Telugu swecha bharatham - anilvaranasi/indianlanguages GitHub Wiki

| స్క =; ' సహజకవి మల్లెమాల . లు. ళో 'త( ఓ ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానులకోసం | త క్‌ ం/ స్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి / వట శ క జు! ఆనందంతో బహూకరిస్తున్నాం. జ లా న్‌ -మల్లెమాలకుటుంబం , (| జ శి | రి “ | (3. | ఈ ' ] క సం శభ ఓ ఫి . | , చే ఇ ఇ టీ స్తే ఖీ! ॥ | స ఫ్‌ 1 రక శ. (టై ల నే ర్ట ము ఏ ౪. స భాట్టం శ్రీరామమూర్తి జ స్వయచరిత్ర ఛో ళా శ / గ్‌ ఖీ

భాట్లం శ్రీరామమూర్తి స్వేయ చరిత్ర లో స్పాబ్బా భారతం తెలుగు సమితి

రత ౩ర్ధం 6% ర 0 కాగే 'స్వేచ్భాభా | హి క? న్ను

భాట్టం శ్రీరామమూర్తి స్వీయచరిత్ర ఆలీ

సంపొదకులు : డా॥ డి.చంద్రశేఖరరెడ్డి

ముద్రణ

సెప్టెంబర్‌, 2009

వెల : రూ.150/- వయ వ

అ ఇకనీ న న్న ట్‌ ష్‌ ళ్‌ జో

ప్రింటర్స్‌ : గ ధి | |

సాయిలిఖిత ప్రింటర్స్‌ (

హైదరాబాద్‌. ల

ప్రచురణ

తెలుగు సమితి

హైదరాబాద్‌.

ప్రతులకు :

సూర్యారావు పేట, విజయవాడ-520 002

ఫోన్స్‌ 2 0866-2486643, 98499 92890

దోమలగూడ, హైదరాబాద్‌ - 500 029

ఫోన్‌ : 040-23264092, ఫ్యాక్స్‌: 040-23264028

అణ: లుజం౦050010ు అ2100.00100, ౪74.6%65000001ఏ.0002

భగవాన్‌ బాబావారికి

అంకితం

న్‌ నా తల్లీ తంట్సే ఎరరో నా గుతురు - సైైం, బ్వరో నాకు తోడూ - నీడ్మా ఆరో ఆ దేయ్యేదు _ స్ప్మగ్రాయి ద్యేని టో చరీల్టొతీ రిందొం చెంత, నౌ జ్‌ యాత్త్రక్పు అద్దీం గ్గ! 'స్పీచ్భాభారతం” అన్నీ సద్సీంథం '్త పుఫట్తుర్రో లంటుం చేసుకుంటున్న

(న (

భక్తఫయాభుళ. 20)జై0 క్కు

64 లల్ల

జీవననాదం వేదం నీవే! బాబా! నీ ముంగిట్లో ముల్లోకాలను తేజోవంతం చేసే హరివిల్లుల రంగవల్లులున్నాయి! సుందర ప్రశాంత మందిర సౌరభాలున్నాయి అందాల విందులున్నాయి; ఆనంద తరంగాలున్నాయి! బాబా! _ నీ గుప్పిట్లో లక్షనక్షత్రాల కాంతులున్నాయి; రతనాల రాసులున్నాయి భక్తవరులను కాపాడే వరదాన వైభవాలున్నాయి! నీ చూపుల్లో చంద్రబింబాల చలువలున్నాయి; పున్నమి వెన్నెల వన్నైలున్నాయి! నీ దరహాసంలో మధుమాసాల విలాసాలున్నాయి; అమృత బిందువుల చిందులున్నాయి! నీ పలుకుల్లో పారిజాతాల పరిమళాలున్నాయి; (పేమ తరంగాల తురంగాలున్నాయి! నీ గొంతులో వేణుగానం ఉంది; తుంబురనాదం ఉంది, విశ్వమోహన రాగం ఉంది అనురాగం ఉంది! బాబా! నీ మధుర వాక్ళులే మాకు వేదవాక్కులు! బుక్కులు! నీ పలుకే పరుసవేది; నీ చూపే చింతామణి! నీ కరమే కల్పద్రుమం; నీ స్వరమే సంజీవిని! బాబా! నీవు లోకాతీత శక్తుల విజేతవు! శాంతి సామరస్యాల సంధాతవు! నవజీవన ప్రదాతవు! విధాతవు! మాతవు! భ్రాతవు! మా జీవననాదం - వేదం నీవే! నీవే మా సర్వస్వం - మా సర్వస్వం నీవే! నీవే! న. లైల త్స గకతలలే కన

జీవన సాఫల్యానికి స్ఫూర్తిదాతలు గరగ! సా మా ళా గ్లగో? న వ న క. గ | పూజ్య బాపూజీ మళ టన నా మడతలు క్షే రాణ కాజలాయాయయై ర్‌ | (1. న ఫా... హయాం, (మ లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ దాః రామ్‌మనోహర్‌ లోహియా

విజయీ భవ విజయీభవ, విజయీభవ, విశాలాంధ్రజననీ ప్రజలంతా సుఖాలతో బ్రతుకంతా మననీ ఏనాడో నలుమూలల ఏలినావు తల్లీ తొలిప్రొద్దుల సంపదలో తేలినావు తల్లీ భరతభూమి కెల్లనాడు నీవె కల్పవల్లి ఆ కలిమీ - ఆ బలిమీ - నేడు చూపుమళ్లీ జీవనదుల తోయముతో నీ చేనులు పండనీ పంటలతో పశువులతో నాదంతా నిండనీ నీ పాపలు - నీ పిల్లలు కలకాలము నవ్వనీ ఆగక కొనసాగుము అమ్మా! ఆంధ్రావనీ! భుజబలమూ - బుద్ధి బలము నిజ పుత్రులకిమ్మా విజయములో వినయముతో మేముండెదమమ్మా! నీ పేరును ప్రపంచాన నిలిపెదమోయమ్మా మా రాష్ట్రము దేశానికి తలమానికమమ్మా! = అరుద్ర ఆంధ్రరాష్ట్రంలో అగ్రశేజిలో నిలిచిన ప్రచురణ సంస్థ ఎమెస్కో వివిధ రంగాలలో నిష్ణాతులు లబ్ధ ప్రతిష్ణుతులు అయిన తెలుగు వెలుగుల జీవిత చరిత్రలతో పాటు చారిత్రిక, సాంస్కృతిక రంగాలకు చెందిన అద్వితీయ గ్రంథాలనేకం ముద్రించి అపూర్వ సేవలందించి చరిత్ర ప్రసిద్ధమైంది. (ప్రేమాస్పదులు - ఉదార చరితులు, సౌజన్యమూర్తి

  • వితరణ శీలి అయిన ఎమెస్కో అధినేత శ్రీ డి. విజయకుమార్‌ గారి చొరవతో - ఈ (గ్రంథం వేగంగా సర్వాంగ సుందరంగా ముద్రించబడింది. వారికి నా సుమనస్సుల నమస్సులు. గ్రంథాన్ని పరిష్కరించిన మాన్యత్రీ డి. చంద్రశేఖర రెడ్డిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అచ్చుప్రతిని తయారు చేసిన శ్రీ బి. సూర్యనారాయణ మాస్టరుగారికి, విజయగారికి నా ధన్యవాదాలు. అందంగా తీర్చిదిద్దిన వురుషోత్త్‌ కుమార్‌కి నా అభినందనలు. - భాట్టం శ్రీరామమూర్తి

విషయ సూచిక... 1 పుట్టుపూర్వోత్తరాలు 13 2 _ విజయనగరం విజ్ఞాన వీచికలు ఎ 19 3 _ దేశభవితవ్యంపై ఆరాటం 238 4 నిద్దరలో కూడా స్వతంత్ర పోరాటాల గురించి ఆరాటమే . 30 5 _ స్వాతంత్ర సమర ధ్యేయాలు ం. తి6 6 జయప్రకాష్‌ జైత్రయాత్ర ఎ ౩9 7 స్వాతంత్ర్య భానూాదయం ఎ డర్‌ 8 మనసులు కలిసిన శుభవేళ! కీర 9 _ చదువులకు గుడ్‌బై - ఛలో రాజమండ్రి ఎం క్‌కి 10 పూజ్యబాపూజీ ఆత్మ బలిదానం 61 11 పత్రికారంగంపై తరగని వ్యామోహం ల. 64 1లి ఉద్యోగపర్వం ంం 68 13 సోంపేట 5.0 ఉపదేశ సారం లం 71 14 హరిపురం డాక్టరు ఆగమనం క్త 15 రాజీనామా చెయ! రోజులు మారుతాయి ౯6 16 మాది విశ్వకుటుంబం 80 17 పి.వి.జి. రాజు విచిత్ర వైఖరి ఎ రిక్‌ 18 పి.వి. గిరి - తెన్నేటి గారలు ఖతం 91 19 పి.వి.జి రాజు నిరాదరణ - రైతు అరణ్యరోదన య. 20 పి.వి.జి గరం గరం కోట గుమ్మం తొక్కం ఎం. 98 21 అమరజీవి త్యాగం - వివిధ విభజనోద్యమాలు ఎ 102 22 _ పార్టీలో చీలికలు ఎ 105 23 రాజకీయ పాఠశాల లోహియా బోధనలు 108 24 అసెంబ్లీ అనుభవాలు ల 115 25 పగబట్టిన పి.వి.జి రాజు 123

26 విజయనగర కురుక్షేత్ర సంగ్రామం ఎ 126 27 _ బ్రహ్మానందరెడ్డి చూపిన పుత్రవాత్సల్యం 130 28 జిల్లా పరిషత్తు ఎన్నికల పూర్వరంగం ఎ 140 29 సంజీవరెడ్డి ప్రేమానురాగాలు కేడీ? 30 ముఖ్యమంత్రుల రాక ల. 161 31 అశయాల హరివిల్లు ఎం. 168 32 పరవాడ నియోజకవర్గంలో నాపనితీరు ల. కడ ౩8 అయ్యపురెడ్డి పిలుపు నా జీవితంలోతు ల కేరి 84 పార్లమెంటు ప్రసంగాల సంక్షిప్త వివరాలు ల. కేరిక తక్‌ ఇళ్లకు కరువా? = 196 86 వివాహ వైభోగాలు - (మంత్రి కొడుకు పెళ్లికి ఆహ్వాన పత్రికల్లేవు!) 202 ౩7 పి.వి. సుపరిపాలన - ప్రత్యే రాష్రోద్యమం 206 38 ప్రత్యేక ఆంధ్రోద్యమము ం. 222 89 జలగం పాలనలో ప్రగతి - సుగతి 229 40 దివిసీమలో ఉప్పెన - మండలి అవిరళసేవ ఎ. 251 41 విశాఖజిల్లా వరదల్లో సాహసకృత్యాలు 258 42 చెన్నారెడ్డి హయాంలో ప్రజాపాలన ఎ 259 438 రోశయ్య విజయరహస్యం 264 కశ అంజయ్య ఆలనా పాలనా 267 ఉర్‌ హరిజనోద్ధరణ - లక్ష్య లక్షణాలు 276 46 పదవుల విరమణ, జీవిత పరమార్థాలు - సంస్మరణ _ .. 280 47 శ్రీ సత్యసాయి భగవానుని దివ్యదర్శనం ల. 284 48 అపూర్వ సహోదరుల మైత్రీ బంధం - ప్రపంచ తెలుగు మహాసభల అనుబంధం ఐ. 293 శ9 ఆత్మావలోకనం 297 50 చిత్రమాలిక ఒం. 301

ఆదర్శ జీవితం “యద్యదా చరతి శ్రేష్ట న్తత్త దే వేతరోజను”

గొప్పవారి ఆచరణల్నే అందరూ అనుసరిస్తారు. సమాజానికి బాధ్యులైన వారు ఆదర్శంగా నడుచుకోవాలని ఈ ఆర్యోక్తి పరమార్ధం.

“యథా రాజా తథా ప్రజా” (ఎలాంటి రాజో, అలాంటి ప్రజలు) అంటే మార్గదర్శకులుగా ఉండవలసిన వారి పోకడల్ని బట్టే ప్రజల నడవడి ఉంటుంది.

నేడు రాజులు లేరు. రాజ్యాలు లేవు. వారి స్థానంలో ప్రజల చేత ఎన్నుకోబడుతున్న ప్రజా పాలకులు వచ్చారు. తాము ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల జీవితాదర్శాలే సమాజునికి మార్గదర్శకాలు. అందుకే గాంధీ మహాత్ముడు ఉన్నత రాజకీయ నైతిక విలువలకు ్రాధాన్యమిచ్చాడు. “నాజీవితమే నా సందేశం” అన్నాడు. ఆనాడు గాంధీ ప్రభావంతో తయారైన తరం ఆ ఆదర్శాలు అందిపుచ్చుకున్నారు. గాంధీ నిర్యాణం తరువాత పరిస్థితి తద్విరుద్ధం.

నేడు సమాజంలో నైతిక విలువలు మృగ్యమవుతున్నాయని, అవినీతి పెచ్చు పెరిగిపోయిందని, స్వార్ధ చింతన మితిమీరి పోయిందని ప్రతిఒక్కరూ ఆవేదన పడుతున్నారు.

నేటి రాజకీయాలు కలుషితమయ్యాయని, సేవాతత్పరత కొరవడిందని, ధన, కండ బలాల ఆధిక్యం పెరిగిందని, కులమత (ప్రాంతీయ తత్వాల ప్రభావం పెచ్చరిల్లిందని వాపోతున్నాము.

అయితే ఇవన్నీ ఆనాడు మాత్రం లేవా? లేకుండా ఎట్లా ఉంటాయి? అయితే ఆనాటి నాయకులకు ఉన్నతాదర్భాలు ఉండేవి. “నియమ నిష్టలు లేని రాజకీయాలు మహాపాపం” అన్న మహాత్ముడి మాటలు వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తుండేవి. దారి తప్పకుండా వారిని ముందుకు నడిపించేవి.

ఈ నేపథ్యంలో ఈ ఆరుదశాబ్దాల రాజకీయ, సాంఘిక పరిణామాల్ని మనం విశ్లేషించుకోవడానికి శ్రీ భాట్టం శ్రీరామమూర్తి గారి స్వీయచరిత్ర “స్వేచ్భా భారతం” మనకెంతో ఉపకరిస్తుంది.

ఒక సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి కుడి ఎడమ ఎవరూ లేని ఒంటరి జీవితం గడిపి కష్టపడి చదువుకుని, విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని ఎలా ఎదిగాడు? ఆ ఎదుగుదల సమాజానికి ఆదర్శమా? కాదా?

జాతినేతలు - జయప్రకాష్‌ దా॥ లోహియా వంటి నాయకుల అడుగు జాడల్లో నడచి, వారి ప్రోత్సాహంతో ముందడుగు లేసే భాగ్యం ఎందరికి కలుగుతుంది!

“ఒకటన్ను ప్రబోధం కన్నా ఒక బెన్సు ఆచరణ మిన్లు” అన్న గాంధీ ప్రబోధంతో అంతరంగాన్ని తేజోవంతం చేసుకుని ఆదర్శంతో భాసించి, ఆచరణలో జీవించడం తేలికైన విషయమా? సంఘ సంస్మరణ భావాలు మాటలతో పరులకు చెప్పకుండా ఆదర్శ కులాంతర వివాహం చేసుకుని జీవితంలో ఆచరణలో చూపడం ఆదర్శమా? కాదా?

మాంగల్య ధారణ లేకుండా 15 రూపాయల ఖర్చుతో ఆదర్శ వివాహం చేసుకుని ఆరు దశాబ్దాల పైగా ఆలుమగలు అరమరికలు లేకుండా ఒకరికొకరై జీవించడం, అన్యోన్య దాంపత్య జీవితం గడపడం ఆదర్శ్భన్యాయమా? కాదా?

పెళ్లిళ్ల ఆడంబరాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న తరుణంలో పెండ్లి శుభలేఖలు అచ్చువేయకుండా అతి సామాన్యంగా కొడుకు (బి. విద్యాసాగర్‌) పెళ్లి చేయడం మంత్రి పదవిలో ఉన్నవారికి సాధ్యమయ్యే పనా? అది ఆదర్శమవుతుందా? కాదా?

రెండు దశాబ్దాలు పైగా శాసనసభ్యుడిగా పనిచేసినా, ఒక పర్యాయం లోక్‌సభ సభ్యుడిగా, ఎనిమిదేళ్లు మంత్రి పదవిలో ఉన్నా చరస్థిరాస్తులు కూడబెట్టుకోకపోవడం, చివరికి ప్రభుత్వమిచ్చిన ఇండ్ల స్థలాన్ని సైతం తీసుకోకపోవడం, మిగుల్చుకోకపోవడం ఆదర్శమా? కాదా?

10 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్రు

ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్న నేటి తరుణంలో చిల్లిగవ్వ చేతిలో లేకుండా మహారాజుల్ని “ఢీ కొని గెలిచి ప్రజాప్రతినిధి కావడం ఆదర్శమా? కాదా?

ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి “మంత్రి పదవి మీకోసం సిద్ధంగా ఉంది. గెలిచే నియోజకవర్గాన్ని చూసుకోండి” అని సూచిస్తే “పదవుల ప్రలోభాలను తలంచం - ఒకరికి తలవంచం” అని విజయ నగరం నియోజకవర్డాన్ని ఎంచుకుని రాజకుటుంబంతో తలపడటం - నెగ్గడం కష్టమని తెలిసి కూడా తలపడటం వెనుక ఆదర్శముందా? లేదా? ఒంటిగానే పరిస్థితులను ఎదిరించినా, ప్రతి ఘటించినా ఆదర్శంలో జంటగానే ఉండాలని అనుకున్నారు.

లోక్‌సభకు మళ్లీ పోటీ చేయమని ఎన్టీఆర్‌ అభ్యర్థించినా తిరస్కరించి రాజకీయాల నుండి స్వచ్చందంగా విరమించారు. రోజూ వందలాది మంది మధ్య మసిలే మనిషి నాలుగుగోడల మధ్యకు మాత్రమే పరిమితమయ్యారు. ఆధ్యాత్మిక చింతనా పరులకు మాత్రమే సాధ్యమైన జీవితాన్ని ఆయన కోరివరించారు. సత్యసాయి సన్నిధి పెన్నిధిగ భావించి పుట్టపర్తి వెళ్లి వస్తుంటారు.

మహాత్మాగాంధీని ఆదర్శంగా ఉంచుకుని సత్యనిష్ట ధర్మదీక్ష కలిగి. ఉండడమేమిటి? సేవా త్యాగాలు జీవితానికి మూల స్తంభాలుగా చేసుకోవడమేమిటి? ప్రస్తుత రాజకీయ వ్యవస్థ గమనిస్తున్న వారికి ఇవన్నీ ఆశ్చర్యమనిపించవచ్చు. ఇలాంటి వ్యక్తులు కొందరు మనమధ్య ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. వారి అనుభవాలు మనకు మార్గదర్శకం కావాలి. అందుకే భాట్టం గారిని స్వీయ చరిత్ర వ్రాయమని పదేపదే కోరాను.

“స్వేచ్భ్చాభారతం ఆరు దశాబ్దాల చరిత్రకు దర్పణం. స్వాతంత్ర్య పోరాటాల ఆరాటం నుంచి ప్రారంభమై స్వాతం[్యానంతర ఎన్నికల రాజకీయాలు - ఎత్తులు - జిత్తులు మనకళ్లముందు రంగుల రాట్నంలా తిప్పారు భాట్టంగారు. ఆధునిక ఆంధ్ర రాజకీయాలు తెరవెనుక బాగోతాలు అనేకం మనకు తెలుస్తాయి. పార్లమెంటరీ సంప్రదాయాలు ఏ విధంగా

స్వేచద్భభారతం.

ఆనాడు పరిఢవిల్లాయో, ఈనాడు అవి ఎలా దిగజారాయో ఈ [గ్రంథం ద్వారా మనకు తేటతెల్లమవుతుంది. కాలో హ్యయం నిరవథిః, విపులాచ పృథ్వీ అన్నాడు భవభూతి మహాకవి. ఈ విశాలమైన పృథ్విలో, అనంతమైన కాలంలో అసంఖ్యాక ప్రజానీకం పుడుతూ ఉంది. గిడుతూ ఉంది, వాళ్లంతా ఎవరికి తెలుసు. కొద్దిమంది పేర్లే మనం తలచుకుంటాం. మనిషి తానెందుకు పుట్టాడో, ఎందుకు, ఎలా జీవించాడో, అతని బ్రతుకు వల్ల ప్రపంచానికి ఏమి ఒరిగిందో ప్రశ్నించుకున్నప్పుడు దానికి ఒక సమాధానం కావాలి. జీవితానికి ఒక సార్ధక్యం ఉండాలి. తోటి మానవ సంక్షేమంలో ఏ కొంచెమైనా పాలు పంచుకోవాలి. చీకటిని నిందిస్తూ కూర్చోకుండా ఒక చిన్న దీపొన్నయినా వెలిగించామన్న తృప్తి, ఒక ప్రాణి కన్నీటినైనా తుడిచి ఆ కళ్లలో ఆశలమెరుపును నిలిపామని నిజాయితీగా చెప్పుకోగలిగిన సాహసం ఏ కొద్దిమందిలోనో ఉంటుంది. వారినే మనం తలచుకుంటాం, ఆదర్శంగా తీసుకుంటాం. అలాంటి అరుదైన వ్యక్తి భాట్టం శ్రీరామమూర్తి అవునా? కాదా? ఈ పుస్తకం చదివిన తర్వాత మీరే నిర్ణయిస్తారు.

  • మండలి బుద్ధ ప్రసాద్‌ 12... భాట్టొ శ్రీగామమూర్తి (స్వీయ చరిత్ర

పుట్టుపూర్వోత్తరాలు

ఎవరు ఎప్పుడు ఎక్కడ వుడతారో? భూతలం మీద ఎంతకాలం ఉంటారో? ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారో? ఎవరికి తెలుసు? చావు పుట్టుకల రహస్యం, జనన మరణాల మర్మం ఎలా తెలుస్తుంది? ఎప్పటికైనా తెలుస్తుందా? పుడమిని పుట్టిగిట్టిన కోటానుకోట్ల మానవుల పునరాగమనం ఎప్పుడో, ఏ రూపంలోనో, ఏ కాలంలోనో ఎవ్వరికీ తెలీదు! ఇది అంతు చిక్కని సమస్య, కలకాలం మానవ మేధస్సుని కలవరపెడుతున్న సమస్య,

జననానంతర వాసం - మరణానంతర ప్రస్థానం - ఎక్కడో? ఎక్కడికో? సత్రం భోజనం - మఠం నిద్ర - అన్నట్లుంది!

కన్నుమూస్తే చావు - కన్ను తెరిస్తే పుట్టుక!

“కొందరు గూడ్సు ట్రయిన్‌ ఉదంతం ఉదాహరణగా తీసుకుంటారు. ఒక 'వేగన్‌” మీద వ్రాసి ఉంటుందిట. “౦ 06 1811168 0%” అని డేటు వేస్తారట. బయలుదేరిన చోటుకి ఎప్పుడు తిరిగి చేరుకోవాలి తేదీతో సహితం ముద్రించి ఉంటుందిట. నరుడు కూడా అంతే! లలాట లిఖితం! ఎప్పుడు మళ్లీ వాపస్‌ వెళ్లాలో! జనన మరణాల మధ్య స్వల్చ్బ విరామం అనంతరం పూర్వ స్థానానికి ప్రస్థానం ఎప్పుడో ఆదిలోనే నిర్ణయం అయి ఉంటుందని అనాదిగా వస్తున్న నమ్మకం! పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలన్న ఉత్కంఠ ఎంత ఉన్నా యీ అగాధ నిగూఢ రహస్యాన్ని (పరిశోధించి) ఖేదించి జీవితపు ఆవలి ఒడ్డున, జీవన ్రవంతికి అవలితీరంలో ఏముందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు!

మనం కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాం. పనికి ఫలితం ఉంటుంది. జన్మకు కారణం కర్మ అంటారు. కర్మానుసారం జన్మ ఉంటుంది. జన్మకర్మల మర్మం తెలుసుకోవడం దుర్లభం అవుతోంది! “చేసుకున్నమ్మకు చేసుకున్నంత” అంటారు. మనచేతలే మన తల వ్రాతలు; మూలకారణాలు అని అభిప్రాయం ఉంది.

“కొందరు పెట్టి పుడ్దారు” అంటారు. నువ్వు ఎంత చేస్తే అంత అనుభవిస్తావని అర్థం. గుప్పెడు అటుకులు కుచేలుడు శ్రీకృష్ణుడికి యిస్తే, పుట్టెడు సంపద వచ్చింది. శ్వచ్చాభంతం లాక్‌

కర్మఫలమే కాదు దైవానుగ్రహ బలం కూడా కలిసిరావాలి. కాలం కలిసివస్తే నడిచి వచ్చే పుత్రుడు పుడతాడు అంటారు. కార్య కారణ సంబంధాలే కాదు, దైవ అనుగ్రహం ఉంటే (గ్రహాలు ఏమి చేస్తాయి? అంటారు కొందరు విజ్ఞులు. యీ విచికిత్స దైవత్వంతో ముడిపడి ఉంది. దైవం సాక్షీభూతుడే కావచ్చు. యీ కర్మసాక్షీ న్యాయనిక్లేత కూడా. ఆ కాటాలో తూకంలో వీసం వార రాదు. ₹6 13 416 6150605601 454106.

ఏమి చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. ఏం చేసినా ఆపని పర్యవసానంగా సంక్రమించే ఫలితాన్ని ఎవరూ తప్పించలేరు. మన జీవన ఫలాలకు మనమే జవాబుదారీ. భగవంతుడుని ఒక తపాలా బంట్రోతుతో సరిపోలుస్తారు కొందరు. బాగా చదివితే పాసయ్యేవన్న టెలిగ్రాం నీ పేరున వస్తుంది. నీకు బట్వాడా చేస్తాడు పోస్ట్‌మాన్‌. నీకు వచ్చిన ఫలితాలతో సంబంధం లేదు అతడికి. అది నువ్వు తెచ్చుకున్న ఫలితమే. ॥12% 19 96 జలు 00113 66న నీ (భవిష్యత్తును) భవితవ్యం నీవే నిర్మించుకుంటావు. ఏదో జన్మలో ఏదో చేస్తే - యీ జన్మలో అనుభవానికి రావడం ఏమిటి? కాలం తుడిచిపెట్టలేని (జీవిత సారాంశం) కార్యకారణ సంబంధం ఇది.

ఏ జన్మలో ఏం చేసుకున్నానో ధర్మవరం గ్రామంలో జన్మించేను. సన్నయ్య పంతులు తరుణమ్మగార్ల ఏకైక పుత్ర సంతానంగా మిగిలేను. మా తాతకు మానాన్న ఒక్కడే కాడుకట. మా నాన్నకు నేను ఒకృడ్నే కొడుకుని. నాకూ ఒక్కడే కొడుకు డా॥విద్యాసాగర్‌. వాడికి ఒక్కడే కొడుకు శ్రీరామ్‌. ఇంకా చదువుకుంటున్నాడు. వంశాంకురం నిలుపుకుంటూ రావడం దైవానుగ్రహ హేతుకమే కావచ్చు. ఇంటిపేరు భాట్టం

మా ఇంటిపేరు భాట్టం వారు. ఈ ఇంటిపేరుతో రాజమండ్రిలో ఎప్పుడో భాట్టం బుచ్చన్నశర్మ గారని ఉండేవారుట! వారి సంగతీ తెలీదు. వారి సంతతి గురించీ తెలీదు. దివాకర్ల వెంకటావధానిగారొాకమారు అన్నారు. “భాట్టం అన్నది పౌరుష నామం భట్టు శబ్దం నుండి వచ్చింది - మీ పూర్వీకులు ఎవరో ఉద్దండ పండితులై ఉంటారు. ప్రతిభా పురస్కారాలు అందుకొని ఉంటారు.” ఇంటిపేరు వచ్చిన విధం వారు తేల్చారు. అలనాటి చీకటి కోణాలు చీల్చుకొని శోధించి సాధించేదేముంది? ఆ తర్వాత ఎంతో కాలానికి - ఎన్నో సంవత్సరాల అనంతరం - ఆ ఆస్తి అంతా అన్యాక్రాంతం అయిందని ఆస్తులు కరిగించ తీర్థయాత్ర పేరుతో - మొక్కుబడుల పేరుతో దిగమింగేరని పెట్టెలో కర్పూరంలా హరించుకుపోయిందని అయినా కొంత వెసులుబాటు కల్పించాడు భగవంతుడు! నలుగురి అక్కలు నాకన్నా పెద్ద వాళ్లే. పుత్ర సంతానం కోసం మొక్కని దేవుడు లేడట. కడకు కేత్త భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

శ్రీరామ పట్టాభిషేకం శాస్త్రోక్తంగా జరిపించిన తర్వాత పుట్టిన వంశాంకురానికి శ్రీరామమూర్తి అని నామకరణం చేసారుట! పెద్దలు రామా! పిన్నలు రామం అనిపిలిచేవారు. ఇంట్లో రామం బళ్లో శ్రీరామమూర్తి. నేను కన్ను తెరవకముందే నాకు లోకం పోకడ తెలియకముందే వాళ్లందరికి వివాహాలు జరిగిపోయాయి. నా దురదృష్టం మా అమ్మనా చిన్నప్పుడే చనిపోయింది. 8 సంవత్సరాలు దాటి 9లోకి వచ్చేసరికి ఆమె పరంధామానికి చేరుకుంది. 10 దాటి 11లోకి వచ్చేసరికి మానాన్న దేవాన్ని వదిలిపెట్టాడు. పరాయి పంచన చేరకుండా 4వఫారం వరకూ 14వ ఏదాది వరకూ మా నాయనమ్మ నన్ను ఆదుకుంది. ఆ తర్వాత సర్వం శూన్యం! అంతా అయోమయం! ఎటువెళ్తే ముక్తి? ఎటు వెళ్తే మృత్యువు? ఇప్పుదేం దారి? గోదారి! యీ స్థితిలో కాలగర్భంలో ఎలా నలిగేను ఎలా మిగిలేను? ఎవరో అన్నట్లు నువ్వు ప్రవేశించింది సెంచరీ క్లబ్బులో కాదు. కత్తుల బోనులో “అవశ్యం అనుభోక్తవ్యం - కృతమ్‌ కర్మ శుభాశుభమ్‌” నీవు అనుభవించే మంచి చెడ్డలకు నీవే కర్తవు. అదురు బెదరు వద్దు. కష్టాలు కార్య సిద్ధికి మైలురాళ్లు! ఎవరూలేరు

మా నాన్న పక్కన ఎవరైనా ఉన్నారనుకుంటే ఎవ్వరూ లేరు. మా యింటి పేరు ఉన్నవాళ్లు కంటికి కనబడరు. మాఅమ్మ తరపున మధుపాడలో జానకమ్మ అని మా అమ్మ కన్నా పెద్దది దొడ్డమ్మ ఉండేది. అదిమా చిన్నప్పుడు సంగతి. ఆమె అంత్యకాలంలో పుడిసెడు నీళ్లు పాసేవారు కూడా లేకపోయారట. నేను దేశంలో ఏకోశాన ఉన్నానో? అది నిస్సంతు. సంతతిలేని కారణంగా నేనే ఏకైక వారసుడ్ని అయ్యేను. అర ఎకరా స్థలంలో లంకంత ఇల్లు - ఒక చెంప పాఠశాల. ఇంటిముందు పెద్ద గడ్డిమేటు ఉండేది. ఆవులు గేదెలు పెరట్లో పగటి పూట. వీథిలో రాత్రి ప్రొద్దున కట్టేవారు. ఏటి బాడవ 4 ఎకరాలు పొలం. నిత్యం కుంపట్లో నిప్పులు కణకణమని కాలుతూ ఉండేవి. పాటకజనం ప్రతిదినం తెల్లవారు జామున పిదకల్లో ఈ నిప్పులు తీసుకెళ్లి పొయ్యి రాజేసేవారు. 10, 25 మంది రాత్రిపూట అరుగుల మీద నిద్రపోయే వారు. మా దొడ్డమ్మ చనిపోకముందు నుండీ ఆ యిల్లు కనిపెట్టుకొని తత్వాలు భజన పాటలూ పాడుతూ ఉండేవారు. భక్తిభావం ఎక్కువ. బంక కృష్ణమ్మ అన్న కొడుకు ఆస్తిపాస్తులు నారాయణ చేతిలోకి వెళ్లాయి. నేను విజయనగరంలో చదువుకొనే రోజుల్లో నన్ను కలిసి సాధు సంతులకు పేదసాదలకీ ఇంత ప్రసాదం పెట్టి భక్తులకు భుక్తి చూపిస్తాను రాంబాబూ! ఈ అస్తి మీద ఆసక్తి లేకపోతే దైవకార్యానికి దీన్నుపయోగిస్తాను అన్నాడు. ఆస్తిపాస్తుల మీద ఎప్పుడు నాది చిన్నచూపే. వంశం నశించాక ఆస్తులేం చేస్తాడు. జానకిరామయ్య జానకమ్మ పేరుతో 'స్వేచ్చాభారతం 15

పత్రాలు తీసుకోమన్నాను. ఆఖరికి ఆ ఆస్తులన్నీ కరిగిపోయాయి. కార్యక్రమాదులన్నీ ఆగిపోయేయి. ఎవరికి వీలైనది వాళ్ళు దక్కించుకున్నారట! కనీసం మా అమ్మ ఇంటిపేరైనా తెలుసుకోవాలని ఉండేది. మా పెద్దక్కయ్యను (అప్పటికి బ్రతికి ఉన్నది) అడిగితే “ద్వాదశొవారు అని చెప్పింది. బరంపురం దగ్గర “అసకా” ప్రాంతంలో ఎక్కడో ఉండేవారట. అక్కడ “తరాతరణి” అనే దేవత ఉంది. అందుకే మా అమ్మకు “తరుణమ్మ' అని పేరు వచ్చిందిట. ఇలా వంశవృక్షమంతా తరచి చూస్తే ఆఖరికి బయటపడే నిజం ఒక్కటే. నేను ఏకాకిని అని. ఒంటరిని అని. ముందూ వెనుకా ఎవ్వరూ లేని వాణ్ణని. కాలం కర్మం కూడి యీ పిండం ధర్మవరంలో పడింది. కన్ను తెరిస్తే ఏముంది గర్వకారణం? నలుదిశలా కారు చీకట్లు, అంతా అయోమయం! మానవుడు చీకటి నుండి వెలుతురులోకి వెళ్లాలని దైవం నిర్దేశించాడు. ఎవ్వరినీ భగవంతుడు నిస్సహాయుడుగా, నిరాధారుడుగా వుంచడు. అంటే నాకు ఆలంబన, జీవన ఆధారం ఆ భగవంతుడు ఒక్కడే. మరి ఎవరు ఉన్నారని? దిక్కులేనివారికి దేవుడే దిక్కు అంటారు. నడి సముద్రంలో నావ నా జీవితం. నట్టేటి మధ్యన వదిలిపెడతాడా దేవుడు? సంసార సాగరంలో మెసిలే మొసళ్లు, తిమింగలాల మధ్యన వదిలిపెట్టేస్తాడా భగవంతుడు! పుట్టిన పశుపక్ష్యాదులు సహితం కూటికి గూటికి లేక, కాలం చేసిన ఉదంతం వినలేదు, కనలేదు. కీకారణ్యంలో జంతుజాలం, జాతివైరంతో పరస్పరం అంతం అవడం విన్నాం. అలాగే జనారణ్యంలో నరమానవుని రక్తం రుచిచూసి పొట్టన పెట్టుకొనే నరహంతకుల్ని యింకా చూడలేదు. తోటిమనిషిని మింగేసి మనుగడ కొనసాగించే వారుంటారా? భగవంతుని ప్రణాళికలో దీనజన రక్షణకు కొంత చోటు చిక్షదా? విజయనగరం చూసేను 16 ఏళ్లు దాటాక కాలేజీ చదువుకోసం వచ్చినప్పుడే మొట్టమొదటిమారు 16మైళ్ళదూరంలో ఉన్న విజయనగరం పట్టణం చూచాను. అటువంటి నేను ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో విజయనగరం నియోజక వర్గానికి ప్రజాప్రతినిధిగా 10 సంవత్సరాలు ఆ పట్టణానికి ఘనకీర్తి చేకూర్చడమేమిటి? ఇంతకీ ఎవ్వరూ లేరన్న ఏడుపు నాకు ఎందుకు? నేను అందరి వాడినైతే సరిపోతుంది కదా! నిన్ను నీవు ఢ్రుమించుకున్నట్లు, ఇతరులనూ (ప్రేమించు. అప్పుడు అందరినోట్లోనూ నువ్వే. అందరి వాకిట్లోనూ నువ్వే. పదిమందికీ కావలసిన కార్యం పనికొచ్చేపని చెయ్యి. అందరి అవసరాలు తీర్చేవారు ఎందరో ఉండరు! కొందరే ఉంటారు. ఎవరి పనులు వాళ్ళే చేసుకోలేక సతమతం అవుతూ ఉంటే, ఊరందరి పని ఎవరు నెత్తిన పెట్టుకుంటారు? ఎవరి స్వార్ధం కోసం వారు పాటు పడతారు అది 165... భాట్టి శ్రీరామమూర్తి (్వీయ చంత్రు

సహజమే. అసలు స్వార్ధమే పరమార్ధం అయిపోయింది. అందరికీ కావలసినవి అర్ధ కామాలు! రెండే పురుషార్థాలు. ధర్మం, మోక్షం అంటూ పట్టుకు వేళ్లాదే వాళ్లెందరుంటారు? అందరిలోనూ నువ్వే “నీతోనే అందరూ” ఆ విధంగా మసిలి, మెలగి, పెరిగి, పెద్దవాడవైతే సదా సర్వదా సర్వత్రా నువ్వే కొలువై ఉంటావు. మతిని బట్టే గతికూడా. గొట్టెల కాపరి గొట్టెలను తోలినట్లు భగవంతుడు మనుష్యుల్ని కర్రపట్టుకొని తోలడు. బుర్రలో బుద్ధి పెడతాడు. బుద్ధి బట్టి సిద్ధి. బుద్ధి కర్మానుసారిణి అని గోళ్లు గిల్లుకొని కూర్చోకూడదు. 84కోట్ల ప్రాణి కోటిలో మానవుడికే భగవంతుడు వివేకం, విజ్ఞానం యిచ్చాడు, ఇంగితజ్ఞానం ఉంది. లోకజ్ఞానం పెంచుకోవాలి. స్పపరభేదం పోవాలి. అప్పుడు అందరికోసం నువ్వు! నీకోసం అందరూ! ఆ రకంగా జీవిత ప్రాంగణంలో అడుగుపెట్టు. సామాజిక జీవితంలో తొలి అడుగువెయ్యి. తర్వాత కాలమే తనపని తాను చేసుకుంటుంది. నువ్వు కలకాలం కావాలని కోరుకుంటుంది. తర్వాత అంతా శ్రీకరం, శుభకరం. చోటాభాయికి బడా సమస్యలు! చిన్న తలకాయకు పెద్ద చిక్కులు. కాలం కరవాలం కాదు. ఆ కాలం నీతో కరచాలనం కూడా చేస్తుంది. భావిజీవితం సాఫీగా సాగుతుంది. ఊరటకావాలి. స్వస్థత చిక్కాలి. నాలో నేనే చింతన! నాకు నేనే బోధకుడ్చి సాధకుడి సార్ధకుడ్ని! కండబలం కన్నా గుండెబలం నమ్ముకున్నా, దేహదారుధ్యం కన్నా దృఢసంకల్పమే మిన్న అనుకున్నా. సంకల్ప బలంతో కాలప్రవాహానికి ఎదురొడ్డి నెట్టుకొని - సుడి గుండాలను దాటుకుంటూ గుండెను గండశిలగా మార్చుకొని ముందుకు దూసుకుపోవాలి. ఇదీ - ఆత్మబోధ! అంతరంగం చేసిన ప్రబోధ! నీ లోపలిమనిషి మాటను విను. ఆ మాట జవదాటకు. నీలో నువ్వే భేటీ! అయితే నీకు సాటి ఎవరు? మేటి ఎవరు? “అత్మన్నేవాత్మనా తుష్ట” నీలో నీకే తృప్తి - సంతృప్తి - సంతోషం! యోగిలా కర్మలు చెయ్యి! “సమత్వం యోగముచ్యతే” సమభావం కలిగి ఉండు. తలవైపు చూస్తే అన్నీ తేదాలే, ఎక్కువ - తక్కువలే - పాదం ్రక్కచూడు. అందరూ సమతలంపై నిలుస్తారు. సరిసమానంగానే ఉంటారు. సమతే - మానవత సహజీవన సౌభ్రాతృత్వమే అధునాతన జనజీవన శంఖారావం. సమ సమాజ నిర్మాణమే నవ జీవన సుప్రభాతం అందించిన తొజా సందేశం - న్యూనాధికాలు లేవు. అంతామాన్యతే! సర్వులూ మాన్యులే! ఇకలే! కర్తవ్య నిర్వహణకు ఉద్యమించు “ఉత్తిష్ట ప్రాప్యవరాన్ని బోధత!” మేలుకో! కోలుకో! జీవితం తొలిమెట్టు పైనుండి ఉపక్రమించు. తర్వాత మలిమెట్టు - మేలిమిమెట్లు

  • వేలమెట్లు అధిగమించు. గమ్యం చేరుకో!

నా మాతను పితను కనుగొన్నాను కాలగమనంలో దశాబ్దాలు దాటాయి! ఒకనాడు భగవాన్‌ సత్యసాయి బాబా దివ్యదర్శనం దొరికింది. కార్యక్రమం మంగళహారతితో ముగుస్తుంది. “మాత, పిత, గురువు దైవము. అంతయూ నీవే - మరి అంతయూ నీవే” అని పాదేరు! జల జలా కన్నీళ్లు కారేయి! నా మాతను - పితను కనుగొన్నానన్న సంతృప్తి నన్ను అలముకొంది. ఇప్పుడు నాలోని వెలితి భర్తీ అయింది. ఇప్పుడు నేనే నిండు మనిషిని. అంతా పూర్ణం. “పూర్ణమదః వూర్ణమిదం - వూర్ణాత్చూర్హ ముదచ్చతే పూర్ణస్య - వూర్ణమాదాయ - ఫూర్ణమేవా-న శివ్యతే” అంతకుముందు బాబా బంగారు గొంతుతో పాడిన అన్న మాటలు నా చెవిలో నేటికీ గింగురు మంటూనే ఉంటాయి! భగవంతుడు తప్ప ఎవరున్నారు నాకు? అందుకే ఆయనే నాకు సర్వం - సర్వస్వం! మళ్లీ ఆశలు పల్లవించాయి. కన్నుల పంటగా - నా "కన్నుల ముందు నడయాడే దైవం నిలిచాడు! “జనసేవ వినాసుఖ శాంతినహీ... భగవాన్‌ వినా కోయి అప్నా నహీ” ప 18... భాట్టం శ్రీరామమూర్తి శ్వీయ చరిత్ర

విజయనగరం విజ్ఞాన వీచికలు

16ఏళ్లు దాటిన తరువాత 17వ ఏట ఇంటర్‌మీడియట్‌ చదువుకు కాలేజీ మెట్లు ఎక్కడానికి 16మైళ్లదూరంలో ఉన్న విజయనగరం పట్టణానికి మొట్టమొదటి ప్రయాణం కట్టేను. పల్లెపట్టున బతికిన వాడ్ని పట్టణంలో అడుగుపెట్టగానే భయం పుట్టుకొచ్చింది. వారానికి ఒకమారైనా స్వగ్రామానికి బస్సులో ప్రయాణం మామూలైంది. ఇది ఖర్చులతో కూడుకున్న పని. కాలేజి క్లాసు గదికి అతుక్కుపోతే, తరువాత లాడ్జిలో ముసుగు తన్నేస్తే సరిపోతుంది. భయాలు బలాదూర్‌. మన ప్రపంచం మనదే.

కేవలం పుస్తకం పురుగు అయిపోతే బాగుండదు. నాటు సరుకు అనుకుంటారు. పల్లెటూరు బైతు అంటారు. బట్టీలబాపతు అనుకుంటారు. నవనాగరికులెవరూ పుస్తకంతో దోస్తీ పెట్టుకోరు. పట్టణవాసం అన్నప్పుడు పక్కవాడితో సంభాషణ ఉండాలి. వాళ్లకి భేషజమే భూషణం! నాకది సాగదు. స్నేహితులూ కావాలి. పరిచయాలు పెంచుకోవాలి. కాలమాన పరిస్థితులు తెలుసుకోవాలి.

కొత్త మిత్రుల్ని కలుసుకోవాలి. తనివితీరామాట్లాడుకోవాలి. సాహచర్యం సహవాసం అలవడింది. మనసు పరిధి పెరిగింది. విశాలమైంది. విస్సృతమైంది. అందరిభావాలు స్వభావాలు, అనుభవాలు తెలుసుకుంటున్నాను. అందులో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ముఖ్యుడు 1.3.శాస్త్రి ఒకడు. నా సాహచర్యం అతని దినచర్య అయింది. చదువు సంధ్యలు మాటెలా ఉన్నా, లోకరీతి, దేశస్థితిగతులు ఆయనకు కొట్టినపిండి. కాలేజీ నాలుగుగోడల బయట ఉండే ప్రపంచం పిలుపు అందుకున్నాడు. అతని పలకరింతలు, పలవరింతలు అన్నీ దేశం కోసమే. ముందుకు దూసుకుపోవాలన్నదే ఆయన తపన. తగురీతిని స్పందించే మిత్రబ్బందాన్ని ఎంపిక చేసుకొని వెంటపెట్టుకొని వారిచే రాజకీయ రంగప్రవేశం చేయించాలన్న కుతూహలం ఎక్కువ. బండిపట్టాలకి ఎక్కితే చాలు అదే తర్వాత ముందుకు నడుస్తుంది. కదన కుతూహలం ముందుకు నెట్టుతుంది. ఇదీ ఆయన తీరు. స్వేచ్చాభారతం 19

యువతరం, నవతరంతో సహవాసం చేస్తూ వారిలో ఉరకలు వేసే ఉద్వేగాన్ని పెంచి వారిచే రాజకీయ ఆరంగేట్రం చేయిస్తాడాయన నాకు అంతపనీ అయింది. కట్టలు తెంచుకున్న ఉత్సాహం నా జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. చేపట్టిన కార్యక్రమానికి అతుక్కుపోవడమే నా అలవాటు. ఇంటర్‌మీడియట్‌ రెండేళ్లూ గడిచాయి. బియస్‌సిలో జాయిన్‌ అయ్యాను. అంతకుముందు ఒక సంవత్సరం నుండి ఒక మిత్రుడు కె.ఎస్‌. శాస్త్రి నా ప్రక్కనే ఎప్పుడూ కూర్చొనేవాడు. చక్కని రూపు, చెక్కుచెదరని ఠీవి. బోలెడు లోకజ్ఞానం నిండుకుండలా ఉండేవాడు. నామీద మక్కువ కొద్దీ ఇంటికి తీసుకువెళ్ళి, వాళ్ళ పెద్దన్నయ్య ముందు కూర్చోబెట్టాడు. ఆయన ఆజానుబాహుడు. వేదాంతి, విజ్ఞానఖని. దివ్యజీవన సమాజం ముఖ్యుల్లో ఒకరిగా చెప్పొచ్చు. వేరే ప్రపంచంతో పరిచయా లేర్చడుతున్నాయి. అక్కడ జరిగే ఇష్టాగోష్టి పసందైన విందు భోజనంలా ఉండేది. మెదడుకు మేతలా ఉండేది. కొన్ని సూక్తులు సూత్రాలు నెమరువేస్తూ ఉంటే నన్ను పట్టి కుదిపేస్తున్నట్టు ఉండేది. మరోలోకంలో తిరుగాడుతున్నట్లు ఉండేది. మరో క్లాస్‌మేట్‌ నాన్నగారిని కలిస్తే లోకం పోకడలు తెలిసేవి. దేశం భోగట్టాలు పెద్దల బాగోతాలు వర్ణించేవాడు. మొదటి సంవత్సరం నేను వీటికి ప్రాధాన్యం ఇచ్చేవాద్ని కాదు. నా స్పందన ఎవరికీ తెలిసేది కాదు. శాస్త్రి ఎంత కదిపినా, కుదిపినా కరిగేవాడ్నికాదు. సాహచర్యం మాత్రం దినదిన ప్రవర్ధ్థమానం అవుతోంది. పెద్దమనిషి రామశాస్త్రిగారు గొంతువిప్పితే గంభీరమైన అలౌకిక ఆనందం కలిగేది. ప్రయాస అనిపించేది కాదు. కొంత ఆసక్తికూడా పెరిగింది. అప్పటికి ఇంకా విద్యార్ధి కాంగ్రెస్‌ నిషేధంలో ఉంది. ఆకారణంగా 1.5.5. వెలిసింది. నిషేధపుటుత్తర్వులు ఎత్తివేసిన తర్వాత విద్యార్థి కాంగ్రెస్‌ రూపంలో వెల్లివిరిసింది. ఈ మారు వేరే ఆలోచనలకు ఆస్కారంఇవ్వకుండా నన్ను విద్యార్థి కాంగ్రెసు ప్రధానకార్యదర్శి పదవిలో కూర్చోబెట్టారు. పట్టు పట్టరాదు-పట్టితే విడువరాదు నేను ఏది పట్టుకుంటే అదే! “పట్టు పట్టరాదు - పట్టు విడువ రాదన్నట్టు” ఉండేది నాపని. ఆలోచనలన్నీ నిత్యం ఆ సంస్థ చుట్టూనే తిరిగేవి. ఇక చదువు సంతకెళ్తుంది. 20. భాట్టం శ్రీరామమూర్తి థ్వీయ చరిత్ర

ఉద్యమంలో ఉరికితే మరి తిరుగేలేదు. ఎక్కడ మునుగుతానో ఎక్కడ తేలుతానో నాకే తెలిదు. నంద్యాల సభలు

కాంగ్రెస్‌ నేతలు వస్తే వారికి జేకొట్టడం, వారు చెప్పిన దానికి ఊ కొట్టడం, ఊరేగింపులు నిర్వహించడం, ప్రచార కార్యక్రమం చేపట్టడం, కుర్చీలు బెంచీలు సర్దడం. ఒకప్పుడు తొలివాక్కులు ఉపోద్దాతాలు, ఇంకొకప్పుడు ధన్యవాదాలు ఇదీ తంతు; ఆ రోజుల్లో గొప్ప ఘనకార్యం జరిగింది. నంద్యాలలో విద్యార్ధి కాంగ్రెస్‌ రాష్టమహాసభలు! జిల్లాలు జిల్లాలు దాటి వెళ్లాలి. రాత్రిపూటే ప్రయాణం కూదా!

బతుకు బితుగ్గా ఉండేది. తిలక్‌ నేను ఒకే బెర్తుమీద పడుకున్నాం. నంద్యాలలో బడాబడా నేతలు దిగేరు. కడప కోటిరెడ్డి సభాధ్యక్షుడు యస్‌.యస్‌. బాటెన్‌వాలా, దినకర్‌ శక్రికర్‌ వంటి పెద్దల ప్రసంగాలు ఉర్రూతలూగించాయి. పిట్టగూడు నుంచి బయటికి వచ్చింది ఇక కూత తరువాయి. అనుభవం అభయం ఇస్తుంది బిడియం బద్ధలవుతుంది. పోడియం దగ్గఅకు దూసుకు వెళ్లడమే మిగిలి ఉంది. పి.సి.సి. మీటింగు

ఈ మారు రాజమండ్రి ప్రయాణం రాష్ట్ర కాంగ్రెస్‌ సమావేశాలు నాళం వారి సత్రంలో జరుగుతున్నాయి. పి.సి.సి. అధ్యక్షుడు ప్రకాశం గారికి కళా వారి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. ప్రకాశం పంతుల్ని గద్దెదింపాలని కుట్ర జరిగిందని, పన్నాగాలు పన్నారన్న వార్త దావాలనంలా వ్యాపించిపోయింది. రాజమండ్రి పౌరులు ప్రళయంలా విరుచుకు పడ్డారు. ప్రకాశాన్ని గద్దె దింపితే భూమి బద్దలవుతుందన్నారు. గోదావరిలో గెంతేస్తామని గుండెలు బాదుకున్నారు. కళావారు కంటికి కనబడితే అగ్నిగుండంలో గిరవాటు వేస్తామన్నారు. బయటి జనం వీరంగం ట్రొక్కుతున్నారు.

ప్రజల గుందెల్లో గూడు కట్టుకున్న ప్రజానాయకుడి పట్టు కొట్టవచ్చినట్లు కన్పించింది. పట్టపగ్గాలు లేని ప్రజావాణి సత్రం చుట్టుముట్టి మెబుపు దాడి చేస్తూ ఉంటే లోపల అందరికీ గుండెదడ పట్టుకుంది. పదే పదే తెన్నేటి విశ్వనాథం పంతులు ఒక్కడూ బయటకు వచ్చి ఏ దుర్శటనా జరగలేదని, సహనం వహించాలని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేసేవారు. ఎట్టకేలకు ఆ సమావేశం సుఖాంతమయింది.

ప్రకాశం పంతులుపై విశ్వాసరాహిత్య తీర్మానం ప్రసక్తి తెచ్చే దమ్ము ఎవరికుంటుంది. జనబాహుళ్య్ళం తరలిరాకపోతే, ప్రజానీకం పిడికిలి బిగించకపోతే యీ కుట్రలూ, స్వేచ్చాభారతం ఖో

పన్నాగాలూ ఫలించేవేమో ఎవరికి తెలుసు? ప్రజలంటే (ప్రేమే కాదు, భయంకూడా ఉండాలి. జనఘోష ప్రజా విజయానికి ప్రథమసోపానం. ప్రజలకోసం పెట్టుకున్న పార్టీలు కూడా ప్రజల ఆగ్రహం దగ్గజ దగ్ధం కాక తప్పదు. ప్రజాప్రతినిధులు మట్టికొట్టుకుపోవడం తథ్యం. జన జాగృతి ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష ఆనాటి సాయంకాలం శద్దానంద ఘాట్‌లో స్వాతంత్ర్య సమరయోధులు, వీరులు కల్లూరి సుబ్బారావు గారు చేసిన ప్రసంగం చిరకాలం నా చెవుల్లో గింగురుముంటూనే ఉంది. నాటి ప్రసంగం అద్భుతం, అపూర్వం. స ఈ ఈ సామ్యవాద జగత్తునకు వైతాళిక గీతిక “రోడ్డు రోలరు” గేయము వ్రాసిన శ్రీ కొనకళ్ల వేంకటరత్నము సంఘములో ఒకానొక 'అజ్ఞాత' గుమస్తా. లాగరా హయిలెస్స లాగరా రోడ్డురోలరు ముందడుగై లాగరా! హయిలెస్స లాగరా! నడినెత్తిన సూరీదూ నకనక లాడించేడు కంకర రస్తాలో సగమింకా మిగిలున్న దిరా ॥ లాగరా॥ గోదావరి వరదలొచ్చి గోలుగున్నదంట ఈడ కట్టసుకాలినడానికి గవినే రొస్తాడంట 1 లాగరా॥ మారువాడి అప్పుకంటె మాయదారి బ్రతుకుకంటె బరువా ఇంతోటి పెద్దబండరాయి మామయ్య ॥ లాగరా॥ లచ్చలున్న షావుకారు లాభాలను మోసేందుకు " భారీ యాపారములో లారీ కొన్నాడంట ॥లాగరా॥ మళ్టిచెట్టు ఊడనీడ మనిషిపురుగు లేనికాడ సనుబాలకు కకృటిల్లి సంటోడేడుస్తుంటాడు 1 లాగరా॥। పొలముపుట్ర అమ్ముకొని పొట్టసేత బట్టుకొని వలసపోయిం డీదారినె పంటకాపు పట్నానికి ॥లాగరా॥ 7! భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్ర

(4 దేశభవితవ్యంపై ఆరాటం

దేశభవితవ్యం ఏమిటి?

దేశం ఏ దిశకు పోతోంది? జాతి కర్తవ్యం ఏమిటి? దేశ భవితవ్యం తీర్చి దిద్దడంలో యువత పాత్ర ఏమిటి? చెజసాలలో (మగ్గి, ఉరికంబాలెక్కి రక్తతర్పణం చేసి తమ సర్వస్వం దేశానికి దారవోసిన, స్వాతంత్ర్య సమరయోధులు నిర్మించిన స్వరాజ్య సౌధం పరాన్నభుక్తుల పాలవుతూ ఉండగా, జాతి జనులు కేవలం చూపరులుగా (ఢ్రేక్షకులుగా మిగిలిపోతున్నారు! బాపూజీ అడుగుజాడలు

దేశాన్ని దోచుకొని జాతి సంపదను కొల్లగొట్టిన కుక్షింభరుల భరతం పట్టే నాథుడే లేదా? నేడు దేశం గొద్దుపోయిందా? ఆనాడు మహాత్ముడు ఆశల హరివిల్లు చూపెట్టలేదు. స్వార్ధ ప్రయోజనాలను, ప్రలోభాలను పెంచలేదు. నావెంట రండి ముందడుగు వెయ్యండి. తుపాకీ తూటాలూ, కారాగార క్షేశాలు మనల్ని అడ్డుకోలేవు. దేశమాత కన్నీళ్లు తుడవాలి! బానిస బంధాలు విచ్చేదం చెయ్యాలి. కదలండి తరలిరండి! అని పిలుపుయిస్తే కోటాను కోట్ల ప్రజలు మహాత్ముని అడుగుజాడల్లో ముందుకు ఉరికేరు. స్వాతంత్ర్య సమరాగ్గ్ని గుండంలో దుమికేరు.

ఈనాడు ఊళ్లు ఏలండి, ఉద్యోగాలందుకోండి. భూమి పుట్రా యిస్తాం ఫించను టంచనుగా అందుకోండి అంటూ ప్రచార సాధనాలు నిరంతరం ఘోషిస్తున్నా పన్నుల రద్దుల పద్దులు పెద్దగా ప్రకటించినా, జనం ముందుకు రారెందుకు? జాతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ముందంజ వేయరెందుకు? (భ్రష్టుపట్టుపోయిన ఆర్థిక సామాజిక వ్యవస్థను దుమ్ము దులపడానికి ముందుకు రారెందుకు? ప్రజాజీవితం స్థంభించి పోయిందెందుకు? వంటగదిలో గుంటనక్కలు

పంచభక్ష్య పరమాన్నాలు వంటగదిలో సిద్ధంచేసి పెట్టారు మన పెద్దలు. బారులు తీర్చి కూర్చున్న జనానికి అవి ఎందుకు అందడం లేదు? గుంటనక్కలు వంటగదిలో స్వేచ్భాభారతం లప

ప్రవేశించాయి. తోడేళ్లు తినగా మిగిలేదెంత? సామాజిక జీవనంలో జన జీవన స్రవంతిలో తిమింగలాలు, మొసళ్లు స్వైరవిహారం చేస్తున్నాయి. ఖూనీకోర్లు, కబ్జాదారులు, ధన మదాంధులు, దురహంకారులు అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు. పదవుల పట్టుగొమ్మలు ఎక్కి పరపీడన పరాయణత్వంలో నిపుణులు, నిష్టాతులు నివురుగప్పిన నిప్పులుగా వర్ధిల్లుతున్నారు. ప్రజాహంతకులు, లోఫర్లు, (బ్రోకర్లు, గుండెపై కుంపట్లా 'ప్రజ్బరిల్లుతూ ఉంటే ఇనుప గజ్జెల తల్లి జన జీవితంలో కరాళనృత్యం చేస్తూ ఉంటే ఏం చెయ్యగలం? ఏమి చేస్తున్నాం? ఎంతకాలం చూస్తాం? స్వార్ధమే పరమార్థంగా, ధనబలమే జనబలంగా ఓటుకు నోటుగా అవినీతి అక్రమాలు మూడు పూవులు ఆరుకాయలుగా వర్ధిల్లుతూ ఉంటే, చూస్తూ, చూస్తూ చేష్టలుడిగి మిన్నక్రుంటున్నాం. సూర్యుని చుట్టూ భూమి, ధనం చుట్టూ జనం గిరగిరా తిరుగుతున్నారు. లక్షలు వెదజల్లి, కోట్లు కుమ్మరించి పదవులు కొనుక్కోవాలి. నేరాలు ఘోరాలు చేసి అధికార (ప్రాంగణంలో అడుగుపెట్టాలి. నీతి నియమాలను నిలువునా కూల్చి, నైతిక ధార్మిక విలువలను తుంగలో తొక్కి జాతిజీవనం బ్రష్టుపట్టించి పదవుల పట్టుకొమ్మలు ఎక్కిన పదఘనాపాటీల హస్తలాఘవం చూడలేక చస్తున్నాం భగవంతుడా! మా బుద్దుడు లాంటి సిద్ధడ్ని ఇంకొకడ్ని ప్రసాదించు. అవని గడ్డలోనే కాక తెలుగుగడ్డలో నలుమూలలా దేశభక్తి పాపభీతి గల పౌరులను పుట్టించు. న్యాయం, ధర్మం కోసం, అలమటించే అపురూప పుణ్యమూర్తుల దివ్యదర్శనం యీ భూతలంపై మాకు యిప్పించు! ఉన్నారెందరో మహానుభావులు జాతి ప్రతిష్ట పెంపొందించ గలిగే ప్రతిభావంతులున్నారు. వారికి శక్తియుక్తులు ప్రసాదించు. “సబ్మో సమ్మతి దే భగవానొ అని మహాత్మాగాంధీ 'ప్రార్టించాడు. అందరికీ సద్బుద్ధి ప్రసాదించు తండ్రీ! యీదేశం ప్రపంచాన్ని తలమానికంగా నిల్చుము తండ్రీ. ఉరుకులు - పరుగులు దిశానిర్దేశం జరిగింది. అనంత ఆకాశం కనిపిస్తోంది. దిగంతరాల వరకూ వ్యాపించవచ్చు. దేశం పిలుస్తోంది యువతముందడుగు వెయ్యాలి. కర్తవ్య నిర్వహణలో నిమగ్నం అయిపోయి - ఏకత్వం నుంచి అనేకత్వానికి పయనించాను. అడుగుముందుకు వేసిన తర్వాత మడం థ్రిప్పడం మాట మరిలేదు. పట్టణ విద్యార్థి కాంగైస్‌ కార్యదర్శిగా కదనరంగంలోకి ఉరికేను. ఇక్కడా బలమైన పోటీ తారసిల్లింది. కమ్యూనిష్టుపార్టీ విద్యార్థి విభాగం వారికి విద్యార్ధిలోకంలో పూర్వం గట్టి పట్టుండేది. వేడి నెత్తురు మరిగించే వారి మాటల తూటాలు ధాటీ ఎదుర్కోవడం ఎలా? పరుషమైన పదజాలం అలవడకున్నా, 24... భాట్ట శ్రీరామమూర్తి (్వీయ చరిత్ర)

సభ్యత చెడకుండా భావగర్భితంగా పదజాలానికి పదునుపెట్టి సంక్షిప్త ప్రసంగాలతో విద్యార్థిలోకాన్ని వేడెక్కించడం అలవడింది.

ఇల్లు, ఒళ్లు మరచి పగలూ, రాత్రి తేడాలేకుండా విద్యార్థిబ్బందంతో కలిసి మెలసి తిరుగుతూ దేశభక్తిపూరితమైన త్యాగమయ పోరాట ఘట్టాలను, స్వతంత్ర వీరుల అనుపమాన శౌర్య ధైర్యాలను అధ్యయనం చేయడం, చర్చాగోష్టుల్లో పాల్గొనడం నిత్యకృత్య మైంది. దేహాన్ని దేశానికి అర్చితం చేసిన త్యాగధనుల అడుగుజాడల్లో పయనించాలనే తపన, తపోదీక్ష అధికమైంది.

పరోపకారం, సేవాభావం, త్యాగశీలం, బుజువర్తన, ఆదర్శజీవనం పరమ ధ్యేయాలుగా కంటిముందు కదలాడేవి. ఊరేగింపులు, సమ్మెలు, బంద్‌లు, సభలు, సమావేశాలు ఎక్కడ జరిగినా మేం ప్రత్యక్షం లేదా మేమే నిర్వహించేవాళ్లం. విద్యార్థుల భవితవ్యానికి సవాళ్లుగా నిలిచిన పలు సమస్యలపై చేసే పోరాటంలో అగ్రశ్రేణిలో ఉండాలని ఉవ్విళ్లూరే వారం. ఊరేగింపులు కొనసాగుతూ ఉంటే సడన్‌గా ప్రక్కన ఉన్న పిట్టగోడమీద ఎక్కి గొంతు చించుకొని గర్జించే కమ్యూనిస్టునేతలకు దీటుగా, ధాటిగా తయారవాలి. పరాయి ప్రభుత్వంపై దండయాత్ర చేస్తూ దేశదాస్య విమోచనకోసం విద్యార్థిలోకం కంకణం కట్టుకోవాలని ఉద్దాటించడం పరిపాటయింది.

చదువుమీద శ్రద్ధ సన్నగిల్లింది. పుస్తకాలు బూజు పడుతున్నాయి. కాలేజీకి వెళ్ళినా క్లాసులో కూర్చోవడం అరుదైపోయింది. ఒకమారు కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ లక్ష్మీనాథరావు గారి క్లాసు అవుతోంది. మిత్రులతో మాటాడుకుంటూ 62111౫0 లో అడుగుపెట్టేను. ఆ ప్రాఫసర్‌ ఒక్క క్షణం ఆశ్చర్యం ప్రకటిస్తూ “౨2౫ 86౫6 [01027664 0) ౪౦౩ 0656006 3 20 0౧0205 [6 ౫౦౪ 10) 36ల 90414%” అన్నాడాయన.

యూనివర్సిటీ పరీక్షల కోచింగ్‌ యిస్తున్నారాయన. యిక చదువేంటి? పరీక్షలేంటి? నా మొహం! పూర్తిగా. రాజకీయాల్లోకి రావాలంటే భయమేసేది. చదువు పోతుందేమోనని బెంగ. అసలే పేదరికం. దూరభారం - పట్టణం చదువులు, గ్రాసానికి వాసానికి లోటు లేక పోయినా కాలేజీ ఫీజులు, హోటలు ఖర్చులూ లాడ్జీల అద్దె, రవాణా చార్జీలు, చాకలి, మంగలి ఖర్చులు అన్నీ కలిసి తడిసి మోపెడయ్యేది. ఇంటర్‌మీడియట్‌ అయింది. బియస్సీ చదువు పూర్తి చేస్తే పట్టా పుచ్చుకుంటే బతుకు భద్రత ఉంటుంది. భావి ఆశాజనకంగా ఉంటుంది. వద్దు వద్దు అంటూనే విద్యార్థి కాంగ్రెస్‌వేపు మొగ్గుచూపాను. ఇప్పుడు (ప్రధానకార్యదర్శిగా పరువు ప్రతిష్టలుపెరిగాయి. కాలేజీ యూనియన్‌ అధ్యక్షపదవి పోటీకి తలపడ్డాను. స్నేహితుల ప్రోద్బలం, ప్రోత్సాహం ప్రధాన కారణం కావచ్చు. నాకైనా స్వేచ్భాభారతం 25

వివేకం ఉండాలి ముందుచూపు ఉండాలి. భవిష్యత్తు భగ్నం అవుతుంది అర్గాంతరంగా చదువు నిలిచిపోతే నిరాధారంగా నడిరోడ్డున పడతాను! ఆపాటి జ్ఞానం లేకపోతే ఎట్లా? కమ్యూనిష్టుల విద్యార్థి విభాగం బలపరిచిన ప్రత్యర్థిని ఎదుర్కోగల బలం భాట్టానికి ఉందంటూ అందరూ ఎగదోశారు. నాకు జీవిత భవితవ్యం పట్ల పూర్వవైఖరి మారిపోతూ వస్తున్నది. భావి సవాళ్ల పట్ల సగటు జీవి ఎదుర్శొనే గడ్డు సమస్యల గురించి ఆలోచనలు అంతరించిపోయేయి. ఉద్యమానికి ఊపిరిపొయ్యాలి అని ఆరాటం పెరిగింది. గెలుపుగుర్రం తోక ముడిస్తే ఎలా? పిరికిపందలు "సేనానులు కాలేరు! కలేజా ఉంటేనే కమాండర్‌! బలహీనుడికి భవితవ్యం ఏమిటి? పిరికిపందలకు పట్టం కట్టడం ఏమిటి? నేనే ముందంజ వెయ్యాలని విద్యార్థిలోకం ఎలుగెత్తి చాటుతోంది. వెనుకా ముందూ అంటూ ఆలోచిస్తూ కూర్చుంటే వెనకపడతాం, వెల్లకిలా పడతాం. దేశభవితవ్యంపై దృష్టి సారించకుండా వ్యక్తిగత భవిష్యత్తు కోసం వ్యూహరచన చేయడం క్షంతవ్యం కాదు. “4142 ౪1 66010 01061” నా ఐతుకు ఒక అతుకుల బొంత. సుడిగుండంలోని ఎండుటాకు. బిడియం ఒదిలినా ఎదారి బిడారినే! కాకలు తీరిన యోధుడిలా కాలేజీ ప్రిన్సిపాలు మీదే తిరగబడుతున్నావు! ఆరోజు మరిచిపోక్తు, హఠాత్తుగా తలఎత్తితే కాలేజీ నోటీసు బోర్డులో ఒకపేరు పడింది. అతనికి యస్‌బిహెచ్‌లో ఫ్రీబోర్జింగు వచ్చింది. ఎంత గొప్ప అదృష్టం. ప్రతి ఏటా చెక్కముక్క అమ్మి ఇక్కడ చదువు వెలిగిస్తున్నాను. కూర్చోని తింటే పర్వతాలు కూడా తరిగిపోతాయి. నేనెంత? నా బ్రతుకెంత? కాలేజీ కుర్రాళ్ళతో కలసి విర్రవీగుతున్నావు భూమి, ఆకాశం కనదిడకుండా ఉంది, కొండెక్కి కూర్చున్నావ్‌. కారుకూతలు కూస్తున్నావ్‌. కాలేజీ ప్రిన్సిపాలు ఒక శుంఠలా కనిపిస్తున్నాడు. తెగదన్ను గర్వం పెరిగింది. ఇప్పుడా ్రిన్సిపాలే దిక్కు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తాడు. బడాయిలు, లడాయిలూ కట్టిపెట్టు! అలనాటి మాట. అప్పుడు శొంఠి రామమూర్తి పంతులు కాలేజీ ప్రిన్సిపాలు. పాపం చాలా మంచివాడు, కరుణామూర్తి. అతని ఎదుట చేతులు జోడించి నిలుచున్నా “ఏం వచ్చేవన్నాడు” దరఖాస్తు యిస్తే చదివాడు. మీ నాన్న ఏం చేస్తాడని అడిగాడు. చనిపోయేరన్నా మరి మీ అమ్మ! అన్నాడు. ఆమె పోయిందన్నాను. పాపం నువ్వెలా చదవగలవు? నేను చూసుకుంటాను. నువ్వు వెళ్లు అన్నాడు అదిగో. నోటీసు బోర్డులో నాపేరుంది. అంతటితో దర్జా వెలిగిస్తున్నాను. గతం మర్చిపోతే పుట్టగతులుండవు. దేశం బాగుంటే పాడయ్యేవారెవరు? దేశం పాడైతే బాగుపడేవారెవరు? ఈ భావం నన్ను (ప్రబలంగా ముందుకు నెట్టింది. 26 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

క్లాసురూము ఇరుకుసందులు వదలి గ్రంథాలయ భవనంలో బైఠాయించేవాద్ని - పుస్తకపఠనానికి పేరుపడ్డాను. బుద్ధిపెరగకుండా ఒళ్లు పెరిగితే ఏం ప్రయోజనం? మాటామంతీ ఉండాలి. విజ్ఞానం సుజ్ఞానం ఉండాలి. నిండుమనిషి పూర్ణమానవుడు. చదువులతల్లి ఒడిలోనే పుడతాడు. వైజ్ఞానిక దివాళాకోరుతనం దేశాన్ని దెబ్బతీస్తుంది. అన్నీ అబ్బాలి. దొరతనం హతమార్చాలంటే సర్వసమర్ధత పుణికి పుచ్చుకోవాలి. పరాయి పీడనకు యిడే విరుగుడు.

ఎన్నికల్లో సంచలమైన తీర్పు లభించింది. విద్యార్థి కాంగ్రెస్‌ అభ్యర్థులందరూ ఘనంగా గెలిచారు. అధ్యక్షస్థానానికి నాకు అఖందంగా విజయం లభించింది. విద్యార్ధి ఉద్యమం - కాలేజి యూనియన్‌ గొడవలు

ఇప్పుడు ఇంకో అధ్యాయం (ప్రారంభం అయింది. విద్యార్థి సమస్యలకు పరిష్కారం కనుగొనాలి. కాలేజీ యాజమాన్యం పై వెరపుతో వీపు చూపిస్తే చరిత్ర నన్ను చెత్తబుట్టలో వేస్తుంది. వాడిగా వేడిగా విద్యార్ధి యూనియన్‌ ఎగ్జిక్యూటివ్‌లో చర్చలు జరిగేవి. సుదీర్హ చర్చల సరళి గందరగోళానికి దారితీసిన సందర్భాలు లేకపోలేదు.

ప్రిన్సిపాల్‌ శ్రీనివాస అయ్యంగారు రాకపోకలు మా కార్యాలయం ప్రక్కనుంచే! యీ వింత విపరీత దుశ్చర్యలు, దృశ్యాలు, ఆయనను అసహనానికి గురిచేశాయి. “ఇది అస్సెంబ్లీ అనుకున్నారా? పార్లమెంటు అనుకున్నారా? దేశ ప్రగతి మీ చేతుల్లోనే ఉన్నట్లు రెచ్చిపోతున్నారు. గొంతుక చించుకుంటున్నారు. విద్యార్థుల ప్రధానధ్యేయం విద్యా సముపార్దన. యిది మరచిపోతున్నారు. పరీక్షల్లో మెరిట్‌ మీద మీ భవిత ఆధారపడి ఉంటుంది, యూనివర్సిటీలో ప్రథమశ్రేణిలో మన కాలేజీ నిలవాలని నేను ఆశపడుతూ ఉంటే, ఇక్కడ గప్పాలు కొట్టి బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. సరస్వతీ పీఠానికి మచ్చ తెస్తున్నారు.” ఈ రకంగా రెండు మూడు మార్లు హెచ్చరించారు. పెద్దవాడు మౌనం వహించాను, భరించాను. అదపా తడపా ఎదిరించక తప్పలేదు. “మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్‌. చర్చల సరళికి అడ్డుపడితే ఎట్లా? భావప్రకటనా స్వేచ్చను ఎవరూ అరికట్టలేరు. యువత కర్తవ్యం పైనే దేశ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.” యిలా మాట్లాడేసరికి అగ్గిమీద గుగ్గిలం అయ్యేవాడు. ఇక్కడ మీ ఫీట్లు- ప్రజాస్వామ్యం పాట్లు చూస్తూ ఉంటే అసహ్యం పుడుతోంది అంటూ తోక ముడిచేవాడు తను. (పాపం చాలా మంచి మనిషి, మెత్తని హృదయం, గాంధీగారు పోయేరని వినగానే తన ప్రాణాలొది లేసాడు పుణ్యమూర్తి - ధన్యజీవి అతనిమీద కలియపడ్డం ఎంత తప్పు? కుర్రకారుకి పాపభీతి ఉండదేమో!)

చదువుల తల్లి ఒడిలో ఉండి దేశ భవితవ్యానికి రూపురేఖలు దిద్దాలనుకుంటే ఎలా? నీ గమ్యం ఏమిటి? గమనం ఎటు? ఏదీ తెలుసుకోలేని వయస్సు. ఈ ఆవేశం అవేదన కాలేజీ గడప దాటితేనే ఆదర్శాలు, ఆశయాలూ అన్నీ అవిరైపోతాయి. నిజ జీవితం తలచుకుంటే భవిష్యత్తు భయంకరంగా విరుచుకుపడుతుంది. ప్రిన్సిపాల్‌ని ఎదిరించి మాటకుమాట చెప్పగలిగిన ధీమంతుడెవరు? ధైర్యవంతులెవరు? అదీ ఆనాటి లెబ్జ. వసంతరావు వెంకటరావు కాలేజీ ముఖద్వారం (1221 8216) వద్ద బెత్తం పట్టుకొని నిలబడ్డాడు. సమ్మె చెడగొట్టడాన్మి 5110116828 కొందరు తయారయ్యారు. యీ విచ్ళిన్నకారుల్ని ఎదుర్కోవాలి. కాలేజీలో ప్రవేశించనివ్వకుండా విద్యార్థి కాంగ్రెస్‌ కార్యకర్తలను అద్దుకుంటున్నాడాయన. కర్రపెట్టి వారిని చిదకబాదాడాయన. ఆ వర్తమానం చేరగానే హుటాహుటిని కాలేజీ ముఖద్వారం దగ్గర వచ్చిపడ్డాను.

“వెంకటరావుగారూ! ఎత్తిన బెత్తం దించండి” అని గర్జించే సరికి ఆయన నిర్ధాంతపోయి వెనుదిరిగాడు! యిటువంటి ఘటనలు, ఫుట్టాలు ఎన్నో అదీ నాటి శూరత్వం! “ధిక్కారమును సైతునా" అన్న సీనియర్‌ ప్రాఫెసర్లే తోకముడిచేవారు. విద్యార్ధి ఉద్యమం బలం ముందు అందరూ బలాదూర్‌!

సాధారణ సమయాల్లో మాత్రం ఎప్పుడూ వినయం ఉట్టిపడేట్టు ఉండేవాద్ని. ఒక్క నమస్కార బాజంతో ఆ పాపాలన్నిటికీ చెల్లు చీటి. “దండం దశగుణం భవేత్‌” నా ప్రణతులు వినతులు చూసి కొందరు పెద్దలు ముగ్గులయ్యేవారు, మురిసిపోయేవారు. శ్రీరాంమూర్తి నా శిష్యుడే అని సగర్వంగా చెప్పుకొనేవారు. వినయం ఉంది. విద్యా ఉంది. లోకంరీతి, ప్రపంచం పోకడా తెలుసు. దేశభక్తి మొలకెత్తింది! స్వాతంత్ర్య సమర కుతూహలం పరవళ్లు తొక్కింది. త్యాగం-యోగం ఒంటబట్టేయి. విజ్ఞాన సుజ్ఞానాల పట్ల మక్ళువెక్కువైంది. పి,వి.జి. పట్టాఖిషేకం

శ్రీ పి.వి.జి. రాజు పట్టాభిషేకం జరుగుతోంది. ప్రిన్సిపాల్‌ నాకు కబురు చేశాడు. పట్టాభిషేకానికి మేమంతా తరలి రావాలన్నాడు. స్వాగత కుసుమాంజలి సమర్పించ మన్నాడు. నాకు యీ తంతు అసలు యిష్టంలేదు, జమీందారి విధానం రద్దుకావాలని అడుగుతున్నాం. అట్టి జమీందారు పట్టాభిషేకానికి బారులు తీరి దాసోహం అనడం, నాకు గిట్టనిపని, అందుచేత “సార్‌, కాలేజీ క్లాసులు ఉంటాయి కదండీ” అన్నాను.

“ఆ వేళ శలవు ప్రకటిస్తాం” అన్నారు ప్రిన్సిపాల్‌. ఆ వంశంలో పుట్టినరోజు పండగకి శలవు! పెద్ద చెబువు కంపుకొడితే శలవు! యిప్పుడు పట్టాభిషేకానికి శలవు! బాగుంది! యీ శలవుల వయ్యారం! “సిద్దాంత రీత్యా యిట్టి కార్యక్రమాలను మేము ్రతిఘటిస్తాం. వీటి పట్ల మాకు సంబరమూ లేదు సానుభూతి లేదు. రద్దయే జమీందారీల బండారాలకు, ఆడంబరాలకు మేము ఆమడదూరం సార్‌” అన్నాను. పాపం ఆయన ఖంగుతిన్నాడు. మిన్నకున్నాడు. పట్టణం అంతా కోటగుమ్మం చుట్టూ (ప్రభంజనంలా విరుచుకుపడ్డారు. మేము మాత్రం ఆ శలవుల్ని సద్వినియోగం చేసుకోవడాన్ని పార్టీ నిర్మాణం పట్ల దృష్టి సారించాం.

కాలేజీ స్టాఫు తరపున ప్రభువు వారికి ప్రశంసాపత్రం సమర్చించుకున్నారట. జోహార్లన్నారో, జోహుకుం అన్నారో! ఎవరి కర్మకు ఎవరు కర్తలు?

జాతీయభావాలు పెంచుకున్నాం. దేశంకోసం ముందంజ వేస్తాం. స్వాతంత్ర్య సముపార్దన కోసం సమర సన్నాహాలు చేస్తాం. జాతినేతలకు జేజేలు పలుకుతాం. స్వాగతాంజలి సమర్పిస్తాం. జొన్నగుడ్డి (హరిజనపేట)లో గుడ్డిదీపం పెట్టుకుని పాఠాలు నేర్పుతాం. పత్రికాపఠనం చేస్తాం, మురికిపేటలో వీథులు ఊడుస్తాం. రోడ్లు శుభ్రపరుస్తాం. మనుష్యుల మనస్సుల్లోని బానిస భావాల బురద కడిగేస్తాం స్వేచ్భా వాయువులు పీలుస్తాం.

  • దీనులు - బలహీనుల ముంగిట వాలుతాం. ధనికపెట్టుబడుదారుల చుట్టు ప్రక్కల చేరం!

షు స ఈ స్వేద్భ్ధభరతం 29

నిద్దరలో కూడా స్వతంత్రపోరాటాల గురించి ఆరాటమే

బ్రైటిష్‌ బావుటాను భూమట్టం చేయాలి! పరాయి (ప్రభుత్వాన్ని పదగొట్టాలి! స్వతంత్ర భారతంలో స్వేద్భా పౌరులుగా జీవించాలి! ఇది ఆనాటి యువలోకం మనోమందిరాల్లో మెలిగిన సుందరస్వష్నాలు!

స్వతంత్ర సంగ్రామంలో ఎందరెందరో వీరమరణం పొందేరు. లాఠీలకు, తుపాకి తూటాలకూ వెరవని యువతరం ముందంజ వేసింది. విద్యార్థి వీరులు జైలుగోడల మధ్య మ్రగ్గుతున్నారు. దేశ దాస్య శృంఖలాలు విచ్చిన్నం చేయాలని వీరోచితంగా పోరాడు తున్నారు. (ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఉరికంబం కౌగిలించుకుంటున్నారు. భరతమాత పాదపద్మాల మైల తమ జీవిత కుసుమాలను పూజా పుష్పంగా అంకితం చేస్తున్నారు.

ఉరకలు వేసే ఉద్రేకం నాలో పరవళ్ళు తొక్కుతోంది. అంతిమ పోరాటం మన ' ముందు ఉందన్నారు జయప్రకాష్‌ రాజ్యాంగసభ ద్వారా స్వాతంత్ర్యం సిద్ధించదని ఉద్దాటించారు. ఆగష్టు విష్లవవీరుడు జయప్రకాష్‌. ఈ అవకాశం చేయి జారకూడ దనుకున్నాను. ఆఖరి స్వాతంత్ర్య సమరాగ్ని జ్వాలల్లో ఉరకాలి అన్న ఉద్వేగం ఆవహించింది.

ఇంతకాలం అజ్ఞానంలో, ఆంధకారంలో జడప్రాయంగా వుండిపోయేను. జాతి జాగ్భతమయింది. నేనింకా నిద్రాబద్భుడనై చైతన్య రహితంగా ఎలా ఉండగలను? కాలేజీ, గోడలమధ్య, పాఠ్యపుస్తకాలే పరమావధిగా రోజులు గడుపుతూ జీవితం వ్యర్థం కాకూడదు. భరతమాత పాదపద్మాలకు నా జీవిత కుసుమం అంకితం కావాలి.

ఖద్దరు వస్త్రధారణ (ప్రారంభమయింది. కారాగార క్లేశాలకు అలవాటు పడాలని భూతలశయనం ్రారంభించేను. విద్యార్థి కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి పదవి అయింది. విజయనగరం కాలేజీ యూనియన్‌ అధ్యక్షపదవిలో వున్నా అన్ని సమ్మెలకూ, బందులకూ, ముందు శంఖారావం ఊదడం నాపనే అయింది. అయినా స్వతంత్ర వీరుల దారిలో జైలు జీవితానికి ఉరకలు వేసే నా ఉద్రేకానికి గండిపడింది. మరో పోరాటానికి కూడా తెరపడింది.

అనాటి భావోద్రేకంలో నాభగ్న స్వప్నాల గురించి (ది డ్రీమ్‌) నా ప్రథమ ఆంగ్ల రచన 1947 ఫిబ్రవరిలో మా కాలేజీ మేగజైనుల్లో ప్రచురించేరు. స్వతంత్ర పోరాటంలో పాల్గొనే భాగ్యానికి నోచుకోని నా దురదృష్టానికి అద్దంపట్టే ఈ కథాకథనం తెలుగు తర్జుమాను చిత్తగించండి. (ఇందులో నా మారుపేరు రమేష్‌ - భాట్టం)

“దేశంలో ఒక అపూర్వ విప్లవం చెలరేగుతున్న రోజులవి. స్వాతంత్ర్య సముపార్టనకు పరాయి ప్రభుత్వం మీద స్వాతంత్ర్య సంగ్రామం జరుగుతున్న కాలమది. జాతినేతల నిరుపమాన త్యాగచరిత్ర దేశభక్తి గల 'ప్రతిపౌరుని గుండెల్లో ఆరని జ్వాలలు రేపింది. ఉరికంబం, కారాగారం దేనికీ వెనుదీయని దేశపొరులు జడిసే రోజులు కావవి. బానిస విద్యా విధానానికి స్వస్తి చెప్పే విద్యార్థుల సంఖ్యపెరుగుతోంది. చట్టాన్ని చూపించి వాదించే న్యాయవాదులు శాసనోల్లంఘన చేస్తున్నారు.

సత్యాగ్రహోద్యమం పిలుపును అందుకొని రైతాంగం శిస్తులు, దస్తులు చెల్లించడానికి నిరాకరిస్తున్నారు. వాణిజ్యవేత్తలు వ్యాపారసంస్థల్ని దుకాణాలనూ బందు చేస్తున్నారు. పరవళ్ళు శ్రొక్కే ఉత్సాహంతో, ఉద్వేగంతో కఠిన కారాగార శిక్షలు అనుభవించేందుకు సంసిద్ధులవుతున్నారు. దేశమాత దాస్య విముక్తి కోసం ఇట్లు అసంఖ్యాకంగా, స్వచ్చందంగా భారతపౌరులు ముందంజవేసిన చరిత్ర మున్నెన్నడూ కనీవినీ ఎరగం. హంతకులను, దొంగలను, దోపిడీదారులను బంధించే చెరసాలలు ఆనాడు ఉత్తమపౌరులకు, గౌరవ నీయులైన పెద్దలకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. జైలు యాత్రకు విచ్చేసే జాతిపొరుల వెల్లువకు తట్టుకోలేక జైలు అధికారులు రేయింబవళ్ళు పరిశ్రమిస్తున్నారు.

రమేష్‌ మనసు చదువు మీద లగ్నం కావడం లేదు. ఎటుచూసినా నిరసన జ్వాలలు, ప్రతిఘటనలు, ప్రదర్శనలు పోరాటపటిమ ద్యోతకం అవుతున్నాయి. రమేష్‌పై వాటి (ప్రభావం (ప్రగాఢంగా పడింది. బందులు, హర్తాళ్ళు, జైలు శిక్షల వార్తలు విని రమేష్‌ ఉవ్విళ్లూరేవాడు. తానే జైలుకు వెళ్ళాలన్న బలవత్తరమైన కోరిక అతడిని ఆవహించింది. రాత్రిపూట ఒంటరిగా ఉన్న సమయంలో తాను నిద్రించే గదిలో పడుకొనే పరుపు ప్రక్కకు నెట్టేవాడు. కటికనేలపై పడుకునే అలవాటు చేసుకోవాలని ఆరాటపడేవాడు. అందుకు అలవాటు పడిన తర్వాత లోలోన ఆనందం ఉప్పొంగేది. కారాగారవాసానికి యోగ్యత సంపాదించుకున్నానని సంబరపడిపోయేవాదు. ఇట్టి చేష్టలు రాత్రిపూట ఎవరైనా కనిపెడుతున్నారేమోనని బిడియపడేవాడు. రాశ్రల్లా నిద్ర ఉండేది కాదు. స్వరాజ్యం కోసం నేనూ పాటుపడాలి, నా కర్తవ్యం నిర్వర్తించాలి, అని పదే పదే అనుకొనేవాడు.

స్వస్నంలో సమరం ఒకనాటి రాత్రి కల అది! ఆ సాయంకాలం (బ్రహ్మాండమైన ఊరేగింపు జరుగుతుందని విన్నాడు రమేష్‌ ఒంటిన ఖద్దరు దుస్తులు, నెత్తిన గాంధీటోపీతో తయారయ్యాడు. అది ఆనాడు దేశభక్తికి, త్యాగదీక్షకు, జాతీయతకు చిహ్నంగా ఉండేది. రమేష్‌ దృఢనిశ్చయంతో ముందంజవేసేడు. నేరుగా ఊరేగింపు అగ్రభాగానికి చేరుకున్నాడు. తనవంటి యువకులు, విద్యార్థులు ఎంతోమంది ఊరేగింపులో పాల్గొన్నారు. గొంతెత్తి పాడుతున్నారు. భూనభోంతరాళాలు దద్దరిల్లేటట్లు నినాదాలు చేస్తున్నారు. “వందేమాతరం!” “ఇంక్విలాబ్‌ జిందాబాద్‌!” అనే అరుపులతో అకాశం దద్దరిల్లిపోతోంది. రమేష్‌ కూడా తన గొంతు కలిపాడు. తన జన్మ తరించిపోయింది! నఖశిఖ పర్యంతం పరవశించిపోయేడు! ఆనాటి సంరంభం, త్యాగపూరిత వాతావరణం గుండెలోతుల్లోంచి మనుషుల్ని కదిపి, కుదిపి జనచైతన్య వెల్లువ అయింది. స్వాతంత్ర్య పోరాట సంరంభం అది. జన సందోహంలో రమేష్‌ కలిసిపోయాడు. స్వాతంత్ర్య సమరోత్సాహంతో పరవశించిపోయేడు. తనలో అంతర్లీనంగా ఉన్న ఉద్రేకం, ఉద్వేగం పెల్లుబికింది. నూతన శక్తి అతనిని ఆవహించింది. ఇప్పుడు అతను అర్భకుడు కాడు. బిడియపడే బాలుడు కాడు. అసమాన ధైర్యసాహసాలు పుణికి పుచ్చుకున్న సమరవీరుడతడు. స్వాతంత్ర్య సముపార్టనకు తన (ప్రాణాన్ని పణంగా పెట్టే స్వాతంత్ర్య సమరసేనాని అతడు. జైలు వారెంటు ఊరేగింపు పురవీథుల్లో కొనసాగుతుంది. ఇంతలో హఠాత్తుగా మృత్యువు తమతో తలపడుతున్నట్లనిపించింది. పోలీస్‌ దుండగులు బారులు తీరి నించున్నారు. తూటాలు నింపిన తుపాకీలు విద్యార్థి వీరులపై గురిపెట్టి, బలికోరుతున్నాయి. ప్రజ్వరిల్లే విద్యార్థి ఉద్యమం అంతుచూడాలని దీక్ష వహించినట్లు తీక్షణంగా, క్రౌర్యంగా చూస్తున్నారు. తుపాకీ తూటా పేల్చడానికి సమాయత్తం అవుతున్నట్లున్నారు. ఒక పోలీసు అధికారి ముందుకు దూసుకువచ్చాడు. ఆ బొద్దుమీసం క్రింద ఒక విషపు నవ్వ మెదలుతోంది. అతని భయంకరమైన చూపులు రమేష్‌ వైపు మళ్ళాయి. పోలీస్‌ అధికారి రమేష్‌కు అరిస్టువారెంటు అందజేసాడు. చిరకాలం నుండి కలలుకంటున్న సమయం ఆసన్నమయింది. కఠినకారాగార వాసానికి ఆహ్వానపత్రిక అందింది. ఎనలేని ఆనందం రమేష్‌ గుండెలనిండా అలముకొని పెల్లుబికింది. అపూర్వ త్యాగచరిత్ర సాటీ విద్యార్థుల వీడ్మోలు అందుకొనే ముందు ఉత్తేజపూర్వకంగా ప్రసంగించడానికి పూనుకున్నాడు. “భారతమాత పిలుపు అందుకోండి, స్వచ్చందంగా, ఆనందంగా తరలిరండి. ముందంజ వేయండి. భారతదేశంలో విద్యార్థుల ఉద్యమం అపూర్వ త్యాగచరిత్ర 32... భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చంత్రు

సృష్టించింది. నిరుపమానమైన త్యాగశీలం ప్రదర్శించింది. ధైర్యసాహసాలు నిరూపించింది. తిరుగులేని నాయకత్వం అందించింది. దేశభక్తి ప్రపూరితమైన యువతీ, యువకులు ఎందరో దేశస్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాన్ని పణంగా పెట్టారు. భారతదేశ చరిత్రలో సువర్దాక్షూలతో లిఖించదగ్గ ఇట్టి మహోజ్వల త్యాగచరిత్రను సృష్టించారు. ఈ సంప్రదాయం ఖావితరాలకు మార్గదర్శకం కావాలి. మన సర్వస్వమూ దేశం కోసం ధారపోయాలి. స్వరాజ్యం సాధించేవరకు మన దీక్ష కొనసాగాలి. “స్వరాజ్‌...స్వరాజ్‌... స్వరాజ్‌” రమేష్‌ అన్న గట్టిగా భుజం తట్టిలేపుతున్నాడు. “శ్సీక్సు వ్రమయింది?” అని అడుగుతూ ఉంటే, తన సోదరుడికి సమాధానంగా ఒక్కమాట తననోటి నుండి వెలువడింది. “ఇది కలి అనగలిగాడు.

భరతమాత పిలుస్తోంది రమేష్‌కు థైర్యసాహసాలకు కొరతలేదు. కృతనిశ్చయుడై ఉన్నాడు. తన ఆలోచనలు అన్నీ దేశస్వాతంత్ర్యంకోసం వ్యూహారచన చేస్తున్నాయి. దేశం కోసం తమ సర్వస్వం అంకితం చేసిన అమరవీరుల త్యాగచరిత్రతో మనస్సంతా నిండి ఉంది. దేహాన్ని దేశానికి ధారబోసి, స్వాతంత్ర్య జ్యోతిని (ప్రజ్వలింపజేసిన యువతీయువకుల త్యాగమయ జీవితం తన కంటిముందు కనిపిస్తోంది. వలస ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధ్వజమెత్తి పోరాడిన విద్యార్ధి ఉద్యమ చరిత్ర తన మనస్సులో మెదలుతోంది. భరతమాత పిలుస్తోంది. ఆధునిక చరిత్ర నేటి విద్యార్థులకు ఒక విశిష్ట పాత్ర అందజేస్తుంది.

రమేష్‌ తన దృఢనిశ్చయాన్ని తన తండ్రి ముందు బయటపెట్టాడు. కన్న కొడుకు తన కంటిముందే తన జీవితం సర్వనాశనం చేసుకుంటున్నాడని (గ్రహించి నిర్భాంత వోయాడాయన! కొడుకును మందలించాడు... వారించాడు... ఈ వయసులో విద్యార్ది దృష్టి ప్రధానంగా చదువుపట్ల ఉండాలి. విద్యను ఆర్డించి, విజ్ఞానం సంపాదించి మంచి భవితవ్యాన్ని నిర్మించుకోవాలి. తమకు అవగాహన కాని జాతీయవిషయాలలో తలదూర్చడం విద్యార్థినీ, విద్యార్థుల కర్తవ్యంకాదు. స్వాతంత్ర్య సంపాదన తమ పరిధిలోని పని కాదని ఎంతచెప్పినా రమేష్‌ వినిపించుకోడు. తనతంగ్రిపట్ల అమితమైన గౌరవం ఉంది రమేష్‌కు. కానీ తన అంతరాత్మ చెప్పింది ఎట్లా నిరాకరించాలి? తన ఆత్మకు విరుద్దంగా తండ్రి సలహా ఎట్లా పాటించాలి? మహాత్మాగాంధీ బ్రిటిష్‌ విద్యావిధానాన్ని దుయ్యబట్టాదు. ఉత్తమ మానవుని పవిత్ర జీవిత లక్ష్యానికీ, నేటి విద్యావిధానానికి ఎట్టి పొంతనాలేదన్నాడు. తన వ్యక్తిగతమైన భవిష్యత్తు కోసం ఆశలు పెంచుకోవడం కాదు... మనజాతి చిరకాల స్వప్నం దేశ స్వాతంత్ర్యం... అందుకోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధం కావాలి! ఎంతైనా త్యాగం చేయాలి. తన కొడుకు ధోరణి మార్చాలనుకున్నాడు తండ్రి. కానీ కొదుకు కృతనిశ్చయుదై ఉన్నాడు. కలోర నిర్ణయం తీసుకున్నాడు. మరి వెనుతిరిగే వైఖరిలేదు! స్వేద్భభారతం 28

ఆ రోజు రమేష్‌ ఆతృతగా దినపత్రిక చూస్తున్నాడు. పతాకశీర్చికపై దృష్టిపడింది. “మహాత్మాగాంధీ సహాయనిరాకరణోద్యమాన్ని నిలిపివేశారు” ఉద్యమం నిలిచిపోయిందా? ఎందుకు?... ఎందుకు?... చౌరీచౌరాలో పోలీసుఠాణాపై ఉద్యమకారుల విధ్వంస చర్యల వల్ల కొందరు పోలీసులు మంటల్లో మరణించారు. ప్రజల గుందెల్లో హింస నిండిపోయింది. సాత్విక నిరోధ ఉద్యమంలో హింసాత్మక చర్యలకు స్టానం లేదు. అందుకే మహాత్ముడు

ఉద్యమాన్ని ఉపసంహరించాడు. రమేష్‌ గుండెలమీద పెద్ద బండ పడినట్లయింది! తన ఆశలు కుప్పకూలిపోయాయి! కనీసం ఒక కలనైనా కన్నాడు! స్వష్నంలోనైనా తన కోరిక కొంతవరకూ నెరవేరింది! ఈ కల అయినా రాకపోతే, మరెంత దుఃఖంతో క్రుంగిపోయేవాడో! స్వాతంత్ర్య సమరానికి సన్నాహాలు దేశస్వాతంత్ర్య సమరఘట్టంలో విజయనగర విద్యార్థి కాంగైస్‌ బలప్రాభవాలు పుంజుకుంటోంది. స్థానికంగా సుట్రసిద్ధం అయింది. విద్యార్థి రంగం నుంచి నేరుగా రాజకీయరంగ ప్రవేశానికి యువరక్తం పెల్లుబుకుతోంది. బొంకుల దిబ్బకు ఎదురుగా ఉన్న 'సఫేద్‌కోటి మా లాడ్జిగా మారింది. కిళాంబి రంగాచార్యుల వారి బెదార్యం వల్ల దానికి “నెహ్రూ హోం” అని పేరు పెట్టాం. కాంగ్రెస్‌ అధ్యక్షస్థానం అలంకరించి, దేశానికి దిశా నిర్దేశం చేస్తూ సమతా సమాజం కావాలని ప్రప్రథమంగా ప్రకటించిన ఏకైక జాతీయనేత జవహర్‌లాల్‌ నెహ్రూ, వారి పేరుతో మా వసతిగ్భహం వర్ధిల్లింది. బహుముఖ కార్యకలాపాలకు కేంద్రబిందువయింది. జిల్లాలో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీని స్థాపనకు తీర్మానం అక్కడే జరిగింది. నాటి కార్యక్రమానికి కె.యస్‌. శాస్త్రి, అధ్యక్షులు. తిలక్‌కు యింకా కొన్ని పరిమితులు ఉండేవి (రిజర్వేషన్లు, రాష్ట్రాయకులు ఎన్‌.జి.రంగా నుండి కార్యకర్తగా నెలసరిజీతం కొంత అందుకొనే వారు. ఆ కారణంగా వారితో ముందు చెప్పకుండా సోషలిస్టు పార్టీ నిర్మాణానికి ఉపక్రమించడం సమంజసం కాదన్న భావనతో తిలక్‌ ఉన్నారు. మహాత్మాగాంధీ సందర్శన మహాత్ముడి మహత్వం ఏమిటో? వారొస్తారంటే జనం విరగబడేవారు బారులు తీరి నిలబడేవారు. ఒళ్ళంతా కళ్లు చేసుకొని ఎదురు చూసేవారు. ఊరంతా ఖాళీ, జనమంతా బజారున పడతారు. 1945వ సం॥ జనవరి మాసం గాంధీమహాత్ముని ప్రత్యేకరైలు విజయనగరం మీదుగా విశాఖ చేరుకుంటుంది. ఈ వార్త (వినగానే) చేరగానే కశ... భాట్టం శ్రీరామమూర్తి స్వీయ చరిత్ర

విజయనగరం స్టేషను నిండిపోయింది. కోలాహలంగా ఉంది. “మవాత్నాగాంధీ జిందాబాద్‌”, “పూజ్య బాపూజీకి జై అన్న నినాదాలు మిన్నుముట్టేవి. ఒకటే జన ప్రవాహం. కనుచూపుమేరలోని గ్రామాలన్నీ ఎగబడ్డాయి. తండోప తండాలుగా జనం. ఇసుకపోస్తే నేలరాలదు. ప్తాటుఫారం కిర్రు పెడుతోంది. ఉత్సాహం పరవళ్లు తొక్కుతుంది. జనం కదం (త్రొక్కుతున్నారు. వారిని ఎవ్వరు అదుపులో పెట్టగలరు? ప్రజలు పట్టాల మీద కూర్చుంటున్నారు! అలాగైతే గాంధీజీ తలుపులు తెరవరు! ఎవరో బాకా ఊదారు. గొడవ చేయకూదదు. ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే గాంధీజీ మాట్లాడరు. “పలాసా నుండి బండి బయలుదేరింది. నిశ్శబ్దంగా ఉంటే గాంధీగారి దర్శనం దొరుకుతుంది. రెండు మాటలు మాట్లాడుతారు.” కళావెంకటరావుగారి మాటగా ఎవరో బాకా ఊదారు.

ఈ రణగొణ ధ్వని మధ్య ఎవ్వరికీ బుర్ర పనిచేయడం లేదు. ఇంతలో జమాజెట్టిలాంటి మనుష్యులు నలుగురు లాఠీలు పట్టుకొని రంగప్రవేశం చేశారు. దబదబా బాదుకుంటూ వెళ్ళిపోతున్నారు నేలమీద. ఎవరి కాలివేళ్ళు తెగిపడతాయో తెలీదు. ఈ హక్కు మీకెవరిచ్చారని కొందరు తిరగబడ్డారు వాళ్ళమీద. యింతలో విద్యార్థి కాంగ్రెసు ముందుకు రావాలన్న కేకలు వినబడ్డాయి. యువకులు, మహిళలు ముందుంటే గాంధీగారి రైలు ఆగుతుంది. సరే జనాలకు దండాలు పెట్టుకుంటూ గొంతుక చీల్చుకొని ప్రార్ధన ప్రారంభించాం. ప్రశాంతంగా ఉండమని, ఇంతలో ఎవరో గళమెత్తి, “కొళ్లాయి గట్టితేనేమీ, మనగాంధీ - మాలడై తిరిగితే నేమి” అంటూ ఘనంగా పాట ప్రారంభించాడు. పడా పడా చప్పట్లు పడ్డాయి. జనం అదుపులోనికి వచ్చారని మేము సంబరపడిపోతూ ఉంటే _ గాంధీబండి విజయనగరంలో ఆగకుండా విశాఖవైపు దూసుకుపోయింది. ప్రజలు గొల్లుమన్నారు. జనం గగ్గోలు పెట్టారు. మమ్మల్ని నిలువునా శిలువ వేసినట్లయింది. మొహం చెల్లక మారు మూలల్లోకి పరుగులంకించుకున్నాం. మామీద దాడి చేస్తారన్న భయంతో.

ఇంతకీ యీ జీవికి గాంధీజీ దర్శనం చేసే భాగ్యం ఉందా! లేదా? ఖద్దరు బట్టలు ఎవరికోసం కట్టాం? గాంధీ టోపీ ఎందుకు ధరించాం.? ఆ గాంధీజీని కంటచూడని జన్మ జన్మేనా? ఏడుపు మొహం పెట్టుకొని లాడ్డీకి చేరాం ఒకరినొకరిని నిందించుకుంటూ, తప్పులెంచుకుంటూ.

షి 1 ఈ

స్వాతంత్ర్య సమర ధ్యేయాలు అది 1947వ సంవత్సరం. రాజ్యాంగ నిర్మాణసభ ద్వారా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని కాంగ్రెస్‌ ప్రముఖుల ్రగాఢవిశ్వాసం. జయప్రకాశ్‌ నారాయణ వాదన అందుకు భిన్నంగా ఉంది. స్వతంత్ర్య సముపార్దనకు అంతిమపోరాటం అవసరం. మరోవిప్లవం కాచుకు కూర్చుంది. అందుకు యువత సిద్ధంకావాలి. ముందుకు రావాలి. నడుం కట్టాలి. అని ఉద్చోధ చేసేవాడు. 1942 ఆగస్టు 9న జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమమే అఆఖరుఉద్యమం., ఇంకో పోరాటం జరగనిదే స్వాతంత్ర్యం అసంభవం అందుకు జాతిని సమాయత్తం చేయడానికి విష్లవబీజాలు నాటేవాడు. పోరాట పటిమను పెంచుతూ ఉద్యమమార్గం చేపట్టేవాడు. జె.పి. సిలుపుతో మాలో క్రొత్త ఆశలు శేకెత్తాయి. విద్యార్థినీ విద్యార్థులు నవయువకులు అంతా కదనరంగంలో ఉరకడానికి ఉవ్విళ్తూరుతున్నారు. దేశదాస్య విముక్తికి తను ధన మాన ప్రాణాలను అంకితం చేయడానికి సమాయత్తం అయ్యేవాళ్ళం మరో పోరాటం అన్న పిలుపు మా గుండెల్లో నిండు ఆశలు నింపగా “ఇంక్విలాబ్‌ జిందాబాద్‌” అని ఎలుగెత్తి చాటేవాళ్లం. అంతిమపోరాటం తీరుతెన్నులు తలచుకుంటూ. అందులో నిర్వహించనున్న ప్రధాన భూమికను తలచుకుంటూ రోజులు గడిపేవాళ్ళం. రాబోయేరోజు పూరించే విప్లవ శంఖానికి అనుకూలంగా నినదించాలని కొన ఆశతో (భూతల శయనం”) నేలమీద పవళింపుకి అలవాటు పడుతున్నాం. చాప పరచుకొని పడుకోవడం, అద్ధం చూడకుండా గెడ్డం గిసుకోవడం. తైల సంస్కారం లేకుందా, తలదువ్వకుండా, కాలికి చెప్పులు తొడక్కుండా, ముతక ఖద్దరు బట్టలు కట్టి నవజీవితానికి అలవాటు పడుతున్నాం. “5100016 11408 జ6 92 410,598" అనేవాడు మహాత్ముడు. “నిరాదంబరముగా బ్రతుకు, అంబరాన్ని చుంబించే ఆశయాలు ఉంచుకో ఆదర్శాన్ని పెంచుకో” అది గాంధీయుగం నాటి మాట. మన నడతలో, ప్రవర్తనలో, పరిసరాల్లో నాలా 56 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

మనం ప్రవచించే ఆదర్శాలు కళ్లకు కట్టినట్లు కనబడాలి. అందుకే మా జీవనశైలి మారింది. ఆదర్శాలకు అద్దంపట్టే ప్రవర్తన, రూపు, చూపు మారింది. కట్టూ, బొట్టూ మారేయి. గాంధీ గారి మాట ప్రతీనోటా వినపదేది. నేటికీ ఖద్ధరు వస్త్రధారణా వ్రతం మానలేదు. గాంధీపటం లేని ఇంట్లో కాపురం ఉండను! గాంధీజీ జీవిత చరిత్ర మా భగవద్గీత!

ఆరాటం, పోరాటం మాత్రమే కాదు. స్వాతంత్ర్య సముపార్దనే కాదు తెచ్చిన స్వాతంత్ర్యం ఎవరికి హక్కుభుక్తం కావాలి? స్వాతంత్ర్యం ఎవరికి? సమాజంలో అట్టడుగున పడి ఉన్న పతిత, దళిత, పీడిత ప్రజలకు యీ స్వాతంత్ర్య ఫలాలు దక్కాలి.

౪7% 5006121130 అని జె.పి. వ్రాసిన పుస్తకం మాకు మరో భగవద్గీత అయింది. 7/0 0౪1౪ [1164117 అన్నది రిఫరెన్సు పుస్తకం. వేళ్ల మీద లెక్కించదగ్గ ధనిక పెట్టుబడిదారుల గుత్తాధిపత్యంలో దేశం మగ్గుతోంది. పట్టపగ్గాలు లేని పెట్టుబడిదారీ విధానానికి స్వస్తి పలికేంతవరకూ, దేశంలో పేదరికం పోవడం కల్ల!

అధికారం, సంపద కొద్ది మంది పెద్దల చేతుల్లో కేంద్రీకృతం కాగా, దారిద్ర్యం కోరల్లోపడి నిరుపేదలు నలుగుతున్నారు. జాతి సంపద సంపన్నుల హస్తగతం అయింది. దారిద్ర్యం, పేదల గూడేల్లో విలయతాండవం చేస్తుంది. ఇట్టి సామాజిక వ్యవస్థను కూకటివేళ్ళతో పెకళించాలి. స్వాళంత్ర్యం కావాలి

రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమేకాదు, ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి. లేకపోతే స్వాతంత్ర్యం అర్ధరహితం అవుతుంది. నిరర్ధకం అవుతుంది. అందుకే సామ్యవాద సిద్ధాంతం అమలు జరగాలి. అసమానతలు తొలగాలి, తగ్గాలి. అందరికీ సమాన అవకాశాలు కావాలి. హెచ్చు లొచ్చులు, తర తమ బేధాలు మటుమాయం కావాలి. మనిషికి మనిషికి నడుమ లేచిన అడ్డుగోడలు కూలిపోవాలి. తొలగిపోవాలి. మనిషిని మనిషిగా గుర్తించే మాననీయమైన మానవ సమాజ నిర్మాణం జరగాలి. స్వాతంత్ర్య పోరాటాల ఫలితాలు అందరికీ అనుభవైక వేద్యం కావాలి.

కేవలం స్వతంత్రం మాత్రమే గాక ప్రజాస్వామ్యము, అహింస, సోషలిజం కూడా ఉండాలని కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీలో చేరడం జరిగింది.

దేశభక్తి, త్యాగనిరతి, జైలు జీవితం, కష్టాలు, కన్నీళ్లు అన్నీ అందరికీ అనుభవైక వేద్యం కావించాలని సమాయత్తం అవుతున్నాం. పరాయి ప్రభుత్వం మీద పోరాటం మాత్రమే కాదు, వలసరాజ్య విధానం మీద, పేదరికం మీద పోరాటం. దారిద్ర్యం మీద స్వేచ్భాభరతం ౩?

దండయాత్ర ఏక కాలంలో యివన్నీ సాధించడానికి సంసిద్దులం కావాలి. లేకపోతే తెల్లదారల జాగాలో నల్లదొరలు వస్తారు! పేదరికం అనే పెనుజాద్యంతో అలమటించే కోటాను కోట్ల అభాగ్యులు, మూగజీవులు బలిపశువులు కావలసి వస్తుంది. ఈ అధ్యాయానికి స్వస్తి పలకాలి.

ఇట్టి ఆలోచనలు ఆశలు, ఆశయాలు కలబోసుకొని, జీవితంతో పెనవేసుకొని యీ (ఆశయాలకు) ఆదర్శాలకు నిలువెత్తు దర్పణంగా జీవనశైలి ఉండాలని, ప్రవర్తనా నియమాలు పెట్టుకొని నవజీవన విధానంతో జీవయాత్ర కొనసాగించాలని అనుకున్నాం. భావాల్లోస్వభావాల్లో మార్చురావాలి. నడవడికలో ప్రవర్తనలో తగుమార్సు ద్యోతకం కావాలి. దేశ ఆర్థిక సామాజిక చిత్రపటానికి కొత్త రూపు రేఖలు దిద్దాలని విద్యార్ధి దశలోనే ఆ చిన్న వయస్సులోనే గంపెడాశ పెంచుకున్నాం. అందుకే విప్లవం కావాలని ఆరాటం. అంతిమ పోరాటానికి సంసిద్ధత, ఆశయం లేని బ్రతుకు వృథా, ఆదర్శం లేని జీవితం వ్యర్థం. జీవితానికి అర్ధం పరమార్ధం ఉండాలంటే దేశ దాస్య విముక్తి కోసం అంకితం

అవడమే ప్రధానం అన్న స్థిర నిర్ణయంతో మా మిత్రబ్బందం అంతా ఉన్నారు.

ఈ ఈ ఈ

88 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్ర)

జయప్రకాష్‌ జైత్రయాత్ర 1947 మార్చి మాసంలో విజయనగరం నుండి ప్రారంభం అయింది. కరుడుగట్టిన కాం(గ్రైసు వాదులు. కాకలు తీరిన కాంగైసు యోధులు ఎవరూ జె.పి. కార్యక్రమంలో భాగస్వాములు కారు. పాలు పంచుకోరు. సర్టార్‌ పటేల్‌ పార్లమెంటరీ బోర్డు చైర్మన్‌, పార్టీ వ్యవస్థమీద గట్టి పట్టున్న మహానాయకుడాయన (భారత ప్రధాని పండిత నెహ్రూ ప్రధానంగా ప్రభుత్వ కార్యకలాపాలపై నిమగ్నమై ఉంటాడు.) సర్దార్‌ పటేల్‌కు ఉక్కుమనిషి అని పేరు. & ౧20 */010 4 02%) 62000660 అ కాంగ్రెస్‌ పార్టీలో యింకోపార్టీ (సోషలిస్టు పార్టీ) పెట్టుకోవడం పనికిరాదు. ఒక పార్టీ పొట్టలో యింకో పార్టీ పుట్టే ప్రసక్తి లేదు. మీరు కాంగ్రెస్‌ వాదులా? సోషలిస్టులా? మీరే తేల్చుకోండి? మీరైన నిషమించండి. మేమైనా మీకు గేటు మన్నా చెబుతాం. అని ఖండితంగా చెప్పాడాయన. ఆయన మాట కాదంటే, తన నిర్ణయాన్ని ధిక్కరిస్తే భావి భారతంలో కాంగ్రెస్‌ పార్టీలో సముచిత స్థానం దొరకదు. ముందున్న ఎన్నికల్లో టిక్కట్లు చిక్కవు.

జె.పి. ప్రచార కార్యక్రమాదుల్లో భాగస్వామ్యులైతే వేటు పడుతుంది. యీ వెరపుతో పండు తలకాయలు అంటీ అంటనట్లు దూరదూరంగా ఉండి, నీళ్లు నములుతూ ఉండేవారు.

ఈ స్థితిలో యువనేతల సారథ్యంలోనే కార్యక్రమాలు పుంజుకోవాలి. అందుకోసమనే రాష్ట్ర జిల్లా నాయకులు పలువురు జె.పి. కార్యక్రమం బాధ్యత మీ భుజస్మంధాల మీద ఉందంటూ నన్ను బుజ్జగించారు. ప్రోత్సహించారు. జె.పి. సతీసమేతంగా ప్రభావతీ దేవితో పాటు విచ్చేస్తున్నందున వారి విడిది గృహం మా లాడ్డీ “నెహ్రూహోం” కాగలదని అంగీకరించారు.

దేశప్రజల ఆశాజ్యోతి, విష్లవ వీరుడు, నవభారత నిర్మాత, సమసమాజన్థాపనకు, నిర్మాణానికి కంకణం కట్టుకున్న వీరుడు, యోధుడు, జె.పి.వంటి జాతినేత కార్యక్రమం విజయవంతంగా విజయనగరంలో నిర్వహించే బాధ్యత నా భుజస్మంధాలపై పడింది. యేమి అదృష్టం! సతీసమేతంగా విచ్చేసే అద్వితీయ జాతినేతలు మా ఆతిథ్యం స్వీకరిస్తారు. ఆగష్టు విప్లవ వీరునికి సేవలందించే భాగ్యం పూర్వజన్మ పుణ్య ఫలం, ఈ అవకాశం చేజార్చుకోకూడదు అనే నిర్ణయం గుండెల్లో నిండింది. అయితే ఇక్కడే ఒక చిక్కుముడి నన్ను కలవరపెడుతోంది. స్వేచ్భాభారతం 89

మార్చి మాసంలో ఫైనలియర్‌ యూనివర్సిటీ పరీక్షలు జరుగుతాయి. అటు పరీక్షలా? ఇటు జె.పి. కార్యక్రమమా? ఏదో తేల్చుకోవాలి, రెండూ కుదరదు, జె.పి. కార్యక్రమం బాధ్యత నెత్తిన ఎత్తుకున్నామంటే పరీక్షలకు పంగనామాలు పెట్టినట్లే. పరీక్షపోతే నా భవిష్యత్తు పోయినట్లే. కనీసం డిగ్రీ అయినా లేకపోతే భవిష్యత్తు బుగ్గయిపోతుంది. తల్లిదండ్రులను చిన్నప్పుడే కోల్పోయినందున మాకున్న చెక్కముక్క తాకట్టుపెట్టి ఆ డబ్బులతో చదువూ సంధ్యా వెలగబెడుతున్నాను. పెద్దరికం మా పెదబావది వాడు అగ్గిమీద గుగ్గిలం అవుతాడు. నా గురించి నాకు బెంగలేదు. స్వాతంత్రపోరాటంలో (ప్రాణాలొడ్డాలని బరితెగించిన వాడికి భావి భద్రత గురించి బెంగఏమిటి? మొండికేశాను. బండరాయిలా నిల్బాను. కార్యక్రమంలో ఉరకడానికి సిద్ధపడ్డాను. ఇది దేశ సమస్య, త్యాగం, సాహసం లేకుండా అడుగు ముందుకు వెయ్యలేం. అన్నివిధాలా యోచించి కృతనిశ్చయంతో ఉన్నా యింకో సమస్య నన్ను పట్టి పీడిస్తోంది. అదీ కీలక విషయమే! ఇందులో ఒక ధర్మసూత్రం యిమిడిఉంది. స్వగ్రామంలోని పెద్దల్ని పరీక్షలకు వెల్తున్నట్టు భ్రమలో పెట్టి, ఇక్కడ రాజకీయ ఆరంగేట్రం చేయడం భావ్యమా? నా యోగక్షేమాలు చూచేవారిని మభ్యపెట్టడం మోసం _కాదా? సూటిబాటలో వెళ్లీ మనిషికి మోసం దోషం అవుతుంది. పెద్ద అపచారం అవుతుంది. నేను గుండె పాషాణంగా మార్చుకోవాలి. ప్రపంచంలో నా అన్నవాళ్లు ఎవరూ లేనివాడ్ని అన్నది మరుపురాదు, మరువలేను, నేను ఏకాకిని, ఒంటరిని, ఏమీ లేనివాడిని. దేశం నాదని భ్రమిసిపోయి భుజాలు చరుచుకుంటున్నాను. దెబ్బతింటే దిక్కు ముక్కూ ఉండదు. సవాలక్ష సందేహాలు. జీవితం ఒక విఫణి వీథికాదు. లాభనష్టాలు బేరీజు వేసుకోడానికి జనంతో జత కట్టడానికి, ఉద్యమంలో దిగడానికి, స్వాతంత్ర్య సముపార్దనా దీక్ష నాలో సడలిపోయిందా? అలనాటి మాటల బడాయిలు బలాదూరయ్యాయా? స్వాతంత్ర్య సమరాగ్ని జ్వాలల్లో ఉరకాలని ఉవ్విళ్లూరే వాడికి వెరపేమిటి? మనశ్చాంచల్యమేమిటి? నిండా మునిగిన వాడికి చలి ఏమిటి? మళ్లీ సెప్టెంబరు పరీక్షలకు ఎలాగూ రావాలి. చేతిలో చిల్లిగవ్వ లేదు. దేశం, ప్రపంచం అంటో గెంతులు వేస్తే సరిపోతుందా! పైసల కోసం పెద్దల ఎదుట పడినప్పుడు బండారం బయట పడుతుంది. గుట్టురట్టవుతుంది. భావి తలపు-వెరపు-మరచిపోయి, గుండె బండ చేసుకొని ఇంట్లో పెద్దలకి మనసులో ఓ దండం పెట్టుకొని పరీక్షలెగ్గొట్టి ఉద్యమంలో ఉగ్రరూపం ధరించాను. కార్యరంగంలోకి ఉరికాను. వందల వేల యువతీ యువకుల సమూహంతో జయ జయ ధ్వానాలతో 40... భౌట్టి శ్రీరామమూర్తి జ్వేయ చరిత్ర

ఆకాశం అదిరిపోయేటట్టు ఉరకలు వేస్తూ ఊరేగింపులు చేస్తూ ప్రభాతఖేరీలు నిర్వహిస్తూ పెద్ద సిద్దహస్తులులాగ ప్రచార రంగంలో ఉరికాము. రేయింబవళ్లు ఎరుగక రోడ్లమీద బోర్డులు - రోడ్తమధ్య రాతలు, బేనర్లు, తోరణాలు వీటితో విజయనగరం ముంచేశాము.

పి.వి.జి.రాజు నివాసం (8 నుంగంబాకం) మద్రాసు. యీ కార్యక్రమానికి ప్రధానంగా పౌరోహిత్యం వహిస్తున్న స్వాతంత్ర్య సమరయోధుడు మద్దూరి అన్నపూర్ణయ్యగారితో మంతనాలు చేసారు. బహిరంగ సభకు ముందు కోటకు కాఫీకి జె.పి.ని ఆహ్వానించడం, తదుపరి జరిగే బహిరంగసభకి తాను హాజరై పార్టీ సభ్యత్వం పుచ్చుకోవడం, యీ నిర్ణయం జరిగింది. ఆ సభలోనే పదివేల రూపాయలు విరాళం కూడా ్రకటిస్తానన్నారు.

సభ దిగ్విజయంగా జరిగింది. జనం తండోపతండాలుగా వచ్చారు. ఆకాశం దద్దరిల్లేటట్టూ కరతాళ ధ్వనులు. జయప్రకాశ్‌ నోట బయటపడే ప్రతీమాట ముచ్చటగా, ముక్తసరిగా, సూటిగా హృదయానికి హత్తుకొనేది. ఆజానుబాహు మనిషి స్ఫురద్రూపి, తెల్లని ఖద్దరు వస్త్రాలు. చిరునవ్వులు చిందే ముఖారవిందం. ఆనోటి మాటల మాధుర్యంలో ఏముందోగాని జనసమూహం మీద సమ్మోహనాస్త్రం ప్రయోగించినట్లయింది. నేల యీనినట్లు జనం, సర్వత్రా నిశ్శబ్దం, ఆ కారణజన్ముణ్జి తనివితీరా చూసి, విజయనగరం తరించింది.

జె.పి. టూరు వల్ల మరో మంచి పని జరిగింది. దేశంలో (ముఖ్యంగా కాంగ్రెసులో) చెలరేగుతున్న రాజకీయ సంక్షోభం నాకు అవగతమయ్యింది. సిద్ధాంతపరమైన భేదవిభేదాలు

  • పార్టీల ప్రగతిలో ఎటువంటి మలుపు తీసుకుంటాయో తేటతెల్లమయింది. పూర్వం కాంగైస్‌ అధ్యక్షసీఠం నుండి పండిట్‌ నెహ్రూ సోషలిస్టు సమాజ నిర్మాణం ప్రధాన ధ్యేయమంటూ ప్రకటించి ప్రసంగించినపుడు టాటా, బిర్లాల వంటి బడా పెట్టుబడిదార్లు ఆక్షేపణ తెలియపర్పారు. మహాత్మాగాంధీకి ఫిర్యాదు చేశారు.

జాతీయకాంగ్రెసు ఒక పార్టీకాదు. అది ఒక వ్యవస్థ, ఒక సంస్థ. రకరకాల రాజకీయ, సామాజిక, ఆర్థిక దృక్పథాలున్న పలువురు ప్రముఖుల, పెద్దల, సభ్యుల సంగమన్థానం కాంగ్రెసు. వలస రాజ్య విధానాన్ని ప్రతిఘటించాలి, రవి కృంగని బ్రిటిష్‌ సామ్రాజ్యం అస్తమించాలి. దేశదాస్య విముక్తి జరగాలి. అదే పరమలక్ష్యం. అంతే తప్ప ఆర్థిక, సామాజిక సిద్ధాంత రాద్దాంతాలు అప్రస్తుతం అసంగతం. ఇదీ వారి ధోరణి. యీ వాదన ముదిరింది. సోషలిస్టు అను పేరు నుండి “కాంగైసు” అను పూర్వపదం తొలగించుకోవలసి వచ్చింది.

విషయపరిజ్ఞానం, సిద్దాంతాల విచారణతో పాటు జె.పి. సంచార కార్యక్రమం వలన వ్యక్తిగతంగా మరో (ప్రయోజనం కలిగింది. జె.పి. మా లాడ్జిలో బస చేసినట్టు స్వేచ్చాభారతం త్తే

యిది వరకు అనుకున్నాం. ఉదయం పూట కాలకృత్యాలు తీర్చుకున్నాక రెండవ అంతస్తు పైభాగం డాబామీదకు వెళ్ళి చాలాసేపయింది. ప్రభావతీ దేవి చూసి రమ్మంటే మీదకు వెళ్ళాను. జె.పి. శీర్జాసనం వేస్తున్నాడు. ఈ ఆసనాలపట్ల కొంత పరిజ్ఞానం ఆసక్తి అంతకు ముందు నాకు ఉండేది. నెహ్రూ పండితుడు లండను వెళ్ళినపుడు శీర్షాసనంలో ఉన్న మన నేతను చూసిన విలేఖరులు మర్నాడు దినపత్రికల్లో (0106 19 2 ౧౩౧ *1మురటుై2 0% 115 [66) అని ప్రచురించారుట.

యోగాభ్యాసం

అయితే యిప్పుడు ఆసనాలు యోగాభ్యాసాలు కూడా విశ్వవ్యాప్తమయ్యాయి! ఆనాటికవి యింకా ప్రాచుర్యంలోకి రాలేదు. స్వామి వివేకానంద అమెరికాకు వెళ్ళినపుడు రెండుపూటలా చన్నీళ్లు స్నానం చేస్తాడని తెలుసుకున్న పత్రికా విలేకర్లు (4 ౫20 ౪1౦ 1205 0210 [౧౦6 4 44౫ 106 1 54] &౪ల అని పత్రికల్లో ప్రచురించారట.

జె.పి. శీర్జాసనం వేస్తున్న దృశ్యం నా హృదయంపై ప్రగాధమైన ముద్ర వేసింది. జె.పి. సంచారం అనంతరం నేనూ గోడకు కాళ్ళు దన్ను పెట్టి శీర్షాసనం నేర్చుకున్నాను. (దాదాపు పాతిక సంవత్సరాల పాటు నిత్యం చేసేవాడ్ని) ఆ తరువాత నాకు మెడలు నొప్పి పుడితే డా॥ కొప్పచ్చి కృష్ణమూర్తిగారు శీర్షాసనం మానేయమన్నారు. తర్వాత (ప్రాణాయామం మొదలుపెట్టాను.

“యుగొ” అనే మాట నుండి పుట్టింది యోగా అన్న మాట. “యుగ్‌” అంటే కలవడం. “యోగం' అంటే కలవడం అన్నమాట. జీవితంలో ఎన్నో వస్తువులతో కలుస్తాం, విడుతాం. భార్యాబిడ్డలతో పుత్ర మిత్ర కళత్రాదులతో కలుస్తాం, విడిపోతాం. ఒక్క వస్తువుతో కలిసి మరిదాని నుండి ఎడబాటు లేకుండా ఉండటమే యోగం, ఆ వస్తువు ఆత్మ! పరమాత్మ.

అద్దంలో మురికి ఉంటే మన మొహం మసకగా కనబడుతుంది. మన చిత్తం దర్చణంలాంటిది. ఆ చిత్తమాలిన్యం పోతే తప్ప పరమాత్మదర్శనం కాదు. శరీరమాలిన్యం కంటే మనోమాలిన్యం మరీ చెడ్డది. ధాన్యం వలన దేహానికి ఆహారం. ధ్యానం వల్ల ఆత్మకు ఆహారం. దీనితో మనోమాలిన్యం తొలుగుతుంది. చిత్తాన్ని క్షాళన చెయ్యాలి. ఎదుటి వాడిని సంతోషపెట్టడమే తన సంతోషంగా భావించేవాడు ధన్యుడు.

సకల సౌఖ్యములకు మూలం సర్వేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే సకల సుఖాల నిదానం. ఈశ్వరుని మాళ్ళభావంతో ఆరాధించడంలో విశేషం ఉంది. బిడ్డలపట్ల తల్లికి వాత్సల్యం

ఎక్కువ. తల్లిపాదాలు ఆశ్రయించిన వారికే శాంతి లభిస్తుంది. పాపాన్ని ధర్మంచేత నివృత్తి చెయ్యాలి. అధర్మానికి విరుగుడు ధర్మం. పాపానికి తల్లి ఆశ. కలిదేవతకు కామ, క్రోధ, శి భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్ర

మోహాదులు సేనాధిపతులు. ప్రాపంచిక సుఖాలపై మళ్లే మనస్సు చిల్లుపడిన కుండలాంటిది. నిత్యసౌఖ్యాన్ని తెలుసుకోలేదు.

దినంలో కొన్ని నిముషాలైనా ఒక్కచోట కూర్చొని దైవధ్యానం చెయ్యాలి. హృదయం భగవన్నిలయం. దాన్ని దుర్గంధ భూయిష్టమైన దురాలోచనలతో నింపితే - ఆ సర్వేశ్చరుడికి స్వస్థానంలోనే చోటు లేకుండా చేసినట్లు ఆయన సింహాసనం అపవిత్రం కారాదు. అప్పుడే అతడు సుప్రతిష్ణుడై ఉంటాడు.

యోగం అన్నది భోగం కాదు. రోగం లేకుండా చేసేది యోగం. శరీరం ఆరోగంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. దీనికి మానసిక శారీరక సాధన అవసరం. ఏ సాధనా లేకుండా మనిషి ప్రయోజకుడు అవడు. ప్రజ్ఞావంతుడు కాడు. మహాత్ముడి దినచర్య తెలుసుకోవాలి. ఆయన మహాత్ముడెలా అయ్యాడు. సామాన్యుడు మాన్యుడు కావాలి మాననీయుడు కావాలి. మహనీయుడు కావాలి. మహాత్ముడు కావాలి.

నీ ఊహలకు ఆకాశం హద్దు. నిన్ను నీవే పెంచుకుంటూ పోవాలి. నీకు నువ్వే సాక్షి ఆత్మసాక్షి కావాలి. నువ్వ ఎదగాలి, ఎదిగి ఒదిగి ఉండాలి. ప్రపంచానికి కావలసినది ధనం. ఆధ్యాత్మికానికి కావలసినది సాధనం. యీ ధనం కోకొల్లలుగా పెంచుకోవాలి. శారీరక సౌఖ్యమే కాదు - మానసిక పుష్టి కూడా ఉంటుంది. నీ కోసమే నీవు కావు, ప్రాణికోటి కోసం నీవు. జీవకోటికోసం నీ జీవనాధారాన్ని కూడా ధారపోసి! ధన్యుడివి కావాలి. గాంధీజీ జోధలు

దేశసేవ కోసం కంకణం కట్టుకున్న ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు నిబంధనలు పాటించాలి. మంచి లక్షణాలు కలిగి ఉండాలి. మానసిక దృథత్వంతో పాటు శరీరసౌష్టవం కూడా ఉండాలి. [61100 1104 1 & [అగు కంఠ. ఒక మారు స్వల్ప అస్వస్థతకు గురి అయినప్పుడు మహాత్మాగాంధీ అన్నారు.

“దేశ సేవకుని అనారోగ్యం అస్వస్థతల వల్ల జాతి కార్యక్రమం కుంటుపడుతుంది. ఆరోగ్యం పోగొట్టుకోవడం పనికిరాదు. అందుచేత ఆచారవ్యవహారాలు, సత్ప్రవర్తన, సద్గుణాలు గణనీయంగా మానవుడి శారీరక మానసిక ఆరోగ్యం పరిపుష్టం చేస్తాయి. స్వభావ శీలాలు, గుణగణాలు, ఆశయాలు, ఆదర్శాలకు ప్రతిరూపంగా ప్రతీ కార్యకర్తా నిలవాలనీ కొన్ని ప్రమాణాలకు కట్టుపడి స్వతహా నీతి నియమాలు నిజజీవితంలో ప్రతిఫలించేట్టు జీవించాలి. కార్యకర్త స్వభావ శీలాలకు కొలబద్ద ఏదీ లేకపోయినా ఆత్మవిచారణ! స్వయం నిబద్ధత! ప్రధాన ధర్మాలుగా ప్రజాసేవకుడు పనిచెయ్యాలి. సాటి స్వేద్భభరతం 43

శకం నాటీ మనుష్యులలో మేటి కాకపోయినా మార్గదర్శకంగా నిలవాలన్నది యం సంప్రదాయం. సామాజిక వాతావరణం కూడా కలుషితం కాదు. జరుగుతుంది. మలరకం లు అందుకే స్వతంత్ర సంగ్రామ కాలంలో పులు కడిగిన ఆణిముత్యాలులాంటి ట్‌ సాటీ మనుషులు దేశసేవకుల్సుగా వందనీయులయ్యారు. అభినందసీయులయ్యార తననూ మనిషిని మరువకు, శోట్రి మానవునితో ప్రోట్రీపడ్లక్షు ప్రరోప్రకారం పరుల్నకా గ్ల ధ్వేయ పునీతుడ్ని చేస్తుంది, సేవ్యాం స్వీయపవిత్రీకరణకు పనికి వస్తుంది. భావశుద్ధి, శుద్ధి కలుగుతాయి. గాంధీజీకి డ్రి ఏళ్లు జైల శిక్ష రు. ఒకమారు ఒక ్రిద్రిక జెడ్డి మహాత్మాగాంధ్ధీక్రి 6 సం॥లు కారాగారళిక్ష వధు అందరూ నిషడ్డవరనంత్రో క్రన్నిర్వ మస్నీరుగా విలపించారు. కోర్టుహాలు నుండి బ ప్రతి వచ్చి చిరునవ్వుల్స చిందిస్తూ గాంధీజీ అంటారు “జైలు శిక్ష పడ్డ ప్రతి దేశభక్తుడు వ అప్పుడే సవవధన శ్ర్య్యం గద ప్రవేశించినంత సంబరంతో జైలు గా అ జాలిగొలిప్టేట్టట్లు క్కర్బ్ర ధైర్యం సంతరించుకున్నట్లు ధీర గంభిరంగో ౦డాలి సత్యాగ్యప్షా ణ్‌ న త్య త్యాగహి. కష్టా తూటాల్టు, ఉరికంబాలు జైలు గోడలు యివిమ కష్ణాలక్ర్ర లకు శల్య వోన్‌ మ ఇ గాకని దాష్టనికి లొంగం. లారీలకు, తూటా నిస దింధనాల్వజ్రు మగ్గిష్రోర్ర్ర మనల గె తరాల స్వేచ్భా జీవనానికి సోపానం! | తం ఆలపించాలి * శరం, “సచ్భావాయువులు పీల్చే నవతరానికి స్వాగత నేది తరం కారే రుధిర నకు తోద్చగతాు. స్యళత్ర్న రారు ౌరతమాత్ర బ్రానిస బంధనాల విచ్చేద వల 0 నుండి వందలాది వేలాద స్యతర్ష గిన స్వతంత్ర సమరయోధుని రక్తబిందు దేశం సరమోధులు ఉద్భవిస్తార్ష! మాకేమ్పిర్చ్యిషి అన్నద శ్రా మ ం అన్నదే మీ శ్ర్వ కావ్యా! త్యాగం దు ముఖ్య, దేశానికి మేము ఏమి యి కరి పన పోవాలి స్వాళం్ష్య బ్ర దోచుకునే దనుననీత్రి పోవాలి. పర కరక్తు క్రూర న స్వ సమ్ష్యం ద శక్తుల న్నే కాలరాయాలి యోధులు సామ్రాజ్యవా త్తే శే స త కొట్టం శ్రీరామమూర్త (శ్వయ బరీ

స్వాతంత్ర్య భానూదయం క్విట్‌ ఇండియా ఉద్యమము

యువశక్తి కదిలింది. స్వతంత్ర వీరులు విజృంభించారు. దోపిడీ విధానం పోవాలని బానిసత్వం అంతరించాలని, స్వేచ్చాజీవిగా మానవుని మనుగడ కొనసాగాలని జాతి జనులను వెన్నుతట్టి నిద్రలేపి స్వతంత్ర శంఖారావం పూరించిన వీరనారీమణులు యువజన యోధులు పుంఖానుపుంఖంగా నేల నాలుగు చెజగులా చెలరేగారు. స్వతంత్ర పోరాటం అంతిమ ఘట్టానికి చేరుకుంది. “చావో! రేవో! నేడే తేలాలి! తెల్లదొరతనాన్ని దేశం పొలిమేరల నుండి తరిమి కొట్టాలి. పరాయి ప్రొాలకులారా! మా మాతృభూమిని వీడిపొండి! 1 116411 మీకు ఆఖరి ఘడియలు సమీపించాయి. మూటముళ్ళు సర్దుకోండి. వ్యాపారానికని వచ్చి యీ దేశాన్ని కొల్లగొట్టి అపార ధన రాసులను మీ దేశానికి తరలించుకు పోయారు. రత్న గర్భ భరతమాతను దోచుకు తిన్నారు. వ్యాపారం పేరుతో వచ్చి శతాబ్దాలకాలం పాలకులుగా మాదేశ మూలుగులు పీల్చి పిప్పి చేసిన నరహంతకులు, దోపిడీదారులు మీ రోజులు మూడాయి! మా దేశంలో దరిద్ర దేవత తాందవిస్తూ ఉంటే, మె దేశం సిరిసంపదలతో పొంగిపొర్లుతోంది.

