Telugu telugu katha nadu , nedu - anilvaranasi/indianlanguages GitHub Wiki
ను... “స కోడూరి శ్రీరామమూర్తి, ' "శషి . || సహజకవి మల్లెమాల ఫు
- | ల. శ మనసుపడి మక్కువతో సేకరించిన | ళు | శ్ షు (ఆ జీ ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం | నీ య గీ స సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి | గ్ ర్త ళు యన ష్ -మల్లెమాలకుటుంబం | ల
- -/ ర కధసార్య్య ర్యాసాయి
లో నొణూ త లో శధిసాహొత్య వ్యాసాలు ట్
- కోదూరి శ్రీరామమూర్తి యము
75666౮ 1%111% - నీల, 150౮ (ఓ19%%ూ/ ౬ంంఖ/5) ర ఈర లళ కంరలగ గంగ సంర క్ష గా భ్ లం. లో అ గం? క/60౬6[1/06 : 12000, 2005 507 000/65 : అర్య కణ కంర) 90241 గ 0-5 గధ గం౭గగ6౧1, 02౧/౬0612, ల గిజగగాలగి6గ/-3 (౬6౮6 084 జీని (/ ౯౧ 0883 - 2430754 ౪19313౧602 [0151109 ట0050 యు రగ 9961 0/66/2024 సంధంయన్ను (10 0116! 62౧౦065) ట్ ౬ న స్ట | 0416 8001 9[009 స ర్స 50. | ఇన న గ లే పలా ఎలి యే 01600169 (౪ 5.4) లా 5/ గం[౦/, గంరంగ 6౬-౧౬) 5/0590/6[0%14॥ 00|1 ౮5 $10/- టు! 5% గ ౧౧4౪౧, 1401200111 570691 గిజజగాాం0గ/ ౯౧. 0883 - 2476345 నిగంఠ: గం, 100/౧
దూడున్నద దశాబ్లుల ప్రాతాచర్యానిపి జీఐతంలో నోచ్చిక ప్రుల్సెలోనికి యబ గుద్తుగా - ప్రేధుతో...... అంకీతం ల శ్రీరామమూర్తి కే
రీచీయితీ గురించి... జననం 1941 సెప్టెంబరు 29న రాజమహేంద్రవరంలో విశ్వవిద్యాలయ ఏద్య తర్వాత మూడున్నర దశాబ్దాల పాటు కళాశాల విద్యార్థులకు అర్ధశాస్త్ర బోధన సాహితీ జీవితం ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి కోడూరి లీలావతిదేవి మాతృమూర్తి కావడంచేత చిననాటినుండి సాహిత్యంపై ఎనలేని మక్కువ కాలక్రమంలో అర్థశాస్త్రం, తత్వ శాస్త్రం, మనస్తత్వశాస్త్రంలపై అభిమానం- బెర్ట్రాండ్ రసెల్ రచనలు, అస్తిత్వవాద (గ్రంధ కర్తల రచనలు, గాంధేయసాహిత్యం, వీటిపై ప్రత్యేకమైన ఇష్టం రచయితగాను, విమర్శకుడుగాసూ, లిటరరీ కాలమిస్ట్‌గానూ, సమకాలిక ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను విశ్లేషిస్తూ ప్రముఖ దినపత్రికల్లో ఎడిటోరియల్ పేజీ వ్యాసాలు రాయడం లోనూ, కృషి, 50 ఏళ్ళక్రితం మొదలయిన సాహిత్యకృషి నేటివరకూ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ప్రధాన రచనలు “తెలుగు నవలాసాహిత్యంలో మనోవిశ్లేషణ” (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు పొందిన (గ్రంథం - తెలుగు నవలలపై మనోవైజ్ఞానిక విమర్శ - 1978) “గాంధీజీ కధావళి” (గాంధీజీ జీవితతత్వం, జీవితోదంఠతాలు,- ఆంధ్రజ్యోతి వారపత్రిక ధారావాహిక -1969) “రవికవి” (బాలల రవీంద్రనాథ్ టాగూర్ జీవితచరిత్ర - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బహుమతి పొందిన పుస్తకం -1961) “ాల్పుగు - వెన్నెల ” (సాహిత్య విమర్శవ్యాసాలు -1986) “రాగమాలిక” (చరిత్రాత్మక నవల - కృష్ణాపత్రిక గోల్డెన్ జూబిలీ అవార్డు - 1964 “నీట్రిలో నీడలు” (సాంఘిక నవల-1965) ఇంకా ముద్రితాలయిన ఎన్నో కధలు, వ్యాసాలు. నిర్వహించిన శీర్షికలు అందాల తెలుగుకథ (ఆంధ్రజ్యోతి' దినప(త్రిక), కథాసుధ (ఆం(ధధ్రభూమి' వారపత్రిక), నెలనెలా తెలుగుకథ (రచని మాసపత్రిక), విశ్వసాహితిలో మణిదీపాలు (1ఆంధ్రప్రభూ వార పత్రిక), క్విజ్కాలం (ఆంధ్రప్రభ దినపత్రిక), అద్దానికి మరోవైపు (కలువబాల' మాసపత్రిక) కుటుంబ జీవితం ౩ ఇద్దరు కుమారులు, ఒకరు హైదరాబాద్‌లో, మరొకరు అమెరికాలో చిరునామా * డి-5, అఖిల్ ఎపార్ట్మెంట్స్, దానవాయిపేట, రాజమండ్రి-8 ఫోన్ * 0888 - 2480754
రుతో కోసీపు ....
- గత పాతికేళ్లుగా తెలుగుకధలపై వివిధ సందర్భాల్లో రాస్తూ వచ్చిన వందలాది వ్యాసాలను గమనించిన చాలామంది సాహితీ మిక్రులు ఇవి పుస్తకరూపంలో వస్తే బాగుందుననే అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చారు అయితే - ఇట్లాంటి పుస్తకాల ప్రచురణ ఆర్దికంగా లాభసాటి కార్యక్రమం కాదు గాబట్టి - వీటిని ప్రచురించేందుకు (ప్రచురణ కర్తలు ముందుకురారు అందుచేత, - ఈ ప్రయత్నం వాయిదాపడుతూ వచ్చి చివరకు ఇప్పుడు ఇలా కార్యరూపం దాట్చింది
కధాసాహిత్యంపై నేను రాసిన వ్యాసాల్లో పన్నెండింటిని ఈ సంపుటిలో చేర్చడం జరిగింది. ఇందులో వున్న వ్యాసాలన్నీ కేవలం కధకు సంబంధించినవే కాబట్టి, - కధా సాహిత్యాఖిమానులకు ఇది ఉపయోగకరం కాగలదని ఆశిస్తాను
నేను గతంలో (80లలో) '“ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఆదివారం సాహిత్యానుబంధంలో “అందాల తెలుగుకధ” అనే పేరుతో నాకు నచ్చిన 50 కథలను వారానికి ఒకటి చొప్పున పరిచయం చేసినప్పుడూ, మూడు సంవత్సరాలపాటు వివిధ పత్రికల్లోవచ్చిన వందలాది కధలను ఏ నెలకానెల చదివి, - ఆ నెలలో నాకు నచ్చిన మూడు మంచి కధలపై విశ్లేషణాత్మక వ్యాసాలను “రచన ఇంటింటి పత్రికలో రాసినప్పుడూ, - చాలామంది సాహిత్యాభిమానులు “ఒక కధను మంచికథగా మీరెప్పుడు భావిసారు? - అసలు మంచికధ అంటే ఏమిటి? -” అని తరుచూ అడుగుతూ వచ్చారు ఇద్రి చాలా కిష్టమైన ప్రశ్న అని నేనెరుగుదును అయితే, - ఇదే విషయాన్ని పదేళ్లక్రితం బెంగుళూరులోని '“కధావేదికి వారు కూడా అడిగి, ఆ అంశంపై వారు ప్రచురించే వ్యాససంపుటికి వ్యాసం రాయమని కోరినప్పుడు - నా మనోభావాలను పారకులతో పంచుకునేందుకు అదొక అవకాశంగా భావించాను “తెలుగు కధవెలుగులు” వ్యాస సంపుటిలో వచ్చిన ఈ వ్యాసం ఈ సంపుటికి మొదటివ్యాసం అయితే బాగుంటుందని పించింది (మంచికధి - అంటే?).
నాకు నచ్చిన కథలు రాసిన కధకులు తెలుగులో ఎందరో వున్నారు “ఆంధ్రభూమి వారపత్రికొవారు - “కధాసుధ” అనే శీర్షికలో తెలుగులో వచ్చిన మంచి కధలను పరిచయం చెయ్యమన్నప్పుడు, - ఆ పత్రికలో వారానికి ఒక కధ చొప్పున 128 కథలను, ఆ కధకుల కధారచనలోని విశిష్టతను, ధారావాహిక వ్యాసాలుగా రాశాను
= ఇదంతా రాయడానికి కారణం నేను రాసిన వ్యాసాల వివరం చెప్పడం గురించి కాదు తెలుగులో నాకిష్టమైన కధకులు చాలామంది వున్నప్పటికీ, - వారిలో చాలామంది గురించి నేను వ్యాసాలు రాసినప్పటికీ, - వాటిలో కొన్నింటిని మాత్రమే ఇందులో చేర్చడం జరిగిందనే విషయాన్ని దృష్టిలోనికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇదంతా రాశాను గ్రంధ విస్తరణ భీతి లేకుండా ఉంటే ఇందులో మరికొన్ని వ్యాసాలు జతచేరి ఉండేవి
ఈ సంపుటిలోని వ్యాసాల గురించి చెప్పేటప్పుడు మరొక విషయాన్ని కూడా ప్రసావించాలని పిస్తున్నది ఇందులో - “చలం కధలు - మనోవిశ్లేషణ” అనే వ్యాసం ఉంది చలం పేరు చెప్పేసరికి సాహిత్యాభిమానులకు పురుషాధిక్య సమాజంలో స్త్రీ స్వేచ్చను అణచివేసేందుకు జరిగే ప్రయత్నాలన్నింటినీ నిరసించిన ఒక గొప్ప రచయిత ఆలోచనా ధోరణి మనోవీధిలో మెదులుతుంది ఇది నిజమే అయినప్పటికీ, - చలం రచనాధోరణిని నిశితంగా గమనించినప్పుడు మనుషుల అంతరంగంలో జరిగే అలజదులపట్ల అతడికి అద్భుతమైన అవగాహన ఉన్న విషయం కూడా అవగతమవుతుంది. ఎక్కువగా ప్రస్తావనకురాని ఈ విషయాన్ని కూడా పారకుల దృష్టిలోకి
తేవాలనే ఉద్దేశంతో చలాన్ని ఈ కోణంలోంచి అవలోకించే “చలం కథలు - మనోవిశ్లేషణ” అనే వ్యాసాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా ఈ సంపుటిలో “తెలుగు కథల్లో రసెల్ దృక్పధం” అనే వ్యాసం కూడా ఉంది. తెలుగుసాహిత్యంపై - ప్రత్యేకించి కథాసాహిత్యంపై మార్క్స్ మొదలుకొని సార్ట్ వరకూ ఎందరెందరో మేధావుల, తత్వవేత్తల ఆలోచనా ప్రభావం ఉన్నదనే విషయం ఎరిగిందే అన్ని సందర్భాల్లోనూ, ఈ “ప్రభావం' అనేది ఒక రచయిత రచన, లేదా ఒక తత్వవేత్త గ్రంధం చదివినప్పుడు మాత్రమే జరగాలనే నియమం లేదు రచయితకు ఇట్లాంటి అవగాహన ఉన్న సందర్భాల్లోనూ, అలాంటి అవకాశం లేని సందర్భాల్లోనూ కూడా ఈ ధోరణి రచనల్లో చోటుచేసుకుంటూ ఉంటుంది. జీవితాన్ని యథాతథంగా చూచి, సమకాలీన సమాజంలోని వికృతుల పట్ల ఆవేదనచెంది, హృదయపు లయకు అనుగుణంగా రచించే రచయిత కొన్ని సందర్భాల్లో ఎట్లాంటి సిద్ధాంతాల (ప్రమేయం లేకుండానే జీవితతత్వాన్ని అద్భుతంగా ఆవిష్మరించగలుగుతాడు దిశానిర్దేశనం కూడా చెయ్య గలుగుతాడు. దీని ఫలితంగానే అతడి రచనల్లో ఒక “దృక్పధం” అనేది ఏర్పడుతుంది
- ఇలా ఆలోచించినప్పుడు, తెలుగు కధల్లో బెర్ట్రాండ్ రసెల్ దృక్పథం (కొన్ని సందర్భాల్లో) నాకు కనబడింది వ్యక్తిగతంగా బెర్ట్రాండ్ రసెల్ రచనల పట్ల నాకు గల విశేషమైన మక్కువ ఇందుకు ఒక కారణం అయితే కావచ్చు. తెలుగు కధకు సంబంధించి అంతగా చర్చలోనికి రాని ఈ విషయాన్ని గురించి చెప్పే ఈ వ్యాసం పారకులకు ఆసక్తికరంగా ఉండగలదని భావిస్తాను. ఈ సంపుటిలో కుటుంబరావు, పద్మరాజు, బుచ్చిబాబు, తిలక్ వంటి కధకుల కథలపై రాసిన వ్యాసాలతో బాటుగా - “పాతికేళ్ల తెలుగుకథొ, “ఓ ఏడాది తెలుగుకథ”, వంటి వ్యాసాలు కూడావున్నాయి. ఈ విధంగా నాటి, నేటి, తెలుగు కధల గురించిన వ్యాసాలు ఇందులో వున్నాయి కాబట్టి - ఈ పుస్తకానికి “తెలుగు కథ - నాడూ, నేడూ” అనే మకుటాన్ని ఉంచడం జరిగింది ఇలా అన్నంతమాత్రాన, - ఇందులోని వ్యాసాలు తెలుగు కధా పరిజామాన్నంతటినీ వివరిస్తాయని గానీ, తెలుగుకథా పరిణామంలో మైలురాళ్లనదగ్గ కథకుల కథలన్నింటినీ పరామర్శిస్తాయని గానీ, అర్ధం కాదు ఇందులోని వ్యాసాలు “85 - 2004 సం॥ మధ్యగల కాలంలో వేర్వేరు సందర్భాలలో రాయబడినవి, మొత్తం అంతా ఒకేకాలంలో ఏకబిగిన రాయబడినవి కావు అందుచేత - కొన్ని సందర్భాల్లో పునరుక్షిచోటు చేసుకునేందుకు, మరికొన్ని సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత సందర్భానికి అంతగా అన్నయించబడక పోయేందుకు, అవకాశం లేకపోలేదు దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యాసాలను అక్కడక్కడా సవరించడం జరిగింది (అయినా,- కొంత సర్దుబాటు తప్పలేదు) ఇక, - ఈ వ్యాసాలు మొదట ఎందులో ప్రచురితమయ్యాయి అనే విషయానికి సంబంధించిన వివరణ (ప్రతివ్యాసం చివర్లో ఇవ్వడం జరిగింది. వీటిని తొలుత ప్రచురించిన పత్రికలవారికీ, ఆయా విశేషసంచికల, వ్యాససంపుటుల సంపాదకులకు, 'ప్రచురణకర్తలకు, కృతజ్ఞతలు. సాహిత్యాభిమానులయిన పారకులు - నా ఇతర రచనలనలె ఈ వ్యాస సంపుటిని కూడా ఆదరించగలరని ఆశిస్తాను. రాజమండ్రి భవదీయుడు, 1-8-2006 కోడూరి శ్రీరామమూర్తి
కి శవా బై “- క్రద్ధలంటే పై పైన ఉన్నాయనుకుంటున్నావేమో - అవి కల్పించ డానికి ఎంతో ప్రతిభ కావాలి వాటి విలువ తెలుసుకోడానికెంతో పరిజ్ఞానం ఉండాలి అవి బోధపరచుకోడానికెంతో బుద్ధిసూక్ష్మత కావాలి కధలు కళ్లకి వెలుగునిస్తాయి.బుద్ధికి పదునుపెడతాయి. మనసుకు ఉత్సాహము, ఉల్లాసము, ఇస్తాయి కధలు చదవడం, వినడం, ఎప్పుడూ దండుగ అనుకోకేం ! -” “కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
రిషయసూదిక
- మంచికధ అంటే? ........ క్షే
- కుటుంబరావు కధలు - సాంఘిక, ఆర్థికనేపధ్యం 29
- పద్మరాజు కథలు - ఒక పరిశీలన శశీ శ తెలుగు కథల్లో రసెల్ దృక్పథం ర్కే
- చలం కథలు - మనోవిశ్లేషణ 66
- పొగమంచులో చిక్కుకున్న మనిషికథను ఆవిష్కరించే
త్రిపురకథలు గ్గ 7. కథకుడుగా తిలక్ 91 & బుచ్చిబాబు కథలు - మనోవైజ్ఞానిక దృక్పథం 103 9. పాతికేళ్ల తెలుగుకథ - కొన్ని అలోచనలు కేమేర్ 10. ఓ ఏదాది తెలుగు కథ గురించి .... కతిక 11. మరుగుజ్జు మనుషుల ఆలోచనలను ఎద్దేవాచేసే
రా,రా.కథలు 176 12. ఓ మంచి కథకుడి గురించి.... 186
మూ అలుగు కథ -నాడు,నేడు 2ఇ2ఇఐఇఐ22వనన2వనివవవరడం2 6 మంచికథి అంటే.....?
“- కథా రచన అనేది అగ్గిపుల్లలతో మేడకట్టడం లాంటిది ఒకదశ వచ్చేసరికి ఒక్కపుల్ల ఎక్కువయినా మొత్తం కూలిపోతుంది. యింత శ్రద్ధగా 'బేలన్స్' గమనించాల్సిన ఆవశ్యకత ఒక కధారచనలో తప్పించి మరెక్కడా కనబడదు అందుచేతనే సృజనాత్మక వచన సాహిత్య ప్రక్రియలన్నింటిలోకీ కథారచన క్లిష్టమైనదిగా నేను భావిస్తాను” అన్నాడు ప్రఖ్యాత కధారచయిత హెచ్ యి బేట్స్ - తాను రచించిన 'మోడరన్ షార్ట్స్టోరో అనే రచనలో
బేట్స్ కధారచయిత కాబట్టి యిలా చెప్పాడనుకోడానికి అవకాశం లేదు. కధారచన, నవలారచన, రెండింటిలోనూ ప్రపంచ (ప్రఖ్యాతి గాంచిన సోమరసెట్మామ్ కూడా ఇంచుమించు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు.
కధ రాయడం అన్నదే ఇంతకష్టమైన పని అనుకుంటే, - ఇక, మంచికథ రాయడం మరింత కష్టమైన పని అని ప్రత్యేకించి చెప్పనవసరంలేదు కధకు గల లక్షణాలు యివీ అని సార్వత్రికమైన రీతిలో చెప్పడం కష్టంగానీ, కధకు ఉండాల్సిన లక్షణాలలో ముఖ్యమైన రెండింటిని గురించి ముందుగా ప్రస్తావించుకుందాం. అవి -
- సంక్షిప్త్రత (9/60
2 అనుభూతి ఐక్యత (౮౧19/ 01 ౧౭౭810౧)
నవలకున్నంత విస్తృతి కథకు ఉండదు కాబట్టి యిందులో అధికసంఖ్యలో పాత్రలను సృష్టించడం, సుదీర్థమైన వర్ణనలు చెయ్యడం లాంటివాటికి అవకాశం ఉండదు. పొత్రచిత్రణకు, ఇతివృత్త నిర్వహణకు కావలసిన వాతావరణాన్ని కథకుడు సమకూర్చుకోవలసి ఉంటుంది. అనవసరమైన విషయాల ప్రస్తావన నవలా శిల్పాన్ని అంతగా దెబ్బతియ్యకపోవచ్చును - కాని కధాశిల్పాన్ని పాడుచేస్తాయి. కధలో ఒకచోట
కోడూరి శ్రీరామమూర్తి మవ తుపాకీ ఉందని కధకుడు చెబితే కధ ముగిసేలోపల అది తప్పకుండా పేలాలంటాడు చెహోవ్. ఈ విషయాన్ని ప్రసిద్ధ తెలుగు కధకుడు బుచ్చిబాబు అంగీకరించ లేదు “ఒక అటవీశాఖాధికారి ఇంటిని రచయిత వర్ణించేటప్పుడు, తగిన వాతావరణాన్ని సమకూర్చుకోవడం కోసం, ఇంటిలో తుపాకీ వుందని చెప్పవచ్చు అంతమాత్రానఅది పేలాలని నియమం లేదు” అంటాడతడు. ఈ విషయమై చర్చ ఎలా ఉన్నా పదాలవాడుక విషయంలో కథారచయితకు పొదుపు అత్యవసరం. ఒక పాశ్చాత్య సాహిత్య విమర్శకుడు అన్నట్టు రెండు నాణేలు ఖర్చుపెట్టే దగ్గిర కధకుడు ఒక్క నాణేన్ని మాత్రమే ఖర్చుపెట్టగలడు!
- అలాకాకుండా కధలో సుదీర్థవర్ణనలు చోటుచేసుకున్నప్పటి పరిస్థితిని బేట్స్ వివరిస్తూ “నవలకు పనికివచ్చే సుదీర్హమైన వర్ణనలు కధలో వుంచడమన్నది ఆరునెలల పాపకు పెద్ద టోపి, ఫర్కోటు వేసి అలంకరించడం వంటిది” అంటాడు ఈ వివరాలనుబట్టి కధకు గల నిడివి తక్కువగా ఉంటుంది అని అర్థం అవుతుంది యిలా రాసినంత మాత్రాన, తక్కువ నిడివిగలదే కధ అనీ, నిడివి పెద్దది అయితే, అది కధకు ఉండాల్సిన లక్షణాన్ని కోల్పోతుందనీ అర్ధం చేసుకోకూడదు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, చలం, బుచ్చిబాబు మొదలయిన ప్రసిద్ధ కధకులు నిడివిలో పెద్దకధలు (వ్రాసినవారే ! చలం 'హంపీ కన్యలు' కథ నిడివి 50 పేజీలు దాటితే శ్రీపాదవారి గూడుమారిన కొత్తరికం' 100 పేజీలు దాటింది. బుచ్చిబాబు రాసిన కధల నిడివి సగటున 20 పేజీలు దాటుతుంది. సమతూకం నిలబెట్టుకుంటూ ఎంత పెద్ద అగ్గిపులలమేడ కట్టినా ప్రమాదంలేదు గాని మేడ పెద్దదవుతున్న కొద్దీ కూలిపోయే ప్రమాదం ఎక్కువ అన్న విషయం మాత్రం గ్రహించాలి. కథకుడు ఒక కథను వ్రాసేటప్పుడు సహజంగానే అతడి మనసులో ఒక భావం, ఒక ఉద్రేకం, ఒక ఆలోచనా ధోరణి ఉంటాయి. కథ చదివిన పారకుడి మనసులో కూడా అలాంటి ప్రతిస్పందనలను కథకుడు తీసుకురాగలిగితే ఆ కథ తన లక్ష్యాన్ని సాధించినట్లుగా భావించవచ్చు. కథలోని వివిధ సంఘటనలు, పాత్రలమధ్య సంబంధాలు, పరిణామం చెందుతున్నప్పుడు కథకుడు చెప్పదలిచిన భావానికి అవి అన్నీ దోహదం చెయ్యాలి. అంతేకాని కేంద్రబిందువునుండి దృష్టి చెదిరిపోకూడదు. తను బయలుదేరిన దోవను మరిచిపోయి కథకుడు మరో దోవ (శ్రాక్కకూడదు. అలా జరిగినప్పుడు రనుభూతిలో ఐక్యత సిద్ధించదు. కథకుడు చెప్పదలిచిన భావం యథాతథంగా పారకుడికి అం .
మావ తలుగు కథ -నాడు,నేడు మైనవి
ఉదాహరణకు రావిశాస్త్రి రచించిన “మామిడిచెట్టు, బుచ్చిబాబు రచించిన 'కొత్తవంతెన - పాతనీరూ కధలనే తీసుకుందాం 'ఆస్తి అనే భావం చుట్టూ అల్లుకుపోయిన మానవ ప్రవృత్తి అసలు కధను బయటపెట్టడం “మామిడిచెట్టు' కధలో కధకుడు ఆశించిన లక్ష్యం కధ చదివిన పారకుడికి రచయిత మనసులోని భావం యధాతధంగా అందుతుంది కధ చాలాకాలం గుర్తుండిపోతుంది ఈ కధలో పారకులను గిలిగింతలు పెట్టే హాస్యోదంతాలు ఎన్నో ఉన్నాయి ఈ ఉదంతాలనన్నింటినీ కధకుడు తన లక్ష్యాన్ని బలపరుచుకునేందుకు మాత్రమే ఉపయోగించుకుంటాడు ఎక్కడా దారి తప్పడు
కాని (బుచ్చిబాబు) 'కొత్తవంతెన - పాతనీరు' కథ పరిస్థితి వేరు. బుచ్చిబాబు ప్రఖ్యాత బ్రిటిష్ తత్వవేత్త బేర్ట్రాండ్ రసెల్‌కు అంకితమిచ్చిన రెండు కధలలో యిది కూడా ఒకటి. స్రీ పురుషుల మధ్యగల సంబంధం వ్యక్తిగతమైనది ప్రపంచంలో వ్యభిచారం ఒక్కటే నేరం కాదు ఒక వ్యక్తి సమాజానికి పనికివచ్చే పనులు ఎన్నిచేసినప్పటికీ వివాహేతర లైంగిక సంబంధం కలిగివున్నాడన్న ఒకే ఒక కారణంగా నిందించబడడమూ, సమాజానికి పనికి వచ్చే పని ఏదీ చెయ్యని వ్యక్తి "సెక్సు' విషయంలో నీతిపరుడయిన కారణంగా గౌరవించబడడమూ సరి అయిన విషయాలు కావు” అనే రసెల్ భావాలకు అక్షరరూపం యిచ్చేందుకు బుచ్చిబాబు ఈ కధను వ్రాశాడు.
ఈ కధలో భరతరాజుకు, (ప్రభాకరానికి మధ్యగల తేడాను రసెల్ దృక్పధంలోంచి చూసి, అర్ధం చేసుకోగలం ప్రభాకరం పట్ల సానుభూతి చూపగలం కాని, కధ చివరికొచ్చే సరికి 'అలివేలు చావువల్ల ప్రభాకరంపై పాఠకులకు కలిగే సానుభూతి కరిగిపోతుంది కధ కేంద్రబిందువు, ప్రభాకరంలాంటి మంచివాడికి సమాజం వలన కలిగిన అపకారం నుండి - అలివేలుకు జరిగిన అన్యాయానికి మరలిపోతుంది. యిదే పొరబాటు మరొకవిధంగా బుచ్చిబాబు (వ్రాసిన 'బీ కధ విషయం కూడా జరిగింది. ఈ కధను బుచ్చిబాబు ఒక సైకలాజికల్ స్టోరీగా ప్రారంభించి, మధ్యలో ఈ విషయాన్ని వదిలి తాత్విక చింతన వైపు, భగవద్దీతవైపు పరిగెట్టాడు.
ఇదంతా (వ్రాయడానికి కారణం బుచ్చిబాబు కధాశిల్పం పట్ల గౌరవం లేక కాదు. అంతటి మంచి కధకుల విషయంలోనే పొరబాట్లు జరిగేందుకు అవకాశం ఎలా వుంటుందో చెప్పడానికి మాత్రమే ఇది వ్రాశాను.
కధను గురించి చెబుతూ 114161౧6 4౧౧౭౧౦౧6 యిలా అంటారు -*క5గ0గ 58100/ [60656015 1512 6౧౧6, +116% & ౧౦1౧01 ౪16౫, & 06౧21౧ 1004166860! ౧౮౧2౧ ౧౭/6, 2౧6 50[0 16619 420061 2౧6] 5/6
2దరలడడ2డ22డ2డ22ద22220222ఊ02222 కోడూరి శ్రీరామమూర్తి మమా కధకు ఇతివృత్తం అంటూ ఒకటి వుండడం తప్పనిసరి. ఇతివృత్తం కోసం ప్రత్యేకంగా వెదకనవసరం లేదు. ప్రతిమనిషి కదలికలోనూ కధకు కావలసిన ఇతివృత్తం వుంటుంది తనను, తన చుట్టూ వున్న సమాజాన్ని మనుషులనూ పరికించి చూడగలిగితే ప్రతి కన్నీటి బొట్టులోనూ, కంటిపాప మెరుపులోనూ, కధకు కావలసిన ముడిసరుకు దొరుకుతుంది ! అయితే, రచయిత తనకు గల అభిరుచులను బట్టి, ఆలోచనాధోరణిని బట్టి, తనకు కావలసిన వస్తువును ఎంచుకుంటాడు. తన సామర్ధ్యాన్ని బట్టి కధగా మలచగలుగుతాడు. అయితే, - వాస్తవజీవితంలో కనబడిన సంఘటన కధలోనికి యథాతథంగా రాదు. రాబర్ట్ ఎడ్జెల్ “సృజనాత్మక క్రియ సూప్ చెయ్యడం లాంటిది. సూప్‌ను మరగబెట్టి తగ్గించినట్టు, వాస్తవంలో నుండి తనకు కావలసిన వస్తువును రచయిత సం(గ్రహిస్తాడు” అని అంటాడు. ఇలా సంగ్రహించిన ఇతివృత్తాన్ని కధగా మలచడంలోనే కధకుడి పనితనం కనబడుతుంది. ఈ కృషిలోనే రచయిత తనను తాను అన్వేషించుకోగలుగుతాడు. తన మనసులోని బొమ్మను వెలుగునీడలతో సవా సందర్శించగలుగుతాడు. సమాజంలో కనబడిన ఒక ఉదంతం తనను నిజంగా ఆకర్షించినప్పుడు, తన అభిరుచికి అది సరిపడినప్పుడు మాత్రమే దానికి కధకుడు కధారూపం ఇవ్వాలి ఈ విషయంలో రచయితకు నిజాయితీ వుండడం చాలా అవసరం. ఇదిలేని రచయిత (ప్రచురణ భాగ్యం పొందడం కోసమో, (ప్రజాదరణను కోరుకునో, కథను మలిస్తే అభాసుపాలవుతాదడు! బుచ్చిబాబు అన్నట్టు “బాహ్య జగత్తులో వస్తువు ఎంత అద్భుతమైనదైనా సరే అది కధకుడి అంతరంగ జగత్తులో ఆవిర్భవించే ఒక కళాదృష్టితో సమన్వయం కుదుర్చుకుని తనదైనప్పుడు తప్ప ఆ రచయిత ఆ వస్తువును స్వీకరించడం మూర్ధత్వం", ఇలా ఇతివృత్తం, కధకు కావలసిన వాతావరణం సమకూరిన తరువాత, దానికి అనుగుణంగా పాత్రచిత్రణ జరుగుతుంది వివిధ పాత్రల మధ్య సంఘర్షణ - కొన్ని సందర్భాలలో ఒకే పాత్రలోని విరుద్ధ ప్రవృత్తుల మధ్య సంఘర్షణ అనివార్యమవుతుంది. మంచి,చెడు అనేవి వేర్వేరు వ్యక్తుల విషయంలో వుంటాయనే నమ్మకం లేదు ఒకే వ్యక్తిలో ఈ రెండు ప్రవృత్తులూ వుండవచ్చు. ఏదీ మంచి, ఏది చెడు, అని విభజించి చెప్పడం సాధ్యం కాని పరిస్థితులు కూడా వుండవచ్చు. ఇటువంటి స్థితిలో వ్యక్తి అంతరంగంలో జరిగే సంఘర్షణను కథకుడు సమర్ధవంతంగా పట్టుకోగలిగితే కధగా అది బాగా రాణిస్తుంది. సజీవమైన పాత్రలతో, ఆ కధ పాఠకునికి ఎప్పటికీ గుర్తుంటుంది.
౨22 తెలుగు కథ -నాడు,నేడు
ఉదాహరణకు చలంగారి 'నాయుడుపిల్లి కథనే తీసుకుందాం. ఈ కధలోని నాయుడుపిల్లకు పరిస్థితుల ప్రభావం వల్ల ఒక ముసలినాయుడుగారితో పెళ్ళి అయింది. ఆ అమ్మాయికి ఆ ముసలివాణ్ణి చూస్తే అసహ్యం కాని అతగాడు ఆమెను ఎంతో మురిపెంగా చూసుకుంటూ, అడిగినవన్నీ కొని యిస్తూ వుంటే కేవలం శారీరకవాంఛ తీరడం లేదన్న కారణంగా అతగాడిని ద్వేషించవలసి వస్తున్నదనే బాధ - అతగాడు తన తండ్రిగాని, మామగారు గాని అయివుంటే బాగేండేదన్న తలంపు - తన ప్రియుడు పార్ధసారధితో శారీరకమైన సంబంధం పెట్టుకుని, నాయుడికి అన్యాయం చేస్తున్నానన్న ఆవేదన - ఇవన్నీ కలబోసి నాయుడుపిల్ల పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు చలంగారు. ఎర్నెస్ట్ హెమింగ్వే కోరుకున్నట్టుగా ఈ కధలో జీవితం కేవలం ఏదో ఒక డైమెన్షన్లో మాత్రమే కాకుండా, రెండు దైమెన్షన్లలలో, కూడా కనబడుతుంది ! చలం చెప్పే సందేశాన్ని అంగీకరించేవారు, అంగీకరించనివారు కూడా “నాయుదుపిల్లి కథను, ఆ కథలోని ఆ పాత్ర సజీవ చిత్రణను ప్రశంసించకుండా వుండలేరు.
పాత్రను సృష్టించడం వరకు మాత్రమే కధకుడి పని. వాటిని అదుపుచేస్తూ తన సిద్ధాంతాలకు అనుగుణంగా రచయిత వాటిని తొలుబొమ్మల్లా ఆడించకూడదు ఇట్లాంటి కధకుల కధల్లోని పాత్రలు సజీవంగా కనబడవు. అవి ఎదుగుదల లేని మరుగుజ్ఞుల్లా వుండిపోతాయి ఈ సందర్భంలో చలం కథల్లోని పాత్రలను గుర్తుకు తెచ్చుకోవలసి అవసరం ఉంది. “కధను యిట్లా నడిపించాలని అనుకోను. కాగితం మీద కలం పెట్టగానే వాళ్లే నడిపించుకుంటారు కధను” అనే చలం మాటల్లో అతిశయోక్తి వుందనేందుకు ఆస్కారం లేదు.
తను చిత్రించిన పాత్ర కధను ఆవిష్కరించేటప్పుడు కధకుడు పాత్ర ప్రవర్తన మొత్తాన్ని సర్వజ్ఞుడిలా ఏకరువు పెట్టకూడదు కొంతచెప్పి కొంత చెప్పకుండా వదిలెయ్యాలి. బుచ్చిబాబు అన్నట్టు పాత్రచిత్రణలో కొంత మిస్టరీ కొంత “అర్ధం కాని గొడవి వున్న సందర్భాలలో కధ రాణించేందుకు అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని సందర్భాలలో కధల్లో “మానసిక విశ్లేషణకు కూడా చోటుదొరుకుతుంది. ఇలాంటి సందర్భాలలో రచయిత మనస్తత్వశాస్త్ర సిద్ధాంతాలను ఆకళింపు చేసుకొని మనుషుల విపరీత, విచిత్ర ప్రవర్తనను కధలలో ఆవిష్కరించాలే తప్ప - కధ పారకుడికి అగ్గం కాకుండా పోతుందేమోనని అనుమానపడి, స్కూల్లో మాష్టరు పిల్లలకు పారం బోధించినట్టుగా “మనస్తత్వశాస్త్రరంగా యిందులో వున్న అర్ధం యిదీ" అని వాచ్యం చెయ్యడం కంటే శిల్పపరమైన దోషం మరొకటి వుండదు ! తెలుగులో మనోవైజ్ఞానిక దృక్పథంతో కధలు వ్రాసినవారిలో ప్రసిద్దుడయిన బుచ్చిబాబు లాంటివాడు కూదా ఈ
షల కోడూరి శ్రరామమూళత్తి మమ విధమైన పొరబాటు చేసిన సందర్భాలు కొన్ని వున్నప్పటికీ, మనిషిలోని అంతస్సంఘ ర్న్షణలకు అద్దంపట్టే 'తెరచాపదించిన పడవి, “ఆ రాలిన ఆకులు, “నన్ను గురించి కధ రాయవూ లాంటి మంచి కథలు ఎన్నో ఆయన వ్రాశాడు.
పాత్రల మనస్సుల్లో జరిగే అంతస్పంఘర్నణను తెలియజేసేందుకు చైతన్యస్రవంతి (382౧ 0 00౧3010౪490993) శిల్పం కూడా ఉపయోగపడుతుంది పాతల అంతస్సంఘర్షణ తీవ్రస్థాయి చేరుకొని, న్యూరోసిస్కు చేరువలో ఉన్నప్పుడు, పాత్ర మనోగతాన్ని పొరకుల ముందు వుంచేందుకు ఈ విధానం ఎంతగానో ఉపకరిస్తుంది. చైతన్య (స్రవంతి విధానాన్ని ఉపయోగించుకొని శ్రీశ్రీ, బుచ్చిబాబు, నవీన్వంటి వారు తెలుగులో కొన్ని కధలు వ్రాశారు. “త్రిపుర కూడా ఈ విధానాన్ని తన కధల్లో అవసరాను గుణంగా కొన్నిచోట్ల ఉపయోగించుకున్నాడు.
ఈ సందర్భంలో కొన్ని విషయాలను గమనించవలసి వుంది. చైతన్యపస్రవంతిలో వుండేది మామూలు స్వగతం (110౧010046) కాదు. దానిని అంతరంగిక స్వగతం (1౧1970 గం౧౦10949) గా గమనించాలి “ఆంతరంగిక స్వగతరిలో తార్మిక విజ్ఞత వుండదు. ఆలోచనలతీరు అస్తవ్యస్తంగా వుంటుంది. ఒక కాలక్రమ వరుస లేకుండా, ఒక పొందిక లేకుండా బుర్రలోకి వచ్చిన భావాలను యథాతథంగా వెలిగ్రక్కడం జరుగుతుంది. గతం, వర్తమానం, భవిష్యత్తు కలగలిసి పరిగెట్టే ఈ రచనల్లో పొందిక లేకపోవడంలోనే ఒక పొందిక వస్తుంది ! అయితే నాలుగు పిచ్చిగీతలు గీస్తే మోడరన్ ఆర్ట్ ఎలా కాదో, అర్ధం లేని మాటల కలయిక చైతన్య ్రవంతికాదని మరచిపోకూడదు
కథారచన విషయం చెప్పేటప్పుడు తప్పనిసరిగా గమనించాల్సిన మరోముఖ్యమైన విషయం - రచయిత చూపే దృక్కోణం (౧౦1౧౦ ౪1అగ). కధా రచయితకు గల దృక్చధాన్ని బట్టి కధను నిర్వహించే తీరులో మార్పువస్తుంది. ఉదాహరణకు శరత్ 'అభాగిని స్వర్ణం, కాళీపట్నం రామారావుగారి “చావు కథలనే తీసుకుందాం. శరత్. కధలోని అభాగినీ, కా.రా.గారి కధలోని నారెమ్మ తాము చనిపోయినప్పుడు తమ శవాలను కప్పి పెట్టకుండా తగలెయ్యాలని కోరుకున్నారు. శవాన్ని కప్పిపెట్టడం కంటే, తగలెయ్యడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అనీ అట్టడుగు స్థాయి ప్రజలకు అది మోయలేని ఖర్చు అవుతుందనీ, ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే శరత్కధలోని అభాగిని (బ్రతుకులోనే కాదు, చావులోకూడా అభాగినిగానే మిగిలిపోతుంది. “అయ్యో అని పారకుల సానుభూతిని పొందడం మినవీ ఆ “అభాగిని' సాధించింది ఏమీ లేదు. కాని కా.రా.గారి 'నారెమ్మూ మాత్రం చావులో అభాగిని కాదు ! ఒక వ్యవస్థపై చావు దెబ్బ తీసేందుకు
కా.రా.గారు నారెమ్మ కోరికను, ఆమె “చావును ఉపయోగించుకున్నారు కా.రా.గారి కధ చదివిన పారకులకు కథ చివరిలో అప్పారావు అన్నమాటలు జ్ఞాపకం వుండే వుంటాయి *ఈ శవాన్ని మీరు ఎలా వదిలించుకున్నా ఒక్కటే! - ఎందుకంటే - నీట్లో పడేసినా, నిప్పుల్లో కాల్చినా, గొయ్యితీసి పాతిపెట్టేసినా జీవుడు ఏడుస్తాడనుకోను. చచ్చిన శవాల గురించి నేను ఏడవను. నా ఏడుపంతా బ్రతికున్న శవాల గురించే ” - శరత్ కధకూ, కా.రా.గారి కధకూ దృక్పధంలో తేడా యిక్కడే వుంది !
- వివిధ రచయితల విషయంలోనే కాదు ఒకే రచయిత వివిధ కాలాల్లో రచించిన కధల విషయంలో కూడా కొన్ని సందర్భాలలో ఈ తేడా కనబడుతుంది. రావిశాస్రిగారు రచించిన “విలువలు”, 'న్యాయం' కథలనే తీసుకుందాం ఈ రెండు కథల్లోనూ డబ్బుకు స్తీ శరీరాన్ని కొనుక్కున్న మగవాడి కథ వున్నది కాని ఫోకస్ చేసిన విషయాల్లు మాత్రం వేరు
“విలువలు” కధలో రూపాయిన్నరకు వళ్ళు అమ్ముకునే ఒక బజారు స్రీని అనుభవించిన పురుషుడు అపరాధభావంతో తనను చూచి తాను సిగ్గుపడే ఉదంతం వున్నది. వెళ్లేముందు అతడిని ఆమె ఆఖరిసారిగా ముద్దుపెట్టుకుంటే తనని మంటల్లోకి విసిరి భస్మం చెయ్యడానికి బదులు స్రీ సహజమైన లక్షణంతో ఆమె తనను ఆదరించిందనీ, అధోస్థానంలో వుంటూ, ఇంకా క్రిందకు జారిపోతున్న తనపై వెన్నెల వర్షం కురిపించిందనీ అతడు పరితపిస్తాడు
“న్యాయం” కధలో అమెరికన్ నావికులు ఒక సొనిపాపను సామూహికంగా అనుభవించి, వంటి మీద బట్టలు కూడా లేని స్థితిలో రోడ్డుమీద వదిలేసిన ఉదంతం ఉన్నది. రోడ్డు మీద అసభ్యంగా తాగి తందనాలాడినందుకు నిజమైన కేసు, సారా అమ్మిందని దొంగకేసు బనాయించి న్యాయం కోసం ఆమెను పోలీసులు మేజి[ప్టేటు కోర్టుకు తీసుకువస్తారు. అప్పుడు ఆమె కోర్టులో ఆవేశంగా పలికిన పలుకులు పాఠకులు మరచిపోలేరు.
- ఈ రెండు కథలూ హృదయాన్ని స్పందింపజేసేవే ! అయితే “న్యాయం కథలోని న్యాయం కాల్పనికతలోంచి పుట్టుకొచ్చింది కాదు. విషాదవాస్తవంలోంచి ఉద్భవించింది. మంచి కథకు, గొప్పకధకూ తేడా ఇదేననిపిస్తుంది
అందరూ రచయితల దృక్సథం ఒకేలా వుండాలనే నియమం లేదు పద్మరాజు అద్వైత దృక్పథంతో “గాలివాని వంటి గొప్పకథను వ్రాయవచ్చును. సామ్యవాద దృక్సథంతో కుటుంబరావు 'జకాసుర వ్రాయవచ్చును మరొక రచయిత ఆస్తిక అస్తిత్వవాద
మరత: కోడూరి శ్రీరామమూర్తి ౨ దృక్పధంతో కథ వ్రాస్తే “త్రిపుర వ్యక్తి అంతరంగ సంక్షోభానికీ, సామాజిక సంక్షోభానికి, మధ్యగల సంబంధాన్ని అస్తిత్వవాద దృక్పధంతో అవలోకిస్తూ కధ వ్రాయ వచ్చును. చక్కని కథాశిల్పాన్ని పుణికిపుచ్చుకున్నప్పుడు ఇవి కధలుగా రాణించేందుకు అవకాశం ఉంటుంది. అయితే వేటివలన సమాజానికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది అనే విషయాన్ని విజ్ఞుదడయిన పారకుడు [గ్రహించవలసి వుంటుంది.
--కథలో ఎత్తుగడ (8601౧౧1౧00), మధ్యభాగం (8060), ముగింపు (౬౧0) అనే మూడు ప్రధాన భాగాలుంటాయి.
“కథా ప్రారంభంలో కధలో వచ్చే ప్రధానపాత్రలు, అవి ఎదుర్శొనే సమస్యలు పరిచయం అవుతాయి. మధ్యభాగం వచ్చేసరికి ఆ సమస్యల నెదుర్శొనేందుకు జరుగుతున్న కృషిస్వరూపం తెలుస్తుంది. ఇక ముగింపులో ఆ కృషిలో పొందిన సాఫల్యం, వైఫల్యాలు వుంటాయి అంటాడు ౮౦[౧ 8012౧6 తన “5౧0 510౧/160%01606* అనే రచనలో.
కథకు మంచి ఎత్తుగడ, ముగింపు వున్నప్పుడు అది పారకులను బాగా ఆకట్టు కుంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఉదాహరణకు ఒక రచయిత తన ఎత్తుగడలో -
"ఉదయం ఎనిమిదిన్నర అయింది తన స్టడీరూమ్‌లో ఉస్సురుమని కూర్చొని దొంగను పట్టకురమ్మని కబురంపేడు లక్ష్మీపతి. దొంగను ఏం చెయ్యాలి, ఏమిటో అతనికేం తోచకుండా వుంది. తన నలఖైఏళ్ల జీవితంలోనూ అతనెన్నడూ ఇటువంటి అవస్థలో, పరిస్థితిలో పడలేదు”
(రావిశాస్త్రి 'సబ్బుబిళ్లు కధా ప్రారంభంలో) అనో -
“ఇలా బ్రతికేకన్నా ఒక చిన్న మెత్తు విషం పుచ్చుకొని...”
ఆ దీవెన మొదటిసారి తగిలినప్పుడు అలాగాచేస్తే చాలనిపించేటంత అసహ్యం ముంచుకొచ్చింది - సంసారం మీద. కాని, అస్తమానూ అదే పదేపదే అయితే అలవాటు కావడం ఎంత సేపు?
రెండో తారీఖు ఉదయం -౫”
= (మల్లాది రామకృష్ణశాస్త్రి 'వేదమూర్తులు కధా ప్రారంభంలో) అనో =
కథను ప్రారంభించి, కథలో తాను చెప్పదలచుకున్న ఉదంతాన్ని ఆసక్తికరంగా పారకుల ముందు వుంచవచ్చు
222 తెలుగు కథ - నాడు,నేడు
లేదా -
“భాస్మరంగారు నాకు మా బాగా దొరికాడు !
ఆయన ఎవరో నేనెరగును ఆయన మాకు చుట్టం కాదు, ఆయనను మొదటిసారిగా చూసినప్పుడే నా కడుపులో దేవినట్టయింది. అన్నివందలసొర్లు చూసినా, యిప్పటికీ ఆయన కనిపిస్తే నాకు పైత్యవికారం వస్తూనే వుంటుంది -”
- (కొడవటిగంటి కుటుంబరావు 'యావజ్జీవ శిక్షు కథా ప్రారంభంలో)
అంటూ తాను చెప్పదలచిన పాత్రగురించి పరిచయం చెయ్యవచ్చు. ఏం చేసినా అది ఆసక్తికరంగా జరిగినప్పుడు ఆ కధ పారకుడిని ఆకట్టుకోగలుగుతుంది. పరనీయత అనేది కధకు వుండాల్సిన ప్రాధమిక లక్షణం
యిక ముగింపు వచ్చేసరికి రచయిత కధలోని సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలనే నియమం లేదు. “రచయిత బాధ్యత పారకుల ముందు సరి అయిన రీతిలో ప్రశ్న వుంచడమేగాని, దానికి పరిష్కారం చూపడం కాదు” అంటాడు చెహోవ్. 'అనాకెరినినొ నవలలో ఒక్క సమస్యకూ పరిష్కారం లభించబడనప్పటికీ అది గొప్ప నవల అని అన్నాడతడు. కధలో రచయిత తాను చెప్పదలచిన అంశంపై, పాఠకులను ఆలోచింప చెయ్యగలిగితే ఆ కధకు మంచి ముగింపు వచ్చినట్టే |
కథ చివరిలో ముగింపువాక్యాలు కూడా కథకు మంచిపుష్టిని యిస్తాయి. ఉదాహరణకు చలంగారి 'సుశీల' కధ చివరలో సుశీల ఏడుస్తూంటే క్షయవ్యాధి[గ్రస్తుడయిన ఆమె భర్త నారాయణప్ప ఆమెను అనునయించబోతాడు. అప్పుడు ఆమె “జరిగిందానికి ఏడ్చాను అంతే” అని అంటుంది. ఈ ఒక్క ముగింపు వాక్యంతో సుశీల పాత్ర పారకుల హృదయాల్లో మరింత ఎత్తుకు ఎదుగుతుంది. అలాగే “లక్ష్మి ఉత్తరం” కధ చివరలో వున్న “మళ్లీ పెళ్లి చేసుకుంటారా ?” అనే వాక్యమూ,- “ఆమె త్యాగం” కథ చివరిలో “ఆమె చెంపల్ని తాకిన దాక్టర్ “ఈ జన్మలో నేను పంపగల బిల్లుల మొత్తం అంతా తీరింది” అనడమూ, కూడా యిటువంటివే. - చలంగారు రాసిన ఈ కధలను చదివిన పారకులు ఆ ముగింపువాక్యాలు ఆయా కథలకు ఎంతటి జవాన్నీ, జీవాన్నీ యిచ్చాయో అవగతం చేసుకోగలరు. ఒక మంచి కథను సమర్ధవంతంగా రాస్తూ, కథ చివరిలో ఒక చౌకబారు ముగింపువాక్యం వ్రాసి మొత్తం కథ స్థాయినంతా పాడుచేసుకున్న కధల గురించి కూడా చెప్పవచ్చు.
కథ ముగింపులో 'కొసమెరుపు' కథకు వన్నె తెస్తుందంటారు కొందరు, ఈ తరవి
మష్త్రచడ2నడడద2222222:2222వ కోడూరి శ్రీరామమూర్తి మవ కథలు వ్రాసినవారిలో 'ఓ హెన్రీ ప్రసిద్ధుడు. ఈ ధోరణిలో కొన్ని మంచికధలు వ్రాసిన కధకులు తెలుగులో కూడా ఉన్నారు. (ఇచ్భాపురపు జగన్నాధరావుగారి కథలు కొన్నింటిలో ఈ కొసమెరుపు అందంగా కనబడుతుంది) ఈ సందర్భంగా ఒక విషయం చెప్పక తప్పదు. కధ రాణించడానికి కొన్ని సందర్భాలలో 'కొసమెరుపు' ఉపయోగ పడుతుందేమో గాని, కొసమెరుపు మీద కథస్థాయి ఆధారపడి ఉండదు ఒక్క నిముషమైనా మనం కథ గురించి ఆలోచించగలిగినప్పుడు మాత్రమే ఆ కధ నిలబడుతుంది. అలా కానప్పుడు
- కధ ముగియగానే పెదాలపై ఒక చిరునవ్వు మెరవడమూ, పేజీ త్రిప్పడమూ,- ఒకేసారి జరుగుతాయి అలాంటి కధలను మంచి కధలుగా గుర్తించలేము. కధకు ప్రారంభం, ముగింపు అనేవి అంత ముఖ్యంకాదనేవారు కూడా ఉన్నారు. కథకు తుదీ, మొదలూ లేకుండా వుండి, మధ్యలో ప్రారంభమై మధ్యలో అంతం కావాలంటాడు చెహోవ్ ! “ఒక సన్నివేశం జరుగుతున్నప్పుడు తటాలున తలుపుతెరిచి, అంతలోనే ముయ్యడం లాంటింది కధ. తలుపుతీసి వేసేలోపల ఏం జరిగిందో మాత్రమే మునకు తెలుస్తుంది” అని జార్టిలెవింగ్ అనడాన్ని ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకోవలసి ది. మొపాసా, మామ్వంటి, వారికి ఈ ధోరణి నచ్చదు. “కథ అనేది గుర్రం పరుగు లాంటిది. ప్రారంభం, ముగింపు ముఖ్యం” అని మొపాసా అంటే, - “కధకు తుదీ మొదలూ వుండకూడదనడం, తలా తోకాలేని చేప కావాలనడంలాంటిది” అన్నాడు మామ్. తుదీ, మొదలూ సక్రమంగా అమరని సందర్భాలలో - తన దృష్టికి వచ్చిన మంచి ఉదంతాలను కథలుగా మలచడం మానుకున్న వైనాన్ని మామ్ తన రైటర్స్ నోట్బుకొలో రాసుకున్నాడు. మొపాసా, మామ్ల కధాశిల్పాన్ని అనుసరించి కథలు రాసిన బుచ్చిబాబు “చెహోవ్ పద్ధతి ఇసుకమీద కెరటం దిగవిడిచిన చారలాంటిది, నాకది తృప్తినివ్వదు. ఆ కథ కెరటంగా కనబడాలి, కెరటం వెనుక సముద్రం హోరు వినబడాలి”. అనడాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకోవలసి వుంటుంది. కుటుంబరావు గారి వంటివారు చెపోోవ్ పద్ధతిలో కొన్ని మంచి కధలను రాసినమాట నిజమేగాని చెహోవ్ పద్ధతిలో రాసిన కథకన్నా మొపాసా పద్ధతిలో రాసిన కథ పారకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ వ్యక్తిగత అభిప్రాయం ఎలా వున్నా - ఏ పద్ధత్షిలో కథను వ్రాసినా అందులో మానవ స్వభావం, జీవితం ప్రతిబింబించడం అనేది ముఖ్యం.
వమ తెలుగు కథ -నాడు,నేడు
తెలుగులో వచ్చిన కధల్లో పద్మరాజు 'వెండిసీసా, రావిశాస్త్రి 'మామిడిచెట్టు?, గోపీచంద్ 'ఆపద్బాంధవ్యం', తిలక్ 'ఆశాకిరణం' శిల్పపరంగా మంచి కధలని భావిస్తాను. అయితే అవి కధలుగా గుర్తుందానికి మరింత ముఖ్యకారణం వాటిలో కనబడిన మానవ స్వభావ ఆవిష్మరణ, జీవిత వాస్తవాల అవగాహన, అనేవిషయం మరచిపోకూడదు.
కధను వ్రాయడానికి కలం పట్టిన కధకుడి ప్రధమకర్తవ్యం - జీవితాన్ని సన్ని హితంగా చూడడం. జీవితాన్ని నిశితంగా పరిశీలించలేని కధకుడు కధకు సంబంధించిన లక్షణాలను ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేసినా మంచి కధను వ్రాయలేడు. కుటుంబరావు గారు ఒక మాట అన్నారు -
“ఒక కధకుడికి రచనా సామర్ధ్యం లేకపోయినా సరిచేయవచ్చును గాని, జీవితం తెలియకపోతే సరిచెయ్యడం ఎవ్వరివల్లా కాదు శిల్చం, భాష రచనకు ముఖ్యంకావని కాదు; అవి చాలా ముఖ్యం. అవి కధారచనకు మూల పరికరాలు, - ముడిపదార్ధం జీవితం”
ఇలా, జీవితంనుండి జాలువారిన కధ - 'మంచి కధి అనిపించుకోవడానికి కొన్ని లిట్మస్ పరీక్షలు చెబుతాడు చెహోవ్.
“మనం చదివిన కధ పారకుణ్ణి నిద్రనుండి మేల్కొల్పగలిగిందా? - ఆశ్చర్యచకితుణ్ణి చెయ్యగలిగిందా? ఆనందింప చెయ్యగలిగిందా? - నిజ జీవితంలో అనుభవంలోకి వచ్చిన సంఘటనకంటే ఎక్కువగా ఆకట్టుకోగలిగిందా?”
ఈ ్రశ్నలన్నింటి మాట ఎలా ఉన్నా మనల్ని నిద్రనుండి మేల్కొలపగలిగిన కథలనన్నింటినీ నేను మంచి కధలుగానే పరిగణిస్తాను.
కధ గురించి చెబుతూ మల్లాది రామకృష్ణశాస్తిగారు “కధకు నీతి ఏమిటి? దానికున్నదల్లా జాతి” అని అన్నారు. “నీతి అనేది కథలో కధకుడు చెప్పదలచిన సందేశానికి, దృక్పధానికీ సంబంధించింది అయితే, - 'జాతి” అనేది శిల్చ్పపరంగా దానికి గల వైశిష్టాన్ని తెలిపేది అని మల్లాదివారు భావిస్తున్నట్టుగా అర్ధం చేసుకోవచ్చు.
- ఈ అభిప్రాయాన్ని నేను అంగీకరించలేను కధలో కధకుడు చెప్పదలచిన నీతిని అతడు చూపే “దృక్కోణాన్ని? పూర్తిగా విస్మరించడానికి వీలులేదు. వ్యక్తిగతంగా నా దృక్చథానికీ, కథలో కనబడిన దృక్చధానికీ తేడా వుండవచ్చును. ఇతరత్రా అన్ని అంశాలూ ప్రశంసనీయమైన రీతిలో ఉన్నప్పుడు దానిని నేను శిల్చ్పపరంగా మంచికథగా గుర్తించకుండా ఉండలేను. అయితే రచయిత ఆలోచనల్లో చైతన్యస్పూర్తి, 'ముందుచూపు'
వచష్రదచైననడడడనన2న2డ2222 కోడూరి శ్రరామమూర్తి వై లేనప్పుడు, - మనను జోకొట్టడమో, మనలోని బలహీనతలను రెచ్చగొట్టడమో, ఆ కథలోని నీతి అయినప్పుడు, శిల్పపరంగా అది ఎంత జాతిగల కథ అయినప్పటికీ ప్రయోజనం ఉండదు. అలాగే కేవలం చైతన్య స్ఫూర్తిగల దృక్పధం ఉన్నంత మాత్రాన సరిపోదు. కథ వెనుకగల లక్ష్యం ఎంత ఉన్నత మైనప్పటికీ, - శిల్చపరంగా పేలవమైపోయినప్పుడు దానిని మంచి కధగా గుర్తించడం సాధ్యం కాదు.
“నీతికి, జాతికీ సమన్వయం కుదిరినప్పుడు కథ మంచికధగా ఎదగగలుగుతుంది. ఒక భాషాసాహిత్యపు స్థాయిని నిలబెట్టగలిగేవి ఇలాంటి కథలేనన్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి మంచికథలకోసం నిత్యం అన్వేషిస్తూ వుండడం అవి తటస్థపడినప్పుడు వాటిని ఆస్వాదించి గుండెల్ని ఆనందానుభూతితో నింపుకొనగలగడం
- అనేవి మంచి పారకుడికి ఉండాల్సిన లక్షణాలు.
(కథావేదిక; - బెంగుళూరు, వారి 'తెలుగుకథ వెలుగులు'ల ప్రచురితం 1995). న వా
3222 తెలుగు కథ - నాడు,నేడు కుటుంబరావు కథలు ఆలి
సాంఘిక, ఆర్ధిక, రాజకీయ నేపథ్యం
“ఒక కధకుడికి రచనా సామర్ధ్యం లేకపోయినా, సరిచెయ్యవచ్చును గాని, జీవితం తెలియకపోతే సరిచెయ్యడం ఎవ్వరివల్లా కాదు శిల్చం, భాష రచనకు ముఖ్యం కాదని కాదు అవి చాలా ముఖ్యం. అవి కధారచనకు మూలపరికరాలు. ముడిపదార్ధం జీవితం”.
- ఈ వాక్యాలను రాసింది మానవజీవితాన్ని బహుముఖంగా పరిశీలించి ఆ ముడి పదార్ధంతో ఎన్నో అద్భుతమైన కథలను, నవలలను, నాటికలను, గల్చికలను, మలిచిన అక్షరశిల్పి కొడవటిగంటి కుటుంబరావుగారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు
1908-80 సంవత్సరాలు మధ్యగల సుమారు 72 సంవత్సరాల జీవితకాలంలో 1991-80 మధ్యగల సుమారు అర్ధశతాబ్ధి సాహిత్య జీవితకాలంలో - కుటుంబరావుగారు సమకాలీన ప్రజాజీవితాన్ని కుదిపేసిన ఎన్నో సంఘటనలకు వ్యక్తిగా, రచయితగా ప్రతిస్పందించాడు. భారతదేశ ఆర్ధిక, సాంఘిక, రాజకీయ చరిత్రపై బలమైన ముద్రను వేసిన ఎన్నో సంఘటనలకు ఆయన ఫ్రత్యక్షసాక్షి రెండు ప్రపంచయుద్ద్ధాలు, ఆర్థిక మాంద్యం, జాతీయోద్యమం, స్వాతంత్యసాధన, దేశవిభజన, కాంగ్రెస్ పరిపాలన, నిరాశనే మిగిల్చిన స్వాతంత్ర్యం, మతోన్మాదం, కులతత్వం, పెరిగిన దారిద్యం- నిరుద్యోగం, అపహాస్యంగా మిగిలిన ప్రజాస్వామ్యం, రష్యాలో జరిగిన విప్లవం రేకెత్తించిన కొత్త ఆలోచనలు, ఆదర్శాలు - వీటన్నింటి ప్రభావమూ వ్యక్తిగా, రచయితగా కుటుంబరావుగారిపై ఉంది. ఈ నేపధ్యంలోంచి కొ.కు సాహితీ ప్రస్థానాన్ని అవగతం చేసుకోవలసి ఉంది.
సంప్రదాయ నీతులను వ్యతిరేకించినా, మూఢనమ్మకాలను ఎద్దేవా చేసినా, స్వాతంత్ర్యానంతరం గద్దెనెక్కిన ప్రభువులపాలనను హేళనచేసినా, సమసమాజ స్థాపనకై పరితపించినా, రచయితగా కుటుంబరావు “జీవిత వాస్తవికత'ను.అన్వేషించడమే లక్ష్యంగా
కోడూరి శ్రరామమూర్తి 222 పెట్టుకున్నారు. “అన్నింటికన్నా కష్టసాధ్యమైనది జీవిత వాస్తవికత. వాస్తవ జీవితం వేరు, జీవిత వాస్తవికత వేరు. వాస్తవజీవితం అందరికీ అనుభవంలోనికి వచ్చేదే”. “మానవజాతి ఎటుపోతున్నది ? ఎటు పోవాలి ? దారిద్ర్యము, అనారోగ్యము, సంకుచితత్వము, కులతత్వము, మతతత్వము, ఇటువంటి సాంఘికపీడలు నిర్మూలనమై ప్రజలు స్వేచ్చగా తమ ఆర్థిక, నైతిక జీవితాలను గట్టిపునాది మీద నిర్మించుకొనడానికి మార్గమేది? యిటువంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న కొద్దీ కధలు జీవితానికి సన్నిహితంగా వచ్చి జీవితసత్యాలను తెలుసుకోగలుగుతాయి”.
- అని ప్రకటించిన కుటుంబరావుగారు ఏ భావజాల ప్రభావంతో ఏవి రచన చేసినా ఈ 'జీవిత వాస్తవికతను అన్వేషించేందుకే పరితపించారు 1981 సంవత్సరంలో కధకుడుగా కుటుంబరావు కలంపట్టేనాటికి చింతాదీక్షితులు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, చలం, వేలూరి శివరామశాస్త్రి, కొడవటిగంటి వెంకట సుబ్బయ్య, పూడిపెద్ది వెంకట రమణయ్య, వరుల బాబూరావు, రాయసం వెంకట శివుడు ప్రభృతులు కధలు రాస్తున్నారు. గురజాడవారి '“దిద్దుబాటు' కధ వచ్చి రెండు దశాబ్దాలు దాటింది. కొ.కు. గారికి కథలురాయాలనే కోరిక కొడవటిగంటి వెంకట సుబ్బయ్య “సుకుమారి, “ఏప్రిల్ ఫూలొ, - చింతాదిక్షితులు 'సొహితికి కధి వంటివి చదివాక బాగా కలిగినప్పటికీ- కథకుడుగా తొలినాళ్ళలో ఆయనకు మారగ్గనిర్దేశకత్వం చేసింది గురజాడ, చలం అని చెప్పాలి. వీరద్దరిలో గురజాడ ప్రభావం చివరిదాకా ఉన్నప్పటికీ - చలం ప్రభావం మాత్రం ఆయన తొలినాటి కధల్లో గణనీయంగా కనబడుతుంది గంట డగ 3 ౧౫/ 112519, ! ౧౭6 & 6౮60/ 10 800180" అనే గ్రహింపుతో చురుక్కుమనిపించే వ్యంగ్యస్ఫూర్తితో రచనలు చేసిన గురజాడ - సమకాలీన ప్రపంచంలో అమలులో ఉన్న విలువలు మానవుని శ్రేయస్సుకు దోహదకారిగా లేకపోతే వాటిని (వ్రశ్నించవలనిన బాధ్యత కలంపెట్టిన రచయితకు వున్నదనే విషయాన్ని తెలియజేప్పాడు అవి సామాజికపరమైనవైనా, లేక అర్ధిక రాజకీయ రంగాలకు సంబంధించినవైనా, వాటిని ప్రశ్నించే అలవాటును అభ్యుదయ దృక్చథం గల రచయితలు గురజాడ అడుగుజాడ నుండి తెలుసుకున్నారు. ఇలాంటి గురజాడ స్ఫూర్తి చివరివరకూ కొకు. రచనల్లో కనబడడంలో ఆశ్చర్యంలో లేదు. ఇక - చలం విషయానికి వస్తే నీతికీ, అవినీతికీ మధ్య గీతగీసి, దాన్నిగ్రురించి వెంగపెట్టుకుని బుర్రపాడు చేసుకోవలసిన అవసరం లేదనీ, దానికన్నా ముఖ్యమైన
22222 తెలుగు కథ-నాడు,నేడు 2222222222 విషయాలు మరికొన్ని జీవితంలో వున్నాయనీ చెప్పడం వరకూ కుటుంబరావు చలానికి సన్నిపాతంగా కనబడతాడు కుటుంబరావు తాను రచించిన “చెడిపోయిన మనిషి కధలో లేడీడాక్టర్ నోట చెప్పించినట్టు “మనిషి నుండి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారము, తక్కువ అపకారము జరిగేటట్లు చూచుకొనడమే సరి అయిన '్రవర్తన. మిగిలినవి బూటకపు నియమాలు” అనేదే ఆయన ఆలోచన ఈ పనిని సాధించేక్రమంలో “ఎదుటివారు, ప్రక్కవారు, ఏమనుకుంటారు అనికాకుండా నీ మనసు ఏం చెబుతున్నది అనే విషయానికి' ప్రాధాన్యతను యివ్వాలని చలం కోరుకున్నట్టుగా - రసెల్ కోరు కున్నట్లుగా,- కొడవటిగంటివారు కూడా కోరుకున్నారు.
(ప్రపంచ ప్రఖ్యాతత్త్వవేత్త రసెల్ రెండు తరహాల 'మంచిపనులు' వుంటాయి అని అంటాడు ఒకటి 56001601/8 గ౦౧1౧95, రెండోది 09601౪78 ౧౧౧693 చట్టం సంప్రదాయనీతులు, చర్చి మొదలయినవి ఏం చెయ్యాలని చెబుతున్నాయో అది 05- 1601౪6 గ౮౧౪౧6౩9 అయితే, - ఇతరులు ఏమంటారు అని కాకుండా మనసు దేనిని మంచి పని అంటుందో దానిని 5401661౪78 18౧1౧656 అని అంటారు. ఈ రెండింటిలో వ్యక్తి అనుసరించాల్సింది “సబ్జెక్టివ్ రైట్నెస్' అని చెప్పిన నేరానికి - సమకాలీన సమాజం రసెల్ వంటి గొప్పమేధావిని దారుణమైన అవమానాలకు గురిచేసింది “మనిషి పాపం చేసినా ఫరవాలేదు. మానవత్వం వదులుకోకూడదు” అని చెప్పిన నేరానికి (యిక్కడ “పాపం” అనే మాటను చర్చి చెప్పే మూఢనమ్మకాలకు, తిరోగమన ధోరణులకు, వర్తించేదిగా అర్దం చేసుకోవాలి) అతడిపై ఆస్తికులు, సంప్రదాయవాదులు కత్తిగట్టారు.
సంప్రదాయనీతులను, పురుషాధిక్య సమాజంలోని రెండునాల్మల ధోరణిని, నిరసించి వ్యక్తి స్వేచ్చకు పట్టాభిషేకం చేసిన చలంగారిలో కూడా ఇలాంటి తిరుగుబాటు ధోరణే ఉన్నది కుటుంబరావుగారిని యిది బాగా ఆకట్టుకుంది.
కుటుంబరావుగారి 'అపనమ్మకం* కధలోని రాజ్యం - “నాకు నిజంగానే నీతి నమ్మకం లేదు. నీతికంటే ముఖ్యమైనవి జీవితంలో ఉన్నట్లు అదివరకే నిర్ధారణ చేసుకున్నాను ఇక, అత్మగౌరవము, పవిత్రత అంటావా? దీర్ధంగా ఆలోచిస్తే అవి అణచిపెట్టిన అహంకారాతి శయాలేగాని, ఇంకేమీకాదు” అనడాన్ని - “పెళ్ళి వ్యవహారం" కధలోని సులోచన తన స్పేహితురాలు అన్న జగన్నాధంతో వివాహం లాంటి “ఒప్పందం' కుదుర్చుకున్న వ్యవహారాన్ని - “పాప ఫలం” కధలోని పంకజాక్షి పంకంలోంచి బయటపడిన తీరును, “సద్యోగం” కధలోని సూర్యనారాయణ నీతిని పట్టుకుని వేళ్లాడి నిరుద్యోగిగా ఉండిపోవడం కంటే తన “పురుష లక్షణానికి తగిన (?) వ్యాపకాన్ని
కోడూరి శ్రీరామమూర్తి మ సంపాదించుకుని బ్రతుకుతెరువును వెదుక్కోవడాన్నీ కుహనా నీతులతో 'అరణ్యం'లా మారిపోయిన ఈ సమాజంలోంచి బ్రతికిబయటపడడానికి 'అరణ్యం” కధలోని వివాహిత చేసిన తెగింపును, గమనిస్తే చలం ప్రభావంతో సమకాలీన సమాజాన్ని దుఃఖమయం చేసిన సంప్రదాయనీతులపై కుటుంబరావు ఎగరేసిన తిరుగుబాటు బావుటా తెలుస్తుంది.
అయితే - చలాన్ని కుటుంబరావు ఏనాడూ గుడ్డిగా అనుసరించలేదు. చలంలో వుండే మితిమీరిన వ్యక్తివాద ధోరణిగానీ, వివాహవ్యవస్థ పట్ల విముఖతగానీ, కుటుంబ రావు కథల్లో సార్వతిక రీతిలో కనబడవు. అదిన్నీగాక - చలంగారి పాత్రల్లా కొ.కు. కథల్లోని పాత్రలు లౌకిక దృక్చధం లేనివికావు లౌక్యం పండిన పాత్రలవి. సంప్రదాయంతో అవి ఢీకొనేవి - కేవలం 'నిజమైని ఆనందాన్ని సాధించడానికీ, తమను తాము అన్వేషించు కోడానికీ కాదు. లౌకికంగా ఏ ప్రమాణాలతో చూసినా హాయిగా సుఖపడదానికీ - (బ్రతుకు తెరువును సాధించుకోడానికీ అవి సంప్రదాయంపై తిరుగుబాటు చేస్తాయి ఇందుకు కావలసిన తెగువ, గడుసుదనం,ఆయన స్తీ పాత్రల్లో మరింతగా కనబడుకుంది. వ్యక్తి చేసే తిరుగుబాటును లౌకికదృష్టితో అవలోకించినందువల్లనే ఆయన కాలక్రమంలో ఆ గీతను పొడిగించి సామాజిక అభ్యున్నతికి దానినొక మార్గంగా చూడగలిగారనిపిస్తుంది.
ఇక, - “సెక్సు అనేది ఒక సున్నితమైన విషయం. అది ఒక సహజమైన ప్రవాహంలా సానుభూతి, ఉదారత, వెచ్చని తాదాత్వతలతో కూడిన ధారావాహికలా ఉందాలి. హృదయంలేని లైంగిక సంయోగంలా ఉండకూడదు. ఏదో ఒక తాత్కాలిక ఆవేశంతో తొందరలో అయిపోయే వ్యవహారంలా ఉండకూడదు” అనే డి. హెచ్. లారెన్స్ భావాలకు చలంగారిలా కుటుంబరావు సన్నిహితుడు కాదు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేద్సు
ఈ విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ మధ్య ఒక సావనీర్ వ్యాసంలో (కొౌడ్రవట్రి గంటి సాహిత్య సమాలోచన - ఢిల్లీ ఆంధ్రంసంఘం) నండూరి రామమోహనరావు గారు చేసిన వ్యాఖ్యలు మనోవీధిలో మెదులుతున్నాయి.
“ఆలం తన ప్రపంచానికి కేంద్రంలో స్త్రీని నిలబెట్టాడు. స్త్రీ స్వాతంత్ర్యం ముఖ్యంగా సెక్స్ స్వాతంత్ర్యం దృష్టి నుంచి సకల సామాజిక సమస్యలనూ పరిశీలించాడు కథారచనలో ఒకవిధంగా ఆయన వారసుడు కొడవటిగంటి. కాని చలం ప్రారంభించిన భావ విప్లవాన్ని ఈయన విశ్వతోముఖంగా విస్తరింపజేశాడు. మార్క్సిస్టు సామాజిక దృక్చథాన్ని సంపూర్ణంగా స్వీకరించాడు. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణలోని సంకుచితత్వాన్ని నిరాకరించి ఆ ప్రక్రియను మానవుని సామాజిక వ్యక్తిత్వావగాహనకు వర్రింపజేశాడు. మానవుడి ఆర్థికరాజకీయ, లైంగిక తదితర సమస్యా సామస్తాన్ని తన సాహిత్య వస్తువుగా
2వ తెలుగు కథ -నాడు,నేడు ౭౭22222222 తీసుకుని హేతువాద దృక్పథం నుండి నిశితంగా, నిర్దాక్షిణ్యంగా విశ్లేషిస్తూ రచనలు సాగించాడు + అంటారాయన ఆ వ్యాసంలో.
ఇందులో నండూరి వారు ప్రస్తావించిన 'ఫప్రాయిడొకు సంబంధించిన అంశాన్ని కూడా (సంక్షిప్తంగా నయినా) అవలోకించవలసి వుంది. ఇరవయ్యవ శతాబ్దంలో మానవుని ఆలోచనలను అత్యంతం ప్రభావితం చేసిన మేధావుల జాబితాను చెప్పవలసి వస్తే - అందులో (ఫ్రాయిడ్ పేరు కూడా (ప్రముఖంగా కనబడుతుంది. ఒకప్పుడు ఛార్లెస్ డార్విన్ సిద్ధాంతం చేసిన అలజడికి మించిన అలజడిని సిగ్మండ్ ప్రాయిడ్ “సైకో ఎనాలిసిస్” సిద్ధాంతం సృష్టించింది. దీని ప్రభావం పలురంగాలపై పడినట్టుగానే సాహితీ సృజనపై కూడా పడింది. పాత్ర చిత్రణలో క్రొత్తపుంతలు తొక్కేందుకు రచయితలకు వీలు చిక్కింది.
దీని ప్రభావం కొ కు. కధలపై కూడా కొంతవరకూ కనబడుతుందిగాని, కొందరు రచయితల్లా - ఈ సిద్దాంతాల అవగాహనతో ప్రయోగాత్మకమైన రీతిలో కధలురాసి ప్రత్యేకతను చూపుదామనే తపన కుటుంబరావుగారికి లేదు. ఆయన దృష్టి అంతా “జీవిత వాస్తవికతను అన్వేషించడం మీదనే ! ఇందుకుగాను ఈ అవగాహన ఎంతవరకూ తోద్బడగలదో అంతవరకే దానిని ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు కుటుంబరావు గారి 'అమాయకురాలు' కధనే తీసుకుందాం. ఒక కధను మనోవైజ్ఞానిక దృక్సధంలోంచి చెప్పబడిన కథగా పేర్శొనేందుకు కావలసిన లక్షణాలన్నీ ఈ కధలో వున్నాయి. కానీ - ఈ కధను చెప్పడంలో కధకుడి లక్ష్యం అంతటితో ఆగిపోదు.
ఈ కథలోని భ్రమరకు యుక్తవయస్సు వచ్చిన తొలిరోజుల్లోనే వైధవ్యం సంప్రాప్తించి నప్పుడు సంప్రదాయాన్ని కాదని జుట్టు తీసుకోడానికి నిరాకరించడానికీ, ఆ తర్వాత ఇంటిలో వాళ్ళు వద్దంటున్నా తనకు తానుగా జుట్టు తీసుకోవదానికీ గల కారణాన్ని అమె అంతరంగపు లోలోపలి పొరల్లో వెదికి పట్టుకోవలసి ఉంటుంది వెంకటేశ్వర్లు పట్ల ఆమె గుండెల్లో కోరిక గూడుకట్టుకుని వున్నందునే మొదటిలో ఆమె జుట్టు తీయించు కోడానికి అంగీకరించలేదు. చివరకు వెంకటేశ్వర్లుకు మరొక అమ్మాయితో వివాహం జరుగుతున్నప్పుడు అందమైన తన కురులను భీభత్సదాయకమైన రీతిలో కత్తిరించుకుని మెసోకికొ ప్రవర్తన ద్వారా అంతరంగంలోని తన కోరికకు, - ఉపశమనం కలిగించు కోవలసి వచ్చింది.
ఈ కథలో భ్రమర అంతరంగంలోని సంఘర్షణ మాత్రమే కాదు, - ఆమెలాంటి బాల వితంతువులు ఆనాటి సమాజంలో ఎదుర్మోవలసివున్న సామాజిక సమస్యకూడా ఆవిష్కరించబడడం విశేషం.
మ్తననమడడిచదననన2222222222222 కోడూరి శ్రీరామమూర్తి ౭
- యిదే విషయాన్ని 'కాలప్రవాహపు పాయలు” కధ విషయంలో కూడా చెప్పవచ్చు.
ఈ కధలోని పురుషోత్తం ఒకప్పుడు సోషలిస్టు. మార్క్స్, లెనిన్ రచనలపట్ల వల్లమాలిన అభిమానాన్ని చూపినవాడు. సంథాన్ని మరమ్మత్తు చేసి, పేదల (బ్రతుకులు బాగుచెయ్యాలని పరితపించినవాడు. అయితే - చిత్రమైన విషయం ఏమిటంటే - అతని గుండెలోపల వున్న అసలు పురుషోత్తం అతడికి మానసిక సంక్షోభం కలిగిస్తూ ఉంటాడు అతడి ఒకనాటి ప్రియురాలినీ, అతడు ఒకనాడు నమ్మిన ఆదర్శాలనూ, జ్ఞాపకానికి తెచ్చి చికాకును కలిగిస్తూ ఉంటాడు. వీటన్నింటి ఫలితంగా అతడు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు చెప్పే “ఆడిటరీ హెల్యూసినేషన్స్”కు, - “విజువల్ హెల్యూసినేషన్స్కు గురి అవుతూ ఉంటాడు. ఇట్లాంటి ఒక ఉదంతాన్ని ఈ కధలో కుటుంబరావుగారు మనసుకు హత్తుకునేలా చెబుతారు. అవకాశవాద రాజకీయాలు ఇన్వగల స్వల్పకాల ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ - దానివలన వ్యక్తికి మనశ్శాంతి కరువుకాక తప్పదని హెచ్చరించే కధ యిది.
- ఇలాంటి ఉదాహరణలు కొ కు. కధల్లో మరికొన్ని కూడా కనబడతాయి కొందరు కథకుల్లా లైంగికప్రవృత్తి అంతరంగంలో అణచివేయబడిన శృంగారభావనలు వంటి కొన్ని అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా - మనిషి కధను పలుదైమెన్నన్రలో చూపేందుకు మనస్తత్వశాస్త్ర సిద్ధాంతాల అవగాహనను సమర్దవంతంగా ఉప్రయ్రా గించుకున్న కధకుడు కుటుంబరావు
ఈ విషయానికి సంబంధించిన చర్చ అలా ఉంచి, కుటుంబరావుగారిపై గల ఇతర ప్రభావాల గురించి చెప్పేటప్పుడు జార్జి బెర్నార్డ్‌షా, హెచ్‌జి వెల్స్, అనటోల్ప్రాన్స మొదలైనవారి పేర్లు మనోవీధిలో మెదులుతాయి.
రచనలో సామాజిక ప్రయోజనానికి పెద్దపీటవేసిన బెర్నార్డ్‌షా నాటక్రాల్లి భావావేశపరులైన హీరోలు, హీరోయిన్లు కనబడతారు. వ్యంగ్యం, వాస్యం వీటన్నింట్రిత్రో తాను చెప్పదలిచిన విషయాన్ని పాఠకుడి బుర్రకు గట్టిగా పట్టేలా చెబుతాడాయన. త్క వ్యంగ్యస్ఫూర్తి కుటుంబరావుగారికి చాలా అభిమానపాత్రమైన విషయం.
నిరాడంబరమైన శైలిలో ఉండే ఆయన రచనలకు ఈ వ్యంగ్యస్ఫూర్తే ఒక ప్రత్యేకతను సమకూర్చి పెట్టిందంటే అందులో అతిశయోక్తి లేదు. (ప్రేమకథను రాసినా, వర్గపోరాటం గురించి చెప్పినా, మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి పెళ్ళికధను రాసినా, ఆఖరికి సినీ 'మాయాలోకం” గురించి రాసినా, ఆయన కధలన్నింటిలోనూ ఈ
వ్యంగ్యస్ఫూర్తి తళుక్కుమంటూనే ఉంటుంది. ఏ విషయాన్నయినా ఘాటయిన
౨2222 తెలుగు కథ - నాడు,నేడు పదజాలంతో విమర్శించకుండా - చురుక్కుమనిపించే వ్యంగ్యంతో చెప్పడం ఆయన ప్రత్యేకత. తన జీవితకాలంలో ఆయనకు చికాకు కలిగించిన చౌకబారు సినిమాలను,
- తాడు, బొంగరం లేని 'సైన్స్ఫిక్షననూ - అధమస్థాయి అభిరుచిని పెంపొందించే డిటెక్టివ్ సాహిత్యాన్ని - ఇట్లాంటి సాహిత్యాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకునే వ్యాపార రచయితలనూ, - కుటుంబరావుగారు తమ కధల్లో ఆటపట్టించిన తీరు ఆయన రచనలు చదివినవారందరికీ గుర్తుంటుంది.
వ్యంగ్యరచనా చమత్కృతిలో కొందరు కుటుంబరావుగారిని (ప్రఖ్యాత రష్యన్ రచయిత చెహోవ్‌తో పోలుస్తూ ఉంటారు చెహోవ్ లాగానే కుటుంబరావుగారికి కూడా పారకులను గిలిగింతలు పెట్టడం ప్రధానధ్యేయం కాదు. సరి అయిన రీతిలో ప్రశ్నను పారకుడి ముందు ఉంచి అతడిని ఆలోచింపచెయ్యడమే ఇద్దరికీ ఇష్టమైన విషయం. “శపదేశం వ్యక్తిత్వాన్ని పరాభవిస్తుంది ఆలోచనను రేకెత్తించే గుణం వ్యక్తిత్వాన్ని నిద్రలేపుతుంది-లో అనే కుటుంబరావుగారి సాహితీ దృక్పధం చెహోవ్ ఆలోచనకు సన్నిహితమైందే.
అంతేకాదు - “కధారచయితగా చెహోవ్ ఇతివృత్తం మీదా, ఏదో ఒక ఆశ్చర్య దాయకమైన విషయం మీద కాక - మొత్తం వాతావరణం మీదా - ఒక సంఘటన ప్రాతిపదికగా జీవితానుభూతినంతటినీ పట్టుకోగలగడం మీద ఆధారపడతాడు” అంటూ చెహోవ్ గురించి 'మార్చిన్ సేమూర్-స్మిత్' చేసిన విశ్లేషణ (గైడ్ టు మోడరన్ వరల్డ్ లిటరేచరొ అనే (గ్రంధంలో) కుటుంబరావుగారికి కూడా చాలా వరకు వర్తిస్తుంది.
- వ్యంగ్యాన్ని అభిమానించే కుటుంబరావుగారు ఒక సందర్భంలో ఇలా అన్నారు.
“నన్నడిగితే కసికొద్దీ, మంటకొద్దీ రాసేది నాకు బాగుంటుంది. కసి అంటే పళ్ళు కొరకడమూ, చిందులు తొక్కడమూ, అనుకోనక్కరలేదు ఆ కసి వీరేశలింగం గారి రచనల్లో ఉన్నట్టే ఉండనవసరం లేదు 'కన్యాశుల్మం'లో ఉన్నట్లు కూడా ఉండవచ్చును చలంగారి కథల్లో కసి ఉంది ఆయనలో సౌందర్య తృష్ట ఒక పాలు తగ్గి, కసి ఇంకో పాలు పెరిగితే ఇంకా బాగుండునేమో అనిపిస్తుంది రాచకొండ విశ్వనాధశాస్త్రిగారి కధల్లో ఉన్నదా కసి భమిడిపాటి వారి హస్యంలో పళ్ళు పటపటలాడించే కసి ఉందేది సెటైరంతా కసి సాహిత్యమే”
(సాహిత్య వ్యాసాలు - పే 313)
- ఇలాంటి 'కసి'తోనే కుటుంబరావుగారు తన కథాసాహితీ ప్రస్థానంలో అన్ని దశలలోనూ రచనలు చేస్తూ వచ్చారు. రాసిన ప్రతిసందర్భంలోనూ సంఘటనల (ప్రాతిపదికగా మొత్తం జీవితానుభూతినీ, వాతావరణాన్నీ సమర్ధవంతంగా పట్టుకున్నారు.
