కృతిలోని మేలిమిని గుర్తించి దానిని కాలానుగుణంగా రూపొందించుకొని సామాజిక కల్యాణాన్ని సాధింపవచ్చుననేదే సీతారామమూర్తి బోధల సారాంశం. అమేలిమి గాంధీజీ బ్రతుకులో ఉదాత్తరూపంతో సాక్షాత్కరిస్తున్నదని విశ్వసించాడు కాబట్టి ఆయన మాటిమాటికీ గాంధీజీ వాక్యాలను ఉదాహరిస్తుంటాడు. దీనికి తార్కాణాలుగా ఈక్రింది పద్యాలను చూపవచ్చు. ఆ.వె. నియతి లేని రాజనీతి, వేసట లేని కలిమి, నడత లేని తెలివి, పాడి లేని బేర, మీవి లేనిపూజావిధి చెనంటి తప్పులని వచించె గాంధి. ఆ.వె. వీధు లూడ్చువాని విశ్వమేలెడువాని వేర్మివిడిచి గౌరవింపవలయు. కృత్యమెల్ల నుత్యమే యనుసత్యంబు చాటినట్టి గాంధికేటికోళ్లు. వీటికితోడు ప్రాచీన గ్రంథాల్లోని వాక్యాలను తలపించే సూక్తులు ఆయన చెప్పాడు. నె్సనుభవం నుండి గ్రహించినసత్యాలను చాటాడు. ఈ కారణాలవల్ల సీతారామమూర్తి ప్రతిపాదించే సామాజిక నీతిగానీ, వైయక్తికనీతిగానీ ఎరవు సామ్ములుగా కనబడవు. అవి ఈనేలలో పుట్టి యుగానుకూల మయినరూపాన్న్ని పొందిన తరణ సాధనాలుగా సహృద యులకు సాక్షాత్కరిస్తాయి. మున్ముందుగా సాంస్కృతికదాస్యం నశించి పోవాలనీ, అది సంభవిస్తేకాని రాజకీయస్వాతంత్ర్యం రాణింపదనీ సీతారామమూర్తి స్పష్టంగా వక్కాణించాడు.

సామాజికకవి [11 తే. సాంస్క ఖతికమైన దాస్యంబు స్రగ్గుదనుక రాజకీయవిభూతికి రాణలేదు కంచమున గూడుకట్టిన కసటు తొలంగు దనుక మృష్ణాన్నమునకు నాదరము రాదు. మానవుడు సమాజ సేవ గావిస్తే తప్ప భగవంతుని బుణం తీర్చుకోలేడని సీతారామమూర్తి సిద్ధాంతం. లోకంలో ఉన్న సంపదంతా భగవంతునిదే. ఆ భగవంతుడు సంఘ స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు, సాంఘిక జీవి అయిన మానవుడు భగవంతుని సొమ్ము తినటం తప్పదు. కాబట్టి సాంఘికసేవ మూనవుణ్ణి బుణవిముక్తుణ్ణి చేస్తుంది. ఆ.వె. జగతి నున్న-కల్మి సకల మీశ్చరునిదే యెసంగు సంఘమూర్తి నీశ్చరుండు మనుజు6 డితనిసాత్తు దినుట తప్పదు; బుణం బిది సమాజసేవనే తొలంగు. అసలు పురుషార్థం ఆకాంక్షించే వానికి సాంఘిక సేవా కావాలి. అత్మ విచారమూ కావాలి. ఈరెండూ పరస్పరప్రాణాలు. స్వతంత్రంగా వ్‌ ఒక్కటీ గణ్యతను పొందదు. కాబట్టే సీతారామమూర్తి ఈ విధంగా త. వలయు సాంఘిక సేవ, కావలయు నాత్మ చింతనము పురుషార్థ మాసించు వాని; కివి పరస్పర ప్రాణము; లిందు నెదియు గణ్యుత గడింపంజాల దెక్కటిగ నున్న, ఏరక మయిన ప్రభుత్వ మయినా దానిలక్ష్ర్రం దారిద్యనిర్మూలనం గావాలని సీతారామమూర్తి అభిప్రాయం. ఆ.వె. సామ్యవాదమో ప్రజాస్వామ్యమో నియం తృత్వమో మజేప్రభుత్వమేని కూడు గుడ్డలేని గూండు లేని వికారి మెప్పు లందవలయు ముప్పు లణంచి పరిపాలనం సక్రమంగా లేనప్పుడు ఎదిరించేసాహసం ప్రజకు ప్రాప్తించి నప్పుడే స్వరాజం వచ్చినట్లని ఆయన చెప్పాడు.

112 తుమ్మల సీతారామమూర్తి తే. దేశమున బదిమంది గద్దియల మీంది శిక్కినంతనె కాదు, వా రేలు తీరు తగని దగునేని యెదురించుతెగువ ప్రజకు వచ్చినపుడే స్పారాజ్యంబు వచ్చినట్లు. భారతదేశం ప్రజాస్వామ్యాన్ని వరించింది. దీనిలో యుక్తవయస్సు వచ్చిన స్త్రీపురుషులకు ఓటు చేసే హక్కున్నది. ఎక్కువ ఓట్లు సంపాదించిన అభ్యర్థి విజయం పొందుతున్నాడు. విజయం సాధించిన అభ్యర్థులు ఎక్కువమంది ఉన్నరాజకీయపక్షం ప్రభుత్వాన్నేర్పరుస్తుంది. ఒక్కొక్క సారి రాజకీయ పక్షాలకూటమి ప్రభుత్వాన్ని నెరపవచ్చు. కాబట్టి ఓటు ప్రజాస్వామ్యంలో ప్రబలమయిన సాధనం. ఈ సందర్భంగా సీతారామ మూర్తి చెప్పిన మాటలను రాజకీయ నాయకులు నిత్యమూ గుర్తుంచు కోవాలి. కం. వాకులతో వర్ణముతో రూకలతో నోట్లు వచ్చురోజులు కడచెన్‌ లోక మిది రాజనైతిక ఢీకిన్‌ వెలకట్టు, దీనించెలియుండు దిట్టల్‌: కం. విధులు నెజవేర్చువానికి నధికారము లావహిల్లు నలవోక6ం గఠో రధరిత్రి దున్ని నానా వ్యధలోర్చుకృషీవలునకు నబ్బవె పంటల్‌. అ.వె. నీక్సం జెట్టు నీడ, నాకు బంగరుమేడ నీకు గోంచిపాంత, నాకు వలువ నీకుం గటికి పస్తు, నాకు విం దనుదొర యెన్నినాళ్లు ప్రజల నేలంగలండు. పేదవానికంటె పేదగా శ్రమిస్తూ, ఆర్హసీవలో ప్రాణాలను సైతమూ పరిత్యజించటానికి సిద్ధపడేవాడే భారతదేశాన్ని పరిపాలించటానికి పాత్రుడని ఆయన ప్రకటించాడు. నాయకులనుబట్లి ప్రజలు నడుచు కొంటారనే సత్యాన్ని వివరిస్తూ ఈవిధంగా అన్నాడు.”

సామాజికళవి 113 ఆ.వె. చిల్లిగవ్వలేని సిరిమ్లీందరుచిలేని మనుజుం డెక్కవ్రలయు మంత్రి పీఠ; మతండు తోటకూర మెతుకుతో బతికెనా ప్రజయుం గన్ను విచ్చుంబగతిహెచ్చు. ఆ.వె. త్యాగమునకుం గాక భోగంబునకు బరా బరులు సెప్ప నిష్టపడరు జనులు మున్ను బుద్ధువెంట నిన్న బాపూవెంట నేలపరువులేత్తె నీజగత్తు? ఈ ప్రకరణంలో ఆయన లాల్‌ బహద్దరు శాస్త్రి నిష్కళంకశీలాన్ని బహుధా ప్రశంసించాడు. శాస్త్రి మరణించేనాటికి ఎక్కడా ఆయనపేర ఒక్కరూపాయ కూడా జమకాలేదు. ఆయనకు ఒక చిన్నయిల్లుకూడాలేదు. ఇల్లాలిపుస్తె మాత్రమే ఆయనకు మిగిలిన ఆస్తి. ' తూట్లూ కుట్లూ లేనిదుస్తులు లేకపోవటం చేత ఆయన భారత ప్రభుత్వపువిందులకు వెళ్లలేక పోయాడు. అరియలూరురైలు ప్రమాదానికి తానే పూటపడి శ్రీ శాస్త్రీ తన పదవిన్‌ తృణప్రాయంగా పరిత్యజించాడు. పదవి వదలిన నిమిషంలోనే ప్రభుత్వ వాహనాన్ని కూడా వదలివేశాడు. ఇంటికి పోయి. ఇల్లాలితో “పదవిపోయింది. పదికూరలు వండవద్దు. ఒక కూరచాలు” అన్నాడు. మూనవుని జీవితం దివ్యమై తేజరిల్లటానికి సీతారామమూర్తి కోకొల్లలుగా నీతులుపదేశించాడు. సత్యనిష్ట్ర ఇంద్రియసంయమనం, నిష్కామసేవ, అహింస, సమత్వం, త్యాగం, సభ్యత, జీవకారుణ్యం, ప్రేమ, అపరిగ్రహం, _అరిషడ్వర్గవిజయం, మానం, దానం మొదలయిన సద్గుణాలను ఆయన అధికంగా వర్దించాడు. సంఘంలో ఉన్న, వివిధ వర్గాల వారికి సదుపదేశం గావించాడు. ఆధ్యాత్మిక చింతన ఆవశ్యకాన్ని వివరించాడు. వివాహ పవిత్రతను వెల్లడించాడు. దాంపత్య మాధుర్యాన్నీ, స్త్రీ జొన్నత్యాన్ని కొనియాడాడు. తనమాటలను సమర్థించు కొనటానికి ఇతిహాసాలనుండీ, పురాణాలనుండీ అనేకాలయిన తార్కాణాలు చూపాడు. ఉదాహరణకు ఈ క్రింది పద్యాలను పేర్కొనవచ్చు. ఆ.వె. కట్టినపుడె వాంగు కయ్యలంబండించు చెక్కినపుడె కొయ్య చెలువుంజూపు

114 తుమ్మల సీతారామమూర్తి వంచినపుడె వెదురు వజలుధనుస్సుగా నొడిచినపుడె చిత్త మొసంగు శాంతి. స్త ఇమ్ముగా నార్‌కేళాదు తెదుగుచుండం బ్రాంబడినమట్ట లల్లల్ల రాలు కరణి నాత్మ వికసించుకొలంది వర్ష్జాదికృతక వైపరీత్యంబు లణంగుట వాస్తవమ్ము. కం. నజ్జలు చెడినన్‌ బొలమున గొజ్టాడదు ముసలియెడ్ల కోల్పల కతనన్‌ కుజ్డలు చెడినన్‌ దేశపు బిత్హాంగదు తాత లెంత పెనంగం బడినన్‌. కారణా లేవయినా మతం దేశ విభజనకు దారి దీసింది. స్నత్రంత్ర భారతం మతకలహాలతో నేటికీ ఉడికిపోతూ సతమతమవుతున్నది. సీతారామమూర్తి మతసమస్కను కూడా ్రస్తావించాడు. ర ఏమతమ్మునం దోణిన నేమి? నిత్య సత్యమున్‌్స్‌ దలందాల్చును సజ్జనుండు నామతంబె సేవ్యం బనునరుండు తెలివి పండని, యహంత యెొండని పండితుండు. కం. కొందఆ కిచటన్‌ గోవెల, కొందజకు మసీదు, చర్చి కొందఅ కున్నన్‌ సుందర భారతదేశం బందఅకున్‌ గుడియగున్‌ మహాతీర్థ మగున్‌. మత సామరస్వమే ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం. ఇంతీ కాకుండా ఆయన యజ్ఞానికి నూతన నిర్వచనం చేశాడు. ఆ.వె. జన్న మనినం బసులం జంపుట కా;దహిం సాపరీత మైన సరణి నొరుల కుపకరింప నలంగు యోగము; కష్టించి తిండి దినెడి హక్కు తెచ్చుకొనుట.

సామాఖికళవి 115 మానవుడు సాధింపదగిన చిట్టచివరి పురుషార్థం మోక్షం. ధర్మబద్ధంగా అర్గాన్ని ఆర్జించి, కామాన్ని అనుభవించి అతడు మోక్షాన్ని పొందగల డని జ్ఞానులు ప్రవచిస్తారు. సీతారామమూర్తి ధర్మబద్ధ మయిన అర్థకామాలతో పాటు ముక్తి మార్గాన్ని కూడా వర్ణించాడు. ఆయన అంతర్యాగం బాహ్యాడంబరం కంటె మిన్న అని నిర్ణయించాడు.

ఆ.వె. సంతుకతనరాదు, సంపత్తిచే రాదు రాదు యజ్ఞకర్మ రక్తింజీసి కాన నుంటరాదు, కావితోడను రాదు వలపు లుడిగి నపుడె వచ్చు ముక్తి, చమూనవుడు గుడ్డరంగును గాకుండా మనసురంగును మార్చుకోవటం ప్రధాన మని ఆయన పలికాడు. కం. తలమీంది వెండ్రుకలు తిరు మలనాథుని కిచ్చినంత మాత్రన పొంగా? తలలోని ఫౌగరు పొచ్చెము బలిగా నిడవోయి! బాగుపడంగా వెడంగా! అని హితబోధ చేశాడు. సీతారామమూర్తి ఆంధ్రపండితుడుగా గురుపీఠాన్ని అధిష్టించిన వాండుగాబట్టి గురుశిష్యసంబంధాన్ని చక్కగా వర్ణించాడు. ఆ.వె. ఒండు చోట నాటకుండినచోం దల్లి మ్రూఢశు నీడ నున్న మోక పెరుంగ; దర్హుం డయినయొబజ్డ కర్పింపకున్నచో ల్‌ దబ వెలయం డయ్యచెంత నిలుచుకొడుకు. తెలుగువారు మాతృభాషపట్ల ప్రదర్శించే వైముఖ్యానికి సీతారామ మూర్తి పరితాపం పొందాడు. ఆంధ్రదేశంలో అంగ్లభాషపట్ల అతిశయిస్తున్న అనురాగాన్ని ఆయన ఈ వధంగా వర్ణించాడు.

116 తుమ్మల సీతారామమూర్తి కం. మూండేండ్లకుజ్జం డే.వీ: సీడీలను దిద్దు. దెల్లుసీమ నయారే! వీండు తననేలనేపెజ వాం డగుటన్‌ జాతి కెంతవల్లడి యగునో! కం. ఈమె యెవ రన్ననేస్తికి నాపెండ్ల మనెన్‌ మగండు; నవలా కోపో ద్ధీపితర్డై “వై ఫనలే వా? పరువుం గానవా? దొరా! యని పదరెన్‌. నియమబద్ధ మయిన భాషపట్ల నిర్వేల మయిన నిష్టగలవాడు కాబట్టీ ఆయన వ్యాకరణ దోషాలనూ, అసాధు శబ్బరూపాలనూ తెలియజేస్తూ అనేకపద్యాలు రచించాడు. సామాజిక కఏగా మానవుని సర్వతోముఖాఖివృద్దిని సాధించే భి కవిత్వాన్ని సీకారామమూర్తి రచించాడు.

