Telugu swapna vasavadhatha - anilvaranasi/indianlanguages GitHub Wiki
న్వత్ము ఎంసవటదట న్ (చిరుతల నాటకం) డ్” ౮ ఇళ సాయ టయయం లం గను రడ రే // లాండు. మటు. స | న్ న్ లమ శాం | 4. న్ న న్ “శ్చాన్షరనమడయనే సశ , టా ॥ టి ల న మళ! గ . “మంజు న్ పామాడు కు రస 1 స్టా 1. గై ర భు స 4! స హం లోగ, టో క [ గ్ ం యు ఈ రము ప పైగ చి స. (పో శయా ఆ యి పం రా. పురు నంటు సరా మంలో ప భా వాము లు లాను పాంచ! మటానజే (టట సునావాటడదు / ఇ్యర్రూ న్ ఘు . రచయిత. వ స. సం స (9. అెల్పయ్య. న క ల న టం.
స్వవ్వవాసవదత్త (చిరుతల నాటకలు రచన వతం నత్సయ్వా సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్లు
గ. స్వప్నవాసవదత్త ॥ (చిరుతల నాటకం ర్మణ్భగ్నం ఇహా2ి
స్సే- సత
ఏప్రిల్ 2002 అ రచయితవి 6౦౧165 : 600 [07106 : 5. 20/
[0 6౬౦౧165 ; క5గ[1219మగడి
6/0. ౪. ఓ101%గ1606౧1%06 గింం
౧1.010. 1-7-1047, ౧౮౧16? గింంర, "676౧061. లా
- సోకణికన[411 గ్ “ఫ.[0. 2-11-5] 4/3, లా ౪/116౫76౧౮68౬6 010% (ప్రై [10౧0గ[0౧6౦, /6౧6౧8౦| 515%. - 506 000 /
శః న. క్ స 01౧166 0౧. జ లతకి న్త్తస్త్రు విక£న| నిగి![స|7525 1 165016! కిం2061 నాలా ో గ4గ44న01104 ఈజ్త్రైల్తైరార యళ
సుహ్బాదంయం
ఉక్రియాభేదం కెలుగు సాహిత్యంలో ఇషారమైన వైవిధ్యానికి కొత్త ద్వారాల్సి తెరచింది అది లిఖిత సాహిత్యం కావచ్చు మౌఖిక సాహిత్యంకావచ్చు, దేంట్లోనైనా విస్తారంగా. గణనీయంగా సారస్వత పుష్టిని కలిగించింది కూడా ప్రక్రియా పరమైన ఈ వైవిధ్యమే నన్నది సార్వకాలిక సత్యం అనంతమైన భావుకతలో నిమగ్నులైన సొహితీ ్రష్టలు తమభావావేశాలకు తొడిగించే రూపాలు ఇన్నీ అన్నీ కొవు తమ భావాలకు ఒదిగే కొత్తకొత్త రూపాల్ని ఆశ్రయించడంలో సృజనాత్మక రచయితలు చూపించిన చారవ, ఉత్సుకతలే ఈ సారస్వతరంగంలో ఎన్నెన్నో వినూత్న ప్రక్రియల సుసంపన్నతకు ముఖ్య కారణాలయ్యాయి వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ప్రక్రియా వైవిధ్యమన్నదే అనేక కళారూపాల సృష్టికి దోహదకారి అన్న విషయం తెలుస్తుంది
సహృదయ ్రచురణగా ఇప్పుడు మీ ముందుకు వస్తున్న ఈ “స్వప్పవాసవదత్త” కధ చిరుతల నాటకంగా రూపుదిద్దుకోవడం వెనక ఈ ప్రక్రియా వైవిధ్యమే ప్రధాన కారణం. అవప్రతిమాన ప్రతిభాసముద్భాసియైన భాసమహాకవీశ్వరుని సంస్కృత సృష్టి “స్వప్ప్నవాసవదత్త”-నాటకం ఇది ప్రపంచంలోని అనేక నాగరిక భాషల్లోకి అనేక రూపాలలోకి అనూదితమై విశేష ఖ్యాతి నార్జించింది. తెలుగు జూనపదులకు అత్యంత ప్రీతిపాత్రమైన చిరుతల నాటక ప్రక్రియగా తెలుగు ప్రజల ముంగిట్లోకి తీసుకొని వచ్చినవారు వంగా నర్సయ్యగారు.
తెలుగు జానపదుల విశేష '్రక్రియయైన చిరుతల నాటకం ఒక గొప్ప కళారూపం ఆంధ్రప్రదేశంలో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చిరుతల నాటకాలు విశేష ప్రాచుర్యాన్ని పాందాయి యక్షగాన ప్రశ్రియకు కొనసాగింపుగా ఇవి ప్రచారంలోకి వచ్చినట్టు విమర్శకులు చెబుతుంటారు. యక్షగాన ప్రక్రియలో సంభాషణలు, పద్యాలు, పాటలు మొ॥నవి ఆయా పాత్రల వరకే పరిమితమై ఉంటాయి కొని ఈ చిరుతల నాటకంలో అన్ని పాటలు, ఆద్యంతాల వరకు నాట్యం చేస్తు, పాత్రలందరు పాడటం ఇందులో ప్రధాన విశేషం - దీనివల్ల ఈ జీవనాటకం ఉత్సాహభరితంగా ఉండి సామాన్యుల్ని చైతన్యవంతుల్ని చేస్తుంది. సాధారణంగా యక్షగానాలు విద్వత్పరంగా కనిపిస్తాయి. చిరుతల నాటకాలు కధాంశాన్ని సాధారణ (పేక్షకునికి కూడా అందించే పద్ధతిలో కొనసాగుతాయి. అందుకే వంగా నర్భయ్యగారు ఈ ప్రక్రియను ఎన్నుకున్నారు. పండితుల వరకే పరిమితమైన భాస మహాకవిని పామరుల దాకా తీసుకువెళ్ళే గొప్ప ప్రయత్నం చేశారు. చెర్విరాల భాగయ్య, విధుమౌళి శాస్త్రి గార్ల వంటి మహనీయుల పూనికే తెలంగాణాలో ఈ ప్రక్రియ ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రధానకారణం. సామాన్యుని గుండెల్లో సర్వకధాసారాల్ని నింపిన ఘనత నిస్సంశయంగా చిరుతల నాటకానిదేననటం నిజాన్ని అంగీకరించడమే
శ్రీ వంగా నర్స్భయ్యగారు సహృదయులు, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, రచయిత్య తెలంగాణా పోరాట కధన శిల్పి, సామాజిక అవగాహనా దృష్టి పుష్కలంగా కలిగినవారు “సహృదయ ప్రచురణగా దీన్ని వెలువరించే అవకాశాన్ని మాకు కలిగించారు దీనికి ముందుగా వారికి మా ధన్యవాదములు
వరంగల్లు కేంద్రంగా గత ఆరేళ్ళ నుండి సాహిత్య సాంస్కృతిక కార్యశ్రమాల్ని ఒకేవేదిక నుండి అవిచ్చిన్నగా నిర్వహిస్తున్న ఏకైక సంస్థ “సహృదయ” రాష్ట్రస్థాయి నాటకొళ్ళవాలి ప్రతియేడాది ఘనంగ- నిర్వహించడం, సాహితీ పురస్కారాల్ని శ్రమం తప్పకుండా ప్రతియేడాది అందించడం, షముబులి అహ్వానించి విశేష కార్యత్రమాల్ని నిర్వహించడమే గాకుండా, పద్యకవిత వచన కవిత. యకవి నాటికల సంపుటులను పదికి పైగా ప్రచురించింది ఇప్పుడు ప్రచురించిన ఈ స్వప్నవాసవదత్త చిరుతల నాటకాన్ని కూడా సహృదయులు ఆదరిస్తారని ఆ?స్తున్నాము
ఈ నాటకానికి తమ అమూల్యాభిప్రాయాల్ని అందించి ఆశీర్వదించిన పెద్దలు. ఆచార్య ఏరుదురాజు రామరాజు గారికి, ఆచార్య పేర్వారం జగన్నాధం గారికి, డాక్టర్ మలయశ్రీ గారికి సహృదయ పూర్వక నమస్సుమాం. *౫ను సమర్ప్చించుకుంటున్నాము ॥
సకాలంలొ దీన్ని ముద్రించి యిచ్చిన దీప్తి ప్రింటర్స్-హన్మకొండ వారికి కృతజ్ఞతలు
ఈ రబనను సహృదయులకు సాదరంగా అందిస్తూ మీ ఆశీస్సులను అభిలషిస్తున్న
- సహృదయ |||
కీశే. వంగా వేంకయ్య కీ.శే. వంగా లక్ష్మీదేవమ్మ
అంకితం
వు(తోత్తావాం పొందినామన్లు తృప్తీతో
నన్ను ఆళీర్వదించి
నా అభ్యున్తుతిని అకాంక్షింది
జీఐఎంబినంత కాలం
నా వురోగళత్తింః ఆరాటవడిన
తల్లిదండ్రులకు (పేమతో...
. మ . / షం స్. గ న క్రీశ. వంగా వేంకయ్య క్రీశ. వంగా లక్ష్మీదేవమ్మ అంకితం వుతోత్తావాం పాందినామన్సు తృప్తతో నన్ఫు ఆశీర్వదించి జీఐఎంబినంత కొలం నా వురోగత్తిక ఆరాటవడిన తల్లిదండ్రులకు (పేమలో...
-
- ౬414 ౬కీల ఆ య (౧616) ౧౧౦ 1-8-117/2, 0౧॥44602||1, ఇ[0౧౭| [6562100 ౯063501 (౪/౮6/2046 - 500 002 0౪10111612 ౧౧౦౧౪ [10 7661034 అబ్గిసిందన్ మన దేశంలో తెలిసినవారు తెలియనివారికి ఇట్టా చేయి, ఇట్లా
- రు మిత్రుని వఠె హితోపదేశం చేస్తుంది. మూడవతీరు ఆహ్హాదకరంగా ప్రియురాలి బోధవలె ఉంటుంది. మొదటివి వేదాలు రెండవతీరు పురాణాలు మూడవతీరు కావ్య నాటకాలు ఈ విధంగా ప్రబోధం చేస్తాయంటారు. ఇందులోనూ నాగరీకులు మెచ్చే ప్రక్రియలు ఒక తీరుగా ఉంటవి. జానపదుల మనసులకెక్కే ప్రక్రియలు ఇంకొకతీరుగా ఉంటవి. తెలుగునాట జానపదులు అభిమానించే దృశ్య, శ్రవ్య ప్రక్రియల్లో చిబుతల ప్రక్రియ ఒకటి. ఈ ప్రక్రియను ఆశ్రయించినదే ప్రస్తుత రచన స్వప్పవాసవదత్త చిబుతల నాటకం. రచయిత వంగా నర్సయ్య స్వాతంత్ర సమరయోధులు. పోలీసు చర్యకు పూర్వం నిజాం ప్రభుత్వాన్ని ఎదిర్చి సాయుధుడై పోరాడిన యోద్ధ. కఠిన కారాగార వాసం అనుభవించిన త్యాగి. కారాగార విముక్తుడై చదువు కొనసాగించి ఉన్నత విద్యనభ్యసించి ఉపాధ్యాయుడై అలనాటి జ్ఞాపకాలకు స్పృతులకు అక్షర రూపం కల్పించిన శిల్పి. ఆయనకున్న సాహిత్య పిపాసతో 1957లో కూర్చిన ఈ స్వప్పవాసవదత్త చిబుతల నాటకం ఇన్నాళ్ళకు ముద్రిస్తున్నారు. స్వప్పవాసవదత్త చాలా ప్రాచీనమైన నాటకం, కాళిదాసుకంటె ఆారు-వైన భాసమహాకవి కధాసరిత్సాగరంలోని కధలతో చాలా నాటకాలు బ'సనాడు. అందులో ఒకటి స్వప్పవాసవదత్తమనే అమూల్య రచన ఆ నాటకేతి వృత్తాన్న కొలది మార్పులతో ప్రయోగ వైవిధ్యంతో వంగా నర్భయ్యగారు ఈ చిబుతల స్వప్పవాసవదత్తగా కూర్చినారు. చాలా సార్లు ప్రయోగం కావటమే దీనికున్న ఆదరణ, ప్రచారం అని భావించవలె శ్రీ నర్సయ్యగారు ఈ మూసిన ముత్యాన్ని ఇన్నాళ్ళకినా వెలువరుస్తున్నందుకు అభినందిస్తూ పండిన అనుభవంతో జానపద ప్రక్రియల్లో సరికొత్త రచనలు చేయవలెనని కోరుతున్నాను తేది. 23-2-2002 ఇ బి. రామరాజు
0౧ ౧౯౧4కి ఉ64ఉసస! 40014541 1-8-120, 111112౧౬౦౭ ౧౯011061 ౪106-0౮౧4౧౦౭||01 8412920646౧2౧) 1914064 ౮౧౫/౪|9|1/ ౧42౧2౧౧గ0౧6౮౬, /2/20౧04! ౧౧ 578392 రినూరత్న పుయోగం
మిత్రులు శ్రీ వంగ నర్ఫ్భయ్యగారు మంచి రచయిత. తెలంగాణా రైతాంగసాయుధపోరాట కాలంలో రజాకార్లు గ్రామాల్లో చారబడి జరిపిన ఎన్నో దురాగతాల్ని ఘాతుకచర్యల్ని ఊరురా తిరిగి సేకరించి రసవత్తరమైన కథలుగా మలచి “అరుణోదయం” పేరుతో మనకందించినారు. అట్టాగే తనతోటి మిత్రుడు, కళాకారుడు శ్రీ బిట్ల నారాయణగారి జీవిత సంగ్రహాన్ని కూడ ఆసక్తికరంగా రచించినారు. “స్వప్నవాసవదత్త” సేరుతో ఒక చిరుతల ఎపుడో నాటకాన్ని రచించినారు. ఇదొక వినూత్న ప్రయోగం. ఇటువంటి ప్రక్రియ తెలుగులో ఇంతకుముందులేదు. తెలంగాణా గ్రామ సీమల్లో “చిరుతల రామాయణం” అడడమున్నది. ఇదొక జానపద కళారూపం. కళాకారులు రామాయణ కథకు చెందిన వేషాలు కట్టి వర్తులాకరంగా ఏర్పడినృత్యం చేస్తూ గుండ్రంగా తిరుగుతుంటారు. అట్లా నృత్యం చేన్తూ గుండ్రంగా తిరుగుతున్నప్పుడు, చిరుతలు వేస్తూ ఆయా పాత్రధారులు తమ తమ వంతులు వచ్చినప్పుడు ఆయా దరువుల్ని రాగయుక్తంగా పాడుతూ ఉంటే, మిగతా పాత్రలు అదే పాటను అందుకొని మళ్ళీ పాడడం ఈ ప్రదర్శనలోని ప్రత్యేకత. ఈ కళలో చిరుతలకున్న ప్రాముఖ్యాన్ని బట్టి ఇది చిరుతల
రామాయణంగా ప్రసిద్ధికెక్కింది. ఐతే నర్స్భయ్యగారు దీన్ని కొంత మార్చినారు. రంగస్థలంపైకి అవసరమున్న పాత్ర మాత్రవే వచ్చి చిరుతలలో గాన చేస్తుండగా, అముఖ్యపాత్రలు రంగస్థలం కింద అర్ధవలయాకారంగా ఏర్పడి చిరుతలు వేస్తూ అదే పాటనందుకొని గానం చేయడంగా మార్చినారు. అంటే రంగస్టలం ఉన్నందున ఇదొక రకంగా నాటిక ప్రక్రయకు సమీపంగా వచ్చిందన్న మాట ఈ ప్రస్తుత గ్రంథం దేవతాస్తుతితో ప్రారంభమై భారతవాక్యం లాంటి ఒక పద్యంతో ముగుస్తుంది. ఇందులో అంకవిభజన కాని రంగ విభజనకానీ లేవు. పాత్రల ప్రవేశం వీధి భాగోతాన్ని పోలి ఉంటుంది. ఇందులో దరువులే అధిక సంఖ్యలో
స!
ఉన్నా కాన్ని పద్యాలూ ఊన్నాయి. అక్కడక్కడ వచనమూ చోటు చేసుకుంది. వర చ రవ చిరుతల రామాయణ, చిరుతల రామాయణం అనే జానపదకళా లకు మిశ్రమ రూప ప చేస్తూ చిరుతల వయడ మన్నది వి న. పొత్రలు నృత్యం ము అదనంగా చేరిన విలక్షణాలన్నమాట వీధి భాగోతాల్నికానీ యక్షగానాల్నికానీ మనం సర్వసాధారణంగా నాటకాలుగా వ్యవహరిస్తాం. కనుకనే రచయిత దీన్ని చిరుతలనాటకంగా సంభావిస్తున్నారు. ఇక మిగతా ప్రదర్శన కళారూపాల్లో ఒక హాస్య ప్రాత ఉన్నట్లుగానే ఇందులో ఒక తురుష్కపాత్ర నుండి వచ్చిరాని తెలుగు మాట్లాడుతూ హాస్యరసాన్ని పోషిస్తుంటుంది.
రచయిత ప్రక్రియలోనే కాకుండా కధ వస్తువులోనూ కొంత మార్చినాడు. భాసుని “స్వప్పవాసవదత్త' నాటకంలోని కథ కొద్దిగా మార్చినాడు. కొన్ని పాత్రల పేర్లను కూడ మార్చినాడు. అవి బెచిత్య భరితంగా ఉన్నాయి. నాటకాంతంలో శూసేనుడనే ఒక దుష్టపాత్రను నర్చయ్యగారు కల్పించినారు. ఈతడు వాసవదత్తను చెరబట్టబోయినప్పుడు ఒక సర్పం అక్కడికి రావడం, చాలా సేపు అది వాసవదత్త ముందు పడగవిప్పి ఆడడం, అంతలోనే అక్కడికివచ్చి శూరసేనుని అది కాబేయడం కృత్రిమంగా కనిపిస్తున్నది. అంతేకాక ఈ దృశ్యంలో కొంత సాగతీత కనిపిస్తున్నది. ఇక్కడ దైవికళశక్తి మీద ఆధారపడినట్లు కనిపిస్తున్నది. అట్ట్లాకాక అతన్ని మానవశక్తి ద్వారా కూడ ఆ సందర్భంలో చంపే అవకాశం ఉన్నది.
ఈ ఒక్క దృశ్యం తప్ప నాటకమంతా రసవత్తరంగా, సరళంగా నడిచింది. పండితపామరులంతా ఆనందించేదిగా ఉన్నది. ఇదొక కొత్త ప్రయోగం, రచయిత దీన్ని చాలా కాలం క్రితమే రచించినా, ఇప్పుడు ప్రచారిస్తున్నారు. ఇంతకు ముందే దీన్ని గ్రామాల్లో ప్రదర్శించినప్పుడు విశేషమైన ప్రజాదరణ లభించింది. అందువల్ల ఈ ప్రక్రియ విజయవంతమైందనే చెప్పాలి.
ఈ విధంగా శ్రీ వంగా నర్మయ్య గారు రచయితేకాదు ప్రయోక్తకూడ. ఏది ఏమైనా ఇదొక వినూత్న జానపదకళా రూపమని చెప్పాలి. ఈ సందర్భంలో నేను రచయితను మనసారా అభినందిస్తున్నాను తేది. 15-2-2002 పేర్వారం జగన్నాథం
౮/11
రఎందులూటు
ఈ 'స్వప్పవాసవదత్త' చిరుతల నాటకం రణయిళ శ్రీ వంగా నరసయ్యగారు. నాకు కేవలం ఏడాదిక్రితం పరిచయం. వారికి నా పరిచయం పదిహేడేండ్లదట. ఇంటర్ మాడియెట్ ఫైనల్ విద్యార్దులకు నా 'శాంతి పధం బుద్ద నాటకం (ఆంధ్రప్రదేశ్‌లో 1975-78 మధ్య) తెలుగు పార్యగ్రంధంగా ఉన్నప్పుడు వీరు లెక్చరర్, విద్యార్దులకు ఆ నాటకాన్ని బోధించినారు. ఈ మధ్య అశ్వఘోషుని 'వజ్రాసూచి. (శ్రీశ.2వ శతాబ్ది) సంస్కృత రచనకు నా ఆంధ్రానువాద పుస్తకం (మిళింద ప్రచురణ
- గుంటూరు, 1997) సమిక్షలను పత్రికలలో చదివి నరసయ్యగారు నాపై అభిమానం పెంచుకొని, గత సంవత్సరం వారి సాహితీమిత్రులు శ్రీ ఇ. దుర్గరాజుగారిని నా దగ్గరికి నా పుస్తకాల కోసం పంపిన సాహిత్యాభిమాని.
21 అక్టోబర్ 2001 నాడు హన్మకొండలో 'తెలంగాణా సాంస్కృతిక వేదిక సభకు నేను వెళ్ళినప్పుడు కనిపించి, ఆపాయ్యంగా మాటాడి వారి “అరుణోదయం', నాటి నైజాం పోరాట వీరుల చరిత్ర పుస్తకాన్ని ఇచ్చిన్రు. నా పి.హెచ్.డి. గ్రంధం' కరీంనగర్ జిల్లా వెయ్యేండ్ల తెలుగు సాహిత్య చరిత్ర అంటే వీరికి చాల అభిమానం.
అనుకోకుండా ఇటీవల ఫోన్లో మాట్టాడి, అన్నట్లు మరునాడు ఉదయం హన్మకొండ నుండి కరీంనగర్ మా యింటికి వచ్చిన్రు మూడు నాలుగు గంటలు తృప్తిగా మాట్లాడి, ఈ నాటకాన్ని నా ముందుంచి, దీని 'ముందుమాటి మిదే అన్నారు. తీరిక లేకున్నా సరే అన్నా అనకతప్పదు కదా వారు కేవలం సాహిత్యాభిమానంతో 45 ఏండ్ల క్రితం రాసిన ఈ చిరుతల నాటకాన్ని ఇప్పుడు అచ్చేసి చేతులు కాల్పుకుంటున్నారు అయినా అందులో ఎంత తృప్తి!
నేను ఈ నాటకాన్ని ఏకబిగిన మొత్తం చదివిన, భానకవి 'స్వప్నవాసవదత్త' సంస్కృత నాటకం అనువాద సహితంగా నేను చదివిందే ఆ కధ గుణాఢ్యుని బృహత్కధలోనిది. గుణాఢ్య కవి రెండు నేలేండ్లకు పూర్వం శాతవాహనుల కాలంలో మన మెదక్ జిల్లా కొండాపురంలో ఉన్నవాడు 10వ. శతాబ్దిలో కరీంనగర్ జిల్లా వేములవాడ చాళుక్యుల ఆస్టానంలో (పంపకవి తర్వాత) సోమదేవసూరి (కాశ్మిర పండితుడు) 'బృహత్కథను' పైశాచీ భాష నుండి సంస్కృతంలోనికి 'కధా సరిత్సాగరం. పేర చంపూకావ్యంగా అనువదించిండు, సరసయ్యుగారు " కధాసరిత్స్నాగర పద్యమంజరి.
౪/111
చదివిన్రట. అది ఎవరి రచనో నేను చూడలేదు. వీరు మరేదో వచన వాసవదత్త కధను కూడ చదివినమన్నారు. అందుకే ఈ కథలో కొన్ని మార్పులు చోటు చేసుకు న్నవి. ఈ మార్పులు మనకు కొత్తకాదు. తొలి నుంచి ఉన్నవే. (వేదబుషుల- చక్రవర్తుల పేర్ల్ణతో ఆ తర్వాత ఎన్ని పురాణాలు (తెలుగులో నన్న్మయ్యభట్టు అనువాదం- అది పర్యంలోని శకుంతలో పాఖ్యానం) కాళిదాసు “అభిజ్ఞా శాకుంతలం' నాటకంలో ఎంతగా మార్చలేదు. “కాళిదాసు కవిత్వానికి తోడుగా అయ్యగారి పైత్యం కొంత” అనే సామెత వ్యాప్తికి వచ్చింది కాని, నిజానికి వ్యాసుని కవిత్వానికి - కథకు కాళిదాసు పైత్యం తోడయ్యింది". హరిశ్చంద్రుని కథ, వేద-పురాణ-కావ్య-నాటకాల వరకు ఎన్నో మార్పులకు లోనయిందే కదా. నక్షత్రకుడు అచ్చంగా మన ఆంధ్రుల సృష్టి! రామాయణమే ఎన్నో మార్పులు పాందె. ఇక మిగితా కధల లెక్కేమిటి? ఈ చిరుతల నాటకాలు 1955-65 మధ్య కాలాన తెలంగాణాలో ఓ ఉప్పెనగా వచ్చినై, ఊరూరా వాటి ప్రదర్శనలే. ఉత్సాహవంతులైన గ్రామ యువకులే నటీనటులు. నేర్చేపంతులు మాత్రం పారుగూరి వారు. చేతిచమురు బాగోతం- చందాలుకొంత సాయం అందించేవి. అయినా అది ఎంత ఆనందం! పాత కాలపు యక్షగాన వీధినాటకాలకు, భద్రాచల రామదాసు చెక్క భజనల(చిరుతల) భక్తబృందాల కీర్తనల బాణీలు తోడయి, ఈ కొత్త ఆరుబయటి పౌరాణిక నాటకాలు వ్యాప్తికి వచ్చినై, గజవెల్లి విధుమౌళి,చంద్రమౌళి శాస్త్రులు, సికిందరాబాద్ చెర్విరాల భాగయ్యకవి ఈ చిరుతల నాటక రచనలో సిద్ధహస్తులు. భాగయ్యగారు మొదట యక్షగాన కవి. ఇంకా, పలువురు కవులు, బెత్సాహిక నటులు అనేకానేక పౌరాణిక - జానపద గాధలను చిరుతల నాటకాలుగా రాసిన్రు-రాణించిను. ప్రస్తుత 'వాసవదత్త - చిరుతల నాటకం' సంస్కృత లాక్షణిక నాటకానికి అచ్చంగా తెలుగునాటి దేశి రూపకం. నరసయ్యగారు ఈ నాటకంల, నాంది విష్కంభాదులు అంక విభజన వంటివి సంస్కృతదశరూపక' అలంకార లక్షణాలు ఏవీ పాటించలేదు. స్వేచ్చా రచన. ఏక రంగం మోద పరదాలు కాక, పాత్రలు మారుటతోనే ప్రదేశాలు సన్నివేశాలు మారుతూ కధ ముందుకు నడుస్తది. ఇది తొలినాటి యక్షగానాల విధానమే. ఇంకా వాటిలోని సంధి వచనాలు దీనిలో లేవు- మేలు (సౌభరి చరిత్ర, సుగ్రీవ విజయం చూడవచ్చు). 1౫
వంగా వారు రబనకు కంగారు పడలేదు. ఈ నాటకంలొని కధబలంగా ఉంది. అది పకడ్పందీగా ముందుకు నడిచింది ఆద్యంతాలు రసవత్తరంగా ఉంది, సన్నివేశాల కూర్చు, పాత్ర పోషణ అద్భుతం, పాత్రల చిత్తవృత్తుల చిత్రణ, ప్రదర్శన, సున్నితం - సునిశితం వత్సరాజు వాసవదత్తల తొలి ప్రణయం రమ్యాతిరమ్యం, యుగంధరుని, ఇతర మంత్రుల సంభాషణలు బెచితీ భూషితాలు. ఎక్కడా పాత్రలు తమ పరిధిని అతిక్రమించలేదు. ఇందులో పోషించిన శృంగార, హాస్య, కరుణ, వీర రసాలలో ఎక్కడా అతిలేదు అందుకు మూల రచన వీరికి మార్గం చూపి ఉంటుంది. ఇందులో దర్వుల పేర పాటలు, పద్యాలు ఉన్నవి. అవి గాన యోగ్యాలు - శయ్యా రమ్యాలు. పాటలు కొన్ని ప్రసిద్ధ చిరుతల రామాయణం బాణీలను అనుసరించినై అది తప్పదు మరి. తొలి రచనలే మలి రచనలకు పధ ప్రదర్శకాలు కదా! కొన్ని పాటలకు వీరు యతులు అంత్యప్రాసలు మరింత చక్కగా పాటించవలసి ఉండె. ఆ ఆరంభ రచనా దశలో వీర కృషికి ఇదే ఎక్కువ. ఎక్కడా పాటలా పద్యాల్లో గణభంగాలు కాని, కుంటి నడక (శయ్యాభంగం) కానీ లేవు. కాని, ఎందుకో పలు పద్యాల్లో యతులు తప్పినై నేను కొన్ని సవరించిన. యక్షగాన కవుల పద్యాలు వేరు- వారు వరకవులు. విద్య-పాండిత్యం తక్కువ, అనుభవ మాత్రకవులు. మనం వేరు విద్యావంతులం. పద్య కవిత్వమంటే ఛందో లక్షణాలను సరిగా పాటించవలసిందే. పద్యాలు పాదాంత పదవాక్య విరమణలతో భావస్పష్టత, గౌనయోగ్యత కలిగి ఉన్నవి. పాటలూ అంతే. వాసవదత కృష్ణయం అచ్చంగా లలిత సంగీత గీతమె వేట-యుద్ధ వర్ణనల దర్వులు పూరకాలపు రగడల వీరశైవుల ఖడ్గాల తలప్పునకు తెస్తవి. వాట్రి పరిచయ ॥ వ సష క దల ౦ ఉన్నవారికే అదిస్పష్టం
ఉంది కొన్ని లంగ పరం. యినా వ్యవహారిక భాషా సర మాత్రం లేవు. కవి తెలంగాణా వారే. బ్లద్రి గ న య చాలు అవతరణ అయినా అపుటికే కోసా ప స చన 55లో ఈ ఆంధ్రప్రదేశ్ ్సై! స్తా వ్యవహారిక భాష. ఎత్రికల, పుస్తకాల మూలంగా
మన నైజాం తెలుగు వారిలో అంతగా వ్యాప్తి అయిందన మాట / శే కోస్తా మాట 'వచ్చాడు' శిష్ట వ్యవహారికం పేర రాయలనీ మ్ వంటి ప్రయోగాలు ఇందులో అక్కడక్కడ ఉనువి తె రట వచ్చినాడు' వంటి క్రియా రూపాలు మాత్రం ఎక్ర డర న గ్ మూట వచ్చిండు ( (డా లెవు. ఒకటి రెండు పదాలు బపూన్-ముస్లిం
ల
నోట తప్ప. అంత ఉపేక్ష మనవారికే మన భాష మోద అందుకె నేను ఈ పీఠిక మన మాండలికంల రాస్తున్న ఈ నాటకంలోని నగరాలు మగధ, కౌశాంబి, ఉజ్జయిని, లావాణకం, రాజగ్భృహం బౌద్ధ పూర్వపుకాలంనాటి గణపాలకుల ముఖ్యపట్టణాలు.
ఉజ్ఞుయినిలోని సైనికుడు- చెలికత్తెలు అవే పేర్లతో మగధలో వచ్చుట వింతే. అది నటుల సౌకర్యార్థం - పాత్రల తగ్గింపుకోసం వీధి నాటకాల్లో సహజమే.
ఇందలి శూరసేనుడు ఈ కవి సృష్టి అతడు విరాట పర్వంలోని కీచకుడు, మృచ్చ్భకటికం లోని శకారుడు, మాయాబజారలోని లక్ష్మణకుమారుడు - ఆ మూడు పాత్రల సమాహార రూపం. ఆ పాత్ర అనవసరమే. దానితో కథకు కలిగిన ప్రయోజనం ఏదీ లేదు. అతని కారణంగానే వాసవదత్త సంభాషణల్లో సైరంధ్రిగా కనిపించినా, అడవి ప్రమాదాల పాలై నాటిపురాణతిహాస పాత్రలైన దమయంతి, చంద్రమతి, సీత మొదలగు నాయికలను గుర్తుకు తెస్తుంది. అది ఒక్కటే ఈ నాటకంలో పాఠకులకు- ప్రదర్శకులకు కాకున్నా ప్రేక్షకులకు విసుగు తెప్పించే సన్నివేశం. ఈ నాటకంలో మగధ రాకుమారి "పేరు మారింది. వత్సనుడు పేరుకంటే
ఇందలి మరో ప్రత్యక ప్రాత బపూన్, సంస్కృత నాటకాలలోని విదూషక పాత్ర. అయినా అట్లా నాయక మిత్రుడు కాడు - ఇతడు రాజసేవకుడు. అనంతర కాలపు వీధినాటకాల్లో కంపెనీల డ్రామాల ఈ బుడ్డర్ఖాన్ (బూడా ఖాన్ పదం మారింది) వేషం తప్పక ఉండేది. కూచిపూడి భాగవతాల సూత్రాధారి, వీధి భాగోతాల మంత్రి వేషం వలె కథ నడిపించుటలో ఇతడు ప్రధాన భాగస్వామి.