కోడూరి శ్రీరామమూర్తి మైవం “నేను మామూలుగా బుద్ధిమంతుణ్జే” (రాజకీయ వ్యాసాలు - పే 366) అని చెప్పుకున్న కుటుంబరావుగారు ఏప్రిల్ 1981లో 'గృహలక్ష్మిలో “ప్రాజాధికం” అనే మొదటి కథను రాసేనాటికి తెలుగుసాహిత్యానికి మరో 'బుద్ధిమంతుడయిని రచయిత వచ్చాడని పెద్దలు భావించారు, - ఆ పత్రిక సంపాదకులు ఆం(డ్ర శేషగిరిరావుగారు ఈ కథకొక ప్రస్తావికను రాస్తూ - “భారతమహిళ శీలవిషయమున అగ్నిశిఖ. నియమ పాలనమున వజ్రభిత్తి, - భర్త్శృ సేవ ఆమెకు ప్రాజాధికము. ఈ విషయమునే ఈ కధ నిర్వహించుచున్నది. ఇది భారతమహిళా సతీత్వమును ప్రదర్శించు చక్కని చిన్నకథ” - అని మెచ్చుకున్నారు కూడా. కాని, మరో ఆరేళ్ళు గడిచేసరికి “తాతయ్యా, “అరణ్యం”, “కాలభైరవుడు” లాంటి కథలు రాసి, ఆ '“బుద్ధిమంతతనాన్ని! చాలావరకూ పోగొట్టుకున్నాడు ! కుసంస్మారి అయిన ముసలిమొగుడితో సంసారం చెయ్యలేక సవతికొడుకుతో వెళ్ళిపోయిన ఓ అభాగ్యురాలి కథను “అరణ్యం”లోను, ఒక ఊరకుక్కను కాలఖైరవుడి అవతారంగా భావించి పూజాదికాలు, భజన సంకీర్తనలు, మొక్కుబడులు, వగైరా కార్యక్రమాలన్నీ జరిపించి ఖంగుతిన్న మూడభక్తుల కధను “కాలఖభైరవుడు”లోనూ - రాసి విమర్శకులకు చికాకు కలిగించాడు ! బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం అనే విమర్శకుడు “కాలభైరవుడు” కథను విమర్శిస్తూ 'ఈ కథ ఎందుకు వ్రాసినట్లో తెలియడం లేదు" అని విసుక్కున్నాడు కూడా, - అంతటితో ఆగకుండా “రావణుడికి న్యాయం చేస్తాను అని బయలుదేరి “అశోకవనం' అనే కథను రాసి సీతను 'బొత్తిగా సౌందర్య దృష్టిలేని వ్యక్తిగా చిక్రిస్తే - విమర్శకులు ఇది “రావణుడికి న్యాయం చెయ్యడం కాదు. సీతకి అన్యాయం చెయ్యడం" అంటూ గుండెలు బాదుకోవలసి వచ్చింది ! - ఇక - కుటుంబరావుగారు ఆ రోజుల్లో రాసిన కధల్లో తనకు బాగా తృప్తి కలిగించ్వి కధ అని చెప్పుకున్న “తాతయ్య” కధ సంప్రదాయవాదులకు మరింత 'బాధ' కలిగించింది. “మనుషులందరిలోకీ బ్రాహ్మలెక్కువ. (బ్రాహ్మల్లో నియోగులకంటే వైదీకులెక్కువ, బ్రాహ్మణ పిల్లలు శూద్ధర వాళ్ళ ఇండ్లలో మంచినీళ్ళు కూడా తాగకూడదు. అందులో ఒక మజ్జిగచుక్కవేస్తే తాగవచ్చు నియోగులు మంచిబ్రాహ్మణులు కారు. కాని, వాళ్ళను శూద్దర వాళ్ళను చూచినట్లు చూడరాదు. నీళ్ళల్లో మజ్జిగ చుక్క వెయ్యమని అడగకూడదు! మాలవాళ్ళ దగ్గరగా పోతే మనం మైలపడతాం. దొరలు కూడా మాలవాళ్ళే - వాళ్ళు స్నానాలు చెయ్యక పోయినా తెల్లగా ఉంటారు. ఇంటిదగ్గర కూడా ఇంగ్లీషు మాట్లాడతారు. వాళ్ళు గొప్పవాళ్ళు!”
౨2333222 తెలుగు కథ -నాడు,నేడు
- ఇలా, ఒక బాలుడి స్వగతాన్ని కుహనా విలువలతో నిండిన సంప్రదాయభావాల పట్ల “కసితో - మనముందు ఉంచుతారు కుటుంబరావుగారోతాతయ్య కధలో. ఇలాంటి చురకలు “కొంతమందికి ఆ(గ్రహాన్ని తెప్పించడంలో ఆశ్చర్యం ఏముంది? సుమారుగా “40౦0ల వరకూ సామాజిక సమస్యలపైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తూ వచ్చిన కుటుంబరావుగారి ఆలోచనల్లో '40ల తర్వాత చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. దీనికి కారణం సామ్యవాద దృక్పథంతో పరిచయం ఏర్పడడం, ఒకప్పుడు [19/౧6 లాంటి అర్ధశాస్త్రవేత్తలు - *1[19 &౧ 00901619 600[౧0గ0 19౧ 000% ౪10% 14౧0౪10 06 ౧౦1౦౧/ 9019౧11021 6గ౯౦౧6౦౪౩ 0641 ౪౧౦౪1 1౧8991 0 ఇ0౧1 6210౧ 10/16 ౧౦66౭౧ ౪ంగ6" అని భావించిన కారల్‌మార్క్స్ 'డాస్ కాపిటలొలో కుటుంబరావుగారికి గొప్ప వెలుగు కనబడింది. (ఆర్థికమాంద్యం సమయంలో మరణశయ్యమీద కెక్కిన పెట్టుబడిదారీ వ్యవస్థను బ్రతికించి - సోవియట్ రష్యా ఒరవడిలో ప్రవంచం 'ఎర్రబడి పోకుండా' 'రక్షించిన' కీన్స్ వంటి అర్ధశాస్త్రవేత్తలకు మార్చ్ ఆలోచనలు రుచించకపోవడంలో ఆశ్చర్యం లేనట్టే - పీడితుల పక్షాన నిలబడాలని కోరుకునే కొ.కు. వంటివారికి మార్క్స్ దృక్పథం ఆకట్టుకోవడంలో కూడా ఆశ్చర్యం లేదు). “౩942లో మార్క్స్ రాసిన 'కేపిటలొ చదివిందాకా నాకు కమ్యూనిజం యొక్క ఆధారమేమిటో తెలియలేదు. ఒక మిత్రుడు యధాలాపంగా అన్నమాట నామీద బండెడు ప్రభావంకన్నా ఏక్కువ పనిచేసింది దొరికిన మార్క్సిస్టు సాహిత్యం చదివాను. భవిష్యత్తు మార్క్సిజంకే ఉన్నట్లు నమ్మకం కుదరింది”. = (రాజకీయ వ్యాసాలు" నుండి-) “మార్క్స్ 'కేపిటలొ చదవడంతో సహా మార్క్సిజం గురించి చదవడం నాకు మేలు చేసింది సంఘవ్యాధి గురించి కొంత అర్ధం చేసుకోగలిగాను. ఈపాటి జ్ఞానోదయం కలగగానే నేనుచేసిన మొదటిరచన 'కులంగాడి అంత్యక్రియలు”,- అటు తర్వాత రాసిన కధల్లో మనస్తత్వం గురించి గాలికబుర్లు రాయడం మానేసి ఆ మనస్తత్వాన్ని ఆడించే సాంఘిక శక్తులను చిత్రించడం ప్రారంభించాను. 'నీ కధలు వెనుక ఉన్నట్లుగా లేవు అవే బాగున్నాయి అని కొందరు అభిమానులు నన్ను హెచ్చరించారు” (సాహిత్య వ్యాసాలు” నుండి)
- అంటూ కుటుంబరావుగారూ వ్యక్తిగా, రచయితగా తనపై మార్క్స్ ఆలోచనలు చూపిన ప్రభావాన్ని చెప్పుకున్నారు. కుటుంబరావుగారు ఏ ఆలోచనలతో కధలను రాసినా, దాని ఆవిష్కరణకు
కోడూరి శ్రరామమూర్తి 22 మధ్యతరగతి కుటుంబీకుల జీవితచిత్రాన్నే నేపథ్యంగా తీసుకునేవారనే సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీరి మనస్తత్వాన్ని, ప్రవర్తనను చిత్రించడంలో కుటుంబరావుగారికి గొప్ప నిపుణత ఉంది. మార్క్సిస్టు దృక్పధంతో రచనలు చేసినప్పుడు కూడా ఇదే ధోరణిని కొనసాగిస్తూ కుటుంబరావుగారు ఇలా అన్నారు
“_ నేను మధ్యతరగతి సంస్కారం కలవాజణ్జ్ణి. ఈ సంస్కారంతో నేను అభ్యుదయ రచనలు చేయగలను కానీ, - శ్రామిక సాహిత్యసృష్టి చెయ్యలేను. అందుచేత నా రచనలు జనసామాన్యాన్నీీ శ్రామికులను, ఉత్తేజపరచలేవు కాని, మధ్యతరగతి వారిలో ప్రజాజీవితానికి అనుకూలించే పరివర్తన తెచ్చే అవకాశం ఉంది. ఈ పని ఎంత విజయ వంతంగా చెయ్యగలిగితే అంత ఉత్తమ కథకుణ్జి అనిపించుకుంటాను -
ఇలా అంటూనే - “రచయిత తన వర్గాన్ని గురించే రాయాలని లేదు. అనేకనుంది సుఫప్రసిద్ధ కధకులు తమకు దూరంగా ఉండేవర్గాలను గురించి కూడా కథలు రాసి ఆయా జీవితాల్లోని సత్యాన్ని ప్రదర్శించగలిగారు -” అని కూడా అంగీకరించారు.
రచయిత తాను ఏ వర్షానికి చెందినవాడో ఆ వర్గాన్ని గురించి రాసినప్పుడు జీవిత సత్యాన్ని మరింత స్పష్టంగా పట్టుకునేందుకు - దానిని శక్తివంతంగా కథల్లో ఆవిష్కరిం చేందుకు అవకాశం ఉంటుంది అలాకాని పక్షంలో తాను ఏ వర్గాన్ని గురించి రాస్తున్నాడో ఆ వర్గంతో కొంత సన్నిహిత సంబంధం ఉండాలి. కేవలం ఊహించుకుని జీవితసత్యాన్ని అన్వేషించగలగడం సాధ్యంకాదు. మరొకవర్ష్నానికి చెంధిన రచయితకు శ్రామికుల జీవితాలతో సన్నిహిత సంబంధం ఉన్న సందర్భాలలో కూడా ఎంతకాదనకున్నా తన వర్గస్వభావం రచనలో చోటుచేసుకునే ప్రమాదం ఉంటుంది.
ఇది చెబుతుంటే - మార్క్సిస్టు సాహిత్యవిమర్భ గురించి చెబుతూ లూనకార్స్కీ
“- రచయిత సృష్టించే సాహిత్యం ఉద్దేశపూర్వకంగానయితేనేమి, అట్లాంటిది లేకుండా నయితేనేమి, అతడు ప్రాతినిధ్యం వహించేవర్గానికి ఎప్పుడూ ప్రతిబింబంగా ఉంటుంది. అలాకానప్పుడు సర్వసాధారణంగా జరిగేదేమంటే - రచయితపై వివిధవర్షాల ప్రభావం జమిలిగా ఆ సాహిత్యంలో కనబడుతుంది. దీనిని చాలా జా(గ్రత్తగా పరిశీలించ వలసి ఉంటుంది- అనడం జ్ఞాపకానికి వస్తుంది.
ఈ విషయానికి సంబంధించిన చర్చ ఎలా ఉన్న, “40౦0ల తర్వాత కొ కు. రాసిన కథల్లో - స్వాతంత్రానంతరం దేశంలో పెచ్చుపెరిగిన దారిద్ర్యం, నిరుద్యోగం, కమ్యూనిజమ్ను అణచివేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిన (శ్రద్ధ ఆకలి దారిద్యాలను తగ్గించడం విషయంలో చూపకపోవడం, కులంపేరుతో మతంపేరుతో
౨2 అలుగు కథ -నాడు,నేడు పెరిగిన దోపీడీ ప్రవృత్తి, మొదలయిన విషయాలను సార్వత్రిక ధోరణిలో చర్చిస్తూ - మధ్యతరగతి కుటుంబాల్లో పలురూపాల్లో చోటుచేసుకునే 'జంకులు వారినెలా శక్తి హీనులను చేస్తున్నాయో, చిన్నపాటి సంపద లభించే అవకాశం ఏర్పడినా మధ్యతరగతి కుటుంబాల్లో కూడా పెట్టుబడిదారీ ప్రవృత్తి ఎలా తలెత్తుతుందో - అద్భుతంగా చిత్రించడం జరిగింది అనేది విస్మరించరాని సత్యం ఇందుకుగాను ఆయన వ్యంగ్యాన్ని చిలకరిస్తూ “కసి” సాహిత్యాన్ని రాయవచ్చు లేదా 'సింబాలిక్ ధోరణిలో కధను అల్లవచ్చు లేదా
- మామూలుగానే కథను చెబుతూ మనుషుల ప్రవర్తనలోని సంకుచితత్వాన్ని ఎద్దేవా చేయవచ్చు. అదీకాదనుకుంటే ఒక 'సైన్స్‌ఫిక్షన్'గా మన ముందు ఉంచవచ్చు ఏ ధోరణిలో ఎలా రాసినా ఆయన ఆరాటం మనిషి మనిషిగా జీవించాలని మాత్రమే !
“రోడ్డు ప్రక్కన శవం” కథలో కుటుంబరావుగారు “-మనిషి ఫాలాక్షుడు. ఫాలం విప్పి ఏ సమస్యకేసి చూసినా ఆ సమస్య యొక్క స్వరూపం మారిపోతుంది. అయితే - తాను ఫాలాక్షుజ్ఞన్న సంగతి మనిషికి తెలియదు అందుచేత ఫాలం విప్పడు. శివోహం అనుకోడు +” అని వ్రాశారు పారకులచేత 'శివోహం' అనిపించేలా చెయ్యాలన్నదే కొకు. తపన!
తాను నమ్మిన విషయాన్ని ఆచరించే విషయంలో వున్న 'జంకు' వ్యక్తికీ, దేశానికీ, మంచిదికాదు అనేది కుటుంబరావుగారి అభిప్రాయం ఈ విషయాన్నే మనం “యావజ్జీవ శిక్ష, 'ఐకాసుర” వంటి కధల్లో చూడవచ్చు. ఈ రెండూ “60లలో వ్రాయబడిన కథలే - (బకాసురిను నవలగా భావించడం వున్నదిగాని, ఒక ప్రక్రియలగా చెప్పాల్సి వచ్చినప్పుడు అది కధే అని నా అభిప్రాయం)
“'యావజ్జీవశిక్షు లోని శేషు ఒక ఆదర్భవాది. హేతువాది. అతగాడికి జంయొప్పోగు మీద, బ్రాహ్మణత్వంమీద, పరలోకం మీద బొత్తిగా నమ్మకం లేదు.
కాని, (బ్రతుకుతెరువుకోసం - అదెమ్మత్త ఆదరణను పొందడం కోసం - ఈ బూటకపు విలువలన్నింటికీ తలవంచవలసి వచ్చింది. ఆఖరికి తద్దినాలు కూడా పెట్టవలసి వచ్చింది “నేను ఎంత వాజెమ్మనో తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది” అనే శేషు స్వగతంతో ఈ కధను ముగిస్తారు కుటుంబరావుగారు. ఇట్లాంటి “రాజీలు మధ్యతరగతి కుటుంబీకుల జీవితాల్లో కోకొల్లలుగా కనబడతాయి. వీరిలోని - “జంకు ఈ పరిస్థితికి మూలకారణం.
ఈ 'జంకు' వల్లనే పెట్టుబడిదారు కూడా స్వేచ్చగా ప్రజలను దోచుకోగలుగుతున్నాడు అనే విషయాన్ని '“బకాసురిలో అత్యద్భుతంగా చెబుతారు కుటుంబరావుగారు.
కోడూరి శ్రీరామమూర్తి మావ ఈ కథలో భీముడు చంపిన బకాసురుడు (రాక్షసుడు) నిజానికి - భయంకరుడేమీ కాదు ! వంట్లో జవసత్వాలు లేకపోయినా (వార్టక్యం కారణం వల్ల) తన ఏజంట్ల పబ్లిసిటీ ద్వారా “రాక్షసత్వాన్ని” నిలబెట్టుకుంటూ ప్రజల్ని హడలకొడుతున్న ముసలి రాక్షసుడు ! - ప్రజల అజ్ఞానమే - ప్రజల పిరికితనమే - అతడి శక్తి. “కేపిటలిజమ్”కు ఉన్న ముద్దు పేర్లన్నింటికీ ఇతడు బదులు పలుకుతాదని చెప్పవచ్చు.
ఈ కథలోని భీముడు మరో ప్రపంచపు మరో లెనిన్ అనుకున్నప్పటికీ, ఇంతకు మించి గుర్తుపెట్టుకోదగిన పాత్రలు ఈ కథలో ఉన్నాయి. అవి - బలభద్రుడు, వేదాంతి, బండివాడు.
“బకాసుర వ్యవస్థకు బలియైపోయిన బలభద్రుడి మరణంలో త్యాగం ఉంటే - ముసలి రాక్షసుడి సంగతి తెలిసీ, రాజుగారి క్రౌర్యాన్ని స్వయంగా చవిచూసీ, బ్రతుకు తెరువుకు తలవంచి రోజుకో ప్రాణాన్ని ఐకాసురుడికి అప్పజెప్పిన బండివాడిలో బానిసత్వపు పిరికిదనం ఉంది. యిక - వేదాంతి గారిలో తిరోగతమనతత్వానికి ఊపిరి అయిన అవకాశవాదం ఉంది ! భీముని అవతారానికి ముందు ప్రతి 'బకాసుర వ్యవస్త లోనూ ఇవన్నీ సాధారణంగా జరిగే విషయాలే ! “బకాసురుణ్ణి భయపెట్టగలిగిన వాడినై ఉండి కూడా వాణ్ణి చూచి హడలిపోయే మంత్రి వగైరాలకు తాను లొంగవలసి వచ్చింది" అని బండివాడనుకున్న మాటలనేపథ్యంలోంచి ఈ కధను చదివే పారకులు ఆత్మపరిశీలన చేసుకొనవలసి ఉంది.
“జాంబవంతుని కలిలో కూడా ఇలాంటి 'సింబాలికొ ధోరణి కనబడుతుంది. త్మ కధలోని జాంబవంతుడు ఓ వానర ప్రభువు కొలువుకూటంలోని మంత్రి మాత్రవ్ష్ర కాదు. ప్రజల అభ్యుదయం కోసం ఆరాటపడిన ఓ మహనీయుడు. కిష్కింధ ప్రజలకు వాలి పాలనపోయి సుగీవుడి పరిపాలన వస్తే దేశం స్వేచ్చా, సమానతలతో అభివృద్ది చెందుళుందనీ, ప్రజలకు హాయి కలుగుతుందని ఆయన కలలు గన్నాడు క్రాన్సీ = సుగ్రీవుడి పాలనలో ఆ కలలేవీ నిజం కాకపోవడమేకాకుండా - దేశంలో రాక్షస రాజ్యం విజ్బంభించడం చూసి కృంగిపోయాడు బుష్యమూకం మీద ఉన్న విప్లవకారులు దేశానికి మంచి చేద్దామనే పట్టుదలతో ఉన్నారని విని - వాళ్ళమీద ఆశలు పెంచు కున్నాడు. దర్బారులో “విప్లవం వర్ధిల్లాలి” అని కలవరించి ఉద్యోగం ఊడగొట్టు కున్నాడు. ఈ కథ చదివినప్పుడు మనదేశంలో ప్రజల కలలు కల్లలుగా మారిన స్వాతంత్ర్యానంతర పరిస్థితులు మాత్రమేకాదు - అవకాశవాదులతో సహజీవనం చెయ్యలేక, ఆత్మను చంపుకోలేక కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన కొందరు వృద్ధ నాయకులు కూడా జ్ఞాపకానికి రావడం సహజం.
222 తెలుగు కథ - నాడు,నేడు
స్వాతంత్ర్యానంతరం మనదేశంలో అధికారం స్వార్థపరుల హస్తగతం కావడంతో దేశం 'దిబ్బరాజ్యం'గా మారిపోయిందని భావించిన కుటుంబరావుగారు 'దిబ్బరాజ్యం” కధలు రాశారు
దిబ్బరాజ్యానికి స్వాతంత్ర్యం వచ్చిందని విని మనకు కథను చెప్పే వ్యక్తి ఆ రాజుగారిని కలుసుకోవడానికి అక్కడకు వెళ్ళేసరికి రాజుగారి దర్బారు 'శాసనసభగా పేరుమార్చుకుందనీ, దానికి రాజావారు అధ్యక్షులయిపోయారనీ, జమీందారులందరూ మంత్రులుగా మారిపోయారనీ తెలుస్తుంది! - రాజుగారు మాటల మధ్యలో తమ దేశంలో జమీందారీలు రద్దయిపోయాయని చెబితే - మన కథానాయకుడు చాలా సంతోషించి, ఆ వివరాలు చెప్పమంటాడు.
“-జమీందారీలు లేవుగానీ, ఒక్కటే చింత, - జమీందార్లకు నష్టపరిహారం రొక్కరూపంలో ఇవ్వలేకపోయాం. పరిహారం క్రింద చాలా భూములు వారికిచ్చేసి - మిగిలిన వాటిని రైతులు నాలుగేళ్ళపాటు ఎలాంటి ప్రతిఫలం పొందకుండా సాగు చేసేటట్లు నిర్ణయించాం” అంటారు రాజుగారు !
యిక, - మరోకథలో దిరుగుండం రాజ్యాన్ని ఏలుతున్న దిబ్బరాజుగారు దేశంలో దారిద్ర్యం పెరిగిపోయిందని విని దరిద్రుల పీడ వదిలించుకోడానికి వాళ్ళందరినీ ఉరితీయాలని ఆదేశిస్తారు ! దీని ఫలితంగా దేశంలో పనిచేసేవారే లేకుండా పోయారు. ధనికులకు భూమ్మీద కాళ్ళు నిలవని పరిస్థితి ఏర్పడి దేశం అల్లకల్లోలమైపోయింది. అప్పటికిగాని శ్రీశ్రీ రాజావారికి, వారి ఆశ్రితులయిన ధనికులకు, తాము ఇన్నాళ్ళు బ్రతికింది బీదల కష్టంమీదనేనని తెలిసిరాదు !
- ఇట్లాంటి కథలను కుటుంబరావుగారు ఏ వ్యవస్థపట్ల 'కసి'తో రాశారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఇలాంటి “కసితో రాసినదే “కరువొచ్చింది” అనే కధ కూడా -
“-కరువొచ్చింది. పంటలుపండినై, - గింజలు కళ్లాలు దాటగానే మాయమయినై. 'పైరు పచ్చగా పెరిగినప్పుడూ, కంకులు బరువుగా వొంగి, తమకు ఏపుగా పెంచిన భూదేవికి జోహార్లు చేసినప్పుడూ, బంగారు గింజలు కనక వర్షంలా జలజల రాలినప్పుడూ, కళ్లపండువుగా చూచిన పేదప్రజలకు కన్నుపొడుచుకున్నా గింజ కనిపించలేదు. రైతుల తపః ఫలితాన్ని గద్దలు తన్నుకుపోయినై. కాటకం వచ్చింది అంటూ మొదలయ్యే ఈ కథలో కరువు నివారణకు ఆకలిని తిడుతూ కవిగారు సద్యరత్నాలు రాయడమూ - కరువు నివారణకు ఏర్పాటు చేయబడిన సభలో - దేశమంతటా కరువు నివారణ హోమాలు, యజ్ఞాలు చెయ్యాలనీ, రామభజనలు
మపంద2నడ2డనడనడన222222డ22 కోడూరి శ్రీరామమూర్తి 2 చేయాలనీ, పేదప్రజలు రోజూ గీతాపారాయణం చెయ్యాలనీ - బ్రహ్మచర్యం పాటించి సంతానోత్పత్తిని తగ్గించాలనీ - పూటకు పావుశేరుకన్నా ఎక్కువబియ్యం అన్నంగా వండుకోకూడదనీ (తర్వాత దీనిని అర్థశేరుగా సవరించారు) తీర్మానాలు ఆమోదించ బడడమూ, - ఆ కధ చదివినవారికి గుర్తు ఉంటుంది. అయికే - కధ చివరకు వచ్చేసరికి, - పేదవాళ్ళందరూ ఏకం కావడంవల్ల లక్షల కొద్దీ బస్తాల ధాన్యం చీకట్లోంచి బయటకు రావడమూ, కరువు పటాపంచలు కావడమూ, జరుగు తుందనుకోండి - అది వేరే విషయం !
ఈ కధ గురించి చెబుతూ వుంటే, - బిజెపి ప్రభువుల పాలనలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన వింత ఒకటి జ్ఞాపకానికి వస్తున్నది. ఆ సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అంతకుముందు సంవత్సరంతో పోల్చి చూస్తే కాస్తపెరిగింది. అప్పటికే ఫుడ్ కార్పొరేషన్ వారి గిడ్డంగుల్లో ఆరుకోట్ల టన్నులదాకా ఆహారధాన్యాలు మూలుగుళున్నాయి. ఇప్పుడు ఈ క్రొత్త దిగుబడి కూడా జత చేరితే వాటిని గిడ్డంగుల్లో నిలవ చెయ్యడానికి పెద్దమొత్తంలో వ్యయం అవుకుంది. ఏం చెయ్యాలి అనే సమస్య వచ్చింది. ఇది ఇలా ఉండగా, ఆహారధాన్యాలు ఖర్చుకాకుండా ఎందుకిలా పేరుకుపోతున్నాయి అనే సందేహం కూడా వచ్చింది.
ఈ (ప్రశ్నకు సమాధానాన్ని కూడా వెంటనే మన మేధావులు” కనిపెటారు. పేదప్రజలు ఇప్పటికే తగినంత ఆహారధాన్యాలను వినియోగం చేస్తున్నారు. అందుచేత అదనంగా వారు ఆహారధాన్యాలను వినియోగం చెయ్యడానికి ఇష్టపడడం లేదు. చేపలు మాంసం ఇలాంటి వాటిపైన వ్యయం చెయ్యడానికీ, ఆహారేతర వస్తువుల వినియోగం చెయ్యడానికీ మొగ్గు చూపిస్తున్నందువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అని వారు తేల్చిచెష్పార్య దాదాపు 50 కోట్లమంది ప్రజలు రోజుకు ఒక పూట కూడా కడుపునిండా తినడాన్సిక్షి నోచుకోని స్థితిలో వున్న దేశంలో - ప్రజలకు ఆహారధాన్యాలు అదనంగా అవసరంలేదని ఆ 'మేధావులు' ఎలా తేల్చిచెప్పారో అర్ధం కాదు ! ఇంతకన్నా విచిత్రం మరొకటి కూడా ఉంది. ఆహార సబ్సిడీపై చేస్తున్న వ్యయం బాగా ఎక్కువగా వుంటున్నది కాబటి _ ఆహార ధాన్యాల నిల్వలపైనా, రవాణాపైనా ఉన్న నియింత్రణలన్నీ ఎత్తివేసి _ వీటిని 'సద్వినియోగం' చేసే బాధ్యత ప్రయివేటు రంగానికి అపుజెపషమని మరో అరశాస్తవే, సో ఇచ్చారు. ధ్య బ్రజిబ్బ ర్థశాస్త్రవత్తగారు
పుడ్ కార్పొరేషన్ గోడవున్లలో పేరుకునిపోయి వున్న నిల్వలలో “పనికి ఆహారం" పధకం క్రింద అదనంగా మరికొన్ని పనులు చేబడితే పేదప్రజలకు మేలు సమకూరదడం మాత్రమే కాకుండా దేశ ఆర్ధికప్రగతికి అది దోహదం చేస్తుందని ఈ “మేధావులకు
22 తెలుగుకథ-నాడు,నేడు మనవ. తాన తెలియదనుకోవాలా? - గిడ్డంగుల్లోని ఆహార ధాన్యాలు వినియోగం కాకపోవడానికి కారణం (ప్రజలకు వినియోగశక్తి లేకపోవడం అనే కనీస అవగాహనవారికి వుండదను కోవాలా? లేక పెట్టుబడిదారీ మనస్తత్వానికి ఇది పరాకాస్ట్ర అనుకోవాలా? అనే ప్రశ్నలకు సమాధానం ఆ మేధావులకే తెలియాలి 1! -
-
ఇలా ఆలోచించినప్పుడు, - కొ కు గానీ 2002 సంవత్సరం వరకూ జీవించి వుంటే 'కరువొచ్చింది కథను ఇంతకుమించిన 'కసితో రాసివుండేవారేమో అనిపిస్తుంది.
-
పెట్టుబడిదారీ ఆర్ధికవ్యవస్థకు మూలాధారామైన విషయాల్లో “దోపిడీ అనేది ముఖ్యమైనది. ఈ “దోపిడీ అనే ప్రక్రియ అవతలి వ్యక్తికి తెలిసీ, తెలియకుండా కూడా ఎలా జరుగుతుందో - సాధారణ ప్రజాజీవితంలో యిది ఎలా ఆమోదాన్ని పొందుతుందో, కుటుంబరావుగారు 'నువ్వులు-కెలగపిండి, *ట్యూటరొ అనే రెండుకధల్లో చాలా అద్భుతంగా చెబుతారు
తెలగపిండి ఎట్లా వస్తుందో అందరికీ తెలుసు. నువ్వులు అట్టే నాగరికతలేని సరుకు. అది పొలాల్లో కష్టజీవుల చేతిలో పెరిగి మధ్యవాళ్ళకు అమ్ముడై బస్తీ చేరుతుంది అక్కడ దాన్ని గానుగ ఆడి నూనె తీస్తారు ఆ నూనె అందమైన సీసాలకూ, డబ్బాలకూ, ఎక్కి అనేక వంటిళ్ళను అలంకరిస్తుంది. తెలకపిండి చక్కను నవ్వులు ఒకవేళ చూచినా పోల్చలేవు. అది గొడ్లకూ, పేదవాళ్ళకూ ఆహారం అవుతుంది” అంటూ ప్రారంభిస్తారు కొ.కు. 'నువ్వులు - తెలగపిండి కధను (రచనాకాలం - 1950). 7
కొందరికి లాభాలను ఆర్టించి పెట్టడానికి మరికొందరు ఎలా గానుగ ఆడబడి వ్యర్థపదార్థంగా ఎలా మిగిలిపోతారో - పెట్టుబడిదారీ పారిశ్రామిక నాగరికతలో ఉత్పత్తి కారకంగా శ్రామికుడి స్థానం ఏమిటో ఒక మధ్యతరగతి కుటుంబం కధగా ఇందులో చెబుతారు కుటుంబరావుగారు ఈ 'నువ్వులు-తెలగపిండి వ్యవహారంలో గానుగ ఆడించేవాడు పారిశ్రామికవేత్త ఆడబడేవాడు కార్మికుడు, అనే నియమం ఏదీ లేదు. దగ్గర బంధువుల విషయంలో కూడా స్వార్ధం? అనేది చారబడినప్పుడు మనుషులు నువ్వుల గానుగ ఆడబడుతూనే ఉంటారు చివరకు తెలకపిండిలా మారి వ్యర్థపదార్థంగా మిగిలిపోతూ వుంటారు అనేదానికి ఈ కధలోని సోమయాజులు అనబడే ఇంటల్లుడే తార్మాణం. అతడికి భగవంతుడు ఇచ్చిన చక్కని గాత్రమే అతడి బతుకును తెలకపిండి చక్కలామార్చేసింది.
ఇక- “ట్యూటర్ కథలోని రాజశేఖర్ - “నువ్వులు తెలగపిండి" కధలోని సోమ యాజులు మాదిరిగా నోట్లో నాలుకలేనివాడు కాదు. 'దోపిడీ అనేది ఎలా జరుగుతుందన్న
కోడూరి శ్రీరామమూర్తి 2222న విషయంలో అవగాహన ఉన్నవాడు. 'వాజొ అనే ఓ ధనవంతుడి కూతురు (టెక్స్టైల్ ఫ్యాక్టరీ అధినేత కూతురు. ఓ మందుల కంపెనీ అధినేత కుమారునికి కాబోయే భార్య) అనేటట్టు - “చాలా నాస్టీమేన్. రిచ్క్లాస్ అంటేచాలా ఎన్వీ - ఎప్పుడూ కమ్యూనిజమే మాట్లాడతాడు".
- ఇలాంటి రాజశేఖర్ వాణికి కేవలం వందరూపాయలకు ట్యూషన్ చెప్పడానికి రోజూ ఎందుకు వాళ్ళ ఇంటికి వెడుతున్నాడు? ఓ సినిమా కంపెనీ వాళ్ళకుచాలా తక్కువ పారితోషికం అని తెలిసి కూడా తన నాటకాన్ని ఎందుకు అమ్మాడు?
“-నెస్సిసిటీ. నా బోటివాళ్ళకు నెస్పిసిటీ అనేది ఒకటి ఉంటుంది. నాకు మీ డాడీ (రాణి తండ్రి) వందరూపాయలు జీతం ఇస్తున్నారు. - ఇలాంటి ట్యూషన్స్ రోజుకు మూడు చెబితే నెలకు మూడువందలు వస్తాయి. డుయు థింక్, ఇట్ ఈజ్ ఎ డీసెంట్ ఇన్‌కం ? - అయితే నేను వందరూపాయలు ఎందుకు యాక్సెస్ట్ చేస్తున్నాను? - సెస్సిసిటీ. నేను సర్వ్వైవ్ కావాలంటే ఈ ఎక్స్‌ప్లాయిటేషన్‌కు ఒప్పుకోవాలి” అనే రాజశేఖర్
ఆవేదనలో ఎక్స్‌ప్లాయిటేషన్ జరగడానికి గల అసలు కారణం తెలుస్తుంది. దీనిని నిర్మూలించాలన్నదే 'సోషలిజమ్” థ్యేయం.
- కుటుంబరావు కథల గురించి చెప్పేటప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో కేపిటల్రిస్స (ప్రవృత్తులు ఎలా చోటు చేసుకుంటాయో ఆయన చెప్పే తీరు గురించి తేష్పక్తుండా (ప్రస్తావించవలసి ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాల్లోని వ్యక్తులకు ఆర్థికపరంగా ఏమాత్రం అవకాశం దొరికినా పెట్టుబడిదారీ వ్యవస్థలోని ఐడాబాబులను మించ్చ్వి అవలక్షణాలను అతి సునాయసంగా సంతరించుకుంటారనేది కొ.కు. అభిప్రాయం, “మారిన జీవితం” “అంతరాత్మ”, “కొత్తజీవితం” మొదలైన కథలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
“మారిన జీవితం” కధలోనిలీల ఒక ఆదర్శవాది కూతురు. హెచ్చు, తగ్గులనేతేద్రాల్పు కృత్రిమంగా కల్పించబడినవేననీ, మనుషులందరూ ఒకటే అనీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకు ప్రతిరోజూ ఇంటిలో ఇచ్చే ఉపన్యాసాలను ఆమె తెరుచూ వింటూందేది. అయితే
- ఆమెకు డబ్బున్న పల్లెటూరి సంబంధం కుదరడంతో - తండ్రి ఇచ్చే ఉపన్యాసాలు” జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. బడుగువర్గాలకు చెందిన ప్రజలను పీడించడానికి కావలసిన హంగులన్నీ సునాయాసంగా ఆమెకు సమకూరాయి. మొదట్లో అత్తింటివారు ఈమెను పరాయిపిల్ల క్రింద చూశారు గానీ, ఆమెకూ తమ తరవో ప్రవృత్తే ఉన్నదని రూఢికావడంతో ఆమెను స్వంతమనిషిగా చూడడం ప్రారంభించారు!
322 తెలుగు కథ -నాడు,నేడు ఒక ప్రక్క కూలిజనాన్ని (తిండికి లేని వెధవలు”-) అణచిపెడుతూ - మరో ప్రక్కన (బ్రాహ్మణులకు సంతర్పణలు చేయిస్తూ - "పెద్దమనుషూోలకు ఉండవలసిన హంగు లన్నిటినీ సము పార్షించుకుంది. ఓ విధంగా చెప్పాలంటే “ఐశ్వర్యం” నవలలోని డాక్టరు కూతురు వంటిదే లీల కూడా
ఇదే విషయం “అంతరాత్మ” కథలో మరొకవిధంగా ఆవిష్కరించబడింది ఈ కధలోని సుదర్శనం అనే యువకుడి తండ్రి ఒక ఆదర్భ్శవాది. వీరేశలింగం గారితో కాస్త పరిచయం ఉన్నవాడు అయితే - అతడు చనిపోయిన తర్వాత - అతడు చేసిన 18వేల రూపాయల ఇన్సూరెన్స్ మొత్తానికి సుదర్శనం తల్లి 'అధిపతి' కావడంతో ఆమెలో తలెత్తిన 'కేపిటలిస్ట్ ప్రవృత్తిని - మున్నెన్నడూ లేనివిధంగా జ్యోతిష్యం, హస్తసాముద్రికం, అంకెలశాస్త్రం, వారాలు, వర్వ్యాలు మొదలైనవాటికి ఆ ఇంటిలో ప్రాధాన్యత లభించిన వైనాన్ని అకారణంగా ఆ ఇంట్లోని మనుషులు ఒకరినొకరు ద్వేషించుకోవడాన్ని ఈ కధలో చాలా ఆసక్తికరమైన రీతిలో చెబుతారు కుటుంబరావుగారు.
“-నేను సమ్మెలు చూశాను. పోలీసుల లారీచార్జీలు చూశాను. కానీ, మా ఇంట్లో జరిగే పోట్లాటలంత అర్ధరహితమైన సంఘటనలని ఎక్కడా చూడలేదు. ఇంట్లో ఇంత తిండి వుండి బతకడం చేతకాని మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాడు తప్ప ఈ కొట్లాటలను ఊపించుకోలేరు. ఇంట్లో డజనుమంది ఉంటే ఏ ఇద్దరి మధ్యనైనా శత్రుత్వం ఉండేది. ఇవాళ కొంపలో ఎవరికి ఏ ఎదురుదెబ్బ తగిలినా మిగిలిన వారంతా ఏకగ్రీవంగా నవ్వడానికి సిద్ధంగా ఉన్నారు”
- అంటూ ఈ కధలోని సుదర్శనం లోనయిన ఆవేదనను పారకులు మరిచిపోలేరు. “ధనంగాడి” లీలలకు తార్మాణాలే ఇవి అన్నీ!
కుటుంబరావుగారి “కులంగాడి అంత్యక్రియలు కధలో (మార్క్స్ కేపిటలో చదివిన తర్వాత కలిగిన అవగాహనతో తాను రాసిన తొలికధగా దీనినే కొ.కు. పేర్కొన్నారు) దిక్కులేని చావుచచ్చిన కులంగాడికధ, ఆ తర్వాత వచ్చిన అధికారం గాడికధల తర్వాత ధనంగాడి కథ కూడా వున్నది.
పరమ కర్మోకటకుడు అయిన ధనంగాడు అమలుపరిచే నిశ్శబ్ద అలిఖిత శాసనాన్ని గురించి చెబుతారు కుటుంబరావుగారు ఈ కధలో. “వాడి మహత్యం ఏమిటోగాని వాడికోసం ్రతీతరంలోనూ అనేక కోట్లమంది మనుషులు మనస్ఫూర్తిగా బలిఅయ్యారు. కేవలం వాడి అనుగ్రహం పొందలేకా, కోల్పోయీ, అత్మహత్యలు చేసుకున్న వాళ్ళ సంఖ్య పెద్దది అని అంటారాయన.
డంనిననతనడడనడైడడనననడ22222 కోడూరి శ్రీరామమూర్తి 2వ
-
ఇలాంటి ధనంగాడి 'ఘనతి గురించి ఎంతమంది ఎన్ని కధలురాసినా ఇంకా కొంత “వ్యథ” మిగిలిపోతూనే ఉంటుంది !.
-
కుటుంబరావుగారు “రోడ్డు ప్రక్కన శవం అనే కధ ఒకటి రాశారు అవడానికి ఇది రోడ్డుపక్కన దిక్కులేని చావుచచ్చిన ఒక వ్యక్తి కథే అయినా - ఆ కధలో కొకు. బ్రతికుండగా ఒక ముష్టివాడికి వచ్చిన రెండు కలల గురించి చెబుతారు.
మొదటి కలలో - పూరిపాక పాక మీద సొరపాదు. ఆ పాదుకు కాయలు. పాకలో వంటచేసే ఆడకూతురు. అన్నం వాసన- పులుసు వాసన - పొయ్యి క్రింద ఎ(రైర్రగా మండుతున్న చితుకులమంట ఉంటాయి.
ఇక, రెండో కలలో ఒక పెద్ద ఇల్లు. దానికి గోడలు, వాకిళ్ళు ఉండవు అందులో
చాలా కుటుంబాలుంటాయి. అందరూ కలిసి అందరికోసం అందులో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ మధ్య స్నేహం, చుట్టరికం, ఇలాంటివి వున్నాయోలేదో గాని - అంతకన్నా సహజమైన, విశాలమైన, బంధం ఏదో వాళ్ళమధ్యన ఉంది. వాళ్ళందరికీ రోడ్డుప్రక్కన దిక్కులేని చావు చచ్చిన ముష్టివాడిమీదా, ఆ ముష్టివాడికి వాళ్ళమీదా, అపారమైన విశ్వాసం ఉంది.
= ఇవి (ప్రాయిడియన్ కలలు కావు. అంతరంగపు లోతులోంచి దినిని విశ్లేషించ
వలసిన పని లేదు. ఇవి అచ్చంగా మనిషి బాహ్యాజీవితానికి కనీస అవసరాలకు సంబంధించిన కలలు. మనిషికి ఆహారం ఉండాలి - దానిని వండుకోవడానిక్తి కావాల్సిన ఆర్ధికస్టోమత, అవకాశం ఉండాలి. అతడికంటూ ఒక సంసారం ఉండాలి _ అనే కోరికలు మొదటి కలలో కనబడుతున్నాయి. ఆకలితో మాడిచనిపోయిన ముష్టివాడ్షిక్ర “నా అంటూ ఎవరూ లేని ముష్టివానికి - ఇలాంటి కల రావడంలో ఆశ్చర్యం లేదు. ఈ కలకు వ్యక్తిపరమైన ఆకాంక్ష మూలం
రెండో కలకూ అవసరాలు తీరడం అనేదే ప్రాతిపదిక విషయంగాని - ఆ ప్రాతిపదిక వ్యక్తిపరమైన ఆకాంక్షకు సంబంధించింది కాదు సామాజిక ఇచ్చకు, సామూప్రాక్ర (శ్రేయస్సుకు సంబంధించినది. ఒక్కమాటలో &0901416 60౫౫౧1౪౫ చెప్పే లక్ష్యాన్ని చెబుతున్నది ఈ కల.
ఈ కలలు నిజమై మానవుడు వ్యక్తిపరంగాను, సమాజపరంగానూ, అభ్యున్నతి సాధించగలగాలనే తపనతో కుటుంబరావుగారు వందలాది కథలను, గల్పికలను రాశారు. “గల్పిక అనే ప్రక్రియను తనదైన రీతిలో రచించి సాహిత్యంలో దానికొక పత్యేకస్టానాన్ని కల్పించిన ఘనత కొ.కు. గారిది. కధకూ, గల్చికకూ, కొంత పోలికవున్నప్పటి తేదా కూడా ఉంది. కథకు ఇతివృత్తం అనేది ఎంతో కొంతమేరకు తప్పనిసరిగా ఉండాలి.
౨222 తెలుగు కథ - నాడు,నేడు గల్చికకు ఆ అవసరం లేదు. ఇందులో పాత్రచిత్రణ అనేదానికి అవకాశమే ఉండదు. గిలి గింతలు పెడుతూ, చురుక్కుమనిపించే వ్యంగ్యంతో-మన విలువలలోని లేకిదనాన్స్ని చిత్తశుద్ది లేమినీ, అవకాశవాదాన్న్సీ ఎద్దేవా చేస్తూ 'సున్నితంగా' మొట్టికాయలు మొట్టేందుకు (1) నిర్దేశించబడిన ప్రక్రియ ఇది! కధతో పోలిస్తేదీని నిడివి బాగా తక్కువేగాని - ఇంచు మించుగా కథ సాధించే ప్రయోజనాన్ని ఇదికూడా సాధించేందుకు అవకాశం ఉంది.
- ఈ విషయానికి సంబంధించిన చర్చ ఎలా ఉన్నా ఒక విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు కుటుంబరావుగారు కధలు రాసినా, గల్పికలు రాసినా, మరేది రాసినా, అన్నింటివెనుకా ఒక లక్ష్యం ఉన్నమాట వాస్తవమేగాని - సిద్దాంతాల ఆవిష్కరణ కోసం జీవితాన్ని ఆయన ఎన్నడూ వక్రంగా చిత్రించలేదు. అన్ని సందర్భాలలోనూ - సిద్దాంతాల కన్నా జీవితాన్నే ఆయన ప్రమాణంగా భావించాడు.
*= రచయిత ఆగ్రహానికి బలమైన కారణం జీవితంలో ఉండాలి. జీవితంలో లేని లోపాలను సంస్కరించి పారేస్తూ రచన చేస్తే ఆ రచనకు రెండు కాళ్ళూ వుండనట్టే - జీవితంలో లేనివిషయం మీద ఆగ్రహావేశం తెచ్చుకుని రచన చేస్తే అదో సుడిగుండంగా తయారై ఊరుకొంటుంది...” అంటారాయన.
ఇక - కధారచనలో శిల్పానికి అవాంఛనీయమైన ప్రాధాన్యతను ఇవ్వడాన్ని కుటుంబరావుగారు అంగీకరించలేదుగాని - కధకు ఆయువుపట్టు అని చెప్పదగ్గ అంశాలలో శిల్పం ముఖ్యమైనది అని ఆయన పలుసందర్భాలలో చెప్పారు. అంతేకాదు = “ఈనాటి యువకులు తమ కథల ద్వారా పరిస్థితులను మార్చాలని చూస్తున్నారు గానీ కధ యొక్క వాస్తవికత శిల్బ్పం మీద ఎంత ఆధారపడి ఉంటుందో గ్రహించడం లేదు” అని కూడా అన్నారు
నేటి కధా రచయితలు కొ.కు చెప్పిన ఈ అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొన వలసిన అవసరం ఎంతయినా ఉంది.
- కధలు రాయడం తగ్గించుకున్న తర్వాత కూడా కుటుంబరావుగారుతన సమకాలీన పరిస్థితులపై పలు సందర్భాలలో వ్యాఖ్యలు చేశారు.
*“- 'మనదేశంలో ప్రజాస్వామ్యం ఎన్నికలతో ప్రారంభమై అక్కదే ఆఅగిపోతున్నది”
*- మనం తలక్రిందులుగా నిలబడి వ్యవసాయం అనే పునాది లేకుండా పారిశ్రామికంగా పైకి రావాలని చూస్తున్నాం”
“- ఈనాటి ప్రపంచ రాజకీయాలను సంక్షోభంలోకి నెడుతున్న అంశాలలో ఒకటి ఆహారధాన్యాలు, రెండోది పెట్రోలు. తిండిగింజలు అమెరికా పాలకుల చేతిలో ఒక అస్త్రం లాంటిది. ఒక వంక ఆహారసమస్య (ప్రపంచ సమస్య అయి కూర్చున్నా కూడా అమెరికా ఆహారాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించే ఆలోచన కట్టి పెట్టలేదు”.
షుచనననడడడడననడనడనడనననన22ఐ కోడూరి శ్రరామమూర్తి వా *..తలసరి రాబడిలో అయిదుశాతం కూడా ఖర్చుచేయాల్సిన అవసరం లేకుండా తిండిపోతులుగా పౌరులు జీవించే అవకాశం ఉన్న దేశాలలో సైతం ఆహారపదార్థాలకు ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చే స్థితిలో ఉండగా - మనదేశంలో లక్షలాది ప్రజలకు ఆదాయం కడుపునిండా తినడానికే చాలడం లేదు” (రాజకీయ వ్యాసాల నుండి)
- వివిధ సందర్భాలలో *70లలో కుటుంబరావుగారు రాసిన వ్యాసాల్లోని కొన్ని వ్యాఖ్యలు ఇవి. కాలగమనంలో కొన్నిమార్చులు, చేర్పులూ, ఏర్పడినా ఈనాటికీ ఈ వ్యాఖ్యలు చాలావరకు వర్తిస్తాయి. ఒకప్పుడు - కుటుంబరావుగారు “గ్రహశకలం” అనే "సైన్స్‌ఫిక్షన్' కధలో చీకటి ప్రపంచంలోని వెలుగుకు, వెలుతురు ప్రాంతంలోని చీకటికి, మధ్యజరిగే సంఘర్షణ గురించి రాశారు. “చీకటి అనేదానిని పెట్టుబడిదారీ వ్యవస్థ స్వరూపానికి - వెలుగు అనేదానిని సామ్యవాద వ్యవస్థకు, ప్రతీకలుగా తీసుకుంటే ఒకనాటి రష్యా, అమెరికా, విధానాలకు సంబంధించిన సంఘర్షణగా దీనిని చెప్పుకోవచ్చు.
కాని, - ఇవాళ సోవియట్ యూనియన్ లేదు. రష్యాలో పెట్టుబడిదారీ ధోరణులకు చోటు దొరికింది దీనితో సామ్యవాద ధోరణికి సంబంధించిన శకం ముగిసిపోయిందనే “'ఆనందరి కొందరికి లభించింది ! -'ప్రపంచీకరణ విధానాల” పేరుతో పెట్టుబడిదారీ దేశాలు బహిరంగంగా, నిస్సిగ్గుగా, పేదదేశాలను దోచుకోవడం మొదలుపెట్టాయి ప్రయివేటీకరణ మంత్రం పేదదేశాలలో కొందరిని మరింత ధనికులను చేస్తే _ పేదవారి పరిస్థితి మరింత దయనీయమైపోయింది. ఈ సమకాలీన చరిత్రను మూడుదశాబ్లాల క్రిందటి కొ.కు. వ్యాఖ్యలలోంచి అవలోకిస్తే మనం ముళ్ళబాటలో చిక్కుపడిపోవదావ్రిక గల కారణాలు మరింతగా అవగతం అవుతాయి.
- కొద్ది మాసాల క్రితం (2004 సం॥లో) ఐక్యరాజ్యసమితి వారి మానవాభివృద్ద నివేదిక వెలువడింది. ఈ నివేదికలో 177 దేశాలకు సంబంధించిన వివిధ మానవాఖివ్చ ద్ధి అంశాలలో జరిగిన ప్రగతి ప్రాతిపదికగా 'రేంకులను ఇవ్వడం జరిగింది. అందులో మన 'రేంకు 127 అని ప్రకటించడం జరిగింది. అంటే - అర్ధశతాబ్ధికిపైగా ప్రజాల్లికల్రన్సు అమలుచేస్తూ - ఆర్ధిక ప్రగతిని సాధించేస్తున్నామని డాంబికాలు పోతున్న మనం - ప్రపంచంలో (మానవాభివృద్ధి విషయంలో) అట్టడుగు స్థాయిలో వున్న 50 దేశాలలో ఒకటిగా ఉన్నాం ! - అదేవిధంగా యు.ఎన్.డి.పి వారి అంచనా ప్రకారం మనదేశానికి 'హ్యామన్ పావర్టీ ఇండెక్స్ (మానవ దారిద్ర్య సూచిక), మహిళా అభ్యున్నతిని గురించి తెలిపే “జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, మొదలైన వాటివిషయంలో కూడా పరిస్థితి ఎంతమాత్రము గౌరవప్రదంగా లేదు !-
మై తెలుగు కథ -నాడు,నేడు
- ఏదో ఒక సంవత్సరంలో కాస్త వర్షాలుపడి పంట దిగుబడి పెరిగిన కారణంగా ఆర్ధికవృద్ధిరేటు (జిడిపి) పెరిగితే - 'భారత్ వెలిగిపోతుంది” అంటూ డంబాలు పలికితే సరిపోదు మానవాఖివృద్ధికి దోహదం చెయ్యని సంపద వృద్ది ఏ దేశానికీ ఎంతమాత్రమూ మేలు చెయ్యదు.
ఇలాంటి స్థితిలో ఉన్న మనం - మన గురించి మరొకసారి ఆలోచించుకోవదానికి “కొకు” కథలు ఇవాళ్టికి కూడా ఎంతగానో ఉపకరిస్తాయి. అంతేకాదు, కధకుడుగా కలం పట్టిన వారి బాధ్యతను కూడా గుర్తుచేస్తాయి
కుటుంబరావుగారే అంటారు ఒకచోట -
“- జీవితం చాలా విశాలమైంది సంఘంలో అనేకవర్ణాల వారు, వృత్తులవారు, ప్రాంతాలవారు ఉన్నారు. వీరందరికీ అనేక వందల సమస్యలున్నాయి వాటిని పరిష్కరించుకునే నేపథ్యంలో వారు చిత్రవిచిత్రమైన నైతిక, ఆర్ధిక పరిస్థితులకు గురి అవుతున్నారు విస్తృతమైన ఈ జీవితాన్ని ప్రతిబించించడానికి ఎన్ని కధలైతే చాలేటట్టు? జీవిత వైవిధ్యంతోబాటు మార్పుకూడా చాలావేగంగా జరుగుతున్నది రెండేళ్ళ క్రితం ఒక సమస్య ఏ రూపంలో ఉన్నదో ఈనాడది ఆ రూపంలో ఉండడం లేదు. దీనిని సాహిత్యంలో చిత్రించవలసిన ఆవశ్యకత ఉన్నది” అని
యివాళ్డి తెలుగు కథాసాహిత్యాన్ని అవలోకిస్తే - ప్రపంచంలోనూ భారతదేశం లోనూ వచ్చిన, వస్తున్న - మార్పులను నేటికధకులు నిశితంగా పరిశీలించడమే కాదు = పలు సందర్భాలలో వాటిని సమర్థవంతంగా కధల్లో ఆవిష్కరిస్తున్నారు. వైవిధ్యభరితంగా వున్న సమస్యలను, వాటి లోతులను, గమనించి కథల్లో అక్షరరూపం ఇస్తున్నారు. ఈ కృషి బహుముఖంగా జరుగుతున్న మాటవాస్తవమే అయినప్పటికీ, వాణిజ్య పోకడల తాకిడికి తట్టుకుని ఇది మరింత శక్తివంతంగా జరగవలసి ఉన్నది.
ఒకనాడు గురజాడ - ఆ తర్వాతి కాలంలో కొడవటిగంటి కుటుంబరావు -వంటి ఎందరో మహనీయులు పెంచిపోషించిన ఈ ప్రక్రియ మరింతగా పురోగమించేందుకు యధాశక్తి కృషిచెయ్యడమే కుటుంబరావుగారికి నిజమైన నివాళి.
(2004 సం॥ ఆగస్సు నెలలో విశాఖలో “వెలుగు” సాహిత్వ సంస నిరళాంచిన 3 శ సమర్పించిన ప్రసంగ క శ నిర్వ సెమినార్లో
కడడడ్తటననడడడడడడడడ2డడ22ఊఊడ222ఊ కోడూరి శ్రీరామమూర్తి 222 పద్మరాజు కథలు - ఒక పరిశీలన “జ్లీవితం గొప్పదా? కళ గొప్పదా? సందేహం ఎందుకు జీవితమే... అన్ని కళలూ నశించిపోయినా, జీవితం మిగలాలి” పద్మరాజుగారి “ఫలశ్ళతి” అనే కథలో ఒక పాత్ర అంతరంగ ఆవేదన ఇది. నిజానికి - తాను రాసిన అనేక కధల్లో ఫాలగుమ్మివారు చెప్పే 'ఫలశ్చతి' కూడా ఇదే ! - శుష్క ఆదర్భవాదానికి కాక, జీవితానికీ జీవితపు విలువలకూ ప్రాధాన్యతను ఇచ్చిన విశిష్ట కథకుడు పాలగుమ్మి పద్మరాజు. పద్మరాజుగారు ఏదో ఒక ప్రత్యేక దృక్పధాన్ని సాహిత్యంలో (ప్రచారం చెయ్యడానికి కలం పట్టిన కధకుడు కాడు ఆయనకు సిద్ధాంతాలకన్నా మనిషి ముఖ్యం మనిషి గుండెల లోతులలోని సంఘర్షణలు, స్పందనలు, ఆర్థతలు, ముఖ్యం. అయితే - వీటిని ఆవిష్మరిస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో ఏదో ఒక తాత్త్విక దృక్పధము, సామాజిక సిద్ధాంతము, అవ్యక్తంగా బయటపడవచ్చు. దానికి ఆయన జవాబుదారీ కాడు. విమానాలలో తిరిగే బడాబాబుల దగ్గిరనుంచి, కాయకష్టంచేసి కడుపునింపుకునే కూలీజనం వరకూ, ఎందరి గురించో ఆయన కధలు వ్రాశారు. వీళ్ళందరి సామ్రాజ్షక్ర స్థితిగతులు, సమస్యల స్వరూపము వేరయినా పద్మరాజుగారు వీటన్నింటికీ అతీతంగా
- అందరిలోనూ ఒకేతీరులో వినబడే గుండెల చప్పుడుతోనే సంబంధం పెట్టుకున్నార్సు దీనికి ఆర్థికనూత్రాలతో సంబంధం లేదు. “తనను గురించి తానూ” అంట్ర్ర పద్మరాజుగారు వ్రాసిన ఒక వ్యాసంలో *- దారిద్ర్యం గురించి, పీడిత ప్రజానీకం గురించి, సామాజిక అన్యాయాల గురించి వ్రాయాలని కోరిక మాత్రం లేకప్రోలేద్రు తీరా కథ మొదలుపెట్టేసరికి ఆ పీడించే భూస్వామో, వడ్డీవ్యాపారో, నాకు అంత ఘోరంగా కనబడేవాడు కాడు ! అతనిలోనూ చిత్రంగా ఆకట్టుకునే లక్షణాలేవో కనబడేవి. పీడించబడే వ్యక్తి కూడా ముమ్మూర్తులా నీతిమంతుడులాగా కనిపించేవాడు కాదు. ఈ పీడిత ప్రజానీకం క్రింద జమకట్టే వర్ణంలోనూ ఎంతోమంది దగాకోర్తూ మోసగాళ్లూ తగులుతూ ఉంటారు. ఈ ప్రజానీకాన్ని అంతటినీ రెండుభాగాల క్రింద విడదీసి వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళుచెడ్దవాళ్ళు అని మూటల కట్టి పడెయ్యడం నాకు చేతనయ్యేది కాదు.
మము తెలుగు కథ -నాడు,నేడు
- పేదరికం, దారిద్ర్యం వీటి మీద సానుభూతి సూత్రప్రాయమైనదే ఆ లోపానికి కొంత బాధపడేవాణ్ణి కూడా. కాని, తర్వాత తెలిసొచ్చింది అది లోపం కాదని. నాలోని కధకుడు నాలోని సూత్రకారుడుకంటె బలమైనవాడు అని చెప్పడానికి సంకోచించను”. - పద్మరాజుగారు వ్రాసిన కధలన్నింటికి కలిపి దీన్నాక సంగ్రహ వ్యాఖ్యానంలా చెప్పు కోవచ్చు. పైకి నీతికబుర్లు చెబుతూ లోపల కామభావనలతో కుతకుత ఉడికిపోయేవారిని (టెలిఫోన్ కధలోని మిసెస్ రావ్, ఎదురుచూస్తున్న ముహూర్తం'లోని శాంత) మొదలుకొని,
- సానులుగా ముద్రపడినా పెద్దహ్బదయాన్ని చూపగల ఉదారుల వరకూ (పరిహారం? కధలోని మందారం) ఎన్నో తరహాల మనస్తత్వాలు గల వ్యక్తులు పద్మరాజుగారి కధల్లో కనబదతారు. ఏ తరహా సామాజిక, ఆర్ధికవర్దానికి చెందిన పాత్రనయినా వెలుగు నీడల్తో సహా చూపడమే ఆయన పని వాటికి రంగులు పులిమే ప్రయత్నం ఆయన చెయ్యరు ఈ కారణం చేతనే పద్మరాజుగారి కధలు సామాజిక దృక్పధం రీత్యాగాని, ఆర్థికదృక్సధం రీత్యాగాని ఏదో ఒక ప్రత్యేక చట్రంలో ఇమడవు కొన్ని స్పష్టమైన ప్రభావాలు కూడా కనబడవు. బుచ్చిబాబులా ఒక వ్యక్తివాద దృక్చధంగాని, కుటుంబ రావులా వ్యక్తివాదంనుంచి సమిష్టివాదానికి ఎదిగిన పరిణామం కాని, ఆయనలో కనబడదు. పద్మరాజుగారు చలంలా ఒక తిరుగుబాటుదారు కాడు. గోపీచంద్లా హేతువాద సిద్ద్ధాంతపు బొమ్మా బొరుసుల మధ్య నలిగిపోయినవాడు కూడా కాదు జీవితాన్ని నిశితంగా పరిశీలించి అది తనకు “ఎలా కనబడితే అలా వ్రాయడమే ఆయన పని “ఇది ఇలా ఎందుకు ఉంది” “ఎలా ఉండాలి?” - అనే విషయాల గురించి ఆయన ఎక్కువగా ఆలోచించడు. ఎడ్వర్డ్గార్నెట్ అన్నట్టుగానే పద్మరాజుగారు కూడా “మనుషులు ఎలా ఉండాలో అలా తప్ప మరోలా ఉండలేరు -” అనుకుంటారేమో! - ఇది వ్రాస్తుంటే నాకు చెహోవ్ పలుకులు జ్ఞాపకానికి వస్తున్నాయి, “నేను భావాల్లో లిబరల్నుకాను. కన్సర్వేటివ్ను అంతకన్నా కాను పురోభివృద్ధి అనేది క్రమానుగతిలో రావాలని నమ్మేవాడినీ కాను, - ఒక సన్యాసిని కూడా కాదు. ఏదీ పట్టించుకోనివాణ్ణి కానే కాదు. నేనొక స్వేచ్చా కళాకారునిలా మాత్రమే ఉండాలని కోరుకుంటాను. ట్రేడ్ మార్క్‌లు, లేబుల్స్ ఇవన్నీ మూఢనమ్మకాలని నా అభిప్రాయం -” అంటాడాయన తన రచనా దృక్పధాన్ని గురించి చెబుతూ. ఈ విషయంలో పద్మరాజుగారు చెహోవ్కు సన్నిహితంగా వస్తారనుకుంటాను
కథావస్తువు విషయంలో మాదిరిగానే, కధాశిల్బం విషయంలో కూడా పద్మరాజు ఏదో ఒక ప్రత్యేక ధోరణికి కట్టుబడినవారు కాదు. కొన్ని సందర్భాల్లో ఆయన కథల్లో - రష్యన్ కధకుడు చెహోవ్ ధోరణిలో “ఏమీ జరగని స్థితొ కనబడుతుంది. నలుగురు
వషటదడడడననడడనదడై222=24ఊ222 కోడూరి శ్రరామమూర్తి ౨ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న గదిలో తలుపును హరాత్తుగా తీసి, అంతలోనే మూసేసే ధోరణి అది! - కధ మధ్యలో ప్రారంభమై మధ్యలోనే ఆగిపోతుంది (ఈ తరహా విధానాన్ని గురించి చెబుతూ సోమరొసెట్ మామ్ 'అదొక తలా తోక లేని చేహ అని అన్నాడు 1-) అయినప్పటికీ ఏదో ఒక మధురానుభూతి పారకుల హృదయాలను స్పందిస్తుంది పద్మరాజుగారి "కుర్రతనమా? - మానవ స్వభావమా?” “తీర్ధపు టుద్రేకాలు", వంటి కధలు ఈ తరహాకు చెందినవే. ఇక - మరికొన్ని సందర్భాలలో పాత్రల ప్రవర్తనను
తీరికగా వర్ణించడం - కథకు ఉండవలసిన మొదలు, మధ్య, తుది అనేవాటిపట్ల శ్రద్ధ వహించడం కనబడతాయి. ఇది ప్రఖ్యాత రచయిత 'మొపాసాొ' రచన ధోరణి. మొత్తం మీద శిల్చ్పపరంగా చూస్తే పద్మరాజుగారు చెహోవ్ కన్నా'మొపాసాకే ఎక్కువ సందర్భాలలో సన్నిహితంగా కనబడతారు మొపాసాను ఆరాధించిన “సోమర్సెట్మామ్”కు ఏకలవ్య శిష్యుడయిన బుచ్చిబాబు పద్మరాజుగారికి నచ్చిన కధకుడు కావడం ఈ సందర్భంలో 'ప్రస్తావించుకోవాలి రచనాశిల్బంలో బుచ్చిబాబు మొపొసాకు బాగా సన్నిహితుడు. “మొపాసా చెమటను వర్ణిస్తే పారకులకు చెమట కనబడటం మాత్రమే కాదు - ఆ వాసన క్షూడా వస్తుంది” - అనే విషయం బుచ్చిబాబు విషయంలో వాస్తవం అయినట్టుగా పద్మరాజుగారి విషయంలో వాస్తవం కాదు
- మొత్తం మీద పద్మరాజు కథల్లో సార్వత్రికంగా కనబడే విషయాల గురించి చెప్పేటప్పుడు - రెండు అంశాలను తప్పనిసరిగా ప్రస్తావించాలి. మొదటిది ఊహ్యూమ నిస్టిక్ రియలిజమ్. రెండోది - “అద్వైత భావన కోసం ఆయన పడిన ఆరాట్రం_ కథకుడుగా పద్మరాజు ఆశించిన “అద్వైత దృక్పధం గురించి ముంద్రుగ్గా ప్రస్తావిస్తాను. మనుషుల సంస్కారాల్లో, ఆర్థికస్థితిగతుల్లో తేడా ఉన్నప్పటికీ _ వీటి నన్నింటినీ సమైక్యం చేసే భావన ఒకటి ఉన్నదని ఆయన నమ్మకం. ఈ విష (గ్రహింపుకు రావాలంటే వ్యక్తి తనను తాను అన్వేషించుకోవాలి. ప్రఖ్యాత అమెరికన్ రచయిత 'మార్క్‌ట్వెయిన్' - “నా జీవితం అంతా మానవజాతిని పరిశీలించద్దాన్సిక్త అంకితం అయిపోయింది అంటే ఆ విధంగా నన్ను నేను పరిశీలించుకోవడం అన్నమ్రాట. మొత్తం మానవజాతి అంతా నాలో నిబిడీకృతం అయివుండడమే ఇందుకు కారణం. మిగతా వ్యక్తులకూ, నాకూ, ఉన్న కొద్దిపాటి తేడాలు వైవిధ్యాన్ని తీసుకురావడానికి, విసుగు పుట్టించే ఏకత్వరీతిని నివారించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంతకు తప్పించి మనమంతా ఒక్కలాంటి వాళ్ళమే” అని అంటాడు కథారచయితగా పద్మరాజు ఆశించిన సమతా దృక్సథం ఇదే సోషలిస్ట్ వాస్తవికతను ఆశించే పాఠకులు దీనిని ఒక 'బూర్డువా రియలిజమ్” అని అనవచ్చుననుకోండి, - అది వేరే సంగతి 1-
పాలగుమ్మి పద్మరాజుగారి చెప్పేసరికి చాలామందికి ఆయన “గాలివాన” కథ పేరు జ్ఞాపకానికి వస్తుంది. 1952లో "హెరాల్డ్ ట్రిబ్యూన్” పత్రికవారు నిర్వహించిన అంతర్జాతీయ కధల పోటీలో ఈ కధకు ద్వితీయ బహుమతి లభించింది. “గాలివాన కధలోని రావుగారు ఒక వేదాంతి. న్యాయవాదిగా రెండుచేతులా డబ్బు సంపాయించి,
- ప్రాక్టీసును కొడుకుకు అప్పచెప్పి అధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించడం వ్యాపకంగా పెట్టుకున్న మనిషి. ఎన్నో లోతయిన తాత్త్విక విషయాల గురించి ఆయన అనర్గళంగా సభలలో ఉపన్యసించగలడు. - కధ ప్రారంభం అయ్యేనాటికి = అంటే గాలివాన రావడానికి ముందు ఆయన '“సామ్యవాదము, రమ్య రసామోదము” అనే విషయం మీద ఒక సభలో ఉపన్యసించడానికి రైలులో బయలుదేరి వెడుతున్నాడు.
రావుగారు జీవితంలో క్రమశిక్షణకు చాలావిలువ ఇచ్చే మనిషి రోజుకు ఓవల్టీన్ ఎన్నిసార్లు త్రాగాలనే విషయం దగ్గరనుంచి ప్రతిదాన్ని ఆయన ఒక నియమం ప్రకారం క్రమశిక్షణ ప్రకారం నెరవేరుస్తాడు. అంతేకాదు - ఆయన పిల్లల్ని కూడా ఆ క్రమశిక్షణలోనే పెంచారు. వాళ్ళు తల దువ్వుకోవడం దగ్గరనుంచి, సినిమాలకు వెళ్ళడం వరకూ రావుగారు నిర్దేశించిన నియమాల ప్రకారమే నడుచుకున్నారు. ఆర్ధిక పరిస్థితులు ఇచ్చిన అవకాశం వల్ల అంతవరకూ ఆయన జీవితం ఒడుదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతున్నది. ఇంతలోనే “గాలివాన ప్రారంభం అయింది.
ఇక, - ఈ కథలోని ముప్టిది రావగారికి పూర్తి భిన్నమైన పాత్ర. ఆమెకు రావుగారిలా నియమాలు, నీతి, క్రమశిక్షణ ఇలాంటివి ఏవీ లేవు. వాటిని గురించి అలోచిలచడానికి కావలసిన ఆర్థిక అవకాశం కూడా ఆమెకు లేదు. రావుగారు అనుకొన్నట్టు “-ఆమె నడవడిని నిర్ణయించే సూత్రాలు లేవు ఆ సూత్రాలలో నిషేధాలు అసలు లేవు. నిత్యము ధర్మచింతనతో బాధపడే అంతరాత్మగానీ, నాగరికులకు సహజమైన సంకీర్ణ మనస్తత్వంగానీ ఆమెకు లేవు”
*(పద్మరాజు కధలు పేజీ 76)
- ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి లోతుగా ఆలోచించగల రావుగారు కథ మొదటిలో బీద ముష్టిదాన్ని తనకు భిన్నమైన ఒక హీనవ్యక్తిగా మాత్రమే చూడగలిగారు. తనకూ, ఆమెకూ, వున్న అద్వైతభావనను (గగ్రహించలేకపోయారు. శంకరాచార్యులవంటి మేధావి - మాలవాడిని అంటరానివాడిని మొదటిలో అనుకున్నట్లుగానే రావుగారు ముష్టిదాన్ని ఈసడించుకున్నారు. కాని - ఆ తర్వాత, శంకరాచార్యులవారు తనలోను “= (ఈ వ్యాసంలో పద్మరాజు కథలు" అని ఉదహరించినవి పద్మరాజుగారి 'గాలివాన కథల
సంపుటికి సంబంధించినవని గ్రహించగలరు)
షక్రదననడడన222డ222డ 2222022 కోడూరి శ్రీరామమూత్తి ౨22 మాలవాడిలోనూ ఉన్న పరంజ్యోతి ఒక్కటే అని గ్రహించినట్టుగానే కథ చివరికి వచ్చేసరికి రావుగారు బిచ్చగత్తెను తనలోని ఒక భాగంగా - ఆమె సాన్నిధ్యం తాను ఏనాడూ మరిచిపోలేని అనుభూతిగా [గ్రహించగలిగారు కథ చివరిలో బిచ్చగత్తె చనిపోవడం రావుగారిలోని ద్వైత భావానికి చావు అని అన్వయం చెప్పుకోవచ్చు అయితే - బిచ్చగత్తె రావుగారి జేబులోంచి దొంగిలించిన పర్సును ఆయన ఆమె ప్రక్కన ఉండనిచ్చి తనకు సంబంధించిందేదో ఒక చిహ్నంగా ఆమె శరీరంతో ఉండిపోవాలనుకోవడం-” హృదయానుభూతిని రూపాయలతో కొలవడానికి రావుగారు చేసిన ఒక వ్యర్థప్రయత్సానికి ఉదాహరణ మాత్రమే ! - బిచ్చగత్తె బ్రతికివుండగా ఆమెకు పైసా దానం చెయ్యడానికి
మనసురాని రావుగారికి - చనిపోయిన తర్వాత పర్సులోని డబ్బంతా ఇవ్వాలనిపించడం బూర్జువా సంస్కృతిని మాత్రమే తెలుపుతుంది.
“గాలివానిను బ్రతుకు అవసరాస్ని తీర్చుకోడానికి ఉపయోగించుకుందామనుకున్న ముష్టీది ఆ గాలివానకే బలిఅయిపోయింది. కాని, - ఈ గాలివానను కూడా ఒక పుస్తక పరనంలాగా జ్ఞానసముపార్దనకు ఉపయోగించుకున్న రావుగారు మేధాపరమైన జీవితంలో మరోమెట్టు పైకి ఎక్కగలిగారు. బహుశా - ఆయన మరో ఉపన్యాషానికి అది ముడిపదార్ధ్థంగా ఉపయోగపడి ఉండవచ్చు 1
ఈ కథలో గాలివాన నాటి రాత్రి వెయిటింగ్ రూమ్‌లో రావుగారు ముష్టిదాన్సిత్రో అంటారు - “ఈ ఇల్లు కూలిపోదు కదా ?-” అని. దానికి సమాధానంగ్యా ముష్టిది “ఎవరు చెప్పగలరు? ఇల్లు గట్టిగానే ఉన్నట్టుంది. గాలిఐలం ఎక్కువ అర్బత్చ పది ఆగుద్ది?” అని అంటుంది. (పద్మరాజు కథలు - పేజీ74) రావుగారి మన్మసెబ ఈో రాబోయే పరిణామాలకు ఇది ఒక ప్రతీక అని చెప్పవచ్చు అంతేకాదు - అంతక్తువ్చ్యు రావుగారికి “-క్రమశిక్షణ, నియమాలు, విలువలు, అన్నీకూడా మానవాతీత్రమై క విజ్బంభించినప్పుడు అర్ధరపొతం అయిపోతాయని జీవితంలో మొదటి సారిగా అనుభవంలోకి వచ్చింది -” (పద్మరాజు కధలు - పేజీ 72) అనే (గ్రహింపుకు ఇది కొనసాగింపుగా కూడా చెప్పుకోవచ్చును.
రావుగారు నమ్ముకున్న నియమాలు, అవలంబించిన కరోర క్రమశిక్ష, ఇవవ ఆయనకు గాలివాన నాటిరాత్రి పరిస్థితుల్ని ఎదుర్కొనడానికి కావలసిన గుండెనిబ్బరాన్ని ప్రసాదించలేకపోయాయి. జీవితం గురించి స్పష్టమైన అభిప్రాయాలు కాని, నిర్దేశించుకున్న ప్రత్యేకమైన విలువలుగానీ లేని ముష్టిది జీవితం ఎలావుంటే అలా యధాస్థితిలో ఎదుర్శొనగల మనస్థయిర్యాన్ని పెంపొందించుకున్నది. గాలివాన నాటి రాత్రిలో రావుగారు
౨22 తెలుగు కథ - నాడు.నేడు ముష్టిదాని దగ్గిర నేర్చుకున్న గుణపారం అదే! - డబ్బుకోసం శరీరాన్ని అమ్ముకోడానికి వెనుకాడని ఆ ముష్టిదాని విషయంలో ఆ రాత్రి రావుగారికి ఎలాంటి భావం కలిగేదోగాని, భయంకరమైన ఆ వాతావరణంలో ముష్టిది ఇంటిదగ్గర తన పిల్లలు ఎలా వున్నారో అని తలచుకుంటే - ఆ ఆవేదనలో ఆయనకు ఆమెతో ఏదో తెలియని సాన్నిహిత్యం కనబడింది. భౌతిక శరీరాలు వేరు కావచ్చు సంస్కారాలు వేరు కావచ్చు. కాని, హృదయపు అన్ధతలు మాత్రం ఒక్కటే అనే అవగాహన కలిగింది. గుండెచుట్టూ కట్టుకున్న గోడలన్నీ మాయమైపోయాయి ఆమెతో మానసికమైన ఏకత్వాన్ని సిద్ధించుకోగలిగారు. ఆయనకు తన పిల్లలపైనా, కుటుంబంపైనా ఉన్న ఆత్మీయత అనురాగం అన్నీ ముష్టిదాని భౌతిక రూపంలో కనబడ్డాయి. రావుగౌరిలో సమతాభావపు వెలుగు తళుక్కుమన్నది.
“ఆయనలో ఉన్న మానవత్వాన్ని ఆ జీవి వికసింపజేసింది ఆయన భార్యగాని పిల్లలుగాని, ఎవరూ ఈమె వచ్చినంతగా దగ్గిరగా రాలేదు. ఆయన విలువలు, నీయమాలు, ధర్మచింతన, వేదాంతం అన్నీ త్యజిస్తాడాయన = ఈ వ్యక్తికి ప్రాణం పాయ్యగలిగితే - బుకింగ్ ఆఫీసులో దొంగతనం చెయ్యడానికి వెళ్ళి భవనం కూలిన కారణంగా (ప్రాణం పోగొట్టుకున్న ముష్టిదానిని చూస్తుండగా రావుగారిలో కదలాడిన భావాలు ఇవి. జీవిత సత్యాన్ని నేర్చిన “గురువుగారికి గురుదక్షిణ చెల్లించడం కోసం “శిష్యుడు పడుతున్న ఆరాటాన్ని ఈ భావాల్లో వ్యక్తం చేస్తున్నాడు కధకుడు.
ఈ కధలో పద్మరాజుగారు చెప్పిన 'గాలివాని మనిషి అంతరంగానికి సంబంధించిందే అయినా, - గొలివాన బాహ్యరూప వర్జనకూడా అత్యంత వాస్తవికంగా ఉంటుంది. దీనికి కారణం ఆ గాలివాన పద్మరాజుగారి జీవితానుభవం కావడమే అని అనుకుంటాను. “1948వ సంవత్సరంలో అర్ధరాత్రి సంభవించిన తుఫాన్లో నేను “గాలివాని కథలో రావు అనుభవించిన క్షోభ అంతా అనుభవించాను. మా ఇల్లు కూలిపోయింది. ఆ కూలిన ఇంటి క్రింది నా భార్య చిక్కుకుపోయి మూడుగంటలు నిస్సహాయంగా పడిఉంది ఆ రొత్రి అంతా భయానకం. భీభత్సం కాని కధలోనిరావుని మాత్రం నేను కాదు -” అని రాసుకున్నారు పద్మరాజుగారు ఈ విషయాన్ని గురించి చెబుతూ (తనను గురించి పద్మరాజు అనే వ్యాసంలో -)
“గాలివాన కథ వ్రాయడానికి సుమారు ఏడు సంవత్సరాల ముందు - 1945లో పద్మరాజుగారు వ్రాసిన మరొక మంచి కధ “పడవ (ప్రయాణంి, 'గాలివాని కధను “పదవ ప్రయాణం) కు సీక్వెల్‌గా చెప్పవచ్చును 'పడవ ప్రయాణం కధలో పద్మరాజుగారు చెప్పిన విషయాన్నే 'గాలివాన'లో మరికొంత విస్తృత పరిచారు అయితే ఈ రెండు కధల ఇతివృత్తాలు, నేపథ్యాలు మాత్రం వేరు.
కోడూరి శ్రీరామమూర్తి మెైవా
- “పడవ ప్రయాణరంి కథలోని రంగి (బ్రతుకు చాలా దయనీయమైంది. తనని రోజూ తన్నుతూ, - చివరకు ఒక రోజున తగలెయ్యటానికి కూడా సిద్ధపడిన వ్యక్తికోసం
- అతడు ఉంచుకున్న దానికి డబ్బు ఇవ్వడం కోసం, 'దొంగనెంజ'గా మారి పోలీసులచేత దెబ్బలు తినడానికి కూడా సిద్ధపడిన రంగి కధ సామాన్య సభ్య ప్రపంచంలోని వ్యక్తులకు (ప్రశ్నార్ధకంగా కనబడడంలో ఆశ్చర్యం లేదు తాను వదో మవాత్మార్యాన్ని చేస్తున్నాననుకునో, లేక గొప్ప త్యాగంగా భావించో, పద్దాలు చేసే దొంగతనాలకు రంగి సహాయపడలేదు. ఏ విధమైన స్వాద్ధమూ అందులో లేదు. తాను చేస్తున్న పనిలో ఆమెకు ఒక సంతృప్తి ఉంది. ఆత్మానందం ఉన్నది. అంతేకాదు - *వాందమందితో పోయినాసరే - ఆడు నావోడు నాకాడికి వచ్చి తీరతాడు. నేను లేకపోతే గుండె పగిలి సచ్చిపోడూ 1-” అనుకునే రంగిమాటల్లో ఆత్మస్టయిర్యమున్నది. బ్రతుకుపట్ల నమ్మకం కూడా ఉన్నది. “- ఆమె అతణ్ని ఉన్నవాణ్సి ఉన్నట్టుగా అంగీకరించింది. అది ఒక ఆదర్శమూ కాదు, భక్తీ కాదు, (ప్రేమా కాదు. ఎన్నో చిత్రమైన సంకీర్ణభావాలతో, ఈసులకో, అనురాగాలతో, ఎన్నిటితోనో కలిసిన స్రీ హృదయం... అతడు నిర్దిష్టమైనరీతిలో నడుచుకోవాలని ఆమెకు పట్టింపు లేదు. అతని సుగుజాలతో, అవగుజాలతో అమె అంగీకరించింది. నాకామె (బ్రతుకు బర్టువనిపించింది. నా బ్రతుకే బరువేమో అంతకంటే...” (పడవ ప్రయాణం” కధలో -) జీవితాన్ని యధాతధంగా చూడమంటూ “గాలివాన కథలో పద్మరాజుగారు చెప్పిన విషయం కూడా ఇదే! -_ అయితే “పడవ ప్రయాణం కథ చివర్గో మనకు కధ చెప్పే వ్యక్తి రంగివ్చి జాలి తలిచి ఒక రూపాయి ఆమె చేతిలో పెడతాడు. అది ఆమె పుచ్చుకుందో ల్రీద్చః కూ గమనించకుందానే పడవ దిగి వెళ్ళిపోతాడు. ప్రతిదాన్నీ రూపాయిలతో కాల్చి విలువకు మధ్యతరగతి మనస్తత్వానికి మరొక ఉదాహరణ ఇది. ఈ కధను రాసిన చాల్రా కా లీ పద్మరాజుగారు తాను చేసిన పొరపాటును (గ్రహించారు “- చెయ్యి తిరిగిన కధకుడు ఎన్నడూ చెయ్యని పొరపాటు చేశాను. ఆమె యెడల నా సానుభూతి - క్రధల్రః శ్వ నిజంగా నేనే అని చూపించడానికి పడవ దిగిపోయేటప్పుడు ఆమె చేతిలో ఒక్ర రూపాయి పెట్టాను. చటుక్కున కథ ఆ ఎత్తునుంచి క్రిందకు పడిపోయింది. కధకుడినన్న సంగతి మరిచిపోయి, మధ్యతరగతి మనిషిగా ఆమె మీద నా ఆధిక్యం బుజువు చేస్తుక్రోద్రానిక్తి ఇచ్చిందా రూపాయి -” (తెలుగు కథ - వికాసం” అనేవ్యాసంలో పద్మరాజు) అని చెప్పుకున్నారాయన. పద్మరాజుగారు చేసుకున్న ఈ ఆత్మవిమర్శ - రచయిత సృష్టించిన పాత్రలకు, అతని ఆర్థికవర్గానికీ, మధ్య ఉన్న సంబంధాన్ని గురించి ఆసక్తిదాయకమైన ఆలోచనను లేవదిస్తుంది.
వవ తెలుగు కథ -నాడు,నేడు 22న పద్మరాజుగారి కథల గురించి చెప్పేటప్పుడు ఆయన “వాసనలేని పువ్వులు” కథ గురించి కూడా చెప్పాలి. “కవి లోపలినుంచి పెరుగుతాడు. అతని అనుభవాలే సత్యా సత్యాలను నిరూపించాలిగానీ, బాహ్యసిద్ధాంతాలు కావు -” (పద్మరాజు కథలు, 'పేజ్డ్ -90) అనే మౌలికభావానికి చక్కని కథాత్మకరూపం ఇందులో కనబడుతుంది. ఈ కథలోని రాజారావు వాసన అనేది పువ్వుకు ఉండవలసిన ప్రాథమిక లక్షణం అని అనుకున్నాడు. అంతేకాదు - కొన్ని పువ్వులకు వాసన ఎక్కువ ఉండడం, మరికొన్ని పువ్వులకు తక్కువ ఉండడం అన్యాయం అనే “ఆధ్యాత్మిక సామ్యవాద సిద్ధాంతాన్ని కూడా తయారుచేసుకున్నాడు! - వాసన లేకపోవడంలో అసహజత్వం లేదు. వాసన ఉంటేనేమి? - లేకపోతేనేమి?