సర్వోదయ విప్లవకవి చం. బుడుతల నిర్వికారమగు బుద్ధులం బ్రోధదవాగ్నిమండలం బడరంగంజేసి విష్ణవ మ హాకవిపట్టము నందు నేర్చు నా పడయంగరాని విద్య; పలు బాముల కోర్చిన శాంత్యహింసలన్‌ విడువంగ లేని మామక క విత్వము నెందలు-మెత్తురియ్యెడన్‌ 1971లో సీతారామమూర్తి చెప్పినమాటలివి. ద్వేషాన్నీ క్రోధాన్సీ రెచ్చగొట్టి పింసద్వారా సమాజాన్ని పునర్మించి భూలోకస్వర్గాన్ని స్థాపింపవచ్చు ననేసిద్ధాంతాలూ, వాటిని ప్రచారం చేసిరచనలూ బయలుదేరిన రోజులవి. ఆటువంటిరచనలు చేసినవాడే విప్ణ్లవమహాకవి అనేబిరుదు పొందటానికి యోగ్యుడని టముకు వేసేకాలమది. భారతీయ సాహిత్య మన్నా భారతీయసంస్కృతి అన్నా కొందరకు తేళ్లూ జెళ్టులూ పాకినట్లు అనుభూతి కలిగే సమయమది. ఇటువంటి రోజుల్లో శాంతినీ అహింసనూ త్రోసిరా జనలేని తనకవిత్వాన్ని ఎంతమంది మెచ్చుక్తొంటా రనే సందేహాన్ని సీతారామమూర్తి వెలిబుచ్చాడు. మహాత్ముని అస్థానకవికి ఈశంక జనించటం సమంజసమే. భూమిమీద లఖించేభోగాలను ఏవిధ మయిన తారతమ్యం లేకుండా అనుభవించటానికి అందరూ అర్డ్హులే. కాని విశ్చమానవ చరిత్రలో ఈసిద్ధాంతం ఏమాత్రమూ చెల్లలేదు. “కజ్జి ఉన్న వానిదే గొట్టె” అనే సామెతకు తార్కాణంగా మానవేతిహాసం నడిచింది. సర్వసమానత్వాన్ని చాటిన ప్రవక్తల వాక్యాలు వల్లించటానికి మాత్రమే పనికి వచ్చాయి. అసమానత్వాన్న్సీ అధర్మాన్నీ అంతరింపజేయటానికి ఆయుధాలు చేపట్టినవారు అణగారి పోయారు. ఒకవేళ వారు విజేతలయినప్పటికీ అది మూన్నాళ్ల ముచ్చటయింది. వారూ మొదటి రోజుల్లో హృదయాలను కదలించిన చిత్తశుద్ధిని కోల్పోయి చివరకు నరహంతలయ్యారు. ఈ జగన్నాటకం నాటినుండి నేటిదాకా ఈరీతిగానే

118 తుమ్మల సీతారామమూర్తి కొనసాగుతున్నది. కాయకష్టం చేసేవారు. 1కూటికీ గుడ్డకూ కటకట పడుతున్నారు. సోమర్‌పోతులు ఏవోకారణాలు ప్రవచిస్తూ సర్వసుఖాలూ చూజగొంటున్నారు. ఈ అధర్మాన్ని రూపుమాపటానికి మానవుడు రెండు దారులను కనుగొన్నాడు. ఇవి క్రుక్లిపోయిన సమాజాన్ని కూల్చివేసి సర్వ సమానత్వాన్ని స్థాపించేవిధానాలకు సంబంధించి నట్టివే. ఈ మార్గాల్లో ఒకటి హింసాయుత మయినవిష్ణవం. దీనికి ద్వేషం మూలసూత్రం. సాధ్యసాధనాల్లో సాధ్యమే ప్రధానం. దీన్ని సాధించటానికి ఏసాధనాన్ని ఉపయోగించినా దోషంగాదు. రెండోమార్గం అహింసాయుతమయిన పరివర్తనం. దీనికి ప్రేమ ఆలంబనల సాధ్యసాధనాలు రెండూ ముఖ్యం. పవిత్రసాధ్యాన్ని సాధించటానికి పవిత్రసాధనం ఆవశ్యక మని ఈమార్గం బోధిస్తుంది. గాంధీజీ తాను జీవించినంత కాలమూ ఈరెండోదారిలోనే ప్రయాణించి ప్రాణాలు బలిపెట్టాడు. సీతారామమూర్తి బాపూజీ. బంటుగాబట్టి ఈద్చితీయమార్గమే స్థిరశ్రేయస్కర మని భావించాడు. ఆయన విధ్వంసవాదికాడు. మరి పరివర్తనవాది. “సర్వోదయం” అనే పదాన్ని గాంధీజీ ఉపయోగించాడు. 1904లో -ఆయన రస్కిన్‌ రచించిన ““అన్‌టు దిస్‌ లాహ్ట్‌' అనేగ్రంథాన్ని చదివి పరమానందం పొందాడు. దీన్ని గుజరాతి భాషకు అనువదించాడు. ఆయన తన అనువాదానికి “సర్వోదయం'”” అని పేరు పెట్టాడు. ఈ పదం గాంధీజీ సృష్టించింది గాదు. సమంతభద్రపాదుడు అనే జైనుడు దీనిని ప్రయోగించాడు. (సర్వాపదామ్‌ అంతకరం నిరంతం సర్వోదయం తీర్థ మిదం తవైవ) ఈయననుండే గాంధీజీ సర్వోదయపదాన్ని స్వీకరించాడు. సర్వోదయం పరిపూర్ణ మయిన జీవనదర్శనం. “ ఆత్మవత్సర్వ భూతాని' “సహనౌభునత్తు” “ఈశావాస్యమిదం సర్వం” ఇత్యాది ఉపనిషద్వాక్యాలు దీని తత్త్వాన్ని చాటుతాయి. సర్వసమభావం, దీనికి హేతువయిన ప్రేమా సర్వోదయానికి మూలస్తంభాలు. ఇది ఎదుటివాణ్ణీ ద్వేషింపదు. అతనిలోని సద్గుణాలనుగుర్తించి వాటి వికాసానికి తోడ్చడుతుంది. సమస్యలను పరిష్కరించటానికి హృదయపరివర్తనం ప్రధాన మంటుంది. సర్వోదయం ధనికవాదం, సామ్యవాదం మొదలయిన

సర్వోదయ విష్లవకవి 119 ఆర్థికసిద్ధాంతాలలోని మేలిమిని స్వీకరించటానికి వెనుకంబవేయదు. లౌకిక పారమార్థిక జీవితాల్లో మానవుడు పరిపూర్ణత్వాన్ని సాధించ కూనికి సర్వోదయ సిద్ధాంతాలే శరణ్యమని గాంధీజీ విశ్వసించాడు. కస్తూరిబాయి. స్మారకనిధిని ఏర్చరిచేటప్పుడు “పేదల నెత్తురు పీల్చే ధనవంతులు ఈ నిధిపాలక వర్గంలో ఉండరా”దన్న అనుచరులకు ఆయన ఈవిధంగా సమాధాన మిచ్చాడు.

తీ. ధనికులందును మానవత్వమ్ము కలదు ధనికు లందును ధర్మతత్చరత కలదు వార లార్జించు కల్మికి వారి ధర్మ కర్తల నొనర్చవలయు లోకం బెలర్బ. త. వసువుగలవారి, నాదారువాండ్ర మంచి చెడ్డలకు6 బాలికాంపులం జేతవలయు నపుడు సాహులసాధ్వస మణంగిపోవు నపుడు పేదలక్షుత్కీల లాజిఫోవు. చం. ఎవనికిం జేం దగున్‌ గలిమి? యెల్లరు విత్తము గోరువారె, నేం డువసువు లేక సాహులం గడున్‌ జెడనాడుదరిద్రుం డర్థముల్‌ కవిసిన నాండు, భోగములు కల్గిననాండు ధనాఢ్యు. దిట్టునా? జివసెడి కుందుపేదలను జీరి సమస్తము ధారవోయునా? గాంధీజీ ఆర్థికసమస్యలను పరిష్కరించటానికి ధర్మకర్హృత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీని ప్రకారం ధనవంతులు తమసంపదకు ధర్మకర్తలు మాత్రమే. వారు దానిని లోక_సంగ్రహానికి వినియోగించాలి. గాంధీజీ మరణానంతరం వినోబాభావే దారిద్ర వినాశానికి సర్వోదయ మార్గం చేపట్టాడు. భూదాన గ్రామదానోద్యమాలు సర్వోదయసిద్ధాంత రూషాలే, వీటిలో బలాత్కారం లేదు. హింసా

120 తుమ్మల సీతారామమూర్తి ప్రయోగం కనబడదు. హృదయపరివర్సనం గోచరిస్తుంది. సర్వోదయ కార్యకర్తల అనుభవాలను పరిశీలిస్తే మనకు ఈ అంశాలు అవగత చువుతాయి. సీతారామమూర్తి అహింసాయుతమయిన విప్లవాన్ని కోరాడు. సర్వోదయ మార్గమే శాశ్వత విజయాన్ని ప్రసాదిస్తుందని విశ్వసించాడు. అందువల్లనే ఈక్రింది పద్యాలు రచించాడు. కం. ఏవిస్టవమున కైనను జీవ మహింసా వ్రతంఖే; చిరతర మగు నీ త్రోవం బడసిన విజయము; రా విందు విజేతపట్ల రవరవ లెపుడున్‌. కం. సర్వోదయ మార్గమ్మున నుర్చికిం దేవలయు శాంతి, నొండొకబాటన్‌ బర్చిడి సాధించిన నది నిర్చాఘ్నం బగుచు నిలువనేరదు నిచ్చల్‌: కం. పదుగురలో నార్వురకున్‌ ముద మిడు రాజ్యుమ్ము కాదు మొత్తముప్రజ కిం పొదవించు క్రభుత కావలె; నిదె సర్వోదయ విధాన; మిదె కామ్య మగున్‌. ఈ సందర్బంగా గాంధీజీ తాను కోరీ భారతదేశాన్ని గూర్చి చెప్పిన మాటలు మనం గుర్తుకు తెచ్చుకోవాలి. “| [8|| ౪౦౫60౯ 20 1౧4 11 ౪100 9 ౧001951 5211 1991 41 4 19 1౧91 606౧౯ 01 *0006 ౧14౧0 6) ౧8/8 20 [6061౪79 ౪౦106, 2% 1౧618 1౧ అగ00 41819 8121 09 ౧0 ౧18౧ 01453 &౧6 [0౪ ౦01255 0 ౧6౦౧16; ౭౧ 1౧618 1౧ ఈ[0% 4|| ౦0౧౧౮౧౫6 [2 16 11 001601 [౧4/గ౦౧౮౫ ...... ౧41 15 1౧6 1౧64 0 గ 6920108 ..” సీతారామమూర్తి “ఈశావాస్య మిదం సర్వం” అన్ను ఉపనిషద్వాక్యార్థాన్ని అందరూ పాటించాలని కోరాడు. పరోపకానాని

సర్వోదయ విష్ణవకవి 121 కొగ్గాలని బోధించాడు. సర్వోదయ మూలసిద్ధాంతమయిన ప్రేమను అలవరచుకోమని ఉపదేశించాడు.

ఆ.వె. నాది నీది యన్న భేద మున్నన్నాళ్లు

తొలంగ దొకని నొకండు దోంచకొనుట సంశయమ్ము లుడిగి సర్వ మీశావాస్య మన్నదెసకు మరలు! డన్నలార।!

ఆ.వె. రవిని శలిని జూచి, రత్నాకరుని జూచి

గాలిం జూచి, మేఘమాలం జూచి తరువుం జూచి, నదిని ధాత్రిని జూచి ప రోపకృతికి మనుజు డొగ్గవలయు. ఆ.వె. దారపుత్రపరిధిదాంటి యూరికి నెల్ల విరియం బాజవలయు నరునిప్రేమ యింతమాత్ర నాంగ కిది మండలాదులం గడచి జగతి ఇల్లం గ్రమ్మ వలయు.

ఆ.వె. కల్ల కవుడు తేని, గర్చ్వగంధము లేని

పరుసందనము లేనిబ్రదుకు నిచ్చి కరుణ నోర్మినిచ్చి, నరు నీశ్చరు నొనర్చు ప్రేమ కుద్దిసియ నేమి కలదు?

1940 సం॥ నాటికే సీతారామమూర్తి మార్క్సు సిద్ధాంతాల మేలిమిని గుర్తించాడు. అవి ఆంధ్రదేశంలో అప్పుడప్పుడే అలము కొంటున్నాయి. ఈకారణం చేత ఆయన ధనికుల దరిద్రుల సమస్యపై చూపు సారించాడు. మార్క్సు వక్కాణించిన ఆర్దిక సిద్దాంతాలనూ, అంతిమరాజ్యవ్యవస్థా స్వరూపాన్నీ ఆయన అంగీకరించాడు. “ధర్మ జ్యోతి” కావ్యంలో తండ్రి నారయ్య నోట ఈవిధంగా పలికించాడు.

ఆ.వె. యుగయుగాల నుండియును థనవంతు లీ

రీతి నీతి పాపఖీతిలేక పీల్చుచున్నవారు పేదలరక్తంబు తీయ తీయ కొండతేనె వోలె.

122 తుమ్మల సీతారామమూర్తి తే. చెమటలోం జీకి చీకి కష్టించుబడుగు కమికెం డన్నంబు లేక యేయారు టేమి యెండక న్నెయింగని శుంఠ లింద్రభోగ మగ్నులై కోరమీసాలు మలయపు టేమి. ' తీ. ఆంటికి మగ్గి, చలిదెబ్బ కలమటించి మొండిరోగాల కవమానములకు లోంగి నాగరకలోకమున కొక్కనవ్వు విసరి పిలుచుచున్నాండు యము నహో। పేదవాండు. తే. ఎవని యెముక లీమేడల కిటిక లయ్యె నెవనిరక్తంబుచే గోడ లిట్లు విగిసె నతనికా యిట్టి పరమ హేయంపు బ్రదుకు వానికా యిట్టిదుర్క్మరణానుభూతి. కే. _కాలదంష్రీక వోనిఖడ్గమ్ము చూపి చెఅకడమ్మును బోని దబ్బఅలు మప్పి చేందు తలపోంత లెణుంగనిపేదవారి పొట్టలం గొట్టి రాజ్మైక భోగరతులు. ఆ.వె. బొజ్జ బలిసి నేండు విజ్ఞవీంగుచునున్న సాహుకార్లయాట సాగదిట్లె రుద్రమూర్తియై దరిద్రుండు చిచ్చల కన్ను విప్పి గ్జెకట్టు నెపుడా. దరిద్రుడు రుద్రుడై అగ్నినేత్రం తెరచి తాండవం చేసినప్పుడు ఆప్రళయాగ్ని జ్వాలలను తటాకాల్లూ నదులూ చతుస్సముద్రాలూ ఆర్పివేయజాల వనీ, ఆవి తమంతతామే ఆరిపోయి, శాంతి జ్యోత్స్స్సలయి అవనీమండలంలో అమృతాన్ని వరజమ్ముతాయనీ సీతారామమూర్తి ఊహించాడు. వాస్తవానికి నారయ్య వైళ్యమిత్రున కేసుద్దులు మప్పాడో ఎవరికీ తెలియదు. కాని “ధర్మజ్యోతి” లో ఆయన కుమారుని అభిప్రాయాలను అనువదించాడన్న మాటమాత్రం నిజం. సమకాలిక రాజకీయ సాంఘిక స్థితిగతులు సాహిత్యంలో సందుకొంటా యనేసిద్ధాంతాని కీఘట్టం ఒక తార్కాణం.