ఈ రాజసేవకుని ఉరూ యాస తెలుగు ఈ నాటకంలు మనకు నవ్వు తెప్పిస్తది. వచ్చిన్యార్, అన్యార్, హెక్ట వంటివి. అన్యారు వంటి పదరూపాలు అనంతపురం జిల్లా వాళ్ళలో వినిపించుతవి. కవి తిక్కన తల్లిపేరు అన్యమ!
1960లో నేను రచించిన '“ధర్మశ్రీ (అశోకుని కళింగ సమరగాధ) పద్య కావ్యాన్ని 2000 సం॥లో ముద్రించిన అదే ఎంత అనుకుంటే ఇప్పుడు ఈ రచయిత 1957 సం॥లో రాసిన తమ నాటకాన్మి ఈ 2002 సంవత్సరంల 45 సంవత్సారాల తర్వాత అచ్చువేస్తున్నరు. సొంత సంతానం వలె స్వీయ రచనలపై కవులకు ఉండే (పేమ ఇంత బలమైంది. పైగా, ఈ నాటకాన్ని కవి తమ స్వగ్రామమైన 'కుందారం'ల నాడు మూడు పర్యాయాలు ప్రదర్శించి, ఓ .:తరగా చుట్టూ పదునాళ్ళ
|
జనాన్ని ఆకర్షించి, ప్రశంసలు పొందినందుకు దీనిపై ప్రత్యేక ఆసక్తి ఎర్పడింది వారికి. నిజానికి ఈ నాటకం బాగుంది. మొన్నటి నవంబర్‌లో మా 'నవ్య సాహిత్య పరిషత్ ప్రచురించిన నిజాంపట్నం- పి. నాసరసయ్యగారి ఆధునిక నవల “ఉతికేసిన బతుకులు” చదివినప్పటి ఆనందం ఇప్పుడు - హన్మకొండ వి. నరసయ్యగారి ఈ నాటకం చదివినప్పుడు నాకు కలిగింది, మరోమాట - నరసయ్యగారు నాడు కమ్యూనిస్టు, నేడు హేతువాది, నాస్తికున్ననే నా మోద అభిమానం. మరి, అటువంటి ఈయన, ఈ పురాతన రాజుల కథను నాటకంగా రాసి - దాచి, ఎప్పుడో రాసిన దాన్ని ఇప్పుడు ప్రచురించుడేమిటా అనిపించుతుంది నవీనులకు ఎవరికైనా నిజానికి ఈ నాటకం లోపల, నాటి రాజుకుటుంబాల, చారిత్రక కథా చిత్రణే తప్ప దైవాల అతీంద్రియశక్తుల విషయాల ప్రస్తావన ప్రదర్శనల్లేవు.
నాటకాదిలోని గణపతి - సరస్వతి స్తుతులు కేవలం జన రంజనంకోసం “ఆస్తిక కమ్యునిస్టులూ, నాస్తిక క్యాపిటలిస్త్పులూ” ఉంటున్నది మన కాలం. సిద్ధాంతాల
ఆదర్శాల మనవాళ్ళు ఖచ్చితంగా పాటించగలరని ఆశించలేం, పాటించవలెనని
ఆదేశించలేం. వీలయినంత ప్రగతశీల మార్గంలో పయనిస్తే చాలు. నరసయ్యగారు ఈ నాటిక దర్వుల చవరిచరణముద్రలతో త్యాగరాజు, జయదేవ, క్షేత్రయ్య, కబీర్దాస్సు, సర్వజ్ఞ తులసీదాసు, మారా ఇతర యకగాన కవుల వలె తమ “కుందవరం” స్వస్థలాన్ని నృసింహస్వనామాన్ని సాహిత్యలోకంలో శాశ్వతం చేసుకున్నారు.
దీనికి ఆదరణ - వ్యాప్తి ఎంత అనే ప్రశ్న వదిలేద్దాం. భవిష్యత్తులో దేని పరపతి తరుగుతుందో, దేని విలువ పెరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఎవరు నచ్చి మెచ్చినా, నచ్చక గిచ్చుకున్నా ఫర్వాలేదు. మనకు నచ్చిన పని మనం నిస్సంకోచంగా చేసుకుపోవుడే మంచిది.
నరసయ్యగారి ఈ నాటకం, కనగ వినగవిందు-మనసుకు పసందు- చదవండి ముందు.
రచయితకు నా ధన్యవాదాలు! తేది: 20-2-2002 డొ మలయశ్రీ ఫోన్ . 08722-56049 కరింనగర్
౫||
౧౧: 08712-446264 సొాఠతూట
నా చదువు చిన్ననాటి నుండి పద్యకావ్యాలతో ప్రారంభమైంది. ఏదో బ్రాయాలని అభిలాష. అప్పుడప్పుడు జరిగే కవి సమ్మేళనాలలో పాల్గొని పద్యాలు వ్రాసి వినిపించెడివాడిని. జైలులో 1948-49లో వున్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నాను. విడుదలైవచ్చిన పిదప 5 సం॥రాలు ప్రయివేటు ఉపాధ్యాయునిగా పనిచేసినాను. ఈ కాలమందే మాగ్రామ మందు శ్రీ అల్లందాసి రెడ్డిగారి అధ్వర్యంలో కొన్ని సాంఘికనాటకాలు వేసినపుడు నేను పాల్గాన్నాను. సందర్భానుసారం వాటికి పాటలు పద్యాలు వ్రాయుట జరిగినది.
1956లో మెట్రిక్ పాసైన పిదప ప్రభుత్వ ఉపాధ్యాయునిగా సెలెక్టు అయి నియమింపబడినాను. కాని అది లీవువేకెన్సీ అగుటచే మధ్య టర్మివేటు అయి ఇంటివద్ద వున్న సమయమందు, మిత్రులు కొందరు చిరుతల స్టైలుపై ఏదేని పుస్తకం వ్రాయమని కొరినారు. అప్పట్లో చిరుతల రామాయణం, తదితర కథలను చిరుతల ప్రదర్శనలు ప్రతిగ్రామంలో వేసెడినారు. 1957 సం. వాని ఉధృతి బాగా వుండెడిది. ఏదేని క్రొత్తకథను వ్రాయాలని సంకల్పించుకుని నావద్దగల పుస్తకాలలో పరిశీలించినపుడు వాసవదత్త కథ కన్పించినది. భాసునిచే వ్రాయబడిన సంస్కృత నాటకము మరియు అదే కథ గద్య రూపములో వ్రాయబడిన పుస్తక మొకటి ఉండినది. నేనా రెండింటిని పరిశీలించి ఈ కథాంశము పాతదే అయినప్పుటికి మా ప్రాంతమునకు కొత్తదే, అగుట వలన కథ రసవత్తరంగా మరియు పల్లె ప్రజల నాకట్టుకునే విధంగా వుండాలను భావంతో భూమిక ఏర్పరచుకున్నాను. కథాంశలో కొన్ని మార్పులు, చేర్పులు చేసినాను.
1957 జూలైలో ప్రారంభించి ఆగష్టులో పూర్తిచేసి మిత్రులకు చదివి వినిపించినొను. బాగుంది ప్రదర్శిద్దామని సిద్ధపడి పాత్రలను నిర్ణయించినారు. పాత్రలకు వారి వారి పోర్షనులు వ్రాయించి యిచ్చినాము. అయితే. నాకు చిరుతలతో ఆడే అలవాటు లేని కారణంగా బాగా ప్రాక్టీసు వున్న కాసోజు రాములు అను నతనిని నేర్పించే పంతులుగా ఏర్పరిచినాము. ఆయనగారు తన ఇంటి ముందు రిహార్సల్‌కు వసతి ఏర్పరచి ప్రతిదినం రాత్రి 9-00 గంటల నుండి 12-00 గంటల వరకు నేర్పెడివాడు. నేను వారి వెంట వుండి
స||1
నిర్దుష్టంగా చదివించెడివాడిని. ఇట్లు దాదాపు నెలన్నర ప్రాక్టీస్ చేయించి ప్రదర్శన తేదీని నిర్ణయంచినాము.
అంతవరకు చిరుతలతో ప్రదర్శన వర్తులా కారంగా వేషధారులందరు చిరుతలు పట్టుకుని కాళ్లకు గజ్జెలు కట్టుకుని పాటకు అనుగుణ్యమైన రీతిలో అడుగులు వేస్తూ తమ తమ పాటలు పాడెడివార మిగతా అందరు దానిని తిరిగి పాడుట జరిగెడిది. నేను మార్పు చేయ సంకల్పించుకుని మిత్రులను సంప్రదించి ప్రదర్శనకై స్టేజి నిర్మాణం చేసి తబలా, హార్మణి పెట్టి సంగీత ప్రావీణ్యంగల ఒక వ్యక్తిని ఏర్పరచి అతనితో ఒక వారం రోజులు రిహార్సు చేయించినాను. కథానుసారంగా పాత్రలు స్టేజి 'పైకి వచ్చి పాడుదురు. మిగతా పాత్రధారులందరు అర్థవర్తులాకారంలో అడుగులు వేస్తు చిరుతలు మైోగిస్తు పాడుట జరిగినది. ఇది క్రొత్త ప్రక్రియ. మొదటి ప్రదర్శన చెప్పదగినంత లేకపోయినా, కథాంశం (ప్రేక్షకులను కదలనివ్వలేదు.
ఆ పిదప రెండవ ప్రదర్శన నెలలోపు ఏర్పాటుచేసి తగిన ప్రచారం జరిపినాము. ఇది వరకటి ప్రదర్శన చూచినవారు దానిని గుర్తించి విన్నవారు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి వచ్చితిలకించినారు. మైకు ఏర్పాటు చేయుటవలన ఎంతమంది వచ్చినా వినికిడి సమస్యలేకపోయినది. ఆ వెంటనే సంక్రాంతి పండగ సందర్భంగా మూడవ ప్రదర్శన ఏర్పాటు చేసినాము. ఈ ప్రదర్శన ఇంకా విజయవంతమైనది.
ఆ వెంటనే నేను ఉద్యోగరీత్యా గ్రామం విడుచుటచే పట్టించు కోలేదు. రిటైరు అయిన పిదప యితర రెండు పుస్తకములు వ్రాసి ప్రచురించిన పిదప మొదట వ్రాసిన ఈ “స్వప్పవాసవదత్త” నాటకమును కూడా ప్రచురింప సంకల్పించుకుని, దానిని తిరిగి కొలది మార్పులతో వ్రాసి శ్రీ జి. గిరిజా మనోహరబాబు తెలుగు లెక్సరర్ మరియు సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్ధ ప్రధాన కార్యదర్శి గారికి చూపించినాను. వారు చదివి చూచి ప్రచురణ కివ్వచ్చునని ప్రోత్సహించినారు. 1957లో వ్రాసిన దానిని 2002లో ప్రచురించే అవకాశం కలిగింది.
ఈ పుస్తక ప్రచురణకు ముందుమాట మరియు అభిప్రాయం ఆశీస్సులు కోరుచు ప్రా. బిరుదురాజు రామరాజు నేషనల్ రీసెర్చు ప్రొఫెసర్‌గారిని మరియు ఆచార్య పేర్వారం జగన్నాథం మాజీ ఉపకులపతి తెలుగు
స
యూనివర్సిటీ, హైద్రాబాద్గారిని అట్లే డా. మలయశ్రీ ఎహగ్రంథకర్త, రిటైర్డు లెక్చరర్ గారిని కలుసుకుని పుస్తకమును అందజేసే అభిప్రాయాలిచ్చి ఆశీర్వదించమని కోరినాను. వారు నా కోర్కెమన్నించి ఆమూలాగ్రం పరిశీలించి తమ అమూల్యమైన అభిప్రాయాలు అందజేసినారు. అట్లే కొన్ని మార్పులు కూడా సూచించినారు. వీరందరికి నా వినయ పూర్వక కృతజ్ఞతలు తెల్పుకోనుచున్నాను. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యలు డా॥ బి. రుక్కిణిగారు నేనిచ్చిన పుస్తకమును తన తండ్రిగారైన ఆచార్య బి. రామరాజుగారికి చదివి వినిపించి వారి అభిప్రాయాన్ని నాకు అందజేయుటకై ప్రత్యేక శ్రద్ధతో రెండు తడవలు హైదారాబాద్ వెళ్లి దానిని తెచ్చి నాకు అందజేసినారు. వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుచున్నాను.
ఇక ఈ పుస్తక ప్రచురణకు ప్రోత్సహించి, వ్రాతప్రతిని పరిశీలించి అవసరమైన మార్పులు సూచించి (ఫెస్వారిని సంప్రదించి అన్ని విధముల తోడ్పడిన శ్రీ. జి. గిరిజా మనోహర బాబుగారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపు కొనుచున్నాను.
ఈ చిరుతల నాటక ప్రదర్శనకు 1957లో నాకు సహకరించిన క్రీశే. గ్రంథాల బ్రహ్మయ్యగారికి, అట్లే నాటక సభ్యులకు చిరుతలతో అడుగులు వేయుట నేర్చి ప్రతి అంశమున ముందుండి శ్రమించిన కాసోజు రాములు గారికి ఈ ప్రదర్శనలో పాల్గొన్న సభ్యులందరికీ, తమ సహాయ సహకారాలతోనూ, కృషితోనూ దీన్ని విజయవంతంగావించిన వారందరికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను.
వరంగల్లులో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను పరంపరగా నిర్వహిస్తున్న “సహృదయ” సాహిత్య సాంస్కృతిక సంస్థ పక్షాన ఈ స్వప్పవాసవదత్త చిరుతల నాటకాన్ని ప్రచురించడానికి నాకు అవకాశాన్ని కలిగించిన 'సహృదయ' సంస్ధ కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలుపుకొనుచున్నాను.
ఈ పుస్తకం ముద్రణ విషయంలో ఓర్పుతో చక్కని సలహాలనిస్తు శమపడుతూ అందంగా ముద్రించి యిచ్చిన దీప్తి ప్రింటర్స్ అధినేత శ్రీ యం. కృష్ణగారికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుచున్నాను.
ఇంకా నాకు సహకరించిన మహానుభావులందరికి కృతజ్ఞతాభివందనాలు.
వి. నరసయ్య ఉం
- గిగింత!తి, 114. ౧1.110 2-11-514/3, ౪12742౧4౦2” 0౦10౧౫ 2౧౪6౧౧0౧౮౬ - 506 009 ౧౧: 08712-446264
ఊకృందొరీం”. గురించి
ఈ గ్రామం శాలివాహన శకం 1141. ప్రమాది నామ సంవత్సరమున పొందింపబడినది. ఇది కాకతీయ గణపతి చక్రవర్తి చెల్లెలు “కుందమాంబ” పేరిట ఏర్పడినది. ప్రస్తుతం ఉన్న కుందారం గ్రామమునకు పడమర దిక్కున ఒక కిలోమోటరు దూరంలో వున్న గుట్ట క్రింద “వేములతోట” అను పేరిట పూర్వం ఒక గ్రామ ముండెడిది. అందుకు ఆధారంగా పాటి మట్టి, పెంకులు, ఇతర ఆధారములున్నవి. గుట్టపైన నరసింహస్వామి ఆలయ మొకటి శిధిలమై ఉన్నది. ఆ గ్రామమునకు దక్షిణముగా కొన్ని రాకాసిగుండ్లు వున్నవి. అవి పూర్వకాలమున మరణించిన వారి సమాధుల చుట్టుపాతెడు వారు. తెలంగాణాలో ఇవి చాలాచోట్ల ఉన్నట్టు చరిత్రకారులు కనుగొన్నారు. ఇవి మధ్యయుగం కాలంనాటివని, క్రీ.శ. 10 శతాబ్దికి పూర్వపునవి చారిత్రకులు పేర్కొన్నారు. అనగా ఈ “వేముల తోట” చాల పురాతనమైన గ్రామమని తెలియచున్నది.
గణవతిదేవ చక్రవర్తి చెల్లెలైన “కుందమాంబ” కొందరు బ్రాహ్మణులకు అగ్రహారంగా ఇచ్చినందున “కుందవరం”గా కుందమాంబ వరంగా పేర్కొన్నారు. అదిప్పుడు “కుందారం”గా ప్రభుత్వ రికార్డులలో ఉన్నది. “కుందవరం” పేరుకు ఆధారంచూసే శాసనమొకటి గ్రామమునకు ఉత్తర దిక్కు చెజువు కట్టి క్రింద మైసమ్మ బండపై ఉంది. ఈ శిలాశాసములో పురాతన లిపితో సంస్కృతభాషలో చెక్కబడిఉంది.
ఈ శాసనం కాకతీయులనాటి శాసన గ్రంధములో ఈ ప్రతి లభించుచున్నది. క్రీ.శ. 2002 (శా.శకము 1923) నాటికి ఈ కుందవరం (గామం రూపాంది 782 సంవత్సరములు గడచినవని శాననాధారంగా చెప్పవచ్చును.
“కుందవరం” పేరుకు ఆధారం చూపే శాసనం యొక్క ప్రతి ఫోటో తరువాత పేజిలలో చూపబడినది.
= రచయిత. ఉ్య/
రంల చు: స్ట్ న పరు నాం. నయ నన గా | ల వ. న స
ళ్ టి మ మ ల మ య సు వ న ల నే టన ననా గ టే న య త వ స య్. త. మ సతి వ మ. స స చన ర స. న 3 వ న వ వ వ టు స ర య శ ర క త న న య.
నంగము
యానాం వు
కు ల? లు న
ము. య. య. ం ల! న సన. యను
న స్ న య. వ నం న ల ర!
య... మ సంచా జీ
బీరు నాటక ప్రదర్శనకు అన్ని విధముల సహకరించి వఐజయవంతం చేసిన మిత్రులు సు? క. 1 నళ / ర కాసోజు రాములు ర్రంధాల నర్సయ్య వంగా నర్భ్మయ్య (రచనాకాలంనాటిది అమృతం రామచంద్రయ్య అనంతోజు ఆంజనేయులు ౫
చిజబుతల నాటకం స్వప్న వాసవదత్త కుందారం ప్రదర్శనలో పాల్గొన్న కభాకారులు పాత్రలు వివరాలు పాత్రధారులు 1... వత్సరాజు వత్సదేశ రాజు గ్రంధాల నర్సయ్య 2. యుగంధరుడు వత్సరాజు మంత్రి అమృతం రామచంద్రయ్య 3. మహాసేనుడు వాసవదత్త తండ్రి కాసోజు రాములు 4. శుభదత్తుడు మగధదేశ రాజు వారాల జనార్థన్ 5. వీరసేనుడు వత్సరాజు శత్రువు వారాల నర్సయ్య 6. శూర సేనుడు శుభదత్తుని బావమనిది అనంతోజు గౌరయ్య 7. సుబుద్ధి మహాసేనుని మంత్రి అనంతోజు సోమయ్య 8. సంజయుడు వత్సరాజు (రెండవమంత్రి) గ్రంథాలపరమాత్మ 9. సేవకుడు న. లొక్కుంట్ల రాములు 10. బ్రాహ్మణులు తీగోజు సాయన్న మరియు వంగ వేంకటేశం 11. వీరబలుడు _ వీరసేనును మంత్రి. _ బైరి నారాయణ 12. సైనికులు . వంగ మురళి వ. జొన్నల నర్భయ్య 13. వాసవదత్త వత్సరాజు భార్య వల్గ్లాల పుల్లయ్య 14. అంగారవతి మహాసేనుని భార్య అనంతోజు ఆంజనేయులు 15. భానుమతి వత్సరాజు రెండవభార్య 16. చెలికత్తెలు 1. విరచిక లొక్కుంట్ల కొమరయ్య 2. చతురిక మంగలి వెంకటయ్య 3. మల్లిక అబ్బాస్ సగ
విష్ణున్తుతి దరువు శ్రీధరా ఓదేవ దేవ, రాధామానస విహార వేద వేద్య భోగిశయన, మోదముతో మముగావుము (శ్రీ) భక్త రక్ష దుష్టశిక్త శక్తి పూర్ణజగద్రూప ముక్తి కరా నీ కరుణీ, భక్తులపై బరవు తండ్రీ (8) ఆది మధ్యాంత రహిత, అచ్యుత మాధవ శౌరి సాధు జనా తాప హరణ, దామోదర ధర్మరక్ష (శ్ర) కరుణాకర కుందవరపు, స్థిరనివాస మరువమయా పరగ నృసింహాఖ్యునేలు, పురుషోత్తమ నారాయణ (శ్ర) గణపతి స్తుతి - దరువు గణాధిపా శరణిదెగొని, గావుమయా విఘ్నములు మనమున మిోచరణములు, అనవరతము దలతుమయా (గ) ఏకదంతనినుమొదలు, నాకవాసులైనగొల్తురు జోకతోనిటు విఘ్నములను, రాకుండా జేయుముయా (గ) గౌరి తనయ నీమహాత్మ్య, మెవరితరము పొగడగను కరిముఖ! వోబొజ్జదేవ, కరుణింపుము మ్రైొక్కెదాము (గ) ధరణిని శ్రీకుందవరపు, ధాముడవై వెలసితివి అరమొరేల మముబ్రోవుము, మరువము మోచరణ సేవ (గు సరసృతి స్తుతి - దరువు వాణీ వీణాభూషణ, పాణీ! వోయజురాణి వాణిశుద్దియుంచు నీల, వేణీ! నిను వేడుచుంటి (వా) వాక్కులందునిలిచిశుద్ధ, వాక్కులివ్వు మాతల్లి నిక్కముగా విద్యలకు, చక్కనికాణాచి వమ్మ (వా) తలవాకిలి నివాసిని, తలపులందుయుండవమ్మ తలపక అన్యము నాచే, పలికించుము భవ్యఫణితి (వా)
స్వష్టవాసవదత్త కుందవరపురంబునందు, అందముగా నెలకొన్న సుందరి ఓ సరస్వతి, సందేహింపక కావుము (వా) సేవకుడు (చోవుదారు) వ్రవశం - దరువు అస్సలాం ఆలేకుం - హమారెనాంచోపుదార్ (అస్స) తస్సాదియ్యా తెల్లుబాస - తక్వతక్వ ఆతహంకో (అస్స) నాకి పెళ్లాంకి లేదు - పిల్లల్కినాల్లున్నయి ఇల్లు వాకిలిగుల్లకర్కె - చల్లగాఫిర్తాహుంమై (అస్స) మూడు రూపాయల్నెలకి జీతం మంజరి వుంది మనకి అమ్మతోడు అంతామిగిలి - ఎంతోకర్నెతాది (అస్సు) మూడు రూప్యాలెక్కజూస్తై - మాడిపోద్దివక్కరూప్యా వుడ్జాతా హైరెండో రూప్యా-తడ్చిపోద్ది మూడోరూప్యా (అన్స) ధరణీ శ్రీకుందావర్మె - ధామంకియసోహరి అరమొరేల హంకోతోడై అంతాచలాయెగా (అస్స) (సేవకుడు తనకుతానే ప్రశ్నించుకానును) స్వ.:వ. : ఏమిటోయి. సాయెబు? ఏమిటా అల్లరి? సేవ. : నాకీ హేవ్వరో తెలియునా? స్వ. వ. : తెలియదండి. స్వవ, : నాకీ పేరు హుండినయి అబ్బుల్, సయ్యద్, మమ్మదు మయ్య్య్దిన్. మగర్ అందరు సాయెబు అని పిలుస్తార్. స్వ.వ. : మోరిపుడిచటికి ఏమి పనిపై వచ్చినారూ? సేవ. : నేను మహారాజుల్కెవద్ద నౌక్రీకర్తాహు. నీవు వెళ్లి మహారాజుకే సేవక్ మహారాజ్ వచ్చిన్యార్ అని ప్రజలకి చెప్పు, స్వ.వ. : అలాగేనండి. సేవ. : లాగునహీ, టోపినహీ, చలో (వెళ్లిపోవును) 2
వంగా నర్జ్మయ్య్మ మవోసేన రాజు ప్రవేశం - దరువు అవంతి దేశపు జనపాలుండను మహాసేనుడని పిలుతురురా నన్ భువిలో నాసరి వీరులులేరని - పేరుగాంచిన వాడనురా (అ) సద్యయశుండగు ప్రతాపసేనుని ముద్దుకుమారుడ నేవినరా వంద్య చరితయగు నాతల్లినిభువిసంధ్యదేవియని పిలుతురు రా. (అ) శృంగారంబుల ప్రోవగు నాసతి నంగారవతీయని యందురురా మంగళగుణియగు నాకూతురును మహిలోవాసవదత్తాయందురు. (అ) భూరిపరాక్రమవీరుడరా అరిసేనభయంకర ధీరుడరా కోరికుంద వర పురమున నెలకొను హరిని దలంచెడి వాడనురా. (అ) మ.వ. : సేవకా నా నామధేయ మెరుగుదువా? సవ. : జీ. మహారాజ్, నాకీ తెల్సివుండినయి. కాని ఈ సభాసదులకు తెలుపండి సర్కార్. ము.వ. : అగుచోవినుము. నేను అవంతిదేశమునకు రాజును. నా నామధేయము మహాసేనరాజు, నాతలిదండ్రులు ప్రతాప సేన, సంధ్యాదేవి. నారాణి పేరు అంగొరవతి. నా ఏకైక కూమార్తి వాసవదత్త. సేవ. : జీ. మహారాజ్. మ.వ. : సేవకా అంత్రఃపురమునకు దారి చూపుము. (నిష్కమింతురు) చెలికత్తెల ప్రవేశము - దరువు చెలికత్తెల మమ్మమేము - చెలియారాజకూతులకు 3
స్వష్టవాసవదత్త కుందవరపురంబునందు, అందముగా నెలకొన్న సుందరి ఓ సరస్వతి, సందేహింపక కావుము (వా) సేవకుడు (చోవుదారు) ప్రవేశం - దరువు అస్సలాం ఆలేకుం - హమారెనాంచోపుదార్ (అస్స) తస్సాదియ్యా తెల్లుబాస - తక్వతక్వ ఆతహంకో (అస్స) నాకి పెళ్ళాంకి లేదు - పిల్లల్కినాల్లున్నయి ఇల్లు వాకిలిగుల్లకర్కె - చల్లగాఫిర్తాహుంమై (అస్ఫ) మూడు రూపాయల్నెలకి జీతం మంజూరి వుంది మనకి అమ్మతోడు అంతామిగిలి - ఎంతోకర్చెతాది (అస్స) మూడు రూప్యాలెక్కజూస్తై - మాడిపోద్దివక్కరూప్యా వుడ్జాతా హైరెండో రూప్యా-తడ్చిపోద్ది మూడోరూప్యా (అస్స) ధరణీ శ్రీకుందావర్మె - ధామంకియసోహరి అరమొరేల హంకోతోడై అంతాచలాయెగా (అస్స) (సేవకుడు తనకుతానే ప్రశ్నించుకానును) స్వ.వవ : ఏమిటోయి. సాయెబు? ఏమిటా అల్లరి? సే.వ. : నాకీ హేవ్వరో తెలియునా? స్వ. వ. : తెలియదండి. స్వ,వ.. : నాకీ పేరు హుండినయి అబ్బుల్, సయ్యద్, మమ్మదు మయ్య్దిన్. మగర్ అందరు సాయెబు అని పిలుస్తార్. స్వ.వ.. : మోరిపుడిచటికి ఏమి పనిపై వచ్చినారూ? సేవ... నేను మహారాజుల్కెవద్ద నౌక్రీకర్తాహు. నీవు వెళ్లి మహారాజుకే సేవక్ మహారాజ్ వచ్చిన్యార్ అని ప్రజలకి చెప్పు. స్వ.వ. : అలాగేనండి. సేవ. : లాగునహీ, టోపినహీ, చలో (వెళ్లిపోవును) 2
వంగా నర్జయ్య్మ మవోసన రాజు ప్రనశం - దరువు అవంతి దేశపు జనపాలుండను మహాసేనుడని పిలుతురురా నన్
భువిలో నాసరి వీరులులేరని - పేరుగాంచిన వాడనురా (అ)
సద్యయశుండగు ప్రతాపసేనుని
ముద్దుకుమారుడ నేవినరా
వంద్య చరితయగు నాతల్లినిభువిసంధ్యదేవియని పిలుతురు రా. (అ)
శృంగారంబుల ప్రోవగు న్నాసతి
నంగారవతీయని యందురురా మంగళగుణీయగు నాకూతురును
మహిలోవాసవదత్తాయందురు. (అ) భూరిపరాక్రమవీరుడరా
అరిసేనభయంకర ధీరుడరా కోరికుంద వర పురమున నెలకొను
హరిని దలంచెడి వాడనురా. (అ)
మ.వ. : సేవకా నా నామధేయ మెరుగుదువా?
సేవ. : జీ. మహారాజ్, నాకీ తెల్సివుండినయి. కాని ఈ సభాసదులకు తెలుపండి సర్కార్.
మ.వ. : అగుచోవినుము. నేను అవంతిదేశమునకు రాజును. నా నామధేయము మహాసేనరాజు, నాతలిదండ్రులు ప్రతాప సేన, సంధ్యాదేవి. నారాణి పేరు అంగారవతి. నా ఏకైక కూమార్తె వాసవదత్త.
సేవ. :జీ. మహారాజ్.
మ.వ. : సేవకా అంతఃపురమునకు దారి చూపుము. (నిష్కమింతురు)
చెలికత్తెల ప్రవేశము - దరువు
చెలికత్తెల మమ్మమేము - చెలియారాజకూతులకు
3
న్వష్షవాసవదత్త
మ.ద. : వత్సదేశా ధీశుడైన - వత్సరాజు కీయదలచి మచ్చిక నేచేయుచుంటి - మచ్చకంటిరోవినుమా!
వ. ; ఇదియానీసందేహము. వినుము మన వాసవదత్తకు అన్ని విధముల ఈడు జోడుకలవాడు వత్సదేశాధీశుడైన వత్సమహారాజు. అతని కిచ్చి 'పెల్లిచేయవలయునని సంకల్పించుకుని యున్నాను. కాని మనకు వారికి వూర్వవైరము మిగిలియున్నది. అందువలన వారితో స్నేవా రాయబారములు నడుపుచున్నాము. తొందరలోనే మన ప్రయత్త్సము సఫలము కావచ్చును.
వ. : తటకున వాసవదత్త - పటము పంపుడాతనికి హఠమేలను కుందవరపు - హరిపై నమ్మక ముంచి (త)
అం.వ. : మహారాజా! అపర రతీదేవియైన మన వాసవదత్త చిత్రపటమును పంపిన వత్సమహారాజు దానిని చూచిన వెంటనే సమ్మతించగలడు.
మ.వ. :సరే! నీ ఇష్టప్రకారముగా అట్లేకావింతును. ఎవరురా అక్కడ?
(అంగారవతి నిష్కమించును)
సేవ. : (గేవకుడు ప్రవేశించి)జీ. మహారాజ్.
మ.వ. :సేవకా! నీవు వెంటనే సుబుద్ధిని తోడ్కొనిరమ్ము,
సేవ... : జోహుకుం మహారాజ్. (ఊఉభయులనిష్క్రమణ)
సుబుద్ధి మంత్రి వ్రవశం - దరువు
ధీయుతుడను సుబుద్ధినామమున
తేజరిల్లెడి వాడనురా పాయక శ్రీహరిస్మరణ చేసిడి
భూసుర కులమున జన్మించితిరా (ధ్ర మహాసేనుడను మహారాజుకడ
మంత్రిపదవిలోనుంటినిరా అహోరాత్రములు సేవజేతునీ
అవంతిదేశప్రజలకురా (ధీ ధరణికుందవర పురమున వెలసిన
6
వంగా శర్ణయ్య్మ హరినిస్మరించెడి వాడనురా
కరమరుదుగ నరసింహునేలిన - పరమపురుషునకు భక్తుడరా (ధ్ర)
"సేవ. : నీకీ పేర టింది మహారాజ్!
సు,వ. : నాపేరు సుబుద్ధి. నేను అవంతిదేశ మహారాజగు మహాసేనునకు మంత్రిని.
