Telugu telugu thera - anilvaranasi/indianlanguages GitHub Wiki
| | న్న : సహజ కవి మల్లెమూల న్ గ మనసుపడి మక్కువతో సేకరించిన | 1 ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం | న్ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి య _ ఆనందంతో బహూకరిస్తున్నాం. ం 1 | ! - మల్లెమాల కుటుంబం ( శ భి! శ వ. /॥ ర. సలదలలలులటి థి
(20వ శతాబ్దపు తెలుగు సినిమా సంక్షిప్త చరిత్ర) 1999 సంవత్సరానికి తెలుగుసినిమా చరిత్రపై ఉత్తమ గ్రంధంగా రాష్ట ప్రభుత్వ 'నంది ఎవార్డు బహుమతి పొందిన పుస్తకం. గ ఆవబా రచన నభిర్కమ్యరు. ఎస్.వి. రామారావు మల్లో రణ రయం తా క. (1 ్య కెన్నెర పబ్నకషన్స్ 2-2-647/153, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ "హైదరాబాద్ - 500 013. (ఆంధ్రప్రదేశ్ 1
“తెలుగు తెర” ప్రధమ ముద్రణ - డిసెంబర్ 1999 గటి ద్వితీయ ముద్రణ - జూన్ 2001 క. గ్ర జ్ రామా కవర్ డిజైన్ . సూరి ఫోటో కర్టసీ 'కళారాధన' సంజయ్ కిష్తోర్ వెల రూ. 100/- (ప్రచురణ : అతనన గో శ 1 ఇ ఇ శ కిన్నెర ఆర్ట్ ధియేటర్స్ గ్సంర న న. 2-2-647/153, 6506 సెంట్రల్ ఎక్సెజ్ కాలనీ ౫౯ (గీ 6.018 వం శీ!) హైదరాబాద్ - 600 013. శే ఘా ఫోన్ : 7677777 ల సాసకాటాద్ ర. రచయిత బిరునామా . ఎస్.వి. రామారావు జి. 3, ఉమా ఎపార్జుమెంట్స్ చ గా లలితా నగర్, దిల్షుక్నగర్ లర హైదరాబాద్ - 500 060 గ్ ఫోన్ : 4100279 ఎస్.వి.రామారావు - 5-97, చాణక్యపురి కాలనీ రామచంద్రరావుపేట ఏలూరు - 534 002 ఫోన్ : 32901 (తులకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 4-1-435, బ్యాంకు వీధి విజ్ఞాన్ భవన్ హైదరాబాద్ - 600 003. ముద్రణ " వివ్ల కంప్యూటర్ సర్వీసెస్ (జీజైనర్స్ అండ్ మల్టి కలల్ ఆఫ్సెట్ వ్రీంటల్ట్/ నల్లకుంట, హైదరాబాద్ - 500 044. ఫోన్ : 040-767 3309
. చలా న్ గుకటంటు జ్ మస ౮౪9౯ రకా! టీ మ. తిసిఅకుగ4 టునం గడీ లం [248480 సటలల సందేశం తొలినాటి నుండి అత్యున్నత కూ సాంస్కృతిక విలువలతో, ఉదాత్త ప్రమాణాలతో ఎదిగి వచ్చి జాతీయ, 'పంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తెలుగు చలన చిత్ర రంగం స్టూల చరిత్రను, పూత్వోపరాల సమీక్షతో “తెలుగు తెర”. పేరిట శ్రీ ఎస్.వి.రామారావు రచించిన పుస్తకాన్ని ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్త అయిన కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వారు తమ 50వ ప్రచురణగా ఆవిష్కరించడం ఎంతైనా ముదావహం, చదువరులకు, విమర్శకులకు, పరిశోధకులకు ఈ పుస్తకం అమూల్య సమాచారంతో ఉపయుక్తం కాగలదని ఆశిస్తున్నాను, మహత్తర ఆదర్శంతో మీరు చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంకీస్తూ...... [ దం (నారా చంద్రబాబు నాయుడు) ఎం.వినారాయణరావు, ఐ.పి.ఎస్., (రిటైర్డ్, అధ్యక్షులు, కిన్నెర అర్ట్ థియేటర్స్.
కిన్నెరమాట 1977లో (ప్రముఖ సినీ నటుడు, అజాతశత్రువు మురళీమోహన్ గారిచే (ప్రారంభించబడిన మా "కిన్నెర ఆర్ట్ ధియేటర్స్ గత 22 సంవత్సరాల్లో వందలాది సంగీత, సాహిత్య, నృత్య, నాటక కార్యక్రమాల్లో జంటనగరాలలోనూ ఆంధ్రదేశంలోని విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, నెల్లూరు వంటి ముఖ్య పట్టణాల్టోను నిర్వహించాము. వాటిలో కొన్ని .... కూచిపూడి వృత్యోత్సవాలు అడవి బాపిరాజు శతజయంత్యుత్సనాలు దేవులపల్లి కృష్ణశాస్త్రి శతజయంత్యుత్సవాలు రావుగోపాలరావు స్మారక వాటకోత్సవాలు యన్.టి.ఆర్. స్మారక చివార్డు ప్రదానం యన్.టి.ఆర్. పద్యవాటకోత్సవాలు ఘంటసాల నిర్విరామ 24 గంటల ఆరాధనోత్సవాలు సినీ రంగానికి చెందిన ప్రముఖులు శ్రీ దుక్కిపాటి మధుసూదనరావు, శ్రీ కె. విశ్వనాధ్, శ్రీమతి పి. సుశీల, ఊర్వశి శారద, శ్రీమతి వాణిశ్రీ, కుమారి విజయశాంతి, శ్రీ సత్యనారాయణ, శ్రీ కాంతారావు, సంగీత సాహిత్య రంగాలకు చెందిన శ్రీ కల్టూరి మురళీకృష్ణ శ్రీ పాలగుమ్మి విశ్శనాధం, శ్రీ అవంత్స సోమసుందర్ 'ప్రభృతులను వివిధ సందర్భాల్టో సత్కరించాము. అడవిబాపీరాజు శతజయంతిఉత్సవాల సందర్భంగా జ్ఞానపీఠ్ అవార్డ్ (గ్రహీత, రాజ్యసభ సభ్యులు, డా॥ సి. నారాయణరెడ్డిగారికి అడివిబాపిరాజు స్మారక బంగారు పతకాన్ని బహూకరించి ఘనంగా సత్కరించాము, నృత్య కిన్నెర పేరిట దేశవిదేశాల్లో నృత్య కార్యక్రమాలు నిర్వహించాము, 1980లో (ప్రముఖ సినీ దర్శకులు శ్రీ దాసరి నారాయణరావు చేతుల మీదుగా 'క్రిన్నెర పబ్లికేషన్స్" (ప్రారంభించి, నేటి వరకు 49 పుస్తకాలు ప్రచురించాము. తెలుగు సినిమా అరవై యేళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భంగా 'అరవయ్యేళ్ళ తెలుగు సినిమా” పుస్తకాన్ని 1995లో ప్రచురించాము. క్
ఈ సహ్రొబ్ది ముగియనున్న తరుణంలో ఇరవయ్యో శతాబ్దపు తెలుగు సినిమా సంక్షిప్త చరిత్రను తెలిపే యీ "జెలుగుతెర” పుస్తకాన్ని మా 50వ ప్రచురణగా అందిస్తున్నాము.
కిన్నెర అధ్యక్షులు శ్రీ యం.వి. నారాయణరావు గారి ఆశీస్సులతో, నారి ఆధ్వర్యంలో కిన్నార తరుపున 50 పుస్తకాలు ప్రచురించి మీ అందరి మన్ననలు పొందాము.
ఈ 'తెలుగు తెర పుస్తకం మీ ముందుకు రావటానికి ఎంతో (శ్రమించి విషయ సేకరణ చేసి అందించిన సినీ నాటక రచయిత, ఫిలిం జర్నలిస్ట్ శ్రీ యస్.వి. రామారావు గారికి, అందంగా ట్రింట్ చేసిన విష్ణ కంప్యూటర్స్ వారికి, ఆర్టిస్ట్ సూరి గారికి మా కృతజ్ఞతలు.
రిటైర్డ్ఐ.పి.ఎస్. అధికారి శ్రీ, ఆర్: ప్రభాకరరావు, డా॥ సుంకు బలరామ్, ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ కె.వి. రమణ, సభాస'మ్రాట్ కె.వి. భాస్కరరావు తదితర అధికార అనధికార పెద్దల సూచనలతో సొంస్కృతిక రంగంలో ముందంజ వేస్తూన్న మాకు అభిమానుల, కళాపోషకుల, వదాన్యుల (ప్రోత్సాహమే కొండంత ఆండ అని సవినయంగా మనవి చేసుకుంటున్నాము.
ఈ పుస్తకం మీ ముందుకు రావటానికి ఆర్థిక సహాయం చేసిన ధాతలకి, 'ప్రకటనలిచ్చి సహకరించిన వారికి కృతజ్ఞతలు.
భవదీయుడు, మద్దాళి రఘురామ్ కార్యదర్శి 6
ముందుమూటి తెలుగు సీనిమా గూర్చి రెండువందల పేజీల్లో పుస్తకమా! వం సరిపోతుంది అన్లు ఆళ్చ్ళుర్భం కలుగవచ్చు. రామాయణ కధను కట్టె-కొట్టె-తెచ్చె అంటూ మూడు ముక్కల్లోనూ నవివరంగా మూడు వేల పేజీల దాకా వివరించిన సందర్భాలున్జాయి. అదే రామాయణాన్ని పలు భాషల్లోవందలాది రచయితలు తమ దృక్టుభంతో వాల్మీకి మూలకథను అందమైన భాష్యంలో అందించిన సందర్భాలూ వున్హాయి. తెలుగులో సినిమాల గూర్చి. ననీ ప్రముఖుల గూర్చి, నంస్తల గూర్చి, చరిత్ర గూర్చి చాలా వుస్తకాలు వచ్చాయి, ఇంకా వస్తాయి, రావాలి కూడా సినీ జద్డలిజంలో నలబై సంవత్సరాలుగా కృషి చేస్తూ కొని సినిమాలకు రచన చేని, నీనీ రంగ పెద్దలైన కె. వి రెడ్డి, యల్ వి. (ప్రసాద్ కమలాకర కామేళ్చరరావు వి. మధుసూదనరావు, ఆదుర్తి నుబ్బారావు, విరలాచార్య, దాసరి నారాయణరావు, కోడి రామక్షృష్ణ వంటి దర్భకులతోనూ; పింజుల నుబ్బారావు, వాకాడ ఆస్తారావు, కెఎన్. రామారావు వంటి నిర్మాతలతోనూ; అక్కినేని నాగేళ్చరరావు, లింగమూర్తి, గుమ్మడి పంకటేళ్ళరరావు, నత్యనారాయణ, మురళీమోహన్ వంటి నటులతోనూ కొనరాజూ, డి.వి. నరసరాజూ, నీ. నారాయణరెడ్డి, జంధ్యాల వంటి రబయితలతోనూ; మరికొంతమంది టెక్టిషియన్ట్తోనూ నాకు గల నన్లిహిత పరిచయంతో వారితో ముచ్చటించిన సందర్భాల్లోయెన్లో విషయాలు తెలిసేవి. వాటిల్లోని ముచ్చట్లను ముచ్చటగా వదిలేసి చరిత్రకు పనికి వచ్చే అంశాలను రికార్డు చేసుకునేవాళ్లో, నాలుగేళ్ళ (క్రిందట నిర్మాత కెఎన్, రామారావు తెలుగు సినిమా చరిత్ర గూర్చి 52 వారాల టి.వి. నీరియల్ ఫ్లాన్ చేసినపుడు ఆ దిళగా ఎన్నో వివరాలు సేకరించి వందలాది కేసెట్టు చూసి ఎన్నో అంశాలు రికార్డు చేశాను. 7
ఈ మధ్య ఆ విషయమై ఆత్మీయమి/ులు, కిన్సైర రఘురాక్ గారితో (ప్రస్తావనకు రాగా ఆయన మీ వద్రనున్దు మెటీరియల్‌తో వుస్తకం వేద్దాం (స్రాసీడ్ అని (ప్రోత్సహించారు. ఆయితే నవివరంగా సమ(గ్రంగా వెయ్యాలంటే కనీసం రెండువేల పేబీలు వుండాలి. అంతటి (ప్రయత్తుం చెయ్యలేక పోయినా సంక్షిప్తంగా తక్కువ పేబీల్లో వీలయినంత ఎక్కువ నమాబారం, నినిమా నిర్మాణంలోని వివిధ అంశాలకు, అందుకు సంబంధించిన పెద్దల గూర్చి రేఖామా(తంగా పరిచయం చేస్తూ నీనియారిటీ ప్రాతిపదికన వివరాల్లి ఇందులో పొందుపరిచాను.
ఈ బృహత్తర ప్రయత్తంలో ఫోన్ చేసిన వెంటనే వలు వివరాలు. తెల్పిన నపహృదయులుు నర్వుశ్రీ అక్కీనేని నాగేళ్ళురరావు, గుమ్మడీ వెంఠబేళ్ళురరావు వలం నరసింహారావు, రావి కొండలరావు వ.వకెరంగారావ్సు ఎడీటర్స్ టి. కృష్ణ జ.జి.కృష్ణారావు ఫోటోగ్రాఫర్ ఎం.విరఘు, వార్త ఆ పాత మధురం ఫేం రాజ్ఞా జర్పలిన్పు యం, నరహరిబాబు, “ఈనాడు” గ్రూవుకు చెందన జర్జలిన్టులు గంగాధర్ కెబి.లక్ష్మీ 'ఆంధ్ర (వ్రభో రమురాములు గార్లకు కృతజ్ఞతలు. ననిమాలకు నంబంధించి నేను బ్రాసీన అనేక వ్యాసాలు (్రురిన్తున్లు ఆంధ్రప్రభ ఆంధ్రభూమి, రిపోర్టర్ పత్రికల యాజమాన్యాలక్కు నంపాదోకులకు, వ్యయ[(న్రయాసాలతో కూడిన యా ప్రయత్తములో నవాకరించిన వదాన్యులకు అన్ఫిటికీ మించ్చి నవ్నాదయంలో యీ కార్యక్రమాన్ని చేపట్టిన నూత్రధారి మద్దాలి రఘురామ్' గారికీ నా కృతజ్ఞతలు. నహృదయ పారకులు ఏమైనా నూభనలు తెలివితే అవి భవిష్యత్తులో ఎంతగానో వువకరిస్తాయి.
ఈ వున్తకొనికి నంది ఎవార్డు' యిచ్చిన ప్రభుత్వానికి రెండవ ముద్రణకు నూబనలిచ్చిన శ్రీ కెవి. రావుగార్కి, ఫోటోలు యిచ్చిన మిత్రులు కళారాధన శ్రీ నంజయ్ కిషోర్ళు శ్రీ అట్లూరి రామారావు (సితార నా వయత్తాన్సి ప్రోత్సపాంచిన నా శ్రీమతి మాజీకేళ్చురికీ కృతజ్ఞతలు
శలవు, నమన్మృతులలో్తో = ఎస్ఐ. రొమారొవు
అంకితం
కీ॥ శే ॥ రఘుపతి వెంకయ్య, హెచ్. ఎం. రెడ్డి బి. యన్. రెడ్డి, కే.వి. రెడ్డి గూడవల్లి రామబ్రహ్మం, ఘంటసాల బలరామయ్య, సి. పుల్లయ్య, పి. పుల్లయ్య, ఎల్, వి. ప్రసాద్, కమలాకర కామేశ్చరరావు, ఆదుర్తి సుబ్బారావు, భరణీ రామకృష్ణ, కె.ఎస్. (ప్రకాశరావు, తాతినేని ప్రకాశరావు, వేదాంతం రాఘవయ్య, విఠలాచార్య వంటి విశిష్ట
నాగయ్య, నారాయణరావు, యన్.టి. రామారావు, యస్.వి. రంగారావు, సి.యస్. ఆర్, శివరావు, రేలంగి, రమణారెడ్డి, కన్నాంబ, కాంచనమాల, సావిత్రి, గిరిజ, లక్ష్మిరాజ్యం, సూర్యకాంతం వంటి నటీ నటులు ....
సముద్రాల, సదాశివబ్రహ్మం, దేవులపల్లి, మల్దాది, ఆరుద్ర, శ్రీశ్రీ, కొసరాజు, దాశరథి వంటి సాహితీ'స్రష్టలు . ...
రాజేశ్చరరావు, ఘంటసాల, సుబ్బరామన్, పెండ్యాల, ఆదినారాయణరావు, అశ్చత్భామ, వేణు, టి. వి. రాజు, ఎ. ఎం. రాజా వంటి సుమధుర సంగీత కర్తలు... ,
ఎందరెందరో మహానుభావులు అసమాన ప్రతిభతో “తెలుగుతెర” ను సుసంపన్నం చేసి అమరులయ్యారు.
వారందరి దివ్యస్కృతికి యీ రచన అంకితం,
= విస్. వి. రామారావు వ్ర
ఇందులో... 1 మూకీల ముచ్చట్లు - టాకీల బాల్యదశ 2. నిర్మాతలు - నిర్మాణ సంస్థలు 3. స్టూడియోలు డీ దర్శకులు 5. నటీనటులు 6 సాహిత్యం 7. సంగీతం ర నృత్యం 9 కళ 10. ఛాయాగ్రహణం 11. ఫైట్స్ అండ్ థ్రిల్స్ క్ష కూర్పు 13. అనువాద చిత్రరంగం 14, సినిమా పత్రికలు - జర్నలిజం 15. ఫిలిం సొసైటీలు - చిత్రోత్సవాలు 16. సినిమా పరిశ్రమ - (ప్రభుత్వం | గ ఎవార్డులు 18. (ఇ) ది ఎండ్ (కాదు) 10
ళ్
స్ 2 హాల వ్ శ య ప న ళ్ సలి , | శ గ ష్య ళ్ ల్ . షా “ న స ల . ర. . భి గ్గ క్ష ను ల (| త్ర కలే
సాప్యా. న త నం ఆలా పైట ప్ నా ట్ న గ ఛో చి సం 228 తాడి తుం వాయన. న్న సా ల నా స య చల్ వన వ భి సట ౭ య
- టం ఇ ష్ష జె కష | "థీ! [ల + న్ స వనన తెచి వ. రా చా ఇ క్ష, బాహా ఆనీ న్ తొ | / ల రసు మ క. రీ. న =- శ లు తి ౯ చ రాం
. (్ న్
. వ. వ
( పూ జ
. | . ణా శ మే! స్ట్ (లి క్ష]
కడై ల్ల ళె య్ 9. 2 గ్ (న ఇ లు ణ్ = ఖ్ ల / చ్ 6 . నా ణ్ నల పభ్రత్త ్న ఎవ. న్ కి ల వ ము షయ సుత్త శ్ వ టా . ల క మ 91 మ . లై లా త్త జై? స గ్గ్గ లి ప. క. చేళి ఇి ము రన న జల్లి ప మ... . ర 2 ళ్ తం... ల్ ౧౧, కం 1 ర్డోడ ్ట్ చి ళీ ( మ ౬ శ న యఖ: న్్. " స్ట జ్జ ప... - న్ జ యయా... 2కిన్ లా... క్డ్ళ్ల 4 మంటు ఇ కి రై చ జె " లి 12
మూకీల ముచ్చట్లు - టాకీల బాల్యదశ
ఈ రోజున ఆబాలగోపాలం ఆనందంతో ముచ్చటించుకొనే అంశాలలో ముఖ్యమైనది సినిమా. ఈ పదం 'కినిమా” అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం 'పురోగమనం-ముందుకు కదలిక” అని.
1896లో భారతదేశంలో బొంబాయినగరంలో తొలిసారిగా లామియర్ బ్రదర్స్ ప్రతినిధులు మూకీ చిత్ర ప్రదర్శన నిర్వహించారు. అది జనాన్ని విపరీతంగా ఆకర్షించింది. దానిని అద్భుతమైన వింతగా పరిగణించి, అటువంటి ప్రక్రియ మనం ఎందుకు సాధించలేమనే ఆలోచన భారతీయులకి కలిగింది. ఆ ఆలోచన పలితంగా ఆర్ జి. టోర్ని విదేశీ సాంకేతిక శాస్త్రజ్ఞుల సహాయంతో 1910లో 'భక్త పుండలిక్, 1911లో 'రాజదర్చారో మూకీ చిత్రాలు నిర్మించారు. అయితే విదేశీ శా(స్తజ్ఞాల సహకారం లేకుండా దుండిరాజ్ గోవిందఫాల్కే స్వీయదర్వకత్వంలో 'రాజాహరిశళ్ళంద్ర నిర్మించగా. దానిని 2.4.1913న ప్రత్యేక ఆహ్వానితులకు చూపించి, 3.5.1913న విడుదల చేయగా _ (ధ్రేక్షకులు దానికి ఘనవిజయం చేకూర్చారు. హరిశ్చంద్రగా ఫాల్కే నటించారు. ఆ మహనీయుని స్మృత్యర్థం భారత చలనచిత్ర రంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తిని భారత (ప్రభుత్వం ప్రతియేటా 'దాదాఫాల్కే'అవార్డుతో సత్కరిస్తుంది.
ఆంధ్రదేశంలో మచిలీపట్నంకు చెందిన రఘుపతి వెంకయ్య ఫోటో(గ్రఫీపట్టగల మక్కువతో ఆ విద్యలో ప్రావీణ్యం సంపాదించి, సినిమా గూర్చి తెలుసుకొని, 1908 ప్రాంతంలో విదేశాల నుంచి క్రోనో మెగాఫోన్ తెప్పించుకొని మద్రాసులో విక్టోరియా పబ్లిక్ వాలులో మూడునాలుగువందల అడుగుల నిడివిగల హ్రస్వ చిత్రాలను ప్రదర్శిస్తూ ఆ మూకీ చిత్రనిడివితో సౌండ్ రికార్డెడ్ డిస్క్‌ను ఆపరేట్ చేయగా ఆ అద్భుతాన్ని (ప్రేక్షకులు వేనోళ్ళ ప్రశంసించారు. ఈయనే మద్రాసులో మొదటి సినిమా (ప్రదర్శనశాల 'గెయిటీ' ధియేటర్ను 1912లో నిర్మించారు. దరిమిలా మింట్ 'ఫ్టీట్లో క్రౌన్ ధియేటర్, పరశువాకంలో గ్లోబ్ (ఇప్పుడు రాక్స్రీ థియేటర్ నిర్మించారు. వారి అబ్బాయి ఆర్. ఎస్. ్రకాశ్కు యీ రంగంపట్లగల ఆసక్తిని గమనించి సాంకేతికపరిజ్ఞానం కోసం విదేశాలకు పంపారు. ప్రకాశ్ ఇటలీ, జర్మనీ, అమెరికా పర్యటించి, 'టెన్కమాండ్మెంట్స్' నిర్మించిన సిసిల్: బి. డిమెల్లి వద్ద కూడా పనిచేసి, సినీ నిర్మాణ విధానాన్ని అధ్యయనం చేసి 'విలియంసన్ అనే కెమెరాతో సహా భారతదేశానికి తిరిగి వచ్చారు. తండ్రి వెంకయ్య గారు ఆనందంతో కొడుకు (ప్రకాశ్ దర్శకత్వంలో 'భీష్మ ప్రతిజ్ఞ (1921) మూకీ చిత్రాన్ని స్టార్ ఆఫ్ యీస్ట్ ఫిలింస్
13
పతాకంపై నిర్మించారు. మూక్రీలకు భాషలేకపోయినా ఒక మూకీ చిత్రాన్ని నిర్మించిన తొలి తెలుగునిర్మాతగా రఘుపతి వెంకయ్య చిరస్మరణీయుడు. ఆయన గౌరవార్ధం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తెలుగు సినీ రంగానికి విశిష్టసేవ లందించిన వ్యక్తిని ప్రతియేటా 'రఘుపతి వెంకయ్య" అవార్డుతో సత్కరిస్తున్నది.
"భీష్మ ప్రతిజ్ఞ”లో దర్శకుడైన ప్రకాశ్ భీష్మ పాత్ర పోషించారు. ఆ తరువాత (ప్రకాశ్ మత్స్వ్యావతార్, నందనార్, గజేంద్ర మోక్షం వంటి మూకీలను నిర్మించారు. ఆయన వద్ద దర్శకత్వంలో సహాయకులుగా పనిచేసిన వారిలో ముఖ్యులు యరగుడిపాటి వరదా (వై.వి.రావు) రావు, చిత్తజల్దు (సి) పుల్లయ్య. వైవి.రావు గజేంద్రమోక్షంతో నటించారు. సి. పుల్లయ్య బొంబాయి వెళ్ళి తిరిగివచ్చి కాకినాడలో 'భక్త మార్కండేయ" మూకీ చిత్రాన్ని ప్రారంభించి 1925 డిసెంబరులో విడుదల చేశారు. ఒక తెలుగువాడు తెలుగుగడ్డపై నిర్మించిన మూకీ. 'భక్త మార్కండేయ". ఇందులో సి. పుల్లయ్య యమునిగ్యా కాకినాడ రాజరత్నం మార్కండేయుని తల్లిగా, మద్దూరి బుచ్చన్న శా(స్త్రి మృకండ మహర్షిగా నటించారు.
ఈ మూకీ చిత్రాలను ప్రదర్శించేటప్పుడు కథ గమనానికి తగ్గట్టు మంచికంరం గల వ్యాఖ్యాత సన్నివేశానికి అనుగుణంగా కామెంటరీ చెప్పేవారు. అది సందర్భశుద్ది కలిగి, హాస్యస్పోరకంగా వుండటం చేత ప్రేక్షకులు ఆనందించేవారు. ఈ తరహా వ్యాఖ్యాతలుగా కస్తూరి శివరావు, కాళ్ళకూరి సదాశివరావు (తర్వాత యిద్దరూ నటులైనారు) పి. కొండలరావు, దంగేటి నర్శింహరావు, కె. హనుమంతరావు (ప్రసిద్దులు.
1991వ సంవత్సరం యావత్ భారతదేశ చలనచిత్ర చరిత్ర సువర్ధాక్షరాలతో లిఖింపవలసిన సంవత్సరం.
1886లో జన్మించిన అర్టేషిగ్మార్వన్ ఇరానీ సినిమా టెక్నిక్పట్ట అవగాహన పెంచుకొని, 1926లో ఇంపీరియల్ స్టూడియో స్టాపించి, విల్ఫోర్డ్ డెమింగ్ అనే విదేశీ సౌండ్టెల్నీషీయన్ సహాయంతో మొట్టమొదట టాకీ చిత్రం 'అలం ఆరా'ను 1931లో హిందీలో నిర్మించి విడుదల చేశారు. దాంతో భారతదేశంలో సినిమా టాకీ యుగం ప్రారంభమైంది.
1892లో బెంగుళూరులో పుట్టి విద్యాభ్యాసం చేసి పోలీసు డిపార్టుమెంటులో
పని చేస్తున్న హనుమంత మునియప్ప రెడ్డి (హెచ్, యం. రెడ్డి) ఉద్యోగానికి రాజీనామూ చేసి, సినిమా కళ పట్ల గల ఉత్సాహంతో తన బావమరిది హెచ్. వి. బాబుతో కలసి బొంబాయిచేరి బి. పి. మిశ్రా వద్ద సహాయకునిగా పనిచేసి, తరువాత అర్లెషిర్ ఇరానీ వద్ద చేరి 1931లోనే తొలి తెలుగు టాకీ 'భక్ర ప్రహ్హాదికు తొలి తమిళ టాకీ "కాళిదాసు*కు దర్శకత్వం వహించారు.
[4
టాకీ పులిగా హెచ్.యం. రెడ్డిని ప్రశంసించారు. సురభి కంపెనీవారు ప్రదర్శించిన ప్రజాదరణ పొందిన నాటకాన్ని “భక్త (ప్రహ్హాద” గా రూపొందించారు. దీనికి సంగీతాన్ని హెన్. ఆర్. పద్మనాభశాస్తి సమకూర్చగా, హిరణ్యకశిపునిగా మునిపల్లి సుబ్బయ్య, లీలావతిగా సురభి కమలాభాయి నటించగా ఎల్. వి. (ప్రసాద్ చండామార్కులవారి శిష్యునిపొత్ర పోషించారు.
తెలుగు టాకీ శైశవ దళలో (1931-40) పౌరాణిక, చారిత్రాత్మక ప్రాధాన్యత గల 60 చిత్రాలు విడుదల కాగా కేవలం 15 సాంఘిక చిత్రాలు మాత్రమే నిర్మించారు. ఆ రోజుల్లో ప్రజల్టో ప్రచారం పొందిన పౌరాణిక నాటకాల్ని వీలయినంత వరకు ఆ నాటక టీం సభ్యులతోనే సినిమాలు తీశారు. సినిమా లాభదాయక వ్యాపారంగా కనిపించటంతో ఒకే కధా వస్తువును రెండు కంపెనీలు పోటీపడి నిర్మించిన సందర్భాలు కూడా వున్నాయి. (సావిత్రి, రామదాసు, ద్రౌపదీ వస్త్రాపహరణం) ఆ బాల్యదళలో వచ్చిన చిత్రాలలో ఎన్నదగిన కొన్నిటి వివరాలను పరిశీలిద్దాం:
నాటి బెజవాడలో తొలి సినిమా ప్రదర్శన శాల “మారుతీ టాకీసు" నిర్మించిన పోతిన శ్రీనివాసరావు సరస్వతీ మూవీ పతాకంపై 'పృద్వీపుత్ర' (1933) నిర్మించాడు. ఇందులో కళ్యాణం రఘురామయ్య (ఈలపాట) కధానాయకుడు కాగా, పారుపల్లి సత్యనారాయణ, సురభి కమలాభాయి ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగువారి పెట్టుబడితో నిర్మించబడిన తొలితెలుగుటాకీగా దీనిని పరిగణించారు.
1933లో ఈస్టిండియా కంపెనీ వారు సి. పుల్లయ్య దర్శకత్వంలో “సావిత్రి” నిర్మించగా బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచన చేశారు. యముని పాత్రలో వేమూరి గగ్గయ్య పాడిన పాట “పోబేల పొమ్మికన్” ప్రాచుర్యం పొందింది.
1934లో ఈస్టిండియా వారే సి. పుల్లయ్య దర్శకత్వంలో 'లవకుశ' నిర్మించారు. విజయవంతమైన ఆ చిత్రానికి బలిజేపల్లి రచన చేయగా ప్రభల సత్యనారాయణ సంగీతాన్ని అందించారు. ఇందులో పారుపల్లి సుబ్బారావు శ్రీరామునిగా, సీనియర్ శ్రీరంజని సీతగా నటించారు. (ఇదే కధను పుల్లయ్య గారే 1963లో యన్.టి.ఆర్., అంజలితో రంగులలో తీసి ఘనవిజయం సాధించటం విశేషం.)
బందరుకు చెందిన పి. వి. దాసు మద్రాసు వెళ్ళి వేల్ పికర్స్ పతాకంపై చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో "సీతాకళ్యాణం” నిర్మించారు. తొలిసారిగా యీ చిత్రంలో కొంత భాగం అవుట్‌డోర్‌లో తీశారు. వాహినీ స్టూడియో రూపకర్తల్లో చెప్పుకోదగిన కమెరామెన్ కె. రామనాధ్, కళాదర్శకుడు. ఎ. కె. శేఖర్ యీ చిత్రానికి పనిచేశారు. గాలి పెంచల నరసింహారావు సంగీతం అందించారు.
15
ఇదే టీంతో 1935లో నిర్మించబడిన 'కృష్ణలీలలు' చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు యన్. రాజేశ్చరరావు కృష్ణుని పాత్ర పోషించగా, కంసునిగా నటించిన వేమూరి గగ్గయ్య పాడిన 'ధిక్కారమును 'సైతునా" అన్న పాట నటనకు మంచి గుర్తింపు లభించింది. యస్. వరలక్ష్మి బాలనటిగా పరిచయమైన సినిమా 'బాలయోగిని (1936). దీనికి కెమెరామెన్ కమల్ ఘోష్ ఇదే సంవత్సరం రాజమండ్రికి చెందిన కృత్తివెంటి నాగేశ్చరరావు ఇండియన్ అర్డ్స్ సినీటోన్ పతాకంపై తొలి తెలుగు సాంఘిక చిత్రం “ప్రేమ విజయం” నిర్మించారు. ఇందులో కధానాయకుడు ప్రభల కృష్ణమూర్తి. ప్రముఖ గాయని ఆర్ బాలసరస్వతి దేవి గంగ పాత్రలో నటించిన చిత్రం 'అనసూయ' (దర్శకులు సి. పుల్లయ్య) కూడా 1936లోనే విడుదలైంది. ఇదే సంవత్సరం నిడమర్తి సోదరులు దుర్గ సినీటోన్ పేరిట పుష్పవల్లి నాయకిగా “సంపూర్ణ రామాయణం” తీశారు. 1936లో చెప్పుకోదగ్గ సంఘటనలలో ముఖ్యమైనది లక్ష్మీ ఫిలింస్ పతాకంపై యస్. జగన్నాథ్ ధర్భకత్వంలో “ద్రౌపదిమాన సంరక్షణ” తీయగా రంగస్థల నటుడు బళ్ళారి రాఘన దుర్యోధనుడు పాత్ర పోషించారు. ఈ చిత్రం పరాజయం పొందగా యిదే కధను సరస్వతీ టాకీస్ హెచ్, వ. బాబు దర్శకత్వంలో “ద్రౌపది వస్త్రాపహరణం” తీయగా యిందులో రంగస్టలనటుడు యడవల్లి సూర్యనారాయణ (దుర్యోధనుడు) సి. యస్, ఆర్. అంజనేయులు (శ్రీకృష్ణు, కన్నాంబ (ద్రౌపది) తమ నటనతో చిత్ర విజయానికి కారకులయ్యారు. దీనికి బి. నరసింహారావు సంగీతం సమకూర్చారు. పారుపల్లి శేషయ్య, కె. సుబ్బారావు, గూడవల్లి రామబ్రహ్మం యీ చిత్ర నిర్మాణంలో భాగస్తులు, ఈ దశాబ్దపు చివరి మూడు సంవత్సరాలు 1938, 39, 40 సాంఘిక చిత్ర విప్లవం ద్వారా ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. మద్యపాన వ్యసనాన్ని నిరసిస్తూ నాగయ్యను కథనాయకునిగా పరిచయం చేస్తూ గౌరిపతిశాస్త, కన్నాంబ, , కాంచనమాల ముఖ్యపాత్రల్లో రోహిణి పిక్చర్స్ హెచ్. యం. రెడ్డి నిర్మించిన 'గృహలక్ష్మి' చిత్రం సంచలనాన్ని సృష్టించింది. (1938) దీనికి సముద్రాల సాహిత్యం, ప్రభల సత్యనారాయణ సంగీతం, కె, రామనాధ్ ఫోటోగ్రఫీ సమకూర్చారు. నాగయ్య పాడిన కల్లు మానండోయ్ బాబూ కళ్ళు తెరవండోయ్' 'లెండు భారతవీరుల్లారా' సాటలు పాపులర్ అయ్యాయి. ఇదే సంవత్సరం సారధీ పతాకంపై గూడవల్లి రామబ్రహ్మం అందించిన 16
“మాలపిల్ల చిత్రం మరింత సంచలనాన్ని సృష్టించింది. మాలపిల్ల (కాంచనమాల) (బ్రాహ్మణ యువకుడు (గాలి వెంకటేశ్చరరావు) యిద్దరూ 'ప్రేమించుకోవటం, అందుకు పెద్దలు (గోవిందరాజుల సుబ్బారావు) సుందరరామ శాస్తి నుంచి ప్రతిబంధకం, దానిని (ప్రేమికులు అధిగమించటం చిత్రకధ. సనాతన భావంతో సంఘ సంస్కరణకు సినిమా బాగా ఉపయోగపడుతుందన్న రామబ్రహ్మంగారి వాదనకు బలాన్ని చేకూర్చిన యీ చిత్రానికి రచన గుడిపాటి వెంకట చలం, తాపీ ధర్మారావు చేయగా బసవరాజు అప్పారావు గీతాలకు బి.యన్.ఆర్ (బి. నరసింహారావు) అపురూపమైన బాణీలు అందించారు. 'నల్లవాడే గొల్లపిల్లవాడే' హిట్సాంగ్. ఈ చిత్రానికి ఛాయా(గ్రహకులు 'సైలేన్బోస్.
జగదీష్ పతాకంపై తాను కధానాయకుడుగా నటిస్తూ వై.వి.రావు దర్శకత్వంలో రూపొందిన రెండు చిత్రాలు 'మళ్ళీ పెళ్ళి” (1939) “విశ్చమోహిని” (1940) ఆయనలోని ప్రగతిశీల భావాలను ప్రతిబింబించాయి.
1939లో 'జయటప్రద' చిత్రం ద్వారా సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకునిగా పరిచయమయ్యాడు.
ఇదే సంవత్సరం సారథీ పతాకంపై గూడవల్లి రామబ్రహ్మం అందించిన “రైతుబిడ్డ” జమీందారీ వర్గాల్లో వ్యతిరేకత కన్పించినా ప్రేక్షకుల విశేషాదరణకు నోచుకొంది. సముద్రాల తాపీ ధర్మారావు రచన చేయగా, బి.యన్.ఆర్. సంగీతాన్ని అందించారు. కొసరాజు రాఘవయ్య చౌదరి గీతాల్ని (వ్రాయటమే గాక ఓ భూమికను పోషించారు. బళ్ళారి రాఘవ, గిడుగు సీతాపతి, టంగుటూరి సూర్యకుమారి, ఎస్. వరలక్ష్మి ముఖ్య పాత్రలు పోషించారు.
1939లో పి. పుల్లయ్య దర్శకత్వంలో శాంతకుమారి, సియస్.ఆర్. కాంబినేషన్లో రూపొందించిన 'శ్రీవెంకటేశ్సర మాహాత్మం' విజయం సాధించింది. దువ్వూరి రామిరెడ్డి, బుచ్చన్న శాస్త్రి రచన చేయగా, ఆకుల నరసింహారావు, బి. కుమారస్వామి సంగీతం అందించారు. (ఇదే కధను 1960లో పుల్లయ్యగారే స్వీయదర్శకత్వంలో యన్.టి.ఆర్. సావిత్రి, యస్. వరలక్ష్మిలతో అదే పేరుతో నిర్మించగా దాన్నికూడా ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు.)
మరాఠీ దర్శకుడు (సుందరరావు నడకల్షి, కన్నడ సంగీత దర్శకుడు (ఆర్: సుదర్శనం) కన్నడ నటుడు (ఆర్. నాగేంద్రరావు) తో రూపొందిన తెలుగు చిత్రం “భూకైలాస్” (1940), మూవీ దర్శకుడైన ఆర్.ఎస్. ప్రకాష్ కన్నాంబ (ప్రధాన పాత్రలో నిర్మించిన చిత్రం 'చండికి, దీనికి కొప్పరపు సుబ్బారావు సంగీతం సమకూర్చారు.
17
చక్రపాణి, దైతాగోపాలం రచన చేసిన చిత్రం 'ధర్మపళ్లి' (1940) కి పి. పుల్లయ్య దర్శకులు. (ప్రధానపాదత్రధారిణి శాంతకువూరి.
1940లో వాహినీ పతాకంపై బి.యన్రెడ్డి అందించిన చిత్రం 'సుమంగళి'లో ప్రధానపాత్రల్నీ నాగయ్య, గిరి, కుమారి, లింగమూర్తి మాలతి, దొరస్వామి పోషించారు. సాహిత్యాన్ని సముద్రాల, సంగీతాన్ని నాగయ్య, కమెరా కె. రామనాధ్, ఆర్ట్ ఎ.కె. శేఖర్ నిర్వహించారు. అయితే 1939లో వై.వి. రావు తీసిన 'మళ్ళీపెళ్ళి ఛాయలు కథాపరంగా యిందులో కన్పించాయనే విమర్శ ఆరోజుల్లో వచ్చింది.
ఈ దశకంలోనే (1931-40) దర్శకులుగా కాళ్లకూరి సదాశివరావు (చింతామణి), కొచ్చర్లకోట రంగారావు (అహల్య), చిత్రపు నారాయణమూర్తి (మార్కండేయ), (బ్రోణంరాజు చినకామేశ్వరరావు (మహానంద), ఆమంచర్ల గోపాలరావు (కాలచక్రం), బ.యన్.ఆల్. (మీరాబాయి), హిరేన్బోన్ (భక్రజయదేవ), నిడుముక్కల (పాశుపతాస్త్రం), వై. భద్రరావు (పాండురంగ విరల్) పనిచేయగా, నటులుగా యింతకు ముందు పేర్కొన్న వారే గొక కురుమద్దాల రామచం(ద్రారావు (కుచేల), బుషేంద్రమణి (శ్రీకృష్ణడులాభారం), జి.యన్.స్వామి (మార్కండేయ), రెండు చింతాల సత్యనారాయణ (భక్త జయదేవ), కస్తూరి శివరావు (వరవిక్రయం), బందా, లక్ష్మీరాజ్యం (కాలచక్రం), లంక సత్యం, జి. వరలక్ష్మి (బారిస్టర్ పార్వతీశం), ఉమామహేశ్వరరావు (ఇల్లాలు), సి.హెచ్. నారాయణరావు, కృష్ణవేణి (జీవనజ్యోతి), మిస్. చలం. జి.వి. సుబ్బారావు (మీరాబాయి) వెలుగొందారు.
తదుపరి చరిత్రను (1941-99) చలనచిత్ర పరిశ్రమలోని వివిధ రంగాలలో తమ (ప్రతిభను ప్రదర్శించిన వారి వివరాలను ఆయా ్రకరణాల్లో తెలుసుకొందాం.
త్ల గ మము.
- “లక్షలాది మందిచే నేను (పేమించబడ్డాను, అయితే నాకు ఆత్హీయుడైన స్టేపాతుడు ఎవరూ లేరు. ఎందుకో నాక్షు- నేను ఎప్పుడు ఒంటరిని అనే భావమే త్పత్తీనిస్తుంది” = చార్లీచాప్టిన్ |
18
న ఖు వ | క్. షక వ జ్.
నా? చ్ న. మ్ న
న. (21 ంటకరి [0.400000 టటం40 5౮96
“_.;. _ విర్మాతలు య. నాగ్ గలిగి 2గగ 3% న. న క్. (చల్. న. త య న. నె . న్ షస్లుని [క మా? వాగు] (న! మ ్టై ణో. ట్ వ వ. న [| స వ
కనే. న. ర స. శి మ ననా జ. సీ " 00. మ వీ య. స్ట న మ ర
శం
హై గ మ యం?” చీ తు నేను” స్త టం మ నం. న న మ మడు స్టే పంపన శ ” మం లి క మను " ల్ . చి క చ్ ప న్న 7 మ గా ర్ శ ఇ య నం షా 'సషైాయ్యల మ. టీ న స క న | ॥ | ర్న ల ర స్ట! గ. క లీ లం శ (| ట్య త్న్ (| లి! "జ వోట్తీగ శః ఈ ంం0ట6గక లలి. గస త టి 2000. ల! హలీ! ల క ర కండోం. టి తం. యునచిత్రు సా ఫే వ అత్య దక? న. గ ్ట్ స స టా గ్ న! న శే ల్ న్ న “గ మహరట గ ల (గః ా పు బ్ + తో? శ్ సవా హు ళల జ్ ాం ప్ర లై ర ఆలే ల బ్ లా! [్న షక; గ పో ళ్ [7 (నో 11:1 1 ఇరాాం క: క ఫలే స్తే 1" 1 10,” క్ష ల! ని . న్ శ | లని ళా ని సవ” గ! /| * ల స న. లే! మహ న. స్ట్ 1న 2 నాలా వ 5 ఏ యిం త... క.” సమఘుూళ్ళ్య్యు మ కు (ళా గ్గ నా వం. న షు ళం" త న నటనల ననన. లం, నీ. మం ట్ర్... న స నం సున గా హ్ క న. గయల నా చ్ మం వయా నా ్ ్ర క స క వెల 1 చు స్ట హ్, క? న! స ని నై ల మ నం నటు 1! వ, మ చలన
నిర్మాతలు - నిర్మాణ సంస్థలు
దౌొజవంశాలు, రాజులు, జెండాపై కపిరాజు వంటి కేతన చిహ్నంతో వారు సాధించిన జయాపజయాలు యేవిధంగా చరిత్రపుటల్లో నిక్షిప్తమై తరతరాలకు కరదీపీకలౌతాయో, అదే విధంగా తెలుగు చలనచిత్ర చరిత్రకు సంబంధించి నిర్మాణ సంస్థలు, నిర్మాతలు వారు రూపొందించిన చిత్రాల వివరాలను యీ ప్రకరణలో పరిశీలిద్దాం. అయితే గతంలో 'బీనర్వాల్యూ' కు ఎంతో ప్రాధాన్యత వుండేది. (ఉదా:- కపి కేతనంతో శబ్దాలతో కూడిన విజయ, ఒక యోధుడు ఢంకా (మోగించే సి.ఏ.పి., ఇద్దరు బాలలు బాకా ఊదే జెమిని, ఇద్దరు బాలికలు ఒప్పులకుప్ప తిరిగే బి.ఏ.ఎస్.) ఫలానా కంపెనీ తీసిన సినిమా అంటే ప్రేక్షకులు ఎదురుచూసేవారు. దానికి కారణం వారు వ్యాపారంతోపాటు సామాజిక విలువలకు కళాత్మక అంశాలకు 'ప్రాధాన్యతయిచ్చి ఆ క్రమంలో పోటీ దృక్పథంతో చిత్రాలు నిర్మించేవారు. రాను రాను వ్యాపారధోరణికి ప్రాధాన్యత పెరిగి చిత్ర నిర్మాణం కొత్తపుంతలు త్రొక్కటంతో ఇద్దరుకలిసి ఒక సినిమా తీస్తే తరువాత ఆ యిద్దరు విడిపోయి విడిగా మరికొందరితో, ఆ మరికొందరు యింకొందరితో కలిపి చిత్ర నిర్మాణం సాగించటం వలన- వ్యాపారం, టాక్సుపరమైన యిబ్బందుల్ని అధిగమించటానికి బేనర్ పేరు మార్చటంవంటి పరిణమాలు చోటు చేసుకొన్నాయి.
ఈ నేపద్యంలో తెలుగు కీర్తి పతాకను ఎగురవేసి కళాత్మకంగా, ఆర్థికంగా మంచి ఫలితాలు సాధించిన నిర్మాణ సంస్థలను ముందుగా ప్రస్తావించి, ఆ తరువాత-తమకు తోచిన రీతిలో సినిమాలు నిర్మించి, మేము కూడా చిత్ర పరిశ్రమ మనుగడకి మా వంతు కృషి చేశాం అన్న సంస్థల వివరాలను అవలోకిద్దాం; టాకీల తాలిదశకంలోని సంస్థల వివరాలను మొదటి (ప్రకరణంలో పరిశీలించాం. ఇప్పుడు నిర్మాణ సంస్థలను గూర్చి ఇంగ్లీషు అక్షరక్రమంలో చూద్దాం.
తెలుగు సినిమాటాకీ రెండవ దశకంలో నాయికా నాయకులుగా పరిచయమైన అంజలీదేవి - అక్కినేని నాగేశ్చరరావు సంయుక్తంగా అశ్వనీ పిక్చర్స్ పతాకంపై 'మాయలమారి' (1951) చిత్రాన్ని అందించారు.
తరువాత నటి అంజలిదేవి భర్త సంగీతదర్శకుడు, సి. ఆదినారాయణరావు నిర్మాతగా అంజలీ పిక్చర్స్ పేరిట తాలి ప్రయత్నంగా యల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో. పరదేశి (1953) చిత్రాన్ని నిర్మించారు. ఇందులో స్లోమోషన్ డాన్సు ఓ ప్రత్యేకత. చక్కని సంగీత భరిత చిత్రాలకు పెట్టిందిపేరు అంజలీ పిక్చర్స్. అనార్కలీ మంచిపేరు తేగా, సువర్షసుందరి మూడు. భాషల్లో (తెలుగు, తమిళ హిందీ) ఘనవిజయం
21
సాధించింది. హిందీలో నిర్మించిన పూలోరికి "సెజ్ పరాజయం పొందింది. తరువాత వారి చిరంజీవులు చిన్నిబ్రదర్స్ పేరిట కొన్ని చిత్రాలు (కుంకుమభరిణ) తరువాత అంజలీ పిక్చర్స్ పేరిట 'భక్త తుకారాం", మహాకవి క్షేత్రయ్య చిత్రాలను అందించారు.
అక్కినేని నాగేశ్చరరావు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్‌గా, దుక్కిపాటి మధుసూదనరాపు నిర్మాతగా, కాట్రగడ్డ శ్రీనివాసరావు. టి. వి. ఏ. సూర్యారావు, కొరటాల ప్రకాశరావు డైరెక్టర్లుగా అన్నవూర్ల పిక్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి తాలిప్రయత్నంగా 'దొంగరాముడు' (1955) నిర్మించారు. ఆ తరువాత శరత్నవల 'నిష్కృతి' తోడికోడళ్ళు” గా బెంగాలీ చిత్రం 'అన్నిపరీక్షను 'మాంగల్యబలం'గా బెంగాళీ చిత్రం తాషేర్ఘరోను “ఇద్దరు మిత్రులుగా నిర్మించారు. ఇది కథానాయకుని పరంగా తెలుగులో తొలి ద్విపాత్రాభినయ చిత్రం. ఈ సంస్థ ద్వారా పలువురు రచయితలు (గొల్లపూడి, భమిడిపాటి, కొర్రపాటి, దాశరధి), నృత్య దర్శకురాలు సుమలీ కౌశల్ గాయకులు కె. బి. కె. మోహన్‌రాజ్, ఆశాలత కులకర్షి మరెందరో రంగస్థల నటులు పరిచయమయ్యారు. హైద్రాబాద్‌లో సారధీలో 'చదువుకున్న అమ్మాయిలు” నిర్మించారు. 'ఆంధ్రప్రభి నవల పోటీల్లో బహుమతి పొందిన కోడూరి కౌసల్యాదేవి నవల 'చక్రభ్రమణం'ను “డాక్టర్ చక్రవర్తిగా రూపొందించారు. కె. విశ్చనాథ్ను దర్శకునిగా పరిచయం చేస్తూ 'ఆత్మగారవం' నిర్మించారు. బేనర్ వాల్యూ గల చిత్రాలను నిర్మించిన సంస్థ 'అన్నపూర్ష+
ఆ తరువాత దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ పేరిట (అమాయకురాలు) అన్నపూర్ణ కళానికేతన్ పేరుతో (రాధాకృష్ణ, ప్రేమలేఖలు) చిత్రాలు నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం జరిగాక అక్కినేని వెంకట్ 'కళ్యాణి' తో మొదలెట్టి చిత్ర నిర్మాణం కొనసాగించారు. ఆ పతాకంపైన వచ్చిన వాటిల్లో సంచలనం సృష్టించిన చిత్రాలు (ప్రేమాభిషేకం, “శివ, తరువాత అక్కినేని నాగార్జున నిర్మాతగా గ్రేట్ యిండియా ఎంటర్టెయిన్మెంట్ పేరుతో చిత్ర నిర్మాణం (నిన్నే పెళ్ళాడుతా) కొనసాగిస్తున్నారు.
ప్రఖ్యాత నిర్మాత, దర్శకుడు యల్. వి. ప్రసాద్ మేనల్లుడు కె. బి. తిలక్ ఎడిటింగ్ శాఖలో, సారధిలో, ప్రావీణ్యం సంపాదించి అనుపమ పిక్చర్స్ స్థాపించి స్వీయ దర్శకత్వంలో తాలి ప్రయత్నంగా శరత్ నవల 'బిందుగారబ్బాయి'ని 'ముద్దు బిడ్డగా నిర్మించారు. ఆ తరువాత “ఎం.ఎల్.ఏ. 'అత్తా ఒకింటి కొడలే*, ఈడు జోడు ఉయ్యాల-జంపాల' వంటి చిత్రాలు అందించారు. కమనీయమైన సంగీత సాహిత్యాలు ఆరుద్ర-పెండ్యాల కాంబినేషన్లో వీరు నిర్మించిన పైచిత్రాలలో అలరించాయి. వీరి చిత్రాల్లో ఎక్కువగా 'జగ్గయ్య' కధానాయకుడు. రమణమూర్తిని
22
“ఎం.ఎల్.ఏ.” లో పరిచయం చేశారు. అభిరుచిగల నిర్మాత కె. క్రాంతికుమార్ అన్నపూర్ణ సినీ ఎంటర్ పైజస్ పతాకంపై శారద, కల్పన, ఊర్వశి వంటి చిత్రాలను తరువాత శ్రీక్రాంతి చిత్రపతాకంపై కొన్ని చిత్రాలను నిర్మించారు. ఈయన నిర్మించిన చిత్రాల్లో అత్యంత (ప్రశంసలు పొందినవి సర్దార్ పాపారాయుడు, స్వాతి.
మీర్జాపురం రాజావారి శోభనాచల కంపెనీలో ఎక్కొంటెంటుగా వుంటూ నిర్మాణ వ్యవహారాలు చూసిన బి, ఏ. సుబ్బారావు “బి.ఏ.యస్” పతాకంపై తొలిసారిగా ఇద్దరు హీరోలు (అక్కినేని-ఎన్.టి.ఆర్) కాంబినేషన్లో పెజారో' నవల ఆధారంగా 'పల్లెటూరి పిల్లి నిర్మించారు. అదే పతాకంపై మార్క్ట్రైన్ రచన ఆధారంగా “రాజు-పేద”లో యన్,టి,ఆర్ డీగ్గామర్ పాత్ర సహజంగా నటించగా, ముసలిరాజుగా యస్.వి.రంగారావు, బాలనటుడు సుధాకర్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ పతాకంపై నిర్మించిన మిగతా చిత్రాల్లో చెప్పుకోదగ్గవి. చెంచులక్ష్మి, భీష్మ. భిష్మ పాత్ర యన్.టి.ఆర్కు మంచి పేరును తేగా, ఆ చిత్రంలో రంగస్థల నటుడు ధూళిపాళ చేత సుయోధనుని పాత్ర ధరింపచేశారు.
టాకీ మొదటి దశకం చివరంలో (1939 - వర విక్రయం) కధనాయికగా ప్రవేశించిన భానుమతి కృష్ణప్రేమలో నాయికగా నటించటం ఆ చిత్ర సహాయదర్శకుడు పీ. యస్, రామకృష్ణ రావును పెళ్ళాడటం వారిద్దరికీ పుట్టిన అబ్బాయి-భరణీ పేరుతో నిర్మాణసంస్థను స్థాపించి, స్టూడియో నిర్మించి, రత్నమాల (1947)తో ప్రారంభించి అణిముత్యాలవంటి లైలా మజ్ను, విప్రనారాయణ, బాటసారి చిత్రాల్ని అందించారు. భానుమతి స్వీయదర్శకత్వంలో “చండీరాణి మూడు. భాషల్లో నిర్మించటమేగాక ద్విపాత్రాభినయం చేసి సంగీత దర్శకత్వం వహించి సంచలనం సృష్టించారు. విలువైన చిత్రాలతోబాటు వినోదాన్నందించిన చక్రపాణి, వరుడు కావాలి కూడా నిర్మించారు. వీరుకూడా సంగీత, సాహిత్యాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు.
నిర్మాత సి. సుందరం బాబూ మూవీస్ పేరుతో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ('ప్రధమ ప్రయత్నంగా 'మంచి మనసులు” నిర్మించి, ఆ విజయంతో తెలుగు వారు మర్చిపోలేని, నూటికి నూరుపాళ్ళు తెలుగుదనం వుట్టిపడే అద్భుత దృశ్యకావ్యం. 'మూగ మనసులు అందించారు. ఆ తరువాత కృష్ణు రామమోహన్, సుకన్య, సంధ్యారాణి తదితరులను తెరకు పరిచయం చేస్తూ రంగంలలో “తేనెమనసులు* అందించారు.
కె. భాస్కరరావు “భాస్కర్ పిక్చర్స్” పేరిట నిర్మించిన చిత్రాల్జో చెప్పుకోదగ్గది కథాబలం వున్న *బ్రతుకు తెరువు." దీనిని ఎల్. వి. ప్రసాద్ హిందీలో 'జీనేకి
23
రావ్'గా నిర్మించి విజయం సాధించారు. ఈ కథను ఆధునీకరించి “భార్యా బిడ్డలు” (పి.ఏ.పి. వారు) నిర్మించారు.
దర్శకులు కె, ఎస్. ప్రకాశరావు వద్ద దర్శకత్వంలో పనిచేసి తరువాత క్రియేటివ్ కమ్మర్షియల్స్ పేరిట రేడియో పబ్లిసిటీ సంస్థను విజయవంతంగా నిర్వహించిన కుదరవల్లి శ్రీరామారావు (3. ఎస్. రామారావు) క్రియేటివ్ కమ్మర్షియల్స్ పేరిట ముందుగా కొన్ని అనువాద చిత్రాల్ని నిర్మించి, తరువాత చిరంజీవి-ఇళయరాజా- కోదండరామిరెడ్డియండమూరి వీరేంద్రనాథ్ కాంబినేషన్లో అభిలాష ఛాలెంజి, రాక్షసుడు చిత్రాల్ని, వెంకటేష్-రవిరాజా కాంబినేషన్లో సూపర్హేట్ చిత్రం “చంటి ని, అవార్డు విన్నర్ 'మాతృదేవోభవ' (అజయ్‌కుమార్ అందించారు.
ఆదుర్తి - అక్కినేని నిర్మాతలుగా చక్రవర్తి చిత్ర పతాకంపై “సుడిగుండాలు” మరో ప్రపంచం" ప్రయోజనాత్మక చిత్రాలు నిర్మించినా, అవి ఆర్థికంగా విజయం సాధించలేకపోయాయి.
చలనచిత్ర పరిశ్రమలో అనేక పదవులు సమర్ధవంతంగా నిర్వహించిన పెద్దలు డ. వి, యస్. రాజు మొదటగా ప్రగతి ఆర్ట్స్‌లో భాగస్వామిగా వుంటూ 'మా బాబు' నిర్మించినా స్వయంగా డి. వి. యన్. ప్రొడక్షన్స్ స్థాపించి, “మంగమ్మ శపథం"”తో మొదలుపెట్టి కొన్ని విజయవంతమైన జానపదచిత్రాల్ని (పిడుగురాముడు, గండికోటరహస్యం) మరికొన్ని సాంఘిక చిత్రాల్ని నిర్మించారు కె, విశ్చనాథ్ దర్శకత్వంలో రూపొందించిన “జీవనజ్యోతి” మంచి ఫలితాన్ని యిచ్చింది.
మొదటి దశకంలో రెండు మూడు చిత్రాల్ని నిర్మించిన ఈస్టిండియా కంపెనీ నిర్మించిన హాస్యరసభరిత చిత్రం, రేలంగి కథనాయకుడుగా నటించిన పక్కింటి అమ్మాయి.' ఇందులో నాయిక అంజలిదేవి కాగా గాస్లాడ్డి సభ్యులుగా సి.యస్.రావు (దర్శకుడు), ఎ.ఎమ్.రాజా (గాయకుడు) మొ॥వారు, సంగీతం టీచరుగా అడ్డాల నారాయణరావు చక్కని హాస్యం అందించారు.
ఈతరం ఫిలింస్ పతకంపై నిర్మాత పోకూరి బాబూరావు నిర్మించిన అన్ని చిత్రాల్లోను సామాజిక స్పృహ తాంగిచూస్తుంది. నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, రేపటిపౌరులు, ఎర్రమందారం - యే చిత్రం ప్రత్యేకత దానిదే.
నిర్మాత యన్. రామబ్రహ్మం, గౌతమి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రాలలో చిరకాలం చెప్పుకోదగిన చారిత్రాత్మక చిత్రం “మహామంత్రి తిమ్మరుసు.”
నటుడు కృష్ణంరాజు సోదరుడు యు. సూర్యనారాయణరాజు నిర్మాతగా గోపీకృష్ణా
24
పతాకంపై అమరదీపం, కృష్ణవేణి, భక్త కన్నప్ప, బొబ్బిలి (బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు వంటి విభిన్న ఉదాత్త చిత్రాల్ని అందించారు.
'“జగపతో పతాకంపై నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ 'అన్నపూర్ణా తో మొదలుపెట్టి ఆణిముత్యాలు అనదగ్గ చిత్రాల్ని (ఆరాధన, ఆత్మబలం, అంతస్సులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు) అందించారు. మొదటి రెండు చిత్రాలకు రంగారావు కూడా భాగస్వామి. కాగా 'దసరాబుల్లోడు' చిత్రానికి రాజేంద్ర ప్రసాద్ తొలిసారిగా దర్శకత్వం వహించగా ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ కోవలోనే నిర్మించిన చిత్రం బంగారు బాబు. సూపర్హీట్ సాంగ్స్‌కు పెట్టింది పేరు 'జగపతి” తరాలు మారినా 'చిటపటచినుకులి ప్రభావం ప్రేక్షకులపై వుంటూనే వుంది. జగపతి- అన్నపూర్ణ పతాకంపై 'రామకృష్ణులు' నిర్మించారు.
కారెక్టర్ నటుడు గిరిబాబు జయభేరి పతాకంపై దేవతలారా దీవించండి, మాధవీ చిత్ర పతాకంపై సంధ్యారాగం, (భ్రమరాంబికా పతాకంపై డి(స్టిబ్యూటర్' కేశవరావుతో కలసి రణరంగం, జయభేరి ఆర్ట్స్ పతాకంపై ఇంద్రజిత్ చిత్రాలను నిర్మించారు.
నటుడు డాక్టర్ యం. ప్రభాకర్‌రెడ్డి జయనవ్రద పతాకంపై నిర్మించిన చిత్రాల్లో మంచి పేరు తెచ్చిన చిత్రం 'పండంటి కాపురం," ఈ చిత్రానికి ఆయనే కథకుడు.
కధానాయకుడు మురళీమోహన్ ఆయన సోదరుడు డి. కిషోర్ నిర్మాతగా “జయభేరి” పతాకంపై నిర్మించిన చిత్రాలన్నింటిలో యెన్నదగినది 'ఓ తండ్రి తీర్పు" ఆ చిత్రంతో పాటు మురళీమోహన్ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకొన్నారు. మొదట్లో బడ్జెట్లో నిర్మించిన చిత్రాలు వారాలబ్బాయి, పిచ్చిపంతులు కూడా ఆర్థికంగా విజయం సాధించగా, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం 'శావణమేఘాలు.”
సహజకవి మల్లెమాల సుందరరామిరెడ్డి (యం.యన్.రెడ్డి 'కౌముదీ' పతాకంపై ముందుగా కొన్ని అనువాద చిత్రాలు, ఆ తరువాత రామబాణం, భార్య వంటి పలు చిత్రాలు నిర్మించారు. పల్నాటిసింహం, ఏకలవ్య, శ్రీకృష్ణ విజయం చెప్పుకోదగ్గవి. వీరి అబ్బాయి శ్యాంప్రసాద్‌రెడ్డి, యం.యస్.ఆర్ట్ ) పతాకంపై నిర్మించిన చిత్రాల్లో “అంకుశం”, “అమ్మోరు” ఘనవిజయం సాధించాయి. కాగా, రెడ్డిగారు నిర్మించిన రికార్డింగ్ ధియేటర్ 'శబ్దాలయా' పతాకంపై అందరూ బాలలతో నిర్మించిన చిత్రం “రామాయణం'. సుందరం మూవీస్ పేరిట 'దొరలు-దొంగలు నిర్మించారు. శ్రీ రెడ్డిగారు అంకుశంలో ముఖ్యమంత్రి పాత్రలో అత్యంత సహజంగా నటించారు.
25
నిర్మాత వాకాడ అప్పారావు పాలకొల్టులో నాటకాలు (ప్రదర్శించిన లలితకళాంజలి పతాకంపై ఇంటి దొంగ, అత్తమెచ్చిన అల్టుడు నిర్మించారు.
అంతకుముందు సర్యోదయ పతాకంపై 'మానవతి' నిర్మించిన లాయర్ శంకరరెడ్డి లలితా పతాకంపై 'చరణదాసి' లలిత శివజ్యోతి పతాకంపై “లవకుశ చిత్రం సంచలన విజయం సాధించగా అదే పతాకంపై నిర్మించిన 'రహస్యం” పరాజయం పొందింది.
మాధనీ పతాకంపై నిర్మాత ఏ.ఎస్.ఆర్. ఆంజనేయులు నిర్మించిన మహత్తర పౌరాణిక చిత్రం “పాండవ వనవాసం" అఖండ విజయం సాధించింది. పొదత్రలకు తగ్గట్టుగా నటినటుల ఎంపిక జరిగింది. ఆ తరువాత ప్రయత్నంగా నిర్మించిన చిత్రం “బందిపోటు దొంగలు.”
యన్:టి.రామారావు విద్యార్థిగా వున్న రోజుల్టోనే వేషనల్ ఆర్ట్ ధియేటర్స్ పేరిట కొన్ని నాటకాలను ప్రదర్శించేవారు. అదే 'పేరుతో నేషనల్ ఆర్ట్ థియేటర్స్ సంస్థను స్థాపించి, ఆయన సోదరుడు (త్రివిక్రమరావు నిర్మాతగా మొదటి ప్రయత్నంగా పిచ్చి పుల్లయ్య, తరువాత ఎవార్డ్ విన్నర్ 'తోడుదొంగలు' నిర్మించి, మూడవ ప్రయత్నంగా నిర్మించిన 'జయసింహ' చిత్రం ఘనవిజయం సాధించింది.
ఆ తరువాత _నిర్మించవిన రెండు చిత్రాలు పొండురంగ మహాత్మ్యం, సీతారామకళ్యాణం ఆబాలగోపాలన్ని అలరించాయి. తరువాత నిర్మించిన “గులేబకావళి కథ ద్వారా సి. నారాయణరెడ్డిని గీత రచయితగా పరిచయం చేశారు. 'సీతారాముల కళ్యాణం'లో రవికాంత్ నగాయిన్ పోటో(గ్రఫీకి గాలొపెంచల సంగీతానికి రావణునిగా యన్.టి.ఆర్ నటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టరు. ఎన్.టి,ఆర్. ఎస్టేట్ పతాకంపై 'కోడలు దిద్దిన కాపురం” నిర్మించారు.
ఆ తరువాత వారి అబ్బాయి రామకృష్ణ స్మృత్యర్థం రామకృష్ణ ఎన్.టి పతాకంపై “శ్రీ కృష్ణ పొాండవీయం' చిత్రాన్ని నిర్మించారు. రామకృష్ణ పినీ స్టూడియోస్ నిర్మించాక ఆ పతాకంపై దానవీరళూరకర్ణ, చాణక్య చంద్రగుప్త నిర్మించారు. నారి పిల్లలు తరువాత రామకృష్ణ హార్టికల్చరల్ పేరిట పెద్దన్నయ్య వంటి చిత్రాలు అందించారు. సంగీత, సాహిత్యాలకు ఉన్నత సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిచ్చిన సంస్థ యన్.ఏ.టి.
సారథీ వారి చిత్రాలకు, మరికొన్ని యితర చిత్రాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేసిన పర్వతనేని గంగాధరరావు, కొందరు మిత్రులతో కలసి 'నవశక్తి' సంస్థ ఏర్పాటు చేసి సారథీ స్టూడియోలో తొలి చిత్రంగా రామినీడును దర్శకుడిగా
26
పరిచయం చేస్తూ "మాయింటి మహాలక్ష్మి" నిర్మించారు. ఇందులో హరనాఠ్ను పరిచయం చేశారు. ఆ తరువాత ఆ పతాకంపై కొన్ని చిత్రాలు, హైదరాబాద్ మూనీన్ పతాకంపై కొన్ని చిత్రాలు నిర్మించారు. వీరు నిర్మించిన 'కీలుబొమ్మలు' చిత్రానికి విదేశాల్డో (ప్రశంసలు లభించాయి. 'అర్దరాత్రి' చిత్రం ద్వారా పి. సాంబశివరావును దర్శకునిగా పరిచయం చేశారు.
రంగస్పలంపై రామదాసు పాత్ర పోషించిన ఘంటసాల బలరామయ్య (1906- 53) కుబేరా పిక్చర్స్ పేరిట చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో మార్కండేయ, మైరావణ చిత్రాల్ని నిర్మించి. తరువాత ప్రతిభ పిక్చర్స్ స్టాపించి 1941లో స్వీయ దర్శకత్వంలో పార్వతీకళ్యాణం నిర్మించారు. ఆతరువాత తీసిన గరుడగర్వభంగంలో వేదాంతం రాఘవయ్య నటించారు. 'సీతారామ జననం” చిత్రం ద్వారా అక్కినేని నాగేశ్చరరావును కథవాయకుడు శ్రీరాముని పాత్రలో సినీరంగానికి పరిచయం చేశారు. అద్భుతమైన జానపదచి(త్రాల్ని (బాలరాజు, స్వప్నసుందరి, స్వీయ దర్శకత్వంలో నిర్మించి, రేచుక్క (దర్శకులు పి. పుల్లయ్య) తీస్తుండగా కీర్తశేషులయ్యారు. వారి అబ్బాయి. కృష్ణమూర్తి నాగభూషణం కథానాయకునిగా నిర్మించిన “ఏది నిజం” చిత్రానికి కేంద్ర అవార్డు లభించింది. ఈ సంస్థ బి,యన్.ఆర్. దర్శకత్వంలో నిర్మించిన చిత్రం “దొంగలున్నారు జాగ్రత్త” ప్రజలకు జానపద కధల ద్వారా వినోదాన్నందించే చిత్రాలు తియ్యాలనేది బలరామయ్యగారు నమ్మిన సిద్దాంతం. ఆ మార్గంలోనే ఆయన విజయం సాధించారు.
నిర్మాత అనుమోలు వెంకటసుబ్బారావు ప్రసాద్ ఆర్ట్ పికర్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా యల్:వి, (ప్రసాద్ దర్శకత్వంలో “పెంపుడుకొడుకు” (1953) నిర్మించారు. తరువాత వరసగా ఇల్లరికం, భార్యాభర్తలు, కులగోత్రాలు, మనుషులు మమతలు వంటి పలు విజయవంతమైన చిత్రాలు అందించారు. సహాయ దర్శకులకు దర్శకులుగా అవకాశమిచ్చి (ప్రోత్సహించిన సంస్థ పి.ఏ.పి.
వేస్ట్ ఫిల్మ్ వ్యాపారం చేసిన పింజల సుబ్బారావు పి.యస్.ఆర్. పతాకంపై శాలి (ప్రయత్నంగా యన్,డి.లాల్ దర్శకత్వంలో 'హంతకులొస్తున్నారు జా(గ్రత్త" నిర్మించారు. తరువాత కాంతరావు (రణభేరి), రామారావు (లక్ష్మీ కటాక్షం), నరసింహరాజు (త్రిలోకసుందరి)లతో కొన్ని జానపద చిత్రాలు, వారి అబ్బాయి ఆనంద్ పేరిట ఆనంద్లక్ష్మి ఆర్ట్ పతాకంపై బాపు దర్శకత్వంలో 'సీతా కళ్యాణం, బాలాజీ ఆర్ట్ న పేరిట మావూరి పెద్దమనుషులు యిలా సుమారు పాతిక చిత్రాలు పైగా నిర్మించారు. సీతాకళ్యాణం లండన్ చిత్రోత్సవంలో ప్రదర్శించబడి ప్రశంసలు పొందింది.
27
హీరో కృష్ణ సద్మాలయా పతాకంపై ఎన్నో సంచలన చిత్రాలు అందించారు. తెలుగులో కౌబాయ్ చిత్రం రిచ్‌గా తీసిన “మోసగాళ్ళకు మోసగాడు” తొలి స్కోప్రంగుల చిత్రం. “అల్లూరి సీతారామరాజు”, తాలి 70 యం.యం. చిత్రం 'సింహాసనం' స్వీయదర్శకత్వంలో నిర్మించారు. వారిసోదరులు అదిశేషగిరిరావు, హనుమంతరావులు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇదే పతాకంపై మరెన్నో సాంఘిక చిత్రాల్ని అందించారు. వాటిల్లో చెప్పుకోదగ్గది “దేవుడు చేసిన మనుషులు” మాధవీ వారితో కలసి నిర్మించిన “కురుక్షేత్రం.” శివాజి గణేశన్: ఎన్.టి.రామారావులకు కొన్ని చిత్రాల్లో ఫైట్ సన్నివేశాల్లో డూప్‌గా నటించి మరికొన్ని సంస్థలలో, ప్రొడక్షన్లో పనిచేసిన కె. రాఘవ, మరో మిత్రుడు ఏకామ్రేశ్చరరావుతో. కలిసి ఫల్గుణ సంస్థ ప్టాపించి జగత్ కిలాడీలు, జగత్‌జెట్టీలు, జగత్జంత్రీలు తీసిన తదుపరి ఇద్దరూ విడిపోయాక స్వంతంగా ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ స్థాపించి ఆ పతాకంపై దాసరి నారాయణరావును దర్శకునిగా పరిచయం చేస్తూ 'తాత-మనవడు” నిర్మించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆయనే కొడి రామకృష్ణను దర్శకునిగా, గొల్లపూడి మారుతీరావును నటునిగా పరిచయంచేస్తూ 'ఇంట్లో రామయ్య -వీధిలో కృష్ణయ్య" నిర్మించారు. ఈ సంస్థకూడా ఎందరో దర్శకుల్ని, టెక్టిషియన్స్ను పరిచయం చేసింది. ఏకా(మ్రేశ్వరరావు ఫల్లుణా కంబైన్స్ పేరిట “రాముడే దేముడు” నిర్మించారు. నటుడుగా సినీరంగప్రవేశం చేసిన ఏడిద నాగేశ్చరరావు, మరోమి(త్రుడు ఆకాశం శ్రీరాములుతో కలసి పూర్ణ్జోదయ ఆర్డ్ క్రియేషన్స్ పేరిట 'తాయారమ్మ - బంగారయ్య" నిర్మించి కాలక్రమేణా స్వయంగా పూర్ణోదయా పతాకంపై “శంకరాభరణం” “సితార “సాగరసంగమం” వంటి ప్రతిష్టాత్మకమైన కళాత్మక విలువలతో కూడిన చిత్రాలు అందించారు. రాజరాజేశ్వరి నాటక సమాజంతో సన్నిహిత సంబందంగల కడారు నాగభూషణం నొటి ప్రముఖ నటి కన్నాంబను నివాహం చేసుకొని, రాజరాజేశ్వరీ ఫిలిం కంసెనీ పేరిట సుమతితో ప్రారంభించి అనేక పౌరాణిక చిత్రాలు నిర్మించారు. సి.యస్. రావును దర్శకునిగా పరిచయం చేస్తూ 'శ్రీకృష్ణతులాభారం' (1955) నిర్మించారు. అన్నాతమ్ముడు వంటి కొన్ని సాంఘీక చిత్రాల్నికూడా అందించారు. (ప్రముఖ రంగస్థల నటులకు అవకాశమిచ్చారు. నెల్లూరులో 1911లో జన్మించి రంగస్థలంపై నటుడిగా, గాయకునిగా ప్రసిద్దినొందిన పి. పుల్లయ్య (1911-85) బాబురావు పెయింటర్ వద్ద సహాయకునిగా చేరి, 1935లో 'హరిళ్ళ్చంద్ర'కు దర్శకత్వం వహించి, నటి శాంతకుమారిని పెళ్ళాడి, అప్పటికే సంగీత 28
దర్శకుడుగా పేరొందిన భీమవరపు నరసింహారావు (బి.యన్.ఆర్ భాగస్వామిగా 1948లో రాగిణి సంస్థను ప్రారంభించి ఆ పతాకంపై తిరుగుబాటు, ధర్మదేవత, అర్జాంగి, (స్వయం సిద్ధ నవల ఆధారంగా) చిత్రాలను అందించారు. అ తరువాత పద్మశ్రీ పతాకంపై శ్రీ, వేంకటేశ్చర మహాత్మ్యం, సిరిసంపదలు, (ప్రేమించిచూడు వంటి చిత్రాల్ని అందించారు. యు. విశ్వేశ్చరరావు నిర్మించిన ప్రయోగాత్మక 'మార్చు” నన్నసత్యం' చిత్రాల్లో నటించారు పుల్లయ్య.
రెండవ తరం కథనాయకి లక్ష్మీరాజ్యం (1922-87) భర్త శ్రీధరరావు నిర్మాతగా రాజ్యం పిక్షర్స్ ప్రారంభించి, తొలి ప్రయత్నంగా 'దాసి" నిర్మించారు. తరువాత హరిశ్చంద్ర, గోవుల గోపన్న, శకుంతల వంటి చిత్రాలు అందించారు. ఈ సంస్థ పరువు ప్రతిస్టల్ని పెంచినది, తెలుగువారు గర్వంగా చెప్పుకొనే చిత్రం 'నర్తనశాల', కమలాకర కామేశ్చరరావు దర్శకత్వంలో రూపొందిన యీ కమనీయదృళ్యకావ్యంలో యొన్నో విశేషాలున్నాయి. జకార్తాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో యీ చిత్రం ప్రదర్శించగా ఉత్తమనటుడ్గా కీచక పాత్ర ధరించిన యస్. వి. రంగారావుకు, ఉత్తమ కళాదర్భ్శకునిగా టి.వి.ఎస్.శర్మకు బహుమతులు లభించాయి.
చ(మియాటాకీ డి(స్టిబ్యూటర్స్, రాజశ్రీ డిస్టిబ్యూటర్స్ వంటి పంపిణీ సంస్థలలో (ప్రధానపాత్ర వహించిన సుందర్‌లాల్ నహతా, థియేటర్ యజమాని అళ్ళత్ర నారాయణతో కలిసి రాజశ్రీ పతాకంపై జయం మనదే, శభాష్‌రాముడు వంటి చిత్రాల్ని, ఆ తరువాత శ్రీ ఫిలింస్ పతాకంపై మంచి మనసుకు మంచి రోజులు, శాంతి నివాసం చిత్రాల్ని, ఆ తరువాత డూండీ భాగస్వామ్యంలో రాజలక్ష్మి పతాకంపై రక్త సంబంధం, బందిపోటు చిత్రాల్ని అందించారు. ఆ తరువాత వారి అబ్బాయి శ్రీకాంత్ నహతా శ్రీకాంత్ పిక్చర్స్ పతాకంపై కర్పూరహారతి, సతీ అనసూయ మొదలగు చిత్రాల్ని నిర్మించారు. డూండీ విడిగా తన తమ్ముడు బాబ్టీ భాగస్వామ్యంలో త్రిమూర్తి పతాకంపై అభిమానవతి, దొంగలవేట వంటి చిత్రాలు అందించారు.
హాస్యనటుడు పద్మనాభం, వల్లం నరసింహారావు యిద్దరూ రంగస్థలం నుంచి సినీ రంగానికి వచ్చినవారే. పద్మనాభం కొడుకు పేరు మురళి. నరసింహరావు కూతురు పేరు రేఖ. కాగా వారిద్దరూ మంచి మిత్రులు కావటం చేత రేఖ మురళి పతాకంపై కొన్ని నాటకాలు (శాంతినివాసం) ప్రదర్శించారు. ఆ అభిమానంతో అదే పేరుతో పద్మనాభం, చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి దేవత, పొట్టి ప్లీడరు, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న కధ ( ఈ చిత్రం ద్వారా గాయకుడు యస్, పి. బాలసుబ్రహ్మణ్యం పరిచయమయ్యారు), కథానాయిక మొల్ల (పద్మనాభం దర్శకత్వం) నిర్మించారు. తరువాత బేనరు మార్చి చక్రపాణి ఆర్ట్ సికృర్స్ పేరిట "పెళ్ళికాని తండ్రి' నిర్మించారు.
29
సారథి స్టూడియోలో ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తూన్న తమ్మారెడ్డి కృష్ణమూర్తి రవీంద్రా ఆర్ట్స్ పతాకంపై లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు వంటి చిత్రాలు నిర్మించారు. తరువాత వారి అబ్బాయి లెనిన్ బాబు దర్శకత్వంలో దత్తపుత్రుడు నిర్మించారు. ఆ తరువాత వారి మరో అబ్బాయి తమ్మారెడ్డి భరద్వాజ చరిత చిత్ర పతాకంపై కొని చిత్రాలు నిర్మించారు. టాకీ చిత్ర ప్రారంభదళకంలోనే సత్రికారంగం (సమదర్శిని-ప్రజామిత్ర) నుంచి సినిమారంగ ప్రవేశం చేసిన గూడవల్లి రామబ్రహ్మం సినిమా “మీడియా” ద్వారా సంఘాన్ని సంస్కరించే సదుద్దేశంతో చల్లపల్లి రాజా, వై. శివరామకృష్ణ ప్రసాద్‌లతో కలసి సారథీ ఫిలింన్ స్థాపించి మొదటి దశకంలో మాలపిల్ల, రైతుబిడ్డ ఆ తరువాత కె.ఎస్. ప్రకాశరావు నాయకుడిగా 'పట్లి' చిత్రం, ఎల్వి. ప్రసాద్ దర్శకత్వంలో (తాలి పరిచయం) గృహప్రవేశం, చిత్రాన్ని నిర్మించి, తరువాత స్వంతంగా శారదా ఫిలింస్ ప్రారంభించి పల్నాటియుద్ధం నిర్మాణదశలో మరణించారు. తరువాత సారథీ ఫిలిమ్స్, వల్లం నరసింహారావును హీరోగా పరిచయంచేస్తూ అంతా మనవాళ్ళే, నాగేశ్వరరావుతో రోజులు మారాయి నిర్మించారు. రోజులు మారాయి సంచలన విజయం సాధించుటయే గాక అందులో 'ఏరువాకి నృత్యం చేసిన నర్తకి వహీదారహమాన్ హిందీ చిత్ర రంగంలో కధానాయికగా రాణించింది. 1958లో హైద్రాబాద్‌లో సి,వి.ఆర్: ప్రసాద్ గారి నేతృత్వంలో సారధీ స్టూడియోస్ ప్రారంభించారు. ఆ తరువాత ఆత్మబంధువు, కులదైనం, కలసివుంటే కలదుసుఖం, రాధాకళ్యాణం వంటి చిత్రాలు పి. శశిభూషణ్ నిర్మాతగా కొన్ని చిత్రాలు నిర్మించారు. నిర్మాత సి.వి. రంగనాధదాన్ సాధనా పతాకంపై తొలి ప్రయత్నంగా అ(గ్రనటీ నటులతో యల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో 'సంసొరం' (1950) నిర్మించారు. తర్వాత స్వీయ దర్శకత్వంలో 'సంతానం' 'సంకల్పం' తోబుట్టువులు నిర్మించారు. న్వతం[త్ర పతాకంపై (ద్రోహి నిర్మించిన కె.ఎస్. (ప్రకాశరావు తర్వాత ప్రకాశ్ పతాకంపై “కన్నతల్లి బాలానందం అందించారు. ఆదుర్తి సుబ్బారావు, యస్. భావనారాయణ, డిబి. నారాయణ కలసి సాహిణి ఫిలింస్ పేరిట తాలి ప్రయత్నంగా అమర సందేశం నిర్మించారు. తరువాత ఆదుర్తి విడిపోయారు. ఇద్దరు నారాయణలు కలసి 'పెంకిపెళ్ళాం, బండ రాముడు అందించారు. ఆ తరువాత విడిపోయి డి.బి. నారాయణ డి.బియన్. ప్రొడక్షన్స్ పేరుతో దాగుడుమూతలు, (సైవేటు మాస్టారు నిర్మించగా యస్, భావనారాయణ ఆయన సన్నిహితబంధువు వై.వి.రావు భాగస్వామ్యంతో గౌరీ పిక్ఫర్స్, గౌరీ ఆర్ట్స్ పిక్చర్స్ 30
పేరిట కొన్ని చిత్రాలు నిర్మించారు. (తోటలో పిల్ల - కోటలో రాణి, గోపాలుడు- భూపాలుడు, మొ) గౌరిశేషు పతాకంపై బాలమిత్రుల కధని నిర్మించారు. ఆ తరువాత వైవి. రావు స్వయంగా రవిచిత్ర సంస్థను ప్రారంభించి, 'నేరం నాది కాదు ఆకలిది" వంటి చిత్రాలు నిర్మించారు.
