Telugu sumathi shathakamu - anilvaranasi/indianlanguages GitHub Wiki

యవ + 4 మ శ లు త! కళ షు. 1! ల స! స ల నాస్య 8%. జేతు... “ష్‌ టీ | నం టే | ర; సే కు భా క ర ( నీ ౧ చ. నహజక్ష్ర న్‌ నం న [తస మనకి ముల్లె గ నం శ ఇరగ ఎవడి మక్ష్మ్య్వ్య్య్య _ ( త. ల స్య గ్‌ ఈవుస్త్రక్ష్యా సొఫా రింబిన షై. శ (| ( న; + య న్‌; ఇ న గాని . తొ, / ! | ౯ / అకయ్య విజ్ఞ్యా తర్హ మైనుల క్యూ [న /| / | టీ. | ఓ | జీ జే దంత్ర చెహహూకర్తన్త్మా షు. " || గీ లో వాట్‌ లం కా | సా ్ష మల్గ్వ్టె కుట్టు.

  • | 1'ల_.. కా లా హన [ వివేకానందినీ వ్యాఖ్య ౭5. శ్లో

నవ్వాఖ్వాన శతక సాపొత్వ పరంపర - 4 శ్రీ బద్దెన కవి ప్రణీతము ఆట సుమతి శతకము వినేకానందినీ వ్యాఖ్య వ్యాఖ్యాత 'ఆంధ్రవ్యాస' బ్రహ్మశ్రీ ఏలూరిపాటి అనంతరానుయ్య సంపాదకులు శ్రీ చల్లా సొంబిరెడ్డి ౪ లట చే | క౬॥ 944

క్‌3 టి! నం. ) = నడు న్‌ శ్హీ పావని సేవా సమితి ప్రచురణ నెం. 5 స ట్య స “పరంపర - 4 ఖీ సవ్యాఖ్యాన శతక్రణ్హోహిత్యంప్లరయ పర ఖీ శ్‌ వ్‌ ” ల! న. (1 (ప్రధమ ముద్రణము - 2000 ర మ గ (ప్రతులు 1000 ఎ లం సెం 9౮344701 54% [ీం - 9 891 3400క క 400 00౧గ౧౭౧12౧/ 9౫ = 'ఉిర0ి౧4 454, 8411484451 “560104 ఉఉంగషంనుంత. 011౧9 816951౧098 0 - “రితఉగఉ/4ఉ?4నిన 5౧1 6౧|| 9॥౧| ౪150444061 ౪154/4040 , 64౧4౬ గంం/66280% 0% = ఏ0. ౪. ౧. 845751, 6010౧, 41104౧4 81400141 (ద౭|00 5606౧066౧2026. ౬66166 5 = రిగ ౦0.4 54118) ౧౯౦౦౪. ౧401151696 & గి౩౧13 1659౧/66 0౫ = 5॥ నిఇ౭౧। 560౪2 52010 (౧6౮) 5గ 32! 144౧ - 5.౧7. 270 520200204౧ = /606/2016- 500 018, ౧౧౦౧6. 3702898. 186 ౯896 6124౧9 - 6200400241 109 = గక, 50/ శ 1౧9 2 = గ0౧10106 1౧201 69, 82311౧84౧౧౧౬1/ శ/06 5801109 క. [0/664046- 500 044, ౧|౦౧౪. 7660006 సాన ణన ాంాంధాంధాలయి కా త గరా 354 గగ ౧॥౧66, ల్‌ ఉదా) || గరం8020- 500004, న౧౦౧౦. 3232316. 7 రటీంంలాో ధో (గ గ్రీ శాల '్వర్రప్టిబొలి హైదరాల

ఈర్చ్యా ద్వేష రహితులు నిప్పక్షపాత దృష్టి మహితులు అప్రకటిత గంభీర వాత్సల్య సహితులు అమోఘోపదేశ (శ్రేయోవిహితులు మామామగారు త్రీ శనగల వీరారెడ్డిగారి పుణ్య స్మృతికి,

  • చల్లా సాంబిరెడ్డీ ్‌ం.

న్‌్‌ న క ను ప... . / న. . || . గవాన్‌ శ్రీశ్సీశీ భగవాన్‌ శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ నుహారాజ్‌ నారి దివ్యాశీస్సులు “జంతూనామ్‌ నరజన్మ దుర్లభం”. అన్ని జన్మలలోనికి మానవజన్మ ఉత్కృష్టమైనది, విశిష్టమైనది, కనుక దుర్లభమైనది. ఇతర ప్రాణికోటిలో లేని విచక్షణా జ్ఞానం, బుద్ది మానవులలో ఉండుటవల్లనే అన్ని జన్మలలోనికి మానవజన్మ ప్రశస్తంగా కీర్తించబడుతోంది. అట్టి మానవుని జన్మ చరితార్థకం కావడానికి, వివేకవంతునిగా, శీలవంతునిగా అతనిని తీర్చిదిద్దడానికి సముచితమైన విద్య, నీతి బోధ అత్యంత ఆవశ్యకం. అందుకనే పురాతన కాలంలో పసిపిల్లలకు అలతి అలతి మాటలతో నీతి బోధ చేసే శతకములను నేర్పి కంఠస్థం చేయించేవారు. పూర్వకాలంలో పసిపాపలు నోరు విప్పితే సుమతి శతకం, దాశరథి శతకం పద్యాలు వెలువడేవి, కాని ఈ నాటి సమాజంలో అలముకొన్న వాతావరణంలో ఆ పరిస్టితి మృగ్యమైనది. మరల ఆ శతకములను, మన అనుదినచర్యలో భాగంగా వాడుకలోనికి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. మరుగవుతున్న మానవత విలువలను పరిరక్షించడానికి, ఈనాడు శతక సాహిత్యం అవసరం ఎంతైనా ఉన్నది.

ఈ అవసరాన్ని గుర్తించి, సౌమ్యుమూర్తి, మానవతావాది ఆయిన శ్రీచల్లా సాంబిరెడ్డి, శ్రీపావని సేవా సమితి అనే సంస్థను స్థాపించి వరుసగా ఈ శతకసాహిత్యమును అర్ధ తాత్పర్య విశేషార్హ సహితంగా ఆంధ్ర పాఠకలోకానికి అందిస్తున్నారు. ఈ ఉద్యమంలో భాగంగానే "సుమతిశతకం” శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య వ్యాఖ్యానంతో మనోజ్ఞంగా వెలువడుతోంది. ఈ శతకాన్ని వ్యాఖ్యాన సహితంగా, ఆమూలా(గ్రంగా పఠించిన నేను ఎంతో ఆనందించినాను. ఉదాహరణకు కథలతో వ్యాఖ్యానించిన తీరు 'ఆహా' అనిపించక మానదు. శ్రీ ఏలూరిసొటి అనంతరామయ్య, భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ వ్యాఖ్యానంలోనే కాదు, శతక సాహిత్య వ్యాఖ్యానంలో కూడా శక్తిమంతుడైన దిట్ట అనిపిస్తాడు.

ఇంతటి మంచి శతకాన్ని వ్యాఖ్యానించిన చి॥ ఏలూరిపాటి అనంతరామయ్యను, సమాజానికి అందించిన చి; చల్లా సాంబిరెడ్డిని అభినందిస్తూ ఆశీస్సులను అందజేస్తున్నాను.

మిగిలిన అన్ని శతకాలూ, ఇదే రీతిలో వెలువడాలని మనసారా ఆళిస్తూ, ఆకాంక్షిస్తున్నాను, ఆంధ్ర పాఠకలోకం, ముఖ్యంగా విద్యార్థి విద్యార్థినులు, ఈ శతకమును సమాదరించి, శక్తిమంతులు కాగలరని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ, ఆశీస్సులు అందజేస్తున్నాను.

శుభం భూయాత్‌ అనధూతీ ఇింతనీ గురుదేవ దత్తీ లోకాస్తసుస్తాస్సుఖినో భవంతు, ఓంశాంత్కొ నాంది శాంతిః 5-1-2000, విశ్చమందిరం కృష్ణనగర్‌: గుంటూరు - 6 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్‌

తెలుగు భారతికి అనర్ధ హారతి

తెలుగువాడు కొన్ని విద్యల్లో నేర్చరి. తనదికాని సాహితీ ప్రక్రియను దాని ఆద్యులకంటే హృద్యంగా మలిచి, అది అచ్చంగా తనదేమోనన్నంతటి అచ్చెరువు కలిగించడం వీటిలో ఒకటి. ఈ అనితర సాధ్యమైన (ప్రజ్ఞలో ఆంధ్రులకు ఇవ్వదగిన స్వర్ణపతకానికి శతక సాహిత్యమే పెద్ద అర్హత. ముక్తక కావ్య ప్రక్రియలో భాగంగా శతక సాహితి తొలుత సంస్కృతంలోనూ, పిదప ప్రాకృతంల్లోనూ రూపుదిద్దుకొని ఆం(ధ్రానికంటే ముందు కన్నడానికి విస్తరించినా తెలుగువారి చేతిలో పడ్డాకే అది బంగారానికి తావి అబ్బినంత శోభాయమానమైంది. పేరుకు శతకమైనా సుమారుగా వంద క్లోకాలే ఉండాలన్న నియమం మొదట్లో ఉండేది కాదు. బాణుడి చండి శతకంలో 48 శ్లోకాలే ఉండగా, అమరుకుని అమరుక శతకంలో 115 శ్లోకాలున్నాయి. సూర్య శతకం, భల్లట కవి శతకాల్లో సరిగ్గానూరే శ్లోకాలున్నాయి. శ్లోకాల సంఖ్యలోలాగే సంస్కృత శతకాలకు మకుట నియమమూ లేదు. ఛందస్సు ఒక్కటే ఉండాలన్న కట్టడీ లేదు. ఇతర భాషల్లో లేనివిధంగా సంఖ్యా, మకుట, పద్య వృత్త, వస్తు రస నియతిని పాటించడంవల్లే తెలుగు శతకానికి అనిదంపూర్వమైన ఒద్దిక, పొందిక ఆఅమరాయి.

శివకవి పండితారాధ్యుడు రాసిన శివతత్వసారం శళకమని పాల్కురికి సోమన చెప్పడంవల్ల తెలుగులో అదే మొదటి శతకమని సాహిత్య చరిత్రకారులు భావిస్తున్నారు. శివసంబంధమైన 28 రకాల మకుటాలతోనూ, ఏ మకుటమూ లేకుండానూ మొత్తం 489 పద్యాలు కలిగిన ఆ (గ్రంథానికి శతక లక్షణాలు బహు తక్కువ. లక్షణాలన్నిటినీ సంపూర్ణంగా పుణికి పుచ్చుకున్న పాల్కురికి సోమన వృషాధిపశతకమే తెలుగులో వచ్చిన మొదటి శతకంగా ఎన్నదగింది. నాటినుంచి నేటిదాకా తెలుగులో కొన్ని వేల శతకాలు వెలువడ్డాయి. వీటిలో కొన్ని వందల శతకాల పేర్టు వినడమే తప్ప అందుబాటులో లేవు తిక్కన కృష్ణశతకం రాశాడంటారు. చాలా శతాబ్దాల కిందటే చెదలు తినేయడంవల్లేమో అది ఎలా ఉండేదో మన పూర్వులకే తెలియదు. “జక్కన చెప్పిన పెమ్మయ ధీమణి శతకము” అని ప్రయోగరత్నాకరంలో చదివే “పెమ్మయ సింగధీమణీ” అనే మకుటంలో వాడుకలో ఉన్న కొద్దిపాటి చాటువులను విని ఆనందించడమేగాని పెమ్మయ సింగరాజు రాసిన శతకం పూర్తిపాఠం ఎక్కడా దొరకదు. పోతనవంటి మహాకవులు మొదలుకొని అనామకులూ, అసంపూర్ణ ప్రజ్ఞావంతుల వరకూ కొన్ని వేల కవులు రాసిన వేలాది శతకాల్లో కాలపరీక్షకు నిలిచి మనదాకా దక్కినవి కొన్ని వందలు మాత్రమే. సుందరి అనే ఉంపుడుగత్తెతో విరహశ్ళంగారాన్ని వరించిన కూర్మనాధకవి సుందరమణి శతకం మొదలుకుని మండపాక పార్వతీశ్చరశాస్తి ఆత్మకథ అయిన “ఆత్మచర్య” శతకం

వరకూ వస్తువైవిధ్యం విసృతంగా ఉన్నప్పటికీ, భక్తి నీతి వైరాగ్య, శృంగారపరమైనవిగా తెలుగు శతకాలను స్టూలంగా వింగడించవచ్చు. వీటిలో కూడా (ప్రధానంగా భక్తి నీతి శతకాలే పండిత, పామర రంజకాలై తెలుగు (ప్రజల నిరంతర ఆదరాభిమానాలకు షాత్రమయ్యాయి. సుమతి శతకం నుంచో, వేమన శతకంనుంచో, దాశరథి శతకంనుంచో, నారసింహ, శ్రీకృష్ణ భాస్కర, శ్రీకాళహస్తీశ్చర శతకాల నుంచో కనీసం కొన్ని పదుల పద్యాలు నాలుకమోద ఆడనివాడు తిలుగువాడే కాదు. పెద్ద బాలశిక్షను నర్ఫ్భకీ రైమ్సు మించేయకముందు పిల్లల్ని బడిలో వేయటానికి ముందే “శ్రీరాముని దయచేతను ...” అని సుమతి శతకంలో మొదలుపెట్టి నీతి పద్యాలను వరసగా కంఠస్థం చేయించడం తాతయ్యలకూ, నాయనమ్మలకూ అలవాటుగా ఉండేది. అలా ఇంట్లో పెద్దలు చెబితేనో, బళ్ళో పంతులుగారివల్లో లేత వయసులో నేర్చుకున్న పద్యాలు వయసు పెరిగేకొద్దీ (క్రమంగా అర్థమవుతూ ... బతుకు గతుకుల్లో సతమతమయ్యేటప్పుడు ఆయా సామాన్య పద్య పాదాల్టోని లోయలూ, అంతరార్జాలూ ఆప్రయత్నంగా స్ఫురిస్తూ ... జీవితపు వొడిదుడుకులను తట్టుకోవడానికి కావలసిన స్టైర్యాన్ని సమకూర్చేవి. కాన్వెంటు, కిండర్‌గార్జెన్‌ చదువులొచ్చాక .... మా వాడిదంతా ఇంగ్లీషు మొడియం; తెలుగు రాయలేడు చదవలేడు అని తెలుగు దేశంలోని కొందరు తలిదండ్రులే సగర్వంగా చెప్పుకునే గొప్పకాలం వచ్చిపడ్డాక బూతులకే తప్ప నీతులకు విలువలేక, నీతిసారపు వెన్నముద్దలైన శతకాలకు ఆదరణలేక ... పిల్లలు కూడా ఈ పెద్దల కుహనా భావాలనూ, కపటిపు విలువలనే పుణికిపుచ్చుకుని తిరిగి తమ పిల్లలకూ అదే శుష్కసంస్కృతిని ఉగ్గుపాలతో నేర్పిస్తున్నారు. ఇదిగో - ఈ దురదృష్టకర దౌర్భాగ్యస్థితినుంచి చేతనైనంతలో చేతనైన మేరకు సముద్ధరించి, మల్లీ మూలంనుంచీ మొదలుపెట్టి, నైతిక దృష్టినీ, ధార్మిక వర్తననూ మనుషుల్లో ముఖ్యంగా భావితరాల వారిలో ఇతోధికంగా (ప్రకాశింపజేయాలన్న ఉదాత్త సదాశయంతోటే చల్లా సాంబిరెడ్డిగారు శతక సాహిత్యానికి తిరిగి మహారాజయోగం పట్టించేందుకు నడుం కట్టారు. పైసా పనికి పది పైసల ప్రచారంపొంది రూపాయి లాభం పొందాలని చూసే ఆళపోతు పక్కా వ్యాపారులు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహితీ రంగాల్లో క్రిక్కిరిసి ఉన్న ఈ కాలంలో ప్రతిఫలాపేక్ష లేకుండా సొంత డబ్బు ఇర్చుపెట్టుకుని ధర్మంకోసం పాటుపడతామనే సాంబిరెడ్డిగారి లాంటివారుండటం చి(త్రమే, నమ్మడానికి కొంచెం కష్టమే. అయితే - ఇలాంటి బతకనేర్వని సత్తెకాలపు అమాయక చక్రవర్తులు లక్షకో, కోటికో ఒకరు చొప్పున ఇంకా మిగిలి ఉన్నారు కాబట్టే ధర్మదేవత ఇవాళ ఒంటికాలితోనైనా కుంట గలుగుతున్నది. మహా సామ్రాజ్యం నేలిన రాజులూ, విశాల సంస్థానాల మహాప్రభువులూ కవిప౦డితులను పోషించి, సారస్వత సేవను సాగించడం అబ్బురం కాదు, ఆధునిక

కాలంలోనూ కోట్ట రూపాయల నిధులు మూలిగే మహా సంస్థలవారు లోకహితానికి పధకాలు చేపట్టడం, లాభాపేక్ష లేకుండా పుస్తకాలు అచ్చువేయించడం గొప్పకాదు. సాంబిరెడ్డిగారిలాంటి వ్యక్తులు తాము ఓ మోస్తరు శ్రీమంతులు మాత్రమే అయినా, సంపద పెంచుకోగలిగిన మార్గాలు, పెంచుకోవలసిన అవసరాలు, అందుకు కావలసిన తెలివితేటలు ఉండికూడా ఉన్నదానితో తృప్తిపడి కలిగినంతలో కొంత ధనాన్ని ధర్మమార్గంలో సామాజిక, సాహితీ సేవకోసం వినియోగించి ఉద్యమ దీక్షతో విరామమెరుగని కృషి సలపడమనేది బహుధా మెచ్చుకోదగిన విశేషం పదుగురికి పనికొచ్చే ఆరోగ్యకరమైన (గ్రంథాల ముద్రణకు మహా మహా ప్రచురణ సంస్థలే వెనకాడుతున్న సమయంలో ...... లాభనష్టాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ధనంతో సారస్వత సేవచేయవలసిన అకాడమోలూ, విశ్శవిద్యాలయాలే కుల రాజకీయాల, అవినీతి ప్రభావాల, అసమర్ధ నిర్వాకాల ఆటపట్టుగా మారి 'తిండికి తిమ్మరాజు'ల్లా తయారైన నేపథ్యంలో ... సాంబిరెడ్డి గారిలాంటివారు సొంత డబ్బుతో సంస్థలను స్టాపించి, విలువైన పుస్తకాలను చక్కటి అభిరుచితో హుందాగా, అందంగా ప్రచురిస్తూ ఒకరి సాయాన్నీ, ఒకరి మెచ్చుకోలునూ ఆశించకుండా నిరాడంబరంగా, సవినయంగా అవిరళ కృషి సలపడం తెలుగువారి అదృష్టం.

ప్రతిపదార్థ తాత్పర్య విపుల వ్యాఖ్యా సహితంగా సుప్రసిద్ద విద్యాంసులచేత (ప్రత్యేకంగా రాయించి 'శ్రీ పావని సేవాసమితి" తరపున సాంబిరెడ్డిగారు వెలువరిస్తున్న శతకాల వరసలో ఈ సుమతి శతకం నాలుగవది. ఇంతకుమునుపు శ్రీకృష్ణ సర్వేశ్వర: దాశరథి శతకాలకు వన్నెతెచ్చిన పెద్దలలాగే ఈ 'సుమతి'ని సుశోభితం చేసిన ఏలూరిపాటి అనంతరామయ్యగారు పరిచయం ఆవనరంలేని జగమెరిగిన పండితులు, సంస్కృతాం'ధ్రాల్లో విశిష్ట విద్వత్తుతో, అసాధారణ సాహితీ శేముషితో, ఉత్తమ (గ్రంధాలను ధారాపాతంగా రచియించి, మహాపురాణాలనే తెనిగించి 'ఆం(ధ్రవ్వాస' బిరుదాంకితులైన అనంతరామయ్యగారు సుమతి శతకానికి వ్యాఖ్య రాయడం ఒకరకంగా పి.జి. కొలేజి ప్రిన్సిపాలు ఎల్‌ె.జి, క్లాసుకు పారం చెప్పడంలాంటిది. కాని- అంతటి ఉద్దండపండితుడినే తేలికపాటి బాధ్యతకు ఏరికోరి ఎంచుకోనటంవల్ల తరతరాలుగా తెలుగు వారందరి వచోవిధేయమైన ఈ సామాన్య నీతిశతకంలోని ఆలతి అలతి తేట తెనుగు పదాల వెనుక దాగిన అసామాన్య, నిగూఢ భావాలను, ధార్మిక చింతనకు విపులంగా తెలుసుకొని కొత్త చూపుతో అవలోకించగల సదవకాశం తెలుగు జనావళికి దక్కింది. కేవలం ఆయా పదాల అర్జాలను, పద్య తొత్పర్యాన్ని వివరించడమే కాకుండా, కలివిడంబనంనుంచి, బాటుపడ్య రత్నాకరం నుంచి, ఉత్తరరామచరితంనుంచి, రామాయణ భాగవత భారతాలనుంచి, ఇతర్‌ శతకాలనుంచి, సంప్రదాయ సాహిత్యంనుంచి ్రసక్తాను ప్రసక్తంగా ఎన్నో విషయాలను ఉదాహరించి, సందర్భోచితంగా పోలికతెచ్చి, ప్రతిపాదిత విషయాన్ని

పఠితల మనసుల్లో గాఢంగా నాటుకునేట్టు చేయడంలో అనంతరామయ్యగారిది అసాధారణ (ప్రజ్ఞ, సుమారు పాతికేళ్లుగా జర్నలిజంలో ఉండి ఎడిటింగు జీవితపు అలవాటుగా మారిన నాబోటి వారికి ఆయన 'వ్యాఖ్యానం' ఒక్కోచోట (ఉదా: “అడియాస కొలువు గొలువకు ...' పద్యం) మితిమించి ఉపన్యాసంగా మారిందన్న అభిప్రాయం కలగవచ్చు. కాని - అనంతరామయ్యగారు చేయి తిరిగిన రచయిత కాబట్టి ఒకరకంగా లోపం అయినా ఇంకోవిధంగా అది కూడా అందమే. ఈ (గ్రంథమంతా చదివిన తరవాత వ్యాఖ్యానంలో సందర్భానుసారంగా తరచూ ప్రస్తావించిన కనీసం కొన్ని (గ్రంథాలను సంపాదించి చదవాలన్న ఆసక్తి పాఠకులకు కలుగుతుంది. అదే జిజ్ఞాసను కొనసాగిస్తే, ఈ (గ్రంథ పఠనంలో ఉదయించిన జ్ఞానకణమే శతసహస్ర ప్రమాణాలుగా విస్తరిల్లి మనిషిలోని జ్ఞాననేత్రం విప్పారవచ్చు. వాస్తవానికి సుమతి శతకానికి వ్యాఖ్యానమే అవసరం లేదు. ఇందులో అర్హంకాని గొట్టు పదాలు, సంక్షిష్ట సమాసాలూ ఏమి ఉండవు. అన్నీ నిత్యజీవితంలో వాడుకలో ఉన్నవే. సులభంగా బోధపరచుకుని గుర్తుపెట్టుకోగలిగినవే. అయినా - కొన్ని కొన్ని మాటలు అర్థమైనట్టే కనిపించినా పెద్దలు విడమరచి చెబితేగాని వాటి వెనుకగల తాత్విక చింతన అంతుబట్టదు. అలాగే - ఆయా మాటలను తప్పుగా అర్ధం చేసుకుని వ్యతిరేక అభిప్రాయం ఏర్పరచుకున్న సందర్భాలూ ఉంటాయి. ఉదాహరణకు - “ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పుటికా మాటలాడి ...” అన్న పద్యం అనంతరామయ్యగారి వ్యాఖ్య చదివాక కొత్తకోణంలో అర్ధమవుతుంది. అలాగే కులప్రస్తావన తెచ్చే పద్యాల్గో ఈ కాలపు భానాలకు, ప్రమాణాలకు విరుద్ధమైన వాటిని ఎవరూ నొచ్చుకోని రీతిలో నేర్పుగా, డొంక తిరుగుడు లేకుండా వివరించిన తీరు అభినందనీయం. ఇంతకుముందు అచ్చయిన పాఠాల్గో వదిలేసిన పద్యాలనుకూడా (శ్రమపడి సంపాదించి, ఇందులో చేర్చడంవల్ల కూడా ఈ ప్రచురణకు నిండుతనం చేకూరింది. వ్యాఖ్యానంలో సందర్పోచితంగా (ప్రస్తావించిన సూక్తి శ్లోకాల, పద్యాల సూచికను, శతకంలోని నీతుల సూచికను ఇవ్వడం పాఠకులకు రడీ రిఫరెన్సుగా ఉపయోగపడుతుంది, సాంబిరెడ్డిగారు తలపెట్టిన సాహితీ మహాయజ్ఞం అనంతరామయ్య గారిలాంటి ధర్మనిరతుల క్రియాశీల సహకారంతో, తెలుగు ప్రజలందరి ఆశీస్సులతో నిరాటంకంగా, నిరాఘాటంగా సాగి, సుప్రసిద్ద శతకాలతోపాటు సంప్రదాయ సాహిత్యపు గనిలో మరుగునపడిన మణిమాణిక్యాలను సైతం వెలికితీసి తెలుగు భారతికి అనర్హహారతిగా చరితార్థం కాగలదని నా ఆశ, ఆకాంక్ష ఎం.వి.ఆర్‌.శాస్త్రి ఎడిటర్‌

1042000 ఆంధ్రభూమి దినపత్రిక

మా నూట సంఘజీవియ్రైన మానవుడు వ్యక్తిగత (్రవర్తనను, ప్రయోజనాలను, సామాజిక పరిమితులకు సర్దుబాటు చేసుకొనటం నీతి. నీతులలో నిజాలేతప్ప, కల్పనలు చోటు చేసుకొనే అవకాశం ఉండదు. అందుచే అన్ని దేశకాల పరిస్టితులకు అనుసరణీయమై నీతులుంటాయి. ధర్మం, న్యాయం, నీతి, ప్రేమ, పునాదులపై సుప్రతిస్టితమైన సామాజిక వ్యవస్త మనది. సర్వమత సానురస్యానికి ఆవాసమైనది మన సంస్కృతి, నీతులు చెప్పటానికి చాల సులువైనప్పటికి, ఆచరించేవారి కొరత యెప్పుడూ యెదురవుతుంటుంది. ఆధునిక మానవ జీవన ప్రస్థానంలో క్రమక్రమంగా నీతినిజాయితీలు జన జీవన (్రవంతిలోనుండి కనుమరుగై పోతున్నాయి. ఆచరణ మాట ఎలాగున్నా కనీసం నీతి అనేది ఉంది అనే విషయం గూడా గుర్తులేకుండా పోతున్నది.

సర్వం ఆందోళనకరమైన గందరగోళంగా మారుతున్న ఈ దశలో ప్రజాబాహుళ్యానికి నీతి శతక సాహిత్యాన్ని గుర్తు చేయటం శ్రీ పావని "సేవాసమితి తన కర్తవ్యంగా భావించింది. దాని కార్యరూపమే ఈ సుమతి నీతి శతక ప్రచురణ.

సుమతి. శతకకర్త శ్రీబద్దెన కవి పదమూడవ శతాబ్దం వాడని చరిత్రకారుల, పరిశోధకుల నిర్ణయం. ఏడు శతాబ్దాల కాలం గతించినా, దేశ, కాల మార్పుల కతీతంగా, నేటి సామాజిక పరిస్థితులకు గూడ అనువర్తించే విధంగా ఈ శతకం ఉండడం గమనించవలసిన సంగతి.

ఈ సుమతి శతకానికి వ్యాఖ్య బ్రాయుటకు మేము కోరిన వెంటనే అంగీకరించి “వివేకానందినీ వ్యాఖ్య" చ్వరుతో ఎంతో ప్రశంసనీయమైన విషయ వివరణ యిచ్చిన ఆంధ్రవ్యాస, కవికులరత్నదీప, వైదికాగమాలంకార, భాషా ప్రవీణ, శ్రీ ఏలూరిపొటి అనంతరామయ్య గొరికి శ్రీ పావని సేవా సమితి కృతజ్ఞతలను తెలుపుకొంటున్నది. కొన్ని వివరణలు ప్రస్తుత కాలానికి అనుగుణంగా మలచి సున్నితముగా చెప్పటం వీరి వ్యాఖ్యలో ప్రత్యేకత.

శ్రీ పావని సేవా సమితి సవ్యాఖ్యాన శతక సాహిత్య పరంపరలో ఈ సుమతి శతకము నాల్గవది. ప్రప్రథమంగా మహాకవి శ్రీమాన్‌ ఉత్పల సత్యనారాయణాచార్య వారి “గోప్రీనయనోత్పలార్భిత వ్యాఖ్య"తో శ్రీ కృష్ణ శతకము, తరువాత ఆచార్య యం.

కులశేఖర రావు మహాదయుల “మానసోల్టాస వ్యాఖ్యతో భక్తరామదాసు (ప్రణీత దాశరథి శతకము, అనంతరం విద్వద్వర్యులైన డా॥ ముదిగొండ వీరభద్రయ్యగారి వ్యాఖ్యతో యధావాక్కుల అన్నమయ్య ప్రణీత సర్వేశ్చర శతకము తెలుగు పాఠకలోకానికి సమర్పింపబడినవి. మరికొన్ని ప్రసిద్ధ శతకాలు - వేమన, భరృహరి (నీతిళతకము), శ్రీ కాళహస్తేశ్చర, భాస్కర, నారాయణ, నృసింహ శతకాలకు సమర్ధులైన పండితులచే వ్యాఖ్యా రచన జరుగుతోంది.

సవ్యాఖ్యాన శతక సాహిత్య ప్రచురణతోపాటు, శ్రీ పావని సేవా సమితి, భాగవతములోని వివిధ ఘట్టాలకు వ్యాఖ్యలు వ్రాయించి ప్రచురణ చేపట్టింది. ఈ దిళలో “శ్రీమద్భాగవత సుధాలహరి” అను పేర ప్రభమముగా బమ్మెర పోతనామాత్య ప్రణీతము గజేంద్ర మోక్షము (సంస్కృతమూల సహితము), మహాకవి శ్రీమాన్‌ ఉత్పల సత్యనారాయణాచార్య వారి గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్యతో ప్రచురించటం జరిగింది. ఈ పుస్తకం పండిత (ప్రశంసలతో పాటు, బహుజనాదరణ పొందటం మాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది.

ఈ సుమతి శతకానికి దత్తాత్రేయ స్వరూపులు, శ్రీశ్రీశ్రీ విశ్శయోగి విశ్వంజీ స్వామివారు అను[గ్రహించిన ఆశీస్సందేశముతో భక్తి పులకిత గా(త్రులమయ్యాము. వారికి మా సాష్టాంగ (ప్రణామములు,

తమకు క్షణం తీరిక లేకున్నా,'మా కోరిక ననుసరించి ఈ పుస్తకానికి “తెలుగు భారతికి అనర్హ హారతి” పేర చక్కని పీఠిక (వ్రాసి యిచ్చిన ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు శ్రీ ఎం.వి.ఆర్‌.శాస్తి గారికి మా కృతజ్ఞతలు.

“ఈ పుస్తకానికి ముఖ పత్రాలంకరణ కావించిన ప్రఖ్యాత చిత్రకారులు శ్రీ గంగాధర్‌ గారికి, ముచ్చటగా టైపు చేసిన ఫాంట్‌లైన్‌ (గ్రాఫిక్స్‌ వారికి, సుందరంగా ముద్రించిన శ్రీ సాయిరాం ప్రింటర్స్‌ అధినేత శ్రీ నాగేశ్వరరావు గారికి మా కృతజ్ఞతలు.

జి.సిహెచ్‌. రామారావు కార్యదర్శి, శ్రీ పావని సేవాసమితి

ధర్మదీక్షాపరాయణులు శ్రీ చల్లా సాంబిరెడ్డిగారికి ళా నే

రెడ్డిని దెగడం గడంగినన్‌

గిడ్డి యనును వ్యాకరణము, నిన్నో వేల్పున్‌

గిడ్డీ యనిన. బొగడుటనున్‌

విడ్డూరము శాస్తములకు నిలుకడ నలదో న్యాయస్త్థానములందున న్యాయమ్మన్యాయముగను నన్యాయమ్మున్‌ న్యాయమ్ముగ నాదించతురు న్యాయపునాదులన నీకు నసవాదమ్మా కలవారు బేయి విదుపను

గలవారును గలరు. గాని కలిమిని మనచే చులతో నీయనె నువచే

తులలో నిడెననెడు నీకు. దులయగువారే కవనము గానము మొదలగు నవి దైవము తనదు సేననమునకె యిడ నౌ నవునంచునె తులువలకై ఎవరు నిదిసిరేని మెచ్చవీవేకానే

నాయన యని నను( బిలుచువు,

నాయన యనె+ బిన్ననాండు నాయన. ఆయా ప్యాయతను జదువ, నీయా

ప్యాయత వ్రాయించి దానిఫలములః బంచున్‌ కోటికట్నమేల? గుణవతి కోడలే వలయుననుచు నిలువ( గలుగువాని. గలియుగమున నిన్నె కనుగొంటి సాంబయా నిన్ను మెచ్చకున్న వన్నె గలదె

అక్షరమున కొక్క లక్షగా( బైతకు

భోజు(డిచ్చె ననుట పూర్వకథలు పద్యమప్పగింస. బదిరూప్యముల లెక్క వేలు రాల్ఫునిన్ను6 బోలం గలరొ నీయభ్యుదయరహసన్యము

నా యెజుకకు వచ్చె. జెప్పనా సతతమ్మున్‌ గాయత్రీజపమే కద

వాయి విడువ దొరులకిట్టి భాగ్యముగలదే భక్తినీతిశతకపఠనమ్ము లుఠితమై

తెలుగు భక్తి నీతి లులితమాయె

శతకపాళి సర్వజనులచే జదివించు సత్యసంధ మెచ్చు సజ్జనాళి

ఆలయముల నర్భలాగమవిహితముల్‌ వాడ వాడ ధర శ్రభాషణములు వేదఘోషలిండ్ల విహితకృత్యమ్ముల వలయుననెడువాని నలదొ మెచ్చ దేవకార్యమునకు( దివురుట మనవంతు వానిపనికి సొమ్ము వాండె యిచ్చు అందటికి నాసంగునాతని నడుగక వీరినడుగ నందు వీరముప్టి కావి గట్టనచ్చు కబురులాడను వచ్చు చేయవచ్చుటెంత చేవయొకద నీకు గలుగుదీక్ష నీదువిశ్వాసమ్ము కోటికొకనియందు. గూడ లేవు ఇరుయుగాల “రామకృష్ణులు లక్ష్మణ యుతులు ముగురు ముద్దుసుతులుగాంగ కలియుగమున నిలిపి పిలిచి సమ్మోదించు మీకు వారు ముగురు మేలిడుదురు

౫ శ్రీ పొంబిరెడ్డీ శ్రీమతి శ్రీమతిగాయ శ్రిదేవి;

  • కుమారులు చిరంజీవులు శ్రీరామరెడ్డి, లక్ష్మణరెడ్డి, కృష్ణారెడ్డీ

శ్రీః సుమతి శతకము వివేకానందినీ వ్యాఖ్యా సహితం అవతారిక : మాననీయుడు కవి తెలుగుభాష మాటలాడే వారి మేలుగోరి నువుతి నువదోళించే నుముతి శతకం (వ్రాయాలని నంకల్పించి, నంప్రదాయాన్లి అనునరింబి, ఇప్టదైవనామ నృరణమూ వస్తు న్హోళయూ ప్రతిజ్ఞా చేస్తూ లొలివద్దుం ప్రారంభిన్తున్దాడు. క శ్రీరాముని దయచేతను నారూఢిగ సకలజనులు నారా యనంా ధారాళమైన నీతులు నోరూరంగ6 జవులు వుట్ట మడివెద సుమతీ, క్ష ప్రతిపదార్హం : సుమతీ = మంచిబుద్ధీగలవాడా, శ్రీరాముని = శ్రీ, అనే మాటకు లక్ష్మి, ధనం, సంపద, సమృద్ధి, ఉన్నతసితి, చక్కదనం, శోభ, కాంతి, గొప్పదనం, అలంకారం, బుద్ది, దివ్యశక్తి సరస్వతి, మంచి వాక్కు, కీర్తి మొదలైన అర్థాలున్నాయి కనుకు అవి కలవాడు కనుక్క మాననీయుడు అయిన రామచంద్రునియొక్క, దయచేతను = అను(గ్రహం కారణంగా, ఆ రూఢిగన్‌ = ఆ+రూఢి+క్షన్‌ = అన్ని చోట్లనూ ప్రసిద్ధి కలిగే విధముగానూ, సకలజనులు = సమస్తమైన అన్ని విధములైన ప్రజలూ, జౌరా = ఎంత ఆశ్చర్యం అని మెచ్చుకొంటూ, అనంగాన్‌ = టఅనన్‌+కొన్‌ = పలుకునట్టుగానూ, ధారాళమైన = ధారాళము+ఐన = అడ్డుపాటు లేనివయిన, నీతులు = ఇహపరాలు సాధించే ఉసాయాలు, నోరూరంగన్‌ = నోరు+ ఊరన్‌+కన్‌ = తినే పదొర్భాలు చూడగానే వాటిని తినాలనే కోరిక కలుగగానే నోటిలో రసం ఊరినవిధముగా, ఈ నీతులు కొన్ని వినగానే ఇంకా వినాలనే కోరిక అధికమయేటట్టుగొ, చవులు వుట్టన్‌ = చవులు+పుట్టన్‌ = ఇంకా ఇంకా వినాలనీ, ఇట్టి ప్రశస్తమైనవి వినాలనీ కోరికలూ అభిరుచులూ కలిగేటట్టుగా, నుడివెదన్‌ = చెప్పుతాను. తాత్పర్యం : సుమతీ, మంచి బుద్ది గలవాడా, కొన్ని అడ్డుపాటులేని నీతులు చెపుతాను. విను. అవి నేను చెపుతున్నానంటే, అందుకు నాయిష్టదైవమైన శ్రీరామునిఅను(గ్రహమే కారణం. నా పాండిత్యాదులు కాదు, అవి సకలదేశాలలోనూ రానున్నకాలంలోనూ బహుటప్రసిద్దములవుతాయి. అవి తగనివని ఎవరూ అడ్డుచెప్పలేని ఉత్తమమైనవి. ఒకటి వింటే మరొకటి వినాలనిపించేటట్టు ఉంటాయి. అవి ఎంతచక్కగా ఉన్నాయి, ఎంత ఉపయోగకరమైనవి, చెప్పిన తీరు ఎంత బాగున్నది అని వినినవారు ఆశ్చర్యపోతారు. క్షే

2 సుమతి శతకము వ్యాఖ్యానం : నీతి అనేమాటకు పొందించేది, ఉపాయం అని అర్జాలు. ఈ నీతులు ఏమి పొందిస్తాయి? ఇహపరాలను లభింపజేస్తాయి. దానికి తగిన ఉపాయాలివి. ఒక కార్యంసాధనకు ఉపాయం తెలుసుకొన్నవాడు ఆ (ప్రకారం ఆచరిస్తే ఆ కార్యం సాధ్యమవుతుంది. మనిషికి కావలసినది ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ సుఖంగా ఉండటం. కవి తాను చెప్పబోయే నీతులు ఉభయలోకాలలోనూ సుఖం కలిగిస్తాయి అని చెపుతున్నాడు. ఇట్టి ఉపాయాలు చెప్పేవానికి ముందు అహంకారం ఉండగూడదు. నేనివి చెప్పగలుగుతున్నానంటే, దానికి నేను సేవించే దైవం శ్రీరామ చంద్రుని అనుగ్రహమే కారణం కాని, నా శక్రియుక్తులు కావని ముందు (ప్రకటిస్తున్నాడు, ఆయనఅను[గ్రహమే నన్ను పలికిస్తున్నది, పలుకవలసిన విషయాలనూ రీతులనూ ఆ అను[గ్రహమే నాకు అలవరుస్తున్నది - అని, “పలికెడిది భాగవతమట, పలికించెడినాండు రామభద్రుండంట నేం బలికిన భవహరమగున(ట, పలికెద వెరొండు గాథ పలుకంగ నేలా” అనిన పోతనగారి విశ్వాసంవంటిదే ఈ మాటలలోనూ ప్రకటమవుతున్నది. మానవుడు కేవల స్వబుద్ధితో చెప్పినదానిలో (భ్రమ(ప్రమాదాలకు అవకాశమున్నది. దైవాను[గ్రహంతో చెప్పినదానిలో, అనగా ధైవం సంకల్పించి చెప్పించినదానిలో, అందుకు అవకాశం లేదు. రెండవది, ఇవి విశ్చమంతటా ప్రసిద్దములవుతాయి అని చెపుతున్నాడు. ఇదీ అహంకారంతో చెప్పినమాట కాదు. అనుభవమూ, పాండిత్యమూ, దైవభక్తీ విశ్చశ్రీయఃకాంక్షా మేళవించి చెప్పిన తన నీతులవిలువా, అవసరమూ, ఉపయోగమూ, బాగా తెలిసి, వీటిని (గ్రహించాలి, నేర్చుకోవాలి, ఆచరించాలి అనే అభిప్రాయం కలిగించటానికి, వస్తుతత్మ్యం వివరించేమాట. ఒక తీయనిపండు సమర్పించినవాడు. “ఇది తీయనిది, ఇది తింటే ఇంకా తినాలనిపిస్తుంది” అని చెప్పాడనుకోండి, రుచి చూచినతరువాత దానిలో ఆ లక్షణాలు లేకపోతే జనం మెచ్చరు. అతనినింక .నమ్మరుగదా, కనుక చెప్పటంలో చిత్తశుద్ధి కనిపిస్తుంది. (క్రొత్తవస్తువు గురించి ఇట్టిదని చెప్పకపోతేకూడా జనం దానిని చూడకపోవచ్చు, అందువల్ల ఇలా చెప్పటం అవసరమే. తినేకొలదీ తినాలనిపించే మంచి ఫలాలలా ఇవి వినేకొలదీ వినాలనిపిస్తాయనీ, “నోరూరంణ6 జవులువుట్ట” అనటంద్వారా కవి చెపుతున్నాడు. (ప్రతిపద్యమూ 'సుమతీ' అని సంబోధిస్తూ చెప్పటంలో కూడా కవి నేర్పు తెలుస్తున్నది. నీతివాక్యాలు ఎంత మంచివయినా వినేవారికి సంతోషంకంటె విసుగు కలిగించే అవకాశం ఉన్నది. పైగా నీతివాక్యాలు ఎవరికి అవసరమవుతాయి? దానికి దూరంగా ఉండే

వివేకానందినీ వ్యాఖ్యాసహితం రి వీలున్నవారికే. నీరు పల్దానికి పోయేటట్టే సహజంగా మనుషులబుద్దులు కూడని రీతులవైపే పోతాయి. వాటిని ఉత్తమగుణాలవైపు మళ్ళించే ఇతరులప్రయత్నం వారికి విసుగు కలిగిస్తుంది. యౌవనం, సంపద, అధికారం వంటివి కలవారికి గురువుల నీతిబోధ గంగాజలం వంటిది. కాని, ఎంతమంచిదైనా గంగాజలం చెవిలో దూరితే పోటు పుట్టిస్తుంది. గురూపదేశంకూడా వారికి అలాగే అనిపిస్తుంది-అని బాణుడు చెప్పాడు. ఎవరికైనా మంచిమాట చెప్పి, వారు బాగా ఉండేటట్టు చేయాలనుకొన్నవారు “నాయనా, నీవు బుద్ధి మంతుడవు, మంచివాడవు, చెప్పినమాట శ్రద్ధతో విని, ఆలోచించి, ఆచరించితే వృద్దిలోనికి వస్తావు” అని చెపితే, బుద్ధీ, మంచితనమూ, ఆలోచనా లేనివాడుకూడా సుముఖుడయి విని, ఆలోచించి మంచివాడుగా ఉండాలనుకొని ఆ (ప్రకారం ఆచరించాలనుకొంటాడు, ఆ మనోధర్మవేత్పత్వమే కవి యిక్కడ ప్రకటించి, చదువరిని సుముఖుని చేసుకొంటున్నాడు. అతడు సుమతి అయితే ఇంక ఉపదేశమెందుకు? అనటం సరి కాదు. మంచిబుద్ది కలవాడు కాకపోతే చెప్పేది వినడు. కొందరిబుద్ది మంచిదే కాని ఏమి చేయాలో ఏమి చేయగూడదో తెలియదు. అట్టివారికి ఇది దారి అని సరయిన దారి చూపిస్తే ఆ దారిని పయనించి గమ్యం చేరుకొంటారు. కనుకనూ సుమతికే చెప్పాలి. ఇన్ని విధాల ఆలోచించి చెప్పినాడు కనుకనే శతాబ్బులుగా ఈ శతకం విశ్చవ్యాష్తమవుతూ సకలజనప్రియమయింది. ఇవి అడ్డుపాటులేని సీతులన్నాడు. అనగా ఇవి అన్నిదేశాలలోనూ అన్నికాలాలలోనూ అన్ని వయస్సులలోఉన్నవారికీ ఉపయోగకరమైనవి, ఎవరూ అడ్డుచిప్పగానివి, చెప్పబోనివి అనిన కవివిశ్వాసం ప్రకటమవుతున్నది. ఇందులో ఉన్నవి కొన్ని అట్టివి కొవేమో అని ఎవరికైనా అనిపించవచ్చు. ఈ రకమైన భావాలకు కాలాన్నీ దేశాన్నీ బట్టి క్రొత్తవివరణం ఆవసరమవుతుంది. కవి ఉద్దేశించినది విశ్చ(శ్రేయస్సనీ, అతడు వది చెప్పినా రాగద్వేషరహితమయిన మనస్సుతో చెప్పాడనీ గమనించినపుడు, కొన్ని మాటలకు వాచ్యార్థాన్ని కాక లక్ష్యార్థాన్నీ వ్యంగ్యార్థాన్నీ చెప్పుకొన్నప్పుడు, వాటి వన్నే వాసీ పెరుగుతాయి కాని తరగవు. అట్టి సందర్భాలు వస్తే అలా కవిహృదయం గమనించి ఆనందించవచ్చు. ఈ శతకమంతా కందపద్యాలుగానే చెప్పాడు. సంస్కృతంలోని ఆర్యావృత్తాన్ని పోలినకందం, సంస్కృతంలో లేనిఅందాలు సంతరించుకొని తెలుగులో ఎన్ని సొగసులో ప్రదర్శించింది. కందం చెప్పిననాడే కవి అనిన సూక్తికూడా పుట్టింది. ఇందులో గగ, భ,జ, స, నల - అనే గణాలు ఉపయోగించాలి. వరసగా కాదు, ఒక గణం ఎన్ని మార్పైనా ఉపయోగించవచ్చు. ఒకటవ, మూడవ పాదాలలో మూడేసీ, రెండవ, నాలుగవ పాదాలలో అయిదేసీ గణాలుంటాయి. మొదటి రెండు పాదాలూ పూర్వార్హంగానూ చివరి రెండు 2

శ సుమతి శతకము పాదాలూ ఉత్తరార్హంగానూ పరిగణిస్తారు. ఆరవగణం అనగా రెండవ నాలుగవ పాదాలలోని మూడవ గణం, విధిగా నలమో జగణమో అయి ఉండాలి, రెండవ నాలుగవ పాదాలచివర విధిగా గురువు ఉండాలి. రెండవ నాలుగవ పాదాలలోని మొదటి అక్షరానికీ నాలుగవ గణంలోని మొదటి అక్షరానికీ యతి ఉండాలి. దీనికి ప్రాసనియమం ఉన్నది.కనుక (ప్రాసయతి వెయ్యగూడదు. రౌతుకొద్దీ గుర్రం, కవికొద్దీ కందం. అవ: మనుషులలో బంధువులూ భక్తుడయితే దైవమూూ బయట తిరగాలంటే వాహనమూ మనిషిబీవితంలో (స్రాధాన్యం వహిస్తాడు. కనుక వారివిషయంలో ఎట్టివారితో ఎలా మెలగాలో తరువాతి వద్యంలో చెపుతునాడు : క అక్కజకు రాని చుట్టము (మొక్కిన వరమీని వేల్పు మోహరమునం దా వెక్కిన( బాజని గుజ్దము (గ్రక్కున విడువంగవలయు( గదరా సుమతీ, 2 ప్ర :సుమతీ, అక్కజణకున్‌ = ఇబ్బందీ కష్టమూ కలిగినపుడు, ఇంటిలో శుభాశుభకార్యములు జరిగినపుడు, రాని = సాయపడటానికి రాని, చుట్టమున్‌ = బంధువునూ, (మొక్కినన్‌ = నమస్కరించిననూ, ఈ కీడు తొలగిస్తే ఈ మేలు కలిగిస్తే ఇది ఇస్తా అని (మైొక్కుకొన్ననూ, వరమీని = వరము+ఈని = కోరినది ఇవ్వని, వేల్పున్‌ = దేవతనూ, మోహరమునన్‌ = వ్యూహంలో = యుద్ధంలో ఒక పద్దతిని తీర్చి నిలిపిన సైన్యంలో, తాన్‌ = చాను = రౌత్తు, ఎక్కినన్‌= అధిరోహిస్తే, పాజని = పరుగుపెట్టని, గుజ్ణిమున్‌ = అళ్వాన్నీ, గ్రక్కునన్‌ = వెంటనే, విడువంగ నలయున్‌ = విడువన్‌+కన్‌+వలయున్‌ = విడిచిపెట్టాలి, కదరా = అవునుకదయ్యా ఈ శతకంలో ఇకముందుకూడా ఇలా 'రా' వస్తుంది. అది కవికి కల వాత్సల్యాన్ని సూచిస్తుంది, తా:సుమతీ, ఏదైనా కష్టం కలిగినపుడు సాయపడటానికి రాని, శుభాశుభకార్యాలకురాని బంధువును శీఘ్రంగా వదులుకోవాలి. అలాగే, ఆపద కలిగినపుడు నమస్కరించి ప్రార్థించినా, ఇది తొలగిస్తే నీకిది సమర్పిస్తానని మొక్కుకొనినా, కరుణించని దేవతను సేవించటమూ వెంటనే మానివెయ్యాలి. అలాగే అశ్వాన్ని యుద్ధంలో ఉపయోగించాలని "పెంచుతారు. యుద్ధంలో దానిని ఎక్కినపుడు అది పరుగెత్తక పోతే వెంటనే వదిలివెయ్యాలి, వ్యా : చుట్టాలు తమలో ఎవరికైనా ఏదైనా కష్టం కలిగినపుడు వెళ్ళి పరామర్శించి ఆ కష్టం తొలగిపోవటానికి అవసరమైన సాయం చెయ్యాలి. అప్పుడే బంధుత్వంవల్ల ప్రయోజనమూ పరస్పరం ప్రీతీ ఉంటాయి, అలా కాక, అంతా బాగున్నపుడు తినిపెట్టటానికి మాత్రమే వచ్చే బంధువులనూ శుభాశుభకార్యాలు వారింట జరిగినపుడు మనం వెడితే సంతోషించి, మనయింట జరిగినపుడు రానిబంధువులనూ విడిచిపెట్టటమే మంచిదని

వివేకానందినీ వ్యాఖ్యాసహితం ర్‌ కవిఅభిప్రాయం. ఇలా చెప్పినాడుకదా అని బంధుత్వాలు తెంచుకోమనటం కవిఉద్దేశ్యం కాదు. సాయం వచ్చినా రాకున్నా, శుభాశుభకార్యాలకు ఒకో సారి రాకపోయినా బంధువు బంధువే. బంధువులు ఒకరినాకరు కష్టాలలో ఆదుకోవాలనీ అలా అదుకొనకపోవటం విడిచిపెట్టదగినంత దోషమనీ చెప్పటమే కవిఅభిప్రాయంగా (గ్రహించాలి, మొక్కితే కోరిక తీర్చని దేవుణ్ణి సేవించవద్దనటమూ ఇట్టిదే. ఆపదలో కాపాడని దైవాన్నైనా విడవాలి అంటే ఆపదలో ఉన్నవారిని కాపాడాలి అనే (గ్రహించాలి. భక్తునికి గల 'శ్రద్దాభక్తులనూ చేసుకొన్న సుకృతాన్నీబట్టి భగవంతుడు కరుణిస్తాడు కాని, వీనికి అవసరం వచ్చినపుడు మొైక్కినంతమాళత్రానికి వరాలివ్వడు. ఒక దండంపెట్టి వరమిస్తే దేవుడవు, ఇవ్వకపోతే నిన్ను విడిచిపెడతాననే వాడికి ఏ దేవుడూ వరమివ్వడు. భగవదను([గ్రవానికి పాత్రుడు కావాలంటే మనిషి చేయవలసినది చాలా ఉన్నది. ఉత్తమగుణాలు అలవరచుకొనటం, తాను కరుణించదగిన సందర్భాలలో కరుణ చూపించి, తనకంటె తక్కువ స్టితిలోనివారు తన సాయం కోరి ప్రార్పించినపుడు వారిని ఆదుకొనటం, మొదలయినవి చేయాలి. సకృదేవ ప్రపసన్నాయ తవాస్మీతి చ యాచతే, అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ర్వతం మమ

  • ఒక్కసారయినా నా శరణు వేడి, నేను నీవాడను అని రక్షణ కోరితే ఏ ప్రాణికైనా సరే నేనభయమిస్తా నన్నది భగవంతుని(ప్రతిజ్ఞ, ఆర్తితో అలా వేడుకొనటం ముఖ్యం. యుద్దాశ్వాన్ని పెంచటమే యుద్దంలో వేగంగా పరుగుపెట్టి శత్రుసంహారంలో సాయపడటానికి. అలా పరుగుపెట్టనిదాని నింకా పెంచటం దండగ. కనుక దానినీ విడిచిపెట్టాలి, అవ : సేవకునికష్టం గమనించాలి కఠినవ్వాదయుని సేవించగూడదు. అని చెప్పుబోతున్లాడు : క అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుటకంటెన్‌ వడిగల యెద్దులం గట్టుక మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమటి, తె ప్ర : సుమతీ, అడిగినన్‌ = ఇమ్మని కోరినప్పటికినీ, జీతంబు = వేతనం, ఇయ్యని = ఇవ్వబోని, మిడిమేలపుదొరను = మిడిమేలము+దొరను = గర్వించిన ప్రభువును, కొల్ఫి = సేవించి, మిడుకుటకంటెన్‌ = పరితపించే - బాధపడేదానికంటె, వడిగల = వడి+శకల = వేగంగల, బలంకల, ఎద్దులన్‌ = ఎడ్లను, వృషభాలను, కట్టుక = నాగలికి కట్టి, మడి = చుట్టూ గట్టువేసి వీర్చరచిన వరిపొలము, దున్నుక = దున్నుకొంటూ, మహిలోన్‌ = భూలోకంలో, బ్రతుక వచ్చున్‌ = (బ్రతుకన్‌+వచ్చున్‌ = జీవింపవచ్చును. 8

6 సుమతి శతకము తా : సుమతీ, అడిగినప్పటికీ, జీతం ఇవ్వకుండా పని చేయించుకొనే యజమానుణ్ణి సేవిస్తూ బాధపడటం నిష్ప్రయోజనం. బలమూ వేగమూ కలఎడ్లను నాగలికి కట్టి వరిపాలము దున్నుకొంటూ బ్రతకటం అంతకంటె మంచిది. వ్యా : తన ఖర్చులకోసం ధనం లేనివాడు ఇతరులవద్ద జీతానికి పనిచేయటానికి ఒప్పుకొంటాడు. చేసినవాడు తనను అడగకుండానే పనిచేయించుకొన్నవాడు ఈయవలసిన సమయానికి ఈయవలసిన జీతం ఇవ్వాలి. అలా ఇస్తున్నావుకదా అని నారదుడు ధర్మరాజుని అడుగుతాడు. ఇవ్వకపోతే చాలా అనర్థం కలుగుతుంది అని కూడా చెపుతాడు. ఇదే మాట శ్రీరాముడు భరతునీ అడుగుతాడు. అట్టి స్థితిలో చేసిన వాడే వచ్చి అయ్యా, అవసరంగా ఉన్నది, నా జీతం నాకు ఇమ్మని అడిగినపుడుకూడా, ఇవ్వకపోతే యేమి, అడిగినపుడే ఇవ్వకపోతే యేమి అనే గర్వంతో ఇవ్వని యజమానుని సేవించటం నిషఘ్రయోజనం. అంతకంటె బలమూ వేగమూ కల ఎడ్లను నాగలికి కట్టి వరిమడి దున్నుకొంటూ బ్రతకటం మేలనటంలో విశేషం ఉన్నది, వ్యవసాయమే కష్టం. అందులో నాగలి దున్నటం మరీ కష్టం. అందులోనూ తడి వరి మడిలో దున్నటం ఇంకా కష్టం, మడికి నీరుపెట్టి ఉంచుతారు. మడి నీటిలో మునిగి ఉంటుంది. ఆందులో ముళ్ళు రాళ్ళువంటివి ఉండవచ్చు. అదీ కాక ఎక్కువసేపు బురదనీటిలో నానుతూ కాళ్ళున్నందువల్ల చర్మం మెత్తబడి తరవాత చెప్పులజోడు లేనిదే, ఉన్నా, నడవటం బాధ కలిగిస్తుంది, అలా అటువంటి మడి దున్నుకొంటూ (బ్రతకటం మంచిదన్నందువల్ల జీతమివ్వని యజమానునిసేవ మానసికంగా ఎంత బాధకలిగిస్తుందో, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు దానివల్ల పడవలసి ఉంటుందో చెప్పక చెపుతున్నది. ఇది సమాజసాొమరస్యానికి అవసరం. మావి మాకివ్వటం నుడిమాన్యాలివ్వటం అన్న సామెత ఇందుకే పుట్టింది. బలమూ వేగమూ గల యెద్దులను అనే అర్ధంలో వడిగల యెద్దుల అనటంలో విశేషం ఉన్నది. బలమూ వేగమూ లేని మొండియెడ్లూ తిన్నా బక్కతనం వదలని యొడ్డూ పనికిరావు. పనిచేసే మంచి యొడ్డ్లే కావాలని సూచన, మడి దున్నుక బ్రతుకవచ్చు అనటంలో మరొక స్వారస్యం ఉన్నది. సొంత పొలము చాలినంత ఉన్నవారు కూడా సోమరితనంవల్లనూ నెలజీతానికి నీడపట్టున పనిచేయటం గౌరవమనీ సుఖమనీ ఉద్యోగాలకు ఎగబడతారు. ఆ ఉద్యోగాలిచ్చినవారు మంచివారయితే సంతోషం కలుగువచ్చు కానిఇట్టివారయితే ని'ష్ప్రయోజనంకదా. కనుక (శ్రమ అయినా వ్యవసాయమే మంచిదంటున్నాడు. అదీకాక సొంత వ్యవసాయం చేసుకొనేవాడు చిన్నరైతయినా ఆతని జీవితం స్వతంత్రం. అతని[్రింద పనిచేసే వారుంటారు కాని తత్రకు మరొకరి ్రీందివాడు కాడు. స్వేచ్చా, గౌరవమూ, నలుగురిపై పెత్తనమూ

నివేకానందినీ వ్యాఖ్యాసహితం 7 మొదలయినవి అతనిసొమ్ములు, అవీ లేక ఎంత జీతగాడయినా ఒకరిక్రింద వంగి ఉండినా జీతం కూడా వేళకు రాకుంటే అంతకంటె దయనీయస్థితి ఉండదు. కనుక ఆ ఉద్యోగంకంటె ఈ సేద్యమే మంచిదంటున్నాడు. అవ = బ్రతుకు తొరువుకోనమ అయినా చేయగూడని వనులు వివరించబోతున్నాడు : క అడియాన కొలువు. గొలువకు గుడిముణియము సేయంబోకు కుజనులతోడన్‌ విడునక కూరిమి సేయకు మనుడవిని దోడరయకొంటి నరుగకు సుమతి. డ్డ ప్ర: సుమతీ, ఆడియాస = ప్రయోజనం ఉండని ఆశ కలిగించే, కొలువున్‌ = సేవను, కొలువకు = సేవించకు, చేయకు; గుడిమణియము = దేవాలయంలో ఉద్యోగం, దేవాలయంపై అధికారం, చేయంబోకు = చేయన్‌+పోకు = చేయుటకు వెళ్ళవద్దు, చేయవద్దు,కుజనులతోడన్‌ = కుత్సితబుద్దిగల మనుష్యులతో, నీచులలో, విడువక = విడిచిపెట్టక, ఎల్లప్పుడు, కూరిమి = మైత్రి, చేయకుము = ఆచరించవద్దు, అడవిని = అరణ్యంలో, తోడరయక = తోడు+అరయక = సాహాయ్యం చూడక, ఒంటిన్‌ = ఒక్కడవే, అరుగకు = వెళ్ళకు, తా : సుమతీ, ఎట్టి పరిస్థితిలోనూ నెరవేరే అవకాళంలేని ఆశ కలిగించే సేవ చేయకు. దేవాలయంలోని ఉద్యోగం కాని దేవాలయం మొత్తంపై పెత్తనం చేసే అధికారం కొని చేయకు. నీచబుద్ధి గలవారితో ఎడతెగని స్నేహం చెయ్యకు. అరణ్యంలో ఒంటరిగా ప్రయాణం చేయకు. వ్యా : ప్రయోజనమనుద్దిశ్య న నుందోపి ప్రవర్తతే అన్నది ఆర్యోక్తి ఏ ప్రయోజనమూ అపేక్షించకుండా తెలివి తక్కువవాడుకూడా ఏ పనీ చేయడని దానిఅర్థం. మనుషులకు సాధ్యాసాధ్యాలతో నిమిత్తం లేకుండా ఆశలు కలుగుతుంటాయి. సంకల్పం మనస్సు పని, వికల్పం పరిస్థితుల పని, ఒక పెద్ద ఆశ మనస్సులో పెట్టుకొని, అది ఒకరివల్ల నెరవేరుతుందని భావించి, వారిసేన చేయటం ప్రారంభించామనుకోండి. వారి సేవవల్ల ఆ ఆశ నెరవేరే అవకాశం ఉంటే అది మంచిపద్ధతే, కాని, ఎవరొసేవ చేస్తున్నామో వారికా ఆళ తీర్చగల శక్తి ఉన్నదో లేదో, అదికూడా ఉన్నా దానికవసరమైన పరిస్టితులున్నాయో లేవో, అవీ ఉన్నా తనకు అట్టి ఉపకారం పొందగల అర్హత ఉన్నదో లేదో, అర్హత ఉన్నా ఆచేసేసేవ ఆంత ప్రయోజనం ప్రతిఫలంగా పొందదగినదవునో కాదో, ఆలోచించుకొని నిశ్చయించుకొనకుండా, ఆశపడి సేవించినందువల్ల వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా అది నెరవేరక బాధపడవలసివస్తుంది. కనుక ఆశ ఉన్నదికదా అని చాకిరీ చేస్తే లాభం ఉండదు, శ్రీ

/ సుమతి శతకము దైవంమీది భక్తితో భక్తులు ఆలయాలు కట్టిస్తారు. అందులోని దైవానికి ధూప-దీప- నైవేద్యాదులు సక్రమంగా జరగటానికీ మడులూ మావ్యాలూ అస్తిపొస్తులూ దానం చేస్తారు. ఆ యా సమయాలలో స్వామికి ధన-ధనేతరములయిన కానుకలూ మొైక్కులూ సమర్పిస్తారు. దేవాలయంలో రకరకాల పనులు చేసేవారుంటారు, చివరిసేవకునినుంచి (ప్రధానాధికారివరకూ. నిజానికి వీరు భక్తితో ఉచితసేవగా (ప్రతిఫల రహితంగా ఆ యా పనులు చేయాలి. కాని అందువల్ల వారి కుటుంబాలు గడవవు, కనుక, జీతబత్తేలో, మూన్యాలో ఏర్పరిచారు. మానవుని ఆశ గరికగడ్డి లాంటిది. గరిక అవకాశం ఉన్నచోట చెరచెర వ్యాపిస్తుంది. ఆశ అవకాశం దారికినచోట అక్రమసక్రమవిచారం లేకుండా ద్రవ్యాదులు కాడేయజూస్తుంది. ఇతరులు విశ్వాసంతో దైవానికి వినియోగమవుతుందని సమత్స్చించినది అక్రమంగా కాజేస్తే అది విశ్వాస ద్రోహమూ దైవద్రోహమూ అవుతుంది. దైవద్రవ్యాలపై అధికారి ఆయినప్పుడూ ఈ బుద్ది ప్రసరిస్తుంది. ఒకని సామ్ముకాజేయటమే దోషమైతే దైపద్రవ్యాపహరణం మరీ మహాదోషమై నరకానికి దారి తీస్తుంది. ఎంత సద్బుద్దితో వ్యవహరించ దలుచుకొన్నా, తెలిసో జెలియకో ఎంతో కొంత దైవద్రవ్యం కాచేయట౦ జరగక మానదు. అందుచేత ఆ (ద్రవ్యానికి దూరంగా ఉండటమే మేలు, ఇక పనిగట్టుకొని స్వామి అస్తులూ, (ద్రవ్యాలూ, అభరణాలూ మొదలయినవి కాజీసేవారి కేగతులు రాసిపెట్టి ఉన్నాయో ఊహిస్తేనే భయం వేస్తుంది. మనుషులకు ఉండవలసింది పాపభీతీ దైవభక్తీ ఇది తలక్రీిందులయి పాపరక్షీ ధైవభీతీ "పెరుగుతున్నాయి.

ఈ సందర్భంలో రామాయణం ఉత్తరకాండంలోని ఒకకథ ఉదాహరించదగినది. శ్రీరామచంద్రుడు రాజ్యమేలుతుండగా ద్వారం వద్ద ఎవరైనా కార్యార్థులున్నారేమో చూచి రమ్మని రాముడు పంపీతే లక్ష్మణుడు వెళ్ళి కార్యార్టులున్నారా ఆంటీ నేనున్నా నన్నవాడే లేడు. ప్రజలకు బెంగలూ లేవు, తెసుళ్ళూ లేవు, రాముడు రాజ్యమేలుతుంటే భూమి చక్కగా పండేది, ధర్మంఫ్రకారం పరిసాఅన సాగేది, కనుక ఎవనికీ బాధే ఉండేది కాదు. కనుక నాకు కావలసినపని ఇది ఉన్నది అని ఒకడు వచ్చి చెప్పుకొనవలసిన అవసరమే ఉండేది కాదు. ఈ సంగతినే లక్ష్మణుడు వెళ్ళి రామునికి చెప్పాడు. రామునికి సంతోషమయితే కలిగింది కాని మళ్ళీవెళ్ళి చూచి రమ్మన్నాడు. ఉత్తనమమయిన నీతిని చక్కగా ఉపయోగించినందువల్ల ఎక్కడా అధర్మం ఉండదు. అట్టి సరిపాలకుడంటే భయపడి ప్రజలు ఒకరినొకరు రక్షించుకొంటారు, నా ఉద్యోగులు నేను వదలినబాణాలలాగే నొ (ప్రజలను కాపాడుతుంటాడు. ఆయినా, మహాబాహూ, నీవు తదేకాసక్తితో ప్రజలను కొపాడాలి అనికూడా చెప్పాడు. లక్ష్మణుడు మళ్ళీ వెళ్లిచూస్తే రాజభవన ద్వారంవద్ద ఒక కుక్క నిలిచి ద్వారంవైప్పు చూచి అరుస్తోంది. మహాభాగా, నీకేమయినా పని ఉంటే చెప్పు,

వివేకానందినీ వ్యాఖ్యాసహితం త్తి నన్ను నమ్ము అన్నాడు. రాముడు సర్వ(ప్రాణులకూ రక్షకుడు, ఏ పని అయినా (శ్రమ లేకుండా చేస్తాడు. భయం కలిగినవారికి అభయమిస్తాడు. కనుక అతనికే చెప్పాలనుకొంటున్నాను అన్నది కుక్క. వెళ్ళి ఆ మాటే రామునికి చెప్పి తిరిగి వచ్చి కుక్కతో - అయితే వచ్చి రామునికే చెప్పుకో - అన్నాడు. కుక్క - దేవాలయంలో, రాజగృహంలో, (బ్రాహ్మణులయింట్లో, అన్నీ, దేవేంద్రుడూ, సూర్యుడూ, వాయువూ ఉంటారు. కనుక వాటిలో నావంటి తక్కువ పుట్టుక పుట్టినవాళ్ళు ప్రవేశించకూడదు. కనుక నేను లోపలికి రాలేను, రామరాజుగారు ఆకారం ధరించి వచ్చిన ధర్మం, సత్యవాది, యుద్దసమర్జుడు, సర్వప్రాణిహితంపైనే ఆయనకు ఆసక్తి సంధి - విగ్రహ - యాన - ద్వైధ -ఆసన-ఆశ్రయములనే ఆరు విధముల రాజనీతిప్రయోగమూ తెలిసినవాడు. న్యాయం చేస్తాడు సర్వజ్ఞుడు, సర్వదర్శి. ఆయనంతగా ఎదుటివారిని సంతోషపెట్టేవాడు లేడు. ఆయన చంద్రుడు, ఆయన మృత్యువు, ఆయన యముడు, ఆయన కుబేరుడు, ఆయన అన్ని, ఆయన ఇంద్రుడు, ఆయన సూర్యుడు, ఆయన వరుణుడు, ప్రజాపరిపాలకుడు ఆయన. కనుక ఆయనతో చెప్పు సౌమిత్రీ. నన్ను అనుమతించనిదే నేను లోపలికి రాను - అన్నది. లక్ష్మణుడు కనికరమున్నవాడూ కాఠిన్యంలేనివాడూ కనుక మళ్ళీ వెళ్ళి రామునితో చెప్పాడు. ఆయన శీఘ్రమే ప్రవేశపెట్టు అన్నాడు. లక్ష్మణుడు గబగబా వెళ్ళి కుక్కను లోపలికి తీసుకు వచ్చాడు. రాముడు - ఏమి చెప్పాలనుకొన్నావో చెప్పు నీకేధయమూ లేదు అన్నాడు.

కుక్కబు(ర్ర బద్దలై ఉంది. అది రామునితో - రాజే ప్రాణిసృష్టికర్త, రాజే నాయకుడు. అందరూ నిద్రపోతుంటే రాజు మేలుకొని ఉంటాడు. ప్రజలను పాలిస్తాడు. రాజు రాజనీతిని చక్కగా ఉపయోగించి ధర్మాన్ని కాపాడుతుంటాడు. అందరినీ రక్షిస్తుంటాడు. పరిపాలకుడు పాలనచేయకపోతే ప్రజలు నళిస్తారు వెంటనే, రాజు కర్త రక్షకుడు, ఈ జగత్తుకంతటికీ తండ్రి. రాజే కాలం, రాజే యుగం, రాజే ఈ జగత్తు,

జగత్తునంతటినీ ధరిస్తుంది - మోస్తుంది, బ్రతికిస్తుంది కనుక ధర్మం అన్న పేరు దానికి వచ్చింది. అదే ప్రజలను మోస్తున్నది. ధర్మంపైనే ముల్లోకాలూ ఆధారపడి ఉన్నాయి. అది శత్రువులనూ మోస్తుంది, ఆపుతుంది, కనుకనే ధారణం, ఆ పని చేసేది ధర్మం అన్నారు. చచ్చిపోయాక కూడా ఫలమిచ్చేది ధర్మం. ధర్మంవల్ల పొందరానిది లేదని నా అభిప్రాయం, దానం, దయ, సజ్జనులను గౌరవించటం, వ్యవహారంలో ఆర్జవం - ఇది పరమధర్శ్మం. ఇలా ప్రజలను రక్షించినందువల్ల ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ సౌఖ్యం కలుగుతుంది. నీవు ప్రమాణాలకు ్రమాణానివి, నీకు ధర్మం తెలుసు, సజ్జనులు దానినిఎలా అచరించారో (ఆచారం) తెలుసు. నీవు ధర్మానికి పరమనిలయం. నీవు

క్‌

10 సుమతి శతకము సుగుణస్తముద్రుడవు. అజ్ఞానంవల్ల నేనీ మాటలు పలికాను. శిరసా క్షమింపగోరుతున్నాను. నాపై కోపపడదగినవాడవు కావు - అన్నది. దానిమాటలు విని రాముడు - నీపనేమిటో చెప్పు నమ్మి, ఆలస్యం చేయకు - అన్నాడు.

కుక్క - రాజ్యాన్ని ధర్మంప్రకారమే సంపాదించాలి. ధర్మం ప్రకారమే పరిపాలించాలి,

ధర్మంవల్లనే రక్షణకోసం తనను చేరవలసినవాడవుతాడు రాజు, అన్ని భయాలూ తొలగిస్తాడు - ఇది తెలుసుకొని నాపనేమిటో విను. సర్వార్ధసిద్దుడు అని ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన ఒక బ్రాహ్మణునియింటిలో ఉంటున్నాడు. నేనేపాపమూ ఎరగకపోయినా ఆయన నన్ను కొట్టాడు నిష్కారణంగా - అన్నది. ఆ మాట వినగానే రాముడు వాకిటికావలివానిని పంపించి సర్వార్ధసిద్దుని రప్పించాడు. అతడెందుకు రప్పించావు అని అడిగాడు. రాముడు --ఈ కుక్కను కట్టెతో కొట్టావట, ఇది నీకేమి అపరాధం చేసింది అని అడిగాడు.

(క్రోధం ప్రాణాలు తీసే శత్రువు. క్రోధం మిత్రునిముఖంతో ఉన్న శత్రువు. (క్రోధం చాలా వాడికల కత్తి(క్రోధం అన్నింటినీ తొలగిస్తుంది. తపస్సు చేయవచ్చు యజ్ఞం చేయవచ్చు దానం చేయవచ్చు, కాని ఒక్క (క్రోధం ఉంటే అది సమస్తాన్నీ హరిస్తుంది, కనుక (క్రోధాన్ని విసర్జించాలి. ఇంద్రియాలు దుష్టములైన గుర్రాలవంటివి. విషయాలవైపు పరుగులు తీస్తుంటాయి. వాటిని ధైర్యమనే సారథిద్వారా మరలించాలి. మనసా వాచా కర్మణా చూపుతో లోకానికి శ్రేయస్కరమైనదే చేయాలి. అలా ద్వేషరహితంగా ఆచరించినవానికి ఏ దోషమూ అంటదు. అదుపులేని మనస్సులా వాడికత్తి కాని, కాలితో

తొక్కిన పాము కాని నిత్యమూ క్రోధంతో నిండి ఉండే శత్రువు కాని కీడు చేయలేరు. ఒకడు ఎంత వినయమైనా నేర్వవచ్చుగాక, స్వభావం మారదు. స్వభావం దాచి ఉంచినా కార్యంపట్ల అదే పనిచేస్తుంది - అన్నాడు. సర్వార్ధసిద్దుడు - నేను దీనిని క్రోధం వచ్చినందున కొట్టాను, భిక్షాసమయం దాటిపోయింది. భిక్షకోసం వెడుతున్నాను. ఈ కుక్క వీధిలో ఉంది. పో పో అన్నాను. అది దానిఇష్టం వచ్చినట్లు కదిలింది కాని వీధిచివర తగనిరీతిని నిలిచే ఉంది. ఆకలితో ఉన్నాను. కోపం వచ్చింది. కొట్టాను. తప్పే. తగినశిక్ష వెయ్యి. నీ దండన పడితే నరకదండనభయం ఉండదు నాకు - అన్నాడు. ఆపై రాముడు ఏమి శిక్ష వెయ్యమంటారు. చక్కగా శిక్షలు వేస్తుంటే ప్రజలకూ రక్షణ ఉంటుంది - అని సభాసదులను అడిగాడు. భృగుడు, అంగిరసుడు, కుత్సుడు మొదలైనవారు, వసిష్టుడు, కళ్యపుడు, ధర్మపాఠకులు మొదలైనవారు, సచివులు, వర్తకులు - వీరూ, ఇతరపండితులూ ఎందరో అక్కడ ఉన్నారు. (బ్రాహ్మణుడు శిక్షలతో వధించదగినవాడు కొడు - అని శాస్త్రవేత్తలంట్లారు అని రాజధర్మాలలో పండితులయిన వారందరూ అన్నారు. అపుడా

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 11 కుక్క - రామా, నాపట్ల నీవు ప్రసన్నుడవయితే, నాకు వరం ఈయదగినదైతే, నేను నీకేమి చేయను? అని ప్రతిజ్ఞ చేశావు కనుక, ఇతనిని కాలంజరంలొని మఠానికి అధిపతిని చెయ్యి -అన్నది. రాముడు అలాగే చేశాడు. ఆ బ్రాహ్మణుడు ఏనుగునెక్కి వెళ్ళాడు సంతోషంతో. అపుడు రామునిసచివులు అయ్యా, మీరే ఆయనకు వరమిచ్చారు కాని, శాపమూ దండమూ కాదు అన్నారు. రాముడు మీకు గతితత్య్యం తెలియదు. కారణం కుక్కకు తెలుసు అని, అదేదో చెప్పమని కుక్కనడిగాడు. అది చెప్పింది : అది పూర్వజన్మలో ఆ మఠానికి అధిపతి. యజ్ఞశిష్టాన్నం ఆహారం. దేవతలనూ ద్విజులనూ పూజించటమూ, దాసీదాసులకు జీతబత్తేల్విటమూ తనపనులు, పుణ్యం ఆచరించేది. దేవునిసొమ్ము కాపాడేది. వినయమూ శిలమూ ఉండేవి. సర్వప్రాణులహితముపట్ల ఆసక్తి ఉండేది. అట్టి నాకు ఈ గతి ఈ ఘోరావస్థ వచ్చిపడింది. ఈ కోపిస్టి బ్రాహ్మణుడు, ధర్మం విడిచి అహితం ఆచరించేవాడు, కఠినుడు, పరుషుడు, అజ్ఞాని, అధార్మికుడు, అటేడు తరాలూ ఇటేడుతరాలూ నరకంలో పడగొట్టి తీరతాడు. కనుక ఏ దశలోనూ ఇట్టి అధికారం చేపట్టగూడదు. పుత్రులు, పశువులు, బంధువులు - వీరితోసహ ఎవనినైనా నరకానికి పంపదలచుకొంటే దేవతలు, గోవులు, (బ్రాహ్మణులు - వీరిపై అధికారిని చేయాలి. (బ్రహ్మస్వం, దేవతాద్రవ్యం, 'ప్రీధనం, బాలధనం, తాను దానం చేసినది తిరిగి - తీనుకొన్నవాడు తనకిష్టమైనవారితోనహ నళిస్తాడు. (బ్రాహ్మణద్రవ్యమూ, దేవద్రవ్యమూ కాజేసినవాడు తత్‌క్షణమే ఆవీచి అనే ఫోరనరకంలో పడతాడు. దేవద్రవ్యమూ బ్రాహ్మాణద్రన్యమూ మనసా హరించినప్పటికీ, అనగా హరించాలని ఆలోచించినప్పుటికీ, ఆ నరాధముడు నరకంనుంచి నరకంలో పడుతూనే ఉంటాడు - అని, ఆ మాట విన్నాటప్పటికి రామునినయనాలు ఆశ్చర్యంతో ఇంతయ్యాయి. మహాతేజస్వి ఆ కుక్క తన దారిని తాను వెళ్ళింది. పూర్వజన్మవల్ల దానిమనస్సు మంచిది. ఈ జన్మలోని జాతివల్లమాత్రమే దానిలోనిదోషం. అందుచేత ఆ మహానుభావంగల కుక్క వారాణసిలో ప్రాయోపవేశం చేసింది. కనుక గుడిమణియము సేయబోకు ఆనటం. కుజనులతో విడువక కూరిమి చేయకు అన్నది మరొక అమూల్యమయిన నీతి. కుజనులనగా కుత్సితులు, నీచబుద్ధి కలవారు అని అర్ధం. కుత్స ఆంటే నింద. కుత్సితం అంటే నిందించబడినది అని ఆర్ధం, నిందించదగినది అని భావం. ఎవరి బుద్ది వారికుంటుంది. మనం మంచివారమైతే వారెవరైతే ఎట్టివారైతే మనకేమీ అనుకోరాదు. అరు వెలలు సొవానం చేస్తే వారు వీరవుతారని శాస్తం. కనుక దూరంగానే ఉండాలి. ఉత్తమ సాంగత్యంవల్ల నీచులు ఉత్తములు కావచ్చుగదా, అది మంచిదేకదా అనీ అనుకోరాదు. సీరి అబ్బకసోయివా చీడ అబ్బుతు౦దని మరొక శాస్తం, మంచికంటె చెడు 6

శై సుమతి శతకము త్వరగా వ్యాపిస్తుంది. కలరా వ్యాపించినంత వేగంగా పరిశుభ్రతా ఆరోగ్యమూ వ్యాపించవు. కనుక వ్యాధి వ్యాపింపజేసే పదార్ధాలకు దూరంగా ఉండటమే పరిశుభ్రంగా ఆరోగ్యంతో ఉండేవారికయినా (శ్రేయస్కరం. అధికసంఖ్యాకులు కుజనులు, అనగా ఏ దుర్గ్షుణమూ లేని వారెవరూ ఉండరు. సుజనులు ఏ దోషమూ లేనివారు అల్పసంఖ్యాకులు. జనులు కుజనులయినా పదిమందికీ అనసరమున్న స్థానాలలో వారు అనేక కారణాలవల్ల ఉంటారు. వారితో సాంగత్యం కూడదంటే లోకమెలా నడుస్తుంది? అనరాదు. విడువక కూరిమి చేయవద్దన్నాడు. కాని అసలే వారితో వ్యవహరించవద్దు అనలేదు. పొలంలోనిపైరుకి పట్టే పురుగులను చంపటానికి విషం అవసరమే కావచ్చు. కాని దానిని వాడేటప్పుడు తీసుకొనవలసిన జాగ్రత్తలు తీసుకోకపోతే, ఉపయోగించాక దానిస్టానంలో దానిని ఉంచకపోతే ప్రాణాలు తీస్తుంది. అలాగే కుజనులతో వ్యవహరించటం తప్పనిసరి అయినపుడు, విషంతో క్రూరమృగంతో మహమ్మారితో వ్యవహరించినట్లు వ్యవహరించాలి గాని, పూసుకొని తిరగగూడదు. అడవిదారిలో ఇతరులెవరూ సాయం లేకుండా పోవద్దు అన్నదీ అవసరమైన హెచ్చరికే, (క్రూరమ్బగాలు, దొంగలు, ఉండవచ్చు. కొన్ని తీగెలే మొక్కలే ప్రాణాంతకాలుంటాయి, దప్పిక దారితప్పటం, ఆకస్మికంగా జబ్బుచేయటంవంటివి సంభవించవచ్చు. కనుక్క కొందరితో కలిసిఉండటం ఆవసరం. అన : ఆద్భష్టవళాత్తూ ఉత్రమపదవులలో ఉన్లువారు ఉండరాని రీతి చెప్పబోతున్లాడు ఇ క, అధరము కదలియు.( గదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుండా వధికారరోగపూరిత బధిరాంధకశవము( జూడ బాపము సుమతీ. క్‌ ఫ్ర : సుమతీ, అధరము = క్రిందిపెదవి, కదలియు( గదలక = కదలియున్‌+కదలక = కదలినప్పటికినీ కదలకుండా ఉన్న విధముగా అనగా ఆంత తక్కువగా మాటాడుతూ, మధురములగు =మధురములు + అగు = తీయనైన భాషలుడిగి = భాషలు+ఉిడిగి = మాటలు మాని, మౌనవ్రతుండౌ = మౌన(వ్రతు౦డు + జౌ = మాటాడని దీక్ష పట్టినవాడు అయిన, అధికార... శవమున్‌ = అధికార = ఉద్యోగం అనే, రోగ = తెగులుతో, పూరిత = నిండిన, బధిర = చెవుడు గలవాడూ, అంధక = గ్రుడ్డితనం కలవాడూ ఐన, శవమున్‌ = పీనుగు వంటివానిని, చూడేన్‌ = చూచినట్టెతే, పాపము = పాపం వస్తుంది, తా : సుమతీ, అధికారి అయినవాడు మాటాడడు, ఆడితే పెదవులు కదిలీకదలనట్లు బహుస్తల్బ౦ంగా మాట్టాడతాడు. మౌనదీక్షలో ఉన్నట్టుంటాడు. ఆడినమాట కటువుగా

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 3 ఉండేటట్టే కాని ఇంపుగా ఉండేటట్టు మాటాడడు. ఇతరులు చెప్పినది వినిపించుకోడు. ఇతరులను సరిగా చూడడు. చూచీ సత్యం (గ్రహించడు. ఇట్టివాడు చెవులు వినిపించని, కనులు కనిపించని శవంవంటివాడు. శవాన్ని చూస్తే కాళ్ళూ చేతులూ కడుగుకొని ఆచమనం చేయాలి, ముట్టుకొంటే స్నానం చేయాలి అంటారు. లేకపోతే పాపం వస్తుంది. ఇట్టి అధికారి అనే శవాన్ని చూస్తే అట్టి పాపం వస్తుంది.

వ్యా : ఇది చాలా కటువుగా చెప్పినట్టూ అధికారులను నిందించినట్టూ కనిపిస్తుంది కాని, సంస్కారహీనులై ఉన్నత పదవులలో ఉన్నవారు చాలా మంది ప్రవర్తించే రీతిని విమర్శిస్తూ వారలా ఉండకూడదని ఉపదేశిస్తున్నది.

ఉన్నతస్థానాలలో ఉన్నవారు ఇతరులతో చనువుగా ఉంటే, వారు అది అవకాశంగా తీసుకొని ఆడుగకూడనివి అడుగుతారు, ఈయగూడనివి ఇమ్ముంటారు, చేయగూడనివి చేయమంటారు, ఇతడూ మనవంటి వాడే అనుకొని చెప్పిన మాట లక్ష్యపెట్టరు - ఇట్టి భావాలతో గంభీరంగా ఉండి, తక్కువ మాట్లాడతారు, ఆడినా, కరుకుగా తప్ప తియ్యగా మాట్టాడరు. తరచు తమ క్రిందివారు చెప్పినది వినిపించుకోరు. వారివైపు చూడనైనా చూడరు. ఈ లక్షణాలు శవానికుంటాయి. గనుక వీరూ అట్టివారే, అంటున్నాడు. ఇట్టివారిని చూస్తే పాపముంటున్నాడు. అధికారులలో అధిక సంఖ్యాకులలో ఇట్టి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ప్రవర్తనం సరి అయినది కాదు. అన్ని విషయాలలోలాగానే అధికారం లభించటానికి కూడా కారణాలు అనేకముంటాయి. వాటిలో అదృష్టంకూడా ఒకటి. అదృష్టం అంటే కనబడనిది అని అర్ధం. అంటే మనకు తెలియకుండా ఏదో కారణం ఉన్నదని భావం. అలాంటిదేమి ఉంటుంది? పూర్వజన్మలలో చేసుకొన్న సుకృతం. ధ్యానం కొంచెం చేసినా కొందరికి సిద్ది కలుగుతుంది. మరికొందరికెన్నాళ్ళు చేసినా కలుగదు. దానికి కారణమేమిటంటే, శ్రీరామకృష్ణపరమహంస గతబహుజన్మలలో చేసిన పుణ్యకర్మలఫలం అని సమాధానం చెప్పారు. ఒకడు కాస్త కల్టు 'త్రాగినమాత్రానికే మత్తెక్కి పడిపోయాడు. ఈ కాస్త కల్లుకే ఇలా అయాడేమిటి? అని కొందరు ఆళ్చర్యపోతుంటే, అక్కడ ఉన్నవారు ఇతడు రాత్రి అంతా (త్రాగుతూనే ఉన్నాడు అని సమాధానం చెప్పారట. అలాగే ఇతరజన్మలలో చేసిన సుకృతంవల్ల అధికారం లభించి ఉండవచ్చు కాని, ఇది కారణం అని వారికికూడా తెలియదు కనుక అదృష్టం అంటారు. అలా వచ్చిన అధికారం ఉన్నంత మాత్రాన ఎవరూ సర్వజ్ఞులూ సర్యోత్తములూ సర్వశక్తిమంతులూ కాలేరు. ఉన్నతాధికారాలలో ఉండకపోయినా, ఉంటే ఉత్తమాధికారులుగా ఇంకా బాగా రాణించగల సమర్హులు, సుగుణవంతులు, జ్ఞానవిజ్ఞానవంతులు అయినవారు చాలామంది ఉంటారు. తాను పదిమందికీ సంబంధించినపనులు చూడవలసిన స్థానంలో ఉన్నాడు,

7

క సుమతి శతకము కనుక, తనను కలుసుకొని తమ పనులు చెప్పుకొనటానికి సామాన్యులూ అసామాన్యులూ కూడా వస్తుంటారు, వారు చెప్పుకొనేది ఓపికతో విని, వారు చెప్పేదానిలోని సామంజస్యాన్ని జాగ్రత్తతో (గ్రహించి, ఇతరులకు ఆపకారంకానిది, వీరు కోరినది చేసిపెట్టటం కర్తవ్యం. చేయటం సాధ్యం కాకపోయినా తగురీతిని మాటాడి, మనం చెప్పినది విన్నాడు, సాధ్యం అయిన పక్షంలో చేస్తాడు అనే తృప్తి వారిలో కలిగించి పంపాలి. భీమకాంతైర్చుపగుణైః వ బభూవోవజీనినామ్‌, అధృష్యశ్చాభిగమ్యశ్చ యాదోరల్లై రివార్లవ -పరిపాలకునికి ఉండవలసినవి రెండురకాల గుణాలు. ఒకటి దోషులకు భయంకరమైనవి. రెండు ఉత్తములకు మనోహరమైనవి. ఈ రెండురకాలగుణాలూ దిలీపమహారాజాలో ఉన్నాయి. అందువల్ల జలజంతువులతో భయంకరమూ ముత్యాలవంటి రత్నాలతో మనోహరమూ అయిన సము(ద్రంలాగే అతడు చెనకరానివాడూ చేరదగినవాడూ అయినాడు తనమీద ఆధారపడినవారికి అన్నాడు కాళిదాసు. ఇది అధికారులకు ఆదర్శప్రాయమయిన ప్రవర్తన, అలా ప్రవర్తింపని వానిగతి ఏమిటో ఒకకవి ఎవరో ఇలా పేర్కొని అమరుడైనాడు ; విధిసంకల్పముచే నొకానొకండు తా విశ్వంబు( బాలించుచో బధిరంబెక్కున, చూపు తక్కువ, సదా భాషల్‌ దురుక్తుల్‌ నునో వ్యథతో మత్తతతతోడ దుర్వ్యసనదుర్వ్యాపారతల్‌ చెందు; న య్యడ్సి కొారాంతమువందు( జూడనలెరా ఆ యయ్య్యపొబాగ్యముల్‌ (చాటుపద్యరత్నాకరము) అవ : ఎట్టి ఊర్లో నివసీంచాలో చెవుతున్నాడు : క అప్పిచ్చువాండు, వైద్యుడు, నెప్పుడు నెడతెగక సాలు నేజును, ద్విజాండున్‌ జొప్పడిన యూర నుండుము, చొప్పడకున్నట్టి యూరు సారకుము సుమతీ. 6 ప్ర : సుమతీ, అప్పిచ్చువాండున్‌ = అప్పు+ఇచ్చువాండున్‌ = బుణం ఇచ్చేవాడూ, వైద్యుండున్‌ = రోగం రాకుండా చూసేవాడూ వచ్చిన దానికి చికిత్స చేసేవాడూ, ఎప్పుడున్‌ = “ఎల్లవేళలా, ఎడతెగక = విచ్ళిన్నంకాకుండా, ఆగిపోకుండా, పాలు = (ప్రవహించే, ఏజును = నది, ద్విజాడున్‌ = బ్రాహ్మణుడూ, చొప్పడిన = చొప్పు+పడిన = దొరకునట్టి, ఊరన్‌ = (గ్రామములో, ఉండుము = నివసించవలసినది, చొప్పడకున్నట్టి = చొప్పు+పడక + ఉన్న+అట్టి = దొరకని ఊరు, చొరకుము = (ప్రవేశింపకు.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం [5

తా : సుమతి, అవసరమైనపుడు అప్పిచ్చేవాడు, జబ్బుచేయకుండా చూచి, జబ్బుచేసినపుడు చికిత్స చేసేవాడు," త్రాగటానికి నీటినిచ్చే జీవనది, వివాహాది సంస్కారాలుచేయించే బ్రాహ్మణుడు, వీరు లభించే ఊళ్ళో నివసించాలి. వీరు దొరకని ఊళ్ళో ప్రవేశించవద్దు.

వ్యా ఏ ఎంతటి వానికైనా బుణం చేయవలసిన అవసరం రావచ్చును. అప్పుడు బుణమిచ్చేవాడు అందుబాటులో ఊళ్ళో ఉండాలి. ఎంత ఆరోగ్యవంతునికైనా ఏదో సుస్తీ చేయకుండా ఉండదు. కనుక సుస్తీ చేయనిరీతి మప్పేవాడూ, చేసినపుడు మందిచ్చేవాడూ ఉండాలి. నీటి వసతి లేనిదే క్షణం గడవదు. కనుక ఏ కాలంలోనూ ఎండిపోకుండా ప్రవహించే నది ఉండాలి. పుట్టినది మొదలు గిట్టేరకూ మన సమాజంలో జాతకర్మ మొదలు అంత్యేష్టివరకూ, అంతకు ముందుకూడా గర్భాధానం సీమంతోన్నయనం పుంసవనం మొదలయిన కొన్ని సంస్కారాలు జరిపించుకొనవలసిన అవసరం ఉన్నది. అవి జరిషించటానికి ఆ విద్య తెలిసిన బ్రాహ్మణుడుండాలి. ఈ ఐదుగురూ లభించే ఊళ్ళోనే నివసించాలి, లేని ఊళ్ళో (ప్రవేశించనే కూడదు అన్నాడంటే, ఇంక నివసించగూడదు అని వేరే చెప్పనక్కరలేదు. పూర్వ సంస్కృత (గ్రంథాలలో గూడా తృణ-జల-కాస్ట్ర-సమృద్ది కల ఊళ్ళో ఉండాలి అని వ్రాసి ఉన్నది. ఈ పద్యంలో చెప్పబడిన భావం గల శ్లోకాలు మనకు వివిధపురాణాలలో లభిస్తున్నాయి :

తత్ర మిత్ర న నస్తవ్యం యత్ర వాస్తి చతుష్టయం,

ముణదాతా చ వైద్యళ్ళ శ్రోత్రియః పజలా నదీ, ఇది మార్కండేయపురాణం 31వ అధ్యాయంలోని 115 వ ళ్టోకం.

ధనివః శ్రోత్రియో రాజా నదీ వైద్యస్తు పంచమ: |

సంచ యత్ర న విద్యంతే న కుర్యాత్తత సంస్టితిమ్‌ 8 ఇది గరుడపురాణం 110 వ అధ్యాయంలోని 26 వ శ్ఞోకం, ఇందులో బుణదాతకు బదులు ధనవంతులు అనీ, అదనంగా రాజు ఉండాలనీ ఉన్నది. ఈ అధ్యాయంలోనే ఈ పురాణంలో, ఉండగూడని ఊళ్ళను చెప్పే మరి రెండు శ్ఞోకాలుగూడా ఉన్నాయి.

లోకయాత్రా భయం లజ్జా దాక్షిణ్‌యం దావశీలతా ॥

పంచ యత్ర న విద్యంతే న తత్రదినససం వ్రదేత్‌। 27 జరుగుబాటు, భయం, లజ్జ, దాక్షిణ్యం, దానస్వభావ౦ - ఈ ఐదూ లేనిచోట ఒక్కరోజు కూడా గడసగూడదు.