సేవ. ; మంచిది. తమరికి వెంటనే రమ్మని మహారాజు హుకుం అయింది.
సు.వ. : అట్టగుచో పదవోయి (కొంతనడచిన పిదప మహాసేన ప్రవేశం)
సువ. : వందనములు మహారాజా! నన్ను పిలువనంపుటలో కారణమేమో 'సెలవిప్పించండి.
మ.వ... : సుబుద్ధీ! వత్సదేశాధీశునితో జరుపుచున్న మైత్రి ప్రయత్నము ఎంతవరకు ఫలించినదయ్యా?
సు.వ. : వయోరూప బలదర్పితుడగు వత్సరాజు మనప్రయత్నములు లెక్కించుట లేదు మహారాజా!
మ.వ. : అతడు లెక్కించక పోయినా మనకది అవసరమై యున్నది. ఎందుకనగా వాసవదత్తను అతని కిచ్చి పెండ్లి చేయదలంచితిని. కావున నీవు రేవు వాసనవదత్త చిత్రపటము నతని కంవుచు వమవాసేవవమువారాజు తనకూతురును నీకిచ్చి వివాహము గావించుటకు సిద్ధముగా యున్నాడని తెలియజేయుము. అతని అభిప్రాయము గూడ తెలుసుకుని తరువాత ఏర్పాట్లు చేయుదము.
సువ. : చిత్తమట్లే పంపించెదను. (నిష్కృమింతురు)
వత్సమవోరాజు ప్రవేశం - దరువు వత్సదేశమున కధీశుడను జన వత్సలుడని పేరొందితిరా, వత్సనామమున బరగిన వాడను మాత్సర్యము కడద్రోచితిరా (వ) 7
స్వష్టవాసవదళత్త చంద్రవంశమున ప్రసిద్ధినందిన సహస్రానీకుని పుత్రుడరా ఇందునిభాస్యయగునాతల్లిని పాొందుగ మృగావతీయని పిలుతురు. (వ) సర్వశాస్తముల నెరిగితిరా నిర్వి క్రపరాక్రమ ధీరుడరా! ఉర్విలోన సంగీతశాస్తమున సరియగు వారీజగతి లేరురా (నా) (వ) ధరణికుందవరపురమున నెలకొను హరినిస్మరించెడి వాడనురా! కరుణనృసింహకవివరునేలిన పరమపురుషునకు భక్తుడరా! (వ) వ,వ. : సేవకా నానామధేయం బెరుగుదువటరా? సేవ. : నాకీ తెలిసి హుండింది. కానిలోకుల్కి తెలుపండి మహారాజ్, .వ.వ._. : నేను వత్సదేశాధీశుడనగు వత్సమహారాజును. నేను సభకు వచ్చుచున్నట్లుగా వెళ్లి తలియజేయుము. (వెళ్లిపోవుదురు) యుగంధర మంత్రిప్రవశము - దరువు యుగంధరుండను మంత్రివరుండను నగధీరుండను నే వినరా నిగమకోవిదుడ నీతివిశారద ఖగరాడ్వాహన భక్తుడరా (యు) వత్సదేశ జన పాలుండైన వత్సరాజునకు మంత్రినిరా! సత్యపాలన ్రజాక్షేమము నిత్యము మాపరిపాలనరా (యు) (పేమకుందవర పుర వాసుండగు 8
నంగా నర్ట్మయ్య రాముని నామది దలుతునురా కామితార్థఫల దాయక మురహరి రామమానస రంజనకారి (యు) యు.వ.:సేవకా! నేను యుగంధరుండను మంత్రిని. మా తర తరంబులనుండి వత్సదేశ రాజులవద్ద మంత్రులుగా యునవ్రారము. వత్సరాజు తండ్రి సహస్రానీకుడు బాల వత్సరాజును నాచేతికి అప్పగించి కాలధర్మంబు నాందినాడు. నేను ప్రభుభక్తిపరాయణుడనై పరిపాలన వత్సరాజు పేర సాగించి; అతనికి విద్యాబుద్ధులు నేర్చించి యోగ్యునిగా తీర్చిదిద్ది పెద్దవానిగా చేసి అతని రాజ్యము అప్పగించి నాను. ప్రభువులు నాయందు దయాభక్తులుగలిగి రాజ్యపరిపాలన చేయుచున్నారు. ఇపుడు అవంతి దేశవువోరాజు తన కూతురు వానవదత్తనిచ్చెదనని ఆమెచిత్రపటముతోపాటు లేఖనంపినాడు. నేను ప్రభువుల దర్శించి వారి అభిప్రాయమును కనుగొనియెదను. సే.వ. : అచ్చా! మహామంత్రిసాబ్. వత్సమహారాజు వచ్చుచున్నారు. (వత్సరాజు ప్రవేశం) యు.వ. : వందనములు మహారాజా! వ.వ. : కుశలమే కదా మహామంత్రీ? యు.వ : పరిపాలనా దక్షులు; శత్రుభయంకరులు అయిన తమబోటి ప్రభువుల పరిపాలనలో కుశలమునకు కొదువా ప్రభూ. వ.వ. . అది అంతయు తమ ఆశీర్వాదమేమహామంత్రీ! విశేషము లేవైనగలవా? యు.వ. : కలవు మహారాజా! అవంతిదేశ పరిపాలకుడైన మహాసేనరాజు తన కూతురు చిత్రపటముతో మనకు లేఖనంపినాడు ప్రభూ! వవ... అట్లయిన చదువుము. యు.వ. : (ఉత్తరము విప్పి) శ్రీశ్రీశ్రీ వత్సదేశాధీశులైన వత్సమహారాజునకు ఆశీర్వాదములు. 9
స్వష్ష్వవూసవదత్త వత్సరాజా! నీవు చిన్నతనమందే వ్రజ్ఞానిధివాట మాకెంతో ఆనందముగా యున్నది. మనము నేటి నుండి పూర్వవైరములు మరచి,
'స్నేహపూర్వకముగా వ్యవహరించుదము. అందుకునిదర్శనముగా నా కూతురగు
“వాసవదత్తను' నీకిచ్చి సెండ్డిసేయ సంకల్పించితిని. వాసవదత్త చిత్రపటము కూడా
వంవుచున్నాను. నీవు వూర్వవైరములు మరచి మాతోనెయ్యమునకు
ఇయ్యకొందువని ఆశించుచున్నాను. ఇట్లు మో స్ప్నేహాభిలాషి మహాసేన రాజు.
వ.వ. : మహామంత్రీ! దీనిపై మీ అభిప్రాయమేమి?
యు.వ. : వత్సరాజా! మహాసేనుని స్నేహము కోరదగినదే. సరిహద్దు రాజ్యనుగుట వారితో మన సంబంధబాంధవ్యములు లాభదాయకముగా నుండును. పైగా వారంతట వారేకోరి తనకూతురిని ఇచ్చి చుట్టరికము నెరపుటకు ఇచ్చగించుట మన మాహ్వానించదగినదే. ఈ చిత్రపటము నొక్కతడవ పరిశీలింపుము. + (చిత్రపటమునందించబోవును)
వ.వ. : అక్కరలేదు. మనమిప్పటికే మగధరాజకుమార్తెయైన 'భానుమతిని' పట్టపురాణిగా స్వీకరించుటకై నిర్ణయించితిమిగదా! మగధదేశాధీశునకు మాటయిచ్చి తప్పుకొనుట తగదు.
యు.వ. : ప్రత్యుత్తరమిట్లిమ్మందురా (అని వ్రాయును)
వవ. : తెలువుడు.
యు. :గీ- సంతసించితి మా స్నేహ సరళిగాంచి
అందదగినదె మోతొ నెయ్యంబు మాకు
తలపకన్యథా వాసవదత్త వలదు
సరసగుణసాంద్ర! మహసేనా రాజచంద్ర! 10
వంగా నర్దయ్య యు.వ. : ఇంకేమైన చేర్చమందురా? వవ. : అక్కర లేదు. పంపించుడు. యు.వ. : చిత్తమట్లే యొనర్తుము. _ (నిష్కమింతురు) అ లం లం (అవంతి దేశమున మహాసేనుడు సుబుద్ధి ప్రవేశము) సువ. : ప్రభూ! వత్సమహారాజు ప్రత్యుత్తర మంపినాడు. మ.వ. : ఏదీ చదువుము. సువ. : (సంతసించితి. అను పద్యము చదువును) వాదము - దరువు మ.ద. : జెర వీని మదాంధము - ఇదెతృణీకరించె నన్ను. (ఇదె) వరదత్తగు నాకూతును - పరిగ్రహింపనంచుతెలిపి (జెర) మ.వ : నా విన్నప ముల్లఘించి పెండ్డిచేసికొన వీలుపడదని ఎంత తెలివిగా ప్రత్యుత్తర మిచ్చినాడు. సు.ద. : అతనిలోన లోపమిందు - సుతరామిటు గన్పించదు. పాతపగతోడ మోరు - పలుకుటయేగాని రాజ! (అత) సు,వ. : అతనిలో తప్పున్నట్లు కన్పించదు. ఎందుకనగా మనము సంపిన దూతను సకల సత్కారములతో పంపించి, మర్యాదపూర్వకమైన ప్రత్యుత్తర మిచ్చినాడు. మ.ద. : వాసవదత్తను దృఢముగ - వత్సరాజునకిచ్చెదాను- మోసముతోనైన పెండ్లి చేసి ప్రతిన నిలుపుకొందు. (వా) మ.వ :నుబుద్గీ! నేనెట్టి పరిస్థితులలో నైనను వాసవదత్తను వత్సరాజు ఇవ్వసంకల్పించుకున్నాను. కావున మోసము చేసియైనను అతనిని నా సన్నిధికి రప్పించుము. తరువాత పనిసులభము కాగలదు. సుద. :ఆ పనికే బూనుకొందు - ఓపిక పట్టుడు మోరు- ఏ ప్రొద్దు కుందవరపు - శ్రీపతి దయయున్నచాలు. 11
స్వష్టవాసవదత్త
సు.వ.. : మహారాజా! మోరు నిర్విచారముగా నుండుడు. వత్సరాజు మన సరిహద్దునకు ఏనుగులవేటకై వచ్చుచుండును. మాయోపాయముచే మన హద్దులలోనికి రానిచ్చి బంధించి తెచ్చెదను. అందుకునా వెంట కొంతసైన్యమును తీసుకుని వెళ్లెదను. తిరిగినేను వత్సరాజుతోనే కన్చించెదను. నేడు రేపట్లో వత్సరాజు వేటకై వచ్చు చున్నాడని వేగులు వార్తలు తెచ్చినారు.
మ.వ, : మంచిదివెళ్ళిరమ్ము. శుభమగుగాక. (వెళ్లిపోవుదురు).
సేవ... : (ఫేవకుడు ప్రవేశించి) ఈ సుబుద్ధి మంత్రిసాబ్ నన్ను గూడా వేటకు రమ్మంటున్యార్. వత్సరాజుల్కి దొంగతనంగా పట్కవస్తనని రాజుగార్కి మాటచెప్పిన్యార్. అక్కడ లడాయిహెంతఅయితదో. నాకె భయంహోతాహై. (వెళ్లిపోవును)
వ్తాస్తాల్తా (సుబుద్ధి, బందీగా వత్సరాజు, "సేవకుడు, ఇద్దరు సైనికులు, మహవాసేనుని ప్రవేశము) వాదము - దరువు
మ.ద.' : వత్సరాజునే విధముగా- వశపరచుకొంటివయా మత్సరము చూపకుండా - మసలుకొంటివా అతనితో (వత్స)
మవ. : వత్సనరాజును ఏ విధముగా వశపరచుకొంటివి సుబద్ధీ?
సు.ధ : బిల్లుని వేషముతోడ - మెల్లెగవత్సనునిజేరి కొల్లగమాకడగజములు - కలవని నమ్మంచితెస్తి (భిల్లు)
సు.వ. : మహారాజా! భిల్లవేషములతోవెళ్లి మాప్రాంతమున ఏనుగులు అధికముగా యున్నవని నమ్మించి మనసరిహద్దులలోనికి రప్పించినాను. అంతకు పూర్వమే నియుక్తులయి వున్న మన సైనికులు హఠాత్తుగా పట్టివేసినారు. మేమాతనిని గౌరవపూర్వకముగా తోడితెచ్చినాము.
మ.ద. : కట్లువిప్పి నాతనిని గౌరవముగ గొంపోయి అతిధిగృహమందుంచి సతతము కాపుంచండి (కట్లు)
12
వంగా నద్ణయ్య మ.వ. 2 సుబుద్ధీ! కట్ట్లువిప్పి అతిథి గృహమందుంచి సకలమర్యాదలతో ఆదరించండి. అట్లే తగు రక్షణ ఏర్పాటుచేయండి. వ.ద. : మోసముతోనన్నిటుతే ఆశయమేమయ్యా మోకు ద్వేషించక మిమ్మెపుడు - నాసరివారుగ జూచితి. (మో) వ.వ. : మహసేనరాజా! నన్నుమోసగించి తెచ్చి మి రాజవంశమునకే కళంకమాపాదించుకుంటిరి. నాలో ద్వేషభావవేయున్న మోరింత వరకుబూడిద అయి వుందురు. "వత్సరాజు! నాకూతుకు వీణాగానము నేర్ప్చుము తత్సంబంధమునకైనిను - దెచ్చితిని మోసముతో (వత్స) వత్సమహారాజా! నాకూతురునకు వైణిక విద్యపై మక్కువ ఎక్కువ. ఇక్కాలంబున నిన్నుమించిన వీణా వాద్యపరుడు లేడని వినియుండుటచే నిన్ను అభ్యర్థించిన పెడచెవిన 'పెట్టుదువని ఇట్టు పట్టి కెప్పించితిని. నీవు సంగీతము నేర్చిన పిదప విముక్తుడవయ్యెదవు. ఈలో తప్పించుకో యత్నించిన ప్రాణాపాయమునకు గురియగుదువు. రేపటి నుండి విద్యాభ్యాసమును (్రారంభింపవలెను. సుబుద్ధీ! వత్సరాజు జాడ హరిహరాదులకైనా తెలియకుండా జాగ్రత్త యొనర్చుము. వ.ద. : ధరణిని శ్రీకుందవరపు - ధాముండగు హరిగలడు. సరె! మిరనినట్లుగ - గరపెదవీణా విద్యను. (ధర) వవ. : మహారాజా! మీకోర్కెనెరవేర్చెద. (అందరు వెళ్లిపోవుదురు) వాసీవదత్త ప్రనశం - దరువు వాసవు వరమునగలిగినదానును వాసవదత్తని అందురె చెలియా! నాసరి వారలు అందగత్తెలలో ఈ జగతిని లేరనిసేరొందితి, (వా) మహాసేన అంగారవతికినేముద్దులు గొలిపెడికూతురు నమ్మా! అహరహంబు శ్రీహరిని దలంచెడి. అతివను నేనోముద్దులగుమ్మా (వా) 13
స్వష్టవాసవదత్త అన్నివిద్యలందారితేరిన కన్నియనేనోపడతిరొవినుమా!
వీణ విద్య నాకిష్ట్టమగుటచే వీజాభ్యసనంబందేయుంటిని (వా)
మానుగకుందవరంబున నిలిచిన జానకిపతినే దలచెద బామా!
మాననీయ నరసింహునేలిన .
మానాథా నను బ్రోవుమురా (వా)
వా.వ.. : చెలియా! నాపేరు వాసవదత్త. నేను దేవేంద్రుని వరంబున గలుగుటచే
నన్ను వాసవదత్తయని పిలిచెదరు. నాతండ్రి మహాసేనరాజు. తల్లి
అంగారవతీదేవి. వైణిక విద్యపై నాకెక్కువ మక్కువ. అందువలన మా
తండ్రిగారు వీణవిద్య నేర్పగల గురువును రప్పించినారట. రమ్మని కబురంపిరి. వెళుదామా చెలియా.
చేవ. : అలాగే వెళుదాము. పదవమ్మా మో తండ్రిగారి దర్శనమునకు. (ఉభయులు కొంత దవ్వునడువగా మహాసేకుని ప్రవేశం)
వా.వ. : వందనములు జనకా! వందనములు.
మ.వ. : కళ్యాణ ప్రాప్తిరస్తు. రాతల్లీ! నీకొరకై సంగీతమందు అశేష ప్రజ్ఞ కలిగి, అందు వైణిక విద్యా విశారదుడైన గురువున. రప్పించితిని. (సేవకుని దిక్కుముఖంబై)
మ.వ. : సేవకా! నిన్నటి అతిథిని వెంటనిడుకొని రమ్ము,
సేవ. ; అచ్చా మహారాజ్ (వెళ్ళిపోవును)
మ.వ.. : వాసవదత్తా! శ్రద్ధాపూర్వకముగా విద్యనభ్యనింపుము. (సేవకుడు వత్సరాజుతో ప్రవేశం)
వాదం - దరువు
మ.ద. : అమ్మానీగురు వాతడె - సమ్మతిగా విద్యనేర్పు నెమ్మనమున భక్తిగౌర-వమ్ముంచీ నేర్వుతల్లి, (అ)
మ.వ.. : వాసవదత్తా! వీరే నీగురువులు - భక్తిశ్రద్ధలు గలిగి విద్య నేర్చు కొనవమ్మా
వాద. : దండమిదే గురువర్యా! నిండగు జ్ఞాన స్వరూప! మెండుగ మో సపరిచర్య - కండగ గైకొనుడు నన్ను (దం)
114
వంగా నర్ణయ్య వావ. : ప్రణామములు గురుదేవా! ప్రణామములు (నమస్కరించును) మ.ద. : వత్సరాజ! నాకూతుకు - మత్సరంబు మాని నీవు ఉత్సుకతతో వీణవిద్య - నిత్యము బోధింపవయా! (వ) వ. : వత్సనా! ఈమె నాఏకైక కుమార్తె వాసవదత్త. ఎంత నీవు తొందరగా విద్యాభ్యాసము పూర్తి గావించెదవో అంత తొందరగా నీవు నీ వారిని కలుసుకుందువు. వ.ద. : అయ్యా మీరనినట్టులె - చయ్యనబోధింతు విద్య. నెయ్యంబుగ 'మోరు మాతో - ఇయ్యెడ వర్తింపవలయు. (అ) వ.వ. : (వానవదత్తను వరిశీలించి చూచి) మహారాజా! మోరనినట్టుగనే విద్యాబోధనగావింతును. ముహూర్తము నిశ్చయించి ఏర్పాట్టుగావింపుడు. వాద : ధరణిని శ్రీకుందవరపు - ధాముండగు హరికృపచే సరసుండగు గురువుదొరికె - మరియాదతో మెలగిదను. (ధ) వావ : నాన్నగారూ! గురుదేవులు సెలవిచ్చినట్లు ఏర్పాటుగావింపుడు. నేను వెళ్ళివచ్చెదను. (చేటితో వెళ్లిపోవును. సేవకుడు, మహాసేనుడు వెళ్లుదురు) వ.వ. : (వాసవదత్త వెళ్లినదిక్కు కొంతతడవుచూచి) ఆహా! ఏమి ఈరాచకన్యసోయగము. ఊఉ. ; చూచితినెందరో సతుల సోయగముల్ విచికిత్సదృష్టితో తూచితి అందమిట్టిదని తోయజగంధుల తేల్చి చూడగా ఈ చపలాక్షి మిన్న్వయయి నేడగుపించెను నాదు దృష్టికిన్ ఆ చతురాస్యుడేర్చరుచి నందున సంభవ మయ్యెనాకుగాన్. వత్సరాజు - దరువు వ.ద.. : ఆహా! ఈసతి సోయగ మెన్నగ నాతర మగునా ఊహలు జనియించి మధుర -భావంబుప్పాంగుచుండె (ఆహా) పలుకుల అమృత మ్మొలుకు కలికి మిళారీయనదగు కులికెడి యా చక్కదనము - తొలివలపులు నింపెమదిలో (ఆవి) చందురుని గేరుమోము-చంద్రికగాదను నవ్వు 15
స్వష్ష్నవాసవదత్త సుందరాంగి వాల్చూపులు - పదునగు మదనుని తూపులు (అ) ఇందునిభాస్యనునాకు - ముందుగ నిచ్చెదననిన మందుడనై వలదంటిని - పొందితి పశ్చాత్తాపము (ఆ) కరుణాకరు కుందవరపు - స్థిరనివాస హరికరుణచె తరుణిని ఇక ఎట్టైన - పరిగ్రహింతు నిల్హాలుగ. (ఆహా) వ _ : ఆహా! ఇట్టి అపురూపవతిని నా కిచ్చి పెండ్డిచేయుదుమని మహాసేనుడు తెలిపినను వప్పుకొనక మోసపోయితిని. నేనానాడె చిత్రపటమును చూచిన ఈ పరిస్థితి రాక పోయెడిది. ఇపుడు నన్నదే కారణముగా బందీయొనర్చి తెచ్చినటులే యున్నది. నేనుగూడ మోసగించి కన్నియను స్వీకరించి వెళ్ళెదను. ఇది మహాసేనునకు గుణపాఠముకాగలదు. ఇక నాపై (పేమానురాగములుప్పతిల్లు నటుల పాఠ్యక్రమము నడిపెదగాక. (వెళ్ళిపోవును) చాలా స్తా (వాసవదత్త వత్సరాజు ప్రవేశం. చెలికత్తె వీణియను తెచ్చిపెట్టును. వాసవదత్త వీణెను పట్టుకుని శృతులు సరిచేయును. వత్సరాజామెను పరిశీలిస్తూ ఆమెతోపాటుకూర్చుని ఉండును. చెలికత్తె వెడలిపోవును). వవ. : వాసవదత్తా! నిన్నటి రాగమలవడినదా? వావ... : అలవడినది గురుదేవా! వవ. నేడు ఇంకొక క్రొత్తపాట చెప్పెదను నన్ను అనుకరించుము. (వత్సరాజు చెప్పచుండును వాసవత్తకలిసిపాడుచుండును) పాట రాధా పిలిచెను రా కృష్ణా నిన్రాధాపిలిచెనురా అనురాగసుధారసధారలాలుక నిన్ (రా) మురళి గానముతొ పరవశమైనీ చరణ సేవకైచేరగదలచి (రా) 16
నంగా నర్ణయ్య (పేమమయంబే జీవితఫలమని సామగొనజికో ననూగ్రుముతో (రా) కుందావర వాసాకృష్ణు! ఆనందసుధాధ్యాసా మందరగిరి ధర మాధవ రమ్మని... (రా)
నవవ. : రాగమింకొక తడవ చెప్పుమందువా?
తా.వ. : వచ్చీనది గురుదేవా వినిపింపమందువా?
వవ. : పొడుము. (వాసవదత్త పాటపాడును. ఉభయులు వెళ్లీపోవుదురు) (ెలీకత్తె విరచిక ప్రవేశించి చకచకా వెళ్లుచుండును. సేవకుడు పరుగుతో వచ్చి విరచికనాషి
సేవ : అరెవో కిర్కీచ్కా! జరా ఆగు.
చవ... ! (ఆగి) ఏమిటయ్యా! అపితివి.
సేవ. : అరి! నీకీ ఈ మధ్యకన్పిస్తాలేద్ ఏం చేస్తున్యార్:
వివ : నాకు వాసవదత్త పాఠములతోనే సరిపోతోంది. తిరిక ఎక్కడీదయ్యా, వెళుతోను.
సేవ. : అర! హొకటి, హొకటి
చవ. : ఏమిటది?
సేవ. : ఒకటీ. తియ్యటి ముద్డు.
చవ... : అలాగో, దగ్గరకు రా. (సేవకుడు దగ్గరగా వచ్చి ముద్దిడు కోబోవు నంతలో అతని చెంపపై కొట్టి వెళ్లిపోవును).
సేవ. : (దెబ్బతగీలిన చెంపను చేతితోనాకి) ఎంత తియ్యగా ఉంది చేతి దెబ్బ (విరచికే వెళ్లిన దిక్కు చూచుచువెళ్లును)
(వాస్వదత్త వ్రనశించి)
వావ. : ఆహా! ఈ గురువు నాలో ఏవో క్రొత్త భావాలు సృష్టిస్తున్నాడు. పాఠరమప్పగించబోయిన నెందుకో సిగ్గుగానుండును. పాఠములను నేర్చుకొనునపుడు సయితమ్ముమనసు కేంద్రీకతమగుట టేిద్చు.
స్వపష్టనాసవదత్త వద్యక్ష వా.ఉ: కామునిగేరు రూపమును గాంచిన తీరని కోరికల్ మదిన్ ధామముజెంద్వా వాక్చతురి తప్పగజేసె, హృదంతరంబునన్ నేమముదప్పె, శిష్యగురు నీతియు నిర్వచనంబుదాటె నే ప్రేమకు దాసురాల నయిబేలగ మారితి నేమిచేయుదున్ దరువు వా.ద : ఏమిసేతు మోహభరం - బెంతని నేనోర్చుకొందు కాముడు వేసెడి తూపులు - నీమమ్ముుతప్పించె మనసు (ఏ) మొదటి చూపులోనె నన్ను - ముగ్భురాలి గావించె పిదప నాగానమహిమ - పదను జేసెమదను తూవు (ఏ) పారములకు నేగ హృదయ - మేటికో తహ తహలాడును ఎటనున్న ఆధ్యాసే - కటకటా నేనేమిజేతు చదువు పాఠమున సిగ్గు - ఎదదొంతరలై పెరుగును చదువాతడు జెప్పుచుండ - చదువక ననునేమరతును (ఏ) బోధించెడు పాటలో నను - బాధించెడు భావముండు ఎదురాడి వలదనుటకు - హృడయ మందు కొప్పకొనదు (ఏ) కులమెరుగక స్థలమెరుగక - తలపుల నాతని నింపితి తలిదండ్రులకిది తెలిసిన - తలదీతురు నిలువున నను (ఏ) ధరణినిశ్రీకుంద వరపు దాముండగు హరిదయయె నరసింహవరదా నిను - మరువను మము కరుణించుము (ఏ) వ, : ఈతని లక్షణంబులు కనుగొన రాజకుమారునివటె కన్పించును. అగుచో బందీగా రావలసిన అవసరమేమి? మా తండ్రి మహాసేనరాజు గూడ పూర్వపు గురువులవలెగాక ఈతనిని ప్రత్యేక గౌరవాభిమానముతోపాటు స్వేచ్చగా విహరింపనిచ్చుచున్నాడు. నాలో ప్రేమ శ్రుతిమించక ముందే వివరములు అడిగి తెలునుకొందును. కాని అతని ముందు మాటాడుటకు భరింపరాని సిగ్గు వెనుకకు లాగుచుండును. 18
నంగా నర్జ్ణయ్య ఇంతవరకెందరో గురువులు విద్యనేర్చిరి కాని వారందరు వయోవృద్ధులు. ఇతను యువకుడు అందగాడు. పైగా పూర్వపు గురువులకన్న మిన్న్మయగు సంగీతకొశలము గలవాడు.
(దాసిప్రవశము - చతురిక)
చ.వ. : అమ్మా! వాసవదత్తా. ఏమిటమ్మా! వంటరిగా కూర్చుని ఆలోచించు చున్నావు? ఈ క్రొత్తగురువు వచ్చిన నుండి నీవేలకో పరధ్యానములో పడుచున్నావు.
వావ. .:ఛీ ఫోవే ! నీకెపుడు విపరీతార్జాలే.
చ.వ. . కోపమెందులకు రాకుమారీ! నీమంచిని కోరియే అడుగుచుంటిని.
వావ : (చతురిక భుజంపై చేయివేసి) నీవు నిజముగా నామంచి కోరెడిదానివా?
చవ :మీ మంచి కొరకు ఏమైనా చేయగలను.
వావ : (కటువుగా) అటులయిన నోరుమూసికొనుము. నీవు నాకు చేయవలసిన సహాయ మేమియు లేదు.
చవ. : అటులేగాని గురుదేవులు పాఠములు బోధించుటకై వచ్చి నర్తనశాలలో ఎదురుచూచుచున్నారు. తమరింతకు రాకపోవుటచే నన్నిచటికి పంపించినారమ్మా,
వా.వ నాకీవేళ తలనొప్పిగాయున్నది. రేపుచెప్పించుకుందునని వెళ్లి తెలుపుము.
చవ . తప్పుగదమ్మా గురుదేవులు వచ్చి ఎదురు చూచుట. మిరు ౮ ననుట పోనీ ఇక్కడికి పిలుచుకు వచ్చేదా?
వావ : పరపురుషులు అంతఃపురమునకు రావచ్చునా?
చవ :మోి నాన్నగారు ఈ గురుదేవుల అంతఃపురప్రవేశమునకు గూడా అనుమతించారు రాజకుమారీ.
వావ. . అలాగా (ఆలోచననభినయించి) మంచిది పిలుచుకు రమ్ము (దాసి వెడలును) ఇదికూడా కలస నచ్చినది.