కారంచేడుకు చెందిన యార్లగడ్డ వెంకన్న చౌదరి శంభూ ఫిలింస్ పేరిట నిర్మించిన తొలి చిత్రం “నమ్మినబంటు” విజయం సాధించటమేగాక స్పెయిన్‌లో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో పాల్గొంది. తరువాత ఆ పతాకంపై పూజాఫలం, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ నిర్మించగా వారి అబ్బాయి శంభు ప్రసాద్
అప్పుడప్పుడు చిత్రాలు (బంగారుబావ) నిర్మిస్తున్నారు.
కారంచేడుకు చెందిన విశిష్ట వ్యక్తి దగ్గుబాటి రామానాయుడు, సినిమా నటుడవ్వాలనే కోరికతో మద్రాసు చేరి ముందుగా అనురూపొ వారి 'ఆనురాగంి చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా చేరి తరువాత స్వంతంగా సురేష్ ప్రొడక్షన్స్ వారి 'పెద్దబ్బాయిపేరిట ప్రారంభించి తాలి చిత్రంగా 'రాముడు - భీముడు' నిర్మించారు. అది ఘనవిజయం సాధించగా తరువాత రెండు మూడు చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేకపోవడంతో నిరాశపడిన రామానాయుడు గారికి ప్రేమనగర్ ఘన విజయం అందించి, ఆయన జీవితాన్ని కొత్తమలుపు తిప్పింది. దానితో ఆయన తిరుగులేని స్టార్ ప్రొడ్యుసర్ అయి తెలుగులో దాదాపు అందరి హీరోలతోనూ చిత్రాలు నిర్మించారు. శతాధిక చిత్రాల్ని నిర్మించిన ఘనచరిత్ర ఆయనది. ఆయన సంస్థ నుంచి ఎందరో దర్శకులుగా (ప్రమోట్ అయ్యారు. మరెందరో టెక్నీషియన్స్‌ను (ప్రోత్సహించారు. చలన చిత్ర నిర్మాణశాఖలన్నిటిలోను క్షుఖ్మమైన పరిజ్ఞానం, అవగాహన వున్నటువంటి బహు అరుదైన వ్యక్తి రామానాయుడు. నిత్యకృషీవలుడు, అలుపెరగని (శ్రామికుడు. ఆయనకు కొండంత అండ వారి అబ్బాయి సురేష్ మరో అబ్బాయి వెంకటేష్ కథానాయకుడు. పరిశ్రమలో ఎందరికో ఆదర్భమైన రామానాయుడు ఆయన పేరిట అన్ని వసతులు గల స్టూడియో కూడా నిర్మించారు. శతాధిక చిత్ర నిర్మాతగా 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైన రామానాయుడు ఆవిధంగా తెలుగు తేజాన్ని ఆంతర్జాతీయ స్థాయిలో ప్రకాశింపజేసిన విశిష్ట వ్యక్తి
సత్యనారాయణ, సూర్యనారాయణ అనే యిద్దరు ఆప్రమిత్రులు 'సత్యచిత్రి పతాకంపై నిర్మించిన చిత్రాల్లో ఎన్నదగినవి తహశీల్దారు గారి అమ్మాయి (దర్శకులు కె.ఎస్, (ప్రకాశరావు), అడవిరాముడు (దర్శకుడు రాఘవేంద్రరావు),
31
నిర్మాత కె. చటర్జీ సమతా ఆర్ట్స్ పతాకంపై మల్లెపూవు, జేబుదొంగ, ఇదాలోకం వంటి వైవిధ్యా చిత్రాల్ని నిర్మించారు.
సూపర్‌గుడ్ పతాకంపై నిర్మాత ఆర్.బి. చౌదరి సూర్యవంశం, రాజా, శీను చిత్రాలు నిర్మించారు.
ఎన్.టి.ఆర్. కు వరస బావమరిది ఎ.పుండరీకాక్షయ్యకు సినీరంగంలో పలుశాఖల్లో ప్రవేశం వుంది. రామారావుగారి చిత్ర నిర్మాణ సమయంలో ఆయనా వారి సోదరుడు బలరాం, ఎన్.టి.ఆర్‌గారి సోదరుడు త్రివిక్రమరావు, తెర వెనుకనే ఎంతో కృషి చేశారు. పుండరీకాక్షయ్య మరికొందరి భాగస్వామ్యంలో తారకరాను పతాకంపై శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు నిర్మించారు. తరువాత స్వయంగా శ్రీ భాస్కరచిత్ర పతాకంపై ఆరాధన అందించారు.
“దర్శకరత్న' దాసరి నారాయణరావు ఆయన శ్రీమతి పద్మ సమర్పణలో “తారక ప్రభు పతాకంపై నిర్మించిన చిత్రాల్లో “శివరంజని బెంగుళూరులో రజతోత్సవం చేసుకుంది. బహుదూరపు బాటసారి, మేఘసందేశం చిత్రాలు మరపురాని మాణిక్యాలుగా చెప్పుకోవాలి. మేఘసందేశం” చిత్రాన్ని దేవులపల్లి కృష్ణశాస్తికి అంకితమిచ్చారు.ఒక కవికి దక్కిన అపూర్వ గౌరవం అది.
ఈనాడు, సితార, మార్గదర్శి సంస్థల ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొన్న సి.హెచ్. రామోజీరావు, చిత్ర నిర్మాణరంగంలో ప్రవేశించి, ఉషాకిరణ్ పతాకంపై నిర్మించిన చిత్రాలన్నిటిలోను చెప్పుకోదగ్గవి, సంస్థ (ప్రతిష్టను యినుమడించినవి ప్రతిఘటన, మయూరి, శ్రీవారికి ప్రేమలేఖ ఈ మూడు చిత్రాలు పండిత పామరుల ప్రశంస లందుకున్నాయి.
కడప జిల్లలో జన్మించి, హెచ్.ఎం. రెడ్డి వద్ద రోహిణి సంస్థకు ఆర్థిక సహాయం అందించి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి), తాడిపత్రిలో జన్మించి, హెచ్.ఎం రెడ్డివద్ద సహాయకునిగా పనిచేసిన కదిరి వెంకటరెడ్డి (3.వి. రెడ్డి అప్పటికే సినీరంగంలో కమెరామెన్గా స్థిరపడిన కె. రామనాథ్, ఆర్ట్ డైరక్టరు ఏ.3. శేఖర్ వీరిందరిలో భావసారూప్యం ఉండటం చేత అందరూ కలసి నాగయ్య గారి ప్రోత్సాహంతో వాహినీ పిక్చర్స్‌ను స్టాసించి, ఆ పతాకర్శపై అణిముత్యాలవంటి పధ్నాలుగు చిత్రాలు నిర్మించారు. అందులో తొమ్మిది చిత్రాలకు (వందేమాతరం, సుమంగళి, దేవత, స్వర్గసీమ, మల్లీశ్చరి, బంగారుపాప, రాజమకుటం, బంగారు పంజరం.. రంగులరాట్నంలో బి.ఎన్, దర్శకత్వంలో తీయగా నాలుగు చిత్రాలకు (భక్తపోతన, యోగివేమన, గుణసుందరికథ, పెద్దమనుషులు) కె. వి. దర్శకత్వం వహించారు. కళాత్మక చిత్రాలకు
32
సాంఘిక (ప్రయోజనంగల చిత్రాలకు నిలయం 'వాహినీ" అనే పేరుండేది. చైనాలో జరిగిన ఈస్ట్-ఏషియన్ ఫిలిం ఫెస్టివల్లో “మల్లీశ్యరి" ప్రదర్శించారు. నాటికి నేటికి ఏనాటికీ వాహిని వారి మల్లీశ్వరి చిత్రం ఎవర్గ్రీన్. ఈ సంస్థ పరిచయం చేసిన రచయితలు దేవులపల్లి (మల్లీశ్యరి), పాలగుమ్మి పద్మరాజు (బంగారుపాప), డి.వి. నరసరాజు (పెద్దమనుషులు), చంద్రమోహన్‌ను నటుడిగా రంగులరాట్నం ద్వారా పరిచయం చేశారు.
బి,యన్. రెడ్డి సోదరుడు బి. నాగిరెడ్డి, రచయిత చక్రపాణి (ఆలూరి వెంకట సుబ్బారావు) కలసి విజయ పిక్చర్స్ సంస్థను ప్రారంభించి షావుకారుతో (1950) ప్రారంభించి వినోదాన్ని విజ్ఞానాన్ని అందించే పలు చిత్రాలను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించారు. పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మకథ - ఈ మూడు చిత్రాలు ఎవర్గ్రీన్ చిత్రాలుగా ఉదాహరించవచ్చు. వీటిని చూసి ఆనందించని సగటు తెలుగు ప్రేక్షకుడు వుండడు అనటం అతిశయోక్తి కాదు. తెలుగులో బాపూ దర్శకత్వంలో రూపొందించిన 'రాజేశ్యరీ కాఫీ క్షబటో తర్వాత కొంత విరామం ఏర్పడింది. అందుకు బహుశా చక్రపాణి గారి మరణం కొంత కారణం కావచ్చు. మళ్ళా యీ దశాబ్దంలో వెంకట్రామరెడ్డి నిర్మాణ సారధ్యంలో విజయ చందమామ కంబైన్స్ పేరిట బృందావనం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం నిర్మించారు. విజయపతాకానికి ఆనాడు చంద్రహారం, యీనాడు శ్రీకృష్ణార్జున విజయం చిత్రసీమలో పరాజయం అంటే యేమిటో చవిచూపించాయి.
టాకీల రెండవ దశకంలో (1941-50) భరణీ పిక్చర్స్ నిర్మాణ వ్యవహారాలు చూసిన అనుభవంతో డి.ఎల్.నారాయణ - తనతో అత్యంత సన్నిహిత పరిచయమున్న రచయిత సముద్రాల సంగీత దర్శకుడు సి.ఆర్. సుబ్బరామన్, నాటి నృత్య దర్శకుడు వేదాంతం రాఘవయ్యలను భాగస్తులుగా చేర్చుకొని, వినోదా పిక్చర్స్ స్థాపించి తాలి ప్రయత్నంగా స్త్రీ సాహసం' నిర్మించారు. దీనికి మాతృక షేక్స్పియర్ నాటిక౦, తరువాత శాంతి, మూడో చిత్రంగా శరత్ నవల 'దేవదాసు'ను నిర్మించారు. ఆ చిత్రం తెలుగు చలన చిత్రసీమలో ఓ సంచలనాన్ని సృష్టించింది. తరువాత కన్యాశుల్కం, చిరంజీవులు నిర్మించి, ఆ తరువాత పతాకం పేరు మార్చి చందమామ ఫిలిమ్స్ పేరిట దొంగల్ట్లో దొర, సిపాయి కూతురు, దొరికితే దొంగలు నిర్మించారు. డి.ఎల్. నిర్మించిన మరోచిత్రం కవిసామ్రాట్ విశ్చనాధ సత్యనారాయణ నవల “ఏకవీర నటుడు సత్యనారాయణను కథా నాయకునిగా (సిపాయి కూతురు) పరిచయం చేసిన ఘనత ఆయనదే!
33
భరణీ వారి చిత్రాలకు వినోదా చిత్రాలకు కమెరామన్గా పనిచేసిన బి.యస్. రంగా విక్రం ప్రొడక్షన్స్ పేరిట తొలి చిత్రంగా హిందీలో విజయవంతమైన భాగ్యవాన్ చిత్రాన్ని 'మా గోపి" పేరిట నిర్మించారు. తరువాత "ఆయన నిర్మించిన చిత్రాల్లో చెప్పుకోదగ్గవి తెనాలిరామకృష్ణు (తెలుగు-తమిళం) అమరశిల్పి జక్కన (తెలుగు- కన్నడం). ఉడిపిలో జన్మించి, చిన్నప్పుడే సర్కన్ కంపెనీలో చేరి కష్టాల కడలిని మధించి, దేశదేశాల జానపదకథల్ని జీర్ణం చేసుకొన్న బి. విఠలాచార్య ముందుగా కన్నడంలో చిత్రాలు నిర్మించి విఠల్ ప్రొడక్షన్స్ స్టాపించి తెలుగులో మొదటగా కన్యాదానం సాంఘిక చిత్రాన్ని, తరువాత వద్దంటే పెళ్ళి హాస్య చిత్రాన్ని నిర్మించారు. అవి అంతగా లాభసాటిగా లేకపోవడంతో పంథామార్చి జయవిజయ (1959) జానపద చిత్రాన్ని నిర్మించారు. అది సాధించిన విజయంతో పరంపరగా జానపద చిత్రాలు నిర్మించారు. టక్కుటమారగోకర్షగజకర్ణ విద్యలు, వింత వింత పోరాటాలు, మాయలు, మంత్రాలు, కామరూపవిద్యలు, యక్షిణి, దేవతలు, దెయ్యాలు, ఆయన చిత్రాల్జోని (ప్రధాన ఆకర్షణలు. జనానికి వినోదాన్ని అందించి విజయం సాధించటం ఆయన వ్యాపార రహస్యం. కనకదుర్గ పూజా మహిమ, నవ[గ్రహ పూజామహిమ, అగ్గిపిడుగు, అగ్గిబరాటా, జగన్మోహిని ఆయనచిత్రాల్లో చెప్పుకోదగ్గవి. అక్కినేనితో 'బీదలపొట్టు' నిర్మించి ఏటికి ఎదురీదటం పొరపాటనే సత్యాన్ని (గ్రహించానని ఆయనే చెప్పుకొన్నారు. నెల జీతాల్ని ఒకరోజు ముందుగానే సిబ్బందికి, కళాకారులకు అందజేసి, వారి అభిమానాన్ని చూరగొన్న విశిష్టవ్యక్తి విరలాచార్య. పాండురంగ మహాత్మ్యంలో బాలనటిగా పరిచయమై, కధనాయకురాలిగా విభిన్న పా(త్రలు పోషించిన విశిష్ట నటి విజయనిర్మల ఆమె సోదరులు రమానంద్, రఘునాధ్ నిర్మాతలుగా విజయకృష్ణ మూవిస్ పతాకంపై 'మీనా'తో ప్రారంభించి పలుచిత్రాలు అందించారు. దర్భ్శకురాలుగా అది ఆమె మొదటి చిత్రం. తెలుగులో ఈ పతాకంపై నిర్మించిన చిత్రాలలో చెప్పుకోదగ్గవి దేవదాసు, 'హేమాహేమీలు. అదృష్టదత్తుగా పేరొందిన చలసాని అశ్వనీదత్ వైజయంతీ పతాకంపై దాదాపు అందరు కథనాయకులతోనూ తెలుగులో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. (ఎదురులేని మనిషి గురుశిష్యులు, జగదేకవీరుడు-అతిలోకసుందరి, అగ్నిపర్సతం, వజ్రాయుధం, ఆఖరిపోరాటం, రాజకుమారుడు.) రాయలసీమలో డిస్టిబ్యూటర్‌గా పేరొందిన దొరస్వామిరాజు వి.యం,సి. పతాకంపై నిర్మించిన చి(త్రాల్లో తెలుగు ప్రేక్షకులు మరువలేని ఆణిముత్యాలు రెండు (సీతారామయ్యగారి మనవరాలు, అన్నమయ్య) 34
సంగీత సాహిత్యాల విలువల గురించి, వాటిలోని మాధుర్యాన్ని గూర్చి సంపూర్ణ అవగాహనవున్న కొద్దిమంది నిర్మాతల్లో కె. మురారి గారిని తప్పక పేర్కొనాలి. యువచిత్ర పతాకంపై నరసింహంనాయుడు సమర్స్భణలో ఆయన రూపొందించిన చిత్రాలలోని పాటలే యిందుకు నిదర్శనం.
గోరింటాకు, సీతామాలక్ష్మి, (త్రిశూలం, సీతారామకళ్యాణం, జానకిరాముడు, నారీనారీ నడుమ మురారి చిత్రాలను యిందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.
పి. పుల్లయ్య గారివద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన యు. విశ్వేశ్శరరావు విశ్వశాంతి పతాకంపై కొన్ని డబ్బింగ్ చిత్రాలు నిర్మించి, సరాసరి తెలుగులో నిర్మించిన తాలి చిత్రం 'కంచుకోట' ఘనవిజయం సాధించింది. తరువాత మంజూ సినీసిండికేట్ పతాకంపై నిలువుదోపిడి, జ్యోతి సినీ సిండికేట్ పతాకంపై పెత్తందార్డు దీప్తి ఇంటర్నేషనల్ పతాకంపై దేశోద్దారకులు నిర్మించారు. ఆ తరువాత తీర్పు, మార్పు, నగ్నసత్యం హరిశ్చంద్రుడు వంటి ప్రయోగాత్మక చిత్రాలు అందించారు.
ఉత్తమ అభిరుచితో చిత్రాలను నిర్మించే సదుద్దేశంతో నడుం కట్టిన మిత్రద్వయం బాపు-రమణలు. వీరు నిర్మాణభాగస్వాములుగా వ్యవహరిస్తూ (ఒకరు దర్శకులు, మరొకరు రచయిత) కొందరు అత్మీయుల్ని నిర్మాతలుగా చేసి తరచుగా బేనరు పేరు మారుస్తూ చిత్రాలు అందించారు. యం.వి.ఎల్., నిడమర్తి, పద్మాక్షి యన్.యస్. మూర్తి, వీరి సినిమాల్లో కొన్నిటికి నిర్మాతలుగా వ్యవహరించారు. నందన పతాకంపై 'సాక్షి తాలి చిత్రంకాగా, గణేశ్ పతాకంపై బంగారు పిచుక. చిత్రకల్పన పతాకంపై బుద్ధిమంతుడు, అందాలరాముడు, లక్ష్మీ ఎంటర్ ్రైజన్ పతాకంపై సంపూర్ణ రామాయణం, శ్రీరామచిత్ర పతాకంపై ముత్యాలముగ్గు. నిర్మించారు. ఒకసారి పరాజయం పొందిన బంగారు పిచుకను మరోసారి పేరుమార్చి పెళ్ళికొడుకుగా తీసి విజయం పొందాలని ప్రయత్నించటం దుస్సాహసం. ఈ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో ప్రతీ ఫ్రేము అందమైన కాన్వాస్‌పై వేసిన కమనీయ దృశ్యంలా కనువిందు చేస్తే డైలాగులు హాస్యరసగుళికలై గిలిగింతలు పెడుతూ, ఒకింత సామాజిక స్పృహ కలిగిన వారి ఆంతర్యంలో అలజడులు కల్లిస్తాయి.
ఈ ప్రకరణం ముందు పేరాలో వివరించినట్లు వ్యాపారపరంగా హిట్ అయిన చిత్రాలు, మంచి చిత్రాలు, ప్లాప్ అయిన చిత్రాలు నిర్మించిన పలు సంస్థల గూర్చి సంగ్రహంగా అవలోకిస్తే.... (ఇంగ్రీషు అక్షర క్రమంలో వివరాలు ఉదహరించబడ్డాయి.)
35
సంస్త పేరు నిర్మాతదర్ధుకుడు చిత్రం పేరు ఎలైడ్ పిక్చర్స్ 'క.శివరావు (హాస్యనటుడు) పరమానందయ్య శిష్యుల కధ అశ్వరాజ్ కె. గోపాలరావు (మేకప్‌మాన్) అన్నదాత, దీపావళి, వినాయకచవితి అమృతా ఫిలింస్ నటుడు యం, బాలయ్య చెల్లెలి కాపురం (బాలయ్య స్వీయదర్శకత్వంలో పసుపుతాడు నిర్మించారు. అందులో తులసీరామ్‌ను హీరోగా పరిచయం చేశారు.) అంజనా పిక్షర్స్ నాగేంద్రబాబు ముగ్గురు మొనగాళ్ళు అమ్మా ఆర్ట్స్ కాస్ట్యూమ్ కృష్ణ మా అవిడ కలెక్టర్ అనూరాధా ఫిలిమ్స్ చదలవాడ తిరుపతిరావు జీవితఖైది, రిక్షారుద్రయ్య డివిజన్ శ్రీనివాసరావు ఆంధ్ర టాకీస్ కృష్ణవంశీ సింధూరం అనంది ఆర్ట్స్ కృష్ణవంశీ అంతశసురం అన్నపూర్ణ సినీచిత్ర కాట్రగడ్డ (ప్రసాద్ పోలీసుభార్య అమూల్య ఆర్ట్స్ సి. కళ్యాణ్ మమ్మీ మీ ఆయనొచ్చాడు అనంతలక్ష్మి దగ్గుబాటి భాస్కరరావు 'ప్రేమలు-పెళ్ళిళ్ళు ఎ.ఎ.ఆక్ట్స్ మహేంద్ర పోలీసు, దేవా ఆత్మ ఆర్ట్స్ కె ప్రత్యగాత్మ చిలకగోరింక ఎ.విశె. ప్రొడక్షన్స్ కె. గోపాలకృష్ణ లక్ష్మణరేఖ అశోకా జంపన వాలిసుగగ్రీవ (ఈ చిత్రానికి అయిదుగురు సంగీతదర్శకులు పనిచేశారు) అశోకా ఫిలింస్ చిత్రపు నారాయణమూర్తి నా చెల్లెలు అశోకా మూవీస్ వి. మధుసూదనరావు పవిత్రబంధం అరుణా పిక్చర్స్ ఆర్.యం. కృష్ణస్వామి గుమస్తా (ఈ చిత్రానికి ఆధారం అత్రేయ నాటకం యన్. జి.వో) అరుణ ఆర్ట్స్ దాసరి నారాయణరావు ముద్దబంతిపువ్వు అవంతి అవినాష్ రేలంగి నరసింహారావు కన్నయ్య-కిష్టయ్య అంబికా ఆర్ట్ పిక్చర్స్ అంబిక కృష్ణ, ఇవి.వి. కన్యాదానం భార్గవ్ ఆర్ట్ పిక్చర్స్ ఎస్. గోపాలరెడ్డి మంగమ్మగారి మనవడు భానూ ఆర్ట్ క్రియేషన్స్ సి,హెచ్.వి. అప్పారావు స్వర్ణకమలం బాబూ ఆర్ట్ జి, బాబు ఇల్లాలి కోరికలు 36
బాబ్ అండ్ బాబ్ రాజబాబు ఎవరికివారే యమునాతీరే భవానీ ఫిలింస్ భమిడిపాటి బాపషయ్య మాయని మమత భాగ్యలక్ష్మి ఎంటర్[పైజన్ _ సి.ఎల్.నరసారెడ్డి గీతాంజలి భరత్ ఫిలింస్ జి. రామినీడు భక్తపోతన బాలాజి చిత్ర టి. కృష్ణ ఖైదీబాబాయ్ బాబూ పిక్ళర్స్ హరిరామజోగయ్య బంగారుతల్లి బాలాజి ప్రొడక్షన్స్ సత్యనారాయణ బంగారు సంకెళ్ళు భ్రమరాంబికా కేశవరావు ధర్మపీఠం దద్దరిల్లింది చం[ద్రోదయా మృణాల్‌సేన్ ఒకవూరికధ సి.పి.ఆర్.ప్రొడక్షన్స్ సి, వి. శ్రీధర్ సీత గీతదాటితే దుర్గా ఆక్ట్ డా॥ కె.ఎల్. నారాయణ హాలో బ్రదర్ కెమెరామెన్: యస్. గోపాలరెడ్డి ఇంట్లో ఇల్లాలు - వంటిట్లో ప్రియురాలు దేవీ ఫిలింస్ కె. దేవీవరప్రసాద్ కేడీ నెం.1, కొండవీటిరాజా దేవి ఆర్ట్ ప్రొడక్షన్స్ శ్రీనివాసులు-పాండురంగప్ప _ దేవదాసు మళ్ళీ పుట్టాడు దివ్య ఆర్ట్ పిక్చర్స్ సురేంద్రరాజు పంచదార చిలక దిగ్యిజయా శోభనాద్రిరావు (ప్రేమ కానుక ఫిలిం క్రాఫ్ట్స్ సియస్.రావు దేశమంటే మనుషులోయ్ గోపీ ఆర్ట్స్ చలసాని గోపి గజదొంగ, అడవిదొంగ గీతా చిత్ర శివరాజు, వెంకట్రాజు పవిత్రబంధం గీతా అల్టు అరవింద్ దేవుడే దిగివస్తే గోపాలకృష్ణా కె. గోపాల కృష్ణ కధానాయకుడు గోకుల్ పిక్చర్స్ దోనేపూడి కృష్ణమూర్తి నిరుపేదలు గీతా ఆర్ట్ పిక్చర్స్ కె.ఎస్. రెడ్డి డాకూరాణి గజలక్ష్మి ఆర్ట్స్ మేకప్ పీతాంబరం అన్నదమ్ముల అనుబంధం గజేంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ _ జి.వి. ప్రభాకర్ కలవారి కుటుంబం గీతాకృష్ణ కంబైన్స్ కె. విశ్శనాధ్ సిరిసిరిమువ్వ హేమా ఫిలింస్ హీరో కాంతారావు సప్తస్వరాలు జనత టి. (ప్రకాశరావు పరివర్తన జయకృష్ణ మేకప్ జయకృష్ణ మనవూరి పాండవులు జలరుహ (యస్.వియస్) మిద్దె జగన్నాధరావు రాజనందిని, కలిసొచ్చిన అదృష్టం. జయంతి కెవి.రెడ్డి పెళ్ళినాటి ప్రమాణాలు 37
జ్యోతి ఆర్ట్స్ భీమవరపు బుచ్చిరెడ్డి గోపాలకృష్ణుడు జయంతి ఎ.టి. కృష్ణస్వామి బంగారుభూమి జానకి పిక్చర్స్ రాజాశాండో చూడామణి జయశ్రీ, ఆర్ట్ పిక్చర్స్ సి.హెైచ్.ఆర్.బి. చౌదరి నేను ప్రేమిస్తున్నాను కౌసల్యా ఎశేషగిరిరావు నూవ్వానేనా కామాక్షి ఆర్ట్ మూవిస్ డి. శివప్రసాద్‌రెడ్డి పెసిడెంటుగారి పెళ్ళాం కృష్ణచిత్ర వై. హరికృష్ణ మమతల కోవెల కృష్ణా పిక్చర్స్ డి.యోగానంద్ అమ్మలక్కలు కెంపరాజ్ కెంపరాజ్ నలదమయంతి కోనేరు ఫిలింస్ రవీంద్రనాథ్ గాజు బొమ్మలు కవిత చిత్ర ఆచార్య ఆత్రేయ వాగ్దానం కోదండపాణి ఫీలిం సర్క్యూట్ ఎస్.పి, బాలసుబ్రహ్మణ్యం శుభసంకల్సం కృష్ణశాయి యర్రా అప్పారావు మనసేమందిరం లక్ష్మీ ప్రొడక్షన్స్ ఎ. పూర్ణచంద్రరావు రౌడీరాణి లలితా మూవీస్ జి. జగదీశచం[ద్ర ప్రసాద్ ఇదెక్కడి న్యాయం లలితశ్రీ ఆర్.వి. రమణమూర్తి అభినందన లక్ష్మీనారాయణ కె. సీతారామస్వామి చిక్కడు దొరకడు లక్ష్మీచిత్ర కె. ఎస్. ప్రకాశరావు సత్యానికి సంకెళ్ళు లిటిల్ ఇండియా బి. నరసింగరావు దాసి లక్ష్మీకిరణ్ నటుడు సారధి అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు మారుతీ (ప్రొడక్షన్స్ ఎ.ఎల్.కుమార్ బాబు ఎం.ఎల్, ఆర్ట్స్ ఎడిటర్ మోహన్ బావ-బావమరిది మహేశ్చరి ఎస్.పి. వెంకన్నబాబు కలవారి సంసారం మహేశ్చరి, పరమేశ్వరి టి. సుబ్బిరామిరెడ్డి స్టేట్ రౌడి యం,ఆర్సి, క్రియేషన్స్ మాగంటిబాబు అల్టుగుగారొచ్చారు మధు పిక్చర్స్ పి.మల్లికార్జునరావు మంచికుటుంబం మధూ మూవీస్ వి. మధుసూధనరావు కళ్యాణమంటపం యం.కెయం. ముక్కామల కృష్ణమూర్తి మరదలు పెళ్ళి మౌళి క్రియేషన్స్ చక్రవర్తి పాప కోసం యం.వి.ఆర్, పిక్చర్స్ ముచ్చర్ల వెంకటరామదాసు ముహూర్తబలం యం.ఆర్.ఎ కృష్ణవేణి మనదేశం మనీషా ఫిలింన్ కె.అచ్చిరెడ్డి యమలీల
38
నాగూర్ సినీ ప్రొడక్షన్స్ నాగూర్ ఇద్దరు పెళ్ళాలు నేషనల్ ఆర్ట్ మూవీస్ టి.వి.డి. ప్రసాద్ ఆంటి నవత యన్. కృష్ణంరాజు ఇంటింటి రామాయణం నంది పిక్చర్స్ వై.వి. రావు శ్రీకృష్ణగారడి నరసు స్టూడియోస్ ఎ.ఎల్నరసు బలేరాముడు నవభారత్ ఆర్ట్ మూవిస్ _ డి, ప్రతాపరాజు దొంగకాపురం నవజ్యోతి తాపీ చాణక్య అడుగుజాడలు నాగేశ్వర ప్రొడక్షన్స్ నాగేశ్చరరావు ఉత్తమ యిల్దాలు పీపుల్స్ ఆర్జ్ ధియేటర్స్ _ టి. ప్రకాశరావు పల్లెటూరు పవన్ ఇంటర్నేషనల్ నూతన (ప్రసాద్ ఓ అమ్మకథ పొన్నలూరి బ్రదర్స్ పి. వసంతకుమార్ రెడ్డి భాగ్యరేఖ పల్లవి కె. ముఖర్జీ ఇద్దరూ ఇద్దరే పి.వి.విియస్ మూర్తి భట్టి విక్రమార్క పల్లవి ఫిలింస్ ఆనంద్ అందరూ దొంగలే పంచవటి చిత్రాలయ కోగంటి విశ్వేశ్వరరావు కృష్ణపారమాత్మ రామవిజేత బాబూరావు, ప్రభాకర్ జరిగిన కధ రిపబ్లిక్ ప్రాడక్షన్స్ సీతారాం బొబ్బిలియుద్ధం రాజలక్ష్మి అంగర సత్యం, మిద్దెరామారావు పదహారీళ్ళవయసు ఆర్. ఎసోసియేట్స్ కె. కృష్ణమోహనరావు అపూర్వసహోదరులు రమాఫిలింస్ కె, నాగేశ్చరరావు బంగారు కుటుంబం రాంప్రసాద్ ఆర్ట్స్ యన్. రామలింగేశ్వరరావు... కిరాయి కోటిగాడు రాశీ మూవీస్ యం. నరసింహారావు మహారాజు రాధాచిత్ర విజయచందర్ కరుణామయుడు రాధాకృష్ణమూవీస్ జి. సత్తిరాజు శివమెత్తిన సత్యం ఆర్.సి. ప్రొడక్షన్స్ రాధాకృష్ణ చలపతిరావు కడప రెడ్డమ్మ రవి కళామందిర్ ఆదుర్తి భాస్కర్ మాయదారి మల్లిగాడు రామకృష్ణా ఆర్ట్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ తారాశశాంకం ' రోజూ మూవీస్ అర్జునరాజు, శివరామరాజు వేటగాడు రాజా (పొడక్షన్స్ డాః రాజారావు పుట్టిల్లు రఘు ఫిలింస్ హేమంబరధరరావు తండ్రులు-కొడుకులు రవి ఆర్ట్ ధియేటర్స్ నాగభూషణం ఒకే కుటుంబం రమణచిత్ర చలం బుల్లెమ్మ బుల్గోడు 39
ఆర్.ఎన్.ఆర్. పిక్చర్స్ ఆర్. నాగేంద్రరావు జాతకఫలం రవిశంకర్ పిక్చర్స్ బి.ఎస్. నారాయణ మేనకోడలు ఆర్.జె.ఆర్ ఫిలింస్ జయరామారావు స్టేషన్ మాస్టర్ రెడ్డి అండ్ కంపెనీ జయరామిరెడ్డి ధర్మపళ్ని
రాజు పిక్చర్స్ మేకప్ వీర్రాజు రాజసింహ
శ్రీసరళ చిత్ర అమరనాద్ మగవారిమాయలు శ్రీదేవి పిక్చర్స్ తోట సుబ్బారావు పరమానందయ్య శిష్యులకధ యన్.యస్.సి. ఆర్ట్స్ గణపతి రాజు తొలిప్రేమ
శ్రీనాథ్ ప్రొడక్షన్స్ అలపాటి రంగారావు రాజ్‌కుమార్ స్రవంతి రవికిషోర్ లేడిస్ టైలర్ సుమంత్ ఆర్ట్స్ యం.యస్, రాజు శత్రువు
శ్రీ సత్యనారాయణమ్మ సి.హెచ్, వెంకట్రావు సమరసింహారెడ్డి యన్.యన్, క్రియేషన్స్ _ వై. సురేంద్ర కలెక్టరుగారి అబ్బాయి యస్.ఆర్. ఫిలింస్ యస్. రామచం(ద్రరావు ప్రతిభావంతుడు సంగీతా పిక్చర్స్ యం.యనస్, ప్రకాశ్ ఇంటిగుట్టు సెల్వకోటి సెల్వరాజ్-కోటేశ్చరరావు స్వయంప్రభ శ్రీవాణి యన్. సుబ్బరాజు స్నేహబంధం శుభోదయ హెజ్వి. బాబు అదర్భం
శారదా ఫిలింస్ వి. నారాయణరావు జయభేరి
శార్వాణి సార్వభౌమరావు అక్కచెల్లెళ్ళు యన్.వి.ఆర్. పీకృర్చ్ యస్,వి. రంగరావు బాంధవ్యాలు సంయుక్త మూవీస్ తిరుపతి రెడ్డి ఖైదీ
శక్తి మూవీస్ శేఖర్ ఇన్స్పెక్టర్ భార్య స్నేహచిత్ర ఆర్. నారాయణమూర్తి వోర్ర సైన్యం సూర్యా మూవీస్ ఎ.ఎం, రత్నం కర్తవ్యం
శ్రీనివాసా ఆర్ట్స్ చంటి, శ్రీనివాసరెడ్డి పవిత్రప్రేమ సుభాషిణి హేమాంబరధరరావు ఆడపడుచు శార్యప్రసాద్ ఆర్ట్స్ మాగంటి రవీంద్రనాధ్ చౌదరి గ్యాంగ్ లీడర్ శ్రీకర్ ప్రొడక్షన్స్ సత్యనారాయణ చట్టానికి కళ్ళు లేవు సరిగమ ఆక్ట్ మేకప్ పోతరాజు ఘరానా గంగులు సాయికిరణ్ భరద్వాజ శివశక్తి శ్రీ లక్ష్మీనారాయణ బాపు రామాంజనేయ యుద్ధం
40
శ్రీ శరణచిత్ర రామమోహన్‌రావు శుక్రవారం మహాలక్ష్మి శ్రీదేవి ఆర్ట్ మూవిస్ కృష్ణప్రసాద్ ఆదిత్య 369 సౌదామిని క్రియేషన్స్ కెవి.వి. సత్యనారాయణ మాయా మోహిని " శ్రీచిత్ర క్రియేషన్స్ ఆచంట గోపినాథ్ టాప్ హీరో
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ బి, శివరామకృష్ణ తమ్ముడు శ్రీ వెంకట రమణ స్రాడక్టన్స ఎం. మురళీకృష్ణ సూర్యుడు త్రీ సాయినాధ ఆర్ట్ క్రియేషన్స్ మాగంటి గోపీనాథ్ రవన్న శ్రీ టైగర్ ప్రొడక్షన్స్ పహిల్వాన్ కాంతారావు అసాధ్యుడు టి. కృష్ణ మెమోరియల్ నాగేశ్వరరావు నవయుగం తరంగ ఫిలింస్ సుబ్రహ్మణ్యం ప్రేమకు వేళాయెరా త్రివేణి ఫిలింస్ పేర్రాజు బడిపంతులు విజయమాధవి వడ్డే రమేష్ కటకటాల రుద్రయ్య విజయగోపాల్ వి.యయన్.రెడ్డి గంగా గౌరీ సంవాదం విజయలక్ష్మీ ఆర్ట్స్ టి. (త్రివిక్రమరావు జస్టిస్ చౌదరి వీనస్ పిక్చర్స్ శ్రీధర్ పెళ్ళికానుక వీనస్ మహీజు సిహెచ్. ప్రకాశరావు యశోదకృష్ణ వీనస్-పద్మిని టి. గోవిందరాజన్ లక్ష్మీనివాసం విశ్వభారతి సింగీతం శ్రీనివాసరావు తరం మారింది వెంకటరమణ వేదాంతం రాఘవయ్య బాలనాగమ్మ వరలక్ష్మీ పిక్చర్స్ కడారు నాగభూషణం సతీ సావిత్రి విజయలక్ష్మీ మూవిస్ బివి.యస్, రాజు అమ్మమాట వర్మ కార్ఫోరేషన్ రాంగోపాల్ వర్మ గోవిందా గోవిందా వెంకటరమణ క్రియేషన్స్ బాబు ఎస్. బూరుగుపల్లి జాబిలమ్మ పెళ్ళి యువతరం పిక్చర్స్ మాదాల రంగారావు విష్ణవశంఖం
తమిళనాడులో తమిళంలో (ప్రధానంగా చిత్రాలు నిర్మించి అప్పుడప్పుడు తెలుగులో కూడా సినిమాలు అందించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న సంస్థలు కొన్ని వున్నాయి. వాటి వివరాల్లో కెళితే.......
శతాధిక చిత్రాల్ని నిర్మించిన ఫఏీ.వియం. సంస్థ ఆనాటి జీవితం నుంచి భూకైలాస్, భక్త (ప్రహ్హాద, లేత మనసులు, మూగనోము, రాము వంటి సాంఘిక పౌరాణిక చిత్రాల్ని అందించి తెలుగువారి అభిమానాన్ని పొందాయి. ఇందుకు ముఖ్య కారణం వీరి చిత్రాల్లో చైల్డ్ సెంటిమెంట్ ప్రధానంగా వుండటమే!
శే
ఆండాళ్ పతాకంపై నిర్మాత రామ అరంగణ్ఞల్ అందించిన చిత్రాలు 'అంతులేని కథ', 'మరోచరిత్ర, అప్పట్లో ఓ సంచలనం సృష్టించాయి.
పిటడల్ స్టూడియో పతాకంపై జోసెఫ్ తలియాత్ 'ముగ్గురు వీరులు” నిర్మించారు.
దేవర్ ఫిలింప్ సరాసరి తెలుగులో నిర్మించిన చిత్రాలు రామలక్ష్మణులు, పొట్టేలు పున్నమ్మ. ఎస్. ఎస్. వాసన్‌కు చెందిన సంస్థ జెమిని. ఆనాటి బాలనాగమ్మ, కలెక్టరు జానకి, ఆడబ్రతుకు, మనుషులు మారాలి. వైవిధ్య కథా వస్తువుతో విజయవంతమైనాయి. ఆంధ్రదేశంలో తొలిసారిగా విజయవాడలో శతదినోత్సవ వేడుక జరుపుకొన్న చిత్రం 'చంద్రలేఖ” అంటారు.
జూపిటర్ పిక్చర్స్ దీక్షిత్ దర్శకత్వంలో సంతోషం" నిర్మించారు.
ఎం.ఏ.వి. పతాకంపై నిర్మాత ఎం.ఎ. వేణు కృష్ణారావు దర్శకత్వంలో ముందుడుగు, ఆలుమగలు అందించారు.
శతాధిక చిత్రాలను నిర్మించిన మరో సంస్థ మోడరన్ థియేటర్స్ (ఢేలం) సహ'స్రశిరచ్చేద అపూర్వ చింతానుణి. వీరకంకణం, మొనగాళ్ళకు మొనగాడు వంటి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఆ సంస్థ నిర్మాత సుందరం (క్రమశిక్షణకు మారుపేరు.
నిర్మాత శ్రీరాములు నాయుడు పక్షిరాజా పతాకంపై అగ్గిరాముడు, విమల నిర్మించారు. పద్మినీ పతాకంపై బి. ఆర్. పంతులు, గాలిమేడలు, పెంపుడుకూతురు అందించారు.
ఆర్. ఆర్. పికృర్స్ పతాకంపై నిర్మాత, దర్శకుడు టి.ఆర్.రామన్న అందించిన చిత్రాలు కార్తవరాయుని కథ, ఇంటికి దీపం ఇల్టాలే,
తమిళవాడు టాకీస్ అధినేత సౌందరరాజన్ అదృష్టదీపుడు, నవ్వితే నవరత్నాలు నిర్మించి, గుమ్మడి వెంకటేశ్యరరావును, కృష్ణకుమారిని పరిచయం చేశారు.
జ తెలుగు టాకీ పీతామహుడు హెబ్ఎం. రెడ్డి దర్భకత్తంలో మూకీ చిత్రం “రాబ్కుమార్"లో ప్రముఖ హిందీ నటుడు పృధ్వీ రాజ్కపూల్ కధానాయకునిగా నటించారు.
42
స ఖ వట. న శాాజ్హ, నచ హాల స అనా ల ణు న | ల శ్ కో న. య టో ప్ో ర క (య మై గై ర క కశ పయ పర క స కీ 1 1జీ: 4కు నన. ఇట క క నం తాన నరాయానన ము గ్ా గ్ధా స క (7 న్న హా యు చం బా భు నశ మ ల న న ం 1 స య ప క ము న నై కారల్ ర... ష్ ర కు ను నమన ( నతన. ౯ ననన స స్ కన ఇ యం శై మ న పస జపత సను) క నగ (స్టా వచో వ సాన సే నచన్లో ప్ సలవ్ న | టల లు. క లు! చున! మ పో తం ల న కుడ మె ప న నామం మ ఫై! వ్ టం శాం... న ం న (నే ర స. ల న] శ యళ! ర వ మనం న న న. టట టం! న న ప న స చ. కా. ఛ్ (వ వాణతాతంసాణడూాంనంలానకా గ గ ల. ష్ మం య. 1 ట్ర ఖ్ హ్హా చ లీ నా న లం న్ ము తో! య న య. చనం ప న ర మ న కర న స మగ మం మ జా న
న నల లే! ప 71 న... య గ్ల... 0. ల మ! న [2కి హహ న నే [1 [1 టన! శ | క్ష మ యా... నై ప. . నన లన? వ సై -. ల్ న్ ళో వే గ్ మాని. ర్న సి న మ క. స హు భ్్సా ల న గ (| తనో గ వా అ ల యి (ఇ వ రో గ్గ కము మ ల గే? | ల న. ్ల! న. న న్ గ్. స? ప రం. రర 'ు-. రర లా ఎ స (ష్ణ ?* న. న... ర నో వ లా ము ష్ కా. 1 నస్టైాడే 122 యో స ల కా న్ య చ్ 1 న... త 11 నం వ చ నం! గరు! లు మ నత న. న వు న సనా మ క్ష గ న! గ్? న. న ఉదరం రాద శ జ క న గ య స ప మ న్ న్న సం క... 4. వ య. న! ము న స్లో నమమ, స్ట వ న ్త | న. . న? ను నం | టో స టో భష. ; భ్ ట్. ఇల “ఈ? స క్. హం న ( న సు. |- వ న. న్ స... (నం + మాట టక క న పాడ్ గ్ సే ్రు పటే ను న్స్ తకమన
స్టూడియోలు - రికార్డింగ్ థియేటర్లు తెలుగు టాకీసు సినిమా తాలి మలిదశల్లో (1931-50) చిత్ర నిర్మాణం తొంబై అయిదు శాతం స్పూడియోల్లో నిర్మించిన సెట్స్‌పై జరిగేది. పరిణామ (క్రమంలో జౌట్డోర్లో షూట్ చెయ్యటం -ప్రయివేటు బంగాళాల్లో షూట్ చేయటం, రమణీయ ప్రకృతి గల ప్రదేశాల్లో పాటలు చిత్రీకరించటం - ఇహ ఇప్పుడు విదేశాల్లో కూడా " చిత్రీకరించడం జరుగుతోంది. తొలిదశకంలో కొన్ని చిత్రాలు కొల్హాపూర్‌లోనూ, కలకత్తా ఈస్టిండియా ఫిల్మ్ కంపెనీ స్టూడియోలోనూ నిర్మించారు. రాజమండ్రిలోని నిడమర్తి సోదరులు దుర్గ సినీటౌన్ స్టూడియో నిర్మించి, అందులో సంపూర్ష రామాయణం (1936) నిర్మించారు. విశాఖ పట్నంలోని ఆంధ్రా సినీటోన్ స్టూడియోలో భక్త జయదేవ నిర్మించారు. వాటితోనే ఆ స్టూడియోల చరిత్ర మాసిపోయింది. మొదటి తరం వాహినీ చిత్రాలు యితర చిత్రాలు కొన్ని మద్రాసులోని న్యూటోన్ స్టూడియోలో నిర్మించారు. అప్పటినుంచీ హైద్రాబాద్‌లో సారథీ స్టూడియో నిర్మాణం జరిగేవరకు దాదాపుగా తెలుగు చిత్రాలన్నీ మద్రాసులోని స్పూడియోల్లోనే నిర్మితమయ్యేవి. సేలంలోని మోడరన్ థియేటర్స్ స్టూడియోలోను, కోయంబత్తూరులోని పక్షిరాజా స్టూడియోలోను కొన్ని తెలుగుచిత్రాలు వారే నిర్మించారు. 1949లో హెచ్.ఎం. రెడ్డి నిర్మించిన స్టూడియో రోహిణి యాజమాన్య పరిస్తితులు మారాక గోల్డెన్ స్టూడియోగా మారింది. భానుమతీ రామకృష్ణ దంపతులు వారి అబ్బాయి భరణి పేరుతో భరణీ స్టూడియోస్ నిర్మించగా, అందులో వారి చిత్రాలతో పాటు యితర చిత్రాలు కూడా నిర్మించబడేవి. సాలి[గ్రామంలో రచయిత అరుణాచలం తన పేరుతో నిర్మించిన అరుణాచలం స్టూడియో, దర్శకుడు కె, ఎస్. గోపాలకృష్ణ నిర్మించిన కర్పగం స్పూడియోలోను, ఆ పక్కనే వున్న పారమౌంట్, శ్యామలా స్టూడియోల్లో కూడా తెలుగు చిత్ర నిర్మాణం జరిగేది. 4ీ్
వాహినీ పతాకంపై పలు చిత్రాలు నిర్మించిన బి.యన్.రెడ్డ, కె. రామనాధ్, ఎ.కె. శేఖర్, మూలా నారాయణస్వామిలతో కలసి వాహినీ స్టూడియో (1948) నిర్మించి చిత్రాలు తీశాక, విజయపిక్చర్స్ నాగిరెడ్డి దానిని తీసుకొని విజయ-వాహిని స్టూడియో కాంప్లెక్స్ తీర్చిదిద్ది విజయపతాకంపై అందులో చిత్రాలు నిర్మించారు. కాలక్రమేణా వాహిని స్టూడియో అంతరించి సువిశాలమైన ప్టోర్స్తో విజయస్తూడియో అవతరించింది. దానికి పక్కనే వున్న రేవతి స్టూడియోను కూడా నాగిరెడ్డి క్రయం పొంది విజయతో దాన్నికూడా విలీనం చేశారు. అప్పట్లో ఆసియాలో కెల్ల పెద్ద స్పూడియోగా “విజయ- వాహిని'ని చెప్పుకొనేవారు.
జూపిటర్ అధినేత సోము జూపిటర్ స్టూడియో నిర్మించగా, కాలక్రమేణా దానిని యం,జి. రామచంద్రన్ లీజుకు తీసుకున్నారు.
మీర్జాపురం రాజావారు శోభనాచల స్టూడియోను నిర్మించి, స్వయంగా చిత్రాలు నిర్మించారు. కాల(క్రమేణా ఆది వీనస్ స్టూడియోస్‌గా రూపొందింది.
తెలుగులో సినిమాలు కూడా నిర్మించిన మరో స్టూడియో నరసూ (గిండీలో వుంది).
పలుచిత్రాలకు ఛాయా(గ్రహకునిగా పనిచేసిన బి.యస్.రంగా విక్రం స్టూడియోస్ నిర్మించారు. కాలక్రమేణా చిత్ర నిర్మాణం తగ్గిన తరువాత అందులో ఆర్.కె.లాబ్‌ను మాత్రం వినియోగానికి అందుబాటులో వుంచారు.
ఎం.వి, మెయ్యప్ప చెట్టియార్ నిర్మించిన సువిశాలమైన ఏ.వియం. స్టూడియోలో పలు తెలుగు సినిమాలు నిర్మించారు.
అవేక హిట్ చిత్రాలు ఎస్.ఎస్.వాసన్ రూపొందించిన జెమిని స్టూడియోలో నిర్మించబడ్డాయి. కాల ప్రభావంవల్ల ఇప్పుడు ఆ స్టూడియో స్టానంలో షాపింగ్ కాంప్లెక్సు వెలసింది.
సిటడల్ స్టూడియోలో (పరశువాకం) వారెన్నో తెలుగు చిత్రాలు నిర్మించారు.
నిర్మాత, దర్శకుడు కోవెలమూడి (ప్రకాశరావు నిర్మించిన ప్రకాశ్ స్టూడియోలో వారి స్వంత సినిమూలేగాక యితర సినిమాలు కూడా నిర్మించారు. కొంతకాలం షూటింగ్‌లకు దూరమైనా ఇప్పుడు దానిని వారి అబ్బాయి కృష్ణమోహన్‌రావు, రాఘవేంద్రరావు నడుపుతున్నారు. షూటింగ్‌లు అంతగా లేకపోయినా వారి కార్యాలయం, కథా చర్చలు అక్కడ జరుగుతుంటాయి.
46
నిత్య కృషీవలుడు, తెలుగుచలనచిత్ర రంగం గర్వించదగ్గ విశిష్టవ్యక్తి ఎల్.వి. ప్రసాద్ నిర్మించిన ప్రసాద్ స్టూడియోలో కూడా అసంఖ్యాకంగా తెలుగు సినిమాలు రూపుదిద్దుకున్నాయి.
పొన్నలూరి స్టూడియోస్ 'ప్రారంభదశలోనే నిర్వహణ లోపంవల్ల మూతబడింది.
ఆ రోజుల్లో షూటింగ్ జరిగేటప్పుడే మాటలు కూడా రికార్హయ్యేవి. వాటిని సౌండ్ రికార్డిస్పులు బహు జాగ్రత్తగా రికార్డు చేసేవారు. తరువాత పాటల రికార్డింగ్ కోసం కొన్ని స్టూడియోల్లో రికార్డింగ్ ధియేటర్స్ ప్రత్యేకంగా నిర్మించగా అందులో సౌండ్ యింజనీర్హు పాటలు రికార్డు చేసేవారు. ఆ విధంగా సౌండ్ రికార్డిస్పాలుగా యింజనీర్టుగా ఆ రోజుల్లో ప్రాచుర్యం పొందిన వారిలో స్వామినాథన్, వల్లభజోస్యుల శివరాం (ఈయన కొన్ని సినిమాల్లో నటించారు కూడా). కోటేశ్చ్యరరావు, కృష్ణంరాజు, వాహినీ జగన్నాథ్, రామనాథన్, కె. విశ్శనాథ్ (సుప్రసిద్ద దర్శకులు) ముఖ్యులు.
ఇప్పుడు మ(్రాసులో తెలుగు సినిమాలకు సంబంధించి షూటింగ్‌లు జరక్కపోయినా సై చెప్పిన కొన్ని స్టూడియోలలో వున్న రికార్డింగ్ థియేటర్లలోనూ, ఎస్పి. బాల సుబ్రహ్మణ్యం నిర్మించిన కోదండపాణి రికార్డింగ్ థియేటర్గోను తెలుగు సినిమా పాటలు రికార్డు చేస్తున్నారు.
ఇక హైద్రాబాద్ విషయానికి వస్తే-తాలిరోజుల్లో అజంతా స్టూడియో, జహనుమా (సదరన్ మూవీటోన్) లో తక్కువగా చిత్ర నిర్మాణం జరిగింది.
సారథి ఫిలింస్ అధినేతలు అమీర్‌పేటలో సారధి స్టూడియోస్ నిర్మించగా, అందులో నిర్మించిన మొదటి చిత్రం మా యింటి మహాలక్ష్మి అక్కినేని నాగేశ్సరరావు మద్రాసు నుండి హైదరాబాద్ తరలివచ్చాక ఆయన కథానాయకుడిగా చిత్రాలు ఆ స్టూడియోలో నిర్మించారు. అంజలి పిక్చర్సు నిర్మించిన “మహాకవి క్లేత్రయ్య”కు సారథిలో వీలుపడకపోవడంవల్ల వారు మైసూరు రాష్ట్రంలో ఆ చిత్రం నిర్మించారు. ఆ సందర్భంలో స్టూడియో ఆవశక్యకతను. గుర్తించ అక్కినేని రికార్డ్ టైంలో 'అన్నపూర్ణ స్టూడియోస్” నిర్మించారు. అందులో నిర్మించిన తొలి చిత్రం సెక్రటరి (1976).
ఆ తరువాత యన్.టి.రామారావు రామకృష్ణా స్టూడియోస్ నిర్మించి, చిత్ర నిర్మాణం కొనసాగించారు.
(ప్రభుత్వ (ప్రోత్సాహలను పురస్కరించుకొని సంచలన నటుడు కృష్ణ పద్మాలయ స్టూడియోస్, సురేష్ అధినేత రామానాయుడు ఆయన పేరుమీద రామానాయుడు స్టూడియోస్ నిర్మించారు.
47
నిర్మాత కె. రాఘవ ్రతాస్ రికార్డింగ్ థియేటర్ నిర్మించారు. ఇందులో డబ్బింగ్, రికార్డింగ్, రీరికార్డింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
"హైద్రాబాద్‌లో తగినన్ని స్టూడియోలు వున్నాయి. కానీ ముఖ్యమైన ఫిలిం లేబొరేటరీ లేదు. ఈ అవసరాన్ని గుర్తించి ఎల్వి. (ప్రసాద్ ఆయన పేరు మీద ప్రసాద్ ఫిలిం లేబొరేటరీ" నిర్మించారు. ఇందులో రికార్డింగ్ ధియేటర్ కూడా వుంది.
కౌముదీ అధినేత యం.యన్. రెడ్డి శబ్బ్దాలయ రికార్డింగ్ ధియేటర్ నిర్మించారు. (క్రియేటివ్ కమ్మర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు గారి సి.సి. ఛానల్స్ స్టూడియోలో ఎడిటింగ్, రికార్డింగ్, డబ్బింగ్ సౌకర్యం వుంది. (నిర్వహణ కె. వెంకటేశ్చరరావు)
ఈనాడు అధినేత ఉషాకిరణ్ నిర్మాత రామోజీరావు యావత్ భారతదేశం గర్వించదగ్గ రితిలో 'రామోజి ఫిలిం సిటీ" నిర్మించారు. ఇందులో చిత్ర నిర్మాణానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు.
హైద్రాబాద్‌లో వున్న స్టూడియోల్లో సర్వ సౌకర్యాలతో, సొమ్ముతో వచ్చిన నిర్మాత ఫస్ట్ ప్రింట్ తీసుకువెళ్ళే విధంగా ధూపుదిద్దుకున్నవి రామోజి ఫిలిం సిటీ, రామానాయుడు స్టూడియో, పైన పేర్కొన్న స్టూడియోల్లో రికార్డింగ్ సౌకర్యాలు కూడా ఉన్నవి. ఆ సౌండ్ రికార్డిస్పుల వివరాలలోకి వెళితే రామోజి ఫిలిం సిటీ-(కర్షల్ గుిష్ రామానాయుడు (తుకారాం, నరసింహం, వసంత్, శేఖర, (ప్రసాద్ (రాధాకృష్ణ కుమార్ వేలన్) పద్మాలయ (రాము), శబ్బాలయ (కొల్లి రామకృష్ణు, అన్నపూర్ణ (లక్ష్మారెడ్డి, కాగా ఈ స్పూడియోల్లో వున్న ఎడిటింగ్ రూములే. గాక వేరేగా నిర్వహించబడుతున్న వాటిల్లో కొన్ని; ఆనంద్ సినీ సర్వీస్, జ్యోతి ఫిలిం ఎడిటింగ్ సెంటర్, కళా ఎడిటింగ్ రూమ్, ఆర్కె. ఎడిటింగ్ రూమ్.
ఒక్కోసారి యీ స్ప్టూడియోల్లో నిర్మించబడ్డ సెట్స్‌ని తొలగించకుండా కొద్ది మార్పులు చేసి మరో నిర్మాత వాడుకున్న సందర్బాలు అనేకం వున్నాయి. ఏమయినా ఇప్పుడు హైదరాబాద్ లో చిత్రనిర్మాణ ప్రక్రియకు సంబంధించిన అన్ని వనరులు వున్నాయనేది సుస్పష్టం. ఈ మేరకు ఆ యాజమాన్యాన్నీ ప్రభుత్వాన్నీ ప్రశంసించాల్సిందే! అయినా యింకా జరగవల్సిన (ప్రగతి కొంత వుంది. ఆ శుభతరుణం కోసం ఎదురుచూద్దాం!
ఫై శం
ను జ ప. నయ. న. ప. ర. అ స. సంలు | న [న 13.9824 స5 84 8స6? 19గ4గఉ0 భో నే గనం తం
న్ న. 511 రన్ యనే
నా 1. ! యా విసా... - వా. న ల న న... |. . తహ | నం ఇ జా
స అనని 2 లు . ము, సు న సీ న.
. | శ సా హా. మ! త | ॥ ట్ స! (. (7 క్ష: స ల మ. ము. |] సట .. 0 క (| య. శీ స
0 (అను భా చ.
.'ఉధిలిగటు స
గ లీ న. వ. క లు! వతు [గ త ము టు. టు ప... యట... ను న. య వు మం! దర కలు మ ల గగ 2 గు రరకికిన 3406. కలిగిం టట 440 | టే మ షరి! 61114101 క 5 చే... ీు యు మెం. ల్ని
ఫా వ లౌ న. బిగి ప. వ. || నో (/ | మ. న్ గన | ప. వ. /. చ య. 4. య గ గ జ. క్ట 1 వ . . గ మ గగన న. న. 1 స. [స ॥ 1. మ్ ఎ .. . న కీ ల (| ు" 4 శ. ష్ష [ మ్ న! గ |. / [ న ను! త! = (॥ (1! . " లర (1, ( సాలే 4 5 ప. య. ్ట స్ట . 8688 న. నా" 111. గ ॥ _ పా ల య. - 1. 2 న హ్. హం ః వ. . గ! [లో . న నో సహ స్ |. న. ల... మ! ల . చ టా |! మో ర నమా స న. 1 నరక ల! గ 1 చీ 1. న్ సక టీ న. | లగ న. గ్ యం. ఎ! ర్ట
దర్శకులు ఒక నిర్మాత సినిమా తియ్యటానికి నిర్ణయించుకున్న తర్వాత ముందుగా నిర్ణయించుకొనేది దర్శకుణ్ణి. సినిమా నిర్మాణానికి కెప్టెన్ వంటి ఆతి కీలకమైన వ్యక్తి దర్శకుడు. కధా నిర్ణయం దగ్గర్నుంచి చిత్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్మంగా పర్యవేక్షిస్తూ చిత్రీకరణ విధానంలో తన స్వంత శైలిలో, నటీనటుల నుంచి, టెక్నీషియన్స్ నుంచి మంచి ఫలితాల్ని రాబట్టి, అన్నిటినీ సమన్వయం చేసుకొని సినిమాను సంపూర్షరూపంలో ప్రేక్షకుల ముందుంచే గురుతర బాధ్యత దర్శకుడిది. ఇందులో రకరకాల పద్దతులున్నాయి. కొందరు సీనియర్ల దగ్గర పనిచేసిన అసిస్టెంట్లు దర్శకులయ్యారు. మరికొందరు వివిధశాఖల్లో ప్రావీణ్యం సంపాదించి దర్శకులైనారు. ఇంకొందరు యెవ్వరి దగ్గరా పనిచేయకుండా పరిశీలనా దృక్సథంతో చిత్ర నిర్మాణం పట్ట అవగాహన పెంచుకొని దర్శకులయినారు. టెక్నిక్ డామినేట్ చేస్తున్న ఈ రోజుల్లో కూడా ఆ టెప్టిక్ను సందర్భానుసారంగా ఉపయోగించుకోగల్లినవారు సత్తావున్న దర్శకులుగా నిరూపించుకుంటున్నారు. మరికొందరు టెక్నిక్కు దాసోహమై ఎదురుదెబ్బలు తింటున్నారు. ఏమయినా చిత్ర నిర్మాణ (ప్రక్రియలో దర్శకుడిది అద్వితీయస్ట్రానం. పోలీసు డిపార్టుమెంటులో ఉద్యోగానికి ఉద్వాసన పలికి ఇంపీరియల్ స్టూడియోలో అర్జేషిర్ ఇరానీవద్ద దర్శకత్వ శాఖతో పనిచేసిన హెచ్.యం. రెడ్డి (1892-1960) తాలి టాకీ (1931) భక్త ప్రహ్హాదకు దర్శకత్వం వహించారు. ఈయన ప్రారంభించిన రోహిణి సంస్టలో బి.యన్.రెడ్డి. కె.వి.రెడ్డి సన్నిహిత సంబంధాలు కలివున్నారు. చిత్తూరు వి. నాగయ్యను గృహలక్ష్మి చిత్రం ద్వారాను కాంతారావు, రాజనాలను ప్రతిజ్ఞ చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయం చేశారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో యెన్నదగినది నిర్జోషి (1951). వీరి వద్ద సహాయకుడుగా పనిచేసిన అభిమానపుత్రుడు వై.ఆర్.స్వామి రోహిణి నిర్మించిన వద్దంటే డబ్బు, ప్రతిజ్ఞ చిత్రాలకు దర్శకత్వం నెరపారు. హెచ్. ఎం. రెడ్డి గారి బావమరిది హెచ్.వి. బాబు (1903-68) టాకీల తొలిదశకంలో (ద్రౌపదీ వ(స్తాపహరణం, కృష్ణ ప్రేమ, దేవసుం లకు దర్శకత్వం వహించారు. భో లాలు ఎర్థ్య్నా కుర *) ా యా గ
హెచ్. వి. బాబు వద్ద తరువాత బి. యన్. రెడ్డి గారి వద్ద దర్శకత్వం శాఖలో పనిచేసిన పి. యస్. రామకృష్ణారావు (1918-86) భరణీ పతకంపై స్వీయ దర్శకత్వంలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగిన లైలా మజ్నూ, విప్రనారాయణ, బాటసారి చిత్రాలు అందించారు.
ఈయన దగ్గర పనిచేసిన పి.వి.రామారావు “భక్త జయదేవ” (1961కు దర్శకత్వం వహించారు.
కడప జిల్లాలో కొత్తపల్లిలో జన్మించిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి,యన్నరెడ్డి
- 1908-77), ఎక్కొంటెంట్గా అనుభవం సంపాదించి, రోహిణి వారి గృహలక్ష్మికి సినేరియాలో సహకరించి, వాహినీ పతాకంపై తొలిసారిగా వందేమాతరం” (1939) చిత్రానికి దర్శకత్వం వహించారు. వాహినీ పతాకంపై నిర్మించబడ్డ తొమ్మిది చిత్రాలకు, బయట సంస్థలకు, పూజాఫలం, భాగ్యరేఖ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
రాసిలో తక్కువయినా వాసిలో తెలుగుజాతి మరచిపోలేని చిత్రాలు బంగారు పాప, రంగుల రాట్నం, దేవత, స్వర్గసీమ అందించారు. అజరామర (ప్రేమకావ్యం 'మల్లీష్ళరి ఆయన (ప్రతిభకు నిలువుటద్దం.
మూకీ చిత్రం భక్త మార్కేండేయ తీసిన కాకినాడ వాసి చిత్తజల్టు (సి) పుల్లయ్య (1895-1967) ఈస్టిండియా పతాకంపై సావిత్రి, వరవిక్రయం, సంక్రాంతి, సోషియోఫాంటసీ దేవాంతకుడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. హాస్యనటుడు రేలంగిని హీరోని చేసిన హాస్యరస ప్రధాన చిత్రం పక్కింటి అమ్మాయి” నవ్వుల పువ్వులు వెదజల్లింది.
భానుమతి, అంజలి, శివరావు వంటి ఎందరో అర్టిస్టుల్ని టెక్సీషియన్స్ని పరిచయం చేశారు.
ఈయన వద్ద పని చేసిన వీరి అబ్బాయి సి్మియస్.రావు సాంఘిక (శాంతినివాసం), జానపద (కంచుకోట), పౌరాణిక (వాల్మీకి), చిత్రాలకు దర్శకత్వం నెరపిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన రూపొందించిన 'కీలుబొమ్మలు” రష్యాలో ప్రదర్శించబడింది. ఈయనలో మంచి నటుడున్నాడు, (పక్కింటి అమ్మాయి, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య) స్వయంగా నటించి చూపి ఆర్టిస్టుల నుంచి మంచి ఫలితాలు రాబట్టటం, స్పీడ్‌గా చిత్రాన్ని పూర్తి చేయగలగటం ఈయన ప్రత్యేకత.
52
నెల్లూరులో జన్మించిన నటుడు, గొయకుడు పి. పుల్లయ్య (1911-1985) బాబురావు పెయింటర్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి తొలిసారిగా హరిశ్చంద్ర (1935) కు దర్శకునిగా పనిచేసి తరవాత రాగిణి సంస్థపై పలు చిత్రాలకు, అటు తమిళ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. ఈయన చిత్రాల్లో చెప్పుకోదగ్గవి అర్జాంగి, వెంకటేశ్చర మాహత్మ్యం.
బందరుకు చెందిన చిత్రపు నారాయణమూర్తి, పి.వి.దాసుగారి వేల్ పికర్స్లో సోదరుడు నరసింహారావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి తొలిసారిగా మార్కండేయ (1938) చిత్రాన్ని డైరెక్టు చేశారు. పూర్తి సెంటిమెంటల్ చిత్రం నా చెల్లెలు (1953) ఈయన ప్రతిభను చాటింది. ఏవియం వారి పౌరాణిక చిత్రాలు నాగులచవితి, భక్త ప్రహ్లాద ఈయన దర్శకత్వంలో నిర్మించబడినవే!
తాడిపత్రికి చెందిన కదిరి వెంకటరెడ్డి (3.వి.రెడ్డి 1912-72) సైన్సులో పట్టం పొంది అటు రోహిణీ తరువాత్తయిటు వాహినీ సంస్థలోనూ ఒక వైపు నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటూ మరోవైపు దర్శకత్వశాఖలో కూడా పనిచేస్తూ తొలిసారిగా 1942లో భక్త పోతన చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పక్కాగా ్రిప్పు రూపొందాకే చిత్రాన్ని ప్రారంభించే బహుకొద్ది మందిలో ఆద్యులు కె.వి.రెడ్డి. ఇదే పంధాను తరువాత యన్.టి.రామారావు అనుసరించారు. రెడ్డిగారు అందించిన గుణసుందరి కధ, పాతాళభైరవి, దొంగరాముడు, జగదేకవీరుని కథ, పెళ్ళినాటి ప్రమాణాలు, దేని ప్రత్యేకత దానిదే! హాస్యాన్ని హృద్యమంగా తెరకు అనువదించడం ఆయనకే చెల్లెంది. ఆయన దర్శకత్వంలో రూపొందిన అజరామర దృశ్య కావ్యం 'మాయా బజార్ సినిమా చూడని ప్రేక్షకుడు వుండడు అనటం
అతిశయోక్తి కాదు. ఆ సినిమాపై వచ్చినన్ని విశ్తేషణా వ్యాసాలు బహుశా మరే చిత్రం గూర్చి రాలేదు.
ఏలూరు దగ్గర సోమవరప్పాడులో జన్మించిన యల్, వి. (ప్రసాద్ (1908-94) నటన, సినిమారంగంపై గల మక్కువతో ఇల్టు వదలి బొంబాయి చేరి తెలుగు హిందీ తమిళంలో నిర్మించబడిన తాలి టాకీచిత్రాలలో చిన్న పాత్రలు పోషించి, ప్పర్వీ థియేటర్స్ నాటకాలలో నటించి తొలిసారిగా సారధి వారి గృహఫ్రవేశంలో (1946) కథానాయకుడుగా నటించి దర్శకత్వం వహించారు. సొసైటి సమస్యను హాస్యంతో రంగరించి చిత్రాన్ని తీయటం ఈయన ప్రత్యేకత. “సంసారం, పెళ్లిచేసిచూడు, మిస్సమ్మ” ఈ విషయాన్ని బుజువు చేశాయి. ప్రసాద్ చాలా వరకు తెలుగులో
విజయవంతమెన కథా బలమున్న అనేక చిత్రాలను హిందీలో 53
నిర్మించి ఘన విజయం సాధించారు. 'ద్రోహి చిత్రానికి ఈయన దర్శకత్వం వహించి ఓ రౌడీ వేషం కూడా వేశారు. ఈయన నటించిన సన్నివేశాలకు ఈయన వద్ద సహాయకునిగా పనిచేసిన తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించారు. వయసు "పెరిగిన తరువాత కూడా “అమావాస్య చంద్రుడు'లో సరదాగా నటించారు. ఈయన తీర్చిదిద్దిన 'మనోహర'* చిత్రం చక్కని (స్కీనొప్టేకు నిదర్శనం.
ప్రసాద్‌గారి దర్శకత్వంలో (ద్రోహి నిర్మించిన కె.ఎస్.ప్రకాశరావు, స్వీయ దర్శకత్వంలో ప్రకాష్ ప్రొడక్షన్స్ పేరిట మొదటిరాత్రి, కన్నతల్లి నిర్మించారు. (ప్రకాశరావు దర్శకత్వం వహించిన చిత్రాల్లో ప్రేమనగర్, తాసిల్దార్‌గారి అమ్మాయి, సెక్రటరి చిరకాలం గుర్తుండిపోయేవి.
యల్ వి. ప్రసాద్ గారి వద్ద సహాయకునిగా పనిచేసిన తాతినేని ప్రకాశరావు (1924-92) తాలిసారిగా దర్శకత్వం వహించిన చిపత్రం పల్లెటూరు (1952). ఆ తరువాత ఆయన తెలుగు తమిళ హిందీ భాషల్లో యెన్నో చిత్రాలకు దర్శకత్వం నెరపారు. జయం మనదే. ఇల్లరికం చిత్రాలు సూపర్ హిట్స్,
చఛాతినేని (ప్రకాశరావు వద్ద సహాయకునిగా పనిచేసిన కె. ప్రత్యగాత్మ తాలిసారిగా పి.ఏ.పి.వారి 'భార్యాభర్తలు' చిత్రానికి దర్శకునిగా పనిచేశారు. వీరు రూపొందించిన చిలకా గోరిక చిత్రం ద్వారా కృష్ణంఠాజును హీరోగా పరిచయం చేశారు. అర్హవంతమైన ఆలోచనలు ప్రేక్షకుడిలో రేకెత్తించే విధంగా కొత్త తరహాలో ఆలోచించి చిత్రీకరించటం ఆయనలోని" స్పెషాలిటీ,
(ప్రత్యగాత్మ గారి సోదరుడు హేమంబరధరరావు దర్శకత్వం వహించిన వాటిల్లో చెప్పుకోదగ్గవి ఆడపడుచు, కధానాయకుడు.
(ప్రత్యగాత్మ గారి అబ్బాయి కె వాసు హాస్యరస (ప్రధాన చిత్రాల్ని రూపొందించ టంలో (గోపాలరావుగారి అమ్మాయి) మంచి నేర్పు చూపించారు.
ప్రత్యగాత్మ గారి వద్ద పనిచేసిన తాతినేని రామారావు తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం పి.ఏ.పి, వారి నవరాత్రి. ఈయన రూపొందించిన యితర చిత్రాల్లో చెప్పుకోదగ్గ వి భార్యాబిడ్డలు, యమగోల.
ఎల్ వి. ప్రసాద్‌గారి సోదరుడు, సంజీవి అటు ఎడిటరుగా (ఆత్మబలం, జల్పారాయుడు, బంగారు గాజులు మొ॥) యిటు దర్శకునిగా (ఇల్టాలు, ధర్మదాత, అక్కాచెల్లెళ్ళు) పేరొందారు,
కశ
ప్రసాద్ గారి వద్ద శిష్యరికం చేసిన మరో దర్శకుడు డియోగానంద్ 1953లో అమ్మలక్కలు చిత్రంతో పరిచయమై, ఇలవేల్పు, జయసింహ, ఉమ్మడికుటుంబం చిత్రాలు అందించారు.
బి. ఏ. సుబ్బారావు వద్ద పనిచేసిన తాపీ చాణక్య, అంతా మనవాళ్ళే చిత్రం ద్వారా పరిచయమై, రోజులు మారాయి, రాముడు భీముడు వంటి హిట్ చిత్రాలు అందించారు.
ఉదయశంకర్ (కల్చన) ఎన్. కె. గోపాల్ (జెమినీ) వద్ద ఎడిటింగ్ శాఖలోను కెయస్. ప్రకాశరావు వద్ద దర్శకత్వ శాఖలోనూ పనిచేసిన ఆదుర్తి సుబ్బారావు (1921-75) తొలిసారిగా దర్శకత్వం వహించిన సంగీత భరిత చిత్రం “అమర సందేశం". ఆ తరువాత ఆయన అన్నపూర్హ సంస్తకు, బాబూ మూలవీస్కు అణిముత్యాల వంటి చిత్రాలు అందించారు. రచయిత, నిర్మాతలతో కలసి స్రీస్ట్ క్షుబ్బంగా చర్చించి కొత్తదనంతో చిత్రం తీయటానికి తపన పడేవారు. స్వతహాగా ఎడిటర్ కావటం వలన తీయవలసిన సన్నివేశం ముందుగానే మనసులో వూహించుకొని తీయటం, ముఖ్యంగా పాటల్ని చిక్రీకరించాల్సి వచ్చినప్పుడు ఆయన ప్రతిభ తెలిసేలా చిత్రీకరించేవారు.
ఏ చరణంలోని యే భాగాన్ని, ఇంటర్ల్యూడ్స్లో ఏ బిట్‌ని యెవరి మీద చిత్రీకరించితే కధాపరంగా మంచి ఫలితం వస్తుందో వూహించగల విశిష్ట దర్శకుడు ఆదుర్తి, ఇందుకు మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి ఇద్దరు మిత్రులు చిత్రంలో చిత్రీకరించిన పాటలు చక్కని వుదాహరణ.
ఆదుర్తి వద్ద శిక్షణ పొందిన ఎడిటర్ టి. కృష్ణ దర్శకునిగా 21 రోజుల్లో అపాయంలో ఉపాయం నిర్మించారు. ఈయన రూపొందించిన హిట్ చిత్రం ఖైదీ బాబాయ్.
బందరులోని కృష్ణా పత్రికకు సినిమా సమీక్షలు వ్రాసి, హిట్ అయిన (ద్రౌపదీ వస్త్రాపహరణం కంటె ద్రౌపది మాన సంరక్షణలో విలువలు వున్నాయని [వ్రాయగా హెచ్.యంగెడ్డి సహృదయంతో స్వీకరించి, ఆహ్వానించగా మద్రాసు చేరిన వ్యక్తి కమలాకర కామేశ్చరరావు (1911-98). వాహినీ స్టోరీ డిపార్ట్మెంటులో పనిచేసి తొలిసారి 'చంద్రహారం' తీయగా, ఫెయిలయ్యింది. తరువాత తీసిన 'పెంకిపెళ్ళాం' అంతంత మాత్రమే. అయితే ఈయన సత్తా తెలిసిన యన్.టి.ఆర్ కల్పించిన అవకాశం “పాండురంగ మాహత్మ్యం” హిట్ కావటంతో కామేశ్చరరావు పరి[శ్రమ
క్
దృష్టిని ఆకర్షించారు. భారత, రామాయణ, భాగవత కధలు ఆయనకు కరతలామలకం. పౌరాణికం తీస్తే ఆయనే తీయాలి అని నిరూపించిన చిత్రాలు పాండవ వనవాసం, శ్రీకృష్ణావతారం, నర్తనశాల, అలాగే మహామంత్రి తిమ్మరుసు, మహాకవి కాళిదాసు. ఆయన రూపొందించిన సాంఘిక చిత్రం “గుండమ్మ కథ”, ఈ చిత్రాలు ఆయనకు తెలుగు చలనచరిత్రలో ప్రధమ పంక్తిలో సుస్టిర స్థానాన్ని కల్పించాయి.
నృత్యదర్శకునిగా సినీరంగ ప్రవేశం చేసి గరుడగర్వభంగంలో నటించి, బాలరాజు, లైలామజ్నూ, స్వప్ప సుందరి చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించి, 1951లో వినోదా పతాకంపై స్త్రీ సాహసం చిత్రానికి దర్శకత్వం వహించిన వేదాంతం రాఘవయ్య (1919-1971) సమర్జుడయిన దర్శకుడు. సహజంగా నృత్యదర్శకుడు గావటం చేత యీయన చిత్రాల్లో (సువర్ల్షసుందరి, అనార్కలీ, భలేరాముడు) నృత్యాలకు ప్రాధాన్యత వుండేది. దేవదాసు యీయన రూపొందించిన గొప్ప చిత్రంగా పేర్కొనాలి.
కృష్ణాజిల్హా ఈడ్పుగల్లులో జన్మించి విద్యార్థి జీవిత దశలోనే జైలుకు వెళ్ళి ప్రజానాట్యమండలి కార్యక్రమాల్లో చురుకుగా పాల్లొన్న వీరమాచనేని మధుసూదనరావు సినీరంగ ప్రవేశం చేసి కె.ఎస్.ప్రకాశరావు, తాతినేని ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి తొలిసారిగా ఒక పౌరాణిక చిత్రం 'సతీ తులసి" (1959)కి దర్శకత్వం వహించారు. ఆ తరువాత ఆయన దర్శకత్వం వహించిన వాటిల్లో ఎనభై శాతం హిట్ చిత్రాలే. ముఖ్యంగా జగపతి వారికి ఆయన తీసినవన్నీ మేలిముత్యాలే। సన్నివేశాన్ని పాటల్ని అర్ధవంతంగా ధ్రిల్లింగ్‌గా తీయటం ఆయన ప్రత్యేకత. ఆర్టిస్టులు ఒక విధంగా వీరి వద్ద వళ్ళు దగ్గిరపెట్టుకొని నటించేవారు. అంతటి క్రమశిక్షణ, శక్తి సామర్థ్యాలు ఆయనవి. స్వయంగా నటించి చూపించేవారు. ఈయన వద్ద పనిచేసేవారు ఎందరో దర్శకులైనారు. రక్తసంబంధం, ఆత్మబలం, అదృష్టవంతులు, ఆరాధన, కళ్యాణమంటపం కొన్ని వుదాహరణలు మాత్రమే. వీరి “పదండి ముందుకు" విదేశాల్టో నిర్మించబడి (ప్రశంసలు పొందింది.
మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ స్థాపించి, ఎందరో కళాకారుల్ని తీర్చిదిద్దుతున్న విశిష్టవ్యక్తి విక్టరీ మధుసూదనరావు.
ఆ మధుసూదనరావుగారివద్ద సహాయకులుగా పనిచేసి దర్శకులుగా వినుతికెక్కిన వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది. కె. రాఘవేంద్రరావు (3.ఎస్.ప్రకాశరావు గారి అబ్బాయి). ఆయన తొలిచిత్రం బాబు (1975) నుంచీ ఇటీవలి అన్నమయ్య వరకూ ఆయన సినిమాలో సుందర స్వప్న లోకాల్ని చూపిస్తాడు. (్రిల్స్తో 'జౌరా' అనిపిస్తారు.
వ
హాస్యాన్ని రసస్పోరకంగా పండించి కడుపుబ్బ నవ్విస్తారు. అటు ఎన్.టిఆర్‌కు ఇటు చిరంజీవికి, కృష్ణకు. మోహన్‌బాబుకు, శోభన్‌బాబుకు, యెన్నో డైనమిక్ చిత్రాలు అందించారు. రాజశేఖర్ (అల్లరిప్రియుడు), శ్రీకాంత్ (పెళ్ళిసందడి), మహేష్ (రాజకుమారుడు) లకు కొత్త ఇమేజ్ కల్షించారు. కథనాయికల్ని ప్రకృతిలోని అందాలతో పోలుస్తూ పాటల్ని రసరమ్యంగా చిత్రీకరించటం యీయన ప్రత్యేకత. కాలంతోబాటు, మారుతున్న అభిరుచులతోపాటు తన ట్రెండ్‌ను మార్చుకుంటూ విజయపథంలో సాగిపోతున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు. ఈయన అద్భుతసృష్టి సోషియో ఫాంటసీ జగదేకవీరుడు-అతిలోకసుందరి. ఇంకో శిష్యుడు ఏ. కోదండరామిరెడ్డి సంధ్యతో దర్శకునిగా మారి, చిరంజీవితో ఖైదీ, ఛాలెంజి, రాక్షసుడు వంటి హిట్స్ ఇచ్చారు. మరో శిష్యుడు పిసిరెడ్డి కృష్ణ కథనాయకునిగా పల్లెటూరి వాతావరణానికి సంబంధించిన చక్కని చిత్రాలు (ఇల్టు ఇల్టాలు - పాడిపంటలు) అందించారు. రచయితగా పేరాందిన గోపీచంద్ (1910-62) లక్ష్మమ్మ పేరంటాలు, ప్రియురాలుకు దర్శకత్వం వహించారు. చాటప!ర్రుకు చెందిన గుత్తా రామినీడు తొలిచిత్రం 'మా యింటి మహాలక్ష్మి" ని ఎంతో అనుభవమున్న దర్శకునిలా చిత్రీకరించారు. ఆయన తీర్చిదిద్దిన మరో ఉత్తమ చిత్రం 'చివరకు మిగిలేది” (ఈ చిత్రం ద్వారా డాక్టర్ ప్రభాకర్‌రెడ్డిని పరిచయం చేశారు). కన్నడ రంగంలో జానపద చిత్రాలు తీయటంలో సిద్ధహస్తుడు, విరలాచార్యకు అంతే వాసి అయిన జి. విశ్చనాధం దర్శకత్వంలో చెప్పుకోదగ్గవి 'తోటలో పిల్ల - కోటలో రాణి, 'గోపాలుడు-భూపాలుడు.” ఎడిటర్ అయిన కె.ఎస్.ఆర్.దాస్ నిర్మాత భావన్నారాయణ తొలిసారిగా “లోగుట్టు పెరుమాళ్ళకెరుక” చిత్రం ద్వారా అవకాశం కల్పించారు. ఒక విధంగా దాస్ ట్రెండ్ సెట్టర్‌గా చెప్పాలి. దీనికి ఆయన దర్శకత్వంలో వచ్చిన కౌబోయ్ చిత్రం “మోసగాళ్ళకు మోసగాడు” పేర్కొనాలి. ఆ తరువాత ఆ తరహాలో యొన్నో చిత్రాలు రూపొందాయి. “పెళ్ళికానుకి చిత్రం ద్వారా తెలుగువారికి పరిచయమైన దర్శకుడు శ్రీధర్ అందించిన ఇతర చిత్రాలు 'మనసే మందిరం”, 'వయసు పిలిచింది". సెంటిమెంటల్ చిత్రాల్ని (మరపురాని కధ), యాక్షన్ చిత్రాల్ని (అసాధ్యుడు), వ్?