ఈ గోముఖవ్యాఘ్రాలు, పయోముఖ విషకుంభాలు, దళారులు, దో పిడీదారులకు యూ దేశంలో ఇక జాగాలేదు. తరలిపొండి. శాలగిపొండి, దేశప్రజలారా! తెల్లదొరతనాన్ని తరిమికొట్టండ్డి. ఈ అ(క్రమార్ముల పరాక్రమాలు యిటు పైన చెల్లవు. ఈ హింస రచన! సంస రచనా మరి కొనసాగదు. ఈ యమకింకరుల అంతుచూడాలి. ఈ భయంకర _కాళుర భరతం పట్టాలి. వలస రాజ్య విధానానికి సామ్రాజ్యవాదానికి గోరీ కట్టాలి. త ఘోరక్ష్ర అజచిపెట్టాలి. తుడిచి పెట్టాలి. ఇది కడపటి పోరాటం. 0౫|| 012 ఉద్యమం వ్వ ే ట పం ధరించేరు.

'హాత్త్మని శ్రంఖ్ఞారావం. విష్రవశంఖం మోగింది. అగ్రనాయకులు ఉగ్రరూపం ధరిం బ్రిటిష్‌ పాలన చరమఘట్టానికి చేరుకుంది. స్వాతంత్ర్య వీచికలు దేశం నలుదిశలా వ్యాపిస్తున్న్న్వా, వేక్రే పోరాటం మరిలేదు. మరో స్వాతంత్ర సంగ్రామం ఆవశ్యకత క వ న సచ్చ్భాభారతం తర్‌

మరిలేదు. స్వతంత్ర సమరంలో సైనికుడుగా స్వరాజ్య అవతరణకు ఆజ్యం పోసిన సమరయోధుడిగా వీరవిక్రమ భూమిక నిర్వహించే భాగ్యం. యీ జీవికి మరిలేదు! మరలరాదు. చిరకాలం కలలు కన్న స్వరాజ్యం సిద్ధిస్తున్న సుదినం కనుచూపుమేరలో గోచరిస్తోంది. జాతి నిండు ఉత్సాహంతో పొంగి పరవశిస్తోంది. పట్టపగలు పండు వెన్నెల విరిసింది. అమృత జల్లు కురిసింది.

ఆగష్టు 15 అర్ధరాత్రి స్వతంత్ర భానూదయం అయింది. మూగబోయిన గొంతుక విచ్చుకుంది. మోడుబారిన చెట్టు చిగిర్చింది అన్నాడు నెహ్రూ పండితుడు. ఆశలు పల్లవించి ఆశయాలు సిద్ధించి సుఖం శుభం వెల్లివిరిసి జాతి జనులకు శాంతి క్రాంతి చేకూరాలనీ సర్వులు ఆశించారు. నా దేశం అన్నపూర్ణ. నా జాతి జగతి ప్రగతికి ఆశాజ్యోతి! ఆశాజీవులు, ఆదర్శవాదులు అంతా అమందానందం పొందారు. స్వతంత్ర ఫలాలెవరికి?

నవశకానికి నాంది ప్రస్తావన జరిగింది. దేశమాత నూతన చరిత్ర సృష్టించాలి. నవయుగ వైతాళికులు ముందుకు రావాలి. సంస్కరణవాదానికి రహదారి తెరవాలి. సమసమాజ నిర్మాణానికి అంకురార్పణ జరగాలి. స్వార్థపరత్వం పోవాలి, పదవీ వాంఛ, అధికారవ్యామోహం అంతరించాలి. భోగభాగ్యాలు, నిరిసంపదల వ్యామోహం తలఎత్తకూడదు. ధనిక పెత్తందారీతనానికి, పెట్టుబడిదారీ విధానానికి స్వస్తి పలకాలి. తిలోదకాలివ్వాలి. సమత-నవత-మానవత కోసం యువత నడుం కట్టాలి. అశలు మోసులెత్తేయి!

జాతి నేతల అడుగుజాడల్లో నడచి నవశకం నిర్మించాలి. మనిషిని మనిషిగా చూసే మాననీయమైన మానవసమాజ నిగ్మాణం జరగాలి. కులమత ద్వేషాలు పేద, ధనిక అంతరాలు అంతరించిపోవాలి. మతసామరస్యం కావాలి. కుల నిర్మూలన జరగాలి. వర్ణ, వర్ణరహిత సమాజం ఏర్పడాలి. తరతమ ఖీదాలు ద్వేషాలు, దోషాలు, కావేషాలు వర్ణ వర్ణ భేద, విభేదాలు లేని శాంతియుత సమాజం రావాలి. సత్యాహింసల ప్రాతిపదికగా శాంతిసామరస్యాలు పల్లవించి, (ప్రేమాభిమానాలు కుసుమించి, అన్యోన్య సహాయ సహకారాలు వెల్లివిరిసే వినూత్న అనురాగమయ తేజోమయ సమాజం నెలకొనాలి. ఇందుకు సత్యనిష్ట, త్యాగనిరతి గల నిస్వార్ధ నిష్కళంక పవిత్ర పారమార్ధిక నవజీవనానికి అంకితమైన యువత ముందడుగు వేయాలి. 46 భాట్టం శ్రీరామమూర్తి శ్వీయ చరిత్ర

స్వార్ధ చింతన చెంతకురాని జనహితం, సమాజ్రేయస్సు ధ్యేయంగా, స్వపర భేదంలేని సంస్కారవంతులు, ఇట్టి నవసమాజానికి శ్రీకారం చుట్టాలి. యిట్టి అరుదైన ఘట్టానికి తెర తెరుచుకోవాలి. ఓర్పు నేర్పు కొంతమేర కొందరికి ఉన్నా ఆ శుభారంభం తన వ్యక్తిగత ప్రయోగంతోనే పరిసమాప్తం కాగూడదు. శాంతియుత ఆర్థిక సామాజిక విష్లవ ప్రణాళికా రచన ఫలప్రదంగా కావాలి అంటే,ఏక వ్యక్తి పటుత్వం, ప్రాబల్యం సరిపోదు. ఏకముఖంగా సదవగాహనతో సమైక్యంగా సాహసవంతులు పలువురు ఉద్యమించి సమ సామాజ నిర్మాణానికి దోహదం చేయాలి. కాదంటే అది ఏ ఒక వ్యక్తి సాహసకృత్యంగానో పరిగణించబడి కాలగర్భంలో మరుగున పదుతుంది. ఉద్యమరూపం రావాలంటే బహుసంఖ్యాకుల సయోధ్య కావాలి. సాహసం, సహవాసం కావాలి. ఆ ప్రేరణ స్ఫూర్తి స్పృహ ఎంతమందికి కలుగుతాయి? ఈ సహకార, సంస్కరణ ఉద్యమాన్ని మనోబలంతో మున్ముందుకు తీసుకుపోవాలి! వెనెంట అనుసరించి వచ్చే అనుచరణగణం కోసం వెనక్కు చూసుకుంటే ముందుకు మున్ముందుకు సాగలేం. దేశస్వాతంత్ర్యంతో పాటు నవసమాజ నిర్మాణం జరగాలి. త్యాగమూర్తులకు ఉక్కు సంకల్పం ఊపిరి పోసుకోవాలి. జనవైతన్యమే జాతికి శ్రీరామరక్ష! విష్లవం ఎన్నడూ జన బాహుళ్ళపు సామూహిక కదలికతో పుట్టుకురాదు. సంకల్ప బలం, దృఢదీక్ష ఆత్మవిశ్వాసం ఉన్న కొద్ది మంది సాహస వీరులు ఆశయసిద్ధికోసం రగిలించే భావోద్వేగంతో ఏర్పడుతుంది. అయినా అంతదూరదృష్టి అపార జన ధన బలం ఎందరికి సంప్రాప్తం అవుతుంది? తనకు తనే బాధ్యుడిగా, ఆద్యుడిగా ముందడుగు వేయడమే ఉచితం అనిపించింది. నా సంస్మరణ వివాహానికి నాందీ వాచకంగా ఆదర్భాలు, ఆపద్ధర్మాలు గురించి చేసిన అసమగ్ర వివరణ నాకూ సంతృప్తి కలిగించదు. అందరితోనూ, ఎంతో కలగలుపుగా కలిసిమెలిసి మాట్లాడే సౌలభ్యం కొందరికి సహజంగా జన్మతః లభిస్తుంది. మరికొందరికి కతుక మెతుక లేనట్లు వితుకు బితుకుగా బతుకుతూ నలుగురితో కలివిడిగా తిరగక సంకోచం, సందేహం బిడియం అన్నీ ఆవహించినట్లు ముద్దరాల్లాగా మూతి ముడుచుకుని కూర్చొనే మగరాయుళ్లు కూడా ఉంటారు. మగాళ్ళతోనే కలిసి కుషీగా కులాసాగా కాలక్షేపం చేయడం తెలియని దశ నాది! ఆడపిల్లలతో చనువు తీసుకొని సంభాషించడం చచ్చినంత పని. అది ఎలాగూ చెయ్యను. యింకా మరికొంచెం ముందుకు వెళ్తే కొంపలంటుకుంటాయి. త 1౬ 2౬

మనసులు కలిసిన శుభవేళ!

కాలేజీ యూనియన్‌ అధ్యక్షపదవికి పోటీచేసే అభ్యర్థిగా ఓట్ల వేట కోసం ఒకరోజు “లేడీస్‌ వెయిటింగ్‌ రూములో అడుగుపెట్టాను. ఏదో మూడుముక్కలు ముచ్చటగా చెప్పి ముగించి బయటపడ్డాను. అయినా ఆ కొద్ది క్షణాల్లోనే నాకు కాబోయే జీవితభాగస్వామిని ముఖారవిందం ఒక మెరుపులా నా మనోనేత్రం ముందు మెరిసి ముగ్దుజ్జి చేసింది. నా జీవితపు లక్ష్య లక్షణాలు పుణికి పుచ్చుకున్న రూపలావణ్యాలు ఉట్టిపడే ఆ ఊహాసుందరి హృదయ విహారం చేయడమేంటి? చూపులో రూపులో నమ్రత ప్రశాంతత ఉన్నాయి. అమాయికత్వం ఒలకబోస్తూ నిష్మలంక, నిరాడంబర, జీవితం మూసపోసినట్లుంది. లావణ్యం, కారుణ్యం అని చెప్పలేను గాని కోమలత్వం, పరతత్వం ఆ ముఖ కవళికల్లో తొణికిసలాడుతున్నాయి. ఆమె పేరు సత్యవతి, ఇంటర్‌మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. మా వైవాహిక జీవితానికి ముందు విద్యార్థి కాంగ్రెస్‌ నేతగా “రవీంద్రవర్మ” సంపాదకత్వాన వెలువడే “సాతి” పత్రికపేరున (సఖుడు అని అర్ధం) సత్యవతి అనుపదంలో మొదట 'సి చివరి '8 కలిపితే 'సతి' అవుతుంది. సాతిగా మార్చి పిలవడం మొదలుపెట్టాను, కాలగమనంలో కళ్యాణం జరిగాక.

మితము, హితము యివి నాకు నచ్చే పదాలు. ఆమె నోట మాట బయటపడడమే బంగారం అన్నట్టుందేది. నా పెళ్ళైన తరువాత కూడా ఏ ఒక్కరిద్దరితోనైనా మాటా మంతీ ఉండేది కాదు. లేడీస్‌వెయిటింగ్‌ రూమ్‌దాటి బయటపడిన తరువాత ఆ ముగ్ధమనోహర ముఖచిత్రం నామదిలో నిల్చిపోయింది. అక్కడితో “కథ కంచికి మనం యింటికి” అనుకున్నాను. కాని కాలం తీరే వేరు! మనుష్యుల్ని ఎప్పుడు, ఎందుకు కలుపుతుందో, విడదీస్తుందో, ఎవ్వరికీ తెలీదు! ఇస్మాయిల్‌ కాలనీ లాడ్డీనుంచి చరచరా, జోరుజోరుగా కాలేజీ వైపు దూసుకుపోతూ ఉంటే - చల్లగా - మెల్లగా అడుగులు వేసుకుంటున్న ఆమె మొహం నన్ను కలవరపెట్టింది. అయితే ఈమె యీ కాలనీలోనే ఉందన్నమాట. జీవితం మలుపుతప్పింది. అవిగో అవి రెండు స్వల్ప విడి సంఘటనలు దైవ ఘటనలుగా మారాయి. 48 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

ఆ తరువాత తెలిసింది ఆమెది నా కులం కాదని. మరీ మంచిది. ఏ కులమో? ఆవివరాలతో నాకు పనిలేదు. సంఘసంస్కరణ కావాలని పరితపించి పలువరించే యీ మానవుడికి వేరే వివరాలెందుకు? నాకు నా మనస్సే సాక్షి! ఆత్మసాక్షి! నా విశ్వాసం నన్ను మోసం చెయ్యదు. కాబోయే నా సహధర్మచారిణి యీ కాలనీలోనే నివాసముంటోంది సకుటుంబంగా. ఏమైనా దైవశాసనం అమలు జరిగితీరుతుంది. తుచ్చమైన మన కోరికల్ని తోసి రాజనే భగవానుడు మన గుండెల్లో విరాజమానుడై ఉంటాడు. సమాజ సంస్మరణ కావాలనుకున్నప్పుడు నాకు స్వామిరామతీర్థ చెప్పిన మాటలు చెవిలో గింగురు మంటున్నాయి. “౭10౧౫6 1000౫ [0 361 గణ[ ఓ సంస్మరణ వాదీ! నిన్ను నీవు సంస్కరించుకో ముందు అన్నదే దైవవాణిగా మారి నాకు దారి చూపించింది.

తర్వాత సత్యవతితో నా జీవిత గమ్యం, నా మనస్తత్వం, తక్షణ కర్తవ్యం, నా ఆశయాలు, ఆదర్శాలు అన్నీ తగు సమయంలో ఆమెకు సవివరంగా సుస్పష్టంగా ఏకరువుపెట్టాను. “బాహ్య రూపు రేఖలు [భ్రమ పెడతాయి. త్యాగమయ జీవితం నా పరమార్థం. అస్తిపాస్తుల ప్రలోభాలు నాకులేవు. తల్లెిదండ్రుల నుండి వారసత్వంగా సంక్రమించిన చరస్థిరాస్తులు కూడా పూచిక పుల్లకూడా ముట్టుకోను. క్రమ అక్రమ మార్గాలేవైనా, సరే వాటితో సంపదలు ఎన్నడూ సమకూర్చుకోను! ఏమీ లేకుండా రోజు ఎలా గడుస్తుంది? యీ ప్రశ్నకు నా దగ్గర జవాబులేదు. కష్టించి, శ్రమించి స్వార్దితంతో సాదా సీదా జీవితం గడిపేస్తాను. జీవితంలో నాకు ఆశయాలు, ఆదర్శాలు ముఖ్యం. గుణగణాలు భావాలు స్వభావాలు ప్రధానం. శక్తి సామర్భాలు, ప్రతిభా విశేషాలు వీటిని నమ్ముకుంటాను. నాయకుడు ధర్మవిహీనుడైతే ప్రజలు కూడా డిటో. రామరాజ్యం గురించి మాట్లాడుకుంటాం ఎందుకు? అయోధ్యలో యథారాజా తథాప్రజా. అతడు వనవాసం చేసాకే సింవాసనాసీనుడయ్యాడు. ఈ సమాజంకూడా ఒక కారడవి - కష్టాలు - నష్టాలు

  • అరిష్టాలు అన్నీ అనుభవించాకే స్వప్న సీమ సాక్షాత్కరిస్తుంది.

మనం మార్గదర్శకులం కావాలి. ఆదర్శ[పాయులం కావాలి. “పెట్టింది తనది, దాచి పెట్టుకున్నది పరులది” అంటారు. మనం దాచుకోవడం, దోచుకోవడం చెయ్యం, ఆశలు పెంచుకోం. ఆశయాలు పెంచుకుంటాం. అవకాశాలు తెచ్చుకుంటాం. జీవితంసాఫీగా నడవకపోతే ఒడుదుడుకులకు తట్టుకుంటాం, సలదొక్కుకుంటాం. కష్టాల్ని ఇష్టాలుగా మార్చుకుంటాం. తనువే తనది కానప్పుడు ఇల్లు వాకిళ్లు తనవౌతాయా? మించి సంపాదించి అనుభవించే ధనమే మన సుఖశాంతులకు మూలకారణం. స్వేచ్చ్భ్యభరతం ఉరి

ఆస్తిపాస్తులు ఆరోగ్యం యివ్వవు. సిరిసంపదలు ఆనందం ఒలకబొయ్యవు. లోకహితం కానిది సమాజ సంక్షేమానికి దోహదం చేయనిది ఏదీ మనది కాదు. సుఖసంతోషాలు పదిమందితో పంచుకుంటాం. పరుల (శ్రేయస్సుకు పాటుపడతాం. మన భవితకు 'బ్రహ్మదేముడే కర్త. మనం కాలం చేతుల్లో కీలు బొమ్మలం. దైవం చేసిన మరమనుషులం. ఎంత లభిస్తే అంతలోనే సంతృప్తి!

కష్టాలు ఏ కొంపలోను కలకాలం కాపురం చెయ్యవు. కాలం కల్గించే కల్లోలాన్ని - కాలమే మళ్లీ నివారిస్తుంది. దుఃఖాన్ని దూరం చేయలేకపోతే సంతోషంగా భరిస్తాం, సహిస్తాం, అనుభవిస్తాం. బయట ఉష్ణోగ్రత ఎంత అధికంగా ఉన్నా మన శరీరంలో 98.4 డిగ్రీల వేడే ఉంటుంది. సహజ ని[గ్రహశక్తి యీ శరీరానికి దైవం సమకూర్చాడు. మనకూ నిగ్రహ- అనుగ్రహాలు ప్రాప్తిస్తాయి దైవం అనుకూలిస్తే. పరమాత్ముడి దగ్గర షరతులు పనికిరావు. అతను యిచ్చినది పుచ్చుకోవాలి. మనకు నచ్చినా-నొచ్చినా! నిండుప్రేమ ఉండాలి. ఉక్కుగుండె కావాలి! ఇనుప నరాలు కావాలి. ఇలా ఎన్ని ఎన్నో చెప్పాను ఆమె స్పందన బాగుంది. జీవితంలో తనకు ఏ ఆశలు లేవనీ, వివాహం నిశ్చయమైతే పతితో నిశ్చింతగా కడదాకా పయనించడమే తన కర్తవ్యమని చెప్పింది. సహజీవనం, సహగమనం తప్ప యీ ప్రపంచంలో ప్రత్యేకంగా ప్రియమైనదేది లేదని స్పష్టంజేసింది. యిప్పుడు లైను క్షియరయ్యింది. పరిస్థితులు అనుకూలిస్తే జరిగే కళ్యాణానికి నిర్ణయించిన తేదీ తెలుసుకొన్నాక మనం తిరిగి కలుద్దామని అనుకున్నాం.

మనకు కావాలని అనుకున్నదాంట్లో దుఃఖం దాగి ఉంటుంది. మనకు లభించిన దాంట్లో సంతోషం తొంగి చూస్తుంది. జీవితం లాగే సుఖ, దుఃఖాలు క్షణభంగురాలు. ఏదీ ఎల్లకాలం ఉండదు. అన్నీ వదిలితే అవధూత - అన్నీ తానైతే పరమహంస. నేను నువ్వైతే, నువ్వు నేనైతే ఆశాపాశాలకు అస్కారం లేదు. మనకు ఉండేవి ఆశలు కాదు ఆశయాలు.

మానవుడు ఆశాజీవి. శ్వాస ఉన్నంతవరకు విశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం సడలకూడదు. పరస్పర విశ్వాసం ఉండాలి. కాలం కలసి వస్తే క్షీరసాగరం ఉప్పొంగి గుమ్మం ముందు వరదలై పారుతుంది. అకాశం చిల్లుపడి అమృతబిందువులు వర్షిస్తుంది. ఆశ దురాశ కాకూడదు. హరివిల్లు తురుముకొని తలలో మలుచుకుందాం అంటే ఎలా? ఆనందం మానవుని జన్మహక్కు మన సహజలక్షణం మన స్వధర్మం. సుఖాన్ని కోరడం తప్పుకాదు. అందుకు అన్యులను ఆశ్రయించడమే తప్పు. మన గుండెలనిండా అమృత బిందువులున్నాయి. పరాధీనం ఎందుకు మనసు బట్టే మనిషి. స్థితి బట్టే గతి. సుఖ 50... భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

సంతోషాలకు మనసే కారణం 14104 ౧౫౫16 [63౪ల) 2 1011 206 [611 4 161760. జీవితం నరకతుల్యమైనా స్వర్గసీమగా మారినా మన మనస్సే మూలకారణం. మనకు సుఖం లేదు. దుఃఖం లేదు, ఏది ప్రాప్తిస్తే అది అనుభవించడమే, భరించడమే. బ్రతుకుమీద ఆశలేదు, చావుమీద భీతిలేదు. ఇది మన జీవనతత్వం [1109000౫ మనకు రోజు గడిస్తే చాలు. బంగారం సింగారాలువద్దు. వైభవాలు - వైభోగాలు వద్దు. భోగాలు రోగాలకు భూమికలు పాశ్చాత్యులది భోగ సంస్కృతి - మనది త్యాగ సంస్కృతి. త్రిభువన పాలకుడు కూడా సర్వసంగపరిత్యాగి పాద పద్మాల ముందు 'ప్రణమిల్లుతాడు. మహారాజని వారిని సంబోధిస్తాడు. శివానంద మహారాజ్‌! అంటారు. సచ్చిదానంద మహారాజ్‌ అంటాం. మీద జేబుల్లో ఉన్న రూపాయిలు కాదు ముఖ్యం - గుండెల్లో ఉన్నదైవం ముఖ్యం. రూపం మీద, రూపాయి మీద పడిచస్తారు. ఆంజనేయుడు రత్నాల రాసులను పారేసి రాముడి పాదాలు పట్టుకున్నాడు. సిరిసంపదలన్నీ పరిత్యజించిన సీత్రామాత బంగారు లేడికి ఆశపడితే వరుడు రాముడితో ఎడబాటు కలిగి అశోక వనవాటికలో బందీ అయింది. శివుని ఆజ్ఞలేక చీమైనా కుట్టదు - హరి ఆజ్జలేకుండా ఆకైనా అల్లాడదు. మంచం ఉన్నంతవరకే కాలు జాపుకోవాలి. ఉన్న దానితోనే సంతోషం - సంతృప్తి! లేదన్న బాధ లేదు. కావాలన్న! కోరికలేదు! భావాల స్వభావాల ఎన్ని చెప్పినా అన్నిటికి సత్యవతి ఆనందపడిపోయింది. తన స్వప్నం తనకంటిముందు తొణికిసలాడింది అనుకుందేమో! తత్వాలు మేళవించడమే మహాభాగ్యం. ఇప్పుడు స్పష్టంగా చెప్పగలను. నా భార్యే నా భాగ్యరేఖ! సత్యవతే నా సంపద! భక్తుడు భగవంతుడు అవిభక్తం. (ప్రేమ - పెండ్లి కూడా అలాగే! భక్తి-రక్తి శక్తి-ముక్తి అంటారు. ఇది రూపాంతరం చెందిన భగవంతుని వరప్రసాదాలివి! ప్రేమసాగర తీరంలో సహజీవనం సుఖ జీవనం ఎందరికి ప్రాప్తిస్తుంది? (ప్రేమానుబంధానికి మించినది. ఏముంది? ఆ, (ప్రేమ ఆత్మకు ఆభరణం - దైవత్వానికి చిహ్నం. ప్రేమేదైవం - దైవమే[ేమ ల్‌ దైవారాధకుడే (ప్రేమ పూజారి! స్వార్ధం లేనిది (శ్రేమ. ్రేమలేనిది స్వార్ధం. ఢ్రైమ ఆట్‌ త్త ఇచ్చుకుంటుంది - పుచ్చుకోదు. త్యాగం (ప్రేమకు వేరొకరూపం, ప్రేమకు పరాకాష్ట సెవ

  • నిజం తెలుసుకుంటే జగమంతా ప్రేమమయం, (ప్రేమకు ప్రతిరూపమే పరమాత్మ, స్వేచ్భాభారతం యా ( శ ర్‌1 పో [ఈ తం ుడిం టై.

(ప్రేమకు అనుమతులు పరిమితులు లేవు - హద్దులు సరిహద్దులు లేవు. విశ్వ(ప్రేమే విశ్వేశ్వర (ఢేమ. (కేమించి జీవించు! ప్రేమలేని జీవితం నీరులేని బావి - కరెంటులేని ల్ని!

తీగ - దేవుడు లేని గుడి.

(పేమ పునాదిపై పరిఢవిల్లే (ప్రేమికులు ఒకే నాణానికి రెండు పార్వ్వాలు.

ఒకసూఫీ కథ ఉంది.

బయట నుండి తలుపు తడుతున్న శబ్దం. లోపలి నుండి ప్రశ్న!

శన్దేన్తే?

“లోపల నేను ఉన్నాను. ఇక్కడ ఇద్దరికి చోటులేదు”

మళ్లీ తలుపు చప్పుడు. “చెప్పు నువ్వు ఎవరివో”

జన్ఫీన్లే

“నీవే నేను” అనగానే తలుపు తెరుచుకుంది!

వ్‌, ను

అక్కడ ఉన్నది ఒక్కరే, ప్రేమ పరిష్పంగంలో ఇద్దరు ఒకరైనారు. లు షు... ద్వంద్వం మరిలేదు. “అహం, త్వం మ. స. “.| సర్వసర్వేభ్యో” ఇద్దర మొక్కటై రోజు గడిపితే చ రా ౧ | ఎదురేముంది? మరి బెదురేముంది? ప ముప క్‌... ఇక కళ్యాణ ఘడియ కోసం ఎదురు ్టీ స ఇళ వ్ర“. చూపులు! ఇది ఎవరిచేతిలో ఉంది? కాలం కత , |

నాభార్య సత్యవతి

52 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

చదువులకు గుడ్‌బై - ఛలో రాజమండ్రి

స్వగ్రామం ధర్మవరం నుండి సెప్టెంబరు పరీక్షలకు తిరిగి విజయనగరం వచ్చాను. ఈ మారు నల్లచెజువు మెట్టల్లో ఉన్నమా లాడ్డీకి ాంం6రంగ 0” “స్వతంత్ర జ్వాల” అని పేరు పెట్టుకున్నాం. వళ్ళ శశిభూషణరావు, జి.ఎల్‌. నాయుడు వగైరా మిత్రుల సాహచర్యంతో రోజులు గడుస్తున్నాయి. శశి దస్తూరి బాగుంటుంది. ఒక చేతి వ్రాత పత్రిక తయారుచేశాం,.ఓపికగల నిండుకుండ, మితభాషి నిర్మలమైన మనసున్న మనిషి. నమ్మకస్తుడైన మిత్రుడు శశిభూషణ్‌రావు. అతడి హస్తవాసితో వ్రాత ప్రతి వెలువడింది. స్మృతిపథం నుండి చెరిగిపోని స్వతంత్ర పోరాట ఘట్టాలను నెమరువేసుకుంటూ స్వతంత్ర భారత అవతరణపై ఒక వ్యాసాన్ని వ్రాసేను.

పరీక్షకు కూర్చునేముందు కలం, చిందులు తొక్కితే (బ్రతుకు చిందరవందర అవుతుందన్న భయంపోలేదు. మిత్రులు కొందరు చనువుతో ఆప్యాయతతో చేసిన హెచ్చరికతో నా దుడుకుతనానికి కళ్లెం పడింది. ఇంతలో అనూహ్యమైన పరిణామం సొదా జీవితానికి చిక్కుముడి పడింది. పుస్తకాలు పారాయణ (గ్రంథాలా? భట్టి పెట్టడానికి, గీతోపనిషత్తులా? పరీక్షముందు పేజీలు తిరిగేస్తే మార్కులు అవే పడతాయి! ధీమా ఎక్కువ! చదువు తక్కువ!

ఇంతలో మద్దూరి అన్నపూర్ణయ్య జగమెరిగిన స్వాతంత్ర్య సమరయోధుడు. సుభాష్‌చంద్ర బోసు కుడిభుజం. అల్లూరి సీతారామరాజు వీరికి ఆప్తమిత్రుడు. స్వాతంత్ర్య సంగ్రామంలో పరాయి పాలకుల క్రూర, కిరాతక హింసాకాండకు గురియై ఒకటిన్నర దశాబ్దాలు జైలు గోడల మధ్య మగ్గిన మహామహండు. శూరుడు, విప్లవ వీరకిశోరం! దేశమాత ముద్దుబిడ్డడు మద్దూరి అన్నపూర్ణయ్య. కరుడు గట్టిన సోషలిస్టు కూడా. రాజమండ్రిలో కొలువు దీరి ఉన్నాడు. “జయ భారత్‌” అన్న వారపత్రిక యీ గ్రంథసాంగుని మానసపుత్రిక. సోషలిస్టు భావాలకు అద్దం పట్టే యీ పత్రికలో ప్రచురణకు ఒక వ్యాసం పంపమన్న వారి ఉత్తరం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. పరీక్షలు పాసయి ఏదో తీరం చేరాలనుకున్న నా మనసు మళ్లీ అన్యాక్రాంతం అయింది. నా వ్యాసం ప్రచురించిన స్వేద్భాభారతం ర్‌తె

అనంతరం “తక్షణం రాజమండ్రి వచ్చి పత్రికలో ఉప సంపాదకుడుగా చేరుమన్న వారి లేఖ భూకంపం పుట్టించింది. వారి పిలుపు అందుకుంటే చదువుకు తిలోదకాలే! జన్మలో మళ్లీ పట్టాపుచ్చుకోలేను! డిగ్రీ కళ్ల చూడను. జీవిత ప్రస్థానంలో బతుకుబాట మూతపడు తుంది. చదువా? పత్రికారంగమా? అన్న ప్రశ్న ఉత్పన్నమయింది.

అది 1945వ సం॥ ఉత్తర విశాఖ కరువుతో దుర్శిక్షంతో సతమతమవుతోంది - పోటా పోటీగా విద్యార్థి కాంగ్రెస్‌, 521 కూడా విరాళాలు సేకరిస్తుండం - ఆరోజు విజయనగర రైల్వే స్టేషన్‌ పరిధిలో ఉన్నాం. కలకత్తా మెయిలు వచ్చింది. అందులో శరత్‌ చంద్రబోస్‌ పయనిస్తూ “నేతాజీ సుభాష్‌ బోస్‌ జిందాబాద్‌” అని నినాదాలు చేస్తున్నాం

  • ఆయన బయటకు వచ్చి తలుపు దగ్గర నిలబడ్డాడు. నిందైన మనిషి - బంగారుఛాయ! ఆజానుబాహులు. మరి కొంతకాలానికి వర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో కేంద్రంలో న్యాయశాఖామంత్రిగా సేవలు అందించారు. - ఆయన్ను వమి అడుగుతాం? బోసు బ్రతికున్నాడా? అని అడిగాము - ఇదే అందర్నీ పట్టి పీడిస్తున్న సమస్య. “నేను ఇంకా మద్దూరి అన్నపూర్ణయ్యను రాజమండ్రిలో కలియవలసి ఉంది. అతడు బోసు బతికి ఉన్నాడంటే బ్రతికి ఉన్నట్లే - లేదంటే లేడు”. అన్న పూర్ణయ్యగారితో బోసుకు ఉన్న సాన్నిహిత్యం అటువంటిది.

ఆ ఆలోచనా క్రమంలో “జాతి భవితవ్యం-నా కర్తవ్యం” అన్న అంశం వెనుకబడి భావి భద్రత అన్న ఎజెండా ముందుకు వస్తోంది. దేశసేవ అన్న భావం కుంటుపడి - నా జీవన యాత్రకు నౌఖరీ అన్న మాట తరుముకోస్తోంది. విజ్ఞానం వివేకం కలబోసి ఆలోచనలన్నీ రంగరించి నా జీవిత సౌధానికి మూల స్తంభాలు "సేవ, త్యాగం, సమసమాజ నిర్మాణం” అనుకుంటే అనుకున్నాను. ఇప్పుడు ఆ మూలస్థంభాలను కూలగొట్టాలా? ఇప్పుడు నా జీవన ప్రస్థానం ఎటు? నాలుగు రస్తాల మధ్యస్థంలో చేరుకొన్నాను. ఎటూ దిశా నిర్ణయం చేయలేని అచేతన, అసహాయ స్థితి. ఇలా ఎంతకాలం యీ అనిశ్చిత స్థితి? చొరవలేకుంటే గమ్యం చేరుకోలేము. సాహసం చెయ్యకుండా ఆదర్శాల దర్శనం దుర్లభం. గతీ మతీ స్థంభించి పోతే, మనిషి నిర్వీర్యం నిస్తేజం అవుతాడు.

నిస్సారమైన నిరర్ధకమైన జీవితం నిష్ప్రయోజనం. పత్రికారంగంలో ప్రవేశించడం ద్వారా దేశ ప్రగతికి సుగతికి రాచబాటలు తెరచినట్లే అన్న ఆలోచన కుదుటపడింది. అవకాశం మనిషిని వెతుక్కుంటూ రావడం కష్టం. వచ్చినప్పుడు మీనమేషాలు లెక్కిస్తూ ఉంటే కాలగమనంలో కొట్టుకుపోతాం. నాకు నేను తప్ప ఎవరున్నారు? సలహాలివ్వడానికి, సహాయక చర్యలకు! స్వయం రాజ! - స్వయం మంత్రి! ఛలో రాజమండ్రి! ర్‌డీ భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

పుస్తకాలు అటకెక్కాయి. రాజమండ్రికి టిక్కెట్టు తీసాను.. మా యింటి పెద్దలకు మాట మాత్రంగా చెప్పలేదు!

అన్నపూర్ణయ్యగారి ఎదుట వ్రాలేను. ఛలో రాజమండ్రి!

'సుస్తీ పుత్రికకు పుస్తెలతాదు' ఆయన ఎగాదిగా చూశాడు. ్రెస్‌కి వెళ్ళి ప్రూఫులు దిద్దాలన్నాడు. విదేశాంగ వ్యవహారాలమీద వారానికో వ్యాసం వ్రాయాలన్నాడు. ఆ తర్వాత స్థలాభావం లేకపోతే నోయిజాలు, నిజాలు” వ్రాసుకోవచ్చు అని తేటతెల్లంగా చెప్పాడు. కాలేజీ గడప దాటి బయటకు వచ్చీ రాకముందే, జాతీయ విషయాలు కూడా కాదు, విదేశీ వ్యవహారాల మీద వరుసపెట్టి ప్రతీ వారం ఎలా వ్రాయగలను? ఇది యింకో సవాలు! నిరంతర అధ్యయనం, నిత్యపఠనం, విషయ సేకరణ ఉండాలి. రచనాతైలి కూడా ముఖ్యం. బుద్దిబలమే కాదు, బోధనావిధానం ముఖ్యం అనేవారు చిన్నప్పుడు మా అయ్యవారు. ఒకే కూరను నలుగురు నాలుగు విధాలుగా వండినట్టు, తెలిసిన విషయాన్ని తేటతెల్లం చేసేందుకు భాషపట్ల, శైలిపట్ల, దృష్టిపెట్టాలి. విషయపరిజ్ఞానాన్ని కొంత ప్రదర్శిస్తూ పరిశ్రమిస్తే ఆపెద్ద తలకాయ అన్నపూర్ణయ్య తృప్తి పడితే ఇంకేమి కావాలి?

అన్నపూర్ణయ్యగారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆదర్భ్శజీవి, సామ్యవాది. కలం పట్టినా గళం విప్పినా వారి రచనావ్యాసంగం, ప్రసంగ పాటవం ప్రజల్ని ప్రభావితం చేసేది. ఆదర్శాలు ఆలోచనలు ప్రకంపనలు పుట్టిస్తాయి. ఆదర్శాలకు గీటురాయి ఆచరణ. తను ప్రవచించే ఆదర్శాలకు సహజ సుందర స్వరూపంగా తాను రూపొందాలి. సిద్దాంతాలన్నీ (ప్రతిష్టాత్మకంగా తీసుకునేవాడు. ఆచరణను అనుష్టానాన్ని సహజ కర్తవ్యంగా చేసుకోవాలి. మాటకు చేతకు మధ్యదూరం పెరిగితే ధర్మం నిలవదు. మదిలో మెదిలే ఆలోచనలకు నోటపలికే పలుకులకు సమన్వయం ఉండాలి, పొత్తు కుదరాలి. మనిషిమాట తన నైజాన్ని, శీలాన్ని ఆవిష్కరిస్తుంది.

మానవుని నడత, ప్రవర్తన తన అంతరంగాన్ని అద్దం పడుతుంది.

సమాలోచనలు స్వర్గానికి సోపానం కడితే - కార్యాచరణ పాతాళం లోతులు చూపించగూడదు. ధనబలం లేని పత్రికలు గాలిలో పెట్టిన దీపాలు, గాలిపటాలు. పత్రికలు సకాలానికి వస్తే కలకాలం ఉన్నట్టే, పాలసీలు కన్నా బయట నగిషీలు మిన్న వాటి రూపురేఖలు చిత్రవిచిత్రాలు. కొన్ని కథనాలు కలకలం సృష్టిస్తే ఆ కొన్ని పత్రికలు కులబలం నిరూపిస్తాయి. అనవసరమైన అర్భాయుష్ను పత్రికలు కొన్ని! కొన్ని పత్రికల ఆయుర్ధాయం అంచనాలకు దొరకదు. పుట్టిగిట్టే పత్రికలు కొన్ని, స్వేద్భాభారతం ర5్‌5్‌

అన్నపూర్ణయ్యగారిది ఒక విలక్షణమైన వ్యక్తిత్వం. విశిష్టమైన సత్పురుషుదాయన. తెలుగుజాతి గర్వించదగ్గ ధీమంతుడు. (2101 2000164102 10 [13 16665) ప్రతి ఒక్కరు తన అవసరాల ప్రాతిపదికన సమష్టి సంపదలను అనుభవించాలని నమ్మిన నాయకుడాయన. ముప్పెవేలు పోగుజేసి పత్రిక పెట్టాడు. ఎంత కాలం ఉంటుందీ డబ్బు? ఈ సొమ్ముహరించి పోవడానికి ఎంతకాలం కావాలి? ప్రమాద ఘంటికలు మోగాయి! పత్రిక మూత పడకుండా ఉండాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి. అవసరాలు కుదించుకోవాలి అవసరమైతే కడుపు కట్టుకుని అయినా పత్రిక నడుపుకోవాలి. ఒకనాటి సమావేశంలో పొదుపు చర్యలు ప్రస్తావనకు వచ్చాయి. అందరూ ఏదో చెబితే “నేను మాత్రం ఒక సింగల్‌ కేరియర్‌ యిచ్చి నెలకు పదిహేనురూపాయలు యిస్తే చాలు” అన్నాను. నా మొహం వైపు తీవ్రంగా చూస్తూ చస్తావా? బ్రతుకుతావా? అన్నాడాయన. “పత్రికను (బ్రతికించుకోవాలి కదండీ” అన్నాను నేను! మా ఉభయులకి వరదారావు హోటలు నుంచి ఒక సింగిల్‌ కేరియర్‌ వచ్చేది. ఇక పై ఖర్చులమాట? కొత్తగా పెళ్ళెంది. మా యిద్దరికీ నాటికి కాఫీ, టీ అలవాటు లేదు. కట్టుబట్టలు కొళాయి దగ్గజ ఉతుక్కుంటే సరిపోతుంది. చెంబు ఇస్రీలో నేను 'ప్రవీణుడ్ని ఆమెకూ చేతనౌను. అలా రోజులు గడుస్తున్నాయి. మా ఆవిడ కడుపులో బిడ్డ బయటపడాలంటే ఎవరు పురుడు పోస్తారు? ప్రసవం ఎక్కడ జరుగుతుంది? ఖర్మం కాలి వేరే గతిలేక విజయనగరం వాళ్ళ అమ్మగారి యింట్లో ఆమెను చేర్చి, నేను పరాయికొంపలో కాలక్షేపం చేస్తున్నాను. ఇంతలో హఠాత్తుగా ఓ రోజు పోస్టుమాన్‌ ఓ తంతి బట్వాడా చేశాడు. విప్పిచూతును గదా! “20౮ 610366 ౫0౦౬ 666 10[00%ల అంటూ యిది అన్నపూర్ణయ్యగారి వర్తమానం. రాజమండ్రి నుండి మా సామాన్లేవి మాతో తెచ్చుకోలేదు. తిరిగి వెళ్తామన్న ఉద్దేశ్యంతో, యిప్పుడు వాటికోసం ప్రత్యేకించి వెళ్లాలంటే కావలసిన పైకమెంత? మిగిలిన సామానుల విలువెంత? యిలా ఎన్నో ప్రశ్నలు? మరెన్నో యిబ్బందులు. ఒకటి మాత్రం బాగా గుర్తుంది. మానాన్న స్వదస్తూరితో వ్రాసిన జాతకం ఒకటి ఉండాలి. అన్నపూర్ణయ్యగారికి జాతకాల పిచ్చి బాగా ఉంది. ముహూర్తం చూడకుండా గడపదాటి అడుగు బయట పెట్టేవాడు కాదు. ఓరోజు నా జాతకం అడిగాడు. తీవ్రంగా పరిశీలనాత్మకంగా చూసి నన్ను కిందా మీదా చూసి యిది తప్పు. యిది నీ జాతకం కాదన్నాడు. అది మానాన్న స్వదస్తూరిది. నేను మా నాన్న ఏకైక పుత్రుణ్ణి. యిది తప్పెలా అవుతుంది. మూడు గ్రహాలు ఉచ్చలో ఉన్నాయి. ఒకటి ఉచ్చసమానం. నేను చూస్తే యిలా ఉన్నాను. 15రూపాయలతో నెలరోజులు గడుపుతున్నాను. అందుకే నా జాతకాన్ని నమ్మలేదు. 1986లో పోయాడు మానాన్న. రాజమండ్రిలో వీథి అరుగు ప్రక్కన ఉన్న ర్‌ం భాట్టం శ్రీరామమూర్తి (్వీయ చరిత్ర)

చిన్న గదిలో నేలను బొంత పర్చుకొని పడుకౌనేవాళ్ళం. క్రింద చాప ఉండేది. నిర్విచారం! నిండు సంతోషం! మెఅకవీథి దిబ్బలనుండి గోదావరి స్టేషను దగ్గరున్న “నేతి”వారి కొట్లో ఉండదే ప్రింటింగ్‌ (డెస్‌కు వెళ్ళాలి. రెండుపూటలా నడక! చిన్నప్పుడు చదువుకోడాన్మి ఒక ప్రక్క నాలుగుమైళ్ళు నడిచాను కదా! ఆ నదకలోనే ఉంది ఆనందమంతా! పుస్తకాల బరువుమాత్రం కొంచెం భారం అనిపించేది. ఇపుడు చక్కా చక్కెర్లు కొడుతున్నాను.

అన్నపూర్ణయ్యగారు పూర్ణపురుషుడు. సర్వోత్తముడు, మంచి సరసుడు, రసజ్జుడు, విజ్ఞాన ఖని. తీరిక సమయాల్లో పిచ్చాపాటి మాటల్లో దేశం ముచ్చట్లు చెప్పేవాడు. నేతల అలవాట్లు సంస్మరణవాదుల లోటుపాట్లు యిలా ఎన్నో కబుర్లు దొర్లేవి. బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ఎదిరించి 14సం॥లు జైలు జీవితాన్ని అనుభవించిన యోధుడాయన. అపారమైన అనుభవం ఉంది. విశాలమైన దృక్పథం ఉంది. జాతి నేతలందరితో సత్సంబంధాలున్నాయి. ఆయన మాటలే విజ్ఞానకానుకలు. ఢిల్లీ వెళ్ళినపుడు (100 మీటింగ్‌) అల్లూరి సత్యం (సత్యనారాయణరాజు)తో కాలి నడకన మైళ్ళ తరబడి తిరిగి ఇడ్లీ, పెసరట్లు ఉండే హోటల్‌ కనిపెట్టామన్న మాటలు చెప్తూ చెరో నాలుగుప్తేట్లు లాగించేశాం అన్న ఉదంతం పసందుగా వీనులు విందుగా చెప్పేవాడు. అల్లూరి సత్యం అన్నపూర్ణయ్యగారి శిష్యుడే. జిన్నూరులో మకాం పెట్టడం అన్నపూర్ణయ్యగారికి వెన్నతో పెట్టిన విద్యయే. అన్నపూర్ణమ్మ (సత్యం నారాయణరాజు భార్య) ఆతిథ్యం గొప్పదని చెప్పేవాడు, సత్యం కూడా సోషలిస్టే.

జె.పి.కూదా అడిగాడు అతని గురించి. “కాళీపట్నం రైతుల సమస్య యింకా తేలలేదు. అందులోంచి బయటపడ్డాక సోషలిస్టు పార్టీ పగ్గాలు పుచ్చుకుంటాదని” చెప్పాను అన్నారు. అన్నపూర్ణయ్య స్వతహాగా సంస్కరణవాదే.

కందుకూరి వీరేశలింగం పంతులుగారు వితంతు వివాహాలు చేయిస్తే, వీరికి కులాంతర, మతాంతర వివాహాల పట్ల మక్కువ ఎక్కువ!

ఆం(ధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావుపంతులు అఖిలభారత కాంగ్రెసు కార్యదర్శిగా అ(గ్రశ్రేణి జాతి నేతల మన్ననలందుకున్న ప్రముఖుడు, సంఘసంస్క్మరణోద్యమంలో వీరేశలింగం పంతులు గారికి వెన్నుదన్నుగా ఉండేవాడు. ఆ మహానుభావుని సమీప బంధువు అర్ధరాత్రి వీరేశలింగం పంతులుగారి తలుపు తట్టాడట గోప్యంగా! ఆయనకి ఆశ్చర్యం వేసింది. తనకి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటున్న ఆంధ్రఖీష్ముని సంతతివాడు యీ రాత్రి పూట రహస్యంగా కలియడం ముందు ఆశ్చర్యపడ్డా, విషయాలన్నీ విన్నాక పంతులుగారు కలవరపడ్డారు. స్వేచ్చాభారతం ర్‌7

ముందుగా ముహూర్తం నిర్ణయించి వధూవరులను పీటలమీద కూర్చోబెట్టి కబురు పంపించారుట సుబ్బారావు పంతులుగారికి. “ఆ గుర్తుకు వచ్చింది. యీ రోజు పెళ్ళి ముహూర్తాలున్నాయి కదా! యిదిగో వస్తున్నా” అని దుస్తులు మార్చుకొని కండువా దులుపుకుంటూ వీథి మెట్లు దిగుతూ “ఎవరి పెళ్లోయి” అన్నాడుట. పెళ్ళి కొడుకు పేరు చెబితే హఠాత్తుగా చేతి బెత్తు అక్కడే పడేసి కండువా విసిరేసి అదే ముహూర్తానికి పౌరోహిత్యుల్ని రప్పించి తన స్వగ్భృహంలోనే ఆ నవ వధువుకు ఘటశ్రాద్ధం పెట్టించాడట. షార్ధివ శరీరం దొరకనప్పుడు చేసే కర్మకాండ అది. యిలాటి సంగతులెన్నో ఎన్నీ చెప్పేవాడు అన్నపూర్ణయ్యగారు. మంగళసూత్రం లేకుండా మాంగల్యం ఆసక్తిగా వింటూ ఉండేవాడిని. నీకేమైనా యిటువంటి కోరికుందా అన్నారు ఒకమారు. “ఆ” అన్నాను. అయితే చెప్పు ముహూర్తం పెట్టేస్తాను. ఆ విధంగా పెళ్ళి ముహూర్తం దగ్గరపడింది. మా ఆవిడకి కబురు చేరింది. వాళ్ళ పెద్దమ్మను తోడు తెచ్చుకొని రాజమండ్రి చేరింది. నా తరపున కె.యస్‌. శాస్త్రి, తిలక్‌, యాళ్ళ, శశిభూషణరావు ఉన్నారు. గూటాల కృష్ణమూర్తికి సావకాశం చిక్కక ఒక వాచీ బహుమతిగా పంపించాడు. అదే నాకు వివాహ మహోత్సవ సందర్భంగా లభించిన ఏకైక కానుక. అదికూడా రాజమండ్రిలోనే ఉండిపోయింది. పోయింది.

సంస్కరణ వివాహం అంటే ఎలాగ ఉంటుంది? సంప్రదాయబద్ధంగా ఉందదు. మా పెళ్ళికి మద్దూరి అన్నపూర్ణయ్యగారు పౌరోహిత్యం వహించారు. తనకు తోచిన పద్ధతిలో ప్రమాణపత్రం తయారుచేశాడు. ఆయన ముందు చదివితే మేము తర్వాత చదవాలి. అన్యోన్య సహాయ సహకారాలతో కడవటకు కలిసి మెలిసి ప్రేమపూర్వకంగా జీవయాత్ర కొనసాగిస్తామని అన్న సారాంశం అందులో ఉంటుంది. ప్రమాణపత్రం చదివాక పూలదండలు మార్చుకోవాలి. ఆహ్వానితులందరికీ తేనీటి విందు జరిగింది. పలువురు ప్రముఖులు చేసిన ప్రసంగాల సారాంశాలతో యీ వివాహ వార్త పత్రికల్లో పడింది. మొత్తం యీ పెండ్లితంతుకు అయిన ఖర్చు 15రూ॥లు. అంతా నిరాడంబరంగా జరిగింది. మా జీవిత చరిత్రలో నూతన అధ్యాయం (ప్రారంభమయింది.

(ఇక్కడ మాయింటి ముందు ఉండే చంద్రమౌళి గురించి చెప్పుకోవాలి. చిన్నపిల్లాడు. నిలువెల్లా తెలివితేటలే! అతని చెలిమే మా వివాహబంధానికి బలిమి అనిపించింది. అతడు గుమ్మంలో అడుగుపెడితే ఇల్లు కళకళలాదేది. ఇప్పుడతను పెద్దవాడయ్యేడు. 58... భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్ర

ఆర్‌ & బి చీఫ్‌ ఇంజనీరుగా రిటైరయి తన సహధర్మచారిణితో ప్రశాంత జీవితం గడుపుతున్నాడు హైద్రాబాద్‌లోనే. గొప్ప మనిషి - మంచి మనస్సు)

ఒకరోజు రాత్రి అన్నపూర్ణయ్యగారు రమ్మంటే వెళ్ళాను మేడమీదకు. “ఒరేయ్‌! నీ పెళ్లి చెల్లూదన్నాడు. శాస్త్రప్రకారం జరగలేదు. న్యాయశాస్త్రం రీత్యా కూడా జరగలేదు. చట్టం ఒప్పదు అన్నాడు. నన్నేం చెయ్యమంటారని అడిగేను. కాకినాడలోని పెళ్లిళ్ల రిజిస్ట్రార్‌కు నోటీసు పంపాలి. సంతకం చెయ్యమన్నాడు. వద్దని మొత్తుకున్నా విడిచిపెట్టలేదు! నా గంట వాదన వృథా అయింది. దసకత్తు చేస్తే ఊరుకోక క్రిందకు వెళ్ళి నా పెళ్ళాం చేత సంతకం చేయించి తెమ్మన్నాడు. అది నావల్ల కాదు ఆ భారం మీదేనని చేతులెత్తేసాను. చరచరా క్రిందకు దిగి మా ఆవిడ ముందు కాగితం పెట్టి సంతకం చెయ్యమన్నాడు. ఎందుకని అడిగింది. లేకపోతే మీ పెళ్ళి చెల్లదన్నాడు. ఎవరి ఆమోదం మేము కోరలేదు కదా అంది మా ఆవిడ. “మొగాడికేం పోయింది నీ గొంతుక కోస్తాడు. ఏం చేస్తావు?” అన్నాడాయన. “మావారు అటువంటి వారు కాదండి” “మొగాళ్ళు యిలాగే మోసం చేస్తారు. ఆ తర్వాత నీ బ్రతుకు రోద్దుమీద పడుతుంది. తలదాచుకొనే చోటు కూడా దొరక్క కడుపుమాడి చస్తావు” అన్నాడాయన. “మా ఆయన చెవులు మూసి చావగొడితే ఏ చట్టం నన్ను రక్షిస్తుంది?” అని అడిగింది.

“ఆస్పిపాస్తుల్లో వాటా ఉంటుంది. బతుకు భృతి దొరుకుతుంది” అంటూ వాక్ళాతుర్యం అంతా చూపించాడాయన. “చస్తే పోతాను సంతకం చేస్తే అతని మీద నమ్మకం చచ్చినట్టే కదా! మా పెళ్ళికి నమ్మికే మూలసూత్రం. పరస్పర విశ్వాసమే ప్రాణం. యీ ప్రాణం మీరు తీసేస్తే నేను బ్రతికున్నా చచ్చినట్లే' అంది మా ఆవిడ. ఇంక అన్నపూర్ణయ్య నీరుకారి పోయాడు. "నిన్ను నట్టేట్లో ముంచేస్తాడు. అప్పుడు నీకు ఎవరు దిక్కు చూసుకో” అన్నాడు. “మీ కాళ్ళమీద పడితే మీరు కంటతడికూడా పెట్టకండి” అంది మా ఆవిడ. 'నిన్ను రక్షించాలని చూస్తే భక్షించేవాడి బోనులో పడ్డావు నీ కర్మ అని వెనుతిరిగాడు. విఫలుడయ్యాడు.

మా ఆశల ఆశయాల పట్టుగొమ్మ మా అవిడ భయసందేహాలకు, ప్రలోభాలకు లొంగదు.

బ్రతుకు బుగ్గి అవుతుంది. భావి శూన్యం అవుతుంది. నిన్ను ఆదుకునే నాథుడు ఉండడు అంటూ ఏకరువు పెడితే ఆ తప్పుడు మాటలు వినలేనంది మా ఆవిడ. అంతటితో ఆగిపోయాడు అన్నప్రూర్ణయ్యగారు, ఆమె గుండె ఎంతగట్టిదో, ఆమె నమ్మకం ఎంత స్వేచ్చభరతం 9

గొప్పదో! సుడిగుండంలో ఉన్నా యమగండం అన్నా ఖాతరు చెయ్యక తన జీవితానికి సర్వస్వం నేనేనని నమ్మి ఎంత ఆత్మార్పణ బుద్ధితో నా బ్రతుకులో భాగస్వామ్యం అయ్యిందో చూడండి. అది భార్య కాదు భగవంతుని వరప్రసాదం.

1947 నవంబరులో పెళ్ళయింది. 60 ఏళ్ళు దాటినా ఇద్దరం ఒకటిగా ఒకచోట గుంభనంగా బతుకుతున్నాము. తన జీవితం నాకు ధారపోసింది. నా బతుకు భారం పంచుకుంది. మా సంసార సాగరానికి ఆమే (ధ్రువతార, ఆమె ్రాపకంలో పెరిగిన పిల్లలు బంగారం. అలసిసౌలసిన యీ చరమఘట్టంలో మా పిల్లలే మాకు పెట్టనిగోడలు, కట్టని కోటలు, స్థిరాస్తివాళ్ళే, చరాస్తి నేనూ!

ఇంత అన్నపూర్ణయ్యగారు పప్పులో కాలేశారు, మా పెళ్ళి పెటాకులవుతుందా? జీవితాంతం సుఖశాంతులే. సర్వత్రా ప్రశాంతి, ఎవరికోసం ఎవరు పుట్టారు? నాకోసం తను, తనకోసం నేను. 'ఇది సహగమనం.”

“సర్వే సుఖినన్సంతు - నర్వేసంళు నిరామయా సర్వే భద్రాణి వశ్చంతు - మా కల్చిత్‌ దుఃఖమూన్నయాత్‌” నా భావాంబర వీథిలో విహరిస్తున్న సుందర స్వప్నాలకు ఆకృతి కల్పించాలి. గుండెలోతుల్లో గూడుకట్టుకున్న మధురభావాలను త్యాగధనుల పాదపద్మాలను దోసిళ్లతో అభిషేకించి పునీతులం కావాలి. పునర్జన్మ పొందాలి! ఎన్ని అనుకున్నా అనుకోకుండా తెరుచుకున్న ద్వారాలు తలవని తలంపుగా మూతపడ్డాయి. షల సల ఈఓ 60 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

పూజ్యబాపూజీ ఆత్మ బలిదానం

1947వ సం॥ నవంబరు 6వ తేదీన రాజమండ్రిలో వర్ధాంతర వివాహం చేసుకొని యింకా రెండుమాసాలు నిండలేదు. సాయంకాలం సమయంలో సతీసమేతంగా గోదావరి గట్టు మీదకి వెళ్తున్నాం. గబగబా షాపులు మూసేస్తున్నారు. ఘోరం జరిగిపోయిందని కొందరు గుండెలు బాదుకుంటున్నారు. అప్పుడే తెలిసింది. తుపాకీ తూటాకు బలై గాంధీజీ ప్రాణాలు కోల్పోయారని. నమ్మశక్యం కాలేదు! వెంటనే హడావిడిగా వెనుదిరిగి టౌనుహాలు చేరుకున్నాం. మళ్లీ మళ్లీ చెబుతోంది రేడియో కఠోరవార్త వినిపిస్తోంది! దుఃఖం పొంగి (ప్రవహిస్తోంది. ఏ మొఖానా వేటు వేస్తే రక్తం చుక్కరాలదు. విషణ్ణ వదనంతో దుఃఖాథు వులు కారుస్తున్న జనం కొందరు, నెత్తిమొత్తుకొని బావురుమంటున్న జనం కొందరు రోడ్డుకు అటు యిటూ కనిపిస్తున్నారు. వెక్కి వెక్కి ఏడుస్తూ నీటి తెర పొరలు తుడుచుకుంటూ జయభారత్‌ ఆఫీసుకు చేరుకున్నాం. మవాత్ముని హత్యాకాండ ఘోర దురంతంతో భరతమాత శోక సముద్రంలో మునిగింది. దేశం అనాథ అయింది. ఆబాలగోపాలం కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక వెలుగు కిరణం ఆరిపోయింది. ప్రపంచ ఆశాజ్యోతి అస్తమించింది. ఒక (ధ్రువతార రాలిపోయింది.

జయభారత్‌ పత్రికా సంపాదకత్వం బాధ్యతలు నాకర్తవ్యం గుర్తుచేస్తున్నాయి. అంజలి ఘటించేందుకు వేరే సాధనం ఏముంది? గళం పలకదు, కలం కూడా కన్నీరే కారుస్తోంది. ఆనాటి మాట యిది. చిరుత ప్రాయంలో గుండె బ్రద్దలైతే కారిన కన్నీటి ఊట ఇది. క్రూర కిరాతక మతోన్మాది పేల్చిన కరకు తుపాకీ తూటాకు బలియై నేలకొరిగాడు. హేరామ్‌ అంటూ నేలకొరిగాడు మహాత్మాగాంధీ.

పంచప్రాణాలు అనంత వాయువుల్లో విలీనమయ్యాయి. ప్రాణ ప్రయాణ సమయంలో మహాత్ముడు “హే! రామ్‌!” అన్నందున సంతు తులసీదాస్‌ మాటల్లో “అంతకాల రఘువర పురజాయి జహా జన్మ హరిభక్త కహాయీ” మహాత్మాగాంధీ రామచంద్ర ప్రభువు చెంతకు చేరుకున్నాడు. మూడు దశాబ్దాల పాటు మహాత్ముని అడుగుజాడల్లో నడిచిన భరతజాతి దౌర్జన్యవాదానికి హింసాకాండకు తలపదుతోంది. ఈ దేశంలో అణువణువూ గాంధీజీ స్వేద్భాభారతం 61

నామంతో స్పందించింది. వారి ధ్యేయంతో ప్రతిధ్వనించింది. వారిని స్మరించి తరించాలని ఉవ్విళ్లూరింది. ఇంతలో యీ దారుణమారణకాండ జరిగి పోయింది. భరతజాతి గుందెల్లో నిప్పుకణాలు కుమ్మరించారు. మహాత్ముని అంతరాత్మ క్షోభించింది. మహాత్మా! మహర్షీ! సత్యం అహింస సాధనాలుగా స్వాతంత్ర్యం సాధించి ప్రపంచ చరిత్రలో నూతన అధ్యాయం ్రారంభించిన మీ దివ్య స్కృతికి జోహార్లు. జాతిపిత పూజ్య బాపూజీ! నీ అడుగుజాడల్లో జాతి నడవాలని నీ వెలుగు కిరణాలు మా అంతరాత్మను తేజోవంతం చేయాలని ఆశీర్వదించు తండ్రీ! రక్తపాతం, హింసావాదం, దౌర్జన్యకాండ అంతరించి, శాంతియుత ప్రజాస్వామిక పార్లమెంటరీ విధానంలో ఉన్నత జాతీయలక్ష్యాలను చేరుకోగలిగే నైతిక శక్తి, ఆత్మబలం ప్రసాదించు. సాంఘిక న్యాయం, ఆర్థిక స్వాతంత్ర్యం అందరికీ సిద్దించాలని నైతిక విలువలు సమతాధర్మం సర్వత్రా వ్యాపించాలని నీ దివ్య స్వప్నం ఫలించాలని స్వర్గసీమ నుండి దీవించు, ఆశీర్వదించు బాపూజీ! నీ ఆత్మ జ్యోతి నిత్యమై సత్యమై వెలుగొందుగాక! పూజ్య బాపూజీ పవిత్ర స్మృతికి దేశం శ్రద్ధాంజలి ఘటిస్తోంది. జాతి భక్ష్యంజలి సమర్చిస్తోంది! వెర్రిగా దేశం నలుమూలలా తిరిగాను. గాంధీ పుట్టిన గుజరాత్‌ నుండి వారి అంతిమయాత్ర జరిగిన ఢిల్లీ పురవీథులెన్నో తిరిగాను. తల్లి కస్తూరిబా - కార్యదర్శి, ష్యారిలాల్‌ తనువు చాలించిన జైలు గోడలలోకి ఆగాఖాన్‌ పేలస్‌కు వెళ్లిచూసాను. పోరుబందరులో గాంధీ జన్మించిన యింటి అరుగుల మీద దొర్లాను. రాజ్‌కోట గాంధీగారి గృహాన్ని దర్శించాను. సబర్శతీ నదీ తీరాన వెలసిన సబర్మతీ ఆశ్రమంలో వారంరోజులు గడిపాను. వార్థాలో సేవాగ్రామ్‌లో గాంధీజీ కుటీరాన్ని తనివితీరా చూశాను. కస్తూరిబా మందిరంలో కళ్లు మూసుకొని ధ్యానం చేశాను. బిర్లామందిరంలో సాయం సంధ్యలో మహాత్ముడు గడిపే ప్రార్ధనా సమావేశాల వేదికకు పదేపదే (మొక్కాను. శతసహస్ర ప్రణతులర్పించాను. ఆ గడ్డమీద మట్టిని కొంత తెచ్చుకొని యింటి గుమ్మం ముందు జల్లుకొన్నాను. గాంధీజీ పటం లేని యింటిలో కాపురం చెయ్యను. వారి స్వీయచరిత్ర తరచు నెమరువేస్తాను. శరీరంలోని కండరాల చుట్టూ చర్మం ఉన్నట్లు నా దేహం మీద ఖద్దరు గుడ్డలుండాలి. ఆయువు తీరేవరకు నా ఆశయాలకు ఎవ్వరూ అద్దుపడరు. నిలువెత్తు గాంధీ పటాన్ని పూలదండలతో అలంకరించి ఉంచుతాడు అబ్బాయి విద్యాసాగర్‌. గాంధీజీ పుట్టిన దేశంలో పుట్టడమే అదృష్టం. 62 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

మా అన్న మండలి సువిశాల ప్రాంగణాన్ని గాంధీ క్షేత్రంగా తీర్చిదిద్ది కుటీర

పరిశ్రమలతో పాటు వృత్తివిద్యను నేర్చించే పవిత్ర గాంధీక్షేత్రాన్ని నెలకొల్పి జీవితం ధన్యం చేసుకున్నాడు. మహాత్మా

కైలాసం కన్న మిన్న

గా పెరిగిన మనిషివి నీవు

కడలి కన్న వెడల్పైన

యెద గల మనిషివి నీవు

భూమాతకు లేని సహన

భూరిగుణం నీదయ్యా

గోమాతకు లేని సహన

కోమల హృది నీదయ్యా = సి.నా.రె

“బుద్ధుడవో - సకల తప

స్సిద్ధుడవో - శంకరుడవో

వృద్ధుడవో - యువకుడవో

సిద్ధాంతింపంగ నీకె చెల్లు మహాత్మా” - దాశరథి

న

స్వేచ్చ్భాభారతం 63

పత్రికా రంగంపై తరగని వ్యామోహం జయజభారత్‌ పత్రిక ఒక విప్లవవీరుని మానసికపుత్రిక అర్ధాంతరంగా ఆగిపోయింది. పత్రికారంగంలో (ప్రతిభావంతులైన నిష్టాతులెందరో నిత్యం నా మనోభావంలో కదిలేవారు. పత్రికారంగం నిస్వార్థ నిష్కళంక కార్యరంగం. విశాల విశ్వమే దాని పరిధి. ఆకాశమే హద్దు - సమర్ధత ప్రతిభ యివే కొలబద్ద. అలుపు వెణుపులేకుండా పరాక్రమించవచ్చు. ధరాతలంలో దానికిసాటి పైన మేటిరంగం ఏది? నిరంతరకృషి - నిత్యజాగృతి దేశానికి మేలుకొలుపు. జగతి ప్రగతికి-జన జీవితానికి భద్రత, స్వపరిపాలన - సుపరిపాలనకు పత్రికలే శ్రీరామరక్ష జాతిజీవితంలో పూలబాటలు పరచేందుకు శక్తిమంతమైన సాధన ప(త్రికారచన. నా భావాంబర వీథిలో సుందర స్వప్నాలకు ఆకృతి కల్పించాలి. గుండెలోతుల్లో గూడు కట్టుకున్న మధుర భావాలు త్యాగధనుల పాదపద్మాలను దోసిళ్లతో అభిషేకించి పునీళులం కావాలి. పునర్జన్మ పొందాలి అనుకోకుండా తెరచుకున్న ద్వారాలు తలవని తలంపుగా మూతపడ్డాయి. పత్రికమీద పెంచుకున్న మక్కున ఎక్కువైనందున - మళ్ళీ మరో రోజు నేనే స్వంత పత్రిక పెట్టి, స్వతంత్రంగా నడిపి - ఢంకా బజాయించాలని ఉంది. నా ఆదర్శాల ఘంటారావం తెనుగునేలపై మారు మైోగునట్లు చెయ్యాలన్న ఆకాంక్ష అంతర్లీనంగా ప్రబలింది. మరోరెండు దశాబ్దాలు దాటిన తర్వాత ఉన్నత ఆదర్శాలు, ఆశయాలు ప్రతిరూపకంగా విశాఖనగరం నుండి స్వీయసంపాదకత్వాన “ప్రజారథం” వారపత్రికను విడుదల చేసాను. ఆశయాలకు చావులేదు. ఆదర్శాలకు మరణంలేదు. క్షేత్రం సారవంతం అయితే మేలురకం విత్తనం అయితే - ఆశలు చిగురించకపోవు - కలలు ఫలించకపోవు! ఈ విధంగా విశాఖనుండి వారపత్రిక “ప్రజారథం” ప్రగతిపథంలో అడుగుపెట్టింది. అందులో నా ఆశల-ఆశయాల తోరణం పరికించండి. “ఉన్నత ఆశయాల, ఆదర్శాల ప్రతిరూపం, ప్రజారథం” జ ాాాాాాాోాభాట్ట శ్రజమమాక సదు

ఎన్నో ఆశలు పెట్టుకొని, ప్రాణప్రదంగా పెంచుకున్న ఆశయాలకూ, ఆదర్శాలకూ దర్చణంగా నిలవాలని నడిపిస్తున్న వారపత్రిక ప్రజారథం.

జాతి ప్రగతికి-సుగతికి రాజబాట వేయాలనీ! దశాబ్దాల తరబడి-గుండెల్లో గూడుకట్టుకొన్న ఆశయాలను రంగరించి - అక్షర రూపంలో ప్రజానీకానికి నివేదించాలని చేసిన సాహసం అది. శరీరాలు శాశ్వతం కావు - సంకల్పాలు మాత్రం చిరంజీవిగా ఉంటాయంటారు. జాతి జీవితాన్ని నిండు గుండెలతో అలంకరించాలన్న ఆశతో - ఈ ఆశయాల తోరణాన్ని మీ హృదయమందిరం ముందు ఉంచుతున్నాను. నాడు నా కంటి ముందు మెదలిన ఆదర్శాల నిఘంటువే నేడు మీ ముందు ప్రత్యక్షమయ్యే ఆశయజ్యోతి, ఆదర్శ్హాల ప్రతిబింబం! (ప్రగతిపథంలో ప్రజారథం ఆశయాల తోరణం

నవసమాజం నిర్మించాలని, సమసమాజానికి స్వాగతం పలకాలని

సాంఘిక అభ్యుదయం, వైజ్ఞానిక ప్రగతి సాధించాలనీ

విశ్వశ్రేయస్సుకు, వినూత్న తేజస్సుకు మూలం మానవుడని చాటాలని

మనిషి గుందెలో, నవభావం, సమభావం నాటాలని

కొత్త విలువలనే విత్తులు నలుదిశలా నాటాలని

మనిషికీ, మనిషికీ మధ్య లేచిన అడ్డుగోడలు కూల్చివేయాలని

ప్రజాహితం కోరి ప్రగతి పథంలో “ప్రజారథం” నడపాలని ఉంది.

ఉన్నత ఆశయాలు అన్నీ క్రోడీకరించి, జాతీయ జీవనగమ్యం వైపు “ప్రజారథం”

నడిపించాలని

జాతి జీవితంలో పన్నీటి జల్లు కురవాలని కలలుకన్నాను!

మనసును మేధస్సును కదిలించి, రగిలించే భావబలంతో, మేధా సంపదతో

ప్రజారథం సగటు మనిషి సవాలక్ష బాధలకీ, బోధలకీ, వాంఛితాలకు, ఈప్పితార్థాలకు

ఒక గీటురాయిగా నిలవాలనీ

ప్రజాభీష్టానికి ప్రతి బింబంగా రాబోయే రోజులకు నాంది వాచకంగా

“ప్రజారథం” విలసిల్లాలని వర్ధిల్లాలని, ఆకాంక్షిస్తున్నాను!

ఆర్థిక,రాజకీయ, సాంఘిక స్థితిగతులను క్షుణ్ణంగా పరిశోధించే వ్యాసావళితో పాటు స్వేచ్చాభారతం 65

నవజీవనానికి నాందిపలికే రచనలనేకం.

నవభావబంధురాలైన కవితా కథా రచనలు మరెన్నో

అందించగలమని ఆశిస్తూ యీ పత్రికను ప్రజలకు అంకితం చేస్తున్నాను!!

ఎన్ని కలలో- ఎన్నెన్ని ఆశలో! ఆశయాలో! వాటికి నేను ప్రాణం పోస్తేనే నా జీవితానికి అర్ధం, పరమార్థం. నామాట ఏమిటి?

పత్రికారంగంలో విహంగంలా ఎగిరాను. తాడుతెగిన పతంగంలాగా ఎగిరిపడ్డాను. పత్రికారంగానికి విశాలవిశ్వమే పరిధి. వారానికో వ్యాసం. అంతర్జాతీయ రాజకీయాలపై రాసిన చెయ్యి యిది. ప్రపంచ అగ్రనేతలు తలరాతలు విధి విలాసాలు అన్నీ కరతలామలకం. ఇప్పుడు నా తల వ్రాత మాట ఏమిటి? పూటకు థికానా లేదు. ఉదరపోషణ కోసం, సంసారసాగరంలో తలమునకలౌతున్నాను. చదువుసంధ్యలు చాలించాక మా అఆవిద్ని పుట్టింటికి చేర్చడానికి తిరిగి విజయనగరంలో పాదం పెట్టాను. ఎక్కడ తలదాచుకోవడమో తెలీదు. మావూరు వెళ్లను. అత్తవారింటిలో ఉండను. బిడ్డకోసం, భార్యకోసం ఆ గడప తొక్కడం తప్పదు. దినభత్యానికి వేరే చోటు చూచుకోవాలి. అలా ఎన్నాళ్ళు గడపాలో! గాలి ఎటువీస్తుందో! త్రాడు లేని బొంగరం నా బ్రతుకు.

నా స్వంత అవసరాలుంటే తప్ప “జయభారత్‌”కోసం రాజమండ్రి రానవసరం లేదన్న అన్నపూర్ణయ్యగారి తంతితో నా ఆశల హరివిల్లు తునాతునకలయ్యింది. భవిష్యత్తు అంధకార బంధురం అయింది. అగమ్యగోచరంగా ఉంది. భావివదనంపై బడబానలం గోచరించింది. భవితవ్యం 'ప్రశ్చార్థకమయ్యింది! పాపం ఆ కన్నెపిల్ల మనసు దోచుకున్నాను. తొలి వసంతంలో ఎన్ని కలలుకందో! ఆమె జీవితానికి ప్రాతిపదిక (పేమ. అదే జీవితానుబంధం. నిండు హృదయంతో పూర్తి విశ్వాసంతో సంసారనౌక (ప్రేమతరంగాల మీద యథేచ్చగా, స్వేచ్చగా, సాఫీగా కొనసాగుతుందని ఆశించి ఉంటుంది. కాని ప్రథమపాదంలోనే జీవితం అతలాకుతలం అవుతోంది! సుడిగుండాల గండం ఎదురౌతోంది! చల్లని చక్కని సంసారం మీద కాలం నిప్పులు కురిపిస్తోంది! ప్రకృతికి కన్ను కుట్టిందా? కాలమే కాలనాగై బుసలు కొడుతోందా? పాలబుగ్గల పసిపాప

యీ అకాల కొరు చిచ్చుకు కమిలి, కుమిలి కృంగిపోవాలా? మా ఆశల ఆశయాల ప్రతిరూపం అన్నట్లు మా పాపాయి చల్లని చందమామలా నిండు జాబిల్లిలా! మాకళ్ల ముందు కదలాడుతోంది. 66 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్రు

పాలబుగ్గల పసిపాప పాలు తాగి ఉయ్యాలలో పవ్వశిస్తే - పండు వెన్నెల పళ్లెంలా ఉండేది. ఆ మొహం మమకారాల మూసలా కనిపించేది. వెన్నెలలు వెదజల్లే బోసినోటి నవ్వులతో, సుందర సుకుమార వదనారవిందం. కనువిందు చేసేది. ఆ ఆనంద సుధా బిందువుల సందడి యింకా చల్లారనే లేదు! యింతలోనే విషాదగీతికల నేపథ్యగానమా? మొదటి సంతానాన్ని చూసి మురిసిపోయి కాలాన్ని మరిచిపోయే రోజులు మరిరావా? బంగారానికి కూడా అగ్నిగందం ఉంటుంది. పుటం పెట్టకుండా, సుత్తి దెబ్బకొట్టకుందా స్వర్ణకారుడు బంగారం ముద్దను కంఠాభరణంగా మలచలేడు.

“అడవులు కొండలు ఎడారులా మనకు అడ్డంకుల్‌” అన్నాడు శ్రీశ్రీ. అధిగమించిన ఆటంకాలు చేరువవుతున్న గమ్యానికి చిహ్నాలు! అధిగమించిన విషవలయాలు తారసిల్లే లక్ష్యాలకు తార్కాణాలు! కాలం కలకాలం ఒక్కలా ఉండదు. ఆయువు ఉన్నంతకాలం, ఆరాట పోరాటాలు తప్పవు.

వస్తేరానీ! పోతేపోనీ

కష్టాల్‌ నష్టాల్‌

అనిష్టాల్‌! అరిష్టాల్‌!

శ్రీశ్రీ ఎంత ఇష్టంతో, కష్టంతో వ్రాసేడో! కాలం జాడల్లో అతనికలం చిందులు తొక్కింది.

ఒకనాడు ఆదర్శాల అంచులు చుంబిస్తాం. మరొకనాడు కైలాస శిఖరాలపై కదలాడుతాం. యింకోనాడు అభయం అజాడ్యం - వాక్చటుత్వం అస్త్ర శస్తాలుగా ముందుకు మున్ముందుకు ఉరకాలన్న గుండె చప్పుడు వింటాం. “అవని అంతా యిల్లయితే పిలుపేది? పలుకేది? వీథి వాకిలి ఏది?” అన్నాడు దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు. ఒకనాడు ఊహా పథంలో, భావావేశంలో, భువన భవనపు బావుటాగా ఎగురుతాం! వెలుగుతాం! గుండె గట్టి చేసుకుని పదేపదే కాలం పెట్టే కఠిన పరీక్షలకు నిలవడం ఎవరితరం! కారు చీకట్లు (క్రమ్ముకుంటున్నాయి! అంతా అంధకార బంధురం! చారీతెన్నూ దృగ్గోచరం కాదు! బతుకు బిడారీ! నీది ఒంటరి పయనం! ఇది ఎంత కాలం? జీవితంతో లడాయి! తల ఒగ్గక నెగ్గుకు రాగలవా? ఎలా?

| ౬ ఈ స్వేచ్చభరతం 67

ఉద్యోగపర్వం

పత్రికల్లో పడిన ప్రకటన చూసి ఉద్యోగ అన్వేషణ కోసం విశాఖపట్నం చేరాను. అక్కడ ఉన్న పార్టీ మిత్రులు, పెద్దలకు కాలమాన పరిస్థితులు వివరించాను. కిం కర్తవ్యం? అప్పటికే ఇద్దరు సహచరులు దాదాపు పార్టీ మీద ఆధారపడుతున్నారు. పాక్షికంగానో - పూర్తిగానో, అదనపు భారం పార్టీ భరించడం కష్టం. నిరాధారంగా ఉండలేను! ఏదైనా

ఆధారం దొరకాలి. ఆలంబన కావాలి. ఇంటర్వ్యూకి అందుకే వెళ్తాను అని చెప్పాను. ఇదివరకొకమారు మేం ముగ్గురం శాస్తి, తిలక్‌, నేనూ అయ్య కోనేరు గట్టున సాయంకాలంపొద్దున గంటల తరబడి చేసుకున్న చర్చల సరళి నా చెవిలో ఇంకా గింగురు మంటూనే ఉంది. సమసమాజ నిర్మాణం గురించి చర్చించుకున్నాం. కష్టనష్టాలు ఎన్ని ఎదుర్కొన్నా జీవిత గమ్యం గాని, తక్షణ కర్తవ్యం గాని, విస్మరించకూడదన్న నిశ్చయానికి వచ్చాం. ఒకరి ప్రాణంతో యింకో ప్రాణానికి లంకె, ఒకరి జీవితం మరొకరి జీవితంతో ముడిపడి ఉంది. మునిగినా తేలినా? అందరిదీ ఒకటే దారి! ఒకరినుండి విడివడి వేరుపడి మరి ఒకరితో ఆలోచన పెంచుకోలేం, వేరేదారి వెతుక్కోలేం, నాటి అన్యోన్యత అలాంటిది! ఇప్పుడు ఎవరికి వారే - యమునాతీరే కట్టకడపటినరకు యీ నిర్ణయానికి జీవన

పోరాటంలో హతాశులేం చెయ్యాలి? వేరే దారి లేదు!

ఇంటర్వ్యూకి వెళ్ళాను. సెలెక్టు అయి ఆర్డర్లు అందుకున్నాం. అది 15.0. ఉద్యోగం. హరిపురంలో వేశారు. మందస ప్రక్కన సోంపేట తాలుకా. గౌతు లచ్చన్న గారి ఊరు బారువా సమీపంలోనే ఉంది. అంత దూరం సకుటుంబంగా ఎలా వెళ్ళడం? పేరు ఖరాబు కాకుండా ఆ పదవి నుండి ఎలా బయటపడాలి? చేతిలో చిల్లుగవ్వ లేదు. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు, వారసత్వ సంపదలు తృణం పణం కూడా నేను ముట్టుకోను. ఉన్నాయి అక్కడ యిల్లు వాకిల్లు. ఎవ్వరనుభవిస్తున్నారో తెలీదు. అయినా ఆ ద్వారం ఏనాడో మూతపడింది. యీ పదవుల వేటలో పడి పరువు ప్రతిష్టలు పోగొట్టుకొంటామా? ఆశయాలకు తిలోదకాలిస్తామా? మాకు చేదోడు వాదోడుగా కలిసి మెలసి తిరిగిన మిత్రులెవ్వరూ ముందుకు రాలేదు. బహుశా వాళ్ల పాట్లు వాళ్లు పడుతున్నారు. తన చిన్నతనంలో కలిసి చదువుకున్న సుశీల అనే అమ్మాయి పలకరించడానికి వచ్చింది. 68. భాట్టం శ్రీరామమూర్తి ట్వీయ చరిత్ర

ఆమె ముందు మా అవిడ భళ్లున కన్నీళ్లు కార్చిందిట. తన చేతి బంగారం గాజులు తాకట్టు పెట్టి ముప్పది రూపాయలు తెచ్చి యిచ్చింది మా ఆవిడకు. ఆ సొమ్ముతో హరిపురం బయలుదేరాము. అటు ప్రక్క దాక్టరుగారు - ఇటు (ప్రక్క స్కూలు హెడ్యాష్టరు గారు మధ్యన మా గడప ఉంది. యీ మూడిల్లు ఒక వాసగా ఉన్నాయి. ముద్దులొలికిస్తూ బుడిబుడి నడకలతో బోసినవ్వులతో చెంతకు చేరిన మా చిన్నారి జాబిల్లి అందరికీ చేరువయింది. అంతా చెంతకు చేర్చుకున్నారు. ఆట, పాట, మాటలతో కులాసాగా కాలక్షేపం అయిపోయేది. అంతా స్వార్దితం, సేచ్చగా స్వచ్చందంగా - సంతోషంగా - రోజులు దొర్లిపోతున్నాయి. ఈ ఆనందం ఎంతకాలం ఉంటుంది?

(25.0.) ఫిర్కా సష్టయి ఆఫీసరు అంటే ధాన్యం ్రొక్యూర్‌మెంటు చెయ్యాలి. పంచదార, బియ్యం వగైరా. రేషను డిపోలకి అలాట్‌మెంటు చెయ్యాలి. టూర్లు ఉంటాయి. ఫిర్మాలోనే కాదు. తాలుకా కేంద్రానికి కూడా పని పడ్డప్పుడు వెళ్లిరావాలి. అన్నీ కలిపి రు.99 రూపాయలు అనుకుంటాను. ప్రతి నెలా ముట్టేది. ప్రాక్యూర్‌మెంటు అంటే జబర్దస్తీ జులుం. పాతర్షోని ధాన్యం తీయించి కొలగారానికి యిస్తే గవర్నమెంటు రేటు రైతుకు ముడుతుంది. అంతా లాక్కుంటే తమ కడుపుకు జరగదని రైతు కంటతడి పెట్టేవాడు. యిదీ సాధారణంగా జరిగే ప్రొక్యూర్‌మెంటు తంతు. నేనలాంటి పని చెయ్యను. చెయ్యలేను. ప్రొక్యూర్‌మెంటు ఆవశ్యకత ఎందుకు వచ్చిందో చెప్తాను. గ్రామపెద్దలు, రైతులు మధ్య కూర్చుని వారే తయారు చేసిన లిస్టుప్రకారం ప్రొక్యూర్‌మెంటు జరపడం ఆనవాయితీ.

. టార్గెట్‌ అందుకోకపోతే! కొంపలంటుకుంటాయి. ఉద్యోగం ఊడిపోతుంది. అది తర్వాత సంగతి. ఆ ప్రమాదం నాకూ ఉంది అని తెలుసు. నా విధానం మాత్రం జనం అందరికీ ఆనందంగా, ఆమోదయోగ్యంగా ఉండేది. దోపిడీ లేదు! జబర్దస్తీ లేదు! బలవంతపు 'బ్రాహ్మణత్వంలేదు! బ్రహ్మాండం బ్రద్దలు జేయడం లేదు! నాకు రహస్యరాబడి లేదు! లంచాలు కుంచాలు లేవు! సర్వం సుభిక్షంగా ఉండేది. రేషను డిపోలకు చేసే ఎలాటుమెంటు మీద ఆధారపడి 25.0. రాబడి ఉంటుంది. నేను చెయ్యి చాపడం ఉండదు. ఎవరూ నా చెయ్యి తడపడం ఉండదు. కాయగూరలు సహితం యింటికి ఎవ్వరూ తేగూడదు. యిలా అంతా సజావుగా సాగిపోతూ ఉంటే, హఠాత్తుగా ఒక పిడుగు పడింది.

జిల్లానుండి డివిజను వరకు. ఉన్నత్రాధికారుల తనిఖీలకు - రాకపోకలు ఉంటాయి. వాళ్ళకి సకల సదుపాయాలు జరగాలి. తడిసి మోపుడు ఖర్చు. యిది ఎవరు భరించాలి? 75.0. లు చెల్లించుకోవాలి. అది సాఫీగా గోప్యంగా జరిగిపోయే రివాజు. యీమారు నా వాటా 150 రూపాయలు చెల్లించమన్నారు. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టయింది. ఇంతసొమ్ము ఎక్కడినుండి తేవాలి? అసలు యీ ఉద్యోగం ఎవరికోసం స్వేచ్భాభారతం 69

చేస్తున్నట్టు? ఎవరి నెత్తో కొట్టి దోసుళ్ళనిండా డబ్బు దోచుకున్న వాళ్ళకి కష్టం అనిపించదు. యీ విధానం వలన అక్రమ ధనార్దనకు నిత్యం తలుపు తెజచుకొనే ఉంటుంది. యిది రహదారి దోపిడి! లంచగొండితనం! ఇది వాడుక అయింది! వేడుక అయింది! దీనికి మామూళ్ళనీ ముద్దుపేరు పుట్టింది. నిజాయితీగా ఎందుకు (బ్రతకలేనో చూద్దాం అనుకున్నాను! [౭26 '3జ1లు 15.0. యీ కలక్సన్లకు సంధానకర్త. యీ దబ్బు చెల్లించడం నా వల్ల కాదని తెగేసి చెప్పాను. యీ వార్త విన్నాక ₹.5.0. అగ్జిమీద గుగ్గిలం అయ్యాడు. “ఖద్దరు కడతాడుట! ఉపన్యాసాలు దంచుతాడు! పైసా విదల్బదు!” అంటూ చెర్రు బుస్సులాడి డిపోలకు ఎలాటుమెంటు పుస్తకాలను నానుండి కట్టగట్టి తీసుకోమన్నాడు. ఇలామాసాలు గడిచినా నేను వాటిని అడగను. ఎలాటుమెంటు చేసేటప్పుడే కదా డబ్బులు ఒడుకుతారు! యీ బాధ్యత తప్పించినందున పీడ విరగడయ్యిందనుకున్నాను. నాకు సంబంధించినంత వరకూ “అది డబ్బుకాదు - నిప్పు. ముట్టుకుంటే అంటు కుంటుంది!” భవిష్యత్తు తగలడుతుంది! యీ దురలవాటు వల్ల దేశ భవితవ్యం మాడి మసి అవుతుంది. ఆశయాలు తరగని సంపద. చెరగని మచ్చ ఎవరికో అచ్చివచ్చి ఉండవచ్చు. దోపిడీ దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు యీ ఉద్యోగులు బరితెగించి గ్రామాలు కొల్లగొట్టి పొట్టలు, పెట్టెలు, పాకెట్లు నింపుకోవడం ఘోరం. దీనిని నేను ఎలా ఎదిరించగలను? ఎలా రూపుమాపగలను? నా (బ్రతుకెంత? ఏ గోడవలోనూ తల దూర్చను. సూటి బాటలో వెళ్తాను, నీతి మార్గంలోనే నడుస్తాను. తన పొట్టకోసం పరుల పొట్టలు కొట్టడమేంటి? దేశం భ్రష్పుపట్టించడమేమిటి? ఇది అంతా విషవలయం అయింది! పరుల సొత్తుతో కులకే కాలాంతకులు, దేవాంతకులు ఎందరో! పరుల సిరి మరిగిన మనిషిని, నెహ్రూజీ మాటల్లో “విద్యుత్‌ స్తంభానికి వేలగట్టి ఉరితీయాలి!” ఏమిటో యివన్నీ చాదస్తపు మాటలు! అమలు జరుగుతాయా ఎక్కడైనా? చాదస్తం మొగుడు చెబితే వినడు. గిల్లితే ఏడుస్తాడు! అని ఒక సామెత ఉంది. కతుక మెతుకులేని ఖాళీ పొట్టలు కొట్టే కరష్పన్‌ అంతం చేయాలి. అంటూ ఎలుగెత్తి చాటాం విద్యార్థి దశలో, విశ్చంఖలంగా విహరిస్తూ, విష్లవగీతాలు పాడుతూ, గుండెర్సుల్లుమన్నట్లు గర్జనలు చేస్తూ. ఇప్పుడిది జీవితం నాటకం కాదు. జీవన పోరాటం” రోజులు గడవాలి, రాబడిని మించిన ఖర్చులు మాకు లేవు. పొదుపు అదుపు తొలి పొద్దుల నుంచీ తెలిసిన వాళ్ళం. కోరికలు తక్కువ, (ప్రేరణ ఎక్కువ. నా సతీమణి నాకన్న ఒక ఆకు ఎక్కువే చదివింది. నా వ్యవహారంలో ఎన్నడూ తలదూర్చదు. ఇచ్చి పుచ్చుకొనే తతంగం మా గడపలో కొనసాగదు. 1 4 ఈ 70 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్ర)

సోంపేట 1.5.0 ఉపదేశ సారం

శ టూరు

ఇంతలోనే 1.0 టూరు వచ్చిపడింది. ఆనాడు నా చదువుకు చిచ్చుపెట్టిన టూరు నేడు నా ఉద్యోగానికి ఎసరు పెడుతుందని అనుకున్నాం నేనూ నా భార్య, అయినా సరే శాస్త్రి చెప్పాడు 3. వంటి జాతీయ నేతకు ముకుళిత హస్తాలతో స్వాగతం పలకడం మన ధర్మం. ఇంతటి ఉద్యోగం ఊడిపోతుందన్న భీతితో సోషలిస్టు జీవితానికి తెరదింపకూడదని అనుకున్నాం.

పర్హాకిమిడి నుండి బరంపురం కార్లో రోడ్డుమీద వస్తున్న సోషలిస్టునేతకు హరిపురంలో హార్దిక స్వాగతం అందించాలని చెప్పాడు శాస్త్రి. సభా (ప్రాంగణం జనసందోహంతో కళకళ లాడింది. స్థానిక మిత్రులు యథాశక్తిని 3.?కి పదివేలు పర్సు ప్రజెంటు చేశారు.

1౬.5 శాస్తి నాయకత్వాన జరిగిన బహిరంగ సభ అది. నా ఉద్యోగ ధర్మం పాటించి నా పేరు బయటకు రాకుండానే కార్యక్రమం దిగ్విజయం చేసారు. పొరుగున గౌతు లచ్చన్న గ్రామం బారువా ఉంది. ప్రక్మనే సోషలిస్టు పతాకం ఎగిరితే అతడు ఊరుకుంటాడా? జిల్లా కలెక్టరుకు ఉత్తరం (వ్రాశాడు నామీద పిర్యాదు చేస్తూ. తర్వాత ఆచార్య 1.6 రంగా చేత ఉత్తరం వ్రాయించాడు. ఆయన రాజ్యాంగ సభ సభ్యుడు. 20.6 అధ్యక్షుడు కూడా. లచ్చన్న కోటకు నిప్పంటుకుంటే ఎవరూరుకుంటారు? ఇంత ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకొని ఒక చిరు ఉద్యోగి దుస్సాహసం సహించడమా? మళ్లీ మరో ఉత్తరం రాయించాడు.

నన్ను కదపమని, దానిమీద శ్రీకాకుళం సబ్‌ కలక్టరు (114 వైట్‌ విచారణకు వచ్చాడు '౫/16/6 1॥ 5006121 [5.0 అనుకుంటూ. నాకు వ్యతిరేకంగా చెప్పడానికి ఎవ్వరూ అంగీకరించరు. లచ్చన్న ప్రియశిష్యుడు భిన్నల లక్ష్మీనారాయణ కూడా సమ్మతించలేడు. ఇన్నాళ్ళకి కానీకి కక్కుర్తిపడని 1.5.0. ఒక్కరిని చూశాం. యిది ప్రజల అదృష్టం. అతణ్ణి సాగనంపడం ఘోరం! సాక్ష్యాలు చెప్పడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. స్వేచ్భాభారతం నాల

అయినా వేటు పడింది. బదిలీ పనిష్మెంటు కాదుట! యిప్పుడు చూడండి ప్రజల తథాకా! జనాల్లో కలకలం చెలరేగింది. వందలాదిమంది మందస రైల్వే స్టేషను చుట్టుముట్టారు. మేము విశాఖపట్నం వెళ్ళవలసిన రైలు అరగంట ఆపేసారు. ఎటుచూసినా జనం, దండాలు, దండలు! నేను నా సతీమణి రైలెక్కేసాం. జగన్నాటకం యిలాగే నడుస్తూ ఉంది! నేను వైజాగ్‌ కలక్టరు కచ్చేరీలో (0.5.0 ఆఫీసులో ) గుమస్తాగా చేరాను. (౧3) పంచదార బస్తాలు ఎలాట్‌మెంటు జరిగే సీటు. విశాఖలో నివాసం నేనెక్కడికి వెళ్ళినా ఇళ్ళ సమస్య ఎదురవుతూ ఉంది. శూద్రునికి ఇల్లు ఇవ్వం అంటారు కొందరు. నేను బ్రాహ్మణి అని చెప్పుకోవాలా? శూద్ర వీథిలో బ్రాహ్మడికి ఇల్లు ఇవ్వరు? శుచి శుభతకు, పూజాపురస్మరాలకు లోపం వస్తుందిట. మాకు పాపం తగులుతుంది ఇల్లు యివ్వమంటారు. మాసం పిల్లడు మా అబ్బాయి. మాకలలకు సాకారం, మా ఆశల ప్రతిరూపం, పండులా ఉండేవాడు, గుమ్మడి పండులా ఉన్నాదనేవారు కొందరు. నా గుండెలనంటి పెట్టుకొని వదిలి పెట్టకుండా ఉండేవాడు. మా తండ్రే అవతరించేదని అనుకొనేవాడిని. ఆ ధీరగంఖీరమ్రైన చూపులు అలాగే ఉండేవి. వాడు కారణజన్ముడు. వాడి చూస్తే కడుపు నిండిపోయేది. విశాఖలో బీచ్‌ ఒడ్డున పాత మినర్వా సినిమాహాలు సమీపంలో ఒక వకీలు ఇల్లు ఉండేది. పెద్దయిల్లు. బాగుంది. అందు ఒక భాగంలో ఒక మేష్టారు నివాసం. రెండో చెంపన మాకిచ్చారు. ఎలాగు మాకు మాంసాహారం నిషిద్ధమే. పూర్తి శాకాహారులం. మా ఆవిడను చూస్తే 1.3 అని ఎవ్వరూ అనుకోరు. కాబట్టి పంతుళ్ల పొరుగున విశాఖలో కాపురం పెట్టి చూస్తూ చూస్తూ రోడ్డుమీద మైళ్ళదూరం నడవడం కష్టమే, కలక్టరాఫీసుకి వెళ్లి రావాలి. కష్టాల్ని ఇష్టాలుగా మార్చుకోవాలి మరి. అసలే పట్టణవాసం, ధరవరలు మండి పోతున్నాయి. రేషను రోజులు. చాలీ చాలని జీతం. అద్దెపోను మేమిద్దరం, మాకిద్దరు పిల్లలు. పెద్దపిల్ల కరుణ గురించి ముందు చెప్పుకున్నాం. అబ్బాయి విద్యాసాగరు. అబ్బాయి కావాలని కోరిక మాకూ ఉంది. కడుపులో పడ్డాడు పిడికెడంత పిల్లడు. పెద్ద బుర్ర. పాల భాగం మీద మెజుపు గీత ఉందేది. నెల తిరక్క ముందే బారెడయ్యాడు. రెండు చేతుల నిండా వచ్చేవాడు. సంబర పడిపోయేవారం. 72 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్ర)

సోంపేట 5.0 ఉపదేశ సారం

ఇంటికి రాగానే ఇద్దరూ చెరో చంకా ఎక్కేసేవారు. సాయంకాలం వీళ్ళని ఎత్తుకొని వెళ్ళి బీచ్‌లో ఆడించేవాడ్ని. ఒకరోజు [626 '4గ౭౦౫ £5.0 పనిమీద జిల్లా ఆఫీసుకి వచ్చాడు. బీచ్‌లో పిల్లలతో నా అవస్థ చూశాడు. “ఆనాడునీతులు వల్లించావు. యిప్పుడు మూతులు కట్టుకోవాలి, నీతులు కడుపు నింపవు, పట్టెడు మెతుకులు పెట్టవు. నీపాటి నీతులు మాకు తెలియవనుకోవద్దు. రాబోయే రోజుకోసం ముందు జాగ్రత్త చర్యగా ముడుపులు పుచ్చుకుంటున్నాం తప్ప - యిది తప్పని తెలియకనా? మేము చేసింది తప్పు! తప్పు! అనేవాడివి! యిష్పుడెన్ని తిప్పలు పడుతున్నావో చూడు! ఆనాడు బుద్ధి గడ్డితిన్నా, నేటికైనా జ్ఞానోదయమైతే నీ పిల్లలకింత కూడు దొరుకుతుంది రెండుచేతులు తోటి సంపాదించు! కొంత వెనకేసుకో! రాబోయే రోజులు ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలీదు! ఇక్కడ ఎంతకాలం ఉన్నా ఒక్క బంట్రోతయినా నీకు సలాం కొట్టాడా? నేను ఒక వంద రూపాయిలనోటు వాడి మొహాన కొడుతాను. వాడే నాఫైలు నడిపేస్తాడు. లోకం పోకడ తెలుసుకో! బళుకు తెరువు తెలుసుకో! జాగ్రత్త పడు! యిప్పుడు నీ సీటు కూడా సిరులొలికించేదే. మరేం ఫర్వాలేదు” అని నీతి సూత్రము, అర్ధశాస్తమర్శాలు అనేకం వాలక బోసేదు. నా బుర్రలో గుమ్మరించాడు. రోడ్డుమీద నిల్చిన కార్లో రయ్యన వెళ్ళిపోయాడు.

ఒకమారు సోంపేట ఎఫ్‌ఎస్‌ఒ మీద కంప్లయింటు వెళ్ళింది. ఎంక్వయిరీ అఫీసరు దిగాడు. అతడ్ని బరంపురం తీసుకుపోయాడు. ఫారిన్‌ కూడా దొరుకుతుంది. కంట్రీ సరుకు కాదు. ఫారిన్‌ సరుకు! ఇష్టమొచ్చినంత విస్కీ బ్రాందీ, రమ్ము తెల్లవార్లూ తప్పతాగి ఫైలుమీద నో ప్రూఫ్‌ అని రాసాడు. “బుజువు దొరక్కపోతే శిక్షించడానికి న్యాయశాస్త్రం వొప్పదు. వందమంది తప్పుచేసినవాళ్లు తప్పించుకున్నా ఫర్వాలేదు తప్పులు చేయని వార్ని ఒక్కడి ఒక్కడంటే ఒక్కడ్ని, శిక్షించకూడదు. తెల్లదొరల న్యాయశాస్త్రం వొప్పదు. నాటికి నేటికీ యీ సూత్రం సుస్థిరంగా నిల్చి ధర్మ పరిరక్షణ చేస్తోంది పుస్తకాలు కాదు ప్రపంచాన్ని చదవ”మని! ఉచిత సలహా యిచ్చాడు.

“ఏమాటకామాటే చెప్పుకోవాలి! ఆ తెల్లవాడికే చెల్లిందయ్యా! పరిపాలన ఎలా చెయ్యడమో! ఎందుకూ? మనకీ ఉన్నారు బభ్రాజి మానాలు! అలాంటి చట్టం ఒక్కటి చెయ్యగలరా? “నా కొద్దీ తెల్ల దొరతనం” అంటూ గెంతుతూ వాళ్ళ గొంతుకలు కోశారు “బోడిరాజ్యం తగలడింది” అని నా బుర్ర డొలిచేశాడు.

స 2౬ 4 స్వేచ్చాభారతం 73

హరిపురం డాక్టరు ఆగమనం

నాకు అందుకు బాధ అన్చించలేదు మా ఆవిడ ఒళ్ళంతా పొంగు రోగం - సూతిక జబ్బు. పురటాలు - ఆరోగ్యం యిలా దెబ్బతింటే ప్రాణానికి ముప్పు అంటారు. ముప్పో మోక్షమో పుస్తె కట్టాను! రాత్రి పగలూ రెండు చేతులతోనూ పనే. ఇంటికొస్తే పిల్లల గోల! ఎత్తుకు తిప్పాలి! ఇద్దరూ చెరో చంకా ఎక్కేస్తారు. పెద్దాసుపత్రి మొహం ఎప్పుడైనా చూశానా? తీరిక దొరికేదెప్పుడు? అక్కడికి వెళ్ళి మందిప్పించడంమంటే తమషాలా? రేపురా మాపురా అని త్రిప్పికొాడతారట! “జబ్బెలాగొచ్చిందో, అలాగే పోతుంది” అంటూ మా ఆవిడకు ధైర్యం చెప్పాను. “రోగం రావడం తేలిక పోవడం కష్టం అంటారు అంది సత్యవతి. మన విషయంలో అలా ఉండదమ్మ అన్నాను. ఏమిటి మన గొప్ప! జబ్బుకి

మనమీద కరుణెందుకు? చేతకానితనం - మాటకారి తనం! ఎవరిని నమ్మిస్తుంది! ఆమె నీటిలో తిరుగకూడదట. రెండో సహాయం లేదు మరేం చెయ్యాలి? “ఆశలు పెంచుకోకు అంటారు. బుర్రలో ఆశలు పెట్టుకోవడం తప్పే! మరి బ్రతుకు మీద మాత్రం ఆశ ఎందుకు?” అంటుంది మా ఇల్లాలు. “అన్నీ వస్తూ పోతూ ఉంటాయి శరీరం కూడా అంతే. దాని సంగతి పరమాత్ముడే చూసుకుంటాడు” అంటాన్నేను. “గాని మన తరవాత బిడ్డలకు దిక్కేంటి అండీ” అంటుంది ఆమె. బుర్ర బ్రద్దలు కొట్టుకోవడం తప్ప జవాబు ఎక్కడి నుండి వస్తుంది? “మనం ఉంటే పిల్లా జెల్లా. మరి వాళ్ళకేం రాసిపెట్టుందో!

ఏమైనా వాళ్ళ ఆలనాపాలనా చూడలేక పోతామా?” అన్నాన్నేను.

తలవని తలంపుగా హరిపురం డాక్టరు మాయింటికి వచ్చాడు. ఆయన దాక్టరేకదా! మా ఆవిడ ఆరోగ్యం గురించి చూడండి అని అన్నాను. అతడు చురాచురా చూశాడు “ఏం మనిషివయ్యా నువ్వు పుట్టెడు రోగంతో ఉన్న ఆడపిల్ల విలవిల్లాడి పోతూ ఉంటే

మందు మాకూ ఇప్పించాలని కూడా తెలీదా?” అంటూ ఎడాపెడా వాయించాడు. 74... భాట్టం శ్రీరామమూర్తి (్వీయ చరిత్ర

నేను అసహాయుడ్ని? నిస్సహాయుడ్ని! కొంత కాలం మౌనంలో గడిచిపోయింది. మా ఆవిడ ఆరోగ్య పరిస్థితి నా దుస్థితి అర్థ్ధమయ్యాయి ఆ డాక్టరుకు. “యీమె ఆరోగ్యం బాగుచేసి మీ యింటికి చేరుస్తాను. మా ఆవిడకు మీ పెద్దపిల్లంటే మాహా యిష్టం. వీడు అలాగే ఉన్నాడు ముద్దులాలుకుతూ - గుప్పెడు నవ్వు గుబాలిస్తూ. వాడిచే చకచకా పరుగులు పెట్టించి మీ యింటికి చేరుస్తాను” అన్నాడు ఆ ఆపద్బాంధవుడు. “దైవం మానుష రుపేణా” అన్నారు. డాక్టరు రూపంలో దైవం సాక్షాత్మరించాడు. అందరూ కలిసి హరిపురం వెళ్ళారు. ఘనకార్యం

ఈలోగా నేనొక ఘనకార్యం చేశాను. మా ప్రక్కనున్న మేష్టారు - చిన్న జీతమే మరి! ఎప్పుడూ కిలకిలా గలగలా నవ్వుతూ దర్చం ఒలకబోస్తూ జల్సాగా తిరిగేవాడు. బీచ్‌లో చిరుతిండ్లు తింటూ కన్పించేవాడు. ఆయనకీ తల్లీ, భార్య ఇద్దరు పిల్లలు. ఇంతమందితో రోజులు ఎలా గడుపుకొస్తున్నాడో! ఆ చిదంబర రహస్యం చెప్పమని కోరాను. ఆయన చాలా మంచివాడు. దాగుడుమూతలు లేవు. చేస్తానంటే చెప్తాను అంటాడు. “ట్యూషన్లు చెబితే భలే డబ్బు వస్తుంది. కాలక్షేపానికి లోటు ఉండదు. నేను ఒకరి దగ్గర చెయ్యిచాపను. నాదగ్గర వున్నవారికి విద్య నేర్పుతాను - వాళ్ళని బాగుచేసి నేను బాగుపడతాను” అన్నాడు. విద్యలో యింత గొప్ప మహత్తుందన్న మాట! మనిషిని బతికిస్తుందా? “చదువులలో మర్శ్మమెల్ల చదివితి తండ్రీ” అన్నాడు ఆనాడు ప్రహ్లాదుడు. ఈనాడు మా మాష్టారు బతుకు తెరువు మర్మం చెప్పాడు. ఆయనే అన్నాడు కావాలంటే మీకు ట్యూషన్సు చూపిస్తానని. షెహబాష్‌! నా మనస్సు ఆయనకి జోహార్లర్చించింది. డా॥ బెండపూడి పేర్రాజు గారి యింటి సమీపంలో యిల్లు. ఆ ఇంటి ముందు విశాలమైన ఆటస్థలం ఉంది. మా యింటికి చాలా దూరం. కలక్టరు కచ్చేరి నుండి కూడా దూరమేమరి. ఏదో దారి దొరక్క పోతుందా? దేవుడు దొడ్డవాడు. హరిపురం నుండి డాక్టరును ఎవరు రప్పించారు? మా ఆవిడ ఆరోగ్యం ఎలా బాగు పడింది? ఆ తరువాత చీకు చింత లేకుండా ఎలా బ్రతగ్గలిగాం?

ఈ ఈ 4౬

స్వేచ్భ్చాభారతం 75

రాజీనామా చెయ్‌! రోజులు మారుతాయి ఇది కూడా ఒక టబ్రతుకేనా? తెలకలివాడెద్దు గొనుగు చుట్టూ తిరుగుతూ ఉన్నట్టు నన్ను నేను తిరగేసి తొడుక్కుంటున్నాను. పిడ్రార్జిత విత్తంతో సతీ సుతులతో ఎందటెందరో దినదిన ప్రవర్ధమానమవుతున్నారు! ఆపదలోనైనా ఆ సంపద అందుకొని అనుభవించడం తప్పు ఎలా అవుతుంది. అది నాకు నిషేధం. ఏదో ఆశయాలు ఆదర్భాలతో జీవితంలో అడుగు పెట్టాం, ఇప్పుడెక్కడున్నాం? పాతాళం లోతుల్లో! ఆకాశం అంచులు అందుకుందాం అంటే ఎలా? తొలి అడుగులోనే తొట్రుబాటు! నోటపెట్టిన మొదటి ముద్దలోనే పురుగు పడింది! ఈత నేరిస్తే (భవ) సాగరంలో పడ్డా, ఏదో ఒడ్డుకు చేరుకుంటాం. రొట్టెకి రేవేంటి? ఏ తీరం నుండి బయలు దేరినా ఏదో ఒడ్డుకి చేరుతాం. సముద్రంలోకి వెళ్ళిన ఓడ జెండామీద వాలిన కాకి - ఎటు ప్రక్క ఎగురుతుంది? చుట్టూ సముద్రం ఉన్న ఉద్యోగాన్ని అంటిపెట్టుకొని ఉంటే తీరం చేరడం నా తరం కాదు. “త్యజించి భుజించు” అన్నాడు ఉపనిషత్‌ కారుడు. “సర్వం యత్భించ జగత్వాం జగత్‌ తేన తృక్తేన భుంజీథాః మాగ్భథం కస్వస్విద్ధనమ” “తేన త్యక్తేన భుంజీథా” త్యజించి భుజించు, సాహసం చెయ్యాలి చొరవవుందాలి. ఏమీ లేకుండా ముందుకు ఎలా వెళ్తావు? మతిని బట్టిగతి!” అన్నారు. మన మనబ్ళితిని బట్టి మన పురోగతి, గతం ఒక పీడ కల అనుకోవచ్చు. భావి ఒక సుందర స్వప్నం ఎందుకు కాకూడదు? ఒక అడుగు వెనక్కు వెయ్యి. నాలుగడుగులు ముందుకు ఛెంగున గెంతు. ఉద్యోగంలోకి ఎలా వెళ్ళానో అలా వచ్చేశాను బయటికి. రాజీనామా చెయ్యడం నా చేతిలో మాట! కలక్టరు కచేరి ఉద్యోగానికి గుడ్‌బై. బీచ్‌వద్ద ఉన్న పెద్ద యిల్లు అద్దె భారమయింది. కనకమహాలక్ష్మి గుడి ముందు చిన్న గుమ్మంతో ఒక పెద్దగది. చిన్న వంటగది. వరండా అద్దెకు వచ్చింది. తక్కువ అద్దెకు దొరికింది. పైగా డాబామీదకు మెట్లున్నాయి. పిల్లాజెల్లా లేని ముసలవ్వ యిల్లది. 76 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

సహజంగా మన పిల్లల్నావిడ చేరిక చేసుకుంటుంది. ఇంటిముందు అమ్మవారు! పైన అచ్చాదన ఏమీ లేదు! ఆనాటికి! విశాఖపుర ప్రజల యోగక్షేమాలు సంరక్షించేందుకు అవతరించిన తల్లి! గుమ్మం ముందు కొలువై ఉంది అభయ హస్తంతో! మాకు భయాలన్నీ పోయాయి. నిండా మునిగిన వాడ్కి చలేంటి? ఉన్నది వదులుకుంటే తప్ప లేనిదిరాదు. ఉన్న పదవికి తిలోదకాలిస్తే తప్ప, కొత్త రస్తా కనిపించదు! అప్పుడు కడుపులో పిల్లులు అరిస్తే ఏంచెయ్యాలి?

రోజుగడవడం ఎలా? పిల్లలకి పాలు పెరుగు తేవాలి! అన్నపానీయాలు కావాలి! ఏమీ లేనివాడికి ఎన్నో కావాలి! ఇది ఏకాలం? కలికాలం! కాదు ఆకలి కాలం! మీమాట దేవుడెరుగు “చిన్ని బొజ్జకు శ్రీరామరక్ష” ఉద్యోగానికి స్వస్తి పలికాను. కాలే కడుపుకు కాలయాపనా? జానెడు పొట్టకయినా బోలెడు ప్రయాస!

ఉద్యోగం వదిలేస్తే కొండంత భారం తొలగినట్టయింది. భూభారం భరించే ఆదిశేషుడు భుజం మార్చుకున్నట్టు! ఇక్కడ సంకల్ప వికల్పాలు అంటూ ఏవీ లేవు! కాలం కాలకూట విషం అందించినా అమృతప్రాయంగా అందుకోవాలి. శూన్యంలోనికి ప్రయాణం! సమస్యల వలయం నుండి ప్రళయం లోనికి పయనం. ప్రళయం లేదూ, విలయం లేదు విజయం మనదే అన్న నమ్మకం నిండుగా ఉండేది! ఊబి నేల మీద నిలబడ్డాం! దిగబడితే కనపడం. కాలానికి కనికరం లేదు! ఏమిటీ సాహసం? ఏమి చూసి యీధైర్యం?

ఉన్న పదవికి నీళ్ళొదిలాను. భావి పిలుపు జీవితానికి మలుపు! యీ ధీమా ఎలా వచ్చింది? యింట్లో బియ్యం నిండుకున్నాయి పిల్లలకు పాలడబ్బాల కొరత ఏర్పడింది పాతబిందె, చెంబు అమ్మితే ఎంతొస్తుంది? అంతా హళ్ళీకి హళ్లీ - సున్నాకు సున్నా

ఒకరోజు పొడి మెతుకులు మజ్జిగ తేట వేసుకొని తిన్నాం. అదేమాకు పంచభక్ష్య పరమాన్నం. పుట్టించిన వాడు ఏది పెడితే అదే తిన్నాం. ఒకరి కడుపు కొట్టి పిడికెడు మెతుకులు ముట్టలేదు. బాల్యమిత్రుడి బెదార్యం

బయట బజారులో ఎక్కడో బాల్యమిత్రుడు గడియారపు సత్యనారాయణ నన్ను చూసి యిల్లు ఆచూకి తెలుసుకొని తలుపుతట్టాడు. మా ఆవిడ ఒక్కర్తే ఉంది. మర్యాదకు మంచి నీళ్లందించి తలదించుకుంది. ఇల్లు యిల్తాలిని చూసి అతనికి గుండె చెరువయ్యింది. అలనాటి ఆప్తమిత్రుడు గౌరునాయుడికి యీ వార్త చెప్పి కన్నీళ్ళు కార్భాడట గడియారపు సత్యం. వెంటనే గౌరు నాయుడు బస్సులో బస్తా బియ్యం వేసుకొని మా యింటికి వచ్చాడు. స్వేచ్భాభారతం 777

వంద రూపాయలున్న కవరూ మా ఆవిడ చేతికి యిచ్చాడు. మాటామంతీ లేకుండా వెను దిరిగాడు. దైవఘటన కాకుంటే ఇదేంటి? ఎంతతిన్నా తరగనిభత్యం! దైవం దయామయుడు! ఇంటిముందు కల్లాపి జల్లింది మామ్మగారు. ముగ్గుపెట్టడానికి బయటకు వచ్చింది మా ఆవిడ. ఆవీథిన వెడుతున్న రేణుక పలకరించింది. రేణుక మాఆవిడ క్లాసుమేటే. చిన్ననాటి స్నేహితురాలు. ఉభయ కుశలానంతరం ఆమె చెప్పింది టెలిఫోన్‌ ఆపరేటరుగా పనిచేస్తున్నానని. ఆ ఉద్యోగం ఎలా వస్తుందని అడిగింది మా ఆవిడ. కలక్టరు కచ్చేరీ సమీపంలో ఉన్న ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సేంజీలో పేరు రిజిప్టేషను చేసుకోవాలి. అప్పుడు టెలిఫోను ఆపరేటరు ఉద్యోగం కావాలని చెప్పాలి. ఉద్యోగం ఖాయం. మేం అంతే చేశాం అంది. ఇల్లాలే ఇంటికి పెద్ద - భారం స్వీకరించిన భార్య అప్పటికి ఆడపిల్లలు ఎక్కువగా ఆ ఉద్యోగానికి రావడం లేదుట! వారం తిరగకముందే మా ఆవిడకు కాల్‌ లెటరు వచ్చింది. ఉద్యోగానికి ఉత్తరువు యిస్తూ వైజాగ్‌లో 2వారాల ట్రయినింగు అన్నారు. విజయనగరంలో "05108 వచ్చింది. రెండుమాసాల అనంతరం రి(ఫఫెషర్‌ కోర్సుకి మద్రాసు వెళ్ళాలి. (బ్రతుకు జీవుడా! అనుకున్నాం. మా ఆవిడ ఎంతో సంబర పడిపోయింది. తన భర్త రాజకీయాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు యిక! తన ఆశలు ఆశయాలు నెరవేర్చుకోవచ్చు! తన జీవితం ధన్యమయిందన్నంత ఆనందం కలిగిందామెకు, పిల్లల పెంపకానికి ఎప్పుడు బెంగలేదు. వాళ్ళ మొహం మీద వ్రాసి పెట్టింది సిర! వాళ్ళే మా సంపద! ఉద్యోగం - ఉదరపోషణ పిల్లల పెంపకం ఆమె పని! ఊళ్లేలడం ఊరేగడం! రాజకీయాల్లో జోరందుకోవడం నాపని. ఆమె కోసం నేనేమి చేశానో తెలీదు. నాకోసం తన జీవితాంతం ఊడిగం చేయడానికి సిద్ధపడింది. “నాది స్వార్థం, మీది పరార్థం” అనేది! ఇల్లు వాకిలీ చూచుకోవడం ఆమె బాధ్యత. ఊళ్లో చాకిరీ రాజకీయ వాదోపవాదాలు

  • ప్రజాసేవ నాపని. ఇప్పుడు దారి కనబడింది! స్థిరపడింది. సంసార భారం ఆమె నెత్తిన ఎత్తుకుంది. నేను కలలు కన్న ఆర్థిక సామాజిక పునర్నిర్మాణం, రాజకీయ వ్యాసంగం యిది నాపని! ఈ నిర్ణయానికి మరి తిరుగులేదు. తిరగదోడ్డం లేదు. ఎవరి కక్ష్యలో వారు పరిభ్రమిస్తున్నాం. బిడ్డల భవితవ్యంపై ఉభయులదీ బాధ్యత. ఉమ్మడి ఖాతాలోనే ఉంది. తెలతెల్లవారగానే ఇంటిపని వంటపని పూర్తిచేసుకొని పిల్లల స్నానపానాదులు చూచుకొని బట్టలు తొడిగి “బంగారంలా ఉండండి. అల్లరి పెట్టకండి నాన్న మాట వినండి” అని బుద్ధి చెప్పి బయట అడుగుపెట్టేది. 78 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్ర)

బాలకాండ

బాల్యంలో బాధలు చెప్పతరం కాదు. ఇద్దరు పిల్లలూ వాదులాడుకుంటే, పోరాటం పెట్టుకుంటే, ఏం చెయ్యాలి? మిట్ట మధ్యాహ్నం అమ్మకావాలని ఏడుపు లంకించుకుంటే ఏం చెయ్యాలి? అడ్డాల్లో బిడ్డకి పాలు పోయడం తమాషా కాదు! పడిశం పడుతుంది! వాంతి అవుతుంది. విరేచనం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తండ్రి తల్లిగా మారాలి, ఓపిక, సహనం ఉండాలి. సంపాదనంతా ఆమెదే. గృహపరికరాలు తదితర వసతుల పర్యవేక్షణ ఆమెదే. పైగా భర్త వేళ పట్టుకు యింటికి చేరకపోతే, తిండీ తిప్పలు కోసం ఎదురు చూపులు ఆందోళన అంతా ఆమెదే.

పరుల సేవ పరమాత్ముని సేవ అంటారు. సృష్టి కార్యం తర్వాత పరమాత్ముడికి మాత్రం ఏం పనుంది? ఆలనా, పాలనా చూసుకోవడమే కదా రక్షించి, సంరక్షించడమే కదా! శ్రీరామరక్ష! సర్వజగద్రక్షా! అంటారు. పోషణ బాధ్యత భగవంతుని పోర్టుఫోలియోలో నిహితమై ఉంది.

ఒకమారు శివాజీ మహరాజ్‌ కట్టిస్తున్న బ్రహ్మాండమైన కోటగోడల చుట్టూ చీమల బారుల్లా కూలీలు పనిచేస్తున్నారు. ఎంత జన బాహుళ్యానికి అన్నోదకాలు కల్పిస్తున్నానో తమరే చూడండని గురువు సమర్ధ రామదాసుకు శివాజీ నమ్రంగా విన్నవించాడుట.

ఆమాట విన్నాక పక్కన పడిఉన్న బండను పగలగొట్టమని గురువాజ్ఞ అయింది. తీరాకొడితే రాతి మధ్యనుంచి కప్ప బయటపడింది. నాతి కడుపులో బిడ్డకు - రాతి మధ్య కప్పకు కూడు గూడు ఎవడు పెట్టాడో, వాడే నాకు నీకు ప్రజానీకానికీ కూడా తిండి గుడ్డ పెడతాడు అన్నాడు సద్గురు సమర్థ రామదాసు.

దైవకృపవల్ల బిడ్డపాప చల్లగా ఉన్నారు. కూడూ గూడూ దొరికాయి. మా యిల్లు అంటే అద్దె యిల్లన్నమాట! మాయింట్లో నేను నా భార్య ఇద్దరమే సభ్యులం. పిల్లలిద్దరుగాని నేనెప్పుడు 2+1 అనుకునేవాడ్ని. కనిపించని ఆపక్కవాడు పరమేశ్వరుడు, నీవెన్నడూ ఒంటరివాడివి కావు. నీకు తోడు నీడగా దైవం ఉన్నాడు. యీ సృష్టిలో ఎవ్వరూ నిరాధారులు కారు. అందరికీ ఆధారం ఆ నిరాకారుడే. నిరంతరం నీఇంటి వెంట, జంట, ఉంటాడు. సీకు ఎవ్వడూ కీడు తలపెట్టలేడు! హానిచేసే వాడికి రెండు చేతులైతే రక్షించేవాడికి వెయ్యి చేతులు! భయాందోళనలకి స్వస్తివెప్పి సాఫీగా సజావుగా జీవిత యాత్ర కొనసాగిస్తూ ఉంటే ఏం జరిగిందో చూడండి.

ఉల ఈ ఈ

స్వేచ్చభరతం 79

మాది విశ్వకుటుంబం

ఆశలు, ఆశయాలు అన్నం పెడతాయా అంటారు. ధనం లేకుండా జనం ఎక్కడొస్తారంటారు. మాకు అన్నమూ పుట్టింది, అమృతమూ పుట్టింది. ప్రజాదరణా ఉంది. జనాకర్షణా ఉంది! 14.1" సుబ్బారెడ్డి మా సోషలిస్టు మిత్రుడు. రాయలసీమ నుండి ఇద్దరు విద్యార్థుల్ని పంపించాడు. విజయనగరంలో ఉన్నత విద్యాభ్యాసానికి. భోజన వసతులు ఏర్పాటు చేయమని ఉత్తరం వ్రాసాడు. అప్పటికి నామాటకి చెలామణి ఉందేది. థ్రీ బోర్జింగు హౌసులో ఇద్దరికీ సీట్లు దొరికాయి. అది సింహాచలం దేవస్థానం వారిది. స్వయాన వచ్చినవారికీ, సిఫార్సుతో వచ్చినవారికీ, ఒక అరడజనుమంది వరకూ సదుపాయం జరిగింది. మాయింటి వెనుక భాగాన మూడు గదులు ఖాళీగా ఉన్నాయి వచ్చిన వారందరూ అందులో ఉండేవారు. వాళ్ళంతా మా కుటుంబ సభ్యులయ్యారు. గుంటూరు నుంచి ఒకరొస్తే నంద్యాలనుంచి నలుగురొస్తే, ఇంకెక్కడి నుంచో మరో యిద్దరు ఊడిపడ్డారు. సంస్కృత కళాశాల నుండి కాలేజీ చదువుల వజకూ ఎవ్వరిది ఏకులమో తెలీదు! వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అసలు తెలీవు. అన్ని అవసరాలకీ మేమే తల్లెనా తందైనా. మా పిల్లలతో పాటు “అమ్మా! నాన్న!” అని మా యిద్దరినీ పిల్చేవారు. ఎంత ఆప్యాయం! ఎంత అనురాగం! ఎంతమంచి అనుబంధం! ఒకరి కష్టసుఖాలు యింకొకరు పంచుకొంటూ, అన్యోన్య (ప్రేమానురాగాలతో, ఉమ్మడి కుటుంబంలా జీవించే వాళ్ళం. మాకు కులం కన్నా గుణం మిన్న అణాలు కన్నా ఆదర్శాలు మిన్న మాదగ్గర కులం చెల్లని చెక్కు నిర్భాగ్యులు, నిర్ధనులు ఎవ్వరూ లేరు మా దృష్టిలో, ఆశయాల జొన్యత్యం బట్టే మనిషి అంతస్తు తెలుస్తుంది! ఉత్తమ భావాలున్న వారందరూ ఉన్నత కుటుంబీకులే. సంస్కారం ఉన్న దంపతులందరూ సన్నిపితులే. ఉపకారి తప్ప అపకారులెవరూ లేరు మాకు. అందరికీ ప్రీతి పాత్రంగా బతుకు బండి నడుస్తోంది. మా యిల్లు అందరి యిల్లూ అయింది. నది రెండు ఒద్దుల మధ్య ప్రవహిస్తూ ఉన్నట్లే నీతి నియమాల సరిహద్దులు అతిక్రమించి జీవించకూడదు. మా జీవిత లక్ష్య లక్షణాలు ఆసక్తిగా గమనించిన రాయలసీమ మిత్ర బృందం, గుంటూరు వాసి సాంబశివరావు 80 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

పెద్దరికంలో పద్ధతి ప్రకారం నడచుకునేవారు. కుల, మత, వర్గ, వర్జ విచక్షణ లేని ఒక ఆదర్శ ఉమ్మడి కుటుంబం మాది. మా ఆవిడ ఆఫీసుకు వెళ్ళినా నేను పార్టీ కార్యాలయానికి వెళ్ళినా పిల్లలకి గోరుముద్దలు తినిపించడం ఉయ్యాల్లో పండబెట్టడం యిదంతా వాళ్లే చేసేవారు. పిల్లలకు ఏలోపం రాకుండా చూచేవారు (వంతులు వారీగా). జీవనం కోసం ఎదురు చూస్తే సహజీవనం లభించింది. సంవత్సరాంతంలో ఇళ్లకు వెళ్లే ముందు తీయించుకున్న మా గ్రూపు ఫొటోలో ఒకరు యాదవ! ఒకరు కాపు! ఒకరు కమ్మ! ఒకరు క్రిష్టియను! ఉన్నారు. యిదిగాక పైగా కోళ్ళ అప్పలనాయుడు తమ్ముడు బంగారయ్య గది అనిపేరు. గౌరునాయుడు కొడుకు కోటిబాబు కొంతకాలం అక్కదే ఉండి చదువు కొనసాగించాడు. యీవిధంగా మాది నానాజాతుల సమ్మేళనం. ఒక ౮0. తర్వాత వెనుక విశ్వబ్రాహ్మణ కుటుంబం చేరింది. ఏ తగువూ ధర్మానికి విజయనగరం వచ్చినా తంగుడు బిల్లి అప్పలస్వామి నాయుడు మాయింట్లోనే ఉండేవాడు. ఇల్లు కళకళలాదేది. పిల్లలకి ఆటాపాటా, మాటావచ్చేది. అందరికీ అందరం సేవచెయ్యదడానికి సర్వసిద్ధంగా ఉందేవారం.

విత్తం కొద్దీ వైభవం! స్వభావం బట్టి సమాజం! అని కృత్రిమ హెచ్చు లొచ్చులు, విభేదాలు, వైషమ్యాలు పట్టుకు వ్రేలాడితే సమష్టి సహకార సహజీవన సమాజం సిద్ధించదు! ఉమ్మడి కుటుంబానికి మా అర్ధమే వేరు! మా యింటికి తాళం వేయడం ఉండేదికాదు. నిత్యం ఎవరో ఒకరు ఉంటారు! అన్యోన్యంగా అరమరికలు లేకుండా అందరూ తలవని తలంపుగా సకుటుంబీకులమయ్యాం. పదవుల ప్రాంగణంలో అధికార ప్రయోజనాలు సిద్ధించాక కూడా వారితో సత్సంబంధాలు కొనసాగేవి. మా ఉభయుల జీవితం ఆ విధంగా ఫలప్రదం అర్ధవంతం అయింది.

సంస్కృత కళాశాలలో ఉపాధ్యాయ బృందం ఆదినుండీ బ్రాహ్మణ వంశస్థుల. మా సాంబశివుడు (కమ్మ) పరీక్ష పాసయి ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే ఆ సంస్కృత కళాశాలలో పదవిప్పించాను. అది అక్కడ జరిగిన తొలి విప్లవం. తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటే భార్య కస్తూరి కూడా ఉభయ భాషా ్రవీణురాలయి ఉన్నందున అదే సంస్కృత కళాశాలలోనే ఉద్యోగం వేయించాను. పనికట్టుకొని కులం అన్న ఉక్కు చట్రాన్ని బద్దలు చేయడాన్ని వ్యూహాత్మకంగా చేసిన పనికాదది! మానవత్వం ప్రాతిపదికగా సహాయపడడం నా విధివిధానం! మొదటినుంచీ మామూలే! నాకు. అదే కాలేజీలో (అనుపిండి) గ. గోపాలరావుకు, గోవిందశర్మకు, కాళిదాసు వగైరాలకు ఉద్యోగం లభించింది. విద్యార్థి దశను దాటి, చదువు నేర్చుకున్న కాలేజీలోనే ఉన్నత స్థితికి రావాలనే నిరవధికంగా స్వేచ్చాభరతం ౩కే

కృషిచేసి వీరంతా తరించారు. వారి కుటుంబాలు ధన్యమయ్యాయి. సుబ్బరాయుడు యాదవ్‌ గురించి ఒక విషయం చెప్పాలి. ఆంధ్రాబ్యాంకు మేనేజరుగా పదవీ విరమణ చేశాడు. ఆఖరు రోజు వరకూ అమ్మా! నాన్న అని పిలుస్తూ! కేన్సరని తేలింది. అయినా మాతో కలిసి పుట్టపర్తి వచ్చాడు. ఆయన తదనంతరం ఇటీవల హైదరాబాదు వెళ్ళిన మా పెద్దమ్మాయి కరుణ, అల్లుడు శ్రీనివాసరావు వాళ్ళింటిలోనే రెండురోజులున్నారు. ఎటువంటి బుణానుబంధమో! ఏ పూర్వజన్మ సంబంధమో! వయోగ బలమో! ఎటువంటి త్యాగరాగాలో! మా ఆవిడ కన్న బీడ్డలు పిల్లలు ముగ్గురే. కాని అమ్మా! అన్న మన్ననలను ఎంతమంది నుండి అందుకుందో! మాది విశ్వకుటుంబం. సుదీర్భ జీవయా(త్రలో ఎందరి (ప్రేమాభిమానాలు, దయానురాగాలు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడాయో! ఎందరు పెద్దల ప్రముఖుల ఆశీర్వాద పరంపరలు మాకు రక్షణ వలయంగా నిలిచాయో! మద్రాసు ప్రస్థానం మా మద్రాసు ప్రస్థానం పలువిధాల ప్రాధాన్యత సంపాదించింది. అక్కడ ఎవరినీ ఎరుగం. భాష రాదు, పార్టీ పదవుల్లో ఉన్న వాళ్లకు కన్పించాలని లేదు. మరెక్కడ ఉండాలి? మద్రాసులో మా ఆవిడ రిఫ్రెషర్‌ కోర్సుకు వెళ్ళవలసిన ఆఫీసు ఎక్కడ ఉంది? ఏమో? ఏదీ తెలియకుండా మద్రాసు సెంట్రల్‌ స్టేషనులో దిగాం! అక్కడ దగ్గరలోనే ఒక పెద్ద సత్రం ఉందని చూపించారు. వెళ్ళి అడిగితే గదులు ఖాళీలు లేవు సాయంత్రం రమ్మన్నాడు. మరి ఎక్కడికెళ్లాల? ఒక మర్రి చెట్టు మొదలున కూర్చున్నాం. ఎదురుగా - బయట కొళాయి కన్పిస్తోంది. పిల్లలకు స్నానాలు చేయించి మేమూ అక్కడే చేశాం. మా రైలు ప్రయాణంలో తారసిల్లిన ఓ పెద్దమనిషి మా ఆవిడ వెళ్ళవలిసిన కార్యాలయం తెలుసునన్నాడు. తాను వెళ్ళేది అటువైపే అని చెప్పాడు. ఆ పెద్దమనిషి సత్రం దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఎంత గొప్ప మనసు అతనిది! మా ఆవిడను దిగబెట్టాడు. సకాలంలో రిఫ్రెషరు కోర్సులో చేరినట్లు రిపోర్టు యిచ్చింది. సాయంకాలం తిరిగి వచ్చేవరకు ఆ చెట్టుక్రిందనే పెట్టెప్రకృన హోల్దాల్‌ పరిచి పిల్లల (ప్రక్కన కూర్చున్నాను. కథలు చెప్తూ - కాలక్షేపం చేస్తూ. సాయంకాలం గది దొరికింది. రెండే రోజులుండొచ్చునట. తర్వాత మాటేమిటి?

ఇంకో సత్రం వెదికాను. అక్కడా రెండు రోజులే గడువు! మళ్ళీ వెతగ్గా మూడవ సత్తరవులో మా అద్భష్టరేఖ దాగి ఉంది. ఒక ముసలమ్మ చూస్తోందా సత్తరువు. ఆమెకు పిల్లలు లేరు. కొడుకు దత్తుడు. తెల్లవారితే ఇల్లువదిలేస్తాడు. మా పిల్లలిద్దరినీ చూసి పొంగిపోయింది. 82 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

తన జీవితంలో నేటికి వెలుగులు విరజిమ్మాయి అనుకొంది. అన్నది కూడా. మేమున్నంత కాలం అక్కడే ఉండమంది. పిల్లల్ని తన నుండి వేరు చెయ్యవద్దంది. నేను బయటకు వెళ్తానంటే మాత్రం మా కరుణమ్మ కంఠం పట్టుకొని వైేళ్లాదేది. తమ్ముడు చంకలో చెయ్యిమీద గమ్ముని కూర్చొనేవాడు. ఇద్దరూ చెరో చంకనా ఉండాల్సిందే నేనెక్కడి వెళ్ళినా ఇప్పుడు నేను ఒక్కడ్ని కాదు. విలక్షణమైన లక్ష్మణదాసు

ఏదో కొనాలని ఎదురుగా ఉన్న కిల్లీకొట్టు దగ్గర ఆగాను. హఠాత్తుగా 15 శాస్త్రి ఆటో వచ్చి ఆగింది. 3.2 మీటింగుకి వచ్చానన్నాడు. మా పాత మిత్రుడు అనుంగు శిష్యుడు లక్ష్మణదాసు అక్కదే ఉన్నాడన్న వార్త మాకు కొండంత బలం ఇచ్చింది. అమృతం ఒలకబోసినట్లయింది. అక్కడే వివేకానంద కాలేజీలో ఫిజిక్సు లెక్చరర్‌గా ఉన్నాడట. ఆ సాయంకాలం జరిగిన 1.9? మీటింగులో శాస్త్రి ద్వారా కబురు విని మా సత్రం గుమ్మం దగ్గర దిగాడు లక్ష్మణదాసు మర్నాడు ఉదయం. కోనేరు లక్ష్మణదాసు చాలా గొప్ప మనిషి. విద్యార్థిదశలో నా శిష్యవర్గంలో ప్రథముడు. వారికి నేను మార్గదర్శిని, తాడేపల్లి గూడెంలోని మెండు నరసింహారావూ అంతే. పాత లక్ష్మణదాసు వేరు. యీ నాటి లక్ష్మణదాసు వేరు. వందల వందల పేజీల పుస్తకాలు నమిలేసేవాడు. రాత్రింబవలూ చదువూ- రాతే. అతని (గ్రంథ పఠన, భాషా పాండిత్యం, విజ్ఞానం, సుజ్ఞానం ముందు నేనేపాటి? ఎంత ఎదిగిపోయాడు లక్ష్మణదాసు!