కాలవిబ్చోత్రియో రాజా నదీ సాధుశ్చ సంచనుః

ఏతే యత్ర న విద్యంతే తత్ర వాసం న కారయేత్‌ [ 28

8

కేం సుమతి శతకము కాలవేత్త అనగా జ్యోతిష్కుడు, శ్రోత్రియుడు, రాజు, నది, ఐదవవాడు సాధువు - ఈ ఐదుగురు లేనిచోట నివసించగూడదు. అవన : కొని చేయరానివి ఉండరానివి చెప్పీ నిషేధిన్తునాడు క అప్పుగొని చేయువిభనము ముప్పున( బ్రాయంపుటాలు మూర్ముని తపసమున్‌ దప్పరయని వృవురాజ్యము దెవ్పరమై మీద గీడు దెచ్చుర సుమతి, లౌ (ఫ్ర : సుమతీ, అప్పుగొని = అప్పు+కొని = బుణముచేసి, చేయువిభవము = సంపాదించే ఆస్తి. చేసేదానం, అనుభవించే హోదా, ముప్పునన్‌ = ముసలితనంలో, పప్రాయంపుటాలు = ('ప్రాయము+ఆలు = యౌవనంలో ఉన్న భార్య, మూర్జునితపమున్‌ = తనకు తోచని, ఇతరులు చెపితే వినని వాని తపస్సూ, తప్పరయని = తప్పు+అరయని = తప్పు చేసిన వానిలోగల దోషాన్ని గమనించని, నృపు = ఏలువానియొక్క, రాజ్యము = ఏలుబడి, ఇవి, మీందన్‌ = తరువాతి కాలంలో, దెప్పరమై = దెప్పరము+ఐ = ఆపద, కష్టము కలిగించేవి అయి, కీడు = నాశం, చేటు, హాని, తెచ్చుర = తెచ్చున్‌+ర = తీసుకొని వస్తాయి నాయనా, తా : సుమతీ, అప్పుచేసి ఆస్తి సంపాదించవచ్చు, జౌదార్యం (ప్రదర్శించి దానం చేయవచ్చు, పెద్దస్థితీ హోదా ప్రదర్శించవచ్చు. అలాగే తాను ముసలివాడై ఉండి యువతిని పెండ్డి చేసుకొనగలుగవచ్చు, మూర్చుడైనవాడు తపస్సు చేయవచ్చు, పరిపాలన చేసేవాడు దోషిలోని దోషం గమనించనివాడు కావచ్చు. కాని తరువాతి కాలంలో ఈ రకమైన ఆస్తి దానం, హోదా, పడుచుభార్య, తపస్సు, దోషం గమనించని ఏలుబడి - ఇవి కీడు తెస్తాయి. వ్యా : కష్టపడిసంపాదించిన ధనంతో ఆస్తులు సంపాదించినా, ఎవరికైనా దానం చేసినా, తాననుభవిస్తూ హోదా ప్రదర్శించినా, నష్టం లేదు. అప్పు అప్పులా ఉండగా ఆ తెచ్చిన సొమ్ము ఇలా వ్యయం చేస్తే తీర్చవచ్చేసరికి ఆదాయం లేనందున కష్టపడవలసివస్తుంది. అప్పు చేసి పప్పుకూడు అన్నసామెత తెలుగులో ఆ విధానాన్ని నిందించటానికే పుట్టింది. తీర్చదలచుకొన్నవానికి అప్పుచేయటం భయంకరమైనది. బుణం కృత్వాఘృతం పిబేత్‌

  • అప్పుచేసి నెయ్యి త్రాగు అన్నది చార్వాక దృక్పథం. అప్పుపెట్టినవాడు జ్ఞప్తికి వస్తే అవయవాలు చచ్చుబడిపోతాయి. కనబడితే తెలివి తెల్దారిపోతుంది, ఎంత వింతో, అప్పుపెట్టినవాడన్న దిదో మహాభూతం అన్నాడు నీలకంఠుడు - స్యృతే పీదంతి గాత్రాణి దృష్టే ప్రజ్ఞా వినశ్యతి, అహో మహదిదం భూతముత్రనుర్థాభిశబ్దితం.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం క్ష ఆతడే ఆంతకునికంటె అప్పులవాడే కరినుడన్నాడు. అఆంతకుడు అంతకాలం వచ్చినపుడే వస్తాడట, అప్పులవాడెప్పుడైనా వస్తాడట. అంతకోసపి హి జంతూనా ముంతకాల మపేక్షతే, వ కొలవియను: కర్చిదుత్ర్త మర్లన్య విద్యతే. అప్పు పెట్టిననానికీ అంతకునికీ మరో తేడా ఉన్నదట. అప్పులవాని నోటిలో కోర కనబడదు, చేతిచివర పాశం ఉండదు. అయినా, ఇతనిని చూస్తే మనస్సు తరతరలాడుతుందట, వ వశ్యామో ముఖే దంష్ర్రాం, న పొళం వా కరాంచలే, ఉత్తనుర్లమవేక్య్యైవ తథాప్యుద్విజతే మనః (కలివిడంబనం 50,51, 52 శ్లో) అష్టకష్టాలలో బుణం మొదటిది. చూడండి ఓ అప్పు, 2. యాచన, 3. వార్ధక్యం, 4, జారత్వం, క్‌. చోరత్వం, 6. దారిద్ర్యం, 7. రోగం, 8. ఒకరుతినగా మిగిలినది తినటం - ఇవి అష్టకష్టాలు. బుణం, యాచ్చా చ, వృద్దత్వం, జారచోరదరి[ద్రతా, రోగళ్చ, భుక్తశేషశ్చాస్యష్టకష్టాః ప్రకీర్తితాః (సంచతంత్రం) ఒక తెలుగుకవి యెవరో అష్టకష్టాలేమిటి పంచదశకపష్టాలున్నాయి. అవన్నీ తనకొక్కసారే వచ్చాయన్నాడు : వీటిలో పారుగున అప్పుబాధ ఒకటన్నాడు. దూరంగా ఉన్న అప్పులవాడు రావటానికి తడవుంటుంది. పారుగువాడైతే పక్కలో బల్లెమే. గురువులరాక, దాసిమృతి, గుజ్జపుదాడియు, వాన, వెల్లువల్‌, పారుగువనప్పుబాధ, చెవిపోటును, దొమ్మరులాట, యింటిలో వరసతిగర్భవేదన, వివాహము, విత్తుట, యల్దువల్కయున్‌, గజవు, దరిద్ర, మాబ్దికము.- గల్లె నొకప్పుడు కృష్ణ భూవరా. (చాటుపద్యరత్నాకరము) ఇది అర్థపురుషార్జానికి సంబంధించిన విషయం. తాను ముసలివాడై ఉండి యౌవనంలో ఉన్నకాంతను వివాహం చేసుకొంటే ఆమెది వచ్చేవయసు, “తనది పోయేకాలం కనుక్క అనేక విధాల చిక్కులు వస్తాయి. ఇది కొమపురుషార్థవిషయం. తపస్సు అంటే మాటలో మనస్సులో చేతలలో నియమనిబంధనలు పాటించటం. వీటివల్ల సాధించవలసినదేమిటో దానిస్వరూపమేమిటో సరయిన జ్ఞానం లేకపోతే ఈ నియమాలవల్ల శ్రమమాత్రమే మిగులుతుంది. కానిప్రయోజనం ఉండదు. అంథే కాదు, అనర్థంకూడా సంభవిస్తుంది. ఇది మోక్షపురుషార్జానికి సంబంధించిన విషయం, ప్రజలున్నపుడు పరిపాలకులుంటారు. వారు పరిపాలన చేస్తుంటారు. పరిపాలనమంటే, పన్నులు ప్రజలనుంచి వసూలు చేస్తూ తాము అధికారసాఖ్యాలు అనుభవిస్తూ, పెత్తనం త్రి

| సుమతి శతకము చేస్తూ ఉండటం కాదు. ప్రజలకు రక్షణా భద్రతా ఇస్తూ ఉండాలి. ఆ క్రమంలో ఇతరుల అప్తిపాస్తులు దొంగిలిస్తూ ఇట్టి అపరాధాలు చేస్తూ ఉండేవారుంటారు. అట్టి సందర్భాలలోనూ ఇంకా అనేకమైన అపరాధాలు చేసిన సందర్భాలలోనూ దోషులను పట్టి, వారి దోషం నిర్ణయించి, దానికి అనుగుణమైన శిక్షలు నిష్పక్షపాతంగా రాగద్వే షరహితంగా విధించాలి. అలా అయితేనే ప్రజలు సుఖపడతారు. అసరాధబుద్ది ఉన్నవారు భయంతో సజ్జనులుగా (ప్రవర్తిస్తారు. ఇది స్వధర్మ నిర్వహణకు చెందినది కనుక, ధర్మపురుషార్హసంబంధమైనది. ఇలా ఒక్క పద్యంలో చతుర్విధప్పురుషార్థాలను సాధించ వలసిన తీరుగురించీ చెప్పాడు, ఈ శతకంలోని పద్యాలన్నీ అకారాది (క్రమంలో ఉన్నాయి. అ.ప్రతిలో ఈ పద్యం ఆరవదిగా ఉన్నది. అప్పిచ్చువాడు ఏడవదిగా ఉన్నది. దీనిని వర్షక్రమం గమనించనివారు చేసిన పొరపాటుగా భావించి దీనిని ఏడవదిగానూ దానిని ఆరవదిగానూ మార్చాము. అవ = అల్లుడు అత్రవారిపట్ల కూడా మంచివాడుగా ఉండాలని చెప్పుబోతున్నాడు : క అల్లుని మంచితనంబును గొల్లనిపాహిత్యవిద్య కోమలినిజమున్‌ బొల్గున దంచినబియ్యము దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ. 8 ప్ర :సుమత్రి, అల్టుని = కుమార్తెభర్త్రయొక్క, మంచితనంబును = సౌజన్యమూ, గొల్లని = గొల్ల అనబడు యాదవకులానికి చెందిన అఆతనియొక్క, సాహిత్యవిద్య = కావ్యనాటకాదులలోని పాండిత్యం, కోమలి = ్రీయొక్క, నిజమున్‌= సత్యం పలకటమూ, పాల్టునన్‌ = తప్పధాన్యాన్ని, దంచిన = రోకలిపోటు పెట్టినందువల్ల వచ్చిన, బియ్యమున్‌ = తండులాలు, తెల్లని ఇ తెల్లరంగుగల, కాకులును = ఆ'పేరుగల పక్షులూ, లేవు = ఎక్కడా లేవు, తెలియర = తెలుసుకో నాయనా, తా ; సుమతీ, లోకంలో అల్లుడు అత్తమామలపట్ల మంచివాడుగా వ్యవహరించటం లేదు. యాదవక్రులంలో జన్మించినవారు సాహిత్యాన్ని చదవటం కాని సృష్టించటం కాని లేదు. స్త్రీలు సత్యం పలకటం లేదు. తప్పధాన్యాన్ని దంచితే వచ్చినబియ్యం లేవు. తెల్లని రంగున్న కాకులు లేవు, స్త్‌ వ్యా. ఈ పద్యంలో మొట్టమొదట అల్టునికి మంచితనం ఉండదన్నాడు. ఈ లోకంలో ఎందుకీ పద్ధతి వచ్చిందో కాని ఎన్నో సంసారాలలో అలి మంచితనం లోపించినందున అత్తమామలు మనస్తాపం అనుభవిస్తూనే ఉంటారు. ఒకవేళ ఏ అల్లుడయినా అత్తవారితో వారికి ఆనందం కలిగేటట్లు మెలిగితే చాలు, అతనియింట్లోనివారూ బంధువులూ మీత్రులూగూడా అతనిమనస్సుకి మాలిన్యమే ఎక్కిస్తారు. ఈ బాధ శ్రీనాధునికి తెలిసినట్టు కనిపిస్తుంది. కనుకనే అతడు కాశీఖండంలో (వ్రాశాడు :

వివేకానందినీ వ్యాఖ్యాసహితం క్షం

'సేదలయ్యును కడు బిబ్బబిగిసి యుంద్రు

వట్టి యభివానములును గర్వములు( బట్టి

అల్లునారికినెల్ల నీ యవగుణంబు

వెన్నతో! బెట్టినది యింత విసునవేల? పిల్లలమజ్ఞ్ణి పిననీరన మరీ బాధపడ్డట్టున్నాడు కణ్వమహర్షినోటనే అనిపించాడు:

వేరములెన్ని గల్గిన గణించుట నేరము లల్టువారిపై

వేరుపులైన యల్లురును నేరములెన్నుదు రత్తవారిపై

నారల నేర్పునేరములు వంకలు దీర్ప నయుక్తమెల్లెడన్‌

గౌరవహీనులిజ్జగతి గన్నియ నిచ్చినవారు కోమలీ. (శకుంతలా 4.73)

నాగరికత పెరిగే కొలదీ మంచితనం కల అల్టుళ్ళుకూడా పెరుగుతున్నారు.

బహుశ ఈకవికాలంనాటికి యాదవవంశీయులలో సాహిత్యవిద్యలో ఘనులు కనిపించలేదనుకోవాలి. లేకపోతే ఆయన ఆ వంశళంవారి సాహిత్యవిద్య లేదని (వ్రాసి ఉండడు, యాదవులు యయాతిమహారాజుపుత్రుడైన యదురాజా వంశంవారు. తనకు అతనియౌవనం ఇవ్వటాని కిష్టపడలేదని ఆతనిని యయాతి భారతస(మ్రాట్టుగా తగడన్నాడు. కాని సరిహద్దురాజ్యానికి అధిపతిగా చేశాడు. ఆ వంశంవారి వంశవృక్షాలు హరివంశ భారత-విష్ణుపురాణాదులలో చూస్తే ఎందరో మహారాజులు తామరతంపరగా కనిపిస్తారు. పరమాత్మ అయిన శ్రీకృష్ణుడే ఆ వంశంలో అవతరించాడు. బహుశః ఆయనఅనంతరం వారు ప్రాభవం కోల్పోయి విద్యలకు దూరమై క్షత్రియసంస్కారాలకూ దూరమై ఉంటారు. యాదవవంశీయులుభారతదేశంలో నేడు అధికసంఖ్యలోనే ఉన్నారు. ఉత్తరహిందూస్టానంలో మరీను. ములాయంసింగ్‌, లాలూ ప్రసాద్‌ ప్రభృతులు ముఖ్యమంత్రులే అయ్యారు. ఇపుడు వారిలో ఎందరో నాయకులూ విద్యావంతులూ రచయితలూ ఉన్నారు. కనుక వారికి సాహిత్యవిద్య లేదనటం ఆకాలానికిమాత్రమే వర్తించే మాట.

కోమలినిజం పలుకదన్నదికూడా చర్చించవలసిందే. కుంతీదేవి కర్ణజన్మవృత్తాంతాన్ని దాచిపెట్టినందుకు ధర్మరాజుగారు కాంతలనోట్లో నిజం దాగదని శపించాడట. దురదృష్టవశాత్తు అతివలకు ఆర్థికస్వాతంత్ర్యమూ, హక్కులూ పురుషులతో సమానంగా లేనందువల్ల వారు పురుషులకంటె తక్కువవారుగా పరిగణింపబడుతూ వచ్చారు. తొలినాటివిద్యావతులయిన 'స్రీలలా కాక, వారు విద్యాహీనలే అవుతూ వచ్చారు. పురుషనికంటె స్త్రీకి తెలివి నాలుగురెట్టెక్కున ఉంటుందని చెప్పినవారే ఆ తెలివి రాణించే అవకాశం కల్పించలేదు. తన అక్క చెల్లెళ్ళకొక విధానమూ విద్యావతి అయినా తన 'భార్యకొక విధానమూ న్యాయమా? అధిక విద్యావంతులు కూడా భార్యతో కనీసం స్నేహితురాలితో మాటాడినట్రైనా మాటాడక, తాము అధికులూ వారు అధమలూ

శం

20 సుమతి శతకము అన్నట్టు మాటాడటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. అనురాగంతో మనసు గెలవటం కాక అధికారంతో అదమటం పద్ధతిగానే ఉంటున్నది. అమెకు, పుట్టింటికి, మనసు పుట్టినపుడు వెళ్ళగలిగే స్వేచ్చకూడా చాలామందివిషయంలో నేటికీ లేదు. నలిపి మెలికలు త్రిప్పి నిరంతరం అదిమి గాలీ వెలుగూ లేకుండా పెంచినమొక్క నవనవలాడుతుందా? ఇట్టి పరిస్థితులలో, సత్యంమా(త్రమే సర్వదా పలకదనటం సత్యమైన పక్షంలో, అందుకు కారణం అమెనలా చేసిన వారనక తప్పదు. పురుషులందరూ సత్యంమాత్రమే పలుకుతున్నారా? సత్యంకూడా పలికే పురుషులెందరున్నారు? ఎందరో పురుషులకంటె ఎంతో సత్యసంధత కల ఇంతులెందరో ఉన్నారు. కోమలులందరినీ గుది(గ్రుచ్చి చెప్పటం న్యాయం కాదు. పాల్గున దంచినబియ్యం లేనిమాట నిజమే. తెల్లని కాకులు కూడా ఉన్నాయని ఆ మధ్య పత్రికలలో పడింది. అవి నల్లకాకులన్ని లేకపోవచ్చు గాని అసలే లేకుండా పోలేదు. ఈ పద్యం వ్రాసిన కాలానికి ఉన్నాయన్న వార్త కవికి తెలిసి ఉండకపోవచ్చు. మొత్తంమీద బాహుళ్యాన్నిబట్టి చెప్పినమాటలివి. అవ : ఆకలి, ఈవి కష్టనహిమ్లుత్స ధైర్యం - వీటిగురించి చెప్పుబోతున్లాడు =: క. ఆ(శొన్నకూడె యమృతము తా(కొందక నిచ్చువాండె దాత ధరిత్రివ్‌ సోంకోర్చువాండె మనుజుండు తేకువ గలవాండె నంశతిలకుండు సుమతి. ప్ర ప్ర : సుమతీ, ధరిత్రిన్‌ = భూమిపై ఆశొన్న = ఆలివేసినపుడు దొరకిన, కూడె = కూడు+ఎ = అన్నమే, అమృతము = సుధ, మిక్కిలి రుచికలది, తాకొందకన్‌ = తాయ*+ఒందకన్‌ = వేసట చెందకుండా, విసుగుకొనకుండా, ఇచ్చువాండె = ఇచ్చువాడు + ఎ = దానం చేసేవాడే, దాత = నిజమైన దానశీలుడు, సోంకోర్చువా(డె = సోయ+ఓర్చువాడు+ఎ = కష్టం, ఇబ్బంది సహించగలవాడే, మనుజాండు = నిజమైన మనుష్యుడు, తేయవ-ధైర్యం, కలవాండె = కలవాండు+ఎ = ఉన్నవాడే, వంశతిలకు(డు = వంశానికి వన్న తెచ్చేవాడు. తా : సుమతీ, ఈ భూలోకంలో బాగా ఆకలివేసినపుడు తిన్న అన్నమే అమృతంలా చాలా రుచిగా ఉంటుంది, విసుగుకొనకుండా దానంచేసేవాడే నిజమైన దానశీలమున్నవాడు, కష్టాన్ని ఓర్చుకొనగలవాడే నిజమైన మనుష్యుడు. ధైర్యమున్నవాడే కులానికి వన్నె తేగలిగినవాడు. వ్యా ; మనిషికి ఆహారం రుచించాలంటే ఆకలి బాగా వెయ్యాలి. అపుడెది తింటే అదే రుచిగా ఉంటుంది. ఆకలి లేకపోతే ఎంత రుచిగల పదార్థమయినా సయించదు. కనుకనే కాలే కడువుకి మండేబూడిద అని శాస్త్రం. క్షుధాతురాణాం న రుచిర్న పక్వః - బాగా

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 21 ఆకలివేసి బాధపడుతున్నవారికి తినటంమీదనే దృష్టీ ఉంటుంది కాని తినేది బాగా ఉడికిందా లేదా, రుచిగా ఉందా లేదా అన్నవిషయాలమీద దృష్టి ఉండదు. మహాభారతం యక్షప్రశ్నలలో యక్షుడు ధర్మరాజుగారిని కోమోదతే? ఎవనికి సంతోషం కలుగుతుంది? అని అడిగాడు. దానికి, జనాబుగా ధర్మరాజుగారు -

సంచమే ౬ హని షస్టే వా శాకం పచతి స్వే గృహేః

అన్ఫణీ చాప్రవాసీ చ స వారిచర మోదతే ॥

బుణబాధ లేకుండా, పరస్థలంలో ఉండక, సొంత యింటిలో ఒకసారి కూరవండుకొని తినిన ఐదవనాడుగాని ఆరవనాడు గాని కూర వండుకొని తినేవాడికి సంతోషం కలుగుతుంది అని చెప్పారు. కనుక రుచి ఆకలివేయటంలో ఉన్నది కాని పదార్థంలో స్వల్పం.

సద్బుద్ది ఉన్నందున ఉత్తములు ఉదారులు ఆయినవారికి ఎవరివల్ల లోకానికి మేలు కలుగుతుందో, ఎవరు లోకానికి మేలు కలిగే పనులలోనే కాని సాంత సంపాదనలో కాలం వ్యయించరో, అట్టివారికి దానం చేయాలనిపించి, తామై వెళ్ళి, వారికృషి ప్రశంసించి దానం చేస్తారు. ఈ అభిప్రాయం క్రింది క్టోకాలవల్ల స్పష్టమవుతున్నది :

అభిగమ్యోత్త్రముం దానం ఆహూయైన తు మధ్యమం।

అధనుం యాచమానాయ సేవాదానం తు నిష్ఫలమ్‌॥

యోగ్యుడయినవానిని నిశ్చయించుకొని ఆతనియింటికి వెళ్ళి యిచ్చినదానం ఉత్తమం, ఆ యోగ్యునే తనయింటికి ఆహ్వానించి ఇచ్చినది మధ్యమం, తానై వచ్చి యాచించినవాని కిచ్చినది అధమం. ఏదైనా ఒక పని చేయించుకొని దానికి ప్రతిఫలముగా ఇచ్చినది 'ప్రయోజనరహితం, అనగా చేసినపనికిచ్చిన కూలి కాగలదు కాని దానంవల్ల వచ్చే సుకృతాన్ని తెచ్చేది కాదని తాత్పర్యం. ఇది మనుస్మృతిలోనిది.

దాతవ్యమితి యద్దావం దీయతే ఒ నుపకారిణే

దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం వృతమ్‌

ఇది ఈయదగినది అని ఉపకారికాని పాత్రునికి తగినచోట తగినసమయంలో

ఈయబడేదానం సాత్షికదానం. ఇది భగవద్గీత (17,20) లోనిది. ఇది సాతికదానం. ఈ (గ్రహీతలనుంచి వారు ఏ ్రతిఫలమూ ఆళంచరు. దానితో ఈ పుచ్చుకొన్నవానికీ ఆశ పెరుగుతుంది. పదే పదే అదీ ఇదీ ఇమ్మని అడగనూ వచ్చును. కొని, అది మంచిపద్దతి కాదు. ఇస్తున్నాడు కదా అని దాతను అస్తమానూ అడిగి బాధించగూడదు. మథించే కొలదీ ఇస్తున్నది కదా అని పాలసముద్రాన్ని అదే పనిగా దేవదానవులు మథించేసరికి అది హాలాహలవిషాన్ని కక్కింది అన్నాడు క్షేమేంద్రుడు.

నాత్యర్థనుర్థార్థవయా ధీమానుద్వేజయేజ్జనమ్‌

అబ్దిర్హత్తాశ్వరల్నశ్రీర్మథ్యమానోఒస్ఫజద్విషమ్‌ (చారుచర్య 34) శ

22 సుమతి శతకము

ఒకనికి దాత అని పేరు రాగానే అర్హులూ ఆనర్హులూ యాచిస్తుంటారు. ఎంత మంచి దాత యీవికయినా పరిమితి ఉంటుంది, కనుక విసుగువచ్చి, యెరక్క పోయి ఈ పని పెట్టుకొన్నాను అనిపించి, అడిగేవారిపై సొమ్యత చూపటం తగ్గుతుంది. ఈ దళ చాలా మంది దాతలకు వస్తుంది. కనుకనే జయదేవుడు యా దాతు: పౌమ్యతా సేయం సుధాంశోరకలలకతా - దాతలో సౌమ్యత ఉండటమంటే అమృతకిరణుడైన చంద్రునిలో మచ్చ లేకపోవటమే అన్నాడు. కనుక దానరుచి తెలిసినవాడు ఎలాగూ ఇవ్వకుండా ఉండలేడు గనుక ఆ ఇచ్చేదేదో విసుగుకొనకుండా ఇచ్చేవాడే నిజమైన దాత అంటున్నాడు.

అలా కాక లోభంకొలదీ ఉండికూడా దానంచేయనివారు చాలామంది కవుల తిట్లకు గురిఅయిన వారున్నారు ;

గొడ్డుటొవు( బితుక( గుండ గొంపోయిన( బండ్ల నూడ6 దన్ను( బాల విడదు

లోభివానినడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమ - అనిన వేమన పద్యం పరమ ప్రసిద్ధం. మరొకరెవరో -

ఇల లోఖి నెంత వేండిన వలవనినెత; లంతె కాని వాండిచ్చేనా?

జలమును వెన గిలకొట్టివ( గలుగునె నననీతమాసం గాడురికేసా - అని నిందిస్తే అడిగితే ఇవ్వకపోగా కోపించేవానిని ఇంకొక కవి ఇలా ఆక్షేపించాడు :

కొలిచేదిన్‌ నగ లేకనే, యడిగితే కోపించుటీలేకనే,

చెలులన్‌ మెచ్చుట కోకనే, నిభనముల్‌ చేకూరుటల్‌ రూకనే,

బలవంతుండగు మూ(కనే, సతి చెడున్‌ బ్రాణేశుం గైకోకనే

జలదశ్యానుల! శంఖ చక్రధర! కృష్ణా! యాసదుద్దారకా! (ఇవి రెండూ చాటు పద్యరత్నాకరంలోనివి)

సుఖం వచ్చినపుడు అందరూ ఆనందిస్తారు. కొందరు తమ(ప్రజ్ఞ అనుకొంటారు, మరికొందరు దైవానుగ్రహ మనుకొంటారు. కష్టాలు వచ్చినపుడు [కుంగిపోకుండా ఉండేవారు అరుదు. కష్టసుఖాలు రెండూ దైవదత్తాలనుకొని కష్టాలు సహించటం ఆవసరం. అతడే నిజమైన మానవుడు అంటున్నాడు కవి. భర్చహరికూడా

సంసదలు గల్లుతతి మహాజమలహృదయ

మభిననోత్ప్సలకోమలం బగుచు వెలయు,

నాపదలు కల్తునపుడు మహా నుహీధ

రాశ్నవంఘాతకర్కశం బయి తనర్భు - అన్నాడు,

ధైర్యం ఉన్నవాడే వంశానికి వన్నై తెస్తాడు అంటున్నాడు. ధైర్యమంటే ధీరత్వం. ఆనగా ధీరునిభావం. ధీరుడంటే - వికారహితాపతి విక్రియంతే యేషాం న చేతాంపి త ఏవ ధీరాః - మనస్సు మార్చు చెందవలసిన సందర్భంలోకూడా ఎవరిమనసు మార్చు

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 23 చెందకుండా ఉంటుందో వారే ధీరులు అన్నాడు కాళిదాసు. కైక అడవికి వెళ్ళమనినా, శూర్చణఖ కామరూపంతో సుందరిగా వచ్చి తనను స్వీకరించమనినా, భరతుడు రాజ్యం మళ్ళీ స్వీకరంచమనినా రామునిమనస్సులో మార్పు రాలేదు. కనుకనే ఆయన రఘువంశ తిలకుడైనాడు. అవ : కొన్టి నిషేధాలు చెవుతున్లాడు : క్త అకలి యుడుగని కుడుపును ద్రేకటి యగులంజ పడుపు విడువని బ్రతుకున్‌ బ్రాకొన్న నూతి యుదకము కేకల సొండియును రోత మేదిని సుమతి. 10 ఫ్ర : సుమతీ, మేదినిన్‌ = భూమిపై, ఆకలి = క్షుత్తు, ఉడుగని = తీరని, కుడుపును = భోజనమూ, ద్రేకటి యగు = (వేళటి+అగు = చూలైన, గర్భవతి అయిన, లంజ = వేళ్ళ్యయొక్క, పడుపు = వ్యభిచారంతో ధనం సంపాదించటం, విడువని = మానని, బ్రతుకున్‌ = జీవితమూ, ప్రాతొన్న = 'ప్రాకు+కొన్న = పాచిపట్టిను నూతియుదకమున్‌ = నూతి+ఉదకమున్‌ = నూతిలోని నీరూ, మేకలపాడియున్‌ = మేకలపాలూ, రోంత = జుగుప్స, ఏవం కలిగిస్తాయి. తా : సుమతీ, భూలోకంలో ఆకలి తీరని భోజనంచేయటం అసహ్యం. గర్భవతి అయినప్పటికీ వ్యభిచరించి ధనం సంపాదించటం మానని వెలవెలది బ్రతుకు ఏవం కలిగిస్తుంది. పొచిపట్టిన నూతిలోని నీరు రోత పుట్టిస్తుంది. మేకపాలూ జుగువ్సు కలిగిస్తాయి. వ్యా: ఆకలి యుడుగనికుడుపు రోంత అనటంలో మనసం(ప్రదాయం ప్రతిబింబిస్తున్నది. కుడుపు అంటే భోజనమనీ భోజనం ెట్టటమనీ అర్థం. “అర్జాకలి'గా భోజనం పెట్టటం తప్పుగా మన యిళ్ళలో మగువలుకూడా భావిస్తారు. అర్జాకలిగా పెడితే పాపం, తింటే అసహ్యం. అందులోని అసహ్యత తనివి తీరకపోవటంవల్ల కలిగే అసుఖంలో ఉంది. విస్తరివేసి భోజనం పెడితే ఇంకా కావాలా, ఇది కావాలా, అది కావాలా అని అడిగి మరీ వడ్డించి పెట్టటం మన సంప్రదాయం. ఆ పెట్టటం సామూహికంగా అయితే అది సంతర్పణం అంటారు. సంతర్పణం ఆంటే చక్కగా తృప్తిపరచటం అని అర్థం. అలా జనం తృప్తి చెందితే జనార్హనుడు తృప్తి చెందుతాడని విశ్వాసం. భిక్షగా పెట్టినపుడు ఈ దోషం ఉండదు. రెండవ అంశం వేళటి యగు లంజపడుపు విడువని బ్రతుకు రోత అనడానికి ఒక విధంగా అర్ధ తాత్పర్యాలు చెప్పబడ్డాయి. అట్టి శారీరిక సితిలోకూడా ఆ పని చేయవలసి రావటం ఆమెకూ ఏవం కలిగిస్తుంది, ఆందుకు సిద్ధపడిన విటునికీ ఏవం కలిగిస్తుంది, ఆమె పురుడు వచ్చి మామూలుమనిషి అయే వరకయినా ఆ పని మానలేని పరిస్టేతిల్లో

26 సుమతి శతకము ఉండటం ఆమె ఉన్న సమాజానికీ జుగుప్స కలిగిస్తుంది. ఆ వాక్యాన్ని రెండుగా విభజించి మరొక రీతిగానూ అర్థం చెప్పవచ్చు. ఒకటి : ద్రేకటి యగు లంజ, రెండు పడుపు విడువని (బ్రతుకు అని ఆ విభజనం. గర్భవతి అయిన వేళ్ళ రోత అన్నపుడు భావం స్పష్టంగానే ఉంది. ఆ దశలో కక్కుర్తి తీరటం తప్ప నిజమైన పరిపూర్ణమైన సౌఖ్యం ఉండదు కనుక రోత, ఒక దళలో తిండి గడవకనో ఇతర పరిస్టితులలోనో ఒకరు పడుపు వృత్తికి దిగి ఉండవచ్చు, కాలం ఒకే రీతిని ఉండదు కనుక పరిస్థితులు మారిన తరువాతనయినా మానాలి. మారినా ఆ పని మానక దానిలోనే బ్రతకటం అసహ్యకరమైనది కనుక పడుపు విడువని బ్రతుకు రోత అనటం. ఆ దుర్‌వృత్తికి కొందరెందుకు దిగుతున్నారు అంటే పొట్టగడవక అని సామాజిక శాస్త్రజ్ఞులు చెప్పే ఒక కారణం. ఆ వృత్తిని ఒక వ్యాపారంగా నడిపేవారూ అందులోని పాత్రధారులూ పొట్ట గడవనివారే కాదు అది ఒక లాభార్జన మార్గంగా ఎంచిన వారే చాలామంది అన్నది లోకంలో కనిపించే దృశ్యం. కనుక రోత. ప్రాొన్న నూతియుదకము రోంతకు రెండు కారణాలు. ప్రాచిపట్టిన నూతినీరు చూడటానికి ఆసహ్యంగా ఉంటుంది, ఆరోగ్యకరమూ కాదు, అనారోగ్యకరం కూడాను. కనుక అది రోత. మేకలపొడి రోంత అన్నది గోవుపాలతో పోల్చినపుడు అన్నమాట. అదీకాక దాని వాసనకూడా వేరుగానే ఉంటుంది. అయినా చాలామంది మేకపొలూ వాటినుంచి వచ్చిన పెరుగు మొదలయినదీ ఉపయోగించే వారున్నారు. గాంధి మహాత్ముడు మేకపాలే (త్రాగేవాడు. ఇంగ్బాండు వెళ్ళేటప్పుడు ఆయన ఒక మేకను గూడా తీసుకుని వెళ్ళటం జగత్ర్రసిద్దమైన విషయం. మదనమోహనమాలవ్యాగారు డబ్బాలకొలదీ గంగాజలం తీసుకొని వెళ్ళటమంత ప్రసిద్దమైన విషయం. అవ : దానం, పౌరుషం, కవిత్తుం - వీటిని ప్రళంనీంచబోతున్లాడు : క ఇచ్చునదె విద్య, రణమున( జొచ్చునదే నుగతవంబు, సుకవీశ్వరులువ్‌ మెచ్చువదె నేర్పు, వాదుకు వచ్చువదే కీడుసుమ్ము నసుధను సుమతీ. క్ష (ఫ్ర: సుమతీ, వసుధను = భూమిపై, ఇచ్చునదె = ఇచ్చునది+ఎ = దానంచేయటమే, విద్య = జ్ఞానం, రణమునన్‌ = యుద్ధంలో, చొచ్చునదే = చొచ్చునది + ఏ = ప్రవేశించటమే, మగతనంబు = పౌరుషం, సుకవీశ్చరులున్‌ = సుకవ్గి + ఈశ్చరులున్‌ = మంచికవులకు ప్రభువులైనవారు కూడా, అనగా గొప్పకవులు కూడా, మెచ్చునదె = మెచ్చునది+శఎ =

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 25 ప్రశంసించేదే, నేర్పు = ప్రొవీణ్యము, వాదుకు జ నిందకు, తగవుకు, వచ్చునదే = వచ్చునది+ఏ = రావటమే, కీడు సుమ్ము = అనర్ధం, హాని, ఆపదసుమా,

తా : సుమతీ, భూలోకంలో దానం చేయటమే జ్ఞానం. యుద్ధంలో ప్రవేశించటమే పౌరుషం. మంచికవులు కూడా మెచ్చుకొనేదే ప్రావీణ్యం, నిందా కలహమూ రావటమే ఆపదసుమా.

వ్యా: ఉన్నదో సంపాదించుకొన్నదో ధనం తనకోసం ఖర్చుపెట్టుకొంటే ఖర్చుపెట్టినపుడే దానివిలువకు తగిన సౌఖ్యమే లభిస్తుంది. అదే ధనం. భగవదర్చితంగా భావించి అర్హులకు దానం చేస్తే ఇపుడూ భవిష్యత్తులోనూ, ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ, ఈ జన్మలోనూ తరువాతి జన్మలలోనూ, తనకూ తనవారికీకూడా సౌఖ్యాన్నిస్తుంది. ధనాన్ని ఇతరలోకాలకూ ఇతరజన్మలకూ తనవెంటతీసుకుపోయే అవకాశం లేదు. దానం చేస్తే అది మనకంటే ముందే ఇతరలోకాలకూ ఇతర జన్మలకూ వెళ్ళి ఉపయోగించేదవుతుంది. కనుక అర్జ్హులయినవారికి దానంచేయటమే నిజమైనజ్ఞానం. దానాన్ని ఎందరో ఎన్నివిధాలుగానో ప్రశంసించారు. కీర్తి రావాలంటే దానం చేస్తేనే వస్తుందన్నాడు నీలకంఠుడు. అమరులు కావచ్చు మానవులు కావచ్చు చేతనములు కావచ్చు అచేతనములు కావచ్చు

  • చేసేదానాన్ని బట్టే ముల్టోకములచేతనూ స్తుతింపబడుతున్నారుట.

అమర్య్యాః సన్తు మర్య్యా నా, చేతనాః నవ్వ చేతనాః

దానమేన పురస్కృత్య స్తూయవ్తే, భువవైస్తిభిః

అయనే ధనం వదలకూడదనే అందరికీ ఉంటుంది మనస్సులో, ప్రాణాలు పోయినా ధనం వదలగూడదు, నెత్తిన గట్టుకొని పట్టుకొని పోతాను అనుకొనేవారు ఆర్హులయినవారి కివ్లటమొకటే మార్గమన్నాడు,

మృతో౭ప్యర్థం న మోక్ష్యామి బద్ద్వా వేష్యామి మూర్దని,

ఇతి చేళ్సుద్చఢడో లోభః పాత్రే దేయనుశంకిభిః

ఆయన మరొక చమత్కారమైన మాట అన్నాడు. పూర్వంకూడా ట్రావెలర్స్‌ చెక్కులపద్దతి ఉండేది కాబోలు. వర్తక సంఘాలవారికీ దేశంలో వంద యిస్తే పరదేశంలో అరవై యిచ్చే వారట, ఈ పద్దతివల్ల ఇచ్చినది తగ్గుతున్నది. దానంవల్ల మేలేమిటంటే ఇక్కడ పొ॥త్రునికి ఒకటి దానం చేస్తే పరత్ర అనంతంగా లభిస్తుందట.

సష్టిర్దేశాంతలే అభ్యా శతం దత్వాత్ర వైగమే,

పాత్రే త్వేకమిహోత్సజ్య పరద్రానంతమాస్యతే.

పైనుంచి ఎన్ని కబుర్లయినా చెప్పవచ్చు. కాని యుద్దరంగంలోనికి దిగి, ప్రాణాలు పోవటం ఖాయమని తెలిసి వెళ్ళి, అధైర్యసడకుండా పోరాడటం సామాన్యం కాదు. కనుక నిజమైన శౌర్యానికి నిదర్శనం యుద్ధరంగంలో ప్రవేశించటమే. ఖడ్గతిక్కన కథలో ఈ మగతనం ప్రసక్తి వస్తుంది. శత్రుబలం అధికంగా తన సైన్యం స్వల్పంగా ఉన్నదళలో మళ్ళీ

క్ష

26 సుమతి శతకము తగుసైన్యంతో తిరిగి వద్దామని అతడు ఇంటికి వచ్చాడు. భార్య మంచం అడ్డుపెట్టి, దానిమీద పసుపుముద్ద పెట్టి స్నానానికి నీళ్ళుతోడింది. ఇదేమిటింటే -

పగజుకు వెన్నిచ్చివచో నగరే నిను మగతనంపు నాయకులెందున్‌,

ముగురాడువారమైైతిమి, నగపేటికి జలకమాడ వచ్చినచోటన్‌ -

అని సమాధానం ఇచ్చిందట. ముగురు అంటే అతనితల్లీ భార్య అయిన తానూ, అతడూ అని. తల్లి విరిగిన పాలు అన్నంలో పోసిందట. ఇదేమంటే,

అనదృశమున నరివీరుల పసమీఆగ గెలునలేక పంద్రీయన్నీ

వసువులకు విరిగివచ్చిన పసులున్విరిగినవి తిక్క పాలున్విరిగెన్‌

అని ఆమె సమాధానం చెప్పినదట. అపుడాయన తిరిగి యుద్దానికి వెళ్ళి శత్రుసంహారం చేస్తూ ప్రాణాలు విడిచాడని కథ.

నీలకంరుడు

శౌర్యేణ లోకసేన్యత్వం శార్యేణ క్షితిపాలఛా,

శౌర్యేణ లభ్యః స్వర్తోసి శౌర్యం కవ్య నశోభనమ్‌ -

శౌర్యమున్నదేని జగమెల్ల సేవించు, శౌర్యమున్న (గలుగు క్షావరతయు,

శౌర్యమున్న నబ్బు ప్వర్గలోకమ్మైన, శార్యమెవనికిడదవార్యశుభము?

అని శౌర్యాన్ని ప్రశంసిస్తూనే నీతితో కలిసినశౌర్యం (ప్రశంసనీయమన్నాడు.

వ్‌ శౌర్యం శౌర్య మిత్యేవ స్తూయతే బుద్దిశాలిభి

కి తు నీత్యా సమాళ్షిష్టం వాగ్మెత్వమిన మేధయా -

శార్యమని వట్టి శౌర్యాన్ని బుద్రిశాలులు స్తుతించరు. నీతి పెనవేసుకొన్న అనగా జయం సాధించటానికి అవసరమయిన ఉపాయం తెలిసిన శౌర్యాన్ని స్తుతిస్తారు, మేధతో కలిసిన మాటనేర్పును స్తుతించినట్లే - అన్నాడు. శివాజీశౌర్యం ఉపాయం తెలిసిన శౌర్యం.

ఒక తెలివి కలవాడు మరొకని తెలివిని సామాన్యంగా మెచ్చడు. కారణం అసూయ కాదు, వానితెలివిలోని తక్కువతనం వీనికి తీలియటమే. మెచ్చదలచినా ఎందుకు మెచ్చాలో ఎలా మెచ్చాలో తెలియదు. కవి ఆంటే కవిత్వం చెప్పేవాడనే కాక పండితుడు అని కూడా ఆర్ధం. అదే తొలిఅర్హం, ఆతడు -ఈశ్చరునిలా సర్వజ్ఞుడుకూడా అని కవీశ్చరుడు అంటారు. వారిలోనూ ఇంకా గొప్పవానిని సుకవీశ్చరుడు అంటారు. అట్టివానికి దేనిని మెచ్చాలో తెలుస్తుంది. ఎందుకు మెచ్చాలో తెలుస్తుంది. ఎలామెచ్చాలో తెలుస్తుంది. కనుక అట్టి సుకవీశ్చరులుకూడా ఏ ప్రావీణ్యాన్ని ఏ చతురతను ఏ శక్తిని ఏ సామర్ద్యాన్ని మెచ్చుకొంటారో, అదే నిజమైన ప్రావీణ్యం, అదే నిజమైన చతురత, అదే నిజమైన శక్తి అదే నిజమైన సామర్థ్యం.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 27 కవులగొప్పతనం గుర్తించి వారిని కవీశ్చరులని భగవత్తుల్యులుగా ఆరాధించటం మనదేశంలోనే ఉన్నది. ఇది మనమహాకవుల మహత్తానికీ సహృ్మదయుల వివేచనశక్తికీ నిదర్శనం. కంకంటి పాపరాజుగారు కవులకూ ఈళశ్చరునికీ అభేదం పాటిస్తూ చెప్పిన పద్యం స్మరణీయం : ధరణీభృన్మణిమౌలివర్తవములం దళ్కొాంది యార్యోక్తి వై ఖరి' బ్రాసించి యహీవవిష్ఫురదలంకారాప్రిశోభిల్లి భూ రిరసారూఢి/జెలంగి యర్జవరమై(త్రింజొక్కి మేటౌకవీ శ్వరులంగొల్చెద వన్మనోహరకలాచంచత్ర్రభావాఢ్యులవ్‌ (ఉ.రా. 1.10) వాదు అంటే నింద, కలహం మొదలయిన చాలా అర్జాలు ఉన్నాయి. మనిషి నిందకు గురి అయినందువల్లా నిరంతరమూ కలహాలలో చిక్కుకొన్నందు వల్లా ఆపదలు వస్తాయని చెప్పినందువల్ల నిందతెచ్చే పనులు చేయవద్దనీ కలహాలకు వీలయినంతవరకూ దూరంగా ఉండమనీ ఉపదేశిస్తున్నాడు. అవ : విద్యా, మాత్చభక్తీ సోదర్యపేమా ముఖ్యమని చెవ్పుబోతున్నాడు : క ఇమ్ముగ( జదువని నోరును, నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్‌ తమ్ముల బిలునని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ. [12 ఫ్ర : సుమతీ, ఇమ్ముగన్‌ = బాగుగా, చదువని = విద్యాభ్యాసము చేయని, నోరును = వాయ, అమ్మా = తల్లీ, అని = పిలిచి, అన్నము = భోజనం పెట్టమని, అడుగని = కోరని, నోరున్‌ = వాయీ, తమ్ములన్‌ = తనకంటె చిన్నవారైన సోదరులను, పిలువని = రమ్మనని, నోరును = వాయి, కుమ్మరి = కుండలు చేసే అతడు, మను = మన్ను, (త్రవ్వినట్టి =గ్రొచ్చిన, గుంటర = చిన్నగొయ్యియే నాయనా. తా : సుమతీ, మనిషిజ్ఞానవంతుడు కావటంకోసం బాగా చదువు కోవాలి, కన్న తల్లిని వినయంతో అమ్మా అని పిలిచి అన్నం పెట్టు అని అడగాలి. తనకంటె చిన్నవారైన సోదరులను వాత్సల్యంతో రమ్మంటూ చూచుకోవాలి. ఈ మూడు పనులూ చేయని నోరు కుమ్మరి కుండలకోసం మన్ను త్రవ్వగా ఏర్పడిన చిన్నగొయ్యివంటిదే. వ్యా: ఇమ్ముగం జదువనినోరు అంటే బాగా విద్యాభ్యాసం చేయని నోరు అనీ, పద్యాన్ని గాని, వచనాన్ని గాని స్పష్టంగా చదువవలసిన విధముగా అనగా ఉచ్చరించవలసిన విధముగా ఉచ్చరించని నోరు అనీ అర్థం చెప్పవచ్చు. పూర్వం విద్యలు గురువు తన నోటితో చెపితే శిష్యుడు తన నోటితో పలికి ధారణ చేసేవాడు. కనుక విద్యాభ్యాసం చేయటమంటే అపుడు నోటితో చదవటమే, అలాగే ఎలా పలుకవలసిన శబ్దాన్నీ స్వరాన్నీ కడ

28 సుమతి శతకము అలా పలకటమూ విద్యే కనుక, అలా చదువని నోరు వ్యర్థం అన్నాడు. నన్నయ్యగారు ఉచ్చారణ .దక్షుచేత నభిహితం బగు శబ్దంబు అన్నారు. బాగా విద్య అభ్యసించటమూ అభ్యసించినది చెప్పేటప్పుడు స్పష్టంగా పలకటమూ అవసరమని బాలురకూ విద్యాగురువులకూకూడా బోధిస్తున్నాడు.

అమ్మా అన్నం పెట్టు అని అడగని నోరూ వ్యర్థమే అంటున్నాడు. అడగవిదే అమ్మయినా పెట్టదు అని శాస్త్రం. కన్నతల్లి అయినప్పటికీ, కడుపారసి పెట్టటం ఆమె స్వభావమైనప్పటికీ, చనువుతో భక్తితో ప్రేమతో ఆమెను చక్కగా అమ్మా అని పిలుస్తూ ఆ పిలుపులో ఆ భావాలు పలికిస్తూ ఆమెకానందం కలిగించి తాను కావలసినది పొందటం ఆవసరం.

ఆమ్మా అని పిలవటంవంటిదే తమ్ముడా అని పిలవటమూ. తనకంటే చిన్నవాడని అలక్ష్యం చేయక, వాత్సల్యంతో తమ్ముడా అని పీలవాలట. అలా పిలువని నోరూ వ్యర్థమేనట. వరుసపెట్టి పిలుచుకొనటంలో ఉన్న ఆప్యాయత పేరు పెట్టి పిలవటంలో లేదు. అన్నా, తమ్ముడూ, అక్కా, బావా, వదినా, అమ్మా అని పరాయివారిని ఆ వరసలతో పిలిచినా ప్రేమలు పొంగి పొరలుతాయి. [ప్రాతకాలంలో ముఖ్యంగా పల్లెలలోని జనం అలాగే పీలుచుకొని ఒకకుటుంబంలోని వారులా హాయిగా జీవించేవారు. ఒకేకుటుంబంలోనివారు వరుసలు పెట్టి పిలుచుకోవాలనటం ఎంత ముఖ్యమో వేరే చెప్పాలా?

ఈ మూడు పనులూ చేయనినోరు కుండలు చేయటంకోసం మన్ను త్రవ్విన చిన్నగొయ్యిలాంటిదనటం కవి పరిశీలనం తెలుపుతున్నది. ఆ గుంటలు (త్రవ్వే విధానం చూస్తే కాని ఈ పోలికవిలువ తెలియదు. రాళ్ళూ రప్పలూ లేని మెత్తని మన్ను దొరికినంతమేరే త్రవ్వుతారు. ఆ (త్రవ్వకంలో ఆ గుంట మెలికలు తిరగవచ్చు, ఎగ్లుగొగ్గులుగాకూడా ఉంటుంది. ఆ గుంట ఇంక దేనికీ పనికి రాదు. అందులోనుంచి మన్ను (త్రవ్వటానికే అది పనికి వస్తుంది. ఇందులో అన్నం వెయ్యటానికిమాత్రమే ఇది పనికి వస్తుంది. ఇంకెందుకూ ఇదీ పనికి రాదు.

అవ : వుట్టినందుకు వురుషార్జాలు సాధించితీరాలని చెప్పుబోతున్హాడు

క ఉడుముండదె మాజేండ్లును బడియుండదె 'పేర్మిం బాము పదినూటేంద్దున్‌ మడువున గొక్కెర యుండదె కడు నిల( బురుషార్ధపరుండు కావలె సుమతీ, [3 ప్ర: సుమతీ, ఉడుము = బల్లిఆకారంతో దానికంటే ఎన్నో రెట్టు పెద్దదిగా ఉండే జంతువు, నూటేండ్దును = నూజు+ఏీండ్లును = వంద సంవత్సరాలూ ఉండదె = ఉండదు+ఎ =

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 29 జీవించదా? పాము = సర్సం, పేర్మిన్‌ = పేరిమిన్‌ = పెంపుతో, పదినూటేండ్లున్‌ = పదివందల సంవత్సరాలైనా, పడి యుండదె = పడి+ఉండదు+ఎ = నిస్ర్రయోజనంగా జీవించి ఉండదా?, కొక్కెర = కొంగ,,మడువునన్‌ = చెరువులో, ఉండదె = ఉండదు+ఎ = జీవించి ఉండదా? నరుడు = మానవుడు (ఇది ఆధ్యాహార్యం), ఇలన్‌ = భూలోకంలో, కడున్‌ = మిక్కిలి, పురుషార్హపరుండు = పురుష+అర్ధపరుండు = పురుషార్ధాలయిన ఛర్మార్ధకామ మోన్షాలపై ఆసక్తి కలవాడు, కావలెన్‌ = అయి ఉండాలి. తా : సుమతీ, ఈ లోకంలో జన్మించిన తరువాత మనిషి పురుషార్జాలైన ధర్మార్థకామమోక్షాలు సాధించటానికి బాగా ప్రయత్నించాలి. ఆలా (ప్రయత్నించనివాని బ్రతుకు నిరర్థకం. ఉడుము నూరేళ్ళూ, పాము వెయ్యేళ్ళూ, చెరువులో కొంగ చాలా కాలమూ బ్రతుకు తున్నాయి. కాని ఆ బ్రతుకువల్ల ఏమి ప్రయోజనం? పురుషార్హసాధకుడు కానివాని బ్రతుకూ వాటిబ్రతుకువంటిదే అవుతుంది. వ్యా : ఈ సందర్భంలో ఈ ల్లోకం యస్మిన్‌ జీవతి జీవంతి బహవః న తు జీవతు | బకో౭పీ కీం న కురుతే చంచ్చా స్వోదరపూరణమ్‌ 11 ఎవడు జీవిస్తే అనేకులు జీవిస్తారో అతడు జీవించాలి. ముక్కుతో తనపొట్ట పోసుకొంటూ కొంగకూడా (బ్రతకటం లేదా? - అనినభావం గలది, జ్ఞప్తికి వస్తుంది. అవ : ఉత్తమగుణాలు నస్వభావజన్యములని చెవ్పుబోతున్లాడు =: క, ఉత్తమగుణములు నీచున కెత్తైెటంగువ గలుగనేర్చు? నెయ్యెడలం దా నెత్తిచ్చి కరంంబోసిన నిత్తడి బంగారమగువె యిలలో సునుతీ. క్షే ఫ్ర : సుమత, ఇలలోన్‌ = భూమిపై, నీచునకున్‌ = అల్పబుద్ది నీచబుద్ధి కలవానికి, ఉత్తమగుణములు = దొడ్డవి ఆయిన, దొడ్డవానివయిన సుగుణాలు, ఎత్తెజయ్‌నన్‌ = ఏ+తెలు గునన్‌ = ఏ తీరుగా, ఏ విధముగా, కలుగనేర్చున్‌ = కలుగన్‌ఇనేర్చున్‌ = సంభవించటం శక్యమవుతుంది? ఎయ్యెడలన్‌ = ఏ+ఎడలన్‌ = ఏ ప్రదేశాలలోనైనా, ఎత్తిచ్చి = ఎత్తు+ఇచ్చి = గొప్పదనం ఇచ్చి, కరంగి = (ద్రవమయేటట్టు కాచి, పోసినన్‌ = అచ్చులో పోసినా, ఇత్తడి = ఒకొనొక లోహం, తాను =అదధి, ఆరకూటం, బంగారము = సైడి, అగునె = అగున్‌ + ఎ = కాగలదా? తా : సుమతీ, దొడ్డవారి దొడ్డగుణాలు వారికి సహజంగా కలుగుతాయి. అవి అల్సులకు ఎంత (ప్రయత్నించినా అలవడబోవు. ఇత్తడి గొప్పదని విలువ కల్పించి కరగించి అచ్చుగా పోసినా అది పుత్తడి కాబోదు. 15

30 సుమతి శతకము వ్యా : సత్పురుషులకు సద్గుణాలు పుట్టుకతోనే స్వభావసిద్దాలై వస్తాయి. ఆ గుణాలు తెచ్చిపెట్టుకొందామని ఆల్పులు ఎంత ప్రయత్నించినా వారికవి కలుగవు. వారికి ఆ గుణాలు కలిగిద్దామని ఇతరులు ఎంతగా ప్రయత్నించినా రావు. ఇత్తడి విలువతక్కువ లోహం. పుత్తడి విలువ ఎక్కువ లోహం, దేనిగుణాలు దానివి. ఎవరైనా. ఇత్తడికి విలున కల్పించి దానికి బంగారానికి సహజంగా ఉన్న లక్షణాలు కల్పించాలని (ప్రయత్నించినా ఆ లక్షణాలు దానికి రావు. ఇత్తడి ఇత్తడే, పుత్తడి పుత్తడే. సద్గుణాలు (ప్రకృతి- స్వభావసిద్దాలనే భావం భర్షృహరీ చెప్పాడు : ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదబందు. దాల్మియున్‌ భూపసభాంతరాళమున6 బుష్కులనాకృతురత్వ మాజి బా హాసటుశక్తియువ్‌ యశమువం దమరక్తియు విద్యయందు నాం ఛాపరివృద్దియుం బ్రకృతి జన్యగుణంబులు సజ్జనాళికిన్‌. దానగుణమూ, ఇంపుగా మాటాడటమూ, ధీరత్వమూ, కౌచిత్యం తెలియటమూ అనే ఈ నాలుగుగుణాలూ పుట్టుకతో రానలసినవే కాని తెచ్చిపెట్టుకొంటే వచ్చేవి కావని మరొక సూక్తి చెపుతున్నది. దాతృత్వం ప్రియవక్షృత్వం ధథీరత్వ ముచితజ్ఞతా | అభ్యాపేన న లఅభ్యంతే చత్వారః సహజా గుణాః ॥ దాన గుణం సహజమని ఎవరో తెలుగు కవి ఇంకా బాగా చెప్పాడు : పుట్టుకతోడుత గరమున. బుట్టవలెన్‌ దొావగుణము పుట్టకపోతే యిట్టట్టు మలిమి బలిమిం బట్టింపను గాజు? తాళ్ళసలి కొండ్రాజా! (చాటు పద్య రత్నాకరము) అయినవ్పటికీ, ఈ చెవ్పటానికి ఉద్దేశం ఉత్తమగుణాలు కలవారేని గౌరవించమనటమూ, అవి అంత దుర్లభమైనవి కనుక, వాటిని అలవరచుకొనటానిక్తీ, అధమగుణాలను వదలించుకొనటానికీ నిరంతరమూ ప్రయత్నం చేస్తూనే ఉండాలిసుమా అనిమా(త్రమే కాని, మనగుణం ఎలాగూ మారదని మరింత ఆధములు కమ శని చెప్పటం కాదు. అవ = విద్యావిహ్‌నుని చేరవద్దని చెప్పుబోతున్లాడు : క ఉదకము. ద్రావెడు హయమును మదమున మష్పాంగుచుండు మత్తేభంబున్‌ మొదవుకడ నున్న వృషభము జదువని యా నీచు. జేర జనకుర సుమతి. [5

వివేకానందినీ వ్యాఖ్యాసహితం తె

ప్ర : సుమతీ, ఉదకమున్‌ = నీటిని, త్రావెడు = త్రాగుతున్న, హయమును = గుజ్టాన్నీ, మదమునన్‌ = క్రొవ్వుతో, ఉప్పాంగుచుండు = ఉప్పాంగుచున్‌ + ఉండు = విజృంభిస్తున్న, మత్తేభంబున్‌ = మత్త+ఇభంబున్‌ = మదపుటేనుగునూ, మొదవుకడన్‌ = (ఎదవోయిన) గోవువద్ధ, ఉన్న = నిలిచిన, వృషభమున్‌ = ఆబోతునూ, చదువని = విద్యనేర్వని, ఆ నీచున్‌ = ఆ కారణంచేత నీచబుద్ధికలవానిని, చేరం జనకుర = చేరన్‌*చనకుర = సమీసించటానికి పోవద్దయ్యా.

తా : సుమతీ, నీరు డ్రాగే గుల్టాన్నీ, క్రొవ్వుతో చెలరేగుతున్న మదపుటేనుగునూ, ఎదవట్టిన గోవువద్ద ఉన్న ఆబోతునూ, విద్యావిహీనుడైన కారణంచేత నీచబుద్దికలవానినీ చేరవద్దు.

వ్యా : నీరు (త్రాగే గుజ్జంవద్దకు పోతే త్రాగనివ్వరేమో అనే అనుమానంతో గుజ్జం ముందుకు వెడితే కరుస్తుంది, వెనక్కువెడితే తన్నుతుంది. క్రొవ్వు కారుతూ చెలరేగుతున్న మదపుటేనుగుదగ్గరికి వెడితే, ఆ మత్తులో అది (క్రోధంతో ఒళ్ళు తెలియకుండా ఉంటుంది కనుక, దంతాలతో (క్రుమ్మి కాళ్ళతో మట్టగించివేస్తుంది. ఎద పట్టిన ఆవు దగ్గర ఉన్న ఆబోతును సమీపిస్తే ఆది తనకు ఆవును దూరం చేయటానికి వచ్చారన్న అనుమానంతో పొడిచి చంపగలదు. ఇవి పశువులు. వీటికి ఈ (ప్రత్యేకపరిస్థతులలో ఒళ్ళు తెలియనందున తమకు మేతపెట్టి పోషించే మనిషికయినా అపకారం చేయటం సహజమే, కాని, విద్యావిహీనః పశుః - విద్యలేనివాడు వింతపశువు. అవిద్యచేత వచ్చిన కృత్రిమ పశుత్వం సహజసిద్ధమైన పశుత్వం కంటె హానికరమైనది, దానికి తోడు దానివల్ల అల్పత్వం నీచత్వం వస్తుందేమో వాడు ఏమి చేస్తాడో వానికే తెలియదు. వివరించిన ప్రత్యేక పరిస్థితులలో ఉన్న జంతువులు విపరీతంగా ప్రవర్తిస్తాయని తెలుసు కనుకనూ, ఏ పశువుకు ఆ పళువులక్షణంమాత్రమే ఉంటుంది కనుకనూ కొంత జాగ్రత్తతో వ్యవహరించి, వాటివల్ల కలిగే అపకారం తప్పించుకోనయినా తప్పించుకోవచ్చు. కాని వీడు మనిషి కనుక నమ్మి ఉంటామేమో, వీడు వింత పశువేమో, నీచుడుకూడా అయినాడేమో ఏ 'పశువులక్షణం ఎప్పుడు ప్రదర్శిస్తాడో, వీడెట్టి అపకారం చేస్తాడో, ఊహించలేన్ను కనుక దుష్టునికి దూరంగా ఉండమని శాస్తంకూడా చెపుతున్నది కనుక, వీనికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. అని కవి చెపుతున్నాడు. చదివీ నీచులు అయినవారూ చదవకపోయినా ఉత్తములుగా ఉన్నవారూ ఉన్నారు. అయితే అవి (ప్రత్యేక విషయాలు, చదువురాకపోతే వచ్చేది నీచత్వమూ వింతపశువు కావటమూ మాత్రమేకాదు, ఎన్నో అనర్థాలు వస్తాయని కేయూర బాహుచరిత్రలో మంచన ఇలా చెప్పాడు :

అక్షరణ్ఞుండు గాని యతనికి శాప్రవురాణాగమాదులు రావు సారగ;

(గ్రంథాధిగమశక్తి గలుగక శుద్దవివేకంబు లేదు; వినేకశుద్ది

కలుగక కర్తవ్య కర్మమెలుంగండు; కర్తవ్య మెలు(గక కడం చేయు

శ్రీయల వీగయరాని కిల్చిషంబులంబొందు(; బావుండు నరకకూపమునగదైెళ్ళు; 1

32 సుమతి శతకము నరకనాసి పేదనరుఃడగు/ బేదయై కడుపుకొణకు( బాతకములు సేసి కౌరవమువః గూలు6 గ్రమ్మజవట్ల; యాపదలకెల్లయదురు చదువులేమి - అని, ఆవ. అఆవకారికీకూడా ఉపకారము చేయటం అత్యుత్తమ గుణమని

చెప్పబోతున్నాడు :

క. ఉపకారికి మపకారము విసరీతము కాదు పేయ నివరింపంగా నపకారికి మసకొారనము నెసమెన్నక సేయునా(డు నేర్పరి సుమతీ. 16 'ప్ర : సుమతీ, ఉపకారికిన్‌ = మేలుచేసినవానికి, ఉపకారము = మేలు, చేయన్‌ = చేయగా, చేస్తే అది, విపరీతము = సహజ(ప్రవర్తనకు విరుద్దమైనది, కాదు = కాబోదు, వివరింపంగాన్‌ = వివరింపన్‌ + కాన్‌= బాగా ఆలోచించి విమర్శిస్తే అపకారికిన్‌ = కీడుచేసినవానికి, ఉపకారము =మేలు, నెపమెన్నక = నెపము + ఎన్నక = అపకారం చేశాడన్లు దోషం లెక్కపెట్టక, చేయువాడు = అచరించేవాడు, నేర్చరి = నేర్చు కలవాడు. తా : సుమతి, తనకు మేలుచేసినవానికి ఎవరైనా తిరిగి మేలుచేస్తారు. అది 'ప్రకృతిసహజమైన సాధారణ ప్రవర్తనకు అనుగుణమైనదే కాని విరుద్ధమైనది కాదు. కనుక అందులో విశేషం లేదు. తనకు కీడు చేసినవానికి, నాకప్పుడు కీడు చేశావుకదా; ఇపుడు నీకు మేలు ఎలా చేస్తాను? అని అతనిలోని దోషం గణించకుండా, మేలే చేసేవాడు నేర్పు కలవాడు. వ్యా : ఉపకారికి ఉపకారం చేయటం కృతజ్ఞత. ఉపకారికి అపకారం చేయటం కృతఘ్నత. అపకారికికూడా ఉపకారం చేయటం నేర్పరితనం. ఇందులో నేర్చరితనమేమిటి? ఒకనికి అపకారం చేసినవాడు అతడు తనకు ఉపకారం చేస్తాడని ఊహించడు. అపకారం చేస్తాడనే అనుకొంటూ ఉంటాడు. అట్టివానికి అపకారం చేస్తే అవును, అప్పుడు వీనికి అపకొరం చేశాను కనుక, ఇపుడు వీడు ప్రత్యపకారంచేసే అవకాశం దొరికింది కనుక చేశాడు, అపుడు నేను ఆలా చేసి ఉండకపోతే ఇపుడు నాకీబాధ కలిగేది కాదు అని బాధపడతాడు. అట్టి వానికి అపకారానికి బదులు ఉపకారంచేస్తే ఇంత ఉత్తమునికా నేనానాడు అపకారం చేశాను అని వెంటనే కాకపోయినా ఎపుడైనా తప్పక పశ్చాత్తాపంతో బాధపడతాడు. అపకారం చేసి బాధపెడితే పాపం. ఉపకారం చేసి బాధపెడితే సుకృతం. సుకృతం చేసికొన్న వాడూ అయాడు, అపకారిని బాధించినవాడూ ఆయాడు. ఇదొక నేర్చు. నోటితో చెప్పకపోయినా, ఈ అపకారికి చేసిన ఉపకారం వల్ల, నీకు నేను అపకారిని

వివేకానందిని వ్యాఖ్యాసహితం 33 కాకపోయినా నీవు నాకు అపకారంచేసి ని నీచబుద్ది నాడు వెల్లడించావు. నా జౌదార్యం చూడు, నీకు ప్రత్యపకారం చేయగలిగినా ఉపకారమే చేశాను అని తన జౌన్నత్యమూ, వాని అల్పత్వమూ నిరూపించినవాడూ అయాడు. ఇదొక నేర్పు.

అపకారి ఏమి చేశాడు? తనమాట కాదన్నాడు. తన నెదిరించాడు. తనను ఆఅవమానపరిచాడు. తనను దూషించాడు. తనపై లేనినిందలు వేశాడు. తనలో ఉన్నదోషాలు ప్రకటించటం తనపని కాకపోయినా ప్రకటించి, తనకు అపకీర్తి కలిగించాడు. తనకు వచ్చే లాభానికి అడ్డువచ్చాడు. నష్టం కలిగించాడు. కొట్టటానికో కొట్టించటానికో ప్రయత్నించాడు. ఇంకా ఎన్ని రకాల అపకారం చేయవచ్చునో అన్నిరకాలా చేశాడు. చేయటానికి ప్రయత్నించాడు. ప్రయత్నిస్తాడు. కనుక వానికి తానూ ఇన్ని విధాలా ఆపకారం చేయాలి. ఈ మనస్రత్ష్యం ఇలా కొనసాగుతున్నందువల్ల ఇదే తత్వం అక్కడా కొనసాగుతూ ఉంటుంది, అపకార - ప్రత్యపకార - ప్రతిప్రత్యపకార ప్రక్రియ తరాలకూ కొనసాగుతూనే ఉంటుంది. దీనివల్ల ఉభయవర్గాల సర్వశక్తులూ ఇందుకే ఉపయుక్తములవుతూ ఇరువర్గాలకూ నష్టమే కలిగిస్తాయి. అపకారిచేసే అపకార ప్రయత్నాలకు విరుగుడు ఏమిటి? ఒకటి ఆత్మరక్షణ. రెండు అతడు ఏ ప్రయోజనంమీద దెబ్బతీయాలనుకొన్నాడో ఆ ప్రయోజనం సాధించటం. దానితో నీవు చేయగలది లేదు అని నిరూపించటం, రెండు అతడు ఇన్ని చేయటానికీ తాత్పర్యం తన మనస్సును బాధించటం. కనుక వాటికి విరుగుడు చేస్తూ మనస్సుదాకా రానివ్వకపోవనటం. ఆ మేరకు వానిప్రయత్నం వ్యర్ధమై వానికే బాధ కలుగుతూ ఉంటుంది. అట్టివానికి ఉపకారమే చేస్తూపోయినందువల్ల వాడు సాత్వికుడు కానందువల్ల పశ్చాత్తాపం కలగకపోయినా స్వషప్రయోజనం ఆశించి అయినా తనకు అనుకూలుడు కాక తప్పదు. దీనివల్ల తనకు అపకారిపరంపరలో ఒకడు తగ్గుతాడు. కాలక్రమంలో వాడూ ముందు తటస్టుడూ తరువాత ఉపకారీ అవుతాడు. ఆ మేరకు తనబలమూ పెరుగుతూ ఉంటుంది. ఎదుటివాడు దుమ్ము రేపితే మనమూ దుమ్ము రేపినందువల్ల ప్రయోజనం ఎవరికీ ఉండదు. నీళ్ళుచల్లినందువల్ల మరి దుమ్ము శేగదు. ఇది పౌరుష హానికూడా కాదు. అపకారికి అపకారం చేసినందుకు ఫలం వానిని లొంగదీసుకొని మన చెప్పుచేతలలోనికి తెచ్చుకోవటం. ఆ పని ఉపకారంవల్లనే అవుతున్నప్పుడు అపకారం ఎందుకు? పగ యడగించు టెంతయు శుభంబది లెన్స యడంగునే పగంబగ అన్నాడు తిక్కన. తన కొడుకులను సంహరించిన అశ్చత్భామను తన భర్తలు చంపకుండా అపినది (ద్రౌపది. తనను అవమానపరచి ఆఅనందింపవచ్చిన దుర్యోధనుని గంధర్వులనుంచి విడిపించాడు ధర్మరాజు. తనను ఓడించవచ్చిన గీ

క సుమతి శతకము మహమ్మదును శరణంటే విడిచిపెడుతూ వచ్చాడు పృథ్వీరాజు. అవమానపరచవచ్చిన 'స్రెంధవుని విడీచిపెట్టారు పాండవులు. ఇందువల్ల వారు మళ్ళీ అపకారాలే చేశారు. అళశ్చత్థాము ఆపాండవం చేసే ప్రయత్నం చేశాడు. దుర్యోధనుడు కురుక్షేత్రసంగ్రామం తెచ్చాడు. గోరీ పృద్వీరోజు కళ్ళుపీకించాడు, మట్టుపెట్టాడు. అభిమన్యునివధకు కారణమైనాడు సైంధవుడు. నాలుగు యుద్దాలలో ఓడినా ఐదవ యుద్ధంకోసం ప్రయత్నం చేస్తానంటూ చేస్తూనే ఉంటుంది పాకిస్థాన్‌. అయినా, అపకారికి ఉపకారము చేస్తూ వాని అపకారం కొనసాగనిరీతిని స్వపామర్థ్యం పెంచుకొంటూ ఉండటం మాత్రమే మనిషి చేయవలసినపని. అయినా వాడు మారడూ? రాముడూ ధర్మరాజూ చేసినపని అపుడు చేయక తప్పదు. ప్రత్యర్థికి పదవి ఇచ్చి దువ్వటం ఇందుకే, విభీషణుడు యుయుత్సుడు శత్రుసక్షంవారే మిత్రులైనారుకదా.

అదీ కాక్క నేర్పు అంటే (ప్రయత్నించి సాధనచేసి, అలవరచుకొన్న నిపుణత, సహజవిరుద్దమయినా సాధ్యం. నేలమీద నడవటం సహజం. తీగెమీద నడవటం (ప్రయత్నించి నేర్చుకొన్న చాకచక్యం. ఒక దున్నపోతును మరొక దున్న పొడిస్తే అది దీనిని మళ్ళీ పొడవటం సహజం. ఒక గాడిదను మరొక గాడిద తన్నితే ఇది దానిని మళ్ళీ తన్నటం సహజం. విపరీతం కాదు. ఒకనికి మరొకడు అసకారం చేస్తే ఇతడు అతనికి (ప్రత్యపకారం చేయటం సహజం. ఉపకారికి (ప్రత్యుపకారం చేయటం సహజం. విపరీతం కొదు. అపకారికి ఉపకారం చేసేగుణం విపరీతమయినా సాధించవలసిన నేర్పు.

శ్రీరామచంద్రుడు ఇట్టి నేర్పు సహజంగా కలవాడు. రావణుడు యుద్ధంలో రామునికంటబడినప్పుడు రాముడు తలచుకొంటే రావణుని చంపగలిగి ఉండేవాడు. కొని చంపలేదు. అతనిరథం, గుజ్జ్ఞాలు, జెండా, గొడుగు, సారథి, అశని, శూలం, ఖడ్గం

  • అన్నీ తనబాణాలతో నువ్వుగింజలంతలుగా నరికాడు. ఒకబాణం వేసి వక్షస్థలంపై కొట్టాడు, ఆ దెబ్బకు రావణుడు వణికి పోయాడు. చాలా బాధ కలిగింది. చేతిలోంచి ధనుస్సు జారిపడిపోయింది. ఆలా పట్టూడిన రావణునిమీద ఒక అర్హ చంద్రబాణం ప్రయోగించి అతనికిరీటం పడగొట్టాడు రాముడు, కిరీటం పడకొట్టగలిగినవాడు తలచుకోలేదు కాని, తలచుకొంటే, తలచి ఉంటే, తలనే నరికి ఉండేవాడు. కాని నరకలేదు సరికదా, చాలా భయంకరమైన యుద్ధం చేశావు, నా వీరులను చాలా మందిని సంహరించావు, అందువల్ల అలినిపోయినట్టు కనిపిస్తున్నావు, నిన్ను ఇప్పుడు చంపదలుచుకోలేదు, వెళ్ళు, ఈ రాత్రి విశ్రాంతి తీసుకొని రేపు మరాక రథమెక్కి, ధనుస్సు పట్టి రా, అపుడు నీవు రథంమీద ఉండి, నా బలం చూద్దువు గాని - అన్నాడు. రావణుడు దర్చం ఉడిగి, గబగబా లంకలో ప్రవేశించాడు. రావణుడు రామునికి చేసిన అపకారాన్ని మించిన ఆపకారం ఎవరూ ఎవరికీ చేయలేరు. అట్టి అపకారిని చంపకుండా వదిలిపెట్టాడు రాముడు. వానికేమాత్రం వివేకమున్నా (బ్రతికి ఉండేవాడు.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం ఏర్‌ వేమన్నగారుకూడా ఈ పద్యంలోని భావంవంటిదే చెప్పారు : చంపం దగినయట్టి శమ్రవు తనచేత చిక్కెనేని కీడుసేయరాదు, పాసంగ మేలు చేసి పొమ్ముముటే చాలు విశ్వదాభిరాను వినురనేను. సుమతికి మూలమనదగిన శ్లోకం జైమిని భారతంలో ఇలా ఉన్నది : ఉపకారిషు యస్పాధుః సాధుత్వే తస్య కో గుణం! అపకారిషు యస్పాధుః స సాధుః వద్భిరుచ్యతే ॥ (639) అవ : దుష్టుని స్టేహంగురించి వివరిస్తున్హాడు :. క ఉసమింప మొదట తియ్యవ కపటం బెడనెడను జెజుకుకైవడినే పో నెపములు వెదకును గడపటం గపటపు దుర్దాతిసొందు గదరా సుమతి. క్ష ప్ర: సుమతీ, కపటపుదుర్జాతి = కపటము + దుర్దాతి = కపటము = మోసం చేసేవాడు, ఐన, దుర్దాతి = దుష్టునియొక్క, పొందు = చెలిమి, ఉపమింపన్‌ = పోల్చగా, చెజకుకైవడినే పో = ఛెజకుకైవడిన్‌ +ఏ, పో = చెణకుముక్కవలెనే సుమా, మొదటన్‌ = ప్రారంభంలో, తియ్యన = తీపీగా, మధురంగా ఉంటుంది, ఎడనెడను = ఎడన్‌+ఎడను = అక్కడక్కడ, మధ్య మధ్య, కపటంబు =దగా చేసేదిగా, రుచిహీనంగా ఉంటుంది, కడపటన్‌ =ఐ చివర్న నెపములు = దోషాలు, తప్పులు, వెదకును = వెతుకుతుంది, అన్వేషిస్తుంది. తా : సుమతీ, దగా చేసే దుష్టునిస్టేహం చెజకుగడలాంటిది. చెటకుగడ మొదట తియ్యగా ఉంటుంది. మధ్య మధ్య తక్కువ రుచితోనూ అరుచితోనూ ఉంటుంది. చివరికి వచ్చేసరికి పూర్తి చప్పగా ఉండి ఏమీ బాగా లేదనిపిస్తుంది. మోసగాడు కూడా అయిన దుష్టునిస్నేహమూ ఇంతే. [ప్రారంభంలో బాగా ఉంటుంది. మధ్య మధ్య తగ్గుతూ ఉంటుంది. చివరిదశలో పూర్తిగా దోషాలు వెదకుతుంది. వ్యా: కసిరసీచ కాసిశాయవమదనుత్తో వృళ్చికేన సందప్టః అపి చ పిశాచగ్రస్తు కీం బ్రూమో వైక్సతిం తన్యః అసలే కోతి, ఆపై కల్టు (త్రాగింది, ఆ వెనుక వెట్టెత్తింది, తరువాత తేలు కుట్టింది. ఆమీద దయ్యం పట్టింది - అన్నట్టు వాడు మొదట దగాకోరు, దానికి తోడు దుష్టుడు, వానిస్నేహం ప్రారంభంలో చాలా బాగనిపించి, మధ్యలో తగ్గి, చివరికి లేని దోషాలు కూడా అన్వేషించి వికటంగా ముగుస్తుంది, ఇట్టిస్నేహం గురించి భర్శహరికూడా ఇలా చెప్పాడు : 18

36 సుమతి శతకము మొదలు చూచినం గడు గొప్ప పిదపం గురుచ ఆది. గొంచెము తర్వాత నధికమొచు! దనరు దినపూర్వపరభాగజనితమైన ఛాయపోలిక కుజనసజ్జనుల మైత్రి. కపటపు దుర్దాతిలక్షణం తప్పులు వెదకటం గురించి మరొక చోటకూడా ఇలా ఉన్నది : నక్కలు బొక్కల వనెదకును వక్కణతో మారపంది యగణిత వెదకున్‌ కుక్కలు చెప్పులు వెదకును తక్కునవాండెబయపుడు తప్పులె వెదకున్‌ ఈ దోషాలు వెదకటంగురించి 19వ పద్యంలోనూ దానికి కారణం గురించి 39వ పద్యంలోమా ఈ కవే ఈ శతకంలోనే చెప్పాడు.

  • ఆవ : కాలాన్సి అనునరించి మెలగనేర్వాలని చెప్పుబోతున్హాడు : క ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్‌ వొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగునాండు ధమ్యండు సుమతీ. కేక్‌ (ఫ్ర: సుమతి, ఎప్పటికెయ్యది = ఎప్పటికిన్‌+ ఏ + అది = ఎప్పటికిన్‌= ఏ కాలానికి, ఎయ్యది ఇ ఏ మాట, ప్రస్తుతము = మిక్కిలి స్తుతింప బడినదో, అనగా ఏ సమయంలో ఏ మాట ప్రశంసింపబడుతుందో, అప్పటికిన్‌ = ఆ సమయానికి ఆ సమయంలో, ఆ మాటలు = ఆ పలుకులు, ఆడి = పలిక్తి (ఎన్నడూ), అన్యులమనముల్‌ = ఇతరుల మనస్సులు, నొప్పింపక ఇ నొచ్చుకొనేటట్టు చేయక, తాన్‌= తాను, నొవ్వక = బాధపడవలసిన పరిస్థితులు కల్పించుకొని బాధపడక, ఇతరులు తనను బాధపెట్టే మాటలనినా మనసుకు పట్టించుకొని బాధపడక్క తప్పించుక = అట్టి పరిస్థితులను తొలగించుకొని, తిరుగువాండు= మెలగేమనిషి, ధన్యుడు = కృతకృత్యుడు. తా : సుమతీ, తెలిసినవారు ఏ సందర్భానికి ఏ మాట తగినదని ప్రశంసిస్తారో, ఆ సందర్భంలో ఆ మాట పలకాలి, ఎన్నడూ ఇతరుల మనస్సులకు కష్టం కలిగించకుండా ఉండాలి. ఇతరులు ఆపోహవల్ల కాని, ఒకని మనస్సు కష్టపెట్టాలని ఉద్దేశపూర్వక గా గాని ఒకని మనస్సుకు కష్టం కలిగించటానికి 'ప్రయత్షించవచ్చు. కాని, అతడు కష్టపడకుండా ఉండాలి. ఇలా ప్రవర్తించేవాడు చేయవలసినపనులు చేసినవాడు.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం రౌ

వ్యా; ఈ పద్యాన్ని చాలామంది తప్పుగా అర్ధం చేసుకొంటున్నారు. తన అభిప్రాయం ఏదయినప్పటికీ ఏ సమయంలో ఏ మాట పలికితే ఇతరులమనస్సుకి బాధకలుగకుండా ఉంటుందో, ఆ మాట పలకాలి, అలా చేసినందువల్ల వారి మనస్సూ కష్టపడదు, వారు తిరిగి తన మనస్సు కష్టపెట్టవలసిన అవసరం ఉండదు కనుక తన మనస్సూ కష్టపడదు

  • ఇలా తాను ఏ కష్టనష్టాలలోనూ చిక్కుకొనకుండా తప్పించుకొని, ఇతరులను మాత్రం ఇరికించి తిరిగేవాడు కృతార్జుడు - అని అవకాళవాదిగా మెలగమన్నట్టు అర్ధం చెపుతారు; అది సరికాదు. అట్టి నీతి ఈ కవి చెప్పడు. అట్టి ఆవకాశవాదికి ఇహపరాలుండవు. జనం త్వరలోనే ఇతడు అవకాళవాది అని గ్రహించి ఇతనికి విలువ ఇవ్వటం మానేస్తారు. కనుక ఐహిక ప్రయోజనాలూ, పరిణామంగా పారమార్థిక ప్రయోజనమూ అతడు కోల్పోతాడు. కనుక ఈ అర్థం కవిఅభిప్రాయం కాదు.

సమయానికి తగినమాట పలకటం అంటే - మనం ఒకరింట్లో వివాహం చూడటానికి వెడతాము. మనని పీలిచినవారు కన్యాదాత అయితే వివాహం చక్కగా చేశారు. ఈ అమ్మాయి పెళ్ళి కూడా చేయటంతో మీ బాధ్యతలు అన్నీ నెరవేరాయి అని జరిగినదానికి అనుగుణమయిన మాటలు పలుకుతాము. ఎవరైనా పరమపదిస్తే వెడితే, ధైర్యంగా ఉండండి, మీరు చేయగలిగినదంతా చేశారు, వారూ నిండు జీవితం అనుభవించారు, అందరూ (ప్రశంసించదగిన జీవితం గడిపారు, ఎవరైనా వెళ్ళిపోవటం బాధాకరమయినా కృతకృత్యులయిన వారిగురించి విచారించవలసినది లేదు అని జరిగినదానికి అనుగుణమయిన ఓదార్పు మాటలు పలుకుతాము. ఈ మాటలు అప్పటికి (ప్రస్తుతములయిన మాటలు. ఇలా ఏ సందర్భంలో ఎట్టి మాటలు పలకాలో చెప్పే (ప్రత్యేకపుస్తకాలే ఆంగ్లంలో ఉన్నాయి. ఇది అవకాశవాదం కాదు. ఎట్టిచోట ఎంతసేపు మాటాడాలో తెలిసి మాటాడాలి అనికూడా (గ్రహించాలి.

సమయమూ, సందర్భమూ, ఎదుటివాని మనఃస్తితీ గమనించి మాటాడి తన చిత్తశుద్ధికి లోపం లేకుండా స్వకార్యం సాధించుకోవాలి తప్ప తదితరముగా ప్రవర్తించి పాడుచేసుకొనగూడదు అనటానికి ఉదాహరణముగా ఒకకథ మా గురువుగారు కళాప్రపూర్ణ శ్రీ కేశిరాజు వేంకట నృసింహ అప్పారావుగారు ఒకసారి ఇలా చెప్పారు :

ఒక పండితునివద్ద ఇద్దరు విద్యార్ధులు పోతనగారి భాగవతం చదువుతున్నారు. ఒకనాడు పాఠం జరుగుతుండగా అధ్యాత్మిక జిజ్ఞాసగల ఒక సంపన్నుడు ఆ పండితునితో ఏదో పని ఉండి వచ్చాడు. పాఠంమధ్యలో విఘ్నం కలిగించటం తప్పు కనుక నమస్కరించి తానూ కూర్చున్నాడు. గురువుగారు పాఠం చెప్పవలసినదంతా పూర్తి చేశారు. తరువాత వారు వేసిన ప్రళ్ళలకు శిష్యులు చెప్పిన సమాధానాలనుబట్టి, వారు శ్రద్దగా చదువుతున్నారనీ,

క్షం

38 సుమతి శతకము బుద్ధిమంతులనీ వృద్దిలోనికి వస్తారనీ, అందుకు తగినట్టుగా దోహదం చేయటం తమవంటివారి కర్తవ్యమనీ, అందువల్ల విద్యార్థులకు ఉత్సాహము కలిగి, వారు బాగుపడటమే కాక, అట్టి వారివల్ల దేశం కూడా బాగుపడుతుందనీ ఆయన భావించి, గురువుగారితో అయ్యా, మంచి విషయాలు చక్కగా తమరు బోధిస్తున్నారు, ఈ చిరంజీవులు (శ్రద్దతో (గ్రహిస్తున్నారు, కనుక వీరికి బహుమానమివ్వాలని నాకు అనిపిస్తున్నది, ఇపుడు దగ్గర లేదు, రేపు మా యింటికి పంపుతారా? అని అడిగాడు. వారు సరే, అని ఆయన మంచి మనస్సుకి ప్రశంసించి మర్షాడు విద్యార్థులను వెళ్ళి తెచ్చుకోండి అని పంపించారు. ఇద్దరూ వెళ్ళారు, లంకంత యిల్టు, రాజభవనంలా మహావైభవంతో ఉంది. చావడిలో మంచి ఆసనాలు, గోడలకి పటాలు, అన్నీ బాగున్నాయి. ఆయన ఒక్కడే ఉన్నాడు. వృద్దుడు. ఆరోగ్యం అంత బాగున్నట్టు లేదు. చత్వారం వచ్చినట్టుంది, మెల్లగా గూడా నడుస్తున్నాడు. ఈ విద్యార్థులను ఆదరంతో లోపలికి రమ్మని కూర్చోబెట్టి వారివాక్కు విని ఆనందించాలని నాయనా, మీరు భాగవతం చదువుతున్నారు గదా, మీకు బాగా నచ్చిన పోతనగారి పద్యమేదయినా చదవండి అన్నారు. ఒకడు :

ధరపింహాసవమై నభంబు గొడుగై తద్దేవతల్‌ భృత్యులై

పరమాన్నూయములెల్ల వందిగణమై (టబ్రహ్మాండనూగారమై

సిరి భార్యామణిటై విరించి కొడుకై శ్రీగంగ సత్సుత్రిభై

వరుసన్నీ ఘనరాజవంబు విజమై వర్దిల్దు నారాయణా -

అని నారాయణ శతకంలోని పద్యం చదివాడు చక్కగా. రెండన అతడు అంతకంటె బాగా

పుట్టంధుండవు పెద్దవాడవు మహాభోగంబులా లేవు నీ

పట్టెల్లం జెడిసోయె దుస్పహజరాభారంబు సైం గప్పెలీ

చుట్టాలెల్లను బోయి రాలునుగలువ్‌ శోకంబునవ్మన్నులై

కట్టా దాయలసంచ నుండందగవే కౌరవ్యవంశా(గ్రణీ -

అని భాగవత పద్యమే చదివాడు, పెద్దాయన మొదటివానితో బాగుంది అని పాతిక రూపాయలిచ్చాడు. రెండవవానితో ఇంకా బాగా నేర్చుకోవాలి అని పదిరూపాయలిచ్చి పంపించాడు.

ఈ “ఎప్పటి కెయ్యది” పద్యానికి మూలమనదగిన శ్లోకం గరుడపురాణంలో ఉన్నది :

యస్య యవ్య హి యో భానస్తన్య తస్య హితం వదన్‌ |

అమ్రవిళ్య మేధావీ క్షిప్రమాత్మవళం వనయేత్‌ ॥

ఎవరిభావం ఎట్టిదో (గ్రహించి, వారితో మాటాడేటప్పుడు అట్టి భావాలే పలికి, వారిహృదయంలో (ప్రవేశించి, తనమాట వినిపించుకొనేటట్టు చేసుకోవాలి అని దీని

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 39 అభిప్రాయం. ఇదికూడా వంచన చేసి లొంగదీసుకోమని చెప్పటంగా భావించగూడదు. ఒక మంచిపనికి ఒకరిసాయం ఆవసరమయినపుడు వారికి నిష్కారణంగా అనవసరంగా వ్యతిరేకంగా మాటాడి, విముఖులను చేసుకోగూడదు. వారికిష్టమైన అభిప్రాయాలే ప్రస్తావనకు తెచ్చి, వాటిలో తనకు నచ్చినవాటిని ప్రశంసించి వారిసుముఖత సంపాదించుకోవాలి. పరస్పరపరాజయం కోరే ఇద్దరు నాయకులు సమావేశమవుతారు. ఇద్దరికీ భేదాభిప్రాయాలున్నాయని ఇద్దరికీ తెలుసు. ఇద్దరూ ఎదుటివారిని చెరిచి తాము బాగుపడాలనుకొనే వారని ఇద్దరికీ తెలుసు, కాని, ఇద్దరూ ఒకటయితే ఇద్దరికీ బలమనీ ఇద్దరికీ తెలుసు. కనుక ఇద్దరికీ సమ్మతమయిన విషయాలు ఇద్దరూ ప్రస్తావించుకొంటారు. తరువాత భేదాభిప్రాయాలు సర్దుబాటు చేసుకొనటానికి ప్రయత్నిస్తారు. ఏకీభవించటానికి వీలులేని తీవ్రసమస్యలు ప్రక్కకు పెట్టి ఏకీభవించటానికి వీలయిన పనులలో కలిసి పనిచేద్దామని శత్రుదేశాలే (నైనా అమెరికాలే) సంభాషణలు జరపటం చూస్తున్నాము. కనుక గొప్ప ప్రయోజనాలు సాధించటానికి ఆలవరచుకొనవలసిన సామర్థ్యంగురించి చెప్పబడింది. కాని అవకాశవాద ప్రబోధం కాదు. ప్రస్తావసదృశం వాక్యం స్వభావసదృళం ప్రియమ్‌ | ఆత్మశక్తి సమం కోసం యో జానాతి స పండితః | సందర్భాని కనుగుణంగా, మనిషి స్వభావానికి తగినట్టు, ఇంపుగా మాటాడటం తెలిసినవాడే పండితుడు. తన తాహతెంతో తెలుసుకొని ఎంతకోపం చూపిస్తే చెల్టుబాటు అవుతుందో, ఆంత కోపమే ప్రదర్శించేవాడే పండితుడు అనిన మహాభారతవాక్యమూ ఈ భావాన్నే సమర్థిస్తున్నది. అవ : ఎదుటివారి తప్పులకోసం వెదకటం తగదని చెప్పుబోతున్హాడు. కు. ఎప్పుడు తప్పులు వెదకెడు వప్పురుషుని. గొల్వం గూడదది యెట్లన్నన్‌ సర్పంబు పడగనీడమ గప్ప వసించినవిధంబు గదరా సుమతి. క్షే ఫ్ర: సుమతీ, ఎప్పుడు = ఎల్లవేళలా, తప్పులు = తనను సేవించే వారి తప్పులకోసం, వెదకెడు = అన్వేషించే, అప్పురుషునిన్‌ = ఆ+పురుషునిన్‌ = ఆమనుష్యుణ్ణి, కొల్పయాడదు = కొల్వన్‌*కూడదు = సేవించగూడదు, అది = ఆ సేవించటం, ఎట్లన్నన్‌ = ఎట్టు+అన్నన్‌ = ఎటువంటిది అంటే, సర్బంబు = పాముయొక్క, పడగనీడను = ఫణముయొక్క ఛాయలో, కప్ప = మండూకం, వసించిన = నివాసం ఉన్న, విధంబు గదరా = విధంబు+కదరా = రీతికదా నాయనా, 20

శ0 సుమతి శతకము తా : సుమతి, తనను సేవించే వారిలో ఏ తప్పు దొరకునా అని ఎల్లప్పుడూ అన్వేషిస్తూ ఉండే మానవుని సేవించగూడదు. అట్టి వానిని సేవించటం పాముపడగనీడలో కప్పనివాసం ఉండటంవంటిది కదయ్యా, వ్యా : పొట్టకోసం ఎవరిదగ్గరనో పనిచేయక తప్పక పోవచ్చును. కాని, తనను సేవించేవారిలో ఏ తప్పుదొారుకుతుందా, దానిని పట్టుకొని ఎలా శిక్షిద్దామా, అని ఎల్లప్పుడూ తప్పులకోసం అన్వేషించేవాన్సివద్ద మాత్రం పనిచేయగూడదు. మనిషన్నాక ఏదో పొరపాటు రాక తప్పదు. అట్టి అవకాశం దొరికితే అపకారం చేయటానికి కాచుకు కూర్చున్నవాడు ఆ సేవకునికి కరినళిక్ష వేయవచ్చు కనుక్క అట్టివాణ్ణి సేవించగూడదు. అలా సేవించటం కప్పలను ఆహారంగ్యా తినే పాముపడగనీడ|్రింద నివసించటానికి ఒక కప్ప పూనుకొనటంవంటిదే. అలా ఉన్న కప్పను ఏ క్షణంలోనైనా ఆ పాము [మింగవచ్చు. కప్పకు తప్పించుకొనే ఆవకాశం ఉండదు. ఏరికోరి అపాయం తెచ్చి సెట్టుకొనటంకంటె అట్టివానికి దూరంగా ఉండటమే (శ్రేయస్కరం. అయితే పని చేయించుకొనేవాడు చేసేవాని పనిలోని దోషం గమనించటం తప్పా? గమనించటం తప్పు కాదు. అవసరంకూడాను. అయితే తప్పులనే కాదు ఒప్పులనుకూడా గమనించాలి. తప్పులకు తగిన శిక్షలాగే ఒప్పులకు తగినమెప్పుకూడా ఉండాలి. తప్పులను గమనించటం, వాటిని దిద్ది, మళ్ళీ చేయకుండా చేసి, తనపని నిర్దుష్టంగా చేయించుకొనటానికి కాని, వానిని శిక్షించటానికి కాదు. చెప్పినా మారకపోతే మానకపోతే శిక్ష ఎలాగూ తప్పదు. ఒప్పులు ఉపేక్షించి తప్పులకోసం చెదకేవానిని పురోభాగి ఆంటారు. వాడు దోషైకదృక్కు. రసిమీద 'శ్రాలే ఈగ. దానివల్ల వానికే నష్టం, ఆవ : బంధువులస్టుభావం చెప్పుబోతున్లాడు క ఎప్పుడు సంపద గలిగిన నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్‌ దెప్పలుగ జెజువు నిండిన గప్పులు పదినేలు చేరు. గదరా సుమతి. 20 (ప్ర: సుమతీ, ఎప్పుడు = ఏ సమయంలో, సంపద = ధనం మొదలయినవి, కలిగినన్‌ = సంభవిస్తే అప్పుడు = ఆ సమయంలో, బంధువులు = చుట్టాలు, వత్తురు = చేరి ఆ కఠిమి అనుభవించటానికి వస్తారు, తెప్పలుగన్‌ = పుష్కలముగా, అధికముగా, చెజువు = కొలను, నిండినన్‌ = నీటితో పరిపూర్ణమైతే, కప్పలు = మండూకములు, పదివేలు = అధికసంఖ్యకలవి, చేరుంగదరా = చేరున్‌+కదరా = వచ్చి సమీసిస్తాయికదా నాయనా, తా : సుమతీ, కలిమి కలిగిన వెంటనే చుట్టాలందరూ వచ్చి చుట్టూ చేళతారు. నీటితో చెజువు నిండిన వెంటనే కప్పలు వచ్చి చేరతాయి గదా,

వివేకానందినీ వ్యాఖ్యాసహితం ల్‌! వ్యా : చెణువునిండా నీరు వచ్చినపుడు ఎక్కడెక్కడి కప్పలూ వచ్చి చేరినట్లే కలిమి, చేరినవెంటనే చుట్టాలూ వచ్చి చేరతారు. చెజువులో నీరు లేకపోతే కప్పలు రావు. నీరయిపోతే ఉండవు. కలిమి లేనివానిదగ్గరకి చుట్టాలు రారు, కలిమి వచ్చినపుడు ఎందరైనా అనుభవించకూనికీ సాయం పొందటానిక్షీ వస్తారు, కలిమి అయిపోతేనూ రారు, ఉండరు. ఇది ఒక్క మానవులకే కాదు, ప్రాణులందరికీ వర్తిస్తుంది. బెల్లంబుట్ట చుట్టూ ఈగలు ముసురుతాయి. కాయలున్న చెట్టుమీదనే పన్షులు వ్రాలతాయి. ఈ వేళ కలిమి కలిగి నిన్న లేమితో ఉన్నవాడూ, నిన్న కలిమికల బంధువులను చేరే ఉంటాడు, చేరాలని ఆశించే ఉంటాడు, తన బంధువులు మంచివారయితే వారిసాయం పొందే ఉంటాడు. రేపు లేమి వస్తే చేరతాడు. ఈ బంధుస్వభావం చెప్పటంలో తాత్పర్యం బంధునింద కాదు. (ప్రతివాడూ ఎందరో కొందరికిబంధువయే ఉంటాడు. బంధువులను చిన్న చూపు చూడమనీ కాదు. చేరినవారిని చూచి నా మంచితనమో నామీది ప్రేమో కారణంగా వీరు వస్తున్నారని పొంగుపాటూ వద్దు, భ్రాంతీ వద్దు, అలాగని లేనివారిమీద ఈసడింపూ వద్దు, వారిని దూషించకు అని తరువాతి పద్యంలోనే చెప్పబోతున్నాడు. ఉన్నప్పుడు పెట్టాలి..ఈ మాట ్రతిమనిషీ అనుకొంటే లేనపుడు ఎవడూ బాధపడనవసరం ఉండదు. అయితే అందరూ అలా సెట్టేవారు కారు. కనుక తన్ను మాలిన ధర్మం కాకుండా, ఉన్నదన్న విరగబాటు లేకుండా, (ప్రేమ ప్రధానంగా, ధర్మం అధారంగా, తగినరీతిలో మెలగాలి. తెప్పలుగ శబ్దానికుదాహరణంగా సూ,ని. ఈ పద్యమే ఉదాహరించింది. అవ : ఆరోగ్యం, బాంధవ్యం, శౌర్యం, గురుభక్తి - (ప్రధానాలని చెప్పుబోతున్నాడు = కు. ఏీజుకుమీ కసుగాయలు దూజకుమీ బంధుజనుల దోషము సుమ్మీ పాజకుమీ రణమంలదున మీఅకుమీ గురువువాజ్ఞ మేదిని సుమతీ, 21 ఫ్ర : సుమతీ, మేదినిన్‌ = భూమిపై కసుగాయలు = కసరు+కాయలు = పిందెలు = లేతకాయలు (నేలపై రాలినవాటిని), ఏఅకుమీ = ఎత్తుకోవద్దు, బంధుజనులన్‌ = చుట్టాలైనవారిని, దూజకుమీ = నిందించవద్దు, రణమందునన్‌ = రణము+అందునన్‌= యుద్దంలో, పాఆకుమీ = పారిపోవద్దు, గురువులాజ్ఞ = గురువుల+ఆజ్జ = చదువు చెప్పువారి ఆనతిని, పూజ్యాలైనవారి అనతిని, మీఅకుమీ = దాటవద్దు, దోషముసుమ్మీ = తప్పుసుమా. తా ; సుమతీ, నేలపై రాలిన చెట్టు పిందెలు ఒకటొకటిగా ఎత్తి తీసుకోవద్దు, చుట్టాలను దూషించవద్దు, యుద్ధంలోనుంచి పాణిపోవద్దు, విద్యచెప్పేవారూ పూజనీయులూ పెట్టిన ఆనతి అతిక్రమించవద్దు. శ

శై సుమతి శతకము వ్యా : చెట్టున పుట్టిన పిందెలన్నీ కాయలుగా ఎదగవు. రకరకాల తెగుళ్ళవల్ల అవి పిందెలుగా ఉండగానే నేలపై రాలిపోతుంటాయి అట్టి వాటిని తీసుకోవద్దని చెపుతున్నాడు. తీసుకోవద్దని చెపుతున్నాడంటే తీసుకొని తినవద్దని చెపుతున్నాడన్నమాట. పెరిగి కాయలై పండుకావలసినవి పిందెలుగానే రాలిపోయాయంటే వాటికేదో తెగులు సోకిందన్నమాట. అట్టివాటిని తీసుకొని తినటం చిన్నపిల్లలకి సరదా, కాని, ఆట్టివాటిని తినినందువల్ల, అవి రాలిపోవటానికి కారణమయిన తెగులువల్ల వాటిని తిన్నవారికికూడా అనారోగ్యం కలుగవచ్చును. కనుక వాటిని ఎత్తి తీసుకోవద్దంటున్నాడు. ఇది చిన్నపిల్లలకే కాదు పెద్దవారికీ వర్తిస్తుంది. కడచినపద్యంలో బంధుస్వభావం చెప్పినవాడే ఈ పద్యంలో చెప్పిననీతి చుట్టాలను దూషించవద్దు అన్నది కూడా అందరికీ వర్తించేదే. ఒకసారి బంధువయ్యాకబంధువే. వద్దన్నా వదలనిది బంధుత్వం. తెంచి వేసుకొన్నా తెగనిది బంధుత్వం. కనుకనే ఎవరైనా ఇరువురు బంధువులమధ్య ఏ కారణంవల్లనైనా వైరం వచ్చినా ఏదైనా కథో కార్యమో వచ్చినపుడు రమ్మని పిలుస్తారు. నేను రానంటే కోపం ఉంటే ఉండనీ, బంధుత్వం ఎక్కడికి పోతుంది? రా, అంటారు. ఇష్టం లేకపోయినా ఆ కాస్సేపూ ఉండి వీరూ వచ్చేస్తారు. అదీ కాక, పరాయివాడు విరోధి అయితే వచ్చే నష్టం వేరు, బంధువు విరోధి అయితే వచ్చే నష్టం వేరు. వీడు అట్టు గుట్టు ఆనవాళ్ళు అన్నీ తెలిసినవాడు కనుక, వీడు అచ్చమైన శత్రువుకంటె ఎక్కువ అపకారం చేయగలుగుతాడు విఖిషణునిలా. ఈ నీతి సకలనీతిశాస్తకారులకూ సమ్మతమైనది. క్షేమేంద్రుడు చారుచర్య 31 వక్లోకంలో వ బంధుపంబంధిజనం దూషయేన్నాపి వర్ణయేత్‌, దక్షయజ్ఞక్షయాయాభూత్‌ త్రినేత్రస్య విమాననా అన్నాడు. చుట్టమైన వాని( జట్టున(దిట్టకు విడిచిపెట్టకెట్టివేళనైన, మూడు కమలనానిమొగియవమావాన దక్షయజ్ఞమెల్లధ్వంనమాయె అని దాని భావం. తిట్టనూ వద్దు విడిచిపెట్టనూ వద్దన్నది ఇందులోని విశేషం. పరస్పరద్వేషంవల్ల పరులకు లోకువవుతారు. కనుకనే కాగలకార్యం గంధర్వులే తీర్చారు మనము తోడు పడవద్దని భీమాదులంటే ఘోషయాత్రా సందర్భంలో దుర్యోధనుని గంధర్వులనుంచి విడిపించుకు రమ్మని ధర్మరాజు పంపిస్తాడు. అంతే కాదు, మనబంధువులలో ఎవరైనా ఒకరు నిర్దనులై గతి లేకుంటే వారిని పోషించాలనికూడా క్షేమేంద్రుడు చెప్పాడు చారుచర్యలో (శ్లో 90) : బిభృయాద్చంధుమధనం మిత్రం త్రాయేత దుర్గతమ్‌। బంధుమిత్రోపజీవ్యోఒభూదర్ధికల్పద్రుమో బలి; అని.