చరిత్రాత్మక చిత్రం అల్లూరి సీతారామరాజు, సమసామర్ష్యంతో దర్శకత్వం నెరపిన వ్యక్తి వి. రామచం(ద్రరావు.
వాహినీలో సౌండ్ యింజనీరింగ్ శాఖలో పనిచేసి ఆదుర్తి వద్ద అన్నపూర్త వారి చిత్రాలకు దర్శకత్సశాఖలో పనిచేసిన కె. విశ్చనాధ్ తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం 'ఆత్మగౌరవం.' ఆ తర్వాత ఓ సీతకధ, సీతామాలక్ష్మి, సిరిసిరిమువ్వ చిత్రాల్లో ఆయన ప్రతిభ కనపర్చినా, శంకరాభరణం చిత్రం ఆయన్ను దర్శకునిగా శిఖరా(గ్రాన నిలబెట్టింది. అసలు శంకరశాస్త్రి పాత్రకు సోమయాజుల్ని, నర్తకి పాత్రకు మంజుభార్లవిని ఎంపిక చేయటంలోనే ఆయన ఆంతర్యం అర్జ్హమౌతుంది. అమలిన శృంగారం, బాహ్యా ఆకర్షణకు అతీతమైన ఆరాధనా భావం ఆయన తీర్చిదిద్దిన పా(త్రల్లో కన్పిస్తాయి. (సాగరసంగమం, స్వాతి కిరణం, స్వాతి ముత్యం, శంకరాభరణం). బహుశా: ఆదుర్తి వారి సహచర్యంలో “మూగమనసులు” తాలూకు (ప్రభావం యిందుకు దోహదం చేసి వుండొచ్చు. సన్నివేశాల్ని నటించి చూపించి మంచి ఫలితాలు సాధిస్తారు. ఈయన చక్కని నటుడు అనికూడా శుభసంకల్పం" నిరూపించింది. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే సంగీత, సాహిత్య, నృత్యాలకు విశ్వనాధుని చిత్రాలు (ప్రతిరూపం.
నిర్మాత పి. గంగాధరరావు సోదరుడు పి. సాంబశివరావు అర్ధరాత్రి చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమై, వంశోద్దారరకుడు, కుమారరాజా, ఈనాడు వంటి వైవిధ్య చిత్రాలు అందించారు.
పాలకొల్టులో నాటకరంగంలో విశేషకృషి చేసి, కె.వి.నందనరావు దగ్గర దర్శకత్వంలోను, పాలగుమ్మి పద్మరాజువద్ద రచనా రంగంలోనూ మెళుకువలు తెలుసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి నారాయాణరావుకు తాలిసారిగా 'తాతా- మనవడు' చిత్రం ద్వారా అవకాశమిచ్చి ప్రోత్సహించారు ప్రతాప్ ఆక్ట్ అధినేత కె. రాఘవ. ఆ చిత్రానికి రచన, దర్శకత్వం నిర్వహించి, యస్.వి.రంగారావు, అంజలి, రాజబాబు వంటి హేమాహేమీలతో తొలి ప్రయత్నంలో సూపర్హేట్ సాధించారు. నాటి నుంచీ నేటిదాకా శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన నారాయణరావు చిత్రాల్లో మెలో (డ్రామాతో పాటు గుండెల్ని కదిసివేసే సెంటిమెంటుకు పెద్దపీట వేస్తారు. డైలాగ్స్‌తో ఆయన చేసినన్ని ఫీట్టు మరెవ్వరూ చెయ్యలేరు. అందరూ కొత్తవారితో 'స్వర్గం-నరకం' తీసి, హీట్ చెయటం ఆయనకే చెల్లింది. ఆ చిత్రంలో ఆచారిపాత్ర ద్వారా సామర్థ్యమున్న నటుడిగా కూడా నిరూపించుకున్నారు. మొదట్లో
5కి
మురళీమోహన్ హీరోగా 'ఇదెక్కడిన్యాయం' వంటి బడ్జెట్ సినిమాలు తరువాత (ప్రేమాభిషేకం, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి వంటి సంచలనాత్మక చిత్రాలు, బడుగువర్గాల జీవితాలకు దర్బణం పట్టిన 'ఒసేయ్ రాములమ్మ వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే బహుదూరపు బాటసారి, రొమాంటిక్, రొమాంటిక్ ట్రయాంగిల్ శ్రీవారిముచ్చట్టు, (ప్రేమాభిషేకం, రొమాంటింక్ సెల్యులాయిడ్ పొయిట్రి మేఘసందేశం- ఆయన ప్రజ్ఞకు ప్రతీకలు. కధ, మాటలతో ఆగక కొన్ని సినిమాలకు పాటలు వ్రాయటం మరి కొన్నిట్లో వేషధారణ చేయటం ఆయనకే చెల్లింది. ఏమయినా తెలుగు చలనచిత్ర సీమకు చెందినంతవరకు దర్శకుడు అన్న పదానికి విలువ పెంచిన వ్యక్తి దాసరి. ఒకవిధంగా చెప్పాలంటే యన్.టి.ఆర్: రాజకీయరంగ ప్రవేశానికి ఈయన సృష్టించిన పాత్రలు కొంతవరకు ప్రేరణ అవటం అతిశయోక్తి కాదు. వీరుకూడా గిన్నిస్ బుక్‌లో చోటు చేసుకున్నారు. (దర్శకులుగా 140 చిత్రాలు),
దాసరి వద్ద పనిచేసిన అనేకమంది శిష్య (ప్రశిష్యులు ఎందరో దర్శకులయ్యారు. వారిలో ప్రముఖంగా పేర్కొనవల్సిన వ్యక్తి పాలకొల్టుకు చెందిన కోడి రామకృష్ణ స్వతహాగా నాటకరంగంనుంచి వచ్చిన వ్యక్తి అవటం చేత స్వయంగా నటించి ఆర్టిస్టుల వద్ద నుంచి కావల్సింది రాబట్టుకొనే సత్తా వుంది. అడపాదడపా వేషాలు వేసిన సందర్భాలు కూడా వున్నాయి. ఈయనకు కూడా ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య” ద్వారా అవకాశమిచ్చారు. మంగమ్మగారి మనవడు, ఇంటిదొంగ, అంకుశం, శత్రువు-యెన్నో వైవిధ్యభరిత చిత్రాలు, (గ్రాఫిక్స్ టెఫ్టిక్స్ వుపయోగించి, అమ్మోరు, దేవి అందించారు. ఈయన కూడా త్వరలో సెంచరీ కొట్టబోతున్నారు.
కె.విరెడ్డి గారి వద్ద దర్శకత్వంలో సహాయకునిగా పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు నీతినిజాయితీ (1972) ద్వారా దర్శకులుగా పరిచయమై ఆహా అనిపించే హాయిగాలిపే చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు సంస్కృతిని చాటిచెప్పిన “అమెరికా అమ్మాయి,” అద్భుత రసాన్ని కలిపిన సోషియో ఫాంటసీ 'ఆదిత్య 369 మాటలు లేని సినిమా పుష్పక్- విజయస్థ్రాయిని గుర్తు చేసిన 'బైరవద్వీపం' (ప్రత్యేకంగా పేర్కొనాలి. ఆ రోజుల్లోనే (1980) బడ్జెట్లో పి.యస్.ఆర్కు జానపద చిత్రం త్రిలోక సుందరి" తీశారు. ఈయన [వ్రాసిన ఒకే ఒక సినిమాపాట 'భైరవద్వీపం” లో 'విరిసినదీ వసంత గానం అలాగే మైకేల్ మదనకామరాజు కథి (డబ్బింగ్ చిత్రం) టైటిల్ సాంగ్ నటిస్తూ స్వయంగా పాడాడు.
5్రి
కమల్ హాసన్‌తో ఆయన తీసిన తమిళచి(త్రాలు (తెలుగు డబ్బింగ్ 'విచిత్ర సోదరులు”) రాజేంద్రప్రసాద్‌కు తీసిన మేడమ్” చెప్పుకోదగ్గవి. సాఫీగా యింటరెస్టింగ్గా కొత్తదనంతో కథనం రూపొందించుకోవటం యీయన ప్రత్యేకత.
జంధ్యాల రచయితగా ఎంత ప్రసిద్దుడో దర్శకునిగా అంత సమర్హుడు. ఈ విషయం ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'ముద్ద మందారం” నిరూపించింది. “ఆనందభైరవి” ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఇక ఉషాకిరణ్‌కు చేసిన “శ్రీవారికి (ప్రేమలేఖ) నవత కృష్ణంరాజుకు చేసిన “నాలుగు స్తంభాలాట” (సుత్తి జంట పరిచయం) సురేష్ తీసిన 'అహ నా పెళ్ళంట' (బ్రహ్మానందం పరిచయం) చిత్రాల్లో ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించారు. పరకాయ(స్రవేశం కధావస్తువుగా తీసిన రావు-గోపాలరావు నిజంగా కత్తి మీద సాము. ఈయన సరదాగా బరువైన పా(త్ర పోషించబడింది. “ఆపద్బాంధవుడు.”
అత్యంత సామాజిక స్పృహతో సంచనలాత్మకం, (ప్రయోజనం కల్లిన చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తి టి. కృష్ణు నేటిభారతం, ప్రతిఘటన, ఈ రెండు చిత్రాలు- అత్యంత సహజంగా తీయటం ఆయన ప్రత్యేకత, ఆయన్ని చిరంజీవిగా చేసిన చిత్రాలు కూడా అవే!
పై విషయాన్ని మరో కోణంలో ఆవిష్కరించిన దర్శకుడు వేజెళ్ళ సత్యనారాయణ. ఆయన తీర్చిదిద్దిన 'మరోమలుపు. 'ఈ చరిత్ర యే సిరాతో “ఈ పిల్లకు పెళ్ళవుతుందా?” నేటి సభ్య సమాజంలోని సామాన్య కుటుంబ జీవితాలకు దర్పణాలు.
ఇదే స్కూలులో మొదట చిత్రాలు తీయటానికి అలవాటుపడ్డ దర్శకులు ముత్యాల సుబ్బయ్య (కలికాలం) తరువాత కొంచెం పద్దతి మార్చుకొని వ్యాపారాత్మక విలువల్ని కథలో కళతో జోడించి పవిత్రబంధం, హిట్టర్వంటి చిత్రాలు అందించారు.
ముందు రచయితగా, తర్వాత నిర్మాతగా మారిన విజయబాపినీడు దర్శకత్వంలో మంచికధ, కథనం, సెంటిమెంట్. ఎంటర్టైన్మెంట్ సమపాళ్ళలో వుంటాయని నిరూపించిన చిత్రాలు మగమహారాజు, నాకూ పెళ్ళాం కావాలి, గ్యాంగ్ లీడర్.
తమిళనాడులో స్టేజినుండి తెరకు వచ్చిన కె. బాలచందర్ మొదటి చిత్రం “అంతులేని కధితో ఆంధ్రులకు అభిమానపాత్రుడైనాడు. అందులో మధ్యతరగతి మహిళా జీవితాల్ని ఆవిష్కరిస్తూ 'మరో చరిత్ర" లో చక్కని ప్రేమకధను సెల్యులాయిడ్‌పై చూపించి చరిత్ర సృష్టించారు. ఆయన రూపొందించిన మరో రెండు గొప్ప చిత్రాలు గుప్పెడు మనసు, ఇది కథకాదు.
60
ఈయన వద్ద పనిచేసిన కె. ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రాలు “ఈ ప్రశ్నకు బదులేది?, 'నవయుగం.”
సురేష్ పతాకం ద్వారా పరిచయమైన దర్శకుల్లో ముందుకు దూసుకెడ్తున్న వ్యక్తిగా బి. గోపాల్‌ను పేర్కొనాలి. బొబ్బిలిరాజా తరువాత రౌడీ యినప్పెక్టర్, అసెంబ్లీ రౌడీ, సమరసింహారెడ్డి చిత్రాల విజయాలు ఆయన సామర్ద్వానికి నిదర్శనాలు.
మహిళా పక్షపాతి అని ముద్రపడ్డ నిర్మాత కె. (క్రాంతికుమార్ దర్శకత్వం చేపట్టి స్వాతి, '్రవంతి, సీతారామయ్యగారి మనవరాలు చిత్రాలద్వారా తన ఆంతర్యంలో దాగివున్న క్రియేటివిటీ యేమిటో నిరూపించుకొన్నారు.
గిరిబాబు నిర్మించిన తొలి వైట్ అండ్ బ్లాక్ సినిమాస్కోప్ చిత్రం 'దేవతలారా దీవించండి'తో హిట్ కొట్టిన దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు, పింజల సుబ్బారావుకు లక్ష్మీపూజ, హాస్యచిత్రం తాయారమ్మ-బంగారయ్య అందించారు.
హాస్యానికి నీటు, నాటు, మోటు యేమిటి-ఏదయినా బాగా దట్టించి తీస్తే (ప్రేక్షకులు నవ్వితీరాల్సిందే అని నిరూపించి అటు రాజేంద్రప్రసాద్నీ, యిటు నరేష్నీ కామెడీ హీరొలుగా (ప్రమోట్ చేసిన ఘనత రేలంగి నరసింహారావుది.
విలక్షణ నటుడు సి.యస్.ఆర్. అల్లుడు దుర్గానాగేశ్చరరావు విజయ, సుజాత, బొట్టు-కాటుక చిత్రాల్ని సంసారపక్షంగా రూపొందించారు.
దాసరి శిష్యుడు రాజాచంద్ర నటుడు మురళీమోహన్ జయభేరి పతాకంపై రూపొందించిన పలు చిత్రాలకు (ముగ్గురు మిత్రులు) దర్శకత్వం వహించారు.
మరో శిష్యుడు రవిరాజా పినిశెట్టి (రచయిత పినిశెట్టి కుమారుడు) మంచి సత్తా వున్న దర్శకుడు అని నిరూపించిన చిత్రాలు చంటి, పెదరాయుడు,
ఆల్‌రౌండర్ పేకేటి శివరాం కన్నడ భాషల్లో నిర్మించిన చక్రతీర్హకు రాష్ట్రపతి బహుమతి లభించింది. దీనిని “చుట్టరికాలు” పేరుతో తెలుగులో నిర్మించారు. ఈయన దర్శకత్వంలో యన్.టి.ఆర్. నటించి, నిర్మించిన చిత్రం 'కులగౌరవం.”
సాంకేతికంగా వున్నత విలువలతో శివ ద్వారా ఓ ట్రెండ్ సృష్టించిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ( సౌండ్ యింజనీర్ కృష్ణంరాజుగారి అబ్బాయి) విచిత్రమైన రీతిలో సినిమాలు కొత్త డైమన్షన్‌లో తీస్తారన్న 'పేరు పొందారు. అదే శైలిలో ఆయన స్కూలుకు చెందిన కృష్ణవంశీ (నిన్నే పెళ్ళాడుతా), సురేస్వర్మ (మృగం) చెప్పుకోవాలి,
61
ఈ చివరి దశాబ్దంలో హిట్ డైరెక్టరుగా పేరొందిన వ్యక్తి ఇ.వి.వి.సత్యనారాయణ. జంధ్యాలవద్ద పని చేసిన యీయనకు 'ప్రేమఖైదీతో గుర్తింపుతో “ఆ ఒక్కటి అడక్కు'తో మంచి బ్రేక్ “హల్లో బ్రదరొతో టాప్ రేంక్ లభించాయి.
మనీషా పతాకంతో సంగీతకర్తగా, నటుడిగా, దర్శకునిగా, కధకునిగా మంచి ఫలితాలు సాధిస్తున్నారు యస్.వి.కృష్ణారెడ్డి (యమలీల - ఉగాది).
ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్, జగపతిలోనూ దర్శకత్వశాఖలో పనిచేసిన ఎ. మోహనగాంధి చిత్రాల్లో అత్యధికమైన పేరు తెచ్చింది, విజయశాంతికి లేడీ సూపర్‌స్టార్ యిమేజ్ను ఇచ్చింది 'కర్తవ్యం.'
ఇక నటుడిగా ప్రసిద్దినాంది దర్శకత్వం చేపట్టినవారిలో ముందుగా నాగయ్య గారిని పేర్కొనాలి. ఆయన స్వీయ దర్శకత్వంలో త్యాగయ్య (1946) నిర్మించారు. యునెస్కో ఆధ్వర్యంలో పారిస్‌లో జరిగిన చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడి ప్రశంసలు పొందిన చిత్రం త్యాగయ్య.
ముక్కామల కృష్ణమూర్తి యం.క.యం. పతాకంపై స్వీయ దర్శకత్వంలో 'మరదలు పెళ్ళి (1952) నిర్మించారు. నటుడు లంక సత్యం, జీవన్ముక్తి చిత్రానికి, అడ్డాల నారాయణరావు అమాయకుడు చిత్రానికి దర్శకత్వం నెరపారు,
కారెక్టర్ నటుడు ప్రభాకర్లెడ్డి రచయిత, దర్శకుడు కూడా. ఈయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ప్రతిభావంతుడు.”
కృష్ణలో మంచి దర్శకత్వపు స్పార్క్ వుందని రుజువు చేసిన చిత్రాలు 'సెంహాసనం' “కొడుకుదిద్దిన కాపురం.” సింహాసనం చిత్రానికి ఆయన కధ, స్ర్కీన్‌ప్లే, ఎడిటింగ్ కూడా నిర్శహించారు.
హాస్యనటులు ఏవియస్ దర్శకత్వం వహించిన చిత్రం 'సూపర్ బ్రదర్స్”, నగేష్ దర్శకత్వం వహించిన చిత్రం మొరటోడు.
యావత్ తెలుగు ప్రేక్షకలోకం దర్శకునిగా యన్.టి.ఆర్ ప్రతిభా పాటవాలకు నీరాజనం పట్టింది. కె.వి.ెడ్డిగారి శైలిలో పక్కాగా (స్కిఫ్ట్ ముందుగా రూపాందించు కోవడం ఆయనకు ఆలవాటు. ఆయన దర్శకత్వంలో తీర్చిదిద్దిన దానవీరశూరకర్ష బ్రహ్మర్షి విశ్వామిత్ర, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర యిందుకు నిదర్శనాలు (పేరు వేసుకోని చిత్రాలు సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణ పాండవీయం)
62
కొన్ని చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించిన డా॥ యన్. శివప్రసాద్ “ప్రేమ తపస్సు"కు దర్శకత్వం వహించి, నటి రోజాను నాయికగా పరిచయం చేశారు.
రచయితలుగా పేరొందిన కొందరు అప్పుడప్పుడు దర్శకత్వం చేపట్టిన సందర్భాలు వున్నాయి. వాటిని పరిశీలిస్తే డి,వి.నరసరాజు (కారు దిద్దిన కాపురం), ఆత్రేయ (వాగ్దానం), రాజశ్రీ (చదువు-సంస్కారం), పరుచూరి బ్రదర్స్ (కాయ్ రాజా కాయ్), వీటూరి (భారతి), పేరాల సుబ్రహ్మణ్యం (మావూరి పెద్దమనుషులు), గోపిచంద్ (పేరంటాలు), సముద్రాల (వినాయకచవితి), పాలగుమ్మి పద్మరాజు (బికారి రాముడు), జి.3.మూర్రి (అడవి మనుషులు), ధర్మవరపు సుబ్రహ్మణ్యమం (తోకలేని పిట్ట), యండమూరి వీరేంద్రనాథ్ (స్టూవర్ట్‌పురం పోలీసు స్టేషన్), అనిశెట్టి (కన్నులపండుగు, ఓంకార్ (పందిరి మంచం).
కమెరామన్గా వుంటూ చిత్రదర్శకత్వం నెరపిన వారిని పరిశీలిస్తే.......
విశిష్ట ఛాయా([గ్రహకుడు అశోక్‌కుమార్ 'అభినందన*, '“నీరాజనం' చిత్రాల్ని (ప్రతిభావంతంగా తీర్చిదిద్దారు.
యం,.విరఘు. దర్శకత్వం వహించిన 'కళ్ళు' విజ్ఞాల ప్రశంసలు, ప్రభుత్వ బహుమతి పొందింది. ప్రఖ్యాత కమెరామన్ యస్,డి.లాల్ పలు చిత్రాలకు (ఉ: మొనగాళ్ళకు మొనగాడు) దర్శకత్వం వహించగా, సీనియర్ కెమెరామెన్, వియన్. రెడ్డి తీసిన సినిమా 'గంగా గౌరీ సంవాదం", మరో సీనియర్ కమల్ ఘోష్ ఘంటసాల నిర్మించిన 'పరోపకారం'కు దర్శకత్వం వహించారు. కెమెరా విజర్డ్‌గా పేరొందిన వియన్.ఆర్.స్వామి కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాంత్రిక ఛాయా[గ్రహకుడు రవికాంత్‌నగాయిచ్ దర్శకత్వంలో తయారైన చిత్రం 'మహాబలుడు" కె.ఎస్(ప్రకాష్ దర్శకత్వం వహించిన చిత్రం 'రౌడీ గారి పెళ్ళాం'
ఎడిటర్ బి. హరినారాయణ దర్శకత్వం వహించిన జానపదం 'మెరుపువీరుడు” సాంఘికం "పట్టుకుంటే లక్ష, సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ ఎస్.వి.ఎస్. రామారావు దర్శకత్వంలో రూపొందినచిత్రం చిన్నమ్ముకథ. మరో కళాదర్శకుడుఎ.కెశేఖర్: దర్శకత్వం వహించిన చిత్రం “శ్రీకాకుళ ఆం(ధ్రమహావిష్ణువు కధ,”
వాస్తవ చిత్రాలు తీసిన దర్శకులుగా మృణాళ్‌సేన్ (ఒక వూరికథ), ఎ. కుటుంబరావు (తోడు, భద్రం కొడుకో) బి. నరసింగరావు (రంగుల కల, దాసి), శ్యాంబెన్గల్ (అను(గ్రహం), గౌతమ్‌ఘోష్ (మాభూమి) పేర్కొనాలి.
63
కన్నడ చిత్ర రంగానికి చెందిన ఆర్. నాగేంద్రరావు (జాతకఫలం) పుట్టన్న (ఇద్దరు అమ్మాయిలు) యస్.వి.రాజేంద్రసింగ్ బాబు (మెకానిక్ మావయ్య), తెలుగు సినిమాలకు దర్శకత్వం వహిస్తే తెలుగు సినిమా రంగానికి చెందిన విజయారెడ్డి (టక్కరి దొంగ-చక్కని చుక్క) సాయిప్రకాశ్ (అమ్మానాగమ్మా) కన్నడరంగంలో విజయబావుటా నెగరవేశారు. తమిళ చిత్ర సీమకు చెందిన మొన్నటి తరం దర్శకులు భీమ్‌సింగ్ (కరుణామయుడు), కె. శంకర్ (భూ కైలాస్), ఏ,సి.త్రిలోకచందర్ (రాము), త్యాగరాజన్ (పొట్టేలు పున్నమ్మ), దాదామిరాసి (నిర్జోసి, నిన్నటి తరానికి చెందిన విసు (సంసారం ఒక చందరంగం), భారతిరాజా (కొత్తజీవితాలు), బాలూ మహేంద్ర (నిరీక్షణ). ఈ తరానికి చెందిన కె.ఎస్, రవికుమార్ (స్నేహం కోసం), మణి రత్నం (గీతాంజలి), కరుణాకరన్ (తొలిప్రేమ), తెలుగువారి ఆదరణకు పాత్రమైనారు. అల్దాగే మలయాళ చిత్రరంగానికి చెందిన ఫాజిల్ (వైతన్య) ప్రియాదర్శన్ (నిర్ణయం), జోషి (అంతిమతీర్పు) హిందీ చిత్ర రంగానికి చెందిన తాంత్రిక, ఛాయా(గ్రహకుడు బాబూభాయ్ మిస్త్రీ (ూయామశ్చీంద్ర) మహేష్‌భట్ (క్రిమినల్ తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. మహిళా విభాగానికి వస్తే 1953 సంవత్సరంలోనే భరణీ పతాకంపై నిర్మించబడిన “చండీరాణి"కి సంగీత దర్శకత్వం నిర్వహిస్తూ క్లిష్టమైన ద్విపాత్రాభినయం (చండీరాణి- చంపారాణి) చేస్తూ ఆ చిత్రానికి సమర్థవంతంగా దర్శకత్వం నెరపిన విదుషీమణి శ్రీమతి భానుమతీ రామకృష్ణ ఆ తరువాత ఆమె భరణీ పతాకంపై కొన్ని చిత్రాలకు (మనవడికోసం, భక్త ధ్రువమార్కండేయ) దర్శకత్వం వహించారు. నటశిరోమణి సావిత్రి దర్శకత్వం చేపట్టి (మాతృదేవత) ఆమె టాలెంట్‌ని నిరూపించుకొన్నారు. తాలినాటి చిత్రాల్లో పాటలు పాడి నటించిన జి, వరలక్ష్మి “మూగజీవులు” అనే చిత్రానికి దర్శకత్వం నెరపారు. ఇహ వందకు సైగా చిత్రాల్లో నటించిన వైవిధ్య నటి విజయనిర్మల “మీనా” (1973) తో మొదలుపెట్టి దాదాపు నలఖై చిత్రాలకు పైగా దర్శకత్వం నెరపారు. ఇది ప్రపంచ రికార్డు. (ఆమె కూడా గిన్నిన్బుక్లో చోటు చేసుకున్నారు.) ఆమె దర్శకత్వం నెరపిన చిత్రాల్లో సంఘం చెక్కిన శిల్పాలు, దేవదాసు, హేమాహేమీలు, కలెక్టర్ విజయ, సాహసమే నా ఊపిరి చెప్పుకోదగ్గవి. ఇహ అఆనాటినుంచీ యీనాటివరకు బహుకొద్ది సినిమాలకు దర్శకత్వం 64
వహించినవారు, యిటీవల దర్శకత్వం చేపట్టి ముందడుగు వేస్తోన్నవారి వివరాలను పరిశిలిస్తే .... జగన్నాధ్ (భలే పెళ్ళి) లంక సత్యం (జీవన్ముక్తి, బి.వి, రామానందం (వరూధిని), 'హెచ్.ఎల్.ఎన్.సింహ (సంసారనారథి), తంగిరాల హనుమంతరావు (గీతాంజలి), డాక్టర్ రాజారావు (పుట్టిల్లు, రజనీకాంత్ (వదినగారి గాజులు), బొళ్ళ సుబ్బారావు (దేశద్రోహులు), ఐ.యన్.మూర్తి (సుఖదుఃఖాలు), వై. రంగారావు (సవతి కొడుకు), నమ్మాళ్వార్ (విష్ణుమాయ), బి.ఎస్.నారాయణ (తిరుపతమ్మ కధ), యం. మల్లికార్డునరావు (గూఢచారి 116), కె.వి. నందనరావు (జగత్ జెట్టీలు), వరప్రసాదరావు (పెళ్ళి సంబంధం), గిడుతూరి సూర్యం (సంగీత లక్ష్మి, డి.ఎస్.ప్రకాశరావు (మరపురాని తల్లి) కట్టా సుబ్బారావు (వియ్యాలవారి కయ్యాలు), మానాపురం అప్పారావు (తారశశాంకం), బి.వి. ప్రసాద్ (చుట్టాలున్నారు జా(గ్రత్త) టి, మాధవరావు (చిల్లర దేవుళ్ళు), లక్ష్మీదీపక్ (పండంటి కాపురం), పి. సుబ్రహ్మణ్యం (దొరికితే దొంగలు), జివి,ఆర్. శేషగిరిరావు (సిపాయి చిన్నయ్య), కె. బాపయ్య (ద్రోహి), బి.వి.శ్రీనివాస్ (నిన్నే పెళ్ళాడుతా), పెండ్యాల నాగాంజనేయులు (బుల్లైమ శ్రబుల్టోడు), ఓ.యస్.ఆర్. ఆంజనేయులు (కన్నె వయసు), దేవదాస్ కనకాల (చలిచీమలు), యన్.బి.చక్రవర్రి (గుండెలు తీసిన మొనగాడు), పోలవరపు (బ్రహ్మానందరావు (చిట్టెమ్మ-చిలకమ్మ), యం.యస్, కొటారెడ్డి (గీత-సంగీత), ఈరంకి శర్మ (చిలకమ శ చెప్పింది), నందమూరి రమేష్ (మా యిద్దరి కథ), పి.వి.సత్యనారాయణ (ఇన్స్పెక్టర్ భార్య), టి.గోపాలకృష్ణు, (వస్తాడే మా బావ), హనుమాన్ ప్రసాద్ (ఖైదీ నెం.77), బి. భాస్కరరావు (ధర్మాత్ముడు), బోయిన సుబ్బారావు (చిలిపి కృష్ణుడు), చంగయ్య (దొంగళల్లో దొర), బోయపాటి కామేశ్చరరావు (బొబ్బిలిదొర), మహేష్ (ముగ్గురు మూర్చులు), వై.ఈశ్చరరెడ్డి (రామబాణం), జి. రామమోహనరావు (రారాజు), ముప్పలనేని శివ (తాజ్‌మహల్), సానా యాదిరెడ్డి (ప్రేమపల్లకి), యన్. గోపాలకృష్ణ (లక్ష్మణ రేఖ), కె. సదాశివరావు (ఆడవి దారు, యన్. హరిబాబు (తేజ), జి.సి. శేఖర్ (అల్లరిబుల్లోడు), అజయ్ కుమార్ (మాతృదేవోభవ), లెనిన్ బాబు (డాక్టరు బాబు), కె.ఎస్.రామిరెడ్డి (కలవారి సంసారం), టి.ఎల్వి.ప్రసాద్ (ఛాలెంజి రాముడు), కె.వి.ఎస్.కుటుంబరావు (పగ సాధిస్తా, శివనాగేశ్చరరావు (పట్టుకోండి చూద్దాం), యం.యస్.గోపీనాథ్ (మహాత్ముడు), పి,వి.రామారావు (భక్త జయదేవ) ఆమంచర్ల శేషగిరిరావు (పెండ్లి పిలుపు), వల్లభనేని జనార్దన్ (పారిపోయిన ఖైదీలు), రామ్‌సురేష్ (శుక్రవారం మహాలక్ష్మి, తమ్మారెడ్డి భరద్వాజ (పచ్చనిసంసారం), ధవళసత్యం (వైతన్య రథం), సురేష్‌వర్మ (ఇంద్రుడు 65
- చంద్రుడు), గుజ్జంగంగరాజు (లిటిల్ సోల్టర్స్) జయంత్ (బావగారు బాగున్నారా), గుణిశేఖర్ (చూడాలని వుంది), గోపీచంద్ (నవ్వులాట) కె.ఎస్.నాగేశ్వరరావు (పోలీసు), కె. రంగారావు (అలెగ్జాండర్), భరత్నందన్ (ఫిల్మ్‌నగర్), యన్. శంకర్ (శ్రీరాములయ్య), వీర శంకర్ (హల్లో ఐ లన్యూ), అల్హాణి శ్రీధర్, (రగులుతున్న భారతం) వై నాగేశ్ళరరావు (మొండి మొగుడు-పెంకి పెళ్లాం), క. మురళిమోహనరావు (సంఘర్షణ), తిరుపతిస్వామి (గణేక్, యస్.యస్.రవిచంద్ర (దేశోద్దారకుడు), నందం హరిశ్చంద్రరావు (దుర్గాదేవి, విజయభాస్కర్ (స్వయంవరం), జాన్ (ప్రేమించేది ఎందుకమ్మా), చంద్రశేఖర్ (భలే బుల్లోడు), గిరిధర్ (మావూరి దేవత), మోహన్‌దాస్ (అంతులేని వింతకథ), గుహనాథన్ (సూర్యచంద్రులు), పిడిప్రసాద్ (జీవిత రంగం), బీరం మస్తాన్‌రావు (ప్రేమ సింహాసనం) సాగర్ (అమ్మదొంగా), సునీల్ వర్మ (ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు), ఆర్. తరణిరావు (రావుగారిల్లు), ఉప్పలపాటి నారాయణరావు (రక్షణ), వైవి.యస్. చౌదరి (శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి), ఎ.వియస్.ఆదినారాయణ (నా హృదయంలో నిదురించే చెలి), బాబీ (నల్లపూసలు), రమణబాబు (వానవుడు-దొనవుడు), బందెల ఈశ్చరరావు (అంకితం), చంద్ర మహేష్ (ప్రేయసి రావే), అయ్యప్ప పి, శర్మ (ఈశ్వర్ ఆల్ట్రా, త్రిపురనేని వరప్రసాద్ (రైతు బారతం), అరుణ ప్రసాద్ (తమ్ముడు), (ప్రతాప్ (నువ్వు వస్తావని)... ఇలా ఎందరో దర్శకులు తమవంతు కృషి చేస్తున్నారు. వో మరగ త్రూ
- తొలితమిళ టాకీ చిత్రం కాళిదాను'ను కూడా హెబ్.ఎం.రెడ్డి రూపొందించారు. అయితే అందులో సంభాషణలు తమిళంలోను పాటలు తెలుగులోను ఉండటం విశేషం, 66
(| చభోలి | స వ. అనా. | (స + కు. న
, (సి 11 (మ స టీకా! | సన సంర ₹|
(ఎ%|, నటనటులు, ౫ ( న || స సీతకు
లీ... వు! న్.
ల క 02 గే న! ఘా! | క్ న వు ౮ కపి
| త టు చటం త
67
(వ య నాట సు న చ్ష మా.
న. / శీ 1 క.. | స (లాం. 5084కి శ్రీం ఈ రుం. | 4%004 1064 జ్. క టు... ...... ప. య సు |] యట ముం సం . 17111 (4 వ శ గ... నం! ;
న 1 ఇతి! | కమి
68
నటీనటులు సినిమా నిర్మాణంలో అత్యంత ప్రధానపాత్ర నిర్వహించేది, ప్రేక్షకుల నుంచి నీరాజనాలందుకొనేది తెరమీద కనిపించే నటినటులు, వారి ప్రజ్ఞాపాటవాలు. అందుకే వారికి ఫాన్మెయిల్ ఎక్కువ. పాపులారిటీ ఎక్కువ. ఒక పేరొందిన టెక్నీషియన్ కంటే సినిమాలో చిన్న పాత్రఅయినా సరే-పోషించిన ఆర్జిస్టును చూడడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. నాటినుంచీ నేటిదాకా యీ పద్ధతిలో మార్పు లేదు.
ఎందరో హీరో హీరోయిన్స్, మరెందరో కారెక్టర్ ఆర్టిస్టులు, ఇంకెందరో హాస్యనటీ
నట సందోహం తమ నటనా వైదుష్యంతో తెలుగు తెరను సుసంపన్నం చేశారు. 1931-40 తొలితరం చిత్రాలతోపాటు నటీనటుల్ని గూర్చి మొదటి (ప్రకరణంలో రేఖామా(త్రంగా వుదహరించాను.
చాలా మంది నాటకరంగం నుంచి సినిమాకు వచ్చినవారే మొదటి తరంలో కన్సిస్తారు. సి.యస్.ఆర్.ఆంజనేయులు (1907-1963) 'రామదాసు'లో (1933) పరిచయమైనా ఆయనకు యశస్సు నార్జించిన చిషత్రం “ద్రౌపదీ వస్త్రాపహరణం” అందులోని శ్రీకృష్ణుని పొత్ర - తరువాత శ్రీ, వేంకటేశ్చర మాహత్మ్యంలోని శ్రీనివాసుని పాత్ర. తరువాత గృహ్రవేశంలో హాస్యం రంగరించిన భూమిక ఓ వెరైటీ. ఆయన జీవితంలో పోషించిన పాత్రలో కన్యాదానం, మాయాబజార్ చిత్రంలోని శకుని. రోజులు మారాయిలో మునసబు పాత్రలు చెప్పుకోదగ్గవి. డైలాగ్‌ను ఓ ప్రత్యేక విరుపుతో ఉచ్చరించి (ప్రాణం పోయటం ఆయనకే చెల్లింది.
వేమూరి గగ్గయ్య కంసుడు, యముడు వంటి పౌరాణిక పాత్రల్గో తన ప్రతిభ కనపర్పాడు. (శ్రీకృష్ణలీలలు-సావిత్రి) 'పృర్వీపుత్రితో పరిచయమైన ఈలపాట రఘురామయ్య శ్రీకృష్ణునిగా నారదునిగా పలుపొరాణిక చిత్రాల్లో రాణించారు. నారదుని పొత్రలో జీవించిన మరో నటుడు పువ్వుల సూరిబాబు.
శ్రావ్యమైన గంభీర కంఠంతో నటించే కపిలవాయి రామనాధ శాస్త్రికి పేరుతెచ్చిన చిత్రం శ్రీకృష్ణ తులాభారం.
“కన్యాశుల్కం' లో 'మాలపిల్లోలో విలక్షణ పాత్రలు పోషించిన డా॥ గోవిందరాజుల సుబ్బారావు నిర్వహించిన పాత్రల్లో చిరస్మరణీయమైనవి బాలనాగమ్మలోని మాయల ఫకీరు, పల్నాటియుద్ధంలోని బ్రహ్మనాయుడు.
విశిష్ట రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ (1880-1946) దుర్యోధనునిగా 69
నటించిన “ద్రౌపదీ మానసంరక్షణ” చిత్రం ఫెయిల్ అయినా ఆయన నటన (ప్రశంసలు పొందింది. 'రైతుబిడ్డలో కూడా (ప్రాధాన్యమున్న పాత్ర పోషించారు. అదే చిత్రంలో గిడుగు సీతాపతి విలన్‌గా విశిష్ట నటన చూపారు.
నటుడుగా, దర్శకుడుగా యరగుడిపాటి వరదరావు (వై.ఎ.రావు 1903-1973) ప్రతిభకు దర్పణం పట్టిన చిత్రాలు మళ్ళీపెళ్ళి, విశ్చమోహిని.
ఈ దశకం అందించిన విశిష్ట కథానాయకుడు చిత్తూరు వి. నాగయ్య (1904- 73) మద్రాసులోని సుగుణవిలాస్ సభ, చెన్నపురి ఆంధ్రమహాసభ వారి నాటకాల్లో పాల్గొని రోహిణి హెచ్.యం.రెడ్డిగారి 'గృహలక్ష్మి' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసారు. నాగయ్య స్వతహాగా చక్కని గాయకుడు. భక్తిరస పాత్రలకు సాత్వికాభినయానికి ఆయనది పెట్టిందిపేరు. ఇందుకు పోతన, వేమన, త్యాగయ్య. ఆయన స్వయంగా నిర్మించిన త్యాగయ్య రామదాసు పేర్కొనాలి. ఈ చిత్రాలకు ఆయనే సంగీతం అందించారు. తెలుగు, తమిళ చిత్ర రంగాలు ఆయన్ని ఆదరించాయి. ప్రభుత్వం పద్మశ్రీ” బిరుదుతో సత్కరించింది. ఈయనకు అత్యంత ఆప్హుడైన వాహినీ నటుడు ముదిగొండ లింగమూర్తి ఈయన పోతన, వేమన, పెద్దమనుషుల్లో నటించగా 'పెద్దమనుషులులో రామదాసు పాత్రకు ఉత్తమ నటుడు బహుమతి లభించింది. ఈయన వ్రాసిన వెంకన్న కాపురం" నాటిక వందలాది (ప్రదర్శనలకు నోచుకుంది.
ఇంకా కురుమద్దాళి రామచం(ద్రరావు (కుచేల) ఆరణి సత్యనారాయణ (రామదాసు), అద్దంకి (హరిశ్చంద్ర), పారుపల్లి సుబ్బారావు (లవకుశ), పులిపాటి (చింతామణి), నిడుముక్కల (పాశుపతాస్త్రం), విప్రనారాయణ ద్వారా పరిచయమైన వంగర వెంకట సుబ్బయ్య శతాధికచిత్రాల్లో మేలికరం హాస్యాన్ని అందించారు.
ఈ దశకంలోనే 'శ్రీకృష్ణలీలలు' చిత్రంలో బాలనటుడుగా, కృష్ణునిగా నటించిన సాలూరు రాజేశ్ళరరావు (1922-1999) తరువాత ఇల్లాలు' లో నటించినా, నటనవైపు అసక్తి చూపక సంగీత దర్శకత్వం వైపు మొగ్గు చూపారు. ఈ దశకం చివరి సంవత్సరంలో (1940 'జీవనజ్యోతి' చిత్ర కథానాయకునిగా పరిచయమైన సి.హెచ్. నారాయణరావు హీరో అని నిరూపించుకున్న చిత్రాలు మనదేశం, జీవితం.
ఇహ నటీమణుల వివరంలోకి వెళితే... తాలి కధానాయిక సురభి కమలాభాయి (భక్త ప్రహ్లాద). ఈమె తరువాత చాలా చిత్రాల్లో సహాయక పాత్రలలో నటించినా, చిరకాలం గుర్తుండిపోయేది 'పాతాళభైరవి'లోని తోటరాముడు తల్లి పాత్ర.
గాయని రావు బాలసరస్వతి అనసూయ (1935)తో (ప్రారంభించి, ఇల్హాలు, అపవాదు చిదత్రాల్లో నటించినా గాయనిగా కొంతకాలం కొనసాగారు.
70
నటి లక్ష్మీరాజ్యం (1922-87) శ్రీకృష్ణతులాభారం (1935) ద్వారా సినీరంగ ప్రవేశం చేసి, ద్రోహి, సంసారం చిత్రాల్లో క్లిష్ట భూమికలు పోషించి “రాజ్యం” పిక్చర్స్ పేరిట నిర్మించిన దాసి, హరిశ్చంద్ర చిత్రాల్లో బి.ఎ.ఎస్.వారి రాజు-పేదలో కరుణరస ప్రధాన పాత్రల్ని పోషించారు. రామతిలకం (సావిత్రి, చింతామణి), కళ్యాణి, బెజవాడ రాజరత్నం (సీతాకళ్యాణం), సీనియర్ శ్రీరంజని (లవకుళ) దాసరి కొటి రత్నం (సక్కుబాయి) కధనాయికలుగా నటించిన వారే! శ్రీకృష్ణతులాభారంలో నటించిన బుష్మేందమణి 'పత్ని'లో కధానాయికగా నటించిన ఆ తరువాత కాలంలో తల్లి పాత్రలు, కొన్ని సందర్భాల్టో గయ్యాళి పాత్రలు (సంఘం), మహారాణి (జగదేకవీరుని కథ) భూమికలు నిర్వహించింది. తాలితరంలోని వారంతా స్వయంగా పాడినవారే. ఆ కోవలో అన్నియు పరిచయమైన కొందరు కథనాయికలు తరువాత కాలంలోకూడా రాణించినవారు... 1935లో శ్రీకృష్ణతులాభారం ద్వారా పరిచయమైన అందాలరాశి కాంచనమాల, మాలపిల్ల, మళ్ళీపెళ్ళి, చిత్రాలు ఆమె నటనకు అందానికి గీటురాళ్ళు కాగా ఆమె నటజీవితానికి హైలైట్‌గా చెప్పుకోదగిన చిత్రం “బాలనాగమ్మ ఈమె గాయని కూడా. జెమినీ వాసన్ కంపెనీతో కాంటాక్టు వుండడం వలన ఆయనతో భేదాబి (ప్రాయాలు ఏర్పడటంతో (నట) జీవితం ఒడిదుడుకుల్లో పడింది. ఆమె చివరిచిత్రం నర్తనశాల. 1935లోనే హరిశ్చంద్ర చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన రాజరాజేశ్చరి నాటక రంగస్థల నటి పసుపులేటి కన్నాంబ, స్పష్టమైన, గంభీరమైన గాత్రానికి మారుపేరు. సువిశాల పాలభాగంతో చం'డ్రనిప్పులు కురిపించగల నేత్రద్వయంతో (ఆవసరమైతే కరుణ చిలికించగలవు) పేజీలకొద్దీ డైలాగుల్ని అనర్గళంగా, అర్ధవంతంగా, భావయుక్తంగా పలకటం ఆమెకే చెల్లింది. పల్నాటియుద్ధంలో నాయకురాలు నాగమ్మ మనోహరచిత్రంలో రాజమాత - వీటికి భిన్నమైన పాత్ర గయ్యాళి అత్తగా సక్కుబాయిలోనూ నటించారు. గాయనీ, నటి సి. కృష్ణవేణి 1936లో అనసూయ ద్వారా చిత్రసీమలో ప్రవేశించి గొల్లభామతో స్టార్డం తెచ్చుకొన్నా సెలక్ట్రివ్గా తక్కువ చిత్రాల్లో నటించారు. మనదేశం లక్ష్మమ్మ చిత్రాల్లో నాయకిగా నటించి, మనదేశం చిత్రంద్వారా ఘంటసాలను సంగీత దర్శకుడిగా, యన్.టి.రామారావును నటుడుగా పరిచయం చేశారు. కీలుగుజ్జం చిత్రంలో అంజలి పాత్రకు ప్లేబాక్ పొడారు. మరో సంగీతదర్శకుడు రమేష్ నాయుడు ఛై
“దాంపత్యం' చిత్రం ద్వారా పరిచయం చేశారు. ఈమె కుమార్తె యన్.ఆర్. అనూరాధా దేవి నేడు సుషప్రసిద్ద నిర్మాత.
1936లో పి.వి.దాసు నిర్మించిన మాయా బజార్ అనే శశిరేఖా పరిచయం ద్వారా కథానాయిక పాత్రలో సినీరంగ (ప్రవేశం చేసిన శాంతకుమారి మంచినటి, సుమధుర గాయని. పి. పుల్లయ్య గారిని వివాహం చేసుకొన్నాక 1939లో శ్రీ వేంకటేశ్వర మాహత్మ్యం నాయకిగా నటించి, తరువాత 1960లో వారే నిర్మించిన అదే చిత్రంలో వకుళమాతగా చూపిన నటన “ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాలా” అంటూ మృదుమధురంగా గానం చేశారు. ఆమె నటించిన ఇతర చిత్రాల్లో చెప్పుకోదగ్గవి అర్జాంగి, తల్హా-పెళ్ళామా!
1936లో సంపూర్ణరామాయణం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన మరో అందాలరాణి పుష్పవల్లి. “బాలనాగమ్మ” చిత్రంలో సంగుపాత్రలో యీమె పాడిన “అహా నా సొగసే కనిమరుడే' ఆ రోజుల్లో హిట్ వయసు పెరిగినా ఆమెలో గ్లామర్ తగ్గదు అని నిరూపించిన చిత్రం నూమకుతగ్గ అల్లుడు, ప్రఖ్యాత హిందీ నటి రేఖ, నాటి బాలనటుడు బాబి (ఏెంచులక్ష్మి సువర్లసుందరి) యీమె సంతానమే.
1936 బాలయోగినిలో పరిచయమై, 1939లో రైతుబిడ్డలో నటించిన గాయని, నటి యస్. వరలక్ష్మి, తరువాతి కాలంలో పల్నాటియుద్ధం, బాలరాజు ఆమెలో బహుముఖ ప్రజ్ఞను వెల్లడించాయి. బాలరాజులో యీమె పాడిన పాటలన్నీ (ప్రేక్షకుల మనసుల్లో కదలాడాయి. ఇతరులు అనుకరించలేని ప్రత్యేక గానైలి ఆమెకే చెల్టు 'మహామంత్రి తిమ్మరుసు" లో లీలాకృష్ణ నీ లీలలు నేలిలగ నైనా తెలియనుగా” “శ్రీవెంకటిశ్చర మాహతృ్మ్యం'లోని “వరాలబేరమయి"....... యిలా యెన్నయినా ఉదాహరించొచ్చు. రెండు దశాబ్దాల కిందట ఆమె ఆత్తగా నటించిన 'బొమ్మబొరుసా'లో నటన ఓ వెరైటీ.
రైతుబిడ్డలో నటించిన టి. సూర్యకుమారి సుస్వరగాయని. చందహాస, దీనబంధు వంటి బహుకొద్ది చిత్రాలలో నటించారు.
1939లోనే సి. పుల్లయ్యగారి “వరవిక్రయం' ద్వారా పరిచయమైన విశిష్ట నటి భానుమతి ఈమె గూర్చి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 'స్వర్గసీమ'లో 'ఓహో పావురమా'అంటూ యువతను గిలిగింతలు పెట్టారు.. కధానాయికపరంగా తొలిసారి ద్విపాత్రాభినయం బేసి, సంగీతం సమకూర్చి దర్శకత్వం నెరపిన చిత్రం 'చండీరాణి' లైలా, దేవదేవి, చింతామణి, యెన్నెన్ని పాత్రలు ఎన్నిన్ని హొయలు ఎన్నెన్ని గానసుధా మాధురులు. తమిళ హిందీచిత్రాల్లో కూడా నటించిన విదుషీమణి. సైకలాజికల్
72
టవెస్ - సంఘర్షణవున్న పాత్రల్ని కూడా బాటసారి, వివాహబంధం చిత్రాల్లోనూ, హాస్యరసభూమికల్ని చక్రపాణి. గృహలక్ష్మి చిత్రాల్లో సమ(ప్రజ్ఞతో పోషించారు.
1940లో బారిస్టర్ పార్వతీశం ద్వారా పరిచయమైన జి, వరలక్ష్మి అటు నాయకిగా (ఫెళ్ళిచేసిచూడు, మొదటిరాత్రి) యిటు ప్రతినాయకిగా (స్వప్నసుందరి, దొంగల్లో దొర), ఆపైన గుణచిత్ర నటిగ (మాంగల్యబలం) ఆమె బహుముఖ (ప్రజ్ఞను ప్రదర్శించారు. 'స్వష్నసుందరిలో ఆమె పొడిన 'నీ సరి నీవేలే జనాన, లే నెరజాణవులే' అన్న పాట మరువలేనిది.
ఇహ ఆ దశకంలో హాస్యనటులుగా పరిచయమైన కస్తూరి శివరావు (వరవిక్రయం) 'గుణసుందరికధ'లో విలక్షణమైన కధనాయకుని పాత్రను పోషించి 'బాలరాజు' లోని యలమందపాత్ర ద్వారా కామెడియన్కి హీరోకి వున్నంత క్రేజ్ తీసుకొనివచ్చారు.
మరో హాస్యనటుడు లంక సత్యం, బారిస్టర్ పార్వతీశంలో హాస్య కధానాయకుడిగా నటించి, తరువాతి కాలంలో జగదేకవీరుని కధ, సహ(్రశిరచ్చేద అపూర్వ చింతామణిలో మేలిరకం హాస్యాన్ని అందించారు.
నటన పట్ల వ్యామోహంతో అష్టకష్టాలుపడి నాటకాల్లో వేషాలు వేసి సినిమారంగంలో చిన్నా చితకా వేషాలువేయటానికి సిద్ధపడ్డ హాస్యనటచ'క్రవర్తి రేలంగి వెంకటరామయ్య (1910-75) సి. పుల్లయ్యగారి ప్రోత్సాహంతో శ్రీకృష్ణతులాభారం (1935)లో నటించి ఆ తరువాత సంసారం, గుణసుందరి కథలో హాస్యపాత్రలు ధరించినా-నిజమైన గుర్తింపు 'పాతాళ భైరవిలోని రాణిగారి తమ్ముడుద్వారా లభించింది. ఇహ అక్కడ్నుంచి రెండుదశాబ్దాలు (1951-70) రేలంగి (ప్రభ వెలిగిపోయింది. ఆ కాలంలో 'ీలంగి' సినిమాలో తప్పని సరిగా వుండాలి. అది సేలబుల్ అయి రెండు వందల చిత్రాల్లో తన మేలిరకం ఆంగికవాచికాభినయంతో హాస్యం అందించి నవ్వుల పంట పండించారు. ఆయన పోషించిన పాత్రల్లో ఓహో అనిపించేవి తిక్కశంకరయ్య (పెద్ద మనుషులు), వీరభద్రయ్య (దొంగరాముడు), లక్ష్మణ కుమారుడు (మాయా బజార్, నారదుడు (చెంచులక్ష్మి, దేవయ్య (మిస్సమ్మ), కధానాయకుడిగా నటించిన పక్కింటి అమ్మాయి సుబ్బరాయుడు. గిరిజ, రేలంగి కాంబినేషన్ హాస్యం (రక్తసంబంధం, ఆరాధన, రాముడు-భీముడు), ప్రేక్షకులకు నవ్వుల విందు, స్వయంగా 'సమాజం” సినిమా నిర్మించి అడ్డాల నారాయణరావును దర్శకునిగా, రాజబాబును హాస్యనటునిగా పరిచయం చేశారు. పద్మశ్రీ, బిరుదుతో ప్రభుత్వం సత్కరించిన తొలి తెలుగు సినీ హాస్యనటుడు రేలంగి, నిజానికి అది హాస్యంగా రేలంగియుగం. స్వయంగా పాడిన 'వినవే బాల' “ధర్మం చేయి బాబు" పాటు మరువలేనివి.
73
1041-50
తెలుగుటాకీ రెండవ దశకం ((1941-50)లో నటనాపరంగా యొన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. రంగస్థల నటులుకూడా అందుకు భిన్నంగా సినిమా టెక్నిక్కు తగ్గట్టుగా నటంచటానికి పద్యాల స్థానంలో పాటలు; దైలాగుల్లో నాటకీయత తగ్గి సహజత్వానికి మొగ్గుచూపే ప్రయత్నం జరిగింది.
1941లో చంద్రహాసలో నటించిన జి. యన్. స్వామి తరువాత రూపవతిలో కథానాయకుడిగా, మరికొద్ది చిత్రాలలో సహాయపాత్రల్ని పోషించారు.
అదే సంవత్సరం అసవాదు చిత్రంద్వారా పరిచయమైన కె.ఎస్.ప్రకాశరావు, పత్ని, (ద్రోహి, మొదటి రాత్రి చిత్రాల్లో నటించినా దర్శకుడిగా ఆయన ప్రతిభ నిరుపమానమైంది. పోతనలో శ్రీనాధుడుగా నటించిన గౌరీనాధ శాస్తి ఆ ఆరువాత కేరెక్టర్ ఆర్హిస్పులుగా కొన్ని చిత్రాల్లో నటించారు (భలేరాముడు).
నాటకరంగస్థలంపై హరిశ్చంద్ర, తెలుగుతల్లి, ఆశాజ్యోతి నాటకాల్టో కదనాయకిగా నటించి రాణించిన అక్కినేని నాగేశ్చరరావును (1924) పి,పుల్లయ్యగారి ధర్మపత్నిలో బాలుడిగా వేషంవేసినా, కధనాయకునిగా శ్రీరాముని పాత్రలో 1944లో సీతారామజననం ద్వారా సినీరంగానికి పరిచయం చేశారు, ప్రతిభా నిర్మాత ఘంటసాల బలరామయ్య, నాటినుంచీ నేటిదాకా సినిమా రంగంలో జరుగుతున్న అనేక మార్పులకు పరిణామాలకు ఆయన ప్రత్యక్ష సాక్షి మొదట్లో ఆయన పాత్రలకు ఆయనే పాటలు పాడుకున్న చిత్రాలు మాయాలోకం, ముగ్గురు మరారీలు, పల్నాటియుద్ధం. 1944 నుంచీ నేటి దాకా దాదాపు 250 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి 60 మందికి పైగా కథానాయికలతో నటించి, ప్రజల నుంచి నటస(మ్రాట్ బిరుదు, (ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారం 'దాదాఫాల్కే' అవార్డు పొందిన ఏకైక వ్యక్తి మొదటిదశలో జానపద కధా చిత్రాల నాయకుడుగా రాణించి 'సంసారం'తో సాంఘిక చిత్ర జైత్రయాత్ర ప్రారంభించి, దేవదాసు, అనార్కలి, లైలామజ్ను, (ప్రిమాభిషేకం వంటి విషాదాంత చిత్రాల్టో నటించి ట్రాజెడి కింగ్ అనిపించుకొన్నారు. తెనాలి రామకృష్ణ, మహాకవి కాళిదాసు, విప్రనారాయణ, భక్త తుకారాం, అమరశిల్పి జక్కన, భక్త జయదేవ, మహాకవి క్షేత్రయ్య పాత్రల్ని పోషించి, బహుశ ఆ కళాస్రష్టలుయిలా వుండేవారేమో అన్నంత సహజంగా ఆ పాత్రల్ని తీర్చిదిద్దారు. ఆనాడు అక్షర సంస్కారం లేకుండా రంగప్రవేశం చేసి, యీనాడు సాంస్కృతిక సంస్కారానికి నిలువెత్తు శిఖరంగా మహోన్నతస్టాయికి ఎదగటానికి వెనుక అయిన అకుంఠితదీక్ష, పట్టుదల, (క్రమశిక్షణ ముఖ్య కారణాలు. జీవితంలో నట జీవితంలో ఎదురైన
74
సవాళ్ళను స్వీకరించి అన్నిటా విజయుడైై అనుభవాల్ని రంగరించి 'అ అ'ల కవిత రూపంలో అక్షర బద్దం చేశారు. ఈయన నిర్మించిన 'అన్నపూర్హ్ణ స్టూడియో” ఆంధ్రులకు గర్వకారణం. ఆ మహా నటుని జీవితం మీద వచ్చినన్ని పుస్తకాలు, నటజీవితంపై జరిగినన్ని చర్చలు మరే నటుని గూర్చి జరగలేదు. ఆయన జీవిత మలిదశలో నటించిన ఉత్తమ చిత్రం “సీతారామయ్యగారి మనవరాలు,"
1946లొా మంగళసూత్రం ద్వారా నటుడైన కోన (ప్రభాకరరావు తరువాత
శ్రీలక్ష్మమ్మ కధలో నటించారు.
అదే సంవత్సరం బి.వి.రామానందం తీసిన 'వరూధిని” ద్వారా కథానాయకుడుగా
పరిచయమైన యస్,విరంగారావు (1918-74) ఆ చిత్రం "ఫెయిల్ కావటంతో వెనుతిరిగి, మనదేశం ద్వారా పునఃప్రవేశం చేసి విజయ వారి 'షావుకారు'లో సున్నం రంగడిగా మార్కులు సంపాదించి, 'పొతాళభైరవి" (1951) నేపాళ మాంత్రికుడి పాత్రను నభూతో నభవిష్యతి అన్నట్టుగా పోషించారు. ఇందుకు ఆయన కాకినాడలోని యంగ్మెన్స్ వాపీ క్లబ్లో నటించిన పేశ్సిపియర్ నాటకం మర్చంట్ ఆఫ్ వెనిస్లోని "సైలాక్ పాత్ర ప్రభావం వుంది. ఆయన తెలుగువారి అదృష్టంకొద్ది లభించిన మహానటుడు, బంగారుపాప, మాయా బజార్, పాండవవనవాసం, నర్తనశాల (అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమనటుడి బహుమతి లభించింది, తోడికోడళ్ళు, తాత-మనవడు, నమ్మినబంటు, మొనగాళ్ళకు మొనగాడు చిత్రాలు ఆయన వైవిధ్య నటనకు నిదర్శనాలు, నటనలో నవరసాలు పండించగల దిట్ట. తెలుగు, తమిళ హిందీ భాషల్లో సుమారు రెండు వందల యాభై చిత్రాల్లో నటించారు. స్వీయదర్శకత్వంలో చదరంగం, బాంధవ్యాలు నిర్మించారు,
ఈ దశకం 'ప్రసాదించిన మరో విశిష్ట నటుడు నందమూరి తారకరామారావు (1923-1996). నాయకురాలు, బలిదానం మొదలైన నాటకాల్లో నటించి, ఎల్.వి. ప్రసాద్‌గారి 'మనదేశం'లో ఇన్స్పెక్టర్ పాత్రలో పరిచయమై 1950లో షావుకారు కథానాయకుడుగా నటించి, 1951లో వచ్చిన రెండు గొప్ప చిత్రాలతో (పాతాళభైరవి, మల్లీశ్వరి) కథానాయకుడుగా నట జీవితానికి గట్టి పునాది వేసుకున్నారు. ఉత్తమ అభిరుచితో పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు, (అవార్డు వచ్చింది) నిర్మించి, ఆర్థికంగా లాభం లేకపోవటంతో పంధా మార్చి జయసింహ తీసి, విజయం వైపు పరుగులు తీశారు. సుమారు 250 చిత్రాల్లో నాయకునిగా నటించారు. యావద్భా రతదేశం గర్వించదగిన స్థాయిలో పరస్పర విరుద్ధమైన పౌరాణికపాత్రలు శ్రీకృష్ణ సుయోధన, శ్రీరామ, రావణ, భీష్మ పాత్రలు” అద్భుతం అన్నస్థాయిలో పోషించి, శ్రీ వేంకటేశ్చరునిగా ప్రేక్షకుల నీరాజనాలందుకొని అందాల రాకుమారుడుగా విరలాచార్య,
75
జానపద చిత్రాల్లో సామాన్య (ధ్రేక్షకుల్ని పరవశింపజేసి సర్జార్పాపారాయుడు, బొబ్బిలిపులి జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం చిత్రాల ద్వారా సంచలనం సృష్టించి ఆ పాత్రల ప్రభావం వల్ల రాజకీయ రంగ (ప్రవేశం చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారదండాన్ని చేపట్టిన మహోన్నతవ్యక్తి మహత్తర శక్తి రామారావు. కె.వి.రెడ్డిగారి తరహాలో పక్కాగా. (స్కిప్ట్ రెడి చేసికొని ఈయన దర్శకత్వంలో రూపు దిద్దుకొన్న చిత్రాలు అనేకం (దానవీరశూరకర్ణు. (క్రమళిక్షణ, సమయపాలన, ఆయన విజయ రహాస్యాలైతే మన పురాణగాధలను పుక్కిట పట్టిన ఆయన జ్ఞాన సంపద ఆయన జీవితాన్ని ఒక మహనీయమూంర్తిగా ఆదర్శషప్రాయునిగా తీర్థిదిద్దాయి. ఆయన నిర్మించిన స్టూడియో రామకృష్ణ స్టూడియోస్,
1950లో కథానాయకుడుగా రామశర్మ పరిచయమైన చిత్రం 'అదృష్టదీపుడు.' ఆ తరువాత ఆయన బంగారు పాప, పల్లెపడుచు, మేనరికం చిత్రాల్లో (ప్రధానపాత్రలు పోషించారు.
అపూర్వసహోదరులు (1950)లో పరిచయమైన రంజన్ (అంతకు ముందు చంద్రలేఖ హిట్ తరువాతి కాలంలో బియస్.రంగా తీసిన 'రాజామలయసింహి నటించారు.
ఇంకా ఉమామహేళ్షరరావు (పంతులమ్మ) సదాశివరావు (దీనబంధు), ముంజులూరి కృష్ణారావు (శాంతవసుంధరవారి బాలనాగమ్మ, డి.వి. సుబ్బారావు (వింధ్యరాణి), మద్దాలి కృష్ణమూర్తి (నారద -నారది) సూర్యనారాయణ (సువర్షమాల,), పద్మనాభరావు (రాధిక), రాళ్ళబండి కుటుంబరావు (ద్రోహి), కోటేశ్ళరరావు (పల్లెటూరి పిల్లు, చిత్రాలలో రాణించారు.
నటీమణుల విషయానికి వస్తే భాగ్యలక్ష్మి చిత్రంలో పరిచయమైన మాలతి తరువాతి కాలంలో 'గుణసుందరికధ'లో ఒక ముఖ్య భూమికను పాతాళభైరవిలో కథానాయిగా నటించి తరువాత తల్లి పొత్రలు పోషించారు.
జయమ్మ త్యాగయ్య, (బ్రహ్మరధం చిత్రాల్లో నటించారు.
1927లో జన్మించిన అంజలీదేవి 1947లో గొల్లభామలో దేవకన్యగా వేంప్ పాత్ర పోషించి తరువాత 1949లో అదే తరహా రాక్షసి పాత్ర నటించి (కీలుగుర్రం) 1950లో పల్లెటూరి పిల్లి కధానాయికగా రాణించి తరువాత కాలంలో వందలాది తెలుగు తమిళ హిందీ చిత్రాల్లో నాయకిగా, వేంప్‌గా. గుణచిత్ర నటిగా వైవిధ్యపాత్ర పోషించారు. ఆమె భర్త సంగీతకర్త ఆదినారాయణరావుతో కలసి ఆణిముత్యాలవంటి సంగీత భరిత చిత్రాలు నిర్మించారు. ఆమె నటించిన పాత్రల్లో అనార్కలీ. ఇలవేల్పు,
76
వదినగారి గాజులు, వారసత్వం, సువర్షసుందరి, సతీసక్కుబాయి ముఖ్యమైనవి కాగా ఆమెను ప్రేక్షకులు మరచిపోరు. అన్నంత గొప్పగా పోషించిన పాత్ర 'లవకుశి లోని సీత. ఒక్కోసారి హాస్యపాత్రల్ని (పక్కింటి అమ్మాయి) కూడా ఆమె నిర్వహించారు.
ఈ దశకం చివరి సంవత్సరం (1950)లో షావుకారు చిత్రం ద్వారా నాయికగా ప్రవేశించిన జానకి-షావుకారు జానకిగా గుర్తింపు పొందారు. ఆమె నోట తెలుగుభాష లలిత ఉుధారసధారలతో విచిత్ర విన్యాసాలు చేసింది ఆమె నటించిన చిత్రాల్లో రోజులు మారాయి, డా॥ చక్రవర్తి ఏది నిజం, ముందడుగు, ఆలుమగలు చెప్పుకోదగ్గవి. రేలంగి సరసన భాగ్యరేఖ, చరణదాసి చిత్రాల్లో హాస్యభూమికల్ని కూడా పోషించారు.
1950లో నాట్య తారగా పేరొందిన కళాకారిణి 'జీవితం' ఫేం వైజయంతిమాల. తరువాత 'సంఘం* లో కూడా ఆ తరహా పాత్ర పోషించి హిందీ రంగంలో ప్రవేశించి నటిగా రాణించింది.
ఇదే సంవత్సరం 'సంసారం' చిత్రంలో తళుక్కున మెరసిన సావిత్రి (1937- 81) మరుసటి రెండు దశాబ్దాల్లోను తిరుగులేని మహానటిగా, నటీ శిరోమణిగా విరాజిల్లింది. చంద్రహారంలో వేంప్‌గా నటించిన సావిత్రి 'దేవదాసు” నాయిక పార్వతిగా ఆ చిత్రంతోనే మేటి నటి అనిపించుకొంది. తెలుగు తమిళ భాషల్లో వందలాది చిత్రాల్లో సంక్లిష్టమైన పాత్రల్ని అవలీలగా పోషించి భాషాతీత సున్నిత భావాలను కళ్ళద్వారా (ప్రదర్శించటం ఆమెక చెల్లు. అర్జాంగి, ఆరాధన, రక్తసంబంధం, మూగమనసులు, చిత్రాల్లో నాయికగా మిసృమ్మలో మేరీగా మాయా బజార్లో శిరేఖగా డాక్టర్ చ|క్రవర్తిలో నాయిక మాధవిగా, తోబుట్టువులో పెద్దక్కయ్యగా యొన్నైన్ని పాత్రలు, యొన్నైన్ని విన్యాసాలు. నిజానికి ఆమె తెలుగుతెరను తననటనద్వారా సుసంపన్నం చేయమని నటరాజుచే దివి నుంచి భువికి పంపబడిన 'నటరాజ్ఞు. ఈమె దర్శకత్వం వహించిన చిత్రాలు మాతృదేవత, చిన్నారి పాపలు. నటజీవితంలో హిమాలయపు అంచులు అందుకొన్న సావిత్రికి జీవితంలో అధ;పాతాళలోతుల్ని తాకింది. నటనారీలోకానికి ఆమె నటన ఆదర్శప్రాయం, జీవితం ఒక గుణపారం.
1944లో భీష్మ చిత్రం ద్వారా పరిచయమైన జూనియర్ శ్రీరంజని (1927-74) జీవితంలో అద్భుతమైన మలుపు గుణసుందరి కధుఆ తరహా శాంతరస ప్రధానమైన పాత్రల్ని యెన్నిటినో పోషించారు. (అమర సందేశం, నా చెల్లెలు, సంతానం).
ఈ దశకంలోనే అంతకు ముందు చిన్న పాత్రలు ధరించినా లైలామబ్బు, సంసారం ద్వారా గుర్తింపు పొందిన నటి సూర్యకాంతం, 1951-80, కాలంలో ఆమె శతాధిక చిత్రాల్లో గయ్యాళి పాత్రలు గణనీయంగా పోషించింది. సూర్యకాంతం అనే
77
"పేరు గయ్యాళికి ముద్రగా నిలిచిపోయింది. ఈమె టైటిల్ రోల్ పోషించిన చిత్రం విజయవారి ఎవర్గ్రీన్ 'గుండమ్మకథ'.
ఈ దశకంలో రంగ ప్రవేశం చేసిన విలక్షణ నటి కనకం కీలు గుజ్జంలో గుర్రింపు కల్గిన యక్షిణి పాత్ర పోషించి ఆ తరువాతి కాలంలో లేతమనసులు వంటి చిత్రాల్లో హాస్యం రంగరించిన వైవిధ్య భూమికలు పోషించింది.
ఆ తరహాకుచెందిన మరోనటి సీత. ఈమె 'స్వష్నసుందరి'లోను, ఆ తరువాతి కాలంలో రేలంగి సరసన కొన్ని హాస్యభూమికలు పోషించింది. (భలే రాముడు)
ఇంకో మహానటి సురభి బాలసరస్వతి, అంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించినా 'సంసారం' లోని ఆడపడుచు పాత్రలో జీవించి ఆ తరువాత రేలంగి రమణారెడ్డి సరసన యెన్నో హాస్యభూమికలు నిర్వహించింది. 'రూపవతి" చిత్రంలో కధనాయిక పా(త్రను పోషించింది కూడా!
ఈ తరంలో నటీమణులుగా పరిచయమైన వారు కమలాకొట్నీస్ (చెంచులక్ష్మి, పూర్ణిమ (ఒక రోజా రాజు), దాసరితిలకం (వరూధిని) పుష్పవల్లి (సంసారం)లను చెప్పుకోవాలి.
హాస్యరంగంలో పద్మనాభం యీ దశకంలో 'మాయాలోకం'లో పరిచయమై షావుకారులో నటించి 'సాతాళభైరవి' డింగరి పాత్రలో రాణించి శతాధిక చిత్రాల్జో నటించి నిర్మాతగా చిత్రాల్ని నిర్మించాడు. ఇంకా నల్లరామ్మూర్తి-సీతారాం పల్లెటూరి పిల్లలో జంటగా హాస్యం అందించి తరువాత విడిగా కూడా నటించారు. డాక్టర్ శివరామకృష్ణయ్య (భలే పెళ్ళి), గోబేరు సుబ్బారావు (వందేమాతరంలో ఇంటల్టుడు) పేర్కొనదగినవారు. “షావుకారు” నటుడు జోగారావు తరువాత పెళ్ళిచేసి చూడు నేచుక్క, ఏదినిజంలో హాస్యనటుడిగా రాణించారు.
క్షం61-60౪
తెలుగు చలనచిత్రసీమలో అసలు సిసలైన స్వర్ణయుగం (1951-60) మధ్యకాలం. ఇంతకు ముందు దశకంలో పరిచయమైన కధనాయకులు అక్కినేని, ఎన్.టి.రామారావు నాయికలు లక్ష్మీరాజ్యం, సావిత్రి, జానకి, జి. వరలక్ష్మి నటనా పటిమను నిరూపించుకొన్న కాలం. సంగీత సాహిత్యాలరీత్యా నిరుపమానమైన అద్భుత సృష్టి జరిగిన కాలం. నటపరంగా యెంతో మెరుగైన పరిణామంగా గమనించవచ్చు. ఇహ యీ కాలంలో రంగ ప్రవేశం చేసినవారిని గూర్చిన వివరాల్టోకి వెళితే.............
78
1952 సంవత్సరంలో ఆరుగురు నటులు కథానాయక పాత్రల్లో పరిచయమయ్యారు.
"పేదరైతులో పరిచయమైన మంత్రవాది శ్రీరామమూర్తి తరువాత బహుకొద్ది చిత్రాలు (రాజేశ్టరి, టింగు-రంగా) నటించారు. ప్రజాసేవ హీరో రామచం(ద్రకాశ్యప తరువాత పెద్దమనుషులులో నటించారు. 'సం్రాంతి'లో పరిచయమైన చంద్రశేఖర్ తదుపరి కాలంలో చక్రపాణి, కీలుబొమ్మలులో నటించారు. 'ముగ్గురుకొడుకులు'లో పరిచయమైన శ్రీరాం ఒక తల్లి పిల్లలు అగ్గిరాముడులో నటించగా, ధర్మదేవతలో హీరో పాత్ర పోషించిన కౌశిక్ తరువాత సదారమ హీరోగా నటించారు.
తరువాతి సంవత్సరం (1953)లో నా చెల్లెలు ప్రధానపాత్ర పోషించిన అమర్నాథ్ జీవితంలో చెప్పుకోదగ్గి చిత్రం అమరసందేశం. ఈయన స్వయంగా “మగవారి "మాయలు" చిత్రం నిర్మించారు.
1952లోనే అదర్శం చిత్రం ద్వారా నాయకుడిగా పరిచయమైన కొంగర జగ్గయ్య (అంతకు ముందు రేడియోలో వార్తలు చదివేవారు) గంభీర గొత్రంతో ప్రేక్షకుల్ని ఆకర్షించారు. కథొనాయకునిగా (ప్రియురాలు, ఆలుమగలు, ముందడుగు, ఎం.ఎల్.ఏ... పెళ్ళికాని పీల్లలు) పలు చిత్రాల్లోనూ (ప్రతినాయకునిగా యన్.టి.ఆర్. (వీర కంకణం, దేవుడు చేసిన 'మనుషులు) అక్కినేని (తోడికోడళ్ళు, ఆత్మబలం, అదృష్టవంతులు) సరసన తన నటనా శక్తితో వారికి సమజిజ్జీగా నిలిచారు. జాగృతి చిత్ర పతాకంపై రాజకీయ చిత్రం 'పదండి ముందుకు” నిర్మించారు. పలు అనువాద చిత్రాలకు గళాన్ని అందించారు. అందులో మనోహర డైలాగులు చెప్పుకోదగ్గవి.
1953లో హెచ్.ఎంగరెడ్డి గారి 'ప్రతిజ్ఞ చిత్రంలో జానపద కథానాయకునిగా పరిచయమైన టి.యల్.కాంతారావు. ఆ తరువాతి కాలంలో సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కధానాయకునిగా ప్రతినాయకునిగా, కారెక్టర్ అర్జిస్టులుగా నటించారు పౌరాణిక నారద పాథత్రని ఎక్కువ చిత్రాల్లో పోషించిన ఘనత ఆయనదే! విరలాచార్య
మార్కు జానపద చిత్రం పేరు చెబితే గుర్తు వచ్చేవి (ఆకాశరామన్న, అగ్గిదొర,
రణభేరి మొ[) సాంఘిక చిత్రాల్లో చెప్పుకోదగ్గవి. శాంతినివాసం, రక్తసంబందం.
స్వయంగా కొన్ని చిత్రాలు (సప్తస్వరాలు, గండరగండడు, స్వాతిచినుకులు) నిర్మించారు. పుట్టిల్లు స్వీయదర్శకత్వంలో నిర్మించి కథానాయకుడుగా నటించిన డాక్టర్
గరికిపాటి రాజారావు ఆ తరువాత బహుకొద్ది (ఆరాధన) పాత్రలు పోషించారు, 1954లో సారధీ వారి "అంతా మనవాళ్ళే” హీరోగా నటించిన వల్లం నరసింహారావు
తరువాత సహాయ పొత్రల్టో నటించినా డబ్బింగ్ రంగంలో యెనలేని కృషి చేశారు.
79
రంగస్థ్రలనటుడు జె.వి.రమణమూర్తి యం.ఎల్.ఏ. చిత్రం ద్వారా 1957లో సహాయ కథానాయకునిగా పరిచయమై ఆ తరువాత కొన్ని చిత్రాల్లో కథానాయకుడుగా (పెళ్ళి తాంబూలం) నటించి, ఆ పై గుణచిత్ర నటులుగా పలు సాొత్మ్యిక పాత్రల్ని, పోషించారు.
ఇంజనీరింగ్ పట్టభద్రుడై 1958లో సారథీ వారి ఎత్తుకు సపైఎత్తులో హీరోగా పరిచయమైన బాలయ్య సాంఘిక పౌరాణిక చిత్రాల్లో వెరైటీ పాత్రలు పోషించి కధా రచనచేసి నిర్మాతగా మారి చెల్లెలికాపురం వంటి ఉత్తమ చిత్రాల్ని అందించారు.
1959లో డి.యల్, నిర్మించిన 'సిపాయి కూతురు' హీరో కైకాల పత్యనారాయణ తరువాత విలన్‌గా గుణచిత్ర నటుడిగా ఏడువందల (పౌరాణిక, చారిత్రాత్మక, సాంఘిక జానపద) చిత్రాల్లో నవరసాల కు చెందిన భూమికల్ని సమప్రజ్ఞతో పోషించి, నవరసనటసార్వభౌముడనిపించుకొన్నారు.
1959లో రామినీడు గారి ద్వారా 'మా యింటి మహాలక్ష్మి'లో కథానాయకునిగా పరిచయం చేయబడ్డ హరనాథ్ నటజీవితంలో సీతరామ కళ్యాణం, లేత మనసులు, చెప్పుకోదగ్గ చిత్రాలు.
"ఆ దశకం చివరి సంవత్సరంలో (1960లో 'భక్త శబరి' ద్వారా రంగ ప్రవేశం చేసిన శోభన్‌బాబు (శోభనా చలపతిరావు) 1965 వరకు సహాయ నాయకుడుగా నటించి ఆ సంవత్సరం 'వీరాభిమన్యు' లో టైటిల్ రోల్ పోషించటం, ఆ మరుసంవత్సరం లోగుట్టు పెరుమాళ్ళ కెరుకలో శభాష్ అనే విధంగా నటించి ఆ తరువాత దాదాపు 200 చిత్రాల్లో ప్రధానపాత్ర పోషించారు. మనుషులు మారాలి, కళ్యాణమంటపం, దేవత, తాసిల్దారుగారి అమ్మాయి, బలిపీరం, శారద, కార్తీకదీపం వంటి చి(త్రాల్లో సంఘర్షణకు [ప్రాధాన్యతవున్న పాత్రలు ధరించి శ్రీకృష్ణావతారంలో నారదునిగా కురుక్షేత్రంలో శ్రీకృష్ణునిగా నటించటం విశేషమే,
అదే సంవత్సరం పినిశెట్టిగారి నిత్యకళ్యాణం పచ్చతోరణం ద్వారా పరిచయమైన హీరో రామకృష్ణ సాంఘిక చిత్రాల్లోనూ (కలవారి కుటుంబం, బొమ్మాబొరుసా జానపదచిత్రాల్జోనూ (పేదరాశి పెద్దమ్మకథ, రణభేరి), కొన్ని పౌరాణిక చి(త్రాల్జోను (శ్రీకృష్ణావతారం) నటించారు.
ఇహ యీ దశాబ్దంలో పరిచయమైన గుణచిత్రాల నటుల విషయానికి వస్తే ముందుగా ప్రస్తావించవలసింది 'అదృష్టదీపుడు" (1950) ద్వారా పరిచయమైన గుమ్మడి వెంకటేశ్చరరావు. 500పైగా అన్ని తరహా చిత్రాల్లోనూ నటించిన గుమ్మడి నట్రస్టానంలో చెప్పుకోదగ్గ వాటిల్లో కాన్ని, హరిశ్చంద్ర లోని విశ్వామిత్ర, కులదైవంలో
80
పెద్దన్నయ్య (ఆ చిత్రానికి ఆయనే హీరో), రాజమకుటుంలో (ప్రచండుడు, నమ్మినబంటు విలన్, అర్జాంగి, అంతస్తులు, జమీందారు, మహామరాత్రి తిమ్మరుసు, ఏదినిజంలో మునసబు, మరోమలుపు ; పదహారణాల తెలుగుతనం మూర్తీభవించిన గుమ్మడి మనిషిగా ఉన్నతుడు, నటునిగా మహోన్నతుడు. అంతకు ముందే రంగ ప్రవేశం చేసిన ముక్కామల కృష్ణమూర్తి ఈ దశకం ప్రారంభంలో స్వప్నసుందరి, మాయలమారి చిత్రాల్లో విలన్‌గా నటించి ఆపై యీ దశాబ్దంలో వైవిధ్యమున్న యొన్నో భూమికల్ని ధరించారు. (మయాబజర్లో దుర్యోధనుడు, శోభలో విలన్, తెనాలిరామకృష్ణలో తాతాచార్యులు) ఈయన స్వీయ దర్శకత్వంలో 'మరదలు పెళ్ళి' చిత్రాన్ని నిర్మించారు. 1952లో 'పల్లెటూరు' చిత్రంలో చిన్నభూమిక పోషించినా నాగభూషణం 1956లో ఏది నిజం'లో కథానాయకుడుగా నటించి ఆ తరువాత “రక్త కన్నీరు' నాటకాన్ని ప్రదర్శించి తిరిగి సినిమా రంగంలో విలన్‌గా (మూగమనసులు, కధానాయకుడు, బంగారుబాబు) కేరెక్టర్ ఆర్టిస్టుగా (ఉమ్మడి కుటుంబం, ఆత్మీయులు) వందలాది చిత్రాల్లో నటించి స్వయంగా ఒకే కుటుంబం, భాగస్తులు చిత్రాల్లో నిర్మించారు. హైద్రాబాద్‌లో సినిమాహాలు మేనేజ్ చేసిన రాజనాల (ఆర్ నాగేశ్వరరావు సంక్రాంతి (1952) ద్వారా పరిచయమై 1959లో మరణించే నాటికి తక్కువ చిత్రాల్లో నటించినా విలన్‌గా బలమైన ముద్ర వేశారు (దొంగరాముడు, శభాష్‌రాముడు, ఇల్లరికం, జయం మనదే, రాజనందిని, ముందడుగు), వీటికి భిన్నంగా “ఇలవేలుపు” లో సాత్తికాభివయం చేశారు. 1953లో “ప్రతిజ్ఞ చిత్రం ద్వారా పరిచయమైన రాజనాల కల్లయ్య యన్.టి.ఆర్. కాంతారావులకు ప్రతినాయకుడుగా జానపదాల్టో నటించి వికటాట్ట హాసం చేశారు. కొన్ని సాంఘిక చిత్రాల్లో నటించిన రాజనాల అభిమాన పాత్ర అంజనేయుడు. 1960లో *చివరకు మిగిలేది" ద్వారా పరిచయమైన డాక్టర్ యం. ప్రభాకరరెడ్డి విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది చిత్రాల్లో నటించడమేగాక రచయితగా (పండంటికాపురం) దర్శకునిగా (ప్రతిభావంతుడు) తన ప్రజ్ఞను ప్రదర్శించారు. డాక్టర్ వక్కలంక కానురాజు గంభీరమైన పాత్రలకు అర్జాంగి, రాజు-పేద, జయసింహ చిత్రాల్లో ప్రాణం పోశారు. విలక్షణ నటుడు పాల్ దొరస్వామి "పెళ్ళిచేసి చూడు'లో ప్రైవేటు గోవిందయ్యగా తడిగుడ్డలతో గొంతులు కోసి తరువాత మిస్సమ్మ 'దేవదాసు" చిత్రాల్లో నాయిక తండ్రిగా విలక్షణ పాత్రలు నిర్వహించారు. 81
(ప్రజానాట్యమండలి నుంచి సినీరంగప్రవేశం చేసిన కళాకారులు కోడూరి అచ్చయ్య (అర్జాంగి) పెరుమాళ్ళు (రోజులుమారాయి) మరో విశిష్ట నటుడు, రచయిత, పరిశోధకుడు అయిన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి పౌరాణికచిత్రాల్లో ధర్మరాజా, భీష్ముడు వంటి గంభీరపాత్రల్ని జానపదచి(త్రాల్లో రాజు భూమికను సాంఘికచిత్రాల్లో ఇన్స్పెక్టర్ జడ్జి వంటి పాత్రల్ని పోషించారు. ఆం(ధధ్రనాటకరంగ చరిత్ర, నటరత్నాలు పేరిట విశిష్ట నటుల జీవిత విశేషాలను (గ్రంధస్తం చేశారు. నాటకరంగం నుంచి సినిమాల్టోకి వచ్చిన కె.వి.ఎస్. శర్మ (పాండురంగ మాహత్మ్యం, శాంతినివాసం, జయసింహ) విన్నకోట రామన్న పంతులు (బంగారుపాప, దొంగరాముడు, కన్యాశుల్కం) గుర్తింపు కలిగినపాత్రలు పోషించారు. ఏ.ఎల్. నారాయణ అంజలి పిక్చర్స్ చిత్రాల్లోను ఇలవేలుపులోనూ వయసు మళ్ళిన పాత్రలు నిర్వహించారు.