నా తరువాత కాలేజీ అధ్యక్ష పదవికి జరిగిన నాటి పోటా పోటీల మాట. అవసరాల సూర్యారావు 5.౯ తరపున రంగంలో దిగాడు. పెద్ద ప్రణాళిక ప్రకటించాడు. ఎన్నికైతే తన అమలు చేసే సుదీర్ధ పనుల పట్టిక. అందులో అసంగతం అయినవీ అసాధ్యమయినవీ కూడా అనేకం ఉన్నాయి. మంచి మాటకారి, రచయిత. అతని ధాటికి తట్టుకోవడం కష్టమై దాసు నన్నాశ్రయించాడు. దీటైన జవాబు చెప్పాలి అని,

విడుదలచేసే ఎన్నికల ప్రణాళిక పత్రంలో ఆఖరు వాక్యంలో “ఇటువంటి మనిషి పిండోత్పత్తికి పూర్వంగాని, అపర కర్మకు ఆవల గాని ఉండి ఉండాలి” అంటూ ముగించాను. పాపం! యింక సూర్యారావు ఖంగు తిన్నాడు. ఆఖరుకి లక్ష్మణదాసే గెల్బాడనుకోండి. ఆ తరువాతి కాలంలో గురజాడ డైరీలు ప్రకటించిన ఘనుడు వక్త, సాహితీవేత్త రచయిత సూర్యారావు. స్వేచ్చభరతం 83

కోనేరు లక్ష్మణదాసు ఆపద్ధర్శంగా కలిసాడు మద్రాసులో. చివరవరకు తోడు నీడగా ఉన్నాడు. పెద్దగది యిప్పించాడు. అన్ని విధాలుగా బాసటగా నిల్చాడు. భోజన వసతి సౌకర్యాలు సర్వం సమకూర్చాడు. ఆఖరున రైలుబండి ఎక్కించి విజయనగరం భద్రంగా చేరునట్లు చేశాడు. ఆ తర్వాత విన్నాను. లక్ష్మణదాసు ఢిల్లీలో ఎంతోకాలం ఉండి, బోడేపల్లి రాజగోపాలరావు పార్లమెంటు వసతిగృహంలో ఉంటూ ఉన్నత విద్యకు అమెరికా వెళ్ళేముందు హఠాత్తుగా అమ్మవారుపడి (ప్రాణం పోయిందిట! మరి కొంతకాలం బ్రతికి ఉంటే జాతి గర్వించదగ్గ నేతను మన రాష్ట్రం దేశానికి అందించిందన్న ఘనకీర్తి దక్కేది. మద్రాసు ప్రస్థానం తర్వాత విజయనగరంలో యథావిధిగా పార్టీ సేవలో తలమునకలయ్యే వాడిని. రాష్ట్ర సోషలిస్ట్‌ పార్టీకి ముగ్గురు సహాయ కార్యదర్శులుగా ఉండేవాళ్ళం. నేను, జొన్నలగడ్డ రామలింగయ్య, కె.బదరీ విశాల్‌ పిట్టీ. ప్రధాన కార్యదర్శి 3.£. గోపాల్‌రావు. పి.వి.జి, రాజు అధ్యక్షునిగా ఉందేవాడు. గోపాల్‌రావు రాజీనామా చేశాక, ఆ స్థానంలో నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. స శ ఈల 84 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

పె.వి.జ. రాజు విచిత్ర వైఖరి

నేను, పి.వి.జి. రాజు కలిసి రాష్ట్ర కార్యవర్గం సమావేశానికి వెళ్ళాం. చర్చల మధ్యలో త్వరలో రానున్న మున్సిపల్‌ ఎన్నికలలో పార్టీ పాత్ర గూర్చి నేను ప్రస్తావించాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కలుగ చేసుకోవద్దు. వాటికి పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు జరగటం మంచిది కాదన్న పద్ధతికి కట్టుబడి ఉన్నాం అని అందరూ అన్నారు. ముఖ్యంగా పి.వి.జి. రాజు, అందుచేత అది చర్చనీయాంశం కాకుండా పోయింది. మునిసిపల్‌ ఎన్నికలు పి.వి.జి. లీలలు

కొంతకాలం పోయిన తర్వాత “విజయనగరం మున్సిపల్‌ కౌన్సిల్‌ ఎలక్షన్‌ గురించి ఏం చేశావు” అని అడిగాడు పి.వి.జి. రాజు. “స్థానిక సంస్థల ఎన్నికలలో కలుగ చేసుకోవద్దని మీరే నిర్ణయం చేసినందున, వాటికి దూరంగా ఉన్నాం” అన్నాను. వెంటనే పి.వి.జి. రాజు ప్లేటు ఫిరాయించాడు. “దేనికైనా దూరదృష్టి ఉండాలి. స్థానిక సంస్కృతి విస్మరించి ఢిల్లీలోనో, హైదరాబాద్‌లోనో కూర్చుని అధికారం చెలాయిద్దామనుకుంటే, అది పునాదుళ్లేని భవనం అవుతుంది. ఒక్కమారు కుప్పకూలిపోయే ప్రమాదం ఎదుర్కోవలసి వస్తుంది. కాకపోయినా మనం అంతా ఏదో పదవుల్లో ఉన్నాం. గానీ పార్టీకోసం, పార్టీ జెండా మోసి, పనిచేసే వాళ్ళకు మనం ఏమిచ్చినట్టు? ఈ సంస్థల్లో కొందరికి పదవులు లభిస్తే, ఆ బలం మళ్ళీ మనకే ఉపయోగపడుతుంది” అన్నాడు. ఇప్పుడెలాచచ్చేది? హైద్రబాద్‌లో పి.వి.జి, రాజు చెప్పిన మాట ప్రకారంగా, స్థానిక కార్యకర్తలందరికీ చెప్పాను. పార్టీపరంగా ఈ ఎన్నికల్లో మనం కలుగచేసుకోవట్లేదని, పెద్దలు నిర్ణయించారని చెప్పాను. ఆ కారణంగా గెలుపు గుర్రాలు వేరే వేరే ముఠాలో చేరిపోయి, వారి వ్యక్తిగత సానుకూలత బట్టి, ఎన్నికల ప్రచారానికి సంసిద్ధులు అవుతున్నారు. ఇప్పుడేం చేయాలి నేను? అప్పుడే పార్టీ మిత్రులు తమ తమ ఎన్నికల వ్యూహాలతో సంసిద్ధులు అవుతున్నారు. ఈ మాట చెప్తే పి.వి.జి. ఊరుకుంటాడా? అందుచేత పి.వి.జి. చెప్పిన ఇటీవలి అభిప్రాయం దృష్టిలో పెట్టుకుని వివిధ వర్ణాలుగా ముఠాలుగా చీలిపోయి చేసుకున్న కూటములలోని ముఖ్యులు అందర్నీ కోటలో మీటింగ్‌ పెట్టి, పరిస్థితులు వివరించాను. ౮౧1164 [౯1001 అన్నపేరు స్వేచద్చభారతం 85

పెట్టుకుని, కేవలం పార్టీ పద్ధతుల్లోనే కాక, మన అనుకూలురుతో కలిసి పోటీ చేయటం తప్పనిసరి అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలలో నేనూ పూర్వం ఎన్నడూ దిగలేదు. అయినా అదృష్టం వరించింది. అధిక సంఖ్యాకులు గెలిచారు. గౌరవప్రదంగా బయటపడ్డాం. అయినా అది కలగూరగంప. నానా గోత్రేభ్య అన్నట్టు ఉంది. గెలుపు అవకాశాలు చూసుకుని, చేసుకున్న సమీకరణలు అవి. సిద్దాంతాల ప్రాతిపదిక లేదు. పార్టీ పరంగా కానే కాదు. వారందరినీ ఒక త్రాటి మీద నడిపించి, క్రమశిక్షణలో ఉంచడం దుసాధ్యమైన పని. అయినా వీరిని తీసికెళ్ళి పి.వి.జి. రాజు ముందు పెడదాం. ఆయన మాట ఎవరు కాదంటారు? ఆ ధైర్యంతో రెండు మూడు కార్లలో. ముఖ్యులం అందరం విశాఖలో ఉన్న పి.వి.జి. రాజుని దర్శించడానికి వచ్చాం. నాలికలు మెలికలు

పి.వి.జి. రాజుకు ఎవర్నీ కలిసే ఉద్దేశ్యంలేదు. శరీరంలో స్వస్థత లేదంటాడు. కాకపోయినా ఆ ఎన్నికలతో నాకేం సంబంధం అన్నధోరణిలో ఉన్నాడు. నేను చొరవ తీసుకుని, లోపలికి వెళ్ళి, గెలిచిన అభ్యర్థులు కొందరు మీ ఆశీర్వచనం కోసం వచ్చారు, మీ ఆదేశానుసారం భావికార్యక్రమం జరుగుతుందని చెప్పాను. నాతో కొందరు మిత్రులను లోపలికి పిలిచాను. “3/2010021 ఎలక్షన్లతో నాకేం సంబంధం, ఇందులో తల దూర్చనని ఏనాడో చెప్పాను కదా, వీరిని నా దగ్గరికి తెచ్చావెందుకు?” అన్నాడు. అక్కడేం జరిగినా, తన నెత్తికి చుట్టుకుంటుందన్న సలహాదారుల మాటవిన్నాడు. మొత్తం జనాభా అంతా నీతోనే ఉండగా, గెల్చిన కొంతమందిని పట్టుకుంటే, మిగతా వాళ్ళు నీకు దూరమైపోతారు కదా! అన్న సలహా ఆయన బుగ్రకెక్కింది. “నువ్వెలా 1420286 చేస్తావో అదంతా నీ పూచీ నీ ఇష్టం, ఆదేశాలే ఇస్తావో, ఉపదేశాలే చేస్తావో, ఆ తలనొప్పి నాకు పెట్టకు” అన్నాడు నిర్జాక్షిణ్యంగా. నిర్ధాంతపోయాం. నిశ్చేష్టుడనయ్యాను. నోరు పెగల్లేదు. అతనితో, ఈ తరుణంలో తగువు తెచ్చుకోవటం, పెంచుకోవటం ఏం మంచిది? అవాక్కయ్యాను. పెద్దల బుద్ధులు ఎప్పుడు ఎలా మారతాయో! పులి వేషం వేసేవాడికి ఫరవాలేదు. దరువు వేస్తే దౌడు వేస్తాడు. చిందులు క్రాక్కుతాడు. తోకపట్టుకున్న వాడికే ప్రాణాంతకం. పులి ఎలాగాడితే తోక అటు త్రిప్పాలి. ఇది నా తరమయ్యేపనేనా? విజయనగరం వెళ్ళి, అక్కడ మిత్రులకు మొహం ఎలా చూపించాలి? ఏం చెప్పాలి?

పి.వి.జి. మాట ప్రకారంగానే పోటీలోకి దిగాం. రాజావారి కోటలోనే మీటింగ్‌లు, అభ్యర్థుల నిర్ణయాలు జరిగాయి. ఇన్నీ అయ్యాక, పి.వి.జి. ఒక్క మాటు మాట మార్చేస్తే, 86 భాట్టం శ్రీరామమూర్తి (జ్వీయ చరిత్ర)

తనకి సంబంధం లేదంటే ఇప్పుడు నేను ఏ గోతిలో దిగాలి? “పోనీ, ఒక్కమారు అందరం కలసి వస్తాం. ముఖస్థంగా మీ ఉద్దేశ్యం వారికి చెప్పండి” అని ఎంత మొరపెట్సినా వినడు. “నేను ఈ ఎన్నికలకే వ్యతిరేకం, గెలుపోటములతో నాకేం సంబంధం? గెల్చినోళ్ళు, ఓదినవాళ్ళూ, అందరూ నావాళ్ళే, ఈ తంటా నాకెందుకు? ఈ పెంట నా నెత్తిన ఎందుకు పెట్టుకోవాలి? నాకసలే వంట్లో బాగాలేదు. 1851 తీస్కోవాలి. ౧౦ [గల 6సఖ02006, 0166 అని తాబేదార్ల వైప్రచూశాడు. నాకు తల తిరిగిపోతోంది. విజయనగరం వెళ్ళలేం. పి.వి.జి. వద్ద ఉండలేం. ఏం చెయ్యాలో తెలీదు. సముద్రపు ఒడ్డుకు చేరుకున్నాం. బీచ్‌లో బఠాణీ పొట్లాలు కొనుక్కున్నాం. అందరం, మా దురవస్థకి దుఃఖించాం. పి.వి.జి. ప్లేటు ఫిరాయించాడని చెప్పగలమా? విజయనగరం కోటలో కూర్చుని, స్వ4లో పి.వి.జి. తో మాట్లాడేవాడిని. అందరికీ తెల్సు. అయినా ఇది నేను చేసుకున్న పాపం కిందవస్తుంది. ఇక నాయకుడిని ఎన్నుకోవాలి. ఎవరి ఆదేశాలూ ఉండవు. మీ చిత్తం వచ్చిన వాడిని ఎన్నుకోండి. ఛైర్మన్‌ చెయ్యండి. మీ కోరికే నా కోరిక. మీ అభీష్టం నెరవేరును అని అందరికీ చెప్పి, ధర్మవరం వెళ్ళిపోయాను. అక్కడ ప్రశాంతంగా, పుస్తకాలు చదువుతూ, కాలక్షేపం చేస్తున్నాను. ఒకరోజు హఠాత్తుగా డా॥ బి.వి. సంజీవరావు, కారేసుకుని మా ఊరు ధర్మవరం వచ్చాడు. పి.వి.జి.,తననే బలపరుస్తున్నట్లు చెప్పాడు. సంతోషం అన్నాను. కానీ ఈ విషయం నువ్వే వచ్చి వాళ్ళని సమావేశపరచి, నాపేరు ప్రకటించాలన్నాడు. ఇదెలా జరిగింది అని అడిగాను. ఒకరోజు సునీతకి చెవులు కుట్టడానికి నన్ను పిలిపించాడు. అప్పుడు రాజావారిని అడిగా పోటీచేయాలన్న కోరిక చెప్పాను. 1/4) 063౪1563 (0 ౫౦౪ అన్నాడు. 51146 [౧2౧6 ఇచ్చాడు. ఇంకేం కావాలి? అన్నాడు దా॥ సంజీవరావు.

ఆ తరువాత విజయనగరం వచ్చి, కోటలో పి.వి.జి. రాజుని కలిశాను. “312120 ఇ” 26 04 92600 ౪౦1 ౧4|| 20016 10 66 ౧6౮౯21. ౫౦౪ (256 2 66013101 [0 540- ౧0402౧౫౬ 0012 (అప్పన్నదొర) ” అన్నాడు. అదేంటి మీరలా అంటున్నారు? 5ఖ్యుం౯/॥ ష౦ని పోటీ చేయమని మీరే అన్నారట, అన్నాను. “లేదు, లేదు తనకే పోటీ చేయాలని ఉందన్నాడు, 0891 ౪190ల అన్నాను. నా 064 ౪130ల ఎప్పుడూ అందరికీ ఉంటాయి అంటే నెత్తిమీద కూర్చోబెట్టుకుంటామా? గద్దెమీద ఎక్కిస్తామా” అన్నాడు. ఏంటీ ఘోరం! కలి బలం ఇక్కడే కనబడుతోంది. ఆ నాలుక ఎన్ని మెలికలైనా. తిరుగుతుంది. అది నాలుకా, చురకత్తా? విజయనగరంలో జనం ఆ నోట జారిపడ్డ మాటకోసం ఎదురు చూస్తారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుకే. ఆఖరుకి తెగించి అన్నాను. పోనీ మీరు అప్పన్న దొరని $20001 చేయమన్నారని అందరికీ చెప్పనా అన్నాను. ఇందులో నా ప్రమేయం ఎందుకు? నా పేరెందుకు బయటకు తెస్తారు? ఆ కీర్తి ఏదో నీకే దక్కనీ అంటాడు. నా స్వేద్భ్ధాభరతం 87

పరిస్థితి అయోమయంగా, గందరగోళంగా ఉంది. ఇంతవరకూ పి.వి.జి. తో తగువులేదు. నిండామునిగాం. ఇప్పుడేం తగువు తెచ్చుకోగలం? కోట బైటకి వస్తున్నాను. శూన్యంలోకి నడుస్తున్నాను. కందకం ఒద్దున కాళ్ళు తడబడుతున్నాయ్‌. బుర్ర ఒక 04112] ౯౧౦౦౫4 లాగ ఉంది. నాకు శాంతి ఎప్పుడొస్తుందని అడిగాడట ఒకతను. ఎదురుగా ఉన్న శ్మశాన వాటికను చూపించి, అక్కడే శాంతి అన్నాడు. ఎటు వెళ్ళాలో తెలీదు. ఏం చేయాలో తెలీదు. సంజీవరావుకి ఏం చెప్పాలి? యునైటెడ్‌ ఫ్రంటు మిత్రులకేం చెప్పాలి? మీ చిత్తం వచ్చిన అభ్యర్థిని ఎన్నుకోమని తెగేసి చెప్పి ఇప్పుడు అప్పన్న దొరపేరు చెప్తే, ఏమనుకుంటారు. అతను నన్ను కొనేసినట్టా? ఇంతలో హఠాత్తుగా గుండాల బదరీ నారాయణ మూర్తి, రోడ్డుపై కలిశాడు. “రాజావారి దగ్గరి కెళ్తున్నాను. నన్ను 530001 చెయ్యమని అడగదాన్ని” అన్నాడు. “అంతపని చేయకండి. ఆయన అప్పుడే నిర్ణయానికి వచ్చేశారు. అప్పన్న దొరకి $9౪0౦౫ చెయ్యమంటున్నారు” అని నోరు జారాను. బదరీ నారాయణ ఛెంగున గెంతాడు. “నాక్కావల్సిందీ అదే, అప్పన్న దొర ఛైర్మన్‌, నేను వైస్‌ ఛైర్మన్‌” అని అదృశ్యమయ్యాడు. క్షణాల్లో ఊరూ, వాడా వార్త పాకిపోయింది. ఎప్పుడైనా వీలైతే, కొణతాల అప్పారావుని వైస్‌ ఛైర్మన్‌ చేయాలని అనుకునేవాణ్ణి. అది నా మనసులో మాట. ఇంతలో పులిమీద పుట్రలా బదరీ తయారయ్యాడు. నేను ఇంటికి చేరునప్పటికి అప్పన్నదొర తయారు. నాకు చాలా సహాయం చేశారు. చాలా కృతజ్ఞుణి మీకు అన్నాడు. గుండెల్లో గునపంతో పొడిచినట్లు అయ్యింది. నేను చేసిందేమీ లేదు! ఇదంతా రాజావారి నిర్ణయం అన్నాను. ఆ మర్నాడు నేను మళ్ళీ తిరిగి ధర్మవరం వెళ్ళిపోయాను. రాజావారి మాట ప్రకారంగా, అప్పన్నదొరని ఎన్నుకున్నామని ఎవరో వచ్చి చెప్పారు. 61-63 మధ్య విజయనగర పురపాలక సంఘం వీరి పాలనలో గడిచింది. గుండెలు తీసిన పని. ఈ వార్త తీసికెళ్ళిన బదరీనారాయణమూర్తి, ఉపాధ్యక్షుదై కూర్చున్నాడు. ఇంత కష్టపడ్డ ౮7కి మిగిలిందేంటి? క్షణచిత్తం, క్షణ విత్తం అంటారు. ప్రభు చిత్తం కూడా క్షణ భంగురమే. మంత్రసాని పని చేశాక, బిడ్డొచ్చినా, దొడ్డొచ్చినా పట్టాలి. ప్రభువులు మాట పడరు. గొప్పవాడికి, ప్రక్క్మవాడు ఒకడు ఉంటాడు. తిట్లన్నీ అతనికి, దీవెనలన్నీ ప్రభువుకి. నా పరిస్థితి అలాగే అయింది. లంక సుందరం బెట్‌

డాక్టర్‌ సరోజిని నాయుడు సుప్రసిద్ధ జాతీయ నేత, అఖిలభారత కాంగ(గైస్‌ అధ్యక్షురాలిగా పనిచేసింది. మహాత్మాగాంధీ ముఖ్య అనుచర వర్గంలోని ప్రముఖ దేశభక్తురాలు. ఆమె సోదరుడు డా॥ జయసూర్య, సుప్రసిద్ధ హోమియా వైద్య శిరోమణి 88... భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

తలుపులు తెరచి, తన చెంతకు చేరేసరికి, ఆ రోగి రోగ నిర్ధారణ చేసేవాడుట! ఇతర వైద్యాలకు లొంగని దీర్ధ వ్యాధులు కూడా ఈ భిషగ్వరుడి చేయి పడితే, వ్యాధి నివారణ అయ్యేదిట. ఆయన పిలుపు మేరకు హైద్రాబాద్‌ అబీద్‌లోని ఆయన ఇంటికి పి.వి.జి. పయనమౌతున్నాడు, నన్నూ కారెక్కమన్నాడు.

“డా॥ లంక సుందరం ప్రఖ్యాత పురుషుడు. పార్లమెంట్‌లో అనర్దళంగా మాట్లాడి అన్ని ప్రముఖ పార్టీల మన్ననలు అందుకున్న సుప్రసిద్ధ పార్లమెంటేరియన్‌. అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా దిట్ట. ఇది మీకు తెలిసే ఉంటుంది. తెలుగు గడ్డకు పేరు ప్రఖ్యాతులు రావాలంటే, అతను పదికాలాల పాటు పార్లమెంట్‌లో తెలుగు ప్రజల ప్రతిభా, పాటవాలు దేశానికి చాటి చెప్పాలి. అతని మీద మీరు పోటీ చెయ్యాలనుకుంటున్నారట. అంత పని చేస్తే, అతను మరి మిగలడు. మనకి దక్కడు. దయచేసి ఆపని చేయొద్దు” అని పి.వి.జి. రాజుని కోరాడు డా॥ జయసూర్య,

నిదానంగా విని, డా॥ లంక సుందరం ఇంకో నియోజకవర్గం ఎంచుకోవడం మంచిది అన్నాడు పి.వి.జి. రాజు. ఇన్నాళ్ళూ 1116 చేసుకున్న సీట్‌ వదలి, పరాయి చోటకుపోతే, పుట్టగతులుంటాయా? అన్నాడు డా॥ జయసూర్య. “'బిజ్రమే, రోజులు మారిపోయాయి. పనిచేస్తేనే పలకడం కష్టంగా ఉంది! క్రొత్తవారు వస్తే ప్రజలు ఎంతవరకూ ఆదరిస్తారు? ఊహించటం కష్టం” అన్నాడు పి.వి.జి.. “అతని భవితవ్యమే కాదు, ఆంధ్ర రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు కూడా అతని గెలుపుపై ఆధారపడి ఉంటాయి” అన్నాడు డా॥ జయసూర్య. “ఎవరి భవిష్యత్తుకు ఎవరు కర్తలు? 4120 1 16 ౧26 0 113 0౪౧1

౮69119). ఎవరి తలరాత వాళ్ళమీదే ఆధారపడి ఉంటుంది'న్నాడు పి.వి.జి. తరువాత కాఫీ వగైరా పూర్తి చేసుకుని, “అతన్ని అభ్యర్థిగా నిలపండి, నా అభ్యర్థన మన్నించండి” అన్నాడు జయసూర్య, “ఒకరి భావిభద్రత, ఇంకొకరి భుజస్కంధాల మీద పెట్టుకోలేరు. ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించాలి. తరువాత అంతా దైవచిత్తం, జనవాక్యం!” అంటూ ముగించాడు పి.వి.జి. వారింటికి వెళ్ళేముందు, దారిలో, కారులో డా॥ జయసూర్య గూర్చి ఎంతో గొప్పగా చెప్పాడు పి.వి.జి. ప్రశంసల వర్షం కురిపించాడు. అంతటి మనిషి దాదాపు చేతులు పట్టుకున్నంత పనిచేసి, అర్ధించినా పి.వి.జి. రాజు కరుగలేదు. “నేనే పడేస్తాను విశాఖపట్నం సీటుకి, చూస్తాను ఎలా గెలుస్తాడో? అతనుపోతే ఆంధ్రరాష్ట్రం గొడ్డుపోయిందా? థిల్లీలో గడగడా వాగేస్తే జిల్లాలో ఓట్ల పంట పండుతుందా? నేలమీద వేళ్ళు లేవుగానీ, అంతరిక్షానికి ఎగబ్రాకాలని ఆశ. ఆషాఢభూతిగాళ్ళు అంతరించాలి. అతని పార్లమెంట్‌ జీవితానికి గండిపడితే ఆంధ్రరాష్ట్రానికి కొంపలంటు స్వేద్ధభరతం ౩9

కున్నట్లు మాట్లాడుతున్నాడు, చూద్దాం, మనం పార్లమెంటులో అడుగు పెడదాం, తడాఖా చూపిద్దాం. ఏమైనా, ఇది సువిశాల దేశం, ఏదో అసెంన్లీ మారుమూలపడి ఉంటే దేశంలో గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది? ఢిల్లిలో ఉన్నవాళ్ళు ఆకాశం నుంచి ఊడిపడినట్లు మాట్లాడితే. అది మన దగ్గర పని చేయదు” అని ముగించాడు. ఇటుపైన, పేరు ప్రఖ్యాతులు ఉన్న పెద్దలపైన వేటువేస్తే, దేశం మొత్తం మీద తనబావుటా ఎగురుతుంది. కీర్తి, ప్రతిష్టలు నలుదిశలా వ్యాపిస్తాయి అన్న నిర్ణయానికి వచ్చాడు.

“పెద్ద తలకాయలు తెగిపడితే, దేశం ఉలిక్కిపదుతుంది. ఆ వేటు వేసేవాడే వీరుడు, దేశం, వారికి నీరాజనం పడుతుంది. మన పేరు ఊరూరా మాగ్రోగుతుంది. చిల్లర దేవుళ్ళు మరి తల ఎత్తరు. ఉపగ్రహాలు మరి వారి బాకా ఊదరు. ఆ వందిమాగధులు మన పాదపద్మాలు హత్తుకుని తిరుగుతారు. వారి పాత స్తోత్రపాఠాలు మర్చిపోయి, క్రాత్త పల్లవి అందుకుంటారు. మన దయా దాక్షిణ్యాలతో ఈ దిగ్గజాలు రాజకీయ దిగ్విజయ యాత్ర చేస్తారుట, ఆ ముఖాలు మతాబులులా వెలుగుతాయట, ఆ రోజులు పోయాయి. మనం క్రొత్త చరిత్ర సృష్టించాలి. తలలు తెగి పడ్డానికి ఇది కళింగ యుద్ధంకాదు, ఎన్నికల సమరాంగణం, ప్రజాస్వామిక పద్ధతిలో శాంతియుత పోరాటం జరుగుతుంది. ఒకరు పరాజితులు అవుతారు. వేరొకరు విజయ పతాక ఎగురవేస్తారు. ఇందులో వీరత్వం లేదు, శూరత్వం లేదు, రక్తపాతం లేదు, రాజ్యకాంక్ష లేదు. ప్రజాభీష్టానికి పట్టాభిషేకం జరుగుతుంది.” ఇదీ పి.వి.జి. రాజు భావ పరంపర. మనోభీష్టం, వారి చిద్విలాసం మన విధి విలాసాల్ని తిప్పిరాస్తుంది.

పి.వి.జి. కూడా పెద్ద తిమింగలాని కోసం మాటు వేసేవాడు. జాతీయ రాజకీయాల్లో నూతన (ధ్రువతార వెలుగొందిందని చరిత్ర పుటలు సాక్ష్యం చెప్పాలి. ఢిల్లీ గల్లీలో మనం దిగుతాం. ఎన్నికల బరినుండి అడుగు వెనుకకు పడదు. ఇప్పుడు ఈ బృహత్తత పథకం సఫలం కావడాన్మీ ఎవరు బలి పశువు కానున్నారు?

14 ఈ 90 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్రు

వి.వి. గిరి - తెన్నేటి గారలు ఖతం

పార్వతీపురంలో వి.వి.గిరి పరాజయం

1957లో వి.వి.గిరి పార్లమెంటు సీటుకి పోటీ చేస్తున్నాడు. అది ద్విసభ్య నియోజకవర్గం. ఒక జనరల్‌ స్థానం ఒక రిజర్వ్‌ స్థానం కల్సి ఉండేవి. గిరితోపాటు కాంగ్రెస్‌ తరపున బిడ్డిక సత్యనారాయణ కాంగ్రెస్‌ అభ్యర్థి. ఇద్దరు రిజర్వుడ్‌ అభ్యర్థులు. జనరల్‌ అభ్యర్థుల కన్నా ఎక్కువ ఓట్లు సంపాదిస్తే, ఆ ఇద్దర్ని ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.

ఒకరు జనరల్‌ సీటుకి ఒకరు రిజర్వ్‌ సీటుకి ఇదీ పద్ధతి. వి.వి.గిరి మీద వాసిరెడ్డి కృష్ణ మూర్తి నాయుడు (జనరల్స్‌తో పాటు డిప్పల సూరిదొర 11021 3621కి నామినేషన్‌ వేశారు. పాపం వి.వి.గిరి ఘనకీర్తి ఆకాశాన్ని అంటుకున్న రోజులు, ఈతరం వారికి జ్ఞాపకం ఉంటుందా? పల్లెటూరు ప్రజలకి చారిత్రక సత్యాలు ఎలా తెలుస్తాయి? దేశ స్వాతంత్ర్య సమరంలో వారు ప్రదర్శించిన అద్భుత త్యాగచరిత్ర ఎంతమంది పామర జనానికి గుర్తుంటుంది? వి.వి.గిరిని పల్టీ కొట్టించాలని, కొమ్ములు తిరిగిన నాయకులని మన్ను కరిపించాలని ప్రతిన బూనిన విజయనగర ప్రభువుల మాట జవదాటని జనాలు జిల్లా అంతటా ఉన్నారు. పాపం గిరిగారు మెడలో ఒక పూలదండ వేస్కుని కార్లో కూర్చునేవారు, అతనే అభ్యర్థి అని తెలియడానికి. ముఖం మీదరాసి ఉండదు కదా, ఇతను ఘనత వహించిన గిరిగారు అని! ఒడ్డు, పొడుగు ఉంటాడు తప్ప, ఆ ముఖంలో కళాకాంతులు కన్పించవు. విజయనగర ప్రభువుల తేజస్సు ముందు అది బలాదూర్‌. కాబట్టి, కారుకు కాంగ్రెస్‌ పతాకం, మెడలో దండ గిరిగారికి సంకేతాలు!

ఆయన చారిత్రక పురుషుడు. 1986వ సం॥లో బొబ్బిలి శాసన సభ్యునిగా పోటీ చేశాడు. బొబ్బిలి రాజా, అవిభక్త మద్రాసు రాష్ట్రానికి ప్రధానిగా ఉండేవారు. (అప్పుడు చీఫ్‌ మినిస్టర్‌ అనే వారు కాదు). అక్కడ పోటీ పెట్టింది గిరిగార్ని జాతీయ కాంగ్రెసు. అది బొబ్బిలి వీరగడ్డ. అది ఒక పులి పంజా. బ్రిటిష్‌ పాలనలో జస్టిస్‌ పార్టీ ప్రముఖుల కార్యక్షేత్రంలో గిరిగారు అడుగుపెడుతున్నారు. గెలుపు ఖయం చేసుకోవాలంటే కాంగైస్‌ స్వేచ్చభరతం ౩

దిగ్గజాలు దిగిరావాలి. ప్రముఖ కార్మిక నాయకుడు, కాంగ్రెస్‌ అధినేత, గిరి గార్ని బలి పశువు చేయలేరూ. జవహర్‌లాల్‌ నెహ్రూ బొబ్బిలికి దిగి వచ్చాడు. వీర బొబ్బిలిపై సింహగర్జన చేయడాన్మి బొబ్బిలి ప్రభువుల తాబేదార్లు, వారి కొలువులోని కింకరులు, భయంకరులు డప్పులు, డమరుకాలతో, భాజా, భజంత్రీల మోతలతో, ఏనుగుల ఘీంకారాలతో రణగొణ ధ్వని చేస్తున్నారు. మాట వినపడదు. అంతా గందరగోళం. నెహ్రూ పండితుడు మండిపడ్డాడు. వేదిక నుండి ఉరికి లంఘించాడు. విధ్వంసకారులను వెంటతరిమాడు. చరిత్ర ప్రసిద్ధమైన ఆ పోరాటంలో విజయదుందుఖి (మోగించిన వీరుడు వి.వి.గిరి. నాటికి నేడు మళ్ళీ పార్లమెంటు సీటుకు బలపరీక్షలో నిలిచేడు. విజయనగర ప్రభువుల సుడిగాలి పర్యటన, ప్రభంజనం సృష్టించింది. పాటక జనం పోటెత్తి, పి.వి.జి. రాజు వెంట పడ్డారు. కాలమాన పరిస్థితులు మారిపోయాయి. గిరిగారు ఓటమి చవిచూడవలసి వచ్చింది. జనరల్‌ సీటు అభ్యర్థులు ఇద్దరూ ఓటమి చెందారు. రిజర్వ్‌ సీటు అభ్యర్థులు ఇద్దరూ గెలిచారు. పి.వి.జి. ఖద్గ తిక్కన. తిక్క తిరిగిందంటే ఆ కరవాలం మననెత్తిన పదుతుంది. రాజకీయ రంగానికి పూర్వ రంగం రణరంగమేననీ. పీకలు తెగిపడకుండా కొత్త చరిత్ర సృష్టించలేమనే నమ్మకం ఒంటబట్టింది పి.వి.జి.కి. రక్త పిపాస క్షాత్ర ధర్మంగా భావించ బడింది. ఒకనాడు రక్తం చవిచూసిన పులిలా ప్రముఖుల్ని పరాజితుల్ని చేసి సృష్టించుకున్న చరిత్ర పునరావృతం కావాలన్న కోరిక గట్టిగా పనిచేస్తుంది. పనిలేని మంగలి పిల్లి బుర్ర గొరికేడన్నట్టు - ఊసుపోకో - కసితోనో, పిల్లకాకి మీద కూడా విల్లు ఎక్కుపెట్టదానికి సిద్ధపదుతున్నాడాయన., తనను తప్పు పట్టినవాడి దుమ్ము దులపాలని చూస్తున్నాడు. తలబిరుసుతనం

కనపడితే తలతియ్యాలన్న తత్వం బలపడింది. పాపిష్టి పాలనలో తలలు తెగిపడతాయిగాని

  • ధర్మపాలనలో అన్యాయం జరుగదు గాని ఇది సత్య కాలం కాదు. బాధితుడు ధర్మఘంట 'మోగించడానికి. (కాంగ్రెస్‌ అభ్యర్థులు వివిగిరి (జనరల్‌) - బిడ్డిక సూర్యనారాయణ రిజర్వు ఇద్దరికీ - వారితో పోటీ పడుతున్న 59 అభ్యర్థులకన్నా అధికంగా ఓట్లు సంపాదించారు. అత్యధికంగా ఓట్లు పొందిన బిడ్డిక సత్యనారాయణ (కాం(గైస్‌) గెలిచినట్లు ముందు ప్రకటించారు. సీటుకు మిగిలిన ముగ్గురులోనూ సూరి దొరకు అధికంగా ఓట్లు వచ్చినందున జనరల్‌ సీటు అతడు గెలిచినట్లు ప్రకటించారు. ఫలితంగా జనరల్‌ అభ్యర్థులు ఇద్దరూ ఓటమి చెందారు. ఈ ఎన్నికల ప్రకటనపై గిరిగారు సుప్రీంకోర్టుకు వెళ్లినా నిర్ణయం మారలేదు)

92 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్ర

తెన్నేటి పరాజయం 1955 ఎన్నికలలో దివంగతనేత తెన్నేటిని ఎంచుకున్నాడు పి.వి.జి. రాజు. పులి బక్కరడం అయ్య (బ్రతకడమూనా! ఎంతటివాడైనా, అరివీర భయంకరుడైనా పి.వి.జి. రాజు ముందు ఎంతటి వీరునికైనా తల తెగిపదుతుంది. పరాజితులవుతారు. విశాఖ కీర్తి పతాకం ఎగరవేసిన మహోదాత్తుడు, ఉత్తముడు, త్యాగధనుడు, నిస్వార్ధ నిష్కళంక దేశభక్తుడు తెన్నేటి. తెన్నేటి కీర్తి కిరీటంపై దృష్టి మళ్ళింది పి.వి.జి. రాజుకు. ఎత్తిన కత్తికి ఎదురులేని ప్రభువు అతను. మంచి చెడ్డల విచక్షణ జ్ఞానం సామాన్య ఓటరుకి సొంత సొత్తు. దీనిమీద ఆధారపడింది (ప్రజాస్వామ్య భవిష్యత్తు ధనబలం, కులబలం, కండబలం, దండు బలం, వీటి ప్రాధాన్యత ప్రజాస్వామ్యంలో ఎంత తగ్గించి చూసినా ఎక్కువే. కరకు పరాయి పాలకుల తుపాకి గుండుకు గుండెవొడ్డిన ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు అడుగుల్లో అడుగు వేసి దేశమాతకు తన ధన, మాన, ప్రాణాలను అంకితం చేసిన మహామనీషి తెన్నేటి. ఆయన ఓటమికి పథకం పన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు, ప్రజాపార్టీ, కృషీకార్‌లోక్‌ పార్టీ వంటి పార్టీలను ఏకం చేసి 01466 00081693 ఏర్పాటు చేసి, రాష్ట్రంలో తిరిగి (0౧87638 గెలుపుకు విజయఢంకా మోగించాలని ఉవ్విళ్ళూరిన తెన్నేటి శకం పరిసమాప్తం కావాలని పెద్దలు పూనుకున్నారు. విజయం వరిస్తే రాష్ట్రరాజకీయాల్లో తెన్నేటి గెలుపు, రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక క్రొత్తమలుపు అవుతుంది. అట్టి చారిత్రాత్మక సందర్భాల్లో తెన్నేటిని పి.వి.జి. రాజు పరాజితుల్ని చేశారు. ప్రభువుల చిద్విలాసం మీద ప్రజాస్వామ్యం మనుగడ గౌలిలో దీపంలా ఉంది! ఇది ప్రజాస్వామ్యమా? ధన స్వామ్యమా? భూస్వామ్యమా? ప్రజాస్వామ్యమా? తేల్చుకోలేని వీథి మానసి, మూగ మానవుడు అరాచక, అక్రమ ఎన్నికల క్రీడలో పావుగా మారుతున్నాడు. ఆశయాలు ఆదర్శాలు మసకబారి, అటకెక్కి మనల్ని వెక్కిరిస్తున్నాయి. గు ఎ ఈ స్వేచ్భాభారతం 93

పి.వి.జి రాజు నిరాదరణ - రైతు అరణ్య రోదన

మా కృతనిశ్చయాలు!

అలనాటి పాలకుడు పడగ విప్పిన పాము. పాముతోక తొక్షితే పగబట్టి విషం కక్కుతుంది.

పేదలగోడు వినిపించాలనుకుంటే నీమీద బండపడుతుంది. రైతుకూలీల (బ్రతుకు బాగు చేయాలని పుట్టిన పార్టీలో వారి రక్షణకు కరువా? సన్న కారు రైతు గోడు విన్నవిస్తే జిల్లా పార్టీ కార్యదర్శిగా నాకు ఎదురైన చేదు అనుభవాలు విన్నవిస్తా. చిత్తగించండి.

అన్యాయాలు సహించం, అక్రమార్ముల మీద విల్లు ఎక్కుపెడతాం, సాంఘికన్యాయం సమతాధర్శ్మం అంటే చెవికోసుకుంటాం, పేద, సాదా, బీదా, బిక్కి దీనులు, బలహీనులు వెంట ఉంటాం. పర్వతం విరిగి మీద పద్దా, జీవితం తునాతులకలైనా, బడుగు జీవులకు బాసటగా నిలుస్తాం, పెద్దల్ని గద్దల్ని చూసి జడుసుకోం. ఇది బడాబాబులకు, సంపన్న వర్ణాలకు తల ఒగ్గక మనతత్వం మనస్తత్వం. మాదగ్గర లాభనష్టాల మాట తలఎత్తదు. మేటువు ఒరిగి మీదపడ్డా వెనుకంజ వేయం. ప్రపంచం ఒక పంచ కూళ్ల కషాయం, ఒక (ప్రక్క వంచన ఉంటుంది. మరో ప్రక్మన దోపిడీ ఉంటుంది. దోచుకొని దాచుకొనే ధనిక వర్గాల మాట పూలబాటగా సాగుతోంది. ఇక ఎంతో కాలం ఇది కొనసాగదు! పేదల బతుకులు కర్మ్కోటకులకు, కాలనాగులకు బలి కాకూడదు! అధికార బధిరాంధులకు కక్ష శిక్ష తప్ప రక్ష తెలీదు. పేదల ప్రయోజనాలకు కాపలా కుక్కలా ౪260064085 కార్య కర్తలు పని చేయాలి. కలిమి బలిమి ఉన్నవాళ్లు కనికరం లేకుండా కాటువేస్తే రాచబాటలోనే తిరుగుబాటు బావుటా ఎగరవేయాలి యిది మా లక్ష్యం. యిది మా ధ్యేయం. యీ పద్ధతినే కొనసాగించాలని నడుం కట్టాం.

గొప్పవాడి పక్కవాడి పొగరు - విగరు ఒకనాడు ఒక పీడితుడు తాడితుడు తన బతుకు గోడు నా ముందు వెళ్లబోసేడు. గోటితో పోయేది గొడ్డలి వరకు ఎందుకు? ఒక రి భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

సన్నక్రారు రైతును మేడిశెట్టి రాంలు పొలం నుండి తప్పించి వేరొకరికి అధికమొత్తంకోసం కౌలుకి అమరికం చేసిన ఘటన యిది. విజయనగరం ప్రభువుల యిలాకాలోనే జరిగింది. ఆయన శ4 గా 414 హుసేన్‌ ఉండేవాడు. అతని బాసు భూకామందు పి.వి.జి.రాజు మద్రాసులో ఉంటాడు. 15.9 రాష్ట్ర కార్యదర్శి కూడా. అంచేత తెగేవరకూ లాగకూడదు. ఇది సున్నిత విషయం. విషయాన్ని హుస్సేన్‌ వద్దకి వెళ్లి చెప్పాను. అతను పట్టించుకోలేదు. ఇది కుదరని వ్యవహారం అని ఖండితంగా చెప్పాడు. అవసరమైతే కొత్తవాడి కన్నా పాతవాదే అధిక మొత్తం అడిగినంతా చెల్లిస్తాడని కూడా చెప్పాను. ససేమిరా అన్నాడు. పార్టీ సిద్ధాంతాలు ఏకరువు పెట్టాను. కౌలుదారీ పరిరక్షణ ప్రసక్తి తెచ్చాను. అవన్నీ తనకు అనవసరం అన్నాడు. పరిపాలనా నిర్వహణలో ఇటువంటి సిద్ధాంతాలు కంటకావృతంగా తారసిల్లితే వాటిని తురిమి వేయాలనీ ఖజానా కుదేలు కాకుండా చూచుకోవడమే తన బాధ్యత అని ఖచ్చితంగా చెప్పాడు. పీకలు కోసి రూకలు దాస్తావా?

గల్లాపెట్టె నింపడానికి పేదల పీకలు కొయ్యక్కర లేదు. అయినా ఆయన దేనికీ వెనుకాడడు. పార్టీసిద్దాంతాల శశ బిషలు అతని దగ్గర పనిచెయ్యవు. కూడు గూడు అని మాట్లాడితే అది తన పని కాదంటాడు. విసిగి వేసారి వెనక్కు వచ్చేశాను. స్వల్ప విరామం తర్వాత మళ్లీ కలిస్తే 0616 00216115 [ఘు 0౪౪21] అన్న ఆశతో. రెండవ దఫా అతని ఆఫీసులో అడుగు పెట్టాను. ఇటువంటి కేసులు అసలు 1216 10 చేయడమే తప్పన్నాదు. నా భవిష్యత్తుకు ముప్పని హితవచనం పలికాడు.

పీకలు కోసే పని చేస్తూ సున్నితంగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఆ గోత్రీకులకు ఉరమకుండా గొంతుక నులుపడం ఎలాగో తెలుసు! నేను విరుచుకు పడితే పి.వి.జి. రాజుమీద దండయాత్ర చేసినట్టు! రైతులను రెచ్చగొడుతున్నట్టు! పి.వి.జి. ని అప్రతిష్టపాలు చేయాలని పన్నాగం పన్నానని కట్టు కథలు పుట్టుకొస్తాయి. రాచరికంలో చుట్టుప్రక్కల వాళ్ళకు చుప్పనాతి బుద్ధులు ఉంటాయి. అఖరకు యిది పి.వి.జి. రాజు లేక భాట్టం శ్రీరామమూర్తియా అన్న పరిస్థితి వరకు తీసుకు వస్తారు. పొట్టేలు పర్వతంతో ఢీకొనడమా? పోనీ పరిస్థితులతో రాజీపడదామా అంటే రైతు బతుకు మీద బండ పడుతోంది. ఎటూ తేల్చుకోలేని స్థితినాది. ఎందుకైనా మంచిదని పి.వి.జి. రాజుకే నేరుగా ఒక ఉత్తరం వ్రాశాను. జాబుకోసం ఎదురు చూడడం వృథాప్రయాస,

రెవిన్యూ పేచీలు నాకేం తెలుసు? పోలీసు తతంగం సుతరాము తెలియదు. నందిని పంది, పందిని నంది చేయగల సిద్ధహస్తులు. రైతు మేడిశెట్టి రాములు కుటుంబాన్ని శృళ్ళధాతం ళ్‌

జైలుపాలు చేశారు. తన స్వాధీనానుభవంలో ఉన్న పొలంలో పంటకోసి ఏనాడో తన కల్లంలో కుప్ప పెట్టాడు. అది నూర్చ్సు చేస్తున్నప్పుడు దొంగతనం నేరం మోపి కట కటాల మధ్య బంధించాడు. అప్పీలు కోసం న్యాయ సలహాకోసం విజయనగరం వచ్చిన రైతు రాములు నన్ను చూచి గొల్లున ఏడ్చాడు. నాలో మానవత్వం యింకా చావలేదు. బతికి ఉండి యీ అకృత్యాలను ఎలా భరించాలి? చచ్చినట్టు పడిఉండి నోరుకుట్టుకోవడం నాతత్వంకాదు! పొట్టిశ్రీరాములు సందర్శన భాగ్యం ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. రెండు పెద్ద ఉత్తరాలు తయారు చేశాను. ఒకటి అశోక్‌ మెహతాకు, రెండవది జయప్రకాష్‌ నారాయణకు. వాటి నఖలు పి.వి.జికి పంపించాను. పార్టీల్లో న్యాయస్థానాలు ఉంటాయా? ఆంధ్రాలో పార్టీకి పట్టుకొమ్మ పి.వి.జి. రాజు, ఆయన్ని తప్పుపట్టే సాహసం ఎవరికుంది? అశోక్‌ మెహతా నుండి మాత్రం జవాబు వచ్చింది. మద్రాసు వెళ్ళి పి.వి.జి.తో మాట్లాడడం మంచిది అన్నాడు. సమస్య పరిష్కారానికి ఆయన సూచించిన రాచబాట అది. ఇంతకీ ఇది ఎవరి సమస్య? నా సమస్యా? పార్టీ సమస్యా? (రాములు సమస్య ప్రక్కన పెడితే) (ఇంకా ఎంత దూరం వెళ్ళాలి నేను? ఆఖరుకు ఏమవుతుంది? పార్టీల సిద్ధాంతాలు కార్యక్రమాలు అనే రస విష గంధకాలు వంట ఇంటి పానీయాలు కావు. గుమ్మం ముందు కల్లాపు జల్లడానికి కూడా పనికిరావు. కావాలంటే బజారులో బాకొ ఊదడానికి పనికివస్తాయి. ప్రజల్లో భ్రమలు కల్పించడానికి పనికివస్తాయి.) మద్రాసు మీటింగు మద్రాసు శాసనసభా ప్రాంగణంలోని ప్రకాశం పంతులుగారి వసతిగ్భృహంలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడుగా రమ్మన్న పిలుపు వచ్చింది. అది 1952వ సంవత్సరం. అమరజీవి పొట్టిశ్రీరాములు మద్రాను నగరంలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న కాలమది. ఆ సమావేశం అనంతరం ప్రకాశం పంతులుగారి శలవు తీసుకొని తెన్నేటి విశ్వనాధంగారి సమ్మతితో మహర్షి బులుసు సాంబమూర్తిగారి యింట్లో (ప్రాయోపవేశం చేస్తున్న పొట్టిశ్రీరాములు గారిని మరుసటి దినం సందర్శించాను. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో పి.వి.జి.ని కలిసి యా భూసమస్య గురించి కదిపాను. అతడు చిందులు క్రొక్కాడు. అశోక్‌ మెహతానే పోయి అడగమన్నాడు. దేశంలో 96 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

న్యాయస్థానాలున్నాయని తెలుసా! తెలీదా? అన్నాడు. వాటిని ఆశయిస్తే న్యాయం జరుగుతుందేమో? ఆ తలుపు తట్టి చూడమన్నాడు.

సిద్ధాంతపరమైన అక్రమాలు లేవనెత్తి ధైర్యంగా రాష్ట నాయకత్వాన్ని నిలదీస్తే ఎవరు మెచ్చుకుంటారు? పెద్ద తలకాయలతో తలపట్లు(పట్టకపోతే) నీకే మంచిదంటారు! ఇప్పుడు ఇది ఎవరి సమస్య? రైతు రాములుకి తన పొలం తనకి కావాలి. యీ సిద్ధాంత రాద్ధాంతాలు అతనికెందుకు? పొలం యిప్పించడం చేతకాకపోయిందని అతడనుకుంటాడు. నామీద కత్తికట్టాడు పి.వి.జి వీడంతు చూద్దామని పి.వి.జి. అనుకుంటాడు. ప్రభువులకు దీర్హకాలేషీ

“నేరం ఘోరం నువ్వు చేసి కోర్టుకెక్కి నన్ను న్యాయం తెచ్చుకోమనడం ఏంటి? దున్నే రైతును మన్ను తినిపించడం సోషలిజమా?” అంటూ నేను ఢీకొన్నాను. దాంతో నాపై కక్ష పెంచుకున్నాడు.

షు ఈ ఈ

స్వేచ్చాభారతం " 97

పి.వి.జి. గరం గరం - కోట గుమ్మం తొక్కం

1955 సం॥లో మధ్యంతర ఎన్నికల్లో జిల్లా పాద్దీ నా పేరు యస్‌.కోట నియోజక వర్గానికి ప్రతిపాదిస్తే నాపేరు పనికి రాదని తిరస్కరించాడు. పార్టీ జెండా భుజాన్ని పెట్టుకొని రాత్రీపగలూ పరిశ్రమించిన జిల్లా పార్టీనేత అభ్యర్థిత్వానికి గడ్డిపోచ విలువకూడా లేకుండా తీసిపారేస్తే కార్యకర్తలకి కష్టం అనిపించింది మిగతా పెద్దలు కూడా తప్పుపట్టారు అసలు సిసలు కార్యకర్తలకు మొండిచేయి చూపుతూ జస్టీస్‌ పార్టీ పాదాల దగ్గరపడి పాతికేళ్లు వారికి ఊడిగం చేసిన గొట్టిముక్కల జగన్నాధరాజుకు పార్టీ తీర్ధం యిచ్చి భీమిలి టిక్కట్టు కట్టబెట్టడం ఏం బాగుంది అంటూ తిరగబడ్డారు కార్యకర్తలు. ఈ విధంగా నాతో ప్రారంభం అయిన తగువు గొట్టిముక్కల జగన్నాథరాజు మీద కేంద్రీకృతమైంది. అంతర్యుద్ధంగా మారింది. పట్టుదలలు పెరిగాయి. నేను పట్టిన కుందేలుకి మూడేకాళ్ళన్న చందాన ప్రవర్తించాడు పి.వి.జి. మంకుపట్టు. తన మాటకి తిరుగులేదని భల్లూకం పట్టు పట్టాడు. ఇది పొసిగే వ్యవహారం కాదని తేలిపోయింది. అంతటితో పార్టీశ్రేణులు రెండు శివీరాలుగా విడిపోయాయి. కోట గోడపట్టుకు వ్రేలాడే వర్గం ఒకటి. పి.వి.జి. ప్రజాస్వామిక నిరంకుశ ధోరణిని ప్రతిఘటించే కూటమి ఇంకొకటి.

ఎందుకు పుట్టిందీపార్టీ. కరుడుగట్టిన జస్టీస్‌ పార్టీ వృద్ధ జంబుకం గొట్టిముక్కల జగన్నాథరాజు అభ్యర్థిత్వాన్ని కార్యకర్తలంతా సంఘటితంగా ప్రతిఘటించారు. సోషలిస్టుపార్టీ జమీందారుల జేబుల్లోనుండి, కోట చుట్టూ తవ్విన కందకాల నుండి పుట్టిన పార్టీకాదు ప్రజల మధ్య పుట్టి ప్రజలకోసం ప్రజల కొఅకు పనిచేసేదే ప్రజాస్వామిక పాద్దీ. అది ధనిక పెట్టుబడిదార్ల ఖజానాలో పుట్టిన ముడి సరుకు కాదు సోషలిజం. దేశ స్వతంత్రంకోసం నిరుపమాన సేవలందించి, అపూర్వత్యాగాలు చేసిన విష్లవవీరుల రుధిరధారలనుండి, శామికవర్గం బానిస బంధనాలు విచ్చేదం చేయడంకోసం పుట్టిన పార్టి సోషలిస్టుపార్టీ. పీడిత తాడిత దళిత పతిత జనోద్ధరణకు పుట్టిన పార్టీ ఇది. ధనిక నిరంకుశ దోపిడీదారుల 98... భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్రు

ఆటకట్టించేందుకు - ఫ్యూడల్‌, బూర్జువా వర్గాల దౌర్జన్యాలు, దుర్మార్గాలు అంతు చూసేందుకు పుట్టిన పార్టీ సోషలిస్టుపార్టీ. రాచరికం ఉట్టిపడే నిరంకుశ మనస్తత్వం ఉన్నవాళ్లకు దాసోహం అనే బానిస మనస్తత్వాలున్న వాళ్లు కాదు పార్టీ కార్యకర్తలు. చర్చల సరళి వాడి వేడిగా సాగింది

ఈ ఘర్షణ రసకందాయంలో పడింది ఈ సంఘటనలో కె యస్‌. శాస్త్రి శివతాండవం చేశాడు ఘనత వహించిన కె.ఎ.యస్‌. తిలక్‌ మాత్రం మంటిబుక్కడంలా మూతి ముడుచుక్కూర్చున్నాడు. మౌనం వహించాడు. సాక్షీభూతంగా మిగిలాడు కె యస్‌.శాస్రి మాత్రం ఒకదశలో ఉగ్రుడయ్యాడు. పి విజి "“గెటవుటొ" అంటే “షటప్‌” అనవలసి వచ్చింది నీ ధోరణి మారకుంటే మళ్లీ నీ కోటలో అడుగుపెట్టబోం అంటూ నినదించి అంతా ని(ష్మమించాం. ఇది అనూహ్యమైన పరిణామం, పి.వి.జి ప్రమధగణాలు ఖంగుతిన్నాయి. పక్కవాయిద్యాల గాళ్ళు అవాక్కయ్యారు.

కోటగుమ్మం బలికోరుతుంది. ప్యూడల్‌తత్వం పెల్లుబికింది రాజరికపు రక్తం నిలువెల్లా నిరంకుశత్వం చాటింది, ప్రజాస్వామ్యం పలాయనం చిత్తగించింది పార్టీ సిద్ధాంతాలు అటకెక్కాయి. సోషలిజం ఫ్యూడలిజం అవతారం ఎత్తింది అందరూ నిషమించాక రాజావారు, తల పట్టుకున్నారట. ప్రభువుల వారి ప్రతిష్ట దెబ్బతింది. వారి అంతేవాసుల్లో కొందరు ఘటికులున్నారు ఆ (ప్రేరణతో త్వరితగతిని పావులు కదిపారు. ఖరారైన అభ్యర్థుల ఇళ్లకు కోటనుండి కారు వెళ్ళింది వారిని పట్టితెచ్చి పార్టీ టిక్కెట్టు, డిపాజిట్టు రుసుము చేతిలో పెట్టి బొట్టు పెట్టారు మీరు యమ్‌.ఎల్‌ ఏ. అవడం ఖాయమన్నారు ప్రభువు దీవనలు అందుకున్నారు

ఈ వర్తమానం పార్టీ కార్యాలయానికి చేరగానే వాళ్ళందరినీ తిరిగి పట్టుకొచ్చి టిక్కట్లన్నీ రిటన్‌ చేయించాం. బొబ్బిలి ఆరి గంగయ్య, చీపురుపల్లి అభ్యర్థి పసుమర్తి రామారావు యిద్దరూ మాత్రం తొణకలేదు, బెనకలేదు చివరివరకూ అలా ఉండిపోయారు. గోకా వెంకటరావు, గంట్లా సూర్యనారాయణ హరిజన అభ్యర్థులు, వారికి మినహాయింపు యిచ్చాడు. శాస్రిగారు, కురుక్షేత్రం రణరంగంలో ఏమి జరుగుతున్నదో సంజయుడు చెప్పాలి. అందరికన్నా పెద్ద, పార్లమెంటు సభ్యుడు కె యస్‌ తిలక్‌, జరిగిన కధనమంతా పూసగుచ్చినట్లు వ్రాసి స్వయంగా తన సంతకంతో కేంద్రకార్యాలయానికి ఫిర్యాదు పంపే సాహసం చేసాడు. ఉద్యమానికి ఊపిరి పోసాడు. స్వేచ్భాభారతం 9ం

గజపతినగర సీటు తిరస్కారం మాట అయినా ఎవరేం చెయ్యగలరు? పలుకుబడి అంతా పి.వి.జి.రాజుది పెట్టుబడి కూడా అతనిదే. తన పూర్వీకుల జమీందారుల ఘనకీర్తి జనం గుందెల్లో గింగుగుమంటూనే ఉంది ఓట్లు దండుకోడానికి అబాకా బాగా పనిచేస్తుంది కేంద్రనాయకత్వం కిమ్మనకుండా! తటస్థంగా ఉండిపోయింది. ఆశలు ఆకాశానికి ఎగదోస్తూ ఉంటే, అదృష్టం వరించిన అభ్యర్థుల్ని ఎంతకాలం ఆపగలం. ఆ తర్వాత అంతా జారిపోయారు నేనూ, శాస్త్రి మేమిద్దరమే మిగిలిపోయాం. న్యాయంగా శాస్త్రి గజపతినగర నియోజకవర్గం నుండి పోటీచేయాలి. జిల్లా పార్టీ నిర్ణయం ప్రకారం ఇప్పుడు జరిగిన సంఘటనల నేపథ్యంలో శాస్త్రిని ప్రక్కనపెట్టి ఆ టిక్కెట్టును నాకిస్తామని ఉత్తరం వ్రాశారు పి.వి.జి.రాజు గారు. నా సమ్మతి తెల్పమని కోరాడు ఇదే అదనుగా తీసుకున్నాను. దొరికేవ్‌ దొరా! అనుకున్నాను. తన ఉత్తరం ఆధారం చేసుకొని పి.వి.జి.రాజు చేసిన అక్రమాలన్నీ ఏకరువు పెట్టి, నిరంకుశత్వాన్ని ఎండగట్టి, జవాబు సంధించాను (ఆ ఉత్తరం కాపీ కేంద్రానికి పంపాను. గజపతి నగరం టిక్కెట్టు నాకు ఆఫర్‌ చేశారు గదా! అది నిరాకరిస్తూ, తిరస్కరిస్తూ అతను అనుసరించే పద్ధతిని దుయ్యపడుతూ జవాబు ఆ రాత్రికిరాత్రే పొర్టీ కార్యాలయం నుండి ఎన్నో రాయించాను ఆ తెల్లవారురూూమున పార్టీ ఆఫీసునుండి యింటికి చేరేసరికి “శాస్త్రి టిక్కెట్టు మీరు పుచ్చుకోలేదు కదా” అని అడిగింది మా ఆవిడ అంతవరకు విన్న వదంతులు కధనాలు బట్టి పుట్టిన ప్రశ్న యిది. “లేదు లేదని” చెప్పగానే బ్రతుకుజీవుడా, అనుకుంది. అందరూ వద్దంటే గజపతినగరం టిక్కెట్టును ఏం చేయాలి మరునాడు ఆఖరురోజు! దగ్గిరపడింది విశాఖపట్నంలో ఉన్న తన భార్య, కుసుమ గజపతిరాజు ను ఆఘమేఘాలమీద రప్పించి నామినేషను వేయించాడు. టిక్కెట్ల వితరణ పూర్తయింది. ఇహ ప్రచారపర్వం ప్రారంభం కావాలి కె.ఎ తిలక్‌ ప్రచారానికి బొబ్బిలి వెళ్ళిపోయాడు. కె.యస్‌. శాస్త్రి నర్సీపట్నం వెళ్లాడు విజయనగరంలో నేనొక్కడినే స్వంత ప్రాంతాన్ని అంటిపెట్టుకొని ఉన్నాను అప్పటికి పి.వి.జి.రాజుకి తెలుగు ఒక అక్షరం ముక్క కూడా రాదు. తర్జుమా పేరుతో పార్టీ పద్ధతిని భాట్టం ఏకరువు పెట్టగలడు. అది ఉభయతారకంగా ఉంటుంది భాట్టాన్ని పిలవమని హుస్సేనును పురమాయించాడు అతడు మా యింటికి వచ్చాడు. నా సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పాను. అయితే ఒక్క షరతు. కోటలో అడుగుపెట్టను అన్నాను. బయట వెయిట్‌ చేస్తానన్నాను. హుస్సేన్‌ వెనుతిరిగాడు పి.వి.జిని సంప్రదించి “సరేనంటూ” మళ్ళీ వచ్చాడు. 100 భాట్లం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

ప్రచారపర్వంలో భాట్టం పాత్ర

కారుముందు సీట్లో పి.వి.జి. కూర్చుంటాడు. వెనుకసీటులో హుస్సేను ఉంటాడు. కోట బయటకు రాగానే కారు తలుపు తీస్తాడు నేను వెళ్ళి వెనుకసీట్లో కూర్చుంటాను రోజల్లా మీటింగులు. పి విజి గురించి, పార్టీ గురించి ఘనంగానే చెప్తాను. వాపసు వచ్చేటపుడు రాత్రి పూట కోటగుమ్మం ముందు కారు ఆగుతుంది. క్రిందకు దిగి కాళ్ళకు బుద్ధి చెప్పి యింటికి చేరుకుంటాను. యిలా మూడు రోజులు గడిచాయి. కుసును గజపతిరాజు యీ సంగతి అంతా వింది “నీ పేరు చెబితేనే ఓట్లుపడతాయి. నీకు ప్రచారం ఎందుకు? భాట్టాన్ని నాతో పంపించండి” అని కోరింది. మర్నాడు హుస్సేను వచ్చి విషయం చెప్పాడు. ఆ తరువాత కొసవజకు ఆమెతోనే తిరిగాను. పరిచయం బాగా పెరిగింది నిండు ప్రేమాభిమానాలు చూపించింది ఆమె. తన తోను ప్రజలతోను, నేను మాట్లాడే తీరు ఆమెకు నచ్చింది. ఎన్నికలు గడచిపోయినా ప్రజల మధ్యకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆమె ప్రక్కన నేను తప్పని సరిగా ఉండాలి. ఎంతటి ఉదారబుద్దో, ఎంతటి మంచి మనస్తత్వమో ఆ తల్లిది. అయితే ఆమెతో కూడా పాత తంతే. కోట గుమ్మం ముందు ఆగిన కారునుండి బయటపడ్డాను. ఇంటిముఖం పద్దాను. పి.వి.జికి నిలువెల్లా కోపం! కసి! కుసుమ గజపతిరాజుకి మనసునిండా పరిపూర్ణ (పేమ, దయాభిమానాలు, కోటతో నా సంబంధం అనుబంధం యీ రీతిగా మలుపుమళ్ళింది. కొత్త రూపురేఖలు దిద్దుకుంటోంది.

3 స ఈ

శ్వళ్ళాభాతం

అమరజీవి త్యాగం - వివిధ విభజనోద్యమాలు అమరజీవి పొట్టిశ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష 1958 అక్టోబరు 19న ప్రారంభం అయింది. డిశంబరు 15 అర్ధరాత్రి వరకు 58రోజులు కొనసాగింది. ప్రత్యేకరాష్ట అవతరణ కోసం పలవరిస్తూ కలలు కంటూ తన పంచప్రాణాలు అనంత వాయువుల్లో చూస్తూ చూస్తూ విలీనం చేయడం ఎవరితరం? ఎప్పుడు ఎక్కడ జరిగింది. ఆ చారిత్రక పురుషుడు, ఆ కారణజన్ముడు, అమరజీవి ఆంధ్రరాష్ట్రానికి గుప్పెడు ప్రాణం పొయ్యాలని తన దేహాన్ని ధారబోసాడు. ఆ పవిత్రమూర్తి ఆ త్యాగపురుషుడు సజీవంగా ఉండగా దర్శనవర్శన సంభాషణ భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం. అది 1952వ సం!॥[మాట. నేను యం.ఎల్‌.ఏ అయింది 1957లో. ఆ తర్వాత తరం వారికి ఏమి తెలుస్తుంది. జాతినేతలు ప్రదర్శించిన అసమాన శౌర్యధైర్యాలు అవ[క్రపరాక్రమాలు. నిరుపమానమైన త్యాగపటిమ. (పార్యగ్రంధాలనుండి తప్ప) ఆంధ్రరాష్ట్ర ఉద్యమం వేరు. ప్రత్యేకాంధ్రోద్యమం వేరు. తెలంగాణా విప్లవం వేరు. 1952లో- 1969లో

  • 1972లో జరిగిన ఉద్యమాలివి అన్నీ చూసి అన్నిటా పాలుపంచుకున్న మా తరం సాధక బాధకాలు వివరించడం ఎవరితరం? రాక్షసబొగ్గు రగిలించి బతుకుబాటలో గుమ్మరిస్తే ఎలా దాటాం. ఎలా బయటపడ్డాం? ఆరని అగ్నిగుండంలో కమిలి కమిలి సమైక్యతను, సమగ్రతను సంరక్షించుకుంటూ ఎలా నలిగేము ఎలా మిగిలేము? త్యాగానికి విలువకట్టి జీతభత్యాలు రెండు చేతులా అందుకుంటూ స్వాతంత్ర్య సమరయోధులుగా రూపాంతరం చెందిన రాజకీయ బాధితులతో పోల్చి చూస్తే నేనేపాటి? నిప్పులు చెరిగినా నిలదొక్కుకొని అఖండ రాష్ట్రంలో ఖాండవదహనం చేసినా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాష్టసమగ్రతను ఎలా కాపాడాం, ఎలా సంరక్షించుకున్నాం? అమరజీవి ఆత్మార్పణ జరిపిన అనంతరం ప్రళయ భీకరంగా చెలరేగిన ఆంధ్రోద్యమ ప్రభంజనంలో యువసేనానిగా పట్టణపల్లై ప్రాంతాల్లో నిర్వహించినవిప్లవ భూమిక నేటికీ నా మనోనేత్రం ముందు కదులాడుతూనే ఉంది. మద్రాసుతో కూడిన ఆంధ్రరాష్ట్రం కావాలని ప్రతినపూని 102 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

ప్రాణాలర్పించిన పొట్టిశ్రీరాములు ప్రగాఢవాంఛ నెరవేరకున్నా - అచిరకాలంలో ముక్కోటి ఆంధ్రులం ఒక్కటవుతామని ఆంధ్రప్రదేశ్‌ సమైక్యతా పతాకం వినువీధుల్లో సగర్వంగా ఎగురగలదని ఆశలు పెంచుకున్నాం.

తెలంగాణా విభజనోద్యమం ఇంతలోనే 1969లో చెలరేగింది సాటిసోదరుల సమైక్య సహజీవనం దుర్భరమైంది విద్వేషాలు, వైషమ్యాలు విలయతాండవం చేసాయి. ఆంధ్ర సామ్రాజ్యవాదతత్వాన్ని రూపుమాపాలి అన్న తిరుగుబాటు బావుటా ఎగిరింది ఉ(దేకం కట్టతెంచుకుంది. ఆవేశం వెర్రితలలు వేసింది. ఆంధ్రజాతి అల్లరిపాలైంది నవ్వులపాలైంది. దౌర్జన్యవాదం కట్టలు తెంచుకుంది. హింసాకాండ పెల్లుబికింది. ఆంధ్రజాతి అంతరాత్మ గాయపడింది శాంతిసామరస్యాలు మటుమాయమయ్యాయి. ఆటవిక మనః ప్రవృత్తి ప్రబలింది దురాగ్రహాన్ని నిగ్రహంతో ఎదిరించడం, సమరం మధ్య సంయమనం ప్రదర్శించడం ఎవ్వరితరం? ఎంతకాలం? సహనంతో, త్యాగశీలంతో రాష్టసమ[గ్రతను పరిరక్షించుకోవాలన్న తపనతో కాలకూట విషాన్ని దిగమింగడం ఎవ్వరికి సాధ్యం ఎంతమందికి సాధ్యం. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా పరిత్యజించాడు. తెలంగాణా సమరయోధుడు పి.వి.నరసింహారావు పదవీ పగ్గాలు చేపట్టడంతో అంతవరకూ భగ్గుమన్న అగ్నిగుండం చల్లారింది. ఇప్పుడైనా ఆంధ్రజాతి నూతన భవితవ్యాన్ని తీర్చి దిద్దుకానే శుభతరుణం ఆసన్నమైందన్న ఆశారేఖ దృగ్గోచరమైంది. ప్రత్యేకాంధ్రోద్యమం

మళ్లీ యీమారు ప్రత్యేకాంధ్రోద్యమం పరవళ్లు తొక్కింది. జాతీ జీవితం అతలాకుతలమయింది ఆనాటి ఆగడాలకు అంతేలేదు. ఆగ్రహోదగ్రులైన నాయకమన్యులు నిప్పులు కక్కుతున్నారు. అక్రమార్కుల, ఆరాచక శక్తుల వికటాట్టహాసం మిన్ను ముట్టింది. ద్వేషకావేశాల వెల్లువలో రాష్ట్రం విలవిల్లాడింది. విచ్చిన్నకరశక్తుల స్వైరవిహారంతో సమైక్యతకు ఆయువు మూడింది అన్నారు. పాలభాండం పగలగొట్టేందుకు నెట్టుకున్నారు. ఏకోదరుల కడుపులో చిచ్చుపెట్టారు. ప్రమాద ఘంటికలు మారుమ్రోగాయి. సమైక్యతా వాదాన్ని పరిరక్షించే నాధుడే లేడా! మందలి వెంకటకృష్ణారావు ముందంజవేశాడు అన్నా నేనూ నడుంకట్టాం. లుకలాపు లక్ష్మణదాసు చెయ్యికలిపాడు. సమైక్యతా పతాకం అవనతం కాకుండా తను, ధన, మాన, ప్రాణాలను పణంగా పెట్టడానికి కంకణం కట్టుకున్నాం. ఉద్యమవాదుల ఆగడాల ఆగ్రహజ్వాలల అగ్నిగుండం మధ్య దినదిన గండంగా రోజులు గడుపుతున్నాం. స్వేచ్భాభారతం 1083

భార్యాబిడ్డల్ని అగ్నిగుండం మధ్య వదిలి, ఐక్యతావాదాన్ని అంటిపెట్టుకున్నాం నాడు (ప్రబలిన ఘోరకలిని, దారుణమారణహోమాన్ని ఎదుర్కోడానికి ఎన్ని గుండెలుండాలి. ఆంధ్రగడ్డ మీద అడుగుపెట్టకుండా గండ్రగొడ్డలి పట్టుకున్న ప్రతీపశక్తుల ప్రతాపాన్ని ఎలా తట్టుకున్నాం? ఎలా మిగిలాం? అది నిత్యాగ్నిగుండం, కత్తులబోను, శాసనసభ్యుల వసతిగృహాల పరిరక్షిత పరిసరాల్లో మేము రోజులు గడిపినా, మా భార్యా,బిడ్డలంతా ఆంధ్రప్రాంతంలో అరచేతిలో (ప్రాణం పెట్టుకొని దినదిన గండంగా భరిస్తూ జీవితం గడుపుతున్నారు. వారనుభవించిన అవమానాలు అపవాదులు ప్రమాదాల పరంపర తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. పసికూనలను కాలసర్పాలముందు విడిచిపెట్టాం నాడు సర్వత్రా ఎగసినసెగలు పొగలు ప్రతీకార జ్వాలలు తట్టుకుంటూ ఎలా నిలిచాం? ఎలా మిగిలాం? అమరజీవి పొట్టిశ్రీరాములు దివ్యచరిత్రను మననం చేసేటప్పుడు నాటి పరిణామాల (ప్రభావాన్ని తట్టుకుంటూ, సమైక్యతా సారధులుగా అన్న మండలి కృష్ణారావుతో పాటు, మేమూ మిగలడమే నేటికాలపు మరో అద్భుతం. స 2౬ ఈ 104... భొట్టొ శ్రీరామమూర్తి (్వీయ చంత్రు

పార్టీలో చీలికలు

సోషలిస్టు పార్టీలో చీలిక - నా భవిష్యత్తు

దేశంలో ప్రజాసోషలిస్టు పార్టీ పరిస్థితులు తారుమారవుతున్నాయి. అగ్రనాయకుల మధ్య విభేదాలు పొడచూపాయి పరిస్థితులు విషమించాయి. అశోకమెహతా ప్రతిపాదించిన సూత్రాలు పార్టీపతనానికి సోపానాలు అనేవాడు డా॥లోహియా (రామ్‌మనోహర్‌ లోహియా). 50166 0[4926600006 ౫06 6132866060 అంటూ అశోకమెహతా చేసిన సరిక్రొత్త వ్యూహరచనను తీవ్రస్థాయిలో పతిఘటించేవాళ్లు అనేకమంది ఉండేవారు. “కొన్ని అంశాలలో కాంగైసుతో మనం ఏకీభవిస్తాం. మనం సమ్మతించిన విధానాల్లో కాంగ్రెసుకు సహకరిస్తాం. మరికొన్ని అంశాలలో అంగీకారం కుదరదు. విభేదించిన మాటల్లో ప్రతిఘటిస్తాం” పార్టీ అనుసరించే పరస్పర వైరుధ్య వైఖరి దేశాన్ని గందరగోళంలో ముంచింది. పార్టీ కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఈ పరిస్థితి, కాంగ్రెసుకు లాభసాటిగా ఉంటుంది. మనకు ఆత్మహత్యా సదృశం అవుతుంది ఇది డా[రామమనోహర్‌ లోహియా భావన.

డా॥ లోహియా సహజంగా ఒక సిద్ధాంతకర్త. వారు ప్రవచించిన సిద్దాంతం వేరే విధంగా ఉంది. “716 1160 06661 61362006” అన్నది ఆయన మూలసిద్ధాంతం. కాంగ్రెసు, కమ్యూనిస్టుపార్టీలకు సమానదూరంలో ఉంటాం. ఎవరిప్రక్క(ప్రేమ ఒలగబెట్టం ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. ఇదీ వారి వాదనలోని సారాంశం. నాకు యిది ఎంతగానో నచ్చింది. ఈ వాద ప్రతివాదాల ఫలితంగా మరికొన్ని పరిణామాల కారణంగా ప్రజాసోషలిస్టు పార్టీ చీలిపోయింది. సోషలిస్టు పార్టీ డా।[లోహియా నాయకత్వం క్రింద ఏర్పడింది. జె పి.. అశోక్‌మెహతాలు పి.యస్‌ పి.లో ఉన్నారు. నేను ఎటు చేరాలి? శాస్త్రి తిలక్‌ పి.యస్‌.పి.లో ఉన్నారు. పి.వి.జి.రాజు యస్‌.పి.లోనికి వెళ్ళాడు. మా యిద్దరి మధ్య పచ్చగగడ్డివేస్తే భగ్గుమంటుంది. కాని నాకు లోహియాపార్టి సిద్ధాంతాలు నచ్చాయి. శొస్తి, తిలక్‌, నేను త్రిమూర్తులం. వాళ్షిడ్ణదూ పి.యస్‌.పి. ప్రక్కన వెళ్ళారు. స్వేచ్భాభారతం 105

వాళ్ళను వదిలితే నేను ఒంటరిని అవుతాను. ఇటు చేరితే పి.వి.జి.తో (వారశూల!) కణకణమండే నిప్పు ప్రక్కన ఎలా యిమడాలి? సందేహాలెన్నో నన్ను చాలా వేధించాయి. చివరకు తెగించి లోహియాపార్టీలో చేరాను. లోహియా (ప్రక్క ఎందుకు చేరాను? కారణం కొంచెం చెప్పాలి. ఆయన అన్నాడు. “డీ ౪01468 - & 90166 - & 341 యివి మూడు ఆయన (ప్రతిపాదించిన మూల కందాలు. “వోటు అన్నప్పుడు ఎన్నికల్లో ప్రక్రియలో పాల్గొనటం ప్రజాస్వామ్యబద్ధంగా “4 90166” అన్నది నిర్మాణ కార్యక్రమానికి సంకేతం, దుక్కి దున్నడం, మట్టి మొయ్యడం, రోధ్గువేయడం వగైరా. “*&ఎ2 4 ₹016అని ఎందుకన్నాడు? అన్యాయాలు, అక్రమాలు ప్రతిఘటించాలి. సొంఘిక దురాచారం దునుమాడాలి. దౌర్జన్యాలు, దోపిడీల మీద పోరాడాలి. యీ ప్రతి ఘటనల ఫలితంగా అవసరమైతే కటకటాల మధ్యకు వెళ్ళాలి ఇందులో ప్రజాస్వామ్యమూ ఉంది. నిర్మాణ కార్యక్రమమూ ఉంది. పోరాడే పద్ధతీ ఉంది. సత్యాగ్రహ సిద్ధాంతమూ ఉంది. స్వతం[త్ర పోరాటకాలంలో నాకు జైలు జీవితం ప్రాప్తం లేకపోయింది. స్వతంత్ర భారతంలోనైనా యీ కోరిక నెరవేరుతుందేమో! నే కన్న కలలు ఫలించాలన్న ఆరాటం! పోరాటం చేస్తూ ముందుకు దూసుకెళ్లాలన్న ఆ సిద్ధాంతమే నాకు నచ్చింది, అనుసరణీయం అయింది. శ్రమైక జీవనానికి తలపడినవాడికి పి.వి.జి.లాంటి అడ్డంకులు ఏమిచేస్తాయి? జాతినాయకత్వం ఏమైంది? ఆత్మవిశ్వాసం చచ్చిందా? మనోబలం లోపించడంవంటి బలహీనత నాలో లేకుంటే - పరాయివాడ్ని చూసి భయపడడమేంటి? (బ్రతుకుమీద భయం లేనివాడికి యముడు కూడా దిగదుపుడే! ఆ విధంగా సోషలిస్టు పార్టీలో స్థిరపడి కడకు బలపడ్డం జరిగింది. ఆంధ్రలో యీ పార్టీ పెద్దగా చెప్పదగ్గ మొదటిపేరు అయినంపూడి చక్రధర్‌. అన్ని విధాలా ఆయన నాకు నచ్చిన నాయకుడు. ఎందుకో ఆయన నాకు నచ్చాడు. ఒకనాడు జరిగిన సంఘటన ఆయన గుండెల్లో ముద్రపడింది అనుకుంటాను. గుంటూరులో 1954 ఫిబ్రవరి 20వ తేదీన జరిగిన రాష్ట్ర ప్రజాసోషలిస్టు పార్టీ మహాసభకు అధ్యక్షుడు శ్రీ కొమ్మారెడ్డి సూర్యనారాయణ. అశోక్‌మెహతా ఆరోజు గంభీరోపన్యాసం యిచ్చాడు. డిప్యూటీ స్పీకరుగా ఉన్న పసల సూర్యచంద్రరావు కూడా హాజరయ్యాడు. రాష్ట్రకార్యదర్శి (పి వి.జి.రాజు) ప్రవేశపెట్టిన కార్యదర్శి నివేదిక మీద చర్చ జరుగుతోంది. హరాత్తుగా నేను లేచాను. “ఇది పంచకళ్యాణీ గుర్రమే. అరక్షణంలో ఆరు ఆమడల దూరం దౌడు తీస్తుంది. ఆ నమ్మకం మనకెంతున్నా వీపు మీద సవారీ చేసేటప్పుడు నోటిలో కళ్ళెం 106 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

పెట్టి గట్టిగా పట్టుకోకపోతే అది ఆకాశంలో ఉంటుంది. మనం పాతాళంలో ఉంటాం.” పి.వి.జి సారథ్యం మీద విసిరిన చెణుకులు పైసభికుల్లో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. వీడు గట్టివాడే అనుకున్నాడేమో. చక్రధర్‌ నాతో ఎప్పుడూ స్నేహంగా, సఖ్యతగా ఉండేవాడు. అతడు రాజ్యసభ సభ్యుడిగా ఉండేవాడు ఆరోజుల్లో కేంద్ర పార్టీ నాయకులందరూ పార్లమెంటు సభ్యుల వసతి గృహాల్లో మకాం వేయడం మామూలు. సోషలిస్టు అ(గ్రనేతలందరూ చక్రధర్‌కి చిరపరిచితులే. అలాగే డా॥లోహియా కూడా ఇక్కడొక మాట చెప్పాలి. సత్యన్నారాయణరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే సోషలిస్టు నాయకుడు “ర్రవీరే” అతని క్వార్టరులోనే దిగేవాడు అంతటితో సన్నిహితత్వం పెరిగింది ఆ తరువాత “రబీరే” లోక్‌సభ స్పీకర్‌ అయ్యాడు. సమయం సందర్భం చూచుకొని సత్యన్నారాయణరెడ్డిని గవర్నరుగా వేయించాడు. అతడు చాలాకాలం అ పదవిలోనే ఉన్నాడు.

ఒకమారు విజయవాడలో రాష్ట్రసోషలిస్టు పార్టీ మహాసభలు జరిగాయి. మైలవరం (రాజా) యస్‌.వి. ఆర్‌.జి. నరసింహారావు ఆహ్వాన సంఘ అధ్యక్షుడు. నాడు డా॥లోహియా గంభీరోపన్యాసం చేశాడు. ఆ ఉపన్యాసం తెలుగులో నేను తర్జుమా చేశాను. అదీ చక్రధర్‌ కల్పించిన పెద్ద అవకాశం అందరూ అది మెచ్చుకున్నారు. అప్పుడునన్ను రాష్ట్రపార్టీ సహాయకార్యదర్శ్భిగా ఎన్నుకున్నారు. పి.వి.జి.రాజుకు శృంగభంగం

1955వ సం॥॥లో అభిలభారత సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక (06864100) మహాసభలు హైదరాబాదులో జరిగాయి కోకొల్లలుగా సోషలిస్టు నాయకులు దేశం నలుమూలల నుండి వచ్చారు. బదరీ విశాల్‌ పిట్టి (మహదేవ్‌ సింగ్‌) వంటి పెద్దల సారధ్యంలో ఘనంగా జరిగిన మహాసభలు అవి. పి.వి.జి. రాజు అప్పటికే దేశ రాజకీయాల్లో తలదూర్చాలన్న కుతూహలంతో ఉన్నాడు. అన్ని హంగులూ ఉన్న ఆయన జాతీయ నాయకత్వస్థాయికి ఎదగాలనుకోవడం సహజమే. ఆ తరుణంలో అఖిలభారత సోషలిస్టు పార్టీ కార్యదర్శి పదవి కావాలని కలలుగన్నాడు. హైదరాబాదులోనే పార్టీ కేంద్ర కార్యాలయం నెలకొల్పాలని దాని ఖర్చులను అన్నీ తానే భరిస్తానని కూడా అగ్రనాయకత్వం దగ్గర వాగ్దానం చేశాడుట. కుసుమ గజపతిరాజు కూడా యీ మహాసభలకు హాజరయింది. అయితే నాటి మహాసభల్లో పి.వి.జి. ఆశలు అడియాశలయ్యాయి

షు ఈ ఈ

స్వేచ్చాభారతం 107

రాజకీయ పాఠశాల లోహియా బోధనలు

ప్రధానకార్యదర్శిగా “మధులిమాయి” ని ఎన్నుకున్నారు. ఆయన సభకు హాజరు కాలేదు కూడా (ఆయన భార్య చిన్నపిల్లాడ్ని చంకలో పెట్టుకొని బొంబాయి నుండి వచ్చింది) గోవాలో జరిగిన సత్యాగ్రహంలో మధులిమాయిని అరెస్టు చేశారు. నిర్బంధంలో ఉన్నందున మహాసభలకు ఆయన రాలేకపోయారు. అయినా అతడు జాతీయ ప్రధానకార్యదర్శి అయ్యాడు. పి.వి.జి.రాజు ఖంగుతిన్నాడు

ఆ తరువాత మద్రాసులో రెడ్‌ హిల్స్‌లో నెలరోజులపాటు సోషలిస్టు పార్టీ శిక్షణాశిబిరం నిర్వహించింది. దానికి నేనూ ఆరాధ్యుల అప్పారావు వెళ్ళాం. యం.యస్‌. అప్పారావు స్నేహలతారెడ్డి గార్లు ప్రధానంగా కార్యక్రమ నిర్వహణకు బాధ్యతవహించారు. పి.వి.జి.రాజు కీలకపాత్ర నిర్వహించవలసి ఉన్నా ఆయన మొహం చాటేశాడు.

యీ నెలరోజుల్లో చాలామంది ప్రముఖుల ప్రసంగాలు వినే భాగ్యం కలిగింది. నాడు అన్నాదొారై వచ్చాడు. గవర్నర్‌ శ్రీప్రకాష్‌ వచ్చాడు. ఇంకెందరో ప్రముఖ విజ్ఞానవేత్తల (ప్రబోధాలు విన్నాం. నేను డా॥లోహియా చేసిన ప్రతీ ప్రసంగానికి నోట్సు వ్రాసి - టైపు చేయించి - ఒక కాపీ డా॥లోహియాకు యిచ్చేవాడిని లాంగ్‌హ్యాండ్‌లో యధాతథంగా తన ఉపన్యాసం ఎలా వ్రాయగలిగేవంటూ ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడు

ఆయన నన్ను తరుచూ ్రోత్సహించేవాడు. ఒక ప్రక్కపి.వి.జి. మీద మండిపడుతూ నన్ను దగ్గరకు చేర్చుకుంటూ ఉంటే ఆయనకు కన్ను కుట్టింది జాతినేత సాన్నిధ్యంలో నెలరోజులు గడిపాను. ఆయన (ప్రేమాభిమానాలు చూరగొన్న ముఖ్యులలో నేనొకడ్ని ఆయన చెప్పిన ఎన్నో ఎన్నెన్నో ఘటనలు నా గుండెల్లో పదిలంగా గూడు కట్టుకున్నాయి. వేరొక సందర్భంలో మరొక ఉదంతం మీముందు ఉంచుతాను.

ప్రతీ ప్రసంగం తరువాత ప్రశ్నోత్తరాల సమయం ఉండేది. ఒకమారు డా॥ లోహియా సోషలిస్టు పార్టీ పుట్టుపూర్వోత్తరాలు గురించి గంభీరంగా మాట్లాడాడు ఆ సందర్భంలోనే కార్ల్‌ మార్క్సు గురించి, సోషలిస్టు భావాలు విశ్వవ్యాప్తం అవడం గురించి ఉన్న ఘనచరిత్రను 108 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

ఉటంకించి ఉర్రూతలూగించారు. ఆనాడు ఆయన వాడిన ప్రతీమాట వజ్రాలమూట, ఆదర్శాల బాట. ఒకమారు సర్వత్రా నిశ్శబ్దం నెలకొన్న తర్వాత రామబాణం లాంటి ఒక గొప్ప ప్రశ్న వేశాడు.

సోషలిజం అంటే ఏమిటి?

“సోషలిజం అంటే ఏంటి?” అని అడిగాడు. మీరు ఏం అర్ధం చేసుకున్నారో చెప్పండి అన్నారు. సాటిలేని మేటినాయకుని ముందు సమాధానం చెప్పే సాహసం ఎవరికీ లేకపోయింది. (అప్పుడు ఆయనే అన్నాడు) “నేనే చెప్తాను “113 2601060601 ఉరగ” బెనా? కాదా?” అన్నాడు. సమానత్వాన్ని ప్రతిపాదించే సూత్రమే ఇది. బెనా! కాదా! అని అడిగాడు. అందరూ బెనన్నట్లు తలపంకించారు. అంతటితో ఆయన సంతృప్తి పడలేదు. “మనకన్నా ఆర్థికంగా, సామాజికంగా పై అంతస్తులో ఉన్నవారితో సరిసమానంగా ఉండాలని అందరూ కోరుకుంటారు, కాని మన కన్నా తక్కువస్థాయిలో ఉన్న జనంతో సమానంగా ఉండాలని కోరుకుంటారా? అందుకు సిద్ధపడతారా? అన్నాడు. అంతా నిశ్శబ్దం. జవాబు చెప్పే మనిషిని చెయ్యి ఎత్తమన్నాడు. ఒక్కడు మాత్రమే చెయ్యెత్తాడు. అప్పుడు డా॥లోహియా అన్నాడు. “నీ సమాధానంతో నన్నైనా వంచన చేస్తావు లేదా! ఆత్మవంచనైనా చేసుకుంటావు నన్నైనా మోసగిస్తావు లేదా నిన్ను నీవైనా మోసగించుకుంటావు. ఈ రెండూ మంచివి కాదు. ఈ ప్రశ్న నీవు, నీవు ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండు! నీకు సంతృప్తికరమైన సమాధానం వచ్చినప్పుడే నీవు అసలు శిసలు సోషలిస్టువి అని అనుకో అన్నాడాయన. అంతరంగాన్ని తరచి చూసుకోమన్నాడు. నన్ను నేనే కొలిచి చూసుకోవాలన్నాడు. ఆత్మపరీక్షకు నిలబడమన్నాడు. అంతవరకు ఆదర్శ మానవుడవు కావన్నాడు. ఇలా మంచితనాన్ని రంగరించి నూరిపోసి, పుటం పెట్టి నిగ్గుతేల్చేవాడు. సోషలిస్టు భావాల పటిమ పెంచేవాడు.

డా॥ లోహియా బహుముఖ ప్రజ్ఞావంతుడు, కార్యశూరుడు. ఆయన చేసిన కఠోర పోరాటాలు ప్రయోగాలు చరిత్ర పుటల్లో నూతన అధ్యాయం తెరిచాయి. స్వాత్రంత్య సంగ్రామంలో ఆయన జరిపిన పోరాట ఘట్టాలు భారతజాతికే ఆదర్భం - ఆయనకు ఇల్లులేదు, ఇల్లాలూ లేదు. దేశమే ఆయన ఇల్లు. జనమే బంధుగణం. ఆదర్శజాతీయవాది. అఖండ దేశభక్తుడు, మహాత్ముని అనుచరుడు, ప్రముఖ గాంధేయవాది. ప్రతీ ప్రసంగంలోనూ మహాత్ముడు ఎప్పుడు ఏది ఎలా చేసేవాడో పూసగ్రుచ్చినట్లు చెప్పి ఉత్తేజపరచేవాడు.

ఒకమారు గాంధీజీ నౌకాలీ ఖర్చుల కత్తుల బోనులో ఉన్నాడు. (వారిని సందర్శించా లని లోహియా వెళ్ళాడట) ఎప్పుడు ఎవరు కుత్తిక ఉత్తరిస్తారో తెలీదు. రక్తం రుచిమరిగిన స్వేచ్భాభారతం 109

మహమ్మదీయులతో నిండిన గ్రామంలో మకాం వేశాడు మహాత్ముడు. శాంతి స్థాపించాలని సమరం అరికట్టాలని! రక్షణ కవచం లేకుండా వంటరిగా కాలాంతకుల మధ్య విడిది. ప్రతిక్షణం (ప్రమాదకరమే! సపరివారంగా కూడా కాదు. ఒంటరిగా అంత వార్ధక్వంలో నిస్సహాయంగా, నిరాధారంగా బస చేశాడు. నిజానికి మహాత్ముడు ఎన్నడూ ఒంటరికాడు! భగవంతుని సాహచర్యంతోనే ఉంటాడు! పరమేశ్వరుని పరిరక్షణలోనే ఉంటాడు. గుందెల్లో కొలువై ఉన్న దేవదేవుని దివ్యవాణి విని మరీ ముందడుగు వేస్తాడు. గాంధీజీతో నౌఖాలీలో = హిందూ ముస్లింల కొట్లాట ప్రతీచోటా జరుగుతోంది. రక్తపుటేర్లు ప్రవహిస్తున్నాయి. ఆ స్థితిలో మహాత్ముడ్ని పరామర్శించడం ఉచితమనిపించి డా॥ లోహియా గాంధీ గుడారం ముందు దండం పెట్టి నిల్చున్నాడు. అప్పుడు గాంధీ గారంటారు “నువ్వు గొప్ప దేశ నాయకుడివి. నేనొక చిన్న కార్యకర్తను. నా మాట వింటావా? నేను చెప్పిన ఒక చిన్న పనిని చేస్తావా?” అని. “బాపూజీ యిలా అనడం ధర్మమా? మీరు చెప్పిందే చెయ్యడం నాకు అసిధారా వ్రతం శలవు యిమ్మన్నాడు” ఎక్కువవద్దు, పది ముస్లిం మొహల్లాలకు వెళ్లు నీవే తలుపు కొట్టు. ఆ రాత్రి సీవు నీ చిత్తమొచ్చిన చోట పెట్టిన మీటింగుకు రమ్మనమని స్వయంగా ఆహ్వానించు. ఎందరొస్తారో, ఏమయిందో నాకు చెప్పు అన్నాడు. “ఇది నాకు ప్రాణగండం అయింది. హిందువు కనబడితే రక్తం కళ్ళజూచే రోజులు, కరకు తురకల గడపను త్రాక్కడం ఎలా? తలుపుతట్టి నా ప్రసంగానికి పిలవడం ఎలా? మహాత్ముడు చెప్పింది చెయ్యాలి. చావో రేవో వారి ఆజ్ఞకు తిరుగులేదు. వెళ్ళి చూశాను. ముందు మీటింగు స్థలం వెదికి చాపలు పర్చి దీపం పెట్టి కూర్చున్నాం. పిలుపునందుకొని పరుగున వస్తారా? ముస్లిం జనాభా! క్రుళ్లి కసరేవాడొకడు. కసిరి ఉరిమే వాడొకడు! ఉమ్మేసేవాడింకొకడు! మొహం వాచేటట్లు తిట్టేవాళ్లెందరో! యిలా బహువిధ అనుభవాల మధ్య బాపూజీ చెప్పినట్లు ప్రతి మొహల్లాకు వెళ్లి ప్రాధేయపడి సమావేశానికి రమ్మన్నాను. ముందే మహాత్ముడు చెప్పాడు. మైకు పెట్టుకుని బాకా ఊదడం పనికిరాదు. ఆగష్టు విప్లవవీరుడు, సోషలిస్టు నాయకుడు, జాతి అగ్రనేత సమావేశం జరుగుతున్నట్లు జోరుగా ప్రచారం చెయ్యడం పనికిరాదన్నాడు. అందుకే ఇది అగ్ని పరీక్ష నాటి మీటింగు సమయానికి అరడజను మంది హాజరయ్యారు! నా నోట మాట రాక ముందే ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకాయన “మీ హిందూకాంగ్రెస్‌ మా ముస్లిం నాయకుడు జిన్నాని సామ్రాజ్యవాదుల కీలు బొమ్మంటున్నారు. నువ్వేమంటావు” అన్నాడు. “జెను” అన్నాను! అంతే ఆ ఒక్కమాటతో మొత్తం అంతా రెచ్చిపోయారు. తిట్ల పురాణానికి లంకించుకున్నారు. అందరూ తలోదారి 110 భాట్టం శ్రీరామమూర్తి (్వీయ చరిత్ర

పోయారు. ఒక్కడు మాత్రం నాతో మిగిలాడు. అతడొక్కడినే పట్టుకొని గాంధీగారి వద్దకు చేరాను. “నేను చెప్పింది చిన్నపనా? పెద్ద పనా?” అన్నది గాంధీగారి మొదటిప్రశ్న. “చాలా పెద్దపని మహాత్మా!” అన్నాను. '్చీ మీటింగు ఫలితం ఏంటి?” అని అడిగాడు. “ఇదిగో అని నా వెంట వచ్చిన యువకుడ్ని చూపించాను” చాలు యింక నువ్వు శలవు తీసుకోవచ్చును. వేలరూపాయలు ఖర్చుపెట్టి, లక్షలాది జనాన్ని ప్రోగుచేసి ఆకాశం దద్దరిల్లేటట్లు ఉపన్యాసం యిస్తే ఆఖరుకి ఈ ఒక్కడూ కూడా మిగలడు. ఎవరి దారిన వారు పోతారు. ఇప్పుడొచ్చిన ఒక వ్యక్తి వెయ్యిమంది బలం, శాంతి సైనికుడితడు. ఇకవెళ్ళి రమ్మని ఆశీర్వదించాడు. గాంధీగారితో పనిచేయడం సామాన్యం కాదు. దాః లోహియా భావ పరంపర

మనం గొప్పవాళ్లమని పని చిన్నదని భావించి అందులో తలదూర్చం. నిజంగా పెద్దపనే అయితే మనం చిన్న వాళ్లం ఇంత పెద్ద పని ఎలా చెయ్యగలం? అని తప్పుకుంటాం! “చిన్నపనికి పెద్ద, పెద్ద పనికి చిన్న యివేనా మన కొలతలు, ప్రమాణాలు. ఈ తర్మం మీ జీవితం నిరర్ధకం చేస్తుంది. చిన్నపనిలో ఉన్న పెద్ద ఆశయాలను చూడండి. జాతిపై ఏ ప్రభావం చూపిస్తుందో గమనించండి. ఇట్టి మనస్తత్వం ఉంటేనే దేశానికి పనికొస్తారు. “పనికి పరార్‌! తిండికి తయార్‌” ఈ పద్ధతి మంచిదికాదు. ఊరంతా బద్దకం చూపిస్తే గోరంత గొప్పతనం కూడా రాదు. పనికి వెరిచేవాడు (ప్రజాసేవకుడు కాడు. బరువు బాధ్యతలు ్రకృవాడి నెత్తినపెట్టి, కీర్తి ప్రతిష్టల కిరీటం మనం పెట్టుకోవాలన్న తత్వం మరింత చెడ్డది. కొండను ఢీకొన్నా ప్రాణం తునాతునకలైనా, ఎత్తిన బావుటా దించనివాడే పురోగమించగల కార్యకర్త. అతడే దేశ భవితవ్యానికి వెన్ను దన్ను. అంటూ కర్తవ్య బోధ చేసేవాడు. “మహాత్ముడు మట్టిలోంచి మాణిక్యాలను సృష్టించేవాడనే వాడు. మట్టి మనిషితోనే దేశ భవిష్యత్తుకు పునాదులు పడాలని డా॥ లోహియా ఆశించేవాడు. ముందడుగు వేసిన వెనుకబడిన తరగతుల నేతలే దేశ భావి చరితను లిఖిస్తారని చెప్పేవాడు. వర్గం, వర్ణం వేరు కాదు. వర్జమే వర్గంగా ఘనీభవించి రూపొందుతుంది. కామరాజు నాడార్‌ దేశనేత అవుతాడు. అన్నాదురై అగ్రవర్దానికి గోరీ కడతాడు. “నిరుపేద దేశ అధినేతగా రోజు కావాలి” యీ విధంగా తరతమ బేధాలు తలఎత్తకుండా, సాటి మానవులను తోటి సహోదరులుగా భావించి పురోగమించి, దేశ పునర్నిర్మాణం చేయాలని బోధించేవాడు. పి.వి.జి.వైఖరి

యే రీతిగా చూచిన ఆనాటి రాజకీయ పాఠశాల మాకొక పునర్జన్మ ప్రసాదించింది. మమ్మల్ని పునరుజ్జీవితుల్ని చేసింది. “ఏ నాయకుడికయ్యా తెల్సు పీపుల్సు పల్ప్సు”? అన్న స్వేద్ధభరతం న్య

మాట విన్నాం. కర్మ కర్త మనసు తెలిసిన జాతి నేతను యిప్పుడు మేము చూస్తున్నాం. మధ్యాహ్నం భోజనానంతర విరామ సమయంలో కాళ్లు చాచుకొని యీజీ చెయిర్‌ లో పడుకున్న లోహియా చుట్టూ కొందరం చేరేవాళ్ళం. అనుకోకుండా పి.వి.జి. రాజు అదుగుల చప్పుడు ఒకనాడు వినబడింది. చేతులు కట్టుకు నిలబడ్డాడు. నక్క వినయాలు ఒలగబోసాడు. ఇన్నాళ్లు ఎందుకు కనబడలేదని డా॥లోహియా నిలదీసాడు. పదిమంది మధ్యపెట్టి ఇలా గుస్సా అయితే రాచపుట్టుక పుట్టిన మనిషి తట్టుకోలేకపోయాడు. (1 12/6 మట్రు/01ల 01%88 (0 60 9షి) అన్నాడు పి.వి.జి. డా॥లోహియా బిగిసిపోయాడు. “506౪01! ఉంగ1 926 జ 04ల 1112 60 60? ౪% ఖు ] 51008 ౪20 0616 101 & [0801 అన్నాడు. అంతటితో తలవంచుకొని సారి సారి సర్‌ అంటూ వెనుదిరిగాడు. మళ్లీ పిలిచి అసలు వచ్చిన విషయం ఏమిటో చెప్పమన్నాడు లోహియా. మీరు సావధానంగా ఉంటే చెప్తాను అన్నాడు. అప్పుడు మిగతా కార్యకర్తలు బయటకు నడిచారు, నేను మినహా! ఆంధ్రా ఎస్సంబ్లీలో రాజ్యసభ ఎన్నికలున్నాయి. నాయకంటి శంకరరెడ్డిని బలపర్బాలని నిర్ణయంతో ఉన్నాం. ఇది మీరు ఆమోదించాలని అన్నాడు. “ఇది నీ నిర్ణయమా? పార్టీ నిర్ణయమా?” అడిగాడు లోహియా. పి.వి.జి. మౌనం దాల్చాడు. “నాయకులు, తన స్వంత నిర్ణయాన్ని పార్టీ నిర్ణయంగా పరిగణించే పద్ధతి ఒకటి ఉంది. ఇందుకు నేను విరుద్ధం. పార్టీ నిర్ణయాన్ని తన నిర్ణయంగా భావించి అమలు చేసే నేతలు కావాలి దేశానికి అంటూ గ్రుచ్చి చూశాడు పి.వి.జి.వైపు. “ఇప్పుడు మీరేం చెయ్యమంటారో చెప్పండి” అన్నాడు పి.వి.జి. “సమయం లేనందున మధ్యేమార్గం సూచిస్తాను. ఇక్కడున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో సం్రదించి తీర్మానం చేసి అది నా ముందుంచండి. కాదంటే కాన్పూరులో జరిగే మరుసటి కార్యవర్గ సమావేశంలో దీన్ని ఆలోచించవలసి ఉంటుంది!” అని లేచిపోయాడు. ఖంగుతిన్న పి.వి.జి, ఇప్పుడు అతడు (పి.వి.జి.) ఖంగుతిన్న మనిష్‌ దెబ్బతిన్న పాము బుసలు కొడుతూ అసలు మనుష్యుల కోసం వెతుకుతున్నాడు. అతని మాట కాదనేవారెవరు, రాష్ట్రంలో? ఓదార్పు మాటలు నాలుగు చెప్పి అతని ప్రతిపాదన ఖాయం చేస్తూ కాగితం మీద దసకత్తు చేసి తీర్మానం రూపంలో లోహియా ముందుంచాం. అప్పుడామోదించాడాయన ఎక్కడా బెణకడు! ఆ కాలంలోనే పి.వి.జి. శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్లమెంటుకు వెళ్ళాడు. అప్పుడు విజయనగరం సీటు ఖాళీ అయింది. ఎవరిని 112 భాట్టం శ్రీరామమూర్తి (భ్వీయ చరిత్ర)

నిలబెట్టాలి? చిత్రం! పి.వి.జి. చిత్తం చెల్లదు. పైగా లోహియా “కమ్‌చీ” పట్టుకుంటాడు. ఎప్పుడు ఎలాంటి సంప్రదింపులు జరిగాయో తెలీదు!

సమావేశాలు శిక్షణం శిబిరం సమాప్తం అయింది. శెలవు తీసుకొనే ముందు లోహియాను దర్శిస్తే “3420 8౦ 206 [16 ౫౦౪ 00102600 10 7120/2022ట000” అన్నాడు లోహియా. కృతజ్ఞతా పూర్వకంగా నమస్కృతులు సమర్పించి విజయనగరం వచ్చాను. విజయనగరం అసెంబ్లీ ఎన్నిక

అప్పటికి విజయనగరంలో సీను మారిపోయింది. కుసుమ గజపతిరాజు మనసు ఎరిగి మసలుతున్నందున, నేను లేకుండా ఏ ప్రజా కార్యక్రమానికి బయటకు వెళ్ళేది కాదు. డా॥లోహియా అన్నట్టు నిర్మాణ కార్యక్రమం చేయాలని ఆమె కృత నిశ్చయంతో ఉంది. చెయ్యాలని త్రవ్వు పనికి తట్ట మోతకి బురదపాడు చెల్వు దగ్గరికి తీసుకువెళ్ళాను. చుట్టు ప్రక్కల గ్రామాల జన సమీకరణం జరిగింది. అందరూ రంగంలో దిగారు. చెజ్వు ఊడ్చేశారు. పక్కాపని జరిగింది. జన సందోహం సందడి పడిపోయారు. కుసుమ గజపతిరాజుకు జేజేలు కొట్టారు. మేము విజయనగరం చేరుకుంటున్నాం. ఇంకా కంటోన్మెంటు రాలేదు. ఆమె అందుకుంది.

ఉగ? ఉం3'13౫/0౪ 60౧6 10 116 [077 అంది. పూర్వం జరిగిన కొన్ని మతలబుల కారణంగా పి.వి.జితో తగువుపడి అడుగుపెట్టకూడదనుకున్నాం అన్నాను. ఆమెకు పూర్వపరాలన్నీ తెలుసు అమాయకురాలేమీ కాదు. *పి.వి.జి. దగ్గరకు రమ్మనలేదు. నా గదికి రమ్మన్నాను" అంది ఆమె. అది మాత్రం కోట కాదా! అన్నాను. ఆ కోటలో నాకు వాటా లేదా? అని అడిగిందామె. ఇంతకీ నేనుండే గదికే నిన్ను స్వాగతిస్తున్నానంది. మారు మాటాడకుండా ఆమె వెంట గదిలోనికి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను. ఆమె ప్రక్క గదిలోకి వెళ్ళి విజయ్‌ అని గొంతెత్తి పిలిచింది. రెండుమార్లు, హడావుడిగా అతడు గదిలోకి ప్రవేశించాడు. నన్ను చూచి నిర్భాంతపోయాడు. ప్రక్క కుర్చీ దూరంగా లాక్కొని అందులో చతికిలపడ్డాడు. ప్రక్కనే ఉన్న పత్రిక తీసి చదువుతున్నాడు. నేను యింకో పేపరు తిరగేస్తున్నాను. ఇంతలో రాణిగారు వచ్చింది. చెరోకప్పు కాఫీ యిచ్చింది.

“మౌనంగా కూర్చున్నారు. మీకు నోట మాటలు రావా?” ఎవరం జవాబు చెప్పలేదు. నా పక్కతిరిగి తన భర్ర నీకన్నా అన్ని విధాల పెద్దవాడు పక్కన కూర్చున్న పెద్దమనిషిని పలకరించడం (నమస్కరించడం) లాంటి మర్యాద కూడా నేను నీకు చెప్పాలా అంది. స్వేద్భాభరతం1కే9ి

హఠాత్తుగా లేచి పి.వి.జి.కి ఒక నమస్కార బాణం వేశాను. ఇప్పుడామె పి.వి.జి. ప్రక్క తిరిగింది. “యింత పెద్దరాజాధికారం చేతిలో పెట్టుకుని చిలిపి తగవుల నడుమ నలిగిపోవడం నీకు చిన్నతనంగా లేదా?” అంటూ “నీ గడప త్రాక్క్మిన గృహస్తుడ్ని గౌరవిస్తే ఘనత వహించిన నీ సంస్కారపు ఘనకీర్తి తరిగిపోతుందా?” అంది. అప్పుడతను చేయి చాచాడు. నా చెయ్యి కలిపి కరస్పర్శ చేశాను. తరువాత మాటల్లోకి దింపింది. అడపా దడపా పరస్పరం మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఏ పూర్వ జన్మ బుణానుబంధమో బొంబాయిలో పుట్టి అమెరికాలో చదివి విజయనగరం రాణీ అయి, నా జీవితంలో క్రాత్తపుటలు తెరచిన ఆ సాధ్వీమణి ఎన్నడూ మరపుకు రాదు. పి.వి.జి. పార్లమెంటుకు వెళ్ళాడు. ఉపఎన్నికల సమయం దగ్గజ పడింది. పి.వి.జి. విజయనగరంలో మకాం వేశాడు. ప్రతీ సాయంకాలం చిన్న సభ జరిగేది. కోట మేడమీద. రాజవంశీకులు అందరూ విచ్చేసే వారు. మరికొంతమంది పురప్రముఖులు కూడా రావడంరివాజు. నేను కూడా వెళ్ళి ఏదో చివరన కూర్చొనే వాడిని మాటా మంతీ లేకుండా, రాజాగారు విజయనగరం వదిలి వెళ్లే సమయం వచ్చింది. నా విజయనగరం టిక్కెట్టు, నేను అడగను! కోరండి ఇస్తానని అతడు అనడు! లోలోపల లోహియా చెప్పిన మాట ధీమా నాకు లేకపోలేదు! అయినా విషయం బయటపడాలి కదా! ఢిల్లీ వెళ్లే ముందురోజు సాయంకాలం సభికులందరి ప్రక్కతిరిగి “౦౫౦190౪ ౪10 13 1౫ 5400655017” అన్నాడు పి.వి.జి. జొన్న వలస ప్రముఖులా డెంకాడ రాజ మార్తాందులా? ఎవరెవరని? అందరూ తహతహలాడుతు చూస్తున్నారు. సరే! నేనే చెప్తానంటూ “31220 13 ౧ 58006550౯7” అన్నాడు. “3 100 అంటూ నా ప్రక్క తలత్రిప్పాడు. నేను నా వెయ్యెత్తి నమస్మారం పెట్టాను. ఆ విధంగా నేను విజయనగరంలో సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడం జరిగింది. అది 1957వ సం॥లో. “పులి బక్కరడం అయ్య బకతడమా?” అంటారు. పులినోట్లో తలపెట్టి మరీ బయటపడ్డాను! నా పేరు విని భగ్గుమన్న మనిషి - తన నోట నామాట తానే చెప్పాడు చుట్టు ప్రక్కలందరికీ! ఎక్కడ డాక్టరు లోహియా? ఎక్కడ నేన? ఆయన దయదల్బడమేంటి? గండం దాటి పిండం బయట పడడమేంటి? భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ పరిపాలన సజావుగాసాగుతుంది. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి. అతడగ్గీరాముడు, అతను తలచింది తలపు. పక్కవాడు మాట్లాడలేదు. “ఇంత మెజార్టి పెట్టుకొని ఒక్క సీటుకు కక్కుర్తి ఎందుకు? అది మనకు దక్కుతుందో లేదో! పోనీ వదిలేద్దాం” అన్నారాయన. పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఉపఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాను 1957వ సం॥లో బడ్జెట్టు సెషన్సు మధ్య. స ల ఈ క. భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్రు

అసెంబ్లీ అనుభవాలు

పోటీలేకుండా ఎన్నికైన (సోషలిస్టు) ప్రతిపక్ష సభ్యుడిగా 1957 సం.లో అసెంబ్లీలో అడుగుపెట్టాను. గుండెనిండా ఆదర్శాలను రంగరించుకొని, ఉద్వేగాన్ని నింపుకొని, ఉన్నత, సామాజిక, ఆర్థిక లక్ష్యాలకోసం నవసమాజ నిర్మాణం కోసం పరాక్రమించాలన్న తపనతో, తపోదీక్షతో, శాసనసభా ప్రాంగణంలో అడుగుపెట్టాను. సుదూర ఆశయాలను అందుకొనే పరశువేదిగా, వేదికగా, పవిత్ర క్షేత్రంగా శాసనసభ దృగ్గోచరం అయింది. చిరకాలంగా జీవితంలో పెనవేసుకున్న ఉత్తమ జాతీయ లక్ష్యాలకు, సమసమాజ సాధనకు ఉద్యమించే శుభతరుణం ఆసన్నమైందనిపించింది. అరక్షణం అప్రమత్తంగా ఉంటే కోటి ప్రాజాలు కాపాడే పవిత్ర లక్ష్యం నుండి పతనం అవుతామనిపించింది. నిత్య నిరంతర జాగరూకత, నిరంతర కృషి సర్వసంసిద్ధత, విషయపరిజ్ఞానం పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాలు మూల సూత్రాల, నిబంధన పరిపూర్ణ పరిజ్ఞానం కోసం అసెంబ్లీ భవనంలోని గ్రంథాలయ 'ప్రాంగణమే మూలకందంగా భావించి పరిశ్రమించడమే ప్రథమ ధర్మంగా పెట్టుకొని కార్యక్రమాలకు ఉప[క్రమించేను. అన్ని రంగాల్లో నిష్ణాతులు, సేవాధర్మంలో అగ్రశ్రేణిలోని త్యాగధనులు, నిప్పుల్లాంటి నీతివంతులు, గుణగణాల్లో అ(గ్రగాములు వంటి ప్రతిపక్ష సభ్యుల సరసన ఆసీనులవడానికి ఎంతో తాహతుకావాలి? నీటిలోంచి నిప్పులు పుట్టించగల ప్రజ్ఞాధురీణులు ప్రతిభావంతులు శస్తాస్తాలు సదా సంధించి, అదను కోసం, అప్రమత్తంగా సర్వసంసిద్ధంగా ప్రతిపక్ష స్థానాల్లో నివురుకప్పిన నిప్పుల్లా, ఆదర్శాల అంతస్తుల్లా, అవినీతిని అంతం చేసేందుకు, అక్రమార్ముల దురంతాల అంతు చూసేందుకు, సమర కుతూహలంతో సభాప్రాంగణాన్ని వెయ్యి కళ్ళతో వీక్షిస్తున్నారు. వారి సమక్షాన లభించిన స్థానం సర్వదా స్ఫూర్తిదాయకంగానే ఉండేది.

ప్రముఖ ప్రతిపక్షనేత సుందరయ్య కరచాలనం అందుకున్నాను. తరిమెల నాగిరెడ్డి ఘంటానాదాన్ని వింటున్నాను. వావిలాల ఆప్యాయత, పలకరింతలు పులకరింతలు పెట్టాయి. భాట్టం బాణితో ప్రతిపక్ష శ్రేణుల బలపరాక్రమాలు ఇనుమడించాలంటూ ఆశీర్వదించారు. సమరోత్సాహంతో కదనరంగంలో కాలుపెట్టిన సవ్యసాచికి కురుక్షేత్రంలో స్వేచ్చభరతం షేర్‌

భీష్మ-ద్రోణ-కృపాది మహామహుల ప్రథమ సందర్శనం వలె సభాప్రాంగణం అవలోకిస్తే అష్టదిగ్గజాల వంటి పలువురు పెద్దలు గోచరించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అరివీర భయంకరులై, అహింసాయుత పోరాటంలో సుప్రసిద్దులెందరో తమ స్కంధావారాల్లో ప్రభుత్వ పక్షంలో అగ్రగాములుగా కొలువుతీరి ఉన్నారు. నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, కళా వెంకట్రావు, కాసు బ్రహ్మానందరెడ్డి, దామోదరం సంజీవయ్య అందరూ ఆధునిక భారత జాతినేతలుగా చరిత్ర సుప్రసిద్ధులైన పెద్దలే మంత్రిమండలిలో ఉన్నారు. కొండా వెంకటరంగారెడ్డి, మందుమల నర్సింగరావు, జె.వి. నర్సింగరావు, తెలంగాణంలోని తెలుగు తేజాలెందరో, కంటికి కనిపిస్తున్నారు.

అధ్యక్షన్థానంలో అయ్యదేవర

స్వతంత్ర సంగ్రామంలో కాకలు తీరిన త్యాగధనుడు, దేశభక్తుడు, బహుముఖ (ప్రజ్ఞాశాలి మహాత్మాగాంధీ సన్నిహిత సహచరుడు స్వాతం శ్రోద్యమానికి ప్రతీకగా ఉత్తమ జాతీయ లక్ష్యాలకు ప్రతిబింబంగా మధుర మందహాసాలు చిందిస్తూ, ఆదర్శాల శిఖరాలపై ఆశీనులైనట్టు అధ్యక్షస్థానం అలంకరించారు ఆంధ్రత్వం మూర్తీభవించిన మహామనిషి అయ్యదేవర కాళేశ్వరరావు. తెలుగుతనానికి నిలువుటద్దంగా భాసించే విజ్ఞాన, ప్రజ్ఞాన భాస్మరుడు అయ్యదేవరవారు. ఆ వృద్ధమూర్తికి సవినయంగా ప్రణతులర్చించి యథోచిత స్థానంలో స్థిరపడ్డాను,

"అలనాటి సభాసదులు, రాజ్యాధినేతలు, ప్రతిపక్ష పరాక్రమశాలుర గుణగణాలు, ప్రతిభా ప్రజ్ఞానవైభవాలు గుర్తించి మనం ప్రశాంత చిత్తంతో నేడు సభాస్థలి నలంకరించిన ప్రజాప్రతినిధుల ప్రజ్ఞాపాటవాలు ఎంతవరకు సరితూగగలవో (గ్రహించెదం గాక! “రాముడంతటి నాయకుడుంటే హనుమంతుడంతటి సేనాని ఉంటాడంటారు! నీతి నియమాలకు నిలయమైన నిజజీవితం నుండే క్రమశిక్షణ, కార్యనిర్వహణ అమలు జరుగుతాయి. మద్రాసులో ప్రకాశం పంతులు దర్శనం

1952వ సం.లో మద్రాసులో (ప్రకాశం పంతులు శాసనసభా ప్రాంగణంలోని విడిది గృహంలో ప్రాయోపవేశం చేస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములును దర్శించిన చిత్తరువు నా చిత్తంలో హత్తుకుపోయింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టడంతో రాష్ట్రం అట్టుడికినట్టు ఉడికిపోయింది. గుక్కతిప్పకుండా గంటల తరబడి ప్రభుత్వం దుమ్ముదులుపుతూ గొంతు చించుకొని గుండెలదరి పోయినట్లు వీరావేశంతో 116 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

ఉగర్రూతలూగుతూ ఉరుములు ఉరిమినట్టు ఆకాశం అదిరిపోయేటట్టూ గంభీరోపన్యాసాలు చేయడం అలవాటు అయిపోయింది. అసెంన్లీలో ప్రసంగానికి ఎన్ని నిబంధనలు పాటించాలి, కొద్ది రోజులు తదేకదీక్షతో పరిశీలించి అసెంబ్లీ విధి విధానాలు ఒంట పట్టించుకొని సభాధ్యక్షులు కాళేశ్వర రావు చాంబరులోకి ప్రవేశించాను.

ఆర్థికమంత్రి బెజవాడ గోపాలరెడ్డి (ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రసంగించాలని కుతూహలం. ఎంత టైము కావాలన్నారు? కాళేశ్వరరావు “అరగంట” అన్నాను. “ఆ కొత్తగా వచ్చేవు అప్పుడే అంతటైమా? ఐదు నిమిషాలు ఇస్తానొన్నారు. ఆయన నా దీన వదనం జాలిగొలిపిందేమో సరే ప్రసంగం బాగుంటే అదనంగా అవకాశం ఇస్తానన్నారు.

ఐదు నిముషాల ప్రసంగానికి ఉద్యుక్తుడనయ్యాను. అదే నా ప్రథమ ప్రసంగం గళం విప్పితే శృతి మెత్తగా సరళ గంభీర స్వరంతో పుంఖాను పుంఖంగా విమర్శనాస్త్రాలు సంధించడం పరిపాటి “పరాయి వ్రభుత్వంతో జరిగిన స్వాతంత్ర్య సంగ్రామమనే సముద్ర మథనంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమనే” హాలాహలం ముందుగా ఉద్భవించింది. అది మింగేస్తే ఆ తర్వాత జాతి జనులకు అమృతం లభిస్తుందని, అన్నాను. అంతటితో సభమారు (మైోగిపోయింది. క్రొత్త పన్నుల ప్రతిపాదనలు బడ్జెట్‌లో లేవు అన్నారు ఆర్థికమంత్రి. అందుకై యిలా వ్యాఖ్యానించాను. అరణ్యవాసంలో సీతమ్మ వారికి బంగారు లేడి కనబడింది. సీతమ్మ వారు ముచ్చటపడింది. రామబాణంతో అసువులు బాసిన తర్వాత అది మాయామృగం మారీచుదడని బయటపడింది. అది వంచనకు పరాకాష్ట అదనపు పన్నుల భారం లేదన్నది కూడా అంతే. రాబోయే రోజుల్లో పన్నులభారం దొడ్డి దారిన ప్రవేశించి నడ్డి విరుస్తుందని ప్రాజ్జులు గమనించెదరు గాక అన్నాను. ఈ ప్రసంగం చాలా ప్రముఖంగా దినపత్రికలు ప్రచురించాయి. పత్రికలకు స్పీకరు హెచ్చరికలు

ఆ మూడోరోజు ఒక ప్రివిలేజిమోషన్‌ పెట్టాను. ఆనాడు రాష్ట్రకాంగైస్‌ అధ్యక్షుడు నూకల నరోత్తమరెడ్డి. ఆయన ప్రచురిస్తున్న గోల్కొండ దినపత్రిక నా ప్రసంగ పాఠాన్ని భాట్టం శ్రీరామమూర్తి (లోహియాపార్టీ) అని ప్రచురించింది. నేను గెలిచింది సోషలిస్టు పార్టీ టికెట్‌ మీద. ఈ వార్త చూస్తే నేను పార్టీ మార్చానని అనుకోవాలా? ప్రజలు. ఇది నా హక్కులకు భంగం వాటిల్లినట్టు అప్రతిష్ట చేకూర్చిన్నట్లు అంటూ మాట్లాడాను.

ముఖ్యమంత్రి సంజీవరెడ్డి సమాధానం చెప్పాలి. వారు మాట్లాడుతూ మేము జవహర్‌లాల్‌ నెహ్రూ పార్టీ అంటే గర్విస్తాం గానీ తన పార్టీ నేత పేరు పెడితే శ్రీరామమూర్తికి స్వేచ్చాభారతం మ17

అవమానకరంగా ఉందట! అంటూ హేళనగా సమాధానం చెప్పారు. వెంటనే నేను లేచి “ఆ పార్టీకి ఒక పాలసీ లేదు. ప్రోగ్రాం లేదు. నాయకుల పేరు చెప్పుకొని చెలామణి అవడానికి చూస్తారు వారు. మాకు కార్యక్రమాలు ముఖ్యం. ఆదర్శం ముఖ్యం” అన్నాను. నా ట్రివిలేజి మోషన్‌ స్పీకరు త్రోసి పుచ్చుతూ పత్రికల వారికి ఇటుపైన ఆవిధంగా ప్రచురించవద్దని హెచ్చరిక చేశారు.

(గ్రామోద్యోగుల సమ్మె తీవ్రంగా జరుగుతున్నది. ప్రభుత్వం కఠిన దందన చర్యలు అనేకం తీసుకుంది. రెవిన్యూ పద్దుపై ఈ సమ్మె గురించి ఎవ్వరినీ మాట్లాడనీయడం కాదు. రెవిన్యూ మంత్రి కళా వెంకటరావు ఏదో అద్దు పెడుతున్నాడు. ఆ దినం నేను ఆఖరున మాట్లాడుతాను. ఒక్క పొడుగాటి సుదీర్థమైన వాక్యసముదాయంతో దూసుకొని, తోసుకొని ముందుకు వెళ్ళాలని అనుకున్నాను. మంత్రి అవరోధానికి అందకుండా “గ్రామోద్యోగస్తుల ఉద్యమాన్ని దుర్మార్గంతో, జబరదస్తీతో, దౌర్దన్యంతో అణగద్రొక్కటానికి ప్రయత్నించే ప్రభుత్వం ప్రజల ప్రజాస్వామిక ప్రభుత్వం ఎలా అవుతుంది?” అంటూ దూసుకుపోతూ ఉంటే మంత్రి చాలా రెస్ట్‌లెస్‌గా ఉన్నారు. పాయింట్‌ ఆఫ్‌ ఆర్టర్‌ లేవనెత్తాను. గౌరవ సభ్యులు దుర్మార్గం, దుర్మార్గం అని పదే పదే అంటున్నారు. ఇది చాలా అభ్యంతరకరం ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. దుర్మార్గం అంటే ఏమిటి? అని ఆఖరు మాటగా అన్నారు. స్పీకరు నా ప్రక్కకు చూశారు.

“దుర్మార్గం అంటే సన్మార్గం కానిది. సన్మార్గం అంటే ఏదో వారికి తెలియకపోతే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను” అన్నాను. ఇంతటితో ప్రతిపక్షాల హర్షధ్వానాల మధ్య నా ప్రసంగం పూర్తి అయ్యింది.

ఇంకోమారు సంజీవరెడ్డి మాట్లాడుతూ విజయనగరం బహిరంగ సభలో సంజీవరెడ్డిని రావణాసురుడుతో పోల్చుతూ ఉపన్యాసాలు ఇచ్చాడు శ్రీరాంమూర్తి బాగుందా? అసి ప్రళ్నించారాయన. ఆ వెంటనే పాయింట్‌ ఆఫ్‌ పర్సనల్‌ క్లారిఫికేషన్‌ మీద లేచి “శతకోటి రుద్రాభిషేకాలు భక్తి ప్రపత్తులతో చేసిన రావణబ్రహ్మతో ఈ సంజీవరెడ్డిని పోల్చేటంత తప్పిదం చేస్తానా?” అన్నాను. అందరూ గొల్లున నవ్వారు. కాళోజీ నారాయణరావు ఆ రోజుల్లో శాసనమండలిలో సభ్యులుగా ఉండేవారు. వారు ఈ మాటవిని ఎమ్మెల్యే క్వార్టర్సుకు రాగానే నన్ను కౌగలించుకొని అభినందించారు.

ఒకరోజు ల్యాండ్‌ హోల్డింగ్‌ సెన్సస్‌ బిల్‌ మీద చర్చ జరుగుతోంది. పుచ్చలపల్లి సుందరయ్య ఒక సవరణ ప్రవేశపెట్టారు. ఎక్కువ భూమి ఉన్నా తనకు తక్కువ ఉన్నట్టు ప్రకటిస్తాడు. అప్పుడు ఏమి చెయ్యాలి? అదనంగా ఉన్న భూమిని ప్రభుత్వం నష్టపరిహారం 118 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్రు

చెల్లించకుండా స్వాధీనం చేసుకోవాలి అని సవరణ పెట్టారు. అది రాజ్యాంగ విరుద్ధమని రెవిన్యూ మంత్రి వాదన! రాజ్యాంగంలో ఒక ఆర్టికల్‌ చదివి విన్సించారు. నష్టపరిహారం చెల్లించకుండా ఎవరి ఆస్తులూ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చెల్లదు అని దాని నసాదాంశం. ఆ ఆర్టికల్‌ చూస్తానని సుందరయ్య కోరికపై పుస్తకం వారికి అందించారు. ఆయన చూడాలి, చదవాలి. అంతవరకూ సభ నిశృబ్దంగా ఉండాలా? నేను మాట్లాడుతాను... అన్నాను. *క్రాత్తగా వచ్చారు ఇది రాజ్యాంగ విషయం” అన్నారు స్పీకరు. 'అవును తెలుసు” అన్నాను. మీరు చదివేరా 'రాజ్యాంగం' అన్నారాయన. “అయ్యా! నన్ను పరీక్ష చేయదలచుకొంటే నేను మీ ఛాంబరులోకి వస్తాను. ఇది శాసనసభ నా హక్కులు గుర్తించి నన్ను మాట్లాడనివ్వండి” అని అర్ధించాను. అది వారికి అంతగా నచ్చలేదు. అయినా మాట్లాడటానికి అనుమతించారు. నాది కాదు అన్నట్టు ఆ భూమిని తనది అని ప్రకటించనప్పుడు “అన్‌ డిక్లేర్డ్‌ ప్రాపర్టీ గా ప్రభుత్వం ఆ ఆస్తి తీసుకోవచ్చు గదా! నష్టపరిహారం ప్రశ్న ఎందుకు వస్తుంది అన్నాను. “తండ్రి చేసిన తప్పుకు తన కడుపున పుట్టిన బిడ్డ హక్కుపోదు. నష్టపరిహారం సమస్యను అంత స్తులభంగా (త్రోసిరాజు అనడానికి న్యాయశాస్త్రం ఒప్పదు.” నా వాదనను స్పీకర్‌ త్రోసిపుచ్చి వారి న్యాయశాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నట్లు భావించుకున్నారు. ఆ తర్వాత పదిరోజులు నన్ను మాట్లాడనియ్యలేదు.

ఈ బిల్లు ఈ రోజే పాస్‌ చేయిస్తాను అన్నాదు కళావెంకటరావు. మూడురోజులు టైము పడుతుందన్నారు సుందరయ్య, 40,50 సవరణలు ప్రతి ఒక్కరం ఇచ్చాం. చర్చపేరుతో కాలం వ్యర్థమౌతుందని రెవిన్యూ మంత్రి మా మాటలకు సమాధానం చెప్పడం మానేశారు. ఓటింగ్‌ పెట్టమంటారు. ఓడిపోతుంది. ఈ విధానం ఘోరంగా ఉందని సుందరయ్య అభ్యంతరం చెప్పారు. “గౌరవ సభ్యులు మాట్లాడమని నిర్బంధించే అధికారం నాకూ లేదు” అన్నారు స్పీకర్‌, ఆ తర్వాత నా సవరణ మీద మాట్లాడడానికి లేస్తూ “అధ్యక్షా! మంత్రిగారికి కంటి చూపే గాని, నోటి మాట లేదు. కడు విషాదకరమైన పరిస్థితి ఏర్పడింది, ఈనాడు” అన్నాను. అప్పటికే వెంకటరావుగారి ఆరోగ్యం బాగులేదు. ఆవేశంగా ఒక్కమారు లేచారు. గడగడ సమాధానం చెప్పారు.

ఒకమారు బి.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు. హక్కుల తీర్మానం ప్రవేశ పెట్టారాయన. “గాడిదకు గడ్డివేస్తే ఆవుపాలు ఇస్తుందా!” అని సంజీవరెడ్డి తన నియోజక వర్గంలో బహిరంగ సభలో మాట్లాడారు. దీనిపై జరుగుతున్న చర్చమీద గందరగోళం చెలరేగింది. “ఏదైనా ఆధారం ఉంటే చూపించమ”న్నారు స్పీకరు. “నేను స్వయంగా స్వేచ్చభరతం 219

విన్నాను” అన్నారు సుబ్బారెడ్డి. లిఖిత పూర్వకంగా ఆధారం ఉందాలి అని గర్జించి అడిగారు స్పీకర్‌. అప్పుడే అసెంబ్లీ లైబ్రరి నుండి ఆ ప్రసంగం ఉన్న పేపరు పట్టుకొని లోపలకు వచ్చాను. సుబ్బారెడ్డి ఒక పక్క కందుల ఓబుల్‌రెడ్డి ముందు భాగాన కాకాని వెంకటరత్నం కూర్చొని ఉన్నారు. ఈ గొడవ గ్రహించి ఆ పేపరు భాగాన్ని సుబ్బారెడ్డికి అందించాను. అప్పుడు స్పీకరు అనుమతి లభించింది. పత్రికలో పడ్డ వార్త ఆధారంగా (ప్రసంగించడానికి ఆనాడే సభాధ్యక్షుడు అయ్యదేవర కాళేశ్వరరావు అనుమతించారన్నది ఇక్కడ గమనార్హం.

ఇంకోమారు కుసుమ గజపతిరాజు ప్రసంగించారు. నాకు గుర్తున్నంతవరకు ఆమెది అదే మొదటి, ఆఖరి ప్రసంగం కూడా. భారీ పరిశ్రమల శాఖ మీద చర్చ జరుగుతోంది. కుసుమ గజపతి రాజు మాట్లాడడానికి లేచారు. ఆ ప్రసంగ పాఠంలో ఇలా ఉంది. “నిజామ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ షేరు విలువ పడిపోయింది. మంత్రుల మార్కెట్‌ విలువ పడిపోయినట్టు!” సంజీవరెడ్డి కోపోద్రిక్తులయ్యారు. తన సమాధానంలో సి.యం. యిలా అన్నారు. “కుసుమ గజపతిరాజు శాసనసభ సమావేశాలకు అసలు రానేరారు. ఈ మారు వచ్చారు. రావడమే కాదు ఏదేదో మాట్లాడారు. మగవాళ్ళు అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు. గాని ఆడమనిషి అనేటప్పటికి నేను పాయింట్‌ ఆఫ్‌ ఆర్దర్‌ లేవనెత్తాను. ఆ వాక్యం పూర్తి చెయ్యనివ్వలేదు. మగవాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు అంటారేమిటి ఈ ముఖ్యమంత్రి. “అధ్యక్షా! చాలా అవమానకరంగా అభ్యంతరకరంగా ఉంది ఆ మాట ఉపసంహరించుకోమని కోరాను. సభాధ్యక్షులు ముఖ్యమంత్రి వైపు చూశారు. వారు లేవ లేదు. అప్పుడు స్పీకర్‌ “నేనూ అలాగే అనుకుంటాను. మగవాళ్ళు అప్పుడప్పుడూ పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తూ ఉంటారు” అన్నారు. వెంటనే శరవేగంతో లేచాను. “ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం విన్న తర్వాత - నేను కూడా మీలాగే అప్పుడప్పుడూ మగవాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారని గ్రహించగలిగాను” అన్నాను. అప్పుడు సభ గొల్లుమంది. ఇంతలో కళా వెంకటరావు లేచారు (బ్రహ్మాస్టం లాంటి పద ప్రయోగం చేశారు. “అటువంటి మగవాళ్ళు అందరికీ శ్రీరామమూర్తి ఏకైక ప్రతినిధా అన్నట్లు ఇంత ఉలిక్కి పడి లేస్తున్నాడు!” అన్నాడాయన. నేను హతాశుడనయ్యాను. ఏమి అనాలో తెలియలేదు.

ఇలా చణుకులు ఉండేవి. ఛలోక్తులు ఉండేవి. హాస్యరసం ఉట్టి పడుతూ ఉండేది. సూటిగా, ఘాటుగా మాట్లాడినా పద్ధతికి విరుద్ధంగా ఉండేవి కావు. పార్లమెంటరీ భాష మాత్రమే ప్రయోగించేవారు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వారు చిత్తానుసారం గొంతు ఎత్తేవారు కాదు. స్పీకర్‌ దృష్టిని ఆకర్షించాలి. వారు అనుమతిస్తేనే సీటు నుండి 120... భొట్ట శ్రీరామమూర్తి గ్వేయ చరిత్ర

లేవాలి. గొంతువిష్పాలి. వారి చెవి ఆకర్షించడానికి కూడా ప్రయత్నం చేయడం నిషిద్ధం. గొడవ, గందరగోళం ఎప్పుడూ ఎరగం. వాకౌట్‌ ఉండేది. వాటికి స్పీకర్‌ అనుమతి కూడా ఉండేది. సభాపతి ఆజ్ఞలకు అందరూ బద్భులై ఉండేవారు. స్పీకర్‌ కూడా అందరికీ అన్ని అవకాశాలు పార్లమెంటరీ పరిమితులకు లోబడి కలుగజేసేవారు. శాసనసభ బయట (ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రకటన చేసుకొంటుంది. ప్రచారం చేసుకొంటుంది. శాసనసభలో మాత్రం పగ్గాలు ప్రతిపక్షాల చేతిలోకి వస్తాయి కొంతవరకు. అప్పుడు కూడా అదుపు తప్పడానికి వీలు లేదు. భావస్వేచ్చ ఇతోధికంగా అందరూ అనుభవించేవారు. ధాటిగా, ధీమాగా, హేతుబద్ధంగా సంప్రదాయానుసారం తమ గుండెల్లో గూడదు కట్టుకున్న ఆవేశాలు, ఆదర్శాలు, ఉద్వేగంగా క్రమపద్ధతిన వ్యక్తీకరించే సావకాశం సాధారణంగా సర్వులకు ఉండేది. అసెంబ్లీ గౌరవాన్ని రాష్ట్రగౌరవాన్నిి ఇనుమడింప జేసేటట్టు హుందాగా, అందరూ సభలో ప్రవేశించే లగాయితూ ని'ష్మమించేవరకు గొంతు విప్పింది మొదలు, ప్రసంగం ముగించే వరకు నియమబద్ధంగా వ్యవహరించేవారు. శాసన సభ సభ్యుడిగా కర్తవ్య నిర్వహణలో సభాషప్రాంగణంలోని ముచ్చట్లు ఇంకా

విశదంగా వివరించి వసిగించడం ధర్మం కాదు. ముక్తసరిగా ముగింపు వాక్యాలు కొన్ని వివరిస్తాను. అవధరించండి. ఒకమారు డా. యమ్‌.యన్‌. లక్ష్మీ నరసయ్య ప్రవేశపెట్టిన పంచాయితీ రాజ్‌ పద్దుపై కాంగ్రెస్‌ సభ్యుడిగా నేను ప్రసంగించాను. ప్రతిపక్షం స్థానంలో ఆసీనుడైన ప్రముఖ నాయకుడు తెన్నేటి విశ్వనాథం గారు ఎంతో ముచ్చటపడ్డారు. నా ప్రసంగం విరమించిన తరువాత హఠాత్తుగా లేచి కొద్దిపాటి మాటలు చెప్పే అవకాశం యిప్పించమని స్పీకరును కోరాను. అంతటి నాయకుడి (ప్రసంగానికి స్వల్ప వ్యవధి ఎలా సరిపడుతుంది? అన్నారాయన. విశ్వనాథం గారు అందుకొని రెందేరెండు మాటలు మాట్లాడుతాను అన్నారు. కాదని ఎలా అంటారు స్పీకరు? అప్పుడాయన అన్నారు కదా! “తన ప్రసంగంలో ముందు వెనుక యీ పద్దు బలపరుస్తున్నానన్న మాటలు మినహాయించి మిగతా మొత్తం భాట్టంగారి ఉపన్యాసం అంతానా స్వంత ఉపన్యాసంగా నమోదు చేయవలసిందిగా కోరుచున్నాను" అని కూర్చున్నారు. అప్పుడు కళ్లు తెరిచాడు పంచాయితీ రాజ్‌ మంత్రి నర్మగర్భంగా భాట్టం నన్ను నిలువునా చీల్చి కూల్చాడన్నమాట! అనుకున్నాడు. బయటకు వచ్చేముందు నా పట్ల ఆగ్రహం వ్యక్తం చేసి పసైమాటనే అన్నాడు. ఏమైనా విజ్ఞుడు విజ్ఞానవేత్తలు అయిన విశ్వనాథంగారు ప్రతిపక్షంలో ఉండి కూడా పాలకపక్షం సభ్యుని ప్రసంగాన్ని ప్రశంసాపూర్వకంగా సభాముఖంగా (స్తుతించాడు. నాకు కొండంత బలం యిచ్చింది. ఇది అత్యంత అరుదైన సంపుటన! స్వేచద్చభరతం 22

మరోమారు దాదాపు యిలాగే జరిగింది. నేను పబ్లిక్‌ అకౌంట్సు కమిటీ సభ్యుడి ఇది వరకు కూడా చాలా మార్లు ఉన్నాను. ఇంకా ఎన్నో కమిటీల్లో కూడా చాలా మంది ప్రముఖులతో కలిసి పనిచేసాను. ఒకమారు రావినారాయణరెడ్డి మరొకమారు వావిలాల గారు. జలగం వెంగళరావుగారితో, పుచ్చలపల్లి సుందరయ్యగారితో, పి. వి.నర్సింహారాను గారితో యింకా ఎందరెందరో పెద్దలతో కలిసి పనిచేసాను. అది పెద్ద చిట్టా. ఈ నూరు యీ కమిటీకి అధ్యక్షుడు తరిమెల నాగిరెడ్డి. సమావేశానికి నోటీసు యిచ్చిన తరువాత

  • జైలు కెళ్లాడు. ఖైదీగా ఉన్నందున కమిటి సమావేశానికి హాజరు కాలేదు. పెద్దలు తెన్నేటి

విశ్వనాథంగారు కూడా ఆ కమిటీ సభ్యులే. కాని ఎందుకో వారు కూడా హాజరు కాలేదు. సహజంగా యిది ప్రతిపక్షనాయకులు అధ్యక్షత వహించి నిర్వహించవలసిన బాధ్యత. అన్ని శాఖల ఉన్నత అధికారులు అధ్యక్షుని పిలువు మేరకు ఫైళ్ళు పట్టుకొని హాజరు అవుతారు వారి సహాయసిబ్బందితో సహా. హాలు నిండిపోతుంది. నాగిరెడ్డి గారు లేనప్పుడు ఎవరు అధ్యక్షత వహించాలి. సభికులే పరస్పరం మాట్లాడుకొని ఒకరిని తాత్కాలిక అధ్యక్షుడుగా ప్రతిపాదించడం, బలపరచడం జరుగుతుంది. ఇది అధ్యక్షపదవి ప్రతిపక్షం హక్కు నేనైతే పాలకపక్షం సభ్యుడ్ని. కూలంకషంగా చదివి మరీ సమావేశానికి హాజరవుతాను. ఇది అందరికీ తెలుసు. ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమైన ప్రతిపక్ష సభ్యులు. చర్చనీయ అంశాలపై సంపూర్ణ అవగాహన లేకుండా అధ్యక్షత వహించి అధికారులను నిలదీయడం కష్టసాధ్యం అవుతుంది. సంజీవరెడ్డి చలువ! బ్రహ్మానందరెడ్డి సాన్నిధ్యం!