- అది ఖచ్చితంగా పువ్వే ! - కళాత్మక హృదయం వుంటేనేమి, లేకపోతేనేమి? . - హృదయం ఉండటం ముఖ్యం. జీవితం ముఖ్యం. జీవించడం ముఖ్యం. రాజారావు చదివిన పుస్తకాల్లో గాని, నమ్ముకున్న సిద్దాంతాల్లోగాని, ఈ వాస్తవం లేదు. కాని, - తీరా అవి అనుభవంలోకి వచ్చేసరికి రాజారావు భార్య అతనితో వేగలేక నూతిలోపడి చనిపోయింది. బ్రతికి ఉన్నన్నాళ్ళూ ఆమె ్రవృత్తినీ, ఆమె శల్లో పెట్టుకునే వాసనలేని పువ్వులనూ ద్వేషించిన రాజారావు ఆమె మరణించిన తర్వాత, “- ప్రాథమికమైన స్వభావం ఏదో ఆమెలో ప్రబలంగా ఆవరించి ఉంది, -” అని గ్రహించగలిగాడు. - కమల భౌతికదేహం అతని కనులు కప్పివేసింది. ఆమె అసలు తత్వాన్ని కప్పివేసింది... ఆ భౌతిక దేహం లేదుకనుక ఆమెకూ తనకూ మద్య ఏవిధమైన అంతరాయమూ లేదు. ఆత్మసంయోగం, అసలయిన అద్వైత భావం తనలో ఏర్పడడానికి ఇప్పుడే సావకాశం వర్చడింది -” (పద్మరాజు కథలు పేజీ 87లో కొన్ని భాగాలు) అందుకే ఆమె బ్రతికి ఉన్నన్నాళ్ళూ ద్వేషించిన వాసనలేని పువ్వులను ప్రేమించడం ప్రారంభించాడు. వాటిని చెక్కులమీద రాసుకున్నాడు. “'క్రమబద్ధత మీది వ్యామోహంతో ఆఖరికి భార్య శవాన్ని శృశానికి తీసుకుపోయే సమయంలో కూడా చెరిగిపోయిన తన జట్టును అద్దంలో చూచుకొని కొంచెం సరిదిద్దుకున్న రాజారావు - ఆ తర్వాత నున్నగా దువ్వుకున్న జుట్టును చెరుపుకునే స్థితికి వచ్చాడు ! - అంటే - 'క్రమబద్ధత' మాత్రమే జీవితపు ధ్యేయం కాదనీ, - క్రమబద్ధత లోపించినప్పుడు కూడా సౌందర్యపు విలువలకు ఆస్కారం ఉంటుందనే గ్రహింపు వచ్చింది. అన్నాళ్ళూ రాజారావులో ఉన్నది ప్రబలమైన 'నార్సిజమ్' మాత్రమే ! తనని తాను ఆరాధించుకున్నట్లుగానే రాజారావు తన సిద్ధాంతాలను కూడా ఆరాధించుకున్నాడు. కాని - ఆ తర్వాత, - క్రమబద్ధతకు, సిద్ధాంత దృక్షృథాలకు, అతీతమైన జీవితసత్యాన్ని 6 కశక, వం త. “రంం20000266220 (
కోడూరి శ్రరామమూర్తి మవ గుర్తించగలిగాడు. తాను వేరు, కమల వేరు, అనే ద్వైతప్రవృత్తి నుండి బయటపడి అద్వైతస్థితికి చేరువకాగలిగాడు. ఇందుకు కమల మృత్యువు ఒక ఉపకరణం అయింది. ఇక, -కొలవరాని దూరం కథలోని కథానాయిక పరిస్థితి కూడా ఇంతే ఈ కధలో ఆమె ్రేమించి పెళ్ళాడిన ఫ్లయింగ్ ఆఫీసర్ రాజా 'కొలవరాని దూరంకు వెళ్ళిపోయిన మాట నిజమే. కాని, అసలు కథ అదికాదు. రాజా మరణం కన్నా అతని శృంగార లీలల కధ ఆమెను బాగా కృంగదీసింది. అతనికీ పనిమనిషి తలుపులకూ మధ్యఉన్న సంబంధం బయటపడి శవాన్ని పోస్ట్‌మార్టమ్ చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు -*ఏ ఏర్హోస్టెస్సో, ఏ టెలిఫోన్ ఆపరేటరో అయితే అర్ధం చేసుకోవచ్చు. తలుపులా ! - అంత దిగజారిపోయాడా రాజా? - కాదు, నన్ను దిగజార్చాడు తలుపుల్లాగే నేనూ ఒక ఆడదాన్ని, డబుల్ బెడ్‌మీద నేనెంతో తలుపులూ అంతే -” అనుకుంటుంది ఆమె. కాని, - ఆ తర్వాత తలుపులు తనంతట తాను రాజా ఇచ్చిన నెక్లెస్‌ను తిరిగి ఇచ్చేస్తూ రాజా కోసం విలపించినప్పుడు - ఆమెలోని ప్రీ హృదయం ెల్లుబుకుతుంది. ఆమెను తన దగ్గిరకు తీసుకొని *- బ్రతికి ఉండగా నన్ను తలుపుల స్థాయికి దించాడు. పోయాక తలుపుల్ని నా స్థాయికి తీసుకువచ్చాడు అనుకుంటుంది (కధలో చాలా ముఖ్యమైన వాక్యం ఇది). - వ్యక్తుల అంతరంగాల మధ్య ఏర్పడే “కొలవరాని దూరం అసలు దూరం కానేకాదని పరోక్షంగా తెలియచెప్పే కథ ఇది. అయితే ఈ గ్రహింప వచ్చిన తర్వాత కూడా ఆమె తలుపులు తన స్థాయికి ఎదిగిందనుకోవడ్లం బూరువ సంస్కృతికి తార్మాణం!- ల ఇలా చెప్పాలంటే, జు పద్మరాజు కధల్లో ప్రతిపాదించబడిన “అద్వైత దృక్చథ సంబంధించి ఎన్ని ఉదాహరణలయినా ఇవ్వవచ్చు. ఈ దృక్పధానికి సంబంధిం చర్చ ఎలా ఉన్నా ఆయన కధల్లో కనబదే మానవతా ధోరణిని మాత్రం మృనంన్ల ట్రే మరచిపోలేం. మాట వరసకు ఆయన రాసిన “వెండిసీసా” “హైడ్్హూన్హర్చు- వో కధలను తీసుకోండి. బి “వెండిసీసా” పేరు చెప్పేసరికి ఆ కధ చదివినవాళ్ళకు గోవిందన్ క్షుట్ట _ _ న ఉ" పెంటి
- ్రాహ్మణసోడా - ఇవన్నీ జ్ఞాపకానికి వస్తాయి. మూర్తీభవించిన మానవత్వానికి గోవిందన్ కుట్టి ఓ ఉదాహరణ. రోడ్డుమీద ఎవరో కనిపారేసిన బిడ్డను ఇంటికి తెచ్చుకున్నాడు కన్నయ్యనాయుడుమాయమాటలు నమ్మి మోసపోయిన “పైంట్రిన్సి వివాహమాడి సంఘంలో ఆమెకు ఒక స్టానాన్ని కల్పించాడు. కన్నయ్య నాయుడు బిడ్డకు తండ్రి అయ్యాడు. అంతేకాదు - చదువుకుందామని ఆశపడ్డ బీదకుర్రాడు “బూతప్పకు సాయం చెయ్యడం కోసం ఇరవయ్యేళ్ళ థఛమను పణంగా పెట్టుకున్నాడు. ఇన్ని
మవ తెలుగు కథ - నాడు,నేడు మంచిపనులు చేసిన, - గోవిందన్ కుట్టిని సంఘం మెచ్చుకొని సత్కారాలు చెయ్యలేదు పైగా - 'మళయాళీవోడివి అంటూ కక్ష కార్చజ్యాలతో అతని దుకాణాన్ని కొల్లగొట్టారు అతని హోటల్‌ను బూడిదపాలు చేశారు జీవితం ఇలా ఎన్ని ఎదురుదెబ్బలు కొట్టినా అతను కృంగిపోలేదు. బ్రతుకుమీద ఆశ చంపుకోలేదు “_ యాడో ఓ చోట బ్రతక్కపోం - భారతదేశం చాలా పెద్దది” - అంటాడతను పెంటితో - నాశనం అయిపోతున్న కొట్టును చూస్తూ. జీవితం పట్ల అలవరచుకోనలసిన వైఖరికి ఓ ఉదాహరణ గోవిందన్ కుట్టి కథ ఇక - “హెడ్ మాస్టారూ” కధ మనల్ని లోతయిన ఆలోచనలోనికి తీసుకు వెళ్ళకపోయినా - మానవత్వపు విలువల్ని గ్రహించగలిగినప్పుడు ఒక నిండుబ్రతుకును ఎలా ఉద్ధరించగలమో గుర్తుంచుకోదగ్గ రీతిలో చెబుతుంది ఈ కథలో పద్మరాజుగారు వర్ణించిన గోదావరితీరం చిన్నతనంలో ఆయనకు సుపరిచితమైనదే. రచయితకు, అతని బాల్యానికీ, మధ్యన ఉన్న అవినాభావ సంబంధం గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతాల్ని పద్మరాజుగారి “హెడ్ మాస్టారు” “మా యాజులు” వంటి కధలు వాస్తవం చేస్తాయను కుంటాను. పద్మరాజుగారు కేవలం కధలు మాత్రమే వ్రాయలేదు కవిత్వం, నవల, నాటిక్కలను మొదలుకొని డిటెక్టివ్ సాహిత్యంవరకూ దాదాపు అన్ని ప్రభ్రియలతోనూ ఆయనకు సంబంధంఉంది అంతేకాదు - వీటన్నింటిలోనూ - “పద్మరాజు టచ్” కనబడుతుంది “-వచన సాహిత్వ ప్రక్రియలన్నింటిలోకి కధారచన చాలా కష్టమైంది. ఈ ప్రక్రియ నవలకన్న కవిత్వానికి సన్నిహొతమైంది... ప్రతి నవలా రచయితా ముందు కవిత్వం రాయాలనుకుని, అది రాయలేనని తెలిసిన తర్వాత కధను ప్రారంభిస్తాడు అందులో కూడా పరాజయం పొందిన తర్వాత నవలలు రాయడం మొదలుపెడతాడు +” అంటూ “ట్రూమన్ కాప్టె చెప్పిన మాటలు విలియమ్ ఫాన్సార్ - వంటి రచయితల విషయంలో వాస్తవం కావచ్చునేమో గాని, - పద్మరాజుగారి విషయంలో వాస్తవం కాదు తాను చేపట్టిన ప్రతి 'ప్రక్రియలోనూ ఆయన "సెహభాష్ అనిపించుకున్నాడు. అయితే - తెలుగు పాఠకులకు మాత్రం పద్మరాజుగారి పేరు చెబితే *కధి మాత్రమే జ్ఞాపకానికి వస్తుంది తెలుగు కధకు ఆయన తెచ్చిపెట్టిన అంతర్జాతీయ ఖ్యాతి అందుకు కారణం అనుకుంటాను. పద్మరాజుగారు ఇచ్చిన ఈ స్ఫూర్తి తెలుగు సాహిత్యాన్ని = అందునా తెలుగు కధను మరింత ముందుకు తీసుకు వెళ్ళగలదని ఆశిద్దాం. (1985 సం॥ ఆగస్టు “భారతిలో ఈ వ్యాసం ప్రచురితం)
కోడూరి శ్రీరామమూర్తి ౨౩౭౩వ తెలుగు కథల్లో రసెల్ దృక్పథం ఇరవయ్యో శతాబ్దంలో బ్రిటిష్ తత్వవేత్త బెర్ట్రాండ్ రసెల్ వలె లీవ్రమైన దూషణ, భూషణలకు గురి అయిన తత్వవేత్త మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. వోల్తీర్, జాన్స్టూవార్ట్ మిల్ ల తర్వాత - వ్యక్తికీ, అతడి వ్యక్తిత్వానికీ రసెల్ వలె నివాళి పట్టినవారు లేరు నీతుల పేరిట సంఘం బిగించిన అవాంఛనీయమైన “చట్రం? నుంచి వ్యక్తిని కాపాడి అతడిని స్వేచ్చాసా'మ్రాజ్యనికి చక్రవర్తిని చెయ్యాలనీ, మానవతా విలువలతో మానవాళి గుబాళించాలనీ - రసెల్ కన్నకలలు, అందుకు అతడు చేసిన నిర్విరామమైన కృషీ సామాన్యమైనవికావు “మేరేజ్ అండ్ మోరల్స్' (1929), రెలిజియన్ అండ్ సైన్స్ (1985), హ్యూమన్ సాసైటీ ఇన్ ఎధిక్స్ అండ్ పోలిటిక్స (1964) మొదలయిన అసంఖ్యాకమయిన రచనల ద్వారా - 1970 ఫిబ్రవరి 2వ తారీఖున 98 ఏళ్ళ - వయస్సులో కన్నుమూసేంతవరకూ రసెల్ నిరంతరమూ అన్నితరహాల ఆ్ర చివేత ధోరణులతోనూ పోరాడుతూనే వచ్చాడు. =7106 3021 ౧౦1 1004 & ౧౪౫14466 10 60 అశ అనే బవైవిల్ ్వా చిన్నప్పుడు నాయనమ్మ దగ్గర తెలుసుకుని దానిని జీవింతము పాటించిన న క్రైస్తవుడు రసెల్, “నీతి అనేది రెండువిధాల శక్తివంతం అవుతుంది. ఒకటి అధిక్షార్రుల్పు పారుగువాళ్లు చేసే ప్రశంసలేక నిందవల్ల - రెందోది స్వంతదయిన నింద, మెప్పువల్లి అంటే 'కాంషన్వల్ల. దీనినే 'సబ్జెక్టివ్ రైట్నెస్, 'అబ్జెక్టివ్ రైట్నెస్' అని రెండు విధాల విభజించవచ్చు. చర్చి, సంఘం, చట్టం అంగీకరించినవి ప్రచారం చెయ్యడం “ఆబ్జెక్టివ్ రైట్నెస్' అయితే, వ్యక్తి అంతరాత్మకు, ఇచ్చకు లోబడి ప్రవర్తించడం “సబ్జెక్టివ్ రైట్నెస్' అవుతుంది - అంటూ ఈ తరవో 'సబ్జెక్టివ్ రైట్నెస్'ను ప్రతిపాదించిన రసెల్ ఒకప్పుడు మతాధికారుల చేత ప్రపంచంలో కల్లా 'అత్యంత అవినీతిపరుడు'గా చిత్రించబడ్డాడు. రసెల్ రచనలు చదవడం ఒక గొప్ప అనుభవం. ఈ అనుభవాన్ని సృజనాత్మక రచయిత పొందినప్పుడు సహజంగానే దాని ప్రభావం అతని రచనలమీద ఉంటుంది
2వ తెలుగు కథ - నాడు,నేడు నిజానికి సాహిత్యంపై తత్వశాస్త్రవేత్తల సిద్ధాంతాల ప్రభావం క్రొత్తవిషయమేమీ కాదు అస్తిత్వవాద తత్వవేత్త కీర్ళగార్డ్, సామ్యవాద తత్వవేత్త మార్క్స్, మొదలగువారి సిద్ధాంతాలు మొదలుకొని - అరబిందు, జాన్డ్యూయిీ, జిడ్డు కృష్ణమూర్తివంటి తత్వవేత్తల సిద్ధాంతాల వరకూ - ఈ తరహా ప్రభావం వివిధ భాషాసాహిత్యాలమీద ఉన్నట్టే తెలుగుసాహిత్యంపైనా అందునా కథాసాహిత్యంపైన కూడా కొద్దో, గొప్పో ఉన్నది.
ఇతర తరవి ప్రభావాలతో పోల్చిచూచినప్పుడు తెలుగుకధాసాహిత్యంపై బెర్ట్రాండ్ రసెల్ సిద్ధాంతాల ప్రభావం చాలా తక్కువ అని చెప్పాలి తమ కధలకు రసెల్ సిద్దాంతాలు (ప్రేరణ కల్పించాయని చెప్పుకున్న రచయితలు - బుచ్చిబాబు తప్ప మరొకరు కనబడరు. అయితే - బుచ్చిబాబుకు ముందు, ఆ తర్వాత కూడా కొందరు తెలుగు కధకుల రచనల్లో ద్యోతకమయిన వ్యక్తివాద ధోరణులను నిశితంగా పరిశీలించినప్పుడు - వాటిల్లోని రసెల్ దృక్పధం పలు సందర్భాలలో దర్శనమిస్తుంది ఈ రచయితలలో చాలామంది రసెల్ రచనలను చదవకపోయి కూడా ఉండవచ్చును. చదివినా ఆ సిద్ధాంతాలకు సృజనాత్మక రూపకల్పన చెయ్యాలనే ఉద్దేశం వారికి లేకపోవచ్చును.
నిజానికి - సృజనాత్మక సాహిత్యానికి మానవజీవితం పునాది. సిద్ధాంతాలతో దానికి సంబంధం లేకపోవచ్చును రచయిత సృష్టించే పాత్రలు నిజజీవితంలోనుంచి వస్తాయి. - 'నా రచనాజీవితంలో నేను ఏదో ఒక భావాన్ని కాక - పాత్రలనే ముందుగా తీసుకోవడం జరుగుతుంది అని మహారచయిత కుగ్గెనోవ్ (1869 ఫిబ్రవరిలో రాసిన ఒక లేఖలో) అనడంలోని ఆంతర్యం ఇదే. సిద్దాంతాలను రచనలో ప్రచారం చెయ్యడానికి కలం పట్టిన రచయిత పాత్రల నోళ్ళు నొక్కి వాటిని తోలుబొమ్మల్లా ఆడిస్తాడు. ఫలితంగా రచన అభాసు పాలవుతుంది '- చవకబారు నవలా రచయిత తన పాత్రల్ని అదుపులో ఉంచుతాడు. నిజమైన నవలాకారుడు పాత్రలు చెప్పేవాటిని వింటాడు వాటి ప్రవర్తనను గమనిస్తాడు" - అంటూ సాహిత్య విమర్శకుడు “ఏండిగైడ్' వెలిబుచ్చిన భావాలు నవల విషయంలోనే గాక - ఇతర తరహా సృజనాత్మక సాహిత్యాల విషయంలో కూడా వర్తిస్తాయి.
ఈ పరిమితులనన్నింటినీ దృష్టిలో ఉంచుకుని - తెలుగు (కథా) సాహిత్యంలోగల రసెల్ దృక్పధాన్ని పరిశీలించేటప్పుడు సహజంగానే చలంగారి పేరు ముందుగా జ్ఞాపకానికి వస్తుంది. రసెల్ రచనల ప్రభావం తనమీద ఉందని చలంగారు చెప్పుకోలేదు. ఇంకా చెప్పాలంటే - రసెల్ రచించిన “మేరేజ్ అండ్ మోరల్స్” వెలువడడానికి ముందే చలంగారి అత్యంత వివాదాస్పదమయిన “శశిరేఖ నవల వెలువడింది. అయితే - భావాలలోని సారూప్యం గురించి మాత్రమే ఇక్కడ చెప్పదలుచుకున్నది
వచష్రకనననననననడనవనననననడడ2డనడవ2వవ22 కోడూరి శ్రీరామమూర్తి వా “- నీతి అనేది చాలా గొప్పవిషయమూ, అవసరమైన విషయమూ కావచ్చు కాని, - నీతి గట్టిగా మనసుకు పట్టిన మనుషులు అందానికి అంధులవుతారనడంలోనే ఉంది నీతిలోని నీచత్వం ఎందుకంటే - దేవుడే ఉంటే అతను నీతికన్నా అందానికి చాలా దగ్గర. సృష్టి అంతా అందం. ఒక్క కుచ్చితపు మానవుడిలోనే ఈ నీతి” (జీవితాదర్శం, నవలలో లాలస - పేజీ 119) అనే చలంగారి పాత్రలు వ్యవస్థతో, సంప్రదాయ నీతులతో పోట్లాడి, తమ '“యిచ' ఎలా చెబితే అలాచేశాయి. పలు సందర్భాలలో దీని ఫలితంగా బాధల్ని కూడా కోరి వరించాయి. *- ఇతడునా భర్త. ఈమె నా భార్య, ఎవరికి దకృనీక నాదాన్ని చేసుకోవాలి యావజ్జీవితమూ అనుభవించాలి. అదేగా పెళ్లి - అంటూ వివాహవ్యవస్థను దుయ్యబట్టిన చలం అందుకు కారణాలనూ చెబుతూ “-పెళ్ళి అనేదానితో నాకు ఎందుకు విరోధం?- పెళ్లి వ్యభిచారం క్రింద మారింది కనుక - (డ్రేమలేఖలు' రెండవ భాగం) అని అంటాడు. “-నేను వాంఛించే మార్పు ఈ వివాహంలో ఉన్న అక్రమాలు, అన్యాయాలు, తొలగిపోవాలని. వివాహం వద్దన్నవాళ్లకు బలవంతంగా కట్టబెట్టకూడదనీ, వివాహం అయినంతమాత్రాన సర్వమూ నీతిగా తలచడమూ, కానంత మాత్రాన అవినీతిగా తలవడమూ మూర్థమనినావాదన- (మ్యూజింగ్స్) అని కూడా అంటాడు. ఇలా చూచినప్పుడు, - వివాహవ్యవస్ల గురించి విడాకుల గురించీ, ఆచారంలో ఉన్నపస్టీ పురుష సంబంధాలకు చెందిన నీళు గురి | చెప్పేటప్పుడు రసెల్ దృక్పధానికి చలం సన్నిహితంగా కనబడతాడు ంచి, “పెళ్లి అనేది స్తీకి ఒక జీవనాధారమైన విషయంగా పరిణమించింది ఇష్టంతే పెళ్లి చేసుకునే సంసార శ్రీకి, ఇష్టంలేని వ్యక్తితో రమించే వ్యభిచారిజక్ష శ్రపాని లేదు. వ్యభిచారంలోకన్నా వివాహవ్యవస్థలోనే స్త్రీ ఇష్టంలేని సెక్సుక్సు ఎక్తు న్ భరిస్తోంది- అంటాడు బెర్ట్రాండ్ రసెల్ తన అత్యంత వివాదస్పదమైన ర్వ హూ అండ్ మోరల్స్”లో అంతేకాదు - “అవివాహితులయిన ఇద్దరు వ్యక్తులు వాళిదరో ఒకళ్లంటే ఒకరికి ఇష్టం ఉన్నప్పటికీ జీవితాంతం కలిసి ఉండడానికి ఇష్టపడక్తి లైంగికసంబంధం పెట్టుకొనడం మహాపాపం అని చెబుతారు మతాధికారులు, అయితే
- భర్త క్రౌర్యం వలన తరుచూ కాన్సులువచ్చి భార్య చనిపోతే దానిని ఎవరూ తప్పు అనరు - అని కూడా అంటాడు. “4/81 8610/67* అనే రచనలో, ఇవన్నీ చలంగారి పారకులకు సుపరిచితమైన భావాలే! “నీర్రి పేరిట సంఘంలో ఆచారంలో ఉన్న భావాలకు చలం చేసిన తిరుగుబాటు “నాయుడు పిల్ల” “భార్య” “సుశీల మొదలయిన కథల్లో కూడా కనబడుతుంది. పెళ్ళి అంటే మొగుడు పెట్టే తిండితింటూ, ఇచ్చే నగలని అనుభవిస్తూ, అతడి శారీరిక వాంఛల్ని
2 తెలుగు కథ -నాడు,నేడు ఇష్టం ఉన్నా లేకపోయినా తీర్చడమూ అనే సాంఘిక మౌధ్యాన్ని ఈ కధల్లో నిశితంగా విమర్శిస్తాడు. - “అందముంటే మొగవాడిని భరించేందుకు, బలముంటే మొగవాడికి చాకిరీ చేసేందుకు, చదువుంటే మొగవాడికి పద్దులు రాసేందుకు, సంగీతమొస్తే మొగ వాడిని సంతోష పెట్టేందుకు, - ఇంత అన్యాయాన్ని లోకమెట్లా భరిస్తుందో -” (భార్య కధలో, 'యవనవ్వనం”* కధల సంపుటి, పేజీ 209) అని ఆవేదన చెందిన “భార్య కథలోని రుక్సిణి, నాయుదుపిల్ల కధలోని నాయుడుపిల్ల, - పెళ్ళి, మొగుడు, కాపురంవద్దని నెత్తీ నోరూబాదుకున్నా మొగుడి దగ్గరకు పంపేంతవరకూ ఊరుకోలేదు సంఘం. మొగుడితో కాపురం చెయ్యడానికి ఇష్టపడని రుక్మిణి అక్కడినుంచి పారిపోయి సొనివృత్తి చేసుకుని బ్రతుకుతున్న మణి ఆశ్రయంలో జీవితాన్ని వెళ్ళబుచ్చుదామనుకుంటేసంఘం దానికీ ఒప్పుకోలేదు చివరకు ఆమెకు ఆత్మహత్యే శరణ్యం అయింది. వివాహ వ్యవస్థలోని ఇష్టంలేని సెక్సు వ్యభిచారవృత్తిలోని “సెక్సు” కన్నా హేయమైనదనే రసెల్ భావానికి ఈ కథ అద్దం పడుతుంది.
“పుండుపడ్డ ఎద్దులను బళ్ళకు కట్టిలాగితే పోలీసులు పట్టుకుంటారు. కాని, భార్యభర్త వద్ద ఇట్లా నరకబాధ పడకపోతే కాళ్లూ చేతులూకట్టి భర్తముందు “-నీ యిష్టం వచ్చినట్లు చేసుకో” అని పారేస్తారు. ఈ నాగరికతగల దేశంలో (భార్య' కథలో - పే. 218) అనే చలం భావాలు చదువుతూంటే రసెల్ వాణి వినబడుతుంది. “'మాపమూ, పాతివ్రత్యమూ, నీతి వదిలేసిన నాముందు నోటికి వచ్చినట్టల్లా మాట్లాడడానికి జంకెవరికి? వడ్డీలకిచ్చి కొంపలు కూల్చి పెద్దలు, లంచాలు పుచ్చుకునే పోలీసులు కోడళ్ళను ఆత్మహత్య చేసుకునేటట్లు చేసిన ముత్తయిదువులూ - అందరూ నా మోహాన తిట్టేవారే అనే రుక్సిణి స్వగతం రసెల్ భావాలకు ప్రతిధ్వనిలా అనిపించదూ? - 'మనకు రెండురకాల నీతులు ఒకదాని ప్రక్క ఒకటి ఉన్నాయి. ఒకటి - మనం ఇతరులకు చెప్పి మనం ఆచరించని నీతి - రెందోది మనం ఆచరించి ఇతరులకు చెప్పనిది - (30901101 6982)/3) లో అంటూ రసెల్ 'నీతివంతు'లయిన పెద్దలను విమర్శించిన విధంగానే - చలం కూడా తన కధల్లో ఈ తరవాో 'పెద్దమనుషు”లు వేళాకోళం చేస్తాడు.
నీతి గురించిన చర్చ ఎలా ఉన్నప్పటికీ చలం రాసిన ప్రతికథకు కేంద్రబిందువు మానవత్వపు విలువలకు సంబంధించే ఉంటుంది. సంఘం నిర్దేశించేనీతికి, వ్యక్తి మనసుచేసే అలజడికి, మధ్యకర్తవ్యం ఏదనే ప్రశ్న వచ్చినప్పుడు చలం మానవత్వపు విలువల్ని కొలబద్దగా తీసుకుంటాడు. “సుశీల కథలోని సుశీల చివరకు సులేమాన్ కాదని నారాయణప్పగారి సేవలో 'సేనిటోరియమ్'లో ఉండిపోడానికి - 'హంపీ కన్యలు కథలోని కథానాయకుడు నని కోరుకునే హంపీకన్యతో శారీరక పొందును పొందడానికి
వకతనన222222డడడడద22222ఊడ222222222 కోడూరి శ్రీరామమూర్తి మ2= తటపటాయించడానికి కారణం బూటకపు నైతిక విలువలు కావు. మనసు నిర్దేశించిన మానవతావిలువలు మాత్రమే ! ఈ సందర్భంలోనే చలం రాసిన గొప్పకధ 'ఆమెత్యాగం' కూడా గుర్తుకువస్తుంది. “ఆమె” సీతారామయ్యను జీవితాంతం విడవకుండా ఉండడానికీ
- చివరకు డాక్టర్ కోరికను తీర్చడానికి సిద్ధపడడానికి కూడా కారణం మానవత్వపు విలువలకు సంబంధించిందే. “ఆమె” పొందుగోరివచ్చిన డాక్టర్ తనలోని తేలికభావానికి తానే సిగ్గుపడి చేత్తో ఆమె చెంపల్ని తాకి -- ఈ జన్మలో నేను పంపగల బిల్లుల మొత్తం అంతా తీరింది అనటం ఆ కథ చదివిన పారకులకు గుర్తుండే ఉంటుందని అను కుంటాను. మానవత్వపు మహోన్నత విలువలముందు తుచ్చమయిన శారీరక వాంఛ సిగ్గుతో తలవాల్బవలసిందే అని చెబుతున్నారు చలం ఈ కథలో. చలంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే - ఏదో ఒక భావాన్ని పారకుల నెత్తిమీద రుద్దుదామని ఆయన తాపత్రయపడడు. తన పాత్రల్ని కొంతమంది రచయితల్లా తన సిద్ధాంతాలకు కీలుబొమ్మల్లా తయారుచెయ్యడు. “-రాస్తున్నాననే 00౧501045- ౧65 ఉండదు. కథను ఇట్లా నడిపిద్దామని అనుకోను...పాత్రని కాగితం మీద పెట్టగానే వాళ్ళే నడిపించుకుంటారు కథని - అందుకునే నా 7060౧099 కి విరుద్ధంగా ఉంటాయి నేను రాసినవి చాలాసార్లు అని చలం రాసుకున్నదాంట్లో అతిశయోక్తి ఏదీలేదు. 2/౧6 8001 అనే సాహిత్యవిమర్శకుడు సృజనాత్మక సాహిత్యాన్ని గురించి చెబుతూ “-ఒక్ష రచయిత రచనను చేసేటప్పుడు ఏదో ఒక భావాన్ని సార్వత్రిక రీతిలో మానవులకు సంబంధించిన విషయాలను కాకుండా తనను తాను అన్వేషించుకుంటాడు _ అని అన్నమాటలు ఇతర రచయితల విషయంలోకన్నా చలం విషయంలో ఎక్కువగా వర్తిస్తాయి. ఈ కారణం చేతనే - కొన్ని సందర్భాలలో రసెల్ దృక్చథాన్నిక్త చల రచనలు విరుద్ధంగా ఉన్నట్లు కనబడినా - చలాన్ని రసెల్‌ను దగ్గరచేసే మానవత్ర్వలి విషయంలోమాత్రం ఎప్పుడూ వైరుధ్యం కనబడదు. 0
- తెలుగు సాపాత్యంపై చలం భావాల ప్రభంజనం విస్తృతంగా పడుతున్న రోజు లలో ఆ ప్రభావాన్ని ముందుగా అందుకున్న రెండోతరపు గొప్ప కధకుల్లో కుటుంబ రావుగారు ఒకరు. కుటుంబరావుగారిపై మార్క్స్ 'కేపిటలో (ప్రభావం పడకముందు ఆయన కలం నుండి వెలువడిన మంచి కధలలో చలం దృక్పధం పలుసందర్భాలలో కనబడుతుంది. “అమలులో ఉన్న నీతికిగాని, న్యాయానికిగాని, ప్రచారం ఇవ్వడమే సాహిత్యం పని అయితే- సారస్వతం నీతిశాస్త్రంగానూ, న్యాయశాస్తంగానూ, మారిపోయి నిజమైన సాహిత్య లక్షణాన్ని పోగొట్టుకుంటుంది- (సాహిత్య ప్రయోజనం, - భారతి
- అంటూ తన రచనల్లో మానవత్వపు విలువల్ని ప్రచారం చేసిన కుటుంబరావుగారు కొన్నికథల్లో రసెల్ ఆలోచనలకు సన్నిహితంగా కనబడతారు.
మమ తెలుగు కథ - నాడు,నేడు
కుటుంబరావుగారి “చెడిపోయిన మనిషి కధలోని పార్వతీశం ఉద్యోగం ఊడగొట్టుకుని, ఉద్యోగం చేస్తున్న కూతురు 'వర్ధని' సంపాదనమీద బ్రతుకుతున్న ఒక బడుగుజీవి కూతురు పెళ్ళిచేసే ఆర్ధికస్తోమత లేని పార్వతీశం - ఆమె ఒక ఓవర్సీర్తో అక్రమసంబంధం పెట్టుకుందని విని మండిపడతాడు. 'పడుపుకూడు తినను” అంటూ జేబుల్లో డబ్బులు లేకుండా రైలు ఎక్కి తిండిలేని కారణంగా శోష వచ్చి పడిపోతే స్నేహలతారావు అనే లేడి డాక్టర్ ఆదుకుంటుంది. తన ఇంటికి తీసుకెళ్ళి బ్రతకడానికి ఒక ఆధారం కూడా చూపిస్తుంది. తీరా కొన్నాళ్లు పోయిన తర్వాత -ఆమె నైతిక ప్రవర్తన కూడా మంచిదికాదనీ -ప్రభాకరం అనే ఆసామితో ఆమెకు అక్రమసంబంధం ఉందనీ తెలియవస్తుంది. ఇక్కడ కూడా తాను తింటున్నది 'పడుపుకూడే' అని తెలిసి బాధపడిన పార్వతీశంతో లేడీడాక్టర్ స్నేహలతారావు ఇలా అంటుంది - ఆ 'ఆడది పెళ్ళిచేసుకుని గృహిణిగాను, పిల్లల తల్లిగాను, బతకడం తప్ప మరోమాదిరి జీవితంగా ఊహించలేకుందా ఉన్నారు ఒకప్పుడెప్పుడో ప్రిమిటివ్ కమ్యూనిటీలో అందరికీ ఒకే నియమాలుండేవట - ఈనాడు మనం ఇంకా అదే మనస్తత్వంతో జీవించడం వాస్యాస్పదమైన విషయం మనిషి నుంచి మనిషి సాధ్యమైనంత తక్కువ అపకారం జరిగేటట్టు చూచుకొనడమే సరి అయిన ప్రవర్తన. మిగిలిన బూటకపు నీతినియమాలను నమ్మకండి-' (పెళ్ళి చెయ్యకుండా చూడు" కధల సంపుటి, పేజీ. 68).
- ఈ హితబోధ విని, కూతురు దగ్గరకు తిరిగి వెళ్ళిపోతాడు పార్వతీశం “-పార్వ తీశం తిరుగు ప్రయాణం అయినప్పుడు గొంతులో గరళం ఉన్న లక్షణాలేవీ లేవు-అంటూ కథను ముగిస్తాడు రచయిత. మనుషులను నీతివంతులు, అవినీతిపరులు అని విభజించ వలసి వస్తే అందుకు కొలబద్ద మానవత్వమే కావాలని కుటుంబరావుగారు ఈ కధలో ఇచ్చిన సందేశం రసెల్ దృక్చధానికి సన్నిహితమైందని వేరుగా చెప్పనవసరం లేదు.
తిలక్ రాసిన 'దేముణ్ణి చూసినవాడు” కధలోని గవరయ్య - భక్తుల దృష్టిలో నాస్తికుడు. దేవుడన్నా గుళ్ళో ఉన్న అతగాడి ప్రతినిధులన్నా బొత్తిగా భయం, భక్తీ లేనివాడు. కట్టుగుడ్డల్లో అ ఊరు వచ్చిన గవరయ్య అందరూ నోళ్లు నొక్కుకుంటున్నా లక్ష్యపెట్టక చర్శవ్యాపారం చేసి లక్షలుగడించాడు. అతగాడు ధనవంతుడయ్యాక ఊళ్లోని పెద్దలు “దైవభక్తితో అతడి పాపాలను ప్రక్షాళన చేద్దామనుకుంటే- మొదటిలో కాస్తమెత్తబడ్డాడు గానీ, ఆ తర్వాత ఘోరమయిన 'పాపం' చేసి కూర్చున్నాడు. అంతటితో ఊరుకున్నాడా - “నాకు దేముడు కనిపించాడు. నేను దేవుణ్ణి చూశాను అని కూడా అన్నాడు. పతితురాలయిన తన భార్యను ఆదుకొనడంలో దేముణ్జి చూశాడు. టైలర్‌తో లేచిపోయి, అన్నివిధాల పతనం చెంది, గర్భవతియె దిక్కులేనిస్థితిలో పురుడుపోసుకోడానికి
కోడూరి శ్రీరామమూర్తి ఉ£€2 ఆమె తన ఇంటికి వస్తే మానవతా దృక్పధంతో గవరయ్య ఆదుకొన్నాడు. పశులపాకలో బిడ్డనుకని, ఆమె మరణిస్తే - ఆ పుట్టిన బిడ్డను పెంచుకోడానికి కూడా గవరయ్య వెనుకాడలేదు. “పాపాత్శుడంటూ ఊరంతా వెలివేసినా అణువంతకూడా చలించని చిత్తస్థయిర్యం గవరయ్యది. 'పాపం చేసిన ఫరవాలేదు. మానవత్వాన్ని కాపాడుకోగలిగితే చాలూ అనే రసెల్ సూక్తిని జ్ఞప్తికి తెస్తుంది ఈ కథ,
“- నేను ఎందుకు క్రైస్తవుణ్ని కాను?” అనే పేరుతో ఒక (గ్రంధాన్ని ప్రచురించిన రసెల్ - ఒకానొక ఇంటర్వ్యులో “మనుషులకు కావలసింది (ప్రేమ, క్రైస్తవ (పేమ అని అన్నప్పుడు చాలామంది గందరగోళంలో పడిపోయారు. ఈ నాస్తికుని కైస్తవ దృక్పథం అర్థం చేసుకోలేక ! కాని, - రసెల్ కోరే “'కైస్రవ (పేమి చర్చి ప్రచారంచేసే మూఢ విశ్వాసాలకు సంబంధించింది కాదనీ, మానవతా విలువలకు మూలమైనదనీ, రసెల్ రచనలను నిశితంగా పరిశీలించనవారికి సులువుగానే అర్ధం అవుతుంది. రసెల్ ఆశించిన కైస్తవ ప్రేమకు జన్మలో గుడికి వెళ్ళని గవరయ్య అనబడే నాస్తికుడు పొందిన “దైవదర్శః నానికి - పెద్ద తేడా ఏమి లేదు ! -
- గోపీచంద్ రచించిన 'కూపస్థ మాండూక్యం' కధలోని రిక్షాలాగే పాపారావు
కూడా ఇట్లాంటి “దైవత్వాన్ని: గుండెల్లో నింపుకున్నవాడే. ఈ కధలోని వంటమనిషి కాంతమ్మ కట్టుకున్నవాణ్డి వదిలి మనసుకు నచ్చినవాడితో లేచిపోత్సుంది. ఆ తరాఇత - చాలామందికి వొళ్ళమ్ముకుని పతితురాలయింది. కాని, - ఆమెకూ ఓ మనస్సు వై ఆ మనసులో ఆత ఉంది. ఈ విషయాన్ని గుర్తించగలిగింది పాపారావ్స 2 క డే నలుగురినల్లా అమె గర్భవతి అయితే - ఆమెతో ఏవిధమైన శారీరక సర్ప. లేని పాపారావు మాత్రమే ఆమెకు అండగా నిలబడేందుకు ప్రయత్నించాడు. బొ ఈ (ప్రయత్నంలోనే ప్రమాదానికి గురి అయి, ఆస్ప[్రిపాలయ్యాడు. ఆస్పత్రిని తిరిగివచ్చేటప్పటికి కాంతమ్మ మృత్యువు ఒడిలో ఒరిగిపోతే - ఆమె శవానిక్రి సక్రమ రడి దహనసంస్కారం అయ్యే ఏర్పాటుచేసిందీ, ఆమెకు పుట్టిన బిడ్డను పెంచుకున్నదీకూడా పొపారావే ! నలుగురూ అనుకునే 'కూపస్థ మండూకం” లాంటి నీత్తిక్షీ వ్ర్యర్రొ విలువలకూ, మధ్యగల తేడాను గుండెలకు హత్తుకునేలా చెబుతుంది త్క కధ.
- తెలుగుకధా సాహిత్యంలో రసెల్ దృక్పధాన్ని గురించి చెప్పేటప్పుడు బుచ్చిబాబు రచించిన 'రసెల్‌కు అంకితమైన రెండు కథలు” గురించి చెప్పకపోతే ఆ పరిశీలన అసమగ్రం అవుతుంది. బెర్ట్రాండ్ రసెల్ 1౫141 881567" అనే రచనలో తన ఆలోచనలను విశ్లేషిస్తూ ఇచ్చిన రెండు ఉదాహరణలను ఆధారంగా చేసుకుని బుచ్చిబాబు 'మరమేకులు - చీరమడతలు), 'కొత్తవంతెన - పాతనీరు), అనే రెండు కథలు రాశాడు.
ఆ తర్వాత -ఈ రెండు కథలూ 'రసెల్‌కు అంకితమైన రెండుకథలు' అనే పేరుతో చిన్నపుస్తకంగా ప్రచురించబడ్డాయి. రచయిత ఈ కధల్ని ఆ మహానీయుడికి అంకితం ఇచ్చాడని వేరే చెప్పనవసరం లేదు. ఒక పాశ్చాత్య తత్వవేత్త సిద్ధాంతాల (ప్రేరణలో ఈ విధంగాకధలు రాయడం ఆనాటికి తెలుగులో ఒక క్రొత్త ప్రయోగం.
తన కధల వెనుకగల కధగురించి చెబుతూ ఆ సంపుటిలో బుచ్చిబాబు ఇలా అంటాడు-
“*_నేట్రి సమాజంలో పాతుకుపోయిన ఒకటి రెండు విషయాల గురించి కొన్ని సంవత్సరాలుగా ఆలోచిస్తూ వచ్చాను. ఒకటి - అవినీతి అంటే వ్యభిచారం అన్నభ్రావం. వ్యభిచారం అవినీతి కాదనను నేను. ఎటొచ్చీ అదొక్కటే అవినీతి కాదు. సామాన్యజనం అనుకునేటంత చెడుగూ కాదు. . శీలం లేకపోవడం అంటే వివాహితుడు మరొక ప్రీతో సంపర్కం పెట్టుకోవడం అన్నబభ్రానం, - దీన్ని సమాజం ఖండిస్తుంది. అలాంటి వ్యక్తిని ఇతరత్రా ఎన్ని మంచి గుణాలున్నా సంఘం దుయ్యబడుతుంది. అతనివల్ల సమాజానికి ఎంతమంచి జరిగినా అతనిని సమాజం బహిష్కరిస్తుంది. ఆ వ్యక్తి పదవిలో ఉంటే అతనిని నిందించే వరకూ ని[ద్రపోదు. లంచగొండితనం, అసత్యాలాడడం, అధికారం చెలాయించడం, స్వలాభాపేక్షతో నిజాయితీ వదులుకోవడం, జూదం, బ్లాక్‌మార్కెట్, ఈ చిట్టా ఎవరికివారు నింపుకోవచ్చు. ఈ దుర్గుణాలు ఎన్నివున్నా ప్రజలు అంతగా పట్టించుకోరు. మరో ప్రీతో సంపర్కం అంటే లేచి కూర్చుంటారు-.
- అసంఖ్యాకమయిన తన రచనల్లో రసెల్ వెలిబుచ్చిన భావాలకు బుచ్చిబాబు చేసిన సంక్షిప్త వివరణగా దీనిని పేర్కొనవచ్చు.
సంఘానికి ప్రయోజనానిన్ని కలుగజేసే ఎన్నో మంచి కట్టడాలను కట్టిన ఇంజనీరు వయస్సులో ఉండి ఒంటరిగావున్న కారణంగా పరస్త్రీతో సంపర్మం పెట్టుకుంటే హింసించిన సంఘం - సంఘానికి ఏవిధంగానూ మేలుచెయ్యని ఒక ఏకపత్నీవ్రతుణ్ణి గౌరవిస్తోందంటూ' రసెల్ ఇచ్చిన ఉదాహరణ బుచ్చిబాబు రచించిన 'కొత్తవంతెన - పాతనీరు” కధకు ఇతివృత్తాన్ని సమకూర్చింది ఇక “-తన క్రింద పనిచేసేవారిని హింసిస్తూ ఏకపత్నీవ్రతుడుగా ఉన్నవ్యక్తిని గౌరవించి, - తన క్రింది ఉద్యోగులను ఆదరంగా చూస్తూ ఏదో ఒక సమయంలో అడసెక్రటరీతో సంపర్కం పెట్టుకున్న వ్యాపారస్తుణ్జి సంఘం చెద్దవాడంటోంది' అంటూ రసెల్ ఇచ్చిన మరో ఉదాహరణ బుచ్చిబాబు రచించిన “'మరమేకులు - చీరమడతలు' కధకు ఇతివృత్తం అయింది. స్టూలదృష్టికి ఇవి రెండు ఉదాహరణలు అయినప్పటికీ ఈ రెండింటి వెనుకా అంతర్లీనంగా ఉన్న భావం మాత్రం ఒక్కటే -,
మష్ర్రదనననడడడడడడననడడడదనడ 2 కోడూరి శ్రీరామమూర్తి మః “'మరమేకులు - చీరమడతలు కధలో బుచ్చిబాబు విభిన్న దృక్పథాలు ఉన్న గంగాధరం, రవిప్రకాశం అనే ఇద్దరు బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌ల పాత్రలను మనముందు ఉంచుతాడు. ఈ కధలోని గంగాధరం వ్యాపారంలోని మెళకువలన్నీ తెలిసినవాడు. కంపెనీకి మంచిలాభాల్ని తెచ్చిపెట్టగలిగినవాడు. అతగాడు వర్మర్హ బాగోగులు పట్టించు కోకపోవచ్చు. డబ్బు తప్ప మరొక ఆలోచన లేకపోవచ్చు కాని - ప్రజల దృష్టిలో అతను మర్యాదస్తుడు. మహాభక్తుడు. ఏకపత్నీవ్రతుడు. (బొంబాయి చీకటిగువాల్లో జరిపిన “లీలలు మరిచి పోవుదము!-) ఇక - రవిప్రకాశం అమెరికాలో బిజినెస్ మేనేజిమెంటులో ట్రయినింగు అయివచ్చినవాడు. వర్మ్కర్లు సుఖంగా ఉంటే యజమానులకు లాభం అంటాడు వాళ్ళ కోసం కేంటిన్లో రేడియో పెట్టించాడు. నడవడానికి తివాసీలు వేయించాడు. లాభాలు రాకపోయినా బోనస్ ఇవ్వాలని వాదించాడు. ఇన్నీ వుండగా - అతగాడు సౌందర్యా రాధకుడు కావడం చేతా, భార్యరోగిప్టిది కావడం వల్లనూ, పర్సనల్ సెక్రటరీ మాధవికి చేరువ అయ్యాడు. స్టెయిన్లెస్ స్టీలు మేకులు కొనడానికి బొంబాయి వెళ్ళిన రవిప్రకాశం, గంగాధరం తలో పని చేసుకువచ్చారు. గంగాధరం, స్టీలు మేకులు కొనడం మాత్రమే కాదు - రవిప్రకాశం దగ్గర స్టీలుపర్మిట్ దొంగిలించి, తన కంపెనీకి మంచి మరమేకులు చేయించాడు. కాని - రవిప్రకాశం మరమేకుల సంగతి మరచి మాధవిని మోడల్‌గా తీసుకుని “చీరమడతలు" బొమ్మగీశాడు. ఆ చిత్రానికి ఆర్ట్‌ఎగ్జిబిషన్‌లో బహుమతి లభించింది కాని, - కంపెనీకి మాత్రం బోలెడంత నష్టం వచ్చింది. పైగా ఆడపిలను వెంటబెట్టుకు తిరిగాడని చెడ్డపేరు. న్డ్ ఈ కథలో బుచ్చిబాబు నీతికి, అవినీతికి మధ్యగల దూరాన్ని, - మరమేక్సృల్రక్ష్య చీరమడతలక్షు, మధ్యగల వ్యత్యాసాన్ని చూవదలుచుకున్నాడు. రవి(ప్రక్రాశం సౌందర్యాన్వేషణను వ్యభిచారం క్రిందా, వ్యభిచారాన్ని ఘోరమయిన నేరం క్రిందా తీసుకుని నిందిస్తే అతడిపై మనం సానుభూతిని చూపగలం. కాని, - వ్యాపారస్తులకు కావలసింది మరమేకులేగాని చీరమడతలుకావు. ఈ కధలో బుచ్చిబాబు మరమేకుల్లాటి మరమనుషులకు, గుండెల్లో ఆర్ధత నిండిన 'చీరమడతలు” కళాకారుడికి మధ్యగల దూరాన్ని చూపడంలో కృతకృత్యుడయినట్లుగా రసెల్ భావసంఘర్షణకు కధారూపాన్ని ఇవ్వడంలో విజయాన్ని పొందలేదనిపిస్తుంది. ఇక - వంతెనలు క్రొత్తవయినా ఆ వంతెనల క్రింద పారేనీరు మాత్రం ఎప్పుడూ పాతదేనని గుర్తుచేస్తుంది. 'కొత్తవంతెన - పాతనీరు' కధ. ఈ కధలోని (ప్రభాకరం
౨౨2 తెలుగు కథ - నాడు,నేడు ఇంజనీరుగా తన విద్యుక్తధర్మాన్ని చిత్తశుద్ధితో చేసినవాడు. చెరువుగట్టును బాగు చేయించాడు. కాలవమీద వంతెనకట్టే పనిని సకాలంలో పూర్తిచేశాడు. సాయంత్రాలు పిల్లలకి ఉత్తినే చదువు చెబుతుందేవాడు ఇన్ని మంచి పనులుచేసిన ఇంజనీరుగారు - ఒంటరిగా ఉంటున్న కారణంగా ఆ ఊళ్ళో ఉన్న అలివేలు అనే అమ్మాయితో శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడు ఆ పిల్ల చిన్నతనంలోనే వైధవ్యానికి గురికావడంచేత ఇద్దరూ ఒకరికి ఒకరు సన్నిహితులయ్యారు. ఈ విషయం ఊళ్ళోవారికందరికీ బాధాకరమైంది. ఈ ఇంజనీరు ప్రభాకరం ఇంకెంతమంది కొంపలుతీస్తాడో అని భయపడి అతడిని ఊళ్లోంచి తరిమేయ్యాలని నిశ్చయించుకుని - బదిలీ చేయించారు. బదిలీ అయి వెళ్ళిపోతున్న ప్రభాకరం తనని తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగాలేడని తెలసి - కాకుల్లాంటి లోకులబాధను తట్టుకోలేక నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది ప్రభాకరాన్ని అలివేలును ఇంతటి ఆవేదనకు గురిచేసిన సంఘం అదే ఊళ్లో సంఘానికి ఏవిధంగానూ మేలుచెయ్యకుండా కాలాన్ని గడిపిన భరతరాజు అనే “పెద్దమనిషిని పరస్త్రీని కన్నెత్తకుందా చూడనందుకు వేనోళ్ల పొగుడుతుంది షష్టిపూర్తి మహోత్సవాన్ని జరుపుతుంది.
ఈ కధలో - భరతరాజుకు, ప్రభాకరానికి మధ్యగల తేడాను రసెల్ దృక్బథంలోంచి చూచి అర్ధంచేసుకొనగలం కాని - అలివేలు చావుకు ప్రభాకరం కారణంకాదన్న విషయాన్ని అంగీకరించలేము కధ చివరిలో పారకులకు ప్రభాకరంపై ఏర్పడుతున్న కెంపతి' కరిగిపోయి ఆలోచనలను మరోవైపు మళ్లిస్తుంది. ఏ అలివేలుచావుతో బుచ్చిబాబు రసెల్ దృక్పథానికి అద్దం పట్టదలుచుకున్నాడో - ఆ పాత్రకు కథకుడు ఇచ్చిన ముగింపు మొత్తం కథనంతటినీ గందరగోళంలో పడేస్తుంది. ఈ విషయాన్ని బుచ్చిబాబు దాదాపుగా ఒప్పుకుంటూ - * ఈ వస్తువుకు రసెల్ ప్రచారం చేసినభావం (ప్రేరణఅయినా, - తీరా కధరాయడం మొదలెట్టాక కొత్త ఉద్రేకం తటస్థపడింది నిజానికి - కేవలం భావాలతో, తర్మంతో కధ సమకూరదు. దీనితోబాటు కథకి హృదయం, ఉద్రేకం, అతీంద్రయజ్ఞానంతో ముడిపడ్డ తృష్ణ్టకూడా కావాలి ఈ కధలో ఇంజనీరు ఉదంతం వెనుక భావం, మెదడు ఉంటే - అతని (ప్రేయసి వెనుక హృదయం, ఉద్రేకం ఉన్నాయి- అంటాడు తన “రసెల్‌కు అంకితమైన కధలు ముందుమాటలో
నిజమే - కేవలం తార్మికదృ్భక్పధంతో కథలు రూపొందవు తన భావాలను కథల రూపంలో (ప్రచారం చేయదలచిన బెర్ట్రాండ్ రసెల్ కూడా కధారచయితగా విఫలుడయ్యాడు. '5414౧ 1౧ 46 56004705, '1%0౧1 ౧౧౫6౩ ౦1 ౬౧1౧6౧1 న6(6౦౧5' అనే పేర్లతో ప్రచురించబడిన అతని కధాసంపుటాలు పారకులను అంతగా ఆకర్షించ లేకపోయాయి. తన రచనలను పోటీపడి ప్రచురించే ప్రచురణకర్తలు కూడా కధలను ముద్రించడానికి ముందుకు వచ్చేవారు కాదని రాసుకున్నాడు రసెల్ తన ఆత్మకథలో.
కోడూరి శ్రీరామమూర్తి మమ ఇక - బుచ్చిబాబు విషయం తీసుకుంటే - అతను ప్రధానంగా హృదయవాది,- సిద్ధాంతాలకు సంబంధించిన భావాలు కాక, హృదయానికి సంబంధించిన ఆర్భతలు, సంఘర్షణలు, అతడిని అధికంగా ఆకట్టుకుంటాయి. వ్యక్తికి, వ్యవస్థకు, జరిగేపోరాటం కాక - వ్యక్తిలో ఉన్న విరుద్ధభావాల మధ్య సంఘర్షణ బుచ్చిబాబుకు అభిమానపాత్రమైన విషయం. “-్రేమించి దూరంగా ఉండి, శరీరసంబంధం కోరక, మనసును ఆనందంతో నింపుకునే ఉదంతం సాహిత్యంలో రాణిస్తుంది - (అంతరంగ కథనం పేజి 88) - అనే బుచ్చిబాబు తన కథల్లో అంతరంగంలో అణచివేయబడిన శృంగారభావాలకో అటమటించే పాత్రలను చిత్రించడంలో సిద్ధహస్తుడనిపించుకున్నాడు. “నన్నుగురించి కథరాయవూ-* దగ్గిరనుండి, 'మేడమెట్లు' కథవరకూ ఎన్నో కధలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. బహుశా - ఈ కారణం చేతనే అనుకుంటాను వ్యక్తికీ, వ్యవస్థకూ సంఘర్షణను తెలిపే రసెల్ భావాలకు కథారూపం ఇవ్వడంలో బుచ్చిబాబు విజయీకృతుడు కాలేకపోయాదనిపిస్తుంది.
ఈ సందర్భంలోనే సి రామచంద్రరావు రచించిన 'వేలుపిళ్లై కథను కూడా 'ప్రస్తావించవలసి ఉంటుంది. సమాజం నిర్దేశించే నైతిక విలువలకు, వ్యక్తి మనసు నిర్దేశించే విలువలకు, మధ్యగల తేడాను మనం గుర్తుంచుకోదగ్గరీతిలో చెబుతుంది ఈ కథ.
ఈ కథలోని *వేలుపిళ్లై ఒక టీ ఎస్టేట్‌లో పనివాడుగా జీవితాన్ని ప్రారంభించి వ్యాపారస్తుడుగా ఎదిగాడు. ఇలాంటి ఎదుగుదలను సాధించినవాళ్ళు చాల్రామ్రంది ఉండవచ్చు గాని, అతడి జీవితంలో ఒక విలక్షణత ఉంది ఇదే అతడి జీవిత్ర కథకొక ప్రత్యేకతను సమకూర్చింది.
ఆర్థికంగా ఎదుగుతూండే సమయంలో అతడు మొదటి భార్యకు అన్యాయం చేశాడు. బలవంతంగా విడాకులు తీసుకున్నాడు. కాపురం చేసే రోజుల్లోకూడా ఆమెను అనేక విధాల మోసం చేశాడు దొంగతనం చేసి వినాయకుడి విగ్రహాన్ని సంపాదించి, దానికి పూజలు జరిపించాడు. దేముడికి గుడి కట్టించేందుకు ఎలాంటి స్వార్థిమూ లేకుండా ప్రయత్నించాడు. గుడిని కట్టించడం సంఘానికి ఉపకారమా? ఇంతకన్నా మంచిపనులు లేవా ? దానిని కట్టించడానికి అక్రమమార్గాలు అనుసరించడం మంచిదా? ఇలాంటి చర్చల జోలికిపోకుండా ఈ విషయంలో అతడి ప్రవర్తనలోని 'అసాధారణతి గురించి మాత్రమే మనం ్రస్తావించుకోవలసి ఉంది.
ఇక, - అతడి మొదటిభార్య పవనాళ్ళ్ రెందోభార్య సెందామరైల విషయం తీసుకుంటే - పవనాళ్ శీలవతి. కాని, - అతడి ఆశలను, ఆశయాలను ఆమె ఏనాడు
మవ తెలుగు కథ - నాడు,నేడు అర్థం చేసుకోలేదు అతడికి ఆనందం కలిగించేందుకు ఎంతమాత్రం ప్రయత్నించలేదు. ఇక,- సెందామరై శీలవతి కాదు. అయితేనేం, - ఆమె అతడి ఆశలను, ఆశయాలను అర్ధం చేసుకుంది యాఖై అయిదేళ్ళ వేలుపిక్లికి అందాల పడుచుభార్యగా సెందామరై అతడికి మానసికంగా, శారీరకంగా సన్నిపొతమై అతదు కోరుకున్న ఇల్లాలు అనిపించుకుంది అతడు కలలుగన్న గుడినిర్మాణం కోసం సంఘందృష్టిలో తప్పుడు పనులు కూడా చేసింది. ఎవరూ నోరెత్తకుండా క్రీగంటి చూపుతో అందరి నోళ్లూ నొక్కేసింది సెందామరై చాటుమాటు వ్యవహారం వేలుపిళ్లెకు తెలుసా, తెలియదా అనేది కథలో చివరివరకూ బ్రహ్మరహస్యంగానే ఉండిపోతుంది. ఈ కథలోని వేలుపిళ్లె, 'సెందామరై, నీతిపరులా? అవినీతిపరులా?, వారు చేసింది పాపమా? - పుణ్యమా?- అనే విషయాలను సంఘం నిర్దేశించే నీతినియమాల నుండి చూచినప్పుడు ఒకవిధమైన సమాధానం లభిస్తుంది. - రసెల్ భావించిన “సబ్జెక్టివ్ రైట్నెస్ ఏది అని ఆలోచించి నప్పుడు మరొకవిధమైన సమాధానం లభిస్తుంది. ఈ కారణం చేతనే ఈ కథలో “రసెల్ దృక్పధం” ఉన్నదని చెప్పడం జరిగింది (ఈ విషయాన్ని రచయిత ఎక్కడా ప్రస్తావించక పోయినప్పటికీ)
ఇలా చూచుకుంటూపోతే తెలుగుకథాసాహిత్యంలో రసెల్ దృక్పథం మనకు పలురూపాల్లో దర్శనమిస్తుంది. ఈ పరిశీలనలో ్రస్తావించబడినవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే ! - మానవజీవితాన్ని బహుముఖంగా పరిశీలించే కధకులు సహజంగానే నీతి, అవినీతి మధ్యగల సున్నితమైన గీతగురించి ఆలోచిస్తారు. మానవతా దృక్పధంతో అమలులో ఉన్న నీతిని గురించిగాక - మనిషిని మనిషిగా తీర్చిదిద్దే విలువలకై అన్వేషిస్తారు పరితపిస్తారు. ఈ ప్రయత్నంలో వీరి రచనలు 'అవినీతికరమైన రచనలు” అనే విమర్శలకు గురికావచ్చు కాని - వారు లక్ష్యపెట్టరు, “నీతివంతమైన రచనలు, అవినీతివంతమైన రచనలు అంటూ ఉండవు. బాగా రాయబడినవి, రాయబడనివి మాత్రమే ఉంటాయి-” అంటూ ఉత్తమసాహిత్యాన్ని ఏనాడో నిర్వచించిన ఆస్కార్ వైల్డ్ భావాలు ప్రపంచంలోని రచయితలందరికీ శిరోధార్యాలు. '- మంచి జీవితమంటే (గ్రేమచే (ఢ్రేరేపించబడి, విజ్ఞానసంపదతో మార్గదర్శకత్వాన్ని చూపేది" అంటూ మంచిజీవితాన్ని నిర్వచించిన మానవతామూర్తి బెర్ట్రాండ్ రసెల్ భావాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, - రచయితలందరి గుండెల్లోనూ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. అన్ని దేశాలలోని సాహిత్యకారుల ఆదర్శం ఇంచుమించుగా ఇదే. తెలుగు కథాసాహిత్యం ఇందుకు మినహాయింపు కాదు.
(ఆచార్య తూమాటి దోణప్పగారి “అభినందన సంచికి 1987 లో ప్రచురితం)
కోడూరి శ్రరామమూర్తి 22222 చలం కథలు - మనోవిశ్లేషణ = చలంగారి గురించి ఆలోచించినప్పుడల్లా నాకు 'మ్యూజింగ్స్లోని రెండు ఉదంతాలు జ్ఞాపకానికి వస్తూఉంటాయి.
ఆయన ఉద్యోగం చేస్తూండే రోజుల్లో ఒక హెడ్ మాస్టారుగారు ఉండేవారట. ఆయన చాలా ప్రిన్సిపుల్సు వున్నవాడు. అన్నింటికీమించి చలంగారి శ్రేయోభిలాషి అందుచేత - సంఘానికి, కులానికి వెలియై అందరి నోళ్లల్లోనూ పడుతున్న చలాన్ని చూచి జాలిపడి అతణ్జి కాస్త 'మంచిమార్గం” (1) లో పెడదామనుకున్నాడు !- “గడియారంలో చక్రం వంటివాడు మనిషి - సంఘంలోనూ బళ్లోనూ -” అంటూ ఓ శుభముహూర్తాన ఆయన ఉపోద్దాతం ప్రారంభించబోయినాడట! - ఆ హిళోక్తి పూర్తి కాకుండానే చలంగారు అందుకొని “నేను గడియారంలో చక్రాన్ని కాను - అసలు ఈ గడియారాన్ని చూస్తే నాకేమి గౌరవం లేదు. దీంట్లో చక్రాలన్నీ తప్పుడు చక్రాలు... ఇది సరియైన కాలాన్ని చూపడం లేదు. ఈ గడియారాన్ని చూచుకొని సత్యాన్ని మరిచి కాలాన్ని కల్పించే సూర్యుడేతప్పుడు నడకలో ఉన్నాడని జనం అభిప్రాయపదుతున్నారు” అంటూ తన మనోభావాల్ని 'కుండబద్దలూ కొట్టినట్టుగా చెబితే - మరి, ఆ శ్రేయోభిలాషి
ఏం అనగలడు? ష్ట్ర స ఇక, - మరో ఉదంతం చలంగారి కొల్లేరు యాత్రకు సంబంధించింది. ఏండ్రూస్ అనే మిత్రుడి ఆహ్వానం మీద కొల్లేటి సరస్సుకు వెళ్ళారాయన. మైళ్లకు మైళ్లు ఎటుచూచినా సువ్వలూ, అందమైన పిట్టలు, ఇవన్నీ చూచిన ఆయన రసహృదయం పులకించిపోయింది. “'పియులతో విహరించడానికి ఉద్దేశించి దేవతలు కటాక్షించిన ఉదయం” అని అనుకున్నా దాయన. ఇంతటిలో మిత్రుడు తుపాకీతీసి పిట్టల్ని నేలరాల్బడం ప్రారంభించాడు. ఆ విధ్వంసాన్నీ చూస్తు ఉంటే చలం హృదయానికి గాయమై బాధతో మూలిగింది అయితే- కథ యింతతో ఆగలేదు. చచ్చిన పిట్టలు పడవలో పడుతూ ఉంటే - ఆయనలోని సౌందర్యదృష్టి మాయమై క్రమక్రమంగా పైశాచిక ప్రవృత్తి ప్రబలడం ప్రారంభించింది!
- రాలిన పిట్టల్ని లెక్కపెట్టడం, - పొదల్లో దూరి తప్పించుకుంటున్న పిట్టల్ని కాల్చి
చంపమని మిత్రుడికి ప్రోత్సాహం ఇవ్వడం ప్రారంభించాడాయన. ఈ విషయాన్ని గురించి తన “'మ్యూజింగ్స్'లో చలంగారు *- ఆ వేట ఉత్సాహం ఆ చంపే దాహం నాలో ఉన్నదని ఎప్పుడూ తెలియదు. అలా ఎవరన్నా అంతకుముందు అంటే మండిపడి ఉంటాను -” అని అన్నారు.
- ఈ రెండు ఉదంతాల్లో మొదటి. ఉదంతం చలంగారి దృకృథాన్ని గురించి చెబితే - రెండోది, మానవ మనస్తత్వం పట్ల చలంగారికి గల అవగాహనకూ - ఆత్మపరిశీలన పట్ల ఆయనకుగల నిర్మాహమాటమైన వైఖరికి తార్కాణంగా నిలుస్తుంది. మానవ మనస్తత్వంలోని 00౧౧౪65 ను, - విరుద్ధ ప్రవృత్తుల మధ్య మనిషిలో. జరిగే సంఘర్షణను, చలంగారిలా అర్ధం చేసుకున్న రచయితలు ఆ తరంలో చాలా తక్కువమంది మాత్రమే.
పెదిమలతో మాట్లాదే మాటలకు, గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న భావాలకు, మధ్య ఉన్న వైరుధ్యాన్ని చూస్తే చలంగారికి అసహ్యం, ఆగ్రహం. మనిషికి తెలియని తెలిసినా పట్టించుకోని మరోమనిషి మనిషి గుండెల్లో 'ఉన్నాడని చలంగారికి తెలుసు. లేకుంటే- “చెడ్డపేరు తెచ్చుకున్న పిల్లల్ని చూస్తే మర్యాదగల తల్లిదండ్రులకు ఎందుకంత కోపమంటే, - తమ అసలు గుణాలు, ఎవరికీ తెలియకుండా తమలో దాచుకున్న గుణాలు తమ పిల్లలముందే, ఆ పిలల మూలంగా బయటపడ్డాయనే కోపం వల్లా - అని అనగలిగి ఉండరు (మూజింగ్స్” పే. 29).
అంలేకాదు - “మహాత్ములు కావడానికీ, దుర్మార్గులు కావడానికీ అవసరమైన 51% 64116 లో తేడా లేదు! - ఒక్క గుణంలో అటూ, ఇటూ, ఉన్న వ్యత్యాసం ఈ చివరినుండి ఆ చివరికి తీసుకువెడుతుంది... జీవితంలోని 140//63 ప్రకారం 6౧౧౦- (0౧5 జాగ్రత్తగా పరిశీలించి 546) చేస్తే గాంధీగారికి దేశం మీది (ప్రేమా, ఆయన కొడుకు హరిలాల్గాంధీకి త్రాగుడుమీది (ప్రేమ, ఒకే 80606 లోంచి వచ్చి ఉండవచ్చులో (మ్యూజింగ్స్ పే 28లో రెండు వ్యాసాలు) అనేందుకు సాహసించి ఉండరు.
“౨౨20లలో చలం రచనలు చెయ్యడం ్రారంభించేసరికి సిగ్మండ్ ఫ్రాయిడ్ 'డెప్త్ సైకాలజీ, - ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ “ఇండివిడ్యువల్ సైకాలజీ, కార్ల్గుస్టావ్యూంగ్ “ఎనలిటికల్ సైకాలజీ" - వెరశి "సైకోఎనాలిసిస'కు సంబంధించిన సిద్ధాంతాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహారచయితల ఆలోచనలపై ప్రభావాన్ని చూపడం ప్రారంభించాయి. సముద్రంపై తేలియాడుతూ ఉందే 'ఐస్బర్గొలో పదింట ఒకవంతు మాత్రమే పైకి కనబడితే - మిగతా తొమ్మిదివంతులూ కనబడకుండా
రతన కోడూరి శ్రీరామమూర్తి 2 సముద్రంలో ఎలా ఉంటుందో అదేవిధంగా “చేతన (00౧5౦1౦౮69) ను బట్టి తెలిసేది మనిషి మనస్తత్వంలోని ఒక స్వల్పమైన భాగం మాత్రమే మిగిలిన భాగం అచేతన (౮౧౦౦౧5౦10౮56) లో ఉండిపోయి మనిషికి అంతుచిక్కకుండా ఉంటుంది అనేఅవగాహన విశ్వవ్యాస్తంగా ఎందరో రచయితల చేత మనోవైజ్ఞానిక దృక్పధంతో మనం మరువలేని నవలలను, కథలను రాయించింది. “చైతన్యస్రవంతి” (918200 01 ౧0౧౩౦10౪9౧699) శిల్చ్పం ఆవిర్భవించేందుకు (ప్రేరణకు కల్పించింది.
- ఇదంతా రాయడంలోని ఉద్దేశం చలాన్ని కూడా - మనోవైజ్ఞానిక దృక్పధంలో రచనలు చేసిన రచయితల జాబితాలో చేర్చుదామని కాదు !- పాత్రల మనస్తత్వచిత్రణను సమర్ధవంతంగా చేసేందుకు మనోవైజ్ఞానిక సిద్ధాంతాల అవగాహన తప్పనిసరి అని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. ఎట్లాంటి సిద్ధాంతాల అవగాహన అవసరం లేకుండానే సమర్భుడయిన రచయిత పాత్రల మనస్తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించగలదు. సిగ్మండ్ (ఫ్రాయిడ్ 70వ జన్మదిన సందర్భంగా జరిగిన సభలో ఉపన్యాసకులు ఆయనను “-అచేతన గురించి కనుగొన్న మేధావి-” అని క్రీర్తిస్తే ఆయన “-నాకుముందే ఎంతోమంది కవులూ కళాకారులూ, 'అన్కాంషన్ గురించి కనుగొన్నారు. నేను చేసిందలా దానిని శాస్త్రీయమైన రీతిలో పరిశోధించడమే -” అనడాన్ని ఈ సందర్భంలో గురుకు తెచ్చుకోవలసి ఉంది. ల
చలం రచనల్లో ప్రత్యేకించి అతడి కథల్లో నవలల్లో పాత్రల మనస్తత్వ చిత్రణ గురించి ప్రస్తావించేటప్పుడు దానిని ప్రధానంగా మూడు తరహాలుగా వర్గీకరించ్వ్వ చ్చు 'నేను-నాది' అనే ౧055655/6 115619 ఫలితంగా వ్యక్తి అంతరంగంలో చెలరేగే అలజడిని ఆవిష్కరించడం మొదటి తరహాకు చెందినదయితే, - వ్యక్తి తనలో ఉన్నాయని భావించుకునే విలువలకూ, వాస్తవ జీవనగతికీ వైరుధ్యం వర్పడినప్పుడు వాస్తవాన్ని అంగీకరించలేక, నమ్ముకున్న విలువలను వదులుకోలేక అతడు లోనయ్యే మ్రన్సస్లక్ర ఆవేదనను చిత్రించడం, రెండవ తరహాకు చెందింది. ఇక,- మూడవది, -_ సంన్గుం, సంప్రదాయం నిర్దేశించిన విలువలను వ్యతిరేకించిన వ్యక్తులు తమ విలువలను త్రాము అన్వేషించుకుంటూ చేసే జీవనయాత్రలో లోనయ్యే సంఘర్షణలకు అక్షరరూపం
కల్పించడంగా పేర్కొనవచ్చు.
నిజానికి - చలం ఏవో కొన్ని సిద్ధాంతాలను మనసులో ఉంచుకొని పాత్రలను తో లుబొమ్మల్లా ఆడించిన రచయిత కాదు. గ౧౮/80166 అనేటట్లు “- చవుకబారు రచయిత పాత్రల్ని అదుపులో ఉంచుతాడు. నిజమైన రచయిత అవి మాట్లాడే మాటల్ని వింటాడు.
2౨ తెలుగు కథ - నాడు,నేడు వాటి ప్రవర్తనను గమనిస్తాడు -” చలం నిజమైన రచయిత. “- కథను ఇట్లా నడిపిద్దామని
అనుకోను. పొత్రని కాగితం మీద పెట్టగానే వాళ్లే నడిపించుకుంటారు కథని. అందుకే
నా 7౧6౦65 కి విరుద్ధంగా ఉంటాయి నేను రాసేవి చాలాసార్లు -” (కవిగా చలం పే.
- అన్న చలం మాటల్లో అతిశయోక్తి లేదు. అందువల్లనే చలం పాత్రలు సజీవ
మూర్తుల్లా మనముందు కనబడతాయి. వాటి ఆవేదనలు, అన్వేషణలు, సంఘర్షణలు,
అన్నీ అత్యంత శక్తివంతంగా మన గుండెలను హత్తుకుంటాయి. “- తనకూ ఈ
ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవిచేసే అంతర్బాహిర్ యుద్ధం కవిత్వం -”
(మవాప్రస్థానం' ముందుమాటలో) అని అన్న చలం ఈ “యుద్దారావాన్ని! వచనంలో
తన రచనల్లో వినిపించాదనిపిస్తుంది అతడి రచనలు చదివినప్పుడు. మనోవిశ్లేషణా
పరంగా చెప్పాల్సి వచ్చినప్పుడు చలంగారి కధలు ఆయన నవలలకు తీసిపోవు.
సహజంగానే నవలకున్నంత పరిధి కధకు ఉండదు చిన్న అద్దంలో కథకుడు ఎంతో
ప్రపంచాన్ని చూపించవలసి ఉంటుంది ఇట్లాంటి పరిమితులున్నప్పటికీ చలంగారు పాత్రల మనః ప్రవృత్తిని అద్భుతంగా మనముందు ఉంచుతారు తన కధల్లో,
“నాయుడు పిల్ల” కధ జ్ఞాపకం ఉందనుకుంటాను. ఈ కథలోని నాయుడుపిల్ల
ఎన్నో సంఘర్షణలకు లోనయింది. కన్యగా ఉండిపోవడం మంచిదా లేక డబ్బున్న ముసలి నాయుడుగారికి రెండోపెళ్లి భార్య అయి ఆర్థికంగా సుఖపడడం మంచిదా,
అనే సంఘర్షణ - శరీరంలో విజ్బంభిస్తున్న కోరికలను అణచుకోలేక చిననాటి చెలికాడు
పార్ధసారధికి చేరువై అతడితో రహస్యంగా పొందుపెట్టుకున్నప్పుడు వ్యక్తి అనందానికీ,
సామాజికపరమైన కట్టుబాట్లకూ, మధ్య'లోనయిన సంఘర్షణ, - తనపై ఎంతో ప్రేమను చూపిస్తూ ఒక మంచి తండ్రిలాగా, మంచి మామగారిలాగా కోరినవన్నీఅడిగినదే తడవుగా సమకూర్చే నాయుడుకి అన్యాయం చేస్తున్నానన్న అపరాధభావం - నాయుడు చనిపోతే శని వదులుతుందన్న కోరిక ఒకవైపు, తన మీద ఇంత దయచూపుతున్న వ్యక్తిని తిడుతున్నాననే పశ్చాత్తాపం మరొకవైపు, - పార్ధసారధి వలన తనకు కొడుకు పుడితే ఆ కొడుకును చూచుకుని వంశాంకురం ఉదయించిందని పొంగిపోయే నాయుణ్జి చూస్తే వళ్లుమంట. అంతలోనే జాలి. - పార్ధసారధితో లేచిపోవాలని కోరిక. - బిడ్డను వదులుకోలేని ఆశక్తత - చివరకు పార్ధసారధి వైపే మొగ్గువచ్చిన కారణంగా తన పేగు తెంచుకుని పుట్టినబిడ్దకు తల్లి ప్రేమ కరువై మృత్యువుపాలయితే - అపరాధభావంతో కన్నీరుమున్నీరుగా రోదన, విషాదం
- ఈ సంఘటనలను, సంఘర్షణలను, పరివృతం చేస్తూ నాయుడు పిల్ల అంతరంగ
మధనాన్ని మనం మరిచిపోలేని రీతిలో ఆవిష్కరిస్తారు చలంగారు ఈ కథలో. ఈ
మవర్ర్రనన2డడడడడడడడడడననన22ఊఊ2 కోడూరి శ్రీరామమూర్తి ౨౨ కథలోని మరో ప్రత్యేకత ఏమిటంటే - కథను చదివినప్పుడు మనకు నాయుడుపిల్ల మీదా, నాయుడు మీదా, కూడా వకకాలంలో సానుభూతి కలుగుతుంది. కథను నడిపించడంలోని విశిష్టతకు, కథలో జీవితాన్ని సమగ్రంగా చూపగల ప్రతిభకు ఇది ఒక తార్మాణం అని చెప్పవచ్చు. ఎర్నెస్ట్ హెమింగ్వే అనేటట్టు జీవితాన్ని మూడు డైమెన్సన్లలోను, నాలుగు డైమెన్షన్లలోను చూపడం అంటే ఇదే అనుకుంటాను. చలం గారికి 'హిపోక్రసీ' అనేది ఎక్కడ ఎలా కనబడినా అసహ్యం, ఒళ్లుమంటి. “నాకు కోపం లేదండి, నేను ఏకపత్నీవ్రతుణ్జి-” “-నా కోర్కెలను నేను అణుచు కోగలను -”, ఇలాంటి ప్రగల్భాలు పలికే ప్రబుద్ధుల్నిఆయన తన కథల్లో పలు సందర్భాలలో హేళన చేశాడు ! - *“అభినవసారంగధరుడు”, “రామభక్తుడు”, “జెలసీ, “కలియుగధర్మం”, ఇట్లాంటి కథలు ఆ తరహాకు చెందినవే. పెళ్ళానికి జబ్బుచేస్తే అంతా రాముడే చూచుకుంటాడని మందు ఇప్పించడం మానేసి, ఆ ఇల్లాలు కాస్తా “హరీ అన్నాక - రామాజ్ఞ అయిందంటూ మరదల్ని పెళాడదానికి తయారయిన దొంగభక్తుడి కథ “రామభక్తుడు” లో కనబడితే - 'కలియుగధర్మం” కథలో ఖద్దరు టోపీ పెట్టుకుని, బ్రిటిష్ ప్రభుత్వపు పోలీసుల దెబ్బల్ని ఎంతో శాంతహృదయంతో భరించి, - ఇంటికొచ్చేసరికి పెళ్ళాం మీద పెద్దపులి అయిపోయిన సత్యాగ్రహ సమరయోధుడి ఉదంతం ఉన్నది. జీవితంలో ఎలాంటి ప్రిన్సిపుల్స్ లేకుండా - ఉన్నట్టుగా నటించే ఇలాంటి వ్యక్తులకు లో ఎం ఘర్షణ అనేదే ఉండదు. కాని, - కొన్ని నియమాలను పొటించాలనే వలసి =. ల పరిస్థితులు ప్రభావం వలన అందుకు విరుద్ధమైన రీతిలో ప్రవర్తించ (కం వతినవారి విషయంలో మానసిక సంఘర్షణ అనివార్యం. ఇట్లాంటి సంఘర్షణ న. కథలో కనబడుతుంది. స్వాతంత్రోద్యమ నేపథ్యంలో రాయబడిన
- ఈ కథలోని సుందర శివరావు దేశసేవ చేద్దామనే దృఢనిశ్చయంతోనే కాంగ్రెస్‌లో చేరాడు. భార్యతో సహా కాకినాడ కాంగ్రెస్‌కు వచ్చాడు. శ్రీరాముడు అతని ఇష్టం దైవం ఏకపత్నీవ్రతం అతడి ఆశయం. ఇదంతా బాగానే ఉందిగాని, - కాకినాడ కాంగ్రెస్‌కు తనలాగే వచ్చిన బెంగాలీ అమ్మాయి నిర్మలను చూచేసరికి అతడి గుండెల్లో అలజడి ప్రారంభమైంది ! - ఆ అమ్మాయి కూడా ఇతడితో చనువుగా ఉంటూ మనసులో కోరికలు రగిలిస్తుంది. “-ఇట్లా చూపులచేత చలించే మనిషి తానేం దేశసేవ చెయ్య గలడు? -” అనే భావమూ, *-ఆమె పెదవులు ఒక్కసారి ముద్దుపెట్టుకోగలిగితే -” అనే
222 తెలుగు కథ - నాడు,నేడు ఆలోచన, అతడి గుండెల్లో పరస్పర విరుద్ధభావాలను ఏకకాలంలో కలిగిస్తూ ఉంటాయి. “-ఈ రోజుతో మనిద్దరి జీవితాలు ఏకమైపోయినాయి. భారతమాత ముందు సేవాదీక్షను తీసుకుంటున్నాము... నువ్వు నా దేవతవు.. నా సోదరివి.. మన (ప్రేమ నిర్మలము” అని అంటాడు గానీ, మనసు మలినంతో నిండిపోయింది. “నిర్మలను కౌగలించుకొనడం పవిత్రం !- దేవాల మీద కామం కాదు. ఆత్మసంయోగానికి చిహ్నము ! ఆమె సోదరిలా అనేది అతడిలోని ఆత్మవంచనకు పరాకాష్ట ! [10160 లోని కామభావాలను కప్పి పుచ్చుకునేందుకు 0618౧08 గ౧6౦౧౭౧15గ౫ ద్వారా జరిగే వ్యర్థ ప్రయత్నం. లేకుంటే
- అంతలోనే “- పాపం నమ్మి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లనిట్లా పంపితే ఈ దేశద్రోహి - ఆమె మనసును నెమ్మదిగా కృత్రిమ మార్గాలవైపు తిప్పుతున్నాడు -” అనే ఆవేదనకు, ఆత్మవిమర్శకు ఆస్కారం వుండేది కాదు.
“నిర్మలా ?- వేను శుద్ధగాడిదను ! - అంటాడు సుందరశివరావు నిర్మలతో ఓసారి-
“నేనింకో గాడిదను. రా - ఇట్లా వచ్చి కూర్చో + అంటుంది నిర్మల !- నిర్మల [10160 లో కూడా సుందరశివరావు పట్ల అలాంటి కామభావనే ఉంది. ఆమె కూడా దానిని అంగీకరించలేదు. “-మనది పవిత్రస్నేహం - ఈ ముద్దుల వల్ల అపవిత్ర మౌతుందా?-” అంటుందామె కాని - సుందరశివరావు ఆమె నడుముమీద చెయ్యివెయ్యబోతే ఆమె వెనక్కు జరుగుతుంది. అప్పుడు సుందరశివరావు “-తాను చేసింది తప్పు. అంత చనువు తనసోదరితో తీసుకొనడం అసహ్యమైన పని బుద్ధిమంతు రాలయిన నిర్మల ముందు తెలివినపడి తనను దూరాన ఉంచుతున్నది, ఆమెకు కృతజ్ఞుడై ఉందాలి...” అనుకుంటాడుగానీ, చివరకు గుండెలలో రగిలే కోరికకు లోబడక తప్పలేదు.
“-ఆత్మలు ఏకం అయ్యాయి దేశసేవలో -” అని సుందరశివరావు అనుకుంటాడు గానీ - నిజానికి ఏకం అయినవి శరీరాలు మాత్రమే అనేది విస్మరించరాని సత్యం 1 -
“హంపీకన్యలు” కధలో కూడా ఇలాంటి సంఘర్షణే ఉంది. అయితే, - అందులో ఎలాంటి 'హిపోక్రసీకి తావులేదు. కామభావనలను మానవతావిలువలు అధిగమించిన ఉదంతం అది.
ఈ కధలో మనకు కథ చెప్పే వ్యక్తికి హంపీ యాత్రలో తారసిల్లిన కూర్చు సుందరి
- హంపీకన్య - అంటే ఎడతెగని మోహం. *- ఈ స్త్రీల జోలివద్దని ఎన్నోసార్లు నేను దూరంగా పోయినా, చివరికీ కొండల్లోనూ, అడవుల్లోనూ వీళ్లని కంటిముందు నిలిపి, ఊరించి, నన్ను బాధిస్తోంది విధి -” (పే. 122) అని కలవరించే మన కథానాయకుడు
వర్తన వ22 కడూరి శ్రీరామమూర్తి మమ2ి శృంగార పురుషుడు. అతడి మీద హంపీకన్యకి మొదటిలో సదభిప్రాయం లేదు. “గొంగళిపురుగులాగ, పరమాన్నంలో ఈగలాగొ అతడిని మొదట్లో ఆమె చూస్తుంది (ప-1229). కథ యిలాగే కొనసాగేదేమో గాని, హంపీ శిధిలాలను చూడడానికి వచ్చినవారిని దోచుకోవడానికి దొంగలు రావడంతో - భీతావహ వాతావరణం సృష్టించబడి కథ మరో మలుపు తిరిగింది. భయంతో వణికిపోతున్న హంపీకన్యకు మన కధానాయకుడు ఒక రాజపుత్రవీరుడిలా శరణుయిచ్చాడు. “తన ఉద్యోగం, కుటుంబం, పిరికిదనం" ఇవన్నీ మరిచి శరణుజొచ్చిన అబిలను ఒక యోధుడిలా గుండెలకు హత్తుకున్నాడు. ఒక తల్లిలా గోరుముద్దలు పెట్టి అన్నం తినిపించాడు. దొంగలకు, యాత్రీకులకు జరుగుతున్న పోరాటానికి దూరంగా ఆ అందాలరాశిని తనపక్కన పడుకోబెట్టుకున్నాడు. ఇద్దరి మధ్యా చీకటి - గుండెల్ని దొలిచే ఏకాంతం -
“నిర్భాగ్యుడా !- ఈ అదృష్టమంతా నాలుగు ఘడియలే. తెల్లారితే మళ్లీ నీ స్కూలు, వాసనగొట్టే పుస్తకాలు, హెడ్మాష్టరు మొహం, సిరామరకలూ సిద్ధం -” (పే. 144) మరి, ఈ కొద్ది సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని మనసులోని కోరికను తీర్చుకోగలడా? - “-ఈ ముగ్ధని, ఈ అమాయకురాలిని- ఈ అస్ప్బృశ్యను- ఎవరి భార్య కాబోతున్నదో - ఎవర్ని హృదయమంతటితోనూ ్రేమించబోతుందో - ఆ భయస్ధితిని పురస్మరించుకొని ఆమెను ఆక్రాంతం చెయ్యడం ఎంత అన్యాయం 1! ఆనాడు తన భర్రతో మొదటిరాత్రి, ఈ రాత్రిని తలుచుకొని ఎంత సిగ్గుపడుతుందో -_ నన్నింత శపిస్తుందో ! -” (పే. 145) - అంటూ మనసు హెచ్చరికలు చేస్తున్నది.
అతడు ఆమెను దగ్గిరగా తీసుకుని ముద్దుపెట్టుకున్నాడు. ఇంకా ఏం జరిగేదో కాని ఆమె దూరంగా జరిగింది. “-కోపమొచ్చింది. లేచి వెళ్లిపోదామనుకున్నాను ఇదా సమయం ! - ఆమె నా అక్రమానికి లోబడితే మిక్రుణ్ణి. ఆమె శీలవతియై నిరాకరిస్తే శత్రువును సిగ్గేసింది. పురుషులందరూ ఇంతే కదా ! - ఊరికే నీతులు మాట్లాడమంటే మాట్లాడతారు. అవినీతి కథలు హెచ్చిపోతున్నాయని వ్యాసాలు రాస్తారు. తమ మనస్సుల్లో పెరిగే కుళ్లు సహజమై పోతూంది - ఈ అవినీతి పరులకి -” (పే-146) అనే ఆత్మవిమర్శ
- ఆత్మక్షోభ.
ఒక దశలో ఈ అలజడి భరించలేక పాపం అయితే అయింది కోరిక తీర్చు కుందామని అనుకుంటాడు. *-నేను చేసిన పాపాన్ని మాత్రమే చూశావా? నేనుపడ్డ
వేదన, నన్ను లోబరుచుకున్న రక్తతీవ్రతను కూడా చూశావా?” (కే. 147) అని
మై తెలుగు కథ - నాడు,నేడు పైలోకంలో వున్న భగవంతుణ్ణి “ .నపుంసక విమర్శకులు వీళ్లకేం తెలుసు ఆ నరకం?
- స్వర్గద్వారం దగ్గిర సంకోచిస్తూ నిలబడే ఆ నరకం - ” (పే. 148) అని ఈ లోకంలో ఉన్న 'పుణ్యపురుషుల్ని' నిలదీద్దామనుకున్నాడు.
కాని, - చివరకు అంతరంగంలోని భావాలను బలంగా అణగదొక్కగలిగాడు ఆ స్థితిలో తననుతాను అభినందించుకుంటూ *-ఆ సమయాన నా అరచేతిలోని కన్యని పాపమని వదిలి వచ్చినందుకు ఈశ్వరుడే వుంటే నన్నుఅభినందించకపోతే ఈశ్వరుడే కాదు మా కాలేజి ప్రిన్సిపాలు కంటే అధముడు +” అని అనుకోగలిగాడు ! -
ఆ రాత్రిలో హంపీకన్యను రక్షించడానికి గాని, భక్షించదానికిగాని, అతడికి అవకాశం ఉంది మన కధానాయకుడు శృంగార పురుషుడే అయినప్పటికీ - క్లోరోఫారమ్లో ఉన్న ఒక ఆడరోగిని తెనాలి డాక్టరు చెరిచినట్టుగా (పే. 152) అధమస్థాయి సంస్కారం ఉన్నవాడుకాదు, మానవతావిలువలను దక్కించుకోగలిగినవాడు.
ఇలా - అతడిలోని అగ్నిని ఉపశమించుకున్న తర్వాత భయంతో వణకిపోతూ తనని కావలించుకున్న హంపీకన్యను నిర్వికారంగా వాత్తుకోగలిగాడు. “తనని కౌగలించుకున్న అమె చేతివేళ్లు ఇదివరకటిలా అతడిని బాధించలేదు. చిన్నపిల్ల వేళ్లవలె అతడికి ఆహ్లాదాన్ని కలిగించాయి” (శే - 154).
“ప్రేమపర్యవసానం” కధలో నీతినియమాలు తన సొత్తని చెప్పుకునే వ్యక్తిలోని “పాప్రోక్రసీ*ో కనబడితే, - తాను మంచిది అనుకున్న పనిని మనస్ఫూర్తిగా చేసేముందు ఒక యువకుడు లోనయిన “అంతరంగమధనం” “హంపీకన్యలు” లో కనబడుతుంది = అని చెప్పవచ్చు.
ఈ కథ అంతా ఒక ఎత్తు,- కథ ముగింపు మరొక ఎత్తూనూ - ఇంత గ్రంధం అనతరం ్రక్కరోజు ప్రొద్దున్న శాంతియుత పరిస్థితులు నెలకొన్నతర్వాత - ఏమీ జరగనట్టుగా అతిసాధారణంగా, యాంత్రికంగా, “గుడ్‌బై” చెప్పి తనవాళ్లతో వెళ్లిపోతుంది హంపీకన్య మానవ ్రవృత్తిపట్ల చలంగారికి గల సంపూర్ణ అవగాహనకు ఇది మరొక ఉదాహరణ.