హాస్యనటులుగా పరిచయమైన వారు ఏపూరి రామకోటి (తెనాలి రామకృష్ణలో చాకలి) చదలవాడ కుటుంబరావు (అర్జాంగి). ఈయన మిత్రులతో కలసి 'సతీ తులసి" నిర్మించి వి.మధుసూదనరావును దర్శకునిగా పరిచయం చేశారు.
'దాసి*. నా చెల్లెలు" చిత్రాల్లో రెండవ కధానాయకునిగా పరిచయమైన రంగస్థలనటుడు చలం (రమణాచలం) హాస్యరస (ప్రధానమైన కథానాయకుని పాత్రను సంబరాల రాంబాబు, స్వయంగా నిర్మించిన “మట్టిలో మాణిక్యం' బుల్లెమ్మ బుల్లోడు, చిత్రాల్లో పోషించారు. హాస్యంలో విషాదాన్ని మిళితం చేసి అద్భుతంగా నటించిన
'చలం'ను ప్పర్వీరాజ్కపూర్ 'ఆంధ్రా దిలీప్" అని ప్రశంసించారు.
పాతాళ్టైరవి అంజిగాడుగా పేరొందిన బాలకృష్ణ తరువాతి కాలంలో విరలాచార్య తీసిన పలు జానపదచిత్రాల్లో కధానాయకుని చెలికాడుగా నటించారు.
వినోదా వారి 'శాంతి' చిత్రం ద్వారా పరిచయమైన హాస్యనటుడు బహుముఖ 'ప్రజ్ఞానిధి "పేకేటి శివరాం ఈయన అంతకు పది సంవత్సరాల ముందే చిత్ర నిర్మాణం పబ్లిసిటీ వ్యవహారాల్ని చూడటమే గొక జర్నలిస్టుగా కూడా "పేరొందారు. దేవదాసు, చిరంజీవులు, గులేబకావళి కథ, పెళ్ళినాటి ప్రమాణాలు, భలేరాముడు వంటి చిత్రాల్లో హాస్యాన్ని రంగరించిన విలక్షణ పాత్రలు పోషించారు.
1952లో మానవతి ద్వారా పరిచయమైన విలక్షణ హాస్యనటుడు తిక్కవరపు రమణారెడ్డి ఈయన స్వయాన రాజకీయవాది, సినీనిర్మాత టి. సుబ్బరామిరెడ్డికి పినతండ్రి. నెల్లూరు మాండలీకంతో హాస్యాన్ని విలనీతో రంగరించటంలో అందె వేసిన చెయ్యి. రోజులు "మారాయి, మిస్సమ్మ, సువర్షసుందరి, ఈయన నటించిన గొప్ప చిత్రాల్లో కొన్ని మాత్రమే.
82
'జీవితం'లో హాస్యపాత్రలో జీవించిన తమిళసటుడు టి.ఆర్: రామచంద్రన్ భరణీ వారి 'వరుడు కావాలి'లో హాస్యం అందించారు. మూడుకాళ్ళ ముదుసలిగా కనిపించే కంచి నరసింహారావు, మాయాబజార్, రోజులు మారాయి, దొంగ రాముడు చిత్రాల్లో అతి చిన్న పాత్రల్ని సయితం సలక్షణ హాస్యంతో పండించారు. అలాగే బొడ్డపాటి (దొంగరాముడు, తోడికోడళ్ళు) కూడా! మహాంకాళి వెంకయ్య, పెళ్ళిచేసి చూడు'లో హాస్యపాత్రని 'రాజనందిని'లో గంభీరమైన విలన్ భూమికను సమర్ధవంతంగా నిర్వహించారు. నాటి 'రాజు-పేద' నుంచి మొన్నటి దాకా సుమారు వేయి చిత్రాల్లో చిన్న చిన్న హాస్యపాత్రాల్ని పోషించి ప్రశంసలు పొందిన ఆర్టిస్టు చిడతల అప్పారావు. 1958లో 'శోభ' చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన నాటక రచయిత రావి కొండలరావు, 200 పైచిలుకు చిత్రాల్జో మేలిరకం హాస్యం (నాటి (ప్రేమించిచూడు నుంచి నిన్నటి పెళ్ళి పుస్తకం దాకా) అందించారు. వీరి శ్రీమతి రాధాకుమారి కూడా మంచినటి. ఆమె ఓ వంద చిత్రాల్లో నటించారు (అందాల రాముడు, వివాహబంధం). ఈ దంపతులిద్దరు సినిమాల్లో జంటగా ఓ పాతిక చిత్రాల్లో నటించారు (తమిళంలో ఈ గౌరవం ఎన్.ఎస్. కృష్ణన్, టి.ఎ.మధురంలకు దక్కింది). కొండలరావు చల్లనినీడ, భైరవద్వీపం, కృష్ణార్జున విజయం చిత్రాలకు రచన చేశారు కూడా. పుట్టిల్లు హాస్యనటుడు అల్టు రామలింగయ్య వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాటినుంచి నేటిదాకా దాదాపు 800 చిత్రాల్లో వైరైటి హాస్యాన్ని అందించి, ఇంకా అందిస్తూ వున్న నవ్వుల డాక్టర్ (ఈయన హోమియోపతి డాక్టర్ కూడా) రామలింగయ్య (ప్రమేయం లేకుండా 'విలనీబ్లాక్ రాణించని సందర్భాలు బహు అరుదు. మెయిన్ విలన్ పక్కన చెవులో జోరీగ లాగా ఇబ్బంది పెట్టి హాస్యాన్ని పండించారు. మాయాబజార్, మూగమనుసులు, సర్దార్ పాపారాయుడు, . . . ఎన్నెన్ని వేషాలు, ఎన్నెన్ని విచిత్రాలు-అందుకే ఆయన్ని (ప్రభుత్వం పద్మశ్రీ" బిరుదుతో సత్కరించింది. 1960లో రేలంగి నిర్మించిన 'సమాజం' ద్వారా పరిచయమైన రాజబాబు, రేలంగి తరువాతి స్థానంలో గొప్ప హాస్యనటుడిగా వెలుగొందారు. రాజబాబు, రమాప్రభ కాంబినేషన్లో శతాధిక చిత్రాలు వచ్చాయి. (ప్రేమనగర్, సర్కార్ ఎక్స్‌ప్రెస్. కళ్యాణ మంటపం, నిండుమనసులు, ఇలా ఎన్నో! స్వయంగా బాబ్ అండ్ బాబ్ పతాకంపై “ఎవరికి వారే యమునాతీరే' నిర్మించారు. 1965-80 మధ్యకాలంలో నిర్మించబడ్డ (ప్రతి నాలుగు చిత్రాల్లో రెండింటిలో రాజబాబు తప్పనిసరిగా ఉండేవారు. 83
ఇక హీరోయిన్ల చరిత్ర చూస్తే ....
1949లోనే 'లైలామజ్ను'లో నృత్యం చేసిన తిరువాన్కూరు సోదరీమణుల్లో పద్మిని నాయికగా నటించిన చిత్రాల్లో పెళ్ళికూతురు, అమ్మలక్కలు, వసంతసేన, మోహినీ భస్మాసుర. ఆమె సోదరి లలిత ముఖ్యపా(త్రను పోషించిన చిత్రం 'దేవదాసు” (చంద్రముఖి) వీరిద్దరు కధానాయికలుగా నటించిన చిత్రం 'విజయగౌరి. మరో సోదరి రాగిణి కొన్ని చిత్రాలలో (మాంగల్యబలం) డాన్సు చేశారు.
పాతాళభైరవిలో 'వగలోయి వగలు" అంటూ నర్తించిన లక్ష్మీకాంత 1ప్రియురాలు' చిత్రంలో హీరోయిన్గా ఆపైన కొన్ని చిత్రాల్టో (తెనాలి రామకృష్ణ భాగ్యరేఖ) నృత్యం చేశారు. మంజరిలో నాయికగా నటించిన రుక్మిణి తరువాత సహాయ పాత్రలు (బుద్ధిమంతుడు) పోషించింది. ఈమె కుమార్తె ప్రముఖ నటి లక్ష్మి జాతకఫలం, నాచెల్లెలులో చలం సరసన నటించిన సూర్యకళ తరువాత కొన్ని చిత్రాల్లో సహాయపాత్రలు, వ్యాంప్ పాత్రలు పోషించారు.
1951లో “నవ్వితే నవరత్నాలు'లో పరిచయమైన కృష్ణకుమారి నటి జానకికి స్వయాన చెల్లెలు. కృష్ణకుమారి కొన్ని హాస్యపాత్రలు (ఠీలంగితో ఇలవేలుపు, చలంతో వద్దంటే పెళ్ళి పోషించి బంగారు పాపలో టైటిల్ రోల్లో అద్భుతంగా నటించి (ప్రేక్షకుల చేత పరిశ్రమ చేత గుర్తింపబడి తరువాత భార్యాభర్తలు, కులగోత్రాలు, వరకట్నం, లక్షాధికారి, కానిస్టేబుల్ కూతురు చిత్రాల్లో క్లిష్టమైన నాయిక పాత్రల్ని పోషించి కాంతారావుతో పలు జానపద చి(త్రాల్లో నాయికగా రాణించారు.
'నా యిల్లు'లో నటించిన నాటి గ్లామర్స్ట్రార్ టి.ఆర్. రాజకుమారి 'మనోహర' చిత్రంలో అతి క్లిష్టమైన వసంతసేన పాత్రను సమర్థవంతంగా నిర్వహించారు.
పాతాళభైరవిలో “నరుడా ఏమి నీ కోరిక అంటూ ప్రత్యక్షమైన గిరిజ (దాసరితిలకం కుమార్తె నాయికగా, సహాయ నాయికగా, వ్యాంప్‌గా, హాస్యనటిగా వందలాది చిత్రాల్లో రాణించారు. అత్తాఒకింటి కోడలే, వెలుగునీడలు, భార్యభర్తలు, జగదేకవీరుని కధ, బహుకొద్ది ఉదాహరణలు.
కన్నతల్లి (1953) లో నటించిన రాజసులోచన అటు నర్తకిగా ఇటు నాయికగా, వ్యాంప్‌గా రాణించింది. (మంచి మనసుకు మంచిరోజులు, శాంతి నివాసం, ఖైదీ కన్నయ్య, ఇంటిగుట్టు, వెలుగు నీడలు). ఈమె భర్త ప్రముఖ దర్శకుడు సి.యస్.రావు.
అదే సంవత్సరం 'పుట్టిల్లు' ద్వారా నాయికగా (ప్రవేశించిన హంపీ కన్య జమున రెండున్నర శతాబ్దాలకు సైగా కధానాయికగా రాణించింది. స్వాభిమానం,
84
ఆత్మాభిమానం, ధీరోదాత్తత, అమాయకత్వం, పొగరు వగరు ఉన్న పాత్రలు పోషించటంలో ఆమెకు ఆమెయే సాటి. పండంటికాపురంలో మాలినిదేవి, కలెక్టరుజానకి, శ్రీకృష్ణ తులాభరంలో సత్యభామ, మూగమనుసులు గౌరి, లేతమనసులు. నాయిక సత్యభ్గామ కొద్ది ఉదాహరణలు. గులేబకావళి, మంగమ్మశపథం వంటి జానపద చిత్రాల్లో కూడా రాణంచిన నటి జమున.
1953లోనే పరదేశి ద్యారా పరిచయమైన నటి పండరీబాయి. కొద్ది తెలుగు చిత్రాలలో నాయికగా (వదిన) తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు.
రేచుక్క జానపద చిత్రంలో యువరాణి పాత్రను పోషించిన ప్రమీల తరువాత దేవికగా పేరు మార్చుకుని శాంతినివాసం, నిండుమనసు,. పిన్ని, కంచుకోట, సహ'స్రశిరచ్చేద అపూర్వ చింతామణి చిత్రాలలో నాయికగా రాణించింది. ఈమె కుమార్తె కనక కూడా సినీ రంగ ప్రవేశం చేసింది.
ఎన్.టి. రామారావు సరసన జయసింహ (1955)లో నాయికగా నటించిన వహిదారెహమాన్ (రోజులు మారాయి నర్తకి) హిందీచిత్రసీమలో కూడా మంచి నటిగా గుర్తింపు పొందింది.
రామారావు సరసన పాండురంగ మాహాత్మ్యంలో (1957) పరిచయమైన బి. సరోజాదేవి తన అందచందాలతోపాటు డైలాగ్ డెలివరీలో ఓ ప్రత్యేకైలితో (ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇందుకు ఉదాహరణగా పెళ్ళికానుకు జగదేకవీరునికధ, ఆత్మబలం, శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రాలను చెప్పుకోవచ్చు.
రాజు-పేద, రోజులు మారాయి, చిత్రాలలో సహాయ నాయికగా నటించిన అమ్మాజి, ఆ తరువాత పేరు మార్చుకుని జయశ్రీగా 'దైవబలం'లో నటించింది. (ఈమె కుమార్తే ప్రముఖ నటి జయచిత్ర).
1960లో వచ్చిన సహహ్ర శిరచ్చేద అపూర్వ చింతామణిలో రెండవ నాయికగా కన్నడ నటి బీ. సరోజ నటించగా అందులో నర్తకిగా రాణించిన రాజశ్రీ తరువాతి కాలంలో కొన్ని సాంఘిక చిత్రాల్లోను, కాంతారావు, రామారావులతో కొన్ని జానపద చిత్రాల్లోను నటించింది.
భలేరాముడు (1956)లో డాన్సు చేసిన ఇవి, సరోజ ఆతరువాత అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులులో ఒక నాయికగా నటించింది.
భాగ్యదేవతలో తల్లి పాత్రతో పరిచయమైన నిర్మలమ్మ నాటి నుంచి నేటి దాకా తల్లిగా బామ్మగా వందలాది చిత్రాల్లో నటించారు,
ళా 85
ఇద్దరు హేమలతలు (ఒకరు ఇల్లరికం ఫేం, ఇంకొకరు మంత్రదండం నిర్మాతల్లో ఒకరు) తల్లి పాత్రలలోను శేషమాంబ గయ్యాళి పాత్రలలోను రాణించారు. గయ్యాళి పాత్రలు పోషించిన మరో నటి ఛాయాదేవి, రమణారెడ్డితో కొన్ని హాస్యభూమికలు నిర్వహించారు. నర్తకీమణులుగా బాల, (భలే రాముడు) రీటా (జయసింహ) గుర్తింపు పొందారు.
నాగయ్యగారి 'నా యిల్లు ఫం విద్యావతి సోదరి సంధ్య (జయలలిత తల్లి) తెనాలి రామకృష్ణ మాయాబజార్ భార్యాభర్తలు లో నిండైన పాత్రలు నిర్వహించారు.
క061-౯0౮
తెలుగు టాకీ నాల్లవ దశకంలో నటన పరంగా మెరుగైన పరిణామాలు కనిపించాయి. 1965లో ఆదుర్తి “తేనె మనసులు” ద్వారా హీరోలుగా పరిచయమైన ఇద్దరిలో ఒకరు రామమోహన్. ఈయన తరువాత బహుకొద్ది చిత్రాల్లో (కన్నెమనసులు, రంగులరాట్నం) సహాయకపాత్రలు ధరించారు. అదే తేనె మనసులు చిత్రంలో అమాయక డడ్రిల్లు మాస్టర్ పాత్ర పోషించిన కృష్ణ (ఘట్టమనేని శివరామకృష్ణు నాటి నుంచి నేటి దాకా హీరోగా కొనసాగుతూ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్నో పరిణామాలకు కారణభూతుడైనాడు. "స్పై" చిత్రం గూఢచారి-116 తో విజయభేరి (మోగించి, మోసగాళ్ళకు మోసగాడు. (తొలి భారీ కౌబాయ్ చిత్రం), అల్ఫూరి సీతారామరాజు (సినిమాస్కోప్), సింహాసనం (70 ఎం.ఎం) చిత్రాలు నిర్మించి, 300 పైగా చిత్రాలలో కథానాయకుడుగా నటించి పద్మాలయా పతాకంపై పైన పేర్కొన్న చిత్రాలతోపాటు ఎన్నో తెలుగు, హిందీ చిత్రాలను అందించారు. జీవితభాగస్వామి విజయనిర్మల దర్శకత్వంలో కొన్ని చిత్రాలలో నటించి ఎన్.టి.ఆర్తో 'దేవుడు చేసిన మనుషులు” వంటి మెగాహిట్ నిర్మించారు. హైద్రాబాదులో 'ఫిలింనగరొలో సువిశాల స్థలంలో పద్మాలయా స్టూడియోస్ నిర్మించారు. సాహసానికి, సంచలనానికి మారుపేరయిన కృష్ణ కథా, (స్క్న్స్లే ఎడిటింగ్‌తో పాటు దర్శకత్వం వహించి ద్విపాత్రాభినయం చేసిన విశిష్ట జానపద చిత్రం 'సింహాసనం'.
1965లో ఎల్వి. ప్రసాద్‌గారి “ఇల్లాలు చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన కె.నాగేశ్యరరావు, తరువాత ఒకటి రెండు చిత్రాల్లో మాత్రమే నటించారు.
1966లో ప్రత్యగాత్మగారి “చిలకా గోరింక కథానాయకునిగా పరిచయమైన కృష్ణంరాజు కొంత కాలం విలన్ వేషాలు వేసి ఆ తరువాత 'కటకటాల రుద్రయ్య'తో హీరోగా మారి సొంత బేనర్ గోపీకృష్ణ పతాకంపై నిర్మించిన కృష్ణవేణి, అమరదీపం, బొబ్బిలి (బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు చిత్రాల్లో విశిష్ట నటన ప్రదర్శించారు.
86
1967లో బి.యన్రెడ్డి గారి గోల్డన్ టచ్‌తో (రంగుల రాట్నం) ప్రకాశించిన నటుడు చంద్రమోహన్ (చంద్రశేఖరరావు). అటు సెంటిమెంటల్ పాత్రల్ని, ఇటు హాస్యపాత్రల్నీ మరో వైపు విలన్ టచ్ ఉన్న పాత్రర్నీ సమ్రతిభతో పోషించగల సవ్యసాచి ఇందుకు పదహారేళ్ళ వయసు, కలికాలం, గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటిఅమ్మాయి, ఆత్మీయులు చిత్రాల్ని ఉదాహరించవచ్చు.
రంగస్త్రల నటుడు కె. వెంకటేశ్చరరావు 1961లో ఇద్దరు మి(ష్రులు, వాగ్దానం చిత్రాల్లో 'ప్రాధాన్యతగల పాత్రల్ని పోషించారు.
భీష్మ" (1962) చిత్రంలో దుర్యోధన పాత్రలో పరిచయమైన రంగస్థలనటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి తదుపరి సంక్లిష్టమైన భూమికల్ని (శకని-శ్రీకృష్ణపాండవీయం; భైరవామాత్యుడు -కంచుకోట; బాధ్యత గల తమ్ముడు-బాంధవ్యాలు; _చిత్రసేనుడు- పాండవ వనవాసం) ఎన్నిటినో సమర్థవంతంగా నిర్వహించారు.
తేనెమనసులు ద్వారా పరిచయమైన యం.వెంకటేశ్వరరావు, జి,ఎస్.ఆర్. మూర్తి, చలపతిరావు, ఆ తరువాత బహుకొద్ది సినిమాల్లో నటించారు.
యస్వీరంగారావు సోదరుడు యస్వీ జగ్గారావు, ఆర్. నాగేశ్వరరావుకు డూప్‌గా నటించిన కె. జగ్గారావు పలు చిత్రల్లో సహాయపాత్రలు పోషించారు.
'రాముడు-భీముడు' చిత్రంలో క్షణకాలం కనిపించిన పి.ఎల్‌నారాయణ తరువాతి కాలంలో బడుగు వర్గాల బాధలకు (ప్రతరూసమయిన పాత్రల్ని అనేక చిత్రాల్లో పోషించారు. ఒక్కోసారి విలన్పొత్రను ధరించిన పెరుమాళ్ళు తాలూకు భారమైన పేద పాత్రలే ఈయనకు పేరు తెచ్చాయి.
'మంచి మనిషి ద్వారా పరిచయమైన త్యాగరాజు, రంగులరాట్నంలో సాత్విక పాత్ర పోషించి తరువాతి కాలంలో దుష్ట భూమికల పోషణలో మంచి పేరు సంపాదించుకున్నారు.
1966లో భక్తపోతన ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన రంగస్థల నటుడు రావుగోపాలరావు కంఠం అప్పట్లో సినిమాకి పనికిరాదన్నారు. ఆయనే 1975లో ముత్యాలముగ్గులో కాంటట్రాక్టర్గా విలన్ పాత్ర పోషించాక ఆ మాటల కేసెట్టు వేల సంఖ్యలో అమ్ముడయ్యాయి. విలనీని అందమైన భాష విరుపులతో పండించిన నటవిరాట్ గోపాలరావు జీవితంలో, ఆ ఒక్కటి అడక్కు, గోపాలరావుగారి అమ్మాయి, సర్దార్ పాపారాయుడు ఆణిముత్యాలవంటివి.
ఈ దశకంలో వ్యాయామరంగానికి చెందిన నలుగురు ప్రముఖులు సినీరంగ
87
(ప్రవేశం చేశారు. వారు పహిల్వాన్ కాంతారావు (వీరాభిమన్యు), దండమూరి రాజగోపాల్ (నర్రనశాల), అజిత్సీంగ్ (పాండవవనవాసం), కామినేని ఈశ్వరరావు (భీిమాంజనేయ యుద్ధం).
కధనాయికల వివరాల్ని పరిశీలిస్తే .....
పలు నాటకాలలో నటించి, 1961లో తండ్రులు-కొడుకులు, ఇద్దరు మిత్రులు చిత్రాలలో సహాయపాత్రలు ధరించిన శారద ఆ తరువాత కొన్ని హాస్యపాత్రలు (దాగుడు మూతలు) పోషించి, మలయాళ సినిమాల్లో నాయికగా నటించి తెలుగులో మనుషులు మారాలి చిత్రంలో అమోఘంగా అభినయించి ఆ తరువాత హీరోయిన్గా రాణించారు (జీవిత చక్రం, శారద, పసిడిమనసులు). నడివయసు పాత్రల్లో బాధ్యత గల పోలిస్ ఆఫీసర్‌గా, జడ్జిగా, కలెక్టర్‌గా విభిన్న పాత్రలు పోషించి ఆ చిత్ర విజయాలకు కారకులయ్యారు (పల్నాటిసింహం, సర్దార్‌పాపారాయుడు, అగ్గిరాముడు). ఆమెను భారత (ప్రభుత్వం 'ఊర్వశి' బిరుదుతో సత్కరించింది. అదే సంవత్సరం (1961) అటు భార్యభర్తలలోను ఇటు జగదేకవీరుని కధలోను తళుక్కున మెరిసిన తార జయంతి ఆ తరువాత కలెక్టర్ జానకి, మాయదారి మల్లిగాడు, చుట్టరికాలు, కొండవీటిసింహం చిత్రాల్లో బరువైన పాత్రల్లో జీవించారు.
1965లో ఎల్.వి.ప్రసాద్‌గారి 'ఇల్చాలు' చిత్ర నాయికగా నటించిన గీతాంజలి తదుపరి పద్మనాభం సరసన ఎక్కువగా హాస్యనటిగా రాణించింది. ఆదే సంవత్సరం ఆదుర్తి తేనెమనసులు చిత్రంతో పరిచయమైన సుకన్య, సంధ్యారాణి తరువాత బహుకొద్ది చిత్రాల్లో నటించారు.
మనుషులు-మమతలు (1965) చిత్రం ద్వారా గ్లామరస్ హీరోయిన్గా స్విమ్మింగ్ (త్రస్సులో క్లిక్ అయిన జయలలిత నటించినంత కాలం హీరోయిన్‌గానే కొనసాగిందే తప్ప సహాయపాత్రలు ఇంచుమించు పోషించలేదనే చెప్పాలి. నటనకు నాట్యాన్ని రంగరించిన గూఢచారి-116, అదృష్టవంతులు, ఆమె ఎవరు కధనాయకుడు, చిక్కడు దొరకడు, చిత్రాలు ఆమె ప్రజ్ఞ చాటిన వాటిలో కొన్ని.
అదే సంవత్సరం (1965) సహనాయికగా “ప్రేమించి చూడు'లోను నాయికగా 'వీరాభిమన్యు'లోను నటించిన మరో గ్ధామరస్ నటి కాంచన. అమెలోని నటనకు పరిపూర్మ రూపం అని చెప్పదగిన చిత్రం “కళ్యాణమంటపం', కాంచన కొన్ని జానపద (అందం కోసం పందెం) పౌరాణిక (శ్రీకృష్ణావతారం) చిత్రాల్లో కూడా నటించారు.
1962లో 'భీష్మ' చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా పరిచయమైన వాణిశ్రీ (రత్నకుమారి), విఠలాచార్య జానపదాల్లో హాస్యపా(త్రలు పోషించి, 1967లో
88
మరపురానికధలో ఆమాయకత్వం కలబోసిన నాయికపాత్ర ధరించి సావిత్రి తరహా పాత్రలు పోషించగల మంచినటిగా గుర్తింపు పొంది. ఆపైన (ప్రేమనగర్, దసరాబుల్లోడు, జీవనతరంగాలు, జీవనజ్యోతి, సెక్రటరి వంటి చిత్రాలలో తన అసాధారణ నటనను ప్రదర్శించి కొంతకాలం విరామం తరువాత “అత్తకు యముడు - అమ్మాయికి మొగుడు” ఏమండీ! ఆవిడ వచ్చింది, అల్లరి అల్లుడు తరహా చిత్రాలలో గుణచిత్ర నటిగా తన వైభవాన్ని గుర్తు చేసింది.
శ్రీకృష్ణపాండవీయం (1966) నాయిక చిరునవ్వుల గ్లామర్‌స్టార్ కె.ఆర్. విజయ, పరమానందయ్య శిష్యులు, సిపాయి చిన్నయ్య, అసాధ్యుడు చిత్రాలలో రాణించి ఆ తరువాతి కాలంలో భక్తిరస ప్రధాన చిత్రాలలో మహాశక్తి అంశ గల దేవతాపాత్రల్ని పోషించి (ప్రేక్షకుల నీరాజనాలందుకుంది. ఎన్.టి.ఆర్. సరసన నిన్నే పెళ్ళాడతాలో నాయకిగా నటించిన భారతి చిత్రాలలో చెప్పుకోదగ్గవి అఖిండుడు, గోవుల గోపన్న,
ఆడపడుచు. (1967)లో టైటిల్‌రోల్ పోషించిన చంద్రకళ దసరాబుల్లోడు, తల్దాపెళ్ళామా, ఇన్స్పెక్టర్ భార్య చిత్రాలలో నాయికగా నటించి బాపుగారి సంపూర్ణ రామాయణంలో కళ్యాణ సీతగా కమనీయంగా కడు రమణీయంగా నటించారు.
అంతకు ముందే బాలనటిగా పేరొందిన విజయనిర్మల 'సాక్షి చిత్ర నాయికగా ఆ తరువాత బుద్ధిమంతుడు, పెత్తందార్డు. అల్లూరి సీతారామరాజు, కలెక్టర్ విజయ వంటి శతాధిక చిత్రాలో నటించడమేగాక నటుడు కృష్ణ సహధర్మచారిణిగా ఆయన కాంబినేషన్లో నాయికగా పలు చిత్రాలలో నటించారు.
1969లో ధర్మపత్ని లో రెండవ కధానాయిక పాత్ర పోషించిన మంజుల తరువాతి కాలంలో బంగారుబొమ్మలు, మాయదారి మల్లిగాడు, మంచి మనుషులు, చిత్రాల్లో నాయికగా నటించి కొంత కాలం విరామం తర్వాత 'చంటి వంటి చిత్రాలలో నడివయసు పాత్రలని పోషించారు.
నర్తకిగా పేరొందిన విజయలలిత కథానాయికగా రౌడీరాణి, రివాల్వర్రాణి, టక్కరిదొంగ చక్కని చుక్క చి(త్రాల్లో వాడియావారి నాడియా తరహా పొత్రల్ని సమర్థవంతంగా మాస్ ప్రేక్షకుల నుంచి చప్పట్టు వచ్చేలా పోషించారు.
ఆ దశకంలో నర్రకీమణులుగా పరిచయమైన వారు జ్యోతిలక్ష్మి జయమాలిని. జ్యోతి-లక్ష్మి టైటిల్లో ఆమె ద్విపాత్రాభినయంలో సినిమాయే వచ్చింది. ఇహ ఆ కాలంలో జయమాలిని నృత్యం సినిమాకి తప్పనిసరి అలంకారం, ఆకర్షణ. నర్రకి నాగరత్నం గులేబకావళి కధలో పరిచయమై శ్రీకృష్ణపాండవీయం 'చాంగురే' అంటూ తళుక్కుమనిపించి మాయమైంది.
89
ఈ దశకంలో. నర్తకిగా నటిగా పేరొందిన ఉభయకళాప్రవీణ ఎల్. విజయలక్ష్మి (పునర్జన్మ అంతస్తులు, రాముడు-భీముడు, పూజాఫలం). నిండుసంసారం అనిత నాగభూషణం చిత్రం నాటకాలరాయుడులోను, నటి మణిమాల పగసాధిస్తాలో నాయికగా నటించారు.
హాస్యనటుడు సారథి బ్రహ్మచారి, పరమానందయ్య శిష్యుల కధ, భక్త కన్నప్ప వంటి వందలాది చిత్రాల్లో హాస్యం అందించి నిర్మాతగా అగ్గిరాజు శ్రీరామచంద్రుడు చిత్రాలు నిర్మించారు. సాక్షి చిత్రం ద్వారా పరిచయమైన రంగావరుల రంగారావు సాక్షి రంగారావుగా వందలాది చిత్రాల్లో హాస్యాన్ని విలనిక్ టచ్‌తో పండించారు. మరో (ప్రపంచం ద్వారా పరిచయమైన మాడా వెంకటేశ్వరరావు చిత్రాల్లో చెప్పుకోదగ్గవి ముత్యాలముగ్గు, చిల్లరకొట్టు చిట్టెమ్మ. ఇంకా వేళంగి, పొట్టి ప్రసాద్, రామచం(ద్రరావు, కోళ్ళ సత్యం, మోదుకూరి సత్యం, గణేశ్ మీనాకుమారి, గిరిజారాణి హాస్యభూమికలు పోషించారు. రంగులరాట్నం ద్వారా పరిచయమైన కాకరాల అన్నితరహాపాత్రల్లో ముఖ్యంగా సెంటిమెంటల్ టచ్ వున్న వాటిల్లో రాణించారు.
చిలకా-గోరింకా (1966) ద్వారా పరిచయమైన విలక్షణ హాస్యనటి రమాప్రభ. దాదాపు 500 చిత్రాలలో నిత్యనూతనంగా హాస్యాన్ని అందించి రాజబాబు కాంబినేషన్లో (ఇల్టు-ఇల్లాలు, ప్రేమనగర్, కళ్యాణమంటపం) ఎంతగానో రాణించారు. నాటికి నేటికి ఎవర్!గీన్ కామెడీని అందివ్వగల ఏకైక నటి రమాప్రభ.
క్షం₹1-60 హాస్యనటుడు (ప్రొడక్షన్ మేనేజర్ రామచంద్రరావు నిర్మించిన బస్తీ బుల్బుల్ (1971లో హీరోగా నటించిన విజయచందర్ తరువాతి కాలంలో స్వయంగా నిర్మించిన చిత్రాలు కరుణామయుడులో యేసు'్రీస్తు గాను, ఆంధ్రకేసరిలో వీరేశలింగం పాత్రను శ్రీ వేమన చరిత్రలో వేమన భూమికను నిర్వహించారు.
_ 1973లో జగమే మాయ చిత్రం ద్వారా పరిచయమైన మురళీమోహన్ ఆ
దశకంలో తయారైన జ్యోతి, కల్పన, ఇదెక్కడి న్యాయం బడ్జెట్ చిత్రాల్లో హ్ర్రోగా నటించి జయభేరి పతాకంపై మంచి అభిరుచితో చక్కని కుటుంబ కధాచిత్రాలు అందించారు. ఓ తండ్రితీర్పు, ఉత్తమ చిత్రంగా ఎంపిక కాబడి ఆయన ఉత్తమ నటుడిగా సత్కరించబద్డారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్, మూవీ ఆర్టిస్ట్స్ ఎసోసియేషన్లకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.
అదే జగమేమాయ ద్వారా పరిచయమైన గిరిబాబు విలన్‌గా, విలక్షణ హాస్యనటుడిగా ఈనాటికి నటనలో వైవిధ్యం చూపుతున్నారు.
90
అదే సంవత్సరం (1973) గీత కథానాయకుడుగా పరిచయమైన ప్రసాద్‌బాబు తరువాతికాలంలో ఎక్కువగా విలన్ పాత్రలు ధరించారు.
నీడలేని ఆడది (1974) ద్వారా పరిచయమైన నరసింహరాజు తరువాతికాలంలో లక్ష్మీపూజ, జగన్మోహిని, ్రిలోకసుందరివంటి పలు జానపదచిత్రాల్లో కధనాయకుడుగా రాణించారు.
లక్ష్మీకాంత్. (కన్నెవయసను), ఈశ్వరరావు (న్వర్శం-నరకం), శ్రీధర్ (ముత్యాలముగ్గు), రంగనాథ్ (చందన), విష్ణువర్దన్ (లక్ష్మినిర్దోషి, రవి (సీతారామ వనవాసం), (ప్రభాకర్ (ఆడవిమనుషులు), హరిప్రసాద్ (శివరంజని), రాజా (స్వప్తు), హరిబాబు (అయినవాళ్ళు), నారాయణరావు (కుక్కకాటుకు చెప్పుదెబ్బ) కధానాయకులుగా సినీరంగ (ప్రవేశం చేసి, తరువాతికాలంలో కేరెక్టర్ ఆర్చిస్టులుగా రాణించారు. ఈ మేరకు నటుడుగా వైవిధ్యం ఉన్న పాత్రల్ని ప్రత్యేక శైలిలో పోషిస్తున్న ఆర్టిస్టు శరత్‌బాబు.
స్వర్గం-నరకంలో మరో కధానాయకుడుగా నటించిన మోహన్‌బాబు (భక్తవత్సలం) తరువాత విలన్‌గా అనేక చిత్రాలలో (సర్దార్ పాపారాయుడు, దేవత, డూండీ నిర్మించిన దొంగల సినిమాలు) రాణించి ఆయన గురువు దాసరి టచ్‌తో 'పాలు- నీళ్ళుతో హీరోగా మారి ప్రతిజ్ఞ, అసెంబ్లీ రౌడీ, మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు, (స్వయంగా నిర్మించినవి) అల్టుడుగారు వంటి చిత్రాల్లో హాస్యరసం, గంభీరత గల హీరోపాత్రలను సమహ్రతిభతో పోషించారు.
అంతులేనికధ (1976) ద్వారా పరిచయమైన రజనీకాంత్ బహుకొద్ది చిత్రాల్జోను (అన్నదమ్ములసవాల్) మరోచరిత్ర (1978), కధానాయకుడు కమలహాసన్ ఆకలిరాజ్యం, ఇదికధకాదు, ఇంద్రుడు చంద్రుడు వంటి చిత్రాల ద్వారా తెలుగు (ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
మద్రాసు ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన శివశంకర వర ప్రసాద్ 'చిరంజీవి'గా మారి పునాదిరాళ్ళు (1978) ద్వారా పరిచయమై ఇది కథకాదు, పున్నమినాగు, చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ ధరించి హీరోగా మారిన తరువాత ఖైదీ చిత్రం అనూహ్య విజయం సాధించి ఆయన జీవితాన్ని కొత్తమలుపు తిప్పింది. ఆనాటి నుంచి చిరంజీవి హీరోగా అందించిన చిత్రాలు అత్యధిక శాతం విజయబావుటాలెగరవేసి విపరీతమైన ఫాన్మెయిల్ సంపాదించిపెట్టాయి. చట్టానికి కళ్ళు లేవు, ఛాలెంజ్ అభిలాష దొంగ, అడవిదొంగ, దొంగమొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్‌లీడర్, చూడాలనివుంది, ఇలా యొన్నెన్నో హిట్స్ ఇవ్వటమే గాక ఆజ్కా గూండా
9]
రాజ్, ప్రతిబంధ్ హిందీ చిత్రాలలో కూడా నటించారు. నిరంతర కృషి వృత్తిపట్ల అంకిత భావం, నవ్యత కోసం తపన-ఇవి ఆయన విజయానికి సోపానాలు. అంతకు ముందు బాలనటుడిగా రాణించిన బాలకృష్ణ 'దానవీరశూరకర్ణలో అభిమన్యునిగా హీరోపాత్రలో అవుననిపించుకొని ఆ(గ్రశేణి కధానాయకుడుగా ఆనాటి మంగమ్మగారి మనవడు నుంచి నేటి సమరసింహారెడ్డి వరకు నటనలో తండ్రి ఎన్.టి.రామారావు తాలూకు గంభిరతను ప్రదర్శిస్తూ సంచలన విజయాలు సాధించారు. ఈ దశాబ్దంలో రంగప్రవేశం చేసిన కొందరు విలన్గుగాను, మరికొందరు కేరెక్టర్ ఆర్టిస్టులుగాను హాస్యాన్ని రంగరించి పాొత్రపోషణ చేసినవారు ఎందరో ఉన్నారు. గోకిన రామారావు, చలపతిరావు, చక్రపాణి, దేవదాస్ కనకాల, పుండరీకాక్షయ్య, నర్రా వెంకటేశ్వరరావు, కె.వి. చలం, నూటొక్కజిల్హాల అందగాడు నూతనప్రసాద్లను ఈ కోవలో ప్రముఖులుగా చెప్పుకోవాలి. హాస్య విభాగంలో సుధాకర్, రాళ్ళపల్లి (ఊరుమ్మడిబతుకులు), తరువాతి కాలంలో బట్టల సత్తెంగా ప్రసిద్దిపొందిన మల్లికార్జునరావు, (నాగమల్లి, కె.కె.శర్మ, రాజబాబు సోదరుడు చిట్టిబాబు, జర్నలిస్టు ఏచూరి లను పేర్కొనాలి. నటీమణుల విభాగంలో ..... వెన్నిరాడై నిర్మల పొగరుబోతు (1972) బొమ్మా బొరుసాలో నటించగా అంతకు ముందు బాలనటిగా పేరొందిన రోజారమణి కన్నె వయసు (1973) ఊరికి ఉపకారిలో నటించిన ఆరతి, గీతలో నటించిన లీలారాణి, జీవితరంగంలో నటించిన ప్రమీల, ఆడదాని అదృష్టం నటి మమత, చిట్టెమ్మ చిలకమ్మ నాయిక కె. విజయ, ముత్యాలముగ్గు సంగీత, నాలాగా ఎందరో రూప, జరీనావహాట్ (గాజులకిష్టయ్య), హేమాచౌదరి (ప్రేమాయణం), సత్యప్రియ. (బ్రతుకే ఒక పండుగ), శ్రీప్రియ (చిలకమ్మ చెప్పింది) కాగా... పల్లెటూరిబావ నాయిక లక్ష్మి సుపుత్రుడు, పంతులమ్మ మల్లెపూవు మొదలగు చిత్రాల్లోను, నీడలేనిఅడది (1974) నాయిక ప్రభ, ఇదెక్కడిన్యాయం, జగన్మోహిని మొదలగు చిత్రాల్లోను, అందాలరాముడు (1973) నాయిక లత ఎన్.టి.ఆర్తో నిప్పులాంటి మనిషి లోను, స్నేహం ద్వార పరిచయమైన మాధవి ఖైదీ, త్రిలోకసుందరి వగైరా చిత్రాల్టోను, రాజాధిరాజు ద్వారా పరిచయమైన సుమలత, కన్యాకుమారి నాయిక శ్రీవిద్య, ఆ తర్వాతి కాలంలో అప్పుడప్పుడు వెరైటీ పాత్రలు ధరిస్తున్నారు. ఈ దశాబ్దం అందించిన నటీమణుల్లో జయ(త్రయాన్ని (జయచిత్ర, జయప్రద, జయసుధ) పేర్కొనాలి. యవ్వనంకాటేసింది నాయిక జయచి(త్ర, చిల్లరకొట్టు చిట్టెమ్మ, 92
రాముడే రావణుడయితే!, కల్పన, బొబ్బిలిపులి చిత్రాలలో నాయికగా నటించి ఈనాటికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్ని పోపిస్తున్నారు. భూమికోసంలో నర్తకిగా పరిచయమైన జయప్రద అంతులేనికథతో, సామర్థ్యం ఉన్న నటిగా నిరూపించుకొని సిరిసిరిమువ్వ, సాగరసంగమం, దేవత, అడవిరాముడు వంటి చిత్రాలలో నటిగా నర్తకిగా రాణించి కొన్ని హిందీ చిత్రాలలో నటించి సత్యజిత్‌రే వంటి విశిష్ట దర్శకుడి నుంచి ప్రశంసలనందుకున్న విశిష్ట నటి. లక్ష్మణరేఖ నాయిక జయసుధ చిలిపినటనకు, గంభీరపాత్ర పోషణకు పెట్టింది "పేరు. శ్రీవారిముచ్చట్టు, శివరంజని, ప్రేమాభిషేకం, ఇది కథకాదు, గోపాలరావుగారి అమ్మాయి, మనీ, ఆంటీ చిత్రాలలో వైవిధ్యం వున్న పాత్రల పోషణలో పరిణతి చెందిన నటన ప్రదర్శించారు. అంతకు ముందు బాలనటిగా బడిపంతులు, భార్యాబిడ్డలు, బాలభారతం మొదలైన చిత్రాలలో నటించిన శ్రీదేవి కధానాయికగా పదహారేళ్ళ వయసు, చిత్రంలో అద్భుతంగా అభినయించి. ఆ తరువాత వేటగాడు, ఆకలిరాజ్యం, (ప్రేమాభిషేకం, దేవత, (త్రిశూలం, క్షణక్షణం వంటి పలు విజయవంతమైన చిత్రాలలో నాయికగా నటించి, హిందీ చిత్ర రంగంలో ప్రవేశించి తన ప్రతిభతో రాణించారు. ఈ దశకం చివరలో ఏడంతస్తులమేడ ద్వారా పరిచయమైన నాయిక సుజాత ఆ తరువాత నటించిన చిత్రాలలో చెప్పుకోదగ్గది చంటి. 1980లో కాత్తజీవితాలు నాయిక సుహాసిని ఆతరువాత వచ్చిన రాక్షసుడు, మంగమ్మగారి మనవడు, అక్కమొగుడు, మొదలగు చిత్రాలలో క్లిష్టమైన పాత్రల్ని పోషించారు. గూడుపురాణి నాయికగా పరిచయమైన శుభ, స్వర్గం నరకం ద్వారా పరిచయమైన అన్నపూర్ష పలుచి(త్రాల్లో వేంపిష్ టచ్ ఉన్న పాత్రలు పోషించిన వైవిజయ, (బ్రహ్మరుద్రులు ఫేం సుమిత్ర, నర్తకి హలం, కొన్ని చిత్రాల్లో నాయికపాత్ర పోషించిన గీతా, కవిత ఈ దశకంలో సినీరంగ ప్రవేశం చేసినవారే. ఒక్కసినిమాలో మాత్రమే నటించిన వక్కలంక పద్మ (గోరింటాకు), తాళ్ళూరి రామేశ్వరి (సీతామాలక్ష్మి, 'అరే! ఏమిటీ లోకం” అంటూ ప్రేక్షకులను అలరించిన మరో చరిత్ర ఫేం ఫటాఫట్ జయలక్ష్మి స్వప్న చిత్రనాయిక స్వప్న, నటలోకంలో రాణించినవారే. 93
క0981-909
గత దళకంలో పరిచయమైన చిరంజీవి యీ దశకంలో మెగాస్టార్ స్టాయికి ఎదిగారు.
సీతాకోక చిలుక కధానాయకుడు మురళి తెలుగులో చేసిన అనుబంధం అభినందన చెప్పుకోదగ్గది.
1982లో మల్లెపందిరి కధానాయకుడు విజ్జిబాబు ఒకటి రెండు చిత్రాల్లో మాత్రమే నటించగా నాలుగు స్తంభాలాట హీరో నరేష్ ఆ తరువాత నటించిన హాస్యచిత్రాల్లో చెప్పుకోదగ్గది 'భళారే విచిత్రం'.
అదే సంవత్సరం 'తరంగిణి' లో నటించిన హీరోద్వయం భానుచందర్, సుమన్ ఆ తరువాత యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాల్లో రాణించారు,
'మయూరి'లో 1985 నెగిటివ్ హీరో పాత్ర ధరించారు సుధాకర్. శివకృష్ణ (కాయ్‌రాజాకాయ్ 1984) తరువాత కొన్ని చిత్రాల్లో నటించి స్వయంగా నిర్మించారు కూడా,
'ఫ్రతిఘటని” (1985) హీరో రాజశేఖర్, 'తలంబ్రాలు'లో విలన్ తరహాపా(త్రను పోషించి, ఆ తరువాతి కాలంలో యాంగ్రీ హీరోగా అంకుశం, ఆహుతి, శివయ్య, చిత్రాల్లోనటించి రొమాంటిక్ టచ్ గల అల్లరిప్రియుడులో రాణించటం విశేషం. ముద్దమందారం హీరో (ప్రదీప్, తరువాత రెండుజెళ్ళ సీత'లో నటించారు. మాపల్లెలో గోపాలుడు కథానాయకుడు అర్జున్ ఆ తరువాత మన్నెంలో మొనగాడు, కోనసీమ కుర్రాడు, చిత్రాలని హిట్ చేశాడు.
హాస్య చిత్ర కథానాయకుడు రాజేంద్రప్రసాద్, రేలంగి నరసింహారావు, జంధ్యాల, ఎస్.వి. కృష్ణారెడ్డి, తీసిన చిత్రాల్లో నవ్వులు పండించి ఆపై బాపుగారి రమణీయ చిత్రాల్లోనూ (పెళ్ళి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం) స్వయంగా నిర్మించి స్త్రీ పాత్ర ధరించిన “'మేడమ్'లోను తన సత్తా చూపించాడు.
1986లో “అర్దరాత్రి స్వతంత్ర్యం నాయకుడు ఆర్. నారాయణమూర్తి ఆ తరహా చిత్రాలు స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించి సహజత్వానికి దగ్గరగా ఉండి, సామాజిక చైతన్యాన్ని కోరీ హీరోపాత్రలను పోషించారు.
అదే సంవత్సరం “అత్తగారు స్వాగతం” ద్వారా పరిచయమైన కళ్యాణచ(క్రవర్తి ఇంటిదొంగ, దొంగకాపురం వంటి బహుకొద్ది చిత్రాల్లో నటించారు. 1986లో తెలుగు తెరకు పరిచయమైన ఇద్దరు కథనాయకులు (నాగార్జున, వెంకటేష్ ఈనాటి వరకు
94
అ(గ్రశేణిలో హీరోలుగా వైవిధ్యమున్న పాత్రలు ధరించి వారి ఇమేజ్ను పెంచు కొంటున్నారు. అక్కినేని-అన్నపూర్ణ కుటుంబానికి చెందిన నాగార్జున 'విక్రమ్'తో ఆరంగేట్రమ్ చేసి మొదట్లో కొన్ని పరాజయాలను చవిచూసినా 'శివితో ఓ క్రొత్త ట్రెండ్ సృష్టించి గీతాంజలి'తో టాలెంట్ వున్న నటుడుగా నిరూపించుకొని 'అన్నమయ్య'"తో విభిన్న తరహాపాత్రలు పోషించగల దిట్ట అనిపించుకొని, అభిరుచితో 'నిన్నేపెళ్ళాడతా' వంటి ఎంటర్న్బైనర్స్ను అందించగల నిర్మాతగా నిరూపించుకొన్నారు. అన్నమయ్యలో నటనకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి (ప్రశంసలనందుకొన్నారు.
సురేష్ ప్రొడక్టన్స్, స్టార్ప్రాడ్యూసర్ డాః రామానాయుడు కుటుంబానికి చెందిన వెంకటేష్ 'కలియుగపాండవులు'తో సినీరంగ ప్రవేశం చేసి బొబ్బిలిరాజా, శత్రువు, చంటి, పవిత్రబంధం వంటి పలు చిత్రాలలో వైవిధ్య నటనను (ప్రదర్శించారు. ధర్మచక్రంలో నటనకు గాను (ప్రభుత్వ బహుమతి పొందారు.
“ప్రార్థన' చిత్ర నాయకుడిగా పరిచయమైన సురేష్ తరువాతి కాలంలో నటించిన చిత్రాలలో ఎన్నదగినవి పరువు-ప్రతిష్ట్ర పట్టుకోండి చూడ్డాం.
“సామ్రాట్ ద్వారా పరిచయమైన రమేష్ కొద్ది చిత్రాల్టో హీరోగా నటించారు.
క్యారెక్టర్ ఆర్జిస్పుల గూర్చి వివిరణలోకి వెళితే ముందుగా చెప్పుకోవాల్సింది గొల్లపూడి మారుతీరావు (1982-ఇంట్టోరామయ్య వీధిలో కృష్ణయ్య), కోట శ్రీనివాసరావు (1985-ప్రతిఘటన). ఆ తరువాతి కాలంలో వీరిద్దరు శతాధిక చిత్రాల్లో హాస్యాన్ని విలనీతో రంగరించి జనరంజక నటన (ప్రదర్శించి (ప్రేక్షకుల అభిమానాన్ని పొందగలిగారు.
చరణ్‌రాజ్ (ప్రతిఘటన), రఘువరన్ (శివ) విలన్ పాత్రల్లో రాణించగా విసు, హేమచందర్, ఆహుతి ప్రసాద్, నాగేంద్రబాబు, రామిరెడ్డి, కోట శంకరరావు, బెనర్జీ పలురకాల పాత్రల్ని అవలీలగా పోషిస్తున్నారు.
హీరోయిన్ల విభాగంలోకి వెడితే .....
“సప్తపది నాయిక సబిత, 'మయూరి' నాయిక సుధ ఆ చిత్రాలతోనే నటనకు స్వస్తి పలికారు. మయూరి నాయిక సుధాచంద్రన్‌కు 1985లో కేంద్రప్రభుత్వ స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది.
ముద్దమందారం (1981) పూర్షిమ, నిరీక్షణ (1986) అర్భన (దాసి చిత్రంలో నటనకు ఈమెకు కేంద్రప్రభుత్వ బహుమతి లభించింది), సీతాకోకచిలుక (1981) ముచ్చర్ల అరుణ, విశ్వరూపం నాయిక అంబిక, సంసారం ఒక చందరంగం నటి కల్పన బహుకొద్ది చిత్రాల్లో నటించారు,
తిక
సితారా" (1984) నాయిక భానుప్రియ చక్కని నటి, అంతకు మించి చక్కని నర్తకి. ఈ విషయాన్ని ఆలాపన, స్పర్ణకమలం, దొంగమొగుడు చిత్రాలు నిరూపించాయి. “వంశగారవం” (1982) నటి విజయశాంతి ఆ దళకంలో దాదాపు అందరూ హీరోల సరసన నాయికగా రాణించి 'కర్తవ్యం'తో లేడిసూపార్స్టార్అయి ఒసేయ్ రాములమ్మలో డీగ్దామర్ పాత్రలో జీవించింది (1990లో కర్తవ్యం నటనకు కేంద్ర (ప్రభుత్వ బహుమతి పొందారు). నటి రాధ నటించిన చిత్రాలలో రాక్షసుడు, కొండవీటిదొంగ, గూండా, చెప్పుకోదగ్గ విజయం సాధించాయి. ఈమె సోదరి అంబిక విశ్చరూపంలో ఎన్.టి.ఆర్ సరసన నాయికగా నటించింది. తమిళ చిత్ర రంగంలో విలన్‌గా పేరొందిన ఎం.ఆర్రాధ కుమార్తె రాధిక నటించిన చిత్రాలలో అనుబంధం, దొంగమొగుడు, గూఢచారి నెం.1 చెప్పుకోవాలి. మంచి నర్తకి రమ్యకృష్ణ చిత్రాల్లో సూత్రధారులు, అల్లుడుగారు, అల్టరిప్రియుడు, అన్నమయ్య చెప్పుకోవాలి. ఇంకా కథనాయికలుగా నటించినవారు అశ్వని (స్టేషన్ మాస్టర్, నిరోష (నారి నారి నడుమ మురారి), సీత (పోలీసుభార్య),శోభన (అభినందన), గౌతమి. (శ్రీనివాసకళ్యాణం), నళిని (ఇంటిగుట్టు, మున్‌మున్‌సేన్ (సిరివెన్నెల) జూహిచావ్లా (విక్కీదాదా), రజని (మజ్ను), మందాకిని (సింహాసనం), రేవతి (అంకురం), వాణివిశ్శనాథ్ (ఆడపులి), అనితారెడ్డి (అబ్బాయ్-బాబాయ్), మహాలక్ష్మి (రెండుజెళ్ళసీత).... బాలనటులుగా పేరొందిన తులసి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి ఈ దశకంలో తారలుగా ఎదిగి పలు చిత్రాల్లో సోదరి పాత్రల్గో రాణించారు. ఈ దశకంలో నర్తకీమణులుగా ప్రసిద్ది చెందినవారు అనూరాధ, డిస్కోశాంతి, సిల్క్‌స్మిత (ఈమె మంచినటి అని కూడా నిరూపించిన చిత్రం సీతాకోకచిలుక). హాస్యవిభాగానికి వస్తే అనంత్ (చిట్టిబాబు సోదరుడు) నారినారినడుమ మురారితో పరిచయమయ్యారు. వసంతగీతంతో పరిచయమైన గౌతంరాజు చిత్రాల్లో ఘరానా మొగుడు, ప్రేమకు వేళాయెరా! చెప్పుకోవాలి. నాలుగుస్తంభాలాట ద్వారా పరిచయమైన సుత్తిజంట వేలు వీరభద్రరావు కలసి కొన్ని చిత్రాల్లోను విడివిడిగా కొన్ని చిత్రాల్లోను హాస్యనటి శ్రీలక్ష్మి కాంబినేషన్‌తో ఆహ్హాదకరమైన ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించారు. ఈ దశాబ్దం బహూకరించిన బహుఉత్తమ హాస్యనటుడు అహా నా పెళ్ళంట! చిత్రంతో గుర్తింపు పొందిన బ్రహ్మానందం, ఈయన ఆరోగ్యకరమైన హాస్యాన్ని నిత్యనూతనంగా అందించేందుకు నిరంతర కృషి చేస్తున్నారు. డైలాగులు లేకుండా 9ర్ర
నటించిన “వినోదం, మనీలో ఖాన్‌దాదా, పట్టుకోండి చూద్దాంలో కత్తిరాందాసు పాత్రలు మరువలేనివి.
“ఈ ప్రశ్నకు బదులేది?” చిత్రం ద్వారా విలక్షణ హాస్యనటుడిగా పరిచయమైన బాబూమోహన్ తనకున్న మైనస్ పాయింట్ శరీరపు రంగును ప్లస్ పాయింటుగా చేసుకొని దాని మీద సెటైర్లు పండించి హాస్యాన్ని అందించటంలో దిట్ట అనిపించుకున్నారు.
విన్నకోట విజయరాం, జుట్టు నరసింహం, గాదిరాజు సుబ్బారావు, లక్కెంసెట్టి నాగేశ్చరరావు, మిరాయిచిట్టి, కృష్ణవేణి, కల్పనారాయ్, బిందుమాధవి, పాకీజా, జయలలిత హాస్యరంగంలో కృషి చేస్తున్న వారిలో కొందరు.
కోవై సరళ ఆలపాటి లక్ష్మి అత్తిలి లక్మి కాకినాడ శ్యామల, పి,ఆర్.వరలక్ష్మి డబ్బింగ్ జానకి, శకుంతల, సరస్వతి, మహిళా విభాగంలో కేరెక్టర్ ఆర్టిస్టులుగా గుర్తింపు పొందారు.
1991-99 చలనచిత్ర రంగంలో యీ దశకం అన్ని విభాగాల్లోనూ సంచలనాత్మకమైన మార్పులకు లోనైంది. అందుకు నటనారంగం మినహాయింపు కాదు. బహుశా యీ శతాబ్దపు చివరి దశకంలో (1991-1999) పరిచయమైనంతమంది హీరోలు, హీరోయిన్సు, కారెక్టర్ అర్జిస్ట్పులు, హాస్యనటులు మరే దళకంలోనూ పరిచయంకాలేదన్నది నిర్వివాదాంశం. ఇది ప్రగతికి చిహ్నం, ఆరోగ్యకరపరిణామం. అయితే వీరిలో ఎందరు కాలపరీక్షకు నిలబడి వచ్చే సహస్రాబ్ది ప్రారంభదశలో తమ ఉనికిని నిరూపించుకొంటారో కాలమే తేల్చిచెప్పాలి. డబ్బింగ్ పుణ్యమా అంటూ గ్లామర్ ఉంటేచాలు,పాత్రధారణ ఒకరు, గాత్రధారణ మరొకరు అన్నచందాన కథ సాగిపోత్తుంది. (ఇది హీరోల విషయంలో కొంత వరకు హీరోయిన్ల విషయంలో చాలా వరకు రుజువైన నిజం). జగపతి సంస్థ అధినేత రాజేంద్రప్రసాద్ తనయుడు జగపతిబాబు క్రిందటి దశకంలోనే (సింహస్వప్నం) రంగప్రవేశం చేసినా యీ దశకంలో శుభలగ్నం, గాయం, అంతఃపురం, సముద్రం ద్వారా తనప్రత్యేకతను ప్రదర్శించారు. మొదట్లో కొన్ని చిత్రాల్లో విలనిక్ టచ్ ఉన్న నెగటివ్ పాత్రలు చేసినా శ్రీకాంత్‌కు రాఘవేంద్రరావు తీసిన 'ెళ్ళిసందడి విజయం కథానాయకుడిగా అతనికి ప్లస్ పాయింట్. అలాగే నెగటివ్ రోల్స్ నుంచి హీరోస్టాయికి ఎదిగిన మరో ఇద్దరిలో ర్త
ఒకరు చక్రవర్తి (శివ నుంచి ఆనగనగా ఒక రోజు, (ప్రేమకు వేళాయేరా! వరకు), మరొకరు శ్రీహరి వైభవం నుంచి పోలీసు, దేవా, సాంబయ్య వరకు.
గుణచిత్ర నటుడిగా పేరొందిన ప్రకాశ్‌రాజ్ కూడా 'వీడు సామాన్యుడు కాదు" చిత్రంలో కథానాయకుడిగా నటించారు (అంతఃపురంలో నటనకు గాను కేంద్ర 'ప్రభుత్వ ప్రశంస పొందారు).
విజయమాధవి కుటుంబానికి చెందిన నవీన్ కొన్ని చిత్రాల్లో కధానాయకుడు (చెలికాడు, పెళ్ళి. కొన్ని చిత్రాలలో సహాయపొత్రలు ధరించి తన కంచుకంరంతో డబ్బింగ్ రంగంలో రాణించి హీరోగా రూపాంతరం చెందిన నటుడు సాయి కుమార్ (ఈశ్వర్ అల్లా). ఇంకా శివాజీరాజా (కుర్రాళ్ళ రాజ్యం) దగ్గుబాటిరాజా(శుక్రవారం మహలక్ష్మి, అజిత్ (ప్రేమపుస్తకం), సాయికృష్ణ (బాయ్‌ఫ్రెండ్), వినీత్ (రుక్మిణి) ప్రశాంత్ (ప్రేమ కావ్యం), అబ్బాస్ (రాజహంస), వేణు (స్వయంవరం), శివాజి (హృదయాంజలి), (బ్రహ్మాజి (చంద్రలేఖ), రవితేజ (సింధూరం), చిన్న (ఆంటి, అరుణ్‌కుమార్ (గ్రీకు వీరుడు) కాగా బాలనటుడు నుంచి హీరోస్టాయికి ఎదిగిన హరీష్ (ప్రేమఖైది), మౌనపోరాటం ద్వారా గత దశాబ్దంలో పరిచయమై సీతారత్నంగారి అబ్బాయి ద్వారా గుర్తింపుపొందిన వినోద్‌కుమార్, పెళ్ళిద్వారా డైనమిక్ ఆర్టిస్ట్ అని ముద్రపడ్డ పృధ్వి, అక్కినేని మనవడుగా నాగార్జున మేనల్టుడుగా ప్రేమకథ ద్వారా ఆరంగేట్రమ్ చేసిన సుమంత్, బాలనటుడుగా రాణించి కథానాయకుడుగా మొదటి (ప్రయత్నంలోనే ఓహో అనిపించుకున్న హీరో కృష్ణ కుమారుడు మహేష్ (రాజకుమారుడు), అన్నకుతగ్గ తమ్ముడుగా తన స్వంత ఇమేజ్‌తో ముందుకు సాగుతున్న పవన్‌కళ్యాణ్ (తొలిప్రేమ, తమ్ముడు)......... వీరందరు రేసులో ఉన్నవారే.
రఘునాథరెడ్డి, జీవా, నవభరత్ బాలాజీ, వినోద్, అశోక్ మొదలగువారు పలు రకాల పాత్రలు ధరిస్తున్నారు.
ఇక హీరోయిన్ల విషయానికొస్తే తెలుగు పరిశ్రమ హిందీ తమిళ రంగాల్లోని హీరోయిన్స్‌ని, పబ్లిసిటీ రంగంలో పేరొందిన వారిని, అందాలరాణులుగా ఎన్నికైన వారికి స్వాగతం చెప్పింది. ఒకసారి ఆ దిశగా అవలోకిస్తే....
మాలశ్రీ, (ప్రేమఖైది), మీనా (సీతారామయ్యగారి మనవరాలు, చంటి) రేఖ (తేనెటీగ), దివ్యవాణి (పెళ్ళిపుస్తకం), ఆమని. (మిష్టర్ పెళ్ళాం), ప్రియారామన్ (శుభసంకల్పం),దివ్యభారతి (బొబ్బిలిరాజా), నగ్మా (కిల్లర్, అశ్చనినాచప్ప (ఇన్స్పెక్టర్ అశ్వని), టాబూ (నిన్నే పెళ్ళాడతా[), మోహిని (ఆదిత్య 369), రోజా (భైరవద్వీపం), (ప్రేమ (ధర్మచక్రం), శిల్పాశిరోడ్కర్ (బ్రహ్మ, సుకన్య (పెద్దరికం), కస్తూరి
98
(అన్నమయ్య, దీప్తిభట్నాగర్ (పెళ్ళిసందడి),యమున (మామగారు), సితార (శుక్రవారం మహాలక్ష్మి, ఊహ (ఆమె), సిమ్రాన్ (సమరసింహరెడ్డి, సాక్షి శివానంద్ (సము(ద్రం) కౌసల్య (పంచదార చిలకు, ట్వింకిల్ ఇన్నా (శీను), ఐశ్వర్యారాయ్. (రావోయి చందమామ), రోషిణి (మాష్టర్, లైలా (ఎగిరే పావురమా), మనీషాకోయిరాల(క్రిమినల్, నటి మంజుల కుమార్తె రుక్కిణి (రుక్మిణి, ఆంధ్ర (పేమకధ), మహిమాచౌదరి, సంఘవి (పట్టుకోండి చూద్దాం), పూజాభట్ (బాయ్‌ఫ్రెండ్), రాశి (గోకులంలో సీత), మోనికాబేడి (తాజ్‌మహాల్, సాధిక (హలో! ఐలవ్యూ), మీనాక్ష్శేషి(ద్రి (ఆపద్బాంధవుడు రవీనాటాండన్ (బంగారు బుల్లోడు), ఆశాపైని (ప్రేమకోసం), లయ (స్వయంవరం), అంజలరువేరి (సమరసింహారెడ్డి, నదియ (వింత దొంగలు, మధుబాల (అల్లరిప్రియుడు) శిల్పాశెట్టి (వీడెవడండీ బాబూ), మమతాకులకర్షి (దొంగ పోలీస్), నటి లక్ష్మికుమార్తె ఐశ్చర్య (బ్రహ్మ, సింధుజ (పెళ్ళిపుస్తకం), ఇంద్రజ (యమలీల), కీర్తిరెడ్డి (తొలిప్రేమ)... ఇలా ఎందరో నాయికలు తమ గ్లామర్‌తో స్ప్టార్స్గా వెలుగొందుతూ ఆర్టిస్టులుగా నిరూపించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఇక క్యారెక్టర్ ఆర్జిస్టులుగా తమకు లభించిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్న వారిలో జయహ్రకాశ్రెడ్డి, నాజర్ విజయకుమార్, సుబ్బరాయశర్మ మహర్షి రాఘవ, శివపార్వతి, సుధ, సన మొదలైనవారు. హాస్యరంగంలో జెన్ని, కళ్ళు చిదంబరం, గరగ, గణేశ్ గుండు హనుమంతరావు, జూనియర్ రేలంగి, జూనియర్ వేణుమాధవ్, ఐరన్ లెగ్ శాస్త్రి, ఉత్తేజ్ కాగా... రైటర్ కమ్ యాక్టర్ ఎం.ఎస్, నారాయణ, నాటి అల్టురామలింగయ్య వలె దొరికిన ప్రతి పాత్రలోనూ తనప్రతిభను నిరూపించుకొని పెరుగుతున్న వామనుడు. బాలనటుడుగా శతాధిక చిత్రాలలో హాస్యాన్ని పండించి రాజేంద్రుడు గజేంద్రుడులో చాట భాషతో కడుపుబ్బనవ్వించి దాంతో హీరో ్రమోషను కొట్టేసి ఎస్వీకృష్ణారెడ్డి గోల్డెన్ టచ్‌తో యమలీల హిట్ చేసిన యమ ఆర్టిస్టు అలి, ఇతర భాషా చిత్రాలకు చెందిన విశిష్ట నటులు కొందరు తెలుగులో అప్పుడప్పుడు నటించిన సందర్భాలలో కొన్ని- హిందీ చిత్రరంగానికి చెందిన 1ప్రాణ్ (తాండ్ర పాపారాయుడు), అంజద్‌ఖాన్ (సింహాసనం), శత్రుఘ్నసిన్హా (మేధావి),పరేశ్‌రావల్ (మనీ, మెకానిక్ మావయ్య), అ(మ్రిష్పూరి. (ఆదిత్య 369, జగదేకవీరుడు అతిలోకసుందరి), ఓంపూరి (అంకురం), సురేష్ఓబ్రాయ్ (భారతంలో బాలచంద్రుడు), ం్రం
తమిళ రంగానికి చెందిన శివాజీ గణేషన్ (భక్త తుకారాం), ఎం.ఆర్రాధ (బొబ్బిలియుద్ధం), నాగేష్ (వేటగాడు), టి.ఎస్. బాలయ్య (అల్దాడద్దీన్ అద్భుతదీపం), యస్వీరామదాసు (అగ్గి బరాటా), సహస్రనామం (సంఘం) పలు చిత్రాల వైవిధ్య నటి మనోరమ (సాంబయ్య).
మలయాళ రంగానికి చెందిన షీలా (విచిత్ర కుటుంబం), సీమ (అంగడి బొమ్మ, కెప్టెన్ రాజు (పిచ్చోడిచేతిలో రాయి!).
కన్నడ రంగానికి చెందిన రాజకుమార్ (శ్రీకాళహస్తి మహాత్మ్యం), ఉదయకుమార్ (కంచుకోట, మగమహారాజు), అరుణపాండ్యన్ (నేటి చరిత్ర). . . .. ఇలా ఎందరో ఇతర భాషానటులు తెలుగు చిత్రాల్లోనూ మన తెలుగు ఆర్టిస్టులు పరభాషా చిత్రాల్లోను నటిస్తున్నారు. భాషాభేదాలకు అతీతమైనదిగదా కళ]
బాల నటులుగా తము ప్రతిభను ప్రదర్శించిన వారిలో కొందరు ....
వెంకటరమణ మల్లిక (మల్లీళ్ళరి), సుధాకర్ (రాజు-పేద, దేవదాసు), ఆనంద్ సరస్వతి (మాయా బజార్, మాష్టరు కుందు, కందా మోహన్ (పెళ్ళిచేసిచూడు), మాస్టర్ వర్మ (దొంగ రాముడు), విజయలక్ష్మి (సంతానం), బాబ్టీ (చెంచులక్ష్మి, సువర్షసుందరి), రోజారమణి (భక్త ప్రహ్లాద), బేబి పద్మిని (లేత మనసులు), రేలంగి గారి అబ్బాయి సత్యనారాయణబాబు (బాలానందం), ప్రభాకర్ (బాలరాజుకధ), సుబ్రహ్మణ్యం నాగరాజు (లవకుళు, తేజ (మాస్టరు తేజా), హరీష్ (అదృష్టవంతుడు), శ్రీదేవి (బడిపంతులు)... అవార్డు పొందిన బాలనటులు, సంతోష్‌రెడ్డి (భద్రంకొడుకో), కుమారి కావ్య (లిటిల్ సోల్టర్స్)...... అందరూ బాలలతోనే ఎం.ఎస్. రెడ్డి నిర్మించిన రామాయణం చిత్రంలో ఎన్‌టి.ఆర్. మనవడు హరికృష్ణ కుమారుడు అయిన తారకరామారావు రాముడిగా నటించటం ఓ విశేషం.
ఇలా ఎందరెందరో మహానుభావులు తమ విశిష్ట నట విన్యాసంతో తెలుగు తెర నటనా విభాగాన్ని సుసంపన్నం చేశారు.
100
తి త 3 న స . సన. 1. నం. య స, ,
ిటునవ టు! ల త గ న! క03%గగ40
1 = సాహిత్యం
| [ .. న య.
6 1484142500 సన! మ క. గిగంరిగికి = వ | న ల ము.
షు] ఆగత కకం | ర నంటు తారకల! | నను న టం. క 101
న. 1 1. య. మ! శు.
వ. 11. అంటు. క్ ఇ న. 0 టట (త... న న్ ఇప జల్ శ నాం 1 (1 స [1 . ఉహ సో ' .
1 . న! న. గ్
|. |. నా నకం , అననన | 1111.. ప న! 1111 [| . చ _ ము. 102 న టం. 2 ౮
సాహిత్యం తెలుగు సినీ సాహితీ పరిణామక్రమాన్ని పరిశీలిస్తే తొలిదశాబ్దంలో ప్రాచుర్యం పొందిన స్టేజి నాటకాలే ఎక్కువగా చిత్రాలుగా తీయటంతో ఆ మూలరచనను సినిమాకు తగ్గట్టుగా కొద్ది మార్పులు చేశారు రచయితలు. అయితే ఆ దశకంలోనే స్వతం[త్ర రచనలు చేసిన వోరు కూడా ఉన్నారు. అ తరువాతి కాలంలో సినిమా రచన అంటే కధ, మాటలు, పాటలు అన్నీ ఇంచుమించుగా ఒక్కరే రాసేవారు, క్రమానుగతంగా కధను తయారుచేసేది ఒకరు, మాటలు మరియొకరు, పాటలు ఇంకొకరు రాయటం దాని తరువాత కామెడి ట్రాక్‌లు. రాసేవారు. గీతాల్లోనే హాస్యగీతాలు, ప్రేమగీతాలు, విషాదగీతాలు, విష్ణవ గీతాలు ఇలా పలు విభజనలు జరిగి, ఒక్కొక్కరు ఒక్కో తరహాలో కృషి చేశారు. చరిత్రను పరిశీలిస్తే తాలి టాకీ చిత్రం 'భక్త ప్రహ్లాద' (దీనికి ఆధారం ధర్మవరం కృష్ణామాచార్యులు గారి నాటకం)కు గీత రచన చేసిన చందాల కేశవదాసునే తొలి సినిమారచయితగా పేర్కొంటారు. ఈ ప్రకరణాన్ని మూడు. విభాగాలుగా చూస్తే ...... మొదటిది ఉభయ కవిమిత్రులు అనగా అటు డైలాగ్స్, ఇటు పాటలు రాసి సవ్యసాచి అనిపించుకున్నవారు. శెండోది కేవలం మాటలు మాత్రమే రాసినవారు (ఇందులో కథారచన చేసిన వారిని కూడా చేర్చవచ్చు). మూడవది కేవలం పాటలు మాత్రమే రాసినవారు. అయితే ఒక రంగంలో విశేషకృషి చేసి రెండో రంగాన్ని అరుదుగా స్పృశించిన వారు కూడా ఉన్నారు. చాలా సందర్భాలలో కధాకధనం (సినేరియో లేక స్ర్కీన్‌ప్లే రచయిత, దర్శకుడు ఒక్కోసారి నిర్మాతకూడా కలిసి సమష్టిగా రూపొందించినప్పటికి టైటిల్స్‌లో క్రెడిట్ ఎక్కువ సందర్భాల్లో దర్శకునికే ఇవ్వబడేది. దీనికి భిన్నంగా విజయ, అన్నపూర్ష వంటి సంస్థలు ప్కీన్ప్లే రూపొందించడంలో పాల్గొన్నవారందరికి క్రెడిట్స్ ఇచ్చి సత్సం'ప్రదాయం నెలకొల్పారు. పరిశ్రమ చేత తాతాజీ అనిపించుకున్న తాపీ ధర్మారావు నాయుడు (1887- 1973), సాంఘిక పౌరానిక జానపదాలకు రచన చేశారు. మోహిని రుక్మాంగద (1937) ద్వారా సినీరంగప్రవేశం చేసి ఆ తరువాత పల్ని, కృష్ణప్రేమ, కీలుగుజ్ణం, (ద్రోహి, పల్లెటూరుపిల్ల మొదలైన చిత్రాలకు పనిచేశారు. కవితా కళానిధిగా పేరొందిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి (1881-1953), భక్త మార్కండేయ (1938) ద్వారా పరిచయమై మళ్ళీపెళ్ళి భూకైలాస్, విశ్చమోహిని, బాలనాగమ్మతహసిల్దార్, సంక్రాంతి చిత్రాలకు రచన చేశారు. 103
ఉభయభాషా ప్రవీణ సముద్రాల రాఘవాచార్య (1902-68), 'హెచ్.ఎం.రెడ్డిగారి గృహలక్ష్మి (1938) ద్వారా రచయితగా ప్రవేశించి శతాధిక చిత్రాలకు తమ రచన ద్వారా ్కిషస్ట్ను పరిపుష్టం చేసి అనేక చిత్రవిజయాలకు కారణభూతులయ్యారు. ఆయన వ్రాసిన విషాదాంత చిత్రాలు లైలామజ్ఞు, అనార్కలి, దేవదాసు, బాటసారి. భక్తిరస ప్రధాన చిత్రాలు విప్రనారాయణ, భక్త రఘునాధ్, పౌరాణికచిత్రాలు, నర్తన శాల, పాండవవనవాసం చారిత్రాత్మక చిత్రాలు తెనాలిరామకృష్ణు అమరశిల్పి జక్కన, ఆయన బహుముఖ ప్రజ్ఞకు, ప్రతిభకు దర్భణాలు. జగమేమాయ, (బ్రతుకేమాయ, రాజశేఖర నీపై మోజుతీరలేదురా, చిగురాకులలోచిలకమ్మా, రామునిఅవతారం రఘుకులసోముని అవతారం, దినకరా శుభకరా.. ఆయన వ్రాసిన వందలాది గీతాలలో కొన్ని మాత్రమే. హెచ్.యం.రెడ్డి గారి తెనాలిరామకృష్ణ (1941) ద్వారా పరిచయమైన వెంపటి సదాశివబ్రహ్మం (1905-68), స్వతహాగా అవధాన విద్యలో దిట్ట, ఈయన రచన చేసిన చిత్రాలలో చెప్పుకోదగ్గవి భలేరాముడు, చరణదాసి, సంసారం, లవకుశ, రహస్యం, పరమానందయ్య శిష్యులకధ, భామావిజయం మొదలైనవి కాగా జిగిబిగి ఉండేలా కథల్ని తీర్చిదిద్దటంలో ఈయన చెయ్యి తిరిగిన రచయిత. ఆ కారణంగా ఈయన్ని కధా శివబ్రహ్మంగా కూడా ఆత్మీయులు చెప్పుకొనేవారు. జగన్నాధ్ పిక్చర్స్ భలేపెళ్ళి (1941) ద్వారా పరిచయమైన రచయిత పింగళి నాగేంద్రరావు (1901-71) తొలుత నాటకరచయితగా సపేరాంది సినీరంగ ప్రవేశం చేసిన తరువాత గుణసుందరి చిత్రంతో ఓహో అనిపించుకున్నారు. దీనికి మాతృక షేక్స్పియర్ నాటకం కింగ్ లియర్. వీరి రచనతో రూపొందిన విజయా వారి పాతాళభైరవి (19513) ఘనవిజయం సాధించటంతో 'ప్రజలనాడి తెలిసిన రచయితగా గుర్తింపు పొందారు. విజయా వారి చిత్రాలన్నిటికి దాదాపుగా ఈయనే పాటలు (వ్రాశారు. పౌరాణిక జానపద చిత్రలకు రచన చేశారు. మాయాబజార్. జగదేకవీరునికథ, మహామంత్రి తిమ్మరుసు, మహాకవి కాళిదాసు, చిత్రాలు ఈయనలో నిక్షిప్తమైన అపార సాహితీ సంపదకు ఉదాహరణలు. ఢింభక, డింగరి, హలా, వైళమా, తస్మదీయులు వంటి మాటల్ని వాడుకలోకి తెచ్చిన సాహితీ'స్రష్ట 1950లో పక్షిరాజా వారి బీదలపాట్టు చిత్రం ద్వారా పరిచయమైన ఆరుద్ర (1925-97 ఆసలు పేరు భాగవతుల శంకరశా(స్త్రి ఆ తరువాత శతాధిక చిత్రాలకు రచన చేశారు. కొన్ని చిత్రాలకు కథలు, మాటలు (గూఢచారి 116 ఇల్లరికం) మరికొన్నిటికి పాటలు (వ్రాశారు. అర్ధవంతమైన అంత్య'ప్రాసలు ఆరుద్ర ప్రత్యేకముద్రతో 104
ఆకట్టుకున్నాయి. రాజ్‌కపూర్ నిర్మించిన (ప్రేమలేఖలు చిత్రంలో హిందీ బాణీలకు తగ్గట్టు (వ్రాసిన పాటలు (పందిట్లో పెళ్ళవుతున్నది). అనుపమ తిలక్చిత్రాలకు పెండ్యాల స్వరపరచిన మధురగీతాలు (కొండగాలి తిరిగింది, ఎవరు కన్నారెవరు పెంచారో, ఇదేమి లాహిరి) బాపు-రమణ చిత్రాలకు అందించిన ముత్యమంతా పసుపు ముఖమంతా చాయ, ఎదగటానికెందుకురా తొందరా; = ఇహ నీలిమేఘాలలో గాలికెరటాలలో, ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, ఊహలు గుసగుసలాడే, యమునా తీరమున..... గాంధి పుట్టిన దేశమా ఇది... ఇలా అనేక వైవిధ్య గీతాలు మానసోల్లాసాన్ని కలిగించాయి. కె.ఎస్. (ప్రకాశరావుగారి దీక్ష (1953 చిత్రం ద్యారా పరిచయమైన ఆచార్య ఆత్రేయ (కిళాంబి నరసింహాచార్య 1921-89) రచనల్లో కుప్తత అప్తత, అర్హత కనిపిస్తాయి. పాట (వ్రాసినా మాటి వ్రాసినా ఒక ప్రయోజనం ఉండాలి. వందలాది చిత్రాలకు మాటలు, వేలాది పాటలు వ్రాసినా యీ సూత్రాన్ని ఆయన మరచిపోలేదు. సినిమాదృశ్య ప్రాధాన్యం కాబట్టి భావ (ప్రకటనకు అవకాశం ఎక్కువ భాష తక్కువగా వాడాలి అనేది ఈయన పద్దతి. ఈ మేరకు ఆయన స్కిస్ట్లోనే నోట్పు వ్రాసేవారు. అన్నపూర్ష (తోడికోడళ్ళు, మాంగల్యబలం, డాక్టర్ చక్రవర్తి, జగపతి (ఆరాధన, అంతస్తులు, దసరాబుల్లోడు), బాబూ మూవీస్ (మంచిమనసులు,మూగమనసులు), సురేష్ (ప్రేమనగర్, సెక్రటరి); - ఈ చిత్రాల్లోని పాత్రోచిత సంభాషణలు, పాటలు, చక్కని ఉదాహరణ. మౌనమే నీ భాష ఓ మూగమనసా, పాడుతా తీయగా చల్లగా, (ప్రేమ ఎంత మధురం, శిలలపై శిల్పాలు చెక్కినారు, ఎక్కడమ్మా చంద్రుడు ఈ పాటలు ఆయన మానసిక మ్హోషణపై చేసిన వ్యాఖ్యలు కాగా దేశభక్తి ప్రపూరితమైన గీతం భారతమాతకు జేజేలు అన్నిటికన్నా మిన్నగా శేషశైలావాసా శ్రీవెంకటేశా అన్నపాట కలకాలం ఆ తిరుమలేశుని స్మరించినంతగా గుర్తుండేపాట. బి.యన్ెడ్డిగారి మల్లీశ్యరి (1951) ద్వారా పరచయమైన రచయిత దేవులపల్లి వెంకటకృష్ణశానస్త్రి (1897-1980) ఆ చిత్రానికి పూర్తిగా మాటలు, పాటలు వ్రాసి తరువాత గీతాలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించి ఉండమ్మా బొట్టుపెడతా! నాయిల్టు, బంగారు పాప, పూజా ఫలం, రంగుల రాట్నం, రాజమకుటం మొదలగు చిత్రాలకు సుమధుర సాహిత్యం అందించారు. మల్లీశ్వరి గీతాలన్నీ భావపరిపుష్టితో భాషాసౌందర్యంతో నాటికి నేటికి నిత్యనూతన గీతసుమాలై మనకుసుగంధాలను అందిస్తునే వున్నాయి. భారతప్రభుత్వం వీరిని పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. ప్రతిభా బలరామయ్యగారి చిన్నకోడలు (1952) చిత్రం ద్వారా పరిచయమైన 105
మల్దాదిరామకృష్ణశా(స్త్రి (1905-65) బహుభాషాకోవిదులు. దేశ విదేశాలకు చెందిన యాబది భాషల్లో ఆయనకు ప్రవేశం ఉంది. తేటతెలుగు మాటలతో తీయతీయని పాటలు అల్లటంలో ఆయన సిద్ధహస్తుడు. రాజనందిని, చిరంజీవులు, రేచుక్క వంటి బహుకొద్ది చిత్రాలకు మాటలు (వ్రాశారు. రసికరాజతగువారము కామా, రాగమయిరావే (జయభేరి), రహస్యంలోని గిరిజాకళ్యాణం యక్షగానం, చిరంజీవులు లోని కనుపాప కరువయిన కనులెందుకు, తెల్లవార వచ్చే తెలియక నా స్వామి, రేచుక్కలోని అన్ని పాటలు ఆయన ప్రతిభకు చెప్పుకోదగ్గ బహుకొద్ది ఉదాహరణలు. మల్గాదివారి గీతాల్లో పాలకాల్టు పూతరేకుల కమ్మదనం, కోనసీమ కొబ్బరిబొండాల తీయదనం, నెల్లూరి రసికశిఖామణుల జాణతనం కనిపిస్తాయి.