బహుశా ఈ కారణంగా అనుకుంటాను. సి.పి.ఎం. నాయకుడు కె.ఎల్‌. నర్సింహారావు నాపేరు ప్రతిపాదించాడు. అధ్యక్ష బాధ్యత స్వీకరించవలసిందిగా (ముందే నాతో సూచించాడు కూడా) ప్రతి పక్షనాయకుడు నిర్వహించవలసిన బాధ్యత వారి సూచన మేరకు నేనా నాడు నిర్వహించడం జరిగింది. మూడు రోజుల పాటు ఇదే తంతు! (ఆ తర్వాత విశ్వనాథం గారు వచ్చారు!, భారత దేశ చరిత్రలో ప్రతిపక్ష నాయకులు పిఏసి అధ్యక్ష బాధ్యతా నిర్వహణ పాలకపక్ష సభ్యునికి ధారాదత్తం చేసిన సంఘటన ఇంకోటి లేదు! నాటి నుంచి నేటి వరకు! ఇది చరిత్రాత్మకం అని చెప్పుకోవచ్చు.

సాంఘిక సంక్షేమ శాఖామాత్యుడుగా రెండు రోజులు పాటు జరిగిన సుదీర్ధ చర్చలకు గంటన్నర పాటు నేను ఇచ్చిన సమాధానానికి ప్రతిపక్షంలో పనిచేసిన సి.వి.కె. రావు, నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి సభా ముఖంగానే అభినందనలు తెలియజేయడం, ఒక అపూర్వ ఘట్టం. ఉపన్యాసం గంగా ప్రవాహంగా అనర్గళంగా కొనసాగిందని అభివర్ణించారు. అనుభవజ్ఞులైన పెద్దలెందరో ప్రశంసించారు.

శ శ ఉల

129... భాట్టం శ్రీరామమూర్తి ట్వీయ చరిత్రు

పగబట్టిన పి.వి.జి. రాజు

శాసన సభ్యుడిగా బయట (ప్రజా కార్యక్రమాలు సజావుగా నిర్వహించడంతో పాటు

  • శాసన సభా ప్రాంగణంలో కూడా నేను రాణిస్తున్న విషయం కొందరి పెద్దలకు కన్నుకుట్టింది. పార్లమెంటు వదలి భీమిలి బై ఎలక్షను ద్వారా అసెంబ్లీ సభ్యుడిగా పి.వి.జి రాజు విచ్చేశాడు. ఆయన తలవని తలంపుగా అసెంబ్లీలో ప్రవేశించి తన సీటు స్వీకరించే ముందు సాధారణ రీతినే సగౌరవంగా అధ్యక్ష స్థానానికి శిరస్సు వంచి కూర్చున్నాడు. అప్పుడు ఆ అధ్యక్ష స్థానంలో ఉన్నది నేను పేనల్‌ స్పీకర్‌గా. ఆ తరువాత చటుక్కున లేచి అసెంబ్లీ సెక్రటరీ గదిలోకి వెళ్ళి పోయాడు. పి.వి.జి. అందరినీ వాకబు చేశాడుట ఈ పదవి ఇతనికి ఎవరిచ్చారని!

లెజిస్తేటర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యావర్గాన్ని సాధారణంగా ముఖ్యమంత్రి వేస్తాడు. సంజీవరెడ్డిగార్మి ఆ కార్యవర్గంలో నన్ను వెయ్యాలని ఉంది. ఆ విషయం చీఫ్‌ విప్‌ ఎం.వి. సుబ్బరాజుతో చెప్పాడుట. అది బయటకు వచ్చింది. పి.వి.జి. చెవిన పడింది. రోజూ సుబ్బరాజు గదికి వెళ్ళి ఘోష పెట్టేవాడట. నన్ను మాత్రం వెయ్యడానికి వీల్లేదని ప్రతి రోజూ పనిగట్టుకొని సుబ్బరాజు చెవి నిల్లు కట్టుకొని చెప్పడం పరిపాటయిపోయింది. సహజంగానే విషయం ముఖ్యమంత్రికి తెలుస్తుంది! ఒక రోజు ముఖ్యమంత్రి నాకు కబురు చేశారు. నేనొక్కడినే ఉన్నాను. “నీకు పి.వి.జి.కూ పడదా?” అని అడిగారు! అప్పటికి గడచిన పైసంఘటన నాకేం తెలీదు! “లేదండి అటువంటిదేమీ లేదు” అన్నాను. “మొగ మాటపడి చెప్పడం మానేస్తున్నావా? లేక అసలు విషయం నీకు తెలియదా?” అన్నాడు. తెలియదని మనవి చేశాను. అప్పుడాయన అన్నాడు.

“ఎందుకో ఆయనకు నీమీద మంచి భావంలేదు. లెజిస్తేచర్‌ పార్టీ కార్యవర్గంలో నిన్నువేద్దామనుకుంటే సుబ్బరాజు దగ్గర ఘోష పెడుతున్నాడు నాకు చెప్పమని. దీని వలన నీకు పెద్దగా ఒరిగేదీ లేదు. ఎందుకైనా మంచిది మానేస్తాను. ఆయన నీపట్ల మంచిగా ఉండేటట్టు చూసుకో! నిన్ను కార్యవర్గంలో వెయ్యనులే, వేస్తే నీకు ఒరిగేదేంటి? నీ విషయాలన్నీ నేను చూసుకుంటాను కదా నీ మంచి కోరి ఈ విషయం చెప్పాను అంతే!” అని ముగించాడు. కొంచెం జాగ్రత్త పదాలనుకున్నాను. స్వేచ్చాభారతం 1283

ఇంతట్లోకి పూర్వం విద్యాశాఖమంత్రి ఎస్‌.పి.బి. పట్టాఖి రామారావు నన్నాకమారు పిల్చారు. “ఏమయ్యా! పి.వి,జి కేం వచ్చిందయ్యా పోయేకాలం! నీవు పనికిరావని పనికి రాదని! నా పీకల మీద కూర్చుంటాడు!” అన్నాడు తలా తోక నా కర్ణం కాలేదు. “నేను మరీ మరీ చెప్పాను పి.వి.జి. రాజుకి భాట్టమే వ్రాసి తెచ్చిన విజ్ఞప్తి పత్రంపై నేను పుచ్చలపల్లి సుందరయ్య, తెన్నేటి, వావిలాల అందరం సంతకాలు చేశామయ్యా ఇప్పుచొ కమిటీ ఏర్పడితే అందులో అతడ్ని వెయ్యవద్దంటావేమిటి” అన్నాను. “నేను తెల్లబోయి చూస్తున్నాను” అని చెప్తున్నాడు.

“రాష్ట్ర ప్రభుత్వం ఆదిభట్ల నారాయణదాసుగారి శతవత్సర మహోత్సవాలు నిర్వహణకు ఒక కమిటీ వేస్తున్నారు. ఇది నీవు పెట్టిన వినతి పత్రం పైనే జరిగింది. అయితే ఇప్పుడు విద్యాశాఖామంత్రి చేతిలో పడింది. ఈ కమిటీకి నన్ను అధ్యక్షత వహించమని బలవంతం చేస్తే ఒప్పుకున్నాను. గాని ఒక్క షరతు అని చెప్పాను. ఈ కమిటీకి భాట్టాన్ని కార్యదర్భిగొ వేస్తే నేను ఒప్పుకుంటాను” “అది మాత్రం పనికి రాదని నా చెయ్యిపట్టుకున్నాడు” బోయి భీమన్నను వెయ్యాలంటాడు. “భాట్టం మీద మీకెందుకయ్యా అంత విముఖత” అంటే ససేమిరా అన్నాడు! సంజీవరెడ్డిగారు చెప్పిన దానికి దీనికి సరిపోయింది. ఇక ముందుంది ముసళ్ల పండగ సర్జుకోకపోతే దెబ్బతీస్తాడు! అనుకుంటూ మౌనంగా బయటపడ్డాను.

1967 ఎన్నికల్లో నన్ను దెబ్బతీస్తాడు అని తెలుసుకున్నాను. ఈలోగా రాజకీయ స్థితిగతులు కూడా త్వరత్వరగా మారుతున్నాయి. పెద్దారాల పి.వి.జి

అప్పట్లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి అన్నయ్య వెంగళరెడ్డి ఒక కేండిడేట్‌, ఓటు వేయడానికి పార్టీ తరపున కొందరు యం.ఎల్‌.ఏి. లను కేటాయిస్తారు ప్రతి అభ్యర్థిక్రీ అయినా వారు ఓటువేస్తారో, వెయ్యరో ఏ ప్రలోభానికో లోబడితే వీళ్ళ పని ఖతమే, సామాన్యంగా అందుకే అందరూ వేరే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. ఇక్కడ బ్రహ్మానందరెడ్డికి అటువంటి అవసరం లేదు. ఆ అవసరం మాకే కల్గింది. ఇద్దరు ఇండిపెండెంటు యం. ఎల్‌ ఏలు మాతో ఉన్నారు. ఒకరు కోళ్ల అప్పలనాయుడు 2. సాలాపు చినప్పల నాయుడు వారు ఎటు ఓటు వెయ్యమంటారని నన్ను అడిగారు. ముందు పి.వి.జి. ని అడగండి. అతడేమీ చెప్పకపోతే నేను చెబుతాను అన్నాను. “మీ ఇండిపెండెంట్ల ఓట్లు నాకెందుకు. మీ చిత్తం” అన్నాడుట. అప్పుడు నా సలహా ఇచ్చాను మీకు ఏనాడైనా ప్రభుత్వ సహాయం అవసరం ఉంది కదా! కాంగ్రెస్‌లో కలవాలని కోరిక మీకు ప్రబలంగా ఉంది. కాబట్టి బ్రహ్మానందరెడ్డిగారి దగ్గణకు వెళ్టాం. 124... భాట్టం శ్రీరామమూర్తి న్వీయ చరిత్ర

ఆయన అన్నగారికి ఓటు వేస్తే మీకే మంచిది! అన్నాను. (బ్రవ్మానందరెడ్డిగారు సంతోషించారు. వాళ్ల భుజం తట్టాడు. యీ వార్త గుప్పుమంది. పి.వి.జి. రాజు యిలాకాలోని ఇద్దరు ఇండిపెందెంటు యం.ఎల్‌్‌ఏ. లు వెంగళరెడ్డికి ఓటువేస్తారట అన్న వార్త పె.వి.జి. చెవిన పడింది. “అవసరమైతే బ్రహ్మానందరెడ్డి నన్ను అడగవచ్చును కదా! నాయకుడుగా నేనుండగా నన్ను అడగకుండా భాట్టాన్ని అడిగి ఓట్లు రాబట్టుకోవడం ఏంటి? నన్ను దెబ్బతీయడాన్మి భాట్టాన్ని తయారు చేస్తున్నాడు. నన్నుమించి పోవాలని అతడు కూడా ఉరకలు వేస్తున్నాడు. దీని అంతు తేలుద్దాం” అని బ్రహ్మానందరెడ్డి దగ్గరకి వెళ్ళాడు. నన్ను రిస్కులో పెట్టడం ఎందుకా అని పోనీ పొరపాటు జరిగిపోయింది ఇటుపైని ఏదొచ్చినా నిన్నే అడుగుతాను అన్నాడు బ్రహ్మానందరెడ్డి. అంటే బ్రహ్మానందరెడ్డి ముందు నన్ను అడిగినట్టే కదా. తిన్నగా నా దగ్గరకు వచ్చాడు పి.వి.జి రాజు. కారెక్కమన్నాడు జన సంచారము లేని రాజభవన్‌ రోడ్డులో కారాపాడు. “మన ఇండిపెండెంటు ఎం. ఎల్‌.ఏలు ఎవరికి ఓటేస్తారు” అని అడిగాడు. “కాసు వెంగళ రెడ్డికి వెయ్యమని వాళ్ళకి నేనే చెప్పాను” అన్నాను. కోరుండి నీవే చెప్పావా? లేక (బ్రహ్మానందరెడ్డి కోరితే నీవు చెప్పావా? అని అడిగాడు.

(బ్రహ్మానందరెడ్డి నన్ను కోరలేదు. నేనే కోరుండి తీసుకువెళ్ళి అప్పగించాను. ముందు మిమ్మల్నే అదడగమన్నాను మీరు 1161651 చూపించలేదు మీ ఇష్టం అన్నారుట. అక్కడ నన్ను ఆపాడు. (బ్రహ్మానందరెడ్డేమో నిన్ను అడిగానని చెప్పాడు. నీవేమో కోరుండి అతనికి అప్పగించానంటావు. ఇందులో ఏదో మతలబ్‌ ఉంది. ఏది నిజం? అన్నాడు. “ఎందుకయ్యా ఈ గొడవ మనకు అక్కర్లేదు. వాళ్ళ మంచి కోసం ఆ ఎం.ఎల్‌.ఏలను అటువెళ్ళి ఓట్లు వెయ్యమని నేను చెప్పాను. ఇది నేను చేసినపనే, ఇందులో ఏం తప్పుందో చెప్పు అన్నాను. ఒక్కమారు అతని టెంపరేచరు తగ్గిపోయింది. ఏం చేస్తాడుట? నేను చేసిన తప్పేంటి? నన్ను మళ్లీ నా రూంకి దిగబెట్టేశాడు. అతని గుండెల్లో మంట ఆగిందనుకోవాలా? దేనికైనా సిద్ధపడాలి.

రావణాసురుడి కాష్ట్రంలా నేటికీ కాలుతున్న శ్రీలంక సమస్యను ప్రత్యేక చర్చకు పెట్టి రెండు సందర్భాలలో చేసిన సుదీర్హ ప్రసంగాలు సభామన్ననలందుకున్నాయి. అప్పట్లో రాజీవ్‌ గాంధీతో చర్చలు కొనసాగిస్తున్న తమిళ పులుల నాయకులు పార్లమెంటు గ్యాలరీ నుండి నా (ప్రసంగాన్ని విని నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభాకరన్‌ సంతకంతో ఉత్తరం అందజేయడం విశేషం.

పార్లమెంటు (ప్రసంగాల బాణి తెలియజేసాను మీకు. (ప్రజల వాణి పార్లమెంటులో విన్సించాను మీకు. యథాశక్తి చేసిన కృషి క్లుప్తంగా విన్నవించాను.

షు స ఈల స్వేచ్భాభారతం 125

విజయనగర కురుక్షేత్ర సంగ్రామం

బ్రహ్మానందరెడ్డికి సంజీవరెడ్దికి మధ్య బెడిసింది. కాంగ్రెసు రెండు ముక్కలయింది. కొందరటు కొందరిటు. పి.వి.జి మాత్రం బ్రహ్మానందరెడ్డితోటే ఉన్నాడు. అతని ఆరోగ్యం దెబ్బతిన్నా ప్రమాదంలో పడినా, ప్రభుత్వం తరపున సర్వసౌకర్యాలు కల్పించి పోర్టు ఫోలియో లేని మంత్రి హోదా కల్పించి ప్రభుత్వం తరపున వైద్యం వగైరాలు సర్వ సౌకర్యాలు సమకూర్చి మంత్రి పదవిలో ఉంచాడు, గౌరవించాడు. అందుకు కృతజ్ఞతా పూర్వకంగా (బ్రహ్మానందరెడ్డి పక్షం చేరేడేమో అనుకున్నాను. బ్రహ్మానందరెడ్డి కూడా మమ్మల్ని నమ్మి అతని వ్యూహాలన్నీ అరమరికలు లేకుండా మాతో చెప్పేవాడు. ఇలాగ కొంతకాలం జరిగింది.

అక్కడ ఢిల్లీలో సంజీవరెడ్డి కొత్త రఘురామయ్య ఏకమైపోయారుట. ఇంతటితో బ్రహ్మానందరెడ్డి కుదేలనుకున్నాడు. పి.వి.జి టఫీమని ప్లేటు ఫిరాయించాడు. సంజీవరెడ్డి వర్గానికి నాయకత్వం వహించాలనిపించింది. వాళ్ళిద్దర్ని వాళ్ళ ఇంటికి డిన్నరుకి పిల్పాడు

  • (గ్రూపు ఎం.ఎల్‌.ఏల నందర్నీ రమ్మన్నాడు. నాకూ వర్తమానం వచ్చింది. కాని నేను వెళ్ళలేదు. మర్శాడు అసెంబ్లీ సెక్రటరీ గదిలో కలిసాం. ఎందుకు రాలేదు? అన్నాడు. నాకు ఇష్టం లేదు అన్నాను. మళ్లీ ప్లేటు ఫిరాయించడం నావల్ల కాదు అన్నాను. ఇదే తుది జవాబా? అన్నాడు. జెను అన్నాను. అయితే నీ అంతు చూస్తాను అన్నాడు. నీ తరం కాదన్నాను. నేలమీద ఉన్నవానికి పడిపోతాననే భయమేంటి? మేడమీద ఉన్నవాడివి పడితే ఏమౌతావో తెల్సుకో అన్నాను. అంతటితో విడిపోయాం ఇద్దరం. అదే ఆఖరి చూపు.

1967 ఎలక్షన్లు వస్తున్నాయి. నన్ను దెబ్బతీయాలని కృత నిశ్చయంతో ఉన్నాడు పి.వి.జి (కార్మిక నాయకుడు) పెమ్మరాజు వెంకటరావు పార్లమెంటుకు పోటీ చేయాలని చూస్తున్నాడు అతనితో కబుర్లు చేసాడు. నేను విజయనగరం నుండి పోటీ చేస్తాను. భాట్టాన్ని తప్పుకోమన్నాడు. నేనూ సవినయంగానే చెప్పాను. అతనికోరిక సహజమే.

నేను వేరే నియోజక వర్గం ఎంచుకుంటే అక్కడ పి.వి.జి వాళ్ళ మనుషులు టిక్కెట్టు కోసం దరఖాస్తు చెయ్యకూడదు. అది ఒకటే షరతు. అతడు పోయి పి.వి. జికి చెప్పాడట. భాట్టానికి నేను కాపలా కుక్కనా? ఎవరు టిక్కెట్టుకు అప్లయి చేస్తారో వాళ్ళను అద్దుకొనే పని నాది కాదన్నాడు. ఆమాట పెమ్మరాజు నాతో చెప్పాడు. అయితే నేను విజయనగరం నుంచే టిక్కెట్టుకు అప్లయి చేస్తాను. ఇంకో జాగాకి వెళ్ళను. రెండుమార్లు గెల్చిన నియోజకవర్గం ఎందుకు వదలాలి? అని ఢంకా బజాయించి చెప్పాను. నిండా మునిగిన వానికి చలేంటి? అయితే ఇద్దరం విజయనగరం టిక్కెట్టుకే దరఖాస్తు పెట్టాం. పార్టీ అధిష్టాన వర్గం నా టిక్కెట్టు ఖాయం చేసి పి.వి.జి.ని భీమిలి వెళ్ళమన్నారు. ఖంగుతిన్నాడు. నన్ను వదిలి పెడతాడు ఇప్పుడు. భాట్టాన్ని కొట్టడం సామాన్యం కాదు. ఏమంత మొనగాడా అన్నాడు. జొన్న వలస ప్రభువులు చిన్నపామైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు. దెంకాడ వారు దశాబ్దాల తరబడి ముఖాలు చూసుకోకుండా విరోధాలు పెంచుకున్నా తన తమ్ముడు విశ్వేశ్వర గజపతి రాజుని విజయనగరం వచ్చి నామినేషన్‌ ఫైలు చెయ్యమన్నాడు. బొబ్బిలి (రాజా) వారి సహకారం సయోధ్యా లభించింది. విశ్వేశ్వర గజపతి విజయనగరంలో దిగాడు. ఎన్నికలు పూర్తి అయ్యేవరకు నెల రోజులపాటు నియోజక వర్షాన్ని దున్నీయమన్నాడు. ఇంకో నియోజకవర్గం తలంపు వద్దన్నాడు. అతడు మద్రాసు నివాసి. ఇక్కడ ఓటరు లిస్టులో పేరు లేదు కొత్తగా చేర్చాలి అందుకోసం దరఖాస్తు చేశాడు. ఈ రాష్ట్రంలో నివాసం లేని వాడికి ఓటర్ల జాబితాలో చేర్చడానికి వీలులేదు అదీ చట్టం. ఇతడు మద్రాసు నివాసి అని చెప్పడానికి సాక్ష్యాధారాలు మస్తుగా ఉన్నాయి. నా దగ్గర లాయర్లందరూ సహాయపడ్డారు. న్యాయస్థానాల్లో లావా దేవీలు అనేకం ఉన్నాయి. అప్పుడు అతడు కోర్టులో ఎఫిడవిట్‌ ఫైలు చేస్తాడు. నెల రోజులు లోపు పైలు చేసిన అఫిడవిట్‌ నఖలు సంపాదించాను. అందులో మద్రాసు నివాసం అని వ్రాసి ఉంది. అది దాఖలు చేశాను. అతడూ వచ్చాడు. నేను వెళ్ళాను. రిటర్నింగు ఆఫీసరు దగ్గరకి డజను మంది బడా వకీళ్ళను మోపుచేశాడు. నేను ఒక్క పీపుల్సు రిప్రజెంటేషన్‌ యాక్టు పట్టుకున్నాను అతని అఫిడవిట్‌ (కాఫీ) నఖలు దాఖలు చేశాను. ఓటరుగా చేరదానికి చట్టం ప్రకారం అర్హత లేదని చెప్పాను. నా వాదన అంగీకరించారు రిటర్నింగు ఆఫీసరు. ఓటరు లిస్టులో నమోదు చేయడాన్ని వీలులేదని తీర్చు చెప్పాడు. అతని బలగమంతా తోకముడిచింది ఇప్పుడు పూసపాొటికి తలవంపులు తప్ప లేదు. అటు అన్నకి టిక్కెట్టు రాలేదు ఇటు తమ్ముడికి ఓటు ఖరారు కాలేదు. స్వేచ్భాభాతం నా 2?

ఇప్పుడేం చేయాలి? వెంటనే తన ప్రమథగణాల మీద విశ్వేశ్వర గజపతి కారాలు మిరియాలు నూరేడట. నన్ను అవమానించడానికే తెచ్చారా ఇక్కడకు అన్నాడట. వెంటనే కార్లో బేగేజ్‌ వేసుకొని మద్రాసుకి రోడ్డు మార్గంలో రయ్యిమని దూసుకువెళ్ళిపోతున్నాడు. విజయనగరం రాజు ప్రముఖులకు గుండెల్లో బండపడింది. మీసాలు మెలేసే మనుషులు మళ్లీ కిందకు దింపుతారా? కోపం కట్టలు తెంచుకుంది? రాజమార్తండుల అత్యవసర సమావేశం జొన్నవలసలో జరిగింది. నూజువీడు రాజా 4.2. అప్పారావు, బొబ్బిలి రాజా ఇద్దరినీ హుటాహుటీని కారుమీద' జోరుగా వెళ్ళి విశ్వేశ్వర గజపతిని అడ్డుకోమన్నారు. విశ్వేశ్వర గజపతి విజయనగరంలో తిష్టవెయ్యకపోతే రాజవంశం గౌరవం మంట గలుస్తుంది అన్నారు. పాయకరావుపేట దాటి తుని దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ తారసపడ్డారు. రథం వెనక్కు మళ్ళీంచారు. విజ్బంభించకపోతే శృంగభంగం అవుతుంది. అంతటితో విశ్వేశ్వర గజపతి పునప్రవేశం చేశాడు. విజయనగరంలో ఏం చేయాలో తెలియక అంతా తల పగలు గొట్టుకున్నారు. ఎంతకైనా బరితెగించాలనుకున్నారు. ఇప్పుడు ఎన్నికల రంగంలో జనసంఘం అభ్యర్థిగా ఒబ్బిలిశెట్టి రామారావు బరిలో దిగి ఉన్నాడు. అతనికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాడు. పద్ధతులు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చాడు. 1962 వ సంవత్సరంలో కూడా ఒబ్బిలిశెట్టి రామారావు నామీద పోటీ చేశాడు. అప్పుదు 30 వేల మెజారిటీతో గెల్బాను. ఇప్పుడు ఈ ఎన్నికల్లో విజయనగర విశ్వేశ్వర గజపతి రంగంలో దిగేడు. రాజనంశం అతని కొమ్ముకాస్తోంది. తన అన్న (246 రాజు) ఆశీస్సులు అందుకొని రంగంలోనికి దిగానన్నాడు విశ్వేశ్వర గజపతి. అప్పట్లో 1967 ఫిబ్రవరి 6వ తేదీన ఆంధ్రపత్రిక ప్రత్యేక ప్రతినిధి ప్రచురించిన కథనం చూడండి. “ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సంఘానికి వచ్చిన వివాదంలో శ్రీ భాట్టం ముఖ్యమంత్రి వర్గీయుడు శ్రీ 9/6 రాజు చీలిక దారుల ప్రముఖుడుగా మారారు. చివరి నిముషం వరకు శ్రీరాజు 'రెండు ఆవుల దూడ'గా వ్యవహరించడం వల్ల ఈ స్థితి వచ్చింది. చివరకు శ్రీ రాజును శ్రీ భాట్టం వ్యతిరేకించాడన్న వాతావరణం ఏర్పడింది. అది ఇప్పుడు విజయనగరం సీటులో వికృత పరిస్థితి కల్పించింది. శ్రీ భాట్టంతో పోటీకి శ్రీరాజు సోదరుడు శ్రీ విశ్వేశ్వర గజపతి సిద్ధపడ్డాడు. కాని ఆయన జనసంఘం అభ్యర్థిని బలపరుస్తున్నాడు. భాట్టాన్ని ఓడించడానికి ప్రయత్చిస్తున్నాడు. 128... భాట్టం శ్రీరామమూర్తి స్వీయ చరిత్ర

మొత్తం మీదశ్రీ భాట్టం గట్టిగా నిలబడ్డాడు. వీజయనగరం చరిత్రలో ఇది నిజంగా నూతన ఘట్టం. ఇక్కడ ప్రధాన అంశం జయాపజయాలు కాదు. ఒక ప్రజా సేవకుడు ఒక పార్టీ తరపున నీతికి నిలబడ్డం అవసరమైతే రాజకీయంగా బలికావడానికి సిద్ధపడ్డం. విజయనగరంలో వాతావరణం పెద్దగా మార్చుఉిన్నట్టు కన్పించదు. చివరకు భాట్టం విజయం సాధించినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు”

వ్యక్తి బలమే పార్టీబలం అన్న హెడ్డింగు క్రింద పత్రికలో ప్రచురించిన వార్తా కథనం పైన వివరించడమైనది. శ్రీ భాట్టం శ్రీరామమూర్తి వంటి ఉత్తమ (ప్రజాసేవకుడు విజయనగరం రాజకుటుంబపు పలుకుబడికి ఎదురు నిలవవలసిన అవసరం తెచ్చిపెట్టింది.

రాజు వంశప్రతిస్టని ఒడ్డి నావంటి ప్రజాసేవకుడ్ని ఓడించాలని చూచినా తట్టుకోవడం తథ్యం. కాని ఇక్కడ అలా జరగలేదు ఇక్కడ అన్నీ నీలాపనిందలు కట్టుకథలు ఘోరమైన నేరారోపణలు. అసత్య ప్రచారాలు నిస్సిగ్గుగా రాజవంశీయుడే చేయడం చాల విచిత్రం. ప్రదేశ్‌ కాంగ్రెసు అధ్యక్షుడు తిమ్మారెడ్డిగారు జాతీయ ట్రేడు యూనియన్‌ నాయకుడు శ్రీ వేదుల జగన్నాథరావు ద్వారా మంత్రి 21/6. రాజుకు వ్రాసిన ఉత్తరంలో “మీ సోదరుడు విజయనగరం కాంగ్రెస్‌ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సంగతి విని ఆశ్చర్య పోయాను. మీ పేరు ఉదహరిస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించాలని మీరు కోరుతున్నట్లు మీ సోదరుడు ప్రచారం చేస్తున్నాడు. ఇలాంటి ప్రచారం ద్వారా అక్కడ కాంగ్రెసు దెబ్బతినరాదని భావిస్తూ దీనిగురించి తగిన వివరణ కోరుతున్నాను” అని వ్రాసాడు. దానికి సమాధానంగా 9౪6 రాజు “నా సోదరుడు గత రెండున్నర సంవత్సరాలుగా నన్ను కలుసుకొనలేదు” అని అంటూ విశ్వేశ్వర గజపతి విజయనగరంలో ప్రచారం చేస్తున్నాడన్న మాట నాకు ఆశ్చర్యంగా (కల్పిస్తోందన్నాడు) ఉంది అన్నాడు. తనకేమి తెలియదంటాడు. తన ప్రోద్బలం లేదంటాడు. ఇప్పటికైనా తనను వారించడు ఎందుకు? లోగుట్టు పెరుమాళ్లకెరుక! పనిగట్టుకొని ఇతర నియోజక వర్ధాలు తిరిగే 2/6 రాజు కాం(గైసు అభ్యర్థిని బలవరుస్తూ విజయనగరంలో మీటింగు పెట్టడెందుకు? నీతి నియమాలను, సత్యవాక్ళును పెద్ద కుటుంబీకుల నుంచి కూడా ఆశించడం నిష్ప్రయోజనం.

స ౩4 3౬

శ్వచ్భాభాతతం

బ్రహ్మానంద రెడ్డి చూపిన పుత్రవాతృల్యం

ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి “విజయనగరం సీటు గురించి నీకు పట్టుదల ఎందుకు? నీవు గెలిచే సీటు ఎంచుకో నీకు కేటాయిస్తాను. నీవు గెలిచి వస్తే నిన్ను మంత్రిని చేయాలని ఉంది. దేశానికి నీ సేవలందించు. రాజులతో ఢీకొని గెల్చుకురావడం కష్టం.” అంటూ “మంత్రి వర్గంలో నీకు సీటు కేటాయించి ఉంచేను” అన్నారు నాటి ముఖ్యమంత్రి శ్రీకాసు బ్రహ్మానందరెడ్డి. గెలిచే సీటు ఎంచుకో! ముందు సాహసించడం తర్వాత తలవంచుకోవడం మంచిది కాదని కూడా హెచ్చించేరు!

నీకు ప్రమాదం అంటే ప్రమోదమా? అన్నారు కొందరు మిత్రులు! సాహసమే ఊపిరి! ఆశయాలే ఆయువు! ఆదర్శంలేని జీవితం ఎందుకు? పట్టుదలే నా జీవితం గుట్టు! పంచప్రాణాలు హరించుకుపోతున్నా వెనక్కు అడుగు పడేది కాదు! యవ్వనం అందించిన జవసత్వాలు కారణం కావచ్చు! సాహస కృత్యాల పట్ల ఆకర్షణ నా సహజ ప్రవృత్తి కావచ్చు! మందేగుండెలు మరిగే నెత్తురు కారణం కావచ్చు! అయినా ఎరిగి మరిగి నిప్పుల్లో ఎవరు దూకుతారు? అగ్నిగుండం అన్నా - పదవీ గండం అన్నా - ఆనాడు లెక్కలేదు! పదవుల ప్రలోభాలను తలచం. ఒకరికి తలవంచం! అదే తత్వం నన్ను ముందుకు నెట్టింది.

విజయనగరం సంస్తానానికి మూర్తాభిషిక్తుడైన ఆఖరి ప్రభువు శ్రీ విజయరామ గజపతి! అరివీర భయంకరులు! అసహాయశూరులు! ఎత్తిన కత్తికి ఎదురులేని భూపతులు వారు, పడగ నీడని పవ్వళించడమా? వారి అఖభీష్టాన్ని అతిక్రమించి - విజయనగరానికే ప్రొతినిధ్యం వహించడమా? ఇది కలలోని మాట! అని అందరూ అన్నారు! అదే నిజమయింది. పదవికన్నా తెగువమిన్న! ఆశకన్నా ఆశయం మిన్న! వెనుకంజ వేయడం సున్నా సర్వం శూన్యం అయినా, బూడిద మిగిలినా చితాభస్మం వంటిని ధరించి - ఆదర్శాల దండ కమండలాలు స్వీకరిస్తా గాని - తిరోగమనం ్రశ్నేలేదు! అదే ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డిగారికి విన్నవించి - అగ్ని గుండంలో ఉరికేను. 1967 ఎన్నికలు అవి. 180 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

పట్టుదల బాగుంది కాని పరిస్థితులు పట్టు తప్పుతున్నాయి! మద్రాసు నుండి విచ్చేసిన శ్రీ విశ్వేశ్వర గజపతి వీరంగం ప్రారంభం అయింది. నిప్పులు చెరుగుతున్నారు! ఆరోపణలు గుప్పిస్తున్నారు. స్వైరవిహారం చేస్తున్నారు. అన్నగారు విజయరామ గజపతుల ఆశీర్వచన పరంపరలు అందుకుంటున్నారు. ఆనాడు గజపతులను గెలవడం కాదు. ఎదిరించదానికి ఎన్నిగుందెలుండాలి? అందులోనూ సామాన్యుడికి?

దశాబ్దం పాటు శాసనసభలో భాట్టం వాణి మారుమోగింది అన్నారు. అన్ని పత్రికలు ఘోషించాయి. అదే పెద్ద ప్రమాదం తెచ్చిపెట్టింది. శ్రీకాకుళంలో విడిది చేసిన ముఖ్యమంత్రి పనుపున అర్ధరాత్రి శ్రీకాకుళం చేరి నాగావళీ తీరాన వసతి గృహంలో వారిని సందర్శించేను. నిష్కారణంగా ఓటమి పాలు కావద్దన్నారు. నామినేషన్లకు ఇంకా రెండు రోజులు గడువుందని గుర్తుచేశారు! గెలిచే నియోజకవర్గం పేరు వారే చెప్పి అక్కడ నుండి పోటీలో గెలిచి మంత్రిపదవి తీసుకుని రాష్రప్రగతికి పాటుపడమని హితవుచెప్పారు. ఎంతగొప్ప మనసు వారిది ఎంతటి వాత్సల్యం అది! నేను మొండికేసేను! భీష్మించికూర్చున్నాను! “చావో రేవో” అక్కడే తేలాలి! పదేళ్ళు పదవిలో ఉన్నాను. 57 నుండి 67 వరకూ 141.4 గా ఉన్నాను. ఇంక ఎంతకాలం ఉంటే తృప్తి? బూచిని చూసి భయపడి పారిపోవాలా? కొండను థీకొనే గుందెబలం లేనివాడు ప్రజలకు ఏం చెయ్యగలడు? ఆశయాలకు ఎలా నిలవగలడు? ప్రభువులు పట్టుదలతో ఉన్నారు. పదవి నుండి ఊదడగొట్టాలని ఎంతకాలం కుర్చీలో కులకాలి? పదవుల - జోలపాటకు నా మనసు ఉపశమించదు! ఆశయం కోసం అంతం అయినా మంచిదే అనుకున్నాను. ఆఖరికి ఊహించిన ఫలితమే ఎదురైంది! విజయనగరం శాసన సభా ఎన్నికల్లో (67 సం॥లో) పరాజయం కలిగింది. ప్రభువుల రాజకీయ జీవితంలో అమవస నిశికూడ ప్రారంభమైంది.

1967 ఫిరంగిపురంలో జాగర్లమూడి చంద్రమౌళితో హోరాహోరి పోరాటం జరుగుతోంది. ఖీకర పోరాటం మధ్య, సంకుల సమరం మధ్య ఉంటూనే కాసు (బ్రహ్మానందరెడ్డి తెరిపి దొరికితే నాతలంపే. “అసలు ఆయన ఎన్నిక అనుమానాస్పదమనీ పత్రికల్లో వ్యాఖ్యలు వస్తోంది. పుట్టి మునిగిపోతుంది. భూభారం మోసే ఆదిశేషునికి భాట్టం బరువు, కరువు (బ్రహ్మానందరెడ్డే పోగొట్టాలి. విజయనగరం కౌంటింగ్‌ ప్రారంభం అయ్యింది. గుంటూరు నుంచి ఫోన్‌ చేస్తే భాట్టం 602006 05811 గా ఉన్నాయి అన్నారట. బ్రహ్మానందరెడ్డి గారు ఆనందపడిపోయాడు. పిడికిలి బిగించి టేబుల్‌పై గుద్దాడట. “0౪ 8220 13 [40 14121364” అని డిక్లేర్‌ చేశాడు. ఆ ప్రక్కనే జిల్లా కలెక్టర్‌ యం.వి.రత్నం ఉన్నాడు. ఈ సంగతి అంతా ఆయనే చెప్పాడు. విజయనగరం సబ్‌-కలెక్టర్‌గా ఉండేవాడు స్వేద్యభరతం 18

రత్నం. నాకెంతో ఉపకారం చేశాడు. ఆయన మరీ ఆందోళన పదుతున్నాడు. నా భవిష్యత్‌ ఎలా ఉంటుందో తెలియక. ఆ తర్వాత మళ్ళీ ఫోన్‌ (మోగింది. కలక్టర్‌ చెవిదగ్గర పెట్టుకున్నాడు. “3114120 13 1099102” పిడుగులాంటి వార్త వచ్చి పడింది. నా ఓటమి విన్న ముఖ్యమంత్రి తల పట్టుకుని “3[14120 15 & 1001. పంతాలకు, పట్టింపులకూ పోవద్దు, గెలిచే సీటు చూస్కోపి. వి.జి. సంగతి తర్వాత చూద్దాం అని ఎంత పోరుపెట్టినా విన్నాడు కాదు. “నిన్ను మంత్రిని చేస్తాను, ఓడిపోయి రాకు” అని మరీ మరీ చెప్పాను. “ఫి.వి.జి.తో అటో, ఇటో తేల్చుకుంటాను” అంటాడు. రాజ్యాధిపతులతో పోటీ ఎంత (ప్రమాదకరం! చెబితే వినడు. బ్యాడ్‌ లక్‌, బ్యాడ్‌ లక్‌” అని అంటాడు. ఇదంతా కలెక్టర్‌ రత్నం తర్వాత నాకు చెప్పాడు. నాకు గుండెలదిరేయి. భయకంపితుదనయ్యాను. మళ్ళీ ఆయనకు మొహం ఎలా చూపించాలి? జనరల్‌ ఎన్నికల విజయం తర్వాత ఢిల్లీ వెళ్ళి, ముఖ్యమంత్రిగా అధిష్టానం తన పేరే ఖరారు చేసుకున్న తర్వాత హైద్రాబాద్‌లో అడుగుపెట్టి సెక్యూరిటీ ఆఫీసర్‌ సీతాపతితో నాకు ఫోన్‌ చేయమన్నారు. ఫోన్‌ తీస్తే సీతాపతి గొంతు, కంగారుపడ్డాను, కలవరపడిపోయాను. సార్‌తో మాట్లాడందని ఫోన్‌ కలిపాదు. “ఎంత పని చేశావయ్యా, వద్దు వద్దని మొత్తుకుంటే విన్నావా” అనేసరికి నా నోరు పెగల్లేదు. బిక్కమొహం వేసి, దిక్కులు చూస్తున్నాను. “సరే ఎప్పుడు వస్తావు హైద్రాబాద్‌” అన్నాడు (బ్రహ్మానందరెడ్డిగారు. “వారం పదిరోజుల్లో” అన్నాను. “పనికిరాదు, రేపే బయల్దేరిరా” అని ఫోన్‌ పెట్టేశాడు. కార్యకర్తలతో మాట్లాడి హైద్రాబాద్‌ బయలుదేరాను. విశ్వేశ్వర గజపతి చేసిన అభాండాలు పురాణం, ఆరోపణల పర్వం క్యాసెట్‌ అంతా విన్నాడు రెడ్డిగారు. “ఎంత నీచానికి ఒడిగట్టాడో చూశావా, నీ మీద అనడానికి నోరెలా వచ్చిందయ్యా? అతనికి, ఎలక్షన్‌ అంటే పూల్స్‌ ప్యారడైస్‌ అనుకున్నాడా, నువ్వు వెంటనే విజయనగరం వెళ్ళొద్దు, రేపొచ్చి పదవి తీస్కుని మరీ వెళ్ళు” అన్నాడు. ఎంత దయామయుగో (బ్రహ్మానందరెడ్డి ఏమి (ప్రేమ స్వభావం, ఏ పూర్వానుబంధమో. ఎంతటి భగవత్మృప, నాలో ఇంకా ప్రాణం నూరిపోయాలని చూస్తున్నాడు. జవసత్వాలుడిగి నేనుంటే, జీవం పోస్తానంటున్నాడు. పడిలేచిన కెరటంలా, ఉవ్వెత్తున ఎగురుతూ, ఆనందోత్సాహాలతో నేను విజయనగరంలో అడుగుపెట్టాలని వారి ఆకాంక్ష పదవి తీసుకొని వెళ్లు మర్నాడు వెళ్ళి కలిశాను. “నీ చిత్తం వచ్చిన పదవి తీస్కుని వెళ్లు. ఎ.పి.యస్‌. ఆర్‌.టి.సి. కావాలా, అది తీస్కో నీ చిత్తం వచ్చింది ఎంచుకో. ఒక్క ఎలక్ట్రిసిటి బోర్టు తప్ప. చల్లా నరసింహంకి ప్రామిస్‌ చేశాను. అతని పదవీకాలంలో గండికొట్టడం బాగోదు,

మాట తప్పినట్లు అవుతుంది. “నీకు నచ్చిన పెద్ద పదవి పుచ్చుకుని, విజయనగరంలో వీరుడిలా అడుగుపెట్టవయ్యా” అన్నాడు. “ఓడిపోయినోడికి పదవిస్తే ఏం బాగుంటుందండీ, లోకం వఏమనుకుంటుంది?” అన్నాను. గతుక్కుమన్నాడు ముఖ్యమంత్రి. “ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నీ పాటి నీతులు తెలియకుండా రాష్ట్రాన్ని ఇన్నేళ్ళూ పాలిస్తున్నానా? తప్పు, తప్పు, మారుమాటాడక, కావలసిన పదవి పుచ్చుకొని వెళ్ళు” అన్నాడు. ముందు నేను ఏం మాట్లాడానో నాకే తెలీదు. వారికి కోపం తెప్పించాను. నాకు నోరు పెగల్లేదు, రేపు వచ్చి చెప్తాను అన్నాను. “సరేపో, నీ ఖర్మం” అని పక్కకి తిరిగాడు, నేను నిష్మమించాను.

నామీద దయే వారికి. ప్రేమాభిమానాలు లేకుండా ఇంత చెప్తాడా? నాకూ ఇంగిత జ్ఞానం ఉండాలి కదా! అధికారవ్యామోహం, పదవీ కాంక్ష లేవు లేవని వక్కాణించిన వాణ్ణి, ఈ కక్కుర్తి బుద్ది ఎందుకు పుట్టాలి? అంతిమంగా మాట కాసేది ముఖ్యమంత్రి కదా! ఓటమి పాలైన వారికి పునరావాస కేంద్రాలు అవుతున్నాయి ఈ పదవులు. ఈ 'ప్రజారంగ సంస్థలు అని లోకం కోడై కూస్తుంది. నావల్ల ఆయన ఎందుకు మాట పడాలి, ఇదేం ధర్మం? ఆదర్శజీవనం అంటూ కలలు కన్నాను. అఖరుకి ఇది ఆశబోతడు జీవితం అవుతుందేమో. పదవిలేకపోతే ప్రాణం పోతుందా? అధికారానికి అర్రులు చాచేవారికి ఏదో సాకు దొరుకుతుంది. ఏదో బోటు ఎక్కేద్దామని చూస్తారు. నేను ఆ తానులోనే ముక్కనే అవుతాను. భగవంతుడా, సద్బుద్ధి పుట్టించు అని భగవంకుని వేడుకుని, మర్నాడు ముఖ్యమంత్రిని దర్శించాను. “ఏంటి నీ సంగతి” అన్నాడాయన. “ఫో, నీ ఖర్మకు ఎవరికి ఏం రాసి పెట్టి ఉందో, ఒకటి మరచిపోకు, 04[01318%6 04[0£0194 అంటారు. నాకంట పదకపోతే నీ ఆలోచన కూడా మరుగున పదుతుంది. జాగ్రత్త చూసుకో” విజయనగరం తిరుగు ముఖం పట్టాను.

అక్కడ జరిగినదంతా చెప్తే కార్యకర్తలు నామీద మండిపడ్డారు. కారాలు, మిరియాలు నూరారు. “ఓడించామని గొప్పలు చెప్పుకున్నవాళ్ళకి, ఒక చెప్పుదెబ్బ కొట్టినట్లు ఉండేది. మీరు పదవి పుచ్చుకుని వస్తే, ఎందుకు మాకీ ఆశాభంగం చేశారు? ఎంత నీతిగా బ్రతికితే లోకానికి ఏం కావాలి? ఏకీ, పీకీ పారేశాడు విశ్వేశ్వర గజపతి. ఈ జనానికి కళ్ళు లేవా? ఈ లోకం గుడ్డి దర్చారా? మీ జీవితం, తెరిచిన పుస్తకం, రహస్యాలు లేని జీవితం, అంతా బట్టబయలు. అయినా, మన మీద నిందలు, నిష్టూరాలు తప్పాయి కావు. నీతులు వల్లించుకుని, చేతులు ముడుచుక్కూర్చుంటే, రేపు చూసేవాడు కూడా ఎవడు ఉండడు. దయచేసి హైద్రాబాద్‌ వెళ్ళండి, పదవి పుచ్చుకురండి, అప్పుడు మేం స్వేచ్భాభారతం 133

తలెత్తుకు తిరగగల్లుతాం” కార్యకర్తలందరిదీ ఒకేమాట. రేపు, మాపు అంటూ మాసం రోజులు గడిపేను. ఇక్కడ గోల పడలేక, హైద్రాబాద్‌ చేరుకున్నాను. ముఖ్యమంత్రిని దర్శించాను. “పి.సి.సి. సెక్రటరీగా ఉంటాను అన్నాను. “ఎవడు చెప్పాడయ్యా నీకు, నిన్నెవడు చూస్తాడు అక్కడ” అని తల ప్రక్కకి తిప్పాడు. నేను బయటపడ్డాను. మర్నాడు శీలం సిద్దారెడ్డి ( ఇరిగేషన్‌ మినిష్టర్‌) కాఫీకి రమ్మన్నాడు. పి.సి.సి. సెక్రటరీగా చాలాకాలం ఉన్నాడతను. అతని స్వానుభవాలు ఎన్నో చెప్పాడు. అన్నీ అక్షర సత్యాలు. ఏదో ఒక పదవి తీస్కోమని హితబోధ చేశాడు. అప్పుడు తప్పని సరని భావించి, ముఖ్యమంత్రిని కలిశాను. “నీ బుద్ధి ఏమైనా మారిందా, ఇంకా నా బుర్ర తినేస్తావా? ఏం చేయమన్నాన్‌” అన్నాడు. ఖాదీబోర్డ్‌ ఛైర్మన్‌ తీస్కుంటాను. ఫక్కున నవ్వాడు. “ఇంతకు మించి ఇంకొక మంచి పదవి నీకంట పడలేదేంటయ్యా, ఈ రాష్ట్రంలో” అన్నాడు. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ మెంబర్‌గా భాదీబోర్డు గూర్చి క్షుణ్ణంగా పరిశీలించాను. “నాకూ తెల్సు ఇది కూలిపోయే కొంప అని, అయినా దీని వెనక ఒక ఆశయం, ఆదర్శం ఉంది. మహాత్ముని సిద్ధాంతం ఉంది. ఈ సంస్థను ఉద్ధరిస్తే, నా జీవితం ధన్యం అవుతుంది” అన్నాను. “మంచిదే గాని, ఇది నా చేతిలో లేదయ్యా, ధేబర్‌ భాయితో మాట్లాడాలి. ఖాదీ కమీషన్‌ వైర్మన్‌ కానీ ఎఐసిసి డ్రైసిడెంట్‌ చేశాడు తెల్సుకదా! అతని కన్‌కరెన్సు కావాలి” అంటూ, సీతాపతీ అని పిలిచి, ఫోన్‌ కనెక్ట్‌ చేయి అన్నాడు. ముందు బి.వి. గురుమూర్తిని పిలు, అతన్ని భాదీబోర్డు ఫైల్‌ పంపించమను అన్నాడు. ఇంతలో ధేబర్‌భాయ్‌ లైన్‌లోకి వచ్చాడు. నా ఎదుటే మాట్లాడాడు అతనితో “ఎక్సలెంట్‌ పర్సన్‌ని ఇస్తున్నాను ఖాదీ బోర్డు చైర్మన్‌గా, ఇంతకు మించిన మంచి మనిషి ఇంకొకడు దొరకడు మీకు” అంటూ ఆయన సమ్మతి తీసుకున్నాడు. ఇంతలో గురుమూర్తి, నా పేరును సూచిస్తూ వచ్చిన ఫైల్‌మీద సంతకం చేశాడు. “చూశావా! భగవంతుడు ఏం చేశాడో! నివర్తి వెంకటసుబ్బయ్యకి ఈ పదవి ఇవ్వాలని ఉండేది. పోనీలే బ్రతికించావ్‌!” అన్నాడు. ఒక సంవత్సరం పిరియడ్‌ ఇవ్వండి సార్‌, ఎంత చేస్తానో చూపిస్తాను అన్నాను. “అంత పని చేయకు, ఈ పదవి మధ్యలో వదిలేస్తాననకు, నీకు ఇంకొకటి చూపలేను పెందుర్తి నాయకద్వయం” అంటూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చి, బెస్ట్‌ విషెస్‌ చెప్పి పంపించాడు. పెందుర్తి మునసబు - జుత్తాడ కరణం

విజయనగరం దాటి విశాఖజిల్లాలో పయనించాలంటే పెందుర్తే ముఖద్వారం అక్కడ ఇద్దరితో మైత్రీ బంధం ఉండేది. ఒకరు పెందుర్తి మునసబు, 2. జుత్తాడ కరణం యిద్దరూ యిద్దరే. ఇద్దరకు ఇద్దరే సాటి. వారికి మేటి మరొకరు లేరు అనుకునేవాద్ని. ఇదొక జోడి. జంటపక్షులు! ప! భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

[45 అప్పలనాయుడు - ద్రోణం రాజు

ద్రోణం రాజు బుద్ధికి బృహస్పతి. ఎవరికైనా దారి చూపిస్తాడు తన దారి తను వెతుక్కుంటాడు. ఏటి ఊటలా ఆ బుర్రలో ఎప్పుడు ఆలోచనలూరుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎవ్వరి మీద బాణం ఎక్కుపెట్టాలో సంగతి సందర్భం తెలిసిన విచక్షణా జ్ఞానం మెందు. కడుపునిండా కబుర్లే! సందర్భానుసారం మాటల తూటాలు పేలుస్తాడు.

నమ్మకస్తుడు. నమ్మిస్తాడు. కడుపుబ్బా నవ్విస్తాడు. సామెతలు చిటికెన వ్రేలు చివర

ఉంటాయి. బ్రతుకు ముడిపడితే. ఆ చిక్కుల ముడి విడిపిస్తాడు. తాను ముడివేస్తే మాత్రం ఆ పీట ముడి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. అతడు దమ్ముకొడతాడు. దుమ్ము రేపుతాడు. దన్ను నిలుస్తాడు. అతడు కరణం పిల్ల పెన్ను గన్నుగా వాడగలడు. కరిణీకం చేసాడేమో వియ్యాలవారి కయ్యాలు తీర్చగలడు. తలచుకుంటే తగువు తీర్చగలడు. లేదా తంటాలు పెట్టగలడు. యే ఆటకా దరువు వేయగలడు. బయట పడకుండా భంగపదకుండా కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు కార్య సాధన చేయగలడు. ఎంత చేసినా చేతికి మట్టి అంటకుండా చూచుకోవడంలో దిట్ట. మాటలు తడుముకోడు. ఎవరైనా ఎగిరెగిరి పడితే ఊరుకోడు. వేటుకు దొరకడు. వేటాడ్డానికి సిద్ధం. అతనితో మిత్రత్వం పూర్వజన్మ సంబంధమా అనిపించేది. స్వంత మనిషిగా భావించేవాడు. నాకు అస్తడు, ఆత్మీయుడు, చిరకాలం కలకాలం యీ సంబంధ బాంధవ్యాలు, నిల్చుగాక అనుకునేవాడ్ని

ఇప్పుడు 5%45 అప్పలనాయుడు గురించి కొంచెం చెప్పాలి. అమాయకత్వం ఉట్టిపడుతూ ఉంటాడు. అలాగని చేతకాని వాడు కాదు. చేతల మనిషే మాటల మనిషి కాదు. ప్రతీ మాటలో మంచితనం కనిపిస్తుంది. ముక్తసరిగా మాట్లాడినా ముక్కోపి. సాధారణంగా నెమ్మది, నిదానం అతని విధానం. అతనిలో అణువణువునా సేవాభావం ఉట్టిపడుతుంది. అంకిత భావం ప్రతిపనిలో తొణికిసలాడుతుంది. అతనితో స్నేహం సర్వశ్రేయస్కర మనిపించేది. అతడు నిండు కుండ, తొణకడు బెణకడు. మాటల మూటలు జారిపడకుండానే కోరిన కోరని కోర్కెలన్నీ నెరవేర్చుకోగల దాంతుడు, శాంతుడు. పొగపీల్చినా పొగపెట్టడం ఎరుగడు. కోపంతో కడుపు కుతకుతలాడుతున్నా మాటల్లో మౌనమే కనబడేది. తన మంచిని కాంక్షించే మనిషిని ఎన్నుకోవడంలో దిట్ట. తన గుట్టు విప్పని గట్టి మనిషి. నోరు మెదపని మనసు విప్పని మాటకారి. దురాలోచన కన్నా దూరాలోచన మిన్న మంచి మనసుతో మంచి మనిషితో మంచి రోజులొస్తాయన్న కాలజ్ఞానం ఉన్న మనిషి అప్పలనాయడు. తానెంత చేస్తే అంతకు పదింతల అవతల

మనిషి చేస్తాడని, భగవంతుడు చేయిస్తాడని పసికట్టే ప్రజ్ఞ అతని స్వంతం. చెప్పాపెట్టకుండా చేయించుకొనే నేర్పు అతనికి పుట్టుకతో వచ్చింది. పంచాయితీ ఎన్నికలంటేనే దడ. అలాగని దూరంగా ఉండడు. విజయనగరం ఫోన్‌ చేసి ఎన్నికల ప్రచారానికి నన్ను రమ్మన్నాడు అప్పలనాయుడు. పెందుర్తి పంచాయితీ వార్డు ఓటర్ని విజయనగరం నుంచి వచ్చి నేనెలా ప్రభావితం చేయగలను. ద్రోణంతో సంప్రదించాను. “అతనిదంతా చాదస్తం. ఎంత చెప్పినా ఒప్పదు. మీరొచ్చి అలా కూర్చొండి. కథంతా నేను నడిపిస్తాను అన్నాడు ద్రోణం. మాటసొయానికి పక్క దన్నుకి నేనూ ఉన్నాననిపించుకున్నాను. ఒక్క ఓటు మెజారిటీతో పంచాయితీ ప్రసిడెంటు అయ్యాడు. జిల్లా పరిషత్‌లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఫైనాన్సు కమిటీలో నాకు స్థానం కల్పిస్తానన్నారు. ఆ సీటు అస్పలనాయుడికి యిచ్చాను. అతడు జిల్లా పరిషత్తులో ఫైనాన్సు కమిటీ మెంబరు అయ్యాడు. అంతకుముందే యం.ఎల్‌.ఏ. ఎలక్షనుకు తాపత్రయపడ్డాదు. శక్తికి మించి ఖర్చు పెట్టి ఊరువాడ ప్రచారం చేసుకున్నాడు. విశాఖ కార్మిక నాయకుడు బి.జె.యం. నరసింగరావు ఆ టిక్కెట్టు తన్నుకుపోయాడు. దాంతో కుదేలయిపోయాడు. జిల్లా పరిషత్‌ అధ్యక్ష ఎన్నికల్లో నా ఓటమి అనంతరం హైదరాబాద్‌వెళ్ళి బ్రహ్మానంద రెడ్డిని కలిశాను. “ఇక్కడ కొచ్చావేంటి... వెళ్ళు, వెళ్ళు, సంజీవరెడ్డి నీకోసం చూస్తున్నాడు. పరిగెట్టు మళ్లీ మీటింగుకు వెళ్ళిపోతాడు” అన్నాడు. నేను గ్రీన్‌ల్యాంర్స్‌ గెస్పుహౌస్‌కు చేరాను. ముఖ్యమంత్రి మెట్టు దిగి కారు ఎక్కుతున్నారు. నన్ను చూసి టపీమని దిగి తన గుండెకు నా భుజాన్ని చేర్చుకున్నాడు. “డోంట్‌వగ్రీ” యివాళ పోతుంది రేపు గెలుస్తావు. రాజకీయాల్లో యిది మామూలే పదపద టయిమౌతోంది. గాంధీ భవనంలో ఎన్నికల సమావేశం జరుగుతోంది. నువ్వు ముందు కారెక్కు త్రోవలో మాట్లాడుకుందాం” అన్నాడు సంజీవరెడ్డిగారు. ఎంతో సానుభూతి ప్రదర్శించారు. ధైర్యం చెప్పారు. పాత పంది కొక్కులకు తెలుస్తుంది ఎన్నికల ట్రిక్కులు. నీకేం తెలుసు. నీవెలా తట్టుకుంటావు. పరవాలేదు. నేనున్నాను. నీకేం భయం? అన్నాడు. ఓదార్చాడు. ధైర్యం చెప్పాడు. చనువిచ్చాడు. (పేను చూపించాడు. కారు గాంధీభవనంలో ప్రవేశించింది. “భాట్టం వెళ్ళిపోవద్దు. ప్రక్క గదిలో వెయిట్‌ చెయ్యి. మీ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రెండు పేర్లు ఎన్నుకోవాలి. ఒక పేరు ఖరారు చేసి రెండోది ఖాళీ పెడతాను. ప్రక్క గదిలో కెళ్ళి పేరు ఆలోచించుకో అవసరమైతే మీటింగులోకి రమ్మంటా” అని సమావేశానికి వెళ్ళాడు.

యమ్‌.యల్‌.సి. ఎన్నికలు - అగ్ని పరీక్ష

స్థానిక సంస్థల పరిస్థితులే తెలియవు నాకు. వాటి ఎన్నికల తంతు గురించి అసలే తెలీదు. తలకు మించిన భారం ఎత్తుకుంటే బోర్లాపడతాం. ఇప్పుడేం చెయ్యాలి భగవంతుడా! మొక్కినా దొరకని ముఖ్యమంత్రి కోరుండి తన స్వంత కారులో తీసుకువచ్చి పేరు చెప్పమని ప్రేమతో అడుగుతూ ఉంటే నా చేతకాని తనం ఎలా చెప్పుకోవాలి? ఇంతలో మీటింగు పూర్తి అయింది. బయటకు వస్తూ పి.సి.సి. (ప్రెసిడెంటు బ్రహ్మయ్యగారి చెయ్యి పట్టుకొని నన్ను చూపించాడు. సంజీవరెడ్డిగారు ఒక సీటు రాజులకిచ్చాం. రెండో అభ్యర్థి పేరు భాట్టం చెప్తాడు. అంటూ వెళ్ళిపోయారు. గొట్టిపాటి బ్రహ్మయ్యగారు, నేనూ న్యూ యం.ఎల్‌.ఏ. క్వార్టర్సు సమీపంలోనే ఉన్నాం. “మీ పేరు రేపు సాయంకాలంలోగా యివ్వండి” అంటూ తన కారులోనే యం.ఎల్‌.ఏ. క్వార్టర్సులోనే దింపేసాడు.

నేను గదిలోకి వెళ్ళలేను. బయట కూర్చోలేను. యీ ఎన్నికలేమిటో యీ కేండిదేటు ఎవరో ఎలా చెప్పేది. నాకేమి పాలు పోలేదు. నాకంటికి యస్‌.ఆర్‌.ఏ.యస్‌. అప్పల నాయుడు కన్పిస్తున్నాడు. పెందుర్తి సమితి ప్రసిడెంటు బుద్దా అప్పలనాయుడు యింటికి ఫోన్‌ చేసాను. స్థానిక సంస్థల ఎన్నికలకు యం.ఎల్‌సి. అభ్యర్థిగా అప్పలనాయుడు అభ్యర్థిగా తయారుకావాలని చెప్పాను. “కష్టం బాబు తట్టుకోలేం. ఇప్పటికే బోలెడు డబ్బు తగలేశాం ఊళ్ళన్నీ చుట్టబెట్టాం బిజెయం సీటు ఎగరేసుకుపోయాడు. మా చేతికి చిప్ప యిచ్చాడు. మళ్ళీ జిల్లా అంతా తిరగమంటే మా తరమా!” అన్నాడు. యస్‌.ఆర్‌.ఎ.యస్‌. తో సంప్రదించి మళ్ళీ మాట్లాడమన్నాను. మళ్ళీ ఫోన్‌ చేస్తే యిద్దరూ కూడ బలుక్కొని కూడా అదే జవాబు వచ్చింది.

జిల్లాపరిషత్‌ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా నన్ను ఒక మెట్టు మీదకు ఎక్కించాలని జిల్లాలో ఒక ప్రధాన పురుషుణ్ణి చెయ్యాలని, ప్రత్యామ్నాయ నాయకత్వంలో నిలబెట్టాలని సదుద్దేశంతోనే సంజీవరెడ్డిగారు యింత ప్రోత్సాహం యిస్తున్నారు. ఒక సీటు కేటాయించి ఉంచారు మాకు. నేను చెప్పడానికి నా చేతిలో చిల్లిగవ్వలేదు మూటపట్టుకొని సిద్ధపడే మనిషి ఎవ్వడో నాకు తెలియదు. తీరా సీటు తెచ్చుకొని డింకీ కొడితే, పుట్టగతులుండవు. కిం కర్తవ్యం? అని తలపట్టుకొని యం. ఎల్‌.ఏ. క్వార్టర్సు లాన్‌లో కూర్చున్నాను. యిప్పుడు నాకంటికి విజయనగరంలోని డా.వి.వి.సంజీవరావు కనబడుతున్నాడు. పదవి అంటే పరుగెడతాడు. కారుంది. డబ్బుంది. జిల్లా గిర్రున తిరిగిరాగలడు, పెద్దవాడతడు. తర్వాత పట్టుకు దొరుకుతాదా! పిలిస్తే పలుకుతాడా? కష్టపడి తిరుగుతాడా! నా మాట బేఖాతరు జేస్తే నేనేమవ్వాలి. అంతా అగమ్య గోచరంగా ఉంది. (ఇంతలో తాడ్డి సన్యాశినాయుడు స్వేచ్చాభారతం 137

యం.ఎల్‌ఏ. వచ్చాడు. మీరెందుకింత బాధపడాలి? మా గజపతినగరంలో ఎన్‌.వి. గంగరాజు అని ఒక సాహుకారు ఉన్నాడు. మస్తుగా సంపాదించాడు. పదవికోసం తహతహ లాడుతున్నాడు. అతడ్ని పెట్టండి అన్నాడు. సరే! ఫోన్‌ చెయ్యమన్నాను. అతడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఉరుకులు పరుగులు ప్రపంచం చుట్టిముట్టి రమ్మన్నా సిద్ధమే. కొత్తపెళ్ళి కొడుకులా ఉన్నాడు. ఆ తొందరపాటు చూస్తే అతడి పేరే చెప్పాను. అదే ఖాయమంది. జయతంగేడున రాజుల తరఫున విజయనగరం మున్సిపల్‌ చైర్మన్‌ అప్పన్న దొర, నా తరఫున గజపతి నగరం పంచాయితీ ప్రసిడెంటు గంగరాజు, రంగంలో ఉన్నారు. ఎన్నికల బరిలో దిగాం. ప్రతీ పంచాయితీకి తిరగడం అదే ప్రథమం. ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరిని కలిసినా అపూర్వ ఆదరాభిమానాలు లభిస్తున్నాయి. రెండు సీట్లుంటే, రాజులు మూడవ అభ్యర్థిని కూడా పడేశారు. శ్రీరాములు నాయుడ్ని ఇండిపెండెంటు అభ్యర్థిగా, అతనిది మునగపాక. సంపన్న కుటుంబీకుడు. గోపాలపట్నం వెళ్ళాను. చదరం అప్పల నాయుడ్ని కలిశాను. ఎంత సంబరపడ్డాడో, ఎంత ఆనందపడ్డాడో చెప్పలేను. మావాళ్ళ ఓట్లన్నీ మీవే. మీతో పాటు మా అబ్బాయి ఒకడు ఉన్నాడు (అప్పల నరసింహం) అతడ్ని కూడా తీసుకుపొండి రాజకీయం నేర్పండి. గెలుపు మందే తథ్యం. ముందుకెళ్లండి” అన్నాడు. బర్మానుంచి వచ్చాక యస్‌. ఆర్‌.ఎ.యస్‌. అప్పలనాయుడు చదరం అప్పలనాయుడు దగ్గర, మేస్త్రీ పనిచేసేవాడు, ఏదో యింత కూడు దొరికింది అతని మీద భక్తిభావం యిప్పటికీ పోలేదు, మేమందరం అరుగుమీద కూర్చుంటే అతడు బయటనుంచొని దండం పెట్టేవాడు. బాబయ్య, బాబయ్య చిత్తం అనేవాడు. చదరం అప్పల నాయుడికి ఒక అలవాటు ఉంది. చుట్టమీద చుట్ట ఏకధాటిన కాలుస్తాడు. ఆ చుట్ట పీకలను వరండా మీదకు విసురుతాడు. అతడు ఈజీచైర్‌లో కూర్చుంటాడు. చుట్టూ చుట్టపీకలే. ఎన్ని చుట్టలు కాలిస్తే అంత సంతృప్తి. ఆ విధంగా అప్పలనాయుడుకు పునాదులు వేయడం, అప్పలనరసయ్య రాజకీయ ప్రవేశాన్మి రంగం తయారయింది. ఆ తరువాత యూత్‌కాంగ్రెస్‌ నేతగా అతన్ని నియమించడంతో రాజకీయానికి శ్రీకారం చుట్టాడు. అది వేరే విషయం. జిల్లా పరిషత్‌ అధ్యక్ష ఎన్నికల్లో యిటీవలె ఓటమి చెందారు. జనబాహుళ్యం నా ఓటమి జీర్ణించుకోలేకపోయారు. నాపట్ల సానుభూతి పెరిగింది. యీ మారు నా అభ్యర్థి ఓటమి చెందడానికి వీలు లేదన్న దృఢదీక్ష ప్రజల్లో కల్గింది. ఒకరోజు కళింకోట వెళ్ళాం. గంగరాజుని పంచాయితీ అధ్యక్షపదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తరువులు నఖలు జిరాక్సు తీసి పంచినవి అక్కడ గుట్టగా పడి ఉన్నాయి. మేం అడుగుపెట్టగానే. ఆ 188... భాట్టం శ్రీరామమూర్తి స్వీయ చరిత్ర

కరపత్రం చూసి గతుక్కుమన్నాను. డబ్బు కక్కుర్తి మనిషి ఎక్కడ దొరికాడు సార్‌ మీకు అన్నారు. కళంకితుదైన అభ్యర్థిని వెంటబెట్టుకొని తిరగడం నాకు సిగ్గు చేవైనపని, దుష్టబుద్ధి ఉన్న మనుష్యుడు గెలిస్తే మాత్రం మీకు ఎగనామం పెట్టడని నమ్మకమేంటి? ఓడ మీద ఉన్నంతసేపూ ఓడమల్లన్న ఏరుదాటాక బోడి మల్లన్న, ఉగ్గుపాలతో పోసిన విద్రోహతత్వం పెరిగిన మనిషిని వెంట బెట్టుకుంటే వచ్చే అగచాట్లు చెప్ప తరం కాదు. అప్పుడే రాజులు చుట్టుముట్టేశారు జిల్లా అంతా. పంచాయితీలో తిన్న డబ్బు గంగరాజు చేత కక్కిస్తామంటున్నారు. ఎన్నికల్లో యీ రాజు కాని రాజు గంగరాజు డిపాజిట్టు గల్లంతవ్వాలి అని ప్రచారం పుంజుకుంది. నాకు దిక్కు తోచలేదు. ఒక్కమాటే చెప్పాను. ఇది రాజులు పన్నిన పన్నాగం. నందిని పంది, పందిని నంది చెయ్యగలరు. బురద జల్లడంలో సిద్ధహస్తులు. ఆరోపణలు గుప్పించడంలో అందెవేసిన చెయ్యి మీరిలా చూస్తుండండి ప్రస్తుతం జిల్లా వదిలి హైదరాబాదులో అడుగుపెట్టలేను. ఎన్నికలు అయిన వెంటనే యీ ఆర్డర్లు. నేను రద్దు చేయిస్తాను. యీ కేండిడేట్‌ ఊసు మర్చిపొండి రాజులకా? నాకా? ఎవరికి ఓటు తేల్చుకోండి. గంగరాజులో తప్పు ఉంటే, ఆ పాప ప్రక్షాళన నేను చేయిస్తాను అని బరోసా యిచ్చాను. జిల్లా ప్రజలు జాలిపడ్డారు, (క్రేను చూపారు. గంగరాజును గెలిపించారు. వాళ్ళ కేండిదేట్‌ మొదటిస్థానం, నా కేండిడేట్‌ రెండవస్థానం. అప్పటినుండి హైదరాబాద్‌లోని నాయకమ్మన్యులందరూ, జిల్లా వ్యవహారాలన్నింటిలోనూ నన్ను సంప్రదించే సాంప్రదాయం ఏర్పడింది. ఒక మాదిరీగా రాజుల ఏకఛత్రాధిపత్యానికి గండి పడింది. అహంకారం పనికిరాదు

రాజాసాగి ప్రభువులకు నాకూ మధ్య ఎప్పుడూ షష్టాష్టకమే. మా మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. వెయ్యకపోయినా పెద్దాయన నిప్పులు కురిపిస్తూనే ఉంటాడు ఎప్పుడూ. నన్ను చూస్తే, కలలో కూడా గంద్రగొడ్డలి పట్టుకున్న పరశురాముడు కనిపిస్తాడుట, రాచపురుగు లేకుండా తుడిచిపెట్టాలని రామ రామ! నాకే గొడవా తెలీదు, ఏకక్సా కార్ప్చణ్యం లేవు, ద్వేషం, రోషం లేదు! సమభావం, సగౌరవం ఇవే నా జీవిత ప్రమాణాలు. పెద్దింటివాళ్ళు రాజా సాగివారు. జిల్లాలో పలు సంస్థలు వారి పెద్దరికంలో ఉన్నాయి. మరిన్ని పెద్ద పదవులు కావాలని కోరితే తప్పేంటి? అనుకునేవాణ్ణి.

కు స౬ ఈ

స్వేచ్చభరతం 139

జిల్లా పరిషత్తు ఎన్నికల పూర్వరంగం శృరోజు ఎన్నికల ముందు సమీక్షా సమావేశాలు లాంటివి జరుగు చున్నాయి. (ఎ వి భానోజీరావుగారి కోటలో, గడపలో, ఇప్పుడు డాల్ఫిన్‌ హోటలు వగైరా ఉన్న సువిశాల ప్రాంతంలో పెద్ద కోట ఉండేది. సుందరమైన చలువరాతి విగ్రహాలెన్నో అందాలొలికిసాపః చూపరులను మైమరిపిస్తూ ఉండేవి) అక్కడ జరుగుతున్న సమీక్షా సమావేశానికి, నేనుః పి.వి,జి. రాజు కలసి వెళ్ళాం. సాగి సూర్యనారాయణరాజు గంభీరంగా, సూటిగా, భాటిగొ ప్రసంగిస్తూ, 'జిల్లాలో అందరి కన్నా అత్యధిక మెజారిటీ తెచ్చుకునే మగాదు ఎవడైనా ఉంటే అది నేనే అని మీసం మెలేశాడు, సవాల్‌ విసిరాడు. ప్ర అని అహంకారానిక్రి ఆనవాళ్ళు, పొగరుకు గీటురాళ్ళు. పి.వి.జి. రాజు, నేనో కష భకనే హర్చన్నాను. ఒక్కమారు ఉలిక్కిపడ్డాడు. ప్రక్కనున్న నన్ను ప్రక్కలో పొడుస్తూ స న్మారు ఇతి పొగరెలా ఉందో” అన్నాడు నాతో. “చెప్తాను వీడి సంగత అంటూ ముగించాడు. సమావేశానంతరం, ఇద్దరూ తిరిగి అదే కారులో వెళ్తుంటే “అతడి కొమ్ములు తియ్యాలి, ఒక ఒరలో చెండు కత్తులు ఇమడవు” అన్నాడు. ఇక్కడ ఒక విషయం చయ హైద్రాబాద్‌లో ఒకప్పుడు క్షత్రియసమావేశం జరిగింది. సజుతీయు వజరయ్యాడ పట్టుకున్న ఒక కుటుంబ తరహా మీటింగ్‌ అది. పి.వి.జి. రాజు కూ ఉండేవాడు - అప్పటికి హిమాయత్‌ నగర్‌లో ఉన్న జి.వి. సుధాకర్‌ రావు ఇంట్స్‌, “నిక షివి.జి దాజు, అతని ఆగమనానికి నిరీక్షిస్తూ మిత్రుడు ఒకడన్నాడు నతి చలుంది. కులపిచ్చి పృద్ధింది. ఇంతలో వచ్చిన పి.వి.జి. “అల్లూరి సత్యనారాయణ రాజు హాజరయ్యాడు, నేను వెళ్ళకపోతే మన బలగాన్ని నొల్లుకు పోతాడు, అది కులం కాదు. బిలం! ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడవు” అన్నాడు. ఆమాట నేడు మళ్ళీ జ్ఞాపకం వస్తోంది. “సూర్యనారాయణ రాజు ఖతం” అన్నాడు. "భాట్టం! నువ్వు బరిలోకి ద్రిగ్గాల్సి అవసరం పడుతుంది, చెపాను” అన్నాడు. నా గుందెల్లో బండపడింది. ఇప్పటి వ్రరక్షూ అందరితోనూ స్నేహంతో, నఖ్యతలో కాలం గడుపుతున్నా

అందరి నోట్లో, నాలుకలా, చీకు, చింతా లేకుండా (బతుకుతున్నాను. పదవిమాట దేవుడెరుగు, వైరం కొంత తెచ్చిపెట్టుకుంటే గుండెమీద కుంపటి పెట్టుకున్నట్టే, అగ్గి రగిలిందంటే చల్లారడం కష్టం. ఆటుపోటులకు నేనెలా తట్టుకోగలను. సంపన్నుల సరసన చేరాం, సమయం వస్తే అందరూ ఒకటే. అడకత్తెరలో పోకచెక్కలా మధ్యన మనం నలిగి పోతాం, బొబ్బిలి కుమార్‌ రాజా, పి.వి.జిరాజు ఇంటికి వచ్చాడు హైద్రాబాద్‌లో. కర్రి నారాయణరావు ఘనంగా గెల్చిన పార్లమెంట్‌ ఎన్నికల తంతు రసవత్తరంగా వర్షిస్తున్నాడు. “కులం తురుపు పట్టుకుని లక్షల మెజారిటీ తెచ్చుకున్నాడు. ఆ ముఠా, ముఠా అంతా కాపుమయం, ఛస్తే మరొకడికి ఓటు పదదు. తల్లక్రిందుగా తపస్సు చేసినా మరొకడు గెలవడు” అన్నాడు. పి.వి.జి. నన్ను ఎగదోసాడు కులం, ధనం ఈ రెందుపేర్లూ చెప్పే, నేను జడుసుకుంటాను. ఇవి నాకు ఎన్నడూ అనుకూబ అంశాలు కావు. అయినా పి.వి.జి. రాజుకి కులగజ్జి పుడుతుందా! కులం విషయంలో పి.వి.జి.కి స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. శ్రీకాకుళం పార్లమెంటు సీటుకి బొద్దేపల్లి పై ఎవర్ని పెట్టాలి అభ్యర్థిగా అన్న ప్రశ్న చర్చకు వచ్చింది. “రోణంకి అప్పలస్వామి గార్ని పెడితే బావుంటుంది అన్నాను. కాలేజీలో పాఠాలు చెప్పుకుంటున్న ప్రొఫెసర్‌ పేరు ఎందుకు తెచ్చావ్‌? అన్నాదు పి.వి.జి.. “అతను కూడా కాళింగ” అదంతా కళింగ బెల్ట్‌. బొడ్జేపల్లి రాజగోపాలరావు గుత్తాధిపత్యం క్రింద ఉంది.దాని మీద దాడి చేయడానికి వ్యూహాత్మకంగా ఈ పేరు చెప్పాను అన్నాను. అప్పుడు పి.వి.జి. అన్నాడు. “ఈ దశలో నాకు కుల ప్రాబల్యాలు,బలాబలాలు అద్దురావు. మన పేరు మీదే, వంశగౌరవం మీదే జండా ఎగరేస్తాం. కొంతకాలం పోతే ఇవి మరి పని చెయ్యకపోవచ్చు, అప్పుడు చూద్దాం. కుల కుమ్ములాట గురించి, స్వ పర కులభేదాల గురించి. ప్రస్తుతం మన ధాటి ముందు అవేవీ ఆగవు” అని నిబ్బరంగా చెప్పాడు. కులం, గోత్రం అక్మళ్లేదు అతనికి. అందుకే రాజా సాగీ మీద చిందులు త్రొక్కుతున్నాడు. గాని గల్లీలో దిగమంటాడు. కొలిమిలో నిస్పులు కోతీ చేత్తో తీయాలి, ఎవరి చేయి కాలుతుంది? చిన్నమీసాలతో (పి.ఎమ్‌) తలపడ్డానికి తయారుగా ఉండమన్నాడు. నేను దీనంగా చెప్పాను, మొరపెట్టాను. ఇలాంటి పదవులకి నేను పనికిరానని, అసెంబ్లీ అయితే మీ చిత్తం. ఏదైనా చేస్తాను. ఈ పదవికి పద్మనాభరాజైతే బావుంటుంది అన్నాను. “సామాన్యంగా బ్రాహ్మణ్లు పిరికి పందలు, నేను అండగా ఉండగా నీకు గుండెదడ ఎందుకు? గెలుపు గుర్రానివి నువ్వు” అన్నాడు. విజయనగరం వెళ్ళి ఏర్పాట్లు చూసుకోమన్నాడు. చచ్చిందిరా గొగ్రై అనుకున్నాను. కాదంటే పి.వి.జి.కి కోపం, సరే అంటే సాగివారితో తలపట్లు. ఎలా వేగాలి? స్వేచ్భాభారతం

ఇది వరకూ ఇలాగే జరిగింది. మిస్పుల సూర్యనారాయణమూర్తిని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ చేద్దామనుకున్నాడు పి.వి.జి. రాజు. అది బెడిసి కొట్టింది. మొదట్లో మిస్పుల ఉత్సాహం ఉరకలు వేసింది. పి.యమ్‌. (పెద్ద మీసాల) దులిపేశాడు. కొమ్ములు తీసేస్తానన్నాడు, జన్మలో పార్లమెంటు మెట్లు తొక్కవు అన్నాడు. కడుపులో చల్ల కదలకుండా నీ నెత్తిన కిరీటం పెట్టి, పార్లమెంట్‌కి పంపిస్తే, మాకు శఠగోపం పెడతావా? అని నిలదీశాడు. వెన్నులో వణుకు పుట్టించాడు. లబోదిబో అన్నాడు. “నాకా పార్లమెంటు చాలు, జన్మలో, జిల్లాలో ఏ పదవీ, ఎన్నడూ అడగను. నిత్యం మీవెంటే జంటగా ఉంటాను” అన్నాడు. అప్పుడు పి.వి.జి. రాజుకి వేరే అభ్యర్థే లేడు. ఇంతలో ముఖ్యమంత్రి సంజీవరెడ్డి పిలిచాడు. లోపాయికారీగా ఏవో గుసగుసలు జరిగాయి. జెడ్‌.పి. అధ్యక్ష పదవికి పోటీ ఉండదు. పీ.వి.జి. అధ్యక్షత వహిస్తాడు సమావేశానికి పరిశీలకుడిగా సిరీస్‌ రాజు (లెసి స్లేటర్‌ కౌన్సిల్‌ డిప్యూటి చైర్మన్‌) వచ్చాడు. చర్చలు లేవు. రెండు దండలు తెస్తాడు. మొదటి దండ ఎవరి మెడలో పడితే, అతడు వైర్మన్‌. రెండవ దండ వైస్‌-చైర్మన్‌ దండ. పి.వి.జి. స్వహస్తాలతో వేస్తాడు. అది అధిష్టానం చేసిన నిర్ణయం. ఆ విధంగా సూర్యనారాయణ రాజు, జెడ్‌.పి. మొదటి ఛైర్మన్‌ అయ్యాడు. నేను ఉపాధ్యక్షుడినైనాను. అభినవ కృష్ణదేవరాయలట

ఏదో కలహాల కాపురం. గడుసుతనంగా కలిసి మెలిసి బ్రతకాలి, బయటపడాలి. ఘనంగా సన్మానాలు జరిగేవి. “మీరు అపర భోజులు, శ్రీకృష్ణదేవరాయలు” అని అవే పొగడ్తలు, ప్రశంసల జల్లులు ఎక్కడికి వెళ్ళినా. ప్రక్క కుర్చీలో ఉన్న నన్ను చూసి, “నా మీసాలు, తలపాగా చూసి కృష్ణదేవరాయలులా ఉన్నాను అంటారు అందరూ. మీరేమంటారు?” అన్నాడు. నేను పొగడను, తెగడను. ఇలా, ఆ కాపురం గట్టెక్కింది అనుకుంటే, సాధారణ ఎన్నికలలో పిఎమ్‌ అసెంన్లీకి ఓటమితో చిన్నాయనకి ఆస్థానం దక్కాలి అక్కడే వచ్చింది సమస్య. నన్ను కలబడమంటాడు పి.వి.జి. అతనితో. విజయనగరం ఫోన్‌ చేశాను. జీప్‌ వగైరా సిద్ధంగా ఉంటుంది. వారం రోజులు గడువులేదు, ఎలక్షన్లు ముంచుకొస్తున్నాయి. నువ్వు ఇక్కడే దాగుడు మూతలు ఆదుతున్నావు, నువ్వు రంగంలో దూకు, ఆ తర్వాత నేను వస్తాను. గెలుపు మనదే” జంకు, గొంకు లేకుండా ముందుకు సాగిపొమ్మన్నాడు. జిల్లా పరిషత్తు ఎన్నికలు

ఈ కట్టె విజయనగరం చేరుకుంది. అక్కడ జీప్‌ రిపేర్‌లో ఉందిట. నన్ను రిపేర్‌ చేశాడు పి.వి.జి.. జీప్‌ రిపేర్‌ చేయించండి దివాన్‌ జీ! “బస్సెక్కి బైలెల్లు, జనాలు పడి క్ష42 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్ర)

ఛస్తున్నారు నీ కోసం” అని మిత్రబ్బందం వీపు తట్టారు. వైజాగ్‌ టర్నర్‌ సత్రంలో మకాం పెట్టాను. జిల్లా అంత కలియతిరిగాను. నలుమూలల నుండి కార్యకర్తలు దిగబడుతున్నారు. సత్రం గదులన్నీ నిండిపోయాయి. వరండా నిండా జనం. అంతా స్వచ్చందంగా సహాయ, సహకారాల కోసం వచ్చిన వాళ్ళే, తంగేడు ప్రభువుల పన్నాగాలు పసిగట్టడం ఎవరితరం? నన్ను బలవంతంగా బరిలోకి దింపిన పి.వి.జి. రాజు ఓటింగ్‌ సమయానికి గైర్జాజరు. నాయందు నిండు (ప్రేమతో ఉన్న తన పినతండ్రి సర్‌ విజయ(యం.పి)ను రావద్దని సందేశం పంపాడు. ఆయనా ఆగిపోయాడు.

ఆ తరువాత వార్తలు వస్తున్నాయి. ఆంధ్రా యూనివర్శిటీలో న్యూక్షియర్‌ ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌, స్వామి జ్ఞానానంద ఉన్నారు. ఆయన రాజగురువు. అతను గీసిన గీటు దాటడు పి.వి.జి.. ఆయన్ని ఆశ్రయించారు. నీరు కన్నా రక్తం చిక్కన అంటారు. సాగి వారి మాటలు జ్ఞానానంద తలకెక్కాయి. “ఈ వాళ మమ్మల్ని కొట్టడానికి భాట్టంని ఉపయోగిస్తున్నాడు. పి.వి.జి. అమాయకుడు, తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళు అనుకుంటాడు. భాట్టంని నెత్తికెక్కించుకుంటే, మరి దిగడు. కులం గుండెలమీద కుంపటి పెట్టినట్టు. రాచపురుగు లేకుండా తుడిచిపెట్టేస్తాడుట, ఇది మమ్మల్ని బలి చేయటం కాదు, క్షత్రియ వంశమే నాశనం అవుతుంది. మమ్మల్ని మట్టు బెట్టినట్టు కాదు. తన వంశాన్నే భూస్టాపితం చేస్తాడు. అని విషం నూరిపోసారు. ఆయన షి.వి.జి. చెవి కొరికాడు. పి.వి.జి. విమానంలో వైజాగ్‌ బయల్దేరాడు అన్నారు ఫోన్‌ చేస్తే. ఎయిర్‌పోర్టుకి వెళ్ళిన వాళ్ళు తెల్లమొహం వేశారు. విమానం వచ్చింది కాని పి.వి.జి. ఆచూకీ తెలీదు. బుచ్చి అప్పారావు

జిల్లా మొత్తం నుండి జనాలు దిగబడ్డారు. ఉత్సాహంతో ఉర్రూతలూగుతున్నారు. ముందురోజు సాయంకాలం గుత్తిసర్కార్‌ సహాయంతో సి.యం. -గొరెపాటి బుచ్చి అప్పారావుతో బేరసారాలు సాగిస్తున్నట్టు గుప్పుమంది. అతడి ప్రథమ శిష్యుడు రుత్తల లత్సాపాత్రుడు, సుంకరి అప్పలనాయుడు హుటాహుటీన అప్పారావు ఇంటికి చేరుకున్నారు. గంట అయినా తలుపు తీయరు. వీళ్ళు అరుగు దిగరు. ఆఖరుకి వాళ్ళు బయటపడ్డారు. వీళ్ళు ఉభయులు బుచ్చి అప్పారావు కాళ్ళు పట్టుకున్నారు, ప్రాధేయపడ్డారు, మా గొంతుక కోస్తావా! అన్నారు. అప్పారావు కరుగలేదు! తెన్నేటిబాట

తెన్నేటి విశ్వనాథం పంతులు గారు ముందు పి.వి.జి. రాజు రాకపోతే నీకే ఓటేస్తానన్నారు. సరే, వస్తున్నానన్నారు ఇంటికి బయల్టేరారు. రోడ్డు మీద కారు నిలబడింది. స్వేద్భాభారతం 143

పంతులుగారు కారెక్కుతున్నారు. ప్రక్కనుంచి రావి కమతం సమితి అధ్యక్షుడు గణపతి రాజు సన్యాశి రాజుగారు తమతో నేనూ రావచ్చా అన్నాడు (మాడుగుల ఎలక్షన్‌ రాజులంతా కట్ట కట్టుకుని తెన్నేటిని తుంగలో త్రాక్కడానికి చూశారు. తంగేడు వారి ఇలాకాలో ఉన్న ఈ రాజు మాత్రం తెన్నేటి వారి ప్రక్కన నిలిచాడు. ఆ చనువు ఎక్కడికి పోతుంది! కారు తలుపు తెరిచి ప్రక్కన కూర్చున్నాడు. జిల్లా పరిషత్‌ కార్యాలయానికి కారు చేరకముందు విశ్వనాథం గారి కాళ్ళు పట్టేశాడు. మా “సియం” కి ఓటేయకపోతే, మీ పాదాలపై పడి చస్తాను గానీ, కాళ్ళు వదలను అన్నాడు. సరే, వస్తాను పదండి అన్నాడు, తెన్నేటివారు. ఇంతలో జెడ్‌.పి. కార్యాలయం వచ్చింది). విశ్వనాథం పంతులుగారు ప్రేమతో మా ఇద్దరికీ ఓటు గుద్దారు. అది రద్దయింది. ధర్మునాయుడు - గంట్లానలగమ్మత్తు ఒక్క పద్మనాభరాజు మాత్రం నన్ను వదలిపెట్టలేదు. రేవిడి యం. ఎల్‌. ఏ జగన్నాథ రాజుని విడిచిపెట్టలేదు. ఆర్ధరాత్రి వార్త చేరింది. మా ప్రక్కనే ఉన్న ఇద్దరు యం. ఎల్‌ ఏలు ధర్మునాయుడు (యస్‌.టి.), గంట్లాన వీరిద్దరినీ జాగ్రత్త చూసుకోమని! అతని చెయ్యి దాటి పోయింది! పద్మనాభరాజుకి చెప్పాను. కౌంటింగ్‌ ప్రారంభం అయింది. జిల్లా నలుమూలల నుండీ వచ్చిన జనం విరగబడి చూస్తున్నారు. ఆత్రుతతో, ఆసక్తితో రాజుల పక్షాన పూలదండ తెచ్చే మొనగాడు కూడాలేడు. కౌంటింగు పూర్తయ్యింది. ఒక ఓటు రద్దయ్యింది. ఒక ఓటుతో సీతారామరాజు గెలిచాడు. అమ్మో! కడుపు నొప్పి అని గంట్లాన బెంచిమీద వాలిపోయాడు. రాజులు అతని సేదతీర్చి, రాజలాంఛనాలతో వైద్య చికిత్స కోసం కార్గో పెట్టి తీసికెళ్ళారు. ఒక్కఓటు మెజార్టి, వారిని ఏదేళ్ళపాటు పదవిలో ఉంచింది. జిల్లా స్వైరవిహారం చేశాడు ఎత్తినకత్తి దింపకుండా. ఒక్కఓటు మెజార్టితోనే తమిళనాడులో సత్యమూర్తి మీద గెలిచిన కామరాజ్‌ నాడార్‌, రెండు దశాబ్దాలు పైగా రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఉన్నాడట, ఓటు కల్పతరువు. బహిరంగ పోటీ ఎలా జరిగింది ఇద్దరు కాం(గ్రెస్‌ అభ్యర్థుల మధ్య బహిరంగంగా పోటీ ఎలా జరిగింది? అధిక సంఖ్యాకులకి ఆమోదయోగ్యమైన అభ్యర్థిని కాంగ్రెస్‌ నిర్ణయించాలి. అందుకొరకే రాష్ట్రనేతలు బెండికూర్శన్నను రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యదర్శి పరిశీలకుడిగా పంపించారు. ౦౪/1 1211లో సమావేశం జరిగింది. ఓట్లు పెట్టె ఒకటి పట్టుకొచ్చాడు ఆయన, “కావల్సిన పేరు రాసి అందులో వేయడానికి. మేజార్టీ నిర్ణయం ప్రకారంగా అభ్యర్థిని ప్రకటించడానికి కూర్మన్న కైతడ భాట్టం శ్రీరామమూర్తి భ్వీయ చరిత్ర)

గారు ప్రప్రథమంగా ఒక ప్రకటన చేశారు. “రాష్ట్ర కాంగ్రెస్‌ అధికార ముద్రతో వేసిన పట్టిక తెచ్చాను. ఇదిగో... ఇందులో పేర్లు ఉన్నవారు ఓటుహక్కు వినియోగించుకోవాలి. వారే ఉండి, మిగతా వారు బయటకు వెళ్ళండి” అన్నాడు. గుండెల్లో రాయిపడింది మా ప్రత్యర్థులకి. గుత్తి సర్కారు చెంగున ఎగిరాడు. ఆ లిస్టు బోగస్‌ లిస్ట్‌ అన్నాడు. ఒరేయ్‌ నువ్వు పట్టుకుపో అన్నాడు సాంబశివరాజు వచ్చి, ఓట్లు పెట్టె ఎత్తుకుపోయారు. ఇక్కడున్న అందర్నీ ఓటువేయనిస్తావా? వెయ్యనీయవా? అని కూర్మన్న చొక్కా పట్టుకుని ఒక ఊపు ఊపాడు. అసలే అతను ఆస్తమా మనిషి. శరీర దారుధ్యం తక్కువ. గజగజ వణికి పోతున్నాడు. నేను పరుగున వెళ్ళి, సర్కార్‌ను ప్రక్కకి తోసి, కూర్మన్న చేతులు పట్టుకుని బయటకి తీసికెళ్ళాను. కారెక్కించి, 01041141 కి తెచ్చాను. కప్పు కాఫీ తాగాక, కాస్త తెప్పరిల్లాడు. ఇది దారుణం, ఇది ఘోరం. మీ పేరు రాసి 1424216 జారీ చేస్తానన్నాడు. అలా చేయటం పరిశీలకుడి తప్పు అవుతుంది. ఆయన మాట పడకూడదని, వద్దని చెప్పి, నేను రంగంలోకి దిగాను. ౧0౪ [211 కి చేరుకునేనరికి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. పోలీస్‌లు వచ్చారు. విడిపించారు. మీటింగ్‌ రద్దయ్యింది. ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య పోటీ అనివార్యమైంది. తరువాత సంజీవరెడ్డిగారు తప్పు పట్టారు నన్ను. )20426 పొందితే, గెలిచిన వాడిచేత రాజీనామా చేయించేవాడిని అన్నారు. కాలం, ఖర్మం ఎలా నిర్ణయిస్తే అలాగే జరుగుతుంది, అంతే జరుగుతుంది! ద్రోణం రాజును గెలిపించిన తీరు

తరువాత 1981వ సంవత్సరం 2.9 ఎన్నికలు జరుగుతున్నాయి. 1981 నాటికి సీన్‌ మొత్తం మారిపోయింది. మంత్రిగా ఉండి, జిల్లా నలుమూలలా తిరిగాను. అభివృద్ధి కార్యక్రమాలెన్నో అమలు జరిగాయి. అందరికీ అనందమే. సర్వులకూ సంతోషమే. ప్రజానీకం విరగబడి వచ్చేవారు. ఇబ్బడి ముబ్బడిగా. ఇప్పుడు రోడ్‌షో అని పేరు పుట్టింది. అప్పట్లో ఆ మాట తెలీదు. వేలాది ప్రజానీకం ఎగురుతూ, గెంతుతూ, తాళ, మేళాలతో, స్వాగతం పలకడం నాకూ కొత్తే. శత్రు శిబిరంలో తిష్టవేశాం. నర్సీపట్నం, పాయకరావు పేట, చోడవరం, మాడుగుల ప్రాంతాల్లో ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు. పట, పట పట్లన్నీ తెగిపోయాయి. పెత్తందార్ల గుండెల్లో గుబులు పుట్టింది. భూనభోంతరాలు దద్దరిల్లునట్లు జిందాబాద్‌లు జైజై నాదాలు! ఎక్కడ చూసినా ఒక్కటే మాట. ఒకటే పలుకు. అది మన గెలుపు.

సమితి ఎన్నికలకు ముందే జాగ్రత్తపడ్డాం. గెలిచిన సమితి ప్రెసిడెంట్‌లపై రుచి మరిగిన పులి పంజా చాపకుండా, వాడి బారిన పడకుండా హైద్రాబాద్‌ తరలించాం. స్వేద్భ్ధాభారతం 145

అయిదు మినహా మొత్తం సమితులు అన్నీ మా కైవసం అయ్యాయి. ముఖ్యమంత్రి అంజయ్య ముందు హాజరుపరచాం. మీ చిత్తం వచ్చిన అభ్యర్థిని 22కి నిలబెట్టుకోమన్నాడు. అక్కడి నుంచి అందరినీ తిరుపతికి మోసుకుపోయాడు ద్రోణం. ప్రమాణాలు చేయించడంలో ప్రముఖుడు ద్రోణం. తన మెడలో వేంకటేశ్వర స్వామి బంగారపు బిళ్ళ ఒకటి వేలాడుతూ ఉండేది. స్వామి మీద ప్రమాణం తరువాత నాకు పాదనమస్మారం. తరువాత సీటు కేటాయించడం. ఈ తంతు తెలిసిన మహానుభావుడు తిరుపతికి తీసికెళ్ళి స్వామి మీద ఒట్టుపెట్టి ప్రమాణం చేయించి, భాట్టం మాటే, మా మాటని ఎలుగెత్తి చాటించాడు. మరి ఎలక్షన్‌ ఎక్కడ? పోటీ ఏముందీ? మా ఇంట్లోనే మంతనాలు జరిపాం. అందరి మనసులూ తెల్పుకున్నాను. భోళెం బుల్లబ్బాయి మాట ఇప్పటికే నా చెవిలో గింగురులు కొడుతూనే ఉంటుంది. “బాబాయ్‌! నీ మాట జవదాటం మీరెంత చెప్తే అంత, కానీ ఒక్కమాట, ద్రోణంకి ఇస్తే, మిమ్మల్నే దెబ్బ కొట్టేస్తాడు” అన్నాడు. అది నిజం అయిపోతుందేమోనన్న భయం ఠపీమని అతనినోరు మూసేశాను. అతను నీతిమంతుడు, సత్యమంతుడు. 5.%.4.5 అప్పలనాయుడు చెప్పేన మాట నిజమే. ఇంకా ఎందరెందరో ఎన్నోో ఎన్నో చెప్పారు. ద్రోణం రాజునే అభ్యర్థిగా నిర్ణయించాను. అందరూ ఆమోదించారు. ఎన్నిక ఏకగ్రీవం. అందరం కల్సి 2.9 కార్యాలయానికి వెళ్ళాం. ఎన్నిక పూరెంది. ద్రోణంరాజు జిల్లా పరిషత్‌ అధ్యక్షునిగా ప్రకటన జరిగింది. అయినా ఉత్సవాలు లేవు, ఊరేగింపులులేవు, అప్పుడే వచ్చిన ఘోర మరణవార్త విని అందరూ దిగ్ర్భాంతి చెందారు. పంచాయతీ రాజ్‌ మంత్రి పరకాల శేషావతారం స్వర్గస్తులయ్యారు. ప్రగాఢ సంతాపం తెలియచేస్తూ తీర్మానించుకున్నాం. తెచ్చిన పూదండలన్నీ గాంధీజీ విగ్రహానికి వేసి, నిశ్శబ్దంగా నిష్రమించాం. ఇప్పుడు స్వపక్షం, విపక్షం లేనేలేదు. అంతా ఏకపక్షం. అదేదో జాతక మాహాత్యం అనుకుంటాను. తెలీదు ద్రోణం 60వ పుట్టినరోజు ఘనంగా చేసుకోవాలని భారీ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నుండి అనేకానేక మంది విశాఖలో వాలేరు. మైకులు మోగుతున్నాయి. పండగ వాతావరణం. దండలు బ్రహ్మాండంగా ముంచెత్తుతున్నాయి. నాయకులు కొలువు తీరే సమయానికి ఒక మంత్రివర్యుడు పాటిరాజం హఠాన్మరణ వార్త వచ్చింది. పిడుగులాంటి వార్త. అంతటితో సన్మానసభ సంతాప సభగా మారిపోయింది. తన ఆఖరి పుట్టిన రోజూ అలాంటిదే. బ్రహ్మాండంగా ఉపన్యసించిన (ద్రోబంరాజు మర్నాడు జబ్బుపడ్డాడు, కొద్ది రోజుల తర్వాత కన్నుమూశాడు. పుట్టినరోజు గిట్టిన రోజుకి గుర్తు. జీవితం బుద్భుద ప్రాయం ఎప్పుడు ఏ జీవికి పైనుండి పిలుపు వస్తుందో ఎవరికి ఎరుక జనన, మరణాలు దైవనిర్ణయాలు. స శ “ల 146 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

సంజీవరెడ్డి ప్రేమానురాగాలు

సోషలిస్టు పార్టీ రద్దు చేసుకుని కాంగైసులో చేరిన నాటిమాట. సంజీవరెడ్డిగారు 'పేమాభిమానాలతో నన్ను కౌగిలించుకున్నారు. “భాట్టం! ఇటుపైన నీ తుపాకీ ఇటు కాదు. అటు ఎక్కుపెట్టు.” ప్రతిపక్షాలు పక్క చూపించాడు. ఎంత ఆప్యాయత! ఎంత(ప్రేమ! సులువు దొరికినప్పుడల్లా శాసనసభలో ముఖ్యమంత్రిని నిలదీశాను. మాటల తూటాలు పేల్చాను. అది ఏది మనసులో పెట్టుకోకుండా నన్ను హృదయానికి హత్తుకోవడమేంటీి? నా భుజం తట్టి, చేతిలో చేయి కలిపి నాలుగడుగులు నడవడమేంటి? ఆ మహానుభావునికి దయాదాక్షిణ్యాలు మెండు. ఉదారస్వభావుడు, (థేమాస్పదుడు, అందరినీ ఆత్మీయులుగా చూసుకునే మధుర స్వభావం కలవాడు. జిల్లా కమిటీ నిర్మాణం - ఎన్నికల సందోహం

జిల్లా కాంగ్రెస్‌ కమిటీ నిర్మాణం జరగాలి. ఇన్ని సంవత్సరాలు సాగి ప్రభువుల పిడికిట్లో ఉన్న సంస్థ అది. వాళ్ళు ఆడింది ఆట. పాడింది పాట. అంతవరకూ, విజయనగరంలోనే జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం ఉండేది. అక్కడ మూతపడింది. దానిని విశాఖపట్నం మోసుకుపోయారు. వాళ్ళనోట్లో నోరు ఎవరు పెట్టగలరు? భజనలకి, గుత్తి సర్కారు ప్రక్కన ఉండనే ఉన్నాడు. ఆ తరుణంలో సంజీవరెడ్డిగారు నన్నుపిల్చారు. “జిల్లా కాంగ్రెస్‌ కమిటీకి సూర్యనారాయణరాజు అధ్యక్షునిగా ఉంటాడు. నువ్వు ప్రధాన కార్యదర్శిగా ఉండు” అన్నాడు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ నియామకం చేసే ముందు జరిగిన సంభాషణ ఇది. “నేనుండలేను సార్‌, కలహాల కాపురం ఎన్నాళ్ళు నిలుస్తుంది.? నన్ను చూస్తేనే తేళ్ళు, జెర్రులు పాకుతాయి పెద్దరాజు ఒంటినిండా” “సరే కార్యవర్గంలో నీకెన్ని సీట్లు కావాలొ అన్నాడు ఆయన. “ఆరుసీట్లూ అన్నాను. “అబ్బో” అన్నాడు. “ఆ రాజు ఒప్పుకోడయ్యా గట్టి చిక్కువచ్చిపడింది! రెండు స్థానాలకు మించివ్వనంటున్నాడు” అన్నాడు రెడ్డిగారు. “అయితే రెండు పేర్లు రాసి ఇచ్చాను అవి 1. కె.వి.యస్‌. పద్మనాభరాజు, 2, స్వేద్భభరతం. మక

ఆరాధ్యుల అప్పారావు” అని రాశాను. ఆ చీటీ చూశాడు. “గొప్పవాడివయ్యా, నువ్వు తప్పుకుందామని చూస్తున్నావా? పనికిరాదు, నీతో ముగ్గురు” అన్నాడు, లేచిపోయాడు. అది 62 ఎన్నికల అభ్యర్థులను జిల్లా కాంగైస్‌ కమిటీ తీర్మానం చేసి, రాష్ట్రానికి సిఫార్సు చేయవలసిన సందర్భం. అప్పటికి ఆ పద్ధతి ఉండేది. దాదాపు 20 మందిలో మేం ముగ్గురు. ఏం చేయగలం? అందులోనూ పద్మనాభరాజు అటు చేరిపోయాడు. మిగిలింది ఇద్దరమే. “మేం మీటింగ్‌లో పాల్గొనం” అన్నాను బ్రవ్మోనందరెడ్డి గారితో. “పనికిరాదు, వెళ్ళాలి, పద్ధతి పద్ధతే... వాళ్ళేం చేస్కుంటే చేస్మోనీ, మీరు 01339606 (అసమ్మతి) రాయండి, మీకు టికెట్‌ ఇచ్చేవాడిని నేనుండగా మీకేం భయం?” అన్నాడు. ఆ భరోసా తీసుకొని, మీటింగ్‌కి హాజరయ్యాం. ఆరాధ్యుల అప్పారావు ఒకపేరు ప్రతిపాదించటం నేను బలపరచటం, ఓటింగ్‌ పెడితే, ఓడిపోవటం. టపటప మా పేర్లన్నీ పడగొట్టేస్తున్నారు. విజయనగరం నియోజక వర్డానికి నాపేరు వచ్చేప్పటికి ఇంకో వింత పరిస్థితి ఏర్పడింది! నా పేరు అప్పారావు చెప్తాడు. మరి బలపరిచే వారెవరు? నాపేరు నేను బలపరచు కోకూడదు. “0 96000461 త్రోసిరాజు” అన్నారు. వివరాలన్నీ పత్రికలకు విడుదల చేశారు సాగి ప్రభువులు. అంతా గుప్పుమని పోయింది. ఘోరం జరిగిపోయింది. సోషలిస్టుల పీకలు తెగిపడుతున్నాయి అనుకున్నారు అందరూ. మా పేర్లకేం భయంలేదు, బ్రహ్మానంద రెడ్డిగారు కాసుకుంటారు. అదే మా మొండిధైర్యం. ఆఖరుకి అంతే జరిగింది. మా పేర్లన్నీ ఖరారు అయ్యాయి. నాపేరు విషయంలో మాత్రం ఓ పెద్ద చిక్కుముడి పడింది. మహిళా అభ్యర్థితో - నా సీటుకు చిక్కుముడి విజయనగరం స్థానానికి ఒక (మహిళ) ఆమె పేరు లింగం సీతాదేవి సిఫార్సు చేశారు రాజులు. ఇందిరా గాంధీ ప్రప్రథమంగా కాంగ్రెస్‌ కార్యవర్గ సభ్యురాలైంది. పార్లమెంట్‌ బోర్డు సమావేశానికి హాజరైంది. అప్పటికి ఈ పార్టీ, ప్రపంచం ఏమీ తెలీదు. అంతా కొత్తే. లిస్టులో ఆడమనిషి పేరు కనపడితే చాలు, టిక్కెట్‌ ఇచ్చేయమనేది. ఈ తలనొప్పి ఎలా వదిలించుకోవాలి? విజయనగరం సీటు మహిళకే ఇవ్వాలని పట్టు పట్టింది. ముళ్ళపూడి పళ్ళం రాజు పి.సి.సి. అధ్యక్షులు ఆయన గట్టిగా నన్ను బలపరిచారు. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి “భాట్టం, ముఖ్యుల్లో ముఖ్యుడు, అతనికి టిక్కెట్‌ ఇవ్వడం పార్టీకే మంచిది. సబ్జెక్టు తెలుసు. మంచివక్త, ప్రజల మనిషి, నిరంతరం ప్రజలకోసం పాటు పడతాడు” అని ఘంటాపథంగా చెప్పాడు. “అంత ముఖ్యమైన వ్యక్తి అయితే ఇంకొక నియోజక వర్గంలో సీటివ్వండి” అందట ఇందిరాగాంధీ. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుంది. మహిళా అభ్యర్థే కావాలి అంటుంది ఈమె. పట్టువిడవదు, మెట్టు 148 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

దిగదు! నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్‌ అధ్యక్షుడు. “సరే మంచిది, ఈ పేరు 41504166 119లో పెడదాం. ఆఖర్న తిరిగి చర్చించినప్పుడు నిర్ణయం తీసుకుందాంా అని ప్రక్కన పడేశాడు. విజయనగరం సీటు సందిగ్ధంలో పడింది. అన్ని సీట్లూ ఖరారు అయ్యాయి. పత్రికల్లో పేర్లు పడ్డాయి. నా సంగతి అయోమయం!

మిత్రులు ఖిన్న వదనులయ్యారు. గుండెలు బాదుకున్నారు. నేను ఫోన్‌ చేసి, ఊరట కల్పించాను. అన్ని రాష్ట్రాల లిస్టులు పూర్తి అయ్యాయి. అందరూ రాత్రింబవళ్ళు కూర్చుని ఈ పని పూర్తి చేశారు. ఈ 61500666 [31 తిరగి తోడి - మళ్లీ చర్చలు చెయ్యడాన్ని ఎవరికీ ఓపికలేదు. అలసి, సొలసి, ఉన్నారు. 15044664 [13 6098653 అధ్యక్షుని నిర్ణయానికి వదిలిపెట్టారు. చిక్కుముడి ఇప్పుడు ఒక్కమారు వీడింది. సంజీవరెడ్డి కబురు పంపించారు, “భాట్టం, నువ్వు ఇక్కడ ఉండకు, విజయనగరం వెళ్ళి జాగ్రత్తపడు, ఎన్నికల వ్యూహం చూస్కో తర్వాత టెలిగ్రాం పంపిస్తాను. నామినేషన్‌ వేస్కో” అన్నారు. అక్కడితో గండం దాటి పిండం బైటపడింది. ఎంత పని చేశారో చూడండి రాజులు! శిఖండిని ముందు పెట్టి భీష్ముడిని పడగొట్టాలని పన్నాగం పన్నినట్టు ఉంది. ఈ పద్మవ్యూహం నుంచి బైటపడేటప్పటికి, తల ప్రాణం తోకలోకి వచ్చింది. అటు పి.సి.సి. ప్రెసిడెంట్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలభారత కాంగ్రెస్‌ అధ్యక్షులు ముగ్గురూ పట్టుకుంటే బ్రతికి బయటపడ్డాం. ఎన్ని గండాలు దాటేనో! ఎన్ని అగ్ని పరీక్షలకి గురిచేశారో! దిగ్గజాల్లాంటి మనుషులు, హేమా హేమీలు, రాష్ట్ర దేశ నాయకులు అందరూ కొమ్ము కాస్తే బయట పడ్డాను. ఎన్నికల రంగంలో ప్రవేశించి విజయధంకా (మోగించాను. రెండవ మారు విజయనగరం నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించటం జరిగింది. పి.వి. హయాంలో దుమారాలు - ద్రోణం ఉదంతం

పి.వి. హయాంలో మన జెండా ఎగురుతుంది. కోరిన టిక్కెట్‌ కోరిన వారికి దక్కుతుంది. బంగారు బాటలు పడతాయి. కాసుల మోతలు వినపడతాయి. విజయఢంకా (మోగుతుంది. ఇదీ మన వర్షం అందరి ధీమా. “రాజులు రాజీకి వచ్చారంటే పి.వి.కి పాదాక్రాంతులు అయినట్టే. మన కత్తికి ఎదురేముంది” అంటూ ధైర్యసాహసాలు నూరిపోసేవాడు ద్రోణంరాజు అందరికీ. తలచుకుంటే పదవిలో ఉన్న పదిమందినీ తలదన్నే (ప్రతిభ మూర్తీభవించిన మనిషి ద్రోణం. కరణీకానికి స్వస్తి చెప్పి, పంచాయితీ పట్టుకు వ్రలాడితే ఏం లాభం? కనీసం సమితి (ప్రెసిడెంట్‌ అయినా కావాలి కదా! చూస్తూ ఊరుకుంటే చేతకానివాడు అనుకుంటారు. పోటీ పడేస్త మూడు చెజువుల నీళ్ళు తాగిస్తాను. గప్పాలు కొడుతున్నాడు. అప్పలనర్సయ్య, ఉఫ్‌మని ఊదిపారేస్తాను మీ దయ ఉంటే స్వేచ్భాభారతం 149

అనే వాడు నాతో, అప్పుడే కండలు బిగిస్తున్నాడు, అర్రులు చాస్తున్నాడు. “చావగొట్టి, చెవులు మూసేస్తానంటున్నాడు, అప్పల నర్సయ్యని, తన కాలిగోటికి సరిపోడు” అని ధీమా వ్యక్తం చేసేవాడు. ధీర, గంభీరంగా మాట్లాడేవాడు. నా దగ్గిర ఎందుకు గప్పాలు కొడ్డాడు? గొప్పలు చెప్తాడు? అనుకున్నాను. అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. మంచిదే. “సమితి చేతిలో పడితే, పరిషత్తు సంగతి తరువాత చూద్దాం” కానివ్వండి అన్నాను. ఇలిచి వచ్చి మొహం చూపిస్తానన్నాడు” “ఎప్పుడు అవసరం ఉన్నా ఫోన్‌కొట్టంది, వచ్చివాల్తాను” అన్నాడు. అబ్బే అంత పరిస్థితి రానివ్వను అంటూ నిష్క్రమించాడు ద్రోణం. పెందుర్తి సమితికి ఓటమి 1970లో సమితి అధ్యక్ష పదవికి ఢీకొన్నాడు అప్పల నర్సయ్యతో అన్నీ శుభ వర్తమానాలే వస్తున్నాయి. మనది గెలుపుగుర్రమే అని సంబరపడిపోయాడు. హఠాత్తుగా పిడుగులాంటి వార్త వచ్చిపడింది. అప్పలనర్సయ్య గెల్బాడు, (ద్రోణంకి ఓటమి సంభవించింది. ఓటమి ఎంతటివాడినైనా కుంగదీస్తుంది. ద్రోణం ఇల్లు చేరుకున్న కొద్ది నిమిషాలకే నేనూ వెళ్ళి వాలేను. జరిగిన అన్యాయాలు, అక్రమాలు ఏకరువు పెట్టారు మద్దతుదారులందరూ. సానుభూతి వచనాలతో సాంత్వన చేకూర్చి, బోలెడు భవిష్యత్తు ఉంది, మనకెందుకు బెంగ?” అని ఓదార్పాను. అది తొలి పరాజయం పరామర్శ, ఇప్పుడు 72లోకి అడుగుపెట్టాం. రాజీ బాటలో రాజులు పి.వి. హయాం. భయం, భీతిలేదు. మనకెదురులేదు. విశాఖపట్నం-2 అసెంబ్లీ నియోజకవర్గానికి టిక్కెట్‌ సాధిస్తే విజయం మనదే అన్నాడు. ఆ పూచీ నేను తీస్కున్నాను. రాజులు ప్లేటు తిరగేశారు. పి.వి. పాలనలో భాట్టం మాటకు తిరుగులేదు అనుకున్నారు. ఆ రాజులు సూక్ష్మగ్రాహులు, గుత్తి సర్కారు, తదితర అనుచరగణం జెడ్‌పి ఆఫీసునుండి మా ఇంటికి, మా ఇంటి నుండి జెడ్‌పి ఆఫీసుకి గడియారంలో పెండ్యూలంలా కలియ తిరగేస్తున్నారు. మనకి మనకి తగువులు లేవన్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో, అన్యోన్య సహాయ సహకారాలతో మొత్తం సీట్లన్ని గెల్చుకుందాం అన్నారు. ఒకనాడు అభ్యర్థుల లిస్టు పట్టుకొచ్చాడు గుత్తి సర్కారు. అది ధర్మం కాదన్నాను. నేనే జెడ్‌పి ఆఫీసుకి వచ్చి కలుస్తాను అన్నాను. ఒక్కపేరు లక్ష్మీరఘురాం చాలా ముఖ్యమని నొక్కి వక్కాణించాడు. ఆమె ఉండేది విజయనగరం. కానీ నాకు ఎన్నడూ ఆమె ఎవరో తెలీదు. ఒకరోజు సాయంకాలం కోటలో కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్న పెద్దల మధ్య కూర్చున్నాను. 150 భాట్టం శ్రీరామమూర్తి (స్వేయ చరిత్ర)

లక్ష్మీరఘురాం అంటే ఎవరండీ అన్నాను. ప్రఖ్యాత అద్వకేట్‌ దేవులపల్లి గణపతి అన్నాడు. “విజయనగరంలో పెద్ద చెలువు ఒకటుందన్న సంగతి మీకు తెలియదా” అన్నాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లో, ఆ దుర్గంధం భరించలేకపోయేవాళ్ళం. సరే, దేవులపల్లి గణపతి మాట జ్ఞాపకం వచ్చింది. ఆ పేరు మార్చేయండన్నాను. అంతకన్నా మంచివ్యక్తి దొరకలేదన్నారు. ఇంకో పేరు నేనిస్తానన్నాను. దయచేసి అలా చేయండి అన్నారు ప్రాధేయపూర్వకంగా. విజయనగరం ఫోన్‌ చేశాను. భార్యాభర్తలిద్దరూ వచ్చివాలారు కొన్ని గంటల్లో, బొడ్డు కళావతి, ఆమె భర్త రాంబాబు. ఎన్నికల్లో పోటీకి తయారవుతారా? అని అడిగాను. టిక్కెట్‌ ఇప్పిస్తే, అంతకన్నా భాగ్యమా అన్నారు ఉభయులు. గుత్తి సర్కారుకు ఫోన్‌ చేశాను. తాతమ్మ రాజుతో సహా వచ్చాడు. వీళ్ళని మీతో తీసికెళ్ళి మాట్లాడుకోండి అన్నాను. అ విధంగా బొడ్డు కళావతి రాజకీయ ఆరంగేట్రానికి రంగం సిద్ధం అయింది. సి.యం. గారి లిస్టులో ఆమెను అభ్యర్థిగా చేర్చుకున్నారు. ద్రోణం సీటు కోసం పాట్లు

ఎలక్షన్‌ కమిటీ సమావేశానికి ముందు పి.వి, నన్ను పిలిచాడు. “గెలవని పేరు చెప్పొద్దు, గెలిచే మనిషికి టిక్కెట్‌ ఇవ్వడం ఖాయం. ఆశపడి, అత్యాశకు పోయి గెలవని గుర్రాలను పట్టుకుంటే మీరు అభాసుపాలవుతారు” అన్నాదు. అప్పుడు నేను పి.సి.సి. కార్యదర్శిని. ఎన్నికల కమిటీ మీటింగ్‌కు కూడా వాజరయ్యే వాడిని. నియోజకవర్థాల వారిగా, ఆ పూటకు చర్చకు వచ్చే అభ్యర్థుల జాబితా, వారి పూర్వాపరాలతో పాటుగా, ప్రతీ సభ్యునికి సర్యులేట్‌ చేయటం జరిగేది. అపుడు పి.సి.సి. అధ్యక్షుడు మహమ్మద్‌ ఇస్మాయిల్‌, యస్‌.కోట నియోజకవర్గం లిస్ట్‌లు చూశాడు. ఆశ్చర్యం, అసహ్యం రెండూ వ్యక్తమయ్యాయి అతని మొహంలో. గొగ్రిపాటి బుచ్చి అప్పారావు ఆయన దగ్గర స్నేహితులు, అతని సీటు కొల్లగొట్టాలని వేరే అభ్యర్థి (లేడీ క్యాండిడేట్‌ కళావతి) పేరు అక్కడ పెట్టారు. ఈ ఎత్తు నా దగ్గర కొనసాగదు. నేను అధ్యక్షునిగా ఉండగా, బుచ్చి అప్పారావుకి సీటు ఖాయం అని ఖరాకండిగా చెప్పాడు. ఆమె పేరు పక్కన పెట్టండి, మర్నాడు చూద్దాం అన్నాను.

బయటికి వచ్చేసరికి రాజుల బృందం చుట్టుముట్టారు. ఏం జరిగిందో తెలుసుకోవాలని, విషయాలన్నీ సమగ్రంగా చెప్పాను. “పోనీ ఆ పేరు తీసి పాలవెల్లికి వ్యతిరేకంగా చోడవరంలో పెట్టమన్నాను. మర్నాడు మీటింగ్‌ ప్రారంభించక ముందు పి.వి. నన్ను పిలిచాడు. “సాహిత్యప్రియుడు, భాషాపరిజ్ఞానం ఉన్న సంస్మారవంతుణ్జి కూడా మీరు బ్రతకనివ్వరా” అన్నాడు పి.వి. కొంత అసహనంగా. ఏ మహానుభావుడికి స్వేచ్భాభారతం 151

ఈ దుర్చుద్ధి పుట్టిందో అన్నాడు. పోనీ ఆ పేరు పక్కన పెట్టండి సార్‌ తరువాత చూడొచ్చు అన్నాను. పాలవెల్లి పేరు కరారు అయ్యింది. . ఇప్పుడు ద్రోణం మాటఏంటి? మర్నాటి సమావేశానికి కేంద్రం నుండి అధికార ప్రతినిధిగా దీక్షిత్‌ అని ఒక కార్మికనాయకుడు ఢిల్లీ నుండి వచ్చి, ఒక సీల్డ్‌ కవర్‌ తెచ్చాడు. అందరి సమక్షంలోనూ ఓపెన్‌ చేశాను. “ఇవి కేంద్రం చేసిన నిర్ణయాలు, వీటికి తిరుగులేదు, ఇవి తప్ప, మిగతా వాటిపై చర్చలు చేసుకోండి. నిర్ణయాలు తీసుకోండి” అంటూ కవరు విప్పి పేర్లు చదివాడు. విశాఖపట్నం-2 ఎదురుగా పి.మన్‌వాల్‌ నాయుడు పేరు రాసి ఉంది. ఆయన ఒక పెద్ద కార్మికనాయకుడు. కేంద్రం కేటాయించింది ఆ సీటు. నోట్లో పచ్చి వెలక్కాయ పడింది! గుండెమీద సమ్మెటపోటు వేసినట్లు అయ్యింది. కరచరణాలు స్తంభించాయి! ద్రోణానికి టిక్కెట్‌ తేలేని నా బ్రతుకెందుకు అనిపించింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. జీవచ్చవంలా బయటికొచ్చాను. మాడుగులకూ రథీ

  • మా ఇంటికొచ్చి, నన్ను కల్సిన ద్రోణం, పరిస్థితులన్నీ తెల్సుకున్నాడు. కళ్ళు బైర్లు కమ్మాయి. స్తంభించిపోయాడు. కానీ అతడి బుర్ర ఆలోచనల పుట్ట. క్షణంలో కోలుకున్నాడు. క్రొత్త ప్రతిపాదన పెట్టాడు. మాడుగుల నియోజకవర్గం మీద గ్రామోద్యోగుల సంఘానికి గట్టి పట్టుంది. మాకు బలవత్తరమైన స్థావరం. అక్కడ టిక్కెట్‌ దొరికినా గెలవడం ఖాయం అన్నాడు. ప్రత్యామ్నాయం చూపించాడు.

ఈ మారు చూద్దామని ద్రోణం పేరు మాడుగుల నియోజకవర్గంలో పెట్టాను. లిస్టు చూసి ముఖ్యమంత్రి పి.వి. నన్ను పిల్చి “మీకీయన అంత ముఖ్యుడా, తప్పని సరైతే చెప్పండి, విదో చూద్దాం” అన్నాడు. “ద్రోణం నాకు కుడిభుజం, అన్ని పనులూ అతనే చక్కబెట్టేస్తాడు, అతనికి సీటు వస్తే గెలుస్తాడు” అన్నాను. “సరే, మంచిది, మీ సీటుకు వెళ్ళండి” అన్నాడు. మాడుగుల మీద చర్చలేదు. ద్రోణం పేరు ఖరారు అయ్యింది. బతుకుజీవుడా అని బయటపడ్డాను. సంతోషం పట్టలేక ఆ చుట్టుపక్కల దోణం తచ్చాడుతున్నాడేమో చూడమన్నాను. దమ్ము కొడుతూ, పచారీ చేస్తున్న (ద్రోణంరాజు పరుగెత్తి దగ్గరకొచ్చాడు. గట్టిగా కౌగిలించుకుని కంగ్రాట్స్‌ అన్నాను. మాడుగుల సీటు ఖాయపడిందని చెప్పాను. ఆ రోజంతా సంబరమే సంబరం. మాడుగులకి ఫోన్‌ పెట్టుకుని కూర్చున్నాడు ద్రోణం.

152 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

మర్నాడు సమావేశానికి వి. బి.రాజు వచ్చాడు. నన్ను పక్కకి పిలిచాడు. ఈ కేండేట్‌ మీకంత ముఖ్యుడా అన్నాడు మాడుగుల సీటు చూపించి, అవునన్నాను. అయితే అతన్ని వేరే నియోజకవర్గానికి మార్చండి, లేదంటే అతని సీటు గల్లంతు అవుతుంది అన్నాడు. ఎట్లా అని క్వశ్చను మార్కు వేశాన్నేను. అంతకుముందు ఆ నియోజకవర్గం నుండి గెల్పింది మహిళా అభ్యర్థి మాడుగుల రాణిరమాదేవి. ఆమెను తప్పించి, ఇంకో కేండేట్‌ని దిగుమతి చేస్తే కేంద్రం వప్పుకుంటుందా? అన్నాడు. ఈ విషయంలో నేను ముందే జాగ్రత్తపడ్డాను. ఎన్నికల పట్ల తనకు ఆసక్తి లేదని, మళ్ళీ పోటీలో నిలవననీ ఆమె వ్రాసిన ఉత్తరం తీసి, దగ్గర జేబులో ఉంచుకున్నాను! అది చూపించాను. దీని వల్ల ప్రయోజనం లేదన్నాడు. ఇక్కడిలా చెప్పింది. ఢిల్లీ వెళ్ళి సీటు కావాలి అంటుంది. అప్పుడేం చేస్తారు? అన్నాడు. తేలని అయోమయంలో పడ్డాను. నా బుర్ర మరి పనిచేయడం లేదు. దారి, తెన్ను తెలియటం లేదు. నా స్థితి గమనించి ఆయనే అన్నాడు. నేనే మార్గాంతరం చూపిస్తాను.మీటింగ్‌ అయ్యాక కలవమన్నాడు. తీరా కలిస్తే ఆయనిచ్చిన సలహా ఇలా ఉంది. “మహిళస్థానంలో మహిళ ఉంటుంది” మాడుగులలో కళావతి పేరు పెట్టండి. ద్రోణం పేరు వైజాగ్‌-1లో పెట్టండి అన్నాడు. నాగుండె గుభఖేల్‌మంది. ఎక్కడ జుత్తాడ కరణం? ఎక్కడ వైజాగ్‌-1 సీటు? తెన్నేటి, భానోజీ రావు వంటి మహామహులు గెల్చిన సీటది. విశాఖపట్నం భానోజీరావు ఖిల్లా. అతనొక రాజు. బొబ్బిలిరాజులాగే “అంకితం వారు కూడా విశాఖనగరానికి మకుటం లేని మహారాజులు” ఆ రాజు మీద స్వారీ చేయడానికి ఇప్పుడు జుత్తాడ కరణాన్ని ఎక్కించాలి. ఎట్లా? భయాందోళనలతో బయటికి వస్తే ద్రోణం రాజు కలిశాడు. అతనికి పాలుపోలేదు. విబిరాజు చెప్పినా ప్రమాదం లేకపోలేదు. వైజాగ్‌-1 కి నాపేరు పెట్టి ఒప్పించగలరా అన్నాడు ద్రోణం. నాకు ధైర్యం చాలడం లేదు అన్నాను. ఏది వీలైతే అదే చేయండి. మన తలరాత ఎలా ఉందో అలాగే జరుగుతుంది.

ప్రముఖులందరూ హాజరైనా ఎవరూ నన్ను కాదనలేదు. మర్రిచెన్నారెడ్డి దగ్గరికి వెళ్తే మీకు కావలిస్తే రాస్మోండి, నాకెందుకన్నాడు. ముఖ్యమంత్రి వప్పుకుంటాడో లేదో చూస్కోండి అన్నాడు. ఇందరు పెద్దల ఆమోదముద్ర లభించింది. పి.వి.గారి ఆటంకం ఉండదు. సామాన్యంగా మిగతావాళ్ళు ఎవరైనా అడ్డుపడితే ఏం చేయాలి? చర్చకురాకుండా సరిపెట్టుకోవడం ఎలా? చిక్కులు చుట్టు ముట్టకుండా ఏం చేయాలి. చల్లగా, మెల్లగా మిగతా పెద్దల దగ్గర కాన్‌వాసింగ్‌ ప్రారంభించాను. బ్రహ్మానందరెడ్డి అన్నగారు కాసు వెంగళరెడ్డి కూడా ఎన్నికల సంఘం సభ్యుడు. ఈ ప్రతిపాదన ఛస్తే ఒప్పుకోను అన్నాడు. నాకు భానోజీరావు చాలా సన్నిహితుడు, అతన్ని త్రోసి రాజు అనడానికి ఇతనెవరు? స్వేచ్భాభారతం 153

ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు? అన్నాడు. “మిగతా పెద్దలందరూ ఒప్పుకున్నారు. మీరూ అడద్దుపడకపోతే సరిపోతుంది. దయచేసి, నా కోసం, నా ముఖం చూసి, ఈ అభ్యర్థన మన్నించండి, సహాయం చేయండి” అని అర్థించాను. కొంతసేపు మౌనం వహించాడు. తరువాత దయ చూపించాడు. సరే నేను సిగరెట్‌ కాల్చుకోడానికి బయటికి వెళ్తాను. అప్పట్లో ఈ పేరు బయటపెట్టండి అన్నాడు. బతుకు జీవుడా అనుకున్నాను. ఒక గండం దాటింది. ఇక వెంకటగిరి రాజా యాచేంద్ర ఉన్నాడు. రాజ కుటుంబీకులందరూ పరస్పరం సన్నిహితులే, ఇప్పులే. ఈ పెద్దింటి వాళ్ళందరి మధ్యా సత్సంబంధాలెన్నో ఉంటాయి. ఈ ఒక్క ముద్ద దిగితే చాలు లైన్‌ క్లియర్‌ అవుతుంది, అనుకున్నాను. అతడు ససేమిరా అన్నాడు. చేతులు జోడించాను. నా సమవయస్ముడో, కొంచెం చిన్నవాడో తెలీదు. జోడించిన నా చేయిని ఠపీమని పట్టుకుని, అంతపని చేయకండి. ఈ నిర్ణయానికి భాగస్వామినై, తరువాత భానోజీకి ముఖం ఎలా చూపించగలను? అన్నాదు. అప్పుడు కాసు వెంగళ్‌రెడ్డి అన్న మాట చెప్పాను. “అయితే సరే, ముందు చెప్పండి, ఆ టైమ్‌కి నేనూ బయటకు పోతాను” అన్నాదు. ఎట్టకేలకు ఏకగ్రీవంగా వైజాగ్‌-1 స్థానానికి ద్రోణం రాజు పేరు నిర్ణయం అయ్యింది. మర్నాడు పత్రికల్లో ప్రముఖంగా ఈ వార్త వచ్చింది. కళావతి మాడుగుల సీటు దక్కించుకుంది. ఢిల్లీలో దిమ్మ తిరిగింది ఇంతటితో ఈ కథ కంచికి వెళ్ళలేదు. కేంద్రంలో ఘనాపాఠీలు ఎందరో? ఏ రోజు, ఏ రాష్ట్రం, ఏ జిల్లా తీసుకుంటారో? చర్చల్లో ఏ నిర్ణయాలు తీస్కుంటారో? ఎలా తెలుస్తుంది! ఢిల్లీ స్థాయిలో పి.వి.యే దిక్కు! ఢిల్లీలో అంతా దర్బారు పద్దు. హరిజనులంతా జగ్జీవన్‌ రామ్‌ ఇంటి చుట్టూను, ముస్లిమ్‌లందరూ ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ ఇంటి చుట్టూ చేరుతారు. వారి మొర ఆలకించి పార్లమెంటరీ బోర్డులో ఏం చేస్తారో వారి దయ. విశాఖపట్నం సిటీ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా డా.యమ్‌. ఆర్‌.డీన్‌ ఉన్నాడు. నాటి పి.సి.సి. అధ్యక్షుడు గొట్టిపాటి బ్రహ్మయ్యగారితో చెప్పి, అతనికా పదవి నేనే ఇప్పించాను. డీన్‌ ఢిల్లీ చేరుకున్న సంగతే తెలీదు నాకు. గుప్తంగా, గూఢంగా ఉంచాడు ఈ వార్త. గుండ్రంగా, పుష్టిగా ఉంటాదు. పొడుగాటి మనిషి మృదుభాష్కీ సౌమ్యుడు. ముఖకవళికలు ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటాయి. ఎలా పట్టుకున్నాడో ఆ పెద్దాయన్ని. పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ పట్టిన పట్టు వదల్లేదట. పట్టణ నియోజకవర్గం కాంగ్రెస్‌ (ప్రెసిడెంట్‌కి ఇవ్వకపోతే మరెవరికి ఇస్తారు? మైనార్టీస్‌కి దేశంలో చోటు ఎక్కడ 154 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

ఉంటుంది? అని భీష్మించుకుని కూర్చున్నాడట. మీటింగ్‌ అయిన తర్వాత లక్ష్మీకాంతమ్మ ఇంటికెళ్ళి పడుకున్నాడు పి.వి. ఆమె దయతో, సౌజన్యంతో లోపల అడుగుపెట్టాను. “భాట్టంగారూ! మీ ద్రోణం పని సున్నా” అన్నాడు ముఖ్యమంత్రి పి.వి. “పెద్దాయన పట్టుబడితే ఏం చేయగలం, ఇంతకీ ఎం. డీన్‌ మీ మనిషే కదా, మీకు తెలియకుండా ఈ పాడు పని చేస్తే ఎట్లా” అని ముగించాడు. వైజాగ్‌-1 సీటు డీన్‌ దక్కించుకున్నాడు. ఈ చేదు మాత్రను నేను దిగమింగలేకపోయాను. నేరుగా హైద్రాబాద్‌ గాంధీభవన్‌కి వెళ్ళాను. అక్కడొక ఆఫీస్‌ సెక్రటరీ శాస్త్రి ఉన్నాడు. మాడుగుల స్థానం నుంది డమ్మీ అభ్యర్థిగా, ద్రోణం పేరు రాయించి, పి.సి.సి. ముద్రవేయించి వైజాగ్‌లో దిగాను. ద్రోణం ఓటమి కాంగైస్‌ నుండి బహిష్కరణ

అప్పటికే పరిస్థితులు చేయి దాటిపోయాయి. (ద్రోణం వైజాగ్‌-2లో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేస్కున్నాడు. కళావతి భర్త, ఇద్దరూ నన్ను కలిశారు. మాతోడు లేకుండా వాళ్ళిద్దరినీ స్వయంగా మాడుగుల వెళ్ళి రమ్మన్నాను. పరిస్థితుల ప్రత్యక్ష అనుభవం, అనుభూతి అవసరం అన్నాను. వాళ్ళు అక్కడ అడుగుపెట్టగానే జనం దూచేసారంట. “ఎక్కడ నుండి దిగబడ్డావమ్మా? ఇక్కడ నీ పాటి మనుషులు లేరనుకున్నావా? మాడుగుల గొద్దుపోలేదు! ఇదొక పునరావాస కేంద్రంగా తయారైంది! మీకున్న అనుభవం ఎంత? ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చా"రని దుయ్యబట్టారు! వీళ్ళిద్దరూ భయభ్రాంతులయ్యారు. ఎలక్షన్‌లంటే ఇలా ఉంటాయా? అన్నారు. మాకీ టిక్కెట్‌ వద్దు, ఎలక్షన్లూ వద్దు. మా ఊరికిపోయి మా బ్రతుకు మేం (బతుకుతాం అన్నారు. ద్రోణం చేత నామినేషన్‌ వేయిస్తాను మాడుగులకి. వీళ్ళు ఇంటిముఖం పడతారనుకున్నాను. ద్రోణంకి ఈ వ్యూహం వివరించాను. డమ్మీ అభ్యర్థిగా పి.సి.సి. ఇచ్చిన పత్రం చూపించాను. మాడుగులలో నామినేషన్‌ వేని గెలవండి అన్నాను. అప్పటికప్పుడే సమావేశాలు జరిగిపోతున్నాయి. జనం కిర్రెక్కి పోతున్నారు. నియోజకవర్గం మారం. విజయం తథ్యం, ప్రక్కదారి పట్టం, ఫపోరుబాటవిడవం అని కూర్చున్నారు ద్రోణం. గెలుపు ఖాయం అంటాడు. ప్రజాబలం ఉంది అంటాడు. బ్రహ్నరుద్రులు వచ్చినా అడ్డుకోలేరు అంటాడు. ద్రోణంతో అన్నాను. “ఈ జనం కొసవరకూ నిలబడతారా? డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? పోటీ అంటే సామాన్యమా? మనబ్రతుకెంత? ఖర్చులెంత? “డబ్బుకే సహాయం కావాలి. గెలుపు మాత్రం ఖాయం” అన్నాడు. పార్టీ నాకిచ్చిన డబ్బులో సగం అతనికిచ్చేస్తానన్నాను జాగ్రత్తలన్నీ చెప్పాను. మాడుగుల సీటుకి కళావతి చేత నామినేషన్‌ వేయించడానికి స్వేచ్చాభారతం 155

గుత్తి సర్మార్‌ను, సిఎమ్‌ రమ్మన్నారు. అందరం వెళ్ళాం. ఆమె గెల్బింది. ద్రోణం ఓడిపోయాడు. 16,000 ఓట్ల తేడాతో పరాజయం సంభవించింది. దోణాన్ని కాంగ్రైస్‌ నుండి బహిష్కరించారు. చచ్చి చెడి చాయం గల విన్నపాలు అన్నట్లు, ఎట్టకేలకు పట్టు పట్టి ద్రోణం రాజును కాంగ్రెస్‌పార్టీ నుంచి బహిష్మరణను రద్దు చేయించగలిగాను. ఎస్‌ఆర్‌ఎస్‌ టిక్కెట్‌ సాధించిన తీరు నా టిక్కెట్‌ విషయంలో రాజులు పన్నిన పన్నాగం - కట్టకడపటికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు (నీలం) సంజీవరెడ్డి కలుగ చేసుకున్న తర్వాత టిక్కెట్‌ దక్కిన వైనం వివరించేను. (ద్రోణం రాజు విషయంలో మేరు పర్వతం పెకిలించినంత పనయ్యింది. అయినా ఫలితం దక్కలేదు. అతడు పక్కదారి పట్టి, తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేసి, ఓటమి చవిచూసిన ఉదంతంతో పాటు కాంగ్రెస్‌ సంస్థ నుండి బర్తరఫ్‌ అయిన ద్రోణాన్ని మళ్ళీ కాంగ్రెస్‌లో చేర్పించడానికి పడ్డ యమయాతనలు కాస్త ఉటంకించేను. ఇప్పుడు ఎస్‌ఆర్‌ఎస్‌ టిక్కెట్‌ విషయంలో పడిన (శ్రమ దాయాదుల గూర్చి క్లుప్తంగా వివరించాలని ఉంది. ఎస్‌ఆర్‌ఎస్‌ మీద పోటీగా కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం నాటి సమితి ప్రెసిడెంట్స్‌, సాలాపు చిన అప్పల నాయుడు కూడా పిటిషన్‌ దాఖలు చేశాడు. ముఖ్యమంత్రి (బ్రహ్మానందరెడ్డి అండదండలున్నందున సురక్షితంగా బయటపదతాం అనే నమ్మకం ఉండేది. చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్లు అన్ని రకాల బందోబస్తు చేసుకుని, ఢిల్లీ ప్రయాణం కట్టేను. అప్పటి పి.సి.సి. కార్యదర్శిగా ఉన్న శీలం సిద్దారెడ్డి పరంగా పార్లమెంటరీ బోర్టు చర్చల సరళి - బయటపడితే - మరుసటి దినం మీటింగు నాటికి సమగ్రంగా వివరణలందించే వాడ్ని బ్రహ్మానంద రెడ్డిగార్కి పరిస్థితులు తీవ్ర రూపం ధరించి, విషమించే ప్రమాదం ద్యోతకం అయితే, బ్రహ్మానందరెడ్డి గారే నా వివరణ విని, ఎంతవరకూ సమర్థనీయంగా, ఆమోదయోగ్యంగా ఉందో ఆలోచించి, కొన్ని సూచనలు చేసేవారు. కొన్ని కిష్టమైన పరిస్థితులెదుర్కొంటే, ఆ సీటు విషయం వెనక్కి పెట్టి, తుది నిర్ణయం, ముగింపు సమావేశాల్లో హడావుడిగా చేసేవారు. కాలహరణంకు తావులేనందున తుది ఘడియల్లో దూసుకుపోవడానికి కొన్ని పడిగట్టురాళ్ళు పెట్టుకునేవాళ్ళు. సాలాపు సామాజిక వర్గం ప్రాబల్యం నియోజక వర్గంలో ఎక్కువగా ఉన్నందున, ఎస్‌ఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఎదురైంది. ముఖ్యమంత్రి వాదనా పటిమతో

  • జనవాక్యం అప్పల నాయుడుకు అనుకూలం అనీ! వివాదాస్పదుడు కాదనీ, ప్రజలనాడి

బట్టి చూస్తే, ఎస్‌ఆర్‌ఎస్‌ పట్లే మొగ్గు కనబడుతోందని వక్కాణించేరు. మొరార్టీ దేశాయ్‌ కలుగచేసుకుని, (బ్రహ్మానందరెడ్డి వాదన సమర్థించే లిఖిత పూర్వకమైన ఆధారాలేమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఎందుకైనా మంచిదని - ముందు జాగ్రత్త చర్యగా, సర్పంచులు, ఉపసర్పంచులు కో-ఆపరేటివ్‌ (పెసిదెంట్‌లు నంటి (ప్రముఖులు బలపరుస్తున్నట్లు వారి సంతకాలు తీసుకున్నాను. అవి మూడు కాపీలు నా వద్ద ఉన్నాయి. నన్ను చూసి సాలాపు కూడా ఇదే రీతిని కొన్ని సంతకాలతో కూడిన పత్రాలను తనకు గల మద్దతును నిరూపించేందుకు దాఖలు చేశాడు.