వివేకొనందినీ వ్యాఖ్యాసహితం క పేదవడినబంధు. నొద్పతిం బోషీంప్పు మూవదలను మి నాదుకొనముము, జర్ధికల్పనృక్షమగు వబి. జూడుము బంధుమిత్రులతని , వలన మనికి - అని బంధువులను మిత్రులను ఆదుకోవాలన్నాడు. ఈ కవియే అక్కటికురాని చుట్టము ... గ్రక్కున నిడువంగనలయు అన్నాడంటే అక్కడ అక్కజకు చుట్టమ్టైనవాడు వచ్చి తీరాలని చెప్పటంపైై (మొగ్గు ఉన్నంతగా. విడువటంపై లేదు. తమలో తాము సాయపడే బంధుమిత్రులు వృద్దిలోనికి వస్తారు, సాయపడతావు మానతావు అది తరువాతి విషయం, దూషించటంమాత్రం ఎన్నడూ తగదు, ఎందుకంటే, పెట్టిన అనం తిన్నది అరిగిపోతుంది, కాని తిట్టిన తిట్టు శాష్టతంగా ఉండి, బాధించి, పగ 'పంచుతుంది. చమవున విరిగిన యలుగుల వమవునం బుచ్చరిగవచ్చు వతినిష్టురతన్‌ మనమువ నాటీన మాటలు వినుమెన్ని యుపాయములను సెడలువె యధిపా అని భారతం చెపుతున్నది. జ్రీపేద్‌ వాక్యశరారిష్టీవ్రాన్న సారుష్యవ్యుషప్లుతాన్‌ | వొక్సారుష్యరుషా చక్రే భినుః కుదుకుఖక్షయమ్‌ ॥ (చారుచర్య క్లో 28) కథినకఠినములపవు కడునాద్సి ముల్కులచంటి. నుడులు విసరిష్టవ వలదు, కలినవాక్యరోషకలితుంై భీముండు కురుకులన్ము నాశవరుపలేదె- అని కురుకులనాశనానికి దుశ్ళాసనాదులు పలికిన సరుషవాక్యాలే కారణమని క్లేమేంద్రుడే చెపుతున్నాడు. యుద్దంలో పారిపోవటం పౌరుషానికి మచ్చ అని జగత్రసిద్దం. యుద్ధంనుంచి శత్రువులను జయించకుండా మరలివచ్చిన ఖడ్గతిక్కన కథ 11వ పద్యం వ్యాఖ్యానంలో చూడండి, గురువుల ఆజ్ఞ మీఆవద్దన్నది అతిముఖ్యమైనది. గురువులు అంటే పూజ్యులు, విద్యాబుద్దులు చెప్పేవారు, తల్లిదండ్రులు మొదలయిన వారు అని అనేకార్థాలున్నాయి. వారిమాట జవదాటక ఫ్రవర్తించే వారికి సమస్తశ్రేయస్సులూ కలుగుతాయి, వారు బెర్డలమీద [ప్రేమతో తమకుగలబ జ్ఞానమూ అనుభవమూ వినియోగించి చెప్పుతారు కనుక మీ మా, సుమ, సునూ, సుమ్మా పెచ్చరించేటపవుడు ఉపయోగించటం వ్యవహారంలో నేటికీ ఉంది, ఈ శతకంలోనూ సర్జ్వత్ర ఇలాగే ప్రయోగించాడు. ఆవ : బవ నాయకత్పం వనికీరాదని చెవ్పుటోత్రున్నాడు : క ఒక యూరికి నొక కరణము నొక తీర్చరి మైనాక నొగి. దజచైవన్‌ జ

గ సుమతి శతకము గకవికలు గాక యుండునె? సకలంబును గొట్టువడక సహజము సుమతీ, 22 ప్ర : సుమతి, ఒక యూరికిన్‌ = ఒక+ఊరికిన్‌ = ఒక (గ్రామానికి, ఒక కరణము = ఒకగణకుడు, (గ్రామపు లెక్కలు (వ్రాసేవాడు ఒకడు, ఒక, తీర్చరి = తీర్పు+ఆరి = న్యాయాధిపతి, ఐనంాక = ఐనన్‌+కాక = ఉంటేనే కాని, ఒగిన్‌ = క్రమంగా, తజవైనన్‌ = తజచు+ఐనన్‌ = అధికమైతే, సకలంబును = సమస్తమూ, కకవికలుగాక = కకవికలు + కాక = తారుమారుకాకుండా, గొట్టువడక = గొట్టు+ పడక = అల్లరికాకుండా, ఉండునె = ఉండున్‌+ఎ = ఉంటుందా? సహజము = తారుమారై అల్లరి కావటం స్వాభావికం, తా ; సుమతీ, (గ్రామానికి ఒక లిక్కలు (వ్రాసేవాడూ, ఒక న్యాయాధిపతీ ఉంటే వ్యవహారం చక్కగా ఉంటుంది. వారు అధికంగా ఉంటే ఆంతా తారుమారై అల్లరిగా ఉంటుంది. ఇది స్వాభావికం. వ్యా : బాలనాయకత్వం బహునాయకత్వం పనికి రాదు. వంటవాళ్ళిక్కువైతే వంట పాడవుతుంది - ఇవి శాస్త్రాలు. (గ్రామం ఉందంటే పొలాలూ, వాటిమీద పన్నులూ, ఆట్టివాటి లెక్కలూ ఉంటాయి. వాటిని వ్రాయటానికి ఒక గణకుడు ఉంటే చాలు, అలాగే ఏవో తగవులు రాక తప్పదు కనుక విజ్ఞుడైన న్యాయాధిపతి ఒకడుండాలి. వాళ్ళు సరిగా (గాయక పోయినా, తగవు సరిగా చెప్పకపోయినా, సైవారికి చెప్పుకోవచ్చు. అంతేకాని, వీరు ఒకరికి మించినవారయితే, సామాన్యంగా మనుషులు రాగద్వేషాలు కలవారవుతారు కనుక, వారిలో వారికి అంతఃకలహాలు ఏర్పడి పాలనక్రమం అస్తవ్యస్తమైపోతుంది. ఊరు పెద్దదై పని ఒకరు చేయలేనిదయితే, వారిక్రింద సహాయోద్యోగులను నియమించవచ్చు గాని, ఊరిని విభజించి ఒక భాగానికి ఒకనిని నియమించవచ్చు గాని, ముఖ్యుడుమాత్రం ఒకడే ఉండాలి. ఒక పనిపై సమానాధికారాలు కలవారు ఇద్దరుండగూడదు ఒకచోట, అని కవిఅభిప్రాయం. అధికులయినందువల్ల ఆ భేదఫలం లెక్కలకూ న్యాయానికీ పరిమితం కాక, ప్రతివిషయానికీ ప్రాకి ఊరి వ్యవహారాలన్నీ సమస్యలమయమైపోతాయి. దానితో అల్లరీ ఆగమూ తప్పవు. ఇందుకెవరిని తప్పుపట్టీ ప్రయోజనం ఉండదు. లోకస్వభావమే అంత కనుక, పెత్తనం అప్పగించే ముందే ఆలోచించాలి అనీ, లోకరీతి తెలిసినవాడు కనుక సహజము అనీ, చెపుతున్నాడు. కకవికలు శబ్దానికుదాహరణంగా సూ.ని. ఈ పద్యమే ఉదాహరించింది. ఆవ ? తామంటే ఇష్టంలేనివారికి దూరంగా ఉండాలని చెప్పుబోతున్నాడు : క _ఒల్లని సతి వొల్లని పతి వొల్లని చెలికాని విడువ నొల్లనివాండే

వివేకానందినీ వ్యాఖ్యాసహితం డర్‌ గొల్లండు కాక ధరలో గొల్లండును గొల్లండౌనె గుణమున సుమతీ, 23

ప్ర : సుమతీ, ధరలోన్‌ = భూమిపైని, ఒల్లని = వలవని, సతిన్‌ = భార్యను, ఒల్లని = ఆదరింపని, పతిన్‌ = యజనూనుని, ఒల్లని = ఇష్టపడని, చెలికానిన్‌ = మిత్రుని, విడువన్‌ = విడిచిపెట్టటానికి, ఒల్లనివాండే = ఒల్లనివాడు+ఏీ = ఇష్టపడనివాడే, గొల్లండు కాక = మూర్చుడు కాని, జాతి మాత్రంచేత, గొల్లండును = గొల్ల అని పిలువబడే జాతికి చెందిన అతడును, గుణమునన్‌ = మూర్ధత్వం అనే గుణంచేత, గొల్లండౌనె = గొల్లయ+టౌనె = మూర్భుడవుతాడా? కాడు,

తా : సుమతి, ఈ భూలోకంలో తనమీద వలపులేని 'ప్రీనీ, తనమీద ఆదరంలేని యజమానునీ, తనమీద ఇష్టంలేని స్నేహితునీ విడిచి పెట్టాలి. అలా విడువటానికి ఇష్టపడనివాడు మూర్చుడు, ఆంతే కాని గొల్లడు అనే పదానికి మూర్చుడు, యాదవజాతికీ చెందిన అతడు అనే అర్జ్థాలున్నంతమాత్రంచేత ఆ జాతికి చెందిన ఆతడు మూర్భడు కాడు.

వ్యా ? ఈ పద్యంలో తనమీద ఇష్టంలేని భార్యనూ, యజమానునీ, స్నేహితునీ విడిచిపెట్టక పోవటం మూర్టత్వం అవుతుంది అని చెవుతున్నాడు.

ఇష్టంలేని ఆమెతో కలిసి. ఉండటం సౌఖ్యకరం కాదు, బాధాకరం కూడా. అంతమాత్రంచేత ఆమెను పరిత్యజించటం యుక్తంకాదనీ, పైపెచ్చు దోషమనీ మనధర్మం చెపుతున్నది. జైమినిభారతంలో చండిక కథ ఈ ధర్మమే చెపుతుంది. ఆమె ఉద్దాలకుడు అనే తనభర్త చెప్పిన (ప్రకారం చేయక పోగా ప్రతిపనీ వ్యతిరేకంగానే చేస్తుంది. అయినా అతడు భరిస్తాడు, కావలసిన పనికి వ్యతిరేకంగా చెప్పే అనుకూలంగా చేయించుకుంటాడు. మంచినీళ్ళు కావలసినప్పుడు మంచినీళ్ళు ఇవ్వవద్దు అంటాడన్నమాట. ఆవిడ ఇస్తుంది. అయినా ఒక సందర్భంలో తనపొరపాటువల్ల అలా చెప్పనందున చివరికి ఆమె మరీ కష్టపెట్టినపుడు శపిస్తాడు రాతివైపొమ్మని. కాని, ఆది మంచిపని అనుకొనినట్టు కథలో లేదు. ఈ సమస్యకు సంబంధించిన కథ ఒకటి మార్కండేయ పురాణంలో కూడా ఇంతకంటె సూటిగా ఉన్నది. (ధ్రువుని సవతితమ్ముడు ఉత్తముడు. అతనిభార్య బహుల. ఆమెకు ఆతడంటే మంట. ఆతనికి ఆమెపైని వల్లమాలిన ప్రేమ, కనుక సర్జుకుపోతున్నాడు. ఒకసారి తోడిరాజుల సమక్షంలో ఆమెకు మదిరాపాత్ర ఆతడు అందిస్తే తిరస్కరించింది. అతడు ఆమెను అరణ్యంలో వదలి రమ్మన్నాడు. ఒక (బ్రాహ్మణునిభార్యను రాక్షసులు ఎత్తుకుపోయారు. ఆమెలో ద్వేషించదగినవే కాని ప్రేమించదగినలక్షణాలు లేవు. అయినా (బ్రాహ్మణుడు ఆమెను తెచ్చి ఇమ్మంటే వెతకటానికి వెళ్ళిన రాజు ఒక ముని ఆమానికి వెళ్ళాడు. అక్కడ తనకి అర్హ్యం ఇవ్వబోయి మానిన మునిని కారణమడిగాడు. న్‌

46 సుమతి శతకము భార్యను పరిత్యజించావు కనుక అర్భ్యానర్హుడవు అన్నాడు. భర్త శీలరహితుడైనా భార్య అనుకూలురాలుగా ఉన్నట్టే భార్యదుళ్ళీలురాలైనా భర్త పోషించాలి అన్నాడు ముని. భార్య దుళ్ళీలురాలయితే పరిత్యజించవచ్చు అనే చట్టానికంటే ఉదారమైనది ధర్మం. ఆ మునిద్వారా ఉత్తముడు (బ్రాహ్మణునిభార్య ఆచూకి తెలుసుకొని మరాక అడవిలో ఉన్న బలాకుడనే రాక్షసునివద్దకు వెళ్ళి ఈమె నెందుకు తెచ్చావు అన్నాడు. ఆమెభర్త మం(త్రవేత్త, యజ్ఞాలలో రక్షోఘ్నమంత్రాలు చదివి తమకు వాటిని పొాడుచేయనీయకుండా అడ్డువస్తున్నాడు, భార్య లేకపోతే అతడు ఆయోగ్యుడవుతాడని తెచ్చాము అన్నాడు. దుళ్ళీలురాలయినా భార్యను పోషించటం పాత్రునిలక్షణం, దుళ్ళీలురాలయినా భార్యను పరిత్యజించటం అపా(త్రునిలక్షణం అని ఇందువల్ల తెలుస్తుంది. అపర్నీకుడు అపూజ్యుడు. అందుకే వృద్దులయినప్పటికీ ఇదివరకు మళ్ళీపెళ్ళి చేసుకొనేవారు. అది వికృతరూపం ధరించి అతివలకు బాధాకరమయింది, కనుక నిరసింపబడింది. అది వేరు. భార్య పరిత్యజింపదగినది కాదన్నది ప్రస్తుతం. రాజు ఆమెను విడిపించి (బ్రాహ్మణునికి అప్పగించాడు. సంతోషించిన బ్రాహ్మణుడు మిత్రవింద అనే యజ్ఞం రాజుచేత చేయించాడు. దాని(ప్రభావంవల్ల ఆమెకు అతనిమీద మైత్రి కలిగింది. వారిద్దరూ సుఖంగా ఉన్నారు. కనుక వలపులేని భార్యవలపు పొందేప్రయత్నం చేయాలి కాని విడువరాదని తేలుతున్నది. కనుక, ఇందులో చెప్పిననీతి వేరు. అసలు ధర్మంవేరు అని (గ్రహించాలి. మనదేశంలో వేలపంవత్సరాలనుంచి వృత్తులనూ గుణాలనూబట్టి వర్దాలూ, వర్ణాలనుబట్టి వృత్తులవిభజనమూ జరిగి, వర్ణవైవిధ్యమున్నా వర్ణద్వేషం లేదు. అయినా, మనుషులలో సహజంగా ఉండే స్వభావంకారణంగా దురదృష్టవశాత్తూ వర్షాలనుబట్టి కొన్ని లోకోక్తులు ఆ యా వర్ణాలవారికి నొప్పికలిగించేవి యేర్పడ్డాయి. అన్ని వర్ణాలవారూ అన్నివృత్తులూ చేస్తున్న ఈ రోజులలో, అన్ని వర్ధాలవారూ విద్యావంతులై వర్ణభేదం పాటించని రాజ్యాంగం[ప్రకారం దేశాన్ని నడుపుకొంటున్న రోజులలో, ఒక వర్ణానికి ఒక గుణం అంటగట్టే గొల్లడువంటి పదాలు వాడగూడదు. వేరు పరిస్థితులలో పూర్వులు ప్రయోగించిన ఇట్టి ఈ మాటలు వృత్తిపరంగానే అన్వయించుకోవాలి గాని వర్షపరంగా కాదు. 8 వ పద్య వ్యాఖ్యలోగూడా ఇట్టి చర్చ కొంత ఉన్నది. గొల్లండు అనే పదానికి మూర్చుండు అనే అర్జానికి సూ.ని ఈ పద్యమే ఉదాహరించింది. అవ : కలిమిలేములు మనుష్యులన్థితిని మార్చటం సహజమని చెప్పుబోతున్హాడు: క. ఓడల బండ్లును వచ్చుము ఓడలు నా బండ్లమీ(ద నొప్పుగ వచ్చున్‌ ఓడలు బండ్లును వలెనే వాడంబడు( గలిమి లేమి నసుధను సుమతీ. 2క

వివేకానందినీ వ్యాఖ్యాసహితం క్తి ప్ర: సుమతీ, వసుధను = భూలోకంలో, ఓడలన్‌ = నౌకలమీద, బండ్లును = శకటాలూ, వచ్చును = ఒకవోటినుంచి మరొకచోటికి వస్తూ ఉంటాయి, ఓడలున్‌ = నౌకలూ, ఆ బండ్లమీ6దన్‌ = ఆ నౌకలు మోసిన శకటాలమీద, ఒప్పుగన్‌ = చక్కగా, వచ్చున్‌ = వస్తుంటాయి, ఓడలున్‌, బండ్లును వలెనే = వాటివిధముగానే, కలిమిన్‌ = సంపదలోనూ, లేమిన్‌ = దారిద్రంలోనూ, వాడంబడున్‌ = వాడన్‌+పడున్‌ = మనుష్యనమూహంకూడా ఉపయోగపడుతుంటుంది. తా :సుమతీ, ఈ లోకంలో నీటిమీద నడిచే నౌక (పడవ)లున్నాయి. నేలమీద నడిచే బండ్లున్నాయి. బండ్లు నీరు దాటవలసి వచ్చినపుడు నౌకలమీద వెడుతుంటాయి. నౌకలు నేలమీద పోవలసి వచ్చినపుడు బండ్లమీద వెడుతుంటాయి. అ విధంగా లేనివారు కలవారిమీద ఆధారపడుతుంటారు. కలవారు లేనివారై, లేనివారు కలవారైనపుడు, వారు వీరిపై ఆధారపడుతుంటారు. అదీకాక, అందరికీ అన్నిపనులూ చేతకావు. చేతనయినా అనేకకారణాలవల్ల చేసుకోలేరు. ఆయాసందర్భాలలో ఇతరులచేత ప్రతిఫలమిచ్చో ఇవ్వకుండానో, మరొక పని వారికి అవసరమైనపుడు చేసి పెట్టో చేయించుకొంటారు. ఒకరిమీద ఒకరు ఆధారపడక తప్పదు. కనుక, కలవారు లేనివారిని నిర్లక్ష్యం చేయగూడదు. లేనివారు కలవారిని ఈర్ష్యతో ద్వేషించగూడదు. వ్యా : ఎంతటివారైనా ఒకరిమీద మరొకరు ఎందుకో ఒకందుకు ఆధారపడటం తప్పనూ తప్పడు, తప్పూ గాదు. కనుక ఈ విషయంలో పొంగు[క్రుంగులు తప్పు. వేమనకూడా అనువుగానివేళ నధికులనునరాదు, కొంచెముండుటెల్ల కొదువకాదు, కొండయద్దనుందు కొంచెమై యుండదా, విశ్వదాభిరామ వినురవేమ - అనీ, నీటిలోన మొనలి నిగిడి యేన్లును బట్టు, బైట కుక్కచేత భంగపడుము, స్థాన బలము కాని తవబలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేను అనీ ఇట్టి భావాన్నే చెప్పాడు. అవ = భార్వాభర్తలు కలిసే ఉండాలి. నిర్జిమిత్తంగా పుట్టినింట పడుచు భార్య చాలా కాలం ఉండగూడదని చెప్పబోతున్హాడు : క కడు బలవంతుండైనను( బుడమిని బ్రాయంపుటాలి. బుట్టినయింటన్‌ దడవుండనిచ్చె నేనియు+ బడుపుగ నంగడికి( దావె పంపుట సుమతీ, 25 2ైడ్త

శప సుమతి శతకము

ప్ర: సుమతీ, పుడమిని = భూమిమీద, మానవుడు, కడున్‌ = మిక్కిలి, బలవంతుండైనను = బలవంతుండు+ఐనను = శక్తికలవాడైనప్పటికినీ, ప్రాయంపుటాలిన్‌ = ప్రాయము+అలిన్‌ చ యౌవనంలో ఉన్న భార్యను, పుట్టినయింటన్‌ = పుట్టిన+ఇంటన్‌ = ఆమె జన్మించిన యింటిలో, ఆమెను కన్నవారి యింటిలో, తడవు = ఎక్కువకాలం, ఉండనిచ్చెనేనియున్‌ ఇ ఉండన్‌+ఇచ్చెన్‌+ఏనియున్‌ = నివాసం ఉండటానికి అనుమతించినట్లయితే, పడుపుగన్‌ = పడుపు+కన్‌ = వ్యభిచరించి సొమ్ముతేవటానికి, అంగడికిన్‌ = బజారుకు, తానె = తాన్‌+*ఎ = స్వయంగానే, పంపుట = పంపించటమన్నమాట.

తా : ఎనరైనా తనభార్యకు తనమీద ప్రేమ స్థిరంగా ఉండేటట్టు చేసికొనగల సమర్భుడే కావచ్చును. కాని, నిర్నిమిత్తంగా తానెక్కడో ఉండి, వయస్సులో ఉన్నతన భార్యను అమెపుట్టినింటిలో ఎక్కువకాలం ఉంచగూడదు. అలా ఉంచితే పడుపువృత్తి నెరపే బజారుకు ఆమెను స్వయంగా తీసికొనివెళ్ళి విడిచిరావటంతో సమానం.

వ్యా: ఈ పద్యంలో ('ప్రాయంపుటాలు, తడవు అన్నపదాలు ముఖ్యమైనవి. వయసులో ఉండటం, సౌఖ్యానికి దూరంగా చాలాకాలం ఉండటం, అనుకూలపరిస్థితులు పారపాట్టు చేయటానికి ముఖ్యమైనవి. బాగా తిని జీర్ణం చేసుకొనగలశక్తి కలవారికి తినేవేళకు ఆకలివేస్తుంది. ఆకలివేయనపుడు ఎదురుగా తమ మధురపదార్హాలున్నా తినాలనిపించక పోవచ్చు. ఆకలి తీవ్రంగా వేసినపుడు తమపదార్జాలు కాకపోయినా, మధురమైనవి కాకపోయినా తినాలనిపిస్తుంది, కొందరు తింటారు, కొందరు మనవి కానివి తింటే వాటి సొంతదారులు కాని, ఇతరులు కాని, మనవారే కాని ఏమైనా అనుకొంటారు అని మానివేయవచ్చు. ఇతరస్టలాలలో అంతదైైర్యం ఉండకపోవచ్చు. పుట్టి పెరిగినచోట ధైర్యం ఎక్కువగా ఉంటుంది. చూచేవారు తనవారే కనుక ఏమీ అనుకోరు, అనరు అనే అభిప్రాయమూ కలగవచ్చు. ఆ విధంగానే పొరపాటు జరిగినా, కన్నవారు కనుక కడుపులో పెట్టుకొని, ఏమీ జరగనట్టుగానే, ఎవరికీ తెలియనీయకుండానే, ఉపేక్షించి, మన్నించవచ్చు. అందువల్ల పొరపాటులు జరిగే అనకాశం ఉంటుంది. అదీకాక, కలవారు చేస్తే మనసు, లేవివారు చేస్తే కరువు అని ఒక లోకోక్తి ఉన్నది. లేనీవాడు పరద్రవ్యం అపేక్షిస్తే లేమివల్ల అలా చేశాడు అంటారు. కలవాడైతే ఎలా ఉంటుందో చూద్దామని కోరిక కలిగి కాని వానికి లేకనా అంటారుట. ఆలాగే తన భార్యకు కావలసినవన్నీ సమకూర్చగలిగినవాడు పుట్టినింట్లో ఎక్కువకాలం ఉంచాడంటే, ఆమె తల్లిదండ్రులదగ్గర ఉండటానికి ముచ్చటపడుతున్నది కనుక కాని, తిండికి లేకనా ఆనుకొంటారుట. అదే లేనివానిభార్య ఆయితే, అక్కడ తిండికిలేక ఉంటోంది అనుకొంటారట. పడుపువృత్తివల్ల సంపాదించేవారు జరుగుబాటులేక అలా

వివేకానందినీ వ్యాఖ్యాసహితం త్త సంపాదించబూనుఓ ౦టారు. అన్నవ(స్తాదులకు ఉండీ సంపాదించేవారు వేరు. కనుక్క పుట్టినింట ఉంచితే, ఇక్కడ లేనిది అక్కడ అనుభవించనీ అనే ఉద్దేశంతో లేనివాడు పంపినట్టూ ఇతరులు అనుకోవచ్చు, ఆందువల్ల తగదనటం. అదీకాక, ఎంత కావలసిన బంధువులయినా వారిసొమ్ము తింటూ ఉండటమేమిటి? అక్కడ గడుపుతుంటే ఇక్కడ మిగులుతుందనే అభిప్రాయంతో పంపేవారూ ఉండవచ్చు. ఇదీ ఒక రకమైన సంపాదనేకదా. అ(క్రమంగా సంపాదించటానికి ఆలిని అనుమతించినపుడు, మనసును అమ్మి ఆమె సంపాదించటం అవుతుంది. మనసుని అమ్మి సంపాదించటానికీ తనువును అమ్మి సంపొదించటానికీ అంతరమెంత? అసలు అంతరం ఉందా? ఈ ఉద్దేశంతోనూ ఈ నీతి చెప్పి ఉండవచ్చు. భారతంకూడా ఎట్టి సాధ్వులకును బుట్టిన యిండ్లను బెద్ద కాలమునికీ తద్ద తగదు అని చెపుతున్నది, శకుంతల నత్తవారింటికి పంపే వేళ మనసుకీ మాటకూ చేతకూ సంబంధం ఉన్నదని దేనితో కూడనిపని చేయటానికయినా ఇష్టపడనివారింకా ఉన్నారు. ఒక ముప్పై సంవత్సరాలక్రితం ఎన్నికలు జరుగుతున్నాయి. వోట్టు వెయ్యటానికి ఒక ఎన్నికల కార్యాలయానికి జనం వస్తున్నారు. వివిధఅభ్యర్థుల ఏజెంట్లు కూర్చున్నారు. ఒక ఆమె వోటు వెయ్యటానికి వచ్చింది. ఎన్నికల అధికారి ఆమెభర్తపేరు రామారావు అన్నాడు. అమె కాదు సుబ్బారావు అన్నది, ఆమె తెచ్చినచీటీలో ఉన్న సంఖ్య మొదలయిన వివరాలూ వోటర్ల పట్టికలో ఉన్న వివరాలూ సరిపోయాయి. ఆమెపేరు ఒకటే. భర్తపేరులో తేడా ఉంది. అందరు ఏజంట్లూ వోటు చేయవలసింది ఆమేననీ, భర్త పేరు తేడా పట్టించుకోవద్దనీ, వోటు వేయనీయండి అనీ చెప్పారు. ఆ అధికారికి ఆ ఏజొంట్టు ఆంతా ఏకమై ఎవరి దొంగవోట్టు వారు తెలివిగా వేయించుకొంటున్నారేమో అన్న అనుమానం కలిగింది. అక్కడ దొంగవోట్టు వేయించే పద్దతి ఉన్నదనీ, అడిగితే ప్రమాదమనీ, కనుక మెలకువతో నేర్పుతో మెలగమనీ, అతని (శ్రేయోభిలాషులు అతనిని 'హెచ్చరించారంతకు ముందే. అందువల్ల అతడు నాకు అచ్చువేసిన వోటర్లపట్టిక ప్రమాణం. ఏదైనా తేడా వుంటే నిబంధనల ననుసరించి. వోటు వేయించుకునే పద్దతి ఉన్నది. దానిప్రకారం పదిరూపాయలు డిపాజిట్టు కట్టి ఆవసరమైన కాగితాలమీద సంతకం పెట్టవలసి ఉంటుంది. మీరంతా ఏకగ్రీవంగా చెపుతున్నారు కనుక, నోటరుగా వచ్చిన యీవిడ పట్టికననుసరించి, నా భర్తపేరు రామారావే అని, ఈ దశలో అయినప్పటికీ, ఒక్కమాట అంటే చాలు నేను నోటు వేయించటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. ఆ వోటరుతో అమ్మా, వారందరూ చెప్పేది యథార్థమైతే ఒక మాట. వోటు వృథాకాదు. ఆ పెద్ద మనుషులమాట నేను మన్నించి గొడవ లేకుండా ఎన్నికలు నడిపించినట్టూ అవుతుంది, మాటేకదా, కాస్సేపే కదా, నా భర్త రామారావు అనటానికి నీకభ్యంతరంలేకపోతే, వోటు వేయనీయటానికి నాకు అభ్యంతరం లేదు

850 సుమతి శతకము అన్నాడు. ఆమెముఖం జేవురించింది, ఏజెంట్టందరివైపూ చూసింది. ఆయనవైపు చురచుర చూస్తూ నేనీ యెదవవోటు వెయ్యను. దీనికోసం నా మొగుడు సుబ్బారావుకాదనీ, రామారావనీ, కూస్సేపే అయినా, ఒక్కమాటే అయినా నేననను. ఇంకా నయం అని విసవిసా ఆ చీటీ అక్కడ పారేసి వెళ్ళిపోయింది. ఏజెంట్లు నవ్వుతూ బంగారంలాంటి వోటు పడకుండా చేశారుకదండీ అన్నారు. ఆ అధికారి (త్రికరణశుద్ది కావాలనుకొనే ఆలాంటితల్లి ఇంకా ఉన్నందుకు ఆమెకు నమస్కరించాలి అన్నాడు. సాఖ్యం రుచి తెలిసి,అనుభవించేందుకు అనుకూలపరిస్థితులుండి, నీతి కాదని మనస్సును నిగ్రహించుకొని మానటం, కొంతకాలమైతే సామాన్యులకు సాధ్యం కావచ్చు. అదే సుదీర్ధకాలమైతే అసాధ్యం కావచ్చు. కనుక అట్టి పరిస్థితులే కలుగనీయవద్దు అంటున్నాడు. ఈ పద్యంలోని “తడవు” అన్నది భారతంలోని “పెద్దకాలము” అన్నమాట. అవ న నీచుడు ఉన్దుతస్తితికి వెళ్ళినా నహజమైన నీచబుద్రి సోదని చెప్పుబోతున్హాడు : క. కనకపు సింహాసనమున శునకము. గూర్చుండ( బెట్టి శుభలగ్నమునం దొవర€గ€ బట్టము గట్టిన వెమకటి గుణమేల మాను వినురా సుమతీ. 26 ప్ర : సుమతీ, శుభలగ్గమునందు = సుముహూర్తంలో, కనకపుసింహాసనమునన్‌: కనకము+సింహ+ఆసనమువన్‌ = బంగారు సింహాకారంగల రాజ పీఠంపైన, శునకమున్‌ = కుక్కను, కూర్చుండంబెట్టి = కూర్చుండేటట్టు చేసి, ఒనరంగన్‌ = ఒనరన్‌+కన్‌ = ఒప్పునట్టుగా, పట్టము గట్టినన్‌ = పట్టము+కట్టినన్‌ = రాజుగా చేసినప్పటికినీ, వెనుకటి = గద్దె ఎక్కకపూర్వం ఉన్న, గుణము = స్వభావం, ఏల = ఎందుకు, మానున్‌ = విడుస్తుంది? విడువదు, విను రా = ఆలకించవయ్యా. తా సుమతీ, ఒక మంచి ముహూర్తంలో ఒక కుక్కను తీసుకొని పోయి ఒక సింహాసనంమీద కూర్చుండబెట్టి రాజుగా చేయవచ్చును. కాని అది దాని స్వభావలక్షణమైన అభక్ష్యభక్షణంవంటి వాటిని మానుకొనలేదు. ఈ నీతి శ్రద్దతో వినవయ్యా, ఏమి చేసినప్పటికిని నీచుని నీచబుద్ది పోదు. వ్యా £ ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క ప్రత్యేకధర్మం ఉంటుంది. దానిని గుణం అంటారు, మల్లికి మల్లివాసన ఉల్లికి ఉల్లివాసన వాటిగుణాలు. నీటికి ద్రవత్వం, శిలకు కఠినత్వం వాటిగుణాలు. ఆవి మారవు. శునకానికి శునకగుణం కనకానికి కనకగుణం ఉంటాయి. అవి మారవు. మనిషి మంచివాడే గుణమే మంచిది కాదు, అంటారు. నీచునికి

ళ్‌” ఫి ౧, కి, ల

వివేకానందిని వ్యాఖ్యాసహితం 4 యా వ ః యో క్‌1 నీచగుణం మారదు. ఉత్తమునికి ఉత్తమగుణమూ మారదు. కనుక గుణం తెలుసుకొని మెలగాలి. ఒకప్పుడు తన శత్రువుతో కలిసిపనిచేసిన వానిని సర్దార్‌ వల్లభ భాయ్‌ పటేల్‌ మళ్ళీ నమ్మేవాడు కాడు, అతడు మారినా సరే, ఆతనిని వాడే వాడు కాడు. ఉదా ॥ కె. ఈశ్శరదత్తు.

ఈయన సుప్రసిద్ద పత్రికా రచయిత, తెలుగు వాడు. ట్వెంటీయెత్‌ సెంచరీ అనే ఆంగ పత్రికకు వ్యవస్థాపక సంపాదకుడు. ఒకప్పుడీయనను పటేల్‌ అలహాబాదునుంచి విమానంమీద బొంబాయి పిలిపించాడు. కాంగ్రెసు తరపున ఒక ఇంగ్లీషు దినపత్రిక స్టాపించబోతున్నామనీ దానికి ఈయన సంపాదకుడుగా ఉండాలనీ కోరాడు. ఈయన అంగీకరించాడు. కాని వేరు కారణాలవల్ల అపుడా పత్రిక పెట్టలేదు. ఈ లోపల దత్తు గారిని సర్‌ మీర్జా ఇస్మాయిల్‌గారు అభిమానించి తాను జయపూర్‌ వెడితే అక్కడికీ "హైదరాబాదు వెడితే అక్కడికీ సమాచారశాఖ డైరెక్టరుగా తీసుకు వెళ్ళారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. పోలీసు చర్యతో హైదరాబాదు సంస్థానం భారత దేశంలో భీనమయింది. అంతకు పూర్వం ఇస్మాయిల్‌గారు హైదరాబాదు ప్రభుత్వం దివానుగా దత్తుగారు డైరెక్టరుగా ఉన్నారు. స్వతంత్ర ప్రభుత్వంలో ఏ విదేశ రాయబార కార్యాలయం వంటి దానిలోనైనా తనకు ప(త్రికావ్యవహారాలు చూసే ఉద్యోగం లభిస్తుందేమో 'ప్రయత్నిద్దామనుకొన్నారు దత్తుగారు. రాజాజీ గవర్నరు జనరలు. ఆయనకు ఈయన ఇప్టుడే. ఆయన పటేలు గారి కార్యదర్శి మీనను గారికి చెపితే వారిద్వారా పటేలుగారి దర్శవం దొరికింది. ఈయన ఎందుకు వస్తున్నారో మీననుగారి ద్వారా పటేలు గారికి ముందే తెలుసు. సమావేశం కాగానే దత్తుగారు నమస్కరించి ఒకప్పుడు మీరు కాంగ్రెసు తరపున పెట్టించదలచుకొన్న పత్రికకు సంపాదకుడుగా ఉండదగినవాడను నేనని నిర్ణయించారు అన్నారు. వెంటనే పటేలుగారు, కాని, తరువాత మీరు సర్‌ మిర్దాయిల్‌ గారి మనిషయారు అన్నారు. దత్తుగారు లేచి నమస్కరించి సెలవు అన్నారు. పటేలుగారు తల పంకించారంతే. భారతదేశంలో చేరకుండా ఉండటానికి నవాబుగారు చేసిన ప్రయత్నాలకు ఇస్మాయిలుగారి ఏకీభావం లేదు. వారివద్ద ఉద్యోగం చేసిన దత్తుగారు సర్వాత్మనా వారితో అన్ని విషయాలలోనూ ఏకీభావం కలవారు కాదు. అయినా ళత్రుశిబిరానికి చెందిన వారుగా పరిగణన చెందినవారిని మరి వాడగూడదన్నది పటేలు గారి భావం. పరిస్థితులు మారినా పూర్వవాసనలు మారవని ఆయన దృఢనిశ్చయిం. ఈ సందర్భంలో వారి ఆంచనా సరి కాకపోవచ్చు. కాని వారి వ్యవహారసరణి ఆంతే. ఈ సంఘటన ది ఫీట్‌ ఆఫ్‌ ఇంక్‌ అనే స్వీయ చరిత్రలో దత్తుగారు స్వయంగా వ్రాశారు.

౨ద్‌

52 సుమతి శతకము అవ : దుఖకరములైన వాటిని కొన్టింటిని చెప్పుబోతున్లాడు న్‌ క కప్పకు నారగాలైనను, సర్పమునకు రోగమైన, సతి తులువైనన్‌ ముప్పున దరిద్రుండైనను తప్పదు మజీ దుఃఖమగుట తథ్యము సుమతి. 27 ప్ర : సుమతి, కప్పకున్‌ = మండూకానికి, ఒరగాలైనను = ఒరగు+కాలు+ఐనను = కుంటికాలైనా, సర్పమునకున్‌ = పాముకు, రోగమైనన్‌ = రోగము+ఐనన్‌ = తెగులు వచ్చినా, సతి = భార్య, తులువైనన్‌ = తులువ+ఐనన్‌ = తుంటరి అయినా, ముప్పునన్‌ = ముసలితనంలో, దరిద్రుణ్రైనను = దరిద్రుండు+ఐనను = 'పేదవాడైనా, దుఃఖమగుట = దుఖము+అగుట =దుఃఖం కలగటం. తప్పదు మజీ = తప్పిపోదు సుమా. తథ్యము = ఇది సత్యం. తా : సునుతీ, కప్పకాలు కుంటిదైనా, పాముకు జబ్బు చేసినా, భార్య తుంటరి ఆయినా, ముసలితనంలో పేదరికం వచ్చిన్నా దుఃఖం కలుగక మానదు, ఇది సత్యం. వ్యా : మండూకప్లుతి అంటారు. అనగా కప్పగంతు. కప్ప దూకుతూ నడుస్తుంది. దూకటానికి కొళ్ళు సరిగా ఉండాలి, ఒక కాలు కుంటిదైతే బాధే. పాముకు జబ్బు చేసినా అంతే, అది పుట్టలో ఉంటుంది. పైకి కనబడదు. కనబడినా విషజంతువాయె. ఎవరు వైద్యం చేస్తారు? దగ్గరికి వెళ్ళటానికే భయమాయె. దానికీ దుఖం తప్పదు. భార్య తుంటరి ఆయినా అలాగే. ఇతర బాధలుంటే భార్యతో చెప్పటంద్వారా భర్తకు కొంత ఊరట. విశ్రామో హృదయస్య యత్ర అన్నాడు రాముడు ఉరా.చులో అట్టి హృదయానికి విశ్రాంతి నీయవలసినదే బాధ కలిగించేదయితే మిగిలేది దుఃఖమే. ఒక చాటుకవి ఇలా అన్నాడు ; “మశకా మత్కుణా రాత్రౌ, నుక్షికా ఇిక్సుకా దివా, దివారాత్రం వ్రబాధేతే దుష్టా భార్యా పిపీలికా” దోమలూ నల్టులూ రాత్రులు బాధిస్తాయి. ఈగలూ బిచ్చగాళ్ళూ పగలు బాధిస్తారు. తుంటరిభార్యా చిన్న ఎర్రచీమూ పగలూ రాత్రీ బాధిస్తాయిట. వయసులో పేద అయితే కష్టపడి సంపాదించుకొంటాడు. శక్తి ఉడిగిన తరువాత దారిద్ర్యం వస్తే దుఃఖమే. కనుకనే వయసులో పుట్టినకొడుకు వయసులో గడించినసొమ్ము అన్లార్లు. ఇవి ఫార్టక్య౦లో అక్కణకు వస్తాయని భావం. వింశతేర్వా (త్రింశతేర్వా విద్యామర్థం చ సాధయేత్‌, కొళనీకాశకేశావామూశా కా కోశవం[గ్రహే -

వివేకానందినీ వ్యాఖ్యాసహీతం ర్‌3

ఇరవై యేళ్ళు వచ్చే లోపలే విద్యనూ, ముప్ఫై యేళ్ళు వచ్చేలోపలే ధనమూ సంపాదించాలి. టెల్లు పువ్వులా జుట్టు మారినతరవాత కోళశసంపాదనకు ఆశ యేమిటి? అన్నాడొక మహానుభావుడు. కోశమంటే పుస్తకం లేదా నిఘంటువు అని ఒక అర్ధం. ఇరవైయేళ్ళ లోపలే కోశం సంపాదించాలంటే విద్య అని భావం. కోశనానాచార్యః పుస్తకమున్నవాడే గురువు అంటే విగ్య నేర్చినవాడే అని అసలుఅభి[ప్రాయం. అయితే పుస్తకం ఉన్హ్నవాడే అనీ చెపుతారు. పుస్తకం ఉంటే చదివి చెప్పగలుగుతాడు. అయితే

పుస్తకస్థా చ యా విద్యా పరహస్తగతం ధనం,

కార్యకాలే సమయాతే న సా విద్యా న తద్దనం -

పుస్తకంలో ఉన్న విద్య, ఎవరివద్దనో ఉన్న ధనం - ఇవి ఆవసరం వచ్చేసరికి అది విద్యా కాదు, అది ధనమూ కాదు, అన్నారు. కంఠస్థ్రమయినదే విద్య అని వీరిఅభిప్రాయం. అయితే సర్వమూ కంఠస్థం కావటం సాధ్యమూ కాదు, ఆవసరమూ కాదు, ఏమయినా కంరస్టం కంఠస్థమే, పుస్తకస్టం పుస్తకస్థ్రమే. కంఠస్థం కానిదీ లేనిదీ సమానమన్న అభిప్రాయం ఉన్నందుననే ఇదివరకటి పండితులు నాస్తి ఆనటానిక్‌ బదులు పుస్తకాపేక్షే అనేవారు, అయితే

అజ్జేభ్యో గ్రంథినః క్రేష్టాః, (గ్రంథిభ్యో ధారిణో వరాః,

ఛారిభ్యో జ్ఞానినః శ్రేస్టాః జ్ఞానిభ్యో వ్యవసాయినః -

ఏమీ తెలియని వారికంటే పుస్తకముండి చదవటం చేతనయినవారు మేలు, పుస్తకం ఉన్న వారికంటె అందులోనిది కంఠస్థ్రమైనవారు గొప్పవారు, కంఠస్థం చేసిన వారికంటే దానిఅర్జం తెలిసినవారు ఉత్తములు, అలా విషయం తెలియటం మాత్రమే కలవారికంటె దాని (ప్రకారం ఆచరించేవారు. ్రేష్టులు అన్న మనువుగారిమాట (12.232) సర్యోచ స్తానం తీరే,

నం అంటే ధనెగారాధికారి అని అర్ధం. ముప్ఫై ఏళ్ళు వచ్చే లోపలే ధనం సంపాదించాలి అంటే కోడెవయస్సులోనే. అప్పుడది ముప్పు గడుపుతుంది.

వర్షార్థమష్టా ప్రయతేత మాసాన్‌, విశార్థనుర్ధం దివపే యతేత,

నారక్యహేతోర్వయపా నవేన, పరత్రహేతోరిహ జన్మనా చ -

వర్షాకాలం వానలతో సంపాదనకు అనువయినకాలం కాదు కనుక, ఆ నాలుగు నెలలూ పనిచేయకపోయినా సుఖంగా గడవాలంటే మిగిలిన ఎనిమిది నెలల సంపాదనలో మిగుల్చుకోవాలట. వానలాంటిదే రాత్రీ కనుక రాత్రి సుఖంగా గడవటానికి పగలు సంపాదించుకోవాలిట. ముసలితనం సుఖంగా వెళ్ళటంకోసం [క్రొత్త వయస్సులో నవయౌవనంలో సంపాదించుకోవాలిట. అంతతో ఆగితే మామూలే. పరలోకంలో

డై

క్‌ సుమతి శతకము సౌఖ్యంకోసం ఈ జన లోనే ఈ లోకంలోనే పుణ్యం సంపాదించుకోవాలిట. ధనమే కాదు పుణ్యధనంకూడా ముప్పున సంపాదించుకోవటం సాధ్యమూ సుఖమూ కాకపోవచ్చు గనుక, అదీ ఓపిక ఉన్నపుడే సంపాదించుకోవాలన్నాడు రామదాసుగారు : ముప్పునం గాలకింకరులు ముంగిట విల్చినవేళ, రోగము ల్గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ బాంధవు ల్లప్పినవేళ మీస్మరణ గల్లువొ కల్గ్లద్హొ నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరధీ కరుణాసయోనిధీ - అని, ఈ పద్యం చెప్పాలంటే లోకపరిశీలనకు తోడు సర్వమనోధర్మవేతృతకూడా అవసరం. ఒరగాలు శబ్దానికి సూ.ని. ఇదే పద్యం ఉదహరించింది. అవ : ఎవరిసానంలో వారుంటే రాణింవు ఉంటుందని చెప్పుబోతున్లాడు : క. కమలములు నీటంబాసిన గమళలాస్తృనిరశ్మి సోకి కములినభంగిన్‌ దమ తను నెలవులు దస్పిన( దమమిత్రులు శత్రులగుట తథ్యము సుమతీ. 2కి (ఫ్ర : సుమతీ, కమలములు ఇ పద్మాలు, నీటంబాసినన్‌ = నీటన్‌+పాసినన్‌ = నీటినుంచి తొలగితే, కమలాస్త్రని = కమల+ఆస్తుని = సూర్యునియొుక్క, రళ్మి = తేజస్సు, ఎండ, సోణి = తగలటంచేత, కమలిన = కందిన, భంగిన్‌ = విధముగా, తమ తమ = సొంతమైన, నెలవులు = స్థానాలు, తప్పినన్‌ = తొలగితే, తమ మిత్రులు = తమ "స్నేహితులే, శత్రులగుట = శత్రులు+ఆగుట = పగవాళ్ళు "కావటం, తథ్యము యా సత్యము, తా : సుమతీ, పద్మాలు నీటిలో పుట్టి నిటిలో సెరిగాయి. నీళ్ళు వాటి నివాసం. నీటినుంచి బయటపడితే కములాలకు ఆప్హుడు అని పేరందిన సూర్యునికాంతి ఎండ తగిలేసరికి అవి కాస్తా కంది వాడిపోతాయి. అలాగే సొంతచోట్టు విడిచిపెట్టినవారికి వారిమిత్రులే శత్రువులవుతారు. వ్యా : ఈ పద్యం (ప్రాణం కమలాస్తుని, తమమిత్రులు అన్న శబ్దాలలో ఉన్నది. కమలాప్తుడు అంటే పద్మాలచుట్టం అని ఆర్ధం. మిత్రుడు అంటే సూర్యుడు స్నేహితుడు అని అర్జాలు. పద్మినీవల్లభుడు, పద్మబాంధవుడు అని సూర్యునిపేర్డు సూర్యుడు ఉదయిస్తే చాలు పద్మాలు వికసిస్తాయి అని కవిసమయం,. పద్మాలు నీటిలో ఉన్నంతసేపు ఎండవల్ల అవి వికసిస్తాయి. సంతోషిస్తాయి. వాటిని సూర్యుడు సంతోషపెడతాడు, అవి తను స్టానమైన నీటి నుంచి బయటపడేసరికి అంత ఆప్రబాంధవుడైన సూర్యునికాంతియే వాటిని కమిలిపోయేటట్టు చేస్తోంది. కారణం ఎవరిదోషమూ కాదు. కమలములు తమ

వివేకానందినీ వ్యాఖ్యాసహితం ళ్‌క్‌ స్థానం తప్పటం అని చమత్కారం. దీనికి మూలమనదగిన శ్లోకం ఎక్కడ నుంచి (గ్రహించినదో గరుడమవిపురాణ నీతిసారం నూటపదిహేనవ అధ్యాయంలో 72 వదిగా ఉన్జుది, ష్టానస్టితన్య మిత్రాయేతే తవ్య రివుడాం గతాః , భానోః పద్మే జలే గ్రీతిః స్థలోద్దరణశోషణః ॥ తన స్టానంలో తానున్నపుడు మిత్రులుగా ఉన్నవారే స్థానం మారేసరికి శతువులవుతారు. నీళ్ళలో ఉన్నంతసేపు సూర్యునికి పద్మంమీద ప్రీతి, పెరికి నేలమీద వేసేసరికి దానిని ఆయనే మాడ్చివేస్తున్నాడు అని దాని భానం. కొంచెం తేడాగా ఇట్టి భావాన్నే అక్కడే 72 నదిగా ఉన్న శ్లోకం చెపుతున్నది. స్టానస్టితస్య పద్మన్య మిత్రా వరుణభాన్కరా స్టానచ్యుతస్య తస్యైవ శ్లేశశోషణకారక్తా ॥ తన స్థానంలో తాను ఉన్హప్పుడు పద్మానికి వరుణుడూ భాస్కరుడూ ఇద్దరూ మిత్రులే, అది స్టానభ్రష్టమయేసరికి ఇద్దరూ క్షేశయమూ ఎండిపోవటమూ కలిగిస్తున్నారు - అని దానిభావం,. ఈవ:? ఒకే రళమైన ఉద్యోగం. చేసేవారు. ఒకరినొకరు నమయ్ముగూడదని చెప్పుబోతున్హాడు న్‌ క కరణము. గరణము నమ్మిన మరణాంతకమౌను గాని మనలేండు నుమీ కరణము దన సరికరణము మటి నమ్మక మర్మమీక నునవలె సుమతీ, 29 ప్ర: సుమతీ, కరణము = (గ్రామవులెక్కలు గ్రాసే అతడు, కరణమున్‌ = మరొక (గ్రామగణకుని, నమ్మినన్‌ = విజ్ధసిస్తే అద్రి చురణాంతకమౌను గాని =మరణ+అంతకము+బౌను+కాని = చావుతో పూర్తి అటేదీ అవుతుంది కాని, మనలేంయ సుమీ = మనన్‌+లేండు+చుమీ = (ట్రతకజాలడు సుమా కరణము = (గ్రామ గణకుడు, తనసరి కరణమున్‌ = తనతో సమానుడైన (గ్రామ గణకుని, మటి నమ్మకన్‌ = ఎక్కువ నమ్మక, మర్మమీక= మర్మము+-ఈక= రహస్యం తెలుపక్క మనవలెన్‌ = మనన్‌వలెన్‌ = (బ్రతకాలి, తా : సుమతీ, ఒక (గ్రామగణకుడు మరొక్ష (గ్రామ గణకుని నమ్మితే ఆ నమ, శైకంవల్ల నమ్మినవాని(ప్రాణాలు పోతాయి కాని నమ్మినవాడు (బ్రతకలేడు. కనుక (గ్రామ గణకుడు తనపసాటి (గ్రామ గణకుని మరీ నమ్మకుండా నమ్మినా ముఖ్యమైన రహస్యం తెలియనీయకుండా బ్రతకాలి, 28

ర్‌6 సుమతి శతకము వ్యా: ఈ పద్యంలో ఉన్న కరణము అన్న పదాన్ని 8వ 23వ పద్యాలలోని 'గొల్ల' పదాన్ని లాగే వృత్తివాచకంగా (గ్రహించాలి గాని కులవాచకంగా కాదు. వెనకటిరోజుల్లో (గ్రామ గణకుడు (గ్రామంలో మకుటంలేని మహారాజుగా ఉండేవాడు. (గ్రామంలోని ఆస్తిపాస్తులు మొదలయినవన్నీ ఆతని కలంపోటుకు లోబడి ఉండేవి. పరిపాలనా వ్యవహారమే కశ్మలమైనది. అందులోనూ గ్రామగణక వృత్తి మరీ చిక్కులతో కూడినది. అతడు చేసేపనులు ఇతరులకు తెలియవలసినవీ తెలియరానివీ కూడా ఉంటాయి. ఏది ఎలా చేశాడో, ఎందుకు చేశాడో, ఎలా ఎందుకు చేస్తాడో, ఇతరులకు అందులోనూ తోడి (గ్రామ గణకునికి తెలియనీయటం మంచిది కాదు. ఈర్చ్యాసూయాలోభాదిహేతువులవల్ల అతడు ఎప్పుడైనా రహన్యం బయటపెట్టవచ్చు. అప్పుడు బలవద్విరోధమూ, బహుజనవిరోధమూ వచ్చి ప్రాణాలమీదికి తేవచ్చును. ఆందువల్ల తోడి (గ్రామ గణకుని మరీ నమ్మగూడదు. ఈ మరీలో అసలు నమ్మక కుదరదు, తనకు అవసరమైన మేరకే నష్టం లేనంతవరకే నమ్మాలి, ఎక్కువ నమ్మగూడదు అని ధ్వనిస్తున్నది. ఈ రకమైన వర్తనం మోసంగా భావించగూడదు. అంతో యింతోచాటూ మాటూ ఆవసరమయినవృత్తిలో ఈ జా(గ్రత్త లేకపోతే బ్రతుకే ఉండదు. కనుక, ఈ మెలకువతో మనవలె అంటున్నాడు. మర్మం అంటే రహస్యం ఆయువుపట్టు అని అర్జాలు. ఏది చెపితే అపాయమో అది చెప్పగూడదన్నమాట. అవ : వ్యవహారంలో (గ్రామ గణకులను సుముఖులను చేసుకొనక తప్పదని చెప్పుబోతున్హాడు : క. కరణముల వనుసరింపక విరసంబునం దిన్న తిండి వికటించు. జుమీ యిరుసున గందెనం బెట్టక పరమేశ్వరు బండియైన( బాజదు సుమతీ. 30 ఫ్ర: సుమతీ, కరణములన్‌ = గ్రామగణకులను, అనుసరింపక = వారిమనస్సునకును అనుగుణంగా (ప్రవర్తింపక, విరసంబునన్‌ = వారికిష్టము కానివిధంగా, తిన్నతిండి = తినిన ఆహారం, వికటించుంజామీ = వికటించున్‌+చుమీ = జీర్ణం కాక రోగం తెస్తుంది సుమా, ఇరుసునన్‌ = బండిచక్రం తగిలించే ఇనుపకడ్డీకి, కందెన = బండియిరుసుకు పూసే మసి, పట్టించే చమురు, పెట్టక = పూయక పరమేశుని = మహేశ్చరునియొక్క, బండియైనన్‌ = బండి+ఐనన్‌ = శకటం, రథం అయిన్నా పొజదు = పరుగుపెట్టదు, వేగంతో నడువదు. తా సుమతీ, గ్రామ గణకులను అనుసరించి వారి యిష్టానికనుగుణంగా ప్రవర్తించాలి. వారి యిష్టానికి వ్యతిరేకంగా తినినతిండి జీర్ణం కాదు, జబ్బు పుట్టిస్తుంది. సంపాదించిన

వివేకానందినీ వ్యాఖ్యాసహితం క5్‌7 సంపద నిలవదు, ఉన్నా చిక్కులు తెచ్చిపెడుతుంది. ఇరుసుకు మసీ చమురూ పట్టించకపోతే పరమేశ్వరుని రథమైనా వేగంతో కదలదు. తమకు అనుకూలంగా పనిచేసి పెట్టేటందుకు ఒక ఉద్యోగిని సంతృప్తిపరచటానికి ఇచ్చే అక్రమ (ద్రవ్యాన్ని ఇందుకే లంచం, ఉత్కోచం అన్న మోటుపదాలకు బదులుగా చమత్కారంకోసం తడి తైలం అంటారు

వ్యా : (గ్రామంలో ఆస్తివివరాలు, పన్నుల వివరాలు - ఇటువంటి అనేకాంశాలు గ్రామ గణకులచేతిలో ఉంటాయి కనుక వారిమనస్సుకు సంతృప్తి కలిగేవిధముగా మెలగకపోతే అన్నీ చిక్కులే వస్తాయి. వారికనిష్టంగా తిన్న తిండి కూడా వికటిస్తుందంటే గడించిన సంపద నిలవదు, నిలిచినా సుఖం ఉండదు, రోగంవల్ల మరణం వచ్చినట్టు ఆ సంపదవల్ల అపాయమూ సంభవించవచ్చు. వారిని సంతృప్తిపరచటం బండియిరుసుకు మసీ చమురూ పూయటంవంటిది. ఆ పని చేయకపోతే పరమేశ్చరునిరథమైనా నడవదు. అలాగే (గ్రామ గణకులు తృప్తిచెందకపోతే ఎంతటివారి పనులయినా ఆగిపోతాయి, చెడిపోతాయి. ఇక్కడ కరణము అన్నశబ్దం వృత్తిపరంగా స్వీకరించాలి తప్ప కులవాచకంగా కాదని మరోమారు చెపుతున్నాము. కరణము వృత్తిలో వెనుకటిరోజులలో ఒకే వర్ణం వారుండవచ్చుగాక, నేడు అన్ని కులాల వారూ ఉన్నారు. వృత్తిరీత్యా ఉన్నదోషం చెపుతున్నాడు కాని కులందృష్టితో కాదు. ఏ కులవాచకం ఈ శతకంలో ఎక్కడ వాడినా ఇలాగే (గ్రహించాలి,

'విరసంబున దిన్నతిండి వికటించు. జుమీ" అన్నపుడు ఒక ఆరోగ్యసూ(త్రంకూడా కవి చెప్పాడు. ఏదైనా తినేటప్పుడు ఎదుటి వారికి పెట్టి తాను తినాలి. అపుడు వారు సంతుష్టి చెందుతారు. తనకూ సంతోషం కలుగుతుంది. అలా సరసంగా తింటే నోరూ సరసం అవుతుంది. కొన్నిరకాల రసాలూరతాయి. అవి కలిసినందున తిన్నతిండి జీర్ణమై ఒంటపడుతుంది. అలా పెట్టక వారు ఆహప్రసన్నదృష్టితో చూస్తుంటే తనకూ వారిద్వేషంవల్ల ద్వేషమేర్చడుతుంది. ద్వేషం క్రోధం నిండిన మనస్సుతో తింటే నోరూ విరసం అవుతుంది. రసాలూరవు. జీర్లం కాదు. రోగం వస్తుంది. కనుకనే అన్నం తినేటప్పుడు సంతోషంగా ఉండాలంటారు. ఇలా ఈ వాక్యం వాచ్యార్థంలో ఆరోగ్యసూత్రాన్ని చెపుతున్నది.

కందెన శబ్దానికి సూ.ని, ఈ పద్యమే ఉదాహరించింది.

అవ: గ్రామ గణకుడు కరకుగా ఉండటమూ అవసరమే అని చెప్పుబోతున్లాడు :

కు కరణము సొదై యున్నను

గరి మదముడిగినము బాము గజవక యున్నన్‌ 29

58 సుమతి శతకము ధర దేలు మీటకున్నను గరమరుదుగ లెక్క గొనరు గదరా సుమతి, 31

(ప్ర : సుమతీ, ధరన్‌ = భూమిపై, కరణము = గ్రామ గణకుడు, సాదై = సాదు+ఐ = మెత్తనివాడై. సాధుస్త్వభావం కలవాడై, ఉన్నను = ఉన్నపక్షంలోనూ, కరి = ఏనుగు, మదము = గండస్థలంనుంచి శారే క్రొవ్వు, ఉడిగినను = పోయినపక్షంలోనూ, పాము = సర్భం, కజవక = కాటువేయకుండా, ఉన్నన్‌ = ఉండిన పక్షంలోనూ, తేలు = వృళ్టికం, మీటకున్నను = మీటకళఉన్నను = కుట్టకుండా ఉన్నపక్షంలోనూ,కరమరుదుగన్‌ = కరము + అరుదు + కన్‌ = మిక్కిలి ఆశ్చర్యకరంగా, లెక్క గొనరు గదరా = లెక్క+కొనరు+కదరా = లక్ష్యపెట్టరు కదయ్యా,

తా : సుమతీ, గ్రామ గణకుడు మెత్తనివాడైనాా ఏనుగు (క్రొవ్వుపోయినదయినా, పాము కరవనిదయినా, తేలు కుట్టకపోయిన్నా ఎవరూ లక్ష్యపెట్టరు.

వ్యా : గ్రామ గణకుడు చేసేది లెక్కలు వ్రాసేపని అయినా ఊరికి ప్రభువులా వ్యవహరించేవాడు. ఊరుమీద పెత్తనం చేసేవాడు రకరకాల మనస్తత్వాలు కలవారితో వివిధసందర్భాలలో వ్యవహరించవలసి ఉంటుంది. మంచితనం అనవసరమని అందరితోనూ దుష్టులతోనూ మెత్తగా వ్యవహరిస్తే ఇతడు ఎవరినీ చేయగలది ఏమీ లేదనుకొని అతడు చెప్పినమాట వినరు కనుక, సందర్భాన్నిబట్టి పెత్తనదారు కరుకుగా ఉండటం ఆవసరం.

అలోగే ఏనుగు బలం కల పెద్ద జంతువే, కాని స్వతః సాధుజంతువు. మదం ఉన్నపుడుమాత్రం ఏమి చేస్తుందో దానికే తెలియదు. ఆ స్థితిలో దానికి కోపం వస్తే విజృంభిస్తే ఎవరూ ఆపలేరు. ఆ మత్తూ కొవ్వూ లేకుండా ఉన్నదశలో అయితే అది ఏమీ చేయకుండా ఉంటుంది. అపుడు భయంపోయి మామూలు పశువుతో ప్రవర్తించినట్లే దానితో ప్రవర్తిస్తారు.

పాము కనపడితే జనం భయపడిపోతారు, అది కరిస్తే నిషంవల్ల చచ్చిపోతామని. ఆ భయంతోనే పాము కనబడితే చాలు, విషంకల పామా లేనిపామా అని ఆలోచించకుండా చంపేస్తారు. అది దగ్గరకు వచ్చినవారిని కరవకపోతే, ఇదీ దుష్టమైనదే కాని, మనకపకారం చేయగలశక్తి లేనిది కనుక, దీనిని సులభంగా చంపవచ్చును గనుక, చంపండి అని, నిర్భయంగా దానికి అపకారం చేస్తారు.

అలాగే తేలు విషయమూ. తేలు నిజానికి కుట్టాలని కుట్టదట. దానికొండేనికి తగిలితే చాలు విషం ఎక్కుతుంది. కనుక తేలుకీ, జనం భయపడుతారు. అది కొండెంమీద చెయ్యివేసినా కుట్టకపోతే ఆటపురుగుగా భావించి బాధిస్తారు కాని లక్ష్యపెట్టరు. కుడితే తేలు కుట్టకపోతే కుమ్మరి పురుగు అని అందుకే సామెత,

వివేకానందినీ వ్యాఖ్యాసహితం ర్‌9 నిజానికి ఈ నలుగురూ అపకారం చేయనందుకు (ప్రజలు వారి మంచితనాన్ని మన్నించి కరణంగారు చెప్పినమాట వినాలి, ఏనుగు పాము తేళ్ళకు అపకారం చేయకుండానూ ఉండాలి. కాని, వాటికంటే వినేకులయిన మనుష్యులే లక్ష్యపెట్టకుండా ఉంటారు. ఇది ఆశ్చర్యకరం, అందుకే కవి కరమరుదుగ అన్నాడు. ఒక పాముంది. అందరినీ కరిచేది, చచ్చిపోయేవారు. ఒక మహర్షి దానితో అలా కరవకు పాపం వస్తుంది అన్నాడు. మానేసింది.ఎందరిని కరిచిందో, ఇపుడు దీని పనయిపోయిందని రాళ్ళతో కొట్టీ, పుల్లలతో పొడిచీ, పిల్లలు కూడా బాధించసాగారు. ఈ సారి మహర్షి కనబడితే, నీమాట వినినందుకు ఇలా ఉన్నాను అంది. కరవ వద్దన్నాను కాని బుసకొట్టవద్దన్నానా? బెదిరించు అన్నాడు. బుసకొడితే, దీనికీ మళ్ళీ పొగరు వచ్చిందే అని, ఈ సారి ఇంకా కొట్టటం మొదలు పెట్టారు. అయినా బుసకొడుతుంది కాని కరవదని నిర్భయంగా బాధించసాగారు. ఈ సారి కనబడినపుడు మహర్షికి చెపితే, అదే పనిగా కరనవద్దన్నాను కాని, అసలు వద్దన్నానా అన్నాడుట. ఈ సారి బాధించినపుడు ఒకణ్ణి కరిచింది. వాడు మరణించాడు. దాని జోలికి పోవటం మానేశారు. లోకస్వభావం ఇలా ఉంటుంది. కనుక సమయోచితంగా మెలగాలి. అవ : వివరీతకామచేష్టలను నిందించబోతున్నాడు : క్త కసుగాయ( గటజిచి చూచిన మసలక దన యొగరుగాక మధురంబగునా? పపగలుగు యువతులుండంగ6 బసి బాలలం బొందువాండు పసరము సుమతి. 32 ప్ర : సుమతీ, కసుగాయన్‌ = లేతపిందెను, కటచి = కొరికి చూచినన్‌ = రుచి చూస్తే, మసలక = ఆలస్యం చేయక, తప్పక, తన యొగరుగాక = తన+ఒగరు+కాక = దానికికల ఒగరు రుచినే కలిగిస్తుంది కాని, మధురంబు = తీయనిది, అగునా? = కాగలదా? కాదు; పసగలుగు = పస+కలుగు = నేర్పు, సామర్థ్యం, ఒప్పిదం, కాంతి, వలపు ఉన్న యువతులు = యౌవనం కల స్త్రీలు, ఉండంగన్‌ = ఉండన్‌+కన్‌ = లభిస్తుండగా, పసిబాలలన్‌ = శిశువులైన ఆడుపిల్లలను, పొందువాండు = కలిసేవాడు, పసరము = జంతువే. తా : సుమతీ, లేతపిందెను కొరికి చూస్తేఒగరుగా ఉంటుంది కాని తీయగా ఉండదు. నేర్పూ సామర్థ్యమూ ఒప్పిదమూ కాంతీ (ప్రేమా ఉన్న వయసుకత్తెలు దొరకుతుండగా మిక్కిలి చిన్నతనంలో ఉన్న బాలికలను కూడగోరీవాడు పశువు కాని మనుష్యుడు కాడు. 30

60 సుమతి శతకము వ్యా : ఏదైనా ఒక పండు తినదలచినవాడు, అది సరిగా పక్తమైనాక తింటే, రుచిగా తీయగా ఉంటుంది. అంతే కాని, ఆ చెబ్బు లేతపిందె కొరికితే, ఒగరుగా ఉంటుంది కాని పండులా తీయగా ఉండదు. నోటికి రుచి అనిపించకపోగా అరుచి పట్టుకొంటుంది. తన నోరు పొడు కావటమే కాక, కాయై పండై దానిసాంతదారుకు సంతోషం కలిగించవలసినది, ఎవడో పిందెగానే కొరికి పారవేసినందువల్ల వ్యర్హమైపోతుంది. అలాగే, ఎవడైనా స్త్రీపురుషుల కలయికవల్ల కలిగే సౌఖ్యం పొందాలనుకొనటం తప్పు కాదు, అయితే, తనకు తగిన తనకు నచ్చిన, యోగ్యురాలైన తరుణిని పెండ్లి చేసుకొని సుఖపడవచ్చును. అపుడు సంతోషం కలుగుతుంది. అంతే కాని, విపరీతబుద్ధితో పసివయసు బాలికలను కూడొలనుకొనటం తగదు. అందువల్ల తనకూ అక్రమమయినందున పాతకమే కాని, అపకృమైనందున ఆసౌఖ్యమే కాని, కోరిన సౌఖ్యం లభించదు. అ బాలికలూ పెరిగిపెద్దవార్నె తగినవారికి భార్యలై సంతోషించి, సంతోషపెట్టనలసినవారు వ్యర్థంగా చెడిపోతారు. పరాయివారి చేనిలో పడి, పంటమొక్కలు కొరికి, పాడుచేయటం దొంగగొడ్డు పని. ఆ కంగారులో కొరికిన మొక్కలతో దానికి కడుపు నిండదు. చేనివారు చూచి చావగొడతారు, బందెలధొడ్డిలో పెడతారు. అది కొరికినమొక్కలు, పెరిగి పంటనివృవలసినవి పొడైపోతాయి. ఆ పఫవుకి జ్ఞానం వివేకం ఉండే అవకాశం లేదు. అవి ఉండవలసిన, ఉన్నవాటిని ఉపయోగించుకొని (ప్రవర్తించవలసిన మనిషి, విపరీతంగా ప్రవర్తించినందున పశువువంటివాడే అవుతున్నాడు. చిన్నపిల్లలను ఇట్టి విపరీతకాముకులు బాధిస్తున్నవార్తలు పత్రికలలో చూస్తుంటాము. ఇట్టి దుర్మార్గులు ఆ రోజులలోకూడా ఉన్నారన్నమాట. కనుకనే అట్టివారిని కవి నిందించవలసి వచ్చింది. ఇట్టి దుర్మార్గానికి పాల్పడే అవకాశం ఉన్నందున, తమ పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తతో చూచుకొంటూ ఉండాలి. చిన్నపిల్లలూ (కొత్తవారిని సమీపించకుండా ఉంటూ ఉండాలి. పసగలుగు యువతులుండగ అన్నాడుకదా, యువతులతో ఇలా ్రవర్తించమంటున్నాడని విపరీత వ్యాఖ్య చేయగూడదు. అట్టి సౌఖ్యవాంఛ కలవాడు తగిన తరుణిని పెండ్లాడి సుఖపడమనే కవి అభిప్రాయంగా గమనించాలి. దేనిమీదనైనా విరక్తి కలగాలంటే, అందులో ఉన్నదోషం తెలియాలి. ఊరకే బాలలజోలికి పోవద్దు అంటే చాలదు. అందువల్ల సుఖం కలగకపోగా దుఃఖం కలుగుతుంది అని చెప్పాలి. కనుక ఇలా చెప్పాడు. ఎవరో సంస్కృతకవీ ఇలాగే చెప్పాడు : అవ్యాకరణపాండిత్యమవ్యక్త తరుణీరతం, అనంపూర్ణజలస్నావం పత్రయం దుఃఖాయ కల్పతే - అని, వ్యాకరణం రాని పాండిత్యమూ, వ్యక్తురాలు కానిపిల్లపొందూ, పూర్తిగా చాలనినీటితో చేసినన్నానమూ, మూడూ దుఃఖం కలిగిస్తాయని భావం,

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 61 అవ : వ్యర్టములైన (నాత వలవు ఆయుధకాళలములు చెవ్పుబోతున్లాడు వి క. _ కవికానివానివ్రాతయు నవరసభానములు లేని నాతులనలపున్‌ దవిలి చను పందినేయని వివిధాయుధకౌశలంబు వృథరా సుమతి. 33 ప్ర: సుమతీ, కవి కానివాని = వర్ణ్షనానిపుణుడయి కవిత్వం చెప్పలేనివానియొక్క, వ్రాతయు = రచనా, నవరసభావములు = శృంగారం మొదలైన తొమ్మిది రసాలూ భావాలూ, ఎప్పటికప్పుడు శ్రొత్తలనిసించే ఆనందాలూ భావాలూ, లేని = లేనట్టి, నాతుల = స్త్రీలయొక్క, వలపున్‌ = (ప్రేమా, తవిలి చను = విడవకుండా పరుగెత్తే పందిన్‌ = అడవి పందిని, ఏయని = బాణం (ప్రయోగించి కొట్టని, వివిధాయుధకౌాశలంబు = వివిధ+ఆయుధకాశలంబు = పలురకాల ఆయుధాలను (ప్రయోగించటంలో కల నేర్చరితనమూ, వృధరా = కొరగానివయ్యా. తా : సుమతీ, స్వయంగా కవి కానివాడు చేసిన రచనా, శృంగారాదులైన తొమ్మిది రసాలూ భావాలూ ఎప్పటికప్పుడు |క్రొత్తలనిపించే ఆనందాలూ, భావాలూ లేని కాంతల(్రేమా, ఆగకుండా పరుగెత్తుకొనిపోతున్న అడవిపందిని బాణం ప్రయోగించి పడగొట్టనివాని రకరకాల ఆయుధాలు ప్రయోగించటంలో కల నేర్చూ, ఎందుకూ పనికి రావు కదయ్యా. వ్యా : కవి కానివానివ్రాత పనికిరాదుట. ఒకడు కష్టపడి భాషలో పాండిత్యమూ, అలంకారాదిశాస్తాలలో వైదుష్యమూ సంపాదించవచ్చు. ఎలాగో (శ్రమపడి, పద్యమో గద్యమో వ్రాయటమూ నేర్చుకోవచ్చు. కాని, జన్మతః ఉండవలసిన వర్షనానైపుణ్యం వానికి లేకపోవచ్చును. నిజమైన కవులకు కలిగే గౌరవాదరాలుచూచి, కవులు కానివారుకూడా కవులమని ప్రచారం చేసుకొని, కవిత్వం కానిదానిని కవిత్వమని (భ్రమింపచేసి, కవిత్వేతరవిషయాలు కలిపి ప్రదర్శించి, కాసులు సంపాొదిస్తుంటారు. వీరిని కుకవులంటారు. ఒకడు కవికాకపోవటం -అకవికావటం అధర్మం కాదు. ఉరివేయవలసిన నేరమూ కాదు, శిక్షార్హమూ కాదు కాని, కుకవి కావటంమాత్రం ప్రత్యక్షంగా (ప్రాణాలు తీసుకోవటమే - వాకవిత్వముధర్మాయ మృతయే దండవాయ నా కుకనిత్వం పునస్పాక్షాన్స తిమావుర్మనీషిణ:

  • అన్నాడు దండి. అట్టివాడు, కుకవి చేసిన రచన చదువరిని సంతోషపెట్టజాలదు. కనుక నిఘ్ర్రయోజనం. నవరసభావములు అంటే శృంగారాదిరస భావాలనీ, (క్రొత్త ఆనందం కలిగించే భావాలనీ అర్హం చెప్పవచ్చు. కేవలం ్రీత్వంమాత్రమే ఉండటం (ప్రేమకారణం కాదు. మ్‌!

ణై సుమతి శతకము శృంగారాది రసాలకు మూలమయిన భావాలూ క్రొత్త అనిపించే ఆనందం కలిగించే భావాలూ ఉన్న కాంతల ప్రేమే సఫలమవుతుందట. అట్టిది కాని'ప్రేమ ని(ష్ప్రయోజనం అంటున్నాడు. ఇక్కడ నాతులవలపు అంటే వారివలపూ వారిమీదివలపూ అని చెప్పవచ్చు. (ప్రీవాంఛవిషయమై పురుషులమనఃప్రవృత్తి క్రమం కవులు సూక్ష్మంగా (గ్రహించి వర్షించారు: అజ్ఞానా మవనీళృతామహరహః సౌవర్లవర్దాదపి జ్ఞానశ్రీయుతనిఃన్వపూరుషవచఃత్లామైన సనమ్మాననా, షారాపారనివేకహీనతరుణీసంభోగసామ్రాజ్యత:, పారజ్టేందుముఖీవిలోకనసముత్కంకైవ యూనాం ముదే

  • కవిత్వంమంచిచెడ్డలు తెలియనిపరిపాలకులు దినదినమూ కురిపించే కనకవర్షంకంటిె, జ్ఞానశ్రీమంతులే కాని లక్ష్మీకటాక్షానికి నోచుకోనివారు, నోటిమాటగా మెచ్చుకొనటమే నిజమైన సమ్మానమట. అదెటువంటిదంటే, సారాసారవివేకంలేని తరుణీసౌఖ్యమనే సామ్రాజ్యం లభించటంకంటె, సారం తెలిసినచం[ద్రముఖి చూడాలన్న కోరిక్తే అట్టి ఆమెను చూడాలన్నకోరికే, యువకులకు సంతోషం కలిగిస్తుంది అని ఆ క్టోకంభావం, ఈ శతకకర్త నవరసభావములు లేనినాతులవలపు వృథా అంటే, ఈ కవి సారాసారవివేకహీన తరుణీసంభోగసా[మ్రాజ్యం వృథ అన్నాడు. అనేకములయిన ఆయుధాలను ప్రయోగించటంలో ఒకడు నేర్చు సంపాదించవచ్చు. ఆయుధవిద్యలు నేర్చినవారి కందరికీ యుద్దాలు చేసే అవకాశాలూ అవసరాలూ రావు. ఆయుధప్రయోగానికి అనువైనది వేట. అందులో ఆయుధప్రయోగకౌశలానికి వన్నె పెట్టుకొంటుంటారు. వేటవల్ల కనీసం ఆహారం లభిస్తుంది. వేటలో అన్ని జంతువులనూ వేటాడటం ఒక యెత్తూ, అడవి పందిని కొట్టటం ఒక యెత్తూ అంటారు. పంది అవలీలగా తప్పించుకొనీ పోతుంది, త్వరగా పరుగూ పెడుతుంది, బాగా కోపం వచ్చినపుడు వేటగానినీ జాగిలాలనూ ఢీకొంటుంది. దానిని వేటాడటం కష్టమంటారు. పాశుపతా'స్త్రంకోసం తపస్సు చేస్తున్న అర్జునుణ్ణి పరీక్షించటానికి, శివుడు కిరాతవేషం ధరించి వచ్చినపుడు, మూకాసురుణ్లి పందిరూపంలోనే పంపించాడు. కాళిదాసుకూడా వేట ప్రయోజనం చెపుతూ, ఉత్కర్హు స చ ధన్వినాం యదిషవః సిద్ధ్యంతి లక్ష్యే చలే అన్నాడు. బాణం తగలవలసిన లక్ష్యం కదులుతుండగా దానిని కొట్టడం, విలుకాండ్రగొప్పదనానికి నిదర్శనం అన్నాడు. లక్ష్యం ఎంతసేపటిలో ఎక్కడికి చేరుతుందో, తనబాణం అంతసేపటిలో అక్కడికి చేరేటట్టుగా కొట్టటానికి, రెండింటి వేగాలగురించిన అంచనా, క్షణంలో వేసి కొట్టగలగటం సామాన్యం కాదు గనుక, అది గొప్ప. అంతనేర్పు అవసరం కనుకనే, పరుగెత్తే అడవిపందిని కొట్టలేని నేర్పు వృథా అంటున్నాడు.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 63 అవ : లోకంలో ఎవరెలా ఉంటారో చెవ్పుబోతున్నాడు : క _కొదన్ననా(డె కరణము వాదడచిననాండె పేడి వసుధేశుకడన్‌ లేదన్ననాండె చనవరి గాథలు పెక్కాడువా(డె కావ్యుండు సుమతీ. ర్రెక్ష (ప్ర : సుమతి, కాదన్నవాండె = కాదు+అన్నవాడు+ఎ = ఒకరు చెప్పినదానిని సమంజసం కాదు అని పలుకువాడే, కరణము = (గ్రామగణకుడు, వాదడచినవాడె = వాదు+ఆడచినవాడు+ఎ = వాదు = అపనింద, అడయినవాంె = పోగొట్టినవాడె, "సీడి = నపుంసకుడు అనగా ఆంతఃపురము కావలివాడు, లేదా, ఓటమిభయంతో కలహం మానినవాడే పౌరుషహీనుడు. ఆ కలహం విద్యావిషయం కావచ్చు ఇతరవిషయం కావచ్చు. వసుధేశుకడన్‌ = వసుధా+-ఈశుకడన్‌ = భూమికి ప్రభువైన రాజుదగ్గర, లేదన్నవాడె = లేదు+అన్నవాడు+ఎ = కోరినదివ్వటానికి లేదు అని పలికినవాడె, చనవరి = చనవు+అరి= హితుడు, గాథలు = ఆ పేరుగల ళ్లోకాలు, లేదా పూర్వకథలు, పెక్కు = అనేకం, ఆడువాడె = ఆడువాడు+ఎ = చదివేవాడే, లేదా చెప్పేవాడే, కావ్యుడు = శుక్రాచార్యునంతటి మేధావి, రాజనీతిజ్ఞుడు. తా : సుమతీ, ఒకరు అవునన్నది కాదన్నవాడే గ్రామగణకుడు, అంతఃపురంలోని వారికి అపనిందలు కలుగకుండా చూడగలవాడే ఆంతజురానికి నిజమైన కావలివాడు. అవసరమైనపుడు కలహించటానికి వెనుకాడేవాడే పుంస్త్యస్రీత్వాలు లేని నపుంసకుడు. (ప్రభువువారి సన్నిధానంలో ఉంటూ వారిని యాచించటానికో ఏదైనా ఉపకారం చేసిపెట్టమని అడగటానికో వచ్చినవారిని లేదు పొమ్మని పలికేవాడే ప్రభువువారికి హితుడు. సందర్భోచితంగా రంజకమైన గాథలనబడే శ్లోకాలు ఉదాహరించగలవాడే లేదా పూర్వకథలు చెప్పగలవాడే మేధావి, రాజనీతిజ్ఞుడు. వ్యా ; లోకంలో పలురకాల ప్రవృత్తులు కల మనుష్యులుంటారు. పదిమందికి మేలో కీడో చేయగల స్థానంలో ఉన్నవారిలో, వీలయినంత మేలు, వీలయినంతమందికి, ఏదో విధముగా చేద్దాము అనే పరోపకారబుద్దికలవారూ ఉంటారు. తమకు గల రాగద్వేషాలూ ఈర్చాసూయలూ కారణంగా, కీడుమాత్రమే చేస్తూ ఉండేవారూ ఉంటారు. తమ విధి నిర్వహించటంలో చేసేపనిలో తప్పు అనటానికుండదు గాని, వివేకం లోపించినందువల్ల చేసిన పని, ఇతరులకు అపకారంగా పరిణమించేటట్టు చేసేవారూ ఉంటారు. నిజమైన తెలివీ రాజనీతిపొండిత్యమూ లేకపోయినా, ఉన్నట్టు మాటనేర్పువల్ల పేరు తెచ్చుకొని, ఏలికలకు సలహాదారులయి, తమ తెలివితక్కువ తనంవల్ల వారికి నష్టం తెచ్చి పెట్టేవారూ ఉంటారు. కనుక అట్టివారి తీరులు అర్థం చేసుకొని, పాలకులూ పాలితులూ తగుఠీతిని వ్యవహరించాలని, ఈ పద్యంలో వివరిస్తున్నాడు. ఇది సూటి నీతి బోధకంగా ఒక సందర్భంలోనూ, అధిక్షేపపూర్వకంగా మూడు విషయాలలోనూ ఉండటం గమనించాలి,

! సుమతి శతకము

ఒకరు అవునన్నది కాదన్నవాడే కరణము అన్నమాట: పదిమందిపై పెత్తనం చేయవలసిన లోకవ్యవహారపరులు, తమ అధిక్యం కాపొడుకొనటానికీ, తమతెలివి ప్రదర్శించి ఎదుటివారిని చెప్పుచేతలలో పెట్టుకొనటానికీ, వీలయినంతవరకూ ఎదుటివారి మాటలలో చేతలలో తప్పులెత్తి చూపిస్తుంటారనే అధిక్షేపమూ ఉంది. స్వషప్రయోజనపరులు స్వకార్యసాధనకు, ఇతరుల ప్రయోజనాలకు భంగకరంగా ప్రవర్రించబోతూ, విచిత్రవాదనలు చేస్తుంటారు. వాటిలోని అసమంజసత తెలుసుకొని, ఎదుటివారు కాదనలేని రీతిని వాటిని ఖండించి, ఏది ఎలా చేస్తే సమంజసమో వివరించగలవాడే రాణిస్తాడు కనుక, ఆ శక్తి అలవరుచుకోవాలన్న హితమూ ఉన్నది.

వాదడచినవాడె పేడి అనటంలోనూ గొప్ప లోకజ్ఞత ఉన్నది. రాజాంతఃపురాలలో పనులు చేయటానికీ వాకిలికాపలా కాయటానికీ పేడివారిని నియమించేవారు. అందుకోసం పాపం కొందరిని పనిగట్టుకొని పేడివారుగా తయారుచేసేవారు, వారిపని కాపాలాకాయటం. కాని, వారు దుర్చుత్తి కలవారి ఎరలకు లొంగి కాని, ఇతర కారణాలవల్ల కాని, తమ విధులవిషయంలో తగురీతిని మెలగకపోతే, ఎవరికి కాపలా ఉన్నారో, వారికి రకరకాల అపవాదులు నచ్చే అవకాశం ఉన్నది. కనుక్క వారు తమ విధులను అ్రమత్తతతో నిర్వహించి, అట్టి అపవాదులు రానివ్వకుండా ఉండాలని సూటిగా ఉపదేశిస్తున్నాడు.

వాదు అంటే కలహం అనీ, అర్ధం ఉన్నది కనుక, ఇలాకూడా వ్యాఖ్యానించవచ్చు : పోరు నష్టం పొందు లాభం - ఇది సామాన్యనీతి. సమయం వచ్చినపుడు తగవాడి వాదించి, ఎదుటివాని అల్ప్బత్వమూ తన ఆధిక్యమూ ్రకటించగలవాడే వీరుడైనా పండితవీరుడైనా. వివాదభీరువైన పండితుడు జ్ఞానాన్ని అమ్ముకొనే వ్యాపారి - తం జ్ఞానపణ్యం వణిజం వదంతి అన్నాడు కాళిదాసు. తాను ఓడిపోతానేమో అనే భయంతో, వాదం కలహం తెంచి వేసేవాడు, పొరుషనంతుడుకాడు, నపుంసకుడు అనీ కవిఅభిప్రాయం కావచ్చు.

వసుధేశుకడన్‌ లేదన్నవాడె చనవరి అనటంలో కవిగారి లోకజ్ఞతా, లోకహితబుద్దీ, అధిక్షేపశక్తీ బాగా వెల్లడి అవుతున్నాయి. ప్రభువులు పాలకులు సంపన్నులు ఉన్నారంటే, కవులు, పండితులు, కళావేత్తలు, పరసేవాపరాయణులు, ఆశక్తులు, పేదలు, ఆర్హులు - ఎన్ని విధాలవారో, వారి సాయం కోరి, వారివద్దకు వచ్చి, తమకృషికి వారిచేయూత ఆపేక్షిస్తారు. ఇట్టివారికి, బొచిత్యం తెలిసి, వీలయినంత ఉపకారం చేయటం వారిధర్మం. అడగకుండానే బౌచిత్యం గమనించి, తమంత తామే వారివద్దకు వెళ్ళి, చేసేదానం సాతికం. కొందరికి ఆసాత్సిక గుణం ఉండదు కాని, జాదార్యం ఉంటుంది. వీరు ఆడిగినవారికి వారి అదృష్టాన్ని భట్టి ఉపకారం చేస్తుంటారు. అందరికీ, ఉన్నట్టుగానే ఇట్టి

వివేకానందినీ వ్యాఖ్యాసహితం రక్‌ ఉదారులకూ స్నేహితులుంటారు. ఈ ఉదారులకు వీరు సామాన్యంగా నిత్యసన్నిధానవర్తులయి ఉంటారు. ఐనదానికీ కానిదానికీ సందర్భోచితంగా పాగడుతూ, దాతల మోమోటమీ చనవూ పెంచుకుంటారు. అడిగినవారికేదో దొతలు జవాబు చెప్పటానికి ఆలోచిస్తుంటే, మధ్యలో వీరు కల్పించుకొని, ఇవుడు వీలులేదువంటి సమాధానాలూ, దాత వారడిగినది ఇద్దామనుకొన్నా, ఇతనికి ఈయవలసిన ఆవసరం లేదువంటి సలహాలూ చెపుతుంటారు. ఎంత కౌదార్యం కలవారికయినా, ఈ రాజసిక

  • తొమసిక- దాతలకు, వచ్చి అడిగేవారిమీద విముఖత కలుగుతున్నా, మొహమాటంవల్లనో, దానరుచి ఏర్చడినందువల్లనో లేదనలేక, ఊగిసలాడుతున్న సమయంలో, ఇట్టివారు తమ తరపున లేదంటే, ఈ అన్నవారు తమ శ్రేయోభిలాషులైన హితులనిపిస్తుందట. ఆ అడిగేవారు దోపిడీదారు లనిపిస్తుందట. ఆతనికి ఇది ఇద్దొమనుకుంటున్నాను అన్నపుడు, మంచిది ఇవ్వండి అన్నవానికంటె, అతనికంత అవసరం లేదు, పైగా, మీకూ అవసరాలూ, జీయవపలసిన సత్కార్యాలూ చాలా ఉన్నాయివంటి అడ్డుపుల్లలు వేసినవాడు, ఎక్కువ హితుడుగా, ఎక్కువ శ్రయోభిలాషిగా కనిపిస్తాడు. నిజంగా వాడు అపా(త్రుడయితే, అట్టి సలహా ఉచితమే కావచ్చు. కాని తన ఛాగద్వేషాలవల్హా, ఈర్వాసూయలవనల్డా ఇతడు ఇలాంటిమాటలంటాడు. ఇందువల్ల ఈ దాతకు, ఇతడు పరమహితుడు కనుక నా లాభనష్టాలగురించి ఇంత ఆలోచిస్తున్నాడు, అని మరింత నమ్మిక ఏర్పడుతుంది. ఎంత స్వనిర్ణయశక్తి కలవానికైనా. ఇట్టివారివల్ల సదాలోచన వక్రించే (ప్రమాదం ఉన్నది. ఇది కవి కాదు, లోకం ఏనాడో గుర్తించింది. కనుకనే వద్దన్నవాడు గురుడు అనే లోకోక్తి పుట్టింది. గురుడు వద్దన్నా తిరుగులేదని ఇచ్చే దానబలిచక్రవర్తులున్నారంటే అట్టివారు అరుదు. ఇట్టి చనవరులను దొతలూ (గ్రహీతలూ గమనించవలసినదే.

కర్ణా కారయితా చైన ప్రేరకశ్చామమోదకః

సుకృతే దుష్కృతే చైవ చత్వారః సమభాగివః _ జేసేవాడు, చేయించేవాడు, ప్రేరణ చేసేవాడు, ఆమోదించేవాడు - ఈ నలుగురూ. ఒక పని పుణ్యమైనా పాపమైనా, దానిఫలం సమంగా పొందుతారు అన్నది గమనిస్తే ఈ దుర్గుణం తొలగిపోతుంది. వారిగుణం పోవకపోయినా, వారితీరు తెలిసి ఉంటే, ఇచ్చే వారూ పుచ్చుకొనేవారూ బాగుపడతారు.

ఇయ్యా ఇప్పింసం గల యయ్యబకే కాక మీ సమన్యులకేలా?

రొయ్యకు లేదా బారెడు - అన్న కవిచౌడప్ప మాట వింటే, దొాశలచనవు ఈ చనవరులు సద్వినియోగం చేసుకొంటారు.