వినోదావారి శాంతి (1952) ద్యారా పరిచయమైన సముద్రాల రామానుజం (జూనియర్ 1923-85) ఆ మరు సంవత్సరం (బ్రతుకు తెరువు పాట'అందమె ఆనందం - ఆనందమే జీవిత మకరందం'తో హిట్ కొట్టేసి ఆ తరువాత సుందరలాల్ నహతా నిర్మించిన అనేక అర్హంటుచిత్రాలకు (శభాష్‌రాముడు, శాంతి నివాసం, మంచిమనసుకు మంచిరోజులు) రచన చేశారు. ఈయన రచనా పాటవానికి ఎన్.ఏ.టి. వారి జయసింవా మచ్చుతునక. సీనియర్ నముద్రాల మేనల్లుడు అప్పలాచార్య హాస్యవిభాగంలో అందె వేసిన చెయ్యి. ఆయన రచన చేసిన చిత్రం మహాబలుడు పలు సినిమాలకు కామెడి ట్రాక్‌లు కొన్ని హాస్యగీతాలు (ఇల్లు-ఇల్హాలు) రాశారు. ప్రజానాట్యమండలి నుంచి సినీరంగానికి పీపుల్స్ ఆర్ట్ థియేటర్స్ వారి “వల్లెటూరు” (1962) చిత్రం ద్వారా వరిచయమైన రచయితలు నుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, వారు రచన చేసిన చిత్రాలు డా॥ రాజారావుగారి వుట్టిల్లు, యన్.టి.ఆర్ ఎ.ఎన్.ఆర్., సావిత్రి పోటీపడి నటించిన పరివర్తన.
ఏ.వియం. వారి సదారమ (1956) చిత్రం ద్వారా పరిచయమైన జి.3.మూర్తి (గంధం కృష్ణమూర్తి. విరలాచార్య జానపద చిత్రాలకు మరికొన్ని సాంఘిక చిత్రాలకు రచన చేశారు. “పూవులు పూయును పదివేలు -భగవానుని మెడలో ఏదిద్రాలు”, నీలిమేఘమాలవో - నీలాల తారవో, తీయ తీయని తేనెల మాటలతో వంటి పాపులర్ పాటలు (వ్రాశారు,
ఆదుర్తి సుబ్బారావు గారి ఆడపెత్తనం (1958) ద్వారా పరిచయమైన రచయిత రాజశ్రీ, (ఇందుకూరి రామకృష్ణంరాజు) ఐదు వందలకు పైగా అనువాద చిత్రాలకు _ మాటలు పాటలు (ప్రాసి డబ్బింగ్ రచయితగా ముద్రపడ్డ రాజశ్రీ చలం నిర్మించిన మట్టిలో మాణిక్యం, బుల్లెమ్మా బుల్లోడు వంటి పలుచిత్రాలకు పటిష్టమైన రచన
106
చేశారు. కురిసింది వాన నా గుండెలోని, 'అమ్మఅన్నది ఒక కమ్మని మాటి మొదలైన రసరమ్య గీతాలు (వ్రాశారు. బంగారు గాజులు చిత్రానికి గాను ఉత్తమ రచయితగా నంది అవార్డు పొందారు. కూతురు కాపురం (1959) ద్వారా పరిచయమైన మహారధి (బాలగంగాధర్ తిలక్ ఆ తరువాత కంచుకోట రణభేరి, దేశమంటేమనుషులోయ్, నిలువుదోపిడి, పెత్తందార్డు చిత్రాలకు మాటలు, మరికొన్ని చిత్రాలకు పాటలు వ్రాశారు. 'స్వర్ణగౌరి' (1962) చిత్రం చ్వారా ఖ్యాతి నొందిన వీటూరి - విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన కొన్ని జానపద చిత్రాలకు చిక్కడు దొరకడు పద్మనాభం తీసిన దేవత వంటి కొన్ని సాంఘిక చిత్రాలకు రచన చేశారు. వాలిసు[గ్రీవ ఫేం జంపన చంద్రశేఖరరావు అటు రచయితగా ఇటుదర్శకునిగా ద్విపాత్రాభినయం చేశారు (భట్టీ విక్రమార్క). ఆచార్య ఆత్రేయ వద్ద సహాయకునిగా పనిచేసిన సుదర్శన భట్టాచార్య పేరు మార్చుకుని జికెభారవిగా రచన చేసిన చిత్రాలు అన్నమయ్య, లవ్ 1999. స న నవలా ప్రపంచంలో సువ్రసిద్భలైన కొవ్వలి, వాసిరెడ్డి సీత్రాదేవి, స. ఆనంద రామం, కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనరాణి, ద్వివేదుల విశాలక్షి డి. కామేశ్వరి, రామలక్ష్మి యండమూరి వీరేంద్రనాధ్, పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి కొండముది శ్రీరామచంద్రమూర్తి, కొమ్మనాపల్లి గణపతిరావు, పూర్యదేవర రామమోహనరావు, వీరు వ్రాసిన నవలలు కొన్ని చిత్రకథలుగా రూపాంతరం చెందాయి. కె.ఎల్. ప్రసాద్ (ఆయనకిద్దరు) తమిళరచయిత, ఆర్కె. ధర్మరాజ మరో రచయిత బాలమురుగన్, యీయన కుమారుడు భూపతిరాజా, శ్రీనివాస చక్రవర్తి కొన్ని చిత్రాలకు కధలు అందించారు. మరికొన్ని సందర్భాల్లో దర్శకులు,నిర్మాతలు కూడా కధల్ని తయారుచేస్తున్నారు. జ సంభాషణల విభాగంలోకి వస్తే... గాలివాన కథతో అంతర్జాతీయ ఖ్యాతి నొందిన పాలగుమ్మి పద్మరాజు బంగారుపాప (1954) చిత్రం ద్వారా సినీరంగ (ప్రవేశం చేసి, బికారి రాముడు, 107
భాగ్యరేఖ, బంగారుపంజరం, రంగులరాట్నం చిత్రాలకు రచన చేశారు. బహుకొద్ది పాటలు మాత్రమే వ్రాశారు. వాటిలో తలమానికంగా చెప్పుకోదగ్గది రాజేశ్చరి విలాస్కాఫీక్షబ్ లోని 'రాకోయి అనుకోని అతిధి" పాట.
తెలుగు సినీరంగంలో (ప్రాచుర్యం పొందిన మాటల రచయితలలో చాలామంది నాటకరంగం నుంచి సినిమారంగానికి వచ్చినవారే! అంటే శక్తిమంతమై నాటకాలు వ్రాసి నాటకకళా పరిషత్తుల్లోను, ఇతరత్రా ప్రదర్శించి ప్రశంసలుపొంది అవకాశాల్ని అందిపుచ్చుకొని సినిమారంగం చేరుకుని తమ కలానికి పదును పెట్టినవారే.
ఆ కోవలో పరిశీలిస్తే...
1954లో వాహిని వారి పెద్దమనుషులు చిత్రం ద్వారా మాటల రచయితగా పరిచయమైన డి.వి. నరసరాజు, ఆతరువాతి కాలంలో సాంఘిక (దొంగరాముడు, గుండమ్మకథ), పౌరాణిక (భక్తప్రహ్హాదు, జానపద (రాజమకుటం), చిత్రాలకు సమసామర్థ్యంతో రచన చేశారు. వ్యంగ్య ధోరణితో హాస్యాన్ని రంగరించి గిలిగింతలు- పెట్టే సంభాషణలు వ్రాయటంలో అందె వేసిన చెయ్యి.
బి.ఎ. సుబ్బరావు గారి రాజు-పేద (1954) చిత్రంతోనే సంభాషణ రచయితగా తన సత్తా నిరూపించుకొన్న పినిశెట్టి శ్రీరామమూర్తి ఇలవేల్పు, ధర్మపత్ని, ఆత్మీయులు వంటి పలుచిత్రాలకు సంభాషణలు వ్రాసి నిత్యకళ్యాణం పచ్చతోరణం చిత్రానికి దర్శకత్వం వహించారు. శతాధిక నాటక రచయిత రంగరచనాధురీణ డా! కొ(రపొటి గంగాధరరావు ఇద్దరుమి(త్రులు (1961కు సంభాషణలు (వ్రాసి ఆ తరువాత ఒక లంబాడోళ్ళ రామదాసుకు మాత్రమే పనిచేశారు. అన్నపూర్ణావారి ఆత్మగౌరవం (1966) ద్వారా సినీరచయితగా అవతారమెత్తిన గొల్లపూడి మారుతీరావు, ఆ తరువాత ఇంట్టోరామయ్య, వీథిలో కృష్ణయ్య వంటి పలు హిట్ చిత్రాలకు పసందైన మాటలు (వ్రాశారు.
సినిమాలపై సమీక్షలు, వందలాది వ్యాసాలు, [వ్రాసిన ముళ్ళపూడి వెంకటరమణ అమాంతం సినిమారచయితగా అవతారమెత్తి రక్తసంబందంలో పవర్‌పుల్ డైలాగ్స్ అంతకు మించి పవర్‌పుల్ కామెడి డైలాగ్సు ఎడాపెడరాసేసి వ్యంగ్య హాస్యరసాలని మేళవించి రచన చేసిన సినిమాలు అనేకం. ముత్యాలముగ్గు, అందాలరాముడు, భక్త కన్నప్ప, శ్రీనాధకవిసార్వభౌమ కొద్ది ఉదాహరణలు (ప్రేమించి చూడు వంటి ఒకటిరెండు చిత్రాలకు పాటలు కూడా (వ్రాశారు).
ముళ్ళపూడి వెంకటరమణ కధ వ్రాసిన కధానాయకుడు చిత్రానికి పదునైన సంభాషణలు (వ్రాసి తన సత్తా నిరూపించుకున్న భమిడిపాటి రాధాకృష్ణ ఆ తరువాత
108
గోవుల గోపన్న, అల్టుడేమేనల్డుడు వంటి చిత్రాలకు పనిచేశారు. నవలా రచయిత్రి ముప్పాల రంగనాయకమ్మ పూలరంగడు చిత్రానికి రచన చేశారు.
హాస్యనటులుగా రాణించిన రావికొండలరావు, అప్పట్లో చల్లని నీడకు మాత్రమే సంభాషణలు వ్రాసి ఈ దశకంలో బృందావనం, ఖైరవద్వీప౦ చిత్రాలకు మాటలు అందించారు.
దర్శకులు ఆదుర్తి సుబ్బారావు సోదరుడు నరసింహమూర్తి కొన్ని చిత్రాలకు రచన చేశారు.
“దేవుడు చేసిన బొమ్మలు' (1976)ద్వారా మాటల రచయితగా పరిచయమైన జంధ్యాల (వెంకటదుర్లా శివసుబ్రహ్మణ్య శాస్త్రి 320 పైగా చిత్రాలకు రచన చేసి 42 చిత్రాలకు దర్శకత్వం వహించి నిజంగా రచయితఅందరిలోను ఒక రికార్డు సృష్టించారని చెప్పాలి. హాయిగొలుపుతూ అలోచింపచేస్తూ గిలిగింతలుపెట్టే సంభాషణలు 'బ్రాయటంలో ఎంత (ప్రతిభచూపారో (శ్రీవారికి ప్రేమలేఖ, నాలుగు స్తంభాలాట, అహ నా పెళ్ళంట) తక్కువ మాటలతో సీరియస్ సినిమాలను (సాగరసంగమం, శంకరాభరణం) అంతగొానూ రక్తి కట్టించారు. హాస్య నిధికి తరగని గని జంధ్యాల.
అటు కె. బాలచందర్ చిత్రాలు, మరోచరిత్ర, ఇది కధకాదు, యిటు క్రాంతికుమార్ చిత్రాలు స్వాతి, ప్రవంతి లకు రచన చేసిన గణేశ్‌పాత్రో మయూరికి (వ్రాసిన స్కిస్ మరువలేనిది.
టి.కృష్ణ చిత్రాలకు ఎక్కునగా రచన చేసిన యం.వియయస్, హరనాధరావు చిత్రాలలో ప్రతిఘటన, మమతలకోవెల, దేవాలయం, వందేమాతరం (ప్రత్యేకించి చెప్పుకోవాలి.
దేవత, గోపాలకృష్ణుడు చిత్రాలకు రచన చేసిన సత్యమూర్తి శైలి భిన్నమైంది.
ఆదివిష్ణు రచన చేసినవాటిల్లో చెప్పుకోదగినవి కన్నెవయసు, బాలమిత్రులకధ; సాహితీ రంగంలో విశేష కృషి చేసిన కొండవీటి వెంకట కవి, దాన వీర శూర కర్ణ చిత్రానికి నాగభైరవ కోటేశ్చరరావు, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రానికి రచన చేశారు.
హైద్రాబాదు ఏ.జి, ఆఫీసులో పనిచేసిన పరుచూరి వెంకటేశ్చరరావు చలిచీమలకు,
ఉయ్యూరు. కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేసిన పరుచూరి గోపాలకృష్ణ
చండశాసనుడుకు రచన చేశాక ఆ ఇద్దరుకలసి రచన చేసిన అనురాగదేవతకు ఇద్దరి
పేర్గు కలసి వచ్చేలా పరుచూరి బ్రదర్స్ అని నామకరణం చేసారు యన్.టి.రామారావు.
ఆనాటినుంచి ఎన్నెన్ని హిట్స్... ఖైదీ, బొబ్బిలి బ్రహ్మన్న, మహాసం[గ్రామం, బ్రహ్మరు(ద్రులు 109
అలా అలా శతాధిక చిత్రరచయితలయ్యారు. వీరిద్దరు కలిసి మరియు విడివిడిగాను కొన్ని సినిమాలలో సరదాగా నటించారు (బ్రహ్మరుద్రులులో గోపాలకృష్ణ, శ్రీరాములయ్య లో వెంకటేశ్వరరావు). అలాగే కాయ్‌రాజాకాయ్, మాతెలుగు తల్లి, శ్రీకట్నలీలలు వంటి కొద్దిచిత్రాలకు దర్శకత్వం వహించారు.
రేలంగి నరసింహారావు తీసిన కొంటెకాపురం ద్వారా సినీరచయితగా ప్రవేశించి దివాకర్‌బాబు హాస్యాన్ని వండటంలో దిట్ట. ఈ విషయాన్ని ఆయన రేలంిగికి (వ్రాసిన ఎదురింటిమొగుడు పక్కింటి పెళ్ళాం. యస్వీకృష్ణారెడ్డికి రాసిన యమలీల నిరూపించగా, చిరంజీవికి చూడాలని ఉంది రచన చేసి శభాష్ అనిపించుకున్నారు.
కాశీవిశ్చనాధ్ దర్శకుడు కట్టా సుబ్బారావు, రేలంగి నరసింహారావు, విజయబాపినీడు తీసిన హాస్యచిత్రాలకు సంభాషణలు ఇచ్చారు. మోదుకూరి జాన్సన్,సోగ్లాడు, కరుణామయుడు చిత్రాలకు పనిచేశారు. సత్యానంద్ (ఆదు ర్తి సుబ్బారావుగారి మెనల్టుడు) మాయదారి మల్లిగాడు ద్వారా రచయితగా పరిచయమై ఎడిటర్ కృష్ణగారి చిత్రం ఖైదీ బాబాయ్, రాఘవేంద్రరావుగారి అనేక హిట్ చిత్రాలకు (అల్లరిప్రియుడు, పెళ్లిసందడి) రచన చేశారు
పోలీన్బ్రదర్స్ ద్యారాపరిచయమైన పోసాని కృష్ణమురళి పవిత్రబంధం, పెళ్ళిచేసుకుందాం రా! సాంబయ్య వంటి చిత్రాలకు పవర్ఫుల్ డైలాగులు రాయటమే కాక ఒకటి రెండు సందర్భాల్లో సరదాగా వేషధారణ చేశారు.
ఒకేసారి మూడు విజయవంతమైన చిత్రాలకు (మామగారు, కలికాలం, భళారే విచిత్రం) రచన చేసి హ్యాట్రిక్ సాధించిన తోటపల్లి మధు సాంఘిక మాయాబజార్ చిత్రంలో శకుని తరహాకు చెందిన కుళ్ళయ్యప్ప పాత్రను సమర్దవంతంగా పోషించారు. ఆయన సోదరుడు సాయినాథ్ కూడా మంచి రచయిత
ఇంకా రచన చేసిన వారిలో...
పేరాల (ఓ అమ్మకధ), సంజీవి (ఒసేయ్ రాములమ్మ), రాజాళివానంద (భూమికోసం, ధర్మవడ్డి, జనార్దన మహర్షి (కన్యాదానం, పట్టుకోండి చూద్దాం), మరుదూరి రాజా, కృష్ణేశ్సరరావు, రాజేంద్రకుమార్, (బావ బావమరిది), ఏల్చూరి వెంకట్రావు (ప్రజల మనిషి ఉద్యమం), యస్.వి. రామారావు, (త్రిలోకసుందరి, శుక్రవారం మహాలక్ష్మి, కొండముది శ్రీరామచంద్రమూర్తి (శ్రీరామచంద్రుడు), సి,ఎస్రావు (నాయకుడు-వినాయకుడు), ఆకెళ్ళ (ఓభార్యకథ) ఎల్బి.శ్రీరాం (ఆ
110
ఒక్కటీ అడక్కు, భిశెట్టి (భోళాశంకరుడు), జీడిగుంటరామచంద్రమూర్తి (ఆమెరికా అబ్బాయి), ఎ.ఎస్.మూర్తి (మోహనరాగం), పృధ్వీరాజ్ (నిన్నే పెళ్ళాడతా), తనికెళ్ళ భరణి (శివా), రమేష్‌గోపి (శ్రీను), పూసలవెంకటేశ్వరరావు (వారాలబ్బాయి), యం.జి. రామారావు (చైతన్యరధం). కాగా గీత రచయితగా పేరొందిన జాన్న విత్తుల రామలింగేశ్వరరావు, దేవి, భారతబంద్ చిత్రాలకు మాటలు వ్రాశారు. తొలి ప్రయత్నంలోనే సాగసు చూడతరమా, సంభాషణలకు నంది బహుమతి పొందిన రచయిత అజయ్శాంతి. తోడు చిత్రానికి పాటలు, పొతనగరంలో పసివాడు చిత్రానికి సంభాషణలు వ్రాసి సహదర్శకత్వం చేసిన రచయిత్రి ఓల్లా. స ఈ “సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగపదయోగ సమభూషితే, హే భారతి మనసా స్మరామి, త్రీభారతి శిరసా నమామి” (సి. నారాయణరెడ్డి - స్వాతికిరణం ఆపాత మధురమైన సంగీతానికి, ఆలోచనామృతమైన సాహిత్యానికి, సరస్వతినే ఆరాధ్యదేవతగ భావిస్తారు అభిజ్ఞులు. తదీతర దృళ్య ప్రక్రియలకన్నా మిన్నగా దీనిని సినిమాపాటకు" అన్వ్నయించవచ్చు. సినిమా గీతంలో సాహిత్యం సంగీతం పడుగుపేకల్టా కలిసిపోయిన సందర్భాల్లో ఆవిర్భవించిన గీతాలన్నీ ప్రేక్షకుల ఆదరణకు పాత్రమై నాటికి నేటికీ సీనీసంగీత ప్రియ శ్రోతల్ని అలరిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే... 1939లో రామబ్రహ్మం గారి రైతుబిడ్డ చిత్రంలో నిదురమేలుకొనరా తమ్ముడా పాట ద్వారా సినీేగేయరచయితగా పరిచయమైన కొసరాజు రాఘవయ్య చౌదరి (1905-87) కొంతకాలం సినిమారంగానికి దూరమైనా వాహినీ వారి పెద్దమనుషులు ద్వారా పునః ప్రవేశం చేసి అందులో నందామయా గురుడనందామయా శివ శివమూర్తివి గణనాధ అనే రెండు పొటలు [వ్రాయగా అవి హిట్ ఆయ్యాయి. అక్కడతో ఆయన ప్రభ మొదలైంది. ఇహ రోజులుమారాయి గీతం ఏరువాక తిరుగులేకుండా హిట్టయింది. ఆరోజుల్లో సినిమాలకు. రేలంగి హాస్యం ఎలాగో కొసరాజు పాట ఆ విధంగా తప్పనిసరిగా ఉండేది. రేలంగిపై చిత్రీకరించిన ఇల్లరికం పాట, సిగరెట్ పాట (రాముడు-భీముడు), పేకాట పాట (కులగోత్రాలు) కాగా, మనిషిలో ఆశావాదాన్ని పాదుకొలుపుతూ వ్రాసిన జయంబు నిశ్చ్యయంబురా (శభాష్‌రాముడు) అతిని(ద్రాలోలుడు తెలివిలేని మూర్చుడు అంటూ హెచ్చరించిన శ్రీకృష్ణపాండవీయం గీతం నిజంగా మత్తువదిలించేలా లిఖించారు. అదృష్టదీపుడు (1950) చిత్రం ద్వారా పరిచయమైన తోలేటి వెంకటరెడ్డి ఆ షష
తరువాత ఏ.వియం.సంస్టలోచేరి వారు తీసిన జీవితం, సంఘం, వదిన మరియు శ్రీకాళహస్తి మాహత్మ్యం చిత్రాలకు భావగర్భితమైన గీతాలను(వ్రాశారు.
హెచ్‌యం. రెడ్డి గారి నిర్దోషి (1951) చిత్రం ద్వారా పరిచయమైన శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు -1910-83) అభ్యుదయ గీతాలు (పాడవోయి భారతీయుడా), గిలిగింతలుపెట్టే యుగళగీతాలు (ఆకాశవీధిలో అందాలజాబిలి), ఆహ్లాద గీతాలు (నా హృదయంలో నిదురించే చెలి), ఒంటరితనంలో ఓదార్చు నందించే గీత నేస్తాలు (మనసున మనసై, ఇలా ఎన్నో! అయితే సరాసరి తెలుగుచిత్రాలకు ఎన్ని పాటలు బ్రాశారో అంతకు రెట్టింపుగా డబ్బింగ్ చిత్రాలకు పనిచేసి మాటలుపాటలు వ్రాశారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో శ్రీశ్రీ (వ్రాసిన తెలుగు వీర లేవరా దీక్షబూని సాగరా అన్న మకుటంగల ప్రబోధ గీతానికి కేంద్రప్రభుత్వ బహుమతి లభించింది. ఈ మహాకవి (వ్రాసిన వెలుగునీడలు గీతం కలకానిది విలువైనది పాట విన్న ఒక వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కవితకు ఇంతకు మించిన సార్దకత ఏముంది?
1952లో రాజేశ్వరి చిత్రం ద్వారా పరిచయమైన అనిశెట్టిసుబ్బారావు కూడా సంతానం, భట్టి విక్రమార్క, రక్తసంబంధం చిత్రాలకు మరపురాని పాటలు (చందురునిమించు అందమొలకించు) వ్రాశారు.
1961లో వాగ్దానం ద్వారా పరిచయమైన దాశరధి ఇద్దరు మిత్రులు, లేత మనసులు, నాది ఆడజన్మ మొ॥గు చిత్రాలకు ఖుషీ ఖుషీగా నవ్వుతూ, వినిపించని రాగాలే, నల్లని కన్నయ్య, నడిరేయి ఏజాములో వంటి హాయిగొలిపే గీతాలు అందించారు.
ఎన్.టి.ఆర్. నిర్మించిన గులేబకావళి కథ (1962) చిత్రంలో వైవిధ్యంతో కూడిన అన్ని పాటలు వ్రాసి సింహద్వారం గుండా సినీరంగ ప్రవేశం చేసిన సాహితీమూర్తి ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) నాటినుంచి నేటిదాకా ఆరోగ్యకరమైన సినిమా పాటలను వ్రాస్తూనే ఉన్నారు. ఏకవీరకు మాటలు (వ్రాయడం ఓ విశేషం. బహుముఖంగా విస్తరించిన వీరి సినీ కవితా విన్యాసంలో ఎన్నెన్నో గమకాలు, గమనాలు, చెణుకులు, చెమక్కులు. చిత్రం భళారే విచిత్రం అని రారాజుచే ప్రణయగీతం పాడించినా, ఎవరికి తలవంచకు, ఎవరినియాచించకు అని యువతకు హితబోధ చేసినా, మానవజాతి మనుగడకే (ప్రాణం పోసింది మహిళ అంటూ మహిళల మహోన్నత శక్తి సామర్థ్యాలను శ్లాఘించినా, తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది అంటూ ఎలుగెత్తి తెలుగునాట ఐక్యతారాగాన్ని వినిపించినా
112
నాయిక ఎదలో పగలే వెన్నెల కాయించినా తోటలో వున్న ప్రియునికి పారిజాతాలవంటి నవ్వులతో రసరమ్య గీతాలు వినిపించినా వీటన్నిటికంటే విభిన్న శైలిలో తెలంగాణా పల్లెపడుచు రాములమ్మ అంతర్యాన్ని ఆవిష్కరించి - అది ఆయనకే చెల్లు. అందుకే దేవులపల్లి తరువాత సినీ కవుల్లో మరో పద్మభూషణుడైనాడు. మరోఎత్తు ఎదిగి జ్ఞానపీర అవార్డు అందుకున్నారు. తెలుగు సినీ సాహితీ లోకంలో నిత్య నూతన చైతన్య '్రవంతికి చెరగని చిరునామా సినారె.
సహజకవిగా వినుతి కెక్కిన మల్లెమాల (నిర్మాత-ఎం.ఎస్.రెడ్డి, ఆశువుగా కవిత వెప్పగలిగిన దిట్ట . జాతికన్న నీతి గొప్పది మతము కన్న మమత గొప్పది అని ప్రవచించిన కోడెనాగులోని సంగమం పాట ఈయన వ్రాసిన పాటల్లో ఆణిముత్యం వంటిది.
ఓసీతకథతో విశ్వనాధుని గోల్డెన్ టచ్‌తో గీత రచయితగా ఆరంగేట్రమ్ చేసిన సాహితీ (స్రష్ట వేటూరి సుందరరామ్మూర్తి అటు క్లాస్‌ను ఇటు మాస్‌ను సమసామర్హ్యంతో మెప్పించగల మేధావి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ అంటూనే దొరకునా ఇటువంటి సేవ అని క్రీర్తించటం, పాడవే పాడవే కోయిలా, రాలేటి పూలరాగాలతో, పూచేటి పూల గంధాలతో అంటూ పూలబాలలతో సయ్యాటలాడటం, కోయిలమ్మ పెండ్లికి కోనంత పందిరి వేయడం, ఆయనకే చెల్లును. నీటుప్రేమను, నాటు (ప్రేమను, ఘాటుప్రేమను మోతాదుకు తగ్గట్టు పాటలో పలికించటంలో సిద్ధహస్తుడు వేటూరి. మాతృదేవోభవ చిత్రానికి వ్రాసిన 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే” గీతానికి కేంద్ర (ప్రభుత్వ (ప్రశంస పొందారు.
కళాతపస్వి మరో డిస్కవరి (1986-సిరివెన్నెల) సీతారామశాస్త్రి ఈయన కూడ పండిత, పామరజనరంజకంగా రచనచేయటంలో సిద్ధహస్తుడనిపించుకొన్నాడు. “విరించినై విరచించితిని యీ కవనం, విపంచినై వినిపించితిని యీ గానం" (సిరివెన్నెల) అంటూ తన ఉచ్చ్వాస నిశ్వాసాలే సంగీతసాహిత్యాల్ని ఢంకాబజాయించి చెప్పి 'మ్యాటనీ ఆట ఉంది, బోటనీక్సాసు వుంది" (శివ) అంటూ విద్యార్థుల్ని మురిపించి ఆపైన 'నిగ్గదీసి అడుగు యీ సిగ్గులేని జనాన్ని” (గాయం) అంటూ ఒకింత తీవ్రంగా సమాజాన్ని గూర్చి ఆలోచింపచేస్తారు. సినీసాహితీక్షేత్రంలో భూసారానికి తగ్గట్టు అన్ని రకాల పంటలు పండించగల కృషీవలుడు సీతారామశాస్త్రి,
విజయాబాపినీడు తీసిన నాకూ పెళ్ళాం కావాలి ద్వారా రంగ ప్రవేశం చేసిన భువనచంద్ర హిందీ సినిమా పాటల సాహితీ సౌరభాల్ని జీర్ణం చేసుకున్న విళిష్ట రచయిత. అందుకే ప్రజల నాడికి తగ్గట్టు మీదుమిక్కిలి చిరంజీవి "స్టెప్పుకు తగ్గట్టుగా
113
సన్డే అననురా మన్డే అననురా ఎన్నడు నీదానరా అంటూ స్పీడు పాటలకు సాహిత్యాన్ని అందించి ఇటీవల స్వయంవరం చిత్రంలో వినవే చెలి ఓజాబిలి నీలో వేడి వుంది నాలో ఈడు వుంది అంటూ యువతకు గిలిగింతలు పెట్టారు. రౌడీ పోలీస్ (1987)తో పరిచయమైన జొన్నవిత్తుల ఎన్నో గీతాలు ్రాసి, జంధ్యాల చిత్రం ష్ గప్‌చుప్'లో తిట్టదండకం హాస్యస్ఫోరకంగా వినిపించారు. ముద్దాయి చిత్రంలో గేయ రచయితగా పరిచయమైన వెన్నెలకంటి ఎక్కువగా అనువాద చిత్రాల రచన చేసినా స్వాతికిరణంకు రాసిన కొండా కోనల్లో గోదారి గంగమ్మా పాయల్టో ఆదిత్య 369కు (వ్రాసిన రసరమ్యగీతం 'రాసలీల వేళ రాయబారమేల' చెప్పకోదగినవి. చిల్లరకొట్టుచిట్టెమ్మ రచయిత దాసం గోపాలకృష్ణకు పేరు తెచ్చినపాట జోరుమీదున్నావు తుమ్మెద (శివరంజని). సుద్దాలఅశోక్తేజ 'నమస్తే అన్నతో పరిచయమై పలు గీతాలు వ్రాసి కంటే కూతుర్నే కను చిత్రానికి (వ్రాసిన ఆడకూతురా నీకు అడుగడుగున వందనం పాటకు ఎవార్డు పొందారు. సురేష్ వారి తాజ్‌మహాల్ ద్వారా పరిచయమైన- చంద్రబోస్ ఆచిత్రంలో వ్రాసిన _మంచుకొండల్లో చంద్రమా, మాస్టర్ చిత్రానికి వ్రాసిన తిలోత్తమ పాటలు ప్రాచుర్యం పొందాయి. మైలవరపు గోపి వ్రాసిన పాటల్లో చెప్పుకోదగినది పండంటికాపురంలోని మనసా కవ్వించే నన్నిలా. ప్రముఖ దర్శకులు దాసరినారాయణరావు దర్శకత్వం రచనతోపాటు కొన్ని చిత్రాలకు పాటలుకూడా (థ్రేమాభిషేకం) వ్రాశారు. కొద్ది పాటలు వ్రాసినా అవిజనరంజకంగా మలచిన రచయితలు రసరాజు (అందమైన వెన్నెలలో -అసెంబ్లీరౌడి), గురుచరణ్ (ముద్దబంతి నవ్వులో మూగబాసలు -అల్టుడుగారు), సాహితి (జాబిలికి-వెన్నలకి పుట్టిన పున్నమివే-చంటి), వడ్డేపల్లి కృష్ణ సింగీతం శ్రీనివాసరావు ప్రోత్సాహంతో పిల్లజమిందార్, భైరవద్వీపం చిత్రాల్లో పాటలు (వ్రాశారు. కథానాయిక మొల్ల చిత్రంలో ఒక పాటలో నాలుగు భాషల్లో నాలుగు చరణాలు ఉంటాయి. వాటిని విజయనరసింహ, అరుణ'ప్రసాద్, శ్రీనివాస్, దాశరధి వ్రాశారు. 114
అవధానవిద్యలో పేరొందిన మాడుగుల నాగఫణిశర్మ, ధారారామనాధశాసస్త్రి నిర్మాతలు నవతా కృష్ణంరాజు (సంసారం ఓ సంగీతం), యు. విశ్చేశ్చరరావు (కంచుకోట), దర్శకులు కె. విశ్వనాధ్ (స్వాతిముత్యం), వంశీ (కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ (గ్రూప్), సి.యస్.రావు (నా రాసి మిథునరాసి పాట), జర్నలిస్టులు మిక్కిలినేని జగదీష్‌బాబు (నాపెళ్ళాం, నాయిష్టం), నారాయణ వర్మ (పోలీసుభార్య), బి.3.ఈళశ్చర్. (హృదయాంజలి), నటుడు కొంగర జగ్గయ్య (పదండి ముందుకు) సినీగీతాలు (వ్రాశారు. ఇంకా ఈ దిగువ పేర్కొన్న నాటి తరంనుంచి నేటి తరం దాకా ఉన్న రచయితలు తక్కున పాటలు ద్రాసినా మంచి కృషి చేశారు;
వారిలో కొందరు చిలకమర్తి నరసింహం, దైతా గోపాలం, కొప్పరపు సుబ్బారావు, వేలూరి శివరామశాస్త్రి బాలాంత్రపు రజనీకాంతారావు (స్వర్గసీమ), నళినీకాంతారావు, ప్రయాగ, కొండముది గోపాలరాయశర్మ (పేమ), మల్హాది వెంకటకృష్ణ శర్మ, ముద్దుకృష్ణ (జయం మనదే), ఎడవల్లి లక్ష్మీనారాయణ, న్యాపతి రాఘవరావు, కామేళ్వరి (బాలానందం), పసుమర్తి యజ్ఞ నారాయణశా'్త్రి, రావూరు వెంకట సత్యనారాయణరావు, చక్రపాణి, కొండేపూడి లక్ష్మీనారాయణ, కొనకళ్ళ వెంకట రత్నం, రాంచంద్ (వద్దంటే పెళ్ళి, జాషువా, తాండ్ర సుబ్రహ్మణ్యం, గబ్బిట వెంకటరావు (విష్ణుమాయ) బైరాగి, నారపరెడ్డి (దొంగల్లోదొర)ు, నాగరాజు, కనకమేడల, గుంటూరు శేషేంద్ర శర్మ (ముత్యాలముగ్గు), ఎం.ని.ఎల్, కోపెల్లె శివరాం (కొత్తనీరు) చిల్లర భావన్నారాయణ, ఆచార్య తిరుమల, అదృష్టదీపక్, ఓంకార్, సొమవేదం షణ్ముఖశర్మ, దేవీప్రియ, సాయికృష్ణ యాచేంద్ర, పైడిపాల, జి. విజయరత్నం (కథానాయకురాలు), భుజంగరాయశర్మ (రంగులరాట్నం టైటిల్సాంగ్). జాలాది (తూర్చువెళ్ళేరైలు)...... డా॥ నెల్టుట్ల (వేజెళ్ళ చిత్రాలు).
ఇలా.... ఇలా.... ఎందరో సాహితీమూర్తులు తెలుగుపాటకు జిలుగువెలుగులు అందించారు, అందిస్తున్నారు.
డగా బా 115
సినిమా సొపౌత్యంలో పొతోక్తులు “అనుకున్నామని జరగవు అన్ని ; అనుకోలేదని ఆగవు కొని జరిగేవన్సీ మంచికని - అనుకోవడమే మనిషి వని” (ఆత్రేయ - మురళీకృష్ణ “క్రోర్రిక ఒకటి జనించు - అది తీరక ఎడద దహించు కోరనిదేదో వచ్చు - శాంతి నుఖాలను యిచ్చు యింతేరా యీ జీవితం - తిరిగే రంగుల రాట్టుము” (యజంగరాయశర్మ - రంగుల రాట్నం) “జవితమ ఓ వైకుంఠపాళీ నిజం తెలుసుకోభాయీ ఎగరేసే నిచ్చనలే కాదు - పడదోసే పాములు వుంటాయి చిరునవ్వులతో విషవలయాలను భేదించి ముందుకు వదవోయి” (ని. నారాయణరెడ్డి - నిండుసంసారం) “ఆగాధమౌా జలనిధి లోన ఆణిముత్యమున్లుటులే శోకాల మరుగున దాగి నుఖమున్సుదిలే - ఏదీ తనంతతానై నీ దరికి చేరరాదు - శోధించి సాధించాలి - అదియే ధీరగుణం” (శ్రీ - వెలుగునీడలు) “వరాభవమ్ము కల్తునంచు పారిపోకుమోయ్ జయమ్ము నినువరించుదాకా పోరి గెల్బవోయ్” (ొనరాజు - శభాష్‌రాముడు” “కృషి ఉంటే మనుషులు బుషులౌతారు = మహాపురుషులొతారు తరతరాలకు తరగని వెలుగౌతారు - ఇలవేలువులౌతారు” (నేటూరి - అడవిరాముడు) ఆరనైదోతనము వీ బోట నుండు - అరుగులొలికేవారి ఆరచేతనుండు తీరైన నంవద వ ఇంట నుండు - అనుదినము ముగ్గున్లు లొగిళ్ళనుండు” (ఆరుద్ర - ముత్వాలముగ్గు “కల్లీరు మానవుణ్ణి బతికించగలిగితే అవి అమృతం కంటే కరువయ్యేది” (ఆత్రేయ - వెలుగునీడలు) 116
, ల. 1న టా! న ఫై య 1,1... న. గా న్ నం... న. ్య;. వ ఆళి 1 అజా. నా... భం... జే. షి ( | (1.10 న... న ప. న్ న [స | "శ స్ట. | గ 1 న. సై? గ్ర న న! |. |) ల య. ట్లో ల. న షి... [క . (. 1 ల. 1 త. గ. న తు యు!
ప టా. మణ. ల య. న నన /. మ 11. స్ సం మ న ను. జ5.గ4!14[గ40 ౨.8.5010%1౪/45 50045
జ యీ [ స... 11౬ మ. మకా ల నత్త స న కుం. 8. శగీగగీన! త్రాగ ః సక. వ స. (శాఖ. న | మగ ంల00 ని44స౮గ41॥ ఇ4|%న913౫44 118
సంగీతం “శిశుర్వేత్తి. పశుర్వేత్తి వేత్తిగానరసంఫణి:” అన్నది ఆర్యోక్తి అది అక్షరాల నిజమని నిరూపించినది, పండిత పామరులందరిని మురిపించిన సినిమా సంగీతం. తనకు ఇష్టమైన పాటని ఏదో సందర్భంలోనైనా ఒంటరిగా పాడుకొని ఆనందించని మనిషి అంటూ ఉండడు. స్వరములు ఏడైనా రాగాలెన్నో అన్న కవివాక్కుకు తగ్గట్టు పలు రాగాలతో సరాగాలాడి ఒక్కోసారి ఒకరాగ శైలికి మరోరాగైలిని జోడించి విచిత్ర విన్యాసాలుచేసి మనసంగీత దర్శకులు మనోజ్ఞ మధుర గీతాలను మనకు అందించారు. ఆ వివరాల్లోకి వెళితే... తొలి తెలుగు టాకీ భక్తప్రహాదలో యధాతథంగా నాటకపద్యాలు వాడినా దానికి సంగీతం అందించినది. హెచ్.ఆర్. పద్మనాభ శాస్తి. ఆకారణంగా ఆయన్నే తొలిసినీసంగీతనిర్దేశకునిగా పేర్కొనటం సబబు. ఆతరువాత వచ్చిన తహసిల్దారు 'పేదరైతు ఆయన ఇతర చిత్రాలు. స్వంత బాణీలు కట్టి పాటలను హిట్ చేసిన లవకుశ (1934) సంగీత దర్శకుడు ('ప్రభల సత్యనారాయణ. అనసూయ, . గృహలక్ష్మి ఆయన ఇతర చిత్రాలు, అనాటి లవకుశ బాణీలలో కొన్నిటిని చిన్న చిన్న మార్పులు చేసి ఘంటసాల లవకుశలో (1963) వాడుకున్నారు. గృహలక్ష్మిలో ప్రభల వారు స్వరపరచిన నాగయ్యగీతం 'కల్టు మానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్" ప్రబోధాత్మకంగా కొనసాగి పాపులర్ అయ్యింది. అదే సంవత్సరం (1934) సీతాకళ్యాణంకు సంగీతం అందించిన మహనీయ వ్యక్తి గాలిపెంచల నరసింహారావు తరువాత ప్రతిభా వారి గరుడ గర్వభంగం మాయలోకం, బాలరాజు చిత్రాలకు సంగీత రచన చేశారు. మాయ లోకంలో ఈయన నిక్రేశకత్వంలో హీరోనాగేశ్చరరావు జలతరంగిణి ఇన్'స్ట్రుమెంటు వాయించారు. బాలరాజులోని పాటలు అన్నీ ప్రజాదరణ పొందాయి. కొన్ని పాటల్ని ఘంటసాల స్వరపరిచారు. బాలరాజు చిత్రంలో చెలియా కనరావా అనేపాటని అక్కినేని పాడగా అది రికార్డుగా వచ్చింది. అదే పాటను ఘంటసాల చేత పాడించి సినిమాలో ఉపయోగించారు. ఈయన జీవితంలో నిలిచిపోయే చిత్రం ఎన్.టి.ఆర్, నిర్మించిన సీతారామకళ్యాణం (1961). అందులోని శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి పాట తెలుగునాట ప్రతి పెళ్ళి పందిట్లో మారుమ్రోగుతుంది. బాలయోగిని (1936) చిత్రానికి సంగీతం అందించిన మారుతి సీతారామయ్య. 119
అదే సంవత్సరం (ద్రౌపదీ మానసంరక్షణకు సంగీతకర్ర (ప్రహ్హాద కాంతయ్య, తాలి సాంఘిక చిత్రం (ప్రమవిజయంకు మునిపంటి వెంకటరావు సంగీత దర్శకుడు.
1936లో పోటీగా నిర్మించబడ్డ (ద్రౌపదీ వ(స్తాపహరణం సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావు (బి.ఎన్ఆల్ ఆయన ఆ తరువాత పలు చిత్రాలకు జనరంజక బాణీలు అందించారు. వాటిల్లో చెప్పుకోదగ్గవి మాలపిల్ల రైతుబిడ్డ అర్జాంగి ఈయన నటుడుగా ఒకటి రెండుచిత్రాల్లో కనిపించారు. దొంగలున్నారు జాగ్రత్త చిత్రానికి దర్శకత్వం వహించారు. మాలపిల్ల చిత్రంలోని నల్లవాడే గొల్లపిల్లవాడే, ఆర్జాంగిలోని అన్ని పాటలు బి.ఎన్.ఆర్. స్వరమాధురికి మచ్చుతునకలు.
1939లో శ్రీ వెంకటేశ్చర మాహత్మ్యం చిత్రానికి ఆకులనరసింహారావు, బి.కుమారస్వామి సంగతం అందించారు.
అదే సంవత్సరం ముగ్గురు దిగ్గజాల వంటి (ప్రముఖులు సంగీత దర్శకులుగా రంగప్రవేశం చేశారు. చిత్తూరు. వి. నాగయ్య వాహినీ వారి వందేమాతరంతో (ప్రారంభించి దేవత, పోతన, స్వర్గసీమ, వేమన చిత్రాలకు, స్వయంగా స్వీయదర్శకత్వంలో నిర్మించిన త్యాగయ్య, నా యిల్లు, రామదాసు చిత్రాలకు సంగీతం అందించారు.
శాస్రీయసంగీతానికి పెద్దపీట వేసి స్వరరచన చేసిన వారిలో అగ్రగణ్యులు నాగయ్య స్వర్గసీమ చిత్రం ద్వారా ఘంటసాలను నేపద్యగాయకునిగా పరిచయం చేసారు. స్వయంగా గాయకుడైన నాగయ్యపాడిన సర్సమంగళనామా సీతారామా, ఎందరో మహానుభావులు, అదిగదిగో గగనసీమ, అందాలు చిందేటి జ్యోతి =ఎ ఆయన గానసుధలు చిలికించిన అమృతగీతాల్లో కొన్ని ఉదాహరణలు మాత్రమే. రెండవ సంగీత కర్త ఓగిరాల రామచంద్రరావు, ఈయన చిత్రాలు మళ్ళీ పెళ్ళి, విశ్చ్శమోహిని, పరమానందయ్యశిష్యులకధ (శివరావుది), పెద్దమనుషులు, గుణసుందరికథ.
గుణసుందరి కథలోని సంగీత వైభవం గూర్చి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పిలీలను ఈ చిత్రంలో గాయనిగా పరిచయం చేయగా ఆమె పాడిన శ్రీ తులసి జయతులసి జయము నీయవే, ఉపకార గుణాలయవై వున్నావు గదె మాతా- హిట్‌కాగా మొదటి పాటను ఇప్పటికీ తెలుగింట పూజామందిరంలో గృహిణులు పాడుకొంటూనే వున్నారు. ఇందులో మాలతి, శాంతకుమారి స్వయంగా పాడిన ద్విగళ గీతాలు చల్లనిదొరవేలే చందమామ, కళకళా ఆ కోకిలేమో పలుకరించే వింటివా, శివరావుచేత ఆడించి పాడించిన ఒహొరే ఓహోరే బ్రహ్మదేవుడా మరువలేనివి.
ఇహ మూడవ వ్యక్తి ఈ శతాబ్దపు విశిష్ట సంగీత స్రష్ట సాలూరి రాజేశ్ళరరావు (1922-99). శ్రీకృష్ణలీలలులో కృష్ణుడుగా నటించినా, ఇల్లాలులో రావు బాలసరస్వతీ
120
దేవితో నటిస్తూ పాడినా ఆమెతో కలసి మరికొన్ని లలిత గీతాలు, ఒంటరిగా యింకొన్ని గీతాలు ఆలపించీనా ముఖ్యంగా ఆయన స్వరకర్తగానే లబ్ద్బ(ప్రతిష్టుడైనాడు. జయప్రద (1939) చిత్రంతో మొదలైన ఆయన సంగీత ప్రస్థానం అయిదు దశాబ్దాలు నిరాఘాటంగా కొనసాగి ఆ రాగజలధిలో సంగీతాభిమానుల్ని ముంచెత్తింది.
ఎన్నెన్ని చిత్రాలు, ఎన్నెన్ని పాటలు, అయితే విషాదగీతాలను సయితం కటువుతనం లేకుండా మెలోడి ప్రాధాన్యతతో రూపొందించటం ఆయన ప్రత్యేకత. జెమినీవారి బాలనాగమ్మ, చంద్రలేఖ మొదటిదశలో చెప్పుకోదగ్గవి.
మల్లీశ్వరి గీతాలన్నీ మనసోల్దాస సంగీత సౌరభాల్ని విరజిమ్మినవే.! అయితే ఈ చిత్రానికి అద్దేపల్లి రామారావు కూడా రాజేశ్వరరావుతో చేయి కలిపారు. ఆ కలసిన చేతుల ముచ్చట్లే మల్లీశ్వరిని ఆస్టాయిలో నిలబెట్టాయి. వందలాది చిత్రాల్లోని వేలాది పాటల నుంచి దేన్ని ఎంపిక చేసినా అరే... దాన్ని గూర్చి ఉదాహరించలేదే అనిపిస్తూంది. అన్నపూర్ణా వారి ఇద్దరుమిత్రులు, డాక్టర్ చక్రవర్తి పి.ఎ.పి.వారి భార్యాభర్తలు, కులగోత్రాలు, బి.ఏ. సుబ్బారావు గారి రాజు-పేద, చెంచులక్ష్మి, భీష్మ, విక్రంవారి అమరశిల్పి జక్కన, విజయ వారి మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు, భరణీ వారి విప్రనారాయణ ఇలా ఎన్నో... స్వతహాగా గాయకుడైన నాగయ్యకు రాజేశ్వరరావు బొబ్బిలియుద్దం చిత్రంలో స్లేబాక్ పాడటం ఓ విశేషం. ఎస్. రాజేశ్చరరావు, వేణుతోకలిసి నమ్మినబంటుచిత్రానికి, ఘంటసాలతోకలసి రామాలయం చిత్రానికి, చలపతిరావుతో కలిసి మంచిమనిషి చిత్రానికి పనిచేయటం ఆయన సహృదయ సంస్కారాన్ని తెలియ చేస్తుంది.
1940లో చండికకు సంగీతం అందించిన కొప్పరపు సుబ్బారావు (ఈయన పాటల రచయిత కూడా) తరువాత భక్తిమాల, పల్ని చిత్రాలకు సంగీతం అందించారు. 1940లో భూకైలాస్ చిత్రానికి సంగీతం సమకూర్చిన ఆర్, సుదర్శనం, ఆ తరువాత జీవితం మొదలైన ఎ.వియం చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఈయనతో కలసి భూకైలాస్ (1958)కు సంగీతం అందించిన గోవర్టన్ తరువాత విడిగా కానిస్టేబుల్ చిత్రానికి సంగీతం అందించారు.
1941లో గుండోపంత్. వాల్వాల్కర్ (మరాఠి సంగీత దర్శకుడు) తెనాలి రామకృష్ణ చిత్రానికి, యస్.వి. వెంకటరామన్ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనివారి తల్లి (ప్రేమ, నవజీవనం చిత్రాలకు సంగీతం అందించారు.
1943లో వచ్చిన చెంచులక్ష్మి చిత్రానికి ఆర్,ఎన్. చిన్నయ్య పేరు సంగీత దర్శకుడిగా వేసినా నిజానికి దానికి పనిచేసింది సి.ఆర్. సుబ్బరామన్ (1921-52ఏఅని
121
గాయని ఆర్. బాలసరస్వతీ దేవి చెప్పినట్టు ప్రఖ్యాత సంగీత విశ్తేషకులు, వి.ఎ.3. రంగారావు, ఓ వ్యాసంలో ఉదహరించారు. సంగీత దర్శకుడిగా టైటిల్ పడ్డ మొదటి చిత్రం రత్నమాల ఆ తరువాత లైలామజ్ను. స్రీ సాహసం, స్వప్నసుందరి, ధర్మదేవత, రూపవతి, ప్రేమ, దాసి, అమ్మలక్కలు, దేవదాసు (ఈ చిత్ర నిర్మాణంలో ఆయన భాగస్వామి కూడా) మొదలగు చిత్రాలకు సంగీతం అందించగా ఆయనను చిరంజీవిని చేసిన చిత్రాలు స్వప్నసుందరి, లైలామబజ్న, దేవదాసు. వీటిలోని పాటలన్నీ అమృతతుల్యమై (శ్రోతలలో మళ్ళీ మళ్ళీ వినాలనే కోరికను చిగురింపచేస్తాయి. దేవదాసు నిర్మాణ దశలోనే ఆయన కీర్తి శేషులు కాగా ఆ బాధ్యతను ఎం.ఎస్. విశ్ళనాధమ్-రామమూర్తి పూర్తి చేశారు. 1946లో బాలాంత్రపు రజనీకాంతారావు సారధీ వారి గృహప్రవేశంకు సంగీత దర్శకులు. అదే సంవత్సరం “నారదనారది' చిత్రం ద్వారా పరిచయమైన సుసర్ల దక్షిణామూర్తి మంచి గాయకుడు కూడా. ఇలవేల్పు చిత్రంలో కేలంగికి స్లేబాక్ పాడారు. సంసారం చిత్రంలో హిందీ బాణీల ధోరణి (కల నిజమాయెగా, ఇకపై నాగతేమి) వినిపించినా ఘంటసాల గళంలో పురి విప్పిన సంతానం పాటలు (చల్లని వెన్నెలలో, దేవి శ్రీదేవి), నర్రనశాలలో బాలమురళి చేత పాడించిన సలలిత రాగసుధారస సారం (గాయని బెంగుళూరు లత కూడా ఈ పాటలోనే ఎల్. విజయలక్ష్మికి పాడారు). అందులోని యుగళగీతం ఎవరికోసం ఈ మందహాసం కాగా హాయి గొలిపే పాట 'సఖియా వివరించవే? జనం నోళ్ళలో సుసర్లను చిరంజీవిని చేసిన గీతం, రఘునాధ పాణి[గ్రహి పాడిన ఇలవేల్పు పాట చల్లని రాజా ఓ చందమామ. రాధిక (1947) సంగీత దర్శకుడు ఎస్. హనుమంతరావు స్వయాన రాబేశ్చరరావుకు సోదరుడు ఈయన కూడా జయప్రదకు సంగీత విషయంలో సహకరించాడనే ఒక మాట అక్కడక్కడ వినపడినా తరువాతి కాలంలో దక్షయజ్ఞం, ఎన్.టి.ఆర్. ఆరాధన చిత్రానికి సంగీతం సమకూర్చి అందులో ఉత్తర హిందూస్తానంలో తిరుగులేని గాయకునిగా పేరొందిన రఫీచేత నేడే తెలిసింది, 'నా మది నిన్ను పిలిచింది గానమై” వంటి కమ్మనిపాటలు పాడించారు. దుక్కిపాటి మధుసూదనరావు నిర్వహణలో అక్కినేని నాయికగా ఎక్సెల్నియర్ క్లబ్ వారి నాటకాలకు సంగీతం సమకూర్చిన పెండ్యాల నాగేశ్చ్వరరావు మద్రాసులో రాజరాజేశ్వరి వారు తీసిన తల్లి (ప్రేమ చిత్రానికి యస్వీ వెంకటరామన్ వద్ద సహాయకునిగా పనిచేసి ఎల్.వి. ప్రసొద్ దర్శకత్వంలో కె.ఎస్. ప్రకాశ్‌రావు నిర్మించిన ద్రోహి (1948) చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయమాయ్యారు. అందులోని ఆలకించండి బాబూ, శివరావు హాస్యగీతం, ప్రసాద్‌పై చిత్రించిన బుల్బుల్ పాట 122
చెప్పుకోదగ్గది. కన్నతల్లి చిత్రం ద్వారా పి. సుశీలను, ఎం.ఎల్.ఏ, చిత్రం ద్వారా ఎస్. జానకిని చిత్రరంగానికి పరిచయం చేసిన వ్యక్తి పెండ్యాల. తెనెలు జాలువారే మాధుర్య సంగీతానికి చిరునామా పెండ్యాల. దొంగరాముడు, వెలుగునీడలు, రాముడు- భీముడు వంటి సాంఘికాలు, జయభేరి భట్టి విక్రమార్క జగదేకవీరుని కధ వంటి జానపదాలు. మహామంత్రి తిమ్మరుసు, మహాకవి కాళిదాసు వంటి చారిత్రకాలు. శ్రీకృష్ణార్జున యుద్దం, దానవీరశూరకర్ణ వంటి పౌరాణికాలు ఎన్నో. శ్రీవెంకటేశ్వర మాహత్యం (1960) చిత్రంలో ఆయన స్వరపరచిన శేష శైల వాసా శ్రీ వెంకటేశ్ గీత చిత్రీకరణలో తెరపై ఘంటసాలతోపాటు పెండ్యాల జె.విరాఘవులు కనిపిస్తారు. అలాగే వెలుగునీడలు చిత్రంలో కలకానిది విలువైనది. పాట చిత్రీకరణలో ఆర్కెస్ట్రా కండక్టరుగా పెండ్యాల దర్శనమిస్తారు. ఆయన స్వరపరచిన వందలాది గీతాల్లో జయభేరిలోని రసికరాజతగువారముకామా, జగదేక వీరుని కధలోని 'శివశంకరి శివానందల హరి' గీతాలు సంగీతంలో ఘనాపొటీలుగా చెల్లుబాటవుతున్న వారందరు ఒకసారైనా పాడి తరించాలనే తలపు కలిగించే గీతాలుగా చెప్పుకోవచ్చు.
ఆ మరు సంవత్సరం (1949) మరో విశిష్ట సంగీత దర్శకుడు గంధర్వగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు (1922-1974) మనదేశం చిత్రం ద్వారా పరిచయ మయ్యారు. నిజానికి అంతకు ముందు రత్నమాల, బాలరాజు చిత్రాల్లో కొన్ని గీతాలు స్వరపరచినా మీర్జాపురం రాజావారి కీలుగుజ్ఞం, కృష్ణవేణి గారి మనదేశం చిత్రాలకు సంగీతం అందించగా ఆ రెండు 1949లో కొద్ది తేడాలో విడుదలయ్యాయి.
విజయనగరం సంగీత కళాశాలలో పట్టభద్రుడై దేశభక్తుడై, జైలు జీవితం గడిపి లలిత గీతాల ద్వారా దేశభక్తి పాటలద్వారా గాయకుడుగా ప్రాచుర్యం పొందిన ఘంటసాల విజయావారి షావుకారుకు లలితసంగీత ధోరణిలో స్వరపరచిన 'ఏమనెనే చిన్నారి ఏమనెనే' పలుకరాదటే చిలుక పాటలు ఆ వెంటనే వచ్చిన పాతాళ భైరవిలోని అన్ని పాటలు హిట్, అయి ఘంటసాల పేరు ఆంధ్రదేశంలో విజయభేరి మోగించింది. నాటి నుంచి సుమారు 100 చిత్రాలకు సంగీతం అందించగా వాటిల్లో వైవిధ్యం దృష్ట్యా పరిశీలిస్తే పల్లెటూరు, పెళ్ళిచేసి చూడు, చిరంజీవులు, మాయాబజార్, పెళ్లినాటి ప్రమాణాలు, పెళ్లిసందడి, శాంతినివాసం, గుండమ్మకధ, బందిపోటు, లఅవకుశ పాండవ వనవాసం, పరమానందయ్య శిష్యులకధ, రహస్యం, రక్తసంబంధం చెప్పుకోవాలి. స్వయంగా పరోపకారం, సొంతవూరు భక్తరఘునాధ్ చిత్రాలను నిర్మించి చేదు అనుభవాన్ని చవిచూశారు. వేలాది పాటలు పాడిన ఘంటసాల వెంకటేశ్చరరావును భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది.
1950లో పల్లెటూరి. పిల్ల చిత్రానికి సంగీత దర్శకునిగా పరిచయమైన
123
పి.ఆదినారాయణరావు విలక్షణ సంగీత (స్రష్ట మంచికధకుడు అంజలి పతాకంపై పలు చిత్రాలు నిర్మించి సంగీతాన్ని అందించారు. పరదేశి చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుకు పిఠాపురం నాగేశ్చరరావుచేత (నేనెందుకు రావాలి ఎవరికోసమొ) స్టేబాక్ పాడించిన ఘనుడు. అనార్కలి చిత్రంలో కొన్ని హిందీ బాణీలు వినిపించినా ఈయన ప్రతిభకు తార్కాణం కలిసే నెలరాజు కలువచెలినీ, రాజశేఖర్నా నీపై మోజు తీరలేదురా గీతాలు. ఇక సువర్షసుందరి పొటలను గూర్చి ఎంత రాసినా చాలదు. ముఖ్యంగా పలురాగాల సమ్మిశితమై కధాపరంగా బుతు(క్రమాన్ని వివరిస్తూ సాగిన హాయిహాయిగా ఆమని సాగే పాటకి చేసిన స్వర రచన అటు ఉత్తర హిందూ దేశం వారిని కూడా పులకింపచేసింది. భక్రతుకారాంలోని గీతాలు మరారీ సంగీత ఛాయలతో పరవశింపజేస్తే హీరో కృష్ణ నిర్మించిన అల్లూరి సీతారామారాజులో వస్తాడు నారాజు ఈరోజు పాటకు కూర్చిన వయ్యారి వరసలు, మోసగాళ్ళకు మోసగాడులో వినిపించిన పాశ్చాత్య సంగీత ధోరణుల విన్యాసం శ్రోతలచే ఆహా అనిపించాయి. సువర్షసుందరి చిత్రానికి ఆదిత్యన్ అనే పేరుతో కథ అందించారు. పల్లెటూరుపిల్ల, అన్నదాత చిత్రాల్లో కొన్ని పాటలు (వ్రాశారు.
మల్లీళ్చరికి రాజేశ్చరరావుతో చేయి కలిపిన అద్దేపల్లి రామారావు స్వంతంగా స్వర రచన చేసిన చిత్రం బంగారుపాప. ఈ ఒక్క చిత్రంతో వంద చిత్రాల ఖ్యాతి నార్జించారు రామారావు. రంగారావుపై చిత్రీకరించగా మాధవపెద్ది సత్యం పొడిన తత్వం తాధిమి తకధిమి తోల్బొమ్మ, యవ్వనమధువనిలో పచ్చని తీగల ఉయ్యాల, పండువెన్నెల మనసునిండా వెన్నెల, యుగళగీతాలు మరువలేనివి.
1950లో పక్షిరాజా వారి 'బీదలపాట్టు' ద్వారా పరిచయమైన అశ్వత్చామ జీవితంలో కలిమిలేములు, - చివరకు మిగిలేది, పక్కింటిఅమ్మాయి. చెప్పుకోదగినవి అయినొ మకుటాయమానంగా 'పేర్కొనవలసింది (ప్రతిభావారి రేచుక్క. అటు మల్దాది వారి సాహితీ సుగంధానికి అశ్వత్చామ సంగీత సౌరభం కలసి మనసును ఆనందడోలికల్లో ఓలలాడిస్తాయి. ఆయె సంబరమె ఆయెపండుగలే, భలే భలే పావురమా, ఆమనసేమో ఆసొగసేమో, పాటలు చక్కని ఉదాహరణలు.
పల్లెటూరి పిల్ల చిత్రంలో ఇద్దరు వ్యక్తులు కంపనదొరవద్ద గూఢచారులుగా నటిస్తారు. వారిలో ఒకరు దర్శకులు తాపీ చాణక్య, రెండవ వారు సంగీత దర్శకునిగా టింగురంగ (1952) ద్వారా పరిచయమైన తోటకూర వెంకటరాజు (టి.వి.రాజు-1921-73) అంతకు ముందు ఈయన ఆదినారాయణరావు వద్ద సహాయకునిగా పనిచేయటం వల్ల మెలోడిని జీర్ణం చేసుకుని దానిని జయసింహ, ఉమ్మడి కుటుంబం, శ్రీకృష్ణాండవీయం వంటి యన్.టి.ఆర్ చిత్రాలకు మంగమ్మ
124
శపధం, పిడుగురాముడు, గండికోటరహస్యం వంటి డి.వియస్. రాజుగారి చిత్రాలకు అందించారు. నిర్మాతలని తృప్తిపరచటం కోసం జయసింహలోని ఈనాటి ఈ హాయి కలకాదోయి నిజమోయి ఈ పాటకు 18 బాణీలు సమకూర్చటం ఆయన ఓపికకు పరీక్ష సామర్ద్యానికి ప్రతీక
1953లో బహుముఖ ప్రజ్ఞానిధి భానుమతి చండీరాణికి కధ సమకూర్చి, ద్విపాత్రాభినయం చేసి దర్శకత్వం వహించి సి.ఆర్.సుబ్బురామన్ సహచర్యంలో సంగీతాన్ని కూడా అందించారు. తరువాత చక్రపాణి, అంతామనమంచికే వంటి సొంత చిత్రాలకు సంగీతం అందించారు. అటు త్యాగరాజ కృతులతోపాటు ఇటు హాస్యపరంగా సాగే పాటలని కూడా ఆమె గళంలో వినిపించారు. విప్రనారాయణ చిత్రంలోని ఎందుకోయి తోటమాలి పాటలో ఆమె పలికించిన గాన విన్యాసాలు అనితరసాధ్యం,.
1953లోనే డాక్టర్ రాజారావు పుట్టిల్లు ద్వారా పరిచయమైన ప్రజానాట్యమండలి సంగీత దర్శకుడు టి. చలపతిరావు (ఈయనతో మోహనదాసుకూడా సహకరించారు). తరువాతి కాలంలో చలపతిరావు పి.ఎపి. (ఇల్లరికం, నవరాత్రి, మనుషులు మమతలు) రవీంద్రా ఆర్ట్ తమ్మారెడ్డి కృష్ణమూర్తిగారికి జమీందారు, లక్షాధికారి, అటు హేమాంబరధరరావుకి ఆడపడుచు వంటి ఎన్నో హిట్ చిత్రాల నందించారు. ఈయన పార్ట్నర్గా నిర్మించిన మంచిమనిషి చిత్రానికి తనతోబాటు రాజేశ్చరరావును కూడా స్వరకర్తని చేయటం ఈయన విశాల హృదయానికి తార్కాణం. మోహన్‌దాస్ తోబుట్టువు చిత్రానికి సంగీతం అందించారు.
'వాలి సుగ్రీవికు సంగీతం అందించిన అయిదుగురు సంగీత దర్శకుల్లో ఒకరయిన మాస్టర్ వేణు (1916-81), సారథి వారి అంతా మనవాళ్ళ (1954) చిత్రానికి సంగీతం అందించారు. ఘంటసాల వద్ద పాతాళభైరవి చిత్రానికి ఆర్కె స్ట్రాకండక్ట్ చేశారు. ఈయన సంగీతం వహించిన చిత్రాలలో రోజులు మారాయి, సిరిసంపదలు, రాజమకుటం, ఆణిముత్యాలు కాగా, హైదరాబాద్ మూవీస్ పేరిట గంగాధరరావు నిర్మించిన హాస్యచిత్రాలకు కూడా సంగీతం అందించారు. పల్లెటూరి వాతావరణానికి దగ్గరగా ఉండి, ఆంధ్రదేశంలో మారుమోగిన రోజులుమారాయి పాట ఏరువాక సాగారోరన్నో చిన్నన్న. ఈయన స్వరపరచిన వాటిలో మలయమారుతం తలపించే పాట దేవులపల్లి రచనతో ఊపిరిపోసుకున్న రాజమకుటంలోని సడిసేయకే గాలి, మరొకటి ఆత్రేయ వ్రాసిన మురళీకృష్ణ గీతం 'ఎక్కడవున్నా ఏమైనా నీ సుఖమే నే కోరుతున్నా.
125
సి.ఆర్సుబ్బరామన్ వద్ద వాద్యగోష్టిలో పనిచేసిన ఎం.ఎస్. విశ్చనాధం - రామ్మూర్తి చాలాకాలం జంటగా మాగోపీ, తెనాలి రామకృష్ణ మంచి-చెడు, పెళ్ళితాంబూలం వంటి చిత్రాలకు పనిచేసి ఆపై విడిపోయిన తరునాత రామ్మూర్తి గూర్చి వినిపించకపోయినా ఎం. ఎస్. విశ్చనాదన్ కెబాలచందర్ రూపొందించిన అంతులేనికధ, మరోచరిత్ర చిత్రాలకు యువతరాన్ని కదిలించే రాగాల్ని (శ్రావ్యంగా అందించారు. ఈ ఇద్దరుసంగీత సారధ్యంలో రూపొందిన తెనాలి రామకృష్ణ అటు సాహిత్యపరంగా ఎంత విశిష్టత సంతరించుకుందో యిటు సంగీతపరంగా అంతటి వైభవాన్ని కలిగివుండటం మనం గమనించవచ్చు. చాలాకాలంగా చిత్రరంగ సంగీత శాఖలో కృషి చేసిన బి.గోపాలం 1957లో నలదమయంతికి సంగీతం అందించారు. గతంలో ఘంటసాలను సంగీతదర్శకునిగా ఎన్‌టి.ఆర్‌ను ఆర్టిస్టుగా పరిచయం చేసిన నటి గాయని నిర్మాత సి. కృష్ణవేణి 1957లో నిర్మించిన దాంపత్యం చిత్రం ద్వారా రమేష్ నాయుడును సంగీత దర్శకునిగా పరిచయం చేశారు. ఆ తరువాత ఆయన కమెరామెన్ సెల్వరాజ్, సౌండ్ యింజినీర్ కోటేశ్చరరావు కలసి 'సెల్వకోటి పతాకంపై నిర్మించిన స్వయంప్రభకు పనిచేశారు. ఆపైన అము శ్రమాట, శివరంజని, తూర్పుపడమర, దేవుడుచేసిన మనుషులు, మేఘసందేశం, వంటి పలుచిత్రాలకు సంగీత రచన చేశారు. గీత రచయిత ఎంతటి సంక్షిష్టమైన పాటలు (వ్రాసినా దానికి అందమయిన బాణీలను తీర్చిదిద్దగల నేర్చు నాయుడుకే సొంతం, దీనికి ఉదాహరణగా దేవులపల్లి అంతకు ముందే (వ్రాయగా మేఘసందేశంలో ఉపయోగించిన ముందు తెలిసినా ప్రభూ పాటను ఆయన స్వరపరచిన తీరు విశదం చేస్తుంది. 1982లో మేఘసందేశం చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకునిగా కేంద్ర ప్రభుత్వ బహుమతి పొందారు. గాయకుడుగా ప్రసిద్ధుడైన ఎయం, రాజా స్వరపరచిన చిత్రం శోభ (1958. తరువాతి చిత్రం పెళ్ళికానుక. ఈ ఒక్క చిత్రం పది కాలాలకు సరిపడినంత యశస్సును రాజాకు సంపాదించిపెట్టింది. అందులోని ప్రతిపాట సందర్భశుద్దితో (శ్రోతల్ని కదిలిస్తుంది. ఈయన సరదాగా పక్కింటి అమ్మాయిలో నటిస్తూ నటనలోకూడా స్టేబాక్ పాడారు. సుసర్ల దక్షిణమూర్తి వద్ద సహాయకుడిగా పనిచేసిన యస్.పి. కోదండపాణి తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించిన చిత్రం “కన్నకొడుకు” (1961) ఆ తరువాత మంచికుటుంబం, సుఖదుఃఖాలు, పండంటికాపురం, గోపాలుడు-భూపాలుడు వంటి పలుహిట్ చిత్రాలకు సంగీతం అందించారు. శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రం ద్వారా బాలసుబ్రహ్మణ్యంను గాయకునిగా పరిచయం చేశారు. దేవులపల్లి రచన 126
ఇదిమలైైలవేళ యని ఒక్కటి చాలు కోదండపాణి అంటే ఏమిటో వివరించడానికి, ఈయన మంచి గాయకులు కూడా (పాట- ఇదుగో దేవుడు చేసిన బొమ్మ).
ఘంటసాల వద్ద సహాయకునిగా పనిచేసిన పొమర్తి సంగీతం అందించిన చిత్రం తిరుపతమ్మకధ (1963) అందులోని 'పూవై విరిసిన పున్నవమివేళి పాట మరువలేనిది.
అదే సంవృతరం తల్లిబిడ్డ చిత్రానికి సంగీతం అందించిన శంకర్ సంగీతంలో రూపొందిన మరో చిత్రం “అమాయకుడు”, హిందీపాటభావాన్ని మాత్రం తీసుకుని స్వరరచన చేసిన 'చందమామ రమ్మంది చూడు' చెప్పుకోదగ్గది.
విజయ సంస్థ అర్కె(స్ట్రాలో పని చేసిన కృష్ణమూర్తి (విజయకృష్ణమూర్తి) సంగీతం అందించిన చిత్రంలో 'అగ్గి బరాటా' (1966) లో హిట్ సొంగ్భు వున్నాయి.
వేదా సంగీతం సమకూర్చిన చిత్రాల్లో చెప్పుకోదగ్గది '“ఆవేకళ్ళు" (1967).
1968లో 'బంగారు సంకెళ్ళు' చిత్రానికి సంగీతం యిచ్చిన చాంద్ బహుకొద్ది చిత్రాలకు పనిచేశారు.
అదే సంవత్సరం భావనారాయణగారి పాలమనసులు' (1968) చిత్రం ద్వారా పరిచయమైన మాస్టర్ సత్యం అంతకు ముందు ఆదినారాయణరావు, టి.వి.రాజు వద్ద సహాయకునిగా పనిచేశారు, సత్యం అటు కౌబాయ్ చిత్రాలకు ఇటు క్లబ్ డాన్సులతో కూడిన యాక్షన్ చిత్రాలకు పేరొందిన 'సీతారాములు, భక్త కన్నప్ప, కన్నె వయసు, బాలమి(త్రులకథ వంటి చిత్రాలకు మెలోడిగల సంగీతం అందించి, ఏ దివిలోవిరిసిన పారిజాతమో, గున్నమావిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి వంటి మధుర గీతాల్ని స్వరపరిచారు.
కన్నడ చిత్రరంగానికి చెందిన జిశె. వెంకటేష్ 1968లో అత్తగారు-కొత్తకోడలు ద్వారా తెలుగు సీనీ చిత్రరంగ ప్రవేశం చేసి ఆ తరువాత అమెరికా అమ్మాయి, చక్రధారి వంటి చిత్రాలకు పనిచేశారు. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, పాడనా తెనుగు పాట ఈ రెండు పాటలు తెలుగు సాహితీవయ్యారానికి ఘన సంగీత గమనాన్ని జోడించిన మధురస్కృతులు,
అదే సంవత్సరం (1968) అందరూ మహిళలే నిర్మించిన “చిన్నారిపాపలు'కు సంగీతం అందించారు పి.లీల.
రచయిత పాలగుమ్మి పద్మరాజు దర్శకత్వం వహించిన దేవడుడిచ్చినభర్త (1969కి సంగీత దర్శకుడు ఎ.ఎ.రాజ్.
127
ఘంటసాల వద్ద సహాయకునిగా పనిచేసిన జె.వి. రాఘవులు సురేష్ వారి బ్రోహి (1970 ద్వారా సంగీత దర్శకునిగా పరిచయమై ఆతరువాత ఆత్మీయులు, జీవనతరంగాలుకు (టైటిల్ సాంగ్ మరువలేనిది) సంగీతం అందించారు.
సంబరాల రాంబాబు (1970కు సంగీత దర్శకుడు ఎ. కుమార్ జెమినీ వారి చిత్రం చిన్ననాటికలలకు కూడ సంగీతం అందించారు.
అంతవరకు పలు డబ్బింగ్ చిత్రాలలో హాస్యపాత్రలకు గా(త్రగానం చేసిన కొమ్మినేని అప్పరావు-చ(క్రవర్తిగా నామాంతరం పొంది 1971లో సంగీత దర్శకత్వం నెరపిన చిత్రం 'మూగప్రేమ” దానితో ఆయన జైత్రయాత్ర (ప్రారంభమై శారదతో సూపర్హీట్ కొట్టి ఆ (ప్రాభవాన్ని రెండు మూడు దశబ్దాల వరకు కొనసాగించారు. అటు కె. రాఘవేంద్రరావు, ఎన్.టి.ఆర్ కాంబినేషన్‌కు (వేటగాడు, కొండవీటి సింహం), ఇటు దాసరినారాయణరావు, అక్కినేని కాంబినేషన్‌కు ((ప్రేమాభిషేకం, యువరాజు), మరో వైపు మురళమోహన్ హీరోగా నటించిన బడ్జెట్ చిత్రాలకు (జ్యోతి, పిచ్చిపంతులు) చటర్జీగారు తీసిన మల్లెపూవు, జేబుదొంగ వంటి క్రాస్ మాస్ చిత్రాలకు ఒక విధంగా
- చెప్పాలంటే శతాధిక చిత్రాలకు ఊపిరి సలపకుండా పనిచేసిన ఏకైక బిజీ సంగీత దర్శకుడు చక్రవర్తి ఈయన మంచి హాస్యప్రియుడు. అప్పుడప్పుడు సినిమాల్లో యీయన పోషించిన పాత్రలు గమనిస్తే (గోపాలరావుగారి అమ్మాయి) ఈ విషయం తెలుస్తుంది. అన్నట్టు ఈయన సరదగా పాటలు పాడిన (శారద-అటు యిటో తేలిపోవాలి) సందర్భాలు కూడా ఉన్నాయి.
కన్నడ రంగంలోను తెలుగులోనువిఠలాచార్య తీసిన చిత్రాలకు సంగీతం అందించిన రాజన్-నాగేంద్ర తెలుగులో 1975లో పంతులమ్మ చిత్రానికి ఆ తర్వాత సొమ్మొకడిది-సోకొకడిది, ఇంటింటి రామాయణం చిత్రాలకు సంగీతం అందించారు. 'పంతులమ్మ'లోని 'సిరిమల్లై నీవే గీతం మెలోడికి మారుపేరు.
వీరిద్దరి వద్ద సంగీత శాఖలో సహాయకునిగా వున్న ఇళయరాజా 1976లో భద్రకాళి ద్యారా రంగప్రవేశం చేసి ఛాలెంజ్, రాక్షసుడు, సీతాకోకచిలుక సాగరసంగమం, సితార గీతాంజలి సూపర్ హిట్ చిత్రాలకు మరపురాని గీతాలు స్వరపరిచారు. మారుతున్న యువతకు కావల్సిన స్పీడుతోపాటు పాత తరం వారు కోరుకునే మెలడీని మేళవించి సంగీతంలో కొత్త ప్రయోగాలుచేసి మంచి ఫలితాలు సాధించిన ఇళయరాజా 1983లో సాగరసంగమంకు, 1988 లో రుద్రవీణకు, ఉత్తమ సంగీత దర్శకునిగా కేంద్ర ప్రభుత్వ బహుమతి పొందారు.
1977లో దాసరినారాయణరావు నిర్దేశకత్వంలో తయారైన కన్యాకుమారి చిత్రం
128
ద్వారా నంగీత దర్శకులుగా కొత్త బాధ్యతను చేవట్టిన గాయకుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం. తరువాత తూగ్పుకు వెళ్ళే రైలు, పడమటి సంధ్యారాగం చిత్రాలకు పని చేశారు. 'మయూరిలోని *“ఈ పాదం ఇలలోన నాట్యవేదం' అన్న పాటకు ఆయన స్వరపరచిన తీరు అబ్బురం, అపూర్వం. హిందీచిత్రం హమ్పాంచ్కు నేపధ్య సంగీతం అందించారు.
ఇహ గడచిన రెండు దశాబ్దాల్లో (1981-99) పలువురు నూతన సంగీత దర్శకులు రంగ ప్రవేశం చేశారు. ఒక వైపు మెలోడీని అందించటానికి తపన పడుతూనే మరోవైపు యువతకు కావల్సిన (టైండ్ యిదికాబోలు అనే భావంతో వెస్టన్ బీట్‌ను రంగరించి సంగీతాన్ని అందిస్తున్నారు.
కన్నడ రంగంలో పేరొందిన హంసలేఖ తొలిసారిగా తెలుగులో ముత్యమంత ముద్దు' చిత్రానికి టి.జి.లింగప్ప (గాలి మేడలు) సంగీతం సమకూర్చారు.
యస్. రాజేశ్చరరావుగారి అబ్బాయిల్లో ముగ్గురు సినీసంగీత దర్శకులుగా పరిచయమయ్యారు. రామలింగేశ్చరరావు రాధమ్మమొగుడు, వాసురావు పోలీస్ ఆఫీసరుతో ప్రారంభించి నాకు పెళ్లాం కావాలి వంటి హిట్స్ అందించారు.
ఇంకో అబ్బాయి కోటేశ్వరరావు టి.వి.రాజుగారి అబ్బాయి రాజ్‌తో కలసి రాజ్- కోటి పేరుతో 'ప్రళయగర్జన'తో మొదలుపెట్టి ఓ పుంజీడు చిత్రాలకు పనిచేశారు. విడిపోయిన తరువాత రాజ్ చేసిన వాటిల్లో చెప్పుకోదగిన 'సిసింద్రి' కోటి చేసిన వాటిల్టో 'హలో బ్రదర్ యెన్నదగినవి.
యం. యం, కీరవాణి యీ చివరి దశాబ్దంలో చేసిన సంగీత విన్యాసాలు అపూర్వంగా వైవిద్యభరితంగా ఉన్నాయి. అల్లరి ప్రియుడు, పెళ్ళిసందడి, అన్నమయ్య, సీతారామయ్యగారి మనవరాలు, బహుకొద్ది ఉదాహరణలు. ఈయన మంచి గాయకుడు కూడా. అన్నమయ్య చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకునిగా కేంద్ర ప్రభుత్వ బహుమతి పొందారు,
వీరి సోదరి శ్రీలేఖ పిన్సవనయసులోనే సంగీత దర్శకత్వం వహించారు (తాజ్‌మహల్.
సంగీత కుటుంబానికి చెందిన మాధవపెద్ది సురేష్ హాయిగొలిసే సంగీతాన్ని అందించిన చిత్రాలు బృందావనం, భైరవద్వీపం,
కృష్ణుచక్ర సంయుక్తంగా కొన్ని చిత్రాలకు సంగీతం అందించారు (చట్టానికి కళ్ళు లేవు). శంకర్-గళేష్ ద్వయం సంగీతాన్నిచ్చిన చిత్రం సీతాపతి సంసారం.
129
వందేమాతరం శ్రీనివాస్ గాయకుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత ఆర్ నారాయణయూర్తి మార్క్ చిత్రాలకు సంగీతం అందించి ఆ కోవలో దాసరి తీసిన 'ఒసేయ్ రాములమ్మ" హిట్ చేశారు. ఆయన మెలోడితో విజయవంతమయిన చిత్రం స్వయంవరం,
ఎస్.ఎ. రాజ్‌కుమార్ 'సూర్యవంశం', 'మానవుడు దానవుడు”, చిత్రాలకు పనిచేశారు.
సుభాష్గోపి (ఈప్రళ్షకుబదులేది?), కృష్ణతేజ (శుక్రవారం మహలక్ష్మి) చిత్రాలకు సంగీతం అందించారు.
తన సంగీత ప్రభంజనంతో దేశాన్ని వూర్రూతలూగిస్తున్న ఎ.ఆర్. రెహమాన్ తెలుగులో సంగీతం అందించిన చిత్రాలు సూపర్పోలీసు, గ్యాంగ్‌మాస్టర్, పల్నాటిపౌరుషం, "
మ్యూజిక్ డైరెక్టర్ అఫ్ ది సీజన్‌గా గుర్తించబడ్డ మణిశర్మ చిత్రాలు(చూడాలని ఉంది, రాజకుమారుడు). సందీప్ చౌత (నిన్న పెళ్ళాడతా), శశిప్రీతమ్ (గులాబి), రమణగోగుల (తమ్ముడు) .... .... యిలా ..... ఎందరో...
ల
మన సంగీత దర్శకులు సంగీత ప్రపంచంలో ప్రసిద్ది పొందిన వాయిద్య కళాకారుల ప్రజ్ఞను కొన్ని సందర్భాల్డ్లో వుపయోగించుకొన్నారు.
యం,యస్. సుబ్బయ్యనాయుడు. (అగ్గిరాముడు, చిత్ర సంగీత దర్శకులు) మురిపించే మువ్వలు చిత్రంలో నీలీల పాడెద దేవా పాటలో (ప్రఖ్యాత సన్నాయి నిపుణుడు కారే కురిచ్చి అరుణాచలం చేత సన్నాయి విన్యాసాలు వినిపించారు.