సర్వోదయ విప్లవకవి 123 1958-69 సం॥ ల మధ్య సీతారామమూర్తి రచించిన “క్రొత్త సంక్రాంతి?” పద్యాల్లోకూడా మార్కు భావచ్చాయలు కనబడు తున్నాయి. 1941 నుండీ కృషికకుటుంబంలో జన్మించిన ఆయన సంక్రాంతిని వర్ణిస్తూనే ఉన్నాడు. కాని పేదల తీరుతెన్నులను గూర్చి యోజించిన కొలదీ ఆయన అపర్వాన్ని వర్డించిన విధానంలో మార్చు వచ్చింది. “క్రొత్త సండక్రాంతి”"లో ఏడాది కొకసారి ఏతెంచే సంక్రాంతిని గాకుండా పూటకొక్కసారి పొడసూపీ సంక్రాంతిని లోకం కోరుతున్న దని ఆయన చెప్పాడు. బోగిమంటల్లో గోగుపుల్లలను గాకుండా కామరోషాలను కాల్పాలనీ, కోడిపుంజులను గాకుండా దురఖిమానా లను క్రుంచివేయాలనీ ఆయన కర్తవ్యోపదేశం చేశాడు. ప్రజల్లో అనైకమత్యాన్ని అభివృద్ధిచేసి కులమత జాతి భాషాభేదాలు సమసిపోవాలని ఆశించాడు. ఇంతే గాకుండా ఆ.వె. మేడప్రక్కగుడినె, మేలిమిబంగారు పట్టు వలువ సరసః బ్రాంత గోంచి తనివి చెంత నింతతలుగని కన్నీరు లేనిపండు విది ఫలింపవలయు. అ.వె. కుక్కలను గదల్స్చి మ్రుక్కడి పందుల మందలించి కడుపు మంటలార్చ నెంగిలాకు.నాకు నేనాదిమూంకలు లేని పండు విది ఫలింపవలయు. అని చాటాడు. చివరకు ఆ.వె. విచ్చగాండు లేని, మ్రుచ్చు లేని, కటారి లేని, దొరతనమ్ము లేని, కు్ర్రు లేని, యీరసమ్ము లేని, దేశావధి లేని పండు విది ఫలింపవలయు. అని ఆకాంక్షించాడు. సామ్యవాద చరమస్వరూపం రాజ్యవ్యవస్థ రద్దయి పోవటమేకదా; ప్రతిదేశంలోనూ రాజ్యవ్యవస్థ రద్దయి పోవాలన్నీ, దేశదేశాల సరిహద్దులు తొలగిపోయి వసుభైకకుటుంబ భావన వర్ధిల్లాలనీ సీతారామమూర్తి వాంఛించాడు.

124 తుమ్ముల సీతారామమూర్తి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. స్వాతంత్ర భారత ప్రభుత్వం దేశపునర్నిర్మాణానికి పూనుకొన్నది. పంచవర్ష ప్రణాళికలు ప్రారంభమయినాయి. కోటానుకోట్ల రూపాయలు వ్యయమయ్యాయి. అన్ని రంగాలో అఖివృద్ది కనబడిందన్నమాట నెవరూ కాదనలేరు. కాని పేదవాడు నిరుపేదవాడయ్యాడు. ధనవంతుడు నవనిధులున్న కుబేరు డయ్యాడు. అర్థిక శాస్తనిపుణుల అంచనాల ననుసరించి దేశసంపద ఒక పది కుటుంబాల వారి చేతులకు చిక్కింది. ఈ దుస్థితి సీతారామ మూర్తిలో బుజుక్రోధాన్ని సృష్టించింది. ఆయనకు మహావేదన కలిగించింది. ఆ.వె. తెల్లవాండు పోయె దేశంబునకు నింక నవత వచ్చు నని జనమ్ము పొంగ నదియ వచ్చెంగాని యరసున్నతో వచ్చి కన్నకలల నిండుసున్న చేసె. అని చమత్కారంగా అన్నాడు. ఈ పద్యంలో సంస్కృతాంధ్ర శ్లేష ఉన్నది. మొదటి నవత తత్సమం. దీని అర్ధం నూతనత్వం. అరసున్నతో కూడిన రెండోనవంత అచ్చితం. నవయుధాతువు నుండి పుట్టిన కృదంతం. దీని అర్థం కష్టం. జనానికి నవయుగోదయం బదులు కష్టనష్టాలు జనించా యని పద్యతాత్పర్యం. “చక్కట్టు” కావ్యంలో కూడా సీతారామమూర్తి ఈభావాన్నే మరలా ప్రకటించాడు. ఆ.వె. నలువదేండ్లనాండు తెలవాండు బోటెక్కె తాఢె మిన్నకోకధర్మచక్ర మెంగిలాకు నాక నెగంబడు బడుగులీ యుర్వింగలరు నేండు నూర నూర, పంచవర్ష ప్రణాళికల ఫలితంగా ప్రభవించిన లక్ష్మి పేదవారి పంచలకు చేరలేదు. షకవారి ప్రాసాదాల్లో కొలువుదీరింది. ఈ అధర్మాన్ని శఈక్షించిన సీతారామమూర్తి ఈవిధంగా పలికాడు. అ.వె. మిద్దెవాండు నాల్గుమేడలవాణ డాయె గుడిసెవాండు పోయెగుట్టనీడ;

సర్వోదయ విప్లవకవి 125 కేల తెల్లవారి నెదిరించి వెతలోర్భి పడసె నేలుబడిని భారతమ్ము? చం, సిరిగలవారి కోశములు చిన్నవి పెద్దవి యయ్యె; సంపదల్‌ పెరింగినవారి కబ్ప్చినవి పెత్తనముల్‌ నియిపేద కెంతయున్‌ బరువుగ మాటె జీవితము; ప్రాణములున్న శవమ్ము కైవడిన్‌ దిరుగు నతండు నేండు నిజ దేశ నికృష్ట దశాపకాకయ్డై. చం. జగమున దంభదర్చముల సందడి హెచ్చె, దురాశ రెచ్చె, నీ సెగనె, ననార్భభోగకల - నేచ్చ కడల్కొనె; సత్యశౌాచముల్‌ దిగువకు వచ్చెం (బ్రేమ సెడె, దెప్పరముల్‌ పదివేలు మూడె, నీ తగులు నడంచి సంఘమును దిద్దువలంతులె ధన్యతానిధుల్‌. రాజకీయార్థిక పరిణామాలు ప్రకటించి ఆయన ఈవిధంగా ప్రన్నించాడు. కం. ఒకయెడ విత్తము మూల్లుట యొకయెడ నాంకంటిమంట యొలయుట యీనే లకుం దప్పదయ్యె నేండును; సుక మెల్లరకున్‌ లభించు సూత్రము లేదా? పేదలబ్రతుకులు గతుకుల దారులయ్యాయి. వారి కాయకష్టానికి అంతం కానరావటం లేదు. సీతారామమూర్తి పేదల కడగండ్లను కడుపు చెరు వయ్యేటట్లు వర్ణించి, సమాజం సమూలంగా మారాలన్నాడు. కం. ' సోలుచుం గూలికి నేగిన మాలెత ఫొాలమందె గొబ్బిమండల నడుమన్‌

126 తుమ్మల సీతారామమూర్తి బాలకుని గనియె, నతండీ నేలకు విడుగో? వచింపు, నిక్కపు నిసుగో? ఆ.వె. నెలలు నిండి రొప్పునెలంతను వరికోంత కంపు రాజ్య మెట్లు పెంపు వడయు? మాట లేల? మనసమాజవ్యవస్థలో చూర్చు వలయు, దిద్ది తీర్చువలయు. ఆ.వె. చూలు ముమ్మరించి సోలునింతిని గూలి కంపు దొరతనంపు జంపుమాన్చం గట్టవలయు నతండు కంకణ మీనాండు జంకుంద్రోచి, బాపు వంకం జూచి ఆ.వె. రాణినంటి చాన తాల్‌ మోయుచున్నది కరుణ లేని మంటగాడ్పునందు తట్టరాపు కతనం దల బోడి యయ్యె; నీ చెట్ట దేశమునకు. బిట్టపిడుగు. ఆ.వె. వానిజీత మైదువంద, లాతనికుక్క లారగించుకండ కాలువంద; లెట్లు సాగుచున్న దీభోగ; మెందఆ నొవ్వు లతనిపాల నవ్వులగునొ? దక్షిణాఫ్రికానుండి వచ్చిన తరువాత గాంధీజీ భారతదేశపర్యటనం గావిస్తూ చూచిన దృశ్యంలో నొకకొంచెం మార్చుచేసి సీతారామమూర్తి ఈక్రింది పద్యం రచించాడు. ఆ.వె. కాల్చకట్ట చాటుగాం జేసికొని, దిస్స మొల నభాగ్యురాలు ముడి౯గ౧ నకటః! యేమిసేయనేర్చు? నెండెడి యరచీర తక్క నామె కొండుముక్క లేదు. ఒకయింటిలో సంపదలు మూల్గటం, మరొకయింటిలో పేగు లరవటం దాపురించిన దేశానికి శాంతీ, పాషాణానికి సంకానమూ ఒకనాడే కలుగుతాయని సీతారామమూర్తి తీర్పుచేశాడు.

సర్వోదయ విష్ణవకవి 127 ఆ.వె. చదువు లేక గ్రుడ్డి బ్రదు కీడ్చుమానిసి మందు లేక రుజలం గుందు పేద కూడు లేక రాలువాః డున్నగడ్డకు ఇాంతి లేదు, జీవకాంతి రాదు. కం. తఆతగందిని తగుళ్లబడి మూ లుగు వారున్‌, మెతుకులేక లోచెడి చెడినీ లుగు వారున్‌ మనకంటికి నగపడం జెల్లదు స్వతంత్ర మగుదేశమునన్‌ అని ఆయన నిష్కర్షగా చెప్పాడు. కడచినకాలంలో మాదిరిగా పేదవారిపట్ల ఉదాసీనతను చూపటం ఇప్పుడికసాధ్యం గాదన్నాడు. అహంకారాన్ని చదలండని ధనవంతులను హెచ్చరించాడు. చం. ఎముకల గూండులై బ్రదుకు నీడ్చుట కొల్లక, త్రెళ్లలేక శో కములం దపించుచున్‌ సెగలు క్రక్కుదరిద్రులః ద్రోసిపుచ్చు కా లము చనె; విష్లవాగ్షి దెసలన్‌ గబళింపక ముందె యందలా లమరినవారు మేల్కొని యహంకృతి నుజ్జ్ఞనసేంత లగ్గగున్‌ ఇంతకంటె మరొక గొప్పసత్యం ఆయన చెప్పాడు. ఇది ఆయన సూక్ష్ర దృష్టితో సాంఘికపరిణామాన్న్ని పరికీలించాడనటానికి నిదర్శనం. ఆ.వె. అంతు పొంతు లేని యాస్తుల నార్జింప( గడంగువారి పప్పు లుడుక వింకను జడత వీడినారు కడగొట్టు తమ్ములు కదలినారు నొసటికన్ను విప్పి. కం. గజగజతో, నెడ చిక్కని గజివిజితోం బ్రాపు లేనికాపురములతో గిజగిజ లాడిన ప్రజలే నిజమైన జగచ్చరిత్ర నిర్మింతురయా!

128 తుమ్మల సీతారామమూర్తి దేశాన్ని పీల్చి పిప్పిచేసే ఈదారిద్ర సమస్యను పరిష్కరించటానికి సీతారామమూర్తి రెండు మార్తాలను సూచించాడు. వాటిల్లో ఒకటి గాంధీజీ ధర్మకర్హృత్వసిద్ధాంతం. ఇక రెండోది వ్యక్తి సంపాదించే సంపదకు ఒక హద్దును నిర్ణయించటం. అయితీ ఆయన ముందుగా జాతి మనస్తత్త్వంలోనే అపూర్వమయిన మార్చురావాలని అభిలషించాడు. ఇక్కడ ఆయన సాంస్కృతిక విప్లవాన్ని వాంఛించే తీవ్రవాదిగా కనబడతాడు. ఆ.వె. “నేను విడిచి “మనము' పైనిచ్చ నిడనిచో దేశ మెక్కిరాదు లేశ మేని క్రొత్త కజద గాదు ముత్తాతలేయిది చెప్పినారు కన్ను విప్పినారు. బలవంతంగా నయినాసరే కండబలం గలిగిన వారి నందరినీ పొలాలకు పంపి పని చేయించాలని ఆయన కచ్చితంగా చెప్పాడు. కాయకష్టం జాతీయ తారకమంత్రంగావాలని ఆయన ఆఖిప్రాయం. తీ. _పంచవర్ణ ప్రణాళికల్‌ పదిపదాలజు నడచినను మనదేశ మున్నతికి రాదు. కండగల వార లందణు కయ్యకేగి హలము పట్టిననాండె నా డందు గెలుపు. తే. చేవ గలవారి నందం జెండి చెండి దుక్కికిన్‌ గోంతకున్‌ బంపు దొరతనమ్ము రావలయు, మూండు పూవు లార్కాయ లగుచు దేశమునం గల్మి చెల్మి నర్హింపనలయు. సీతారామమూర్తి ఇంకా ముందుకు పోయి తండ్రులు తమబిడ్డలకు శీలమూ, రెక్కలూ తప్ప సంపదలు ఇయ్యరాదని ఉపదేశించాడు. పాళ్చాత్యదేశాలో జరుగుతున్నదిదే కదా! ఆ.వె. విత్త మీయరాదు విశ్చంబు నలరించు వృత్త మీయ వలయు బిడ్డ కయ్య డయ్యకుండ వచ్చు డబ్బుచే నరునకు నాముకేంగు నెల్లబాము లొదవు,

సర్వోదయ విప్లవకవి' 129 తీ. _ టెక్క లిచ్చి పోవలెం గాని రొక్కమిచ్చి పోవుటొప్పదు పితరులు పుత్రకులకు మనసమాజమునం దీమమత్నమెపుడు సమయునో సర్వభద్రమ్ము లమరు నపుడు. ఆత్మజ్ఞానం కలిగిన మానవుడు అన్నవస్తాలకు సరిపోయే సంపదను మాత్రమే వాంఛభించినపుడు లోకంలో దొంగ లుండరనీ, దోషు లుండరనీ, శత్రువు లుండరనీ, పరిపాలకు లుండరనీ సీతారామమూర్తి అఖిప్రాయం. ఇది ఆదర్శవాదం గావచ్చు. అసాధ్యమనిపింపవచ్చు. ఆ.వె. పండి పండి నరుండు తిండికి వల్వకు మించు కల్మి కేవగించునపుడు దొంగ లేండు; నిందితుండు లేండు పగలేండు టీండు లేండు, మంతిరియును లేండు: అర్థిక సమస్యల వల్ల అలజడి పుట్టకుండా నీవారించటానికి గాంధీజీ ప్రవచించిన ధర్మ కర్పృత్వ సిద్ధాంతాన్ని సీతారామమూర్తి అంగీకరించాడు. దారిద్ర్యం మానవుడు సృష్టించింది కాబట్టి తలచుకొంటే అతడు దానిని నివారింపగలడని ఆయన చెప్పాడు... ధనవంతులు తెలివితేటలతో నడచుకొనక పోతే దరిద్రులు విప్ణవం సృష్టిస్తారని ఆయన వారిని హెచ్చరించాడు. కం. సంపన్నులు తమబంగరు గంపలకున్‌ దాము ధర్మకర్పల యని భా వింపవలయుం బేదలసిరి పెంపవలయుం ద్రుంపవలయు. విసిడితనమ్మున్‌. ఆ.వె. ఉన్నవారు తెలివియున్నవారగుచు స ర్వోదయమ్ము దెసకు నొగ్గరేని లేనివారు తాల్మిలేని వారగుచుండీం"? డ్రింప6గలరు, కట్లు త్రెంపంగలరు. సంపదకు హద్దులు పెట్టటం సీకారామమూర్తికి ఇష్టమయిన రెండోమార్గం. కుటుంపనియంత్రణాన్నీ, సంపన్నియంత్రణాన్నీ వ్యక్తులు