ఇద్దరి అభ్యర్థుల మద్దతుదారుల సంతకాల పత్రాలు దాఖలు చేసినందున, ఎవరికి ఎక్కువమంది సంతకాలు ఉన్నాయో తేల్చుకోవాలన్నాడు మొరార్జీ దేశాయ్‌. కొంప మునిగింది. సాలాపు కాగితం మీద సంతకాలు అధికంగా ఉన్నాయ్‌. అప్పుడు నేను, వేరే కాపీ సిద్ధంగా ఉన్నందున అది కూడా జత పరచి వరుసనంబర్లు వేస్తే ఈ సంఖ్య బాగా అధికంగా ఉంది. ఆ పేర్లు, సంతకాలు తెలుగులో ఉన్నాయి. ఆ పేర్లకే మళ్ళీ వరుస నంబర్లు పడ్డాయని కేంద్రంలో ఎవరూ గుర్తించే ప్రమాదం లేదు. అత్యధిక సంఖ్యాకులు బలపరుస్తున్న అభ్యర్థినే ఖాయం చేయాలనే నిర్ణయం వల్ల ఎస్‌ఆర్‌ఎస్‌కు సీటు దక్కింది. అప్పల నాయుడు విజయం సాధించేడు. పాడేరు విషయం

ఈ సందర్భంలో ఇంకొక విచిత్ర సంఘటన గుర్తుకొస్తోంది. ఇది కూడా చిత్రాతి చిత్రమైన సంఘటనే. పాడేరు సీటుకు అభ్యర్థిని ఖరారు చేయడానికి సంబంధించి చర్చల సరళి విద్యాధికుడికి టిక్కెట్‌ ఇవ్వాలన్న అభిప్రాయం మీద కేంద్రీకృతం అయింది. ఇది కూడా మొరార్డీ పట్టుదల కారణంగానే జరిగిన నిర్ణయం. ఆ రోజు మేము ఎం. మత్స్యరాజు ఎంపి/ఎస్‌టి/ ఇంట్లో పడుకుని ఉండగా, అర్ధరాత్రి దాటాక ఈ వార్తనాకు చేరింది. వెంటనే (ఎస్‌.టి) ఎం.పి మత్స్యరాజును లేపి వాకబు చేస్తే మా అభ్యర్థిగా చిట్టి నాయుడే విద్యాధికుడని ఖరారు చేశాడు. ఈ విషయం బుజువుల నిమిత్తం సిట్టింగ్‌ ఎం.పి. మత్స్య రాజు నుండి తన లెటర్‌ పేడ్‌ మీద ఉత్తరం తీసుకున్నాం. తెల్లవారిన తరువాత మళ్ళీ పరిశీలన చేస్తే మా అభ్యర్థి టి. చిట్టి నాయుడు అని ఆంగ్రంలో సంతకం చేసినట్లు విశదమైంది. ఈ రెండు సాక్ష్యాధారాలు పార్లమెంట్‌ బోర్డు ముందు ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిగారు పెట్టగా టి.చిట్టినాయుడు పేరు పాడేరు ట్రైబల్‌ సీటుకు ఖరారు అయ్యింది. శతకోటి దరిద్రాలకి, అనంతకోటి ఉపాయాలు అన్నట్టు. ఒక్కొక్క అభ్యర్థి ఎదుర్కొన్న గండం ఇలాగ దాటించి, టిక్కెట్లు సాధించడం జరిగింది! స్వేచబ్భభారతం ||| నాక్‌?

తెన్నేటిపై పోటీ - గుత్తి సర్వార్‌ టిక్కెట్టు ద్రోణం చిక్కించుకోడం!

పులి నెత్తురు రుచి మరిగింది అన్నట్టు, ద్రోజానికి ఎన్నికల రుచి తగిలింది. కాంగ్రెస్‌ సభ్యత్వం మళ్ళా వచ్చి ఒళ్ళో పడింది. ఎప్పుడు ఎన్నికలన్నా చెలరేగి చూస్తున్నాడు. ఈ విశ్వంలో సమస్తం అతని గుప్పెట్లోనే ఉన్నట్లు, ఉపన్యాసాలు దంచుతున్నాడు, అసలు పట్టు ఢిల్లీలో ఉందని తేలిపోయింది. ఇది స్వానుభవం. చురుకుదనానికి లోపం లేదు ఢిల్లీ ఛలో అని మిత్రులతో కలసి, ఢిల్లీలో బైదాయించేవాడు. 77లో ఎన్నికలు వచ్చాయి- పార్లమెంటు స్థానానికి అటు తెన్నేటి పోటీ చేస్తున్నాడు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరు? ఎంత వెదికినా సరియైన పేరు దొరకదు. గెలిచే గుర్రం మాట దేవుడెరుగు. బరిలో దింపడానికి గౌరవప్రదమైన పేరు దొరికితే అదే పదివేలు. ఇంతవరకూ అక్కడ బ్రాహ్మణ అభ్యర్థుల మధ్యే పోటీ జరుగుతుంది. కాంగ్రెస్‌ తరపున తెన్నేటిని ఢీకానే తాహతుగల సీనియర్త కోసం వెతికితే గుత్తి సర్మార్‌ పేరు దొరికింది. పెద్దవాడు, జాంబవంతుని లాంటివాడు, పాతకాలం నాటివాడు. ఎంతపాడు పనిచేసినా మెడలో జంధ్యం వేలాడవలసిందే. ఆరడుగుల పొడుగు? కొర్రులాంటి కుర్రాడు. 70వ పడి దాటినవాడు. అతని అసలుపేరుచాలా మందికి తెలీదు. సర్మారు ఏంటో, గుత్తి ఏంటో? ఈ రెంటికీ సంబంధం ఏంటో? గుత్తి సర్మారుది కూడా ఓ సర్మారే! ఢిల్లీ పెద్దలకి గుత్తి సర్కార్‌ అనే పేరు తెలీదు. ఇలపకుర్తి సత్యనారాయణ అన్న నామధేయమే తెల్పు. ఇలపకుర్తి పలకడం కష్టం. ఐ. సత్యనారాయణ అంటే సరిపోతుంది. పోటీ పెట్టడానికి ఈ పేరు ఖరారు చేసుకున్నారు. వయస్సు చేత పెద్దవాడు, తలపండినవాదు, తెన్నేటి పై తలపడడానికి సరిపడ రాజకీయ అనుభవం కలవాడు. అయితే ఈ సత్యనారాయణ ఎక్కడున్నాడు? ఎలా పట్టుకోవాలి? ఢిల్లీ వెళ్ళి ఉంటాడు. ఎక్కడ దొర్హుతున్నాడో, పొర్గుతున్నాడో? సత్యనారాయణ కావాలని వెతుకుతున్న వాళ్ళ దగ్గిర నేనే సత్యనారాయణ అన్నాడు ద్రోణం. ఐ. సత్యనారాయణ అన్నారు వాళ్ళు. ఐ యామ్‌ సత్యనారాయణ అన్నాడు ద్రోణం. సరే పదండి అని పి.వి. ఎదుటపెట్టారు. “ఇతనెవడో? ఇతన్ని తెచ్చారేంటి? నువ్వు వెళ్ళు, వెళ్ళు” అంటున్నాడు పి.వి. అతనిని సాగనంపడానికి చూస్తున్నాడు పి.వి. ఇంతలో విబిరాజు వచ్చాడు. ఎందుకు తరిమేస్తున్నావు ఇతన్ని అని అడిగాడు. ఐ.సత్యనారాయణ అని మనం అనుకుంటుంటే ఈ సత్యనారాయణని పట్టుకొచ్చారు. “అవునయ్యా! మనక్కావలసింది సత్యనారాయణ ఐ ఆ, డి ఆ కాదు. ఇతనూ సత్యనారాయణే, ఏ రాయి అయితేనేంటి పళ్ళూడగొట్టుకోదానికి? దొరికిన సత్యనారాయణని వదిలేయడం ఏంటి? దొరకని సత్యనారాయణ కోసం (ప్రాకులాడటం దేనికి? ఇంతకీ మనక్కావల్సింది ఒక బలిపశువు. తెన్నేటిపై గెలుపంటే 158 భాట్టం శ్రీరామమార్తి న్వేయ చంత్రు

చందమామను అందుకున్నట్టే. ఎలాగూ ఓటమి రాసి పెట్టి ఉంది. వచ్చినవాడి చేతిలో టికెట్‌ పెట్టి పంపించు, ఇంకా మనం చూసుకోవల్సిన పనులెన్నో ఉన్నాయి” అన్నాడు వి.బి.రాజు పి.వి.తో. రొట్టె విరిగి వెన్నపై పడినట్టయింది ద్రోణానికి. టిక్కెట్‌ దొరికింది. అదృష్టం వరించింది. తెన్నేటిని ఓడించిన ఘనకీర్తి లభించింది. అంత గొప్ప మనిషిని గురుతుల్యుడిని ఓడించానే అని విచారం పట్టుకుంది అంటాడు ద్రోణం. ఆఖరి రోజుల్లో తన గుండెల్లో గూడు కట్టుకున్న ఈ విషాదగాథ వెళ్ళగక్కేవాడు అందరిలోనూ. (ద్రోణం సహజనటుడు. అభినయం అతని కూసువిద్య. నక్కపల్లి ప్రక్కన ఒక ఊరు. ఆ ఊరికరణం సూరిబాబు. ద్రోణానికి అన్న వరుస. (ద్రోజాన్ని నకులుడు అనేవాడు ఆయన. “మా నకులుడు మీకింకా ఎసరు పెట్టలేదా” అనే వాడాయన. (ద్రోణం పద్యాలు బాగా పాడతాడు. ఆఖరి రోజుల్లో పి.వి.ని అలరించినది ఈ కళా నైపుణ్యమే. గల్లీ నుండి ఢిల్లీ వరకూ వెళ్ళాలని రాసిపెట్టి ఉంది. గుత్తి సర్కారు గుండెలు తీసిన బంటు. అలా ఎందరికి ఎగనామం పెట్టాడో? ఆ దేవుడికెరుక! అతడికే పంగనామాలు పెట్టి టిక్కెట్‌ కొట్టేశాడు మన ద్రోణం రాజు! జెండా కొయ్యలా ఉండే గుత్తి సర్మారు బదులు, పొట్టి గిత్తలా ఉందే ద్రోణం మెడలో కాంగ్రెసు మదగజం వరమాల వేసింది. తెన్నేటి చిత్తయ్యాదు. ద్రోణం రాజు రాజయ్యాడు. 1970వ సం॥లో అప్పల నర్సయ్యమీద పెందుర్తి సమితికి పోటీ చేసి ఓటమి పాలైన ద్రోణం, 1972లో అసెంబ్లీకి టిక్కెట్‌ గల్లంతు అవ్వటం, సీటు పోవటం జరిగిన తరువాత అదృష్టదేవత తలుపు తట్టింది. ఈ కామెడీ అఫ్‌ ఎర్రర్స్‌లో ద్రోణం విజేత. తెన్నేటి పై గెలుపు అతని జీవితానికి మేలు మలుపు! ఒక్కనూరు హఠాత్తుగా, అమాంతం ఆకాశమంత ఎత్తుకి ఎదిగిపోయాడు. అంతటి మహానుభావుడిని నాచేత్తో నేనోడించానే అని విషాదం ఒలకబోసేవాడు ఈ జాలిగుండెల మారాజు ద్రోణంరాజు. ఇంతకీ తెన్నేటిని ఓడించింది ద్రోణమా? కాంగ్రెస్‌ పార్టీయా! గుత్తి సర్కార్‌ పేరు మట్పబెట్టి, టికెట్‌ పట్టుకుని గెంతులు వేసింది ఎవరు? తెన్నేటిపై గెలుపు తనకి ఆపాదించుకోవటం సాహసమా? సానుభూతా! ఆధునిక రాజకీయంలో నటనా వైదుష్యానికి పట్టం కట్టడం కూడా కద్దు. ఏమైనా ద్రోణానికి కాలం అనుకూలిం చింది. జాతకబలం బాగుంది. అదృష్టం పండింది. పల్లెనుండి ఢిల్లీకి రైలు కట్టుకొని ఎగిరి అగ్రపీఠం మీద భద్రంగా కూర్చున్నాడు! అయినా ఈ పదవి ఎంతకాలం? మళ్లీ 78లో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడెక్కడికి వెళ్లాలి? ద్రోజానికి ఒళ్లంతా కళ్ళే నలువైపులూ చూడగలడు. బుర్ర నిండా ఆలోచనలే - సెలయేటి ఊటలా ఊరుతాయి! స్వేద్ధభారతం. 59

1978లో గుడివాడ అప్పన్న అసెంబ్లీకి పెందుర్తి నుండి కాంగ్రెస్‌పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా దాదాపు 29 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. దురదృష్టవశాత్తూ అతడు స్వర్గస్థుడయ్యేడు. గుడివాడ గురునాథరావు తండ్రి అతడు. ఆసీటు ఖాళీ అయింది. 1980లో జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడ నుండి పోటీచేసి ద్రోణం గెలిచాడు. మళ్లీ అక్కడ నుండి 83లో పోటీచేస్తే ఓటమి లభించింది. విడివుల నర్సింహం సుమారు 18 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

దరోణానికి పుతప్రేమ ఎక్కువ! పుత్రేషణ - దారేషణ - ధనేషణ అని ఈషణత్రయం! వీటికి తల ఒగ్గని వాళ్లు ఎందరుంటారు?

“ప్రథమపుత్రుడు శ్రీనివాస “తండ్రికి తగ్గ తనయుడే.” అయితే కాలం, కర్మం కలసి రావాలి కదా? పేకాటలో మూడు ముక్కలాటలాగ ద్రోణం రాజు టిక్కట్టు పంపిణీ చేసేవాడు. ఒకమారు గురునాథరావును విశాఖ-1 సీటుకి తోసేడు. విశాఖ నుండి గెలిచిన ఈటి విజయలక్ష్మి 'వరవాడికి పంపించాడు. ఎన్ని చేసినా కొడుకు శ్రీనివాస్‌ 1994లోను 1999లో కూడా రెందుమార్లూ ఓడిపోయేడు.

ఆఖరికి తన తండ్రి మరణించిన తర్వాత ఈ సీటు నుండి నెగ్గాడు. పాపం ద్రోణం బ్రతికి ఉండి ఈ విజయాన్ని చూడలేకపోయాడు. ఏమైనా “తండ్రీ కొడుకులకు ఉప ఎన్నికలు అచ్చొచ్చాయి.”

ఈ 1 ఈ 160 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్రు

ముఖ్యమంత్రుల రాక

బ్రహ్మానంద రెడ్డిగారితో భేటీ

ముఖ్యమంత్రి అయినా కాసు బ్రహ్మానందరెడ్డి సభానాయకుడు కాదు. సంజీవరెడ్దే శాసన సభా పక్షనాయకుడు. సంజీవరెడ్డి నియమించిన మంత్రివర్గమే అధికారంలో ఉంటుంది. కాని బ్రహ్మానందరెడ్డే ముఖ్యమంత్రిగా పనిచేయాలి. అతనికి చాలావరకు అసంతృప్తి ఉన్నా ముఖ్యమంత్రి పదవిని ఎవరు వదులుకుంటారు? ఢిల్లీలో ఒకమారు ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిని గెస్టుహౌస్‌లో కలిశాను. తెల్లవారేసరికి నేను ప్రత్యక్షం. ఇంకా లుంగీతోను, బనీయనుతోనే ఉన్నాడు. “భాట్టం నీకేదైనా చెయ్యాలని ఉంది. అన్నివిధాలా సమర్భుడివి. గాని ఏం చేయాలో? ఎలా చేయాలో? తెలియడం లేదు! 2౪6ని బాగానే చూస్తున్నాను. పంజాబులో దెబ్బతిని వచ్చాడు. మంత్రిగానే ఉంచాను. క్రమేపి కోలుకుంటున్నాడు. నిన్నాక మినిష్టరు చేయాలని ఉంది. ఎట్లా?” అన్నాడు.

నేను అన్నాను నేను రెండోమారు ]4.1.4. ని. అప్పుడే నాకు మంత్రిపదవి ఎందుకండి? ఇలా ఆశపడితే ఎందరో ఉంటారు! మీరు మన్నిస్తే ఒక సలహా ఇస్తాను అన్నాను. సరే చెప్పమన్నాడు. పూర్వం సంజీవరెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంత ఉన్నా! కాంగ్రెస్‌ అసెంబ్లీ పార్టీ నాయకుడిగా ఎన్నికైనా, పెద్ద తలకాయి ఆంధ్రకేసరి టంగుటూరిని తీసుకువచ్చి అతను ఉపముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పట్లో ఎంతో పెరిగాడాయన! అలాగే మీరు తెన్నేటి విశ్వనాథంలాంటి పెద్దల్ని తీసుకొచ్చి మీమంత్రి వర్గంలో వేసుకుంటే మీకు ఘనకీర్తి వస్తుందన్నాను. “అం మంచిమాటే ఇది. గాని సంజీవరెడ్డి ఒప్పుకుంటాడంటావా! వాళ్ళిద్దరికీ పొసగదయ్యా! ఇంతకీ తెన్నేటి ఒప్పూకుంటాడేంటి? నా పార్టీని పట్టుకుని వ్రేలాడుతానంటాడు” అన్నాడు. “అయ్యా! మీరొప్పుకుంటే తెన్నేటితో ఆ రాయబారం నేను నడిపిస్తాను. మీ పేరు బయటకు తేను ఆయన ఒప్పుకుంటేనే మీరు బయటపడండి. లేదంటే లేదు” అన్నాను “అరే! నీ గురించి నేను మాట్లాడుతుంటే మధ్యను తెన్నేటిని తెచ్చావేంటయ్యా నువ్వు, అది ముడియాదు తర్వాత చూద్దాంలే అన్నాడు.

నేను బయటపడ్డాను. నాకు ఎప్పుడు పదవి వస్తుందా? అని ఎదురు చూడలేదు! . ముఖ్యమంత్రి కదిపినా నేను తొణకను. ఇప్పుడు నాకేం తక్మువైందని? నలుగురు మంత్రులూ నేనూ లోపటికి చీటీ పంపిస్తే ముఖ్యమంత్రి ముందు నన్నే పిలుస్తాడు. జిల్లాలో టూర్‌ ఉంటే నేను లేకుండా మీటింగు ఉండదు. విజయనగరం వస్తే మా ఇంట్లో ఫలహారమో, భోజనమో చెయ్యకుండా ఎటూ వెళ్ళరు. నాకు కారెక్కడుంది? ఎటువెళ్ళినా వారి కారెక్కే వెళ్ళాలి. ముందు సంజీవయ్యతో ప్రారంభమయింది. నెల్లిమర్ల మీటింగుకి నన్ను తీసుకొనే వెళ్ళాడు! శ్రీకాకుళం జిల్లాపరిషక్‌కి బెండి కూర్మన్న అధ్యక్షుడైనప్పుడు ఆ ప్రమాణ స్వీకారపు ప్రథమ కార్యక్రమానికి బ్రహ్మానందరెడ్డి తనతో నన్ను తీసుకుని వెళ్ళాడు. “అన్నా! కూర్మన్నా!” అంటూ ఒక వ్యాసం కూడా వ్రాసాను అతని అభినందన సంచికలో. సంజీవరెడ్డి గారి ప్రోత్సాహం ఇక సంజీవరెడ్డి ఇచ్చిన ప్రోత్సాహం చెప్పతరం కాదు. పెందుర్తిలో జరిగిన మీటింగే ఉదాహరణ! జిల్లా పెద్దలు, పెద్ద మీసాలు. చిన్న మీసాలు ఆ వేదిక మీదే ఉన్నారు. ఒకరు జిల్లా పెద్ద. ఒకరు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌. 5.[.4.5 అప్పలనాయుడ్ని ప్రక్కన పెట్టుకొని నేనున్నాను. ముందు నన్ను మాట్లాడమన్నాడు సంజీవరెడ్డిగారు ఆఖరున తన ప్రసంగంలో అంటాడు గదా ముఖ్యమంత్రిగారు. “చిన్నప్పుడు యూత్‌కాం(గ్రెసు లీడరుగా “ఇదిగో ఈ భాట్టంలాగే ఉండేవాద్ని” అసెంబ్లీలో సిద్ధాంత రాద్ధాంతాలు జరుగుతూ ఉంటే నేను మన భాట్టాన్ని ఉపయోగిస్తాను. ఇంకేవో గొడవలు గందరగోళాలు జరిగితే మారాజును ఉపయోగిస్తాను” అంటూ తన ప్రసంగం కొనసాగించాడు. విజయనగరంలో మాది చిన్నజల్లు. అదీ అద్దెకొంప! అంతపెద్ద నాయకునికి ఈ చిన్న ఇంట్లో విందు ఎలా ఏర్పాటు చేయగలను? అని ఎంత విన్నవించినా - “నీ ఇంటికొచ్చే నేను భోజనం చేస్తాను. బయట బంగారం పెట్టినా నేను రానే రాను” అన్నాడు సంజీవరెడ్డి. వచ్చిన కార్లన్నీ పక్కన బొంకులు దిబ్బమీద ఆగేవి. భోజనం చేశాక తల్లీ పిల్లలనందరినీ పేరు పేరునా చనువుగా పలకరించి, మా అబ్బాయిని వెన్నుతట్టి బయటకు వెళ్ళాడు. ఆయనెప్పుడూ అంతే, రాష్ట్రపతిగా విచ్చేశాడు విశాఖపట్నానికి. తెన్నేటి విశ్వనాథంగారి విగ్రహ అవిష్కరణకి! నాకు కబురు చేశాడు. సకుటుంబంగా సర్ఫ్యూటు హౌస్‌కి వచ్చి తనని కలియమన్నాడు. నేనూ మా ఆవిడ ఇద్దరమూ వెళ్ళాం. “ఏమయ్యా! కుటుంబం అంటే భార్యా భర్రలా? పిల్లలు, అల్లుళ్లు మనమలూ ఏమయ్యారు? సరే! ఈమారు వచ్చినప్పుడు అందరూ రావాలి. నీకు ముందే కబురు చేస్తాను. రా నిలబడు” అన్నాడు. ఓ పక్క నేను - మరోపక్క 162 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చర్యిత్రు

ఆయన భార్య, ఆమె ప్రక్కన నా భార్య. ఫొటోలు తీయించి వాటిపై సంతకం పెట్టి రాష్ట్రపతి భవనం నుండి నాకు పంపించాడు. ఆ (ప్రేమాభిమానాలు ఎక్కడొస్తాయి? ఎవరు చూపిస్తారు? ఢిల్లీ స్పీకరుగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికివెళ్తే, అతని కారులో పార్లమెంటుకు తీసుకువెళ్ళి స్పీకరు గాలరీలో కూర్చోమన్నాడు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వెళ్తే తను ఆసీనుడైన సీటు నుంచి లేచి నన్ను కౌగలించుకొని పక్కన కుర్చీలో కూర్చోమన్నాడు. “పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో!” బ్రహ్మానందరెడ్డి ప్రేమనురాగాలు

(బ్రహ్మానందరెడ్డేం తక్కువ చేశాడా? అంతకు పదిరెట్లు (ప్రేమాభిమానాలు కురిపించాడు. అడిగినదే తడవుగా అడిగిన పని చేసేవాడు. కూడని పనులు నేనెన్నడూ చెప్పనని తెలుసు అతనికి. 1967వ సం॥లో నన్ను 4.1.6.0 సభ్యుడ్ని చేశాడు. 20 ఏళ్ళుపైగా ఉన్నాను. 20.6 కార్యవర్గ సభ్యుడ్డి కోశాధికారిని, జనరల్‌ సెక్రటరీని! ఏ పదవి లేదు నాకు? చెన్నారెడ్డి హయాంలోనూ ఇలాగే జరిగింది. రాష్ట్రపంచాయితీ రాజ్‌ పరిషత్‌ని మాకోసం ఏర్పాటు చేశాడు. మొదటి చైర్మన్‌ జలగం వెంగళరావు. నేను ప్రధాన కార్యదర్శిని!

పి. రమణారెడ్డి బూర్లగడ్డ నిరంజనరావు సహాయకార్యదర్భులు. మేమందరం కలిసి బెంగుళూరు వెళ్ళాం. గ్లాస్‌ హౌస్‌లో మీటింగు. అఖిల భారత్‌ పంచాయితీరాజ్‌ పరిషత్‌కు అధ్యక్షుడుగా జయప్రకాష్‌నారాయణ ఉండేవాడు. ఆ మీటింగుకి మేం వెళ్ళాం. ఓ పర్సు ప్రజంట్‌ చేసాము. అప్పటికి వెంగళరావుగార్కి పెద్దపొట్ట ఉండేదికాదు. ఒక సంచి భుజాన వేసుకునేవాడు! 1.9 దగ్గరకి నన్నే ముందు త్రోసాడు.

మేమిద్దరం ముందు విద్యాశాఖ కన్సల్‌టేటివ్‌ కమిటీ సభ్యులం 14... లుగా. 2/6 రాజు మీటింగు పెట్టాడు. అజెండాలేదు ప్రొసీడింగ్సులేవు. అసెంబ్లీలో ఎడ్యుకేషన్‌ పద్దు పెట్టేటప్పుడు ఎవరేం మాట్లాడుతారో చెప్పమన్నాడు, ముందు అల్పాహార విందు జరిగింది. అనంతరం అదేమాట. “ఎవరేం మాట్లాడుతారో మీరే వినండి. మేమెలా చెప్పగలం?” అన్నాడు వెంగళరావు. “అవేం చెప్పలేకపోతే మీరేం సభ్యులు?” అన్నాడు. 21/6 బర్రని కుర్చీ లాగి చట్టుక్కున లేచాడు. వెంగళరావు ఇక్కడ ఇంకేంపని జరగదని అన్నాడు! ఈ ఘటన తరువాత అసెంబ్లీలో వెంగళరావు విద్యాపద్దు మీద మాట్లాడాడు. ఛెణికేశాడు. చెలరేగిపోయాడు. 76 కి నషాళానికి అంటుకుంది. అంతా అయిం తర్వాత నన్నడుగుతాడు “కన్సల్‌టేటివ్‌ సంఘ సభ్యులు ఇలా మాట్లాడవచ్చా!” అని. ఎవరి చిత్తానికి ఎవరు కర్తలు? నేను చెబితే వింటాదేంటి? అన్నాను. స్వేచ్చభరతం 6

ఆ తర్వాత కాలంలో జలగమే ముఖ్యమంత్రి అయికూర్చున్నాడు. ఘనకీర్తి పొందాడు. మా మధ్యకూడా చిన్న అరమరికలు ఉండేవి. (బ్రహ్మానందరెడ్డి నన్ను అడగందే జిల్లాలో ఏ కార్యక్రమం పెట్టేవాడు కాదు. ఒకనాడు కోళ్ళ అప్పలనాయుడు కోసం భాసాపేట తీసుకువెళ్ళి మీటింగు పెట్టాం. మారుమూల గ్రామానికి కూడా వచ్చాడు. ఈమారు దేశంలో రాజకీయ చిత్రపటం మారిపోతోంది. కాంగ్రెస్‌లో లుకలుకలు బయలుదేరాయి. ఇందిరాగాంధీ మీద దండయాత్ర. ఆమె అసాధ్యురాలు! ఆడమనిషి ఆమెను పదవిలో పెడితే మనమాట సాగుతుందనుకున్నారు కామరాజ్‌ నాడార్‌, నిజలింగప్ప వంటి పెద్ద నాయకులు. గద్దెనెక్కిన తరువాత ఈ పెద్దలకు గేటు మన్నా దక్కింది! ఏ పాటకా శృతి కలపడం ఆమె తత్వం కాదు! నెహ్రూ పండితుని కూతురామె. తండ్రికి మించిన తనయ! కాకాపట్టినా కుదరదు.

తిరుగుబాటే శరణ్యం. సిండికేటు పెద్దలు చిందులు తొక్కేరు. అంతకముందు ఎన్నడో పదవులన్నీ వదిలేసి సంజీవరెడ్డిగారు హాయిగా స్వగ్రామం ఇల్లూరు వెళ్ళి కూర్చున్నాడు. బెంగుళూరు మహాసభలకు ఇందిరాగాంధీ ఓడ్రాప్ట పట్టుకొని వచ్చింది. పార్టీ రూపు రేఖలు చిత్రిస్తూ. కాంగ్రెస్‌ ప్రణాళిక ప్రధాన అంశాలు పొందుపరుస్తూ,

దానిమీదే రణభేరీ (మైోగనుంది. రాష్ట్రపతి అభ్యర్థి సెలక్షను మీద కూడా యుద్ధభేరీ (మోగుతుంది! ఆ కీలక సమావేశంతో బ్రహ్మానందరెడ్డి నన్ను పిల్చాడు. “మంత్రివర్గం విస్తరణకు జాష్యం జరగదు. ముందు ఇప్పుడే ఆలోచించుకో! నీ పేరేదో నాకియ్యి” అన్నాడు. అప్పటికి నేను ఖాదీబోర్డు చైర్మన్‌గా ఉన్నాను. కార్లో బెంగుళూరు నుండి తిరుపతి వెళ్ళాను. అక్కడ నుండి విజయవాడ వచ్చాను. అక్కడ రెండ్రోజులు ఉండి హైదరాబాదు చేరుకున్నాను. బ్రహ్మానందరెడ్డి పేరు రెడీగా పెట్టుకోమంటే నేను మనిషినే కనబడలేదు! కొమ్మూరి అప్పడు దొర, గంగరాజు మాడుగులరాణి అందరూ హైదరాబాద్‌లో కూర్చున్నారు. గవర్నరుకి లిస్టు ఇచ్చే తొందర్లో ఉన్నాడు (బ్రహ్మానందరెడ్డి. అప్పలనాయుడుకు మంత్రిపదవి - ముఠా తగువులు

మా (గ్రూపు తరఫున మాడుగుల రాణి పేరు చెప్పారు. అది ఖరారు అయిందని అందరికీ తెలిసింది. జె.వి. నరసింగరావు ఆమెను కంగ్రాట్యులేషన్సు చేశాడుట. శీలం సిద్దారెడ్డి కూడా. నేను హైద్రాబాద్‌లో ఇంట్లో అడుగుపెట్టగానే వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడుకి ఫోన్‌ చేశాను అతని అవకాశాలు ఎలా ఉన్నవో తెలుసుకోవాలని, తనపేరూ మాడుగుల రాణి, రమాదేవి పేరు ఖరారు అయినట్లు చెప్పాడు. మావాళ్ళందరూ 164 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

కట్టకట్టుకొని వెళ్ళి ఆపేరు ప్రతిపాదించినట్లు చెప్పాడు. ఇప్పుడు చూడండి నాపని. ఒకప్రక్క రాజులుతో వేగలేకపోతున్నాను! ఇప్పుడు రాణితో వేగాలి! తిన్నగా వెళ్ళి బ్రహ్మానంద రెడ్డిని కలిశాను ఆమెపేరు పనికిరాదన్నాను. వేరొకపేరు ఆలోచించాలని అడిగాను.

“నా మాటకేం గాని నీ సంగతి చూసుకో! మీవాళ్ళందరూ చెప్పినపేరు నీవు కాదంటే నీ మీద తిరగడతారేమో!” మీరు నన్ను చూచుకుంటే అదే పదివేలు. మిగతావన్నీ నేను చక్కబెట్టుకుంటాను అన్నాను. “అయితే కానీ, నీపేరేదో బయటపెట్టు.” అన్నాడు. 5.%.4.5 అప్పలనాయుడు అన్నాను నేను. “ఎవరయ్యా ఈ నాయుడు? ఓ మారు మనిషి మొహమైనా చూపించవయ్యా?” అన్నాడు.

“సార్‌! అతను చాలా ఉత్తముడు అంత మంచి మనిషి! మరొకడుండడు. వివరాలు మళ్ళీ మనవి చేస్తాను” అని తిన్నగా కొమ్మూరి అప్పుడు దగ్గణకు వెళ్ళాను. ఇదివరకు జరిగిన సంగతులన్నీ చెప్పాడు. రాణీగారి పేరు ఖాయం చేసుకున్నాం అన్నాడు. అది పనికిరాదు అన్నా నేను. ఐతే ఇక మా పని అయిపోయింది. ఇకపై మీరే తేల్చుకోండి అన్నాడు. తిన్నగా రమాదేవి దగ్గజకు వచ్చాను. అమ్మా! మీరు ఉండడం మంచిది కాదని చెప్పాను. వేరే పేరు ప్రపోజు చేస్తాను అన్నాను. సరే చేసుకోండి అంది. తనపేరు ఖరారైందన్న ధీమాతో! మీకు ముందు చెప్పకుండా వేరే పేరు ప్రతిపాదించడం పొరపాటు అవుతుంది కదా! అందుకే హైదరాబాదు చేరగానే మీ దగ్గరకే ముందు వచ్చానని అన్నాను. “నేనేం పర్టిక్యులర్‌ కాదని” ఆమె అంది. ఈలోగా అప్పడు దొర మాళంటికి వచ్చాడు. తన ఛాన్సు తెలుసుకోవాలన్న కుతూహలంతో. నేను కొత్తపేరు చెబుతున్నాను. నేను చెప్పబోయే కొత్తపేరు 6.34. ఒప్పుకుంటే తర్వాత మీకే తెలుస్తుంది అన్నాను. ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళే ముందు సమితి ప్రెసిడెంటు బుద్ధా అప్పలనాయుడుకి ఫోన్‌ చేశాను 5.%.4.5. అప్పలనాయుడు మంత్రి అవుతున్నాడు వెంటబెట్టుకొని విమానంలో హైదరాబాద్‌ చేరమని. ద్రోణం రాజుకి ఫోన్‌ చేసి అదే చెప్పాను. కోళ్ల అప్పలనాయుడుకి ఫోన్‌ చేసి తప్పకుండా దగ్గరుండి తీసుకురమ్మన్నాను. అప్పల నాయుడు పేరు గవర్నర్‌కి వెళ్ళిపోయింది. తరువాత ముఖ్యమంత్రి అప్పలనాయుడు 5.గ.4&.5. ముఖం చూశాడు. “ఇతడు విశ్వాసపాత్రుడు మీ మాట ఎన్నడూ జవదాటడు. బడుగు వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చినట్టూ ఉంటుంది. ఇంతవరకూ ఈ కులానికి పెద్ద ప్రాధాన్యత రాలేదు. పెద్ద చదువు లేకపోయినా బుద్ధిమంతుడు. కావలసినంత లోకజ్ఞానం ఉంది. ఏ చిన్నపోర్టు ఫోలియో మీరిచ్చినా అతన్ని పట్టుకొని జిల్లాలో తిరుగుతాం. మళ్లీ రాజులూ, రాణీలు అంటే వాళ్ళ వెంట మేం తిరగలేం” అని వివరించాను. స్వేచ్చభరతం 165

అప్పలనాయుని చూసిన తరువాత నాకు కబురు చేశాడు ముఖ్యమంత్రిగారు. ఇతనికి ఏం పోర్టుఫోలియో ఇమ్మన్నావయ్యా! అన్నాడు. అంతకుముందే వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు మా ఇంటికొచ్చి నన్ను కలిశాడు. నాకు ప్రొహిబిషన్‌ శాఖ ఇస్తారట అది మాత్రం నాకు లేకుండా చెయ్యండి అన్నాడు. “మీకు ఇష్టం వచ్చింది ఇవ్వండి 5.%.4.5.కు గాని. కృష్ణమూర్తి నాయుడుకి మాత్రం మంచి పోర్టుపోలియో ఇవ్వండి. ప్రొహిబిషన్‌ మాత్రం వద్దు అన్నాను. అప్పలనాయుడు మీద పెద్దబరువు పెట్టను. చిన్న శాఖను తీసుకొని పెద్దపేరు తెచ్చుకోవటం మంచిది. పెద్ద శాఖ తీసుకొని చెడ్డపేరు వచ్చేకన్నా! మత్స్యశాఖ ఇస్తానయ్యా! చేపలు చూసుకోమను. రాజుకి పొట్టేలు లాగ పోరాడుతాడు గొట్టెల మేకలు చూసుకొంటాడు. పశువులు అడవులు ఏదో చూస్తానులే. అంతకన్నా ఏవి పెద్దవి ఇవ్వనులే? మా కృష్ణమూర్తి నాయుడు విషయం సార్‌ మాకు పెద్దనీటి వనరులు లేవు. చిన్న జలాశయాలు! ఏదో ప్రజలకు పనికివచ్చే పని చూపించండి సార్‌! అతని పేరు చెప్పుకొని మేం చలామణి అవ్వొచ్చు. అతని కులం వాళ్లు మా జిల్లాలో పెద్దసంఖ్యలో ఉన్నారు అన్నాను ఇంత తంతు జరిగితే! ఘనత వహించిన 5.%.4.5. అప్పల నాయుడు ఘనకీర్తి విని - పెందుర్తి పెట్రోలు బంకుకి బ్రహ్మానందరెడ్డిగారు ఫోన్‌ చేసి అప్పలనాయుడుని రప్పించి పదవి కట్టబెట్టాడంటూ ఇటీవల పత్రికల్లో ఓ కథనం చదివాను. అతడి అనుచరవర్గం అలా తయారైంది! ఒకరు పత్రిక విలేఖరిట! ఆఖరికి అందరిది ఇదే తంతు! - ఏం చేస్తాం? పి.వి.రమణ జబ్బుచేసి ఆసుపత్రిలో పడి ఉన్నాడు. ఒకకాలు, చెయ్యి కొట్టుకుంటూ ఉండేవి. అప్పలనాయుడు చెబితే చూడటాన్ని వెళ్ళాను. “రమణా బాగుపడతావు నీవు. కాని కాంగ్రెసులో చేరిపోవయ్యా” అన్నాను. “ఇన్నాళ్లూ ఈ పార్టీలో ఏడ్చాను! ఇప్పుడు నన్నక్కడ ఎవరు చూస్తారయ్యా” అన్నాడు. “నేను ఉన్నాను! చూసుకుంటాను ఫరవాలేదు. పార్టీ టిక్కెట్టు ఇప్పిస్తాను” అన్నాను. “పోటీ చేయడానికి పైసాలేదు కదా” అన్నాడు “మాకు మాత్రం ఏముంది? పార్టీ మాకు ఇచ్చినట్లే నీకు ఇప్పిస్తాను” అన్నాను. అప్పలనాయుడు వెళ్ళి సభ్యత్వం పుస్తకం పట్టుకొచ్చాడు. మాతోపాటే అతడూ ]4.1..4. అయ్యాడు. 27కు సన్నిహితుడయ్యాడు. హేతువాది, నిజాయితీపరుడు. ప్రజాసమస్యల కోసం ప్రాణం పెడతాడు. సిద్ధాంతాల కోసం దేశంకోసం ముందుంటాడు. 166 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

ఎస్‌.ఆర్‌.ఎస్‌. అప్పలనాయుడు మంత్రి అయిన మొదటి రోజుల్లో ఇది పాదుకా పట్టాభిషేకం అనేవాడు. రాముడు వనవాసంలో ఉండగా అతడి పాదుకలు పెట్టుకొని భరతుడు రాజ్యమేలినట్టు ఉంది నా పని! నేనెక్కడి మనిషిని? నన్ను ఎంత అందలం ఎక్కించారు? భాట్టంగారి అడుగు జాడలో నడిచి వారి నీడను పెరుగుతాను, బ్రతుకుతాననే వాడు “జన్మలో మిమ్మల్ని మర్చిపోతే నాకు పుట్టగతులు ఉండవు” అనేవాడు. దొద్దమనిషి! పెద్దమనస్సు నెమ్మదస్తుడు!

అతడు అమాత్య శేఖరుడయిన కొన్నేళ్ళకు పరిస్థితులు తారుమారవుతాయని, తల్లక్రిందులవుతాయని, ఎన్నడూ అనుకోలేదు. అప్పలనాయుడంటే కోళ్ళ అప్పల నాయుడని అందరూ అనుకొనేవాళ్లు. కోళ్ల అప్పలనాయుడుకి షేక్‌ హేండు ఇచ్చేవారు. “పదేళ్లు ]4.1.4. చేశాను! సీనియర్ని శ్రీరాంమూర్తిగారు నాపేరే చెబితే నేను మంత్రిని అవనా?” నేను చెప్పాను కాదని అతను అనుకునేవాడు. కోళ్ల అప్పలనాయుడు అంటే నాకు బాగా ఇష్టం. చాలా ఇష్టమే. కాని ఆ మారు కాంగ్రెసుని ఓడించి ఇండిపెందెంటుగా గెల్బాడు. అతని పేరు చెబితే మాత్రం (బ్రహ్మానందరెడ్డి ఎలా వింటాడు?

బి.వి.గురుమూర్తి మంత్రి చనిపోయాడు. నాటి నుంచి నేటివరకు సాహుకారికి (షాహుకారు) మంత్రిపదవి దొరకలేదు. నాపేరు చెబితే నేనే అయిపోనా? అని గజపతినగరం గంగరాజుకి కడుపులో శూలపుట్టింది.

పెట్టిన పేరు తీయించాను కాబట్టి మాడుగుల రమాదేవి బుసకొట్టడం న్యాయమే! ఇక కొమ్మూరి అప్పడు దొర. అతనితో తూకానికి ఎవరు సరిపడతారు? కొండంత మనిషిని కంటిముందు పెట్టుకొని నలుసంత మనిషిని వెతుక్కొని పట్టాభిషేకం కట్టిస్తాడా శ్రీరామమూర్తిగారు అనుకున్నాడు దొర. ఇలా పద్మవ్యూహం మధ్యనపడ్డాను. మన సరుకు గట్టిదైతే ఎంతటి భీకర పోరాటానికైనా తట్టుకుంటాను. నెట్టుకొని వస్తాను! మన బంగారం మంచిదయితే ఫర్వాలేదు! కాకుంటే చిక్కులకు చెక్‌ ఉండదు.

సల 1౬ ఈ

స్వేచ్చాభారతం 167

ఆశయాల హరివిల్లు కాలేజీ చదువుల రోజుల్లో అధికార మదాంధులపై విల్లు ఎక్కుపెట్టేవారము. చదువు సంధ్యలులేవు. విద్యా విజ్ఞానాలు లేవు. సభ్యత సంస్కరణలు తెలీవు. వారు ప్రజా ప్రతినిధులా? పదవీ వ్యామోహపరులా? అంటూ రెచ్చిపోయే వాళ్ళం. యువత ఉడుకు నెత్తురు మరిగిపోయేది. నేను అధికార ప్రాంగణంలో సంచరిస్తున్నాను. శాసన సభాపర్వంలో సముచిత పాత్ర నిర్వహిస్తున్నాను. నేను పట్టభద్రుడ్ని కాదు. డిగ్రీ తెచ్చుకోలేదు. ఆత్మపరీక్ష లేకుండా పరులను ప్రశ్నించడం పొరపాటు కదా! డిగ్రీ పుచ్చుకోవడం 1947లో జె.పి. రాక సందర్భంగా చదువుకు స్వస్తిచెప్పాను. అది బి.యస్‌.సి ఫిజిక్సు, కెమిస్ట్రీ ఇప్పుడు నాకు వంటపడతాయా? లేబొరేటరీ మొగమే చూడలేదు. అందుచేత బి.ఏ డిగ్రీ తీసుకుందామనుకున్నాను. అప్పటికి దూరపువిద్య డిగ్రీల వెసులుబాటులేదు. ఆ తరువాత ఉపాధ్యాయుడుగా గాని, జర్నలిస్టుగా గాని కొన్ని సం॥ల అనుభవం ఉంటే (ప్రయివేటుగా పరీక్షకు కూర్చొనే అనుమతి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేవారు. ఇందుకు నా పత్రికా వ్యాసంగం పనికివచ్చింది. ప్రయివేటుగా బి.ఏ పరీక్షకు కూర్చున్నాను. ఆ విధంగా 15 సం॥ల తర్వాత డిగ్రీ తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఎం.ఏ చేయాలని ఆశ. పరీక్షకు దబ్బు కట్టేవాడిని. పుస్తకాలు తలక్రింద పెట్టుకునేవాడ్ని ఏ &.1.0.0. మీటింగో లేక కాకాని వెంకటరత్నం ఎలక్షనో వచ్చిపదేది. కొండల్రావు సహాయం ఈ విధంగా ]4.4. చదువు కొనసాగలేదు. అది 1967 సం॥ ఉస్మానియా యూనివర్సిటీలో 1.1.3. డిగ్రీ పరీక్షకు కూర్చున్నాను. మిత్రుడు సారిపల్లి కొండలరావు. ఎంత సాయం చేసేవాడో! అన్ని పుస్తకాలూ తెచ్చి ఇచ్చేవాడు. పాత ప్రశ్న పత్రాలు అన్నీ ఇచ్చేవాడు. సర్వవిధాలా నాటి నుండి నేటి వరకూ సర్వదా తోడ్పడే ఏకైక మిత్రుడు హితుడు, సన్నిహితుడు ఉదార చరితుడు, సంస్కార వంతుడు కొండలరావు. నీతి 168... భాట్టం శ్రీరామమూర్తి ట్వీయ చరిత్ర

నియమాలతో ఆదర్శవంతంగా నిజజీవితం తపనతో తపోదీక్షతో విజయవంతంగా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వాడు. అతడు అజాత శత్రువు కొండల్రావు ఆదర్శవాది. సంపద ఎంత ఉన్నా నమ్రత వీడనివాడు. ప్రతినిత్యం నాకు సాయపడుతూనే ఉన్నాడు. ఈ సగటుజీవి అతని బుణం ఎలా తీర్చుకోగలడు అతనికి శుభం సుఖం కలుగుగాక! శుభమస్తు! ఆరోగ్యమస్తు! రామానుజుల నాయుడు ప్రోత్సాహం

జి. రామానుజుల నాయుడు, సాలూరు వాస్తవ్యుడు. యూనివర్సిటీలో గోల్టుమెడలిస్టు ఘనకీర్తి సంపాదించిన ప్రఖ్యాత న్యాయవాది. అడపాదడపా వచ్చి 12౪౫ పాఠాలు చెప్పేవాడు. రోమన్‌ లా చాలా కఠినమైంది. నేనింకా పుస్తకం పట్టుకోలేదు. పరీక్షకు ఇంకా రెండు రోజులే ఉంది. జాగ్రత్త పడమన్నాడు. రాత్రింబవళ్ళు ఆ రెండు రోజులు ఆ పుస్తకం కంఠోపాఠం పెట్టేశాను. పరీక్ష పాసయ్యాను. లా డిగ్రీ తెచ్చుకున్నాను. కొందరు మిత్రులనేవారు నీకు నోరుంది. ప్రయివేటు ప్రాక్టీసు పెట్టి ధనార్జన చేయడం కోసం పట్టాపుచ్చుకుంటున్నావు అన్నారు. చదువు మీద ప్రీతి. డిగ్రీ పుచ్చుకుంటాను. పట్టా పుచ్చుకోను. ప్రాక్టీసు పెట్టను అనేవాడ్ని నామాట ఎవరు నమ్ముకారు.?

విద్యా సంపాదన ఉంది కాని ధనార్జనలేదు. నాటికీ నేటికీ అదే మాట. ఎన్ని పదవులు పుచ్చుకున్నా ఉత్త చేతులతో వెళ్ళిపోతాం. నిరాధారంగా ఉంటూనే సమాజ భారం భరిస్తాను. ఆశలు వదులుకొని ఆశయాలు పెంచుకుంటాను. రామానుజుల నాయుడు హైకోర్టు జడ్జీ చేశాడు. ఏక్టింగ్‌ ఛీప్‌ జస్టీస్‌ చేశాడు. ఎప్పుడూ పోరుపెట్టేవాడు “నా కారులో తీసుకెళ్తాను. పట్టా ఇచ్చి పంపిస్తాను” రమ్మనేవాడు. ఎంత అభిమానమో! ఎంత మంచి మనిషో! మహాజ్ఞాని కూడ. న్యాయశాస్త్ర నిష్ణాతుడు, నిగర్వి మా ఆవిడతో మరీమరీ చెప్పేవాడు మీరైనా చెప్పండి అని. రెండు దశాబ్దాలవుతుంది.

పదవులన్నీ వదిలేసి ఏ పదవీ లేకపోతే ఎవరు చూస్తారు? చేతిలో ఉన్నత విద్య, లాపట్టా పుచ్చుకుంటే పదిమందీ ఏ తగువో ధర్మమో అంటూ సహాయానికో సలహాకో ఆశ్రయిస్తారు కదా, లేదని ఒకమారు అన్నాం - మరి దానికి తిరుగులేదు నష్టమైనా, కష్టమైనా అంతే, సత్యవాక్కు అన్నారు పెద్దలు. నాకు నేనే జవాబుదారి. ఆడిన మాట తప్పడమేంటి? ఆంధ్రోద్యమంలో కూడా అంతే. ముందడుగు వేశాం మడం త్రిప్పం.

అన్నా (మండలి), నేనూ మా ఇద్దరం అంతే. పూసపాటి వంశం విరుచుకుపడుతోంది. పతనమైనా సరే ఫలితం లేకున్నా సరే ఎదురు నిలుస్తాం గుండె ఒడ్దుతాం. పదవి స్వేచ్భ్చాభారతం 169

ఆశచూపాడు. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి. గెలిచి వస్తే మంత్రి పదవి ఇస్తానన్నాడు. విజయనగరం మీటింగులో ముందే బహిరంగంగా (ప్రకటించాడు కూడా. ఆశాపాశాలు పనికిరావు. అధికార వ్యామోహాలు వద్దు! ఆశల కన్నా ఆశయాలు మిన్న! నా జీవితం తెరచిన పుస్తకం. అన్న మండలి వెంకట ్రిష్టారావూ అంతే. మంత్రిగా ఆస్తిపాస్తుల వివరాలు ముఖ్యమంత్రికి అందజేయమని వెంగళరావు టైములో రహస్య తాఖీదు. ముఖ్యమంత్రికి అందించిన వివరాలు అన్న కృష్ణారావు దినపత్రికల్లో కూడా ప్రకటించాడు. ఆ బాటలోనే వెళ్ళి మర్నాడు ఆపని నేనూ చేశాను. ఏది నీ అస్తి - ఏం పట్టుకెళ్తావ్‌? దాపరికం ఏముంది? ఎవరికోసం (బ్రతుకుతున్నాం? ఏం పట్టుకెళ్తాం? ఏం కావాలి మనకి? అన్నీ ఇచ్చాడు భగవంతుడు. విద్య, విజ్ఞానం, అధికారాలు, పదవులు, పేరు ప్రతిష్టలు! ఇంకేమి కావాలి? ఉత్తములైన బీిడ్డలున్నారు. అదే నా ఆస్తి. నా భార్యే నా ఆస్తి అది లేని నా జీవితాన్ని ఊహించుకోలేను. ఆమె ప్రక్కన లేకపోతే ఒక్కరోజు గడవదు. ఇంతకన్నా ఏం ఇవ్వాలి భగవంతుడు? ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవలసిన వాళ్ళమే అంతా! అబద్ధాల పుట్ట పూసపాటి విశ్వేశ్వర గజపతి అబద్దాల పుట్ట. ఆయనకి అనృతం అమృతప్రాయం. నోరు విప్పితే ముందు భగవద్గీతలో ఒక శ్లోకం తర్వాత అబద్ధాల ఆరోపణలకు లంకించుకొనేవాడు. నాకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అనేవాడు. వందలాది ఎకరాల భూములు, లెక్కలేనన్ని కార్లు! బస్సులు! బ్రహ్మానందరెడ్డి ఇచ్చిన లైసెన్సుతో నేను కోటికి పడగలెత్తానని చెప్పేవాడు. డబ్బులో కూరుకుపోయానని చెప్పేవాడు. ఇవి అతడు నామీద సంధించిన ఆరోపణా బాణాలు. పోనీ విన్నవాడికైనా ఇంగితజ్ఞానం ఉండాలికదా అని! మనం ధీమా పడతాం. ప్రభువుల వారిమాట పొల్లుకాదని ఆథభ్రిత జనాభా ఛాందసపు విశ్వాసం! విజయనగరంలో ఇంకో తంతువుంది. విశ్వాసమే వారి శ్వాస అట! రాజావారి రక్తమే వారిలో ప్రవహిస్తోందట! వాళ్ళ అన్నం తిని వాళ్ళ బట్టకట్టేరట! ఆప్పులెందరో వెళ్లిపోయారు బానిసత్వం నాజన్మహక్కు అనుకొంటే కాదనడానికి నేనెవడిని? నిజానిజాలు నిలకడమీద తెలుస్తాయి. పదేళ్లు విజయనగరంలో అసెంబ్లీ మెంబరుగా పేరు ప్రఖ్యాతులన్నీ ఆనాడు సాధించినవే! ఘనులెందరో ఆయువు తీరి దైవ సాన్నిధ్యం చేరారు. ఎస్‌.కె. జగన్నాథరావుగారు జాగరణ చేస్తున్నారు. కాలం కోసం ఎదురుచూస్తూ! నాటికి నేడు 170 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర) *

వరప్రసాదంగా ఉన్నవాడు పన్నా ఒక్కడే. ఆపన్న హస్తం చూపుతూ పిలిస్తే పలుకుతూ పనులెన్నో చేసిపెడుతూ. విజయనగరం వస్తే మా గడప తొక్కని మంత్రులు, ముఖ్య మంత్రులు లేరు. ఎన్నున్నా “హళ్లీకి హళ్లీ సున్నకు సున్న” ఏముంది నాకు? మళ్లీ విజయనగరం వెళ్ళామంటే ఇల్లులేదు, వాకిలి లేదు. ఆస్తిపాస్తులు లేవు. రుద్రభూమి అయినా లేదు. అలనాటి మిత్రులు ఎందరో కాలం చేశారు. బొత్స గురు నాయుడు నా ఆప్తమిత్రుడు నేనెప్పుడు వచ్చినా ఆ లాడ్డిలోనే మంచి భోజనం తెప్పించి పెట్టేస్తాడు. నేను వెళ్ళేవరకూ నావెంట ఉండేవాడు. నాకేం అవసరమున్నా! అతనే అన్నీ సరిపెట్టేవాడు ఇప్పుడు అతను పరంధామానికి చేరుకున్నాడు. అతని కొడుకు అధికార బావులూ పెట్టుకొని జోరుగా కారులో తిరుగుతున్నాడు. నా కంటికి కనిపించడు! నా ఆప్తమిత్రుడు నరాలశెట్టి ప్రకాశరావు వెళ్ళిపోయాడు. నా ఆరోప్రాణం అతదు. మిత్రుడు కాళ్లపైడయ్య వెళ్లిపోయాడు. చింతపల్లి నారాయణ వెళ్లిపోయారు. రొమ్ము ఒడ్డి వెన్నుదన్నుగా కొణతాల అప్పారావు నిలిచిన పన్నీరు గోపాలం లంకవీధీ నత్యం యెందరెందరో మహానుభావులు, ఘనులెంతమందో ఆయువుతీరి దైవసాన్నిధ్యానికి చేరుకున్నారు. విశ్వేశ్వర గజపతి ఎటు పోయేడు

అంతెందుకు అనత్యాల మూట. అబద్దాల కోరు విశ్వేశ్వర గజపతిరాజూ వెళ్ళిపోయాడు. ప్రాతః సంధ్యలో వాహ్యాళికి వెళ్లాడట. మరి తిరిగిరాలేదు. సంవత్సరాలు గడిచినా ఆచూకీ తెలియరాలేదు. ఆ మహానుభావుడు ఎలా అదృశ్యమయిపోయాడో ఎవరికీ తెలియదు. అతను ఉన్నప్పుడు నేను మద్రాసు వెళ్ళాను. అతని దగ్గరికే విచారణకోసం లాయరును తీసుకొని, నా మీద కరపత్రం వేయించాడు ఆరోపణలు చేస్తూ. పరువు నష్టం దావా వేశాను. ఆ సందర్భంగా వెళ్తే అంటాడు శ్రీరామమూర్తిగారూ! మీలాంటి మంచివాళ్లు చాలా అరుదండి. ఎవ్వరి నడిగినా అదే చెప్తారు. ఎలక్షను కోసం ఏదో చెప్పాననుకోండి మిమ్మల్ని ఓడించాలని, మా అన్న ఆజ్ఞ మీద మీరు గెలిస్తే మంత్రి అయి ఉండేవారు. ఈ ఆరోపణలకి ఏవైనా ఆధారాలు ఉన్నాయా? అని అడగడానికి వచ్చి ఉంటారు. ఇది ప్రజాస్వామ్యం 'వాక్‌ స్వాతంత్ర్యం ఉంది. అందుచేత ఒకడు చెప్పిన మాట చెప్పాను. నాకు తోచిందీ చెప్పాను. బుజువు సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయండీ?' మీ మంచి తనం ముఖంలోనే కనబడుతుంది అన్నాడు. పెద్దవాళ్ళ బుద్ధులు ఎప్పుడు ఎలాగ ఉంటాయో? ఎవరికెజక! పి.వి.జి రాజుతో దశాబ్దాలు గడిపాను అతడు చెప్పిందేమిటో? చేసిందోమిటో? ఇప్పుడెవరికి చెప్పగలను? మహారాజు పుట్టుకపుట్టేడు. ఒక్కమాట మీద నిలబడ్డది ఎప్పుడైన ఉందా? నేను మహారాజును నా తండ్రి మహారాజు. నా తాత 'స్వేచ్భాభారతం 171

ముత్తాతల మహారాజులు అయితే వారిపుడెక్కడున్నారు! కాల జంరూమారుతం. అందర్నీ దూది “పింజెల్లా” కొట్టుకుపోయింది. జీవితాలు అశాశ్వతాలు. సర్వ సంపదలు, రాజ్యభోగాలు మూణ్జ్డాల్ల ముచ్చట్లే. ఇంకా పూసగుచ్చినట్టు చెప్పగలను. చచ్చి ఏ స్వర్గాన ఉన్నాడో ఆ మహారాజు! ఇప్పుడు నోరు జారడం తప్పు అవుతుంది. కోట బురుజులు పట్టుకొని (వేళ్ళాడే ప్రబుద్ధులు ఉండేవారు. పి.వి.జి.రాజు రెండవ భార్య గజపతినగరం ఎన్నికల్లో ఓడిపోయింది. డిపాజిట్టు పోయింది. ఆనందగజపతి ఎన్నికల్లో ఓటమి మామూలే! పెద్ద తరహా మనిషి. నిర్మల హృదయుడు, నిండుకుండ. అతని రెండవ సుపుత్రుడు అశోక్‌ కూడా ఓటమిని చవి చూశాడు. ఇప్పుడు ఆ పాత కోటలో గబ్బిలాలు వ్రేలాడుతున్నాయి! అరివీర భయంకరుడు కూడా కాలం కలిసి రాకపోతే పరాజితుడౌతాడు! పతనమౌతాడు. ఇది కాల చక్రం. మీద కిందవుతుంది! కింద మీదవుతుంది! అంతా దైవ ఘటన ఏదీ నీ గుత్తకాదు. (అధికారము) పదవులు, మేడలు మిద్దెలు నీ సొత్తుకాదు. దైవం సొత్తు. చూడండి ఆఖరుకి ఈనాడు ప్రజల సొమ్ముతో కోట బురుజులు దులిపి కందకాలకు రంగులు పూసి, పర్యాటకులకు కనులు విందు చేస్తారట! కోట పేట అవశేషాలను శుభ్రంగా తీర్చిదిద్దుతారట! పురావస్తు శాఖ సౌజన్యంతో జిల్లా కలక్టరు ఆధ్వర్యంలో! ఆర్జన సున్నా 1972 సం॥ నుండి 1983 వరకు పరవాడ నియోజకవర్గం యం.ఎల్‌.ఏ. గా చేశాను. దాదాపు 8 ఏంద్లపాటు మంత్రి పదవి నిర్వహించాను. అంతకు ముందు రెండేండ్లు ఖాదీ బోర్డు చైర్మన్‌గా ఉన్నాను. ఇలా పదవుల పట్టిక చెప్పుకుపోతే పెద్దాపురం చేంతాడంతవుతుంది. పదవులు ఎన్ని ఉన్నా నేనార్జించింది సున్న ఆ నియోజక వర్గం మొత్తం మీద మీ చిత్తం వచ్చిన వార్ని చిన్నా పెద్దా ఎవరినన్నా అదగండి. సెంటూ కుంటా భూమి లేదు. నిలువ నీడ, వాడలేదు. కావాలనుకోలేదు. లేదని విచారం లేదు. ఉండవలసిన రీతినే ఉన్నాను. ప్రజల ప్రేమే నా ఆస్తి. జనాదరణయే నా జీవనాధారం. నిర్మల నిష్క్మలంక పవిత్ర జీవనమే నా ప్రాణ సమానం. అయినా దుర్శిణీ పెట్టి వెదికి చూశారు. మంత్రి వర్యులు సూర్యనారాయణ రాజు. కట్ట కడపటికి చిన్న ఆచూకి చిక్కిందట. నేను మంత్రిగా హైదరాబాద్‌ వెళ్ళేటప్పుడు. మా డాక్టరు చదువుకొనే అబ్బాయి నాతో కలిసి రాకున్నా ఆ తరువాత వచ్చినా ముందే ఆ టి.ఏ నేను క్లెయిమ్‌ చేశాననీ, నా పర్సనల్‌ లగేజీ నాతోనే తెచ్చుకొని సెపరేట్‌ లారీలో 172 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

తెచ్చుకున్నట్టు డబ్బు డ్రా చేశానని ఫిర్యాదు చేశాడు. ఢిల్లీవరకు వెళ్ళారు ఎంత పెద్ద మొత్తం. ఆరువందల రూపాయల పైచిలుకు. కోరుండి తినేస్తానా? ఆ మంత్రివర్యులు పట్టుపట్టాడు. వదిలి పెట్టడు. కేంద్రప్రభుత్వం నియమించిన విమద్‌లాల్‌ కమీషన్‌ ముందు కెళ్ళింది, విచారణ జరిగింది అధికమొత్తం నేను రాబట్టలేదని పొరపాటున నాకు రావలసిన మొత్తం కొంత నేనే కోల్పోయానని చెప్పిన తీర్పు ప్రచురించింది!

ఎవరు ఎంత తిన్నారో ఆ దేవుడికే ఎరుక. ప్రజాసేవ తప్ప ధనార్దనా తత్వం లేదని లోకం కోడై కూసినా తోక త్రొక్కిన పాములా నామీదే విషం (గ్రక్మిన వాడ్ని దైవం ఏం చేస్తాడంటారు? నాకు శఠగోపం పెట్టిన వాళ్ల (బ్రతుకు లేమయ్యాయో? ఎవరు ఎలా ఎప్పుడు కనుమరుగయ్యారో తరచి చూస్తే చరిత్రపుటలే తెలియజేస్తాయి!

చిత్రంగా విచిత్రంగా మన గుండె గుహలో గుప్తంగా ఉన్న చిత్రగుప్తుడే మన చిట్టా చూసి చరిత్ర చెత్తబుట్టలో పదేసి చేయి దులుపుకుంటాడు. స్వంత జాగీరులా (తాబేదారుని వెంట బెట్టుకొని) జిల్లా ఏలుబడి చేసిన రాజరాజ నరేంద్రులు. రాజ సార్వభౌములు అందర్నీ కాలం ఎలా కుడిచి పెట్టిందో సమకాలీనులు గుణపాఠం నేర్చుకొందురు గాక! ఎందుకీ విరగబాటు? ఎవరి నెత్తో మొత్తాలనే పాడుబుద్ధి నీకెందుకు. దైవం అందర్నీ ఒకకంట కనిపెట్టి చూస్తూనే ఉంటాడు! మన రాక్షస గుణాలు, చుప్పనాతి బుద్ధి, ప్రజావంచన అన్నీ దైవం కళ్లు కప్పలేం కదా? కవి కంటికి కనిపించనిది కూడా 'దైవం కంట బడుతుంది. అతని దృష్టి తప్పించుకోవడం ఎవరి శక్యం?

శల ఈల ఈఓ

స్వేచ్చభరతం 178

పరవాడలో నియోజకవర్గంలో నా పనితీరు

పెద్ద, పిన్నా చూడలేదు. పేద, గొప్ప తేడా లేదు. ఎవరు చెప్పినా విన్నాను. ఏది చేయమన్నా చేశాను, చేయగలిగినంతా చేశాను, నిస్వార్థంగా చేశాను, నిర్విరామంగా చేశాను. ఊరు మంచికోసం, గ్రామ క్షేమం కోసం, నియోజకవర్ద అభివృద్ధి కోసం ఆహోరాత్రులు కృషి చేశాను. వేళా, పాళాలేదు, రేయి, పగలూ లేదు. అడిగిందే తదవుగా (గ్రామాలకు వెళ్ళినా, కార్యకర్తల సమావేశం జరిపినా, అధికారులతో మాట్లాడినా, విధీ, విరామం ఉండదు. పది మంది మధ్యన ఉంటే, భోజనం గడువుదాటినా, నాలుగు ముద్దలు నోటిలో వేసుకుంటూ, ఫోన్‌లో మాట్లాడుతూ, వచ్చీ, పోయే వాళ్ళను పలకరిస్తూ, పరామర్శిస్తూ, కష్ట సుఖాలు వింటూ వినతి పత్రాలు స్వీకరిస్తూ, రోజులు గడిపేవాడ్ని.

ఒక చేత్తో నియోజకవర్గపనులు, రెండో చేత్తో జిల్లాకు సంబంధించిన పనులు, రెండు చేతులతో రాష్ట్రపురోగతికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ, పాటుపడటం జీవిత విధానం అయ్యింది. ఎవరికో సాయం చేస్తున్నాం అన్న భావన లేదు, ఒకరికి సహాయపడక పోతే, నేను నిస్సహాయుడ్ని అన్నమాట. ఊరికి ఉపకారం జరిగితే నీ జీవితం ధన్యం అయినట్లే. ఒకరికి పనికి రాకపోతే ఈ పనిముట్లు ఎందుకు? ఈ దేహం ఇచ్చింది ఎందుకు? (బ్రతుకు బాటలో మానవులెదుర్శొనే అవరోధాలెన్నో! ఆటంకాలెన్నో! పట్టుబట్టి 10 సంలు పైగా పనిచేశాను. విధీ, విరామం లేకుండా కాణీకి కక్కుర్తి పడకుందా, రోడ్డు, బిల్టింగులు 30 పడకల ఆసుపత్రి, పాఠశాలలు, కళాశాలలు, కాలువలు, బ్రిడ్జిలు, వోస్టళ్ళు, బావులు, ఇళ్ళు, అన్నీ అందరికీ కాకున్నా, ఎంత ఎక్కువ అయితే అంత అడిగి, మరీ మరీ అడిగి, ఉత్తర్వులు తెప్పించి పనులు జరిపించాను. ఊరూ, వాదా తిరిగేను. ప్రతీ పల్లెకూ, గల్లీ తిరిగాను. గడప గడపకూ వెళ్ళేను. పిల్లా, పాపా, తండ్రీ, కొడుకూ, అన్నా తమ్ముడూ అందర్నీ పలకరించి, పరామర్శించి, చెప్పిందీ, చెప్పనిదీ కూడా చేసి, చేయలేనిది కూడా చేతనైనంత చేసే వరకూ ఆగేవాణ్ణి కాదు. కథ... భాట్టం శ్రీరామమూర్తి జ్వీయ చరిత్ర

నిత్యసహాయం: సబ్బవరం కరణం కొడుక్కు బాగాలేదు. ఆస్పత్రిలో చేర్పించి మందులు కొనుక్కోమంటే, కొన్నైనా స్వంతంగా కొని తెచ్చి ఇచ్చి, బాగుపడ్డాక ఇంటికి చేరినట్టు తెల్సుకుని, సంబరపడిపోయేవాడి. ఇలా ఎందరికి ఎన్ని చేశానో! కాలేజీలో, యూనివర్సిటిలో చదువుకునే వారికి సీట్ల కోసం తాపత్రయ పడ్డం. ఉద్యోగం, సద్యోగం లేకపోతే, సహకార హస్తం అందించటం, దీనికి రాత్రేంటి? పగలేంటి? ఎప్పుడు తోస్తే అప్పుడు వాళ్ళందరికీ అందుబాటులో ఉండి, పనిపాట్లు చెయ్యడం వెన్నతో పెట్టిన విద్య. నరవ గ్రామంలో

నరవ (గ్రామంలో 400 ఎకరాలు గవర్నమెంట్‌ ఎక్రైర్‌ చేసింది. వుడా కోసం అంతా అయ్యాక, నా దగ్గర కొచ్చి గోలపెడితే, ఆ గ్రామాలన్నీ తిరిగేను. దరఖాస్తులు వ్రాసి, దస్కత్తులు తీసుకుని, నిశానీ బాపతుకు [వేలిముద్రలు వేయించి, హైద్రాబాద్‌ పట్టుకెళ్ళి ఎన్ని అవస్థలు పద్డానంటారు? 800 ఎకరాలకు పైగా వారికి వాపసు చేయిస్తూ, అ స్థలానికి నీటి వసతికై ఉత్తర్వులు పుట్టిస్తూ, ఆ గ్రామానికి వెళ్ళి, ఆ (ప్రభుత్వ ఉత్తర్వులు అందజేసి ఇంటికి తిరిగివచ్చేను. వారికి కానీ ఖర్చులేకుండా వాళ్ళ గుమ్మం ముందు ఉత్తర్వులు స్వయంగా బట్వాడా చేసి, ఆ భూములు తిరిగి వాళ్ళకు కట్టబెట్టేను. ఎంత థమ అయ్యిందీ, అన్నది చూడలేదు ఎన్నడూ, ఎంత సంతృప్తి కలిగిందీ అన్నది చూశాను. అదే నా మానసిక తృప్తి, ఆనందమే నా ప్రతిఫలం.

ఊరల్లా తిరిగి, జిల్లా అంతా చుట్ట బెట్టి అర్ధరాత్రి ఇంటికొస్తే పిల్లా పాపలకు నిద్రాభంగం కలుగకూడదని వెచ్చగా పడుకుని, పొద్దున్నే లేచి, కాఫీతాగి, గుమ్మం ముందున్న జనాలతో మాట్లాడుకుని, స్నానం, సంధ్యావందనం చేసుకొని మిగతాపనికి సిద్ధపడేవాడ్ని అందరికీ నా మీద హక్కు ఉంది సేవ చేయించుకోవడానికి, నాకు ఎవరిమీదా హక్కు లేదు, సహాయం పొందడానికి! హక్కుల్లేని అధికారం నాది! అధికారం లేని హక్కులు ప్రజలవి! ఎన్‌.టి.ఆర్‌. విజృంభణ

అంతా ఉమ్మడి కుటుంబంలో సాగిపోయిన కాలం అది! 11 ఏళ్ళపాటు “ఎన్‌.టి. ఆర్‌. రంగప్రవేశం చేసే వరకూ.” ఆయన ఎన్నికల్లో అడుగు పెట్టాడు. ఇప్పుడు ఎవరి మాటలు ఎవరు వింటారు? మా ఆడంగులు మా మాట అసలు వినరండీ అన్నాడొక పెద్దమనిషి, “కుర్రకారుకు తలపొగరు, ఇటు రమ్మంటే, అటు పరుగెత్తటం” అన్నాడింకో పెద్దాయన. అదీ మంచిదే. ఇన్నాళ్ళకు, వాళ్ళకి ఒక కోరిక పుట్టింది. పెద్దల అదుపుదాటి, మనసు స్వేచద్భభరతం మర్‌

దౌడు తీస్తుంది. ముభావాలు వదిలి, స్వభావాలు బయట పెట్టారు. స్వేచ్చగా, స్వతంత్రంగా, వారి చిత్తం వచ్చినట్లు ఓట్లేసుకుంటారు. వాళ్ళకి ఇప్పుడే స్వాతంత్ర్యం సిద్ధించింది అనుకుందాం. మనం పని చెయ్యటం తప్ప, ఫలితం కోసం ఆశించటం లేదు. ఫలితం ఇచ్చేవాడు పరమేశ్వరుడు అని నమ్మేవాణ్సి!

ఎన్నికలు సజావుగా జరిగాయి. ఓటమి సుస్పష్టంగా కనపడుతోంది. సబ్బవరంలో

లెక్కింపు తేలగానే, విశాఖపట్నం చేరుకున్నాను నిర్విచారంగా. ఫలితాలు అధికారికంగా వెలువడిన వెంటనే పత్రికా ప్రకటన చేశాను. చేసిన పనులు సూక్ష్మంగా వివరిస్తూ, అందుకు ప్రజలు ముట్టచెప్పిన ప్రతిఫలానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నియోజక వర్ద ప్రజలు సదా, సర్వదా, సమగ్రాభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్ధిస్తూ, ప్రజల నుండి సెలవు తీసుకుంటున్నానని - ఆ (ప్రకటన సారాంశం. అంతే మరి! ఆ ప్రాంతాల్లో అడుగు పెట్టలేదు! వచ్చీపోయే జనం ఎంత చెప్పినా, ఎన్ని మార్లు అడిగినా, అటు ప్రక్క మరి వెళ్ళలేదు!

(ప్రజాస్వామ్యంలో గెలుపుఓటములు ఎవరికైనా ఎప్పుడైనా కలుగుతూ ఉంటాయి. అదే నియోజకవర్గం మీకు చేతులెత్తి పిలుస్తుంది! రా, రమ్మని మొక్కుతుంది. మీరు మొహం చాటేస్తే ఎలా? అనేవారు. చెయ్యగలిగినంత చేసేను. అంతకుమించి చెయ్యలేను అన్నప్పుడు తప్పుకోవడం మంచిది. అదే చేశాను. విజయనగరం నియోజకవర్గం విషయంలో 19867 తరువాత, 69లో పత్రికారంగం నుంచి తప్పుకున్న తరువాత మరి తిరిగి చూడలేదు. చూడ్డానికి ఏముంది అక్కడ? గోష్పాదం అంత భూమి లేదు. నిలువ నీడలేదు. బలహీన వర్గాలకు చెందిన మిత్రబృందం ఉందేది. ఒకరూ, ఒకరుగా వారూ కాలం చేయటంతో పాతకాలం స్మృతులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఏదీ నీ గుత్తా కాదు

. అసలే అది పరవాడ, పరులవాడ, మనిషి భూమ్మీదకు రావడమే ఒక ప్రహసనం లాంటిది. వాసము, గ్రాసాదులు పరమాత్ముడి ప్రసాదాలు. ఈ భూమ్మీద వఏిదీ నీ స్వంతం కాదు. నీ స్వారితం కాదు, నీ గుత్త కాదు, పరమేశ్వరుడి సొత్తు. నీతనువే నీది కాదన్నపుడు సిరిసంపదలు నీవి ఎలా అవుతాయి? శ్రీహరి పత్ని - క్షీరసాగరం నుండి ఉద్భవించిన శ్రీమహాలక్ష్మీ తనను కోరని వాడి మెడలో వరమాల వెయ్యాలనుకుంది! నలుదిక్కులా చూసింది. ఏ దిక్కూ చూడకుండా, శేషతతల్పంపై శయనించిన శ్రీమహావిష్ణువు చెంతకు చేరింది. ఆయన పాదాలు పట్టుకుసేవచేస్తూ, కన్పిస్తుంది లక్ష్మీదేవి. సేవాభాగ్యానికి సిరి, నీ దరి చేరుతుంది. సేవించి, తరించే మహదవకాశం కల్పించే సిరి, ఎవరి చెంతా 176... భాట్టి శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

నిరంతరం నిలువదు. లేదన్న విచారం, కావాలన్న కోరికా లేదు. అన్నీ ఉన్నవాడు మనవాడై ఉండగా వేరే కోరిక మరెందుకు? 80 రోజుల పాదయాత్ర

కాల ప్రభావం తప్ప - (ప్రజాభిమానం కొరవడి ఎన్నికల్లో పరాజయం సంభవించిందన్న అపోహ ఎవరికీ కలుగరాదన్న భావన కలిగింది. ఒక నియోజకవర్గం మాత్రమే నా పరిధిగా ఎన్నడూ భావించలేదు. నన్ను నేను జిల్లాకు అంకితం చేసుకున్నాను. నా నియోజకవర్గంలోని ప్రజలే అన్నట్లు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కూడా కృషి చేశాను. ఘటాకాశం పోతే, చిత్తాకాశం ఉంది. మహదాకాశం ఉంది. నాదన్న అసెంబ్లీ నియోజకవర్గం హుళక్కి అయితే, జిల్లా అంతా నా నియోజకవర్గమే. జిల్లావాసుల కడసారి సేవాభాగ్యం పొందాలని, కాలినడకన మాసంరోజుల పాదయాత్ర తలపెట్టాను.

మహాత్మాగాంధీ జన్మదినం అక్టోబర్‌ 2. నాటి పి.సి.సి. అధ్యక్షులు వై. యస్‌. రాజశేఖర రెడ్డి ప్రారంభించారు నా పాదయాత్ర. పాయకరావు పేట నుండి వర్షాలు పడుతూ ఉండగా, ఆఖరు రోజున భీమిలి నుండి పయనించి విశాఖ చేరుకున్నాను. ఎటువెళ్ళినా జనం, జనం, జనం, జన ప్రభంజనమే! తాళ, మేళాలతో ఊరు ఊరంతా ఎదురు సన్నాహాలు, స్వాగతాలు చెప్పేవారు. ఒక ఊరు ఇంకో ఊరికి ఉరకలు వేస్తూ, పయనిస్తున్నట్టుండేది. పాదయాత్ర దిగ్విజయం కాగానే ఊపిరి పీల్చుకున్నాను. కొంత సేద తీరాలని, విశ్రాంతి తీసుకుంటున్నాను.

& స& *౬

స్వేచ్భాభారతం 177

అయ్యపురెడ్డి పిలుపు నా జీవితంలోతు

అయ్యపరెడ్డి హైదాబాద్‌నుంచి ఫోన్‌ హైద్రాబాద్‌ రమ్మని, అస్త్రసన్యాసం చేయొద్దని. భవిష్పళ్తు పిలుస్తోంది అంటూ మళ్ళీ మళ్ళీ ఫోన్లు. అసెంబ్లీ సభ్యత్వం అయిపోయా మరి అసెంబ్లీ భఖవసంలోక్షి అడుగుపెట్టను! హైద్రాబాద్‌ వెళ్ళడానికి అభ్యంతరం ఏమిటి? మళ్ళీ ఫోను మీద ఫ్టోన్సు అయ్యపురెడ్డి నాకెంతో మంచీ స్నేహితుడు, ప్రియతముడు. ఎన్‌.టీ.ఆర్‌. ఆరోగ్యం దెబ్బిత్రిన్నాక్క తరచు అతన్ని చూసేవాడట! ఎన్‌.టి.ఆర్‌. కూ లాయర్లంటే గొప్ప గారం క్రూద్రా ఎన్‌.టి.ఆర్‌, పిలుస్తున్నాడు, రమ్మని చెప్పాడొక పూరు. ఇది కాల కృపా! 83 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ నన్మొడించింది. సంవత్సరం త్రీరగక్ర ముందే పార్టీ అధినేశ్ర నన్ను షిలుస్తున్నాడంటారు. ఏమిటీ విచిత్రం! నొ నుండి ఆర్యున ఆశించేదేమిటి? నొక్టత్రన్సు ఫ్ర చెయ్యగలడు? విధి బలీయం! ఎవరు ఎ్టుడు ఏ విధంగా వ్యవహరిస్తారో చెప్పలేం? జరుగనున్నది జరుగక మానదు. ఏది పెరిగినా నున మంచికే గెల్టివినా పేడినాా అన్నీ మన మంచికే అనుకునే స్వభాదం నాది.

ఈ మారు హైద్రాబాద్‌ వియల్టేద్ది మా బంధువుల ఇంటిలో ఐస చేసేను. అయ్యప్పురెడ్డిక్రి ఫ్యా చేసి వేన్సు వచ్చినట్లు చెప్పాను. రెండురోజులపాటు అతను ఫోన్‌ చెయ్యలేదు చాబ్రన్స ఇంకో శెండ్ష రోజులుండి వైజాగ్‌ వెళాం అనుకున్నాను. ఆ మర్నాడు ఫోన్‌ చ్చే ఎన్‌. టి, ఆర్‌ రమ్మంట్రున్నాడ్డు ఆ ప్రార్రీలో చేరాలి. సిద్దంగా ఉండు. ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాద్చు, స్‌ ల

  • రొపకయంలతోక్తి వచ్చాం. ఇప్పుడ్లు బ్రంక్రో రంగు ఎలా వులు కుంటాస్టు? / శ్రకు అన్నాను” ఎవరైనా నున అరసం పడితేనే పీలుస్తారు. అది వాళ్ళే అవసరం, నున్షక్త అవకాశ కావచ్చు అన్నాడు అయ్యపురెడ్డ. అన్నిటికీ గుడ్‌బై కో ట్టి తా టను మ

కూర్చున్న మనిషిని లాగితే ఏం ప్రయోజనం? అన్నాను. పద పద కలవటాన్ని మనకి ఎన్‌.టి.ఆర్‌. ఇచ్చిన టైమ్‌ అయిపోతుంది. త్రోవలో మాట్లాడుకుందాం, అన్నాడు. ఎన్‌.టి.ఆర్‌. ఇంటి నిండా జనం. పార్లమెంట్‌ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమై ఉన్నాడు ఎన్‌.టి.ఆర్‌. లోపలికి వెళ్ళేటప్పుడు పిడతల రంగారెడ్డి, మద్దూరి సుబ్బారెడ్డి వంటి పెద్దలతో మంతనాలు జరుగుతున్నాయి. నన్ను చూసి, ఆ ప్రక్క గదిలో కూర్చోండి, యీ పని సరిపెట్టుకుని వస్తాను అన్నాడు ఎన్‌.టి.ఆర్‌. “భలే కుదిరేరు జోడీ!మీలాంటి వాళ్ళుండాలయ్యా పార్లమెంటులో అన్నాడు” రంగారెడ్డి. నేను గతుక్కుమున్నాను. మహామహాులే టిక్కెట్ల వేటకు ఎన్‌.టి.ఆర్‌. దగ్గర కొస్తే ఎన్‌.టి.ఆర్‌.ను చూడనంటావెందుకు? అని లోపలి మనిషి నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఇంతలో ఎన్‌.టి.ఆర్‌. పిలిచాడు. మేం ఇద్దరం చెరోప్రక్కనా కూర్చున్నాం. “నేను మిమ్మల్ని నమ్మేను - నన్ను మీరు నమ్మండి, టిక్కెట్టు పట్టుకెళ్ళండి, పార్లమెంటులో నా ప్రతిష్ట నిలబెట్టండి” అన్నాడు ఎన్‌.టి.ఆర్‌. చెయ్యి చాపేడు, నా చేతిలో మీరు చెయ్యి వెయ్యందన్నాడు. ముందు నేను, తర్వాత అయ్యపురెడ్డి చేతిలో చెయ్యి వేశాము. “పార్టీలో లేని వారికి నేను టికెట్‌ ఇవ్వనే ఇవ్వను. దానికి మీ ఇద్దరూ ఎక్సెప్పన్‌. మీరు సభ్యులు కాకపోయినా, నా పార్టీ ప్రతిష్ట మీ చేతుల్లో పెడుతున్నాను” అని చప్పట్లు చరిచేదు. వీరిద్దరి పేర్లూ వ్రాసి రెండు టిక్కెట్లు పట్టుకురా, అన్నాదు. మళ్ళీ చప్పట్లు కొట్టాడు. ఈ మారు కెమెరామెన్‌ వచ్చాడు. అయ్యపురెడ్డితో, నాతో విడివిడిగా రెండు, మూడు ఫోజుల్లో ఫొటోలు తీశాడు. వాల్‌పోస్టర్స్‌ అచ్చువేయించి ఇస్తాడనుకున్నాను. ఇక మీరు వెళ్ళిరండి. అయ్యపురెడ్డి గారితో ఇంకా పని ఉంది అన్నాడు ఎన్‌.టి.ఆర్‌. బయటికి వచ్చేటప్పటికి ఫొటోగ్రాఫర్‌ బిల్లు ఇచ్చాడు. అది చెల్లించి ముందుకు వెళ్తూ ఉంటే, ఆఫీసు సెక్రటరీ వచ్చాడు. ఇంతవరకు మీకు పార్టీ సభ్యత్వం లేదు. ఇదుగో రశీదు కోసి ఉంచాను. డబ్బు చెల్లించమన్నాడు. ఆ డబ్బు చెల్లించి బయటకు వస్తున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? జేబులో పార్టీ టిక్కెట్‌ ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. అందులోనూ పార్లమెంటు ఎలక్షను! డబ్బెక్కడ తేవాలి? రోడ్డుమీదకు వచ్చి నిలబడ్డాను. అయ్యపురెడ్డి కారు కనపడదు. అంతా అగమ్యగోచరంగా ఉంది. ఆటో కోసం చూస్తున్నాను. ఖాళీ లేదంటున్నారు. నడుచుకుంటూ అబిడ్స్‌ సెంటరుకు వస్తున్నాను. ఆటో ఆపి ఎక్కమన్నాడు. ఆటో వెళ్తోంది. ఎక్కడికి? అని ఆటోవాలా అడిగాడు. ఎటు వెళ్ళాలని! అదే నాకూ తెలీదు. ముందు పోనీ, తర్వాత చెప్తాను అన్నాను. ఆటో అసెంన్లీ దాటుతోంది. ఈనాడు సమీపానికి వచ్చింది. ఇక్కడ ఆపు అని క్రిందకి దిగాను. రామోజీని కలిస్తే మంచిదేమో! ఏదైనా దారి దొరుకుతుందేమో! లోపలికి వెళ్ళాను. స్వేచ్భాభారతం [79

లేచి వచ్చినట్టయింది. కం'గ్రాచ్యులేషన్‌, టికెట్‌ దక్కింది అన్నాడాయన. ప్రాణం వ య జ్ర ఖాయం ప్పు పని చెయ్యలేదన్న మాట అనుకుంటూ కూర్చున్నాను. “నిన్న ఇంతకీ తప్పు పని చెయ్యలదన్న రశేరాయన అని దే ఉన్నానూ” అన్నాడాయన. “పార్టీలు మార్చేరా 0ది మీపేరు. నేను అక్కడే ఉన్నాను” అన్నా! ట్త రిగిందన్న ఒకరంటే, 710, 110, 1026 10 56 16 180014 5621200” ఇ కనపడలేదు. “మీ క్‌ కొ డు [ మాట. అయితే ఇప్పుడేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? దారి, తెన్నూ వైజాగ్‌ వెళ్ళండి. సహాయం కూడా దొరికింది నాకు” అన్నాను. దాంది ఏముంది? ముందు వై టిక్కెట్‌ తీసి నామినేషన్‌కు గడువు 8రోజులే ఉంది అన్నాడు రామోజీ. మర్నాడు కకట్టుడుంటూ. వాళ్ళకెలా తెలిసిందో. బయట టి.డి.పి. జండా ఎగురుతున్న కార్షొ రందరూ. నేనైజే, ఆటో తీసుకొని వెళ్లేవాడ్ని ఇంటికొచ్చాక ఏమిటీ అవతారం అనుకున్నా! యన్‌.టి.ఆర్‌తో ప్రచార సన్నాహాలు నికీ ప్త నామినేషన్‌ వేసే ముందర, సినిమాహాల్లో కార్యకర్తల మీటింగ్‌ అన్నారు. రు ఉపేంద్ర దిగబడ్డాడు. అతను రావడమంటే, మేరుపర్వతం దిగివచ్చినట్టు భా వ్వడం టిడిపి. కార్యకర్తలు. కోరుండి శ్రీరామ్మార్తిగార్ని ఆహ్వానించి మరీ లకు మిటింగ్‌ అంటే, ఎంతటి వారికి దక్కుతుంది యీ గౌరవం అనుకున్నారుట కొంతమం చేసేరు. ఘనంగా జరిగింది. వందలాది కార్యకర్తలు భాట్టం గార్ని గెలిపిన్తాం అని శపథం కంకణ బద్భులయ్యారు. ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.

  • డే. ఎన్‌.టి.ఆర్‌. యథావిధిగా కొమ్మురు సంజీవరావ్పత్రోనే ప్రోట్రీ కాంగ్రెస్‌ అభ్యర్థి అతడే. బాభాలోకం కార్యక్రమం బయటపడింది. కార్యకర్తల్లో ఉత్సాహం ఉప్పాంగింది. మపి నుపొమ విరుచుకుపడింది. యువక్షుల్స ఉర్రూతలూగుతున్నారు. ఎన్‌.టి.ఆర్‌. మాటల్లో నో ఉందో! ఏం మహత్తుందో! అమ్మల్లారా! చెల్లెళ్లారా అనేప్పటికి పడి పడీ చప్పు కి తమ్ముళ్లారా! అనేప్పటిక్తి, ఎగిసి ప్రడ్డే కెరటాల్లాగా యువజనం చిందులు రం, ఎగిరేవారు, వేలాది జనం, ఎటు చూసినా జనం, జన ప్రభంజనం. అటు త్తి అనే బీన్‌ ఒద్దున ఇక్కడ జన సముద్రం, అర్ధరాత్రి గ్రామాల్తోకి వెళ్తే “మా తెలుగు ర ునో, సట వింటే పరుగుపరుగున తండోపత్రందాల. వచ్చేవారు జనం. జెండాలు ప భావుడు దండలు ప కునో, దండాలు పెట్టకుంటూనో దు జల్లేడో మహాను ట్టు స్ట , ఏ మత్తు మందు జల్లే ఎన్‌.టి.ఆర్‌, చినట్లు వేణుగానం విని మురళీలోల్పుద్ని కలవడానికి గోప్రగోప్రిక్రాజనం తరలి. ఇసుకపోస్తే ర్రాలన్సి జనం మంత్రమ్సుగ్భలై - ఇల్లూ, ఒళ్ళు మరచిపోయి వి వం. ల

మాట ఇచ్చేవారు! చెప్పినట్లు చేసేవారు. జనబలం ముందు ధనబలం బలాదూర్‌! అటుపక్క కోట్లు ఖర్చుపెట్టనివ్వండి! అంత సొమ్ము గోతిలో పోసినట్లే. తెలుగుదేశం పిలుస్తోందిరా! అంటే, ఓట్లు గుమ్మరించినట్లే, ఆ తర్వాత భాట్టం గారి మీద (ప్రేమ.

1978 ఎన్నికల్లో జనం వంచనకు గురై తమ ప్రియతమ అభ్యర్థి పరాజయం పాలవడం జనం జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ ఉక్రోషంతో, పౌరుషంతో పట్టుబట్టి గెలిపించారు. లక్షన్నర ఓట్ల మెజార్టీతో. 1983లో నన్ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడం ఏంటి? 84లో పార్లమెంటుకు అఖండ మెజార్టీతో గెలిపించడం ఏంటి? దైవకృప, ఊహాతీతం: జయాపజయాలు దైవనిర్ణయాలు. విజయం వరిస్తే, పొంగిపోవటం, పరాజయం పాలైతే కృంగిపోవటం పనికిరాదు. ద్వంద్వాతీతుడే సుఖసంతోషాలతో ప్రశాంత జీవితం గడపగలడు. అయితే ఆడంబరం, లేకుంటే ఆందోళన! సుఖదుఃఖాలు, లాభనష్టాలు జయాపజయాల ద్వంద్వాల బంధనం నుండి విముక్తే, శాంతి క్రియకు దోహదం చేస్తుంది. పూర్వం నేనెప్పుడు గెలిచినా, అది నా గెలుపుగా ఉండేది. టి.డి.పి.లో మాత్రం ఇది ఎన్‌.టి.ఆర్‌. గెలుపుగా చరిత్ర మలుపు తిప్పింది.

ప్రచార పర్వంలో భాగంగా, అర్ధరాత్రి హఠాత్తుగా ప్రచారరథం ఆగింది. లఘు 'ప్రక్షాళనానంతరం, ఏ జేబులోనించి తీశాడో, 40వేల రూపాయల కట్ట ఒకటి నా చేతిలో పెట్టాడు ఎన్‌.టి.ఆర్‌. “డబ్బులు ఓట్లు కురిపించవుగానీ, డబ్బుకు ఇబ్బంది పడితే ప్రచారరథ చక్రాలు తిరగవు కదా! ఈ సొమ్మును మీ దగ్గర ఉంచుకుని, అవే లక్షలు, కోట్లు అనుకొని ఖర్చు పెట్టుకోండి” అన్నాడాయన. వెంటనే ఆ సొమ్ము ప్రసాదరావ్‌ చేతిలో పెట్టాను, దాచిపెట్టమని అదే, ఆర్థికంగా, పార్టీపరంగా చేతిలో పడిన సొమ్ము. డబ్బుకు ఇబ్బంది పడకుండానే విజయఖేరి మోగింది. ఖద్దరు వదలను

నన్ను చూస్తే ఎన్‌.టి.ఆర్‌.కు కాంగ్రెస్‌ వాళ్ళే కనపడేవారు. ఖద్దరు పంచ, చొక్కా ఆ అకు చెప్పులు, ముఖం మీద కుంకుమబొట్టు సహవాస దోషం వల్ల మార్చు సిద్ధిస్తుందన్న (భ్రమ ఉండేది. తర్వాత శ్రేణి నాయకత్వానికి ఒకనాడు దర్జీవాడొచ్చి అందరికి కొలతలు తీసుకుంటున్నాడు. రెండు పసుపురంగు చొక్కాలు కుడతాడట. ఆ పైకం చెల్లించేము. మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఎ.పి. భవన్‌ నుండి ప్రమాణ స్వీకారానికి బయలు దేరే ముందు నా చొక్కాలునా గదిలోనికి వచ్చాయి. పసుపురంగుతో కళకళ లాడుతూ, సమష్టిగా అందరం ఏక కాలంలోనే వాహనాల్లో పార్లమెంటుకు చేరాము. స్వేద్భాభారతం 181

ఎప్పుడో ధరించిన ఖద్దరు నా ఒంటిమీద చర్మంలాగా, నాతో భాగమే ఉండిపోవాలి అనుకునేవాణ్ణి. ఇప్పుడు ఈ చొక్కా తొడిగితే తేళ్ళూ, జెర్రిలు పాకినట్టుండేది. ప్రమాణ స్వీకారం అనంతరం గూటికి చేరుకుని, చొక్కాలు రెండూ చెత్తబుట్టలో వేశాను. రెండు ఖద్దరు చొక్కాలు తీసి, పసుపురంగు అద్దకానికి పంపించేను. విధిలేనపుడు అరుదుగా వేసుకునేందుకు.

మీ ఉపన్వ్యాసపాఠం పత్రికల్లో (ప్రింట్‌ అవుతుంది. చూస్తాను, మీరేం చెప్తారో, దెబ్బమీద దెబ్బ వేయాలి, అన్యాయాలు, అక్రమాలు చీల్చి చెండాలాలి అన్నాడు ఎన్‌.టి.ఆర్‌. రైల్వే బడ్జెట్‌ మీద చర్చ పప్రారంభించవలసి ఉంది. లేచి నిలబడగానే మధుదండావతే అడ్డంగా వచ్చి, “మాజీ రైల్వే మంట్రిగా చర్చ నేను ప్రారంభించాలి, మాధవరెడ్డితో కూడా చెప్పే'నన్నాడు. “ప్రిపేర్‌ అయి వచ్చేను. ఇప్పుడు నేను వెనక్కి తగ్గేది లేదు, సారీ సార్‌” అని చర్చ ప్రారంభించేను. మొట్టమొదట రాజ్యాంగ నిబంధనలు ఉటంకించేను. సాలీనా ఒక ఆదాయ వ్యయ పట్టిక (బడ్జెట్‌ అంచనాలు) సభ ముందు ఉంచాలి అని రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్‌ చదివాను. అందులో “ఒక” అని ఉంది. ఇక్కడ రెందు బడ్జెట్లు వస్తున్నాయి. అసలు బడ్జెట్‌ ఆర్థికశాభా మంత్రి ప్రవేశపెద్దారు మరి ఈ రెండో బడ్జెట్‌కు రాజ్యాంగంలో స్థానం లేదే. అందులోనూ, ఈ బడ్జెట్‌ అసలు బడ్జెట్‌ను వెనక్కు నెట్టి ముందుగానే పార్లమెంట్‌లో చర్చకు వస్తుంది. రాజ్యాంగ రీత్యా ఈ విధానానికి తావులేదు! అన్న మాటలతో ప్రారంభించిన ఉపన్యాసం, దాదాపుగా గంటవరకూ కొనసాగింది. పత్రికల్లో 'ప్రముఖంగా ప్రచురించబడింది. ఎన్‌.టి.ఆర్‌. ఫోన్‌ చేసి, తన సంతోషాన్ని తెలియజేశాడు.

నాటినుండీ మరి వెనక్కి చూడలేదు. వీలైనప్పుడల్లా వినదగ్గ విషయాలను విన్నవించి, సభ మన్ననలందుకున్న సందర్భాలు ఉన్నాయి. పంజాబు సమస్య

పంజాబులో జరుగుతున్న ఘోర దురంతాలు, నిరంతర మారణహోమం, హత్యాకాండ, దేశ విద్రోహ చర్యలకు అంతులేదు. ఈ క్రూర, కిరాతక దమనకాండని అద్దుకునే నాథుడే లేడా? పంజాబులో రగిలిన కార్చిచ్చు దేశ రాజధానిని చుట్ట పెట్టింది. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ లేదు. ఆగని కార్చిచ్చు మధ్య నిత్యాగ్ని గుండం మధ్య జన జీవితం దిన దిన గండంగా మారింది. ప్రళభయభీకరమైన ఈ గడ్డు సమాన శాంతిభద్రతలు జాతి గుండెపై కుంపటిగా మారి మటుమాయం అయ్యాయి. జనజీవితం అతలాకుతలం అయ్యింది. విద్రోహకరశక్తులు, విచ్చిన్న కర శక్తులు విలయతాండవం 182 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

చేస్తూ, బీభత్సం సృష్టిస్తున్నాయి. అరాచకమూకల దహనకాండపై దాడిచేస్తున్న ఈ సమస్యపై చర్చ ప్రారంభించి, ప్రభుత్వవైఫల్యాలను తూర్చారబట్టి, ప్రత్యేక చర్చ లేవదీయడానికి ఎన్ని గుండెలు కావాలి? కేంద్రప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ, దేశసమగ్రతను సంరక్షించుకునే తక్షణ ఆవశ్యకతను, బాధ్యతనూ గుర్తు చేస్తూ, చేసిన ప్రసంగం, సభాధ్యక్షుడు సైతం ప్రశంసించడం, సభామోదం, హర్షం ప్రకటించడం జరిగింది. పార్లమెంట్‌లో ఉభయదిశలా కొలువై ఉన్న మొత్తం సభ్యుల అందరి మనోవేదనలను, అందోళలను ప్రతిబింబిస్తూ చేసిన ప్రసంగాన్ని శ్లాఘిస్తూ, పూర్వ న్యాయశాఖామంత్రి (జగన్నాథ కౌషల్‌ నా తర్వాత తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ల ౬ ఈ స్వేచ్భాభారతం 183

పార్లమెంటు ప్రసంగాల సంక్షిప్త వివరాలు

పార్లమెంటులో అడుగుపెట్టాక పట్టణ, ప్రాంతీయ సమస్యలు పట్టుకు ్రేళ్లాదాలా? జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలా? పల్లె నుండి ఢిల్లీ వెళ్ళిన అదృష్ట జాతకుడు స్థానిక సమస్యల్లో తలమునకలై సెంట్రల్‌హాల్‌ దౌత్యంలో సిద్ధహస్తుడై పక్రికా విలేఖర్ల సౌజన్యంతో పార్లమెంటు వెలుపల చేసే ప్రకటనల జోరుతో, హోరుతో పరవశించే ప్రబుద్ధులు కొందరుంటారు. ప్రధాన జాతీయ సమస్యలపై ప్రత్యేక చర్చలు లేవనెత్తి ఘంటాపథంగా గంటపాటు ప్రసంగించే అరుదైన అదృష్టం నాకు కల్లింది. విశాఖ ఉక్కు

“ఆంధ్రుల హక్కువిశాఖ ఉక్కు అని నినదించిన ఆంధ్రజాతి నేతల పరమ గమ్యాన్ని తూట్లు పెట్టే ఢిల్లీ పెద్దల పద్ధతులు ఎండగట్టడానికి నడుం కట్టే అపూర్వ అవకాశం నాకు దక్కింది. ఉక్కు ఫ్యాక్టరీని ముక్కలు చెక్కలు చేసి మూలకు నెట్టాలని జరుగుతున్న కుట్రల, పన్నాగాల పద్మవ్యూహం ఛేదించేందుకు వాగ్చాణాలు సంధించవలసి వచ్చింది.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తలపెట్టింది 1960లో, పునాది రాయి పడింది 1971లో, పబ్లిక్‌ ఇన్‌వెస్టుమెంటు బ్యూరో ఆమోదం లభించింది 1979లో, రష్యాతో ఒడంబడిక కుదిరింది 1980లో. కాలయాపనతో నిధుల కొరతతో నిర్మాణం కుంటుపడింది. ధరలు శరవేగంతో ఆకాశాన్నంటుకుంటున్నాయి. 1979లో ఉక్కుఫ్యాక్టరీ అంచనా ఖర్చు 2256కోట్లు. 1981వ సంవత్సరానికి ఈ మొత్తం 38897 కోట్లకు పెరిగింది. మళ్లీ మరింత దారుణంగా 7500కోట్ల ఖర్చుతో అంచనాలు తయారు చేశారు. (గ్రామ ప్రజలను తమ నివాసాల నుండి తొలగించి 25,000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. మరో 10వేల ఎకరాల భూమి కావాలని ప్రతిపాదనలు పెడుతున్నారు. 18000 కాందిశీక కుటుంబాలు పూటకు టికానాలేక రోడ్డున పడ్డారు. ఎకరా భూమి 1200 రూపాయల నష్టపరిహారం చెల్లిస్తే ఎలా బ్రతకగలరు. కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పిస్తామన్న 184... భొట్టొ శ్రీరామమూర్తి ట్వీయ చరిత్ర

ప్రధాని ఇందిరమ్మ మాట నీటి మూట అయింది. ప్రమథగణాలు పట్టించుకోలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి దిక్కులేని పరిస్థితి దాపురించింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం ఒక్కరోజు జాప్యం చేస్తే దేశానికి మూడువేల కోట్లు నష్టం వాటిల్లుతుందని ఉన్నత స్థాయి సంఘం లెక్కలు ఉటంకిస్తున్నాయి. గంటల తరబడి చేసిన మూడు ప్రసంగాలకు పార్లమెంటు నుండి అద్భుతమైన ప్రతిస్పందన లభించింది. అప్పటి భారత (ప్రధాని రాజీవ్‌గాంధీ ఉదారస్వభావంతో ముందంజ వేశారు. తల్లికి మించిన చొరవ. తాతకు మించిన నేతగా సాహసం చూపించాడు. బడ్జెట్టులో కేటాయించిన 215కోట్లు కంట్రాక్టర్ల బకాయిలు చెల్లించడానికే చాలవన్నాను. యీ మొత్తం 900 కోట్లకు పెంచుతానని వాగ్దానం చేశాడు రాజీవ్‌గాంధీ. మన ప్రాంత ప్రజల తరఫున పార్లమెంటులోనే వారికి కృతజ్ఞతలు తెలియజేసాను. ఇంతటితో ఉక్కు ఫ్యాక్టరీకి పునరుజ్జీవనం కల్గింది. చావు బ్రతుకుల మధ్య నున్న ఉక్కు ఫ్యాక్టరీ జీవన్మరణ సంగ్రామం నుండి బయటపడింది. సత్వర పురోగమనానికి శ్రీకారం చుట్టింది. నాడు జరిగిన కృషి కారణంగా ఉక్కు ఫ్యాక్టరీ కొత్త ప్రాణం పోసుకుని ఉజ్వల భవితవ్యం దిశగా దూసుకుపోతుందని సి. ఎమ్‌.డి. బి.ఎన్‌ దత్తు వ్రాసిన లేఖలో నన్ను అభినందించారు. పూర్వం వాల్తేరు స్టేషనుగా ఉన్న పేరును, విశాఖపట్నం రైల్వే స్టేషనుగా పేరు మార్చేందుకు రెండు సంవత్సరాలు కృషి చేయవలసి వచ్చింది. ఇక్కడ కార్మిక నాయకుడు మంత్రి రాజ్‌వేకర్‌ సమస్యల కట్ట పట్టుకొని ఢిల్లీలో కేంద్ర నాయకుల చుట్టూ తిరిగేవాడు 1౧12౮.0. అధ్యక్షుడు జెంషెడ్‌పూర్‌ యం.పి. గోపేప్వర్‌ వద్దకు వెళ్తే, విశాఖ ఉక్కు సమస్యలు కూలంకషంగా తెలుసుకొని క్షుణ్ణంగా పరిశోధించి కేంద్రాన్ని నిలువునా చెండాడి పోరాడుతున్న ప్రతిభావంతుడైన మీ స్థానిక పార్లమెంటు సభ్యుడు కన్నా మిన్న యెవరు? ఆయన్ను కలిసి మీ కార్యాన్ని నెరవేర్చుకోమని సలహా యిచ్చినట్లు నాకు చెప్పాడాయన. ఆ తరువాత మంత్రి రాజ్‌వేకర్‌ కూడా తరచూ కలిసేవాడు. ప్రాంతీయ ప్రయోజనాలు విస్మరించకుండా పలు సందర్భాలలో జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చలు లేవదీసి పార్లమెంటు మన్ననలు పొందిన విషయం పార్లమెంటు రికార్డులోనే ఉంది. శ్రీలంక సమస్య రావణాసురుడి కాష్ట్రంలా నేటికీ కాలుతున్న శ్రీలంక సమస్యను ప్రత్యేక చర్చకు పెట్టి రెండు శందర్భాలలో చేసిన సుదీర్హ ప్రసంగాల సభామన్ననలందుకుంది. అప్పట్లో స్వేచ్భాభారతం 185

రాజీవ్‌గాంధీతో చర్చలు కొనసాగిస్తున్న తమిళపులుల నాయకులు పార్లమెంటు గాలరీ నుండి నా ప్రసంగాన్ని విని నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభాకరన్‌ సంతకంతో ఉత్తరం అందజేయటం విశేషం.

పార్లమెంటు ప్రసంగాల బాణి తెలియజేసాను మీకు. ప్రజలవాణి పార్లమెంటులో విన్సించాను మీకు. యథాశక్తి చేసిన కృషి క్లుప్తంగా విన్నవించాను. (వివరాలు ఇంకా కావలంటే “34 5615 9201400610 గ్రంథంలో నా ఆంగ్రప్రసంగాలు చూడండి.)

ఇక్కడ నాకు కొంచెం బ్రేకులువేస్తే బాగుంటుందన్న ఉద్దేశం పార్టీ పెద్దలకు కలిగింది. 060121 ఏీలు[ం8 కింద నేను అనేక ముఖ్యాంశాలు లేవనెత్తేవాడ్ని. ఉక్కు ఫ్యాక్టరీ నిర్వాసితులకు, ఉద్యోగాలు, పర్యాటకప్రాంతంగా విశాఖ ప్రాంతం, నిధుల కొరత, విశాఖ కార్పోరేషన్‌కు ప్రత్యేక నిధులు, పారిశ్రామిక కాలుష్యం వంటి అంశాలు ప్రజల దృష్టిని ఆకర్షించేవి. సీనియర్‌ సభ్యులు 506012] 1480102 చేయకూడదన్నారు. ఇది నాపై పడ్డ మొదటి వేటు. నా ఒంటరి వాక్‌అవుట్‌

నేను ఎప్పుడూ సిద్ధాంతపరమైన విషయాలు, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసే సమస్యలే చర్చలకు చేపట్టేవాణ్ణి. కాంగ్రెస్‌ పార్టీనో, వ్యక్తుల్నో దూషించటం నాకు అలవాటు లేదు. అయినా ఒకమారు గవర్నర్‌ శారదాముఖర్జీ రిపబ్లిక్‌డే సందర్భంగా రాష్ట్రప్రభుత్వంపై చేసిన నిశిత విమర్శలు ఉటంకించి, ఇట్టి విమర్శలు గవర్నర్‌ హోదాను భ్రష్టు పట్టిస్తాయని మాట్లాడుతున్నప్రుడు హోంమంత్రి బూటాసింగ్‌ అభ్యంతరం చెప్పాడు. గవర్నర్‌ ప్రసక్తి తేకూడదని, ఆమె ప్రసంగాన్ని ఉటంకించి, విమర్శించేను గాని గవర్నరును వ్యక్తిగతంగా చేసిన విమర్శ కాదని చెప్పాను. ప్యానెల్‌ స్పీకర్‌గా ఉన్నది పురుషోత్తం (కేరళ) అనుకుంటాను. హైదరాబాద్‌లో ఆమె ఏమి చెప్పినా, యిక్కడ ఆ విషయంపై చర్చించడం అంటే గవర్నర్‌పై విమర్శించినట్లే అని రూలింగ్‌ ఇచ్చాడు. అంతటితో నేను వాక్‌ అవుట్‌ చేశాను. నాతో ఎవరూ రాలేదు. ఇది నాటి నాయకత్వం నాపట్ల ప్రదర్శించిన వైఖరి. అంతటితో నేను మరి దగ్గరుండి చర్చలు లేవనెత్తడం గానీ, చర్చల మధ్య ప్రభుత్వ పెద్దల్ని అద్దుకోవడం గాని మానుకున్నాను.

పార్లమెంటరీ కార్యక్రమాలపట్ల కొంత ఉదాసీన భావం కలిగింది. వ్యక్తిగత ్తీర్తి ప్రతిష్టలకు పాకులాడే స్వభావం మొదటినుండి నాకు లేదు. పార్లమెంటు సభాభవనంలో 1868... భాట్టం శ్రీరామమూర్తి స్వీయ బంత్ర

కన్నా లైబ్రరీలోనే ఎక్కువకాలం గడిపేవాడిని. బుద్ధిబలానికి, జ్ఞానసంపాదనకు ఉపయోగపడే కార్యక్రమానికి ఉపక్రమించాను. (ఈవిధంగా టి.డి.పి. నుంచి నిష్కమించడానికి నాందీ ప్రస్తావన జరిగింది). పి.ఏ.సి. చైర్మన్‌ పదవి

నేను విశాఖపట్నంలో ఉండగా ఒక ఉత్తరం వచ్చిపడింది ఇంట్లో. ఎన్‌.టి.ఆర్‌. నుండి కూడ ఢిల్లీ వెళ్ళేముందు హైద్రాబాద్‌లో తనని కలిసి వెళ్ళమని, ఆ తర్వాత ఫోన్‌లో వార్త వచ్చింది. పి.ఏ.సి. మెంబరుగా నా పేరు నిర్ణయించినట్టు, ఈ ఫోన్‌ వార్తకు, ఈ తంతి వార్తకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది అనుకుంటూ హైద్రాబాద్‌ ఎన్‌.టి. ఆర్‌. ఇంటికి చేరాను. ఆఖరు అంతస్తులో ఒక్కడూ యం. ఎస్‌.ఎస్‌. కోటేశ్వరరావుతో నాటి క్వశ్చన్‌ అవర్‌లో మెడికల్‌ ఆఫీసర్ల ప్రైవేటు ప్రాక్టీసు గురించి జవాబు చెప్పవలసిన తీరు గురించి చెప్తున్నాడు. ఆ గది బయట కుర్చీలో ఏదో వ్రాసుకుంటూ, చదువుకుంటూ నారా చంద్రబాబు నాయుడు కూర్చున్నారు.

కోటేశ్వరరావు అసెంబ్లీకి బయలుదేరిన తర్వాత ఎన్‌.టి.ఆర్‌. నాతో అన్నాడు. మీ మీదే ఆశలన్నీ పెట్టుకుని పి.ఏ.సి. ఛైర్మన్‌ చేస్తున్నాం. కేంద్రంలో జరుగుతున్న లొసుగులు, లోటుపాట్లు బట్టబయలు చేసి, కేంద్రానికి బుద్ధి చెప్పే బాధ్యత మీ మీద పెడుతున్నానన్నారు. “మీరైతే సద్భావంతో నా పేరు పెట్టారుగానీ, ఉపేంద్ర ఇది జరగనిస్తాడా?” అన్నాను. “నేను చెప్పినా చెయ్యడా? అదీ చూస్తాను. ఇదిగో చంద్రబాబూ చూడండి! భాట్టం గారి పేరు చెప్తే, ఏదో నాన్చుడు మొహం కొంత కన్పించింది. వెంటనే ఫోన్‌ చేసి, భాట్టంగారే పి.ఏ.సి. ఛైర్మన్‌ అని స్పష్టం చెయ్యండి. నేను చెప్పానని చెప్పండి ఉపేంద్రతో” అంటూ ఉరుకులు, పరుగులుతో అసెంబ్లీ చర్చలకు బయలుదేరేడాయన. నేను బయటకు రాగానే చంద్రబాబు ఉపేంద్ర ఫోన్‌కు దొరకలేదు. అన్నగారు చెప్పిన పని నేను చూసుకుంటాను మీరు వెళ్ళి రండి అంటూ 'షేకహ్యాండ్‌ ఇచ్చాడు. ఉపేంద్రను దేవేంద్రుడు కూడా తట్టుకోలేడు

పార్లమెంటు భవనంలో జరుగుతున్న తతంగం కొంత మేర కనిపెట్టాను. ఉపేంద్ర పాచిక వేస్తే, పన్నాగం పన్నితే, బ్రహ్మరుద్రాదులు కూడా తప్పించుకోలేరు. చక్కా చల్లగా, హేతుబద్ధంగానే మాట్లాడుతూ, నవ్వుతూ తూట్లు పొడిచి, అట్టు తిరగేస్తాడు. మాధవరెడ్డితో కుమ్మక్కవ్వటం చూస్తున్నాను. అయ్యపురెడ్డి తెలిసీ తెలవనట్లు చూసీ, చూడనట్లు స్వేచ్చాభరతం 287

నటిస్తున్నాడు. రెండు పర్యాయాలు ఛైర్మన్‌ పని చేసిన పెద్దమనిషి. తన తర్వాత ఆ పదవి తన ఆప్పమిత్రుడికి అని తెలిసీ ముభావం వహిస్తున్నాడంటే, నా కంటికి కనబడని తతంగం తెరమరుగున జరిగి ఉంటుందని అనుమానం కలిగింది. ఇంతకీ ఇది ఎన్‌.టి.ఆర్‌, ప్రతిపాదన. దీనిపైన తనకెందుకు అంత ఆసక్తి? అనుకున్నా. ప్రధాన ప్రతిపక్షానికి ఛైర్మన్‌ వదలి పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారంగా నా పేరు ఒక్కటే పి.ఏ.సి. లో ఉన్నందున నా పేరు ఛైర్మన్‌గా ప్రకటించడానికి నిర్ణయం తీసుకుని స్పీకర్‌ ఆరోజు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా లేటు చేస్తే కొంప మునుగుతుందంటున్నాడు ఉపేంద్ర, మాధవరెడ్డితో. గుసగుసలాడి ఒక ఉత్తరం స్పీకర్‌కు వ్రాసేరు. మాది ప్రధాన ప్రతి పక్షం అయినా ఈ మారు పి.వ.సి. ఛైర్మన్‌గిరీ మాకు వద్దనీ, సి.పి.ఎమ్‌. పార్టీకి చెందిన “అమల్‌ దత్తా”కు ఇమ్మని (వ్రాసిన ఉత్తరం సెక్రటరీ జనరల్‌ అందుకున్నాడు. అపుడు నేను పార్లమెంటులో లేను. సెక్రటరీ జనరల్‌ మా యింటికి ఫోన్‌ చేసి చెప్పాడు జరిగిన తతంగం అంతా. “మీ పార్టీ మాట్లాడకుండా ఉంటే చాలు, మీ పేరు స్పీకర్‌ ప్రకటిస్తాడు రేపు. మీ పార్టీ లీడర్‌, మాకు చైర్మన్‌ పదవి వద్దు అని వ్రాసి పెట్టిన ఉత్తరం ఉపసంహరించుకుంటే చాలు అన్నాడు. “మీరు ఇలా చెప్పినట్లు చెప్పవచ్చా?” అని అడిగాను. “మీ పార్టీ పెద్దకు చెప్పండి, పైవారికి చెప్పొద్దు” అన్నాడు. ఆ రాత్రి ఎన్‌.టి.ఆర్‌.కు ఫోన్‌ చేశాను. జరిగిన తంతు అంతా చెప్పాను. అనుకున్నంత పనీ చేశాడా? చూస్తాను ఎందుకు చెయ్యడో! మీరే ఛైర్మన్‌ అని అరిచి, టేబుల్‌ మీద గుద్దాడు ఎన్‌.టి. ఆర్‌. ఉపేంద్రతో మాట్లాడినట్లా? మాట్లాడనట్లా? మాట్లాడితే ఏమయ్యిందో! నాకు చెప్పకపోతే, మర్నాడు పార్లమెంటులో సెక్రటరీ జనరల్‌ మొహం చూస్తూ, ఎలా కూర్చుంటాను? తెల్లవారు రూమునుండీ పనిచేస్తాడు ఎన్‌.టి.ఆర్‌. 4 గంటలకు ఫోన్‌ చేశాను ఏమయ్యిందండీ అంటూ! చూడండి శ్రీరామ్మూర్తిగారూ! ఇందులో చాలా పెద్ద జాతీయ విధానాలు ఇమిడి ఉన్నాయి! అంటూ ఉండగానే “మరి మీనుంచి నేను తెల్సుకోవలసినది ఏమీ లేదు” అంటూ ఫోన్‌ కట్‌ చేశాను. ఆ ఉదయం క్వశ్చన్‌ అవర్‌ అనంతరం స్పీకర్‌ యథావిధిగా టి.డి.పి. పార్లమెంటు పార్టీ కోరినట్లు, అమల్‌దత్త పేరు పి.ఏ.సి. ఛైర్మన్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత నేను పార్లమెంటుకు చేరుకున్నాను. ఇందులో ఎన్ని గూడు పుఠాణీలు ఉంటాయనుకున్నారు? వెన్నుపోటుదార్హు, నీ వెన్నంటే ఉంటారు. ఆప్యాయత ఒలకబోస్తూ, ప్రేమబంధాలు కురిపిస్తూ!

ఎన్‌.టి.ఆర్‌. ముచ్చట్లు

ఆ తర్వాత ఇది వరకు వలే చారవ తీసికుని ప్రభుత్వాన్ని ఎదుర్కోవటం మానేశాను. చర్చల సరళి, చల్లగా, చప్పగా కనపడిందట ఎన్‌.టి.ఆర్‌.కు. ఢిల్లీ వచ్చాక నాకు కబురు చేశాడు. నేను వచ్చాక ముందు టిఫిన్‌ చెయ్యమన్నాడు. “ఈ వడ బాగుంది” ఇంకొక్కటి తినండి అంటూ వేశాడు. అంతా అయిన తర్వాత మీరు అస్త్రసన్యాసం చేస్తే ఎట్లా? ప్రభుత్వాన్ని నిలదీసి, నిగ్గుతేల్చకపోతే ఎట్లా? అన్నాదు. ప్రజలు ఒక కంట అన్నీ కనిపెడుతూ ఉంటారు. మళ్ళీ ఎన్నికల్లో వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారు అన్నాను. ఇక్కడ పార్లమెంటులో నోరుండి, ప్రజ్ఞ ఉండి, ప్రతిభ ఉండి, మీరు మెదలకుండా ఉంటే, ఎక్కడో మారుమూల (గ్రామంలో నోరులేని మూగమానవుడు ఏం చెయ్యగలడు? అంటూ కొంత ఉద్రేకం చూపించాడు ఎన్‌.టి.ఆర్‌. “51% సీట్లు వచ్చిన వాళ్ళదే పరిపాలన. 49% సీట్లు వచ్చిన వాళ్ళేం చెయ్యగలరు? ప్రజాస్వామ్య విధానం ఇదే అన్నాను. “మీరు ధనుర్భాణాలు ఎక్కుపెట్టి, గురిపెట్టి ఘోరాలు, నేరాలు అరికట్టడానికి బదులు 49% జడప్రాయంగా, కుక్కిన పేనులా పడి ఉంటారా?” అన్నాదు. “అయ్యా, ఈ సిద్ధాంత, రాద్ధాంతాలు చర్చించడాన్మి (నేను కాదు) తగిన మనిషి పార్టీ లీడరు. ఆయనతో మాట్లాడవలసిన విషయాలకు నేనెలా జవాబు చెప్పగలను?” అన్నాను, అసహాయంగా, నిస్సహాయంగా కూర్చునే కన్నా తప్పుకుంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటాను అన్నాను. “ఆ ఆ - అలాంటి పని మాత్రం చెయ్యకండి. అది తప్పుడు సంకేతాలు ఇస్తుంది” అన్నాడు ఎన్‌.టి.ఆర్‌. నేను నిష్కమించాను. పార్లమెంటుకు మరి పోటీ చేయను

ఆ తర్వాత పార్లమెంటరీ పార్టీ ప్రధానకార్యదర్శి పదవికి రాజీనామా చేసి ఎన్‌.టి. ఆర్‌, కు పంపించేను. అది ఆమోదించకుండా, ఢిల్లీ వచ్చినపుడు నా భుజం మీద ఒక చెయ్యివేసి, రెండో చేతిలోని ఉత్తరం నా జేబులో తోసేశాడు. ఇప్పటికి ఊరుకోండి, దయ చేసి, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతానన్నాడు. ఇపుడు అయ్యిందేదో అయిపోయింది. ఇటు పైన మళ్ళా నేను పార్లమెంటుకు పోటీ చేయను అని ఉత్తరం వ్రాసి ఇచ్చాను.

మరి వచ్చే ఎన్నికలకు నాకూ సంబంధం లేదంటున్నట్లు చాలామందికి తెలిసిపోయింది. ఢిల్లీలో మా ఇంటి ప్రక్కన సి.పి.ఐ. ఆఫీసులో కూర్చుని ఉండగా సీనియర్‌ సభ్యుడు ఎం.ఎస్‌. గురుపాదస్వామి నాతో అన్నాడు. మళ్ళీ ఎన్నికలలో మీరు మానేస్తా మంటున్నారుట అంతపని చెయ్యకంది. స్వేచ్భాభారతం 189

మొన్ననే నిర్ణయం తీసుకున్నారు. బోఫోర్సు సమస్యపై రాజీనామా చేసిన వాళ్ళందరికీ తిరిగి టిక్కెట్లు (అన్ని పార్టీ వాళ్ళూ) ఇచ్చి తీరాలని తీర్మానం జరిగింది. రాబోయే ఎన్నికలలో రాజీవ్‌గాంధీ ఓటమి తథ్యం. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం. ఇప్పుడు తప్పుకోవడం మంచిది కాదంటూ మరీ మరీ చెప్పాడు. ప్రతిపక్షం పదవిలోకి వస్తే, కేంద్రంలో మనం చక్రం తిప్పుతాం అన్నట్టు సూచించాడు.

84-89 మధ్యకాలంలో పార్లమెంటులో 70%- 50116 ఉం౫16౪6౧6౫1 ఏదైనా ఉందా అంటే అది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవడం అని చెప్పాలి. అవసరమైన నిధులు దక్కించుకోవడం అని చెప్పాలి! అలా చెప్తే ఆ పేరు ప్రఖ్యాతులు నాకు దక్కుతాయేమో! ప్రాణార్ప్చణ చేసి సాధించుకున్న ఆంధ్రుల హక్కు అనుభవంలోకి తేవడం గర్వకారణం అయిన విషయం. అయితే దీని పట్ల పార్టీ నాయకత్వం ప్రదర్శించిన ఉదాసీనత, ఉపేక్ష క్షంతవ్యమా? వ్యక్తిగత పేరు ప్రతిష్టలు లాభనష్టాల పట్ల భ్రమలు లేని నేనూ చాలావరకు ముభావంగానే ఉన్నాను. క125 గగ౫1౦6 జాతికి అంకితం చేసే కార్యక్రమానికి నాటి ప్రధాని వి.పి.సింగ్‌ విశాఖ వచ్చినపుడు నేను ప్రేక్షకుడిగా మిగిలిపోయి దూరంగా ఉండిపోవలసి వచ్చింది. పూర్వం ఇందిరాగాంధీ, రామ్‌మనోహర్‌ లోహియా వంటి పెద్దల (ప్రసంగాలు తర్జుమా చేసిన నన్ను ప్రకృనపెట్టి ఆ బాధ్యత ఉపేంద్ర తన పూర్వమిత్రుడు, విశ్వవిద్యాలయం ఆచార్యుడు ప్రసాదరావుకు అప్పగించాడు.

హైద్రాబాద్‌లో ఎన్‌.టి.ఆర్‌. పెట్టిన సమావేశంలో నన్ను ఒప్పించడానికి చూశాడు. నేను జవాబు చెప్పలేదు. మళ్ళీ టిక్కెట్ల ప్రస్తావన వచ్చి, చర్చలు జరుగుతున్నట్లు తెలిసి, ఆ సమావేశానికి వెళ్ళి “నేను మరి పోటీ చేయను, నా గురించి ఆలోచించనవసరం లేదు” అని చెప్పి వచ్చేశాను. ఆ స్థానంలో ఎమ్‌.వి.వియస్‌. మూర్తి ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత రాజకీయాలకు స్వస్తి! ఒక విషయం ప్రక్కన పెట్టాను, మన్నించండి ఇక్ళడ ఇంకో ముఖ్యవిషయం వివరించడం న్యాయం. కాని నేను ఆ పని చెయ్యడం లేదు. ఈ ఘటనకు ప్రధాన కారకులు నాకంటి ముందు కదల్లూనే ఉన్నారు. నాటి వారి చేష్టలు క్షతవ్యం కాదు. ఆ గుట్టు బయటపెట్టి నిలదీయడానికి మనసు రాలేదు. చెరపకురా చెడేవు అన్నది సామెత! నాకోసం తీసిన గోతిలో ఒకృరే పడతారా! నన్నుపాడు చెయ్యాలని చూసిన వాడు బాగుపడ్డ దాఖలాలేదు! కాని ఇతను బాగుపడితే కొంత మంది జనం అయినా బాగుపదతారన్న ఆశాభావం నాకు ఉంది. బంగారు గుద్దు పెట్టే బాతు కదుపు కోస్తే మనకేం వస్తుంది? అనాడా పెద్దమనిషి ఏం చేసినా అతను బాగుపడాలనే కోరుకుంటూ 190 భాట్టం శ్రీరామమూర్తి డ్వడు వాళు

అతనికి మంచి జరగాలని 89 నాటి ఎన్నికల తతంగం వ్రాయడం మానేస్తున్నాను” సర్వేజనాః సుఖినోభవంతు. “సత్వవాం, కామయే రాజ్యం నన్వర్థంన వునర్భవం కామయే దుఃఖ తప్తానాం (సొణి నా కార్తినాళనం. ” చిమటాసాంబు సొహసం - ప్రహసనం ; సోమనాథఛటర్టీ పార్లమెంటు కార్యక్రమాలకు సభ్యులు అడ్డుతగల కూడదని క్రమశిక్షణ పాటించాలని గొంతుకు పెంచి ఇటీవల గర్జించడం టి.వీలో చూసి నవ్వుకునేవాడ్ని - 84-89 మధ్యకాలంలో పార్లమెంటులో నా వెనుక రెండవ వరసలోనే కూర్చునేవాడాయన! ఆయన చేసే గొడవ గల్లంతు మరుపురాదు! గొంతుకు చీల్చుకొని మరీ అరుపులతో కేకలతో పాలక పక్షానికి అద్దుతగిలేవారాయన! (ఇతరుల కన్నా మిన్నగా) అసలే ఆయనది పెద్ద గొంతుక. ముఖ్యంగా ఇక్కడ బోఫోర్సు సమస్యపై జరిపిన ఆందోళన, సభా కార్యక్రమం స్తంభింప చేసిన వైనం ఎన్నటికీ మరుపురాదు. సభ వాయిదా పడ్డ తర్వాత ప్రతిపక్ష నాయకులు తరుచూ టి.డి.పి. కార్యాలయంలోనే సమావేశం అయి, తదుపరి వ్యూహం చర్చించేవారు. 3,4 రోజులు సభను స్తంభింపచేసేం. యింకా ఇది పొడిగిస్తే ప్రజల స్పందన మనకు వ్యతిరేకం అయ్యే ప్రమాదం ఉంది అని ఎవరు చెప్పినా కొందరు సి.పి.ఎమ్‌. నేతలూ ముఖ్యంగా వి.పి.సింగ్‌ అంగీకరించేవారు కాదు. ఈ విషయం (ప్రజలకు మరపురాకుండా వారి నరనరాల్లో ఇంకిపోవాలంటే ఈ దుమారం మరికొంత కాలం చెలరేగాలని ఉద్దాటించేవారు. మర్నాడు మళ్ళీ సభలో లొల్లి! అమ్మవారు పూనినట్లు ఊగడం - ఎగరడం అరవడం! “గల్లీ గల్లీ హోర్‌ హై - రాజీవ్‌గాంధీ చోర్‌ హై” ఈ నినాదాలు మిన్నంటి పోయేవి. నాన్‌స్టాప్‌గా సి.పి.యమ్‌. సభ్యుల హంగామా చెప్పనలవి కాదు! ఒకరిని మించి ఇంకొకరు

  • పోటాపోటీగా సభ వాయిదా వేసే వరకు అరుపులు, కేకలు! టి.డి.పి. యువతకు కిరైక్కించే పెద్దమనుష్యులు రాజ్యసభ నుండి వచ్చి ఈ వేడుకలు చూసి తరించేవారు. 'జరునకర్వునా అన్నట్టుంటే వారికి భుజం తట్టి ప్రశంసలు కురిపించి వెళ్లేవారు. వాళ్ళకు ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. ఇది మరి భరించశక్యం గాక సభాధ్యక్షుడు యీ అరుపులు కేకల మధ్యనే ఒకనాడు సభా కార్యక్రమం కొనసాగించాలని ప్రశ్నలు సమాధానాలు ఇలా (0 06 1214 0% (006 (2016 0016 0056 అని చదువుకుపోయేడు. 0౪6:40౧ (౯౭24646 10 ౧276 066% 20- స్వేచ్భాభారతం 191

3౪4684 అంటూ సభాధ్యక్షులు ఆ విధంగా దూసుకుపోతూ ఉంటే మనం మరింత దుడుకుగా వ్యవహరించాలన్న భావనకు పెద్దల ప్రోత్సాహం లభించింది.