స్వష్టనాసవదత్త (చతురిక వళ్సినునితో ప్రవశించును) వావ. : (లేచినిలబడి) వందనములు గురుదేవా! ఆ ఆసనమలంకరింపుడు. చవ. : నాకు పని వుంది నేవెళ్లివస్తాను. (వెళ్లిపోవును వాసవదత్త ఆలోచనామగ్ను రాలగును). వవ. : వాసవదత్తా! నీవేదో దీర్చాలోచనలో యున్నావు? ఈవేళ నన్నే నీకడకు రప్పించితివి. వావ. : (స్మ్మతినభినయించి) ఆ( ఏమిలేదండి. ఈ శ్రొత్తరాగము సరిగా రావటం లేదు గురుదేవా. వ.వ. : ఏదీ! పాడుము. (వాసవదత్త పాడుచుండును. మధ్య మధ్య వత్సరాజు సర్దిచెప్పును) పాట 2 వూదుమురా కృష్ణా! మురళీ మూుమురా కృష్ణా! వా మోదమందురా ముల్లోకంబు ఎ నీదౌ మురళీగాన మహిమచే బృందావనిలో వుందువు , *ని ముందు జేరమూగ పందెములిడుకొని | అంద వచ్చిరదె సుందర గోపిక (లూదు) (వూ పాలు పితుకు ఆ రాధను గనుమా పిల్లనగ్రోవిని అల్లన విని తా కేలాడింపక బేలాయెను రా! (వూ) వవ... : పట్టపడినది. ఇంక కొలది పరిశ్రమతో పూర్తికాగలదు. క్రొత్త పాఠము ప్రారంభింతామా? వావ. : వలదుగురుదేవా! మోతోకొన్ని సందేహములు తీర్చుకో దలంచితిని. అది మోరను మతించినచో, 20
వంగా నర్జ్ణయ్య వవ. : సందేహ మెందులకు నిరభ్యంతరముగా అడుగుము (తనలో) ఈ సమయమున నా హృదయ భావము వెల్లడింతును గాక. వాదము - దరువు వా.ద_ : గురువరవినుడీ, గురుతరమగు నా ప్రశ్నల నుడి (గు) కరుణించి తెలుపుడయా, పెరభావము మదినుంచక (గు) వ.ద. : సందియమేలా - ఆనందముగా అడుగు బాల (సం) సుందరాంగి నీమదిభయ - మందకు ఏ విషయమైన (సం) వాద : కులమేదండి - మోరలుగవలదు తెలుపుడు మోస్థలమేదండీ. తలపోయగ బ్రాహ్మణులను - తలపురాదు మిముజూడగ (కు) వ: గురుదేవా! మిరెవ్వరు? మికులమెయ్యది? మదే దేశమో దయతో 'సెలవీయండి. వ.ద. : క్షత్రియరాజున్ - వత్సరాజు పేరు భువిని (క్త వత్సదేశ మేలునట్టి = దక్షతగల రాజునేను (క్త వాద : కారణమేమి మిరిట్టులు బందీగ రాను (కా) ధీరులు మిముబోంటులు ఏ కారణమున ఇట్ట్లుండిరి? (కా) వ. : మిరు మాకు శత్రువర్గములోని వారగుచో మిమ్ము ఎందులకు మా నాన్నగారు గురుదేవులుగా నియమించినారు? వ.ద. : వాసవదత్తా! ఈ సమయంబున తెలిపిన నీకంతయు క్రొత్తా. మోసగించి నీదు తండ్రీ గాసినిబడద్రోచెనన్ను (వా) ద : మాది మో సరిహద్దు రాజ్యము. పూర్వము నుండియే ఉభయులకు వైరమున్నది. వేము శత్రుత్వంబు నెరపక మిత్రత్వంబుతోడనే మసలుచున్నాము. ఈ మధ్య మో తండ్రిగారు నన్నొక కోరిక కోరిన నేను కాదంటిని. దానిపై కుపితుడై మా తండ్రి మోసముతో పట్టితెచ్చి బందీగా వుంచినాడు. వాద : కోరినదేమి - మనోరది తీర్చక యుండుటలోకారణమేమి! ధర్మాత్ముడు నా తండ్రి - సరగున మిము మోసగించ. (కోరిన) 21
స్వష్టనాసనదత్త వ. : ధర్మశీలుడైన నా తండ్రి మిమ్మే మికోరెను? మోరెందుకు తీర్చ లేకపోయితిరో తెల్పుడు గురుదేవా? వద. : చెప్పుమందువా, -చెప్పిన నీవు బాధపడేవు తప్పదుమగువా _ (చెప్పు) ఎప్పగిదినికుందవరప్పురి హరిదయేకాని. (చెప్పు) వద్యం వత్స.సీ. : పడతిరో నీ తండ్రి పూర్వ వైరము మాని పంపెనులేఖ నీపటముతోడ పటము నా కూతురు వాసవదత్తదీ వాసవిన్నీకవ్వ వాంఛగలిగె మన్నించినాకోర్కెమత్సుతన్ గగ్రహియించి మని వియ్యమంద మోయయ్యనవ్రాసె నాతిరో మగధేశు కూతుతో నాపెళ్లి స్థిరపడియుంటచే తిరిగిపంప గీ! అంత మో తండ్రి కుపితుడై అంతబోక వేటకై వచ్చి అడవిలో వేచియుండ పట్టి తెప్పించి నన్నిటు గట్టివేసి నీకు గురువుగా నియమించె నేర్చవీణ (వాసవదత్త తలవంచకుని దీర్చాలోచన నిమగ్నురాలగును) వ.వ _ : వాసవదత్తా! ఏవిటలా దీర్చాలోచన చేయుచుంటివి? వావ : వత్సదేశా ధీశులగు వత్సమహారాజు మరీనా? వవ :బెను వాసవదత్తా! ఆ అభాగ్యుడనగు వత్సరాజును నేనే నీబోటి కన్యారత్నమును కాదని యిపుడు పశ్చాత్తాప పడుచున్నాను. వావ : గురుదేవా! నేను మోదృష్టిలో అంతయోగ్యురాలిగా కన్పించితినా? వ.వ : అవును వాసవదత్తా! నేను నిన్ను చూచిన తోడనే ఒక రత్నమును జార 22
వ్ంగా నర్జ్ణయ్య విడచితినని బాధపడితిని. కాని ఇక నిన్నువీడలేనని నీవేనా అర్భాంగివని, భావించితిని అర్జాంగిగా చేసుకుని ఇటనుండి వెళ్ళ నిశ్చయించు కుంటిని. లేనిచో నాకిచ్చిన స్వేచ్చతో ఎన్నడో తప్పించుకు వెళ్ళి ప్రతీకారము తీర్చుకునేవాడిని. వాసవదత్తా! నన్నుపెళ్లాడుట నీకు ఇష్టమేనా? వావ : ఇది నా అదృష్టముగా భావింతును. నా తలిదండ్రుల కోర్కి ఈడేర్చిన దాననగుదును. నా జన్మసాఫల్యమగును. పద్యం - వళ్సమడు ఉ:. సుందరి నిన్నుబోలు సతి చేకొనలేకను వైరదృష్టితో మందుడనైతి నేనపుడు మమ్ముల నీపిత వేడి వ్రాసిన్ ఇందుముఖీ! కృపామయుడు ఈశ్వరుడే ఇటు” .వెచ్చెనా పొందుకురాగదే కలిసి పోదమె మాపురిజేర దరువు - వాదం వద : మన్నింతువ నా కోరిక వాసవదత్తా నేనిన్నే పెళ్తాడెదనో వాసవదత్తా మన్నించితివా కోరిక - ఎన్నికైన జీవిత మగు (మన్ని) వా.ద : నోములు ఫలియించెనుగా ఓ గురుదేవా నా మానస చోరుండవు నీవే గావా ధీమతులగు తలిదం*తేజ - నోములు ఫలియించెదేవా (నో) వద :రావే బిగి కౌగొబిలో కతు చేర్చుటకు నీవే నా జీవితముశేజజకలుగూర్చను రావే మరుతూపులునన్ - చేవజెడ చేయు చుండె' (రా) వాద : తొందరేల జెందెదరు ఓ మహరాజా! స్వజ్షిీయము జెందవలదు రవితేజా తాందరశీత్తో చేసెడిపని ముందుశూన్యమని యందురు. (తొం) వ.ద. .: ధరణిని శ్రీకుందవరపు ధామునిసాక్షి కరమరుదుగ గాంఛర్వ్యంబున గొల : నబ్బాక్షీ నరసింహుని వేలినహరి దురితంబులు ఎ"పునుమన (ధర) 23
స్వష్షనాసనదత్త పద్యం - వళ్సినుడు తే.గీ. : సూర్యచంద్రులు సాక్షిగా సుదతినిన్ను గొందుగాంధర్వమున మన కోర్కెలీన క్షత్రియులకు గాంధర్వంబు చెల్లుగాన సందియముజెందవలదింక మందయాన, వవ _ : వాసవదత్తా ! నిన్ను గాంధర్వంబున పంచభూతముల సాక్షీగా హరిహరాది బ్రహ్మసాక్షిగా పరిగ్రహించుచున్నాను. ఏదీ నీ కరగ్రహణంబు గావింతును. (తనవ్రైలి ఉంగరము తీసీ వానవదత్త వేలికి యుంచి దగ్గరగా తీసికొనును). వావ : ఎన్నాళ్ళకు నా కోర్కె ఫలియించినది ప్రభూ! వవ. : శిష్యురాటా! వావ : గురుదేవా (వత్సరాజు భుజముపై తల అన్నును) (దాసి చళురిక ప్రవేశించి దృశ్యముచూచును) చవ. : (ముక్కుపై వ్రేలిడికొని (తనలో) అప్పుడే ప్రణయ మారంభమైనధి, నేనిపుడిచట యుండుట పానకమందళలి పుడకవటె నుండును, (అట్లే వెనుకకునడచునప్పుడు కాలికెదోతాకిపడిషోవును) (వత్సరాజు వాసవదత్త ఆ ధ్వని వినివిడిపోవుదురు) వావ. : ఏమీటే ఆ కంగారు? ఎందుకలాహకకోయితివి? చవ. :ఏ,. ఏ. ఏమిలేదండి. (వాసవదత్త వత్సరాజు నవ్వుదురు] చవ... : నన్ను చూస్తేనే వేళాకోళము. నేనిప్పుడీ తిరిగి వత్తును. (వెళ్ళిపోవును) వావ. : వచ్చిన పని ఏమిటో చెప్పి వెళ్లుము, చవ. : మరేమిలేదండి. మీ పాఠములు ఎలా జరుగుత్తున్నవి చూచి రమ్మని ప్రభువులు సంపుటచే వచ్చినాను; (వెళ్లును) (వాసవదత్త వత్సరాజు ఒకరి ముఖమునొకరు చూచుకొందురు) వొ. ; (విఛారముగా ముఖము క్రిందికి దించుకొనును) వవ. : (ధైర్యముగా) ప్రియా! భయపడితివా? ప!
వావ : ఈ దాసిది ఎంతకైనా తగును. మన ప్రణయ కళాకలాపములు మా తండ్రి గారికి తెలిసిన ప్రమాదమే. వ.వ.. : భయము వలదు శిష్యురాలా. అటు తోటలోనికి వెళ్ళుదము రమ్ము వావ : నాకెందుకో భయముగా వుంది ప్రభూ! వ.వ.._ : నీ భయమునకు తరణోపాయము చెప్పెదను రమ్ము (కొంతదూరము నడచి) వీద్యం - వత్సనుడు గీ! _ ద్వేషమున నీదు తండ్రి నన్దెచ్చెనిటకు వాస్తవమ్మిది తెలిసిన వచ్చుముప్పు తరుణి మనమిటనుండివేతప్పుకొనుట క్షేమముభయులకగునె వోచంద్రవదన వాదము - దరువు వ.ద : రావే పోదాము మనము వాసవదత్తా రావెరానే పోదాము ప్రేమహృదిదళ్కొత్తా రావే పోదాము నాదు రాజ్యంబు జేరవేగ (రావే) వాద : తలిదండ్రుల విడిచిఎటుల రాగలనండి నా తలిదండ్రుల కొక్కర్తెనే కూతురునండి మలిన మగును మాకీర్తి తలవంపులు గలుగునిచట (తలి) వద : నిలిచిన ప్రమాదంబు నను వెంటాడు కలిసిన మన హృదయాలకు కలుగును కీడు నిలువరాదు ఏస్థితిలో నిలిచిన ప్రాణంబుబోవు (నిలి) వాద : తలిదండ్రులు పెండ్లిచేయ తరలుదమండి తపఃఫలితంబౌ పుత్రికనే వారికిసుండి వలపుగాధ నేను దెలుప వలదనడిక నాతండ్రి (తలి) వావ : ప్రభూ! మన ట్రేమను గురించి మా తండ్రిగారికి విన్నవించిన తప్పక మన వివాహమునకు సమ్మతించును. వివాహానంతరము వైభవముగా 25
న్వష్టనాననగత్త
వెళ్ళవచ్చును. ఏమందురు ?
వద : తప్పించుకు వెళ్ళుట మన కుత్తమ మిపుడు
ఇప్పట్టయున్న ద్వేషంబు ఇకపై వీడు
అప్పుడు మన నాహ్వానించి గొప్పగ సన్మానించు (రావే)
వవ. :రాకుమారీ! మి తండ్రికి ఇప్పట్లో అధికమగు కోపముండియె నన్నిట్టుపట్టితెప్పించి నీకాచార్యునిగా నియమించినాడు. పైగా మన ప్రణయ గాథ తెలిసెనా మండిపడి ఎంతకైనను తెగించును. నేనిక్కడ నిస్సహాయునిగా నున్నాను. నన్నుగురించి మావారికి వార్తలేక వారెంత సతమత మగుచున్నారో తెలియదు. మనము తప్పించుకుని వెళ్లనిచో రేపుదయము నాతల కోటగుమ్మమునకు ద్రేలాడుట వాస్తవము. నీవు నన్ను భర్తగా స్వీకరించితివి. నా ప్రాణాపాయము నీకు సంతోషమా? నిశ్చయించుకొనుము. నా దేశంబున నీకేకొదవ యుండదు.
వాద : కరుణాకరుకుందవరపు హరికరుణండి
మోరనినట్టుగ నే వచ్చెద పయనముగండి.
సరసుడు నరసింహునేలు, హరియే గలడన్నింటను (తలి)
వావ : గురుదేవా! మిమ్ముల 'ప్రమాదమునకు లోనుచేయుట నాకెట్లు సమ్మతమగును? కావున పయనముకండు. తగిన ఏర్పాట్లు గావింతును. నేనొక దాసిని గొనిమోకళభు అర్జరాత్రివచ్చెదను. కోట రహస్య ద్వారము కడ రెంటు ఎవనాశ్వంబుల సిద్ధముగా నుంచెదను. మిరు వేషము మార్చుకుని సైనికుని వేషమున సిద్ధముకండి. నావెంట వచ్చుచెలికత్తెతో మన వివరములు తెలిపి వెళ్లవచ్చును. సమ్మతమేనా?
వ.వ _ : అంతకన్ననా? ఏదీ ఒక ముద్దు (తీసికొన బోవును)
వావ . (తప్పించుకుని) ఇపుడు కాదు. నెరవేర్చవలసిన పనులు చాలా గలవు, సెలవు (వెళ్లిపోవును) (కొలదిసెపు అటే చూచి వత్సరాజు వెళ్లిపోవును) (చతురిక ప్రవేశించి)
చ.వ.. : ఈ దినము రాజకుమార్తె వైఖరియే మారిపోయినది. సంతోషముగా ఈ
26
నంగా నర్సయ్య రాత్రికి తనసేవనుండి నాకు సెలవిచ్చినది. అప్పట ప్రణయ సల్లాపము చూచినందులకు ప్రతిఫలమను కొందును. (వెళ్లిపోవును) లిం ఉం 6్టీల (వాసవదత్త నల్లని ముసుగుతో దాసి విరచికను వెంటబెట్టుకుని ప్రవేశించును “గురుదేవా” యని ముమ్మారు లోగొంతుకతో పిలువగనే వత్సనుడు సైనికుని వేషముతో ప్రవేశించును. చేతియందు కత్తి ధరించియుండును). వావ : సిద్దమేనా ప్రభూ! వవ... : సిద్ధమే ప్రియా! వావ :నన్ను అనుకరించుడు (అనివత్సరాజు వెంటనడువగా కొంతదూరము నడచి) ప్రభూ ఈ రహన్య ద్వారమునకవతల రెండు గుళ్తిములు సుసజ్జతములై ఉన్నవి. ఈ దాసితో మీరు చెప్పి అంపదగిన దేమైనాయున్నచో తెలుపుడు. వవ... : విరచికా! నే చెప్పినట్లు మహారాజుల వారికి తెలుపుము వ : తేగీ : మున్ను మోకోర్కె మన్నింపకునికి వగచి నీదుసుత వాసవిని గొని ఏయేగుచుంటి పూర్వద్వేషంబుబోనాడి ముదముతోడ మమ్ముదయజూడ వేడెద మండలేశ. (వాసవదత్త విరచికతో) వావ. "మా నాన్నగారికి ఇట్టుతెలుపుము. మం॥ మును మోరెవ్వరికిత్తునంచునను మోదంబొప్పగానుంటి రా ఘనుతో నేగుచునుంటియొంటరిని గాంధర్వంపుటిల్లాలినై చనుచున్నందుకు బాధజెందకుడు మన్నించండి నాతప్పులన్ జనకా! దూరము జేయగావలదు జామాతన్ దయంజూడుడ్తీ, వా.వ. . విరచికా! మా కల్లిగారితో ఇట్లు తెలుపుము తేగీ - నన్నుగని మోదమున పెంచినట్టి నీచె నాజ్ఞగొనకయె నిన్వీడి నరుగుచుంటి 2/7
స్వష్టవాసవదత్త కూతురునుగాన నీ బాధ కొంత తెలుసు నన్ను మన్నింపుమా నన్నుగన్నతల్లి వి.వ. : అమ్మా! (విచారముగా) నాకేమి చెప్పుదురు? వా.వ . (విచారముతో) విరచికా! తొందరలోనే నిన్ను నావద్దకు రప్పించుకుందును. నిర్విచారముగా నుండుము. వివ : (నమస్కరించి) సెలవొసంగెదరా? జాగ్రత్తగా వెడలుడు. వవ... : తెల్లవారు వరకు ఈ వార్త పొక్కవలదు. అంత వరకు మేము మా సరిహద్దులకు చేరుకుందుము జాగ్రత్త! వివ. : (పునఃనమన్మ్కరించి)ి అట్లే మహారాజా! (అని మరలిచూచుచు వెడలిపోవును, వత్సరాజు, వాసవదత్త విరచిక వెళ్లినదిక్కు చూచుచుందురు. వాసవదత్త కంటితడి తుడుచుకొనును) వ.వ. : ప్రియా! మనము ఆలస్య మొనరించిన ప్రమాదము. వావ. : సరీ నడవండి. దరువు - వత్సరాజు కోటదాటి మనబాట జేరితిమి పడతిరొపడమటి బాట పట్టితిమి అడుగో పట్టణ పాలిమేరదియె కడుజాగ్రత్తగ నడువవలెన్. 'సైనికులచ్చటకావలి యుందురు మనమని తెలిసిన మూడునుముప్పు ఉజ్జయినీ పురి వెడలి యిప్పటికి యోజనమొక్కటిదాటి వచ్చితిమి ఈ విధి ప్రయాణమును సాగించిన ఓవనితరొ మన ముదయమువరకే మన సరిహద్దులు చేరుకొందుము మనమున ధైర్యంబూని నడుపుము. 28
నంగా నర్ణయ్య్మ వెనుక బడకుమవూ ఘనమగు యడవిది
వెనుకొని మెకములు వెంటనంటును కొండల వరుసలు మెండుగ గలవిట
గుండెదిటవుతో నడుపుము అశ్వము వేగుచుక్కయదె తూరుపు దిక్కున
మగువరొ పోడిచెను మనసరిహద్దులు చేరవచ్చితిమి నేరుపు మారగ
తీరను శత్రుభయంబిక మనకు తూరుపు తెలతెల వారుచున్నది
మోరెను పక్షుల కలకల రవములు మన సరిహద్దులు చేరితి మబలా
మనసుప్పాంగెడు మాదేశములో అల్లదె సరోవరంబదెయచ్చట
చల్లని గాలిటు వచ్చుచున్నది. ప్రయాణమున కడుడస్సితి వీవు
ప్రియారావె విశ్రాంతిగొందము ఈదిన మిచ్చట ఆగియుండి మన
మంత్రికి లేఖలు పంపెద నేను సంతసమున మన నాహ్వానింతురు
ఇంతిరో ఇట విశాంతి గొందము కరమరుదుగ కుందార పురీహరి
కరుణచె నిర్భయముగ జేరితిమిటు.
(ఆగిపోవుదురు)
ఆస్థి అక్టీం ర్టేం
(ఉజ్జయినీ పట్టణ అంతపురమున చతురిక పరుగెత్తుకుని వచ్చి)
చవ. : అయ్యో! అయ్యో! కొంప మునిగినది. వాసవదత్త మాయమైనది. 29
స్వష్టాసవదత్త కూతురునుగాన నీ బాధ కొంత తెలుసు నన్ను మన్నింపుమా నన్నుగన్నతల్లి వివ. : అమ్మా! (విచారముగా) నాకేమీ చేప్పుదురు? వా.వ : (విచారముతో) విరచికా! తొందరలోనే నిన్ను నావద్దకు రప్పెంచుకుందును. నిర్విచారముగా నుండుము. వివ : (నమస్కరించి) సెలవొసంగెదరా? జాగ్రత్తగా వెడలుడు. వవ. : తెల్లవారు వరకు ఈ వార్త పాక్కవలదు. అంత వరకు మేము మా సరిహద్దులకు చేరుకుందుము జాగ్రత్త! వివ. : (పునఃనమన్కరించి) అట్లే మహారాజా! (అని మరలిచూచుచు వెడలిపోవును, వత్సరాజు, వాసవదత్త విరచిక వెళ్లినదిక్కు చూచుచుందురు. వాసవదత్త కంటితడి తుడుచుకొనును) వ.వ. : ప్రియా! మనము ఆలస్య మొనరించిన ప్రమాదము. వావ. : సరే నడవండి. దరువు - వల్స్రాజు కోటదాటి మనబాట జేరితిమి పడతిరొపడమటి బాట పట్టితిమి అడుగో పట్టణ పొలిమేరదియె కడుజాగ్రత్తగ నడువవలెన్. సైనికులచ్చటకావలి యుందురు మనమని తెలిసిన మూడునుముప్పు ఉజ్జయినీ పురి వెడలి యిప్పటికి యోజనమొక్కటిదాటి వచ్చితిమి ఈ విధి ప్రయాణమును సాగించిన ఓవనితరొ మన ముదయమువరకే మన సరిహద్దులు చేరుకొందుము మనమున ధైర్యంబూని నడుపుము. 28
నంగా నర్దయ్య వెనుక బడకుమవూ ఘనమగు యడవిది
వెనుకొని మెకములు వెంటనంటును కొండల వరుసలు మెండుగ గలవిట
గుండెదిటవుతో నడుపుము అశ్వము వేగుచుక్కయదె తూరుపు దిక్కున
మగువరొ పోడిచెను మనసరిహద్దులు చేరవచ్చితిమి నేరుపు మోరగ
తీరెను శత్రుభయంబిక మనకు తూరుపు తెలతెల వారుచున్నది
మోరెను పక్షుల కలకల రవములు మన సరిహద్దులు చేరితి మబలా
మనసుప్పాంగెడు మాదేశములో అల్లదె సరోవరంబదెయచ్చట
చల్లని గాలిటు వచ్చుచున్నది. ప్రయాణమున కడుడస్సితి వీవు
ప్రియారావె విశ్రాంతిగొాందము ఈదిన మిచ్చట ఆగియుండి మన
మంత్రికి లేఖలు పంపెద నేను సంతసమున మన నాహ్వానింతురు
ఇంతిరో ఇట విశ్రాంతి గొందము కరమరుదుగ కుందార పురీహరి
కరుణచె నిర్భ్వయముగ జేరితిమిటు.
(ఆగిపోవుదురు)
లల య్జం
(ఉజ్జయినీ పట్టణ అంతపురమున చతురిక పరుగెత్తుకుని వచ్చి)
చవ. : అయ్యో! అయ్యో! కొంప మునిగినది. వాసవదత్త మాయమైైనది. 29
స్వష్టనాసనదత్త అంతఃపురమంతయు గాలించితిని. నిన్న వాసవదత్త గురుదేవులతో ఆడిన సరససల్హాపములు మహారాజుల వారికి తెలియవరచిన ఇంత వరకు రాకపోవునేమో. గురువుగారుగహమందులేరు. ఇద్దరు కలసి ఈ అఘాయిత్యమునకు పాల్పడియుందురు. కొలది దినముల నుండి వాసవదత్త వైఖరియే మారినది. నన్ను గతరాత్రి తనతోయుంచుకొనక సెలవిచ్చిపంపినది. విరచికను మాత్రముంచుకొనినది. ఈ వార్త రాజుగారి కందించక పోయిన నాప్రాణములు తీయుదురు. (సేవకుడు ప్రవేశించి) సేవ. : అరె చర్కికా! నీకి హెద్కిహెడ్కి యాష్టవచ్చినాది. హెక్టపోయినావు. చవ... : ఎందుకయ్యా!
సేవ. : హెందుకు హేమిటి, రాజుగారు పిలిచిన్యార్
చేవ. : (అదిరిపడి) ఎందుకారకో?
సేవ. : నాకీహేమి తెల్పు నడువ్ (ఇద్దరు నడచుచుందురు మహాసేనుడు ప్రవేశం)
చవ " దండములు మహారాజా! (భయపడుచుండును)
మ.వ.. : ఎందుకే కంగారు పడుచున్నావ్?
చవ. : మరే. మరే మరే.
మ.వ. : ఏమిటే ఆమరే, సరేగాని ఈ పగలు రాజకుమార్తె సంగీత విద్యా పరీక్ష జరుపదలపెట్లినారము. నీవు వెళ్లి ఈవార్త రాజకుమార్తెకు, గురువుగారికి క్త టె ళా తెలియపరచుము.
చవ... . నేనదేనండి చెబుతున్నది.
మ.వ : ఏమిటిది?
దరువు నాదం చద : రాజపుత్రి గనిపించుట లేదో మహరాజా (రా) రాత్రి నుండి వెదకుచు నున్నానో రాజేంద్రా! 30
నంగా నజణ్ధయ్య్మ మ.ద : గురువుల కడయున్నదేమో గాంచక పోయావా
అరువాతనె పాఠాలు అప్పగించుటల్ ఎరుగవా? (గు) చ.ద : గురువు గూడ గృహమందు లేడో మహారాజా
త్వరపడి నేనచటగూడ వెదకితి రాజేంద్రా! (గు) మ.ద : రాత్రి రాజపుత్రితోడ నీవు కూడ వుండలేదా ?
చిత్రముగా నున్నదిట్టి సంగతి పరిశీలింప (రా) చ.ద : గతరాత్రి విరచికచట గలదో రాజేంద్రా
ఉదయము గనుగొనగ ఎవరు లేరో మహారాజా (గ) మ.ద :విరచిక నిటు బిలచితెమ్ము పోరా వోసేవకా
సరె గురువుతో నా కూతురు సరసమాడుటెరుగుదువా? (వి) చద : వారము దినముల నుండి అయ్యో రాజేంద్రా!
గురువులపై మక్కువ గనిపించెను మహారాజా. (వా) మ.ద : ఎంతమోసమాయె ఇంక ఏమి చేయగవలయు
ఇంత వరకు తెలుపక నీ వెందుకె అదిదాచినావు. (ఎం) చ.ద. : నిన్నిటి వరకు ఆ విషయము అయ్యో రాజేంద్రా
నా కన్నులబడలేదు నిన్నబడెనో గుణసాంద్రా (ని) (విరచికను తోడ్కొని సేవకుడు మరియు అంగారవతి ప్రవేశం)
దరువు వాదము
'మ.ద : ఏమిటే ఓ విరచిక, ఎక్కడే నా కూతురు
క్లేమమెకద రాకుమార్తె - చెప్పుము చూచెదవేమి? (ఏ) విద : ఏమందును మహారాజ - ఏమని చెప్పగ గలను
ధామమిడిచె రాకుమార్తె - (ప్రేమతో గురుదేవులతో (ఏ) మ.ద :ఎంత మోసమాయెనిపుడు - ఇంతవుట తెలియనైతి
పంతంబుగ నా కూతును - వెంటగొని వెడలునంచు (ఎం) అం.ద : చేజేతుల పెళ్లిచేసి - క్షేమంబుగ పంపకిటుల
చేజేతుల చేసుకుని - చేసెడి దేమున్నదింక (చే) మ.ద ఎరినటే జరిగినది - కొలది వ్యత్యాసముతో
31
స్వృష్టవాసవదత్త మీరిన పనికిప్పుడు - విచారించి _-భమేమి ? (కో) అం.ద : పిలువనంపి వైభవముగ - పెళ్లిజేసి పంపుదాము. మలినముగాకుండ మిగులు - మన కీర్తి ఈ భువిలో (పి) మ.ద : ఇప్పట్లో అతడిచటికి - ఎప్పగిదిని రాడు భామ తప్పేమిటె గాంధర్వకర గ్రహణముగావించియుండు (ఇ) విద : వారి చిత్రపటములకిట - వైభవము గ పెల్లిజేసి కోరికతో కట్నాలను - కొల్లలుగా పంపండి (వా) వివ ; మహారాజా! రాకుమార్తె గురుదేవుల చిత్రమును లిఖించినది. అట్లే రాకుమార్తె చిత్రమును గురుదేవులులిఖించినారు. ఇవి వారివారి సదనములందున్నవి. ఆ చిత్రపటముల నొక్కెడచేర్చి వానికి పెళ్లి జరిపించండి మహారాజా. అం.ద : ధరణి శ్రీ కుందవరపు - హరి కరుణ ఎట్లున్నదొ సరసుడు నరసింహునేలు - పురుషోత్తముడే గలడు. (ధ) అం.వ. : మహారాజా విరచిక చెప్పిన యోచన బాగున్నది. అట్టొనర్చుట మనకు తృప్తి, పెళ్లికి ఏర్పాటు చేయించండి ప్రభూ. మ.వ : అబే యొనరింతము. సేవకా! నీవు వెళ్లి సుబుద్ధినిటు తోడుకొనిరమ్ము సేవ. ; అటులే మహారాజ్ (అని వెళ్లి సుబుద్ధితో ప్రవేశించును) సువ : వందనములు మహారాజా. తొందరగా పిలువనంపుటలో విశేషమేమి ప్రభూ. మవ. : వత్సరాజు మనలను మోసగించి ప్రతీకారము తీర్చుకున్నాడు. వాసవదత్తతో గత రాత్రి పారిపోయినాడు. నాకేమాత్రము తెలిసివచ్చిన పెళ్లిజేసి పంపించెడి వాడిని. నా కోర్కె సఫలమయినప్పటికి సెళ్లిచేసి పంపలేదను విచారము మిగిలి పోయినది. సువ : పిలువ పంపినా రాడను కొందును. కొంత కాలము గతించిన పిమ్మట వారే వచ్చెదరు. విచారమెందులకు ప్రభూ. మ.వ : అయినా -మనమెందులకు మిన్నకుండవలతె. వారి చిత్రపటములకు వైభవముగా పెండ్డిజేసి కాన్మలనంపుదాము! 32
వంగా నర్జయ్య
సువ : ఇది ఉభయతారకమైన యోచన ప్రభూ
మ.వ : దేశమంతట వత్సరాజుకు వాసవదత్తకు వివాహము జరుపబడునని చాటింపు వేయింవుము. పట్టణమలంకరింపజేయుము. లగ్నము నిర్ణయించి గుట్టుగా పెళ్లిజేసి కానుకలంపుదము. (వెళ్లిపోదురు)
ఆస్ట లస్టి ఆస్టీం (కౌశాంబి పట్టణములో)
(వాసవదత్త వత్సరాజు పెళ్లిదుస్తులతో 'ప్రవేశింతురు. పిదప కానుకలు మోసి తెచ్చెడి వ్యక్తులతో సేవకుడు ప్రవేశించును)
సేవ : దండాలు మహారాజ్
వవ : ఏమిటిరా! ఇవన్ని ఎక్కడివి. ఎవరు పంపినారు.
సేవ : ఉజ్జయినీ మహాసేన మహారాజ్ కాన్కల్కి పంపిండు
వ్యవ : దండాలు మహారాజా! ఉజ్జయిని మహాసేన రాజు తమకీ కాన్కలు పంపుచు ఈ లేఖను ఇచ్చినాడు. స్వీకరించండి ప్రభూ. (యుగంధరుడు ్రవేశము)
యు.వ :; వందనములు మహారాజా !
వవ :; మహామంత్రీ, ఆ లేఖను చదువుడు.