130 తుమ్మల సీతారామమూర్తి ఐచ్చికంగా పాటింపవచ్చు. అప్పుడేవారు మనక్శాంతిని అనుభవింప గలుగుతారు. ప్రభుత్వంకూడా శాసనాలు చేసి సంపదకు మేరలు నిర్ణయింపవచ్చు. ఆ.వె. సంపదలకు మాని సంతతికే హద్దు పెట్టంజూతు రిపుడు పెక్కుమంది మేరలునుప వలయు నీరెండిటికి గేస్తు కుందు అేని శాంతి నందు నపుడె: అని సీతారామమూర్తి బోధించాడు. ఆయన మరొక హెచ్చరిక కూడా చేశాడు. పంటదిగుబడి పెరుగుతున్నది గదాయని ప్రజలు గంపెడుమందిని కనరాదనీ, ఆవిధంగా చేయటమే త్యాగమనీ అన్నాడు. ఆ.వె. పంట హెచ్చుంగాక ప్రజ సంతుబరువును హెచ్చనీయరాదు, మెచ్చందగిన త్యాగ మిదియనేండు ధరణీజనులకెల్ల మూల మిదియ దేశములు సుఖింప. “సంపదకు త్యాగమూ, భోగము, నాశమూ అనే మూడుగతులున్నాయనీ, మొదటి రెండూ లేని దానికి మూడోగతి మూడుతుం దనీ భర్తృహరి చెప్పాడు. సీతారామమూర్తి ఆ.వె. ఒక్కచోట నునికి యొప్పుదు సంపత్తి కదలవలయు గడపగడప'దెసకు6 గదల దేని క్రుళ్లి కంపెత్తి కూలారుం గానవలయు సాహు లీనిజంబు. అని పలికాడు. దేనిని గూర్చి కవిత్వం బ్రాయదలచుకొన్నా ముందు ఆయనకు పేదలే గుర్తుకు వస్తారు. “క్రొత్త సంశ్రాంతి” పద్యాలీవిషయాన్నే రుజువుచేస్తున్నాయి. పేదల స్థితిగతులను బట్టే సీతారామమూర్తి పర్వాలకూ ఉత్సవాలకూ వెలకట్టాడు. ఆగష్టు పదిహేనో తేదీనాడు స్వాతంత్ర్యోత్సవం జరుగుతుంది. ఇది భారతీయులకు ముఖ్యమయిన

సర్వోదయ విప్లవకవి 131 పర్వం. ఆనాడు ఉపన్యాసాలూ విందులూ ప్రవర్తిల్లుతాయి. అయితే సీతారామమూర్తి చూపు దీనికి వేరుగా ఉంటుంది. ఆయన

కం, ఆగష్టు పదే ననియూ 'రేగెదరా ప్రజలు నింగి కెగసిన ధరలన్‌ (ాంగుచు, వెడవెడ తిండికి లోంగుచు నడపీన్గులై యలుగులంపడుచున్‌ అని మొదలు పెట్టి చివరకు కం. ఆగప్టుపదేననియూ రేగుదురు శ్రజల్‌ విపన్న హితకర సమతా యోగం, బఖండరాగం వీగడ్డకుం గ్రొత్తవెల్లు లిచ్చెడు వేళన్‌ అని ముగిస్తాడు. తే. గాంధికంటె వినోయోగికంటె నధికుం డుండునా విష్ణవ విధాతృమండలమున అని సీతారామమూర్తి పలికాడు. విప్ణవ విధాతల్లో గాంధికంటె వినోబాభావేకంటె అధికుడు లేడు. కవుల్లో సీతారామమూర్తికంటె అధికుడయిన సర్వోదయ విప్ణవకవి లేడు.

కావ్యశిల్పము

సీతారామమూర్తి కావ్యశిల్పాన్ని పరిశీలించేముందు రెండుమూడు ముఖ్యాంశాలను గుర్తింపవలసిన అక్కర ఎంతయినా ఉన్నది. ఆయన పద్యకవి. మొదటి రోజుల్లో ప్రకటించిన, ప్రకటింపని పొరాణికరచనలను వదలివేస్తే ఆయన నికరంగా ఇరవైరెండు చిన్నపన్న కావ్యాలను రచించాడని చెప్పవచ్చు. వీటిల్లో ““రాష్టగానము”' ఏడు సార్లు ముద్రిత మయింది. ““ధర్మజ్యోతి* అయిదుకూర్చులు పొందింది. “ ఆత్మార్చణము”' నాలుగు పర్యాయాలు అచ్చు౩క్కింది. “ఉదయగానము'”” “పజిగపంట'” రెండు తడవలు ముద్రితా లయ్యాయి. మిగిలిన కావ్యాలు ఒక్కొక్క ముద్రణం పొందాయి.

సీతారామమూర్థి కావ్యాలను సమీక్షించే విమర్శకులుగానీ, పరోలించే పరిశోధకులుగానీ వాటి పూర్వకాలముద్రణాలను గాకుండా, ఉత్తరకాలనూత్న్న ప్రతులను స్వీకరించాలి. తిరిగి ముద్రెంచే టప్పుడు ఆయన తన కావ్యాలను సంస్కరించాడు. ఈసంస్కరణం (ముఖ్యంగా పద ప్రయోగానికి సంబంధించి ఉన్నది. ఇంతీ కాకుండా “పూర్వ ముద్రణల్లోని పద్యోలను తొలగించటం, వాటి స్థానంలో “కొత్తపద్యాలను ' చేర్చటం, అదనంగా నూత్న పద్యాలను కూర్చటం ఆయన కలవాటు. ““ఆత్మార్చణము” ముద్రణాలోనూ, “బాపూజీ ఆత్మకథ” ప్రథమభాగంలోనూ ఆయనచేసిన మార్చులు ఇన్నీ అన్నీ కావు. ఇవన్నీ కాల క్రమాన ఆయనలో వర్జిల్లిన కవితాసంస్కారానికి చిహ్నాలు.

నవీనాంధ్రకవుల్లో సీతారామమూర్తి మాదిరిగా వ్యాకరణ నిష్ట గలవారు లేనేలేరని చెప్పటం అసత్యంగాదు. బాలవ్యాకరణం ఆయన పాలిటికి శరణాగతి శాస్త్ర. తనలో చిన్నయసూరి జీవాత్మవలె కొలువున్నవాడని ఆయనే సగర్వంగా చాటుకొన్నాడు. ఇంతటితో ఆగకుండా ఆయన ప్రొఢవ్యాకరణ పోేషాలను గుర్తించాడు. మహాకవి ప్రయోగాలను సూక్ష్మంగా పరిశీలించాడు.

““లక్షణమపో! మహాకవి లక్ష్యమేని'"

కావ్యశిల్చ్పము 133. అని నిర్హయించుకొన్నాడు. వ్యాకరణానికి సంబంధించే .కాకుండా ఛందశ్శాస్త్ర విషయంలోనూ ఆయన మహాకవి. ప్రయోగాలను' ప్రామాణికంగా సంభావించాడు. అందువల్లనే

తే. ప్రాసమునయగూర్హు నణల నేరాశివైన నీంతకును దాత కీషొత్తు నిడుట కోర్తు వడికి. బ్రాసకు నుభయరేఫములం జేర్తు నుత్తమకవి ప్రయోగంబు లున్నకతన. అని ప్రకటించాడు. ఛందోవ్యాకరణాలతో ముడిపడిన్న మహ్హాకి ప్రయోగాలను ఆయన తనకావ్యాల్లో యథాతథంగా వాడటానిక్సి గానీ, వాటివంటి వాటిని క్రొత్తగా సృష్టించటానికి గానీ వెనుకంజ వేయలేదు. వాటి విశేషాలను తానే కావ్య పీఠికల్లో వివరించాడు కూడా. ఈ శిష్టని భాషాప్రయోగ నిష్టను గూర్చి అపరచిన్నయసూరి దువ్వూరి వేంకటరమణ “మతియు నీయన పదప్రయోగవిషయమున అతిజాగర్తూక్రుల్ను మిక్కిలి శ్రద్ధాళువులు. నియమనిష్టలు లేకుండ, సాధ్వసాధువిచారము లేకుండ, లక్షణపరిశీలనము లేకుండ, సంప్రదాయ గౌరవము లేకుండ, ఎవరిదారి వారిదేయని యథేచ్చముగా6 బ్రయోగించు సోమరుల కోవకుః జెందినవారు గారు. భారతాది ప్రామాణిక గ్రంథములను లోచూపులతో. బలుమాలు పరికించు కొనుచు, అటు ప్రయోగపరిపాటికిని ఇటులక్షణ నియతికిని నూటికి నూఅుపాళ్లును లోపడుచు ఏపదమునయిన_ నిదానముగా (బ్రయోగించు దృష్టియు, నభ్యాసమును గలవారు.” , అని నిజం చెప్పారు. "“ఎవ్వ రంద ఆంత దవై్వైన నేనుఖా షా విపర్క్యయమ్ము సైంపలేను” అని ధీరంగా సీతారామమూర్తి కీర్పికీ ఇతరులమెప్పులకూ ఆసింపకుండా చాటుకొన్నాడు. నవీనాంధ్ర విద్వాంసులు ఈసడించే బండితాను, అరసున్నను నియతంగా ప్రయోగించాడు. కావ్యాలలోనే కాదు ఆయన వాసిలేఖల్లో కూడా ఇదేబడి.

134 తుమ్మల సీతారామమూర్తి

సంస్కృ్పతాంధ్రాల్లో పటిష్టమయిన పాండిత్యాన్ని సంపాదించిన సీతారామమూర్తి మహాకవులు కూర్చిన సమాసాలను, పదబంధాలనూ, పదాలనూ ఉన్నవాని నున్నట్లుగా తనకావ్యాల్లో ఉపయోగించటం పట్ల మక్కువ చూపాడు. తెలుగు మీద మేరలు లేని క్రుమ పుట్టినవాడు కావటం వల్ల తిక్కన తెన్నున పోయి రచనం చేశాడు. కవిబ్రహ్మ మాదిరిగా అనేక వాక్యాలను పద్యంలో కూర్చటం, కృదంతాలను బహుళంగా ప్రయోగించటం ఆయనకు చాలా ఇష్టం. వ్యవహారం నుండి జారిపోయి, నిఘంటువుల్లో, మాత్రమే నిలిచిపోయిన తెలుగు మాటలను వాడాలనే ఉబలాటం ఆయన కెక్కువ.

_ సీతారామమూర్తి సాహిత్యం విచిత్రలక్షణాల సంగమం. ఆయన స్వీకరించిన వస్తువు నవయుగోచితం. ప్రయోగించిన భాష ప్రాచీన సంప్రదాయ బద్ధం. భావాలు యుగథధర్మాన్ని ప్రతివింబిస్తున్నాయి. పద ప్రయోగాలు ప్రాచీన మహాకవుల పోకడలు పోతున్నాయి. ఆయన ప్రాచీనుల్లో నవీనుడు. నవీనులో ప్రాచీనుడు. కాళిదాసు మాటలకు ఫిన్సంగా

తే. ప్రాంత దన్నది సర్వంబురోంత గాదు కొత్త దన్నది సర్వంబు గుణము గాదు ప్రాంత క్రొత్తలలో మేలిరీతు లెజింగి చేయవలయును సాహితీసృష్టి సుకవి. ఆయన తన అఫిప్రాయాలను వ్యక్తీకరించాడు. ఈకారణాల వల్ల ప్రాచీన మహాకవుల సాహిత్యాన్ని చక్కగా చదివిన వారూ, వ్యాకరణ శాస్త్రం మీద గురి ఉన్నవారూ, నవయుగధర్మాన్సీ, గాంధేయవాదాన్నీ అంగీకరించే వారూ, సీతారామమూర్తి కావ్యాలను పఠించి రసానందం అనుభవింప గలుగుతారు. ఈసందర్భంలోనే సీతారామమూర్తి శైలిని గూర్చి కూడా చెప్పాలి, ఇది రెండురకాలుగా గోచరిస్తున్నది. మొదట రచించిన కావ్యాల్లో శైలి ప్రొఢం. “అత్మార్చుము”ను గూర్చి శ్రీగిడుగు వేంకటరామమూర్తి “మీరచన ప్రాచీనకవులరచనను జ్ఞప్తికి తెచ్చి నాకు చాలా ఆనందము

కావ్యశిల్పము 135 కలుగజేసినది” అని అన్నారు. ఇక శ్రీమాన్‌ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ “మీకు సంస్కృతాంధ్రములయందు. ధారాళమైన _ శైలిగలదు. మీగ్రంథమును జదువునప్పు డేదోయొక ఫ్రాంతకాలపు ప్రబంధమును చదువుచున్నట్లు భావము కలుగును” అని పలికారు. కాలక్రమాన రచించిన కావ్యాల్లో సరళసుందరమయిన శైలి 'గోచరిస్తున్నది. ఈరెండు విధాల శైలులోోనూ మాధుర్యమూ, వ్యాకరణానికి సంబంధించిన ప్రయోగవైలక్షణ్యమూ సథానధర్మాలుగా గనబడతాయి. నియమబద్ధ మయిన భాషతో ప్రాచీన చృందస్సులతో యుగకవితను సృజింప వచ్చునని సీతారామమూర్తి రుజువు చేశాడు.

సుందరంగా మలచిన భావస్పోరకమయిన అమరావతీ శిల్పాన్ని పోలిన పద్యసృష్టి సీకారామమూర్తి సొమ్ము. ఆపద్యరచనలో అన్వయ క్లిష్టత మచ్చుకయినా కనబడదు. ధారాళమయిన గమనం కొట్టవచ్చినట్టు గనబడుతుంది. పద్భనిర్మాణంలో ఆయన చూపిన సోగసులు "అనంత వైవిధ్యంతో సహృదయులను మురిపిస్తాయి. తండ్రి నారయ్య వ్యక్తిత్వం పాఠకుల చిత్తాలకు హత్తుకొని పోయేటట్లు ఆయన ఈక్రింది పద్యొన్ని రచించాడు. సి. నిత్యసత్యాలాపనియతిపై ననురక్తి =సెందినాండు జయంబు నందినాండు పరవిత్తమది తృణప్రాయంబ యని విశ్వ సీంచినాండు తిరస్కరించినాండు దీనార్ధిలోకమ్ముం దిలకించి కన్నీరు కార్చినా. డండకు' జేర్చినాండు. మొగమోట దిగంద్రావి తగవుసెప్పెడి నేర్చు గాంచినాండు యశంబు పెంచినాండు తీ. కష్టమున్‌ సుఖమున్‌ దుల్యదృష్టి తోడం జూచినా డొకత్రాసులో. దూధినాండు నాండు నేండును బుధులు కొండాడు నడత నివ్వటిల్లిన నారయ్యకెవ్వరీడు.