ఆ రోజు 1206౧ [0 606 111400 (16 (1016 0116 [10436 మంత్రి చిదంబరం లేచి చదువుతున్నాడు. మా పక్షాన ఉన్న టి.డి.పి. సభ్యుడు చిమటాసాంబు చెంగున అటువైపు దూకి చిదరంబరం చదువుతున్న చేతిలోని కాగితాన్ని లాక్కున్నాడు. క్షణంలో జరిగిపోయిన యీ దూకుడు చూస్తూ ఉండగానే నలుగురు కాంగ్రెస్‌ సభ్యులు ఛెంగున గెంతి సాంబు చేతిలో ఉన్న కాగితం లాక్కున్నారు. కాగితం చిరిగిపోయింది. ఏదో కొట్లాట జరుగుతోందని చూస్తున్నారు. (పెస్‌ గేలరీ నుంచి అంతా! “ఒరేయ్‌! నిన్ను కొట్టేసినారని చెప్పి క్రిందన పడిపోరా!” అన్నాడొక మహాశయుడు, సెక్రటరీ జనరల్‌ ముందు కాళీ జాగాలో కాళ్ళు జాపుకు పడిపోయేడు చిమటా సాంబు. అమ్మో! చంపేసారు మావాద్ని అన్నాడొకాయన. ఒకరు చెయ్యి పట్టి పల్ప్సు చూస్తూ ఉంటే, ఒకరు మొహంమీద నీళ్ళు జల్లుతున్నారు. ఇంతలో డాక్టరు 'ప్రవేశిస్తున్నాడు. ్రెచ్చర్‌ ఎక్కనంటాడు సాయబూ. చాలా షేమ్‌ రా అంటాడు ఛీ కళ్ళు మూస్మోని పడుకో!

ప్రెచ్చర్‌ దగ్గరకు తీసుకువెళ్తూ ఉంటే ఓరేయ్‌! ఇంజక్షన్‌ చేస్తాదేంటో డాక్టర్‌ అన్నాదు. “సాంబు- ఫరవాలేదు నేను చెప్తాను కదా?” అంటూ ఉండగా స్రెచ్చర్‌ లాబీ దాటింది. అయ్యా! ఈ తంతును ఏమంటారు? మర్నాడు 4/00! ౫6: అంతటా ప్రముఖంగా ఈ వార్త ప్రచురణ అయింది. టి.డి.పి. అభ్యర్థిని కాంగ్రెస్‌ ఎమ్‌.పి.లు చావగొట్టినట్టు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పరిహాసమా? ఈ ప్రహసనాన్ని ఏమి అంటారు? దీనికి బాధ్యులెవరు? ప్రోత్సాహమెవ్వరు? ప్రేక్షకులెవ్వరు? ఈ విపరీత విచ్చిన్నకర పోకడలకు కారణభూతులే (ప్రజాస్వామ్యానికి పునాదులుగా భావిస్తున్నారు! ఆశ్చర్యం.

దేశంలో అత్యున్నత పవిత్ర స్థానం అయిన పార్లమెంటులో టి.డి.పి. కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేసిన ప్రహసనానికి కారకుడైన చిమటా సాంబుకు అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం ఏది ఇవ్వాలో తోచక సాంబూతో సంప్రదిస్తే 01౪11 4౪111100 0005411206 00011149 సభ్యుడిగా నియమించమని కోదేడు. ఆ కమిటీ ప్రథమ సమావేశంలో పలు దేశాలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుందిట! ఇవి అన్నీ చిన్ని చిన్ని ఆశలు. చిలిపిచేష్టల చిన్నారుల ఆశలు! పార్టీ అగ్రనాయకత్వం అనుగ్రహించి, ఆశీర్వదించింది. (క్రమేణా పార్లమెంటు సపోర్టు

48వేల మైళ్ళ భూభాగం అనుకుంటాను భారతదేశానిది. దురాక్రమణ చేసి తన హక్కు భుక్తం చేసుకున్న చైనా ఉదంతం ఒకమారు పార్లమెంటులో రాగా అది అంతా 192 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

చైనాదే అంటూ సూత్రీకరించి చైనాను బలపరుస్తున్న సి.పి.ఎమ్‌ సభ్యుడు అమల్‌దత్తాకు ఎదురు చెప్తే ప్రతిపక్షంలో చీలికలు దాపురిస్తాయన్న పెద్దమనుష్యులు యీ పార్టీ లీడర్లు. దళితస్థానం కోరిన యం.పి.

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండీ చూస్తున్నా దళితుల సమస్యలు పెరుగుతున్నాయే కాని తరగడం లేదు. దళితులు సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే దళితులకు దళితస్టాన్‌ ఏర్పడాలని చింతామోహన్‌ పార్లమెంటు వేదిక మండి తన ప్రసంగంలో ఘంటాపథంగా ఉద్దాటించారు. అతడ్ని నిగ్రహించడానికి ప్రయత్నాలు జరిగాయి. “షోకాజు నోటీస్‌” వెళ్ళింది. అతడసలు జవాబు యిస్తే కదా? ఇప్పుడేం చెయ్యాలో తెలీక తల పట్టుకున్నారు పెద్దలు కొందరు! ఇంతలో చింతామోహన్‌ అంబేద్కర్‌ భార్య సబిత అంబేద్మర్‌ను కలిశాడు. ఆమె కలుగ చేసుకుంది. ఇప్పుడేం చెయ్యాలో తెలీక చేష్టలుడిగిన నాయకత్వం పరిస్థితులతో గుట్టు చప్పుడు కాకుండా సమాధానం పడకపోతే కోతి పుండు బ్రహ్మరాక్షసి అవుతుందన్న నిర్ణయానికి వచ్చి చల్లబడిపోయి మిన్నకుంది.

ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్‌లో చేరిన చింతామోహన్‌కు పి.వి. ప్రభుత్వంలో కేంద్రమంత్రి పదవి లభించింది. జలగం హయాం - బాలమురళికి అవార్డు విషయం

హరిజన సంక్షేమ శాఖ, నాకు అప్పనంగా అప్పగించారు. కోరిక నాది కాదు, నిర్ణయం ముఖ్యమంత్రిది అనుకోవడమూ భ్రమే. అలా రాసిపెట్టి ఉంది. పూజ్య బాపూజీ పవిత్రాత్మకు సన్నిహితంగా ఉన్నది హరిజనోద్ధరణ కార్యక్రమం. నా జీవితాన్ని చరితార్థం చేసుకునేందుకు ఆ పరమాత్ముడు అప్పగించిన శాఖ అది. నేను చేపట్టిన తర్వాత క్రొత్త పుంతలు తొక్కింది. సరికొత్త లక్ష్యాల (ప్రక్క పరుగులు తీసింది.

అనాదిగా - సనాతనంగా- తరతరాలుగా పాతుకుపోయిన అంటరాని తనం అన్న జాద్యాన్ని నిర్మూలించడం ఎవరి తరం? వారి ఆర్థిక పురోగతికి కొత్తబాటలు తెరిస్తే, అన్ని రంగాల్లోనూ సమానావకాశాలు లభిస్తే, విద్య, విజ్ఞానాలతో పాటు ఆర్ధిక స్తోమత, సాంఘిక భద్రత కల్పిస్తే, స్వయం సమృద్ధిగా జీవించి రాణించ గలిగితే, వారి భవిష్యత్తు వారే తీర్చి దిద్దుకుంటారు. ఇంత పెద్ద ప్రభుత్వంలో ఒక శాఖను నెలకొల్పి, పేదరికం మీద పోరాటం, అవిద్య మీద దండయాత్ర అనడం ఒక సాహసమే అవుతుంది. ప్రభుత్వ ఖజానాలోని ఎంత శాతం యీ శాఖాపరంగా ఖర్చవుతుంది? యీ స్వల్బ మొత్తంలో యుగయుగాలుగా పేరుకుపోయిన యీ ఘోరపాతకాన్ని ప్రక్షాళన చేయగలమా? స్వేచ్భాభారతం 193

ఉపప్రణాళిక నిర్ణయం ముఖ్యమంత్రి మనస్తత్వం తెలుసు. అఖిల భారత స్థాయిలో జరగాలి ఈ పోరాటం. ఢిల్లీలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రుల సమావేశం సదస్సు జరిగింది. జాతినేతలంతా పాల్గొన్నారు. ప్రధానంగా ప్రధాని ఇందిర, బాబూ జగ్జీవన్‌ రామ్‌, హోమ్‌ శాఖామాత్యులు, వగైరా అందులో 5420-0122 0086601 గురించి చేసిన నా ప్రసంగం, అందర్నీ ఆకట్టుకుంది. ఆఖరుకు ఇది కేంద్ర ప్రభుత్వవిధానం అయి కూర్చుంది. ఓమ్‌ మెహతా! మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ ప్రతి నిధులను పంపించారు, ఈ విధానాన్ని అమలు చేయాలంటూ, ముఖ్యమంత్రి వెంగళరావు దీన్ని తీవ్రస్థాయిలో నిరసిస్తూ, ఆచరణ యోగ్యంకాని పథకాన్ని పట్టుకొని వ్రేలాడొద్దన్నాడు! మానెత్తిన రుద్దొద్దన్నాడు. ఈ విధానాన్ని ప్రతిపాదించి, ప్రస్తుతించి విశ్లేషించిన వ్యక్తి ఆం.ప్ర. మంత్రి అన్న విషయం వారు ఉటంకించారు. తర్వాత ఆయన నాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత 1 5400016 ఈ 00 కి కట్టుబడతామని ప్రకటించాడు ముఖ్యమంత్రి. శం02! 00101121 [6562601 ౯21102 ౧౦౧౯6 ఒకటి ఉంది. ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న స్వతంత్ర స్థాయి సంస్థ అది. సుప్రసిద్ధుడు, రాష్ట్రస్థాయి గెజిటెడ్‌ ఉద్యోగాలకు ఎస్‌.సి. - ఎస్‌.టిలకు శిక్షణా తరగతులు క్రమ పద్ధతిని నిర్వహణ బాధ్యత అప్పగించేను. ఐ.ఎ.ఎస్‌. వంటి అఖిల భారత సర్వీస్‌కు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక టైనింగ్‌ సెంటర్‌ నెలకొల్పాలని, ఆ సంస్థకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. ఈ శిక్షణా తరగతులు ్రారంభించడాన్ని ముఖ్యమంత్రిని ఆహ్వానించవలసి ఉంది. ఈ కార్యక్రమం కనీసం వారి దృష్టిలో పెట్టాలి కదా! ఆ బాధ్యత సోషల్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ మీద పెట్టాను. ఆయన జంకిన విషయం తెల్సిన వెంటనే నేనే వెళ్లి ఆ శిక్షణ తరగతులకు ప్రారంభోత్సవం చేశాను. తర్వాత ముఖ్యమంత్రి విషయం (గ్రహించి నాతో ఒకమారు మంచి కార్యక్రమం తీసుకున్నారు అన్నాడు! బాల మురళి ఆంధ్రుల నుంచి తగిన గౌరవం తనకు లభించడం లేదన్న భావనలో ఉన్న బాల మురళీకృష్ణ అడ్డపంచ మానలేదు. ఒకమారు రవీంద్ర భారతిలో జరుగుతున్న బాల మురళి కార్యక్రమానికి గవర్నరూ, ముఖ్యమంత్రి, అన్న మండలీ నేనూ హాజరైనాము. ఆ పాత మధురంగా ఉన్న ఆ సంగీతం, సభికులను ఉర్రూతలూగించింది. కరతాళ ధ్వనులకు 194 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

కొరతలేదు. ముఖ్యమంత్రి జగలం కూడా చప్పట్లు చరుస్తున్నప్పుడు దగ్గరకు వెళ్ళి, వీరిని ఆస్థాన విద్వాంసులుగా వెయ్యాలండీ అన్నాను. ఆ ప్రక్కన ఉన్న విద్యాశాఖ కార్యదర్శి సి.యన్‌.శాస్తి గారి పక్కకు తిరిగి మీరు ఫైల్‌ మూవ్‌ చేస్తే బాగుంటుందన్నాను. సి.ఎం. వింటూ ఉండగా ఆయన సరేనన్నాడు. అన్న కృష్ణారావుతో మాట్లాడి, మీ డిపార్ట్‌మెంట్‌ తరఫున ఫైల్‌ మూవ్‌ చేసి నాకు పంపించమన్నాను. ఇద్దరం సెక్రటరీతో పాటు సంతకాలు చేసి, ముఖ్యమంత్రికి పంపిస్తే “నాట్‌ నౌ” అని వ్రాసి సంతకం పెట్టాడు.

బాల మురళికి అప్పటికి డాక్టరేట్‌ రాలేదు. ఎం.వి.రాజ్‌ గోపాల్‌ గార్ని పిలిచి, బాలమురళికి డాక్టరేట్‌ ఇవ్వాలి అన్నాను. ఇప్పుడు 001౪062601 లేదు కదా? అన్నాడాయన. 501. 00౫౪౦62601 పెడదాం అన్నాను. నేను 2600. 26462101 [41015- 161 గా 4౫౫౮ - 9/0, ౮0100661]07? గా ఉన్నాను. సరే. ఆలోచించి చెప్తానన్నాడు. వారం దినముల అనంతరం, పేర్ల లిస్ట్‌ తీసుకొచ్చాడు. అందులో కె.ఎల్‌ రావు, భాను ప్రసాద్‌, అతా మంగేష్కర్‌, కాకినాడ 5.౫.4.]. ఛైర్మన్‌గా ఉందే నక్కా సూర్యనారాయణ ఇలా పేర్ల పట్టిక చూశాను. 501 60౧౪౦౦1401 అన్నప్పుడు తగిన పెద్దల పేర్లుందాలి కదా అన్నాడు. బాల మురళితో పాటు అన్ని పేర్లూ పెట్టి, ౮౧20661]0% 6079౧౦౯వద్దకు వెళ్ళి ఆమోదం పొందేము. తారీఖు నిర్ణయం అయ్యింది. ముఖ్యమంత్రికి ఎవరు చెప్తారు? అన్నాడు. నేనే యిస్తాను అన్నా ఆ పత్రికలు ఇచ్చిన వెంటనే డ్రాయర్‌లో ఒకమూల భద్రంగా ఉంచేను. 0027061102 అయిపోయింది. సి.ఎం. తర్వాత తెల్సుకున్నాడు? గొప్ప గొప్ప వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి. ఇప్పుదడేమంటాడు? ఒకమారు కలిసినప్పుడు యథాలాపంగా బాలమురళి పట్టు మీరు వదల్లేదు” అన్నాడు సి.ఎం.నాతో “ఆ మంచిపేరు అంతా మీకే దాఖలు పడుతుంది” అన్నాను. “0[0046౯” అన్నాడు. నేను నిషమించేను.

పదవి ఉంటుంది, పోతుంది, ఉన్నప్పుడే చేయగలిగినన్ని మంచి పనులు చేయాలి. అంతకూ పరిస్థితి విషమిస్తే, శాఖమారిపోతుంది. లేదా పదవి ఊడిపోతుంది. అంతేగాని చేసిన మంచి పని ఉండిపోతుంది కదా! మనం ఉంటే ఏంటి? ఊడితే ఏంటి? ఆశయం సిద్ధించాలి, ఆదర్శం నిలవాలి. అదిలేని నాడు పదవులు వ్యర్థం. అధికారం నిరర్ధకం.

౫ 1 ఈ

స్వేచ్చాభారతం 195

ఇళ్లకు కరువా?

ఒకప్పుడు సర్‌ విజయ (విజయనగరం రాజా పినతండ్రి) పార్లమెంటుకు నిలబడ్డాడు. అప్పుడు కలిసి తిరిగే వాళ్ళం. నామీద ్రేమకొద్దీ అడిగాడు. ఇల్లూ వాకిలి లేకుండా ఎలా ఉంటున్నావని. “లంక వీథిలో సంగీత కాలేజీ దగ్గర సింహాచలం మేడ సమీపంలో. ఇల్లు అమ్మేయమని పి.ఎల్స్‌ఎన్‌,రాజుకి చెప్పాను. ఎంతో కొంత ఇచ్చి మీరే తీసుకోండి” అన్నాడు. పి. ఎల్‌.ఎన్‌.రాజుకి కబురు పంపించాడు. చాలా చౌకబేరం తొమ్మిది వేలుకి యిస్తానన్నాడు. 1/4 ఎకరాలో ఉంది. రెండు వారాలు సరే పుచ్చుకుంటానన్నాను. మళ్లీ ఆలోచించాక మా ఆవిడ అంది. “రాజుల సొమ్ము తింటున్నామంటారు. ఇంకోమారు ఆలోచించుకోండి” అని. ఆస్తిపాస్తులు వద్దనుకున్న తరువాత వాళ్ళ యిల్లే కావాలా మనకి? నేనైతే మొగ్గలేదు. వద్దని దండం పెట్టేశాను! ॥

ఆ తర్వాత మళ్లీ విజయనగరంలోనే హెచ్‌. బి.సింగ్‌ ఉండేవాడు. మోటారు పార్టులు అమ్మేవాడు. పి.వి.జి. రాజు తల్లి విద్యావతి పేరున కొన్ని యిళ్లు ఉన్నాయి. మద్రాసులో సింగుకి ఫవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇచ్చింది. అది ఈ సింగ్‌ చేతిలో పడింది నన్ను తిప్పి రెందు మూడిళ్లు చూపెట్టాడు. నేనూ మా ఆవిడ ఆలోచించి మాకు వద్దనుకొన్నాం.

తక్కువ ధరకు వచ్చినా ఆ యిల్లు వదలుకున్నాం.

అతడే మరోమారు నన్ను కలిసి లకవరపుకోటలో ఠాణా కచ్చేరి ఉంది. లంకంత భూమి ఉంది. తీసుకోమన్నాడు. వెంటనే నాకంటికి కోళ్ళ అప్పలనాయుడు కన్పించాడు. ఖాసాపేట నుండి కాలి నడకన లక్‌వరపు కోట వచ్చేవరకూ బస్సు దొరకదు. ఎన్నోమార్లు

వెళ్లానక్కడికి. స్వానుభవం. అందుచేత కోళ్ల అప్పలనాయుడుకి చెప్పాను. అది తీసుకోమన్నాను. ఐదువేలో ఆరువేలో నాకు గుర్తులేదు. వెంటనే కాగితం వ్రాయించి రిజిస్టేషను చేయించాను. అప్పలనాయుడుకి ఇప్పించడం గొప్పేమికాదు. అతనెంతో మంచివాడు మొదటినుండీ నాతో ఉండేవాడు. పరోపకారానికి పెట్టింది పేరు. అదీ నాకు తెలిసిన అప్పలనాయుడు. ఇప్పుడు అతడు బాగా గట్టి పడ్డాడంటారు. పాతకాలం 196 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

మనిషిని! నాటి అప్పలనాయుడినే నాకు తెలుసు. అతని పిల్లా జెల్లా బాగుండాలి. యిదీ ఈ జిల్లాలో నా సంపాదనా వైభవం! హైద్రాబాదులో

హైదరాబాదులో ఒకమారు లా సెక్రటరీ నారాయణస్వామి బ్రహ్మానంద రెడ్డిగారి ఇంట్లో కనబడి తనతో తీసుకువెళ్ళాడు. వాళ్ళ ఆఫీసుకి. ఒక ఫారం మీద సంతకం చేయించాడు. జూన్లీ హిల్సు సొసైటీ... దానికి ఆయన అధ్యక్షుడు. రు. 500లు పంపించమన్నాడు. పక్కాయిల్లు, బ్రహ్మాండంగా కట్టించి మీకు ఇచ్చేస్తాను. మీరు చూసుకో నక్కరలేదు. అన్నీ నేనే చేస్తాను. మీ తరపున. ఆ తర్వాత నేను అతని కంటికి కనబడలేదు. ఆ సొమ్మూ కట్టలేదు. అతని ఫోనుకు జవాబూ చెప్పను. ఆ ఇల్లు వదులుకున్నాను.

తరువాత నన్ను హౌసింగుబోర్డు మెంబరుగా వేశారు బ్రహ్మానందరెడ్డిగారు. సేతు మాధవరావు అని ర్షిటైద్‌ ఛీఫ్‌ ఇంజనీర్‌ ఉండేవాడు. అతడు టంగుటూరి ప్రకాశంపంతులు గారి బంధువు. అతను పదే పదే చెప్పేవాడు. ఇన్నేళ్లయింది హైదరాబాద్‌ వచ్చి? తలదాచుకోదానికి కొంప లేక పోవడమేంటి? నేనిస్తాను మీకు ఇల్లు! మంచిది చూస్తాను! తీసుకోండి అనేవాడు! పదే పదే చెప్పి చూశాడు.

“నేను ఇల్లు సంపాదించుకోవడానికి సభ్యుడిని కాలేదండి ఒకరికి యిప్పించదానికి నేను ఉన్నాను” అన్నాను. అతడన్నాడు “మీ కివ్వడానికి నేను ఉన్నాను?” ఓ మారు కారులో తీసుకువెళ్ళాడు. విజయనగర్‌ కాలనీలో వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు ఇల్లు తీసుకున్నాడు. రాయవరపు మునసబూ తీసుకున్నాడు. మీరెందుకు తీసుకోకూడదు? అన్నాడు. “భగవంతుడు రాసి పెట్టలేదు. నన్నిలాగే ఉండమన్నాడు!” అన్నాను.

ఇంకో సందర్భం వచ్చింది. ఈ మారు గవర్నమెంట్‌లో ముఖ్యమంత్రే స్వయంగా ఇస్తున్నాడు. జలగం వెంగళరావు కేబినెట్‌ సమావేశంలో ఇది జరిగింది. ఎవరికి ఎక్కడ ఇల్లు కావాలో ఎంచుకోమన్నాడు. 04[0£ (౪౫ 2100ల అన్న మండలి కృష్ణారావు సంతకం పెట్టాడు. నేనూ పెట్టాను. గాంధీ భవనం సమీపంలో మొఖరం జాహి మార్కెట్‌ దగ్గర. మా ఆవిడను తీసుకువెళ్ళి చూపించాను. ఎలా కట్టాలో ముందే చూసుకోమన్నాడు. ఆ కాంట్రాక్టరు. “మనకు వైజాగులోనే ఇల్లులేదు. ఇక్కదెందుకండీ” అంది “పదవంటూ ఉంటే వాళ్ళే ఇస్తారు ఇల్లు. పదవి లేకుంటే మనకు ఇక్కడ ఇల్లెందుకు?” అంది. ఈ లాజిక్‌ బాగుంది. సరే! వద్దని వ్రాసి ఇచ్చేశాను. ఆ తరువాత కృష్ణారావు కూడా తప్పుకున్నాడని తెలిసింది. స్వేచ్చభరతం నాం నం 9?

విశాఖపట్నంలో

అప్పుడు టౌను ప్లానింగ్‌ ట్రస్టు ఉండేది. రంగారెడ్డి అనే అధికారి ఉండేవాడు. నాకు బాగా తెలుసు. ఇంటికోసం దరఖాస్తు దాఖలు చెయ్యండి. రు. 500లు. కట్టండి అన్నాడు. నేను కాగితం పెట్టను! డబ్బు కట్టను ఎలా వస్తుంది ఇల్లు హైదరాబాదులో. ఓమారు అందరూ కలిసి కూర్చున్నాం లాన్‌లో. నా ప్రక్కన వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు కూడా ఉన్నాడు. నాకు ఇక్కడ ఇల్లు ఉండాలన్న (ప్రేమతో మిత్రుడు అటుయిటూ తిరుగుతున్నాడు. నేను సంతకం పెట్టనని తెలుసు. కృష్ణమూర్తినాయుడు అతన్ని పిలిచి నాచేత సంతకం చేయించాడు. సంతకం పెడితే ఏం లాభం ? డబ్బు కట్టాలి కదా! ఐదు వందలో ఐదువేలో జ్ఞాపకం లేదు. నాకు చెప్పకుండా అతన్ని బయటకు తీసుకువెళ్ళి ఆ డబ్బు అతని చేతిలో పెట్టాడు. “ఆ రసీదు అమ్మకు యిచ్చేయి సార్‌కు చూపించకు” అన్నాడు. చాలా కాలం నాకు తెలీదు. నేనూ అడగలేదు. ఎంతోకాలం అయిన తరువాత స్పెషలాఫీసరుగా “దిల్‌షుక్‌ రాం” 145 స్వయంగా వచ్చాడు. కొన్నాళ్లు విద్యాశాఖ కార్యదర్శిగా పూర్వం పనిచేశాడు. చాలాకాలం నుండి పెండింగులో ఉండిపోయిన దరఖాస్తులు తీసి లాటరీ వెయ్యమన్నాడు. అందులో నా పేరున సర్ఫ్యూట్‌ హౌస్‌ ప్రక్కన ఉన్న స్థలం.” అది నాదని తెలిసింది. గౌరవార్థం మా ఇంటికి వచ్చి ఉత్తర్వులు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడక్కడ ఇల్లు కట్టాలి. ఇప్పుడొక విషయం చెప్పాలి. డబ్బుకులోటేమిటి?

నేను ప్రజారథం పత్రిక పెట్టానని ముందే చెప్పాను. దానికి తప్పనిసరిగా ప్రెస్‌ అవసరం. అప్పట్లో అనకాపల్లి కొణతాల సుబ్రమణ్యం నాకు చాలా సహాయం చేశాడు. ఎందుకో అతనికి నామీద (ప్రేమ! ఎప్పుడూ కలిసేవాడు. హైదరాబాద్‌లోనూ - విశాఖపట్నంలోను కూడా మంచి సంపన్న కుటుంబీకుడు. అతనికి వాస్తుశాస్త్రం కూడా బాగా తెలుసు. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినట్లే మా ఇంటిముందు చిన్న పిట్టగోడ కట్టించాను. చాలామందిని ప్రజారథం పత్రికకు చందాదారులు చేర్పించాడు. (సబ్బవరంలో జూనియర్‌ కాలేజీకి కూడా నేను అడిగితే వర్తకసంఘం తరఫున పాతికవేలు ఇప్పించాడు)

విశాఖపట్నంలో పోర్టు, బి.హెచ్‌.పి.వి. వగైరావంటి సంస్థలు ఉన్నాయి. వాటి అద్వర్‌్‌టైజ్‌మెంట్లు వచ్చేవి. నేను పెట్టిన డబ్బు దాదాపు నాలుగువేలు ఉంటుంది మొదటి నుంచీ. ఇప్పుదా (ప్రెస్‌ విలువ 50వేల రూపాయిల వరకు ఉంటుంది. నేనేం వ్యాపారం చెయ్యలేదు. నాది కాని డబ్బు నాకెందుకు? అది సమాజానికే చెందాలి. ఆ ఉద్దేశంతో ఉన్నాను. నేను మంత్రి అయ్యాను. ఆ '్రెస్‌ అమ్మిన డబ్బు గాంధీభవన్‌కు ఇస్తానని 198... భాట్టం శ్రీరామమూర్తి (్వీయ చంత్రు

చెప్పాను! ఇంటికి రాగానే మా ఆవిడ చెప్పింది. “ఎవరూ ఇంతకాలం కొనకపోతే వృథాగా ఇంటి అద్దె కట్టుకుంటున్నాం. ప్రెస్‌! పాతికవేలకు అమ్మేశా”నని! అయితే ఆ డబ్బు ఒక చెక్కు వ్రాసి వెంగళరావు మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన చేతిలో పెట్టాను. అప్పుడు మునిసిపల్‌ చైర్మన్‌గా ఉన్న గుడివాడ వెంకటరమణకి అప్పగించాడు. “మనకే ఇల్లు లేదు. చూస్తూ చూస్తూ ఆ దబ్బు ఎవరి చేతిలోనో పోస్తారు. మీ ఉద్దేశాలు ఎంతవరకు వాళ్ళు నెరవేరుస్తారో ఆ దేవుడికి తెలియాలి.” అంది మా ఆవిడ. అతనూ! అంతే చేశాడు. కనీసం ఫిక్సుడు డిపాజిట్‌లోనైనా వెయ్యలేదు ఛైర్మన్‌గా ఉన్న రమణ. స్థలాన్ని కూడా కేటాయించలేదు! ఒకరి చేతిలో పెట్టిన తరువాత నేనెందుకు అడగాలి? అని ఎప్పుడూ అడగలేదు. ఆ డబ్బు కరంటు అకౌంటులో వేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సంగతి గుర్తుకొచ్చింది. అది లక్షా ఏభై తొమ్మిది వేలయింది ఒక లక్షరూపాయలు శాంతి ఆశ్రమానికి ఇచ్చేశాను. ఏభైవేలు గాంధీ కేంద్రం పెడతానంటే కె.సి. శాస్త్రికి ఇచ్చేశాను. మా శిష్యుడు ఒకడు పేదపిల్లలకి తిండిపెట్టి సేవ చేస్తున్నాడని పెదమ్మాయి కరుణ అంటే ఆ తొమ్మిది వేలు అతనికి ఇచ్చేశాను. మొత్తం కాళీ! మళ్లీ పైసా చేతిలో లేదు! నా మొహం! ఇల్లు ఎలా కట్టేది?

మా ఆవిడ ఒక పదివేలు (దాచుకున్నది), మా అల్లుడు ఒక పదివేలు పెట్టాడు. (అప్పుకి). గుమ్మం ఎత్తుతున్నారు. నేను వచ్చాను. గవర్నమెంటు 20,000 లు నాకు బుణం ఇచ్చారు. ఆ డబ్బుతో సర్క్యూట్‌ హౌస్‌ పక్కని ఇల్లు కట్టాము అప్పట్లో సిమ్మెంటు బస్తా ఖరీదు 16 రూపాయలు, స్టీలు 12 వందలు. మేస్త్రికి 8. రూ. ఆడకూలికి 3 మగవారికి 5రూ. కూలీ ఇచ్చేవారం. ఇదిగో ఆ విధంగా ఆ ఇల్లు కట్టి మేం యిద్దరం ఈ మధ్య మా పెద్దమ్మాయికి ఇచ్చేశాం. మేం కొన్నప్పుడు గజం 50 రూ. ఇప్పుడు అక్కడ గజం 45 వేల రూపాయిలు. ధరలు మండిపోతున్నాయి. మేం మాత్రం అన్నీ అందరికీ ఇచ్చేసి హాయిగా ఉన్నాం.

పుట్టినరోజులు పండగల్లేవు. అదృష్టం. అబ్బాయి మంచివాడు. మంచి చెడ్డలన్నీ అతడే చూసుకుంటాడు. మా పెద్దమ్మాయి కూడా అంతే. మా చిన్నమ్మాయి కూడా ఏమీ అడగదు! పండగలకు పిలవం. వాళ్ళే ఏదో తీసుకువచ్చి మాకు ఇస్తారు. పండగలకి కొత్త బట్టలు పెట్టడం మాకు అలవాటు లేదు. వాళ్ళు ఇచ్చింది మేము పుచ్చుకునే వాళ్లం. తరువాత మరి ఇవ్వవద్దన్నాం. నావయస్సు 50. తరువాత 60 వచ్చినప్పుడు కూడా ఏఏ కార్యక్రమాలు చేసుకోలేదు. అలాగే 70 ఏళ్లు, 80 ఏళ్లు పూర్తి అయినప్పుడు కూడా ఏ సంబరం చేసుకోలేదు. స్వేచ్చ్బాభారతం 199

షష్టిపూర్తి కూడా ఎంతో గొప్పగా చేసుకుంటారు. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. హిమాలయాలకు వెళ్ళిపోనాలనుకున్నాను. తర్వాత బుపీకేశ్‌ శివానంద ఆ(శమానికీ వెళ్ళాను. ముడుకుల నొప్పి మా ఆవిడ రాలేక పోయింది. షష్టిపూర్తికి నేను బువీకేళ్‌లో కూ అవిడ ఢిల్లీలో ఒడ అమ్మాయి హైదరాబాద్‌లో! తక్కిన ఇద్దరూ వైజాగ్‌లో ఉన్నారు. మాకు వివాహం అయి 60 ఏళ్లు అయినప్పుడు కొందరు మిత్రులని పిలిచాను. వారితో సరదాగా గడిపాం. 83వ ఏట సహస్రచంద్ర దర్శనం మాత్రం మాపేల్లలంతా కలిసి ఘనంగా చేశారు. దీనికీ అన్న కృష్ణారావు కొడుకు మందలి బుద్ధప్రసాద్‌ వైభవోపేతంగా దగగ్గర ఉండి జరిపించారు. యిదీ మా జీవన విధానం. చిన్నప్పుడు బంగారం కూడా పెట్టుకోలేదు. చెవులకు, ముక్ళుకి కూడా ఎప్పుడూ ఏవీ ఎవరూ పెట్టుకోలేదు, మా జీవిత విధానమే పిల్లలకి అలవడింది. మా చిన్నలుడికి, పేద్దల్లుడికి కూడా కానీ కట్నం ఇవ్వలేదు. పిల్లల పెళ్లిళ్లు ఘనంగా జరిగాయి. అబ్బాయి ఇల్లు కొనడం . కెజి.హెచ్‌. దౌన్‌లో మేం అద్దెకున్న ఇంటి యజమాని సుబ్బారావుగారు ఏదో పని ఎదో సమస్య అంటూ వచ్చేవాడు. నేను సంబధిత అధికారికి ఫోన్‌ చేసే వాడిని ఆ పని నుకూలం అయ్యేదిట, ఆయనకు ప్రత్యేకించి నేను చేసేదేమీలేదు. ఇది నాపనితీరు. నా అచివొటు., నామీద ఆయనకు (ప్రేమ సెరిగింది. మీరు ఉన్న ఇల్లు పక్కన ఖాళీజాగా అంబ ః. య. ఆయనకుండేది. అ మాట ఎన్నో మారులు చెప్పేవాడు. నేను పట్టించుకోలేదు. ఇ శ్రే నుడి జంద న పట్టను మిగతా ఇళ్ళసీ ఒకటీ ఒకటీ అమ్మసేరు. వ న హు రాబా ర్స ష్‌ క్షీ చెప్పేవాడు. ఊరువదిలే స్థిరపడాలని నేను వినకపోయినా ఇల్లాలికి పిల్లలం కూర్చున్నాడు న ముందు. ఆ ఇల్లు నాకు అతడు ఐడి చేయాలని పట్టుల్ట ఆస్తిపాస్తుల పట్ట నాక్తున భగనంకుడు ఆయనకు ఎంత మంచిబుద్ధి పుట్టి గ పెద్దయిన పిల్లలతో ప్రదే స్ట లత చూసి విసిగిపోయేడు. ఇంటి ఇల్లాలితో పి దే ఎబ్లలఈ పది ప చెపే ల గౌరికి తెలియటంలేదు. నే వనాని. ఎంత మొత్తుకున్నా ఈ స్థలం విలున శ్రీరామమ్మ అజాాయి వై - నేను చేస్తున్న సహాయం కూడా గుర్తించటం లేదు. పేద్దవొటే ప ఎల్లల బ్రతుకు భద్రత కూడా పట్టకపోతే ఎలా. మీరున్న ఇలేకొదు అవతేల వక్క దడ్రైణాన ఉన్న ఖాళ్లీస క్‌ " గా ళ్‌ ఇవ్వండి. ఎంత సామ బ్‌ లం కూడా రాసి ఇచ్చేస్తానన్నాడు. మీ చిత్తం వచ్చిన / జంట అంత ముందు చెల్లించి ప్రోనోటు రాసి ఇవ్వండి అన్నాగా" న నాం త భొట్టం శ్రీరామమూర్తి (స్వీయ చిన

అబ్బాయి డాక్టరు విద్యాసాగరు ముందకు వచ్చేడు. సమర్భుడు, సంపాదకుడు కూడా. వాడు కొనుక్కుంటానంటే మీరు అద్దుపెట్టడం బాగులేదంది మా ఆవిడ. మనం ఆస్తిపాస్తులు సంపాదించుకోవటానికి పెంచుకోడానికి పుట్టేమా అని అడిగేను. సరే ఉన్న ఇల్లు తీసుకుని సంతృప్తిపడు. ఆ ఖాళీజాగా మనకెందుకు అన్నాను. ఆ విధంగా కె.జి.హెచ్‌. డౌన్‌లో ఇల్లు అబ్బాయి విద్యాసాగరు కొనుక్కున్నాడు. దానిని అనుకుని ఉన్న మిగతా ఖాలీ జాగా అమెరికాలోనున్న అల్లుడిపేరు రాసేసేడు సుబ్బారావు పంతులు.

అబ్బాయికి తలదాచుకొనే కొంప దొరికింది. ఆ ఇల్లు అభివృద్ధికి సొంత భూములు 25 ఎకరాల అమ్మి వాళ్ల అమ్మ కొంతసాయం చేసింది. నేనూ కొంత సాయపడ్డాను. భగవాన్‌ బాబావారి దివ్యానుగ్రహం వల్ల విద్యాసాగర్‌కు ఈ స్వగృహపునర్చిర్మాణం ప్రాప్తించింది. ఈ వార్ధక్యంలో వాడే మాకు పెద్ద దిక్కు నేను నా భార్య వాడి రక్షణలోనే ఉన్నాం. నాకు 84 నడుస్తోంది. అలాగే నా భార్యకు 82 దీర్హ జీవనం కాదు. దివ్య జీవనం కావాలి అన్నాడు సాయి రాముడు. అలాగే దైవ చింతనలో రోజులు గడుపుతున్నాం.

శ 4 ఈ

క... స్వేచ్భాభారతం 201

వివాహ వైభోగాలు మంత్రి కొడుకు పెళ్లికి ఆహ్వాన పత్రికల్లేవు! మా పెద్దమ్మాయి కరుణ పెళ్లి 69లో జరిగింది. (67లో ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం) బియ్యం బస్తాలు ఎన్నో వచ్చిపడ్డాయి. ఉప్పు వంట చెజకు చెప్పనక్కరలేదు. బెల్లం, చింతపండు, నూనె డబ్బాలు, కాయగూరలతో గదులు నిండిపోయాయి. కిళింబి రంగాచారిగారి ఇంట్లో పెళ్లి జరిగింది. అది చాలా పెద్ద బంగళా మగపెళ్లి వారిలాగే మమ్మల్ని వచ్చి కూర్చోమన్నారు. కార్యకర్తలు, మా ఆవిడా, వాళ్లు వైజాగు నుండి వచ్చారు. వాళ్లను ఇందులో కలుగుజేసుకోవద్దన్నారు. వందలు వేలమంది జనం. అందరికీ పసందైన విందుభోజనాలు కట్నాలు - కానుకలు చదివించినవాళ్లున్నారు. ఆ మొత్తం అంతా పెద్దల దగ్గర పెట్టాం. వివాహవేదుకలు అయిన తరువాత మేం వైజాగ్‌ వెళ్లకుండా రెండురోజులు విజయనగరంలో ఉన్నాం. మరి మా భోజనం మాట మాకో నాలుగుశేర్లు బియ్యం కొనుక్కున్నాం. బొంకుల దిబ్బనుంచి కూరగాయలు తెప్పించి. మా ఆవిడ మాకూ అన్నం పెట్టింది. పెళ్లిజరిగిన మేడలో గదులు నిండా ఉన్న బియ్యం వగైరా అన్నీ పేదలకు పంచేయమన్నాం. మనది కానిది, మనం అనుభవించడానికి వీలులేదు. సమాజానికే చెందాలి, నరాలశెట్టి ప్రకాశరావు, పన్నీరు గోపాలం, చింతపల్లి నారాయణ, కొణతాల అప్పారావు, బూరగరికయ్య, కాళ్ల పైడయ్య, చింతపల్లి ముత్యాలు ఇలా ఎందరో! అందరూ కలిసి పేదలకు పంచారు. వారం రోజులు పంపకం జరిగింది. వంట చెరకు మాత్రం (సేమ సమాజానికి బళ్లమీద పంపించారు. మేము చేతులు దులుపుకుని విశాఖపట్నం చేరుకున్నాం. జీవితం ఇలాగడుపుతూ వచ్చాం. భగవంతుడు పిల్లలెవరికీ వలోటూ చెయ్యలేదు! చిన్నమ్మాయి లలిత వివాహం విషయంలో నేను మా ఆవిడ చాలా తర్జన భర్దన పడ్డాం. మా వెనుక వీథి కళ్యాణ మండపం. ప్రక్కనే అద్దెకు ఉన్న తెన్నేటివారి కుటుంబంతో 202 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

సంబంధం కలుపుకోవాలి. మా అమ్మాయి లలితతో చదువుకున్న రేణుక అన్నయ్య గోపీనాథరావుకు ఇచ్చిపెండ్లి చేయాలని మా ఆవిడ సంకల్పం. అతడు కోరమండల్‌ ఫెర్టిలెజరులో గుమస్తా చేస్తున్నాడు.

అది 1988 వ సంవత్సరం నేను పదవిలో ఉన్నప్పుడు ఏ ఆడపిల్లకీ పెండ్లి చేయలేదు. పెండ్లికి, పదవికి లింకు హోదా ఉంటుంది. సంచులు గళగళ మంటాయి. మల్లెంపూడి పళ్లం రాజుగారి విషయంలో ఆయన మంత్రి చేస్తున్నాడు. పి.సి.సి. అధ్యక్షుడయ్యాడు. ఆ పదవి పుచ్చుకొనే ముందు కుమారుని వివాహం నిశ్చితం అయింది. ఆర్‌.టి.సి.లో పెద్ద అధికారి ముఖ్యమంత్రిని టైం అడిగాడు. పెళ్ళి పూర్తి చేసిన తరువాత గాంధీ భవన్‌లోకి వెళ్ళాడు. ఎన్నో సంఘటనలు నాకు తెలుసు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం. పదవుల (ప్రభ వెలిగిస్తూ వీవాహ వైభవాలు జరిపించడం.

1967లో నా ఎమ్‌.ఎల్‌.ఏ గిరి పోయిన తర్వాత పెద్దమ్మాయి పెండ్లి చేశాను. 1988లో ఎన్‌.టి.ఆర్‌ ప్రభంజనంలో పరవాడ సీటు పోయాక చిన్నమ్మాయి పెండ్లి ముహూర్తం నిశ్చయమయింది. 1983కు ముందు ఎన్నో సంవత్సరాలు అధికార బాధ్యతలు నిర్వహించాను. ఉన్నత పదవిలో ఉండి కీర్తి ప్రతిష్టలార్జించి ఇప్పుడు అమ్మాయిని చూస్తూ చూస్తూ గుమస్తా, చేతిలో పెట్టాలి! వాళ్లకి వేరే ఆస్తిపాస్తులు కూడా లేవు. బంగారపు పళ్లెంలో పెట్టి పెంచిన పిల్లని దినదిన భత్యంగా బతుకుతున్న కొంపలో చేర్చాలి! ఎందుకో నా మనస్సు వెనక్కు లాగుతోంది! అప్పుడు మా ఆవిడ విజ్బంభించింది. తన వివేక విజ్ఞానాలు ప్రదర్శించింది. నీతిబోధకు ఉపక్రమించింది. ఒకప్పుడు శిక్షణ శిబిరంలో దా॥ లోహియా చెప్పిన మాటలు నాకు ఎత్తి చూపించింది. “మనకన్నా ఉన్నతంగా ఉన్న వారితో సమానం కాదు. తక్కువ స్థాయిలో ఉన్న వారితో సమానంగా ఉంటేనే, సోషలిస్టు అనిపించుకొనే తాహతు మీకు ఉంటుంది.” అన్న మాటలు ఆమె ఉంటంకించింది.

“మన కున్నదేమిటి? వాళ్లకు భగవంతుడివ్వకపోడా? కాలం కర్మం కలిసివస్తే. బళ్లు ఓడలవుతున్నాయి. అమ్మాయిలలిత సుగుణాల రాశి, సుందర విగ్రహం, నమత విధేయత ఉట్టిపడుతూ ఉంటుంది. కుందనపు బొమ్మ. అల్లారుముద్దుగా పెరిగింది. వాళ్ళే వెయ్యికళ్ళు పెట్టుకొని చూసుకొంటారు. భగవదేచ్చ ఎలా ఉంటుందో. అబ్బాయికి వచ్చిన లోటు ఏమిటి? బంగారంలా ఉన్నాడు. బుద్ధిమంతుడు. పోస్టు (గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పుచ్చుకున్నాడు. అదృష్టం కలిసొస్తే పెద్ద పదవులెన్నో నిర్వహించే నైపుణ్యం ఉంది. ఆతి శాంతుడు. ప్రపంచం పోకడలు తెలిసినవాడు. కన్ను ముక్కు తీరు బాగున్న పొరుగింటి బిడ్డడు. అన్ని విధాలా ఈడూజోడూ కుదురుతుంది. అన్యోన్యదాంపత్యం పెళ్లి వేయి స్వేచ్చాభారతం 203

జన్మల పంట అంటారు. పూర్వజన్మలోనో పరస్పరం ఒడంబడిక చేసుకొని ఒకరికోసం ఒకరు పుట్టినట్టున్నారు. హాయిగా సుఖశాంతులతో జీవిస్తున్నారు. ఒప్పుకోడం మంచిది” అంది. నా భార్య మాటనేనెప్పుడు కాదన్నాను? ప్రహ్హాదకళ్యాణ మండపంలో పెళ్ళి! నాటికి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా ఉన్న ద్రోణంరాజు కార్యక్రమాలన్నిటికి బాధ్యత తీసుకున్నాడు. అర్ధరాత్రి దాటాక పెళ్ళి. ప్రముఖులందరూ హాజరు అయ్యారు. ప్రముఖ సినీనటి జమున వచ్చింది. నాటక కళారంగ సామ్రాట్టు పీసపాటి వచ్చాడు. రాజకీయ ధురంధరుడు జనార్ధనరెడ్డి. ప్రముఖపారిశ్రామికవేత్త ఎమ్‌.వి.ఎస్‌. మూర్తి ఎందరెందరో విచ్చేసారు. వివాహం ఎంతో వేడుకగా జరిగింది. ఇప్పుడు చూడండి ఇంకో తమాషా తెన్నేటివారు అ తరువాత రోజుల్లో వాళ్ళమ్మాయి రేణుకని ఒక ఇంజనీరుకి ఇచ్చి పెండ్షిచేశారు. అతడు పెద్దఇంజనీరు ఇంటి నిండా నౌకర్లూ చాకర్లూ. దిన దిన ప్రవర్ధమానంగా ఉన్నారు. ఆహ్వాన పత్రిక లేకుండా మంత్రికుమారుడి పెళ్ళి మా అబ్బాయిది నాతంతే. ఎమ్‌.బి. బి.ఎస్‌ పాసయ్యాడు. కట్నాలు కానుకలు ఇచ్చి పుచ్చుకోడాలు ఏమీ ఉండవు. ఇది అబ్బాయికి నిషేధం. పెళ్ళి ఆడపిల్లవారు చేస్తారు. ఆహ్వానితులు అంతా పాతికమంది కన్నా ఎక్కువ ఉండకూడదు. విశేషంగా డబ్బు కుమ్మరించి, తాళమేళాలతో వైభవోపేతంగా చేయడం అబ్బాయికి ఇష్టం ఉండదు. ఆడపెండ్లివారికి అనుకూలమైన నిర్ణయాలే ఇవి. వాళ్లూ ఒప్పుకున్నారు. మరి మేమెంత మందిని పిలవాలి? మంత్రి పదవిలో ఉన్నాను. పిలవాలంటే. లోకమంతా మనవాళ్లే, కాదంటే మాకు మేమే చుట్టాలా? పక్కాలా! కాబట్టి ఆహ్వానపత్రిక వెయ్యలేదు. రెండు కార్లతో వెళ్ళాం పార్వతీపురం ముందుసీట్లో డ్రైవరు గన్‌మన్‌ బంట్రోతు ఉంటారు. మా ఆఖరి అక్కయ్య మాత్రం వధువును తోడ్మొని రావడానికి ఒకసీటు ఖాళీ ఉం చుకున్నాం. తిరుగు ప్రయాణంలో ముందు సింహాచలంలో దిగాం. మేము వేరే గదిలో ఉన్నాం. వధూవరులకు (ప్రత్యేక గది ఏర్పాటైంది. అదే శోభనం గది, మూడు రాత్రుళ్లూ గడిచాక వైజాగ్‌ చేరుకున్నాం. విజయనగరం కార్యకర్తలు మాత్రం గొడవ పెట్టారు. పెద్దమ్మాయి పెళ్ళి ఘనంగా చేశాం. అబ్బాయి పెండ్లికి యేమైనా లోపం చేస్తామా? అంటూ తిరగబడ్డారు. కానుకులవారి సత్రంలో కార్యకర్తలు ఆధ్వర్యంలో రిసెప్షన్‌ ఏర్పాటయింది. దానికి మాత్రం ఒక అరచేయంత ఆహ్వానపత్రిక అచ్చువేశాం పెళ్ళి జరిగినట్లు! అందరికీ తెలియాలి కదా. నాడు పార్వతీ 204 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

పురంలో జరిగిన వివాహ మహోత్సవానికి నేడు విజయనగరంలో జరుగుతున్న రిసెష్టన్‌ అయినా ఇతర పట్టణాలనుండి ప్రముఖులెవరొన్తారు? మంత్రి వర్యులెంత మంది వస్తారు. న్థానికులు మాత్రం వేలాదిగా విచ్చేశారు. నేరెళ్ళ వేణుమాధవ్‌ మిమిక్రీ ఏర్పాటు అయింది. అందరినీ ఉర్రూతలూగించేశాడు. ఘనంగా (బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగిందన్నమాట. ఆ ఘనత విజయనగరం కార్యకర్తలకు దక్కింది. వధూవరులు అశేషమైన ప్రజానీకం ఆశీర్వాద పరంపరలందుకున్నారు. స స ఈఓ స్వేచ్భాభారతం 205

పె.వి. సుపరిపాలన - ప్రత్యేక రాష్ర్ట్రోద్యమం పి.వి. హయాంలో అత్యధిక ప్రాధాన్యత లభించింది నాకు. అందరి (ప్రేమాభిమానాలు అమృత ర్సురీలా ప్రవహించేవి. పూర్వస్నేహానుబంధాలు (్రేమానురాగాలు మరింత పెరిగి పెనవేసుకున్నాయే తప్ప తరగలేదు. విరగలేదు. తన కేబినెట్‌లో నన్ను సహాయమంత్రిగా చేర్చుకున్న రోజే పి.వి. నాతో విడిగా ముచ్చటిస్తూ తన కేబినెట్‌ నిర్మాణం గురించి (ప్రస్తావించాడు. “కాబినెట్‌లో ఒక బ్రాహ్మడుకే స్థానం దొరకడం గొప్ప. ఇద్దరికి స్థానం లభించడం దుర్లభం. అలాంటిది, ఇప్పుడు నాతో కలిసి ముగ్గురం అవుతున్నాం. నా కన్నా పెద్దాయన అయ్యవారు (హయగ్రీవాచారి. ఆయనకు ముఖ్యమైన పంచాయితీరాజ్‌ శాఖ ఇచ్చాను. మరి మీకు పెద్దశాఖ కట్టబెడితే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. పేరుకు సెకండరీ విద్య అన్నా మీ బిరుదు మాత్రం విద్యా సాంస్కృతిక శాఖామాత్యులు అని ఉంటుంది. కాలేజీ విద్య కూడా మీకే కట్టబెడితే ఎవరికైనా కన్నుకుడుతుంది. కాలేజీ విద్య పేరుకు నా దగ్గర పెట్టుకుంటాను. ఇంకొక ముఖ్య కారణం కూడా ఉంది. తెలుగు అకాడమీ నా సృష్టి. తెలుగుభాష అధికార భాష కాలేజీ విశ్వవిద్యాలయాల భాషగా రాణించాలి ఒకనాటికి. అందుకోసం తెలుగు అకాడమీని పరిపుష్టం చెయ్యాలి. మీకు ఏలోటు చెయ్యలేదు. స్వతంత్ర సంగ్రామ చరిత్ర, గ్రంథాలయ సంస్థలు, మ్యూజిక్‌ కాలేజీలు సాంస్కృతిక కార్యకలాపాలు ఎన్నో మీ క్రిందకు వస్తాయి”. “యింత విడమర్చి చెప్పాలా మీరేది ఇస్తే అది. మీరేది చెప్తే అది. మాట పడకుండా మీ మనసుకు నచ్చుకున్నట్లు మీకీర్తి ఇనుమడించేటట్లు చేయడమే నా ధ్యేయం” అన్నాను. అంతా శుభారంభమే. నాటి నుండి వంచిన బుర్ర ఎత్తలేదు. చదవడం, వ్రాయడం అవసరమైతే మాట్లాడడం. ప్రాణంపెట్టి ఈ శాఖ ప్రతిష్ట పెంచాలనుకున్నాను. ఇది నా పరమ ధ్యేయం అయింది. కౌన్సిల్లో ప్రశ్నలు నాకే హైదరాబాద్‌ పెద్దల అలవాట్లనుకుంటాను. అర్ధరాత్రివరకు కబుర్లు పిచ్చాపాటి మధ్యే మధ్యే పానీయంగా... రాష్ట్ర దేశ రాజకీయాలు ప్రస్తుత పరిస్థితులు చర్చల్లో చోటు 206 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్ర

చేసుకుంటాయి. వినతిపత్రాలు, స్తోత్రపాఠాలు యథావిధిగా ఉంటాయి. ఫైళ్ళు గుట్టలు గుట్టలుగా పడిఉంటాయి. అసెంబ్లీ, లెజిస్లేటివ్‌ కౌన్సిలు సమావేశాలు ఏకకాలంలో జరుగుతున్నా ఇదే తంతు. బుద్ధి పుడితే, ఓపిక ఉంటే ఫైళ్ళు కొన్ని విప్పి చూడడం లేదా కౌన్సిలుకు సంబంధించిన వన్నీ మా ఇంటికి పంపించేయడం. ఇదీ సామాన్యంగా ముఖ్యమంత్రిగారు నాపట్ల ప్రదర్శించిన ప్రగాఢ విశ్వాసానికి తార్కాణం. ప్రతిదినం ఉదయం స్నానానంతరం ఆఫీసు గదిలోకి తొంగిచూస్తే కౌన్సిలుకు (క్వొళ్చెన్లు)ు సమాధానం చెప్పాల్సినవి. ఆ ఫైళ్లు నేను చదివి, సమగ్రంగా అవగాహన చేసుకోకముందే సంబంధిత ఆఫీసర్లు వచ్చేవారు. పూర్తి వృత్తాంతం చెప్పేవారు. సందేహాలకు సమాధానాలు దొరికేవి. అక్కడినుండి ఉరుకులు పరుగులు. కౌన్సిలుకు హాజరవడం.

ఒక్క విద్యాశాఖకు సంబంధించినవే కాదు. ముఖ్యమంత్రి నిర్వహించే సమస్త శాఖల (ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సంసిద్ధంగా ఉండాలి. కొత్తగా ప్రవేశపెట్టివలసిన బిల్లులుండేవి. శాంతి భద్రతల సమస్యల నుండి భూసంస్కరణల వరకు అన్ని రకాల సైళ్ళు ఉందేవి. శాసన మండలిలో ఉద్దండపిండాలు ఉండేవారు. జూపూడి యజ్ఞానారాయణ,. డి.సూర్యప్రకాశరెడ్డి, వి.రామారావు, ఎస్‌.టి.పి.వి. కూర్మాచార్యులు, వి.పి.రాఘవాచార్యులు, కొల్లూరు కోటేశ్వరరావు, ఎస్‌. రామకృష్ణయ్య, ఇటువంటి ఉద్దండులు పుంభానుపుంఖంగా ప్రశ్నల పరంపరలు, వాగ్బాణాలు. వదిలేవారు. అప్పటికి కె.రోశయ్య అప్పుడే ఎమ్‌.ఎల్‌.సి.గా ఎన్నిక అయి ప్రతిపక్ష బెంచీలో కూర్చొని ప్రశ్నలు గుప్పించేవాడు.

తెలుగు కన్నడభాషల లిపి ఏకీకరణ. మరుసటి రోజు, సమస్యలు గూర్చి ముఖ్యమంత్రి తరఫున వివదించవలసి వచ్చేది. సభాహక్కుల ఉల్లంఘన పై చర్చ, హరిజనులపై దురంతాలు, నిడుబ్రోలు కాలేజీలో లెక్చరర్ల తొలగింపు, ప్రయివేటు కాలేజీలకు ఆర్థిక సహాయం, ప్రభుత్వం అందజేయడంలో జాప్యం, తాడిగడపలో బోటు ప్రమాదం. భూ సంస్కరణల చట్టం. ఆంధ్రప్రదేశ్‌ కౌలుదారీ రైతుల రక్షణ బిల్లు, వ్యవసాయ భూముల గరిష్టపరిమితి నిర్ణయించే చట్టం. బెల్లం మీద అమ్మకం పన్ను ఆంధ్రప్రదేశ్‌, సంగీత నాటక అకాడమీ పునర్నిర్మాణము వంటి అనేక అంశాలపై ప్రసంగాలు చెయ్యపలసి వచ్చేది. సంధించిన (ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసి వచ్చేది. వాడిగా వేడిగా జరిగే గంట ప్రశ్చల సమయం పరీక్షా సమయమే.' ముఖ్యంగా అయ్యవార్ల సమస్యలు ఎదుర్కోవడం బహుకష్టం. భుజంగరావు, కొల్లూరు కోటేశ్వరరావు, రాఘవాచార్యులు వంటి పెద్దలకు అన్ని జి.ఓలు కంఠోపాఠమే. సులువుదొరికితే. నిమిషంలో నిలదీసేవారు. అప్పుడే ఇండిపెండెంటుగా స్వేచ్చభరతం 207

గెల్చిన రోశయ్య కౌన్సిలులో ప్రవేశించి ప్రశ్చలమీద కసరత్తు చేసేవాడు. ఉపాధ్యాయుల కోసమే పుట్టిందా లెజిస్లేటివ్‌ కౌన్సిలు అన్నట్లు సింహభాగం ప్రశ్నల వాద వివాదమే. జవాబు చెప్పడమే కాదు. సమాధానాలతో వారిని సంతృప్తి కల్గించాలి. లేదా రెచ్చిపోయే వారు. మొత్తం ప్రతిపక్షం అంతా నిలబడి పోరాడ్డానికి తయారయ్యేవారు. సవాళ్ళు ఉంటేనే శక్తి సామర్భాలు బయటపడతాయి. నిలదీస్తేనే నిగ్గు తేలుతుంది. అడగటం తేలిక. చెప్పడం కష్టం. విషయసేకరణ, పరిస్థితుల పరిశీలన, పరిశోధన, ప్రతీ అంశం పట్ల విజ్ఞతతో విచక్షణతో ధీటుగా జవాబులు చెప్పడంలో నైపుణ్యం ప్రదర్శించాలి. అన్ని శాఖల మూలాల్లోకి వెళ్ళి చదువుకొని రావడం. చదవకుండా జవాబు చెప్పదం కొట్టిన పిండి అయ్యింది. పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వ యంత్రాగాన్ని పాలకపక్షం దుర్వినియోగం చేస్తోందనే అభియోగంతో ముఖ్యమంత్రి మీద సభాహక్కుల ఉల్లంఘన చర్చకు వచ్చింది. పోలీసు శాఖ పంపిన వైర్‌లెస్‌ మెసేజ్‌ కాపీ ప్రతిపక్షం చేతిలో పడింది. కాంగ్రెస్‌ ఎన్నికలు జరుగుతున్న సమయమది. కాంగ్రెస్‌, శాసనసభ్యులకు ముఖ్యమంత్రి పంపించిన తాఖీదది. మొదటిమారు ముఖ్యమంత్రి నోటీసు కావాలని కోరారు. మళ్లీ జవాబు చెప్పవలసిన రోజున ఇంకా సమాచారం సేకరిస్తున్నామని ముఖ్యమంత్రి జవాబు చెబితే సభ్యులు మండిపడ్డారు. మూడవదఫాఫైలు నాకువచ్చింది. 916236 25% [07 [1006 అని వ్రాసి పెట్టి ఉంది. ఇంకా జాగు చేస్తే ఊరుకుంటారా? విరుచుకుపడిపోతారు! టాప్‌ లేచిపోతుంది! నేను సమాధానం చెప్పడానికి సిద్ధపడుతూ ఉంటే హయగ్రీవాచారి నా దగ్గరకువచ్చి “మీరు జవాబు చెప్పవద్దు. సి.ఎమ్‌. వ్రాసి పెట్టారు కదా? నాకూ చెప్పారు. భాట్టం తొందర పడకుండా చూడమని, మీరు జవాబు చెప్పద్దు ఆగండి” అన్నాడు. నేను విన్సించుకోలేదు. ప్రశ్నలకు ఉపప్రశ్నలకు అన్నిటికీ జవాబు చెప్పాను. సభ్యులు శాంతించారు. అధ్యక్షుల వారు తదుపరి అంశాన్ని చేపట్టారు. పి.వి, ప్రభుత్వంలో సాగివారికి స్థానం 1971వ సంవత్సరంలో పి.వి. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తరువాత మంత్రివర్గంలో స్థానం కోసం తల్లక్రిందుల తపస్సు చేస్తున్న పెద్దలు మాకంటపడేవారు. విశాఖజిల్లా ఆ ప్రత్యేకత సంతరించుకున్న సాగి ప్రభువుల సన్నాహాలు వారి సమూహాల ప్రయత్నాలు పన్నాగాలు గురించి తెలుసుకుందాం. జిల్లా నుండి కోళ్లు గొట్టెలు వగైరా తెప్పించుకొని. వాటిని వారి మద్దతుదారులకు మేపుతూ హైదరాబాద్‌లోనే తిష్టవేశారు. పొట్టనింపినా పొట్టకొట్టినా వారికి వారే సాటి. మేటి మరెవ్వరూ లేరు. బలప్రదర్శనకు తెచ్చిన మద్దతు దారులను బంధిలదొడ్లో పడేసినట్లు పదేసి ఒక కాపలా దారుని పెట్టి ఒక కన్ను వేసి 208... భాట్టం శ్రీరామమూర్తి థ్వీయ చంత్రు

కనిపెట్టమనేవారు. నిత్యకృత్యాలకు కూడా అనుమతి పొందకుండా గేటు దాటడానికి వీలులేదు. వాళ్ళను చూస్తే జాలేస్తుంది. అందితే జుట్టు . అందకపోతే కాళ్లు. ఏది పట్టుకున్నా పట్టుసాధించడంలో మొగాళ్ళకు మొనగాళ్లు. మీసాల ప్రభువులు ఎలా చిక్కాడో తెలీదు. ఎస్‌.ఆర్‌.ఏ.ఎస్‌. అప్పలనాయుడితో మంతనాలు పూర్తి చేసుకున్నాడు అతడు. సంధానకర్త. నన్ను గల్లీలోకి దింపాలి. రాజుల కొమ్ముకాయాలి. అప్పుడే రాజులకు మంచిరోజులొస్తాయి. అప్పలనాయుడు వచ్చి విషయాలన్నీ చెప్పాడు. నా సహాయం లేకుండా వారు గట్టెక్కలేరట. వారి అభ్యర్థనను మన్నించి సహాయపదాలట. అందుకు మా ఇంటికి వస్తారట. అన్నాడు అప్పలనాయుడు.

మా గుమ్మం తొక్కడం, నా గెడ్డం పట్టుకోవడం నాకు ఇష్టం లేదు. సహాయం అర్ధించిన శత్రువుకైనా సహాయపడడం ధర్మంగా పెట్టుకున్న మనిషిని నేను. అందులోను. అప్పలనాయుడు లాంటి ఆప్తమిత్రుడు రాయబారాన్ని త్రోసిరాజనడం ఎలాగ?

అప్పలనాయుడూ “ఒక్కటి ఆలోచించు ముందుంది ముసళ్ళ పండగ. 1972 లో ఎన్నికలు జరగనున్నాయి. మంత్రిపదవి ఇప్పించడం అంటే వాళ్ళ చేతిలో పదునైన కత్తి పెట్టడం అన్నమాట. అదే కత్తితో నిర్దాక్షిణ్యంగా మన పీకలు పరపరా కోసేస్తే మనగతేం కాను? అప్పుడెవరితో చెప్పుకోగలం? తల్లితోదు! అమ్మతోడు! భూదేవితోడు! అని ఒట్లుపెడుతున్నారన్నారు!” అన్నాడు అప్పలనాయుడు. ఆ ఒట్లుమీదకన్న మనమీద మనం నమ్మకం పెట్టుకోవడం మంచిది అనుకున్నాను. మన కుత్తుక ఉత్తరించాలని ఎంత మంది పెద్దలు పూర్వం కుయుక్తులు పన్నలేదు. వారు మనల్నేమి చెయ్యగలిగారు. పోయేరోజొస్తే ఎలాగూ పోతాం. ఎలాగూ ఆపలేం. లేదంటే కొండొచ్చి మీదను పడుతుందన్నా. గుండె ధైర్యం ఉంటే అది మనలను తప్పించి ప్రక్కన పడుతుంది. శివుదాజ్ఞ లేకుండా చీమకూడా కుట్టుదు.

ఢిల్లీలో ఉన్న పి.విని కలవడానికి విమానం టిక్కెట్టు సిద్ధంగా ఉందన్నారు పెద్ద మీసాల ప్రభువులు “ఆశ్రమ మీకొద్దు. ఎ.ఐ.సి.సి. మీటింగుకు వెళ్ళడానికి - టిక్కెట్టు కొనుక్కున్నాను పి.సి.సి వారి సౌజన్యంతో (అప్పుడు నేను పి.సి.సి. సెక్రటరీగా ఉండేవాడ్ని) ఢిల్లీ వెళ్ళి పి.విగారితో తప్పకమాట్లాడుతానని చెప్పాను. నేను చెప్పిందే చేస్తాను. ఒకటి చెప్పి ఇంకొకటికి చెయ్యను. ఈ నమ్మకం రాజులకి ఉంది. కర్ణాకర్టీగా ఈ వార్త మంత్రివర్యులు అక్కిరాజు వాసుదేవరావుగార్కి చేరింది. వారు పి.విగార్మి అత్యంత సన్నిహితులు, చిరకాలస్నేహితులు సహచరులు. నన్ను పిల్చి అన్నారు ఆయన “అంత అమాయకంగా అందర్ని నమ్మి ఆపదలు కొని తెచ్చుకోవడం ఎందుకు? వారు మాట స్వేచ్చభారతం 209

తప్పడం సహజం వారి స్వధర్మం అది మీరు పునరాలోచించండి” అన్నాడు. మాట ఇచ్చి మారినవాడు మనిషేమిటండి? ప్రమాదాలకు జడిసిపోవడానికి ఈ గుందె కాయ కాసింది! ఎన్ని ప్రమాదాలు ఎదుర్క్శొన్నామో? దాటుకున్నామో? మీ వంటి పెద్దల సహాయ సానుభూతులుంటే మమ్మెవరేం చెయ్యగలరు? “సరే రేపు మా ఇంటి దగ్గర 7 గం. లకు సమావేశం అందరూ రండి” అన్నారు. రాజుల్ని తీసుకువచ్చే పూచి - ఎస్‌.ఆర్‌.ఎ.ఎస్‌. మీద పెట్టాడు. అందరం వెళ్లాం. రాజుల మొహం వాచేటట్లు చీవాట్లు పెట్టారు. “భాట్టం గారే కాదు - నేనూ సాయం చేస్తాను మీకు. మీరందరూ కలిసి ఉంటే. ఎత్తిన కత్తి దింపండి. పొత్తు కలపండి మిత్రులవండి” అని హితబోధ చేసాడు. ఆయన చెప్పిన అన్నిటికీ తలూపాడు. అయితే ఇదంతా ఒక కాగితం మీద పెడతాను. కలిసికట్టుగా పనిచేస్తామని పరస్పర విరోధాలు విడనాడుతామని పి.వి. పాదాలు వదలమని అని, జిల్లాలో మరి కలతలు, కలహాలు ఉండవని వాగ్దానం చేస్తూ ప్రమాణ పత్రం లాంటిది. పి.వి.కి వ్రాయించాడు. అందరిచేత సంతకాలు చేయించాడు. ఆ కాయితం తన దగ్గర ఉంచుకున్నాడు. ఆ తర్వాత ఆ పత్రం నాకు అందజేసాడు. మర్నాడు ఢిల్లీ వెళ్ళే విమానానికి బృందం అంతా వచ్చి నన్ను సాగనంపారు. మీమీదే ప్రాణం పెట్టుకొని చూస్తూ ఉంటాము. వీలైనంత తొందర్లో ఫోను చెయ్యమని కోరారు రాజ ప్రముఖులు. ఢిల్లీ వెళ్ళిన వెంటనే పి.వి.ని కలిశాను. తన మంత్రివర్గంలో సూర్యనారాయణరాజుకి స్థానం కల్పించమని కోరాను. పి.వి. నిర్దాంతపోయాడు “ఈ కోరిక కోరింది మీరేనా? ఎప్పుడొచ్చిందీమార్పు? ముందే తెలిస్తే ఏదైనా చేసేవాడినేమో? ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు? లిస్టు ప్రధాని ఇందిరాగాంధీ గారి దగ్గర ఉంది. చేర్చులు మార్పులు అంటూ మళ్లీ వెళ్లి అడగలేను. అంత అస్థిరత్వం ఉన్న మనిషి ముఖ్యమంత్రి అనుకుంటుంది. మీ రాజుకు ఇప్పట్లో సాయం చెయ్యలేను. అప్పుడే ఇద్దరు రాజులు ఉన్నారు ఆ లిస్టులో

  1. మూర్తిరాజు 2. రుద్రరాజు రామలింగరాజు. అందుచేత 16110 ౪211 90211 26 02/6 0011౫” ఆ విషయం వెంటనే ఫోన్‌ చేసి చెప్పాను సూర్యనారాయణరాజుకు. ఆ మహానుభావుడు నమ్మడే. ఇద్దరు రాజులు లేరండి ఆ లిస్టులో అంటాడు. ఇది ఎవరో చెప్పిన మాట కాదండీ ఆంతరంగికంగా సి.ఎమ్‌. నాతో చెప్పినమాట. ఆ లిస్టు ఇంకా ప్రధాని మంత్రిదగ్గర ఉంది. సారీ! ఇంతకుమించి సాయం చెయ్యలేకపోయాను అన్నాను. మనసారా ప్రయత్నం చేశాను. చెయ్యగలిగిందంతా చేశాను. హృదయపూర్వకంగా. కాలం కలిసిరాకపోతే నేనేం చెయ్యగలను? 210 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

ఇక్కడితో వదిలిపెడదతారా ఆ మీసాల ప్రభువులు. అక్కడ హైదరాబాద్‌ బసలో బందోబస్త్‌ మరీఎక్కువ చేశారు. కక్క ముక్క మస్తుగా పెట్టి అనుచరవర్షాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇంతలో నేను ఢిల్లీనుండి తిరిగి వచ్చాను. పి.వి. కూడా వచ్చిన తరువాత బలప్రదర్శనకి మద్దతు దారులను మళ్ళీ మోసుకెల్తున్నారు. నన్నూ రమ్మని అప్పలనాయుడు వచ్చాడు. రానంటే అబద్దాలు చెప్పినట్లు ఉంటుందేమో! ఇంతా చేశాం, దీనికేముంది పదండి అన్నాను. నన్ను చూసిన వెంటనే పి.వి. అన్నాడు. “ఢిల్లీలోనే మీకన్నీ చెప్పాను. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు. మున్ముందు రాజులకు సాయంచేస్తాను అన్నాను కదా” అన్నాడు నా ప్రక్కకు తిరిగి. అప్పటికి వారికి నమ్మకం బలపడింది. అప్పలనాయుడు ఆత్మకు తృప్తికలింది. ఇందులో నాకు పోయేదేముంది. వచ్చేదేముంది. అన్నీ చేయించేవాడు ఆ పరమాత్ముడు. ఆపైవాడు. ఆయనే చూసుకుంటాడు అన్నీ మనం ధర్మం తప్పకుండా ఉంటే అదే మనలను కాపొడుతుంది. ఆ నమ్మకమే నన్ను నడిపిస్తుంది.

అపకారికి ఉపకారం అన్నమాటచాలదు. తలనరికేవాడికి కూడా చేతికి కత్తి అందించడం నా నైజం అయింది. మమ్మల్ని పదవుల నుండి తప్పించి భ్రష్టుపట్టించాలని ఉవ్విళ్లురేవారి పదవుల పునాదుల గట్టిపడేందుకు కూడా తోడ్చడం సహజమైంది. అడిగితే కాదనడు, ఆశ్రయిస్తే ఆదరిస్తాడన్న గుట్టు తెలిసి తమ పంటపండించుకున్న వారెందరో! రాజులు రారాజులైనా మాతలతియ్యలేరు! ఇది గట్టి ప్రాణం అనుకున్నా! దాని గుట్టు నాకే తెలీయదు. రాజ్యసభ ఉప ఎన్నిక

పి.వి. ఉత్తమ పురుషుడు. ఉన్నత ఆశయాలు మహోన్నతమైన ఆదర్శాలు తన మనోఫలకంపై నిల్చుకొని తదనుగుణంగా కార్యాచరణ పథకాన్ని నిర్మించుకొని కార్యక్రమాలు చేపట్టేవాడు. పి.వి. బడుగు బలహీన వర్గాలుకు హరిజన గిరిజనులకు పేద మధ్యతరగతి ప్రజానీకానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు. అసెంబ్లీ సీట్లు కూడా ఆ ప్రాతిపదికనే కేటాయించేవాడు. ఎన్నికల సమరంలో విజయం సాధించాక పార్టీలో అంతర్గతంగా క్రమశిక్షణ నెలకొల్పి బలహీన వర్గాలతో పాటు, ఉన్నత గ్రేణిలోని శాసన సభ్యులను అదుపులో పెట్టి, పార్టీ మీద పట్టుసాధించడం కూడా గద్దు సమస్యే. సత్చురుషుడు. ఉదారస్వభావుడు అయిన పి.వి.కి రాజ్యసభ ఉప ఎన్నికలు సమస్యాత్మకంగా పరిణమించాయి. అధికారపార్టీ అభ్యర్థులు ఇరువురు పరాజయం పొందారు. 1. బెజవాడ పాపిరెడ్డి 2. చదలవాడ వెంకటరావు. ఈ ఓటిమి ముఖ్యమంత్రి బలహీనతకు నిదర్శనంగా స్వేచ్చాభాంతం లలా

నిల్చే ప్రమాదం ఉన్నందున పి.వి. పగ్గాలు బిగించేందుకు పూనుకున్నాడు. అధికార ప్రాంగణంలో ఉన్న అధినేత తల్చుకుంటే తలుపులు తెరచుకుంటాయి. నిగూఢ రహస్యాలు బయటపడతాయి. క్రాస్‌ ఓటింగు జరిగిన వైనం విశదమౌతుంది. ఇందులోని పాత్రధారులు సూత్రధారుల గుట్టబయటపడుతుంది. బట్టబయలవుతుంది. చేతులుమారిన అర్థం పరమార్థం అవగతం అవుతుంది. అల్లూరి బాపినీడు తనయుడు ఎ.ఎస్‌. చౌదరి (అల్లూరి సర్వారాయచౌదరి) కి టిక్కట్టు లభించనప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగేవాడు, సంచులు పంచేవాడు. ఆయన పేరుమోగితే డబ్బులు ఘల్గుఘల్లుమంటాయి. అధికారపార్టీ అభ్యర్థుల గుండె ర్సుల్లురుల్లు మంటుంది. విదేశాల్లో టొబేకో వ్యాపారంలో లోగడ గడించిన కోటానుకోట్లు మూలను పడి మూల్లితే ఏం లాభం? రాజకీయ రంగ ప్రవేశం చేసి పదవుల పట్టుకొమ్మలు పట్టుకొని ప్రభుత్వాధినేతలను గుప్పెట్లో పెట్టుకొని పక్కా వ్యూహంతో స్థిరచరాస్తులు, భోగభాగ్యాలు ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోడానికి రాజకీయ అధికారం ముఖద్వారం. ప్రభుత్వ అధినేతల కనుసన్నలలో మెలిగే అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న బాపతు కొందరైతే, మందు విందు పసందుగా లాగించిన తరువాత చేతిలో చెయ్యేసి, ఆడిన మాట తప్పనని చెప్పిన సత్య సంధులు కొందరుంటారు. ఇటు కోటీశ్వరులను గుప్పెట్లో పెట్టుకొని, అధికార ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకు పదవీ వ్యామోహం గల అధికార మదాంధులు కొందరుంటారు. ఇలా ఎన్నో సవాలక్షకారణాలు. ఈ పరోక్ష ఎన్నికల ప్రక్రియలను పట్టుకొని పీడించే జాద్యాలు అనేకం. గుట్టు చప్పుడు కాకుండా సంచుల మూతులు తెగుతాయి. అధికార పార్టీ అభ్యర్థుల పీకలు తెగిపడతాయి. “ఇప్పుడేం చేయాలి తమ్మన్నా! ఎంతైనా చేద్దాం “తిమ్మన్నా” అని బయలుదేరుతారు. పెద్దల ఆథభ్రిత జనావళి. తీగె కాళ్ళకు తగిలితే దొంక అంతా కదులుతుందన్నట్లు వ్యూహరచన చేసిన నెల్లూరి నెణిజాణల కళాపోషణకు పరికరంగా మారిన మన జిల్లా ప్రబుద్ధుల సల్లాపాలు వెలుగు జూసాయి. నేదురుమల్లి జనార్దనరెడ్డికి ఆత్మబంధువు లాంటివాడు పద్మనాభరాజు. ఈ కుతంత్రంలో పాచిక అయి 'ఈ చిన్న చిల్లర నేరానికి బంగారులాంటి బతుకు కంగాళీ అయింది. విశాఖపట్నం విచ్చేసిన ముఖ్యమంత్రి పి. వి, నరసింహారావుగారితో రాత్రి డిన్నరు అనంతరం. పద్మనాభరాజు ఎక్కడ పిలవండి అన్నాడు పి.వి. అంతవరకూ అంటీముట్టనట్లు తచ్చాడుతున్న పద్మనాభరాజు ఉడాయించాడు. “సరే! రేపు ఉదయానికి నా దగ్గర హాజరు పెట్టండి” అన్నాడు పి.వి.నాతో. ఎ.ఎస్‌. చౌదరీకి జనార్దనరెడ్డి ప్రోద్బలంతో ఓటు గుద్దాడు మనవాడు పద్మనాభరాజు, అక్కడ ఎన్‌.జి.రంగా (స్వతంత్రపార్దీ) కు ఓటు ముద్రగుద్దాడు. కొమ్మూరి అప్పడు దొర... పేర్లతో పాటు తెలిసిపోయింది. కక్ష కార్ప్చణ్యం లేని మనిషి 212 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్ర

పి.వి. తప్పు ఒప్పుకొంటే మన్నిస్తాడు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు అన్నాడు పి.వి. పద్మనాభరాజు మెడకు ఉచ్చుతగులుకోకుండా పి.వి.జి.రాజు దృష్టిలో ఈ పాపిష్టి పని పడకుండా “దండం దశగుణం భవేత్‌” అన్నట్లు పి.వికి దండప్రమాణాలతో ఈ కథ కంచికి వెళ్ళింది. అంతకన్నా నేనేం చెయ్యగలను? ఆ తరువాత పద్మనాభరాజుతో చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆయనతోను ఆయన కుటుంభసభ్యులతోను సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చాడు జనార్దనరెడ్డి. విశాఖజిల్లా పై జెండా ఎగరేసిన జనార్దనరెడ్డి పద్మనాభుని ఆత్మీయుల సేవలు అందుకున్నాడు.

జనార్దనరెడ్డి నిర్వాకంలోనే లోపాలు పాపాలు అనేకం. చిత్రగుస్తని చిల్టా విప్పి ఆరోపణల పర్వాన్ని విచారణకు కె.ఆర్‌. వేణుగోపాల్‌ ఐ.ఏ.ఎస్‌ ను నియమిస్తే. అతడు గూటాయించి రాసాడు రిపోర్టు. సిలువవేసినా తొలగని పాపాలకు పరిహారమేంటి? పి.వి. దయదలచి ఎమ్‌.వి.రాజగోపాల్‌ ఐ.ఏ.ఎస్‌.ని పంపించి నాటి ఆరోపణల పై పునః పరిశీలన చెయ్యమన్నాడు. బుజువులు దొరకని నేరాలు పలుచబడి నిందితుడ్ని ఒడ్డున జేర్చడానికి వాటము దొరికింది! నేను సాంఘిక సంక్షేమశాఖామంత్రిగా వచ్చేటప్పటికి ఆ కరుకి కట్ట కొన్ని రీముల పేపర్లున్న దస్త్రం అయి నా దస్మత్తు కోసం వచ్చింది. చూద్దాం అని ప్రక్కనపెట్టాను. నాకు అప్పుడు ఆప్తుడు, సన్నిహితుడు, సహచరుడు అయిన మంత్రి ఆనం వెంకటరెడ్డిని నావద్దకు పంపాడు జనార్దనరెడ్డి “ఆకట్ట చూద్దాం” అన్నాడాయన. ఎక్కడ గుట్టుమట్టులూ ఆయనకు (జలగాన్మి తెలిసిపోతాయి! అసలే పోలీసు బుర్ర. నాకు ఫోను చేశాడు. ఆ ఫైలు ఏం చేశారని అడిగాడు. ఇంకా పరిశీలనలో ఉందన్నాను. మీరు ఏమీ చెయ్యవద్దు 70 (04 0౯06ల). అని వ్రాసి పంపించండి అన్నాడు. అదే చెప్పాను వెంకటరెడ్డికి. జలగం బలగాన్ని ఎవరు ఎప్పుడు ఎలా కలుసుకున్నారో. మణుగు బరువున్న దస్త్రం. మొత్తం ఎందుకు జావకారిపోయిందో ఆపరమాత్ముని కెరుక!

పాలక పక్షంలో కొన్ని పక్షులు పాపాలవైతరణిని దాటేందుకు వారధి నిర్మించుకొనే కక్షిదారులను పెట్టుకుంటారు. రాజకీయ అధికార పీఠం చుట్టూ నిత్యం తిరుగుతూ ఉంటారు. ధర్మోరక్షతి - రక్షితః పి.వితో మద్రాస్‌ ప్రయాణం

తన మద్రాసు ప్రయాణంలో పి.వి నన్ను రమ్మన్నాడు. చేపాక్‌ 6౮౦౪ల౦౧696 80656 1౦౪56 లో బస, మొదటి 2,3 గదులు ముఖ్యమంత్రివి. తరువాత నాది. జనాలు వస్తూనే ఉన్నారు. వరండా నిండిపోయింది. గది నిండా జనం, వాళ్లని వదిలించుకుని, ఆయన బయటకురాగానే, నేను ఆ కారు దగ్గర సిద్ధంగా ఉన్నాను. ఒకాయన్ను చూపించి, ఈయన శ్వ్యళ్చాళాతం

చాలా గొప్పవాడు, దేశంలోనే సుప్రసిద్ధుడు, వీరిని సంగీత, నాటక అకాడమీకి అధ్యక్షునిగా వేయమన్నారు. అడ్డపంచి కట్టుకుని, పొట్టిగా ఉన్న ఆ పెద్ద మనిషి మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని తరువాత తెలిసింది. మనసులోనే ఒక నమస్కారం పెట్టుకుని, హైద్రాబాద్‌ వెళ్ళిన వెంటనే మామిడి పూడి ఆనందాన్ని కృష్ణంరాజుని పిలిచాను. వారు అకాడమీలో ప్రముఖులు, మంచి పట్టున్న వాళ్ళు. “[0౧12240 చేయడాన్ని నిబంధనలు వప్పుకోవు, ఎన్నికలు జరపాలి, ఇప్పటికే సమస్య కోర్టులో ఉన్నందున, చేయగల్లింది ఏమీలేదు” అన్నారు. మరికొంతమంది పెద్దల పేర్లు చెప్పి వారిని అడగమన్నారు. ఎన్నికల్లో గెల్బేందుకు ముమ్మరంగా ప్రచారంచేసుకుని ఉన్నదిగ్ధంతులు అంతా ఎలా వప్పుకుంటారు. మంత్రి పదవి చేసినంత మాత్రాన అన్నీ మనమాట ప్రకారం జరుగుతాయి అని అనుకోవటం తప్పు. కొన్ని నిబంధనలు ఉంటాయి. కొన్ని బంధనాలు ఉంటాయి. కాకలుతీరిన పెద్దలు కొందరు అడ్డుపడతారు. మన చిత్తానుసారం నడవడానికి రాజ్యాంగం ఒప్పదు. గం24లస్రు నిబంధనలు అతిక్రమించడానికి వీల్లేదు. పసల సూర్యచంద్రరావు సంగీత, నాటక అకాడమీ అధ్యక్షులు, సాహిత్య అకాడమీకి బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షులు. దేవులపల్లి రామానుజరావు ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండేవారు. నరోత్తమరెడ్డి లలిత కళా అకాడమీ అధ్యక్షులు, కార్యదర్శి అందరూ 'ప్రతిభావంతులే, ప్రజ్ఞాధురీణులే. ప్రఖ్యాత పురుషులే. వాళ్ళను కదపడం ఎవరితరం? అందుకే ఒక 1616౪ 60౧814ఆని వేశాను. ఈ 8 అకాడమీల కార్యక్రమాన్ని పరిశీలించి, వాటి పునర్నిర్మాణం గురించి సముచితమైన సూచనలు చేయటంకోసం. ఈ కమిటీకి తెన్నేటి విశ్వనాథంగార్ని అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఇంకా పనిచేపట్టనేలేదు. ఇంతలో ఆంధ్రోద్యమం ఆరంభమైంది. ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూ నడిపిస్తున్న ఉద్యమానికి సారథ్యంవహిస్తూ, ఈ కమిటీకి అధ్యక్షునిగా ఉండడం బెచిత్యంకాదని భావించి, నాకు ఫోన్‌లో చెప్పి, రాజీనామా చేశారు తెన్నేటి వారు. దా. పి.ఎస్‌.ఆర్‌ అప్పారావు కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితి వివరించగా, ముఖ్యమంత్రి పి.వి, ఖాళీ అయిన అధ్యక్షన్థానంలో రాష్ట్రపతిగిరి గారి కుమారుడు, ఎమ్‌.పి. శంకరగిరి గార్ని నియమించమని చెప్పాడు. సరే, ఆ కమిటీలో చాలా గొప్ప, గొప్ప పండితుల్ని కవి పుంగవుల్ని, విద్యా విజ్ఞాన వేత్తల్ని మపిళామబుల్ని వివిధ రంగాల్లో కీర్తి, ప్రఖ్యాతులు ఆర్జించిన మహామహులు అందరినీ నియమించడం జరిగింది. ఆ కమిటీ రాష్ట్రమంతటా సంచారం చేసి వివిధ సంస్థల పెద్దలతో సంప్రదించి చేసిన నిర్ణయాలు మూలపడి ఉన్నాయి. (ఈ లోగా పి.వి. ప్రభుత్వం పతన మైనందున తరువాతి ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు!) 214... భాట్టం శ్రీరామమూర్తి ట్వీయ చరిత్ర

అప్పట్లో విద్యాశాఖ కార్యదర్శిగా ఎస్‌. ఆర్‌. రామ్మూర్తిగారు ఉండేవారు. చాలా గొప్ప వ్యక్తి, ఉత్తముడు, పరిపాలనాదక్షుడు. (కొన్ని సంల తరువాత ఆయన ఛీఫ్‌ సెక్రటరీ అయ్యారు) వారితో సంప్రదించాను. ముందు సంగీత, నాటక అకాడమీని మార్చాలి. స్పెషల్‌ ఆఫీసరుని వేద్దాం అన్నాడాయన. దీనికి అన్నివిధాలా అర్హుడైన ఆఫీసరుని చూడమన్నారు. కె.ఆర్‌. పరమహంసపేరు పట్టుకొచ్చాడు. మళ్ళీ ఇది కోర్టు లిటిగేషన్‌లో పడకుండా చూసుకోవాలి. హైకోర్టుకు వెళ్ళే ఆస్కారం లేకుండా చెయ్యాలి. ఒక శుక్రవారం సాయంకాలం, పరమహంస ఎస్‌. ఎన్‌.అకాడమీ అధ్యక్షస్థానం అలంకరించి, పదవి స్వీకరించిన రిపోర్టు పంపించాడు. ఆ తక్షణమే పాత నేమ్‌ప్లేట్‌ స్థానంలో పరమహంస పేరున్న బోర్డు వెలసింది. ఇదంతా పి.వి. చెప్పినట్లు బాలమురళీకృష్ణకి అధ్యక్షన్థానం కల్పించడానికి చేసిన ప్రాథమిక సన్నాహం. 'ప్రధానభూమిక.

ఈ మధ్య కాలంలో జరిగిన ఒక ఉదంతం గుర్తుకొస్తుంది. పట్టాభిరామారావు (విద్యాశాఖామాత్యులు) మా ఇంటికి వచ్చి శ్రీరంగం గోపాలరత్నాన్ని సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించాలని కోరాడు. ఆమె ఎ.ఐ.ఆర్‌లో కొనసాగడానికి ఇష్టపడలేదట. వెంటనే సెలక్షన్‌ కమిటీ వేయటం, ఆమెను ప్రిన్సిపాల్‌గా నియమించటం జరిగిపోయాయి. ఇంతలో అధ్యక్షపాలన రాష్ట్రంలో ఏర్పడింది. (1971 సెప్టెంబరు 81న పి.వి. ఛీఫ్‌ మినిష్టర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. సాధారణ ఎన్నికల అనంతరం, 78 జనవరి 18వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్షపాలన విధించబడింది. 1973 డిసెంబరు 10వ తేదీన రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. తదనంతరం జలగం వెంగళరావు 1973 డిసెంబరు 10వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు.) అధ్యక్షపాలన గడువు సంవత్సరం. ఈ మధ్య కాలంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలీదు.

బలపరీక్ష ఎన్నడైనా జరగొచ్చు. తన ఎమ్‌.ఎల్‌.ఏ.లను కాపాడుకోవటం ముఖ్యమైంది పి.వికి. ఇల్లు, ఇల్లాలు, పిల్లలని వదలి, పరాయి ప్రాంతం (హైదరాబాద్‌)లో ఎంతకాలం ఎదురుచూస్తారు శాసనసభ్యులు? వాళ్లకి ధైర్యం నూరిపోయడానికి పి.వి ఇంటి వద్ద నిత్యం సమావేశాలు జరుగుతూ ఉండేవి. ఆ రకంగా పోగైన ఎమ్‌.ఎల్‌.ఏల సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కలు గట్టి, పి.వి బలం తెలుసుకోవడానికి 1261186266 అధికార్ల నిఘా పెట్టింది కేంద్రప్రభుత్వం. వాళ్ల ధోరణి ఘోరంగా ఉండేది. ఇక్కడ 90 మంది సమావేశమైతే 40 మంది కలిశారని నివేదిక పంపేవారు, ప్రతీమారూ ఇదే తంతు. “నువు నియమించిన ముఖ్యమంత్రిపై నీకే నమ్మకం లేదా? నాలుగురాళ్ళు సంపాదించడానికి ఉద్యోగంలోకి వచ్చిన ఆఫీసరు మాట నమ్ముతావా?” అంటూ పి.వి. గోల పెట్టేవాడు. (అప్పట్లో, 10- స్వేచద్భభారతం.. 25

1611196006 580610160660[గా ఉండే ఐ.పి.ఎస్‌ రామమోహన్‌రావు ఉండేవాడు. ఇటీవలి కాలంలో మద్రాస్‌ గవర్నర్‌గా నియమితుడైన విషయం లోకానికి తెల్సు.) “ముఖ్యమంత్రిని నమ్మరట. ఎమ్‌.ఎల్‌.ఏ.ల మాట నమ్మరట. రూకల కోసం, పదవుల కోసం చాకిరీ చేసే వాడి వాక్కే వేదవాక్కు? పోలీసు వాడి నోటినుండి సత్యం ఊడిపడుతుందా? (ప్రజాప్రతినిధులను గడ్డిపోచల్లా చూడ్డం ఏం ధర్మం” అని వాపోయేవాడు పి.వి. నానాటికీ తన బలగంపై పట్టు పెరిగిందే గానీ తగ్గలేదు. ఇది అంతులేని అనంత యాత్రలా ఉంది. ఈ శాసన సభ్యుల్ని ఎంతకాలం పోగుచేయాలి? వట్టుకోవాలి? పోషించాలి? “పోనీ నువ్వైనా చెప్పమ్మా ఎటువంటివాడు, కావాలో నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపారసమ్ము పై జల్లెడు వాడు... నవ్వు రాజిల్లెదు మోము వాడు” అంటూ భాగవతంలోని పద్యం చదివేవాడు పి.వి. అందరి చప్పట్ల మధ్య ఆనందం తాండవించేది. నవ్వుల పువ్వులు తారాజువ్వల్లా వెలిగేవి. ఈ సందడి మధ్యన విసుగుతగ్గేది. అవును అమెక్కావలసిన ముఖ్యమంత్రి రూపు రేఖా విలాసాలు చెప్పాచ్చుకదా! మన దగ్గరలేనిదేంటి? అతను పెట్టిపుట్టి తెచ్చుకొచ్చిందేంటి? తల్లిబిడ్డను నవమాసాలూ కడుపులో పెట్టి పోషించటమే కష్టం. మందత్రసానమ్మ రాకుండా నొప్పులు రావటం కూడా పురటాలు తప్పే. ఎంతకాలం ఈసుదీర్హ నిరీక్షణ? పాపం ప్రాణం విసిగింది పి.వికి. ఒకరోజు పి.వి అంటాడు “ఏతవీథి ప్రక్మనున్న వాళ్లకి తెలుస్తుంది. పందిని చంపి, పండుగ చేసుకుందామని, చేతులో బడితలు పట్టుకుని బయల్దేరుతారు. దభీదభీమని కొడతారు, పంది కై... మని అరుచుకుంటూ పారిపోతుంది. అడ్డంగా వచ్చిన ఇంకొకదండు గభీగభీమని రెండిచ్చు కుంటారు. కయ్‌మని అరుచుకుంటూ తిరగబడిపడిపోయిన పంది మళ్ళీ పరుగులంకించు కుంటుంది. అంత సుళువుగా చావదది, మన పని అలాగే ఉంది. బడిత పూజ జరిగినా...” వరాహ అవతారాన్ని తల్చుకుని, తలపట్టుకుంటున్నాడు పి.వి పండితుడు. నిర్విరామంగా జరిగే నిరంతర ప్రక్రియే పి.వి. ఇంట్లో జరిగే ఎమ్‌.ఎల్‌్‌ఏ.ల సందడి, పౌరాహిత్య - సౌరభాలు! మధ్య మధ్య ఢిల్లీ యాత్ర. అధిష్టాన వర్గం సమ్ముఖానికి రాయబారం! అందులో నేను విధిగా ఉండేవాణ్ణి! కాకాని వెంకటరత్నం ఎవ్వర్నీ మాట్లాడనిచ్చేవాడు కాదు, ముందే ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో ఏమిటి చెప్పాలో సలహా ఇమ్మనేవాడు. అందరు మంత్రుల్నీ అడిగేవాడు. ప్రధాని ఇందిరకు పలుమార్లు విన్నపాలు (ప్రధాని ఇంధిరాగాంధీ ఇంటి దగ్గర ఒక్క భాట్టం మాత్రమే మాట్లాడుతాడు, తప్పనిసరైతే ఎవరైనా కలుగచేస్కోవచ్చు. సమర్ధనీయమైన కారణాలుంటే. ఢిల్లీ దర్బారు 216. భాట్టం శ్రీరామమూర్తి జ్వీయ చంత్రు

చుట్టూ ఈ రాయబార వర్గం ప్రదక్షిణలు చేసి, ఆ మహాతల్లికి ప్రణతులు, వినతులు సమర్పించుకోవడం. ఇలా ఎన్ని మార్లు చేశామో! పి.వి బలం గురించి గొంతెత్తి చాటి చెప్పామో! లెక్కలేదు. అన్నీ చెప్పాను ఆమె మనసు బదులు పెడుతుందా అంటే, అదీ లేదు. యక్ష ప్రశ్నలాంటి ఒక ప్రశ్న వేసేది. కళ్ళు టపటపా కొట్టుకుంటూ, ఎటో శూన్యంలోకి చూస్తూ, “ఆంధ్ర ఎమ్‌. ఎల్‌. ఏ.లు ఆంధ్రలో అడుగుపెట్టలేదట, నిజమా అంటూ బాంబు పేల్చేది. ఆ జవాబు చెప్పలేక, మూడు చెజువుల నీళ్లు త్రాగే వాళ్లం. ఈ చెవి నుండి వెళ్లి ఆ చెవి నుండి బైట పదేవి మామాటలు “50, 161౪5 566” అని లేచిపోయేది.

&.1.0.06. ₹|651646%1+ శంకర్‌ దయాళ్‌ శర్మ అయితే మరీ చెప్పనవసరంలేదు. రకరకాల స్వీట్లు, తినుబండారాలూ టేబుల్‌ నిందా ప్లేట్‌లలో ఉండేవి. ఇది బావుంటుంది. అది బావుంటుంది అంటూ తినమనేవాడు. మాకు బావుందే మాట ఒక్కబీ చెప్పేవాడు కాదు. పి.ఎమ్‌. కన్నా ముందే ఆయన్ని కలిస్తే, పి.ఎమ్‌.ని కలవండి చూద్దాం అనేవాడు. పి.ఎమ్‌.ని కలిసాక ఆయన దగ్గరకి వెళ్తే పి.ఎమ్‌.కి అన్నీ చెప్పారుకదా, సరే చూద్దాంలెండి అనేవాడు! అవి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు ఉండేది మాపని, పోనీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తారా అంటే, అదీ చెప్పడు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి ఇంకొకర్ని ఎంపిక చేయాలన్న భావమా అంటే, అదీ తేల్చరు. ఇంతకీ ఈ ఆరాటం, పోరాటం ఎందుకు? ఎవరికోసం? శత్రుదుర్శేద్యమైన పద్మవ్యూహాన్ని ఛేదించుకుని, ఢిల్లీ దర్బార్‌ ముందు సాగిలపడి, మోకరిల్లడం ఎందుకు?

మొదటి నుండీ కాకానికి నామీద మక్కువ ఎక్కువ. ఆయన పి.సి.సి. థ్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే హైదరాబాదులో అఖిల భారతకాంగ్రెస్‌ మహాసభలు జరిగాయి. (అంతకుముందు బ్రహ్మానందరెడ్డి, ముఖ్యమంత్రి పదవిచేపట్టిన అనంతరం గుంటూరులో మహాసభలు జరిగాయి). రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులుగా కాకాని స్వాగత పత్రం చదవాలి. ఒకమారు (బ్రహ్మానందరెడ్డిదగ్గర కెళ్ళాం. పి.వి స్వాగత పత్రం రాస్తాడు మీరు చదవండి అన్నాడు కాకానితో. “పి.వి ఎందుకు? నాకు మా భాట్టం ఉన్నాడు, అతను రాస్తాడు. నేను చదువుతాను” అన్నాడు కాకాని. ఒక తెలుగే కాదు. దేశం నలుమూలల నుండీ వచ్చే ప్రతినిధులు ఉంటారు కదా? ఇంగ్లీషులో ఉంటే బావుంటుంది అన్నాడు ముఖ్యమంత్రి. “మీరు ఏ భాషలో రాసినా, నేను చదివేది తెలుగులోనే కదా” అన్నాడు కాకాని. “అంతగా ఇంగ్లీషు కావాలంటే, భాట్టం రాసిన దాన్ని మీరు ఇంగ్లీష్‌లోకి తర్జుమాచేసుకోండి.” అన్నాడు. ఆపని పి.వికి పురమాయించమన్నాడు. 4.1.0.0. ష౭౦లగ00 0011169 ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించాడు. ఏకైక నామధేయం పనికిరాదంటే మరొకరు చెప్పిన భవానీ ప్రసాద్‌ అనే పేరు కింద రాస్మ్కోమని అన్నాడు. అంత అపూర్వమైన నమ్మకం స్వేద్ధభరతం ౨217

నామీద ఉండేది. రోజుకు ఒక్కమారైనా కలవకుండా ఉండేవాడు కాదు. ఒక ఊపుతో వచ్చేవాడు. బయట అందరూ ఉండేవారు. ఈయనొక్కడే నాగదిలో ప్రవేశించేవాడు. బయట పిన్నమనేని కోటేశ్వర్రావ్‌, చనుమోలు వెంకట్రావ్‌, అక్కినేని భాస్మర్రావ్‌ వంటి ఉద్దండ పిండాలుండేవారు కాకానివెంట. సర్దార్‌ కాకాని అని బిరుదు. ఉక్కుకాకాని అని మరోపేరు, ఎక్కడ రాజకీయ పాఠశాల పెట్టినా, నేను వెళ్ళి ప్రసంగం చేయవలసిందే. నాపట్ల ప్రగాఢమైన విశ్వాసం, నిండు ప్రేమ, దండిగా అభిమానం. అతని వందిమాగధుల్లో ఎప్పుడూ, ఈయన్ని వెనకేసుకు తిరుగుతారెందుకు అనే సందేహం ఉత్పన్నమైతే “ఏడీ చూపండి శ్రీరామ్మూర్తిలాంటి మరో మనిషిని” అనేవాడట. ఇది ఎంతవరకూ వెళ్ళిందంటే ముల్కి నిబంధనలపై, సుప్రీంకోర్టు తీర్చు ప్రకటించే నాటివరకూ కొనసాగింది. కాకానితో స్నేహం - పూర్వరంగం బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో చిచ్చు పెట్టాలని, గ్రూపుల రగడ ప్రారంభమైంది. సంజీవయ్య, రఘురామయ్య, ఎ.సి. సుబ్బారెడ్డి కలిసిన గ్రూపు సంజీవరెడ్డిని కలుపుకున్నారు. సంజీవరెడ్డి వ్యతిరేకులందర్నీ బ్రహ్మానందరెడ్డి కూడా కూడగట్టారు. కందుల ఓబుల్‌రెడ్డిని వ్యవసాయ విశ్వవిద్యాలయం 1/06 011066111/ని చేశాడు. జె.వి. నర్సింగరావు 2166- ౯160 కెంజ4 అధ్యక్షుడు అయ్యాడు, వి.బి. రాజు ఆర్టీసీ ఛైర్మన్‌ అయ్యాడు, తిమ్మారెడ్డి పి.సి.సి ప్రెసిడెంట్‌, గొట్టిపాటి బ్రహ్మయ్య కౌన్సిల్‌ ఛైర్మన్‌ అయ్యాడు. రాష్ట్రంలో సంకుల సమరం ఆరంభమైంది. ముఠాకక్షలు పెరిగాయి. బలబలాలు తేల్చుకోడానికి చూస్తున్నారు. ఇంతలో ఆలపాటి వెంకట్రామయ్య మరణించాడు 1965లో. ఆలపాటి బ్రతికుంటే ఎ.సి. ముఠాదేపైచేయి. రాష్ట్ర ఎన్నికల కమిటీలో ఎ.సి. సుబ్బారెడ్డి, రెండు నూకల రామ చంద్రారెడ్డి, మూడు పి.వి.జి. రాజు, నాలుగు నవాబు మీర్‌ అహ్మద్‌ ఆలీఖాన్‌ ఐదు ఆర్‌, రుక్మిణమ్మ. కాసు గ్రూపు. 1. కాసు (బ్రహ్మానందరెడ్డి 2. తిమ్మారెడ్డి, 3. చెన్నారెడ్డి, 4. తోటరామస్వామి 5. వి.బి.రాజు. పదకొందోస్థానం అందుచేత కీలకమైంది. రాబోవు ఎన్నికల్లో వారిదే ప్రాబల్యం. ముఖ్యమంత్రి తరఫు అభ్యర్థి కాకాని వెంకటరత్నం, ఎ.సి. తరఫు అభ్యర్థి మూర్తిరాజు. ఆ కాకాని అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకే పి.సి.సి. సభ్యులు అందర్నీ సమీకరించటం. బంజారాహిల్స్‌లో శిబిరం నెలకొల్పటం జరిగింది. దానికి నేను పూచీదారుని. అంటే, నాకు ఒక ప్రముఖపాత్ర బ్రహ్మానందరెడ్డిగారు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కాకాని గెలిచాడు. ఆ విధంగా కూడా కాకానికి నేను విశ్వాసపాత్రుడినయ్యాను అనుకుంటాను.

అంతకుముందు 12% 001% ౧1] 0910 ముల్కీ 11ల చెల్లవని తీర్చు చెప్పింది. 1972 ఫిబ్రవరి 4వ తేదీన పి.వి. ప్రభుత్వం అందుపై సుప్రీంకోర్టుకి అప్పీలు చేసింది. 1972లో అక్టోబరు ౩వ తేదీన ముల్కీ రూల్స్‌ చెల్లుకాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వెంటనే సంబరపడిపోయాడు పి.వి. “| 13 [౧1” అన్నాడు పి.వి. ఎగిరిగంతేస్తూ. “చూశావా ఇప్పుడు పి.వి. సంగతి బయట పడింది, పోదాం రా! ఇంక ఇతనితో మనకేం పని” అన్నాడు కాకాని నా చేయి లాగుతూ. “తొందరపడకండి చూద్దాం, చేద్దాం” అన్న పద్ధతుల్లో నసుగుతూ, నానుస్తూ మాట్లాడుతున్నాను. అక్కడి నుండి కదల్లేదు. కాకాని మండిపడ్డాడు. “పోతేపో! నీ బండారం కూడా బయటపడింది” అన్నాడు ఉద్రేకంగా. (నేనూ బ్రాహ్మణ్జి కాబట్టి పి.విని వదల్లేదనే అర్ధంలో) అంతే! రౌద్రాకారంలో బారలు చాచుకుని బయటకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత మరి ముఖాలు చూసుకోలేదు. రాజీనామాల పర్వం ఆంధ్రోద్యమం భగ్గుమంది. ఆంధ్రామంత్రులు తొమ్మిది మంది రాజీనామాలు చేశారు. నేను, అన్న మండలి, లుకలాపు లక్ష్మణదాసు తప్పిస్తే, ఆంధ్రుడు అన్నవాడు ఎవడూ పి.వి. కేబినెట్‌లో లేడు. అందరూ గుడ్‌ బై చెప్పి రంగంలోకి ఉరికారు. పంచాయితీలు, సమితులు, పరిషత్‌లు. కో-ఆపరేటివ్‌ సంస్థలు, శాసనసభ్యులు మొత్తం అంతా తిరగబద్దారు. ఊరూ, వాడా భగ్గున మండిపోతోంది. “ప్రత్యేక ఆంధ్ర” కావాలని! నేను, అన్న క్రిష్టారావు చాలా వరకూ ఆలోచించాం. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అన్నాం ఒకప్పుడు. దశాబ్దాల తరబడి జరిగిన పోరాటాల అనంతరం ఏర్పడిన సమైక్య రాష్ట్రాన్ని విచ్చిన్నం చేయడానికి చేతులు రావడంలేదు. అన్నదమ్ములమధ్య అనుమాన, ద్వేషాలు పెరిగాయి. ఆంధ్రలో అగ్నిగుండం రాజుకుంది. సమైక్య ఆంధ్ర, మన ఆదర్శం, ఆంధ్రరాష్ట్ర సమగ్రత మనలక్ష్యం మనబ్రతుకు బలైనా సరే, మన ఆదర్శాన్ని వదలొద్దు. స్వతం(త్రపోరాటంలో, [ప్రాణత్యాగం చేసిన సమరవీరులు ఎందరో ఉన్నారు తమ సర్వస్వాన్నీ దేశానికి ధారపోసిన స్వాతంత్ర్య సమరయోధులు, త్యాగ ధనులు. మనం కూడా వారి సరసన చేరుదాం. నాడు స్వతంత్రం కోసం పోరాటం, నేడు సమగ్రత, సమైక్యతలకోసం మన ఆరాటం. ప్రాణానికి తెగించి, ఉద్యమానికి బలిపశు వైనా విశాలాంధ్రని రక్షించుకోవాలన్న కృత నిశ్చయానికొచ్చాం. ప్రత్యేకవాద ఉన్మాదం పేట్రేగింది. తెలుగుగడ్డ మీద అడుగపెడితే, ప్రాణాల దక్కవని హెచ్చరికలు చేస్తున్నారు. స్వేచ్చాభారతం 219

డిసెంబరు 24వ తేదీ 1978, విజయవాడలో ్రత్యేకవాదుల సమావేశం పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. నేను, అన్న క్రిష్ణారావు అక్కడికి వెళ్ళాలని నిర్ణయించు కున్నాం. విజయవాడలో అడుగుపెడితే, ప్రమాదం ముంచుకొస్తుంది. మిమ్మల్నెవరూ రక్షించలేరు. మీ ప్రాణాలు కాపాడలేం అని అధికార వరాలు చేతులెత్తేశాయి. పి.వి. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌ కుమారస్వామి రెడ్డితో మాట్లాడుతున్నాడు. విమానంలో వస్తే తగలెట్టాలని, గన్నవరం విమానాశ్రయంలో తారు డబ్బా డ్రమ్ములు తెప్పించి, ఒలకబోశారు, ముట్టించారు. రోద్దుమీదవస్తే, జగ్గయ్యపేట నుండి అన్ని దార్లూ కాశారు. మంటలు మండించాలని, సజీవ దహనం చేయాలని. మేం ఆంధ్రకు ద్రోహం చేశామని. సమైక్యత పేరు చెప్పిన పురుగుకూడా తెలుగు గడ్డపై ప్రాణాలతో బ్రతకదు. ఎత్తిన కత్తి దించడానికి సిద్ధంగా లేరు, మాటువేశారు, అర్ధరాత్రి అవుతోంది.

కలెక్టర్‌ది ఒకటే మాట. ప్రభుత్వ వ్యవస్థ స్తంభించిపోయింది. ఆదేశాలు జారీచేసి ప్రాణాలు కాపాడ్డం దుర్లభం అని ముమ్మాటికీ నొక్కి వక్కాణించాడు. ముప్పు తప్పదు, ప్రాణగండం పొంచి ఉంది. మీరు, మరి సాహసం చేయవద్దు అంటున్నాడు పి.వి. “విజయవాడ కార్యక్రమం రద్దు చేస్కోండి” అని శాసించాడు. మేము నిషమించాం. వీర కాకాని మరణం

అక్కడ కాకాని గొంతు చించుకుంటున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు, గిర్రున బొంగరంలా, నలుదిశలా తిరుగుతున్నాడు, వీర కాకాని, వైరి కాకానై నిప్పులు చెరుగుతున్నాడు. ఉరుములు ఉరుముతున్నాడు. 1972 డిసెంబరు 24 అర్ధరాత్రి దాటింది. కాకాని గుండె ఆగిపోయింది. జనం ఘౌొల్లునున్నారు. కాకానికి వీరమరణం ప్రాప్తించింది.

తుది వీడ్కోలుకు అంతిమ సంస్కారానికి హాజరై, మా ప్రగాఢ సంతాపాన్ని తెలపాలనుకున్నాం. పరిస్థితులు అదుపుతప్పాయి. శాంతి, భద్రతల రక్షణ బాధ్యత నిర్వహించే జిల్లా అధికార వర్గం మమ్మల్ని వారించారు. మా ప్రయాణం రద్దయ్యింది. సైలెంటుగా దివంగత నేతకు మేము సెల్యూట్‌ చేశాం. విశాలాంధ్ర కోసం ఆత్మ బలిదానానికి మొదటి వరుసలో నిలవాలనుకున్న మా ఇద్దరం, ప్రత్యేకాంధ్రకు ప్రాణార్పణ చేసి అగ్రశ్రేణిలో నిలిచిన వీర కాకానికి జోహారులు అర్చించుకున్నాం!

ఆంధ్రరాష్ట్ర అవతరణకోసం అసువులు బాసిన అమరజీవి పొట్టిశ్రీరాములు పవిత్రాత్మకు శతాధికంగా మనో మందిరంలో భక్తి ప్రపత్తులతో ప్రణామాలర్చించి, 1957లో శాసనసభాసభ్యుడిగా రాజ్యాంగబద్ధంగా అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన జరిగిన 220 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్ర)

సభలో ప్రమాణస్వీకారం చేశాను. నాటికి నేడు మళ్ళీ ఉద్రేకానికి గురై, చిచ్చరపిడుగులా విరుచుకుపడి, గుండెటబ్రద్దలై, ప్రత్యేక రాష్రానికి 'ప్రాణార్చణ చేసిన, “వీర కాకాని అమర్‌ హై” అనుకుంటూ మిన్నకున్నాము.

వీర కాకాని పార్ధివ శరిరంతోపాటు వారి ఆశయాలు కూడ అగ్నికి ఆహుతి అయ్యాయా? ఆత్మార్పణ చేసిన త్యాగధనుడి చితాభస్మం మండి వందల వేల వీరులు ఉద్భవిస్తారంటారు? నేల ఈనినట్లు విజయవాడ పురవీథుల్లో తరలి వెళ్లిన జనప్రవాహం మన కర్మ వీరుని కాటికి పంపేక వారి ఆశయాలూ సమాధిని చేరాయీ?

సమైక్యతా సారథులకు, జగజట్టీలయినా అగ్నిగుండం తప్పదని పగబట్టిన ప్రమథ గణాలకు, ప్రత్యేక ఆంధ్రవాదులకు ఇప్పుడు ఆత్మశాంతి ఎలా లభిస్తోందో! ప్రత్యేక ఆం(ధ్రవాదం ఇప్పుదెక్కడుంది? దీనికి ఎవరు కారణం?

సమైక్యవాదం అన్న గొడుగు కింద సేదతీరి, అధికార రాజకీయ క్రీడలో నూతన పాత్ర ధారులై వెలుగొందుతున్నారు? పి.వికి పదవిపోయింది. కాకానికి అంత్యక్రియలు జరిగాయి. నాటి ఉద్యమకారులు కొత్త అవతారంలో ఉత్తీర్దులయ్యారు! గతంగతః! విస్కృతే-మృతి!

జ్ఞాపకాలు పీడకలలాంటివి. మరుపు మానవుడి వరంలాంటిది! గతం అసంగతం అని సరిపెట్టుకుంటే శాంతి సుఖం.

నాటి సమైక్య వాదుల త్యాగాలు కూడా మరుగున పడ్డాయి! జాతి విస్మరించింది! నేతలకు ప్రజల బలహీనతలు తెలుసు! పదవి ఒక సూదంటురాయి! దాని ప్రభావానికి లోబడనివారు!

షు ఈ ౫

శ్రా న్వచ్చాభారతం 221

ప్రత్యేక ఆంధ్రోద్యమము

ఆంధ్రప్రాంతంలో సమైక్యవాదుల పరిస్థితి, నరకప్రాయంగా ఉందేది. నిప్పుల మీద నడకలా ఉండేది. మంటల్లో మనుగడలా ఉండేది! కంటపడితే మట్టు పెట్టాలని, ఎత్తిన కత్తి దింపకుండా, మనిషిని నిలువునా చీల్చాలని, కసితో కార్చణ్యంతో బుసలు కొడుతూ ఉండే రోజులవి.

జంట నగరాల్లో గుప్తంగా, గోప్యంగా తలదాచుకుని వెలుగులోనికి రాకుండా ఎంతకాలం ఉండగలం? ప్రాణ భీతితో, రక్షణ వలయంలో ఎంతకాలం ఉండగలం? సమైక్యతా వాదుల అంతు చూడాలని పగబట్టి, ప్రతిన బూనిన ప్రత్యేక ఆంధ్రవాదులు కక్షతో, కార్చణ్యంతో రగిలిపోతున్నారు. కొంత కాలానికి తెగించి బయటపడ్డాం. జన జీవన (స్రవంతిలో కలవాలనీ, జీవితపు చేదు నిజాలు అనుభవించి - భరించాలని అనుకున్నాం. ఈ కఠోర సత్యాలు నేనూ, అన్న మండలీ దాదాపు ఒకే రకం ఉత్తరం అచ్చువేయించి, సమైక్య వాదానికి కట్టుబడి ఉండడానికి మా కారణాలు సవిస్తరంగా వివరిస్తూ, గుప్త అనుచరుల సహాయంతో నియోజకవర్గం నలుమూలలా పంచడానికి ఏర్పాటు చేశాం. ఆ ఉత్తరాలు పంచుతూ ఉండగా, ఆరాధ్యుల అప్పారావుని చితక బాదారుట. చచ్చేడన్న అనుమానంతో వదలిపెట్టి వెళ్తే అ గాయాలతో చికిత్స చేయించుకుని ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అప్పారావు! ద్రోణం అజ్ఞాత వాసం

ఈ పరిస్థితులన్నీ కళ్ళారా చూసి, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు ప్రముఖ కార్యకర్తలంతా. (ద్రోణం రాజు సత్యనారాయణ పరిస్థితి దుర్భరంగా ఉన్నందున, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రాణగండం ఎదురౌతున్నందున ఒరిస్సాలో 'సునాబేడాలోని బంధువుల ఇంటికి తలదాచుకోడానికి తరలి వెళ్ళి, పరిస్థితులు చల్లపడ్డాక తిరిగి రాగలనని నాకు చెప్పి, అజ్ఞాత వాసానికి వెళ్ళ నిర్ణయించుకున్నారు. అట్టి పరిస్థితుల్లో నేను విశాఖపట్నం చేరాను. భట్టు ట్రావమా డ్వద వాళు

విశాఖలో బహిరంగ సభ. కమ్యూనిస్టుల పార్టీ ఆది నుంచీ సమైక్య వాదానికి కట్టుబడి ఉన్నందున, ఆ పార్టీ నాయకులతో సంప్రదించి, బహిరంగ సభకు సన్నావోలు చేశాం. విశాఖపట్నం, వెలంపేట సమీపంలో పాత బస్టాండ్‌ వద్ద మైదానంలో మీటింగ్‌ జరుగుతుందని ప్రచారం జరిగింది. పెద్ద స్టేజ్‌ నిర్మాణం చేసి, కుర్చీలు, మైకులు అమర్చారు. సాయంకాలం సమావేశానికి ప్రజలు అత్యధికంగానే హాజరయ్యారు. ప్రప్రథమంగా కమ్యూనిస్ట్‌ నాయకుడు ఎం.వి.భద్రం ప్రసంగంతో సభ ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత నా ప్రసంగం ఉంటుంది. మొదటి అర్ధగంటలోనే వెలుతురు బాగా ఉండగా కొసన నిలబడ్డ దుండగుల గుంపు స్టేజిమీద గురిపెట్టి, చేతి బాంబు విసిరారు. అది స్టేజి వరకూ రాకుండా మధ్యంతరంగా సభికుల మధ్య పడటం వలన షిప్‌యార్డ్‌ ఉద్యోగి ఒకరి చేతి మీదపడి మోచెయ్యి ఎగిరిపోయింది. రక్తం మడుగులో అతను కూలిపోయేడు. (ఢేక్షక జనం చెల్లా చెదురయ్యారు. విధ్వంసానికి పాల్పడ్డ దుండగులు పరారయ్యారు. నెత్తురు కారుతున్న పెద్దమనిషినీ, మోచెయ్యినీ తీసికెళ్ళి కె.జి.హెచ్‌.లో చేర్చించారు. స్టేజి వెనుక భాగం నుంచి వ్యతిరేక నినాదం వినిపిస్తున్నందున మాకు ప్రమాదం పొంచి ఉం దని భావించి రక్షణ కవచంగా ఏర్పడ్డ మిత్రులు మమ్మల్ని వేరే చోటుకు తరలించారు. యస్‌.పి. హెచ్చరిక మీటింగ్‌ రసాభాస అయ్యి, రద్దయ్యింది. ఈ వార్త పట్టణం నలుదిశలా వాయువేగంతో వ్యాపించినందున భీతావహమైన వాతావరణం ఏర్పడింది. ఇంతటితో సమైక్యవాదుల కథ సమాప్తం అయిందన్న గాలికబుర్లు జిల్లా నలుమూలలా వ్యాపించాయి. ఇంతటితో మడం త్రిప్పితే, వెన్ను చూపిస్తే, మరింత భయంకర పరిస్థితులు ఎదర్మోవలసి వస్తుందని, పల్లెటూర్లలో, నా నియోజకవర్ల గ్రామాల్లో మీటింగులుంటాయని ప్రకటించి నేను బయళ్టేరే ముందు, ఎస్‌.పి వచ్చి, నన్ను జీప్‌లో ప్రయాణం చేయొద్దని, 0105664 ౪601160165 ఎందులోనైనా ప్రయాణం చెయ్యమని హెచ్చరించాడు. తీవ్రవాదుల దారుణానికి దొరక్కుండా కాపాడుకునే నిమిత్తం నాకున్నది జీపు మాత్రమే కారులేదు. ఎవరిదో ఎరువు తెస్తే అది తగలబడితే అంతడబ్బు నేనెలా ఇచ్చుకోగలను? ఆకారణంగా “లేదు, జీపులోనే నా ప్రయాణం” అని చెప్పాను. అయితే కనీసం మీరు మధ్యలో కూర్చోండి, బాహాటంగా బయటపడుతూ కొసన కూర్చోవద్దన్నాడు. నా సంక్షేమం కోసం పోలీస్‌ ఉన్నతాధికారి అభిప్రాయం అది. నా అలోచనా విధానం వేరు. నన్ను గురిపెట్టి చేసిన దాడికి నా అనుచరవర్గంని ప్రమాదానికి గురిచెయ్యటం ధర్మం కాదనిపించింది. “లేదు, నేను కొసనే కూర్చుంటానన్నాను. జీపు స్వేచ్చభరతం 2238

బయల్దేరింది. ఆ రోజు మీటింగ్‌లు జరగాలి. మొదటి చోట చిన్న స్టేజి కట్టి, 2 కుర్చీలు వేశారు. జనాలు వేదికకు దూరంగా పలచ పలచగా కూర్చున్నారు. ఫలానా సర్బంచ్‌ అధ్యక్షత వహిస్తారని కిందనుండే ఆయన వేదికమీద నిలబడి, భాట్టం గారి ఉపన్యాసం వినండని చెప్పి, వేదిక దిగిపోయి, (ప్రేక్షకుల్లో కూర్చోడం జరిగేది. బాంబు భీతి అందర్నీ నిలువరించింది. నా ప్రసంగానికి గ్రామాల్లో ఎవరూ అడ్డు తగలకపోయినా, నామీద అభిమానంతోనే గానీ, నా భావాలు ఆమోదించినట్టు కాదని చెప్తూ ఉండేవారు. అలా వారం రోజులపాటు కొంతబందోబస్తు చేసుకుంటూ, కార్యక్రమాలు జరుపుకుంటూ, మళ్ళీ ప్రజలతో మమైక్యం కావడానికి అలవాటు పడ్డాను. క్రమేపీ- గతంలో జరిగిన సంఘటన

ఇక్కడ ఇట్టి ఉదంతం ఇంకొకటి గుర్తుకొస్తోంది. గానీ, తాను గెలవడానికి తనబలం చాలేదికాదు! తాను ఎక్కదల్పుకున్న రైలు 5 నిమిషాలు ముందు దాటిపోయింది అన్నట్లు! గెలుపు అంచులు వరకూ వచ్చి, ఓటమి చవిచూసేవాడు. మారేపల్లి నాయుడు బాబు (సమితి ప్రెసిదెంట్‌) అతడు (వైస్‌ ప్రెసిడెంట్‌ ఇద్దరూ వచ్చేవారు. 1981లో మాత్రం ఇతజ్జి ఎలాగైనా గెలిపించాలని దీక్షతో రాత్రిపూట 2,3 గంటలు అయినా మీటింగ్‌లు పెట్టి ఓటర్ల ఆమోదం కోసం సకల విధాలా ప్రయత్నించేవాణ్ణి. ఈ మారు కూడా బలమైన పోటీయే. ఒకటే సామాజికవర్గం. ఆయన సంపన్న కుటుంబీకుడు, జనాదరణ ఉన్నవాడు. అతడు అన్నిటికీ తెగించి - చావో రేవో తేల్చుకోవాలని గెలుపుకోసం అన్నిటికీ బరితెగించి ఉన్నాడు. సామ, దాన, భేద, దండోపాయాలళో, అన్నిటికేసి సిద్ధంగా ఉన్న పరివారంతో గ్రామాలన్నిటిపైనా నిఘా పెట్టి ఉంచారు. ఎలక్షన్‌ ముందు ప్రచారానికి అదే ఆఖరిరోజు. 6 గంటలు దాటాక మీటింగ్‌లు నిషిద్ధం. నేను మంత్రిగా ఉంటూ, నారాయణమూర్తి గెలుపు సందిగ్ధంలో ఉన్నందున ఆ సాయంకాలం రోడ్డు దిగువున ఉన్న వలస (గ్రామాల్లో ప్రచారంలో ఉన్నాను. 7 గంటలు సమీపిస్తూ ఉండగా కర్రలు పట్టుకుని ఆఖరి గ్రామంలో కొందరు ఘర్షణకు సిద్ధపడుతూ ఉండగా, మా కార్యక్రమం పరిసమాప్తం చేస్కుని రోడ్డు వద్దకు వస్తున్నాం. త్రోవలో 10 మంది పరుగున వచ్చి వ్యాన్‌ ఆపారు. అడ్డు రోడ్డు మీద 200 మంది వరకూ ఉంటారు.

కర్రలు పట్టుకు కాసేరు, ప్రమాదం ముంచుకొస్తుంది అని గుత్తి సర్కారు, నన్ను మధ్యకు జరగమన్నాడు. తాను లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. పక్కవాడి డొక్కలో బళ్ళెం గుచ్చుకుంటే మనం క్షేమంగా ఉన్నామని చంకలెగరేసేవాడూ ఒక మనిషేనా? మొగాదేనా? దమ్ముంటే గుండెలొడ్డి నిలవాలి! లేదంటే పోరాట బాటపట్టకూడదు. పిరికి పందలా ల! భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

ప్రక్కకు తప్పుకోవాలి. పరాయి వాడి ప్రాణం ఒడ్డి, మనం బ్రతికిపోయేమని తప్పించుకునే కక్కుర్తి బతుకు నాకు నచ్చదు!

నేను మాత్రం ముందు సీట్లో యథావిధిగా, నిబ్బరంగా కూర్చున్నాను. రోడ్డుకు అటూ, ఇటూ అరడజను కార్లు పేర్చేసి ఉన్నాయి. లైట్లు మామీద ఫోకస్‌ చేస్తున్నారు. బరిసెలు పట్టుకుని, దాడికి సిద్ధంగా ఉన్న మూకలు రోడ్డు రెండు వైపులాకాసారు. పల్లం భూముల్లోంచి చొచ్చుకుని వచ్చి, రోడ్డు ఎక్కుతున్నాం. లైటు ఫోకస్‌ నాపై పడుతోంది. బారులు తీరి, బడితెలు పుచ్చుకున్న మోతుబరులు, కర్రలు ఎత్తలేదు, కిందకు దింపేశారు. మా వ్యాన్‌ చర్రున ముందుకు దూసుకుపోయింది. కథ సుఖాంతం అయ్యింది. చచ్చీ, చెడి చేయంగల విన్నపాలు అన్నట్టు - నారాయణ మూర్తి, కడకు, సమితి ఎన్నికలలో గెలిచాడు కూడా! పిక్కబలం, కండబలం కాదు, గుండెబలం ఉండాలి. లక్ష్యం మీద నిర్లక్ష్యం పనికిరాదు. గమ్యం మీద గురి ఉండాలి. పనిమీద, పరిశ్రమ మీద నమ్మకం ఉండాలి. ఆశయం మీద, ఆదర్శం మీద, ఆత్మ విశ్వాసం మీద ఆధారపడాలి. ఉడుంపట్టు, ఉక్కుపట్టు వదలకూడదు. జీవితంలో ఏదో సాధించటం కోసం నీ బొందిలో ప్రాణం పోశాడు పరమేశ్వరుడు. ప్రాణం కాపాడు కోవడమే సాధన అనుకోవడం దివాళా కోరుతనం సాధించగలిగినది లేకపోతే జీవించనవసరం కూడా లేదు. నిత్యకృషి, నిరంతర పరిశ్రమ, అలుపెరగని జీవితం, అంతిమ లక్ష్యానికి సరసన చేరుస్తుంది. వ్యక్తిత్వం చంపుకోలేదు!

రాష్ట్రమంత్రి వర్గంలో సభ్యునిగా చేరినంత మాత్రాన, నా నిబద్ధత వ్యక్తిత్వం పూర్తిగా కోల్పోయి, నాయకుల అడుగులకు మడుగులొత్తే పద్ధతికి నేనెప్పుడూ పాల్పడలేదు. నేను సర్వస్వతంటత్రుడిని కాకపోయినా, స్వంతభావాలు యథేచ్చగా అవసరమైనప్పుడు, కుండ(బ్రద్దలు కొట్టినట్లు చెప్పేవాజ్ణి దాపరికం, దాగుడుమూతలులేవు. నా భావ (ప్రకటనకి సమయం ఆసన్నంకాకపోతే ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోడానికి ఆత్మవిరుద్ధంగా ఎన్నదూ వ్యవహరించలేదు. నేను మంత్రిగా చేసిన పి.వి. జలగం, అంజయ్య ముఖ్యమంత్రుల సమయంలో ఎల్లప్పుడూ ఈ విధి విధానాన్నే అనుసరించేవాణ్డి.

పి.వి. ప్రభుత్వ కాలంలో జరిగిన సంఘటనతో ప్రారంభిద్దాం. రాష్ట్రపతిపాలన కొనసాగుతోంది, శాసనసభ్యుల బలబలాలు సంఘటితం చేస్కోడానికి, ప్రతినిత్యం కసరత్తు చేసుకోవలసి వచ్చేది. గ4ఖంగ0/ సభ్యులు మన ప్రక్కన ఉన్నప్పుడు, ఢిల్లీ పెద్దలు (ప్రధాని ఇందిర) తమ చిత్తాన్ని మన నెత్తిన రుద్దాలనుకుంటే, ప్రతిఘటించక తప్పదు అన్నాడు స్వేద్ధాభరతం | 225

పి.వి. విసిగి వేసారి. ఆ సమావేశం అనంతరం ని'ష్రమించేముందు “మీ భావన సరైనది కాదు, అది సవరించుకుంటే మనకే మంచిది” అని చెప్పి వెళ్ళిపోయాను. మరి 3 రోజులు కనబడలేదు. ఒకరోజు పి.వి నాకుకబురంపి, గ్రీన్‌లాండ్‌కు రమ్మన్నాడు. నాలో తప్పేముంది? నిష్కర్షగా చెప్పండి అన్నాడు. మేం ఇద్దరమే ఉన్నాం. సి.ఎమ్‌. అవ్వకముందు, మీవద్ద ఎంతమంది ఉన్నారు? ఆ ప్రసక్తి లేకుండానే మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసిన ప్రధానిని ఎదిరించి, మన బలం గూర్చి, బలగం గూర్చి మాట్లాడడం సమంజసమా? ఈ పదవి ఉన్నంత వరకూ, మనతో ఉంటారు, తరువాత ఎవరి మట్టుకు వారు జారుకుంటారు. పొంగుని బలంగా భావిస్తే అది తప్పిదం అవుతుందన్నాను.” అయితే ఇప్పుడు ఏం చెయ్యమంటారు అన్నాడు. ఢిల్లీ నుండి పరిశీలకుడు రాక ముందే మెజారిటీ సభ్యుల సంపూర్ణ మద్దతు మనకుందని, ఢిల్లీ వెళ్లి ప్రధాని ముందు ప్రదర్శిస్తే తప్పేముందీ మీ విశ్వాసపాత్రుల్ని తప్పించాలనుకోవటం ధర్మమా? అని నిలదీశాడు. అయినా ఆమె అంగీకరించకపోతే తలవంచుతాం అన్నాను. ఆమె ఇష్టాఇష్టాల మీదే ఆధారపడి రాజ్యచక్రం నడుస్తోంది ఈ రోజుల్లో. ఇప్పుడైనా, ఎప్పుడైనా మీ పరపతి పెరుగుతుందేగానీ, తరగదు. ప్రస్తుత పరిస్థితులపై ఆమె అవగాహనబట్టి తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్‌కు చేటు చేయదు, అయినా పోరాడాలి ప్రతిఘటించాలి అనుకుంటే, మీ భవిష్యత్తుకు మంచిదికాదు,” అన్నాను. అయితే ]440గ0/ కి 52% 6410 ఏంటి? “అధిక సంఖ్యాకులు బలపరిస్తే, అది నీకు పరగడుపు అవుతుందా? దిగదుదుపు అవుతుందా" అన్నాడు. “సిద్ధాంతాలు చర్చించటంలేదు మనం, పార్టీ వ్యవహారాల్లో అధినేత! అధిష్టానం నిర్ణయంపట్ల మన స్పందన ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించటం? మన ధర్మమేమిటో అన్నదే ఆలోచిస్తున్నాం, ఆగిరిదాటిపోయి, బరిలో దిగితే, భవిష్యత్తుకు మంచిదికాదని నా భావన” అన్నాను. “సరే మంచిది, లేచిపోదాం. శం4 566 10 ౪౦౪1 95” (నీమాట మరి మారదన్న మాట) అంటూ బయలుదేరాడు. అదే కారులో వెళ్తూ ఎమ్‌.ఎల్‌.ఏ. క్వార్టర్సు వద్ద నేను దిగిపోయాను. పదవిలో ఉన్నన్నాళ్లూ మనచుట్టూ చక్కర్లు కొట్టి - ప్రదక్షణలు చేసే వారంతా మనవారనుకోవడం (భ్రమ. చుట్టూ చేరిన మనష్యులు చప్పట్లు చరిస్తే మనం ఒక - ఊడలు వేసిన మర్రిచెట్టుతోసమానంగా భావించుకుంటే మోసపోతాం. నిజమే అది ఒక చెట్టు-ఒకమాను దానిచుట్టూ తీగచుట్టుకుంటుంది. (అనుచరవర్గం చుట్టూ తిరుగు తున్నాడు) ఆ తీగపైకి పైపైకి ఎగబాకాలని చూస్తుంది. రాజకీయాల్లోనూ అంతే. అధికారపీఠం దక్కించుకున్న వాళ్ల ప్రాపుకావాలి వారి చుట్టంలా కనపడాలి. చూరుపట్టుకు 226 భాట్టం శ్రీరామమూర్తి శ్వీయ చరిత్ర

వేలాడాలి. వీలు చిక్కితే పైకి ఎగబాకాలి. అనుచరగణానికీ నోట్లో నాలిక లేకపోయినా (ప్రణాళిక ఉంటుంది. ఇవి రాజకీయ క్రీడలు పదవీ వ్యామోహాల జాడలు! పదవుల క్రీనీడలు. అధికారాల ఎండమావులు! అంజయ్య హయాంలో సంఘటన

అంజయ్య అమాయకుడో, గడుసరో తెలియదు! రవీంద్ర భారతిలో ఘనంగా పురస్కారాలు జరుగుతున్నాయి దేశ విదేశాలలో లబ్ధి ప్రతిష్ణులైన తెలుగు వెలుగులను ఘనంగా సన్మానిస్తున్నాం. అందులో టి. సుబ్బరామిరెడ్డి పేరు చేర్చమని నాకు ఫోను చేసాడు. నేను నిరాకరించేను. మళ్ళీ మళ్ళీ అదే ఫోను విశ్వావిఖ్యాతి చెందిన తెలుగు వెలుగులు? సరసన స్థానం స్వీకరించే అర్హత ఆయనకు ప్రస్తుతం లేదు. అందుచేత నేను ఆపేరు జతపరుచలేను అన్నాను. “నువ్వు మొండిమనిషివయ్యా” అంటూ ఫోను పెట్టేసేడు!

ఆంధ్రప్రదేశ్‌ వృత్తి కళాకారుల సమాఖ్య అంటూ ప్రముఖ సినీనటి పెట్టిన ఆ సంస్థ వార్షికోత్సవానికి గవర్చరు, సి.ఎం.తో సవిీ నేనూ మరికొందరు మంత్రులం హాజరయ్యేము. సి.ఎం. ప్రక్క సీట్లో నేనూ కూర్చున్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు చొక్కా పట్టి వెనక్కు లాగేడు. సి.ఎం. చెవి ఆయన నోటి దగ్గరకు చేర్చేను. “జమునను ఎస్‌.ఎన్‌. అకాడమి అధ్యక్షురాలిగా చేస్తాం అని చెప్పు” అన్నాడు. “ఇప్పుడు కాదు తరువాత చెప్తాను” అంటూ నా ప్రసంగం యథావిధిగా కొనసాగించేను. ముమ్మూరు చొక్కాలాగడం నేను ఆ ప్రకటన చేయకుండా ప్రసంగం ముగించడం జరిగింది. నేను కూర్చున్నాక నాకోసం కూడా ఒక ప్రకటన చెయ్యవా! అన్నాడు సి.ఎం. “మనం జనం మెచ్చుకొనే మాట అనాలి కదా” అన్నాను. పక్కలో పొడిచేడు ఊరుకున్నాను. తరువాత తదుపరి చర్యలు చేపట్టాను ఎస్‌. ఎన్‌. అకాడమిని 3 ముక్కలు చేస్తూ. జమునమ్మను పిలిచేను. నాటక అకాడమికి మిమ్మల్ని అధ్యక్షురాలను చేస్తున్నాం. అందుకు సంతోషం అంది.

ఇతర పదవుల్లో ఎవరిని పెట్టాలో చెప్పమని కోరేను. ఆమె సంబరపడి పోయింది. ఏ.ఆర్‌.క్రిష్ట పేరు నాటక శిక్ష విద్యా సంస్థ నిర్వహణ బాధ్యతలు పెట్టేను. ఆతరువాత అదే విధంగా సంగీత అకాడమి గురించి మద్రాసు ఫోన్‌ చేసేను. బాలమురళి అందుకున్నారు ఫోను. సంతోషంగా పని చేస్తానన్నారు. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గారు ఉన్నారు. వారిని సలహాదారుగా వేసేను.