“- ప్రీ పురుషులిద్దరూ నిజమైన స్ప్నేహిశులు, దంపతులు కావాలంటే ఇద్దరికీ సంపూర్ణమైన స్వేచ్చ ఉండాలి. వ్యభిచారం చెయ్యడానికిగాని, మానడానికి గాని, స్వేచ్చ ఉన్నప్పుడే పతివ్రతలో, దడుర్మార్గులో కావడానికి అవకాశం ఉంది. - అసలు దుర్మార్గం చెయ్యడానికి స్వేచ్చ లేనప్పుడు పవిత్రులేమిటి ? - చాలామందితో స్నేహం కలిగి, భర్తమీది ప్రేమవల్ల భర్తతో తప్ప ఇతరులతో ఏ సంబంధానికీ ఒప్పుకోనప్పుడే నిజమైన పాతివ్రత్యం-” అని అంటారు చలంగారు “స్త్రీలో -
కోడూరి శ్రీరామమూర్తి మమా
- ఇలాంటి పతివ్రత కధను, తన విలువలను తానే అన్వేషించుకొనడంలో ఆమె లోనయిన సంఘర్షణలను, “సుశీలొ కధలో చలం చెప్పినతీరు ఆయన కథల పారకులు మర్చిపోలేరు. ఈ కధలోని నారాయణప్ప, సుశీల ఎంతో అన్యోన్యత కలిగిన దంపతులు. నారాయణప్పగారు తన భార్యకు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చారు. “- భార్య ఆత్మని చంపి, తనవశం చేసుకొని, తన ఊహలే ఆమె తల్లోపెట్టి, ఆమె నోట చెప్పించి మేమిద్దరం ఒకటయిపోయినామనే రకం కాదాయన +” (పే. 155).
ఈ స్వేచ్భా వాతావరణం కారణంగానే సుశీల పోలీసు సూపర్నెంట్ సులేమాన్‌కు సన్నిహితురాలు కాగలింది. అయితే - తన మనసు నిర్దేశించిన మార్గానికి విరుద్ధంగా జరిగే ఈ జీవితయానం ఆమెకు ఆనందాన్నిగాక, సంక్షోభాన్ని కలిగించింది. అపరాధ భావంతో ఆమె కుమిలిపోయింది ఇందుకు కారణం సంఘం, వ్యవస్థ నిర్దేశించిన నియమాలు, నైతిక సూత్రాలు కాదు. “బ్రాహ్మణీకం” నవలలోని సుందరమ్మలా అజ్ఞానంతో వచ్చిన అపరాధభావం కాదిది. నారాయణప్పగారిపై ఆమెకు గల ఢ్రేమ - నిజమైన (మమ, - ఇందుకు కారణం.
అపరాధభావం నుండి బయటపడి, నారాయణప్ప గారితో తనకు గల మానసిక తాదాత్యతనుతిరిగి పునరుద్ధరించుకొనడం కోసమే - సుశీల స్వాతంత్రోద్యమంలోకి దూకి సహాయనిరాకరణోద్యమంలోను, స్వదేశీ ఉద్యమంలోను, ముఖ్యమైన పొత్ర సర్యహించింది. ఒకనాటి ఆమె ఆలోచనలకు ఇది పూర్తివిరుద్ధమైన విషయం. సులేమాన్ కనబడేది ఉండే రోజుల్లో ఆమెకు స్వాతంత్రోద్యమం అర్ధరహితమైన విషయంగా మారు ఇర జదొరల పరిపాలన గొప్ప విషయంగా తోచేది. పరిస్థితులలో వచ్చిన
వదిల కరౌ మె స్వాకంత్రోద్యమంలోనికి దూకడంతో - మనసులోని కల్మషాన్ని 1గజర గది ఒక ఆలంబన అయింది. మనస్తత్వశాస్రజ్ఞులు చెప్పేక ఒకప్పుడు తన క కి ఇదొక ఉదాహరణగా భావించవచ్చు. దీని ఫలితంగానె ఆ ఆరాధనా స్తానంన. పొరలు కప్పిన సులేమాన్ పోలీసురీవిని, అధికార దర్చాన్నిి '5౦నుండి తొలగించుకో గలిగింది. “- ఈ ఉద్యమం, ఈ త్యాగం, అంతా చాన - ఒక జీవితానికన్నా ఉపకారం చేసింది. కొత్త అదర్శాన్నీ గౌరవం లేదు = “లి. ఇదివరకటివలెనే నీ వోదా, నీ ఉద్యోగం చూస్తే నాకేమి కాల్చిచంపడం జాహీ యూనిఫారం చూస్తే నాకు పంజాబు వధలు, నిరాయుధుల్ని గలిగుది ౬౬ వసాయి ౮ అనగల ఆత్మస్థయిర్యాన్ని ఆమె సమకూర్చుకో ది. ఒకప్పుడు - తనగుండెల నిండా ఆక్రమించిన సులేమాన్‌ను తలుచుకుంటూ “-నా శక్తికి మించిపోయింది, అందుకే లోబడాను-” అని ఆక్రోశించే అగత్యం ఆమెకు తప్పిపోయింది. 6
౨2222 తెలుగు కథ - నాడు,నేడు
ఇక - నారాయణప్పగారి విషయానికి వస్తే సుశీల, సులేమాన్‌ల వ్యవహారం ఫలితంగా తన గుండెల్లో రగులుతున్న ఆవేదనను మరిచిపోయేందుకు ఆయన సత్యాగ్రహిగా బెయిల్ నిరాకరించాదనీ, వైద్యులు హెచ్చరించినా వినకుండా చెజసాల పాలయి క్షయరోగాన్ని కోరి తెచ్చుకున్నాడనీ అనిపిస్తుంది. అతడిలోని [82900010 54001406 ని సూచిస్తాయవి
నారాయణప్పగారు తీవ్రమైన క్షయవ్యాధితో చెజసాలనుండి బయటకు వచ్చినప్పుడు అపరాధభావంతో కుమిలిపోతున్న సుశీలకు బొమికల కుప్పలాగ ఉన్న అతడిపై (ప్రేమ మరింత పెరిగిపోయింది. సులేమాన్ ఎంత (బ్రతిమాలినా వినకుండా అతడితో తెగదెంపులు చేసుకొంది. మదనపల్లి శానిటోరియమ్లో ఏ తల్లీ ఏ కొడుకుకూ చెయ్యలేని సేవలు చేసింది. “ఆయన సేవకు ఈ చేతులను నిర్మలంగా ఉంచలేకపోతినే-” అని రోదిస్తుందామె. ఇంత జరిగినా - సులేమాన్ సుశీలను వెదుక్కుంటూ మళ్లీ అక్కడకు వచ్చాడు. అతడిని వెళ్లిపొమ్మన్న తర్వాత - సుశీల మౌనంగా రోదిస్తూ ఉంటే - నారాయణప్పగారు అనునయంగా ఆమె భుజం మీద చెయ్యివేసి “-నీకు ఆనందం అక్కరలేదూ? -” అంటూ అతడితో ఆమెను వెళ్లవలసిందిగా కోరతాడు. అప్పుడు ఆమె “జరిగిందానికి ఏడ్చాను అంతే 1-” అంటుంది కధలోని ఆఖరివాక్యం ఇది. సుశీలలో రగిలే ఆవేదనాగ్నికి అక్షరరూపం ఈ వాక్యాలు
మనిషి గుండెల్లో కామభావన చేసే అలజడి మధ్యవయస్కులలోనే ఇంత సంక్షోభ జనితంగా ఉంటే - నూత్నయవ్వనుల విషయంలో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఈ అలజడికి అక్షరరూపం “యవనవ్వనం” కధలో కనబడితే, - [19610 ఫలితంగా పురుష స్పర్శ పట్ల విముఖత కలిగిన ఒక బాలిక అంతరంగ ఆవేదన “భార్య” కధలో కనబడుతుంది.
“-గర్భాదానాలతోనే మన ప్రేమకధలు ప్రారంభం అంటే _శీవోతో, - ఒక్కరికీ ఈ ఆచారాన్ని ఎదిరించే ధైర్యంలేదు -” అంటాడు చలం (మ్యూజింగ్స్- పే 49)
పురుష స్పర్శ అంటేనే అసహ్యించుకునే ఈ కథలోని సీతారావమ్మ వివాహం పేరుతో పెద్దలు దగ్గిరుండి జరిపించే 'రేపొకు గురి అయింది “- నేను వాంఛించే మార్పు ఈ వివాహంలో ఉన్న అక్రమాలు, అన్యాయాలు తొలగిపోవాలని - వివాహం వద్దన్నవాళ్లకు బలవంతంగా కట్టబెట్టకూడదనీ - వివాహం అయినంతమాత్రాన సర్వమూ నీతిగా కలవడమూ, కానంతమాత్రాన అవినీతి అనడమూ మూర్ధమని నా వాదన ౮ (మ్యూజింగ్స్ -పే. 48) - అంటూ ఆక్రోశించిన చలం తన తపన అంతటినీ సీతారావమ్మ అంతరంగ ఆవేదనగా వినిపించాడా అనిపిస్తుంది ఈ “భార్య” కథను చదివినప్పుడు.
కోడూరి శ్రీరామమూర్తి ౨22
- ఇలా చూచుకుంటూపోతే, - తన కధల్లో, నవలల్లో, మనిషి మనసులోని సంఘర్షణలను చలం చిత్రించిన తీరు బహుముఖంగా కనబడుతుంది. మానవ మనస్తత్వం లోని సంక్షిష్టకను సంపూర్ణంగా గ్రహించగల అక్షరశిల్సి ఆయన. లేకుంటే 'మ్యూజింగ్స్'లో- ”
“- ఈ దయాపరులు, రక్తం చూస్తే భరించలేని బ్రాహ్మలు, వీళ్లందరిలో ఎంతెంత శ్రార్యం దాగుందని అంటారు? - వేటలో కోర్కెని తీర్చుకోలేక - అది తనలో దాగొని ఉన్నదని కూడా తెలీక, - పిట్టల మీద, మృగాల మీద చూపని ఆ క్రౌర్యాన్ని మనుషుల మీద, కోర్టుల్లో ఆఫీసుల్లో ఇళ్లల్లో తీర్చుకుంటారు కక్ష గట్టి - (పే. 93 - 'మ్యూజింగ్స్)
“== వితంతు వివాహాలు చేసేవాళ్లకి ప్రీ మీద ఎక్కువ గౌరవం అనుకుంటామా - వాళ్ళకంటే చాలామంది పూర్వాచార పరాయణులకే స్త్రీల మీద ఎక్కువ గౌరవం చూశాను-
ఆార్వా గం
రోజూ భార్యలను కొట్టేవాళ్లను చూచి మండిపద్దాను. కాని, - సమయం వచ్చేసరికి వాళ్లల్లో చాలామంది ఆ భార్యల కోసం అద్భుతమైన త్యాగాలు చేస్తారు. షొ కులభేదాలు సర్వమానవ సౌభ్రాతృత్వానికి అడ్డు అనుకుంటామా - ఇరుగు
రుగువారి మీద (క్రేమను బట్టి చూస్తే ఈ కులభేదం పాటించే వాళ్లకే నిజమైన (్రేమ న అందువల్లనే కార్యాల్నిబట్టి మనుషుల్ని జడ్జి చెయ్యగూడదని ఎంత మొరబెట్టినా, న్న్ కథలు వ్రాసినా లాభంఉండదు -” (పేజీలు 27,28) విప్పగం అని వ్రాసిఉండరు. మనిషి మనస్తత్వం ఒక చిక్కు ప్రశ్న వంటిది దాని ముడి రచటషళతో మనస్తత్వ శాస్త్రజ్ఞుడికి మాత్రమే కాదు. నిశిత జీవిత పరిశీలనగల
కూడా ఉంటుంది. చలంగారు అందుకు ఓ మంచి ఉదాహరణ
చ
( లం శ్రతజయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంసాహిత్యపీరం, నిర్వహించిన సెమినార్లో చదివిన వ్యాసం 1994 - కొన్ని మార్పులతో-) ప్ డా
౨3222 తెలుగుకథ-నాడు,నేడు .2.2.ై22ైద222222222ఊ2చ2ాారడండ2 పొగమంచులో చిక్కుకున్న మనిషి కథను ఆవిష్కరించే ఒకి (త్రిపుర కథలు “మిత్ అఫ్ సిసిఫస్” అనే ప్రసిద్ధ గ్రంథంలో ప్రపంచ ప్రఖ్యాత రచయిత అల్బర్ట్ కామూ (4|102గ ౦౧౮49) ఇలా ఆంటాడు -
“నిద్రలేవడం, ట్రామ్ ఎక్కి ఆఫీసుకు వెళ్లడం, అక్కడ నాలుగంణదు గంటలు పనిచెయ్యడం, భోజనం, మళ్లీ ట్రామ్, మళ్లీ ఆఫీసు, మళ్లీ భోజనం - సోమవారం, మంగళవారం, బుధవారం, ఇలా అన్నిరోజులూ ఒకేపద్ధతిలో గడిచిపోతూ ఉంటాయి. చివరకు ఏదో ఒకరోజున - ఎందుకు? అనే ప్రశ్న విసుగుదల, ప్రారంభమవుతాయి. ఆ విసుగుదలలోంచే అంతా మొదలవుతుంది -” అని ! -
నిజమే, - ఇట్లాంటి గానుగెద్దు జీవితం వలన కలిగే మొనాటనీ ఆకలి సమస్యకన్నా భయంకరమైంది 1! కానీ, - దీనిగురించి ఆలోచించేవారు తక్కువ. ఈ ఆలోచన మొదలయిందంటే మనిషిలో అంతర్మధనం తప్పదు
“-జీవితానికి అద్ధం ఏమిటి? - అని ప్రశ్నలు లేవదీస్తూ - జవాబులు వెదకడం మానేసి చాలాకాలం అయింది - తవ్వుకున్న కన్నాల్లో, బారియల్లో, జంతువుల్లా వుంటే?- జీవితంలో "పేషన్ పోయింది నాకు. కాని, తెరుచుకుంటాయి ద్వారాలు మళ్లీ. సుఖంగా వున్నానా నేను?-” (త్రిపుర రచించిన *“చీకటిగదులు కథలో-) అని ఆలోచించడం మొదలుపెట్టిన మనిషికి ఏదో ఒకరోజున చుట్టూ వున్న ప్రపంచం నిరర్ధకంగా కనబడుతుంది తన విలువలకు, ప్రపంచపు విలువలకు తేడావున్నట్టు అవగతం అవుతుంది. నలుగురూ శిరోధార్యంగా భావించే సాధారణ విలువలు అంగీకరించలేక
- వాటినుండి విడివడి తన విలువలను తాను అన్వేషించాలనుకున్నప్పుడు పరాయీకరణ (46౧20౧) అనివార్య మవుతుంది. అంతేకాదు - పలుసందర్భాలలో తన విలువలు ఏవో తనకే అర్ధంకాని పరిస్థితి, తనకు ఆనందం ఎక్కడ ఎలా లభ్యమవుతుందో తెలియని
వర్త్రద2డడడడడడడడడడనద2 22 కోడూరి శ్రీరామమూర్తి మడ పరిస్థితి కూడా తలెత్తవచ్చు. దీని ఫలితంగా ఒక్కొక్కప్పుడు మనిషిలోని అపరాధభావం (3610 రగిలి ఆత్మహత్యా ప్రవృత్తి కూడా కలగవచ్చు.
- ఇట్లాంటి అస్తిత్వ సంక్షోభం (51516081 6౧515) మానవ జీవితంలోని అసంబద్ధత (4054161) పట్ల గ్రహింపుకు, సాహిత్యంలో స్థానం కల్పించిన కథకులు, నవలాకారులు, ప్రపంచ సాహిత్యంలో ఎందరో ఉన్నారు. సార్ట్, కాఫ్కా కామూ, ఆప్దైక్, మొదలయినవారు ఈ తరహాలో చిరస్మరణీయమైన రచనలెన్నో చేశారు. అయితే “ తెలుగులో ఈ ధోరణిలో వచ్చిన రచనలు తక్కువ. అందునా, కధలు మరీ తక్కువ. ఈ పనిని సమర్థవంతంగా చేసిన కధకుల్లో “త్రిపుర ఒకరు మాత్రమే కాదు చాలా ముఖ్యులు గూడా త్రిపుర అనే కలం పేరుతో కధలు వ్రాసిన రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు గారు 1928 సం॥ సెష్టెంబరు రెండవ తారీఖున జన్మించారు. కాళీ విశ్వే విద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తిచేసుకుని త్రిపుర రాజధాని అగర్తలలో చాలాకాలం ఆంగ్లోపన్యాసకులుగా పనిచేశారు. “త్రిపుర అనే పేరుతో 1963-78 సం1॥ల మధ్యకాలంలో రాసిన కొద్ది కథల్లో 18 కథలు (మంచిసంఖ్య !) 'తిపుర కథలు' అనే పేరుతో 1980 సం॥లో మొదటిసారి ముద్రించబడి, ఈ మధ్యకాలంలో మళ్లీ 'ప్రతురించబడింది. ఇన్ని తక్కువ కధలు రాసి, ఇంత పెద్దపేరు సంపాదించుకున్న కధకులు తెలుగులో అ్రగ్సుదు. పదక కుర్చిలో తశ్వీగా ప్రడ్తుక్తుని, కాలక్షేపానికి కథలు చదివే పారకులకు త్రిపుర కథలు అర్థం కావ, ఫ్రీ కథల్లో 'గాజుపెంకులు గుద్దిన ముఖం, కనురెప్పల క్రింద బలిసిన రెండుకుక్కలు' ంట్రి వర్ణనలతో పాత్రలు పరిచయం అయినప్పుడు పారకులకు ఆశ్చర్యం కలుగుతుంది, చాలాకథల్లో “కధ అనేది కనబదకపోవడమూ, ఒకవేళ కనబడినొ
- ఆ కథలోని పాత్రలు హేశ్రవాద్దానికి తావివ్వని రీతిలో విచిత్రమైన రీతిలో ప్రవర్తిస్తో ఉండడమూ, గమనించినప్పుడు పారకులు పలు సందర్భాలలో ఈ కధలను చిక్కుప్రశ్నల్లో భావిస్తారు. అత్తలూరి వారు అనేటట్టు “-త్రీపుర కథలు ట్రాన్స్పరెంట్ చీకటిలాగానూ: విశాఖపట్నం పిచ్చాసృ్రిలాగాన్తూ, సర్రియలిస్ట్ చిత్రాల్లాగానూ, ఉన్నట్టనిపించి మనల్ని గొభారపడతాయి !-
- అయికే, ఆ కథల వెనుకగల నేపథ్యం, పాత్రల ప్రవర్తన వెనుకగల మనస్తత్వ పరమైన కారణాలు అర్థంచేసుకుని కాస్త ఓపికగా చదవగలిగితే ౨ పృదయాంతర సీమలను ఆర్మీయంగా తట్టే అపూరూపమైన భావం అనుభవంలోకి వస్తుంది. ఓ
మవ అెలుగు కథ - నాడు,నేడు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. టత్రిపుర రచించిన పలుకథలకు నేపథ్యంలో ఉండే వారణాసి నగర వీధులు మనకు చాలాకాలంగా సుపరిచితమైనవే అనే భావం కలుగుతుంది.
పొగమంచులో చిక్కుకున్న మనిషి తన దోవను వెదుక్కుంటూ ప్రయాణం చేస్తున్నప్పుడు- అతడిలో వ్యక్తిగత విలువలకు, సామాజిక విలువలకు, మధ్య జరిగే ఘర్షణ - మనిషి గుండెల్లో వెలుగుచీకట్ల మధ్య (0౧గ91౪౩ ౮4౮2౩ ప్రవృత్తులు) జరిగే సంఘర్షణ, అపరాధభావం (164॥0/ ౦౦౧౨౩౦1౦౮5౧655), ఆత్మన్యూనతాభావం (1౧గ౦౫౦/ ౦౦౧౧|అ౦, అంతరంగ సంక్షోభాల ఫలితంగా వ్యక్తిలో కలిగే 1126060010 54001266 మొదలయినవన్నీ త్రిపురకధల్లో అద్భుతంగా కనబడతాయి. మనిషిలోని చీకటిగదుల కధను ఆవిష్కరిస్తూ - మానవ జీవితంలోని అసంబద్ధతను వేలెత్తి చూపించే కథలు ఇవి, - అందుచేత, త్రిపుర కధలను ఆస్వాదించాలంటే, కథాంశాల వెనుకగల తాత్వికదృక్పధం, పాత్రల ప్రవర్తన వెనుకగల మనస్తత్వపరమైైన కారణాలు, అవగతం చేసుకొనడం అవసరం
“-అసలు 'నేను ఎవరు ?- (చూ. "కనిపించని ద్వారం” కథ) అనే చిక్కుప్రశ్న (త్రిపుర రాసిన చాలాకధలకు కేంద్రబిందువుగా ఉంటుంది. “- తన్ను తాను తెలుసు కోవాలి. తనకేమికావాలో తెలుసుకోవాలి, తనలోంచి తాను వేరుపడి తనను వేరే చూచుకొనడం నేర్చుకోవాలి -” (జర్మన్ కధలో-) అనే ఆలోచనలు గల పాత్రలు (త్రిపుర కధల్లో అధికం అస్తిత్వవాద దృక్పధానికి ఇదే - కీలకమైన అంశం. కీర్క్గార్డ్ , కార్ల్జాస్పర్స్ మొదలుకొని జీనపాల్సాగ్రే వరకూ ఎందరెందరో అస్తిత్వవాదుల అలోచనలకు ఇదే కేంద్రబిందువు. (అస్తిత్వవాద సిద్ద్ధాంతకర్తలు దీనినే ౯౮6 ౬0801, ౬16 ౧౦4౧5౦1, ల మధ్యగల తేడాగా చెబుతారు)
అస్తిత్వవాద దృక్సధంగల వ్యక్తుల ప్రవర్తన సాధారణ వ్యక్తుల ప్రవర్తనకు భిన్నంగా ఉంటుంది. చాలామందిలాగా గానుగెద్దుల్లా బ్రతికేధోరణి వీరిలో ఉండదు. అందువల్ల ఒంటరితనం, పరాయీకరణ (%॥16౧460౧) వీరి జీవితాల్లో అనివార్యమవుశుంది. (వ్యక్తి సమాజంలోని అసంబద్ధత గి0586గ6/ -ని గుర్తించగలగడమేఈ గ16౧౭40౧కు కారణం)
ఈ తరహా |॥6౧౭10౧ గల పాత్రలు థత్రిపుర కథల్లో చాలా కనబడతాయి. ౫18౧21౦౧ ఫలితంగా మనిషిలో ఆత్మహత్యా (ప్రవృత్తి రగిలే అవకాశం ఉంటుంది. 416౧౬1౦౧ కు, అసంబద్ధతకు, ఆత్మహత్యా ప్రవృత్తికి, మధ్యగల సంబంధాన్ని చెబుతూ శి[86గ1 ౦4౧౫౮5 “1౧6 61/01/0686 081466౧ గొడగి &౧6 ౧1 116, 16 ఇం10! ఇ౧౮ 1౧6
న్త్రందనననననడనననన.2222న22222ఊచఊఊఊఊ కోడూరి శ్రీరామమూర్తి ౨222 5611౧0 - 15 ౧౧౦౧61౫ 116 166100 020390641610/ 41 [౧6౭14/ ౧౪౧ ౧౭౪౧౧౦ ఛం0ం1 01161 9౪410166, 1 0౧ 08 566౧ ౪/00౪1 14౧౧౦౯ ఆఅ(|2౧2(౧౦౧, 21 (616 15 & 616061 00౧౧౭౦100౧ 061466౧ 1119 18611౧3 2౧౮ ౫9 10౧01౧౦ 10౯ ర6241)- అని అన్నాడు. అంతేకాదు - "౫61913 0౪610౧6 1410/ 960౬9 ౧౧1॥090011041 ౧౧౦916గ = ఇగ6 02113 8610166 అని కూడా అన్నాడు.
“- జీవిత పరిమితుల్ని ఒక్క దుముకులో దాటెయ్యాలి. తలచుకున్నప్పుడు చావు. ఎవరో, ఏ జబ్బో, ఏ క్రిములో చంపెయ్యకముందే - దర్జాగా మనల్ని మనం చంపుకోవాలి. బాత్‌టబ్‌లో వేన్నీళ్ళు నింపి, అందులో పడుకుని రిస్ట్దగ్గిర బ్లేడుతో కోసుకుంటే గంటలో తియ్యగా చావు. కాని, -నాకలా ఇష్టం లేదు. స్మెస్కేపర్ పదమూడో అంతస్థు మేడ మీదనుంచి పేవ్మెంట్ మీదకి దుమికి రక్తం కక్కుకుని చావాలి (ప్రయాణికులు కథలో) అని, తమకుతాము అంతం చేసుకోడానికి పధకాలు వేసుకునే పాత్రలు త్రిపుర కథల్లో దర్శనమిస్తూ ఉంటాయి. ఈ తరహా పాత్రలన్నింటిలోనూ ఏదో ఒక విధమైన ౫16౧౭101 కనబడుతూ ఉంటుంది.
ఈ విచిత్ర ప్రవర్తన వెనుక - మానసిక కారణాలు కూడా అనేకం ఉంటాయి. బాల్యజీవితంలో గుండెల్ని రగిలించిన చేదు అనుభవాలు, పెద్దలు పిల్లల్ని పెంచడం విషయంలో చేసిన పొరబాట్లు, పెద్దయిన తర్వాత - వారిలో అంతరంగ సంక్షోభాలు కలిగేందుకు ఎలా కారణం అవుతాయో సిగ్మరిడ్ ఫ్రాయిడ్, ఆల్(ఫెడ్ ఆడ్లర్ మొదలయిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు “సెకోఎనాలిసిస్కు సంబంధించిన సిద్ధాంతాల్లో వివరించారు. ఈ నేపథ్యంలో కూడా క్రిప్పర కథల్లోని పాత్రల ప్రవర్తనను విశ్లేషంచవలసి ఉంటుంది.
మానవ ప్రవర్తనలోని వైచిత్రిని - మనోవైజ్ఞానిక దృక్పధం నుంది, అస్తిత్వవాద దృక్పథం నుండి, ఆవిష్కరించిన కథలు (వాటిసంఖ్య తక్కువే అయినప్పటికీ-) తెలుగులో లేకపోలేదు. అయికే- ఈ విషయంలో కూడా త్రిపుర కధలకు ఒక ప్రత్యేకత ఉంది. అది -అస్తిత్వవాద దృక్చథానికీ, మార్కి ఎస్టు దృక్పథానికీ, కధాపరంగా అనుసంధాన్ని చేసేందుకు (ప్రయత్నించడం.
స్థూలంగా చూస్తే - అస్తిత్వవాద దృక్సథమూ, మార్క్సిస్టు దృక్పధము ఒకదానితో ఒకటి సంబంధంలేని భావనలు, ఆస్తిత్వవాదం వ్యక్తివాదానికి సన్నిహితమైనదైతే, - మార్క్సిజమ్ సమిష్టివాదానికి చెందింది. కార్యకారణ సంబంధంపైనా, హేతువాద ధోరణి (౧40౧400) పైనా మార్మ్సిజమ్ ఆధారపడుతుంది. కార్యకారణ భావశూన్యత, నిర్జేతుకత్వం (17260౧4180), స్వేచ్భాయుతమైన ఇచ్చ, వ్యతిరేకత (169280౧) అనేవి
అస్తిత్వవాద ధోరణికి సంబంధించిన ముఖ్యఅంశాలు. అస్తిత్వవాద దృక్పథాన్ని మార్కిస్టు మేధావులు ప్రపంచ యుద్దాలకు, ఆర్ధికసంక్షోభాలకు, పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థ తట్టుకోలేకపోయిన కారణంగా పుట్టుకొచ్చిన విపరీత సిద్ధాంతంగా విమర్శిస్తూ ఉంటారు అస్తిత్వవాద సిద్ధాంతాన్ని సమర్ధించినవారు మార్క్సిస్టు దృక్పథంలో వ్యక్తి స్వేచ్చకు గల పరిమితులను, ౮౧|౦గ౧1/కి అవాంఛనీయమైన రీతిలో గల (ప్రాధాన్యతను నిరసిస్తారు.
అయితే, - ఈ రెండు సిద్ధాంతాల్లోనూ గ|16౧౭40౧ అనేభావం ప్రాధాన్యతను కలిగి ఉండడం చేత - ఈ రెండింటినీ సమన్వయం చెయ్యడం సాధ్యమేనని సార్ట్ భావించాడు. “42౧ 10౧10000 15 ౧౪౮౧౭౧19౪౦ 66919౧6418 గ, “4౧0౧109001 15 5501౧14021 500516౧112119గ) 1౧ 6600614! 12006206-” అని 6€గ౦ ౯౧౦౫ వంటి మేధావులు వ్యాఖ్యానించడాన్ని ఈ సందర్భంలో ప్రస్తావించుకొనవలసి ఉంటుంది ఈ తరహా ధోరణి (తిపుర రచించిన కొన్ని కథల్లో ఆసక్తికరంగా కనబడుతుంది.
- ఈ సంక్షిప్త పరిచయంతో త్రిపుర కధాప్రపంచంలోనికి అడుగుపెడదాం
2
త్రిపుర కధల్లో “భగవంతం కోసం), “జర్మన్, “కనిపించని ద్వారం), 'అభినిష్కమణ*, “సఫర్, “వంతెనలు, చాలామంచి కధలు అని నా అభిప్రాయం. వీటిల్లో - వ్యక్తిగతంగా నాకు 'జర్మన్, కధ అంటే మరీ ఇష్టం (త్రిపుర తనకు ఇష్టమైన అస్తిత్వవాద దృక్పధాన్ని జీవితంలోని అసంబద్ధతకు సంబంధించిన ఆవిష్కరణను, ఈ కథల్లో పారకుల హృదయాలను హత్తుకునేలా అందించగలిగాడని నా అభిప్రాయం. అంతేకాదు - శిల్పపరంగా కూడా ఈ కధలో పరిపూర్ణత ఉన్నది. సిద్ధాంతాలను వల్లించే మేధావులకు, తాము నమ్మినదాన్ని అక్షరాలా ఆచరణలో పెట్టి చూపించగల కర్మయోగులకు మధ్యగల తేడాను ఈ కధలో అద్భుతంగా చెబుతాడు (త్రిపుర.
“-పసుపూకాదు, ఆకుపచ్చా కాదు. మిరిమిట్లుగొలపదు. అంగుళం పొడుగు నాలుగు ముఖాల అందం -”
*జాగ5 ౧౦౧౦౭౧1 (116౧4౪0౧) [5 ౧118! ౧ [46౧1610 6౧8౧/ ౪516౧2115౧ - జర *జోం౪6 సక/0%01001021 1౧16౧౧౧61200౧5 01 గా౭౧౮5గా = ష[6గడ60౧ (౧ గొడగి౦క 56166 [౧8౩ & 606016 ౦గ1౧ 1౧ 6 ౧౮౫౭గ9౩3౧౦53 01 ౧౮౧౧౬౧ 081౧0౩ [0 00౧1౧0] ౧౭౫౧౩, &౧6 96800౧6) 1% 16 93 900610 1౧ 8 శి18౧౬1100 0 1200౪64 9 113 ౧౧౦౮౦1 -
109940/ 0 ౧౧|౦9౦౧౧104 16౧౧9 (౯0162109 01 14౧691 ౧౧0300౧/- 660౧9 $04460"
వర్తన. కోడూరి శ్రరామమూర్త ౨ “నేను ఆంటూ మనకు కథను చెప్పే ఒక ప్రాఫెసర్గారికి రంగూన్లో వీరాస్వామి అనే కోటీశ్వరుడు ఇచ్చిన 'జర్మన్' రాయి రూపమిది. వీరాస్వామి కూడా జర్మన్రాయి లాంటివాదే. జర్మన్ అనే మామూలు రాయిలో అపురూపమైన అందాలు ఉన్నట్టుగానే - అంతగా చదువుకోని వీరాస్వామిలో అరుదుగా మనుషుల్లో కనిపించే లక్షణాలున్నాయి. వివేకానందస్వామి భారతీయులకు ఉండాలని కోరుకున్న “ఇనుప కండరాలు, ఉక్కునరాలు” వీరాస్వామికి ఉన్నాయనిపిస్తుంది. లేకుంటే - కేవలం డబ్బుసంపాదనే లక్ష్యంగా పెట్టుకుని, ఎన్నో అక్రమాలు చేసి, కోట్లకు కోట్లు విలువయిన 'కార్గోబోట్లు (౧8౦ 80213) సామ్రాజ్యానికి దేశంగాని దేశంలో అధిపతిగా ఎదిగిన వీరాస్వామి - ఆ సంపదనంతా హరాత్తుగా, ఐచ్చికంగా, వదిలేసి భారతదేశానికి తిరిగివచ్చి కూలీలమధ్య ఓ పూరిపాకలో ఏ విధమైన గుర్తింపు, గౌరవం లేకుండా బ్రతుకుతాడా? - చివరకు ఆ ఐడుగుజీవుల కోసం (ప్రాణాలు కూడా అర్బణ చేస్తాడా ?- గాంధీజీ తన సిద్ధాంతాల్లో పదే పదే ప్రవచించిన ౪0౪16౧(2౧/ ౧౦౪౭గ) (ఐచ్చిక దారిద్ర్యం) అనే భావనకు, - వ్యక్తి తన విలువలను తానే అన్వేషించుకోవాలని అస్తిత్వ వాదులు ఇచ్చే సందేశానికి, ఈ కథలోని వీరాస్వామి ఒక గొప్ప ఉదాహరణ. "[42౧ 13 ౦౪1౧9 01021౪0100 ౧6 ౧౧౬69 01 [౧17561 అనే సార్ర్ పలుకులకు వీరాస్వామి ఒక అక్షరరూపం, వీరాస్వామి ప్రవర్తనలో మనస్తత్వపరమైన చిక్కుముడులు కూడా కొన్ని ఉన్నాయి. మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పే 801/06180౧4%/ అతనిలో ఉంది. చిన్నప్పుడు అకారణంగా గొంగలీ పురుగుల్ని కొట్టిచంపి ఆనందించేవాడు. కాని, అంతలోనే - తనకి త్రాగడానికి ఇచ్చిన పాలను అత్యంత దయతో పిల్లికి పోసి అది త్రాగితే సంతోషించేవాడు. మంటల్లో కాలిపోతున్న ఇంట్లోకి ప్రాణాలకు తెగించి జొరబడి మూడేళ్ల అబ్బాయి ప్రాణాలను కాపాడినందుకు ఒకప్పుడు బర్మా ప్రభుత్వం అతడికి బంగారు పతకం ఇచ్చింది. అయితే,
- అదే బర్మా ప్రభుత్వం మరొక సందర్భంలో వీరాస్వామి ఒక అమ్మాయిని 'రేవ్ చేసినందుకుగాను జైలుశిక్ష విధించింది. వీరాస్వామి క్రూరత్వం భరించలేక అతడి భార్య ఆత్మహత్య చేసుకుంది. అతని దగ్గిర పనిచేసేవాళ్లు అతని క్రూరత్వానికి మలమల మాడిపోయేవారు. ఈ విరుద్ధ ప్రవృత్తుల్లో ఏది తన సహజ'్రవృత్తి అని తెలుసుకోడానికి వీరాస్వామికి చాలాకాలం పట్టింది. ఈ అన్వేషణలోనే వీరాస్వామి అనే మామూలు మనిషి “'సూపర్మాన్' లాగా ఎదగగలిగాడు.
2 తెలుగు కథ - నాడు,నేడు
వీరాస్వామి మొదట్లో తనకు ఆనందం సంపదలో మాత్రమే దొరుకుతుందను కున్నాడు. దానిని సాధించడం కోసం అనేక అద్దుదార్లు తొక్కాడు సభ్యమానవులు హర్షించలేని ఏహ్యమయిన పనులు చేశాడు. కాని, - చివరకు ఆనందం దొరికేది అక్కడ కాదు అని తెలుసుకుని, - ఆ సంపదనంతా వదులుకొని, బీదవాళ్లలో వబీదవాడుగా బ్రతికాడు. వాళ్లు అతడిని ఏ మాత్రమూ ఆదరించకపోయినా - వాళ్ల ఇళ్లు కాలిపోతూంటే, మంటల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడం కోసం తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. “= ట్రతికున్నంతకాలం గీరగాడని ఒగ్గేసినాం - బస్మం అయ్యాక ఆడిని తలుచుకోని రోజు లేదు -” అంటాడు, శ్రామికవాడలోని ఒక శ్రమజీవి మనకు కథకు చెప్పే వ్యక్తితో -
దారిద్ర్యంలో మృత్యువులో, వీరాస్వామి తనను తాను తెలుసుకోగలిగాడు. తానేమిటో ఇతరులకు చెప్పగలిగాడు
గను అంటూ ఈ కధలో మనకు కథను చెప్పే వ్యక్తి - తత్వశాస్త్రంలో పేరుపొందిన మేధావి బౌద్ధతత్వాన్ని గురించి, అనాసక్తయోగాన్ని గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. అతడికి రంగూన్లో వీరాస్వామి పరిచయం అయినప్పుడు - వీరాస్వామిలో ఒక అసంతృప్తి ఉందన్న విషయాన్ని గమనించాడు. “అతడు (వీరాస్వామి) తనకు ఏది కావాలో తెలుసుకుని తనను తాను తెలుసుకోవాలి-” అనుకున్నాడు.
కాని, - అతికొద్ది సంవత్సరాల్లో వీరాన్వామి అనాసక్తయోగాన్ని ఒట్టి కబుర్లుగా కాకుండా, - అక్షరాలా ఆచరణలోపెట్టి ఎవరూ అందుకోలేనంతటి ఎత్తుకు ఎదిగిపోతాడని మనకు కథనుచెప్పే ప్రొఫెసర్‌గారు ఊహించలేకపోయాడు. మన కథలోని తత్వశాస్త్ర మేధావి “ఆలోచనకీ, తెలుసుకోడానికీ, మధ్య అఖాతం ఉంది. అది ఆలోచిస్తే తెలియదు-” అని తెలుసుకోగలిగాడు గానీ, - “తెలుసుకోడానికి ఏం చెయ్యాలో తెలుసుకోలేక పోయాడు. లేకుంటే - కళ్యాణి గురించి అంతగా ఆవేదన చెందేవాడు కాదు కాని, వీరాస్వామి ఆలోచనకి, తెలుసుకోడానికి, మధ్యగల అఖాతాన్ని - హోరుపెట్టే జలపాతాన్ని కూడా లెక్కచెయ్యకుండా - అవతలిగట్టుకు సునాయాసంగా గెంతేశాడు ! అప్పుడే - మనకు కథను చెప్పే 'నేను” కు తెలిసివచ్చింది “-అవతలిగట్టుకు గెంతెయ్యగలననీ, మానవ మాత్రుణ్జి కాననీ-”
ఎంతోకాలం గుర్తుండే కథ ఇది.
- త్రిపుర కధల్లో 'భగవంతం కోసం” ఒక విలక్షణమైన కథ. ఎవరికోసమైనా ఎదురుచూడ్డం అనేది పలుసందర్భాల్లో విసుగుదలను కలిగించే వ్యవహారం. మరి,
మర్త్రద2డడడడడడడడడడడడడడ222 కోడూరి శ్రీరామమూర్తి ౨2 రావాల్సిన వ్యక్తి ఎలా ఉంటాడో, ఎందుకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎందులో వస్తాడో, ఇవేమీ తెలియకుండా ఎదురుచూడ్దం అనేది జరిగేటట్టయితే - అందులో అసాధారణత మాత్రమేకాదు. అసంబద్ధత కూడా ఉంటుంది. అలాంటి అసంబద్ధతను ఆవిష్కరించే కధ యిది.
“- భగవంతం చెప్పకుండా వస్తాడు. ముందు చెప్పినా ఎట్నుంచి వస్తాడో తెలియదు. ఎట్నుంచి వస్తాడో తెలిసినా అనుకున్న టైముకి రాడు. వచ్చినా అతనితో ఏం మాట్లాడతాం?”
-ఇలాంటి భగవంతం కోసం మనకు కధను చెప్పేవ్యక్తి గంటల తరబడి ఒక హోటల్లో నిరీక్షించి - “భగవంతం రాడు. అట్నించి ఏడో నెంబర్లోనూ రాడు. ఇట్నించి పదమూడో నెంబర్లోనూ రాడు. నా పిచ్చిగాని ౮
- అనుకోవడంతో నిరీక్షణకు స్వస్తి చెప్పడం జరుగుతుంది. కథ ముగుస్తుంది.
నిజానికి, కథ అనేదే లేని ఈ కధలో “భగవంతం”? అనబడేవాడు మామూలు వ్యక్తికాడు. “భగవంతం అనేమాట భగవత్ స్వరూపానికి ప్రతీక అని అనుకుంటే, -పరమాత్మ పొందుకోసం జీవాత్మ చేసే అనంత నిరీక్షణ ఈ కధలోని ప్రధాన అంశం అవుతుంది. దాదాపుగా ఇదే భావాన్ని మరొకవిధంగా వ్యక్తీకరిస్తూ త్రిపుర “హోటల్ అనే మరొక కధను కూడా రాశారు. ఇందులో “హోటలో అనేది అస్తవ్యస్తమైనరీతిలో ఉన్న సమకాలీన సమాజానికి ప్రతీక. భగవంతం వస్తాడనుకునే ఏడో నెంబరు బస్సు హిందూమతానికీ, పదమూడో నెంబరు బస్సు క్రైస్తవ మతానీకీ ప్రతీకలు మనకు కథను చెప్పే వ్యక్తితో భగవంతం నాలుగు గంటలకు వస్తానని చెప్పడం - హిందూ మతంలోని నాలుగో ఆశ్రమానికి ప్రతీకగా చెప్పవచ్చు.
- ఇంతకూ ఈ భగవంతం రాకకు సంబంధించిన వ్యవహారం ఏమిటి? - భగవంతం అనబడేవాడు ఉండి ఉంటే - ఏదో బస్సులో వచ్చివుండేవాడు. కాని, - అతగాడు “ఉన్నిధన్' అనే హోటల్ సర్వరు ఇచ్చే కాఫీ అనే గోధుమరంగు ద్రవంిలాగ “ఉత్త గోధుమరంగు వేడి ఊహా అయినప్పుడు ఎలా వస్తాడు? మన భ్రమగాని ! -
భగవంతం కోసం సుదీర్హ వ్యర్థనిరీక్షణ చేసిన వ్యక్తి - మధ్యమధ్యలో కాఫీలు త్రాగడానికి గాను హోటలు ప్రొప్రయిటరుకు ముందుగానే నాలుగుకాఫీలకు డబ్బు చెల్లించాడు. (లేకుంటే
- అతగాడు తన కనురెప్పల క్రింద బలిసిన రెండు పోతుల్లాంటి కుక్కలను ఉసిగొల్పడూ?-)
కానీ, - మూడుకప్పుల కాఫీయే త్రాగాడు. “మూడు త్రాగాను, నాలుక్కిచ్చాను. మిగతాది 'పర్గెటేరియో'లో మనం కలుసుకున్నప్పుడు ఇద్దురుగాని- అంటూ చివర్లో అతడు
332 తెలుగు కథ - నాడు,నేడు అన్న మాటల్లో వ్యర్థనిరీక్షణ ఫలితంగా అంతరంగంలో రగుల్మొనే ఆత్మహత్యా ప్రవృత్తికి సంబంధించిన వ్యధ ఉంది.
“*- వీ భయాలు, అనుమానాలు నాకు తెలుసు. భరించలేననుకుంటే - ఇక లాభం లేదనుకుంటే పరిగెత్తుకుని రా - వాళ్లని వదిలేసి. నా ఇంటిద్వారం ఎప్పుడు తెరుచుకునే ఉంటుంది -” అని మొదట్లోనే భగవంతం కధను చెప్పేవ్యక్తికి చెప్పివున్నాడు కాదూ? - సేమ్యూల్ బెకెట్ రచించిన “4214౧ 10 0601 ను జ్ఞాపకం చేసే కథ ఇది -
3
“వంతెనలు, “కనిపించని ద్వారం”, కథల విషయానికి వస్తే - వాటి తరహా వేరు. వ్యక్తి అంతరంగ సంక్షోభానికి, సామాజిక సంక్షోభానికీ, మధ్యగల చిక్కుముడి ఈ కధల్లో మనకు కనబడుతుంది.
నిజానికి - ఈ రెండు కధలూ కధానాయకుడి ఆత్మహత్యతోనే ముగుస్తాయి. కాన్మి - ఈ రెండు కథలూ మనలో ప్రేరేపించే భావాలు మాత్రం వేరు.
కనిపించని ద్వారం” కధానాయకుడు నారాయణకు జీవితంలో చాలామందికి లేని అవకాశాలున్నాయి. అపారమైన సంపద ఉంది కొడుకు ఆనందంకోసం ఎంత డబ్బయినా ఖర్చు చెయ్యడానికి వెనుకాడని తండ్రి ఉన్నాడు. సర్వవేళలా సేవలు చెయ్యడానికి కాచుకుని వుండే సేవకులు ఉన్నారు. కాని, - అతగాడికి జీవితంలో శాంతి అనేది లేదు.
“- అసలు నేను ఎవరు? -” అనే ప్రశ్న అతడిలో అస్తిత్వ సంక్షోభం (౬1518024 011519) ను సృష్టించింది. బాల్యజీవితంలోని విషాద సంఘటనలు అతడిలో సృష్టించిన మానసిక ఆవేదన (మనస్తత్వ శాస్తపరిభాషలో గ౧౧2| 1౧2౧౭) తనను తాను హింసించుకునే $/25001%10 ప్రవృత్తికి దారితీసింది. పూజగదిలో తండ్రి తల్లిని హత్య చెయ్యడం (ఈ ఉదంతం త్రిపుర రచించిన మరికొన్ని కధల్లో కూడా కనబడుతుంది 1) అతడిలో తండ్రిపట్ల ద్వేషాన్ని రగిలిస్తే - తెలిసీ తెలియని వయస్సులో కలిగిన సెక్సు అనుభవం 0/21 31% గా అతడిలో అపరాధభావాన్ని రగిలించింది. పదిహేడేళ్ల వయస్సులో చెప్పాచెయ్యకుండా ఇంట్లోంచి పారిపోయాడు. దేశదిమ్మరిగా తిరిగి పలు రకాల బాధలకు, అనుభవాలకు గురిఅయ్యాడు. ఇదంతా అతడిలోని ఆశాంతి ఫలితమే!
- నారాయణ తండ్రిని ద్వేషించడానికి అతడిలోని ఆత్మన్యూనతాభ్రాంతి (౧గ0గ౧0/ ౦౦౧౧౧|అ౮ కూడా ఒక ముఖ్యమైన కారణం తండ్రిలా సమాజంలో ఇమిడిపోయి
వష్రలద2ైడడన2డడ2డ2డదడద22222222ఊ2ఊఊ22 కోడూరి శ్రీరామమూర్తి ౨222 సుఖజీవనాన్ని గడపగల శక్తి అతడికి లేదు. (ఈ కథలో - ఇంటికి చాలాకాలం తర్వాత తిరిగివచ్చిన నారాయణ బ్రతికి ఉన్నప్పుడు తండ్రివాడిన హవానా చుట్టలపెట్టెను చూస్తాడు. ఆ పెట్టెలో రెండు చుట్టలుంటాయి. ఒకటి - సెల్లోఫెన్ కవరులో ఉంటుంది. మరొకటి - సెల్లోఫెన్ కవరునుండి విడిపోయి అడ్డంగా పడిఉంటుంది. అది చూచి నారాయణ భోరుమని ఏడుస్తాడు. ఒక చుట్ట నారాయణ తండ్రి ప్రవృత్తికీ, మరొక చుట్ట నారాయణ ప్రవృత్తికి సంకేతాలు). సమాజ విలువలను కాదని తన విలువలేవో అన్వేషించుకుని సాధించుకోగల సత్తా నారాయణకు లేదు. ఈ కారణం చేతనే ఆత్మన్యూనతాభ్రాంతితో నారాయణ తండ్రిని తప్పించుకుని తిరిగాడు. తండ్రి చనిపోయిన తర్వాత, - ఇంటికి తిరిగివచ్చి - తండ్రినుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని కాలదన్నాడు. చివరకు - సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు (చనిపోయే ముందు - జోళ్లకు పాలిష్ కూడా పెట్టుకున్నాడు !-) అయితే - ఇదంతా ఎందుకు చేశాడు? - ఈ 'ఎందుకు”- అన్న ప్రశ్నకు నారాయణకు సమాధానం దొరకలేదు. గోపీచంద్ సృష్టించిన సీతారామారావును వేధించినట్టగానే ఈ “ఎందుకు? “ఎందుకు?” - అన్న ప్రశ్న అతడిని చివరిదాకా కాల్చుకుతింటూనే ఉంది. ఈ (ప్రశ్నకు సమాధానం లభిస్తే - గోపీచంద్ సీతారామారావు లాగా - ఒక “డోరియన్ గ్రే లాగా నారాయణ నిందునూరేళ్ల జీవితాన్ని ౩7 సంవత్సరాలకే ముగించుకోవాల్సిన అగత్యం ఏర్పడి వుండేదికాదు. అదే - అతడి జీవితంలోని కనిపించని ద్వారం, ఒక వ్యక్తి అంతరంగంలో రగిలిన బీభత్సానికి అద్దం ఈ కథ. విష్లవస్ఫూర్తి మనుషుల గుండెల్లో పెంపొందించే త్యాగశీలత, - అదే గుండేలో దాఉన్న మరుగుజ్జు మనస్తత్వం కలిగించే భయాలు, రెచ్చగొట్టే బలహీనతలు, - పరస్పరం సంఘర్షించి అంతరంగంలో ఎలాంటి అలజడులను రేపుతాయో, వాటి ఫలితాలు ఎలావుంటాయో - 'సఫర్, 'అభినిష్కమణు కథల్లో చెబుతాడు త్రిపుర. “నువ్వు సీజర్‌వి కావు కాలేవు జుడాస్వి అవగలవు కాని - నువ్వు జుడాస్వి కావు - నీ చీకటిగదిలో ద్వారం తెరుచుకున్నప్పుడు ఏ కాంతి కనిపించింది? - ఏ ద్వారం
222 తలుగు కథ - నాడు,నేడు తెరుచుకుంది? - అసలు ఏ ద్వారం తెరిచావ్? -” (సఫర్ కధలో) - అని ప్రశ్చిస్తాయి ఈ కథలు.
ఒక విప్లవకారుడి హృదయంలో క్రైస్ట్, జుడాస్, ప్రవృత్తుల మధ్య జరిగే సంఘర్షణను యథాతధంగా (కొంతవరకూ) చైతన్యస్రవంతి రీతిలో మనముందు ఉంచుతుంది. 'సఫర్ కథ.
“నీ విస్కీ మత్తునిన్ను కొంతవరకూ అబ్జెక్టివ్ చెయ్యగలదు. కాని, - దాని మోతాదు ఎక్కువ అయినప్పుడు నీ రెండో చీకటి ద్వారం తెరచి నిన్ను పిలుస్తుంది. అందులోకి వెడతావు. అప్పుడు జుదాస్వి అవగలవు కాని - అవవు. 7౧41 15 ౫౦౪! 66960) (సఫర్ కథలో-)
ఈ కథలోని కథానాయకుడికి రెండు వేల మైళ్ళ దూరంలో సంసారం ఉంది. తోటలున్నాయి. స్టీరియోలో నిర్మలేందు చౌదరి పాటలు వినగల అభిరుచి ఉంది. కాని,
- వివ్లవాల పట్ల మక్కువతో ఉద్యమంలో చేరాడు. విప్లవం త్యాగాన్ని కోరుతుంది. విప్లవకార్యాచరణ ఆత్మసంతృప్తిని ఇస్తుంది. కాని, - ఆశయాల బెడదను వదిలించుకుని పారిపోతే, వెనుకటి జీవితం వలన లభించిన సుఖాలన్నీ యధాతథంగా లభిస్తాయి. కాని, - అది అత్మహత్యాసదృశ మవుతుంది. ఈ స్థితిలో - బాధలను ఓర్చుకుంటూ ఎరుపురంగు వేపు సాగిపోవాలా? లేక ఎర్రటిగాజులు ఇచ్చే సుఖాన్ని జుర్రుకోవాలా?
- ఎర్రటి విస్కీమత్తులో మునిగిపోవాలా? - ఎడతెగని ఈ అంతస్సంఘర్షణ కలిగించే ఆవేదన ఇందులోని కథావస్తువు 41ని, 51౧ని, తప్పించుకోవాలని ఒక విప్లవవాది పదే అరాటం అంతా ఈ కధలో కనబడుతుంది.
ఇక, - 'అభినిష్రమణ” కధ విషయానికి వస్తే - ఈ కథలోని కథానాయకుడు కూడా బాగా సంపన్నుడు పెద్దబంగాళా. చుట్టూ పెద్దతోట అందులో దేశదేశాల్నించి ప్రత్యేకంగా తెప్పించిన గులాబీల ఆర్మిడ్స్ షెల్ళులనిండా హార్వర్డ్ క్లాసిక్స్ - నిర్మలేందు చౌదరి, అబ్బాస్ ఉద్దీన అహ్మద్ రికార్డులు - ఓర్గ్స్మగ్లర్, బ్లాక్నైట్స, విస్కీసీసాలు - (ప్రేమించే భార్య సుశీల - సాధారణ ప్రమాణాల్లో చూచినప్పుడు 'సుఖంగా' జీవించడానికి కావలసిన హంగులన్నీ ఉన్నాయి.
కాని, - మన కథానాయకుడు “కాజలో అనే విష్లవకారుడివలన ప్రభావితుడయి, ఈ సుఖాలనన్నింటినీ పరిత్యజించి, - విప్లవోద్యమంలోకి చేరాలనుకున్నాడు. ఐశ్వర్య వంతుల పక్షాన కాకుండా - ఆకలితో అలమటించే నిర్భాగ్యులకు బాసటగా నిలబడాలను కున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే - అపర గౌతమబుద్దుడిలాగా 'మవాఖభినిష్కమణి
కోడూరి శ్రీరామమూర్తి హె చేసి కొత్త అవతారం ఎత్తాలనుకున్నాడు. రివాల్వర్ చేతబూనాడు. “-అనంతంగా దిగంతందాకా వ్యాప్తిచెందిన ఈ ఎర్రటి పొగమంచులో - నిన్ను నేను చూడలేకు౦డా వున్నాను” ఆంటూ గాఢనిద్రలో ఉన్న తన భార్య సుశీలకు అర్ధరాత్రివేళ మౌనంగా మనసులో 'సేర్వెల్ చెప్పుకున్నాడు. “ఎర్రటిరంగుల్లో చిత్రించిన బుద్దుడి పిలుపు స్వంతం చేసుకున్నా ననుకున్నాడు. కానీ, - అంతలోనే ఆతడిలోని సంఘర్షణ మరోమలుపుకు దారితీసింది. పేలిన తుపాకీగుండు అతడి కణతల్లోకి దూసుకునిపోయి, - బతుకుకు అర్జాంతరంగా ముగింపును తెచ్చింది. అతగాడి గార్డెన్లో వున్న ఎర్రటి పాపీపువ్వుల లాన్‌మీద అతడి శవంపడి, - కొన్ని మొక్కలు నలిగిపోయినా - మళ్లీ తెల్లవారగానే పాపీమొగ్గలు ఎర్రగా జ్యోతుల్లాగా వెలుగుతాయి అనే సందేశం మిగిలింది ! - తానెవరో తాను తెలుసుకునేందుకు వ్యక్తిసాగించే వ్యధాభరిత అన్వేషణ లోలోన రగిలించే అస్తిత్వ సంక్షోభాన్నీ దానికి నేపధ్యంలో ఉండే మనోవైజ్ఞానిక కారణాల్నీ ఆవిష్కరిస్తూ - వ్యక్తి ఆవేదనను మార్క్సిస్టు దృక్పథపు కోణంలోంచి చూపించే కథలు ఇవి,
- ఈ సందర్భంలోనే మరొక విషయం గురించి గూడా చెప్పవలసి ఉంది. ఫ్రాయిడ్ గ్ధాంతాల్లో చెప్పబడే 16, ౬00, 5606౯ 580 ల మధ్య సంఘర్షణను యధాతథంగా, వ్ర్బిగా, పాత్రల అంతరంగ స్వగతాలలో (1౧18౧౦ ౧౧౦౧౦1౦8౮9) ఆవిష్మరించదలుచు జి డు చైతన్యస్రవంతి విధానం (59/9౧) 01 60౧9510645౧655 1900౧160౪9) పపయోగపదడుకుందన్న విషయం సాహితీపరులు ఎరిగిందే. తెలుగులో ఈ విధానాన్ని ర 'తల అంతరంగ సంక్షోభాలకు అద్దం పట్టేందుకు గాను - సందర్భోచితంగా ఎందరో చయితలు తమ కథల్లో, నవలల్లో ఉపయోగించుకున్నారు. అయితే, - వారిలో చాలామంది దీనిని కేవలం వ్యక్తిగతమైన “అంతరంగపు గొడవకు, అంతరంగంలో అణచివేయబడే శృంగార భావాల ఆవిష్కరణకు, ఉపయోగించుకున్నారే తప్ప, చుట్టూ ఉన్న సమాజంలోని అస్తవ్యస్త పరిస్థితులకు, అసంబద్ధతకు, వ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తున్నాడు అనే భావానికి అక్షరరూపం ఇచ్చేందుకు ఉపయోగించుకోలేదు.
- ఈ తరహా ప్రయత్నం త్రిపుర రచించిన “రాబందుల రెక్కలచప్పుడు” వంటి కథల్లో కొంతవరకూ కనబడుతుంది. “అమ్మా ! - నాకు చేతుల్లేవు నేను కళ్లులేని కబోదిని
మవ తెలుగు కథ - నాడు,నేడు నేను కుంటి.. ... వెన్నెల్లో అడవుల నిశ్శబ్దంలో వేటాడే తోడేళ్ల మూకలు చిలకల యుగం నెమళ్ల యుగం గుడ్లగూబలు కొండల మీద ఆదివాసుల ఆయుధాలు మెరుపులు, మేఘాల్లో ఉరుములు పల్లెల్లో మైదానాల్లో భయం పోలీసుల అన్రెస్ట్ .. .. చిరంజీవి సౌభాగ్యవతి కరుణాంజలి పెళ్లయున మూడునెలల్లోనే ఒంటిమీద కిరసనాయిలు వొంపుకొని . చిరంజీవి మస్తకేచ విలసత్కుంద ఉద్యోగం లేక రోడ్ల మీద....” (రాబందుల రెక్కలచప్పుడు' కధలో) వంటి వాక్యాలు ఆ “చప్పుడులోని కొన్నిభాగాలు. రాబందుల రెక్కలచప్పుళ్లు స్మశానాలుగా మారిన మానవ సమాజాల్లో మాత్రమే కాదు - వ్యక్తుల అంతరంగాల్లోని “జుడాస్ ప్రవృత్తిలో కూడా భయంకరంగా వినబడుతూ ఉంటాయి. మనిషి అంతరంగంలో దాగిఉండే ఇలాంటి వికృతమనస్తత్వాల అసలు కథను మనోవైజ్ఞానిక దృక్పథంలోంచి చెబుతారు త్రిపుర. ఇతడు రచించిన 'పాము, “చీకటిగదులు” వంటి కధలు మనిషి వ్యక్తిత్వానికి సంబంధించిన తాళంచెవి అతడి బాల్యజీవితంలోనే దొరుకుతుంది అనే సిగ్మండ్ ఫ్రాయిడ్ పలుకులను మరోమారు జ్ఞాపకం చేస్తాయి “పాము” కధలోని శేషాచలపతిరావు అలభఖ్ నిరంజన్, బైరాంఖాన్ మొదలయిన పేర్లతో నమ్మకద్రోహాం చెయ్యడానికీ, - అస్తవ్యస్త జీవితాన్ని గడిపిన “బీకటిగదులు' కథలోని శేషాచలపతి మిత్రద్రోహం, గురుద్రోహం చెయ్యడానికి వారి విషాద బాల్య జీవితమే కారణం 1! - ఇక, “చీకటిగదులు, కథలోని ప్రొఫెసర్‌గారికి కళ్యాజి అంటే అపారమైన (మేమ ఉన్నా ఆమె (ప్రేమను ఎందుకు తిరస్కరించాడు? - $4290010 ప్రవృత్తితో కళ్యాణి తన జీవితాన్ని కోరి ఎందుకు నాశనం చేసుకుంది? - ముక్తాదేవి తాను చనిపోయే సమయంలో (ప్రేమించిన భర్త 'బార్వేని దూరంగా ఉంచి 26౧ 866015) చదువుతూ ఎందుకు ఒంటరితనం అనుభవించింది? - ఇలాంటి చిక్కుప్రశ్నలు పారకులకు కలిగితే - వాటిన్నింటికీ సమాధానాలు మనోవైజ్ఞానిక శాస్త్రపరంగా దొరుకుతాయి. ఇలా - చూచుకుంటూ పోతే, - త్రిపుర కధల్లో మనిషిగుండెల్లోని చీకటిగదుల
కోడూరి శ్రీరామమూర్తి 222 కథను మనోవైజ్ఞానిక దృకథంలోంచి, అస్తిత్వవాదృక్పథంలోంచి ఆవిష్కరించిన తీరు పలువిధాలుగా కనబడుతుంది. అయితే,[- ఇవి పూర్తిగా వ్యక్తివాద ధోరణిగల కథలు కాకుండా, వీటిల్లో సామాజిక నేపధ్యం కూడా కనబడుతూ ఉండడం విశేషం
ముందే చెప్పినట్టు ,- త్రిపుర కథల్లో చాలా పాత్రలు ఆర్ధికంగా ఉన్నతవర్గానికి చెందినవి కావచ్చు. (సుబ్బారాయుడి రహస్యజీవితం'లో మధ్యతరగతికి చెందిన శ్రీమాన్ సుబ్బారాయుడి వంటివారిని మినహాయిస్తే -) ఇవాళ మన ఆర్థికవ్యవస్థను పట్టిపీడిస్తున్న ఆకలి సమస్య, దారిద్ర సమస్య వంటి వాటి ప్రస్తావన త్రిపుర కథల్లో అంతగా కనబడక పోవచ్చు తెల్లవారితే పొట్టగడవడం ఎలాగ అని లక్షలాది ప్రజలు కలవరపడుతూండే ఈ దేశంలో - తిని త్రీరికగా కూర్చొని “నేనెవరు?-” అంటూ తెగబాధపడిపోయే వ్యక్తుల అంతరంగ సంక్షోభాలగురించి, - తాడూబొంగరం లేనట్లుగా ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తించేవారి జీవనరీతి గురించి, తెలుసుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏముందన్న విమర్శ వినబడవచ్చు. (అస్తిత్వవాద దృక్పధంలో వెలువడిన సాహిత్యం గురించి చిరకాలంగా వినబడుతున్న ప్రశ్నే ఇది ప్రఖ్యాతకవి 1/11 4౮6౭౧. రష్యన్ నవలాకారుడు దొస్తోవ్స్కీ రచనల గురించి చెబుతూ -506180/ 00016 101 91914 ఆ౪౭౧/060/ ౪616 19 0081064310 2౧6 [15 0౧27201395 అని అనడం గుర్తుంచుకోదగ్గది). ఇక, - ఈ కథల్లో 12170/మృగ్యం అనేది మరి కొందరి విమర్శ ఈ “విమర్శలూ, “సందేహాలు, విషయం ఎలా ఉన్నా - మానవజీవితంలోని అసంబద్ధతను బహుముఖంగా మన ముందు ఉంచుతూ - చీకటిగదుల్లోని చీకటిని చీల్చగల కాంతికిరణాల అన్వేషణకు, - త్రిపుర కథలు పాఠకులను ఉద్దీపిస్తాయన్నది నిర్వివాదాంశం. పొగమంచులో చిక్కుకుని దోవ తెలియక అలమటించే వ్యక్తి తన దోవను వెదుక్కుకేంద్దుక్తు పడే తపన, లోనయ్యే ఆవేదన, సంఘర్షణ, వీటన్నింటినీ వర్మరేంగా అద్ధం పట్టే కథలివి, ఒకదోట అంటారు త్రిపుర - “అన్నింటినీ కలిపెయ్యంది ఒకటి గొల్పస్సులాగా కలిపి ఆలోచించండి. అర్హమయిపోతుంది. ఆ తర్వాత అంతా సులభమే” లని | (4వంతం కోసం కథలో క అది జరిగినరోజున “ఎర్రటి రంగులో చిత్రించిన బుద్ధుడు” ఇచ్చేసందేశాన్ని అవగతం చేసుకోగలం. త్రిపుర కథలు అంతర్లీనంగా ఇచ్చే సందేశం ఇదే 1 - (తెలుగు కథకులు - కథనర్శులు' = విశాలాంధ్ర ప్రచురణ 2001 వ్యాససంపుటి ౩వ భాగంలో ప్రచురితం)
మమ తెలుగు కథ - నాడు,నేడు కథకుడుగా తిలక్
తిలక్ గురించి రాద్దామనుకున్నప్పుడు చలం (మొదటి) నవల 'శశిరేఖ'కు ముందుమాట రాస్తూ శివశంకరశాస్రిగారు రాసింది జ్ఞాపకానికి వచ్చింది. అందులో ఆయన పుస్తకాలను రెండురకాలుగా వర్గీకరించారు. “- సామాన్య పుస్తకము ,పడవ 'ప్రయాణమువలె అట్టే కదలిక పుట్టించదు. చదివేటప్పుడు కాలం మృదువుగ్గా వెళ్ళి పోతుంది. ఏవిధమైన (శమా కలుగదు. చివరకు పుస్తకంమూసి నిద్రపోతాము. మర్నాడు దానిసంగతి తలపెట్టము. త్రాణగల పుస్తకములు కదలిక పుట్టిస్తవి. పాత ఊహాలను పారద్రోలి కొత్తభావాలను రగుల్కొలుపుతవి -” అని అన్నారు.
పుస్తకాల మాదిరిగానే కథల్లో కూడా సాధారణమైన కథలూ, త్రాణగల కథలూ, ఉంటాయి. (త్రాణగల కథలు ఆలోచనలను డ్రేరేపిస్తాయి. కదలికను కలిగిస్తాయి, అట్లాంటి త్రాణగల కథలు రాసిన తెలుగు కథకుల్లో బాలగంగాధర తిలక్ ప్రర్యేకించి పేర్కొన దగినవాదు.
“తిలక్ పుంఖానుపుంఖంగ కధలు రాసినవాడు కాదు. యాఖై ఏళ్ళు కూదా రాకుండానే 45 ఏళ్ళ చిన్నవయస్సులో కన్నుమూసిన తిలక్ యాఖైకథలు కూడా రాశాడనిపించదు. (1988లో విశాలాంధ్రవారు అప్పటికి లభించిన కథలు సేకరించి ప్రచురించినవి29). రాశి తక్కువ అయినా, వాసిగల కథలు రాసిన కథకుడాతదు.
కొంతమంది కధకుల్లా తిలక్‌ను వదో ఒక తరహాకు చెందిన కథకుడుగా వగ్గీకరించేందుకు వీలులేదు.
“= నా కవిత్వం కాదొక తత్వం
మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యో అయోమయం జరామరం -” (నా కవిత్వం' కవితలో)
షంిననడడడ22222222222222 కోడూరి శ్రీరామమూర్తి 22 అంటూ తిలక్ తన కవిత్వం గురించి చెప్పుకున్నది అతడి కధాసాహిత్యానికి కూడా వర్తిస్తుంది. *- కధలలో ఒక సిద్దాంతాన్ని ప్రతిపాదించడానికో బలపరచడానికో చేసే ప్రయత్నం కథాశిల్బంలో ఒక ముఖ్యమైన దోషం -” అని భావించాడు తిలక్. ఇది రాస్తుంటే నాకు చెహోవ్ పలుకులు జ్ఞాపకానికి వస్తున్నాయి “- నేను లిబరల్ను కాను. కన్సర్వేటివ్ను అంతకన్నా కాను. పురోభివృద్ధి అనేది క్రమానుగతిలో రావాలని నమ్మినవాడినీ కాను. ఒక సన్యాసిని కూడా కాదు. ఏదీ పట్టించుకోనివాణ్ణి కాదు. నేనొక స్వేచ్భా కళాకారుడిలా మాత్రమే ఉండాలని కోరుకుంటాడు. ట్రేడ్ మార్ములూ, లేబుల్స్ ఇవన్నీ మూఢనమ్మకాలని నా అభిప్రాయం -” అంటాడతడు ఈ అభిప్రాయం తిలక్‌కు గూడా ఆమోదయోగ్యం అయి ఉండవచ్చుననిపిస్తుంది
తిలక్ ఎలాంటి రంగుటద్దాలలోనూ (ప్రపంచాన్ని చూడలేదు. తన రచనల్లో చూపించలేదు. అతడి కథల్లో ఆర్థికంగా అట్టడుగు వర్గానికి చెందిన వీదవారు, మధ్యతరగతి కుటుంబీకులు, కడుపులో చల్లకదలాల్సిన అవసరం లేని ధనికులు, - ఇలా అన్ని ఆర్థిక వర్గాలకు చెందినవారూ కనబడతారు. ఆశలూ, నిరాశలూ, ఆత్మవంచనలూ, హిపోక్రసీలు, ప్రణయాలు, వైఫల్యాలు వీటన్నింటి ఫలితంగా గుండెల్లో చెలరేగే అలజడులు, ఆకలి దారిద్ర్యాలు సృష్టించే భీభత్సాలు, - వెరశి మానవజీవితానికి నింబంధించిన ఎన్నో అంశాలు తిలక్ కథల్లో బహుముఖంగా కనబడతాయి. ఏ ఆర్థికవర్గానికి చెంద్రిన వాడయినా మనిషి మనిష్కే ఆ మనిషి గుండెల్లో ఆర్ధతలు, శచేదనలు, తీరని కోరికలు, ఆశలు, నిరాశలు, ఉండక తప్పదు. ఆ మనిషి కథతోనే సంద లం లం పెట్టుకున్నాడు. అతడి తీరని ఆశల పట్ల వ్యథ చెందాడు. పలు విన లకీ మనుషులు ఇరుకు గదులలో ఇరుక్కుపోయి గుండె చప్పుడులను మనిషి చన - సంప్రదాయనీతులకు మతానికీ, ఇచ్చే విలువ మానవత్వానికి, కు, ఇవ్వలేకపోతున్నందుకు కలత చెందాడు. కవితల్లో మాదిరిగానే
కథల్లో కూడా అతడి అక్షరాలు “కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు”
శ
దారిద్యపు విషవలయంలో కూరుకుపోయిన మనుషుల గుండెల్లో తీరని కోరికలు, కూలిపోయిన కలలు, కలిగించే విషాదం తిలక్‌ను ఎంతగానో కదిలిస్తుంది. “దరిద్రం సముద్రంలో వేదనం తెరచాపలెత్తి ప్రయాణించే జీవన నౌకలికి మృత్యువే ఒక లైట్వౌస్” అని ఓ కవితలో అన్నా - “సముద్రంలాంటిదే దరిద్రం కూడా అవతలి ఒద్దు కనబడదు”
2222 తెలుగు కథ - నాడు,నేడు అని ఓ కధలో అన్నా - అన్నింటా ఈ ఆవేదనే కనబడుతుంది. “సముద్రపు అంచులు” కధలోని వీరయ్య, “బాబు కధలోని బాబు, దారిద్ర్య రాక్షసి వెలిగ్రక్కే విషజ్వాలలకు మలమల మాడిపోయినవారే
సముద్రంలో చేపలు పట్టే బెస్తవాడు వీరయ్య (“సముద్రపు అంచులు” కథలో) చాలామంది బడుగుజీవుల్లాగానే అతడికీ ఎన్నో పసిడికలలున్నాయి. తను (్రీమించిన చంద్రిని పెళ్ళి చేసుకోవాలి. మంచి చొక్కా వేసుకుని, కాళ్ళకు చెప్పులు తొడుక్కుని, హాయిగా బ్రతకాలి. ఇందుకోసం అతడు నిరంతరం (మించి, ప్రాజాలను కూడా లెక్కచెయ్యకుండా సముద్రంలో చేపలుపట్టి డబ్బు పోగుచేశాడు. కాని,- చేతిలో ముద్ద నోట్లోకి వెళ్ళలేదు చాలామంది బడుగుజీవుల్లాగానే ఒక ధనస్వామి పీడనాప్రవృత్తికి అతడు బలియైపోయాడు కష్టార్టితం నేలపాలయింది. కోరికలు సముద్రంలో కలిసి పోయాయి మనిషి జైలుపాలయ్యాడు
కధ చివరిలో వీరయ్య చంద్రికతో అంటాడు -
“సముద్రంలో పడి చచ్చిపోదామనుకున్నాను.... కాని సావలేదు -”
“మరి ఇల్లు మాటేంటి వీరయ్య బావా -”
“ఉత్తది. అంతా ఉత్తది. మనం ఇలాగే ఉంటాం. మనం ఇంతే. - వెధవ ఆశ - అంతే -”
- ఎంత జరిగినా *వెధవ ఆశి మనిషిని వదిలిపెట్టదు. వ్యధను కలిగించకా మానదు.
“-రోగిష్టి ఆరోగ్యాన్ని గురించీ, ఆకలితో ఉన్నవాడు రుచికరమైన పిండివంటల గురించీ ఆలోచించకుండా ఏ చట్టమూ శాసించలేదు -” అంటాడు. “ఉంగరం” కథలో తిలక్. ఈ కధలోని దాసీపిల్ల లక్ష్మి, “ఊరు చివరి ఇల్లూ” కథలోని రమ, పెళ్ళి చేసుకుని గృహిణి జీవితం గడుపుదామని కలలు గన్నారు. కాని - దారిద్ర్యం లక్ష్మికి 'దొంగ' అనే ముద్రవేసి జైల్లోకి తోసింది. రమను వ్యఖిచారిణిగా బతకమని శాసించింది. అలాకానప్పుడు మృత్యువు కౌగిలిలో ఇమిడిపొమ్మంది. ఇలా - వీళ్ళందరి జీవితాలు మోడువారిపోదానికి మూలకారణం ఎక్కడ ఉంది? - ఇందుకు సంబంధించిన “గొలుసులోని అసలు కిటుకు” (చూ - “నిన్నరాత్రి కవిత)ను చెప్పకుండానే చెబుతాడు తన కథల్లో. తిలక్ కధల్లో గోర్కీ పరిభాషలో చెప్పబడే 'సోషలిస్టు వాస్తవికత” (90612810 79215౧0) లేకపోవచ్చు. విమర్శనా వాస్తవికత (0౧041 7921157) మాత్రమే అందులో
వదారలడనననడడనడనననననడడన వ 22 కోడూరి శ్రీరామమూర్తి ౨222 కనబడవచ్చు. కాని - హృదయానికి హత్తుకునే అతని కథలు మనల్ని సరియైన దిశలో ఆలోచింప చేస్తాయి.
దారిద్ర్యం, దానిని ఆనుకుని వచ్చే ఆకలి, - దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో
సృష్టించే అలజడికూడా సామాన్యమైందేమీ కాదు. ఈ అలజడి “ఆశాకిరణం” కథలో అద్భుతంగా కనబడుతుంది. ఈ "శతాబ్దంలో వచ్చిన గొప్పకధల పేర్లు చెప్పవలసి వచ్చినప్పుడు తప్పకుండా పేర్కొనవలసిన కథ ఇది. ఈ ఒక్క కథను మాత్రమే రాసినా తిలక్‌కు గొప్ప కథకుడుగా గుర్తింపువచ్చేదని నా అభిప్రాయం. మనం ఎంతో గొప్పగా చెప్పుకునే విలువలు, ఉదాత్తమైనవానిగా చిత్రించుకునే “సెంటిమెంట్స్” ఆకలి సమస్యముందు జవసత్వాలు కోల్పోయి ఎలా కూలబడిపోతాయో తెలుస్తుంది - ఈ కధను చదివినప్పుడు.
ఈ కధలోని వెంకటేశ్వర్లు బ్రతకలేని బడిపంతులు. ఒక సగటు మనిషిగా జీవనయాత్ర సాగించడానికి అభ్యంతరం లేదు. కాని, - బుద్ధి కొంచెం వక్రించడంతో బ్రతుకు సుడిగుండాల్లో చిక్కుకుపోయింది. స్ట లే (బ్రతకడానికి వెంకటేశ్వర్లు ఏ మార్గం తొక్కుదామన్నా కలిసిరాలేదు. చేతిలో కానీ
ని స్థితిలో తినడానికి తిండిలేక “పెళ్ళామూ, పిల్లలూ, ఏ అకలివల్లనో చచ్చిపోయివుంటే వమా కులాసా కలిగేది - * అనుకునే వెంకటేశ్వర్లు - పిల్లవాడికోసం భార్య ఎవరినో కొదుకు చ్చిన కొద్దిపాటి అన్నాన్ని దొంగచాటుగా తినెయ్యబోయిన వెంకటేశ్వర్లు - భార్య ఫైబ్బటేసి చాను బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు మందు జస్పించలేని నిస్సహాయతతో దిస్తూ ఉంటే, క్షుద్భాధను అణచికోలేక “తినడానికి ఏమయినా ఉందా” అని వ అడిగి ఆవిడచేత చెంబు ముఖాన్న విసిరేయించుకున్న వెంకటేశ్వర్లు - ఇంటికి బై వరం లేక అక్కడా ఇక్కడా తిరిగి పొరుగింటి కుర్రాజ్జీ “- ఏరా, మా అబ్బాయి డా చచ్చిపోయాడా” అని అడిగిన వెంకటేశ్వర్లు - ఈ కధను చదివిన వాళ్ళకు చాలాకాలం గుర్తుంటాడు. దగ రష అల్పజీవి వెంకటేశ్వర్లు చివరకు చావాలని నిర్ణయించుకుని రైలుకట్ట ఖ్ర తూ ఉంటే, - అతనికి ఒక వర్తమానం అందుతుంది. తన కూతురు ఓ రార్టింగ్ వౌస్లో వ్యభిచారానికి కుదిరిందని! - ఈ వార్తను మోసుకొచ్చిన పెద్దమనిషి (పతిష్ట గురించి లబోదిబోమంటూ వుంటే వెంకటేశ్వర్లుకి మాత్రం 'ఏదో ఆనందంలాంటి కాంతి" ముఖం మీద కమ్మిందట ! - నడి సముద్రంలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ఏదో నావ దొరికినట్టనిపించిందట 1! - ఆకలి తీరే మార్గం దొరికింది కాబట్టి ఇక చావనక్మర లేదనుకుంటాడు. (
వను లుగు కథ - నాడు,నేడు
ఇది చదివిన పారకులకు వెంకటేశ్వర్లు ప్రవర్తన జుగుప్పను కలిగించవచ్చు. అతగాడు ఒక 'అసహ్యకరమైన' పురుగులా అనిపించవచ్చు. వీడు కూడా ఒక తంద్రేనా అనిపించవచ్చు. నిజమే - వెంకటేశ్వర్లు 'తండ్రి' అనే పదంలో ఉన్న పవిత్రతకు పూర్తిగా అనర్నడు కావచ్చు. కాని, - అతడు ఆకలిని జయించలేని మనిషి, బ్రతకడానికి తిండిని వెదుక్కునే మనిషి. (అదెలాంటి బ్రతుకు అయినా సరే -) గుండెల్ని షిందే కరోరవాస్తవం ఇది. కాలేకడుపుకు ఆకలి తీర్చుకోవడం ఎలా అనే ఆటవిక ధర్మానికి మించిన ధర్మం మరొకటి కనబడదని చెబుతుంది ఈ కధ. అంతేకాదు - ఆకలి సమస్యను పరిష్కరించలేని సమాజం విలువలను కాపాడుకోలేదనే హెచ్చరిక కూడా పరోక్షంగా వినబడుతుంది - ఈ కథలో. (ప్రేమ్‌చంద్ 'కఫన్ొను జ్ఞాపకం చేసే కధ ఇది -
దారిద్ర్యం చేసే భీభత్సం మనిషి మనస్తత్వంపై ఎలాంటి విపరీతప్రభావాన్ని చూపుతుందో, మనిషి బొమ్మను తిరగేసి చూపగల శక్తి దానికెలా ఉందో, 'అతని కోరిక, “హోటల్లో వంటి కధల్లో గూడా కనబడుతుంది.
“అతని కోరిక కధలో - అతడి ఒక్కగానొక్క కొడుకు జబ్బుచేసి చనిపోయాడు. సరియైన వైద్యం చేయించగల ఆర్ధికస్థితిలేని కారణంగా చనిపోయాడు. భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. అతడి గుండెలనిండా దుఃఖం. ఆ విషాదాన్ని అతడు భరించ లేకపోయాడు తాత్మాలికంగానయినా బాధోపశమనం కలిగితే బాగుండు ననుకున్నాడు. తనివితీరా ఏడ్చేందుకు భార్యని ఒంటరిగా వదిలిపెట్టి వీధిలో పడ్డాడు. జేబులో భార్య మంగళసూత్రం - ఇంట్లో మిగిలిన ఖఖరి బంగారం అది. కొడుకు చనిపోవడానికి ముందు మందులకోసం తాకట్టు పెట్టమని భార్య ఇచ్చిన వస్తువు అది. ఆ అవసరం రాకుండానే కొడుకు దరిద్రం నుండి విముక్తుడై వెళ్ళిపోయాడు.
ఇట్లాంటి విషాదకర పరిస్థితుల్లో బాధోపశమనం కోరుకుంటున్న వెంకటేశ్వర్లుకు చిరకాలంగా గుండెల్లో గూడుకట్టుకుని ఉన్న కోరిక - భోగం స్త్రీ పుష్పలతను అనుభవించాలనే పశువాంఛ - పుట్టలోని పాములా బయటకు వచ్చింది. జేబులో ఉన్న మంగళసూటత్రంతో నేరుగా భోగం స్త్రీ పుష్పలత ఇంటికి వెళ్లాడు. అతని వాలకం చూచి ఆమె జాలిపడుతుంది. తనను అనుభవించే అవకాశం ఇవ్వదు. అతడు ఇచ్చిన మంగళసూత్రం తిరిగి ఇచ్చేయ్యడం మాత్రమే కాకుండా పదిరూపాయలు దక్షిణం ఇచ్చి, ఫలహారం పెట్టి, “-నాకూ తెలుసు కష్టం అంటే ఏమిటో -” అంటూ పంపేస్తుంది. తన దారిద్ర్యానికి, ఆమె ఉదారతకు ఆ మానవుడు సిగ్గుపడాలా? లేక తన పశువాంఛ తీరనందుకు నిరాశ చెందాలా? - పుత్రుడి చావువలన కలిగిన బాధనుండి ఉపశమనం
కోడూరి శ్రీరామమూర్తి 222 కలగనందుకు రోదించాలా? - దారిద్ర్యం, దుఃఖం, కలలు, కన్నీళ్ళు, తీరని కోరిక, వీటన్నింటి సమాహారంగా కలిగిన మానసిక సంక్షోభం ఒక మనిషిని చిక్కుప్రశ్చగ్గా మార్చిన ఉదంతం ఇది - అచ్చంగా ఇదేరీతిలో కాకపోయినా - దీనిని కాంతవరకూ పోలిన ఉదంతం సోమరొసెట్ మామ్ రచించిన “011189 ౧6 గ|1ఠ నవలలో కూడా కనబడుతుంది. ఆ నవలలోని మిసెస్ రోజ్ డ్రిఫీల్డ్ తన ప్రియాతిప్రియమైన బిడ్డ చనిపోయిన రోజున - ఆ దుఃఖాన్ని దిగమింగుకోలేక - మనసు తేలికపరుచుకోడానికి ఒక వినోద ప్రదర్శనకు వెళ్ళి, ఆ తర్వాత తన మిత్రుడితో వ్యభిచరిస్తుంది ! - అయితే - ఆ నవలలో 'రోజ్ద్రిఫీల్డ్ చేసిన పని గుండెల్లో చిరకాలంగా గూడుకట్టుకుని ఉన్న కోరికకు సంబంధించిన కార్యాచరణ కాదు. లోకం దృష్టిలో ఆమె శీలవతి కాదు. ఈ పోలికలు, తేడాలు, మాట ఎలా ఉన్నా తీవ్రమైన మానసిక వత్తిడి ఫలితంగా
- మనిషి ప్రవర్తనలో ఎలాంటి విపరీతస్థితి చోటు చేసుకుంటుందో చెప్పేందుకు తార్మాణాలే ఇవన్నీ - 2 “ - దేవుడా రక్షించు నా దేశాన్ని --- నీతుల రెండు నాల్కలు సాచి బుసలు కొట్టే నిర్దేతుక కృపాసర్పాల నుండి వారి వారి ప్రతినిధుల నుండి సిద్ధాంత కేసరుల నుండి, సిద్ధుల నుండి, శ్రీ మద్దురు పరంపర నుండి - ” (ప్రార్ధన కవితలో-)
- అని ప్రార్ధన చేసిన తిలక్ మానవతను మించిన మతధర్మం మరొకటి లేదని నమ్మాడు. ఆ పరమధర్మాన్ని విస్మరించి, స్వలాభపేక్షతో దేవుడి పేరిట వ్యాపారాలు సే విభూతి రాయుళ్ళను పలుసందర్భాలలో హేళనచేశాడు. అతడు రాసిన “దేమ్ముణ్జి చూసినవాడు” కథ ఇందుకు ఓ మంచి ఉదాహరణ. ఇది రాస్తున్నప్పుడు ప్రసిద్ధ బ్రిటిష్ తత్వవేత్త బెర్ట్రాండ్ రసెల్ వాజి నా మనోవీధిలో మొదలింది. “మనిషి పాపంచేసినా ఫరవాలేదు. మానవత్వాన్ని మాత్రం కోల్పోరాదన్న! రసెల్
2 తెలుగు కథ - నాడు,నేడు మతాధికారుల చేత పరమనాస్తికుడుగా ముద్ర వేయబడ్డాడు. “నీతి అనే విషయం సంప్రదాయపు చట్రంలో బిగించబడి, మానవుణ్ణి ఒక బానిసగా చేసి, అతడిని ఆవేదనకు గురిచేసేదిగా కాకుండా - వ్యక్తి వికాసానికి దోహదం చేసేదిగా ఉండాలని, తెలిపిన రసెల్ - అవినీతిపరుడుగా మతాధికారులచేత, “పెద్దమనుషుల చేత, దూషించబడ్డాడు. ఇల్లాంటి రసెల్ - “నేను జైస్తవుణ్జి ఎందుకు కాను? -” అనే గ్రంథం రచించిన రసెల్
- ఒక ఇంటర్వ్యూలో “- మనుషులకు కావలసింది (ప్రేమ. క్రైస్తవ ప్రేమ” అని అన్నాడు.
అయికే-ఈ క్రైస్తవ (ప్రేమ చర్చి ప్రచారం చేసే మూఢవిశ్వాసాలకు సంబంధించింది కాదనీ, మానవతా విలువలతో కూడినదనీ, రసెల్ రచనలు చదివినవారందరికీ తెలిసిన విషయం. ఇట్లాంటి 'దైవ(ప్రేమి గుడికి వెళ్ళడం అంటే ఇష్టపడని నాస్తికుడు గవరయ్యలో కనబడుతుంది. “దేముణ్జి చూసినవాడు” కథలో -
- ఈ కధలోని గవరయ్యకు దేవుడన్నాా గుళ్ళో ఉన్న అతగాడి ప్రతినిధులన్నా బొత్తిగా భయం, భక్తీ లేవు తండ్రినీ, పిత్రార్దితాన్నీ చిన్నతనలలో పోగొట్టుకున్న గవరయ్య తోళ్ళ వ్యాపారం చేసి లక్షలు గడించాడు. గవరయ్య ధనికుడయిన తరువాత ఊళ్ళో పెద్దలు అతగాడిని దైవభక్తుణ్ణి చేసి, గుడిగోపురానికిగాను పెద్దమొత్తంలో విరాళం ఇప్పించాలని (అందులో కొంత మిగుల్చుకుందామన్న ఉద్దేశం కూడా వారికి ఉందను కోండి - అది వేరేసంగతి) ప్రయత్నం చేస్తే, - మొదట్లో కాస్త మెత్తఐడినట్టు కనబడ్డాడు గానీ, - అంతలోనే ఘోరమయిన “పాపం చేసి, - “పుణ్యం” పార్టీలో ఉందే అవకాశాన్నీ కోల్పోయాడు !