136 తుమ్మల సీతారామమూర్తి , శబ్దాలంకారాలు అప్రయత్నంగా అమరి, సందర్చానికి అతికి నట్లు సరిపోతుంటాయి. - గీ విత్తముం గొల్బుకొన సమర్చించుంగాని విత్తముం గొల్బుకొన కృతుల్‌ వెట్టండీత డుత్తలంపడకుము వీని కుపద నీమి నుత్తలంపట యేల కవ్యుత్తములకు. “రోసికొందు నఘము. బాసికొందు” “చిక్కినాండ మిగుల స్రుక్కినాండ” “మనుండు మంచిబాట గనుండు చనుండు”” “మానరా దుపేక్ష పూనరాదు” “ధీమహస్సు సాహితీరహస్సు'”” ఇటువంటి రచనాపద్ధతిని సీతారామమూర్తి చివరికావ్యాల్లో అధికంగా ఆదరించాడు. ఆయన పద్యసృష్టిలో త్రీనాథ-పోతన-రామరాఖి- భూషణాది కవుల పోకడలనూ చూడవచ్చు. ఇక తిక్కన పద్ధతులను గూర్చి చెప్పవలసిన పనిలేదు. ॥ సామాన్యాలయిన విషయాలను చెప్పవలసి వచ్చినప్పుడు సతారామమూర్తి పద్యరచనా శిల్చ్పంచేత వాటిల్లోని రసహీనత్వాన్న్ని తొలగించి తిక్కన మాదిరిగా పాఠకులకు అహ్హాదం కలిగిస్తాడు. అహమ్మదాబాదు కాంగ్రెసుసభ కధ్యక్షుడయిన హకీమ్‌ అజ్మల్‌ఖానును ఆయన వర్ణించిన తీరు దీనికి నిదర్శనం చం. ఒక పెను పాదుసాకరణి నొప్పు నతం డెనలేనికీవి; ఠీ వికిం దగి నంత విజ్ఞతయు, విజ్ఞతకుం దగినంత శీలమున్‌ స్వకవశ వర్తులై వెలయ సత్చురుషుం డత. డచ్చమైనకీ రికి నెజపట్టమై, ప్రజకుం దీయని పాయని చుట్టమై తగున్‌

కావ్యశిల్పము 137 18-3-1922 వ తేదిని అహమ్మదాబాదు న్యాయస్థానమున. గాంధీజీని దోషిగా చేసి ఆంగ్లప్రభుత్వం సాగించినవిచారణ జగత్రసిద్ధ మయినట్టిది. ఆనాడు గాంధీజీ న్యాయస్థానానికి వచ్చిన విషయం అంతగా రసవంతమయిందేమీ కాదు. కాని సీతారామమూర్తి గాంధీజీ రూపం కన్నులను గట్టేటట్లు వర్ణించి దానిని చిత్తాకర్ణణగా చేశాడు. ఊ. చిక్కిన మేనితో, నెడంద చేవను జూటు గఖీరదృష్టితోం జక్కని నవ్వుతో, మొలకు జాలియుంజాలని మోటవల్వతో మక్కువ దన్నుంగొల్పుబలు మానిసి శంకరలాలుతో. బ్రజల్‌ యమొక్కుచు నిల్వంగా నడుగు మోపె మహాత్ముండు పాడిపట్టునన్‌ తిక్కనబాట పట్టిన సీతారామమూర్తి తనకావ్యాల్లో తెలుగుదే పైచేయిగా ఉంటుందని వక్కాణించటం వింతగాదు. ఆయనకు సంస్కృ తం మీద ద్వేషం లేదు. దాని మహత్తను ఆయన చక్కగా తెలిసికొన్నవాడే. పౌచిత్యాన్ని బట్టి సంస్కృత పదప్రయోగం గావించాలనేదే ఆయన సిద్ధాంతం. తిక్కన సంస్కృత పదజాలాన్ని పరిత్యజింప లేదు గదా! గొప్పతనమూ,_ తీవ్రతా మొదలయిన. స్థితులను వర్జిందేటప్పుడు సీతారామమూర్తి ప్రాఢమయిన సంస్కృత భాషనే ప్రయోగించాడు. ఆయన హంపిక్షేత్ర ఘనతను ఈ క్రింది విధంగా వర్ణించాడు. శా, కర్ష్ణాటక్షితి పాల పండితజయా ఖండ ప్రథాకల్పిత . స్వర్హస్న్నానము నంది తద్రసికరా జశ్రేష్టు నిచ్చోటనే వర్ణించెన్‌ గవిరాజు ధూర్జటిశిరో వాటీనటత్‌ స్పార్ణదీ తూర్గాంభః పరిఖావి భవ్యకవితా దుర్వార ధారోద్ధతిన్‌

138 తుమ్మల సీతారామమూర్తి ఈ పద్యంలోని సంస్కృత సమాసాలకు మాతృకలు శ్రీనాథుని కాశీఖండంలోనూ _ క్రీడాఖిరామంలోనూ కనబడతాయి. గాంధీజీ నవ్వుమహిమను చం. మతకుల వర్గభేదరత మానస వృత్తి విరుద్ధశీలదీ ధితి సముపాత్త సర్వజగ తీహిత నిర్మల కర్మయోగ ధూ ర్నత బహువర్ష జీవన వి నాకృత కైతవ మోహనాస్య ని ర్గత మగుబోసినవ్వు మన కల్మషమున్‌ గదలించుంగావుతన్‌! అని ఆయన వెల్లడించాడు. ఈ పద్యంలో సంస్కృతసమాసం మూడు పాదాలకు నిండుగా వ్యాపించింది. 1943లో వంగదేశంలో భయంకర మయిన క్షామం సంభవించింది. ఇది యాఖైలక్షల మందిని. తన పొట్టను బెట్టుకొన్నది. ఈక్షామ డామరాన్ని వ్యంజింప జేసీటట్టుగా సంస్కృత సమాసభూయిష్టంగా సీతారామమూర్తి ఈ క్రింది గీతిమాలిక రచించాడు. “గీ _ అది దరాశా పిశాచీ సమర్చన ప్ర భూత సవన బృహద్బాను హేతివదన “హుత దయాధర్ములకు నరాకృతి నివిష్ట దుష్టరక్షస్సులకు జగద్భూమ కేతు వులకుం గేతువులకు వణిక్కులకు నిలయ; మది నిరంకుశక్షామ దురంత దుర్చు రాగ్రహావేశ వికటాట్టహాస జవన గమన విన్యాసముల కసంఖ్యాత సాధు మానవీ మానవచ్చటా ప్రాణమాన రాశి బలివోయినట్టి నిర్భాగ్యదేశ మదీ మహాభూత వేతాళ మదవతీ ప రంపరారూక్ష ఖడ్గ నిర్యత్‌ ప్రభాస ముజ్ఞ్వల ద్ధంస్టయై మృత్యువుగ్ర దీర్హ

కావ్యశిల్చ్బము 139 జిహ్వ లార్చుచు వాహ్యాళి చేసినట్టి రంగ మది మది( గరంగించు వంగభూమి. తిక్కన కవిత్వంలో వలెనే సీతారామమూర్తి కవిత్వంలో కూడా " తెనుగుదనం ఎక్కువ. ఇది తెలుగు మాటల కూర్చ్పుగాదు. మతి తెలుగువాడు తనభావాలను వెల్లడించు విధానం. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అవస్థకు అనుగుణంగా తెలుగుజాతి తనభావాలను వ్యక్తీకరిస్తుంది. ఈ వ్యక్తీకరణం జాతి సహజలక్షణం. తిక్కన మహాభారతంలో పాత్రలసంభాషణలందు ఈ తెనుగుదనం విశ్చరూపం ధరించి సాక్షాత్కరిస్తున్నది. సీతారామమూర్తి రచించిన సర్వకావ్యాల్లోనూ ఇది సమృద్ధిగా కన్పట్టుతుంది. సైమన్‌ కమిషను వచ్చినపుడు చెన్నపట్టనంలో ఆంధ్రులు దానిని బహిష్కరించారు. అప్పుడు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు ఒక పౌరుడు మరణించాడు. అతని శవాన్ని చూడాలని జనసముద్రం ముందుకు త్రోసికొని వస్తున్నది. పోలీసులు శవాన్ని ఒకగదిలో ఉంచి, ముందుకు అడుగు. వేశారా? కాల్చి చంపివేస్తాం అని జనాన్ని బెదరించారు. అప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులుగారు వీరాంకమూర్తి అయి కాలుస్తామన్న, షోలీసులతో ఈ విధంగా అన్నాడు. మ. ఎవండా కాల్చెడు వాండు? కాల్పవలె నా యీ జొమ్ముపై: నీ శవం బవలోకింపక పోవనేనిపుడు; న న్నాంపంగ నెవ్నాని కు న్నవి గుండెల్‌ నిటలాక్షుండడ్డుపడినన్‌ నాఢాకకుం జాలం డీ యవనిన్‌ ఖీరులు లేరు, తేరు పరగ ర్వాగస్సహిష్టుల్‌ శకుల్‌. కం. ఏనేకా దీజనతతి లో నొక్కరుంైన సజ్జలోం గలబడుగున్‌ గానక మజలండు మఅలండు సైనికులారా! తొలంగి చను. డవ్వలికిన్‌.

140 తుమ్మల సీతారామమూర్తి

ప్రకరణంలో పాత్ర మనస్తత్తాాన్ని పట్టి చూపేరీతిగా పదప్రయోగం గావించటం తిక్కన సంప్రదాయం. దీనిని సీతారామమూర్తి బహుళంగా పాటించాడు. “ఆత్మార్చణుము”లో వలలో చిక్కిన ఆడుపులుగును తలచుకొని మగపులుగు దుర్చరవియోగంతో విలపిస్తుంది. దాని. సద్గుణాలను కొనియాడుతుంది. పతి ముఖంనుండి వెలువడిన ప్రశంసావాక్యాలు విన్న విహగి సంతోషం పట్టలేక.

సీ. _ధన్యనైతిని జగన్నాన్యనైతిని మహా

పుణ్యనైతిని సతీగణ్యనైతి నాథుండస్మద్నర్హనంబు నెంతయు మెచ్చి ప్రకటించె నిర్మల ప్రణజయగరిమ ఇత్యాదిగా పలుకుతుంది. పద్యం ఎత్తుగడా, పదప్రయోగమూ అఆడుపులుగు ఆనందాన్ని వ్యంజింపజేస్తున్నాయి.

“బాపూజి ఆత్మకథ” లో ఇటువంటి సన్నివేశమే ఒకటున్నది. గాంధీజీ ఇంగ్లండులో చదువుచున్న కాలమది. పోర్‌ట్సుమత్‌ అనే రేవు పట్టనంలో శాకాహారభోక్తలసభ జరిగింది. ఈసభకు గాంధీజీ ఒకమిత్రునితోపాటు వెళ్లాడు. వీరిద్దరూ విడిది చేసిన ఇల్గు వేశ్యలను పోలినట్టివారిది. ఇంగ్లండులో అతిథులతో ఇంటి అడువారు చీట్లపేక ఆడతారు. అందువల్ల గాంధీజీ ఆయన మిత్రుడూ వసతిగృహాంగనలతో పేకాట ఆడటం మొదలు పెట్టారు. ఆట అడేటప్పుడు ఆదిని ఛలోక్తులు ఆరంభమయినాయి. ఆ తరువాత నీతిబాహ్యమయిన వేడుకలు విస్తరిల్లాయి. ఆపిదప బీభత్సరసం వెల్లివిరిసింది. పేక ముక్కలను ప్రక్కను బెట్టే పరిస్థితి దాపురించింది. అప్పుడు మిత్రుడు గాంధీజీని ఆతావునుండి వెళ్లిపొమ్మన్నాడు. ఆయన చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు వెళ్లిపోతాడు. ఈరంగాన్న్ని సీతారామమూర్తి ఈవిధంగా చిత్రించాడు.

తే. బళ౦! యీఘోరకలికి నీపాపమునకు

నకట! నీవును బానిస వగుదువోటు వలదు వలదిందు నీవుండవలదు వలదు లెమ్ము లేలెమ్ము పొమ్ము పోపొమ్ము వెలికి

కావ్యశిల్పము 141 కం. అఆనవుడు లజ్ఞ్టాంబుధిలో మునింగితి, నప్పనుపు మస్తమునం దాల్చితి, నా తని మది మెచ్చితిం బదపడి జనని కడన్‌ నొడువుబాస జ్ఞిప్తికివచ్చెన్‌. వ పదంపడి కం. ఊడనింబాడితి, గడగడ లాడితి, నానిల్పుసజ్జి కరిగితి, మృగయా పీడకుం దప్పిన హరిణము జాడన్‌ నాగుండె లదరె, జడిగొనెం చెమటల్‌. ఆ.వె. నాటిరేయి నిదుర నను డాయదాయె, నా యాత్మ. బెక్కుచింత లలముకొనియె నిదియె నాకు లాతియింతుల పట్ల వి కార మొదవ మొదటి సారి యాయె. ఆ.వె. అంత నెంత చెట్ట యయ్యెదైవంబ! యి పెమరిలి యున్న నెట్టలగునొ ర! ళా ళు యని తలంచి యింకనైనం బరాకును దలంగవలయు నంచుం దలంచినాండ. త. అవల నిదివాసయోగ్య మైనట్టికావు కాదు కాదని యెంచి సంగాతిం దొజంగి నాంటి వజువాత లేచి పైనంబుగట్టి వీడనాడిన వాండ నష్పాడు వీడు, గాంధీజీ మిత్రుని మాటలు అతని స్నేహానురాగాలవల్ల పుట్టిన ఆరాటాన్ని వ్యంజింపజేస్తున్నాయి. గాంధీజీ క్షోభను పద్యాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. చివరి పద్యంలోని చివరిపాదం డకారావృత్తితో కూడి - ఇదే వృత్త్యను ప్రాసాలంకారము - ఆయన పోర్‌ట్సుమత్‌ను వదలి ఎంత తొందరగా వెళ్లిపోయాడో ధ్వనింపజేస్తున్నది. శిల్పవేత్త ఆయిన మహాకవి మాత్రమే ఈ విధమయిన రచనం చేయగలడు.

142 తుమ్మల సీతారామమూర్తి “పఆిగపంటి"లో “వీరధర్మము”' అను ఖండకావ్యం ఉన్నది. బాలచంద్రుడు తన్ను యుద్దానికి వెళ్లకుండా నివారించేతల్లి ఐతాంబకు వీరధర్మాన్ని వివరించే ఖండకావ్యం ఇది. దీనిలో చివర అతడు సీ మాతృదేశం బన్యమనుజేశ్వరుని చేతం జిక్కి, స్వాతంత్ర్యంబు దక్కి, తనదు జాతీయతను బాసి, చేతోగతం బైన తలంపు వెలువరింపందగిన హక్కు నెడసి, లోలోపలనే క్రుళ్లి కుములుచు, నీచదాస్యమున మునింగి పిణికి తనము వరించి, నితాంత కష్టపరంప రలనీంగి, దారిద్ర మలమ, దిక్కు శే. లేక శోకించువేళం దల్లిమొణ నాల కించి, మై పులకింపం జలించి, కొంచె మేని నామెకుం దోడ్చడలేని బిడ్డ బతు కదేటికి? ధాట్రికి బరువుచేటు. అని అంటాడు. ఈపద్యంలో దుర్చర దాస్యస్థితి వర్దితమయింది పద్యమంతటా ఒకే ఒక వాక్కమున్నది. అసలు సీసపద్యమే దీర్హచ్భ్చందస్సు. దానిలో కూడా ఒక గీర్ణవాక్యం మాత్రమే నెలకొన్నది. ఇది దీర్ణదాస్య భారాన్ని వ్యంజింపజేస్తున్నది. పద్యం సమకాలిక భారతదేశస్థితికి అద్దం పట్టింది. ఈవిధంగా సీతారామమూర్తి సమకాలిక రాజకీయ స్టితినీ, భారతీయుల వీరధర్మాన్నీ వ్యంజింపజేసి చారిత్రికఘట్టాలను మూటిని రచించాడు. సీతారామమూర్తి మాలికాకవిత్వం రచించటంలో దిట్ట. ఆయన ఉత్చల చంపక మాలా మాలికా కవిత్వంతో, తేటగీతి మాలికా కవిత్వంతో, మంజరీద్విపద మాలికా కవిత్వంతో, కూడిన ఖండ కావ్యాలను - ఇరవైనాల్లింటిని రచించాడు. ఇక కథాకావ్యాల్లో ఆయన వ్రాసిన మంజరీ ద్విపద మాలికలకు లెక్కలేదు. క్లిష్ట ప్రాసలతో ఆయన వృత్త మాలికా కవిత్వాన్ని సృష్టించాడు. కవిప్రశంసలకూ, దేశసీవా పరాయణస్తుతులకూ, ఆత్మసిద్ధాంత వ్యక్తీకరణకూ, సన్మానసమయ

కావ్యశిల్బము 143 కృతజ్ఞతా ప్రకటనకూ, సంస్కార బోధకూ ఆయన మాలికా కవిత్వాన్ని ఉపయోగించాడు. ,

తన అనువాదనైపుణ్యాన్ని సీతారామమూర్తి “గిశాదర్శము”లో ప్రదర్శించాడు. ఆయన జాత్యుపజాతి పద్యాలనే' ఈ అనువాదానికి స్వీకరించాడు. సారళ్ళ మాధుర్యాలూ, తెనుగు దనమూ ఈపరివర్తనానికి ప్రధానలక్షణాలు. శ్ఞో॥ నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద | కిం భోగై ర్జీవితేనవా (అధ్యా 1. శ్తో 32) అనే శ్లోకం అనువాదంలో ఈ విధంగా అవతరించింది. ఆ.వె. వలదు గెలుపు నాకు వనజాక్ష!ః వసుధయు వలదు,. భోగమేని వలదు' వలదు సకలబంధుకోటి చచ్చిన పిమ్మట నేల యేల? బదు కదేల చెపుము! శ్లో॥ యావత్‌ సంజాయతే కించిత్‌ సత్వం స్థావరజంగమం క్షేతక్షేతజ్ఞసంయోగాత్‌ తద్చిద్ధి భరతర్షభ! (అధ్యా 13. శ్లో. 27) అనే శోకాన్ని సీతారామమూర్తి కం. స్థావరమో జంగమమో యీవసుమతిం దోంచువస్తువెదియైనను గాం డీవి! యది ప్రకృతిపురుషస . మావేశము కతన. బుట్టు నని నమ్మంగడే! అని తెలిగించాడు. సీతారామమూర్తి అనువాదం తిక్కన భగవద్గీతా శోకానువాదంతో సమానంగా సాగిందని నిర్ణయించటం అతిశయోక్తి గాదు.