యస్. రాజేశ్చరరావు స్వరపరచిన “పాడమని నన్నడుగవలెనా (డా.చ'క్రవర్తి పాటలో ప్రఖ్యాత వైణిక విద్వాంసుడు చిట్టిబాబు వీణనాదం చేశారు.
గొాలిపెంచల “సీతారాముల కళ్యాణం'లో రావణుడు. జీవనాడుల్ని వీణా తంధత్రులుగా మీటినప్పుడు ఈమని శంకరశాస్త్రి వీణా విన్యాసం వినిపించారు.
'పూజాఫలం' చిత్రంలో (ఎస్. రాజేశ్వరరావు) పోరూర్ గోపాలకృష్ణన్ వయలిన్పై తన ప్రతిభ కనబరిచారు.
మహదేవన్ నిక్టేశకత్వంలో 'సప్తపది' చిత్రంలో నంజుడప్ప ఫ్లూట్ వినిపించారు.
ఆయనే స్వరపర్భిన 'సిరివెన్నెల్ చిత్రంలో మురళీ గానలోలుడు హరిప్రసాద్ చౌరాసియా ప్రతిభకు శ్రోతలు జేజేలు పలికారు.
130
పిచ్చిపుల్లయ్య, చిత్రంలో నిర్మాత పుండరీకాంక్షయ్య బస్తీకిపోయేటి పల్లెటూరి
వాడా నేపధ్య గీతాల్ని పాడారు. నే
గాయకుల (ప్రకరణకు వస్తే ప్రథమ తాంబులం ముట్టవలసింది 'స్వర్గసీమ'తో పరిచయమైన ఘంటసాలకే! నవరసాలకు చెందిన పాటల్ని తన్మయత్వంతో తాదాత్యం చెంది ఆ పాట ఆ నటుల నాభినుంచి పయనించి గొంతులోంచి వూడిపడిందా అన్నట్టు భావయుక్తంగా ఆలపించటం ఆయనకే చెల్టు. (ప్రతీరాత్రి వసంతరాత్రి లాగ ఆయన పాడిన ప్రతిపాట సంగీతసాగర మధనంలోంచి ఆవిర్భవించిన అమృతభాండమే! పాడవోయి భారతీయుడా అని ప్రబోధించినా, అమ్మా అని పిలిచినా ఆలకించవేవమ్మా అని ఆర్తితో రోదించినా, కొండగాలి తిరిగిందని ప్రకృతితో సరాగాలాడిన ముక్కోటి దేవతలు ఒక్కటైనారని భక్తితో క్షీర్తించినా జోరుగా హుషారుగా షికారు పోదమూ అంటూ కేరింతలు కొట్టినా, రసికరాజ తగువారముకామా అంటూ సంగీత ప్రపంచంలో గిరికీలు కొట్టినా ఆయనకే చెల్లింది.
సీనియర్ గాయకుడు, నటుడు నాగయ్య గారికి రారాకృష్ణయ్య అంటూ స్లేబాక్ పాడటం వో తీయని అనుభూతి ఇవన్నీ ఒక ఎత్తైతే పద్మశ్రీ సత్కారం పొందటం చరమదశలో భగవద్గీత ఆలపించి చరితార్థుడవటం ఘంటసాల చేసుకున్న పూర్వజన్మ సుకృతం.
యం.యస్, రామారావు పాడిన నేపథ్యగీతాల్లో పోరాబాబు పో (దీక్ష) జీవితమింతేలే (జయసింహ) చెప్పుకోదగ్గవి.
(ప్రేమలేఖలు, విప్రనారాయణ, పక్కింటి అమ్మాయి, మిస్సమ్మ అన్నింటినిమించి అమరసందేశంలోని పాటలు ఏ.ఎం. రాజా గొత్ర మాధుర్యంతో మలయనిలంలా హృదయాన్ని పులకింపజేస్తాయి.
ఎస్.వి.రంగారావు పాటలకు పద్యాలకు నేపధ్యగానం చేసిన మాధవపెద్ది సత్యం (వివాహభోజనంబు) హీరో జగ్గయ్యకు కూడా (ముందడుగు) పాడారు.
అంతేవాసిగా వినతికెక్కిన పిఠాపురం నాగేశ్చరరావు హాస్యగీతాలు పాడటంలో సిద్ధ హస్తుడు. అవేకళ్ళు లోని మావూళ్ళో ఒకపడుచుంది, సంఘంలోని పెళ్ళి పాట ఉదాహరణలు.
పి.బి, శ్రీనివాస్ పాడిన వేలాదిపాటల్లో చెప్పుకోదగ్గవి ఓహో గులాబి బాలా! (జగ్గయ్య) మీ అందాల చేతులు కందేనుపాపం (నాగేశ్వరరావు), ఎవరికి ఎవరుకాపలా!
131
(యన్.టి.ఆర్, ఈయన కూడా నాగయ్య గారికి శాంతినివాసంలో గాత్ర దానం చేశారు.
విచిత్రబంధంతో గాయకుడైన రామకృష్ణ పాడిన భక్తిరసగీతం విరలా విరలా పాండురంగ విఠలా మరువలేనిది.
కె.జె. జేసుదాసు గాయకునిగా అటు మేఘసందేశంలోను , యిటు మోహన్‌బాబు సొంత చిత్రాల్లోను, తన గాత్ర వైభవాన్ని (ప్రదర్శించి 1982లో గాయకునిగా కేంద్ర ప్రభుత్వ బహుమతి పొందారు.
జి. ఆనంద్ పొడిన గీతాల్లో వసివాడనిది ఒక వేణువు వినిపించెను (అమెరికా అమ్మాయి) చెప్పుకోదగ్గది.
శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్నతో గాయకుడుగా పరిచయమైన యస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల తరువాత అంతటి స్టాయిలో వైవిధ్యం వున్న గీతాలను అందరూ హీరోలకు పాడి గ్రేక్షకుల్ని మెప్పించిన వరపుత్రుడు, వేటగాడు, మరోచరిత్ర, (ప్రేమాభిషేకం, సాగరసంగమం, శంకరాభరణం వంటి వందలాది చిత్రాలు - వేలాది పాటలు, దేని ప్రత్యేకత దానిదే! అందులో ఆర్టిస్టుగా, నిర్మాతగా 'ప్రజలనాడి బాగా తెలిసిన గాయకుడు. అన్నిటిని మించి మంచి సంగీతం కోసం త్రికరణశుద్దిగా తపనపడే. సంగీత ప్రియుడు. ఈయన గా(త్రధారేకాదు కొన్ని సందర్భాల్గో సినిమాలలో పాత్రధారి మరికొన్ని కార్యక్రమాలకు సూత్రధారి. 1983, 1988 సంవత్సరాలలో ఉత్తమ గాయకునిగా కేంద్ర ప్రభుత్వ బహుమతి పొందారు.
రాజ్‌సీతారాం ఆ మధ్యన సింహాసనంకు, నాగూర్ బాబు (ఏ జన్మదోయీ అనుబంధము) వందలాది గీతాలు గానం చేశారు.
దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ సతీసావిత్రి, గుప్పెడుమనసు, మేఘసందేశం చిత్రాలలో గానం చేశారు. ఈయనతోకలసి మరో విద్వాంసుడు నూకల చిన సత్యనారాయణ పవిత్ర హృదయాలు చిత్రంలో పాడారు. ఇంకా కె.బి.క. మోహన్‌రాజు (చిగురులు వేసిన కలలన్ని) చిత్తరంజన్ (రావే రావే వయ్యారి నా చెలి) తెలంగాణా ప్రజాగాయకులు గద్దర్నరసింహమూర్తి కూడా చిత్ర గానాలాపన చేశారు.
ఇతర భాషా గాయకులు ఉన్నికృష్ణన్ (ఉగాది), ఉదిత్‌నారాయణ్ (రామ్మా చిలకమ్మ), హరిహరన్ (మాస్టర్, సురేష్ పీటర్ (శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి), తెలుగుభాషలో తేనె లొలుకు తెలుగుపాటకు ప్రాణం పోయటానికి (ప్రయత్నిస్తున్నారు.
132
హిందీ చిత్ర రంగానికి చెందిన దర్శకులు శంకర్ జైకిషన్ (జీవిత చక్రం), సి. రామచంద్ర (అక్బర్ సలీం అనార్కలి), లక్ష్మీకాంత్ ప్యారేలాల్ (మజ్నా), సలీల్ చొదరి(వైర్మన్ చలమయ్య), ఆర్.డి.బర్మన్(అంతం), బప్పీలహరి (సింహాసనం), చిత్రాలకు సంగీతం సమకూర్చగా లతామంగేష్కర్. (సంతానం), ఆశాభోంస్టేల (పవిత్రబంధం), కవితాకృష్ణమూర్తి (సిద్దార్టు, రఫీ (ఆరాధన, భలేతమ్ముడు), తలత్ మహమ్మద్ (మనోరమ), తెలుగుగీతాల్ని తమ గళంలో వినిపించారు.
గాయనీమణుల వివరాలు పరిశిలిస్తే.......
టాకీలు వచ్చిన తొలి రెండు దశకాల్లో (1931-50) నటీనటులుగా వెలుగొందిన వారిలో చాలా మంది నాటకరంగం నుంచి వచ్చిన వారే, సియస్,ఆర్. ఆంజనేయులు, రఘురామయ్య, సూరిబాబు, నాగయ్య, నాగేశ్చరరావు, రాజరత్నంద్వయం (కాకినాడ, బెజవాడ), భానుమతి, సి. కృష్ణవేణి, మాలతి, శాంతకుమారి, జి, వరలక్ష్మి యస్. వరలక్ష్మి టంగుటూరి సూర్యకుమారి, హాస్యనటులు శివరావు, రేలంగి వారి పాటలు వారే పాడుకొనేవారు. నాయికాపరంగా 1943లోనే 'ప్లేబాక్ మొదలైంది. 1943లో చెంచులక్ష్మిలో కమలాకొట్నీస్కు బాలసరస్వతిదేవి పాడినట్టు ఆమెతెలిపారు. ఆ విధంగా ఆమెనే తొలి నేపధ్య గాయనిగా వుదహరించాలి. ఆ తరువాత ఆమె స్వప్నసుందరి (నటనలు తెలుసునులే) జయసింహ (మదిలోని మధురభాను) రాజీనాప్రాణం (మల్లెపూవు). పెళ్ళి సందడి (ఓహో కవిరాజా) వంటి గీతాల్ని వినిపించారు. అనుకరణ కసాధ్యమైనది ఆమె శైలి. అంతకు ముందే ఆమె 'ఆ తోటలో నొకటి, బంగారు పాపాయి వంటి గీతాల ద్వారా శ్రోతల అభిమానానికి పాత్రలయ్యారు.
1949లో 'గుణసుందరికథ' చిత్రం ద్యారా పరిచయమైన పి. లీల ఘంటసాల నిర్దేశకత్వంలో విజయవారి చిత్రాలకు (తీయని ఊహలు, ఎచటనుండి వీచెనోయీ చల్లనిగాలి, చిరంజీవులు (తెల్లవార వచ్చే తెలియకనే స్వామి) భలేరాముడు (ఓహోమేఘమాల), రాజమకుటం (సడిసేయకోగాలి) ఇలాంటి యెన్నో సుమధుర గీతాలు వందల సంఖ్యలో వినిపించారు.
(ప్రేమలేఖలు గీతాల ద్వారా ఆనాటి శ్రోతల్లో సంచలనం సృష్టించిన పి.జి, కృష్ణవేణి(జిక్కీ గొంతులో ప్రాణం పోసుకున్న అసంఖ్యాక గీతాల్లో కొన్ని..... జీవితమే సఫలము (అంజలి, అనార్కలి) వద్దురా కన్నయ్య (సావిత్రి-అర్జాంగి పులకించని మది పులకించు. (కృష్ణకుమారి-పెళ్ళికానుక). కాలం గడచిన ఆమె గాత్రంలో మాధుర్యం తగ్గలేదని చెప్పటానికి ఆదిత్య 369లో ఆమె పాడిన 'జాణవులే, నెరజాణవులే' చక్కని ఉదాహరణ.
133
1953లో “కన్నతల్లి ద్వారా గాయనిగా ప్రవేశించిన పి. సుశీల భారతీయ భాషల్లో వేలాది పాటలుపొడిన ఏకైక గాయని. ఏస్టాయిలో నైనా మాధుర్యం పెంచుతూ అందరు కధనాయికలకు పంచుతూ గాత్రాని మలచుకొంటూ పాడటం ఆమె ప్రత్యేకత. అనురాగమువిరిసేనా (జమున -దొంగరాముడు), అహనా పెళ్ళంట (సావిత్రి - మాయబజార్ీ ఏమని పాడెదనోయీవేళ (కృష్ణకుమారి - భార్యాభర్తలు), పాడెద నీ నామమె గోపాల (శారద-అమాయకురాలు), మీ నగుమోము నా కనులారా (అంజలి-బడిపంతులు), చేతిలో చెయ్యేసి చెప్పుబావా (వాణిశ్రీ-దసరాబుల్లోడు) - ఆమె గాన వైచిత్రికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈమె 1983లో ఉత్తమ గాయనిగా కేంద్ర ప్రభుత్వ బహుమతి పొందినది.
కె. రాణి గాత్రంలో అటు నిరాశను యిటు హుషారును పలికించగల సౌలభ్యం ఉంది అని నిరూపించినపాటలు అంతా (భ్రాంతియేనా (దేవదాసు), కొండమీద కొక్కిరాయి కాలు జారి కూలిపోయె (జయసింహ).
ఎం.ఎల్ఏ (1957)లో నీ ఆశ అడియాశ పాటతో గాయనిగా పరిచయమైన యస్. జానకి ఏ రేంజిలోనైనా మెలోడీ కోల్పోకుండా హాస్కీనెస్తోకలిపి పాడగలగటం ఆమె ప్రత్యేకత, డబ్బింగ్ చిత్రమైన మురిపించే మువ్వలులోని “నీ లీల పాడెద దేవ' గాయనిగా అమె ్రతిభకు ప్రతీక ఇహ పగలేవెన్నెల, నీలిమేఘాలలో, నడిరేయి యేజాములో వంటి వందలాది పాటలు ఆమె గళంలో నర్తించాయి. (1984లో ఉత్తమ గాయనిగా కేంద్ర ప్రభుత్వ బహుమతి పొందారు).
ఆ రోజుల్లో తక్కువ పాటలు పొడినా వక్కలంక సరళ ( కీలుగుర్రం), ఏపి. కోమల (చంద్రహారం), వసంత (బంగారు బండిలో) వారి ప్రత్యేకతను నిలుపుకొన్నారు. "
(శ్రోతలకి, ప్రేక్షకులకి కిక్ అందించే మజాపాటల్లో (ప్రాచుర్యం పొందిన గాయనీ మణులుగా జమునారాణి (మావ మావ మావ, ముక్కమీదకోపం), యల్.ఆర్. ఈళశ్చరి (లేలే లే నారాజా, ఆకులు పోకలు ఇవ్వద్దు, మపక మసక చీకటిలో, మాయదారిసిన్నోడు మనసేలాగేసిండు) లను పేర్కొనాలి.
సాత్త్యిక భావ (ప్రధానంగా లాలిత్యాన్ని జోడించి మాధుర్యాన్ని అందించగల కంరం వాణిజయరాం (ఆనతినీయర దొరా, పూజలు చేయ పూలు తెచ్చాను). ఈమె 1979, 1991 సంవత్సరాల్లో ఉత్తమ గాయనిగా కేంద్ర ప్రభుత్వ బహుమతి పొందారు.
నటి గిరిజకు ఎక్కువగా హాస్యరస ప్రధానగీతాలు పాడినగాయని స్వర్ణలత (అప్పుచేసి పప్పుకూడు).
134
శాస్త్రీయ సంగీత కచేరీలు చేసి రేడియోలో ప్రసిద్దినాందిన సంగీత విద్వాంసులు ఎం.ఎల్. వసంతకుమారి (ఈమె కుమార్తె ప్రముఖ నటి శ్రీవిద్య) జయభేరిలో పాడిన నీవెంత నెరజాణవవురా పాటను సంగీత కళాశాలలో పనిచేసిన శ్రీరంగం గోపాలరత్నం, వెంకటేశ్వర వైభవం కోసం పొడిన ఒక పిలుపుతో పలుకుతావట. పాటల్ని మరువగలమా?!
ఇంకా విమలలో కన్నుల్లో నీ బొమ్మను చూడు పాడిన రాధాజయలక్ష్మి కనకదుర్గ పూజా మహిమలో జీవనమే పావనమూ పాడిన శూలమంగళం రాజ్యలక్ష్మి ఆకాశవాణి గాయనీమణులే.
అన్నపూర్ణా వారు పరిచయం చేసిన గాయని ఆశాలత కులకర్షి (చదువుకున్న అమ్మాయిలు).
ఇహ యీ రెండుతరాల్లో (1981-99) గాయనీమణుల్లో అ(గ్రతాంబూలం చిత్రదే! మాతృభాష కాకపోయిన తేటతెలుగులో తేనెలూరే మాధుర్యాల్ని గమకాల్ని గొంతులో పలికించి గానామృతాన్ని శ్రోతలకు పంచిఇవ్వుగల కారణజన్మురాలు, ఓ ప్రియా ప్రియా (గీతాంజలి), మా పెరటి జాంచెట్టు రామచిలుక (పెళ్ళి సందడి), కలికి చిలకల కొలికి మాకు మేనత్త (సీతారామయ్యగారి మనవరాలు), యీ మూడు చాలు ఆమె సామర్థ్యం బేరీజు వేయటానికి,
యస్పి. శైలజ విషయంలో వో విచిత్రం జరిగింది సాగరసంగమంలో అమె నటించగా ఆమె సై చిత్రీకరించిన ఓం నమఃశివాయ పాటను జానకి పాడటం అదే చిత్రంలో వే వేల గోపమ్మల ముద్దు గోపాలుడే పాటని శైలజ పాడటం.
మాల్గుడిశుభ గాత్రంలో ప్రేక్షకుల్ని మత్తులో ముంచెత్తగల ఒక కిక్ వుందని నిరూపించిన పాటలు “బావలు సయ్య-మరదలు సయ్య”, 'లాల్గూడ గల్లి కాడ. సంగీత దర్శకురాలు శ్రీలేఖ “మంచి గాయని కూడా (ఆయనకిద్దరు-మధుమాసపు మల్లెల వేళు,
ఇంకా... సుజాత (జీన్స్-పువ్వుల్లో దాగున్న కళ్ళంతో అతిశయం) స్వర్ణలత (ప్రేమంటే ఇదేరా-నైజాం బాబు),సునీత (ఎగిరేపావురమూ-మాఘమాసం వ్పడొస్తుందో) ఈమధ్యనే గాయనీమణులుగా ప్రేక్షకులకు చేరువవుతున్నారు.
వమ షల 135
తెలుగు సినీ సంగీత వ్రవందంలో కారణజన్సుడు ఘంటనాలి ద్రముఖ వాగ్గేయకారుడు త్వాగరాజస్తామి ఆరాధనోత్సవాలు దక్షిణ భారతదేశంలో నంగీత ప్రియులు ఘనంగా జరువుకొంటారు. నీనిమా సంగీతానికి సంబంధించి అంతటి ఖ్యాతి దక్కంచుకొన్లు వక్తి ఘంటసాల వెంకటేళ్టరరావు ఆయన జయంతి ఉత్సవాలను, నర్రంతులను ఆంధ్రదేశయంతటా సంగీత వ్రీయులు ఘంటసాల ఆరాధనోత్సవాల పేరిట ఘనంగా నిర్దహించి నివాణలర్చిస్తున్దారు. ఇది ఆయనకు దక్కిన అపూర్చు గౌరవం, ఆ మహనీయుని జీవితంలోని కొన్టి ముఖ్య ఘట్టాలు = జననం 4-22-2922 (కృష్ణాజిల్లా బాటుపల్లి (గ్రామం) శ సంగీతవిద్ధలో విజయనగరం కళాశాలలో పట్టా పొందటం. శ 29ళ2లో కిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బెజవాడ గోపాలరెడ్డీ పొట్టిశ్రీరాములు వారి నహచర్చంలో 28 నెలలు శజైలుళిక్ల అనుభవించటం, శ పేకటి శివరాం నవోయంలో తొలిసారిగా హెబ్ఎం.వి. కంపెనీకి రికార్డు ఇమ్రుటం, కరుణశ్రీ కొనకళ్ళ వెంకటరత్డుం (ప్రయాగ రావ్రలవ్త్తి తోలేటి (వ్రాసిన పలుగీతాలు, దేళభక్తి గీతాలు పాడటం. ౫ 7945లో సముద్రాల గారి ప్రోత్సాహంతో నాగయ్య నంగీత దర్భకత్సంలో తొలిసారిగా స్వర్గసీమలో పాడటం. శ 2949లో నటి నిర్మాత కృష్ణవేణి ప్రోత్సాహంతో మనదేశం చిత్రానికి సంగీత దర్చకత్తం వహించారు. = 100 చిత్రాలకు పైగా సంగీత దర్భకత్సం వహించి 20వేలకు పైగా పాటలు పాడటం. ౫ భారత ప్రభుత్వంచే వద్మశ్రీ బిరుదు నత్కారం పొందటం, శ్ జీవిత చరయ దోలో భగవద్గీతను గానం చేసి తరించటం. ౫ 2202-74లో అశేష అభిమానుల్లి దుఃఖసాగరంలో ముంచి క్తీర్తిశషులవటం. 136
కయ. ప చ క
గ్ స [స] ్ల
[|] న... 1 1]
భీ! భం... నా |
|. క న. 137
ల న నో కాలే ననన స తు అ జీ ల నాల న
ఆ నతాశణఖ చెతి ఉత్త ం భ్ 2 ను ఖ్ హ్ యాయ! ౪5 హ్ సో పళ 20
138
నృత్యం చతుస్టష్టి కళల సమ్మేళనా సమ్మోహితం చలనచిత్రం. అందులోని ఒక ముఖ్య పార్వ్యం నృత్యం, నాట్యం పేరిట పరిగణంపబడే కళా విశేషం. “స్వరములు ఏడైనా రాగాలెన్నో - యొన్నెన్నో; పదములు రెండయినా నాట్యలెన్నో-యెన్నెన్నో” అన్నది సినీ కవి సూక్తి. సినీ పరిభాషలో డాన్సుగా పరిగణిపబడేది పదవిన్యాసం. అది కూచిపూడి కావచ్చు, భరతనాట్యం కావచ్చు, జానపద నృత్యం గావచ్చు, కథాకళి కావచ్చు, భాం(గ్రానృత్యం గావచ్చు, లేక విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న రాక్ అండ్ రోల్ గావచ్చు, ఆధునిక ప్రక్రియల్లో మరేపేరుతో అయినా పిలవవచ్చు. కావలసిన ఫలితం ఆనాడు కానీ యీనాడుకానీ ఒక్కటే... కధలో సన్నివేశపరంగా జనాన్ని ఆకర్షించగల డాన్సులు వుండాలి. ఈ మేరకు తెలుగుసినీరంగంలో సాంప్రదాయ నాట్యరీతుల్ని అభ్యసించి దానిని సినిమాకు తగ్గట్టుగా మలచగలగినవారు డాన్సు మాస్టర్టు డాన్సు డైరెక్టర్షయి కనువిందొనర్చు నృత్యాలకు రూపకల్పన చేశారు. తొలి దశకంలోని (1931-40) చిత్రాల్టో రంగస్థల నటీమణులు నాయికపాత్రలు ధరించటం వల్ల వారు స్టేజిపై నర్తించిన సందర్భంలో వలెనే తెరపై ఆవిష్కరించేవారు. రెండవ దశకంలో కూచిపూడి నుంచి వచ్చి మద్రాసులో సినీరంగంలో నృత్యదర్భకులుగా స్టిరపడ్డ (ప్రముఖవ్యక్తి వేదాంతం రాఘవయ్య. అటు ప్రతిభా వారి చిత్రాలు గరుడగర్వభంగంగా (ఇందులో వేషం కూడా వేశారు). బాలరాజు, స్వప్నసుందరి యిటు భరణీ వారి లైలామజ్నుకు నృత్య దర్శకత్వం వహించి ఆపై వినోదా సంస్థలో భాగస్వామియై దర్శకుడయ్యారు. బాలరాజులో యక్షకన్య అంజలి చేసిన “తీయని వెన్నలరేయి” ఆరోజుల్లో నర్తకీమణులు ముచ్చటపడ్డ నాట్యం, అలాగే స్వష్టసుందరిలో అంజలీపై చిత్రికరించిన “ఓ పరదేశి మరేజాడలా చూడవురా యీ హాయిని" తరువాత లైలామజ్నూాలో తిరువాన్కూరు సోదరీమణులు లలిత-పద్మిని చేసిన నృత్యాన్ని సాంప్రదాయరీతుల్లో రూపొందించారు. తరువాత చెప్పుకోదగ్గ వ్యక్తి పసుమర్తి కృష్ణమూర్తి. మల్లీశ్వరి చిత్రంలో భానుమతిపై చిత్రీకరించిన జావళి పిలిచిన బిగువటరా' నృత్యానికి, మన పల్లెపట్టుల పండుగ సందర్భంలో సాగే జానపదగీతం 'నోమీనమన్నాల నొమన్నలాలో చందమామ, చందమామ” పాటలో నృత్యప్రాధాన్యత లేదేమో అనిపించినా రిధిమ్కు తగ్గ భంగిమలతో రూపకల్పన చేశారు. 139
పసుమర్తి నేతృత్వంలో మాయాబజార్లోని నృత్యాలన్నీ (ప్రేక్షకుల్ని బాగా
అలరించినవే. ముఖ్యంగా జనహృదయాన్ని దోచుకున్న మాయాశశిరేఖ (సావిత్రి) పై చిత్రీకరించిన అహ నా పెళ్ళంట చెప్పుకోవాలి. ఇందులో భస్మాసుర కథ దృశ్యరూపంగా చిత్రీకరించగా ఆ సన్నివేశంలో గోపీనాధ్ పాల్గొన్నారు. నృత్య (ప్రాధాన్యతగల మరో గీతం మాయాబజార్లోని స్వాగత గీతం. “దయచేయండి దయచేయండి” అన్న పల్లవి గల గీతంలో కె.ఎస్.రెడ్డి చేసిన రక్షలు రక్షలు పాదరక్షలు కాగా, నర్తకీమణులు రీట్లా సరోజలపై చిత్రీకరించిన నయగారముల కనరా వయ్యారము నా వలరా అన్న పాటకు కూర్చిన నృత్యరీతులు (ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి. ఈయనే నృత్య దర్శకత్వం వహించిన మరో అద్భుత చిత్రం పాండవ వనవాసం. ఇందులో రాజసులోచనపై మూడు చరణాలు మూడు విభిన్న రీతుల్లో (పాట: ఉరుకులపరుగుల దొర) సంగీత వైవిధ్యానికి తగ్గట్టు రూపొందించారు. ఇహ విశిష్ట నర్తకి ఎల్. విజయలక్ష్మిపై చిత్రీకరించిన నా చందమామ నీవే భామా రాగాలు పరవళింప నృత్యాలు కనువిందు చేస్తాయి. అటు మాయాబజార్‌కు యిటు పాండవ వనవాసంకు పసుమర్తి నృత్య దర్శకుడు కావటంతో మాయాబజార్లో రేలంగికి (సుందరి నీవంటి దివ్య స్వరూపం) పాండవవనవాసంలో పద్మనాభానికి (బావ బావ పన్నీరు) కూర్చిన భంగిమల్లో కొంత సామ్యం కనిపిస్తుంది. నృత్య ప్రాధాన్యత సంతరించుకొన్న చిత్రం “సిరిసిరిమువ్వ”. జయప్రద సహజంగా నర్తకి కొవటం చేత అందులోని నృత్యాలన్నీ రాణించాయి. ఆలాగే నవరాత్రి చిత్రంలో అక్కినేని-సావిత్రిలపై చిత్రీకరించిన
వీధిభాగవతం నాటకానికి ఆ పద్దతిలో రూపకల్పన చేశారు. ఇహ దొంగరాముడు
చిత్రంలో సామాన్య ప్రేక్షకుల్ని అలరించే విధంగా సావిత్రి-ఆర్.నాగేశ్ళరరావులపై చిత్రీకరించిన 'రారోయి మా యింటికి పాటను పాత్రల బౌచిత్యాన్ని తగ్గట్టుగా
తీర్చిదిద్దారు.
టాకీ వచ్చిన మూడు నాల్లు దశకాల్లో (951-70) పేరేన్నికగన్న నృత్యదర్శకుడు
వెంపటి సత్యం, సంగీత నృత్య ప్రధానంగా సాగిన 'సువర్షసుందరి' చిత్రం; అందులో
అంబజలిపై చిప్రీకరించిన నీ నీడలోన, పిలవకురా, మాస్‌ను ఆకర్షించే బొమ్ములమ్మా
బొమ్మలు, చివరన రాజసులోచన (క్షణకాలం అక్కినేని) చేసిన నృత్యాలకు ఆయన
కూర్చిన భంగిమలు చిత్ర విజయానికి దోహదం చేశాయనటం అతిశయోక్తి కాదు.
ఈయన గూర్చి ప్రత్యేకంగా (ప్రస్తావించవలసిన చిత్రం 'నర్తనశాల', విరాటరాజు
కొలువులో బృహన్నల (యన్‌టి.రామారావు) ఉత్తరకు (ఎల్, విజయలక్ష్మినాట్యం
నేర్పిన సలలితరాగసుధారస సారం పాటకు భంగిమలు బృహన్నల చూపగా ఉత్తర
అనుకరించటం-ఆ యిద్దరు నటుల్ని దృష్టిలో వుంచుకొని వైవిధ్యభరితంగా రూపొందించిన అ నృత్యగీత నన్నివేశం అపూర్వం.
140
ఏ.వి.యం. వారి 'భూ కైలాస్' చిత్రానికి క.దండాయుధపాణి నృత్య దర్శకత్వంలో హిందీ చలనచిత్రరంగంలో పేరాందిన గోపీకృష్ణ (యునక్యునక్పాయల్బాజే ఫేం) కేవలం సంగీతంతో రూపొందించిన నృత్యాన్ని శివుని ఎదుట ప్రదర్శించటం, (ప్రఖ్యాత నర్తకి కమలాలక్ష్మణ్పై చిత్రీకరించగా అవతార విశేషాలను తెలిపే 'మున్నీట పవళించు నాగశయనా', హిందీ నర్తకి హెలెన్‌పై చిత్రీకరించిన నృత్యం సుందరాంగ అందుకోరా” చెప్పుకోదగినవి.
ఆ రోజుల్లో హీరాలాల్ (1960-75) నేతృత్వంలో కొత్తపోకడల్లో జనరంజకమైన నృత్యాలు రూపొందించబడ్డాయి. తెలుగులో తొలిసారిగా భాంగ్రా నృత్యం (నీ నల్లని జడలో పూలు) కులగోత్రాలు చిత్రంలో (ప్రవేశపెట్టారు. 'మంచిమనసులు", చిత్రంలో మావా మావా మావా 'మూగమనసులు' లో గౌరమ్మా నీ మొగుడెవరమ్మా పాటలకు ఆయన రూపొందించిన భంగిమలు పాటలోని సంగీత సాహిత్యాలకు మంచి ఊపునిచ్చాయి. కథాపరంగా సన్నివేశ ప్రాధాన్యతగల 'ఆత్మబలం'లోని ఎక్కడిపోతావు చిన్నవాడా, అంతస్తులులోని మైకంలో వున్నాను మన్నించాలి పాటలకు కూర్చిన నృత్య భంగిమల్లో ఎంతో ధ్రిల్ వుండి (ప్రేక్షకులు ఉత్కంఠ భరితంగా చూసేలా రూపొందించారు. హీరాలాల్ జీవితంలో హైలైట్ గా చెప్పుకోదగ్గది - “దసరాబుల్లోడు” చిత్రంలో అక్కినేని చేత పులినృత్యం చేయించటం. నిజునికి ఆరోజుల్టో వింతగా ఆ సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తూ ధియేటర్జో యీలలు వేశారు ప్రేక్షకులు.
చిన్నిలాల్.సంపత్‌కుమార్ అనే యిద్దరు నృత్యదర్శకులు వారిపేర్టు కలిపి చిన్ని- సంపత్ పేరుతో అటువిరలాచార్య జానపద (అగ్గిపిడుగు) చిత్రాలకు హుషారైన నృత్యాల్ని అందిస్తూ మరోవైపు జల్పారాయుడు వంటి చిత్రాలకు రాకెన్‌రోల్ తరహాలో 'రాకు రాకు రాకు నా దగ్గరికి అనేపాటకు పాశ్చాత్య రీతుల్లో నృత్య భంగిమళల్ని సమకూర్చారు.
వెంపటి చినసత్యం గారివద్ద నృత్యాన్ని అభ్యసించిన శేషు మాస్టారు నృత్యం (ప్రధానంగా సాగిన పలు చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు (అనంద ఖైరవి, సాగరసంగమం, సీతాకోకచిలుక, మయూరి, శంకరాభరణం మొ) మయూరి చిత్రంలో నాయిక సుధాచంద్రన్ నిజజీవితంలో ఒక కాలు కోల్పోయి జైపూర్ కాలు సహాయంతో నర్తించిన నర్తకి. ఆమె వాడింది ఆ కృత్రిమ పాదం అనే భావం రాకుండా 'ఈ పాదం' అన్నపాటకు గౌరీశంకర శృంగం, నరనారీసంగమరంగం, అన్న గీతానికి కూర్చిన భంగిమలు అపూర్వం. స్వాతిముత్యంలో కమల్‌హాసన్ చేసిన సువ్వి సువ్వి పాటలో కనపడని నృత్యం వుంది. అది అమాయకుడి తప్పటడుగులు అనుకోవచ్చు. అలాగే ప్రతిఘటన చిత్రంలో విజయశాంతి పాడిన ఈ దుర్యోధన దుశ్శాసనలోకంలో
141
అన్న పాటలోకూడా భావ ప్రధానమైన భంగిమల్ని తీర్చిదిద్దారు శేషు. జనసామాన్యాన్ని అలరించిన ముత్యాలముగ్గు హలం నాట్యం 'ఎంతటి రసికుడవో తెలిసెరా?, సీతాకోకచిలుకలో ముచ్చర్ల అరుణపై చిత్రీకరించిన 'పగలు రేయి కలిసి విరిసిన సంధ్యారాగంలో' పాటలు చెప్పుకోదగ్గవి. వీటన్నిటికంటే మిన్నగా యొన్నదగినది సప్తపది చిత్రంలో నాయిక సబితపై చిత్రీకరించిన 'నెమలికి నేర్పిన నడకలివి, నాట్యానికి రూపొందించిన భంగిమలు. అలాగే స్వతహాగా నాట్యతార అయిన భానుప్రియపై స్వర్లకమలంలో చిత్రీకరించిన గీతాలకు రూపొందించిన భంగిమలు కూడా (ప్రజలు (ప్రశంసించారు. గిరీష్ కర్నాడ్ చక్కని ఆర్టిస్టు ఆయనచేత “ఆనంద ఖైరవి'లో చేయించిన నృత్యాలు మరువలేము. సన్నివేశ బలముంటే నాట్యం కూడా పండుతుంది. ఇందుకు 'సాగరసంగమం' చిత్రంలో కమల్ హాసన్ చేసిన, వైవిధ్యమున్ను నృత్యాలు వేవేల గోపెమ్మల, తకిట తకిట తకిట తిల్లాన గొప్ప ఉదాహరణలు.
సంగీత దర్శకులు ఇతర ప్రముఖ వాయిద్యకారుల సహకారం తీసుకున్నట్టే శేషు మాస్టారు 'ఆనందభైరవి'లో నాట్యాల చిత్రీకరణ కోసం యితరుల సహకారాన్ని తీసుకున్నారు. మణిపూరి నాట్యాన్ని ఆదిలక్ష్మి, సింహకౌతం నాట్యాన్ని ఆచార్య, కధక్ నృత్యాన్ని బుద్దదేవ్ రూపకల్పన చేసారు,
(ప్రేక్షకుల్ని తాను రూపొందించిన భంగిమలద్వారా సమ్మోహపరచిన నృత్యదర్శకుడు సలీం గోపీకృష్ణ వద్ద విద్యనభ్యసించి, ఉదయశంకర్ వైజయంతీమాల బృందంలో చేరి నృత్య ప్రదర్శన లిచ్చిన సలీం మాస్టరు తెలుగులో సుమారు 500 పైగా చిత్రాలకు నృత్యదర్భకత్వం వహించి రికార్డు నెలకొల్పారు. అ(గ్రశ్రేణి కధనాయకులందరి చిత్రాలకు ఆయన నృత్య దర్శకత్వం వహించి తన బహుముఖ (ప్రజ్ఞ నిరూపించుకున్నారు. అక్కినేనికి ప్రేమాభిషేకం, అనుబంధం, యన్,టి,ఆర్.కు వేటగాడు, సర్దార్ పాపారాయుడు, కృష్ణకు ఊరికిమొనగాడు, చిరంజీవికి అడవిదొంగ, గూండా వంటి హిట్స్ బహుకొద్ది వుదాహరణలు మాత్రమే! ఖైదీ చిత్రానికి ఊయన మాధవి- చిరంజీవి కోసం స్నేక్డాన్సు తరహాలో కంపోజ్ చేసిన 'రగులుతోంది మొగలిపొద' భంగిమలు ప్రేక్షకుల్లో సంచలనం కలిగించాయి. ఏ ఆర్టిస్టుకి ఏరకమయిన భంగిమలు బాగా ఎఫెక్టివ్‌గా ఉంటాయి అన్న రహస్యాన్ని జీర్ణం చేసుకున్న వ్యక్తి సలీం. కాబట్టే డాన్స్ డైరెక్టర్‌గా ఉన్నతస్థాయిలో ఉంటూ మంచి ఫలితాలు సాధించారు.
ఈ దళకం ద్వితీయార్హంలో లారెన్స్ చిరంజీవి చిత్రాలకు (మాస్టరు డాన్సు కంపోజ్ చేసి మంచి పేరు తెచ్చుకొని ఒక చిత్రంలో కధానాయకుడిగా (స్పీడ్ డాన్సర్ నటించారు.
142
అలాగే ఆనాటి సుందరం మాస్టరు (అమాయకురాలు) అబ్బాయి (ప్రభుదేవా. నృత్యదర్శకుడుగా వుంటూనే కథానాయకుడి పాత్రలు పోషించారు.
సాధారణ డాన్సర్‌గా ప్రవేశించిన కె.ఎస్‌రెడ్డి (రాముడు-భీముడు, వెలుగునీడలు), తరువాత డాన్సు మాస్టరయి టక్కరిదొంగ-చక్కనిచుక్క, ధర్మదాత, బంగారు గాజులు మొః చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించి స్వీయదర్శకత్వంలో కొరడారాణి చిత్రాన్ని నిర్మించారు.
డాన్సు మాస్టర్ సుచిత్ర మనీషా సంస్ట నిర్మించిన పలుచిత్రాలకు నృత్యదర్శకత్వం వహించారు.
'స్నేహచిత్ర పతాకంపై ఆర్. నారాయణమూర్తి నిర్మించిన చిత్రాలకు సీనియర్ నృత్య దర్శకుడు ముక్కురాజు నృత్యాలు కంపోజ్ చేయడమే గాకుండా కొన్ని పాత్రల్ని కూడా పోషించారు.
తంగప్పన్ (ఆత్మీయులు), ఎ.కె.చోప్రా (మూగనోము, ఆకాశరామన్న), వేణుగోపాల్ (బొబ్బిలియుద్దం), నాగేశ్చరరావు (కొదమసింహం), పి. జె. శర్మ (పెద్దరికాలు), తార (అదృష్టవంతులు), (ప్రమీల (శుక్రవారం మహాలక్ష్మి), రాజన్‌రాజు (అల్లుడు పట్టిన భరతం) సీనియర్జ్లుగా పలు చిత్రాలు నృత్య దర్శకత్వం వహించారు.
ఇహ యీ చివరి దశాబ్దంలో నృత్య దర్శకులుగా పలు చిత్రాలకు నూతన పోకడల్లో స్పీడుగా నృత్యాల్ని తీర్చిదిద్దుతున్న వారిలో కొందరు నల్లశీను, ప్రేమలత, చిన్ని-ప్రకాశ్ అనూరాధ, డి.కెయస్. బాబు, శివశంకర్, కె. ఎస్. రఘురాం, తార ప్రసాద్ మొదలైనవారిని పేర్కొనాలి.
కొసమెరుపు. : సారధివారి 'రోజులు మారాయి" (1955) చిత్ర నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశలో అంతవరకూ వారి చిత్రాలకు నృత్య దర్శకులుగా పనిచేసిన వెంపటి (పెద) సత్యం ఆ చిత్రానికి పని చేయలేదనే విషయం చర్చకు వచ్చి యేదయినా సందర్భం చూసి ఒక నృత్యం ప్రవేశపెడితే బాగుంటుందని నిర్మాత ప్రసాద్, దర్శకులు తాపీ చాణక్య ఆలోచించి గీత రచయిత కొసరాజును సంప్రదించగా ధాన్యలక్ష్మి రైతుల యిళ్ళకు వచ్చిన ఆనందంలో ఓ పాటవుంటే బాగుంటుందని 'ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా" పాట వ్రాసి రికార్డు చేయటం అది వెంపటి సత్యం నృత్యదర్శకత్వంలో వహీదారెహమాన్పై చిత్రీకరించగా ఆ పాట సూపర్‌హిట్టయి చిత్ర విజయానికి దోహదం చేసింది. ఆ రోజుల్లో వీధుల్లో జరిగే రికార్డింగ్ డాన్సుల్లో ఆ పాట తప్పనిసరిగా ఉండేది.
ర ఈ 143
కళ
చలనచిత్ర నిర్మాణ విభాగాలలో ఒక ముఖ్యమైన (ప్రకరణం కళ. ఈ రోజుల్లో విరివిగా సాంఘికచిత్రాలు నిర్మించబడటం అందునా ఎక్కువ భాగం జౌట్డోర్స్లోను (పైనేటు భవంతుల్లోను, షూటింగ్ జరుగుతున్నా, కధాపరంగా అవసరాన్నిబట్టి స్టూడియోల్లో అనుగుణమైన విధంగా సెట్స్‌ను తీర్చిదిద్దుతున్నారు. పౌరాణిక జానపద, చారిత్రాత్మకచిత్రాలకు సంబంధించినంతవరకు కళాదర్భకునిపై గురుతరమైన బాధ్యత వుండేది.
కధా కాలం యేమిటి ఆ కాలంలో యేవిధమైన నిర్మాణాలు వుండేవి. సన్నివేశం జరిగే స్టల [ప్రాధాన్యత ఎటువంటిది, పాత్రల స్వభావం యేమిటి - ఆ పాత్రల తాలూకు పాత చిత్తరువులు ఎక్కడయినా వున్నాయా, లేకపోతే ఆ స్వభావాన్నిబట్టి కవి సృష్టించిన పాత్రను యేవిధంగా తీర్చి దిద్దాలి యివన్నీ కళాదర్శకులు దృష్టిలో పెట్టుకొని స్కెచ్‌లు వేసుకొనేవారు. నాడు చిత్ర నిర్మాణం సమష్టి కృషిగా వుండేది కాబట్టి, కళాదర్భ్శకుడు కూడా విధిగా కధ చర్చల్లో పాల్గొనేవారు. పౌరాణిక పాత్రలకు సంబందించి నంతవరకు రవివర్మ చిత్రాలనే కొంతవరకు ఆధారంగా తీసుకొన్నారు. చరిత్రకు సంబందించిన పాత్రలు పుస్తకాల్లో లభ్యమైన ఫొటోలను బట్టి రూపకల్పన చేసేవారు. ఆర్టిస్టుల రూపు రేఖలకు పాత్రల స్వభావానికి మధ్య సమన్వయం సాధించే విధంగా వారి అలంకరణలు, దుస్తులు, ఆ సెట్లో వుండవలసిన సొమాగ్షి యివన్నీ వూహించి, స్కెచ్‌లు వేసేవారు. అవి రూపశిల్పి (మేకప్ మెన్) కు సహకరించేవి,
తొలిదశలో (ప్రఖ్యాత చిత్రకారుడు, రచయిత అడవి బాపిరాజు, అనసూయ, (ధ్రువ మీరాబాయి చిత్రాలకు కళా దర్శకత్వం నెరపారు. తొలితరానికి చెందిన వారిలో సీనియర్ కళాదర్శకుడు యస్.వియస్. రామారావు. ఆనాడు ్రతిభావారు తీసిన జానపద చిత్రాలు ముగ్గురు మరార్‌లు, బాలరాజు చిత్రంలో ఇంద్రుని సభ సెట్ వర్క్, ఆశ్చరాజ్ వారు నిర్మించిన 'దీపావళి' చిత్రంలో నరకాసురని దర్బారు, నరకుని పాత్ర రూపకల్పన చెప్పుకోదగ్గవి.
వాహినీ సంస్థ స్థాపకుల్లో ఒకరైన ఎ.కె.శేఖర్ ఆ సంస్థ నిర్మించిన చిత్రాలకు కళా దర్శకత్వం నెరపారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గ చిత్రం 'మల్లీశ్చరి" ఈ చిత్రకథకు ప్రాణం శిల్పకళాదాని వైభవం. ఆయన వేసిన స్కెచ్ ననుసరించి తీర్చిదిద్దిన శ్రీకృష్ణదేవరాయలు పాత్ర (నటుడు శ్రీవత్సవ) తరువాతి వారికి ఆదర్శప్రాయమైంది. చిత్రంలో ప్రతిసన్నివేశం స్థలం రాయల కాలం నాటి వాతావరణన్ని జ్ఞప్తికి తెచ్చేలా
[44
వుంది. మల్లీశ్వరి వుండే (గ్రామం రాణివాసమందిరం, రాయలవారి సభాప్రాంగణం- ఉషాపరిణయం నృత్యం జరిగిన లతా మంటపం, మనసున మనసై మల్లెల మాలలూగించిన తుంగభద్రా నదీ తీర ్రాంతం-యివన్ని రూపొందించటంలో ఆయన (ప్రతిభ కనబడుతుంది. ఆయన స్వీయదర్శకత్వంలో రూపొందించిన 'శ్రీకాకుళ ఆంద్ర మహావిష్టువుకధ” చిత్రంలో కూడా కళా నైపుణ్యం స్పష్టంగా కనువిందు చేస్తుంది. విజయవారి విశిష్ట జానపదచిత్రాలు పాతాలభైరవి, జగదేకవీరునికధ, ఎవర్ 'క్రీన్గా చెప్పుకునే పౌరాణిక చిత్రరాజం మాయాబజార్లకు కళాదర్శకత్వం వహించిన మాధవపెద్ది గోఖలే గూర్చి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. (చాలా చిత్రాల్లో ఈయనతో పనిచేసిన కళాధర్‌కు కూడా క్రెడిట్ చెందుతుంది). పాతాళభైరవి చిత్రంలో మాంత్రికుడి గుహ సెట్, రాజమందిరం, మాయామహల్ సెట్ ఎన్నో (ప్రత్యేకతలతో చిత్రానికి నిండుదనాన్ని చేకూర్చాయి. కధానాయకుడు తోటరాముడు మొసలితో పోరాడిన పుష్కరిణి సెట్‌ను కూడా చెప్పుకోవాలి. నేపాళమాంత్రికుని రూపకల్పన. ఆ గడ్డం (అసలు కధంతా దానిమీదే ఆధారపడింది) చేతిలో మంత్రదండం, ఆఖరికి అక్షయ పొత్ర రూపకల్పన కూడా అపూర్వం. బొడ్డుదేవరను బద్దలుకొట్టిన సన్నివేశం, కత్తులబోను యివన్ని రచయిత ఊహకు తగ్గట్టుగాను సృష్టించారు గోఖలే, ఇహ మాయాబజార్ విషయానికి వస్తే ఘటోత్కచుని నివాసం, అతడు సృష్టించిన మాయాబజార్ ( ఈ సందర్భంలో పాతాళభైరవి మాయామహల్ స్ఫూర్తి వుండొచ్చు) అందులోని వివిధ భాగాలు, శాస్తి శర్మల వంటి పాత్రలతో సహా వారి సోదరుడు మాధవపెద్ది సత్యం వేసిన దారుకుని పాత్ర రూపకల్పన దాకా ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గ అంశం శ్రీకృష్ణుశకుని పాత్రల స్కెచ్. ఆ చిత్రంలో యన్.టి.ఆర్ అభినవకృష్ణుడిగా పేరొందారు. నీవేనా నను తలచినది పాటకు మూలమైన ప్రియదర్శిని పేటికను కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఎకానమీని దృష్టిలో పెట్టుకొని మాయాబజార్ మీనియేచర్ సెట్ - దానిని మార్కస్ బార్ట్టే పూర్తి ఎఫెక్టుతో చూపటం ఒక అద్భుతం. అన్ని అద్భుతాలు చేసిన గోఖలే విజయవారి సాంఘిక చిత్రాలకుకూడా కళాదర్శకత్వం వహించి యే ఆర్టిస్టు సన్నివేశాన్ని బట్టి యే దుస్తులు వేస్తే బాగుంటుంది. సన్నివేశం పండుతుంది అని ఆలోచించేవారు. ఆ తరం సీనియర్స్‌లో చెప్పుకోదగ్గ కళాదర్శకుడు టి.వి.యస్. శర్మ, నర్తనశాల, పాండవవనవాసం, సీతారామకళ్యాణం, ఈ మూడుచిత్రాల్లో ఆయన చూపిన ప్రతిభ అనన్యసామాన్యం. నర్తనశాల చిత్రంలో బృహన్నల పాత్రకు ఆయన వేసిన స్కెచ్‌కు తగ్గట్టు మేకప్ హరిబాబు యన్.టి.ఆర్‌ను తీర్చిదిద్దిన తీరు అపూర్యం. ముఖ్యంగా ఆ 45
చిత్రంలో ప్రాణప్రదమైన సన్నివేశం నర్తనశాల. అక్కడే ఉత్తర నృత్యగానాదులలో ఉత్తీర్ణత చెందటం. కీచకుని వలలుడు (భీమసేనుడు) సంహరించటం మొదలైన ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. అట్టాగే కీచకపాత్రను, అజ్ఞాతంలో మారువేషాలలో వున్న పాండవుల పాత్రల రూపకల్పన (ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈ చిత్రంలోని కళాదర్శకత్వం ప్రతిభకు అబ్బురపడి జకార్హాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ కళాదర్శకునిగా శర్మకు పురస్కారం లభించింది.
పాండవ వనవాసంలో చెప్పుకోదగ్గది మాయాజూదం జరిగిన సభాప్రాంగణం. చిత్రంలో ఆ సెట్ మీద దాదాపు 35 నిముషాల సేపు తెరపై కన్పించే అద్భుత సన్నిశాలు చిత్రీకరించబడ్డాయి. ఈ సెట్‌ను 'దేవదీనబాంధవా' అన్న (ద్రౌపది పాటలో పూర్తిగా వినియోగించుకొన్నారు. ఇహ భీమసేనుడి పాత్రకు చేసిన రూపకల్పన వో వైవిధ్యం. హిమగిరి సోగసులు' పాట చిత్రీకరణ సన్నివేశంలోనూ రాజసులోచన నృత్యం చేసిన 'ఉరుకుల పరుగులదొర' పాట చిత్రీకరణ సన్నివేశంలోనూ ఆ వాతావరణం ప్రతిబింబించేలా సెట్స్ రూపొందించారు శర్మ. రావణాసురుడి పాత్ర యీ తీరులో వుంటే బాగుంటుందని ఆయన స్కెచ్ వేసిన మేరకు సీతారామకళ్యాణం" లో రావణుడు పాల్లొన్న ప్రతి సన్నివేశంలోనూ ప్రయాణం చేసిన విమానం. వాడిన గదా, కదిలించిన గౌరీ శంకరశిఖరం-సీతారాముల్ని కళ్యాణ దంపతులుగా రూపొందించిన తీరు, జనకుని సభామందిరం అన్నీ నాటి త్రేతాయుగ వాతావరణంలోకి (ప్రేక్షకుల్ని తీసుకువెళతాయి.
వాలి - సుబ్బారావు, గోడ్‌గాంకర్ యిద్దరుకలసి కొన్ని చిత్రాలకు (దేవదాసు),విడిగా కొన్ని చిత్రాలకు కళా దర్శకత్వం నెరపారు. సృజనాత్మక శక్తికి చక్కటి వుదాహరణ వాలి ప్రతిభ. అంజలి పిక్చర్స్ వారి 'సువర్షసుందరి" చిత్రం ముందుగా వచ్చే గురుకులం, దేవకన్యలు నాట్యం చేసే శివాలయం (క్రైమాక్స్ కూడా అక్కడే చిత్రీకరించారు) దేవలోకం, ఇం(ద్రసభ, గిరిజ నాట్యం చేసిన రాజుప్రసాదంలో తోట యివన్నీ ఒక ఎత్తు హాయిహాయిగా ఆమనిసాగే పాట చిత్రీకరణలో మూడు నాలుగు ప్రదేశాల్లో పాటలోని భావానికి తగ్గట్టు ఆహ్హాదకర వాతావరణాన్ని కల్పించే సెట్స్వేయగా అక్కడ చిత్రీకరించటం వల్ల ఆ పాటలోని మాధుర్యం ద్విగుణీకృతమైంది. వాలి సుబ్బారావు సరదాగా చల్మోహనరంగా చిత్రంలో ఆనాడు హీరోగా నటించారు. వీరు కళాదర్శకత్వం చేపట్టిన కొన్నిటిలో చెప్పుకోదగ్గది విరలాచార్య తీసిన నవమోహిని.
గోడ్‌గాంకర్ కళాదర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో కొన్ని బొబ్బిలియుద్ధం, దొరికితే దొంగలు, రమాసుందరి, పెంకిపెళ్ళాం.
146
'కురుక్షేత్రం' చిత్రంలో నిజమైన మయసభను ' తన నైపుణ్యంతో సృష్టించిన అపూర్వ కళాదర్భ్శకుడు కుదరవల్లి నాగేశ్చరరావు, చిత్రంలోని ప్రతి అణువూ భారతకథ వాతావరణాన్ని జ్ఞప్తికి తెస్తుంది.
బాపు గొప్ప చిత్రకారుడు. ఆయన ముందుగా ప్రతి సన్నివేశాన్ని స్కెచ్ వేసుకొని చిత్రీకరించే దర్శకుడు. వారు తీసిన 'సీతాకళ్యాణం' చిత్రానికి కుదరవల్లి నాగేశ్వరరావు కళా దర్శకత్వం వహించాడంటే ఆయన ప్రతిభకు అంతకంటే గుర్తింపు మరేముంటుంది? ఆయన కళా దర్శకత్వంలో రూపొందించిన మరో చిత్రం 'మాయామళ్చీంద్ర'.
ఏ.వియం. వారి నాగుల చవితి మధుసూదనరావుగారి కళ్యాణమంటపం చిత్రానికి కళాదర్శకత్వం వహించినది హెచ్. శాంతారాం.
ఎ. బాలు కళ నైపుణ్యానికి ఉదాహరణ “భూకైలాస్. మున్నీట పవళించు నాగశయన' నృత్యాన్ని చిత్రికరించిన రాక్షసరాజు (రంగారావు) సభామందిరంలో శిల్పకళ ఉట్టిపడుతుంది.
విరలాచార్య గారి అగ్గిపిడుగు, నవ(గ్రహపూజామహిమ మొ చిత్రాల్లో ఆ జానపద కధలకు తగ్గ వాతావరణాన్ని సృష్టించినది బి.సిబాబు.
రామానాయుడు తీసిన బొమ్మలు చెప్పిన కధ, సిపాయి చిన్నయ్య వంటి చిత్రాలకు కళాదర్శకత్వం నెరపిన రాజేంద్రకుమార్ అభిరుచితో నిర్మించిన “తారాశశాంకం' చిత్రంలో బృహస్పతి (గుమ్మడి) తార (దేవికు చంద్రుడు (శోభన్‌బాబు) పాత్రలు కల్పనలో కూడా ఆయన నైపుణ్యం తెలుస్తోంది.
మోడరన్ ధియేటర్స్ వారి కొన్ని చిత్రాలకు (వీర కంకణం) కళాదర్శకుడు ఎ.జె, డొమ్మిక్.
ఊహాలోకంలో విహరింప జేసే చిత్రాలు జానపదాలు. మంగమ్మశపథం వంటి జానపదాలకు దక్షయజ్ఞం వంటి పౌరాణికలకు, సిరిసిరిమువ్వ, నిండుమనసులు వంటి సాంఘిక చిత్రాలకు కళాదర్శకత్వం నెరపిన సవ్యసాచి తోట వెంకటేశ్వరరావు.
సాంఘిక వాతావరణం. అది పల్లెటూరిది కావచ్చు, పట్నానికి చెందవచ్చు. ఆ తరహాల్లోను అటు సారధి వారికి (కులదైవం), యిటు హైదరాబాద్ మూవీస్ (జల్పారాయుడు) సృష్టించి యిచ్చిన కళాదర్శకుడు సూరీ క
సాంఘిక చిత్రాలకు ఎక్కువగా కళాదర్శకత్వం వహించి సహజత్వానికి దగ్గరగా చిత్రాల్ని తీర్చి దిద్దటానికి కారణమైన వ్యక్తి జి.వి సుబ్బారావు. ఈ దళగా ప్రత్యేకించి
147
పేర్కొనవలసిన చిత్రం “మూగమనసులు.” సుందర గోదావరినదీ తీరాన రూపుదిద్దుకొన్న గోపీ పర్షశాల వంటి కుటీరం. దానికి కొద్దిగా దగ్గరలో వున్ల జమీందారు గారి భవంతి, ముఖ్యంగా గోపీ, గౌరి పాత్రల తాలుకు స్కెచ్ అత్యంత సహజంగా వుండి నటులు గాక పాత్రలు మాత్రమే కన్పిస్తాయి. ఆయన యితర చిత్రాల్లో చెప్పుకోదగ్గవి మనుసులు మమతలు, ఆత్మీయులు, అమాయకురాలు, డాక్టర్ చ(క్రవర్తి సెక్రటరీ, ఆత్మబలం, అంతస్తులు.
మరో విశిష్ట కళాదర్శకులు ఎస్. కృష్ణారావు (మెరామెన్ నవకాంత్ తండ్రి). ఈయన వీరాంజనేయ వంటి పౌరాణికాలకు, మహాబలుడు,బందిపోటు వంటి పలు జానపద చిత్రాలకు దొంగరాముడు, రక్తసంబంధం, ఆరాధన, జీవన తరంగాలకు కళాదర్శకత్వం వహించారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎఫెక్టు రావాలని ఆరాటపడే కళాదర్భకుల్లో ఒకరు. బి. చలం. టక్కరిదొంగ చక్కని చుక్క వంటి యాక్షన్ చిత్రాల శైలికి తగ్గట్టుగానూ భారీతనం కనిపించే శ్రీకృష్ణార్జున విజయం వంటి పౌరాణికం బహుకొద్ది ఉదాహరణలు.
చలం గారి వద్ద శిష్యరికం చేసిన పేకేటి రంగా (శివరాం గారి అబ్బాయి) మద్రాసులో అయిదు సంవత్సరాలు ఫైన్ ఆర్ట్స్‌లో కృషి చేసి డిప్లామా పొంది "స్నేహబంధం'తో కళాదర్శకునిగా మారి, ఆదిత్య 369, భైరవద్వీపం వంటి విశిష్ట చిత్రలకు కళాదర్శకత్వం వహించారు. ఒక విధంగా భైరవద్వీపానికి పాతాళభైరవి, ప్రేరణ. ఆ విషయం సెట్స్‌లో కూడా కనిపించింది. రంగా శిష్యుడు రాము ఇటీవల వచ్చిన ప్రేమించేది ఎందుకమ్మా" చిత్రానికి 'కళాదర్శకుడు. రంగా భైరవద్వీపం చిత్రానికి ఎవార్డు పొందారు.
'ప్రేమ' చిత్రంతో ప్రారంభించి ఇటీవలి 'రాజా' వరకు కళాదర్శకత్వం చేస్తూనే మిత్రుడు శ్రీనివాసరెడ్డితో కలసి 'ఆరోప్రాణం, పవిత్రప్రేమ' చిత్రాలు కూడా నిర్మించారు అడ్డాల చంటి.
పాత తరానికి చెందిన వారిలో ప్రసాద్ (భలేరాముడు) ఖండవల్లి సుబ్బారావు (అర్జాంగి) కె. సుబ్బారావు (శంకరాభరణం)లను పేర్కొనాలి.
అలాగే కాంతారావు నటించిన భలే మొనగాడు, ఆకాశరామన్న, చిక్కడు- దొరకడు, వంటి జానపద చిత్రాలకు బి. నాగరాజ్ కళను అందించారు. ముఖ్యంగా చిక్కడు - దొరకడు పతక సన్నివేశానికి యాయన రూపొందించిన సెట్‌వర్క్ ప్రశంసనీయం.
148
అటు భారతీయుడు చిత్రానికి, యిటు ఒకే ఒక్కడు చిత్రంలో వందలాది (ప్రొద్దుతిరుగుడు పూలతో వేలాది కుండలతో నృత్యసన్నివేశానికి ప్రాణం పోసిన ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి రిచ్‌నెస్‌కు మరోపేరు. గత రెండు దశాబ్దాలుగా అటు రాఘవేంద్రరావు, యిటు నారాయణరావు రూపొందించిన అనేక రిచ్‌నెస్ కనిపించే చిత్రాలకి కన్నుల విందుగా అందంగా, అర్ధవంతంగా సెట్స్‌ను రూపొందించిన శిల్పి భాస్కరరాజా, వారిసోదరుడు శ్రీనివాసరాజు దొాంగమొగుడు వంటి చిత్రాలకు పని చేశారు. ఇంకా యీ రంగంలో ప్రసాదరావు (పెద్దరికాలు), దిలీప్‌సింగ్ (శుక్రవారం మహాలక్ష్మి, రామచంద్రసింగ్ (గూఢచారి. 137), లీలాకృష్ణ తోట హేమచందర్, అశోక్‌కుమార్, విజయకుమార్, వెంకటేశ్వరరావు మొదలైనవారు కళాదర్శకత్వం నెరపుతూ యీనాటి సాంఘిక చిత్రాలకు పాత్రలకు రూపకల్పన చేస్తున్నారు. దాసి చిత్రానికి గాను ఉత్తమ కళా దర్శకునిగా కేంద్ర బహుమతి పొందారు. నే మెకప్ మేకప్ (రూపశిల్పం) ప్రత్యేకమైన విభాగంగా అభివృద్ది చెందినా దీనికీ కళాదర్శకత్వానికీ అవినాభావ సంబంధం వుంది. పాత్ర సాంఘికమైనా, పౌరాణికమైన జానపదమైనా, చారిత్రాత్మకం అయినా ఆ నటుడ్ని తీర్చిదిద్దటం, మేకప్‌మాన్ పని. గతంలో వీరే దుస్తులు, అలంకరణలు, హైయిర్ డ్రెస్సింగ్ చేసేవారు. ఇప్పుడు ఏ భాగానికి అది ప్రత్యేకంగా నిర్వహింపబడుతున్నాయి గతంలో అన్ని రోగాలకు ఒకరే డాక్టరు వుండేవారు. కాలక్రమేణా స్పెషలిస్టులు వచ్చారు. యిది కాలం తెచ్చినమార్చు. ఆ విధంగానే చిత్ర నిర్మాణంలోని ప్రతి చిన్న అంశంలోకూడా ప్రత్యేకతలు కల్షినవారు ప్రవేశిస్తున్నారు. ఇది మంచి క్వాలిటి రావటానికి శుభపరిణామం, తొలిదశలో గోపాలరావు (తర్వాత యీయన నిర్మాతగా వ్యవహరించారు) మంగయ్య, హరిబాబులను (ప్రఖ్యాత రూపశిల్పలుగా పేర్కొనాలి, తెలుపు నలుపు చిత్రాలు నిర్మాణం జరిగిన రోజుల్లో మేకప్‌మేన్ ఎక్కువ శ్రద్ద తీసుకొని ఒక్కో పాత్రకు మేకప్ చెయ్యాలంటే కనీసం 45 నిముషాలు తీసుకొనేది. దేవదాసు విజయానికి చెప్పుకోదగ్గ కారణల్లో ఒకటి మంగయ్య గారి మేకప్. దేవదాసు పాత్ర సన్నివేశపు మూడ్నిబట్టి మేకప్‌లో ఎఫెక్టు తేవటానికి ప్రయత్నించారు మంగయ్య. యన్.టి.ఆర్‌ను శ్రీకృష్ణునిగా, శ్రీరామునిగా-ఒకటేమిటి ఆయన ధరించిన 149
అద్భుత పౌరాణిక పాత్రల్ని చాలా వరకు పీతాంబరం మరికొంత వరకు హరిబాబు తీర్చిదిద్దారు. ముఖ్యంగా శ్రీకృష్ణునిగా యన్.టి.ఆర్ మరికొంత మార్చటానికి పీతాంబరం చేసిన కృషి శతధా ప్రశంసనీయం. తదుపరి యీయన నిర్మాతగా మారి యన్.టి.ఆర్ హీరోగా అన్నదమ్ముల అనుబంధం చిత్రం నిర్మించారు. పీతాంబరం అంతేవాసి అయిన భక్తవత్సలం కూడా మాయాబజార్లోని యితర పాత్రలకుతన హస్తవాసి “ద్వారా రూపం కల్పించారు.
1960 వరకు కంపెనీకి ఒక మేకప్ మాన్ వుంటే ఆయన సూచనలతో చిత్రంలోని అన్ని పాత్రలకు మేకప్ జరిగేది. కాలక్రమేణా పేరొందిన ప్రతి ఆర్టిస్టు తనకు ఒక ప్రత్యేక మేకప్మాన్ని పెట్టుకోవడం అలవాటయింది. ఇహ చిన్నా చితకా పాత్రలకు మాత్రమే కంపెనీ మేకప్‌మేన్ పని చేసేవారు.
ఆతరువాత తరంలో చెప్పుకోదగ్గ (ప్రముఖులు ఎ. పోతరాజు (మహాబలుడు, బొబ్బిలియుద్ధం, సెక్రటరి), భద్రయ్య (రమాసుందరి, గురువును మించిన శిష్యుడు), వీర్రాజు (విచిత్ర కుటుంబం, మంగమ్మ శపథం.చిక్కడు-దొరకడు). వీరిలో పోతరాజు సరిగమ అఆక్ట్స్పై ఘరానగంగులు మొః చిత్రాల్ని. వీర్రాజు, రాజూ పిక్చర్స్‌పై రాజసింహ మొ॥ చిత్రాల్ని నిర్మించారు,
ఆ తర్వాత తరానికి వస్తే అక్కినేని నాగేశ్చరరావుగారి పలు చిత్రాలకు పనిచేసేన నాగేశ్చరరావు చౌదరి (మనుషులు మమతలు, ఆరాధన, గోవుల గోపన్న. ఈయనే 'మూగమనసులు' చిత్రంలో వయస్సు మళ్ళిన గౌరిగా జమునను ఆహార్యం ద్వారా అద్భుతంగా తీర్చిదిద్దారు.) కె. నరసింహరావు నవరాత్రిలో నవరసాలను ప్రతిబింబించే తొమ్మిది రకాల పాత్రలను వైవిధ్యానికి తగ్గట్టుగా మేకప్ చేసి, నాస్తిక అస్తిక వాదాలకు (ప్రతిబింబమైన గోపి, మాధవచారి పాత్రలు (బుద్దిమంతుడు) లు తీర్చిదిద్దిన రూపశిల్పి.
ఆ తర్వాత వచ్చిన వారిలో జయకృష్ణ (సిరిసిరిమువ్వ), జాస్తి మాధవరావు (సాక్షిలను ప్రత్యేకించి పేర్కొనాలి. తర్వాత కాలంలో జయకృష్ణ నిర్మాతగా మారి మనవూరి పాండవులు, కృష్ణార్దునులు వంటి పలు చిత్రాలు నిర్మించారు.
కొద్దికాలం యన్‌టి.ఆర్:కు పర్సనల్ మేకప్‌మేన్‌గా వున్న రమేష్ చేతుల్లో రూపొందిన రూపాలు జస్టిస్ చౌదరి, సర్దార్ పాపారాయుడు.
ఇంకా యీ మేకప్ కళలో ప్రసిద్దమైన వారిలో గురునానక్ (వీరకంకణం), బాబు (కొదమ సింహం), రాజశేఖర్ (మహాబలుడు), ముండూరు సత్యం (ప్రత్యేకించి పేర్కొనవలసినది “శంకరాభరణం'లో శంకరశాసస్త్రికి తీర్చి దిద్దిన ఆహార్యం)
150
సి. వెంకటేశ్చరరావు (నవమోహిని), కామేశ్వరరావు (నవ(గ్రహహపూజామహిమ), యం. రామస్వామి (భలే రాముడు), కె.ఎస్కిని (నాగులు చవితి), మాధవయ్య (అకాశరామన్న), నాగేశ్చరరావు (అత్త ఒకింటికోడలే), కష్టనన్ (కళ్యాణ మంటపం), రాము (బంగారు గాజులు, నాయుడు (మేఘసందేశం), తోటహరి (మయూరి), కొల్లి రాము (మురళీమోహన్ చిత్రాలు), సి. మాధవరావు (కృష్ణ చిత్రాలు).
ఇక దుస్తులు ఆలంకరణ విషయంలో వి.ఎస్.గాంధి, బి. నారాయణరావు, సూర్యారావు, రోషయ్య, మొ॥వారు హెయిర్ (డ్రైస్సింగ్స్ విషయంలో తానారపు భాస్కరరాజు, కొండలరావు, కమలా మొ॥1వారు పాత తరంలో కృషి చేశారు.
మేకప్, దుస్తులు, హెయిర్ డడ్రస్పింగ్ యీ మూడింటికి అవినాభావ సంబంధం వుంది.
ఈ దిశగా ఆలోచిస్తే యీనాడు యీ రంగంలో అన్వర్, భాగ్యలక్ష్మి, బలరాం భాషా, భాస్కరరెడ్డి, వి. గిరిష్ జగదీష్ కుమార్. పి.వి. కృష్ణారావు, పి, మురళి, పి. మల్లి, యం. మోహనరావు, పి. మోహన్, మాధవరావు, మురళి, పాండు, పట్టాభి, ఎం. ఆర్. రెహమాన్, కె. రామకృష్ణ ఆర్.టి.రాఘవ, పి. రాంబాబు, ఎం. రమేష్ రాము, ఎ. శేఖర్, వై. సీయాద్రి, టి. సూరిబాబు, శ్రీకాంత్, ఆర్. సురేష్ యం. శివ, శోభాలత మొః॥ వారు కృషి చేస్తున్నారు.
పేక్షకుల్ని మాయ చేసే మహత్తర కళ మేకప్, ఇందుకు కమల్‌హాసన్‌ను భారతీయుడు ముసలి వ్యక్తిగా చూపటానికి కమల్‌హాసన్ చూపిన శ్రద్దాసక్తులు అపూర్వమైనవి.
ల ఫోటోగ్రఫి
'సినిమా సంగతికేంగాని ఫోటో(గ్రఫి అదిరిపోయిందనుకో' అనే మాటను అప్పుడప్పుడు సామాన్య (ప్రేక్షకుడు అనటం మనం వింటుంటాం”. అంటే కంటికింపుగా దృశ్యాలు వున్నాయని అర్ధం చేసుకోవచ్చు. ఈ బృహత్కర కార్యక్రమానికి సినిమా రూపకల్పనలో విశిష్ట స్థానం వుంది. సన్నివేశాన్ని బట్టి దర్శకునితో చర్చించిన తరువాత యే షాట్‌ను యొక్కన్నుంచి యే కోణంలో తీస్తే మంచి ఎఫెక్టు వస్తుంది అనేది కెమెరామెన్ భావుకతపై ఆధారపడి వుంటుంది. ముందురోజుల్లో తెలుపు నలుపు సినిమాలు, ఆ తరువాత గేవా కలర్ ఆపైన ఈస్టుమన్ కలర్; సినిమా స్కోప్, 70 ఎం.ఎం. యిలా యొన్నెన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.
151
మొదటి దశలో డ్రి కమెరాద్వారా తరువాత ఆరిస్లెక్స్ కమెరా ఆ తరువాత అధునాతనంగా యిప్పుడు స్టడీకమ్ కెమెరా వచ్చాయి. లాంగ్‌షాట్, క్లోజప్, ట్రాలీషాట్, (శ్రీన్షాట్స్ ఆంటూ సన్నివేశ చిత్రీకరణ ప్రాధాన్యతను బట్టి తీయటం జరుగుతుంటుంది. ప్రతి రంగంలో కొత్తదనం కోసం ప్రయోగాలకు అవకాశం వుంటూనే వుంటుంది. సినిమాలకు సంబంధించి ఫోటో(గ్రఫీలో యీ దిశగా అద్భుతమైన ప్రయోగాలు చేసి ఆహా అనిపించుకొన్నవారు ఎందరో!
వాహినీ సంస్థ రూపశిల్పులలో ఒకరైన కె.రామనాథ్ టాకీల తొలిదశకంలో సీతాకళ్యాణం, గృహలక్ష్మి చిత్రాలకు ఫోటో(గ్రఫీ అందించి ఆ తరువాత వాహినీ॥ చిత్రాలు వందేమాతరం, సుమంగళి, దేవత, భక్తపోతనలకు కెమెరామెన్‌గా పనిచేశారు.
ఆతరువాత చెప్పుకోదగ్గ సీనియర్ కమల్‌ఘోష్ 1936లో బాలయోగిని చిత్రానికి ఫోటో[గ్రఫీ అందించి తర్వాత తల్లిప్రేమ, చండిక, (ప్రేమ, రోజులుమారాయి, గోవులగోపన్న, బొబ్బిలియుద్ధం చిత్రాలకు పనిచేశారు. రోజులు మారాయిలో పల్లెటూరి సహజవాతావారణాన్ని బొట్డోర్లో చక్కగా చిత్రీకరించారు.
మోహినీ రుక్మాంగద (1937) చిత్రానికి బొమ్మన్. డి. ఇరానీ. కలకత్తాకు చెందిన బిరేన్డే వరవిక్రయం (1939) పక్కింటి అమ్మాయి చిత్రాలకు, శైలేన్‌బోస్
మాలపిల్ల (1938) జెమినీ వారి బాలనాగమ్మ (1942) చిత్రాలకు యన్.కె.పాండు ధర్మపత్ని (1940)కు, జితేన్బెనర్జీ చెంచులక్ష్మి (1943) గృహప్రవేశం, పల్నాటియుద్దం చిత్రాలకు ఫోటోగ్రఫి అందివ్వగా మహారాష్ట్రకు చెందిన మామాషిండే చూడామాణి (19410) చిత్రానికి పనిచేశారు.
ఆ తర్వాత తరం మొదట్లో వచ్చిన ఎం.ఎ. రెహమాన్ చాలా (ప్రతిభవంతమైన కౌమెరామెన్, భక్తిమాల (1941) నుంచి శ్రీమద్విరాటపర్వం వరకు వందలాది చిత్రాలకు తన ఫోటో(గ్రఫితో విజయాన్ని సాధించిపెట్టారు. విప్రనారాయణ, సువర్షసుందరి, జయసింహ, నర్తనశాల, త్యాగయ్య చిత్రాలు ఆణిముత్యాలుగా పేర్కొనాలి. పైన పేర్కొన్న చిత్రాన్ని రాత్రి-పగలు జరిగే సన్నివేశాల్లో ఆయన ప్రదర్శించిన నైపుణ్యం వల్ల స్పష్టతతో రాణించాయి.
1941లో నాటి తెనాలి రామకృష్ణను ఫోటో(గ్రఫి అందించిన పి. శ్రీధర్ తరువాత (ప్రతిభావారి స్వష్టసుందరి, బాలరాజుతో తమ ప్రతిభ చూపించారు. వీరి అబ్బాయి పి, దేవరాజ్ తరువాత ఆరంగంలో ప్రావీణ్యం సంపాదించి తాలి తెలుగు సినిమా స్కోప్ చిత్రం (తెలుపు-నలుపు) దేవతలారా దీవించండి చిత్రం ద్వారా ఫోటోగ్రఫిలో ఓ మలుపుకు శ్రీకారం చుట్టారు.
152
సీనియర్ కమెరామెన్గా గౌరవింపబడ్డ ఆది. యం. ఇరానీ మల్లీశ్చరి (1951) 'పెంపుడుకొడుకు. అన్నపూర్ణ వారి తొలి చిత్రం దొంగరాముడుకు పనిచేశారు. అయితే మళల్లీశ్యరి చిత్రానికి బి.యన్నెడ్డి గారి సోదరుడు కొండారెడ్డి కూడా పనిచేశారు.
ఆ తరువాతి వాహినీ చిత్రాలు బంగారుపాప, పెద్దమనుషులు, రాజమకుటం, బంగారుపంజరం, చిత్రాలకు కొండారెడ్డి పనిచేశారు,
కృష్ణప్రేమ (1943)కు పనిచేసిన పి.యన్. శెల్వరాజ్ ఫోటో(గ్రఫిలో విశేష కృషి చేసి మంచి ఫలితాలు సాధించారు. హీరోపరంగా తాలి ద్విపాత్రాభనయ చిత్రం. ఇద్దరుమిత్రులు. దాసరి నిర్మించిన 'మేఘసందేశం'లోను సెల్వరాజ్ పనితనం స్పష్టంగా కన్పిస్తుంది. 'ఆకాళదేశాన' పాట చిత్రీకరణను నిశితంగా పరిశీలిస్తే రంగులలో ఎంత అద్భుతాన్ని సెల్వరాజ్ సృష్టించారో తెలుస్తుంది. తొలితరానికి చెందిన మరో ఛాయా[గ్రహకుడు పురుషోత్తం (1944 తహశిల్దార్.
సినిమాల్లో ఫోటోగ్రఫి విలువను దాని ద్వారా కన్నులపండుగ వంటి నిండుపున్నమి హాయిని, మందమందంగా తాకే మలయానిలాన్ని మనకు తన కమెరా ద్వారా అందించిన విశిష్టవ్యక్తి మార్కస్ బార్ట్లే విజయపతాకంపై నిర్మితమైన చిత్రాల్లో పాతాళభైరవి, చంద్రహారం, పెళ్ళిచేసిచూడు, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మకథ, జగదేకవీరునికథ. వీటికి చందమామ, వెన్నెల, (ప్రాణం వంటివి. వాటిని తన కెమెరా ద్వారా బార్ట్లే మనకు అందించిన విధానం అపూర్వం. “లాహిరి లాహిరి లాహిరోలో అన్న ఒక్కపాట చిత్రీకరణచాలు-ఆయన ప్రతిభను అంచనా వెయ్యటానికి. అంతకు ముందు ఆయన వాహినీ వారి స్వర్గసీమ (1945). యోగివేమన(1947)కు ఫోటోగ్రఫి నిర్వహించారు.
విషాదాంత ప్రేమకథా చిత్రాల్లో సన్నివేశానికి తగ్గ మూడ్ క్రియేట్ చేయటానికి కెమెరా ఎంతో సహకరిస్తుంది. ఈ మేరకు లైలామజ్ను, దేవదాసు, చిత్రాల ఘనవిజయానికి పరోక్షంగా కారకుడైన వ్యక్తి కెమెరామెన్ బియస్.రంగా ; తరువాత విక్రం ప్రొడక్షన్స్ స్థాపించి అభిరుచితో చిత్రాలు నిర్మించారు.
మరో సీనియర్ ఫోటోగ్రాఫర్ పియల్.రాయ్, హెచ్, యం. రెడ్డిగారి నిర్దోషి (1951) శ్రీ వెంకటేశ్చర మాహత్మ్యం, మంచిమనసులు చెప్పుకోదగిన చిత్రాలు కాగా ఆదుర్తి సుబ్బారావు తీసిన 'మూగమనుసులు చిత్రంలో పీయల్రాయ్ సాధించిన ఫలితాలు అద్భుతం. తెలుపు నలుపులో గోదావరి సౌందర్యాన్ని ముఖ్యంగా “కన్నులు కలవాల యొన్నెలు కాయాలా' అన్న చరణాన్ని రాత్రివేళ ఎఫెక్టుతో గోదావరిపై నాయికా నాయకులపై చిత్రీకరించిన తీరు అపూర్వం. వీరు తీసిన తొలి కలర్ చిత్రం '“లవకుశో. 153
రాజరాజేశ్చరి నవజీవనం (1949) పేదరైతు చిత్రాలకు పి. ఎల్లప్ప ఈస్టిండియా వారి సంక్రాంతి (1952) చిత్రానికి యస్.పి. బాలకృష్ణ ఫోటో(గ్రఫి అందించారు. ఉత్తర హిందుస్తానంలో కమెరామెన్గా పేరొందిన వియన్:రెడ్డి రాజారావుగారి పుట్టిల్లు, డఊ.ఎల్. తీసిన “'చిరంజీవులు' చిత్రానికి పనిచేశారు.
ఇటు సెట్వర్క్పై జరిగిన సన్నివేశాల్లోనూ అటు బౌట్డోర్లో చిత్రీకరించిన సన్నివేశాల్లో తన పనితనంతో “'భూకైలాస్' చిత్రానికి ప్రాణం పోసిన వ్యక్తి మాధవ బుల్బులే, పుల్లయ్యగారి అర్జాంగి, మురళీకృష్ణ చిత్రాలకు కూడా పనిచేశారు.
సినిమారంగంలో ఎందరో శిష్య ప్రశిష్యుల్ని కమెరామెన్లుగా తీర్చిదిద్దిన వ్యక్తి సి. నాగేశ్చరరావు, పాండవ వానవాసం, శర్మగారువేసిన సెట్స్‌కి తన కెమెరా ద్వారా (ప్రాణం పోసిన నాగేశ్వరరావు పని చేసిన యితర చిత్రాల్లో చెప్పుకోదగ్గవి చెంచులక్ష్మి జగపతి వారి ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, దీపావళి, పల్షాటియుద్దం. దాదాపు రెండు దశాబ్దాలు మకుటం లేని మహారాజులా వెలిగారు.
వీరి అబ్బాయి సి. విజయకుమార్ శుక్రవారం మహాలక్ష్మి చిత్రానికి పనిచేశారు.
తాతా మనవడు మొదలుకొని దాసరి నారాయణరావుగారి అనేక చిత్రాలకు ఫోటోగ్రఫి అందించిన కన్నప్ప (మీసాలు స్పెషాలిటి) జీవితంలో చెప్పుకోదగ్గ విశిష్ట చిత్రం దానవీరశూరకర్ణ. ముఖ్యంగా ఎరీనా సెట్లోని మయసభ చిక్రీకరణలోనూ చూపిన పనితనం ప్రశంసనీయం. ఈయన శిష్యుడు కె.ఎస్.మణికూడా దాసరి చిత్రాలకు పనిచేశారు. (దేవదాసు మళ్ళీ పుట్టాడు, కోరికలే గు(ర్రాలయితే,రాముడే రావణుడైతే),.
సీనియర్ కెమెరామెన్ విన్సెంట్ ఆనాటి రాజు-పేద (1954) మొన్నటి కులగోత్రాలు, సెక్రటరి చిత్రాలకు పనిచేశారు. వీరి అబ్బాయి జయానన్ విన్సెంట్ (ప్రేమంటే యిదేరా చిత్రానికి యింకో అబ్బాయి అజయ్ విన్సెంట్ రాజకుమారుడు (మహేష్ పరిచయ చిత్రం) చిత్రానికి పనిచేశారు.