టైలర్‌తో లేచిపోయిన గవరయ్య భార్య అన్నివిధాల పతనం చెంది, గర్భవతియై, దిక్కులేని స్థితిలో ఇంటికి తిరిగివచ్చి అతడి ఆశ్రయాన్ని కోరితే - మానవతా దృక్పథంతో గవరయ్య ఆమెను ఆదుకున్నాడు. అలాంటి చెడిపోయిన మనుషులను ఆదరించడం మహాపాపమనీ, దేముడికి నచ్చదనీ, భగవత్ తత్వం తెలిసిన” () పెద్దలు నయానా భయానా ఎంత చెప్పినా గవరయ్య వినలేదు. అంతటితో ఊరుకున్నాడా - 'ఆమెకు సహాయం చెయ్యమని దేముడే నాకు స్వయంగా చెప్పాడు. నేను దేముణ్ణి చూశాను అని కూడా అన్నాడు. దాంతో ఆగ్రహించిన పెద్దలు అతడిని ఊళ్లోంచి వెలివేస్తే - ఆ ఊరినే అతదు వెలివేశాడు,
గవరయ్య తండ్రి చనిపోయేటప్పుడు “- ఎవర్నీ నమ్మకు. ఈ మనుషులందరూ దొంగవెధవలు, విషసర్పాలు” - అనే అంతిమ సందేశాన్ని కొడుకుకు ఇచ్చాడు. జీవితంలో గవరయ్య మనుషుల్ని నమ్మలేదు గాని, - మానవత్వాన్ని మాత్రం మరచిపోలేదు.
కోడూరి శ్రీరామమూర్తి 2 భక్తాగేశ్వరుల మాట వినలేదు గాని, దేముడి మాట విన్నాడు. తండ్రి చనిపోయిన తరువాత నిరాశ్రయుడు, నిర్ధనుడు, అయి - గవరయ్య ఒంటరితనంతో అలమటిస్తూంటే పెద్దమనుషులు, భక్తాగేసరులు, ఎవరూ అతడిని ఆదుకోలేదు దబ్బు ఉన్న రోజుల్లో తండ్రి ఉంచుకున్న ఒక స్త్రీ అతడిని కన్నకొడుకులా ఆదరించింది. ఆనాడే ఆమె అశడి గుండెల్లో మానవతా బీజాలు నాటిందనిపిస్తుంది. అందుకే - దిక్కులేని స్థితిలో నిండుగర్భిజీగా అతడి పంచన చేరిన భార్య చేతులెత్తి తనకు నమస్కరించినప్పుడు - గవరయ్య ఆమెలో తన తల్లిని చూడగలిగాడు. పురుడు కష్టమై భార్య మరణించినప్పుడు ఆమెకు పుట్టిన బిడ్డ అనాథగా మిగిలిపోతే, జాలిగా ఆ బిడ్డను తన అక్కున చేర్చుకున్నాడు. అప్పుడు ఒక మెరుపు మెరిసి, ఆ మెరుపులో వేణుగోపాలస్వామి గోపురాగ్రం మెరిసినట్టనిపించిందట గవరయ్యకు. - “దేముడికి గుడి ఎందుకు? - ఆ గుడి చుట్టా గోడ ఎందుకు? -” అని ప్రశ్నించి భక్తజనులను గాభరా పెట్టిన గవరయ్య - ఒక మహాద్భుతమైన దేవాలయాన్ని కట్టించకుండానే కట్టించాదనిపిస్తుంది !- చోటురే సి పేరుతో చలామణీలో ఉన్న విలువలను మాత్రమే కాదు మానవత్వానికి హనా విలువల నన్నింటినీ తిలక్ తన కథల్నోగేలిచేశాదు. విద్యాధికులమనీ, ప్రక్టమునుషలమనీ, చెప్పుకునేవారిలోని సంకుచితతత్వాన్ని తప్పుడు విలువలనూ, హేళన పె ఇతరం అనే ఒక ధనికుడు తన మిత్రబృందంతో కలెక్టరుగారి ఇంట్లో కథ పైలంిదేర అడవిలో చిక్కుకుపోయినప్పుడు జరిగిన భీతావహ సంఘటన ఈ చావలద[ దున చిమ్మదీకట్లో, అడవిలో పాముకాటుకు గురిల్రున రామచంద్రం సిరిసంపదల టీ కొట్టుమిట్టాడుతుంటే - అతడిని కాపాడింది మి(తబృందంగాని, రామచంద్రం న కాదు. నిర్ధనుదు, నిరక్షరాస్యుడు అయిన పాముల సిద్ధయ్య నిస్వార్ధంగా సూరీడు ప్రా ప్రాణాలు కాపాడాడు. అందుకు కావలసిన మూలికను అతడి చెల్లెలు ఆశ్రయం ల్ తెగించి అడివిలో వెదికి తెచ్చింది. రామచం(ద్రం మితృబృందానికి అంటలేదు థ్యం, సిద్ధయ్యపాకలో లభించింది. ఇందులో ఎక్కడా స్వార్ధపు బురద కుదు టై | సిద్ధయ్యను కాసేపటి తర్వాత, పాముకాటేస్తే - అతడి ప్రాణం చెప్పాలా, లేక వా రామచంద్రం, అతని మిత్రులు, అక్కడే ఉండి సూరీడుకు ధైర్యం
- లక వాళ్ళ ఖర్మకు వాళ్ళను వదిలేసి కలెక్టరుగారి ఇంట్లో పెళ్ళికి వెళ్ళిపోవాలా?
- అంతేకాదు - విషం విరుగుడు మూలికను ప్రాణాలకు తెగించి తెచ్చిన సూరీడుకు
మ2=222 తెలుగు కథ -నాడు,నేడు చెయ్యాల్సింది పాద నమస్మ్కారమా - లేక అర్థరాత్రి పూట చెయ్యిపట్టుకుని నంద రూపాయలిచ్చి శరీరసుఖం ఇమ్మని కోరడమా? - ప్రాణదాత ప్రాణాలకన్నా కలెక్టరుగారి దగ్గర పలుకుబడి ముఖ్యం అనుకోవడంలోనే ఉంది అవకాశవాద దుర్గంధం. సూరీడు లాంటివాళ్లకు నీకి ఉండదు అనుకోవడంలోనే ఉంది 'నీతి' అసలు కధ అంతా -
“- స్వార్థం కన్నా గొప్పశక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు - ఈ ఆదర్శాలు, ఆశయాలు, అన్నీ ఆ (ప్రాథమిక స్వార్ధానికి అంతరాయం కలిగించనంతవరకే
- ప్రతీ మనిషి లోల్లోపల ఒక పాము +” అంటాడు ఈ కథలో మనకు కథను చెప్పే వ్యక్తి. మనిషిలోని ఈ పాముకు అధికారం, పలుకుబడి, సెక్స్ అనుభవం ఇవే ముఖ్యం. హృదయంలోని ఆర్ధతలు ముఖ్యం కాదు ఓ పాముకాటు ఉదంతం నేపథ్యంలో మనిషిలోని ఎన్నో పాముల కథను ఈ కథలో చదవడం ఒక అనుభవం.
3
తిలక్ ప్రత్యేకమైన దృష్టితో మనోవైజ్ఞానిక కథలు రాసిన కథకుడు కాడు. అయితే = మనిషిలోని ౦౦గ౧|౭౮౧6౩౪ని విభిన్న భావాల మధ్య అంతరంగంలో జరిగే సంఘర్షణను, పలు సందర్భాలలో తిలక్ సమర్థవంతంగా చిత్రించాడు. ఇందుకు “అద్దంలో జిన్నా”, “సీతాపతి కధొ, “పలితకేశం” వంటి కథలను ఉదాహరణలుగా చెప్పవచ్చు. వీటిలో “అద్దంలో జిన్నా” ప్రత్యేకించి పేర్కొనదగ్గ కథ.
మహమ్మదాలీ జిన్నాకు భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేకస్థానం ఉన్నది. హిందూ, ముస్లిమ్‌లు ఈ దేశంలో అన్నదమ్ముల్లా ఉండాలని, అన్ని మతాలసారమూ ఒకటీ అని మహాత్ముడు ్రబోధిస్తే - మత(ప్రాతిపదిక మీద మనుషులను విడదీసి, ముస్లిమ్‌లకు విడిగా ఒకదేశం కావాలనే భావనను రగిలించి, _ దేశంలో రక్తపాతాన్ని సృష్టించిన వాడతడు. ఈ దేశచరిత్రలో పీడకలలాంటి ఒక అధ్యాయానికి అతడు చాలావరకు బాధ్యుడు.
ఇలాంటి జిన్నా గుండెలమీద పడిన మరక, అతడి కోటుగుండీలోపల దాగిన మనసు చేసే అలజడి, “అద్దంలో జిన్నా” కథలోని ప్రధానాంశాలు. తాను రేకెత్తించిన ఉద్యమం వెనుక ఒక ఆదర్శభావం ఉందని జిన్నా నమ్మకం. ఈ నమ్మకంతోటే అతడు పదికోట్లమంది ముస్లిమ్‌లను ఒకటిగా చేశాడు. అదేభావంతో ఆ పదికోట్లమందిని ముప్ఫైకోట్లమంది నుండి వేరుచేయగలిగాడు. అయితే ఈ ఉద్యనుం వెనుక - ఈ భావం వెనుక, - రాజకీయ స్వార్థం ఉంది. ఈ విషయాన్ని ఎవరిదగ్గర దాచినా, జిన్నా
కోడూరి శ్రీరామమూర్తి మ తన మనస్సు దగ్గర దాచలేడు. అద్దంలోని జిన్నా ప్రతిబింబం “*- నీ భావం అబద్ధం: నీ భావం అనవసరం. తనే నిజం. భావం కన్నా మనుష్యులకన్నా సిద్దాంతాల కన్నా తనే నిజం -” అని ఘోషిస్తే - అంతరాత్మ చెప్పే చేదునిజాన్ని అతడు కాదనలేకపోయాడు.
లక్షలాదిమంది ప్రజలు ఒకర్పొకరు పొడుచుకుని వీధుల్లో రక్తాన్ని పారిస్తూ ఉంటే
- అతనిలోని “మనిషి ఎదుట జిన్నా అపరాధభావంతో తలించుకోవక తప్పలేదు. తన మనసును చంపుకోలేక, ఒకదశలో *- నాకు శాంతి కావాలి. మైథతి కావాలి అని అందామనుకున్నా అప్పటికే పరిస్థితి చెయ్యిదాటిపోయింది.
సౌందర్వప్రియుడైన జిన్నా గుండెలమీద రక్తం మరకపడింది. అది అసహ్యంగా ఉంది.
“- ఈ రక్తం మరకను చెరిపెయ్యి -” అంటూ ఆయాను పిలిచాడు గానీ, -
“అది చెరగదు ప్రభూ - అనేది సమాధానం.
న ఈ కథను చదివినప్పుడు మనకు జిన్నాపై ఆగ్రహం కలుగదు. స్వార్ధపు వలలో,
రాజకీయాల సుడిగుండాల్లో, చిక్కుకుపోయిన మనసున్న మనిషిగా కనబడతాడు జిన్నా ఈ కథలో,
చస" ఈన వాదానికి గల బొమ్మ, బొరుసులను జిన్నా జీవించి ఉండగా అర్ధం
స గలిగాడా? - దేశవిభజన సమయంలో ఇంతటి మానసిక సంక్షోభానికి అతడు
పత్తిద్య సదా? - అన్నది కాదు ప్రశ్న జిన్నాకు మనసు అనేది ఉంటే - ఆ ఎదలోని
క శో అతడు వినగలిగి ఉంటే - అతడు తప్పకుండా ఇలాంటి ఆవేదనకు గురి క ౦వాడు. ఆ ఆవేదనాస్థితికి అక్షరరూపం ఈ కథ. జిన్నాను ప్రధానపాత్రగా
సి, అతడు లోనయిన ఆవేదనను చిత్రించే ఇలాంటి కథ తెలుగులో మరొకటి వచ్చినట్టు అనిపించదు.
_ చాలామంది తెలుగుకథకుల్లా తిలక్ కూడా యువతీయువకుల ప్రణయం, - చాని సాఫల్య బైఫల్యాల గురించి కొన్ని కథలు రాశాడు. ఇవి సంఖ్యలో తక్కువే అయినప్పటిక్తీ, వాటిల్లో కూడా తిలక్ (ప్రత్యేక దృష్టి కనబడుతుంది.
_ _£€ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్న తరువాత - ఒకరినొకరు పెళ్ళి చేసుకోడానికి గ్లాని, చేసుకోకపోవడానికి గానీ అనేక కారణాలు ఉండవచ్చు. అయితే
- ఆ కారణం రూపాయిల కొలమానంలో ఉండటంకన్నా చేదైన విషయం మరొకటి ఉండదు. దీనికి మనం గడుసుదనం అనో, బ్రతుక నేర్చినతనం అనో, పేర్లు పెట్టుకోవచ్చు.
= తెలుగు కథ - నాడు,నేడు కాని - అందులో ఉండేది వ్యాపారధర్మం మాత్రమే ! - ఈ వాస్తవం “క్పందరీ సుబ్బారావు, “పరివర్తన”, “నవ్వు” వంటి కధల్లో కనబడిన తీరు గుర్తుంచుకోదగ్గది.
ఈ “బ్రతుకునేర్చినతనం' తిలక్ కధల్లో పురుషపాత్రల్లో కంటే స్రీ పాత్రల్లో అధికంగా కనబడడం ఒక విశేషం కావచ్చునేమో గాని, - కేవలం కొద్దికధల ప్రాతిపదికగా తిలక్ ఆలోచనా సరళిని నిర్ణయించలేము రూపాయిల లెక్కల్లో బందీ అయిన మనిషి కథను ఆవిష్కరించే ఉదంతాలే ఇవన్నీ అనుకుంటే సరిపోతుందనుకుంటాను.
= ఈ విషయం ఎలా ఉన్నా, ఒకటిమాత్రం సత్యం. తిలక్ ఏం చెప్పినా చెప్పదలచిన విషయం సూటిగా హృదయాలకు హత్తుకుంటుంది. కథాశిల్పంలో పరిపుష్టికి తిలక్ కధలు, పలుసందర్భాలలో మంచి ఉదాహరణలుగా కనబడతాయి. కథాశిల్పానికి సంబంధించి తిలక్ కొంతవరకూ మొపాసాకు సన్నిహితంగా కనబడతాడు. -“కథ అనేది గుర్రపు పరుగులాంటిది. ప్రారంభం, ముగింపు ముఖ్యం -” అనే మొపాసా ధోరణి కథారచనలో మొదలు, మధ్య, తుది అనేవి తీర్చిదిద్దినట్టుగా ఉంటాయి. చెహోవ్ ధోరణిలో మాదిరిగా కధ మధ్యలో ప్రారంభమై మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఉండదు.
తిలక్ కధలను నేరుగా ప్రారంభిస్తాడు. డొంకతిరుగుడు ధోరణి ఉండదు అనవసర విషయాల ప్రస్తావన ఉండదు అందువలన పారకుల దృష్టి సరియైనచోట సరియైన రీతిలో కేంద్రీకరించబడుతుంది దృష్టి చెదరదు
“నల్లజర్ల రోడ్దు” కధ “నల్లజర్ల అడివిమీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు అనే వాక్యంతో (ప్రారంభమై - ఆ అడవిలో జరగబోయే సంఘటనల స్వరూపాన్ని రేఖామాత్రంగా పరిచయం చేస్తుంది. అదేవిధంగా - 'పలితకేశం' కథ “-ప్రసాదరావు అద్దం ముందు నిలుచున్నాడు. అతనికి తనను తాను చూచుకోవాలనిపించింది- అందులోనే ఏదో తృప్తి ఉంది -” అనే వాక్యంతో ప్రారంభమై ఇలాంటి వ్యక్తుల విషయంలో _ జుట్టులో కనబడిన తెల్లవెంట్రుక ఎలాంటి ఆవేదనను కలిగించగలదో చెప్పక చెబుతుంది.
పలుసందర్భాలలో తిలక్ కథాప్రారంభంలో పాత్రస్పభావాన్ని పరిచయం చెయ్యడం మాత్రమే కాకుండా, ఆ పాత్ర ప్రవర్తనలోని వైచిత్రిని అర్థం చేసుకోవడానికి సంబంధించిన “తాళంచెవి” కూడా ఇస్తారు. “అతని కోరిక' కథలో లక్ష్మీమోహనరావును కథా ప్రారంభంలో పరిచయం చేస్తూ - “అతనికి నిద్ర అన్నా నోవకేన్ ఇంజక్షన్ అన్నా చాలాఇష్టం. ఇదివరకెప్పుడో తేలుకుట్టి అతనికి కాలంతా మంటలూ, పోట్లూ, తల ఎత్తినప్పుడు దాక్టర్ ఆ ఇంజక్షన్ ఇచ్చాడు. దాంతో పాదం తిమ్మిరెక్కిపోయింది. బాధ తెలియలేదు.
మష్త్ర్రదన2డడడడడడడ2డ22222222న222ఊఊఊఊఊ22 కోడూరి శ్రీరామమూర్తి 2222 నిద్ర కూడా అతనికి అలాగే ఉంటుంది. బాధల్ని అరుచికరమైన సంఘటనల్నీ నొక్కి ఉంచుతుంది-” అని అంటాడు. ఇది చదివిన పారకుడికి - లక్ష్మీమోహానావు పలాయనవాదం, కొడుకు చనిపోయిన వేళ అతడు కోరుకున్న 'నోవకేన్ొ ఇంక్షజన్ స్వరూపమూ, తేటతెల్లం అవుతాయి. దాదాపుగా తిలక్ కథలన్నింటిలోనూ ఒక సంపూర్ణత, సమగ్రత ఉంటుంది. 10059 ౬౧69 ఉండవు. అస్పష్టత ఉండదు. కథ చదివిన పారకుడు తనను కథకుడు నట్టడివిలో వదిలి వెళ్ళపోయాడని గానీ, గాలిలో తేలియాడమని వదిలేశాడని గానీ, అనుకోడు. కథకుడు తనను ఎక్కడికి తీసికెళ్ళ దలిచిందీ పాఠకుడికి స్పష్టంగా తెలుస్తుంది. “- ప్రతీ జీవితం ప్రత్యేక జీవితం. ఒకరికీ మరొకరికీ సంబంధం లేదు - అంటాడు తిలక్ “జీవితం” కథలో. ప్రతీవ్యక్తి జీవితంలోనూ ఏదో ఒక వైచితి ఉంటుంది, ఛార్రెస్ డికెన్స్ అనేటట్టు ఉప్ప వ్యక్తికావ్యక్తి గంభీరమైన పరమరహస్యం _... ఒకరికొకరు దురవగాహనమైన అయోమయం -౫ (7210 01740 ౮11189).
- ఇట్లాంటి మనిషికథను తద్వారా మనుషుల కధను ఒక్కొక్కరు ఒక్కో
దృక్యోజంలోంచి చూచి చెబుతారు. ఏ దృక్కోణంలోంచి చూశారు అనే దానితోబాటుగా లా చెప్పారు అనేది కూడా చాలా ముఖ్యం. తిలక్ కథలు,స్కెచెస్, గల్పికలు ఏం
కో సిన్మా అందులో ఒక్ర పరిపక్వత, నిపుణత ఉంటాయి. కవితారచనలాగానే - కథారచన
త్తి న ఓ [10౧6౫౫ అని అనుకుంటే, ఆ పరసువేదిని సాధించిన విశిష్ట కథకుడు లపు,
(మధురాంత న “తెలుగు కథకులు - కథనరీత్పుల్ను కం వంగి సంపాదకత్వంలో వచ్చి విశాలాంధ్ర ప్రచురణ - 1998 “శేసపుటి మొదటి భాగంలో ప్రచురితం
క్షీ యా
వవ తెలుగు కథ -నాడు,వేడు బుచ్చిబాబు కథలు - మనోవైజ్ఞానిక దృక్పథం
తెలుగు సాహిత్యంలో కధకుల సంఖ్యకు కొదవలేదుగాని, మంచి కథకుల గురించి చెప్పాలంటే, ఆ సంఖ్య తక్కువగానే ఉంటుంది అ కొద్దిమంది కథకుల్లో ఎన్నదగినవాడు బుచ్చిబాబు జీవితాన్నీ జీవితంలో తనకెదురయిన వ్యక్తులనీ, ఆ వ్యక్తుల జ్ఞాపకాలు అందిచ్చే అనుభూతుల్నీ నిశితంగా పరిశీలించి గుండెల్లో పదిలపరుచుకొని, ఒక్కొక్క పాత్రగా తీర్చిదిద్దాడు బుచ్చిబాబు. అయితే, ఆ పాత్రలను సృష్టించిన కథకుడు అటు విశ్వసాహిత్యంలోని ఆధునిక పోకడలను, ఇటు మనస్తత్వశాస్త్ర, తత్వశాస్త్ర సిద్ధాంతాల సారాంశాన్ని ఆకళింపు చేసుకున్న మేధావికావడంతో - అతని కథలు కాలక్షేపపు పరిధిని దాటి ముందుకు వెళ్ళగలిగాయి.
“మనమందరమూ గోగోల్ 'ఓవర్కోటొ లోంచి పుట్టుకొచ్చిన వాళ్ళమే గ అంటాడు గోర్కీ. ఆధునిక కధానికకు ఒకప్పటి గోగోల్స్ ఆ తర్వాత మొపాసా, చెహోవ్, అటుతర్వాతి కాలపు సోమర్సెట్ మామ్, ఓ హెన్రీ, ఇత్యాదులందరూ సరిక్రొత్త సోయగాలు సమకూర్చిన వాళ్ళే ! బుచ్చిబాబు వీళ్ళందరి సాహితీపరిచయాన్నీ కావలసిన మేరకు సముపార్టించు కున్నాడు కధాశిల్పానికి సంబంధించి సోమరొసెట్మామ్కు ఏకలవ్య శిష్యుడయ్యాడు. “క్షహాబలం, కవితాశక్తి, జీవితంపట్ల ఉండాల్సిన గౌరవభావం, మామ్ కథలలో లోపించినందువల్లనే అవి అంత సంతృప్తికరంగా ఉండవు...” అని అన్నప్పటికీ “రచనా విధానంలో గొప్పశిల్పంవుంద”ని అంగీకరిస్తూ, కథను నడపడంలో గల మెళకువలను మామ్ దగ్గరనుండే [గ్రహించానని ఒప్పుకున్నాడు బుచ్చిబాబు.
సోమర్సెట్ మామ్ ప్రత్యేకతలలో ఒకటి - “నేన” అంటూ ్రథమపురుషలో కధ చెప్పడం. ఇలా కధ చెప్పడంలో కొన్ని ప్రయోజనాలున్నాయంటాడు మామ్. కధ చెప్పే వ్యక్తి ఒకే విషయంపై దృష్టి కేంద్రీకరించి - తను కన్నవీ, విన్నవీ, చేసినవీ
కోడూరి శ్రీరామమూర్తి మి చెప్పవచ్చు. ఇలా చెప్పడం వల్ల పాఠకులకు అతనిపై ఒకవిధమైన సాన్నిపొత్యం ఏర్పడుతుంది. అతను చెప్పేదాన్నీ, చేసినదాన్న్సీ అంగీకరించినా, అంగీకరించకపోయినా, అతనిపై సానుభూతి చూపే స్థితికి పారకులు వచ్చేస్తారంటాడు మామ్. ఇది గాక, మరొక ప్రయోజనం కూడా ఉంది. ఈ తరహా కధనంలో రచయిత సర్వజ్ఞుడిలాగా, అన్నీ చెప్పనక్కరలేదు. కొన్ని విషయాలు చెప్పి, మిగతావి నాకు తెలియదని తప్పుకోవచ్చు. దీనివల్ల కధలో అవాంఛనీయమైన రీతిలో సమగ్రత ఏర్పడకుండా - పారకుడు పాత్రల గురించి కొంత ఆలోచించేందుకు వీలుపడుతుంది. తనకు తోచిన రీతిలో సమాధాన పడడడానికి అవకాశం ఉంటుంది. కథకుడుగా బుచ్చిబాబు ఆశించిన ఫలితాలలో ఇది కూడా ఒకటి. పాత్ర చిత్రణలో కొంత “మిస్టరీ - అర్ధంకాని, బహిర్గతం గాని “గొడవి ఉండాలని బుచ్చిబాబు కోరుకోవడంలో ఉన్న ఉద్దేశ్యం ఇదే ! కథాశిల్పం విషయంలో మాత్రమే గాక, కధారచనకీ, సామాజిక ప్రయోజనానికి మధ్య గల సన్నిహిత సంబంధాన్ని గూర్చి అధికంగా ఆలోచించక పోవడంలో కూడా మిచ్చిబాబు మామ్‌కి సన్నిహితంగా కనబడతాడు. ఆర్థిక, సామాజిక, శక్తుల (ప్రేరణతో వ్యక్తిలోనయ్యే సంఘర్షణల గురించి గాక, తనలోని విరుద్ధ ప్రవృత్తుల ఫలితంగా వ్యక్తిలో చెలరేగే సంఘర్షణలకు ప్రేరణ రచయితలోంచే పుట్టుకొస్తుందంటాడతను. “నిత్యజీవితంలో రచయిత సంఘర్షణకు గురి అవుతాడు. తాను కోరుకున్న ఉద్యోగం దొరకదు. ప్రేయసి దొరకదు. స్నేహితులుండరు.... ఒక సంఘర్షణ (ప్రబలి ద్వంద్వ వ్యక్తిత్వం వర్చడి ఈ బాధను ఇతరులతో చెప్పుకుని విముక్తుడవుతాడు” అంటాడు బుచ్చిబాబు తన కథల వెనుక కథ గృరించి చెబుతూ. ఈ సంఘర్షణ స్వరూపాన్నే మరికాస్త పొడిగిస్తే - వ్యక్తికీ వ్యవస్థకూ, జరిగే పోరాటంలో ఆర్థిక, సామాజిక శక్తులకు గల స్థానం అవగతమవుతుంది. కొని, దానిపట్ల బుచ్చిబాబుకు ఆసక్తిలేదు. “ముష్టినిజం”, “ఊడిన చక్రం - వాడిన పుష్పం” వంటి కథల్లో అట్టడుగు సమాజానికి చెందిన ముష్టివాడు, రిక్షావాడు, పాత్రలయి నప్పటికీ తన్సు గీసుకున్న గిరిదాటకుండా, ఆర్థికపరమైన శక్తులను గురించిగాక, పహృదయానిక్షి సంబంధించిన ఆర్ధతలు గురించే ఆలోచించాడు బుచ్చిబాబు. అయితే, ఇది ప్రయత్నపూర్వకంగా ఏదో కావాలని చేసిన విషయం కాదు. స్వతహాగా బుచ్చిబాబు హృదయవాది. ప్రకృతి పలకరింపుతో పులకరించిపోయే కవితాత్మక హృదయం అతనిది. కథకుల్లో భావకవి అతను. ఆకులమధ్య ప్రసరించే కిరణాలు వనదేవత కుట్టుపనిలో ముందుకీ వెనక్కీ కదలడాలు, (ఎల్లోరాలో ఏకాంతసేవ” కథలో) వెన్నెల పిలుపుకి ఊగిపోయ్యే సముద్రకెరటంపై నురుగులో వెలుగుల సొగసులు (అనురాగ ప్రసారం" కధలో) ఇవన్నీ బుచ్చిబాబు కథల్లో పుష్కలంగా దొరుకుతూ, అతని దృకథంలోని
2వ తెలుగు కథ - నాడు,నేడు 'రొమాంటిసిజమ్”ను వ్యక్తీకరిస్తాయి. ఈ విషయాన్ని గురించి చెబుతూ “నాగరికతలో నుండి ప్రకృతిలోకి పారిపోయే వ్యక్తులన్నా అట్టివారిని గురించి కథలన్నా, నాకెంతో ఇష్టం... సోమర్సెట్ మామ్ రచనలంటే నాకిష్టం ఏర్పడ్డానికి ఆయన ఇట్లాంటి వ్యక్తుల గురించి ఎక్కువగా రాయడమే కారణం అనుకుంటాను అంటాడు బుచ్చిబాబు తన “అంతరంగ కథనంలో (స్వీయచరిత్రాత్మక రచన):
“నా కథలన్నీ నే ఎరిగున్న మనుషులు, స్థలాలు, అనుభవాలు వీటిగురించే వ్రాసినవే” అని చెప్పుకున్న బుచ్చిబాబు, మామ్‌లాగానే 'నోట్‌బుక్‌లో తనను కదిలించిన విషయాల నన్నిటినీ 'నోటొ చేసుకొనేవాడు. నిజానికి, వాస్తవపు ఆధారంలేని కల్పన సాహిత్యంలో రాణించలేదనుకుంటాను సాహిత్యంలో ప్రసిద్ధిచెందిన ప్రకీపాత్ర వెనుకా నిజజీవితంలో నమూనాలు దొరుకుతాయి. తనను ఆకర్షించిన వ్యక్తులను సాహిత్యంలో ఇరికించడంలో (ప్రసిద్దుడయిన మామ్, “ఏ రచయిత అయినా సజీవమైన 'మోడల్ లేకుండా ఒకపాత్రను సృష్టించానని చెప్పుకుంటే అతను చాలా పొరబడుతున్నాడని అర్ధం” అన్నాడు. (ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అతని 'రెయిన్' (వర్షం) కధలోని మిస్ తామ్సన్, దేవిద్సన్ (మతాధికారి) పాత్రలకు గల నమూనాల గురించి, మామ్ వ్యాసాల్లో తెలుసుకుంటున్నప్పుడు అతని అభిమానులకు ఎంతో ఆనందం కలుగుతుంది మామ్‌లాగానే బుచ్చిబాబు కూడా దాపరికం లేకుండా తన కధల వెనుకగల కథల గురించి అనేక సందర్భాలలో చెబుతాడు.
బుచ్చిబాబు కధల్లో “నన్నుగురించి కధరాయవూ” ప్రసిద్ధి చెందింది. బుచ్చిబాబు చిన్నవాడుగొ ఉన్నప్పుడు ఒక అమ్మాయి అతణ్ణి నన్ను గురించి కధ రాయవూ అని అడిగిందట ! తర్వాత పదిహేనేళ్ళకి బుచ్చిబాబు అదే మకుటంతో ఒక కథ రాయగలిగాడు. అయితే, ఇందుకు మరికొన్ని డ్రేరణలు కూడా ఉన్నాయి. బుచ్చిబాబు స్నేహితుడు ఒకాయన కొన్ని షరతులు పెట్టి ఒక కథ రాయమన్నాడట. “ప్రేమ' అనే పదం రాని (ప్రేమకథ అయి ఉండాలి కధలో ఏమీ జరక్కూడదు అనేవి ఈ షరతులు. ఈ షరతుల పరిధిలో కధ మలుచుకొనేందుకు అతని చిననాటిజ్ఞాపకాలు కూడా తోడయ్యాయి. “నన్ను గురించి కధ రాయవూ?” లో కుముదానికీ, కథచెప్పే “నేన” అనే వ్యక్తికీ మధ్యన ఉండే శారీరకమైన సంబంధంలేని “శ్రేమ” (ప్లేటోనిక్ లవ్ వంటిది) బుచ్చిబాబు తండ్రికీ, 'కోమలి” అనే అమ్మాయికి (ఈ 'కోమలి' అనే పేరునే బుచ్చిబాబు “చివరకు మిగిలేది నవలలో వాడుకున్నాడు) మధ్యన ఉండేదని బుచ్చిబాబు తన “అంతరంగ కథనం” (స్వీయచరిత్ర)లో రాసుకున్నాడు ఈ భావాలన్నీ జమిలిగా జతచేరిన ఫలితమే “నన్ను గురించి కధరాయవూ అనే కథ
కోడూరి శ్రీరామమూర్తి 2222 “కుముదం” అనబడే ఓ మధ్యతరగతి కుటుంబీకురాలి పాతికేళ్ళ జీవితకథను సుమారు పాతికపేజీల ఈ కథలో ఇముడుస్తాడు బుచ్చిబాబు. కధ (ప్రారంభం అయ్యేటప్పటికి చిన్నపిల్లగా ఉండే కుముదం కథ చివరికొచ్చేసరికి నలుగురు పీల్లల తల్లి అవుతుంది. అయితే - ఈ మార్పు శారీరకమైంది మాత్రమే ! మనసులోని భావనలో మాత్రం మార్పులేదు.
కధకుణ్జి కుముదం “నన్ను గురించిన కథరాయవూ అని అడగడానికి కారణం
ఒక మామూలు కథకు కథానాయిక అవుదామన్న కోరిక కాదు. కుముదానికి చిననాటి నుండి కధకుడంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానాన్ని శారీరక అనుభవంగా మార్చగల తెగువ అతనికి లేదు - ఆమెకీ లేదు. అందుచేత తనకున్న మానసిక బంధం మరింత పటిష్టం కావడానికి అమె అతగాడి కధకు కధానాయిక కాదలచింది. ఒక కథలో తాను ఇమిడిపోయి శాశ్వతంగా అతడి దగ్గర ఉండపోదలచింది. కాని, ఇది జరగాలంటే ఆమెలో వదో '“అసాధారణతి ఉండాలంటాడు కథకుడు తనలో లేని “అసాధారణతి ఏమిటో కుముదానికి తెలుసు. అందుచేతనే - తనలో అట్టి అసాధారణతను కలిగించేందుకు ప్రోదిని కల్పించే స్వేచ్చపై ఆమె నానాటికీ మమకారాన్ని పెంచుకోసాగింది. ఉద్యోగం దొరకలేదని బాధపడే కధకుడిలో కుముదం ఉద్యోగం చెయ్యడం బానిసత్వమని చెప్పడం దాస్యాన్ని తాను సహించలేననడం, వ్యవస్థ గీసిన గిరిపట్ల నానాటికి ఆమెలో పెరిగిపోతున్న రోతకు పరోక్ష వ్యక్తీకరణగా చెప్పుకోవచ్చు. అయితే, ఆమె తన మనసులోని మాటను ప్రత్యక్షంగా వ్యక్తీకరించగల తెగువను పెంపొందించుకొనేటప్పటికి జీవితపు తుది ఘడియలు సమీపించాయి. చావు బ్రతుకుల మధ్య ఉన్న కుముదాన్ని చూడ్డానికి కథకుడు ఆస్పత్రికి వస్తే - “నువ్వెందుకు పెళ్ళిచేసుకోలేదో నాకు తెలుసు... నా కోసం...” అని అనడంతో ఆమె స్వేచ్చకోసం పడిన తపన పరాకాష్టకు చేరుకొంది. ఈ ఒక్కమాటతో కుముదం కథకుడి కథకు నాయిక కాగల అర్హతను సంపాదించుకొంటుంది.
ఈ కథను బుచ్చిబాబు నడిపిన తీరు ('ప్రశంసనీయంగానే ఉన్నా - కధ చివర్లో మానవుడి బుర్రలో ఉందే అథోలోకం గురించిన ప్రాయిడియన్ సైకాలజీని - (కథకుడి ఆలోచనలు రూపంలోనే అనుకోండి) వివరించబోవడం కథాశిల్పాన్ని పాడుచేసినట్లుగా అనిపిస్తుంది. కధ మధ్యలో శాస్త్రీయమైన విషయాలను వివరించడం, వ్యాఖ్యానించడం, దోషాలని తెలిసినా బుచ్చిబాబు కొన్ని సందర్భాలలో నిగ్రహించుకోలేకపోయాడను కుంటాను. “అనురాగ ప్రస్తారం” అనే కథలో బుచ్చిబాబు “నేను” అనే పాత్రతో కూడా
౨22 తెలుగు కథ - నాడు,నేడు సంబంధం లేకుండా కూడా కధకు అడ్డం వచ్చి మాట్లాడడం ప్రారంభిస్తాడు. కథగాని, నవలగాని, ఏ సాహిత్యప్రక్రియ విషయం తీసుకున్నా ఇది మంచి సంప్రదాయం కాదు.
బుచ్చిబాబు కధల్లో కనబదే మరో విషయం - సుదీర్హమైన వర్ణనలు. కధ చదువుతున్న పారకుడి కళ్ళకు పాత్రలు కనబడాలి నిజమే ! - దానికోసం పాత్ర స్వరూపాన్ని సుదీర్ధంగా వర్ణించి పారెయ్యడం (కవితాత్మకంగానే అనుకోండి) కొన్ని సందర్భాలలో కథగమనానికి ఆటంకంగా కూడా ఉండవచ్చు. కుముదం సాధారణంగా ఉందనీ చెప్పడానికి బుచ్చిబాబు అసాధారణమైన ఉపమానాలు వేస్తాడు. ఈ తరహా ధోరణి నవలకు కొంతవరకూ ఉపయోగవపడవచ్చు గానీ, కథకు అనవసరం. ఇలా, అక్కడక్కడ మోతాదు మించినా మొత్తంమీద బేలన్స్ నిలబెట్టుకుంటూ, తన “అగ్గిపుల్లల మేడిను (సాహిత్య విమర్శకుడు హెచ్.ఇ. బేట్స్ ఉపమానం (ప్రకారం) భద్రంగా కాపాడుకుంటూ వచ్చాడు బుచ్చిబాబు.
బుచ్చిబాబు కధల్ని మొత్తంమీద చూచినప్పుడు ఒక విషయం మనకు సులువుగా అవగావానకు వస్తుంది అతని కధల్లో సాధారణంగా కనబడేది అంతరంగంలో అణచి వేయబడిన శృంగార భావనలు, “ప్రేమించి దూరంగా ఉండి, శరీరసుఖం కోరక, మనస్సుని ఆనందంతో నింపుకొనే ఉదంతం సాహిత్యంలో రాణిస్తుందొ అంటాడతను కుముదంతో బాటుగా “మేడమెట్లు కధలోని అరుణ, “ఆశాప్రియ” కథలోని ఆశాప్రియ, “పాగలేని నిప్పు” కధలోని సీతారత్నం, “వీరేశలింగం ఏం చెయ్యాలి?” కథలోని మైథిలి, “తెరచాప దించిన పడవ” లోని విదురమ్మ, “ఆ రాలిన అకులు కథలోని కాంతం - ఇత్యాదులందరూ మనసులోని కోరికకూ, శరీరపు అనుభవానికీ, పొందిక కుదరక వేర్వేరు విధాలుగా ఆవేదనతో అలమటించినవారే !
“ప్రాగలేని నిప్పు” కధలోని సీతారత్నం కథ చాలా చిత్రంగా ఉంటుంది. ఈ కథలో ఇరుగు పొరుగున ఉన్న భాస్కరం, సీతారత్నంల మధ్య నిప్పు ఉంది. అది రోజురోజుకూ రాజుకుని మహాగ్ని అవుతున్నది. అయినప్పటికీ, ఇద్దరూ తప్పుచెయ్యలేక పోయారు. పవిత్రతకూ, అపవిత్రతకూ మధ్య ఉన్న అడ్డుగీతను దాటిపోయేందుకు పరిగెడుతూ, తమకు తామే కళ్ళాలు వేసుకుని వాళ్ళు ఎలా ఆగిపోయేవారో కుతూహలాన్ని కలిగించే రీతిలో చెబుతాడు బుచ్చిబాబు ఈ కథలో. తను రాసిన కథల్లో ఇది తనకు ఇష్టమైనకథ అని చెప్పుకున్నాడు బుచ్చిబాబు.
=వ్పేడ్రమెట్లు” కధలోని అరుణ కథ కూడా ఇంతే. అయితే సీతారత్నం మాదిరిగా అరుణకు నిత్యసంఘర్ష్నణ లేదు. సంస్కారపు ముసుగును పదిలంగా పరుచుకోగల
కోడూరి శ్రరామమూర్తి 222 నైపుణ్యము, బ్రతుక నేర్చినతనం, ఆమెలో అధికంగా ఉండడమే ఇందుకు కారణం. అరుణకాక, ఈ కధలోని మరి రెండు ప్రధానపాత్రలు '“అధికారి' 'దౌర్భాగ్యుడు' వీళ్ళిద్దరూ మిత్రులు. అధికారి అరుణ భర్త. దౌర్భాగ్యుడు ఆమె చిన్ననాటి ప్రియుడు. మనిషిలో ఉండే 'రెండుతరహాల ప్రవృత్తులకూ వేర్వేరు సంకేతాలు. ఐశ్వర్యంపట్ల, అధికారం పట్ల మనిషికి ఉండే ఆకాంక్షకు సంకేతం “అధికారి అయితే - సౌందర్యపిపాసకు, అలౌకికమైన శాశ్వత విలువలకు, సంకేతం “దౌర్భాగ్యుడు” ! - పరస్పర విరుద్ధమైన ఈ రెండు ప్రవృత్తులలో దేనినీ వరించలేక వీటిమధ్య జరిగే సంఘర్షణలో ఎటూ తేల్చుకోలేక సతమతమయ్యే సగటు మనిషికి 'అరుణ సంకేతం. ఈ ్రతీకల నేపధ్యంలో ్రాయిడియిన్ సైకాలజీని దృష్టిలో ఉంచుకుని అంతరంగంలో చెలరేగే తపనల కథ చెబుతాడు బుచ్చిబాబు “మేడమెట్లు” కథలో - ఫ్రాయిడ్ మనస్తత్వశాస్త్రం ప్రకారం (గైకోఎనాలిసిస్) మేడమెట్లు ఎక్కడం, దిగడం అనేవి కలలోనిక్రి వస్తే, అంతరంగంలో చెలరేగే మైధునవాంఛకు ప్రతీకగా చెప్పడం జరుగుతుంది. నిజానికి దౌర్భాగ్యుడి డ్రేమకధ కూడా ఒక కలలాంటిదే ! దౌర్భాగ్యుడు తన చిననాటి ప్రియురాలితో ఆడుకున్నది మేడమెట్ల మీద. ఆమెకోసం కలవరించింది మేడ మెట్లమీద. కథ చివర్లో అధికారి కూతురు కళ్యాణిని చూచి, తన చిననాటి స్నేహితురాలిగా భావించి, ఆవేశంతో మేదమీదనించి దిగుతూ కాలుజారి పడి చనిపోయింది గూడా మేడమెట్లమీదనే ! అతని జీవితకధలో మేడమెట్లకు గల స్థానం అత్యంత ముఖ్యమైంది. క్ట దౌర్భాగ్యుడి ప్రేమకథను పెనవేసుకున్న మరొక విషయం అరుణ ఉంగరం. ఆ ఉంగరాన్ని అతడు విడిచిపెట్టలేకపోవడానికి కారణం మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పే “స్టఫ్ ఫెటిషిజ్స్*గా అభివర్జించుకోవచ్చు. అరుణకు ఆ ఉంగరం దౌర్భాగ్యుడి దగ్గిర ఉండడమే ఇట్టం. ప్రతిసారి అది తనకు తిరిగి ఇచ్చెయ్యమని అడగడం, దానికోసం దౌర్భాగ్యుడితో పోట్లాడడం - అతనిపట్ల గల మమకారాన్ని దానికి విరుద్ధమైన భావంగా వ్యక్తీకరించడమే! అయితే, ఆమె 'బ్రశుకనేర్చింది దౌర్భాగ్యుడు కోరుకున్నట్టుగా ఆమె నగలన్నీ విడిచేసి పువ్వుల్ని పేమించలేదు. అందుకే అధికారానికి అరాంగి అయింది. అయినప్పటికీ ఆమె దౌర్భాగ్యుణ్ధి మరచిపోలేదనడానికి కారణం భర్తకు నచ్చకపోయినా, పట్టుపట్టి ఇదివరకు తాను చిన్నకనంలో దౌర్భాగ్యుణ్ణి (అతని పేరు అదే అనుకుంటే) కలుసుకున్న ఇంటికి ఉన్నట్టుగానే సరిగ్గా అదే ఇరవైమూడు మెట్లున్న మేడను అద్దెకు తీసుకునేలా చెయ్యడం. కాని, ఆమె ఎప్పుడూ మేడ దిగివచ్చేది కాదు ఆ మెట్లు దిగిరాగలిగికే ఆ రోజేఆమె దౌర్భాగ్యుడికి అంకితమై పోయేది ! దౌర్భాగ్యుడి చేతికి ఉన్న ఉంగరాన్ని
22 తెలుగు కథ - నాడు,నేడు అరుణ తీయించడం మధురమైన జ్ఞాపకాలను తన గుండెల్లో భద్రపరచుకోవడానికి ఆమె చేసిన మరో ప్రయత్నంగా భావించవచ్చు.
ఇట్లాంటి ఆవేదనే మరోరూపంలో 'ఆశాప్రియ” కధలోని ఆశాప్రియలో కనబడు తుంది. ఈ కధలో బుచ్చిబాబు - ఒక సినిమాతార, ఒక సినిమాపత్రిక సంపాదకుడు, ఒకరినొకరు ద్వేషించుకుంటూ అంతరంగంలో ఆల్మీయతతో, ఆరాధనాభావంతో, ఎలా సతమతమై పోయారో చక్కగా చిత్రిస్తాడు అంతరంగంపై తనకు తానుగా పెట్టుకున్న మూతను తొలగించే అవకాశం రాకుండానే ఆశాప్రియ తారాపథం నుండి రాలిపోతుంది. కథ కంచికి వెళ్ళిపోతుంది.
కుముదం, సీతారత్నం, అరుణ, ఆశాప్రియ వీళ్ళందరూ ఒకేభావానికి విభిన్న రూపాలు. సంప్రదాయం కోసమో, ఆర్గిక సామాజిక స్తాయిల కోసమో, మనసుని
థి థి
చంపుకోడానికి వీళ్ళందరూ వ్యర్ధప్రయత్నం చేసారు. బుచ్చిబాబు స్రీ పాత్రల విషయంలో సాధారణంగా కనబడే ధోరణి ఇది. కొన్ని సందర్భాలలో అతని స్రీ పాత్రలు మానవత్వాన్ని కూడా మరచిపోయినట్టుగా కనబడతాయి “జ్యోతి” కథలోని జ్యోతి, “అనురాగ ప్రన్థారం” కథలోని శోభాసుందరి, “నాసటన ్రాసినవ్రాత” కధలోని రాజమ్మ, ఇత్యాదుల గడుసుదనం, తమ ప్రయోజనాలకు మొగవారిని ఉపయోగించుకునే ధోరణి, మనల్ని ఆశ్చర్యపరిస్తే - “మీరు, నేనూ, మామ్” కధలోని పద్మావతి, “నిరంతర త్రయం” కథలోని సుగుణ, “వనకన్య” కధలోని వనకన్యల ప్రవర్తన మనకు బాధను కూడా కలిగిస్తుంది. అయితే, వీళ్ళెవరూ సోమరొసెట్ మామ్ నవల “ఆఫ్ హ్యూమన్ బాందేజి” లోని “మాల్డ్రిడ్” మాదిరిగా క్రూరులు కారు.కొన్ని సందర్భాలలో బుచ్చిబాబు ద్హీ పాత్రల ఆశక్తతను, బ్రతుకనేర్చినతనాన్ని, క్షమించగలుగుతాం కూడా. బుచ్చిబాుక్తు తన పాత్రలపట్ల సానుభూతి ఉండడమే ఇందుకు కారణం. బుచ్చిబాబు మామ్ లేదని భావించిన "జీవితం పట్ల ఉండాల్సిన గౌరవభావం” ఇదేననుకుంటాను | -
బుచ్చిబాబు కథల్లో కనబడే స్త్రీ పాత్రల్లో 'తెరదాప దించిన పడవి కథలోని విదురమ్మకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని నా అభిప్రాయం. రచయితగా అతడు పాత్ర చిత్రణలో ఆకాంక్షించిన “అర్ధంకాని గొడవి విదురమ్మ కథలో పుష్కలంగా ఉంట్టుంది. నా దృష్టిలో బుచ్చిబాబు కధల్లో ఆణిముత్యం అనదగ్గ కధ ఇది యుగానికి పోయి తిరిగిరాని తన భర్త జ్ఞాపకాలతో సతమతమవుతూ, మృత్యువును ఆహ్వానిస్తూ (బ్రతుకుతున్న పతివ్రతగా కధ మొదటిలోమనకు విదురమ్మ పరిచయం అవుతుంది. అయితే, కథ చివరికొచ్చేసరికి పరిస్థితి వేరు. శరీరం చేసే అలజడికి తట్టుకోలేక, లొంగిపోయిన ఒక సామాన్యురాలిగా ఆమె మనకు కనిపిస్తుంది. అయినా ఆమె మీద మనకు కోపం రాదు. దీనికి కారణం రెండింటిలోనూ ఉన్నది. - విదురమ్మ సిసలైన
కోడూరి శ్రరామమూర్తి వి వ్యక్తిత్వమే ! ఆమె తన భర్తను ఎంతగానో (ప్రేమించింది. అతడి ఎడబాటును భరించలేక పోయింది. యుద్దానికి వెళ్ళిన భర్త తిరిగి వస్తాడేమో నన్నఆశతో అతడి గదిని ఆమె ప్రతిరోజూ శుభ్రం చేసి, అతడు వాడే వస్తువులన్నీ ఎక్కడివక్కడే ఉంచేది భర్తమీద 'పేమను అతడు వాడిన వస్తువులపైన కూడా చూపించేది. అందుచేతనే, ప్రభుత్వంవారు ఆమెకున్న కొద్దిపాటి భూమిలో కొన్నిగజాల స్థలాన్ని కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం కలుపుకోవాలని అడిగినా - తనూ, తన భర్త, కూర్చుని కబుర్లు చెప్పుకన్న బండరాయిని కదల్బడానికి వీల్లేదంటూ అభ్యంతరం చెప్పింది. అతి బలవంతం మీద ఆ బండరాయిని కాస్త ప్రక్కకి తొలగించడానికి ఒప్పుకుంది గానీ, కమ్యూనిటీ హాలు నిర్మాణానికి అడ్డంగా ఉన్న చెట్టునుమాత్రం కొట్టడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే, అ బండరాయి మీద ఉన్నవి తను గడిపిన తీయటిరోజుల జ్ఞాపకాలు. తను పోయినప్పుడు ఆ జ్ఞాపకాల చిహ్నం ఏమయినా ఫరవాలేదు. కాని, తాను చెట్టుమొదటిలో కప్పెట్టిన చేదు జ్ఞాపకాలు మాత్రం తనతోనే పోవాలి! అందుకే ఆ జ్ఞాపకచిహ్వాన్ని చేజిక్కించుకోవడం కోసం ప్రాణాల్ని పూర్యామాంగా పెట్టుకొంది. మనిషిలో ఉండే బొమ్మా, బొరుసుల కథను హృదయానికి సా రీతిలో చెబుతాడు బుచ్చిబాబు ఈ కథలో. విదురమ్మ మనస్తత్వంలోని వైచిత్రిని ఆవిష్కరించడం మాత్రమే గాక, బుచ్చిబాబు ఈ కథలో మరొక ప్రయోజనాన్ని కూడా స్థైరంచగలిగాడు. అది - వ్యక్తి ప్రయోజనానికీ, సామాజిక ప్రయోజనానికీ మధ్య గల బందం ద చడం. సంఘానికి కమ్యూనిటీహాలు ముఖ్యం. ఒక ముదుసలి విధవరాలు నంలో పెట్టుకున్న సెంటిమెంటు ముఖ్యం కాదు. సామూహిక ప్రయోజనాన్ని "“ధించదలుచుకున్నప్పుడు వ్యక్తిచేసే ఆర్తనాదం పట్టించుకునే తీరిక ఎవరికీ ఉండదనే కథో మరోమారు మనకు జ్ఞాపకం చేస్తుంది. చాలాకాలం జ్ఞాపకం ఉందేకథ, సిన మొదలు, మధ్య, తుదిభాగాలు మూడు చక్కగా అమిరాయి. అంత్య మొదలూ, లేకుండా ఉండి - మధ్యలో (ప్రారంభమై మధ్యలో హర్షించనలీ రణిని, అంటే చెహోవ్ రీతిలో కధ చెప్పేధోరణిని, సోమర్సెట్మామ్ దిగవెడచిన బుచ్చిబాబు కూడా హర్షించడు. “చెహోవ్ పద్ధతికథ ఇసుక మీద కెరటం వెనుక సమర షి నాకది తృప్తినివ్వదు. ఆ కధ కెరటంగా కనబడాలి. కెరటం అభిప్రాయా న్ రు వినఐడాలిో అంటాడతను. సోమరొసెట్ మామ్ కూడా అదే గమ న ఈస్ట్ అండ్ వెస్టో కథల సంపుటి మొదటిమాటలో వ్యక్తీకరించడాన్ని చేప ది. “కథకు తుదీ మొదలూ ఉండకూడదని అనడం తలా తోకాలేని ప కావాలనుకోవడం లాంటిది. ఆ రెండూ లేకపోతే అది చేప కానేకాదు”. అన్న మామ్ - సరిఅయిన తుదీ, మొదలూ దొరకక తన దృష్టిలోకి వచ్చిన మంచి ఇతివృత్తాలను వదులుకున్న వైనాన్నికూడా తన రైటర్స్ నోట్‌బుక్'లో రాసుకున్నాడు.
మవ తెలుగు కథ - నాడు,నేడు
బుచ్చిబాబు కూడా ఇట్లాంటి వాటిని వదిలి పెట్టాలనుకున్నాడు గానీ, కొన్ని సందర్భాలలో నిగ్రహించుకోలేక పోయాడనుకుంటాను. 'రైటర్ నోట్బుకిలో మామ్ ప్రస్తావించి, కధగా రాయకుండా వదిలేసిన ఒక ఉదంతాన్ని ప్రాతిపదికగా చేసుకుని “మామ్ రాయని కధి అంటూ రాసి దాన్నాక కాశీమజిలీ కథలాగా తయారుచేశాడు. “వీ అనే కధ విషయంలో కూడా పరిస్థితి ఇంతే !
మాంసం సాహేబు కూతురు 'హసీమావీకి వేగంగా తిరిగే ఏ చక్రాన్నయినా ఆపడం ఇష్టం. తిరుగుతున్న ఫేన్లోనూ, సైకిల్ చక్రంలోనూ, కుట్టుమిషను చక్రంలోనూ, వేళ్ళు పెట్టి దెబ్బలు తగిలించుకుంటూ ఉంటుంది ఈ అలవాటును మనస్తత్వ శాస్త్రరీత్యా ఒక “అబ్సెషన్' అని చెప్పవచ్చు ఇట్లాంటివి ఏర్పడ్డానికి చిన్నతనంలో పెరిగిన వాతావరణం దగ్గిరనుంచి, చాలా కారణాలుంటాయి. 'వీ విషయంలో ఈ అలవాటు ఒక శాపంగా మారి ఆమె బతుకును విషాదపు అగాధాల్లోకి తోసేస్తుంది. చివరకు ఆమె జీవితాన్నే బలి తీసుకుంటుంది. హష్షీమాబీలోని ఈ అబ్సెషన్ వెనుక ఏదో ఒక 'ముసోఖిక్ ప్రవృత్తి కారణభూతంగా ఉండిఉంటుంది. కాని, బుచ్చిబాబు దీనికొక తాత్త్విక అర్ధం ఇవ్వడానికి ప్రయత్నించాడు. నిత్యకర్మ అనే చక్రంలో తిరిగిపోతున్న మనిషిని అందులోంచి తప్పించడానికి గాను, చక్రం ఆపేందుకు జరిగే ప్రయత్నానికి ప్రతీకగా “వీని నిలుపుదామనుకొని, దానిని సక్రమంగా నిర్వహించలేక అభాసుపాలయ్యాడు. ఈ కథను బుచ్చిబాబు ఒక "సైకలాజికల్ స్టోరోగా ప్రారంభించి,మధ్యలో ఆ భావనను వదిలితాత్తిక అర్భాలవైపు, భగవద్దీత వైపు పరిగెట్టాడు. అందువల్లనే “వీ కథ అసమ[గ్రంగా ఉన్నట్టు కనబడుతుంది
ఇక, - “నేను అనబడే కధకుడికి “బీ పట్ల అంతటి కుతూహలం ఉండడానికి మాత్రం సమర్ధన చెప్పుకోవచ్చు. అతడి అంతరంగంలో 'బీ కి ఉన్న 'మసోఖిక్' ప్రవృత్తి లాంటిదే ఉన్నది.తాను చేయదలచి చేయలేని పనుల్ని 'బీ అవలీలగా చేస్తూండటంతో, అతడు 'బకి ఓ రకంగా మానసికంగా సన్నిపొతుడయ్యాడు - ఇక, ఈ కథలోని మారెన్నకు “బీ పై గల అభిప్రాయాన్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో దొరికిన 'పీ తలవెంట్రుకను అతడు దాచుకోడాన్ని బట్టే అవగతం చేసుకోవచ్చు. ఇట్లాంటి స్టఫ్ ఫెటిషిజమ్ “ముగింపు మీకు తెలుసు” కథలోని అటవీశాఖ ఉద్యోగి విషయంలో కూడా కనబడుతుంది. తను (ప్రేమించిన అమ్మాయి తలవెంట్రుకను అతడు చేతి పిడికర్రలో దాచుకుంటాడు. “ఆ రాలిన అకులు” కథలోని కాంతం తన మరిది పంపిన గులాలీ మొక్కను అప్యాయంగా పెంచడం, అది ఎప్పుడు పువ్వుపూస్తుందా, దాన్నెప్పుడు తల్లో పెట్టుకుందామా అని కలవరించడం, కూడా ఈ బాపతు అంతరంగ సంక్షోభానికి గుర్తుగా చెప్పుకోవచ్చు. “చివరకు మిగిలేది నవలలో దయానిధి అమృతం తలవెంట్రుకను
కోడూరి శ్రీరామమూర్తి ౨వ
దాచుకోవడాన్ని కూడా పాఠకులు ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకోవచ్చు. మనస్తత్వ శాస్త్రంలో తనకు గల పరిజ్ఞానాన్ని ఇలా పలు సందర్భాలలో బుచ్చిబాబు పాత్రల స్వరూపాన్ని తీర్చిదిద్దేందుకు ఉపయోగించుకున్నాడు. “వీరేశలింగం ఏం చెయ్యాలి?” కధలోని మైధిలి, “యువపాశం” కథలోని మాయల విషయంలో జరిగిన 'సబ్లిమేషన్ యాక్టివిటీ'కి కూడా మనస్తత్వ శాస్త్రపరమైన వ్యాఖ్యానం చెయ్యవచ్చు.
- ఇదంతా బాగానే ఉందిగాని, “బీ జీవిత కధను బుచ్చిబాబు మనకు చూపించిన తీరు అతని తాత్త్విక పరిజ్ఞానానికి గానీ, మనస్తత్వశాస్త్ర పరిజ్ఞానానికి గానీ సూచికగా లేదు. “పీ వింత ప్రవర్తన వెనుకగల విచిత్ర మనస్తత్వాన్ని గానీ, ఆ విచిత్ర ప్రవర్తన ప్రేరేపించే కాత్త్విక జిజ్ఞాసనుగానీ, అవిష్కరించడంలో రచయిత దాదాపుగా విఫలీ కృతుడయ్యాడు. మనం చెయ్యగలిగిందల్లా దేన్ని గురించీ పట్టించుకోకుండా ఉండడమే నన్న మారెన్న సూక్తి కథకు *నీతి కావడం “బీ కధను మరింత గందరగోళంలో పడేసింది. కథలో ఆలోచించవలసిన విషయం ఉండాలి, నిజమే ! కాని, దానికీ ఒక పరిమితి వ సోమరొసెట్మామ్ అన్నట్టు - పారకుణి గాలిలో వదిలెయ్యడం మంచిదే గొని,
డితో బాటు రచయిత కూడా గాలిలో ఉండిపోకూడదు ! -
చాలా ముందే చెప్పినట్టు, బుచ్చిబాబుకి మనిషి మనసులో జరిగే అలజడి వివరించడం కూ “.నొనపాథమైన విషయం. ఇందుకుగాను అతను 'చైతన్వస్రనంతి' విధానాన్ని
వు సీసయోగించుకున్నాడు. పాశ్చాత్య సాహితీసీమలో జేమ్స్‌జాయిస్, వర్జీనియావుల్స్ శి ్సేల్ ఫ్రోస్ట ఇత్యాదులచే రచనలు చేయంచిన స్టీమ్ ఆఫ్ కాన్షస్నెస్' రచనా
'ప్ర్టైరైలుగులో (ప్రచారంలోకి తీసుకువచ్చినవారిలో బుచ్చిబాబు ప్రముఖుడు. అయితే
ఈ క్రద్ధ లో అతడు రాసిన 'వైతన్య ్రవంతి' అనే పేరుగల కథ కధగా రాణించలేదు.
లేదనే క్రో చైతన్య (స్రవంతి విధానానికి ఉన్న కొద్దిపాటి ప్రయోజనం కూడా
తి కలుగుకుంది.
అంకి వ్రపపగా బుచ్చిబాబును గురించి తెలిపే ఏ పరిశీలనలోనయినా అతని “రసెల్‌కి నా అభిష్టా టకథలూ గురించి చెప్పకపోతే - అది అసమగ్ర పరిశీలనే అవుతుందని బెర్ట్రాండ్ రే తత్త్వశాస్త్రవేత్తలలో తీవ్రంగా వివాదానికి గురిఅయిన వారిలో పేరుకుపోయి 6 ఒకడు. “నీకి అనే పేరుతో 'సంప్రదాయం' అనే పేరుతో, సంఘంలో ప్రపంచంలో ప్రై కుళ్ళును ఎదుర్కోడానికి రసెల్ చేసినంతటి పోరాటం సమకాలీన ర8[ఈ౪ అనే గ తత్త్వశాస్త్రవేత్తా చేసి ఉండడు. ఆ మహనీయుడు రాసిన ౫/౧2! 'మరమేకులు ర్థంథంలోని కొన్ని భావాలను ప్రాతిపదికగా చేసుకుని బుచ్చిబాబు
- చరమడతలు', "కొత్త నీరు - పొతవంతెని అనే రెండుకధల్ని రాశాడు.
2222 తెలుగు కథ - నాడు,నేడు రసెల్ భావాల ప్రభావం తెలుగుసాహిత్యంపై ప్రత్యక్షంగాపడడం ఇదే మొదలు అని చెప్పవచ్చు.” రసెల్ సిద్దాంతాలలోని “స్వేచ్చా ఆరాధన” సోమర్సెట్ మామ్‌ని ఆకట్టుకున్నట్టుగానే, బుచ్చిబాబును కూడా ఆకట్టుకుంది.
'మరమేకులు - చీరమడతలు' కధలో బుచ్చిబాబు చెప్పదలుచుకున్నని రెండు విషయాలు ఒకటి - నీతికీ, అవినీతికీ, మధ్య ఉన్న దూరం.రెండోది - మరమేకులకు, చీర మడతలకు గల వ్యత్యాసం ఈ కధలోని రవిప్రకాశం సౌందర్యాన్వేషణను వ్యభిచారం క్రిందా - వ్యభిచారాన్ని ఘోరమైన నేరం క్రిందా పరిగణించి లోకం అతనిని ఇబ్బంది పాలు చేయడం పట్ల మనం సానుభూతి చూపించవచ్చు. దైవభక్తుడుగా, నీతిమంతుడుగా చలామణీ అవుతూ గంగాధరం చేసే పరపీడనా కృత్యాలను మనం ద్వేషించవచ్చు. అయితే - అంతమాత్రాన వ్యాపార నిర్వహణలో రవిప్రకాశం అసమర్ధను మనం సమర్థించలేం. వ్యాపారస్తులకు కావలసింది చిత్రకారులు కారు. వాళ్ళకు కావలసింది మరమెకులే ! చీరమడతలెందుకు ? - అదిన్నీ గాక, రవి'ప్రకాశం చిత్రం ఆర్ట్‌ఎగ్జిబిషన్‌లో ఉత్తమంగా ఎన్నిక చేయబడి - అటుతర్వాత గంగాధరం పార్టీవాళ్ళ “అవినీతి మార్కు (ప్రచారం ద్వారా బహుమానార్దతను కోల్పోయిందనడం సమంజసంగా లేదు.
ఇక, “కొత్త వంతెన - పాతనీరు' కధలో రచయిత ఆలిమేలు జీవితానికి ఇచ్చిన ముగింపు, కథను గందరగోళంలో పడేసింది. నిజాయితీపరుడయిన ఇంజనీరు ప్రభాకరంపై పారకులకు కలిగే సెంపతీ కధ చివరికొచ్చేసరికి అలిమేలు చావు ఫలితంగా కరిగిపోతుంది. బుచ్చిబాబే అన్నట్టు ఈ కథలోని ఇంజనీరు ఉదంతం వెనుక భావం, మెదడు ఉండే - అతని ప్రేయసి అలిమేలు కధ వెనుక వృాదయం, ఉద్రేకం ఉన్నాయి. బుచ్చిబాబుని మొదటినుండి ఆకట్టుకునేది ఈ రెండో విషయమే ! అందుచేతనే ఒక దోవలో బయలుదేరి మరొక దోవలో బయటకువచ్చాడు బుచ్చిబాబు
నిజానికి - ఏ కధకుణ్ణయినా ముందుగా కదలించేది హృదయానికి సంబంధించిన ఉటద్రేకాలే ! దీనికున్న శక్తి మెదడుకు సంబంధించిన భావానికి లేదు. అందుచేత ఒక మంచి కధ మేధాపరంగా లోతయిన భావాల నెన్నింటినో వ్యక్తీకరించవచ్చు. కాని - ఒక గొప్ప భావం మంచికధకు ప్రాతిపదిక కాగలదని చెప్పలేము.
ఏది ఏమైనా - ఈ వివరణలన్నీ కధ రాద్దామని కూర్చున్న కథకుడికి అవసరం లేదు. వదో ఒక భావం, లేదా ఏదో ఒక సంఘటన తనని కదిలించినప్పుడల్లొా అతడు కథ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అతనిది నిరంతర కృషి ఈ విషయాన్ని గురించి చెబుతూ అంటాడు బుచ్చిబాబు -
- రసెల్ భావాల (ఢేరణతో కథకుడు కథను రాసానని తెలపడం అని భావం
ము పద2మ2222డ2డడ2డడనడడడ22వ2222 కోడూరి శ్రీరామమూర్తి మమ “పక్షి గూడు కట్టుకుంటుంది. దానికోసం కావాల్సిన ఆకు, అలము, గడ్డి, పుల్ల - ఎన్నెన్నో పోగుచేసుకొచ్చి గూడు కడుతుంది. అందులో గుద్దుపెడుతుంది అనుక్షణమూ ఏదో సేకరిస్తూ ఉంటాడు కథకుడు. పెద్దగాలికి గూడు పడి (గ్రుడ్డు పగులుతుంది. మళ్ళా మరో కథ రాస్తాడు. తుఫానుకి ఆ చెట్టు కూలుతుంది. మరోచోటుకి పోతాడు. మనుషులను కూలని చెట్లుగా భ్రమించి, వారి హృదయంలో జొరబడి వారి ఆనందానికి కృషిచేసే జీవి కథకుడు” తన అల్పజీవితంలో బుచ్చిబాబు చేసిన అనల్బ కృషి ఇదే! కథా రచయితగా బుచ్చిబాబు దృక్పథం సరిపడనివారు ఉండవచ్చు అతడి కథల్లో సామాజిక ప్రయోజనం కానరాదనే విమర్శ కూడా ఉండవచ్చు. కాని, సాహిత్య కృషిలో బుచ్చిబాబుకు గల నిజాయితీని మాత్రం శంకించనవసరం లేదు. మార్కెట్లో ఏ సరుకుకు గిరాకీ ఉందో పరిశీలించి - దానికనుగుణంగా సోషలిస్టు మార్కు కధల్లో, రొమాంటిక్ ధోరణి కథలనో, అతను రాయలేదు. ఇతరుల అభిప్రాయం ఏదన్నా గాని - తన హృదయాన్ని కదిలించి, ఉద్వేగం కలిగించిన విషయాల గురించే ఆతను రాశాడు. మిచ్చిబాబు అంటాడు - “నిజాయితీ, ఉద్వేగము, ఈ రెండూ కథకుడి ఆయువుపట్టు. కథలు ఇప్పటికీ - బహృుశా ఎప్పటికీ - తమ స్థానాన్ని నిలబెట్టుకోడానికి గల కారణం ఇదేననుకుంటాను. (ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ప్రచురితం - 1985) ఈ వ్యాసంలో ఉపయోగించిన కొన్ని మనోవైజ్ఞానిక పదాలకు అర్థవివరణ. 0180 ఏ & న౭101001024 ౧0౧౮1౪౦౧ 1౧ ౪౧1౦) 5అల౬! ౮౯4౪02410౧ 5 [గ రే086 0౫ ౧2౧61౧౮ 09016615 0? ౧౦౧-౫1౬ ౧౭౧19 ౦01౧6 006 081000119 104 ౧౦గా౦౭౯౦ 6 ౦౧౧౦5౧19 96% 0093688107 : | ౧615151201ఇ06 0[6౧ 1౧౬౪10౧౬] 1662 ౪౧1౦0 గ౫౫౫/ 09 2600గ౧- 20166 0/ ఇ 60౧౧౧౪1910 10 04౧౧/ ౦౪1 2౧ 201 [1290011501 : 51141 ౧1945419 అధింగంగ౧ం66 1౧ 06109 ౧౮ ౧౪౧౫1౬66, 0౪ 6౦౧౧1౧2166. 5060110280: ౧ 1౧౦౦౧96005 ౧000958 ౪౧69 0౪ ఏ6 [101600 19 ౪2౧510గ౧66 1౧10 ౧౦౧౪ ఇం06౧14016 107౧౫ ౦1 ౦416 ఓ15160 వ 56%44] 0౫/౧౮ (4౧6), 6౧౦౪0౧౬! 012౪1౧9 0౯ ౦2౧౭౦|0/ (0౯ 9గ66 (౪౧౮)
222 అలుగు కథ - నాడు,నేడు పాతికేళ్ళ తెలుగుకథ - కొన్ని ఆలోచనలు
“కధ అనేది సమాజానికి అద్దమూ, దీపమూ కావాలంటారు. గురజాడవారి ధర్మమా అని పుట్టుకతోటే యౌవ్వనాన్ని సంతరించుకున్న తెలుగుకథ చిరకాలంగా ఈ బాధ్యతను నెరవేరుస్తూనే ఉంది గడిచిన పాతికేళ్ళ కాలం* ఇందుకు మినహాయింపు కాదు.
నిజానికి - గత పాతికేళ్ళ కాలం చాలా ప్రాముఖ్యత కలిగిన కాలం. ఈ కాలంలో మనదేశంలో దాదాపుగా అన్నిరంగాల్లోనూ ముందెన్నడూ లేనన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. అర్ధిక విధానాలకు సంబంధించి ఇది మరింత సత్యం. సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయిన తర్వాత, - ముఖ్యంగా 90ల నుండి - లిబరలైజేషన్, ప్రయివేటైజేషన్, గ్లోబలైజేషన్ (ఎల్పిజి) అనేవి ఈ దేశంలో తారకమంత్రాలయి పోయాయి! మల్టీనేషనల్స్ రంగప్రవేశం చెయ్యడం, మార్కెట్లోనికి వినియోగవస్తువులు వరదలా వచ్చి పదటం, ఇవన్నీ ప్రజల ఆలోచనావిధానంలో, వినియోగపు అలవాట్లలో గణనీయమైన మార్పులు తీసుకొని వచ్చాయి. వికృతరూపంలో కన్ఫ్యూమరిజమ్ సమాజాన్ని ఆక్రమించుకుంది. మానవ సంబంధాలలో - ప్రత్యేకించి కుటుంబ సంబంధాలలో ఆర్ధత, ఆత్మీయతలకు బదులుగా లాభనష్టాల లెక్కింపు (ప్రాధాన్యతను పొందసాగింది. పెట్టుబడిదారీ వ్యవస్థ వికృత చేస్టలన్నింటికీ ఈ దేశం ఒక విశాల రంగస్థలమయిపోయింది. తరతరాలుగా దేశంలో పాతుకునిపోయి ఉన్న అనేకానేక సమస్యలకు జతగా చేరినవి ఇవన్నీ -
ఈ దేశంలో (ప్రణాళికా యుగం ప్రారంభమై అయిదు దశాబ్దాలు దాటినా సాగునీటి ఎద్దడి అలాగే ఉంది. ఇప్పటికీ వ్యవసాయం అనేది “వర్షాలతో జూదం' గానేఉన్నది. (చూ-కేతువిశ్వనాథరెడ్డి - 'వానకురిస్తే? పంట పండినా, పండకపోయినా - వ్యవసాయ వస్తువులు ధరలుపెరిగినా, తగ్గినా - అన్నింటా లాభం మధ్యవర్తులకు, నష్టం రైతులకు అనే “న్యాయం” (1) ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వ్యవసాయం అనేది ఎంత గిట్టుబాటు కాని వ్యాపకంగా ఉన్నప్పటికీ, మట్టిని నమ్ముకుని తరతరాలుగా బ్రతికిన రైతుకు తాను
కోడూరి శ్రరామమూర్తి ఊహ సాగుచేసే భూమి ఒక దేవత. కన్నకల్లి. దానినతడు ఒక వాణిజ్యవస్తువుగా ఎన్నటికీ చూడలేడు. వ్యవసాయ భూమిని రొయ్యల చెరువుగా మార్చలేడు భూమిని ఇళ్ళష్ణాట్లుగా మార్చి, సొమ్ము చేసుకునే అవకాశానికి ఎదురుచూడలేడు కానీ హృదయంలోని ఆర్ధతలను గుర్తించలేని క్రొత్తతరం వారికి, వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చాలని చూచే పట్నం నించి వచ్చిన మోతుబరులకు ఇలాంటి సమస్యలు లేనేలేవు. వెనుకటి తరం రైతుల ఈ ఆలోచనలు వారికి నవ్వులాటగా మాత్రమే ఉంటాయి. ఒక వైపున ఉన్న పరిస్థితి ఇలా ఉంటే - వేరొక వేపున ఉన్న సమస్య మరొకటి. దేశాన్ని చిరకాలంగా పట్టిపీడిస్తున్న కులవివక్ష. మతవివక్ష వంటి “వ్యాధులు ఇటీవల మహమ్మారిలా విజృంభించి సాధారణ జనజీవితాన్ని అశాంతిమయం చేస్తున్నవి. కులాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకొనడం అలవాటయిన రాజకీయవేత్తలకు 'మతం' అనేది కూడా ఓట్లు సంపాదించి పెట్టే సాధనంగా మారిపోయింది. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత, గోద్రా ఉదంతం తర్వాత రాజకీయవేత్తలకు ఈ విషయంలో మరికొంత ష్పు వచ్చింది. ఇంతవరకూ పేర్కాన్న ఈ అంశాలన్నీ గతపావు శతాబ్దికాలంలో వచ్చిన తెలుగు కథల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కనబడతాయి. ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త 861206 గి5961 ఒకప్పుడు తన ఆత్మకథలో *-10/68 ౧5310౧5 91గ౧౫/ 060౪67 ర 80౧00 ౧౭౪6 30౪9౧66 ౧౫/18 - 116 [000100 10౯ 10౪6, 116 56౬00 101 కగ౧04|1- ఆరే్ర6, ఇ౧6 ౪౧౦92౯2016 ౧స/10/ 16 9616౧100 ౧౧౭౧౧6” అని రాసుకున్నారు. కనన ౧౦92016 ౧1/10? 46 966౧౧9 ౧౫౭౧౧౮ తోనే నేటికథకులు కూడా వితానికి బహుముఖంగా అద్దంపడుతూ చక్కటికథలు రాస్తున్నారు
మనిషిలోనయ్యే బాధల్లో చాలావాటికి మనిషిలోని పీడనా ప్రవృత్తి, దోపిడీ ప్రవృత్తి, కారణభూతాలవుతాయనే విషయం అందరూ ఎరిగిందే. పురుషాధిక్య సమాజాల్లో స్త్రీకి, కులవ్యవస్థకు ప్రాధాన్యత గల సమాజాలలో దళితులకు ఆవేదనను కలిగించే పరిస్థితులు ఏర్పడటానికి కారణం ఈ (ప్రవృత్తులే ! అయితే, ఈ ప్రవృత్తుల ఫలితంగా ఏర్పడే ఫ్థితి కాలానుగుణంగా కొత్తరంగులు వేసుకుంటూ ఉంటుంది.
“80ల నాటి చలం రచనల కాలంతో పోలిస్తే ఈ రోజున స్త్రీలు ఎంతగానో మెరుగైన స్థితిలో ఉన్నారు. విద్య, ఉపాధి, సంపాదన ఇలాంటి అనేక విషయాలలో పురుషుడితో సమానంగా ఉన్నారు. చట్టపరంగా కూడా వారికి ఎన్నో రక్షణలు కల్పించ బడ్డాయి. అయినా శారీరకంగా, మానసికంగా ఆమె అనేకరకాల “హింసిలకు గురికాక
22 తెలుగు కథ - నాడు,నేడు తప్పడం లేదు! కుమార్తెగా, భార్యగా, తల్లిగా మాత్రమే కాకుండా తనకంటూ -ఒక వ్యక్తిత్వం (4 ౧౭/౦౧ 9 ౧౭౧౪) వున్నదని బుజువు చేసుకోడానికి ఆమెపదే తపన, లోనయ్యే ఆరాటం, శతాబ్దాలు గడిచినా ఇంకా చెక్కుచెదరకుండానే ఉన్నది (శ్రామిక వాడలు మొదలుకొని, ఆర్ధికంగా,సామాజికంగా ఉన్నతస్థాయిలో ఉన్నారని భావించబడే కుటుంబాలు నివసించే ప్రాంతాలవరకు - ప్రతి ఇంటి తలుపు తడితే ఆ ఇంటీలోని స్త్రీ, మనసు విప్పుకొని తన ఆవేదనను చెప్పుకోగలిగితే,- ప్రతి ఇంటా ఒక్కో వ్యధ వినబడుతుంది ! అంగీకరించలేని చేదు నిజమిది.
వీటినన్నింటినీ అతిసూక్ష్మంగా, నిశితంగా, గమనిస్తూ - గత ఒకటిన్నర దశాబ్దాలుగా రచయిత్రులు, రచయితలు - మారీమారని ప్రపంచంలోని స్రీ మనోగతాన్ని అద్భుతమైన కధలరూపంలో మన ముందు ఉంచుతున్నారు. “బ్రతుకంతా బూజులు దులుపుతూ, దిండు కవర్లు మారుస్తూ, చీపురుకట్టతో చచ్చిపోవలసిందేనా?-” అనే సాధారణ గృహిణి ఆక్రోశం (అతడిభార్య' కథలో - కొండేపూడి నిర్మల) మొదలుకొని, “స్త్రీని స్రీగా తయారుచేసి కంట్రోలు చెయ్యడం వల్లే ఈ దోపిడీ సమాజం మనగలుగు తోంది. సమాజాన్ని ఉత్పత్తి విధానం ద్వారా మాత్రమే కాదు. పునరుత్పత్తి విధానం ద్వారా కూడా అర్ధం చేసుకున్నప్పుడు - ఈ సమస్యలు స్రీల లైంగిక వ్యక్తిత్వం మీదా, సంతానోత్పత్తి మీదా, సమాజం విధించిన కంట్రోళ్ళుగా అర్ధం అవుతాయి -” అనే ఆలోచనాత్మక ప్రతిఘటన వరకూ (ఒక రాజకీయ కధా - ఓల్లా) - నేటి స్త్రీవాద కధాసాహిత్యం సమాజంలోని స్త్రీల వేదనకు పలువిధాలుగా అక్షరరూపం ఇస్తున్నది.
అంతేకాదు ప్రీ పురుషులు కలిసి కాపురం చేసే వివాహ వ్యవస్థకు మూలాధారం పురుషాధిక్యత అని భావిస్తూ - స్ర్రీవాదపు దృక్సథంతో వచ్చిన కథల్లో పలుసందర్భాల్లో సంప్రదాయ వివాహ వ్యవస్థపై పెద్దఎత్తున దాడిచెయ్యడం కూడా జరిగింది. “అబార్షన్ చేయించుకొనడమో, బిడ్డను కనడమో, ఏదయినా నా ఇష్టప్రకారంగా జరుగుతుంది. బిడ్డకోసం పెళ్ళేమిటి? నాకు మొగుడు వద్దు. పెళ్ళి వద్దు. నా బిడ్డ నాకు కావాలి. కంటాను” నిర్ణయం” - కుప్పిలి పద్మ) అనే ధోరణిలో కొందరు కథలు రాశారు. సాంసారిక జీవితంలో పురుషుడు చేసే అవాంఛనీయమైన ఆధిపత్యాన్ని సహించలేక, భర్తనుండి విడిపోయి, తమ అభిప్రాయాలకు సన్నిహితమైన వ్యక్తి అని తాము భావించిన మరొక స్త్రీతో - కలిసి జీవించే ప్ర్రీల కథలను మరికొందరు రాశారు. పెళ్ళిచేసుకొనడం, పిల్లల్ని కనడం, అనే విషయాలలో తనకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకునే స్వేచ్చ స్త్రీకి ఉన్నదా? - లేక దానినాక సామాజిక బాధ్యతగా తప్పనిసరిగా నిర్వర్తించవలసిందేనా?
- అనే విషయాన్ని ఎప్పుడో చలంగారు 'భార్యా వంటి కథల్లో ఆవేశంతో చర్చించి
ష్తుటడక2డనడడడడడననననడడడన వవ కోడూరి శ్రీరామమూర్తి మమ ఉండవచ్చు. కానీ, ఈనాటి రచయిత్రులు ఈ విషయాన్ని మరింత విస్తృతంగా తమ కథల్లో చర్చిస్తున్నారు. ప్రీ కేవలం పిల్లల్ని కనే యంత్రంగా భావించే వివాహ వ్యవస్థ లోపభూయిస్టం కావచ్చు. కానీ, - పెళ్ళితో సంబంధం లేకుండా స్త్రీ తన మనుస్సుకు నచ్చిన పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకుని పిల్లల్ని కనడం జరిగితే ఈ పరిస్థితి కనీసం ప్రీకయినా ఎంతవరకూ ఉపయోగపడుతుంది? - ఎప్పుడో ప్లేటో ప్రతిపాదించిన “కమ్యూనిటీ చిల్జనో అనే భావనకు ఇది కార్యాచరణను కల్పిస్తుందని అనుకోవాలా? - ఇది రాస్తున్నప్పుడు “౬10౦99 01 ౯౭౧1౧15౧” అనే పుస్తకంలో 01౪6 81206 - “672416 9అ62| 6660గ ౧29 00౧౧9 10 06 5688౧0 25 ౬ 6౦౪0౪౪] 0616112 0062600 21606917 19 1౧198519 0 ౧౭౧ 266౯1౧20 ౪0౯౧౧౭౧౮ అని రాయడం జ్ఞాపకానికి వచ్చింది /| ఈ విషయానికి సంబంధించిన చర్చ అలా ఉంచి, ఇద్దరు ప్రీలు 'కలిసి జీవించి నంత మాత్రాన -_ దానివలన ఇద్దరికీ సమానమైన ఆనందం లభిస్తుందా? - అనే విషయాన్ని కూడా ఆలోచించవలసి ఉంటుంది. - నిజానికి అందులో ప్రయోజనం ఏదీ లేదు అన్ని చెబుతారు కె. రామలక్ష్మి "స్వేచ్చ నుండి పంజరంలోకి' అనే కథలో. ఒకరిపై ఒక్షర్స ఆధిపత్యం చెలాయించాలనే ప్రవృత్తి మనిషిలో ఉన్నప్పుడు - ఒకే ఇంటిలో స్త్రీ పురుషులు కలిసి ఉన్నా లేక ఇద్దరు స్రీలు 'కలిసి జీవిస్తున్నా - కలిగే ఫలితం మాత్రం ఒక బే అని ద్ తేకాదు “న్స పురుషులు పెళ్ళి చే కై అని చెబుతుంది ఈ కథ. అం స అసో మాత్రాన 'కనబడని తాళ్ళు' వాళ్ళని కట్టిపదేస్తాయనుకోవడం పొరపాటు. టె ఉన్నకమైసవీ, సున్నితమైనవీ, వారిని కట్టిపదేస్తాయి” అనే సందేశాన్ని ఇచ్చేందుకు ఈ కథ వెనుకాడదు. న్్ ఈ అభిప్రాయం విషయం ఎలా ఉన్నా, గత పాతికేళ్ళలో ఒక వరదలాగా ప్రీవాద దృక్పధంతో కథలు పుంఖానుపుంఖంగా వచ్చాయి. పి. సత్యవతి, ఓల్లా, ముదిగంటి ఎ కుప్పిలిపద్మ కవనశర్మ, బమ్మిడి జగదీశ్వరరావు, రాష్తాడు గోపాలకృష్ణ మొదలయిన వారెందరో ఈ తరహా కథలు రాశారు. ఈ మధ్యలో ఈ తరహా కథలు *ంఖ్యాపరంగా కొంత తగ్గుముఖంలో ఉన్నప్పటికీ దానినిబట్టి స్రీల సమస్యలు తగ్గిపోతున్నాయి అని భావించేందుకు వీలులేదు. ఈ సమస్యను మరిన్ని కోణాల్లోంచి అవలోకించేందుకు కథకులు తీసుకుంటున్న విరామంగా మాత్రమే దీనిని భావించవలసి ఉంది!
మవ తెలుగు కథ - నాడు,నేడు
కొంత అప్రస్తుతంగా అనిపించినా - ఇక్కడ ఇంకొక విషయం రాయక తప్పదనిపిస్తుంది అయిదేళ్ళ క్రితం -1998లో శ్రీ రమణ రచించిన “మిధునం” అనే కథ 'రచన'లో వచ్చింది. భార్యాభర్తల మధ్యన ఉండే సంబంధం - 'అన్ పెయిడ్ డొమెస్టిక్ సర్వెంటొకీ, 'యజమాని'కీ ఉందేసంబంధం కాదనీ, లౌకికభావాలకు అతీతమైన ఆత్మీయానుబంధం అందులో ఉన్నదనీ హృదయాలను కదలించే రీతిలో అత్యద్భుతంగా చెబుతుంది ఈ కధ ఆడది ఉన్నది మొగవాడికి చాకిరి చెయ్యడానికేనా? పెళ్ళాం అర్ధరాత్రి నిద్రలోంచి లేచి, ఆకలివేస్తోంది కంది అట్టు వేసివ్వమని భర్తను అడిగితే అతగాడు 'దొరుకునా ఇటువంటిసేవి అనుకుంటూ అట్టువేసి పెడతాడా? ఆ పని భార్యే ఎందుకు చెయ్యాలి? "సెంటిమెంటాలిటీ' పేరుతో భార్యని బానిసగా కట్టి పడెయ్యడానికి ఇవన్నీ మొగవాళ్ళు వేసే ఎత్తుగడలు కావా? ఇలాంటి వాదనలను కాసేపు మరిచిపోయి చదవగలిగితే మనసుకు హత్తుకుపోయే కథ ఇది. (అయితే, వివాహబంధం పేరుతో మగవాడు తన మననులోని దగుల్బాజీతనాన్ని ఎలా దాచుకుంటున్నాడో చెప్పే రంగనాయమ్మగారి “తలలు పుచ్చిన మనుషులు" కథ కూడా ఆ ఏడాదే వచ్చిందనుకోండి అదే వేరేసంగతి 1).