గొథలు సెక్కాడువాండు కావ్యుణడు అన్నదికూడా అధిక్షేపంగానూ ఉపదేశంగానూ స్వీకరించదగిందే. తెలివి ఉండటం వేరు, దానిని సరైన మార్గంలో వినియోగించుకొనటం

33

న సుమతి శతకము వేరు. ఒకనిఅభి'ప్రాయాన్ని ఇతరులు ఆమోదించాలి, కాని ఆమోదించటం లేదు. అంటే, దానిని వారు (గ్రహించటంలేదనేకంటే, వారికి దానిని అతడు సరిగా వివరించగలవాడుగా ఉండటం అవసరం, ఈ వివరణం తన మాటల ద్వారామాత్రమే కాక, వాటికి సమర్ధకంగా పూర్వకవులో ప్రస్తుత కవులో, మహాత్ములో చెప్పిన శ్లోకాలో, పద్యాలో, సూక్తులో, సామెతలో, పిట్టకధలో జోడించగలిగితే, అతడెంత మేధావి అని అబ్బురపడి మెచ్చి అంగీకరిస్తారట. ఈ శక్తిని సరిగా వినియోగిస్తే లోకానికీ అతనికీ మేలే. కాకుంటే ఇద్దరికీ కీడే. ఇలాంటిశక్తి బాగా ఉన్నవాడు ఈ శతాబ్టిరాజనీతివేత్తలలో చక్రవర్తి రాజగోపాలాచారిగారు. పాకిస్తాను ఏర్పడాలనీ ఆ కోరిక సమంజసమనీ (ప్రచారం చేసినవాడాయన. ఆంధ్రరాష్ట్రం ఏర్పరచనక్కరలేదనీ, పొట్టి శ్రీరాములుగారి ప్రాణాలు పోవనీ, కొన్నాళ్ళు పోతీ ఆకలికాగలేక ఆయనే నిరశనదీక్ష విరమిస్తాడనీ, ప్రధాని నెహ్రూగారికి సలహా ఇచ్చినవాడాయన. సూక్తులుటంకించటంలో, పిట్టకథలు చెప్పటంలో, అంతటివాడు లేడు. మరో వివరణశక్తి కలవాడు భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు. గాంధిగారు ఏదైనా విషయం (ప్రతిపాదించినపుడు, వివరించమంటే, ఆయన ఆ పని పట్టాభి చేస్తాడు అనేవారట, [61 04? న౭|40%| 6616౧6 1 అనేవాడట. నేను సూ(త్రకారుణ్తే పట్టాభి భాష్యకారుడు అనేవాడట. భూవనభాంతరాళమున పుష్కలవాక్చతురత్వం సజ్జనులకు ప్రకృతిజన్యగుణమన్నాడు భరృహరి. అయితే, మాటలు తాత్కాలికంగా పనిచేసినా, జనం చేతలవాళ్ళను నమ్మినట్టు మాటలవాళ్ళను నమ్మరు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశంపంతులువంటి త్యాగులకు జేజేలు పలుకుతారు. తెలివికి విస్తుపోతారు, త్యాగాన్ని (ప్రస్తుతిస్తారు. ఆన : దుష్టస్టేహం, క్తీర్తి అవ్బివ్వుటం, (ప్రేమ - వీటి గురించి చెప్పుబోతున్నాడు : క కాదు సుమీ దుస్సంగతి పోదు సుమీ క్రీర్తకాంత పొందినసిదపన్‌ వాదు సుమీ యప్పిచ్చుట లేదు సుమీ సతులవలపు లేశము సుమతీ. 3క్‌ ప్ర : సుమతీ, దుస్సంగతి = దుస్‌+సంగతి = దుర్దనులతో సావాసం, కాదు సుమీ = కాదు+చుమీ = చేయదగినది కాదు సుమా, క్షీర్తికాంత = దానశౌర్యాదులవల్ల వచ్చిన మంచిపేరు అనే మగువ, పొందినపిదపన్‌ = లభించిన, కూడిన తరువాత, పోదు సుమీ = పోదు+చుమీ = పిడిచి ఎక్కడికీ వెళ్ళదు సుమా; విడువనే విడువదు సుమా, అప్పిచ్చుట = అప్పు+ఇచ్చుట = బుణం ఇవ్వటం, వాదు సుమీ = వాదు+చుమీ = అపక్తీర్తీ కలహమూ కలిగిస్తుంది సుమ, సతులన్‌ = స్ర్రీలయందు, వలపు = స్థిరమైన (ప్రేమ, లేశమున్‌ = అతి స్వల్పమైనా, లేదు సుమీ = లేదు+చుమీ = ఎప్పుడూ ఎక్కడా లేదు సుమా, "

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 67 తా : సుమతీ, దుష్టులతో స్నేహం చేయగూడదు సుమా, కీర్తి అనే వనిత లభించిన తరువాత, కూడిన తరువాత, విడిచిపెట్టదు సుమా. ఒకరికి సొమ్ము అప్పివ్వటం వల్ల అపకీర్తి వస్తుంది సుమా, స్త్రీలలో ప్రేమ కొంచెమూ ఎన్నడూ ఎక్కడా లేదు సుమా. వ్యా : ఇందులో నాలుగు హెచ్చరికలు చేశాడు. మనము ఎవరికైనా అనేకవిషయాలు చెప్పేటప్పుడు వాటిలో ముఖ్యమైన విషయమై హెచ్చరించేటప్పుడు సుమా, సుమ్మా, నూ, మీ - వంటివి ప్రయోగిస్తాము. ఇది తేవటం మరిచిపోయేవు సుమా - ఇలా.

ఇలాంటి హెచ్చరికలీ శతకంలో 23 చేశాడు.

ఈ పద్యంలోని నాలుగింటిలో మొదటిది కాదు సుమీ దుస్సంగతి అన్నది, దుస్పాంగత్యం ఎంత కూడనిదిగా ఈ కవి భావిస్తున్నాడో దీనివల్ల తెలుస్తుంది. శవ పద్యంలో కుజనులతోడన్‌ విడువక కూరిమి సేయకు అన్నాడు. 17వ పద్యంలో దుస్సాంగత్యం ఏ తీరుగా ఉంటుందో చెప్పాడు. మొదట తియ్యగా ఉండి తరవాత దగా చేసేదిగా ఉంటుందన్నాడు. వానిదుష్టత్సం ఎపుడు చూపిస్తాడో తెలియదు కనుక దుష్టునికి దూరంగా ఉండటమే మంచిది. 40వ పద్యంలో అల్పునితో, అంటే దుష్టుడైన అల్పునితో అన్నమాటే, సాంగత్యం చేస్తే కీడు వస్తుందన్నాడు. నల్లి కుడితే మొత్తం మంచానికి దెబ్బలు తగుల్తున్నాయని దృష్టాంతం చూపించాడు. 80వ పద్యంలో పాలలో కలిసిన నీళ్ళు చూడటానికి పాలలాగానే ఉన్నా, పాలరుచి కూడా పోగొడతాయి కనుక, పాలసుడు అనగా దుష్టుడయినవానిచెలిమి వలదుర, వద్దురా నాయనా, అని చెప్పబోతున్నాడు. కనుక ఈ హెచ్చరికఅవసరం ఉంది.

రెండవ హెచ్చరిక వచ్చినక్తీర్తి కూడినక్తీర్తి విడిచిపోదు సుమా అన్నది. అంటే మంచిపేరు సంపాదించ్హుఖ్రది శాశ్చతమయింది. చచ్చిపోయాకకూడా ఉండేది సత్కీర్తి ఒక్కటే, కడమవే అన్నీ పోయేవే అని చెపుతున్నాడన్న మాట. అలాగని, పేరుకోసం వెంపరలాడమని కాదు. సత్కీర్తి దాయకములైన పనులు చేస్తుంటే కీర్తి దానంతటదే వస్తుంది. రాకపోయినా ఫలం తప్పదు.

“కారే రాజులు? రాజ్యముల్లలుగవే? గర్వోన్నతిం జెందరే?

వారేరి? పిరిమూట గట్టుకొని పోనంజాలిరే? భూమిసై

సేరైనం గలదే? శిబిప్రముఖలుం బ్రీతిన్‌ యశఃకాములై

యీరే కోర్కులు? వారలన్మరచిరే యిక్కాలమున్‌ భార్గవా?” అన్న బలిచశ్రవర్తి వాక్యంలోకూడా శిబిచక్రవర్తి మొదలయినవారు యళశఃకాములై దానాలిచ్చారని ఉన్నది. ఎందరు రాజులేలినారో, వారిని తలుచుకొనేవారు లేరు, శిబి మొదలైనదాతలను తలుచుకొంటున్నారు. అన్నీ ఎలాగా అశాశ్ళతమైనవే, వీటిని వదిలితే

రెడీ

68 సుమతి శతకము శాశతమైన కీర్తి వస్తుంది, అన్నది ఉద్దేశ్యం కాని, క్తీర్తకోసం చేయాలని కాదు. కాని, నలుగురూ తననుగూర్చి మంచిగా చెప్పుకొనే ఖ్యాతిని మాత్రం కాపాడుకోవాలి, దీనివల్ల భౌతికశరీరం పోయినా క్షీర్తిాయం నిలుస్తుంది -

రక్షేత్‌ ఖ్యాతిం పువఃన్యృత్యా యశుకాయస్య జీవనీమ్‌,

చ్యుతః స్కృతో జనైః స్వర్గమింద్రద్యుమ్నః పునర్గత;ః - ఎవ్వరూ నిన్ను తలవటం లేదని స్వర్గంనుంచి పంపివేశారు దేవతలు ఇంద్రద్యుమ్నుని. ఆయన తనను తలచుకొనే వారున్నారని రుజువుచేసేసరికి మళ్ళీ తీసుకువెళ్ళారు. కనుక సత్మ్కీర్తిని కాపాడుకోవాలన్నాడు. క్షేమేంద్రుడు చారుచర్యశ్లో, 45లో. అలా వచ్చినకీర్తికాంత విడిచిపోదు, అనటంలో ఈ కవి మరొక చమత్కారం చేశాడు. నాలుగవ హెచ్చరిక సతులలో వలపు లేశమూ లేదు సుమా అని చేయబోతున్నాడు. వాళ్ళు వదలిపోయినా పోవచ్చు. కీర్తిసతిమా(త్రం విడిచి పెట్టదు, కనుక వాళ్ళమీద మోజెందుకు కాని శాశ్వతంగా వదలకుండా ఉండే కీర్తొంతనే సంపాదించుకో అని హెచ్చరిస్తున్నాడు.

ఇక్కడ అందమంతా కీర్తిని కాంతతో పోల్చి ఆమె 'సొందిన' పిదప పోదు సుమీ అనటంలో వాడిన పొందిన'లో ఉంది. తొయ్యలి సంబంధంతొంభై ఏళ్ళయినా పోదంటారు.

వాదు సుమీ యప్పిచ్చుట అన్నది అద్భుతమైన హెచ్చరిక. అప్పుగురించి ఈ శతకంలో 6, 7, 88 పద్యాలలో చెప్పాడు. 6వ పద్యంలో అప్పిచ్చువాడులేని ఊళ్ళోకి 'ఫ్రవేశించవద్దన్నాడు. మూలంలో ధనవంతులు లేని ఊర్జో ప్రవేశించవద్దంటే కవిహృదయాన్ని (గ్రహించి తాను అప్పిచ్చువాడులేని ఊర్గోకి అని వ్యాఖ్యానించాడు. ఎప్పుడో ఒకప్పుడు ఎందుకో ఒకందుకు అప్పుచేయక తప్పదు కనుక అలా చెప్పాడు. తప్పనిసరయిన పరిస్థితులలో మాత్రమే అప్పు చేయాలని అభిప్రాయం. 7వ పద్యంలో అప్పు తీసుకొని హోదా అనుభవించటం వల్ల కీడు కలుగుతుందన్నాడు. 88వ పద్యంలో కుటుంబంలో అనుదినమూ కావలసిన చిల్లర సరుకులకోసం అంగడిలో అవ్పుపెట్టకు అని చెప్పబోతున్నాడు.. అప్పుచేసి పప్పుకూడు తినగూడదన్న నియమం పెట్టుకున్నందువల్ల సొమ్మున్నప్పుడే కావలసిన సరుకులు కొనుక్కుంటారు. అంగడిలో అడిగితే చాలు సరుకులు వస్తున్నాయంటే కోరిక కలిగినపుడెల్లా తేవటం అలవాటవుతుంది. ఇందువల్ల అనవసరతక్రయం పెరుగుతుంది. మొదటి పద్ధతివల్ల మితవ్యయం అలవడుతుంది. ఇక్కడ ఇతరులకు అప్పిస్తే అపకీర్తీ కలహమూ వస్తాయి సుమా అని హెచ్చరిస్తున్నాడు. అప్పు పుచ్చుకొన్నప్పుడున్న తొందర తీర్చీటప్పుడుండదు. ఇమ బని అడిగితే కష్టంవేస్తుంది. తనను పీడిస్తున్నాడని నలుగురికీ చెప్పి కఠినుడనే అపకీర్తి తెస్తాడు. గట్టిగా అడిగితే కలహమే రావచ్చు కనుక అప్పు పెట్టవద్దని హెచ్చరిస్తున్నాడు. ఎవరివైనా వదిలించుకోవాలంటే అప్పుపెట్టమని లోకోక్తి,

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 69

“పుస్తకం వనితా విత్తం పరహస్తగతం గతం,

అథవా పునరాయాతి జీర్ణం భ్రష్ట చ ఖండళః” - పుస్తకమూ, స్త్రీ ధనమూ ఇతరులచేతిలో పడిందంటే మనకు కాకుండా పోయిందన్నమాటే. ఒకవేళ తిరిగి వచ్చినా పుస్తకం చిరిగి వస్తుంది. స్త్రీ (భ్రష్టురాలై వస్తుంది. ధనం ఒక్క మొత్తంగా కాక కొంచెం కొంచెంగా వచ్చి చిల్లరమల్లరగా ఖర్చయిపోతుంది అని ప్రాస్తావికనీతి. ఒకనికి అప్పు పెట్టేటప్పుడు ఇది తిరిగి వచ్చేది కాదు, రాక పోయినా బాధలేదు, అని నిర్ణయించుకొనే పెట్టమని పెద్దలు చెపుతారు. అప్పుచేస్తే తీర్చటం బాధ, అప్పుపెడితే పొమ్ము పోయి దుమ్ము వచ్చిందని అపకీర్తీ కలహమూ వస్తాయి. కనుక అప్పుజోలికి ఏ విధముగానూ పోవద్దన్నది ఈ కవి అభిప్రాయంగా కనిపిస్తుంది. ఏమైనా అప్పివ్వకా తప్పదు, పుచ్చుకోకా తప్పదు, ఎవరికో తప్పు

సతులవలపు లేశము లేదు సుమీ అన్నది మరో హెచ్చరిక. కాంతలవిషయమై ఈ కవి?, 8, 10, 12, 23, 25, 32, 33, 35, 36, 37, 38, 41 43, 44 4ర్‌, 48, 51, 52, 54, 56, 57, 63, 65, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 82, 84 85, 92, 93, 101, 103, 104, 105, 106, 107, 110=వ సంఖ్యలు గల 49 పద్యాలలో (ప్రస్తావించాడు. వాటిలో 54 నీతులు చెప్పాడు. 32వ 38వ 4ర్‌వ 74వ 75వ పద్యాలలో రెండేసి నీతులు చెప్పాడు. వీటితీరు విశ్లేషిస్తే ఈకవి ధోరణి స్పష్టంగా తెలుస్తుంది.

తల్లిగా (స్త్రీ స్థానం వందనీయమైనది. ఆమెను అమ్మా అని పిలవటం వాక్కును చరితార్థం చేస్తుంది. ఆమెను పరవళింపజేస్తుంది. తల్లి బిడ్డను కనటంలో ఎంత ప్రాధాన్యం వహిస్తున్నదో పోషించటంలోనూ అంతే ప్రాముఖ్యం వహిస్తున్నది. 12వ పద్యంలో అమ్మా అని పిలిచి అన్నమడుగని నోరు కుమ్మరి మన్ను త్రవ్విన గుంటతో సమాన మన్నాడు.

67వ పద్యంలో తల్లితో పరిహాసం ఆడవద్దన్నాడు.

తల్లిమాట గౌరవించవలసినదే కాని తేలికచేసి త్రోసి పొరవేయవలసినది కాదని కనిఅభిప్రాయం. తల్లిస్టానం (ప్రత్యేకం కనుకనే సన్బ్యాసికూడా తల్లికి నమస్కరించాలి. ఇంకెవరికీ అవసరం లేదు.

తల్లిగా ఎంత (ప్రముఖురాలో ఇల్లాలుగానూ ఆంత మాననీయురాలు ఇంతి, 38వ పద్యంలో కులకాంతతో ఎన్నడూ కలహించవద్దన్నాడు. ఆమెను (ప్రేమతో లాలించాలి కాని బాధించి సాధించటం తగదన్నాడు.

ఆ పద్యంలోనే ఆమెకు వట్టి తప్పు ఘటియింపకుమీ అన్నాడు. ఆమెలో లేని దోషం ఉన్నదని ఆంటగట్టకు అన్నాడు. ఇదీ ముఖ్యంగా భావించిన హెచ్చరిక. చాలా సమంజసమైనదేకూడా.

తక్‌

70 సుమతి శతకము పర్వథా వ్యవహర్తవ్యం కుతోహ్యవచనీయతా, యథా ప్రీణాం తథా వాచాం పాధుత్వే దుర్హనో జనః - అతి దుర్దనఇతి నక్తన్యం - అన్నాడు భవభూతి. స్త్రీలు పవిత్రలు, శబ్దాలు దోషరహితాలు అనవలసిన సందర్భంలో మనుషులు దుష్టులు - ఆతిదుష్టులనాలి - అని దాని అర్థం. అనగా ఆలోచించకుండా ఇది అపశబ్దం, ఆమె సరయినది కాదు అని చట్టున అనేస్తారన్నమాట. కవి ప్రయోగించిన శబ్దాలు అపశబ్దాలన్నందువల్ల కావ్యంఖ్యాతి దెబ్బ తింటుంది. స్వయం నిర్ష్ణయశక్తిలేనివారు (గ్రంథం వ్రాసినవానికంటె తప్పన్నవాడు గొప్పవాడనుకొంటారు. (స్రీ సాధ్వి కాదు అన్నందువల్ల ఎన్నో అనర్థాలు ఆమెకూ ఆమెవారికీ సంభవిస్తాయి. కనుక లేనితప్పు అంటకట్టకు. స్త్రీ కంటనీరు పెట్టవలసిన పరిస్టితి ఏ యింట వస్తే ఆ యింట సంపద ఉండదన్నాడు. ఇలా ఈ పద్యంలో రెండు నీతులు చెప్పాడు. ఏ యింట ఇంతి కన్నీరు రాలుస్తుందో ఆ యింట లక్ష్మి ఉండదన్నాడు. అంతేకాదు 84వ పద్యంలో మగువ సిరికి 'పప్రాణమన్నాడు. 51వ పద్యంలో భార్యవిషయంలో మగవానిమనస్సులోని మరొక లోపం చెప్పాడు. ఎట్టి మనుజుడూ తన సతిఆందం మనస్సులో వర్షించడట. అనగా మెచ్చుకోడట. భార్య అందగత్తె అయినా ఆతనికి అలా అనిపించదట. పారుగింటిపుల్లకూర రుచి, పెరటిలోని కాకరకాయలు చేదు. తన భార్యఅందంగురించి ఇతరులఎదుట మెచ్చడంటే ఆది వేరు. కాని ఇక్కడ మనసున వర్షించడనే అన్నాడు. 57వ పద్యంలో తలమాసినా ఒళ్ళుమాసినా వలువలు మాసీనా కులకాంతలయినా ప్రాణ ప్రియువైనా అసహ్యించుకొంటారు అని చెప్పాడు. సామాన్యంగా భార్య భర్తని అసహ్యించుకోదనీ, ఇట్టి పరిస్టితులలో ఆసహ్యించుకొంటుందనీ చెప్పటంలో ఆమెసహనగుణమే తెలుస్తున్నది. ఈ మూడు విషయాలలోనూ పురుషులు (శ్రద్రపట్టాలన్న ఉపదేశమే [ప్రాధాన్యం వహిస్తున్నది. 70వ పద్యంలో తనపట్ల (ప్రేమగల భార్యవద్దకు వెళ్ళేటప్పుడు ఖాళీచేతులతో పోగూడదని చెప్పాడు. దీనిని బట్టి ఆమెమనస్సు సంతోషపెట్టటానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలని ఉపదేశించాడు. 71వ పద్యంలో కులకాంత పనులు చేసేవేళ దాసిలా, భర్తను సంతోషపెట్టేటప్పుడు అలంకరించుకొని రంభలా, ఏదైనా ఆలోచన చెప్పవలసినపుడు మంత్రిలా, భోజనంపెట్టేటప్పుడు తల్లిలా ఉండాలని, ఇల్టు బాగా నడవాలంటే ఇల్ఫాలెంత బరువు మోయవలసి ఉంటుందో వివరించాడు. ఇల్చాలిశ్రమ యెంతో ఎల్లరూ గుర్తించాలని చెప్పకుండా చెప్పాడు.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం గ్గ సంతోపపెట్టే సముయంలో రంభలా ఆలంకరించుకోవాలని ఇల్లాలికి ఉపదేశించినంత మెలకువతో రంభలా ఎప్పుడు కనిపిస్తుందో మగవానికి 52వ పద్యంలో వివరించాడు. తన వలచినయదియె రంభ అని. అంటే వలపు నిలుపుకొనటం ముఖ్యమని చెప్పాడన్నమాట. వలపుముఖ్యమే కాని నవరసభావరహితలయిన నాతుల వలపూ, నాతళులమీదివలపూ వృథా అని 33వ పద్యంలో చెప్పాడు. ఇది కవిఅభిరుచిని తెలియజేస్తుంది.

భార్యను యౌవనంలో ఉన్నదానిని పుట్టింటిలో ఆట్టే కాలం ఉంచితే చెడిపోయే అవకాశం ఉన్నదని 25వ పద్యంలో చెప్పాడు. ఇది వివాదాస్పదమైన అభిప్రాయమైనా, కారణం చెప్పకపోయినా, పుట్టింటిలో ఆట్టేకాలం ఉండటం మంచిది కాదన్న అభిప్రాయం చాలా కాలంనుంచి చాలా మందిలో ఉన్నదే. దీనిగురించిన చర్చ 25వ పద్యం వ్యాఖ్యానంలో చూడవచ్చు.

తన ముసలితనంలో వయసులో ఉన్న ఆమెను పెండ్లాడటం కీడన్నమాట 7వ పద్యంలో చెపుతున్నాడు. ఇది ఇద్దరికీ కీడే. ఈ శతకంలో స్త్రీ ప్రసక్తి తాలిసారిగావచ్చినదే ఈ పద్యంలో.

23వ పద్యంలో ఒల్లనిసతిని విడువ నొల్లనివాడు మూర్చుడన్నాడు. ఒకరిమీద ఒకరికి యిష్టంలేని నారీనరులు విడిచి పోవాలన్నది ఆధునికరీతి కావచ్చుగాని (ప్రాచినధర్మరీతి మాత్రం కాదు.

'స్రీవలన లభించేసౌఖ్యంగురించిన కవిఅభిప్రాయాలలో వైవిధ్యం కనిపిస్తుంది. 36వ పద్యంలో ఒక పురుషుడు అనుభవించిన వనితను మరొకడు కలియగోరటం చెరకుపిప్పిమీద చీమలు చేరటం వంటిదన్నాడు. ఇది వరశన్రీసాంగత్యనిరననం కావచ్చు. వేశ్యాసాంగత్యదూషణం కావచ్చు, (భ్రష్ట అయిన స్వకాంతావిషయమూ కావచ్చు.

కశీవ పద్యంలో రమణిపొందెరుగని ఒడలు తుచ్చమన్నాడు. ఇది సౌఖ్యాలలో స్ర్రీసాఖ్యం ఉత్తమమైనదని చెప్పటం.

75వ పద్యంలో మనస్సులో మరొకపురుషునిపై మక్కువ కల మగువను విడువమని చెపుతున్నాడు. 238వ పద్యంలో చెప్పినది తనపై ఇష్టంలేనిదానివిషయం. ఇక్కడ చెపుతున్నది తనపై ఇష్టం ఉన్నదా లేదా అన్నదానితో నిమిత్తంలేకుండా ఇతరుని కాంక్షించే ఆమెను విడువమని,

76వ పద్యంలో ఒరు గదిసినసతిని కలువకు అని నిషేధిస్తున్నాడు. 36వ పద్యంలో అట్టిస్త్రీని కలియటం ఎట్టిదో చెప్పటంద్వారా నిషేధిస్తే ఇక్కడ సూటిగా కూడదు అన్నాడు.

స్రీవలనిసౌఖ్యం ఎంత ఆకర్షకమైనా, తఆచుగ సతిని కలియనద్దని చెపుతున్నాడు. తరచు కలయికవల్ల సౌఖ్యరుచీ ఆరోగ్యమూ పోతాయని అందరూ చెపుతున్నదే. ఈ

36

ళ్గాల్లై సుమతి శతకము (ప్రత్యక్షప్రమాణానికి తోడు, ప్రాచీనశాస్తాలలో చెప్పినవిషయం, అమావాస్యవంటి పర్వాలలో (ప్రీ సాంగత్యం నిషిద్దమంటున్నాడు 77వ పద్యంలో.

78వ పద్యంలో ప్రణయకోపం తీరినతరువాత ఆ పడతితో పొందు విశేషసాఖ్యదాయకమని చెపుతున్నాడు.

79వ పద్యంలో పురుషునికలయిక పొందేటప్పుడు, ఆ కలయికవలనిసౌఖ్యం అనుభవిస్తున్నట్లు తెలియని అతివ పొందు, ఏటికెదురీదటంవంటిదన్నాడు.

కూటము అంటే సభ అని అర్ధం చెప్పినపక్షంలో, సభవారికి అనగా సమాజానికి తెలియనికోమలి అనగా తనకు భార్య ఐనది అని తెలియనికోమలిపొందు నిషేధించాడు. అనగా ఆందరూ ఆమోదించేరీతిని వివాహం చేసుకొని కాక, తమకిద్దరికీ మాత్రమే తెలిసేరీతిని, ఏ గాంధర్వవివాహంవల్లనో వధూవరులమైనామని పొందే పొందు, శకుంతలావిషయంలోలా కష్టమే తెచ్చిపెడుతుందని అభిప్రాయం కావచ్చు.

81వ పద్యంలో మనసు కలియని సతి పొందు చేయవద్దన్నాడు. 75వ పద్యంలో మనసుమరొకనిపై కల మగువను విడువుమని చెపితే, అట్టిఆమెను కాంక్షించవద్దనటానికి కారణం చెపుతున్నాడు 92న పద్యంలో. పంజరంలోని చిలుక చెప్పినచదువు మళ్ళీ చదువుతుంది. అలాగే ఒకతెను ఒకడు వలచితే ఆమెకూడా అతనిపై వలపు చూపించవచ్చు. కొని ఆ చిలుకను పిల్లి పట్టినపుడు అది చెప్పినచదువు చదువదు. అలాగే, ఈమెమనసు మరొకనికి చిక్కిఉన్నకారణంచేత, ఈ రెండవవానివలపునకు ఈమె బదులువలపు చూపించలేదు అని కారణం చెపుతున్నాడు. ఇది చెప్పిననీతినే మళ్ళీ చెప్పటమైనా, రెండవదానిలో విశేషమున్నది కనుక వ్యర్థమనుకోనక్కరలేదు.

23వ పద్యంలో ఒల్లనిసతిని విడువనొల్లనివాడు మూర్చుడని చెప్పినవాడు, 101వ పద్యంలో అందుకు కారణము చెపుతున్నాడు. ఆమెలో వలపులేనపుడు బలవంతంగా అనుభవించినందువల్ల సౌఖ్యం కలుగదు కనుక అని. సానమీద నీళ్ళు చల్లకుండా గంధం తీయబోతే ఎలా రాదో, అలాగే వలపులేని వనిత పొందువల్ల సౌఖ్యం కలుగదు అని చెపుతున్నాడు,

32వ పద్యంలో పస గల యువతినే పొందాలనీ, పసిబాలలపొందు తగదనీ రెండు హెచ్చరికలు చేశాడు.

క5శీవ పద్యంలో రమణిపొందును కౌగిలికి (ప్రాధాన్యమిచ్చి ప్రశంసిస్తే 103వ పద్యంలో అధరామృతపానానికి (ప్రాధాన్యమిచ్చి అట్టిదిచేయనినోరు బూడిదకిరవైన పాడుబొంద- గుంట అన్నాడు.

23న 101వ పద్యాలలో చెప్పిన విషయమే భంగ్యంతరంతో 107వ పద్యంలో అభిలాషలేనికూటమి చప్పన అని చెపుతున్నాడు.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 73 సామాజికసువ్యవస్థ కాంక్షించిన ఈకవి, పరనారీసాంగత్యం నిరసించాడు. 72వ పద్యంలో పరనారీసోదరుడైనవాడు పరముడు అని చెప్పాడు. 73వ పద్యంలో పరసతికూటమి కోరకు అని నిషేధించాడు. 74వ పద్యంలో పరసతులతో అధికముగా మాటాడితే భీష్మునికైనా నింద వస్తుందన్నాడు. మాలో దోషం లేదుకదా అని లాభంలేదు. పరపురుషులతో కలసిమెలసి తిరిగితే, సౌశీల్యం కల ఆమెకయినా నిందవస్తుంది కనుక, లోకాన్నిబట్టి పోవాలన్నాడు. ఇరువురివైపునుంచీ విడిగా రెండు నీతులు చెప్పినట్టయింది. పరకాంతలతో మాటాడవద్దని చెప్పినవాడు, అంతతో ఆగక, అంతఃపురకాంతలతో మంతనములు నూనుము అని ప్రత్యేకించి నిషేధించాడు క5వ పద్యంలో. కారణం స్పష్టమే. ఇతరపరకాంతలతో అయితే నిందతో ఆగుతుంది. అంతురకాంతలతో అయితే తల తెగిపోతుంది. పరకాంతలు కాక, సామాజికంగా సామాన్యకాంతలయినా, వేశ్య్వలకూటమి తగదని వివిధరీతులలో చెప్పాడు : 10వ పద్యంలో గర్భవతి అయిన వేళ్యకూటమి రోత అన్నాడు. అనగా గర్భవతి కానిఆమె తగునని కాదు. ఈ స్థితి మరీ రోత అని. ఆ స్థితిలోకూడా ఆమె అలా సంసాదించవలసిఉండటం మరీ రోత అని. 41వ పద్యంలో వారకాంత మిక్కిలి రొక్కములియ్యక చిక్కదురా అని హెచ్చరించాడు. అది ఆమెవృత్తి అయోగ్యమైనది కావచ్చుగాక, ఆమె ధనంకోసం ఆ పనిచేస్తున్నది. ఆ విషయం బాహాటంగా ప్రకటమైనదే కాని, రహస్యం కాదు. ధనమీయనిదే రాదనటమేమిటి? ఉచితంగా రావాలని ఎందుకనుకోవాలో! అన్నం అమ్మటంకోసం పూటకూటిల్టు పెట్టిన వానిని ఉచితంగా భోజనం పెట్టడు అనటంలాంటిదే ఇదీ, ఆమె డబ్బుకోసం ఆ వృత్తి స్ప్వీకరించినమనిషి, ప్రేమమనిషి అనుకొని సంబంధం పెట్టుకోకు అని హెచ్చరించటం కొవాలి. 56వ పద్యంలో ఎంత ధనమిచ్చినా సత్యానికి వెలయాలు కట్టువడి ఉండదు అని హెచ్చరించాడు. నెత్తిమీద చేయి వేసి ప్రమాణం చేసి, ఆమె తనను నమ్మమని ప్రమాణం చేసినా, నమ్మి ఉండవద్దు అన్నాడు. 63వ పద్యంలో వెలయాలిని నమ్మవద్దన్నాడు. 85వ పద్యంలో అస౦భవాలు అద్భుతకృత్యాలు అపూర్వత్యాగాలు చేసి, ఎంత ధనమిచ్చినా, వెలయాలి స్నేహం నత్యస్నేహం కాదన్నాడు. ఆమె ఉన్నదే సొమ్ముకోసమన్నపుడు తదితరం అపేక్షించటమే కూడనిది. 3

లెడు సుమతి శతకము 104వ పద్యంలో ఈ విషయమే మళ్ళీ చెప్పి ఆమెకు స్నేహం ఉండదు, ఉన్నా చివరివరకూ ఉండదు అని చెప్పి దృష్టాంతం ఇచ్చాడు, నలుగురూ నడిచేదారిలో గడ్డి మొలవదు, మొలిచినా పెరగదు అని. 105వ పద్యంలో మళ్ళీ ఒకటేమాట, వెలయాలు సేయుబాసలు నమ్మరాదు అని, 56వ పద్యంలో చెప్పినదే మళ్ళీ చెప్పాడు. 106వ పద్యంలో కాసులు గలవాడె రాజుగదరా అని బహు(ప్రసిద్దిలోనికి వచ్చిన నీతి చెపుతూ, అతడు దాసికొడుకైనా అని ఒకమాట అన్నాడు. దాసి అంటే వెలకుకొన్న పనికత్త, బానిస అన్నమాట. అదలా ఉండగా, ఎన్ని విధాల ఒకడు అల్పుడయినా సొమ్ము సంపాదిస్తే పరిపాలకుడు కాగలడని చెప్పదలచాడు. అలాగే వితంతువుల పెత్తనంపట్లకూడా ఈయనకు సద్భావం లేదు. ఇంటిలో, ఆమె తీర్చరి అయితే, మరణాంతకమవుతుందంటాడు 65వ పద్యంలో. దురదృష్టవశాత్తూ భర్త గతించిన స్తితిలో తెలివితో సమర్ధతతో ఇల్లు చక్కగా తీర్చిదిద్దిన వితంతువులెందరో ఉన్నారు. స్తీలవేషంగురించికూడా ఈయన చెప్పక మానలేదు, 37వపద్యంలో రవికలేని లేమ వృథా అన్నాడు. ఇది రుచిభేదమే. ఇప్పటికీ కలిమి ఉన్నా రవికలుపయోగించని రమణీమణులు లక్షలకొలదిగా ఉన్నారు చాలా ప్రాంతాలలో. 68వ పద్యంలో చీరయె శృంగారమన్నాడు. శ8ివ పద్యంలో నాతికి మానంబు తొడవు అని, అదే నిజముయిన అలంకారమన్నాడు, అభరణమన్నాడు. బోటికి మానము (ప్రాణమని 938వ పద్యంలో చెప్పాడు. ఆ తరువాతిపద్యంలోనే మానఘనుడు హీనుని ఆ(శ్రయించగూడదన్నాడు. 68వ పద్యంలో నారియె నరులకు రత్నము అని ప్రశంసించాడు. అంతేకాదు, 110వ పద్యంలో సస్త్రీలవద్ద (స్త్రీలతో వాదించకు. స్త్రీల విషయంలో అపవాదులు పలుకకు అని హెచ్చరించాడు. వారితో మృదువుగా ఉండాలి గాని ఖండితంగా కాదనీ, వారివిషయంలో నోటికి వచ్చినట్టు మాటాడవద్దనీ, శతకంచివర స్త్రీవిషయమై ఉత్తమమైన హెచ్చరిక చేయటం బాగున్నది. కాని, మొత్తంమీద చూస్తే, ప్రీలవిషయమై మరికాస్త సంయమంతో చెప్పి ఉండవలసింది అనిపించకమానదు : 8వ పద్యంలోనే కోమలినిజం భూమిమీద లేనివస్తువులపట్టికలో చేర్చాడు. ఇది ఆదినుంచీ వస్తున్నదే. ఇలాగే, 35న పద్యంలో సతులలో వలపు లేశమూ లేదు సుమా అని హెచ్చరించాడు. 43వ పద్యంలో భామలవలపు బొంకు అన్నాడు. ఇదే అభిప్రాయం కర్‌వ పద్యంలో ఇంతులు వలతురని మదిలో ఎంతయు నమ్మకు అని ఖండింతంగా మళ్ళీ చెప్పాడు.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 75 అంతే కాదు, ఆమె వట్టి డబ్బుమనిషి సంపాదిస్తున్స్నంతకాలం అడుగులకు మడుగులొత్తుతుంది, సంపాదన పోగానే జీవచ్చవం వస్తోందని భర్తను ఈసడిస్తుంది అని 4త్తవ పద్యంలో చెప్పాడు. శ5వ పద్యంలో కోమలికి విశ్వాసం బొంకు అని తేల్చి పారవేశాడు. కనుక, మహిలో మగువకు మనసియ్యవలదు అని సిద్దాంతం చేశాడు 69వ పద్యంలో. కొందరినిబట్టి అందరూ అట్టివాళ్ళే అనటం న్యాయమా? ఆవ : అనేకులకు ఒకతెలో నంబంధం ఆయోగ్యమనబోతున్హాడు : క కాముకుండు దనిసి విడిచిన కోమలి. బరవిటుండు గవయంోరుట యెబ్లన్‌ ట్రేమమున జెజకు పిప్పికీ6 జీవులు వెస మూంగినట్లు సిద్దము సుమతీ, 36 ప్ర: సుమతీ, కాముకుడు = ్రీపురుషులకలయికపై కోరిక కలవాడు, తనిసీ = తృష్తి చెంది, విడిచిన = వదలిపెట్టిన, కోమలిన్‌ = వనితను, పరవిటుడు = ఇతరజారుడు, ప్రేమమునన్‌ = (ప్రేమతో, కవయంగోరుట = కవయన్‌+కోరుట = కలియగోరటం, ఎల్లన్‌ = అంతా, చెజుకు పిప్పికిన్‌ = రసం తీసివేయగా మిగిలిన చెరకు తుక్కుకోసం, చీమలు = పిపీలికలు, వెసన్‌ = ఆసక్తితో, వేగంతో, మూ(గినట్టు = ్రోగైన విధంగా ఉంటుంది, సిద్ధము = ఇది నిరూపించబడిన సంగతి. తా : సుమతీ, కాంతతో కలయిక కావలె ననుకొనువాడు అనుభవించి, తృప్తి చెంది వదలిన వనితను, మరొకడు (ప్రేమతో పొందాలనుకొనటం, చెజకుగడ నుంచి రసం తీసి పారవైచిన పిప్పికోసం చీమలు ్రోగవటంవంటిది. వ్యా : చెజకురసం కావాలనుకొంటే చెజకుగడ తినాలి. ఒకరు తినిసడవేసిన పిప్పిని చూచి, రసం ఉన్నదనుకొని చీమలూ ఈగలూ దానిమీద ద్రాలుతుంటాయి. అలాగే (స్రీవలనిసౌఖ్యం కావాలను కొన్నవాడు ఉత్తమురాలైన స్త్రీని వివాహం చేసుకొని సుఖపడాలి. అంతే కాని, ఒకరు అనుభవించి విడిచిన ఆమెను తాను పొందాలనుకొనటం హేయమైనది. ఇది వారవనితను దృష్టిలో పెట్టుకొని చెప్పినది కావచ్చు, దు(ష్ప్రవృత్తికల స్త్రీని ఉద్దేశించి చెప్పినదీ కావచ్చు. అవ : వీవి లేకపోతే ఏవి వృఠాయో చెవ్పుబోతున్నాడు : క. _కారణములేని నగవును బేరణమునులేని లేము పృథివీస్థలిలో6 బూరణములేని బూరెయు వీరణములులేని పెండ్లి వృథరా సుమతీ. 37 తికి

76 సుమతి శతకము

ప్ర: సుమతీ, పృథివీస్టలిలోన్‌ = భూప్రదేశంలో అనగా భూలోకంలో, కారణములేని = హేతువు ఉండని, నగవును = నవ్వూ, పేరణమును = రవిక (అయినా) లేని, లేమ = స్తీ పూరణములేని = కుడుములు మొదలైన పిండివంటలలోపలపెట్టే బెల్లంవేసి నూరిన పప్పుముద్ద మొదలైనదిలేని, బూరెయున్‌ = ఆ పేరుగల పిండివంటా, వీరణములు = డంగురములు అనే ఒకరకమైన చర్మవాద్యాలు, లేని, పెండ్లి = వివాహం, వృధరా = నిష్ప్రయోజనములయ్యా.

తా : సుమతీ, భూలోకంలో నిష్కారణంగా నవ్వటం వృథా. రవిక (అయినా) లేని రమణి వృథా. పూరణంలేని బూరె వృథా. వీరణములులేని పెండ్లి వృథా.

వ్యా : నవ్వు చాలా ముఖ్యమైనది, నరులకుమాత్రమే చేతనైనది. నవ్వుతూ మాటాడితే విముఖులుగా ఉన్నవారుకూడా సుముఖులవుతారు. అయితే ఆ నవ్వు సందర్భోచితంగా ఉండాలి. వందమాటలు చెప్పలేని భావాన్ని ఒక్క నవ్వు వెల్లడించవచ్చు. రకరకాల నవ్వులను వర్షించటంలో తిక్కనగారు నేర్పరి అని విశ్చనాథ సత్యనారాయణగారు సోదాహరణంగా వివరించారు. మొలకనవ్వు వాడినవ్వు వేడినవ్వు ఎ(ర్రనవ్వు - ఇలా. ఇంత విలువయిన నవ్వు నవ్వటానికి తగిన కారణం ఉండాలి. లేకపోతే అది వెర్రి నవ్వు అవుతుంది. దానిని సరిగా ఉపయోగించకపోతే అనేకమైన చిక్కులుకూడా రావచ్చు. లక్ష్మణదేవరనవ్వు ప్రసిద్దమైనదే. నవ్వు వాలుగందాల చేటన్నది శాస్తం.

రవికలేని రమణి వృథా అనటంలో కవిభావం కాస్త తరచిచూస్తే గాని దొరకటం కష్టం. రవిక రమణి తప్పక తొడుగుకోవాలి అనే అభిప్రాయంతో చెప్పాడనుకోవచ్చు.

పసుపుం గుంకును కజ్జలంబు మమకూర్చాపంబు తాంబూలమున్‌

కుసుమంబుల్‌ కబరీభరంబు చెవియాకుల్‌ ముంగళాలంకృతుల్‌

విమవొక్కింతయులేక తాల్పనలయున్‌ నీని నృదాకాలమున్‌

పసి చక్కంగం బ్రియుండు వర్దిలుటకై నాళికస్రొక్షికిన్‌ - అని కాశీఖండం (2.73) చెపుతున్నది, కనుక భర్త బాగుండటానికి భార్య రవికతొడుక్కొనటం అవసరమని అలా తొడుక్కొననిది వృథా అంటే తనప్రాణం కోరుకొననిదానివల్ల భర్తకు (ప్రయోజనం లేదు అని చెపుతున్నాడు అనవచ్చు.

ఈ అర్థంలో 'పేరణమును అన్నప్పటి 'ను' కేవలం అలంకారంగా కనిపించవచ్చు. ఉంటే 'యు లేమ తరవాత ఉండాలి కాని ఇక్కడెందుకు? అంటే, దానివల్ల పసుపు, కుంకుమ, కాటుక మొదలయినవాటిని (గ్రహించవచ్చు అని చెప్పవచ్చు. ఆయినా వృథా అన్నదానికి అర్ధం కొంచెం దూరాన్నయంగానే కనిపించవచ్చు.

కనుక మరొక అర్థం భావించవచ్చు. స్త్రీలకు అలంకారాలు నాలుగు విధాలు, ఒకటి: కట్టుకొనేవి, వస్త్రాలు, రెండు: పెట్టుకొనేవి, నగలు, మూడు: ముడుచుకొనేవి, పువ్వులు, నాలుగు: పూసుకొనేవి, గంధం మొదలైనవి. ఇవి చిన్నప్పుడు సమకూర్చటం తం డ్రిబాధ్యత,

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 77 పెండ్లి అయిన తర్వాత భర్తబాధ్యత. ఇవి అన్నీ సౌభాగ్యచిహ్ష్హోలుగా మనవారు పేర్కొన్నారు. కనుక ఎంత నిష్టదరి[ద్రులయినా కనీసం ఒడలినిండా బట్టా, కాళ్ళకూ, (వ్రేళ్ళకూ, చేతులకూ, చెవులకూ, ముక్కుకూ బంగారపువో వెండినో తమ తాహతును బట్టి ఏవో నగలూ, మంచిగంధమూ, కాటుకా, పువ్వులూ బిడ్డకూ భార్యకూ సమకూరుస్తారు. మిగిలినవి విలాసొలలోకి జమచేసినా, రవికను పేర్కొనటాన్నిబట్టి చీరెనూ (గ్రహించి, కట్టుకొనటానికి నిండయిన వస్తాన్నయినా పెట్టలేనివానికి రమణి వృథా,ఆంటే అంత అసమర్హుడు భార్యను కట్టుకొని ఏమి సుఖపడగలడు? ఏమి సుఖపెట్టగలడు? కనుక వాడు సెండ్దాడటం వృథా అని భావం. ఈ మాటకు అర్ధం పెండ్లిచేసుకోవద్దని కాదు. కనీసం ఆమాత్రం అయినా ఆర్జించి పెట్టే సామర్ధ్యం సంపాదించాలి అని కవి అభిప్రాయమనవచ్చు.

పూరణములేని బూరె వృథా ఆంటే కవిగారు బూరెల వంట బాగా గమనించినవాడనాలి. శ్రీనాథుడు వండగా( దిన్న బూరెలవరున దోప అన్నాడు. పూరణంబూరెలు వండేవి వండుతుంటే, తినేవారు (ప్రక్కనుండి తింటుంటే మిగలవు. పూరణం తయారుచేయటం కొంచెం శ్రమ. పూరణంబూరెలు సరిగా రావాలంటే వంట బాగా తెలిసి ఉండాలి. కనుక, కొన్ని సందర్భాలలో వేగంగా దేవునికి నైవేద్యం పెట్టాలంటే, గబగబా పూరణంలేకుండా వట్టి చోవి (= మినపపిండీ వరి మొరుమూ కలిపిన పలుచనిపిండి)తోనే పిండి బూరెలు వండుతారు. అవీ చూడటానికి బూరెలలానే ఉంటాయి కాని, ఆ రుచి ఉండక, చప్పగా ఉంటాయి. వాటిని పొంగడంబూరెలు, వట్టిబూరెలు ఆంటారు. అవి మైక్కుబడి బూరెలే కాని, మక్కువతో మెక్కటానికి పనికివచ్చేవి కావు. కనుక చెల్లవు, అందువల్ల అవి వృథా అంటున్నాడు.

వీరణం అన్నది దేశీయమైన చర్మవాద్యం, చూడటానికి మద్దెలలా ఉంటుంది. దానికంటె కొంచెం లావుగానూ, రెండువైపులా వాయించే చోట్లకూడా దానికిలా సన్నగా ఉండక విశాలంగానూ, పొడవు కొంచెం తక్కువగానూ ఉంటుంది. ఒక వైపున పలచటిబద్దతో ఎగువనుంచి దిగువకూ దిగువనుంచి ఎగువకూ గీస్తూ ఉంటారు. ఎడతెగని ధ్వనివస్తూ ఉంటుంది. రెండవ వైపున ఒక కట్టెముక్కతో కొడుతుంటారు. దీనితో తొషా, మరపా రాండోలూ కలిపితే, రాండోలుమేళం అంటారు. ఇవన్నీ పెట్టుకోలేని వాళ్ళు ఒక వీరణం, ఒక (శుతిబూరా - ఒక సన్నాయిలాంటి బూరా, ఇవి మూడూ కలిపి బక్క పెళ్ళిళ్ళకు పెట్టుకుంటారు. ఇవీ - ఈ బాబాలూ పెట్టుకోలేని పెళ్ళి అంటే, అసలు మంగళవాద్యాలు లేని పెళ్ళి అన్నమాట. అది ఏమి వేడుకగా ఉంటుంది? కనుక వృథా అంటూ ఉండాలి. అదీకాక, ఇతర వాద్యాలెన్ని ఉన్నా, వీరణాలధ్వని (ప్రత్యేకత దానిదే కనుకు వీరణాలు లేనిపెండ్లి వృథా అంటున్నాడు అనీ చెప్పవచ్చు.

తం

గ్ర సుమతి శతకము ఈ పద్యంలో కారణము పేరణము పూరణము -_ ఇవి మూడూ ఏకవచనంలో చెప్పి వీరణములు అని నాలుగవది బహువచనంలో చెప్పాడు. ఇది కావ్యదోషంలోకి వస్తుంది. కనుక వీరణములు అన్నది లేఖకదోషంవల్ద వచ్చిందేమో, వీరణమును అన్నపాఠం కవి చెప్పినదేమో అనిపిస్తుంది. అపుడు వీరణంకూడా అంటే, వీరణమైనా లేనిపెండ్లి అనే ఆర్థం వచ్చి, స్వారస్యం అధికంగా ఉంటుంది. 'పేరణము, పూరణము పదాలకు సూని. ఈ పద్యాన్న ఉదాహరించింది. అవ : భార్యను దుఃఖపెడితే దారిద్ర్యం వస్తుందని చెప్పుబోతున్లాడు = క కులకాంతతోడ నెప్పుడు! గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ కలకంఠకంళికన్నీ రొలికివ సిరి యింటనుండ నొల్లదు సుమతీ. 38 శ్ర : సుమతి, కులకాంతతోడన్‌ = భార్యతో, ఎప్పుడున్‌ = ఏనాడూ, కలహింపకు = జగడగా డవద్దు, వట్టితవ్పు = లేనిదోషం, ఘటియింపకుమీ = అంటగట్టకుసుమా, కలకంఠకంఠి = (ప్రీయొక్క, కన్నీరు = కన్ను+నీరు = కన్నీళ్ళు, ఒలికినన్‌ = రాలినపక్షంలో, ఇంటన్‌ = ఆగ్భహంలో, సిరి = లక్ష్మీదేవి సంపద, ఉండనాల్లదు = ఉండన్‌+ఒల్లదు = నివసించటానికి ఇష్టపడదు. తా : సుమతీ, భార్యతో ఏనాడూ జగడమాడవద్దు, ఆమెలో లేని దోషం ఉన్నదని ఎన్నడూ ఆరోపించనద్దు. ఏ యింటిలో (ప్రీ దుఃఖంతో కన్నీరు కార్బవలసివస్తుందో ఆ యింటిలో సంపద ఉండదు. వ్యా : మానవజీవితం సుఖమయంగా గడవటానికి (ప్రధానమైన రెండు సూత్రాలూ ఈ పద్యంలో చెపుతున్నాడు. వాటిలో మొదటిది భార్యతో ఎన్నడూ కలహించవద్దు అన్నది. స్వభావాలలో తేడా లుండవచ్చు. స్వభావం తెలిసి, సర్దుకొని పోవటమన్నది లేనివారి సహజీవనంలో, సౌఖ్యం ఉండదు. కలిసిఉండక తప్పనివారు, ఒకరు మరొకరిస్వభావం తెలుసుకొని, ఘర్షణకు అవకాళం ఇవ్వకుండా ఉండాలి అనే దృథనిశ్చయంతో ప్రవర్తిస్తే కలహం రాదు. ఆ దృష్టితో మెలగటం నేర్వాలి. ఎదుటి వారిదీ తన స్వభావమే, తన ఆలోచనే, తన గుణమే, తన సంస్కారమే, తన సంప్రదాయమే అయితే, ఓరిమి అవసరమే ఉండదు. ఈ అయిదూ తనవాటికి విరుద్దం కాకపోయినా, కొంత తేడా ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు విరుద్రమూ కావచ్చు. మనకు ముఖ్యమయిన ('ప్రయోజనమున్నపరాయివారు ఇట్టివారయితే, ఆ ప్రయోజనానికి భంగం రాకుండా ఉండటానికి, వారితో ఎంత మెలకువతో ప్రవర్తించి మనప్రయోజనం సాధించుకుంటామో,

వివేకానందినీ వ్యాఖ్యాసహితం ౯79 ఎంత ఓపిక పడతామో ఆలోచించుకొంటే, మిక్కిలి దగ్గరివారితో అలా ఎందుకుండగూడదు అనిపించితీరుతుంది. అపుడు కలహం రాదు. అయినా వైరుధ్యంవల్ల ఘర్షణవస్తుందీ, ఓపిక పట్టాలి. తన మాట వినితీరాలి, కాదనకూడదు అనే భావం కలహానికి మూలం. ఎదుటివారిది మూర్జత్వం, నష్టదాయకమైన మంకుతనం కావచ్చు. అయినా కలహం పరిష్కారం కాదు. కలహంద్వారా పరిష్కరించుకోదలిస్తే సమస్య మరింత జటిలమవుతుంది. ఇరువురిలోనూ పట్టుదలా కలహస్వభావమూ పెరిగిపోయి, శాంతిసౌఖ్యాలు కొంపలో నిలవవు. కలహంలో మగవానిది పైచేయి కావచ్చు అనేకకారణాలవల్ల. అపుడు తలవంచవలసివచ్చినవారు దుఃఖపడతారు. కలహంవల్ల గెలవాలనే కోరిక ప్రబలుతుంది. గెలుపు ముఖ్యమయినపుడు ముందు పోయేది యుక్తాయుక్తజ్ఞానం. దానితో ఎదుటివారిలో లేనిదోషం ఉన్నట్టు కనిపిస్తుంది. అది ఆరోపించి, లొంగదీసుకొని, గెలిచే ప్రయత్నం చేస్తాడు. లేనిదోషం ఆరోపించటం మరీ ఘోరం, మరీ దుఃఖకారణం. ఆర్హిక-సామాజిక- విద్యా-జ్ఞాన-కారణాలు అనేకంవల్ల, ఆరోపణకు గురి అయిననారి ఏమీ చేయలేక పోవచ్చు. ఇందువల్ల ఆమె మరీ దుఃఖితురాలవుతుంది. తాను ఆనందంతో ఉండి, భర్తను ఆనందపెట్టవలసిన కాంత, దుఃఖితురాలై, పరిణామంగా మనస్సు ద్వేషపూరితంకూడా అయితే, ఆ యింట్లో ఒకరు అవునన్నది మరొకరుకాదనటం అనే నిరంతర-ప్రచ్చన్నకారణ- 'ప్రత్యక్షకలహం కొనసాగుతూనే ఉంటుంది. ఫలం చిత్తశాంతి కొరవడుతుంది. అది ఉంటేనే కాని, చేసిన పని ముందుకు వెళ్ళదు. వెడితేనే కాని ఆర్థికఫలం ఉండదు. కనుక పెట్టుబడీ తిరిగిరాదు, లాభం రాకపోవటం సరేసరి. కనుక్క 'ప్రీకన్నీరొలికినయింట్లో లక్ష్మి నిలవదు అని చెప్పటం. (ప్రచ్చన్నప్రతిఘటన ఉండదనుకొన్నా, దుఃఖంవల్ల ఇల్టాలు నిరుత్సాహపూరితురాలయితే, ఆ నిరుత్సాహం భర్తకూ సం క్రమించీ లక్ష్మిని నిలవనీయదు. కలకంఠం అంటే కోకిల. అవ్యక్తమథురస్వరం కలది అని ఆర్ధం. దానిస్వరంవంటి స్వరంకలది కలకంఠకంరి. కంరం మధురంగా ఎప్పుడుంటుంది? సంతోషంగా ఉన్నపుడు. సంతోషం ఎప్పుడుంటుంది? ప్రేమ ఉన్నపుడు. అట్టి ఆమెకు కన్నీరు వచ్చిందంటే, అవన్నీ పోవటానికి దారి ఏర్పడిందన్నమాట. అవ (వేమ లేకపోవటం ఉండటం తప్పొప్తులకు కారణమనబోతున్నాడు =: క్ష కూరిమి గల దినములలో వేరము లెన్నడును గలుగనేరవు మణీ యా కూరిమి విరసంబైనను వేరములే తోంచుచుండు నిక్కము సుమతి. 39 శ0

80 సుమతి శతకము

(ప్ర: సుమతీ, కూరిమి = స్నేహం, (ప్రేమ, కల దినములలో = ఉన్ననాళ్ళలో, నేరములు = ఆపరాధాలు, ఎన్నండును = ఏ+నాండును = ఎన్నాండును = ఎన్నండును = ఏదినమునా, ఎప్పుడూ, కలుగనేరవు = కలుగన్‌+నేరవు = సంభవింపజాలవు, మథి = తరువాత, ఆ కూరిమి = ఇదివరకటి స్నేహం, (ప్రేమ, విరసంబు = ద్వేషం, ఐనను = ఐనపక్షంలో, నేరములే = నేరములు+ఏ = ఆపరాధాలే, తోంచయుచుండున్‌ = తోంయచున్‌+ ఉండున్‌ = కనిపిస్తుంటాయి. నిక్కము = నిజం.

తా వ సుమతీ, ఇరువురిమధ్య స్నేహం, ప్రేమ కల రోజులలో, ఒకరికి మరాకరిలో అఆపరాధాలేమీ కనిపించవు, కాని ఆ స్నేహం, ప్రేమ ఏ కారణంవల్లనైనా ద్వేషంగా మారితేమాత్రం, వారిలో ఆపరాధాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇది నిజం.

వ్యా : మానవునినైజం ఈపద్యంలో గొప్పగా వివరించాడు. ఇద్దరిమనుష్యుల మధ్య బాగా స్నేహం, ప్రేమ ఉన్నకాలంలో వారిలో ఏవైనా అపరాధాలున్నప్పటికీ ఆవి కనపడనే కనపడవు. పైగా అన్నీ.మంచిగానే కనిపిస్తాయి. ఏ కారణంవల్ల నైనా ఆ స్నేహం (ప్రేమ కాస్తా ద్వేషంగా మారిపోతేమాత్రం అన్నీ దోషాలుగానే కనిపిస్తాయన్నది ముమ్మాటికీ సత్యం, కనుక స్నేహం, ప్రేమ ఉన్నదా లేదా అన్నది ముఖ్యం, కనుక మనుష్యులమధ్య స్నేహం, (ప్రేమ చెడిపోనకుండా రక్షించుకోవాలంటున్నాడు. స్నేహమూ, (ప్రేమా సంపాదించుకొనటం సులభం. దానిని కాపాడుకొనటమే కష్టం. అపకారం అపకారమే, ఉపకారం ఉపకారమే, (ప్రేమ ఉన్నదికదా అని చేసిన అపకారం ఉపకారమెలా అవుతుంది? ఆపకారితో స్నేహం, డ్రేమ కొనసాగించటం ఎలా సాధ్యం? అన్న ప్రశ్న రావచ్చు. అపకారిపట్లనైనా ఎలా ప్రవర్తించాలో 'ఉపకారికి' అనిన 16వ పద్యంలో చెప్పాడు. అయినా దూరం కాక తప్పనిసరి అయిన పరిస్థితి వస్తే చేయగలది లేదు. కాని, కూరిమికి కల శక్తి గమనించి, దాని కోసమే పాటుపడాలన్నది కవిఅభిప్రాయం. దీనికి పోషకమైన ఒక అద్భుత శ్లోకం కర్త ఎవరో తెలియవలసినదొకటి ఉన్నది.

యదేవ రోచతే ముహ్యం చశదేన కురుతే ప్రియా!

ఇతి వేత్తి న జానాతి తత్చియం యత్కరోతి సా ॥

సీత (క్రొత్తగా కాఫురావికి వచ్చినసమయంలో రాముడు అనుకొనేవాడట - నాకేది ఇష్టమో అదేనా ప్రియ చేస్తున్నది అని. అంతే కాని, ఆనిడ ఏది చేస్తే అదే తనకు (ప్రియమవుతున్నదని ఆయనకు తెలియదట. ఆయనకు ఆమెపై ఉన్న కూరిమి కారణంగా, ఆమె చేసే ప్రతిదీ ఆయనకు ప్రియమైనదిగా కనిపిస్తున్నదని, ఆయనకుకూడా తెలియదనటంలో, ప్రేమ దానికి మూలమన్నది స్పష్టంగా తెలుస్తున్నది.

సూనని.కూరిమికి ప్రేమ - స్నేహ-వాత్సల్యార్థాలు చెపుతూ ఈ పద్యమే ఉదాహరించింది.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 81 అవ : నీచజనసాంగత్యం వద్దని చెప్పుబోతున్నాడు = క క్రాంచెవునరుసంగతిచే నంచితముగ గీడు వచ్చు వది యెట్లన్నన్‌ గించిత్తు నల్లి కుట్టిన మంచమునకుః బెట్టు వచ్చు మహిలో సుమతీ. శ0 ఫ్ర : సుమతీ, కొంచెపు నరు = కొాంచెము+నరు = తల్పుడైన నరునియొక్క, సంగతిచేన్‌ = సొంగత్యంచేత, అంచితముగన్‌ = అంచితము+కన్‌ = వంకరగా, అనగా తనయోగ్యతకు విరుద్దంగా: కీడు = ఆపద, వచ్చున్‌ = వస్తుంది. ఆది = ఆ శ్రీడు రావటం, ఎట్టన్నన్‌ = ఎట్టు+అన్నన్‌ = ఎలా అంటే, మహిలోన్‌ = భూలోకంలో, కించిత్తు = కొంచెం, నల్లి = మత్కుణం, కుట్టినన్‌ = కరొస్త్రే మంచానికి = పర్యంకానికి, పెట్టు = దెబ్బలు, వచ్చున్‌ = కలుగుతాయి. తా ; సుమతీ, అల్పునితో స్నేహం చేస్తే ఆపద వస్తుంది. ఎలాగంటే, నల్లులలోకెల్లా చిన్నదైన నల్లి పండుకొన్నవానిని కుట్టినప్పటికీ, మంచానికి కట్టెదెబ్బలు కలుగుతాయి. వ్యావ క్రాంచెపునరుడంటే అల్పుడు, నీచుడు. వాని అల్బత్వం, నీచత్వం, ఆకారం పరిమాణంలోకాక, బుద్ధిలో ఉంటుంది. అట్టి నీచబుద్ధి కలవారితో స్నేహం చేస్తే గొప్పవానికైనా ఆపద రాక తప్పదు. నాలో దోషంలేదు కదా నాకేమి? అనుకొని ('ప్రయోజనంలేదు. నీచబుద్దివాడేదో నీచపుపని చేయకమానడు. దానివల్ల వానిని చేరనిచ్చినవానికికూడా కీడు రౌక మానదు, అని కవిఅభిప్రాయం. దీనికిచ్చిన ఉదాహరణం ఎంత నచ్చిక అయిందోకదా. మంచంలేని యిల్హుండదు. మంచానికెప్పుడో ఒకప్పుడు నల్టులు పట్టకా మానవు. ఆ నల్లులలో అల్పాల్బములదగ్గరనుంచి ఒక్కొక్కప్పుడు పెద్దవికూడా ఉంటాయి. పెద్ద నల్టులకు అనుభవంమీద తెలిసి ఉంటుంది కనుక, మంచినిద్రలో మనిషి ఉన్నపుడుమాత్రమే. రాత్రులుమా[త్రమే. కుడతాయి. ఆవగింజలకంటెకూడా చిన్నవిగొ. నెత్తురు[గ్రుడ్లకంటె చిన్నవిగా ఉండేవిమా(త్రం, మనిషి దొరికితే చాలు, కుడతాయి. వెంటనే నుంచాన్ని తీసుకొని వెళ్ళి ఎండలో వేసి, నల్లులు రాలిపోవటంకోసం కర్రతో బాదుతారు. నేల రాలిన తరువాత నల్గుల్ని చంపుతారు, అది తరవాతవిషయం. కాని కుట్టింది చిన్ని నల్లి ఆ నల్లిని చీరనిచ్చినందుకు కర్రదెబ్బలు తినేది మంచం. నీచసాంగత్యఫలం ఇట్టిదే అని, ఈ సర్వానుభవసిద్ధమైన ఉపమానంతో మనసుకు నచ్చిక అయేటట్టు చెప్పాడు కపి. అవ: వారకాంతకు ధనమే (ప్రధానము కావున ఆమెపొందు తగదని చెప్పబోతున్నాడు. కు కొక్కోకమెల్ల. జదివిన( జక్కని వాండైన రాజచంద్రుండైనన్‌ త్తే

82 సుమతి శతకము మిక్కిలి రొక్కములియ్యక చిక్కదురా వారకాంత సిద్ధము సుమతి. త్తే (ప్ర : సుమతీ, పురుషుడు, కొక్కోకమెల్లన్‌ = కొక్కోకము+ఎల్లన్‌ = రతిశాస్తమంతా, చదివినన్‌ = చదివినవ్పటికినీ, అనగా సుఖం కలిగించే మార్గాలు శా(స్తమార్గంలో తెలిసినవాడైనప్పటికీ చక్కనివాల్టైనన్‌ = చక్కనివాడు+ఐనన్‌= ఆందమైనవాండు అయినప్పటికినీ, రాజచం'ద్రుండైనన్‌ = రాజచంద్రుండు+ఐనన్‌ = భూపరిపాలకులలో ఉత్తముడు ఐనప్పటికినీ, వారకాంత = వేళ్ళ, మిక్కిలి ఇ అధికముగా, రొక్కములియ్యక = రొక్కములు+ఇయ్యక = ధనములు ఇవ్వకుంటే, చిక్కదురా = దొరకదయ్యా, సిద్దము = ఇది [ధ్రువపరచబడిన విషయం. తా వ సుమతీ, పురుషుడు రతిశాస్త్రం బాగా చదువుకొన్నవాడు కావచ్చు, ఎంతో అందగాడు కావచ్చు, పరిపాలకులలో గొప్పవాడు కావచ్చు, కాని, అతడు తనకు ధనం అధికంగా ఇవ్వని పక్షంలో, వేశ్య అతనికి లభింపదు. వ్యా ; తనకు వలపున్నా లేకున్నా, ఉన్నట్టు నటిస్తూ పురుషుని లోబరచుకొని, అతనిధనం దోచుకొనటానికి ('ప్రయత్నించేమనిషి వారకాంత. భార్య తనకు భర్తపై ఎంత వలపున్నదో అంతే (ప్రదర్శిస్తూ అదికూడా కొన్ని పరిస్థితులకు లోబడి, ఎంతవరకు ప్రకటనకు సాధ్యమో అంతే ప్రకటిస్తూ, కలిమిలోనూ లేమిలోనూ భర్తననుసరించి ఉంటుంది. సామాన్యంగా ప్రీలు తమను పురుషులు ఎంత సుఖపెట్టగలవారైతే, వారిమీద అంత మక్కువ పెంచుకొంటారు. ఈ సామర్థ్యం వీరికి సహజంగా ఉండవచ్చు. దానికితోడు ఆ శా/స్త్రం నేర్చినందువల్ల "పెరగవచ్చు. వీరిని కోరేకాంతలకు సౌఖ్యం ప్రధానం కాని, ఇతరమైనవి కావు. కనుకనే అందం లేనివానికోసంకూడా (ప్రాణాలిచ్చే ఆతివలుంటారు. సుఖం కలిగించగలిగినా లేకపోయినా, అందం చూచి మోజు పడేవారుంటారు, వీరు సౌఖ్యం కలిగించగలరనే ఆశతో వీరికి వళ్యలవుతారు. ఆయినతరువాత ఆ సుఖం అంతే కాబోలనుకొని కాని, అంత అందగాడు లభించాడనే తృప్తితో కాన్సి, వీరిపట్ట (ప్రేమతోనే ఉంటారు. ఆశించినఅందగాడు లభించాడన్న తృప్రియే వీరికి సౌఖ్యం. మరి కొందరు తమ మగడు పదిమందిసైని అధికారం చేసి, సంపాదించగలవాడు కావాలనుకొంటారు. అ అధికారంమీది మక్కువతో కాని, దానివలన లభించే హోదా, సంఘగౌరవం, ఆస్తిపాస్తులు, మొదలయినవాటిమీది మమకారంతో కాని, వీరు పరిపాలనాధికారం కలవారిపట్ల ప్రేమతో ఉంటారు, తాము ఆశించిన అధికారం కలవాడు లభించటమే వీరికి తృప్తీ సౌఖ్యమూ. ఇవి కులకాంతలలో వేర్వేరు స్వభావాలు కలవారిలో రకాలు. భార్యలు కాకపోయినా, ఈ గుణాలవల్ల పరపురుషులపై మోహం పెంచుకొనేవారుంటారు. ధర్మప్రధానమైన కులకాంత ప్రణయంతో పొలిస్తే వీర మెహమూ

వివేకానందినీ వ్యాఖ్యాసహితం కం తక్కువ రకమే. కాని ఇది గుణానురాగం కనుక కీడులో మేలువంటిది. ఇట్టి వారికి పూర్తిగా భిన్నమైనవారు వారకాంతలు. వారికి డబ్బే ప్రధానం. పురుషునిలోని సౌఖ్యపెట్టగల సామర్థ్యం కాని, అందం కాని, అధికారం కాని వీరికి అప్రధానాలు, అ్రధానాలే కాదు, అక్కరలేదు. ఆతడు తమకు ఎంత ఎక్కువగా ధనమివ్వగలడు అన్నదానినిబట్టి, వీరు అతనిపై అంత వలపు చూపిస్తుంటారు. ఆ ధనమిస్తున్నంతసేపు, ఇవ్వగలడనివారు ఆశిస్తున్నంతసేపు, వారివలపు అధికాకర్షకంగా ఉంటుంది. మరింత ఇవ్వగల మరొకడు లభించినపుడు, అది మాయమవుతుంది. కనుక అది అస్థ్రిరమైనది, కనుక, అధర మే కాక అధమమైనది. అది సత్యమనుకొని, శాశ్ళతమనుకొని, ఉత్తమమనుకొని, చెడిపోవద్దు అని కవి హెచ్చరిస్తున్నాడు. అవ : ఆ(ప్రయోజకుడయిన పు(తునివల్ల లాభం లేకపోవటమే కాదు, నష్టమున్సుదని చెవ్పుబోతున్హాడు : క్ష కొజగాని కొడుకు వుట్టినం గొజుగామియె కాదు తండ్రిగుణముల జెజచున్‌ జెజకుతుద నెన్ను వుట్టిన( జెజకున. దీపెల్లం జెజచు సిద్ధము సుమతీ. డ్త౭ై ప్ర: సుమతీ, కొజగాని = కొజ+కాని = ప్రయోజకుడు కాని, కొడుకు = కుమారుడు, పుట్టినన్‌ = జన్మిస్తే కొజగామియె = కొజి+కామి+ఎ = ప్రయోజనం లేకపోవటమే, కాదు = అంతమాత్రమే కాదు, తండ్రి = జనకునికికల, గుణములన్‌ = సుగుణాలనుకూడా, చెజచున్‌ = పాడుచేస్తాడు, చెజకుతుదన్‌ = చెజకుగడచివర, వెన్ను = ఎన్ను = కంకి పుట్టినన్‌ = మొలిస్తే చెజకునన్‌ = చెజకుగడలోకల, తీపెల్లన్‌ = తీపుశఎల్లన్‌ = తియ్యదనమంతా, చెజచున్‌ = చెడగొడుతుంది, సిద్ధము = ఇది ద్రువపజచబడిన విషయం. తా : సుమతీ, పనికిమాలినకుమారుడు జన్మిస్తే అతడు పనికిమాలినవాడు కావటమే కాదు, తండ్రిలో ఉన్న సుగుణాలను కూడ చెడగొడతాడు. చెజకుగడ చివర కంకి మొలిస్తే అది తీపిలేనిది కావటమే కాదు, గడలో ఉన్న తీపినంతనూ చెడగొడుతుంది. ఇది లోకానుభవంవల్ల ద్రువపడినవిషయం. వ్యా : కొఆగానికొడుకు, పనికి మాలినవాడంటే, ఏ పనీ చేతకానివాడు, నేర్వనివాడు, చేయనివాడు అని అర్హం. దీనికి పర్యాయంగా 'ప్రయోజకుడు కొనివాడు అంటాము. ప్రయోజకుడు అంటే, బాగా సమకూర్చేవాడని అర్థం, అన్నీ వాటంతట జరిగిపోయేవయితే సమకూర్చటమేమిటి? ఒకదానికి ఒకటి పొంతనలేకుండా ఉన్న కార్యాంశాలను, పరస్పరం కార్యసాధకాలు అయేటట్టు చేసి, తాను ఉద్దేశించిన కార్యం సాధించేవాడు అని భావం, కై

84 సుమతి శతకము అనగా వురుషార్దసాధకుడన్నమాట. అట్టి సామర్ద్యం లేనివానిని, ఉన్నా ఉపయోగపరచనివానిని, ఆప్రయోజకుడు, కొజుగానివాడు, పనికిమాలినవాడు అంటారు. ఇట్టివాడు తాను వ్యర్ధుడు, ప్రయోజనరహితుడు కావటమేకాక, తండ్రికి కల సుగుణాలనుకూడా చెరుస్తాడు. వీనివ్యర్థతవల్ల తండ్రికి కల మంచి పేరుకూడా పోతుందన్నమాట. దీనికిచ్చిన దృష్టాంతం సర్వానుభవసిద్దమైనందున, ఈ భావాన్ని మనస్సుకు పట్టిస్తున్నది. చెజకుగడచివర వేసిన కంకి, వట్టి నిష్ర్రయోజనం. వరికంకి, కొజ్జకంకి, జొన్నకంకి వంటి వున్నాయంటే, వాటివల్ల గింజలు వస్తాయి. అవి ఆహారానికీ విత్తనానికీ ఉపయోగిస్తాయి. ఆ యా సస్యాలలో అవి ప్రధానమై, అవి రావటానికి మూలమైనవి గడ్డిగా మిగిలిపోతాయి, అక్కడ కంకులు వేసినందువల్ల, ఆ మొక్కలకు (ప్రయోజనం సిద్ధించింది. చెజకువెన్ను అలా కాదు. అది ఎందుకూ పనికిరాదు. చెజకువిత్తనం చెజకుముక్కయే కాని కంకి కాదు. ఈ కంకి వేసేవరకు గడ పెరుగుతుంటుంది. లావెక్కుతుంటుంది. దానిలో రసమూ మాధుర్యమూ పెరుగుతుంటాయి. వెన్నువేశాక పెరుగుదల ఆగుతుంది. మాధుర్యమూ రసమూ తగ్గటం మొదలవుతుంది. ఆ గడ నరికి వేయకుండా అలాగే ఉంచితే, అది నిస్సారమైన పనికిమాలినదవుతుంది. ఇంత చక్కని పోలిక ఈ కవికి దొరకటమే, ఆతని ప్రతిభకు నిదర్శనం. ఏ మాత్రం వివేకి అయినా, దీనిని అర్థం చేసుకోగలిగినవాడు, వ్యర్థుడు కాలేడు. అన : స్తీ విశ్చాసాద్దులు అనత్వాలని చెప్పబోతున్లాడు : కు. కోనులి విశ్వాసంబును బాములతో. జెలిమి యన్న భామలవలపున్‌ వేముల తియ్యందనంబుము భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ. శ్ర ప్ర: సుమతీ, కోమలి = ప్రీయొక్క, విశ్వాసంబును = నమ్మకమును, పాములతోన్‌ = సర్నాలతో, చెలిమి యన్నన్‌ = చెలిమి+అన్నన్‌ = స్నేహమనినా, భామల = ్రీలయొక్క, వలపున్‌ = (ప్రేమా, వేముల = వేపకాయలయొక్క, తియ్యదనంబును = తియ్య+తనమును = తీసీ భూమీశుల = భూమి+ఈశుల = రాజులయొక్క, నమ్మికలును = నమ్మకాలూ, బొంకుర = అసత్యమయ్యా, తా : సుమతీ, స్త్రీవిశ్చాసంతో ఉండటమూ, సర్పాలతో స్నేహమూ, స్త్రీలప్రేమా, వేపకాయల తీయదనమూ, పరిపాలకుల నమ్మకాలూ అసత్యాలు. వ్యా : స్త్రీపైని పురుషుడు ఎంత (ప్రేమ చూపించి ఏమి చేసినా ఆమెకు విశ్వాసం ఉండదట. సర్పాలస్నేహం అసత్యమట. పాములు విషజంతువులు కనుక వాటితో స్నేహంతో ఉన్నా అవి ఏదో సమయంలో కాటువేయక మానవు. స్నేహానికి లక్షణం

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 85 ఎల్లపుడూ మేలు చేస్తుండటమే కనుక, ఇదీ శాళశ్ళతం కాదంటున్నాడు. భామల'ప్రేమా సత్యం కాదట, అంటే, వారి'ప్రేమా చంచిలమైనదని కవిఅభిప్రాయం. వేపకాయ తీయగా ఉండటమూ అసత్యమే. భూమిశులు అంటే భూపతులు అనగా రాజ్యపాలకులు. వారినమ్మికలు అంటే వారు మనపై ఉంచినవిశ్వాసాలు. లేదా వారిపై మనకు కల నమ్మకాలు. ఇవిఆఅశాశ్చతాలట. అంటే పరిపాలకులు పాలితులను నమ్మి ఉండటం అబద్ధం. పాలకులపై పాలితులు పెట్టుకొన్న నమ్మకాలు అసత్యం. పాలకులు ప్రయోజనాన్నిబట్టి వ్యవహరిస్తుంటారు కాని నమ్మకాలనుబట్టి కాదు. వారికి మనపై విశ్వాసమున్నదని కాని మనం వారిని నమ్మిన ప్రకారం ఉంటారని కాని అనుకోరాదని భావం. ఇది చివరలో చెప్పినందువల్ల, ఇదేమేరకు సత్యమో, మిగిలినవీ అంతే సత్యాలని కవిఅభిప్రాయం. ఇందులో (్రీలవిశ్వాసమూ వారిప్రేమాగురించి ఈ కవి చెప్పినవిషయం సంపూర్ణ్షసత్యమనటానికి వీలు లేదు. అవ : స్రీలు భర్తను ఆతనినంపాదనను బట్టి గౌరవిస్తారని చెప్పుబోతున్లాడు : క. గడనగల మగని. జూచిన నడుగులకుము నుడుగులిడుదు రతివలు తమలో గడనుడుగుమగని. జూచిన నడపీనుంయు వచ్చె నమచు నగుదురు సుమతీ, క్త ఫ్ర : సుమతీ, అతివలు = (స్రీలు, గడనగల =గడన+కల = ధనసంపాదనగల, మగనిన్‌ = భర్తను, చూచినన్‌ = చూస్తే అడుగులకును = ఆతనిపాదాలకు, అనగా ఆవి అనటానికి, మడుగులు = ఉతికిమడిచిన పరిశుద్దవ(స్త్రాలను, ఇడుదురు = ఉంచుతారు, పరుస్తారు, గడన = ధనసంపొదనం, ఉడుగు = పోవు అనగా పోయిన, మగనిన్‌ = భర్తను, చూచినన్‌ = చూస్తే, నడపీను(గు = నడ+పీనుంగు = నడిచేశవం, వచ్చెన్‌ = వచ్చినది, అనుచున్‌ = అని పలుకుతూ, అని భావిస్తూ, తమలోన్‌ = స్రీలనడుమ, నగుదురు = నవ్వుతారు, లేదా, తమలోన్‌ = తమమనస్సులలో, నగుదురు = నవ్వుకొంటారు. తా : సుమతీ, స్త్రీలు తమభర్ర ధనసంపాదన చేస్తుంటే ఆతనికి ఎంతో మన్నన చేస్తారు. అతనిసంపాదన లేనిసముయంలో నడిచేశవం వచ్చిందని తమ మనస్సులలో తేలికగా చూస్తారు. ఒకరితో ఒకరు మాటాడుకొనేటప్పుడు ఇతరెస్త్రీలతో ఆ మాట అంటారుకూడా, వ్యా ఈ పద్యంలో భార్యలు తమ భర్తలకు గల ధనార్జనశక్తిని బట్టి గౌరవిస్తారు అని చెపుతున్నాడు. అది కవితా ధోరణిలో చమత్కారంగా చెప్పాడు. బాగా ధనం సంపాదించేభర్తను బాగా గౌరవిస్తారనటానికి అడుగులకు మడుగులు పరుస్తారన్నాడు. ఇందులోని భావం ఒక దృష్టాంతాన్నిబట్టి తెలుస్తుంది. ఇప్పటికీ పల్లెలలో (గ్రామదేవతలజఉత్సవాలు జాతరలవంటిని జరిగేటప్పుడు, గరగ నెత్తిని బెట్టుకొని, అమ, శవారు పూనిన మడివేలు ఊగుతూ, చిందువేస్తూ నడుస్తుంటాడు, బాజాలు (మోగుతుంటాయి. త్త

86 సుమతి శతకము ధూపాొలు వేస్తుంటారు. వేపమండల వీచోవులు వీస్తుంటారు. (ప్రతిగుమ్ముంముందు పసుపు నీళ్ళు కాళ్ళపై పోస్తుంటారు. ఉతికిన చీరలూ పంచెలూ కొందరు మడివేళ్ళు అతనిముందు, వేగంగా వీధిలో నిలువుకీ పరుచుకొంటూ వెడుతుంటారు. ఆ వ(స్త్రాలమీద కాని, అతడు నేలమీద నడవడు. ఆ ఊరేగింపు దాటివెళ్ళిన తరువాత, మళ్ళీ కొందరు వాటిని మడుచుకొంటూ ముందుకు వెళ్ళి పరుచుకొంటూ వెడుతుంటారు. ఆ గరగనెత్తుకొన్న ఆతడు వెడుతుంటే, అమ్మవారు వెడుతున్నట్టే కాని, ఒక మనిషి వెడుతున్నట్టు భావించరు. ్రతియింటిముందూ స్త్రీలు పళ్ళేలతో బియ్యం, పండ్డు, నైవేద్యాలు, హారతులూ సమర్పిస్తారు. ఆధునికకాలంలోకూడా అత్యంతగొారవ్యులయిన అతిథులు వచ్చినపుడు, ఎర్రతివాలీపరచి, గుమ ౦నుంచి వేదికవరకూ దారి చూపిస్తూ తీసుకువెడుతున్నారు. అడుగులకు మడుగులు ఇడుట అంటే, ఇంత గౌరవంతో చూడటమన్నమాట, సంపాదించే భర్తను ఇలా ఆరాధిస్తారట స్త్రీలు. వార్హక్యం, అనారోగ్యం, తెలివి తక్కువతనం, కాలం దైవం కలిసిరాకపోవటం మొదలయిన కారణాలవల్ల ధనార్జన పోతే, నడిచేశవం వస్తోందనుకొని తేలికగా చూస్తారట. ఇతర'స్తీలతో మాటాడేటప్పుడు, అదిగో మా శవం వస్తోంది అంటారట, శవాన్ని చూడటం మనవాళ్ళు అశుభంగా భావిస్తారు. చూస్తే కాళ్ళూ చేతులూ కడుగుకొని ఆచమించాలంటారు. తాకితే స్నానమే చేయాలంటారు. కనుక వీలయినంతవరకు శవదర్భ్శనం కాకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. పడి ఉన్న శవాన్ని చూడటం ఇష్టంలేనివారు దూరంగా చాటుగా ఉంటే సరిపోతుంది. కాని, అది నడిచి దగ్గరికి వచ్చేదయితే తప్పించుకొనటం సాధ్యం కాదుకదా. దానిదర్శనంవల్ల ఉపయోగం లేదు సరికదా, అమంగళకరం, తాకితే స్నానాదులూ తప్పవు. కనుక నడపీనుగు ఖీతీ రోతా పుట్టిస్తుంది. సంపాదనలేని భర్తమీద ఇంత వీహ్యభావం కలుగుతుందట. కొన్ని అభిప్రాయాలు కలిగినా వ్యక్తీకరించరు. మర్యాద, ఇతరులేమనుకొంటారో అన్న అభిప్రాయం

  • ఇలాంటి కారణాలవల్ల, మా నడపీనుగు వస్తున్నదని ఇతరకాంతలతో అంటారట కూడా ధనార్జనా హీనుడైన పెనిమిటిని చూచి. గౌరవాన్ని ఎంత గొప్పగా చిత్రించాడో, ఆగౌరవాన్నికూడా అంతశక్తితోనూ వర్షించగలగటం కవి(ప్రతిభకు నిదర్శనం.

అయితే, అతివలమొహాన్నే ప్రొద్దు పొడిచినదని కాని, అందరు అతివలూ అట్టివారని కాని, ఎవరూ అనుకొనవలసిన పని లేదు. కలవానిని, అతనికలిమివల్ల తమకు లాభం ఉంటుందని ఆశకు అవకాశం కలవానిని, నెత్తిని పెట్టుకొనటం చాలామంది చేసేదే. ని'ష్ర్రయోజకులయినవారిని నిర్లక్ష్యం చేయటానికీ లింగభేదం లేదు. కలిమిలోనూ లేమిలోనూ ఒకే రీతిని, కట్టుకొన్నవానితో మెలగటం మెలతధర్మం కనుక, అలా ఉండకపోతే అది విపరీతం అనిపిస్తుంది. సంపద తెచ్చిన, సంపాదిస్తున్న చానను ఒకలాగు చూడటం, తదితరలను మరొకలాగు చూడటమూ, కొందరిలో కనిపిస్తున్నదికదా. తెచ్చినా, తెస్తున్నా, ఇంటెడు చాకిరీ చేస్తున్నా, కనీసమైన స్నేహ(్రవృత్తినయినా కాంతపట్ట

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 87 చూపించటం అవసరమనుకొనని భర్తలు, బావలు, మరదులు, అన్నలు, తమ్ములు, తండ్రులు ఎంతమంది లేరు? కనుక, ఈ పద్యంలో చెప్పినదికూడా కొందరివిషయమే కాని, అందరిసంగతి కాదు.

ఈ పద్యంలోని మూడవపాదానికి గడనుడిగిన వడి యుడిగివ అని పాఠాంతరం ఉన్నది. అలా ఈ వ్యాఖ్యాత తండ్రిగారు యేలూరిపాటి సుబ్బయ్యగారు తరచు చదివేవారు. అప్పుడు, ధనసంపాదన పోవటానికి తోడు ఒడలిలోని మనస్సులోని వడికూఢా ఉడిగిన భర్త అని అర్ధం. వడి అంటే జవం, వేగం, చురుకు అని అర్ధం. ఆతనికి జవసత్త్యాలుడిగాయి అని జనవ్యవహారం, జవం మానసికమైనది. వేగం శారీరకమైనది. కనుకనే సుప్రసిద్ధమైన ఆంజనేయస్తుతిళ్లుకం

మనోజవం నూరుతతుల్యవేగం, జితేంద్రియం బుద్దినుతాం నరిష్టమ్‌!

వాతాత్మజం వానరయూథముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి॥ అనినదానిలో 'మనోజవం' 'మారుతతుల్యవేగం' అని రెండింటినీ ప్రయోగించిన సందర్భంలో ఈ విధమయిన అర్థం, మనోవేగం వట్టివేగం కలవాడనిమాత్రమే కాక్క మనస్సుయొక్క చురుకుతనమూ అనికూడా చెపితే ఇంకా బాగుండవచ్చు.

నడపీనుగు పదానికి సూ.ని. ఈ పద్యమే ఉదాహరించింది.

అన : ముఖ్యమైన మానసిక వాచిక కాయిక నీతులు చెవ్పుబోతున్నాడు :

క. చింతింపకు గడచినపని

కింతులు వలతురని నమ్మకెంతయు మదిలో నంతఃపురకాంతలతో మంతనములు మానుమిదియె మతముర సునుతీ. డక్‌ ప్ర: సుమతీ, కడచిన = జరిగిన, పనికి =ఐ కార్యంనిమిత్తమై, చింతింపకు = విచారించవద్దు; ఇంతులు = స్రీలు, వలతురని = వలతురు+అని = ్రేమిస్తారని, మదిలోన్‌ = మనస్సులో, ఎంతయున్‌ = కొంచెమైనా, నమ్మకు = విశ్వసించకు; అంతవురకాంతలతో = లోపలిరాచనగరిమగువలతో, మంతనములు = రహస్యాలోచనలు, రహస్య సంభాషణాలు, మానుము = విడిచిపెట్టు; ఇదియె = ఇది+ఎ = ఈ మూడింటిసముదాయమే, మతముర = నాకు మిక్కిలి ఇష్టమైనది నాయనా, తా : సుమతీ, జరిగిపోయినపని ఆలా చేశామే, ఇలా చేయలేదే మొదలయినవిధంగా విచారించకు. స్త్రీలు పురుషుని ప్రేమిస్తారని మనస్సులో కొంచెముసాటిగానైనా విశ్చసించకు. రాజాంతఃవురస్రీలతో ఏకాంతంలో మాటాడకు. రహస్యాలోచనలు చేయకు - ఈ మూడు అంశాలూ ముఖ్యమైనవని నా అభిప్రాయం నాయనా. (1

88 సుమతి శతకము

వ్యా :; ఈ పద్యంలో త్రికరణాలకు - మనోవాక్కాయములకు సంబంధించిన మూడునీతులు చెప్పాడు. ఇదే మతం అనికూడా చెప్పాడు. అంటే ఈ మూడూ చాలా ముఖ్యమైనవని తన అభిప్రాయం అని చెప్పాడు. వీటిలో మొదటిది కాయికమైన నీతి. మనము దినమూ అనేక కార్యాలు చేస్తుంటాము. ఒక్కొక్క పనివిషయమై ఒక్కొక్క నిర్ణయం వేగంతో తీసుకొని, అంతకంటె వేగంతో అమలుచేయవలసిన అవసరముంటుంది. అప్పుడు మనకున్న అనుభవమూ, తెలివీ, ఉపయోగించి, మనకు తోచినట్టు చేస్తాము. ఎల్లప్పుడూ మన నిక్ణయం లాభకారి కాకపోవచ్చు, నష్టదాయకంకూడా కావచ్చు, అనుకొన్నపప్రయోజనం సిద్దించకపోవచ్చు, విపరీత ఫలం కలుగవచ్చు. అయినప్పటికీ, అలా చేయకుండా ఉండవలసింది, ఇలా చేసిఉండవలసింది - ఇలా అస్తమానూ దానిని గురించే దిగులు పెట్టుకొనవద్దు అంటున్నాడు. ఇది అవసరం. తిరిగి సమీక్ష చేసుకొని, జరిగినదానిలో లోటుపాటులు తేలుసుకొనటం అవసరమే. ఆ ఆలోచనవల్ల మళ్ళీ అట్టిపని చేయవలసి వచ్చినపుడు ఎలా చేయగూడదో, లేదా ఎలా చేయాలో తెలిసివస్తుంది. ఆఅంతతో ఆ విషయం విడిచిపెట్టాలి. అలా కాక నష్టదాయకమే అయినప్పటికీ, అదే పనిగా విచారించినందువల్ల ప్రయోజనం లేకపోగా, మానసికమయిన దిగులు, దానివల్ల బుద్ధిమాంద్యం, అనారోగ్యం మొదలయినవి కలిగి, తరువాతిపనులుకూడా పాడవుతాయి. కనుక్క ఇక చేయవలసినదేమిటి అని ఆలోచించాలి కాని, పశ్చాత్తాపంవల్ల ప్రయోజనం లేదు. కనుకనే కడచినదానిగురించి దుఃఖించను, నాకు చేసిన ఉపకారం మాత్రం బ్ఞప్తిలో ఉంచుకొంటాను - గతం న శోచామి, కృతం స్మరామి - అనిన ఆర్యోక్తి పుట్టింది. ఇది (ప్రతిమనిషీ అవలంబించి తీరవలసిన విధానం. దీనివల్ల సంపూర్లశక్తి వినియుక్తమై, ఘనకార్యాలు సామాన్యులనబడినవారు కూడా చేయటం సాధ్యమవుతుంది. ఇక -

స్త్రీలు ప్రేమిస్తారని మనస్సులో కొంచెంకూడా నమ్మవద్దంటున్నాడు. ఈ అభిప్రాయం ఈ శతకంలో పలు పర్యాయాలు పలురీతులలో చెప్పాడు. ఈ విషయంలో ఇతనికింత గట్టి అభిప్రాయమేర్చడిందంటే, మనస్సులోని ఆ పొరకు అంత గట్టిదెబ్బ తగిలి ఉంటుందనుకోవాలంతే.

అంతఃపురకాంతలతో రహస్యాలోచనే కాదు, రహస్యసంభాషణం వద్దనటం, ఆ కాలంలో తల నిలవటానికి అత్యావశ్యకమయిన అవసరం, మనిషివివేకాన్ని పరిపూర్ణంగా చెడగొట్టటానికి, తన (ప్రేమస్టానంగురించిన అనుమానాన్ని మించినది మరొకటి లేదు, రాజు తలచుకొంటే దెబ్బలకు కొదువలేని అధికారం అతనికున్నరోజులలో, తల తీసినా అదేమనే అవకాశం లేనికాలంలో, అంతఃపుర ద్రోహానికి శిరళ్ళేదనం దండన అయినప్పుడు, సకారణమయినా అకారణమయినా, అంతఃపురంలోని వారితో మాటాడటం మరణం కోరితెచ్చుకొనటమే.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 89 అంతివురము చుట్టణికం బెంతయు గీడంతకంటె వెగ్గు తదీయో పాంతచరకుబ్దనామనకాంతాదులతోడి పాందుకలిమి భటునకున్‌ -

(విరాట. 1.13 అని మహాభారతం చెపుతున్నది, ఈ కవిగారు వారితో రహస్యాలోచనలు-

రహస్యసంభాషణములు మానుమన్నారు. పొందంటే స్నేహం. స్నేహం ఉంటే మాటలూ

ఆలోచనలూ వస్తాయి, అవి రెండూ వస్తే స్నేహం వస్తుంది. కనుక ఇద్దరిఉద్దేశమూ ఒకటే. మూలభారతం - నైషాం దారేషు కుర్విత మైత్రీం ప్రాజ్ఞః కదాచన, అంతఃపురచరా యే చ ద్వేష్టి యావహితాశ్చ యే -

అని చెపుతున్నది. సంస్కృతంలోని మైత్రి చుట్టజికమయింది తెలుగులో. అంతఃపురచరాః

తెలుగులో కుబ్బవామనకాంతాదులయారు. ఇద్దరితోనూ మైత్రి చేయరాదనిమాత్రమే

మూలంలో ఉంటే, ఎంతయు కీడు అన్నారు తిక్కనగారు. అంతకంటే ఎగ్గు తదీయోపాంతచరకుబ్దవామనకాంతాదులతోడి పొందు అన్నారు. ఈ కవిగారు మంతనములు మానుమన్నారు. నేడు అంతటిఅధికారం కలవారు లేరు కాని, చట్టవిరుద్ధంగా నయినప్పటికీ అనుమానాలవల్ల ప్రాణం తీయగలవారు ఉన్నారు. ప్రతిరంగంలోనూ పురుషులకంటె (ప్రముఖస్థానాలలోకూడా స్తీ ఉంటున్నందున, పరస్త్రీతో ఒంటరిగా మాటాడవలసిన అవసరాలుకూడా ఇపుడు చాలా పెరిగాయి. కనుక అట్టివారి కాంతలతో నైనప్పటికీ యుక్తమైన రీతిలో వ్యవహరించటం అవసరమని ఈ నీతిని (గ్రహించవలసి ఉంటుంది. అన : నంపొదించినది నద్ద్యయం చేసుకోవాలని చెప్పుబోతున్హాడు = క. చీమలు పెట్టినవుట్టలు పాములకిరనైనయట్లు పానురుడు తగన్‌ హేమంబు కూడ. బెట్టిన భూమీశులపాలం జేరు భువిలో సుమతీ. క ప్ర: సుమతి, భువిలోన్‌= భూలోకంలో, చీమలు = సిపీలికలు, పెట్టిన = నిర్మించిన, పుట్టలు = వల్మీకాలు, పాములకున్‌ = సర్పాలకు, ఇరవు = ఇండ్లు, నివాసస్టానాలు, ఐనయట్టు = ఐన+అట్టు = అయినవిధముగా, పామరుండు = మూర్చుడు, తెలివిలేనివాడు, తగన్‌ = తన ఆశకూ, అవకాశానికీ, శక్తికీ తగినట్టుగా, లేదా, దగన్‌ = దాహంతో, అత్యాశతో, హేమంబు = బంగారం = సంపద, కూడంబెట్టినన్‌ = కూడన్‌+పెట్టినన్‌= ప్రోగుచేసి, వ్యయం చేయక అలాగే ఉంచితే, భూమీశుల = భూమి+ఈచశుల = 'రాజుల, పాలన్‌ = భాగంలో, చేరున్‌ = కలిసిపోతుంది. క్త్‌్‌

న! సుమతి శతకము

తా :సుమతీ, ఈ లోకంలో చిన్ని చీమలు నిరంతరమూ కష్టపడి పుట్టలు నిర్మిస్తాయి. వాటిలో పాములు చేరి నివసిస్తాయి. అలాగే తెలివితక్కువవాడు తనశక్తికీ, ఆశకూ, అవకాశానికీ తగిన విధముగానూ, అత్యాళతోనూ సిరిసంపదలు (ప్రోగుచేస్తాడు కాని, సద్వినియోగం చేయడు, అది చివరికి ప్రభుత్వంవారి ఆస్తిలో కలిసిపోతుంది.