నృత్య అకాడమికి నటరాజు రామకృష్ణ అధ్యక్షులు. సలహాదారుగా వెంపటి చిన్న సత్యంగారిని నియమించేం. అందులోని సభ్యులు కూడా వారి ఆమోద ముద్ర పొందడం స్వేద్ధాభరతం 227

మంచిదని చర్చలు కొనసాగిస్తూ రోజులు గడుపుతున్నాను. అక్కడ సి.ఎం. అంజయ్య నియమించిన భారీ మంత్రి వర్షం పరిహాసపాత్రంగా తయారైనందున ఆ సంఖ్య తగ్గించడానికి కసరత్తు ప్రారంభించేరు. ఎవరి తల తెగిపదుతుందో తెలియదు! మంక్రులంతా ముఖ్యమంత్రి కంచు గోడల మధ్య జరిగే పరిణామాల్ని వేచి చూస్తున్నారు. ఆత్మ రక్షణకు వ్యూహరచన చేసుకుంటున్నారు! అకాడమి పునర్నిర్మాణానికి కుస్తీ పట్లు పడుతున్న నన్ను “రేపేమౌతుందో అన్న ఆలోచన మీకు లేదా?” అని అడిగేరు కొందరు. “నా పని నేను చేయాలి. దైవం తనపని తనే చేస్తాడు. పదవి! విధి నిర్వహణలో నిమగ్నం కావడమే నా ధర్మం. పదవి ఉంటుందా? ఊడుతుందా అన్న (ప్రశ్న నాకు ఉత్పన్నం కాదు” అకాడమిల పునర్నిర్మాణం ఫైల్‌ మీద సి.ఎం. సంతకం పడాలన్నదే ముందు నా ధ్యేయం. పదవి ప్రాణ వాయువుకాదు. ప్రజాహితం కోసం తుదిక్షణం వరకూ పాటుపడటమే మానవధర్శం. నిస్వార్థంగా, నిష్మళంకంగా అంకితం చేసిన ప్రజాసేవే పరమాత్ముడు పూజా పుష్పంగా స్వీకరిస్తాడు. దేహం ధరించిన ప్రతిమానవుడు ఆఖరి క్షణం వరకూ తన దేహాన్ని దేశసేవకోసం వినియోగించాలి. అందుకు వినియోగపదని దేహం ఒక పుట్టగొడుగు! ఒక తోలు తిత్తి! ఒకమైనం ముద్ద. దుర్గంధభూయిష్టమైన మలమూత్రాల సంచి. ఒక ఎముకల గూడు! దానిని సేవించడం కన్నా విసర్జించడం మేలు! యింకా రాయదగ్గది ఎంతో ఉంది - మీకు తెలుపవలసినది చాలా మిగిలే ఉంది. ఈ ౬ 228 యా భాట్టం శ్రీరమమార్తి ద్వయ చుట్రు

జలగం పాలనలో ప్రగతి - సుగతి

ఒకమారు అసెంన్లీ ఆవరణంలో నాటి విద్యామంత్రి ఎస్‌.పి.బి. పట్టాఖిరామారావు నన్ను పిలిచి కలియుగ రాక్షసుడ్ని మీరు చూసారా అన్నాడు. రాక్షసుడా! అన్నాను “ఆ రాక్షసుడే” అన్నారాయన. “దైవ కృపవలన నాకు తారసపడలే"దన్నాను. “ఐతే ఖమ్మం జిల్లా వెళ్లండి. జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు రూపంలో కనబడతా”దడన్నాడు. జలగం వెంగళరావుని నాటి విద్యామంత్రి అభివర్ణించిన విధానమిది.

ఆ తరువాత కూడా విన్నాను. వెంగళరావు మాట కాదంటే ఎవడూ బతికి బట్టకట్టరని. అతని నోటిలో నోరుపెడితే కాటికి సిద్ధపడాలి. చండశాసనుడు. ఎత్తిన కత్తికి ఎదురులేదు. జలగం ఒక జలంధరుడు. ఇవి పూర్వం అతని గురించి నేను విన్న మాటలు.

వాళ్ళ తమ్ముడు కొండలరావు మాతో ఎమ్‌.ఎల్‌.ఎ. గా ఉన్నాడు. నాకు బాగా తెలుసు. సౌమ్యుడు, నెమ్మది నిదానం. ఇదీ ఆయన విధానం. తంటాలు తెచ్చుకోడు. లోక కంటకుడుకాదు. అసభ్యకార్యక్రమాలపట్ల ఉదాసీనత ఉపేక్ష ఇవి ఆయన లక్షణాలు.

ఆయన అన్న వర్ణన వింటే గుండెగుభేలు మంటుంది. అతన్ని చూశాను, కలిసి. ఆయన ఎమ్‌.ఎల్‌.ఎ అయ్యాక అసెంబ్లీ ఆవరణలోనే అందరిలాగే ఉన్నాడు గాని అడుగడుగునా ఒక హుందా. ఒక ఆధిక్యత ఉట్టిపడుతూ ఉంటుంది. సంభాషణా చతురుదే. గాని ఒక్కొక్క మారు అతని హావభావాలు చూస్తే కల్లు జిగ్గమంటాయి. భగ్గున మండుతాడేమోనని, ఉరుముతాడేమోనని. సాదా సీదా మనుష్యులు ఆయన దగ్గర భయభక్తులతో ఉంటారు. పుట్టుకతోనే ఉట్టిపడిన హుందా అది. అధికార హోదా ఎప్పుడూ అతన్ని వెన్నంటి ఉంటుంది. సహజంగా సిద్ధించిన భావగాంభీర్యం. అతని (ప్రత్యేక అలంకారం.

తరచు నాసీటు ప్రక్కనే కూర్చొనేవాడు. చాలా కమిటీల్లో ఇద్దరం కలిసి పనిచేశాం. అదేం చిత్రమో దైవం మా ఇద్దరిని ఒకే గూటికి చేర్చాడు. డా॥చెన్నారెడ్డి పంచాయితీరాజ్‌ స్వేద్భాభారతం 229

మంత్రిగా ఉండేవాడు. స్టేట్‌ చాంబర్‌ ఆఫ్‌ పంచాయితీ రాజ్‌ అనే సంస్థను స్థాపించి. వెంగళరావుని అధ్యక్షుడుగా, నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమించాడు. “ఈ చాంబర్‌ కార్యకలాపాలు ఎలా నడిపిస్తారో మీ ఇష్టం. మీ ఇద్దరిమీద ఆశలు పెట్టుకున్నాను. దేశంలో మనరాష్ట్రం ఫస్టు, బెస్టు, అనిపించాలి” అన్నాడు చెన్నారెడ్డిగారు. “మీరే చూస్తారుగా! మా ప్రత్యేకత! మే చేసిన పనులే చూపిస్తాయి. వేయి మాటలెందుకు” అన్నాడు వెంగళరావు. పంచాయితీ రాజ్‌ ఛాంబర్‌ ఆ ఛాంబర్‌లోనే తిష్ట వేశాడు. నిద్రహారాలు అక్కదే. మిత్రులు, సన్నిహితుల భోజన భాజనాదులు కూడా అక్కడే. తనకు బాగా సన్నిహితుడ్ని ఒక ప్రముఖ ఉద్యోగిని ఛాంబర్‌ కార్యదర్శిగా నియమించుకున్నాడు. అతడు గట్టివాడు. కాని ఆయన అధ్యక్షుడికే జవాబు దారి. ఇతరులకు లొంగడు, వాంగడు, కొరకబడదు. ముఖ్యమైన ఫైళ్లు అన్నీ రాత్రివేళ నేరుగా వెంగళరావు టేబులు మీద పెట్టేవాడు. తెల్లవారేసరికి అన్ని ఫైళ్లు చూసి సంతకాలు చేసి క్రింద పడేసేవాడు వెంగళరావ్‌. నేను మధ్యాహ్నం పూట ఆఫీసుకు వచ్చేవాడ్ని ఆ ఫైళ్ళు అన్నీ నా టేబులు మీద పెట్టేవాడు. తీరా చూస్తే అన్నింటిమీద అధ్యక్షుల వారి సంతకాలు అయ్యాయి. అధ్యక్షుని ఆమోద ముద్రపడిన తరువాత నేను చూడడమెందుకు అని అడిగితే. మీకూ తెలియాలికదండీ ఇక్కడేం జరుగుతోందో అనేవాడు ఆఫీసు కార్యదర్శి. అక్కడ జరుగుతున్న తతంగం అంతా తెలుసుకొని నేను తరించాలన్నమాట. ఇది ఓకే. తదుపరి చర్య తీసుకోండి ఉత్తర్వులు జారీ చెయ్యండి అనేవాడు. అప్పుడప్పుడు నాతో కులాసా కబుర్లు చెప్పేవాడు వెంగళరావుగారు. పంచాయితీరాజ్‌ వ్యవస్థ గురించి సాధారణ చర్చ కూడా జరిగేది. కానిపైన వివరించిన ఈ ఫైళ్ల తంతు మామూలే. నేను దగ్గర ఉంటే మీరు చూసి నాకు పంపించండి అనేవాడు. లేకపోతే తానే ఉత్తర్వులు జారీ చేసేవాడు. ఆఫీసు పని సజావుగా సాగిపోతోంది. అసలే అతనికి అరివీరభయంకరుడనే బిరుదులన్నీ ఉన్నాయి. కొత్తగా తగువులు తద్దినాలు నేనెక్కడ నెత్తిన తెచ్చిపెట్టుకోవడం? తరచూ ఆఫీసుకు వెళ్ళడం మానేసేవాడ్ని. నా ప్రమేయం లేకుండా కూడా రోటీన్‌గా నడిచిపోయేది. కొంతకాలం చూసి రాజీనామా లేఖ ముందు వెంగళరావుకు పంపించాను. “ఎందుకింత పనిచేశారు. హాయిగా యిద్దరం కలిసి పని చేసుకుంటున్నాం కదా!” అన్నాడు. “మీకు పంచాయితీ రాజ్‌ విషయాలు కొట్టినపిండి. నాకు అసెంబ్లీ చర్చలపట్ల ఆసక్తి ఎక్కువ. నామమాథత్రంగా నా పేరుండం మంచిదనుకొంటే మీ ఇష్టం” అన్నాను. “నా నేమ్‌బోర్డు అలాగే ఉంచాలనుకుంటే అలా ఉంచండి లేదా ! 280 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్రు

నా రాజీనామా లేఖ చెన్నారెడ్డిగారికి మీ సిఫారసుతో పంపించండి.” అన్నాను. “మీరు మాత్రం అప్పుడప్పుడు రావడం మానొద్దు మనం మాట్లాదుకోవలసినవి చాలా ఉన్నాయి” అన్నాడు. అలాగేనంటూ ఉదడాయించాను. ఒక సంవత్సర కాలం తరువాత నా రాజీనామ. అమల్లోకి వచ్చింది. పెద్దవాడితో తగవు ఎందుకు? ఎవరు కోరిన పదవి ఇది! నాకు వేరే హంగులూ ఆర్భాటాలు అక్కరలేదు. అసెంబ్లీలో నాగొంతు గింగురుమంటే చాలు. ఇంతకీ వెంగళరావుకి నాకు మధ్య అరమరికలు లేవు. ఎవరైనా పెద్ద వాళ్లు ఆఫీసుకువస్తే నన్ను పరిచయం చేస్తే “చాలాగట్టి వాడండీ ఈయన. అసెంబ్లీలో ఈయన ధాటీని తట్టుకొనేవారే అరుదు” అనేవాడు. పి.వి. మంత్రివర్గంలో మే మిద్దరం కూడా పనిచేశాం. హోమ్‌ శాఖ నిర్వహించేవాడాయన.

నక్సలైట్లను పిట్టల కొట్టినట్లు కొట్టిపారేయమన్నాడు. పడపడపడ కాల్చి పారేశారు. శవాల ఆనవాలు కూడా దొరికేవి కావు. శ్రీకాకుళం జిల్లాలో నక్సలైట్లని తుడిచిపెట్టిన ఘనకీర్తి ఆయనకు దక్కింది. పోలీసు అధికారుల మీద ఈగవాలనిచ్చేవాడు కాదు. రక్షకభటుల వ్యవస్థమీద గట్టి పట్టుండేదాయనకి. అప్పటికే బాగా రాటు తేలాడు. ఆమాట ధాటీ కూడా అలాగే ఉండేది తుపాకీ తూటాలాగ. తాను ఒక స్టూర్‌పటేల్‌ని అనుకొనేవాడు. జిల్లా సంచార కార్యక్రమాల్లో వందిమాగధులు అలాగే స్తోత్ర పాఠాలు వల్లించేవారు. అతదేం చెప్పినా ఒక శాసనం. అతడు ఉక్కుమనిషి అనే కీర్తి సంపాదించాడు.

పి.వి. తరువాత అతడే ముఖ్యమంత్రి అయ్యాడు. దేశంలో ప్రజాస్వామ్యం (బ్రతికి ఉంది అన్న ఆనవాలు కావాలి కదా! ఎమ్‌.ఎల్‌్‌ఎ. ల అభిప్రాయసేకరణచేసి తరువాత ముఖ్యమంత్రిని నిర్ణయించాం. అంటే ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టినట్లే కదా! కేంద్ర పరిశీలకునిగా దీక్షిత్‌ రాక!

ఈమారు ప్రముఖ జాతీయ నాయకుడు ఉమాశంకర్‌ దీక్షిత్‌ను పంపించింది పరిశీలకుడుగా ప్రధాని ఇందిరమ్మ. పి.వి.ని తప్పించడానికి ఈ తతంగం జరుగుతుందని ఎవరికి తెలియదు? ముందే జలగం పేరు నిర్ణయం అయ్యింది? తరువాత కంటి తుడుపుగా జరుగుతున్న తతంగం యిదంతా! జలగానికి ఒక ప్రత్యేకత ఉంది. అతణ్ణి తెలంగాణావాదని అనుకోవచ్చు. ఆంధ్రప్రాంతానికి చెందినవాడిగా చెప్పవచ్చు. గట్టి మనిషి. తగువులెత్తకుండా చూస్తాడు అని కేంద్రం నిర్ణయానికి వచ్చింది. కాబోయే ముఖ్యమంత్రి కనుసన్నల్లో మెలగాలని ఎవరికి ఉండదు. శాసన సభ్యులు ముందుగా వారింటికి వెళ్లి దర్శనం చేసుకోవడం తరువాత దీక్షితుల దగ్గరకు వెళ్ళి అతని పేరు చెప్పడం జరిగేది. శ్యచ్చాభాతం

అన్న మండలి మన నిర్ణయం ఏమిటని అడిగాడు. “వెంగళరావు అంటే మాకూ అంగీకారమే. కాని ఆ పేరు చెప్పం. అసలు ఎవరిపేరు చెప్పం. పి.వి.ని బ్రహ్మానందరెడ్డి గారిని అడిగి వారు చెప్పిన పేరు ఖాయం చేస్తే పదికాలాలు ప్రభుత్వం నిలుస్తుంది అని చెప్తాం.” ఇదే నేను చెప్పబోయే సారాంశం. అన్నకు కూడా తనకి అదే నచ్చిందని చెప్పాడు. మా గ్రూపు ఆరుగురు ఎమ్‌.ఎల్‌.ఎ లము వెళ్లి ఆవిధంగా సాక్ష్యం చెప్పి వచ్చాం. ఇది కొంత రిస్కుతో కూడుకున్న పనే. కాబోయే ముఖ్యమంత్రి వెంగళరావే అని తెలుసు మనకి, అతని పేరు చెప్పకపోతే అతన్ని వ్యతిరేకించినట్లే కదా! మరి మమ్మల్ని ఇన్నాళ్లు చేరదీసి పెంచి పెద్ద చేసిన బ్రహ్మానందరెడ్డి, పి.వి.లను మర్చిపోతే ఎట్లా అని అనుకున్నాం. ముందుంది ముసళ్ల పండుగ. గద్దెనెక్కి ఏ చిక్కులు తెచ్చి పెడతాడో అన్న భయం లేకపోలేదు. రాజభవన్‌లో దీక్షిత్‌ దగ్గర ఏం జరిగేదో ఎప్పటికప్పుడు గూఢచారులు కబుర్లు మోసేవారు వెంగళరావుకి. ముఖ్యంగా డి.జి.పి., ఎమ్‌.వి.నారాయణరావు ఉన్నాడు. మొత్తం కథ అంతా అతడే మోస్తాడు. సరే, మంచిది చూద్దాం. జలగం బలగంతో చేరాలా? ఆరోజు రాత్రి విజయనగర్‌కాలనీలో ఉన్నాను. తొమ్మిదిదాటిన తరువాత ఫోను (మోగింది. “నేను వెంగళరావుని మాట్లాడుతున్నాను” అన్నాడు. నమస్మారంసార్‌. చెప్పండి అన్నాను. భాట్టంగారు నేను ఎవ్వరినీ ఏ కోరిక కోరను. ఆ అలవాటు నాకు లేదు. మీకు నా సంగతి బాగా తెలుసు. ఎవ్వరినో కాదు. మిమ్మల్ని ఒక్కరినే అడుగుతున్నాను. ఉదయాన్నే మీ సహచరులు, అనుచరులు వెళ్లి ఏం చెప్పారో మర్చిపోండి! మీరొక్కరే వెళ్లండి. రేపు ఉదయం దీక్షిత్‌ని కలిసి నా పేరు చెప్పండి. మిమ్మల్ని తప్ప వేరెవర్ని ఇలాగ అడిగేవాజ్ణి కాదు. ఆ సంగతి మళ్లీ మీకు చెబుతున్నాను అన్నాడు. నేను మీకు చాలా చాలా కృతజ్ఞుణ్ణి. అంటూ అందరితో కలిసి వెళ్లి ఒక మాట, నేను వంటరిగా వెళ్లి ఇంకోమాట చెప్పడం ఏం భావ్యం? ఒక్కమనవి. మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం. నేను చెప్పినా చెప్పకపోయినా మీకే పట్టాభిషేకం కడతారు గాని మామాటలే మాకు చేటు తెస్తాయేమో! అన్న జంకు ఉంది. ఎంతచేస్తే అంత అనుభవించక తప్పదు కదా! అన్నాను. ఫోను పెట్టేశాడు వెంగత్రావ్‌. శంకర్‌ దయాళ్‌ శర్మ ఆదరణ వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యాడు. మంత్రివర్గ నిర్మాణం జరుగుతోంది. బరిలో చాలామంది ఉన్నారు. అందరూ ఢిల్లీలో ౫. 2 భవనం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. మా వాళ్లు నన్ను ఢిల్లీ వెళ్లమన్నారు. వెంగళరావు కొలువు తీరి ఉన్నాడు. దర్బారు 282 భాట్టం శ్రీరామమూర్తి (్వీయ చరిత్ర

సాగుతోంది. నా చీటి వెళ్ళింది. వెంటనే రమ్మన్నాడు. రహస్యం లేదు. అందరూ ఉండగానే మాట్లాడాడు. “శ్రీరాంమూర్తిగారూ! మొదటి లిస్టులో మీ పేరు లేదు. నన్ను బలపరిచిన వారిని ముందు చేర్చుకోవాలి కదా! ఇక రెండవ లిస్టు ఉంటుంది. అందులో వీలు చూసుకొని మీ పేరు చేరుస్తాను. అందర్ని కలుపుకుపోవాలని ఉంది నాకు.” అని ముగించాడు. శలవు తీసుకొని మర్నాడు వెళ్లాను! మరలా “శ్రీరాంమూర్తిగారూ! రెండవ లిస్టులో మీ పేరు చేరుద్దామనుకున్నాను. ఇప్పుడది సాధ్యపడేటట్లు లేదు. కాంగ్రెస్‌ (ఢ్రైసిడెంటు శంకర్‌ దయాళ్‌శర్మ నాకు ఒక చీటి ఇచ్చాడు. అందులో ఎమ్‌.ఆర్‌.డీన్‌ పేరు ఉంది. కాంగైస్‌ ప్రెసిడెంటు మాట ఎలా కాదనగలను” అన్నాడు. “ఈ విషయం శంకరదయాళ్‌ శర్మగారిని అడగవచ్చా.” అన్నాను. “ఓ! తప్పక అడగండి. నేను చెప్పానని కూదా చెప్పండి. అతని మనసు మారితే నాకూ సంతోషమే” అన్నాడు.

మర్నాడు గ.1.6.6 ఆఫీసుకు వెళ్లి చీటి పంపాను. వెంటనే పిల్చి మంత్రి వర్గంలో నీ కెలాంటి అవకాశాలున్నాయి అని అడిగాడు. “నాకు చాన్సు లేకుండా మీరే చేశారట ” అన్నాను. నేనా! నీకు అద్దుతగులుతానా? ఎవరు చెప్పారో చెప్పు! అన్నాడు. జ్రైంగళరావు” అన్నాను. “అతని దగ్గర నీపేరు రాలేదే” అన్నాడాయన. అలాక్కాదు ఎమ్‌.ఆర్‌.డీన్‌ అన్నపేరు గల చీటి మీరు ఇచ్చారట. అతడికిస్తే మరి నాకు ఛాన్సు ఎక్కడుంటుంది? “ఆ రైటే. ఆ పేరు ఉపసంహరించుకుంటే నీకు స్థానం యిస్తాడా!” అన్నాడాయన. (ఫ్రకృద్దీన్‌ ఆలీ అహమ్మద్‌ యిస్తే ఆ పేరు వెంగశ్రావుకు యిచ్చాను. నీకు దెబ్బ తగులుతుందని నాకేం తెలుసు? ఒక్కపని చెయ్యి ఆతని మంత్రివర్గం లిస్టు నా దగ్గరే ఉంది. తీసుకువెళ్ళడానికీ, సాయంకాలం నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నీ సంగతి అడిగి తెలుసుకుంటాను. రేపు ఇదే టైముకు ఆఫీసుకు వస్తే చెప్తాను.” అన్నాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు. నామీద నిండా అభిమానం పెద్దాయనకు. అందుకే చనువు తీసుకొని మాట్లాడాను. మర్నాడు ఆఫీసుకు వెళ్తే, షేకేండు ఇచ్చాడు. “కంగ్రాట్యులేషన్సు!” అన్నాడు. “వెంగళరావుకి నీమీద మంచి అభిప్రాయం ఉంది. నీలాంటివాడిని తీసుకోడం అతనికీ మంచిది అనుకుంటున్నాడు. నేను ఇచ్చిన చీటీ తెచ్చిన చిక్కు యిది! నాకు ఆ పేరు ఎవరిదో తెలియదు. ఆ మనిషినీ తెలీదు. ఫక్రుద్దీన్‌ ఆలీ ఇమ్మంటే యిచ్చాను. రెండోలిస్టుతో నా ముందుకు వచ్చినప్పుడు శ్రీరామమూర్తి పేరు కలిపి తీసుకురా. ఆ చీటి గురించి మర్చిపో అని చెప్పాను వెంగళరావుకి. సంతోషంగా అలాగే అన్నాడు. అందుకే నీకు కంగ్రాచ్యులేషన్‌ చెప్పాను” అన్నాడు. నేను కృతజ్ఞతలు చెప్పాను. “నాకు కాదు వెంగళరావుకి చెప్పాలి. అతనికి నీమీద గురి ఉంది. నీలాంటివాడిని కలుపుకుంటే రాష్ట్రానికీ మంచి పేరు వస్తుందని ఆశపడుతున్నాడు”. స్వేద్భభరతం | 28కి

ఇప్పుడు నీకు ఒక సలహా యివ్వాలి. మనమధ్య జరిగిన విషయాలు బయటపడితే టెలిగ్రాంలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడతాయి. నీకు వ్యతిరేకంగా. ఎవ్వరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లిపో! భగవంతుడిని వేడుకో. “వేంకటేశ్వరస్వామిని ప్రార్ధించు.” చేతిలో ఉన్న కప్పుకాఫీ, నీనోటి దగ్గరకు వచ్చేలోగా మధ్యన ఎన్నో ఆటంకాలు రావచ్చు, కలగవచ్చు. “లాల ల 206 1, 4ల6 2) 06 200 28 51ష్టా” ఇక్కడితో కథ ముగియలేదు! వైజాగ్‌ టూర్‌ సి.ఎం. వెంగళరావు వైజాగ్‌ టూరు వస్తున్నాడు మొదటిలో సూర్యనారాయణ రాజు పేరు ఉంది. తంగేటి వారికి పట్టపగ్గాలు లేవు, సందడే సందడి. ఆనంద తాండవం చేస్తున్నాడు. మన శ్రేణులు నిరాశతో మునిగిఉన్నారు వారికి ఊరట ఎలాగు కలుగుతుంది. వైజాగ్‌ నుండి ఫోన్‌ చేశాను ముఖ్యమంత్రికి. “మేం ఒక కార్యక్రమం పెట్టుకుంటాం ఒక గంట స్పేర్‌ చెయ్యండి” అన్నాను. “నాకు అభ్యంతరం లేదు గాని టైము ఎక్కడ ఉంది?” అన్నాడు ఆయన. మధ్యాహ్నం 8-4 గంటల మధ్య అన్నాను. “ఆ టైములో ఏ కార్యక్రమం జరుగుతుంది” అన్నాడు. ఘనంగా చేస్తాము. వైజాగ్‌లోనే చేస్తాం. గంట గంటన్నర రాటకుందా చేస్తాం అన్నాను. “అయితే మీ ఇష్టం నేను వస్తాను మీరు చేసుకోండి" అన్నాడు. న్‌ మాకు కార్యక్రమం ఇచ్చేటప్పటికి తంగేడు ప్రభువులు కత్తులు నూరుతున్నారు ఉరుములు ఉరుముతున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు. ముఖ్యమంత్రి రాగానే సర్మూట్‌ వహౌసుకి వెళ్లి కలిశాన్సు. “సూర్యనారాయణ రాజుతో చెప్పారా?” అని అడిగాడు వెంగళరావు చెప్పలేదూ అన్నాను, “పెద్దవాడు. మంత్రివర్గ సభ్యుడు. అతనితో చెప్పకపోతే ఎలాగ? వెళ్లి చెప్పండి! కిందగదిలో ఉన్నాడు? అన్నాడు. “వెళ్లి చెప్తాను గాని, అతని నోరు మంచిదికాదు. క " పడుతు. “|లకు వెలితే తగవు కొని తెచ్చుకాన్నట్లవుతుంది. మీకు చిరా అన్నాను. “నేనేం అనుక్రోనుగ్న ముందు అతనికి వెళ్లి చెప్పిరండి” అన్నాడు: వెల్లి చెబి బు ఈ నీ వరే నేనెందుకు రావాలి? ఎవ్వరిని అడిగ మీటింగుపెట్టారు? ముందో వళమ చెప్పలేదు? అడ్డమైన వాళ్లూ మీటింగులు పెట్టేస్తే తోకాడించుకొంటూ వెనకొలి నాపని | వ్‌ తు చించుకుంటు అడ లం అని అరుస్తున్నాడు. ఉరుముతున్నాడు. క్‌ 0 గ మీరు వను ణ్‌ “నా కూ చిరెత్తుకొచ్చింది. గాన్ని మర్యాద తప్పగూడదుకదా! “*9 జ మనిషిని ల రాసూ వెళ్తున్నానని అన్నాను. “ఏమండోయ్‌! నేను ఇలాంటి అలౌం | షని కాను, [7 రానంటేరాను, రాన్సగాక్ష రాను! ముఖ్యమంత్రి వచ్చిచెప్పినొ రాను చత డా భాట్టం శ్రీరామమూర్తి స్వీయ చి

అని ఖరాకండిగా చెప్పాడు. ఈ విషయాలుచెప్పగానే “సరే మనం వెళ్దాం పదండి” అన్నాడు వెంగళరావు. మీటింగు ఘనంగా జరుగుతోంది. మధ్యలో నా ప్రక్క తిరిగి శ టాబ్‌ ఎప్పుడు వస్తున్నారని అడిగాడు. పదిపదిహేను రోజుల్లో అన్నాను. పే బయలుదేరండి” అన్నాడు. అంతే. ఆవిధంగా మర్నాడు బయలుదేరి హైదరాబాద్‌ చేరుకున్నాను. మంత్రివర్గంలో చేరడానికి నా సమ్మతి తెలియపర్భమంటూ ముఖ్యమంత్రి రాసిన ఉత్తరం ఇంటిలో ఉండి ఉంది. ఆవిధంగా మంత్రివర్గంలో చేరాను. ఎన్ని అరిష్టాలు? ఎన్ని ప్రతిష్టంభనలు? అడుగడుగుకీ ఆటంకం! అన్నీ గండాలే! సుడిగుండాలే! విచ్చుకత్తులతో పోరాటాలే! విచ్చిన్నకరశక్తుల ఆర్భాటాలే! నా జీవితంలో అన్నీ అగంతకాలే! అకాలమేఘాలే! ఏ క్షణం జీవితం ఏమలుపు తిరుగుతుందో! ఉట్టిఎక్కగలమా? కైలాసమార్గం కనిపెట్టగలమా? దారితప్పలేను - దాసోహం అనలేను! అడుగడుగునా గమ్యాన్ని గమనాన్ని నిర్దేశించే అద్భశ్యశక్తుల (ప్రాబల్యంతో, వెనకపడినా ముందుకు పడడమే జరుగుతోంది! నా రాజకీయ జీవితంలో వ్యూహం లేకపోవడమే వ్యూహం! నేటి కర్తవ్యాన్ని నీతి నిజాయితీలతో నిర్ణయించుకుంటే, రాబోయే రేపు చల్లని చూపు చూస్తూంది! దిశానిర్దేశం దశా నిర్ణయం విధాత చేతుల్లోనే ఖరారవుతుంది! వెనుకపడితే వెనుకేనోయి! ముందుపడితే ముందేనోయ్‌! పది-లేచే- కదలితరంగంలో ముందుకు దూసుకుపోవోయ్‌! వెంగళరావ్‌ పరిపాలనా దక్షత వె సుస్థిరమైన ప్రభుత్వం, పటిష్టమైన పరిపాలన, పారదర్శకంగా కార్యకలాపాలు ఇద్ర 0గళరావ్స హయాంలో ప్రధానంగా పేర్కొనవలసిన అంశాలు. మధ్యకాలంలో వచ్చిన ఎమర్షన్సీలో క్రూడా విచ్చలవిడిగా రెచ్చిపోవడం, ఏ వర్శాన్నో అణగదొక్కడం. ముట్టు పెట్టడం, ప్రొంసను పాదుచేయడం వంటి దుశ్చర్యలు లేవు. వెంగళరావు పరిపాలనా దక్షుడు. క్రమశిక్షకు మారుపేరు. నియమ నిబంధనలు ఉల్లంఘించదు. ప్రజాసంబంధ సజావుగా క్రానస్తాగృతాయి. వందలమంది వచ్చినా దర్శనం దొరక్క నిరాశలో వెనుదిరగడం ఉండదు. నిముషమో క్షణమో ఎంతో కొంత సమయం దొరుకుతుంది. అర్జీలు అందుక్షుంట్రాడ్రు. గోడువింటాడు. వచ్చిన మనిషి నొచ్చుకోకుండా నచ్చుకొని వెళతాడు. స్మ ట్రైషే కూడా అదే తంతు. కార్యదర్భులను విశ్వాస పొత్రులను ప్రత్యేక కార్యదర ౧ ట్టకుంట్రాడు. ప్రతీ ముఖ్య ప్రతిపాదన మీద తీన్‌ మనసువిప్పి ముందే చెప్తాడు. ఈదన్స్బ్య వ ము గవ నేబిలుపై పెట్టిన ప్రతీ ఫైలుపై వీ స్యా 235

అదేరోజు సంతకం పడుతుంది. సంతకం పెట్టిన ఫైలు సారాంశం తన మనసులో మెదులుతుంది. అద్భుతమైన జ్ఞాపకశక్తి. పోలీసు జాగిలాలు పనిచేసి వార్తలు చేరుస్తాయి. ఎందరో వేగులవారు గూఢచారులు వార్తలు చేరవేస్తారు. అందరి మంత్రుల పనులు ఒక కంట కనిపెట్టి ఉంటాడు. రాజకీయంగా ఎక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టడంలో తన ప్రతిభ అనితరసాధ్యం. ఇంటికి ఫైళ్లు మోసుకెళ్లడం ఉండదు. అసెంబ్లీలో పలుశాఖల ప్రశ్నలకి దీటైన జవాబు చెప్పగలడు. బనియను తొడగడు, అండర్‌వేర్‌ వేయడు. కందువ వాడడు. విజయవాడ వంటి నగరాల్లో భారీ ఊరేగింపుల్లో అనేకమార్లు పాల్గొన్నాడు. ఎన్ని కండువాలో! ఎన్ని పంచల చాపులో! దండలకు లెబ్బలేదు. వెనకాల జీపులు నిండిపోయేవి. అందులో ఒక్కటంటే ఒక్కటీ ఇంకొకరికి ఇచ్చిన దాఖలాలేదు. ఏం చేసేవాడో? ఎలా అనుభవించేవాడో? సిద్ధార్ధ ఇంజనీరింగ్‌ కళాశాల ఒకమారు కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగు కాలేజీ పెట్టడానికి అన్న మండలి వద్దకు వస్తే ఫోన్‌ చేసి నా దగ్గరకు పంపాడాయనను. టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరుకు ఫోన్‌ చేసి నాలుగు రోజులు లోగా ఫీజి బులిటీ రిపోర్టు ఇమ్మన్నాను. ఇది ఎలా తెలిసిందో? ఎవరి వలన విన్నాడో? మరికొంతమంది కోటీశ్వర్లు కుమ్మక్కయి వెంగళరావుని కలిస్తే తక్కిన ఫైళ్లు వెనక్కుపెట్టి సిద్దార్ధ కాలేజీ గురించి రిపోర్టు రెండు రోజుల్లో తన ముందు ఉంచమన్నాడు డైరెక్టరుతో. కోనేరు లక్ష్మయ్య కాలేజీ వెనక్కు వెళ్లింది. సిద్ధార్థా ఇంజనీరింగు కాలేజీముందు మంజూరు అయింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త వై. నాయుడమ్మ వస్తే ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముచ్చటగా నన్ను కూడా మెచ్చుకొని నాలుగు మాటలు చెప్పి ప్రసంగం ప్రారంభించాడు ముఖ్యమంత్రి. మొదటి రోజుల్లో సదవగాహన అలాగ ఉండేది. సత్సంబంధాలు కొనసాగేవి. పూర్వం (బ్రహ్మానందరెడ్డి హయాంలో పి.వి.నరసింహారాన ఉపయోగపడ్డట్టు తన పాలనలో ఆ రీతిని (అంత మేధా సంపద లేకున్నా) నీవు ఉపయోగపడాలని ఆశించేవాడనుకుంటాను. ఇందిరాగాంధీ హైదరాబాద్‌ 1975 నవంబరు 17వ తేదీన విచ్చేసినప్పుడు లాల్‌ బహదూర్‌ స్టేడియంలో జరిగిన బ్రహ్మాండమైన మీటింగులో ప్రధాని ప్రసంగాన్ని నన్ను తెలుగులో తర్జుమా చెయ్యమన్నాడు. అందరూ మెచ్చుకున్నారు. తానూ సంతోషపడ్డాడు. ఇంతటితో మన రాజులు చెలరేగిపోయారు. రంగంలోకి దిగారు. చెప్పింది చెప్పకుండొ రోజూ ఏదో నూరిపోసేవారు నామీద, బి.బి.నగర్‌ రైల్వేలైను 7-4-1974లో ప్రారంభించిన సమావేశంలో కూడా ప్రధాని ఇందిర ప్రసంగానికి నేనే తెలుగులోకి తర్చుమా చేశాను. 236 భాట్టం శ్రీరామమూర్తి ఢ్వీదు చల

దాంతో మన రాజులు రెచ్చిపోయారు. కుప్పిగెంతులు ప్రారంభించారు. నాకు ప్రాధాన్యత లేకుండా చేయడమే వారి ప్రధాన కర్తవ్యం. నన్ను కంటకప్రాయంగా చూసేవారు. జలగం చెవి కొారకడమే పనిగా పెట్టుకున్నారు. చెప్పింది చెప్పకుండా నామీద కుంటిసాకులు చెప్పేవారు. నన్ను బయటకు తెస్తే కొరివితో తల గోక్కున్నట్టే అని ప్రచ్చన్నంగానే గాక, బహిరంగంగా కుళ్లు కక్కేవారు. పి.వి. బ్రహ్మానందరెడ్డిని మింగేవాడు. భాట్టం భాగోతం తరువాత బయటపడుతుంది నేనుకూడా అతన్ని మింగేస్తాను! ఇప్పుడు భాట్టం వంతు. జలగం జాగాలో సర్దుకుంటాడు. అంటూ నామీద కట్టుకథలు చెప్పేవారు, . కుళ్లు వెళ్లబోసేవారు. నాపై జలగానికి అపనమ్మకం పెరగాలి. విశ్వాసం తరగాలి. నా ప్రాధాన్యత తగ్గాలి. నా పని త్రోసిరాజు ఆటకట్టు అనిపించాలి. మిత్ర బేధానికి శ్రీకారం చుట్టారు. ఎవ్వరిని కలిసినా నామీద చాడీలే. అవాక్కులు చెవాక్ళులే. ఇంత చెప్తూ ఉంటే, అందులో కొంతైనా నిజం ఉండకపోతుందా అన్న లెక్కకు వస్తారు. ముఖ్యమంత్రి కూడా మానవమాత్రుడే. కట్టకడపటికి నన్ను ఒక కంట కనిపెట్టి ఉండాలన్న దగ్గరనుండి కొంత మట్టుపెట్టి ఉండాలన్న వరకు వచ్చాడాయన. సంక్షేమశాఖ పునరుజ్జీవనం

ఈలోగా నేను సాంఘిక సంక్షేమ శాఖను పునరుజ్జీవనం చేయాలనే పథకం చేపట్టాను. బడా పెట్టుబడిదారులు, ధనిక భూకామందులు, జాగీర్‌దారులు మొఖాసాదార్లు అభివృద్ధి నిరోదకులు పంచాయితీ రాజ్‌ సంస్థలను తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. వాళ్ల కబంధ హసాలనుండి సాంఘిక సంక్షేమశాఖను విముక్తి చేయాలి. జిల్లాపరిషత్‌ల కార్యాలయాల్లో మారుమూల గదుల్లో మగ్గుతున్న సంక్షేమ కార్యాలయాలను బయట భారీ అద్దె గృహాల్లోకి తరలించి స్వేచ్చగా నిర్భయంగా పేదసాదల బతుకులు బాగుపర్చే పనులు చేపట్టాలని ఆదేశించాను. స్వంతంగా స్వతంత్రంగా ప్రత్యేక కార్యాలయాలు నడుపుతూ స్కాలర్‌షిప్పులు ఇవ్వడం బలహీన వర్గాలకు ఇండ్లు మంజూరు చేయడం వంటి అనేకానేక కార్యాక్రమాలు జిల్లాల్లో డిప్యూటీ డైరెక్టర్లు చేపట్టడం పెద్దలకు కన్నుకుట్టింది. మాది పేద సాదల కోఠి! జిల్లాపరిషత్‌లు ధనిక పెత్తందార్ల కోటలుగా జనం చెప్పుకుంటున్నారు. ఈర్చ్యా అసూయలు ప్రారంభం అయ్యాయి.

మహిళలకు 5% హరిజనులకు 14% జిల్లాపరిషత్‌ ఆదాయంలో ఖర్చు చేయాలన్న రూలు బయటకు లాగాను. ఖర్చుచేయని మొత్తం కక్కిస్తాను. ఇది కాలదోషం పట్టని పద్దు. ఎస్‌. టి.లకు చెల్లించవలసిన డబ్బు కూడా ఉంది. పేదల డబ్బునంజుకున్న వాళ్లు. హరిజన గిరిజన బడుగు బలహీన వర్హాల ద్రోహులనిపించుకుంటారు. అట్టి వాతావరణం స్వేచ్చభరతం 287

తయారయ్యింది. ఇది మురిగిపోయే డబ్బు కాదు, ఆ డబ్బు కక్కిస్తానన్నాను. మా గల్లాపెట్టె ఖాళీ అవుతుంది. మేం ఏమౌతాం? అంటూ మొరపెట్టారు ముఖ్యమంత్రి దగ్గర. విశాఖలో మామీద కక్షబూని ఈ కూపీలన్నీ బయటకు లాగి మామీద దుమారం రేపుతున్నాడు. అప్రతిష్టపాలు చేస్తున్నాడని రాజులు మొరపెట్టారు. ముఖ్యమంత్రి నన్ను నిలువరించబోవడం కూడా నిజమే. కాని పేదసాదల శాఖ స్వీకరించాను. వారి యోగక్షేమాల పట్ల ఉపేక్ష వహించడం ధర్మంకాదు అనుకున్నాను. కాలేజీ చదువులు, పోస్టు (గ్రాడ్యుయేట్‌ చదువులు ఇంజనీరింగు వంటి సాంకేతిక విద్య నేర్చుకునేవారికి, జీతాలు ప్రభుత్వం కట్టాలి. ఈ నిర్ణయం తీసుకున్నాను. జి.ఒ. జారీ అయింది. గెజిటెడ్‌ ఉద్యోగాలన్నీ సంపన్న కుటుంబాలకేనా? ఉన్నత వర్ధాలకేనా? పై చదువులు చదువుకున్న బడుగు బలహీన వర్గాలకు ఉన్నత ఉద్యోగాలు (ప్రాప్తించవా? వారికి శిక్షణ తరగతులు ఏర్పాటుచేశాను. టైబల్‌ కల్చరల్‌ రీసెర్చి ట్రయినింగ్‌ సెంటర్లు వారికి ఈ బాధ్యత అప్పగించాను. వందలమంది తయారవుతారు. ఇప్పుడు జిల్లాస్థాయి ఉద్యోగాల మాటేంటి? ఐ.ఎ.ఎస్‌., ఐ.పి.ఎస్‌. ల్లో ఎందరు వెనుకబడిన తరగతులవారు ఉన్నా ఎస్‌.సి., ఎస్‌.టి.లు ఎంతమంది? వాళ్ల ఖర్మ ఏం కాలింది? మనమెందుకున్నాం ఈ పదవుల్లో! వాళ్లకీ శిక్షణ తరగతులు ప్రారంభించాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్లను నియమించి ఈ పథకాన్ని నడుపుతున్నాను.

పేదల పిల్లలకు పనికిరాని పాఠశాలలా? ధనికులకు ప్రత్యేక ప్రఖ్యాత పాఠశాలలా? బడుగులకు కూడా. రెప్యుటెడ్‌ స్కూల్సులో కొన్ని సీట్లు కేటాయించాలి. ఖర్చు ప్రభుత్వం భరించాలి. నృత్యం, సంగీతం నేర్చుకున్నవారికి ధనరూపేణా ప్రోత్సాహకాలు కల్పించాలి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి గ్రంథాలు కొనుక్కోవాలి. దానికి ప్రభుత్వం సాయం చెయ్యాలి. ఈవిధంగా బహుళ ప్రయోజనాలు ఆశించి పలు రకాల కార్యక్రమాలు చేపట్టాను.

హరిజన, గిరిజన మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు అనాచారాలు అరికట్టాలి. దురంతాలను దునుమాడాలి. దోషులను శిక్షించాలి. ఈ కార్యక్రమం ఎంత చురుగ్గా కొనసాగుతుందో పరిశీలించేందుకు అన్ని రాజకీయ పక్షాలతో కూడిన శాసనసభ కమిటీ ఏర్పాటు చేశాం. పబ్లిక్‌ అకౌంట్‌ కమిటీ, ఎస్టిమేట్‌ వంటి ప్రతిపత్తి వాటికి ఉంటుంది. వారి నివేదిక శాసనసభకు సమర్పిస్తారు. ఈవిధంగా ఇట్టి అభ్యుదయకర పద్ధతులతో పేదల ప్రయోజనాలు పరిరక్షించాలని ముందంజవేశాను. బి.సి., ఎస్‌.సి. ఫైనాన్సు కార్పొరేషన్లు నెలకొల్పాను. పేద (ప్రజలకు వృత్తి ఉపాధులు కల్పించేందుకు ధన సంపాదన మార్గాలు చూపించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం, బుణసహాయం 298 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్రు

ఈ సంస్థలు అందించాలి. ఈ రకంగా పరుగులు తీసుకొని జోరందుకొని మున్ముందుకు కొనసాగుతున్న ఈ సంక్షేమశాఖ ముకుతాడువేయడం ఎవరితరం? ఉప (ప్రణాళికకు సి.ఎం. విముఖత

మానవ జీవితం మెటలుగు పడాలని, సాంఘిక సంక్షేమ శాఖ వలె ప్రభుత్వంలోని అన్ని శాఖలు వాటి నిధుల్లోని కొంతభాగం బలహీనవర్ధాల బ్రతుకు కెరువు బాగుపడాలని వారి నిధుల్లోని కొంత భాగం ఖర్చు చేయాలి. చదువు శాతం తక్కున ఉంటే విద్యాశాఖ, పరిసరాల అపరిశుభ్రత అయి అనారోగ్యకారణాలైతే ఆరోగ్యశాఖ, రహదార్లు నిర్మాణానికి అయితే, రోడ్లు భవనాల నిర్మాణశాఖ. ఇలా అన్ని శాఖలూ తమ నిధుల్లో కొంత శాతం హరిజనాభ్యుదయానికి దీనజనోద్దరణకు కేటాయించి కార్యక్రమాలు చేపట్టాలి. ఢిల్లీలో అఖిలభారత స్థాయిలో సంక్షేమ శాఖామాత్యుల సదస్సులో ఈ 920 12 (ఉప ప్రణాళిక) సిద్ధాంతాన్ని పథకాన్ని ప్రతిపాదించడం నాటి హోంశాఖామాత్యులుగారయిన ఓం మెహతాగారు ఇది ప్రభుత్వ పథకంగా నిర్ణయించడం జరిగింది. ఈ సదస్సుకు ప్రధాని ఇందిర, బాబూ జగజ్జీవన్‌రామ్‌ కూడా హాజరయ్యారు.

ఈ విధాన ప్రకటన చూసి వెంగళరావు మండిపడ్డాడు. ఢీల్లీనుండి దిగబడ్డ ఉన్నతాధికార్లతో వాదానికి తలపడ్డాడు. దేశరక్షణ శాఖ, విదేశాంగ శాఖ, న్యాయశాఖ, హోంశాఖ వంటి శాఖల్లో మీరు ఎంత శాతం కోతపెట్టి పేద వర్ణాలకు ఇవ్వగలరు? అన్నాడు! ఆ ఉక్రోషం నామీద చూపించాడు! హరిజన మహాసభలంటూ పెట్టి జనాన్ని ఊదరగొట్టాడు భాట్టం. మాలమాదిగ వర్గాలను రెచ్చగొట్టాడు. సంజీవయ్య నగర్‌, అంబేద్యర్‌ నగర్‌, బాబూ జగజ్జీవన్‌రాం నగర్‌ అంటూ వారికి కొమ్ములిచ్చాడు. అత్తమీద కోపం గిత్తమీద చూపినట్లు, రాజులను దెబ్బతీయాలన్న కోపంతో రాష్ట్రంలో కలకలం రేపుతున్నాడు. అంటూ ముఖ్యమంత్రి ఆవేశపడ్డాడు.

కాకి మాధవరావు వరంగల్‌ జిల్లా కలెక్టరు. అతన్ని మాశాఖ డైరెక్టరుగా నియమించమన్నాను. అతను నక్సలైట్‌ నేను ఒప్పుకోనన్నాడు సి.ఎం. నేను పట్టుపడితే ఆఖరుకు అతణ్ణి ఇచ్చాడు. నా ఆలోచనా విధానంలో ముఖ్యమంత్రికి తీవ్రవాదం కన్పించింది. హరిజన మహాసభల అనంతరం ఆ శాఖను నానుండి బదిలీ చేసి మంత్రిమహేంద్రనాథ్‌కు అప్పగించాడు.

పదవులు పట్టుకొని ఉద్యమాలు నిర్మించడం దుస్సాధ్యం! ప్రభుత్వ కార్యక్రమాలు సామాజిక వ్యవస్థలో మార్పు సాధించడం అసాధ్యం!

'స్వేచ్భాభారతం లం

గిరిజన శాఖ గిరిజన సమస్య పట్టుకున్నాను సమూలంగా మార్పులు తెచ్చే ప్రయోగాలు చేపట్టాను. శేదరికం రూపుమాపడం, (ప్రభుత్వ వ్యవస్థకు అసాధ్యమా? పంచాయితీ రాజ్‌ పుట్టినప్పటినుండి ప్రతీ గిరిజన సంస్థలోను కోట్లు కోట్లు గుమ్మరించినా కొండజాతి (ప్రజల కడుపు నింపలేకపోతున్నాం. ఎందుచేత? విద్య విజ్ఞానాలు అందించలేకపోతున్నాం. ఎందుచేత? ఉపాధికల్పనా కార్యక్రమాలు ఎన్నిఉన్నా వారికి చేతినిండా పని, కడుపునిండా తిండి దొరకదెందుకు? అటవీ సంపదకు (01651 [౯౫1౧౦ 1064806) గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేం? దోపిడీ వ్యాపారాన్ని ఆపలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా? జి.సి.సి. వైఫల్యాలను దుయ్యబడితే తప్పా? ఈ మంత్రాంగం మీద పట్టు బిగించి ప్రధాన అధికారిని నిలదీస్తే ముఖ్యమంత్రిలో అసహనం పుట్టుకొచ్చింది. ఉన్నతాధికారులను రాసిరంపాన పెడుతున్నామన్న అభిప్రాయం పుట్టుకొచ్చింది. అధికార పరిధిలో చట్టాలు చేపట్టి సోషలిజం కోసం కలలు కనడం నిష్ప్రయోజనం! ఆచరణ సాధ్యంకాని ఆలోచనలతో అధికార గణాన్ని ఉక్కిరిబిక్కిరి చెయ్యడం మంచిపని కాదంటాడు ముఖ్యమంత్రి. ప్రజా ప్రతినిధులు అధికారవర్గాలు చెరో కొమ్ముకాసి ప్రభుత్వ రథాన్ని నడిపించాలి! ఇది వారి అభిప్రాయం. రౌతు కొద్దీ గుర్రం! అన్నట్టు స్వారీ చేసే గుర్రం నోట్లో కళ్ళెం బిగించకపోతే తిక్క పుట్టి నిన్నే ఎత్తి కుదేస్తుంది. ఇదీ నా భావన. మచ్చిక చేసుకొని కావలసిన కార్యాలను సాధించుకోవడం మంచిది. ప్రభుత్వ పనుల్లో సింహభాగం ఆవిధంగానే నెరవేరుతాయి. అధికార వర్గాల విశ్వాసానికి పాత్రుడైనవాడే పరిపాలనా దక్షుడు. ఇది ముఖ్యమంత్రి భావనా సరళి *ల్యు21120 1 2 0410240126 20008 02624026 అధికారులే పరిపాలకునికి కండ్లు చెవులు, వాళ్ల కళ్లద్దాలతో చూస్తే పరిపాలనా సౌలభ్యం ఉంటుంది అన్నది ముఖ్యమంత్రి విశ్వాసం. నా దృష్టిలో లుందాం ఇంటి & 00660621 0626 [00 కట య20. ౮౧016166 00లడం/ 13 ౪056 120 2610020 54071721 01 గం0000120/ 12063 2 ౪611016 య21ఆ86 గంగి 16 ₹28్రటోఆ 0% 00620010. ఇది నా అభిప్రాయం. “సోషలిస్టులకు వేపకాయంత వెర్రి ఉంటుంది.” అన్నాడు ముఖ్యమంత్రి నాతో. ఆ వెర్రి ముదరకముందే [గ్రంథ రచన చేబడితే మీరు రాణిస్తారు అన్నాడు వెంగళరావు. ఎప్పుడు ఎవరిని నిలదీయాలనుకున్నా వారిని వెనకేసుకొచ్చేవాడు. ఇక ఆగడం లేదు. అదను దొరికితే సాగి ప్రభువులకు సహకరించేవాడు. మల్లీ ఈ మారు ప్రధాని 240 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్ర)

ఇందిర మూడోమారు రాష్ట్రానికి వస్తోంది. విశాఖపట్నంలో కార్యక్రమం. అక్కడ గద్దెనెక్కి ప్రధాని ప్రక్కన నిలబడి తెలుగులో తర్జుమా చేస్తుంటే రాజుల పరువేమౌతుంది? ముఖ్యమంత్రికి మొక్కడం ప్రారంభించారు. ఎమ్‌. సత్యనారాయణరావుకి తర్జుమా చేయడం బాధ్యత అప్పగించాడు ముఖ్యమంత్రి. సాగివారాక్కరూ నన్ను తట్టకోలేకపోతున్నారని తేలిపోయింది. మంత్రి వర్గం నాల్గవ దఫా విస్తరణ జరుగుతోంది. కొమ్మూరి అప్పుడు దొరను మంత్రి మండలిలో చేర్చారు. నాకన్నా ముందుపేరతనిది. మంత్రసాని పని చేసేటప్పుడు, బిదొచ్చినా పట్టాలి! దొడ్పొచ్చినా పట్టాలి. అన్న సామెత నాకు సరిపోయింది ఇప్పుడు. అనకాపల్లి శర్మ సవాల్‌

జిల్లా పరిషత్‌ అధ్యక్ష స్థానానికి చిన్నమీసాలతో పోటీ చేసేటప్పుడు అనకాపల్లి శర్మ (ఎ.ఐ.సి.సి. మెంబరు) అనేవాడు “విశాఖ జిల్లా పరిషత్‌ అధ్యక్ష స్థానానికి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను” అని తప్పులేకుండా తెలుగులో వ్రాస్తే శ్రీరాంమూర్తిని పోటీనుండి విరమింపజేస్తాం అనేవాడు. సవాలు విసిరేవాడు. ఫైలుమీద చిన్నసంతకమా? పెద్ద సంతకమా? అని అడిగి పెట్టేవాడు. ఇప్పుడు అప్పడుదొర విషయంలో ఇంకోరకం సవాలు విసిరాడు మనవాడొకడు. “అతని సంతకం చూపించి చదవనక్కరలేదు. అది దుస్సాధ్యం, అది ఏ భాషో చెప్పుకుంటే చాలు. దొరకే కిరీటం పెడతాం” అనేవాడు. ఇదీ నేనెదుర్కొన్న పెత్తందార్ల జ్ఞాన విజ్ఞానాలతంతు.

ప్రతిఘటనా పర్వం నర్సీపట్నం ప్రాంతంలో ఉద్వేగభరితంగా ఊరేగింపులు కొనసాగుతున్నాయి. అసంఖ్యాకంగా జనప్రవాహం. అడుగడుగునా మడుగులొత్తే పరిస్థితులు! జంరూ మారుతంగా ఎదురు బెదురులేకుండా సాగిపోతున్న కార్యక్రమాలు! ఇసుకపోస్తే రాలని జనం! గోడలు, మిద్దెలు ఎక్కి చెవి కోసుకొని వింటున్నారు! ఆనందంతో ఉ(రూతలూగుతున్నారు ప్రజలు! సాగి వారికి దడ పట్టుకుంది! కన్నుకుట్టింది. ముఖ్యమంత్రి చేతులు పట్టుకున్నారు. ఇవి చేతులుకాదు. కాళ్లనుకోండి శ్రీరామమూర్తి గారిని నిలువరించకపోతే మా పరువు పోతుంది, మాప్రతిష్ట దెబ్బతింటుంది మా ఏరియాలో అతడెందుకు అడుగుపెట్టాలి అని ప్రాధేయపడ్డారు.

ముఖ్యమంత్రి నన్ను పిలిచాడు. “నర్సీపట్నం ఏరియా ఎందుకు వెళ్తారు మీరు?” అన్నాడు కరుకుగా. “ఏ పదవీలేనపుడు జిల్లా అంతటా తిరిగేవాడిని. ఆ ఏరియా కూడా తిరిగాను ఇప్పుడు పదవి వచ్చాక రమ్మంటే రానని ఎలాగ చెప్పగలను? నేనేమి స్వేచ్చభరతం 2

దుప్ప్రచారము చేయలేదు, ఎవరిమీదా! ఏదైనా తప్పుమాట అంటే మీరు నన్ను నిలదీయండి” అన్నాను. “ఏమైనా ఇది మంచిపని కాదు. ఒకరి ఏరియా మీద ఇంకొకరు దండయాత్రకు దిగడం ఎలా సమర్థిస్తాం. ఒకే కేబినేట్‌లో ఉన్న ఇద్దరు మంత్రులు ఇలా తలపడితే ఎలా?” అన్నాడు కఠినంగా, కఠోరంగా. ఈ పరిస్థితి పునరావృతం కాకూడదన్నాడు. ఈ సంకేతాలు అవగతమౌతున్నాయి!

మాడుగుల టూరు బేక్‌!

ఈ మారు అటుకాదు. నర్సీపట్నం కాకుండా మాడుగులవైపు వెళ్తున్నాను. చాలారోజులయింది అటువెళ్లి. ప్రజలు పదేపదే రమ్మని కోరుతున్నారు. కళావతి (స్థానిక ఎమ్‌.ఎల్‌ఎ.) తో ముందుగా చెప్పి ఆమెను కూడా పిలవమన్నాను. కార్యక్రమం తయారయింది. కరపత్రం అచ్చువేశారు. పంచారు. నేను రాజకీయ బిక్ష పెట్టిన కళావతి ముఖ్యమంత్రికి ప్రీతిపాత్రమయింది. జిల్లాలో నా బలం తగ్గిపోయిందని నన్ను మంత్రివర్దం లోంచి తప్పిస్తే ఆమెకు నా స్థానం దక్కుతుందని కొందరు కిరైక్కించారుట. ఆమెకు బుర్ర తిరుగుడు ప్రారంభం అయింది.

“కళావతికి చెప్పారా?” అని అడిగాను. “ఆమె రానంది ఒక్క ముఖ్యమంత్రి కార్యాక్రమానికైతే వస్తాను. ప్రతీ మంత్రితో తిరగమంటే నేను తిరగను. నాకూ బోలెదన్ని పనులు ఉంటాయి.” అందట విసుగుకుంటూ. కురచారామునాయుడు- ఈ మాట చెప్పాడు. “అయితే సరే! నేను వస్తాను. కార్యక్రమాలు చేసుకోండి” అన్నాను. నా కార్యక్రమాలకు ముందురోజు నేరుగా హైద్రాబాద్‌ ముఖ్యమంత్రి దగ్గరకు చేరుకొంది

కళావతి. నా కార్యక్రమం జరగకుండా ఆపుచెయ్యమని. ఆమెకు తగు హామీ లభించింది. ఓ.ఆ.అన్నాడు.

ఇక్కడ వైజాగ్‌ నుండి ఉదయం మాడుగుల బయలుదేరే ముందు జాయింట్‌ కలెక్టరు హడావిడిగా వచ్చాడు నా దగ్గరకు. “సర్‌! ఏదో అర్జంటు పనుందట. ముఖ్యమంత్రిగారు మిమ్మల్ని వెంటనే బయలుదేరి విమానంలో హైదరాబాదు వచ్చేయమన్నారు” అన్నాడు. నాకు దీని అర్ధం బోధపడింది. పరిస్థితులు మారిపోయాయి. కొత్త సమీకరణలో ఎలా ప్రవర్తించాలో తెల్ప్సుకొంటాను అనుకొని జాయింట్‌ కలెక్టరుతో “సరే! మంచిదండి. ముఖ్యమంత్రి సందేశం అందించినందుకు కృతజ్ఞుణ్ణి.”అన్నాను. ఆయన వెళ్లిపోయాడు. నేను యథావిధిగా ఆరోజు మాడుగుల కార్యాక్రమాలన్నీ ఘనంగా, జయప్రదంగా జరుపుకొని (సుర్నాటి కార్యక్రమాన్ని రద్దు చేసుకొని) అర్ధరాత్రికి విశాఖపట్నం చేరుకున్నాను. 2త2 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్ర)

మళ్లీ ఈమారు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు వచ్చాడు. మెసేజ్‌ పట్టుకొని “సి.ఎమ్‌. వెంటనే మిమ్మల్ని హైద్రాబాద్‌ రమ్మన్నారన్నారు” అన్నాడు. సరే వెళ్తానని చెప్పాను. హైదరాబాద్‌ చేరాను.

శృతిమించి పాకాన పడుతోంది అటో ఇటో తేలిపోతుంది! మనం అన్నిటికీ సిద్ధమే! ప్రజల దగ్గరకు వెళ్తే పరవళ్లు త్రొక్కుతారా? రంకెలు వేస్తారా? విమానంలో వెళ్లి ఇంటికి చేరి మా ఆవిదకు చెప్పాను. “రెండురోజుల్లో ఈ బంగళా ఖాళీ చెయ్యాలి, సామాన్లన్నీ సర్దుకొని సిద్ధంగా ఉండండి” అన్నాను. “నాకేం సామాన్గున్నాయండి. ఈ పుస్తకాలు ఫైళ్లకట్టలూ అన్నీ మీవే. నాకెంతసేపు రెండు గంటలు చాలు” అంది మా ఆవిడ. “జ్వంత్రక్తీ ఇప్పుదేమొచ్చిందండి, ఈ (ప్రాణంగండం. క్షణాలమీద ఖాళీ చెయ్యమంటున్నారు?” అని అడిగింది. “నేను ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాలి. ఐదున్నర గం.లకు రమ్మన్నాడు. ఆ తొందర్లో ఉన్నాను, ఆ తర్వాత చెప్తాను. వివరాలు” అని సరాసరి సి.ఎమ్‌. ఇంటికి వెళ్లాను. రాజీనామా పత్రం

“నమస్మారం” అన్నాను. నా నమస్కారం అందుకోలేదు. “నిన్న రమ్మంటే ఎందుకు రాలేదు?” అని నిలదీశాడు. చండశాసనుడిలా కనబడుతున్నాడు! ఉగ్రరూపం ధరించాడు “బోలెడు డబ్బు ఖర్చుపెట్టి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకున్నారు. హఠాత్తుగా ఎగ్గొట్టేస్తే ప్రజలు బాధపడతారు. అది నాకు ఇష్టం లేదు. ఇంతకీ ఈవాళ వచ్చాను కదా! చెప్పండి నేనేం చెయ్యాలో” అన్నాను. నా జవాబు విని తెల్లబోయాడు. “మీ సంగతేం బాగులేదండి. ఏం చెయొద్దంటే అదే చేస్తారు. నర్సీపట్నం వెళ్లొద్దంటే అక్కడికే వెళ్తారు! హైదరాబాద్‌ రమ్మంటే రారు! ఇక్కడ ముఖ్యమంత్రి అంటూ ఒకడు ఉన్నాడని మీకు తెలియదా? నామాట అంటే అంత భఖాతరులేదా? మీ పనేం బాగులేదు! *! ౦|౫ ౫10% 9801 011025 1 100/ 0201060” అన్నాడు తీవ్రంగా తోక తొక్కిన పాములా విరుచుకుపడుతూ. అదే మంచి మాట. “అంత నేరం చేసిన మనిషి మీ కేబినెట్‌లో ఉండకూడదు. రాజీనామా తీసుకొని బయటకు పంపించేయండి. మంత్రిని ఎవరు ఎన్నుకొంటారు? ముఖ్యమంత్రినే ఎన్నుకొంటారు ఆయన ఇష్టపడి వేసిన మనిషే మంత్రి అవుతాడు! ఆయనకు ఇష్టం లేకపోతే మంత్రివర్గంలో స్థానం- ఎలా ఉంటుంది? ఎమ్‌.ఎల్‌ఎ. గా అసెంన్లీలో సంతోషంగా కూర్చుంటాను!” అన్నాను.

ఒక్కమారు ఉలిక్కిపడ్డాడు. “ఏడండీ ఆ మనిషి! ఆ ఫైలు వచ్చిపడిఉంది నా దగ్గరో. “ఏ మనిషండి? ఏం ఫైలు” అన్నాను. “మీతో వచ్చాడు. ఆ మీసాల పంతులు రాంబాబు! స్వేచద్భాభరతతం 248

రాజులు అడవి కొట్టేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. అతనూ” అన్నాడు. “ఇప్పుడతడు ఎక్కడున్నాడో నాకేం తెలుసు? కనుక్కోమంటే కనుక్కుంటాను!” అన్నాను. “వెంటనే తెప్పించండిఅన్నాడు. “సరే మంచిది” అని దండం పెట్టి లేచిపోయాను! గత చరిత్ర చెప్పిన గుణంపాఠం నాకు కంఠోపాఠం నాకు బాగా జ్ఞాపకం పి.వి.జి.రాజు సంజీవయ్య మంత్రివర్గంలో సభ్యుడు. ఎందుకో అలిగాడు. (నాకు కారణం తెలీదు) ముఖ్యమంత్రిని కలవకుండా ముఖం చాటేశాడు. తరువాత కేబినెట్‌ మీటింగులో ఎదురుపడగానే ఒళ్లు మండుతోంది, రక్తం పొంగుతోంది. రాజా బహుదూర్‌ కదా! “ఇలా చేస్తే నేను మీ కేబినేట్‌లో ఉండను"అన్నాడు సంజీవయ్యతో. “అహా! రాజూ! నీకు రాజీనామా చేయాలని ఉందా? ఎప్పుడో ఎందుకు? ఇప్పుదే చెయ్యి! కాగితం ఉందా? తీసుకో ఈ కాగితం. ఇప్పుడు, ఇక్కడే నీ రాజీనామా అంగీకరిస్తా” అన్నాడట. పి.వి.జి, రాజుకి తిక్కతిరిగింది. బింకం అణిగింది. దిమ్మ తిరిగింది. ఉలకడు! సలకడు! “కాగితం కావాలా? ఇదిగో తీసుకోగొ అన్నాడు మళ్లీ సంజీవయ్య. పి.వి.జి. (య్రాన్పడి ఉన్నాడు మూతికట్టుకు కూర్చున్నాడు. ఆ తర్వాత సంజీవయ్య వేరే విషయం చేపట్టాడు. మీటింగు తరువాతే పి వి.జిరాజు బయటకు వచ్చాడు. అతడు చస్తే రాజీనామా చెయ్యడు! ముఖ్యమంత్రి మాత్రం అతడి నుండి ఏ ఫైలు వచ్చినా అడ్డంగా రాసి త్రిప్పికొట్టేవాడట! ప్రతీ ప్రతిపాదన తిరస్కారానికి గురిఅయ్యేది! ఇది నాకు బాగా జ్ఞాపకం, తొలగడమో - తొలగించదడమో తేడా వచ్చిన తరువాత తొలగడమో, తొలిగించడమో? తప్పుకోవడమో! తప్పించడమో! ఏదో ఒకటి జరగాలి. మర్నాడు రాజీనామా పత్రం శుభ్రంగా టైపు చేయించి సంతకం పెట్టాను. సి.ఎం. దగ్గరకు వస్తానంటే నిన్నటి టైమే ఐదున్నరగంటలకు నిర్ణయించాడు. నేను వెళ్లేటప్పటికి ఎవ్వరూ లేరు సి.ఎం. గడపలో. వెళ్లగానే షేక్‌హాండు ఇచ్చి కూర్చోమన్నాడు. ఇది అపూర్వం, గంట కొట్టి కాఫీ తెప్పించాడు. ఇది ఇంకో అద్భుతం! ముందెన్నడూ ఈ గౌరవం లభించలేదు! నిన్నటి సంగతి ప్రస్తావనే లేదు! రాష్ట్రాన్ని బాగుచేయడానికి ఏ పథకాలు ప్రవేశపెట్టాలని చూస్తున్నాడో - సత్వరాభివృద్ధి సాధించే దిశలో ఎటువంటి వ్యూహరచన చేస్తున్నాడో - తక్షణ ఫలితాలు ప్రజలకు లభించేందుకు ఏ కార్యక్రమాలు తలపెట్టాడో - దాదాపు 20-80 నిమిషాలు చెప్పడం ప్రారంభించాడు. నన్ను ఎంతో విశ్వాసంలోకి తీసుకొని ఆడుతున్న మాటలవి. ఆయన ఎంత చెప్పినా నా దృష్టిమాత్రం నా జేబులోని రాజీనామా పత్రంపైనే ఉంది. ప్రస్తుత 244 ఎ భాట్టం శ్రీరామమూర్తి గ్వీయ చంత్రు

పరిస్థితుల్లో అది బయటపెట్టడం తప్పిదమవుతుంది. ఇంటిమీద రాయి విసిరి వీపు ఒడ్డినట్లుంటుంది!

సామరస్య పూర్వక సంభాషణ అనంతరం శలవు తీసుకొని కారెక్కాను. జేబులో రాజీనామా పత్రం తీసి బర్ర్‌మని చింపాను. బయట పారేయకుండా మళ్లీ జేబులోనే పెట్టి ఇంటి దగ్గర మా ఆవిడ్ని చదవమన్నాను. “సగం చింపిన కాగితం చదవడం ఎందుకండీ” అంది. “తరువాత పూర్తిగా చింపడానికి అన్నాను. ఆవిధంగా ఈ ప్రహసనం సుఖాంతం అయింది. నాటినుండి అరమరిక లేని ఆప్యాయత మా ఇద్దరి మధ్య ప్రబలింది.

ఇక్కడ ఒక్కమాట చెప్పాలి. 1978లో తిరిగి కాంగ్రెస్‌ టిక్కెట్టు పుచ్చుకొని మాడుగుల నియోజకవర్గంలో పోటీచేస్తోంది కళావతి. కురచారామనాయుడు వ్రత్యర్థి - ఇండిపెందెంటు! ఆ ఎన్నికల్లో ... 5గురు సభ్యులమధ్య పోటీ. (నేను బయటకు రాను) కాంగైస్‌- ఇందిరాగాంధీ, జనత-ఇద్దరు స్వతంత్రులు (ఒకే సామాజిక వర్గం) - అందర్నీ ఓడించి స్వతంత్ర అభ్యర్థిగా కురచారామనాయుడు గెలిచాడు! మళ్లీ 1994తో ఉత్తరాపల్లి నుండి కాంగ్రెస్‌ టిక్కెట్టు సంపాదించి పోటీ చేసింది. కె. అప్పలనాయుడు 29 వేల మెజారిటీతో గెలిచాడు. కాంగ్రెస్‌లో చీలికలు - అర్స్‌ కాంగ్రెస్‌ పుట్టుక

మంత్రివర్గంలో కొందరు రాజీనామా చేసి, ఇందిరా కాంగ్రెస్‌లో చేరిపోయారు. జి.రాజారాం, మాణిక్యరావు, లుకలాపు లక్ష్మణదాసు రాజీనామా చేసినవారిలో ఉన్నారు. ఈ రాజీనామాలు వెంగళరావుని బాగా కలచివేశాయి. ఒకరోజు అందరూ వెళ్లేవరకూ నన్ను ఉందమన్నారు. “మీరు అందరిలాగే చెయ్యకండి, నన్ను వదలివెళ్లవద్దు. మీకు ఇందిరాగాంధీ పట్ల విశ్వాసం అని నాకు తెలుసు. బ్రహ్మానందరెడ్డి కూడా ఇటే ఉన్నాడు కదా! కలసి పనిచేసుకుందాం” అన్నాడు. అతని చెయ్యిలో చెయ్యి వేశాను. మీతో ఉంటానని మాట ఇచ్చాను.

పార్లమెంటు ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయి. అనేక ఆలోచనలు చేస్తున్నాడు. నాపట్ల పూర్తిగా విశ్వాసంతో ఉన్నాడు. తన ఆలోచనా విధానాలని నాతో చెబుతున్నాడు.

“నన్ను క్షణం క్షణం పిలవనక్కరలేదు. అడుగడుగునా నన్ను సంప్రదించనవసరం లేదు. మీకన్నా అనుభవజ్ఞులు, విజ్ఞులు ఎవరున్నారు? మీ నిర్ణయాలు శిరోధార్యం” అన్నాన్నేను. ఈ అదను తీసుకొని ముఖ్యమంత్రి నన్ను హఠాత్తుగా ఒకరోజు విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్న పార్లమెంటు అభ్యర్థిగా 1980 ఎన్నికల్లో నాపేరు పేపర్లో ప్రకటించాడు. నాతో చెప్పకుండా. అది చూచి షాక్‌ అయ్యాను. 'స్వేచ్చాభారతం 245

మాట తప్పను విశాఖపట్నంలో నివాసం తప్ప ఈ పట్టణ ప్రగతికి నేనందించిన, పేర్కొనదగ్గ ప్రత్యేక సేవలేవీ లేవు. పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లులో 5 చోట్ల అర్చు కాంగైస్‌ అభ్యర్థులు డిపాజిట్లు పోగొట్టుకున్నారు. ఒక్క నియోజకవర్గం - “బోగాపురం'లో అర్సు కాంగ్రెసు గెల్బింది. (అప్పడుదొర). అతనికి నాకు చుక్కెదురు. భీమునిపట్నం కూడా. తన నివాస ప్రాంతానికి అంటిపెట్టుకుని తన ప్రాబల్యంలో ఉన్న (ప్రాంతం, అతను ప్లేటు ఫిరాయిస్తే నా పని చిత్తు. నా అసెంబ్లీ నియోజక వర్గం అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉంది. ఈ ఎన్నికల్లో నేను మట్టి కొట్టుకుపోవాలనా? బతికిబట్ట కట్టకూడదనా? సి.ఎం. ఉద్దేశం ఏంటి? నాతో సంప్రదించకుండా కూడా నిర్ణయాలు తీసుకోవచ్చని. వాటికి కట్టుబడి ఉంటామని మాట ఇవ్వడం వాస్తవమే. ఆడినమాట మార్చను. అబద్ధం నావంట పట్టదు. సత్యాన్ని వీడను. మడం త్రిప్పను. ఇది జీవితంలో ఎన్నడూ చెయ్యరాని పని. పోటీలో ఘోర పరాజయం ఎదురౌతోంది! ముఖ్యమంత్రికి ఫోను చేశాను. “ఎందుకు ఇటువంటి పని చేశారు. వైజాగ్‌నుండి నాపేరు ప్రకటించడం ఏం న్యాయం?” అన్నాను. “1978 అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైన మెజారిటీ ప్రాంతాలు నాకింద వస్తున్నాయి. నేనెలాగ గట్టెక్కుతాను?” అన్నాను. “ఎన్ని విధాల ఆలోచించినా మీరే అర్హులు, సమర్థులు అని పేరు ప్రకటించాను. మీరు ధైర్యంగా ఉండండి మీరు గెలుస్తారు” అన్నాదు. “ఇక్కడ అప్పడుదొర ఒక్కడే గెలిచాడు. అతనికి నాకు మొదటినుండీ పడదని మీకూ తెలుసు! ఏం చూసుకొని బరిలో దిగుతాను చెప్పండి!” అన్నాను. “రేపు పొద్దున్న అప్పడుదొర మీ గుమ్మం ముందు ఉంటాడు. మీరేం చెబితే అది చేస్తాడు. సరేనా!” అని ఫోను కట్‌ చేశాడు. అప్పడుదొర వచ్చాడు! చేతిలో చెయ్యి వేశాడు. “అమ్మతోడు! అబ్బతోడు!” అన్నాడు. శతవిధ ప్రమాణాలు వరసపెట్టిచేశాడు. భీమిలి ఏరియా (ఆనందపురం) ప్రక్క వేములవలసలో మొదటి మీటింగు ఉంటుందన్నాడు. ప్రముఖులందరినీ ్రోగుచేసి వాళ్లందరిచేత ప్రమాణాలు చేయించాడు. తానూ చేశాడు వాళ్లతోపాటు! అంతే! అదే అఖరి దర్శనం! తర్వాత చెక్కేశాడు. మరి కనబడడు! ఏ కబురుకీ అందడు! ద్రోణం పురైలో ఆలోచనల ఊటలు కాంగ్రెసు అభ్యర్థిగా రైల్వేకాంగ్రైస్‌ కార్మిక నేత శశిభూషణరావు పేరు అధిష్టానం ప్రకటించింది. నా పేరు పత్రికల్లో చూసి తను పోటీ చెయ్యనన్నాడు. తరువాత మరోపేరు 246 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

తెరమీదకు వచ్చింది. ద్రోణంరాజు సత్యన్నారాయణ! అతడూ కుయ్యో! మొగ్రో! అన్నాదు. ఇప్పుడు కిం కర్తవ్యం! ద్రోణానిది బ్రహ్మాండమైన బుర్ర! ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి! వాటికి తట్టుకోలేక దిమ్మతిరిగి పోతాడెవడైనా! అప్పడుదొర తమ్ముడు సంజీవరావుని రెచ్చగొట్టాడు! “జన్మలో నీకిలాంటి ఛాన్సు దొరకిదన్నాడు. దొర ప్రక్కకు తప్పుకుంటే 'భాట్టం చుక్కలు లెక్కపెడతాడన్నాడు. మీ గెలుపు ఖాయమని భరోసా ఇచ్చాడు! రాయబారం సఫలమయింది. బేరం కుదిరింది. అప్పుడు దొర రంగంనుండి తప్పుకున్నాడు. సంజీవరావు పోటీకి నిలబడతాడు! ఇదీ వ్యూహం. ఈ మారు తెరపైకి కొమ్మూరు సంజీవరావు పేరు వచ్చింది.

ఆనంద గజపతిరాజు జనతాపార్టీ తరఫున అనకాపల్లి నుండి పోటీ చేస్తున్నాడు. అనకాపల్లిలో తిష్ట వేశాడు. అప్పడు దొర అతన్ని గెలిపిస్తాడట. మరి ఆ మొహం కనబడదు. అతని మాట వినబడదు. ఒకే ఒక పబ్లిక్‌ మీటింగ్‌ జరిగింది. విశాఖపట్నంలో దేవరాజ్‌ అర్స్‌ వచ్చినప్పుడు వెంగళరావు రావడంకూడా అదే మొదలు అదే ఆఖరు! మరో నాథుడు లేడు! ఒకృద్నే! ఏడు నియోజకవర్గాలు తిరగాలి! తోడు నీడా నాకు నేనే! నాకు భగవంతుడే దిక్కు అప్పటికే నా పేరు జిల్లా మొత్తం మీద మారు మోగుతోంది! అదే నా పెట్టుబడి! చెన్నారెడ్డి సలహా

టిక్కెట్ల వేటకు ఢిల్లీ వెళ్లినవారిని నా దగ్గరకు రాయబారం పంపించాడు చెన్నారెడ్డి, ముందు వారాడ నారాయణ మూర్తి వచ్చి కలిశాడు. “దేశమంతా ఇందిరాగాంధీ గాలి వీస్తోంది. ఆమె గెలుపు ఖాయం. భాట్టాన్ని ఇందిరా కాంగ్రెస్‌ టిక్కెట్టు మీద విశాఖపట్నం నుండి పోటీ చెయ్యమంటున్నాడు. లేదా? మొత్తం జిల్లా అంతా అతనికి అప్పగిస్తానన్నారు. రాజకీయం నడుపుకోమన్నాడు. మంత్రి పదవి తీసుకోమన్నాడు. ఓడిపోయే అరు కాంగ్రెస్‌ తరఫున మాత్రం పోటీ చెయ్యవద్దు! మీ క్షేమం కోరి చెబుతున్నాను. మంచివాడు, ప్రజలకు పనికొచ్చేవాడు. బలిపశువు కాకూడదని. ప్రజలకు సేవ చేసుకోమని కబురు పంపాడు డా! చెన్నారెడ్డి. నిజమే! అతని ధోరణి నాకు తెలుసు! నామంచి గురించే చెప్పాడు! అతని తత్త్వం తెలుసు నాకు. నా నుంచిని కాంక్షించి చెప్పిన మాటలే ఇవి.

ఇదివరకూ ఇటువంటి ప్రయత్నం ఒకమాటు చేశాడు. ఒక డజనుమంది ఎమ్‌.ఎల్‌.ఎ.లను నా దగ్గరకు పంపించాడు. నన్ను తన ఇంటికి తార్నాక రప్పించాడు. అర్ధరాత్రి వరకూ మాట్లాడాడు. “నీకు మంత్రి వర్గంలో స్థానం ఇస్తాను” అన్నాడు. అప్పుడూ నేను ఒప్పుకోలేదు. పదేపదే చెప్పాడు. “నాకు కావలసినంత బలం ఉంది. మాకు బలం చాలక రమ్మనలేదు మీ క్షేమం కోసమే చెప్తన్నానన్నాడు. “మంచివాళ్లు స్వేచ్భాభారతం లై?

ప్రపంచానికి పనికిరావా"లన్నాడు. అది నాకు బాగా జ్ఞాపకం. అంచేత అతని ప్రోద్చలంతోనే రాయబారం జరుగుతోందని అర్ధమవుతుంది. వరుసపెట్టి వార్తాహరులు వేగులవాళ్లు వస్తున్నారు. ఎన్‌.జనార్జనరెడ్డి నా మిత్రులచేత వత్తిడి తెచ్చేందుకు కలియతిరుగుతున్నాడు! పురైకు పుట్టిన బుద్ది పుడకలతోనుగాని పోదంటారు. ఆడిన మాట తప్పను! పోటీకి నిలబెట్టిన పెద్దలను వంచన చేయను. ఎవ్వడు మూడేబైలు (బ్రతికాడు? పిరికిపడి, తోక ముడిచి పరువు దక్కించుకోవడానికి. బ్రతికి బయటపడద్డానికి. సీటు దక్కించుకోడాన్మి అర్భ్జాంతరంగా ప్లేటు పిరాయించి ఇందిరా కాంగ్రెసు కొమ్ముకాయటం. నా జీవితానికి మాయనిమచ్చ! నీతిమాలిన బతుకు టబ్రతికితేయెంత? చస్తేయెంత? “క్షమించమని చెప్ప”మన్నాను చెన్నారెడ్డిగారితో. వారి అపారప్రేమకు సదాకృతజ్ఞున్ని అని చెప్పాను. రాయబారాలు విఫలమయ్యాయి. “ఒక సీటు గెలవడం, ఓడడం ముఖ్యంకాదు. భాట్టంలాంటి మనిషిని పోగొట్టుకోవడం దేశానికి నష్టం! అందుకే ఇన్ని ఆలోచనలు చేశాను - అతను లొంగలేదు. ఇటుపైన ఖబడ్దార్‌! భాట్టాన్ని మట్టు పెట్టాలి! పదగొట్టాలి! ఇదే మన ధ్యేయం.” నట్లు అన్నీ బిగించాడు. పద్మనాభరాజు, రోశయ్యకి ఈ నియోజకవర్గ బాధ్యత అప్పగించాడు. ఎన్నికలయ్యేవరకూ ఇక్కదే ఉండాలన్నాడు. విశాఖ నియోజకవర్గం దాటకూడదని శాసించాడు. ఇందిరాగాంధీ మీటింగు విశాఖలో జరిగిన తరువాత రోద్దుమీద (ప్రయాణం. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు రానూపోనూ రెండు వేర్వేరు మార్గాలు. అంతా విశాఖపార్లమెంటు నియోజక వర్గమునుండే, పులి పంజా చాపింది! తట్టుకొని ప్రాణం నిలబెట్టుకోవడం ఎలా? జిల్లా కలెక్టరు కుమ్మక్కు జిల్లా కలెక్టరు అర్జునరావు నాకు శఠగోపం పెట్టడానికి ముందు వెనుకలు ఆలోచించాడు! జిల్లా పరిషత్‌ మీటింగులో నాచేత చావుదెబ్బ తిన్నాడు. అధికార అనధికార ప్రముఖులమధ్య క్రుళ్ళగసిరి నోరు మెదపకుండా కూర్చోబెట్టాను. ఆ మానవుడు ఎలా సహించాడో! భరించాడో! తెలీదు! జిల్లా కలెక్టరు హోదాలో ఉన్న మనిషికి. అది హతో! ఆత్మహత్యో! చెప్పలేం? కుర్చీకి అతుక్కుపోయి కూర్చోవాలి! గుడ్లప్పగించి చూడాలి! చెవులో సీసం పోసుకోవాలి! జిల్లాలో కరువులేదని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపినందుకు ఏకి పీకి పాకం బట్టాను. అధికారగణం విస్తుపోయింది! జిల్లాజనాలు కథలు కథలుగా చెప్పుకున్నారు. ఆనాటి సంఘటనని “ఈ బుర్రకథ దళం” మన జిల్లాని భ్రష్టు పట్టిస్తున్నదన్నాను. ఎవరీ బుర్రకథ దళం అంటారు. 1. మంత్రి పద్మనాభరాజు 2. జిల్లా కలెక్టరు అర్జునరావు 8. ద్రోణంరాజు సత్యన్నారాయణ. దళాన్ని తిక్కదిగింది! గట్టిమొట్టి కాయలు పడి బుర్రకాయకాసింది. 248 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్రు

ఎక్కడ మర్చిపోతాడు అర్జునరావు? ఈ ఎన్నికల్లో అతని చేతుల్లో పద్దాం! పోలింగు బూతులు మార్చుచేశాడు. ఓటర్ల లిస్టుమీద అడ్డంగా గీతలు గీశారు! వైజాగ్‌లో కాన్ని ప్రాంతాల్లో అంతా అస్తవ్యస్తం అయోమయం! క్రింద అసెంబ్లీ అభ్యర్థులు లేరు! డైరెక్టుగా పార్లమెంటు ఎన్నిక. డబ్బు వరదలై పారుతోంది. బీర్లు బార్లు తెరిచి ఉంచారు. ఒక్కడిని మొత్తం పార్లమెంటు స్థానానికి ఎక్కడ తిరగాలి. ? అసెంబ్లీ సెగ్మెంట్ల ఎలక్షన్ల ఖర్చుకు లక్ష రూపాయలు ఇచ్చాడు వెంగళరావు. డబ్బు చాలదని ఫోను చేస్తే దొరకడు. ఖమ్మం వెళ్ళాడంటాడు. ఊళ్లో లేడంటారు. ఎన్ని మార్లు ఫోన్‌ చేసినా అదే తంతు. టైం వేస్టు. నలుగురిని వెంటబెట్టుకుని జగదాంబ సెంటరు చేరుకొంటే 100మంది అయ్యేవారు! అరగంటలో వెయ్యిమంది జనాలు గుమిగూడేవారు! ఊరేగింపుకు మీటింగుకు, పదివేల మందివరకు వచ్చేవారు.

భగవంతుడు ఇచ్చిన పేరు ఖరాబు చేయడానికి దీర్ధకాలిక ప్రణాళిక ద్రోణం వేస్తున్నాడేమో తెలియదు. నా దగ్గర నక్క్మవినయాలు చూపించేవాడు. అతదెన్ని చేసినా అతనిమీద ([్రేమ పోలేదు. అతని శక్తియుక్తులు పక్కదారి పడితే. అతదే పాడవుతాడు. జిల్లాకు ప్రయోజనం ఉండదు. అని మళ్లీ చెంత చేర్చి స్వంత మనిషిగా చూసుకొనేవాణ్ణి. అప్పడుదొర దొరకడు! పలుకడు! వెంగళరావు చిక్కడు! దొరకడు! ఎన్ని అన్యాయాలో! ఎన్ని అక్రమాలో! అన్యాయాల పట్టిక తయారయింది!

పద్మనాభరాజు నాపై పంతం పట్టడం తగదు. పూర్వ స్నేహితులం. సమవయస్ములం సాంప్రదాయకమైన కుటుంబం అతనిది. కుటుంబం అంతా నన్ను ఆప్యాయంగా పిల్చేవారు. సోదరుడి వలే చూసేవారు. ఇప్పుడు అతడు నామీద పగబట్టి మాటుకాయడమేంటి? నాకూ కోపం వచ్చింది! “మీ అసెంబ్లీ నియోజక వర్గంలోనే మెజారిటీ సాధిస్తానన్నాను.” పరువుకోసం ప్రాకులాడాడు. మాట దక్కలేదు. అతని నియోజకవర్గంలో కొద్దోగొప్పో మెజారిటీ! నాదే! మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంటులో మూడింటిలో మెజారిటీ నాదే కాంగ్రెసు గెల్బింది. సంజీవరావు ఎం.పి. అయ్యాడు.

ఎన్నికల తరువాత హైదరాబాదు వెళ్లి వెంగళరావుని కలిశాను. “ఘోర సంగ్రామం జరిగింది. హేమాహేమీలు బరిలో దిగారు. ఒంటిచేత్తో పోరాటం. మీరా పైసా రాల్బరు. లక్ష రూపాయలతో ఎలా గెలుస్తాను?? అప్పుల ఊబిలో కూరుకుపోయాను!” అన్నాను. “ఇక్కడ పరిస్థితీ అలాగే ఉంది! ఏం చేస్తాం? ఖజానా ఖాళీ అయ్యింది! మనకు డబ్బు ఎవడిస్తాడండి?”అన్నాడు. నిర్జాతపోయాను. అసలు దెబ్బ ఇప్పుడు తగిలింది. “మీరేం చెయ్యమంటారు ఇప్పుడు నన్ను” అన్నాను. “ఎలక్షను కేసు పడెయ్యండి. గెలుస్తారు” స్వేచ్భాభారతం 249

అన్నాడు. “నన్ను నేను తాకట్టు పెట్టకోవాలి. నా దగ్గరేముంది బూడిద!” అన్నాను. లేచిపోయాను. చిత్తంవచ్చిన నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్న మాట తిరగలేక కొండను ఢీకొని ఇంకా ప్రాణంతో పదిలంగా నిల్చుంటే వెంగళరావు దావా వెయ్యి అంటాడు. మరి నేను “పోటీ చెయ్యను పొమ్మంటే, ఏం చేస్తాడు?” సత్యవాక్ళు అని నిలబడి చతికిలపడ్డాను. ఎన్నికల్లో ఓట్ల వివరాలు ఈ దిగువ రాశాను చూడండి. వచ్చినఓట్లు విశాఖపట్నం 2లో 27,728 కొమ్మూరు 27,547. నాకు పెందుర్తిలో 80,878 కొమ్మూరు 35,886 నాకు ఉత్తరాపల్లిలో 26,625 కొమ్మూరు. (ఇది పద్మనాభరాజు మంత్రి ఏరియా.) 28258. నాకు ఎస్‌.కోట 29,006. కొమ్మూరు 27559. నాకు భోగాపురం, భీమిలి, విశాఖపట్నం-1లలో 92,542 కొమ్మూరు 52487 _ నాకు మొత్తం మీద 34635 ఓట్ల తేడాతో ఓటమి సంభవించింది. 1 ఈ ఈ 250 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్ర)

దివి సీమలో ఉప్పెన - మండలి అవిరళ సేవ

అన్న మండలి ఆశాసౌధం (దివిసీమ) దివ్యసీమ. తన కంటిముందే కుప్పకూలి పోయింది. పీనుగుల పెంట అయింది. బతుకు భగ్నమయింది. అన్న గుండె బద్దలయింది. కళ్లనుండి సెలఏపరుల్లా అశ్రుధారలు ప్రవహించాయి. గుండెలో గునపం దిగింది. ఒళ్ళల్లా గాయాలు, చేతుల్లో కాళ్లల్లో ముళ్ళు. దేహ ధ్యాసలేదు. ఎక్కడచూసినా ఆక్రందనలు, ఆర్తనాదాలు! వినిపిస్తున్నాయి. (బ్రతుకు చీకటయింది. కంటికి కునుకురాదు. మెతుకు గొంతుకు దిగదు. బతుకు బీడయింది. భావి శూన్యమయింది, వెర్రిగా మొగర్రిగా రోధిస్తూ పీనుగులపెంట మధ్య పయనిస్తూ శోక తస్త్రలను ఓదారుస్తూ తిరుగుతున్నాడు.

తాళవృక్ష ప్రమాణాన్ని ఎగసిపడ్డ ఉప్పెన అవనిగడ్డ ప్రాంతాన్ని ముంచేసింది. వేలాది మృతకళేబరాలు ఒద్దున పడ్డాయి. మానవదేహాలేగాదు. గొట్టెలు, బట్టెలు సకల రకాల జంతుజాలం శవాలు గుట్టలు గుట్టలుగా పడిఉన్నాయి. ప్రకృతి ఉగ్రరూపం ధరించింది. ఒకప్రక్క సముద్రపు ఘోష మరోప్రక్క ప్రజల ఆక్రందన. పుత్ర, మిత్ర కళత్రాదులను, ఆస్తిపాస్తుల సర్వస్వాన్ని కోలుపోయి అస్థిపంజరంలా మిగిలిపోయిన దీనజనుల అథుధారల జలపాతం! పిడికెడు మెతుకులు దొరకవు. త్రాగడానికి గ్రుక్కెడు నీరు లభించదు.

ఉత్తుంగ తరంగాల ధాటికి కొంపలు కూలిపోయాయి. తీరవాసులు సుడిగుండంలో ప్రాణగండంతో అల్లాడిపోయారు. చెట్టూపుట్టా కొట్టుకుపోయాయి. తండ్రీ కొడుకులు, అన్నాచెల్లెళ్లు ఆలుబిడ్డలు చెల్లాచెదురయ్యారు. ఎటుచూసినా యమకింకరుల డెక్కల చప్పుళ్ళు బ్రతికిఉన్న ప్రతి ప్రాణి భయంతో భీతితో అల్లాడిపోతున్నారు. పదివేల ప్రాణాలు తెగిపడ్డాయి. ఆహాకారాలు మిన్నుముట్టాయి. ఇది ప్రళభయమా విలయమా! ఇది ఎవరి శాపం? ఎవరు చేసుకున్న పాపం. [ప్రాణికోటి మీద ప్రకృతి చేసిన విలయతాండవం! అంతా బీభత్సం! భయంకరస్వప్నం! ఆశ ఏ కోశానా కనబడదు. బ్రతుకు బుగ్గయింది! మనిషి మట్టి అయ్యాడు. గుండె చెరువు అయింది. ఊరు అడవి అయింది. ఊరట కరవయింది. అంతటా చీకట్లు చుట్టుముట్టాయి. సర్వత్రా అంధకారం అలముకొంది. స్వేచ్చ్భాభారతం 251

భగవంతుడు చల్లగా చూడకపోతే మానవాళికి మనుగడే లేదు! మొత్తం చుట్టబెట్టి తుడిచిపెట్టేస్తే ఎలా కోలుకోవాలి? బ్రతికి బయటపడ్డ జనం బతుకు చావుకన్నా హీనం. ఆకాశం దద్దరిల్లేట్లు గుండెలు బాదుకున్నారు. ఉరుములు ఉరిమినట్లు గొల్లున గోలుపెట్టారు. అది అశనిపాతం. శోకసముద్రం. ప్రజానాయకుడు అన్న ఏం చెయ్యాలి? ప్రజల గుండె చప్పుడు తెలిసిన ప్రజా నాయకుడు ఏంకావాలి? ఏం చెయ్యాలి? కంఠశోష ఎవరు వింటారు? అన్న జాలి గుండె కరిగి నీరైంది. మన కరుణామయుడికి కంటికి కునుకు కరువైంది. ప్రజల ప్రియ బాంధవుడుగా (బతికిన ప్రజాబంధు గుండెలు బద్దలయ్యాయి. పిలిస్తే పలికే ప్రభుత్వంలోని పాత్రధారి నేడు దిక్కుతోచని బికారిలా ఉన్నాడు. ఫకీరులా ఉన్నాడు. ప్రభుత్వాన్ని అర్ధించి అగ్రనేతల రప్పించి దేశ విదేశాల సహాయసహకారాలను సమన్వయ పరచి, సహాయ సహకారాలను ముమ్మరం చేస్తూ ఘోర ఆపదలో మునిగిన అభాగ్యులను, అనాధలను ఊరడిస్తూ ప్రకృతి సృష్టించిన ప్రళయాన్ని విలయాన్ని విధ్వంసాన్ని ధీరోదాత్తంగా ఎదుర్కొని సహ(్ర బాహువులతో సేవలందిస్తూ నిండు జీవితాన్ని దివిసీమకు అంకితం చేసి, అర్పితం చేసి చరిత్ర సృష్టించిన మార్గదర్శి! ప్రజల మనిషి! మాన్యమండలి ధన్యజీవి! స ఈల 1 252 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

విశాఖజిల్లా వరదల్లో సాహస కృత్యాలు

పదవికోసం పనికాదు. ప్రజలకోసం పని. వర్ణాలు లేవు. వర్గాలు లేవు. నియోజక వర్షాలు లేవు. ఎక్కడ పుట్టాం? ఎక్కడ పెరిగాం? ఎక్కడ చస్తామో? ఇంత మాత్రానికి ఈ ప్రాంతం నాదని స్వంతమని గెంతులేయడం ఏమిటి? ప్రజల్ని పావులుగా చేసుకోవడం ఎంత తప్పు! ప్రజల్ని పదవులకు సోపానాలుగా మార్చడం ఏం న్యాయం? నీవు చేసింది ఆవగింజంత. కోరింది కొసరింది గుమ్మడి కాయంత! ఏది? ఎప్పుడు? ఎవరికి సంక్రమించాలో ఏది ఎవరి వస్తువో? ఎవరికి దఖలుపడాలో అదంతా పైవాడు చూసుకుంటాడు. మన స్థానం నిర్ణయించే పని మనలను పుట్టించిన వాడి పని. అందులో నీ జోక్యం ఎందుకు? జీవులు దైవం చేతిలో పావులు, అతడెలా నడిపిస్తే అలా నడవాలి. సేవ అంటే స్వార్ధం లేనిది. స్వార్థం ఉంటే అది సేవ కాదు. ఈ రెండింటికి పొత్తు కుదరదు. ప్రాణం మీద దృష్టి పెట్టుకోకుండా పరోపకారంమీద నీ దృష్టి మళ్లిస్తే ఆయాసం ప్రయాస ఉండదు.

ఈ ప్రాణం మనకోసం కాదు. జనంకోసం. మనిషి కడుపుకోసం కాదు బ్రతకడం. పరోపకారం కోసం. ప్రాణ ప్రయాణ సమయం వరకు సేవాభావం తొణికిసలాడాలి.

ఆప్తణ్జి కలుసుకోవడం అంటే పరమాత్ముణ్ణి కలుసుకున్నట్లే. పేదల గాథలు వినడం భారత, రామాయణ ఇతిహాసాలు విన్నట్టే. అందులో పుణ్యం ఉంది. పురుషార్థం ఉంది. తోచింది చెయ్యి. చెయ్యి గలిగినంత చెయ్యి. ఎంత ఎక్కువ మందికి చెయ్యగల్లితే అంతమందికీ చెయ్యి. అందులో జాగు చెయ్యకు జాప్యం వద్దు. నెలిమర్ల నియోజవర్గం

పొద్దున కొద్దిగా కడుపులో చల్చి వేసుకొని విజయనగరం నుండి గుర్ల మీదుగా కలువచెర్ల, కోటగంద్రేడు, కొత్తపేట, గరికివలస కార్యాక్రమాలు చూసుకొని విజయనగరం స్వేచద్చభారతం 259

వాపసు వెళ్లాలి. నాకు పదవుల ప్రసక్తి రాదు. ప్రజలపట్ల అనురక్తే. ఒంట్లో శక్తి ఉంది. సేవ చేయాలన్న కోరిక ఉంది. నీతో కలిసివచ్చేజనం ఉన్నారు. ఒక ఊరో పది ఊళ్లో. ఎన్నైతేనేం? నాకు గుండెబలం ఉంది, పిక్కబలం ఉంది. పట్టున పదిమైళ్లు నడిచిరాగలను. జేబులో పైసాలున్నాయో లేదో చూడకు! గుండెలో దేముడున్నాడో లేదో చూసుకో. పండితులు పరమాత్ముడి దగ్గరకి కాదు పైసాల దగ్గరకి చేరుతారు. పామరుడి దగ్గరకు వెళ్ళే వాడి రూటేవేరు.

(ఛ్రమదానం చెయ్యడానికి జనం ముందుకు వచ్చారు. గుర్లనుండి కోట గందేడు వరకు నాలుగుమైళ్లు ఉంటుంది. తిన్నగా గీత గీసాను. పొలం ఎవరిదైనా దారి అందరిదీ. అందరూ అంగీకరించారు. వందల తాటిచెట్లు తెగిపడ్డాయి. మట్టిరోద్దు పడింది. ఆ తరువాత కంకర. ఆ తర్వాత మెటల్‌. తరువాత తారు. అంతవరకు వెళ్లలేకపోయాం. ఆనాడు వందలాది మంది జనం స్వచ్చంద సేవ చేస్తూ, శ్రమదానం చేస్తూ సహజీవనంతో రహదారి వేస్తూ ఉంటే, ఎవ్వరినుండి ఎవరు పాఠం నేర్చుకోవాలి? ఆదర్శవంతులెవరు? మార్గదర్శకులెవరు? జనం కలిస్తే అదే ధనం. మనసు కలిస్తే అమృతం పుడుతుంది!

నరుల మధ్య నారాయణుడుంటాడు. జన వాణే దైవవాణి. పామరుడే పరమాత్ముడు. కలువచర్లలో హైస్కూలు అయింది. కోటగంద్రేడులో ఆయుర్వేద వైద్యశాల వెలసింది. ఆనందపురాన్ని నీటి కట్టురావాలి. గరికవలసకు మరెన్నో అవసరాలు. ఈ మధ్య నడయాడే యాత్రికుణ్ణి నేను.

ఆనందపురం నుండి గరికవలస మధ్యన చంపావతీనది పొంగి పొర్లుతోంది. ఆఅమీద మెరకల్లో, కొండల్లో వర్షాలు పడ్డాయి. వస్తానని చెప్పి గరికవలస వెళ్లడం మానేస్తానా? ఆనందపురం నుండి ఎందరో బయలుదేరారు. అవతల ఒద్దున గరికవలస జన సమూహం ఎదురుచూస్తున్నారు. పూర్వం నడిచివెళ్లే వాళ్లం. చిన్న నీటి వాగది. ఇప్పుడది పొంగి (ప్రవహిస్తోంది. నా చొక్కా పంచా పట్టుకొస్తున్నారు కొందరు. నలుగురు నన్ను నీట్లో దింపారు. రెక్కలు పట్టుకున్నారు. మొలలోతు దాటింది. గుండెను తాకుతుంది. “బాబూ మీకు ఈత వచ్చునా!” అన్నారు. “రాదు. మీరింతమంది గజఈతగాళ్లు ఉండగా నాకేం భయం” అన్నాను. ఇంతలో నీటిలో దుంగలు బడితెలు కొట్టుకువస్తున్నాయి. పిరికివాడు ప్రజాసేవకు పనికిరాడు! తన ప్రాణంకోసం పెనుగులాడేవాడు పరుల్ని ఎలా కాపొడుతాడు. సేవకు తెగింపు అవసరం. అంతకుమించి త్యాగం ముఖ్యం? చొరవలేని సాహసం ఎరుగని మట్టిమనిషితో మరో సమాజాన్ని నిర్మించలేం? దేశం కోసం దేహం ధారపోసే జాతినేతల వరవడిని నడిచే మానవులు కరువయ్యారా. '్రజలపట్ల (ప్రేమ అంటే ఏమిటి? ఎలా ఉంటుంది. (ప్రేమానురాగాలు అంటే పరస్పర అవసరాలా? సమయానుకూలాలా? 24 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చంత్రు)

ఆఅ రాత్రి గరికవలసలో ఉండిపోయాం. మర్నాడు తిరుగుప్రయాణం. ప్రాణం మీదకు వచ్చిన మనిషిని కడసారి చూపుకు చుట్టపువాడు కూడా రాదు ఇట్టి పరిస్థితుల్లో. ఈ వరదలు దాటుకుంటూ నాకోసం వచ్చారు. మాయందు ఎంత (్రేమ మీకు. ఎంత తెగువ. వస్తానన్న మాటను చెల్లించుకోడానికే గదా ఇంత పట్టింపు అన్నారు కొందరు. ఇది నేటీ సాంబశివరాజు నియోజకవర్గం. ఆనాడు అతను రాజకీయాల్లోకి దిగలేదు. అనకాపల్లి వరద ప్రాంతం

సాధారణ కార్యక్రమాల్లోనే ఇలాంటి సాహసం చేసి ప్రజల వద్దకు చేరేవాణ్ణి. వరద బీభత్సం, జనజీవితం అతలా కుతలం అయింది. అంటే వెనక్కు తగ్గుతానా! జిల్లా కలెక్టరు, సూపరింటిండెంట్‌ ఆఫ్‌ పోలీసు విమానమెక్కి తిరుగుతున్నారు. వరదపోటు, ప్రజలపాట్లు చూడడానికి. నాది రోడ్డు ప్రయాణం. కాలిబాటఅయినా ఫరవాలేదు. ప్రజల మధ్య వాలాలి. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న (ప్రజల్ని కలిసే వరకు సహాయ కార్యక్రమాలు అందించేవరకు నిద్రపట్టదు. అనకాపల్లి ముందు సాలాపువాని పాలెం దాటిన తరువాత రోడ్డుకు అడ్డంగా జోరుగా వరదనీరు ప్రవహిస్తోంది. మరి కారు కదల్టు... కాలు బయట పెట్టాను తెగువతో ముందడుగు వేస్తున్నాను. పైన కాలువ గండి పడింది. గెడ్డ ఉధృతంగా పారుతోంది. కొట్టుకుపోతారు. అడుగు ముందుకు వేయకండి అంటూ అరడజనుమంది రెక్కలు పట్టుకుని వెనక్కులాగారు. అయితే అవతలి ఒడ్డుకు ఎలాచేరుకోవాలి? కాలి నడకన రైలు పట్టాలు మీదుగా సబ్బవరం రోడ్డువద్ద రైలు గేటు తగిలేవరకు. అంతఎత్తునుంచి చీకటిలో రైలు పట్టాలు మీద నడవాలా? అడుగు తదబడితే నాలుగు నిలువుల లోతుకు పడతాం. నావెంట కొంత జనం ఉన్నారు. తెగించి పట్టామీద అరగంట పైగా నడిచి రైలుగేటు వద్దకు చేరుకున్నాను. వాడ్రాపల్లి మునిగిపోయిందన్నారు! ముందు మునగపాక చేరుకోవాలి. ఊరు చివర ఏతలపాకలు ఉన్నాయి. తాటిచెట్టు కొట్టిపడేసినవి కన్పించాయి. రెండు కలిపి దోనెలాకట్టి వాటిమీద పడవలా ప్రయాణం చేయాలి. రెండు వెదురు కర్రలు దుక్కని కలిపి కట్టారు. వాటికి అడుగు తగిలేది కాదు. తప్పటడుగులు వేస్తే నీట మునిగి జలసమాదే! గుండెగట్టిని చేసుకొని పట్టువిడవకుండా వాద్రాపల్లి రాంమందిరం మీద దిగాం. కష్టాలు కళ్లారా చూశాను. ఎటుచూసినా కన్నీళ్ల కెరటాలు. సర్వత్రాకన్నీళ్లు, ఊళ్లు, ఏళ్లు ఏకమయ్యాయి. రోడ్డు, రహదార్లు ఆనవాళ్లు లేవు! గ్రామమంతా నీట మునిగింది. కనుచూపుమేర భూమట్టం కనబడదు. అంతా (సముద్రం) అనంత సాగరంలా ఉంది. అంతా జలప్రళయం. పీకలలోతు నీట్లో రోజులు తరబడి (గ్రామాలన్నీ తిరిగాను. ముఖ్యమంత్రికి రాశాను. పత్రికా ప్రకటనలు చేశాను. ప్రజలకు ధైర్యం నూరిపోయాలని ప్రయత్నం చేశాను. స్వేచ్భాభారతం 255

నేను రాసిన ఉత్తరాల నఖలు కలెక్టరుకు రిపోర్టు నిమిత్తం పంపించాడు ముఖ్యమంత్రి. నాకు ఒళ్లు మండింది. కేబినేట్‌ మీటింగులో అటో ఇటో తేల్చుకుందామను కున్నాను. ముందు ముఖ్యమంత్రి గడపతొక్కాను. “పత్రికల్లో మీ ప్రకటనలు చూస్తున్నా”నన్నాడు. “ఆపాటి చెప్పకపోతే ప్రభుత్వం నిద్రపోతోంది అనుకుంటారు ప్రజలు” అన్నాను. మీ బహిరంగ వివరణ చూశాక నిద్ర ఎలా పడుతుంది అన్నాడు ముఖ్యమంత్రి. “నా ఉత్తరాలు కలెక్టరుకు పంపించి దానిమీద రిమార్ములు అడుగుతారా? మీ దృష్టిలో కలెక్టరే ప్రభుత్వానికి కళ్లూ చెవులూ అయితే మంత్రులుగా ఉన్న మేమేమిటి?” “నాతో గొడవ జరిగితే ప్రజలకు ఏం సహాయం జరుగుతుంది అన్నాడు. “గొడవ పడలేదండి గోల పెడుతున్నాను” అన్నాను. “ప్రజలు పెద్ద ఆపదలో పడ్డారు. ఈ కష్టకాలంలో మీరు కాకుంటే మరెవరు ఆదుకుంటారు?” అన్నాను. “అవనిగడ్డ ప్రాంతానికి ఎంత చేస్తున్నామో తెలుసా?” అన్నాడు. “అంతా - లేకపోతే అందులో కొంతైనా మా జిల్లా ప్రజలకు కూడా చెయ్యండి. పుట్టెడు దుఃఖంలో మునిగిఉన్నారు. ప్రజలు దిక్కువూలి ఉన్నారు. పనిచేసే ప్రభుత్వం మీది. అన్నపేరు దెబ్బతిన్నకుండా ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోండి. మీకు దండం పెడతాను! ఎక్కడ (ప్రజలకు కష్టం కలిగితే అక్కడకు వెళ్లి ప్రకాశం పంతులు వాలేవాడట. మీ

  • దూతలు గానే మేం వెళ్తున్నాం. ఆ ప్రజలూ మీ ప్రజలే. మీపేరే చెప్పుకుంటారు.” అన్నాను. “ఎవరు కాదన్నారు? ఈ రాష్ట్రమే నాది. రాష్త్ర ప్రజలంతా నావాళ్లే. నాకు విచక్షణ ఎప్పుడూ ఉండదు. పదండి ముందు కేబినేట్‌ మీటింగుకు.” అవనిగడ్డ ప్రాంతానికి ఇచ్చిన సహాయక చర్యల జి.ఒ.లు అన్నీ దొంతుపెట్టి మా టేబుళ్లపై పెట్టారు. మీటింగు 'ప్రాంరంభించి రాష్ట్రానికి ఏర్పడిన దుర్హటన గురించి ప్రస్తావించిన తరువాత, అధికారులకు ఆదేశం ఇచ్చాడు ముఖ్యమంత్రి. అవనిగడ్డ ముప్పు ప్రాంతానికి వర్తించే అన్ని జి.ఒ.లు విశాఖజిల్లా వరద ప్రాంతానికి కూడా వర్తిస్తాయని ఉత్తర్వులు జారీ చెయ్యమన్నాడు. అప్పటితో మనసుకి కొంత స్వస్తత చిక్కింది.

1977 నవంబరులో వచ్చిన వరదల వలన విశాఖజిల్లా బాగా దెబ్బతింది. ఎంతో నష్టపోయింది. రైతాంగానికి తట్టుకోలేని కష్టంవచ్చింది. రెండున్నర లక్షల ఎకరాల పంట పూర్తిగా నష్టపోయింది. అంతా ధ్వంసం అయింది. కొన్ని ప్రాంతాలలో 9-10" అడుగుల వరకు నీటిమట్టం నిల్చిపోయింది. 10-15 రోజుల వరకు. 5-6 అడుగుల నీరు నిల్వ ఉంది. హరిపాలం (గ్రామంలో కొండకర్ల ఆవ సమీపంలో కొంతమేర నీరు నిల్వఉంది ఐదారురోజులు! ఈ సంవత్సరం వరి బాగా పండింది. ముందెన్నడూ లేనంతగా పెద్ద వెన్ను వేసింది. చచ్చిపోయేవాడి కళ్లు చారడంతేసి అంటారు. రేపో మాపో చేనుకోతలు కోసి కుప్పలు వేసుకోవాలి. కొందరు చేను కోసి పనలు పొలాల్లోనే ఉంచారు. అది కాస్తా 256 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్రు

వరదలో కొట్టుకుపోయింది. సిద్దాన్నం కుక్క ముట్టుకున్నట్టు అయింది. నోటి దగ్గర అన్నం నీట మునిగింది. వందలు వేలు మదుపుపెట్టారు. చేతికి చిల్లిగవ్వకూడా రాదు. మనిషికి, పశువుకి కూడా (గ్రాసం లేదు నివాసం లేదు. వేల ఇండ్లు కూలిపోయాయి. లక్షన్నర జనం నిరాణ్రితులయ్యారు. కూడులేదు గూడు లేదు. పంటలేదు పనిలేదు. పట్టెడు మెతుకులు దొరక్క పిల్లలు అల్లాడిపోతున్నారు.

శారదానదికి తగరంపూడి నుండి నాగులాపల్లి ఆనకట్ట వరకూ - అనాకపల్లి తాలుకాల్లో ఎక్కడా వరదకట్టలు లేవు 9 అడుగుల నీరు ప్రవహించింది పొలాలమీదుగా. శారదానదికి బొడ్జేటి ఆనకట్ట తరువాత సముద్రానికి వెళ్లేవరకు వరదకట్టలు లేవు. శారదానదికి ౩ ఉపనదులు ఉన్నాయి తాచేరు, బొడ్దేరు, పెద్దేరు ఈమారు ఎంత ఎత్తున నీరు ప్రవహించిందో (అంత ఎత్తుకు గట్టు పెంచాలి). బెన్నవోలు, గౌరీపట్నం, వడ్డాది, వీరవల్లి గ్రామాలన్నీ నీట మునిగిపోయాయి. (ప్రొటక్షను వాలు కడితే బాగుంటుంది).

వరహానది కూడా పెనుగోలు గ్రామం దిగువన. వరహా, పెద్ద ఉప్పల్నాం రెండు నదులుగా చీలిపోయింది. వీటి నడుమ చిన్న ద్వీపంలా ఏర్పడుతుంది. అక్కడ అరడజను (గ్రామాలు ఉన్నాయి. వాటికి దారి తెన్ను లేదు. ఎప్పుడో 1955లో వరదలు వస్తే ఈ ఫ్లడ్‌ బ్యాంకు గురించి అనుకున్నారు. వరద నివారణ పథకానికి మాష్టరు ప్లాను వేసుకున్నారు. వాటికి బూజుపట్టింది. మూలపడ్డాయి. వాటిని బయటకు లాగాలి.

అనకాపల్లి పట్టణానికి కొంత దూరంలో బ్రిడ్జి దాటిన తరువాత ఏటిగట్టుకి గండిపడింది. ఇంకా ముందు గండి పడితే మొత్తం పట్నం కొట్టుకుపోయేది. అంతా జలమయమయింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు నీటమునిగాయి. మహా ప్రళయం ఉధృతంగా నదులు వాగులు పొంగి పొర్గాయి. శారదానది వాకాడ దగ్గర సముద్రంలో కలుస్తుంది. రెండుకొండల మధ్యనుండి వెళ్లి ఆ నీరు సముద్రంలో కలవడానికి వీలుపడదు. ఎన్నోగ్రంద్లు పడ్డాయి. ఊర్ల దగ్గర గంద్లుపడి ఉంటే సర్వనాశనం అయ్యేది. అపార ప్రాణనష్టం కల్లేది. మరికొన్ని గ్రామాల పరిస్థితి మళ్లీ వివరిస్తాను. చుట్టూ నీరు ఉరకలు వేసుకొని ప్రవాహం వస్తుంటే వాగులు దాటడానికి వీలులేదు. ఊరు ఒక ప్రక్క పొలాలు మరొకప్రక్క అటు వాళ్లు ఇటు - ఇటువాళ్లు అటు. కశింకోట దగ్గర, గనపర్తి దగ్గర, మెలిపాక దగ్గర బ్రిడ్జిలు కట్టాలి 1. అనకాపల్లి ఆవ. 2. కొండకర్ల ఆవ ఉన్నాయి. అందులోంచి నీరు ఇందులోనికి వస్తుంది. కొండకర్ల ఆవనుండి నీరు శారదా నదిలోనికి వస్తుంది. అప్పటికే శారదానది వరదలతో పొంగిఉంటుంది కాబట్టి ఆ నీరు వెనక్కు స్వేచ్భాభారతం 267

వెళ్తుంది. శారదానదిలో కలవనియ్యదు. కొండకర్ల ఆవనీరు నేరుగా సముద్రంలో కలియాలి. ముందు ఉప్పుటేరులో కలవాల్సి ఉంటుంది. అక్కడనుండి సముద్రంలో కలుస్తుంది.

జిల్లాలో నదులు 4. శారదా, వరహా ఇవి ఉగ్రరూపం ధరించాయి. తాండవ, చంపావతి ఇవి కూడా గట్టు దాటి ప్రవహించాయి. ప్రకృతి వికటించి విరుచుకుపడితే ఎవ్వరు తట్టుకోగలరు. నదులు విజృంభించి గట్లు తైంచుకొని ప్రవహిస్తే ఏ గ్రామాలు మిగులుతాయి? నదులు పరవళ్లు శ్రాక్కి ప్రవహిస్తే సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేచి ఊళ్లు తుడిచిపెడితే ఎవరు తట్టుకోగలరు? మొత్తం ఆస్తినష్టం, జననష్టం - అన్నీ నష్టాలే, కష్టాలే - కన్నీళ్లే. ఊళ్లు బీళ్లు ఏకమైన చోట కొత్త కట్టడాలు రావాలి. కమ్యూనిటీ హాళ్లు రావాలి. పాడిపంట తెలుగింట వెలుగుపెట్టాలి. తెనుగుతల్లి వదనంమీద చిరునవ్వులు చిందులాడే రోజులు రావాలి.

ఈ ఏక ప

2658 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్రు

చెన్నారెడ్డి హయాంలో ప్రజాపాలన

దా॥ చెన్నారెడ్డి 1978లో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించే నాటికి నేను ప్రతిపక్షంలో ఉన్నాను. (అధికార కాంగ్రెస్‌ (9 తరఫున ఆయన ముఖ్యమంత్రి అయిళే నేను రెడ్డి కాంగ్రెస్‌ తరఫున కాంగ్రెస్‌ లెజిస్టేటర్‌పార్టీ లీడరుగా ఉన్నాను (జలగం వెంగళ్రావు రాజీనామా చేసినందున).

డా! చెన్నారెడ్డి ప్రభుత్వం మీద అవిశ్వాస రాహిత్య తీర్మానం మీద ప్రసంగం చేయవలసిన సంకట పరిస్థితి ఏర్పడింది. ఎంతో కాలంగా సన్నిహిత సంబంధాలు పెనవేసుకున్న ప్రముఖుల మీద ధనుర్చాణాలు ఎక్కుపెట్టడం ఎట్లా? నా ప్రసంగం ప్రారంభిస్తూ అదే చెప్పాను. కురుక్షేత్ర సంగ్రామంలో కురువృద్ధ. గురుబంధుగణం చూసి శర సంధానం చేయడానికి సంకోచించిన నవ్యసాచి విషాద భూమిక నన్నా వహించిందనగానే అధ్యక్ష స్థానంలో ఉన్న డి.వి.కొండయ్య చౌదరి “ఏనుగు ఎంతో ధ్వని చేస్తుందనుకుంటే తుస్పుమనిపోయింది” అన్నాడు.

నేను అసెంబ్లీలో ప్రతిపక్షంలో ప్రవేశించినప్పుడు 57లో చెన్నారెడ్డి కాంగ్రెస్‌లోనే ఉండి ప్రతిపక్షపాత్ర నిర్వహించేవాడు. (పైమరీ హెల్తు సెంటర్లు ఎంపికలో ప్రభుత్వ వైఖరి ఎండగడుతూ చేసిన గంభీర ప్రసంగం నన్ను ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రసంగ ధోరణి విని నన్ను పలకరించాడు, ప్రారంభించాడు. 60లో మేము కాంగ్రెస్‌తో చేరిన తర్వాత సాన్నిహిత్యం పెరిగింది.

అప్పట్లో ప్రత్యేకించి ముగ్గురు డా॥ చెన్నారెడ్డి - ఎక్పోటే - ప్రఖ్యాత అడ్వకేటు - తర్వాత ఛీప్‌ జస్టిస్‌ అయ్యారు. బొమ్మకంటి సత్యనారాయణరావుగారు త్రయంగా ఏర్పడి రాజకీయల స్థితిగతులపై సుదీర్హ చర్చలు జరిపేవారు. అడపా తడపా హయగ్రీవాచారి హాజరుకావడం జరిగేది. నన్ను కూడా అప్పుడప్పుడు దేవుడు మేమ పూర్వకంగా ఆహ్వానించగా నా భావాలను వారితో పంచుకొనే వాడిని. స్వద్భాభారతం నకం

స్వతంద్రపార్టీ ఏర్పడకముందు డెమొక్రటిక్‌ పార్టీ పెట్టడం జరిగింది. తెనాలిలో జరిగిన యీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షపదవి మీద అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. లచ్చన్న అధ్యక్షుడిగా ఉండాలి అనుకుంటే ఆ పదవి పి.వి.జి. రాజు ఆశించాడు. లెజిస్తేటర్‌ పార్టీకు పోల్సాని నర్సింగరావు నాయకుడు. ఆ పదవి దా! చెన్నారెడ్డికి దక్కుతుంది కాబట్టి పార్టీ వ్యవస్థకు పెద్దరికం షి.వి.జి.కి లభించాలని పట్టుదల పుట్టింది. అప్పట్లో చీకటి పరశురామ నాయుడు నోరుపారేసుకోవడం. పి.వి.జి, పరశురామనాయుడూ “నువ్వెంత అంటే - నువ్వెంత” అనుకోవడం జరిగింది. చెన్నారెడ్డి అన్నాదు “లెజిప్లేటర్‌ పార్టీ నాయకత్వం నాకువద్దు (లచ్చన్నను అధ్యక్షుడిగా ఉంచండి) నేను పి.నర్సింగరావు లీడరుగా ఉంటే - నేను డిప్యూటీ లీడరుగా ఉంటానని!

ఆఖరికి చెన్నారెడ్డి లీడరుకాగా నేను విప్‌గా పనిచేసాను. తర్వాత లచ్చన స్వతంత్ర పార్టీలోకి పోయినందున ఈ ప్రయోగం బెడిసికొట్టింది. బందరు బైఎలక్షను

రాళ్లపల్లి అచ్యుతరామయ్యగారు స్వర్గస్థులు కాగా బందరు అసెంబ్లీ సీటుకు జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నిమిత్తం ప్రతిపక్షం తరపున అందరం బయలుదేరేము. కాకాని మార్గదర్శకత్వంలో లచ్చన్న బందర్‌లోనే ఉండి ఏర్పాట్లు చూస్తున్నాడు. కారు ముందు సీటులో ప్రజాపార్టీ నాయకుడు డా॥ ఏ.బి. నాగేశ్వరరావు కూర్చున్నారు. వెనుకసీటులో అటుకాకాని, ఇటు చెన్నారెడ్డి మధ్యన నేనూ. విజయవాడలో కాకాని వారి అనుయాయుల చేతుల్లో ఉన్న కో ఆపరేటివ్‌ సంస్థ మేడ మీద భోజనాలు చేసి బందరు చేరాము.

చెన్నారెడ్డికి ఆత్మవిశ్వాసం మెండు. కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయేటట్టు చేస్తాను మీరు చూస్తూ ఉండండి. నేనొక్కడ్నే మాట్లాడుతానంటూ వేదిక ఎక్కాడు. ఉత్సవమూర్తుల్లౌగ మేము కూర్చున్నాం - “నేను ప్రత్యేకంగా ఉపన్యాసం అంటూ చెయ్యను - (్రేక్షకులు తమ చిత్తం వచ్చిన ప్రశ్నలు వేయండి. ఎన్ని ప్రశ్చలనైనా వెయ్యండి. వాటికి మౌ సమాధానాలు సంతృప్తికరంగా ఉంటేనే మాకు ఓటు వెయ్యండి - లేకుంటే లేదు” అన్నాడు. దాదాపు మూడు గంటలపాటు కొనసాగిన కార్యక్రమం. సభికులను ఉర్రూతలూగించి హర్షధ్వానాల మధ్య ప్రసంగం ముగించాడు. అదీ అతని ధైర్యము! స్టెర్యము! బుద్ది బలము! ప్రసంగ పాటవం! 260... భౌట్టి శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

కాంగ్రెస్‌లో నాకు ఉన్నత స్థానం కల్పించాలని రాష్ట్ర పంచాయితీ రాజ్‌ పరిషత్తు అధ్యక్షుడు జలగం వెంగళరావుకు నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమించాడు. ప్రతి జిల్లాలో సమితి - పరిషత్తు అధ్యక్షుల, అధికారుల సమావేశాలు జరిగేవి. పంచాయితీ రాజ్‌ వ్యవస్థ పునరుజ్జీవింప చెయ్యాలని, రాజస్థాన్‌ కన్నా దేశంలో ఆంధ్రకే ప్రథమస్థానం దక్కాలని తపనతో - తపోదీక్షతో జరిపించే ఈ కార్యక్రమాలన్నిటిలోనూ నేను పాల్గొనాలని చెప్పాడాయన. ఇంతకుమించిన అవకాశం నాకు మాత్రం ఎలా దక్కుతుంది? ఉత్సాహంగా పాల్గొనడంతో నా గొంతు ప్రస్ఫుటంగా వినపడేది. చెన్నారెడ్డి సంతోషించేవాడు. చెన్నారెద్దికి ఆగ్రహం

గోదావరి జిల్లాల పర్యటనలో మాత్రం ఒక అపళ్చతి దొర్లింది. చెన్నారెడ్డి సహించలేకపోయాడు. అప్పటికి గ్రామోద్యోగుల ఉద్యమానికి నేను ఒక పట్టుకొమ్మగా నిలిచేవాడిని. ఇందులో నా ప్రవేశానికి కారకుడు (యలమంచిలి) రాష్ట్ర అధ్యక్షుడు కోరుమిల్లి వీరభద్రరావు, ద్రోణం ఆ స్థానం మీద కన్ను వేసాడు. అతడు చురుకైన వాడు, సమర్భుదే. అయినా ప్రతి జిల్లా మహాసభలో దోణానికి బాక ఊదడం. అతన్ని ఆకాశానికి ఎత్తడం నా వంతు అయింది. ద్రోణం కోరిక మీద తన ఉన్నతిని కోరి అలాచేసేవాడ్ని ఈ మారు కీలకమైన మహాసభలు విశాఖపట్నం (పాత) మినర్వహోటల్లో జరుగుతున్నాయి. రెవిన్యూ మంత్రి నూకల రామచంద్రారెడ్డి - పి.వి. నర్సింహారావు వస్తున్నారు. అప్పట్లో జరిగే ఎన్నికలకు నేను సభలకు హాజరవడం ముఖ్యం అని ద్రోణం గోలపెట్టేవాడు.

చెన్నారెడ్డికి - నూకల రామచంద్రారెడ్డికి అసలు పడేది కాదు. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేది. ఈ పరిస్థితుల్లో చెన్నారెడ్డి పెట్టే పంచాయితీ రాజ్‌ సభలకు గైర్దాజరై

  • నూకల మీటింగులో ఆ ప్రక్కన కూర్చున్న ఫొటో కనపడితే చెన్నారెడ్డి భగ్గుమంటాడు! ఇప్పుడేం చెయ్యాలి! ద్రోణం రాజుగోడు వినాలా? చెన్నారెడ్డి ఆదేశం పాటించి - గోదావరి జిల్లాలో పంచాయితీ రాజ్‌సభలకు హాజరుకావాలా? (అప్పటికి ద్రోణం అంటే ఎవరికీ తెలీదు!) నేను లేకపోతే తన భవిష్యత్తు దెబ్బ తింటుంది అంటూ గోలపెడుతున్నాడు. మిత్రుడికి, ఆప్పుడికి సహాయం చేస్తే వచ్చే ఆపదను ఎదుర్కోలేకపోతానా? అని వైజాగ్‌లో ఉండిపోయాను.

అంతే రెండు రోజుల అనంతరం వెళ్తే ఇదివరకు వలె చెన్నారెడ్డి ప్రక్కన కూర్చొనే అవకాశం లేకుండా చేసాడు. నాతో మాట్లాదేవాడు కాదు. మాట్లాడనిచ్చే వాడుకాదు. మొత్తం అన్ని చోట్లా అదే తంతు. ఆఖరు మీటింగు హైద్రాబాదులో జరిగినప్పుడు మాత్రం మొత్తం సమీక్ష చేస్తూ చెన్నారెడ్డిని ప్రశంసిస్తూ మాట్లాడగలిగేను. స్వేచ్చాభారతం 261

ఇచ్చాపురం ఎం.ఎల్‌.ఏ. రాజీనామా

ఆనాటి గ్రూపు వైరాలు అలా జోరు అందుకున్నాయి! మంచిగా ఉంటే అంతామంచే. కోపం వస్తే మాత్రం దుడుకుగా వ్యవహరిస్తాడు చెన్నారెడ్డి. కసిరి కొడతాడు. దులిపించుకొని దూరంగా తరిమి కొడతాడు. అదీ అతని తత్త్వం. ఒకమారు ఇచ్చ్భాపురం ఎం. ఎల్‌.ఏ. సంజీవరెడ్డి హయంలో చెన్నారెడ్డి దగ్గణకు వెళ్తే 5[000, 86: ౧4! అంటూ విరుచుకు పడ్డాడట! పాపం ఆయన ఒక పిల్ల జమీందారు. రాజీనామా లేఖ వ్రాసి ముఖ్యమంత్రికి పంపించాడు. నేను ఇక శాసన సభ్యుడిగా ఉండలేను అంటూ. సంజీవరెడ్డిగారు ఆయనను చేరదీసి - బుజ్జగించి రాజీనామా లేఖ ప్రక్కన పెట్టేరు. తన అవసరాలేమి వున్నా తనను కలిస్తే సరిపెడతానని చెప్పి ఊరుకోబెట్టారు. ఇదీ చెన్నారెడ్డి తంతు! చెన్నారెడ్డి భోళాశంకరుడు

చెన్నారెడ్డి భోళా శంకరుడు. పొగిడితే పొంగిపోతాడు. రెచ్చగొడితే రెచ్చిపోతాడు. తన వాళ్లయితే ఆప్యాయత! సఖ్యత ప్రదర్శిస్తాడు. పరాయి వాళ్ల పట్ల కరకుగా మొరటుగా బెరుకుగా ఉంటాడు. స్వంత మనిషి అనుకుంటే ఆకాశంలో సగం రాసిచ్చేసే వితరణ ఉంది. తననోటి మాటే (శిలా) శాసనం అంటాడు. సర్వస్వతంత్ర ప్రతిపత్తీ అతని వ్యక్తిత్వం. అతని మాటల్లో క్షాత్రధర్శం ఉంది. అతని చేతల్లో నిరంకుశత్వం ఉంది. అతనికి పదునైన నాలుక్క చురుకైన మెదడు. సహనం తక్కువ. సాహసం ఎక్కువ. ఆయన వాగ్జాటీలో ఆత్మవిశ్వాసం - శౌర్య ప్రతాపాలు ప్రతిబింబిస్తాయి. పరనింద ఆత్మస్తుతి రుచించనిది ఎవరికి? షష్టిపూర్తికి తాడేపల్లిగూడెంలో మూర్తిరాజు అధ్వర్యంలో తులాభారం తూగిన తెగువ అతనిది. దూషణ భూషణ తిరస్మారాలు అతని ఒంటికి పట్టవు. ఆత్మకు అంటవు. ఆయన శ్రీమంతుడు, ధనవంతుడు. సిరిసంపదల మోజులో రోజులు గడిపే భోగ భాగ్యశాలి. జీవితం ఆనంద బృందావనం

చెన్నారెడ్డి మర్రికి - ఎప్పుడు లేదు వగ్రీ! విత్తం వైభవం ఉంటే చాలు. చిత్తంలో చిద్విలాసాలే! భోగం - రాగం - రంగూ రుచీ వాసన చెన్నారెడ్డికి ఒంటపడతాయి.

జీవితం ఒక రాసలీల, ఆ నాటిబ్బందావనం. అనంతకళ్యాణ గుణగణ శోభితుడైనా ఈ క్రీడాఖిరాముడు, రసజ్జడు, విజ్ఞుడు. సరస సంభాషణ చతురుడు. విత్తం కొద్దీ వైభవం, చిత్తం కొద్దీ భోగభాగ్యానుభవం! 262 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

కామిగాక మోక్షగామి కాదు అన్నాడు వేమన. మోహంకోసం మోక్షం వచ్చిన మానవుడే భూ విభుడు! “స్త్రీల పెదవులందు రాజ్య పదవులందు ఆశలు డిగినట్టి అయ్యలు ధన్యులు” అంటారు పెద్దలు. అయినా ఆశలు ఎదిగిన అయ్యలు కోకొల్లలు! ఆయనకు దైవప్రీతి ఉందని తెలుసు. పాపభీతి ఉందో లేదో తెలియదు! మోహక్షయం మోక్షమంటారు. మోక్షనికి మూలం మోహమేమో తెలీదు! “మా కురు ధనజన యవ్వన గర్వం, హరమి నిమేషం కాలం సర్వం, మాయామయమిది అఖిలం బుధ్వా” పృథ్వీపతి

నా విష్ణుః పృథ్వీపతి అంటారు. ఇతడు భూమిని పాలించిన భూపతి - ధరణిపతి అనుకుంటాడు. ఆంధ్రలో పుట్టాను కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రినయ్యాను అమెరికాలో పుడితే అమెరికా అధ్యక్షుడ్ని అయ్యేవాడను అంటాడు, అనుకొంటాడాయన. అందరిమీద అన్ని హక్కులు అతని హస్తంలో నిక్షిప్తం అయ్యేయి అనుకొనే పరిపాలనా దురంధరుడు. రాజ్యం వీరభోజ్యం అన్నదే వీరితత్వం. అతడు ధీశాలి, ధైర్యశాలి, కార్యశూరుడు అతడు ఉగ్రుడు, రుద్రుడు, వీరభద్రుడు, పొత్తు కలపగలడు. కత్తి ఎత్తగలడు.

(పేమ - ద్వేషాలు పెనవేసుకొనే - సఖ్యత మాది. విముఖత సుముఖత మిళితమైన సంబంధాలు అనుబంధాలు మావి. (తొలి చూపులోనే (పేమ ఉన్నట్లు, ప్రథమ సమాగమంలోనే (యేమ భావ సంబంధాలు నెలకొన్నాయి.)

అతడు ముఖ్యమంత్రిగా శాసన సభలో అడుగు పెట్టిన వెంటనే (కాంగ్రెస్‌) పార్టీ నుండి వలసలు ప్రారంభమయ్యేయి! “నాకు తెలుసు చెన్నారెడ్డి గారిలో ఉన్న ఆకర్షణా శక్తి అధిక మోతాదులో ఉందని. ఇంకా ఎన్నికల జమా ఖర్చులు, పద్దులు దాఖలు చేసే సమయం ఉండదనే ఉంది! అంతకు ముందే పరకాయ ్రవేశమా? ఈ తంతు చూస్తూ ఉంటే “మంగళసూత్రాలతో, మధు పర్మాలతోనూ పెళ్లి పీటల నుండే లేచిపోతున్నట్లుంది” అనగానే దుమారం చెలరేగింది! [02౯0105 చేసిన వాళ్లలో ఆడవాళ్లు కూడా ఉన్నందున “లేచిపోయేరనే పదానికి అభ్యంతరం చెప్పారు అధికార పక్షం పెత్తందార్లు - ఈ తంతు వర్ణించడానికి అంతకన్నా మంచి పదం ఏదైనా ఉంటే తెలియ చేయమని కోరేను! ఇంతకు లేచిపోవడం అనే పదం పార్లమెంటరీయా! అన్‌ పార్లమెంటదీయా? తేలవలసి ఉంది.

షల సల ఈ స్వేచ్భాభరతం ౨268

రోశయ్య విజయరహస్యం

చెన్నారెడ్డి బలాన్ని బలహీనతలను నికరంగా ఖరీదు కట్టి సరియైన టైములో - సరియైన నిర్ణయం తీసుకున్న అదృష్టజాతకుడు రోశయ్య, నిత్యం కారాలూ మిరియాలూ నూరుతూ, చిటపటలాడుతూ ఉండే సూటిపోటు మాటల రోశయ్య హఠాత్తుగా కత్తి దించాడు. ముఖ్యమంత్రి పంచ, చెన్నారెడ్డి చెంతకు చేరాడు. చెన్నారెడ్డి చెంగుపట్టుకొని తిరగడం ప్రారంభించాడు.

పట్టిందల్లా బంగారం : నాటి నుండి అతను పట్టిందల్లా బంగారమే! అడుగు తీసి అడుగులేస్తే కీలక పదవుల ప్రన్థానమే! షాహుకారు కుంచం పట్టుకొలచేటప్పుడు “ఒకటి అనడు. “లాభం” అంటాడు. లాభనష్టాల బేరీజు కట్టి రాజకీయాన్ని రంగుల కలగా మార్చి, విందు భోజనంగా జీర్ణించుకొన్న దూరదర్శి రోశయ్య! లాభసాటి చెయ్యి రోశయ్యది! ఈ మర్రిమాను క్రింద మాత్రం మరింకో మొక్క మొలవదని, ఎదగదని చాలామంది సగోత్రీకులు ఇప్పటికీ చెప్పుకుంటారు! రోశయ్యగారికి మరెన్నో ఉన్నత శిఖరాలు స్వాగతం పలుకుతున్నాయి.