యు.వ : అట్లే (లేఖనందుకుని విప్పిచదువును) చిరంజీవ! వత్సదేశాధీశవత్సమహారాజునకు ఆశీస్సులు. నీవు తొందరపడి వెళ్లి పోయినావు. మీకు వైభవముగా పెండ్డిగావించి పంపవలయునను మాకోర్కె తీరలేదు. విధివిలాసము తప్పునా? మీరు పరస్పరము చిత్రించుకున్న చిత్రపటములకు నిన్న వైభవముగా పెళల్లిజరిపి కానుకలు పంపుచున్నాము. పరిగ్రహింపుము. పరోక్షంగానైనా మా కూతురును నీకు అప్పగించినాము. గురువు అయినా భర్తవయినా నీవే మా కూతురునకు
33
స్వష్షవాసవదత్త ఏడుగడ. ఇవేమా అప్పగింతలు. ఇకముందు పూర్వవైరము మానుకుని స్నేహముగా వుందాము. నిన్ను మోసగించి తెచ్చిన ఉద్దేశము నెరవేరినది. అందుకు నన్ను మన్నింపుము. స్నేహదృష్టితో చేసినపని 'స్నేహాభివృద్ధికే దారితీసినది. ఇకముందే సహాయమవసరమైనా అందుకొనుటకు వెనుదీయవలదు. వాసవదత్తను నిర్విచారముగా యుండుమనగలరు. ఆమెకు మా ఆశీస్సులు. ఇట్లు మీ హిత్తైషి మహాసేనరాజు వ.వ._. : (వత్సరాజు చిరునగవుతో వాసవదత్తను చూచుచుండును) వావ. : (విచారముగా కళ్లుతుడుచుకొనును) వవ : చూచితివా మహామంత్రీ! నేనే పారపడ్డాను. యు.వ : బెను మహారాజా! ఇట్లు జరుగగలదని నాకు ముందే తెలుసు. మీరు పట్టుబడిన మరుసటి దినమే నాకు విషయము తెలిసినది. మహాసేనుని ఇంటిలో సుఖముగా యుండుటే కాక వాసవదత్తతో తిరిగి వచ్చెదరని నిశ్చింతగా ఏ ప్రయత్నముచేయక మీకొరకెదురు చూచుచు కాలము గడిపినాను. నేను ఊహించినదే జరిగినది. వవ. : (వానవదత్తను చూచి నవ్వును" వానవదత్త సిగ్గుతో ముఖము వాల్చుకొనును) యు.న : మహారాజా! ఇంత కాలముగా మిమ్ము కాపాడి శత్రుభయము లేకుండా రాజ్యమును కాపాడితిని. ఇపుడు నీవొక ఇంటివాడివైతివి. నా భారమంతయు తగ్గిపోయినది. నేనుమీ తండ్రిగారికి ఇచ్చిన మాటను నిలుపుకొనగలిగినందులకు ధన్యుడను. ఇప్పుడు నేనా వృద్ధుడనైనాను. మీ తండ్రిగారి కాలము నుండి మీ సేవ చేయుచున్నాను. అందువలన నేను కొంత కాలము విశ్రాంతి తీసికొనదలచితిని. కొంత కాలము తీర్థయాత్రలు కూడా చేయదలచుకున్నాను. ఇక రాజ్యభారము మీ భుజస్కంధాల మీద వుండగలదు. నాకు సెలవిప్పించిన వెళ్లివత్తును 34
వంగా నర్దయ్య వవ _ : (విచారముగా) నిన్ను కాదందునా మహామంత్రి. కాని అనుభవరహితుడను గదా యను భయము వేయుచున్నది. యువ : భయమక్కరలేదు. జాగరూకుడవై మెలగుము - మిగతా మంత్రులు ఉందురుగదా. నేనెప్పటికప్పుడు ఎచ్చట యున్నను వార్తలంపుచుందును. అవసరమని తోచిన యెడల కబురు ెట్టినచో వెంటనే వచ్చెదను. వవ. : మంచిది వెళ్లిరండి. తొందరలో పునర్దర్శన మగునట్లుగా. రాగలరు. యు.వ : సెలవు (నమస్కరించి వెల్లిపోవును) (మిగతా సేవకులు వెళ్లుదురు) వవ ; వాసవదత్తా! మనమిక్కడ పెళ్లి చేసుకొనిన ముహూర్తమునకే మీ తలిదండ్రులచ్చట మన చిత్రపటములకు పెళ్లియొనర్చినారట నా చిత్రపటమును నీవు చిత్రించి యుంటివా? వావ : మరి నా చిత్రపటమును మీరెందులకు చిత్రించితిరి?(నవ్వుకొందురు) వాదము - దరువు వ.ద ; నేటికిగా మన కోరిక తీరను బోటీ ఇది మన తపఃఫలం సాటి జగతికాదర్శవంతముగ-సాగింతుము మనదాంపత్యం (నేటి) వాద ; వయోరూప గుణసంపన్నుండగు వరుని బొాందుట నా అదృష్టం దయమాలుదురనుకొన్నపెద్దలు-దయతో జూచుట మనయదృష్టం (వయో) వద : పూవులో ఇమిడిన తావిరీతిగా జీవితమెంతో హాయిగదే పూవును నేనై తావివి నీవై - జీవిత మిట్లేగడుపుదమే (నేటి) వాద . కరుణాకరకుందార పురీహరి కరుణకు పాత్రులమైతిమిగా సరసగుణంబున నృసింహునేలిన-నారాయణుని మరువముగా (కరు) వవ : చెలీ! మీ తలిదండ్రులంపిన కానుకలను చూతమురమ్ము వావ. : అట్లే (ఇద్దరు వెళ్లుదురు) - అల్యిం లా 35
స్వష్టనానవదత్త వీరసేనుని ప్రవశం - దరువు వీరసేనుడను మహారాజు నరి - వీరభయంకరుడను నే వినరా లేరునాకు సరిసమానధీరులు - కోరి కదనరంగంబున పోరెడి (వి) కళింగదేశాధీశుండను బహు - కళాభిమానిని నే వినరా. కళాభివృద్ధికి పాటుపడుచు జన - కళ్యాణంబుగ పరిపాలించెడి (వీ) శూరసేనుడు నా జనకుండు, వీరమాత నాతల్లి గుణావతి సూర్యవంశమున జనన మందితిని - ఆర్యసంస్తుతుండను వినరా (వీ) సమయము కొరకు వేచియుంటి యమ సన్నిధికంపగ వత్సరాజును అమల చరితు నాతండ్రినిజంపిన - కుమతులపై పగదీర్చగను (వీ) ధరణీకుందవర ధాముండగు హరి - కరుణతో జూడగ వేడితిని సరసగుణంబున నృసింహునేలిన - పరమాత్మా నీభక్తుడరా (వీ) వీవ :వరే సేవక! సేవ. : నమస్కారాలు (మహారాజ్, మీ సంగతి చెప్కాండి మహారాజ్, వవ. : నేను కళింగ దేశాధిపతీని. మా తండ్రియగు శూరసేనభూపతిని వత్సరాజు తండ్రిగారగు సహస్రానీకుడు అకస్మాత్తుగా మా ;దేశంపై దాడి జరిపి చంపివైచెను. నేను చిన్నవాడనగుటచే అప్పట్లో శత్రువులను తుదముట్టించ లేకపోయితిని.. ఐనా ప్రతీకారము కొరకై నిరీక్షించుచుంటిని. ఎందుకనగా మాయోపాయంబులు గల యుగంధరుండను వత్సరాజుని మంత్రి నా ప్రయత్నములను భగ్నము చేయుచు వచ్చెను. సేవకా! నీవు వెళ్లి మంత్రి వీరబలుని తోడ్కొనిరమ్ము. సే.వ. : జీ! మహారాజ్ (వెడలిపోవును) వీరబలుండను మంత్రి ప్రవేశం - దరువు ద : వీరబలుండను మంత్రివరుండను - ధీరవరుండను నే వినరా ఈ రేడ్డగములు వెదకి చూచిన - లేరు ప్రజ్ఞాధురీణులు నాసరి (నీ) 36
వంగా నర్జ్ణయ్య వీరసేనుడను మహారాజుకడ - వీరుడనగునే మంత్రినిరా పౌరసౌఖ్యముగ పరిపాలనను - నిరతము నడిపెడి వాడనురా (వీ) కోరికుందవరపురమున నెలకొను - పురుషోత్తమునే దలచెదరా కరుణ నృసింహకవివరునేలిన - పురాణ పురుషు నమ్మితిరా. (వీ)
లీవ : వరెసేవకా! నేను వీరసేన మహారాజు యొక్క మంత్రిని ర!
సేవ : అట్లక్యా సర్కార్, తమర్కి వీరసేన మహారాజ్ జల్దిసే రమ్మన్యార్.
లీవ : మంచిది వెళుదాము పద. (కొంత దూరము నడువగనే వీరసేన రాజు ప్రవేశం)
లీవ : దండములు మహారాజా!
వీరవ : మంత్రివరా! విశేషములేవైన గలవా?
వీబ.వ : చాల గలవు ప్రభూ! (అని సేవకుని జూడగనే అతడు వెడలిపోవును) మహారాజా! మన శత్రువులను తుదముట్టించుటకు సమయము కలిసివచ్చినది. వత్సదేశ మంత్రియగు యుగంధరుడు తీర్థయాత్రలకై వెళ్లినాడట! వత్సరాజు భార్యాలోలుడై రాజ్యభారము మంత్రులకప్పగించి పరిపాలన మరచియున్నాడట. ఇపుడున్న మంత్రులెవరు సమర్ధులు కారు. వారు యుద్ధ ప్రయత్సముల యందుండరు. కావున మనము అకస్మాత్తుగా వత్సదేశముపై దాడిచేసిన సులభముగా రాజ్యము నాక్రమింపవచ్చును. వత్సరాజు ఇక మనకు సులభముగా చిక్కిపోవును.
వీఠవ : మంచివార్త తెచ్చితివి.
వాదము - దరువు
వీరద : సమయం బాసన్నమాయె - సమయింపగ శత్రువులను
సమకూర్చుము సైన్యమును - అమిత వేగ మాక్రమింప _ (స) 37
స్వష్టవాసవదత్త వీబ.ద : పరరాజుల సాహాయ్యము-కూర్చుకుని వెడలుదమా! (ప) పరిమితిలో మనసేన - వైరులను మించియుంది. వీరుద : అతి రహస్యముగ జరుపున - దితరులను పిలుచుటెట్లు కతిపయ దినములు గడిచిన - గతియించును అవకాశము. (అ) వీ.బ.ద : సేనానులు బిలిచినేడే _ జేతు సమావేశంబు ఏనాడు కదలుటనిన - మీనుడికే ఎదురు చూపు (సే) వీర.ద : రేపుశుద్ధదశమికదా - మాసే కదలించు సేన ఏపుగ నాలుగు వేపులు - నేర్చుతోడ ఆశక్రమించ (ర) వీరద : పడమటి దిశ మీరుండుడి - బలువగు స్థానంబదియె కడమదిక్కులందు తగిన - వడిగల యోధులనుంచెద (ప) వీర.ద : ధరణిని శ్రీ కుందవరపు - ధాముండగు హరికరుణచె కరమరుదుగ శత్రువులను - గాసిజేసి విడిచెదను. (ధు) వీరవ : మహామంత్రీ! నేటి రాత్రికే సేనానాయకుల సమావేశ మేర్పాటుచేసి వ్యూహము సిద్ధపరచి వత్సదేశమాగక్రమిద్దాము. ఏకాదశి నాటికి కౌశాంబి నాక్రమింపవలయును. చాలా రహస్యముగా కట్టుదిట్టము లేర్చరచుము. వీబ,వ. : అట్లే గావింతును మహారాజా (వెడలిపోవును) వీరువ.. : ఎన్ని నాళ్లనుండియో యెదురు చూచిన అవకాశము నేటికి గదా లభించినది. (నవ్వుచు వెడలిపోవును) సంజయుడను మంత్రి ప్రవేశము - దరువు దరు. , మంజుల భాషణుడని పేరొందిన _ సంజయుడను మంత్రినీ వినరా తేజము గలిగిన మంత్రిని నేనని - భూజనులందరు కొల్తురురా (మం) వత్సదేశమున కధీశుడైన - వత్సరాజుకుపమంత్రినిరా సత్యసంధుడని పేరొందిననే -_ మాత్సర్యము కడద్రొచితిరా (మం) ధారుణి కుందవరంబున నెలకొను - కరుణాకరు హరిభక్తుడరా సరసగుణంబున నృసింహృనేలిన-పరమ పురుష నిన్మరువనురా (మం) 38
వంగా నడ్దయ్య్మ వ : సేవకా! నా పేరు సంజయుడు. నేను వత్సమహారాజు వద్దమంత్రిగా యున్నాను. మా ్రధానియగు యుగంధరుడు తీర్థయాత్రల కొరకు వెడలుటచే రాజ్యభారమంతయు నాపైవడినది. భార్యా లోలుడై మహారాజగు వత్సరాజు రాజ్య నిర్వహణ బాధ్యతలు మరచి యుండుటచే వీరసేనుడను కళింగ దేశపు రాజు పూర్వవైరము దృష్టి యందుంచుకుని అకస్మాత్తుగా దండునడిపి దేశము నాక్రమించినాడు. ఇపుడు పట్టణ పొలిమేరలోనికి వచ్చినారట. నేనీవార్త వత్సరాజుతో తెలిపి శత్రువు చేజిక్కకుండా కాపాడవలయును. (ముందుకు నడచును) (వత్సరాజు వాసవదత్త ప్రవేశింతురు) వవ : ఏమి మంత్రివరా! ఇట్లు అకస్మాత్తుగా వేంచేసితిరి? సం.:వ : ప్రమాదము సంభవించినది ప్రభూ! దరువు - వాదము సం.ద : మునిగినాది మునిగినాది - సర్వస్వము మునిగినాది వెనుక చూపులేక రాజ్య - మునకే ముప్పాచ్చినాది (ము) వద : జరిగిన సంఘటన లేవో - పొారబడకను తెలుపవయ్యా పరుగులో గల కారణంబు - అరమరలేకుండ తెలుపు (జ) సం.ద : అరిసేనలు నాల్గుచెరగు - లాక్రమించె బహువేగము వీరసేనుడీ పురమును - ఘోరంబుగ చుట్టివేసె (అ) వ ; మహారాజా! వీరసేనుడకస్మాత్తుగా దేశంపై దాడి వెడలి రాజ్యము నాక్రమించినాడు. దారి తప్పించి వచ్చుటచే మన సైన్యము వారి రాకను కనిపెట్టలేకపోయినది. ఇపుడు కౌశాంబిని చుట్టివేసినారు. ఇక కొలది సమయములో కోటపై దాడి చేయనున్నారు. వ.ద . చేతులు గట్టుకు మీరఠరలు - ఏతీరుగవుంటిరయా యిీతీరే మొదలు నాతొ - ఎందుకొరకు తెలుపలేదు? (చే) వ : (కోపముగా) మీరేమి చేతులు ముడుచుకుని యుంటిరా? వేగుల వారు 39
స్వష్టవాసవదత్త విషయమందించలేదా? తగుకట్టుదిట్టము లెందుకు గావింపలేదు? సం.ద : మిమ్ముల దర్శించుకొరకు మూడు దినముల నుండి యమ సమ్మతితో అనుమతీక - చేసితిరి ఆలస్యము.
వద _ : దాటిపోయినది లేదు - మేటి వీరులను బంపుము
తృటిలోపల వీరసేను - దిటవు మాన్తు కదనమందు (దా) పుము. నేను వవ : సంజయా! మించినది లేదు. సైన్యమును రప్పింపుము నేను స్వయముగా సైన్యమును నడిపి శత్రువు బిలుకుమార్చిదను. వెంట ఏర్పాటు గావింపుము.
సం.ద : మొదటే అనుమతి యిచ్చిన - ఇంతవరకు రాకపోవు
తుదికిట్టులు మూడివచ్చి - బ్రతుకులకే ముప్పువచ్చె. (మొ)
వ : మీరు యుగంధర మహామంత్రి వెళ్లిన నాటి నుండి రాజ్య విషయము పట్టించుకొనరైతిరి. వీరసేనుడు అవకాశము వినియోగించుకుని హఠాత్తుగా దాడిచేసినాడు. సందేహించకు మంత్రి సరగున సేనను కూర్చుము.
సం. తే.గ ఇల్లుగాలంగ బావిత్రవ్వించినట్లు
కొరివితోడుత తలగోకికొనినయట్లు మొగ్గరంబులో చొచ్చుట లగ్గుగాదు పారిపోవుట మేలౌను వత్సరాజ!
వ : ఇచట కోట్ల రక్షణకై కొలది సైన్యము మాత్రమే యున్నది. వీరసేనుడు అపారమైన సేనావాహినితో వచ్చినాడు. కోటను ముట్టడించు చున్నారు. మనమివుడు రహస్య మార్గముగుండా శత్రువు కంటబడకుండా తప్పించుకొనుట మేలు. లేనిచో ఆపదల పాలగుదుము. (వీరసేన మహారాజుకు జైయని తెరలోపల నుండి ముమ్మారు వినిపించును)
(0.
వంగా నర్ణయ్య అడుగో శత్రువులు డగ్గరుచున్నారు. రండి వెళ్ళుదాము. వ.వ : భీ పిరికిపందవలె పారిపొామ్మందువా. తుచ్చుడగు వీరసేనునకా నేజంకి పారిపోవునది- శా॥ ఓరీ నీచుడ! మూడెనీదు దినముల్ నన్నెవ్వాడుగా నెంచితో క్రూరా!మజ్జనకుండు మున్నుదయతో కూల్చంగలేడాయెరా వీరున్నన్ జెనకంగ జూచెదవు నిన్నె వ్వారగాపాడినన్ పోరన్ నిన్నిదె దున్మవచ్చెదను యోరీ వీరసేనాధమా! సవ : వత్సరాజా! ఆవేశంబున కిది అదనుకాదు. శాంతింపుడు, మహారాజా! శాంతింపుడు. (వాసదత్తతో) మీరైనా చెప్పుడు మహారాణీ. (తెరలోపల వీరసేన మహారాజునకు 'జైయని ముమ్మారు వినిపించును. అందరు అటుదిక్కుచూచెదరు. వత్సరాజావేశంబున పరుగెత్తబోవును. సంజయుడు వాసవదత్త చెరియొక ప్రక్క పట్టి ఆపి వేయుదురు). సం. :గ॥ శత్రువులు బలవంతులై చేరిరిచట కదన భూమికి యేగుట గాదు లగ్గు తప్పుకొనుటయె మేలు యా తరుణమందు బ్రతికియుండిన శుభములు బడయవచ్చు. నావ... : కొను మహారాజా! మంత్రిమాటలను పాటించుటయె ఇప్పట్లో మేలు. శత్రువులు మనలను మించి యున్నపుడు యుద్ధమునకు వెళ్ళుట మలుకాదు. కోరి ముప్పు దెచ్చుకొనుట తగనిపని. ఇపుడు తప్పుకుని అవకాశముతో శత్రువుల నెదురుకొని రాజ్యము తిరిగి సంసాదించుచొక లెక్కకాదు. వవ :నా మనస్సుందులకు అంగీకరించుటలేదు దేవీ. వావ : వలదు. రండి రహస్య మార్గము గుండా వెళ్లుదము. (వత్సరాజును వాసవదత్త, సంజయుడు చెరియొక ప్రక్క పట్టుకుని లాగుకు వెళ్లుదురు.) ఆ్హం ర్ట ర్టిం ట్రే
స్వష్షవాసవదత్త కౌశాంబి రాజధాని (వీరసేనుడు వీరబలుడు ప్రవేశింతురు) వీ.వ. : మహామంత్రి! శాంతి నెలకొనినట్లే గదా! వీబ.వ : అందుకు సందేహమా మహారాజా! మీబోటి అరివీర్భభయంకరులకు శాంతి చేకూర్చుట ఒక లెక్కా. వాదము - దరువు వీరుద : శత్రువుల రాజ్యము చేజిక్కెనుగని - శత్రువు దప్పుక పోయెనుగా శత్రుశేషమును విడుచు మనకీ - ధాత్రిని క్షేమముగాదు సుమా (శ) వ : వీరబలా! నీవు శత్రువులను వెంటాడుచు. వారెక్కడ యున్నది కనుగొని, వారి నామూలాగ్రముగా నాశమొనరించనిది నాకు నిద్రరాదు. వీబ.ద : పారిపోయిన శత్రువుకొరకై - మీరు విచారము మానండి వారివెంట నేబడియెదగాని - మీరిట శాంతిని నెలకొలుపండి. (పా) వ : దేశమంత చెలరేగిన అశాంతిని దూరము చేసి శాంతిని నెలకొల్ప వలయును. వీర.వ : ఎదురు తిరిగిన ప్రజలను బట్టీ - పదునగు కత్తుల నరుకండి హడలుపుట్టవలె మన పాలనలో - జడమతులగు మన శత్రులకు.(ఎ) వీబ.దు : మీరని నట్టుగ జేతును నేనిట - నేరుపుతోడుత మహరాజా పెర రాజుల సహాయము శత్రులు - పొందకుండగా జూడండి. (మా) వ : ఇతర రాజుల నుండి వత్సనుడు సహాయము పొందకుండ తగు ఏర్పాటు చేయవలయును. వీరుద : పర రాజుల సహాయము శత్రులు-కోరక ముందే పంపుము లేఖలు ధరణి కుందవరధాముండగు హరి - కరుణయున్న ఇక చాలుగదా (ప) వ : బెను వీరబలా! నీవన్నట్టుగ మన మెరిగియున్న రాజు లందరికి నేడే లేఖలు పంపించుము. అట్లే వత్సరాజెక్కడ దాగియున్నది కనిపెట్టి మట్టుపెట్ట వలయును. (వెళ్లిపోవుదురు). శై
వంగా నర్ణయ్య రావాణకి గ్రామీ మందు వళ్శరాజు, వానీవదత్త మారుటేషములళో, సంజయుడు వ్రవశింతురు) వ.వ ; సంజయా! యుగంధరునకు వార్తపంపితివా? మనమిపుడు చెట్టుక్రింది పక్షులవలె పరచోటులలో తలదాచుకొనవలసిన గతి పట్టెనుగదా. సం.వ : వార్త పంపితిని మహారాజా. మీరు విచారింపవలదు. యుగంధరుడీ పాటికి రావచ్చును. వావ : ప్రభూ! మా తండ్రిగారికి కబురంపి వారి సహాయమెందులకు కోరవలదు. లేదా మన మచటి కేగి యొక గొవ్ప సైన్యమును కూర్చుకుని శత్రువునెదుర్కొన లేమా? వవ. :ప్రియా! ఈ పరిస్థితులలో ఏముఖము పెట్టుకుని వారి సహాయము కోరవలయును? యుగంధరుని రానిమ్ము (మాటలలోనే యుగంధరుడు ప్రవేశించును) (వత్సరాజు ఎదురేగి కౌగిలించుకొనును) యు.వ : కుశలమా ప్రభూ ? వవ : కుశలమున కేమి కొదువ మహామంత్రీ! సీ।; చిన్ననాడె నన్నుగన్న వారలు నీకు అప్పగించి స్వర్గమందునాడు విద్యనభ్యసించవివిధ శిక్షల బొంది నమితమౌ బాధలనందునాడు శత్రువుల్ రాజ్యంబు చుట్టివేయగ నీవు వెంటాడి యుద్ధమొనరించునాడు మాయలలో బడి మహసేను చెరయందు నాచార్య్యురీతిగా నడలునాడు గ|॥ నీవు లేనట్టి స్థితిలా నన్నేమరించి శత్రువుల్ మన రాజ్య విజేత లౌట త్రాణయైవచ్చి “'పెరచోట దాగియుంట కృంగ లేదింత ఇటనేడు కృంగునంత. తం
స్వష్పవాసవదత్త యు.వ : విచారింపవలదు మహారాజా. నీ చిన్నతనము నుండి కాపాడిన ఈ నీ వత్సదేశమును పరుల చేతిలో నుంచెదనా. మొదలే నాకు తెలియజేసిన ఇంత ప్రమాదము జరుగకపోయెడిది. వా.వ _. : మహామంత్రీ! ఈ పరిస్థితులలో మాతండ్రిగారి సహాయమెందులకు కోరవలదు? యు.వ : అవశ్యము కోరదగినదే. కాని వీరసేనుని ఎదురుకొనుటకు ఉజ్జయిని 'సైన్యబలము సరిపోదు. అందువలన మనమొక కొంత సైన్యము సమకూర్చుకుని కోరుదము. వ.వ _ : అవశ్యమట్లే యొనర్తుము. యు.వ : మన మిత్రులైన రాజులను సంప్రదించి సహాయమర్థించి మీ మామగారి సహాయము కూర్చుకుని శత్రువునెదురుకోవలయును. వవ :మన ఉనికి శత్రువు ఎరిగిన ప్రమాదమగును, యు.వ : జాగరూకతతో వ్యవహరింతును. మీరున్న ఈ స్థలము శత్రుదుర్భేద్యమైనది. నిశ్చింతగా యుండుడు. వ.వ. : మంచిది. మీకిష్టమగునట్లు నడుపుడు. జల్ళం ల్టేం (ఉజ్జయినీ పట్టణమున మహాసేనుడు) ప్రవేశము మ.వ. : యుగంధరుడు వచ్చుచున్నట్లుగా వార్తనంపినాడు. నా కూతురు వత్సరాజుతోపాటు అడవులలో ఎంత బాధపడుచున్నదో యు.వ : (ప్రవేశించి) వందనములు మహారాజా! య.వ : కుశలమా యుగంధరా ? యు.వ : కుశలమే ప్రభూ! నేనిపుడు మీ సహాయము కోరుటకై వచ్చితిని. నేనెరిగి యున్న రాజులందరు మనకు సహాయమొనర్చుటకు భయపడుచున్నారు. ఆ [క్రూరుడగు వీరసేనుడు సహాయమొనర్చ వలదని తన మాటను టీటీ
వంగా నర్మయ్య కాదని సహాయమొనర్చిన పర్యవసానము బాగుండదని వారికి హెచ్చరిక జేసియుంచినాడు. అందువలన ఎవరు ముందుకు రావటములేదు. య.వ :యుగంధరా! నా సేనా సహాయముతో శత్రువులను జయింపలేమా? లేదా వత్సరాజేడే వచ్చి ఇక్కడే ఎందుకు ఉండరాదు. నాకా పుత్రసంతానము లేదు. ఈ రాజ్యమెన్నడైనా అతనిదేకదా. యు.వ : మహారాజా! మీమాట వాస్తవమైనా వీరక్షత్రియుడందులకు ఇచ్చగింపడు. ఇందుకునాకొక ఉపాయము తోచుచున్నది. మీరఠరంగీకరించిన నేను ఆ పనికి పూనుకొందును. (కొలది సేపు మహాసేనునుని చెవిలో గుసగుసగా చెప్పును) మ.వ :మీ ఊవా మంచిదే. కాని, వానవదత్త భవిష్యత్తును గూడ దృష్టియందుంచుకుని ఆలోచింపపుము యుగంధరా. యు.వ : నేనన్నిటిని సమగ్రముగా ఆలోచించి ఈ నిర్ణయమునకు వచ్చితిని. మనకింత కన్న గత్యంతరము లేదు. వాసవదత్త భవిష్యత్తు పూచి నాది. ఏమందురు? మ.వ : (విచారించుచు) జాగ్రత్తగా వ్యవహరింపుము. యు.వ : మంచిది. సెలవు ప్రభూ (యుగంధరుడు వెడలిపోవును) (మహాసేనుడు యుగంధరుడు వెళ్లిన దిక్కు చూచి వెళ్లును) లిం ఆర్థం ల్టేం లావాణఠ్ అంతఃవురంబున వాస్వదత్త, యుగంధరుడు, వ్రవళశము యు.వ : అమ్మా! మహారాణీ! మీతో యొక విన్నపమొనరింపవచ్చినాను. వావ. : నాతో తెలుపుటకు సంశయమెందులకు మహామంత్రీ. దరువు - వాదము యు.ద : ఎంతని తెలిపిన పెడచెవినిడి రా జంతఃపురమ్ము విడరమ్మా! చింతమానె తన రాజ్యంబంతయు శత్రుల చేతుల గలదమ్మా (ఎం) ఉర్
స్వష్టవాసవదత్త వ : నేను తిరిగి వచ్చిన పిదప రాజ్యము శత్రువు చేతిలో యున్నదను మాటే మరచినాడు. అంతఃపురము విడచి రావటములేదు. వాద : వ్రతిదినమీవిషయుంబునేను. బహు పోరుపెట్టుచు దెలిపినను మతిమంతుండు యుగంధరుడుండగ-మనకేమబలా భయమనును(ప్ర) వ ; నేనెంత తెలిపినా యుగంధరుడుండగా భయము లేదనును. యు.ద : మీ తండ్రి ఒక్కడు దప్పయితరులు - మిన్నకుండిరి సహాయమడుగగ ఘాతకుడగు మన శత్రువుధాటికి-ఓ తల్లిరో బహుసైన్యము గావలె.(మీ) వ ;: సహాయము కోరగా మీ తండ్రిగారు తప్ప ఇతర రాజులెవ్వరు ఒప్పుకొనలేదు. ఉజ్జయిని సైన్యముతో మనము శత్రువును జయింపలేము. ఏమి చేయవలయునో తోచనిస్థితి ఏర్పడినది. వా.ద _ : ఎవ్విధియైన ప్రయత్నించక మీ - రివ్విధినుండుట తగునామంత్రి దవ్వుకరిగి పెర రాజులనైనా కయ్యమునకు గొనిరావలెను. _ (ఎ) వ ; సర్వసమర్ధులగు మీరే అధైర్యపడిన శత్రులను సాధించు మార్గమేది? మీరేవిధినైనను ప్రయత్నించి సాధించాలి. అందుకు నా అవసర మేర్చడిన నేనందులకు సిద్ధముగా వున్నాను. యు.ద : మీ సహాయమపేక్షించుటకే - వోసతీమతల్లిచటికి వచ్చితి వెసమీరొకఘనదీక్షనుబూని మసలవలెను ఇక ఓ మహారాణి (మి) వ : నేనిపుడు మీ సహాయ మపేక్షించియే వచ్చినాను. వాద : ఏమి చేయవలెనో అది తెలుపుడు నేమముతోనేనాచరించెద కామితార్థఫల దాయకుడగురఘు" రాముని సాక్షిగ సంశయించకు (ఏ) వ : సందేహింపకనేనేమి మీరు చేయవలయునో తెల్పుడు. యు.ద : దృఢమగు ప్రతిజ్ఞచేసి తెలుపుమో పడతిరొ నీవీపని చేయుటకు పుడమిని కుందవరంబునవెలసిన గరుడ గమనుడే గాచును మనలను. (ధృ) 46
వంగా నర్దయ్య్మ వా. వ్ గీ; రాజ్యమును మోరు తిరిగి రాబట్టుటకును నీచమగు వృత్తి దప్ప నేనెట్టిదైన పతిహితంబునకై నాదుప్రాణమిడుదు వలదు యోచింప నాపతిపైన యాన వావ. :నా ఆరాధ్య దైవము నా నర్వన్వమగు నా వతిపై ఒట్టుపెట్టు కొనుచున్నాను. సంశయము తీరినదా మహామంత్రీ! యు.వ. : (సంతోషముగా) అమ్మా! చాలు నీ పతిపైగల భక్తి అపారమైనది. అవసరము ఏర్పడిన వెంటనే వచ్చి వివరింతును. మనము రాజ్యము తిరిగి రాబట్టు వరకు నేటి నుండి మోరు నామాట కెదురాడ వలదు. నా పై మికెట్టి సంశయమువలదు. నన్ను నీ తండ్రిగా భావించుకుని వ్యవహరింపుము. వా.వ. : సందేహమా? మహామంత్రీ! యు.వ : సంతోషము వెళ్లివస్తాను తల్లి! (వెళ్లిపోవును) వా.వ. : ఈతడు ఇంత ఘోరమగు ప్రతిజ్ఞ చేయించి విషయమెదో వివరించకుండానే వెడలిపోయిను. కానిమ్ము సావధానముగా తెలినసివచ్చును గదా. (వెళ్లిపోవును) (యుగంధరుడు వత్సరాజు ప్రవేశింతురు) యు.వ. : దండములు మహారాజా! వాదము - దరువు వ.ద. . విశేషమేమిట్లకస్మాత్తుగా వేంచేయుట మోకోమంత్రీ శేషప్రశ్చలేవైనయున్నచో ఈ సమయంబున అడుగ దలంచితో వ.వ. . మహామంత్రి! ఏ కాంతముగా కలిసికొనుటకు కారణమేమి? టీ
న్వష్షవాసవదత్త యు.ద : అంతఃపురమ్మువిడిచి నీవు ఏకాంతసమావేశమునకురావు ఎంతప్రయాస పడుచుంటిని స్వా తంత్ర్యముకై యిటుగనవేమి (అంతః) వవ : మోరు అంతఃపురమును విడచి ఎపుడు రారైతిరి. పనులు ఎలాచక్కబడగలవు? వ.ద. : ఏమాటను నేకాదంటినిమో మాటము నీకిపుడో మంత్రీ నీ మానస మిటు బాధపడుటలో కామితార్థమేమిటి మంత్రీ (ఏ) యు.వ : శత్రులతో సమరంబొనర్చెడి సమయంబాసన్నంబాయె తుప్పుపట్టు మి ఆయుధంబులు ఎంతోకాలము వాడకుండిన (శ) యు.వ. : విముబోటి వీరుడు చేతులు ముడుచుకు కూర్చుండరాదు. వ.ద. : ఏమిచేయవలెనో అది తెలుపుడు నీ మాటను నేకాదనగా సమయస్ఫూర్తి కలిగి తెలిపిన సంతోషముగా ఆచరించెద (ఏ) యు.ద. : వేట కారకు ఏర్పాట్లోనర్చితీ పూటేకదులుము మహరాజా! వేటతోడ ఉత్సాహము గలిగి దీటుబొందు మో బాణప్రయోగము (వే) వ.ద. : కుందావరపురంబున నెలకొను మందరగిరిధరు దలుచుచునే సందేహించక వెడలెద వేటకు ముందేర్పాట్లీవానరింపు (కుం) ఉరి
వంగా నర్ణయ్య వ.వ. ; మోరనినట్లుగానే వేటకు వెడలేదను. వానవదత్తకీ విషయము తెలిపివచ్చెదను. యు.వ. : అట్లే ఏర్పాట్టోనర్చెదను సెలవు (వెళ్లిపోవును). (వానీవదత్త ప్రవశము) వాదము - దరువు వ.ద. : వేటకునే వెడలుచుంటి వెలదిరొలసెవిచ్చిపంపు తటకున గలిగను ఈ పని తొందరగా తిరిగివత్తు (వ) వాద : ఇన్ని నాళ్లనుండిలేని దిప్పట్లోగలిగె నేల? ఎన్నగ నాకెలనో సంశయమిచ్చటగలిగేనండి (ఇన్ని) వ.ద. _ : అన్నులమిన్నరొసంశయ మెన్నగనీకేలగలిగె విన్నవింపుమూ మాట - విశదంబు సేతునీకు (అన్ను) వా.ద. : కుడికన్ను కుడిభుజము తడవ తడవ కదురుతోంది (కుడి) కడగండ్లు కలుగునంచు బెడదతో మది వడకుతోంది వద : ఎడబాటుగలుగుననుచు బెడదతో నీకట్టయ్యె తడవేమి చేయనచట పడతిరొతొందరగవత్తు (ఎ) వాద : నన్నుగూడ మోవెంట గొనిపొండో మహరాజా నిన్నువిడిచి వంటరిగా త్రి
న్వష్షవాసవదత్త నేనుండలేను రాజా! వద : తొందరగా తిరిగి వత్తు సందేహింపకు రాణీ సుందరి నీ ఎడబాటును ముందుగ నేనోపలేను (తొం) వా.ద : ధరణిని శ్రీకుందవరపు ధాముండగు హరికరుణే మరువకు నరసింహాఖ్యుని కరుణతొ ఏలినహరిని (ధర) వావ : (వాసవదత్తచుబుకము పట్టుకుని) (ప్రేయసీ! భయమెందులకు. తొందరగా తిరిగివత్తును (వత్సరాజు వెల్లిపోవును. యుగంధరుడు వచ్చును) వావ : మహామంత్రీ మిరు నాధుని వెంట వెళ్లలేదా? యు.వ. : లేదు తల్లి! ఇతర మంత్రులను పంపించితిని. నేనిచ్చట నెరవేర్చ వలసిన పనులుచాలగలవు. ఇప్పుడు మోరు నాకిచ్చిన మాట నిలుపుకొనవలయును. దరువు - వాదము వాద : తెలుపుడదేమో- గొలుపదొడగెమది భీతి (తె) తలపక మోరన్యథా ఏ తలపులోనైన ఇపుడు (తె) యు.ద : ఓ రాజకుమారీ - నీ రాజసమును విడచి ముందుకదులుము కోరి కోరి మనము కొన్నినాళ్లు దూరదేశమేగవలయు. (ఓ) వ. _: అమ్మా మహారాణీ! నీవిపుడు బ్రాహ్మణ వేషముతో నాతో కదలిరా వలెను. మనము దూరదేశ మేగ వలసియ్నుది. వా.ద. : నాపతి ఏ మనును! పతిఆజ్ఞ లేక మోవెంట చనుటెట్లగును పతిని విడచి ఒక పూట బ్రతుకలేను ఈ భువిలో (నా) 50
వంగా నర్ణయ్య
యు.ద : ఆ భయమేల - నీకభయమునేనిత్తుబాల నీభయమిపష్పాటవిడచి
నిర్భయముగ గదులవలయు (ఆ)
వా.ద. : నీతోవస్తే ప్రజ - లంత ఇచటనాపై అపవాదులువేస్తే హేతువు గన్పించకపతి చేతనత్వమేవీడును (నీ)
యు.వ : హరిహరి వినుమీ ఓ- తల్లిరొ నీవామాటలు అనబోకు సుమో త్వరపడకుము తెల్పెదాను - తెలిసి తిరిగి మాటాడుము (హరి)
యు. :సీ॥ సాధ్వీమ తల్లిరో సరగున గృహమిాడి
చనినంత ఇంటికి చిచ్చుబెట్టి మంటలో మహారాణి మడయగనుండగా గాంచి యుగంధరుడు గావబోయి్రి భృందర హా శ్ లగంతాల ర్టై వాసవదత్తతో వారునుమడిసిరి ల త్న గ యనియెడునపవాదు వ్యాప్తిజేసి[| (౯ లో నీ భర్త నూరార్చి నొక కొన్నినాళ్లకు స. ీ ణ -ం ఆక్త త పెల్లిజేతురు తిరిగి పేర్మితోడ మార రకా
గీ॥ పడతిరో నీవు జీవింప వత్సరాజు స తిరిగి తలబెట్టలేడమ్మ పరిణయంబు నీవుచచ్చితివను అపవాదు నెరపి పిదప వత్పనుని పెళ్లితో తిరిగి వచ్చు సుఖము.