వ్యా : ప్రకృతిలో సహజంగా జరిగే సన్నివేశం, చిన్న చిన్న చీమలు పెద్ద పెద్ద పుట్టలు నిర్మించటమూ, వాటిలో ప్రవేశించి పాములు నివసించటమూ. దీనిని దృష్టాంతంగా చూపించి, మనిషికి అత్యావళ్యకమైన నీతి చెప్పాడు కవి. మూర్చుడు చీమలా సంపాదించి, అది వినియోగించక, దాచి ఉంచుతాడు, వాడు ప్రోగుచేయటానికీ ఖర్చుచేయకపోవటానికీ కారణం ధనదాహం. విపరీతమైన ధనం ఒకచోట 'ప్రోగై వినియోగం లేకుండా ఉంటే, (ప్రభుత్వానికి చెందుతుంది అని చెపుతున్నాడు. చీమలు పుట్టలు పెట్టటం జీవికి సహజుతమైనగుణం, ఉండటానికి ఇల్టు కావాలి. మిక్కిలి చిన్నప్రాణి అయిన చీమనుంచి మిక్కిలి పెద్దప్రాణులు త్రిమూర్తులవరకూ నివాసానికి నిర్మించుకోవటం ఉంది. చీముకూ మనిషికీ మధ్యలో ఉన్నషప్రాణులన్నీ తమ అవసరానికి తగిననివాసస్టానాలు నిర్మించుకొనటం చూస్తాము. చీమలకూ మనుషులకూ అవసరాన్ని మించి నిర్మించే గుణం ఉన్నది. చీమలకు అంతపెద్ద పుట్టలు అక్కరలేదు. కాని నిర్మాణం నిర్మాణం కోసమే అన్నట్టు, వేరేపని లేకుండా పుట్టలను పెంచుతూనే ఉంటాయి. ఆహారం ఏమైనా వినియోగమవుతుందేమో తెలియదు కాని, పుట్టలుమాత్రం వాటికి కాకుండా బలిష్టములైన 'క్రూరసర్పాలు ఆ|క్రమించుకొంటాయి. మనిషి ధనసంపాదనా గృహనిర్మాణమూ చేయవలసినదే. అతడు పెద్దభవనాలు కడతాడు. వాటినీ గతంలోనూ, నేడూ ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొనటం చూస్తుంటాము, హైదరాబాదులోని కింగ్‌ కోఠి భవనం అలా నిజాం నవాబుగారు సంపాదించినదే అని చెపుతారు. ఇంకా చిక్కులు వస్తాయనే రాజగృహంబుకంటె నభిరామముగా నిలుగట్టగూడదు అని ధామ్యులవారు పాండవులకు ఉపదేశించారు. ఇక్కడినీతిలో ధనం ప్రోగుచేసి ఉంచితే ప్రభువులపాలవుతుంది అని ఉన్నది. ఈ నీతిలో ప్రాణం 'తగనోలో, లేదా 'దగన్‌లో ఉంది. అతిగా సంపాదించటానికీ అట్టే పెట్టటానికీ ధనదాహం కారణం, ఆ దాహమే లేకపోతే మిగిలిన పురుషార్థాలకోసంకూడా (ప్రయత్నించాలి. సోన, సంపాదించాడు. నంపాదించినధనానికి వినియోగం మూడురకాలన్నారు,

దానము భోగము వాశము పూవికతో మూడుగతులు భువి ధనమునకున్‌,

దానము భోగము వెలుంగని దీనువి ధవమునకు గతి తృతీయమె పాసగున్‌ అని, సంపాదించినది సత్సా(త్రులక్రు ఇవ్వటం దానం. అది (శ్రేష్టం. రెండవది తాననుభవించటం, ఇవి రెండూ తన చేతితో తాను చేసేవి. ఇవి చేయకపోతే, తనతో

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 91 నిమిత్తం లేకుండా జరిగేది, ఆ ధనం నళించటం. నశించటమంటే తనది కాకుండా పోవటం. అది (ప్రభుత్వానికి చెందటం చివరికి జరుగుతుంది అని, ఈ శతకంలోని ఈ నీతి చెపుతున్నది. కనుక ధనం అవసరమే కాని, ధనదాహం నిష్ప్రయోజనం అని ఈనీతి చెపుతున్నది. ఆవ : ధనమున్ధృవానిని బంధువులు కానివారు బంధువులమని ఆశ్రయిస్తారని చెప్పబోతున్నాడు : క. చుట్టములు గాని వారలు చుట్టములము నీకటంచు సొంపు దలిరన్‌ నెట్టుకొని యాశ్రయింతురు గట్టిగ ద్రవ్యంబు గలుగ గదరా సుమతి, క్త ప్ర: సుమతీ, గట్టిగన్‌ = ఎక్కువగా, (ద్రవ్యంబు = ధనం, కలుగన్‌ = సంభవిస్తే చుట్టములు = బంధువులు, కాని వారలున్‌ = కానివారుకూడా, నీకున్‌ = నీకు, చుట్టములము "= బంధువులము, అటంచున్‌ = అట+ఆంచున్‌ జ అని పలుకుతూ, సొంపు దలిర్పన్‌ వా సొంపు+తలిర్చన్‌ ఇ అందం చిగురింపగా, నెట్టుకొని = త్రోసికొని, ఆశ్రయింతురుకదరా = ఆశ్రయిస్తారు కదయ్యా, తా : సుమతీ, బాగా ధనం వచ్చినసమయంలో బంధుత్వం లేనివారు కూడా మేము నీకు బంధువులము అని పలుకుతూ ఆశ్రయిస్తారు. వ్యా : 20 వ పద్యంలో సంపదకలిగినవుడు బంధువులు వచ్చి ఆశ్రయిస్తారు అని చెప్పాడు. ఈ పద్యంలో- ధనం బాగా ఎవనికయినా కలగొలి గాని, బంధువులు కానివారుకూడా మేము మీ బంధువులము, కనుక నీవు మాక ఆ ఉపకారం చేసిపెట్టు, ఈ ఉపకారం చేసిపెట్టు అని పలుకుతూ ఒకరితో ఒకరు పోటీపడుతూ మరీ వచ్చి ఆశ్రయిస్తారు అని చెపుతున్నాడు. 20లో బంధుస్వభావం చెపేతే, స్వప్రయోజనపరులైన మానవులస్వభావం ఈ పద్యంలో చెపుతున్నాడు. ఒకరివల్ల నురొకరికి ఉపకారం కావలసిన అవసరం ఉన్నపుడు, అపరిచితులనయినా ఆశ్రయించ వలసిరావచ్చు, ఆగశ్రయింపబడినవారికి. గల బౌదార్యాన్నిబట్టి ఉపకారం జరుగవచ్చు. పరిచితులను పరిచితులు ఆశ్రయించవచ్చు. అపుడు పరిచయానికి గల గాఢత్వాన్నిబట్టి ఆశ్రితులకోరిక తీరవచ్చు. బంధువులను బంధువులు ఆశ్రయించవచ్చు. అపుడు ఆశ్రయమయిన వారికి వారి బంధుత్వంపట్ట గల మక్కువను పట్టి మేలు కలుగవచ్చు. అపరిచితులకంటె పరిచితులకూ, కేవలపరిచితులకంటె బంధువులకూ, ఉపకారం పొందటానికి హాక్కెక్కువ ఉన్నట్టు అందరూ భావిస్తారు. కనుక బంధువులు కానివారుకూడా మేము నీకు

92 సుమతి శతకము బంధువులమని పలుకుతూ వచ్చి ఆశ్రయిస్తారట. ఇది ఆశావిలాసంగా భావించి, చేయగల ఉపకారం ఉంటే చేయాలి కాని, వారిని మోసకారులుగా భావించగూడదు. బంధువులు కాని వారు అంటే, చెప్పుకొనదగినంత బాంధవ్యం లేనివారు అని భావించాలే గాని, సుతరామూ బంధుత్వం లేనివారు అని భావించగూడదు. అసలు బంధువులు కానివారు బంధువులమని ఎలా అంటారు? అంటేమాత్రం ఎలా చెల్లుతుంది? ఆరా రాదా? వస్తే లేదని తేలదా? తేలితే ఉపకారం జరగక పోగా అపకారం జరుగదా? కనుక దీనినిలా అర్హంచేసుకోవాలి. సంబంధాలు తడవిచూస్తే ఒక కులానికి చెందినవారిలో ఎక్కడో ఏదో బంధుత్వం కలియకపోవదు. దీనిని బీరకాయపీచు బంధుత్వం అంటారు. ఇట్టీ బంధుత్వమూ లేనివారుకూడా (ప్రయత్నిస్తే 'ప్రయత్నించవచ్చుగూడా. అధికారమో, ధనమో, పలుకుబడో, కీర్తో కలవారిని తమ బంధువులని కలిమిలేనివారు బీరకాయపీచుబంధుత్వం కలవారు చెప్పుకొనటమూ, అవసరాన్నిబట్టి ఆశ్రయించటమూ ఉంటుంది, సామాన్యంగా ఆ కలవారు ఈ లేనివారినిగురించి చెప్పుకోరు. వారు మీ బంధువులటకదా అంటే, ఆం, ఏదో బీరకాయపీచు బంధుత్వం లేనివారెవరు? అంటారు. ఇలా ఆ(శ్రయించేవారందరూ ఆశాపరులు కావచ్చు గాని, మోనకారులుగా భావించనక్కరలేదు. చేతిలో ఉన్న ఉపకారం చేయటమే కర్తవ్యం. ఆ బీరకాయపీచు సంబంధమూలేనివారు ఉన్నదని కల్పించి చెప్పి చేరారా? వీరిని దూరంగా ఉంచక తప్పదు. ఇట్టి స్వభావంకలవారు ఎట్టి కల్పనలకయినా వెనుదీయరు కనుక, అవ : ఎవరికేది అలంకారమో చెవ్చుబోతున్హాడు : క. చేతులకు. దొడవు దానము భూతలనాథులకు( దొడవు బొంకమి ధరలో నీతియ తొడనవెవ్వారికి వాతికి మావంబు తొడవృ నయముగ సుమతి. శం (ప్ర: సుమతీ, ధరలోన్‌ = భూలోకంలో, నయముగన్‌ = న్యాయంగా, దానము = ఈవి, చేతులకున్‌= రెండు హస్తాలకూ, తొడవు = అలంకారం, నగ; బొంకమి = కల్లలాడకపోవటం, భూతల నాథులకున్‌ = పుడమి యేలికలకు, భూ పరిపాలకులకు, తొడవు = భూషణం; నీతియ = నీతి + అ = నీతియే, ఎవ్వారికిన్‌ = ఏ + వారికిన్‌ = ఎవరికైనప్పుటికినీ, తొడవు = అలంకారం; మానంబు = గౌరవం, నాతికిన్‌ = (్రీకి తొడవు = నగు తా : సుమతీ, భూలోకంలో న్యాయంగా దానం చేయటం చేతులకు అలంకారం. అబద్ధమాడకపోవటం పరిపాలకులకు ఆలంకారం. నీతి ఎవరికైనా అలంకారం. ప్తీకి గౌరవం అలంకారం.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 93 వ్యా; కొన్ని అవయవాలకూ, కొందరు మనుష్యులకూ, కొన్ని వస్తువులూ, కొని గుణాలూ, ఉన్నందువల్లనో, లేనందువల్లనో, అందం వస్తూ ఉంటుంది. వేటికి ఎవరికి ఏవి ఉన్నందువల్ల గాని, ఏవి లేనందువల్ల గాని, అందం వస్తుందో, ఈ వద్యంలో చెప్పాడు. అలంకారాలు అందంకోసం ధరిస్తారు. మురుగులూ, మురిడీ గొలుసులూ, కంకణాలూ అందంకోసం చేతులకు ధరిస్తారు. ఈవి లేని చేతులకు అలంకారంగా అట్టివి పెట్టుకొన్నందున అందం రాదు, దానం చేయటం వల్లనే చేతులకు అందం వస్తుంది. దానం చేయని చేతులకు పెట్టుకొన్న అలంకారాలవల్ల అందం రాదు అంటున్నాడు. అందం ఎందుకు కావాలను కొంటారు? చూచినవారు మెచ్చుకోవాలని. చేతులకు ఏ అలంకారాలూ పెట్టుకొనకపోయినా దానం చేస్తుంటే ఆ చేతికెముక లేదు - ఇలా 'మెచ్చుకొంటారు. పూర్వం రాజులు సర్వావయవాలకూ సర్వాభరణాలూ ధరించేవారు. వారు ఇతరులు అబద్దాలాడితే శిక్షించగలవారు. వారే అబద్దాలాడుతుంటే ఇంకేది దారి? కనుక, ఉన్నది కదా అని పరిపాలకులు అలంకారాలు ధరిస్తే ఎవరూ మెచ్చరు. అబద్దా లాడకుంటే అందరూ మెచ్చుకొంటారు. దానికిది, వీరికిది అన్న మాటేమిటి? ఎవరికైనా అందం సమకూర్చేది నీతి. నీతి అంటే, సుమతి శతకం మొదటి పద్యంలో ధారాళమైన నీతులు నుడివెద అన్నాడు కనుక, ఇందులో చెప్పబడిన నీతుల సముదాయమన్నమాట. అవయవాలంకారమూ, అవనీపతిఅలంకారమూ, సర్వాలంకారమూ చెప్పిన తరువాత, నాతికి మానంబు తొడవు అని చెపుతున్నాడంటే, ఇది అన్నింటికంటే ప్రధానమని కవి భావిస్తున్నాడన్నమాట. మగవాడు మాన ప్రధానుడయితే, ధీమంతుడులా మానవంతుడు అని, ఒక (ప్రత్యేక గుణం కలవాడుగొ పేర్కొంటారు కాని, మానవంతుడు అంటే మగవానికి పర్యాయం కాదు. మానవతి అన్నది.మాత్రం మగువకు పర్యాయం, దీనిని బట్టే ఆమెకు మానం ఎంత (ప్రధానంగా భావించారో మనవారు, తెలుస్తుంది. అవ + కార్బనిద్దికి ఓరిమీ కష్టసపొమ్లుతా కావాలని చెవుబోతున్లాడు 7? క. _తడవోర్వక యొడలోర్వక కడ్తువేగం బడిచి పడిన కార్యం బగునే తడవోర్చిన నొడలోర్చిన చెడిపోయిన కార్యమెల్ల' జేకురు సుమతీ, క్త ప్ర : సుమతీ, తడవు = జాగు, ఆలస్యం, ఓర్వక = సహించక, ఒడలు = శరీరశ్రమ, ఓర్వక = సహించక, కడున్‌ + మిక్కిలిగా, వేగంబు = శీఘ్రముతో, అడిచి పడినన్‌ = తొందరపడితే, కార్యంబు = కావలసినపని, ఆగునే = నెరవేరుతుందా? తడవు = జాగు, ఓర్చినన్‌ = సహిస్తే డ్డ

94 సుమతి శతకము ఒడలు = శరీరశ్రమ, ఓర్చినన్‌ = సహిస్తే, చెడిపోయిన = పాడైపోయిన, కార్యము = పని, ఎల్లన్‌ = సమస్తమూ, చేకురున్‌ = సమకూడుతుంది. తా వ సుమతీ, ఏదైనా పనిచేసేటప్పుడు, అనుకొన్న దానికంటే ఆలస్యం కావచ్చు. శరీరానికి 'శ్రమా కలుగవచ్చు. ఈ రెండింటినీ ఓరిమితో తట్టుకొనక, శీఘ్రంగా అయిపోవాలని తొందరపడినందువల్ల, పని పూర్తి కాదు. ఆలస్యాన్నీ శరీర శ్రమనీ ఓర్చుకొని కృషిచేస్తే ఇతర కారణాలవల్ల చెడిపోయిన పనికూడా నెరవేరుతుంది. వ్యా వ ఓరిమి రెండు రకాలు. మానసిక (శ్రమను ఓర్చుకొనటం, శారీరక (శ్రమను ఓర్భుకొనటం. ఒక (శ్రమవల్ల మరొకటి కలుగుతుంది. ఏ ఒకటి లేకపోయినా, పని పాడవుతుంది. రెండూ లేకపోతే ఇక చెప్పనక్కరలేదు, పనిపాడై తీరుతుంది. రెండూ ఉంటే, చెడిపోయిన పనికూడా చక్కబడుతుందని, క్షమాగుణం ఎంత అవసరమో చెప్పాడు. క్షమకూడా అభ్యాసం వల్ల సాధించవలసిన సుగుణం. ఆధునిక కాలంలో దీని అవసరం మరీ పెరుగుతున్నది. మనం ఎక్కవలసిన బళ్ళూ బస్సులూ వేళకు రావు. విసుగూ చిరాకూ పెరుగుతాయి. అందువల్ల మనస్సు సరిగా పనిచేయదు. తనకు తనమీదనూ ఇతరుల మీదనూ వట్టి పుణ్యానికి కోపం వస్తుంది. కనుక కలహాలు పుడతాయి. ఫలితం కార్యభంగం. కనుక ఈ రెండురకాల (శ్రమలనూ ఓర్చుకో గలిగితే, ఈ పరంపర తప్పి, వ్యతిరేక పరిస్థితులను గూడా అనుకూలంగా మలుచుకొనటం సాధ్యమవుతుంది. ఈ దృష్టిలేకపోతే, అస్సు ఉస్సు అంటూ, అనుక్షణం అసౌఖ్యపడేవారు పెరిగిపోతారు. అవ :కోవము శాంతి దయ నంతోషం, దుఖం - వీటి గురించి చెప్పుబోతున్నాడు : క. తన కోపమె తన శత్రవు తన శాంతియె తనకు రక్ష దయ చుట్టంబౌం దన సంతోషమె స్వర్గము తవ దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ, 50 ఫ్ర : సుమతీ, (తెలిసినవారు) తన కోపమె = తన కోపము ౪ ఎ = జీవి అలుకయే, తన శత్రువు = ఆ జీవికి పగవాడు, తన శాంతియె = తన శాంతి + ఎ = తన శాంతగుణమే, తనకు రక్ష= రక్షణము, దయ = ఇతరుల కష్టాలను పోగొట్టటానికి చేసే కృషి, చుట్టంబౌన్‌ = చుట్టంబు

  • బౌన్‌ = బంధువు అవుతుంది, తన సంతోషమె = తన సంతోషము + ఎ = తనతృష్తియే, స్వర్గము = దుఃఖం ఉండని, సుఖం మాత్రమే ఉండే దేవలోకం, తన దుఃఖమె = తన దుఃఖము
  • ఎ౯= తన బాధే, నరకము = దుఃఖం, పాపం చేసినవారు దానికి ఫలముగా కష్టాలు అనుభవించే

వివేకానందినీ వ్యాఖ్యాసహితం $్ర్ర్‌ చోటు (ఇవి పలురకాలుగా యమలోకంలో ఉంటాయి), అం'డ్రు = అంటారు, చెపుతారు. తథ్యము = ఇది నిజం.

తా : సుమతి, తనకు కల కోసమే తనకు అపకారం చేసే శత్రువు. తనకున్న శాంతగుణమే, తనకు రక్షణ మిస్తుంది. ఇతరుల కష్టాలను పోగొట్టటానికి తొను చేసే పనియే తన బంధువు, తనకు కల తృప్తియే సుఖం కలిగించే చోటు, తనకు కల బాధయే దుఃఖం కలిగించే చోటు అని జ్ఞానులు చెపుతుంటారు.

వ్యా : పగవాడు, తనకు ఎవరిమీద పగ ఉన్నదో, వారికి అపకారం చేయాలని చూస్తూ ఉంటాడు. పగ కోపంవల్ల కలుగుతుంది. కోపం తాను చెప్పిన మాటలు వినలేదనో, తన సుఖానికి అడ్డం వచ్చారనో, తన లాభానికి అడ్డం వచ్చారనో వస్తుంది. కోపం ఎవరి మీద వచ్చిందో వారికి అపకారం, కష్టం, నష్టం, దుఃఖం కలిగించాలని పిస్తుంది. దీనినే పగ అంటారు. ఎవరికిటువంటివి మనం కలిగిస్తామో వారు ఊరుకోరు. కదా. వారూ మనకిట్టివి కలిగించటానికి ప్రయత్నిస్తారు. కనుక, వారితో పగ ఏర్పడటానికి మనలో ఉన్న కోపం మూలం కనుక, మనకోపమే మనకు శత్రువంటారు.

శాంతి అంటే మనస్సులో వడిదుడుకులూ కలతా లేకుండా ఉండటం. తొందరపాటూ, దుష్టత్వమూ పాగరూ ఉన్నా, మనస్సు స్తిమితంగా ఉండక, ఐనదానికీ కానిదానికీ క్రోం. ఈర్ష్య, అసూయ, బాధ మొదలయిన వాటివల్ల కలత చెందుతున్నా, మనిషి ఎదు వారికి కష్టం కలిగించే మాటలనటమూ, పనులు చేయటమూ చేస్తాడు. అందువల్ల వారూ అలా చేస్తారు. దానితో వారిలో పగ బయలుదేరి అపకారం చేయాలనుకొంటారు, వీలయితే చేస్తారు. కనుక శాంతి లేకపోవటం రక్షణ లేకపోవటం. శాంతి ఉంటే ఈ చిక్కులు రావు కనుక, వేరే రక్షణ ఏర్పాట్ల అవసరం లేదు. అది లేక ఎన్ని జ్‌ ఏర్పాట్టున్నా, పరిణామంలో కీడు కలుగుతుంది కనుక, ఎన్ని రక్షణ ఏర్పాట్టున్నా, లేనట్టే

దయ అంటే చాలా మంది జాలి అనుకొంటారు. దయ అంటే ఆ అర్ధం ఉన్నమాట నిజమే కాని, వట్టి జాలివల్ల దానిని చూపిన వారికి కొని, ఎవరి మిద చూపించారో వారికి కొని, ఏ (ప్రయోజనమూ ఉండదు. కనుక, జాలి పడవలసిన కష్టాలలో దుఃఖాలలో ఎవరున్నారో, వారి ఆ కష్టాలనూ దుఃఖాలనూ తొలగించటానికి చేసే కృషికి దయ అని పేరని, విష్ణుపురాణ వ్యాఖ్యలో శ్రీధరస్వామివారు వ్రాశారు. అట్టి దయాళాలిపట్ల అందరికీ సద్భావం ఏర్పడుతుంది. ఆయన కేఇబ్బంది కలిగినా అందరూ అండగా ఉంటారు. బంధువులు చేసే పని అదే. తమ బంధువుకి అవసరమైనపుడు తోడ్పడుతుంటారు. అలాంటివారే బంధువులు. కనుకనే శతకం 2 వ పద్యంలోనే అక్కటకు రాని చుట్టము (గ్రక్కున విడువంగ వలయు అని చెప్పాడు. దయాశాలికి అందరూ బంధువులే అవుతారు కనుకు దయ చుట్టమన్నాడు.

తీరి

9 సుమతి శతకము స్వర్గంలో సుఖం మాత్రమే ఉంటుంది, దుఃఖం ఉండదు అని చెపుతారు. స్వర్గానికి నాకం అన్నది పర్యాయపదం, నాకం అంటే దుఃఖం ఉండని ప్రదేశం అని అర్హం. మనిషికి సంతృప్తి అనే గుణం, సహజమై, మనస్సులో ఉండాలి. సంతృప్తి అనేది, కలిమి మీదనూ, బాహ్య వస్తువుల మీదనూ ఆధారపడి ఉండదు. ఎన్ని ఉన్నా, సంతృప్తి లేనివానికి సుఖం ఉండదు. ఆది ఉన్నవానికి ఏమీ లేకపోయినా, సుఖమే ఉంటుంది. కనుకనే భర్షహరి వయమిహ పరితుష్టా వల్కలైస్వ్యం దుకూలైః సమ ఇహ సరితోషో నిర్విశేష్ణి విశేషః సతు భవతు దరిద్రో యస్య తృష్టా విశాలా మనపి చ పరితుష్టే కోర్టవాన్‌ కో దరిద్రః - అని యోగి చేత అనిపించాడు. మాకు నార చీరలుంటే చాలు, నీకు పట్టుబట్టలుంటేనే తృప్తి, దాహం బాగా ఉన్నవాడే దరిద్రుడు. మనస్సులో తృప్తి ఉన్ననాడు కలవాడెవడు? లేనివాడెవడు? అని దాని భావం. సంతృప్తి ఉంటే స్వర్గంలో ఉన్నట్టే. సంతృప్తిలాగే దుఃఖం కూడా లోపల ఉండేదే. కనుక, దుఃఖానికి మనస్సులో అవకాశం ఇస్తే నరకంలో ఉన్నట్టే. దుఃఖం అసంతృప్తినల్ల వస్తుంది, కనుక దానికి చోటివ్వకూడదు. శత్రువులేర్చడటానికీ, రక్షణ ఉండటానికీ, బంధుప్రీతి ఏర్పడటానికి స్వర్గమో నరకమో రావటానికీ, ఇతరులు కాదు, మనమే కారణం, ఈ పద్యానికి ప్రేరక మనదగిన శ్లోకం 'ఆర్యధర్మములు*లో ఇలా ఉన్నది : శాంతితుల్యం తపో నాస్తి న సంతోషాత్సరం సుఖం; న తృష్ణాయాః పరో వ్యాధిఃన చ ధర్మో దయాసమః॥ శాంతితో తుల్యమైన తపస్సు లేదు, సంతోషాన్ని మించిన సుఖం లేదు, తృష్ణకంటె అధికమైన వ్యాధి లేదు, దయతో సమమైన ధర్మం లేదు - అని దాని భావం. ఆవ : ఆతి వరిచయాదులవళ్ల ప్రళంసింపబడినివాటిగురించి చెప్పుబోతున్న్హాడు క. తనయూరి తపసీతపమును తనపుత్రునివిద్యపెంపు( దనసతిరూప్పున్‌ తన పెరటిచెట్టునుందును మనసున వర్షింపరెట్టి మునుజులు సుమతి, ర్‌ ఫ్ర : సుమతీ, తన + ఊరి = తన నివాస (గ్రామానికి చెందిన, తపసి తపమును = తపస్వి తపస్సునూ, తన పుత్రుని = తన కుమారుని యొక్క, విద్యపెంపున్‌ = చదువులోని ఆధిక్యాన్నీ, తనసతి= తనభార్యయొక్క, రూపున్‌ = అందాన్నీ, తనపెరటి = తన దొడ్డిలోని, చెట్టమందును = వృక్షంవల్లనైన బౌషధాన్నీ, ఎట్టి = ఎంత వివేకంకల, మనుజులున్‌ = మనుష్యులూ, మనసునన్‌ = చిత్తంలో, వర్షింపరు = నర్షన చేయరు, మెచ్చుకొనరు,

వివేకానందినీ వ్యాఖ్యాసహితం యీ

తపసితపమును అనిన పాఠాంతరం మేలైనది. కనుక (గ్రహించాము. పుత్రునివిద్య, సతిరూపు, చెట్టమందు అనిచెప్పిన రీతికి అనుగుణంగా ఉన్నది. తపసితనమును అనిన అ. 'ప్రతిపాఠానికి తపస్విభావం అని అర్థం,

తా : సుమతీ, ఎంత వివేకంకల మనుష్యులయినప్పటికీ సొంత ఊరికిచెందినవాని తపశ్శక్తినీ, సాంతకొడుకు చదువులోని గొప్పతనాన్నీ, సొంతభార్య అందాన్నీ, సొంతయింటి దొడ్డిలో ఉన్న చెట్టునుంచి వచ్చిన జౌషదాన్నీ మనస్సులో మెచ్చుకొనరు.

వ్యా : ఇందులో ఎవరూ మెచ్చుకొనని నాలుగు విషయాలు పేర్కొన్నాడు, వాటిలో మొదటిది, ఏ ఊరిలో నివసించే మునీశ్ళరుని తపళ్ళక్తిని, ఆ ఊరివారు మెచ్చుకోరు అన్నది. దీనికి అతిపరిచయాదవజ్ఞా - ఎక్కువ పరిచయంవల్ల తక్కువభావం కలుగుతుంది అన్నసత్యం ఒక కారణం కావచ్చు. రెండవకారణం దూరంనుంచి వచ్చినవారు, ఒకటి రెండు రోజులో, కొన్నాళ్ళో ఉండి పోతారు. వారికన్ని విషయాలూ తెలియకపోవచ్చు. దూరపు కొండలు నునుపు- దూరస్టాః పర్వతా రన్యూః సమీపష్ట్రాన్తు బర్బరాః అన్నట్టు, (ప్రచారాదులవల్ల లేని గొప్పదనం ఉన్నదన్న అభిప్రాయమూ వీరికి ఉండవచ్చు. కారణమేదైనా, చెప్పినదిమాత్రం చాలామందివిషయంలో సత్యం,

రెండవ విషయం, తనకువూరునివిద్యలోని ఆధిక్యం. దీనినీ సామాన్యంగా మెచ్చుకొనరు. తాము _మెచ్చుకొంటే పిల్లలకు ఆయుఃక్షీణం అన్నవిశ్వాసం పైకి చెప్పేది. తాము మెచ్చుకొంటే పైవారు అసూయ చెందటానికి కారణమవుతుందన్న అభిప్రాయం లోపలికారణం. తమపీల్లలను తామే మెచ్చుకొంటే గర్వం పెరిగి చెడిపోతారన్న అభిప్రాయమూ కారణం కావచ్చు. ఏమైనా, కొన్నిసందర్భాలలో మెప్పుగూడా అవసరమే. అసలుమెచ్చుకోనందువల్ల, తల్లిదం'డ్రులకు తమమీద (ప్రేమ తక్కువని, పిల్లలు అపోహపడి, బాధపడే అవకాశంకూడా ఉంది. ఇందుకుదాహరణంగా సంస్కృతమహాకవి భారవికథ తరచు పెద్దలు చెపుతుంటారు. భారవి చిన్నతనంలోనే మంచిపండితుడై, అర్ధగంభీరమైన కవిత్వం చెప్పేవాడు. అందుకు & ధందరూ మెచ్చుకొనేవారు. తండ్రిమాత్రం వా పండితుడూ వానిది ఓ కలిబ్వమూనా? మీరే మెచ్చాలి అని ఈసడింపుగా అంటుండేవాడు. ఈ ధోరణికి కష్టపడి, కక్ష పెరిగి. ఈ తండ్రి చస్తేనే కాని తనపీడ విరగడ కాదనుకొని, చంపివెయ్యాలనుకొన్నాడు కొడుకు. ఒక పెద్ద బండరాయి అటకమీదకి ఎక్కించి తండ్రి పండుకొన్నపుడు ఆయనమీద పడవేయటమే అందుకు మార్గమనుకొన్నాడట. ఒకనాడు అలా అటక ఎక్కి కూర్చుని తండ్రిమీదకి దానిని దార్లించబోయేక్షణంలో తల్లీ తం మాటాడుకొనటం ప్రారంభించారట. అవి తనకి సంబంధించిన వైనందున దొర్లించక అగి విన్నాడట. తల్లి ఏమండీ, అందరూ అబ్బాయిని పొగుడుతుంటే మీరు శచడిస్తరోమిటి?

98 సుమతి శతకము అందుకు వాడు ఎంత బాధపడుతున్నాడో మీకు తెలుసా? మీకు నచ్చకపోతే ఊరుకోండి కాని, విమర్శించటమేమిటి? అన్నదట. దానికి తండ్రి వెర్రిదానా, నాకు తెలియకా (ప్రేమతక్కువయీ అనుకొంటున్నావా? నేనలా అంటున్నాను కనుక పరాయివాళ్ళు మరీ మెచ్చుకొంటున్నారు. ఆ వంకతో వారి పొగడిక మాటిమాటికీ వింటూ ఆనందిస్తున్నాను. నేనే మెచ్చుకొంటే అబ్బో ఏమి బడాయో, తనకొడుకంతటి వాడు లేడని తానే పొగడుకొంటున్నాడు అని వాళ్ళే విమర్శిస్తారు. అదీ కాక, తమబిడ్డలను పొగడితే వారికి ఆయుశక్షీణమంటారు. వినలేదా? అన్నాడు. ఆ మాటలతో ఆయనమనస్సు తెలిసి, భారవికి తనతప్పు తెలిసి, పశ్చాత్తాామూ తండ్రిమీద భక్తీ పొంగి, అటక దిగి వచ్చి కాళ్ళమీద పడ్డాడు. చేయబోయినపని చెప్పి, తనపాపానికి ప్రాయశ్చిత్తం చెప్పమన్నాడు. ఆయన భార్యతోసహ వెళ్ళి ఆరునెలలు అత్తవారింట్లో ఉండి రమ్మన్నాడు. ఇన్నాళ్ళుంటానని కాని, ఇది కారణమని కాని చెప్పగూడదన్నాడు. మా నాన్నతో విసిగిపోయాను. ఇక ఇక్కడే ఉంటామనమన్నాడు. అలాగే వెళ్ళి, అలాగే చెప్పి, అక్కడ ఉంటున్నారు దంపతులు. ఆత్తవారు కొన్నాళ్ళు అల్హునిమర్యాదలు చేశారు. తరువాత (క్రమదక్రమంగా మర్యాదలు తగ్గించి, ఇంటిలోనివానికంటె హీనంగా చూడసాగారు. ఇంతలో (శ్రావణమాసమూ మంగళగౌరీ వ్రతమూ వచ్చాయి. కూతురు తానూ [వ్రతము చేస్తానంటే, తల్లి నీకదొకటే తక్కువయింది, మీ ఆయనమహాకవి ఉన్నాడుగా, కావలసినసామానులు ఆయనను తెమ్మని చేసుకో*అంది ఆమె బాధపడుతూ భర్తకామాటలు చెప్పింది. భారవీ బాధపడి తాటాకుమీద ఒక్ష క్లోకం వ్రాసి ఇచ్చి ఇది ఆ అంగడివానికిచ్చి నీకు కావలసినవి తెచ్చుకో అన్నాడు..ఇంగడివర్తకుడు చదువుకొన్నవాడు. ఆ శ్లోకం చదివి సంతోషించి కావలసినవన్నీ ఇచ్చాడు.తరువాశ ఆయన విదేశవాణిజ్యానికి వెళ్ళి చిక్కులలో పడి, కొన్ని నెలలుండిపోయి, చివరికి బాగా ధనం సంపాదించి, తిరిగివచ్చాడు. చాలాకాలం గడిచిందికదా, హఠాత్తుగా కనిపించి ఆనందింసజేద్దామని, రాత్రిపూటకూడా అయిందేమో, గోడ దూకి లోపలికి వెళ్ళి, చూచేసరికి తనభార్య మంచంపై పడుకొని నిద్రపోతున్నది. ఆమెప్రక్కనే ఒక మగవాడుకూడా నిద్రపోతున్నాడు. .కోపం వచ్చి మొలనున్న బాకు దూసి, వానిని నరకబోయాడు. పైకెత్తిన కత్తి గోడనున పటానికి టక్కున తగిలింది. అటు చూశాడు. అందులో ఉన్నది బొమ్మ కాదు, తానే గుడ్డ మీద వ్రాయించి పటం కట్టించిన శ్లోకం. అది యిది : నహపా విదధీత న క్రయా మవినేకఃు పరమాపదాం పదమ్‌, వృణుతే హి విమృళ్యకారిణో గుణలుబ్దాః న్వయమేన సంపదః. తొందర పడి ఏ పనీ చేయగూడదు. అవివేకమున్నచోట ఆపదలు కాపురముంటాయి. సంపదలకు సుగుణాలంటే చాలా ఇష్టం. కనుక ఆలోచించి పనులు చేసేవారిని

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 99 సంపదలు స్వయంగా వరిస్తాయి అని దానిభావం. అది చూడగానే భార్యను లేపి వీడెవడని అడిగాడు. ఆమె అతడు వచ్చినందుకు ఆనందిస్తూ అతడు తమకుమారుడే అనీ, ఒంట్లో కొంచెం సుస్తీగా ఉంటే ఊరడిస్తూ అలా ఒరిగి నిద్రప్రోయాననీ చెప్పింది. అతడు తప్పిన (ప్రమాదానికి సంతోషించి భారవిని అపారధనాదులతో సత్కరించాడు. భారవి, తనప్రయోజకత్వం నిరూసింపబడినతరువాత, విస్తుబోయిన అత్తవారిసెలవు తీసుకొని, తండ్రిపెట్టిన గడువూ పూర్తి ఆయినందున, భార్యతో, లభించినసంపదతోసహ తల్లిదం(డ్రులవద్దకు వెళ్ళి, వారికి ఆనందం కలిగించాడు. త్వరలోనే దేశనుంతా ఆ శ్లోకమున్న కిరాతార్డునీయననే కావ్యంద్వారా అతనిని మహాకవిగా గుర్తించింది. అది భారవిపేర పంచకావ్యాలలో నాలుగవదయింది. మూడవ విషయం : తన భార్యఆందం. ఇదికూడా చాలామందివిషయంలో నిజం. తనదికాకుండా ఉన్నంతవరకూ కల కావాలన్న తహతహ, తనదైన తరవాత, చాలామందికి చాలా విషయాలలో ఉండదు. ఈ లోపం గుర్తించి సవరించుకొనటానికి ప్రయత్నించాలి అందరూ, నాలుగవ విషయం : పెరటిచెట్టునుందు. ఇదీ లోకంలో ఉన్నదే. దీనికీ ఒకటవ మూడవ విషయాలలోని కారణాలే వర్తిస్తాయి. దీనికి వివేకం పెంచుకొనటంకంటె విరుగుడు లేదు. ఇక్కడ దొరకదు, పైనుంచి వచ్చింది, చాలా ఖరీదైనది - ఇట్టి భావాలవల్ల మందుమీద మోజూ, అందువల్ల చిశ్వాసమూ, పెరుగుతుండటం ఉన్నదే. కనుకనే “దైవే తీర్థే గరా నుంత్రే దైవజ్జే భేషజే తథా, యాదృశీ భావనా యత్ర సిద్దిర్భవతి తాదృశీ”

  • దైవం, తీర్థం, గురువు, మంత్రం, జ్యోతిష్కుడు, మందు - వీటిమీద మనకు కల భావాన్లిబట్టిఫలం ఉంటుంది అనిన ఆర్యోక్తివల్ల మందు పనిచేయటానికి మానసికకారణం (ప్రధానమని తెలుస్తున్నది, అవ: కొందరిదృష్టిలో వారెకలిమి, లేమి, మరణము, వలపులగురించి చెవ్పుబొతున్హాడు. క. తన కలిమి యింద్రభోగము తన లేమియె సర్వలోకదారిద్ర్యంబున్‌ తవ చావు జగత్ర్రళయము తన వలచినయదియె రంభ తథ్యము సుమతీ, 52 ప్ర: సుమతీ, తన కలిమి = తన సంపద, ఇంద్రభోగము = ఇంద్రుని ఐశ్చర్యమే, తన లేమియె = తన లేమిశఎ = తన పేదరికమే, సర్వ = సమస్తమైన, లోక్షి = జగత్తులయొక్క, దారి[ద్యంబున్‌ = పేదరికముకూడా, తన చావు = తన మరణము, దగత్ర్రళయము 7

100 సుమతి శతకము లోకాలఆంతం, తన వలచినయదియె = తనవలచిన+అది+ఎ = తాను ఎవతెను (్రీమించినాడో ఆమెయే, రంభ = సౌందర్యం మొదలైనవాటికి ప్రసిద్ధురాలైన దేవవేశ్య, తథ్యము.

తా : సుమతీ, కొందరిదృష్టిలో, తమ సంపద ఇంద్రునిఐశ్చర్యంతో సమానం. తమకు దారిద్ర్యం వస్తే సకలలోకాలకూ దారిద్ర్యం వచ్చినట్లే. తమకు మరణం సంభవిస్తే, సకలలోకాలూ నాశనం చెందినట్లే తమకు ఎవతెమీద మోజుకలిగితే ఆమెమా(్రమే, అందరికంటె అందగత్తె అనిపిస్తుంటుంది. ఇది నిజం.

వ్యా £ ఇందులో సామాన్యమానవ్రవృత్తిని చక్కగా వివరిస్తున్నాడు. కొందరు మనుషులుంటారు. వారికి వారిబాగు లోకంబాగు. వారిఓగు లోకంఓగ్సు అన్నట్టు ఉంటుంది. వారికున్నసంపద ఇంద్రునిఐశ్వర్యంతో సమానం అనుకొంటారు. ముళల్లోకాలలోనూ గొప్ప ఐళ్చర్యశాలి ఇంద్రుడన్నది సత్యం. ఇంద్రుడు అన్నపదమే ఇదీ ఐళ్చర్యే అనే ధాతువునుంచి పుట్టింది. అనగా ఐళ్చర్యశాలి, అనగా అందరికంటె ఐశ్చర్యమున్నవాడు అని అర్ధం. ఐళశ్చర్యమున్నవానికే భోగం ఉంటుంది కనుక ఎంత ఐశ్వర్యముంటే అంత భోగం ఉంటుందనే అభిప్రాయంతో మవోభోగం అనవలసినసందర్భంలో దేవేంద్రభోగం ఆంటుంటారు. ఈ స్వార్థపరులు తమ భోగం దేవేంద్రభోగం అనుకొంటారు. భోగాలు ఎనిమిది రకాలంటారు. 1. దాసి, 2. భృత్యుడు, 3. కొడుకు, 4 బంధువు, 5. వస్తువులు, 6.వాహనం, 7. ధనసమృద్ది, 8. ధాన్యసమృద్ధి

  • ఇవి అష్ట్రభోగాల్సు, వీట్రిన్స అష్టైళ్ళర్యాలంటారు.

దాసీ భృత్యస్పుతో బంధుః వస్తు వాహవమేవ చ,

ధవధావ్యసమృద్దిశ్చాస్యష్టభోగాః ప్రకీర్తితాః

తనకు పేదరికం వస్తే అందరికీ పేదరికం వచ్చిందన్నట్టు భావిస్తారట, అలాగే తనకు కష్టం వస్తే అందరికీ వచ్చినట్లే, అంటే తనకష్టాన్ని మించినకష్టం మరొకటి లేదని భావిస్తారట. అలాగే తమకు ఎవరైనా ఒక ఆమెమీద ఇష్టమేర్పడితే, ఆమెను మించినఅందగత్తె మరి సృష్టిలో లేదనుకొంటారట. వీరిది తమ యిష్టమే ఇష్టం అనిన వైఖరి. వీరిది సత్యదృష్టి కాదు. స్వార్థదృష్టి ఇది అలవరచుకొనదగిన దృష్టి కాదు.

ఈ పద్యంలోవి-తను వలచినయదియె అనేపాఠంకంటె, మిగిలిన మూడువాక్యాల నిర్మాణరితినిబద్ధి, తనవలచినయదియె అన్న పాఠం సముచితం, తాను అనే అర్హంలో తను అనేవాడుక శ్రా ధునికం. లి

శ

ఆవ : మనిషి ఉండద్యూనివ్రోట్లు చెప్పుబోతున్లాడు.

కు తనవారు లేన్వ్విశ్విన్సు జనవించుక లేవిచ్రోట జగడముచోటన్‌

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 101 అనుమానమ్రైనచోటను మమజునకున్‌ నిలువందగదు మహిలో సుమతి ర్‌3 ఫ్ర: సుమతీ మనుజునకున్‌ = మనిషికి మహిలోన్‌ = భూమిపై తనవారు = బంధువులు మిత్రులు అయినవారు, లేనిచోటను = ఉండని (ప్రదేశంలోను చనవు = తనసైగాని తనకు గాని అనురాగం, అధికారం ఇంచుక = కొంచెమైనా లేనిచోటను = జగడముచోటన్‌ = కలహం సంభవించే ప్రదేశంలోను అనుమానమైన = అనుమానము+ఐన = తనపై సందేహం తనకు సందేహం కలిగినచోటను నిలువందగదు = నిలువన్‌ = ఉండుట, తగదు = యుక్తం కాదు తా : సుమతీ, మనిషి ఈ లోకంలో కష్టనష్టాలలో ఆదుకొనే, తనను ఆదుకొనేవారు లేనిచోట నివసించగూడదు తనపై ప్రేమా, తనకు అధికారమూ కొంచెమైనా లేనిప్రదేశంలోనూ ఉండగూడదు. నిరంతరంగా కలహం కలిగేచోటనూ ఉండగూడదు. తనమీద కాని తనకు గాని సందేహం కలిగినచోటనూ ఉండగూడదు. వ్యా : కాలం ఒకరీతిగా నడవదు ఎప్పుడు ఎట్టి పరిస్టితి కలుగుతుందో చెప్పలేము. కనుక ఎట్టి పరిస్థితిలోనైనా మనలోని సుగుణదుర్గుణాలతో కాని, మన కలిమిలేములతో కాని మనయోగ్యతాయోగ్యతలతో కాని నిమిత్తంలేకుండా, ఆండదండలు అందించగలవారుండటం ఆవసరం, వారు బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు. అట్టివారు లేని(ప్రదేశంలో నివసించగూడదు. ఒక ప్రదేశంమీద కాని, అక్కడివారిపై గాని, సకారణంగానో, అకారణంగానో, మనకు కొంచెమైనా ఇష్టం లేదు, అక్కడివారికీ మనపై కొంచెమైనా ఇష్టం లేదు, అలాగే ఆ 'ప్రదేశంపై గాని అక్కడి మనుషులపై గాని, మనకు ఏ విధమైన హక్కూ లేదు; అటువంటి (ప్రదేశంలో నివసించగూడదు. అలాగే, ఒకప్రదేశంలోనిజనం, మనతో సకారణంగానో, అకారణంగానో, నిరంతరమూ కలహిస్తూ ఉంటారు. లేదా, వారిలో వారు, ఎల్లవేళలా ఎందుకో అందుకు కలహిస్తూ ఉంటారు. అది వారిస్వభావం. అందువల్ల శాంతి ఉండదు. కనుక అక్కడా ఉండగూడదు. అదీకాక, ఎక్కడైనా వాక్కలహం కాని, కొట్లాట గాని జరుగుతూ ఉండవచ్చు. అలాంటిచోట నిలిచి చాలామంది అదేదో వినోదమన్నట్టు చూస్తూ ఉంటారు. అందువల్ల ఒక్కొక్కప్పుడు ఈ చూచే వారికికూడా తిట్టూపెట్లూ లభించవచ్చు సాక్ష్యం చెప్పవలసి రావచ్చు కనుక, అక్కడి నుంచి తప్పుకొనటమే మంచిది ఆంటున్నాడు అనికూడా చెప్పవచ్చు. ఇదేమి నీతి? కలహించేవారిని విడదీయటం, దుర్చలులను రక్షించటం - ఇవికదా చేయవలసినవి, నిలవకుండా పొామ్మనటమేమిటి? అని ఎవరికయినా అనిపించవచ్చు కాని, అందుకు న!

102 సుమతి శతకము తగిన సామర్శ్యంకూడా ఉండాలికదా. అది లేకుండా కుడిచి కూర్చుని దారే పోయే తద్దినమా మాయింటికి రా అని పిలిచి తెచ్చుకొనటం తగదని చెపుతున్నాడన్నమాట. మనము ఏ పాపమూ ఎరగము. అయినా, ఎందువల్లనో మనమీద ఒక చోటివారికి దొంగలమనో, అపకారులమనో, ద్రోహులమనో, సందేహం కలిగింది, లేదా అక్కడివారిమీద అట్టివారని మనకు సందేహం కలిగింది. రుజువులూ సొక్ష్యాలూ లేకపోయినా, ఒక్కొక్కప్పుడు మనస్సు హెచ్చరిస్తుంది. కనుక అక్కడా నివసించటం ఎప్పటికైనా కీడు కలిగించవచ్చు గనుక తగదు. తనవారుండకపోతేనో? కొందరినైనా తనవారిని చేసుకోవాలి. అనురాగం లేకపోతేనో? కలిగించుకొనటానికి ప్రయత్నించాలి కలహానికి జడియటం పౌరుషమూ? పౌరుషం కాకపోవచ్చు. కాని, ఎల్లప్పుడూ పౌరుషాన్ని వినియోగించటంకాని, వినియోగించవలసిన పరిస్థితులే ఉండటం కాని, క్షేమం కాదు. క్షేమకరమైన సుఖాన్ని అపేక్షించటం పౌరుషంలేమి కాదు. అనుమానం వచ్చిందని అనర్హ్మప్రదేశమా? మనలో లోపం లేకపోయినా ఆవమానించారంటే, అక్కడివారు నిత్యశంకితులన్నమాట. అట్టి స్వభావం ఉండటంవల్ల వారికీ సుఖం ఉండదు, మనకీ ఉండనివ్వరు కనుక దూరంగా ఉండటమే మంచిది. ఈ భావాన్నే మరో కవి ఇలా చెప్పాడు : మచ్చిక లేవిచోట, అనుమానము నచ్చినచోట, వెచ్చుగా( గుచ్చితులున్నవోట, గుణకోవిదులుండనిచోట, విద్యకున్‌ మెచ్చనిచోట, రాజు కరుణించవిచోట, వివేకులున్నచో వచ్చట మోపమం।డు పుగుణాకర 'సెమన్ముయసింగధీమణీ - అని, ఆవ : తాంబూలం, దాంపతృసాఖ్యం మొదలయినవాటి గురించి చెవుబోతునాడు. క. తములము పేయనినోరును రమణుల చనుమొవలమీ6ద రాయనిమేనువ్‌ కమలములు లేనికొలయను హిీమధాముండు లేవిరాత్రి హీనము సుమతీ, క్‌డ్త (ఫ్ర ఏ సుమతీ, తములము సేయని = తములము+చేయని = తాంబూలము వేయని, నోరును =నోరున్నూ రమణుల = స్ర్రీలయొక్క, చనుమొనలమీ(ద = స్తనముల చివరిభాగాలమీద, రాయని = ఒరసికోని, మేనున్‌ = శరీరమూ, కమలములులేని = పద్మాలులేని, కొలంకును = చెరువూ, హిమధాముండులేని = చల్లనికాంతికల చంద్రుడు లేని, రాత్రి = రేయీ, హీనము = తక్కువది. తా ;'సుమతీ, తాంబూలము వేయనినోరు ప్రశస్తమైనది కాదు, కాంతాస్తనా(గ్రస్పర్శ ఎరుగని శరీరమూ ఉత్తమమైనది కాదు, తామరపువ్వులు లేనిచెరువూ అందమైనది కాదు, చందమామ లేనిరేయీ సుఖకరమైనది కాదు.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 103

వ్యా తాంబూలం మనదేశంవారికి చాలా ఇష్టమైనది భోజనానంతరం తప్పనిసరిగానూ ఇతర సమయాలలోకూడానూ చాలామంది తాంబూలం వేసుకొంటూ ఉంటారు. అటు (బ్రహ్మచారులు కాని ఇటు వానప్రస్టులు గొని, సన్యాసులు గాని శాంబూలం వేసుకోగూడదు. గృహస్టులు వేసుకోవాలి కవులు పండితులు మొదలయినవారికి తాంబూలమివ్వటం గొప్ప సత్కారంలో భాగం. దైవపూజలోకూడా తాంబూలం సమర్పించటం విధాయకం జరదాలు, పొగాకు మొదలయిన నిషిద్ధద్రవ్యాలతో సేవించటం దూషితం కాని, గృహస్టులకు తగు సుగంధద్రవ్యాలతో తాంబూల సేవనం విహితమైనది. ఇది ఒక శాస్త్రంగా కళగా పెరిగింది ఎవరికెన్ని ఆకులు ఇవ్వాలి ఎవరు ఎలా వేసుకోవాలి అన్న నియమాలు కూడా ఉన్నాయి. తాంబూలం తొలుత నోటిశుద్ధికొసం ఏర్పడింది. నిత్యమూ తాంబూలం వేసుకొనేవారికి ఆహారాదులు చక్కగా జీర్షమవుతాయి. నోటికి దుర్వాసన ఉండదు. లిప్‌స్టిక్‌ వగైరాలు వాడకుండానే పెదవులు ఎర్రగా ఉంటాయి కాన్సర్‌ వ్యాధికూడా రాకుండా చేస్తుంది తాంబూలం. కనుక తాంబూలం చేయనినోరు ప్రశస్తమైనది కాదనటం సమంజసమే.

కాంతాస్తనాగ్రస్పర్శ లేనిశరీరమూ ఉత్తమమైనది కాదనటమూ ఇట్టిదే. యౌవనంలో ధర్మవిరుద్దం కానివిషయసుఖానుభవ౦ యుక్తమైనదనే శాస్త్రాలు చెప్పాయి.

“శైళనేభ్యస్తనిద్యావాం యౌవనే విషయైషిణాం,

వార్దకే మునివృత్తీవాం యోగేవాన్తే తముత్యజామ్‌” అని కాళిదాసు రఘువంశరాజులు బాల్యంలో విద్యలభ్యసించేవారు. యౌ; వనంలో విషయసుఖాలనుభవించేవారు, ముసలితనంలో మునులలా ఉండేవారు, అంతకాలంలో యోగమార్గంలో శరీరం విడిచిపెట్టేవారు అని కీర్తించాడు.

ధర్మావిరుద్దోభూతేషు కామోస్మి భరతర్షభ - ప్రాణులలో ధర్మవిరుద్ధం కానికామం భగవత్స్వరూపమని భగవద్గీతలో భగవానుడు వివరించాడు.

సరస్సుపర్యాయపదాలలో కమలాకరమన్నదొకటి. లక్ష్మికి పద్మాలయ, పద్మ, కమల పర్యాయపదాలు వికసించినపద్మాలున్నసరస్సు మాచినవారికి కాని కమలములు లేనికొలకు హీనము అని ఎందుకన్నాడో తెలియదు.

చంద్రుడు లేనికేయి హీనముకూడా ఇటువంటిదే. చంద్రునివల్లనే రాత్రి ఏర్పడుతున్నది. యే ద్వే కాలం విధత్త అని కాలం ఏర్పరచే ఇద్దరిలో చం(ద్రుడొకడన్నాడు కాళిదాసు.

శర్వరీదీపకశ్చంద్ర: ప్రభాతోద్దీసకో రవిః;

తైలోక్యదీనకో ధర్మః సుపుప్రః కులదీసక?

క్‌2ై

104 సుమతి శతకము (విక్రమార్కచరి(త్ర) రాత్రికి వెలుగునిచ్చేవాడు చంద్రుడు, ప్రాతఃకాలానికి వెలుగునిచ్చేవాడు సూర్యుడు, ముల్గోకాలనూ ్రకాశింపజేసేది ధర్మం, కులానికి వెలుగునిచ్చేవాడు సుపుత్రుడు అన్నారు. ఎన్ని చుక్కలున్నా చంద్రుడులేకపోతే అందం లేదు అవ : ఖలుడు విషమయుడని చెవ్పుబోతున్లాడు. క, తలనుండు విషము ఫణికిని వెలయంగా( దో(కనుండు వృశ్చికమునకున్‌ తల తోక యవక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. 5్‌5్‌ ప్ర* సుమతీ, విషము = గరళం, ఫణికిని = పడగగల పాముకు, తలన్‌ = శిరస్సుభాగమైన నోటిలో, ఉండున్‌ = ఉంటుంది వృళ్చికమునకున్‌ = తేలుకు, వెలయంగాన్‌ = వెలయన్‌+కాన్‌ = స్పష్టమయేటట్టుగా తోంకన్‌= తోకలో ఉండున్‌ = ఉంటుంది, ఖలునకున్‌ = దుష్టునికి, నీచునికి, తల తోక యనక = తల 'తోక + అనక = శిరస్సు, పుచ్చం అనే భేదం లేకుండా నిలువెల్లన్‌ = నిలువు+ఎల్లన్‌ = ఆకృతి-రూపం - శరీరం ఆంతటా విషము ఉండును, కదరా = కదయ్యా, తా వ సుమతీ, విషం పాముకి శిరస్సులోని నోట్టోమాత్రమే ఉంటుంది. తేలుకి తోకచివరమాత్రమే ఉంటుంది. దుష్టునికి నోట్టోనూ తోంకచివరామాత్రమే ఆనే హద్దు లేకుండా శరీరంఆంతటా విషం ఉంటుంది వ్యా ; విషం ఆంటే గరళం, అంటే ప్రాణంతీసే బాధ కలిగించే పదార్ధం. అది పాముకి నోట్లోమాత్రమే ఉంటుంది. తేలుకి తోకచివరమాత్రమే ఉంటుంది దుష్టునికి శరీరమంతటా ఉంటుంది, అనటంలో విశేషం. అతడు చేసే ఆలోచన ఎదుటివాని (ప్రాణాలు తీస్తుంది, పలికే పలుకూ ప్రాణాలు తీస్తుంది. చేసే పనీ ప్రాణాలు తీస్తుంది అతడు ఏ అవయవంతో ఏమి చేసినా, ఇతరులకు పరమాపకారంగా పరిణమిస్తుంది. పాము ఎవరిని కరిస్తే వానిప్రాణాలే పోతాయి, ఈ దుష్టుడనే పాము చంపే పద్దతి వింత అయినది. వీడు ఒకని చెవి కొరుకుతాడు, దానికి ఫలముగా మరొకని(ప్రాణాలు పోతాయి. కనుక వీడు అసలు పాముకంటె ప్రమాదకరమైనవాడు. అహో ఖఇలభుజంగన్య విచితోయం వధడక్రమః అన్యస్య దళతి శ్రోత్రం ప్రాజ్టైరవ్యో వియుజ్యతే | అన్నాడొక కవి చాడీకోరుల లక్షణం చెప్పాడిక్కడ ఇట్టి వారికి విరుగుడేమిటో మరొక కవి చెప్పాడు: ఇతరులను బాధించే దుష్టులు ముళ్ళలాంటి వాళ్ళు. వీళ్ళకి రెండే ప్రతిక్రియలు. చెప్పు పుచ్చుకొని ముఖం బ్రద్దలు కొట్టాలి. లేదా, దూరంగా విడిచిపెట్టాలి -

వివేకానందినీ వ్యాఖ్యాసహితం = 105 ఖలానాం కంటకొనాం చ ద్వావేవ హి ప్రతిక్రియే ఉపానమ్మఖభంగో వా దూరతః పరివర్షనమ్‌ - అని. అవ . వేళ్ళది ఆఅసత్యవ్రవర్తనం ఆమెను నమ్మరాదు అని చెవ్పుబోతున్హాడు: క. _తలపొడవు ధనము బోసిన వెలయాలికి నిజము లేదు వివరింపంగా6 దల దడవి బానంీసిన వెలయాలిని నమ్మరాదు వినరా సుమతి. ర్‌6 ప్ర సుమతి, వివరింపంగాన్‌ = వివరింపన్‌+కాన్‌ = స్పష్టంగా ఆలోచిస్తే, తలపొడవు = శిరస్సుయొక్క ఎత్తున, ధనముంబోసినన్‌ = ధనమున్‌+పోసినన్‌ = సొమ్ము రాశిగా పోసి ఇచ్చినప్పటికీ, వెలయాలికిన్‌= ఖరీదుకు అమ్ముడుపోయే స్త్రీ అయిన వేశ్యకు నిజము = సత్యం, లేదు = ఉండదు, తలందడవి = తలన్‌+తడవి = తలన్‌ = శిరస్సును తడవి = ఆంట్సి ముట్టి, స్పృశించి బాసంజేసినన్‌ = బాసన్‌+చేసినన్‌ = ప్రమాణం చేసినప్పటికీ, వెలయాలిని, నమ్మరాదు = నమ్మన్‌+రాదు = విశ్చసింపగా తగదు, వినురా = వినవయ్యా తా ఏ సుమతీ, వేళ్ళను నుంచోబెట్టి, ఆమెతలయెత్తు ద్రవ్యం రాళిగా పోసి ఆమెకు ఇచ్చినప్పటికీ ఆమె సత్యంప్రకారం వర్తించదు ఆమె నీనెత్తిపై చేయిపెట్టి ప్రమాణం చేసినాసరే, ఆమెను విశ్చసించగూడదు వ్యా : ఇక్కడ వెలయాలు అన్నపదాన్ని ఒక కులపుస్రీసర్యాయంగా కాక్క ఒక వృత్తినవలంబించిన ఉవిదకు పర్యాయంగా తీసుకోవాలి. ఆమెను నుంచోబెట్టి, అమెనిలువెత్తుసామ్ము రాశిగా పోసి యిచ్చినా ఆమె తనతో ఉండేవారితో సత్యం పాటించటం ఉండదు, అమె నీనెత్తిమీద చేయి ఉంచి (ప్రమాణం చేసినప్పటికీ, ఆమెను నమ్మగూడదు. అనటంలో విశేషం గమనించాలి. లోకంలో ఇతరులెవరికైనా కొంతద్రవ్యం ఇస్తే వారు అనినమాటకు కట్టువడి ఉంటారు. ఎంత ఎక్కువగా (ద్రవ్యమిస్తే అంత ఎక్కువగా కట్టువడేవారుంటారు. కేవల సత్య్రీతితో కాకపోయినా, ఇంత ద్రవ్యమిచ్చారే అనే కృతజ్ఞతాభావంతోనైనా, వారు కట్టుపడి ఉంటారు. వెలయాలు కట్టుపడి ఉండాలనుకొనటమే తప్పు. అది ఆమెతప్పు కాదు, ఆ వృత్తిది. అందరూ అతిముఖ్యమైనదిగా భావించే శరీరసంబంధంలోని పవిత్రతను, ఆమె ధనంకోసం విడిచి పెట్టినపుడు, ఒకరిచ్చినది ఎంతయినప్పటికీ, పరిమితమయిన ధనంతో తృప్తిచెంది, శాశ్వతంగా ఉంటుందనుకోవటం వెర్రి. ఉండాలనుకోవటం అత్యాశ. శరీరసంబంధానికే విలువ పోయినపుడు మరికొంత ధనం వచ్చే ఆవకాశం దొరికినపుడు సత్యం అమెకు అడ్డం రాలేదు. అలాంటిదే, నెత్తిమీద చెయ్యివేసి ప్రమాణం చేసినా నమ్మగూడదనటమూ. ధనంవెలకంటే పాటించవలసినది లేదన్నది ఆ వృత్తికి మూలాధారం. ప్రమాణం

106 సుమతి శతకము పాటించకపోతే నష్టం ఏమిటి? పాపం. ఆ పాపం ఆ వృత్తికే పెట్టుబడి అయితే, ప్రమాణం పాటించకపోవటం అంతకంటె పాపమా అన్న ఆలోచన ఆమెకుండదా? కనుక ప్రమాణం ఆమెకు ఒక బంధం కావాలనుకోవటమే వెర్రి. కనుక ఆమె సత్యానికి కట్టువడదు. ఆమెప్రమాణం విశ్వాసకారణం కాకపోవటమే సహజం. ఆవ : మనిషి చూడముచ్చటగా ఉండటం అవసరమని చెప్పుబోతున్నాడు : క. తల నూసిన నొలుమాసిన వలునలు మాసినను బ్రాణనల్లభునైనన్‌ గులకాంతలైన రో(తురు తిలకింసగ భూమిలోన( దిరముగ సుమతి, ర్‌ ప్ర. సుమతీ తలమాసినన్‌ = శిరస్సుపై జుట్టు మిక్కిలిగా పెరిగిపోయినా, ఒలు = ఒడలు, ఒళ్ళు ఒలు = శరీరం, మాసినన్‌ = దుమ్ముగొట్టుక పోయినా వలువలు = వస్త్రాలు, మాౌసినను = ముటికివైనా, ప్రాణవల్లభునైనన్‌ = (ప్రాణవల్లభున్‌ + ఐనన్‌ = 'ప్రాణములకంటె 'ప్రియుడయినవానివైనా, కులకాంతలైనన్‌ = కులకాంతలు+ఐనన్‌ = భార్యలైనప్పటికీ, తిలకింపంగన్‌ = తిలకింపన్‌౪కన్‌ = చూడటానికి, భూమిలోనన్‌ = భూలోకంలో, తిరముగన్‌ = స్ర్రీరంగా రోంతయరు = అసహ్యించుకొంటారు. తా : సుమతీ, భూలోకంలో ఒకడు వివాహం చేసుకొన్నభర్తయే కావచ్చు, భార్యకు ('ప్రాణాలకంటె ప్రియమైనవాడే కావచ్చు, అయినా వానిజుట్టు తెగ పెరిగిపోయినా, ఒళ్ళు దుమ్ముగొట్టుకు పోయి అన్నా, కట్టుకొన్న బట్టలు మురికిపట్టి ఉన్నా, ఆతనిని చూడాలంటే ఆ భార్యకూడా తప్పక అసహ్యించుకొంటుంది. వ్యా ఈ పద్యంలో అద్బుతమైన మనోధర్మం చెప్పాడు. ప్రాణులు తమశరీరం, వాడుకొనే వస్తువులు, నివాసముండేచోటు, వీలయినంత ఇంపుగా, చూడముచ్చటగా ఉంచుకొనటానికి ప్రయత్నిస్తుంటాయి, ఉంటారు, పళుపన్షులలోకూడా ఈ లక్షణం కనపడుతుందంటే, మనిషి ఎంత ప్రయత్నించాలి? ఎక్కువమంది అలా ప్రయత్నిస్తూనే ఉంటారు కాని, కొంతమంది సోమరితనంవల్లనో ఇతరకారణాలవల్లనో కాని, ఈ (ప్రాధమికమైన అవసరాన్ని గమనించరు. జుట్టు ఉండవలసినరీతిలో ఉంచుకొనటం ఒళ్ళు స్నానాదులచేత పరిశుభ్రంగా ఉంచుకొనటం, కట్టుకొనే బట్టలు మురికిలేకుండా ఉంచుకొనటమూ కంటికింపుగా ఉండటానికెంత అవసరమో ఆరోగ్యంతో ఉండటానికీ, మనస్సు ఉత్సాహంతో ఉండటానికీకూడా అంత అవసరం. మన దృష్టిలోనే కాక నలుగురూ ఆసహ్యించుకోకుండా ఉండాలన్నా, ఈ మూడు విషయాలలోనూ (శ్రద్దతో ఉండటం అవసరం,

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 107 వస్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చః నకారైః పంచభిర్హీనో నరో నాయాతి గౌరనమ్‌ 1 - వస్త్రం, వపువు (=శరీరం), వాక్కు. విద్య, వినయం అనే ఈ వకారపంచకం సరిగా ఉండనివానికి గౌరవం ఉండదని ఒక సూక్తి జుట్టు సరయినరీతిలో ఉంచుకొనటానికి పెద్దఖర్చు ఉండదు. అలాగే శరీర పారిశుద్ద్యానికీ. వస్త్రాలు ఖరీదైనవి కావాలని చెప్పలేదు, మురికిలేనివిగా ఉండాలని చెప్పాడు. ఇవి మూడూ సరిగా లేనివానిని, ప్రాణప్రియునయినా పతివ్రత అయిన భార్య అయినా, అసహ్యించుకొంటుందంటే, ఇతరులసంగతి చెప్పనక్కరలేదు మనవారికి మొదటినుంచీ ఈ సౌందర్యదృష్టి ఉన్నందుననే, పనికిమాలిన వాడనటానికి పర్యాయంగా, తలకు మాసినవాడని ఈసడింపుగా పలుకుతారు. ధనహీనుడయితే చినిగినవ(స్త్రాలు ధరించవచ్చు. కాని, మాసినవి ధరించవలసిన పనిలేదు. మాసినవ(స్తాలు సోమరితనానికి చిహ్నం. మురికిగుడ్డలు ధరించినవాడు పితృక్రియలో భోక్తగా పనికిరాడు. దానార్హుడు కాడు. వాడు అలక్ష్మీ నివాసస్థానం. మురికికి దారిద్ర్యానికీ సంబంధమేమిటి? దానార్హుడు కాకపోవటమేమిటి? మురికి పేరుకొనేది సోమరితనంవల్ల సోమరి పనిచేయడు. పనిచేయనిదే దారిద్ర్యం పోదు లక్ష్మి రాదు. కనుకనే అందరూ అసహ్వించుకొనటం. అసహ్యం చేరటానికే కాదు చూడటానికి కోడా. 66వ పద్యవ్యాఖ్యూడా చూడండి అవ : నంపాదించుకొన్లు ద్రవ్యం అనుభవించాలని చెప్పుబోతున్లాడు : క తానమభవింసనర్థము మానవపతి జేరు( గొంత మణి భూగతమౌ* గానల నీ(గలు గూర్చిన తేనియ యొరు! జేరువట్లు తిరముగ సుమతీ! 58 ప్ర : సుమతీ, కానలన్‌ = అడవులలో, ఈంగలు = తేనెటీగలు, కూర్చిన = ప్రోగుచేసిన తేనియ = తేనె, ఒరున్‌= ఇతరుని చేరునట్టు = పొందే విధంగా తాను = సంపాదించినవాడు అనుభవింపని = ఉపయోగంపని, అర్ధము = ధనం, మానవపతిన్‌ = నరులను పాలించువానిని, రాజును, చేరున్‌ = పొందుతుంది, కొంత = దానిలో కొంచెము భాగం, మజి = ఇంక్కా తిరముగన్‌ = తిరము+కన్‌ = సిరంగా, భూ! తమౌన్‌-= భూగతము+బౌన్‌ = భూమిలో పోయినది అవుతుంది. తా : సుమతీ ఎవడయినా తాను సంపాదించిన ద్రవ్యం తానే ఉపయోగించుకోవాలి అలా చేయకుండా అట్టే పెడితే, ఆందులో కొంత పరిపాలకునిపరమవుతుంది ఇంకా భూమిలో దాచి ఉంచినది, భూమిలోనే పోతుంది. ఎలాగంటే, అడవులలో తేనెటీగలు తేనెను పట్టులోకి చేరుస్తాయి కాని, అవి (త్రాగవు. దానినెవరో వచ్చి కొజేస్తారు. అలాగే ఇదీన్ను

108 సుమతి శతకము వ్యా . ద్రవ్యసంపాదనం (ప్రాణులకు సహజమైన లక్షణం. సంపొదించేది నిజానికి దానిని ఉపయోగించటానికి. ఈ ఉపయోగం రెండు రకాలు సొంతానికి ఇతరఅవసరాలకి అని. దీనినే అనుభవించటం అనవచ్చు, దీనినే అచ్చతెలుగులో తినటం పెట్టటం ఆంటారు. ఆలా తాను ఉపయోగించకుండా ్రోగుచేసి అట్టేపెట్టి ఉంచుతారు చాలామంది. కొంత ఇతరులకు కనపడకుండా ఇదివరకటి రోజులలో నేలలో పాతిపెట్టేవారు. దీనినే సంస్కృతంలో నిక్షేపం అనీ తెలుగులో పాతు అనీ అంటారు. ఈ పాతినది ఎవరికీ చెప్పకుండాచచ్చిపోతే అది అలాగే నశించిపోతుంది లేదా, ఎప్పుడో ఎవరో అదృష్టవంతులకు దొరికితే దొరుకుతుంది, కాని, సంపాదించినవానికి సంబంధించినంతవరకూ పోయినట్టే లెక్క, అలా దాచటానికి వీలులేనిది పరిపాలకులపరమవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, తేనెటీగలు తేనె ప్రోగుచేయటంలా ఉంటుంది. అవి ప్రోగుచేస్తాయి కాని త్రాగవు, తేనెపట్టు చూచినవారెవరో దానిని తీసుకొని ఉపయోగించుకొంటారు. తేనెటీగలకు నంపాదనగ్రమా, రక్షణశ్రమామాత్రమే మిగులుతుంది రక్షణప్రయత్నంలో చచ్చిపోతుంటాయికూడా. అందుకనే - అర్భావానూర్దనే దుఃఖం ఆర్జీతావాం చ రక్షణే వాకే దుఃఖం వ్యయే దుఃఖం ధిగర్థం దుఃఖభాజనమ్‌ 1 సొమ్ము సంపాదించటంలోనూ దుఃఖమే, సంపాదించినది కాపాడటంలోనూ దుఃఖమే, పోయినా దుఃణమే, ఖర్చైనా దుఃఖమే. - ఇన్నివిధాల దుఃఖకారణమైన సొమ్మెందుకు? ఛీ అన్నారు. కనుకనే ఇక్కడ ఈకవిగారిలాగే భర్యహరి ఇంతకంటె స్పష్టంగా “దానము భోగము నాశము, పూనికలో మూడుగతులు భువి ధనమువకున్‌, దానము భోగము వెజు(ని దీనునిధనమునకు గతి తృతీయమె సాస(గున్‌ - ధనం ఉన్నదంటే, ఒకరికింత పెట్టాలి, తాను తినాలి. లేదో, నశించిపోతుంది. కనుక పెట్టని తినని వానిసొమ్ముకి నాశనమే గతి అన్నాడు. అవ : చ్రాడీకోరులమాట పట్టుకొని వరిపాలకులు వ్రజలకు కీడు చేయగూడదని చెవ్పుబోతున్నాడు : క దగ్గణ కొండెము చెప్పెడు 'ెగ్గడపలుకులకు రాజు ప్రియు(దడై ముటి తా వెగ్గు ప్రజకాచరించుట బొగ్గలక్రై కల్పతరువు. బొడుచుట సుమతీ. 59 ప్ర సుమతి, రాజా = పరిపాలకుడు, దగ్గణ = తనవద్ద కొండెము = ప్రజలపై చాడ్తీ, చెప్పెడు = వచించే (ప్రెగ్గడ = మంత్రి యొక్క పలుకులకు = మాటలకు, ప్రియుంై =

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 109 ప్రియుండు+ఐ = ఇష్టపడినవాడై మటి = ఇంకా తాను = స్వయంగా ఎగ్గు = కీడు ప్రజకు = జనులకు, ఆచరించుట = చేయటం బొగ్గులక్రై = బొగ్గులకున్‌+ఐ = బొగ్గులకోసమై కల్పతరువున్‌ = కల్పవృక్షాన్ని పొడుచుట = నరకటం తా : సుమతీ, మంత్రి రాజుదగ్గర చేరి ప్రజలమీద చాడీలు చెపుతుంటే, ఆ మాటలకు ఇష్టపడి రాజు ప్రజలకు అపకారం చేయటం, బౌగ్గులకోసం కల్పవృక్షాన్ని నరకటమే కాగలదు. వ్యా : ఈ పద్యంలో పరిపాలకుడు చాడీకోరులతోనూ ప్రజలతోనూ ఎలా

వ్యవహరించాలో వివరిస్తున్నాడు. ఒకడు, తలచుకొంటే మేలు ఐనా కీడు ఐనా చేయగల ఉన్నతపదవిలో ఉన్నాడంటే, అతని యిష్టం సంపాదించటానికి ఆందరూ ప్రయత్నిస్తూ ఉంటారు ఒకరియిష్టాన్ని సంపాదించటానికి సులువైన మార్గం వారినిగురించి యితరులు ఏమనుకొంటున్నారో రహస్యంగా వారికి తెలియచేయటం. జనం సామాన్యంగా ఒకరిగురించి యితరులు అనుకొనే చెడుమాటలు చెప్పరు. అలా చెప్పినందువల్ల వీరి మనస్సు కష్టపడుతుందనీ, ఒకరిమీద ఒకరికి అట్రీతి కలిగించటం పాపమనీ, అలా చెప్పకుండా ఉంటారు. అట్టి పరిస్టితులలో మిమ్మల్నిగురించి వీరు మంచిగా మాట్టాడుకుంటున్నారు అని చెప్పినందువల్ల కంటె ఇలా మీకు అపకారం చేయబోతున్నారు

అని చెప్పినందువల్ల, ఆ వినినవారికి ఈ చెప్పినవారు, ఎంతో ఆప్తులలా కనబడి, చాలా ఇష్టులు అయిపోతారు. ఈ చెప్పేవారికి ఉండే రాగద్వేషాలనుబట్టి, ఇలాంటివారు

సామాన్యంగా రాగద్వేషాలు బలంగా ఉన్నవారే అయి ఉంటారు కనుక, వీరు చెప్పే

మాటలు నూటికి తొంబైపాళ్ళు అసత్యములై ఉంటాయి వారిమీద వినేవారికి కలిగినఇష్టం

ఆ మాటలలోని సత్యాసత్యాలను పరిశీలించనివ్వదు. వెంటనే వీరికి ఎవరిమీద చెప్పారో

వారిమీద క్రోధం కలిగిస్తాయి. క్రోధంవల్ల అపకారం తలపెడతారు. ఇలా పరిపాలకులు

అయినవారు, చెప్పుడుమాటలు విని ప్రజలకు అపకారం చేయటం, బొగ్గులకోసం

కల్పవృక్షాన్ని నరికివేయటం అని చెపుతారు ఇక్కడ (ప్రజలు కల్పవృక్షంవంటివారు.

చాడీలు చెప్పేవారు, లేదా, చాడీలు బొగ్గులవంటివి కల్పవృక్షం అంటే,

కోరినవారియోగ్యతాయోగ్యతలగురించి ఆలోచించకుండా కోరినవి అన్నీ ఇచ్చే చెట్టు. ఆ

చెట్టుక్రింద నిలిచినవాడు, ఏది కావాలని కోరినా, ఆ చెట్టే ఇస్తుంది. ఏ అన్నం

వండుకోడానికో బొగ్గులు కావలసినవాడు, కట్టెలను కాలిస్తే కాని బొగ్గులు రావు కనుక,

కల్పవృక్షాన్ని నరికి ఆ కట్టెలు కాల్చటం ఎటువంటిదో, ప్రజలకు కీడుచేయడం

అటువంటిది. అన్నం కావాలని కోరితే అన్నం ఇచ్చే చెట్టును, బొ గ్గులకోసం నరుకుకోవడం

తెలివితక్కువ. పరిపాలకులకు (ప్రజలు కల్పవృక్షంలాంటివారు. ప్రజలను చక్కగా పెంచితే వారినుంచి పరిపాలకులకు పన్నుల రూపంలోనో, బహుమతులరూపంలోనో

110 సుమతి శతకము ఏది 'కావలిస్తే అది, ఎంతకావలిస్తే అంత, లభిస్తుంది. అలాంటివారికి కీడు చేస్తే ఏదీ లభించదు సరకదా, వారే నశించిపోతారు. అందువల్ల చివరకు నష్టం కలిగేది పరిపాలకులకే. అందువల్ల, చాడీకోరులమాటలు నమ్మకూడదు నమ్మినా, ఎవరిమీద చెప్పారో వారికి, తొందరపడి” ఆపకారం చేయకూడదు అని చెపుతున్నాడు. చేమకూర వేంకటకవి, రఘునాధనాయకుడు తనతో ఎవరైనా ఎవరిమీదనైనా కొండెములు చెపితే, వానికి మేలు చేయమని మనవి చేసినట్టుగా భావించేవాడని ప్రశంసించాడు. వావిక్షై మవవిచేసినకైనడి వెంచు అని: ఇంకొక కవి, కొండెములు చెప్పువారికేదండవంబు మంచిదని రాజడుగ నిట్లుమంత్రి పలికె కొండెములు వీను చెవులను గోయుదేవి కొండెగాండ్రకు వలదింక దండవమవి చమత్కరించాడు. 'ఈ చాడీలు చెప్పేవారికి కలిగే ప్రయోజనం ఏమీ ఉండదనీ కుక్కలు ముట్టుకొని పాత్రలను పాడుచేసినట్టు, వీరు పాత్రులను పాడుచేస్తూంటారనీ' ఒక సంస్కృతకవి చేప్పాడు. శు 0 చ సిశునావాం చ పరగేహవ్రనేశివామ్‌ (యోజనం వ పశ్యామా పార్రాణాం దూషణాదృతే _____-అనకు నంబంధించినవారికి ఎంత ఐళ్చర్వం ఉన్లా తన అదృ్భష్టాన్లిబట్టే తనకు లభిస్తురిదని చెవ్పుబోతున్హాడు న్‌ క్ర -ధవపతిసభుండై యుండియు- నేవయంగా శివుండు భిక్షమత్తం; వలసెన్‌ దనవారికెంత గలిగివ౯ దన భాగమె. తవకుణాక తథ్యము వశీ, 60 _/ప్ర స్తుమత్సి ధనపత్తి= కుబేరుడు, సఖుండై = సఖుండు+ఐ = చెలికాడ్డై, ఉండియున్‌ = ఉన్నప్పటికినీ, ఎన్యయంగాన్‌ ఇ ఎనయన్‌+కాన్‌ = తనకు తగినట్టుగా, శివుడు = శంకరుడు భిక్షము = బిచ్చము. ఎత్తంగవలసెన్‌ = ఎత్తన్‌+కన్‌+వలసన్‌ = తీసుకొనవలసి వచ్చింది. తనవారీకీన్‌= తనకు సంబందించినవారికి. ఎదత గలిగనన్‌= ఎంత+కలిగినన్‌= ఎంత సంపద ఉన్నప్పుటిక్‌తన భాగ్యమె =“తన భాన్యము+ఎ = తన అదృష్టముమ్యత్రమే, తనకుంగాక = తనకున్‌+కాక జతవకు లభించును గాని, ఇతరమునుబట్టి కాదు, తధ్యము = సత్యం “తొ శ్‌ నుమ; కుబేరుడు సృష్టిలోనిధనానికి "అంతటికీ అధెకారి. అతడు శివునష్థేహిరుడు. స్రయినప్పటిక్‌ శివుడు బిచ్చమెత్తుకుంటున్నాడు. దీనినిబట్టి తనకు సంబంధించినవోరికీ ఎంత ఐళ్ళర్వము ఉన్నపుటికీ తన అదృష్తాన్సిబటిమా(త్రమే తనకు లభిస్తురిది అని తెలుస్తుంది వం. ఎ సన్ని బస6

  • వ్వా: ఈపద్య్వంలో దైవమహిమ చెపుతున్నాడు. దైవం దిష్టం, భాగధేయం, భాగ్యం, నియతి, విధి = ఇవి పర్యాయపదాలు. అదృష్టంకూడా ఇట్టిదే. తన బంధువులో మి(త్రులో

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 111 ఎంతో భాగ్యవంతులు అయి ఉండవచ్చు. వారు ఇవ్వదలచఛుకొన్నా, తాను పుచ్చుకో దలచుకొన్నా, తన అదృవ్వాన్నిబట్టి మాత్రమే తనకు లభిస్తుంది. అదృష్టాన్ని మించి వీసమెత్తు లభించదు. అదృష్టానికి చిన్నం ఎత్తు తగ్గదు. ఇతరకారణాన్ని బట్టి లభించదు. కుబేరుడు విశ్రవసునికొడుకు. లంకాపట్టణానికి అధిపతి. అతనిని, అతనిసవతితమ్ముడు రావణుడు చెంపమీద కొట్టి, లంకనుంచి తరిమివేశాడు. ఆయనకు "పరమేశ్చరుడు మిత్రుడు కనుక ఆయన దయతలచి, ఈయనకు తనకైలాసపర్వతంమీద, ఉత్తరంవైపున, అలకానగరమనే పట్టణం ఉండటానికి ఇచ్చి, సృష్టిలోని సమస్తధనంపైని అధికారిని చేశాడు. తనవల్ల అధికారము, ఐళ్వర్యము, ని ము పొందిన కుబేరుడు ఈశ్చరునిభోజనానికి తగినవీర్పాటు చేయలేడా? చేయగలడు. కాని ఈశళ్చరుడు బిచ్చమెత్తుకొని గడుపుకొంటున్నాడు. కనుక ఎవరికైనా అదృష్టాన్నిబట్టి లభిస్తుంది కాని ఎక్కువ కాదనీ, ఇతరకారణాన్నిబట్టి కాదనీ కవి చమత్కరిస్తున్నాడు. శివుడు బిచ్చమెత్తుకొనేది తనకు లేకకాదు. అది వేరే విషయం. అదృష్టం ముఖ్యం అనటానిక భాస్కరశతకంలోకూడా ఒక చక్కనిపద్యం ఉన్నది. వానికి విద్యచేత సిరివచ్చె నటంచును విద్య వేర్వంా బూవిన( బూను(గాక తనపుణ్యము చాలకదృష్టరేఖకున్‌ బూనంగ వెవ్వండోవు నరిపో( జెవిం బెంచునుగాకదృష్టతా హీ్‌నుండు కర్ణభూషణములెట్టు గడింపంగ నోపు ఖాన్కెరా - అని, " కుంతిదేవికూడా - భాగ్యం ముఖ్యం, భాగ్యవంతుని కను గాని శూరునీ, పండితునీ కాదు. శూరులు పండితులు ఐన'నా కొడుకులు అడవికి పోయారు.- “భాగ్యవంతం ప్రసూటయీథాః న శూరం వ చ సండితం శూరాళ్చ కృతవిద్యాశ్చ- మమ-పు(త్రా ననల గతాః” వనికి అంటుంది. ఈ చెప్పినదానికి అర్ధం బంధుమిత్రసహాయం కాని స్వాప్రయత్నరి కాని న్‌ మాలినవి అని కాదు, సుకృతం ముఖ్యం అని చెప్పటమే. ఒకనాడు మనం చేసుకొన్నపుణ్య శై సుకృతం, అదే అదృష్టం. అంటే, కంటికి కనపడకుండా ఉండి- పలొన్ని ఇచే'ది. దాని దైవమనీ, భాగ్యమనీ, విధి అనీ, నియతి అవీ పేర్లు, కనుక సుకృతం ఆచరించుకొనండి, అని హెచ్చరిస్తున్నాడు. నేటిసుక్సతం రేపు అదృష్టమై ఫలిస్తుంది. అవ న త్డాపలకు. టా చేస్తే మా నుఖమూ_ కలుగుతాయని చెప్పుబోతున్లాడు : క్క ధీరులకు( చేయుమేలది పారంబగు నాధికేళసలిలముభంగిన్‌ గౌరవముమ మతి మీందట భూరిసుఖభానహము వగును భువిలో సుమతీ, ల

112 సుమతి శతకము ప్ర: సుమతి, భువిలోన్‌ = భూలోకంలో, ధీరులకున్‌ = జ్ఞానులైనవారికి, చేయు = ఆచరించే, మేలది = మేలు+అది = ఉపకారం అది, సారంబగు = సారంబు+అగు = బలమైన స్థిరమైన అంశమైన, నారికేళ = కొబ్బరికాయలోని, సలిలముభంగిన్‌ = నీటిలా, గౌరవమును = మన్నననూ, మటి = ఇంకా, మీందటన్‌ = తరువాత, భూరి = అధికమైన, సుఖావహమున్‌ = సుఖ+ఆవహమున్‌ - సుఖాన్ని కలిగించేదీ, అగును = అవుతుంది. తా : సుమతి, ఈ లోకంలో జ్ఞానులైనవారికి ఉపకారం చేయాలి. అలా చేస్తే, అది బలం కలిగించే స్థిరాంశమైన కొబ్బరికాయలోని నీటిలా అనంతరకాలంలో గౌరవంగా సుఖంగా మారుతుంది, వ్యా : ఇందులో, కవి జ్ఞానులకు ఉపకారం కర్తవ్యమని చెప్పాడు. దానివల్ల గౌరవం కలుగుతుంది, చాలా సుఖంకూడా కలుగుతుంది అనీ చెప్పాడు. గౌరవాన్నీ సుఖాన్నీ ఎలా కలిగిస్తుందంటే, కొబ్బరినీటిలా అని పోలిక చెప్పాడు. ఈ భావం బాగా విమర్శిస్తే కాని మనస్సుకు పట్టదు. ఇందులో (ప్రధానమైన ఉపదేశం జ్ఞానులకు మేలు చేయాలి అన్నది. ధీరులంటేనే పండితులు, జ్ఞానులు అని ఆర్ధం. వారికి ఉపకారం చేయటమంటే 'సేవించటమన్నమాట. భూనాయకం వా ధనవాయకం వా భజన్‌ భునం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథం న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యమ్‌ అన్నాడు అభినవకాళిదాసు నడిమింటి సర్భమంగళేశ్చరశాస్రేగారు. భూనాయకుణ్ని సేవిస్తే భూమినిస్తాడు, ధననాయకుణ్ని సేవిస్తే ధనమిస్తాడు, అలాగే, విఘ్ననాయకుణ్ణో "సేవిస్తే విఘ్నమిస్తాడమా, కనుక ఆయనను సేవించను, దూరంనుంచే నా జోలికి రావద్దని నమస్కరిస్తాను అని దాని అర్థం. ఇంతకూ, ఏది ఉన్నవారిని సేవిస్తే, వారు తమదగ్గర ఉన్నదిస్తారని ఫలితార్థం. జ్ఞానమున్నవారిని సేవిస్తే జ్ఞానమిస్తారు. ఈ మాట భగవానుడే చెప్పాడు. “తద్విద్ది ప్రణిపాతేవ పరిప్రశ్నేన సేనయా, ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్భినః - తత్ప్వద్రర్భులైన జ్ఞానులకు సాష్టాంగనమస్కారం చేసి సేవించుకొని (ప్రళ్నించు. వారు నీకు జ్ఞానం ఉపదేశిస్తారు అని, జ్ఞానం కలిగితే, లోకంలో కీర్తీ దానివల్ల గౌరవమూ కలుగుతాయి. వాటివల్ల ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ మహాసుఖమూ కలుగుతుంది. ఆ జ్ఞానం సేవవల్ల కలుగుతుంది. సేవే ఉపకారం. ఉపకారానికే మేలనిమరో పేరు. కనుక, ధీరులకు ముందు చేసినమేలే, అనంతరకాలంలో గౌరవసుఖాలు కలిగిస్తుంది ఆంటున్నాడు. చేసిన ఉపదేశమే చక్కగా మననం చేసి (గ్రహించదగినదైతే, దానికిచ్చిన పోలిక మరింత

వివేకానందినీ వ్యాఖ్యాసహితం లు! భావగంభీరంగా ఉంది, సారంబగు నారికేళ సలిలముభంగిన్‌ అని. పారో బలే స్టిరాంశే చ అని నిఘంటువు, ఇక్కడ సారమైన నారికేళసలిలం, గౌరవానికీ భూరిసుఖొనికీ పోలిక. ఆ నారికేళసలిలాన్ని ఏవి ఇస్తాయి? కొట్బరిచెట్టు, జ్ఞానులకు సేవలా కొబ్బరిచెట్టకు చేసిన ఉపకారమేమిటి? అవి చిన్నవిగా మొక్కలుగా ఉన్నప్పుడు, అవి బ్రతికి, వేరూనుకొని, నిలవటానికి పోసిన కాసిని నీళ్ళు. ఆ మామూలు నీళ్ళు బలమిచ్చే సుఖాన్నిచ్చే కొబ్బరినిళ్ళవుతున్నాయి. “*ఫ్రథధమనయనసి పీతం తోయమల్పం న్మరంతః శిరసి నిహీతభారా వారికేళా నరాణాం సలిలమవ్చుతకల్పం దద్యురాజీనితోరతం నహి కృతముపకారం పొధవో విస్మరంతిొ - మొక్కలుగా ఉన్నప్పుడు కొబ్బరిచెట్టు తమకు తాగటానికి నరులు పోసిన కాసినినీళ్ళను తలచుకొంటూ, వీటిబొండాలను నెత్తిని బెట్టుకొని మోస్తూ, వారికి అమృతంలాంటినీటిని జీవితాంతమూ ఇస్తున్నాయి. తమకు చేసిన ఉపకారాన్ని సజ్జనులు మరచిపోరుకదా అని, విశ్రమార్కచరిత్రలో పూర్వులు చెప్పినదానిఛాయనే ఈ కవి ప్రదర్శించాడు. ఈ పద్యంలో భూరిశుఖభావహము అనిన పొరాంతరం ఆం.ప్ర. సొ. (ప్రతిలో ఉన్నది. భా ఉంటే శు ఉండాలి, సు ఉంటే ఖా ఉండాలి. అవ: ఒంటరిపయనం,. వైరివిందు, వరధభనం, వరుషూక్కు ఈగవని చెప్పుబోతున్నాడు = క్త వడునకుమీ తెరు నొక్కట సుడువకుమీ శష్రునింటం గూరిమి తోడన్‌ ముడువకుమీ సరధనములు ముడువకుమీ యొరులనునసు నొవ్వయ సుమతీ. 62 ఫ్ర: సుమతీ, ఒక్కటన్‌ = ఒంటరిగా, తెరువు = బాటలో, నడువకుమీ = నడచిపోవద్దు సుమా, ఇత్రునింటన్‌ = శత్రు+ఇంటన్‌ = వగవానియింటీలో, కూరిమితోడన్‌ = చెలిమితో, కుడువకుమీ జ తినవద్దు, పరధనములు = ఇతరులసొమ్ములు, ముడువనకుమీ = మూటగట్టకు = దొంగిలింపకు, ఒరుల మనసు = ఇతరులమనస్సు, నొన్న(గన్‌ = నొవ్వన్‌+కన్‌ = బాధపడే విధముగా, నుడువకుమీ = పలుకవద్దు. తా : సుమతీ, తోడులేకుండా ఒంటరిగా బాటలో నడబిపోవద్దు, పగవానియింటిలో మైత్రితో ఏమీ తినవద్దు. ఇతరులద్రవ్యములు మూటగట్టవద్దు, ఇతరులమనస్సులకు కష్టంకలిగే విధముగా మాటాడవద్దు, కౌ

114 సుమతి శతకము వ్యా 2 పూర్వం దేశంలో అడవులు ఎక్కువగా ఉండేవి. ఇందరు జనం లేరు కనుక జనసంచారమూ తక్కువగా ఉండేది. సుఖకరమైన బాటలూ తక్కువగా ఉండేవి. కనుక్క సర్పాలు, క్రూరమృగాలు, దోపిడీదొంగలు - వీరి బాధలు అధికంగా ఉండేవి. కనుక జనం గుంపులుగా ప్రయాణాలు చేసేవారు. ఇప్పటికీ సర్ప-మృగాదిబాధలు చాలాచోట్ల తగ్గినా, బస్సులలో, రైలుబండ్లలోకూడా, దొంగలూ, దుష్టులూ, శత్రువులూ, పెట్టేబాధలు ఉండనే ఉంటున్నాయి. కనుక ఒంటరిప్రయాణం మంచిది కాదన్న సూచన, నేటికీ అవసరమే, పగవాడు చెలిమి చూపించినా, పగవాడే అన్నమాట మరిచిపోగూడదు. (ప్రత్యక్షంగా 'ప్రాణాలు తీయలేనివాడు పరోక్షంలో తీయటానికి ప్రయత్నిస్తాడు. ఆహారపానీయాదులలో విషాదిపదార్థాలు కలిపినందున ప్రాణాలు వెంటనే పోకపోయినా, కాలాంతరంలో మెల్లగా ప్రాణాలు తీయవచ్చును. ఆధునికకాలంలోకూడా అమెరికా సి.ఐ.ఏ. గూఢచారి సంస్థల వంటివి, ఇలాంటి ప్రక్రియలలో పగవారి ప్రాణాలు తీయటానికి ప్రయత్నాలు చేయటం, వారినివేదికలు బహిర్గతం ఐనందువల్లనే తెలుస్తున్నది, బహూకరించిన చుట్టలు కాల్బటంద్వారా, ఖరీదైన మింక్‌కోటు ధరించటంద్వారా, ఆ కారణాలవల్ల వచ్చినట్టు అనుమానమైనా రాకుండా, రకరకాలరోగాలు వచ్చే ఏర్పాట్టు చేసినట్టు తెలుస్తున్నది. కనుక్క పగవారియింట్లో మైత్రితో ఏమీ తినవద్దు, అని హెచ్చరించటం అవసరమైనదే. శ్రీకృష్ణుడు పాండవులరాయబారిగా హస్తినాపురం వెళ్ళినపుడు, దుర్యోధనుడు మహావైభవంతో విందు ఏర్పాటు చేస్తాడు. కృష్ణుడు అక్కడికి వెళ్ళక, తనను పిలువని విదురుని యింటికి భోజనానికి వస్తున్నానని తానే చెప్పి మరీ వెళ్ళాడు. ఇదేమని దుర్యోధనుడు అడిగితే, స్పష్టంగా నీవు మా మిత్రుడవు కావు గనుక రానని చెపుతాడు. పరధనములు ముడువవద్దు అనటంకూడా యుక్తమే. ఇతరుల (ద్రవ్యాన్ని ఆశించనే కూడదని మనధర్మం మొదటినుంచి చెపుతున్నది. ఆ లోకంలో సౌఖ్యంనిమిత్తం ఇతరులు దానముగా ఇచ్చినప్పటికీ పుచ్చుకొనే అర్హత ఒక్క ద్విజునకే మనధర్మం అంగీకరించింది. తదితరులకు ఇవ్వవద్దని చెప్పలేదు. అది కనికరంతో ఈఊఈయవలసినది, ఇచ్చేది అని చెప్పింది. అందుకు కారణం ద్విజుడు తనసమయం అంతా లోకానికి క్షేమం కలిగించే తపస్సు, విద్యాబోధ మొదలైన వాటిగురించి వెచ్చిస్తుండటమే. కనుకనే ఈశావాస్యోపనిషత్తు - “ఈశావాస్యమిదం పర్వం యత్కిం చ జగత్యాం జగత్‌, తేన త్యక్తేన భుంజీథాః మాగ్భధ;ః కన్య స్విద్ధనం - ఈ జగత్తూ ఇందులో ఏ కొంచెం ఉన్నదో అదీ, ఈశ్చరునిదే కనుక, ఆతడు ఇచ్చినదానిని మాత్రమే అనుభవించాలి, ఎవనిసొామూ ]] ఆశించగూడదు అని చెపుతున్నది.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం శక్‌

ఇతరులమనస్పు నొచ్చుకొనేట్టుగా మాట్టాడవద్దనేది, ఇహానికీ పరానికీ అతిముఖ్యమైన ఉపదేశం. మాటతీరునిబట్టే మనిషికి మిత్రులు శత్రువులు ఏర్పడతారు. పరుషంగా మాట్లాడటం సప్రవ్యసనాలలో ఒకటిగా మహాభారతం చెపుతున్నది.

వెలది, జూదంబు, పొనంబు, వేట, సలుకు

ప్రల్లదవమును, దండంపు( బరుసదవము,

సొమ్ము నిష్ట్రయోజవముగా నమ్ముపేత

అనెడి సప్తవ్యననముల( జవదు తగుల అని. కొలు జారితే తీసుకోనచ్చు గాని వోరుజారితే తీనుకోలేమని సొమెత.

తనువున విరిగినయలుగుల

ననువుగం బుచ్చంగవచ్చు నతినిష్టురతన్‌

మనమున వాటినమాటలు

వినుమెన్ని యుసాయములను వెడలునె యధిపా - అని కూడా భారతమే చెపుతున్నది.

కాకేమి తన్ను తిట్టెనె

కోకిల తననేమి ధనము కో కొమ్మనెనే,

లోకము పగయగుః బరుసని

వాకున( జుట్టమగు మధురవాక్యమువలనన్‌ అని కవికర్షరసాయనం చెపుతున్నది. పరుషవాక్కులవల్ల మనస్సువిరిగిపోతుంది.

ఇమము విరిగెనేని యినునూరు మున్మూరు(

గాచి యతుకవచ్చు. గమ్మరీండు

నునసు విరిగెనేని మరి యంటరాదయా

విశ్వదాభిరామ నినురవేమ అని వేమన చెప్పాడు.

బెడిదముగ గత్తి గొడ్డటం బొడువం దెగివమ్రానం జిగురు పొడమ( బలుకులన్‌

జెడం దునిసినకార్యంబు నిగుడనేరదు మరల నెట్టు. గురునంశవిధీ - పరుషవాక్కులవల్ల పాడయిపోయినపని కొనసాగదని భారతమే చెపుతున్నది. కనుక పరుషవాక్కులే పలుకకూడదు. మనసు. నొచ్చుకొనేటట్టుగా అసలు పలుకకూడదు.