నాటి అత్త ఒకింటికోడలే, భరణి వారి అంతా మనమంచికే చిత్రాలకు పనిచేసిన లక్ష్మణ్ గోరే కూడా సీనియర్లలో ఒకరు. ఈయన వద్ద కొంతకాలం పనిచేసారు.
సీతారామకళ్యాణం ద్వారా రంగప్రవేశం చేసిన రవికాంత్‌నగాయిచ్ కెమెరా ద్వారా ఎన్నో ట్రిక్కులు చేశారు. మొదట చిత్రంలో అది కనిపిస్తుంది. ఆ తర్వాత అగ్గిపిడుగు, బందిపోటు వంటి బహుకొద్ది చిత్రాలకు పనిచేశారు. ఈయన దగ్గర పనిచేసిన యస్. వెంకటరత్నం బుద్దిమంతుడు, సర్దార్ పాపారాయుడు, ధర్మదాత,
154
జీవనతరంగాలు చిత్రాల్లో తన నైపుణ్యంచూపోరు. సర్దార్ పాపారాయుడు చిత్రంలో అటు పాటల చిత్రీకరణలో యిటు డ్రమెట్రైజ్ చేయబడ్డ సన్నివేశాల్ని సముచితకోణాల్లో చిత్రీకరించటంలోనూ తన ప్రతిభ కనపర్చారు. తరువాత నిర్మాతగా మారి 'యమగోల' నిర్మించారు.
ఈయన దగ్గర పనిచేసిన వి.యయస్.ఆర్. స్వామి బందిపోటు, వీరాభిమన్యు చిత్రాలకు సహాయకునిగా పనిచేసి అసాధ్యుడు చిత్రం ద్వారా డైరెక్టర్ ఆఫ్ ఫోటో(గ్రఫి స్థాయికి. చేరుకొని బహుశాః తెలుగు చలనచిత్రసీమలో యెవరూ చేయలేనన్ని (ప్రయోగాలు చేసి అద్భుత ఫలితాల్ని సాధించారు. తొలి తెలుగు కలర్ సినిమాస్కోప్ చిత్రం 'అల్లూరి సీతారామరాజు'లో అరణ్య'ప్రాంత సౌందర్యాన్ని అత్యంత సహజంగా ఆ తరువాత మోసగాళ్ళకు మోసగాడు” చిత్రంలో కౌబాయ్ చిత్రాల తాలూకు ఎఫెక్ట్లు తీసుకువచ్చి 70 ఎం.ఎం.లో 'సింహాసనం' చూపిన విశిష్ట వ్యక్తి. కెమెరా విజర్డ్‌గా స్వామిని అభివర్షిస్తారు. ఈయనకు కూడా ఎందరో శిష్యప్రశిష్యులు ఉన్నారు.
వారిలో (ప్రథమంగా చెప్పుకోదగ్గ వ్యక్తి ఎస్. గోపాలరెడ్డి (ఆనందభైరవి) తరువాత నిర్మాతగా మారి హల్లో బ్రదర్, ఇంట్లో యిల్దాలు, వంటింట్లో ప్రియురాలు వంటి హిట్ హిట్ పికృర్ణు నిర్మించారు.
గోపాలరెడ్డి శిష్యులలో ముఖ్యుడైన యం.వి.రఘు విశ్వనాథ్‌గారి స్వాతిముత్యం, సిరివెన్నెల, వంశీ చిత్రాలు. సితార, అన్వేషణ, ఆలాపనలో ్రకృతిశోభను కన్నుల పండుగగా తీర్చిదిద్దారు. స్వీయదర్శకత్వంలో 'కళ్ళు" చిత్రం నిర్మించారు.
కమల్‌ఘోష్ శిష్యుడు కె.ఎస్.ప్రసాద్ బాపుగారి 'సీతాకళ్యాణం' చిత్రానికి అందించిన కనువిందైన ఛాయా[గ్రహణం (ప్రశంసనీయం. సీత స్వయంవర ఘట్టం గంగావతరణ ఘట్టం ప్రత్యేకించి పేర్కొనాలి. ఈయన యితర చిత్రాల్లో చెప్పుకోదగ్గవి శ్రీరామాంజనేయయుద్దం. మాయమశ్చీంద్ర, వినాయక విజయం.
కెమెరా పనితనంలో డైనమిజం చూపించిన వ్యక్తి జికె. రాము (కంచుకోట, శారద, యశోదకృష్ణు.
బె.యన్ంరెడ్డిగారి నిర్దేశకత్వంలో తయారైన పూజాఫలం, రంగులరాట్నం, దాసరి తీసిన గోరింటాకు చిత్రానికి పనిచేసిన యు. రాజగోపాల్, సారథి వారి కులదైవం,కు పనిచేసిన సుఖదేవ్, రోహిణి కుటుంబానికి చెందిన ఆర్.మధు (రాముడే దేముడు - ఇతను (ప్రతిజ్ఞ చిత్రంలో నటించాడు) యం,జి.సింగ్ (ఆడపడుచు), జి,ఆర్,నాథన్ (వీర కంకణం), అన్నయ్యగా పిలువబడ్డ డయల్, నారాయణ (శ్రీకృష్ణావతారం, పెంకిపెళ్ళాం)ను సీనియర్లగానే పరిగణించాలి.
155
కన్నడరంగంలో కమెరామెన్గా, దర్శకులుగా ప్రసిద్ది నొందిన జానకిరాం తెలుగులో నిజం నిరూపిస్తాపి.యస్.ప్రకాష్ రామబాణం, (ప్రేమ వంటి చిత్రాలకు ఫోటోగ్రఫి అందించారు.
వి మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన “కళ్యాణమంటవం” ఛాయాగ్రాహకుడు బాలకృష్ణ అండమాన్ దీవి సౌందర్యాన్ని 'అండమాన్ అమ్మాయి" లో చక్కగా చిత్రీకరించారు.
ఆర్ట్ డైరెక్టర్ యస్. కృష్ణారావు గారి అబ్బాయి నవకాంత్ (శ్రీరంగనీతులు) కమెరామెన్గా మారారు.
తమిళ సినీరంగములో విశిష్ట దర్శకుడుగా పేరొందిన ఏ.భీమ్‌సింగ్ సోదరుని కుమారుడు లోక్సెంగ్ అభిలాష, దొంగమొగుడు చిత్రాలకు ఛాయగ్రహణం నెరప్తి, వార్నింగ్ చిత్ర నిర్మాణదశలో ఒక ఫైర్ (మంటల) దృశ్యాన్ని చిత్రీకరిస్తూ ఆ మంటలకు బలైపోయారు.
లోక్‌సింగ్ వద్ద పనిచేసిన ఛాయాగ్రహకులు శరత్ బంగారుచిలుక, మావిచిగురు,
కళ్యాణతాంబూలం చిత్రాలకు ఫోటోగ్రఫి అందించారు.
తక్కువ భాషతో ఎక్కువగా తన కమెరా పనితనం ద్వారా యెన్నో భావాల్ని రాబట్టిన విశిష్ట కెమెరామెన్ బాలూ మహేంద్ర. ఇందుకు శంకరాభరణం చక్కని వుదాహరణ,
సీనియర్ కెమెరామెన్ అశోక్‌కుమార్ ఛాయా(గగ్రహణం అందించి దర్శకత్వం వహించిన అద్భుత చిత్రాలు అభినందన, నీరాజనం. ఈయనదగ్గర పనిచేసిన ప్రసాద్ నిన్నే పెళ్ళాడుతా చిత్రానికి ఛాయా(గ్రహకుడు.
కె. బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన విలక్షణచిత్రాలకు (అంతులేనికథ, మరోచరిత్ర, ఇదికధకాదు) ఫోటోగ్రఫి అందించారు. బి.యస్.లోకనాధ్ అదే స్కూలులో తర్చీదు పొందిన రఘునాధరెడ్డి ఛాయా(గగ్రహణం అందించిన చిత్రాలు కుక్కకాటుకు చెప్పుదెబ్బ. నాయిల్ట్లు-నావాళ్ళు.
గోపాలరెడ్డి శిష్యవర్గంలోని మరో వ్యక్తి శ్రీనివాసరెడ్డి విజయబాపినీడు జూలకటకతో మొదలుపెట్టి ఎన్నో చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసి అడ్డాల చంటితో కలసి నిర్మాణ సంస్థ ప్రారంభించి చిత్రాలు తీశారు.
దర్శకులు కె.రాఘవేం[ద్రరావుగారి సోదరులు కె.ఎస్. ప్రకాక్స్ అన్నగారికి తగ్గ స్పీడ్‌లో వేటగాడు, అపూర్వసహోదరులు, కొండవీటి సింహం, అగ్నిపర్వతం, కమల్‌హాసన్ అద్భుతంగా నటించిన ఇంద్రుడు-చంద్రుడు చిత్రాలకి ఫోటోగ్రఫి అందించారు.
156
సీనియర్ కెమెరామేన్లలో చెప్పుకోదగ్గ మరో వ్యక్తి కె. ఎస్. రామకృష్ణారావు (మరో ప్రపంచం, పవిత్రబంధం).ఈయనకు జ్యోతిషూూ(స్తంలో కూడా ప్రవేశం, ప్రావీణ్యం వుంది.
మంత్రతంత్రాలు మాయలకు సంబంధించిన జానపదచిత్రాలకు ఫోటోగ్రాఫర్ ఎంతో (శ్రమపడాల్సివస్తుంది. మొండెం,తల వేరవ్వటం, కలవటం, దెయ్యాలు, పిశాచాలు, ఆకాశంలో తివాచీలు ఎగరటం-యిటువంటివి మాస్క్ సహాయంతో తీస్తారు. ఆ విద్యలో ప్రసిద్దుడు హెచ్ఎస్. వేణు. ఆ కోవలో యీయన విరలాచార్యకు తీసిన జగన్మోహిని, చిక్కడు-దొరకడు, పింజల సుబ్బారావు తీసిన టత్రిలోకసుందరి, పేదరాసిపెద్దమ్మకథ, భావన్నారాయణ తీసిన గోపాలుడు-భూపాలుడు చిత్రాలు కొన్ని వుదాహరణలుగా పేర్కొనాలి.
తాంత్రిక చక్రవర్తి బాబు భాయ్ మిస్త్రీ ఫోటోగ్రఫితోపాటు దర్శకత్వం చేసిన చిత్రం “మూయామళ్చీంద్ర”.
ఇక తమ విశేష ప్రతిభా విశేషాలతో యావద్భారత స్థాయిలో ఛాయాగ్రహ దర్శకులుగా పేరొందిన ప్రత్యేక వ్యక్తులు ఇషాన్ ఆర్య (ముత్యాలముగ్గు), కస్తూరి (సప్తపది), నివాస్ (సాగరసంగమం), బాబా ఆజ్మి (త్యాగయ్య), ఎెబీర్ (దాసి), కబీర్‌లాల్ (ఆదిత్య 369), పి.సి. శ్రీరామ్ (గీతాంజలి), మధు అంబట్ (తమ్ముడు) లను పేర్కొనాలి. సహజత్వానికి అతి దగ్గరగా వుండేలా రూపకల్పన చేసిన సన్నివేశాల్లో అంతకంటే సహజంగా కెమెరాలో వివిధ భంగిమల్లో బంధించటంలో వీరంతా యెవరి ప్రత్యేకత వారిదే అని నిరూపించుకున్నవారే.
ఈ శతాబ్దపు చివరిదశకంలో కెమెరా పరంగా యెంతో రిస్కుతో కూడిన షాట్సు తీస్తూ ఫోటో(గ్రఫిలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న సోదరులు ఛోటా కె.నాయుడు (చూడాలని వుంది), శ్యాం క. నాయుడు (రాజా, ఒసేయ్ రాములమ్మా,
దర్శకుడు ఎస్.డి.లాల్ సోదరుడు ఎస్.ఎస్. లాల్ నిండుహదయాలు, భలే తమ్ముడు, సిపాయి చిన్నయ్యకు, విఠలాచార్యగారి కొన్ని జానపదచిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు. నహతా కుటుంబానికి చెందిన శ్రీకాంత్ (నిర్మాత కాదు) అందడు-ఆగడు, సిరిపురం మొనగాడు చిత్రాలకు ఫోటో(గ్రఫి దర్శకత్వం నెరపారు!
హీరోకృష్ణ నటించిన పలు చిత్రాలకు (దొంగలకు సవాల్, విజయనిర్మల దర్శకత్వం నెరపిన చిత్రాలకు (హేమాహేమీలు) ఎక్కువగా పని చేశారు పుష్పాల గోపీకృష్ణు
157
ఎక్కువగా కోడి రానుకృష్ణ (అత్తమెచ్చిన అల్టుడు) చిత్రాలకు ఛాయా(గ్రహకులుగా పనిచేసిన కె.ఎస్.హరి చిత్రాల్లో చెప్పుకోదగ్గవి ముగ్గురు మొనగాళ్ళు, కొదమసింహం,.
ఇంకా ఛాయా[గ్రహ దర్శకులుగా ఎందరో తమ ప్రతిభను ప్రదర్శించారు. వారిలో యన్.ఎ.తార (ఇంటింటిరామూాయణం), వి.వి.రామ్ చౌదరి (రతీమన్మథ), ఊవిరాజు (అల్టుడు పట్టిన భరతం), ఆర్. సంపత్ (విచిత్ర కుటుంబం), ఎస్.కె. వరదరాజన్ (అన్నాచెల్లెలు), సి,ఎన్.సుందరం (భలే కోడళ్ళు), కె. హెచ్.కపాడియా (కన్నవారి కలలు), ఎ.వెంకట్ (వియ్యాలవారి కయ్యాలు), జె. సత్యనారాయణ (కార్తీకదీపం),యన్. మారుతీరావు (పుట్టినిల్లు-మెట్టినిల్లు), కన్నన్ (సీతాకోకచిలుక), జయరాం (శివ-శక్తి, పాచు అనే పొర్టసారధి (ఏదిపాపం ఏది పుణ్యం), కోడి లక్ష్మణ్ (గూండారాజ్యం), యస్, వెంకట్ (మా బాలజీ) రామ్ (ప్రసాద్ (ప్రేమకోసం), వర్మ (మరోసీతకధ), యన్.ఆర్కె.బాబు (కంచికి చేరని కధ), ఆర్.3.వర్మ (రామబంటు), వి.యస్.ఆర్ కృష్ణారావు (చెయ్యెత్తి జైకొట్టు), సురేందర్ రెడ్డి (లవ్‌గేమ్) మొ॥వారు.
నవయువతరానికి ఛాయా[(గ్రహకులు (బాబూరావు, దివాకల్, దత్తు, మధుమహంకాళి, మీర్, మోహన్‌చంద్, ప్రతాప్, రవీంద్రబాబు, రసూల్, రాజేంద్రప్రసాద్, శంకర్, తేజ) ఎందరో తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకొని రాణించటానికి (ప్రయత్నిస్తున్నారు.
శ శ ఈ స్టైల్స్ (నిశ్చల చిత్రాలు)
ఛాయా(గ్రహణ విభాగానికి దూరంగా వున్నా ఆ కోవకే చెందిన మరో ముఖ్య విభాగం స్టిల్స్. ఈ స్టిల్స్ చిత్ర పబ్లిసిటికీ ఎంతో ఉపకరిస్తాయి. సినిమా స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్ (ఇందులో టెక్నిషియన్సు కూడా వుండొచ్చు) వీటిని పత్రికల్లో ప్రచురించటం అవి (ప్రచారంకి, వ్యాపారపరంగా సినిమాకు ఒక ఆకర్షణగా వుపయోగపడతాయి. మరోకోణంలోంచి చూస్తే కొత్తగా నటీనటులు కాగోరేవారికి మేకప్ టెస్ట్ చేసి 'స్టిల్స్' తీస్తారు. ఆ కోణాల్లో బాగుంటే వారికి మంచి అవకాశాలు లభించినట్లే.
తొలిమలి దశకాల్లో అక్కినేని నాగేళ్ళరరావు, యన్.టి.రామారావు, సావి'త్రి, అంజలీదేవి వంటి ఎందరో నటీనటులకు తొలి మేకప్ స్టిల్స్ తీసిన ఘనత. జైహింద్ స్టూడియో సత్యంకు దక్కుతుంది. ఈయన్ని మన సత్యం, జైహింద్ సత్యం, అంటూ కూడా పిలిచేవారు. కొన్ని వందల చిత్రాలకు ఈయన స్టిల్స్ తీశారు. తెలుగు సినీ
158
(ప్రపంచంలో టాకీలు వచ్చిన తరువాత యీయన పేరుతెలియనివారు అరుదు. (ఈయన అల్లుడు, (ప్రఖ్యాత దర్శకులు తాతినేని రామారావు. వారి దర్శకత్వంలో శ్రీరామరక్ష చిత్రాన్ని నిర్మించారు) నర్తనశాల చిత్రానికి ఈయన తీసిన స్టిల్స్ భావగర్భితంగా వుండి పదికాలలపాటు పదిలం చేసుకోదగ్గవిగా వుంటాయి.
ఈయన వద్ద కెమెరా క్లికమనిపించిన ఎందరో ఫోటో(గ్రాఫర్జు స్టిల్ ఫోటో(గ్రాఫర్లయి యీనాడు వున్నత స్థాయిలో ఉన్నారు. వారిలో కొందరు వృషభేంద్రయ్య (మాయా బజారు), బౌనా (నిండు హృదయాలు), భూషణ్ (ఎక్కువగా బాపుగారి చిత్రాలు) శ్యామలరావు (గూఢచారి 117) మొ॥ వారు. శ్యామలరావు వద్ద పనిచేసి ఇ.వి.వి.గిరి (దర్శకులు ఇ.వి.వి. సోదరుడు) స్టిల్ ఫోటోగ్రాఫర్ అయ్యారు.
రెండవ తరానికి చెందిన ప్టీల్ ఫోటోగ్రాఫర్ కె. వెంకటేశ్చరరావు, ఈయన సారధి చిత్రాలకు రామినీడు చిత్రాలకు స్టైల్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేసి బాలయ్య శోభన్‌బాబు, రమణమూర్తి హరనాధ్, రామకృష్ణ వాణిశ్రీలకు తొలిమేకప్ స్టిల్స్ తీశారు. వీరి అబ్బాయి కె. విజయకుమార్ కూడా ఇప్పుడు స్టిల్ ఫోటోగ్రాఫర్ (రాజా, శ్రీను) గా పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరరావు, భరణీ రమ్యకృష్ణ దర్శకత్వంలో అనుబంధాలు చిత్రాన్ని నిర్మించారు.
స్టిల్స్‌లో నిపుణులైన వారు యిద్దరు పి.గంగాధరరావు పేరుతో వున్నారు. వారిలో ఒకరు పర్వతనేని గంగాధరరావు. ఈయన కూడా సౌరధి వారి చిత్రాలకు స్టిల్స్ తీసి నవశక్తి సంస్థ స్థాపించి ఆ పేరుతో కొన్ని చిత్రాలు, హైదరాబాద్ మూవీప్ పేరుతో కొన్ని చిత్రాలు నిర్మించారు.
క. వెంకటేశ్చరరావు దగ్గర సహాయకులుగా పనిచేసిన మోహన్‌జీ, జగన్జ్ యిద్దరూ కలసి జంటగా స్టిల్ ఫోటో(గ్రాఫర్టుగా పేరు తెచ్చుకున్నారు. మరో సీనియర్ స్టిల్ ఫోటోగ్రాఫర్ నాగరాజారావు.
ఇంకా కె.వి.ఆర్భక్త. సెబాస్టియన్ (బ్రదర్స్, రవీంద్రబాబు, రామస్వామి, ఆర్.వి.రాజు, ఆర్.పార్టసారధి, డి. రామానుజయ్య, గౌరీశంకర్, జగన్ పాత తరాలకు చెందిన వారు కాగా నవతరానికి చెందిన స్టిల్ ఫోటోగ్రాఫర్లు అరుణ్‌పాండ్యన్, తాతాజీ, గౌరి శంకర్, గుణకరప్రసాద్, కరారి శ్రీను, మనీషా ప్రసాద్, నారాయణరావు, బలరామ్ మొ॥ వారు యీ రంగంలో కృషి చేస్తున్నారు.
జ శ ల 159
పబ్లిసిటీ
తీసిన సినిమా స్టిల్స్‌ను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దే బాధ్యత పబ్లిసిటీ విభాగం వారు చూస్తారు. ఫోటోకార్డులు, బేనర్లు, వాల్‌పోస్టర్లు, కటవుట్స్ యిందులో ముఖ్యమైన అంశాలుగా పేర్కొనాలి. ఒక విధంగా చూస్తే సినిమా అనేది పరిశ్రమ అనటానికి యీ ఒక్క విభాగపు వుదాహరణ చాలు. దీని మీద ఆధారపడి దేశ వ్యాప్తంగా కొన్ని వేల కుటుంబాలు (బ్రతుకుతున్నాయి. స్టిల్స్‌లో బాగున్న వాటిని రెండు లేక మూడు కలిపి ఆకర్షణీయంగా వుండే విధంగా ఒకటిగా డిజైన్ చేస్తారు. ఇటువంటి పలు డిజైన్త వారానికి ఒకటి లేక రెండు చొప్పున తయారుచేసి యిటు పేపరు పబ్లిసిటీకి అటు వాల్ పోస్టరు పబ్లిసిటీకి వుపయోగిస్తారు. దీనికి రకరకాల ఏజెన్సీలు కన్సల్టెన్సీలు వున్నాయి. ఇది వరకు రేడియో (క్రియేటివ్ కమర్షియల్స్) పబ్లిసిటీ వుండేది. రాను రాను టి.వి. పబ్లిసిటి ప్రాముఖ్యత సంతరించుకొన్నాక రేడియో ప్రభావం తగ్గిపోయింది.
పబ్లిసిటీని డిజైన్ చేసిన ముఖ్యుల్లో కె. రామదాస్, గాంగాధర్: ఈశ్వర్; ప్రసాద్ మాతా స్టూడియో రాధాకృష్ణ ముఖ్యులుగా పేర్కొనాలి. ఆ తరువారి వారిలో కేతా ఆర్ట్స్, రూప్కళా, కళాభాస్కర్; కల్పన పబ్లిసిటీ, లక్ష్మీ పబ్లిసిటిస్, లంక భాస్కర్, మెరుపు శ్రీకృష్ణ ఆదిత్య, అజయ్, సురేష్ సుజిత్ భరణీ (గ్రాఫిక్స్... యిలా ఎందరో వ్యక్తులు,యెన్నో సంస్థలు వచ్చాయి. వీటిల్లో కూడా పోటీ పెరగడంతో నలుగురు కలసి ఒక యూనిట్‌గా పనిచేస్తున్నారు. ఏమయినా సినిమాలో పస వుంటేనే వీరందరి కృషి రాణింపుకు వచ్చేది.
క నే స్టంట్స్ అండ్ థ్రిల్స్
ఇదివరలో కొన్ని సినిమాలకు టైలర్లు తయారు చేసి సినినూ విడుదలకు కొన్ని రోజుల ముందు వాటిని థియేటర్లలో (ప్రదర్శించేవారు. ముఖ్యంగా విరలాచార్చ జానపద చిత్రాలకు, ఒక తరహా క్రైం చిత్రాలకు యివి తప్పనిసరిగా వుండేవి. అందులో గగుర్పాటు కలిగించే భయంకరపోరాటాలు అనగానే ముష్టియుద్దాలు, కత్తియుద్దాలు, కారులు వేగంగా దూసుకుపోవడం - గుర్రపు స్వారీలు - యివి వుండేవి. ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకర్షించేవి. దానికి రీరికార్డింగ్ ఎఫెక్ట్ బాగా - అంటే అమ్మో అన్నంత (థ్రిల్లింగ్‌గా వుండేది.
160
అది కత్తియుద్దంగానీ, కర్రసాము గానీ, ముష్టియుద్దంగానీ, వాటిలో కూడా పలురకాల పోరాటాలు. వీట్టని స్టంట్స్‌గా వగ్లీకరిస్తే..... అమాంతం కథానాయకుడు యన్.టి.రామారావు గ్లాసు కిటికినీ దూసుకుని బయటకు దూకటం, మెగాస్టార్ చిరంజీవి మోటారు సైకిల్‌పై, కారుపై, హెలికాష్టర్పై, బుల్డోజర్పై, రకరకాల విన్యాసాలు చేయటం, హీరో బాలకృష్ణ ఒక తాడు సహాయంతో తోటలోంచి రాజ(ప్రాసాదంలోకి దూకటం యిటువంటివన్ని '(ధ్రిల్స్గా అభివర్షించవచ్చు. వీటిని కూడా స్టంట్ మాస్టర్తే కంపోజ్ చేస్తుంటారు. వీళ్ళ దగ్గిర అందరూ ఆర్టిస్టులకు విగ్రహస్టాయిలో సరితూగే సాహసవంతులు వుంటారు. వారు రిస్క్షాట్స్లో డూప్‌గా నటిస్తారు. మన కధనాయకులు. కొందరు రిస్క్షాట్స్ డూప్ లేకుండా చేసిన సందర్భాలు వున్నాయి.
టాకీల తాలిదళకంలో ఎక్కువగా పౌరాణికచిత్రాలు, బహుతక్కువ సాంఘిక చిత్రాలు వచ్చాయి. వాటిల్లో యీ స్టంట్స్‌కి అసలు ప్రాధాన్యత లేదు. రెండవదశకంలో (1941-50) జానపదచిత్రాల్లో కత్తియుద్దాలు ప్రవేశపెట్టారు. అవి యించుమించుగా అక్కినేని జానపద హీరోగా నటించిన మగ్గురు మరారీలు, పల్నాటియుద్దం, కీలుగుజ్ణం చిత్రాల్లోనే. అవి ఆయనే స్వయంగా దర్శకులు సూచన మేరకు చేసేవారు. ఆ ప్రాంతాల్లోనే స్వామినాధన్ స్టంటుమాస్టర్గా రంగ (ప్రవేశం చేశారు.
1950లో విడుదలయిన పల్లెటూరిపిల్ల చిత్రంలో యన్.టి.ఆర్.-దున్నపోతు తో పోరాడే దృశ్యం ఉంది. దానిని డూప్ (ప్రసక్తి లేకుండా ఆయనే చేశారు. ఆ సందర్భంలో ఆయన కంటి క్రింద చిన్న గీత కూడా ఏర్పడింది. అదే చిత్రంలో క్రెమాక్సు దృశ్యంతో కంపనదొర (ఎ.వి. సుబ్బారావు) తో జరిగిన పోరాటం తర్వాత పాతిక అడుగుల ఎత్తున వున్న కోట ప్రహరిగోడ మీదనుండి పసిపాపని వీపుకు కట్టుకుని (ఒక్కో షాట్లో బొమ్మ వుండొచ్చు) గురి తప్పకుండా క్రింద నున్న గుర్రం మీదకు దూకటం అప్పట్లో ఒక ధ్రిల్గా ఫీలయ్యారు. అ కత్తుల పోరాటంలో కూడా మామూలుగా సహజ శబ్దం తప్పితే రీరికార్డింగ్ ఆర్భాటం వుండేది కాదు.
ఆ మరుసటి సంవత్సరం కొంత మార్పు వచ్చింది. పాతాళభైరవి పతాకసన్నివేశంలో తోటరాముడు, (యన్.టి.ఆర్ మాంత్రికుడు (రంగారావు) ముష్టియుద్దం చేస్తారు. దీనికోసం కె.వి.రెడ్డిగారి పర్యవేక్షణలో వారు తాలింఖానాలో ఆ పోరాటం (ప్రాక్టీసు చేశారు. అదే సంవత్సరం విడుదలయిన స్పష్ట సుందరి, మాయలమారి, ఆ రెండు జానపద చిత్రాల్లోను కత్తి యుద్దం వుంది. దీనిని స్వామిశాథన్ కంపోజ్ చేయటమే గాక లాంగ్‌షాట్స్‌లో ముక్కామలకు డూప్‌గా నటించారు. నాగేశ్చరరావు మాత్రం ఆ చిత్రాల్లోడూప్ లేకుండా కత్తిసాము చేసారు.
161
ఆ తరువాత అదే స్వామినాధన్ రోహిణి వారి ప్రతిజ్ఞను పనిచేసినప్పుడు హీరో కాంతారావు, విలన్ రాజనాల కత్తి యుద్దం (ప్రాక్టీస్ చేశారు. స్వామినాధన్ ఒక స్టంట్ పార్టీని మెయిన్‌టెయిన్ చేసేవారు. వారు వివిధ భాషా చిత్రాల్లో పోరాటం సన్నివేశాల్లో వీరులుగాను, డూప్స్గాను నటించేవారు. ప్రతాప్ ఆర్ట్స్ నిర్మాత కె. రాఘవ కొన్ని చిత్రాల్లో యన్.టి.ఆర్కు యం.జి.ఆర్కు డూప్‌గా పోరాటదృశ్యాల్లో నటించారు. ఆ పార్టీలో చెప్పుకోదగ్గ (ప్రతిభ కనబర్చిన వ్యక్తి సోము. అతనిలోని చురుకుతనాన్ని గమనించిన ఎన్.టి.రామారావు ఎన్.ఏ.టి. పతాకంపై తీసిన 'జయసింహ' కు స్టంట్స్ కంపోజ్ చేసే బాధ్యతవప్పజెప్పారు. దానిని అతను విజయవంతంగా నిర్వహించాడు. చిత్రం మొదట్లో జరిగే గొడ్డలి-డాలు యుద్ధం రామారావు -సోము చేశారు. చిత్రం మధ్యలో వచ్చే కాగడాల యుద్దం కూడా జనాన్ని బాగా ఆకట్టుకుంది. అంతవరకూ వచ్చిన కత్తి పోరాటయుద్దాల్ని యీ చిత్రం అధిగమించింది.
అదే సంవత్సరం విడుదలయిన 'దొంగరాముడు” చిత్రంలో అక్కినేని - ఆర్. నాగేశ్చరరావు (బాబులోకు మధ్య ఫ్రీస్టయిల్ రెజిలింగ్ వుంది. దర్శకుడు కె.వి. రెడ్డి ఆధ్వర్యంలో అది తెలివిగా కంపోజ్ చేయబడింది. పర్సనాలిటీరీత్యా తక్కువగా కనిపించే హీరో భారీ శరీరంగల విలన్‌ను ఎగిరి తన్నటం - వాడుపుగా కాలు మెలి తిప్పటం వంటి ప్రక్రియలు (ప్రవేశపెట్టారు. దీన్సి వారిద్దరు ప్రాక్టీసు చేశారు. అప్పటికి స్టంట్స్‌లో పాల్గొనే రాఘవులు కూడా యీ పోరాటచిత్రీకరణప్పుడు తగు సూచనలు యిచ్చి పర్యవేక్షించారు.
ఆ తరువాత స్టంట్ మాస్టర్ సోము యన్.టి.ఆర్ కధానాయకుడిగా నటించిన పలు జానపద చిత్రాకు, అక్కినేని నటించి పలు సాంఘిక చిత్రాలకు రాఘవులు స్టంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. వారితోపాటు సైట్ మాస్టర్‌గా రంగ ప్రవేశం చేసిన మరొక వ్యక్తి సాంబశివరావు. ఈయన అన్ని తరహా చిత్రాలకు పనిచేశారు.
యన్.టి.ఆర్. “గులేబకావళి కధ' నిర్మించే రోజుల్లో అందులో పోరాటంలో ఉపయోగించటానికి అయిదు వీశెల (దాదాపు యెనిమిది కేజీలు) బరువున్న కత్తుల్ని (ప్రత్యేకంగా తయారుచేయించారు. దానితోనే రాజనాల-యన్,టి.ఆర్. మధ్య జరిగే పోరాటాన్ని చిత్రీకరించారు. అయితే యీ సినిమా వచ్చే సరికి పోరాటంలో కత్తుల ఖణేల్ ఖణేల్ శబ్దాలు ఖంగుమని ఎఫెక్టివ్‌గా వినిపించేవి. “గులేబకావళి కధిలో అస్రిపంజరాలతో పోరాటం విచి(త్రంగా చెప్పుకొన్నారు. గౌరీ మాహత్య్మం, రాజనందిని వంటి చిత్రాల్లోని పోరాటాలు సోముకు మంచిపేరు తెచ్చాయి.
రాఘవులు ఇల్లరికం, ధర్మదాత వంటి చిత్రాలకు కంపోజ్ చేసినా అతనికి
162
మంచిపేరు తెచ్చిన చిత్రాలు అదృష్టవంతులు, బంగారు బాబు. అదృష్టవంతులు చిత్రంలో 30 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే రైలు టాప్ మీద అక్కినేని రిస్క్ తీసుకుని ఫైట్ చేశారు. అదే రిస్క్ తీసుకుని నిర్మాత జగపతి రాజేంద్ర ప్రసాద్ వద్దన్నా వినకుండా డూప్‌తో అవసరం లేకుండా బంగారుబాబులో 150 అడుగుల ఎత్తున ఎగిరే హెలికాప్టర్లో ఫైట్ చేశారు. 'సువర్షసుందరి' చిత్రంలో పోరాట దృశ్యాల్ని సాంబశివరావు కంపోజ్ చేశారు.
విరలాచార్య కాంతారావు, రాజనాల కాంబినేషన్లో తీసిన అనేక జానపద చిత్రాలకు ఇ. పరమఃళివన్ స్టంట్స్ కంపోజ్ చేశారు (నవగ్రహపూజా మహిమ, గురువును మించిన శిష్యుడు), చిక్కడు-దొరకడు చిత్రంలో పోరాటాల్ని శివయ్య కంపోజ్ చేశారు. హీరోలు ఇద్దరూ పోరాడుతూ కత్తితో ఒకరి చేతిపై మరొకరు వారి "పేరును చెక్కడం ఒక ధధ్రిల్ ఆకాశరామన్న చిత్రానికి, కృష్ణ నటించిన టక్కరిదొంగ- చక్కని చుక్క చిత్రానికి కె. మాధవన్ ఫైట్ మాస్టర్.
సాంబశివరావు కంపోజ్ చేసిన పోరాటంలో అత్యంత సహజంగా గంభీరంగా రూపొందించిన భీమ, దుర్యోధన గదా యుద్ధం దానవీరశూరకర్ణలో ఎరీనా సెట్లో యన్.టి.ఆర్.-సత్యనారాయణలపై చిత్రీకరించారు. అలాగే నర్తనశాల చిత్రంలో భీమ-కీచక పోరాటాన్ని లైట్ అండ్ షేడ్ ఎఫెక్ట్‌లో యస్.విరంగారావు, దండమూరి రాజగోపాల్ పై అర్హవంతంగా కంపోజ్చేశారు.
'ఎ.ఆర్.భాషా మహాబలుడు, నవమోహిని వంటి కొన్ని జానపదచిత్రాలకు పనిచేశారు.
జూడోరత్నం కృష్ణ నటించిన కొన్ని చిత్రాలకు ఫైట్మాస్టరుగా పనిచేశారు. మాధవన్ కూడా కృష్ణ నటించిన అనేక చిత్రాలకు పనిచేశారు. స్వయంగా ఆయన పోరాట సన్నివేశాల్డో పొల్తొనేవారు.
రాఘవులు. గారాబ్బాయి రాజు గత ఇరవై సంవత్సరాలుగా ఫైట్స్ థధ్రిల్ఫ్ అందిస్తూ ఎన్నో చిత్రాల విజయానికి కారకుడయ్యాడు. చిరంజీవి నటించిన అసంఖ్యాక హిట్ చిత్రాల్లో (ఖైదీ, దొంగమొగుడు,కొదమసింహం, అభిలాష గ్యాంగ్ లీడర్, మొ) రాజు కంపోజ్ చేసిన పోరాట విన్యాసాలు ధధ్రిల్స్ ఆకట్టుకున్నాయి.
ఆలోచన దర్శకుడిదే అయినా శివ చిత్రానికి రాజు కంపోజ్ చేసిన సైకిల్ ఛైన్ ఫైట్ ఓ కొత్త తరహా ధధ్రిల్స్కు తెర లేపింది. ఇటీవల వచ్చిన శవయ్య' చిత్రంలో రాజ్ శేఖర్‌తో చిత్రీకరించిన పోరాటాలు కూడా రాజు కంపోజ్ చేసినవే!
163
ఈయన నేతృత్వంలో రూపుదిద్దుకున్న మరొక ధధ్రిల్లింగ్ ఫైట్ చిరంజీవి నటించిన 'కొండవీటిరాజూ'లో వుంది. నేలమీద కాలుపెట్టకుండా విలన్స్‌ను ఉతికేయటం అందులో స్పెషాలిటి!
రాజు దగ్గర పనిచేసిన ఎందరో నేడు ఫైట్మాస్టర్స్గా వెలుగొందుతున్నారు.
వారిలో సాహుల్‌ను ముందుగా చెప్పుకోవాలి. విజయబాపినీడుగారి “ఖైది నెం. 786”లో చిరంజీవి - హిందీ ఫైట్ ఆర్టిస్ట్ మాణిక్ ఇరానీపై కొండలవడద్ద చిత్రీకరించిన ఫైట్ చెప్పుకోదగ్గది. ఇంకో శిష్యుడు విజయన్ కూడా చిరంజీవి నటించిన 'దాంగి వంటి చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేశారు.
ఎ. విజయ కూడా రాజువద్ద ట్రైనింగ్ పొంది దేవి, స్నేహితులు, దేవా, రాజా చిత్రాలకు మంచి ఫైట్స్ కంపోజ్ చేశారు. అయితే 'సాంబయ్య' చిత్రానికి ఆర్టిస్టు శ్రీహరిని దృష్టిలో పెట్టుకొని కంపోజ్ చేసిన (్రిల్లింగ్ పోరాటాలు 'అమ్మో' అనిపించాయి. వళ్ళు గగుర్పొడిచేలా తీర్చిదిద్దారు.
ఈ దశకంలో (1991-99) ఫైట్స్ ధ్రిల్స్ స్వరూపస్వభావాలు చాలా మారిపోయాయి. కారు వేగంగా ఛేజ్ చేయబడి కొండమీద నుంచి పల్టీలు కొట్టి తగలబడుతూ నేలకొరగటం, అగాధంలో పడిపోవటం. మోటారు సైకిల్ మంటల్లో చిక్కుకొని గాలిలో పల్టీలు కొట్టటం - అంటే వస్తు విధ్వంసం ద్వారా గగుర్పాటును కలిగించాలని (ప్రయత్నించడం ముమ్మరమయింది. అది గతంలో రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో తయారైన కొన్ని భారీ చిత్రాల్లో కనిపించేవి. నేడవి సర్భసామాన్యమైనాయి. ఇటువంటి విన్యాసాలు విక్రమ్ ధర్మా నేతృత్వంలో మెకానిక్ మావయ్య చిత్రంలో ఎన్నో చేశారు. అయితే విక్రమ్ ధర్మా సమరసింహారెడ్డి" చిత్రానికి కంపోజ్ చేసిన ధ్రిల్స్ పోరాటాలు గగుర్పాటు కలిగించటమే గాక చిత్ర విజయానికి ఎంతో సహకరించాయి. దీనికి కారణం కధలో అండర్ కరెంటుగా వయొలెన్స్ వుండటం - అవసరార్థం తప్పనిసరిగా ఫైట్ చేయాల్సిన సందర్బం రావటం వల్ల కౌచిత్యభంగం కలుగలేదు.
హిందీ చిత్రరంగానికి చెందిన షెట్టి కొన్ని తెలుగు చిత్రాల్లో ఫైట్స్ చేశారు.
/ 'ఫైట్ మాస్టర్ విక్కి అక్కబాగున్నావా, శుక్రవారం మహాలక్ష్మి, వంటి చిత్రాలకు పనిచేశారు.
ఇంకా సూపర్ సుబ్బరాయన్, జూడో రత్నం, కన్నల్ కన్నన్, (ఒకేఒక్కడు చిత్రీకరణలో యీయన ప్రతిభ తెలుస్తుంది), దళపతి, రాంబో రాకేష్ హార్స్ పటేల్ హార్చ్మెన్ రాజు 'ఫైట్మూస్టర్స్గొ ధ్రిల్స్ అందిస్తున్నారు. అయితే యీ థ్రిల్స్‌కు
164
రీరికార్డింగ్ ఎఫెక్ట్ బాగా తోడవడం వల్ల మంచి ఫలితాలు కన్పిస్తున్నాయి. అమ్మో అనిపిస్తున్నాయి. అయితే కథాకమావిషు వున్న చోట మాత్రమే యివి రాణిస్తున్నాయి. శ్ 4 ౩ కూర్చు(ఎడెటింగ్ చలనచిత్ర నిర్మాణంలో అత్యంత కీలకమైన విభాగం కూర్పు. దీన్ని గూర్చి కొంచెం వివరంగా తెలుసుకోవటం అవసరం. ఒక సినిమాకథ తయారయ్యాక డైలాగ్స్తోకూడిన ్రిస్ట్ వర్కు పూర్తవుతుంది. ఆ 'స్కీష్ట్ ప్రకారం సినిమాలో సుమారు 75 నుంచి 150 వరకు సీన్సు (సన్నివేశాలు) వుంటాయి. ఒక్కోసన్నివేశాన్ని షాట్టుగా విభజిస్తారు. ఆ ప్రకారం ఏ షాటును ఏ ఆర్లిస్టుపై ఎంత వరకు తియ్యాలి -ఆ పొత్ర డైలాగులు చెప్పుతున్నపుడు, కధాగమనాన్ని అవసరాన్ని బట్టి రియాక్షన్ ఎవరిమీద చూపాలి-యివన్ని షాట్ డివిజన్లో నిర్ణయించబడతాయి. ఆ తరువాత ఆ షాట్‌ను లాంట్, మిడిల్షాట్, క్లోజప్ అంటూ పలు విధాలుగా విభజించుకొంటారు. ఆ తరువాత ఒక్కో షాటును సెట్స్ సౌలభ్యరీత్యా చిత్రీకరిస్తారు. ఆ షాట్లో టేక్ 1-22-3-4 అలా వుంటాయి. మొదటి టేక్‌లో ఒకే, కాకపోతే తర్వాత టేక్‌లు తియ్యాల్సిన అవసరం వుంటుంది. ఈ వివరాలు ఆంటే సీను నెంబరు, షాట్ నెంబరు, టేకు నెంబరు, ఎఫెక్టు పగలు లేక రాత్రికి సంబంధించినదా అనే వివరాలు క్లాప్ బోర్డు మీద వుంటాయి. (తేదీతో సహా) ఈ వివరాలను ఓకే అయిన షాటు వివరాలను అసిస్టెంట్ లేక అసోసియేటర్ డైరెక్టరు ఎడిటింగ్ రిపోర్టునోట్సులో (వ్రాసుకుంటాడు. ఇది చిత్రానికి ఆయువుపట్టు వంటి అంశం. ఆ నోట్సు ఆధారంగా చిత్రానికి ఎడిటర్‌గా నియమించబడ్డ వ్యక్తి ఓకే అన్న షాట్సును వుంచి మిగతా వాటిని తొలగిస్తాడు. అల్టా ఓకే అయిన షాట్స్‌ని స్స్స్ _ షాటు నెంబర్జ్హు ఆధారంగా ఒక (క్రమంలో సినిమాను రూపొందిస్తాడు. సన్నివేశం ఎంతవరకుంటే ఆ కధ రక్తి కడుతుందో వూహించి దర్శకునితో సంప్రదించి ఆ చిత్ర నిడివిని నియం[త్రణ చేస్తాడు. అప్పుడు చిత్రం మంచి రసపట్టులో నడుస్తుంది. అటువంటి ఎడిటర్ దర్శకుడయితే ముందుగానే నిడివిని గూర్చి ఓ నిర్ణయానికి వచ్చి ఆ ప్రకారమే షూటింగ్ చేస్తాడు, కిప్టుకు అ్రన్లనస్తరంగా ఎక్కువ ఫిల్మ్ దుబారా కొవటానికి అవకాశం ఉండదు. దీనికి ఒక చిన్న వుదాహరణ. చలనచిత్ర రంగంలో ఆత్రేయ గొప్ప రచయిత, ఉత్సాహం కొద్ది వాగ్దానం చిత్రం నిర్మించి అనుకొన్న నిడివికి ఎంతో ఎక్కువగా 165
షూట్ చేశారు. ఆ ప్రకారం ఆ చిత్రం సుమారు 4 గంటలపాటు (ప్రేక్షకులు చూడాల్సి వచ్చేది. అయితే దర్శకులు ఆదుర్తి సుబ్బారావు కూర్పులో నేర్పరి. దాన్ని ఎడిట్ చేసే బాధ్యత ఆ(త్రేయపై గల అభిమానంకొద్దీ ఆయన టేకప్ చేసి అనవసర సన్నివేశాల్ని తగ్గించి చిత్రాన్ని రెండు వంతులు తొలగించగా మిగిలిన భాగం చక్కని వేగంతో కధ నడిచేలా ఎడిట్ చేశారు.
ఇహ అసలు కథలోకి వస్తే ఆ రంగంలో ఆద్యులుగా చెప్పుకోదగిన వారిలో ముఖ్యులు యం.వి. రాజన్ (ఈయన ప్రముఖ రాజకీయవేత్త అనంతశయనం అయ్యంగార్‌కి స్తయాన మేనల్లుడు) టాకీల తొలిదశకంలో హెచ్.ఎం.రెడ్డిగారి చిత్రాలకు, యల్వీ (ప్రసాద్ చిత్రాలకు యీయన ఎడిటర్‌గా పనిచేయగా తరువాత తరానికి చెందిన ఆనుపమతిలక్ ప్రసాద్‌గారి సోదరుడు సంజీవి, భరణిరామకృష్ణారావు శిష్యులుగా తర్ఫీదు పొందారు.
ఉదయశంకర్ దగ్గర కె.ఎస్ ప్రకాశరావు దగ్గర అటు ఎడిటింగ్ శాఖిలోను యిటు దర్భ్శకత్వశాఖలోనూ పని చేసిన ఆదుర్తి సుబ్బారావు దర్శకుడయిన తరువాత ఆయన తిసిన చిత్రాల్లో కధా గమనం అద్భుతంగా వుండేలా చూసేవారు. ఈయన వద్ద అటు దర్శకత్వ శాఖలో సహాయకునిగా వుంటూ యిటు ఎడిటింగ్ చూసిన సీనియర్ ఎడిటర్ టి. కృష్ణు ఆదుర్తి వద్ద పనిచేయటానికి ముందే యీయన హెచ్.ఎం, రెడ్డి గారి వద్ద అనుభవం సంపాదించారు. ఈయన వద్ద పని చేసిన ఎందరో శిష్య ్రశిష్యులు నేడు ఎడిటర్స్‌గా మంచి పేరు సంపాదించారు.
టి. కృష్ణ శిష్యుడు జి.జి. కృష్ణారావు ఎడిటింగ్‌లో చేయి తిరిగిన ప్రజ్ఞావంతుడు. అటు విజయమాధవీ వారి చిత్రాలకు (విశ్సనాథనాయకుడు, రావణబ్రహ్మ) యిటు విశ్చనాధ్గారి దర్శకత్వంలో తయారైన క్లాసిక్స్ (శంకరాభరణం, స్వాతికిరణం, ఆపద్బాంధవుడు) కు పనిచేశారు. ముఖ్యంగా నృత్య సన్నివేశాల్ని చాలా జా(గ్రత్తగా ఎడిట్ చెయ్యాలి, లేకపోతే జర్క్ వస్తే ఫలితం దెబ్బతింటుంది. అయితే యీ రోజుల్లో జర్క్‌లు ఎక్కువ వుండటం గమనించవచ్చు.
వాహినీ వారి చిత్రాలకు (మల్లీశ్వరి) పనిచేసిన నారాయణదాసు సీనియర్ ఎడిటర్.
సుప్రసిద్ధ కెమెరామెన్, ఎడిటర్, దర్శకుడు వాహినీ స్టాపకుల్లో ఒకరైన క. రామనాధ్ మేనల్డుడు యం.యస్, మణి అన్నపూర్హ వారి చిత్రాల్ని (దొంగరాముడు, ఇద్దరు మిత్రులు, అమాయకురాలు) ఎడిట్ చేశారు.
యం.యన్. మణితో కలసి పనిచేసిన జంబు అటు విజయా (మాయాబజార్)
166
చిత్రాలకూ వీనస్ చిత్రాలకూ పనిచేశారు. వీరి వద్ద పనిచేసిన కళ్యాణసుందరం కూడా విజయ చిత్రాలకు పని చేశారు.
మొదట్లో బి.ఏ. సుబ్బారావు గారి చిత్రాల్ని ఎడిట్ చేసిన కెఎ. మార్తాండ్ తరువాతి కాలంలో సురేష్ రామానాయుడిగారి చిత్రాలను ఎక్కువగా (జీవనతరంగాలు, బొమ్మలు చెప్పిన కథ, సిపాయి చిన్నయ్య, సెక్రటరి)ఎడిట్ చేశారు.
సినియర్ ఎడిటర్స్ లిస్ట్‌లో చెప్పుకోదగిన వ్యక్తి యన్.యస్.ప్రకాశ్: ఎక్కువగా సుందర్‌లాల్ గారి చిత్రాలకు పనిచేశారు. చిన్నకోడలు (రక్తసంబంధం). జి.డి.జోషి పరదేశితో మొదలుపెట్టి కొన్ని విరలాచార్య గారి చిత్రాల్ని ముఖ్యంగా డి.వియస్.రాజు గారు నిర్మించిన వాటిని (మంగమ్మ శపధం) ఎడిట్ చేశారు.
జి. కృష్ణస్వామి పి.ఏ.పి.చిత్రాలను (మనుషులు-మమతలు) కొన్నిటికి పనిచేశారు.
కన్నడరంగంలో ఎడిటర్ కం డైరెక్టర్‌గా పేరొందిన జి. విశ్శనాధం వద్ద సహాయకునిగా పని చేసిన గోవిందం విఠలాచార్య గారి స్వంతజానపద చిత్రాలకు (అగ్గి పిడుగు, గురువును మించిన శిష్యుడు, నవగ్రహపూజామహిమ, చిక్కడు- దొరకడు) పనిచేశారు.
బాలు (దేవదాసు మళ్ళీ పుట్టాడు, ధర్మదాత) సీనియర్ ఎడిటర్, ఎ.విియం.వారి చిత్రాలకు ఎక్కువగా పనిచేసిన ఎడిటర్ ఆర్.విరల్ (మూగనోము) ఎ.వియం. వారి తొలితరం చిత్రాల్లో కొన్నిటిని ఎడిట్ చేసిన వ్యక్తి యన్. సూర్య (నాగులచవితి),
ఒక్క 'పాండవ వనవాసం' చిత్రానికి అతి సీనియర్లయిన ముగ్గురు ఎడిటర్లు (సంజీవి, వీరప్ప, అంకిరెడ్డి పని చేయటం విశేషమే!
సంజీవి (యల్.వి.ప్రసాద్‌గారి సోదరుడు) అటు హైద్రాబాద్ మూవీస్‌కి (జల్పారాయుడు) ఇటు జగపతికి (ఆత్మబలం) పనిచేయడమేగాక కొన్ని చిత్రాలకు (ధర్మదాత, ఇల్టాలు) దర్శకత్వం వహించారు.
క్రైం చిత్రాల దర్శకుడు కె.ఎస్.ఆర్.దాసు ఎడిటింగ్నుంచి దారి మళ్ళిన వారే.
నవయుగ డిస్ట్రిబ్యూషన్ భాగస్టులు, మరియు నిర్మాత అయిన పర్వతనేని చంద్రశేఖరరావుగారి సోదరుడు పి. శ్రీహరిరావు పలు చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు.
జానపద చిత్రాల్ని అందంగా, పవర్‌ఫుల్‌గా ఎడిట్ చేయడంలో అందె వేసిన చెయ్యి బి. కందస్వామి. గుర్రపుస్వారీలు, కత్తియుద్దాలను చాలా జాగ్రత్తగా ఎడిట్ చెయ్యకపోతే ఎఫెక్ట్ రివర్స్ అయ్యే ప్రమాదం వుంటుంది.
మార్తాండ్ దగ్గర శిష్యరికం చేసిన బి. గోపాలరావు నిండు మనసులు వంటి
167
యాక్షన్ చిత్రాలను చేయగా ఆయన వద్ద టి. కృష్ణ వద్ద తర్ఫీదు పొందిన సోదరులు కోటగిరి గోపాలరావు, కోటగిరి వెంకటేశ్వరరావు గత రెండు దశాబ్దాలుగా అటు రాఘవేంద్రరావుగారి చిత్రాలకు (వేటగాడు) ఇటు దాసరి గారి చిత్రాలకు పనిచేయడటమే గాక ఊరంతా సంక్రాంతి చిత్రాన్ని నిర్మించారు.
టి. కృష్ణ వద్ద శిష్యరికం చేసిన మరో వ్యక్తి ఆదుర్తి హరనాథ్ (దర్శకులు సుబ్బారావు గారి సోదరుడు) విజయనిర్మలగారి చిత్రాలకు పనిచేశారు.
సంజీవి దగ్గర పనిచేసిన కె. సత్యం ఎక్కువగా విక్టరి మధుసూదనరావు దర్శకత్వంలో తయారైన (పవిత్రబంధం, అంతస్తులు, కళ్యాణమంటపం) చిత్రాల్ని ఎడిట్ చేశారు. .
సీనియర్ ఎడిటర్ వీరప్ప పనిచేసిన చిత్రాల్లో చెప్పుకోదగ్గది 'నర్రనశాల”!
ఉదయశళంకర్ 'కల్పన' చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన వ్యక్తి ఎన్.3. గోపాల్ (వీరికి ఆదుర్తి సహాయకునిగా పని చేశారు) కొన్ని జెమినీ చిత్రాలకు రాజరాజేశ్చరీ వారి చిత్రాలకు (పేదరైతు, దక్షయజ్ఞం) పనిచేశారు.
తొలిదశలో భరణీ వారి చిత్రాలకు తరువాత ఎడిటర్ సుందరం వద్ద పనిచేసి శిక్షణ పొందిన అంకిరెడ్డి సారధివారు నిర్మించిన చాలా చిత్రాల్ని ఎడిట్ చేశారు.
నరసూ వారి (భలేరాముడు) చిత్రాలను ఆర్. రాజగోపాల్, కొన్ని ఏ.వియం, చిత్రాలకు (రాము) ఆర్.జి. గోపు పనిచేయగా చెప్పుకోదగ్గ వారిలో కొందరు ఎడిటర్స్ జి. కృష్ణస్వామి (నవరాత్రి) కె. బాబురావు (సిరిసిరిమువ్వ), వి.ఎస్. నారాయణ (అత్తా ఒకింటికోడలే) (ప్రతిభా చిత్రాలకు (ఏదినిజం) పనిచేసిన ఎ.ఆర్.బి.యస్. మణి, జి. విష్చనాథ్ (అన్నాచెల్లెలు), ఆర్: సురేంద్రనాథ్‌రెడ్డి (యశోదాకృష్ణు, కాగా నవతరంలో చెప్పుకోదగ్గవారు మురళీ-రామయ్య కె. రామగోపాల్‌రెడ్డి, కోలా భాస్కర్, కృష్ణారెడ్డి, మోహన్, రవి, యస్.వి. రమణారావు మొవారు.
గత రెండు దశాబ్దాలుగా తన ప్రత్యేక ప్రతిభతో ఎడిటింగ్రంగంలో విశిష్ట వ్యక్తిగా గుర్తించబడిన వారు గౌతంరాజు. ఆనాటి జంధ్యాల చిత్రాలు ముద్దమందారం, నాలుగు స్తంభాలాట, ఆనందభైరవితో జైత్రయాత్ర ప్రారంభించి ఉషాకిరణ్‌లో వారి చిత్రాలకు (మయూరి) అనేక ఎవార్డు పొందిన చిత్రాలకు కధాపరంగా, నిడివిని ఉత్కంఠత కలించేవిధంగా నియం(త్రించటంలో నిపుణునిగా ప్రసిద్ధి చెందారు.
విశిష్ట ఎడిటర్‌గా గుర్తించబడిన మరోక వ్యక్తి అనిల్ మల్నాడ్. ఈయన ప్రతిభకు చక్కని వుదాహరణ 'సితార-
168
ఉత్తర భారతంలో విశిష్ట నటుడు ఛాజ్కపూర్ చక్కని ఎడిటర్. ఆ తరహాలో తెలుగు చలనచిత్రసీమలో సూపర్‌స్టార్ కృష్ణ ఎడిటింగ్‌లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. సింహాసనం' చిత్రం చూస్తే చాలు ఎడిటర్‌గా కృష్ణ పనితనం వేగం ఎంతో ఏమిటో తెలుస్తాయి.
ఈ ఎడిటర్స్ అటు స్టూడియోల్లోని ఎడిటింగ్ రూమ్స్‌లో బయట ఉన్న ఎడిటింగ్ రూమ్స్‌లోనూ ఎడిటింగ్ నిర్వహిస్తూంటారు. ఆ దిశగా హైద్రాబాద్‌లోని జ్యోతి ఫిలిం ఎడిటింగ్ సెంటర్, కళా ఎడిటింగ్ రూమ్, ఆర్.కె. ఎడిటింగ్ రూమ్‌లను పేర్కొనాలి.
శ శ ఈ అనువాద చిత్రరంగం
“ఏవండీ, పిల్లలు ఒకటే గోల చేస్తున్నారు - మమ్మీ సినిమా చూపించమని - ఈ రోజు వెళదామా!”
“ఎందుకే అది ఇంగ్లీషు సినిమా - వాళ్ళకేం అర్థమౌతుంది?”
“కాదండీ, అది తెలుగులోకి డబ్ చేశార్ట! చాలా బాగుందిట.”
“అయితే సరే!”
ఈ విధంగా యావత్రపంచభాషల్లో యే భాషలో నిర్మించిన చిత్రాలైనా హక్కులు కొనేసి మూలకధ - సన్నివేశ ప్రభావం అర్ధమయ్యేలా హాయిగా తెలుగులోకి అనువదించబడుతున్నాయి. మనకు అర్ధమయ్యే మన భాషలో ఆలచిత్రాన్నిచూసి ఆనందించగల్లుతున్నాడు. సగటు సినిమా ప్రేక్షకుడు. ఇది డబ్బింగ్ అనే ప్రక్రియ సామాన్య (ప్రేక్షకుడికి యిచ్చిన వరం. అంతకంటే విడ్డూరం ఏవిటంటే - యీ రోజున హైద్రాబాద్ నగరంలో మమ్మీ, టెర్మినేటర్, డీప్ బ్లూసీ వంటి చిత్రాలు మాతృకలో నిర్మించిన భాషతో పాటు హిందీ తెలుగు భాషల్లో 'డబ్ అంటే అనువదించబడి మూడు భాషల సినిమాలు ఒకేసారి ప్రదర్శించబడుతున్నాయి.
ఈ ప్రక్రియకు నాంది పలికింది నిర్మాత వాసిరెడ్డి నారాయణరావు. (ఈయన “జయభేరి చిత్ర నిర్మాత). నీరా జౌర్ నందా అనే హింది చిత్రాన్ని 1950 ప్రాంతంలో 'ఆహుతి" అనే పేరిట తెలుగులోకి డబ్ చేశారు (అనువదించారు). అనువాద చిత్రానికి రచయిత (ప్రాణం వంటివాడు. పెదవుల కదలికలకు తగ్గట్టు పరభాషలోని భావం చెడకుండా మన భాషలోకి మాటల్ని (వ్రాసి మెప్పించాలి. అప్పటికే ప్రగతిశీల భావాలతో కవితా సృష్టి చేసేవ 'మహా్రస్థ్రానం' ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకొన్న
169
శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) 'ఆహుతి' చిత్రానికి రచన చేశారు. అయితే ఆ చిత్రం ఆశించినంతగా విజయం సాధించలేదు. అయినా ఆ ప్రక్రియ తరువాత కొనసాగింది.
డబ్బింగ్‌కు సంబంధం వున్న మరో పద్దతి ట్రాక్ ఛేంజి. అంటే మూలభాషను తగ్గట్టు సంభాషణలు-అలాగే పాటలు (వ్రాయగా వాటి ఆధారంగా షూటింగ్ జరపటం
- ఈ ప్రక్రియకు చక్కని వుదాహరణలు మనోహర, (ప్రేమలేఖలు చిత్రాలు. సుమారుగా 1955 నుంచీ యీ డబ్బింగ్ ప్రక్రియ వూపందుకుంది.
ఈ శతాబ్దిలో సరాసరి తెలుగులో నిర్మించినవి సుమారు 3525 చి(త్రాలుకాగా తెలుగులోకి యితర భాషలలోకి డబ్ చేయబడిన చిత్రాలు సుమారు 1075 అంటే ముప్పయ్యవశాతం అనువాద చిత్రాలు వచ్చాయి. వీటిల్లో మూడవవంతు ఈ దశకం (1991-1999) లో వచ్చాయి. ఇంతగా డబ్బింగ్ చిత్రాలు నిర్మాణం కావటానికి మూలకారణం అలోచిస్తే రిన్స్ తక్కువ. ఫలితం ఎక్కువ. ఇతర భాషల్లో విజయవంతమైతే ఆ హక్కులు పొందితే షూటింగ్ బెడద లేకుండా డబ్ చేసి మినిమమ్ గ్యారంటీతో వ్యాపారం చెయ్యిచ్చు.
ఈ రహస్యాన్ని కనిపెట్టిన చాలా మంది నిర్మాతలు విశ్చశాంతి విశ్వేశ్చరరావు, ఎస్, గోపాలరెడ్డి, కె.ఎస్. రామారావు ఏ.యం.రత్నం మొదలైనవారు డబ్బింగ్ చిత్రాల్లో విజయం సాధించి తరువాత సరాసరి తెలుగులో చిత్రాలు నిర్మించిన వారే! ఇహ జెమినీ, ఏవియం, నిన్నటి జయభేరి మొదలైన సంస్థలు కూడా యీ డబ్బింగ్ రంగంపై (శ్రద్ద చూపాయి. విజయబాపినీడు మరో అడుగు ముందువేసి కొన్ని అవసరమైన సన్నివేశాల్ని తెలుగులో తీసి ఆ డబ్బింగ్ చిత్రానికి కలిపిన సందర్భాలు.
ఫలితంగా తమిళ చిత్రరంగంలో పేరొందిన చిత్రాల్ని తెలుగులోకి అనువదించగా (ప్రేక్షకుల ఆదరణకు నోచుకొని నిర్మాతలకి లాభాలు చేకూర్చిన వాటిల్లో కొన్ని: కొండవీటిదొంగ, ఆలీబాబా నలభైదొంగలు, రత్నగిరి రహస్యం, వీరప్రతాప్, కొండవీటి సింహం, విజయకోటవీరుడు, పాపపరిహారం, సింగపూర్ సి.ఐ.డి. సాహసవీరుడు, సర్వర్ సుందరం, కర్ణ వీరపాండ్యకట్టబ్రహ్మన్న, మురిపించే మువ్వలు, విరిసిన వెన్నెల, మన్మధలీల, రెండు తోకలపిట్ట, (శ్రావణ పౌర్ణమి, నాగబాల, ఘర్దణ, భారతీయడు, భామనే సత్యభామనే, (ప్రేమదేశం, (ప్రేమలేఖ, నరసింహం, ఒకే ఒక్కడు,... ఇలా యెన్నో... ఈ ్రకియవల్ల తమిళరంగంలో ప్రసిద్దులైన నటులు యం.జి.రామచంద్రన్, శివాజిగణేశన్, జెమిని గణేశన్, ప్రభు, ప్రతాప్‌పోతన్, నంబియార్, వీరప్ప, తంగనేలు, చంద్రబాబు వంటి ఎందరో నటీనటులు తెలుగు వారి అభిమానానికి పా(త్రులైనారు.
170
అదే విధంగా కన్నడ భాష నుంచి తెలుగులోకి అనువదించబడిన చిత్రాలు పరిశీలిస్తే కత్తిపోటు, శ్రీకృష్ణదేవరాయలు, బడిపంతులు, మంతత్రశక్తి- దైవభక్తి ఎ. ఉపేంద్ర, ఇలా,..ఎన్నెన్నో... దీంతో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, ఉదయకుమార్ వంటి ఆర్జిస్తులు మనకు పరిచయమయ్యారు.
అదే విధంగా మలయాళం నుంచి ఆతను ఎవరు, సి.ఐ.డి. వైశాలి వంటి చిత్రాలు రాగా ప్రేమనజీర్, మోహన్‌లాల్ వంటి ఆర్టిస్తుల టాలెంట్ మనందరికి అర్హమైంది.
ఇక హిందీ నుంచి తెలుగుకి కూడా ఎక్కువ సంఖ్యలో (తమిళం తరువాతగా) సినిమాలు డబ్ చేయబడ్డాయి. నాటి జంబో, జంబో నగర (ప్రవేశం, రామభక్త హనుమాన్ నుంచి మొన్నటి (ప్రేమ పొవురాలు నిన్నటి 1ప్రేమ' 1ప్రేమతో' వరకు యెన్నో చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి.
డబ్బింగ్ రచయితలు మూలభావం చెడకుండా స్వతంత్రించి లిప్‌సింక్ (పెదవుల కదలికుకు తగ్గట్టుగా సంభాషణలు (వ్రాసి విజయవంతమైన సందర్భాలు చాలా వున్నాయి. అలాగే తెలుగులో తీసిన సినిమాల్జోని పాటలకంటే డబ్బింగ్ చిత్రాలలోని పాటలు సూపర్హీట్ అయిన సందర్భాలూ వున్నాయి.
శ్రీశ్రీ రాసిన సాహసమే జీవితపు బాటరా (కొండవీటిదొంగ),మనుష్యుడిలా మహానుభావుడే (గంధారి గర్వభంగం) ఆరుద్ర (వ్రాసిన యంజి.ఆర్. నటించిన అలీబాబా నలభై దొంగలు పాటలు సి. నారాయణరెడ్డి వ్రాసిన 'కర్ష చిత్రంలో “గాలికి కులమేది' మురిపించిన మువ్వలులోని 'నీ లీల పాడెద దేవా' వంటి పాటలు నేటికి అక్కడక్కడ వినిపిస్తూనే వుంటాయి.
తొలితరంలో శ్రీశ్రీ, ఆరుద్ర, అనిపెట్టి, మహారధి, గబ్బిట వెంకట్రావు డబ్బింగ్ చిత్ర రచయితలుగా వెలుగొందారు. డి.వి, నరసరాజు కర్ణ వీరపాండ్య కట్ట(బ్రహ్మన్న చిత్రాలకు రచన చేశారు. పాలగుమ్మి పద్మరాజు, మాగావు అమ్మిరాజు, విజయరత్నం గోపి కొన్ని చిత్రాలకు వ్రాశారు.
అయితే వందల సంఖ్యలో మాటలు, పాలు అలవోకగా, అర్థవంతంగా, అద్భుతంగా (వ్రాసి డబ్బింగ్ రచయితకు చిరునామా రాజశ్రీ అన్నంత విశిష్టమైన రచనలు చేశారు రాజశ్రీ. ఆయన వద్ద పనిచేసిన వసంతకుమార్, శ్రీరామకృష్ణ వెన్నెలకంటి, ఘంటసాల రత్నకుమార్, భారతీబాబు మొ॥వారు డబ్బింగ్ రచయితలుగా "పేరొందారు.
[71
గత మూడు సంవత్సరాలుగా 'త్రీరామకృష్ణు గాలి బాగా వీస్తున్నదని చెప్పాలి. రజనీకాంత్ నోటి వెంట వచ్చిన 'నేను ఒక్కసారి చెబితే వందసార్హు చెప్పినట్టే” 'నా దారి రహదారి" వంటి డైలాగులు జనంలో ప్రశంసలు పొందాయి.
సంగీతపరంగా పామర్తి. బి.గోపాలం చక్రవర్తి, చాంద్, కృష్ణమూర్తి, కృష్ణతేజ, ఘంటసాల విజయకుమార్ వంటివారు డబ్బింగ్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు.
డబ్బింగ్ ప్రక్రియలో అతి ముఖ్యమైన అంశం గాత్రదానం. అంటే ఇతర భాషలో ఏ రస (ప్రధానంగా భాష పలికిందో దానిని తు.చ. తప్పకుండ ఆ నటుని కంరస్వరానికి దగ్గరగా వుండేలా లిప్‌సింక్ చూసుకొని భావయుక్తంగా మాట్టాడగలగటం గొప్పకళ ఈ కోణంలో పరిశీలిస్తే ఆ రోజుల్లో 'మనోహర' చిత్రానికి శివాజిగణేషన్ పాత్రకు గాత్రధారణ చేసిన జగ్గయ్య గొంతు పాత్ర తాలూకు ఆవేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. ఆ చిత్రంలోని మాటలు రికార్డుల రూపంలోకూడా వచ్చాయి. ఆ తరువాత ఆయన శివాజీ నటించిన అనేక చిత్రాలకు గంభీర గాత్రాన్ని అందించారు. అయితే అదే శివాజీ కొంచెం వయసు మళ్ళిన 'కట్టబ్రహ్మన్న' పాత్ర ధరించినపుడు కె.వి.ఎస్. శర్మ ఆందుకు తగ్గట్టుగా మాట్టాడి శభాష్ అనిపించుకొన్నారు.
(ట్రాక్చేంజి పద్ధతిలో రూపొందిన రాజ్‌కపూర్ తీసిన 'ప్రేమలేఖలు" చిత్రంలో
రాజ్‌కపూర్‌కు కళా చంద్ర, ప్రాణ్ పాత్రకు ఎడిటర్ టి. కృష్ణ నక్లీస్ పాత్రకు కృష్ణకుమారి విజయలక్ష్మి పాత్రకు కమలాచంద్రబాబు వాయిస్ యిచ్చారు.
వల్లం నరసింహారావు నూటికి పైగా డబ్బింగ్ చిత్రాల్లో హీరో పాత్రలు ధరించిన యం,.జిఆర్.కు (అనగనగా ఒకరోజు, లోకం చుట్టిన వీరుడు) జెమినీ గణేశన్‌కు (విజయకోట వీరుడు, ఎవరబ్బాయి), జయశంకర్‌కు, ముత్తురామన్‌కు, రవిచంద్రన్‌కు, (ప్రేమ నజీర్‌కు తన గొంతుతో ప్రాణం పోసారు. వారి శ్రీమతి ఇందిర కొన్ని పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. తమిళంలో కె.ఆర్: విజయ, జయలలిత నటించిన ఎక్కువ చిత్రాలకు పార్వతి గాత్ర ధారణ చేశారు.
కొంతకాలం తెలుగులో చక్కని వాయిన్తో కధానాయికలుగా రాణించిన రోజారమణి, సరిత డబ్బింగ్ చిత్రాల్లో నాయికలకు గాత్ర ధారణ చేసి శభాష్ అనిపించుకున్నారు.
ఆ రోజుల్లో యం.ఆర్రాధా నటించిన విలక్షణ పాత్రలకు దశరధరామిరెడ్డి, చంద్రబాబు, తంగవేలు నటించిన హాస్యపాత్రలకు సత్యం, నాగేష్కు యీనాడు సంగీత చక్రవర్తిగా వెలుగొందిన అప్పారావు, విలన్ నంబియార్ పాత్రలకు చుండ్రు సూర్యనారాయణ, కొన్ని గంభీరభూమికలకు పి.జె.శర్మ, కాశీనాధ్తాతా తమ
172
గొంతుద్వారా నిండుదనాన్ని చేకూర్చారు. విలన్ పాత్రలకు భూసారపు వెంకటేశ్ళరరావు, వీరప్పన్ ధరించిన దుష్ట భూమికలకు డబ్బింగ్ రచయితగా పేరొందిన వసంత్ కుమార్, గయ్యాళి పాత్రలకు డబ్బింగ్ జానకి, కొన్ని పాత్రలకు గౌరిప్రియ, శిల్ప, విజయదుర్గ, జయశ్రీ, తెలుగులో నటిగా వెలుగొందిన టి.జి. కమలాదేవి, వీరమాచనేని సరోజని (దర్శకులు వి. మధుసూదనరావుగారి శ్రీమతి), ప్రమీల, మోదుకూరి సత్యం, రామకోటి డబ్బింగ్ ఆర్జిస్పులుగా పేరొందారు.
ఇప్పుడు తెలుగు ఆర్జిస్పులు కోట శ్రీనివాసరావు, రాళ్ళపల్లి, మల్లికార్జునరావు రంగనాథ్ వంటి వారు కూడా కొన్ని డబ్బింగ్ చిత్రాలకు వాయిస్ యిస్తున్నారు.
తెలుగుహీరోలు రాజశేఖర్, సుమన్‌లకు డబ్బింగ్ చెప్పిన సాయికుమార్ (ప.జె.శర్మ గారి అబ్బాయి) భావయుక్తంగా ఆవేశపూరితంగా డబ్బింగ్ డైలాగులు చెప్పటంలో దిట్ట. అతను నటించిన పోలీస్‌స్టోరీలో అతని పాత్రకు అతనే డబ్బింగ్ చెప్పుకోవటం యిందుకు చక్కని ఉదాహరణ.
ఆ తరువాత శ్రీనివాసమూర్తి యీమధ్యకాలంలో ఎన్నో చిత్రాల్లో హీరోలకు (ఉపేంద్ర) గాత్ర దానం చేశారు. తెలుగు చిత్రాల్ణో పాటలు వ్రాసి శబాష్ అనిపించుకొన్న యీతరం రచయితలు వేటూరి, భువనచంద్ర, జొన్నవిత్తుల కూడా డబ్బింగ్ చిత్రాలకు అర్ధవంతమైన గీతాలు (వ్రాస్తున్నారు.
అయితే నేటివిటీ లేకపోవటం వల్లనో కథాబలం లేకపోవటం వల్లనో, మెరుపు కలలు, ఇద్దరు వంటి కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డబ్బింగ్ నిర్మాతల అంచనాలు తారుమారు చేసిన సందర్భాలు వున్నాయి. సినిమా ప్రపంచంలో విచిత్రమైన పరిస్థితి ఒకటుంది. ఎవరూ మరొకర్ని చూసి పొరాలు నేర్చుకోరు. యెవరి పద్దతి వారిది. లేకపోతే ఎప్పుడైన ఊహించామా, ఇంగ్లీషు చిత్రాలలో సరాసరి ఆ చిత్రం తాలూకు తెలుగు (ప్రతి విడుదలకావటం, ఇప్పుడు ఆనాటి కళాఖండాలు హెలెన్ ఆఫ్ ట్రాయ్, క్రియోపా(త్ర, టెన్ కమాండ్మెంట్స్, బెన్హర్ వంటి చిత్రాల్ని యెవరైనా డబ్ చేసినా ఆశ్చర్యం లేదు.
ఈ ప్రక్రియ ఫలితంగా తెలుగులో తీసిన కొన్ని సినిమాలు తమిళ, హింది భాషల్లోకి డబ్ అయిన సందర్భాలుకూడా వున్నాయి. గత కాలంలో (1960-75) అటు విరలాచార్య తీసిన జానపద చిత్రాలు యిటు కృష్ణ హీరోగా తీసిన యాక్షన్ చిత్రాలు షూటింగ్ ప్రారంభం రోజునే తమిళంలోకి డబ్బింగ్ రైట్స్ కొనేవారు. అంతస్పీడుగా జరిగేది డబ్బింగ్ చిత్ర వ్యాపారం. నిర్మాతతో ఒక అంగీకారానికి వచ్చి ఇంత మొత్తం" లొ డబ్బింగ్ ప్రక్రియ పూర్తి చేసి యివ్వటానికి (స్కిస్ట్ తయారు
173
చేయటం, డబ్బింగ్ చెప్పించటం, పాటలు రికార్డ్ చేయించటం మొ! అన్ని అంశాలు) కాంట్రాక్టు కుదుర్చుకొని చకచకా డబ్బింగ్ ప్రక్రియ పూర్తిచేస్తున్నారు. అయితే యీ కాంట్రాక్టు పోటీ సృష్టించటం వలన కొంతవరకు క్వాలిటీ దెబ్బతినే (ప్రమాదం వుంది. అయితేనేం - కొంత మొత్తనికి పూర్తి చేయటం ఆ తర్వాత మరికొంత లాభానికి అమ్ముకోవటం, అవకాశం లేకపోతే ఫిలిం బాక్సుల్ని చూచుకుంటూ విధిని నిందించటం కూడా జరుగుతుంది. సెన్సార్ పూర్తి చేసుకొని నాటినుంచి నేటి దాకా విడుదలకు నోచుకొని డబ్బింగ్ చిత్రాలు సుమారు 200 దాకా వున్నాయంటేనే తెలుస్తుంది ఒక్కొసారి పరిస్టితి ఎంత భయంకరంగా వుంటుందో! కాగా యితర భాషలతో ఏ మాత్రం పరిచయంలేని సగటు (ప్రేక్షకుడికి ఆ సినిమా ఒరిజినల్స్ చూసి ఆనందించే అవకాశం వుండదుకాబట్టి యీ డబ్బింగ్ చిత్రాల పుణ్యమా అని యితర భాషా చిత్రాల దర్శకుల స్టాయిని, కధలన్థాయిని, సాంకేతిక విలువల్ని (ఉదా; విచిత్రసోదరుడు, భారతీయుడు, ఒకేఒక్కడు, (మ్రేమదేశం) చూసి ఆనందించగల్గుతున్నాడు. మన తెలుగువారి శక్తిసామర్థ్యాలను బేరీజు వేసుకుంటున్నాడు. నిజంగా యిది డబ్బింగ్ ప్రక్రియ సామాన్య (ప్రేక్షకుడికి యిచ్చిన ఒక వరం. న సినిమా పత్రికలు - జర్త్షలిజం సమాజం, రాజకీయం, (క్రీడలు, కళలు - ఏ రంగానికి చెందినవైనా సరే ఆ వివరాలల్ని, విశేషాల్ని, విశ్లేషించి ప్రజలకు అందించి వారిని చైతన్యపరచటమే ప(త్రికల యొక్క పాత్రికియులయొక్క పవిత్ర లక్ష్యం. అందుకే దానిని ఇంగ్లీషులో “ఫార్త్ ఎస్టేట్ అన్నారు, సహేతుకమైన విమర్శ నిర్మాణాత్మకమైన సూచన ప్రగతికి పునాది. ఇది పత్రికలయొక్క (ప్రధమ లక్ష్యం కాగా తెలుగు చలనచి(త్రసీమకు సంబంధించి టాక్సీలు (1931) ప్రారంభమైన ఏడు సంవత్సరాల తరువాతనే సినీ రంగానికి చెందిన వార్తలతో కూడిన పత్రిక అవళ్యకత గుర్తించి పసుమర్తి యజ్ఞనారాయణశా(స్త్రీగారి పెట్టుబడితో ఇంటూరి వెంకటేశ్చరరావు సంపాదకత్వంలో రాజమండ్రి నుంచి 1938లో “చిత్రకళ పత్రిక ప్రారంభించబడింది, రెండవ సంచిక వచ్చేసరికి యాజమాన్యానికి సంపాదకత్వానికి మధ్య, అభిప్రాయ భేదాలు రావడంతో సంపాదకత్వ బాధ్యతను స్వీకరించిన వ్యక్తి నేడు సీనియర్ సినీ ఆల్‌రౌండర్‌గా పేరొందిన పేకేటి శివరామ్, 174
సినీ నిర్మాణ ప్రక్రియలో దాదాపుగా ఆయనకు తెలియని అంశం అంటూ లేదు. ఆ పత్రిక కొంతకాలం కొనసాగింది. పేకేటిని 'ఆంధ్ర అబ్బాన్ అని ఇంటూరి ప్రశంసించారు.
ఒక విధంగా చెప్పాలంటే ప్రముఖ దర్శక నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం (సమదర్శి ప్రజామత) రచయిత తాపీ ధర్మారావు నాయుడు (జనవాణి) సముద్రాల రాఘవాచారి (ప్రజామత) పత్రికా ప్రపంచంలో పనిచేసి సినీరంగ ప్రవేశం చేసినవారే.
ఆ రోజుల్లో మచిలీపట్నం (బందరునుంచి) వెలువడే కృష్ణా పత్రిక (ఈనాటిక్తీ ఉన్న ఏకైక పత్రికలో సుప్రసిద్ధ దర్శకులు కమలార కామేశ్వరరావు, చిత్ర సమీక్షలు (వ్రాశారు. 1936లో పోటీగా ఒకే కథతో రెండు చిత్రాలు విడుదలయ్యాయి. హెచ్.ఎం, రెడ్డి నేతృత్వంలో హెచ్‌వి. బాబు దర్శకత్వంలో యడవల్లి సూర్యనారాయణ దుర్యోధనుడుగా నటించిన ద్రౌపది వ(స్తాపహరణం _ సినిమా హిట్ అయ్యింది. (ప్రముఖ రంగస్టల నటుడు బళ్ళారి రాఘవ నటించగా జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన (ద్రౌపది మానసంరక్షణ చిత్రం పరాజయం పొందింది. అయితే కామేశ్చరరావు తన సమీక్షలో విజయవంతమైన చిత్రం కంటే పరాజయం పొందిన “ద్రౌపది మానసంరక్షణ"”లో విలువలు ఎక్కువ, బళ్ళారి రాఘవ నటన ప్రశంసనీయం, అంతేకాకుండా “ద్రౌపది మానసంరక్షణ” అన్న టైటిల్లో పాజిటివ్ అప్రోచ్ ఉంది అని సమీక్ష వ్రాసి పంపగా తన చిత్రాన్ని సహేతుకంగా విమర్శించినందుకు హెచ్.ఎంగరెడ్డి సంతోషించి కామేశ్చరరావుని పిలిపించి దర్శకత్వశాఖలో చేర్చించారు. తరువాత ఆయన వాహిని సంస్టలోచేరి అనుభవం సంపాదించి కళాఖండాలు అని చెప్పుకోదగ్గ చిత్రాలు రూపొందించారు. అది ఆనాడు ఫిలిం జర్నలిస్టుకు దక్కిన అపూర్వ గౌరవం,
ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు బంధువు డిటెక్టివ్ నవలా రచయితగా పేరొందిన కొమ్మూరి సాంబశివరావు 1940లో 'తెలుగు సినిమా ప్రారంభించారు. ఆతరువాత వి. సీతారామయ్య సంపాదకత్వంలో “రూపవాణి” వెలువడింది. పి.ఎస్,ఆర్. ఆంజనేయశా[స్రి గోలకొండ అనే పత్రికకు సినిమా వార్తలు అందించేవారు. సినిమా వార్తలకోసం కేటాయించిన పేజీలలో షూటింగ్ జరుగుతున్న సినిమా వార్తలతోపాటు విడుదలయిన చిత్రాలపై (ప్రేక్షకులు పాఠకులు పంపిన సమీక్షల్ని కూడా (ప్రచురించేవారు.
1953లో విజయ కుటుంబానికి చెందిన బి.ఎన్‌కె. ప్రసాద్ 'కినిమా' అనే పత్రికను ప్రారంభించారు. అయితే అందులో వారి సంస్థకు చెందిన
75
చిత్రాల (చంద్రహారం) పబ్లిసిటీకి ఎక్కువ (ప్రాధాన్యత ఇవ్వటంతో అనతి కాలంలో అది కనుమరుగైపోయింది.
1954లో టి.వి.రామ్నాద్ నిర్వహణలో తెలుగులో సినిమారంగం, తమిళంలో
'పేసుంపడం, ఇంగ్లీషులో పిక్చర్పోస్టు ప్రచురించబడి, ఆ సినీ మాసపత్రికలు పారకుల అభిమానాన్ని చూరగొన్నాయి. అందులో షూటింగ్ జరుగుతున్న చిత్ర వివరాలు, చిత్ర సమీక్షలు, ప్రేక్షకుల అభిప్రాయాలు సినీరంగానికి చెందిన దర్శకులు సి.యస్.రావుచే చిత్రసీమలో చిదానందం పేరుతో వచ్చిన వ్యంగ్య పూరిత హాస్య రచనలు సీనియర్ పాత్రికేయుడు జి.విజి కృష్ణ ఆర్టికల్స్ పారకులను బాగా ఆకట్టుకున్నాయి. అందులో నటీనటుల రంగురంగుల ఫోటోలు కూడా పాఠకులని, ఆ నటీనటుల అభిమానుల్ని బాగా ఆకట్టుకున్నాయి.