వ. : అమ్మా! మనమోగృహమువిడిన వెంటనే ఇంటికినిప్పంటించి మంటలలో నున్న వాసవదత్తను కాపాడబోయి వాసవదత్తతోపాటు యుగంధరుడు కూడ మరణించినాడను వార్తను నీ భర్తకు అందజేతురు. వత్సరాజు నీ పై ప్రేమతో కొన్నాళ్లు దుఃఖించును. పిదప నాతనికి మగధ దేశరాజు కుమార్తెతో వివాహము గావింపబడును. మగధ సైన్యసహకారంతో శత్రువులను జయ్యించగలుగుదుము. అంతవరకు మన మిద్దరము గుప్తముగా నుండి రాజ్యము సంపాదించిన పిదప నీ పతిని కలిసికొందుము. అంతవరకు మోకీ కష్టములు తప్పవు తల్లీ,
వాద . అయ్యోనాథా! - నేనింతటితో అవుదునేమొకో అనాధా
51
స్వష్షవాసనదత్త చయ్యననే చచ్చితినన ఇయ్యెడ ఎటు తాళుదురో (అ) యు.ద : విచారంబేల - నీ ప్రతినను దృఢచిత్తముతో నిలుపుము బాలా! యోచనేల? కుందవరపు దోషరహితహరిగలడు (విచా) యు.వ : మహారాణీ! ఆలస్యం వలదు. నీవు వెంటనే బ్రాహ్మణస్తీ వేషంతో రమ్ము ఇక నుండి నీవు నా చెల్లెలివి. నీ పేరు లక్ష్మి నా పేరు భాస్కరుడు. వావ. : అయ్యా! నా పతి నింకొక తడవ చూచివెళ్లుదము. అంతవరకు ఆగలేమా మహామంత్రి. యు.వ : వీలులేదు తల్లీ. ఇప్పటికే కాలహరణమైనది. నేను వేషము మార్చు కుని వచ్చెదను. నీవుకూడసిద్ధముగా నుండుము (వెళ్లును) వావ. : (యుగంధరుడు వెళ్లినదిక్కు చూచి లోనికి వెళ్లిభర్త చిత్రపటము తెచ్చి ముందుంచుకుని దుఃఖముతో) వావ : సీ॥ ఏయాశచే నేను నీ మాట పాటించి తలిదండ్రులన్ వీడి దరలినానా ఏ యాశచేనేను నీ మనోహరరూప పూజారినైవెంట వచ్చినానొ ఏయాశచేనేను నీ రాజ్యమునుబోవ నీతోడునీడలా నిలచినానా ఏయాశచేనేను ఇన్ని నాళులనుండి నీపద దాసిగా నెగడి నానా గు ౩ అట్టి ఆశయె నావెంటనహరహంబు చిచ్చులోబడి చచ్చెనన్ మచ్చతోడ నిన్ను విడనాడి యొంటిమై ఏగుచుంటి నీదు పదదాసి తప్పు మన్నింపుదేవ! వావ... : పరమేశ్వరా! నీపై భారముంచి వెడలుచున్నాను. రాజ్యమును తిరిగి రాబట్టు వరకు నాభర్తను కాపాడుము. నాభర్తకు నాపై ప్రేమ తగ్గకుండా చూడుము. (అనిశూన్యంలోనికినమస్కరించి వెడలిపోవును). 52
వంగా నర్జ్ణయ్య అడవిలో (వత్సరాజు, సంజయుడు, వేటకాండ్రు ప్రవేశింతురు) దరువు వ.ద. : వేటలాడుదము రావోమంత్రి ఘోటకంబుల నధిరోహించి దీటగుసైనికులను వెంటిడుకుని సాటిలేని మన ప్రతిభను చూపుము (వే) అదుగోకురంగమటుబోయెనుగా ఏదుపంది యిటు వచ్చుచున్నది ఇదే నేను _బాణంబు వదలితిని మోదుసి పూవైమొగ్గిపోయినది. సింహంబట గర్జించునున్నది శరభములిచ్చటే గనపడవేమి? సంహరింతునాబాణవర్షముతో సరగున నడవండచ్చటికి వేదండంబుల దండు వచ్చినది కోదండంబున బాణ మిడచితిని అదే ఘీంకృతితో బడియెనచ్చట సదయులార మోరచటికి నడుపుడు ధరణికుందవరపురముననెలకొను "హరికగుణచె వేటాడుదము కరమరుదుగ నరసింహునేలిన పరమాత్మా మముకరుణించుమురా (వేట) వవ. : మంత్రీ సంజయా! వేటలాడి బాగా అలసిపోయితిని తిరిగి మన గుడారంబులకు వెళ్లి విశ్రాంతి తీసికొందము. సంహరించిన జంతువులను వేటకాండ్రు తెచ్చెదరు. 53
స్వష్టవాసవదత్త సం.వ : అటులే మహారాజా! (అంతలో ఒక సేవకుడు పరుగెత్తుకుని వచ్చి వత్సరాజునకు నమస్కరించి లేఖ నొసంగును). వ.వ. : మంత్రివరా! ఈ సేవకుడు తెచ్చిన లేఖాంశము చదువుము. (ఇచ్చును) (సంజయుడు లేఖ తీసుకుని) సంవ : శ్రీశ్రీశ్రీ వత్సరాజుల వారిసన్నిధికి ప్రణామములు. మోరు వేటకై వెళ్లిన కొంత 'సేవటికి అకస్మాత్తుగా రాజభవనమునకు నిప్పంటుకుని పరశురామప్రీతి జరిగినది. మంటలలో నుండి వానవదత్త తప్పించు కొనలేక బాధపడుచుండగా యుగంధరుడామెను కాపాడ బోయి ఆమెతోపాటు అగ్నికాహుతి అయినాడు. చిత్తగించగలరు. ఇట్లు ఇతర మంత్రులు వ.వ. : హాదుర్విధీ! ఎంతఅన్యాయమైనది! (మూర్భపడబోవును ఇతరులు పట్టుకొందురు) సంవ : సేవకా! ప్రయాణమునకు ఏర్పాట్టానర్చుము. మనము వెంటనే లావాణకమునకు వెళ్లవలయును. సేవ : చిత్తం. మహారాజ్ (అందరు వెళ్లిపోవుదురు) కనే నన (లావాణక గ్రామంబున వాసవదత్త, యుగంధరుల సమాధుల మధ్య విచారముగా వత్సరాజు సేవకుడు ప్రవేశము) వ.సీ. (ఓ యుగంధరా!) కన్న తండ్రిని బోలి కరుణమైననుబెంచి శద్ధభక్తుల తోడసాకినావు (ఓ వాసవదత్తా) కన్న తలిదండ్రుల కాదని విడనాడి ధైర్యాన నావెంట తరలినావు (ఓ యుగంధరా!) విద్యబుద్ధులు నేర్చి వివిధ శిక్షలగరపి సాటిలో మేటిగా జేసినావు. ర్తీ
వంగా నర్ణయ్య (వాసవదత్తా) నన్నెప్రాణంబుగా మన్నించి (ప్రేమతో నాతోడునీడలా నడచినావు (యుగంధరా) రాజ్యరమన్ బాసి రహివీడియుండగా స్వాతంత్ర్య దీక్షనే సలిపినావు (వాసవదత్తా) కష్టవేళలగూడ కడుప్రయాసలనంది నాపదసేవలో నడచినావు గ్॥ అక్కటామిముబాసి యిక్కటికవేళ బ్రదుక లేనింక మోజాడ బట్టివత్తు నాదు సర్వస్వమే మోరు నన్ను విడచి నొంటిమై నేగ మోమది నొప్పెనెట్లు వవ. : అయ్యో వాసవదళత్తా! యుగంధరా! మోరిద్దరు నాకు రెండు కళ్లు. ఈ రెండు కళ్లనొకేసారి చితుక బాడిచి నన్ను గ్రుడ్డివానినిగా చేసితిరి. మీరు లేని ఈ నొజీవితము జీవచ్చవమయినది. ఇక నేను జీవించి ప్రయోజనమేమి? నాకు మో దారియె శరణ్యము (ఒరలోని కత్తిని తీసి పోడుచుకోయత్సించును. సంజయుడు తదితరులు ఆపివేయుదురు) సం.:వ :; మహారాజా! శాంతింపుడు. ఆపత్సృమయంబున ఆవేశము వలదు. వ.వ. : సంజయా! నాకింకెక్కడిశాంతి. నా శాంతిని వారే దొచుకుని వెళ్ళరి. మోరు నన్ను నిశ్చింతగా మరణించనిండు. సవ. : ఈ స్మశాన వాటికలో మోబోటి ధీరచిత్తుల విచారము చూచి నవ్వు కుందురు. ఇంటికిపోదామురండి. | వ.వ. : నేనెక్కడికి రాను. నేనీ సమాధులమధ్య సమ+ధియయ్యెదను. (మంత్రులు లాగుకొని వెళ్లుచుందురు. వత్సరాజు గింజుకొనుచు అనుసరించును),. ఆ ఆ ల ర్5్
స్వష్టవాసవదత్త (భానుమతి ప్రవశము) దరువు మగధపురీశుని ముద్దుల బిడ్డను _ మగువరో భానుమతీయని అందురునన్ అగణితమగు సద్గుణములు గలిగిన మగువలలో నుతికెక్కిన దానను (మ) శుభసేన సుశీలదేవికి సుందరాంగినగు కూతురు నమ్మా శుభదత్తునకు తోడబుట్టువును ఇభరాడ్గమనరొ విననే జగతిన్ (మ) ధరణికుందవరపురమున నెలకొను హరినిస్మరించెడి దానను చెలియా కరమరుదుగ నరసింహునేలిన పురాణ పురుషా (బోవుమురా మల్లిక : అమ్మా! మో వివరములు తెలుపండి రాజకుమార్. భా.వ. : నేను మగధదేశ రాజగు శుభదత్తుని తో! బుట్టువును. మా తల్లి తండ్రులగు శుభసేనరాజు, సుశీలాదేవి వానప్రస్థమందుండుటచే వారిని దర్శించి వచ్చుచున్నాను. మ.వ. : మిరిపుడు చాటింపు చేసిన విషయ మేమిటి రాకుమార్! భావ. : నేనిచ్చట యున్నంతకాలము ఈ ప్రాంతమందలి అతిథి అభ్యాగతులకు వారి కోర్కెలు తీర్తునని చొటబంపినాను. మ.వ. : రాజకుమారీ! ఎవరో ఇద్దరు ఇటు వచ్చుచున్నారు. (మారువేషములతో వాసవదత్త యుగంధరుడు ప్రవేశం) భావ. : నమస్కారము బ్రాహ్మణోత్తనూ. యు.వ. : దీర్దాయుష్యమస్తు. శ్రీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. దరువు- వాదము భాద : ఏ దేశమునుండిచటికివస్తిరి 56
కంగా నత్టయ్య మోదేశంబేదో తెలుపండి మోదౌ కులగోత్రంబులుతెలిపి - మోదము గూర్చండీ మాకు (ఏ) యు.వ. : బ్రాహ్మణకులమున జన్మించితిమి భాస్కరుడని పిలుతురు నన్ను హితమతి ఈమెనా తోబుట్టువు - అతివరొవత్సదేశము మాది (బ్రా) భాద : ఏమోకారణమున ఇచటికివస్తిరి ఎరుగదెలుపుడో బ్రాహ్మణులారా! కామితార్థములు తీర్తును మోకు - నేమంబున నేనుంటిని వినుడీ, (ఏ) యు.ద : భర్మప్రోషితీపడతిని మోకడ బెట్టిపోదునొక కొన్నాళ్లు. తిరిగివత్తునే కాశికిబోయి - కరుణతొమోకడ యుంచండీ. యు,వ : అమ్మా! ఈమె మా చెల్లెలు. అమె భర్త చదువు ముగియని కారణంబున ఈమె నావద్దనే యున్నది. ఈమె అత్తవారి తరపు వారెవరు లేరు. నేనిపుడవసరముగా కాశికి వెళ్లవలసివచ్చినది. మాగ్రామమందితర బ్రాహ్మణకుటుంబములు లేని కారణంగా వెంటతీసుకుని వచ్చినాను. కాని ఈమెతో పయనం ఇబ్బందిగావుంది. నేను మొదయాగుణంబులు విని మోకడనుంచుటకై వచ్చితిని. అనుమతించండి రాకుమార్! భాద : పరవనితల న్యాసముగా వుంచుట బహుప్రయాసవోభూసురోత్తమా కర్తవ్యంబిక ఏమియులేదు - కాదనలేనిక మాటయిచ్చితిని. (పర) యు.ద : కరుణాకరకుందార పురీహరి కరుణకుపొత్రులమైతిమిగా మరువకుమా నామాటలనెపుడు - మదిలో యుంచుము ఓ చెల్లీ (క) యు.వ. : అమ్మా లక్ష్మీ! రాకుమారి అనుమతించినది నేను తిరిగి వచ్చు వరకు భక్తి శ్రద్ధలతో మసలుకొనుము. వావ. : నన్నాంటరిగా వదలి వెళ్లుదువా అన్నయ్యా, భా.వ.. : విచారించకమ్మా నీ కెట్టిలోటు రాకుండా కాపాడుదును. యు.వ. : నాకదే కావలిసినది రాజకుమారీ! ఈతేప. నేను మా లక్ష్మి భర్తతో తిరిగి వచ్చెదను. అమ్మా లక్ష్మి! నిర్విచారముగా నుండుము. వెళ్లివచ్చెద 57
స్వష్టవాసవదత్త రాకుమారీ. (వెళ్లిపోవును) భావ. ; అమ్మాలక్ష్మీ! సంధ్య వార్చుకుని భోజనమునకు వేళ అయినది రమ్ము (అందరు వెళ్ళిపోవుదురు) పాస్తా స్తా (వోన్యం) (యుగంధరుడు బ్రాహ్మణవేషముతో వత్సరాజు చిత్రపటమును పట్టుకుని ప్రవేశించును) యు.వ. : నేనిప్పటికి వాసవదత్తను భానుమతి వద్ద న్యాసముగా యుంచి ఒక నెల గడిచినది. ఇపుడు వెళ్లి శుభదత్తునితో సంప్రదించి వత్సరాజునకు భానుమతినిచ్చి పెల్లి చేయించుటకు ప్రయత్న మొనరించి, వారి అనుమతితో లగ్నం నిర్ణయించవలయును. వెళ్లి మగధరాజగు శుభదత్తుని దర్శింతును (వెళ్లును) శుభదత్త మవోరాజు వ్రవళం - దరువు శుద. : మగధ దేశమున కధీశుడను జన మంగళ దాయకుడను వినరా అగణితమగు సద్గుణములలోనే ము నగ్రగణ్యుడని పేరాందితిరా ( శుభనామంబున బరగెడినన్ను శుభదత్తుండని పిలుతురురా ను శుభసేనా సుశీలదేవికి - సుందరాంగుడగు పుత్రుడరా (మ) అనిమొన సమానముగ, నన్నెదుర్కొను మొనగాడెవ్వడు లేడుభువిన్ అనంగుగేరెడి అందగాడనగు - ఘనుడను రాజ రాజునురా (మ) వరదుడు 'కుందవరంబున నెలకొను హరిని నమ్మినవాడనురా 58
వంగా నర్ణయ్య సరసుడు నృసింహకవివరునేలిన-మురహరినే స్మరియింతునురా (మ)
సేవ. : మహారాజా! మా వివరము ఈ సభాసదులకు తెలుపండి.
శు.వ... : నేను మగధ సామ్రాజ్య చక్రవర్తియగు శుభదత్తుడను. ఇవుడు మాచెల్లి వివాహ విషయమై మాట్లాడుటకు ' వత్సరాజు నుండి బ్రాహ్మణులు వచ్చినారట. మా చెల్లెలు ఇదివరలోనే అతనిని పెళ్లియాడుటకు సమ్మతించి యున్నది కావున స్థిరపరచుటమేలు.
సేవ. : సర్కార్! బొమ్మనాయిన అవుతల వుండింది. లోనికి తీస్కరమ్మంటారా?
శు.వ... : సరే. ప్రవేశపెట్టుము. (సేవకుడు వెళ్లియుగంధరునితో ప్రవేశించును. యుగంధరుని చేతిలో వత్సరాజు చిత్రపటముండును).
శు.వ. : వందనములు బ్రాహ్మణోత్తమా!
యువ. : దీర్చాయుష్మాన్భవ. మహారాజా! నేను వత్సదేశాధీశ్వరుడగు వత్సరాజు కార్యార్థమై వచ్చినాను.
వాదము - దరువు
శు.ద. : విషయంబేమా- మీరిచటికిపుడు వచ్చినట్టి (విషు కుశలమెకద వత్సరాజు-కుశలమా మోవారందరు (విష)
యు.ద : కుశలమె రాజా - మా వత్సమహారాజు ఇపుడు (కుశ) వాసవదత్తను బాసి - గాసిజెంది యున్నాడయ్యా! (కుశ)
యు.వ. : ప్రభూ! రాజభవనమునకు అకస్మాత్తుగా నిప్పంటుకుని అగ్గిలో వాసవదత్త మరియు ఆమెను కాపాడబోయిన యుగంధరుడు అగ్నికాహుతి అయినారు. ఇది వత్సమహారాజు వేటకై వెడలినపుడు జరిగినది. శత్రువులచే రాజ్యముకోలుపోవుట, వాసవదత్త మరణము నాతనిని కృంగదీసినది. అందువలన మోసోదరి యగు భానుమతిీదేవి నిచ్చి వివాహముగావించి ఆతని రాజ్యము పునరుద్దరించుటక్రై మిమ్ము ప్రార్థింపవచ్చినారము.
శు.ద.. . విచారింతునూ - నా సహోదరిని పిలిచినేడే (వి)
5్ర్రి
స్వష్షవాసవదత్త
సచివులను రావించి - జరుపుద మాలోచనలను (వి)
శువ. : మా సహోదరిని - మంత్రులను విచారించి నిర్ణయింతుము. నీవు రెండు దినములు ఆగియుండుము.
యు.ద. : కోరిన వరుడే మోరాతనిని ఇదివరలో (కో) వేరు విచారణజేయ - కారణమేముంది ప్రభూ! (కో)
యు.వ. : ప్రభూ! రాజకుమారికోరుకున్న వరుడే కదా. యివుడు అతడే మమ్మర్థించినపుడు తిరిగి విచారింపనేల? వచ్చె శుద్ధదశమికి మంచి లగ్నమున్నది. ఆ లగ్నంబున నలక్షణంబుగా వివావామొనర్చి ఉభయతారకము గావించుడు.
శుద. : మంచిదికానీ - ఎంచి అట్లేయొనరింతుము. (మం) అంచితముగ కుందవరపు - హరిదయయేకానిమ్ము (మం)
శు,వ. : బ్రాహ్మణోత్తమా! మోరనినట్లే అందరిని విచారించి ఆ లగ్నమునకే వివాహమొనర్చుటకై ఏర్పాటొనర్చెదము. ఆ చిత్రపటము నిమ్ము (అని పటముతీసికొని వెళ్లిపోవును).
యువ : ఇప్పటి వరకు నా పన్నుగడ నిర్విఘ్నముగా. జరుగుచున్నది. ఇక వత్సరాజు కుల గురువు వేషముతో వెళ్లి అతనిని పెళ్లికిఒప్పించి ఈ పెళ్లి నిర్విఘ్నముగా జరుగునట్టు చూచెదను. యిపుడు లావాణకమునకు వెళ్లెదను (వెళ్లును)
మగధ అంతువురములూ
(భానుమతి, లక్ష్మి (వాసవదత్త) మల్లిక ప్రవేశింతురు)
భా.వ. : అక్కా! లక్ష్మీదేవి వనవిహారముచేసివత్తమా
వా.వ.. : రాకుమారీ! ఇపుడునేనెచటికి రాలేనమ్మా! నామనస్సెందులకో ఆందోళన కలిగియున్నది,
భావ. : మోరెప్పుడు ఏదో కోలుపోయినట్టుందురు. కారణమడిగిన ఏమియు లేదందురు.
60
వంగా నర్ణయ్య (ఇంతలో ఒక, చేటి వత్సరాజు చిత్రపటముతో ప్రవేశించును) విర.వ. : రాకుమారీ! శుభవార్త. (అని పటమును ప్రదర్శించును) భావ. : ఏమిటే చతురికా! విరవ : ఇదుగో (అని పటమును భానుమతికందించును. ఆమె చిరునగవుతో పరిశీలించుచుండును). దరువు - వాదము వాద. : ఏమిటే భామా - ఆ పటములోని పూరుషుండెవ్వడెలేమా? ధీమహితుడు ఆ తడుబహు రూపసిలాగున్నాడె (ఏమి) భావ. : ఎవ్వరీతడూ -ఈ పటమునగల పురుషశ్రేష్టుడెన్నగనేడూ నవ్వుమోముతోడహృదయ మాకర్షించుచునుండె (ఎవ్వ) చతు.ద : వత్సరాజమ్మా - వత్సదేశమేలేడు ధీవరుడే కొమ్మా మత్స్యకంటినువుకోరిన - వత్సరాజితడె సుమ్మా (వత్చ వ. : రాజకుమారీ! నీవు వూర్వమే వత్సరాజును వివావాము చేనుకుందునని కోరితివో అతడే తిరిగినీకడకు వచ్చినాడు. వాద : అన్యాయంబమ్మా- అతడిప్పట్లోపెళల్లాడుటఅధర్మంబమ్మా కాయమెస్థిర మనుకొనియెడు మాయపురుషులి రాజులు. (అన్యా) భాద : కారణమేమో? మీరనెడుమాటలోని నిగూఢార్థంబేమా? మోరాతని నెరుగుదురా ఈరీతిగ బాధపడగ (కారణ) వా.ద : మొన్ననేగాదా - వాసవదత్తాచిచ్చునబడి మన్నైపోదా ఉన్నపళంబునదుఃఖముడిగియెట్లు పెళ్ళాడును (మొన్న) ల్, వావ... - వేరేకారణమేమి లేదు రాకుమారి! పురుషులెంత దయాహీనులో కాంచుము. అతనినే సర్వస్వమని నమ్మి తలిదండ్రులను విడచి వెంటవచ్చిన వాసవదత్త అగ్నిలోబూదియై నెలనాళ్లుకోలేదు. అపుడే తిరిగి సెళ్లిప్రయత్నములు చేయుచున్నాడు. 61
స్వష్షనాసనవదత్త
సచివులను రావించి - జరుపుద మాలోచనలను (వి)
శువ. :మా సహోదరిని - మంత్రులను విచారించి నిర్ణయింతుము. నీవు రెండు దినములు ఆగియుండుము.
యు.ద. : కోరిన వరుడే మోరాతనిని ఇదివరలో (కో) వేరు విచారణజేయ - కారణమేముంది ప్రభూ! (కో)
యు.వ. : ప్రభూ! రాజకుమారికోరుకున్న వరుడే కదా. యివుడు అతడే మిమ్మర్థించినపుడు తిరిగి విచారింపనేల? వచ్చె శుద్దదశమికి మంచి లగ్నమున్నది. ఆ లగ్నంబున నలక్షణంబుగా వివావామొనర్చి ఉభయతారకము గావించుడు.
శుద. : మంచిదికానీ - ఎంచి అట్లేయొనరింతుము. (మం) అంచితముగ కుందవరపు - హరిదయయేకానిమ్ము (మం)
శు.వ. 2 బ్రాహ్మణోత్తమా! మోరనినట్లే అందరిని విచారించి ఆ లగ్నమునకే వివాహమొనర్చుటక్రై ఏర్పాటొనర్చెదము. ఆ చిత్రపటము నిమ్ము (అని పటముతిీసికొని వెల్లిపోవును).
యు.వ : ఇప్పటి వరకు నా పన్నుగడ నిర్విఘ్నముగా. జరుగుచున్నది. ఇక వత్సరాజు కుల గురువు వేషముతో వెళ్లి అతనిని పెల్లికిబప్పించి ఈ పెళ్లి నిర్విఘ్నముగా జరుగునట్టు చూచెదను. యిపుడు లావాణకమునకు వెళ్లెదను (వెళ్లును)
మగధ అంతవురములా
(భానుమతి, లక్ష్మి (వాసవదత్త) మల్లిక ప్రవేశింతురు)
భావ. : అక్కా! లక్ష్మీదేవి! వనవిహారముచేసివత్తమా
వావ. : రాకుమారీ! ఇపుడునేనెచటికి రాలేనమ్మా! నామనస్సెందులకో ఆందోళన కలిగియున్నది.
భావ. : మోరెప్పుడు ఏదో కోలుపోయినట్టుందురు. కారణమడిగిన ఏమియు లేదందురు.
60
వంగా నర్జ్ణయ్య (ఇంతలో ఒక, చేటి వత్సరాజు చిత్రపటముతో ప్రవేశించును) విర.వ. : రాకుమారీ! శుభవార్త. (అని పటమును ప్రదర్శించును) భా.వ. : ఏమిటే చతురికా! విరవ : ఇదుగో (అని పటమును భానుమతికందించును. ఆమె చిరునగవుతో పరిశీలించుచుండును). దరువు - వాదము వా.ద. : ఏమిటే భామా - అ పటములోని పూరుషుండెవ్వడెలేమా? ధీమహితుడు ఆ తడుబహుం రూపసిలాగున్నాడె (ఏమి) భా.వ. : ఎవ్వరీతడూ -ఈ పటమునగల పురుషశ్రేష్టుడెన్నగనేడూ నవ్వుమోముతోడహృదయ మాకర్షించుచునుండె (ఎవ్వ) చతు.ద : వత్సరాజమ్మా - వత్సదేశమేలేడు ధీవరుడే కొమ్మా మత్స్యకంటినువుకోరిన - వత్సరాజితడె సుమ్మా (వత్స) వ. : రాజకుమారీ! నీవు పూర్వమే వత్సరాజును వివాహము చేసుకుందునని కోరితివో అతడే తిరిగినీకడకు వచ్చినాడు. వాద : అన్యాయంబమ్మా- అతడిప్పట్లో పెళ్తాడుట అధర్మంబమ్మా కాయమెస్థిర మనుకొనియెడు మాయపురుషులీ రాజులు. (అన్యా) భా.ద : కారణమేమో? మోరనెడుమాటలోని నిగూఢార్థంబేమా? మోరాతని నెరుగుదురా ఈరీతిగ బాధపడగ (కారణ) వాద : మొన్ననేగాదా - వాసవదత్తాచిచ్చునబడి మన్నైపోదా ఉన్నపళంబునదుఃఖముడిగియెట్లు పెళ్లాడును (మొన్న) వావ ' వేరేకారణమేమి లేదు రాకుమారీ! పురుషులెంత దయాహీనులో కాంచుము. అతనినే సర్వస్వమని నమ్మి తలిదండ్రులను విడచి వెంటవచ్చిన వాసవదత్త అగ్నిలోబూదియై నెలనాళ్లుకాలేదు. అపుడే తిరిగి పెళ్లిప్రయత్సములు చేయుచున్నాడు. 61
స్వపష్టవాసవదత్త భాద :నా కోరిక తీరే - నా కోరిన పతి దొరుకుట నవకోరికలూరే ధీరచిత్తుడాతడు సుగుణ - తేజవరుండో కాడో (నా కో) భావ. : అవా! నేనుకోరుకున్న వురుషుని భగవంతుడు నాకు వతిగా కూర్చుచున్నాడు. కాని అతని రూపమునకు తగిన సుగుణరాశి యగునోకాదో? వా.ద. : గుణవంతుండు - సుగుణముల రాశియతడు. (గుణ) నారీమణి ఆతడునగధీరుడు - సువిచారుండు (గుణ) భా.ద. : నీకేమెరుకా - నీవాతని నిదివరకెరుగుదువా వోఅక్కా నాకాశ్చర్యము గొలిపెడు నీవాకృద్ధతిగాంచిన (నీకే) భావ. : అక్కా! నీవు అతనిని ఎరుగుదువా? వాద : గుణవంతుండు - ఘనరూపుడగుటచే వాసవి (గుణ) తనతలిదండ్షల విడచి -చనియెను ఆతనివెంటా (గుణ) వావ : రాకుమారీ! మాకు ప్రతి మాటసందేహము కలిగించుచున్నదే. అతడు రూపగుణవిలాసంబులు కలిగి యుండనిచో వాస్తవదత్త తన తలిదండ్రుల విడచి అతనితో వెళ్లునా? చద. :ఓ రాజకువూరీ! మో అన్నగారితో తెలుపనా నమ్మతి కోరి, ధరణినిశ్రీకుందవరపు ధాముండగు హరిగలడు. (ఓ) వివ : రాజకుమార్! నేవెళ్ళి మో అన్నగారితో మికు సమ్మతియేనని తెలుపమందురా? వావ : (వెనుకకు తిరిగికంటితడి తుడుచుకుని) చెప్పిరావే చతురికా. రాజకుమారి కోరుకున్న వరుడే కావున సమ్మతించినట్లుగా తెలుపుము, (భావ. : (సిగ్గుతో) పోవె అక్కా. (అందరు వెళ్లుదురు) “62
వంగా నర్ణయ్య శూరసేనుని ప్రవేశం దరువ)
శూ.ద. : ధీరవరుండన పేరొందితినే శూరసేనుడను రాజునురా. చారు విలాసగుణంబులలోనే పేరుగాంచిన వాడనురా. (ధీర) చంద్రవంశమున చంద్రసేనునకు సుందరిరాణికి పుత్రుడరా ఇంద్రవైభవంబులలో దులదూగిడి - మందరగిరిధరు భక్తుడరా (ధీర) చిన్ననాట తలిదండ్రుల గొల్సొాయి - మనుచుంటిని నే మగధదేశమున అనవరతంబే లోపములేకా-మునుకొని నడచెడిధీమంతుడరా (ధీర) కుందవరంబున నెలకొను హరికి - పొందుగభక్తుండనువినరా ముందుగనృసింహకవివరునేలిన మాధవ నినునేమరువనురా'..