అవ : ఎట్టి వరిస్టీతులలోనూ నమ్మగూడనివారిగురించి చెప్పుబోతున్నాడు.

క్క _వమ్మకు సుంకరి జూదరి

నమ్మకు మగపాలివాని నటు నెలయాలిన్‌ 5్‌8ి

116 సుమతి శచకము నమ్మకు మంగడివానిని నమ్మకు నుజీ హామవుస్తు నననిని సునుతి. 63

(ప్ర; సుముతీ, అవనిని = భూలోకంలో, సుంకరిన్‌= సుంకము+జరీన్‌ = పన్నురాబట్టేవానిని, జూదరిన్‌ = జాదము+అరిన్‌ =జూదము అడేవానిని, నమ్మకు = విశ్శసించవద్దు, అగసాలివానిన్‌ = స్వర్గకారుని అనగా బంగారు పనిచేసేవానిని, నటున్‌ = అభినయించే వానిని, వలయాలిన్‌ = వెలఆలిన్‌ = వేళ్యను; నమ్మకుము, అంగడివానిని = కొట్టువానిని, నమ్ముకుము, మజీ = ఇంకా, వామహస్తున్‌ = ఎడమచేతివాటముకలవానిని లేదా, పొట్టిచేతులవానిని నమ్మకు.

తా : సుమతీ, పన్నులు వసూలుచేసేవానిని, జూదము అడేవానిని, బంగారుపని చేసేవానిన్మి అభినయము చేసేవానిని, వేశ్యను, కొట్టులో సరుకులు అమ్మేవానిని, ఎడమచేతినాటం కలవానిని, లేదా, పొట్టివేతులవానిని విశ్చసించవద్దు.

వ్యా; పన్నులు వసూలు చేసేవానిసనీ ఎదుటివానినుంచి డబ్బు రాబట్టటం, కొందరు రాబట్టినదంతా ఏలికకు అందజేస్తారన్న నమ్ముకం లేదు. అడి రసీదులు బేనికాలం. ఆదీకాక రాబట్టదగినదానికంటె తక్కువ రాజేసి కొంత తనకిమ్మునవచ్చు. తన మామూలు తనకివ్వకపోతే ఏక్కువ పన్నువేస్తానని బెదిరించి, తాను సొమ్ము కాేయవచ్చు. పన్ను పెరగకుండా చేస్తానని సొమ్ము తీసుకొని, ఏలికదృష్టిలో తాను మంచినాడుగా మిగలటంకోసం పెరగటం అపకపోవచ్చు. దానివల్ల ఏలికకు జనానురాగం పోతుంది. కనుక వీనిని విశ్శసించగూడదు.

జూడమాడటంలో సామాన్యంగా మాయపద్దతులు అవలంబిస్తుంటారు. అసలు జూదమాడి గడించాలనుకోవటంలోనే ఎదుటివానిని పాడుచేసే తాను బాగుపడాలనే మనస్తత్య్యం ఉంది. ఈ మనస్త్రత్యంతో మాయచేయటానికీ పాడుచేయటానికీ అలవాటు పడినవాడు ఆ విద్య అందరిమీదా ప్రయోగిస్తాడు. అదికాక, జూదం వ్యసనం. వ్యసనానికి లొంగినవాడు వ్యసనం తీర్చుకొనటానికే ఏ ఉపాయమైవా అనలంబిస్తాడు. ఏమైనా చేస్తాడు. కనుక నమ్మగూడదు.

బంగారపుపనివాడు సామాన్యంగా బంగారంలో రాగివంటివికలిపీ కొంతా, తూకంలో

  • కొంతా హరిస్తుంటాడు. ఈ హరణం పట్టుకొనగలశక్తి పనిచేయించుకొనేవారికి

సామాన్యంగా ఉండదు. విలువైనది తాను దొరకకుండా దొంగలించే ఆవకాశమున్నపుడు లోబడకుండా ఉండటం కష్టం, అలవాటుగా పరిణమించినపుడు అందులో నేర్చుకూడా పెరుగుతూ ఉంటుంది. కనుక కాజేస్తుంటాడు. అందుకే నమ్మవద్దనటం. ఇక్కడ అగసాలి అన్నపదం కూడా కులవాచకంగాకాక వృత్తికలవానికి వాచకంగా (గ్రహించటం న్యాయం. ఇపుడు అన్ని సనులూ అన్ని కులాల వారూ వేస్తున్నారు.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం [117 నటుడుఅంటే అభినయం నాట్యం చేసేవాడు. నాట్యమంటే అవస్థను అనుకరించటం. ఎవరిఅవస్టనో తనదిగా అభినయించటానికి అలవాటుపడినవాడు, తనలో లేనిభావాలు ఉన్నట్టు ప్రదర్శించటం అలవ్నాటైనవాడు, ఆ పని నిత్యజీవితంలోకూడా చేయవచ్చు. స్త్రీవేషాలు వేసే పురుషులు కొందరు నిత్యజీవితంలోకూడా (్రీలలా త్రిప్పుకొనటమూ, పురుషవేషాలు వేసేస్తీలలో పురుషులచాలికలు కనిపించటమూ చూస్తుంటాము. కనుక నటుల అసలుభావాలేవో, తెచ్చిపెట్టుకొన్న అభినయభావాలేవో, తెలుసుకొనటం కష్టమవుతుంది కనుక, నటుని నమ్మవద్దరటున్నాడు. వెలయాలిని నమ్మవద్దనటమూ ఇట్టిదే. సామ్ముకోసం లేని వలపుఉన్నట్టు ప్రదర్శించటం ఆమెపని. సొమ్మైపోయినవానిని నిర్దాక్షిణ్యంగా వదలి, కలవానిని పట్టుకొనటం ఆమెకు అవసరం. అదీ వృత్తిధర్మంలోనిభాగం. నిజమైన (ప్రేయసి'ప్రేమలా ఆమె ప్రేమ స్టిరమైనదని కాని, ధర్మపళ్నిలా ఆమె కలిమిలేములలో తన్నుమాత్రమే అనుసరించి ఉంటుందని కాని, నమ్మటం ఆమెవృత్రినిబట్టి ఏర్పడే మనః ప్రవృత్తిని నిర్లక్ష్యం చేయటమవుతుంది. అంగడివానిని నమ్మవద్దనటం సామాన్యంగా అంగడివారు అనుసరించే పద్ధతులనుబట్టి చెప్పినమాటగా తోస్తుంది. తాను అమ్ముతున్న సరకు యథార్ధస్వరూపాన్ని చెప్పటం, దానికి న్యాయ్యమైన వెలను నిర్ణయించి అమ్మటం, కల్తీ చేయకుండా ఉండటం, కొలతలలో తూకాలలో మోసంచేయకుండా ఉండటం, అందరికీ ఒకవెలకు విక్రయించటం, కొనేవారిఅవసరమూ - సరకు తగినంత అందుబాటులో లేకపోవటమూ చూచి ధరలు పెంచకుండా ఉండటం - ఇట్టివి అంగడివారు పాటించవలసిన ధర్మాలు. వీటిని పాటించేవారు తక్కువ కనుక, అంగడివానిని నమ్మవద్దనటం. ఏమి వ్యాపారీ, విచారంతో ఉన్నావు? అని ్రశ్చిస్తే, విచారం కాక ఏముంది? సరుకుకొనటానికి మిత్రుడూ రాలేదు, తెలివితక్కువవాడూ రాలేదు అని సమాధానం చెప్పాడట. అనగా మైత్రివల్దా తెలివి తక్కువ తనంవల్లా వీరు తనను నమ్ముతారు కనుక, వీరిని మోసగించటం తేలిక, మోసంతో సంపాదించినది సంతోషకారణం అని ఆతడు భావిస్తున్నాడన్నమాట. ఇట్టివారి గుణం గమనించిన ఒక సంస్కృతకవి - తులేన కించిత్తులయా చ కించిత్‌, మానేన కించిత్‌ శనథేన కించిత్‌, కించిచ్చ కించిచ్చ హరత్యశేషం, నణిక్సమో నాస్తే ప్రశస్తచోరః - తూచటంవల్ల కొంచెం, త్రాసువల్లకొంచెం,కొలతవల్లకొంచెం, ఒట్టుపెట్టుకొని కొంచెం, కొంచెం కొంచెంగా ఏమీ మిగల్బకుండా మొత్తం కాజేస్తాడు. వర్తకుని వంటి గొప్పదొంగ ఉండడు - అన్నాడు. ఇక్కడ అంగడివానిని అన్నది కులవాచకం కాదనీ, అంగడి వ్యాపారం వృత్తిగాగలవానీని అనీ (గ్రహించాలి. . వ్యాపారులు న్యాయమైన లాభంతో 59

118 సుమతి శతకము కల్తీలేనిసరకు అమ్మటంతోనూ, ఉద్యోగులు యజమానులు ఇచ్చే జీతంతోనూ, తృప్తిచెందకపోవటం మనదేశంలో పరిపాటి కనుక, ఇట్టి నీతుల అవసరం ఏర్పడింది. ఎడమచేతి వాటముగలవారినో, పొట్టి చేతులవారినో, ఎందుకు నమ్మవద్దన్నాడో, ఇంకా పరిశీలించాలి. మాకు తెలిసిన ఈ లక్షణాలు కలవారిలో నమ్మదగనివారు లేరు. సుంకరి అన్నపదానికి ఈ అర్థంలో ప్రామాణికమైన ప్రయోగంగా సూనని.దీనినే ఉదాహరించింది. ఆవ : భయంవల్ల వనులు అవుతాయని చెవ్పుబోతున్నాడు : క, నయమున బాలుం ద్రావరు భయమునను విషమ్మునైన భక్షింతురుగా నయమెంత దోషకారియొ భయనే చూపంగవలయు బాగుగ సుమతి. 6 ప్ర: సుమతీ, జనులు (ఇదిఅధ్యాహార్యం), నయమునన్‌ = న్యాయమువల్లా, ధర్మమువల్డా, పాలున్‌ = పాలనుకూడా, (త్రావరు = త్రాగరు, భయమునను = భయమువల్ల, విషమ్మునైనన్‌ = విషమ్మున్‌ + ఐనన్‌ = గరళాన్ని అయినప్పటికీ, భక్షింతురుగా = భక్షింతురు+కా = తింటారుకదా, నయము = న్యాయం, ధర్మం, ఎంత = ఎంత ఎక్కువ పరిమాణం కల, దోషకారియొ = దోషకారి+ఒ = తప్పుచేసే చేయించే గుణమున్నదో తెలియదు, భయమే = భయము+వీ = భయాన్నిమాత్రమే, బాగుగన్‌ = బాగు+కన్‌ = బాగు అగునట్టుగా, ఎక్కువగా, చూపంగవలయున్‌ = చూపన్‌+కన్‌*వలయున్‌ = చూపించటం కోరదగినది. తా : సుమతీ, న్యాయమాడి, ధర్మమని చెప్పి, పాలు (త్రాగమన్నా త్రాగరు. వారినే తినకపోతే ఏదో చేస్తామని భయపెడితే, విషమైనాసరే తింటారు. నయంవల్ల ఎంత దోషం కలుగుతుందో చెప్పటం కష్టం. కనుక పనులు కావాలంటే, చేసేవారిని ఎక్కువగా భయపెట్టాలి. వ్యా : నయం అంటే న్యాయం, ధర్మం. ఇవి రెండూ సంస్కృతపదాలు. ఈ రెంటినీ తెలిపే ఒకే ఒక తెలుగుపదం పాడి. నాయనా, నీది ఎదిగే వయస్సు. ఏ వయస్సుకి తగిన “పనులు ఆ వయస్సులో చేయటం న్యాయం. ఈ వయస్సులో పాలు (త్రాగాలి. పాలు బలకరమైన పుష్టికరమైన ఆహారం, నీ ఆరోగ్యానికీ బలానికీ మంచివి అని న్యాయమాడి చెప్పినా, ఇతరపానీయాలు (త్రాగుతాము అంటారు కాని పాలు (త్రాగరు. నాయనా, నీవు సొత్సికాహారం తినే వంశంలో పుట్టావు. పాలు సొత్మ్యికాహారం. సాత్ష్యికాహారం తినటమే ధర్మం - అని ధర్మం చెప్పినా (త్రాగరు, వాళ్ళనే చేతికి విషమిచ్చి, ఇది విషం, ఇది తింటే ప్రాణాలు పోయేమాట నిజమే కాని, తినకపోయావో, అదైనా తినకపోయానే అని

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 119 పశ్చాత్తాపపడేటట్టు చేస్తాను. అని భయపెడితే మాత్రం విషంకూడా తింటారు. కనుక ఎంత భయపెడితే అంతగా పనులవుతాయి అంటున్నాడు. ఇలా ఈ కవి చెప్పటానికి కారణం, లోకంలో ఇప్పటికీ వ్యాప్తిలో ఉన్న కొందరు జనులనమ్మకమే అయి ఉంటుంది. దీనికి మూలం తైత్తిరియోపనిషత్తులో ఉంది. భీషాఒస్మాద్వాతః పవతే, భీషోదేతిసూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ, మృత్యుర్దానతి పంచను: (బ్రహ్మానందవల్లి, అనువాకం -8) అతని భయంతో గాలి వీస్తున్నది, అతని భయంతో సూర్యుడుదయిస్తున్నాడు, ఆతని భయంతోనే అగ్ని, ఇంద్రుడూ కూడా (తమ విధులు నిర్వర్తిస్తున్నారు), ఐదవదైన మృత్యువు పరుగుపెడుతున్నది - అని. అంతా భయంతోనే నడుస్తున్నదన్న అభిప్రాయమే మానవ(ప్రవృత్తిని _మలుస్తున్నదనిపిస్తున్నది. వానికి భయభక్తులు లేవు అన్నమాటలో, భక్తికంటే భయానికి ప్రాధాన్యం ఇవ్వటం కనిపిస్తున్నది. భార్య భర్తకి, కొడుకు తండ్రికి చిన్నవాడు "పెద్దవాడికి, సేవకుడు యజమానునికి, శిష్యుడు గురువుకి, ప్రజ అధికారికి. భయపడాలి అన్న అభిప్రాయమే జనులనడవడిని నిర్దేశిస్తున్నది, అనురాగానికీ వివేకనికీ రెండవస్థానమే లభిస్తున్నది. కనుకనే నేటికీ భర్తలు భార్యలను భయపెడుతున్నారు. తండ్రి చిన్నప్పటినుంచీ కొడుకును భయపెడుతున్నాడు. పెద్దవాడు చిన్నవాడిని భయపెడుతున్నాడు. యజమానుడు సేవకుని భయపెడుతున్నాడు. గురువు శిష్యునికి బెత్తంతో భయం చెప్పటంతోనే విద్యాభ్యాసం మొదలవుతున్నరి. ఇందువల్ల మానవ సంబంధాలు వక్రిస్తున్నాయనిపిన్తున్నది. భయవడినవాడు భయపెట్టినవానిని ద్వేషించటం నహజం. భయంస్పానాన్ని (్రేమా వివేకమూ ఆ(క్రమించవలసిన అవసరమున్నది. అవ: పెత్తనం చేసేవారు ఎలాంటివాడు కావాలో ఎలాంటివారు కాకూడదో చెప్పుబోతున్లాడు : కు వరపతులు మేర దప్పిన దిరమొప్పంగ విధవ యింట దీర్పరి యైనవ్‌ గరణము వైదికుండైనను మరణాంతకమౌను గాని మానదు సుమతీ. 65 ఫ్ర: సుమతీ, నరపతులు = రాజులు, జనపరిపొలకులు, మేరందప్పినన్‌ = మేరన్‌+తప్పినన్‌ = మేరన్‌ = ఎల్లను, హద్దును, మర్యాదను, తప్పినన్‌ = అతొక్రమించినా, విధవ = వితంతువు, తిరమొప్పంగన్‌ = తిరము + ఒప్పన్‌*కన్‌ = స్థిరము తగునట్టుగా, అనగా కదలకుండా, ఇంటన్‌ = ఇంటిలో, తీర్చరి = తీర్పు+అరి = అధికారిణి, ఐనన్‌ = ఐననూ, వైదికుండు = వేదంలో 60

120 సుమతి శతకము చెప్పబడినదానిని అనుసరించే ఒక తెగ బ్రాహ్మణుడు, కరణము = (గ్రామగణకుండు, ఐనను ౯ ఐనా, మరణాంతకమౌనుగాని = మరణ+అంతకము+జొను+కాని = మరణ = చావు కలిగేటట్టు, అంతకము '= అంతంచేసేది, టౌను = అవుతుంది, కాని = తక్క, మానదు = తప్పదు.

తా : సుమతీ, ప్రజాపరిపాలకులు హద్దు దాటినా, అనగా ధర్మమర్యాద అతిక్రమించినా, ఇంటిలో వితంతువు కదలకుండా పెత్తనదారయినా, తూ చా తప్పకుండా వేదధర్మం అనుసరించే విప్రుడు గ్రామగణకుడైనా, అది చావుతో సమానమవుతుంది.

వ్యా : ఈ పద్యంలో, కవి, కుటుంబం, (గ్రామం, రాజ్యం - వీటిని తీర్చిదిద్దేవారు ఎట్టివారైతే వాటిలో ఉండే జనానికి బాధలు కలుగుతాయో వివరించాడు. మానవజీవితం గురెంచి ఈ కవికి కల అవగాహన ఈ పద్యంలో మరో మారు వ్యక్తమవుతుంది. ఇల్టు, ఊరు, దేశం అన్నవి మనిషిబ్రతుకులో అతి (ప్రధానమైనవి. ఇవి ఒకదానికంటె మరొకటి విశాలమైనవి. ఇవి సరిగా ఉంటేనే జీవితం. వీటిలో ఏ ఒకటి సరిగా ఉండకపోయినా అంతకంటె మరణమే మేలనిపిస్తుంది. వీటిపై అధికారం నెరపేవారి మనస్తత్వాన్నిబట్టి వీటిపరిసాలనమూ దానినిబట్టి వీటిలోనివారి కష్టసుఖాలూ ఉంటాయి.

వీటిలో ముందు చెప్పినది దేశపరిపాలకునిగురించి. యథారాజా తథాప్రజా అన్నారు. దేశపరిపాలకుడు సరయినవాడయితే, దేశం అంతా సరిగా ఉంటుంది. అతడు హద్దుమీరకుండా ఉంటే, అంటే ధర్మమర్యాద ఆతిక్రమించకుండా ఉంటే, అందరికీ హద్దూ పద్దూ ఉంటుంది. ఆతడు ధర్మప్రకారం నడుచుకొంటే, అందరూ అతనినే అనుసరిస్తారు. కనుకనే ధర్మస్వరూపుడు అనిపించుకొనిన రాముడు, వారికి ఆదర్శప్రాయుడుగా, వారికి అసోహ నిలువకుండా ఉండటంకోసం సీత నిరపరాధిని అని తెలిసికూడా, తనకుకూడా కష్టదాయకమే అయినా, సీతాపరిత్యాగం సహించాడు. పరిపాలకుడు ధర్మం ఆచరించితే సరిపోదు, అతిక్రమించకుండా కూడా ఉండాలి.

రాజ్యం సరిగా ఉన్నా, ఇంట్లో తీరు సరిగా లేకపోతే సుఖం ఉండదు. ఇంటిపెత్తనం వహించేవారుకూడా రాగద్వేషాతీతులుగా, నిష్పక్షపాతులుగా, ఇంటిలోనివారి అచ్చటా ముచ్చటా ఎప్పుడు తీర్చవలసినది అప్పుడు తీర్చీవారుగా, తమ యిష్టం మాత్రమే కాకుండా, అధర్మం కాకుండా ఉన్నంతవరకూ, అందరిఇష్టమూ వీలయినంతవరకూ గమనించేవారుగా, అందరిసంతోషమే తమ సంతోషంగా భావించేవారుగా, తాము కష్టపడి అయినా అందరినీ సుఖపెట్టేవారుగా, ఇంటిలోనివారు ఎవరు తమపట్ట ఎలా (ప్రవర్తించినా తాముమాత్రం వారిపట్ల ఉదారంగా మన్నించేవారుగా, ఇంటిలోనివారు ఎవరు ఏ విషయంలో అసమర్హులయినా, ఇంటిలోని ఆహారవ(స్తాదుల ఏర్పాటులోమాత్రం

వివేకానందినీ వ్యాఖ్యాసహితం క్ష21 తారతమ్యం చూపకుండా, ఎవరిఅవసరానికి తగిన రీతిని వారికిచూచేవారుగా ఉండటం అవసరం. దీనికి వితంతువు అర్హురాలు కాదు అని కవి చెపుతున్నాడు. చాలామంది వితంతువుల్లు ఇంటిపెత్తవం తదితరులకంటి సమర్ధంగా నిర్వహించినవారున్నారు, వారిపెత్తనమే లేకపోతే ఆ కుటుంబం ఏమయిపోయేదో అన్నంత చాకచక్యంతో నిర్వహించినవారున్నారు. అయినా, కవి ఇలా చెపుతున్నాడంటే కారణం పరిశీలించాలి. 'పెత్తనదారుకుండవలసిన లక్షణాలుండాలంటే, ఆ పెత్తవదారుకుండనలసినవీ ఉండకూడనివీ కొన్ని పరిస్థితులున్నాయి, అసంతృప్తమైన జీవితం గడిపేవారు, జీవితంలో సుఖపడే అవకాశం ఏమాత్రం లేనివారు, గర్భభారమూ ప్రసవవేదనా సొంత పిల్లల ఆళలూ అల్లరీ తెలియనివారు, సామాన్యంగా ఇతరులు సంతోషంగా ఉండటం కాన్ని, వారిలోని చిన్న చిన్నలోపాలు కాని, సహించలేరు. కఠినహృదయులై ఉంటారు. ఇలాంటివారు ఇంటిపెత్తనం వహిస్తే, ఇంటిలోనివారు నవ్వినా, సంతోషించినా, సుఖించిసా, మంచిబట్టలు కట్టుకొన్నా. వారిలో ఎవరికి వీమంచి జరిగిన్నా వీరు సహించలేరు. ఇలాంటివారిని ఆంగ్లభాషలో శాడిస్టులు అంటారు. వీరికి ఇతరులబాధ అనందం కలిగిస్తుంది. కనుక నిరంతరం ఇతరులను బాధిస్తూ ఉంటారు. ఇట్టివారు ఇంటిపెత్తవదారులు అయితే మరణాంతకం అవుతుంది అనటంలో సందేహం లేదు.

సర్వాధారమైన రాజ్యానికి అధిపతి ఆయినవానిని గురించీ సర్వావస్థ్రలలోని సర్వాలోచనలకు కేంద్రమైన యింటిపెత్తనం గురించీ చెప్పి, బహిరంగజీవితంలో ఎక్కువ సంబంధం ఉండే ఉన్నఊరి పెత్తనంగురించి చెపుతున్నాడు. వేదాలలోచెప్పబడిన ధర్మాన్ని ఆచరించటం ప్రధానంగా భావించే విప్రుడు, స్వరమైనా తప్పకుండా వేదం చదవటమూ, వేళ తప్పకుండాస్నానమూ సంధ్యావందనమూ అగ్బిహోత్రాదులూ చేయటమూ, అలవాటైన పరంపరలో పుట్టినవాడైనందున కావచ్చు, సామాన్యంగా ముక్కుకు సూటిగా ప్రవర్తించేవాడై ఉంటాడు. కనుక యితరులు అలా ప్రవర్తించాలని భావిస్తాడు. (గ్రామాధికారి వేరే ఉన్నప్పటికీ (గ్రామంలోని ప్రజల సుఖశాంతులు గ్రామ గణకునిపై ఆధారపడి ఉంటాయి. వారి ఆస్తిపాస్తులు, ఆదాయవ్యయాలు, పాడిపంటలు, కలిమిలేములు, 'స్నేహవిరోధాలు, మొదలైన సర్వవిషయాలమీద అతని'ప్రభావం ఉంటుంది. వ్యక్తిగతమైన ధర్మవర్తనం వేరు, పరిపాలననిర్వహణం వేరు. సామాన్యనీతి వేరు, పరిపాలకనీతి వేరు. వ్యక్తిధర్మంలో తప్పుగా కనిపించినది, షరిపాలకధర్మంలో ఒప్తు కావచ్చు. పరిపాలకుడు కొన్ని విషయాలూ కొందరి చేరాలూకూడా కొంత కాలమూ, కొంతవరకూనూ, ఒక్కొక్కపుడు ఉ పేక్షించినట్టు వ్యవహరించవలసి ఉంటుంది. వ్యక్తిగతజీవితంలో వేదధర్మ౦ం తు.చ. తప్పకుండా ఆచరించటానికి అలవాటుపడినవాడు ఇలా వ్యవహరించలేకపోవచ్చు. ఇట్టి ప్రవృత్తివల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగవచ్చు. ళ్‌

క్షే22 సుమతి శతకము

పత్యాఒన్ఫతా చ పరుషా ప్రియభాషిణీ చ,

హింప్రా దయాళురసే చార్జసరా వదాన్యా,

నిత్యవ్యయా ప్రచుర నిత్యధనాగమా చ,

వారాంగవేవ వృషనీతిరనేకరూపా - రాజనీతి ఒకప్పుడు సత్యాన్నీ మరాకప్పుడు అసత్యాన్ని అనుసరిస్తుంది. కఠినంగానూ ఇంపుగానూ మాటాడుతుంది. (క్రూరంగానూ కనికరంతోనూ ఉంటుంది. డబ్బే పావనంగానూ దానమే జీననంగానూ ఉంటుంది. తెగ ఖర్చుపెడుతుంది, ఎంత సొమ్మైనా పోగుచేస్తూనూ ఉంటుంది. రాజనీతి వేళ్యలా అనేకరూపాలు ధరిస్తూ ఉంటుంది అన్నాడు భర్షహరి నీతి 39లో. వేదధర్మానుయాయి ఇంతటి అభినేత కాకపోవచ్చు. ఆందువల్ల జనానికి అనేకమైన యిబ్బందులు కలుగవచ్చు. ఇక్కడ విధవ అంటే సౌఖ్యానికి అవకాశంలేని మనిషిగాను, నిరాశా శుష్కజీవితం గడిపే మనిషిగాను, వైదికుడు అంటే పట్టూ విడుపూ లేకుండా ముక్కుకు సూటిగా నియమనిబంధనలు అమలుపరిచేవాడుగానూ (గ్రహించటం సముచితంగా ఉంటుంది.

కరణము వైదికుడైనను అనినపుడు మరొక విధముగాకూడా అర్ధము చెప్పవచ్చును. (గ్రామ గణకవృత్తిలో నున్నవాడు ఆ వృత్తిలో నున్న సాటివారిలా కాక, వైదికవృత్తిలో ఉన్నవానిలా (ప్రవర్తించేవాడయినా అన్నది ఆ అర్హం. ఇరవైయవ శతాబ్దితాలిపాదంలో కరణములనబడేవారే కాక ఇతరవర్షములవారిలోకూడా కొందరు వైదిక (బ్రాహ్మణులలా మంత్రాలు చదవటమూ, వేషభాషలలో శాస్త్రి శర్మాదినామధారణమూ నియమనిష్టలూ వహించటమూ, పౌరోహిత్యాదులు చేయటమూ చేసేవారు. వీరు ఆసలు వైదికులకంటేకూడా అధికవైదికులలా ప్రవర్తించేవారు. మధ్యవైష్ణవునకు పంగనామాలు హెచ్చు అన్నట్టు అన్నమాట. ఇది సహజం. ఒకపార్చీ వదలి మరొకపార్టీలో చేరినవారు, మొదటినుంచీ ఈ పార్టీలో ఉన్నవారికంటెకూడా పట్టుదలతో ఈ పార్టీవృద్ది విషయంలో పట్టుదల చూపించటమూ, వీరికంటెకూడా తీవ్రంగా తాము వదలివచ్చినపార్టీని నిరంతరమూ విమర్శిస్తుండటమూ రాజకీయంలోకూడా చూస్తూనే ఉన్నాము. వైదికశాఖకు చెందినవారిని ఛాందసులు చాదస్తులు అనటం కద్దు. ఈ (క్రొత్త వైదికపద్ధతిని అవలంబించినవారిలో ఈ లక్షణాలు అసలువైదికులలోకంటె అధికంగా కనిపించేవన్నమాట. ఈ వృత్తి (శ్రమకరమైనంతగా లాభకరంకాదని, ఇతరవర్ణాలవారు (క్రమంగా ఈ పద్ధతి చాలావరకూ (ప్రస్తుతం విడిచిపెట్టారు. వైదికళశాఖలలో 'పెద్దశాఖ వెలనాటిశాఖ. వైదికులంటే వెలనాడులే అనే అంతగా వీరిపట్ట వైదికళబ్దం రూఢమయింది. వైదికచాదస్తం అన్నట్టుగానే వెలనాటిచాదస్తం అన్నది రూఢమయినదన్నమాట. ప్రసిద్దకవీశ్ళరులు తిరుపతి వేంకటకవులలో తిరుపతిశాస్తిగారు వెలనాటిశాఖవారు. వేంకటళశాస్తిగారు ఆరామ(దద్రావిడశాఖవారు. ప్రాణమిదత్రులని వేరే చెప్పనక్కరలేదుకదా. వీరు ఒక సభకు

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 123 వెళ్ళవలసిన సమయం అతి'క్రమించిపోతున్నది. వేంకటశా(్రిగారు సన్నద్దులయ్యారు కాని, తిరుపతిశాస్రిగారింకా పంచెబిళ్ళకుచ్చులు సవరిస్తూ తెమల లేదు. అపుడు వేంకటళా(స్తిగారు దబ్బున తెమలవేమిరా, వెలనాటి చాదస్తమూ నువ్వూను అని తాందరపెట్టారట. అపుడు తిరుపతిశాస్తిగారు “వెలనాటివాండం గవితకు వెలనాటీనవాండ, వట్టి వెలనాంటినిగొ, వెలమిన్‌ ద్రనిడులకంటెమ నెలనాంటులె తెలుగు కవిత నిందులు సేర్మినొ అని పద్యం చెప్పారని కథ, ఈ పద్యం నానారాజసందర్భనంలో అన్నై ఉన్నది. ఇప్పుడు, ఒకనాడు లేని, అనంతరకాలంలో ఏర్పడిన అన్ని శాఖలబ్రాహ్మణులూ ఏకశాఖగా ఉండాలన్నభావం (క్రమంగా బలపడుతుండటం సంతోషకరమైన విషయం. ఇంతకూ వైదికుడు అనే ఒక తెగకు చెందినబ్రాహ్మణుడు (గ్రామగణకుడయినా ప్రాణాంతకమే, (గ్రామగణకుడు వైదికునిలా ప్రవర్తించినా ప్రాణాంతకమే అని రెండు విధాలా అర్ధం చెప్పవచ్చును అన్నది సారాంశం. ఆవ : కవిత్తమూ గానమూ _మెచ్చుకొనటానికీ వివేకం ఆవనరమని చెవ్చుబోతున్నాడు : క్త నవరసభావాలంక్సత కవితాగోష్టియును మధురగానంబును దొ వవివేకికంత( జెస్పివ( జెవిటికి సంకూదివట్లు సిద్ధము సుమతీ. 66 (వ్ర: సుమతీ, తాను = కవి కాని గొయకుడు కాని, నవ = లొమ్మిది ఆయిన, కొత్తవి అయిన, రస= రసాలతో, భావ = భావాలతో, అలంకృత = ఆలంకరించబడిన కవితా = కవిత్సంయొక్క, గోస్టియును = సల్హాపాన్నీ తాను = గౌయకుడు, మధీరగానంబును = క " అవివేకికిన్‌ = వివేకం - యుక్తాయుక్తడ్డానం - లేనివానికి, ఎంతన్‌ = ఎంత ఎక్కువగా, చెప్పీ న్‌ = వినిపించినా, అది, చెవిటికిన్‌ = వినేకక్తి లేనివానికోనం, సంకు = శంఖం, ఊరినట్టు = పూరించటంవంటిది, సిద్దము = అనుభవ౦వల్ల తెలిసేది. వాలూ కవితాికి తా : సుమతీ, శృంగారం మొదలైన తొ! మ్మిదిరసా లూ, క్రొత్త బా వివే నక అందం తెస్తాయి. అట్టి కవిత్వాన్ని కరీ, తియ్యని పాటను గాయకుడూ కంలేనివా! వినిపించటం, వినేశక్తి లేనివానిముందు అతడు విని ఆనందించాలని శంఖం ఊదటం వంటిది. ఇది అనుభవంనల్ల తెలిసే విషయం. వ్యా: కవిత్వం, సంగీతం మొదలయినకళలు సర్పసామాన్యమైనవి, దైవానుగ్రహామూ, పూర్వజన్మసంస్కారమూ, అపూర్వమైన సాధనా ఉంటేనే కాని, ఆలవడేవీ కావు, నిలిచేవీ 62

కంత సుమతి శతకము కావు, పెరిగేవీ కావు, వాటిలో నవరసాలూ, కక్రొత్తభావాలూ కవిత్వానికి అలంకారాలు. శృంగారం, హాస్యం, కరుణం, వీరం, భయానకం, బీభత్సం, రౌద్రం, అద్భుతం, శాంతం

  • ఇవి తొమ్మిది రసాలు. ఇవి కాక విభావములు, అనుభావములు, సాత్తికభావములు, సంచారిభావములు అనేవి ఉన్నాయి. విశ్చ(శ్రేయస్కరములూ, ఆనందజనకములూ, భావించే కొలదీ క్రొత్తవనిసించే భావములూ ఉన్నాయి. ఇవి కవిత్వానికి అందాన్నిస్తాయి. గాత్రసంగీతం కాని, జంత్రగానం గాని సహజమైన, సొధనసిద్ధమైన మాధుర్యం నింపుకొన్నది ఉన్నది. అట్టి కవిత్వాన్ని కాని, అట్టి కవిత్వంతో కూడిన ఇట్టిగానాన్ని కాని, విని ఆనందించాలంటే, శ్రోతలోకూడా సంస్కారమూ, సాధనా, పరిజ్ఞానమూ, జిజ్ఞాసా, యుక్తాయుక్తజ్ఞానమూ ఉండాలి, ఇవి లేనివానికి మెచ్చదగినదేదో, తగనిదేదో తెలియదు. అటువంటివానికి అట్టి కవిత్వగానాలను వినిపించటం, వినేశక్తి లేనివానిముందు, అతడు విని ఆనందించాలని శంఖం ఊదటంలా నిష్ప్రయోజన మంటున్నాడు కవి. ఇతరపాసఫలాని యఖేచ్చయా నితర తావి పహే చతురానవ। అరసికేషు కవిత్వనివేదవం శిరసి మా లిఖ మా లిఖమా లిఖ॥ - నేనెన్నో పాపాలు చేసి ఉంటాను. వాటికి నీయిష్టం వచ్చిన శిక్షలేవైనా వేయి కాని, (బ్రహ్మదేవుడా, ఆరసికులముందు కవిత్వం వినిపించే శిక్షమాత్రం నా నొసట వ్రాయకు, (ప్రాయకు, [వ్రాయకు అని ముమ్మారు మరీ అన్నాడో మహానుభావుడు. పాటకు వినుటయే బహునుతి, తలయూసినందుకు తంబురా యనెడు వారున్నారన్నారు తిరుపతివేంకటకవులు. చెవిటినానిముందు శంఖం ఊదితే దీనిని కొరకటం నీ తరం కాదు సరికదా, వీ అబ్బతరంకూడా కాదన్నాడవి లోకోక్తి, అవ : నవ్వు నాలుగందాలచేటని చెప్పుబోతున్నాడు : క నవ్వకుమీ పభలోపసల నవ్వకుమీ తల్లి-దం డ్రి-నాధులలోడన్‌ నవ్వకుమీ పరసతితో నవ్వకుమీ వివ్రవరుల నయమిది సుమతి. 67 ఫ్ర : సుమతీ, సభలోపలన్‌ = కొలువుకూటములో, నవ్వకుమీ = నవ్వవద్దు సుమీ, తల్లి- తండ్రి - నాధులతోడన్‌ = తల్లితో, తండ్రితో, ప్రభువుతో, '్రీలైతే భర్తతో, నవ్వకుమీ = పరిహాసమాడవద్దు సుమా, పరసతితో = ఇతరుని భార్యతో, నవ్వకుమీ, నిప్రవరులన్‌ = (బ్రాహ్మణులలో (శ్రేష్టులైనవారిని, నవ్వకుమీ = వేళాకోళం చేయవద్దు సుమా, ఇది = ఈ చెప్పబడినది, నయము = నీత్తి,

వివేకానందినీ వ్యాఖ్యాసహితం శ25

తా : సుమతీ, సభలో నవ్వవద్దు. తల్లిదండ్రులతోనూ (ప్రభువుతోనూ భర్తతోనూ పరిహాసం పనికి రాదు. పరునిభార్యతో నవ్వవద్దు. ద్విజులలో (శ్రేష్టులయినవారిని అక్షేపించవద్దు. ఇది నీతి.

వ్యా ; నవ్వు ప్రాణులలో మనిషికిమాత్రమే చేతనయినవిద్య, నవ్వు సంతోషానికి చిహ్నం. వారిది నవ్వుమొహం అని అందరూ మెచ్చుకొంటారు. నవ్వు కనిపించని మొహాన్ని తుమ్మలలో ్రొద్దుగూకినట్లున్నదనో, ధుమభుమలాడుతున్నదనో, ఆముదం (త్రాగినవాని మొహమున్నట్ట్లున్నదనో, పుట్టెడు ఆముదాలు వేయించి నట్టున్నదనో, బడిలో నికి వెళ్ళ పిల్లవానిమొహంలా ఉన్నదనో ఆక్షేపిస్తుంటారు. వాల్మీకి రాముని “'స్మితపూర్వభాషీ చ పూర్వభాషీ చి అన్నాడు. ముందు చిరునవ్వు నవ్వి మాటాడేవాడట, ఎదుటివారిని తానే ముందు పలుకరించేవాడటకూడా. అయినా ఆతిజా([గ్రత్తతో ఉపయోగించవలసినది నవ్వు. మహాభారతంలో లేకపోయినా మయసభలో, నేల అనుకొని నీటిగుంటలో పడిపోయిన దుర్యోధనునిచూచి, ద్రౌపది నవ్వినందుననే అతనికి ఆమెను పరాభవించాలనే పగ పుట్టిందంటారు కొందరు.

నవ్వు నాలుగందాల చేటవే సామెత పుట్టటానికి, వాలీ గకిరామాయణంలో లేకపోయినా, (ద్రౌపది నవ్వువంటి లక్ష్మణదేవరనవ్వు కారణమంటారు. రామునిపట్టాభిపేశమయింది. అందరూ ఆనందంగా ఉన్నారు సభలో. హరాత్తుగా లక్ష్మణుడు పకపకా నవ్వాడు, రాముడు, సీత, విభీషణుడు, సు(్రీవుడు, కైక మొదలైనవారందరూ, ఎవరిమట్టుకి వారు, తమలోని లోపాన్ని చూచే ఆతడు నవ్వి ఉంటాడని, మనస్సులో చిన్నబుచ్చుకొన్నారు. చివరికి రాముడు ఎందుకు నవ్వావని అడిగాడు. అరణ్యవాసంలో పద్నాలుగు సంవత్సరాలు నీ సేవ చేస్తుంటే ఎన్నడూ రాని నిద్ర వస్తున్నదిపుడు నాకు, అందుకు నవ్వు వచ్చిందంటే, అపుడందరూ అమ్మయ్య అనుకొన్నారు. కనుకనే సభలో నవ్వవద్దన్నాడు కవి.

తనతో సమానమైనవారితో పరిహాసమాడవచ్చు. గాని, అల్పులతో అధికులతో ఆడరాదు కనుక, తల్లిదండ్రులతో భర్తతో ప్రభువుతో పరిహాసం వద్దన్నాడు. పరునిభార్యతో కలిసి కాని, అమెను చూచికాని నవ్వితే, ఆమె కాని, ఇతరులు కాని, ఏ ఉద్దేశంతోనో నవ్వాడనుకోవచ్చు. కనుక ఆమెను చూచి కాని, ఆమెతోపాటు కాని నవ్వవద్దన్నాడు. పరునిభార్యతో నవ్వటమే కాదు, మిత్రునిభార్యతోనైనా అతడు భేనపుడు మాటే ఆడగూడదన్నారు మనవారు.

తత్ర శ్రీణి వ కర్తవ్యం యత్ర మిత్రత్వ మిచ్చతి,

వాగ్వాదమర్థవంబంధః పరోక్షే దారభాషణం -

63

126 సుమతి శతకము ఎవరితోనైనా మైత్రి కావాలనుకొంటే, వారితో వాగ్వాదం, ధనసంబంధం, అతడు దగ్గరలేనపుడు అతనిభార్యతో మాటాడటం - ఈ మూడూ చేయగూడదన్నారు, మాటే వద్దంటే, నవ్వులాట వద్దని వేరే చెప్పాలా? విప్రవరులను నవ్వవడ్డనటం తల్లిదం[డ్రులు మొదలయినవారి గురించి చెవృటంవంటిదే, కాని విశేషం ఉంది. వి(ష్రలలో వరులు (శ్రేమ్బలంటే, శిష్టాచారసంపన్నులన్నమాట. వారి ఆచారవిహారాలూ, వేషభాషలూ, ఇతరులవాటికంటే విలక్షణంగా ఉంటాయి. కనుక తెలియనివారు అఆక్షేపిస్తుంటారు. గుణనిధి 'బ్రాహ్మణాచారంబు సరివాసకము చేయు అగ్నిహోత్రవిధానమన్ననలుగు' అన్నాడు శ్రీనాథుడు. ఈ స్వభావం అనాచారులలో ఉన్నది కనుకనే, అట్టి స్వభావం కలవారు గుణనిధిలా చెడిపోయే అవకాశం ఉన్నందున, అట్టి ఉత్తములను ఆక్షేసించగూడదన్నాడు. అక్షేపిస్తే అక్షేసింపబడిన వారినిబట్టి ఆక్షేపకులకు కలఠిగేఫలం ఉంటుంది. శ్రీ కృష్ణునిఅండదండలవల్ల యాదవులు సర్వైశ్చర్యసంపన్నులూ శత్రుదుర్నిరీక్షులూగా తయారయ్యారు. ఒకనాడు కొందజు మహర్షులు ద్వారకకు వచ్చారు. కొందరు యాదవయువకులు శ్రీకృష్ణునికుమూరుడు చాలా అందగాడు అయినసాంబునికి గర్భవతివేషం వేసి వారికి మైొక్కించి ఈమెకు కొడుకు పుడుతాడా కూతురుపుడుతుందాా అని అడిగారు. అంతరం తెలియని వారిఆగడానికి అలిగి మహర్షులు యాదవకులనాశనానికి ముసలం పుడుతుందన్నారు. అలాగే పుట్టింది. అదివిని వసుదేవుడు దానిని అరగదీసి సము(ద్రంలో కలపమన్నాడు. అలా కలిపిన తెట్టు ఒడ్డుకు చేరితే దానినుంచి రోకళ్ళలా ఉండే తుంగపరకలు మొలిచాయి. యాదవనాళనం తప్పదని తెలిసిన కృష్ణుడు అది తీర్జప్రదేశంలో అయితే మంచిదని జాతరకని సముద్రానికి అందరినీ తీసుకొని వెళ్ళాడు. అక్కడ అందరూ తప్పతాగారు. మత్తెక్కిన కృతవర్మకూ సాత్యకికీ మాటా మాటా వచ్చి బినికి చినికి గాలివాన అయింది. యాదవులు రెండుతెగలుగా చీలిపోయి ఆ తుంగకాడలతోకొట్టుకొని చచ్చిపోయారు. యాదవకులానికి ముసలంలా పుట్టాడు అనే సామెత ఏర్పడింది. ఇంతకూ ఆ మహర్శులను పరిహసించాలని ఆ యువకులకు కలిగిన ఆలోచనమూలం, పూజ్యులను ఎగతాళి చేసిన ఫలాన్ని ఎంతటివారైనా అనుభవించవలసి ఉంటుంది. ఒకప్పుడు కళ్యప ప్రజాపతి పుత్రులు కావాలని ఒక యజ్ఞం చేస్తున్నాడు. దేవేంద్రాదులందరూ తలకొకపనీ చేస్తున్నారు. సమిధలు తేవటానికి నియుక్తులయిన వారిలోని యింద్రుడు కొండలా ఉన్న పెద్ద సమిధలమోపు అవలీలగా తెస్తుంటే బొటనవ్రేలంత ఉండే వాలఖిల్యులు అందరూ కలిసి బహు(శ్రమపడుతూ చిన్ని మోదుగు పుడక ఒకటి తెస్తున్నారు. వారసలే

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 127 అల్పకాయులు. ఆహారంకూడా తీసుకోని తపోధనులు. దానిబరువుకు (క్రుంగిపోతున్నారు. గోవుకాలానినందున ఏర్పడినగుంటలో నిలిచిననీరు దాటలేక వారు బాధపడుతుంటే, బలమదంతో వారిని చూచి పరిహసించి అవమానించి దాటివెళ్ళాడు దేవంద్రుడు గబగబా. అందుకు వారికి కోపం వచ్చింది. వారు రోషంతో ఇంద్రభయంకరమైన ఒక మహాక్రియ ఆచరించారు. సర్సదేవేంద్రుడు కాగలవాడు మా తపఃశక్తివల్ల మరొకడు జన్మించాలి, అతనికి కోరుకొన్నంత పరాక్రమం ఉండాలి. కామగమనం ఉండాలి. అతడు ఇంద్రునికీ భయం కలిగించగలగాలి. అతనికి మనోజనమూ ఇండద్రునికంటె నూరురెట్టు శార్యమూ పరాక్రమమూ ఉండాలి అని హోమం చేస్తున్నారు. ఇది తెలిసి ఇంద్రుడు చాలా బాధపడి కళ్యపుని శరణువేడుకొన్నాడు. కళ్యపుడు వాలఖిల్యులను ఏమి కోరి ఈ హోమం చేస్తున్నారు? అని అడిగాడు. వారు సత్యవాదులు గనుక నిజం చెప్పారు. ఆయన

  • ఈతనిని త్రిలోకాలకూ ఇం(ద్రునిగా బ్రహ్మ నియమించాడు. మీరూ ఇంద్రునికోసం ప్రయత్నిస్తున్నారు. బ్రహ్మమాటా మిథ్య కాగూడదు, మీ సంకల్పమూ మిథ్య కాగూడదు. కనుక మీసంకల్పంవల్ల సంభవించే అతిబలసత్త్యశాలి పక్షీంద్రుడవుగాక, ఈ ఇంద్రుడు మిమ్మల్ని యాచిస్తున్నాడు, అనుగ్రహించండి - అన్నాడు. వారా (ప్రజాపతిని గౌరవించి ఇండద్రనినిమిత్తం మేము పూనుకొన్నాము, పుత్రనిమిత్తం నీవు యజ్ఞం చేసున్నావు, కనుక నీవు శ్రేయస్కరమనుకొన్నట్లే ఈ కర్మఫలం నీవే స్వీకరించు అన్నారు. ఆంటే నీయజ్ఞఫలంగానూ మా హోమఫలంగొనూ ఆ పక్షీంద్రుడు నీ కుమారుడే అగుగాక అన్నారన్నమాట. అందువల్లనే గరుత్మంతుడు ]నతాకళ్యపులకు జన్మించి ఇంద్రునోడించి అమృతం తీసుకువచ్చాడు. మెలగనేర్వనివారికి (శ్రేయస్సు తొలగిపోతుంది కనుక, ఇంటా బయటా, ఇంతులతో, ఏలికలతో, కొలువుకూటాలలో, పూజ్యాలతో ఎలా మెలగాలో, ఎలా కూడదో చెప్పి, నయమిది అని ప్రత్యేకించి హెచ్చరించాడు. ధారాళమైన నీతులు నోరూరంగ6 జవులు వుట్ట నుడివెద సుమతీ అని ఆదిలోనే చెప్పినవాడు, మళ్ళీ ఆ మాట అన్నాడంటే, ఇది మరీ ముఖ్యమైన నీతిగా భావించాడన్నమాట. అవ : నీరు, నోరు నారి చీర - వీటి ప్రాముఖ్యము చెప్పుబోతున్హాడు : క, నీరే ప్రాణాధారము నోరే రసభరితమైన నుడువులకెల్లన్‌ నారియె నరులకు రత్నము చీరయె శృంగారమండ్రు సిద్ధము సునుతీ! 68 6క్ష

128 సుమతి శతకము

'ఫ్ర : సుమతీ, నరులకున్‌ = మానవులకు, (ప్రాణాధారము = ప్రాణ+ఆధారము = ప్రాణాలకు ఆదరువు, నీరే = నీరు+ఏ = జలమే, రసభరితమైన = రసభరితము+ఐన = రసముతో నిండిన, రసవంతములైన, నుడువులకున్‌ = మాటలకు, ఎల్లన్‌ = అన్నింటికినీ, నోరే =నోరు+ఏ = నోరుమా(్రమే, ఆధారము, నారియె = నారి+ఎ = స్త్రీయే, రత్నము = శ్రేస్టమైనది, శృంగారము = అలంకారము, చీరయె = చీర+శఎ = వస్తమే, ఆం'డ్రు = అంటారు, సిద్ధము = లోకానుభవంచేతా, శాస్త్రాదిజ్ఞానంచేతా తేలినవిషయం ఇది.

తా :సుమతీ, నరులప్రాణాలకు ఆధారం జలమే. రసవంతములైన మాటలకన్నింటికీ ఆధారం నోరే. అన్నింటిలో ్రేస్టమైనది ్రీయే. అలంకారాదులలో (శ్రేష్టమైనది వస్తమే. ఇది శా(స్తజ్ఞానంపల్లనూ అనుభవంవల్లనూ తేలినవిషయం.

వ్యా : మనిషి ఏ ఆహారమూ స్వీకరించకపోయినా, నీరు త్రాగుతుంటే, చాలా రోజులు జీవించగలడు. ఏ ఆహారం స్వీకరించినా, నీరు త్రాగకపోతే, ఎక్కువ కాలం జీవించలేడు. కనుక నీరే ప్రాణాధారమనటం యుక్తమే. కనుకనే దానికి జీవనం అని మరొకపేరు. జీవనం అంటే బ్రతుకు అనీ అర్థం,

రసవంతములయిన మాటలకన్నింటికీ నోరీ ఆధారమనటంలో కవి ఉద్దేశ్యమేమిటి? రసభరితములన్నమాటే ఏమిటి, ఏ మాటలయినా నోటినుంచే వస్తాయికదా. నోరు అంటే అందులో ఉన్న నాలుక, మాటాడే ఒక అవయవం, ఒక సాధనం. దానంతట అది పనిచెయ్యదు. దానినుపయోగించేవారు ఏది చేయిస్తే అది, ఎలా చేయిస్తే అలా చేస్తుంది. నోరు ఒక కత్తిలాంటిదో, కట్టెలాంటిదో కాదు. శరీరంలో ఒక భాగం, అవయవం, సజీవసాధనం, మనిషేకాదు, మనిషిఅవయవాలూ అలవాటు చేయటాన్నిబట్టి ప్రవర్తిస్తాయి. ఎడమచేతివాటం మొదలయినవి ఇలా అలవాటునుబట్టి స్థిరపడినవే. నడవటం, పనిచేయటం, చూడటం, పలకటం౦కూడా అలవాటునుబట్టే ఉంటాయి. ఏ గూటిచిలుక ఆ గూటిపలుకు పలుకుతుందంటారు, అలాగే నోరూ, పరుషంగానైనా, మృదువుగానైనా, అనుచితంగానైనా, సముచితంగానైనా, ఆసందర్భముగానైనా, సమయోచితముగానైనా మాటాడటం అలవరచుకొన్నదానిని బట్టి ఉంటుంది. కాలు జారితే తీసుకోగలం కాని నోరు జారితే తీసుకోలేనుంటారు. కనుక మాటతీరు ప్రయత్నించి అలవరచుకోవాలి. నా మాటతీరే ఆంత అనటం సమర్థనీయమైనది కాదు.

ఎదిరికి హితమును బ్రియమును మదికింపునుగాంగ6 బలుకునూటలు పెక్కై

యొదవివను లెన్స, యటుగా కిది యది యనకూరకునికి యెంతయు నొప్పున్‌.

చెలిమియు బగయును, దెలివియు౧ గలకయు, ధర్మంబు బాసగతియుము, బెంపుం,

దులువతనంబును వచ్చును బలుకుబడిన, కాన పాసంగం బలుక[గవలయున్‌

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 129 (ఉద్యోగ, 2.59, 60) అని భారతం చెపుతున్నదంటే అట్టిపలుకు నలవరచుకొమ్మనే. అలాగే -

మాటలచేత దేవతలు మన్నవచేసి వరంబులిత్తురా

మాటలలచేత భూపతులు మన్నవనచేసి పురంబులిత్తురా

మాటలచేత గామినులు మన్ననచేసి సుఖంబు లిత్తురా

మాటలు నేరకున్న నవమావము మ్యూనము మానభంగమున్‌

అన్నకవీ ప్రయత్న(ప్రాధాన్యమే చెపుతున్నాడు. వోరా నీపునకు దెబ్బలు తేకే నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది వంటి సామెతలూ నోటికి మంచిమాటలు పలకటం నేర్చమనే చెపుతున్నాయి. కనుకనే నోరే రసభరితమైన నుడువులకెల్లన్‌ ఆధారమని చెప్పటం.

ఈ మాటలచేత అన్న పద్యం కీశే. దీపాల పిచ్చయ్యశాస్తిగారు ప్రకటించిన చాటుపద్య రత్నాకరం చతుర్ధ ముద్రణం నుంచి స్వీకరించినది. అయితే ఆందులో మొదటి మూడు పాదాల చివరా 'లిత్తురా" బదులు 'లిచ్చెదరో అనీ, రెండపాదంలో పురంబు బదులుగా కూడా 'సుఖంబు' అనే ఉన్నది. అయితే, నాకు ఎపుడో వినగా జ్ఞాపకమున్న దానిని బట్టి ఈ మార్పులు చేశాను,

నారియె నరులకు రత్నము అన్న వాక్యము, మనసం'ప్రదాయము మహిళలకు ఎంత సముచితస్టానమిచ్చినదో తెలియజేస్తున్నది. రత్నమన్నమాటకు ఆ జాతిలో (్రేస్రమయినది అని అర్ధము, జాతా జాతా యదుత్కష్టం తద్రత్నమితి కథ్యతే - నారియె నరులకు రత్నము అంటే, మానవజాతిలో (శ్రేష్టమైనది మగువ అని చెపుతున్నాడు. స్త్రీ రత్నం దుష్కులాదపి అన్నారు. అనగా దుష్టకులంలో పుట్టినప్పటికీ (స్రీ (శ్రేష్టురాలు అవి అర్ధం. స్త్రీని మన్నించటానికి కారణము ఆమెకులమో, అందమో, మరేమో కారణం కాదు, ఆమె స్త్రీ కావటమే అంటున్నది ఆ వాక్కు. దానికి ప్రధానమైన హేతువు, మనిషి పుట్టటానికీ, పెరగటానికీ, ఉత్తమసంస్కారం పొందటానికీ కారణం స్త్రీ ఆమె లేకపోతే ఏమీ లేదు. ఒకసారి బిడ్డను కని తల్లి అయిందంటే, ఆ బిడ్డకే కాదు, తన భర్తకుకూడా తల్లివంటిదే. కారణం గర్భమై ఆమెలో అతడు (ప్రవేశిస్తున్నాడు. పతిర్దాయాగ్‌ం ప్రవిళతి గల్చోభూత్వా

  • మళ్ళీ ఆమెకు పుత్రరూపంలో జన్మిస్తున్నాడు. ఆమె 'అమ్మ' అయిందంటే చాలు, వందనీయురాలే. ఆమెగుణదోషాలతో ఇక నిమిత్తం లేదు. 'కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి" కుత్సితుడయినకుమారుడు పుట్టవచ్చును గాని, కుమాత, అంటూ ఉండదన్నారు శంకరాచార్యులవారు. తల్లిఆయినా కాకపోయినా, తల్లి కాదగినది కనుక, ఆమె ్రేష్టురాలే. సన్యాసం పుచ్చుకొన్నవారు ఎవరికీ నమస్కరించగూడదట, కాని తల్లికిమాత్రం నమస్కరించాలట. ఇది నారియొక్క సర్యోత్కృష్టతను తెలియజేస్తుంది.

65

130 సుమతి శతకము చీరయె శృంగారమండ్రు సిద్ధము అన్నపుడు, చీర అంటే స్త్రీ ధరించే (ప్రధానవస్త్రమని కాదు. వస్త్రము అని అర్ధం. కోకకూడా ఇటువంటిదే. కోక, చీర, ఇప్పుడు కోమలి ధరించే వస్త్రానికి పర్యాయాలుగా రూఢమయాయి. తలచీర, తలకోక అన్నసమాసాలలో, వస్రసామాన్యంగా ఇంకా ఉంది. చీరయె శృంగారమంటే అదే (ప్రధానమైన అలంకారం అని అర్థం. అలంకారం నాలుగు విధాలన్నారు పూర్వులు, 1, తలలో పెట్టుకొనే పువ్వులుమొదలైనవి. 2. మేనికి పూసుకొనే గంధం మొదలైనవి, 3. ఆయా అవయవాలకు పెట్టుకొనే ఆభరణాలు. 4. కట్టుకొనే వస్త్రాలు, ఇవి కాక ఏదేశపు స్త్రీలకు ఆదేశపుఅలంకారాలు వేరే ఉంటాయి అన్నారు. అనగా మనకు అలవాటులేని విధముగా ఎవరైనా అలంకరించుకొంటే వారిదేశీయపద్దతి ఆది కాబోలు అనుకోవాలి కాని ఆదేమి అలంకరణమని ఈసడించుకొనటం ప్రపంచజ్ఞానం లేకపోవటమన్నమాట. అది వేరే విషయం. “కచధార్యం దేహధార్యం పరిధేయం విలేసనం, చతుర్ధా భూషణం ్రాహుః ప్రీణామన్యచ్చ దైశికమ్‌” వీటిలో పువ్వులు, పూత, నగలు - లేకపోయినా నష్టం లేదు. తగురీతిలో ఉంటే అందం పెరగవచ్చు. కాని వలువలు లేకపోతే కుదరదు. అంతేకాదు, తగినవలువలుంటే, తక్కిన మూడురకాల అలంకారాలు ఏమీ లేకపోయినా, అందం ఇనుమడిస్తుంది. అంతే కాదు, 57వ పద్యవ్యాఖ్యలో ఉదాహరించిన వస్తేణ అన్న శ్లోకంలోని గౌరవం తెచ్చిపెట్టే వకారపంచకంలో ప్రధానమైనది, ప్రముఖమైనదీ, వస్త్రం. కనుక చీరయె శృంగారమనటం సమంజసమే. ఆన: వగా, లేమిలో వగపూ , నభలోతెగనాడటమూ మగువపై వలవూ వద్దని చెప్పుబోతునాడు = క్త పగ వలదెవ్వరితోడను వగవంగా వలదు లేమి వచ్చినపిదపన్‌ దెగనాడనలదు సభలను మగునకు మనసియ్యవలదు మహిలో సుమతీ. 69 ఫ్ర : సుమతీ, మహిలో = భూలోకంలో, ఎవ్వరితోడను = ఏ మనుష్యులతో నైనప్పటికినీ, పగ = విరోధం, వలదు = వద్దు, లేమి = దారిద్ర్యము, వచ్చినపిదపన్‌ = కలిగినతరువాత, వగవంగాన్‌ = వగవన్‌+కాన్‌ = శోకింపగా, వలదు, సభలను = సభలలో, తెగనాడన్‌ = తెగన్‌

  • ఆడన్‌ = తెగన్‌ = మనస్సు ఇండితమైపోవునట్టుగా, ఆడన్‌ = పలకటం, నందు, మగువకున్‌ = స్త్రీకి మనసీయ్యన్‌ = మనసు+ఇయ్యన్‌ = మనసు = హృదయం, ఇయ్యన్‌ = అర్పించటం, వలదు. తా వ సుమతీ, ఈ భూలోకంలో ఎవరితోను విరోధం పెట్టుకోకు. పేదరికం కలిగినపుడు బెంగపెట్టుకోకు. జనుల సమావేశాలలో ఎవరిమనస్సూ కష్టపడే విధంగా మాటాడక్తు, ్రీకి హృదయం సమర్పించకు.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 131

వ్యా : ఇందులో నాలుగు చేయగూడనిపనులు చెపుతున్నాడు. వీటిలో రెండు మనస్సుకీ, ఒకటి చేష్టకీ, మరొకటి వాక్కుకీ సంబంధించినవి. విరోధమూ, వలపూ మనస్సుకీ, శోకం చేష్టకీ, తెగనాడటం వాక్కుకీ సంబంధించినవనుకొంటే, త్రికరణాలనూ దృష్టిలో పెట్టుకొని చెప్పినాడనవచ్చు. ఇంకా విరోధం క్రోధానికీ, శోకం లోభానిక్తీ తెగనాడటం మదానికీ, వలపు కామానికీ సంబంధించినవనుకొంటే, అరిషడ్వర్గంలోని కామ(క్రోధలోభమదములు పనికిరానివని చెపుతున్నాడనుకోవచ్చు.

పగకూడా ఒక అలవాటు, ఐనదానికీ కానిదానికీ విరోధం వహిస్తుంటే, ప్రతివారిలోనూ ఏదో లోపం కనిపిస్తూనే ఉంటుంది కనుక, కోపం రావటమూ, దానివల్ల, ఈ శతకమే తన కోపమె తన శత్రువు అని చెప్పినట్టు, అందరూ శత్రువులు కావటమూ సంభవిస్తుంది. ధర్మరాజుగారికి దుర్మార్గులు కనిపించలేదట, అందువల్లనే ఆయన అజాతళత్రువయాడు. దుర్యోధనునికి మంచివాడు కనిపించలేదట. ఆ స్వభావం కారణంగా తనవారైన పాండవులూ విరోధులై నళించాడు. పగను (ప్రేమతో అణచాలి. నీళ్ళు చల్లితే నిన్ను చల్దారుతుంది, కాని నిప్పులు పోస్తే కాదు. కనుకనే తిక్కనగారు

పగయడగించుటెంతయు శుభం, బదిలెన్స, యడంగువే పగం

బగ - వగ గొన్న మార్కొనక సల్కక యుండ(/; వచ్చునే, కడుం

దెగ మొదలెత్తిపోవం బగదీర్సం1 వచ్చినః గ్రౌర్యమొందు, నే

మిగళి. దలంచినం బగకు మేలిమిలేమి ధ్రువంబు గేశవా (ఉద్యో3.21) అన్నారు. పగకు విరుగుడు క్షమ

క్షమీియించువారి. గని చాలమి వెట్టుదురైననుం దలంస ననూన

క్షమయ కడు మెళయుతొడ వుత్తమరూసను కోరువారు తాల్తురు దానిన్‌ - (ఉద్యో. 2.40) అన్నారు.

ఒకరు చేసిన అపకారాన్ని తలుచుకొంటున్నందున పగ పెరుగుతుంది. ఉపకారాన్ని స్మరించుకొంటున్నందున ప్రేమ పెరుగుతుంది. పగవల్ల వగపెరిగినట్టుగొనే (స్రేమవల్లమా[త్రమే (ప్రేమపెరిగే అవకాశం ఉంది.

న స్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయా

కథంచిదుసకారేణ కృతేనైకేన తుష్యతి (రామా. 21110)

తనకు వంద ఆపకారాలు చేసినా వాటిని తలచుకోడట రాముడు, చేసినది ఒక చిన్న ఉపకారమైనా జ్ఞాపకం ఉంచుకొంటాడట. అందుకు కారణం అతడు మంచి మనస్సు కలవాడు కావటం, ఆందుకే అంత అపకారం చేసిన రావణుడుకూడా బ్రతకటానికి

ళ్‌

132 సుమతి శతకము అవకాళమిచ్చాడు. అతనికి వినాశకాలం దాపురించింది కనుక, ఉపయోగించుకోలేదు. ధర్మరాజూ దుర్యోధనాదుల విషయంలో అలాగే వ్యవహరించాడు. అయినా వారి దుర్మార్గం వారిని బ్రతకనివ్వలేదు. కనుక పగ ఎన్నడూ మేలు చేయదు. లేమి వచ్చినపుడు వగవగూడదు, కలిమిలేములు కావడికుండలు, ఒకటి ఉన్నదంటే దానికి ముందో వెనకో, రెండవది తోడుండక తప్పదు. కలిమిలో పాంగూ లేమిలో క్రుంగూ ఉత్తమలక్షణాలు కావు. భర్శహరి సంపదలు కల్లుతటినుహాజనులహృడయ మభిననోత్సల కోమలంబగుచు వెలయు, ఆపదలు గల్గువపుడు మహామహీధ రాళ్మసంఘాత కర్కళంబై తవర్భు - అన్నాడు, కలిమిలేములు కలగటానికి కారణాలు అనేకముంటాయి. సరయినమార్గంలో తమకక్తినిబట్టి కలిమి కలగటానికీ, లేమి తొలగటానికీ (ప్రయత్నించాలి కాని, లేమివచ్చినదని శోకించినందువల్ల (ప్రయోజనం లేకపోగా కీడు కలుగుతుంది. దారిద్ర్యాద్ధియమేతి, హ్రీపరిగతస్పత్వాత్పరిభ్రశ్యతే, నిన్సత్వః పరిభూయతే, సరిభవాన్నిర్వేదనూపద్యతే, నిర్విల్లః శుచమేతి, శోకనిహతో బుద్ధ్యా పరిత్యజ్యతే, నిర్చుద్దిః క్షయమేత్యహో విధవతా సర్వాపదామాస్పదం - దారిద్య్యంవల్ల లజ్జ-వస్తుంది. లజ్జపడినమనిషికి మనళ్శక్తి తొలగిపోతుంది. మనళ్ళక్తి లేనివానిని అవమానిస్తారు. అవమానంవల్ల సమస్తమూ విడిచిపెట్టాలనిపిస్తుంది. దానివల్ల శోకం వస్తుంది. శోకంవల్ల తెలివీ స్థిరనిశ్చయమూ (బుద్దీ) పోతాయి. దానివల్ల సర్వనాశనం సంభవిస్తుంది. కనుక లేమి సర్వాపదలకూ మూలమన్నాడు శూద్రక మహాకవి. ఇది లేమివల్ల కలిగే ఆపదల'క్రమం. ఈ క్రమంలో లేమికీ శోకానికీ మధ్య సిగ్లూ మనశ్శక్తిహినతా, పరాభవమూ, నిర్వేదమూ ఉన్నాయి. ఇవి లేమివల్ల కలిగే శోకానికి అవాంతరకారణాలు. కనుక అదినే లేమినెదుర్కొంటే శోకమూ దానివల్ల ఆపదలూ రాకుండా ఉంటాయి. సభలలో తెగనాడవలదు. సమాజంలో సత్సంబంధం పెంపొందించుకొనటం ఆవశ్యకం, అదీ మాటతీరువల్ల వస్తుంది, దాని కపకారకమైన ఖ౦ండితవాదం మంచిది కాదు. అంటే ఒకరు అనినమాటను ఖండించటం, నరికినట్టు మాటాడమూ, పరాభిప్రాయాన్ని ఇండించవద్దంటే ఎలా? ఎదుటివారు అసమంజసవాదం చేసీ, అదే సమంజసమైనదనే అభిప్రాయం కలిగించటానికి ప్రయత్నిస్తుంటే, ఖండించవలదా? వలసినదే కాని, ఆ ఖండనం ఉండవలసినవిధముగా ఉండాలి. ఉండవలసినవిధమంటే? మొదట ఆది

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 133 అసమంజసమైైనదని నిరూపించటం తనపని కొవాలి. రెండవది అది యుక్తియుక్తం, కావాలి. మూడవది సత్యం బ్రూయాత్‌ ప్రియం బ్రూయాత్‌ న బ్రూయాత్‌ సత్యమప్రియం సత్యం చ నానృతం బ్రూయాదేష ధర్మః సవాతనః (మను 4,138) - సత్యం పలకాలి, ప్రియనుగా పలకాలి, సత్యమైనా ఆప్రియముగా పలకకూడదు అన్నారు. ఈమాటలకు చాలామంది, సత్యం పలకాలి, ప్రియమైనది పలకాలి, సత్యమయినా ఆప్రియమైతే పలకగూడదు, అని అర్థం చెపుతారు. సత్యంపలుకవలసిన అవసరం వచ్చిందంటే, ఆ సత్యం ఎవరికి సంబంధించినదో, వారికి నూటికి తొంభై తొమ్మిదిపాళ్ళు (ప్రియమైనది కాదు కనుక, ఆప్రియం పలుకగూడదు ఆంటే, సత్యం పలుకగూడదు అన్నట్లే అవుతుంది. కనుక, సత్యంకదా అని, అప్రియముగా, అంటే పరుషంగా చెప్పక వీలయినంత ప్రియమయేటట్టుగా చెప్పాలి అని అర్ధం. కనుకనే, టెలిగ్రాం ఇచ్చేటప్పుడు మరణించాడు అని యివ్వరు, సీరియస్‌గా ఉన్నది అని ఇస్తారు. మాట్టాడేటప్పుడుకూడా మరణించాడు అని పలకరు. 'పెద్దనిద్ర పోయాడు, కాలధర్మం చెందాడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు = ఇలా అంటారు. నిజానికి చని అంటేనే వెళ్ళి అని అర్హం. అదీ వాడుకలో మరణసూచకమై పోయేసరికి, దానిపర్యాయం వాడుతున్నారు. ఇలా, కలోరవిషయమైనప్పుటికీ, వీలయినంత మృదువుగా చెప్పే ప్రయత్నం చెయ్యాలి అంటే, పరాభిప్రాయఖండనం ఎంత మృదువుగా చేయటం సాధ్యమయితే అంత మృదువుగా చేయాలి. అంతే కాని, తెగవేసి చెప్పటం మంచిది కాదు. విడిగా ఇద్దరూ ఉండి మాటాడేటప్పుడే అయినా, ఇలా మాటాడాలి. ఇక సభలో, అయితే మరి మెలకువతో మాటాడాలి. ఎందుకంటే సభలో అయితే అవమానంగా భావిస్తారు. అదీకాక, కొందరికి పరాభిప్రాయఖండనం ఆలవాటయిపోతుంది, తముమాట పైనుండాలనే విపరీతమనోధర్మపరిణామమది. కనుక, వీలయినంత ఎదుటివారి అభిప్రాయంలోని సామంజస్యాన్ని కనిపెట్టే అలవాటే చేసుకోవాలి. ఆసమంజసమైనపుడు, ఆ మాట అనవలసివచ్చినవుడు, వీలయినంత ప్రియముగా చెప్పాలి. అనగా, ఎవరి అభి'ప్రాయాన్ని మనము కాదంటున్నామో, వారుకూడా అభిప్రాయము వేరైనా, అప్రీతిచెందే అవకాశము ఇవ్వకుండా మాటాడాలి, ఏక్షీభవింపక పోవటానికి కారణం ఇష్టంలేకపోవటం కాదనీ, ఇది నమంజనమని వారు గమనించలేకపోవటమేననీ, గమనించేటట్ట్లు మనం చేయలేకపోయామనీ మాత్రమే వారనుకొనేటట్టు మాటాడగలగాలి, మగువకు మనసియ్యవలదు అనటం మరీ వైరాగ్యసూచకంగానో, ద్వేషసూచకంగానో కనిపించవచ్చు. మగువలలోనూ, మగవారిలోనూకూడా, నమ్మదగినవారు, నమ్ముదగనివారూ 67

134 సుమతి శతకము ఉండవచ్చు. కొందరు మనసీయదగనివారుగా కనిపించారుగదా అని, అందరూ అలాంటివారే అన్నట్టు మాటాడటం మంచిది కాదు, మనలను ఎదుటి వారు మోసగించారు అనే అభిప్రాయం కలిగినపుడు, ఎదుటివారిని ఎవరైనా ఇలాగే ఆంటారు. “మాయాశిలురు చంచలాత్ములముకంపాశూన్యులాత్మైక కా ర్యాయత్తుల్‌ సమయానుకూలహృదయన్యాపారగోపాయవనో పాయజ్ఞుల్‌ మగవారలాపయి మహారాజుల్మహావైభవ శ్రీయోగాంధులు చెప్పనేల మగనారిన్నమ్మ(గావచ్చునే - అని ఆతివలూ ఆంటారు. ఎవరయినా, ఎవరికయినా, ఏదయినా, ఎంతవరకూ ఇవ్వాలో అంతవరకే యివ్వాలి: మనసివ్వటం వేరు, మనస్సు పారవేసుకానటం వేరు. ధనం ఇవ్వటం వంటిదే మనస్సివ్వటంకూడాను. ధనం పాత్రత యొరిగి ఇవ్వాలి. అపొ(త్రులకిస్తే ఇచ్చినది, నష్టం కావటమే కాదు, ఇచ్చినవారికీ పుచ్చుకొన్నవారికీకూడా కష్టదాయకమే అవుతుంది. ధనం ఆపాత్రులకు అవధిలేకుండా ఇవ్వటంకంటె ఘోరమైనది మనస్సివ్వృటం. మగువలయినా మగవారయినా, మగవారికయినా మగువలకయినా, మనస్పయినా మరేడయినా, ఎంతవరకివ్వాలో అంతవరకే ఇవ్వాలి. హద్దుమీరి ఇచ్చిన తరువాత, అనర్ధమని అనుతాపం చెంది ప్రయోజనం ఉండదు, ఆవ : వట్టి చేతులతో దగ్గరకు పోరానివారినిగురించి చెపుతున్నాడు : క. _పతికడకు. దన్ను. గూర్చిన సతికడకును వేల్పుకడకు సద్గురుకడకున్‌ సుతుకడకు రిత్తచేతుల మతిమంతులు చవరు నీతిమార్గము సునుతీ. 70 ప్ర : సుమతీ, మతిమంతులు = బుద్ధికలవారు, పతికడకున్‌ = రాజువద్దకూ, లేదా తనదేశపాలకునివద్దకూ, లేదా తనను పోషించేవానివద్దకూ, తన్ను గూర్చిన = తన్నున్‌+కూర్చిన = తనకిచ్చి పెండ్లిచేసిను సతికడకును = ్ర్రీవద్దకూ, వేల్పుకడకున్‌ = దేవునివద్దకూ, సద్గురుకడకున్‌ = సత్‌+గురుకడకున్‌ = యోగ్యుడైన ఉపాధ్యాయుని దగ్గరకూ, సుతుకడకున్‌ = కుమారునివద్దకూ, రిత్తచేతులన్‌ = శూన్యహాస్తాలతో, చేరరు = సమీసించరు. తా : సుమతీ, బుద్ధిమంతులైనవారు రాజునూ, భార్యనూ, దేవునీ, ఉపాధ్యాయునీ, కుమారునీ వట్టిచేతులతో సమీపించరు. వ్యా : ఇందులో చెప్పబడిననీతి అన్ని కాలములలోనూ, అన్ని సమాజాలలోనూ, అన్ని దేశాలలోనూ వాడుకలో ఉన్నదే, ఏదో కానుకో, తినుబండమో, ఫలమో, పుష్పమో పట్టుకొని వెళ్ళి ఇచ్చి కాని, చూడగూడని వారిని, ఐదుగురిని పేర్కొన్నాడు. వారిలో

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 135 మొదటివాడు రాజు. పూర్వకాలంలో దేశాన్ని పరిపాలించే రాజులు సర్వాధికారులుగా ఉండేవారు, వారి పరిపాలనకు ధర్మశా(స్తాలు మొదలయినవి విధాయకాలుగా ఉన్నప్పటికీ మనుషులు గనుక రాగద్వేషాలూ ఈర్జ్యాసూయలూ వారిపై పనిచేసే అవకాశమున్నది. నిరంకుశమైన అధికారం ఉన్నవారికీ సౌముఖ్యమో వైముఖ్యమో ఏర్పడిన తరువాత, మారటం కష్టమవుతుంది. దానివల్ల కలిగే లాభనష్టాలు వ్యక్తులకు తీవ్రమైనవిగా శాశతమైనవిగా ఉంటాయి. కనుక, సౌముఖ్యసంపాదనకోసమూ, వైముఖ్యము కలుగకుండా ఉండటంకోసమూ, ప్రయత్నిస్తూ ఉంటే, సుఖం కలుగుతుంది. ఆ ప్రయత్నం విధాయకమైన అలవాటుగా ఉంటే, పొరపాటుకు అవకాశం ఉండదు. సొముఖ్యసంపాదనకు ఏదైనా ఒకటి ఇవ్వటం ప్రధానసాధనం. యజన - యాజన - అధ్యయన - అధ్యాపన - దాన - ప్రతిగ్రహాలలో 'ప్రతిగ్రహం గురుస్టానమైన (బ్రాహ్మణునికి మాత్రమే విహితమైనది. తదితరులకు నిషిద్ధమైనది. కాని ్రీతిదానం నిషిద్ధంకాదని రాముడే చెప్పి, అనసూయ యిచ్చిన అంగరాగ-వ(స్తాదులు తీసుకోమని సీతకు చెపుతాడు. కనుక ధారాపూర్వకం కాని కానుకవంటిది, రాజు తీసుకొనటం దోషం కాదు, ఇతరులు ఇవ్వటం అవసరం అని ఏర్పరిచారు. దర్శనానికి వచ్చినవ్యక్తి వేషభూషాదులపై రాజు దృష్టపడకుండా, పడినా నిలవకుండా, నిలిచినా ఈర్చాసూయలు కలుగకుండా తొలగించటానికి, తానీయబోయే బహుమతి రాజుకి కనిపిస్తుండేలా పట్టుకొని ఎదుటికి వస్తే రాజుదృష్టి దానిమీద పడుతుంది. కనుకనే దానికి కనుపడజేసేది, కనిపించేది అనే అర్ధంకల కొనుక, కానిక అనే పదాలు తెలుగులో ఏర్పడ్డాయి. వీటికి సమానార్థకనుయిన ఉరుదూ పదం నజరానా ఇలా నజర్‌ దృష్టి అనే పదంనుంచి వచ్చినదే - సంస్కృతంలోకూడా 'దర్భనంబిచ్చి నెద్దాని' అని శ్రీనాధుడు ప్రయోగించిన 'దర్శనంబు' అన్నపదమూ ఇట్టిదే. రాజదృష్టికి రాళ్ళు పగులుతాయి, రాజదృష్టీ శివదృష్టీ మీద పడగూడదు అనే సామెతలు ఇలా ఏర్పడినవే. శివదృష్టి పడేటట్టు ఇళ్ళుకట్టరు. శివునికి ఆగ్రభాగానకాక, అటూ ఇటూనిలిచి దర్శనం చేస్తారు. ఇక్కడ రాజు అంటే కులవాచకం కాదు. అధికారసూచకం. నేటికాలంలో

తనకంటె పైస్టానంలో ఉన్న అధికారి, పరిపాలకుడు అనిన అర్థం చెప్పుకోవాలి. 'తన్నుం గూర్చినసతి' అంటే తనను పెండ్డాడినస్త్రీ అని అర్ధం, 'కూర్చుచెలికాడు" అంటే ఇప్పుడైన స్నేహితుడు అని అర్ధం. కూర్చుసతి అంటే ఇష్టమైన సతి, ప్రియ అనీ అర్థం. ఇదీ భార్యాపర్యాయమే. భార్యవద్దకు వెళ్ళేటవ్వుడూ. ఏమైనా తీసుకు వెళ్ళవలెనంటున్నాడు. తరువాత సుతుకడకు అనీ చెపుతున్నాడు. అక్కడ సుతుడు అంటే కుమారుడు అర్థమైనా, సొంతకొడుకు అనిమాత్రమే కాక, చిన్నపిల్లలకు ఉపలక్షణంగా స్వీకరించాలి. ఈ యిద్దరిదగ్గరికీ వెళ్ళినపుడూ ఏీనుయినా తీసుకు వెళ్ళాలి అన్నదానికి 68

136 సుమతి శతకము హేతువు ఒకటే. (ప్రేమలు వాటంతట అవి కలుగవు. ప్రేమ ఒకరు ప్రదర్శిస్తే ఎదుటివారూ ప్రదర్శిస్తారు. ఒకరిమీద ఒకరికి ప్రేమ ఉన్నదని ఎలా తెలుస్తుంది? వారు ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాటాడటం ఒక మార్గం. కసరుకొనటం, విసుగుకొనటం, దెప్పుకొనటం, పెడర్ధాలు తీయటం, పుల్లవిరుపుగా మాటాడటం, అక్షేపించటం, ఐనదానికీ కానిదానికీ తప్పు వట్టటం - ఇవి (పేమసూచనలు కావు, కనుక ఎవరిగ్రేమ మనం కావాలనుకొంటున్నామో, వారితో మాటాడేటప్పుడు, ఇటువంటివి రాకుండా చూచుకోవాలి. ఇంకొక మార్గం ఇచ్చిపుచ్చుకొనటం, ప్రేమ ఉంటేనే కాని పెట్టరు, పగ ఉంటేనే కాని తిట్టరు అని పామెత. కనుక మనకిష్టమైనది, వారికీ యిష్టమైనది అని మనమనుకొంటున్నది, "పెట్టటం అవసరం. అది కావాలి, ఇది కావాలి అని కోరకూడదు కాని, వీలయినపుడెల్దా ఏదైనా ఇస్తుండటం ప్రేమ పుట్టటానికీ, నిలవటానికీ, పెరగటానికీ అవసరం. భర్తను (ప్రేమించటం భార్యకూ, భార్యను (ప్రేమించటం భర్తకూ, చిన్నపిల్లలపై వాత్సల్యం చూపించటం పెద్దలకూ, ధర్మమైనా, దాని ఉత్పత్తి - స్థితి - పోషణలకు ఆందరూ ప్రయత్నించటం అవనరం. నువాసినులైన (నీలు సొభాగ్యవర్దకములని చతుర్విధాలంకారాలనూ ధరిస్తారు, ధరించాలి అని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. పసి చక్కంగ6 బ్రియుండు వర్ధిలుటకై నాళికప శ్రాక్షికిన్‌ అని కాశీఖండం ఇందుకే చెపుతున్నది. 37వ పద్యం వ్యాఖ్యానం చూడండి. కనుక, సౌభాగ్యవతికి సౌభాగ్యవర్టకంకంటె దానినిచ్చినవారికంటె ప్రియమైనది, ప్రియమైనవారు ఉండరు. భార్యను చూడబోయినపుడు పువ్వులు పట్టుకొనివెళ్ళటం అవసరమని పెద్దలూ పిన్నలూ చెపుతారు. సుతుడంటే పిల్లలకు ఉపలక్షణమన్నట్టే, ఇక్కడ సతి అంటే స్త్రీకి ఉపలక్షణంగా (గ్రహించాలి. కూర్చినసతి అంటే, తనకు గౌరవమో, స్నేహమో, వలసో, వాత్సల్యమో ఎవతెపై ఉంటే, ఆ వనిత అని చెప్పుకోవాలి. అందరూ అతివను ఆదరంగా చూచుకోవాలి. అందుకే మనుస్కృతి పిత్పభిర్భాతృభి్చైతా: పతిభర్దేవైస్తా, పూజ్యా భూషయితవ్యాళ్ళ బహుకళ్యాణమీప్పుభి: తండ్రులు, సోదరులు, భర్తలు, మరుదులూకూడా బహుశుభములు కోరి, స్త్రీలను గౌరవించి, వారికి అనేక అలంకారాలు ఇవ్వాలి అని చెపుతున్లది. కనుక, వారు సౌభాగ్యచిహ్షాలుగా సౌందర్యకారణాలుగా భావించే పువ్వులు మొదలయినవి, కనీసం అవి అయినా, వారిని చూడబోయినపుడు ఇవ్వాలి అని చెప్పటం. ఇలా పిల్లలవద్దకు వెళ్ళినపుడు, సామాన్యంగా తినుబండాలు పట్టుకొని వెడుతుంటారు. పిల్లలు నిరంతరం ఎదుగుతుంటారు, వారికి ఆకలీ బాగా ఉంటుంది. కనుక పుష్టికరమైన ఆహారమూ

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 137 అవసరమవుతూ ఉంటుంది. వారికి తెలిసినదీ అవసరమూ అయినదీ తిండి. అందువల్ల వారికి ఆనందమూ అధికమవుతూ ఉంటుంది. కనుక, ఏది చేతికందినా, ముందు వారు నోట్లో పెట్టుకొంటూ ఉంటారు. జిహ్వకు తృప్తికలిగితే సర్వానికీ తృప్తి కలిగినట్లే కనుక, పిల్లల('ప్రేమ పొందటానికి తినుబండాలు తీసుకొని వెడతారు. అట్టివో, వారివయస్సునీ, అభిరుచినీ, అవసరాన్నీ, ఉపయోగాన్నీ బట్టి ఆటబొమ లో, ఏవో, ఇవ్వవచ్చు, ఇస్తుంటారు.

దేవునివద్దకూ వట్టి చేతులతో వెళ్ళగూడదు.

“పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతిః

తదహం భక్యుపహృత మళ్చామి వప్రయతాత్మన?గ॥।

మనస్సు నదుపులో ఉంచుకొని, భక్తితో నాకు పత్తిరి, పుష్పం, ఫలం, జలం - ఏది సమర్పించినా, నేను స్వీకరిస్తాను అన్నాడు భగవానుడు. హరికి తులసీపత్రం, హరునికి బిల్వ-మారేడు-పత్రం, ఇద్దరికీ కములపుష్పం, అందరికీ కొబ్బరివంటి ఫలాలూ, గంగాది జలాలూ ఇష్టమైనవే. మనం సమర్చించేది ఏదీ, నిజానికి, దేవునికి అక్కరలేదు. ఈ సమర్పణవిధానం మనం తరించటానికి ఏర్పరిచినదే. పుష్పాలూ ఫలాలూ లభించటం, కష్టం కావచ్చు కొందరికి. పత్రీ, జలమూ సర్వసులభమైనవే. మనస్సును అదుపులో ఉంచుకొనటమూ, భక్తితో సమర్పిరచటమూ ముఖ్యం. అదీకాక, పత్రసమర్పణమంటే, హృదయపత్ర సమర్పణమే - ఆత్మనివేదనమే. పుష్టసమర్పణమంటే, అష్టవిధమానసిక వుష్పసమర్చణం. అనగా అహింసానత్యాదు లవలంబించటమని స్కాందాది బహువురాణములు చెప్పుతున్నాయి. ఫలనమర్చణమంటే, దుష్కర్మాచరణం విడిచిపెట్టటమూ, సత్కర్మఫలం భగవదర్చితం చేయటమూ, జలములతో స్వామికి అభిషేకం చేయటమంటే, తనపాపాలను కడిగివేసుకొనటం, అంటే చిత్తశుద్ది సమకూర్చుకొనటమే.

సద్దురువువద్దకు వెళ్ళట మూ ర్షిక్తహస్తాలతో కాగూడదనటానికి తదితరులకు చెప్పినవన్నీ వర్తిస్తాయి. గురువంటే?

గురుర్పహ్మా గురుర్విష్ణుర్లురుక్టేనో మహేశ్వరః,

గురుస్సాక్షాత్సరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః .

అని గురువును భావించటం మనసంప్రదాయం,. త్రిమూర్తులకూ అతీతమైనది పరబ్రహ్మం, దానినుంచే సమస్తసృష్టీ వెలువడింది. ప్రత్యక్షతత్సరూపుడు గురువంటే, త్రిమూర్తులు సాక్షాత్కరించటమూ జరిగినట్టు అనేకకథలలో వింటున్నాము కాని, పరబ్రహ్మసాక్షాత్కారం సులభమని వినబడటం లేదు. ఆ పరబ్రహ్మమే ప్రత్యక్షమైతే,

69

138 సుమతి శతకము దానిరూపం గురువనటంలో గురువువిశిష్టత తెలుస్తున్నది. అజ్ఞానమనే తిమిరంతో అంధమైన నేత్రాన్ని, జ్ఞానమనే కాటుకకణికతో తెరిచేవాడు గురువు -

అజ్జానతిమిరాంధస్య జ్ఞావాంజనళలాకయా

చక్షురున్మీలితం యేన తస్మై, శ్రీగురవే నమః

ఆయన ఇచ్చిన జ్ఞానంవల్ల కర్మబంధం తొలగుతుంది. జ్ఞానాదేన హీ కైవల్యం జ్ఞానంవల్లనే పరబ్రహ్మైక్యం సిద్దిస్తుంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేనయా - సాష్టాంగనమస్కారం చేసి సేవించి అడిగి జ్ఞానం తెలుసుకో. తత్త్యదర్భులైన జ్ఞానులు నీకు జ్ఞానోపదేశం చేస్తారన్నాడు భగవానుడు. మనస్సు ప్రసన్నమైతే కాని సదుపదేశం జరగదు. జరిగినా, దానిపై గురి ఏర్పడాలంటే, ఆత గనివేదనం ఉండాలి. అందుకుకూడా గురువును తగురితిని ఉపాసించాలి. ఇట్టి గురువుకి ఏదో సమర్పించటమంటే, అది రాజుకి, దేవునికి, ఇష్టురాలయిన ఇంతికి, దైవస్వరూపులయిన పిల్లలకి సమర్సించినదానికంటె ఎక్కువది.

దైవానికీ, గురువుకీ ఏదైనా సమర్పించటంలో పరమెంత ఉన్నదో, ఇహమూ అంత ఉన్నది. దేవునికి ఆలయంలో ఎలాగూ సమర్పిస్తారు. ఆయన ప్రత్యేకమయిన ఉత్సవాలలో రథాదులపై ఊరేగుతూ వచ్చినా సమర్పిస్తారు. ఇదంతా దేవస్టానానికీ, అర్బకులకీ ఆదాయం రావటానికి చేసినఏర్పాటు అన్నాడొకాయన. ఆదాయం వచ్చేమాట నిజమే కాని, అది అందుకుమాత్రమే ఏర్పడినది కాదు, ఆదాయం వస్తున్నా, అది అమార్ల్గం కాకపోగా, బహుళార్థ సాధకమైన ప్రశస్తమైన మార్గం, అనేక కారణాలవల్ల అందరూ ఆలయానికి అనుదినమూ వెళ్ళలేకపోవచ్చు, వెళ్ళినా దైవదర్శనం లభించకపోవచ్చు. ముక్కోటివీకాదశి, మహాశివరాత్రి వంటి ప్రత్యేకదినాలలో, దైవదర్శనం తప్పకచేసి తరించవలసిన వాళ్ళలో, తీరికా, ఓపికా చేసుకొని వెళ్ళినా, ఊరందరికీ, పై ఊళ్ళనుంచి వచ్చినవారికందరికీ, దైవదర్శనం లభించటం అసాధ్యమూ, అసంభవమూ కావచ్చు. కనుక, అందరికీ అన్నిచోట్లా లభించటానికి అనువుగా, ఆలయపురూపంలో రధం నిర్మించి, ఆలయంలోని దేవునిరూపాన్నే ఆందులో ఉంచి, అందరిదగ్గరికీ తీసుకొనివచ్చి, అక్కడ ఆ దేవునే దర్శించినసుకృతం దక్కిస్తున్నారు, ఇందువల్ల ఆదాయం పెరుగుతున్నదీ, భక్తి పెరుగుతున్నదీ, అది ఎవరికీ భారం కానిరీతిని సమర్పితమై, దైవసీవలకు వినియోగమవుతున్నది. దైవసేవకులు (ప్రజాగౌరవాన్ని చూరగొనవలసిన అవసరం ఏర్పడుతున్నది. వారిని జీతగాళ్ళని చేసినందున వారూ అధికారితుల్యులయి, ప్రజానురాగదూరులయినందున, వ్యవస్థకే కీడు కలుగుతున్నది అని మరొకరు జవాబు చెప్పారు. అలాగే, ఉపాధ్యాయునికి జ్ఞానార్థులు ఐచ్చికంగా, భక్తితో, ఏదో

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 139 సమర్చించినందువల్ల ఆయనకు అవసరాలకు లోపం ఉండదు, వీరికి భారం కాదు, ఇది ఇందులోని ఐహికం అని మరొకరు యథార్హం వివరించారు. ఈ పద్యంలో చెప్పిన భావానికి మూలం అగ్నిహోత్రం, గృహం, క్షేత్రం, గర్భిణీం, వృద్దబాలకౌ, రిక్తహప్తేన వోపీయాద్రాజావం విబుధం గురుం. అగ్నిహోత్రం, ఇల్టు, క్షేత్రం, గర్భవతి, వృద్దులు, చిన్నవారు, రాజు, పండితుడు, గురువు - వీరివద్దకు వట్టిచేతులతో పోరాదనిన భావంగల శ్లోకం మనుస్కృతిలోనిది. గురువుకూడా, జ్ఞానోపార్దనకూ జ్ఞానోపదేశానికీ నిశ్చింతగా తనసమయం అంతా వెచ్చించవలసినవాడు, సంసారం గడవటం కోసం తడుములాడవలసిన స్థితిలో ఉండకూడదు. అలాగని, గురువుకి ఎవరో జీతం ఇస్తుంటే, అతడు ప్రజలనూ, విద్యార్థులనూ, విద్యాదిబోధనూ నిర్లక్ష్యంచేసే అవకాశం ఉండవచ్చు. ఇందరు గురువులమీద నిఘావేసి విద్యావ్యవస్థ నడపటం, (ప్రభువుకు అసాధ్యం కావచ్చు. సాధ్యమైనా, ఆ వేతనాలకోసం పన్నులు వేయవలసిరావటమూ, అందువల్ల జనానురాగానికి దూరం కావటమూ మొదలయిన సమస్యలు తలెత్తవచ్చు. ప్రజలు గురువుకు గౌరవంతో ఏదో సమర్పిస్తుంటారు. జ్ఞానులయిన ఉపాధ్యాయులు యథాలాభ సంతుష్టితో జ్ఞానవితరణం చేస్తుంటారు. తొము ఏమాత్రం ప్రమత్తతతో ఉన్నా, కీర్తీ గౌరవమూ లోపించవచ్చు నన్నశంకతో గురువులూ (శ్రద్దతో, నిష్టతో తమ విధులు ఆలయనిర్వాహకుల లాగానే నిర్వహిస్తారు. ఇది పరస్పరాశ్రయం, భారరహితం, లక్ష్యసాధనకు ఉపకారకం. కనుక గురువులను దైవతుల్యులుగా ఇలా చూస్తూ, రిత్త చేతులతో సమీపించరాదనటం. ఇలా అన్నిరంగాలలోనూ కేంద్రీకృతం కాని వ్యవస్థ ఉండటమూ, (ప్రజల నిత్య సన్నిహిత భాగస్వామ్యముండటమూ, నిర్వహణక్షిష్టత లేకపోవటమూ, నిర్జిష్టములుగా నిర్దిష్టప్రయోజనాలు సిద్ధిస్తుండటమూ పూర్వవ్యవస్థలోని మేళ్ళు. ఆవ ? కులకాంత ఎలా ఉండాలో చెవుబోతున్హాడు : క. పనిచేయువెడల దాసియు, నమభవమున రంభ, నుంత్రి యాలోచనలన్‌, దన భుక్తియెడల( దల్లియు నన దన కులక్రాంత యుండనగురా సుమతి. గ్గ (ఫ్ర: సుమతీ, తన = భర్త అయిన తనయొక్క, కులకాంత = ఇల్లాలు, పని చేయునెడలన్‌ = పనిచేయు+ఎడలన్‌= ఇంటి పనులు చేసే సమయాలలో, దాసియున్‌ = కొన్న ఊడిగకత్తెయునూ, అనుభవమునన్‌ = (భర్తతో పాఖ్యం) అనుభవించే సమయంలో, రంభ = ఆ పేరిటిప్రసిద్దురాలైన 70

140 సుమతి శతకము దేవవేశ్యా, ఆలోచనలన్‌ = వ్యవహారాల ఆలోచన చేసే సమయాలలో, మంత్రి = అమాత్యుడూ, తన భుక్తియెడలన్‌ = తన = భర్త అయిన తనయొక్క, భుక్తి*ఎడలన్‌ = భోజనసమయాలలో, తల్లియున్‌ = కన్నతల్లియూ, ఆనన్‌ = అనునట్టుగా, ఉండన్‌ = ఉండగా, మెలగగా, అగురా = అగున్‌+రా = తగునయ్యా, తా : సుమతీ, ఇల్లాలు ఇంటిపనులు బేసే సమాయాలలో ఊడిగకత్తెలా ఉండాలి. భర్రపాందుసమయంలో రంభలా ఉండాలి, ఏవైనా వ్యవహారవిషయాలలో ఆలోచనలు చేసే సమయాలలో అమాత్యునిలా ఉండాలి. భర్త భోజనంచేసే సమయాలలో కన్నతల్లిలా ఉండాలి. వ్యా : ఈ పద్యంలో, ఇల్హాలితనం ఎంత గురుతరమైనదో వివరించబడింది. దీనికి మూలమైన శ్లోకం సుప్రసిద్ధమైనది పంచతంత్రంలో ఇలా ఉన్నది. కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపే చ లక్ష్మీ క్షమయా ధరిత్రి, స్నేహే చ మాతా శయనే తు వేశ్యా, షట్కర్మయుక్తా కులధర్మపల్ని - అని. పనులలో దాసిగా, కార్యాలోచనలో మంత్రిగా, రూపంలో లక్ష్మిగా, ఓరిమిలో భూదేవిలా, స్నేహం (= (ప్రేమలో తల్లిలా, పడకటింటిలో వేశ్యలా - ఈ ఆరుపనులలోనూ మెలగవలసినది కులకాంత అని దీనిభావం. శ్లోకంలో స్నేహే చ మాతా అనినతావులో భోజ్యేషు మొతా అనీ, శయనే తు వేశ్యా స్థానంలో శయనే చ రంభా అనీ పాఠాంతరాలున్నాయి. ఆ పాఠాంతరాలననుసరించే ఈ పద్యం వ్రాయబడి ఉన్నది. శ్లోకంలోని, రూపంలో లక్ష్మీ ఓరిమిలో భూదేవీ అనిన రెండు లక్షణాలూ పద్యంలో రాలేదు. తలచుకొంటే కవి రప్పించగలడు కాని, ఎందువల్లనో పరిహరించాడు. రూపంవిషయం మళ్ళీ పేర్కొననక్కర లేదు. అనుభవమున రంభ అన్నదానితో అది చెప్పినట్లే అనుకొని ఉండవచ్చు. అదీకాక, లక్ష్మివంటిదానిని, లోకమూతను, పవిత్రురాలిని అందానికి ఉదాహరణంగా స్వీకరించటమేమిటి? అందానికి అప్పరసనుగదా పేర్కొంటారు అనుకొని ఉండవచ్చు. కాని, అందంగా ఉన్నదని ఇల్లాలిని (ప్రశంసించవలసివచ్చినపుడు, ఆవిడకేం మహాలక్ష్మిలా ఉన్నది అంటుంటారు. అప్పరస ఎంత అందగత్తె అయినా, ఇల్లాలితో పోల్చదగినపవిత్రత అక్కడ లేదు. దానిపవిత్రతతో కూడిన అందానికి లక్ష్మియే ప్రసిద్దురాలు. ఓరిమికి భూదేవిలా అన్న లక్షణమూ వదలవలసింది కాదు. దాసిలో ఆ లక్షణం వచ్చేసింది అనుకొని ఉండవచ్చు. కాని క్షమయా సృథివీసమః అని రాముని వర్షించే సమయంలోకూడా ఈ పోలికనే తెచ్చాడు వాల్మీకి, ఇవి ఇలా ఉండగా, ఈ ఆరు రకాలబాధ్యతలూ ఆమెనెత్తినే పెట్టటం పక్షపాతబుద్ది అనేవారున్నారు కాని, ఆమెను కించపరచటానికి చెప్పిన మాటలు కావివి. సంసారం

వివేకానందినీ వ్యాఖ్యాసహితం క్షజ్ష1 సౌఖ్యవంతంగా ఉండాలంటే, ఆమె తీసుకొనవలసిన (శ్రద్దాసక్తులనే ఇది తెలియజేస్తుంది. మహాభారతంలోని సత్యభామాద్రాపదీసంవాదంలో (ద్రౌపది ఇట్టి భావాలనే చెపుతుంది. కుటుంబం విజయావహం కావాలంటే, గృహిణి ఇలా వ్యవహరించక తప్పదు. వీటిలో ఏ లక్షణం కొరవడినా, ఆ లోటు కుటుంబంలో కనిపిస్తుంది. ఇంత భారం ఉన్నది కనుకనే ఆమె గృహనిర్వహణానికి అంకితం కావాలన్నారు. పిల్లల్ని కనిపెంచవలసిన సహజసృష్టిధర్మం ఆమెది అయినందువల్లగూడా ఆమె యింటికి పరిమితం కావలసి వస్తున్నది. వివాహం కాకపోవటం, భర్త పోవటం, కుటుంబాన్ని పోషించగలవారు లేకపోవటం వంటి అనేక కారణాలవల్ల మహిళలకార్యరంగం ఇంటిబయటికికూడా విస్తరించి ఉండవచ్చుగాక, అయితే, అది ్రత్యేకసందర్భవిషయం కాని, సామాన్యసూత్రం కాదు. చాలామంది ఇంటిలోనిపనులు సొంతంగా చేసుకొనవలసినవీ, చేసుకొనగలిగినవీకూడా దాసీజనానికి అప్పగించి, ఆరోగ్యరక్షణార్థం వ్యాయామాలూ, ఉదయసాయంకాలాలలో నడకలూ చేస్తుంటారు. ఇంటిపనులు సొంతంగా చేసుకొంటే వట్టి వ్యాయామాలఆవసరమే ఉండదు. పల్లెలలో ఇప్పటికీ ఎంతెంత పనులయినా సొంతంగా చేసుకొనే శ్రీమంతులకాంతలు సంపూర్ణారోగ్యవతులుగా ఇల్టు దీర్చిదిద్దేవారందరో ఉండగా, నగరాలపరిస్థితి అన్ని విధాలా ఇందుకు విరుద్దంగా ఉన్నది. ఆధునిక మహిళలు, అవసరం లేకపోయినా, ఇల్టు వదలి ఇతర రంగాలమీద పడుతున్నందున, చాలా కుటుంబాలలో సుఖశాంతులు పిల్లలకూ పెద్దలకూ, ఆ అతివలకూకూడా ఆందని(మ్రానిపండ్లే అవుతున్నాయనిపించక తప్పదు. అవ + వుడుషనికి నిజమైన గొప్పదనం ఎలా వస్తుందో చెప్పుబోతున్లాడు = క. పరవారిసోదరుై పరధనములకానపడక పరులకు సొతు(డై పరులు దను€ బొగడ నెగడియు+ బరులలిగినవలుగనతండు పరముండు నునుతీ. 72 ప్ర: సుమతి, పరనారీ = తన భార్యకంటె ఇతరులయిన కాంతలు, సోదరు(డై = సోదరుండు+ఐ = తోబుట్టువులుగా గలవాడై. వరధనములకున్‌ = ఇతరుల (ద్రవ్యాలకోసం, ఆసపడక = ఆశపెట్టుకొనకుండానూ, పరులకున్‌ = ఇతరులకు, హితుండై = హితుండు+ఐ = 'స్నేహితుడైయూ, ఇష్టుడై పరులు = ఇతరులు, తనున్‌= తనము, పొగడన్‌ = ప్రశంసించునట్లుగా నెగడియున్‌ = వరిల్దుతూ ఉంటూనూ, పరులు = ఇతరులు, పగవారు, అలిగినన్‌ = తనపై కోపించినా, అలుగని = వారిపై తిరిగి కోపపడని, అతండు = ఆ మనుష్యుడు, పరముండు = గొప్పవాడు. 7

142 సుమతి శతకము

తా : సుమతీ, మనుష్యుడు, తన భార్య కాక ఇతరకాంతలందరూ తన సోదరీమణులని భావించాలి. ఇతరుల([ద్రవ్యాలు తనవి కావాలని ఆశించగూడదు. ఇతరులు తనను మిత్రుడనుకొనేటట్టుగా మెలగుతూ ఉండాలి. తనను ఇతరులు ప్రశంసించేటట్టుగా ప్రవర్తిస్తూ ఉండాలి. తనమీద ఇతరులు కోపపడినా, తాను వారిమీద కోపపడకుండా ఉండాలి. ఇట్టివాడు అందరికంటె గొప్పవాడు.