144 తుమ్మల సీతారామమూర్తి చిట్ట చివరకు సీతారామమూర్తి కావ్యసృష్టిని గూర్చి సాహిత్యలోకంలో అలముకొన్న అపోహను ప్రస్తావింపక తప్పదు. కీ.శే. నార్ల వెంకటేశ్చరరావు మాదిరిగా సీతారామమూర్తి భావనాశక్తి దుర్చల మని భావించువారెందరో ఉన్నారు. కాని సీతారామమూర్తి స్వీకరించిన 'వస్తువునూ అంగీకరించిన కవితాతత్త్వాన్నీ శ్రద్ధగా పరిశీలించి, ఆయన కావ్యాలనన్నింటినీ పఠించినవారెవ్వరూ పై అభిప్రాయం సమంజసం అని అనుకోరు. ముందు ఆయన భావనాశక్తిని ప్రకటించే పద్యాలను తార్కాణిస్త్రే విమర్శకుల నిర్ణయం నిజమోకాదో తెలుస్తుంది. సీతారామ మూర్తి 1941లో రచించిన ““సంక్రాంతి' పద్యాల్లో ఈక్రింది పద్యం మొట్టమొదటిది. సీ. కొసరి నూటిన పచ్చి పసపుంబూంతమొగాన గుమ్మడి పూదుమారమ్ము నద్ది కండరేగడ నారంబండి కన్చండువై పౌలుచుమిర్ణుపుంబండు బొట్టువెట్టి వలిపమ్మునకు నొక్కవాసి హెచ్చైనట్టి నునుమంచుం దెరచీర నూలుకొల్పి బంతి పూవులకుం జేమంతి నెయ్యముగూర్చి కబరీ భరమ్ము చక్కన కుదిర్చి కే. పంటకళ్లాలు మును బరాబరులు సేయ గూండుగట్టిన తెలిమబ్బు గొడుగునీడ గదలి వచ్చెను భాగ్యాలకడలి వోలె మకరసంక్రాంతి లక్ష్మి హేమంతవీథి. 193లో ఆయన తొలకరిమబ్బును చం. అది జవరాలి కంటికొస కద్దిన కాటుకరేకకైవడిన్‌ ముదిత లలాట భాగమున మూంగిన ముంగురు లట్లు, సుందరీ పృథు జఘనాగ్రలంచియగు

కావ్యశిల్చము 145 పెన్దడ వోలె మనోజ్ఞమూర్తియ్రై పాదలు కొనంగ సమ్మదము పొందిరి కా6ంపులు తేతి చూపులన్‌.

ఈ పద్యాల్లో భావనాశక్తి పంచారించిందని సహృదయులు తప్పక అంగీకరిస్తారు. ఇటువంటి పద్యాలు కొన్ని వందలు సీతారామమూర్తి కావ్యాల్లో కనబడతాయి. తిక్కనరచించిన కపోతోపాఖ్యానంలో ముప్పై నాలుగు గద్యపద్యాలున్నాయి. సీతారామమూర్తి అఆఉపాఖ్యానాన్ని నూటతొంఖై ఒక్కటి గద్యపద్యములకు పెంచి “ ఆత్మార్చణము” రచించాడు. భావనా శక్తిపట్ల మోహం గల సాహితీ పరులు దానిని చదువ వచ్చు. సీఠారామమూర్షి కవిత్వం భావప్రధానం. దానిలో ఉక్తివైచిత్రి ఎక్కువ. ఆయన అదినుండీ భావనో శక్తిని సముచిత స్థానంలో ప్రదరిస్తూనే ఉన్నాడు. అది విశ్చంఖలంగా కనబడదు. ఆయన స్వీకరించిన వస్తువు కల్చనలకూ భావనా శక్తి తాండవానికీ అవకాశం లేనట్టిది. వేమనవలె కళాత్మకంగా సందేశ ప్రధానమయిన కవిత్వం రచించటం ఆయనకిష్టం. “సందేశసప్తశతి” ““ఎక్కట్లు” “చక్కట్లు' కావ్యాల్లో సీతారామమూర్తి చూపిన దృష్టాంతాలు ఆయన్న భావనా శక్తిని గొప్పగా చాటుతున్నాయి.

ఆ.వె. ఆతపార్తి గూర్చునట్టివసంతుండే

చూవి పండ్ల నిచ్చు మల్లెలిచ్చు నాదియం దలంచు నాచార్యుండే పోవం బోవం జియిత కిష్టదైవ మగును.

ఆ.వె. పొదుగుబరువుతోడ మొదవు దయామూర్తి

లేంగ కొఅకు. బజచులీల నెలుకం బండినట్టి చురుండు ప్రజకుందానై పుణ్య పాపములతెఆంగు పల్కవలయు.

ఆ.వె. నోరుజాఆరాదు నేరము తెల్లమై

వచ్చు దనుక లాతివానిపట్ల మచ్చలేని మంది మదిం జిచ్చు పెట్టిన సితపడ్డపాట్లు చెప్పవలెనె?

వ్యక్తిత్వము సీతారామమూర్తి కవిత్వం ఎంతగొప్పదో ఆయన వ్యక్తిత్వం కూడా అంతే గొప్పది. “నా నృషిః కురుడే కావ్యమ్‌”" అని ప్రాచీనులు ప్రవచించారు. బుషికానివాడు కావ్యం రచింపలేడని ఈ సూక్తికర్థం. ఈపలుకు నూటికి నూలు పాళ్లూ సీతారామమాూర్తిపట్ల చెల్లుతుంది. ఆయన గృహస్థాశ్రమబుషిగా జీవించాడు. ఆ బుషిత్వమే ఆయన కావ్యాల్లోనూ అవతరించింది. ఆ.వె. నరున కింటితావి, యిరుగుపౌరుగు తావి కూర్చువారి తావి, గురుల తావి యంటితీరుం గాన నతని మేల్సీడుల కవియె కారణమ్ము లగుట నిజము. అని సీతారామమూర్తి చెప్పాడు. తల్లితండ్రుల, ఇరుగు పొరుగు వారల, మిత్రుల, గురువుల వాసనలు అంటుకొని మానవుని వ్యక్తిత్వాన్ని. రూషాందిస్తాయనేమాట _ నిజమే. సీతారామమాూర్తిపట్ల ఈమాట మరీనిజం ఆయన పుట్టి పెరిగిన పల్లెటూరు గుంటూరు జిల్లాలో ఒక ప్రక్కకు విసరివేసినట్లున్న గ్రామం. ఆయన మామూలు రైతు కుటుంబంలో పుట్టాడు. అఆకుటుంబం వంశపారంపర్యంగా ప్రాప్తించిన చదువు సందెలకూ, సంపదకూ వాసికెక్కిందేమీ కాదు. సీతారామమూర్తి చదివిన చదువు విలక్షణమయిందేమీ కాదు. అది ఇరవయ్యో శతాబ్లి మొదట్లో వీదిబడుల్లో అయ్యవారు బోధించే సంస్కృతాంధ్ర సాహిత్యాలతో ముడిపడినట్టిది. ఎన్నోయిబ్బందులుపడి చదువుకొని ఆయన అఆంధ్రపండితుడయ్యాడు. ఆంగ్లభాష చదువని ఆయనకు పాశ్చాత్య _సభ్యతాసంబంధం దూరమయింది. కాని ఆంగ్లేయుల పరిపాలనంవల్ల భారతదేశంలో తలయెత్తిన సాంస్కృతిక పునరుజ్జీవన కాంతులు ఇరవైయేడోయేట _ సారస్వతంద్వారా ఆయనమీద ప్రసరించాయి. అనాటికి ఆయన భారతీయ సంస్కృతి ప్రతివింవించే జాతీయవిద్యను బోధించే శ్రీతిలక్‌ జాతీయ పాఠశాలలో ఆంధ్రోపా ధ్యాయుడయ్యాడు. మరి పందొమ్మిదో యేట నుండీ ఆయన గాంధీజీ

వ్యక్తిత్వము 147 నాయకత్వం ఎహించిన కాంగ్రెసుకు వశపడిపోయాడు. గాంధేయ సిద్ధాంతాలను ప్రచారం జేసీ నిర్మాణకార్యకర్త అయ్యాడు. సత్యాహింసలూ, త్రికరణ శుద్ద, దీనజనసేవా, కర్తవ్యనిష్టా గాంధేయ వాదానికి అస్తి భారాలు. ఇవి సీతారామమూర్తి అంతరంగంలో చెరగని ముద్ర వేశాయి. ఆజన్మాంతమూ ఆయనకు ఆలంబనాలయ్యాయి. వాటిని గుజిగా పెట్టుకొని ఆయన తనబ్రతుకును తిద్ది తీర్చుకొన్నాడు. సీతారామమూర్తి వ్యక్తిత్వం పాశ్చాత్య వాసనావాసితమయిందిగాదు. అది కాలానుకూలంగా మార్చులు పొందిన భారతీయ సంస్కృతి నుండి ప్రభవించినట్టిది. దానివేళ్లు ఈనేలలోనే పాతుకుపోయాయి. తల్లిదండ్రుల (బతుకు పోకడలు దానికి దోహదం చేశాయి.

సీతారామమూర్తి తండ్రి నారయ్య భగవద్భక్తుడు. ఆయన పరుల మొగమోటం లేకుండా తీర్చులు చేశాడు. పేదవారిని ఆదుకొన్నాడు. అపహరించటానికి అవకాశమున్నబంగారాన్ని, దాచటానికి తనకష్పు గించిన కోమటినేస్తికి తిరిగి నిష్కామంగా ఇచ్చి వేశాడు. ఈ ఘట్టాన్ని జీవించినంత కాలమూ సీతారామమూర్తి విస్మ్కరింపలేదు. కం. ఆసకు లొంగక తొమ్మిది వీసెల పైచిలుకు పరుల విత్తము పసిండిన్‌ 'దోసిన మత్పిత నారయ వాసియ ననుదిడ్ది యింతవానిని జేసెన్‌. , అని ఆయన చెప్పికొన్నాడు. “ధర్మజ్యోతి'' కావ్యంలో చివర కం. వ్రాసిన యీ చిణుకబ్బము వాసిన్‌ గడియించుంగాత। వసుమతి; మాకున్‌ మాసంతతికిని ధర్మ వ్యాసక్తియ సిరులకంటె నగ్రియ మగుతన్‌, అని ఆకాంక్షించాడు. నారయ్య కొడుకునకు నీతీ, ధర్మనిరతీ, ఉదారసరణీ నేర్పాడు. కలభళో కూడా బుజుమార్గం తప్పవద్గని మష్పాడు. తల్లి చెంచమ్మ ““సీతాసతివంటి వహ్నిశిఖ' అమెకు సత్యమే

148 తుమ్మల సీతారామమూర్తి అలంకారం. ఎప్పుడయినా సీతారామమూర్తి తప్పుచేస్తే ఆమె ఆయనను గొడ్డును బాదినట్టుబాది దారిలో బెట్టేది.

సీతారామమూర్తి గురువుల్లో కావూరి శ్రీరాములు “అచ్చశీలరాఫ్‌?. తాడేపల్లి వేంకటప్పయ్యశాస్త్రి “ఇద్ధాచారు”డు. బుషిత్వం రూపు గొన్నవాడు. దువ్వూరి పేంకటరమణకాస్త్రి “అంచితాచార విభవుండు”. “సాధుసత్తము”డు. ఆయనకు కూర్చువారిలో తుమ్మల బసవయ్య అగ్రగణ్యుడు. ఈయన “కర్మయోగిమూర్థ''న్యుడు. వినయాశ్రమానికి సొంతమన్నది లేకుండా సర్వస్వమూ దానం చేసినవాడు. అనాథులనూ, ఆర్హులనూ _ఆదుకొన్నవాడు. వీరందరి జాడలూ సీతారామమూర్తి వ్యక్తిత్సంలో పాదుకొన్నాయి.

ఆయన కవిత్వం కంటె మిన్నగా జీవనవిధానాన్ని పరిగణించాడు.

“తొలుత జీవన సరణికిన్‌ విలువచూచి

మాట కవ్వల వెలకట్టు మతము నాది” అని ఆ'కారణం చేతనే చెప్పాడు. “కవిత్వం కంటె జీవనపద్ధతి నాకు ప్రధానం” అని ఈరచయితతో ఎన్నోసార్లు అన్నాడు. అర్థంగానీ, కామంగానీ ధర్మానికి దూరమయినప్పుడు వాటిని రోసి త్రోసివేశాడు. చిన్నప్పటినుండీ మహాత్ములను ఆదర్శంగా పెట్టుకొని తన నడవడిని అడుగడుగునా తూకం వేసికొంటూ తిద్దుకొన్నాడు. ఇందువల్ల ఇతరులకు కష్టసాధ్యమయిన క్రికరణశుద్దిని ఆయన సునాయాసంగా అలవరచు కొన్నాడు. తాను రచించిన కావ్యాల్లో సీతారామమూర్తి పలుమారు కవినియమనిష్టలను గూర్చి పలికాడు. “ఇన్ని నీతులు చెప్పాను. ధర్మవంచకులను ఎంతగానో వెక్కిరించాను. నన్ను నేను తిద్దుకో గలిగానా?” అని అనవరతమూ మథన పడేవాణ్జీ కాబట్టి నేను నలుగురిలో తలయెత్తుకోగలిగానని ఆయన చాటుకొన్నాడు.

“శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికంటే గొప్పగా కవిత చెప్పినవారు ఉండవచ్చు. వారికంటే గొప్పపండితులూ ఉండవచ్చు. కాని వారిలాగా చెప్పినదానిని ఆచరణ లోపెట్టి బ్రతీకేవారు మాత్రం అరుదు, ఆరుదేమిటి? నేడు వారపేరు కనిష్టికాధిష్టితమే”.

అని డాక్టర్‌ తిరుమల రామచంద్ర ప్రశంసించారు.

వ్యక్తిత్సము 149

“భాషలోవలె జీవితమందును పావిిత్యమునెడ పట్టుదల కలవారు శ్రీ సీతారామమూర్తిగారు. గాంధీజీ 'వినోబా భావేల వంటి మహాత్ముల అడుగుజాడల ననుసరించి అనఘ జీవితము పుచ్చనిచ్చించు ననవడ్యు చరిత్రులు వారు”

అని విశిష్ట సభ్యత్వ ప్రదానం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ కొనియాడింది.