వ. ; నేను శూరసేనుడను రాజకుమారుడను. నా చిన్న తన మందే నాతలిదండ్రులు గతించుటచే మేనమామరాజ్యమగు మగధ రాజగృహంబున పెరిగితిని. నామేన మరదలగు భానుమతిని నాకిచ్చి వివాహము గావింతురని ఆశించియున్నాను. కాని యిపుడు వత్సరాజుకిచ్చి పెళ్లిచేతురని తెలిసినది.
సేవ. : అయితే తమరేమి చేయతలచుకున్నార్ మహారాజ్.
శూ.వ. : భానుమతినే స్వయముగా అడిగి నన్ను పెళ్లాడమని కోరుట కై వచ్చితిని. ప్రన్తుతము ఆమె పూదోట యందున్నదని తెలిసినది. (విరచిక చిత్రపటముతో ప్రవేశము)
శూ,వ.. : చతురికా! ఓ చతురికా. భానుమతి ఎక్కడే?
చవ : పూదోట యందున్నది మహారాజా.
శూవ : ఆ చిత్రపటమెవరిదే?
చవ : వత్సరాజు చిత్రపటమండీ.
శూ,వ : రాకుమారి యిష్టపడినదా?
చ.వ. : రాజకుమారి కోరుకున్న వరుడేకదా.
శూ.వ.. : మరినాగతి?
చప. : అధోగతి. (అని నవ్వుచు వెడలిపోవును)
63
నస్వష్టవాసవదత్త శూ.వ. : హతవిధీ! నేను దాసికి గూడాకొరగాని వాడినైనాను. మొదట వత్సరాజును కోరిన పిదప ఆతడు వాసవదత్తను పెళ్లిచేసికొనినాడని తెలిసి నన్నుపెళ్లాడు ననుకున్నాను. కాని ఇంతలో వాసవదత్త మరణించినదని తెలిసిన పిదప తిరిగి వత్సరాజునే పెళ్ళాడుదునని సిద్ధమైనది. వాసవదత్త ఇపుడే మరణించాలా? నాకు భానుమతితో పెళ్లైన పిదప మరణించగూడదా! నేడే ఆమె ఉద్దేశమును స్పష్టముగా తెలిసికొందును. (ముందునకు నడచి ఆలోచన అభినయించి) భానుమతితో పాటు లక్ష్మియను ఒక బ్రాహ్మణస్రీ యున్నది. ఆమె నిజముగా లక్ష్మియే. ఆ అపురూప సౌందర్యము ముందు భానువముతి వెలవెలపోవును. భానుమతి నన్నుపెళ్లాడని పక్షమున ఆమెనైనా స్వాధీనపరచుకుందును. కాని ఆమె పురుషుల ఎదుటికి రాదు. కనిపించినచో ముఖము చాటుచేయును. కనీసం కన్నెత్తిచూడదు. ప్రయత్నించాలి. (ఏదో ఆలోచించుచూ వెళ్లును) (వాసవదత్త విచారముగా ప్రవేశించును) వా.వ_ : సర్వేశ్వరా! నీవు నన్నెట్టి విషమ పరీక్షలకు లోను చేసితివయ్యా. నేను నీకే మపరాధము చేసితిని? దరువు వా.ద. : ఎందుకయా ఈ విషమపరీక్ష - మందరగిరి ధర మాధవశౌరి పొందుగ కష్టపరంపరలోనను - బంధించుట ఫలమేమి తండ్రి (ఎం) నా పతిక్షేమముకోరినేనిటు - ఆపదలకు తలయొగ్గితిదేవా శ్రీపతి నీవేనాకిక దిక్కు- నీ పదములు ధ్యానించెద దేవా (ఎం) నాపతికిపుడు మళ్లీపెళ్లి - నా చేతులతో చేయింతువ దేవా రేపటిగతి నాకింకే ముందో - శ్రీపతి నిన్నేనమ్మితి దేవా (ఎం) ధరణిని కుందవరంబున నెలకొను - పురాణపురుషా! కాపాడుమురా. కరమరుదుగ నరసింహునేలిన - పరమాత్మానిను నమ్మితిరా (ఎం) వా.వ._ : (చేతిలెత్తి శూన్యంలోకినమస్కరించి) నన్నీ కష్టములనుండి కాపాడుము. (ఇంతలో శూరసేనుడు ప్రవేశించును) 64
వంగా నర్ణయ్య
శూ.వ. : ఎందులకు లక్ష్మీ దుఃఖించు చుంటివి?
వా.వ.. . (వెనకకు తిరిగి కళ్గ్లుతుడుచుకుని) ఏమీలేదు రాకుమారా! మా అన్నయ్య నన్నిక్కడ విడచి వెళ్లిఇంతవరకు రాలేదు. నాకదే విచారముగా యున్నది. (వెళ్లబోవును)
శూ.వ. : (అడ్డగించి) విచారమెందులకు? నీకే సహాయము అవసరమయినను నాతో తెలుపుము, నెరవేర్చేదను. నీ కొరకు నా ప్రాణమయినా అర్పించగలను.
వా.వ. : ధన్యవాదములు. నాకు దారి వదలండి.
శూ,వ. : (నవ్వి) ఎందుకు అంతకోపము. కోపము నీ ముఖమునకు అందమునే ఇచ్చుచున్నది. నాతో మాటాడుటకు సందేహమేల?
వాదము - దరువు
వాద : చాల్చాల్పోపో మాటలాడకు వాచాలత్వము చూపకిటా నీచగుణంబుల కాశ్రయమిచ్చిడి -యోచనఇచ్చట చెల్లదికా (చాల్)
శూ.ద.. : కోపమేలనే మిఠారి మదనుని - తూపులకెట్లు తాళుదును ఓపడతిరో నను చేపట్టినచో - పట్టపురాణివవుదువికా (కో)
వా.ద, : పాపకూపమున పడిపోయెదవు - పరస్త్రీ కోరుట పొరపాటు శ్రీపతి భక్తుల బాధలుపెట్టిన - నీపతనమునకె దారిసుమా (పా)
శూద. : నీపతిపైనే భక్తియుంచుకుని - ఈ పషగిదిని కష్టాల్పదనేలా ఓపడతిరొ నను పెళ్లియాడిన - పదదాసుడనైమెలగెదను నీ.
వా.ద. : హరిహరి ఎంతటిమూఢచిత్తుడవు - పరస్త్రీ నన్నా చెవిబడద కరుణ జూపి నీ దారి జూచుకో - కాదుకూడదని ఇటురాబోకు
శూ.వ. : ధరణిని కుందవరంబున నెలకొను - హరితోడే ఇకచూడగదే త్వరలోనను సెళ్లాడనిచో - చెరబట్టకనే విడువనుభామా (ధ) (ఇంతలో భానువుతి వ్రవేశించును.శూరసేనుడు వానవదత్తకు యెొడమగును)
65
స్వపష్టవోఎవదత్త
భా.వ._ : ఏమిటేఅక్కా! వాదులాడు కొనుచున్నారు! మా బావ వట్టి పిచ్చివాడు నిన్నే మయినా అనలేదు కదా?
వావ. : పరచోట వుండుటే పారపాటు( కళ్ళుతుడుచుకొనును)
భావ. : లక్ష్మిగారిని ఏమన్నావు బావా? ఆమె కులీనులబిడ్డ. నీవెమైనా అంటివా కళ్లుపోగలవు.
శూ.వ. : అబ్బే! ఏమనలేదే భానుమతి ఎక్కడమ్మా ? అని అడిగాను అంతే, ఏడుపు ప్రారంభించినది.
భావ. : మంచిది బావగారూ, భానుమతితో ఏమిపని?
శూవ. : మరి, నీవు, నీవు
భావ. : ఆం నేను, నేను?
శూవ. ; నన్ను పెళల్లిచేసుకొనవా?
భావ... : నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎపుడైనా అన్నానా?
శూవ.. : అనలేదా?
భావ. :అన లేదే.
శూర. ;ఆ వత్సరాజు నా కన్నా ఏ విషయమందు గొప్పవాడు. అతనికి రాజ్యంలేదు. నాకూ లేదు. నేను శూరసేనుడను తెల్సా!
భావ. ; తప్పుబావా. కాబోవు నాభర్తను అలా అనగూడదు. నీ శూరత్వం ఎంతటిదో నాకు నీ చిన్ననాటినుండి తెలుసు కదా.
శూవ. అగుచో నన్ను పెళ్ళాడవా?
భావ. : ఇక ముందిట్టి ప్రస్తావన నాతో తేవలదు. అంతేకాదు నా అంతః పురమునకు రావలదు. అట్టు వచ్చినచో అన్నయ్యతో తెలిపెదను, జాగ్రత్త,
శూ.ర. : చూస్తాగా (కోపముగా వెళ్లిపోవును)
భా.వ.. : (నవ్వుచు) చూచితివా అక్కా. మా బావ వట్టి అమాయకుడు, నీవాత్రని మాటలు పట్టించుకోవలదు (వెళ్లిపోవుదురు)
66
వంగా నర్జ్ణయ్య లావాణకత్ గ్రామమున (వత్సరాజు విచారముగా ప్రవేశించును)
వ.వ. : అయ్యో వాసవ దత్తా! ఎంత అన్యాయము చేసిపోయితివి. నీవులేని ఈ వత్సరాజు జీవన్కృతుడే కదా. నీవా అగ్నిలో కాలుచు నా కొరకై ఎంతబాధపడితివో కదా. నీవు కోరినపుడు నాతో పాటు వేటకు కొనిపోయిన నీకీ హానిరాకపోయెడిదికదా. నన్నే సర్వస్వమని నమ్మి వచ్చిన నిన్ను అగ్నిపాలుచేసితినికదా. మో తలిదండ్రులు నినుగూర్చి అడిగిన వారికేమి సమాధానమోయగలను (దుఃఖించుచుండును) (సంజయుడు భానుమతి చిత్రపటముతో ప్రవేశము)
సం.:వ : వందనములు - మహారాజా!
వ.వ. : (కళ్లుతుడుచుకుని) రమ్ము సంజయా! విశేషములేవైన గలవా?
సం.:వ : లేకేమి ప్రభూ! మోరు చింతానిమగ్నులగుటచే మోకిది నివేదించుటకు విచారముగా నున్నది.
దరువు - వాదము
సం.:వ : చింత అదేలా - మోస్వాంతంబున ధీరగొనుడి పంతముతో శత్రులుమన - ప్రాణముగొన నున్నారు (చిం)
వ.ద. : చావేమేలూ - నా సహచరులు లేని భువిలో (చా) నావారె లేనపుడు - నేనెందుకు ఈ భువిలో (చా)
సంత : పగతురద్రుంచా-నగధీరా యోచించితిమి (ప) మగధ రాజ్యస్నేహముతో - అగచాట్లన్నియుబాయు (పగ)
వ.ద. : మోరేపొండి - నాకెవరితో సఖ్యంబువలదు (మి) కోరి కష్టములలోతల దూర్చను నేనిప్పట్టున (మో)
సం.ద : చిత్రముగనుడీ మగధరాజపుత్రికదీ, (చిత్ర) శాత్రవులను ద్రుంచుటకీ - చేడియను పెళ్లాడుము (చిత్ర)
వద : హరి హరివలదు - మరి యెొవ్వరిని పెళ్లాడను (హరి) ఇరవుగ వాసవదత్త - సర్వస్వంబె నాకు (హరి) 6/7
స్వస్షవాసవదత్త
సం.:ద : కాదనవలదు - శుభలగ్నమునకు ఏర్పాటు గావించితిమి (కా) కాదనకుడి మా మాట - లేదు వేరెదారిమనకు (కా) (సేవకుని ప్రవేశము)
సే.వ. : దండములు మహారాజా! తమకుల గురువులు దర్శనము కోరుచున్నారు.
వవ. : అటులనా? వెంటనే ప్రవేశపెట్టుము. (సేవకుడు వెళ్లి సాధు వేషముతో యున్న యుగంధరునితో ప్రవేశించును)
వవ. : ప్రణామములు గురుదేవా. (నమస్కరించును).
యు.వ : కళ్యాణప్రాప్తిరస్తు. వత్సా! వత్సమహారాజా! నేను నిన్ను చిన్ననాట చూచియుంటిని. మో తండ్రి గతించినప్పటి నుండి నేనిచటికి రాలేదు. హిమాలయములలో తపస్సు చేయుచుంటిని. నీవు ఆపదలలో యున్నావని తెలసి నత్వరముగా వచ్చినాను. నీకుడి భుజన్ర్షగు యుగంధరుడు నీ ప్రాణప్రియ వాసవదత్త అగ్నికాహుతి అయినారట. నీవు ఆపదలపాలుకాకుండా కాపాడవలయునని వచ్చియున్నాన్సు,
వ.ప. : (పరిశీలనగా చూచుచు) నా సర్వస్వము శూన్యమైనది గురుదేవా.
యు.వ. : విచారించకు వత్సరాజా! నీ జాతకము నామూలాగ్రముగా పరిశీలించిత్రిని. వచ్చే శుద్ధ దశిమితో దుష్టగ్రహములు తొలగిపోవును. ఇక్ర నీకంతా మంచియే జరుగగలదు.
సవ. : అందులకే గురుదేవా. మగధ రాజకుమార్తెతో వివాహమునకు ఏర్పాట్లు చేసినాము. వారి బాంధవ్యముతో, వారిసేనా సహాయము పాంది శత్రువులను సులభముగా జయింపవచ్చును. ఎంత చెప్పినను వినుటలేదు.
యు.వ. : వత్సరాజా! నీ జాతకమున ద్వితీయ కళత్రముకూడా కలదు. పెగా రాజులెందరినైనా నిరభ్యంతరముగా పెళ్లాడవచ్చును. అభ్యంతర పెట్టవలదు. నేను వెంటవుండి విజయము చేకూర్చిన పిదపవెళ్లెదను. కాదనవలదు.
వ.వ. . : గృర్పుదేవా! మోకెదురు చెప్పజాలను. కాని నాకు ద్వితీయ వివాహముపై మక్కువలేదు, రాజ్యము తిరిగి రాబట్టుటక్రై మా ఆజ్ఞను శిరసావహించెదను.
యువ : సంతోషము వత్సరాజా! సంతోషము. (సంజయునితో) మహామంత్రి! లగ్నమెపుడు నిర్ణయించితిరి?
68
వంగా నర్ణయ్య
సం.వ. : రేపు వచ్చే శుద్ధదశమి గురుదేవా. (యుగంధరుడు వేళ్లపై లెక్కించి ఆలోచనను అభినయించి)
యు.వ. : చాలా చక్కని ముహూర్తమేర్చరచినారు. ఇది వత్సరాజునకు విజయకరమైన లగ్నము.
సం.:వ. : ఈ దినవే ప్రయాణమునకేర్పాట్టోనర్తుము. మహరాజా! మీరు విచారముడిగి సిద్ధముగా నుండుడు! గురుదేవా మోరుకూడా మావెంట తప్పక దయచేసి మహరాజును ఆశీర్వదింపవలయును. తమ విడిదికై తగిన ఏర్పాటుగావింతును. వత్సరాజు విచారము దూరమగునట్లు వారికి తగు మాటలు చెప్పుడు.
యు.వ. : అవశ్యము (అందరు వెల్లిపోవుదురు)
జ్జ ల్హీం లర్హం మగధ అంతంవురము (భానుమతి, విరచిక, వాసవదత్త ప్రవేశింతురు)
విరవ : నేటి నుండి రాజకుమారి మననుండి వెళ్లిపోవునని విచారముగా వుంది.
భావ : అక్కా! లక్ష్మీదేవీ! ఈ దినము నా వెంట వుండి నా లగ్నం కళ్లారా చూచి నన్నాశీర్వదింపవలెనమ్మా
వా.వ. : నేను పదుగురిలోనికి రాలేనుకదా.
విరవ : ఈమెగారు నీ పెళ్లి నిశ్చయమైన దినము నుండి విచారముగా నున్నారు రాజకుమార్.
భావ. :బెనా అక్కా! నేను మోనుండి దూరమగుదునని విచారించవలదు. నిన్ను నావె ' తీసుకువెళ్లి మోకక్కడ తగు ఏర్పాట్లు గావించెదను. విచారము వలది.
వా.వ.. : మా అన్నయ్య తొందరగా వత్తునని వెళ్లి ఇంతవరకు తిరిగి రాకపోయె.
భా.వ. : తొందరలోనే రావచ్చును విచారమువలదమ్మా, (చతురిక ప్రవేశించి)
చవ... : రాకుమారీ! పెళ్లికుమారుడు తరలివచ్చినాడు. నిన్ను పెళ్లి కూతురు
69
స్వష్షవాసవదత్త చేయమని మహారాజుగారు ఆజ్ఞాపించినారు. విచ్చేయండి. భావ. : అక్కా! వెళ్ళుదము రండి. వా.వ. : నేను పదుగురిలోకి ఎలా వచ్చేది రాకుమారీ. నీ కోర్కెతీర్చుటకు వచ్చెదను. కాని నిండు ముసుగుతో వచ్చెదను. అదినీకు ఇష్టమగుచో. భావ. :మంచిది. మో యిష్టము వచ్చినట్లేకానిండు. (విరచిక భానుమతి వెళ్ళుచుందురు) చ.వ. : అమ్మా! మా కొక లేఖ (అని యిచ్చివెడలిపోవును) వావ. : (లేఖను విప్పి బిగ్గరగా చదువును) ప్రియాతి ప్రియమైన లక్ష్మిదేవి! ఈ దినము శుభలగ్నమున భానుమతితోపాటు మనము కూడా గాంధర్వవిధిని పెళ్ళాడుదాము. నీకొరకై నేను పూదోటలో ఎదురు చూచెదను. నీవు దీనిని తృణీకరించితివా తరువాత పశ్చాత్తాప పడుదువు. ఇట్లు నీ ప్రేమాభిలాషి శూరసేనరాజు వా.వ.. : భీ- నీచుడా (లేఖను చింపి ప్రారవైచి వెళ్లిపోవును) (బ్రాహ్మణుని ప్రవశము) బావ :; శుభదత్త మహారాజు తన చెల్లెలగు భానుమతీదేవి వివాహ మొనర్చుటకు బ్రాహ్మణుల నాహ్వానించినారు. మావారందరు ముందే వచ్చినట్టున్నారు. తెరలోనికి తొంగిచూచి అదిగో అచట లగ్నము జరుగుచున్నట్టున్నది. నేను గూడ వెళ్లి వారితో కలువనిచో నా సంభావన తప్పింతురు. (వెళ్లును) (వాసవదత్త, సన్యాసివేషముతో యుగంధరుడు ప్రవేశం) యు.వ. : కుశలమేనా తల్లీ? వావ. : ఇట కష్టాలలో కృంగికృశించున్నాను. యువ. : నీ క్రష్టఫలితము చేరువలోకి వచ్చినదమ్మా దరువు - వాదము వాద : ఉండలేనిటా- మెండగు కష్టాల బడి (ఉం) అండ ఎవరులేకనేను - గుండెదిటవుతోడ ఇక (ఉం) 70
వంగా నడ్ద్ణయ్య
యు.ద. : తొందర వలదు - ఓ మందయాన ఇప్పట్లో (తాం) తొందరగా పతిని చేరు -కుందువు ఈ వారములో
వా.ద_ : పతినెడబాసి - ఆపతికింకొక పెళ్లిటు నా చేతనే చేసి వెతలలో బడి కుందుచుంటి - సుతరామిట నిలువలేను (ఉం)
యు.ద. : కర్తవ్యంబే అదినీచేగావింపదగిన కర్తవ్యంబే
యు.వ. : భర్తకొరకు నీ త్యాగము - వ్యర్థముగా బోదుతల్లీ
వాద : శూరసేనుడూ - కోరిటననుబాధించుచుండె (శూ) వారకాంతలట్టుగనను - ధూర్తుడు వెంటాడుచుండె (ఉం)
వావ : ఇచట శూరసేనుడు భానుమతి మేనబావ యొకడు కలడు. వాడు నన్నెపుడు పెళ్లాడుమని బాధించు చున్నాడు. వానితో వేగలేక ప్రాణత్యాగమొనర్చుస్థితి కలుగుతొంది. లేదా నన్నీరోజే మోవెంట తీసుకుపాొండు.
యు.ద. : అంత మోనమా-చింతించకు రేపుదయమే పయనింతము తల్లీ కాంతామణి నిరర్భ్యయముగ - గడపుము ఈ రాత్రియంత.
వా.ద._. : తప్పకుమన్నారేపు ఉదయము వెళ్లకయున్న ప్రాణం సున్నా. ఒప్పుగ శ్రీకుందవరపు - హరిదయతో గడుపుదునిశి (ఉం)
వా.వ : అన్నయ్యా! రేపు వెళ్లనితీరుకు మిరు నాశవమునే తీసుకువెళ్ల వలసివచ్చును.
యు.వ. : అట్లు జరుగదు తల్లి! (వెళ్లిపోవును).
వా.వ. : సర్వేశ్వరా! నన్ను కష్టములనుండి గట్టెక్కించుము తండ్రీ. (శూన్యంలోకి నమస్కరించును) (వాసవదత్త వెనుకగా శూరసేనుని ప్రవేశం)
శూ.వ : బెరా! నేను పంపిన లేఖను లెక్కించక నిర్భయముగా మసలుచున్నది (తనలో) ఈమె ఎవరో రహస్యస్ర్రీవలె యున్నది. ఇంతవరకెవరో సన్యాసితో
వృటించి రేపు ఉదయమే వెళుదామనుచున్నది. (గట్టిగాదగ్గును).
వా.వ. _ (ఉలికిపడి వెనుకకు చూచి వెళ్లబోవును)
శూ.వ.. : (వాసవదత్తను అడ్డగించి) లక్ష్మీదేవీ! నీరహస్యము నేను కనిపెట్టితిని, నీవు కులీననని చెబుతూ సన్యాసులతో సరససల్తాపములాడుటనేను చూచితిని. నాబోటి సరసుల కన్నెత్తి చూచిన పాపము వెంటనంటును చైనా?
71
స్వష్షవాసవదత్త వావ : హరి! హరి! ఎంతనీచమైన మాట. శూ.వ. : లక్ష్మీదేవి! నీ అందము నన్ను పిచ్చివాణ్ణీచేయుచున్నది. నన్ను పెళ్లాడి ఈ రహస్య జీవితమునకు స్వస్తి చెప్పుము. వా.వ. : భీ నీచుడా. నేను కులప్టీని. నన్ను పెళ్ళాడుదు నను మాటనీకు భావ్యము కాదు. నన్ను నీ చెల్లిగా భావించి కరుణించుము. హూ.వ.. : నీవెన్ని మాయదారి మాటలు చెప్పినను నేను నమ్మను. నీకు ఈ పగలు సమయ మిచ్చుచున్నాను. నీవు నాదారికి వచ్చితివా నరే. లేదా బలవంతముగా పెళ్లాడి తీరుదును. నిన్నుకాపాడటకు ఇటువంటి సన్యాసులెందరు వత్తురో చూస్తాను. (వెళ్లిపోవును) వావ : అయ్యో ఈశ్వరా. ఈ ఆపదనెట్టు దాటింతువో (వెళ్లును) (వత్సరాజు, శుభదత్తుడు, (మారువేషముతో యుగంధరుడు ప్రవేశింతురు) యు.వ : మహారాజా శుభదత్తా. ఈ రాత్రి సైన్యముతో దాడివెడలుటక్తు ముహూర్తము నిర్ణయింపబడినది. కావున నీవు మరియు వత్సరాజు సైన్యము తీసుకుని యుద్ధమునకు వెళ్లవలయును వేకువనేకదలవలెను, వవ. :బెను శుభదత్త మహారాజా! గురుదేవుల మాట అవశ్యము ఆచరింపదగినది. శు.వ. : మంచిది. అట్లే సేనను కదిలళింతము. నేనింత వంకే సేనాధిపతులకు ఆదేశాలిచ్చియున్నాను. బావా! వత్ససేనమహారాజా! సైన్యమును నీ అధీన మందుంచుకొని ఆగక్రమించుము. మో ప్రాంతపు ఆనుపానులన్నియు నీకు తెలియును. నేను మిమ్మనుసరించెదను. (వెళ్లిపావుదురు) ల్సి ల (శూరసేనుడు ప్రవశము) శూ.వ.. : భానుమతికి తలనొప్పిగా యుండుటచే శ రాత్రి సముద్ర గృహంబున పడక ఏర్పాట్టుగావించినారు. భానుమతి అస్వస్థతగా యుండుటచే లక్ష్మి ఆమె వెంట తప్పకరాగలదు. ఇచట ఒక దాసి కూడా యుండకుండా లంచములిచ్చి పంపివేసితిని. లక్ష్మి ఇక నావంట ఇంటి కుందేలు. నేనీ 72
వంగా నర్దయ్య పాదమాటునదాగి యుండెదను. వత్సరాజు రాగనే లక్ష్మి బయటకు రాగలదు. అపుడు చెరబట్టి నా కోర్కె తీర్చుకుందును. (అని ఒక పాదమాటున దాగి యుండును) (సముద్ర గృహము మంచముపై పడకవేసి యుండును) (వాన్వదత్తి మరియు భానుమతి వ్రవశింతురు) భావ : అక్కా! ఇచట ఒక దాసియైనను లేదు, తిరిగి కోటలోనికి నీవు వంటరిగా ఎలా వెళ్లగలవు? వావ : నిజమే. ఈ దాసీలందరు ఎటువెళ్లినట్టు? నేను తోడుగా రానిది నీవిచటికి రానని మంకుపట్టుతోనన్నిటుతెచ్చితివి. భా.వ : అదికాదక్కా వత్సమహారాజు మరియు మా అన్నగారు యుద్ధ విషయము చర్చించుటకై నమావేశమొనర్చినారట. ప్రభువులు వచ్చు వరకు ఆలస్యము కావచ్చును. నేనొంటరిగా యుండలేక నిన్ను రమ్మని కోరితిని. వావ ' మంచిది. రాత్రి చాలగడిచినట్టున్నది. నిద్రించుము. (భానుమతి మంచముపై పడుకొనును. వాసవదత్త మంచము వద్ద నిలచి యుండును. ఇంతలో వత్సరాజు ప్రవేశించుటగాంచి వాసవదత్త ప్రక్కకు తప్పుకొనును) వ.వ. : ప్రయా భానుమతి. (భానుమతి పలుకదు) ఓహో అపుడే నిద్రించినట్టున్నదే. శిరోవేదనతో అలసినట్లున్నది. (అని మంచముపై భానుమతి ప్రక్కగా పడుకొనును) (వాసవదత్త నిద్రించిన తన పతిని గాంచి దుఃఖముతో) వా.గీ : (తనలో) గీ ఎంత అన్యాయ మాయె నాజీవితంబు భర్తపడకకు ఇంకొక పడతి దెచ్చి దాసివతె సేవచేయుచు దాగి తిరిగి యుండజేసితి వీశ్వరా యొప్పునయ్య. వావ :వీరు నిద్రించినారు. నేనిక్కడ యుండదగదు. నేను వంటరిగా ఎట్టుకోటలోనికి వెళ్లగలను. లేనిచో నా భర్త కంటబడిన ఇంత కాలము నుండి నేనుపడిన ప్రయాస వ్యర్థమగును. వెళ్లినచో శూరసేనుని నుండి ఆపద కలుగునేమోయను భయము వెంటాడుచున్నది. భగవంతుడా 73
స్వపష్షవాసవదత్త నేనేమి చేయుదును?
వ.వ... . (వత్సరాజు మగత నిద్రలోకలవరించును) ప్రియా! వాసవదత్త! నన్ను విడచిపోవుటకు నీ మనస్సెట్టోప్పెనే?
వావ : నిద్రలో కలవరించుచున్నట్టున్నది. (వినుట అభినయించి) ఆహా! నా భర్త ప్రేమకు ఇంతగా పాత్రురాలనై దూరముగా యుండవలసిన పరిస్థితి ఏర్పడినది. (కన్నులు తుడుచుకుని) కలలో గూడా నన్నేస్మరించు చున్నాడు. ఆహా! ఎంత ప్రేమ!
వ.వ : (నిద్రలో) వాసవదత్తా! శిష్యురాలా! నాపైనీకింత కోపము ఎందులకు వచ్చినది ప్రియా. నా పై దయలేదా? ఈ కోపము మానవా? రావా? నీ కౌగిలీయవా? నీకు కోపము లేదా?
వావ. : (తనస్థితిని మరచి) నీ పై నాకెట్టి కోపము లేదు ప్రభూ! నీశిష్యురాలు నీ వెంటనే వుంది. ఇదిగో నను నీ కౌగిలిలోనికి తీసికొనుము.
(అని దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొనును కాని వెంటనే స్కృతినభినయించి) ఎంత ప్రమాదము. (చేతులు విడచి పారిపోవును) వవ. : (తటాలునలేచి) వాసవదత్తా! వెళ్లిపోవలదు. వెళ్ళిపోవలదు. (నిద్రలో లేచి పట్టుకొనుటకై పరుగెత్తి పడిపోవును)
భా.వ.. : (నిద్రనుండి మేల్కాంచి) ప్రియా! ఏమది నిద్రలో పరుగెత్తుచుంటివా?
వవ. : (లేచినిలచి) ఏమిలేదు ప్రియా! నాకేదో పీడకల వచ్చినది. రమ్ములోనికి వెళ్లి నిద్రింతము. (వెళ్ళిపోవుదురు) (వాసవదత్త భయముగా అటుఇటు చూచుచు వెళ్లుచుండును శూరసేనుడు అకస్మాతుగా ఎదురుపడును)
శూ.ర.వ : ఇపుడెక్కడికి వెళ్లగలవు లక్ష్మీ?
వావ. : అదుగో! (అని అతని వెనుకకు చూపగనే శూరసేనుడు వెనుకకు మరలిచూచును. వాసవదత్త తప్పించుకొనుటకు పరుగెత్తును శూర సేనుడు వెంటాడును. కొంత పరుగెత్తి అడ్డము వచ్చును.)
వావ. : (రోజుచు) అయ్యో! పరమేశ్వరా ఎట్టి సంకట పరిస్థితి కల్పించివయ్యా!