వ్యా :-ఈ పద్యంలో ఎట్టివాడు ఉత్తముడో చెప్పుతున్నాడు. అనగా ఏ యే విషయాలలో ఎలా ఉంటే గొప్పతనమవుతుందో చెప్పి, ఆ లక్షణాలు అందరూ అలవరచుకోవాలని ఉపదేశిస్తున్నాడు. వాటిలో మొదటిది అన్యకాంతలను సోదరీమణులుగా భావించటం. కామం ధర్మపత్నికీ భర్తకూ మధ్య ఉన్నంతవరకూ దోషం కాదు. దోషం కాకపోవటమే కాదు ధర్మవిరుద్ధం కానందున భగవత్స్యరూపం. ధర్మావిరుడ్డో భూతేషు కామోలఒస్మి భరతర్షభ. ప్రాణులలో ధర్మవిరుద్దం కాని కామాన్ని నేను అని భగవంతుడు చెప్పాడు. అది ఆ హద్దు దాటినపుడుమూత్రం శత్రువవుతుంది. (క్రోధమయినా అంతే. కనుకనే

కొమ ఏష క్రోధ ఏషరజోగుణసముద్భవ:,

మహాశనో మహాపాష్మా విద్ధ్యేనమిహ వైరిణం

ఆని భగవానుడు. ఎంత తిన్నా దీనిఆకలి తీరదు. తినేకొలదీ తినాలనిపించినట్టే, అనుభవించేకొలదీ అనుభవించాలన్నకోరిక పెరుగుతూనే ఉంటుంది. పాపకారకం, కనుక, దీనిని శత్రువుగా భావించాథి అని భావం.

న జాతు కానుః కానూనాం ఉపభోగీన శాన్యుతి

హవిషా కృష్ణవర్మేవ భూయ ఏవాభివర్ధతే.

అనుభవించినందువల్ల కామం ఎన్నడూ తగ్గదు. హవిస్సు హోమం చేసేకొలదీ అన్లి పెరుగుతూనే ఉంటుంది. అలానే ఇదీ అనుభవించేకొలదీ పెరుగుతూనే ఉంటుందని భారతం. కన్నమ్మకి కన్నంతవాప్పు తిన్నమ్మకి తిన్నంతవాప్పు అని తెలుగుశా(స్తం. అయితే, అది దంపతులమధ్య పరిమితమయితే, సృష్టి కొనసాగటానికి మూలమై, సృష్టి భగవత్కార్యము కనుక, భగవత్స్యరూపమవుతుంది. ఇది వడిదుడుకులు లేకుండా కొనసాగటానికి, హద్దుమీరకుండా ఉండాలంటే, పరకాంతలను తల్టులుగానో, తోబుట్టువులుగానో చూడటం అవసరం. కమ్నుదోయికి నవ్యకాంతలడ్డంబైన మాతృభావనసేసి మరలువాండు అని ప్రహ్హాదుని గురించి భాగవతం. పరనారీసోదరుండై ఉండాలంటున్నాడు కవి. రావిపాటితిప్పన్న ఇంతకంటె పైమెట్టమీదనుంచి చెప్పాడు :

లాచి పరాంగనల్‌ వరవిలాసమనోహరలోలదృష్టులం

జూచిన జూడ డుత్తము(డు చూచివం జూచుము మధ్యముండు తాం

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 143 జూచిన( జూడకుండినము జూచు గనిష్టుండు నన్ను వీరిలో6

జూచిన( జూడకుండు గుణి( జూచినచూపున( జూడుమంబికా. అని. ఇలా అతీతులుగా ఉన్నవారికి దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని సూచన. తాను పరకాంతలను తల్టులుగానో తోబుట్టువులుగానో చూస్తున్నా, వారు ఆకర్షించే (ప్రయత్నం చేస్తే? ఎలా ఉండాలో ఉదాహరణం రాముడు. ఇట్టి నిగ్రహం అతికష్టం కనుకనే

విశ్వామిత్రపరాశరప్రభృతయో వాతాంబుపర్ధాశన్గాం

తేఒపి స్రీముఖపంకజం సులలితం దృష్టైన మోహం గతాః,

శాల్యన్నం సనఘృతం సయోదధియుతం భుంజంతి యే మాననాః

తేషామిన్దియని([గ్రహో యది భనేద్వింధ్యః వ్లవేత్సాగరే -

(భరృహరి శృంగార. 79) వాయుభక్షకులు, పర్షభక్షకులు అయిన విశ్వామిత్రుడు, పరాశరుడు మొదలయిన మహర్షలే, మిక్కిలి అందమయిన స్త్రీముఖ , కమలాన్ని చూచినంత మాత్రానికే మోహపడిపోయారంటే, సన్నవరిబియ్యపన్నం నెయ్యీ పాలూ పెరుగూతోసహ తినే మనుషులకే ఇంద్రియనిగ్రహం కలిగేపక్షంలో, వింధ్యపర్వతం సముద్రంపై తేలిపోతుంది అన్నారు.

కామంతరువాత మనిషిని పాడుచేసేది డబ్బు, దానికోసం ఎన్ని కానిపనులయినా చేస్తారు. ఒకరిసొమ్ము తాను కాజేయాలనుకొనటం తప్పు, మనిషన్నాక ఇచ్చిపుచ్చుకొనటాలు తప్పవు. వాట్టవిషయంలో ఎలా ్రవర్తిస్తాడన్న దానినిబట్టి నమ్ముదగినవాడో, తగనివాడో నిర్ణయిస్తారు.

పర్వేషామేన శౌచానామర్ధశౌచం పరం సృతం,

యోలర్జే శుచిః స హి శుచిః వ మృద్వారిశుచిః శుచిః

(మను. 5.106) అన్నారు. డబ్బువిషయంలో ఎవడు పరిశుద్దుడుగా ఉంటాడో, అతడు పరిశుద్దుడు. నీటివల్లనూ, మన్నువల్లనూ పరిశుద్దుడయినవాడు పరిశుద్దుడు కాడు అని దానిభావం. కష్టపడి న్యాయమార్గంలో సంపాదించినదానితో తృప్తిపడాలి. ఎక్కువ కావాలనుకొంటే ఎక్కువ కృషిచేయాలి. అంతే కాని, అమార్గాలలో సంపాదించాలి అనుకోకూడదు.

తగినవేషంబు, తము డాను సాగడుకొనమి, నొచ్చియును కీడు వలుకమి యిచ్చి వగవ

కునికి తనకెంత నడవకయున్న పథము తస్పకుండుట నడవడి కొప్పుపేయు (ఉద్యోగ. 2.45) అన్నారు.

ఈశావాస్యమిదం సర్వం యత్కిం చ జగత్యాం జగత్‌

తేన త్యక్తేన భుంజీథాః నూ గృధః కస్యస్విత్‌ ధనం - ఆని ఉపనిషత్తు. ఈ జగత్తూ

శేశ4 సుమతి శతకము ఇందులో ఏ కొంచెమున్నదో అదీ ఈశ్చరునిదే. ఆయన ఇచ్చినదే అనుభవించాలి. ఇతరుల సొమ్ముకోసం ఆశించవద్దు అని దానిభావం. కనుక పరధనములకాళ పడగూడదనటం సమంజసమైనది. పరులకు హితుండై ఉండటం మూడవ లక్షణం, ఇతరులకు తాను హితుడై ఉండాలి అని దానిభావం. మనము ఇతరుల పట్ల ఎట్టి భావంతో ఉంటే, ఇతరులు మనపట్ట అట్టివారుగా ఉంటారు. మనము ఇతరులమేలు కోరుతూ ఉంటే, ఇతరులను హితులుగా భావిస్తుంటే, వారు మనలను హిత్తులుగా భావిస్తారు. భగవద్గిత అద్వేష్టానర్వభూతానాం మెత్రవ కరుణ ఏన చ అని చెపుతున్నది. దైవభక్తుడు ఏ ్రాణినీ ద్వేషించకుండా సర్వప్రాణులపైనీ మైత్రితో, జాలితో ఉండాలి అని చెపుతున్నది. పరోపకార: పుణ్యాయ పాపాయ సరసీడనం అని సూక్తి పరోపకారంవల్ల పుణ్యమూ, పరులనుపీడించినందువల్ల పాపమూ కలుగుతాయని దానిభావం. పరులకు ఉపకారం ఏమి చేసే అవకాశం, ఎలా లభిస్తుందా అని ఎదురుచూచే స్వభావం అలవరచుకోవాలి. పరులు దనుంబొగడ నెగడటం నాలుగవ లక్షణం. ఏ పని చేస్తే ఇతరులు తనను (ప్రశంసిస్తారో, ఆ పనిచేస్తూ ఉండాలి అని భావం. దాని అర్ధం ఇతరుల(ప్రశంస కోరి పని చేయమని కాదు, ఇతరుల ప్రశంసకు అర్హమైన పని చేయాలి అనిమాత్రమే. ఒక్కొక్కపుడు మంచిపనికి కూడా ప్రశంస రాకపోవచ్చును. అంతమాత్రాన మంచిలోని మంచిపోదు. అది వృథాకాదు. ప్రశంస కాని, నింద కాని పొందటం లక్ష్యం కాదు. ఉత్తమమైన పని చేయటమే లక్ష్యం. మనము మంచిపని చేసినా ఇతరులు ప్రశంసించకపోగా ఇతరకారణాలవల్ల నిందించవచ్చు. అయినా, దానిని మనము లక్ష్యపెట్టగూడదు. పరులు అలిగినా అలుగకపోవటం ఐదవ లక్షణం. ఒక్కొక్కపుడు ఇతరులు మనమీద అకారణంగానే, లేదా, వారిదృష్టిలో సకారణంగానే కోపపడవచ్చు. అయినా, మనము కోపపడగూడదట. వారికోపం సకారణమైతే, ఆ కారణం తాలగించే ప్రయత్నం చేయాలి. అకారణమయితే, ఆ విషయం వారికర్థమయేటట్టు ప్రయత్నించాలి. అయినా వారు కోపిస్తూనే ఉంటారూ, ఆత్మరక్షణ (ప్రయత్నం చేసుకోవాలి. అంతేకాని, మనమూ కోపపడినందువల్ల సత్ఫలం కలుగదు. ఇట్టి స్వభావం కలవారికి శత్రువులంటూ వారిదృష్టిలో ఉండరు. వీరిని అజాతశత్రువులంటారు. ధర్మరాజుగారు అట్టివాడు, దుర్యోధనాదులు ఎన్ని ఆపకారాలు చేసినా, వారిమీద ధర్మరాజుకు పగలేదు. చివరికి దుర్యోధనుడు మడుగులో దాగిన సందర్భంలో కూడా, పాండవులలో అతడు కోరినవారితో కోరిన ఆయుధంతో పోరాడవచ్చుననీ, ఆతడు ఆ ఒక్కనినీ గెలిచినా, అందరినీ గెలిచినట్లే అనీ చెప్పాడు. నిజానికా రీతి యుద్ధనీతి కాదు.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం కతర్‌ అవ : పరతీ - వరధన - వరనిందా - అనమనంబంధాదులు తగవని చెప్పుబోతున్లాడు : క _పరసతికూటమి. గోరకు, పరధనముల కాససడకు, పరునెంచకుమీ, సరిగాని గోష్టి పేయకు, సిరి చెడి చుట్టంబుకడకు. జేరకు సుమతీ. 73 (ప్ర: సుమతీ, పరసతి = ఇతరునిభార్యయొక్క, కూటమి = కలయిక, కోరకు = కావాలి అనుకోవద్దు, పరధనములకు = ఇతరులసామ్ములకోసం, ఆసపడకు = ఆశించవద్దు, పరున్‌ = ఇతరుని, ఎంచకుమీ = దోషాలు పేర్కొనకు, సరిగాని = సరి+కొని = సమానము కాని, గోఫ్టి = సంభాషణం, చేయకు = చేయవద్దు, సిరి =లక్ష్మీ = సంపద, .చెడి = పోయినపుడు, చుట్టంబుకడకున్‌ = బంధువువద్దకు, చేరకు = పోవద్దు. తా : సుమతీ, ఇతరునిభార్యను పొందవలెననుకోవద్దు, ఇతరుల సొమ్ములు నీకు దక్కాలి అనుకోవద్దు, ఇతరులలో ని దోషాలు గణించవద్దు, నీతో సమానులు కానివారితో మాటాడవద్దు, ఉన్నసంపద పోయి బీదతనము వచ్చినపుడు బంధువులవద్దకు సాయము కోరి పోవద్దు. వ్యా : ఈ పద్యంలో, చేయకూడని ఐదు పనులను పేర్కొంటున్నాడు. వాటిలో మొదటి రెండూ ఇదివరకూ చెప్పినవే. కాని కొంచెం తేడాతో ఒకటీ, మరొకరీతిగా మరొకటీ చెపుతున్నాడు. వాటిలో మొదటిది, పరసతికూటమి కోరవద్దన్నది. పరకాంతాసోదరుడు కావాలని పై పద్యంలోనే చెప్పినవాడు, ఈ పద్యంలో పరసతికూటమి కోరకు అని చెప్పటంలో భేదమున్నది. అక్కడ ఇతర స్త్రీలు కావాలనుకొనవద్దని సాధారణనీతి చెప్పాడు. ఇందులో ఇతరునిభార్యను పొందాలనుకోకు అని విశేషనీతి చెపుతున్నాడు. పర'స్తీపొందు కూడనిదే, ఆందులో సందేహం లేదు, ఒకవేళ అట్టిపని చేయవలసివచ్చినా, ఇతరునిభార్యను పొందవద్దని విశేషం. అందువల్ల తనకూ, ఆమెకూ, ఇతరులకూ నష్టం అధికంగా ఉండటమే అందులోని విశేషం. పరధనములకు ఆసపడవద్దనటం పునరుక్తి అయినా, అది ప్రధానమని చెప్పటం ఉద్దేశం. ఇతరులలోని దోషాలు నీవు పేర్కొనవద్దు అనటం విమర్భ్శనీయం. ఏ దోషమూ లేనివారు ఎవరూ ఉండరు. పరిపాలకుడో, ధర్మాధికారో ఇట్టివాడు అయితే, ఇతరులదోషాలు కనిపెట్టి, నందర్భాన్ని బట్టి నిందించటమో, హెచ్చరించటమో, తిక్షించటమోా, శిక్షింపడేయటమో చేయవచ్చు. ఆలా చేయటం అతనివిధికూడా. తనకు తెలిసిన ప్రతి మనిషిలోని ప్రతిదోషాన్నీ విమర్శించటమే పనిగా పెట్టుకొంటే, అతడు యఠథార్థవాదియే

1146 సుమతి శతకము కావచ్చుగాని, బహుజనవిరోధి కాక తప్పదు. దానివల్ల సుఖశాంతులు కొరవడతాయి. అయితే, కూడనిపనులు చేసేవారిని ఛీ అనకపోతే వారు మానరు, మారరుకదా, మరి పరులదోషాలు ఎంచవద్దంటే ఎలా? నిజమే. పరులను ఎంచవద్దు అన్నది నిత్యశంకితత్వం పనికి రాదు అనటానికి చెప్పినది. ఇతరులదోషాలను ఎంచటానికి ముందు, నీ దోషాలు తగ్గించుకో అనటానికి చెప్పినది కాని, సామాజిక కర్తవ్యం నిర్వహించవద్దనటానికి చెప్పినది కాదు. అదీకాక, ఇతరులను ఎంచదలచుకొన్నప్పుడు అందువల్ల వచ్చే చిక్కులను ఎదుర్కొనటానికి సిద్దపడి ఉండాలని (గ్రహించాలి, సరిగాని గోస్టిసేయకు అంటే, నీతో సమానులు కానివారితో గోస్టిసేయకు అని స్ఫురిస్తుంది. కాని నీకు సరికాని గోస్టిచేయకు అని (గ్రహించాలి. మనుషులు తనకు సమానమైనవారైనా, అధికులయిన్నా నీకు సరిఅయిన, అనగా తగిన, సంభాషణమే చేయాలి కాని, దానికి విరుద్ధమైనది కారాదని భావం. సిరి చెడి చుట్టంబుకడకు చేరవద్దంటే, అక్కరకురాని చుట్టము (గ్రక్కున విడువంగవలయు అని చెప్పినదానికి విరుద్ధము కాదా? నిజమే కాని, బంధువులు ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు వచ్చేవారే కాని, చెడినవానిని సగౌరవంగా సొకేవారు కారు. లేవడివేళ ఇచ్చేవాడు మిత్రుడుమాత్రమే, కనుక మానాభిమానాలు పోకుండా ఉండాలంటే మిత్రుని చేరటం మంచిది కాని, బంధువులను కాదని కవిభావం. ఆవ : వరసతులగోష్టిమాత్రమే కాదు ,వరునంగతికూడా వనికి రాదనబోతున్నాడు : క. పరసతులగోప్టినుండిన పురుషుడు గాంగేయుండైన భువి నిందపడున్‌ బరసతి సుశిల యైనను బరునంగతినున్న నిందపాలగు సుమతి. 7డీ ప్ర : సుమతి, పరసతుల = అన్యకాంతలతో చేసే, గోస్టిన్‌ = సంభాషణంలో, ఉండిన = ఉన్నట్టి పురుషుండు = మగవాడు, గాంగేయు.డైనన్‌= గాంగేయు6ండు+ఐనన్‌= గంగకుమారుడైన భీష్ముడైనప్పటికీ, భువిన్‌ = భూమిమీద, నిందపడున్‌ = నిందింపబడతాడు, పరసతి = అన్యకాంత, సుశిలల్రైనను = సుశీలశఐనను = మంచిశీలము కలది అయినప్పటికీ, పరుసంగతిన్‌ = అన్యపురుషుని సాంగత్యంలో, ఉన్నన్‌ = ఉండినపక్షంలో, నిందపాలగున్‌ = నిందపాలు+అగున్‌ = నిందవంతు ఆనగా నిందకు గురి అవుతుంది. తా : సుమతీ, అన్యకాంతలతో మాటాడుతూ ఉంటే, ఆ మాటాడే మగవాడు, ఆ జన్మబ్రహ్మచారి అయిన భీషు శ్రజైనప్పటికీ, పరకాంతాసక్తుడనే అపనింద వచ్చి పడుతుంది. అలాగే, పరపురుషునితో స్నేహం మాత్రమే అయినా చేసే వనిత, మంచి ప్రవర్తన కలది అయినప్పటికీ, ఫరపురుషుని మరగింది అనే నిందకు గురి అవుతుంది.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 147

వ్యా ; 72వ పద్యంలో పరనారులను సోదరీమణులుగా చూడవలెనని పురుషులకు బోధించాడు. పరకాంతలకలయిక తగదని 73వ పద్యంలోనూ పురుషులకే చెప్పాడు. ఈ పద్యంలో పరసతులతో మాటాడితే పురుషులకూ, వారితో కలిసి కేవలమైత్రితోనే అయినా ఉంటే స్రీలకూ, నింద తప్పదని చెప్పుతున్నాడు. తండ్రి శంతనుడు కోరిన సత్యవతిని, ఆయన వివాహమాడే వీలుకోసం, తాను ఆమరణ(బ్రహ్మచారిగా ఉంటానని భీషణ్రతిజ్ఞ చేసినవాడు భీష్ముడు.

వినా భస్మం వినా రామం ఆంజనేయం తథా శుకం

హరిణీఖురమాత్రేణ చర్మణా మోహితం జగత్‌ -

భీష్మునీ, రామునీ, ఆంజనేయునీ, శుకమహర్షినీ మినహాయించి, కడమజగత్తంతా కామమోహపితమ్రై పోయినదే అని, కామమోపాతులు కానివారిలో ('ప్రథమస్మరణగౌరవార్డుడైనవాడు భీష్ముడు. అట్టివాడుకూడా పరతరుణీగోస్టిలో ఉంటే నింద రాక తప్పదట. ఇక మామూలుమానవులయితే చెప్పేదేమిటి? పరకాంతతో మాటాడితే చాలు, ఎంతటి ఉత్తమపురుషునయినా శంకిస్తారు. పరవురుషునితో కలిసి ఉంటే, ఎంతటి సత్ర్రవర్తన కలిగిన ఇంతినైనా శంకిస్తారు. స్త్రీని శంకించటానికికంటె పురుషుని శంకించటానికి స్వల్పకారణం చాలంటున్నాడు. పురుషుని మనుపరిణామ(క్రమం ప్రసిద్ధం.

అదర్భనే దర్శవమాత్రకానూ దృష్ట్వా పరిస్వంగసుఖైకలోలా,

ఆలింగితాయాం పునరాయతాక్ష్యామాశాన్మహే నిగ్రహయోరభేదం,

ఆమెను చూడనంతవరకు చూస్తే చాలనిపిస్తుంది. చూచాక కౌగిలించు కోవాలనిపిస్తుంది. కౌగిలించుకొన్నాక రెండు శరీరాలూ ఒకటై పోవాలనిపిస్తుంది - అని. కాంతల విషయం అయితే ఒకచోట ఉనికి కావాలి. అది జరిగితే, ఎంత ఉత్తమురాలినయినా శంకిస్తుందై లోకం. సీత విషయంలో అదే జరిగింది. అన్నాళ్ళు లంకలో ఉన్నదన్నదే, ఆమెను లోకం అడిపోసుకొనటానికి కారణం. ఆయతే ఇలా శంకించటం సబబని చెపుతున్నాడని భావించగూడదు. సబబా, కాదా అన్నది తరవాతిసంగతి. లోకం శంక్షిస్తుంది. నింద వచ్చిపడిన తరువాత, చేయగలది ఉండదు. వివ్పులేనిదే పొగ వస్తుందా అనుకొంటారు. పొగలేని నిప్పులూ ఉంటాయి. నిప్పులేని పొగలూ ఉంటాయి అని భావించరు. కనుక నింద రాకుండా చూచుకొనటం నీతి అని కవి భావం.

అవ : వరుచింతగల ఇంతి మొదలయిన వారిగురించి చెపుతున్నాడు న్‌

క. పరునాత్మ(. దలయసతి విడు

మజుమాటలు సలుకుసుతుల మన్నింపకుమీ గడీ

146 సుమతి శతకము వెజపెజు(గని భటు నేలకు తజుచుగ సతి గవయ(బోకు తగదుర సుమతీ, 75 ప్ర: సుమతీ, పరున్‌ = పతివైన నీకంటె, పరున్‌ = ఇతరుడైన వానిని, తలంచు = స్మరించే = కోరుకొనే, సతిన్‌ = భార్యను, విడు = విడిచిపెట్టు, మజుమాటలు = మారుపలుకులు, ఎదురుమాటలు, పలుకు = మాటాడునట్టి, సుతులన్‌ = కొడుకులను, మన్నింపకుమీ = క్షమించకు, వెజపెజు6గని జ వెజపు+ఎజుంగని = భయం తెలియని, భటున్‌ = పనివానిని, ఏలకు = పనిలో ఉంచకు, తఆచుగన్‌ = తజచు+కన్‌ = ఎక్కువగా, సతిన్‌ = స్త్రీని కవయంబోకు = కవయన్‌+పోకు = కూడవద్దు, తగదుర = ఈ పనులు చేయటం యుక్తం కాదయ్యా. తా ఏ సుమతీ, నీకంటె ఇతరుని మనస్సులో తలచుకొంటూ ఉండే తరుణిని విడిచిపెట్టు. నీకు ఎదురుమాటలు చెప్పే కొడుకులను క్షమించకు. నీవంటే భయంలేని పనివానిని పనిలో పెట్టుకోకు. మితి మించి మెలతను కూడకు. వ్యా: ఈ పద్యంలో స్త్రీ విషయకమైన నీతులు రెండూ, కొడుకులకు సంబంధించినది ఒకటీ, పనివానికి సంబంధించినది ఒకటీ చెపుతున్నాడు. మొదటిదీ, సీకి సంబంధించిన వాటిలో మొదటిదీ, మనస్సులో ఇతరుని తలచుకొనే మగువను విడిచిపెట్టు అన్నది. ఇది పెండ్లి కాకముందూ, తరువాతాకూడా చేయదగినపని. ఒకనిని 'పెండ్లాడదామనుకొంటున్న ఉవిదను మరొకడు పెండ్లి చేసుకొనటమూ తగదు, పెండ్లి అయిన తరువాత భర్తనుకాక మరొకనిని కోరుకొనే ఆమెనూ ఏలుకోగూడదు అని నీతి కనుకనే, తనమనస్సు సాల్వరాజుపై ఉన్నదనిన అంబను విచిత్రవీర్యునకిచ్చి చేయక, సాల్వునివద్దకు పంపించాడు భీష్ముడు. భర్తనుకాక మరొకనిని తలచుకొంటూ ఉండటం మానసికమైన తిరుగుబోతుతనం. మానసికం దైహికం కావటానికి తాలి అడుగు. "కనుక ఆమెను విడిచిపెట్టముంటున్నాడు, తండ్రిమాటకు ఎదురుమాట చెప్పే కొడుకులను క్షమించవద్దన్నది, వారిబాగు కోరి చెప్పినమాట. తండ్రిమాట తనయుడు మన్నించాలన్నది మన సంప్రదాయం. దీనికి శ్రీరామచంద్రునికంటె మంచి ఉదాహరణం ఉండదు. మథికొన్ని నిమిషాలలో యౌవరాజ్యపట్టాభిషేకం జరుగనున్నదనగా అడవికి వెళ్ళమనటం, ఎంత ఉత్తమునికైనా కష్టం కలిగించే విషయం. రాజ్యంకోసం తలలు నరుకుకునేవారుండగా, న్యాయంగా తనకు దక్కవలసినరాజ్యం ఎవరికో ఇస్తాననటం, ఏ రాజకుమారుడూ సహించలేనిది. అదీ మరొకొంత సేపటిలో పట్టాభిపేకమనగా, అయినా, మనస్సులోకూడా కించపడకుండా వెళ్ళాడు రాముడు అడవికి. ఇట్టివాడుగా ఉండవలసిన కొడుకు, తండ్రిమాట కాదనేస్థితిలో ఉన్నాడంటే, వాడింక బాగుపడటం కల్ల. కనుక అతనిని తగుదారికి తీసుకువచ్చే ప్రయత్నం చెయ్యాలి గాని, ఉపేక్షిస్తే వాడు పాడైపోతాడు. వినయం నేర్చవలసిన తొలిగురువు తండ్రి, ఆది అతనివిధి,

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 149

(ప్రజానాం వినయాధానా ద్రక్షణాద్భృరణాదసి ॥

స పితా పితరస్తాసాం కేవలం జన్మహేతవః ॥

(ప్రజలకు వినయం మప్పటంవల్లనూ వారిని కాపాడటంవల్లనూ పోషించటం వల్లనూ వారికి దిలీపమహారాజే తండ్రి, కన్నతం'[డ్రులు పుట్టుకకు మాత్రమే కారణమైన తండ్రులు అన్నాడు కాళిదాసు. తండ్రినే ఎదిరించినవాడు ఇక ఎవరిపట్టనూ వినయంతో (ప్రవర్తింపబోడు. అవినయవంతునికి అనర్జాలుతప్ప, మరే ప్రయోజనాలూ కలుగవు. కనుక ఎదురు చెప్పిన సుతులను క్షమించక, తగు విధానంద్వారా దారికి తేవలసి ఉన్నది.

భయం తెలియని పనివానిని పోషించక తొలగించాలి. ఒకనివద్ద పనికి కుదురుకొన్నవాడు తనకు లభిస్తున్న జీతానికి తగినపని చేయాలి. ఇది చివరి చిన్న ఉద్యోగినుంచి పెద్ద ప్రథమ ఉద్యోగివరకూ, అందరికీ వర్రించవలసిన నియమం, అలా పనిచేయకపోతే, తన యజమానుడు తననేమంటాడో, ఏ శిక్ష వేస్తాడో, అనిన భయం పనివానికి ఉండాలి. అది లేనిపక్షంలో, అతడు పని సరిగా చేయడు. తాథెడ్డ కోతి ననమెల్లా చెరుస్తుందవి, అట్టి పనివాడు ఒకడుంటే, వానిని జూచి ఇతరులుగూడా చెడి, పని చేయనివారుగా తయారవుతారు. కనుక, తనవలన భయం లేని పనివానిని తొలగించాలి తప్ప, వానిని పనివానిగా కొనసాగనివ్వగూడదు.

స్త్రీని తరచుగా కూడవద్దన్నది సౌఖ్యదృష్టితోనూ, ఆరోగ్యదృష్టితోనూ, మనస్తత్ర్రదృష్టితోనూ ఆలోచించి చెప్పిన నీతి. ఆధునిక మనస్తత్ష్యవేత్తలూ, వైద్యులూకూడా కలయికలమధ్య, వ్యవధి అవసరమని చెపుతున్నారు. శరీరారోగ్యానికీ, సుఖానుభవ సామర్దానికీ, మానసికతృప్తికీ ఈ వ్యవధి ఆవసరమని చెపుతున్నారు. మన ప్రాచీనులు, ఇట్టి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొనే, (ప్రషరుషుల కలయికకు త్త్‌న తగని వారాలు, తిథులు, నక్షత్రాలు కూడా పేర్కొన్నారు. వయసులో ఉన్నవారూ, లేసివారూ వాటిప్రకారం ప్రవర్తించటం అరుదుకాని, పాటించగలిగితే, తజచుగా కనయబోకు అని చెప్పవలసిన అవసరమే ఉండదు.

అవ : పలుకుతీరు, వరులయిండ్రకు వెళ్ళటం, తిరుగుబోతుపొందు, పొగడు గుర్రాలను గురించి చెప్పుబోతున్లాడు :

క. పరులకనిష్టము సెప్పకు

పారుగిండ్లకు. బనులులేక పోనకుమెవుడున్‌

ఒరు గదిసిననతి. గవయకు

మెటి/గియు బిరుసైవ హయము నెక్కకు సునుతీ. 76 75

150 సుమతి శతకము

ప్ర: సుమతీ, పరులకున్‌ = ఇతరులకు, అనిష్టము = ఇష్టముకాని విషయం, చెప్పకు = తెలుపవద్దు, పనులు లేక = పోవలసినపనులు లేకుండా, పొరుగిండ్లకున్‌ = పొరుగు+ఇండ్లకున్‌ = ఇంటి ప్రక్కగృహాలకు, ఎపుడున్‌ = ఏ సమయంలోనూ, పోవకుము = వెళ్ళవద్దు, ఒరున్‌ = మరొక మగవానిని, కదిసిన = సమీపించిన = పొందిన, సతిన్‌ = వనితను, కవయకుము = పొందకు, ఎటింగియున్‌ = తెలిసిఉండికూడా, బిరుసైన = బిరుసు+ఐన = పొగరుతో ఉండే, హయమున్‌ = గుజ్జాన్ని, ఎక్కకు = ఆరోహించకు.

తా: సుమతీ, ఇతరులకు ఇష్టంకాని విషయం నీ నోటితో చెప్పవద్దు. పని ఉంటే తప్ప, ఇరుగుపొరుగువారి ఇండ్లకు, ఏ నాడూ వెళ్ళవద్దు. మరొకరితో కూడిన మగువతో నీవు కూడవద్దు. ఆది చెప్పినమాట వినని పొగరుబోతు గు(ర్రమని తెలిసిన తరువాత అటువంటి గు(ర్రాన్ని ఎక్కవద్దు,

వ్యా ఏ ఇతరులకు ఇష్టం కలిగించనిమాటలు నీవు చెప్పవద్దనటం, మాటతీరు విషయంలో వహించవలసిన (శ్రద్ధను సూచిస్తుంది. ఈ విషయం 62వ పద్యం వ్యాఖ్యలో చర్చింపబడింది. ఇది స్త్రీపురుషులిద్దరికీ వర్తిస్తుంది.

ఇరుగుపొరుగువారియిండ్లకు పని ఉంటేనే వెళ్ళాలి. పని లేకపోతే ఎన్నడూ వెళ్ళగూడదు.

అతిపరిచయాదవజ్ఞా సంతతగమనాదనాదరో భవతి।

మలయే భిల్లపురంధ్రీ చందనతరుకాస్ట్రమింధనీకురుతే ॥

(పండితరాజశతకం) పరిచయం ఆతి అయితే, ఎదుటివానిపట్ట తేలికభావం ఏర్పడుతుందట. అస్తమానూ పరాయి ఇంటికి వెడుతుంటే, అనాదరం ఏర్పడుతుందట. మంచి గంధపు చెక్కముక్కను తులాలలెక్కను, (గ్రాములలెక్కను, ఆంగుళాలలెక్కను కొని ఉపయోగించుకొంటారు. మలయపర్వతం మీద నివాసముండే కిరాతస్ర్రీ మంచిగంధపు చెట్టముక్కలను వంటకట్టెలుగా వాడుతుందట. దానికి కారణం, ఆచెట్టు ఆ కొండమీదనే పెరుగుతున్నందున, ఆ కట్టెముక్కలు విరివిగా సులభంగా చొరుకుతుండటమే.

వాన సమస్తజీవులకవళ్యము (ప్రాణము, ప్రాణమైనయ

వ్వానయు(బల్మయుం గురియవచ్చినం దిట్టదురెల్లవారలువ్‌

హీనమనమన్కు(డై యొరులయిండ్లకు( బల్మటు పోవువేవియున్‌

మానిసీ కట్టవచ్చువనమానము న్యూనము మావభంగమున్‌

అని నీతి శాస్త్రముక్తావళి. కనుక, ఇతరుల ఇండ్లకు తరచు పని లేకుండా వెళ్ళినందువల్ల ఆనాదరం ఏర్పడుతుంది. అదీకాక, అస్తమానూ వీరికి ఆయింటిలో ఏమిపని ఉన్నది అని,

జనులు తలకొక విధంగా భావిస్తారు. అపనిందలు రావచ్చు. అందువల్ల, పనిలేనిదే (ప్రక్కయిండ్లకు స్త్రీలూ పోరాదు. పురుషులూ పోరాదు. పని ఉండి పోయినా,

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 151 (ప్రక్కయిండ్లలోనేకాదు, కార్యాలయాలలోనయినా, ఎంతసేపు ఉండటం వెళ్ళినపనికి అవసరమో, అంతవరకూమాత్రమే అక్కడ ఉండి, అయిపోయిన వెంటనే వెళ్ళిపోవాలి. వృథా కాలయాపన తగదు, దానివల్ల మన సమయం వ్యర్థం కావటమే కాదు, ఎదుటివారి సమయమూ వ్యర్హంచేసిన వారమవుతాము. దానివల్ల, వారు ఒకసారి మొహమాటపడి భరింపవచ్చు కాని, తరువాత ఇట్టి వారిరాక కంటగించుకొనే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది గమనించటం అవసరం, గాంధి మహాత్ముడు తనను చూడవచ్చే వారిలో ముఖ్యులతో ఇంత సమయమని మాటాడటానికి కేటాయించేవారు. ఆ నిమిషాలు అయాక కూడా వారుంటే, గడియారం చూపించి, నీ సమయమై పోయింది అని చెప్పేవాడు. ఒక ఉద్యోగి - రచయిత కూడా తన తల వెనుక “ఇది వాజ్ఞ్యయ తపోభూమి, ఇదే మీకు స్వాగతమ్ము, ఇటకు మీరు విచ్చేయుట ఇందుండుట సంతోషము, అవనరమ్ము మించి ఒక్క అక్షరమ్ము పలికి కాని, అరక్షణమ్ము నిలిచి కావి అంతరాయమొసగరుగద” అని వ్రాసిన ఒక అట్ట (వ్రేలాడదీశాక కాలాంతకుల బెడద తగ్గింది అతనికి, డబ్బుకంటె, బంగారం కంటె, ప్లాటినంకంటె, రత్నాలకంటె విలువయినది సమయం. సమయాన్ని సద్వినియోగం చేసుకొన గలవారు ఘనకార్యాలు సాధిస్తారు. సమయాన్ని వ్యర్థంచేసినవారు వ్యర్థులవుతారు. “సమయమమూల్య మొక్క నిమునమ్ము వృథా చవ(/గ్రమ్మరింప నే రము మన మాయువా (త్రుటిపరంసర యౌట యెటింగి నిద్రనూం ద్యముమ దొజంగి మీ పనుల నొారయుఃడో జనులార యంచు డం బముగ మెడన్నిగిద్చి కృకవాకము కూపెడి వింటికొప్పునన్‌” అన్నాడు కవి దువ్వూరి రామిరెడ్డి ఒరు6 గదిసిన సతిం గవయకు మన్నది స్త్రీ పురుష సంబంధాలలో అతిముఖ్యమైన నీతి. వివాహం చేసుకొన్న స్త్రీ పురుషులు మాత్రమే కలియటం ఆదర్భం. ఇందులో చెప్పినది, ఇతరుని పొందిన పాలతిని పొందవద్దన్నది, భార్యావిషయమే, వనితా విషయమే, అన్నట్టు కనిపించినా, ఇది పురుష విషయంగా గూడా (గ్రహించవలసినది. ఒక కాంతను కలిసినపురుషుని మరొక్ష స్రీ, ఒక పురుషుని కూడిన చేడెను మరొక పురుషుడూ కూడరాదన్నది ఉండవలసిన నీతి, ఇది నీతికి మాత్రమే. సంబంధించినదిగా 'పైకి కనిపించినా, ఆ నీతి వ్యక్తి ఆరోగ్యానికీ, సమాజం ఆరోగ్యానికీ సంబంధించిన మహావిషయం కనుక్క మరీ ముఖ్యమైనది, అందులోనూ (ప్రాణాంతకమైన ఎయిడ్స్‌ వంటి రోగం, ళో

1152 సుమతి శతకము మహామారిలా (ప్రపంచమంతటా (క్రమ్ముకొంటున్న ఈ రోజులలో, ఈ విధముగా దీనిని (గ్రహించటం, మానవ జాతిమనుగడకే అవసరమయిన ప్రధానమైన విషయం,

ఎజింగియు బిరుసైన హయము నెక్కవద్దన్నది, సజీవ వాహనాలను అధికంగా ఉపయోగించే కాలంలో చెప్పినమాట, అందులోనూ వేగంగా పరుగెత్తేది హయం. అశ్వహృదయం ఒక విద్య. ఆశ్చశాస్త్రమని ఒక శాస్త్రమే పెరిగి, ఈ దేశంలో వివిధ భాషలలో అనేక (గ్రంధాలు కూడా వెలువడ్డాయి. గుట్టాలకు జన్మనిచ్చిన గుజ్ఞాల జాతులు, అవి తినే ఆహారం, పెరిగిన ప్రదేశం, ఇచ్చిన శిక్షణ - వంటి వాటిని బట్టి గుజ్జ్హాల గుణాలూ స్వభావాలూ ఏర్పడతాయి. పోట్టగిత్తలు, దొంగగొడ్డు ఉన్నట్లే పొగరుబోతు గుజ్ఞ్రాలుంటాయి. అవి తమను అధిరోహించిన వారిని పడద్రోసి, (త్రొక్కి, కరిచి, తన్ని చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్టివాటిని స్వాధీనం చేసుకొనటానికి అనేక ప్రక్రియలు శాస్త్రంలో చెప్పి ఉన్నాయి. అట్టి వాటిని స్వాధీనం చేసుకొనగలగటం, వాటిని దారికి తేవటం, అశ్చ శిక్షకుల నైపుణ్యం. కళ్యాల పదిలంబుగాని గుబ్దంబుల క్రొత్త ముట్టున కియ్య కొలువు వెవు నాకు తెలుసునన్నాడు తంత్రీ పాలుని వేషంలో నకులుడు. కళ్యాలంటే కళ్ళెములు. కళ్ళేలకు లొంగని గుజ్జాలను ఇట్టే తెగిపోయే నూలు పోగుతో లొంగదీస్తానని అతని అభిప్రాయం. 1క్రొత్తముట్టు అంటే, నేత మగ్గంలో వలువనేత కుపయోగించే అసలు నూలు కదుకువెట్టే దుర్చలమైన దారపు పోగు. ఆ ప్రక్రియలూ ఆ శాస్త్రాలూ తెలిసినప్పటికీ, అది లొంగివచ్చినదైనప్పటికీ, ఆ సంగతి స్వారీ చేసే వానికి తెలిసినప్పటికీ, పొగరుబోతు గుజ్ఞాలను స్వారీ చెయ్యటం తగదన్నది చెపుతున్న నీతి. ఏదైనా మారుతుంది కాని గుణం మారదు. అణచిపెట్టి ఉంచవచ్చు గాని, పొగరున్నది పాగరున్నదే. అట్టి దానికి అణగిన గుణం, ఎపుడు మళ్ళీ పైకి లేస్తుందో తెలియదు. అట్టివాటి సవారీ పరిహరించటమే మంచిది. ఈ రోజులలో గుర్రపు పందేలలో పాలుగొనేవారు, గుజ్ఞాల వంశ చరిత్రల్ను మొదలయిన వన్నీ పరిశీలించి మరీ, పందేలు కాస్తారన్నది ప్రసిద్ద విషయం. కనుక వాహన విషయంలో చెప్పిన ఈ నీతి గొప్పదనం మనకు తెలుస్తుంది. మంచి జాతి గుజ్ఞాలు రాణాప్రతాప్‌, ఇడ్లతిక్కన వంటి వారి గుట్టాలు చరిత్రలో (ప్రసిద్ధమైనాయి, ఏ సమయంలోనైనా, ఏ కారణం వల్లనో ఎదురు తిరిగే అవకాశమున్న గుజ్ఞాన్నెక్కి, ఆపద తెచ్చుకొనటంకంటె, దానిని ఉపయోగించకనే పోవటం మంచిది కదా.

అన? పొలతిపొందు, రాజుకరుణ, అలిగర్పం, జరుగుబాటుల గురించి చెప్పబోతున్నాడు :

క పర్వముల సతుల గనయకు,

ముర్వీశ్వరుకరుణ నమ్మి యుబ్బకు మదిలో,

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 153 గర్వింప నాలి( బెంచకు నిర్వహణము లేనిచోట నిలునకు సుమతీ, ౯77

ప్ర : సుమతీ, పర్వములన్‌ = అమావాస్య మొదలయిన తిథులలో, సతులన్‌ = స్త్రీలను, కవయకుము = పొందకుము, ఉర్వీశ్చరు = ఉర్వీ + ఈశ్చరు = భూపతి = రాజు = ఏలికయొక్క, కరుణ = దయను, నమ్మి = విశ్చసించి, మదిలోన్‌ = మనస్సులో, ఉబ్బకు = పొంగిపోకు, గర్వింపన్‌ = మదించునట్టుగా, ఆలిన్‌ = భార్యను, పెంచకు = పెరుగజేయవద్దు, నిర్వహణము = జరుగుబాటు, లేని చోటన్‌ = లేని ప్రదేశంలో, నిలువకు = ఉండవద్దు.

తా ; సుమతీ, పర్వాలలో పడతులను కూడవద్దు, ఏలినవానిదయ విళ్చసించి పొంగిపోకు, మదం కలిగే విధంగా భార్యను పెరగనివ్వుకు, జీవనం గడవనిచోట నివసించవద్దు.

వ్యా : ఈ పద్యంలో స్రీలకు సంబంధం ఉన్న నీతులు రెండూ, ప్రభువు దయ గురించి ఒకటీ, ఆహార సంపాదన విషయం ఒకటీ చెప్పాడు.

మొదటిది పర్వాలలో పడతుల పొందు వద్దు అన్నది. 75వ పద్యం వ్యాఖ్యానంలో తజఆచుగ సతిం గవయంబోకు అన్నదానికి (గ్రాసిన వ్యాఖ్య మళ్ళీ చదవండి. తఆచుగా కలియకుండా ఉండటం కూడా ఒక (ప్రయోజనంగా, కలయిక నిషేధించిన తిథులలో పర్వాలున్నాయి. పర్వం అంటే దర్భ్శం, అమావాస్య, పాడ్యమి - ఈ రెంటి సంధికాలం దర్భ్శం, అంటే - మొత్తం మీద అమావాస్య, అమావాస్యనాడు అతివ కలయిక కూడదు, పర్వం అంటే పండుగ అని కూడా అర్ధం. సంక్రాంతి మొదలయినవి. అట్టి వాటిలో కూడా పనికిరాదు. ఒక్కొక్క పర్వంనాడు ఒక్కొక్క రీతిని దేవ - పితృ దేవాది - పూజా - స్నాన

  • ధర్మ - దానాది కార్యాలు గృహస్టులు ఆచరించవలసిన వున్నాయి. ఆ సందర్భాలలో ఆహార విహార నియమాలు పాటించవలసిన వున్నాయి. అట్టి వాటిల్లో పొలతిపొందు పనికిరాదన్నది శాస్త్రం. అష్టమి, చతుర్షశి, కుహువు (చంద్రకళ కనిపించని అమావ్షాస్య) పూర్ణిమ, రవి సంక్రాంతి - వీటిని పంచ పర్వాలంటారు. ఇట్టి నిషిద్ధ దినాలలో పొలతిపాందువల్ల దేవ-పితృ దేవ-అపచార దోషం సంక్రమిస్తుంది, అయోగ్య సంతానం -కలుగుతుంది.

ఏలిక దయను విశ్వసించి పొంగి పోవద్దన్నటి రెండవనీతి, పరిపాలకులకు ఎవరిమీదా శాశ్ళతమైన అను[గ్రహం ఉండదట, వారికి వారిపని కావటం ప్రధానం. ఆది సాధించి పెట్టగలవారిపై దయా గౌరవమూ కలుగుతాయి. ఆ పని కాకపోయినా అవి నిలవవు, అయిన తరువాతా ఉండవు, కాళిదాసు “ప్రయోజనా సేక్షితయా ప్రభూణాం ప్రాయశ్చలం గౌరవమాశ్రితేషు” అన్నాడు. ప్రభువులు మన్నన చూపించటమనేది కలిగే ప్రయోబనాన్నిబట్టి ఉంటుంది. కనుక ఆది సామాన్యంగా చంచలంగానే ఉంటుంది అన్నాడు. క్షేమేంద్రుడు కూడా తన చారుచర్యలో గా

154 సుమతి శతకము ప్రభుప్రసాదే పత్యాశాం న కుర్యాత్‌ స్వస్నసంనిఖే ॥

వందేన నుంత్రీ నిహితః శకటాలో హీ బంధనే ॥

(ప్రభువు అను(గ్రహంచాడని ఆశపెంచుకోకు. ఆ అనుగ్రహం కలవంటిది. తననెంతో సేవించిన శకటాలుడనే మంత్రిని నందరాజు, కారాగారంలో ఉంచాడు అని చెప్పాడు. ఈ కథ విపులముగా కావాలంటే, చారుచర్య 46, 55వ పద్యాల వివరణలో చూడండి.

అలిని వర్చిల్లజేయవలసినదే కాని మదమెక్కేటట్టు కాదన్నది మూడవ నీతి, ఇది ఆలుమగలలో మగవాడు అధికుడు, ఆలు అతని ఆదుపాజ్ఞలలో ఉండవలసినది అనిన అభిప్రాయాన్ని అనుసరించినది, ఆధిక్యప్రస్తావన లేకున్నా, అనుసరించవలసినదీ కావచ్చు. ఈ పద్రతిని ఆధునిక (స్రీలు కొందరు అంగీకరించటం లేదు. అయితే ఒక దేశాన్ని పరిపాలించే పద్దతి, రాచరికపు పద్దతి అయినా, ప్రజాస్వామ్యమయినా, సామ్యవాద పద్దతి అయినా, నియంతృత్వ విధానమైనా, ఏదయినా, ప్రభుత్వ నిర్వహణలో గల పదవులలో తారతమ్యం తప్పటం లేదు. రాజ్యాంగాన్నననుసరించి ఒక పదవి ఉన్నతము, తక్కినవి దాని క్రిందివి అనే ఒక క్రమం తప్పటం లేదు. తప్పదు, తప్పగూడదు కూడా. ఇల్లు కూడా ఒక చిన్న ప్రభుత్వ వ్యవస్థ అనుకొంటే, దీనిలోనూ కొన్ని అంతరాలు తప్పవు. అయిజే రాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు - ఇట్టి తారతమ్యంలో ఎవరికీ యధేష్టాధికారావకాశం కాక, పరిమితమైనదే అయినట్లే ఇంట్లో కూడా. సాంకేతికంగా రాష్ట్రపతి పదవి సర్యోన్నతమయినా, (ప్రధాని మొదలయిన వారిని నిరంకుశంగా నియంత్రించే పదవి కాదు. అలాగే గృహ యజమానుడు సర్భనియంత కాడు, తమ తమ పరిధులలో పరస్పర ్రీతికరంగా వివిధ పదవులలోని వారు పరిపాలన నడపవలపి ఉన్నట్టే ఇంట్లోని అందరూ కలిసి, తమ తమ విధులు నిర్వర్తిస్తూ ఇల్టు నడపాలి. ఇందులో ఎవరు అహంకరించినా, వారికీ, ఇంట్లోని ఇతరులకీ ఆసుఖమే కలుగుతుంది. ఇంత అవగాహనతో యజమానుడు, భర్త తనను మన్నించే వాడయితే, ఆ మన్నన, భార్య అహంకరించి వ్యవహరించటానికి కారణం కారాదు. అట్టి అహంకారం ఆమెలో పెరుగుతున్న పక్షంలో, దానిని సవరించవలసినవాడు భర్త. అయితే, అతడు మళ్ళీ సరయిన నిర్ణయాలు చేయటానికి ఆతని అహంకారం కారణం కాగూడదు. ఈ సందర్భంలో మార్కండేయ పురాణం ఇలా చెపుతున్నది :

పతి ప్రయత్నంబుతో భార్య భరించుచు( గీడొందకుండ రక్షింపచనలయు, నవిరోధవృత్తి ధర్మార్ధకాముములు భార్యామకూలత బతికతిశయిల్టు, భార్యావిహీనత బతికి నర్షత్రితయంబులో నొక్కటి యయిన లేదు,

దేన పిత్రతిథి పూజావిధు లొవరింస భార్యయ పతికి మపాశ్రయంబు,

మగండు వెలిగాంగ సతికి ధర్మంబు ధనము! గామముమమున్న లభ్యముల్లావు గాన్‌,

దంపతులు పరస్పరవళతా ప్రమోద మగ్నమానమలై కూడి మునుట యొప్పు.(2.325.)

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 155

ఇందులో భార్యా భర్తల విధులు చెప్పాడు. ఒకరివల్ల ఒకరికి కలిగే ప్రయోజనాలు చెప్పాడు. ఒకరు లేకపోతే ఒకరికి అవి లభించవని చెప్పాడు, చివరికి, అందువల్ల, దంపతులు ఒకరికి ఒకరు వళులైనందువల్ల ఆనందం అనుభవిస్తూ కలసిమెలసి బ్రతకాలి అని చెప్పాడు. ఆ యా సందర్భాలలో ఒకరికొకరు వశులయినందువల్ల ఇద్దరికీ ఆనందం కలుగుతుందన్నది సారాంశం. ఇద్దరి లక్ష్యమూ ఆనందప్రాప్తి. ఇద్దరూ ఇద్దరికీ వశులే కావాలి. ఎవరూ అహంకరించగూడదు. ఇచ్చిన చనువును ఆహంకరించి దుర్వినియోగం చేసేవారుంటారు. ఆలా అహంకారం పెరగకుండా పరిధిలో ఉండేటట్టు చూడవలసినవిధి యజమానునిదీ అని ఈ పద్యంలో కవి చెప్పాడు.

'నిర్వహణము లేనిచోట నిలువకు' అన్ఫది చివరినీతి. అనగా, బ్రతుకు గడవటానికి ఆధారమూ అవకాశమూ లేనితావున ఉండవద్దు అని. 'సోనమద్యోగికిని దూరభూమి లేదు" అన్నారు. జన్మస్థానం విడిచి ఎంతదూరమైనా ఎందుకు వెడుతున్నాడు? అక్కడ ఉద్యోగం చేస్తే బ్రతుకు గడుస్తుంది కనుకు

ప బంధుర్యో హితే యుక్త, స సితా యస్తు పోషకః,

తన్మిత్రం యత్ర విశ్వానః, స దేశో యత్ర జీవ్యతే

మనకు హితం సమకూర్చటంలో ఆసక్తుడై ఉండేవాడే బంధువు, పోష్షించే వాడే తండ్రి, విశ్చసించదగినవాడే మిత్రం, ఎక్కడ (బ్రతుకుతున్నామో అదే దేశం అని గరుడపురాణం. (108.15) పొట్టగడిచే అవకాశం లేనిచోట ఉండగూడదు.

ఆవ : ఎక్కువ హాయినిచ్చే తాంబూలాదుల తరుణం చెప్పుబోతున్లాడు :

కు. పలుదోమి పేయు విడియము

తల గడిగివ వాంటి నిద్ర తరుణుల తోడన్‌

బొలయలుకనాంటి కూటమి

వెలయింతని చెప్పరాదు వినురా సుమతీ. 78

ప్ర : సుమతి, పలుదోమి = దంత్తధావనం చేసిన తరువాత, చేయు జ వేసుకొనే, విడియము

= తాంబూలము, తలలడిగిననాంటి నిద్ర = తలన్‌ + కడిగిననాంటి నిద్ర = తలంటి నీళ్ళు పోసుకొనిననాడు పట్టిన నిద్ర, తరుణులతోడన్‌ = పడుచులతో, పాలయలుక నాఃటి = పొల్లి

  • అలుకనా6టి = వ్యర్థమైన కోపం కలిగిననాడు చేసీన, కూటమి = పొందు, వీటియొక్క, వెల =ఖరీదు, ఇంతని = ఇంత + అని = ఇంత పరిమాణం కలది అని, చెప్పరాదు = చెప్పన్‌ + రాదు = చెప్పటానికి శక్యంకాదు, వినురా = వినవయ్యా,

తా: సుమతీ, పల్లు తోముకొన్న తరువాత వేసుకొన్న తాంబూలము, అభ్యంగనస్నానం చేసిన తరువాత పట్టిననిద్ర, ప్రణయకోపం వచ్చి తీరిన తరువాత ఆంగనలతో కలిగే కలయిక - వీటి విలువ ఇంత అని చెప్పటానికి శక్యం కాదు. న

156 సుమతి శతకము వ్యా : తాంబూలం సామాన్యంగా భోజనానంతరం వేసుకొంటారు. దానివల్ల నోరు పరిశుద్దమవుతుంది. తాంబూలం వేసుకొనటం ఒక అలవాటుగా పరిణమించినవారు, ఇతర సమయాలలో కూడా వేసుకొంటారు, అప్పుడూ దాని ప్రయోజనం అదే. తాంబూలం వల్ల నోరు పరిశుద్ధం కావటం గురించి తెలియాలంటే, రాత్రి భోజనానంతరం తాంబూలం వేసుకొంటే, మరునాడు నిద్రలేచేసరికి నోరిలా ఉంటుందో, వేసుకోని రాత్రి తెల్లవారాక ఎలా ఉంటుందో, జ్ఞప్తికి తెచ్చుకొని పోల్చుకొంటే తెలుస్తుంది. పరిశుద్దం చేయవలసిన పదార్థాలు ఉత్పన్నం కాకుండా చేస్తుంది, చేరిన పదార్థాలవల్ల కలిగే అపరిశుద్దిని తొలగిస్తుంది తాంబూలం అని, ఈ అనుభవాల వల్ల తెలుస్తుంది. రెండు సందర్భాలలోనూ పరిశుద్ది కావటం మాత్రమే'కాక, తాంబూలంవల్ల నోరు రుచిగా సుఖంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అట్టి స్థితిలో. లేవగానే పల్గుతోమకుండా ఇప్పుడు చాలామంది కాఫీటీలు సేవిస్తున్నట్టుగానే, తాంబూలం వేసుకొనేవారూ ఉన్నారు. వీరు అప్పుడూ ఉన్నారని ఈ పద్యాన్నిబట్టి తెలుస్తున్నది. అలా చేసినదానికంటే పల్టూ, నోరూ శుభ్రంగా పలుదోముపుల్ల మొదలయిన వాటితో పరిశుభ్రపరచుకొన్న తరువాత, తాంబూలం నమిలితే, ఆది మరింత రుచినీ, సుఖాన్నీ కలిగిస్తుంది. ఆ రుబీ, సుఖమూ, ఇంత విలువయినవని చెప్పటానికి శక్యం కాదు. (శ్రమ పడిన తరువాత, అలసటవల్ల వచ్చిన నిద్ర, హాయిగా ఉంటుంది. ఆ ఆలసట తరువాత, స్నానం చేసిన తరువాత, నిద్రపోతే ఇంకా హాయిగా ఉంటుంది. శరీరంలోని సర్వావయవాలకూ నేతినో, వెన్ననో, నూనెనో పట్టించి మర్దన చేసి, ఆ నెయ్యి మొదలయినవి శరీరాన ఇంకిన తరువాత, సున్నిపిండితో నలిచినందువల్ల, కేవల జలస్నానంతో తొలగని మాగుళ్ళు, చర్మ స్వేదరం(ధ్రాదులలో నిండి ఉన్న మురికి మొదలయినవి తొలగి, కుంకుడు పులుసువంటి వాటితో రుద్ది, సమృద్ధిగా ఉన్న తియ్యని వేడినీళ్ళతో పరిశుద్ధంగా స్నానం చేసిన నాటిరాత్రి పట్టే నిద్రకూ, మిగిలిన నిద్రలకూ పోలికే ఉండదు. కనుక దీనికీ వెలకట్టలేమంటున్నాడు. కోపం, మనస్సులో కూడుకొన్న మాలిన్యానికి ఫలం. కనుక, సకారణంగా అయినా, అకారణంగా అయినా, ఇష్టులమధ్య, అందులోనూ ('ప్రణయావిష్టలమధ్య, కలిగినకోపం పరస్పరం నిందించుకొనటం, అక్షేసించుకొనటం, దెప్పుకొనటం, కన్నీళ్ళు కార్భటం, బతిమాలుకొనటం మొదలైనవాటి వల్ల శాంతించినదంటే, మనస్సులో పేరుకొన్న మాలిన్యమంతా కడిగివేసిన్నటై, అనుమానం, ఈర్ష్య, అసూయ మొదలయిన మురికి అంతా తొలగి, పరిశుద్ధ్రమైనందున, కేవల(ప్రేమ మాత్రమే మిగిలి, అపుడు కలిగిన పొందు, మిక్కిలి సుఖకరమవుతుంది. కనుక, దానికీ వెలకట్టలేము, అవ : చేయటం కష్టమైన సేవ పొందు, చెలుములను గురించి చెప్పుబోతున్నాడు : క. పొటెజబు.గవి పతికొలువును కూటంబున కెజుకపడని కోమలి రతియున్‌

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 157 బే(టెత్తేయు చెలిమియు నేంటికి నెదురీందివట్టు లెన్నర సుమతీ, 79

ప్ర : సుమతీ, పాటెలుంగని = పాటు + ఎయుంగని = (పని చేసేవాని) శ్రమ తెలియని, పతికొలువును = యజమానుని సేవా, కూటంబునకున్‌ = పొందుకు, ఎజుకపడని = పరిచితురాలు కాని, కోమలి = సుకుమారియొక్క, రతియున్‌ = పొందును, పేంటెత్తశేయు = పేంటు + ఎత్తన్‌ + చేయు = బీట కలిగిన తరువాత చేసే, చెలిమియున్‌ = స్నేహమూ, ఏటికిన్‌ = నదీప్రవాహానికి, ఎదురీందినట్టులు = ఎదురు + ఈదిన + అట్టులు = ఎదురుగా ఈదటం వంటివి, ఎన్నర = భావించవయ్యా.

తా : సుమతీ, పనిచేసే సేవకునిశ్రమ తెలియని యజమానుని సేవించటమూ, కలయికకు పరిచితురాలు కాని సుకుమారి పొందూ, భేదం కలిగిన తరువాత చేసే "స్నేహమూ, నదీ(ప్రవాహానికి ఎదురీదటం వంటివి. అనగా మిక్కిలి కష్టమైనవి అని భావించు,

వ్యా : విద్వానేవ విజావాతి విద్వజ్ఞన పరిశ్రమం - విద్వాంసుల (శ్రను విద్వాంసులకే తెలుస్తుంది అన్నారు. కష్టం తెలిసిన వాడే కష్టానికి తగిన ్రతిఫలమిస్తాడు. కష్టం తెలియని వానిని సేవిస్తే, కష్టమే కాని, ఫలం ఉండదు. నదీ ప్రవాహాన్ని వాలుకు ఈదితే, ఈతా సులభమే, గమ్యం చేరటమూ సులభమే, ఎదుతీదటం ప్రారంభిస్తే, ఈదటంలోని శ్రమ మిగులుతుంది. కాని గమ్యం చేరటం ఉండదు,

పొందులోని సౌఖ్యం తెలిసిన పొలతి అయితే, దానికోసం ఆశిస్తుంది, సుఖపడుతుంది, సుఖాన్నిస్తుంది. దానిగురించి తెలియనిది అంటే, దానియందు ఆసక్తి కూడా లేనిది అన్నమాట. అట్టి ఆమె పొందువల్లకూడా, సౌఖ్యముండదు సరికదా, కష్టనష్టాలే మిగులుతాయి. 35వ పద్యం వ్యాఖ్యానం కూడా ఈ విషయమై చూడండి. ఈ ఎజుక పడకపోవటానికి అనేక కారణాలుండవచ్చు. వివాహాదులవల్ల భర్తపొందు లభించాలి గొని, లభించలేదు; అవ్యక్తురాలు అనగా రజస్వల కాకపోవటం - మొదలయిన కారణాలు.

“అవ్యాకరణ పాండిత్యమవ్యక్తతరుణీరతం,

అపంపూర్ణజలస్నానం త్రయం దుఃఖాయ కల్పతే” - వ్యాకరణం చదువని పాండిత్యం వల్హా, వ్యక్తురాలు కాని యువతి పొందువల్హా, చాలినన్ని నీళ్ళులేని స్నానంవల్హా దుఃఖమే కలుగుతుంది అని సూక్తి

చెలిమిలో పొరపొచ్చెములు రాకుండానే ఉండాలి గొని, వచ్చిన తరువాత మళ్ళీ పూర్వస్థితి రమ్మంటే రాదు. పరస్పర విశ్వాసమూ (ప్రేమా కలవారి స్నేహంవల్ల, పరస్పరసుఖం ఉంటుంది. భేదం కలిగిన తరువాత, ఏ యితర (ప్రయోజనం కోసమో ఆ చెల

158 సుమతి శతకము కొనసాగిస్తూ ఉంటే, భేదం మరీ పెరుగుతుందే కాని పూడదు. ఇద్దరూ సజ్జ్ఞనులయితే భేదమే రాదు. వచ్చిందంటే, ఎవరో ఒకరైనా దుర్షనులన్నమాట. దుర్జనమైత్రి మట్టికుండ వంటిది. దానికి బీట ఏర్పడిందంబే, ఇక అతకటం కుదరదు. అందులో నీళ్ళు పోస్తే, అవి కారిపోవటంమా(త్రమే. కాదు, పైపెచ్చు ఇల్లంతా రొచ్చవుతుంది, కనుక ఎంతలో వదిలించుకొంటే అంతమంచిది. అవ దుర్తన సాంగత్యంనల్ల కలిగే దోషం ప్రదర్శించి అది వద్దని చెప్పుబోతున్లాడు : క. పాలను గలిసిన జలమును పాలవిధంబుననె యుండు. బరికింపంగా( బాల చవి. జెజచు. గావ్సనం బాలసు(డగువానిపొందు వలదుర సుమతి. 80 ప్ర : సుమతీ, పాలను = క్షీరాన్ని, కలిసిన = కలిసినట్టి, జలమును = నీరుకూడా, పరికింపంగాన్‌ = పరికింపన్‌ + కాన్‌ = చూస్తే పాలవిధంబుననె = పాలవిధంబునన్‌+ఎ ఇక్షీరంలాగానే, ఉండున్‌ = ఉంటుంది, పాలచవిన్‌= పాలరుచిని, చెజుచున్‌ = పొడుచేస్తుందికూడా, కావునన్‌ + కనుక్క పాలసుండగువాని = పాలసుండు + అగువాని = దుర్దనుడు మూర్చుడు అయిన వానియొక్క, పొందు = మైత్రి, వలదుర = వద్దయ్యా. తా : సుమతీ, పాలలో కలిసిన నీళ్ళు కూడా చూడటానికి పాలలాగానే ఉంటాయి. కాని, అవి కలిసినందున పాలరుచి మాత్రం పోతుంది, కనుక, దుర్దనుడు, మూర్చుడు, అయిన వానితో స్నేహం చేస్తే, వాడూ సజ్జనునిలాగానే, వివేకిలాగానే, కనిపిస్తూ ఉంటాడు కొని, వీని సజ్జనత్వాన్నీ, వివేకాన్నీ కూడా పోగొడతాడు. కనుక, దుర్జనుడైన మూర్భునిసాంగత్యం పనికిరాదు. వ్యా : ఒక దుర్దనుడూ ఒక సజ్జనుడూ స్నేహం చేస్తే దుర్దనుడు సజ్జనుణ్జై పాడుచేస్తాడు. ఈ స్నేహంవల్ల దుర్దనుడు కూడా సజ్జనుడే అన్నట్టు, ఇతరులకు కనిపిస్తూ, ఈ పని చేస్తాడు. కనుక, వీని స్నేహం వద్దంటున్నాడు. దానికి దృష్టాంతం, పాలలో నీళ్ళు కలవటం చూపించాడు. అక్కడ నీళ్ళుకూడా పాలలాగానే కనిపిస్తూ ఉంటాయి. పాలరంగు మాత్రం నీళ్ళకు వస్తుంది. నీళ్ళు పాలరుచిని పాడుచేస్తాయి. ఇక్కడ సజ్జన - దుర్షనుల విషయమై, మనమొక మాట అడుగవచ్చు, వీరిద్దరి సాంగత్యంలో దుర్దనునివల్ల సజ్జనుడు చెడిపోతాడనే ఎందుకనుకోవాలి? సజ్జనునివల్ల దుర్దనుడు బాగుపడగూడదా అని. ఇది లోకానుభవానికి విరుద్దం. నీటి కలయిక ఏ మేరకు జరిగితే, ఆ మేరకు పాలరుచి చెడిపోవటం ఖాయం. నీళ్ళు మంచినీళ్ళు కావటం ఉండదు, పాలరుచికల స్వచ్చమైన పాలు కావటమూ ఉండదు. కనుకనే, సిరి అబ్బకపోయినా, చీడ అబ్బుతుంది అంటారు. దుర్దనునికి దూరంగా ఉండటం ఒకటే కర్తవ్యం.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 159 అన + దుర్దనునిఆవదను తొలగించ గూడదని చెప్పుబోతున్లాడు : క పాలసునకైన యాపద జాలింబడి తీర్పం దగదు సర్వజ్ఞునకున్‌ దేలగ్ని. బడల బట్టిన మేలెజుంయనె మీటు(/గాక మేదిని సుమతీ, తే (ప్ర: సుమతీ, పాలసునకున్‌ = దుర్జనునకు, ఐన యాపదన్‌ = ఐన + ఆపదన్‌ = కలిగిన విపత్తును, జాలింబడి = జాలిన్‌ + పడి = కనికరం వహింి, తీర్చన్‌ = పోగొట్టటం, సర్వజ్ఞునకున్‌ = అన్నీ తెలిసిన వానికి, తగదు = యుక్తం కాదు, మేదినిన్‌= భూమిపై, తేలు = వృళ్ళికం, అగిన్‌ = నిప్పులో, పడంగన్‌ = పడన్‌ + కన్‌ = పడిపోయిన తరువాత, పట్టినన్‌ = చేతితో పట్టుకొంటే, అది, మీటు(గాక = మీటున్‌ + కొక = కుడుతుంది కాని, మేలెలుంగునె = మేలు + ఎఆుయను

  • ఎ జ చేసిన ఉపకారం తెలుసుకొంటుందా ? తొ : సుమతీ, దుర్జనుడు ఏదైనా ఇడుమలో చిక్కుకొన్నపుడు, అన్నీ తెలిసినవాడు జాలిపడి, ఆ ఇడుమ తప్పించటానికి ప్రయత్నించగూడదు, తేలు నిప్పులలో పడినపుడు, జాలిపడి, చేతితో పైకి తీద్దామని పట్టుకొంటే, అది కుడుతుంది కాని, ఇతడు ఉపకారం చేసిన వాడు కనుక కుట్టకూడదని మానదు. వ్యా : ఈ పద్యంలో, దుర్దనునిపట్ల వ్యవహరించనలసిన విధానం చెప్పబడింది. దుర్దనుడు తేలువంటివాడు. కొండెకు అందిన (ప్రతి వస్తువునూ, ప్రాణినీ కుట్టటం దాని గుణం. అందిన ప్రతి వానికీ ఆపకారం చేయటం దుర్దనుని గుణం. తేలు కనిపిస్తే చాలు, ఆది మనను కుట్టకపోయినా, మనము చంపుతాము. అది యితరులను కుట్టి బాధిస్తుంది కనుక, (బ్రతికి ఉండగూడదని ఆ పని చేస్తాము. ఇతరులకు ఆసకారం చేయటం గుణమైనవాడు, ఆ తేలువంటివాడు. అయితే, అతడు మనిషి కదా అన్మి తేలును చంపినట్టు చంపము. ఆతనిఅపకారానికి గురికాకుండా, ఆత్మరక్షణం మాత్రం చేసుకొని ఊరుకొంటాము. అయితే, అతడు దైైవికంగానో, తనంత తానో, ఏదో ఇడుమలో చిక్కుకొంటాడు. ఎవరైనా ఇడుమలో చిక్కుకొన్నపుడు, దయదలచి దానిని తొలగించే (ప్రయత్నం చేస్తాము. దుర్దనునిఇడుమ తొలగించే ప్రయత్నం చేయగూడదు. కొగట కార్యం గంధర్వులు తీర్చారన్నట్టు, మనం కలిగించవలసిన ఇడును దానంతట అదే వచ్చి, వాడు నళిస్తుంటే, నశించనివ్వాలి కాని, తప్పించగూడదు. తప్పించితే, వాడు వీలయినంత మందికి ఇంకా అపకారం చేయటానికి, మనం అవకాశం కల్సించామన్నమాట, ఇతరులకూ చేస్తాడు, మనకూ అతడు అపకారం చేస్తాడు కనుక, వానిని నశింపనివ్వాలి అని నీతి, ఇందుకిచ్చిన దృష్టాంతం తేలు ఈ నీతికి తగి ఉన్నది. 80

160 సుమతి శతకము అయితే, ఈ శతకకర్తయే 16వ పద్యములో అపకారికి నుపకారము, నెపమెన్నక చేయువాడు నేర్సరి అని చెప్పినవాడు, ఇలా చెప్పటం స్వవచోవ్యాఘాతం కాదా? అనిపించవచ్చు. అహింసావాదులు తేళ్ళనూ విషసర్సాలనూ గూడా చంపకుండా, పట్టి కాని, పట్టించి కాని అవి మానవులకు అపకారం చేయనిచోట విడిచిపెడుతుంటారు. నీళ్ళలో మునిగిపోయే తేలును, ఒక సన్న్యాసి, చేతితో పట్టి పైకి తీయబోయాడు. అది ఆయన చేతినే కుట్టింది. అమ్మా ఆని వదిలాడు. మళ్ళీ కొట్టుకొని పోతుంటే, మళ్ళీ పట్టి తీయబోయాడు. అది మళ్ళీ కుట్టింది. మళ్ళీ వదిలాడు. మళ్ళీ తీస్తున్నాడు. అప్పుడిది చూస్తున్నవాడు, ఆ విష ప్రాణిని పోనివ్వరాదా, (బ్రతికించటవెందుకు? కుట్టించుకొనటమెందుకు? అన్నాడు, అపుడు ఆయన - కుట్టటం దాని గుణం, బాధించినా (బ్రతికించే ప్రయత్నం చేయటం నా గుణం - అన్నాడట. దుర్దనునిఇడుమ అయినా తాలగించవలసిందే, అయితే, అతనిబాధ ఇతరులకు కలగకుండా, తగు అధికారులు తగు చర్య తీసుకోవాలి అన్నది ఉదారవాదం. మీటు అన్న పదానికుదాహరణంగా ఈ పద్యాన్నే ఉదాహరించింది శర. తేలనుచు బిగియంబట్టిన అనిన పా.అ. తో. ఆవ: వీలువని వనికి పోవటంవంటివి తగవని చెప్పుబోతున్నాడు : క పిలువని పనులకు( బోవుట, గలయనిసతిరతియు, రాజు గాననికొలువున్‌, బిలువనిపేరంటంబును, నలననిచెలిమియును చేయవలదుర సుమతీ. 82 ప్ర: సుమతీ, పిలువని = ఆహ్వానింపని, పనులకున్‌ = కార్యములకు, పోవుట = వెళ్ళటం, కలయని = కూడని అనగా మనస్సు కూడని, సతి = స్రీ యొక్క, రతియున్‌ = పొందును, రాజు = పరిపాలకుడు, కానని = చూడని = గమనింపని, కొలువున్‌ = "సేవా, ఉద్యోగమూ, పిలువని = అహ్వానింపని, పేరంటంబును = వివాహాదిశుభకార్యాలకు సువాసినులు వెళ్ళి చేసే ఆ కార్యాలకు సంబంధించిన పనీ, వలవని = ఇష్టపడనివారి, చెలిమియును = "స్నేహమూ, చేయన్‌ = చేయగా, వలదురా = వద్దయ్యా. తా : సుమతీ, ఇతరులు వచ్చి చేయమని పిలవని వారిపనులు చేయటానికి పోవద్దు, నీపై మనస్సులేని మగువను అనుభవించవద్దు. రాజసేన చేసేటపుడు దానిని అతడు గమనించాలి. అలా గమనించని పని చేయవద్దు. పిలువని పేరంటానికి పోవద్దు. వ్యా : ఈ పద్యంలో, చేయగూడని పనులు ఐదింటిని పేర్కొంటున్నాడు. వాటిలో మొదటిది పిలువని పనులకు పోవటం; ఇది కొంచెం అస్పష్టంగా ఉన్నది. తనవి

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 161 కానిపనులు, తను చేసి తీరవలసినవి కానివి, ఇతరులకు సంబంధించినవి అనుకోవాలి. అట్టి పనులలో తానై కల్పించుకొనటం తగదని చెపుతున్నాడు.

రెండవది కలయనిసతిరతి కూడదనటం. కలయని అంటే కూడని అని అర్థం. అయితే, ఏమి కూడని? మనస్సు కూడని అన్న మాట, మనస్సులు కలియని వారి కలయిక ఆనందజనకం కాదు. కనక వద్దంటున్నాడు.

మూడవది రాజు కానని కొలువు. ఒకరిపని మనం ప్రతిఫలానికి చేసేటపుడు ఆ పని అతనిదృష్టికి వచ్చేది కావాలి. లేకపోతే రావలసిన (ప్రతిఫలం రాదు సరికదా, కనీసం చేసినవాడు వీడని గుర్తింంయినా ఉండదు, మెప్పయినా రాదు, కర్రవ్యబుద్దితో ఫలం ఆశించకుండా చేసేపనుల విషయం వేరు, పనిచేసి, ఒకరిని మెప్పించి, తగిన ప్రతిఫలం పొందాలని ఉద్దేశించి చేసేపని, వారిదృష్టిలో పడనినాడు వ్యర్థమే అవుతుంది, శ్రమ అంతా ఒకరి దవుతుంది, ఫలం ఇచ్చకపు మాటలు పలికే వారిదవుతుంది. కనుక, తన శ్రమ, చేయించుకొనే వారి దృష్టికి రా వీలయినదిగా చూచుకొనటం ఆవసరం అంటున్నాడు. అదీ కాక, కానని కొలువు ఆంటే, కానరానిదే కాదు, కానవలసినవాడు కానడు. వాడు బులబాటపు మాటలు చెప్పి చాకిరీ చేయించుకొంటాడు, ఇస్తే, తోచినదేదో యిస్తాడు. లేకపోతే అదీ లేదు, వీడెంత కష్టపడ్డా, ఇట్టివానికెంత (ప్రతిఫలం ఇస్తే బాగుంటుంది అని ఆలోచించి, తగినది ఇచ్చే స్వభావమే వానికి లేదు. అట్టివానిపని చేయనే కూడదు. దీనివల్ల ప్రస్తుతంలో పని చేసినవానికి నష్టం, పరిణామంలో చేయించుకొన్నవానికీ నష్టమే. వాడు శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వడు కనుక, వానిపని ఒళ్ళు విరుచుకొని చేయటం అనవసరం అని, ఇతరులు కూడా వానికి (క్రమంగా దూరమవుతారు కనుక,

నాలుగవది పీలువని పేరంటం, పేరంటం, పేరటం అనికూడా దీనిని పేర్కొంటారు. ఇంట్లో వివాహాదులు జరిగినపుడు, ముత్తైదువులను రమ్మని, ఇంటికి వెళ్ళి, బొట్టుపెట్టి పిలుస్తారు. వాళ్ళు వెళ్ళి, ఆ కార్యాలలో జేసేపనులకు పేరంటం అని పేరు అని శర. ఒకరి ఇంట్లో ఇట్టీవి జరిగినపుడు, తమకు కావలసిన వారిని రమ్మని వారు పిలుస్తారు. పిలువబడినవారు వెళతారు. వెళ్ళి అక్కడి కార్యక్రమంలో పాల్గొని, వారిచ్చిన పసుపు కుంకుమలూ, ఫలతాంబూలాదులూ, వాయనాలూ, కానుకలూ స్వీకరిస్తారు. పిలిచినపుడు వెళ్ళకపోవటం సౌభాగ్యలోపకారణంగా భావించి, కలవారు లేనివారనే భేదం లేకుండా, తమ కులం వారు, బంధువులు, మిత్రులు పిలిచినపుడు, విధిగా వెళ్ళే ఆచారం ఇప్పటికీ పల్లెల్లో మిగిలి ఉంది. ఎవరినైనా ఫిలువలేదంటే, వీరు రావటం వారికిష్టం లేదని భావించాలి. అలాంటి చోటికి తోమై వెళ్ళటం మర్యాద కాదు. ఎవరైనా పిలువనిచోటికి తామై వెళ్ళటం, పిల్వని పేరంటానికి వెళ్ళటం అనే మాట పుట్టింది. అహంకారాదులు

162 సుమతి శతకము కలవారు, తమకంటె కలిమి మొదలయిన వాటిలో తక్కువవారు అనుకొన్న వారిని పిలువరు. ఒకవేళ పిలిచినా, ఏదో దురుద్దేశంతో అవకారమో, అవమానమో చేసే ఉద్దేశంతో పిలిచినట్టు భావిస్తారు. దీనిని 'షెద్దపులి పేరంటానికి పిలవటం అంటారు. "పేరంటానికి రమ్మంటే తప్పక వస్తారు కనుక, వచ్చినవారిని పట్టి చంపి తినేపులిలా, వీరూ వచ్చినవారికి ఆపకారమో, అవమానమో చేస్తారని భావం. అదీకాక, పెద్దపులి తనకు కావలిస్తే వేటాడి చంపుకొని తింటుంది కాని, ఆహ్వానించి రమ్మని చంపదు. కనుక వారు పిలిచేవారు కాదనటానికి, పెద్దపులి పేరంటానికి పీలుస్తుందా? అంటారు. దక్షప్రజాపతి, అల్టుడైన ఈశ్వరుని ఆవమానించాలనే ఉద్దేశంతోనే ఒక యజ్ఞం చేయటానికి సంకల్పించాడు. ఆందరినీ పిలిచి ఆయనను అహ్వానించలేదు. ఆందరూ వెడుతుంటే,

  • దక్షునికూతురు, ఈశ్వరుని భార్య, సతీదేవి ముచ్చటపడి తానూ వెడతానంది. పిలవలేదుకదా వద్దని భర్త అన్నా, తండ్రికదా పిలవకపోతే ఏమి? అని వెళ్ళి, తండ్రి తన భర్తను అవమానిస్తూ మాటాడేసరికి అభిమానపడి, యోగాగ్నిదగ్టురాలైపోయింది. పిలునంగ( బడక సభలకు బలిమిం జని పలుకు దుఃఖభాగుల లోకం బులకు జననేడి పలికదు సలువ యెజుంగవు పరాత్మపరినూణంబుల్‌ అన్నారు నన్నయగారు. ఈ మాటలు ఈ పద్యంలోని మొదటి నీతికీ వర్తిస్తాయి. ఐదవది వలవని చెలిమి చేయవద్దన్నది. వలవనిచెలిమి అంటే ఇష్టపడనిస్నేహం. అనగా, మనము ఒకరిస్నేహం కావాలనుకొంటాము, వారు వారికారణాలవల్ల మనస్నేహం అపేక్షించరు. అట్టివారిస్నేహంకోనం 1ప్రాకులాడటం మాని, మనస్నేహం కావాలనుకొనేవారితో స్నేహం చేయటం మంచ్చిదంటున్నాడన్నమాట. మహాభారతంలో ఒక పద్యమున్నది, ఎమ్మిగలనారి వొల్లరు, తమ్మొల్లనినారినెనుక తగులుదు రధిక త్వమ్మెటి/గి యెటిండి తొడరుదు రిమ్మెటుల[నియట్టి వార లిభపురనాధా (ఉద్యోగ. 2.34) అని. మనుష్యులలో వీలూ సాలూ తెలియనివారు కొందరుంటారు, వీరు తమపై ప్రేమగలవారంటే ఇష్టపడరు. తమమీద ఇష్టం లేనివారివెంటపడి, వారియిష్టంకోసం ప్రాకులాడుతుంటారు.ఎదుటివారు తనుకంటె ఎక్కువవారు, వారిని తామేమీ చేయలేరు, వారు, తలచుకొంటే, తమకు అపకారంచేయగం శక్తీ యుక్తీ స్వభావమూ కల దుర్మార్గులు అనితెలిసికూడా, వారినెదిరిస్తారు అని దానిభావం,. స్నేహానికి సంబంధించినంతవరకు, ఈ కోటిలో చేరవద్దంటున్నాడు ఈ కవి, ఒకేప్రేమ 'ప్రీపురుసులమధ్య వలపూ, పెద్దవారిపట్లనూ దైవంపట్లనూ భక్తీ సమానులపట్ట స్నేహమూ, చిన్నవారిపట్ట వాత్సల్యమూ అనిపించుకొంటుంది. [ప్రారంభం ఎటునుంచి అయినా,

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 163 రెండవవైపునుంచి కూడా ప్రసరించినపుడే ఉభయులకూ సౌఖ్యదాయకమవుతుంది. వలవనిచెలిమివల్ల, వలసినవారికి దైన్యమూ, వలవనివారికి చికాకూ తప్ప, సుఖం ఉండదు. కనుక, ఆ గుణం కనపడగానే దానిని విడిచిపెట్టటమే మంచిది. మనచెలిమి అక్కరలేనివారు మనకూ అక్కరలేనివారే, ఇంత భూమిమీద, మనకు తగినవారు మనము కావాలనుకొనేవారు, మనకూ లభిస్తారు - అన్నగుండె దిటవు అవసరం, ఆవ : వుతునివల్లు కన్టువారికి కలిగే ఆనందంగురించి చెప్పుబోతున్హాడు : క. పుత్రోత్సాహము తండ్రికి/ బు(్త్రుండు జన్మించినవుడె పుట్టదు జనులా వుత్తుని. గమంగొని పాగడంయం బుత్రోత్సాహంబు వాండు పొందుర సుమతీ. 83 ఫ్ర: సుమతీ, తండ్రికిన్‌ = జనకునికి, వుర్తుండు = కుమారుడు, జన్మించినపుడె = జన్మించిన+అపుడు+ఎ = పుట్టినసమయంలోనే, పుత్రోత్సాహము = పుత్రునివల్ల కలిగీసంతోషం, పుట్టదు = కలుగదు, జనులు = ప్రజలు, ఆ పుద్రునిన్‌ = ఆ జన్మించినకుమారుని, కనుగొని = చూచి, పాగడంగన్‌ = పొగడన్‌+కన్‌ = (ప్రళంసించగా, నాడు = ఆరోజున, పుత్రోత్సాహంబున్‌ = పు(త్త్ర+ఉత్ప్చాహంబున్‌ = పుత్రునివల్ల కలిగే సంతోషాన్ని, తండ్రి, పోందుర = పొందున్‌+ర = పొందునయ్యా, తా ఏ సుమతీ, తండ్రికి కుమారుడు పుట్టినవెంటనే కుమారునివల్ల కలుగవలసిన సంతోషం కలుగదు. ప్రజలు ఆ కుమారుని చూచి ్రశంసించిననాడు, ఆతడు పుత్రోత్సాహం పొందుతాడు. వ్యా: ఈ పద్యంలో తండ్రి కొడుకులసంబంధంలో ఉండే లోకరీతిని చెప్పటంద్వారా, అటు తండ్రికీ, ఇటు కొడుకుకూ కవి చక్కని ఉపదేశం చేస్తున్నాడు. కొడుకు ఆనేమాటకు అనేకపర్యాయపదాలున్నాయి. వాటి వ్యుత్చత్తినిబట్టి ఆలోచించినపుడు ఆ పదాలలో రెండు మిక్కిలి ప్రధానమయినవిగా కనిపిస్తుంటాయి. వాటిలో ఒకటి పుత్రుడు. పున్నామ్నో వరకాత్తాయత ఇతి పుత్రః. పుత్‌ అనే నరకానికి పోకుండా రక్షిస్తాడు కనుక పు్తుడు అన్నపేరు ఏర్పడింది. రెండవది నందనుడు. నవందయతీతి నందనః. సంతోషపెడతాడు కనుక నందనుడు అన్నపేరు వచ్చింది. ఒకటి పరలోకకారణంగా ఏర్పడింది. సంతోషానికి కారణం ఇహపరాలు రెండూ కావచ్చు గనుక, రెండవది ఇహపరాలు రెండూ కారణంగా ఏర్పడింది. రెండు పదాలూ ఒకే కొడుకును చెపుతాయి. ఇంతటి సంతోషం కలిగిస్తాడు కనుకనే, పుత్రుడు జన్మించటం గొప్ప సంతోషకారణ౦గా మనవారు పేర్కొంటూ వచ్చారు. అర్హమాత్రాలాఘనేన పుత్రోత్సవం నున్యంతే వైయాకరణాః అని శా'స్తజ్హులమాట.

కరడ సుమతి శతకము వ్యాకరణశా(స్తవిషయం చెప్పేటప్పుడు, ఒక్క మాత్ర తగ్గించి చెప్పటం సాధ్యమైనా, వ్యాకరణశాస్రజ్ఞాలు పుత్రుడు పుట్టినందుకు కలిగే ఆంత సంతోషం పొందుతారని దానిభావం. అంతకంటె సంతోషకారణం ప్పేర్కొనదగినది మరాకటి లేదని వారిభావం. ఉంటే దానినే పేర్కొనేవారు. పుత్రుడు కలిగినందుకు పొందవలసిన సంతోషం తండ్రి, పుత్రుడు కలగగానే పొందడట. పుత్రునిగుణగణాలనూ, విద్యాబుద్దులు మొదలయినవాటినీ చూచి, జనులు ఆ పుత్రుని పొగడుతుంటే, అపుడు ఆ సంతోషం పొందుతాడట. ఇది లోకరీతిని చెప్పటం. దీనిద్వారా కవి, తండ్రికి పుత్రలాభమాత్రం సంతోషకారణం కాదనీ, ఆ పుత్రుడు యోగ్యుడై ప్రజాప్రశంసాపాత్రుడు కావటమేననీ, కనుక, పుత్రుని అట్టివానినిగా తీర్చిదిద్దుకోవాలనీ, ఉపదేశిస్తున్నాడు. దీనిద్వారా, తల్లి దండ్రులను సంతోషపెట్టటం పుత్రుని కర్త్రవ్యమనీ, ఆ సంతోషం వారికి, 'ప్రజాప్రశంస తనకు లభించినపుడు మాత్రమే కలుగుతుందనీ, కనుక, తనను నలుగురూ మెచ్చుకొనేటట్టు, తాను 'ప్రవర్తించాలనీ పుత్రునికి ఉపదేశిస్తున్నాడు. ఆ ప్రశంస యెలా లభిస్తుంది? ఆ మాట మహాభారతం చెపుతున్నది : వురుషుండు రెండు తెజంగుల ధర ముత్తముండవం16 బరంగు( దావెయ్యెడలన్‌ పరుషములు పలుకకునికిన్‌ దురితంబులు దొరయుసనులు దొజంయటకతనన్‌ - (ఉద్యోగ. 2.410) అని, పొడి గలిగిన నిహలోకఫలములెల్ల( జేరుటయ కాదు, క్రీర్తియు. జెందు. బురుషు, ధరణి బొగడిత యెందా/(క( బరగు, వంత కాలమును బుణ్యలోకంబు కల్గు వండ్రు, (ఉద్యోగ. 2.57) అనీ. ఆవ + వర్తకుడు, నీరు, వనిత మొదలయినవాటికి గల ప్రాముఖ్యం చెప్పుబోతున్న్హాడు : క. పురికిని బ్రాణను కోనుటి వరికిని బ్రాణంబు వీరు వసునుతిలోనన్‌ గరికిని బ్రాణము తొండము సిరికిని బ్రాణంబు మగువ సిద్దము సునుతీ, 84 ప్ర: సుమతి, వసుమతిలోనన్‌ = భూలోకములో, కోమటి = వర్తకుడు, పురికిని = ఊరికి, ప్రాణము = బలము, నీరు = జలం, వరికిని = వరిపైరుకు, ప్రాణంబు, తొండము =

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 165 ఏనుగుహస్తం, కరికిని = ఏనుగుకు, ప్రాణము, మగువ = స్రీ సిరికిని = ఐశ్చర్యానికి, ప్రాణము, సిద్దము = సహజంగా ఏర్పడినది. తా ;సుమతీ, భూలోకంలో వర్తకుడు ఊరికి బలం, నీరు వరిపైరుకు బలం. తొండం ఏనుగుకు బలం, స్రీ ఐశ్చర్యానికి బలం. ఈ బలాలు వీటికి సహజసిద్దమైనవి. వ్యా : ప్రాణము అంటే బలం అని నిఘంటువు చెప్పే అర్ధం. లోకంలోకూడా వాడుక ఉంది 'అబ్బేవాడిలో ప్రాణమేదండీ?' అని. అంటే, అతనిలో సత్తువ, బలం బొత్తిగా లేదని అర్ధం. అయితే ప్రాణానికి ఉసురు, జీవం అన్న అర్హమూ ఉంది. ఇదే ప్రధానంకూడా. మరి బలం అన్న అర్థంలో [ప్రాణం ఉపయోగిస్తే? ఏది లేకపోతే ఏది ఉండదో అది ప్రాణం, బలం లేకపోతే జీవి (బ్రతికి ఉంటాడు. కాని ప్రాణం లేకపోతే ఉండడు. మరి బలం అనే అర్థంలో ప్రాణం ఉపయోగిస్తే, ఆ జీవికి 'ప్రాణమూవేరే ఉన్నది, బలమూ వేరే ఉన్నది కాని, ఈ బలం లేకపోతే అది ఆట్టేకాలం ఉండదు కనుక, ఆది ప్రాణంతో సమానమైన బలం అని అర్ధం. ప్రాణం లేకపోతే వెంటనే జీవి పోతాడు. ప్రాణంవంటి ఈ బలం లేకపోతే, = అల్ప్బకాలంలో పోతాడు అని అర్ధం. అట్టి ప్రాణంవంటి బలం దేనికేదో నాలుగింటివిషయంలో చెప్పటం ద్వారా, వాటి ప్రాధాన్యం చెపుతున్నాడు : ఒకటి : వర్తకుడు ఊరికి ప్రాణంవంటి ముఖ్యమైన బలం. వర్తకునిపనులు మూడుగా మన శా(స్తాలు చెపుతున్నాయి. వర్తకం చేసేవానిని వైశ్యుడు అని సంస్కృతంలోనూ, కోమటి అని తెలుగులోనూ అనేవారు. ఆతడు చేయవలసిన మూడు పనులూ కృషి గోరక్ష్మ వాణిజ్యం - ఇవి. అంటే పాడీ, పంటా, వర్తకమూ అన్నమాట. ప్రతిఊరిలోనూ పాడీ, పంటా ముఖ్యమైనవి. అవి ఉంటే చాలదు. అవి (ప్రతిఊరిలోనూ కావలసినంతగా ఉండకపోవచ్చు. అసలే ఉండక పోవచ్చు. అక్కరలేనంతగా కూడా ఉండవచ్చు. అవి ఉన్నా, కావలసినవి ఇంకా ఉన్నాయి. అవి ఆ ఊరిలో పుట్టేవి కాకపోవచ్చు. కనుక ప్రతిఊరికీ పాడిపంటదినుసులూ, ఇతరవస్తువులూ ఉత్పత్తి చేయటమూ, చాలినన్ని ఉంచటమూ, చాలనివీ, లేనివీ ఇతరనగరాదులనుంచి తెప్పించి ఆందించటమూ, వర్తకుడుచేయవలసిన పని అన్నమాట. కనుక వర్తకుడు ఊరికి (ప్రాణంవంటి బలం. వరిపైరుకు (ప్రాణంవంటి బలం నీరు. వాననీరు గొని, భూగర్భజలం గాని, నదీజలం గాని లభించకపోతే, వరిపంట (బ్రతకదు. కనుక వరికి నీరు ముఖ్యం, కరి అంటేనే కరము కలది. కరము అంటే తొండము. కరికి సంస్కృతంలో ద్విపము, తెలుగులో రెంటత్రాగుడు అని పేర్లు ముందు తొండంతో నీరు తీసుకొని, తరువాత నోట్లో పోసుకొని త్రాగుతుంది కనుక, అది రెంటితో (త్రాగే ద్విపం, రెంటత్రాగుడు, తొండం లేకపోతే, ఏనుగు ఆహారబలాదులు స్వీకరించటం కష్టం కనుక, తొండం దానికి 'ప్రాణంవంటిబలం.