ఎనఖైల రెండో అర్ధభాగం చివరినుండి సాహిత్యంలో దళితవాద దృక్పథం కూడా చెప్పుకోదగ్గ రీతిలో చోటుచేసుకుంది. గతంలో మా గోఖలే, కరుణకుమార వంటి కథకులు దళితుల దయనీయస్థితిని తమ కథల్లో ఆవిషరించినప్పటికీనాటికీ నేటికీ ఒక లేడా ఉంది. నేటి కథల్లో ఉన్నది దళితులపై సానుభూతి మాత్రమే కాదు. దళితుల గుండెల్లోంచి పొంగిపారలిన ఉద్యమస్సూర్తికి అద్దం పడుతున్న ఈ కథలు - వర్జాశ్రమ ధర్మసిద్ధాంతాన్ని పట్టుకుని వేళ్ళాడే సంప్రదాయ వాదులకొక సవాలుగొ దళితుల సమస్యలు నిర్లక్ష్యం చెయ్యదగ్గవి కావనే హెచ్చరికగా, కూడా ఉంటున్నవి
కొలకలూరి ఇనాక్ “60లో రాసిన 'ఊరబావి' కథనూ, తొంభైలలో రాసిన “గొడ్డు దొంగొ కధనూ, సరిపోల్చినా ఈ విషయం చెప్పవచ్చును. ఇక, హరిజనుల మధ్యన ఉందే తెగలు, స్పర్ధలు, వారిలో ఎలాంటి అనైక్యతకు కారణమవుతున్నాయో, వారి బ్రతుకులను మరింత దయనీయంగా ఎలా మారుస్తున్నాయో, చెప్పే కథలుకూడా వస్తున్నాయి. ఒకప్పుడు శ్రీపాదవారు రాసిన “సాగరసంగం' వంటి కథల్లో కూడా ఇలాంటి ప్రస్తావన ఉన్నప్పటికీ నాటికీ నేటికీ పరిస్థతుల్లో చాలా లేదా ఉంది. ఒకప్పుడు ఇది దళిత కుటుంబాల మధ్య గల వైయక్తిక విషయం మాత్రమే. కానీ నేడు కొందరు రాజకీయ వేత్తలు దళితుల మధ్య తేడాలను భూతద్దంలోంచి చూపించి, వాటిని తమ స్వప్రయోజనాలకు వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నందున ఈ సమస్య మరింత జటిలమవుతున్నది దళితులలో ఒక సమిష్టి ఆలోచన, సమిష్టిపోరాటం పట్ల తపన,
కోడూరి శ్రీరామమూర్తి 2
పెంపాందవలసి ఉన్నది. ఈ అంశాన్ని నేటి కథకులు మరింత సమర్ధవంతంగా తమ కథల్లో ఆవిష్కరించగలుగుతున్నారు.
దళితులను ప్రధాన పాత్రలుగా తీసుకొని నేటికధకులు రాస్తున్న కథల్లో మరొక
అంశం కూడా ప్రస్తావనకు వస్తున్నది. ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉన్న దళితులు కష్టించి ఆర్థికంగా ఉన్నతస్థాయికి ఎదిగిన తర్వాత తమ కులాన్ని ఇతరులకు చెప్పేందుకు నామోషీ పడి, తమకు తామే న్యూనతాభావానికి లోనవుతున్న సందర్భాలను, తమ కులానికి చెందిన వారయినప్పటికీ అవతలివారు ఆర్థికంగా, సాంస్కృతికంగా, తక్కువస్థాయిలో ఉన్న సందర్భాలలో వారిని తాము కూడా చిన్నచూపు చూస్తూ, తమ వారి వద్దనే ఆధికత్య చూపడానికి ప్రయత్నిస్తున్న సందర్భాలను,- రచయితలు తమ కథల్లో చెబుతూ ఈ విషయంలో దళితులు చేసుకోవలసిన ఆత్మవిమర్శ గురించి, వారు పెంపొందించుకోవలసిన ఆత్మవిశ్వాసాన్ని గురించి కూడా కధలు రాస్తున్నారు. (స్వామి “తల్లి మట్టి”, తోలేటి “కులం” మొదలగునవి),
ఈ సందర్భంలోనే మరొక విషయం. దళితులు ప్రాణాలకు తెగించి సాయుధ పోరాటాల్లో పాల్గొన్న సందర్భాల్లో కూడా వారిపట్ల చిన్నచూపు తప్పలేదని, ప్రభుత్వం పిలుపు కొరకు వారు ఉద్యమం నుండి విరమించుకొని “జనజీవన (్రవంతిలో కలిసిపోయినప్పుడు కూడా వారికి అన్యాయమే జరుగుతున్నదనీ, చెప్పే కథలు కూడా వస్తున్నవి. “నిర్భంధం బరువు అంతా అభివృద్ధి చెందని వర్ణాలకు, అభివృద్ధి అంతా అగ్రకులాలకు, ఇట్లా అప్పగించడానికే ఈ విప్లవం. ఈ విషయం అప్పుడే తెలిసిఉంటే విప్లవంలోకి చేరివుండే వాడినే కాదు. విప్లవంలో చేరి జీవితాన్ని ఓడిపోయాను. జీవితాన్ని గెల్బుకోడానికి విప్లవంలో చేరితే, విప్లవం నాకు ఓడిపోయే జీవితాన్నిచ్చింది అంటూ 'గుర్రాల పెంటయ్య అనబడే ఒక దళితుడి ఎదలోని వ్యధను ఆవిష్కరించిన బి.ఎస్. రాములు దక్షయజ్ఞం” కథ దళిత సమస్యతో బాటుగా సాయుధపోరాటానికి సంబంధించిన పలు అంశాలను నిర్మొహమాటంగా చర్చిస్తుంది.
ఇలా దళిత సమస్యను బహుముఖంగా అవలోకిస్తూ - కొలకలూరి ఇనాక్, నాగప్పగారి సుందరరాజు, సకీష్చందర్స్ శాంతినారాయణ, రాప్తాడు గోపాలకృష్ణ చిలుకూరి దేవపుత్ర, స్వామి, వి. చంద్రశేఖరరావు, నన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, (ప్రభృతులు గత రెండున్నర దశాబ్దాల్లో మంచి కథలే రాశారు...
ఆర్థికంగా, సామాజికంగా, అట్టడుగు స్థాయిలో ఉన్నవారిలో కుమ్మరి, మంగలి, చాకలి, జాలరి, యాదవ మొదలయిన కులస్తులు కూడా ఉంటారు. బలహీనవర్ధాలందరికీ
మా తెలుగు కథ - నాడు,నేడు సార్వత్రికంగా కొన్ని సమస్యలు ఉండేటప్పటికి - కుల సంప్రదాయాల విషయంలో,
సంప్రదాయ వృత్తిని నమ్ముకుని బ్రతికే సందర్భాలలో, జీవన సమరంలో వారు ఎదుర్శొనే
సమస్యల స్వరూపం విషయంలో సహజంగానే ఒక వైవిధ్యం ఉంటుంది. ఒక 4100
ఓఆ/614ం౧/౦౦౧ తో కధకుడు వీటిని పట్టుకోగలిగితే - తెలుసునని అందరూ అనుకునే
జీవితాల్లో తెలియని ప్రపంచమెంతో కనబడుతుంది. ఈ తరహా ప్రయత్నం “పల్లె మంగలి
కధలు” వంటి రచనల్లో కొంతవరకు జరిగినప్పటికీ 'మాదిగోడి కథలు”, “మల్లెమొగ్గల
గొడుగు కథలూ వచ్చినట్టుగానే సంప్రదాయ ధర్మం కారణంగా వెనుకబడిపోయిన
కులాలన్నింటి విషయంలోనూ ఇది బృహత్స్థాయిలో జరుగవలసి ఉంది.
తెలుగు కధాసాహిత్యంలో కొద్దికాలంగా చోటు చేసుకుంటున్న మరొక పోకడ మైనారిటీల జీవనసరళికి అద్దం పడుతూ వచ్చిన కధలు మైనారిటీల నమ్మకాలను, సంప్రదాయాలను, వారిని వేధిస్తున్న సమస్యలను, ఆవిష్కరిస్తూ నాలుగయిదేళ్ళుగా తెలుగులో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే కధలు వస్తున్నవి. ఈ ప్రయత్నం ముస్లిమ్ రచయితల విషయంలో మరింతగా కనబడుతుంది.
ఒకప్పుడు ముస్లిమ్ రచయితలు ఇతరులు రాసిన ధోరణిలోనే తాము కూడా రాయాలని ప్రయత్నించేవారు కానీ ఇవాళ వారు తాము సృష్టించే సాహిత్యపు విలక్షణతను, ప్రత్యేకతను, బుజువు చెయ్యగలుగుతున్నారు. తమకు మాత్రమే నిశితంగా తెలిసిన జీవితాన్ని, తాము తప్ప మరెవరూ చెప్పలేని జీవితాన్ని పాఠకుల మనసులకు హత్తుకునేలా కళ్ళకు కట్టినట్లు చెబుతున్నారు మహమ్మద్ ఖదీర్‌బాబు, అన్సర్, యాకూబ్, స్కైబాబా, రహమతుల్లా మొదలయినవారు రాస్తున్న కధలు ఈ సందర్భంగా పేర్కొనదగ్గవి. ఖదీర్‌బాబు “దర్గామిట్ట కధలు”, “దావత్”, వంటి కథలు చదివితే మన పొరుగునేఉన్న వారి గురించి మనం తెలుసుకోవలసింది చాలా ఉందనిపిస్తుంది.
ఈ సందర్భంలో మరొక్క విషయం - బాబ్రీ మసీదు విధ్వంసం, గోద్రా ఉదంతపు అనంతర సంఘటనలు, మనదేశంలో తీవ్రస్థాయిలో మత సంఘర్షణలు చెలరేగడానికి కారణభూతమయ్యాయనే విషయం అందరూ ఎరిగిందే ఓట్ల రాజకీయాలు ఈ అగ్సికి ఆజ్యం పోసాయి. ఇలాంటి స్థితిలో రచయితలలో సంయమనం ఉండడం ఎంతయినా అవసరం. అలాకానప్పుడు మనుష్యుల మధ్య విద్వేషాలు మరింతగా పెరిగేందుకు ఆస్కారం కలుగుతుంది. ఇటీవల వచ్చిన ఒకటి రెండు కథలు చదివాక ఇది రాయకతప్పదినిపించింది (స్కైబాబా -'సుల్తానా,, హరికిషన్ 'నయాఫత్వా మొదలగునవి.
- అడుగడుగునా తోడేళ్ళు ఉన్న ఈ సమాజంలో స్త్రీ వంచనకు గురి అయ్యేందుకు
కోడూరి శ్రీరామమూర్తి వమ అవకాశం ఉంది. దీనిని గమనించకుండా విషయాన్ని కేవలం మతపరమైన కోణంలోంచి మాత్రమే చూచినప్పుడు ఒనగూడే మేలు కంటే కీడే ఎక్కువగా ఉంటుంది. 'హర్యాలొ పుస్తకంలో కె. శ్రీనివాస్ అనేటట్టు ముస్తిమ్ల మనుగడ, గతం, వర్తమానం, భవిష్యత్తు, ఈ దేశంలో, ఈ సమాజంలో ఎంత అవిభాజ్యమైనవో చెప్పే కధలు రావాలి. ముస్లిమ్‌ల ప్రత్యేకతను, విశిష్టతను, సార్థకతను తెలిపే కధలు రావాలి”. 2
- శ్రీకాకుళ పోరాటం మేధావుల ఆలోచనల్తో, ప్రత్యేకించి కథారచయితల దృక్పథాల్లో గొప్ప మార్చును తీసుకుని వచ్చి మొత్తం మీద తెలుగుకథకు ఒక గొప్ప 'కుదుపును ఇచ్చిన విషయం సాహిత్యాఖిమానులందరూ ఎరిగిందే. ఆ రోజుల్లో రావిశాస్త్రి కా.రా. భూషణం, మొదలయినవారు చిరస్మరణీయమైన కధలు రాశారు. నగరాల్లో
మైదానప్రాంతాల్లో గిరిజన సీమల్లో, వేర్వేరు రీతులతో - వేర్వేరు రంగులతో - పీడనా ప్రవృత్తి చోటుచేసుకుంటున్న తీరును వీరు తమ కధల్లో ఆవిష్కరించిన తీరు ఆ తర్వాత ఎందరో కథకులకు మార్గదర్శకమైంది. శ్రీకాకుళ ఉద్యమాన్ని బలంగా అణచివేసిన తర్వాత, ప్రభుత్వం గిరిజన సంక్షేమంపై కొంత శ్రద్ధ చూపించడం ప్రారంభించింది. గిరిజనుల హక్కులను రక్షించడం కోసం కొన్ని ప్రత్యేక కార్పారేషన్లు, కొన్ని (ప్రత్యేక చట్టాలు వచ్చాయి. కానీ ఇదంతా మేడిపండు చందమే అని తెలిసేందుకు ఎక్కువ వం పట్టలేదు ! ధనికులు, అధికారులు, గిరిజనులను ఇదివరకటి కంటే ఎక్కువగా చుకోవడానికి క్రొత్తదారులు ఏర్పడ్డాయి. ఈ క్రొత్త కథను కూడా కథకులు “90లలో మనకు చెప్పారు. ఒకప్పుడు “70లలో “కొండగాలి” కథలు రాసిన భూషణంగారు 90లలో ఈ “కొత్తగాలి కథలు కూడా చెప్పారు. “కొండలు క్రొత్తరూపును దిద్దుకుంటున్నాయి. కొత్తదార్లంట కొత్త రోడ్డు, కొత్త పారశాలలు కొత్త పాటలు, కొత్త మాటలు"అని చెబుతూనే (జ్ఞప్తి కథలో) దీనివలన గిరిజనులను రక్షించడానికి రూపొందిన చట్టాలు దుర్వినియోగం అయి గిరిజనులకు కీడు చేస్తున్న తీరును గురించి, గోముఖ వ్యాఘ్రాల స్వార్థప్రవృత్తిని గురించి చెప్పే కథలు వస్తున్నాయి.
“సిందవ ఎదురొత్తె గొత్జెపిల్లలు బెదిరిపోతాయి. మందకాసే గొల్లలు సిందవని తగుల్తారు. కాని - సిందవ వచ్చి మందలో కలిసిపోతే మెడలొంచిన గొట్టెపిల్లకి ఏటి తెలుత్తాది? సిందన ఏటిసేస్తందో కానుకోలేదుూ” (తెంపు - సువర్ణముఖి) ఇలాంటి 'సిందవిల పన్నాగాలను బయటపెడుతూ గౌర్నాయుడు, అప్పల్నాయుడు, బమ్మిడి
22 తెలుగు కథ-నాడునేడు. .ై2వ.వవననడడనననషనా జగదీశ్వరరావు మొదలయినవారు కధలు రాశారు - అంతేకాదు. ఒకనాటి సాయుధ విప్లవ ఫలితాలను కూడా బొమ్మ, బొరుసులతో బేరీజువేసే ధోరణి ఇప్పుడు వస్తున్న కథల్లో కనబడుతున్నది. “ఒకప్పుడేమోగాని, అవతలివారి సామ్రాజ్యం ఇప్పుడు చెక్క చెదరకుండా ఉన్నది. ఊరిలో మిల్లును మూయించేస్తే సూర్యంబాబు పిల్లలు పట్నంలో ఫ్యాక్టరీ పెట్టుకోగలిగాడు కిడ్చాప్ జరిగాకనే శివన్నారాయణ మండలస్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదగగలిగాడు” - అంటూ ఉత్తరాంధ్రలో ఒక గొప్ప ఆశయసాధన కోసం జరిగిన సాయుధపోరాటాలు చివరకు అనుకోనిరీతిలో స్వార్ధపరుల బలాన్ని ఎలా పెంచగలిగాయో చెబుతారు అట్టాడ అప్పల్నాయుడు 'యజ్ఞం తర్వాతి కథలో (కా.రా.గారి 'యజ్ఞం” కధకు “'సీళ్వైలొగా రాయబడిన కథ ఇది).
సాయుధపోరాటాలలో పాల్గొన్నవారు “కారబాంతరాలిచేత ఉద్యమంనుండి బయటకు వచ్చిన తర్వాత వారి ఆలోచనా సరళి, మానసికస్థితి ఏవిధంగా ఉంటాయి అనే విషయాన్ని ఆవిష్కరించిన కథలు కూడా ఇటీవల వస్తూఉండడం ఒక విశేషం (యొట్ల మీద'-మిడ్కో, అట్లాగే 'జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తర్వాత, ముఖానికి ఇంతకాలం వేసుకున్న రంగులను, పెట్టుకున్న ముసుగును, నిస్సిగ్గుగా తొలగించేసుకుని, రెండుచేతులా ఆడ్జిస్తూ స్వార్ధప్రయోజనాలను తీర్చుకునే అవకాశవాదుల అసలు స్వరూపాన్ని బయటపెట్టే కధల్ని కూడా కొందరు రాశారు(రేణ' - చైతన్య'ప్రకాళ్),
ఒకే అంశాన్ని ఎన్ని కోణాల్లోంచి అవలోకించి నేటి కథకులు విశ్లేషించగలుగు తున్నారో చెప్పేందుకు తార్మాణాలే ఇవన్నీ -
కష్టజీవులు చేసే పోరాటాల్లో అధికభాగం కాలే కడుపుల ఆకలిమంటల్లోంచి పుట్టుకొచ్చినవే. అందువల్ల మనలాంటి వ్యవసాయదేశాల్లో జరిగిన పోరాటాల్లో అధికభాగం భూపోరాటాలే అవుతాయి ఇలాంటి భూపోరాటాలు తెలంగాణాలో కూడా అధికం. ఈ భూపోరాటాల కధను గత రెండున్నర శతాబ్దాలుగా తెలంగాణా జిల్లాలకు చెందిన కథకులు గుర్తుంచుకోదగ్గ రీతిలో ఆవిష్కరిస్తున్నారు.
“అయ్య బాంచెను అనుకుంటున్న అమాయకులే భారతదేశంలో భూపోరాటాలకు వారసత్వాన్ని అందించారు. ఆ తర్వాత మళ్ళీ దొరల అణచివేతను సహించారు. బానిస బతుకులు బతికారు. మళ్ళీ విజృంభించి భూపోరాటాలు చేస్తున్నారు. ఓ దిక్కున పోరాటాలు, మరో పక్కన పోలమ్మ, పోచమ్మ వంటి మాతృస్వామ్య దేవతల ఆరాధన" (యుద్ధభూమి' - కాలువ మల్లయ్య) - ఇట్లాంటి తెలంగాణా ప్రజల జీవిత చిత్రాన్ని
కోడూరి శ్రీరామమూర్తి మమా అందులోని వైరుధ్యాలను, నేడు తెలంగాణా నుండి వస్తున్న కధల్తో, వారి మాండలికంలో చదవడం ఒక అనుభవం. అల్లం రాజయ్య రచించిన “తుఫాను” అనే కథలోని మొగిలి తన భార్యకు గాలికి ఊగుతున్న మామిడిచెట్టును చూపిస్తూ “గీవేళ సెట్టుకు ఒక్క ఆకన్నా గాలికి ఊగకుండా వున్నదా చెప్పు” అని అంటాడు “గాలైకే ఎట్లుంటది?*” అంటుంది భార్య. దానికి అతడు - “మనమంతా ఈ క్రొత్త గాలికి రెపరెపలాడక తప్పదు అని అంటాడు - ఉద్యమ ప్రభావం నుండి ఎవరూ తప్పించుకోలేరని చెబుతూ. ఇలాంటి గాలితో తెలంగాణా కధ రెపరెపలాడి ఆ ప్రాంత ప్రజల జనజీవనాన్ని మాత్రమే కాదు ఉద్యమ ప్రభావాలను, వైఫల్యాలను కూడా మన ముందు ఉంచుతున్నది. తెలంగాణా కథలను ఆస్వాదించాలంటే ఆ మాండలికాన్ని శ్రద్ధతో గమనించడం ఎంత అవసరమో, ఆ నేలలో జరిగిన, జరుగుతున్న పోరాటాల గురించి, అందుకు గల కారణాల గురించి, కనీస అవగాహన అయినా కలిగి ఉండడం కూడా అంతే అవసరం. “తెలంగాణా కధ పుట్టుకే ఉద్యమాలతో పుట్టింది ఉద్యమాలతో పెరిగింది. ఉద్యమంలోని ఆటుపోట్లను తెలుగుకథ అనుభవించింది తెలుగు ప్రపంచంలో తలెత్తిన ఉద్యమాలగురించి తెలుసుకుంటేనే తప్ప తెలుగు కథ వస్తువు, భాషు శిల్పం, అర్ధం కావు అనే అల్లం రాజయ్య అభిప్రాయం మిగతా ప్రాంతాల నుండి వచ్చిన కథల ౯ కడా తెలంగాణా నుండి వస్తున్న కధల విషయంలో మరింతగా వర్తిస్తుంది. ఈ గథంలో అల్లం రాజయ్యతో బాటుగా తుమ్మేటి రఘోత్తమరెడ్డి, కాలువ మల్లయ్య, “౨. రాములు, బోయ జంగయ్య, పి.చంద్ ప్రభృతులు చేస్తున్న కృషి కూడా ప్రత్యేకించి పేర్కొనదగ్గది. య్క పృ స్తున్నకృ గడిచిన పాతికేళ్ళ కాలంలో తెలుగుకధ తీరుతెన్నులను గురించి పేర్మ్ళొనేటప్పుడు (ప్రముఖంగా పేర్కొనవలసిన మరొక అంశం నేటి కధల్లో చోటుచేసుకుంటున్న 'ప్రాంతీయత” “ప్రాంతీయత” అనేది లేకుండా ఏ కాలంలోనూ, ఏ కధకుడూ, కథను వ్రాయలేడు, అయితే, ఇప్పుడు వస్తున్న కధల్లో ఈ “ప్రాంతీయత” మరింత విస్తృతంగా చోటుచేసుకొనడం విశేషం. తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాం(ధ్ర వంటి ప్రాంతాలలో ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన రచయితలు ఈవిధంగా ఆలోచించాల్సిన అవసరం మరింతగా పెరిగింది. దారిద్ర్యం అనేది దేశమంతటా ఉన్నప్పటికీ మనరాస్త్రంలో మధ్యాంధ్ర ప్రాంతాలతో పోల్చి చూస్తే ఈ ప్రాంతాలలో దారిద్ర్యరేఖ దిగువన ఉన్నవారి
322 తెలుగు కథ - నాడు,నేడు సంఖ్య ఎక్కువ. నీటి కరువు కారణంగా రాయలసీమలోను, కరకు నైజాం ప్రభుత్వం, దౌర్జన్యమే ఊపిరిగా గల దొరలు, ప్రజలను పీక్కుతిన్న కారణంగా తెలంగాణాలోనూ;
- ఒకప్పుడు జమీందారులు, ఆ తర్వాత ప్రజాషప్రభుత్వాలు, అవలంబించిన నిర్లక్ష్య వైఖరి కారణంగా అభివృద్ధికి నోచుకోనందునల్ల ఉత్తరాంధ్రలోని పలుప్రాంతాల్లో - ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లోనూ- ఆకలి, దారిద్ర్యం, అజ్ఞానం. అనేవి అధికంగా చోటుచేసుకున్నాయి. దీనికి తోడుగా ఈ ప్రాంతాలలో మరికొన్ని ప్రత్యేక సమస్యలు, సంస్కృతీపరమైన విలక్షణతలు కూడా ఉన్నాయి. రాయలసీమలోని మురాకక్షలు సాధారణ జనజీవితంలో తీవ్రమైన అశాంతిని సృష్టిస్తున్నాయి. అధికారం కోసం, పలుకుబడికోసం, కొందరు పెద్దలు అతి సామాన్యులను మురాకక్షలోకి దించి వారి బ్రతుకులను బుగ్గిచేసే కథ చాలాకాలంగా కొనసాగుతున్నది. (ఈ విషయాన్ని వినినమూర్తి 'స్పర్శ' కథలో విశ్లేషించిన తీరు గమనించదగ్గది) ఇక, - తెలంగాణాలోని హిందూ, మహమ్మదీయ, సంస్కృతుల సమ్మేళనం వారి జీవనవిధానంపైనా, వారు మాట్లాడే తెలుగుభాషపైనా గణనీయమైన ప్రభావాన్ని చూపి వారి మాండలికానికి ఒక విలక్షణతను సమకూర్చి పెట్టింది.
ఇదంతా అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ గత శతాబ్ది రెండో అర్ధశతాబ్ది వచ్చేవరకూ (ఈ ప్రాంతాలలో సాపొతీ సృజన అధికంగా జరగనందున) ఆయా ప్రాంతాలలోని ప్రజల సమస్యలకు, వారు మాట్లాడే మాండలిక భాషకు కథాసాహిత్యంలో చెప్పుకోదగ్గ చోటు లభించలేదు. ఇలా ఆలోచిస్తే నేడు ఈ మూడు ప్రాంతాలనుండి ప్రాంతీయ సమస్యల పట్ల ప్రత్యేకదృష్టితో వస్తున్న కధల ప్రల్యేకత, అవసరం అర్ధం అవుతుంది అప్పుడు తెలంగాణా అంటే కేవలం పోరాట కథ మాత్రమే అనీ, సీమ కథ అంటే కేవలం నీటికరువు కధ మాత్రమేననీ, ఉత్తరాంధ్ర కథ అంటే నీటికరువు, పోరాటాల కధ మాత్రమేనని అనిపించదు అంతేకాదు “అవ్వతోడు గిది తెలంగాణా, “నాలుక్కాళ్ళ మండపం కథలూ, “కళింగోర” వంటివి ఏవో కొన్ని ప్రాంతాలకు చెందిన జనజీవితాన్ని వారి మాండలికాల్లో చెప్పిన కథలుగా కాకుండా - ఇంచుమించు తేడాలతో బడుగు జీవులందరి కథలు అని గుర్తించగలుగుతాం.
తెలుగునేలపై ఉన్న అయిదు మాండలికాల్లో ప్రతి మాండలికానికి ఒక సొగసు ఉంది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారన్నట్లు ఈ అయిదు మాండలికాలు తెలుగుతల్లికి పంచప్రాజాల వంటివి గ్రామీణుల జీవితాల పట్ల నిశితమైన దృష్టిని పెంపొందించు కుంటున్న తెలుగు కధకులు నేడు మాండలికానికి కథల్లో పెద్ద పీటవేస్తూ ఉండడం అభినందించదగ్గ విషయమే. అయితే, కేవలం వదో ఒక మాండలికంలో రాసినంత మాత్రాన కథకు సాహిత్యపరమైన విలువ సమకూరదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
కోడూరి శ్రీరామమూర్తి 2 గత పాతికేళ్ళ తెలుగుకధలో విస్మరించరాని మరొక అంశం. “విదేశాంధ్ర కథ". అమెరికా వంటి విదేశాలలో ఉంటున్న ఆంధ్రులు అక్కడ ఉన్న తెలుగువారి జీవనసరళికి అద్దం పడుతూ గత పదేళ్ళుగా చక్కటి కథలు రాస్తున్నారు. ఈ కధలు చదివితే అక్కడి ఆంధ్రుల సామాజిక, వైయక్తిక, జీవితాలు మొదలుకొని - వృత్తిపరమైన విశేషాల వరకూ - ఎన్నో విషయాలు సీరియస్ టోన్‌లోనూ, వోస్య, వ్యంగ్య ధోరణిలోనూ కూడా పరిచయం అవుతాయి. అంతేకాదు, తరిగిపోతున్న మానవ సంబంధాల పట్ల వీరి కథల్లో వ్యక్తమయ్యే ఆవేదన కూడా గమనించదగ్గ రీతిలో ఉంటున్నది. సంఖ్యాపరంగా కూడా ఇవి తక్కువగా ఏమీ లేవు, “విపుల మాసపత్రికలో ప్రతి సంచికలోనూ “విదేశాంధ్ర కథా అనే పేరుతో ఇతర దేశాల్లోని ఆంధ్రుల కథలు (ప్రచురించడం జరిగిందన్నా “రచన పత్రికలో కొన్ని విశేష సంచికల్లో అత్యధిక సంఖ్యలో అమెరికాలోని ఆంధ్రులు రచించిన కథలను ప్రచురించారన్నా, “అమెరికా తెలుగుకధి అనే పేరుతో కథాసంపుటాలు వెలువడుతున్నాయన్నా - ఇదంతా విదేశాల్లోని ఆంధ్రుల సాహిత్య కృషికి తార్మాణా అవుతుంది. అమెరికా తెలుగు కథకుల కథల్లో ఆరె సీతారామయ్య, సత్యం మందపాటి, వేమూరి వేంకటేశ్వరరావు, కలశపూడి శ్రీనివాసరావు ప్రభృతుల రచనలు పేర్కొనదగినవి. ఇటీవల శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు ఒక వ్యాసం వ్రాస్తూ - తమ సాహిత్యాన్ని “డయస్వోరా సాహిత్యంగా పేర్కొన్నారు. (01190012 15 & ౦0౧౧౫౧౪గ౧9/ ౦! ౧60016 11౧0 0౪166 119 004౧1౧/ 0౧4161001౧) ఈ సందర్భంలోనే ఆయన మరికొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు. “దేశం విడిచిపెట్టాకనే మన దేశం బాగా అర్థం అవుతుంది. ఇక్కడికి రాకముందు మనలో చాలామంది తెలుగుమీద, తెలుగు సాహిత్యం మీద, త్‌ద్ధ చూపించేవాళ్ళం కాదు. తెలుగుదేశంలో ఉండగా ఎప్పుడూ తెలుగు రాయని వాళ్ళం, గట్టిగా తెల్సగ చదవని వాళ్ళం, ఇక్కడికి వచ్చాకే మనకి ఇంగ్లీష్ కన్నా తెలుగే బాగా వచ్చునని గుర్తించాం. తెలుగులో రచయితలం, కవులం అయ్యాం” అని వారు అనడం గమనించదగ్గది.
- నేటి తెలుగు కథల పోకడల గురించి చెప్పేటప్పుడు “ప్రపంచీకరణ” ప్రభావం తెలుగు కధపై ఉన్నతీరు గురించి ప్రస్తావించకపోతే ఆ వివరణ అసమ([గ్రమే అవుతుంది. (ప్రపంచీకరణ ధోరణుల ప్రభావం మనలాంటి బీద దేశాల్లో నష్టదాయకంగా ఉంటుందని గత పదేళ్ళుగా ఎందరో మేధావులు హెచ్చరిస్తూనే ఉన్నారు. (ప్రముఖ అర్ధశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి (గ్రహీత, గతంలో బెల్క్షింటన్కు ఆర్థిక సలహాదారు అయిన జోసెఫ్ స్టిగ్లిట్ట్ ఇటీవల వెలువరించిన “గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ డిస్ కంటెంట్స్” అనే గ్రంథంలో కూడా ఇదే సందేశం వినబడడం విశేషం):
మవ తెలుగు కథ - నాడు,నేడు
ప్రపంచీకరణ వలన దేశంలోకి మల్టీనేషనల్స్ జొరబడేందుకు అవకాశం పెరిగి దేశీయ పరిశ్రమలు - ముఖ్యంగా చిన్నతరహా పరిశ్రమలు - ఘోరంగా దెబ్బతిని ఆర్థికవ్యవస్థ పలువిధాలుగా కృంగిపోతున్నదనే విషయం ఆందోళనకరమైనదైనా, సమస్యలో ఇది ఒక పార్వ్వం మాత్రమే అంటున్నారు నేటి కథకులు. (ప్రపంచీకరణ వలన దేశీయ పరిశ్రమలు, చిన్నకరవో పరిశ్రమలు, దెబ్బతింటున్న వైనాన్ని ఆవిష్టరించే కథలు కూడా తెలుగులో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే వచ్చాయి) ప్రపంచీకరణ ప్రభావం సామాజిక, సాంస్కృతిక రంగాలపైనా, మానవ సంబంధాలపైనా అవాంఛనీయమైన రీతిలో ఉంటుందంటున్నారు వీరు.
“అభివృద్ధికి దారులు వేస్తున్నామని బాకా వాయిస్తూ తలుపులు తెరిచే వాళ్ళకి ప్రపంచ చరిత్ర తెలియదా? చిరునామా కోల్పోయిన శేషజీవితాల చిట్టాపద్దులు తెలియవా?” అని ప్రశ్నిస్తూ, “గ్లోబలైజేషన్ బ్యాంకుల దగ్గరే ఆగిపోదు. బెడ్రూమ్లోకి కూడా వస్తుంది” అంటూ కుప్పిలి పద్మ “ఇన్స్టెంట్ లైఫ్, 'కుబుసం” వంటి కథలు వ్రాశారు. ప్రపంచీకరణ పోకడలను కుటుంబజీవితం వైపునుండి, ప్రత్యేకించి స్రీ దృక్పథం నుంచి గమనిస్తూ చంద్రలత, నల్లూరి రుక్మిణి ప్రభృతులు రాస్తున్న కథలు కూడా గమనించదగ్గవి.
ప్రపంచికరణ వికృత (ప్రభావాలను ్రతీకల ఆలంబనతో భావనంక్షిష్టత గల కథలుగా చెబుతారొకరు. (చంద్రశేఖరరావు, కాశీభట్ల వేణుగోపాల్ మొదలుగువారు) హస్య, వ్యంగ్య కధలుగా కూడా దీనిని చెప్పవచ్చంటారు మరొకరు (తోలేటి జగన్మోహన రావు మొ). 'ఒక వ్యక్తి జీవితంలో ఆర్థికపరంగా ఇది ఎలాంటి గట్టి దెబ్బ కొడుతుందో చెబుతారు ఇంకొకరు (మహమ్మద్ ఖదీర్‌బాబు). “డిస్ఇన్వెస్ట్మెంటొ అనే మాటను పదేపదే జపిస్తూ లాభాలతో నడవగల పరిశ్రమలను కూడా కావాలని దేశవిదేశాల్లోని పెట్టుబడిదారులకు అన్యాయంగా అప్పజెబుతున్నప్పుడు ఆ పరిశ్రమల్లో నిజాయితీతో పనిచేసే ఉద్యోగుల మనోగతాన్ని హృదయస్పందనలను, కథగా చెప్పి ఒప్పించవచ్చుననేది మరొకరి ఆలోచన (సురేష్క్ గొరుసు జగదీశ్వరరెడ్డి, మొ!) ప్రపంచీకరణ ప్రభావాన్ని తెలుగు కథకులు వివిధ కోణాల్లోంచి చూస్తున్న తీరును తెలిపేవే ఇవన్నీ -
ఇవాళ ప్రపంచాన్ని ఆవేదనకు గురిచేస్తున్న మరొక అంశం - మానవ జీవితంలో నానాటికీ పెరిగిపోతున్న యాంత్రికత. లౌకికమైన కోరికలు రోజురోజుకూ పెరిగి వినియోగ స్వభావం (కన్ఫ్యూమరిజమ్) పెచ్చుపెరిగి పోతున్నందున, మనుషులు ప్రతీదాన్ని లాభనష్టాల పద్దుతో సరిచూచుకునే మరబొమ్మల్లా మారిపోతున్నారు. మానవ సంబంధాలు నానాటికీ క్షీణించిపోతున్నాయి. దీనినొక తాత్త్విక సమస్యగా అవలోకిస్తూ మునిపల్లెరాజు, శ్రీవిరించి, నవులూరి వేంకటేశ్వరరావు మొదలయినవారు కథలు రాశారు. “౧౧౪ [౧౪౧౭0
వష్త్త్ర్రంనడడడడనడడనననడనన22నవమనవ2ఒవ2ద కోడూరి శ్రరామమాూర్తి మ ౧౦౪101 %గాం/012% ౧౧|౬|3౧) ౪3 10 08 00౮౪౧186 0౧161 1౧ 0086067 ,0౧6604 11061689 91018604 - 1౧ 9[0గ & ౧9౧1౧౮1855 అ1516౧౦౪9” అంటూ గిం౦9గ ౪44౧04 వంటి సామాజిక శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికలు - క్రొత్త రంగులను పులుముకుంటున్న మనలాంటి దేశాలకు కూడా వర్తిస్తుందనిపిస్తుంది మారిపోతున్న పరిస్థితులను గమనిస్తున్నప్పుడు.
ఈ విషయానికి సంబంధించిన చర్చ ఎలా ఉన్నాా నేటి క్రొత్త ప్రపంచంలో అత్యంత ఆవేదనను కలిగించే మరొక అంశం పిల్లలకు, వృద్ధులయిన తల్లిదండ్రులకు మధ్యగల సంబంధాలు. 'తరాల అంతరం” అంటూ దీనిని తేలికగా తీసిపారెయ్యకుండా దీనిని ఆర్ధికకోణం లోంచి, ఆర్థికేతర కోణాల్లోంచి కూడా అవలోకించవలసి ఉంది.
పెరిగి, పెద్దవారయిన తర్వాత, పిల్లలు స్వార్ధంతో ప్రవర్తించి వృద్ధులయిన తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకొనకపోవడం, వారిపట్ల కనీస మర్యాదను కూడా చూపకపోవడం, ఇదంతా చిరకాలంగా జరుగుతున్న కధే ! (ఇట్లాంటి ఇతివృత్తాలతో లెక్కకు మీరినన్ని కథలు వచ్చాయి). ఈ సమస్యకు మరొక పారం కూడా ఉంది. వృద్ధులకు ఉండేది కేవలం ఆర్థికసమస్య మాత్రమే కాదు. ఆర్థికపరమైన ఇబ్బందిలేని సందర్భాలలో కూడా విడిగా వేరొకచోట ఉండలేక పిల్లల ఇళ్ళల్లో ఇమడలేక, తమ
ఉనికిని పట్టించుకునే వారు లేరనే అభద్రతాభావాన్ని వదులుకోలేక (పిల్లలు మంచి వాళ్ళయిన సందర్భాలలో కూడా), *“ఒంటరితనం'తో శారీరకంగా, మానసికంగా, సతమతమయ్యే వృద్ధుల వెతలు ఎన్నో - వీటిని నేటి కధకులు సమర్ధవంతంగానే ఆవిష్కరిస్తున్నారు. అయితే ఈ వ్యాస రచయిత దృష్టిలోనికి వచ్చిన కధల్లో చాలా భాగం వృద్ధులు వృద్దాశ్రమాలలో చేరడంతో ముగుస్తున్నాయి. వృద్ధుల సమస్యకు అదే పరిష్కారమన్న భావం చాలా కథల్లో వినబడుతున్నది.
మెటీరియలిస్ట్ ధోరణులు పెరిగి, మానవసంబంధాలు, హృదయ సంబంధిత ఆధ్ధతలు, నానాటికీ క్షీడించిపోతున్న ఈ రోజులలో వృద్ధాశ్రమాల అవశ్యకత చాలా ఉందని అంగీకరించక తప్పదు. కానీ మనదేశంలో ఈ వ్యవస్థ అభివృద్ధి చెందవలసి సంతగా అభివృద్ది చెందలేదు. ఈ పరిస్థితుల్లో నేటి వృద్దాశ్రమాల్లో వృద్ధుల జీవితం ఎలా ఉన్నది? అక్కడ వారు మనశ్శాంతిని పొందగలుగుతున్నారా? అనే విషయాలపట్ల సరి అయిన అవగాహన లేకుండా ఒక ఊహాచిత్రాన్ని పారకుల ముందు ఉంచి, “వృద్ధాశ్రమాలకు తరలిపొండి” అనే నినాదం ఇవ్వడం బాధ్యాతాయుతమైన విషయం కాబోదు. (మనదేశంలో చాలా వృద్ధాశ్రమాలు ఈనాటికీ బీదవారి అనాధాథనూలుగానే వుంటున్నవి),
- ఇలా మొత్తంమీద, “పాతికేళ్ళ తెలుగుకథి కథను అవలోకించినప్పుడు ఒక
2222 అలుగు కథ - నాడు,నేడు విషయం మనకు స్పష్టంగా అవగతం అవుతుంది. మనిషికి ఎక్కడ, ఎలాంటి కష్టం వచ్చినా తెలుగు కధ స్పందిస్తున్నది అది దేశంలోని కొందరు ప్రజల వ్యధ కావచ్చు, కొన్నిప్రాంతాల ప్రజలకు వచ్చిన కష్టం కావచ్చు, జాతీయ అంశం కావచ్చు, అంతర్జాతీయ అంశం కావచ్చు తెలుగు కధకులకు అన్నీ ఆత్మీయమైన విషయాలే ! లాతూర్ భూకంపం వలన కలిగిన విషాదం అయిన, గోద్రా ఉదంతం సృష్టించిన భీభత్సం అయినా, కాళ్ళీర్ టెర్రరిస్ట్‌ల ఘాతకం అయినా, సెప్టెంబరు 11న తేదీన అమెరికాలో జరిగిన దురంతం అయినా - అన్నింటి ప్రతిస్స్పందనా ఈనాటి తెలుగు కథల్లో కనబడడం మాత్రమే కాదు - అతివేగంగా కూడా కనబడుతున్నది ! రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం మొదలుకొని జన్మభూమి కార్యక్రమం వరకూ, ప్రతిదాన్నీ తెలుగు కథలు వెలుగునీడలతో సహా చూపుతున్నాయి
జాం ౪ంగీ6 ౪౧1౦౧ ౪6 ౧151 966% 1 7 *౧100 19 15 8౧ 2౧0/6 1|| 01 10/౬౧ ౧౦౧౪ 025601 216490౧ 10౮139 10 00౧౩౯౮౦. 4120 ౪00౧ 116 66619 10781210 ౪౧౬ 4/6 ౧౯౦5655 051626 ౪4113 ౧0565566 0/ 011613 - ౧౮5606 2 ౪౦గ|6 1౧ ౪౧10౧ 2గంంగ00 ౧29 & 16601౪/ 1౧ ౧101 ౧౭6/6 6౧౧/ ౧49 0681 6150691166 0/ ౧౧౧1౧695” అంటూ ఒకప్పుడు బెర్ట్రాండ్ రసెల్ కన్న కల లాంటిదే - అభ్యుదయ దృష్టిగల కధకులందరిదీ కూడా !
ఇదంతా అభినందించదగ్గ విషయమే కాని, - ఇక్కడే ఇంకొక్క విషయం కూడా చెప్పాలి.
ఇటీవల వస్తున్న కథల్లో - కధకులు చెప్పదలిచిన విషయానికి ఇచ్చిన ప్రాధాన్యత కథా శిల్పానికి ఇవ్వడం లేదు. శిల్పపరమైన కనీస అవగాహన కూడా లేకుండా సగటు స్థాయి కథలు, అంతకన్నా తక్కువస్థాయి కథలు రాసే కథలు గురించి కాదు చెప్పేది. అలాంటి కధకులు ఎప్పుడూ ఉంటారు. శిల్పపరమైన మెళకువలు తెలిసి ఉండి కూడా శిల్పం పట్ల నిర్లక్ష్యభావంతోనో, ఇలా రాస్తే ఒక ప్రయోగం అవుతుందేమోనన్న *'ప్రలోభం” తోనో కొందరు ఇలాంటి రచనలు చేస్తున్నారేమో అనిపిస్తుంది ఇటీవల వచ్చిన కొన్ని కథలను గమనించినప్పుడు. నిజానికి, కధను ఇలాగే రాయాలన్న నియమం ఏదీ లేదు. రచయిత మనసులోని భావం పారకుడికి సరిగా అందడానికి ఏ పద్ధతి అయినా ఆచరణ యోగ్యం అవుతుంది. (చూ. వర్దినీయా వుల్ఫ్ - మోడరన్ ఫిక్షన్)
అలాగే కధకు ఫలానా పరిమాణంలో ఇతివృత్తం ఉండాలి అని నియమం ఏదీ లేదు. ఎంత చిన్న ఇతివృత్తంతోనయినా సమర్భడయిన కథకుడు ఆజిముత్యం లాంటి కథను వ్రాయగలడు. (మానవ జీవితాన్ని వేదనకు గురిచేస్తున్న అంశాలను అనేక
కోడూరి శ్రీరామమూత్తిమై పార్య్వాలనుండి అద్భుతంగా చూపించిన “అతడు”, “పనిపిల్ల”, “నాలుగు కా శృమండపంా లాంటి కథలే ఇందుకు తార్మాణం) - ఇదంతా అంగీకరిస్తూనే ఇది వ్రాసేది. ఇటీవల తెలుగు కధల్లో స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీవాదం, ప్రపంచీకరణ విధానాలపట్ల వ్యతిరేకత,- ఇలా అనేకానేక అంశాలను కుప్పపోసి, మనిషి జీవితాన్ని సంక్షోభానికి గురిచేస్తున్న పలు అంశాలను ఒకే కథలో “ఆల్ ఇన్ వన్ ధోరణిలో ఆవిష్కరించే ధోరణి పెరుగుతున్నది ! దీనివలన కథలు సుదీర్ధమైపోవడం మాత్రమే కాదు. చెప్పదలచిన విషయాలపట్ల పొంతన కుదరకపోవడం, కధ భావాల బరువుతో కృంగిపోవడం కూడా జరుగుతున్నది ! ఇలా కొంతమంది సుదీర్హమైన చర్చలతో కథలను వ్యాసాల మాదిరిగా చేస్తూ ఉంటే,- మరికొందరు బొత్తిగా సంక్షిప్తీకరించి అయోమయ కవిత్వంలా తయారుచేస్తున్నారు! జీవితం ఒక సరళరేఖ లాంటిదికాదనీ, అనేకానేక షా రసుర (ప్రభావం జమిలిగా దానిపై ఉంటుందనేది వాస్తవమే అయినా - ఈ హత్తుక్షునే దృష్టిలో ఉంచుకుని పరనీయతకు భంగం రాకుండా పాఠకుల వృాదయాలను రీతిలో కథకుడు కథను నడపవలసి ఉంటుంది. గంగాసడు శ్రీశ్రీ అన్నారు - “కొంతమంది ఒక చిటెకెడు కథావస్తువును తీసుకుని అని సీ కషాయాన్ని కలుపుతారు. మరికొంతమంది చవగ్గా దొరికింది కదా శన గారేమంత కధావస్తును తీసుకుని చెమ్బాలో ఇమిదిపోయేంత చిన్నకథ రాస్తను ని జెషధప్రాయంగా దానిని దిగమ్రింగాలొ అని! (అనామిక కథలో) కథ ఇన దీ కషాయాలు, బెషధాలు, మాటకేమిగాని, - మొత్తం మీద ఇవాళ తెలుగు మధురాంతకం లే సన్నిహితంగా వచ్చింది. కొం.కు., రావిశాస్త్రి, కొ.రా., ప్రవేశించింది. ' ల *రవకితరంగా గతపావు శతాబ్దిలో తెలుగుకథలో కొత్తరక్తం “ఎవరీ కథక్ర, అంకేకాదు - కొందరు కొత్తతరం కథకులు తమ మొదటి కథతోనే గపుడు అని నలుగురూ చగలుగుతున్నారు. గతపషా కనుబామలెత్తి చూచేస్టితిని సాధిం న్నా! ఎ శతాద్ది కాలంలో వాజిజ్యపవనాలు పలుసాహిత్య (ప్రక్రియలను రెపరెప లాడించినా, తన క్ష£న్సుగడ్ల జ్యపవనాలు పలుసాహిత్య (ప(& రెపరెప గలిగింది. ఒక సాహిత్య స ననితను తెలుగు కథ నిర్ద్వందంగా బుజున్వ వ్ ఇంతకన్నా దాఖలాలు సేం రయ కరోగ్యవంతంగా ఎదుగుతున్నది అని చెట్బ నంది పంటిని పరిమితిని, పరిధిని దృష్టిలో ఉంచుకొని కొన్ని కథల గురించి, కొందరు కథకుల (్రన్వావించడం జరిగింది. ఎందరో మంచి కథకులు - అందరికీ వందనాలు!- వ్యాసకర్త) (తానా. ౮.5గ వారి రజతోత్సవ విశేషసంచిక-20039 జూలై -తెలుగు పలుకులో ప్రచురితం)
న ఓ ఐదడాది తెలుగు కథ గురించి.....
*“...... కథలంటే పైపైన ఉన్నాయనుకుంటున్నావేమో ! - అవి కల్పించడాని కెంతో ప్రతిభ కావాలి వాటి విలువ తెలుసుకోడానికెంతో పరిజ్ఞానం ఉండాలి. అవి బోధపరుచుకోడానికెంతో బుద్ధిసూక్ష్మత ఉండాలి. కథలు కళ్లకి వెలుగునిస్తాయి. బుద్ధికి పదునుపెడతాయి. మనస్సుకు ఉత్సాహము, ఉల్లాసము ఇస్తాయి. కథలు చదవడము, వినడము, ఎప్పుడూ దండుగ అనుకోకేం?....”
... కధ గురించి ఆలోచించినప్పుడల్లా కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్రిగారు ఒక కథలో పలికించిన ఈ పలుకులు మనోవీధిలో మెదులుతూ ఉంటాయి. కథకున్న విశిష్టతను, దానికుండాల్సిన లక్ష్యాన్ని ఇవి చెబుతాయి. గురజాడ వారి మానసిక పుత్రిక అయిన తెలుగుకధకు ఇలాంటి విశిష్టత ఉండటంలో ఆశ్చర్యం లేదు.
1979లో అనుకుంటాను - ప్రసిద్ధ కథకులు మధురాంతకం రాజారాం గారు తెలుగు కధను గురించి చెబుతూ - “గడిచిన పాతికేళ్ల కాలంలో తెలుగులో వెలువడ్డ కథల్లోంచి వంద మంచికధలను ఎంపికచేసి, సంపుటిగా ప్రచురించినట్లయికే - అది సంఘజీవితంలో వచ్చిన వివిధ పరిణామాలనే వ్యక్తం చేస్తూ తెలుగువారి సాంఘిక చరిత్రకు ప్రత్యామ్నాయంగా రూపొందగలదని నిస్సందేహంగా చెప్పవచ్చు-” అని అన్నారు.
- తెలుగు కథ విషయంలోనే కాదు - ఏ భాషలోనయినా, ఏ సాహిత్య ప్రక్రియ విషయంలోనయినా అది ఆరోగ్యవంతంగా ఉన్నదా లేదా అని చెప్పడానికి ఇంతకు మించిన తార్కాణం మరొకటి ఉండదనుకుంటాను.
కేవలం ఒక్కవడాది కాలం ప్రాతిపదికగా తీసుకుని, సాంఘిక చరిత్ర స్వరూపాన్ని అధ్యయనం చేసేందుకు అవకాశం లేనప్పటికీ, ప్రజల ఆర్థిక, సాంఘిక జీవన ్రవంతిలో ఇది ఒక చిన్నభాగం అని చెప్పేందుకు సందేపొాంచనవసరం లేదు. అలా ఆలోచించి నప్పుడు 2001* లో వచ్చిన కధల సమీక్షకు ఒక ప్రాతిపదిక దొరుకుతుంది.
- ఈ వ్యాసం 2001 సం॥ కథల సమిోక్షగా వ్రాయబడింది
కోడూరి శ్రరామమూర్తి మి అయికే, - ఒక సాహిత్య ప్రక్రియ మంచి చెడ్డలను బేరీజు వేసేటప్పుడు సమకాలిక జీవితాన్ని ఇతివృత్తంలో (ప్రతిబింబించేటట్టు చెయ్యడం జరిగిందా, లేదా అనే విషయాన్ని గమనించడం ఎంత ముఖ్యమో, - చెప్పదలిచిన విషయాన్ని రచయిత పాఠకులకు ఎలా అందివ్వగలిగాడు అనే విషయాన్ని గమనించడం కూడా అంతే ముఖ్యం. ఇతివృత్తం, శిల్పం, కధకు ముఖ్యమైన అంశాలని అందరూ ఎరిగిందే. ఇలా అని - కథను ఈ విధంగా మాత్రమే చెప్పాలి - 'ఇది కధ రాసే పద్ధతి అని చెప్పడం కూడా సమర్థనీయమైన విషయం కాదు. “1101౧12 ౪0౦04 అన్నట్లు - అంగం 19 10౧1 &౧6 ఆ౪౭౧/ ౧9౧౦౮ 19 గంగ! 041 అ(/99365 (0635, 1౪6 219 ౪16౧, - 121 9౧95 ౮౩ ౦010586710 ౪//116/5 1119౧1005 / ౪6 119 !6926615.... * అనేది తిరుగులేని సత్యం. సాయే అంశాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని, - రావిశాస్రిగారు అన్నట్లు “చెడుకు
- మంచికి అపకారము” చెయ్యని కథల గురించి - మొత్తం మీద 2001లో వైన కథల పోకడలను గురించి సంక్షిప్తంగా సమీక్షించుకుందాం. కేవలం ఒక్క ఎక్కువ లలపంమితిని తీసుకున్నా వందలాది కథలు వచ్చాయి. వీటిల్లో సాధ్యమైనన్ని జరిగింద లను పరిశీలించి, ప్రాథమిక పరిశీలనలో 300 కధలను ఎంపిక చెయ్యటం _ ఇ." * బైన వివిధ వడపోతలలో కొన్ని కథలను చివరకు ఎంపిక చెయ్యడమూ జ కథలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సమీక్షించడమూ జరిగింది. ఒక్క వ్యక్తి నిశితంగా పంథలదలో అనేక ఇబ్బందులున్నప్పటికీ, - దొరికిన ప్రతి కథను ఈ విషయంలో గి చెప్పగలను. సహృదయులయిన రచయితలు, పారకులు, క రిమితులను అర్ధం చేసుకోగలరని ఆశిస్తూ - 2001 సంవత్సరం కథాసమీక్షలోనికి అడుగిడదాం _ క . కవ వలెనే ఈ ఏడు వచ్చిన కథల్లో కూడా ఫెమినిస్టు, దళితవాద, ధోరణులు బదుగురైతుల సమస్యలు, పట్టణాలకు వలసపోతున్న గ్రామీణుల ఆవేదనలు, నిరాదరణకు గురియౌతున్న వృద్ధుల వ్యధలు, నాగరీకరణ పెరిగిపోతున్న కారణంగా పుట్టుకొస్తున్న విషఫలాలు, చదువుల బరువులు లేతవయస్కులలో కలిగిస్తున్న సంక్షోభాలు
- వీటినన్నింటికీ అద్దంపట్టే కథలు, వచ్చాయి.
చెత్త కధలను, బూతు కధలను, మినహాయిస్తే - మొత్తం మీద అన్ని తరహాల కథలలోనూ, శిధిలమైపోతున్న మానవసంబంధాల పట్ల ఆందోళన స్పష్టంగా కనబడింది. మనుషుల్లో నానాటికీ పెరిగిపోతున్న వాణిజ్యప్రవృత్తి, మెటీరియలిస్ట్ ధోరణులు, - మానవ సంబంధాల్లో ఎలాంటి అవాంఛనీయమైన మార్పులను తీసుకువస్తున్నాయో కథకులు తమ కధల్లో బాగా పట్టుకోగలుగుతున్నారు. సరళీకృత ఆర్థికవిధానాలు, (ప్రయివేటీకరణ ధోరణులు, కుటుంబజీవితంపై కూడా అవాంఛనీయమైన ప్రభావాన్ని చూపుతున్న తీరును కధకులు తమ కధల్లో ఆవిష్కరించగలుగుతున్నారు. ఈ విధంగా చూసినప్పుడు గతంలో వచ్చిన తరహా ఇతివృత్తాలతోనే ఈ ఏడు కూడా కథలు వచ్చినప్పటికీ కొంతవరకు క్రొత్తచూపుకు అవకాశం ఏర్పడిందని చెప్పవచ్చును.
అయితే, - ఈ అభిప్రాయం అన్ని కథలకూ వర్తించదు. మూసధోరణిలో ఇది వరకు రాస్తున్న ధోరణిలోనే మళ్ళీ మళ్ళీ రాసిన కథల సంఖ్య కూడా తక్కువదేమీ కాదు.
ఇక, - అమెరికాలో ఉండే ప్రవాసాంధ్రుల జీవనసరళి గురించి చెప్పే కథలు ఇదివరకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఈ ఏడు రావడం గమనించదగ్గ విషయం, సత్యం మందపాటి “రచనిలో రాస్తున్న ఎన్.ఆర్.ఐ. కథలు, ఇటీవల ఆవిష్టరించబడిన “అమెరికా తెలుగు కధలు” నాలుగో సంపుటి, ఇందుకు కొన్ని ఉదాహరణలు. వీటిల్లో 'మనవాళ్లు ఎక్కడున్నా ఇంతే” అని చెబుతూ గిలిగింతలు పెట్టే కథలు కూడా ఉండడం విశేషం.
మైనారిటీల జీవన సరళి - ముఖ్యంగా మున్లిమ్ మైనారిటీల జీవితాన్ని ప్రతిబింబిస్తూ గణనీయమైన సంఖ్యలో కథలు ఈ ఏడాది వచ్చాయి. వాటిల్లో కొన్నివాద ప్రతివాదాలకు దారితీసాయి కూడా. ఈ విషయానికి సంబంధించిన చర్చ ఎలా ఉన్నా ఇతివృత్తాల పరంగా తెలుగుకధ బహుముఖంగా విస్తరిస్తున్నదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పవచ్చు.
ఇతివృత్త పరంగా - ఈ ఏడు వచ్చిన కథల్లో కనబడిన మరొక ప్రత్యేకత ఏమిటంటే _ దేశంలోపలా, వెలుపలా ఈ ఏడాది జరిగిన అనేకానేక సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సంఘటనల నేపథ్యంలో కధలు రావడం. ఆ సంఘటనలు జరిగిన కొద్దినెలలకే ఈ కథలు ప్రచురించబడ్డాయంటే - ఈ విషయంలో మన రచయితల స్పందన ఎంతవేగంగా ఉందో అర్ధం అవుతుంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ టెర్రరిస్టుల దాడికి కుప్పకూలిన ఉదంతం అమెరికాలోని ఒక యువజంట (పేమకథకు ఎలాంటి విషాదమైన ముగింపునిచ్చిందో ఒక రచయిత కథగా మలిస్తే -
మష్తపినివనడడ2డ22డడ222ఊఊ22ఉ2ఊ222ఊ22 కోడూరి శ్రీరామమూర్తి 22 కాళ్ళీరులో టెర్రరిస్టులకు, మిలటరీవారికి మధ్య జరుగుతున్న పోరాట నేపథ్యంలో ఒక మగువ మనసులోని ఆవిష్కరించేందుకు మరొక రచయిత ప్రయత్నించారు. ఆస్టనిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న సిపాయి వ్యధ ఒకరిచేత కథను రాయిస్తే - ఇటీవల మన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శిశువుల విక్రయం ఉదంతం మరొకరి కధలో ఇతివృత్తం అయింది. ఇక, - ఎలక్ట్రిసిటీ ఛార్జీల పెరుగుదలకు వెల్లువగా పెల్లుబికిన నిరసన, కృషి బ్యాంకుతో సహా మరికొన్ని బ్యాంకులు దివాళాతీసి సహకార బ్యాంకింగు రంగాన్ని అపహాస్యం చేసిన సందర్భం కూడా కధలు రాయడానికి కావలసిన ముడి పదార్థాన్నిచ్చాయి. ఆఖరికి పోస్టల్ శాఖవారు కొద్దిరోజుల పాటు చేసిన సమ్మెను కూడా మన కధకులు వదిలిపెట్టలేదు.
ఇక, - వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై టెర్రరిస్టులు దాడిచేసిన తర్వాత - ఇన్నాళ్ళూ భారత్‌లాంటి దేశాలు పడుతున్న బాధలను పట్టించుకోని అమెరికా, - ఒక్కసారి కళ్లు తెరిచి - ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చెయ్యాలని “ధర్మపన్నాలు' పలికినప్పుడు, అమెరికా అంటే 'గిట్టని కొందరు తెలుగువారు ఎప్పుడో గురజాడవారు, 'కన్యాశుల్కం'లో పలికించిన “స్వానుభవం అయికేనేగాని, తత్వం బోధపడదు-” అనే మాటలు జ్ఞాపకం చేసుకుని ఉండవచ్చు. కానీ, ఈ విషయాన్ని వ్యంగ్యధోరణిలో ఒక కథకుడు “గ్లోబల్ గ్రామం” అనే పేరుతో- ఒక పల్లెటూరి మోతుబరి పెత్తందారీతనాన్ని తెలిపే కథగా రాశారు. సెప్టెంబరు నెలనాటి దాడి జరిగిన కొద్దివారాలకే ఈ కధ రావడం విశేషం. వెడ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రపంచబ్యాంకు అర్ధ్థికసహాయంతో రోడ్లు ల్పుచేసే కార్యక్రమం చేపట్టిన విషయం అందరూ ఎరిగిందే. విశాలమైన రహదారులతో నగరాలు, పట్టణాలు మరింత అందంగా రూపొందడం వాంఛనీయమైన విషయమే కావచ్చు. కాని - ఈ క్రతువుకు సమిధలైపోయిన బడుగుజీవుల గురించి పట్టించుకునే తీరిక, ఓపిక, అధికారపీరంపై ఉన్నవారికి ఉండదు. రోడ్డుప్రక్కన చిన్నచిన్న బడ్జీలుపెట్టుకుని పొట్ట గడుపుకునే అతిసామాన్యులు దీనివలితంగా దారిద్ర్య విషవలయాల్లో చిక్కుకుపోత్రారు. పెద్ద వ్యాపారస్తుడి షాపులో కొంతమేర కొట్టి వేయడం ని నప్వాన్ని అతడు త్వరలోనే పూడ్చుకుంటాడు. కాని, - నిర్భాగ్యుల ఈ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని మహమ్మద్ ఖదీర్‌బాబు ఈ ఏడాది “ఖాదర్ లేడు” అనే కథను రాశారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఫలితంగా సైకిల్‌షాపు ఖాదర్, బట్టల దుకాణం బైసాని సుబ్బయ్య, ఇద్దరూ నష్టపోయారు. కాని,- ధనవంకు
222 తెలుగు కథ - నాడు,నేడు డయిన బైసానికి కలిగిన నష్టం లెక్కలోనిది కాదు మరి - ఖాదర్ పరిస్థితి ఏమిటి? వినాశన కార్యక్రమం తర్వాత పత్తాలేకుండా పోయిన ఖాదర్ ఏమైపోయాడు? - ఆర్థిక కార్యక్రమాల అమలు వెనుక నిర్లక్ష్యం చెయ్యబడే హృదయపు ఆర్ధతల గురించి చెప్పే కథ ఇది.
సాఫ్ట్వేర్ టెక్నాలజీ మున్నెన్నడూ లేనంతగా ఇటీవలి సంవత్సరాల్లో మనదేశంలో
అభివృద్ధి చెందడం అందరూ ఎరిగిన విషయమే. సాంకేతికపరంగా ఇది ఎంత గొప్పవిషయం అయినప్పటికీ, దాని ప్రభావం కుటుంబజీవనంపైనా, మానవ సంబంధాల పైనా, ఉన్న తీరును గురించి ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పే కథలు కొన్ని ఈ ఏడు వచ్చాయి.
కమ్యూనికేషన్ సదుపాయాలు చాలా వేగం అయిపోయాయి అని జబ్బలు
చరుచుకుంటున్న ఈ కాలంలో, ఈ-మెయిల్, టెలిఫోన్ వంటి సాధనాల ద్వారాయేగాని,
- ఉత్తరాల ద్వారా సమాచారం చెప్పుకునే ఓపిక, తీరిక, ఈ కాలంలో చాలామందికి తగ్గిపోతున్నాయి. కాని, - నిజానికి మనసుపెట్టి ఉత్తరం రాసినప్పుడు వచ్చే సంతృప్తి - దొరికే అనుభూతి - మిగతావాటిల్లో అంతగా లభించదు. ఈ విషయానికి కొందరు కథకులు కధల ఇతివృత్తాల్లో చోటు కల్పించడం గమనించవలసిన విషయం.
*_ ఎన్నిరోజులు కాదు,ఎన్నేళ్ళయిందో నాకు మధు దగ్గిర్నించి లెటర్ వచ్చి, మధుయే కాదు - ఎవరి దగ్గిర్నించి అయినా నాకు లెటర్వచ్చి ఎన్నాళ్ళయిందో.. ఎప్పటికప్పుడు ఈ మెయిల్లో అన్ని సంగతులూ అత్యంతవేగంగా తెలిసిపోతున్నాయన్న సంతోషం తప్ప - తీరిగ్గా కూర్చుని జ్ఞాపకాలన్నింటినీ స్పృశిస్తూ ఆరుబయట వెన్నెల్లో కూర్చుని ముచ్చటించుకొంటున్నట్లు హృదయం విప్ప ఒక్క నాలుగుముక్కలు కాగితం మీద రాసి ఎన్ని యుగాలయిందో?-” అంటూ 'టొరంటో'లో ఉంటున్న ఒక ఇల్లాలు బాధపడి పెన్ను వెదికి కాగితం పుచ్చుకుని ఉత్తరం రాయడానికి ప్రారంభించిన విషయం ఒక కథలో ఉంటే, - (అపురూపమీ లేఖ” - బి. పద్మజ) - తండ్రి బ్రతికిఉండగా ఆయన కోరుకున్నట్టుగా ఉత్తరాలు రాయలేకపోయిన కుమార్తె, తన కండ్రిచనిపోయిన తర్వాత ఆయనకు అందదని తెలిసి కూడా - పశ్చాత్తాపంతో కుమిలిపోతూ రాసిన ఉత్తరానికి సంబంధించిన ఉదంతం మరో కథలో ఉంది. (నాన్నకి రాయని ఉత్తరం' - పింగళి బాలాదేవి) “-ఎవరెవరికి ఎవరెవరు రాయలేదో వాళ్లందరూ కూడా ఈ ఉత్తరం చదివి ఉద్తరాలు రాయాలని ప్రతిజ్ఞ తీసుకుంటే నా ఉత్తరానికి సార్థకత దొరుకుతుంది -” అంటుంది రచయిత్రి ఈ కధలో-
కోడూరి శ్రీరామమూర్తి 2222 ఇక, - ఒకే ఊళ్ళో ఒకే ఇంట్లో ఉంటున్న భార్యాభర్తలు ఎవరి టైముల్లో వారు ఉద్యోగాలకు పరుగెట్టి వెళ్లాల్సి ఉండటంతో - కంప్యూటర్ మాధ్యమంలో ఈ మెయిల్ సందేశాలు పంపుకునే పరిస్థితిని గురించి వివినమూర్తి “సాఫ్ట్లోకం” కధ చెబుతుంది! ఇవి అన్నీ క్రొత్త ప్రపంచపు క్రొత్తపోకడలు మానవ సంబంధాలపై చూపుతున్న (ప్రభావాల గురించి చెప్పే కథలే.
అమెరికాలో నచ్చిన డిప్రెషన్ ప్రభావంగా ఇండియానుండి వెళ్లిన సాప్ట్వేర్ ఇంజనీర్లకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఏర్పడిందనే విషయం తరచూ పత్రికలలో చూస్తున్నదే. ఇది కూడా మన కథకులచేత కథలు రాయించింది.
“- పరిస్థితి మారింది. ఇవాళ “జావా' వాళ్లందరూ దిక్కుమొక్కూలేని జనం. ఇండియాలో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్నికణం అని అయినా పాడుకోవచ్చు.... ఎంత చెద్దా మన దేశం, మన ప్రభుత్వం. జెయిల్లో పెట్టినా ఏదో ఒకటి పెడకారు తినడానికి...” అంటూ - అమెరికా వెళ్లి నిరుద్యోగిగా మారిన ఒక ఇంజనీరు లోనయిన పశ్చాత్తాపం, కొత్తగా పెంచుకున్న దేశభక్తి, ఒక కథలో కనబడితే (అసమర్థుని జీవయాత్ర)
మరో కథలో - కొడ్డుకు అమెరికాలో ఉద్యోగం చేసి డాలర్లు పంపుతూ వుంటే - అన్ని ఆధునిక సదుపాయాలూ అనుభవిస్తూ, అందరూ “- నీకేమయ్యా అదృష్టవంతుడివి. నీ కొడుకు అమెరికాలో ఉన్నాడు-” అంటూ ఉంటే పొంగిపోతూ - డాలర్ మత్తులో మునిగితేలిన ఓ తండ్రి - అమెరికాలోని కొడుకు ఉద్యోగం ఊడిపోయేలా ఉందని తెలిసినప్పుడు కలకరిగి లబోదిబోమనే ఉదంతం మరో కథలో ఉంది (మిడిసిపాటు - రచన ; నల్లూరి రుక్కిజి),
ఇటీవల పర్యావరణ సమస్యపై కూడా కథలు వస్తున్నవి. దేశంలో దారిద్ర్యం తగ్గకపోయినా - పారిశ్రామికంగా వస్తున్న మార్పుల కారణంగానూ, నగరాల సంఖ్య పెరుగుతున్న కారణంగానూ, మనదేశంలో కూడా వాతావరణ కాలుష్యం ఒక ముఖ్య సమస్య అవుతున్నది. తెలుగు కథకులు ఈ సమస్యపై కూడా దృష్టి సారించడం ముదావహమైన విషయం. పెళ్లిళ్లవంటి శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ఏవో ఖరీదయిన బహుమతులు తీసుకువెళ్లేకంటే - ఒక పచ్చని మొక్కను కానుకగా ఇచ్చివారి ఇంటిలో పెంచుకోమని చెప్పడం మంచిది అనే సందేశంతో ఒక కథకుడు ఈ ఏడాది కథ (వ్రాయడం ఆసక్తిని కలిగించే విషయం (ఆకుపచ్చని ఆదర్శం” - జి. సుభా)
ఇలా తెలుగు కథల ఇతివృత్తాలలో - క్రొత్త ప్రపంచపు ప్రతిస్పందనలు కనబడుతున్న
తీరును వివరించడానికి కారణం ఇవి అన్నీ మంచి కధలు అని చెప్పడం కాదు. వీటిల్లో
మన తెలుగు కథ - నాడు,నేడు కొన్ని శిల్పపరంగా మంచి కధలు అయితే, - మరికొన్ని కథలు పేలవంగా ఉన్నవి. అయితేనేం, - అన్నింటా ఏదోమేరకు క్రొత్తచూపు కనబడడంతో వీటిని ప్రస్తావించడం జరిగింది. ఇతివృత్తపరంగా తెలుగుకథల్లో వస్తున్న మార్పులను చెప్పేందుకు ఇవి తార్మాణాలు. 2 “80లలో 'ప్రారంభమై' 90లలో తెలుగు కథాసాహిత్యంలో ఉప్పెనలా ప్రవేశించిన ధోరణులలో స్త్రీవాదం ఒకటి అనే విషయం ఇవాళ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ౯8గ)1౧|04%/50606 వంటి ప్రసిద్ధ గ్రంథాలను వ్రాసిన 89%/ ౧6620 పురుషాధిక్య సమాజంలో నేటి మహిళ తల్లిగా, భార్యగా, కుమార్తెగా నిర్వహించే మూడు డైమన్లన్లను దాటి, తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోగలిగే నాలుగో డైమన్నన్లోనికి ప్రవేశిస్తున్నది అంటూ- =గ(1|110గ5 0% ౪౦౧౧6౧ 1౧ ౧౧6 ౪౪6౧64 06౧4౧/ ౧/4 080160 0౪490, 07 0౧ 18 ౪౪౭౧36 01 0/692[-10గ౧0౪8౧ 10 & (04510 61106౧9100 1౧ 461 66918006, - ₹/00౧160 &3 & ౧6౧౩౦౧ ౧6౧౪| 691౧0 4617 401169 1౧ & 00400100 *ంగ6 + 8 6౧౫౭6౭౧౦౪౦ 1119 1060౧ 61౧9౧౩9100 1౧/౦1/౪5 & 88019 0014 0010406 6౧8౧86 72 6 ౪౧౦18 6512101 ౪0౧౧6౭౧8 1౪63 “ అని అంటారు. ఇట్లాంటి 'ఫోర్త్ డైమెన్షన్' కోసం ప్రీలు పడే ఆరాటం, చేసే పోరాటం గురించి చెప్పే కథలు ఈ ఏడు కూడా వచ్చాయి సంఖ్యాపరంగా ఇవి తక్కువగా వున్నాయని చెప్పేందుకు వీలు లేదు. అయితే, - వాటిల్లో చాలాభాగం గతంలో వచ్చిన ఈ తరహా కథలకు కార్బన్ కాపీ కథలుగానో, సగటు కథలుగానో, మాత్రమే ఉన్నాయి. స్త్రీవాద దృక్పధంతో ఈ ఏడువచ్చిన కథల్లో - చంద్రలత “కొలీగ్స్”, కుప్పిలి పద్మ “కుబుసం”, ఇంద్రగంటి జానకీబాల “నిర్ణయానికి అటూ, ఇటూ = కొండవీటి సత్యవతి “ముందడుగు, ముదిగంటి సుజాతారెడ్డి “నిశ్శబ్దం ! నిశ్శబ్దం 1”, ఓల్లా “నిర్ణయం”, వి ప్రతిమ “ఎండ్లెస్ ట్రావలొ, వివినమూర్తి “నేరం” మొదలయిన కథలు పేర్కాన్నదగ్గవి. వీటిల్లో “నేరం” కధకు స్త్రీవాద దృక్చథానికి మించిన పరిధి ఉన్నది. సరళీకృత ఆర్థికవిధానాల ఫలితంగా మనదేశంలో వ్యాపారం నిమిత్తం అడుగు పెట్టిన విదేశీ కంపెనీల వ్యాపార విధానాల (ప్రభావం - పురుషాధిక్య సమాజంలో కుటుంబ జీవితంపై ఉన్న తీరును “కుబుసం” కథ చెబుతుంది. భర్త మంచివాడే అయినా, పురుషాధిక్య సమాజంలో ఇంటికి సంబంధించిన
కోడూరి శ్రీరామమూర్తి వైవా నిర్ణయాలు తీసుకునే విషయంలో మగవాడిదే పైచేయిగా వుంటూ ఉంటుంది. అంతేకాదు
- మనలాంటి దేశంలో భార్య ఏ ఉద్యోగం చెయ్యాలి, ఎలాంటి ఉద్యోగం చెయ్యాలి, అనేది కూడా సర్వసాధారణంగా భర్తగారే నిర్ణయిస్తూ ఉంటారు. ఈ పరిస్థితిలో తనకూ ఒక వ్యక్తిత్వం ఉందని భావించిన ఒక ఇల్లాలు తన ఉద్యోగ విషయంలో తీసుకున్న నిర్ణయం “కుబుసం” కధలోని ప్రధానాంశం.
ఈ అంశంతో గతంలో కూడా కొన్ని కధలు వచ్చాయి. గానీ, ఒక మల్టీనేషనల్ కంపెనీవారు - భారతీయ ఉద్యోగుల దగ్గిరనుండి పని బాగా రాబట్టడం కోసం వారి కుటుంబజీవనం ఎలా ఉండాలో నిర్దేశించడానికి పూనుకోవడం ఈ కథలోని విశేషం.
“= సైన్సు, టెక్నాలజీ, బోబ్దన్ని యంత్రాలను ఇచ్చి పనిభారాన్ని తగ్గిస్తున్నాయి. మరోవైపు ప్రపంచంలో ఎవరినయినా, ఎప్పుడయినా, ఎక్కడయినా అత్యంత వేగంగా పలుకరించుకునే అపకాశాన్నిస్తున్నాయి. కానీ, - అత్యంత ఆప్త్పులయిన మనుషుల మధ్య ఈ దూరాలు ఎందుకు? - వెబ్సైట్ నాట్ఫొండ్ బుస బుస. ఎమోషనల్ వయెలెన్స్ డాట్ కామ్ - అంటూ సాగే ఈ కథలోని ఇల్లాలి ఆవేదనను అర్థం చేసుకొనగలం.
ఇదే విషయం - మరొక కోణంలోంచి చంద్రలత రచించిన “కొలీగ్స్”కథలో
ంపతుంది. భార్యభర్తలిద్దరూ ఒకే చదువు చదివి, ఒకేవృత్తిలో వున్నా వృత్తిపరమైన ఎంద లు తీసుకునే విషయంలో భార్యకు స్థానం లేకపోవడమనేది ఒక స్రీగా ఆమెకు ర బక నినేదనను కలిగిస్తుందో ఈ కథలో మనసుకు హత్తుకునే రీతిలో చెబుతారు మిగ వ విదేశీ తిమంగలమో కంపెనీని మింగడానికి ముందుగా, నా ఉనికిని లోనంటే ఈ విపర్యయం నుండి నన్ను నేను రక్షించుకోవద్దూ?” అంటూ ఆమె చదివినప ఆవేదన, ఆందోళన, ఆత్మరహితమైనవి కావు అనిపిస్తుంది ఈ కధను పడు,
సాధి 2001-2002 సం॥ బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ ఆర్థికమంత్రి 2001 సం॥ను మహిళా
తార సంవత్సరంగా ప్రకటించారు. ఆ విషయకంగా ఏడాది పొడుగునా జరగాల్సిన తార్యక్రమాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఆ ఆర్థిక సంవత్సరం పమసిక్తోనుంది మరి - మహిళలకు ఎంత సాధికారం లభించిందో అందరికీ తెలిసిన ర _ గిహిళలు 'ప్రజాప్రాతినిధ్యం వహించే సందర్భాల్లో ఇది మరింత ప్రహసనప్రాయంగా ఉంటున్నది. రిజర్వేషన్ నియమాల వలన మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక అయినా, అధికారం చెలాయించేది మాత్రం ఆమె వెనుక వున్న మొగవారే ! ఇట్లాంటి పరిస్థితుల్లో - ఒక వూరి సర్పంచిగా ఎన్నిక అయిన మహిళ -
వనన తెలుగు కథ - నాడు,నేడు తన భర్త నిర్ణయాలను అమలుపరిచే ఆటబొమ్మలా కాకుండా, తనకు తానుగా నిర్ణయాలు తీసుకోగల సబలగా ఎదగడం - కొండవీటి సత్యవతిగారి “ముందడుగు” కథలో కనబడుతుంది. (ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇలాంటి కథలు మరిన్ని రావలసిన అవసరం ఉంది.
ఇక, - స్త్రీపై పురుషుడు ఆధిపత్యం చెలాయించాలని చూసే ధోరణికి ఉద్యమాల్లో పనిచేసేవారి విషయంలో కూడా మినహాయింపు ఉండదు అనే విషయాన్ని కాసుల ప్రతాపరెడ్డి “పెనుగులాట” వంటి కథలు చెబితే - వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా ఈ బెడద తప్పదు అని చెబుతుంది ఇంద్రగంటి జానకీబాల “నిర్ణయానికీ అటూ, ఇటూ-” కథ.
వృద్ధుడయిన మగవాడికి జబ్బుచేస్తే - అతడి భార్యకు కూడా వయస్సు పైఐడుతున్నా శరీరంలో శక్తి సన్నగిల్లుతున్నాా భర్తకు సేవచేస్తూ "తరించడం” భార్య ధర్మం అని అంటారు. తనకూ శరీర సత్తువ తగ్గుతోంది కాబట్టి ఇద్దరమూ వృద్ధాశ్రమంలో చేరితే తమ ఇద్దరి బాధ్యతా వాళ్లు తీసుకుంటారుకదా అని ఒక ఇల్లాలు ఆశపడితే - భర్తగారు సహజంగానే దానిని ఒక 'మహాపరాధం'గా భావిస్తాడు. అయితే, - వృద్దురాలయిన భార్యకు జబ్బు చేస్తే - పని మనుషులున్నప్పటికీ ఇంటి బాధ్యత, ఇల్లాలి బాధ్యత, రెండింటినీ పడడం కష్టం అని భావించిన మగ మహారాజు 'ఇద్దరం వృద్ధాశ్రమంలో చేరిపోతే ఆ “బెడద ఏదో వాళ్లే పడతారు” అనుకుని నిర్ణయం తీసుకుంటే - ఎవరూ దానిని తప్పుపట్టరు ! -
ఒక ఫెమినిస్టు దృక్సధంలోంచి వృద్ధులకు నంబంధించిన సమస్యను అవ లోకించడం ఈ కధకాక ప్రత్యేకతను సమకూర్చింది.
స్రీలకు సంబంధించిన విషయాలపై చర్చ జరిగే సందర్భాలలో తప్పనిసరిగా (ప్రస్తావనకు వచ్చే అంశం - ఆమెపై జరిగే లైంగిక అత్యాచారం. ఏ పరిస్థితుల్లో నేరం ఎలా జరిగింది? ఎవరు చేశారు? అనే విషయాలకు సంబంధించిన తర్మనితర్మాలు ఎలా ఉన్నా, దాని విషఫలాన్ని అనుభవించేది మాత్రం స్రీయే ! -
అత్యాచారానికి గురి అయిన స్త్రీ ఏం చెయ్యాలి అనే విషయం మీద చాలామంది చాలా తరహాల కధలు రాశారు ఈ ఏడాది వచ్చిన వివినమూర్తి “నేరం” కథలో ఈ అంశం ఒక విలక్షణమైనరీతిలో అవలోకించిఐడింది. ఈ కథలో ఉదాత్తమైన ఆశయాలు గల డాక్టర్ వైష్లవ ఉద్యమంలో చేరి కొన్నాళ్ళు తుపాకీ పట్టింది. కానీ, - కొంతకాలం తర్వాత కారణాంతరాల వల్ల ఉద్యమం నుండి బయటకు వచ్చి జనజీవన '్రవంతిలో
కోడూరి శ్రీరామమూర్తి మవ చేరింది. మరొక డాక్టర్‌ను వివాహమాడి అమెరికాలో డబ్బు బాగా సంపాదించింది. కానీ, - మనసులోని ఆదర్శాలకు మాత్రం సమాధి కట్టలేదు. “ప్రపంచం అంతా ఆరిపోయిం దనుకున్న కమ్యూనిజమ్ గురించి రక్తం కార్చలేకపోయినా, కన్నీళ్లు కార్చగల స్థిత” నుండి ఆమె ఎన్నడూ దూరం కాలేదు. మరి కొన్నాళ్ల తరువాత ఆమె ఇండియాకు తిరిగివచ్చి ఒక అస్పత్రి ప్రారంభించడానికీ, ప్రపంచంలో అనాధలు ఉన్నంతకాలం పిల్లల్ని కనకూడదు అనుకోడానికీ, భిక్షం అనీ బీద కుర్రవాడిని పల్లెటూరు నుంచి తీసుకువచ్చి వాడికి 'ఏసీతో సహా సమస్త సదుపాయాలు ఇచ్చి ఇంటిబాధ్యత పూర్తిగా చూడమని చెప్పడానికి, ఇవి ముఖ్యకారణాలు. అయితే, - అమాయకుడు, మొరటువాడు, అయిన భిక్షం డాక్టర్ వైఫ్లవ్యలోని మానవతా ధోరశ్రిని అపార్థం చేసుకున్నాడు. ఆమెలో ఒక తల్లిని కాకుండా, ఒక స్త్రీని మాత్రమే చూశాడు. ఫలితంగా ఒకానొక బలహీనక్షణంలో ఆమెపై ఆత్యాచారం చేశాడు. ___ కథకు కీలకమైన ఈ అంశం నేపథ్యంలో పురుషాధ్యి సమాజ భావజాలంలోని రర దాక్టర్ వైప్లవ్య ప్రవర్తన వెనుకగల మానసిక సంఘర్షణను, ఆవిష్కరిస్తాడు పురుషాధిక్య సమాజంలో పురుషుడు (అతడు ఏ ఆర్థికస్థితికి చెందినవాడయినా) స్త్రీని కన అవసరాలు తీర్చే వ్యక్తిగా మాత్రమే భావిస్తాడు. ఈ కథలోని భిక్షం మొదటిలో వను తల్లిగా గౌరవించాడు. ఆ తర్వాత తోటమాలి మాటలను అమాయకంగా పాటీ అవసరం తీర్చుకోవడం కోసం ఆమె తనను చేరదీసిందనుకున్నాడు. ఖై హించిన తర్వాత - తనకు కరిన శిక్ష లభించాలని కోరుకున్నాడు గానీ అప్పటిక్తి జరగవలసిందంతా జరిగిపోయింది. వ్ వైపవ్య భర్త దాక్టర్ రాఘవ అవకాశవాది. ఆమె సహకారంతో అతడు డబ్బు, పెరు సంపాదించాడు ఆమె వలన తనకు అపఖ్యాతి రానంతవరకు ఆమె ఏం చెప్పినా గంగిరెద్దులా తల వూపాడు. పిల్లలు పుట్టకుండా ఆమె ఆపరేషన్ చేసుకోడానికీ, భిక్షం లాంటివాడికి సమస్త సదుపాయాలూ కల్పించడానికి, భర్తగా అతడు కాదనలేదు. కానీ,
- లేవ్ ఉదంతం తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకోడానికి సందేహించలేదు. కానీ - దాక్టర్ వైష్లవ్య పరిస్థితి వేరు. ఒకనాటి ఉద్యమ ఆదర్శాలను ఆమె ఏనాడూ మరచిపోలేదు. ఉద్యమంలోంచి బయటకు వచ్చి ఆమె డబ్బును, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నా అది ఆమెకు పూర్తి సంతృప్తిని కలిగించలేదు. ఒక
మవ అలుగు కథ -నాడు,నేడు :2ఒ2ఒ2ఒఐ2ఒ2వననవ22ఒ222న టన విధమైన అపరాధభావాన్ని మాత్రమే దానివలన ఆమె పొందింది. ఒకనాటి ఆమె ఉద్యమసహచరుడు, ఆ తర్వాత పెద్ద కాంట్రాక్టరు అయిన వాచస్పతి రెడ్డి లాంటి వాళ్లకు కూడా “ఏమాత్రం నెగ్గినా ఓడిపోతున్నా'మనే భావం ఉన్నప్పటికీ - వైష్లవ్యలో ఉన్నంతటి అపరాధభావన వారెవరికీ లేదు.
ఈ అపరాధభావనకు ఉపశమనం కలిగించడం కోసం మాత్రమే ఆమె పిల్లల్ని కనకూడడు అనుకుంది. భిక్షానికి సమస్త సదుపాయాలూ కల్పించి ఒక మంచి పనిచేసిన సంతృప్తిని పొందాలనుకుంది. డాక్టర్ రాఘవ ఆమెకు విడాకులు ఇచ్చినప్పుడు, తనపై అపచారం జరిగినప్పుడు, ఆమె క్రుంగిపోలేదు. మనసుకు నచ్చిన మార్గానికి దూరమై (బ్రతుకుతెరువు వెదుక్కున్నందుకు అదొక శిక్షగా మాత్రమే భావించింది. చట్టం దృష్టిలో నేరం చేసినవాడు భిక్షం కావచ్చు - వైష్లవ్య మానసికస్థితి నుండి చూసినప్పుడు నేరం చేసింది తానేనని భావించుకుందామె ! ఈ అపరాధభావ ఉపశమనానికే ఆమె - తనకు మానభంగంచేసిన భిక్షాన్ని - తన బిడ్డలా భావించిన భిక్షాన్ని - దత్తత చేసుకుని ఒక సంచలనం సృష్టించింది ! - ఇది ఆమెలోని [4019౯1౧84001కు గాక, అపరాధ భావనకే ప్రతీకగా భావించుకోవలసి ఉంది.
వైప్రవ్యలోని ఈ మానసిక సంఘర్షణను అర్థం చేసుకోకుండా, “ఎక్కడ ఉంచే వారిని అక్కడ ఉంచకుండా సమానంగా చూడబోయింది. అందుకే ఇలా జరిగింది-” అని వాఖ్యానించే 'మేధావు'లకు చెంపదెబ్బకంటే సరిఅయిన సమాధానం ఏమ్ముంది?
ఈ కథను రచయిత హరాత్తుగా చెళ్ మనిపించే చెంపదెబ్బతో ముగించడం కథకు శిల్చ్పపరంగా మంచి పరిపూర్ణతను ఇచ్చింది.
ఈ కధలోని ధోరణిలో కాకపోయినా, స్త్రీలపై అత్యాచారం జరిగిన సందర్భాలు ఇతివృత్తంగా గల కథలు మరికొన్ని కూడా వచ్చాయి. ఈ సందర్భంలో జి. నిర్మలారాణి “వ్పల్రుపు” కథ గురించి రెండు మాటలు రాయాలనిపించింది. ఈ కథలో రెడ్డికులానికి చెందిన ఓ కులాసా మోతుబరి సునీతలాంటి అమ్మాయిలను పాశవికంగా అనుభవించడం
సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయమే. దానిని ఎవరూ కాదనరు. అయితే,
- ఈ కథలోని సునీత అత్యాచారం చేసినవాడిని పెళ్ళాడనని చెబుతూనే - తనకు అతడివల్ల పుట్టే బిడ్డకు మాత్రం అతడి ఆస్తిలో వాటారావాలని డిమాందుచెయ్యడం ఆలోచనలలోని అస్పష్టతను, గందరగోళాన్ని చెబుతుంది.