వాల్మీకి మహర్షి రామాయణంలో “రామో ద్వీ ర్నాఖిభాషతీ” అని రాముని నోట పలికిస్తాడు..రామునికి రెండు నాల్కల్లు లేవని దీని అర్థం. ఈ అర్ధం సీతారామమూర్తిపట్ల నూటికి" నూరుపాళ్లూ చెల్లుతుంది. కొత్తవారితోగానీ, పాతవారితోగోనీ ఆయన అలోచించి ఒకసారి ఒకమాట, చెప్తాడు. అంతే. ఇకదానికి' తిరుగుండదు. దీనివల్ల ఇతరులకు ఆయన అభఖిప్రాయమేమిటో అవగతమవుతుంది. ఆయనతో వ్యవహ రించటం సులభమవుతుంది. అల్బవిషయాలనుండి అధికాంశాలదాకా సితారాముమూర్తి 'రెండుమాటలు చెప్పకుండా నడుచుకొన్నాడు. ఆర్థిక వ్యవహారాల్లో సైతమూ నిక్కచ్చిగా ఉండేవాడు. డబ్బు కర్చుచేసేటప్పుడు ప్రతిపైసాకూ లెక్కవబ్రాయటం ఆయనకలవాటు. 'లెక్కసరిపోయినప్పుడు పరమానందం షాందేవాడు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఆయనకు పద్దులు వ్రాయటం అభ్యాసమయింది. వేరుపడిన తర్వాత కూడా ఈ మంచి అలవాటును మానలేదు.

“కలంత లేనిబ్రతుకు వలచువాండలసట'

యనక లెక్కవ్రాయ నగు సతమ్ము'' అనేది ఆయన సూక్తి.

సత్యనిష్ట సీతారామమూర్తికి తల్లిదండ్రులనుండి సహజగుణంగా సంప్రాప్తించింది. బాపూజీబంటు గావటంవల్ల ఇది మరింత బలపడింది. ఆయన మనసులో మాటలో ప్రవర్తనలో అసత్యానికి చోటులేదు. అందువల్ల ఆయన పలుకు వాడిగా వేడిగా ఉండేది. అయినవారుకానీ, కానివారుకానీ ఆయన ఒకమాట అన్నతరువాత దానికనుగుణంగా నడుచుకొనకపోతి ఆయనకు అతివేలమైన ఆగ్రహం కలిగేది, అయితే

1560 తుమ్మల సీతారామమూర్తి సహజంగా "మెత్తని మనస్సు కలిగినవాడు కావటంచేత ఆకోపం అంతలోనే అణగారి పోయేది. “విప్రుల యలుకయుం దృణహుతా శనంబు దీర్హమగునె” అన్న నన్నయ మాటకు తార్కాణంగా ఉండేదద్ది, వెంటనే నవ్విస్తూ నవ్వుతూ ఆయన మాటలాడటం మొదలుపెట్టేవాడు. హాస్యం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ సత్యవాదినిగూర్చి, ఈ నైప్టికకీలుణ్తిగూర్చి 1942 సం॥ సన్మాన సంచికలో శ్రీవిశ్చనాథ సత్యనారాయణ ఈ విధంగా అన్నారు. మ॥ * ఇతరుల్‌ తారొక వేయిమందిసఖులై యేతెంచినన్‌గాదు, స చృతి నీయట్టిం డొకండు శత్రువయినన్‌ సాఫల్యమౌ; నట్టినీ వితరాప్రాష్యసఖిత్వభావమున న హితమే వందకు వంద సాధుజన సా హిత్యంబు నన్నందెడున్‌. శ్రీకాటూరి వేంకటేశ్వరరావు 1949 సం॥ సన్మాన సంచికలో ఈరీతిగా ప్రశంసించారు. చం. మకుటము లేల, ఆశ్చములు మత్తకరుల్‌ ిబికాదులేల, సా యక నివహమ్ములేల, చతు రంగబలమ్ములు నేల నీకు? మా ధుకణ మృదూళక్తి సంపదల తో హృదయమ్ముల నేలు లోకకా సకుండవు; నీవసించు చిటి చాపకు నోపవు సింహపీఠముల్‌, సీతారామమూర్తి మానధనుడు. ప్రతిక్షణమూ ఆత్మగౌరవానికి భంగం కఠగకుండా నడుచుకొనేవాడు. ఎంతగొప్పవారినయినా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేవాడు. జమీందారులతో, మంత్రులతో, మహాధికారులతో, శ్రీమంతులతో, ఆత్మగౌరవం వీసమంతయినా వెలితి

వ్యక్తిత్వము 151 పోకుండా సమస్కంధుడుగా వ్యవహరించేవాడు. ఈ ఆత్మగౌరవానికి యాచనారాహిత్యం తోడయింది. ఒక జమీందారు. తన పుత్రుని జన్మ దినోత్సవానికి ఆహ్వానిస్తూ దివానుచేత లేఖ వ్రాయించాడు. జమీందారు లేఖ బ్రాయవచ్చునుగదా అని సీతారామమూర్తి అనుకొన్నాడు. వెంటనే ఆహ్వానాన్ని త్రోసిపుచ్చుతూ ఆయన శిష్యుని చేత లేఖ వ్రాయించాడు.' చల్లపల్లి రాజా రాష్ట్రగాన కృతిపతి., కృతి సమర్పణోత్సవంనాడు కవికి సమర్పించాలని తీసికొని వచ్చిన సౌమ్మును ఆయన వెనుకకు కొనిపోక తప్పలేదు. రాజాగారు ఆయాసందర్భాలను పురస్కరించుకొని ఎనొస్టీసారులు ఆహ్వానాలు 'పంపినప్పటికీ సీతారామమూర్తి ఒక్కసారి కూడా చల్లపల్లికోటగడప త్రొక్కలేదు. వెళ్లితీ కృతి అంకితం చేసిన కవి అని చెప్పి ధనసత్కారం చేస్తాడనీ, అది తన అంకిత నియమాలకు విరుద్ధమవుతుందనీ ఆయన భావించాడు. చివరకు రాజావారి షష్టిపూర్తి సభలో పెక్కుమంది కవులతోపాటు ఆయనా పాలొన్నాడు. ఒక తడవ ఒక మంత్రి తన పర్యటన _ వివరాలను తెలిపి, వచ్చి తన్ను కలసికోవలసిందని లేఖ వ్రాశాడు. ఇది తన ఆత్మగౌర వానికి వ్యతిరేకంగా భావించి ఆయన ఆగ్రహోదగ్రుడయ్యాడు. నాకళ్లముందే ఆలేఖను చించి బుట్టలో పారవేశాడు. ఆయన కలవ్వారియిళ్లచుట్టూ తిరిగినవాడు గాడు. ఈ ఆత్మాభిమానం, ఈ యాచ్వనా రాహిత్యం ఆయనకు దక్కవలసిన కీర్తిని పదవులనూ దక్కకుండా చేశాయని స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఆయన అఆరెండింటి కొరకూ ఏనాడూ వెంపరలాడలేదు. ప్రాప్తించిన వాటితోనే పరితృప్పి వహించాడు. అపికట్ల గ్రామస్థులు ఇల్లుకట్టించి ఇస్తామన్నా ఆయన అంగీకరింపలేదు. “మీకేమి ఇయ్యలేక పోయా”' నని కుమారులతో అంటుండేవాడు. సీతారామమూర్తి ధీరోదాత్తుడయిన ఒకనాటి ఆంధ్రహాలికుని ఉత్తమలక్షణాలన్నీ పుణికిపుచ్చుకొన్నాడు. ఆయనకు గ్రామజీవితం అంటే పరమట్రీతి. ఆడంబరం అంటే అసహ్యం. ఆయన కట్టూబొట్టూ మోతుబరిరైతు. చిన్నెలను పోలి ఉండేవి. సన్మానాల్లో తనకు లభించినసామ్ము మూటకట్టి ముడివేయకుండా వీలున్నంత మేరకు గుప్తదానాలు చేయటం సీతారామమూర్తి వ్రతం. గాంధేయవాది కాబట్టి కలలో కూడా కులమతాదిక్షుద్రభేదాలను పాటించేవాడు. గాడు.

152 తుమ్మల సీతారామమూర్తి (బతికినంతకాలమూ. ఖద్దరుబట్టలే కట్టాడు. వాయిదా వేయకుండా ఆయన ఏరోజు పనులను ఆరోజే చేసికొనేవాడు. ఆలస్యం అనేమాట లేకుండా వెంటనే లేఖలు, వ్రాసీవాడు. తనకు వచ్చిన, తానువ్రాసిన జాబుల వివరాలను తేదీలవారిగా ఒక పుస్తకంలో నమోదు చేసేవాడు. తనమాదిరిగా అందరూ విలంబనం లేకుండా లేఖలు వ్రాయాలని వాంఛించేవాడు. 1930 నుండీ దినచర్య వ్రాశాడు. ఆస్తికుడయిన సీతారామమూర్తి తీ. జగము నాదెస మెఉయుప్రసాదమెల్ల భగవదనుకంప యని ముదంపడెద నేను జగమునకు జేయుస్తేవ యీశ్చరునిపట్ల నప్పున యొనర్చు నూడిగ మనితలంతు అని చెప్పాడు. అహింసామార్గాన్నవలందించి పరోపకారార్థం పరిశ్రమించే యోగమే యజ్ఞం అని ఆయన నిర్వచించాడు. సదాచారాలకు సంబంధించినంతవరకూ ఆయన ప్రవచనం కంటె ఆచరణం శ్రేష్టమని విశ్వసించి తదనుగుణంగా నడుచుకొన్నాడు. నాల్గవకుమారుడు జన్మించిన తర్వాత ఆయన అచల బ్రహ్మచర్యాన్ని అవలంబించి నెగ్గాడు. ఆయనకు బాహ్య పూజకంటె మానసిక పూజ ముఖ్యం. భగవద్విశ్చాసం గలవాడయినప్పటికీ మతసంబంధమయిన _దురాచారాలనూ .మూఢవిశ్వాసాలనూ, కట్టుకకలనూ ఆయన మోమోటం లేకుండా ఖండించాడు. ఈసందర్భంగా ఆయన ప్రకటించిన అభిప్రాయాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. క్ట కం. దేవుండు కలం డనిచెప్పిన ప్రావక్కణ వలయు. గాని బాంపలు మాలల్‌ దేవునిగుడి కర్చకులై పోవచ్చు నటన్న క్రొత్తబోధయు వలయున్‌. కం. గుడి కాదు నేండు నరునకు బడీ కావలె; మూఢమైన ప్రత్యయములపో బడి కావలె; యుగయుగముల. గడల్కొనిన తమముతీలుగడ కావలయున్‌.

వ్యక్తిత్వము 153 కం. గోపన్న బుణమ్మునుసీ తాపతి చెల్లించె ననుట దబ్బ; కరణా లాపని చేసిరి సిరిగల కాపులు జేరులు కరంగి కాసు లొసంగన్‌. ఆ.వె. భక్తి పెరింగి గాదు పాపిష్టపథములం బసిండి కూర్చు వారి భయము పెరింగి పెరిలె మింటిదనుకం దిరుమలవెంకన్న బొక్కసంబు లనుట నిక్కువంబు. ఆ.వె. పాడిదప్పి నరుండు పడసిన సిరికొంత గుడికి బడి కొసంగం జెడదు కలుచ సెలగ గొంతు కోసి చెప్పులదాన మొ నర్చినంతం దూలునా యఘమ్ము దారులు వేరయినప్పటికీ సీతారామమూర్తి సద్గుణాలను బట్టి మనుష్యులను ఆపారంగా ప్రేమించేవాడు. ఆయనమిత్రుల్లో వ్యావహారిక భాషావాదులున్నారు. నాస్తికులున్నారు. గాంధీజీ విమర్శకులున్నారు. తే. అడ్డగించునె సిద్ధాంత మచ్చమైన ॥ ప్రేమ గలరెండు గుండెలు బెరసినపుడు. అని ఆయన పలికాడు. ఎన్నడూ అసూయనూద్వేషాన్నీ ఆయన తనదరికి రానీలేదు. తనపై దుమ్మెత్తి పోసినకవులకు కూడా సన్మానాలు జరగటానికి ఆయన కారకుడయ్యాడు. శ్రీకృష్ణునిపట్ల -పొండ్రక వాసుదేవునివలె తనపట్ల ఈర్జ్యాగ్రస్తులయిన వారి పోకిళ్లు చూచి నవ్వుకొని, 'భవిష్యాజ్జన్మమందయినా వారికేకొరతలు లేకుండా చేయమని భగవంతుణ్ణి ప్రార్థించాడు. మానవునిలో ఎప్పటికయినా మంచిమార్చు రాక తప్పదని ఆయన హృదయపూర్వకంగా విశ్వసించాడు. ఇందువల్లనే ఆయన -.కృతఘ్నుణ్ణి సహించాడు. దారి తప్పిన శిష్యునిపట్ల ఓర్చు చూపాడు. తీసిన అప్పు తీర్చకుండా వంకలు పెట్టేవాజ్జి వాని కర్మానికి వదలాడు, సీతారామమూర్తి జీవితంలో గోచరించే బుషిత్వమే ఆయన కవికా సృష్టిలోనూ కనబడుతుంది. ఆయన “తపస్సిద్ధి కావ్యంలో సరస్వతీదేవి నుద్దేశించి

154 తుమ్మల సీతారామమూర్తి ఉ రూకలకీపిలో మనుజ రూపము గన్ననిశాటు, నుగ్రద ర్వీకరు, లోకమాన్యపద వీచ్యుతు నెన్నండు మెచ్చలేద! య ఉ్దూంకల కోడి మైలవడి నట్టిపదమ్ముల నంటలేద! త ల్లీ! కరుణించి నీ విడిన యెల్లయు మల్లియవోలె. బెంచితిన్‌. “సత్యానుచరము సాహితి”? అని గట్టిగా నమ్మినవాడు గాబట్టి కావ్యరచనంలోనూ ఆయన సత్యభంగాన్ని సహించేవాడుగాడు. “తప్పు వ్రాయని యెప్పులకుప్పు*' నని ఆయన యేనాడూ భావింపలేదు. ఆ.వె. తప్పులేనికైత సెప్పెదనని గుండె పైని జేయివైచి పలుకంజాలు కవియెవండు? బుధులు కారుణ్యమూర్తులై యుంట నాట సాగుచుండుంాని. అని ఆయన “బాపూజీ అఆత్మకథ"”"లోనే వక్కాణించాడు. ప్రాజ్ఞులిది దోషమంటే, వెంటనే దానిని దిద్దుకొనేవాడు. శబ్దసాధుస్వరూపం తెలిసికొనటానికి విద్వన్మణులకు లేఖలు వ్రాసేవాడు. తనకు - గురి కుదిరిన పిన్నలతో చర్చించేవాడు. నిఘంటువులూ, సంస్కృతాంధ్ర వ్యాకరణాలూ తిరుగవేసివాడు. తనసందేహం నివృత్తి అయ్యేదాకా, ఎన్నిరోజులయినా వేచియుండేవాడు. ఒకానొకప్పుడు ఒక సహృదయ పండితుడు సీతారామమూర్తి కవిత్వంలోని అపశబ్దాన్ని గుర్తించి “ఇది అచ్చు తప్పేమో?” అని.లేఖ పంపాడు. వెంటనే ఆయన “ఇది అచ్చు తప్పుగాదు. నా అజ్ఞానంవల్ల దొరలిన ఆప్మబ్దం” అని ఆంతరంగ శుద్ధితో జవాబు. వ్రాశాడు. జీవించినంత కాలమూ ఆయన విద్యార్థి మాదిరిగా సుశబ్దాపశబ్దవిబారం గావించాడు. తెలుగు కారకాన్ని తెలిసికోవటానికి తీవ్రవ్యాసంగం చేశాడు. కావ్యాలకు రచించిన పీఠికలో సీతారామమూర్తి సత్యదృష్టీ చిత్త శుద్ధ కొట్టవచ్చినట్టు కనబడతాయి. వాటిల్లో తన సందేహాలను -నివారించిన పెద్దలనూ పిన్నలనూ _ పేరుపేరునా' పేర్కొన్నాడు.