దరువు - వాదము శూ.ర. : సంకటమని మది చింతించకునా - చెంతజేరగా రావెభామా. 74
వంగా నర్భయ్య పంకజాక్షిరా ననుచేపట్టినచో-నాక సుఖంబులదేలింతునునే (సం) వా.ద . చెల్లెలు లేదా- నీచెల్లుండ్రను బోలిన నే చెల్లెనుగానా చెల్లదు నీకీ చేతా - కాళ్లబడివేడుదాన (చె) శూ.వ. : చెల్లెలునని నీవెందుకందువే - చల్లని ప్రియురాలివిగావే అల్లరి చేయక ననుచేపట్టుము : చల్లని భావముతోనీవు (చె) వా.ద : వలదోయన్నా-పరస్రీల గోరి ఇహపరముల బాయకుమన్నా తలపరాదె రావణుండు - ధరణి పుత్రి గోరిచచ్చె (వల) శూ.ద : బ్రతుకెందుకె నినుబోలిన పడతితొ-రతిసాఖ్యంబుల దేలకనూ ఇతిహాసంబుల కథలెందుకే నీ పతిగా జీవించిన చాలు. వాద :నా ప్రాణముదీయీ - అభిమానమునీ చేజిక్కదు (ప్రా) హీనబుద్ద్ధినన్ను నీవు - అబలయని తలచితేమో (పా) శూద : ఏమిజేతువే ఇదుగోనిన్నూకోములాంగిరో పట్టుకొంటిని కాముని కేళిలో గూడి సుఖించెద - భామా అడ్డంబెవరింకా (ఏ) (శూరసేనుడు వానవదత్తను వట్టుకొనగా తప్పించుకుని అతని మొలలోయున్న బాకు లాగుకొని అతనిని పాడువ బోవును శూరసేనుడు వెనుకకు తగ్గును) వా.ద : ఏమిజేతునా? - ఒక అడుగు ముందు వేసిన ప్రాణంబుదీతును. కాముకుడా నన్ను నీవు - ఏమని భావించితివి (ఏ) వావ. : దుర్మార్గుడా! ఒక అడుగు ముందుకు వేసితివా ఈ బాకుతో నీ గుండెలు చీల్చుదును. లేదా నా గుండెలలో గ్రుచ్చుకుని ప్రాణంబు తీసుకుందును. శూద. . కత్తితో పొడిచెడి శక్తి యున్నదా! - కానీ చూతును నీ ధైర్యం బిత్తరి చూపుల వనితరొనక్క - జిత్తులు సాగవు నాముందు. (క) (అని వాసవదత్త కత్తి పట్టుకొనిన చేతిని వడిసి పట్టుకొని మెలిపెట్టును. బాకు క్రింద పడిపోవును. వాసవదత్తను రెండు చేతులతో పట్టుకుని దగ్గరకు లాగుకొనును. అవకాశము కల్గించుకుని వాసవదత్త శూరసేనుని చేతిని గట్టిగా కరచును. వాడు వాసవదత్తను వదలగనే ఆమె పారిపోవును. తెప్పరిల్లి ఇటు అటు చూచి లక్ష్మీదేవీయని పిలుచుచు అతడు వెదకు చుండును. వాసవదత్త అటనే ఒక పాదమాటున దాగి శూరసేనుడు వెళ్లిన పిదప ప్రవేశించును) 75
స్వష్షవాసవదత్త వా.వ : భగవంతుడా! నాకేమిగతి కల్పించితివయ్యా! దరువు వా.ద _ . ఎంతని వేడిన దయరాదేరా సంకట హరణా శ్రీరమణా పంతంబేల వహించి నన్నిట్లు ఇంతగ కష్టంబుల బడవేసితి (ఎం) భక్తుల నిట్టుల బాధల పెట్టుట భావ్యముగాదు ఓ దేవా భక్తుల పలువుర గాపాడితివని పాగడెడి సర్వ పురాణములు నిను (ఎం) ద్రౌపది మొరవిని వలువల నిచ్చి దయతో గావవె కౌరవసభలో ఆపగిదిని ననుగాపాడుమురా నీపద భక్తిని మరువని నన్ను (ఎం) గృహమున కేగిన పతిగనిపెట్టును ఏగకున్న నీచుడు చెరబట్టును నాగతి ఇక ఇంతేనా దేవా త్యాగబుద్ధికి ఫలితమిదేనా (ఎం) ఛీ యికనాయీ జీవితమెందుకు నీచుని చేతిలో జిక్కుటకు పాహిపాహి శ్రీహరి నను గాపుము గావకున్న నీ కడకేవచ్చెద. (ఎం) ధరణిని కుందవరంబున నెలకొను హరినాపై యిక దయరాదా? కరమరుదుగ నరసింహు నేలిన దురితహరావో వేంకటరమణా. (ఎం) : సీ! ఏలరా దయరాదు జాలి లేదా ప్రభో చాలించనా నాదు జన్మమింక 76
వంగా నర్దయ్య్మ భక్తుల పాలిట బాంధవుడని నిన్ను పొగడవే సర్వ పురాణములును పతి సౌఖ్యమును గోరి వెతల జెందుచునుండ ఈ పర్క్షలివేల ఈశనాకు పతిని దైవంబుగా భావించి తిరుగాడు నన్ను వెతల బెట్ట న్యాయమేన? గీ॥ _ ప్రాణముండగా వానిచేబడక ముందు వత్తు నీలోకమింకయో వరద ఇపుడు స్వార్ధత్యాగంబానర్చి నిస్వార్ధగతిన వెతలబడువారికేల ఈ గతి పరీక్ష వావ. : ఈ నీచుని కంటబడి పతితనై మరణించుటకన్న ముందె ప్రాణత్యాగ మొనర్హును. (అని తన కొంగుతో మెడకు ఉరిగా బిగించుకొనుచుండును. ఇంతలో ఒక సర్పము బుసకొట్టుచు ఆమె దిక్కుగా వచ్చి పడగ విప్పి తోకపైకిలేచి నాల్కలు చాచుచుండును) వావ : (ఉరిపెట్టుకొనుట ఆపివేసి సర్వమునకు దగ్గరగా వచ్చి) ఓ సర్పరాజమా! నీవైనా కరుణించి నా ప్రాణంబు హరించి నన్నీ నీచుని నుండి కాపాడుము. (అని సర్పమునకు దగ్గరగా చేయిచాచును. సర్పము వెనుకకు తగ్గుచుండును) వావ : అయ్యో! నేనెంత పాపాత్మురాలను. కనీసము నీకాటుకైనా నోచుకోలేదా. నాపై దయచూపి కాటువేయుము నర్చ్పరాజమా! (అని గట్టిగా అరచుచుండును) (ఇంతలో శూరసేనుడా ధ్వని విని వాసవదత్తచే కరవబడిన చేతిని చూచుకొనుచు ప్రవేశించును) శూువ : అల్లదుగో, లక్ష్మిదేవి! కరువుమనుచు కోరుచున్నది. వెళ్ళి రక్షించుకొందును (అని దగ్గరగా వచ్చును.) వావ ళీ దుర్మార్గుడా! నీవిక్కడికి గూడ దాపురించితివా? ఓ సర్పరాజమా తొందరగా కాటువేయుము. 77
స్వష్షవాసవదత్త శూవ. : వలదు లక్ష్మీ వలదు. నిన్ను చావనీయను (అని తన చేతి బాకుతో సర్పమును కొట్టబోగా అది అతనిపైబడి కాటువేయును. అమ్మాయని పెద్దగా అరచుచు శూరసేనుడు పడిపోవును) వావ ; అమ్మయ్య! (గట్టిగా నిశ్వసించి) భగవంతుడా! దరువు వాద : ననుకరుణించి కాపాడితివా నీచుని చెరలో నన్నిపుడు. ఓ కరుణాకర శ్రీధరా నీ కరుణ అపారమైనదిగా (నను) నాపతి కష్టములన్ దొలగించి నన్నాతనితో కూర్చుము దేవా నీపదదాసుల మరువకు తండ్రీ ఈ పగిదిని ననుగాపాడుమురా (నను) రేపుదయంబున నాపతి యింటికి నే పయనంబయ్యెదనోదేవా ఏ పగిదిని ననుగాపాడుదువో నాపతితో ననుగూర్చుట కొరకు (నను) ధరణిని కుందవరంబున నెలకొను హరి నిన్నే మదినమ్మితిరా కరుణాకర నరసింహునేలిన పురాణ పురుషా మరువనురా (నను) (సేవకుడు ప్రవేశించి) సేవ. : శభదత్తమహారాజ్, వత్సృమహారాజులకీ పిలుచుకురమ్మన్యార్.సమంతర్ ఇల్గుకాడ. ఉన్యార్ జల్లిసేపిల్వాలి. వావ. : (తనలో ఈ సేవకుడు వత్సరాజును పిలువబోవుచున్నాడు. నేను వెళ్లి భానుమతితో కలసియుందును. ఇప్పడు భానువుతి ఒంటరిగా 78
వంగా నర్గ్ణయ్య యుండును అని సేవకునికి కనిపించకుండా అనుసరించును). సే.వ.. : (తెరలోపలి దిక్కు మొగంబై) వత్సరాజు సర్కార్. యుద్ధంకేవాస్తే సైన్యము తయారుయింది. తమర్కు వెంటనే రావలసినదిగా శుభసేన మహారాజ్ రమ్మంటావున్యార్. వ.వ. : (కత్తిచేతిలో ధరించి ప్రవేశము) జెను నేను వెంటనే వచ్చుచుంటిని. ఓదేవాదిదేవా! గీ; రాజ్యరమతోడ నామనోరమణి బాసె ధైర్యమిచ్చెడి నా యుగంధరుడు పోయె. పోరు కేగెద నీ పైన భారముంచి విజయలక్ష్మిని చేకూర్చవేడుదీశ. (శేవకుడు, వత్సరాజు వెళ్లిపోవుదురు) వా.వ. : (తనలో) ఈ రాత్రి దండయాత్రకు ముహూర్త మేర్పరచియుండిరి. వెళ్లుచున్నట్టున్నది. నేను వెళ్లి భానుమతిని కలుసుకుందును. అటనున్న నాకే ఆపద రానేరదు. (వెళ్లిపోవును) ఆ గిం ఆక్ట (గురువు వేషముతో యుగంధరుడు, వత్సరాజు ప్రవేశం) యు.వ : వత్సరాజా వచ్చితివా. వెళ్లుము! సైన్యము సర్వసన్నద్ధముగా యున్నది. నీవు మాత్రమే పడమర దిక్కుగా వెళ్లి ఆక్రమించుము. శుభదత్తుడు ఉత్తరదిక్కు నాక్రమించును. నేను భానుమతిని వెంటతీసికొని మీవెనుకనే వచ్చెదను. (శుభదత్తుడు, సైనికులు ్రవేశింతురు) శుభదత్త మహారాజులకు జై (సైనికులు జై కొట్టుదురు). వత్సమహారాజులకు జై (సైనికులు జై కొట్టుదురు) శు,వ. బావగారు సిద్ధమేనా? వ.వ. : సిద్ధమే శుభదత్తా (గురువులతో) సెలవొసంగెదర్గా గురుదేవా? యు.వ. : విజయ ప్రాప్తిరస్తు వెళ్లుడు. (వెళ్లిపోవును) 79
స్వష్షవాసవదత్త దరువు సై.ని.ద : వత్సరాజు విజయంబునుగోరి - తుచ్చుడైన వీరసేనునణచగా కరిరథాశ్వములు కదలిటురాగా తరలితిమిపుడే దృఢప్రతిజ్ఞతో వీరసేనుని సైన్యము మించి నరికదము మే ముత్సాహించి వ.ద _ : సైనికులారా మగధనువిడచి చేరితిమి మన వత్సదేశము తూరుపు తెలతెలవారజొచ్చినది దారివిడచి 'ఫేడదారి బట్టుడు శత్రులకంతు ఛ్సిక్కకుండగా చొచ్చుకు స్తవలె హఠాత్తుగా వద. : అడకత్తెర వ్యూహంపుతో మనము ఆక్రమింతము శత్రుసైన్యమును శుభదత్తుండా దిక్కులనుండి గబగబ వచ్చుచునున్నాడదుగో సై.ద : శత్రుసైన్యము ఇంతవరకు మన చేరేడిత్రోవను కనుగొనలేదు కౌశాంబినిని చేరవచ్చితిమి కౌశలమును కనబరచుదమిపుడు వ.ద, ; సైనికులారా మనకోటదియె అనిసల్పుడు మోరతి శార్యంబున కోటబురుజుపై శత్రువులదుగో దీటుగ మన రాకను గనిపెట్టిరి బాణపరంపర పరపుడు మిరు ప్రాణభయంబులు లెక్కించకుడి సై.ద. ; వీరస్వర్గమో విజయముగొనుటో వీరసేనుని హతమొనర్చుటో 80
వంగా నర్జ్ణయ్య్మ వద _ : రహస్యమార్గంబుల గాయండీ ఆహవమున ముందడుగేయండి వీరసేనుడదె ప్రాణ భయమ్ముతాొ పారిపోవుచున్నాడదె పట్టుడు పట్టుడుపట్టుడు పరువెత్తండీ కట్టుడు వాని రెక్కలు విరచి, (ఇంతలో వీరసేనుడు కత్తిపట్టుకుని పరుగెత్తి వచ్చును. సైనికులు చుట్టుముట్టుదురు. వత్సరాజు ముందునకు వచ్చి)
వ.వ_ : ఓరీ! వీరసేనాధమా! ఆనాడు నన్నుమోసగించి, విజయలక్ష్మిని గాంచితివి, కాని ఇపుడు నాచే చిక్కితివి. నిన్నుగాపాడుటకు హరిహారాదులడ్డు వచ్చినా బ్రతుకవు.
వీవ : (కత్తిచూపుచు) గీ॥ పారిపోయిన నీచుడా పలుకబోకు సాహసమె యున్న నిలువుము సమరమందు నాడు విడచితి ప్రాణాలతోడ నిన్ను నేడు నిన్నని ద్రుంచినే నిదురబోదు.
(ఇద్దరు కత్తులతో పోరెదరు వీరసేనుడు పడిపోవును) వ.ద_ : కట్టుడు వాని రెక్కలు విరచి కట్టాయెంతటి దుర్మార్గుడురా ధరణికుందవర ధాముండగు హరి కరుణచె శత్రువు కడతేరెనుగా (అందరువెళ్లి పోవుదురు) సొస్తా సు తొశాంబిలో యుగంధరుడు గురువు వేషముతో ప్రవేశము) యు.వ. : (తనలో) ఇంత వరకు నా ప్రయత్నమన్ని విధముల సఫలమైనది. ఇక వాసవదత్తను వత్సరాజుతో చేర్చవలసియున్నది. నేను వెళ్లిపోవుచున్నట్లుగా 81
స్వష్టవాసవదత్త తెలిపి వత్సరాజు వద్ద సెలవు గైకొందును. వ.వ. : (ప్రవేశించి) గురుదేవా! ఎదో ఒంటరిగా యుండి యోజించుచున్నారు? దరువు - వాదము యు.ద : శత్రువులందరు నశించిపోయిరి వత్సానశాంతితో రాజ్యంబేలుము కర్తవ్యంబును మరచి మంత్రులకు - అప్పగించియుండకు మా రాజ్యం (శ) వద. :మి ఆశీర్వచనబలంబుచే నే మోదముతో రాజ్యముగైకొంటిని మోరీ విధముగ నాపై దయనిడి మాకడ యుండగ వేడెదను. (మీ) యు.ద. : వీలుపడదు నా తపస్సుచెడును వచ్చుచు వెళ్ళుచునుండెదను ఏ వేళా నీకవసరమైనా - వచ్చెదనినుగాపాడుటకై (వీ) వ.ద : యుగంధరుని మరపించెడి మాటలు నగధీరా మికడ గలవండీ (యు) అగచాట్లలొమిరెప్పుడు వచ్చి తగురీతిగ నను గాపాడండీ. యు.వ. : ధరణికుందవరధాముండగు హరి దయతో మనుము మహారాజా (ధ) కరమరుదుగ నరసింహునేలిన పరమాత్ముండే మననేలు యు.వ : వత్సరాజా! విచారింపకుము. నేనెచ్చట యున్నను. నీ హితము కాంక్షింతును. సెలవొసంగిన వెళ్లివత్తును. వవ. _ వందనములు గురుదేవా (నమస్కరించును) యు.వ. , చిరంజీవివై వైభముగా రాజ్యమేలుము. (యుగంధరుడు వెళ్ళును) 82
వ.వ : నేవెళ్లి రాచకార్యములు చూచుకొందును (వెళ్లిపోవును) (అంగారవతి, మవాసేనుల వ్రవళశము) మ.వ. : దేవీ! అంగారవతీ! వత్సరాజునకు నేను వచ్చుచుంటినను వార్తనంపితిని. అతడు మనల నాహ్వానించుటకై వచ్చియుండును. దరువు - వాదము అ.ద : అకస్మాత్తుగా వత్సదేశము రాకకు కారణమే మండి కకవికలయ్యెడు నామనసంతా సకలము తెైలియజెప్పండి. మ.ద : వాసవదత్తను తిరిగి యిపుడు వత్సరాజుతో జేర్చవలెన్ ఈ సమయంబునకే రమ్మని ఇటు యుగంధరుండు తెలిపెగదా మ.వ : యుగంధరుండు ఇన్నాళ్ల నుండి వాసవదత్తను మగధదేశంబున దాచి యుంచి, ఆమె అగ్నిలో మరణించినదను అపవాదు పుట్టించినది నీ వెరుగురువు గదా. ఇపుడు వాసవదత్తను వత్సరాజుతో కలిపి వెళ్లవలయును. అం.ద :' చచ్చిన వాసవదత్త బ్రతికి వచ్చెనన వత్సరాజెటు నమ్మునయా మచ్చిక గలుగునో లేదో ఆతనికి మునుపటి గ్రేమ చూపునొ లేదో? (చ) మ.ద. : అదిచేయును యుగంధరుడంతయు ౨బలావీడుము భయమంతా ఇదుగొ వత్సరాజుతో ఇప్పుడు ఏమి తెలియనట్టుండవలెన్. (అది) అం.ద. : మంచిది కుందవరంబున నెలకొను పంచశరుని తండ్రియె గలడు ఎంచగ వాసవదత్తను చూచెడి యోగంబైనా కలిగినది (మం) 83
స్వష్టవానవదత్త (వత్సరాజు సంజయునితో కలసివచ్చును. మహసేనుని గాంచి నమన్కరించి ఆలింగనము చేసికొనును. అంగారవతి కన్నులు తుడుచుకొనును) దరువు - వాదము మహం.ద: కుశలంబేనా - మోరిచటగలవారికెల్లకుశలంబేనా వాసవదత్తయె మమ్ముబాసిపోయి గాసిచేసె (కుశలం) వద : అన్యాయంబు - జేసితి మీకెంతో నేనపచారంబు కన్యను మియింటినుండి - గొని తెచ్చిగొంటియుసురు (అన్యా) వ.వ. : మహాసేనరాజా! మికు నేనుతీరని అపచారమెనర్చితిని వాసవదత్తను మీకు తెలుపకుండా కొనివచ్చి మిమ్ముల తిరిగి చూడకముందె అగ్నికాహుతి చేసితిని. మద. : చింతించకుమా. నీచింతమేము ఎరుగుదుము (చిం) ఎంతగ ఆమెను నీవు - స్వాంతమందు ్రేమింతువో మ.వ.. : వత్సరాజా! విచారింపకుము నా కూతునెంతగా నీవు గ్రేమింతువో మేమెరుగుదుము. (భానుమతి చతురికతో ప్రవేశము) వ.ద_. : పూజ్యులువీరు - వాసవదత్తనుగన్నవారు (పూ) పూజ్యభావముతో నీవు - పొందుగ నమస్కరించు వవ. : భానుమతీదేవి! వీరు వాసవదత్త తలిదండ్రులు నమస్కరించుము భాద : దండములండీ - మా బిడ్డను ననుదీవింపుడు (దం) ఖండితముగ మో కూతురు యుండదగిన చోటికొస్తి (దం) (అని ఉభయులకు నమస్కరించును) మద... : వత్సరాజా! గొనుమా _ వాసవదత్తా చిత్రపటము (వత్స) వత్సరాజా! ఈ పటము చూచి _ వాసవదత్తను మరువుము _ (వత్స) (వత్సరాజు చిత్రపటమును త్రీసికొన్సి చూచి కంటతడితుడుచుకొనును భానుమతి ఆ చిత్రపటమును అతని నుండి తీసుకొని చూచి ఆశ్చర్యముతో) 84
వంగా నర్దయ్య్మ భావ. : ఓ మహారాజా! ఈమెబోలుఉవిద యొకతె ఉన్నదిచ్చటా నామము లక్ష్మీదేవి, భూమిసురులంటవారు (ఓ) మ.వ. : మహారాజా! అచ్చము ఈ చిత్రపటములోని మూర్తినిబోలిన వనిత యొకరు నావద్దగలదు. ఆమె ్రోషితభర్భకయని యొకబ్రాహ్మణుడు తన చెల్లెలని నా వద్ద న్యాసముగాయుంచి కాశీకివెళ్లినాడు. అతడు తిరిగి వచ్చి తీసుకువెళ్లెదనని బ్రతిమిలాడుటచే యుంచుకున్నాను. ఆమెపై గల మక్కువచే ఇచటికి గూడ నావెంటగొని వచ్చినాను. వ.ద : నిజముగగలదా? ఈ పటములోని రూపంబున బోలియున్నదా? ఆశ్చర్యముగొల్పదొడగె అతివరో పిలుపించుమిటా (నిజ) భా.వ : చతురికా! నీవువెళ్లి లక్ష్మీదేవినిటకు తోడ్కునిరమ్ము చతు.వ : రాకుమార్. ఆమె పురుషులున్న చోటికి రాదుగదా భావ. : భయములేదు. పరులెవ్వరులేరని, నేను ఎదురుచూచు. చున్నానని పిలిచిరమ్ము. గా) అంద :నా కూతునుబోలి - మోతోడునీడలోగలదా కుందవరపుహరిదయచే - పొందుగ నాకూతురేమో (నా) మ.వ. : అంత అదృష్టమాదేవీ? (యుగంధరుడు బాహ్మణ వేషముతో ప్రవేశము) భా.వ... : నమస్కారములు బ్రాహ్మణోత్తమా (నమస్కరించును) యు.వ. : నిత్యసుమంగళీభవ! గ్॥ అమ్మ మహారాణి. భానుమతమ్మ తల్లి కాళివిశ్వేశ్వరుని పూజ చేసి నేను వచ్చుచుంటిని నా చెల్లినిచ్చిపంపు వేగపిలిపింపుమమ్మనే వెళ్ళవలయు కై వెళిపొవుచున్నాను. యువ : అమ్మా! భానుమతీదేవి! నా యాత్ర పూర్తి అయినది. ఇంటి ల యున్నాను నీవింత కాలము నా చెల్లెలిని కాపాడినందున నీకెంతో రుణపడియున్నాని. నీకివే నా ఆశీస్సులు. కృతజ్ఞతలు. తొందరగా పిలిపించిన వెళ్లిపోవుదును. మీరు మగధ దేశమందుందురని అచటికి వెళ్లివచ్చినాను. (వత్సరాజు యుగంధరుని గుర్తించి) వవ... : బతికియుంటివా యుగంధరా? నా వాసవదత్తకూడ బ్రతికియున్నదా. (యుగంధరుని కౌగలించుకొనును) 85
స్వపష్షనాసవదత్త (చతురిక వాసవదత్తను వెంటనిడికొని వచ్చును) వా.వ.. . బ్రతికియే యున్నాను ప్రభూ. (కాళ్లపై పడును) వవ. : (లేవనెత్తి కౌగలించుకొనును) వా.ద_ : (వత్సరాజు విడిపించుకుని తల్లీ! తండ్రీ! యని వారిని కౌగలించుకొనును? యు.వ. : అమ్మా భానుమతి! నా చెల్లినప్పగించుడమ్మా, భావ : ఇంకెక్కడి చెల్లి. నీవు వచ్చెటపుడు ఆమె భర్తను తొడ్కాని వచ్చెదనన్నావు కదా! ఆమె భర్తను చూపిన పంపుదును. దరువు - వాదము వ.ద. : ఎందుకు నన్నిటు లేడిపించితివి ముందుగ దెలుపుము యుగంధరా! పొందుగ నాసతి చిచ్చునమడియగ అందున నీవు గలవను చూ (ఎం) యు.ద. : శత్రులనుండి రాజ్యము పొందగ జేసితి నేనీ ప్రయత్నము వత్సా! వాసవదత్త యుండిన వలదందువు కదపరిణయము (శ) యు.వ. : వత్సరాజా! నీరాజ్యము రాబట్టుటకై ఇంత నాటకమాడవలసి వచ్చినది. నీమేలుగోరి ఇన్ని పనులు చేసి నీ ప్రియురాలితో పాటు నీ రాజ్యము నప్పగించుచుంటిని. సాహసించి యొనర్చిన నా కృత్యమును మన్నించుడు మహారాజా! వద. : నాసర్వస్వము మిరు లేరన - నా జీవితమే అడుగంటె వవ .నీసస్తంచిటలేదుగావున - చేసిన కార్యమ్ముదావహం. (నా) జ్యముపోయిన బాధపడలేదు. కాని మోరు లేరను భావన అను నిత్యము దుఃభింపడేసినది. మోరుభయులు తిరిగి కన్పించి నా విచారము దూరము చేస్పిత్రిి. వాద: క్ష వు మన్నించినన్ను మి - దాసిగగ్రైకొనుడో రాజా! వావ ; మహారాజా! మై యించె నేటికి - మో పదములకడజేరుటదే. ' ఎ అనుమతి లేకుండా ఈ సాహసమునకు వొడిగట్టినందులకు నన్ను క్షమించి ఆదరించుడు. వద అపర సాంరియా. నా స్వార్థముకగచాట్టోందితివీ మం ఊన్షియు - అతివరొనీవే గుణవతివి. 86
వంగా నర్ణయ్య్మ వవ. : ప్రియా! నా కొరకై, నా రాజ్యము కొరకు మరణించితి నను అపవాదును భరియించి వొక రాజకుమారి వద్ద ప్రోషిభర్శకనని న్యాసమగా యుండి, నీ చేతులతోనా పెళ్లియొనర్చి నీస్వార్థ త్యాగమును ్రదర్శించితివి. నీవు ధన్యచరితవు వాసవదత్తా. వా.ద _ : నాకర్తవ్యంబునేనొనర్చితి మోకై ప్రాణములిచ్చెదను పొలతికి భర్తను మించినదైవం బిలలో లేదని వినలేదా (నా) మ.ద.. : ధన్యచరితవో వాసవదత్తా - ధన్యచరితపు నీవుగదే కన్నియగా మా ఇంటజనించి - పుణ్యము ఫలింపజేసితివీ (ధు మ.వ_ : అమ్మా! వాసవదత్తా! నీవు పుట్టినింటికి మెట్టినింటికి అపారమైన కీర్తిని సంపాదించితివమ్మా వాద : నను క్షమియింపుము నాదుజనకమోి అనుమతిలేకయె వచ్చితిని, మనమున నాపై కోపముంచక - నన్దయగనవే నా తల్లి. వావ :మా అనుమతి లేకుండ నా భర్తతో వచ్చి మో మనస్సులకు బాధకలిగించినందులకు క్షమింపవేడుదును. అం.ద : పూర్వజన్మముల పంటామముగను ధర్మదేవతవు వాసవదత్తా నిర్విచారముగ యుండుము తల్లీ సర్వముచక్కబడియెనుగా (పూ) భావ అక్కానన్నుదయతోగనవే నిక్కువమేదో తెలియకను భావ చిక్కులలో నిన్నుంచితినమ్మా మక్కుజూపుము నాపైనా (అక్కా) భావ అక్కా! గీ॥ పూజ్యురాలవు నీవు నా పొంతనుండి వెలది నీ భర్తకే నన్ను పెల్లిజేసి పరులరీతిగా తిరిగినన్ పాపిజేసి ధన్యవైతివి వాసవదత్తనీవు వ. ; అక్కా! నీవని తెలియక అనుచితంబుగ ప్రవర్తించి యున్నచో నన్ను క్షమింపుము 87
స్వష్టవాసవదత్తే వాద : చెల్లీ నీవు ధన్యచరిత్రవు - తల్లీదీనికి చింతిలకూ చల్లని నీ కళ్యాణంబుననే - కలిగెను శుభములు మాకిచట! (చె) వ. : భానుమతిీదేవి! నీరాకచే మేము చింతావిముక్తులమైతిమి. నా భర్తను తిరిగి కలసికొంటిని. మేమే నీకెంతో రుణపడియున్నాము (అని కౌగలించుకొనును) మద : వత్సా! మరిక సుఖంముగనుండుడు ఇచ్చితి నా రాజ్యము నీకు సుతులు లేని నా రాజ్యంబంతయు శత్రుల పాలుకాకుండా మ.వ : వత్సరాజా! నాకా కుమారులు లేరు. అల్లుడి వయినా కుమారుడవైనా నీవే. నేను వృద్దుడనయినాను. రాజ్యమును పరిపాలించుశక్తి ఉడిగిపోయినది. నా రాజ్యమును నీకు అప్పగించి మేము వానప్రస్థాశ్రమమునకు వెళ్లదలచితిమి. ఇదే నా రాజ్యమును స్వీకరించుము. యు.ద :; శుభములు మోకన్నిటకలిసొచ్చెను శుభచరితా వాసవదత్తా అభయమిమ్ము మో మామకు రాజా! శుభసమయంబున గాదనకా (శు) అందరు : ధరణికుందవర ధాముండగు హరి కరుణకు పాత్రులమైతిమిగా సరసుడునృసింహ కవివరునేలిన పరమాత్ముండే కాపాడెనుగా. (ధ్ర) యు.వ : అమ్మా! వాసవదళత్తా! గీ! తన్వినీ కథ స్రీలకాదర్శమయ్య చంద్రతారార్శముగ నుండు జగతియందు నిన్నుబోలిన సద్గుణనిరతలెపుడు భరతదేశంబునన్ బుట్టి బ్రబలుగాత అందరు : తథ్రాస / భ్రమ్యారరాలయ ఎరా (జో శగ! మంగళం ల రి సిబాల్ 88
“వంగా నరృయ్య, 11.4. 8.64 . | . ” శ శ్రీమతి వంగా లక్ష్మీదేవి, శ్రీ వంగా వెంకయ్యగార్ల ద్వితీయ సంతానంగా 24-8-1929న వరంగల్లు జిల్లా - జనగాం మండలం - కుందారం గ్రామంలో, | జననం. ,? - ౨. | శ _స్వగ్రామంలోనే ఉర్జూ మాధ్యమంగా ప్రాథమిక విద్యాభ్యాసం.
- వయోజన విద్యా వ్యాప్తినే ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావిఠచిన నాటి నైజాం న పాలకుల శాసనాన్ని ప్రతిఘటించి ఈ రంగంలో తీవ్రకృషి చేశారు. ఫలితంగా పోలీస్ ఆక్షన్ తర్వాత కూడా అజ్ఞాత జీవితమే గడిపారు. , “ఫా 1949 మార్చితో షోలాపూర్‌లో అరెస్ట్ పూనాలోని ఎఅవాడ జైల్లో 1950 జూన్ దాకా:(దాదాపు 15 నెలలు) నిర్భంధం,. తర్వాత్త కారాగార విముక్తి . ౯౧ శ నిర్భంధ సమయంలోనే తోటి కొమేడ్డ ప్రోత్సాహం, విశేషించి అజయ్‌కుమార్ ఓ“ ఘోష్ ప్రోత్సాహ; కారణకిగా పునర్విద్యాభ్యాసం ప్రారంభం ప్రైవేట్‌గా మెట్రిక్ - __ పరీక్ష ఉత్తీర్ణత... . మ... శ” ఉపాధ్యాయనృత్తిలో కొత్త జీవితం ప్రారంభం, ఎం.ఎ, బి.ఇడి. వరకు ఉన్నత “ల... విద్యాసాధన్ను లెక్చరర్‌గా _ పదోన్నతి, అంకితభావంతో _14 సంవత్సరాలు వసులు... _ ఉద్యోగ నిర్వహణ - పదవీ విరమణ. 1" . వ. కొ" పదవీ విరమణ 'వల్ల పొందిన విశ్రాంతి సమయంలో. రచనా. వ్యాసంగం “౨. 4998లో కీ.శే, బిట్ట నారాయణగారి జీవిత చరిత్ర: “అంతరంగ తరంగాలు” " “ఎ, రచన... |. చ స ల ౨. షు నాటి తెలం్గ్గాణా సాయుధపోరాట చరిత్రను “అరుణోదయం” పేర ప్రజాశక్తి ౧. 'ప్రచురణగ్భా2౦౦0 మే నెలలో వెలువరించడం, న . శ 1957లో రచించి, విసృతంగా ప్రదర్శించిన “స్వప్నవాసవదత్త” చిబుతల
- 'నాటకం 2002 నాటికి ముద్రణ రూపంలోకి తీసుకురావడం. ౧... “7 _ ఇ _ఇంకా.మున్ముందు మరికొన్నిస్సూర్తివంతమైన రచనల గురించి'ఆల్లోచన్న-.