మానభంగం జరిగినప్పుడు ప్రీ తన శీలాన్ని బలవంతంగా కోల్పోతే - మరికొన్ని సందర్భాల్లో అయిష్టంగా తన శీలాన్ని పణంగా పెట్టవలసి వస్తుంది. టూరిస్టులకు,
కోడూరి శ్రీరామమూర్తి 22 వ్యాపారవేత్తలకు, తోడుగా ఉంటూ వారికి కాలక్షేపాన్ని ఆనందాన్నీ అందజేసే వృత్తిలో ఉన్న సాలభంజికల ఆవేదనను తెలిపే కథ కూడా ఈ ఏడు వచ్చింది (సాలభంజిక - రచన : కుప్పిలి పద్మ)
అందం, చదువు, తెలివితేటలు, అన్నీ వున్నప్పటికీ - పెద్ద జీతాలు వస్తాయన్న ఆశతో, కొన్నాళ్లు ఈ పనిలో ఉండి ఆ తర్వాత వివాహం చేసుకుని గృహిజిగా బ్రతక వచ్చునన్న భ్రమతో - కొందరు అమ్మాయిలు ఈ ఉద్యోగంలో చేరుతూ ఉంటారు. ఈ ఉద్యోగంలో తాము చేయాల్సి ఉండే మరికొన్ని పనుల గురించి వారికి తెలియదనే అవకాశం లేదు. ఆడపిల్లలు తెచ్చే ఈ డబ్బుతో అన్నలు అమెరికా వెళతారు. తమ్ముళ్లు పెద్ద చదువులు డొనేషన్ కట్టి మరీ చదువుతారు. తల్లులు ఇంటికి కావలసిన వస్తువులన్నీ అమర్చుకుంటారు. కానీ ఈ క్రమంలో ఆ అమ్మాయిలకి వంట్లో మిగిలోఎయిడద్స్” వంటి భయంకర వ్యాధులు మాత్రమే | -
- ఈ కథలోని అంజలి జీవితం సుడిగుండాల్లో పడడానికి కేవలం - సురేష్‌లాంటి మొగవాడు - మోసగాడు - మాత్రమే కారణం అనడానికి వీలు లేదు. సురేష్ అంజలిని తన స్వార్ధానికి నిస్సిగ్గుగా ఉపయోగించుకున్నాడు నిజమే. కాని, - ఆమె పతనానికి మాత్రం అతడు కారకుడు కాదు. నానాటికీ పెరిగిపోతున్న మెటీరియలిస్ట్ ధోరణులు,వస్తు వ్యామోహము, ఆమె పతనానికి బాధ్యత వహిస్తాయి. ఒక కుటుంబంలోని సభ్యుల సళ రాహిత్యానికి బలియెపోయిన అమ్మాయి కథగా మాత్రమే దీనిని చూడవలసి
3 భగ కథాసాహిత్యంలో దళిత జీవిత చిత్రణ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి సాగరసంగం' నుండి, కరుణకుమార “క్రొత్త చెప్పులు" నుండి, - వున్నదే అయినా - అది ఈ కాలంలో ఉదార మానవతావాదానికి మాత్రమే పరిమితం కాకుండా, (కొత్తపుంతలు (తొక్కుతున్న విషయం అందరూ ఎరిగిందే.
అ(గ్రకులస్తులను బ్రితిమాలో, వారిని ఒప్పించో, దళితులు తమ సమస్యలను పరిష్మరించుకొనడమూ లేదా ఎవరి పాపానవారే పోతారు అనే ధోరణిలో ఊరుకొనడము,
కాకుండా - దళితులు ఉద్యమస్ఫూర్తితో చేస్తున్న పోరాటాలు ఈనాటి దళితకథలకు ఇతివృత్తాలుగా ఉంటున్నవనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
2222 తెలుగు కథ - నాడు,నేడు
అయితే, - ఈ సంవత్సరం వచ్చిన ఈ తరహా కథలు సంఖ్యాపరంగా తక్కువేనని చెప్పాలి. వాటిల్లో కూడా ఎక్కువ కథలు దళితులకు, దళితేతరులకు, మధ్య (ప్రేమ అంకురించిన సందర్బాల్లో అన్యాయం జరిగేది దళితులకే అని చెప్పడానికి మాత్రమే పరిమితం అయ్యాయి. ఇక, - మరికొన్ని ఎంత పెద్దచదువు చదువుకుని ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా దళితులకు ఇళ్లు అద్దెకు ఇవ్వరనీ, దేవుడి గుళ్లోకి వెళ్లాలని ఎంత ఆరాటపడినా రానివ్వరనీ, చెప్పే కధలు. ఇవి అన్నీ చట్టపరంగా ఎన్నిమార్చులను తీసుకువచ్చినా - మనుషుల హృదయాల్లో ఇంకా ఆశించిన మార్చు రాలేదు అని చెబుతాయి. ఈ సమస్యలన్నీ ముఖ్యమైనవే కానీ, - ఎన్నుకున్న సమస్యను సమర్థవంతంగా నిర్వహించినప్పుడు మాత్రమే కధకు రాణింపువస్తుంది.
దళిత సమస్య నేపధ్యంలో ఈ ఏడు వచ్చిన కథల్లో - వి.ఆర్. రాసాని “రెక్కల గుర్రం”, కాట్రగడ్డ దయానంద్ “నీడ”, డి.ఆర్. ఇంద్ర “మాలిన్యం”, సభిలేటి “కల విరిగిపడ” మొదలయిన కధలు పేర్మొనదగినవి.
రాసాని “రెక్కలగుర్రం” కథలో అగ్రకులస్తుడయిన ఒక స్కూల్‌టీచర్ మాయమాటలు నమ్మి మోసపోయిన దళిత యువతి గర్భవిచ్చిత్తి చేసుకోవడంగానీ, గర్భంలో ఉన్న శిశువు 'అంటరాని దరిద్రం? అని బాధపడడం గానీ, చెయ్యకుండా - “బిడ్డను కంటాను. తరతరాలనుండి ధనం పేరుతో, కులం పేరుతో, మతంపేరుతో, స్రీలకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్శొనేటట్టుగా ఒక బాలభటుడులాగా పెంచుతా-” ననడంలో నవతరపు చైతన్యస్స్ఫూర్తి ఉన్నది.
చట్టం పేరుతో ప్రభుత్వం నిరుపేదల గుడిసెలను ఖాళీ చేయించడానికి సంబంధించిన ఇతివృత్తం కాట్రగడ్డ దయానంద్ “నీడి కథలో ఉన్నప్పటికీ - అంతర్లీనంగా ఒక దళిత స్రీ కధ ఉంది. అంగవికలురాలయిన ఒక దళిత స్తీ మానవత్వాన్ని. గుండె నిబ్బరాన్ని, ఒకవైపు - అన్నీ వున్నా సంస్మారంలేని అగ్ర కులస్తురాలయిన స్త్రీ మనస్తత్వాన్ని మరొకవైపు - ఈ కథలో చూపిస్తాడు రచయిత. అంతేకాదు - దళితస్త్రీతో చాలాకాలంగా కాపురం చేస్తున్నా అగ్రజాతి పురుషుడి గుండెల్లో అనివార్యమై దర్శనమిచ్చే చీకటి కోణపు కధను కూడా మనసుకు హత్తుకునే రీతిలో చెబుతాడు రచయిత.
కడుపునిండిన తర్వాత విసర్జించే మాలిన్యాన్ని పొట్టగడవడం కోసం శుభ్రపరిచే పాకీ పనివాడికి మాలిన్యం అంటదనీ, వారిపట్ల మనకు వున్న చిన్నచూపులోనే మాలిన్యం ఉన్నదనీ చెబుతుంది డి.ఆర్. ఇంద్ర “మాలిన్యం” కథ. అంతేకాదు - మనం నిర్లక్ష్యం
కోడూరి శ్రరామమూర్తి వ చేస్తున్న బాలతశ్రామికుల సమస్యను కూడా గుర్తుంచుకునే రీతిలో మనముందు ఉంచుతుంది. బాల్యం అతిమధురమైంది అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ముందు - చదువుకుందామని వున్నా చదువుకోలేక పాకీపనిలో బ్రతకాల్సి వచ్చే ముక్కుపచ్చలారని పసివాళ్ళ గురించి ఆలోచించమని చెబుతుంది ఈ కధ. మంచిశిల్పం ఉన్న కథ ఇది.
నభిలేటి రాసిన “కలవిరిగిపడె” కథలో ఒక పల్లెటూరి మంగలి కులవృత్తి
చేసుకుంటూ అందరికీ లోకువగా బ్రతికేకంటే - స్వతంత్రంగా (బ్రతకడం మేలు అని భావించి వ్యవసాయం చేసి, వ్యాపారం చేసి, నష్టపోయి చివరకు దయనీయమైన స్థితికి దిగజారిన ఉదంతం ఉన్నది.
ఈ ఏడు వచ్చిస ఈ తరహా కథల గురించి చెప్పేటప్పుడు “ఇంతే ఇలాగే -" (రచన : నడిమింటి జగ్గారావు) కథ గురించి కూడా వ్రాయాలనిపిస్తున్నది. కొలకలూరి ఇనాక్ రాసిన “ఊరబావి” కథ వచ్చిన మూడు దశాబ్దాల తర్వాత ఈ కథ రావడం చూస్తూ - మన సమాజం ఇంకా చైతన్యరహితంగానే ఉన్న వైనం మరోసారి అవగతం అవుతుంది,
" తెలుగు కథల్లో దళిత జీవన చిత్రణతోబాటుగా - మైనారిటీల జీవన సరళిని కూడా చిత్రించడం ఇటీవలి పరిజామం. ముఖ్యంగా ముస్లిము మైనారిటీల జీవనతైలికి అద్దం పట్టే కథలు ఇటీవల ఎక్కువగా వస్తున్నవి. వీటిల్లో గుర్తుంచుకోదగ్గ కథలు కూడా ఉంటున్నవి,
ఒకప్పుడు మృస్లిమ్సు రచయితలు కధలు రాసేటప్పడు - మిగతా రచయితలు నడిచిన దోవలోనే వారు నడుస్తూ, అందరూ రాసే కధలు వంటివే తామూ రాసేవారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఒక ముస్లిమ్ రచయిత్రి ప్రచురించిన కధాసంకలనంలో ముస్లిమ్‌ల జీవితాన్ని గురించి చెప్పే కథ ఒక్కటీ లేకపోవడం గమనించదగ్గది. ఈ రోజున అలాంటి పరిస్థితి లేదు
ఈ ఏడాది వచ్చిన సుల్తానా, దస్తర్ (స్కైబాబ), మున్నాబేగం (ఖలందర్), మన్నక్ (యాకూబ్), మొదలయిన కథలు - జవా, నయాఫత్వా (ఎం. హరికిషన్) వంటి
కధలు - ఈ సందర్భంలో పేర్కొనదగ్గవి.
'మన్నత్ కథలో ముత్యాలగూడెం జ్యాపాట సైదులకు మొక్కి జెండా ఎత్తి 'మన్నక్లు
చేసుకోవడము, దారిద్ర్యం ఎంతపీడిస్తున్నా 'మన్నక్'లు మానకపోవడమూ వుంటే -
నవనవ జెలుగు కథ -నాడు,నేడు
“జవా” కధలో మసీదుకు చెందిన ఆస్తిపాస్తులను అనుభవిస్తూ మసీదు అభివృద్ధికి ఎంతమాత్రమూ తోడ్చడని ముల్లాలు 'పెద్దబుక్కు చదివినవారు చేయాల్సిన జవాను గౌండా అయిన రసిక్ చేశాడు కాబట్టి అతడికి వెయ్యిరూపాయలు జుల్మానా వెయ్యడము
-
పాతకక్షలు పెట్టుకుని “-ఈ రోజొకడు 'జవా' చేస్తానంటాడు. మరొకడు 'నిఖా సేస్ముంటానంటాడు -” అంటూ అపద్ధర్మ పరిస్టికుల్లో కోడినికోసిన రసిక్‌పై మండిపడడమూ-
-
ఇలాంటివన్నీ వేర్వేరు రూపాల్లో, వేర్వేరు సందర్భాల్లో, పిడివాదాన్ని బుర్రకు పట్టించుకున్న అన్నిమతాల్లోనూ ఉండేవే !-
“_ అవున్రా నేన్మాఫిర్ని మీరే నిజమైన ముస్లిమ్‌లు అల్లా పేరు చెప్పి మమ్మల్ని దోచుకుంటూ, భయపెడ్దూ, మా గొంతు కోసి 'జవా' చేస్తున్న మీరే నిజమైన ముస్లిమ్‌లు
- నేన్మాఫిర్ని - ఒక్క నయాపైసా కూడా ఇవ్వను-” (జవా కధలో) అనే తిరుగుబాటు వేర్వేరు రూపాల్లో, వేర్వేరు మతాల్లో, హేతువాదులు చిరకాలంగా చేస్తున్నదే !-
ఇక, - ఖలందర్ “మున్నీజేగం” కధలో ఒక ముస్లిమ్ స్త్రీ వివాహం పేరుతో లోనయిన దయనీయస్థితిని మనసుకు హత్తుకునే రీతిలో చెప్పడం జరిగింది స్త్రీకి హృదయం అనేది ఉంటుందని (గ్రహించక, ఆమెను సెక్సు అవసరం తీర్చుకోడానికి ఉపయోగపడే సాధనంగా మాత్రమే చూసినప్పుడు - ఏ మతంలోనయినా, ఏ దేశంలోనయినా ఆమెకు ఆవేదన తప్పదు - అని మనకు ఈ కధ మరోమారు జ్ఞాపకం చేస్తుంది.
హిందువుల ఇళ్ళల్లో జరిగే శుభకార్యాల్లో ఇతర మతస్తులు పాల్గొనడం అభ్యంతరకరం కాదుగానీ, హిందూమతానికే చెందిన దళితులు పాల్గొనడం మాత్రం నిషిద్ధం అనే చేదు నిజాన్ని “దస్తర్” కథ చెబుతుంది ఈ కథలో - మహమ్మదీయ మిత్రుడి సోదరి వివాహ సందర్భంగా జరిగిన 'ద్రావకోలో ఒక హిందూ అగ్రకులస్తుడు, మాదిగ కులానికి చెందిన దళితుడు, భోజనం వడ్డిస్తే అది ఎవరికీ అభ్యంతరం గాలేదు. కాని, - హిందూ మిత్రుడి సోదరి వివాహ సందర్భంగా జరిగిన విందులో దళితమి(త్రుడు, ముస్లిమ్ మిత్రుడు, అదే పని చేస్తే - ముస్లిమ్ గురించి ఎవరూ పట్టించుకోలేదు గానీ, దళితుడి విషయమై పెద్దరగడ జరిగింది. “-మాదిగోనితోని అన్నాలు వడ్డిస్తార్రా ఎ రెడ్డిపుట్టక పుట్టలేదురా మీరు?” అంటూ కులపెద్దలు అల్లరి లేవదీశారు. ముస్లిమ్‌లకు ఉన్న మతపరమైన పట్టింపు కంటే, పొందువులకున్న కులపరమైన పట్టింపు ఎక్కువ అని చెప్పే కథ యిది.
“దస్తరొ కధ రాసిన స్కైబాబా రాసిన మరొక కధ - “సుల్తానా” ఈ ఏడు చర్చనీయాంశ మయింది. “-అనార్మలీ సలీంను (్రేమించినట్లు, లైలా మజ్నూను
కోడూరి శ్రీరామమూర్తి మ 'ప్రేమించినట్లు - సుల్తానా ఏ మహబూబ్ ఆలీ మీదో మనసు పడ్డా ఫర్వాలేకుండె కాని,
- ఇక్కడ సుల్తానా ఒక హిందూ పురుషుణ్ణి నిష్కల్మషంగా (ఢ్రేమించింది-”” ఆంటూ (ప్రారంభమయ్యే ఈ కధ - సుల్తానా (ప్రేమించిన హిందువు రామారావో, కృష్ణారెడ్డో, శ్రీనివాసో, శాస్త్ర శర్మో ఎవరయినా జరిగేది ఒక్కటేననీ - అమాయకురాలయిన ముస్లిమ్ యువతి వంచనకు గురికాక తప్పదనీ, - హత్యగానో, ఆత్మహత్యగానో, ఆమె కథ ముగియవలసిందేననీ చెబుతుంది. ఇది ఒక సుల్తానాకు, ఫలానా సుబ్బారావుకు, జరిగిన (ప్రేమవ్యవహారంలో అయిన వంచనగా చెబితే - అది కేవలం ఒక ఉదంతంగా మాత్రమే ఉందేది. కాని, - ఈ కథలో రచయిత “సుల్తానా అనే అమ్మాయి ఏ హిందూ యువకుణ్ణి (క్రేమించినా జరిగేది ఇదేనని చెప్పడం - పనిగట్టుకుని మతవిద్వేషాన్ని రెచ్చగొట్టడమేనని కొందరు తీవ్ర స్వరంతో విమర్శించారు అంతటితో ఆగకుండా - ఎం. హరికిషన్ అనే రచయిత నయాఫత్వా' అనే ప్రేర్సుత్రో (సుల్తానా కధకు ఖందడనగా మరొక కధను రాశాడు. హ్ గ కళ్లు మూసుకుంటే చాలు 'ఆకాశదేముని నయాఫత్వా వెంటాడసాగింది. ౦దువులను (పేమించవద్దని, వారితో లేచిపోవద్దని, పోతే రయుట్కా తింటారనీ అమగదుగునా ఉదాహరణలతో వివరించిన 'ఫత్వా'నే మాటిమాటికీ యాదికి గింది” అంటూ మరో సుల్తానా గురించి ఈ కథలో చెబుతాడు రచయిత, అమి అయినా, సుబ్బలక్ష్మి అయినా లెక్కకు మీరినన్ని తోదేళ్లు ఉన్న సమాజంలో ఈ వాస్త లయిన స్త్రీ వంచనకు గురికావడం అసాధారణమైన విషయం ఏమీ కాదు, వనాన్ని గమనించనప్పుడు మతపరమైన విద్వేషాలు మాత్రం మిగులుతాయి. | గుంజే .గరేదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మేధావులను ఆందోళనకు మఖ విషయాలలో గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రయివేట్రైజేషన్, విధానాలు లభ్య ట్ వడ గోబలైజేషన్ ఫలితంగా చౌకధరకు దొరికే విదేశీ వస్తువులు మార్కెట్లో ఈ విష యాన చిన్న పెద్ద దేశవాళీ పరిశ్రమలకు దెబ్బతగిలే పరిస్థితి ఏర్పడుతుంది. ౧౦బంధించిన నేపథ్యంలో ఈ ఏడు కూడా కొన్ని కధలువచ్చాయి. నెత్తి మొ - “పట్టు అనే కథను (రచన : రుక్మిణి) ప్రస్తావిస్తాను. ఈ కధలో త్రీముద మూటపెట్టుకుని పల్లెటూళ్లల్లో తిరుగుతూ బట్టల అమ్ముకున్న ఆంజనేయులు
మా తెలుగు కథ - నాడు,నేడు నాలుగు రాళ్ళు సంపాదించుకుని బాలాజీ క్లాత్ స్టోర్సు యజమానిగా ఎదిగాడు. ఆ రోజుల్లోనే - లంబాడీలు ఉండే పల్లెటూళ్లల్లో అద్దాల లంగాలు, రవికెలు, కుట్టిపేరు తెచ్చుకున్న దావూద్ మరికొంత ఎదుగుదామని పట్నం వచ్చి ఆంజనేయులు బట్టల కొట్టు అరుగుమీద మిషన్ పెట్టుకున్నాడు. ఇలా కొన్నాళ్ళు ఇద్దరూ కాస్త ఎదిగారు గానీ, - చైనా నుండి రకరకాల రెడీమేడ్ బట్టలు దిగుమతి అయి మార్కెట్లోకి రావడంతో
- వాటి ధర బాగా తక్కువ ఉండడంతో - బాలాజీ క్లాత్స్టోర్సులో బట్టలు కొనేవాళ్లు, దావూద్ దగ్గర బట్టలు కుట్టించుకునేవాళ్లు, బాగా తగ్గారు. బట్టలు దుకాణానికి బేరాలు తగ్గడానికి కారణం షాపు ఈశాన్యం మూలఖాళీగా ఉండకుండా దావూద్ మిషన్ పెట్టుకోవడం అంటాడు ఆంజనేయులు కొడుకు. కానీ, నిజానికి బఐడుగుజీవుల పొట్టగొట్టే ఆర్థికవిధానాలే ఇందుకు కారణమనే విషయం ఆలోచించగలిగిన వారికి మాత్రం తెలుసు. కారణం వమయితకేనేం - ఇన్నాళ్లూ మిషన్‌తో బట్టలు కుట్టి బ్రకికిన దావూద్ చివరకు కూలీ అవతారం ఎత్తి 'ఇటుకలు, పిటకలు), మోసే పని చెయ్యడమే గత్యంతరం అయింది. చిన్నఅద్దంలో పెద్దకొండను చూపేకధ ఇది. వినడానికి కొంత జుగుస్పాకరంగా ఉన్నా - గ్లోబలైజేషన్ ప్రభావం 'రెడ్‌లైట్ ఏరియా'ల మీద కూడా ఉందంటారు మరో రచయిత. (స్వదేశ భక్తులు - రచన : పి. చంద్రశేఖర ఆజాద్) ఈ కధలోని 'రెడ్‌లైట్ ఏరియా*కు చెందిన వ్యభిచారిణులది మరొక ప్రత్యేక సమస్య “_ ఎప్పుడయితే గ్లోబలైజేషన్ ప్రారంభమైందో అప్పుడే హైటెక్ వ్యభిచారం ప్రారంభ మయింది. సెల్ఫోన్లు, పేజర్లు, ఇంటర్నెట్ల ద్వారా ఈ వ్యభిచారం విస్తృతమౌతున్నది. ముఖ్యంగా విదేశాల నుండి ఎందరెందరో ఇక్కడికి వచ్చి సంపదల్ని తరలించుకు పోతున్నారు +” అంటూ - *_ ఈ దేశ ప్రజలు ఈ దేశ వ్యభిచార గృవాలకే వెళ్లాలి” అనే నినాదంతో ఉద్యమిస్తారు వీరు వీరి “స్వదేశ భక్తిని కాదనేందుకు వీలు లేదు !! - గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ విధానాలు కల్పించే భ్రమలు ఎలాంటివో కాశీభట్ల వేణుగోపాల్ రచించిన 'తాబీడు' కధలో (ప్రతీకాత్మకంగా కనబడుతుంది. అయితే - కథకు ఇంతకు మించిన విస్తృత పరిధి కూడా ఉంది. తాబేలు సైజులోవున్న సాలీడుకు రచయిత “తాబీడు” అని పేరుపెట్టారు. ఈ కథలో వున్నది ఒకటే 'తాబీడు' అయినప్పటికీ
కోడూరి శ్రీరామమూర్తి మమా అది రెండు రకాల 'తాబీడు'లకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఒకటి - విదేశాలనుండి తెచ్చిపెట్టుకున్న తాబీడు. రెండోది ప్రజాప్రతినిధుల పేరుతో మనకు మనమే తయారు చేసుకున్న తాబీడు తాబీడు ఏ జాతిదయినా బుద్ధి లక్షణం మాత్రం ఒక్కటే ! - మొదటి తాబీడులో ప్రపంచబ్యాంకు ప్రతిపాదనలు, 4౧౦ వారి విధానాలు, విదేశీ వ్యాపార సంస్థల పోకడలు, ఇవన్నీ కనబడితే - రెండో తాబీడులో రాజకీయ నాయకుల ఎన్నికల వాగ్దానాలు ప్రతిబింబిస్తాయి “- ఆకాశం మీ ముంగిట్లోకి చేరుస్తా. కాలువ తవ్వించి సముద్రాన్ని మీ వీధుల్లోకి మళ్లిస్తా, హైబ్రీడు విత్తనం వేసి ఏ పురుగూ కుట్టలేని పంట వందల ఎకరాలు పండుతుంది” ఇలాంటి వాగ్దానాలు నమ్మి సాలెగూటి దగ్గిరకు వెడితే చిక్కుకుపోవడం మాత్రమే జరుగుతుందనేది ఇన్నాళ్ల స్వానుభవం మనకు చెప్పిన గుణపారం. సరళీకృత ఆర్థిక విధానాల వల్ల (ప్రయివేటు రంగం మనదేశంలో మున్నెన్నడూ లేనంతగా విస్తరిస్తున్నది, పబ్లిక్ రంగ ప్రాధాన్యత నానాటికీ తగ్గిపోతున్నది. “- కొద్దిమంది పారిశ్రామిక్షవేత్తల చేతుల్లో వారు ఎంత మంచి వాళ్లయినప్పటికీ, ఎంత సమర్భలు ఆయినప్పటిక్తీ ఆర్థిక శక్తి కేంద్రీకృతమై ఉండటం అత్యంత అవాంఛనీయమైన విషయం
- అని భావించిన జవహర్లాల్ నెహ్రూ కలల పంటగా “50లలో రూపుదిద్దుకున్న పల్లీకరంగం “90లు వచ్చేటప్పటికి దయనీయమైన స్థితికి చేరుకుంది. రెండు విడతలుగా అసులు జరిగిన, జరుగుతున్న, ఆర్థిక సంస్కరణలు పబ్లిక్ రంగపు ఉనికిని ప్రశ్శార్ధకం హ్ తీసుకుని వచ్చాయి. లాభాలు తెచ్చిపెడుతున్న పబ్లికిరంగ పరిశ్రమలను దా స్వార్థంతో + దుర్మార్గంతో, నష్టాల ఊబిలోనికి నెట్టివేసి, ప్రయివేటు వారికి అమ్మి, ఈ వ్యవవారంలో బాగుపడదామని చూసేవారు అన్నిస్తాయిలలోనూ నానాటిక్తీ పెరిగిపోతున్న పరిస్థితి ఉంది, ఈ నేపధ్యంతో - మనల్ని 'లోచింపజేసే ధోరణిలో కొందరు కథకులు కధలు రాస్తున్నారు. ఈ ఏడు వచ్చిన ఈ తరహా కధల్లో - “టైటానిక్ (సురేష్స్ బతుకుగోస (గొరుసు జగదీశ్వరరెడ్డి, “విషబీజం” (నల్లాని చక్రవర్తుల గోపాల్స్ మొదలయిన కథలు పేర్కొనదగినవి. -
॥ కర్మాగారం అంటే కేవలం యంత్రాల సమాహారం మాత్రమే కాదు ఆ యంత్రాలను నడిపె మనుషులు కూడా ఉంటారు. వారికి హృదయాలు ఉంటాయి. ఆ హృదయాల్లో ఆర్ధతలుంటాయి. తాము పనిచేసిన, చేస్తున్న వాతావరణంపై - సహోద్యోగులపై - అనుబంధం వుంటుంది. “డిజెన్నిస్ట్మెంటొ (01510౪650౧6౧0 అంటూ యాంత్రికంగా చేసే కార్యక్రమంలో ఇట్లాంటి హృదయ స్పందనలను గమనించే అవకాశం ఉండదు.
మావా లుగు కథ - నాడు,నేడు ఒక పెద్దకర్మాగారం పబ్లికిరంగంలో ఒక వెనుకబడిన ప్రాంతంలో స్థాపించబడినప్పుడు ఎన్నో వేల కుటుంబాలు ఆర్ధికంగా లబ్బిని పొందుతాయి. అదేవిధంగా - ఒకే ఒక్క కలంపోటుతో ఆ కర్మాగారం మూతపడినప్పుడు ఆ కుటుంబాలన్నీ వీధినపడతాయి. వాళ్ళ సంసారాల్లో సంక్షోభాలు ఏర్పడతాయి. సమర్శ్జుడయిన కధకుడు ఈ వాతావరణాన్నంతా తన కధలోనికి సమర్ధవంతంగా యిమడ్చగలిగినప్పుడు సహజంగానే అది మంచి కధ అవుతుంది అలాంటి మంచి కధ సురేష్ వ్రాసిన “టైటానిక్”.
ఒకప్పుడు పబ్లికరంగంలో మంచి లాభాలు గడింది, ఆర్థికమంత్రి చేత నవరత్నాలలో ఒక రత్నంగా ప్రశంసించబడిన 'ఆంధ్రాస్టీల్స్' కర్మాగారం టైటానిక్ ఓడ మునిగినట్లుగా నష్టాల ఊబిలో కూరుకునిపోయి అదృశ్యమైపోతున్నప్పుడు తాను చేస్తున్న పనిని, అఆ పనిని తనకిచ్చిన కర్మాగారాన్ని ఢ్రేమించిన ఒక యువకుడి అంతరంగంలో చెలరేగిన ఆవేదన ఈ కథకు ఇతివృత్తం
(బ్రహ్మాండమయిన పెట్టుబడితో (ప్రారంభమైన ఆంధ్రాస్టీల్స్ క్రుంగిపోతున్న సమయంలోనే - ఆ కర్మాగారానికి చేరువలో కేవలం అయిదులక్షల రూపాయల పెట్టుబడితో ప్రయివేటు రంగంలో (ప్రారంభమైన స్వతంత్రా స్టీల్స్ - లాభాలబాటలో నడిచి అయిదువందల కోట్ల రూపాయల పెట్టుబడికి చేరుతుంది. అంతే కాదు - అతితక్కువ ధరకు ఆంధ్రా స్టీల్ ఫ్యాక్టరీని కొనుక్కుని తనలో విలీనం చేసుకుంది ఒకచోట సాధించబడిన విజయానికీ, మరొకచోట పొందిన వైఫల్యానికీ గల కారణాలు ఐహిరంగ రహస్యాలే ! - అయితే, ఇదే స్వతంత్రా స్టీల్స్‌ను మరొక మల్టీనేషనల్ కంపెనీ కబళించటం మరొక ముచ్చట.
ఈ కధనంతటినీ - *ప్లాష్బేకొలతో ముందు వెనుకలా కలబోస్తూ - చాలా ఆసక్తికరంగా చెబుతారు రచయిత ఈ క్రమంలోనే మనం శ్రీహరి సహోద్యోగులయిన రాజారావు, సనా మొదలయిన వారందరి కధనూ తెలుసుకోగలుగుతాం. శిల్చరీత్యా పరిపూర్ణత ఉన్న కధ ఇది
మొత్తం మీద - రచయిత కధను నడిపిన తీరు మెచ్చుకోదగ్గదిగా ఉన్నదిగానీ - కధ చివరలో “-ఈ దేశ ప్రజల కష్టార్జితమైన ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకునే వాక్కు ఏ ప్రభుత్వానికీ లేదు నా సంస్కరణలను దారి మళ్ళించారు” అనే మాజీ ప్రధాని మాటలకు ప్రాధాన్యతను ఇవ్వడం - అతడి మాటల్లో చిత్తశుద్ధి వున్నదేమోనన్న (భ్రమను పారకులకు కలిగించడమే అవుతుంది. వ్యంగ్యం కోసమే రచయిత దీన్ని ప్రస్తావించి వుంటే - దానిని మరింత స్పష్టంగా కథలో ఎస్టాల్లిష్ చేయవలసి ఉన్నది.
కోడూరి శ్రీరామమూర్తి మ ఈ విషయానికి సంబంధించిన చర్చ ఎలా ఉన్నా ఈ ఏడాది వచ్చిన ఒక మంచి కథ ఇది.
గొరుసు జగదీశ్వరరెడ్డి “ఎకుకుగోసొ కధ కూడా ఇదే ధోరణిలో నడుస్తుంది. ఈ కధకూడా ఒక పబ్లికిరంగ సంస్థల్లో సుదీర్హక్షాలం పనిచేసి, - ఆ సంస్థ మూతబడిన తర్వాత కూడా దానిపైన మమకారం చంపుకోలేక, లోనికి వెళ్లి చూసి, గుండెల్ని విషాదంతో నింపుకున్న వ్యక్తి కథనే చెబుతుంది.
రచయిత కథను ఒక 'ఫాంటసీగా తయారుచేసి ముగించకుండా ఉంటే బాగుండేది.
ఇక - “విషబీజం” కథలో రచయిత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో - పబ్లికిరంగ పరిశ్రమల్లో పనిచేసేవారిలో ఎంతటి నిబద్ధత ఉండేదో - క్రమశిక్షణ ఉండేదో చెబుతారు. అయితే ఆ రోజుల్లో కూడా “విషపురుగులు' కొందరు వున్న వైనం ఈ కథలో చదవడం ఆసక్తికరంగా ఉంటుంది. కధలో రచయిత ప్రస్తావించిన మంచి అధికారిలాంటి వాళ్ల గురించి చదివినప్పుడు - “ఏవి తల్లీ నిరుడు విరిసిన విరిసుమాలు' అని అనుకోవడం మాత్రమే మిగులుతుంది ! ర్ | వి తర్వాత దేశంలో వచ్చిన - ఆర్థిక సాంఘిక, రాజకీయ పరమైన మార్పులు క్ అతనే మతపరమైన విద్వేషాలు - ఆలోచనాపరులకు ఆవేదనను కలిగిస్తున్నాయి. నడిలన ను కథారూపంలో అక్షరరూపం ఇచ్చేందుకు కొందరు రచయితలు నలుగురు సుందన మార్గాన్నే నడుస్తూ ఉంటే - మరికొందరు కొత్తధోరణిలో తమ హృదయ స్ో “లను వ్యక్తం చేసేందుకు మార్గాలు వెతుక్కున్నారు. నిజానికి - ఇది క్ శ్రవిషయమేమీ కాదు. చిరకాలంగా కథాసాహిత్యంతో సహా అన్ని సాహిత్యప్రక్రియల షయంలోనూ జరుగుతున్నదే. దాదాపుగా అన్నిభాషా సాహిత్యాల్లోనూ జరుగుతున్నదే), __ో సందర్భంలోనే - ఇటీవల మన రచయితలను ఆకట్టుకొంటున్న “మాంత్రిక వాస్తవికత (8010 (629) గురించి పేర్ళొానవలసి ఉన్నది. - 'మాంత్రిక వాస్తవికత అగ మాటలో ఉన్న అర్ధం ఇది అని చెప్పేందుకు ప్రామాణికమైన నిర్వచనం లేకపోవచ్చును గాన్కి మొత్తం మీద ఈ విషయానికి గల అర్థాన్ని గ్రహించవచ్చు.
దీనిని గురించి చెబుతూ కొందరు “గ||గ౧౦||౧౮ ౦ 006 గ౧౮౧౦౮౬౧6 ౪11౧ 66 14౧4910
గా భావిస్తే - మరికొందరు "110440! 0౮6016120౧ 2౧6 12712510 50% 11 19 00౧౧1 &గ౧6 1900౧11649 -" అని భావించారు.
మవ తెలుగు కథ -నాడు,నేడు
ఈ తరహా రచనల్లో - *% గం (28940 ౧4౧210? 0౧9193 16 690% 0! ౪౧62110 - 1201౧09 6 690806 70గ 26 ౧4|౧| - 2౧6 16115 2౧ 2060౧ 14 6౪8౧ | 22009463 25 6౫14104016, ॥ ౧౦౧౭౩ &0౧035 &3 5౧2006 - 1౧ 51౧2009 ౧2౧౫౪౦౧౦, €16 ౪౧19౯ ౧౧౪౦౩౭౧౪౧౩ 30గ౭ 10100 29 92% 16 ౧981%/ 5800౧069 గ౫౭౮168|” అనే ధోరణి ఉండడం గమనార్దం
మామూలుగా వ్యక్తం చెయ్యలేని భావసంచలనాన్ని ఈ తరహా ధోరణిలో
శక్తివంతంగా వ్యక్తీకరించవచ్చునని కొందరి అభిప్రాయం. - ఈ ధోరణిలో ఇటీవల వరుసగా కధలు రాస్తున్న డా.వి. చంద్రశేఖరరావు ఈ ఏడు కూడా ఈ విధమైన కథలు కొన్ని రాశారు. వీటిల్లో - “కాకుల ఇల్లు, “కేక, “సలీం సుందర్ ప్రేమకధ', ప్రత్యేకించి పేర్కొనదగినవి.
“కాకుల ఇల్ల కధలో - మనకు కధను చెప్పే బాలిక, కాకులకును గొప్ప సంస్కృతికి ప్రతిబింబంగా భావించి పెంచుకునే ఆ బాలిక తండ్రి, కళ్లు లేకపోయినా ప్రపంచాన్ని హృదయంతో స్పష్టంగా చూడగలిగిన అజంతా, రంగస్థలంపైనా బయిటా కూడా సమర్ధవంతంగా నటించగలిగిన సుందర్ అంకుల్, పిజ్జాలు తింటూ బోస్నియాలో జరిగిన మానభంగాల దగ్గిర్నించి పౌరహక్కులవాళ్ల బులిటిన్లలోని సమాచారం వరకూ అన్నింటినీ ఓపిగ్గా వినగల 'మాయ'” అనే ఆవు - ముఖ్యమైన పాత్రలు. ఇక, - జనం అందరూ చచ్చినట్లు చూడవలసిన 'ప్రజలవద్దకు పాలని నాటకం, జనాలకు గుబులు పుట్టించే పోలీసుల దౌర్జన్యాలు, తెరవెనుక నుండి మనల్ని పలుకరించే అంశాలు.
ప్రజలకోసం బ్రతికి, దురహంకారుల దౌర్జన్యానికి నడిరోడ్డుమీద నలుగురూ చూస్తుండగా దారుణంగా హత్యచేయబడిన దళిత నాయకుడు విలియం సార్ ప్రత్యక్షంగా కనబఐడకపోయినా ఈ కధలోని కీలకమైన పాత్ర.
తన కళ్ల ఎదుట హత్య జరిగినా సాక్ష్యం చెప్పడానికి జనం ముందుకు రాకపోవడమూ, సాక్ష్యం చెప్పడానికి వచ్చిన అజంతా లాంటి వాణ్ణి క్రూరంగా హింసించడం మాత్రమే కాకుండా ముక్కుపచ్చలారని బాలికను దారుణంగా మానభంగం చెయ్యడమూ, కల్పనలని ఎవరూ అనలేరు. సత్యాన్ని చెప్పవద్దని శాసించడము, అసత్యాన్ని చచ్చినట్టు ఆమోదించాలనడమూ ఈ రెండూ అధికారం వున్నవాళ్లు దౌర్జన్యంతో సాధించే విషయాలే కాని, - స్వేచ్భాప్రియత్వాన్ని ఎవరూ ఎంతోకాలంగా బలంగా అదిమిపెట్టలేరు
- అనే హెచ్చరిక ఈ కధలో ఉంది.
ధవళవస్రం నలుపురంగుగా మారినవేళ - 'మాయి అనే అవుపై ఎక్కి మనకు
కోడూరి శ్రీరామమూర్తి మవ కధను చెప్పే బాలిక, అజంతా కలిసి ఎగిరిపోతూ ఉండగా - ఆ ప్రయత్నాన్ని గండి కొట్టేందుకు తుపాకీ గుళ్లు పేలడమూ - ఈ కధలో వున్న ఫాంటసీ ఈ రెండింటి సమ్మేళశనంలోనేమనకు ఒక 015౪1066 ౫౫౧6౮ ఆలోచనాసరళి కధగా మనముందుకు వస్తుంది. ఇక, - “కాకులు” అనేవి కేవలం ఒక పక్షిజాతికి మాత్రమే చెందినవి కావనీ, “నలుపు అనేది కేవలం ఒక రంగుమాత్రమే కాదనీ, - ఒక దళితనాయకుడి వాత్య నేపధ్యంలో వ్రాయబడిన ఈ కధ చదివినవారికి సహజంగానే తెలుస్తుంది.
కులం పేరుతో మనిషి సృష్టించుకున్న అశాంతి “కాకులు” కధలో కనబడితే - మతం పేరుతో మనిషి సృష్టించుకున్న మారణహోమం “సలీం సుందర్ ప్రేమకథలో అక్షరరూపాన్ని పొందింది.
“- హైదరాబాద్ నిర్వాణమూర్తి, రౌడీషీటర్, చాచి మొఖంమీద కొట్టిన ఫెమినిస్టు
కవిత. ఆకాశం వైపు నిలబడి మాస్టర్ బేట్చేసుకుంటున్న బాచిలర్ కవిత -” అని ఈ కధలో హైదరాబాద్ గురించి చెప్పిన 'సలీం సుందర్' ఒక - జర్పలిస్ట్ తాను పనిచేస్తున్న పత్రిక హరాత్తుగా మూతబడగా సంచీలో కవితలు పెట్టుకొని తిరగడం మినహాగా (ప్రస్తుతం అతడికి వ్యాపకం ఏమీ లేదు. ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతున్న అమ్మాయి - ఆకుపచ్చని రెయిన్‌కోటు అమ్మాయి - మనోరమ అతడి స్నేహితురాలు, ప్రియురాలు.
వీల్లిద్దరి ప్రేమకథ నేపథ్యంలో,- ఈ కధలో మతం పేరుతో విశ్వవిద్యాలయ
ప్రాంగణంలోనూ, బయటా జరిగే ఆరాచకం - పోలీసుల జులుం - మురాతత్వం - వీటినన్నిటినీ మనముందు ఉంచుతాడు రచయిత అ కారణంగా పోలీసుల చేత తిట్లు, దెబ్బలు, “- ఇంతకూ నీ రూల్స్ ఏమిటి? - నీ లాయల్టీస్ ఎటువైపు? - అసలు ఆ పేరేమిటి?” అంటూ సలీం సుందర్‌ను ఆరాతీసి తగువుపెట్టే విద్యార్థులతో పోట్లాటలు
- భయపెట్టే నిక్కర్లు - లారీలు -_ కాషాయజండాలు - ఇదంతా యదార్ధ జీవితదృశ్యం ఆ భీభత్సం.
ఈ భీభత్సంలోనే సలీమ్ యుద్ధం గురించి కలలు కన్నాడు. అ కలలో అతడి పెదాలు తెగిపోయాయి. “-పెదిమలు లేని ముఖాన్నిఏం చేసుకోను?” - నవ్వు పోయి పెదాలువున్నా బాగుండేది” అంటుంది మనోరమ. కాని, - అంతలోనే “స్వప్నాల మరణమే మేలుకొలుపు అనే అవగాహన కలిగింది “-నువ్వు ముస్లిమ్వో, నేను హిందువునో కాకపోతే ఏమి నష్టం?” అనే సాంత్వనం కలిగించే మనోరమ పలుకు లున్నాయి.
222 తెలుగు కథ -నాడు,నేడు కాని, - “మనోరమ చెయ్యి అతడి శరీరాన్ని తాకగానే అతడిలో కామోద్దీపనకు బదులు ఒక విధ్వంసం, ఒక ప్రాణభయం -” అనుభవంలోనికి రావడము, “శతాబ్దాల గాయాలకు ప్రతీకారంగా తన శరీరం ఆయుధం అయి, ఆమె శరీరాన్ని చీల్చి - ఆ రక్తాన్ని చూచి సేదదీరడం -” అనే సాంత్వనం శరీరాలను గగుర్పొడిచే ఉదంతం. ఇంతా జరిగాక, సలీమ్ తిరిగి మనసున్న మనిషిగా మారి క్షమించమని అడిగితే
- అర్ధమైనదానిలా అతడి తల నిమురుతుంది మనోరమ. జుగుప్సను కలిగించే ఈ సన్నివేశం వెనుక వున్నవి సలీమ్ 'లిబిడోలోని భావాలు కావు. తనని తాను దహించుకునే ధోరణిలో ఒక తరవిో 'మసోఖిక్' ప్రవృత్తితో అతడు ఈ పనిని చేశాడు. అందుకే - అతడి మానసిక సంక్షోభాన్ని ఒక తల్లిలా మనోరమ అర్ధం చేసుకోగలిగింది ! - మతపరమైన సంకుచిత దృక్పధము, సంఘర్షణలు, సర్వసాధారణమైపోతున్న మహానగరాలలో ఇలాంటి భీభత్సదృశ్యాలు అసాధారణమైన విషయాలు కావు. అయితే
- దీనికి రవ్వంత “ఫాంటసీ” జతచేర్చి విలక్షణమైన కధనంతో పారకుల ముందు ఉంచటంతో - కధ చదివిన పాఠకులకు ఒక విలక్షణమైన అనుభూతి కలుగుతుంది. 35[04178 500౧౧90100 00గ౫గ౧౫౦౧ ౦1 61/ 1౧1౦ 950౧1641౧9 512006” అంటే ఇదే అని చెప్పవచ్చు. కె.వి.కూర్మనాధ్ రచించిన “ఒక జననం కోసం” కథలో కూడా మాంత్రిక వాస్తవికతా ధోరణికి చెందిన కథనం ఉంది. -నల్లాల నీళ్లొస్తున్నాయి. మొహంమీద రక్తం తుడుచు కోవచ్చు కదా ! -” అంటూ ప్రారంభమయ్యే ఈ కధలో “- రాలిన పువ్వుల నుండి వికసించిన విస్ఫులింగాలను వెదికి పట్టుకోండి. ఖండిత స్వప్నాలను చేబూని కవాతు చెయ్యండి-” అంటూ చేసే (ప్రతికాత్శ్మక) నినాదాలు, “తెగిపడ్డ ఆలోచనలు విత్తనాలయ్యాయి” వంటి నమ్మలేని నిజాలు, ఆశ్చర్యజనకంగా ఉన్నా - అనగనగా రాజుగారి కధలో *- అందరికీ అన్నం దొరికేది - అది వండిన పూటకూళ్లమ్మకు తప్ప -” అనేది ఒక రాజుగారి కధే అనుకోనకృరలేదు. “జీవించాలంటే మరణించాల్సిన వైరుధ్యం-” అనేదాన్ని అర్ధం చేసుకోవడం కష్టంకాదు. చిరకాల సత్యాలను, ఆశ్చర్యజనక సంఘటనలను, కలబోస్తూ మన రాజ్యాంగంలో ఉటంకించబడిన పందొమ్మిదో అధికరణం నియంతల వంటి అధికారుల చేతిలో నవ్వుల పాలైన వాస్తవాన్ని - మాంత్రిక వాస్తవికతా ధోరణిలో చెప్పే కథ ఇది. అంతే కాదు - మరజూన్ని గురించి చెబుతూ అది జననానికి సంకేతమని సూచిస్తాడు రచయిత ఈ కథలో -
కోడూరి శ్రీరామమూర్తి మం ఇక - మరికొందరు కథకులు తాము చెప్పదలచిన విషయాన్ని విలక్షణంగా చెప్పడం కోసం (ప్రతీకాత్మక ధోరణి (9౧౦౦15౧) ని ఆశయించడము - పాత్రల మానసిక సంక్షోభాలను, అవి లోనవుతున్న సంఘర్షణలను, యధాతధంగా చూపడం కోసం చైతన్యస్రవంతి విధానాన్ని (692౧2 0! 00౧౩౦1౦౮5౧655 180౧1066) ఉపయోగించు కొనడము చేశారు. కాశీభట్ల వేణుగోపాల్ ఈ ఏడాది రాసిన “గుర్రపుదెక్క” వంటి కథలు ఇందుకు ఒక ఉదాహరణ. విలక్షణమైన రీతిలో - ఇలా ఒక్కొక్కరు ఒక్కోమార్గాన్ని ఎంచుకుంటూ - మనసులోని సంఘర్షణలకు అక్షరరూపం ఇచ్చే ప్రయత్నం తెలుగుకధాసాపిత్యంలో బహుముఖంగా జరుగుతున్నది. ఈ తరహా కథల్లో అస్పష్టత (00506౧00) అనివార్యంగా ఉంటున్నది. ఒకటికి రెండుసార్లు కష్టపడి చదివితేనే గాని ఈ తరహా కధలలో చెప్పదలచిందేమిటో కూడా బోధపడదు. కధ అనేది కాలక్షేపం బరాణీ కాకూడదు అనేది ఎంతనిజమో - కథ అనేది 'కొరకరాని కొయ్య'లా మారి కధకుడికీ, పారకుడికీ మధ్యదూరం బాగా పెరిగిపోకూడదు - అనేదికూడా అంతే నిజం.ఇలా రాసినప్పుడు - [2002 08% లాంటి వాళ్ల రచనల మాటేమిటి? అని అడగవచ్చు వర్జీనియా వుల్ఫ్, జేమ్స్ జాయిస్‌ల వంటి రచయిశల రచనల్నీ మొదట్లో ఇలా విమర్శించారు చాలామంది అనిచెప్పవచ్చు. అంతేకాదు - కవిత్వంలో అనివార్యమైపోతున్న అస్పష్టత గురించి చెబుతూ 75 ల్ో నేటి ప్రపంచంలో కవిత్వం సంక్లిష్టంగా ఉండక తప్పదు. ఆధునిక నాగరికతలోని (వవైరుధ్యాలు సంక్లిష్టతలు, మనిషిపై చూపే ప్రభావం విభిన్న వరిణామాలకు దారితీస్తున్నది. దీనివల్ల కవిత్వంలో వ్యక్తమయ్యే భావాలు పలుసందర్భాల్లో డొంక తిరుగుడుగా ఉన్నట్టు అనిపించవచ్చు. కానీ, - ఈ పరిస్థితి తప్పదు -” అని వెలిబుచ్చిన అభిప్రాయం కథకు కూడా వర్తిస్తుందని వాదించవచ్చు తనకు నచ్చిన రీతిలో శ్రనక్తు నచ్చిన భావాన్ని వ్యక్తంచేసే అవకాశం ప్రతీ రచయితకు ఉంది అనికూడా అనవ చ్చు మేడ్ నమక న్ స్టో స్తాదర్తంలో చెప్పదలచిన విషయం ఒక్కటే -“రంగనాథయ్యర్ ట్ - సూటిగా, స్పష్టంగా, హృదయాలకు హత్తుకునేలా, చెప్పడానికి అవకాశం ఉన్న విషయాన్ని గందరగోళం పెట్టే రీతిలో చెప్పి - మంచికధ రాశామని అనిపించుకునే ప్రయశ్నానికి మన కధకులు దూరంగా ఉంటే చాలు, ఇది
వావ ఇలుగు కథ - నాడు,నేడు ఎంతవరకూ జరుగుతున్నదనే విషయం ఎవరికివారు ఆత్మసరీక్షతో నిర్ణయించు కొనవలసి ఉంది
6
- తెలుగు కధల పోకడల గురించి చెప్పేటప్పుడు వామపక్ష ఉద్యమ(్రభావం గురించి చర్చించకపోతే - అది అసమగ్రం అవుతుంది. ఉద్యమ నేపథ్యం తెలుగుకథకు క్రొత్తది కాదు. బడుగురైతులను, గిరిజనులను, ఒకవైపు నుండి భూస్వాములు, షావుకార్హు = మరొకవైపునుండి లంచగొండులయిన అధికార్లూ దోచుకుంటూ ఉంటే - వారిలో చైతన్యస్ఫూర్తిని, పోరాటపటిమను, పెంపొందించే ఉద్యమ నేపధ్యంగల కథలు 70ల నుండి చెప్పుకోదగ్గ సంఖ్యలోనే వస్తున్నాయి.
ఈ ఏడాది కూడ అట్లాంటి కధలు కొన్ని వచ్చాయి. అయితే గతంలో వచ్చిన కధలకు ఈ ఏడువచ్చిన కధలకు కొంత తేడా ఉంది. వీటిల్లో కొన్ని కథలు ఉద్యమ స్ఫూర్తిని పెంపొందించుకోవలసిన ఆవశ్యకతను గురించి చెప్పేవయితే, - మరికొన్ని ఉద్యమ స్వరూపాన్ని బొమ్మాబొరుసులతో మనముందు ఉంచే కథలు.
“- నిజంగా సోషలిజం ఎక్కడయినా ఉందా? నిజమైన సమసమాజం అన్నిరకాల దోపిడీ వర్జాలు నశించిన తర్వాత మాత్రమే సాధ్యం అనీ - ఈలోగా భయంకరమైన వర్గపోరాటాలు జరగక తప్పదనీ గుర్తించక, - రాని సోషలిజం వచ్చినట్టు ప్రచారం చేశాం. ఇప్పుడులేని సోషలిజం కుష్పకూలిపోయిందని క్రుంగిపోతున్నాంలి అనే ఆలోచన మరికొన్ని కథల్లో కనబడుతుంది (మహాప్రస్థానం - తోలేటి జగన్మోహనరావు).
ఇలాంటి 'ఆలోచనిల విషయం అలా ఉంచి, కధల విషయానికి వస్తే - ఈ తరహా ఇతివృత్తంతో ఈ ఏడువచ్చిన కధల్లో 'మిడ్యో రచించిన “మెట్లమీద” ప్రముఖంగా 'పేర్మానదగిన కధ.
ఈ కథలోని రవీంద్ర అనే యువకుడు నిబద్ధతతో ఉద్యమంలో పనిచేసి నాయకుడుగా ఎదిగాడు ఉద్యమంలో ఉన్న రోజుల్లోనే - తనలాగే ఉద్యమంలో ఉన్న పుష్ప అనే ఆమెను వివాహం చేసుకుని ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు. అయితే - కారణాంతరాల వలన రవీంద్ర పదిహేను సంవత్సరల ఉద్యమ జీవితాన్ని వదులుకొని భార్యతో సహా జనజీవన ్రవంతిలో కలిసిపోయాడు. నాయకుల అనుమతితోనే ఇదంతా చేశాడు. తన స్వగ్రామానికి తిరిగివచ్చి వ్యవసాయదారుడుగా ప్రశాంతజీవితం గడపాలని అతని ఉద్దేశం.
కోడూరి శ్రీరామమూర్తి 22 ఇదంతా మామూలు కథే కావచ్చు గానీ - స్వగ్రామానికి తిరిగివచ్చిన తర్వాత అతడు లోనయిన మానసిక సంఘర్షణలోనే అసలు కధ ఉంది ఈ కధలోని రవీంద్ర
- తాను ఇంతకాలం ఒక చైతన్యపూరితమైన వాతావరణంలో ఉండి ఇప్పుడు స్వగ్రామానికి తిరిగి వెళ్లినప్పుడు వెనుకబడిన భావజాలంతో ఉండే ప్రజలతో ఘర్షణకు లోనుకావాల్సి వుంటుందనుకున్నాడు దాదాపు పదిహేనేళ్ల రహస్యజీవితం గడిపి తిరిగిరావడంతో ఈ మధ్యకాలంలో అ ఊరిలో వచ్చిన మార్పుల గురించి అతడికేమి తెలియదు. తన తలిదండ్రులలో చుట్టపక్కాల, (గ్రామస్తుల ఆలోచనలలో వచ్చిన మార్చు అతడు ఎంతమాత్రమూ ఎరుగడు. అందుకే - ఆ ఊళ్లో ప్రస్ఫుటంగా కనబడుతున్న మార్చును చూసి అతడు ఆశ్చర్యపోయాడు.
ఇప్పుడు ఆ గ్రామం అంతటా ఉద్యమస్ఫూర్తి పెల్లుబుకుతున్నది. ఇకప్పుడు ఉద్యమంపట్ల ఆసక్రిలేని తన తల్లి, చెల్లెలు, ఇవాళ ఉద్యమకారులకు సహాయం చేస్తున్నారు. ఒకప్పుడు తనను ఉద్యమంలోకి చేరవద్దని హితవు చెప్పిన 'ఆశాలు' వంటివాళ్లు ఇవాళ
ఉద్యమకారులను “మనోల్లో అంటున్నారు ఒకప్పుడు తన ప్రోద్బలంతో ఉద్యమంలోకి చేరిన అయిలయ్య పోలీసుకాల్పుల్లో మరణించాడన్న బాధతో - అతడి తల్లి తనని దూషిస్తుందని రవీంద్ర అనుకొంటే - ఆమె కొదుకు త్యాగాన్ని అర్ధంచేసుకుని గర్వించగల స్థాయికి ఎదిగింది ఇది ఇలా ఉండగా, తన చెల్లెలు లలిత ఒక ఉద్యమకారుణ్ణి వివాహమాడాలని నిర్ణయించుకుంది. డిగ్రీ చదువుతున్నతన మేనకోడలు సౌజన్య ఉద్యమం కి చూపిస్తున్నది. ఈ పరిస్థితులు అతడికి ఆశ్చర్యం కలిగించడం మాత్రమే చూపి న ఉద్యమాన్ని విడిచి వచ్చినందుకు అందరూ తనని అపరాధిగా వేలెత్తి కబుర్లు పించేది. చుట్టూ ఉన్న జనం తనని క్షమించి ఊరుకున్నారో, లేక ఇన్ని ప్పి చివరకు ఇంతేనా అని నవ్వుకుంటున్నారో అతడికి తెలియదు.
ఈ పరిస్థితి అంతా అతడిలో అపరాధభావాన్ని మరింతగా రగిలిస్తూ ఉంటే - దీనికి తోడుగా మరొక సమస్య వచ్చిపడింది. తమ ఇంటికి వచ్చిన సాటి ఉద్యమకారులకు తిండి పెట్టవద్దని అతడు తల్లికి చెప్పగలడా? - ఉద్యమంలో చేరమని ఎందరికో స్ఫూర్తిని ఇచ్చిన తాను తన మేనకోదలిక్రి ఉద్యమం మంచిది కాదని చెప్పగలడా? తాను ఉద్యమంలోంచి బయటకు రావడానికి కారణం సిద్ధాంతపరమైన వైరుధ్యాలా? - వ్యక్తిగత కారణాలా? - స్వార్థమా? జా నిరాశావాదమా?- ఏ ప్రశ్చకూ - అతడికి సమాధానం దొరకదు.
“- పార్టీ మంచిది కాదు రాజ్యం మారదు” అని చెబితే ఆది ఆత్మద్రోహం అవుతుంది “-పార్టీ మంచిదే. రాజ్యం ఏనాటికయినా ఖచ్చితంగా మారుతుంది"
మై తెలుగు కథ - నాడు,నేడు అనిగాని అంటే, - మరి నువ్వు పార్టీ నుంచి ఎందుకు వచ్చావు? అనే ప్రశ్న ఎదురవుతుంది. అందుకే -మేడమీద గదిలో తన కుటుంబసభ్యుల మధ్యవేడిగా చర్చ జరుగుతూ ఉంటే - సలహా చెబుదామని మేడమీదకి వెళ్లబోయి, - మెట్లు ఎక్కలేక దిగలేక, మధ్యలో ఆగిపోయాడు ఈ కధలో రవీంద్ర పాత్రచిత్రణను రచయిత నిర్వహించిన తీరు ప్రశంసనీయంగా ఉన్నదిగానీ - ఈ కధలోని రవీంద్ర దంపతులు ఉద్యమంనుండి బయటకు రావడానికి గల కారణం విషయంలో స్పష్టతలేదు. ఒక నిబద్ధతతో ఉద్యమంలోనికి వెళ్లినవారు ఆ నిబద్ధత కోల్పోనప్పటికీ ఉద్యమం నుండి తిరిగి వచ్చారంటే, - (ఆరోగ్యపరమైన కారణాలు లేనప్పుడు) అందులో వున్నది స్వపప్రయోజనం మాత్రమే అవుతుంది. ఉద్యమ నేపధ్యం గురించి ప్రస్తావించుకునే ఈ సందర్భంలో ఎ. అప్పలనాయుడు రచించిన “యజ్ఞం తర్వాత” కధను కూడా పేర్కొనవలసి ఉన్నది. కాళీపట్నం రామారావు గారి ప్రసిద్ధ కధ “యజ్ఞం” 1966లో ప్రచురితమైన మూడున్నర దశాబ్దాల తర్వాత - ఆ కథకు కొనసాగింపుగా దీనిని అప్పలనాయుడు వ్రాశారు. (ఇంతకుముందు ఇదే పేరుతో 1996లో చందు సుబ్బారావుగారు 'యజ్ఞం” తర్వాతి కథను రాశారు. కాళీపట్నం వారు “యజ్ఞం” కధను వ్రాసిన తర్వాత - దేశ ఆర్థిక రాజకీయ పరిస్థితుల్లో చాలామార్చులు వచ్చాయి. మరింత విస్తృతస్థాయిలో, విభిన్నరూపాలలో దోపిడీ కొనసాగుతున్నది. ఒకప్పుడు సిద్ధాంతాలు ఉదాత్తమైనవి అయినా - వాటిని అమలుచెయ్యడంలోని లోపాలవల్ల, పొరబాట్లవల్ల, బలహీనులకు అన్యాయం జరిగేది. జాతీయస్థాయిలో జవహర్లాల్నెహ్రూలాంటివాళ్లు, (గ్రామస్థాయిలో శ్రీరాములు నాయుడులాంటివాళ్లు పొందిన వైఫల్యాలకు ఇదేకారణం. కాని, - ఇప్పటి పరిస్థితి అది కాదు. సిద్ధాంతాల రూపకల్పనలోనే దుర్మార్గం ఉన్నది. “60ల నాటి కా.రా.గారి కధ (యజ్ఞం) “శ్రీరాములు నాయుడు హిపోక్రాటా?
- అమాయకుడా?”అనే సందేహాన్ని పూర్తిగా తీర్చదు. కాని, - అప్పలనాయుడు కధ శ్రీరాములునాయుడును “వెర్రిపీరు” అని తేల్చడమే కాకుండా అటు శ్రీరాములునాయుడు, ఇటు అప్ప(లాముడు, పొరబాటు పడడానికి గల కారణాలను చెబుతుంది. “- శ్రీరాములు నాయుడు ఆర్థికాతీత రాజకీయ శక్తులుంటాయనుకున్నాడు. అప్పల్రాముడు రాజకీయాతీత జీవితం ఉంటుందనుకున్నాడు. ఇద్దరివీ రెండుపక్షాలకు చెందిన అమాయకజీవితాలు-” అంటూ రచయిత (యజ్ఞం తర్వాతి కథలో-)
కోడూరి శ్రీరామమూర్తి ౨2 సీతారాముడి చేత చెప్పించడం గుర్తుంచుకోదగింది. నిజానికి - ఒకనాటి “యజ్ఞం” కధకు సంబంధించిన కీలకమైన అంశం ఉత్పన్నం కావడానికి కారణం ఇదే - అప్పల్నాయుడి కథలో కాళీపట్నంవారి కధలో ఉన్న ప్రధానపాత్రలు అవే పేర్లతో కొనసాగినప్పటికీ - ఆ తర్వాతికాలంలో ఉద్యమ(ప్రభావంవలన వచ్చిన మార్చులు, జాతీయ అంతర్జాతీయ ఆర్థికవిధానాల (ప్రభావాలు, వీటినన్నింటినీ కలుపుకుంటూ క్రొత్తప్రపంచపు క్రొత్తకథగా చెప్పడానికి ప్రయత్నం జరిగింది
“యజ్ఞం తర్వాత” కథలో సీతారాముడు ఉద్యమంలో చేరి లక్షంనాయుజ్జి చంపినా
- శివన్నారాయణలాంటి అవకాశవాదులు తమ స్వలాభసాధన యజ్ఞాన్ని నిర్వఘ్నంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఐడుగుజీవులు సమిధలుగా మిగిలిపోతూనే ఉన్నారు.
సీకారాముడ్డి పోలీసులు నిర్జాక్ష్య్య్యంగా చంపిన తర్వాత అతడి జ్ఞాపకార్థం నిర్మించిన స్థూపాన్ని కూడా ఉద్యమకారులు నిలబెట్టుకోలేకపోయారు ఈ కధలో నారాయణమూర్తి మేష్టారు చినఅప్పల్రాముడితో అన్నట్టు “-ఒకప్పుడేమోగాని, అవతలివారి సామ్రాజ్యం ఇప్పుడు చెక్కుచెదరలేదు. మీరు ఊరిలో మిల్లుకూలిస్తే సూర్యంబాబు పిల్లలు పట్నంలో
ఫ్యాక్టరీ పెట్టుకోగలిగారు కిడ్నాప్ జరిగాకనే శివన్నారాయణ మండలస్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాడు- ఈ మాటల్లో కొంత నీరాశ ఉన్నప్పటికీ నిజం మాత్రం లేకపోలేదు,
నారాయణమూర్తి మేష్టారు ఈ కథలో ఒకనాటి (“యజ్ఞం” కథాకాలంనాటి) పరిస్థితులనూ, శనాట్రి పరిస్థితులనూ సరిపోలుస్తూ చినఅప్పల్రాముడితో “-అప్పట్లో రాజ్యం తన సైనికపాత్రను పెద్దలకు ఇచ్చింది. ఆర్థికంగా బలంగా రాజ్యం ఉండేది. ఆ తర్వాత అటుదిటు అయింది . రాజ్యం ఇప్పుడు ప్రయివేటు రుణాలపై (బ్రతుకుతోంది-” అంటూ చేసిన విశ్లేషణ గుర్తుంచుకోదగ్గది.
“యజ్ఞం తర్వాత' కథలో నారాయణమూర్తి మాష్టారి ఉపన్యాసమే కీలకమైంది. కథ మొత్తం కథకుడు చెప్పదలచిందంతా అందులో ఇమిడిఉంది. ఇలా - మొత్తం కథ అంతా ఒక సుదీర్ధ ఉపన్యాసం మీద ఆధారపడి ఉందడమూ, సన్నివేశకల్పన బలహీనంగా ఉండడమూ, ఈ కారణాలచేత కథాశిల్పం పటిష్టంగా ఉన్నట్లు అనిపించలేదు.
నిజానికి - కా.రా గారి కథలో కూడా ఇలాంటి సుద్ర్హ ఉపన్యాసమే ఉంది. ఈ
- కధ పంచాయితీ మండపంలో తీర్చుకు వచ్చిన ఒక వివాదస్పద అంశంపై ఆధారపడింది. పంచాయితీ మండపం దగ్గిర జరిగిన - గగుర్పాటు కలిగించే సంఘటన కథలో అత్యంత కీలకమైంది. కధలో ఎందరు ఎన్ని ఉపన్యాసాలు చేసినా కేంద్రబిందువు
222 తెలుగు కథ - నాడు,నేడు మాత్రం పంచాయితీ మండపం వద్దనే ఉంది. అందుచేతనే కా.రా.గారి కథ పరనీయతను కోల్పోలేదు సుదీర్చ ఉపన్యాసాలు కధాళిల్పానికి భంగం కలిగించలేదు. అలాకాకుండా - ఉపన్యాసాల మీద ఆధారపడి అప్పల్నాయుడు కథను కల్పించడంతో - కధ కేవలం ఒక మంచి వ్యాసంతో మిగిలిపోయిందని నా అభిప్రాయం. ఈ సందర్భంలోనే మరొక విషయాన్ని గురించి కూడా చెప్పక తప్పదు. ఈ కథలో మద్టీ నేషనల్స్ గురించి, సరళీకృత ఆర్థికవిధానాల గురించి, రచయిత సందర్భోచితంగా ప్రస్తావించినప్పటికీ - ఈనాడు జరుగుతున్న ఆ క్రొత్త యజ్ఞానికి మరికొంత ప్రాధాన్యతను ఇచ్చి (కధలో సంఘటనల పరంగా) కధను నడిపితే మరింత సమగ్రంగా యజ్ఞం తర్వాతి పరిస్థితులను పారకుల ముందు వుంచేందుకు అవకాశం కలిగేది. ఈ విషయాలకు సంబంధించిన చర్చ ఎలా ఉన్నప్పటికీ - అప్పల్నాయుడు చేసిన ప్రయత్నం అభినందనీయం ౯
- ఎప్పటివలెనే వ్యవసాయరంగానికి, గ్రామీణ జీవితానికి, సంబంధించిన సమస్యలను - పట్టణాలకు పొట్ట చేత్తో పట్టుకుని వలసపోతున్న గ్రామీణుల వ్యధలను
- వెరశి దారిద్ర్య సమస్యను, బహుముఖంగా ఆవిష్కరించే కథలు ఈ ఏడు కూడా ఎక్కువ సంఖ్యలోనే వచ్చాయి. వీటిల్లో గంటేడ గౌరునాయుడు “ఒక దృశ్యం రెండు స్వప్నాలు", “మరో కిసాన్” (శ్రీధర దేశపాందే), అన్నదాతా దుఃఖీభవ (ఎం.వి. రామిరెడ్డి), నెర్లు (చిలుకూరు దేవపుత్ర), దృశ్యభీభత్సం (సింహట్రసాద్), వాన (దాసరి రామ చంద్రరావు) వలస (ఇమానుల్లా), వంటి కధలు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అతివృష్టి - అనావృష్టి - నకిలీ విత్తనాల అమ్మకం - పనిచెయ్యని పురుగుల మందులు - పండిన పంటకు గిట్టుబాటు ధర పలకకపోవడం - మొదలయినవి చిరకాలంగా మనదేశంలోని బడుగురైతులను వేధిస్తున్న సమస్యలు. కాలానుగుణంగా ఈ సమస్యల స్వరూపాల్లో మార్పు రావచ్చునేమోగాని, - వాటివలన రైతుకు కలుగుతున్న బాధ మాత్రం అలాగే ఉంది అందుకే అనిపిస్తుంది - ఇవి పాతఠబడని పాతకథలని 1 అంతేకాదు - ఆవేదన అనేది ఉన్నంతకాలం అది అక్షరరూపంలో అభివ్యక్తం కావలసిన అవసరమూ ఉంటుంది. ఇది రాస్తూంటే [69 ౧౫15620169 (లేమిజర్ బ్లె) నవల ముందుమాటలో విక్టర్ హ్యూగో రాసింది జ్ఞాపకం వచ్చింది. దారిద్ర్యం అనేది మనిషిని దిగజారుస్తున్నంత
మష్ర్త్రైదనడడనద2222ఊచఊఊఊడడవ22222 కోడూరి శ్రరామమూర్తి ౨౭2 కాలం ఇలాంటి నవలల అవసరం ఉంటుందంటాదడతడు. వ్యవసాయ సమస్యలకు, పేదరిక సమస్యకు, ఇతివృత్తాలలో చోటు కల్పిస్తూ వచ్చే కధల విషయంలో కూడా ఈ అభిప్రాయం వర్తిస్తుంది.
“-ఈ పత్తుల ధరలు ఎక్మిచ్చేటోరు, దించోటోరు, ఎవరో - దాని కధేందో రైతులకు తెల్వది. వాల్లకి తెల్సింది ఒక్కటే- పంట వస్తే ధర పల్మదు. పంటరానప్పుడు ధర పల్ముతది ఆఖరికొచ్చేటాల్లకు బాకీతేల్తరు-” (మరోకిసాన్' కధలో-) అని ఒకరైతు ఆవేదన చెందినా.
“-ఏళ్ల తరబడి మా బతుకులు ఇత్తనాల దగ్గిరే బుగ్గిపాలైపోతున్నాయి. ఎవర్ని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అంళుబట్టకుండా తయారైంది-” అని మరో రైతు వ్యథ చెందినా (అన్నదాతా దుఃఖీభవి కధలో-)
'ప్రాంతమేదయినా, గాథలన్నీ ఒక్కటీ ! -
“'దృశ్యభీభత్సం' (సింహప్రసాద్) కథలో గాంధీగారిలాగా వున్న ఒక రైతును పట్టుకునేందుకు - యుద్ధప్రాతిపదిక మీద పోలీసులు, సైనికులు, ప్రయత్నం చెయ్యగా చివరకు ఒక (ప్రత్తిపాలంలో అతడు చచ్చిపడి ఉన్నట్టు కనుగొంటారు. “అమ్మయ్య - చచ్చాడు. మనం బ్రకికాం అనుకుంటారు ! నిజమే మరి - సాక్షాత్తూ ప్రధానమంత్రి ఉపన్యానం ఇస్తున్నప్పుడు మధ్యలో చొరబడితే ఉపేక్షించి ఊరుకొనడం ఎలా కుదురుళుంది? - ఆమాళ్యులకు, అధికారులకు, ఎప్పుడో చనిపోయిన గాంధీలాంటి రైతు దర్శనమివ్వటం కంటే 'దృశ్యభీభత్సం” మరొకటి ఏముంది? - ఆసక్తికరమైన కథనం ఉన్న కథ ఇది
వ్యవసాయం గిట్టుబాటు కాని వ్యాపకం కావటంతో బీదరైతులు (బ్రతుకుతెరువు వెదుక్కుంటూ పట్నాలకు తరలివెళ్లడం అతిసామాన్యమైన విషయం అయిపోయింది. పట్నాలలో ఉండే ధనికులు వ్యవసాయాన్నాక కార్పొరేట్ వ్యాపారంగా భావించి, పెద్దపెద్ద పెట్టుబడులతో పల్లెటూళ్లల్లో వ్యవసాయం చేయిస్తూ ఉంటే - మట్టిని నమ్ముకుని ఇన్నాళ్లూ ట్రతికిన రైతులు భూములు అమ్ముకుని వలసపోవలసిన పరిస్థితి దాపురిస్తున్నది. భూమి తల్లిని వదిలివెళ్లాలంటే మనసురాదు. అయినా, - పొట్టగడవడం కోసం పట్నానికి తరలి వెళ్లక తప్పదు. ఈ పరిస్థితిలో ఒక బడుగురైతు గుండెల్లో చెలరేగిన సంఘర్షణకు అద్దం పడుతుంది. -*ఒక్ర దృశ్యం, రెండు స్వప్నాలు” కథ. అట్లాంటి పరిస్థితుల్లో అపరాధభావం ఫలితంగా వచ్చే [14010240౧9 ను రచయిత ఈ కథలో చక్కగా
ఆవిష్కరించారు,
22 తెలుగు కథ - నాడు,నేడు వ్యవసాయం చెయ్యలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు - కరువు బాధతట్టుకోలేక రైతులు పట్నాలకు వలసవెళ్లినా దారిద్ర్యం వారిని వదిలిపెట్టదు. (గ్రామీణ దారిద్ర్యం (౧4|| ౯0౪౭౧౧ కు, పట్టణ దారిద్ర్యం (౮౧౬౧ ౯౧౦0౪౭౧0) కు, కారణాలు వేరయినా వాటి ఫలితాలు మాత్రం ఒక్కటే. ఇట్లాంటి దారిద్రపు వికృతస్వరూపాన్ని చూపుతూ ఈ ఏడువచ్చిన కధల్లో గిట్టుబాటు (వల్లూరు శివప్రసాద్), పెట్టుబడి (నెల్లూరి భాస్మరరావు), దిష్టి (శ్రీకంర స్ఫూర్తి), తిరస్కృతి (వి. సికిందర్) మొదలయిన కథలు ఎన్నీ ఉన్నాయి.
ఈ కధలు చదివినప్పుడు ఈ దేశంలో పేదవారు పల్లెటూళ్లో వుంటేనేం, పట్నంలో వుంటేనేం, - పెద్దలు, పిల్లలు, ఎవరయినా సరే దారిద్ర్యపు రాచపుండుకు బలికాక తప్పదు అనే కరోరసత్యం గుండెలకు హత్తుకునేలా సాక్షాత్మరిస్తుంది
8
భారతీయులకు "సెంటిమెంటాలిటీ” కొదవలేదు. వ్యక్తులపరంగా, వస్తుపరంగా, మనకు అనేకానేక సెంటిమెంట్లు వుంటాయి. దీనికి కథల్లో చోటుదొరకడర క్రొత్తకాదు. అయితే- హేతుజ్ఞానంతో ఆలోచించగలిగిన రోజున సెంటిమెంట్లకే కాదు - అనేక మూఢనమ్మకాలకు కూడా దూరం కాగలుగుతాం,
ఈ సందర్భంలో - మధురాంతకం నరేంద్ర “అస్తిత్వానికి అటూఇటూ” కథను ప్రస్తావించుకోవలసి ఉంది.
ఆత్మీయులు చనిపోయిన తర్వాత వారి ఆస్తికలను సంగమంలో కలిపితే చనిపోయిన వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయనేది హిందువుల సెంటిమెంట్ అయితే, - నిమజ్జనం పేరిట అక్కడ జరిగే వ్యాపారాన్ని గమనించినపుడు ఇది మతపరమైన పవిత్రకార్యమా?
- చనిపోయిన వారిపై జరిగే వ్యాపారమా? - అనే సందేహం కలగక తప్పదు. ఈ నేపథ్యంలో - తన తల్లి అస్తికలను కలపడానికి పవిత్ర సంగమస్థలానికి వెళ్లిన ఒక యువకుడికి ఎదురయిన అనుభవాలను, అతడిలో కలిగిన భావ సంఘర్షణను , - కథగా మలిచాడు రచయిత.
ఏ అనుభవం, ఏ అనుభూతి, నిజం ? - ఏది సత్యం? ఏదసత్యం ? - మనిషి అస్తిత్వానికి మూలం ఏది? - అనే ఆలోచనలను (-ఒక మతపరమైన సెంటిమెంట్ నేపథ్యంలో-) మనలో (డ్రేరేపించే కధ ఇది.
ఈ ఆలోచన ఫలితంగా ఒక్కొక్కరికి లభించే సమాధానం ఒక్కొక్క విధంగా ఉండవచ్చును. కానీ, - ఒక ముసలిడొక్కు ఆవును అనేకమందికి అమ్మి - మళ్లీ
మాష్యత్రద22దదననననడనననఒవనడ22222 22 కోడూరి శ్రరామమూళ్తి ౨22 దానం స్వీకరించి, కొద్దిసేపటి వ్యవధిలో ఒక ముసలి ఆవుద్వారా ఎంతోమంది పరలోకవాసులకు అతివేగంగా పుణ్యం బట్వాడా చెయ్యడంలోని వ్యాపారాన్ని - నిమజ్జనంలో విసిరేసిన కుండల్లోని నాజీల కోసం ప్రాణాలకు తెగించి, గంగలో ఈతకొట్టే వాళ్ల దారిద్ర్యాన్ని మాత్రం మరిచిపోలేం - చక్కని కధాశిల్పమున్న కధ ఇది.
(శ్రావజ్కుమార్ “యూధనేషియా” కధ 'మెర్సీ కిల్లింగ్ గురించి చెబుతుంది. మనకు ఆత్మీయులు ఎవరయినా కుదరదని తెలిసిన జబ్బుతో బాధపడుతూ ఉంటే - వారి బాధ తగ్గించడానికి ఏమీ చెయ్యలేకపోతున్నామని బాధపడతామేగాని, - ఆ జీవికి ఇంతటి బాధను ఇలా ఎంతకాలం కలిగించాలనే విషయం ఆలోచించం ఒకవేళ ఎవరయినా అలా ఆలోచించినా వారిని పహృదయంలేనివారుగానో, అవతలి వాళ్ళ బరువు వదిలించు కోడానికే ఇలా చేశారనో, మాత్రమే అనుకుంటాం. సెంటిమెంటల్‌గా ఆలోచిస్తే ఇది సమర్థనీయమే కావచ్చు. కాని, - హేతుబద్ధంగా ఆలోచిస్తే దొరికే సమాధానం మరోలా ఉంటుంది. తండ్రిపట్ల ఎంతో ప్రేమవున్నా, - దానిని మనసులోనే చంపుకుని, తండ్రిని బాధావిముక్తుజ్జి చేయడం కోసం 'మెర్సీకిల్లింగ్' చేసిన డాక్టర్ కొడుకు కథ ఇది.
ఈ విషయం అలా ఉంచి, - ఈ సందర్భంలోనే మరొక అంశం ప్రస్తావించవలసి ఉంది. తల్లిదంద్రులకు వృద్ధాప్యంలో తిండిపెట్టక చంపేవాళ్లు, మానసిక వ్యధకు గురిచేసి చచ్చిపోయేలా చేసేవాళ్లు కూడా ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు. వాళ్ళందరూ 'యూధనేషియా కధలోని కొడుకులాంటివాళ్లే అనుకుంటే అంతకన్నా ఘోరమైన విషయం మరొక్రట్రి ఉండదు,
ఇటీపలి కాలంలో వృద్ధుల మానసిక వ్యధలను, పిల్లల (ప్రేమాభిమానాలు నోచుకోని తల్లిదంద్రుల ఆవేదనలను, చెప్పే కథలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ తరహా ఇతివృత్తాలతో ఈ ఏదాదినా దృష్టిలోనికి వచ్చిన కథలు అరవైకి పైగా ఉన్నాయి. ఒక పత్రిక “రిటై్మ్మైంట్ కథలు” అనే పేరుతో వృద్ధాష్యంలో అడుగుపెట్టినవారి ఆలోచనాసరళిని చెప్పే కథలను ధారావాహికంగా (ప్రచురించింది కూడా. మెటీరియలిస్ట్ ధోరణులు పెచ్చుపెరిగిపోతున్న
ఈ కాలంలో వృద్ధుల సమస్య ఎంత ముఖ్యమైందో తెలియచెప్పేందుకు ఈ కధలెంతగానో ఉపకరిస్తాయి.
దాదాపు ఈ కధలన్నింటిలోనూ పిల్లల ప్రవర్తనకు విసిగిపోయి వృద్ధా శ్రమాలే
శరణ్యం అనే స్థితికి వృద్ధులు రావడం జరుగుతున్నది ఈ పరిస్థితి ఆర్ధికంగా పిల్లలపై ఆధారపడిన తల్లిదండ్రుల విషయంలోనే కాదు - ఆర్థికస్తోమత వున్న తల్లిదండ్రుల
22 తెలుగు కథ - నాడు,నేడు విషయంలో కూడా ఉన్నదని కధకులు గమనించడం ప్రత్యేకించి పేర్ళొనదగ్ధ విషయం. పిల్లలతో విసిగిపోయిన తల్లిదండ్రులు తమ ఆస్తిని వృద్ధాశ్రమాలకు రాసిఇచ్చిన సందర్భాలు కూడా చాలాకధల్లో కనబడుతున్నవి.
ఇక, - పిల్లల ఇళ్ళల్లో ఉండలేని తల్లిదండ్రులందరూ ఒక సహకార సంఘంగా ఏర్పడి వృద్ధా శ్రమాన్ని నిర్వహించుకొనడము, - పిల్లల దగ్గిరుండి అవమానాలు భరించలేక
- భార్యలేని పురుషుడు, భర్తలేని స్త్రీ, వృద్ధావ్యంలో పరస్పర అవసరార్థం వివాహం చేసుకొనడము - మరికొన్ని కధల్లో చూడవచ్చు.
“- మానాన్న బ్రతికితీరాలి దాక్టర్. ఈ నెలాఖరున ఇన్‌కంటాక్స్ రిటర్బ్పెట్టాలట. పేషెంట్‌కి పెద్దజబ్బు అయితే ఇన్‌కంటాక్స్ రాయితీ ఉంటుంది +” (విషాదవాయులీనం
- ఎస్.కె. సుధాకర్) అనే పిల్లలు ఈ ప్రపంచంలో ఎక్కువమందే ఉండవచ్చు. కాని, - మొత్తం మీద పిల్లల్ని “విలన్లుగా మాత్రమే చిత్రించే ఈ విధమైన కథలవలన కుటుంబ సంబంధాలపైన అవాంఛనీయమైన (ప్రభావంపడుతుందనే విషయాన్ని కూడా గమనించవలసి ఉంది. ఈ ఏడాది వచ్చిన ఓ కథలో ఒక తండ్రి - పిల్లలు ఎలానూ తనని వృద్ధాప్యంలో చూడరు కాబట్టి వాళ్లకు చదువు చెప్పించడం మానేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తాడు ! - ఇది ఎంత అవాంఛనీయమైన విషయమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు - ఒక కధకుడు ఒక కధలో అన్నట్టు “- వాళ్లు మనల్ని చూడాలనే ఆశతో పెంచొద్దు నది నలుగురి దప్పికను తీర్చడానికి, భూముల్ని సస్యశ్యామలంగా పండించదానికి 'ప్రయత్నిస్తుందే తప్పు, తన నీళ్లు తానెప్పుడూ త్రాగదు -” (నది శ్రాగని నీళ్లు -ప్రసాద్ తోట) ఈ సత్యాన్ని గమనించడం తప్పనిసరి.
ఈ ఏడాది అధికసంఖ్యలో వచ్చిన ఈ తరవో కథల్లో సగటు కథలు, అంతకన్నా బాగా తక్కువస్థాయి ఉన్న కధలు ఎక్కువగా ఉన్నాయి. అయితే - కొన్ని బాగున్న కథలు కూడా లేకపోలేదు.
కె. రామలక్ష్మి “అద్దంొ, ఆరె సీతారామయ్య “అపచారం” ఈ సందర్భంలో శుర్మొనవలసిన కధలు.
ఒక వృద్ధురాలి గుండెల్లోని ఆవేదనను అద్భుతంగా మనముందు ఉంచుతుంది రచయిత్రి “అద్దం” కథలో -
ఈ కధలోని వృద్ధురాలు లక్ష్మి అద్దంలో తన ముఖాన్ని రోజుకు చాలాసార్లు చూసుకుంటూ వుంటుంది. ఆమె గడిపే ఏకాకి జీవితంలో ఆమెకు అదొక్కటే ఆనందం కలిగించే విషయం. అద్దంలో ఆమెకు ముడతలు పడిన తన ముసలిముఖం కనబడదు.
మవర్వ్తంద22డనడడడడచడడదనద22222వవ2 కోడూరి శ్రరామమూర్తి ౨22 దయనీయమైన ఆమె ప్రస్తుత జీవితం కనబడదు. గతంలోని మధురమైన జీవితం మాత్రమే కనబడుతుంది.
“- ముసలిదానికి మరో పనిలేదండీ. ఆ డొక్కుమొహం రోజుకు పదిసార్లయినా అద్దంలో చూసుకుంటుంది” అంటుంది కోడలు -దానికి అదో పిచ్చి" అంటాడు కొడుకు. కాని, అందులో ఆమె పొందే ఆనందపు రహస్యం ఎవరికీ తెలియదు. అక్ట్లోదు.
ఒక క్రొత్త సంవత్సరం ప్రారంభమైన రోజున, ఆ వృద్ధురాలి డొక్కు అద్దం క్రిందపడి ముక్కలయిపోయింది. అయినా, - ఆ ముక్కలన్నింటిలోనూ తన ముఖం మరింత పరిపూర్ణంగా కనబడుతూ ఉంటే - ఆ అద్దం ముక్కల్లో తన ముఖం తాను చూసుకుంటూ చివరకు తుదిశ్వాస విడిచింది. ముసిల్ది చచ్చిపోవడం వలన ఫేమిలీ పెన్నన్గా ఆమెకు
వచ్చే డబ్బు ఆగిపోయిందని బాధపడతాడు కొడుకు హృదయాన్ని ద్రవింపచేసే రీతిలో ఈ కథను చెబుతారు రచయిత్రి,
- ఆరె సీతారామయ్యగారి “అపచారంి కధలో ఇలాంటి 'విలనీ' లేకపోవచ్చు. ఒక తల్లి ఇంతటి దయనీయస్థితిలో లేకపోవచ్చు. కాని, - పిల్లలు తమకు తెలియకుండానే తల్లులకు చేసే 'అపచారం' ఉంది
అమెరికాలో కూతురు, అల్లుడు ఉద్యోగాల్లో ఉంటే - కూతురుకు పురుడు వచ్చి బిద్దను'కంటే - ఆ బిడ్డకు కాస్త వయస్సు వచ్చేదాకా సంరక్షణ చేయాల్సిన బాధ్యతను తల్లికి అప్పచెబుతుంది కూతురు. అమెరికాలో ఎంతమంది కూతుళ్లు వుంటే అన్నిసార్లు పురుళ్ళు పుజ్యాలకు తల్లులు బలవంతపు అమెరికాయాత్రలు చెయ్యక తప్పదు.
కూతురు తల్లిని అమెరికా చూపించటం కోసం తీసుకువస్తే మంచిదే - కాని, చౌకిరీ చెయ్యడం కోసం తీసుకురావడం మాత్రం వాంఛనీయమైన విషయం కాదు - అని చెబుతాడు రచయిత ఈ కధలో. అంతేగాదు - విమానం ఖర్చులు ఇచ్చి అమెరికన్లు మెక్సికో నుంచి కూలీలను తెచ్చుకోడానికీ, ఇండియా నుండి కూతుళ్లు తల్లుల్ని తెచ్చుకోడానికీ, వున్న తేడా ఏమిటని (ప్రశ్నిస్తాడు. “- ఆమె (ఒక తల్లి) రావడానికి కారణం (పేమకావచ్చు. కాని, ఆమెను తీసుకురావడానికి కారణం మాత్రం ప్రేమకాదు-ా అనే నిఖార్సయిన నిజాన్ని కథకుడు ఈ కధలో నిర్మాహమాటంగా చెబుతాడు. ఇలాంటి పరిస్థితి భారతీయ కుటుంబాల విషయంలోనే కాదు - ఒక అమెరికన్ కుటుంబంలో కూడా ఉన్న తీరును చెప్పడం వలన కధకు మరింత సమగ్రత చేకూరింది.