వ్యక్తిత్వము 155

కవిత్వమే ఊపిరిగా సీతారామమూర్తి జీవించాడు. అయితే ఆయన కవిత్వానికి వాపుకంటె బలుపు ముఖ్యమని భావించాడు. జౌచిత్యమూ, సాధుత్వమూ కవిత్వానికి జీవకళ సిద్ధింపజేస్తాయని నమ్మటంచేత, ఆ రెండింటి కొరకూ, అహోరాత్రాలూ కష్టపడేవాడు. ఒక్కొక్కసారి నెలకు ఒకటో రెండో పద్యాలను మూత్రమే రచింపగలిగేవాడు. వ్రాసిన దంతా అచ్చుకెక్కించాలనే ఉబలాటం ఆయనకుండేది గాదు. తన రచనాన్ని పాత్రులయిన పండితులకూ, కవితాశిల్పవేత్తలయిన విమర్శకులకూ ఎందరకో విన్చించేవాడు. సమంజసమయిన వారి సూచనలు మన్నించి ఆయన దానిని సవరించుకొనేవాడు. ఈ భాగాన్ని పరిహరించండని వారు సహితుకంగా విమర్శిస్తే దానిని రద్దుచేసివాడు. ఈవిధంగా ఆయన తొలగించిన పద్యాలెన్నో ఉన్నాయి.

సీతారామమూర్తి అవేశం కలిగినప్పుడే కవిత్వ రచనకు కలం అందుకొనేవాడు. ఆపౌంగు తగ్గినదాకా కవిత్వం రచించేవాడు. ఆంధ్రరాష్ట్రం అవతరించిన అనంతరం తలయెత్తినతంపులూ, ఆకాశవాణీ కవిసమ్మేళనంలో ఒక మహాకవి పత్రికలవారిని విమర్శింపగా చెలరేగిన వాదప్రతివాదాలూ ఆయనలో అవేశాన్ని కల్గించాయి. వెంటనే కవిత్వ రచనకు పూనుకొని ఐదారు పద్యాలు రచించాడు. ఇంతలో మంగలి రావటంచేత గడ్డంగీయించు కొంటానికి కూర్చున్నాడు. ఆవేశం తగ్గలేదు. గడ్డం సగంగికటమే జరిగింది. అయినప్పటికీ ఆయన మంగలిని ఆగు అని ఆజ్ఞాపించాడు. వాడు చిత్తం అన్నాడు. వెంటనే ఆయన కలమూ కాగీకాలూ అందుకొని తెలుగుబాస సారుతీరులను వర్ణిస్తూ ఒక గంటలో నలభై పద్యాలు రచించాడు. ఆవేశం తగ్గింది. తర్వాత విస్తుపోయి చూస్తున్న మంగలి చేత మిగిలిన సగం గడ్డం గొరిగించుకొని వానికి రెట్టింపు సొమ్ము ఇచ్చి పంపివేశాడు. ఆ పద్యాలే “ఉదయగానము” లోని “తెనుంగు తీపీా.

అహంకారానికీ సీతారామమూర్తికీ ఆమడదూరం. వినయం ఆయనకు అఆజానజంగా అబ్పిన సుగుణం, "ఆయన విరు దధారణం ఈమాటను రుజువు చేస్తున్నది. ఆయాసందర్భాల్లో , తెలుగువారు ““బాలకపి,” “అవధానపండిత,”' సరసకపిశేఖర” ““ఆశుకవీంద్ర”, “విద్వత్కవి సమ్రాట్టు”, “జాతీయకవిబ్రహ్మ'', “రాష్ట్రీయ కవ్యగ్రణి'' -

156 తుమ్మల సీతారామమూర్తి అనే బిరుదులు ఆయనకిచ్చి తమరాసిక్యాన్నీ పూజ్యపూజాతత్ప్చరతనూ చాటు కొన్నారు. “ఆత్మకథ” మొదటి భాగం ప్రకటించిన తర్వాత 1939 మార్చిలో నెల్లూరివా రాయనకు ఘన సన్మానం గావించి “అభినవ తిక్కన” విరుదు నిచ్చారు. మిగిలిన విరుదులమాట యొట్లున్నా సీకారామమూర్తికి “అభినవ తిక్కన” విరుదం పెద్దబరువుగా తోచింది. మూడుకాలాలోనూ తిక్కనకు సాటి తిక్కనే అని ఆయన అభిప్రాయం. “కం. తిక్కన ధర్మాద్వైతము చిక్కినదా? మార్గదేశి కిల్పముల జగా పెక్కువ నాకల్చినదా? నక్కయెచట? నాక మెచట? నాయము సెపుండీ! అని ఆయన తన్నుతాను ప్రశ్నించు కొన్నాడు. చివరకు 25-12-1960 కేదిని నరసరావు పేటలో జన్మదినోత్సవం జరిగినపుడు నిండుసభలో దానిని విడిచివేస్తున్నానని ఆయన ప్రకటించాడు. దీనివల్ల పేరుముందు ఏర్పడిన బోసితనం పోవటానికి “తెనుంగు లెంక అనే బిరుదును తనకుతానే తగిలించుకొన్నాడు. లెంక అంటే సేవకుడని అర్థం. తెనుగులెంక అంటే లంధ్ధసివకుడు అని అర్థం చెప్పాలి. ఈవిధంగానే మొదటిరోజుల్లో తర్వాత చేర్చిన “చౌదరొ* అనే కులవాచకా ళ్ల పీదప కోలుతపే ర్చి అనే న్ని కొన్నేళ్ల సీతారామమూర్తిలో ఆత్య్మవిచారం అధికం. ఈ గుణం ఆయనకు జరిగిన సన్మానాల విషయంలో వ్యక్తమవుతుంది. జీవితంలో మొట్టమొదటి సారిగా ఆయనను నెల్లూరివారు సన్మానించారు. 1949 జనవరి 29వ తేదిని సీతారామమ్యూర్తికి నిడుబ్రోలులో కనకాఖిషికం, గజారోహణం, గండపెండారప్రదానం మొదలయిన సన్మానాలు పెద్ద యెత్తునజరిగాయి. 1952 నుండీ తెలుగువారు వారి జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. 1960 మేలో అఖిల భారత తెలుగురచయితల మహాసభ వారిని సత్కరించింది. 1967 జనవరి 7వ తేదిని ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ఆయనకు విశిష్టసభ్యత్వ ప్రదానం చేసింది. 1969లో కేంద్ర సాహిత్య అకాదెమీ వారి “మహాత్మకథ'”కు బహుమానం ప్రకటించింది. ఆ సంవత్సరం డిసెంబరులో ఆంధ్రవిశ్చ్వవిద్యాలయం “కళాప్రపూర్ణ” బిరుదు ప్రసాదించింది. 1984లో మద్రాసులోని ఎల్‌ వి. ఆర్‌. ఫొండేషన్‌ ఆయనను

వ్యక్తిత్వము 157 సన్మానించింది. 1985 ఫిబ్రవరి మూడోడీిదిసి నాగార్జున విశ్చవిద్యాలయం “డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌” విరుదంతో సత్కరించింది. 1985 డిసెంబరు 25వ జిదిని విశాఖపట్టనంలో వారి సహస్ర చంద్రదర్శన మహోత్సవం వైభవంగా ప్రవర్తిల్లింది. సీతారామమూర్తి అంగీకరించిన సన్మానాలకు తుల్యంగా తిరస్కరించిన సన్మానాలున్నమాట సత్యం. ఈసన్మానపరంపర సీకారామమూర్తికి లోచూపు పెంచింది.

ఆ.వె. కవిత చెప్పేనాండం గనకాఖిషేకాది పరమ గౌరవములు పడసినాండ నేల కులుకవలయు నీసిరిజూచి? నే నెవండనో రవంత యెయుంగ నైతి. అని ఆయన తన్ను తాను సమీక్షించు' కొన్నాండు. ఫలాఫలాలను ఒకే తీరుగా చూచి, కర్మయోగకౌశలాన్ని ఆర్జింపలేకపోయానని ఆయన విచారించాడు. “బుద్ది ఆత్మవైపు సాగటం లేదు. దానిని అనుసరించి ఇంద్రియాలు నడవటం లేదు. ఎంతశ్రమించినా సకలదు:ఖాలనూ సమయించే ప్రసన్నత పట్టువడలేదు. సత్త్వం కొఆకు తపస్సు చేస్తున్నాను. కాని రజోగుణం విడువలేదు ఇక తమస్సు లేకపోవటమే చాలు ననుకొంటానని ఆయన మథన పడ్డాడు. చివరకు ఆ.వె. అఖిల భూతకోటియం దాత్మ నీక్షించి యఖిలజగము నాత్మయందు జూచి యద్వితీయమయిన యానందమున జొక్కు వడయు దనుక నల(తి వాండ నేను. ఆ.వె. నిక్కమయిన చదువు నేర్చి “కో౭హ”మ్మను చింత కొగ్గి, సాధుసేవమరగి మోహమును దొలంచి “సోఒహ”” మ్మనెడి ప్రజ్ఞ వడయుదనుక నలథతి వాండ నేను. అని నిర్ణయించుకొన్నాడు. ఇటువంటి సీతారామమూర్తి 21-3-1990వ తేదిని అప్పికట్టలోని స్వగృహంలో నిర్యాణం చెందాడు. ఆంధ్రదేశం ఒక ఆంధ్రకవినీ, ఒక జాతీయ కవినీ, ఒక యుగకవినీ శాశ్వతంగా కోల్పోయింది.

801 000124911/

  1. ౯611511 ౦౧65 రల 0.౮. "౧6 కం1॥60 01 5064 10612 1920-1937 ౫౭౪౫ ౨6101, 1976. 614/6, ౪1౧002 గెలం14[0025/ 52౧7062౪28, రెంగు02౪, 1964. ఆజ41 సక 52౧/06202, గీ[గిం6648026, 1954. [00ల|21 622646 01 1౧418, ౦౪1౧0181 561, సగర, 610414, 1908. సంంగ10, క0్ర006 ౯. కం1110 26 39064! 008౧0104 1౧ 5060) 1౧612, ౧6 ౦౧-9800020 గిశీంళంం0గం00 206 ౭౧|| వఏలుడ 269౧౫, 1916-1929, 800292 1969, లేంగ౧1 0 6 తంగిజాం!2! ౮౧1౪ల 511౪6 ల01199, 1955. సేకీషం060216, 001401 420421! ౦ 616 196౯4 5015010; గగీడెర29, 1883. శజాతజు 1.0. [15401%/ 01 46 [౭౭60గా స0౪లు౭౧6 11 106412, 4 ౪010006, 0210604. సజ 1121 0410౧) 4౧601 1 [౧064140 46206, స5076, 1971. 120064, గగ. జతే గిం, ౮౧. : (064110౧) [06 సశ1164 01 13042001 28641, ఉగగంయ36026, 1967. కండర ౪3 జర గి౭ంగ40442 ౧౭౦, ౨. గంర2 ఆగిరం? 861690 ౧16 క4ల౭0164, 1975. ౧౭94౧1, 54/0)101 10019026 0 16 [౭6640గ సి[076గ౭౧6 1౧ తీర! క2669%, స్యడీల౭036, 1972.

2, ౯౮౮0౮ ౦౧15 తగ౭గిణ కూ15[0& కజాం8, ౧112 9౭11. 0802, 2102, 1929. కౌం1486 ఏజగం1ం!క, 601060 ఫ0404 వడాా౭9౪ఖం6, ₹019 3౩ & 4, 1959, 1961. రషండంయ4062 100212, సేలజ2ం0కం! 12066301 560416402086, 1975. ౪6౧16218 గజగర్రడ!2, కిశీతంం1610061. కరెగిషా౭ర& క54890000ంరయ బం ౧౧౭102. 58౭0య1%641ల42026, 1974-1977. ౪6044౭6801, 08బగీ2, గంత: 26650 కళ0సు& ఉకిచతలా!, 1/191502 580%012 ౧232252. కస ఉలతంతత, 1972. 51౪జ4గా& 58561, ౪ల161 గజ౧91260౧) దీ[ం2 రడ, కిశ2రం2ం, 1947. వ 1 కక కచండ కజ882006, 1919, కతంండ11096542/2 క2011గ0౮, 1919. సకతటండ 0406401 గతా, 1921. మం3రం8 00416జ104, 1922. డం2019002 50541, 11923. సశ తంగడే:3 లీ౭రజ2గం 1924. నిళుటం208004, (007 క4గ4ం౧9), 1932-1953. తీటండ!8014, 0110810, 1936. గంం! గటంంంతాడ!! గంట ౧2౧109), కం[ట8 0మ౭గ3, (56/51 8418009) 1938-1973

లి బాగ౭ లంక! (1౪76 56416009) 1943- 1985. క2గర4 202 40 54180౧9) 1943-1952. ౭646 గతం, 1946. తీ[డ గడ04 (60గ౧|6(౭) 1951. రేడి 6జజంం (౪4/0 6416009) 1955- 1973. 510413, 1955. 5జాంరేడ32 640౧106, 1961. ౧౮౩౪ సంంఈ1, 1961. 60౧4, 1963. 6౭694 రేజకడ000, 1963. 212 2౭౧. 1964. 52046446 1967. సె డటం8 క203, 1968. 1 సట2జ0, 1973... కలకల, 1976. కజంంపు య6జత, 19785. 52౧64662 5202562011, 1981. [02630008 [6జ02, 1983. 0%ఐ4,4410, 1993. 10/2 లంక 1994,

501౧౧29618 రీషగా౭, కిశే12గ004111. శీగయమ2 5జగ9!001 జా౭గి8్ర101 కరేల౭086, 1976.

ణా యి ల

ఇరవయ్యో శతాబ్దిలోని తెలుగు కవుల్లో తుమ్ముల సీతారామమూర్తి వంటి కవి ఇంకొకడు కనబడడు. ఉత్తమ కావ్యసృష్టికూడా మానవ సేవయే అని నమ్మి త్రికరణ శుద్దిగా ఆయన జీవించాడు. పదేళ్ల " ప్రాయంలోనే పద్యం అల్లిన సీతారామమూర్తి మొదట గ్రామ్లీల్ల ..

సంస్కృతిని ప్రతిబింబించే కావ్యాలు రచిస్తూ సాహిత్య ప్రస్థానం సాగించాడు. తరువాత రాష్ట్రకవిగా, జాతీయకవిగా, యుగకవిగా

అవతరించాడు. ఈ శతాబ్దిలోని ఆంధ్రుల, భారతీయుల హృదయ . స్పందనలకు ఆయన రచించిన కావ్యాలు మనోహర రూపాలు. ఆ

కావ్యాల మూలతత్త్వం గాంధేయవాదం. అమరజ్యోతి అయిన గాంధీ = సంపూర్ణ జీవన చరిత్రను మహావీర కావ్యాలుగా తీర్చితిద్ది సీతా

రామమూర్తి మహాత్ముని ఆస్థానకవి అయ్యాడు. చిక్కని చక్కని - తెనుగుదనం గుట్టు తెలిసికోవాలనుకొనే సాహితీ రసికులు ఆయన ళా కావ్యాలను చదువక తప్పదు. ఈ గ్రంథకర్త నాగళ్ల గురుప్రసాదరావు నలఖైర్బైదేళ్లనుండి సాహితీ సేవ గావిస్తున్నాడు. వందకుపైగా పరిశోధన వ్యాసాలు రచించాడు. మూడువందలకు పైగా గ్రంథ సమీక్షలు చేశాడు. ఈయన విమర్శలో తత్త్వదర్శనం * తప్ప స్టుప్రయోజనపరత్వమూ, మోమోటమూ _ కనబడవు. "ఇద్దరు తెలుగు మహాకవులు, “శాలివాహనుడు' ఈయన ఇతర రచనలు. అమెరికా, ఇంగ్లండు

పర్యటించి ఆంధ్రసాహిత్య ప్రసంగాలు గావించాడు.

శ

ఇుణుగు22 వంం02 20200గ09 - ౧౦080) శం. 25 శ

153% : 81-260-0833-4 , సాహిత్య అకాదెమీ ప్రపంచంలోనే పెద్ద ప్రచురణా సంస్త. మ. ల. చ