1954లో గౌతమ్ రాజమండ్రిలో గౌతమి పత్రిక ప్రారంభించి, తరువాత దానిని మద్రాసుకు తరలించారు. ఇంకా తెలుగుటాకి మూడవదశకం (1951-60లో వెలువడ్డ సినిమాపత్రికలో చెప్పుకోదగ్గవి ఢంకా, విశ్వమోహిని, పెంకిపిల్ల,
ఈ దశకంలో ఫిలిం జర్నలిజానికి పత్రికలలో సినిమాలపట్ల ప్రేక్షకుల్లో చక్కని అవగాహన ఏర్పరచిన ఖ్యాతి ఆంధ్రపత్రిక సచిత్రవారప్రికకు దక్కుతుంది. అందులో విడుదలయిన సినిమాలపై ముళ్ళపూడి వెంకటరమణ అందించిన హాస్యవ్యంగ్య సమీక్షలు ఇటు పారకుల్ని అటు పరిశ్రమలోని సంబంధిత పెద్దల్ని ఎంతగానో ఆలోచింపచేశాయి. ఆ విమర్శలకు ఆపడప్పుడు బాపు వేసిన కార్టూన్లు తోడై కథను రంజుగా నడిపేవి. ఆ రకమైన సద్విమర్శలు తనను ఎంతగానో ఆలోచింపచేశాయని అక్కినేని నాగేశ్చరరావు పలు సభల్లో ఉదహరించారు. కాగా అప్పట్లో విడుదలయిన సినిమాల్జోని సంగీత సాహిత్యాలను 'సరాగమాల' పేరిట వి.ఎ.కె. రంగారావు సహేతుకంగా విశ్లేషిస్తూ (వ్రాసిన వ్యాసాలు ఎందరినో అలరించటమే గాక ప్రభావితం చేశాయి. ఈ రెండు రకాల ప్రక్రియలు గూడా ఆ పత్రికకు సినిమారంగంనుంచి వచ్చే ప్రకటనలకు ఏమాత్రం ప్రతిబంధకం కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ పత్రిక యాజమాన్యం సినిమారంగానికి చెందిన (ప్రకటనలకు తమ పత్రికలో వచ్చే సినిమా ఆర్జికల్సుకు ఎప్పుడూ వ్యాపారపరంగా ముడిపెట్టి చూడలేదు.
ఇప్పటి తరహా వేరు. చాలా పత్రికలు వేల, లక్షల రూపాయల్లో (ప్రకటనలు యిచ్చే సినిమా వారిని గురించి వారు తీసే సినిమాగురించి విమర్శించటానికి సాహసించరు. మధ్యేమార్గంగా తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న ధోరణిలో కొనసాగిపోతుంది వ్యవహారం. ఆప్పుడప్పుడు 'సితార'లో గుడిపూడి శ్రీహరి
176
వ్రాసే నిష్పాక్షిక చిత్ర సమీక్షలు, పాత గీతాల సంగీత సాహిత్యాలను విశ్లేషిస్తూ ఆ పాత(ట) మధురం పేరిట వార్త దినపత్రికలో రాజా బ్రాసే ఆర్టికల్సు పత్రికా (ప్రమాణాల విలువల్ని గుర్తు చేస్తుంటాయి.
మరలా ఒకసారి ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళితే గోటేటి శ్రీ రామారావు నడిపిన మధురవాణి, రమణమూర్తి కొరడా", శ్రీకృష్ణ 'మెరుపు, నరసింహారావు “చిత్ర, లక్ష్మీనారాయణ 'తుఫాను* ఇంటూరి వారి సినిమా పత్రిక కొంతకాలం వరకే మనగలిగాయి.
పి.ఎస్.ఆర్. ఆంజనేయళాస్త్రి నేత్రత్వంలో దినపత్రిక సైజులో 1975లో రాకూర్ వి. హరిప్రసాద్ ప్రారంభించిన 'సినిహెరాల్డ్ ' కూడా కొంతకాలంనడిచి ఆగిపోయింది.
కాగడా శర్మ సినిమాల్జోని శృంగారానికి సంబంధించిన స్టిల్స్ వేసి రసవత్తరమైన వ్యాఖ్యలు వ్రాసి కొంత కాలం దూషణ భూషణ తిరస్కారాలను సమభావంతో స్వీకరించి ముందుకు నడిచిన ధైర్యశాలి. మాగాపు రామన్ (ధ్వని), రామాచారి (నటన), ఉషశ్రీ (చలనచిత్ర), కొలను బ్రహ్మానందరావు (చిత్రసీమ) కొంతకాలం మాత్రమే నడపగలిగారు. వారికి సరిగ్గా అర్వర్మ్టైజ్మెంట్టు రాక (పోటీ గదా) వచ్చినా సరిగ్గా పేమెంట్సు జరగక ఆగిపోతప్పింది కాదు.
ఈ పుస్తక రచయితనైన నేనుకూడా 'సారధి' అనే కలం పేరుతో 1961 నుంచి ఏలూరు నుంచి వెలువడే యువరక్తం, రత్నగర్భ, స్నేహలత, బెంగుళూరు నుంచి వచ్చే ప్రజామిత్ర పత్రికలకు చిత్ర సమీక్షలు వ్రాసి సహేతుక విమర్శలు చేయగా వాటిని దర్శకులు కమలాకర కామేశ్చరరావు, ఆదుర్తి సుబ్బారావు, నటులు అక్కినేని నాగేశ్చరరావు, గుమ్మడి, లింగమూర్తి సహృదయంతో స్వీకరించిన సందర్భాలు ఉన్నాయి.
రచయిత్రి మాలతీచందూర్ భర్త ఎన్.ఆర్-చందూర్ నడిపిన జగతి పత్రికలో చివరిపేజీల్లో చిత్ర సమీక్షను (వ్రాసేవారు.
నెల్లూరుకు చెందిన డేగా రాధాకృష్ణమూర్తి సినిమా విడుదలకాగానే టాక్ని నిర్మాతలందరికి పోస్టు కార్డుపై బ్రాసి మద్రాసుకు పంపేవారు. తరువాత తరంగిణి అనే పత్రిక ప్రారంభించి కొంతకాలం నడిపారు. అలాగే సలీం బేగ్ చిత్ర జగత్తును, బి.ఏ.వి. శాండిల్య వెండితెర, దర్శకులు శ్రీధర్ చిత్రాలయ కొంతకాలం నడిపారు.
1966లో విజయవారు (ప్రారంభించిన విజయచిత్ర చాలాకాలం సినిమాపత్రికల్లో తలమానికంగా నిలిచింది. మంచి మంచి వ్యాసాలు, ఆర్టిస్టులు, టెట్టషియన్ల జీవిత
177
విశేషాలు, అందమైన ఫోటోలు, షూటింగ్ ముచ్చట్టు, విచిత్రమైన ప్రశ్నంజవాబులు, ఉండడమే గాక కొంతకాలం విజయా-వాహినివారు నిర్మించిన మల్లీశ్చరి, మాయాబజార్, గుండమ్మకథ, వంటి సినిమాల ్రిప్పనుకూడా (ప్రచురించారు. ఆ పత్రిక చాలా కాలం నటుడు, రచయిత అయిన రావి కొండలరావు సంచాలకత్వంలో విజయ వంతంగా నడిచింది. కారణాలు ఏమయినా ఆ పత్రిక కూడా విజయ నిర్మాణసంస్తలాగా వెనుకబడక తప్పలేదు.
1965లో వి. కోటేశ్చరరావు సినీజనత పత్రికను హైదరాబాద్‌లో ప్రారంభించి చాలా కాలం నడిపి (ఈయనకు ఫోటోస్టూడియోకూడా ఉంది) జనతా కోటేశ్చరరావుగా 'ప్రసిద్ధిపొందారు. ఆంధ్రపత్రిక ఫిలిం జర్నలిస్టు టి.ఆర్. శ్రీనివాస్, కొంతకాలం పి.ఆర్.ఓగా పని చేశారు. అలాగే కొందరుపాత్రికేయులు సినీ నిర్మాణ సంస్థలకు ఆర్టిస్టులకు పబ్లిక్‌రిలేషన్స్ ఆఫీసర్‌గా పనిచేసిన సందర్భాలున్నాయి. గత రెండున్నర దశాబ్దాలుగా సినీపత్రికా రంగం అనేకమైన మార్పులకు లోనైంది. ఈనాడు (గ్రూపుకు చెందిన సితార 1976లో (ప్రారంభమైంది. 1977లో ఆంధ్రజ్యోతి (గ్రూపుకు చెందిన జ్యోతిచిత్ర, తరువాత దశకంలో ఉదయం [గ్రూపుకు చెందిన శివరంజని (ప్రారంభమయ్యాయి. కొంతకాలం సితార సినిమా ఎవార్డులను, జ్యోతిచిత్ర సూపర్‌స్టార్ పోటీని నిర్వహించాయి.
కాలం తెచ్చిన మార్పులకు అనుగణగా ఈ పత్రికల్లో సెంటర్'స్పైడ్లు కలర్బ్లోఆప్లు అంటూ రకరకాల పద్దతుల్లో పబ్లీసిటి ప్రారంభమైంది. ఈ ధాటిని తట్టుకోవటానికి అంతకు ముందు వారానికి ఒక రోజు మాత్రమే సినిమా వార్తల్ని (ప్రచురించే దినపత్రికలు తప్పనిసరిగా ప్రతిరోజూ సినిమా వార్తల కోసం ఒక పేజీ కేటాయిస్తున్నారు.
సినిమా వ్యాపారరంగం. ఈ సత్యాన్ని (గ్రహించిన కొందరు సినిమా వ్యాపారాభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార పరమైన వివరాలను అందిస్తూ ట్రేడ్ గైడ్. మూవీ మార్కెట్, నెంబర్ వన్, బాక్సాఫీస్, మేఘసందేశం, సూపర్‌హిట్ వంటి ఎన్నో పత్రికలు రంగంలో కొచ్చాయి. క్రిటిక్, &ిపోర్టర్, జర్నలిస్ట్ అనే పదాలమధ్య భేదం దాదాపుగా తొలగిపోయింది. అలాగే ప్రతి పత్రికకు స్టిల్ ఫోటోగ్రాఫర్ల అవసరం కూడా పెరిగింది. (క్రియేటివిటికి ఎక్కువ అవకాశం పోటీ ఉంది. దమ్మున్న సరుకు ఎక్కడ వున్నా అమ్ముడుపోతుంది. అలాగే సత్తా వున్న జర్నలిస్టు ఎక్కడ వెళ్ళినా రాణిస్తాడు. ఇప్పుడు అందరి దృష్టి లేటెస్ట్ వార్తలపై పడింది. జరిగింది ఒక సినిమా (ప్రారంభోత్సవమే అయినా దానిని ప్రజంట్ చేసే విధానంలో ఎన్నెన్నో రచనా విన్యాసాలు. సన్నివేశాన్ని
178
కొత్తగాను ఆకర్షణీయంగాను విన్లేషంచగల జర్నలిస్టుల మేధస్సుకు పనికల్పిస్తుంది. ఇప్పటిదాకా తెలుగులో సినిమాల పరంగా వచ్చిన పత్రికలు సుమారు 150 ఉండవచ్చు. అయితే ఈ రోజున మనం చూడగలుగుతున్నవి కేవలం పాతిక లోపే. వీటిల్లో ఏవి ఎంతకాలం ఉంటాయో మరెన్ని కొత్త పత్రికలు వస్తాయో కాలమే నిర్ణయించాలి. అయితే ఈ సందర్భంలో ఒక విషయం (ప్రస్తావించక తప్పదు. ఇంగ్లీషులో దాదాపు అర్ర్హశతాబ్దం పైగా (ప్రచురించబడుతున్న స్కీన్, ఫిలింఫేర్ పత్రికలు-ఈనాటికి కాత్తపుంతలు తొక్కుతూ నిత్యనూతనంగా దక్షిణాది పారకులను సైతం ఆకర్షిస్తున్నాయి.
తెలుగు సినీ రంగానికి చెందినంతవరకు ప్రస్తుతం వున్న బిజీ రీత్యా ఒకో పత్రికకు కనీసం 10 మంది దాకా రిపోర్టర్లు ఉంటున్నారు.
ప్రస్తుతం సినీపత్రికా సంపాదకులుగా, -జర్నలిస్టులుగా, రిపోర్టర్లుగా. వివిధ పత్రికలకు మరియు ్రీలాన్సర్గా పనిచేస్తున్న వారిలో కొందరు... నిర్మాతగా మారిన సినియర్ జర్నలిస్టు వాసిరాజు ప్రకాశం, తుర్లపాటి కుటంబరావు,
ప్రసాద్: మోహన్ గోటేటి, ప్రభు, ఏ.బాల్‌రెడ్డి బి.ఏ. రాజు, ఎల్ బాబూరావు, తోటకూర రఘు, భగీరధ, బోసుబాబు, దేవరాజు రవి, గుడిపూడి శ్రీహరి, గిరిథర్, గంగాధర్; జగన్, కౌండిన్య, కె.ఎల్. కుమారస్వామి, మోహన్‌రావు, నాగేంద్ర ప్రసాద్, నారాయణరాజు, ఓంప్రకాష్ రాజా, పాత్రికేయ పద్మనాభశర్మ పెద్దాడ మూర్తి కాలికపూడి రవి, రవికుమార్; రామారావు, రాఘవ, కొండేటి సురేష్స్ ఎన్. సుబ్బారావు, కె. ఉమామహేశ్చరరావు, ఉడయవర్హు, వినాయకరావు, ఐ. అర్జునరావు, ఫిలిం న్యూస్ ఆనందన్, పీ. హర్నాద్, జగన్: జగన్మోహన్, డి. నారాయణవర్మ, ' మణిగోపాల్, ఎం.ఎల్. నరసింహం, ప్రమోద్‌కుమార్, పసుపులేటి రామారావు, బి. శ్రీనివాసరావు, ఐ. శళిమోహన్, వ్యాస్చంద్, వెలది రఘుకుమార్, బి. జయ, పాటిబండ్ల విజయలక్ష్మి ఉమర్జి కుమరన్ మొదలగువారు.
ఫోర్త్ ఎస్టేట్‌గా ప్రవచించబడిన పత్రికారంగంలో రాజకీయ సామాజిక సాంఘిక సంస్కరణల కోసం పత్రికలు ఎలా కృషి చేస్తాయో అదే విధంగా సినిమా పత్రికలు మంచి చిత్రాల మనుగడకు సినీరంగ ప్రగతికి కళల ద్వారా సామాజిక చైతన్యానికి ఇతోధిక కృషి చేయడం సమంజసం.
179
ఫిలిం సాసైటీలు - చలనచిత్రోత్సవాలు వ్యాపార దృక్పధం, లాభాపేక్ష లేకుండా, సాంఘిక, సామాజిక, లలిత కళల ప్రగతికి దోహదం చేసే విధంగా ఏడుగురుకంటే తక్కువగాకుండా ఉండే వ్యక్తులు ఒక సొసైటీ (సమాఖ్య) గా ఏర్పడి ఇండియన్ సొసైటీస్ రిజిస్టేషన్ చట్టం (ప్రకారం రిజిథ్ర్రేషన్ చేయుంచుకొని తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ఉత్తమ (ప్రమాణాలతో నిర్మించిన సహజ చిత్రాలను ప్రోత్సహించి, ప్రదర్శించి సభ్యులకు ఆ చిత్రం తాలూకు విలువలను తెలిపే సదుద్దేశంతో ఫిలిం సొసైటీలు ఆవిర్భవించాయి. అవి దేశ విదేశాల్లో నిర్మించబడిన కళాత్మక చిత్రాలను సభ్యులకు ప్రదర్శిస్తూ ఉంటాయి. భారతదేశంలో మొట్టమొదట 1937లో బొంబాయిలో 'అమెచ్య్యూర్ సినీసొసైటి' నెలకొల్పారు. అది విజయవంతం కాలేదు. భారత సినీ చరిత్రలో తన దర్శకత్వంలో నిర్మించిన చిత్రాలతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సత్యజిత్ రే 1947లో కొందరు మిత్రులతో కలిసి కలకత్తాలో “కలకత్తా ఫిలిం సొసైటీ” (ప్రారంభించారు. నెలకు లేక మూడు నెలలకు లేక సంవత్సరానికి సొసైటీ నిర్ణయించిన మొత్తాన్ని సభ్యులు చందాగా కట్టవలసి వచ్చేది. కలకత్తా సొసైటీ విజయవంతంగా నడిచి, సభ్యుల (ప్రోత్సాహం బాగా ఉండడంతో దానికి ప్రాచుర్యం లభించి, ఆ తరహా సొసైటీలు మద్రాసు, పొట్టా, బొంబాయి, ఢిల్లీ నగరాలలో (ప్రారంభించటం, అలా ప్రారంభమైన సొసైటీలు అన్నీ కలిసి అఖిల భారత స్థాయిలో “ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం సొసైటీస్ అఫ్ ఇండియా” అనే ఒక సమాఖ్యగా ఏర్పడడం, దానికి ప్రభుత్వ గుర్తింపు లభించి ఆర్థిక సహాయం అందించి వినోదపు పన్ను మినహాయింపు యివ్వటం జరిగిన చరిత్ర. దాంతో ఈ సొసైటీలు ప్రతి రాష్ట్రంలోను దాదాపు అన్ని ముఖ్య నగరాల్లో ప్రారంభించబడి కళాత్మక చిత్రాల్ని, సహజత్వం గల చిత్రాల్ని దేశ విదేశాలకు చెందిన వాటిని ప్రదర్శించేవారు. అయితే ఏది కళాత్మక చిత్రం, దానికి కొలబద్ద ఏమిటి అన్న మీమాంస నాటినుంచి నేటిదాకా అందుకు సంబంధించిన వారందరికీ కలుగుతూనే ఉంది. ఒకవైపు ఆర్ట్ ఫిలింస్‌కు ప్రోత్సాహం అంటూనే యీ సొసైటీలు నిర్వహించే కార్యక్రమాలకు కమర్షియల్‌గా పేరొందిన కళాకారుల్ని ఆహ్యానించడం కొంత వింతగానే కనిపిస్తుంది. ఒక సమావేశంలో ప్రసంగిస్తూ , అక్కినేని నాగేశ్చరరావు “సినిమాల్లో ఇతర విశ్లేణలకన్నా మిన్నగా చెప్పాలంటే చిత్రాల్లో రెండే రెండు రకాలున్నాయి. ఒకటి మంచి చిత్రం, రెండోది చెడ్డ చిత్రం” అంటూ వివరణ ఇవ్వటం గమనార్హం, 180
ఆ చర్చ అలా ఉంచితే యావద్భారత దేశంలో సుమారు 200 సైగా ఫిలిం సాసైటీలు ఏర్పడి, అఖిల భారత సమాఖ్య యొక్క గుర్తింపు పొందాయి. సమాఖ్య నిర్వహణకు సభ్యులైన సొసైటీలు కొంత చెల్లించాల్సి వచ్చేది. సభ్యుల నుంచి వసూలైన సభ్యత్వ రుసుములో కొంత భాగం దీనికి జమ చేయబడింది. ఈ ఫిలిం సొసైటీలు పరస్పర అవగాహనతో పూనాలోని నేషనల్ ఫిలిం ఆర్కీవ్స్ సహాయంతో కొన్ని విలువైన చిత్రాలు ప్రదర్శించేవి. విదేశాలనుంచి వచ్చిన కొన్ని చిత్రాలకు సెన్సార్ మినహాయింపు కూడా యిచ్చింది కేంద్ర ప్రభుత్వం. మలయాళ ఎవార్డు చిత్రాల దర్శకుడు ఆదూరి గోపాలకృష్ణ ప్రముఖ నటుడు కమలహాసన్, ప్రఖ్యాత దర్శకులు మృణాళ్స్న్, గౌతమ్ ఘోష్ శ్యాం బెనగల్, బాసూ ఛటర్జీ, ఆపర్ఞాసేన్; ఆంధ్రాకు చెందిన నిర్మాత దర్శకుడు బి. నర్సింగరావు ఈ సొసైటీలతో సన్నిహిత సంబంధం కలిగి, వాటి మనుగడకు, ప్రగతికి కృషి చేసినవారే.
సభ్యుల సంఖ్య మీద ఆధారపడి యీ సొసైటీలు నడిచేవి. (ప్రోత్సాహం లేనిచోట్ల మూలపడి, మూతపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఆంధ్రలో గుంటూరు, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, కావలి, బాపట్ట, విశాఖపట్నం, భీమవరం, ఏలూరు, అనకాపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట మొదలగుచోట్ల ఫిలిం సొసైటీలు నిర్వహించారు.
, ఈ పుస్తక రచయితనైన నేను కూడా నాలుగు సంవత్సరాలు (1977-81) ఏలూరు ఫిలిం సొసైటీకి కార్యదర్శిగా ఉండి “రోమన్ హాలిడే, “బైసికిల్ ధీఫ్*, “క్రేన్స్ ఆర్ స్రెయింగ్”, “'హంసగీతే”, “ఘట శ్రాద్ధ", “దిక్కట్ర పార్వతి”, “చారంగీలేన్, పధేర్పాంచాలి' వంటి పలు చిత్రాలను సభ్యులకు అందించటమే గాక 'ఎఫిసోన్యూస్' పేరిట ఒక పత్రికను నడిపి, అందులో చిత్ర కధా వివరాలను, అవి సాధించిన విజయాలు, పొందిన గౌరవాలు సభ్యులకు తెలియచేసేవాణ్ణి
వీలైనప్పుడల్లా ఎక్కడో ఒకచోట సమాఖ్య పరంగా సమావేశాలు జరిపి సాధకబాధకాలు చర్చించుకునేవారు.
కరీంనగర్లో ఏర్పడ్డ ఫిలిం సొసైటీ అక్కడి కలెక్టర్ సహాయంతో సభ్యుల ఉత్సాహంతో సొంతంగా ఒక అడిటోరియమ్ నిర్మించుకొని దానిలో చిత్ర ప్రదర్శన ఏర్పరచుకోవడం నిజంగా గర్వించదగ్గ విశేషం. ఐ.ఎస్కె. దేవరాయలు, కాట్రగడ్డ నరసయ్య నిర్వహణలో విజయవాడ ఫిలిం సొసైటీ చాలా కాలంనుంచీ నడుస్తున్నది.
ముఖ్యంగా ఈ ఫిలిం సొసైటీలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల నిర్వహణ సందర్బంగా గణనీయమైన సేవలు అందిస్తున్నవి.
181
"హైదరాబాద్‌లోని “హైదరాబాద్ ఫిలిం క్షబో' యీ మేరకు కృషి చేయటమేకాక అవకాశం దొరికినప్పుడు చిత్రోత్సవాలను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం (1999) జనవరిలో జరిగిన అంతర్జాతీయ చలనచి(త్రోత్సవంలోను, అక్టోబర్‌లో జరిగిన క్లబ్ వార్షికోత్సవ సందర్పంలోను, నవంబర్‌లో జరిగిన బాలల చిత్రోత్సవ సందర్భంలోను ఎంతగానో తన సేవలను అందించింది. ఈ దిశగా సహజ చిత్రాల దర్శకుడు బి.నరసింగరావు చేసిన కృషి ప్రశంసనీయం.
ఈ అంతర్జాతీయ చలనచి(త్రోత్సవాల్గో5్-10 నిమిషాల వ్యవధి గల డాక్యుమెంటరీల నుంచి పలు దేశాలకు చెందిన కధాచిత్రాలు రకరకాల విభాగాల్లో (పనోరమా, మెయిన్స్టీమ్) (ప్రదర్శించేవారు. ఈ చిత్రోత్సవ ముఖ్యోద్దేశం సాంస్కృతిక పరంగా దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపాందించటం, సొంకేతిక విలువల్ని అర్దం చేసుకోవటం. అయితే ఫిలిమోత్సవం వచ్చిందంటే చాలు - ఏదో హడావిడీ, వెంటనే ఆ ప్రదర్శించిన చిత్రాల్లో ఏదైనా మంచి పాయింట్ ఉంటే దాన్ని జాతీయం చేసేద్దాం అనే భావన ఎక్కువ మందికి ఉందేమో అన్న (భ్రమ కలిగించిన సందర్భాలు లేకపోలేదు. ఈ చలనచిత్రోత్సవాల్లో ఒకవిధంగా అంతర్జాతీయ మార్కెట్‌కు చెందిన సినిమా పరమైన లావాదేవీలు జరగటానికికూడా ఆస్కారం ఉంది. సంస్కారంతో కొందరు కధలు నచ్చితే నిజాయితీగా ఆ నిర్మాతలతో మాట్లాడి హక్కులు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తొలిసారిగా 1952లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను న్యూఢిల్లీలో నిర్వహించారు. కాలక్రమేణా ఒక్కో రాష్ట్ర రాజధానిలో ఈ ఫెస్టివల్స్ ఆయా రాష్ట్రవ్రభుత్వాల నవాకారంతో నిర్వపొంచబడ్డాయి. వీటినే 1975 నుంచి 1988 వరకు ఫీలిమోత్సవ్ అనే పేరుతో నిర్వహించారు. ఆ వివరాలను పరిశీలిస్తే..........
1వ సెస్టివల్ 1952లో - 2న ఫెస్టివల్ 1961లో - 3వది 1965లో - శీవది 1969లో - 5వది 1975లో - 6వది 1977లో - 7వది 1979లో - 8వది 1981లో - 9వది 1983లో - 10వది 1985లో - 11వది 1987లో నిర్వహించారు. ఇవన్నీ దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించబడ్డాయి.
ఒక్కోసారి ఒక్కో నగరంలో ఈ ఉత్సవాలు చేయటం సబబని నిర్ణయించిన ఫలితంగా 1975 ఫిల్మోత్సవం ఢిల్లీలో, 1976లో బొంబాయిలో, 1978 మద్రాసులో, 1980లో బెంగుళూరులో, 1982లో కలకత్తాలో, 1984లో బొంబాయిలో, 1985లో హైదరాబాద్‌లో నాటీ ముఖ్యమంత్రి యన్. టి. రామారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
182
ఆ తరువాత చిత్రోత్సవాలు - త్రివేండ్రం (1988), న్యూఢిల్లీ (1989), కలకత్తా (1990), మద్రాసు (1991), బెంగుళూరు (1992), న్యూఢిల్లీ (1993), కలకత్తా (1994), బొంబాయి (1995), న్యూఢిల్లీ (1996), తిరువనంతపురం (1997), న్యూఢిల్లీ (1998), హైదరాబాద్‌లో సహ(స్రొబ్టెలో చివరి చిత్రోత్సవం 1999 జనవరిలో నిర్వహించారు.
ఈ సంవత్సరం నవంబర్ నెలలో ప్రభుత్వ నిర్వహణలో హైదరాబాద్‌లో బాలల అంతర్జాతీయ చలనచిత్రోత్సవం నిర్వహించింది.
అయితే యీ ఉత్సవాలు మహానగరాలకే పరిమితం కాకుండా జిల్లా కేంద్రాలకు కూడా విస్తరిస్తే బాగుంటుందనే సూచనలు కూడా వచ్చాయి.
మన తెలుగులో నిర్మించబడి విదేశాల్లో నిర్వహించబడిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పాల్గొని ప్రశంసలు పొందిన సందర్భాలుకూడా ఉన్నాయి.
ఆ వివరాల్ని పరిశీలిస్తే . ..
వాహినీ వారి “స్వర్గసీమ” చిత్రం వియత్నాంలో ప్రదర్శించబడింది.
యునెస్కో ఆధ్వర్యంలో పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొని (ప్రశంసలు పొందిన చిత్రం “త్యాగయ్య”. దీనిని నాగయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మించి, కధానాయక పాత్ర పోషించారు.
ఈస్ట్-ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ "పెకింగ్ (వైనా)లో ప్రదర్శించబడ్డ చిత్రం వాహినీవారి “మల్లీశ్చరి”.
శంభూ ఫిలింస్ వారు నిర్మించిన “నమ్మినబంటు” చిత్రం శాన్సెబాస్టియన్ (స్పెయిన్) లో జరిగిన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. గాంధీ చిత్ర నిర్మాత రిచెర్డ్ ఎటిన్బరో ఎంతగానో ఆ చిత్రాన్ని, గుమ్మడి నటనను ప్రశంసించారు.
రాజ్యం పిక్చర్స్ నిర్మించిన “నర్తనశాల” చిత్రం జకార్తాలో జరిగిన చిత్రోత్సవంలో పాల్గొనగా, కీచకపాత్ర ధరించిన యస్.వి, రంగారావు ఉత్తమ నటుడిగా, టి.వి.యస్. శర్మ ఉత్తమ కళాదర్శకునిగా బహుమతులు పొందారు. “కీలుబొమ్మలు” చిత్రం (సి.యస్. రావు) రష్యాలో (ప్రదర్శించారు. ఇంకా “సీతాకళ్యాణం” (బాపు) లండన్‌లోను, “నిమజ్జనం” (బి. యస్. నారాయణ) పోలెండ్లోను, “అను[గ్రహ” (శ్యాంబెనగల్ హాంకాంగ్‌లోను, “మాభూమి” (గౌతమ్ఘోమ్ కార్టోవివారిలోను, అదే ఫెస్టివల్లో మృణాల్‌సేన్ తీసిన “ఒక ఊరికధ” (ప్రదర్శించబడి ప్రశంసలు పొందాయి.
ఈనాడు సహజ చిత్రాలు తెలుగులో రావటం లేదని విమర్శించే వారికి మన
183
తెలుగు వాళ్లు ఆ తరహా చిత్రాలు తీయలేరని వాదించే వారికి యాభైఏళ్ళ కిందట గూడవల్లి రామబ్రహ్మంగారు. నిర్మించిన “మాలపిల్ల”. “రైతుబిడ్డ” చిత్రాలు, యన్.టి. రామారావు నిరి గంచిన “తోడుదొంగలు” చూస్తే మన తెలుగు దర్శకుల సత్తా ఏమిటో తెలుస్తుంది. ఏమైనా ఫిలిం సొసైటీలు కళాత్మక దృష్టితో తీసిన సహజ చిత్రాల్ని ప్రమోట్ చేయటానికి కొంతవరకు సహకరిస్తున్నాయి అన్నమాట నిజం. ఈ సొసైటీలు కూడా సినిమాలకు సంబంధించి పలు సెమినార్డు, రిఫ్రెష్ కోర్సులు నిర్వహించి సభ్యుల్లో మంచి చిత్రాలపట్ల సదవగాహన కలిగించటానికి ప్రయత్నిస్తున్నాయి. దానితోపాటు సమాజాన్ని పెడదోవ పట్టిస్తున్న చిత్రాల్ని నిరసించటానికి కూడా కృషి చేస్తే కొంతవరకు ప్రయోజనం ఉండవచ్చు. ఒకవేళ అవి కొంతవరకు సఫలీకృతమైనా చిత్ర విచిత్ర విన్యాసాలతో (ప్రేక్షకుల్ని ముఖ్యంగా యువతను ఉర్రూతలూగిస్తున్న విదేశీ ఛానల్ టి.వి. చిత్రాల్ని నియంత్రించటం అసాధ్యమే! మంచిని చెడుని కూడా సమంగా ప్రదర్శించే సినిమా చాలా శక్తిమంతమైన మాధ్యమం. రెండువైపులా పదునుగల కత్తి. దాని (ప్రభావం ఏమిటో, ఎంతవరకో కాలమే నిర్ణయిస్తుంది. క జ సినిమా పరిశ్రమ - ప్రభుత్వం సినిమాకు సంబంధించి ముఖ్యమైన ప్రధాన విభాగాలు మూడుగా చెప్పుకోవాలి. అవి చిత్ర నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన. మొదటగా నిర్మించిన చిత్రం 'భక్త ప్రహ్హాద' కాగా అంతకు ముందే మూకీ చిత్రాలు తయారుకావటం వల్ల వాటిని ప్రదర్శించటానికి తొలిసారిగా 1921లో విజయవాడలో పోతిన శ్రీనివాసరావు “మారుతీ టాకీస్” నిర్మించారు. ఇప్పుడు ఆంధ్రదేశంలో సినిమా ప్రదర్శనశాలలు వేల సంఖ్యలో వున్నాయి. పల్లెటూళ్లలో వుండే టూరింగ్ టాకీస్ నుంచి మహానగరాల్లో అన్ని సౌకర్యాలతో లేటెస్ట్ టెక్నిక్‌తో అద్భుతమైన సౌండ్ సిస్టమ్‌తో నిర్మించబడ్డాయి. నిర్మించిన చిత్రాలను ఈ ధియేటర్లకు అందజేసే బాధ్యత పంపిణీ దారులు తీసుకుంటారు. విశాఖపట్నంలో ముందుగా జి. కె, మంగరాజు 1934లో విశాఖపట్నంలో క్వాలిటీ పికృర్ సంస్థను, 1936లో విజయవాడలో పూర్ణా పిక్చర్స్‌ను స్థాపించారు. ఆ తర్వాత చమ్రియా, రాజశ్రీ, నవయుగ, విజయ, లక్ష్మీ ఫిలింస్, ప్రీమియర్ వంటి పలు పంపిణీ సంస్తలు రావటం, కాలక్రమేణా జిల్హాల వారీగా (క్రయ విక్రయాలు జరగటంతో ఉషా పిక్చర్స్, పద్మావతి పిక్చర్స్, జగపతి ఫిలింస్ 184
డిస్ట్రిబ్యూటర్స్ వంటి పంపిణీ సంస్థలు జిల్దాకు కనీసం పది నుంచి నలభై దాకా వెలసిన సందర్భాలున్నాయి. అటు నిర్మాణ రంగంలో, ఇటు పంపిణీ (ప్రదర్శన రంగాల్లో లక్షకు మించిన సిబ్బంది పనిచేస్తున్నారు. అంటే లక్షలాది కుటుంబాలకు ఈ సినిమా పరిశ్రమ పరోక్షంగా జీవనోపాధి కల్పిస్తుంది. కోట్టాది రూపాయలు వినోదం పన్ను రూపేణా ప్రభుత్వ ఖజానాకు జమపడుతున్నాయి.
గతంలో దక్షిణ భారతదేశంలో పలు భాషలకు చెందిన చిత్రాల నిర్మాణానికి కేంద్ర స్థానం మద్రాసు కాగా కాల(క్రమేణా కన్నడ చిత్రాలు బెంగుళూరు, మైసూరులోను, మలయాళ చిత్రాలు త్రివేండ్రంలోను నిర్మితమవటం మొదలెట్టాయి. 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక హైదరాబాద్‌లో సారధీ ఫిలింస్ వారు సారధీ స్టూడియోస్ నిర్మించగా అందులో తీసిన మొదటి తెలుగు చిత్రం నవశక్తి వారి “మా యింటి మహాలక్ష్మి”. తరువాత సారధీ వారి చిత్రాలే అందులో నిర్మించారు తప్ప బయటి నిర్మాతలు మద్రాసు నుంచి వచ్చి హైదరాబాదులో సినిమాలు తీయటానికి అంతగా ఆసక్తి చూపలేదు. అయినా మన రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోరుతూ అందుకోసం తీసుకోవలసిన చర్యల్ని వివరిస్తూ దుక్కిపాటి మధుసూదనరావు ప్రభృతులు నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రిగా గల (ప్రభుత్వానికి ఒక మెమోరాండం సమర్పించారు. 1962 ప్రాంతంలో మద్రాసు సినీ పరిశ్రమలో సమ్మె జరగటం వలన అన్నపూర్ణా వారి “చదువుకున్న అమ్మాయిలు” చిత్రం హైదరాబాదు సారధీ స్టూడియోలో నిర్మించారు. పైన పేర్కొన్న మెమొరాండం పరిశీలించిన నీలం సంజీవరెడ్డి రాష్ట్రంలో చిత్రాల నిర్మాణం ప్రోత్సాహకరంగా ఉండాలంటే తీసుకోవలసిన చర్యల గూర్చి ఒక సబ్- కమిటీని వేసారు. అందులో ఆనాటి మంత్రులు మర్రి చెన్నారెడ్డి కాసు బ్రహ్మానంద రెడ్డి పి.విినరసింహారావు సభ్యులు,
అప్పట్లో మద్రాసు నుంచి హైదరాబాదు వచ్చి సినిమా తీస్తే మామూలుగా అయ్యే ఖర్చు కంటే అదనంగా 75 వేలు అవుతుంది. అందులో 50 వేలు ప్రభుత్వం సబ్బిడీగా ఇస్తే మిగతా పాతికవేలు రాష్ట్రాభిమానంతో నిర్మాతలే భరించాలి. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడి 1965 నుంచి అమలులోకి వచ్చాయి. (ప్రముఖ హీరో అక్కినేని నాగేశ్వరరావు తన మకాం హైదరాబాదుకు మార్చగా ఆయనతో చిత్రాలు తీసే పి,ఏ.పి., జగపతి, అన్నపూర్ణ, పద్మశ్రీ వారు తమ చిత్రాలను హైదరాబాదులోనే నిరికైచారు. ఆ తరువాత జలగం వెంగళరావుగారు ముఖ్యమంత్రిగా ఉండగా సబ్సిడీ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచారు. జుతీయ స్థాయిలో నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నట్టే ఆంధ్రాలో రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస ప్రభుత్వపరంగా ప్రారంభమైంది. అయితే ఆ సంస చిత్ర నిర్మాణాలకంటే
185
ముఖ్యంగా ధియేటర్ల నిర్మాణానికి తగిన బుణాలు మంజూరు చేయటానికి ప్రాధాన్యమిచ్చింది.
ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, ఆయన చిత్ర పరిశ్రమ అభివృద్దికి సహకరిస్తాననటం, వెంటనే దుక్కిపాటి మధుసూదనరావు అధ్యక్షతన ఫిలింనగర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఆవిర్భవించటం, అందులో ఫిలిం పరిశ్రమకు చెందిన వివిధ వర్గాల వారికి ప్రభుత్వం ఇండ్ల స్థలాలు మంజూరు చేయటం జరిగింది. చెన్నారెడ్డి గారి హయాంలోనే ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అవతరించింది.
ఇలా ఉండగా అంజలి పిక్చర్స్ వారి “మహాకవి క్షేత్రయ్య” నిర్మాణానికి సారధిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో కన్నడ రాష్ట్రంలో ఆ సినిమా తీయాల్సి రావడం గుర్తించిన హీరో నాగేశ్వరరావు హైదరాబాద్‌లో స్వంతంగా స్టూడియో నిర్మించాలని స్థిర నిర్ణయానికి రావటం, రికార్డుటైంలో “అన్నపూర్ణా స్టూడియో” నిర్మించటం జరిగింది. మరో అ(గ్రనటుడు ఎన్టీరామారావు కూడా రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్దిని ఆశించి “రామకృష్ణ స్టూడియో” నిర్మించారు. ఇవి రెండూ -అంతకు ముందే ఉన్న సారధి, భాగ్యనగర్ స్టూడియోస్ - వీటిల్లో చిత్రాలు నిర్మించబడ్డాయి.
భవనం వెంకట్రామరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో బుణాన్ని మంజూరు చేయగా హీరో కృష్ణ “పద్మాలయా స్టూడియో” నిర్మించారు. ప్రతాప్ ఆర్ట్స్ అధినేత రాఘవ ఒక డబ్బింగ్ థియేటర్: ఎల్.వి. ప్రసాద్ గారు ఆధునిక సౌకర్యాలతో కూడిన ఫిలిం లాబొరేటరీ నిర్మించారు. ఆ తర్వాత రామానాయుడు స్టూడియో, రామోజీ ఫిలిం సిటీ, శబ్బాలయా రికార్డింగ్ థియేటర్ నిర్మించబడ్డాయి.
ఇక సబ్సిడీల పర్వం చూస్తే 1984లో లక్షరూపాయల మొత్తాన్ని రెండు లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ఒక లక్ష రూపాయలు నేరుగా నిర్మాతకు అందించటం, మిగతా లక్ష రూపాయలు స్టూడియో, రికార్డింగ్ ధియేటర్ మొదలైన ఇన్'ప్రాస్టక్సర్ వాడుకున్నందుకు వారికి చెల్లించటం దాని సారాంశం.
నిర్మాణ వ్యయభారం పెరగటం రీత్యా 1989లో సబ్సిడీ మొత్తాన్ని మూడు లక్షలకు పెంచారు. పరిశ్రమకు చెందిన యన్. టి. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పైన పేర్కొన్న సబ్సిడీలు రెండుసార్లు పెంచారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి చం(ద్రబాబు నాయుడు హయాంలో ఉత్తమ బాలల చిత్రానికి ఐదు లక్షలు, చిన్న నిర్మాతలకి ఇచ్చే సబ్సిడీని 10 లక్షలకు పెంచారు. ఉత్తను కుటుంబ చిత్రంగా ఎంపికైన దానికి ప్రత్యేకంగా 5 లక్షలు ఇచ్చేందుకు ఏర్పాటు జరిగాయి. ఎక్కువ శాతం షూటింగ్ రాష్ట్రంలో జరగాలి,
186
కొంత శాతం రాష్ట్రం వెలుపల తీసుకొనవచ్చు. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో తెలుగు సినిమా పరిశ్రమ దారుణమైన సంక్షోభంలో పడిపోయింది. పరిశ్రమ అభివృద్దికి చిన్న నిర్మాతలు కొన్ని సూచనలు ఇవ్వటం, పెద్ద నిర్మాతలు (అంటే పెద్ద హీరోలతో సినిమా తీసేవాళ్లనవచ్చునేమో[) అందుకు భిన్నమైన సూచనలు ఇవ్వటం, వేచిచూద్దామనే పద్దతుల్లో ప్రభుత్వం ఉండి ఇటీవల కొన్ని నిర్ణయాలు తీసుకొని బడ్జెట్లో తీసిన మంచి చిత్రానికి 10 లక్షలు సబ్సిడీ ప్రకటించటం జరిగింది. అయితే ఈ మంచి అన్నదానికి కొలబద్ద ఏమిటి, ఎవరు నిర్షయిస్తారనేది వెంటనే వచ్చే ప్రశ్న. అది అలా ఉంచితే కొంచెం లోతుగా పరిశీలిస్తే వివిధ భాషల్లో గత 15 ఏండ్లుగా నిర్మించబడ్డ చిత్రాల స్థితిగతులు ఇలా ఉన్నాయి :
సంవత్సరం _ 1985 1990 1993 _ 1998
హిందీ 185 200 183 125
కన్నడం 69 క! 78 72
తమిళం 190 194 168 87
తెలుగు 198 204 148 70
'పైన ఉదాహరించిన అంకెల్ని (సుమారుగా) పరిశీలిస్తే ఒక్క 1990 సంవత్సరంలో భారతదేశంలో రికార్డు స్పాయిలో 204 చిత్రాలను తెలుగులో నిర్మించారు. గత సంవత్సరం ఆ సంఖ్య 70కి అంటే సుమారు మూడోవంతుకు పడిపోయింది. హిందీ, తమిళ చిత్ర రంగాల్ని మినహాయించి చూస్తే కన్నడ రంగం కొద్దిపాటి ప్రోత్సాహకరంగా కన్పిస్తుంది. దానికి కారణం అక్కడ వున్న సబ్సిడీ విధానం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే - ఇతర భాషల్లో నిర్మించిన చిత్రాలు కన్నడ దేశంలో ప్రదర్శించవచ్చు. కానీ ఇతర భాషలనుంచి కన్నడంలోకి చిత్రాలు డబ్బింగ్ చేయరాదు. ఆ నిర్ణయం కొంత వరకు కన్నడ చిత్ర పరిశ్రమను ్రతికించిందనే చెప్పాలి. మన తెలుగు చిత్రం నిర్మాణ వ్యయం గురించి ఒకసారి ఆలోచిస్తే 1985లో ఒక అ(గ్రనటుడుతో సినిమా తీయాలంటే సినిమాకి అయ్యే సుమారు ఖర్చు 90 లక్షలు. అదే 1991లో కోటి 80 లక్షలు, 1994లో మూడు కోట్టు, ఈ రోజు కనీసం 5 కోట్టు. దీనికి ఎవరు బాధ్యులు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న
బడ్జెట్ సినిమాల గూర్చి ఆలోచిస్తే మార్కెటింగ్ ప్రభావం ప్రధానంగా ఎదురయ్యే సమస్య. ఏది తీస్తే సక్సెస్ అవుతుంది అన్న విషయంలో_మీమాంసలో పడి 'మంది' డబ్బుతో ఏదో ఒకటి చుట్టేయటం (సబ్సిడీ వస్తుంది కదా అనే ఆశ) తర్వాత చేతులు కాల్చుకోవటం జరుగుతున్న కథ. ఈ పోటీ యుగంలో ప్రచారం టి.వి, ఛానల్స్ ద్వారా
187
చేయటం తప్పనిసరి. ఇక్కడకు వచ్చేసరికి చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ సెకనుకు ఇంత అని ఒకే రేటు చెల్లించి తీరాలి. పెద్ద సినిమాకు ఓ నెల రోజులు చాలు. చిన్న సినిమా వ్యవహారం మొదటి వారంలోనే తెలిసిపోతుంది.
(ప్రభుత్వ పరంగా చెప్పుకోవలసిన అంశాలు రెండు. 1. వినోదపు పన్ను విధానం 2.సబ్బిడీ విధానం. ఈ రెండు సమస్యలను గూర్చి పరిశ్రమలోనే భిన్న వాదాలు ఉన్నాయి. ఆసలు సబ్సిడీ ఉండాలా వద్దా? ఉంటే ఏ విధంగా ఉండాలి? (కర్ణాటకలో సబ్సిడీ సరాసరి స్టూడియోలకు అందించే అలవాటు ఉంది). రాష్ట్రంలో ఇంతశాతం సినిమా తీసి తీరాలి అనే నిబంధన ఉండాలా? సవరించాలా? సినిమా సృజనాత్మక కళ కనుక కనీసం 50 శాతం, అంటే సగం సినిమా రా(ప్టేతర ప్రాంతాల్లో తీయటానికి అనుమతించాలని కొందరు; ఈ సబ్బిడీ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఏవిధంగా విధాన నిర్ణయం రూపొందించాలి అనేవి సాధారణంగా ఎదురయ్యే సమస్య, రెండవది టాక్స్ విధానం. గతంలో అమ్మకపు విలువనుబట్టి పన్ను ఉండేది. టిక్కెట్టు ధరను బట్టి పన్ను శాతం ఉండేది. దీనిని అధికారులు, ధియేటర్ యాజమాన్యం కుమ్మక్కై దుర్వినియోగం చేస్తున్నారని స్లాబ్ పద్దతిని (ప్రవేశపెట్టారు. మనిషి వచ్చి సినిమా చూసినా చూడకపోయినా సీటింగ్ కెపాసిటీనిబట్టి పన్ను చెల్లించాలి. సినిమా హాలులో జనం బాగా ఉంటేనే ఈ పద్దతిలో నిర్మాతలకు లాభం, సగటు సినిమాకు టాక్ వచ్చేలోగా తీసేయాల్సిన పరిస్థితుల్లో సరిగ్గా ఫీడింగ్ జరక్కపోవడంతో (ప్రదర్శన శాలలను పడగొట్టి షాపింగ్ కాంప్లైక్స్లుగా తీర్చి దిద్దుతున్నారు.
టి.వి. ల ధాటికి సినిమాలు నిలబడలేకపోతున్నాయి అనేది ఒక వర్గం వాదన. ఇది కేవలం ఆడలేక మద్దెల ఓడు అన్న సామెతను గుర్తుచేస్తుంది. విదేశాల్లో ఎప్పట్నించో టివి.లు ఉన్నప్పటికీ పస ఉన్న సినిమాలను జనం ధియేటర్‌కు వెళ్లి చూసొస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే టి.వి.ల మీద అభాండం వేయటం సరిగాదు. సినిమా పరిశ్రమ సంక్షోభంలో ఉన్న ఈ తరుణంలో సన్నకారు, చిన్నకారు ఆర్టిస్ట్‌లకు, అసంఖ్యాకంగా ఉన్న టెల్నీషియన్స్కు ఆశ్రయం కల్పించి ఆదరిస్తున్నది టి.వి. రంగమే. ఇది లేకపోతే వేలాది కుటుంబాలు రోడ్డున పడేవి అనేది నిర్వివాదాంశం.
ఈ రోజున తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ట్రేడ్ యూనియన్ తరహా నియమ నిబంధనలతో రూపొందించిన పలు సంఘాలున్నాయి. అవి ;:-
ఎ. పి. ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్
సినీ రైటర్స్ అసోసియేషన్
188
సినీ ప్రొడక్షన్ ఎన్టిక్యూటివ్స్ యూనియన్
సినిమూటోగ్రాఫర్స్ యూనియన్
సినీ ఆర్డ్ డైరెక్టర్స్ మరియు అసిస్టెంట్స్ యూనియన్
సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్
సినీ మేకప్ ఆర్టిస్ట్ & హెయిర్ డైసర్స్ యూనియన్
సినీ & టి.వి. కాస్టూనుర్స్ యూనియన్
సినీ & టి.వి. అవుట్డోర్ యూనిట్ టెక్నీషియన్స్ యూనియన్
సినీ అవుట్డోర్ లైట్‌మెన్ యూనియన్
మోషన్ పిక్చర్స్ డైవర్స్ యూనియన్
సినీ మ్యూజిషియన్స్ యూనియన్
సినీ ఆడియోగ్రాఫర్స్ యూనియన్
ఫిలిం ఎడిటర్స్ యూనియన్
మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్
సినీ స్టంట్ డైరెక్టర్స్ & స్టంట్ ఆర్షిన్స్ యూనియన్
ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్
సినీ స్టూడియో వర్కర్స్ యూనియన్
సినీ ఆర్టిస్ట్ యూనియన్
సినీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్
సినీ జూనియర్ ఆర్టిస్ట్ ఏజంట్స్ యూనియన్
సినీ & టి.వి ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్
సినీ మెస్ ఎంప్లాయిస్ యూనియన్
సినీ పబ్లిసిటీ ఆర్డిక్స్ యూనియన్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
పైవి గాకుండా యింకా ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉండనే ఉన్నాయి. అలాగే డి స్టిబ్యూటర్లకు, ప్రదర్శకులకు సంబంధించి జిల్లా స్టాయిలోను, రాష్ట్ర స్థాయిలోను యూనియన్లు ఉన్నాయి.
189
'పైన పేర్కొన్న సంఘాలు అన్ని ఒక్క తాటిమీద నడవటం కష్టమే! అయినా సినిమా పరి[శ్రమ ప్రగతికి, మనుగడకు ప్రభుత్వం చేయవలసిన సహాయం గూర్చి తమలో తాము చర్చించుకొని ఆ తీర్మానాలను ప్రభుత్వానికి పంపటం, ప్రభుత్వం వాటిని అన్ని కోణాల్లోంచి పరిశీలించి గృహ వసతి దగ్గరనుంచి సబ్సిడీలు, టాక్సు విధానం మొదలైన పలు సమస్యల్ని వీలైనంత ఎక్కువ మందికి (ప్రభుత్వంతో కూడా కలుపుకొని) ఎక్కువ (ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. సృష్టికర్త అందరికీ న్యాయం చేయలేడు. ఇది ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది.
చంంయేం9 ౨టెబ్బంరే 15 ఆయం ౦జయలనే అనేది సూక్తి అందుకని సత్వర న్యాయ సాధన దిశగా ఇటు పరిశ్రమ, అటు ప్రభుత్వము చారవ చూపితే ఉఛభయతారకంగా ఉండే నిర్ణయాలతో తెలుగు సినీ పరిశ్రమకు వచ్చే సహస్రాబ్టిలో తప్పక మంచిరోజులు వస్తాయి,
౭9 9=నవర్తూ ఎవార్డులు
భారతదేశంలో తొలి మూకీ (రాజా హరిశ్చంద్ర) చిత్ర నిర్మాత దుండిరాజ్ గోవిందఫాల్కే (1870-1944. ఆయన జ్ఞాపకార్థం భారతప్రభుత్వం ప్రతియేటా అఖిల భారత స్థాయిలో చలనచిత్ర రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖులకు “దాదాఫాల్కే” ఎవార్డు ప్రదానం చేసి సత్కరిస్తుంది. ఈ ఎవార్డు తొలిసారిగా 1970 సం॥లో దేవికారాణికి ప్రదానం చేయబడింది. ఆ సత్కారాన్ని అందుకున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు :
శ్రీ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.యన్. రెడ్డి ..... . 1975
శ్రీ అక్కినేని లక్ష్మివరప్రసాద్ (యల్.వి. ప్రసాద్) .... 1983
శ్రీ బొమ్మిరెడ్డి నాగిరెడ్డి ......౨౨౨౨౯౯ ౯౨౨౨౨౨ 1987
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు .......౯౧౨౯౬౨ ౨౨ 1991
యావద్భారత స్థాయిలో ఉత్తమ విలువలతో నిర్మించిన చిత్రాలకు ఎవార్డులు ప్రదానం చేసి ఆ తరహా చిత్ర నిర్మాణాన్ని ప్రోత్సహించే సదుద్దేశ్యంతో 1954 చిత్రాల నుంచి ఎవార్జుల (ప్రదానం మొదలుపెట్టింది భారత (ప్రభుత్వం.
190
ఆ (క్రమంలో స్వర్ణకమలం, రజితకమలం, ప్రశంసాపత్రం, యోగ్యతాపదత్రం ఇస్తూ వచ్చారు. తరువాత ఉత్తమ (ప్రాంతీయ చిత్రానికి ఎవార్డు యివ్వటం మొదలెట్టారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవార్డు పొందిన తెలుగు చిత్రాల వివరాలు :
వివరణ : (స్వ) = స్వర్షకమలం; _ (5) = రజితకమలం
(ప్ర) = ప్రశంసాపత్రం; (యో) = యోగ్యతాపత్రం (ఉ.(ప్రా) = ఉత్తమ ప్రాంతీయ చిత్రం సంవచ్సరం చిత్రంపేరు దర్శకుడు ఎవార్డు వివరణ 1954 పెద్దమనుషులు కెవి. రెడ్డి ర విప్రనారాయణ పి. రామకృష్ణ యో తోడు దొంగలు డి. యోగానంద్ యో 1955 బంగారుపాప బియన్. రెడ్డి ర అర్జాంగి పి, పుల్లయ్య యో 1956 తెనాలి రామకృష్ణ బి,యస్. రంగా ర ఏది నిజం? యస్. బాలచందర్ ప్ర 1957 తోడికోడళ్ళు ఆదుర్తి సుబ్బారావు యో భాగ్యరేఖ బి.యయన్. రెడ్డి ప్ర 1958 సెళ్లినాటి ప్రమాణాలు కె.వి.రెడ్డి ర 1959 జయభేరి పి, పుల్లయ్య యో మాంగల్యబలం ఆదుర్తి సుబ్బారావు యో మా యింటి మహాలక్ష్మి _ జి, రామినీడు ప్ర 1960 మహాకవి కాళిదాసు కె. కామేశర రావు ర నమ్మినబంటు ఆదుర్తి సుబ్బారావు ర 961 భార్యాభర్తలు కె. ప్రత్యగాత్మ ర సీతారామకళ్యాణం యన్.టి, రామారావు. యో 1962 మహామంత్రి తిమ్మరసు._ కె. కామేశ్వర రావు ర కులగోత్రాలు కె. ప్రత్యగాత్మ యో సిరిసంపదలు పి. పుల్లయ్య యో 1963 నర్తనశాల కె. కామేశ్వర రావు ప్ర 1964 డాక్టర్ చక్రవర్తి ఆదుర్తి సుబ్బారావు ర మూగమనసులు ఆదుర్తి సుబ్బారావు యో 191
1964 అమరశిల్పి జక్కన్న బి.ఎస్. రంగా యో రామదాసు వి. నాగయ్య ప్ర 1965 అంతస్టులు వి మధుసూదనరావు ర మనుషులు-మమతలు _ కె. ప్రత్యగాత్మ ప్ర 1966 ఆత్మగౌరవం కె. విశ్వనాధ్ యో పల్నాటియుద్దం జి. రామినీడు ప్ర 1967 సుడిగుండాలు ఆదుర్తి సుబ్బారావు ఊ.ప్రా. రంగులరాట్నం బి.యన్. రెడ్డి ఊప్రా 11968 వరకట్నం యన్.టి.రామారావు ఉప్రా. 1969 ఆదర్శకుటుంబం శె, ప్రత్యగాత్మ ఉపా. 1970 దేశమంటే మనుషులోయ్ సియయన్. రావు ఊప్రా. 1971 మట్టిలో మాణిక్యం బి.వి. ప్రసాద్ ఉ.్రా. క్షం72 పండంటి కాపురం లక్ష్మీదీపక్ ఉంప్రా. 1973 ఆ _ య 974 అల్లూరి సీతారామరాజు (గేయరచయితగా శ్రీశ్రీకి ఎవార్డు) 1975 ముత్యాలముగ్గు బాపు ఉప్రా. 11976 ఊరుమ్మడి బ్రతుకులు. బి.ఎస్. నారాయణ ర శ977 ఒకవూరి కధ మృణాల్‌సేన్ ర 1978 నిమజ్జనం బి.ఎస్. నారాయణ ఉ.ప్రా. క్షం79 శంకరాభరణం కె. విశ్శనాధ్ స్వం 1980 హరిశ్చంద్రుడు యు. విశ్వేశ్వరరావు ఊప్రా. 1981 సప్తపది కె. విశ్వనాధ్ (ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం) 1962 సీతాకోకచిలుక భారతీరాజా ఊప్రా. మేఘసందేశం దాసరి నారాయణరావు ఉఊప్రా. 19083 రంగులకల బి. నరసింగరావు ఊ(ప్రా. 1084 సితార వంశీ ఉశప్రా. 1985 స్రవంతి కె. క్రాంతికుమార్ ఉఊప్రా. 1986 స్వాతిముత్యం కె విశ్శనాధ్ ఉప్రా. 1987 య ఆ ఆ 1988 దాసి బి. నరసింగరావు ఊప్రా. 11989 గీతాంజలి మణిరత్నం (ఉ. వినోదాత్మకచిత్రం) 192
1989 సూత్రధారులు కె, విశ్శనాథ్ ఊఉ.ప్రా. 1990 మట్టి మనుషులు బి. నరసింగరావు ఉప్రా. 199] భద్రంకొడుకో ఎ. కుటుంబరావు ప్రా. 1992 అంకురం సి, ఉమామహేశ్చరరావు ఊ్రా, 1993 మిస్టర్ పెళ్ళాం బాపు ఊప్రా. 19094 - - = - 1995 స్రీ కె.ఎన్. సేతుమాధవన్ ఉ.్రా, 1996 నిన్నే పెళ్ళాడుతా కృష్ణవంశీ ఉప్రా, 1997 రామాయణం గుణశేఖర్ (ఉత్తమ బాలల చిత్రం) 1993 తొలిప్రేమ కరుణాకరన్ ఊప్రా. కంటే కూతుర్నీ కను దాసరి నారాయణరావు ప్రత్యేక ప్రశంస న తాలి తెలుగు మూకీచిత్రం (భీష్మప్రతిజ్ఞు నిర్మాత రఘుపతి వెంకయ్య (1869- 1941). ఆయన గౌరవార్దం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలందించిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య ఎవార్డును యిచ్చి సత్కరిస్తోంది. 1981 సంవత్సరంలో ఈ ఎవార్డు (ప్రదానం చేయటం మొదలు పెట్టింది. ఆ (క్రమంలో .. ఆ ఎవార్డును పొందిన వారి వివరాలు : 1981 యల్‌వి. (ప్రసాద్ (దర్శక, నిర్మాత) 1982 బి.ఏ సుబ్బారావు (దర్శక, నిర్మాత) 1983 యం.ఎ. రెహమాన్ (ఛాయా(గ్రాహకుడు) 1984 కొసరాజు రాఘవయ్య చౌదరి (గీత రచయిత) 1985 భానుమతి (నటి, నిర్మాత, గొయని, రచయిత్రి, సంగీత దర్శకులు, దర్శకురాలు) 1986 బాపు-రమణ (దర్శకుడు, రచయిత) 1987 బి. నాగిరెడ్డి (నిర్మాత) 1988 డి.వియస్. రాజు (నిర్మాత) 1989 అక్కినేని నాగేశ్వరరావు (నటుడు) 1990 దాసరి నారాయణరావు (నిర్మాత, దర్శకుడు) 1901 కె. విశ్చనాధ్ (దర్శకుడు) కం92 సాలూరి రాజేశ్వరరావు (సంగీత దర్శకుడు) 193
1993 దుక్కిపాటి మధుసూదనరావు (నిర్మాత) క్షం94 కె.ఎస్. ప్రకాశరావు (నిర్మాత, దర్శకుడు) 1995 అంజలీదేవి (నటి, నిర్మాత) 1996 ఇంటూరి వెంకటేశ్వర రావు (జర్నలిస్టు) 1997 వీరమాచనేని మధుసూదనరావు _ (దర్శకుడు) 1998 గుమ్మడి వెంకటేశ్ళరరావు (నటుడు) శ శ ఆ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా నిర్మాణం అభివృద్ది చెందాలి - తెలుగు భాషలో నిర్మితమయ్యే చిత్రాలు ఎక్కువ శాతం ఆంధధ్రదేశంలోనే నిర్మించబడాలి అనే దృక్పథంతో ఈ మేరకు అభిరుచి గల నిర్మాతలను ఉత్తమ చిత్ర నిర్మాణం వైపు మొగ్గు చూపాలనే సదుద్దేశంతో 1965 సం॥లో నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఆధిపత్యంలో ఉత్రమచిత్రాలకు 'నంది' ఎవార్డులు యిచ్చి ప్రోత్సహించాలనే నిర్ణయం తీసుకోవటం, ఆ మేరకు తెలుగుభాషలో 1964లో నిర్మితమైన చిత్రాలకు 1965 సం॥లో నంది ఎవార్డులు ప్రదానం చేసి తెలుగుచిత్ర నిర్మాతలకు కొత్త ఊపిరిపోసింది నాటి ప్రభుత్వం. ఉత్తమ చిత్రానికి బంగారునంది, ద్వితియ ఉత్తమ చిత్రానికి రజితనంది, తృతీయ ఉత్తమ చిత్రానికి కాంస్యనంది ప్రదానం చేస్తూ వస్తుంది. ఎవార్డుతో పాటు కొంతనగదు కూడా అందించి ప్రోత్సహించింది. కాలక్రమేణా ఆ నగదును పెంచటం, నంది ఎవార్డులను చిత్ర నిర్మాణంలోని నటన, రచన, సంగీతం, ఫోటోగ్రఫీ మొదలైన యితర అనుబంధ శాఖలకు విస్తరింపజేయటం చెప్పుకోదగిన పరిణామం, ఈ దిగువ నాటి నుంచి నేటి వరకూ మూడు శ్రేణుల్లోను (స్వర్ణ రజిత, కాంస్య) నంది ఎవార్డు పొందిన చిత్రాల వివరాలను ఉదహరించడమైనది. సంవత్సరం బంగారు నంది. రజితనంది కాంస్యనంది 1964 డా॥ చక్రవర్తి కీలుబొమ్మలు గుడిగంటలు 1965 అంతస్థులు శ్రీకృష్ణపాండవీయం ఆత్మగౌరవం 1966 రంగులరాట్నం చిలక-గోరింక అస్తిపరులు 1967 సుడిగుండాలు చదరంగం భక్త ప్రహ్లాద 1968 బాంధవ్యాలు చిన్నారిపాపలు బంగారుగాజులు 1969 కధానాయకుడు ఆత్మీయులు బంగారు పంజరం 1970 కథానాయిక మొల్ల కోడలుదిద్దిన కాపురం బాలరాజు కథ 194
1971 చెల్లెలికాపురం శ్రీకృష్ణసత్య అమాయకురాలు 1972 కాలంమారింది తాత-మనవడు (ప్రజానాయకుడు 1973 శారద అందాలరాముడు -సంసారంసాగరం 1974... అల్లూరి సీతారామరాజు ఓ సీతకధ తీర్చు 975 జీవనజ్యోతి ముత్యాలముగ్గు స్వర్గం-నరకం 1976 ఊరుమ్మడి బ్రతుకులు మహాకవి క్షేత్రయ్య అంతులేనికథ 1977 - తరంమారింది ఒకవూరికధ 1978 నాలాగా ఎందరో చలిచీమలు కరుణామయుడు 1979 శంకరాభరణం మాభూమి పునాదిరాళ్ళు 1980 - యువతరం కదిలింది సంఘం మారాలి 1981 సీతాకోకచిలుక తాలికూడి కూసింది ఊరికిచ్చినమాట 1982 మేఘసందేశం మరోమలుపు క్రీర్రికాంత-కనకం 1983 ఆనందభైరవి నేటిభారతం సాగరసంగమం 1984 స్వాతి కాంచనగంగ సువర్షసుందరి 1985 మయూరి ఓ తండ్రి తీర్పు వందేమాతరం 1986 స్వాతిముత్యం రేపటిపొరులు అరుణకిరణం 1987 శృతిలయలు అభినందన ప్రజాస్వామ్యం 1988 స్వర్షకమలం ఉొత్రెడ్రదే ఆధారం కళ్ళు 1989 గీతాంజలి మౌనపోరాటం సూత్రధారులు 1990 ఎర్రమందారం సేశ్రారామయ్యగారి మనవాలు హృదయాంజలి 1991 యజ్ఞం పెళ్ళిపుస్తకం అళ్చని 1992 - రాజేశ్వరి కళ్యాణం ఆపద్బాంధవుడు 1993 మిస్టర్ పెళ్లాం మనీ మాతృదేవోభవ 1994 బంగారుకుటుంబం శుభలగ్జం భైరవద్వీపం 1995 సొగసుచూడతరమా! బదిలీ అమ్మాయికాపురం శ996 పవిత్రబంధం లిటిల్సోల్డర్స్ శ్రీకారం 1997 అన్నమయ్య సింధూరం తోడు 1998 తొలిప్రేమ శంటేకూతుర్న కను గణేష్ 1999 సంవత్సరానికి బహుమతులు 2000 సంవత్సరంలో 'ప్రకటించబడతాయి. 195
నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో నిర్మించబడి, ఎవార్డులు పొందిన చిత్రాల వివరాలు :
1991 - జాతీయ స్థాయిలో 'యజ్ఞం' (దర్శకులు గుత్తా రామినీడు) చిత్రంలో నటించిన పి. ఎల్ నారాయణ ఉత్తమ సహాయ నటుడి బహుమతి అందుకున్నారు.
1996 - “స్రీ చిత్రానికి (దర్శకులు కె.ఎస్. సేతుమాధవన్) ప్రత్యేక ప్రశంస లభించటమే గాక్క నటి రోహిణి జ్యూరీ ప్రత్యేక ప్రశంస పొందారు.
1997 - “తోడు” (దర్శకులు ఎ. కుటుంబరావు) రాష్ట్ర ఎవార్డుల్లో మూడవ ఉత్తమ చిత్రం, ఉత్తమ కధారచన, ఉత్తమ సహాయనటి, ఉత్తమ గాయని ఎవార్డులు పొందినది.
ఓ చ ౧౮౨౦౨ భారతీయ చలనచిత్ర చరిత్రలో మూకీల నిర్మాణానికి
- ఆద్యుడైన దాదాఫాల్కే (దుండిరాజ్ గోవింద ఫాల్కే) జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం 1971వ సంవత్సరంలో 20 పైసలు గల ప్రత్యేక తపాళ బిళ్ళను విడుదల చేసింది. ఇది సినిమారంగానికి దక్కిన అపూర్వ గౌరవం. 196
(ఇు దిఎండ (కాదు ఈ (క్రింద ఉదహరించే వివిధ అంశాలు యింతకు ముందు ఉన్న ప్రకరణాల్లో వివరిస్తే జొచిత్య భంగం అవుతుందనే ఉద్దేశ్యంతో విడిగా యిక్కడ వ్రాయటం జరిగింది.
-
నిర్మాణ వ్యయం నిర్మాత చేతుల్లో ఉండకపోవటానికి కారణం సరియైన ప్లానింగ్ లేకపోవటమే 1! షూటింగ్లో అప్పటికప్పుడు మల్లెపూలు కావలసివస్తాయి. అవి వచ్చేదాకా ఆర్టిస్టులు వెయిటింగ్. మల్లెపూల ఖర్చు పదిరూపాయలే ఆయితే అవి ఎక్కడ్నుంచో తీసుకురావటానికి అయ్యే పెట్రోలు ఖర్చు వందరూపాయలు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ష్టానింగ్ ఉన్నప్పుడు ఈ విషయం ముందురోజే తెలిస్తే సమయం కలిసి రావటమే కాక దుబారా ఖర్చు కూడా కొంత తగ్గుతుంది.
-
చేదు నిజం అనిపించే మరొక విషయం కూడా మనం గమనించవచ్చు. గత కాలంలో ఎందరో కళాస్రష్టలు వేమన, పోతన త్యాగయ్య, వంటి కళాఖండాలు మనకి అందించారు. వాటిని తిరిగి ఎంతో గొప్పగా తియ్యగలమని కొందరు దుస్సాహసం చేసి పరాజయం చవిచూసారు. ఒకరినిచూసైనా రెండోవారు జూ(గ్రత్త పడకపోవటం దురదృష్టకర పరిణామం. ఈ విషయం పాటలకు కూడా వర్తిస్తుందేమో! గతంలో సూపర్ హిట్టయ్యి ప్రజా హృదయాల్టో తిష్టవేసుకున్న అమృతతుల్యమైన కొన్ని పాటల్ని బాణీలో కొంచెం మార్పులు చేసి ఓహో అనిపిస్తాం అని చేసిన ప్రయత్నాల్ని కూడా (ప్రేక్షకులు త్రిస్పికొట్టారు. కాబట్టి ఆ దిశగా ఆలోచనలు వచ్చినప్పుడు కొంచెం తీవ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవటం సమంజసమేమో!
4 తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులకు (బి.యయన్. రెడ్డి బి. నాగిరెడ్డి, ఎల్వి. ప్రసాద్, అక్కినేని నాగేశ్చరరావు) దాదాఫాల్కే అవార్డురావడం, రికార్డు స్థాయిలో చిత్రాలు నిర్మించిన నిర్మాతగా డా॥ డి. రామానాయుడు, రికార్డు స్టాయిలో చిత్రాలకు దర్శకత్వం వహించిన డాక్టర్ దాసరి నారాయణరావు, నలభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం నెరపిన మహిళా దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకోవటం తెలుగు జాతికి గర్వకారణం.
ఈ. తెలుగు సినీరంగంలోని మహిళలు కొందరు మాతా పిక్చర్స్ పేరిట “చిన్నారి పాపలు” చిత్రం నిర్మించారు. సావిత్రి దర్శకురాలు, లీల సంగీత దర్శకత్వం,
197
పాప కళాదర్శకత్వం చేయగా వీరమాచనేని సరోజని రచన చేసి, నిర్మాణ వ్యవహారం చూసి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. (ప్రపంచ చలనచిత్ర చరిత్రలో యిది అపూర్వ సంఘటన.
- గతంలో ఎన్నడూ లేని ఓ గొప్ప పరిణామం ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో (1999) జరిగింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులు డా॥ డి. రామానాయుడు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు, నిర్మాణ రంగానికే చెందిన భూమా నాగిరెడ్డి, జితేందర్ రెడ్డిలు పార్లమెంటుకు ఎన్నిక కావడం, దర్శకులు, నటులు ఆయిన డా॥ యన్. శివప్రసాద్, నటులు కోట శ్రీనివాసరావు, బాబూమోహన్, నిర్మాణ రంగానికి చెందిన అంబికా కృష్ణు వి.వి.యస్.యస్. చౌదరి, చెంగళ వెంకట్రావు శాసనసభకు ఎన్నిక కావటం హర్షదాయకం. వీరిలో డా॥ యన్. శివప్రసాద్ సాంస్కృతిక, సమాచార శాఖా మంత్రి కావటం కళాకారులందరూ హర్షించదగ్గ విషయం.
౯ భారతదేశంలో తొలిసారిగా నిర్మించబడిన టాకీ చిత్రం 'అలంఅఆరా' (1931)
-
తొలి సినిమాస్మ్కోపు చిత్రం గురుదత్ నిర్మించిన 'కాగజ్కేపూలో (1959)
-
ఒకేఒక్క నటుడితో నిర్మించబడ్డ చిత్రం సునీల్‌దత్ నటించిన 'యాదిన్'(1964)
శ్ ఇరవైనాల్లు గంటల రికార్డు టైంలో నిర్మించబడ్డ చిత్రం 'స్వయంవరం' (తమిళం
శ రంగులలో నిర్మించబడిన మొదటి 70 యం.యం. చిత్రం పచ్చీస్ తీసిన ఎ రౌండ్ ది వరల్డో (1967)
౯ విదేశాలలో ప్రదర్శించబడి తొలిసారిగా బహుమతి పొందిన భారతీయ చిత్రం 'నీచ్ నగర్ (1947 కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో)
శ్ ఆంధ్రదేశంలో తొలిసారిగా విజయోత్సవం జరుపుకున్న చిత్రం జెమినీ వారి చంద్రలేఖ" (విజయవాడలో జరిగింది)
శ మనం సినిమా థియేటర్లో కూర్చున్నాం అనే ఆలోచన రానీయకుండా తనలో లీనమై, తనతో పాటు మనల్ని కూడా ఆ వాతావరణంలో విహరింపబేసేదే నిజమైన సినిమా.
ఈ౯ సినీ కళాకారుల సంక్షేమ నిధిని “నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్బొరేషన్” ఏర్పరచింది. 'గాంధీ' చిత్ర లాభాల్లో కొంత భాగం ఈ నిధికి జమచేయబడింది.
198
దీనితో కళాకారుల కుటుంబంలోని వారి ఆరోగ్య విద్య అవసరాలకు సహకారం అందజేస్తుంటారు. నిజానికి ఈ పుస్తకంలో ఉదాహరించిన ప్రతి ప్రకరణాన్ని గూర్చి విసృతంగా పరిశోధనలు జరిపితే ఓ పెద్ద గ్రంధం అవుతుంది. అన్నిటినీ కలిపి వేల పేజీల్లో పుస్తకంగా తీసుకురావచ్చు. కానీ ఎంతో ధర వెచ్చించి ఆ పుస్తకాన్ని ఎందరు కొనగలుగుతారు ? ఎందరికి అందుబాటులో ఉంటాయి? ప్రభుత్వం దయళలిస్తే లైబ్రరీల్లో చోటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకే అందరికీ అందుబాటులో ఉండాలని వీలైనంత ఎక్కువమంది చదవాలని ఈ ప్రయత్నం చేసాను. సినిమాల గూర్చి నేను చదివిన ఎన్నో పుస్తకాలు నాకు ప్రేరణ యిచ్చాయి. చరిత్రకు సంబంధించినంత వరకు ఏ విషయం సమగ్రం కాదు. ఎంత తోడినా కొంత మిగులుతూనే ఉంటుంది. ఒకే విషయాన్ని మరో పరిశోధకుడు మరో కొత్త కోణంలోంచి ఆలోచించి విశ్లేషిస్తాడు. సముద్రాల వారి రచనల్లో అదృశ్యంగా మల్లాది వారి హస్తం ఉందనే వాదం చిత్ర పరిశ్రమలో ఉంది. దీనికి పూర్వపక్షంగాను, ఉత్తరపక్షంగాను వాదనలు ఉన్నాయి. ఈ వాద ప్రతినాదాలు చాలా మంది ప్రముఖ ఆంగ్ల కవులు, వారి రచనల విషయంలో కూడా జరిగింది. ఈ తరహా అభిప్రాయ బేధాలు చరిత్రకు తప్పవు. సద్విమర్శ ఎప్పుడూ స్వీకారయోగ్యమే. కాబట్టి పాఠకులు చేసే సూచనలను మనస్ఫూర్తిగా స్వీకరించి భవిష్యత్తులో ఈ తరహా రచనలు చేసే వారికి ఉపకరించే ప్రయత్నం చేద్దాం. ఈ తరహా రచనలు ఎన్నో రావాలి. మరిన్ని వివరాలు పాఠకులకు అందివ్వాలి. అందుకని నా యీ రచనకు (ప్రారంభమే గాని ముగింపు ఉండదు, ఉండకూడదు. కనుక దినిని సంపూర్హమని, సమ(గ్రమని అనటానికి సాహసించను. అందుకే నాతోపాటు మరెందరో ఈ తరహా కృషి కొనసాగించాలని తెలుగు సినీ పరిశ్రమనుగూర్చి మరెన్నో మంచి పుస్తకాలు రావాలని మనసారా కోరుతూ , (| శీ (ల [99
/ అద ఒడ నూతన సహస్రాబ్దిలో శ “తెలుగు తెర” నోదాన్నిప విజ్ఞానాన్ని వినోదాన్ని పండించాలి ఎన్నెల వెలుగులు అందించాలి గ 1 సం భ్ ర మంగల లు ఖం యే... మ ఆర్.బి. బౌదరి వాకాడ అప్పారావు నూవర్ గుడ్ ఫిలింన్ శ్రీలలిత కళాంజలి (ప్రొడక్షన్స్ 23-ఎ, మందిరా అపార్ట్మెంట్స్ శాంతి టవర్స్, నార్త్బోగ్ రోడ్ 5వ బ్బాక్స్ ధర్డ్ ఫ్లోర్, చెన్నె - 17 88, ఆర్కాట్ రోడ్, ఫోన్ : 8256214, 8226587 వడపళని, చెన్నై - 26. ఫోన్ : 4722872 27/1, హబీబుల్లా రోడ్, టీ నగర్, చెన్నె - 17. ఫోన్ : 6284446, 8284237 హైద్రాబాద్ : 98480-22532 (సెల్ 200
భగవంతునికి భక్తునికి అనుసంధాన మైనది. అంబికా దర్బార్ బత్తి నూతన సహస్తైద్దకి స్వగతం పలుకుతూ. 'కినెర'నారి తెలుగు తెర'కు శుభాకాంక్షలు 4.
అంబికా కృష్ణ, ఎంఎళఏ
ఛ్రైర్లన్
అంబికా భ్రూపుసంస్తలు ఏలూరు |
నూతన సహస్రాబ్దికి స్వాగతం “తెలుగు తెరకు అభివందనలు వి.వి. బాలరృష్ట్ణారావు, చైర్మన ఉషా గ్రూప్ ఆఫ్ కన్సరన్స్ ఏలూరు ఉషా పిక్టర్స్ (ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్) ఏలూరు ఉషా బాలాచిట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రె లిమిటెడ్, ఏలూరు ఉషా ఎకాడమి (విద్యాసంస్థ) రాజమండ్రి ఉషాబాల అగ్రో ప్రొడక్ట్స్, ఏలూరు సౌయి బాలాజీ థియేటర్ (ఎ.సి.; డి.టి.ఎస్్ ఏలూరు మరియు ఉషా వేలంటైన్, ఏలూరు (సెంట్రల్లీ ఎసి.లాడ్జి అండ్ రెస్టారెంట్ 202
నూతన సహస్రాబ్దికి స్వాగతం 2౦వ శతాబ్ది తెలుగు సినీ సంక్షిప్త చరిత్ర “తెలుగు తెర” రనయిత యస్.వి. రామారావును 'కిన్నెర పబ్లికేషన్స్ మద్దాలి రఘురామ్‌ను అభినందిస్తూ. ... యం ౯//11///1 . //1. 5. ఎస్. రామారావు నిన్ నిర్మాత (క్రియేటివ్ కమర్షియల్స్ జూబ్లిహిల్స్, హైదరాబాద్ స్పిస్తి, ఛానల్స్ (రికార్రింగ్ డబ్బింగ్ & ఎడిటింగ్ న్తూడియో) 6వ ఫ్లోర్, బి.బ్బాకు, కాంతిశిఖర ఎపార్జుమెంట్స్ పంజగుట్ట, హైదరాబాద్. ఫోన్ : 3390973, 3397490 203
“కిన్నెర పజ్లికేషన్స్ వారి యాభయ్యవ ప్రచురణ “తెలుగు తెర” అవిష్కరణ సందర్భంగా శ్రీ మద్దాలి రఘురామ్ గార్కి రచయిత శ్రీ యస్. వి. రామారావు గార్కి స్నేహపూర్వక అభివందనలు....
సామా గణేష్ రెడ్డి
యం. గణేష్ ప్రసాద్ గౌడ్ మర్రి జయంత్ రెడ్డి సామా ప్రతాప్ రెడ్డి 204
ర్ రతిజులి 62/47/5472 42డూ ర౭ం727 యం క్ 9౭౬ ౧౧౦౦౬౧౦౮౧౦౫5 సై ర్ | లే ర 52255 ౧౧౦౨౪౦౮౫౦౫ () ₹70. స్ట్ ఉంచిన గు. 5720005 చచగటుం ౧005000202 48 590౯6 ౫401726 ౧14౯057208 షాంగెం తురకల 02277547 ఈ 003౭౮ టా 59255 07 ౧౫౧౯౧8 [2755405 3౧7558 ౧౧౧4౬ న య్! ల త. [4౫44100 5౧00105, ౮౮81౬6౬ 1115, 1054340 - 500034, ౧11. 5608797/3544188. [4౫ ; 5547583 205
చ యా | స 'లంఠాలయు షై చ సప్త 'వైదా హో ల క (6౧/5121 1౧64650165 11011666 33/65, గస ౧౬౮౩14 ౧414%510%. 1-10-1/1. 4ఉ5గ౦[ గగ౦ంకగి, [70౬౧4840 - 500 020. &ీ'00౧౧4 గ౧౧4౦౬5గ. 11016. ౧౧౦0౧6 : ౦గ108: 7606242. ౯2౫ : 040-761380/ 206
, ఎస్. విరామారావు 1940లో జననం. 1960లో ఏలూరు సర్, సి, ఆర్ రెడ్డి కళాశాలలో పట్టా పొంది వృత్తిరీత్యా రిజిస్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో సబ్ రిజిస్టారుగా, ఆంధ్రా ఏరియా చిట్ రిజిస్ట్రారుగా పనిచేసి విధి నిర్వహణలో ఎవార్డులు పొంది, పదవీ విరమణ చేసినా - ప్రవృత్తిరీత్యా, , నటన, నాటకం, సినిమా, జర్నలిజం అభిమాన విషయాలుగా నూట యాభయి. నాటకాల్లో నటించి పలు నాటికలు వ్రాసి (స్టేజిపై ప్రదర్శించారు, రేడియోలో ప్రసారితాలు), సినీరంగ దర్శకులు కె.వి.రెడ్డి, దాదాఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఆచార్య సి, నారాయణరెడ్డిలకు అంకితమిచ్చారు. కాలేజి రోజుల్నుంచి ఫిలిం జర్నలిజం అభిమాన విషయం. వందలాది వ్యాసాలు వ్రాసి ఓ అరడజను సినిమాలకు రచన చేయటం అనేక సాంస్కృతిక సభల్లో ప్రసంగించటం, వ్యాఖ్యాతగా వ్యవహరించటం చెప్పుకోదగ్గ విశేషాలు. మంచి 'స్నేహితులు, మంచి పుస్తకాలు, మంచి సంగీతం, ఈ మూడు ఆత్మానందానికి సోపానాలు . అనేది వ్యక్తిగత నమ్మకం. నంత... |