సాధారణంగా మర్రిచెట్టు కింద మొక్క మొలవదన్న మాట నిజమేగాని ఊడలు తన్ని విరివిగా పెరిగిన ఈ మర్రి (చెన్నారెడ్డి) నీడను, మొక్కలు మానులౌతాయి. కొమ్మలు, రెమ్మలు పెంచుకుని వృక్షామౌతాయి. ఆ విధంగా అనుచర వర్గాన్ని పెంచిపోషించే మనస్తత్వం ఆయనది. కాలం కలసివస్తే, శత్రువు మిత్రుడు అవుతాదన్న నమ్మకం ఆయనది. వైరి వర్గం నోరు కట్టేయాలని, కుట్టేయాలని చూడడాయన. నోటికి ఓ బెల్లం ముక్కో రొట్టి ముక్కో అందిస్తే, అరుపులు, కేకలు తగ్గిపోతాయని, తొలగిపోతాయని తెలిసిన రాజనీతిజ్ఞుడాయన. ప్రతిపక్షంలో ఉన్నప్పటి ప్రతాపాలు

రోశయ్య ఆగ్రహావేశాలు అలనాటి శాసన మండలిలో చూశారా మీరెవరైనా? నిత్యం ఉరుములు, మెరుపులు కురిపించే సూత్రధారి అతను. ఆరోపణల, అభాండాల భాండాగారం 264 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

ఆయన. శాసన మండలిలో సర్వదా అస్త్ర శస్త్రాలతో సర్ప సంసిద్ధంగా ఉంటాడు. అవి అక్షయ తూణీరాలు. ఆయన ఆరోపణాస్తాలు సంధిస్తే ఆవగింజ కూడా తాటికాయ అవుతుంది. తాటికాయి బండరాయంత అవుతుంది. ప్రభుత్వ అధినేత పట్ట శరసంధానం చేసి, పుంఖాను పుంఖంగా బాణ పరంపర ప్రయోగించడంలో సిద్ధహస్తుడు. ఆరోపణల పర్వం

పూర్తిగా నిరాధారమైన ఆరోపణల పర్వం కూడా కాదది! ఆయనకు ఇజాలు కాదు, నిజాలు కావాలి! ఆయన ప్రయోగాలు, ప్రయోజనాలు పసికట్టదానికి అసామాన్య మేధావి కూడా చాలడు! ఆయన అదను, పదును చూసుకుంటాడు; దయ, దాక్షిణ్యాలు, (పేమాఖభిమానాల జంరూటం ఉండదు. రోశయ్య గుక్క తిప్పకుండా నేరారోపణలు గుప్పించటం చెన్నారెడ్డి కెరుకే. చెన్నారెడ్డి హయాంలో రోశయ్య దూమారం లేపటం, కలకలం సృష్టించటం కడు సామాన్యమైన విషయమే. చెన్నారెడ్డి ప్రభుత్వంపై చెణుకులు విసరడం, అవినీతి పురాణం విప్పడం రోశయ్యకే చెల్లింది! అక్రమాల చిట్టా వల్లించే వాడు. నిప్పుల వర్షం కురిపించేవాడు. కొంపలంటు కుంటాయ్‌ అనుకుంటాం మనం. గానీ వారుణాస్త్రం ప్రయోగించటం చెన్నారెడ్డికే చెల్లింది. (కొద్ది కాలంలో తంటాలు తప్పిపోయేవి, చెన్నారెడ్డి బుట్టలో పడగానే మంటలారిపోయేవి!)

అధికార పదవులు సూదంటు రాయివంటివి. అందుకే చెన్నారెడ్డి సమ్మోహనాస్త్రం (ప్రయోగించాడు. పదవులు పందారం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నా వరదానం చేయడానికి వెనుకంజవేయడు చెన్నారెడ్డి. రోశయ్య రొట్టి విరిగి నేతిలో పడింది, నూతన పదవుల అధికార ప్రాంగణంలో ప్రభుత్వ అధినేత (చెన్నారెడ్డి; కనుసన్నలలో అరంగేట్రం ప్రారంభం అయ్యింది. కోటలో పాగా వేసాడు. కాంగైసు పట్టుకొమ్మలు పట్టుకున్నాడు. అనాయాసంగా చెన్నారెడ్డి అంతే వాసిగా కొలువు తీరాడు. కరువు తీరా పదవులు! ఆలస్యం, అమృతం, విషం (ప్రేక్షక జనాన్ని అబ్బుర పరచే అద్భుత ప్రయోగం చేయటం చెన్నారెడ్డిగారికే చెల్లింది! రోశయ్యగారికి అదిసరిపడింది! రోశయ్య రూటు మారింది. మరి బుసకొట్టడు! విషం కక్కడు, అది ఇప్పుడు కోరలు తీసిన పాము, వానపాము. మణిమంటపంలో తిష్టవేశాడు రోశయ్య. క్షీరసాగరంలో అపర మహావిష్నువు వలే, పదవుల ఆదిశేషుని మీద పవళించి సజావుగా పరిపాలన నాగించాడు చెన్నారెడ్డి. నిగూఢ రహస్యాలు

రాజకీయాల్లో నిగూఢ రహస్యాలెన్నో విజయానికి రాచబాట వేస్తాయి! ఈ 9 రంధ్రాల తోలు బొమ్మకు పదవుల పంచభక్ష పరమాన్నాలు నువో ఇష్టం! అధికార పదవుల భుజకీర్తుల స్వేద్చభరతం 265

మీద మానవుడికి మక్కువ ఎక్కువ. రోశయ్య దశ తిరిగింది పదవుల స్వీకారమేగానీ, విరమణ ఎరుగని మహజ్ఞాతకుడు చెన్నారెడ్డి, విజయభాస్కరరెడ్డి, అంజయ్య, వెంకట్రామిరెడ్డి. ముఖ్యమంత్రులెందరికో అపరకర్మ జరిగి, జీవితం ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు. కానీ రోశయ్య కిష్కింధకాండ ఇంకా అవిచ్చిన్నంగా కొనసాగుతూనే ఉంది. రామకార్యం నెరవేర్చకుండా వెను తిరగరు. అలనాడు రంకెలు! ఈనాడు అంకెలు! లింకులు! ఆంధ్రప్రదేశ్‌ ఇంకా మిగిలే ఉంది! అది మన అదృష్టం! కనువిందు చేసే వింతలూ విడ్డూరాలు చూస్తూ! స్వామికార్యం స్వకార్యం పూర్తి చేసేందుకు ఆయుర్దాయం పరమేశ్వరుడు ఆయనకు ప్రసాదించుగాక! న 266... భాట్టం శ్రీరామమూర్తి గ్వీయ చరిత్ర

అంజయ్య ఆలనా - పాలనా

అంజయ్య ప్రభుత్వంలో నా పాత్ర, ఒంటిచేత్తో ఇంద్రధనుస్సు ఎక్కుపెట్టడం లాంటిది! దర్భపుల్లలతో ధనుర్భాణాలు చేసి, ఆకాశంలో చందమామకు గురిపెట్టడంలాంటిది! కుంటికాలుతో కొండలెక్కి దిగిరావడం వంటిది. నా శాఖ ఒకటి పట్టుకుని, రాష్ట్రం నలుమూలలా తిరిగి, ప్రజలను అబ్బురపరచటం, ఆశ్చర్యచకితుల్ని చేయటం, అసంభవం. ప్రజల ఆమోద ముద్ర పొందటం దుస్పాధ్యం.

దురదృష్టవశాత్తు పి.వి. జి.రాజు చండీఘర్‌లో కారు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఘనవైద్య చికిత్సలు జరిపించమంటూ కోమాలో ఉన్నా మంత్రివర్గ సభ్యునిగానే కొనసాగించారు బ్రహ్మానందరెడ్డి. కొంత కోలుకొని మాటా, మంతీ వచ్చిన తరువాత, “నాకు పోర్టుఫోలియో అప్పగించమని చెప్పమానేవాడు నేను వెళ్లినప్పుడల్లా. “అతని శారీరక, మానసిక పరిస్థితుల్లో బరువు మోపడం మంచిదికాదు, తలకు తగిలిన దెబ్బకు విశ్రాంతే దివ్యౌషధం అంటున్నారు వైద్యులు” అని బ్రహ్మానందరెడ్డిగారు అనేవాడు. మళ్లీ మళ్లీ అడిగితే, “అతన్ని కష్టపెట్టి అతన్నుండి పని పుచ్చుకోవడం అతనికి మేలుకన్నా కీడు చేసినట్టు అవుతుందని భయవడుతున్నాను”అనేవాడు. €.]4. పి.వి.జి.ని పలకరించినప్పుడల్లా అదేమాట, పోర్టు ఫోలియో ఊ సెత్తేవాడు. ట్రహ్మానందసెడ్డి “చూద్దాం

  • చేద్దాం” అంటూ కాలయాపన చేసేవాడు. ఒకనాడు అన్నాడు అతనికి తృప్తి కలిగితే, మనసు శాంతిస్తుందని సాంస్కృతికశాఖ ఇస్తున్నాం. త్వరగా కోలుకోవాలని కోటి దేవుళ్లకు మొక్కుతుంటే, పెద్ద బరువుబాధ్యతలు నెత్తిన మోపడం మంచిది కాదని ఈ పని చేశాను.

విద్య, వైద్య, ఆరోగ్య శాఖలు నిర్వహించినవాడే ఆ మహానుభావుడు పి. వి.జి.రాజు, ఏనుగుకి వెలక్కాయ పెడితే తృప్తి కల్గుతుందా? సాంస్కృతికశాఖ స్వీకరించి సంతోషిస్తాడను కుంటే, మళ్లీ నాతో అనేవాడు “ఒక్క ఫైల్‌ రాదు, ఒక్క సంతకం పెట్టలేదు, అదీ ఒక శాఖేనా?” అని. చింతాగ్రస్తుడై, తన ఉనికిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లు భావించేవాడు. మరికొంత తేరుకున్న తరువాత భగవంతుడే నన్ను రైటాఫ్‌ చేయలేదు. బ్రహ్మ స్వేచ్భాభారతం 267

(బ్రహ్మానందరెడ్డి) నన్ను రైటాఫ్‌ చేస్తున్నాడు, చూశావా అనేవాడు జాలిగా, దీనంగా. తరువాత అంతా సర్దుకుని ఆయన సంపూర్ణ, ఆయురారోగ్యాలు పొంది యథాప్రకారం రాజకీయరంగంలో రాణించాడు. సాంస్కృతిక శాఖకు పెద్దల దృష్టిలో ఉన్న స్థానం తెల్సుకోడానికి ఇదంతా చెప్పాను. సాంస్కృతిక శాఖ చేపట్టిన మంత్రివర్యులు ఎవరూ ఆనందబాష్పాలు రాల్బలేదు. వారి మీద ప్రజానీకం పుష్పవర్నాలు కురిపించలేదు. మరినా ప్రత్యేకత ఏంటి? ఈ శాఖ చేపట్టాక, దేవతలు దుందుభి మైగించలేదు కుంటికాలుతో మింటికి ఎగరటం ఎవరి తరం? అరణాల కూలీ! ఆంధ్రప్రదేశ్‌ అధినేత అంజయ్య నాకు చిర పరిచితుడే. 50 ఏళ్ళ క్రితం శాసనసభలో నేను అడుగు పెట్టినప్పటికే నా కంటికి కనపడ్డ కార్మిక నాయకుడు జి. సంజీవ రెడ్డి, టి. అంజయ్య, జి.వెంకటస్వామి. అప్పుడప్పుడు యం.యం. హాషిం, కరీం వంటి నాయకులు కూడా అబిడ్స్‌లోని ఇరానీ హోటల్‌లో కాలక్షేపం చేసేవారు. నేనంటే ఎంతో నమ్మకం అతనికి! నా మీద గౌరవం కూడా అపారంగా ప్రదర్శించేవాడు. ఆరణాల కూలీని అన్నమాట అతనినోటిన ఖంగున మారు మోగేది ఒకప్పుడు. ఇప్పుడతడు ఈసువిశాల ఆంధ్ర సామ్రాజ్యానికి కిరీటధారి కావటమే ఆశ్చర్యంలో ఆశ్చర్యం. విజయవంతంగా అధికార బాధ్యతలు నిర్వహించిన ప్రజారంజకుడు అని చరిత్ర కారులు లిఖిస్తే కూడా ఆశ్చర్యం లేదు. అతడు బడుగు, పేద (ప్రజలకు ఆప్పడు. బడుగు, బలహీన వర్గాలకు మిత్రుడు. అతని హఠాన్మరణ వార్త విని, అంతిమ యాత్రకు విచ్చేసిన జన (ప్రభంజనం జంటనగరాలలో మున్నెన్నడూ కన్పించని అసమాన, అపురూప దృశ్యం. నేల ఈనినట్లు

  • జన సముద్రం పొంగి పొరలినట్లు, ఐడుగు బలహీన వర్ణాలు తండోపతండాలుగా శృశాన వాటికకు విచ్చేశారు. జంటనగరాల పట్టణ వాసులంతా శోకతప్త హృదయంతో గుండెలదిరేటట్లు ఘోషిస్తూ, రోధిస్తూ, కడసారి చూపుకు శ్మశాన వాటికకు పరుగులు తీశారు. ఎటు చూసినా జన ప్రభంజనం, ప్రజా ప్రవాహం, ఒక ప్రక్కకన్నీరు కురుస్తోంది. ఇంకోప్రక్క చితిరగులుకొని, మంటలు ఎగసిపడుతున్నాయి. అంజయ్య పార్ధివదేహాన్ని అగ్నిహోత్రుడు భస్మరాశిగా మార్చేశాడు. నేనూ, అంజయ్య మలేషియా ప్రధానితో కలిసిన భారీ చిత్రపటాన్ని బాహాటంగా బయటపెట్టారు వారి కుటుంబీకులు. సంతాపసూచకంగా పూజాపుష్పాలు కురిపించి, కంటతడిపెట్టారు అశేష ప్రజానీకం.

కేంద్ర కార్మిక మంత్రిగా అంజయ్య

ఢిల్లీలో, కేంద్రంలో కార్మిక సహాయమంత్రి పదవి స్వీకరించాక, నేను ప్రతి పక్షంలో పార్లమెంటు సభ్యునిగా ఉండగా, పదే, పదే అనేవాడు అంజయ్య. “నాకు ఎవరూ ఒరగబెట్టిందేమీ లేదు, భాట్టం చేసిన పనే నాకు మంచిపేరు తెచ్చి పెట్టింది. నేను భాట్టానికి చేసిందేముంది! ఒక చిన్నకోక - ఒక సాధారణ శాఖ - సాంస్కృతిక శాఖ కట్టబెట్టాను. కానీ భాట్టం నాకు చరిత్రలో చెరిగిపోని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాడు. నాపేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని, హైద్రాబాద్‌లో బహుళ అంతస్థుల భవనానికి “అంజయ్య భవన్‌” అని పేరు పెట్టించాడు. భాట్టానికి నేను బుణపడి ఉన్నానా? నాకు భాట్టం బాకీ పడ్డాడా? మీరే ఆలోచించండి” అని. ఢిల్లీ పార్లమెంట్‌ హౌస్‌లో నన్ను ఎలా మెచ్చుకునేవాడో చవి చూపించడానికి చెప్పేను. చుక్కల్ని తాకిన ఈ చిన్న తోక ఈ శాఖ రాణించిన బాణీ మీకు తెలియచేసాను. రోశయ్య మాటలు

ఒకమారు రోశయ్య నాతో అన్నాడు అప్పట్లో, “భాట్టంగారిని మించిన వాడులేడండీ! సహారా ఎడారిలో పడేస్తే కూడా, ఇసక్కి ధర కట్టి అమ్మేస్తాడాయన” అన్నాడు. ఆ మాట నాకు ముందు బోధపదక, “అమ్మడం, కొనడం ఇది మీ షావుకార్ల వ్యాపారం. ఆ ప్రక్రియ నాకు అంటగట్టి ఆనందిస్తున్నారేంటి?” అన్నాను. “అది కాదండీ! వెటకారంగా మాట్లాడలేదు, ఎడారిలో ఇసక్కి విలువేమిటి? అలాంటి విలువలేని శాఖను చేపట్టి దేదీప్యమానంగా వెలగిపోతున్నారు. ఎక్కడ చూసినా మీరే. మేమే, ఆ శాఖను తీసికొని ఉంటే, మట్టి కొట్టుకుపోయే వాళ్ళం” అన్నాడు. అది అతని మనఃపూర్వక ప్రశంసే. అది (గ్రహించి “కృతార్చుడిని” అన్నాను.

దా.సి. నారాయణరెడ్డి అనేవాడు “ఇది స్వర్ణయుగం, స్వర్ణయుగం” అని. ఆంధ్రుల సాంస్కృతిక వైభవం రాష్త్రం నలుమూలలా విరాజిల్లుతోంది అన్న అభిప్రాయం వెలిబుచ్చాడు.

ఆంధ్రదేశం, కళలకు నిలయం. కళామతల్లి పుట్టిన స్థానం. దేశం నలుదిశలా విస్తరించిన ఈ కళా జగత్తుకు నీరాజనం పట్టిన ఖ్యాతి మన రాష్ట్రానికే దక్కుతుంది.

ఇంతకీ ఈ శాఖ నిజ స్వరూపం ఏమిటి? దానిని నాకప్పగించడంలో అంతరార్థం ఏమిటి? దాని పరిస్థితి ఏంటి? దాని తూకమెంత? సత్యభామ ఏడువారాల నగలను వేస్తే, సరితూగక ఆఖరికి రుక్మిణమ్మ సమర్పించిన తులసిదళం బాపతు నేను. నా ఆలోచన, స్వేచ్చాభారతం 269

సులోచనాలతో నాస్వంత మనసంతా అర్చించి, ఈ శాఖను వెలుగులోకి తేవాలని అహరహం కృషి చేశాను. ఇది ఒక ఒంటి స్తంభం మేడ. నేలను నిలబడి నింగిని అందుకోవాలంటే, ఎలా? ఆకాశ వీథిలోని నక్షత్రాలను గుప్పిట్లో పట్టుకోవాలని ఆశపడితే ఎలా? నక్షత్రాల కాంతులు ఈ శాఖ విరజిమ్మాలని ఉవ్విళ్ళూరదానికి ఇది మ్యాజిక్కా? గిమ్మిక్కా? ఇది సాహసమూ కాదు, సర్మసూ కాదు. ఇది కట్టుకథాకాదు, పిట్టకథా కాదు. లోగుట్టు పెరుమాళ్ళు కెరుక! శ్రీకృష్ణుడు, మురళిని పక్కన పెట్టి,పవళించి ఉంటే, ఆ గిరిధారి సువర్జ్ద హస్తాలలో నిరంతరం విరాజిల్లే ఈ మురళి రహస్యం తెల్సుకోవాలని గోపికాంగన అడిగిందట. “చూడు నాలో ఏముందో! అంతా డొల్ల, ఏమీ లేదు! మీ ప్రియుడు పెదాల దగ్గర పెట్టినప్పుడే మురళిగానం వినపడుతుంది! గోప, గోపికా జనాన్ని తన్మయత్వం చేస్తుంది. అలాగే, ఈ శాఖను అణాపైసలలో లెక్క పెట్టాలంటే, మాటలు దొరకటం లేదు. ఈ శాఖ ఎంతా? బడ్దెట్టు ఎంత?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రస్తుత ఆదాయం లక్షకోట్లు దాటింది. నేటి ముఖ్యమంత్రి తన సంచారకార్యక్రమంలో ఒక చోట గుప్పెట్లో విసిరితే రూ. 500కోట్ల ప్రాజెక్టు వెలుస్తుంది. ఇంకోచోట పదివేల కోట్లు పథకానికి పునాది పడుతుంది. ఈ విధంగా వందలు, వేల లెక్కని పలు తావులలో కోట్లు, కోట్లు గుమ్మరించటం చూస్తున్నాము. అవి అంకెలా లేక రాకెట్లా? అంత ఆదాయం అప్పట్లో లేకపోయినా, ఈ శాఖ బడ్జెట్‌ పెట్టుకొని ఆకాశాన్నంటుకునే కీర్తి, ప్రఖ్యాతులు రాష్ట్రానికెలా తేవాలి? చెన్నారెడ్డి హయాంలో ఈ బడ్జెట్‌ 60లక్షలకి పెంచాడట. ఎంత గోలపెట్టినా కోటి దాటితే బాగుండును అనుకున్న నా ఆశలు అడియాశలు అయ్యాయి.

నేను శాఖ చేపట్టిన తర్వాత సంగీత, నాటక అకాడమీని మూడు అకాడమీలుగా మార్చాను. సంగీత, నృత్య, నాటక అకాడమీలు రూపొందాయి. అనాదిగా ఆంధ్ర ప్రజలను అలరిస్తున్న సాహిత్య, లలిత కళలకు కూడా రెండు అకాదమీలున్నాయి. వాటికీ ఈ శాఖనుండే డబ్బు కేటాయించాలి. ఇప్పుడు చెప్పండి మరి. ఉప్పు, కారం లేని రుచీ లేని కూడు తింటామా? రంగు, రుచీ, వాసన లేని శాఖ మనదని గుట్టు చప్పుడు కాకుండా మూలపడి ఉందామా? అసలు దీని ఆఫీసు గదెక్కడ? సంచాలకుని కార్యాలయం ఎక్కడ? ఈ వ్యవస్థ స్వరూపం ఏమిటి? చెట్టంత మనిషిని తీసుకెళ్ళి, పెరట్లో నాలుక గీస్కోమని పెట్టడం ఏం న్యాయం? అందుకే ముఖ్యమంత్రిని రవీంద్రభారతిని మా స్వాధీనంలో ఉంచమని కోరాను. “నీకెంత కావలస్తే అంత తీస్కో మొత్తం బిల్లింగ్‌ అంతా తీస్కో” 270 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్రు

అన్నాడు అంజయ్య. రవీంద్రభారతికి ఒక డైరెక్టర్‌. అన్ని కార్యాలయాలకు అన్నీ ఆఫీసులు, సాంస్కృతిక శాఖ డైరక్టర్‌కు ఉపసంచాలకుని వేరే గదులు. నా కార్యాలయం యథావిధిగా సెక్రటేరియట్‌లో ఉంటుంది. ఇపుడు నివాసయోగ్యత కల్గి, గృహహ్రవేశం జరిగింది. పి.వి. హయాంలో నేను ఆనాడు నియమించిన అకాడమీల రివ్యూ కమిటీ సిఫార్సులు సచివాలయం సందు గొందుల్లో మూలపడి, ధూళి పట్టీ ఉన్నాయి. వాటి దుమ్ము దులిపాను. 1981లో వాటికి ప్రాణం పోశాను క్రొత్తగా. మూడు అకాడమీలు ఏర్పాటు చేసి, సాటిలేని మేటి మహనీయులతో చర్చించి, ఒప్పించి, కీలకస్టానాల్లో పెట్టి పదవీబాధ్యతలు అప్పగించాను. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సంగీత అకాడమీ అధ్యక్షుడు. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి సలహాదారు. మామిడిపూడి ఆనందం కార్యదర్శి, ఒక కార్యవర్గం, జనరల్‌ కౌన్సిల్‌ కూడా ఉంటుంది. అందులో బాలాంత్రపురజనీకాంతరావు, పాలగుమ్మి విశ్వనాథం, శ్రీరంగం గోపాలరత్నం, యస్‌.పి. బాలసుబ్రమణ్యం, భానుమతీ రామకృష్ణ, జానకీ చిట్టబ్బాయ్‌ వంటి (ప్రముఖులను నియమించటం జరిగింది. అదే విధంగా నాటక అకాడమీకి జమున అధ్యక్షురాలు, సుంకర కనకారావు ఉపాధ్యక్షులు, పి. కృష్ణంరాజు కార్యదర్శి, రాజారాందాస్‌ సలహాదారుడు. కళాసుబ్బారావు, ధూళిపాళ సీతారామశాస్త్రి, పీసపాటి నర్సింహమూర్తి ఆచార్య ఆత్రేయ, చాట్ల శ్రీరాములు, జె.వి. రమణమూర్తి, పుండరీకాక్షయ్య, వేమూరి రామయ్య, ఏడిదగోపాల రావు వంటి ప్రముఖులు కార్యోన్ముఖులయ్యారు. ఎ.ఆర్‌. కృష్ణ అధ్యక్షతన నాటక శిక్షణాలయం ఏర్పడింది! అదే విధంగా నృత్య అకాడమీ, నటరాజ రామకృష్ణ అధ్యక్షతన. వెంపటి చినసత్యం సలహాదారు పి. ఎస్‌.ఆర్‌. అప్పారావు కార్యదర్శి. సుమతీ కౌశల్‌, కోరాడ నరసింహారావు, యామినీ కృష్ణమూర్తి మంజుభార్గవి, స్వప్న సుందరి, వాసిరెడ్డి కనకదుర్గ, శోభానాయుడు, కళ్యాణి, చిత్తరంజన్‌ వంటి ప్రముఖులు నృత్యకళారంగానికి నూతన వైభవం చేకూర్చడానికి ఉద్యుక్తులయ్యారు. కళలకు కాణాచి, లలిత కళలకు పుట్టినిల్లు సంగీత సాహిత్య చిత్రకళలకు నిలయము అయిన ఆంధ్రవైభవం దశ దిశల చాటి చెప్పగల దిగ్గంతులు అగ్రశ్రేణిలో నిలిచారు. ఆంధ్రజాతి దీర్హ సుషుప్తి నుండి మేల్మొని భారత జాతీయవిద్యా వైజ్ఞానిక కళా రంగాలలో సాటిలేని మేటిగా చిరస్థాయిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించగలదన్న విశ్వాసం ఆంధ్ర ప్రజానీకానికి స్వేచ్భాభారతం 271

కలుగజేశాం. స్వరూపరాణి, వింజమూరి సీత వంటి ప్రముఖులు సేవలందించారు. ఈ అకాడమీలన్నింటికీ ఒక సంవత్సరం పాటు జరిపే కార్యక్రమాల పట్టిక (ధ్రువపర్చి 1.నృత్యోత్సవాలు, 2. సంగీతోత్సవాలు, 3. నాటకోత్సవాలు, 4. చిత్రకళా ఉత్సవాలు, ర్‌. సాహితీ మూర్తుల జయంతులు జన్మదినాలు ఏటికేడాది పొడుగునా జరుపుకొనే కార్యాచరణ పథకాన్ని రూపొందించుకొనే పలువిధాల సూచనలు చేశాను.

సెమినార్లు నిర్వహించాను. నృత్య, నాటక, సంగీత పోటీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాము. జిల్లా స్థాయిలో సాంస్కృతిక సలహా సంఘాలు ఏర్పరచి వాటికి జిల్లా కలెక్టరు అధ్యక్షుడనీ, ఎక్సఫీసియో డి.పి.ఆర్‌.ఓ.లను కన్వీనర్లుగాను ఏర్పాటు చేయడమైనది. స్థానిక కళాకారులు, సాహితీపరులు, సంగీత, నాటక రంగాలలో నిష్ణాతులను యిందులో చేర్చుకోవాలని నిర్ణయించాము. (ప్రప్రథమంగా పాతికవేల రూపాయలు కేటాయించి, అదనపు నిధులను అవసరం నిమిత్తం జిల్లా యంత్రాంగం సమకూర్చుకోవలసి ఉంటుంది.

(ప్రతి జిల్లాలో సాంస్కృతిక అభ్యుదయ చరిత్రను గ్రంథస్థం చెయ్యాలన్న నిర్ణయం కూడా జరిగింది. ఎకాడమీలన్నీ సుప్రసిద్ధులైన ప్రఖ్యాత పురుషుల కంఠధ్వని, పాట, మాటలు వగైరా టేపురికార్డు చేయవలెనని కోరాము. సంచార రంగస్థలం కోసం ప్రయత్నం ప్రారంభమయింది. లైట్‌ & సౌండ్‌ యూనిట్స్‌ ఏర్పాట్లు చేయాలని మరొక ముఖ్యమైన నిర్ణయం.

పోతన పంచశతి ఉత్సవాలు వరంగల్‌లో దిగ్విజయంగా పి.వి. నరసింహారావుగారి ప్రోత్సాహంతో సూచనలతో జిల్లా అధికారులు, స్థానిక సాహితీవేత్తల సహకారంతో యీ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ప్రఖ్యాత సినీ కథానాయకీ నాయకులు, ప్రఖ్యాత నటుల సహాయంతో జిల్లాల్లో సాంన్క్సృతిక కార్యక్రమాలు నిర్వహించి మినీ ఆడిటోరియంలను నిర్మాణం చేయడానికి కొన్ని కార్యక్రమాలు జరిగాయి. కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేసి ఆ కూచిపూడి నృత్యశిక్షణా అంతర్జాతీయ కేంద్రంగా అభివృద్ధి పర్చి, దానికి కావలసిన పరికరాలు హంగులు సమకూర్చుకునే కార్యక్రమాన్ని సాంస్కృతిక శాఖ చేపట్టింది.

ఉత్తమ ప్రఖ్యాత సాహితీవేత్తల, రచనల ్రచురణలకు నిధులు కేటాయించడం కూదా జరిగింది. ఉదా: దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి గ్రంథ (ప్రచురణకు రూ. 45,000/- పుట్టపర్తి నారాయణాచార్యుల రచనలకు 1. జనప్రియ రామాయణం, 2. శ్రీనివాస ప్రబంధములకు 20,000రూపాయలు యివ్వడమైనది. కొత్తపల్లి వీరభద్రరావు, 272 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

యం.వి. శర్మ, ఇల్లిందల సరస్వతీ దేవి, పుల్లెల రామచంద్రుడు గారు వంటి ప్రముఖులు ప్రచురణలకు కూడా సహాయం జరిగింది.

ఇది గాక సత్మవుల, సాహితీ వేత్తల ప్రచురణల ఉ(ద్ధంథాలను కొని వివిధ సాంస్కృతీశాఖలకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. వివిధ జిల్లాల్లో సుప్రసిద్దులయిన మహనీయులు, మహాత్ములు, దేశభక్తుల పేర్లతో ఆడిటోరియం నిర్మాణం చేపట్టే పథకం కూడా తీసుకున్నాం.

పోతన పేరుతో వరంగల్‌లో, బళ్లారి రాఘవ పేరుతో కడపలో, త్యాగరాజ స్వామి వారి పేరుతో విజయవాడలో, జమలాపురం కేశవరావు పేరుతో ఖమ్మంలో, నేలకొండపల్లిలో భక్తరామదాసు గారి పేరుతో, శామశాస్త్రి పేరుతో కంభంలో, త్యాగరాజ స్వామి పూర్వీకుల (గ్రామమైన కాకర్లలో, అల్లూరి సీతారామరాజు గారి పేరుతో కె.డి. పేటలోను, గురజాడ అప్పారావు గారి పేరుతో యస్‌.రాయవరంలో, ఆనందగజపతి రాజు పేరుతో విజయనగరంలో, యిట్టి నిర్మాణాలు చేపట్టడం జరిగింది! జగన్నాథ పండిత రాయలు పేరుతో ముంగండలో, ఏర్పాటు చేయడం జరిగింది.

యిది కాక విశ్వవిఖ్యాతి చెందిన తెలుగు వెలుగులనందరినీ ఏక వేదిక మీదకు తెచ్చి ఉగాది పర్వదినాన ఆం(ధ్రప్రభుత్వ పక్షాన సముచిత రీతిని సగర్వంగా సన్మానించడం జరిగింది. ఇవి కాక ఆస్థాన విద్వాంసులను నియమించడం జరిగింది. ఉప్పులూరి గణపతిశాస్తిగారు, బాలమురళీకృష్ణగారు, నటరాజ రామకృష్ణగారు, ఈమని శంకరశాస్రిగారు, పీసపాటి నరసింహమూర్తిగారు, ఎల్లా వెంకటేశ్వరరావులతో పాటు ఉర్జూకవి యాకుబ్‌ అహమద్‌, జావళి, సంగీత విద్వాంసులు అజీజ్స్‌ అహమత్‌ ఖాన్‌ వగైరాలు యిదికాక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గాన కోకిల యం.ఎస్‌. సుబ్బలక్ష్మీని కూడా మన ఆస్థాన సంగీత విద్వాంసురాలుగా నియమించడం జరిగింది. మొదటి ప్రపంచ తెలుగు మహాసభల డెలిగేట్సు కమిటీకి, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీకి, కవిసమ్మేళనాలతో పాటు రెండవ ప్రపంచ తెలుగు మహాసభలను మలేషియాలో కౌలాలంపూర్‌ పట్టణంలో అద్భుతంగా అత్యంత అనందదాయకంగా నిర్వహించడం జరిగింది. సిద్ధేంద్ర కళాక్షేత్రంలో మూడు రోజులపాటు, కూచిపూడి నృత్యోత్సవాలు జరిగాయి. ఆ కార్యక్రమాల అనంతరం ఒక నృత్య విశ్వవిద్యాలయాన్ని అక్కడ నెలకొల్పే ఆశయంతో ముఖ్యమంత్రి అంజయ్యగారితో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అప్పట్లో అక్కడ కృష్ణాజిల్లా కలెక్టరు ఎ.వి.ఎస్‌. రెడ్డి చొరవతో దాదాపు 10 ఎకరాల స్వేచ్చాభరతం 2703

స్థలం తీసుకొని అందులో ప్రఖ్యాత నాట్యాచార్యుల పేర్లతో వారి ఆర్థిక సహాయంతో వసతి గృహాలు నిర్మించడానికి ఉద్యుక్తులయ్యాము. విజయవాడలో సంగీత నృత్యకళాశాల ప్రాంగణంలో విశాలమైన అత్యంత విలువైన భూభాగం అమ్మి ఆ నిధులతో నృత్య విశ్వవిద్యాలయ స్థాపనకు నిర్ణయం జరిగింది. దురదృష్టవశాత్తు అక్కడ స్థానికులు ఈ ప్రతిపాదనను ప్రతిఘటించడం, ప్రముఖంగా నాటి (కమ్యూనిష్టు) విజయవాడ మేయరు మార్కిష్టు నాయకుడు టి. వెంకటేశ్వర్రావు ఆధ్వర్యం వహించడం యిబ్బందికరంగా మారింది. అంతటితో యీ ప్రతిపాదన వెనక్కు పోయింది, మరుగున పడింది. ఈనాడు వందలాది ఎకరాల విలువైన భూభాగం ప్రభుత్వ ఆదాయంకోసం, ప్రయివేటు సంస్థల అభ్యర్ధన మేరకు స్వల్పధరకు దఖలు పర్చడం చూస్తున్నాం. అయినా 1981వ సంవత్సరంలో జరిగిన వైపరీత్యం వలన నృత్య విశ్వవిద్యాలయం నెలకొల్చే ప్రతిపాదన కాలగర్భంలో కలిసిపోయింది. హైదరాబాద్‌లోని పబ్లీక్‌ గార్జెన్‌లోను, తరతరాల తెలుగు పేరుతో కల్చరల్‌ మ్యూజియం పునర్జీవింపజేసే ప్రతిపాదనతో ముందంజ వేయడం జరిగింది. ఇదికాక ప్రభుత్వం తరపున గ్రంథాల ప్రచురణ (స్వల్ప ధరల) పథకం చేపట్టాం. ఆంధ్రదేశంలో స్వాతంత్ర్య సమరం అన్న తెలుగు గ్రంథాన్ని మామిడిపూడి వెంకటరంగయ్యగారు, ఇన్నయ్య గారు కలిసి వ్రాసారు. అదే పేరుతో వేరొక ప్రత్యేక గ్రంథాన్ని ఆంగ్లంలో సరోజినీ రేగాని గారు వ్రాయడం జరిగింది. ఇరవై సంపుటాలలో సమగ్రమైన ఆంధ్రుల చరిత్రను వ్రాయించే బాధ్యత 1-2 నంవత్సరాలలో పూర్తి చేయునట్లు ఆదేశించి ఈ కార్యక్రమాన్ని మామిడిపూడి వెంకటరంగయ్యగారు, ఆరుద్రగార్ల నేతృత్వంలో పూర్తి చేయడం కోసం తగిన ఉత్తర్వులు చేయడం జరిగింది. తిరువయ్యూరులో త్యాగరాజస్వామి వారి శిథిలావస్థలో నున్న స్వగృహాన్ని నేను స్వయంగా చూసి, పునర్చిర్మాణానికి 10లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. గురజాడ స్మారక మందిరం రూపొందించడాన్మి విజయనగరంలోని వారి స్వగృహాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారి స్వగ్భహాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేసినా వారి కుటుంబీకులు అందుకు అంగీకరించలేదు. సుప్రసిద్ధ భాష్యకారుడైన మల్లినాథసూరి వంటి ప్రజ్ఞావంతుల నివాసాలను కూడా జాతికి అంకితం చేసేందుకు ఉత్తర్వు జారీచేయడం జరిగింది. బత్త భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

వృద్ధకళాకారులకు పింఛను సదుపాయం ఉదారంగా, విరివిగా కల్పించడంతో పాటు సుప్రసిద్ధ సాహితీమూర్తులకు 600 రూపాయలు నెలసరి పారితోషికం మంజూరు చేయడం జరిగింది. పారితోషికం అందుకున్న అట్టి ప్రముఖులలో రాయప్రోలు సుబ్బారావుగారు, ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, మరుపూరి కోదండ రామిరెడ్దిగారు, సంజీవ్‌దేవ్‌గారు, దివాకర్ల వెంకటావధాని గారు, కాళోజీ నారాయణరావుగారు, తుమ్మల సీతారామ్మూర్తి గార్లను పేర్కొనవచ్చు.

సంగీత, సాహిత్య, నృత్య, నాటక లలిత కళల పురోగతికి ముఖ్యంగా రాష్ట్రంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికీ, వివిధ రంగాలలోని ప్రముఖుల సహాయ సహకారాలను సమన్వయపరచి, సమీకృత కృషి జరిపి, రాష్ట్ర చరిత్రలో సాంస్కృతిక వికాసానికి నూతన అధ్యాయం ప్రారంభించడం ఆంధ్రజాతికి గర్వకారణం. ఇంకా చెప్పవలసింది ఎంతో మిగిలి ఉంది. కాలం కలిసివస్తే మరోమారు శేషం లేకుండా సంపూర్ణంగా అందజేస్తాను.

| షట ఈ

స్వేచ్భాభారతం 275

హరిజనోద్ధరణ - లక్ష్య లక్షణాలు

మానవ జీవితాల ఆదర్శాల అంతస్థులు

మహాత్మాగాంధీ నిర్మాణ కార్యక్రమాలలో అత్యున్నత స్థానం అలంకరించిన ఖద్దరు ఉద్యమంలో పనిచేసే భాగ్యం కల్గింది. ఆంధ్రప్రదేశ్‌ ఖాదీ గ్రామోద్యోగ సంస్థ అధ్యక్షుడిగా పనిచేసి నాటి అఖిలభారత ఖాదీ కమీషన్‌ అధ్యక్షుడైన దేబరు భాయిమన్నన లందుకోవడం నా అదృష్టం.

మహాత్నాగాంధీ సిద్ధాంతంలో అత్యంత కీలకమైన ప్రముఖన్థానం ఆక్రమించిన మద్యనిషేధ ప్రచార ఉద్యమంలో పాల్గొనే మహాభాగ్యం కూడా కల్గింది. స్వరాజ్య సాధనను వాయిదా వేయడానికైనా అంగీకరిస్తాను గాని మద్యపానానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలను మాత్రం నేను వాయిదా వెయ్యలేనన్నాడు మహాత్మాగాంధీ. సాంఘిక సంక్షేమానికై జరుగుతున్న సాత్విక సమరంలో మద్యపాన నిషేధ కార్యక్రమం అత్యంత ్రధానమైనదని మహాత్మాగాంధీ భావించాడు. అట్టి చరిత్రాత్మకమైన ఉద్యమంలో దీక్ష వహించి ఉద్యమాన్ని కొనసాగించే మహాభాగ్యం కూడా నాకు లభించింది.

అదే విధంగా హరిజనోద్ధరణ కార్యక్రమం కూడా మహాత్ముని అంతరాత్మకు అత్యంత సన్నిహితమైన పవిత్ర ప్రజా ఉద్యమం. సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా పనిచేసిన కాలంలో ఈ ఘన కార్యానికి రాష్ట్ర హరిజన మహాసభల రూపంలో అంకురార్చణ జరిగింది. పేద సాదల బాధలు తొలగాలని నా జీవిత ప్రధాన ఆశయంగా బలీయమైన విశ్వాసంగా ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టి నా ప్రధాన ఆశయాలకు ఆదర్శాలకు అక్షరరూపం ఇవ్వడం జరిగింది.

దారిద్య్రం మీద దండయాత్ర! పేదరికం మీద పోరాటం! కులమత - వర్ణ వర్గ రహిత సమాజ నిర్మాణం అన్న - అనాది - పునాది - విశ్వాసంలోంచి ఉత్పన్నమైన కార్యక్రమం రాష్ట్ర హరిజన మహాసభలు - అంటరాని తనం నశించాలి! ఆర్థిక స్వాతంత్ర్యం 276 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర

కావాలి! సమాజంలో అడుగున పడిన బడుగు ప్రజల (బ్రతుకులు బాగుపడాలి అన్న మహాత్ముని ఆదర్భంలోంచి ఉత్పన్నమైన విశేష కార్యక్రమం. రాష్ట్ర హరిజన మహాసభలు

“నభూతో నభవిష్యతి” అన్నట్టు! అంతకు ముందు ఏడాది జరిగిన ప్రపంచ తెలుగు మహాసభకు దీటైనట్లు ఈ దళిత మహాసభలు చరిత్ర ప్రసిద్ధ కావాలని ఆశ! ఆకాశం అంతపందిరి! భూదేవి అంతవేదిక! అంటూ ఆశలు అల్లుకున్నాను. ఈ బృహత్తర కార్యక్రమానికి ధనాభావం తొంగి చూస్తోంది అయినా భావాలకు బలం ఉంటుంది. ఉత్తమ ఆశయాలకు దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ముందు బిగబిగిసి కూర్చున్న ముఖ్యమంత్రి ముందుకు వచ్చారు. వీటివల్ల జలగం బలం పెరుగుతుంది! పేరు 'ప్రఖ్యాతులొస్తాయి ప్రభుత్వ పెద్దగా! నాకు ఆశయాలు సిద్ధిస్తాయి. కలలు ఫలిస్తాయి!

దళిత జాతి అగ్రనేత కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర నిర్వహిస్తున్న బాబూ జగజీవనరామ్‌ సభల ముగింపుకు ముందే ముఖ్యమంత్రి వెంగళరావునూ-సాంఘిక సంక్షేను శాఖామాత్యుడిగా నన్నూ ఆయన ఘనంగా సన్మానించడం చరిత్రాత్మకమైన సంఘటన. ఆశయాల అంతస్తులు - ఆదర్శాల గోపురాలు!

“జాతి సంపదకు, దేశసొభాగ్యానికి” అందరూ వారసులే,

ప్రగతిశీల ప్రజాకార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ బాధ్యులే;

నవసమాజ నిర్మాణానికి, నూతనశకోదయానికి

మనమంతా మన కర్తవ్యం కలిసికట్టుగా నిర్వర్తించాలనీ,

ఆర్థికంగా, సాంఘికంగా, వైజ్ఞానికంగా, వెనుకబడిన తరగతుల, జాతుల

అభ్యున్నతికి, సత్వర పురోభివృద్ధికి

అభ్యుదయకరమైన పథకాలను కార్యక్రమాలను

పునర్చిర్మించాలనీ, నిర్వహించాలనీ,

అంటరానితనం, ఆర్థిక దాస్యం అంతరించాలనీ,

తరతరాలుగా దగాపడిన, దోపిడికి గురి అయిన నిర్భాగ్యుల, నిరాశ్రయుల,

హరిజనుల సర్వతోముఖాభివృద్ధికి సమగ్రపథకాలు రూపొందించి,

సమైక్య కృషిజరపాలనీ- స్వేచ్చాభారతం 277

అజ్ఞానంలో, అంధకారంలో, ఆర్థిక దాస్యంలో కృశిస్తున్న జాతి జనులను, హరిజనులను, అహంకారంతో, మదాంధతతో నీచంగా, క్రూరంగా చిత్రహింసలు జరిపే అనాగరిక, అటవిక మనఃప్రవృత్తి మటుమాయం కావాలనీ, మానవధర్శ్మం ప్రబలాలనీ, సాటి మానవులతో సమాన ప్రతిపత్తి సర్వప్రజలకు లభించాలనీ- కులమత విభేదాలు, వ్యత్యాసాలు, వైమనస్యాలు నిర్మూలించాలనీ, అంతరించాలనీ, సంపన్నులకు, శ్రమజీవులకు మధ్యవున్న హస్తిమశకాంతర తారతమ్యాలు హెచ్చులొచ్చులు తొలగిపోవాలనీ, తగ్గిపోవాలనీ- మనిషికీ-మనిషికీ మధ్య లేచిన అడ్డుగోడలు తాలగిపోవాలనీ, కూలిపోవాలనీ, మనిషిని మనిషి దోపిడీచేసే సామాజిక వ్యవస్థ మారిపోవాలనీ, మటుమాయం కావాలనీ, మనిషిని మనిషిగా గౌరవించే మాననీయమైన మానవ సమాజ నిర్మాణం జరగాలనీ- సామాన్యుడి శకం కోసం, శ్రమజీవుల స్వర్ణయుగం కోసం, విశ్వమానవ కళ్యాణం కోసం, ఉన్నత జాతీయ పరమ లక్ష్యాల కోసం, జాతినేతలు భారతజాతికి అందించిన ఆర్థిక సూడ్రాల పరమార్థాన్ని సాధించడం కోసం, ముందంజవేయాలనీ - భారత రాజ్యాంగంలో పొందుపరచిన మహోన్నత ఆశయాలను, ఆదర్శాలను, ముందుంచుకొని, సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో నిమ్నజాతులకు న్యాయం కలగాలనీ, దేశప్రగతిలో వారు సరిసమానమైన పాలుపంచుకొని, పురోగమించాలనీ- 278 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్రు

దళిత జాతుల జీవిత ప్రమాణం పెంచేందుకు, విద్యా, ఉద్యోగ విషయాల్లో సాంస్కృతిక రంగాలలో సత్వరాభివృద్ధి సాధించేందుకు, హరిజన సమస్యలు సర్వం సమగ్రంగా, చర్చించి సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించి, ప్రభుత్వానికి అందించాలనీ- ఈ మహాసభ రాష్ట్ర ప్రగతిలో మరో మైలురాయిగా నిలవాలనీ, దళిత ప్రజల జీవిత చరిత్రలో మరపురాని మరోఘట్టంగా ఎన్నో ఆశలతో, ఆశయాలతో పరమలక్ష్యాలతో చరిత్రాత్మకమైన ఈ మహాసభలు నిర్వహిస్తున్నాము.” ఓ ప ఈ స్వేద్ధభరతం 2739

పదవుల విరమణ జీవిత పరమార్థాల సంస్మరణ

“క్రియాశీల రాజకీయాలు వదిలే” నన్నాను. రాజకీయాలలో శీలం ఏమిటి? క్రియ ఎక్కడ? క్రియా శూన్య సామంతులే అంతా అసాధారణ ప్రజ్ఞాధురీణుల బారి నుంచి బయట పడగలవా?” అన్నారు.

“దేన్ని దూరంగా వెళ్లమంటున్నావు? దేవోన్నా? ఆత్మనా?” అని ప్రశ్నించి, ఆది శంకరుని జ్ఞాననేత్రం తెరిపించాడు ఒక నిషాదుడు! రాజకీయాలూ అంతే ఆత్మాశయం కాని రాజకీయం ఉంటుందా? రాజకీయాల నుంచి నిష్క్రమించడం ఏమిటి? ప్రవేశించడం ఏమిటి? రాజకీయం లేని జీవిత ప్రాంగణంలేదు! శరీరం శిథిలం అవుతుంది. కాని ఆత్మనిత్యం! సత్యం! రాజకీయాలూ అలాగే! సమాజానికి రాజకీయాలకు ఉండే సంబంధం జీవాత్మకు - పరమాత్మకూ ఉన్న సంబంధం లాంటిది! ఆత్మనిష్టా గరిష్టులే ముక్తికాంతను వరిస్తారట! జీవితమే సందేహాల పరంపర, ఊహల తంపర. ఎవరు దీన్ని విసర్జింపగలరు? జీవిత పరమార్థాల సంస్మరణ జీవితం పదవుల విరమణ!

నిమ్నోన్నతాలు లేని జీవితం ఉంటుందా? సమస్యలు, సవాళ్ళు లేని జీవితం జీవితం ఏమిటి? సంఘర్షణ లేకుండా సంఘం ముందుకు వెళుతుందా? ప్రతి ఘటన లేకుండా మార్పు ఎక్కడ నుండి వస్తుంది? పోరాట పటిమలేని మట్టి మనిషితో నవసమాజాన్ని నిర్మించగలమా? దీక్షా దక్షతళ్లేని వాడు దాంపత్య జీవితానికి కూడా పనికిరాడు! ప్రజ్ఞకన్నా ప్రతిభ ముఖ్యం! వ్యక్తిగత ప్రతిష్టకన్నా నిర్మాణ పటిష్టత అవసరం. సంకల్పబలం కన్నా త్యాగనిరతి ప్రధానం! సామర్థ్యం కన్నా సాధన ముఖ్యం.

పదవికన్నా - పరిశ్రమ మిన్న ఆశయంలేని జీవితం ఎందుకు? ఆదర్శం ఎరుగని (బ్రతుకు వృథా! లక్ష్యాల నక్షత్రాల మీద చూపు నిలపని శాపగ్రస్తులు సమాజానికే బరువు! 280 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్ర)

ఒంటిగానే పరిస్థితులను ఎదిరించినా, ప్రతిఘటించినా, ఆదర్శంతో జంటగానే ఉందాలి అనుకున్నాను. సమసమాజ సందర్శన కోసం ఎన్ని జన్మలైనా ఎదురు చూడాలనుకున్నాను! నవ సమాజ నిర్మాణానికి మరోమారు జన్మించినా మంచిదేనని భావించాను! మకుటధారి మానవుడని ఎలుగెత్తి చాటాను! మూగపోయిన గొంతుక విచ్చుకొనేవరకూ, మోదడువోయిన బ్రతుకు చిగిర్చే వరకూ, సమాజం శాంతించదనీ, లోకానికి కాంతి, శాంతి లభించవనీ చెప్పాలనుకున్నాను! ఆరు దశాబ్దాలు గడిచాయి? జీవితంలో సాధించింది ఎంత? అంతరంగం మలినం కాకుండా కాపాడుకోవడం ఎలా? దినమొక గండం - బ్రతుకే సుడిగుండం

రాజకీయ రంగంలో ఉండి, విరామం ఎరుగని పనుల పరంపరలో తలమునకలైన రోజులెన్నిలేవు? స్వార్ధ రాజకీయ స్పర్ధల మధ్య, అన్ని రకాల ద్వేషాల వేషాల అష్ట దిగ్బంధనం మధ్య, ప్రముఖులు పన్నిన పన్నాగాల పద్మ వ్యూహం మధ్య, ఎన్నెన్ని ప్రభంజనాలు తట్టుకుంటూ, రోజులు నెట్టుకుంటూ వచ్చానో! రాజకీయ భేతాళుర వికటాట్ట హాసానికి తట్టుకుంటూ నిలిచానో! దినం ఒక గండంగా, బతుకే ఒక సుడిగుండంగా, గడచిన రోజులు తలపుల తలుపులు తడుతున్నాయి! చల్లారని విద్వేషాలు, పెల్లుబికిన వైషమ్యాలు, పెనవేసుకున్న భేద విభేదాలు, దోషాలు, ఆవేశాలు, కట్టలు తెంచుకు ముందుకు వచ్చినా ఎలా మిగిలాం? ఎలా నలిగాం?

రాజుకుంటున్న గుండెలతో రాజకీయద్వేషాగ్ని గుండం మధ్య ఉంటూనే అరుదైన ఆదర్శాల శిఖరాలు వీక్షించాలని, తపనతో, తపోదీక్షతో గడిపిన రోజులు మనసును కలిచివేస్తే ఏం చేస్తాం? చొరవలేకుండా లక్ష్యాన్ని చేరుకోలేమని, సాహసం లేకుంటే సంస్కరణ లేదనీ, గుండె గట్టిది కాకుంటే ప్రగతి పథంలో నడవలేమని, కొన్ని కట్టు దిట్టాల మధ్య జీవితానికి వరవడి పెట్టాలనీ, ఎంతగా ప్రయత్నించానో, ఎన్ని అవస్థలు పడ్డానో ఇప్పుడు అది అంతా అనవసరం! జీవితం ఒక ధ్యేయానికి నివేదన కావాలనీ, అదర్శ్భాల అంతస్టుల్లో నివసించాలనీ, ఆలోచనాలోచనాలు అంతిమ లక్ష్యాల ఉన్నత శిఖరాలపై నిలపాలనీ, ఎన్నెన్ని కలలు కన్నానో, ఎంతెంత తపన చెందానో ఇప్పుడు తలచుకుంటే ఏం లాభం? అగ్నిహోత్రం లాంటి అనుభవాలు; నిప్పురవ్వలాంటి భావాలు, బాధలు, బోధలు; ఎన్ని 'జ్ఞాపకాలు ఎంతకాలం, కాలం కడుపులో నిలుపుకుంటుంది? స్వేచ్చాభారతం 281

బాధల బోధలు ఇక వర్తమానం, సామాజిక జీవనంలోని వైపరీత్యాలు మరీ కలవరపెడుతున్నాయి! కలిచివేస్తున్నాయి! కలిసిమెలిసి ఎంత తిరిగినా, కడుసన్నిహితంగా ఎన్ని దశాబ్దాలు మెలిగినా, అవసరాలు తప్ప, ఆప్యాయతలు లేవు! ప్రయోజనాలు తప్ప పరస్పర ('పేమాఖభిమానాలు రావు! అధికార బాధ్యతలు తప్ప, అనురాగబంధాలు ఉండవు. ద్వేషం రోషంలేని తీరాలకు... పదవుల పోటీలు, వాటాలు, పోరాటాలు, ప్రలోభాలు జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. పదవుల వెలుగులు కల్పించిన కృత్రిమ కాంతుల నుంచి, భ్రాంతుల నుంచి, సంభ్రమ సందోహాల నుంచి దూరం కావాలని ఉంది. రాజకీయ సంరంభాల నుంచి, సంకుల సమరాల నుంచి, సమరాంగణ '్రాంగణాల నుంచి దూరం కావాలని ఉంది! అధికార రాజకీయ వలయం నుంచి, పదవుల పందెపు పరుగుల, నురుగుల నుంచి విడుదల కావాలని ఉంది! వెంటాడే విద్వేషం, ఎదురయ్యే మాత్సర్యం, ఎటు చూచినా స్పర్ధలు, వైషమ్యాలు - అంతటా అలముకున్న అసూయ, అసహనం - ద్వేషం రోషం లేని తీరాలకు చేరాలని ఉంది! మనిషికి గౌరవం, మనసుకు శాంతి, సాటి సోదరునికి సరిసమాన ప్రతిపత్తి - వున్న చోటుకు, ప్రేమానురాగాలు పల్లవించే తావుకు చేరుకోవాలని ఉంది! స్వయంభువులు ఎండమావుల్లాంటి మిత్రత్వాలను ఆరాధించాను, ఎడారుల్లాంటి గుండెల గుడారాల్లో విశ్రమించాను. నా తనువు, తపస్సు సర్వం ధారపోసి అందలం ఎక్కిస్తే అధికారపు టంచులలో పయనించిన సమయంలో, పదవుల ఉపరితలంపై ప్రాణవాయువు లభించిన తరుణంలో, అన్నింటికీ తామే అధినేతలమని, స్వయంభువులమని ప్రకటించారు! కుటిల రాజకీయాల బాల్యక్రీడలలో పెరిగి, కుతంత్రాల వెల్లువలో పదవుల పట్టుకొమ్మలందుకొని, విద్రోహచర్యల ద్వారా వినీలాకాశంలో భాసించాలని ఉవ్విళ్ళూరారు! అందరి మంచిలోనే పంచప్రాణాలు పంచుకొన్నా బుక్కిందేకూడు అని భుజకీర్తులు ధరించారు. రాజ్యం వీరభోజ్యం అని భుజంచరిచారు. పెట్టిన చేతితో. పడగొట్టలేను. నిలబెట్టడమే గాని పడగొట్టడం అలవాటు లేదు! పగబట్టిన జగజ్జెట్టీలను కూడ తిప్పికొట్టిన రోజులు లేకపోలేదు. విధి వంచితుడు చింతించడం కన్నా - సహించడం మంచిది! 282 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్రు

మట్టి నుంచి మనిషిని పుట్టించలేను! మనిషిని మట్టిగా భావించలేను! ఏనుగు దాహం తీర్చలేను! ఎదలో పెరిగిన అసూయాగ్ని ఆర్బలేను!

స్వాతంత్ర్యం వచ్చిందని గట్టిగా చెప్పలేను, అధికారానికి తలవొగ్గమని, అవసరాలకు ఆత్మను '“అమ్ముకోము' అని చెప్పలేను. చిన్న చిన్న గుళ్ళకు చిల్లర దేవుళ్ళకు, జీవితాలు తాకట్టుపెట్టమని అసలే చెప్పలేను. మదాంధకారంలో అధికారానికి, కారం కన్నా వికారం ఎక్కువ,

షి ఈఓ ఈ

స్వేచ్చాభారతం 283

శ్రీ సత్యసాయి భగవానుని దివ్యదర్శనం (ప్రశాంతి నిలయం - దివ్యకాంతుల వలయం! అదే ప్రశాంతి నిలయం. సర్వేశ్వరుని సంస్థానం. సర్వమతాల సంగమస్థానం. సర్వమానవాళికీ కేంద్రస్థానం. నకల బలహీనతలకు - బానిసలంతా అక్కడ పరమాత్ముడి ఒడిలో విజ్ఞత తెచ్చుకుంటారు. సఖ్యత పెంచుకుంటారు (పేమదృక్కుల - ప్రాణవాయువులు పంచుకుంటారు. ఆత్మశక్తి, అనంతశక్తి కలసిన కాయకల్ప చికిత్స పొందుతారు. ఆత్మ విద్యకు మూలాధారం - ఆధ్యాత్మిక కర్మాగారం అది ప్రశాంత నిలయం. అలసిన - మనుషులకు - శరణాలయం. అది స్వామి సన్నిధి - మానవాళికి పెన్నిధి. మానవత్వానికీ - దైవత్వానికీ వారధి. గండ శిలలవంటి గుండెలెన్నో ఆ కరుణా నిలయంలో - కరిగిపోయాయి. పాషాణ హృదయాలు పరిపక్వం చెందిన దివ్యక్షేత్రం అది. మానసికంగా - నీరసించి, కృశించిన వారు, ఆదర్శ జీవితానికలవడి, నైతిక పునరుద్ధరణ పొంది, ఆ పరమపురుషుని పవిత్ర హస్త స్పర్శవల్ల, చల్లని వెన్నెల వంటి కనుచూపుల వల్ల, కదలాడే (ప్రేమ తరంగాల మలయమారుతం వల్ల, దేహం పాందిన -,జవ సత్వాలతో, గుండెల్లో నిండిన - దివ్యత్వంతో, పునీతులై, పవిత్రులై - ఏకస్థలై మెలిగేరు. శిథిల హృదయాలను సరిచేసే ఆధ్యాత్మిక కర్మాగారం, ఆఅత్మవిద్యకు మూలాధారం, పర్తి పురిశుని ప్రశాంతి నిలయం. భూ ప్రపంచానికి బ్రహ్మవిద్య నేర్పే సనాతన ధర్మ పాఠశాల అది. అధ్యాత్మిక పునరుజ్జీవనానికి నాంది పలికే పుణ్యభూమి అది. నవశక వికాసానికి వెలసిన దివ్య కేంద్రమది. మానవాళికి శాంతి, కాంతి. వన్యప్రాంతాల్లో మనిషికి దూరంగా, పర్వత శిఖరాల్లో దేవుళ్ళు అవతరిస్తున్నారు. తిరుపతి, శ్రీశైలంలో మాత్రమేకాక అహోబిలం, మహానంది, కాళహస్తివంటి ఎన్నో పవిత్రక్షేత్రాలు రాయలసీమ ప్రాంతంలో వెలిశాయి. వెనుకబడిన ప్రాంతాలు దేవుడికి దగ్గర అవుతాయా? ఆ ప్రజలు చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం 2ర్రిడ్న భాట్టం శ్రీరామమూర్తి (శ్వేయ చరిత్ర)

ఎంత మహిమాన్వితమైనదో? ఈ కరువు ప్రాంతంలోనే కరుణామయుడు - ప్రేమ సాగరుడు, మానవతామూర్తి, వసుధైక కుటుంబీకుడు భగవాన్‌ సత్యసాయి బాబా జన్మించి, మానవాళికి శాంతి, కాంతి పంచుతున్నారు. లోక కళ్యాణం కోసం అహింసా మూర్తి బుద్ధుడు ప్రభవించిన పుణ్యభూమి మనది. సత్యాహింసలకు మారుపేరుగా, శాంతిదూతగా నిలచిన జాతిపిత మహాత్మాగాంధీ గుందెల్లో తుపాకీ తూటాలు దూసుకుపోయిన దుష్టఘడియల్లో దేశం విలవిలలాడింది. ఆ తరుణంలో జయప్రకాష్‌ నారాయణ చేసిన ప్రకటన ఎన్నడూ మరువలేము, దేశాన్ని హింసాకాండ నుండి, దౌర్జన్య వాదం నుండి కాపాడి, మానవత్వపు విలువలను పునః ప్రతిష్ట చేయడానికి, భగవాన్‌ రమణ మహర్షి అరబింద ఘోష్‌ - భగవాన్‌ దాసుల వంటి మహనీయులు ముందుకు రావాలి అని అన్నాడు. ఆయన భావగర్భితమైన ప్రకటన అంతరార్థం నాటికీ నేటికీ వర్తిస్తుంది. ఎక్కడ శ్రీ సత్యసాయి వాణి వినపడిందో, అక్కడ లోకకళ్యాణం, విశ్వమానవ సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తాయని నమ్ముతున్నాం. రాముడు ఎక్కడ ఉంటే - అదే అయోధ్య. న్వామి ఎక్కడ ఉంటే అది శాంత ధామం. పుట్టపర్తి క్షేతరాజమై జగద్విఖ్యాతమై విరాజిల్లుతోంది. ఒకనాటి కుగ్రామం పుట్టపర్తి నేడు భూతల స్వర్గాన్ని కలియుగ వైకుంఠాన్ని తలపింపచేస్తున్నది. దేశాధినేతల నుండి సాధారణ పౌరుల వరకు పుట్టపర్తి నేడు ఆశ్రయం కల్పిస్తోంది. బుద్ధభగవానుడు - ఏసుక్రీస్తు - జొరాస్టర్‌ - మహమ్మద్‌ ప్రవక్తలందర్నీ తలపించి, మైమరపించే మహిమాన్వితుడు - భగవాన్‌ బాబా సమకాలికులుగా పుట్టడమే మన అదృష్టం. మనం ధన్యులం. దయామయుడు - ఢ్రేమసాగరుడు ఈ విశ్వం సమస్తం - శ్రీ సాయిబాబా నామధేయంతో నిండిపోయింది. చరాచర జగత్తు అంతా - వారిపట్ల ఎనలేని ఢ్రేమ, భక్తి విశ్వాసాలతో పరవశించింది. దృశ్యమాన జగత్తు అంతా - సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అహింసలతో తులతూగాలనీ, మానవత్వంతో తొణికిసలాడి - మాధవుడిగా మానవుడు - లోకకళ్యాణానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి పాటుపడే రోజు రావాలని భగవాన్‌ బాబా, అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఈ స్థిత ప్రజ్జుడు - ఈ పురుషోత్తముడు, ఈ దేవదూత - ఈ అవతారమూర్తి ఆపన్నులను కాపొడి, ఆర్తులను ఆదుకొని మానవత్వంలో దైవత్వం ద్యోతకం చెయ్యాలన్న - అవతార లక్ష్యంతో పనిచేస్తున్నారు. స్వేచ్చాభరతం 285

గిరిగహనాల్లోనో - కొండ గుహల్లోనో, ఉన్నత పర్వత (్రేణుల్లోనో లోకానికి దూరంగా దైవసాన్నిధ్యం లభిస్తుందనుకోవడం భ్రమ అన్నారు. సత్యంతో - త్యాగంతో - వ్‌ వైరాగ్యంతో - ఇంద్రియ విజయంతో, మనో లయంతో ఆత్మ సామ్రాజ్య వైభవం రుడు అనుభవైక వేద్యమేనని చాటి చెప్పేరు బాబా. దయామయుడు బాబా, ప్రేమసాగ బాబా. అవతార తత్వం

తాను కోల్పోయిన దివ్వత్యాన్ని మానవుడు గుర్తించి వర్తించడం కోసం, గమ్యాన్ని చూపించి గమనాన్ని నిర్దేశించడం కోసం, దేహధారిగా పుట్టపర్తి పవిత్రక్షేత్రాన వెలా సాయీశుడు. “అఖిల మానవులకు ఆనందమొనగూర్చి రక్షించుచుండుటే దీక్షనా కో అన్నారు స్వామి. “బీద సాదలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ఢ్రేమనా లోక అని ప్రకటించి ప్రపంచ ప్రజలను ప్రభావితులను చేస్తున్న - భగవాన్‌ బాబా భూ మి చరిత్రగత్తినే మారుస్తున్నార్సు, శ్రీ సత్యసాయి బాబా సర్వజ్ఞుడు. సర్వాంతర్యా సరి సర్వశక్తిసంపన్నుడు. ఆపన్నుల ప్రాల్రిటి పెన్నిధి. భక్తులపాలిటి కల్పతరువు. న్‌ (గ్రామంలో మానవాకారంలో వెలసిన దైవస్వరూపమే భగవాన్‌ బాబా. ఆయ ఆపద్బాంధవృడ్దు, జగద్రక్షకుడ్డు, సర్వదేవతా స్వరూపుడు. పర్తిక్షేశ్ర మాహాత్మ్యం

అవిశ్రాంతంగా ప్రశాంత నిలయానికి దశదిశల నుండి విచ్చేసి ఆ (ప్రేమమ యుద, అ కరుణామ్రూర్తిన్సి ఆదేవదేవ్పడ్పిన్సి భక్తజనులు కన్నుల పండువుగా తిలకించి తరిస్తున్నాల' పుణ్యభూమి బ్రర్సన్స పుట్టపర్తి క్షేత్రానికి మక్కా మసీదులకు మించిన పేరు ప్రఖ్యాత (ప్రపంచం అంతా వ్యాపించాయి. జెరూసలెంను మించిన జగద్విఖ్యాతి పర్తిపరా సన్‌ వెట్టపర్తి రూప్రాాద్ర్వ్వ అయోధ్యానగర వైభవంతో విరాజిల్లే పటి ప్రపంచానిక్తి ఆధ్యాత్మిక రాజధానిగా రూపొందింది. అక్క న కిన కోటీశ్వరుడు మొదలు కూటికి గతిలేని కటిక దరిద్రుడు సర అన్నార్తులు అంత్రా సవమ కూర్చుంటారు. అగర్భ శ్రీమంతులు, అనొగ

ఖ్‌ నంగా ఆ కరుణామయుని కటాక్ష వీక్షణం కోసం ఉంటారు. మాన్యుల్పు, సామాన్వుల్ప “సజ గ ముందు సహాజే సమత్వం కలిగి శ్రంట్రార్స డే వ తా ఆస్వామి పాదపద్మాల సాపొత్‌

  • దెశదేశాల నుండి విజ్ఞాన శాస్త్రవేత్తలు, సంగీత

286 చరిణో? అకా టన లో

నృత్య కళాకోవిదులు, పండితోత్తములు, కవి సార్వభౌములు ఆ దివ్యకేజఃపుంజం ముందు 'ప్రణమిల్లాలని భక్షి ప్రపత్తులతో వస్తారు. యతీశ్వరులు, బుషిపుంగపులు, భక్తాగ్రేసరులు ఎందరెందరో 'పర్తిక్షేత్ర మాహాత్యంతో తన్మయత్వం చెందుతారు. కట దు ళ్‌ జ న ఏద్రుమం వెలసింది ; అన్నపూర్ణ తరలివచ్చింది ప్రశాంత మందిర పరిసర ప్రాంతాల్లో ప్రవేశించగానే వేడీ లోకంలోకి వెళ్ళినట్లు ఉంటుంది. ఈ పవిత్ర ప్రాంగణంలో పూర్వజన్మ ఫుణ్యవశాన అడుగిడినట్లు అనిపిస్తుంది. అలౌకిక ఆనందానుభూతి కలుగుతుంది. సుందరస్వప్పాల, సుమధుర భావాల శీరాల్లో విహరిస్తున్నట్లు ఉంటుంది. కల్పవడ్డం కనుసన్నట్లో మెదలుతున్నట్లు ఉంటుంది. సకల దిక్సాలకుల పర్యవేక్షణలో - సర్వసదుపాయాలు భక్తకోలికి లభిస్తున్నట్లు ఉంటుంది. అన్నపూర్ణ తరలి వచ్చినట్టనిపిస్తుంది. కాషాయాంబరభారి మూలంగా వర్తిపురంలో కలియుగ వైకంళం వెలసిరి. మో పురాకృత పుణ్యఫలంగా పర్తిక్షేతంలో కబ్పదుమం వెలసింది. ౯ సర్వదేవతారిత సరా పునీతం చేసిన పవిత్ర క్షేత్రం నుండి జనావళికి శుభం - సం జగాన రర ునాలు

  • లభిస్తున్నాయి. అక్కడ అంతా నిత్య కళ్యాణం పచ్చతోరణం, సందని వ నవ్వినట్లు ఉంటుంది. నవపారి జుజాలు వల్లివిరినినటు లు సర్వత్రా శాంకి గారి అన రనొ శై మధుర భాషలు - వేద ఘోషలు, భక్త బృందాలి సంర్త చని పవితెక్షేతం " ప్రశాంత సౌరభాలు, కలికానికి కూడా కలియుగ ప్రభావం కనుపీం వ్‌లయ్యు, భూలోక వైళ్రంఠమా? క్రైలాసవాసమా? హా నం కోసం సహస్ర నేత్రాలతో ఎదురు ఆ దేవదేవుని దివ్య మంగళ విగ్రహం సందర్భ కల్పిస్తే శాంతిసొధం నుండీ చూస్తాను, జ నిరాకారుడు సాకారుడిగొ సందర్శన పోసన్ననటు ఉంటుంది. కొంతిపుంజం కదలివచ్చినట్లు ఉంటుంది శాం యంలో విహారిస్తున్నటు " వెలుగుని చల్లని చంద్రరేఖ స్పర్శించినట్లు ఉంటుంది. వెన్సిలె భూలోక వైకుంఠమా? వైలాస పరజాజుల రాజరికంలో ఉన్నట్లు అనిపిస్తుంది. క పాష సమా? నరూపుని దివ్యకాంతులు తమూర్తీ బీ ఏ అ కరుణామయుడు, ఆ అవ ల కేలూపలో సారీ ఫైకుంఠాలు హృదయాంతరాళాలను తేజోవంతం చే నం _ శాంతీ దేవతకు స్వాగలే గీతం కదిలినట్లు ఉంటుంది. వారి న్చుడు మధుర హ్‌? లు న.

పలికినట్లు ఉంటుంది. యాత్రికులను మంత్ర ముగ్జులను చేస్తుంది. సర్వత్రాభక్తి భావ తన్మయత్వం తాందవిస్తుంది. సత్యం నా తనువు - శాంతినా శ్వాస (ప్రేమ నామతం - సత్యం నావ్రతం అన్నారు బాబా. ధర్మం నాదీక్ష - శాంతి నా శ్వాస అన్నారు వారు. ధర్మం నా దేహం. సత్యం నా తనువు. ప్రేమే నా స్వరూపం, సహనం నా వదనం అన్నారు భగవాన్‌ బాబా. ధర్మం - నా దుర్గం. ఆహింసేనా (క్రతువు అన్నారు బాబా, నా బాటే ప్రేమ. నా మాటే ప్రేమ. నేనే (ప్రేమ అన్నారు బాబా. నా ప్రచారం సత్యం, నాతత్వం సత్యం, నేనే సత్యం అన్నారు. ఈ నిత్య సత్యవ్రతునికి నీరాజనాలు. సుందర సత్యసాయీశునికి శతకోటి వందనాలు. విశ్వానికి వేగుచుక్క శ్రీరాముడ్ని చూడలేము. కృష్ణపరమాత్మను కనబోము. నాటి అవతార పురుషుల దివ్య సందర్శన భాగ్యం మనకు లభించదు. మానవాకారంలో నున్నదైన స్వరూపాన్ని శ్రీ సత్యసాయి బాబాలో సందర్శించగలం. ఆంధ్రావనిలోనే ఆయన అవతరించడం మన అదృష్టం. దేవదూత అని - దేవదేవుడని, సకలదేవతా స్వరూపుడని అందరూ ఆరాధిస్తున్న భగవాన్‌ శ్రీసత్యసాయి బాబా జన్మదినోత్సవం వైభవోపేతంగా జరుగుతున్నది. ప్రపంచ దేశాల భక్తకోటి దృష్టి అంతా పుట్టపర్తి మీదనే కేంద్రీకృతం అయింది. ఖండ ఖండాంతరాల నుండి జనసందోహం పుట్టపర్తి గ్రామానికి తరలివస్తున్నారు. జగత్తుకు ఆధ్యాత్మిక రాజధాని దశావతారాలను తలచుకుంటే, వారి అవతార (ప్రాభవం దాదాపు దేశ పరిధులకే పరిమితం అయింది (బౌద్ధంలో తప్ప), శ్రీ సత్యసాయి అవతార ప్రభావం మాత్రం దిగ్ధిగంతాలకు వ్యాపించింది. భగవాన్‌ బాబా ఆత్మజ్యోతి అఖండ జ్యోతిగా భూమండలాన్నే తేజోవంతం చేసింది. దేశవిదేశాలు పయనించి తమ అపూర్వ వాగ్గాటితో ప్రపంచ ప్రజలను ముగ్జులను చేసారు స్వామి వివేకానంద, స్వామి రామతీర్థ వంటి మహనీయులు. దేశం పొలిమేరలు దాటకుండానే (ఒక్క ఆఫ్రికా సందర్శన సందర్భం మినహాయిస్తే) ప్రపంచ (ప్రజానీకం పుట్టపర్తి తరలివచ్చేటట్టు చేసారు శ్రీ, సత్వసాయిబాబా! ఆస్తిక ప్రపంచానికి పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. బాబా జన్మదినోత్సవం వేడుకల సందర్భంగా పర్తిగ్రామంలో యావత్‌ప్రపంచ సంగ్రహ స్వరూపం సందర్శించగలం. చైతన్య మహాప్రభువు

  • భక్తజయదేవ్‌ - జ్ఞాన్‌దేవ్‌ - నామదేవ, మీరాబాయి వంటి మహనీయులెందరో 288 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

ప్రభవించిన పుణ్యభూమి మనది. భక్తరామదాస్‌, త్యాగయ్య, అన్నమయ్యలకు పుట్టినిల్లు ఈ తెలుగు గడ్డ. (పేమ బీజాలు - శాంతి కుసుమాలు మానవాళి పునరుద్ధరణ కోసం, ఉన్నత మానవత్వ విలువల పరిరక్షణకోసం నవజగానికి సాయీశుని యుగావతారం దివ్యసందేశం అందించింది. భక్తి కోటికి మోక్షమార్గాన్ని లోక క్షేమానికి ఆధునాతన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించింది. సనాతన భారతీయ సాంస్కృతిక ప్రాభవాన్ని వైభవాన్ని సర్వులకు ప్రబోధించి, అనేకత్వంలో ఏకత్వాన్ని సర్వమత సామరస్యాన్ని సాధించి - మానవాళికి ముక్తి మార్గం చూపించడమే ఈ అవతార లక్ష్యం. మానవుని అంతరంగంలో (క్రేమ బీజం నాటి - శాంతి కుసుమాల సౌరభం వెదజల్లి - విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నాంది పలకాలని వారు కృషి చేస్తున్నారు. మానవుడు మాధవుడు కావాలని, సమత - నవత - మానవతా మహోద్యమాలు మానవాళిని మహోన్నత పథానికి చేర్చాలనీ, సనాతన ఆర్షధర్మ పునరుద్ధరణకు మహోన్నత నైతిక ఆధ్యాత్మిక శక్తిగా అవతరించారు. గతకాలంలో చరిత్ర పుటల్లో మరుగున పడిన స్వర్ణయుగం పునరావృతం కావాలనీ, తిరిగి బంగారు భవితవ్యం ' మనకళ్ల ముందు సాక్షాత్కరించాలనీ - మానవాళిని ముందుకు నడిపే మహోద్యమ రథసారథి శ్రీ సత్యసాయిబాబా. ఆయన నినాదం శాంతి ఆయన పతాకం (ప్రేమ ఆయన సంకేతం సత్యం ఆయన విశ్వశ్రేయస్సుకు వేగుచుక్క ఆయనను దర్శించిన ప్రతిదినమూ పర్వదినమే. జగతి పునరుజ్జీవన మహోద్యమం మనిషికి మనిషికి మధ్య సరిహద్దులు లేని వసుధైక కుటుంబం కోసం - లోకకళ్యాణం కోసం - విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం - మన మధ్య అవతరించేరు బాబా. నవజగానికి ఇది ఒక యుగావతారం. పల్లెసీమల్లో చిరుతప్రాయంలో పాఠ్యగ్రంథాలు వర్ణించిన సామాన్య బాలుడు, భగవాన్‌ బాబాగా భక్తకోటికి షద్దర్శనాల సారాన్ని, సకలశాస్త్ర పురాణ, ఇతిహాసాల పరమార్దాలను, గీతోపనిషత్‌ సారాన్ని - వేద వేదాంగాల ప్రామాణిక వ్యాఖ్యలను అవలీలగా స్వేచ్చాభారతం 289

అర్ధం అయేటట్లు విపులీకరిస్తున్నారు. వేద వాజ్మయాన్ని సనాతన సాంస్కృతిక వారసత్వ సంపదను పునరుద్ధరించి, ఉన్నత మానవత్వపు విలువలు మానవాళికి అందించే మహోద్యమానికి సనాతన సారథి శ్రీ సత్యసాయి బాబా. ఆయన నామం - సత్యం ఆయన రూపం - సత్యం ఆయన నినాదం - సత్యం ఆయన విధానం = అహింస ఆయన విశ్వశ్రేయస్సుకు వేగుచుక్క స్వామి ప్రసంగాలు - మధుర కవితాధారలు వారు మాటలతో చెలగాటం ఆడుతారు. పదగుంభనలో వారు సాటిలేనిమేటి? వారి ప్రసంగాలు ప్రశాంత గంభీరంగా, గంగానదీ ప్రవాహంలా ఉంటాయి. వారి ఉపన్యాసాలు జలపాతంలా ఉంటాయి. జేట తెలుగు తియ్యందనాలు, మనలను పరవశింప చేస్తాయి. తేనెల సోనలను మరిపించే మాధుర్యాలు మనలను మంత్రముగ్దులను చేస్తాయి. సుధారసభరితమైన వారి ప్రసంగాల కవితాధారలు, మనలను తన్మయం చేస్తాయి. సుజన హృదయరంజకంగా ఉంటాయి; ్రబోధాత్మకంగా ఉంటాయి. రసోత్పత్తిని కలిగిస్తాయి. ఆ సౌజన్యమూర్తి పదలాలిత్యం, దివ్యకాంతులు ప్రసరిస్తాయి. కాంతి పుంజం - శాంతి దూత మైకుముందు వారు ఒకకాంతి పుంజంలా ఉంటారు. ఒక కాంతిదూతలా కంటికి కనిపిస్తారు. హంసగమనంతో వారు వేదికను అలంకరించునప్పుడు మలయమారుతం వీచునట్లు ఉంటుంది. వారి ప్రసంగం పారవశ్యంలో తన్మయులు అయిన శ్రోతలు - పరలోక రహస్యాలు (గ్రహిస్తున్నట్లు ఉంటారు. ఆ మధుర కవితాధార - ఆత్మానందం కలిగిస్తుంది. ఆ ప్రసంగ సుధా ్రవంతిలో భావాతీత సత్యాలు గోచరిస్తాయి. ఆ స్వర మాధుర్యంలో దివ్యభావాల పరిమళాలు వెదజల్లుతారు. వారి కంఠధ్వనిలో లోకనాథుని నాదాలు వీనులవిందు చేస్తాయి. వారి అద్భుత తేజస్సు - దేవ గంధర్వుల శాంతి పుంజాలు తలపింపజేస్తాయి. వారి వాగ్గోరణి హృదయాంతరంగాలను తేజోమయం చేస్తుంది. వారి ప్రసంగ ప్రవాహం ఉషనిషద్వాహినిలా ఉంటుంది. వారు ప్రయోగించే ప్రతిపదం - ఒక (బ్రహ్మ సూత్రంలా ధ్వనిస్తుంది. 290 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్రు

వారి ప్రతి మాట ఒక మంగళ గీతంలా ఉంటుంది. ప్రతి పలుకు ఒకపద సాహిత్యంగా ఉంటుంది. 'ప్రతివాక్యం ఒక సత్యకావ్యంలా ఉంటుంది. వారి ప్రసంగం వినే ప్రతినిముషం మనం అనిమిషుల్లా ఉంటాము. ఆ (ప్రసంగం ప్రవాహంలో తడిసి తలమునకలైన శ్రోతలు యుగావతారం సత్య ప్రభావానికి, ఉత్తేజితులు అవుతారు. అమృత బిందువులు - ఆనంద సింధువులు ఆ అనంతశక్తి - ఆ తేజోశక్తి మానవమాక్రుని ఆధ్యాత్మిక ఉన్మత్తతలో, ఆనంద పారవశ్యంలో ముంచి తేలుస్తుంది. స్వామి పలుకు భావికి ఒక పిలుపులా ఉంటుంది. మన మలిన భావ తరంగాల పైన ఉరుములా ఉంటుంది. శాఖోపశాఖలుగా విస్తరిల్లిన మనజీవిత కీకారణ్యంలో - పుష్పరాసులు చేర్చినట్లు ఉంటుంది. పూలగుత్తులు విరజిల్లినట్లు ఉంటుంది. గండశిలల - గుండెలు కూడా కరిగించి ద్రవించేటట్లు చేస్తుంది. కరకు రాతి మనస్సును కూడా - మృదు మధురంగా మార్చివేస్తుంది. ఎడారులు వంటి గుండెల గుడారాల్లో అమృత బిందువులు కురిపిస్తుంది. ఆనంద సింధువులు ఒలికిస్తుంది. మానవత్వం మటుమాయమైన మనిషి హృదయంలో విశ్వ ప్రేమ విత్తును నాటుతుంది. హింసకు, క్రార్యానికి, కుటిలత్వానికి అలవడిన మనిషి మనస్సులో - కారుణ్య రసవాహినులు ఉత్పన్నం చేస్తుంది. తప్పు చేసిన సొంత బిడ్డను తల్లిలాలించి, సవరించి ఊరడించినట్లు ఉంటుంది. వసుధైక కుటుంబానికి రహదారి దారితప్పి తప్పటడుగు వేసిన తనయుడిని - పశ్చాత్తాప, ప్రాయళ్చిత్తాలతో పవిక్రుడిని చేస్తారు స్వామి. పునీతుడిని చేస్తారు. జీవితం గమ్యం వైపు నడిపిస్తారు. అంతిమ లక్ష్యాల సుందర స్వప్పాలను దర్శింపజేస్తారు. స్వామీ దివ్యత్వ ప్రభంజనం భక్త జన హృదయాల్లో పరివర్తన తెస్తుంది. తక్షణ కర్తవ్యం గుర్తింపజేస్తుంది. పరమాత్ముడి వైపు పిలుస్తుంది. పరలోకకాంతులు కురిపిస్తుంది. స్వేచ్భ్చాభారతం 291

సహజంగా స్వామిని సందర్శించిన ప్రతి ఒక్కరు మళ్లీ స్వామిని దర్శించడానికి టిక్కెట్టు పొందినట్లే. ప్రపంచములోని రస్తాలు సమస్తము పర్తిపురానికే దారి చూపిస్తాయి. సుందరస్వామి సన్నిధే - మన పెన్నిధి అని నిరూపిస్తాయి. ఆ అవతారతత్త్వం దివ్యత్వం దిశదిశలను తేజోవంతం చేస్తుంది. సర్వమానవాళిని ఏకోన్ముఖం చేస్తుంది. ప్రపంచ పౌరులంతా ఏక కుటుంబీకులు అని గుర్తుచేస్తుంది. వసుధైక కుటుంబానికి - రహదారి వేస్తుంది. అది దివ్యవాక్కు - వేదవాక్కు స్వామి అందరినీ “బంగారూ” అనే పిలుస్తారు. బంగారంలా అందరూ మెరిసిపోతూ ఉండాలని వారి కోరిక. వారి కంటికి కాకి బంగారం - మాయ బంగారం కూడా - అసలు సిసలు బంగారంగానే కనబడుతుంది. వారి కంటికి మంచే గోచరిస్తుంది. వారి కనుచూపువల్ల మనలోని చెడ్డ అంతా మటుమాయం అవుతుంది. మనదృ్భష్టి వారి మీద ఉంటుంది. వారి దృష్టి మన సృష్టి మీద ఉంటుంది. మన ్రవృత్తి మీద ఉంటుంది. మనలో పరివర్తన కోసం - పరిశోధన చేస్తూ ఉంటుంది. అది దైవదృష్టి. దివ్యదృష్టి వారిది దివ్యవాక్కు వేదవాక్కు శ 4 ఈ 292 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

అపూర్వ సహోదరుల అలసి జోషి

మైత్రీ బంధం - ప్రపంచ తెలుగు మహాసభల అనుబంధం

(మండలి వెంకట కృష్ణారావ్‌ - నేనూ) -మా ఇద్దర్నీ జంటకవులు అనేవారు. ఆధునిక రాజకీయాల్లో కవలలుగా భాసించే మమ్మల్ని చూస్తే కొందరికి కన్ను కుట్టేది. మరికొందరికి కడుపుమండేది. ఆనందపడేవాళ్లు కూడా అత్యధికంగా లేకపోలేదు. ఒకే నాణానికి రెండు పార్వ్వాలుగా - ఒకే గమ్యానికి రెండు మార్గాల్లా - ఇద్దరం సమ ఉజ్జీలుగా రాజకీయ క్షేత్రంలో పులుకడిగిన ముత్యాల్లా భాసించేవాళ్లం.

పదవుల కోసం ప్రాకులాడక - అధికారం కోసం అగ్రులు చాపక, నీకీ నిజాయితీలకు నిలువుటద్దాలుగా జీవిత పరమర్థాలుగా భావించే మా అన్నదమ్ముల అభేద రహస్యం అందరికీ తెలిసేది కాదు. పదవుల పంపకంలో. శాఖల కేటాయింపుల్లో మాకు తేడాపాడాలు వచ్చేటట్టు అధికార శిఖరాగ్రంలో కూర్చొన్న ప్రముఖులు పన్నాగాలు పన్నేవారు. అది గుర్తించనట్లు వర్తించేవాళ్లం. మా ఐక్యతకు అంతరాయం కలిగేది కాదు!

పరస్పరం ఒకరినాకరం “అన్నాగ అని పిలుచుకున్నా - వయోఖభేదం పాటించకుండా

  • అన్నివిధాల అతడే (మండలి) జ్యేష్టుడు ఆ (ధ్రేష్టుడు అన్న భావన నాలో ఉండేది. మొట్ట మొదటి ముఖ్యమంత్రి జలగం చేసిన మొదటి ప్రయోగం కాస్త చూద్దాం.

పి.వి హయాంలో విద్యాశాఖామాత్యుడిగా నేనూ - సాంఘిక సంక్షేమ శాఖా మాత్యుడిగా అన్న మండలి పనిచేశాం. ముఖ్యమంత్రి పదవీ స్వీకరించిన 'జలగం”' ఆ శాఖలను తారుమారు చేసారు. అన్నద్రి నాకు - నాది అన్నకు శాఖాపరమైన బదలాయింపు జరిగింది - కేటాయింపులు ప్రకటించిన వెంటనే రాజ్‌భవన్‌లోనే అన్న నా చెయ్యి పట్టుకొని అన్నదమ్ములిద్దరికీ కుండమార్చులు చేసాడు. వద్దని చెప్పాంపద అని ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లాడు. “ఇది అందరికీ కొట్టొచ్చినట్టు కనిపించే సత్యమే. నాకు ఇది తెలిసి మరీ చేసాను. ఇదే మంచిది మీకూ - నాకూ” అన్నాడాయన. స్వేచద్భాభారతం 298

నిజం చెప్పొద్దూ? అనుభవం నేర్చిన గుణపాఠం కూడా అదే. విద్యాశాఖామాత్యుడిగా నాకన్నా అన్న మిన్నగా శోభించాడు అనుకున్నాన్నేను. సాంఘిక సంక్షేమశాఖ నా అధ్వర్యంలో కొత్తపుంతలు తొక్కింది అని అన్న భావించాడు. ఇదీ - మా పరస్పర అవగాహనా రీతి!

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ మాకు అగ్నిపరీక్షగా మారుతుంది అనుకున్నారు కొందరు. ప్రథమ ప్రపంచ మహాసభలపై మొదటి (పెస్‌ కాన్ఫరెన్స్‌ నా చేత పెట్టించి నన్నే ముందు మాట్లాడించాడు అన్న. ఆనాడు బెజవాడ గోపాలరెడ్డి ఆ వావిలాల వంటి ప్రముఖలెందరో హాజరయ్యారు! ప్రధాన భాగస్వామ్యం నాకిస్తూ - కమిటీలెన్నో ఏర్పరచాడు. ప్రతినిధుల జాబితా ఖరారు. కవి సమ్మేళనం - సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు నాపై పెట్టాడు.

అహోరాత్రులు కష్టించి పని చేసాను. కాని నాపేరు ముందుకు రావాలని ఎన్నడూ అనుకోలేదు. మండలియే అగ్రజుడు - అగ్రగామి. అతని కుడి ఎడమల తోడు నీడగా ఉండాలన్నదే నా ఆశయం వెన్ను దన్నుగా నిలవాలన్నదే నా ఆకాంక్ష! ప్రపంచ మహాసభలు అన్న కిరీటంలో కలికితురాయిగా నిలవాలన్నదే నా ధ్యేయం. అలాగే అన్న ఘనక్తీర్తి విశ్వమంతా వ్యాపించింది. ధన్యోస్మి!

రెండవ ప్రపంచ మహాసభలు మలేషియాలో జరిగాయి - సాంస్కృతిక సంబంధాల శాఖకు అనుబంధంగా జరిగిన ఈ కార్యక్రమం నా శాఖ పరిధిలోకి పర్యవేక్షణలోకి వచ్చింది. ఇంటర్‌నేషనల్‌ తెలుగు ఇనిస్టిట్యూట్‌ అధినేతగా అన్న చేతిలో పగ్గాలు ఉన్నందున దాని ప్రకారం ఆయన ఆమోద ముద్రతోనే అన్ని కార్యక్రమాలు అమలు జరిగేవి!

కౌలాలంపూర్‌లో ఒకే ఒక్క కార్యక్రమం మాత్రం నేను నిర్వహించవలసి ఉంది. రెండవరోజు మధ్యాహ్నం 2.30 - 3.00 గం॥ మధ్య తెలుగు కల్చరల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం. సంతోషం, ఆనందం! అభ్యంతరాల్లేవు!

ఆఖరుకు మద్రాసులో కొందరు ధూర్తులు - యువనేతల వేషధారుల - అసభ్య - అనాగరిక ఆటవిక దుష్ట వర్తనవల్ల అన్న మండలి మలేషియా విమానం తప్పిపోయింది

  • ఆలోటు బయటకు కనపడకుండా దీటుగా భర్తీ చేస్తూ నేనే సభాభినందనలు అందుకున్నాను. 5 ప్రసంగాలు చేసాను. ఆఖరి ప్రసంగంతో మాత్రం ఈ కార్యక్రమాలు అన్నకే అంకితం అంటూ కంటతడిపెట్టాను. 294... భాట్టం శ్రీరామమూర్తి జ్వీయ చంత్రు

మళ్లీ భారత భూభాగంపై కాలుపెట్టిన వెంటనే, ఎదురు వచ్చిన “అన్నను కౌగలించుకొని భోరునవిలపించాను. ఎంత ఆప్యాయతో! ఏమి అనుబంధమో! ఎన్ని జన్మల పుణ్యఫలమో! మద్రాసు నగరంలో యువకింకరుల యమపాశం (ప్రతాపాన్ని ప్రక్కనపెడితే - మలేషియా మహాసభలు ఘనంగా దిగ్విజయంగా జరిగి చరిత్ర ప్రసిద్ధమయ్యాయి. అయినా పనికట్టుకొని కొందరు పైత్యకారులు విపరీత బుద్ధితో అసంగత వ్యాఖ్యానాలు, పత్రికలు దేశానికి ప్రపంచ ప్రజానీకానికి చేరవేసాయి. అసూయపరులు అభూత కల్పనవల్ల - ప్రభుత్వ ప్రతిష్టకు దెబ్బ తగిలింది - మళ్లీ ప్రపంచ మహాసభల ప్రసక్తి ఎన్నడూ ప్రభుత్వం తలపెట్టని పరిస్థితి - దుస్థితి ఏర్పడింది. 'ఆటావంటి సంస్థల అధ్వర్యంలో అమెరికా వగైరా దేశాల్లో ఇప్పటికీ జరిగే సభలకు వీటితో సాటి ఏపాటి? ఉన్నతోన్నతమైన ఆశయాలు ఆదర్శాలు ఫలించేది ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే! మహాసభల ఆశయాలు ఛి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, భాషాభిమానులు, ఒక వేదిక మీద కలుసుకొని పరస్పరం సంప్రదింపుల, చర్నల ద్వారా సాంస్పృతిక, భాషా విషయక సంబంధాలను దృధపరచుకోవాలి,

  • తెలుగు భాషా సాహిత్వం, సంస్కృతి, కళల అభివృద్ధిని సాధించడం కోసం. తెలుగు భాషాభిమానులలో సహకార సుహృద్భావాలను మరింతగా పెంపొందించుకోవాలి. +* _ పరిశీలక బృందాలను, మేధావుల, రచయితల, కళాకారుల బృందాలను దేశ, విదేశాల మధ్య మార్చిడి చేసుకొంటూ, సాంస్కృతిక నత్పంబంధాలను నెలకొల్పుకుంటూ, సదవగాహన పెంపొందించుకోవాలి. +* _ తెలుగు జాతి మహోజ్వల చరిత్రను పునఃశ్చరణ చేసుకొని, సంస్కృతిక వారసత్వ సంపదను సుసంపన్నం చేసుకోవాలి! +* వివిధ రంగాల్లో విశ్వ విఖ్యాతి గాంచిన ్రవీణులు నిష్టాతులైన తెలుగు జాతి రత్నాల సహాయ సహకారాలతో, 'తెలుగుభాష - చరిత్ర, 'సంగితం - సాహిత్యం లలితకలా సంపదలను నూతన రీతుల అధ్యయనం చేస్తూ, పరిశోధననలు జరుపుతూ విశ్వవ్యాప్తం చేయాలి. స్వేద్భాభారతం 295
  • దేశ విదేశాలలోని తెలుగు ప్రముఖులు, ప్రజల పట్ల సన్నిహిత - సాంస్కృతిక సంబంధాలు పరిపోషించుకుంటూ, పెంపొందించుకుంటూ, విదేశాంధ్రుల, వారి సంస్థల సాంస్కృతిక అవసరాలను నెరవేరుస్తూ, వారి జాతీయ భావస్సూర్తిని పటిష్టం చేయాలి.

  • _ తెలుగు జాతి మహోజ్వల చరిత్రను స్పృతిపథంలో నిలుపుకొని, నేడు అమలు జరుగుతున్న సాహిత్య వైజ్ఞానిక లలిత కళల (ప్రగతిని సమీక్షించుకొంటూ, నూతన పథకాలను ప్రణాళికలను రూపొందించుకొంటూ, సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలకాలి.

  • _ కార్యాచరణ విధానాలను అనుసరించటం తరతరాల తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే సంగీత, సాహిత్య, నృత్య, నాటక, జానపద కళరూపాలతో, ఉత్తమ ప్రదర్శనలకు ఉత్తమ ప్రతిభకు, సర్వదా, సర్వత్రా ప్రోత్సాహం కల్పించాలి.

  • _ దేశ దేశాలలోని తెలుగుజాతి ప్రజానీకంతో సన్నిహిత సంబంధాలు ఉంచుకుంటూ, పెంచుకుంటూ, వివిధ రంగాలలో తెలుగు వెలుగులుగా లబ్ద ప్రతిష్టులైన మహానీయులను సత్కరించి ప్రోత్సహించాలి.

  • _ ప్రతిభావంతుల పరిశోధనలు, ఉద్దండపండితుల ఉద్దంథాలు, విజ్ఞాన సర్వస్వాలు, ప్రజ్ఞాన ధురీణుల పాండిత్య (్రతికర్న మాత్రమే ఒక జాతి విశిష్ట సాంస్కృతిక స్పూర్తికి కరదీపికలుగా విరాజిల్లగలవు.

  • ఆంధ్రుల ప్రజ్ఞకూ, విజ్ఞతకూ - విజ్ఞాన వికాసాలకు - సాపొత్య సాంస్కృతిక వైభవానికి సజీవ చిహ్నాలుగా, నిలిచిన లలితకళలు, సంగీత సాహిత్య, నృత్యాలు కలకాలం వర్ధిల్లాలి. అజరామరమైన మన సాంస్కృతిక సంపదను దేశ విదేశ ఆంధ్రులు తమ జీవన స్రవంతిలో మేళవించుకున్నారు. అదే మన జాతీయ, అంతర్జాతీయ భావ సమన్వయానికి, సాంస్కృతిక పరిరక్షణకూ శ్రీరామరక్ష!

+* ఈ సువిశాల విశ్వంలో ఎనలేని తెలుగు జాతి చారిత్రిక, సాంస్కృతిక వైభవాన్ని ఇనుమడింపచేస్తున్న విదేశ ఆంధ్ర ప్రజల కళాఖభినివేశం - సమైక్య సద్భావ జాతీయ చైతన్య విస్ఫోటనం సభ్య ప్రపంచాన్ని సదా ముగ్భులను చేయుగాక!

శ స ఈ 296 భాట్టం శ్రీరామమూర్తి (శ్వీయ చరిత్ర

ఆత్మావలోకనం

అతడు బుద్ధుడు, సుప్రసిద్ధుడు. భగవంతుని వరప్రసాదం. అన్న మండలి వెంకట కృష్ణారావు సుపుత్రుడు. అతనికి మాతో అదే సఖ్యత, అదే ఆప్యాయత. అంతకుమించి మా వృద్ధ దంపతుల పట్ల అపారమైన (ప్రేమానురాగాలు కురిపిస్తున్నాడు. మాకు మాత్రం అంత మంచి మనస్సున్న మనిషి మరొకరు ఎవరున్నారు? అతని మాట కాదనటం ఎంత కష్టం? గత జలసేతు బంధానికి పురికొల్పాడు బుద్ధప్రసాద్‌. వయస్సు పళ్చిమాద్రికి మళ్ళింది, మెదడుకు మేత పెట్టి, కలానికి పదునుపెట్టి 20వ శతాబ్దం ఓవ దశకం నుండి ఆరు పదులు పైగా గడచిన చరిత్రను చిలికి ఆణిముత్యాల్లాంటి అనుభవాలను జాతికి అందించాలని శాసించాడు మా ప్రియతమ బుద్ధప్రసాద్‌.

జాతి జీవితంలో ఆరు దశాబ్దాలు ఆరు క్షణాల క్రిందలెక్క కాలగమనంలో కనుమరుగయ్యే ఆదర్శవంతమయిన చారిత్రక ఘట్టాలకు ప్రాణం పోయాలన్నదే బుద్ధప్రసాద్‌ ఆశ. ప్రస్తుత నా శారీరక మానసిక పరిస్థితులలో ఈ ఆశ నెరవేర్చగలనా? ఎన్నో మలుపులు - మెరుపులు

ఆశయాలు పెంచుకున్నాను. ఆదర్శాలు ముందుంచుకున్నాను. కార్యాచరణకు పూనుకున్నాను. దేహం విడిచేలోగా గమ్యం చేరుకోవాలని, ఆశయాలు సిద్ధించాలని, ఆశపడ్డ మాట నిజమే! అంతిమంగా ఏ దశకు చేరుకున్నాను? ఏ దిశకు పయనించాను? జీవనయానంలో ఎన్నో చిక్కులు! ఎందరికో మొక్కులు! మరెన్నో ఇక్కట్లు, పొరపాట్లు, కష్టాలు, నష్టాలు, అరిష్టాలు, అనిష్టాలు, నిష్ణూరాలు, ఎన్నెన్నో అవాంతరాలు దాటాను; ఎందరో ప్రముఖులు, విముఖుల పరీక్షకు నిలవాలి! నెగ్గాలి! దేశ రాష్ట్ర పరిపాలకుల చెంత చేరి, వంతపాడి, కడకు చింత చెంది, ఆత్మపరీక్ష చేసుకున్నాను. కారు చీకట్ల మధ్య ఒక చిరుదీపం వెలిగించాలని, కాంతిరేఖలు ప్రసరించే కలం వెలుగులు జాతి జనులకు, తోటి మానవులకు, గమనార్హమైన, మార్గదర్శకమైన జీవిత సంఘటనలు, చారిత్రక ఘట్టాలు, వంటివి వారి ముందుంచాలి. జీవితం అనే కొవ్వొత్తి వెలిగించి, స్వేద్భ్ధభరతం 297

బతుకును కరిగించి, కాంతులు నలు దిశల ప్రసరించాలని, పడ్డ ప్రయాస ఫలితం మీముందు ఉంచుతున్నాను. నిండు జీవితపు సాటిలేని మేటి అనుభవాలు అనే కస్తూరిని రంగరించి సమాజం ఆస్వాదించేందుకు అందించాలని ఆశపడ్డాను.

లోకం పోకడ

ఎవరు ఎన్ని చెప్పినా, చేసి చూపినా, ఈ కాలం మానవుడి మనస్సు ఎటు తిరుగుతుందో చెప్పలేం! లోకం పోకడ మారింది! కాలం మారింది! మనిషి మారాడు! మనస్సు మారింది! అతని తీరు తెన్నులు మారాయి. భావాలు స్వభావాలూ మారాయి! ఆకాంక్షలు, అభీష్టాలు మారాయి. అలనాటి విలువలు మటుమాయం అయ్యాయి! నేటి మానవుడు కనే కలలూ మారాయి.

“నేనే సమస్తం” “నాకే సమస్తం” అనే తత్వం పుట్టింది! నీ ఇంటికొస్తే ఏమిస్తావు? మాయింటికొస్తే ఏం తెస్తావు? అనే ఉబలాటం పెరిగింది! మీ ఇంట్లో భోజనం చేసి మా ఇంట్లో చెయ్యి కడుక్కో అన్న తత్వం ప్రబలింది. “పదవులకు పెట్టుబడి! ప్రజలకు మొక్కుబడి!” “అధికారం మెక్కడం! ప్రజలన్ని తొక్కడం!” ఇది నేటి తీరు. “పదవికి ముందు, సేవకు వెనుక” ఇదే నేటి వైఖరి. “పరోపకారం తగ్గింది. స్వార్ధపరత్వం పెరిగింది!” “పనికి పరార్‌, పదవికి తయార్‌!” “అధికారానికి ఆరాటం - పదవికి పోరాటం!” తిట్ల పురాణం - అవినీతి భాగోతం! కులాల కుమ్ములాటలు, మతాల మారణ హోమం! ఈ పద్ధతి ప్రబలింది. దేశం కోసం మనం ఏమిచ్చాం? అన్నది ఒకనాటి గీటురాయి దేశభక్తులకు. దేశం మనకేమిచ్చింది? అన్నదే నేటిమాట! సేవ, సహనం, సమభావం, కరువయ్యాయి! (ప్రేమతత్వం మానవత్వం, మృగ్యమయ్యాయి! “స్త్రీల 'పెదవులందు రాజ్య పదవులందు ఆశలు ఉడిగినట్టి అయ్యలు ధన్యులు!” అన్నారు పూర్వం మన జాతినేతలు. ఇట్టీ ఆశలు పెరిగినట్టి అయ్యలు కోకొల్లలు ఈనాడు! పొరుగువాడికి కీడు చేయటానికి సహస్ర బాహువులు! పరుల దోషాలు ఎంచటానికి వేయి కన్నులు! తమ తప్పు తెలియని కళ్ళులేని కబోదులు ఎందరో ఈనాడు! ఎంచబోతే మంచం అంతా గంతలే! అన్ని పార్టీల్లోను బారులు తీరిన బంధుగణాలే! కొంతకష్టం - కొంత ఇష్టం

“ఇట్టి అవలక్షణాలు ఎన్ని ఎందుకని, లెక్కించాలి? మనిషి విలువలకు నిలబడితే మానవ జీవితానికి వెలుగులు వస్తాయి. జాతి జీవితంలో వెన్నెల కురుస్తుంది. తరచిచూస్తే గడచిన కాలమే బంగారు కాలమనిపిస్తుంది. అప్పుడప్పుడు! 298... భాట్టం శ్రీరామమూర్తి స్వీయ చరిత్ర

కాలానికి కనికరంలేదు. కాలం ఎవరి కొరకు వేచి ఉండదు. జీవితం పరిసమాప్తం కాక ముందే అవతలి ఒడ్డుకు చేరుకోవాలి! గమ్యానికి చేరుకోవాలి! జీవన గమ్యం తెలుసుకున్నవాడే మానవుడు. కలకాలం మానవుడు కృషీవలుడుగానే ఉండాలి. “కృషితో నాస్తి దుర్భిక్షం” 84వ పడి నడుస్తోంది. కొంత ఇష్టంగా, కొంత కష్టంగా రోజులు దొర్లుతున్నాయి. సహ ధర్మచారిణి సహచర్యముతో, అబ్బాయి పరిరక్షణలో, సుపుత్రికల పరిచర్యలతో కాలం గడుస్తోంది. సత్యాన్న ప్రమది తవ్యం

కాలం, కలం సహకరించాలి! జగాలు మారినా నిజాలు మారవు! నిజాలకే విజయం! నిజాలు స్వరానికి ద్వారాలు. “సత్యాన్న ప్రమది తవ్యం” “ధర్మాన్న ప్రమది తవ్యం” ఇవి ఉపనిషత్‌ వాక్యాలు. సత్యనిష్ట్ర ధర్మదీక్ష జీవితానికి పట్టుకొమ్మలు! సత్య శోధన, దినచర్యగా భావించిన పూజ్య బాపూజీని దివ్య జీవితం ఆత్మ చరిత్రగా వెలువడింది. “సత్యం పరం ధీమహి” సత్యం మహిమ వర్ణించడం అలవికాదు! నా దృష్టిలో ఈ రచనకూడ ఒక సత్యగోష్టి సత్‌గోష్టి. ఇది ఒక సత్‌ సంగం! మనమధ్య (పేమబంధం పండించే, భావాల పరంపర! జీవిత సత్యాల, అనుభవాల సంపద! ఆదర్శాల విందు! ఆశయాల దర్పణం!

బుద్ధ ప్రసాద్‌ సంకల్పం ఎంతగట్టిదో! ప్రోత్సాహం ఎంత గొప్పదో! కాకుంటే నా కలం కలకాలం నిలిచే పరమార్థాల పలుకులు ఒలకపోసేనా? ఒంటరిగా పుట్టి, ఒంటరిగానే వెళ్లిపోతాము. ఏది పట్టుకొచ్చి పుట్టాము? ఇక్కడ నుంచి ఏది పట్టుకుపోతాము? జ్ఞాపకాలే మనిషికి ప్రాణ సమానాలు! గత స్కృతులే మనిషికి మృతి లేకుండా చేస్తాయి. స్మరణకు మరణం లేదు!

“దేశాన్ని మరువకు, దైవాన్ని విడువకు.” అన్నారు భగవాన్‌ బాబా. దేహానికి మూలా ధారం తల్లిదండ్రులు. జీవితానికి మూలాధారం భగవంతుడు. భగవంతుడు ఇచ్చిన వస్తువు

  • ఈ దేహం భగవంతునికి ఒకనాడు తిరిగి అప్పగించాలి!

మాలిన్యం లేకుండా! కలిమలం అంటకుండా ప్రక్షాళన చేసి మరీ అర్చించాలి! పుట్టినప్పుడు ఎంత పవిత్రంగా పుట్టామో! పరమాత్మ పాదపీఠం ముందు తలవాల్చేటప్పుడు అంత పవిత్రంగానే ఉండాలి! అందుకే, లోపల మనిషి తృప్తిపడాలి! అంతర్యామి పరిశీలనకు నిలవాలి! ఇందుకు ఆత్మపరిశీలన, అంతర్యానం, అంతర్‌ ముఖత్వమే ఏకైక మార్గం. అంతరంగంలో నిరంతరం కొలువుండే అంతర్యామి పలికించే సత్యవాక్ళులే, పసిడి పలుకులే, ఈ [గ్రంథం అందించే కలం విందులు. స్వేచద్చభరతం 299

పశ్చాత్తాపం

పూర్వం ఎవరితో, ఎంతమందితో తేడా పాదాలు వచ్చాయో! కోరుండి నాకు ఎవరు చెడ్డ చేస్తారు? బహుశ వారిపట్ల నేనే తప్పు చేసుంటాను! తెలిసీ తెలియని తప్పులు ఎన్ని చేసానో! నా తప్పిదాలను, దోషాలను మరచిపోవాలనీ, పెద్ద మనస్సుతో మన్నించాలని సహచరులు - సంబంధీకుల్నీ మిత్ర బృందాన్న్‌ ఆప్తబంధుగణాన్నీ అందర్నీ కోరుకుంటున్నాను. అనుభవాలు, గడచిన అనుభూతులు. భూతాల్లా నన్ను వెంటాడకుండా వాటిని తొలిగించుకోవాలని ఉంది. అందుకే అందర్నీ మన్నించమని కోరుతున్నాను. తుది పలుకులు

నేను అర్భకుడినే. గాని నిర్భయుణ్లి కూడా! నేను ఒంటరినే. గాని అనాథను కాను, నా నాథుడు ఆ శ్రీనాథుదే' ఆజగత్బతే, “రక్షకులు లేనివారిని రక్షించెదను” అని ప్రతిన పూనిన పరంధాముడే నా రాముడు. నయనాఖి రాముడు. సాయి రాముడుకు సాటి ఎవ్వరు? మేటి ఎవ్వరు? ఆ నీడనే ఈ జీవితం పెరగనీ! ఒరగనీ!

“నా నుండి, “మా” వరకూ పయనించమన్నాడు నాదేముడు. ఇప్పుడిక “నేను”

  • “నాదొ అన్నది భావన ఏమీ లేని వాడిని! అందరివాడిని. అంతా మనదే, మానవుడిదే మాధవుడిదే అన్న స్పృహ కలిగినవాళ్డి.

“కోహం” అంటూ పుట్టావు, “సోహం” అంటూ చావు అన్నారు భగవాన్‌ బాబా. నేను ఎవర్ని? అనుకుంటూ పుట్టావు నువ్వు! “నువ్వే (భగవంతుడే) నేను” అని తెలుసుకుని ఈ తనువు చాలించు! ఏడుస్తూ పుట్టావు! నవ్వుతూ చావు అన్నారు! నవ్వే! ఆనందమే! ఏడుపు ఎందుకు నేను పుట్టిన చోటుకు చేరటానికి? నన్ను పుట్టించిన వాడి ఒడిలో కరిగిపోడానికి?

తండ్రీ! ఈ దేహంలో ఆయువు నింపావు! ప్రాణం పోశావు! అది లేచిపోతే ఏమి మిగిలి ఉంటుంది? అప్పుడిది ఒక తోలు తిత్తి! ఒట్టి మట్టి బొమ్మ! నీవున్నంత వరకే నేను. నీవు లేకుంటే నేనులేను. “నేనే-నువ్వు” అనుకుంటూ నీలో చేరనీ! నీలో కలవనీ! ఓ పరమాత్మా! ఓ పరబ్రహ్మ! పాహిమాం! పాహి! పాహి!

1 1 ఇఓ 800 భాట్టం శ్రీరామమూర్తి (స్వీయ చరిత్ర)

చిత్రమాలిక భై. స మ ల. ర టు ర్మ?) ఖ్‌ 1... అత జ న 1 టన "శు తినీ ల టీ క సు! 1 భ్‌ ఘం .. (| ట్ట స గ్గ మ లా ( నట. సన్‌ ర ర మ సి నని తత పే టకా మ సా: ము. భాట్టం శ్రీరామమూర్తి చిన్నప్పటి ఫొటో 4గురు అక్కయ్యలు, తండ్రి సన్నయ్య పంతులుతో మం. [స ఆరేళ్ళ వయస్సులో శ్రీ భాట్టం | స మ. య. ఇస్త్లుళ వా స న... జ్‌ జి | యి టై న మం. స , నం ర సా టం ల న. నం |. 2 ( |] 4 బి టి లే ఏ న! సన ఈ ని | న (1 న... సశ తనన శ. ం గ మ్‌ నాన చనన నచట లో విజయనగరం ఎం.ఆర్‌. కాలేజి విద్యార్ధి యూనియన్‌ అధ్యక్షునిగా (ఎడమ నుంచి రెండవవారు) అధ్యాపక బృందంతో

స్ట్‌ త లత డా స? టో సల స సున ఇడ? ర్జ మౌ ర ర క్షి ట్ర క లో ళ్‌ శు | న తళ ల ఎ రా పం టై + ఎనో సా [ శ ్‌ సన _ జె ధారా స్సు తాాం న్వార్టో. క్‌ ం స. అం. చక్‌: వ్‌ న్‌ ౯ ॥. ఈసి గాట్టా ఠ | / . /| 1 ల వి స ల * గ్రాసం సో అచ ల | ఆంత య] య. | మ! లై స నా. [గా (. వా, + [[[ "గప ల భష పం ను ఉలవ యయా క్‌ అల్‌ రా 1945 సం॥లో నంద్యాలలో జరిగిన విద్యార్ధి కాంగైస్‌ మహాసభకు డెలిగేటుగా హాజరైన భాట్టం - తదితర నాయకులు నా ల లా సనం సస స చ. క గ్‌ నం" ॥ [స య గ్‌ / “ళు ( ప్త? టా యన లర న నున సక కాలయ న. మః బ్యా జే రాజమండ్రి 1947 నవంబరులో భాట్టం వివాహం. మద్దూరి అన్నపూర్ణయ్యగారిని చూడవచ్చు 302

|] టు టు: క... ో టు , మ. ము. . స? రీ. శీ న స్ట కం వుత్రిక లలితల . య కంటు! కరుణ, కనిష్ట పు శీ యి ప్రథమపుత్రిక ఎమ పుత్రుడు . ష్‌. 11] గ్గ] ] య! న! [| “ మ. టు న. ల్ల ్ట (1. / న్‌ శ న | % ల |. నై" సో తా . న. గ గప హ్‌ టం. స! టై షా ర లం గ బం న. ట్ర? టన ళ్‌ లో ౦ కుటుం: . స స” మనా భాట్ట 808

గ న టక ఖో చ ౧ | న .. .. (1/0 స్‌ . యు వ! మ. శ్రీ నందమూరి తారక రామారావుగారితో లో డా! 12 కా క 11. ళా వండ ర... సో. ్‌ వ వ స న్‌? స. కార | ము. | మ ల... టంట. స హా సట క. వటం చటం మ. దిన క లన న ల " న్‌ / క్‌ క్ష [| మ. | లో ఫ్‌ [” ఇ ఇ క్‌ [= నాం ఉట ఈ ని శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డిగారితో 3౩04

గే ల్సి య స. లం [న | / _ శ్‌ టే స ను

  • న ల స. ఎమ్మ న మం న. న మ న. సో న టో శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారితో | క స గ క. హ్‌ మ ళ య. | షం?” నో ష్‌] క" - మ్‌ స్నో ళ్‌ జ స యై = ప్రశ్నా ళీ ఖై . | న్‌ా | న. సు న | షా? క ళీ లై ్గ్‌ శ | శవా. పష క అ శ్హుం॥ స శ స హు ఇళ శ్రీ కాకాని వెంకటరత్నం, శ్రీ నిజలింగప్ప, శ్రీ బ్రహ్మానందరెడ్డి, శ్రీ పి.వి. నరసింహారావుగార్లతో

స స్నో న్‌ న్‌ శ ్దే మం (౮ / నె గ్‌ ల ్ట ల! ే త ౨ ర |. క. ల్‌ బి ధం తో గ్‌. భల రం చా తట్టీ. ఆల స్‌ ॥| న. సిల్‌ హా. ం / ల ( య అవవ ల) లవమ్‌ న ట్‌ 7 స గ్‌ న న లి వ. ఇ? న్‌ నా ర్‌ (4. | సై న క యాం... జే స? ఆ ఆంధ్రప్రదేశ్‌ హరిజన మహాసభలో కేంద్రమంత్రి బాబూ జగజ్జీవన్‌రామ్‌ గారితో టే సంజ ః స ల్థి గః యం . | ప ల “న వాయోా మాం్‌. స . ఆర ఆరి ప్రపంచ తమిళ మహాసభలో తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీయం.జి.రామచంద్రన్‌తో... 306

ము. /.. టై టి చిట! [1 ల 1 | న ,/ న 1 (| న ము స ల్లీ ని. " , నం / టం సెల. టే న్న. ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీతో సమైక్యవాదులు శ్రీ జి, సోమశేఖర్‌, శ్రీ మండలి వెంకటకృష్ణారావు, శ్రీ అసిఫ్‌ పాషా, శ్రీ భాట్టం. | మ 01 స. టీ ల తి న న న న ట్ల వ్‌. అ మం పె. నా... స్ట నీ ః్‌ క్‌ స. (1 11 ల్‌! ప్రసిద్ధ గాయని శ్రీ యం.యస్‌. సుబ్బలక్ష్మిని సత్కరిస్తున్న శ్రీ భాట్టం, ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య, శ్రీ బి.కృష్ణంరాజు 307

[న ల న యన వ స్‌. కు. ల్‌ మ మ ద న స మ! లు స న టి మ లు స న వన మ టు మ ను క న క ల్ల న మ న ని యాం డా. స్యా త హై - న న యా కం టు స ను 1 లై న? నక మ. న | చంచ్తపస్తాలలు న. వ ట్‌ మం. జ సూ బం మా. వ. అశేష ప్రజానీకంతో భాట్టం పాదయాళ[ | న. 1... న . గ. ర. క్‌ి న్‌ పో షై ల్‌ ల ల సన మ. క లం , న. యవ. , శ లొ న గలం ళం / . శ స | + ఎలో స “సహన _ / గ్లో స . ప న. మ వ. న్‌ సత్యాల / [1 .. ం ము. న ఖ వై.యస్‌. రాజశేఖరరెడ్డిగారికి అందిస్తున్న శ్రీమం ష్మరించిన భాట్టం, డా॥ వైయస్‌. శ్రీ మండలి జీవిత చరిత్రను ఆవిష్కరి ట్ట నస్‌ గాజరేఖరంరిగా! . లో శ్రీ కె.రోశయ్య, శ్రీ ఉదయభాను, శ్రీ బుద్ద దృశ్యం. చిత్రంలొ త్రి 5. ్ట్ర, 308

ం జీ? న. వ న ఎన ం జ వ మ ప ఖై గ గా .. కో... ట్‌ స్‌ మహావామ్ష న్య ిష్షాట్రాతనను.. ఫై" ప న సల పం త్యన్మ్య్ష్రషేమాయు, ప టీ స 4న. న. న. వా హ్‌ సు. రండ “7 మం మ న్న నియత లు. లీ వ వ ॥

స్వగ్రామ

గ్రామం ధర్మవరం (గ్రామంలో భాట్ట

జ్య ట్టం నిర్మింపజేసిన శ్రీ సత్యసాయి సే సేవామందిరం,. ఇ నో - మ న నబ న్‌ ాాా

టల మ మ. వ లా. క. ళా మ స ్యల్లూన 2 య న. క క! చాలు వ! హో శభ (స. ం _ నక స. న. మాం షష న న స ఖు. మతం! న | ఎ మ... కంచి పంవపురన! న గో యా.

యు. ” కాకా టీ. సత. పెద్దకుమార్తె శ్రీమతి కరుణ, (|. తు. హ్‌ శిఖ స్తూ అల్లుడు ఆచార్య ఎమ్‌. శ్రీనివాసరావు. , . మాం ని స చట ముల టు కోడలు శ్రీమతి భారతి నస్టాలు యల. మనుమరాలు సునీత, మనుమడు శ్రీరామ్‌. నే ల ను |] నా . _చిన్నకుమార్తె శ్రీమతి లలిత, శ ల ల న గోపినాథరావు. 310

శ నం [జ /] జా స గ న |] (1 య. | | ॥ / శ శ! [యు (స్ట. ల్లో! స్ట మ మం . న్యం సహస్ర చంద్రదర్భనోత్స తానా ము ఈ భాట్టం, శ్రీమతి సత్యవతమ్మలతో శ్రి మండలి బుద్ధప్రసాద్‌ జ మ. | సట ॥ స! కాలేజి చదువులో మి బు గోరరసోవికుదలోుత్షో 2311

న న ప ల ళ్‌ ఓ ర్‌ గ త్త = స! దాశరథి, సి.నా.రె. మంత్రులు అయ్యపురెడ్డి. నేదురుమల్లి జనార్దనరెడ్డి = న న న... ట్‌ టి. తీ న! న్‌ | వ్‌ . కె.వి.ఎస్‌. పద్మనాభరాజు, రాజా సాగి సీతారామరాజు, కాసు బ్రహ్మానందరెడ్డిగార్లతో... 312

1,1 కా మ. | శశ! వలు |: 1 గ్‌ స ం 1; స్థ ఫో " తన్‌ ॥ | క్రొ టు. (నా ల (1 [| ఉంట క ల . మ... |] శాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు ఓంకారస్వామి, మాతాజీగార్లతో భాట్టం శ్రీరామమూర్తి దంపతులు

  1. | క్ష్‌ | - .. కుం (శిఖ మ షత గ్‌ ఇ (చ / కలీ ౮ ల , చీ న్‌ ళా ై మౌంటు ఆబులో బ్రహ్మకుమారీ సంస్థ అధినేత్రి దాదీ - ప్రకాష్‌మణిగారితో భాట్టం శ్రీరామమూర్తి చంపతులు 313

సట వన జ మ వ. మ న్‌ ॥ స , ఖే భగవాన్‌ శ్ర సత్యృసాయిబాదాదారతో ఖాలుల శ్రరాముయూక దందతులు | నాం వ నం నం నం న క యక క ననన న న... ం . న |. మ పం మ గస షం కా శ. ్‌ / గ. భోద స న. రమ్‌ | నానే శే

పం యా పా నన నక స న. సె ళా స్ట వ మాం. మ య / నై చ ముం ల సు అలు ల స్త ర న. ఓ న! న ఆ సాయన ఆ చళ్ల నమ రాష హరిజన మహోనవ్లాలో ంల్‌నున్న భాట్టం ఇరామమూర్తి. నూ వ్‌ ప. టో ప కేంద్ర హోంయంత్రి కాను బ్రహ్మానందరెడ్డి. ముఖ్యములతి అంగం చెంగళరావు, ఒా వై శ లం టా యుఎన్‌, ధేబర్‌, రఘురామయ్య ర. 314

ల ఫో క 4 న్‌ ం ఈ. డా మ. | న. | ఫీ సే... ప్‌ + యం టా చ. కా యటం ఎ.ఐ.సి.సి. అధ్యక్షులు సంజీవయ్య, రఘునాథరెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి, పి. నర్సారెడ్డి (రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షులు) పురుషోత్తం రెడ్డిగార్లతో భాట్టం శ్రీరామమూర్తి (ఏి.సి.సి, సెక్రటరీగా) క్రి ఫి న న నా | మ త నన స స. యం తస చ. యట మ న మట నుత శ. తుమ జె.యన్‌. టి. యూనివర్సిటీలో రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ ఆలీ అహమ్మద్‌, గవర్నరు భండారీ, ముఖ్యమంత్రి జలగం వెంగల్రావు, వైస్‌ ఛాన్సలర్‌ ఎమ్‌.వి. రాజగోపాల, ప్రో.ఛాన్సలర్‌గా భాట్టం శ్రీరామమూర్తి ప్రసంగం 315

న... ల సో వు మక శల ల! సగ

(౧ న శ్‌ ్ష్న న 4 - య్‌.

| |

శి ల న్‌ గ స న లీ కం చళ్ల ॥

స న ఆ ణ్‌ స్స ల (|

॥ /" అం '

/ / /| "4 || 4 / / .. [ఎ . క్‌ , గా (" /ం నీ

ళ్‌ ల్‌ ॥ | . ర న. న మ ౮ 1 సర్దుతున్న బాయల చమన ణయ

శ్రీ డి. సంజీవయ్య, కాంగ్రెస్‌ అధ్యక్షులు, శ్రీ జయపాల్‌రెడ్డి, శోష ఇక్‌ శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, ముఖ్యమంత్రిగార్హతో న. త్‌ యి న. న ప! - | ల మలం లీ నవం [| ర్‌ "| న . హం 6 మా ,.1 ము. ల ఖు శ ర్ల 5 ॥| క! క | య 4. వు సం తో _. సక. ల న. న నానో న 4 బాం? తము. క. ల మ శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, శ్రీ భాట్టం శ్రీరామమూర్తి 316

॥ టు నల స క టల నం. గి 11 గ్గ | వ్య” /! స న్‌ నమ... సట రం స గ [న నాం క. న. |. న పక ల న న . షా య స సై . ఫో... శ .. స్‌? /. . శే 1 |. న గహ 2 ల . రం ల సి. జే న నం. న ణే న. గ! ల ల్‌ో వో బా! 1 1 ల నొ నీల “ న ణో సహ మ న న. | ల న సనన శ్‌ లలల ఎం అలై ఛం శా ఆ ఎల టర్‌ న క "క వల లవి! యో అటు వం భట కాం క. తం. వ వ గ ॥ ॥ యజ తరు” ళో గా యు! ం నం. న న్‌ షే న. ప = |. ఇ ల హె =. ప్త స "క. జీ "౦ ళం న న క నా 4 క రా? ల

  • ॥ జు అ న స్య. / 2 ల ఇ దు న న న ప ళా కా న్‌ న. నం మ క బా. ర్‌ లు లు క్‌ ఉతమ నగ. జ క్‌ జ్‌ ల మ. మ క, లకిరపోయ్నన్న శ | సజ య ఖీ మ. న! నలా వ నవ్యా వాం రు ల్‌ అంక మం మాస్కో (యు.ఎస్‌, ఎస్‌.ఆర్‌.) క్రెమ్లిన్‌లో భారత ప్రతినిధి బృందంలో 317

నీ (1 ప పం పై నిం . సనా లో | [ (| 1 త జీ “ | ః ట్‌ ॥ ల న ఇ య హొ చ్‌ =. ్గ. 11 ళ్‌ వ న... గి పం... స సంసా శ్‌ స! మా. న. | లో గా టల టలు బి ఆ ళ్‌ నోర ల ఈం న. [స మాడకతమి టు ప యం మో... అభిలభారత పంచాయత్‌ పరిషత్‌ సమావేశంలో శ్రీ జయ(ప్రకాశ్‌నారాయణతో ం ల ర! గె మ్ల ము నల్లా మలో క్‌ న యి. ఈ న న త... త ర స... ॥ న లం లం శా ని... నం గ! మ ఖేట్లు ఎ టి సట రట నన చ సనన బుడాపెస్ట్‌, హంగేరీలో ప్రపంచ శాంతి సమావేశ ప్రతినిధిగా 318

[1 న ప్లాన్లు మ ప మ | ప. . ప... న నాన జ ర శ్‌ త . | భి న్‌ ॥ ళ్‌ ల్‌ నో ఆనర్యష్త్రషి గ వయా స షక న నాటి ప్రధానమంత్రి శ్రీ లాల్‌బహదూర్‌ శాస్తి, విశాఖపట్టణం సందర్శించిన సందర్భంలో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, శ్రీ భాట్టం వవ వంట న్‌ య. | య... టాం యి (. సాషహ్టై న “| మ ౪వ. టు / న క. చం ట్‌ |. స . గ. గ య, , శః స్‌ ( ల | న్‌ వ ప న్న స్రీ అలలే! మమల న. నాగా ళా తే కు . పేల న. సో న చస న ట్ట. వ ష్‌ . | షు. న ్ష్‌ శమ న ర క హ్‌ వ స్‌ న. త్రీ తెన్నేటి విశ్వనాథంగారితో శ్రీ భాట్టం 319

న స న?! సు! | లా లే న్‌. య. వ. న స్టు టు] - యా. ల్‌ స్మ | ఖ్‌ (. ఒ 1 ల సల[వ్‌ /| న నా | మ

/ వ. |

వి స

క. ష్‌ చచ టన |

గ్‌ 1) న్‌ మ ల స

/| జం స ప / గ్‌ ల న గ. శ్‌

శో | వోవ్‌ య కం. ౮ ర

స్త్‌ య్‌ అనా! రాష్ట్రపతి శ్రీ నీలం స - జ్రుల క్ర నలం సంజీ తలి గ - వరెడ్డి దంపతులతో శ్రీ భాట్టం దంపతులు క్ష న వా కం. వ యే రం న ఆం చల స యం మ ల అట స్వ ణా మ న న స్త భాట్టం బ్రం ఇంట్లో విశ్వకుటుంబం 320

స జొ య్‌ ళ్‌ ల. య్‌. సా + 11 న్య / | సట. త. చయ . స. (6 స. ల | న న. స.

టీ ను శ్రీ సుందర చైతన్యానంద స్వామితో శ్రీ పి.వి.ఆర్‌.కె. ప్రసార్‌, త్రీ భాట్టం శ్రీరామమూర్తి

/ " ల్‌. నం. లం స క్ష్‌. డే. న. / మ న! గ

  • [ యు. 1 న టీ పింటో | వ న య టు ల. లీ హలో లా శ్‌ న న్‌ [పటట టు మగ! గ క. మ మను ఆ మట మ... న్‌్‌ టి! అ క యుండ. ము! ॥ | 111. య |. ల మి.

వ 1% లతో తీ భౌటొ

త్య య ట్ర

నా మ గీ సీం 11] 101/1 ||! నా ( - క. లు న మనో [111 .. శ (| కి త [ మ ములో శ... స లే ష్‌! ళ్జ స ముల మగా టో ని ు శ స న. గ | | +; తో న్య న్‌ య [ చ్శః , న! న) టం ం! సోః ల (, | ల్‌ సల ల [. 1/1 [111 న లము. ర్ట ట్ల శ. ! లే [1 భక్‌ న్‌ 0 [) కం. జంటే! సు 1" స భ్‌” క్ట క [ న 12 0 మా (5 1. ప? 1! వి ఆ [స | (| జ వా న నె శాఖజి (1 ర! న్‌ నా క్‌. జి "హో న కంు.. న సం! షు! శ ల్లా బోర్లు మా శ 1 / గే స [జ్ర చ. వు. జూ స్ట మాజీ అ శీ ఈగ కసి స... స్‌ న ల &్‌మ ధ్యక్షులు శ్రీ త. ప. చ. (| 1 వ. - త్రి కో ఏపాటి ల “+ స గా ం .. య. టై ళ్త అప టి బుషి టై |. ళ్‌. స సస. ల. క మ త | | [1 ప. 1 య! (1; [1 | న ' క్‌ . పు. . న . ' స! స ష్‌! న ం! . గ మ. గ్గ, . | శ 0? గ 1 జ్ఞాననిధి న. క స టో ... ఉప్పు - స్క . జో న! పతిశాస్ట్రి పా నం. న్‌ థ్‌ ఫట % ప ఫా! గారిని స టు నే క (| 0 శ్రీరా న్మానిస్తు క్రై న. క. స్టయిం 1 1. తె త్రిఅ న లబ ంజయ్య గ

యో నా పుటి. / న భా స్త్ర. ॥ ప! స్‌ ాో. నో స

దివాకర్ల వేంకటావధానిగారి సన్మానంలో న. ( న. న్‌ నట సు మం న. భు న న య.

ఇచ్చి ఆళీ ఆస్థాన విద్వాంసునిగా దాశరథిని స్వాగతిస్తున్న భాట్టం శ్రీరామమూర్తి

|]. 1... న. [11111111 . | ప. ప. న ప. వ ల ప... ౯. న. | ననన స గ్తటముసంయి ము. షష... న... న. న. (1 య. యట 0 ల! న... వ. .. ఖా వ. సం. ల్‌ | న. . తా “న య 0 సంజీవరెడ్డి గారితో వ గ త్‌ 111. యస... జీ? స 1 00 | . 1 ॥ ( 1 [ | ..... శేగాసుటెహానదొడ్డగితో ర బ్రహ్మానందరెడ్డిగారితో గ్‌ 324

ీ వ? సట్‌ ర ) మ షే న్‌్‌ గ్‌ శీ లె న. ల ల న్‌ త్తి పివి న కా! [2 న గ్‌. ర నొ . నరసిం స్త సె చ స హారావు మ క ళా గారితో . వ. లస (1 స హం సీ న ం క ఇ ప . శ్రీ జలగ తి బే . ౧వె మ. సల య. 0 న. . 325 న

గ్‌! ళ్‌ న్‌ ళా స ు.? న జై. డా మ య! స్ట ప. య. స్య? ॥ ౦గళంప న న. [11 పల్లి గా . . నా లబా యట ష్‌ గ [7 లముర* సక .. వ. గ. 01 క సృష్ణ గారికి స న | 111.11 న! 1 న | న్బనం టి ల /1 ల! (| 1 2 1... 1... మ! నాటా 110, నం ఖః వ క్‌ లో గ న. : . లు సుబ పా ఖీ. రిని స్వాగతిన్త మ్‌ న్వొాగళ ౬కి 26 మ్లుల్ము ఖా టం శీ ల రామ. మూరి ట్‌

1.1! ఎ ర్ట ) ( న: స. వ. స ఇళ [1 ఖ్‌ త 1 రుద్రగా, ఖ్యుట్ధ్‌ య! స. క. ఖ్‌ కలో సా బృనంలో ము ని (న ణా న... త్రీటి. అం ఇర జయ్యగారితో త్రీభా ఈ [1 . గారిని హస 1 న. స్‌ సన్నానిస న. మ. న న. శ్రీ భాట్టం న...

వ యి 0 ఫే కం జీ సో... ఖ్‌ సా! “టీ భ్‌ మ ప బాల్యమిత్రుడు యమ్‌. గౌరు నాయుడు ళా గ న్న్న జ. ఘా నానా

11 భాట్టం శ్రీరామమూర్తి శ్వాబ్బా ఖారతం

భాట్టం శ్రీరామమూర్తిగారు 12.5. 1926న జన్మించారు. సోషలిస్టు భావాలతో రాజకీయాలలో ప్రవేశించారు. 1952-58 మధ్య సోషలిస్టు పార్టీ లో వివిధ స్థాయిల్లో వివిధ పదవులు నిర్వహించారు. 1957లో తొలిసారి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. తరువాత కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1967 నుండి 1983 వరకు మూడుసార్లు శాసనసభకు, 1984లో లోక్‌ సభకు ఎన్నికయ్యారు.

1972-81 మధ్యకాలంలో ఏడు సంవత్సరాలు రాష్త్రమంత్రిగా అనేక శాఖలు నిర్వహించారు. మంత్రిగా ఉన్నకాలంలో రాష్ట్రస్థాయి హరిజన సదస్సువంటి అనేక విశిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. తొలి రెండు ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో ప్రముఖ క్రియాశీల పాత్ర పోషించారు.

పదిహేడు సంవత్సరాలపాటు ఏఐసిసి సభ్యుడుగా ఉన్నారు.

“ప్రజారథం), '“ఆంధ్రజనత' పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. తెలుగులోను, ఇంగ్ర్లీషులోనూ వివిధ పత్రికలలో రచనలు చేశారు. సాహిత్య సాంస్కృతిక విలువలు సంతరించుకున్న పలు గ్రంథాలు రచించారు.

తమ సుదీర్ధ రాజకీయ ప్రస్థానంలో హంగరీ, ఇటలీ, ఆ్టియా, యుఎస్‌ఎస్‌ఆర్‌ వంటి వివిధ దేశాలను సందర్శించారు. ...

నిస్వార్థ నాయకునిగా, బలహీనవర్గాల పక్షాన అలుపెరుగని పోరాటం సాగించిన యోధునిగా, ప్రజాసేవకునిగా తెలుగు ప్రజల హృదయాలలో చోటు

_ సంపాదించుకున్నారు. 1989 తరువాత రాజకీయాలనుండి విరమించుకొని ఆధ్యాత్మిక జీవనంలో పరిణతి సాధించారు. దేశాన్ని గురించి, దేశప్రజల భవితవ్యాన్ని గురించి. నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నారు. ఆయన సహజోన్నత సంస్కార సంపన్నత, బెదార్య మధురిమ, అర్ధవంతమైన రాజనీతి అందరికీ ఆదర్శం, ఆచరణీయం.

“స్వేచ్భాభారతం” భాట్టం శ్రీరామమూర్తిగారి ఆత్మకథ "మాత్రమేకాదు, సమకాలీన దేశ చరిత్ర కూడా. గత ఆరు దశాబ్దాలలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో చోటు చేసుకున్న పలు పరిణామాలపట్ల ఒక సచ్చీలుదైన , పౌరుని ఆవేదన కూదా.

తెలుగుసమితి