పిల్లలు తల్లిదండ్రులకు చేసే “అపచారం” తెలిసి జరగవచ్చు. - తెలియకా జరగవచ్చు. కాని, ఫలితం మాత్రం ఒక్కటే అని చెప్పే కధ ఇది ఈ తరహా దృక్చథంతో
- ఇంతటి విశాల నేపథ్యంతో తెలుగులో వచ్చిన కధలు తక్కువ.
3 తెలుగు కథ - నాడు,నేడు
- తల్లిదండ్రులకూ, పిల్లలకు మధ్యగల సంబంధాన్ని కథకులు తమ కథల్లో ఈ ఏడు చిత్రించిన తీరుగురించి చర్చించేటప్పుడు తరాల అంతరాలకు (66౧691410౧ (120) సంబంధించిన విషయాన్ని కూడా విశ్లేషించవలసి ఉంది వెనుకటితరం వారికీ, క్రొత్తతరం వారికీ, ఆలోచనలలో తేడా ఉండడం అత్యంత సహజమైన విషయం. అయితే - ఈ తేడా అన్నది క్రొత్తతరంలో వస్తున్న అభ్యుదయ భావాలకు సూచికగా ఉంటే అంతకన్నా ఆనందించదగ్గ విషయం మరొకటి ఉండదు. కాని, - వెనుకటితరం వారిలో ఉండే పురోగామిధోరణి, మానవతాదృష్టి, ఆ తర్వాతితరం వారిలో కనబడకపోవడం కంటే విషాదం మరొకటి వుండదు. ఈ చేదునిజాన్ని తెలిపే కధలు కూడా ఈ ఏడు వచ్చాయి. వాటిల్లో “మిలీనియం సంబంధం” (కాలువ మల్లయ్య), “సిగ్గుపడుతున్నా? (యస్. జితిన్‌కుమార్) పేరొనదగ్గవి. తక్కువ కట్నం పుచ్చుకుని మేనకోడల్ని కోడలిగా చేసుకోడానికి పెళ్లి కొడుకు తండ్రి ఒప్పుకున్నా - పై సంబంధం చేసుకున్న అక్కకి ఎక్కువ కట్నం ఇచ్చారు కాబట్టి,
- తనకూ ఎక్కువ కట్నం ఇచ్చి తీరవలసిందే అని పట్టుపట్టిన అమ్మాయి ఆలోచనాసరళి “విలినీయం సంబంధం” కధలో కనబడుతుంది. ఈ అమ్మాయి ఆలోచనలు ఇలా ఉంటే - ఈ అమ్మాయి చెల్లెలు మరొక “ముందడుగు” వేసింది ! - అమెరికాలో ఎక్కువ డబ్బువచ్చే వ్యాపకం దొరికితే - శీలం గురించిన ఆలోచన ఎందుకంటుందామె ! - నీతి, శీలం, మానవత్వం అనేవి కేవలం వెనుకటితరానికి మాత్రమే చెందిన ఆలోచనలా? - క్రొత్తతరం వారికి డబ్బుసంపాదన తప్ప మరొక ఆలోచనలేదా? అనే ప్రశ్నను ఆందోళన కలిగించే రీతిలో మనముందు వుంచే కథ ఇది- “నిగ్గుపడుతున్నా-” కధలో కూడా వివావోనికి సంబంధించిన విషయమే ఉన్నది. చాలాకాలం క్రితమే ఎంతో ఉదాత్తమైన ఆశయాలతో కట్పకానుకల ్రసక్తిలేకుండా, ఎలాంటి ఆర్భాటాలు, అనవసర ఖర్చులు లేకుండా పెళ్లిచేసుకుని "సెభాష్ అనిపించుకున్న తల్లిదండ్రులు - తమ పిల్లల పెళ్ళిళ్లను అన్నిరకాల ఆర్భాటాలతో క్రొత్తతరంవారి కోరికల మేరకు చేయాల్సి వచ్చిన ఉదంతం ఉంది. ఇలాంటి పరిస్థితిలో - ఆ తల్లిదండ్రులు “సిగ్గుపడుతున్నామని అనుకోవడం కంటే చేసేది ఏముంది? - ఇక, తరాలు మారుతున్న కొద్దీ మనుషుల ఆలోచనల్లో ధనసంపాదన చింతన ఎలా పెరుగుతున్నదో - సుంకోజు దేవేంద్రాచారి “నీడ” కథలో కూడా కనబడుతుంది. ఈ కధలో కధకుడు మనకు మూడుతరాల వారిని పరిచయం చేస్తాడు. మొదటి
కోడూరి శ్రరామమూర్తి ము తరానికి చెందిన రామిరెడ్డి నేలతల్లిని నమ్ముకున్నాడు. తనలాగే తన కొడుకు కూడా వ్యవసాయదారుడు కావాలనుకున్నాడు. కాని, - మట్టిపిసికే పనిచెయ్యలేనని కొడుకు, తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా కొంతభూమిని అమ్మించాడు ఆ దబ్బుతో కోళ్లఫారం పెట్టాడు. ఫైనాన్స్ వ్యాపారం చేశాడు. తండ్రి తాతలకాలం నాటి ఇల్లుపడగొట్టి ఆధునిక వసతులతో బంగాళా కట్టాడు. ఇక - అతడి కొడుకుకు ఈ కోళ్లఫారం, పల్లెటూరి మేడ వెగటు అనిపించాయి. పల్లెటూళ్లో ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మి ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఏ తరంవారూ అంతకుముందు తరంవారి ఆలోచనలను లక్ష్యపెట్టలేదు. వాళ్ల కళ్లదుట కనబడుతున్నదీ వారు కోరుకున్నద్రీ “రూపాయి మాత్రమే !-
- నేటి ప్రపంచంలో నిరంతర అన్వేషణ దీని కొరకే కదా ! - రి తెలుగులో మంచి హాస్యకథలు రాసిన కథకులు పేర్లు చెప్పమంటే - ముని మాణిక్యం, భమిడిపాటి, ముళ్లపూడి ఇలాంటి కొన్నికేర్లు మాత్రమే మనోవీధిలో మెదలుతాయి. మిగతా తరహా కథలతో పోల్చిచూస్తే - తెలుగులో మంచి హాస్యకథలు ఎప్పుడూ తక్కువే -
ఈ ఏడు వచ్చిన కధలను సమీక్షించేటప్పుడు కూడా అదేవిషయం మళ్లీ చెప్పవలసి ఉంటుంది అలా అని - హాస్యకథలు ఈ ఏడురాలేదని అర్ధం కాదు సంఖ్యాపరంగా చెప్పాలంటే అవితక్కువ ఏమీకాదు. వ్యాపారధోరణిలో వెలువడే వారపత్రికలు దాదాపుగా ప్రతీవారం హాస్యకథలు, కామెడీకథలు, ఇలాంటి పేర్లతో కథలు ప్రచురిస్తూనే ఉన్నాయి. వాటిల్లో కొన్నిపత్రికలు హాస్యకథల పోటీ పెట్టి ఉత్తమంగా ఉన్నాయని భావించినవాటికి పెద్దమొత్తంలో బహుమతులు కూడా ఇస్తున్నాయి
అయితే - ఇలా వస్తున్న కథల్లో వెకిలి కథలే ఎక్కువ ! మరికొన్ని కథలు చదివినప్పుడు నవ్వురాదు, సరికదా చికాకు కూడా కలుగుతుంది - ఇట్లాంటి పరిస్థితుల్లో వోయిగా నవ్వించగల కథలు కొన్నివచ్చినప్పుడు మండుటెండలో పన్నీరుజల్లులా అనిపించక మానదు.
ఈ ఏడు వచ్చిన ఈ తరహా కథల్లో తోలేటి జగన్మోహనరావు “కప్పడాలు” ప్రముఖంగా పేర్కొనదగ్గది. ఒకప్పుడు వీరు రచించిన “లక్ష్మీకటాక్షం”లో షేర్ మార్కెట్‌పై
ఎలాంటి విసుర్లు వినిపించాయో - ఇవాళ్టి గ్నోబలైజేషన్, సరళీకృత ఆర్థికవిధానాలు, వీటన్నింటి పైనా చురుక్కుమనిపించే వ్యంగ్యాస్త్రాలు ఈ కథలో వున్నాయి. చాలాకాలం తర్వాత హాయిగా నవ్వించగల ఒక మంచి హాస్యకథ చదివిన అనుభూతిని ఈ కధ మనకు ఇస్తుంది
“- ప్రేమ కధలన్నీ ఒకేలాగా ముగుస్తాయని నాదో థీరీ. ప్రేమపెళ్ళికి దారితీస్తే, పెళ్లయ్యాక ఏడుస్తారు. పెళ్లికాకపోతే దేవదాసులై ఏడుస్తారు. వడుపు మాత్రం తప్పదు-ా అంటూ (ప్రారంభమయ్యే ఈ కథ - అవడానికి “గన్ అనే ఒక భగ్నుప్రేమ కథ అయినప్పటికీ దీని నేపధ్యంలో బహుళజాతి కంపెనీలు భారీఎత్తున పెట్టుబడిపెట్టి పబ్లిసిటీ ఇచ్చి, దేశీయ పరిశ్రమల మనుగడను ఎలా (ప్రశ్నార్థంకం చేస్తున్నాయో చెబుతాడు రచయిత.
గ్లోబలైజేషన్ పేరుతో బహుళజాతి కంపెనీలకు తలుపులు తెరచిన తర్వాత - వారు అన్నిరకాల వ్యాపారాల్లోకి జొరబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంకో దేశానికి చెందిన 'కెప్సీ' కంపెనీవారు అప్పడాల వ్యాపారంలోకి ప్రవేశించారు.తమ కంపెనీ అప్పడాలను (వాటిపేరు 'కవ్పడాలు) అందరూ కొనేలా చేశారు. దీనిఫలితంగా దేశవాళీ అప్పడాల తయారీలో పేరెన్నికగన్న అప్పడాల రాజుగారు దివాళా కొట్టడాన్నీ కెప్సీ కంపెనీవారి మేనేజర్ (గన్ అతగాడి పేరు) (ప్రేమకథకు అవాంతరం ఏర్చడ్డాన్నీ వ్యంగ్యస్స్ఫూర్తితో చెబుతారు తోలేటివారు ఈ కథలో -
- అచ్చంగా హాస్యకథలు కాకపోయినా, “తిమింగలగిలం” (గంధం యాజ్ఞవల్క్య శర్మ), “అంతాబాగానే ఉంది” (ఆదూరి వెంకట సీతారామమూర్తి) “కోరికలరేయి” (శ్రీలత) మొదలయిన కథల్లో కూడా చక్కటి వ్యంగ్యస్ఫూర్తి ఉంది.
“తిమింగలగిలం” కధలో -- సోషల్ వేల్ఫేర్ ఆఫీసర్‌గా పనిచేసి, బల్లక్రింద చెయ్యిపెట్టి సంపాదించిన డబ్బుతో - 'బుచ్చేశ్వర్రావు' అనే అసామీ గుంటూరు శివార్లలో చాలాకాలం క్రితం కారుచౌకలో భూమి కొంటాడు. అతగాడు రిటైర్ అయి, మరొక ఊళ్లో ఉంటున్నప్పుడు అతడికి తెలుస్తుంది. చాలాకాలంక్రితం తొను కొన్నభూమికి ఇప్పుడు కోటిరూపాయల విలువ ఉందని, దాంతో బుచ్చేశ్వేరరావు దానిని అమ్ముదామని గుంటూరు వస్తాడు గానీ, - అక్కడ కొంతమంది శ్రామికులు గుడిసెలు వేసుకుని చాలాకాలంగా ఉంటున్నారనీ, వాళ్లని ఖాళీ చేయించడం సాధ్యంకాదనీ తెలుస్తుంది. ఇట్లాంటి పరిస్థితిలో అతడు ఆ ఊళ్లో వున్న ఒక రాజకీయ నాయకుడు మరియు గూండా అయిన ఓ పెద్దమనిషిని ఆశ్రయిస్తాడు. అతగాడు ఈ సమస్యను సులువుగానే
మష్రం2222డ222020ఊ24222222ఊ22 కోడూరి శ్రీరామమూర్తి ౨౭౨ పరిష్కరిస్తాడు గానీ - మొత్తం భూమినంతా తానే తీసుకుని ఇతగాడి చేతిలో పదిలక్షలు మాత్రమే పెట్టి పొమ్మంటాడు !-
ఈ వ్యవహారంలో బుచ్చేశ్వర్రావు నష్టపోయాడా? - అంటే అదొక భేకాళప్రశ్చ అతడు ఆ భూమిని కొనడానికి పెట్టిన మొత్తం అతడి కష్టార్దితం కాదు. ఇక, భూమి విలువ పెరగడం విషయంలో అతడి పాత్ర ఏమీ లేదు. అలాంటప్పుడు - బుచ్చేశ్వర రావుకు పదిలక్షల రూపాయలు లాభం అనుకోవాలి గానీ, తొంభైలక్షల రూపాయలు నష్టం అనుకోవడానికి వీలులేదు. అయినా, - తిమింగలాలు ఎన్నిఉంటేనేం అ తిమింగలగిలాలు కూడా ఉంటాయి !- చురుక్కుమనిపించే వ్యంగ్యంతో ముసిముసి నవ్వులు నవ్వించే కథ ఇది.
- అమెరికాలోని ఆంధ్రుల జీవితాన్ని గురించి చెబుతూ ఇటీవల వస్తున్న కథల్లో గిలిగింతలు పెట్టే కథలు చెప్పుకోదగ్గసంఖ్యలోనే వస్తున్నాయి వీటిల్లో “పెళ్ళిమాటలు” (శ్యామసుందరరావు పప్పు) “అంతర్జాతీయ ఆవకాయ కథ” (పద్మదేశిరాజు) కథలు పర్మొనదగ్గవి, ద
“అంతర్జాతీయ ఆవకాయ కధిలో -అమెరికాలో ఆవకాయపెట్టుకోదలచిన ఇల్లాలు " ఫ్లోరిడా మామిడికాయలు, చైనీస్ ఆవాలు, పాకిస్తాన్ కారం, కొరియన్ నూనె, అమెరికా డిపార్ట్మెంట్స్టోర్లో కొని తెలుగువారి ఫార్ములాతో ఆవకాయ పెట్టడానికి పూనుకొని అభాసుపాలవడాన్ని ఆసక్తికరంగా చెప్పడం జరిగింది.
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు ఇండియాలో పెళ్లిచూపులకు వెళ్లేటప్పుడు అమ్మాయి చదువు అమెరికాలో ఉద్యోగం చెయ్యడానికి పనికివస్తుందా రాదా అనే విషయానికి ప్రాధాన్యతను ఇస్తున్న సందర్భాలు ఎక్కువగానే ఉంటున్నవి. ఈ కారణంచేత ఇంజనీరింగ్ చదివిన అమ్మాయిలకు ఇండియాలో డిమాండ్ బాగా పెరిగిందట. ఇట్లాంటి స్థితిలో ఇంజనీరింగ్ చదివిన అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు అబ్బాయి తరుపువారిని ఆటపట్టించడం “పెళ్లిచూపులు” కథలో చదవడం ఆసక్తికరంగాఉంటుంది. “-మీ అబ్బాయి చికాగోలో ఉన్నాడా? - అకడ చలి ఎక్కువకదా - మా అమ్మాయికి చలిపడదు. అయినా మా అమ్మాయికి కాలిఫోర్నియా, ఫ్లోరిడా సంబంధాలు కూడా వచ్చాయి” మీ అబ్బాయి లూసెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడా? - అదేం సెంటో? - మాకు ఐ.బి.ఎమ్, మైక్రోసాఫ్ట్ సంబంధాలు కూడావచ్చాయి-” పెళ్లికూతురు తరపువాళ్లు ఇట్లా
మాట్లాడడం చదివినప్పుడు ఎప్పుడో చదివిన వీరేశలింగంగారి “సత్యరాజ అపూర్వ దేశయాత్రలు" జ్ఞాపకంవచ్చి నవ్వుకోకుండా ఉండలేం ! -
వవ అలుగు కథ -నాడు,నేడు
ఇట్లాంటి సంగతులు విన్నవాళ్లు “- మాకు ఇద్దరూ అమ్మాయిలేనండి - ఇద్దరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు -” అని గొప్పగా చెప్పుకోవడం మరొక ముచ్చట. ఇందులో హాస్యోక్తులు, ఛలోక్తులు, అతిశయోక్తులు ఉన్నప్పటికీ - పీత కష్టాలు పీతవి అనుకోక తప్పదు.
- ఇలా ఏ ఇతివృత్తంతో కథరాసినా హాయిగా నవ్వించగల క్షథను రాయడం ఒక కష్టసాధ్యమైన కృషి. ఈ యాంటత్రిక ప్రపంచంలో మంచి హానస్యరచనల ఆవశ్యకత ఎప్పుడూ ఉంటుంది. మన లాక్షణికుల వోస్యం అనేది 'వయ్యారి వాలుజడతో కొట్టినట్టుండాలి”' అని అంటారు.
వాలుజడతో వయ్యారి కొట్టినప్పుడు పులకరింపుకు ఉన్న ప్రాధాన్యత దెబ్బకు ఉండదు. అలా పులకరింపచేస్తూనే చురుక్కుమనిపించే వాస్య, వ్యంగ్య రచనలకు సాపితీలోకం ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది.
ఈ ఏడు వచ్చిన తెలుగుకధల ఇతివృత్తాల గురించి చెప్పేటప్పుడు చదువుల బరువు కధలు, విశ్వవిద్యాలయాల్లో మారుతున్న వాతావరణాన్ని గురించి చెప్పే కథలు, ముఠాకక్షలు ఇతివృత్తాలుగా గల కథలు, ఇలా పలుతరహాల కథల గురించి కూడా చెప్పవలసి ఉంటుంది.
రెసిడెన్షియల్ కాలేజీలు, స్కూళ్లు, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో - చదువు పేరిట పిల్లల్ని యంత్రాల్లా, మరల్లా మారుస్తున్న విషయం అందరూ ఎరిగిందే. అందరూ ఇలా మరల్లా మారలేరు. అంతేకాదు - అందరికీ ఒకే విషయంమీద ఒకేవిధమైన ఆసక్తి ఉండదు. దీంతో - చదువులు బరువులుగా మారే ప్రమాదం ఏర్పడుతుంది.
చదువుల పేరిట రెసిడెన్షియల్ కాలేజీల్లో జరుగుతున్న హింసను భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విద్యార్థినీ విద్యార్థుల ఉదంతాలు ఇటీవల పత్రికల్లో వచ్చిన విషయం అందరూ ఎరిగిందే. తల్లిదండ్రులకు పిల్లలకు చదువు 'కొనిపెట్టాలి అనే ఆత్భత పెరుగుతున్న కొద్దీ - విద్యావ్యాపారవేత్తలు అసంఖ్యాకంగా విద్యాసంస్థలను
పదుతూనే ఉంటారు.
“- మా పిల్లవాడికి మూడో ఏడురాగానే మీ స్కూల్లో పడేస్తాం. నర్సరీ నుంచి వాడిని “ఎంసెట్‌కు ప్రిపేర్ చేయించగలరా?-” అని అడిగిన తండ్రికథను రాశాడొక కథకుడు (రాకూడని కలి : వారణాశి రామకృష్ణ ఇది కేవలం కల్పనే అని అనుకోనక్కరలేదు.
కోడూరి శ్రీరామమూర్తి 2222 ఈ వాతావరణంలో 'గురుబ్రహ్మ' అని ఒకప్పుడు గౌరవాన్ని పొందిన ఉపాధ్యా యుడు ఈ రోజున వ్యాపార వస్తువు క్రింద తయారయిపోతున్నాడు రెగ్యులర్ కాలేజీల్లో వేలకొద్దీ జీతాలు తీసుకునే లెక్సరర్లు - తాము పనిచేసే విద్యాసంస్థలను విశ్రాంతి గృహాలుగానూ, - గంటల లెక్కన కూలీ ఇచ్చే రెసిడెన్షియల్ కాలేజీలు పని చెయ్యాల్సిన స్థలాలుగానూ భావించే దౌర్భాగ్యపుస్థితి ఈరోజు దాపురించింది. ఈ విచిత్ర విషాదస్థితికి రవ్వంత హాస్యం జోడించి చెప్పిన “సిన్సియారిటీ” కధ (రచన : సూర్య ప్రసాదరావు) చదివి చిరునవ్వులు నవ్వకోకుండా ఉండలేం.
- సాధారణ కాలేజీలు మాత్రమే కాదు. ఇవాళ విశ్వవిద్యాలయాల్లో ఉన్న వాఠావరణం కూడా ఆశాజనకంగా లేదు. అన్ని తరహాల అశాంతులకు - కులతత్వానికి, మళతత్వానికి, మురాతత్వానికి చాలా విశ్వవిద్యాలయాలు ఆలవాలాలుగా ఉంటున్నాయి, ఉపాధ్యాయులు చదువృచెప్పే స్థితి, విద్యార్థులువినే పరిస్థితి, దాదాపుగా కనుమరుగై పోయింది.
తీవ్ర నిరుద్యోగసమస్య ఫలితంగా వచ్చిన నిరాశజనక పరిస్థితులు చాలామంది విద్యార్శలకు తాము చదువుతున్న చదువుపట్ల నిరాసక్తతను కలిగిన్తున్నాయి. మనదేశంలోని ఆర్థికపరిస్థితులు గత పావుశతాబ్టిగా ఆందోళనకరంగా ఉంటున్నప్పటిక్తీ
- ఒకప్పటి విద్యార్థులు అభ్యుదయ భావాలు కలిగి ఉద్యమస్ఫూర్తితో ఉండేవారు, ఈనాడు. అది దాదాపుగా కనుమరుగై పలాయనవాదమే మిగులుతున్నది.
ఈ వాతావరణాన్ని ఇతివృత్తనేపథ్యంలో తీసుకుని తెలుగులో ఇటీవల కొందరు కథలు రాస్తున్నారు. ఈ ఏడు వచ్చిన ఈ తరహా కథల్లో “ములాఖత్” (సురేష్, "వెన్నెల మెట్లు (కాసుల ప్రతాపరెడ్డి) మొదలయినవి పేర్కొనదగినవి
“ములాఖత్ కథలో రచయిత కేంపన్లోని విద్యార్థుల ఆలోచనల్లో వచ్చిన మార్పులను మాత్రమే కాదు - ఒకప్పుడు అభ్యుదయవాదులమని చెప్పుకున్న వారి ఆలోచనల్లో వచ్చిన మార్పులను కూడా ప్రస్తుత భీభత్స వాతావరణ నేపథ్యంలో చెబుతారు.
ఇక, - రాయలసీమలో మురాలపేరుతో - రాజకీయ పలుకుబడికోసం, ఆర్థిక
ప్రయోజనాల కోసం, కొందరు పెద్దలునడిపే రాజకీయానికి శలభాల్లా అమాయకులు, బీదవారు అయిన ప్రజలు మాడిపోతూందే వైనాన్ని కథలుగా గతంలో ఎందరో కథకులు రాశారు. వాటిల్లో గుర్తుంచుకోదగ్గ కథలు కూడా ఉన్నాయి. ఈ ఏడు కూడా ఈ నేపథ్యంలో కొన్ని వచ్చాయి గాని, - రాశిలో గాని, వాసిలోగాని, గతంలో వచ్చిన
వానను తెలుగు కథ - నాడు,నేడు కథల స్థాయి వీటికి కనబడలేదు. ఉన్నవాటిల్లో “నెత్తురు మరకలు” (బత్తుల ప్రకాష్, చంద్రగ్రహణం (నాగులారపు విజయసారథి) పేర్కొనదగినవి.
10
- 2001లో వచ్చిన కథలను మొత్తం మీద అవలోకించినప్పుడు వాటి పోకడలలో కనిపించిన తీరు ఇది.
అంతకు ముందెన్నడూ లేని క్రొత్తపోకడలు ఈ ఏడు (2001) వచ్చిన కథల్లో వున్నాయనేందుకు అవకాశం లేదు. గొప్పకథలు రాకపోయినా, కథల స్థాయి మరీ నిరాశనజనకంగా ఉందని చెప్పేందుకు కూడా వీలు లేదు. ఉన్నంతలో వైవిధ్యాన్ని చూపిస్తూ, పాత సమస్యలనే క్రాత్తకోణాల్లోంచి చూపిస్తూ - మంచి కథలు అనిపించుకో దగ్గవి చెప్పుకోదగిన సంఖ్యలోనే వచ్చాయి. అయితే సగటు కథలు, “బాగానే ఉన్నాయి? అనిపించుకునే కథలు ఎక్కువ. ఇక, - చెత్తకథలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి.
“90లలో వచ్చినట్టుగా ఇవాళ ఎక్కువ సంఖ్యలో మంచికథలు రాకపోవడానికి కారణం ఏమిటి? - అనే ప్రశ్చ - తెలుగుకథకు మళ్లీ స్తబ్ధత దాపురించిందా? అనే అందోళన - సాహిత్యాభఖిమానులందరిలోనూ ఉంది.
90-95 సం॥ల మధ్య కాలంలో లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ మొదలుకొని స్రీవాద, దళితవాదాలవరకూ అనేకరకాల క్రొత్తసమస్యలు,' క్రొత్త ఆలోచలను, ఒక్కుమ్మడిగా రావడంతో అంతవరకూ కొంత స్తబ్బతతో ఉన్న కథకులు ఒక్కసారిగా తమ కలాలు విదిలించారు. అంతకుముందు అంతగా కథలు రాయనివారు కలంపట్టి అద్భుతమైన కథలను తెలుగువారికి అందించారు. ఇవాళ కూడా ఆ సమస్యలు ఉన్నప్పటికీ - పరిస్థితుల (ప్రభావంగా నిరాశతో కూడిన స్తబ్ధత కథా సాహిత్యంపైన పడిందేమో అనిపిస్తుంది.
మనిషి ముందు చెడును అసప్యాంచుకుంటాడు. తర్వాత దానితో సమాధాన పడతాడు. ఆ పైన చెడును (ప్రేమించడం ప్రారంభిస్తాడు. రెండో దశలోంచి మూడోదశ వస్తుంది. మన కథకులు ఏ కారణం చేతనయినా రెండో దళకు వచ్చినా, - తిరిగి మొదటి దశకు వస్తారే తప్ప - మూడో దశకు మాత్రం రారని నా గట్టి నమ్మకం.
ఈ సందర్భంలోనే మరొక విషయం గురించి కూడా చెప్పాలి. ఇవాళ మంచి
మర్యాదని కోడూరి శ్రరామమూత్తి వచ కథలు రాసినా ప్రచురణ అనేది సమస్యగా ఉంటున్నది. మంచి కథలను గతంలో (ప్రచురించిన పత్రికలు మూతబదడడమో, వ్యాపార కారణాలవలన కధకు సంబంధించి తమ విధానాలను మార్చుకోవడమో, చేస్తున్నాయి. కాలక్షేపం కధలను, బూతుకథలను, (ప్రచురించే పత్రికలకు లోటులేదు గాని, - సీరియస్‌గా ఒక సమస్య గురించి ఆలోచించి రాసిన కథలను ప్రచురించే పత్రికలు చాలా తక్కువగా మాత్రమే ఉంటున్నాయి. వున్న ఆ పత్రికలు కూడా మనుగడ కోసం నిత్యపోరాటం చేసుకొనవలసిన పరిస్థితి ఉంటున్నది. మధ్యమధ్యలో కొన్ని పత్రికలవారు ప్రచురించే ప్రత్యేకసంచికలు మాత్రమే మంచి కథలకు నెలవుగా ఉంటున్నాయి. ఇక - కథాసంకలనాలకు మార్కెట్ బాగా పడిపోవడంతో కొందరు కథకులు తాము మంచిది అని భావించిన కథనొక్కదానినీ ఒక్క చిన్నపుస్తకంగా వేసి విడుదల చేసుకునే పరిస్థితి ఇవాళ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మంచి కధలు రావడానికీ - వచ్చిన కథలు జనబాహుళ్యానికి అందడానికీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తున్నది. మంచి కథరాస్తే - పారితోషికం సంగతి అలా ఉంచి, భుజం తట్టి ప్రోత్సహించే వారు కూడా లేని పరిస్థితి. - ఈ నేపధ్యంలో మన తెలుగు కథ సజీవంగా, సహజవైతన్యాన్ని కోల్పోకుండా, వున్నది అంటే అది ఎంతయినా అభినందించాల్సిన విషయం, అయితే, - ఒక విషయాన్ని మాత్రం గమనించాల్సి ఉంది. కధాశిల్పం విషయంలో మన కథకులకు (శ్రద్ధ సన్నగిల్లుతున్నదనిపిస్తున్నది కథను ఇలాగే రాయాలనే నియమం లేదు గానీ కథకుడు చెప్పదలచిన కధ పారకులకు సక్రమంగా అందేందుకు శిల్చపరమైన అవగాహన కొంతవరకూ తప్పనిసరి కొంతమంది కధకులు తమ కధకు చక్కని నేపథ్యాన్ని తీసుకున్నా - పాత్రచిత్ర్య విషయమై స్పష్టమైన దృక్సధంలేని కారణంగా మంచికథ కాపలసినదాన్ని పేలవమైన కథగా తయారుచేస్తున్నారు. ఈ ఏడు వచ్చిన ఓ కథలో ఒక కథకుడు భారత భూభాగమైన కాశ్మీర్లో మిలిటెంట్లు చేస్తున్న దురాగతాలు, మన సైనికులు వారి ఘాతుకాన్ని ఎదుర్శొనేందుకు చేపడుతున్న సాహసోపేత చర్యలు, నేపథ్యంగా తీసుకుని ఒక కథను రాశాడు. ఒక తెలుగు కధకుడు చేసిన ఈ ప్రయత్నం ఎంతయినా అభినందనీయం. అయితే, - ఈ కధలోని ప్రధానపాత్ర చిత్రణ విషయంలో స్పష్టమైన అవగాహనకు రాలేకపోయాడు. మిలిటెంట్లు చేస్తున్న మానభంగాలు, దౌ ర్దన్యాలు చూసినప్పుడు ఈ కథలోని కథానాయిక గుండెలు (ప్రతీకార జ్వాలలతో మండిపదేవి. ఇట్లాంటి స్థితిలో - ఇంటిలో చొరబడి భీభత్సాన్ని సృష్టిస్తున్న మిలిటెంట్లను హతమార్చిన భారతీయ సైనికుడిపై ఆమెకు ఆరాధనాభావం ఉండడంలో
మా తెలుగు కథ -నాడు,నేడు ఆశ్చర్యం లేదు ఈ ఆరాధనాభావంతోనే ఆమె అతడికి తన శరీరాన్ని అర్చించుకుంది. ఇంతవరకూ బాగానే ఉందిగాని, - అతడి వల్ల ఆమె తల్లి అయిన తర్వాత కూడా అతడిని పెళ్లాడడానికి ఆమె అంగీకరించదు. అతడి బిడ్డను గొప్ప సైనికుడిగా చేసి- దేశానికి అర్పించడం తనధ్యేయం అంటుంది. - ఇందులో వున్నది (ప్రేమా? - త్యాగమా?
-
దేశభక్తా? -మూర్ధత్వమా? - అతడిని పెళ్లాడ్డ్ణంలో ఆమెకు ఉన్న అభ్యంతరం ఏమిటి?
-
విశ్వనాధవారు ఒక కథలో అన్నట్టు దానిని “జీవుడి ఇష్టము అనుకోవాలి కాబోలు! - ఈ విషయంలో స్పష్టత వుంటే కథ రాణించేది అని నా అభిప్రాయం.
ఇక, - దేశంలో పెచ్చుపెరిగి పోతున్న వస్తువ్యామోహం (00౧5619137) ను నిరసిస్తూ ఈ మధ్యలో చాలా కథలు వస్తున్నాయి. ఇది హర్షజ్రీయమే. అయితే - అంతమాత్రాన, మనం ఆధునిక నాగరికత ఇస్తున్న సదుపాయలన్నింటికీ దూరం కావాలని అర్ధం కాదు. ఇదేగాని, మనం కోరుకున్న విషయం అయితే, - తిరిగి 511118 (06 కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది.
ఈ మధ్య ఓ కధలో ఓ కధకుడు వేపపుల్లతో పళ్లుతోముకోవాలనీ, పిడకల మీద నీళ్లు కాచుకోవాలనీ, ఎలక్ట్రిసిటీ లేకపోతేనే మంచిదనీ, సందేశం యిస్తూ ఒక కథ రాశాడు. మరొక కధకుడు - ఎక్కువమంది పిల్లల్ని కంటే ఒకరు కాకపోతే మరొకరయినా తల్లితండ్రుల దగ్గిర వుండి వాళ్ల బాగోగులు చూస్తారనీ, - బొత్తిగా ఒకళ్లనో, ఇద్దరినో కంటూ ఉండడంవల్ల పిల్లల ఆత్మీయతను తల్లిదండ్రులు పొందలేక పోతున్నారనీ కథలో రాశాడు. 21వ శతాబ్దంలో ఇలాంటి [6౪1/21151 ధోరణులు వాంఛనీయం కాదు.
మంచి కధరాయాలంటే రచయితకు సరియైన దృష్టి (౧౭906014) కూడా ఉండాలి. వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌గా కరణం మల్లిశ్వరి బరువులను ఎత్తి అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించి ఉండవచ్చు. కానీ, - బ్రతుకుతెరువు కోసం ఒక డెబ్బయ్యేళ్ళ ముదుసలి ప్రీ కూరలగంప బరువును మోస్తూ రోజూ ఇంటింటికీ తిరుగతూ ఉంటే - ఆమె మోసిన బరువు మల్లీశ్వరి మోసిన బరువు కంటే ఎక్కువగా భావించాలి అంటాడు ఓ కథకుడు, - ఈ ఏడాది వచ్చిన ఓ కథలో - (బరువు -పి.రామకృష్ణ. కథ విషయం అలా ఉంచి - ఈ కధలోని కధకుడి దృష్టి మెచ్చదగింది అని నా అభిప్రాయం.
ఇది రాస్తూంటే - మార్క్‌ట్వెయిన్ తన 'నోట్‌బుక్'లో రాసుకున్న ఓ ఉదంతం జ్ఞాపకానికి వచ్చింది. ఓ రోజున మార్కీట్వెయిన్ పర్వతప్రాంతం వైపు వ్యాహ్యాళికి వెళ్లినప్పుడు కొంచెం ఎత్తు ఎక్కవలసి వచ్చిందట. అలా ఎక్కినప్పుడు మార్క్‌ట్వెయిన్
కోడూరి శ్రీరామమూర్తి 22222 చాలా అలసట చెందినట్లు భావించాడు. ఆ సమయంలో ఒక 70 ఏళ్ల ముదుసలి స్రీ కొండ ఎక్కుతూ కనిపించింది. బ్రతుకుతెరువు కోసం ఆమె రోజుకు రెండుసార్లు అంత ఎత్తుఎక్కి దిగి ప్రక్క ఊరికి వెడుతూ ఉంటుందని తెలిసి సిగ్గుపడ్డానని మార్క్‌ట్వెయిన్ తన “నోట్‌బుక్'లో రాసుకున్నాడు. - నిజమే, నిరంతర జీవనపోరాటంలో బరువులు, కష్టాలు తెలియవు.
కథ అనేది ఎవరు రాసినా, ఎందుకురాసినా పరనీయత అనేది చాలా ముఖ్యమైన విషయం. అది లోపించిన నాడు ఒక కథ ఎంతమంచి కధఅయినా ఫలితం ఉండదు. ప్రయోగాత్మకమైన ధోరజిలో విలక్షణమైన రీతిలో కథలు రాస్తున్న కొందరు కథకుల కథలు చాలామంది పారకులకు అర్ధంకాని స్థితిలో వుంటున్నవి. రచయితకూ, పాఠకుడికి మధ్య దూరం బాగాపెరిగ్సి - మంచి కథ అంటే 'మాకు అర్ధంకాని కథ” అని పాఠకులు అనుకునే పరిస్టితి ఏర్పడితే, కథ తన ప్రయోజనాన్ని కోల్పోతుందనే విషయాన్ని రచయితలు గమనించవలసి ఉంది.
ఈ విషయాలకు సంబంధించిన చర్చ ఎలా ఉన్నా - నేటి తెలుగుకథ బహు ముఖంగా సమాజ స్వరూపానికి అద్దం పడుతున్నదనేది నిస్సందేహమైన విషయం. అంతేకాదు - అనేక ఘ్రాంతీయ సమస్యలకు, తెలుగుభాషలో గల వివిధ ప్రాంతీయ పలుకుబడులకు, కూడా కథల్ల! చోటు దొరుకుతున్నది. బి.ఎస్. రాములు, కాలువ మల్లయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, అల్లం రాజయ్య, బోయ జంగయ్యలాంటివారు గంగొణా చిత్రాన్ని కథల్లో చూపిస్తూంటే - కేతు విశ్వనాధరెడ్డి, సింగమనేని, చిలుకూరి, సన్నపురెడ్డి వంటివారు సీమప్రజల కథకు అద్దం పడుతున్నారు. అప్పలనాయుడు, గౌర్జాయుడు, వంటివారు శ్రీకాకుళం కథ చెబుతున్నారు. తెలుగు కధలను సీరియస్‌గా చదివే పాఠకులకు ఆంధ్రదేశంలోని అన్నిప్రాంతాల కధలు, ఆయా (ప్రాంతాల మాండలికాల్లో సుపరిచితంగా ఉన్నవి అని అంటే - అది నేటి తెలుగు కథ సాధించిన విజయం అని సగర్వంగా చెప్పవ
చాలాకాలం క్రితం త్రమ్ర “అనుభవాలు - జ్ఞాపకాలూ'లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ఇలా రాశార్తు _
“- మొదటి మాటు విశాఖపట్టణం వెళ్లాన్నేను. అప్పటికి నాకున్నది ఒక్కటే ప్రాణం. వారం రోజులు అక్కడ వృన్నాక రెండో ప్రాణం సంక్రమించినట్లు నాకనిపించింది. తర్వాత - నెల్లూరు వెళ్లాను. మూడోప్రాణం సంక్రమించింది. చివరకు హన్మకొండ
222 అలుగు కథ - నాడు,నేడు వెళ్లాను. అయిదో ప్రాణం కూడా నాకు సంక్రమించినట్టు, నా ఆంధ్ర రక్తం పరిపూర్ణం అయినట్టు అనుభవం అయింది - నా స్వప్రాంత పలుకుఇడిలో ఎంత జీవశక్తి ఉందో, అక్కడక్కడి పలుకుబళ్లల్లోనూ అంతటి జీవశక్తి ఉంది. పల్లెలు, పట్నాలు తిరగాలి. అష్టాదశ వర్జాలవారినీ, పరభాషా వ్యామోహం లేనివారినీ, కలుసుకోవాలి. ఆ పలుకుబళ్లు చెవులారా వినాలి. అప్పుడుగాన్ ఏ తెలుగువాడికీ నిండుప్రాణం వున్నదని చెప్పడానికి వీల్లేదు అన 'కథక చక్రవర్తి మాటల్లో చెప్పాలంటే - ఇవాళ మన తెలుగుకథ అలాంటి 'నిండుప్రాణంితో ఉంది. ఉంటుంది. ఎందరో గొప్ప కథకులు - అందరికీ వందనాలు !- (మధురాంతకం రాజారాం సాహిత్యనంస్థ వారి =2001- కథావార్నీకొలో (ప్రచురితం శ _ కొన్ని మార్పులతో) క్ యమైలమె అకవయమ
ష్తత్రదదననననడడనడడ2న2222 ఈడూరి శ్రీరామమూర్తి మవ జ్ మనుషుల మరుగుజ్ఞు ఆలోచనలను ఎద్దేవా చేసే రా.రా. కథలు
“- పాఠకుల హృదయంపైన గాఢమైన ముద్రవెయ్యాలనే ఉద్దేశంతోనే నేనీ కథలు రాసినాను. కథానికను గురించే కాదు. మొత్తం సాహిత్యం గురించే నా అవగాహన అది అనుభూతి లేకుండా సాహిత్యమనేదే లేదు. సమస్త సాహిత్యమూ హృదయ వ్యాపారమే.”
- ఈ మాటలు అన్న రాచమల్లు రామచంద్రారెడ్డిగారు తెలుగువారు చిరకాలం గుర్తుంచుకోదగ్గ గొప్ప విమర్శకులు మాత్రమేకాదు, కధకులు కూడా కొందరు కధకుల్లా ఆయన ఎక్కువ కధలు రాసి ఉండకపోవచ్చు. ప్రధానంగా కధారచనపైననే దృష్టిని కేంద్రీకరించి ఉండకపోవచ్చును. కాని ఆయన తన కధల్లో ఎలాంటి జంకులూ లేకుండా చూపిన జీవితసత్యాలు మరుపురానివి. కుటుంబరావుగారు రా రా. కథల గురించి చెబుకూ- “రారా, కథలు పాఠకులకు 'షాక్‌ని ఇస్తాయి. జీవితంలో చూచి ఉపక్షించిన విషయాలను వీరి కథల్లో చదివి షాక్ తింటాం” - అని అనడం సాహిత్యాభిమాన్సులక్తు గుర్తుండే ఉంటుంది. సాధారణంగా మనందరికీ తెలిసిన జీవితాన్ని = ఆయన ఒక అసాధారణమైన రీతిలో చూపించడం, ఆ చూపించిన తీరు పలుసందర్భాలలో జీర్ణించు కోడానికి కొంత ఇబ్బంది కలిగించేదిలా ఉండడం, వల్లనే కుటుంబరావుగారు “షాక్ అనేమాట వాడారనుకుంటాను.
“రా.రా.” తన కధల్లో చెప్పదలచిన విషయాన్ని కొందరు కధకుల్లా డొంకతిరుగుడు రీతిలో చెప్పరు. కుటుంబరావుగారిలా - స్పష్టంగా, సూటిగా, నిరాడంబరమయిన రీతిలో చెబుతారు. కొన్ని సందర్భాలలో చురుక్కుమనిపించే వ్యంగ్యం జతచేరుతూ
ఉంటుంది. కధాశిల్బ్పంపట్ల స్పష్టమైన అవగాహన గల కథకుడు కావడంచేత
2వ తెలుగు కథ - నాడు,నేడు అనవసరమైన సంఘటనలకుగాని, అసందర్భ ్రసంగాలకుగాని, కథల్లోచోటు కల్ప్సించరు. తక్కువ నిడివిగల మంచి కథలు రాసిన కథకుడాయన. (అయితే - కొన్ని పెద్దద్దధలు కూడా లేకపోలేదు) మనుషుల ఆలోచనల్లోని డొల్లతనాన్ని, హిపోగక్రసీని,- వాటన్నింటికీ నేపధ్యంలో ఉండే వ్యవస్థ స్వరూపాన్ని రా.రా. తన కథల్లో గుర్తుంచుకోదగ్గ రీతిలో చూపిస్తారు. వీరి కథలు నాలుగు దశాబ్దాల క్రితం రాయబడినవే అయినా, - ఆలోచించి చూస్తే ఆ కధల్లో చెప్పబడిన ఆంశాలు ఈనాటికీ వదో ఒక రూపంలో అన్వయిస్తాయని పిస్తుంది. రా.రా.గారి “అలసిన గుండెలు కథల సంపుటిలో రాఘవయ్య రాజకీయాలు” అనే కథ ఉంది. ఈ కధలోని రాఘవరావు చాలాకాలం బడిపంతులు ఉద్యోగం చేసి, చివరకు హెడ్ మాస్టర్‌గా రిటైర్ అయ్యాడు. రాఘవరావు భార్యకు అతడినొక వి.ఐ.పి.గా తయారుచేద్దామని తాపత్రయం. అందుకే ఎం.ఎల్.సీ పదవికి పోటీచెయ్యమని శత పోరింది. - “ఎప్పుడూ ఏ టీచరుకూ సహాయం చేసి ఎరుగనే - వాళ్లను ఓట్లు అడిగే దెట్లా?” అంటాడతను. “సుబ్బమ్మ మొగుడు ప్రతిసారీ మునిసపల్ కౌన్సిలర్ అవుతూనే ఉన్నాడు. ఎప్పుడు ఎవరికి ఏ సహాయం చేసాడో చెప్పండి” అంటుందావిడ! “అర్ధరూపాయికి అమ్ముడుపోయే మునిసిపల్ ఓటర్లు - టీచర్లు ఒకటెలా అవుతారు-” అంటాదడతడు. “చదువుకుంటే మాత్రం బుద్దులు మారతాయటండీ - మునిసిపల్ బుద్దులు కొంచెం నాజుకుగా ఉపయోగించాలి గానీ - అంటుందావిడ.
- ఎన్నికల్లో గెలిచినా టీచర్లకు తాను ఏం చెయ్యగలనని రాఘవరావు సందేహం. “-_ వాళ్లకు చెయ్యమని ఎవరన్నారు - మన సుఖం మనం చూనుకోవాలిగానీగ అంటుందావిడ. చివరకు అతడి అదృష్టంవల్లనో - ఓటర్ల దురదృష్టం వల్లనో రాఘవరావు ఎం.ఎల్సీ అయ్యాడు. ఈ పదవి వల్ల అతడికి ఏమివచ్చినా, రాకపోయినా, పెళ్లాం పోరు లేకుండా హైదరాబాదులో నమస్త సౌఖ్యాలు అనుభవిస్తూ హాయిగా పడుకోవచ్చునని తెలుసుకుని సంతోషిస్తాడు. ఈ కధను రా.రా.గారి రాసి నలభైసంవత్సరాలు అయింది. ఈ మధ్యకాలంలో
- ప్రజాస్వామ్యపు కథలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చిందనుకోను. ఇలాంటిదే - 'నీతిగానుగి కధ కూడా. నేటిరూపాయల ప్రపంచంలో చాలా మందికి 'నీతి' గురించిన అభిప్రాయాలేగాని, నీతిలేదనే విషయాన్ని వ్యంగ్య స్ఫూర్తితో
నష నడడనవనడడ22డడనడవ.22 కోడూరి శ్రీరామభూత్రి 2 చెప్పేకథ ఇది. ఈ కథలో కనబడే మనుషుల్లోని హిపోక్రసీ, ఆత్మవంచన పాఠకులకు చాలాకాలం గుర్తుంటాయి. రాచమల్లువారు రాసిన పెద్దకథల్లో ఇది కూడా ఒకటి.
ఇష్టంలేని పెళ్లిని పెద్దలు నిర్ణయించిన కారణంగా ఒక అమ్మాయి పెళ్లిరోజున ప్రియుడితో లేచిపోదామని విఫలప్రయత్నం చేస్తే - ఆ అమ్మాయి మానసిక వ్యధను గురించి పట్టించుకున్నవారెవరూ ఉండరుగాని, నీతి “తూకం. లాళ్లు' వేసి ఆమె చెడిపోయిందని తీర్మానించగల '“నీతిమంతులు' మాత్రం చాలామంది. ఉంటారు. ఇట్లాంటి 'నీతిమంతులు' పెళ్లికొడుకు తరపువారిలో సహజంగానే మరీ ఎక్కువమంది ఉంటారు. ఈ విధమైన స్థితిలో - గడుసువాడయిన పెళ్లికూతురు తండ్రి ఇస్తానని చెప్పిన కట్నానికి, 'బోనస్'గా మరికొంత కలిపి మగపెళ్లివారికి అర్పిస్తే - నీతికబుర్లు కథ ఏమవుతుంది?
“ముందు పదివేలు ఇస్తామన్నారు. ఇప్పడింకో రెండువేలు ఎక్కున ఇస్తున్నారు. డబ్బు చేదా మనకు?” అంటూ - ఈ పెళ్లిని చేసుకోనంటున్న పెళ్లికొడుకును అతడి తండ్రి బుజ్జగించాడు. అంతకుముందు కొద్దిసేపటి క్రితం వరకూ 'పాడు సంబంధం అని తిట్టిపోసిన పెళ్లికొడుకు అక్కగారు “-కాబోయే పెళ్లాన్ని గురించి మర్యాదగా మాట్లాడ్డం తెలియదా?-” అంటూ పెళ్లికూతుర్ని వెనకేసుకొచ్చి తమ్ముణ్సి మందలించే స్థితికి వచ్చింది.
ఈ విషయం ఇలా ఉండగా - ఈ కథలో మరో ఆసక్తికరమైన విషయం కూడాఉంది. ఈ కథలోని పెళ్లికొడుకు పెద్దగా చదువుకున్నవాడు కాదు. బి.ఎ. పరీక్షల్లో చాలాసార్లు కుస్తీపట్టి ఇక వశంకాక, పరీక్షకు వెళ్లడం మానుకున్నవాదు. ఇట్లాంటి పెళ్లికొడుకు - పెళ్లికూతురు ఎవరితోనో లేచిపోయిందని విన్నప్పుడు - “నగలతో పదివేలిస్తారని తండ్రి అన్నాడు. నగలతో కూడా లేచిపోయిందేమో -- పెళ్లికూతురు స్కూల్ స్టైనల్ పాసయ్యింది - లేవదీసుకుపోయినవాడు బి.ఎ. పాసైనాదేమో... (భర్త) వి.ఎ. పాస్ కాకుంటే లేచిపోతారు...” అని అనుకుంటాడు. ఈ ఆలోచనల్లో తన చదువు తక్కువ అనే అపరాధభావం ఒకవైపు, పెళ్లికూతురు నగల ప్రస్తావన మరొకవైపు ఉండడం గమనించదగ్గది.
ఇట్లాంటి పెళ్లికొడుకు - పెళ్లికూతురు శోభనం గదిలోకి వచ్చినప్పుడు “-నువ్వు చెయ్యరాని తప్పుచేసినావు. ఐనా ఉదారంగా పెళ్లిచేసుకున్నాను-” అని అనడం
మవ తెలుగు కథ - నాడు,నేడు చదివినప్పుడు - మనుషుల ఆలోచనల్లోని లేకితనానికి, ఆత్మవంచనకు ఇంతకుమించిన ఉదాహరణ మరొకటి ఉండదనిపిస్తుంది. ఈ కధలోనే స్కూలుమాష్టారు పాత్ర ఒకటి ఉన్నది. భార్యపెళ్లివారి ఇంటికివెళ్లి, ఆ రాత్రి అక్కడే ఉండిపోయిన కారణంగా - రోజూ అతడికి కావాల్సిన శారీరక సుఖం కరువవుతుంది. మధ్యలో ఆమె ఒకసారి వచ్చి తన తాపం తీర్చిపోతే బాగుండును అనుకుంటాడు. అంతేకాదు - “తప్పుపని చెయ్యకుండా కోర్కెలుతీర్చుకోవడానికి కదా భర్తకు భార్య, భార్యకు భర్త ఉండడం-” అని కూడా భావిస్తాడు. నేటి వివాహ వ్యవస్థలో భార్యాభర్తల సంబంధాలు మానసిక ఐంధాలుగా కాకుండా, వ్యాపారసంబంధాలుగానో, కేవల శారీరక సంబంధాలుగానో దిగజారి పోతున్న వైనాన్ని చెప్పే ఉదంతాలే ఇవన్నీ “అలసిన గుండెలు కథాసంపుటిలో ఓడిపోయిన సంస్మారం' అనే మరోకథ ఉంది. చిత్తశుద్ధి లేకుందా కేవలం కీర్రికండూతితో సంఘసంస్కర్తగా చలామణీ అవుదామని చూచిన ఓ “మహానుభావుడి కథను ఇందులో ఆసక్తికరంగా చెబుతారు రారా. ఈ కధలోని సుందరమ్మకు చిన్నతనంలోనే పెళ్లిఅయింది. అయితే, పెళ్లి అయిన ఏడాదికే భర్త చనిపోవడంతో పాదాల పారాణి ఆరకుండానే ఆమె విధవరాలయింది. ఇట్లాంటి స్థితిలో ఈ కథను రాసిన (1968) నాటికి పెద్దలు ఆమెకు పునర్వివాహం చేద్దామను కోవడం ఒక అసాధారణమైన విషయమేమీకాదు. పెద్దలు తనకు వివాహం చేస్తామన్నప్పుడు కోల్పోయిన సుఖాన్ని తిరిగి పొందవచ్చుననే ఉద్దేశ్యంతోనే ఆమె ఇందుకు అంగీకరించింది. అంతేగాని అదొక ఘనకార్యమని ఆమె భావించలేదు. తనను పెళ్లాడదలచిన వ్యక్తి కూడా అట్లాంటి సంసారసుఖం కోసమే తనని పెళ్లాడుతున్నాడు అనుకుంది. కానీ, పెళ్లికొడుకు రామనాధం ఆలోచనలు వేరు. దీనిని అతడు ఒక సంఘ సంస్కరణ కార్యక్రమంగా భావించాడు.ఇంతటి ఘనకార్యం తాను చేస్తున్నందుకు సంఘంలో తగిన 'పబ్లిసిటీ' రావాలనీ, తన త్యాగాన్ని భార్య గుర్తించాలనీ కోరుకున్నాడు. శోభనం గదిలో అడుగుపెట్టిన భార్యను అప్యాయంగా అక్కున చేర్చుకునేది పోయి- “మానవులన్న తర్వాత త్యాగం చెయ్యకపోతే ఎట్లా? - నీ తోటి యువతులందరూ నిష్కారణంగా జీవిత సౌఖ్యాలకు దూరమై ఉసూరుమంటూ ఉంటే మన సంఘం బాగుపడేదెట్లా?-”ొ అంటూ ఆవేశంతో ఉపన్యాసం దంచడం
కోడూరి శ్రరామమూర్తి వవ ప్రారంభించాడు! అది విని నివ్వెరపోవడం ఆమె వంతయింది ఈ స్థితిలో ఆమెకు “-ఈ త్యాగాన్ని జీవితమంతా మోసే శక్తి నాకు లేదు-” అని అరవాలనిపించింది. కాని, ఆ పనిచెయ్యగల తెగువ (ఆమె ఉన్న పరిస్థితిలో - ఈ వ్యవస్థలో) ఆమెకు లేదు. కధ ఇంతవరకూ బాగానే ఉన్నది గాని, 'తనఅసహాయత మెరుపువలె మనసులో తోచిని కారణంగా - సుందరమ్మ తన మనోభావాలను తమాయించుకుని - “మీ త్యాగానికి తగిన యోగ్యత కలిగేటట్టు ఆశీర్వదించండి-” అని హఠాత్తుగా ఆ అయోగ్యుడి పాదాల దగ్గిర వాలిపోవడం ఆత్మవంచనకు పరాకాష్ట అనిపించింది]. ఆమె మౌనంగా ఉండిపోయినట్టు కథను ముగిస్తే - కధకుడు ఆశించిన ప్రయోజనం మరింతగా నెరవేరేది పరిస్థితుల కారణంగా సుందరమ్మ సంస్కాళల ఓడిపోయి ఉండవచ్చు. కాని, ఆ ఓటమి రేపటి విజయానికి తగిన నేపధ్యాన్ని సమకూర్చేది గానయినా ఉండాలి అని నా అభిప్రాయం. రా.రా. కథల్లో మన జీవితకథలు కూడా పేర్కొనదగిన కథ.ఈ కథలోని కథానాయకుడు తమ ఇంటి'ప్రక్కన ఉన్న “పెద్దమ్మ”పై కధను రాయాలను కున్నాడు.అయితే - కథ రాయాలంటే కథావస్తువులో ఉండాల్సిన “అసాధారణత” ఏదీ ఆమెకు జీవితంలో కనబడనందుకు పరితపించాడు. (ఈ కధ చదువుతున్నప్పుడు మిచ్చిబాబు కథ - “నన్ను గురించిన కధ రాయవూ” జ్ఞాపకానికి వచ్చింది ఇందుకు ఈ రెండు కథల మధ్య ఉన్న పోలిక కంటే తేడాయే ముఖ్యకారణం ! ) సాధారణంగా చాలామంది స్త్రీల జీవితాల్లో ఉన్నట్టుగానే - పెళ్లిపిల్లలు, సంసార జీవితం వంటి విషయాలు తప్ప ఆమె జీవితంలో (ప్రత్యేకించి చెప్పుకోదగిన సంఘటనలేవీ జరగలేదు, భర్త చనిపోయిన కారణంగా ఒంటరిగా ఆమె ఆ ఊళ్లో ఉంటోంది. దూరంగా ఏవో ఊళ్లల్లో వాళ్ల బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్న పిల్లలు అప్పుడప్పుడు వచ్చి, ఆమెను చూచి పోతుంటారు. అంతకుమించి మిగతాదంతా మామూలే! ఆమెకు జీవితంలోని ఏ విషయం మీదా ఆసక్తిలేదు. నిస్సారమై, నిర్జీవమూ అయిన జీవికాన్ని ఆమె యాంత్రికంగా గడుపుతున్నట్టు కథానాయకుడికి అనిపిస్తుంది. ఈ నిరుత్సాహం వెనుక జీవితంలో ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండి తీరుతుందనీ, దానిని తవ్విబయటకు తియ్యగలిగితే ఆమె మీద కధను రాయవచ్చుననీ కథానాయకుడి తపన, అందుకని అతడు ఎన్నో విఫలప్రయత్నాలు చేశాడు. ఇదంతా గమనిస్తున్న
మవ తెలుగు కథ -నాడు,నేడు కథానాయకుడి భార్య తెలిసో తెలియకో ఓ మంచిమాట అంటుంది “మీ దిగులంతా కథను గురించే. ఆమె గురించి మీకేమాత్రం దిగులు లేదు*- చురుక్కుమనిపించే ఈ వ్యాఖ్యలోని అంతరార్జాన్ని (గ్రహించగలిగితే, కథ కుడికి ఉండవలసిన లక్ష్యశుద్ధి ఏమిటో, అతని సామాజిక" బాధ్యత ఏదో అవగతం అవుతుంది. నిజమైన సాహితీవిలువలు గల కధకుడు కధల ఇతివృత్తాల కోసం అంతరంగపు చీకటి గుహల్లో వెంపర్లాడడు. అతడికి ఆలోచించగల మెదడు, స్పందించగల హృదయమూ ఉంటే
- కళ్లెదురుగా కనబడుతున్న మనిషిలో ఎన్న్హీ ఇతివృత్తాలు చూడగలుగుతాడు. మీదు మిక్కిలి, - మనిషిని మనిషిగా చూడగలుగుతాడు. ఇక, ఈ కథకు రా.రా. "పెద్దమ్మ జీవితకథ” అని కాకుండా - 'మన జీవితకథలు అని పేరు పెట్టడంలో - ఈ దేశంలో లక్షలాది ప్రజలు నిరుత్సాహంతో నిస్తేజంతో, బ్రతుకుబండి లాగుతున్న వైనాన్ని మనముందు ఉంచుతున్నాదడనిపిస్తుంది. కుటుంబరావుగారి స్తీపాత్రల్లాగానే రా.రా. కథల్లో కూడా కొన్ని సందర్భాల్లో కనబడేస్త్రీ పాత్రల గడుసుదనం పాఠకుల్ని ఆకట్టుకుంటుంది. 'ఉదరనిమిత్తం' కథనే తీనుకుందాం. - ఈ కథలోని నరసింహులు వ్యవసాయంలో దెబ్బతిని, భార్య (ప్రోద్చలంతో పల్లెనుంచి పట్నంవచ్చి, ఒక చిన్న హోటల్ పెట్టుకుంటాడు. అదొక పరువు తక్కువ విషయంగా కొందరు భావించినా, ఉదరపోషణ నిమిత్తం మరొక మార్గం లేదు. ఇలా ఉండగా, హోటల్‌కు వచ్చేవాళ్ళల్లో రామిరెడ్డి అనే వ్యక్తి నరసింహులు భార్య కామేశ్వరితో కొంత చనువుగా ఉందామని ప్రయత్నిన్తూ ఉంటాడు. ఇందులో కామేశ్వరి ప్రమేయం ఏమీలేనప్పటికీ తప్పంతా ఆమెదే అయినట్టు నరసింహులు మండిపడతాడు. దానికి ఆమె - “భర్త ముఖంలోకి చూచి, జాలిగా నవ్వి' ఇలా అంటుంది - “మన ఊళ్లోనే ఆ రామిరెడ్డి అలా ప్రవర్తించి ఉంటే ఏం చేసేవారు? -” “అప్పుడు పంద్లు రాలగొట్టి పంపించేవాణ్ణి -” “మరి - ఈ రోజున ఆ పని ఎందుకు చెయ్యలేదు?-” “హోటలు అన్న తరువాత - రకరకాల మనుషులు వస్తూ ఉంటారు. అందరితోనూ కొట్లాట పెట్టుకుంటే వోటలు మూసుకోవలసి వస్తుందిలో అది విని, నరసింహులు భార్య నిబ్బరంగా అంటుంది - “నేననేదీ అదే-” అని!
కోడూరి తీరామమూరి ==
- అనవసర అనుమానంతో నిప్పుతాక్కిన కోతిలా చిందులేస్తున్న భర్తతో వాదులాదకుండా సునాయాసంగా అతడి నోరును మూయించిన కామేశ్వరి గదుసుదనాన్ని ఈ కథలో చదివి ముసిముసి నవ్వుల నవ్వుకోకుండా ఉండలేం. ఈ కథను గురించి చెబుతూ రా.రా. *-ప్రతికూల పరిస్థితుల్లో ఉదరనిమిత్తం మనుషుల సర్దుకుపోతారనే జీవితసత్యం ఈ కధ లక్ష్యం” అని రాసుకున్నారు.
“మారేలోకం' కథలోని సబ్ఇన్స్పెక్టర్ కూడా (బ్రతుకుతెరువుకోసం పరిస్థితులతో రాజీపడినవాడే. ఉద్యోగంలో చేరిన కొత్తలో - తన చుట్టూ వున్న కల్మష వాతావరణం పట్ల విముఖతతో “ఈ ఉద్యోగం చెయ్యడం కంటే బిచ్చమెత్తుకోవడమే మేలు. నిజంగా మానమర్యాదలు వున్నవాడెవడూ ఈ ఉద్యోగం చెయ్యలేడు” అన్న సబ్ఇన్స్పెక్టర్ రామమూర్తి - మూడేళ్లు ఆ ఉద్యోగం చేసి డబ్బురుచి మరిగేసరికి 'మేన్‌ఈటర్”గా ఎలా మారిపోయాడో, క్ర కథ చెబుతుంది. ధన పిశాచికి మనిషి తొత్తుగామారి,
విలువల్ని సమూలంగా నాశనం చేసుకున్న ఉదంతమది. ఇందులో సర్దుబాటు కంటే స్వార్ధం పాలే ఎక్కువ, “ఉదర నిమిత్తం), 'మారేలోకం' కథలు - ఒకే విషయానికి సంబంధించిన బొమ్మా బొరుసులను మనసుకు హత్తుకునే రీతిలో మనముందు ఉంచుతాయి. రా.రా. కథల్లో 'అలసిన గుండెలు కధకు ఒక ప్రత్యేకత ఉంది. “దారిద్ర్య బాధచేత అలసిపోయిన హృదయాలను చిత్రించడం ఈ కధానిక లక్ష్యం. బీదరికంలో (శ్రమజీవులు యెన్ని కష్టాలు పడినా వాళ్ల గుండెలు అలసిపోవు. మధ్యతరగతి మనుషుల గుండెలే అలా అలసిపోగలవు” అని చెబుతారు రా.రా. - తాను రచించిన ఈ రా.రా. కథలు రాసే రోజుల్లో (60లలో) దిగువ మధ్యతరగతికి చెందిన బీద బడిపంతుళ్ల సంసారాల్లోని దారిద్ర్యాన్ని చెప్పేకథలు ఎక్కువ సంఖ్యలో వచ్చేవి. వాళ్ల దారిద్ర్యానికున్న అనేకానేక కారణాల్లో కుచేల సంతానం ఒక ముఖ్యకారణం. ఈ కథ ఇతివృత్తంలో ఆ విషయం కేంద్రబిందువుగా వున్నది.
ఈ విషయం ఇలా ఉండగా, - ఈ కధ మరో విషయాన్ని కూడా ప్రస్తావిస్తుంది. మనకున్న శతకోటి దేవుళ్లకు జనం ముడుపులు కట్టేటప్పుడు - తమకు ఫలానా పనిచేసి పెట్టమని కోరడం సహజం. కాని, ఈ కధలోని ఇల్లాలు దేముణ్ని ఫలానా పని జరక్కుండా ఉండేటట్టు చూడమని ప్రార్థిస్తుంది ! అందుకు ముడుపు కడదా
మై తెలుగు కథ - నాడు,నేడు మనుకుంది పిల్లలు పుట్టే వరాలు ఇచ్చేవాడు దేవుడే అయితే, - ఇచ్చిన వరాలు చౌలు మవోప్రభూ ఇక వరాలు ఇవ్వడం మానేయి అని దేముణ్జి ప్రార్ధించడంలో లాజిక్ లేకుండా ఎలా ఉంటుంది? నిజానికి ఆ ఇల్లాలి లాజిక్ వెనుక మరొక కారణం కూడా ఉంది. వాళ్ల పొరుగున ఉన్న ధనికులకు ఇన్‌కంటాక్స్ సమస్య వచ్చిపడితే - టాక్స్ పదకుండా చెయ్యమని వాళ్లు దేవుడికి ముదుపు కట్టుకున్నారు. దేముడు 'ఒబ్లయిజ్ చేసి, - వాళ్లకు ఆదాయపు పన్ను బెడద లేకుండా చేశాడు |! దబ్బున్నవాళ్లకు టాక్స్ పడకుండా చెయ్యగలిగిన దేవుడు బీద పంతుళ్ల ఇళ్లల్లో సంతాన నరాల వర్షం కురవకుందా చెయ్యలేదా? - అయితే,- అనుభవజ్ఞుడయిన ఆమె భర్త మాత్రం “పిచ్చిదానా ! మన దేవుళ్లకు యివ్వడమే చేతనవునుగాని ఇవ్వకుండా ఉండడం చేతకాదు అంటాడు ! (శాపాల్లాంటి వరాలా? వరాల్లాంటి శాపాలా?)
ఈ విషయానికి సంబంధించిన వ్యంగ్యవైభవం ఎలా ఉన్నాా ఒకేనెలలో ఇద్దరు కన్నబిడ్డలు చనిపోతే - కడుపుకోతతో ఏడవాలో వాళ్లకు తిండిపెట్టే బరువు తగ్గిందని సంతోషించాలో తెలియని ఓ ఇల్లాలి వ్యధను ఈ కథలో చదవడం ఓ మరిచిపోలేని అనుభవం (ఈ కధను రా.రా గారు 1958లో రాసేనాటికి మనదేశంలో కుటుంబ నియంత్రణ విధానానికి సంబంధించిన ప్రచారం పుంజుకోలేదు. ఆ విధమైన శస్త్రచికిత్సలు కూడా ఎక్కువగా కూడా జరుగుతూ ఉండేవి కొవు. అట్లాంటప్పుడు రాయబడిన ఈ కధకు మరింత ప్రత్యేకత వుందనే విషయాన్ని కూడా గమనించాల్సి ఉంది
రా.రా కధల గురించి చెప్పేటప్పుడు 'కావ్యచితి కథగురించి కూడా ప్రస్తావించవలసి ఉంది. (ఇది కూడా పెద్ద కథే. ఇది “అలసిన గుండెలు కథల సంపుటిలో లేదు) గురజాడ తన డైరీలో రాసుకున్న 11400౧7299 2౧ 119౧60/ 2౧6 ర6౧6?065 అనే సూక్తికి అక్షరరూపం ఈ కథలో కనబడుతుంది. ఏ విషయంలోనయినా మంచీ చెడుల మధ్యగల గీత ఎంత సన్నగా ఉంటుందో చెప్పే కధ ఇది. ఈ కధను రా.రా. గురజాడ వారికే అంకితం ఇచ్చారు. త్రాగని వారందరూ పుణ్యాత్ములు కానట్టే - త్రాగేవారందరూ చెడ్డవాళ్లు కాదనీ, నిజానికి మనిషిలోని మంచితనం, స్నేహశీలం, త్రాగినప్పుడు మరింత బయటపడేందుకు అవకాశం ఉందనీ, ఈ కథ ఆసక్తికరంగా చెబుతుంది!- అంతేకాదు, - “మద్యంలో మీకు
ఆనందం లభిస్తే తాగండి కాని, త్రాగుడుకు మనిషి బానిస కాకూడదు” అంటూ ఈ
కోడూరి శ్రీరామమూర్తి మావ కథలోని చిత్ర తన భర్త శ్రీపతితో అన్నమాటలను కూడా ఈ కధకు సంబంధించిన మరొక ముఖ్యమైన అంశంగా గమనించవలసి ఉంది. విమర్శకుడుగా రారా. ఎంత నిర్మాహమాటస్తుడో - తాను చెప్పదలచిన విషయాన్ని కుండబ్రద్దలు కొట్టినట్టు కధల్లో ఆవిష్కరించే విషయంలో కూడా ఆయన అంత నిర్మాహమాటంగా ఉంటారు. “- స్ర్రీలోలతను వ్యసనంగా చెప్పింది పురుషాధిక్యం గల సమాజం. అదే స్రీ ఆధిక్యం గల సమాజం అయితే వెలదిస్థానంలో పురుషుడు ఉండేవాడు. పురుషలౌల్యం ప్రధమవ్యసనం అని ఆడరుషులూ, ఆడకవులూ చెప్పిఉందేవాళ్లు ౮ అని కధలో (కావ్యచిత్ర) చెప్పేందుకు ఆయన ఎలా సందేహించడో
- “నోబుల్ బహువతీ, ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన మదర్ధెరిసా కుటుంబనియంత్రణ పద్ధతులు అవలంబించడం పాపమనీ, దైవద్రోహమనీ వాదిస్తున్నది. బీద జనాభా తగ్గితే తనలాంటి వాళ్లు నిరుద్యోగులవుతారని భయమేమో ఆమెకు-” అని వ్యాసంలో (కధానికా, దాని శిల్చమూ' - వ్యాసంలో) రాసేందుకు కూడా ఆయన వెనుకాడడు! ఈ నిర్మాహమాటము, నిర్భీతి వలన ఆయన రచనలకొక ప్రత్యేకత సమకూరిందని నా అభిప్రాయం,
గోర్కీలాగానే రా.రా.కు.అన్ని ఆలోచనలకన్నా మనిషి ముఖ్యం మనిషి మనుగడ ముఖ్యం. లేకుంటే - ఆయన మృత్యుముఖంలో వున్న ఒక రోగిష్టి బాలికలో దేవకన్యను చూడగలిగిన యువకుడి కధను రాయగలిగి ఉండేవాడు కాదు. (దేశంలో దేవకన్యలు కథలో అంతేకాదు “దేశ్రల్రో రోగులు ఉన్నారు. మందులూ ఉన్నాయి. డాక్టర్లు ఉన్నారు. వాళ్లెరికీ స్వాతంత్ర్యం లేదు. - అందరినీ శాసించే హక్కు డబ్బుకు ఉంది-” (దేశంలో దేవకన్యలు) అంటూ ఆవేదన చెంది, ధనస్వామ్య వ్యవస్థ కదింధహస్తాల నుండి మనిష్ని బయటపడి ఉన్నత మానవతా విలువలతో మనుగడ నాగించాలని తపన చెందేవాడు కాదు.
1988 నాటికే దేశంలో సాహిత్యంలో పెచ్చుపెరిగిపోతున్న వాజిజ్యవిలువలను ఆయన ఈసడించుకున్నాడు. “-వ్యాపార పత్రికల ఉక్కుకౌగిట్లో చిక్కి కధానిక రూపురేఖలే కోల్పోయి, శల్యావశిష్టంగా బ్రతుకుతున్నది. కథానికకు కాలక్షేపమే పరమాశయమై పోయింది. అది దురభిరుచులను ప్రోత్సహించే సాధనమైంది- ఈ దుష్పరిణామాన్ని ఎదిరించాలని” కోరుకున్నాడు.
నవతరం పాఠకులు - ముఖ్యంగా యువకులు మంచి సాహిత్యాన్ని చదవడం
మూ తెలుగు కథ - నాడు,నేడు అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే రా.రా. ఆశయం నెరవేరుతుంది. నేటితరం పారకులు రారా కధలు చదవాల్సిన అవసరం ఉంది. అంతకుమించి ఆ కథల సంపుటికి అనుబంధంగా ఆయన *“కథానికా, దాని శిల్పమూ' - అనే పేరుతో రాసిన 48 పేజీల బృహత్ వ్యాసం తప్పనిసరిగా చదవాల్సి ఉంది. ఆ వ్యాసంలో ఆయన కథానికా శిల్చ్పరహస్యాలను అత్యంత సరళంగా విడమరిచి చెప్పడం మాత్రమే కాకుండా
- శిల్పపరంగా తన కధలను తానే విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ వ్యాసంలో రా.రా. చేసిన వ్యాఖ్యలు పాఠకులకు, విమర్శకులకు, ఆమోదయోగ్యంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కాని, చదవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఈ విషయం ఆయన రచనలన్నింటి విషయంలోనూ వాస్తవం.
రా.రా. మరణించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన రచనలన్నీ పునర్ముద్రింపబడి నేటితరం పారకులకు అందుబాటులోనికి రాగలవని ఆశిద్దాం.
(ప్రజాసాహితి - మార్చి 99 సంచికలో - రా.రా. సంస్మరణ సందర్భంగా)
చషపననననన2డనననననన22 2222 కోడూరి శ్రీరామమూర్తి ౨2272 ఓ మంచి కథకుడి గురించి...
పూసపాటి సూర్యవెంకట కృష్ణంరాజు గారిని నేను ఎరగను. ఒకే ఒకృసారి
- వారు చనిపోవడానికి కొద్దికాలం ముందు ఒక సభలో ఆయనను చూశాను.
అయితే, - ఆయన కథల్ని నేను చాలా కాలంగా ఎరుగుదును, 'దివాణం సేరీ వేట “రెండు బంట్లు పోయాయి' వంటి గొప్పకధలు రాసిన కధకుడుగా ఆయన నాకు సుపరిచితుడు. ఆత్మీయుడు. ఆ పరిచయంతోనే - ఆయన సంస్కరణకు ఈ చిన్న పలవరింపు.
“-మనం చదివిన కథ పారకుజ్తి నిద్రనుండి లేపగలిగిందా? - ఆశ్చర్యచకితుణ్ని చెయ్యగలిగింద్రా? _ ఆనందింప చెయ్యగలిగిందా? _ నిజజీవితంలో ఆనుభవంలోకి వచ్చిన సంఘటనకంటే ఎక్కువగా ఆకట్టుకోగలిగిందా? - అంటూ మంచి కథకు ఉండాల్సిన మంచి లక్షణాల గురించి చెహోవ్ చెప్పాడు. ఆ లక్షణాలు అన్నీ కాకషో్సునా _ కొంతవరకూ కృష్ణంరాజుగారి కథల్లో కనబడతాయి. హాయిగా చదివింపడ్లేస్తూ - కొంత ఆలోచింపజేసి, వ్యంగ్య చమత్కృతితో చురుక్కునునిపింపజేసే కథలంటే నాకు ఇష్టం. కృష్ణంరాజుగారికధలు నాకు నచ్చడానికి ఇది కూడా ఒక ముఖ్యకారణం, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్తిగారిలా ఆయనవి నవలల్గ్లాంటి కథలు కావు. కధకు సంబంధించి - పెద్దదీ, మరీ చిన్నది గాని ౦0౧౯౪౫ నిడివికి వీరి కథలను కూడా ఉదాహరణగా చెప్పవచ్చు
శోతియ (బ్రాహ్మణ కుటుంబాల్లోని బూజుపట్లి ఆచారాలను గురజాడ తన రచనళ్లో ఎలా గేలిచేశారో, - కృష్ణంరాజుగారు తమ కథల్లో విజయనగరం [ప్రాంత క్షతియ కుటుంబాల్లో - డాంబికం ముసుగులో ఉన్న 'అసలు కథను తన కథల్లో అలా హేళన చేశారు. ఫ్యూడల్ వ్యవస్థ అవశేషాలుగా మిగిలిన క్షత్రియ జమీందారీ కుటుంబాల్లోని డాబు దర్చాలను గేలిచేస్తూ - కృష్ణంరాజుగారిలా అంతకుముందు
కథలు రాసినవారు లేరు
మ తెలుగు కథ - నాడు,నేడు ఇక్కడ ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. జమీందారీలు రద్దు అయినాక సిరిసంపదలు పోయినప్పటికీ, మీసాలకు సంపెంగ నూనె రాయడం మానుకోలేని వెనుకటితరం పెద్దలు మారుతున్న పరిస్థితులకు ఇమడలేక అవస్థపడ్డారంటే అర్ధం చేసుకోగలం. కానీ కొత్తతరానికి చెందిన చిన్నరాజులు కూడా పాతపాటే పాడుకుంటూ వెనకడుగులు వేస్తూ ఉండటం - వెనుకటి తరంవారికి ఉన్న ఇంగితజ్ఞానం కూడా వీరికి లేకపోవడం విశేషం. ఈ పరిస్థితిని కథకుడుగా కృష్ణంరాజుగారు బాగా గమనించారనిపిస్తుంది. ఈ పరిస్థితి ఇవాళ లేకపోవచ్చు. కాని, - మూడునాలుగు దశాబ్దాల క్రితం కృష్ణంరాజుగారు కథలు రాసేనాటికి స్థితి ఇది. మాటవరుసకు - కలిదిండి నీలాద్రిరాజుగారు సుపుత్రుడు వరహాలరాజు 'ఎమ్.ఎ.'నే తీసుకుందాం. (రెండుబంట్లు పోయాయి? కథలో-) చెట్మాసోట' జరీపాగా ధరించి పెటోమాక్సులైట్ల వెలుగులో పెళ్లికాడుకుగా క్షత్రియ రాజకీవితో వెలిగిపోవడం వరకూ, “సంప్రదాయం” అనే మాటను తన అవసరం కోసం పదేపదే పలికేంతవరకూ, అతడు సంప్రదాయాన్ని పాటించి ఉండవచ్చు. కాని - పెళ్ళికుమార్తె తండ్రి కట్పంగా ఇవ్వవలసిన నగదు సకాలంలో దాఖలు చెయ్యలేకపోతే - పీటల మీదనించి లేచిపోయి పదిమందిలో నానారభసా చేసి - తన రాజకీవిని కాక చిన్నబుద్ధిని మాత్రమే చూపించుకున్నాడు ! “ఎందుకు తొందరపడతావు బాబూ-” అని అతడి బంధువయిన ముసలిరాజు సర్దిచెప్పబతే “-తమరు కొంచెం నోరు ముయ్యించండి అనగలిగిన మర్యాదస్తుడతదు. ఇదంతా చూస్తున్న తాతగారు “-పెళ్లికుమారుడు పీటలమీద కూర్చుని నోరు కదపడమా !- హద్దూ పద్దూ లేనట్టుంది. పైగా సాంప్రదాయం అంటాడు. చదువుకున్నాట్ట చదువు. ఎందుకూ -? నామోషీ 1-” అని బాధవద్దారంటే పడరూమరి? - వ్యవహారం ఇలా నడుస్తూ ఉండగా పెళ్ళికూతురు పినతండ్రి జోక్యం కలిగించుకుని దౌర్జన్యంగా పెళ్ళికుమారుడిని పెళ్ళిపీటల మీద కూర్చొనబెట్టినా- పెళ్ళికూతురు ఇలాంటి మొగుడు నాకక్కరలేదని సర్వవిధాలా యోగ్యుడయిన శంకరాన్ని ఆదే ముహూర్తానికి కట్టుకున్నప్తుడు చదరంగ ప్రియుడయిన తొతగారు “ఈ ఎత్తు మరీ పసందుగా ఉంది-” అని మురిసిపోలేదూ? - ఈ కథ అంతా ఒక ఎత్తూ - పెళ్ళి నుండి తిరిగి వచ్చేటప్పుడు తాతగారు. తమ (చదరంగ) బలగంలో 'లెండు ౭ంట్లు ఎక్కడో జారిపోయాయని” గొణుక్కోవడం మరొక ఎత్తూనూ.' ఒకనాడు లాజులుగా వెలిగిన రాజులు కుహనా విలువలతో పరువు, మర్యాదలను కోల్పోతూంటే వేనుకటితరం ఆనందించగలదా? పోయిన ఆ 'రెండుబంట్లూ తిరిగివస్తాయా?-.
కోడూరి శ్రీరామమూర్తి వు ఇదే వ్యంగ్య వైభవం కృష్ణంరాజుగారి “దివాణం సేరీవేటొ కధలో కూడా కన బడుతుంది ఈ కధలోని రాంభద్రరాజుగారు వేటలో ఆరితేరిన చెయ్యి. చినరాజులందరికీ ఆయన భీష్ముడు ఆయన పూనుకుని తుప్పుపట్టిన ఈటెలను దులిపించి వేట తర్భీదు ఇచ్చాడు. ఆ శిక్షణ ఫలితం చినరాజులు చేసిన అడవిపంది వేట. ఆ పందిని చూడగానే రామభద్రరాజుగారు “బొత్తిగా పరిగలాగా అనిపిస్తుంది బాబూ. . కాళ్లు కురచగా వున్నాయి” అంటూ సందేహాలు వ్యక్తం చేశారుగానీ, - చినరాజులు ఏవేవో సమర్ధనలు చెప్పుకొచ్చారు. చివరకు పందిని కోశారు వాటాలు వేశారు. అడవిపంది మాంసం తిన్నామన్న తృప్తితో రాజులు భోజనం చేశారు. ఆ తర్వాత తెలిసింది అసలు కథ. చినరాజులు ఘనకార్యంచేసి తెచ్చింది 'చంద్రాయ” పెంచుకుంటున్న జిగినీ పంది అని ! గరువు దగ్గిర చిక్కుపడ్డ జిగినీ పందిని చూచి అదే అడవి పంది అని భావించి చినరాజులు పొడుచుకొచ్చారు. రాజులందరూ ఆ విందు ఆరగించారు. ఇప్పుడు చంద్రాయ వచ్చి తన పంది దబ్బులు అడిగితే తమ అహం నిలుపుకోడానికి ఓ లెంపకాయ కొట్టినా వాదడిగిన డబ్బులు ఇవ్వక తప్పుతుందా? - ఇదంతా విన్న రామభద్రరాజుగారు “రాచపుట్టుక పుట్టి ఊరపందిని తిన్నారు. పొండి వెధవ నాగమ్మలు” అని ఊసురుమనడంలో కంటే - “సిన్రాజుల సేరీవేట జిగినీ పందికాకపోతే అడవిపంది అవుతాదేటే?” - అంటూ హాస్యం ఆడిన నరశి మాటల్లోనే వుంది అసలు కథ. పులిని చూచి నక్కవాతబెట్టుకోవడం లాంటిది చినరాజుల వేట ఆర్భాటం. వారు పట్టుకుని వేళ్ళాడుతున్న విలువలు కూడా జిగినీ పంది.వంటివే అనేది ధ్వని. కృష్ణంరాజుగారి కథల్లోవున్న ప్రత్యేకత - సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించడం. చినరాజులు వేటలో పొడుచుకుని వచ్చిన పందిని చూడాలని వచ్చిన జనసందోహాన్ని వర్ణించినా, రాజుల పెళ్ళి మర్యాదలు వర్ణించినా, ఆఖరికి స్మశానంలో సీతాలు జడవడం సన్నివేశాన్ని వర్ణించినా, అంకాకళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అయితే - ఏక్ష్మడ్షా సన్నివేశ వర్ణన మోతాదు మించదు. కధ అనేది అగ్గిపుల్లలతో కట్టిన మేడ అయిత్తే _- ఒక్క అగ్గిపుల్ల కూడా ఎక్కువకాకుండా 8812006 ను పాటించిన కథాశిల్చీ ఆయన, తప్పుడు విలువలు, మూఢనమ్మకాలు, చెయ్యగల ప్రమాదాన్ని తెలియజెప్పడం కూడా కథకుడిగా తన బాధ్యత అని రాజుగారు భావించారనిపిస్తుంది. - మాజీ జమీందారులయినా, సామాన్యులయినా, అందరి విషయంలోనూ ఇది వాస్తవం.
ఎద్సీత్రాలు జదుపడ్డది” కధనే తీసుకుందాం. “వండిన గింజలు దాచుకుని ఎప్పుడూ కమ్మని వరికూడు తింటూ - ఊళ్ళో అవుననిపించుకుని గోడుగా బతుక్కొస్తున్న సీత్రాపురం నాయురాలు సీతాలు - ఆమె భర్త సిరిపురం బుట్టెడు, అతని బావమరదులు, అందరూ కలిసి సుఖంగా బ్రతక్కుండా బ్రతుకులు స్మశానం పాలు కావడానికి కారణం ఈ మూధనమ్మకాలే కాదూ ? -
మనిషిని పీక్కుతినే ఇలాంటి “దెయ్యాలు” వదిలిపోవాలని కథకుడుగా రాజుగారు కోరుకున్నారు. మనిషి ముందుకు మాత్రమే నడవాలనీ, వెనక్కు నడవకూడదనే తపన
ఆయన కధల్లో స్పష్టంగా కనబడుతుంది. చక్కని కథాశిల్బ్పంతో రూపొందించబడిన ఆయన కథలు ఈ తపనకే అద్దం పదతాయి. ఒక కధకుణ్ణి మంచి కథకుడుగా పేర్కొనడానికి ఇంతకుమించిన అర్హతలు
అవసరం లేదనుకుంటాను. (ఫిబ్రవరి 1995- “ప్రజాసాహితి” సంచికలో ప్రచురితం - పూసపాటి కృష్ణంరాజు 'శంస్మరణ సందర్భంగా-) వ?
190 “= వెనుక చూచిన కార్యమేమోయి మంచిగతమున కొంచెమేనోయి మందగించక ముందు అఆదుగేయి వెనుకబడితే వెనుకేనోయి-” = గురజాద (దేశభక్తి కవితలో-) రడరయ్య (గై లైనా ళ్ళి కో ణా మ
5౬06౮ గష!114 - సగ౦౮, [1౬౯0౮6 ద కంర6గ 5101202 100100 శ్రీరామమూర్తిగారి రచనలలో ఒక పదును, ఒక పారదర్శకత, ఒక పాటవం, ఉంటాయి. ఏ క్రొత్త విషయాన్నయినా పాతదిగా చేసుకునిగాని దాని గురించి రచించరు. ఇ
- సంజీవదేవ్ (వెలుగు-వెన్నెల” వ్యాససంపుటి ముందుమాటలో) సాహిత్యవిమర్శకుడుగా, రచయితగా, / 1. లిటరరీ కాలమిన్స్గా, సాహితీలోకానికి | శిఖీ ్ | సుపరిచితులయిన శ్రీ కోడూరి శ్రీరామమూర్తి మ! కొందరు ప్రముఖ కథకుల రచనా ధోరణులపై, ఇవ. సమకాలీన కథాసొాహితీ వాతావరణంపై,- ల్ టి నాటి,నేటి కథలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు - / చేసిన విశ్లేషణలు, - వెరశి పన్నెండు వ్యాసాల సమాహారం ఈ పుస్తకం | . ఆధునిక వఛన రచయితలపై స్పష్టమైన అభిప్రాయాలు, అవగాహన, . ఏర్పరుచుకోదలచినవారికి శ్రీరామమూర్తిగారి వుస్తకం చక్కగా ఉపకరిస్తుంది. . నండూరి రామమోహనరావు (“వెలుగు-వెన్నెల” వ్యాససంపుటి సమిక్షలో- 'ఆంధ్రజ్యోతి'దినపత్రిక-1986) నగ౧౦౭: గక. 100/- ౮.5.$10