1ర6 సుమతి శతకము

మగువ సిరికి ప్రాణం అన్నది చివరిది. ఇటీవలివరకూ ప్రధానముగా సంపాదించేవాడు మగవాడుకదా, మగువ ఐశ్వర్యానికి ప్రాణమేమిటి? అన్నసందేహం రావచ్చు. ఒకడు ధనవంతుడు కావటానికి, అతడు ఎంత సంపాదించాడు అన్నది (ప్రధానం కాదు, సంపాదించినదానిని ఎలా జాగ్రత్త చేసుకొన్నాడు, ఎలా వినియోగించాడు, అన్నది (ప్రధానం. సంపాదించినది వినియోగించే స్థానం ఇల్టు, ఇల్లంటే ఇల్లాలు. సంస్కృతంలోనూ ఇంతే- _

న గృహం గృహమిత్యాహు: గృహిణీ గృహముచ్యతే

గృహం తు గృహిణీహీనమరణ్యసదృశం విదుః = ఇల్లంటే ఇల్లు కాదు, ఇల్లాలే ఇల్టు, ఇల్లాలు లేనిఇల్టు అడవి అని అర్ధం. ఇల్హాలు దొరికితే, అనగా పెండి ఆయితే, ఒకళఇంటివాడయాడంటారు, అతనికి ఇల్టు లేకపోయినా సరే, "పెండ్లికానంతవరకూ, ఆతనికి ఇల్లు ఉన్నా, అతడు ఒక ఇంటి వాడయాడనరు. భార్య పోయినయిల్టు, దక్షత లేనియిల్హ్లు అంటారు. భార్య ఉన్న యిలు, దక్షతకల యిలు అంటారు. దక్షత అంటే, గృహనిర్వహణసామర్థ్యమన్నమాట. అది మగువకున్నంతగా మగవానికుండదు. ఇంటికి తెచ్చిన వచ్చిన ద్రవ్యాలు దాచవలసినవి దాచి, వినియోగించవలసిన సమయాలలో వినియోగించవలసినంతగా వినియోగించటం ఆమెపని. కనుకనే పాపం అతనికి ఆడదక్షత లేదు ఆంటారు. ఆ దక్షత లేకపోతే ఆ యింటిలో ఎంత పిరి చేరినా నిలవదు. ఈ మాటనే భాస్కరుడూ చెప్పాడు :

దక్షత లేనియింటికి పదార్థము వేరొకచోట నుండి నే

లక్షలు వచ్చుచుండిన పలాయనమై చను( గల్ల గాదు వ్ర

త్యక్షను నాగులువ్వరదటై చనుదెంచిన వీరు నిల్చునే

యక్షయమైన గండితెగివట్టి తటాకములోవ భాస్కరా - అని.

ఇయం గేహే లక్ష్మీ రియమమ్పత వర్తిర్ణయవయో

రసొవస్యాః వ్పర్సో వపవుషి బహుళశ్చందన రసః

అయం బాహుః కంఠే శిశిరముసృణో మౌక్తికపరః,

కిముప్యా న ప్రేయో యది సరనముసహ్యన్తు విరహః - ఈమె ఇంటిలో లక్ష్మి ఈమె కన్నులకు అమృతపువత్తి, ఈమెస్పర్శ ఒడలికి పూసిన మంచి గంధపురసం, మెడమీది ఈమెచేయి, చల్లగా మిలమిలలాడే ముత్యాలపేరు, ఈమెకు సంబంధించినదేది ఇష్టం కాదు? ఒక్క విరహం మరీ ఆనుభవించరానిది కాని

  • అన్నాడు భవభూతి ఉత్తరరామచరిత్రలో. కనుక సిరికి ప్రాణం మగువ.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 167 ఇవి వీటికి ప్రాణములు కావటం సిద్ధమే కాని, సాధితమూ కాదు, సాధ్యమూ కాదు. సహజసిద్ధము అనటానికి సిద్దము అని (ప్రయోగించాడు. అనగా ఈ ప్రాధాన్యం సహజమైనది, వాస్తవమైనది, తెచ్చిపెట్టినది కాదు అని అర్ధం. ఆవ : వేళ్ళకు విత్రముమీదనే వాని, విటునిమీద కూర్మి ఉండదని చెవ్పబోతున్లాడు : కు. పులిపాలు దెచ్చి యిచ్చిన నలనడంా గుండె కోసి యజచే నిడినన్‌ దలపొడుగు ధవము పోసిన వెలయాలికి నూర్మి లేదు వినురా సుమతీ, 85 ప్ర :సుమతీ, పులిపాలు = పెద్దపులినుంచి పితికినపాలు, తెచ్చి = తీసుకొనివచ్చి, ఇచ్చినన్‌ = సమర్చించినప్పటిక్సీ ఆలవడంగాన్‌ = అలవు+పడన్‌+కాన్‌ = తగునట్ట్లుగా, గుండె = తన హృదయం, కోసి = తరిగి, ఆటిచేన్‌ = అరచేతిలో, ఇడినన్‌ = పెట్టినప్పటికీ, తలపాడుగు = శిరస్సుఎత్తు, ధనము బోసినన్‌ = ధనమున్‌+పోసినన్‌ = సొమ్మురాశిగా క్రుమ్మరించినవ్పటికీ, వెలయాలికిన్‌ = వెల+అఆలికిన్‌ = ఇరీదుకమ్ముడువోయే స్త్రీ అయిన వేళ్యకు, కూర్మి = (విటునిపై) ప్రేమ, లేదు = ఉండదు, వినురా = ఆలకించవయ్యా. తా :సుమతీ, విటుడు, పెద్దపులిపాలు పితికి తెచ్చి యాయవచ్చును, తగినవిధముగా తన హృదయం ఛేదించుకొని, చేతికందించి యాయవచ్చును. వేశ్యను నిల్చుండబెట్టి ధనము (కుమ్మరించి, ఆమెశిరస్సుఎత్తున రాశిగా పోయవచ్చును. అయినప్పటికీ, ఆమెకు ఆతనిపై ప్రేమ ఉండదు. కనుక్క ఆమెకు వశుడు కాగూడదు. వ్యా : ఒకరిపై మరొకరికి కల మక్కువను తెలుసుకొనటానికి, అసాధ్యకార్యాలు సాధించమనీ, (ప్రాణాలు పోయే త్యాగాలు చేయమనీ, యీయ శక్యం కాని సొమ్ములిమ్మనీ, పరీక్షలు పెట్టేవారని ప్రాతకాలపు జానపదకథలలో వినవస్తూ ఉంటుంది. అలా వేళ్యపై తనకు కల మక్కువ రుజువుచేయటానికి, ఒక విటుడు, తేవటానికి శక్యం కాని పులిపాలు తెచ్చి యాయవచ్చును. దీనిలోని అసాధ్యత ఏమంటే, పులి క్రూరజంతువు. ఈనినపులికి ఆకలీ, కోపమూ ఎక్కువగా ఉంటాయనీ, అపుడది దానిపిల్లలనుగూడా తినివేస్తుందనీ, చెపుతారు. అలాంటి స్థితిలో దాని దగ్గరకు వెళ్ళటమే కష్టం, వెళ్ళి తీరికగా దానిపొలు పితకటం అసంభవం, ఇవి చేసి బ్రతికి బయటపడటం అసలే ఊహించలేము. ఇంత సాహసం చేసి, ఇన్ని కష్టాలు పడీ, అవి తెచ్చియిచ్చి, తనకామెసప్టై గల మక్కువను రుజువు చేసినా ఆమెలో అతనిపై నిజమైన (ప్రేమ ఉండదట. అలాగే, ఇష్టదైవంపై కల భక్తిని ప్రకటించటానికి, తమ దేహంలోని వివిధములయిన అవయవాలు ఇఖండించుకొనేవారున్నారు. ఆ రీతిగానే, తనకామెపై గల మక్కువ

168 సుమతి శతకము (ప్రకటించటానికి, ఒక విటుడు అలవడునట్టుగా తన గుండెనే కోసి ఆమెఅరచేతిలో పెట్టవచ్చును, అలవడుట అంటే అభ్యాసపడుట, తగుట, సిద్దించుట, స్వాధీనపడుట అనే అర్థాలున్నాయి. తన గుండె తాను కోసుకొనటం సాధ్యమైనా, ఆ తరువాత బ్రతికి ఉండటం కాని, దాని నింకొకరికి సమర్పించటం కాని, దానివల్ల ప్రయోజనం పొందటం గాని, అయే పనులు కావు. అవి చేయటం అభ్యసించి తగినరీతిని ఆ (ప్రక్రియ స్వాధీనం చేసుకొని తన లక్ష్యం సిద్దించేలా గుండెకోసి ఆమెచేతిలో పెట్టవచ్చును. అయినప్పటికీ అతని ధనంపై కల మక్కువ ఆమెకు అతనిపై ఉండదు. ఆమె రో వెలది. అనగా డబ్బుకు అమ్ముడు పోయే మగువ ఆమె, సాహసంవల్లా త్యాగంవల్లా ప్రేమ ఆమెకు కలుగక పోవచ్చు, పోనీ నిలువెత్తుధనం రాశిగా పోసి యిస్తే (ప్రేమ కలుగుతుందేమో అంటే, ఇంకా ఎక్కువ ఎవడిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది కాని, ఇంత ఇచ్చినవీనిపై స్థిరమైనమై(త్రి చూపదట. కనుక నాయనా, నా మాట వినరా, ఆమెజోలికి పోవకురా అంటున్నాడు. ఆవ - దానానిబట్టే ధనప్రాప్తి అని చెప్పుబోతున్నాడు : క. పెట్టినదినములలోసపల నట్టడవులకైన వచ్చు నానార్ధములున్‌ పెట్టనిదినముల గనకపు గట్టెక్కిన వేమి లేదు గదరా సుమతి. 86 ప్ర: సుమతీ, పెట్టినదినములలోపలన్‌ = దానం చేసినరోజులలో, నట్టడవులకైనన్‌ = నడు+ ఆడవులకున్‌ +ఐనన్‌ = అడవుల నడిమిభాగాలకైనప్పటికీ, నానార్థములున్‌ = నానా+అర్థములున్‌ = సకలద్రవ్యములూ, వచ్చున్‌ = రాగలవు, పెట్టనిదినములన్‌ = దానంచేసి ఉండని రోజులలో, కనకపుగట్టు = కనకము+గట్టు = పసిడికొండ, మేరు పర్వతం, ఎక్కినన్‌ = ఆరోహించినప్పటికీ, ఏమి = అనుభవించదగినదేదీ, లేదుగదరా = లేదు+కదరా = ఉండదు కదయ్యా. తా : సుమతీ, దానం చేసినరోజులలో అరణ్యమధ్యభాగాలలో ఉన్నప్పటికీ అక్కడ సమస్తద్రవ్యాలూ అభిస్తాయి. చేయని రోజులలో పసిడికొండమీద ఉన్నప్పటికీ అనుభవించదగినదేదీ లభించదుగదా, కనుక ఉన్నంతలో దానం చేసుకోవాలి. వ్యా వపెట్టవిదే పుట్టదవి సామెత. ఉన్ననాడు చేసినదానం లేనినాటికి ఉపయోగిస్తుంది. చేసిన దానధర్మాదులకన్నింటికీ ఫలం వెంటనే లభించదు. కాలక్రమంలో లభిస్తుంది. మనము చేసుకొన్న దానానికి ఫలం, ఏనాటికి ఉపయోగపడేలా చేసుకొన్నామో, నాడు మనము కారడవిలో ఉన్నా, అక్కడ మనకు ఆవసరమైనవన్నీ లభిస్తాయి. మనము చేసుకొన్నదానానికి ఫలం, ఏ నాటికి ఉపయోగించేది లేదో, వాడు బంగారు కొండమీద

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 169 ఉన్నా, ఉపయోగించేది ఏదీ లభించదు. బంగారం విలువ అయినదే కావచ్చు, అది కొండగా మనకు లభిస్తుండవచ్చు, కాని బంగారం ఆహారం కాదు, పానీయం కాదు, వస్త్రం కాదు, నివాసంకాదు, ఇంకా మనకు అవసరమైనదేదీ కాదు. ఒక్కొకనాడు కోటీశ్చరునికి కూడా గుప్పెడు మెతుకులు తినే అవకాశం లభించదు. ఇది నిత్యజీవితంలో మనము చూస్తూ ఉంటాము. కనుక వీలయినంతగా సత్సాత్రదానం చేసుకొమ్మని ఉపదేశిస్తున్నాడు.

యద్యదిష్టతమం లోకే యచ్చాస్య దయితం గృహే,

తత్తద్గుణవతే దేయం తదే వాక్షయమిచ్చతా -

ఈ లోకంలో ఏది అన్నింటికంటె తనకు ఇష్టమైనదో, ఇంటిలో ఏది ప్రియమైనదో, అవి తరుగకుండా తనకు లభిస్తుండాలనుకొనేవాడు వాటిని గుణవంతుడైనవానికి దానం చేయాలి. దానం చేయనందున దరిద్రుడై పుడతాడు. దారిద్యంవల్ల పాపం చేస్తాడు. పాపంవల్ల నరకానికి పోతాడు. తరవాత మళ్ళీ దరి'ద్రుడైపుడతాడు. మళ్ళీ పాపి అవుతాడు.

అదత్తదానాచ్చ భవేద్దరిద్రో దరిద్రభావాత్ర్రకరోతి పానమ్‌,

సాపప్రభావాన్నరకం ప్రయాతి, పునర్దరిద్రః పువరేవ పాపీ - అని గరుడపురాణం చెపుతున్నది. (ఉత్తరఖండం .1419)

ఆవ గ్రామగణకులకు ఏ వరిస్టితులలో కష్టాలు వస్తాయో చెప్పుబోతున్నాడు :

క. పారుగునం బగవాండుండిన.

నిరవొందంల వ్రాంతకాండె యేలిక యైనన్‌ ధర గాంపు కొండెమాడిన( గరణాలకు బతుకు లేదు గదరా సుమతీ, 87 ప్రవ సుమత, పగవాండు = శత్రువు, పారుగునన్‌ = తమ నివాసగృహానికి ప్రక్కనే, ఉండినన్‌ = నివాసమున్నా, ఇరవొందంగన్‌ = ఇరవు+ఒందన్‌+కన్‌ = స్థానం లభించగా, (వ్రాంతకాండు+ఎ = వ్రాయటం నేర్చినవాడే, ఏలికయైనన్‌ = ఏలికశఐనన్‌= ప్రభువు ఐనా, ధరన్‌ = భూమిపై కాపు = గృహస్థుడు, వ్యవసాయదారుడు, (గ్రామాధికారి, కొండెమాడినన్‌ = కొండెము+ఆడినన్‌ = చాడీలు చెప్పినా, కరణాలకున్‌ = (గ్రామగణకులకు, బ్రతుకు = జీవించటం, లేదు కదరా = ఉండదుకదయ్యా. తా :సుమతీ, శత్రువు తమ యింటికి ప్రక్కనే కాపురమున్నా, వ్రాత చేతనయినవాడే, బ్రాతపని చేసేవాడే ఏ విధముగానో పదవి సంపాదించి పరిపాలకుడయినా, వ్యవసాయదారుడు, గృహన్సుడు, (గొమాధికారి తమపై కొండెములు చెప్పినా (గ్రామగణకులకు జీవితం కష్టమైపోతుంది.

170 సుమతి శతకము వ్యా 2 ఈ పద్యంలో (గ్రామగణకులకు బాధలు కలిగించగల వారి గురించి చెపుతున్నాడు. మూడు పరిస్థితులలో వారికి జీవనం దుర్భరమైపోతుందట. వాటిలో మొదటిది, వారి యింటిప్రక్కనే పగవాడు నివసించటం. ఒకనిపై ఒకనికి పగ పుట్టకుండా ఉండాలి గాని, ఆతడు నిరంతరమూ ఎదుటివానిలోని లోపాలు వెదకి, అవి అవకాశంగా అపకారం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అట్టివాడు ఎంత దూరంగా ఉంటే, ఆంతగా అపకారానికి అవకాశం తగ్గుతూ ఉంటుంది. దగ్గర అయేకొలదీ పెరుగుతూ ఉంటుంది. అలాంటివాడు ఇంటిప్రక్కయింటిలోనే కాపురం ఉంటే, ప్రక్కలో బల్లెం ఉన్నట్టే, ఇతని ఇంటికి ఎవరు వస్తున్నారు? ఏమి తెస్తున్నారు? ఏమి మాటాడుతున్నారు? ఏ సమయంలో వస్తున్నారు? ఎందుకయి ఉంటుంది? మొదలయిన ఆరాలు తీస్తూ, అవి ఆధారంగా అపకారం చేస్తాడు. పగపరిమాణాన్ని బట్టీ పగవానిస్వభావాన్నిబట్టీ, అన్నిరకాల ఆనుపొనులూ గమనించి, ఏమయినా చేయగలుగుతాడు. ఇందువల్ల గణకులకు చాలా చిక్కులు వచ్చి పడతాయి. రెండవది : (వ్రాతకాడయినవాడు ఎలాగో పదవి సంపాదించి ఏలిక కావటం. (ప్రభుత్వవ్యవహారాలలో ఇతరులకు తెలియరాని చిక్కులు అనేకముంటాయి. వృత్తిరహాస్యాలూ ఉంటాయి. (వ్రాతకోతలలో (వ్రాసేవారికి మూ(తవే అర్థమయేసంగతులుకూడా చాలా ఉంటాయి. ఏ పని చేసేవారికి ఆ పనిలోని అట్టు గుట్టు ఆనవాళ్ళు తెలిసినట్టుగా ఇతరులకు తెలియవు. పూర్వకాలపు ప్రభువులు పత్రవ్యవహారం తక్కువ చేసేవారు. అంతా జ్ఞప్తిమీదా నమ్మకంమీదా నడిచిపోయేది. వచ్చిన పత్రాలు చదివి వినిపించేవారుండేవారు. సమాధానాలు వగైరా పత్రాలు వ్రాసేవారూ విడిగొ ఉండేవారు. వారు దాచే విషయాలు గూడా "ఉండే అవకాశం ఉంది. అట్టి స్టీతిలో (వ్రాతకాడు తానే పరిపాలకుడయితే, వ్రాతకాళ్ళు చేసే పనులగుట్టు తెలిసినవాడు కనుక, దొంగలు దొరికిపోయే అవకాశమూ, శిక్షలకు గురి కావలసినపరిస్టితులూ ఏర్పడతాయి. వ్రాతకాళ్ళలో (గ్రామగణకులు ముఖ్యులు. కనుక అట్టి యేలికవద్ద ఇట్టివారు పనిచేయటం వీరికి బాధాకరం అవుతుంది. మూడవది : కాపు కొండెకాడు కావటం. కాపు అంటే గృహస్టుడు అని ఒక అర్థం, గృహస్థుడు ఆంటే ఊరిలో నివసించే యింటియజమానుడు, ఊరిలో ఉండే గృహస్టులంటే (ప్రజలు, వారు గణకులకు అనుకూలురై ఉంటే ఫరవా లేదు కాని, వారే గణకులపై కోపం పెట్టుకొని, పై అధికారులకు గణకులసై చాడి చెప్పటం మొదలు పెడితే, సామాన్యంగా వారు యథార్జాలే చెపుతారు కనుక, గణకులకు చిక్కులు వచ్చి పడతాయి.కాపు అంటే వ్యవసాయాదులు చేసే అతడు అనీ అర్ధం. గృహస్థులకు చెప్పినవిషయాలే, వీరికీ

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 4! వర్తిస్తాయి. వీరు సామాన్యంగా ఎదురు తిరిగే స్వభావం కలవారు కారు. భయభక్తులతో ఉండేవారు. వారే పై అధికారులకు చెప్పటానికి దిగితే, వరద ముంచినట్టే. కాపు అంటే (గ్రామాధికారి అనీ అర్ధం. వ్రాతపని (గ్రామ గణకులూ, (గ్రామపాలనంలోని మిగిలినపెత్తనం మొదలయినవి (గ్రామాధికారి చేసేవారు. (గ్రామాధికారిని అతనిన్యాయవర్తనాన్నీ, పెద్దమనిషి తరహాని, దర్వాన్నీ బట్టి గౌరవిస్తే, గణకులను వారివ్యవహార దక్షతనుబట్టి మన్నించేవారు. వీరిద్దరూ ఐకమత్యంతో ఉంటే పరవాలేదు. (వ్రాతకానిపై, (గ్రామాధికారి, పై అధికారులకు కొండెములు చెపితే, గణకులకు కష్టం తప్పదు. అన : తాకట్టు, పారుబోతుతనం, ఆంగడిఅమ్హులు, అవివేకి స్టేహాలగురించి చెవ్పుబోతున్లాడు : క బంగారు కుదున( బెట్టకు సంగరమున బాజిపోకు పరసు(డవైనన్‌, అంగడి వెచ్చము లాడకు నెంగలితో( చెలిమి నలదు వినురా సుమతి. 88 ప్ర: సుమతీ, సరసుండనైనన్‌ = సరసుండవు+ఐనన్‌ = ఆనందించే వాడవైతే, బంగారు = ఫైడి, కుదువంటెట్టకు = కుదువన్‌+పెట్టకు = తాకట్టు ఉంచకు, సంగరమునన్‌ = యుద్ధంలో పాఠీపోకు = పలాయనం చేయకు, అంగడిన్‌ = దుకాణంలో, వెచ్చములాడకు = వెచ్చములు+ఆడకు = ఇంటికి వాడుకొనటాన్షికి కావలసిన చిల్లరసరుకులు అరువుమీద కొనకు, వెంగలితోన్‌ = మూఢునితో, అవివేకితో, చెలిమి = హ్నేహం, వలదు = వద్దు, వినురా జ ఆలకించవయ్యా, తా : సుమతి, నీవు సంతోషంగా ఉండాలనుకొంటే, నా నీతి ఆలకించవయ్యా. బంగారం తాకట్టు పెట్టకు, యుద్దంలో పలాయనం చేయవద్దు. ఇంటికి కావలసిన చిల్లర సరుకులు దుకాణంలో అరువుకు కొనవద్దు, యుక్తాయుక్త జ్ఞానం లేనివానితో స్నేహం చేయవద్దు. వ్యా : ఇందులో నాలుగు నీతులు చెప్పాడు. ఒకటవ మూడవ నీతులు ఆర్థికమైనవి. రెండవది పౌరుషానికీ నాలుగవది సమాజానికీ సంబంధించినవి. _ మొదటిది బంగారం తాకట్టు పెట్టవద్దన్నది. ఇది ఎందుకు కూడదు? అప్పు ఇచ్చేవారు ఎవరు ఎందుకిస్తారు? ఒకటి : పరిచయస్టులు మిత్రులు బంధువులు మొదలయినవారు. వీరు అప్పు అడిగినవానిమీద కల మమత్వంమీద ఇస్తారు. మమత్వంవల్ల ఏర్పడిన నమ్మకాన్ని నిలబెట్టుకొని, తిరిగి యిస్తానన్న రీతిలో, ఇస్తానన్న నాటికి ఇస్తే మళ్ళీ అవసరమయినా ఇస్తుంటారు.

172 సుమతి శతకము రెండు : వీరి దగ్గర నమ్మకం కోల్పోయినా, ఇట్టివారు మొదలే లేకపోయినా, వడ్డీ కిచ్చేవారిదగ్గర అప్పు చేయవలసి ఉంటుంది. వారు ఇచ్చేది వడ్డీకయినప్పటికీ, కేవలం నమ్మకాన్నిబట్టి ఇవ్వరు. అక్కడ (ప్రేమ అసలే కారణం కాదు. నమ్మకానికి తోడు అతనికున్న తిరిగి యాయగలశ్తక్తినీ, ఆ శక్తికి మూలమయిన అస్తిపాస్తులనూ, చూచి ఇస్తారు. ఆస్తులు ఖేక, అస్తులుంటే, నమ్మకం లేకపోతే, వాటిని తాకట్టు పెట్టుకొని ఇస్తారు. ఆస్తులూ లేకపోతే, వస్తువులు తాకట్టుపెట్టటం కంటె మార్గం లేదు. వస్తువులలో విలువైనవి బంగారపుని కనుక, వాటినిస్తారు. క్రమక్రమంగా చెంబులూ, తప్పాలాలూ, ఒకటి రెండు రూపాయలకుకూడా తాకట్టుపెట్టే స్టితికి వస్తారు. తాకట్టు పెట్టవద్దు అనే మాటకు, తాకట్టు పెడితేనే కాని అప్పుపుట్టని స్థితి కల్పించుకోకు, విశ్వాసార్హత సంపాదించుకో, సంపాదించినది నిలుపుకో, అది బంగారంకంటె విలువయినది అని చెప్పటం. ఒక్కసారి తాకట్టుల అప్పులకు దిగాడో, ఇక మరే విధముగానూ అప్పు పుట్టదు. నువిషి నిద్రసోనచ్చు కాని వడ్డీ. నిద్రపోదు. అది పెరుగుతూ ఉంటుంది నిద్రపోకుండా పగలూ రాత్రీ, ఒక్కొక్కప్పుడు, అలా పెరిగినందున, తాకట్టు వాకట్టయిపోయే (ప్రమాదం ఉంది. ఉంటేనే ఖర్చుపెట్టటం, లేకపోతే ప్రాణాంతక పరిస్థితులలో అయితేనే అప్పుచేయటం, ఆలవాటయితే, ఉన్నవి ఉంటాయి. రెండన ఆర్థికవిషయం అంగడివెచ్చము లాడకు అన్నది, అంగడిసరుకులు సామాన్యంగా తిండికి సంబంధించినవి. తిండి రెండు రకాలు. ఆకలితీరటానికి తినేది, జిహ్వాచాపల్యానికి తినేది. వచ్చేది ఇంత ఆదాయం అని లెక్క ఉంటుంది కనుక్క దానిలో ముఖ్యమైన ఆహారాదులకు అవసరమైనది కేటాయించుకొని, మిగిలిన సరదా ఖర్చులు సొమ్ము మిగలటాన్నిబట్టి చేసుకొంటుంటే, తిండికోసం అప్పుచేయవలసిన అవసరమే ఉండదు. చిల్లరకొట్టులో కావలసిన సరకులు అరువుకు తెచ్చుకొనే పద్దతి పెట్టకొన్నందువల్ల, జిహ్వాచాలప్యంకోసం సరుకులు తెచ్చుకొనటం అలవాటవుతుంది. సొమ్ము ఇవ్వకపోయినా సరుకు వస్తుంది. కనుక, కోరిక పుట్టినవెంటనే సరుకులు తెచ్చుకొని వాడుకొంటారు. ఇవ్వవచ్చేటప్పటికి అది తడిసి ముప్పందుమవుతుంది. అప్పు మొత్తం తీరిస్తే కాని ఖాతా ఎత్తే వీలుండదు. అంతంతమాత్రం ఆదాయంలో, ఏ నాడూ అప్పు పూర్తిగా తీరటం ఉండదు, కనుక ఖాతా తీరటం ఉండదు. ఖాతాలో సరుకులు కొనటంలో మరో ఇబ్బంది ఉంది. నగదిచ్చి సరుకులు కొనేవారికి ముందిచ్చి, ఖాతావారికి చివర ఇస్తారు. నగదు వాళ్ళకిచ్చే ధరకంటే, ఖాతావాళ్ళకి ధర ఎక్కువ వేస్తారు. ఇందుకు కారణం స్పష్టం, ఖాతా వాడెప్పుడిస్తే అప్పుడే తీసుకువెళతాడు. నగదువాని కాలస్యమైతే, మరో కొట్టుకు పోతాడు.

వివేకానందిని వ్యాఖ్యాసహితం 173 వీడు పోలేడు. ఖాతావాడు సొమ్ము చెల్లించటం ఆలస్యం అవుతుందీ కనుక, దానికి వడ్తీగా ధర ఎక్కువ వేస్తాడు. తక్కువరకం సరుకిచ్చినా పుచ్చుకోవాలి. ఉద్దరిస్తున్నట్టు మాటలాడతాడు. సారాంశం : అంగడి అప్పువల్ల 1. శక్తికి మించిన ఖర్చు. 2. హెచ్చు ధర చెల్లించాలి. 3. ఎప్పుడూ అప్పులో ఉండాలి, & మేలిసరుకు ఎంపికకు అవకాశం ఉండదు. 5. కాలం వృథా అవుతుంది. 6, సొమ్మిచ్చి దైన్యం అవలంబించాలి. కనుక, అంగడి వెచ్చము లాడవద్దనటం. పౌరుషానికి సంబంధించిన నీతి, యుద్ధంలో పారిపోవద్దన్నది. ఇది పూర్వకాలపు యుద్దనీతి. ఆధునికయుద్ధనీతి వేరు. గెలవటం కోసం వెనక్కుతగ్గటం పోరుషహానిగా వీ దేశమూ భావించటం లేదు. ద్వితీయ[ప్రపంచ సం(గ్రామ వార్తలలో మనసైన్యం ధైర్యంతో వెనుకంజ వేస్తున్నది అని చెప్పేవారు మిత్రదేశాలవారు. వ్యూహరీతి వేరు. పారిపోవటం వేరు. పాతిపోవటం పిరికితనంవల్ల జరుగుతుంది. పిరికితనం ఎన్నడూ ప్రశంసనీయం కాదు. విజయనగర సా(్రాజ్యానికీ బహమనీసుల్హానులకా' రక్కసతగడీవద్ద జరిగిన యుద్ధంలో, మోసంతో అలియరామరాయలతల నరికి, ఈటెకు (గ్రుచ్చి, ఫైకెత్తి చూపగానే, అధికసంఖ్యలో ఉన్న విజయనగరసేన, తమ నాయకుడు చనిపోయినందున బెదరి, పారిపోయింది. విజయనగరం ధ్వ్యంసమయింది. అనవసరమైన పిరికితనం వహించక, - సైన్యం నిలబడి పోరి ఉంటే, చరిత్ర మరోలా ఉండేది, రామాయణంలో రాముడు, తాటకను చంపే వీలుకోసం, రెండడుగులు వెనక్కు వేశాడట. అది పౌరుషవోని అని లవకుశులు ఉత్తరరామచరిత్రలో ఆక్షేసిస్తారు. నాటి యుద్ధధర్మానికీ, నేటి యుద్ధనితికీ తేడా ఉంది. అయినా, పిరికితనం ఎప్పుడూ నిందనీయమే. సామాజికమైననీతి, వెంగలితో చెలిమి వలదు అన్నది, మూఢుడు వివేకంలేనివాడు. వాడు ఒకరు చెపితే వినడు, వానికి తోచదు. ఇటువంటివాడు తాను మునుగుతాడు, తన నంటిపెట్టుకొన్నవానిని ముంచుతాడు. రావణుడు దుర్యోధనుడు మొదలయిననారిట్టివారు. వారిమూర్థత్వం వారినీ వారిమిత్రులనూ బంధువులనూగూడా నళింపజేసేది. కనుక వెంగలితో సంగాతం పనికి రాదు. అవ : బలమున్దుదని బలహీనులయినా బహునంభఖ్యాకులయినవారిలో విరోధం వద్దని చెప్పబోతున్లాడు : క్త బలనంతు(డ నాక్తేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బబవంతమైన సర్పము చలిచీములచేత జిక్కి చావదె సునుతీ, 89

174 సుమతి శతకము ఫ్ర : సుమతి, నేను, బలవంతుండన్‌ = శక్తికలవాడను, నాకేమని = నాకున్‌+ఏమి+అని = నాకు ఏమి నష్టం కలుగుతుంది అనిన అభిప్రాయంతో, పలువురతోన్‌ = అనేకులతో, నిగ్రహించి = త్రోపాడి = అంటే త్రోసివేసి, వారిని తృణీకరించి, పలుకుట = మాటాడటం, మేలా = మేలు+ఆ = హితం కలిగిస్తుందా? శ్రేష్టమైనదా? బలవంతమైన = బలవంతము+ఐన = శక్తి కలిగిన, సర్బము = సాము, చలిచీమలచేతన్‌ = ఒకరకమయిన నల్లని చీమలచేతిలో, చిక్కి = తగులుకొని, దొరకి, చావదె = చావదు+ఎ = చనిపోవదా? తా ;సుమతీ, తనకు శక్తి ఉన్నది కనుక, తననెవ్వరూ ఏమీ చేయలేరని ఎక్కువమందిని తీసిపారవేసి మాటాడినందువల్ల మంచి కలుగదు. ఎంతో బలం కల పాము, అత్యల్పశక్తికల చిన్ని నల్ల చీమలకు దొరకిపోయి, ప్రాణాలు కోల్పోతున్నది. వ్యా: ఎంతో బలం కలవాడుండవచ్చును. ఎదుటివారు చాలా తక్కువ బలం కలవారే కావచ్చును. అయినా వారు తనకేమీ చేయలేరనుకొని, గర్వించి, ఎక్కువమందిని తీసి పారవేసి, తృణీకరించి, మాటాడగూడదు. తాడివెక్కేవాని తలదన్నేవాడుంటాడు. గడ్డిపరకలుకూడా వెంటిగా ఏర్పడి మదపుటేనుగునుసైతం బంధిస్తున్నాయి. చీమలలో చిన్న చీమలున్నాయి. వాటిలో మళ్ళీ ఎర్రదీమలు, నల్ల చీమలు ఉన్నాయి. ఎర్ర చీమ కుడితే దద్దురు తేలుతుంది, నల్ల చీమలలో ఒకరకమయినవాటిని చలి చీనులు అంటారు. అవి ఎవరినీ కుట్టనే కుట్టవు, కుట్టినా అంతగా బాధపెట్టవు. అవి చాలా వేగంతో పరుగెత్తగలవు. ఆ చలి చీమలకు పాము దొరికిపోయింది. పాము ఎంతో బలమయినదే. దానివిషం కారణంగా అది, ఎంతో పెద్ద ప్రాణులనుకూడా కరిచి చంపగలదు. కనుక, మరీ శ్షక్తిమంతమయినది. అయినా, ఇవి కరవటానికి చాలినవి కావు, నలిపి చంపటానికి తనకు చేతులూ, కాళ్ళూ లేవు. కనుక, అంతహీనశక్తికల చలి చీమలు ఎన్నో కలిసి కుట్టేసరికి, ఇంత శక్తికల పాముకూడా ప్రాణాలు కోల్పోతున్నది. కనుక, బహుజనవిరోధం బలవంతునికైనా పనికి రాదు. అన . ఎంత గొప్పు వరిపొలకునికయినా ముఖ్యుడైన కార్భనవోయకుడుండటం ఆవనరమని చెవ్రుబోతున్లాడు : క. మండలపతిసముఖంబున మెండైన ప్రధాని లేక మెలగుట యెల్లన్‌ గొండంత మదపుటేను(గ తొండము లేకుండినట్ట్లు దోచుర నుముతి. ఇం 'ప్ర : సుమతీ, మండలపతి = దేశానికి ఏలిక అయిన వానియొక్క, సముఖంబునన్‌ = ఎదుట, మెండైన = మెండు+ఐన = అధికుడైన, ప్రధాని = ముఖ్యకార్యసహాయుడు, లేక =

వివేకానందినీ వ్యాళ్యాసహితం క్షగ5 ఉండకుండా, మెలంగుటి = (ప్రవర్తించటం, ఎల్లన్‌ = సమస్తమూ, కొండంత = కొండ+అంత = పర్వతమంత పరిమాణం కల, మదపుటేనులు = మదము+వీనుగు = (్రొవ్వినయేనుగు, తొండము = హస్తం, లేకుండినట్టు = లేక*+ఉండిన+అట్టు = లేకుండా ఉన్నరీతి, తోచుర = అభిప్రాయం కలుగుతుందయ్యా,

తొ : సుమతీ, ేశపరిపాలకునిదగ్గర, అన్నిరకాల పనుల విషయంలోనూ సహాయం చేసే ముఖ్యాధికారి ఉండటం అవసరం. ఆతడు లేకుండా, తానే పరిపాలన చేసుకొనటం, క్రొవ్విన పెద్ద యేనుగు, తొండం లేకుండా ఉండటం వంటిది.

వ్యా : ఎంత బలవంతుడైనా, ఎంత బలహీనులనయినా తృణీకరిస్తే అపాయమని 89వ పద్యంలో చెప్పినవాడు, ఎంత శక్తిపామర్థ్యాది పరిపూర్జునికైనా, ఇతరుని పాహాయ్యం లేనిదే జరగదని, ఈ పద్యంలో చెపుతున్నాడు. భూమిమీద అన్ని విధాలా పరిపూర్ణుడయినవాడు దేశపరిసాలకుడు. అతనికి అంగబలంలో కాని, అర్హదలంలో కాని, ఏ విధమైన లోపమూ ఉండదు. అయినా, అతడు ఇతరుల తోడ్పాటు ముఖ్యంగా (ప్రధానమంత్రి పాహాయ్యం లేనిదే, ఏమీ చేయలేడని ఛెపుతున్నాడు. పరిపాలకునిసామర్థ్యం ఎక్కడ వెల్లడి అవుతుందంటే, అన్ని పనులూ తాను స్వయంగా చీసుకొనటంలో కాదు. అలా చేసుకో లేడు, చేసుకోగలిగినా, ఎల్లకాలమూ సరయిన పద్ధతిలో చేసుకొనగలగటం అసొధ్యంకూడా. కనుక్క ఏ పనికి ఎవరు సమర్భులో గమనించి, వారిచేత ఆ సనులు చేయించటంలో, అతని సామర్థ్యం వెల్లడి అవుతుంది. ఈ చేయించే పనిలో కూడా, అతనిసామర్థ్యం ఒకటే చాలదు. తెలివిలో, శక్తిసామర్థ్యాలలో, దూరదృష్టిలో, వ్యవహారదక్షతలో, తనకు పొటి రాగలవాడే. కాదు. తనను మించగలవాడు 'ప్రధానకార్యసహాయకుడుగా, నిరంతరం, అతనికి అందుబాటులో ఉంటూ ఉండాలి, పద్యంలోని మెండైన అన్నపదం ముఖ్యం. ఈ వ్యాఖ్యలో, శక్తీ మొదలయిన వాటిలో, తనను మించగలవాడు అన్నది దానికి వివరణం, చాలామంది పరిపాలకులు తమకంటే సమర్భులు. తనుకు సహాయకులుగా ఉంటే, తమను మించిసోతారేమో అన్న భయంతో, తమకంటే శక్తిహీనులనే తమకు సహాయకులుగా వేసుకొంటారు. దీనివల్ల తమ తెలివి పెరగదు. ప్రజలకు మేలు జరగదు. పూర్వం మహారాజులు, (ప్రతివిషయంలోనూ సర్వ్యోత్తములయినవారినేే ఆ యా విషయాలలో అస్టానవిద్వాంసులు ఇత్యాదులుగొ నియమించుకొనేవారు. దానివల్ల విద్వత్చోమషణా జరిగేది, ఆ యా విషయాలూ, శాస్త్రాలూ చదవకుండానే, మహారాజులు వాటిలో అననరమైన విషయాలలో, వివేకులయేవారు. విద్యలూ బ్రతికి ఉండేవి. కనుక తనకంటె సమర్డునే తనప్రధానిగా వేసుకోవాలి. అతనిద్వారా అన్ని పనులూ జరిసించుకోవాలి. అతడు తావే అన్నట్టు వ్యవహరించగలిగి,

[76 సుమతి శతకము తనకు ద్రోహం చేయనివాడై, ఉండాలి. అపుడే అతనికి శాంతీ, సౌఖ్యమూ మొదలయిన కావలసినవన్నీ లభిస్తాయి. తానుమాత్రం గమనిస్తున్నట్టు కనిపిస్తూనూ, కనిపించకుండానూ, చివరివాని నుంచి ప్రధానివరకూ గల అందరిచేష్టలూ గమనిస్తూ అవసరమయినపుడు అవసరమయిన వ్యక్తులద్వారా, విధానాలద్వారా, అవసరమయిన సవరణలు చేస్తూ ఉండాలి. ఏనుగు ఎంతో బలమైనదే, దీనికెవరితోడ్చాటూ అవసరమయినది కాదు. కాని, తొండంమా(త్రం అవశ్యం ఉండవలసినది. దానిద్వారానే అది తినినా, త్రాగినా. ప్రధానిద్వారా మాత్రమే పరిపాలన జరిపించేటప్పుడు, అవసరమై, తప్పి తగిలి వచ్చినపుడు, తాను పైనుండి తగురీతిని లోపం సవరించే అవకాశం ఉంటుంది. పనులూ పాడుకావు, తనప్రతిష్టా పాడు కాదు. కనుక, ఇది చిన్నిసంస్థనుంచి పెద్ద ప్రభుత్వంవరకూ, దేనిని నడిపేవారయినా గమనించవలసిన అవసరం ఉన్నది. ఇంటి వ్యవహారాలలో భార్య అఆటువంటిమంత్రి. కనుకనే కార్యేషు నుంత్రి అన్నారు. ఆవ : మంత్రి (ప్రాధాన్యమే మరొక రీతిని చెప్పుబోతున్హాడు : క. మనంత్రిగలవానిరాజ్యము తంత్రము చెడకుండ నిలుచు. దజణచుగ ధరలో నుంతధ్రివిహీనుని రాజ్యము జంట్రపుం గీలూడివట్టు జరగదు సుమతి. స! 'ఫ్ర:సుమతీ, ధరలోన్‌ = భూలోకంలో, తఆచుగన్‌ = అధికంగా, మంత్రి = బుద్దిసహాయుడైన అధికారి, కలవాని = ఉండిన ఏలిక యొక్క, రాజ్యము = దొరతనానికి లోబడిన దేశం, దొరతనం, తందత్రము = ఉభయార్థసాధకమైనఉపాయం, చెడకుండన్‌ = చెడక+ఉండన్‌ = చెడిపోవకుండా, నిలుచున్‌ = ఉంటుంది, మంత్రివిహీనుని = మంత్రిలేని ఏలిక యొక్క, రాజ్యము, జం(త్రపుంీలు = జంత్రము+కీలు = యంత్రంలో సులభంగా అటూ ఇటూ తిరగటం మొదలయినవాటికి వీలుగా ఉంచినమర, ఊడినట్లు = ఊడిన+అట్టు = రాలిన, జారిన తీరున, జరగదు = ్రవర్తిల్లదు. తా : సుమతీ, మంత్రి ఉన్న ఏలిక పాలించే దేశం, అ ఏలికప్రయోజనమూ, ('ప్రజలప్రయోజనమూ సాధించే ఉపాయం చెడిపోకుండా ఉంటుంది. కనుక స్థిరంగా ఉంటుంది. మంత్రిలేనివాడేలే దేశం, సులభంగా ఆటూ ఇటూ యంత్రభాగాలు తిరగటం మొదలైనవి జరగటానికి ఏర్పరచిన మర జారిపోయిన యంత్రంలాగే, పనికిమాలినదవుతుంది. వ్యా : ఏలిక తన ప్రయోజనాలు కాపాడుకొనటానికి, అన్ని విషయాలలోను సమర్దుడైన మంత్రిని నియమించుకొని, అతనితో ఆలోచన చేస్తూ తదనుగుణముగా

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 177 పరిపాలన చేయాలి. ఆలా అయితే, పాలకుని ప్రయోజనాలూ, పాలితుల ప్రయోజనాలూ సిద్ధించే ఉపాయాలు, చెడిపోకుండా ఉంటాయి. కనుక, రాజ్యం స్థిరంగా ఉంటుంది. దీనికిచ్చిన ఉపమానముకూడా, ఈ భావాన్ని అనుభవంలోనికి స్పష్టంగా తీసుకు వస్తున్నది. ఒక యం[త్రం ఉందనుకొందాము. ఆందులోని భాగాలు చక్కగా అటూ ఇటూ తిరగటానికి వీలుగా, ఒక మరయో, సూత్రమో పెట్టారనుకుందాము. ఆది బాగా ఉన్నంతవరకూ యంత్రం పనిచేస్తూ ఉంటుంది. అది జారిపోతే, అన్ని భాగాలూ కదలకుండా ఉండిపోతాయి. కదిలినా యం(త్రప్రయోజనం సిద్దించేటట్టు కదలవు, మంత్రిలేని రాజ్యము ఆ యంత్రము వంటిదయిసోతే, యం(త్రంలోని కీలువంటివాడు మంత్రి. అవ = ఒకనిని వలచిన అమెను మరొకడు కామించటం తగదని చెప్పబోతున్లాడు : క, మది యొకని వలచి యుండంగ మది చెడి యొకక్రూరవిటుండు మానక తిరుగున్‌ అది చిలుకల బిల్లి పట్టీన( జదువునె యా పంజరనున జగతిని సుమతీ, 2 ప్ర : సుమతీ, జగతిని = లోకంలో, మది = మనస్సు, ఒకనిన్‌ = ఒక మగవానిని, వలచి = కామించి, ఉండంగన్‌ = ఉండన్‌+కన్‌= ఉండగా, ఒక = ఒకానొక, (క్రూరవిటుండు = కఠినుడైన జారుడు, మది = బుద్ది, చెడి = పాడైపోయి, మానక = విడువక, తిరుగున్‌ = ఆమెకోసం తిరుగుతూ ఉంటాడు; చిలుకన్‌ = ఒక శుకాన్ని, పిల్లి = మార్దాలం, పట్టినన్‌ = తినటానికి నోటితో పట్టుకోగా, ఆది = ఆ చిలుకు ఆ పంజరమునన్‌ = దానిని ఉంచి పెంచేగూటిలో, చదువునె? చదువును+ఎ? = నేర్చిన పలుకులు పరించునా? పరించదు. తా :సుమతీ, ఒక ఉవిదమనస్సు ఒకనిని ప్రేమిస్తుంటే, బుద్ధిపొడై ఇంకొక జారుడు ఆమెను కోరి, ఆమెచుట్టూ తిరుగుతుంటాడు. పంజరంలో ఉన్నచిలుకను ఒక పిల్లి పట్టుకొంటే, ఆ చిలుకపలుకులు నినాలని మరొకరు దానిని చదువమంటే, అది చదువుతుందా? చదువదు. వ్యా : 72వ పద్యంలో పరనారీసోదరుడు పరముడు అని చెప్పాడు. 73 వ పద్యంలో పరసతి కూటమి కోరవద్దన్నాడు. 74లో పరసతుల గొస్టిలో ఉంటే నింద వస్తుందన్నాడు. ఎరక నితావైముఖ్యం కవికిష్టం. కనుక, బహుభంగులుగా ఆ విషయం చెప్పదలచి ఈ పద్యంలోనూ చెపుతున్నాడు. అయితే ఈ భంగిలో విశేషం ఉన్నది. పై పద్యాలలో, తనపై మక్కువ ఉన్న పరసతులగురించి చెప్పాడు. ఇందులో, ఒకని మీద మనస్సున్న ఉవిదను, బుద్ది సరిగా ఉన్నవాడు, సుకుమారహృదయుడు కోరడని సూచిస్తున్నాడు. బుద్ధిపొడైన

178 సుమతి శతకము కరినుడే ఆ పని చేస్తాడట. బుద్ధిచెడటం ఆమెకు తనమీద వలపులేదనే కాదు, మరొకనిమీద ఉన్నదని తెలిసీ కోరటంలో వ్యక్తమవుతున్నది. ఆమె కావాలని తిరిగేవాడు, (క్రూరుడైన జూరుడన్నాడు. (క్రూరుడంటే భయంకరుడు, కరినుడు, నొప్పించేవాడు అని అర్జాలు. ఆమె ఒకనిని వలచి ఉంటే, తనపై వలపు చూపమనటం ఆమెను నొప్పిస్తుంది. అలా ఆంటూ మానక తిరుగుతుంటే, ఆతనిని చూస్తేనే ఆమెకు భయం వేస్తుంది కనుక, భయంకరుడు. ఆమెమనస్సు ఎలా ఉన్నా, తనపై లేకున్నా, తనను వరించాలని తిరగటం కాఠిన్యం. ఈ క్రూరత్వం, ఈ పద్యంలో ఇచ్చిన ఉపమానంలో మరీ బాగా వ్యక్తమవుతున్నది. ఒక చిలుకను ఎవరో ముద్దుగా పంజరంలో పెట్టి మాటలు నేర్పారు. ఇక పిల్లి వచ్చి, దానిని ఎలా పట్టిందో, పట్టింది. ఆ పట్టులో అది గిలగిలలాడుతున్నది. అదే సమయంలో ఇంటికి వచ్చిన అతిధులు, దానిబాధ గమనించకుండా, ఆ స్థితిలోకూడా తమకు ఆనందం కలిగించేమాటలో పద్యాలో చదవమంటున్నారు. తమ వినోదం తప్ప, దానిమనస్సు గమనించక పోవటం, ఎంత బాధాకరం, ఎంత భయంకరం, ఎంత కాఠిన్యం అంటున్నాడు. ఒకరిమీద వలపు ఏర్పడి ఉండటం, అది తీరక నెరవేరక బాధపడుతుండటం, పీల్లికి చిక్కినపిట్ట గిలగిలలాడటం వంటిదనటం, ఎంత మనోధర్మం తెలిసిన తనమో! తనపై సక్తురాలు కాని అన్యాసక్తురాలిని కోరటం గురించినదిది అయితే, అన్యుడు కూడిన అతివను కూడనే వద్దన్నాడు 76వ పద్యంలో. అన్యుని తన మనస్సులో తలచుకొంటూ ఉండేదానిని విడిచి "పెట్టమన్నాడు, 75వ పద్యంలో. అన్యునిపై మనసుండనీ, ఉండకపోనీ, తనమీద వలపులేని వనితను బలాత్కరించటం, సానమీద నీళ్ళు పొయ్యకుండా గంధం తీయటం వంటిదని, 101వ పద్యంలో చెపుతూ, కూటమికి పరస్పరం వలపు ముఖ్యమని చెప్పాడు. అది తప్పు, పాపం, అని చెప్పటం ఒక పద్ధతి. ఆ పనిలో ఉన్న కష్టసుఖాలు బోధించి, కష్టభూయిస్టం కనుక వద్దనటం ఒక పద్దతి. మనిషిని పద్దతికి తేవటానికుపయోగించే పద్ధతులలో దేనినీ వదలిపెట్టడు. 35వ పద్యవ్యాఖ్యలో 92వ పద్యం(ప్రసక్తి తెచ్చి వ్రాసినదికూడా చూడండి. ఆవ : నత్వం, నుభటకోట్సీ మానం, వ్రాలు - వీటి (ప్రాధాన్యం చెప్పుబోతున్నాడు : క మాటకు( బ్రాణము సత్యము కోటకు( బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్‌ బోటికి. బ్రాణము మానము చీటికి. బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి, 93 ప్ర: సుమతీ, ధరిత్రిన్‌ = భూలోకంలో, మాటకు = పలుకుకు, సత్యము = నిజం, ప్రాణము = ఉసురు, కోటకు = నగరానికి చుట్టుగల ప్రహరికి, సుభటకోటి = మంచికాలిబంటుల గుంపు,

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 179 ప్రాణము, బోటికిన్‌ = వనితకు, మానము = గౌరవము, (ప్రాణము, చీటికిన్‌ = పత్రికకు, పత్రానికి, వ్రాలు = సంతకం, ప్రాణము, సిద్దము = వీటికి ఈ [ప్రాధాన్యం తెచ్చిపెట్టినది కాదు, తనంతట కలిగినది. తొ : సుమతీ, మాటకు నిజం ప్రాణంవంటిది. కోటకు కాలిబంట్టు ప్రాణంవంటి వారు, మగువకు గౌరవం (ప్రాణంవంటిది. పత్రానికి సంతకం (ప్రాణంవంటిది. వీటికీ ప్రాధాన్యం ఎవరో తెచ్చిపెట్టినదో, కల్ప్సించినదో కాదు, వాస్తవమైనది. వ్యా: జీవులకు శరీరం, ప్రాణం రెండు ఉంటున్నవి. శరీరంలోని చాలా అవయవాలలో కొన్ని, ఒకటిగాని, ఆంతకు మించినవి కాని లేకపోయినా, జీవి బ్రతికి, ఉంటున్నాడు. ప్రాణం ఉన్నంతవరకూ బ్రతికి ఉన్నట్టు లెక్క. ప్రాణం పోతే శరీరం శవమై, ఎక్కువసేపు ఉండకుండా పోతున్నది, అలా కొన్ని ముఖ్యమైన వస్తువులకూ, ప్రాణులకూ ముఖ్యమైనవేవో చెపుతున్నాడు. ఆ యా వస్తువులకూ, ప్రాణులకూ అవి లేకపోతే, అవి పనికిమాలినవి అని అర్ధం, అన్ని మాటలూ మాటలే, అయితే సత్యం లేనిమాటలు శవాలవంటివి. అవి పలికినా ఒకటే, పలకకపోయినా ఒకటే, అలాగే రాళ్ళు, ఇటుకలు మొదలయిన పదార్థాలతో ఊరికో, నగరికో చుట్టూ (ప్రహరి కడతారు. శత్రువులు సరాసరి వచ్చి బాధించకుండా, అది కాపాడుతుందనీ, కాపాడాలనీ అది కట్టేవారి ఉద్దేశం. ఒక ప్రహరి దాటినా, రెండవ (ప్రహరి దాటటం కష్టమయేటట్టు, అనేక ప్రహరులు కూడా నిర్మించేవారు. ఓరుగల్లులో కంచెకోట, మట్టికోట, రాతికోట మొదలయిన (ప్రాకారాలుండేవట. ఇన్ని ఉన్నా, శత్రువులరాకను అవి కొంచెం జాగు చేయగలవు కాని, పూర్తిగా ఆపలేవు, ఆ పని చేయటానికి, వాటిమీద యోధులుండి పోరాడినపుడే వాటి ఉపయోగం, వారు కనుక లేకపోతే, అవి పనికిమాలినవే. కనుక్క యోధులు కోటకు ప్రాణంవంటివారు. మానం అంటే గౌరవం. మగువకిది [ప్రాణంవంటిది. దానిని కాపాడుకొనటానికి మానవతులు (ప్రాణాలుకూడా విడిచిపెట్టినట్టు బొబ్బిలిమల్లమాంబా, అనేక రాజపుత్రకాంతలూ చరిత్రలో ఉదాహరణాలుగా లభిస్తున్నారు. కనుకముగువకు ప్రాణంవంటిది మానం, పత్రంమీద ఏమైనా వ్రాయవచ్చును. కొని, దానిని ఎవరు, లేక ఎవరితరపున వ్రాశారో, వారి సంతకం లేకపోతే అది చెల్లదు. కనుక, పత్రానికి సంతకం (ప్రాణంవంటిది. ఈ సత్యం మొదలయినవాటికి ఈ [ప్రాధాన్యం దానంతట అదే వచ్చినది కాని, ఎవరో కల్పించినది కాదు. కనుక అతిముఖ్యం,

180 సుమతి శతకము అవ : మానవంతుడు వొనుణ్లి ఆశ్రయించగూడదని చెప్పబోతున్నాడు : క మానఘను(డాత్మ ధృతిపెడి హీనుండగువాని నాశ్రయించుట యెొల్లన్‌ మావెండు జలములలోపల నేనుంగు మెయి దా౭చినట్టు లెజబుంయుము సుమతీ, రక్త ఫ్ర : సుమతి, మానఘనుండు = చిత్తంయొక్క బౌన్నత్యంచేత గొప్పవాడైన వాడు, అత్మన్‌ = మనస్సులో, ధృతి = ధైర్యం, చెడి = పోయి, హీనుండు = నీచుడు, అగువానిన్‌ = అయినవానిని, ఆశ్రయించుట = అండగా చేరుకొనటం, ఎల్లన్‌ = సమస్తమూ, మానెండు = మౌనిక అనగా కుడపము ఆనగారెండు సేర్గు పరిమితిగల ద్రవ్యం పట్టీ, కొలపాత్ర నిండే, ఆనగా స్వల్పమైన, జలములలోపలన్‌ = నీటిలో, ఏనుంగు = గజం, మెయి = శరీరాన్ని, దాంచినట్టులు = దాంచిన+అట్టులు = కనపడకుండా మరుగుపరచినట్టు, ఎజుంగుము = తెలుసుకో. తా : సుమతీ, గొప్ప మనస్సుఉన్నందున గొప్పవారనదగినవారుంటారు. అట్టివాడు ఒక్కొక్కపుడు, ఏ పరిస్థితుల ప్రభావంవల్లనో నీచుని ఆశ్రయించవలసి రావచ్చును. అలా ఆశ్రయించటం, ఏనుగు వెళ్ళి రెండుసేర్లనీటిలో తన శరీరం కనబడకుండా ఉంచటంకోసం 'ప్రయతశ్నించటంవంటిదని తెలుసుకో. వ్యా : మనిషిగొప్పదనం మనస్సునుబట్టి ఉంటుంది. గొప్ప మనస్సు కలవానిని మానఘనుడు అంటారు. మనస్సుయొక్క బొన్నత్యమే మానం. ధనం, అధికారం, శ్తీర్తి అందం, విద్య మొదలయినవెన్టి ఉన్నా, మానంతో సమానమైనవి కావు. అది కలవాడు, అవి లేకపోయినా గొప్పవాడే, అది లేనివాడు, అవి ఉన్నా హీనుడే. గొప్పవాడు నీచుని ఆశ్రయించటం దయనీయమైన విషయం, ఏనుగు నీళ్ళలో తన శరీరం ముంచాలనుకొంటే, లోతునీళ్ళలో దిగాలి గాని, మానెడు నీళ్ళున్నగుంటలో దిగితే, దానిశరీరపరిమాణానికీ నీళ్ళు చాలనివని తేలిపోతుంది, అలా, గొప్పవాడు కొద్దివాణ్ళి ఆశ్రయిస్తే, వీనిగొప్పదనమూ వానికొద్ది తనమూ రెండూ దాగేవి కావు కనుక, చూచేవారికి వింతగా కనిపిస్తుంది. గొప్పవాడు కొద్దివాడుగా ఇమడలేక, కొద్దివాడు గొప్పవాడుగా కనపడలేక, ఇద్దరూ మానసికంగా బాధపడవలసి వస్తుంది. వీనికొద్దితనం గుణములవల్ల ఉన్నదయినపుడు, గొప్పవానికి మరీ బాధాకరంగా ఉంటుంది. కనుకనే, ఆధములు కలహం కావాలనుకొంటారు, మధ్యములు సంధి కావాలనుకొంటారు, ఉత్తములు మానం కావాలనుకొంటారు, ఎందుకంటే, గొప్పవారికి మానమే ధనం కనుక. అధమాః కలిమిచ్చంతి, సంధిమిచ్చంతి మధ్యమాం ఉత్తనూ మానమిచ్చంతి, మానో హి నుహతాం ధనం -

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 181 అంటున్నది గరుడపురాణం. (115.11) కొందరు మానావమానాల కంటె ధనమే పావనమనుకొంటారు. కాని గరుడపురాణం ధనానికి మూలం మానమే, మానముంటే ధనమెందుకు? మానమూ దర్భమూ పోయినతరువాత ధనమెందుకు, ఆయువెందుకు? (115.12) అని అడుగుతున్నది. అంతేకాదు, ధనం కావాలని ఆధములనుకొంటారు, ధనమూకావాలి, మానమూ కావాలి అనుకొంటారు మధ్యములు, కాని, ఉత్తములు మాత్రం మానమే కావాలి అనుకొంటారు. వారికి, గొప్పవారికి మానమేధనం - అని ఆ పురాణమే (115.13) చెపుతున్నది. 'యాచ్చా మోఘా నరమధిగుణే నాధమే లబ్ధకామా' సుగుణాలవల్ల అధికుడైనవానిని అడిగి లేదనిపించుకొనటం, గుణహీనునడిగి కోరికనెరవేర్చుకొనటంకంటే మేలయినది, అన్నాడు కాళిదాసు. నీచాశ్రయో న కర్తవ్య: కర్తవ్యో మహదాశ్రయః నీచుని ఆశ్రయించగూడదు. గొప్పవానినే ఆశ్రయించాలి - అని మరొక సూక్తి రంజన చెడి పాండవులరిభంజనుబై విరటు( గొల్వ బాల్ప్బడి రకటా సంజయ విధి నేనుందుము, కుంజరయూథంబు దోమకుచ్తుక( జొచ్చెన్‌ అని రామకృష్ణునిచాటువు. కనుక్క మానఘనుడు మనోధైర్యం చెడకుండా ఉండటమే మార్గం గాని, నీచుని ఆశ్రయించటం కాదు అని చెపుతున్నాడు. అవ : నీచకార్యాలు చేసేవాడు మఘనకార్యాలను ఆలోచించదగరని చెప్పుబోతున్లాడు : క. మేలెంచని మాలిన్యుని మాలను నగసాలివాని మంగలి హితు(గా నేలిన నరపతిరాజ్యము నేల గలిసిపోవు. గాని వెగడదు సుమతీ. కి ప్ర : సుమతీ, మేలెంచని = మేలు+ఎంచని, ఉపకారం హితం గురించి ఆలోచించని, మాలిన్యుని = మలినత కలవానిని, మాలను = ఆ 'పేరిటికులంవానిని, అగసాలివానిన్‌ = బంగారుపనిచేసేవానిని, మంగలిన్‌= జుట్టు గొరిగే పని చేసేవానిని, హితు(గాన్‌= హితున్‌+కాన్‌ = మిత్రునిగా, ఏలిన = స్వీకరించిన నరపతి = ప్రజాపాలకునియొక్క, రాజ్యము = ఏలుబడిలోనిదేశము, నేలన్‌ = మంటిలో, కలిసీ = మిళితమై, పోవుంగాని = పోవున్‌+కాని = నళిస్తుంది తక్క, నెగడదు = వర్ధిల్లదు. తా : సుమతీ, ఉపకారం తలపని మలినబుద్ది కలవాడు, మాలకులమువాడు, బంగారు పని చేసేఆతడు, వెంట్రుకలు గొరిగే పనిచేసే ఆతడు-వీరిని మిత్రులుగా ఏ పప్రజాపాలకుడు తీసుకొంటాడో అతనిరాజ్యం మంటిలో కలిసిపోతుంది కాని వృద్ధిలోనికి రాదు.

182 సుమతి శతకము వ్యా వ ఇది నాటి ఆలోచనలనుబట్టి చెప్పిన పద్యం. ఆధునికవిజ్ఞానం కాని, నేటిభారతరాజ్యాంగం కాని, ఈ కాలపు మహాపురుషులు కాని, ఇట్టి అభిప్రాయాన్ని ఆమోదించటం లేదు. గతకాలంలో ఇంచు మించు అన్ని దేశాలలోనూ, పేర్టు వేరైనప్పటికీ మనుష్యులు చేసేవృత్తులు కొన్ని గౌరవింపదగినవిగానూ, కొన్ని నీచమైనవిగానూ పరిగణించటం ఉన్నది. దానినిబట్టి ఆ వృత్తులు అవలంబించిన వారిని చూడటమూ ఉన్నది. క్షురకుడు - న్యాయవాది వీరిరువురిలో ఒకరు ఆధికంగా గొరవించదగినవారుగా భావింపనక్కరలేదనీ, ఇద్దరూ తాము చేసినపనికి ప్రతిఫలం తీసుకొని ఇతరులపనిచేసి పెట్టే వారేననీ రస్కిన్‌ వ్రాసినవాక్యం, గాంధిమహాత్ముడు మొదట ఆమోదింపలేకపోయినాననీ, తరువాత సత్యమని తెలుసుకొన్నాననీ (వ్రాసినాడు. కులమునుబట్టికాక గుణమునుబట్టి అల్పులుగానో, అధికులుగానో పరిగణింపవలసినవారు అన్నికులములలోను ఉన్నట్టు, మనప్రాచీన నవీన (గ్రంథములలో అనేకమయిన ఉదాహరణాలు లభిస్తున్నాయి. నేడు ఉత్తమగుణములూ అధమగుణములూ కలిగి, అన్నిరకములప దవులూ నమర్హతతో నిర్వహిన్తున్నవారూ, అనర్హులుగా పరిగణింపటడుతున్నవారూ లేనికులం లేదంటే, అది సత్యమే అవుతుంది. కనుక ఈ పద్యంలోనిభావం ఈకవిదిగా (గ్రహింపవలసినదే కాని, సర్వకాల సర్వజనశిరోధార్యంగా భావించనవసరం లేదు. అవ : అనుచరులను ఆదరింపని వీలికను సేవింపగూడదని చెప్పుబోతున్నాడు : క. రా పొమ్మని పిలువనియా భూసాలుని( గొల్వ భుక్తిముక్తులు గలనే; దీసంబు లేని యింటను చే పుణికిళ్ళాడినట్టు సిద్దము సుమతీ, 96 (ప్ర: సుమతీ, రా = రమ్ము, సొమ్ము = పో, అని = ఈ విధముగా, పిలువని = పలుకరింపని, ఆ భూపాలునిన్‌ = ఆ రాజును, కొల్వన్‌ = సేవించగ్గా భుక్తిముక్తులు = భోగమూ, మోక్షమూ, కలవె = కలవు+ఏీ = ఉంటాయా? దీపంబు = దివ్వె, లేనియింటను = లేని+ ఇంటను = లేనిగృహంలో, చే = చేయి, పుణికిళ్ళు = దేవులాటలు, తడుములాటలు, ఆడినట్టు = ఆడిన+అట్లు = చేసినవిధం, సిద్ధము = వాస్తవం. తా :సుమతీ, రా వెళ్ళు అని పలకరించని ప్రభువును సేవించటంవల్ల భోగమోక్షాలుండవు, అది దీపంలేని యింట్లో చేతితో తడుముకొనటంవంటిదే, ఇది అనుభవంవల్ల తెలిసినవాస్తనం, వ్యా : సేవకుడు సేవచేయటానికి వస్తే, వచ్చినట్టు గుర్తించి సంతోషించి పనికి రమ్మనడు, ఆ వేళ చేయవలసిన పని అయిపోయాక కూడా, ఈ వేళకు వెళ్ళు అని

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 183 పంపడు, పనిచేసినందుకు సంతోషించనే సంతోషించడు, సంతోషించినా, ఆ మాట చెప్పడు, ఏమీ ఇవ్వడు, కనుక భోగం లేదు, పని పూర్తి కావటం, ఇంటికి వెళ్ళటం, అనగా పనినుంచి విడుదల, ఉండవు. కనుక ఐహికమైన మోక్షమూ ఉండదు. సేవకుడు, సేవ యజమానుడు సంతోషించేలా చేయటమే మోక్షహేతువు కనుక, పారమార్డికమైన మోక్షమూ ఉండదు. ఈ సేవ దీపంలేని యింట్లో చేతితో తడుములాడటంవంటిదెలా అవుతుంది? దీపం ఉంటే, వెలుతురు వస్తుంది, దానివల్ల కన్నులు కనిపించి, చూడవలసినవస్తువులు కనిపిస్తాయి. చేతితో తడుములాడినందువల్ల, కనపడవలసినవి దొరికితే దొరుకుతాయి, లేకపోతే లేదు. శ్రమ మిగులుతుంది. ఆ తడుములాటలో ఇతరవస్తువులు చిందరవందర కావచ్చు గూడా. ఇక్కడ రాజు ఆదరణ దీపంవంటిది. అది లేనిసేవ చీకటింట తడుములాటవంటిది. దానివల్ల భోగమోక్షాలుండవు. దీనివల్ల కావలసినవస్తువులు కనిపించవు. ఇది ఆనుభవంవల్ల తెలుసుకోవలసిన విషయం, తానంటే, తనసేవలంటే, ఇష్టపడని రాజును విడిచిపెట్టాలనీ, అతని సేవ విడిచిపెట్టనివాడు మూర్చుడనీ 23న పద్యంలో చెప్పాడు, ఇక్కడ మరొక విధంగా, అది నిష్ప్రయోజనమైన సేవ అని చెప్పాడు. రా పో లేదనటాన్నే అక్కడికి వెడితే ఆవాహనా విసర్జనా లేవు అనీ అంటారు. ఇలా రా, పో అనటం గౌరన సూచకంగా ఇతరకవులూ వర్షించారు. పింగళిసూరన్నగారి కళాపూర్జోదయంలో మాయారంభా - రంభాసంవాదంలో ఒకరంభ మరొక రంభను దేవసభకు వెళ్ళి అక్కడనే అసలు రంభ ఎవరో తేల్చుకుందామంటేమొదటిరంభ అంటుంది : - “అప్పరః ప్రీలలో నగ్రగణ్యత్వంబు జగదుపళ్లోకితంబుగ వహించి, యూర్వశిమేనకాద్యుత్తమ స్రీలు రావమ్మ పోనమ్మువావతిశయిల్లి, యెన్నండు నెచ్చోటనేవారిచే వ్రేలంజూసించుకొనక ప్రస్తుతికి వెక్కి, వలకూబరుండు ధన్యతరుండు వా గణువతవంబుచే వీకు వన్నెదెచ్చి, యొప్పునే? యింకం గడవట నిప్పిశాచి నాకు వరిచేసికొని దేవలోకనభమ వీవు సూ, వీవు మి మ్ముని యేవిధమున గలహమాడెద? నిదినీవె తలచిచూడు” అని (3.240) అవ : అనత్వం, బంధుదూషణం, కోవిస్టిరాజిసేవ సావదేశ ప్రవేళు వద్దనబోతున్నాడు = క్క రూసించి పలికి బొంకకు, ప్రాపగు చుట్టంబు వెగ్గు సలుకకు, నుదిలో( గోపించురాజు గొల్వకు, పాపపు దేశంబు సొటుకు, పదిలము సుమతీ. త్ర

1164 సుమతి శతకము

ఫ్ర : సుమతీ, రూపించి = నిరూపించి, అందరికీ తెలిసేలా, పలికి = మాటాడి, బొంకకు = మాటాడలేదనకు, ప్రాొపగు = (ప్రాపు +అగు = అండ అయిన, చుట్టంబున్‌ = బంధువుగురించి, ఎగ్గు = దూషణము, పలుకకు = అనకు, మదిలోన్‌ = మనస్సులో, కోపించు = అలుక ఉంచుకొనే, రాజాన్‌ = ఏలికను, కొల్వకు = సేవించకు, పాపపు దేశంబు= పాపులున్నదేశంలో, చొజుకు = ప్రవేశించకు, పదిలము = జాగరూకతతో ఉండు.

తా : సుమతీ, నీ వనినట్టు అందరికీ తెలిసేలా ఒకమాట పలికి, తరువాత నేననలేదు అనకు, నీకు అండగా ఉన్న బంధువును దూషించకు, వచ్చిన కోపాన్ని ప్రకటించక మనస్సులో అట్టేపెట్టుకొనే ఏలికను సేవించకు, పొపాత్ములున్న దేశంలో ్రవేశించకు, జాగరూకతతో శాంతము కలిగి ప్రవర్తించు.

వ్యా : ఈ పద్యంలో నాలుగుపనులు చేయవద్దని నిషేధిస్తున్నాడు. అందులో రెండు వాచికమైనవి, రెండు కాయికమైనవి. వాచిక కార్యాలలో నిషేధించిన మొదటిది: అని అనలేదనవద్దు ఆని. ఆ అనటంకూడా అందరికీ తెలిసేలా అని, అనలేదనవద్దు అంటున్నాడు. దుష్యంతునిలా ఇతరులకు తెలియక్తుండా చేసినపనో, పలికినపలుకో, చేయలేదనో, ఆనలేదనో అనటం వేరు. కొందరైనా అతడు చేయలేదేమో, అనలేదేమో, అనుకోవచ్చు. రూపించి పలకటం అంటే, పలుమందికి తెలిసేలా ఆనటం. ఆలా అని అనలేదంటే, ఆసత్యమాడుతున్నాడని అందరికీ నిరూపణ అయినందున, ఇక జన్మలో ఎవరూ అతనిని నమ్మరు. నేటి (పప్రజాపాలకులు చాలామంది, పత్రికావార్తా సం(గ్రాహకులముందు అనేక సందర్భాలలో అనేక విషయాలు చెప్పి, అలా చెప్పినందువల్ల , ఏవైనా చిక్కులు తరువాత వస్తే నేనలా అనలేదు, వారు పొరపాటుగా అర్ధంచేసుకొని (వ్రాశారు, అనటం పరిపాటి అయిపోయింది. ఇందువల్ల, ఎక్కువమంది నాయకులు అసత్యవాదులని ప్రజలు నమ్ముతున్నారు.

'ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు అన్నది రెండవ వాచికనిషేధం. దూజకుమీ ఐంధుజనుల దోషము సుమ్మీ అని 21వ పద్యంలో చెప్పనే చెప్పాడు. ఇక్కడ నీకు అండగా ఉన్న బంధువును దూషించవద్దు అని చెపుతున్నాడు. అండగా ఉన్నవానిని దూపిస్తే కృతఘ్నతాదోషం చుట్టుకొనటం ఒకటి, ఆండగా ఉన్నవానిని దూషించినందువల్ల ఆ అండ కోల్ఫోవలసివస్తుంది కనుక, ఐహికమైన నష్టం రెండు.

'మదిలో6 గోపించు రాజు. గొల్వకు' అన్నది కాయికకార్యనిషేధాలలో మొదటిది. కోపపడేవానినే కొల్వగూడదు. ఎందుకంటే, సేవచేయించుకొనే వానిఆంతటి తెలివీ, సామర్హ్యమూ కలవారు సేవకులుగా ఉండరు. కనుక్క వారు పొరపొటులు చేస్తూ ఉంటారు. అవి బుద్దిపూర్వకం గానంతవరకు క్షమించి, సరిదిద్దుకొంటూ, వారిచేత పనిచేయించుకొంటూ ఉండాలి. పనివారిఅవసరం ఉన్నపుడు, (క్రాత్రపనివారయినా అట్టి

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 185 పొరపాటులు చేయరని చెప్పలేముకదా. బుద్ధిపూర్వకమయితేమా(త్రం శిక్షించక తప్పదు. శిక్షించినా, కోపించవలసిన పని లేదు. వారితప్పు నిరూపించి, తఈదనుగుణమయిన చర్య తీసుకొంటే, చేశాం, అనుభవిస్తున్నాం, మళ్ళీ చేస్తే మళ్ళీ అనుభవించవలసి రావచ్చు, కనుక ఇట్టి పనులు మానుదాం, అనుకోవచ్చు వారు. అలాకాక, కోపం ప్రకటించటం, అస్తమానూ కస్పుబుస్సుమనటం - ఇట్టివాటివల్ల ద్వేషం పెరిగే అవకాశముంది, పడిన వారిలో, కోపం వచ్చినపుడు ప్రకటించి రెండు మాటలనినా, మంచి చేసినపుడు మెచ్చితే, వారుకూడా సరిగా ప్రవర్తించవచ్చు. అలాకాక, సర్వాధికారి అయినవాడు వచ్చినకోపాన్ని ప్రకటించకుండా, కోపకారణాన్ని క్షమించకుండా, మనస్సులో పెట్టుకొనే స్వభావం కలవాడయితే, కోపం తీర్చుకొనే అవకాశంకోసం ఎదురుచూస్తున్నాడన్నమాట, ఇట్టివానివల్ల కాచుకోలేని దెబ్బతగులుతుంది. కనుక, కోపం రాక తప్పనికొలువు చేయటమెందుకు? కోపఫలంగా నష్టం అనుభవించటమెందుకు? అట్టి వానికి దూరంగా ఉండటమే మంచిది అంటున్నాడు. పాపపు దేశంబు సాజుకు అంటే పాపులున్నదేళశంలో ్రవేశించకు అన్నది, రెండవ కాయికకర్మనిషేధం. పాపదేశం అంటే పాపులున్నదేశం. వచ్చుగా కుచ్చితులున్నచోట వివేకులుండగూడదని మరొక కవికూడా చెప్పాడు. వారు పాపులెపవుడయితే అయారో, అవకాశం దొరకినపుడు ఎవరిపట్టనయినా పొపమే ఆచరిస్తారు కనుక, వారిచేరువలో ఉండి, అపకారం చేసేఅవకాళం ఇవ్వటంకంటె, దూరంగా ఉంటే క్షేమం. చొజనే వద్దన్నాడంటే నివసించవద్దని వేరే చెప్పనక్కరలేదు. ఒకవేళ ప్రవేళించవలసివస్తే పదిలము, జా[గ్రత్తసుమా అని హెచ్చరిస్తున్నాడు. ఆవ : దేహబలంకంటె బుద్ధిబలం గొవుదని చెవుబోతున్నాడు =: క, లావు గలవావికంటెను భావింప(గ నీతిపరు(డు బలవంతుండాౌ (గ్రావంబంత గజంబును మావటివాండెక్కినట్టు మహిలో సుమతీ, 9ం్ర ప్ర: సుమతీ, మహిలోన్‌ = భూలోకంలో, (గ్రావంబంత = (్రావంబు+అంత = కొండంత, పర్వతపరిమాణంలో ఉన్న, గజంబును = ఏనుగును, మావటివాడు = గజశిక్షకుడు, ఎక్కినట్టు = ఎక్కిన+అట్టు = ఆరోహించినతీరుగా, లావు = దేహబలం, కలవానికంటెను = ఉన్నవాని కంటె, భావింప(గన్‌ = భావింపన్‌+కన్‌ = ఆలోచింపగా, నీతిపరుండు = అన్నిరకముల నీతియందూ ఆసక్తికలవాడు, నీతిచేత పరుడు, గొప్పవాడు అయినవాడు, బలవంతుండెన్‌ = బలవంతుండు+బౌన్‌ = బలంకలవాడు కాగలడు.

186 సుమతి శతకము తా : సుమతీ, దేహబలం ఉన్నవానికంటె అన్ని రకముల నీతినీ ఎరిగినవాడు, నీతి తెలిసినందున గొప్పవాడైనవాడు ఎక్కువ బలవంతుడు. పర్వతమంత ఉన్న ఏనుగును గజశిక్షకుడు ఎక్కినట్లే ఇది జరుగుతుంది. వ్యా £ దేహబలం ఉన్నవానికంటె, ఎవనినెలా స్వాధీనం చేసుకోవాలి అనే నీతి తెలిసినవాడు ఎక్కువ బలశాలి. ఏనుగెక్కడ మావటివాడెక్కడ? ఏనుగుకున్న దేహబలం మరే ప్రాణికీ ఉండే అవకాశం లేదు. అది చూడటానికి కొండంత ఉన్నట్టు కనిపిస్తుంది. దానిమీద మావటివాడెక్కి కూర్చోగలుగుతున్నాడంటే, దానికి అతని తెలివిమాత్రమే కారణం. ఆవ : వరివంటా వీలికా ఉండనిఊరూ తోడులేని దారీ, వతిలేనియిల్లూ శృశానతుల్వములని చెన్చుబోతున్లాడు : క. వరిపంట లేవియూరును, దొర యుండనియూరు, తోడు దొరకని తెరువున్‌. ధరను జతి లేవిగృహమును, నరయంగా రుద్రభూమి యనందగు సుమతీ. ంం ప్ర : సుమతీ, వరిపంట = వరిధాన్యం పండించటం, లేనియూరును = లేని+ఊరును = ఉండని([గ్రామమూ, దొర = ఏలిక, ఉండని = నివసించని, ఊరు = (గ్రామమూ, తోడు = సాహాయ్యము, దొరకని = లభించని, తెరువున్‌= దారీ, ధరను = భూలోకంలో, పతి = భర్త లేనిగృహమును = ఉండనియిల్లూ అరయంగాన్‌ = ఆరయన్‌ +కాన్‌ = ఆలోచింపగా, రుద్రభూమి = శ్మశానము, అనం దగున్‌ = అనన్‌ +తగున్‌ = అనటానికి అర్హమైనవి. తా:సుమతీ, వడ్డు పండించని ఊర్హూ, ప్రభువు నివాసముండని ఊరూ, తోడిబాటసారి సాహాయ్యం లభించనిబాటా, భర్తలేనియిల్టూ, శ్మశానంవంటివి అనటానికి అర్హమైనవి, వ్యా : గతకాలంలో, ఒక చోటినుంచి మరొక చోటికి నరులు పోవాలన్నా, సరుకులు పంపాలన్నా, చాలా కష్టమయేది. బాటలు సరిగా లేకపోవటానికి తోడు, దారిదోపిడులు, (క్రూరమృగాలు మొదలైనవాటివల్ల బాధలు అధికంగా ఉండేవి, కనుక, అతిప్రధానమైన అన్నానికి మూలమయిన వరిపంట, ఊళ్ళో లేకపోతే, ఇతర(గ్రామాలనుంచో, ప్రాంతాలనుంచో రావటం కష్టమవుతుంది కనుక, ఆ వంట లేనిఊరు శృశానతుల్యమన్నాడు. ప్రధానమైన ధాన్యముంటే, కాయగూరలూ మొదలయినవి తక్కువయినా బ్రతుకవచ్చు. బియ్యం లేకపోతే ప్రాణాలుండవు, కనుక ఇలా అన్నాడు. ఏలిక ఊళ్ళో ఉంటే, రక్షణకూ, తగవులతీర్పులకూ, అపరాధులశిక్షణకూ అందుబాటులో ఉంటాడు. కనుక, దొరలేనిఊరు కూడా శ్మశానతుల్యమే అన్నాడు.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 187 అట్టిపనులకు ఎక్కడికో వెళ్ళటం కష్టం. తోడుదొరకని దారీ శృశానంవంటిదే అన్నాడు. కాశికి పోనటమూ కాటికి పోనటమూ ఒకటే అన్న సామెత, అందువల్లనే పుట్టింది. తోడులేని ప్రయాణం ఆపాయం కనుకనే, 62వ పద్యంలో కూడా నడువకుమీ తెరువాక్కట అని చెప్పాడు. ఆది అడవిదారి ఆయితే, ఇంకా అపాయం కనుక, శవ పద్యంలో అడవిలోకి తోడులేకుండా ఒంటరిగా వెళ్ళవద్దని చెప్పాడు. భర్తలేని యిల్లూ శ్మశానతుల్యమే అంటున్నాడు. అనురాగంగల దంపతులు కలిసి ఉంటే ఆనందం. భర్త ప్రవాసగతుడైతే ఇంటనున్న ఇల్బాలికి ఆనందమెక్కడిది? అందులోనూ, ఆ రోజుల్లో యోగక్షేమాలు తెలియటానికి ఫోన్హా టెలి[గ్రాములా, ఉత్తరాలా? కనుక వెళ్ళినవాడు, వచ్చాకనే వచ్చాడనుకోవాలాయె. కనుక, ఇలా ఆనటం యుక్తమే. ఇందులో తెరువును అ, ప్రతి తెరవు అనటం అచ్చుతప్పు, అవ. చేనుదున్షుటం, బంధునమాశ్రయం, రహన్యం, వీరికిసేనావతులగురించి చెప్పబోతున్లాడు. క. వజపైన చేను దున్నకు కజవైనను బంధుజనులకడ కేగకుమీ పరులకు మర్మము సెప్పకు పిజికికి దళవాయితవము బెట్టకు సుమతీ, 100 ఫ్ర; సుమతీ, వఆపైన = ఎండలు కాస్తూ వానలు కురియనపుడు, చేను = పొలము, దున్నకు = దుక్కిచేయకు, కజవైనను = కజవు+ఐనను = క్షామం వచ్చినా, బంధుజనులకడకున్‌ = చుట్టాలవద్దకు, ఏగకుమీ = వెళ్ళవద్దు సుమా, ఫరులకున్‌ = ఇతరులకు, శత్రువులకు, మర్మము = ఆయువుపట్టువంటి రహస్యము, చెప్పకు = తెలియజేయవద్దు, పిటికికిన్‌ = పిటికివానికి, భీరువుకు, దళవాయితనమున్‌ = సేనాధిపత్యమును, పెట్టకు = ఈయకు. తా : సుమతీ, అనావృష్టి యేర్పడినపుడు దుక్కి దున్నవద్దు, కవు వచ్చినాసరే చుట్టాలను ఆ(శ్రయించవద్దు, ఇతరులకు, శత్రువులకు ఆయువుపట్టువంటి రహస్యం చెప్పవద్దు, పిజికివానిని సేనానాయకుని చేయవద్దు, వ్యా ; వానలు కురవనిసమయంలో పంటపొలం దుక్కి చేయవద్దంటున్నాడు. వానలేనివేళ దున్నటం వ్యర్థం. కనుక వద్దంటున్నాడు. కజవులో ఆపద్ధర్మంగా కానిపనులయినా ప్రాణాలు నిలుపుకొనటం కోసం చేస్తుంటారు. ఆట్టికరవు సంభవించినప్పటీకీ, ఎవరినయినా ఆశ్రయించు కాని, చుట్టాలను ఆశ్రయించకు అంటున్నాడు. చుట్టాలకు పరస్పరం ఈర్చ్వాసూయామాత్సర్యాలుంటాయి. అప్పుకూడా

188 సుమతి శతకము ఇవ్వరు, తిరిగి వారంతట వారివ్వరేమో, ఇమ్మని అడిగితే కోపం వస్తుందేమో, అందువల్ల బంధుత్వం చెడిపోతుందేమో - ఇలాంటి శంకలందుకు కారణం, ఈర్చ్యాదుల కారణంగా వచ్చినవారి కష్టం చూచి, సంతోషించవచ్చుకూడా. చెడి చెల్లెలింటికి చేరవద్దన్నారు. చుట్టాలింటికి కూడా వద్దంటున్నాడు ఈ కవి. సిదిచెడి చుట్టంబుకడకు చేరకు అని 73వ పద్యంలోనూ చెప్పాడు. జ్ఞాతిశ్చేదనలేవ కిం - జ్ఞాతి ఉంటే నిప్పెందుకు? అన్నాడు రామరాజభూషణుడు, జ్ఞాతి జయమందండేని తజ్జనుండు జమ(డె అన్నాడు శ్రీనాథుడు, ఇందువల్లనే, ఇతరునికి అందులోనూ శత్రువుకి ఆయువుపట్టువంటి రహస్యం చెప్పవద్దంటున్నాడు. శత్రువుకి చెపితే అనర్ధం, ఏమి చేస్తే తమ (ప్రాణాలు పోతాయో భీష్ముడూ, ద్రోణుడూ ధర్మరాజుకు చెప్పారు. అతడు నిక్షేపంలా అది ఉపయోగించుకొని వారిని పడగొట్టాడు. శత్రువుకే కాదు ఇతరులకీ చెప్పవద్దన్నాడు, 'పరి శబ్దానికున్న మరొక అర్జాన్నిబట్టి. రహస్యం అంటే రహస్యమే, సెదని దాటితే సృథినిదాటుతుంది. ఆప్పుడుకదా అని చెపితే వానికాప్త్రుడుంటాడు. అలా అప్తపరంపరలోకి ప్రాకి తెల్లవారేసరికి మన మరొక ఆస్తునిద్వారా మన దగ్గరకే వస్తుందిట. రహస్యం - అంటే పెదవి విప్పవద్దన్నాడు చాణక్యుడు. పిజికికి దళవాయితనము పెట్టకు అన్నది రాజనీతి తెలిసిన మాట. ధైర్యం సాహసం విజయానికి ముఖ్యం. ధైర్య పాహసే లక్ష్మీః పిటికివాడు సేనానాయకుడైతే, సేన అంతా పిటికిదవుతుంది. అతడు ధైర్యంతో నిలబడితే "సైన్యం గెలుస్తుంది. సింహగడం ముట్టడించినపుడు తానాజి నేలకొరిగితే, సైన్యం పారిపోతుంటే, ఆతనితమ్ముడు సూర్యాజి ధైర్యంతో నిలబడి (ప్రబోధిస్తే ఆసాధ్యమనుకొనే గఢమే స్వాధీనమయింది. సంగరమున పాణీపోకు అని 88వ పద్యంలో చెప్పాడు, పాటకుమీ రణముందువ అని 21వ పద్యంలోకూడా ప్రబోధించాడు, ఆ పద్యాల వ్యాఖ్యలుకూడా చూడండి. విచ్చిపోకుండా పోరాడుతూ మరణిస్తే వీరస్వర్లం మనశా(స్తాలు చెపుతున్నాయి. కనుక, క్రీలకవ్యక్తి సేనానాయకుడు పిటికివాడు కాగూడదు. ఆ.ప్రతి వజదైన సాఠం అచ్చుతప్పు, పాఠాంతరమనినా స్వరసంకాదు. వఆదవచ్చి తీస్తే ఆ పొలంలో ఒండ్రు మన్నైనా మిగులుతుంది, గుండాలయినా ఏర్పడతాయి, ఇసుక మేటలయినా లేస్తాయి. ఒండ్రు మన్ను మిగిలితే తర్వాత పంట బాగా పండుతుంది. ఇసుక మేటలేస్తే ఆ ఇసుక తొలగిస్తే కాని ఆ పొలం పంటకు పనికిరాదు. గుండాలు పడితే మళ్ళీ చదును చేసుకొంటేనే కాని పనికి రాదు. కనుక,నఆద పాఠం స్వీకరిస్తే పై మూడింటి చివరి రెండు పరిస్టితులనూ దృష్టిలో పెట్టుకొని చెప్పాడనుకోవాలి.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 189 అవ : వలవు లేని వనితను బలాత్కరించటంలో నుఖమూ లేదని చెప్పుబోతున్లాడు : క వలసింత సతికి బుట్టక బలిమిని. దమకించి విటుడు 'పైకొనుటెల్లన్‌ మలయజము సావమీ(దను జలముంచక తీసినట్టీ చందము సుమతి. 101 ప్ర: సుమతీ, సతికిన్‌ = స్త్రీకి వలపు = (ప్రేమ, ఇంత = కొంచెమైనా, పుట్టక = కలుగకుండా, విటుండు = జారుడు, బలిమినిన్‌ = బలంతో, తమకించి = త్వరపడి, 'పైకొనుటెల్లన్‌ = పైకొనుట+ఎల్లన్‌ = కూడుట అంత్తా సానమీ(దను = గంధం తీసే రాతెసైని, జలముంచక = జలము+ఉంచక = నీళ్ళు చల్లకుండా మలయజము = గంధము, తీసినట్టి = తీసిన+అట్టి = తీసినటువంటి, చందము = విధము. తా : సుమతీ, వనితకు కొంచెమైనా వలపువుట్టకుండానే, జారుడు త్వరపడి ఆమెను బలాత్కరించి కూడటం, సానమీద నీళ్ళు చల్లకుండా గంధం తీయడంతో సమానం. వ్యా: 'ప్రీపురుషుల శారీరకమైన కలయికకు ముందుండవలసినది, ఒకరిపై ఒకరికి వలపు. అదిలేకపోతే, ఆ కలయికవల్ల ఇటు శారీరకముగా కాని, అటు మానసికముగా కాని ఆనందం కలుగదని చెపుతున్నాడు. ఇందులో జారునికి వలపున్నదికదా, ఆమె లభించినదికదా అని, ఆమెకు తనపై వలపుకొంచెమైనా కలుగక ముందే, ఆమెతో కలయికకు త్వరపడి, బలాత్కారంగా పూనుకొనినందువల్ల, అపేక్షించిన ఆనందం కలుగదు సరికదా, ఉభయవిధముగానూ (శ్రమా, ఆతృప్తీ మాత్రమే మిగులుతాయని చెపుతున్నాడు. దీనికి ఈ కవి యిచ్చిన ఉపమానం, ఆయన విషయానుభవాన్ని తెలియజేస్తున్నది. ఇందులో సాన చాన, గంధపుచెక్క జారుడు, ఆనందానుభూతి తీయదలచిన మంచిగంధం, సానమీద జలం చల్లటం వనితలో వలపు ఉత్పన్నం కావటం. ఈ పద్యంలో అ. ప్రతిలో 'జలముంచక' బదులు 'బలముంచకి అచ్చుతప్పు. ఆ పాఠానికి అర్ధము లేదుసరికదా యతి-భంగం కూడా. అవ . చెప్పినవారెవరని కాక వీమి ఆని ఆలోచించి న్వుబుద్ధితో నతానత్వన్నిర్భయం తీసుకోవాలని చెవ్పుబోతున్లాడు : క వినదగు నెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింప(దగున్‌ గని కల్ల నిజము తెలిసిన మనమజుండె పో వీతిపరుండు మహిలో సుమతి. 102

190 సుమతి శతకము ప్ర: సుమతీ, మహిలోన్‌= భూలోకంలో, ఎవ్వరు = ఏ మనుష్యులు, చెప్పినన్‌ = ఏ విషయం చెప్పినప్పటికీ, వినందగున్‌ = వినన్‌+తగున్‌ = ఆది ఆలకించటానికి ఉచితమైనదే, వినినంతన = వినిన+అంతన్‌+ అ = ఆలకించినవెంటనే, వేగపడక= వేగము+పడక = తొందరపడకుండా, వివరింపన్‌ = ఆలోచింపగా, తగున్‌ = అర్హము, కని = చూచి, తెలిసి, కల్ల = ఆసత్యం, నిజము = సత్యం, తెలిసిన = ఎరిగిన, మనుజా(డెసో = మనుజుడు+ఎ, పో = మానవుడేసుమా, నీతిపరుండు = నీతివల్ల (శ్రష్పుడైనవాండు. తా : సుమతీ, ఎవరు ఏమి చెప్పినా ఆలకించవచ్చు. కాని ఆలకించినవెంటనే తొందరపడి ఒక నిర్దారణకు రాగూడదు. బాగా ఆలోచించి తెలుసుకొని, ఆ చెప్పినది అసత్యమో, సత్యమో, తెలుసుకొన్నవాడే నీతి తెలిసిన వాడు. వ్యా : సుమతిశతకంలోని పద్యాలలో మిక్కిలి (ప్రసిద్దమైనవాటిలో ఇది ఒకటి. అనేకులు అనేక కారణాలవల్ల అనేక విషయాలను అనేకులకు చెపుతుంటారు. వీటిలో పరనిందలు, అపవాదులు, ఆత్మస్తుతులు, ఉపదేశాలు, నిషేధాలు, పుకార్జు - ఇలా రకరకమైనవి ఉంటాయి. వీటిలో కొన్ని ఉద్దేశపూర్వకంగా వీరే కల్పించినవి, ఇతరులు కల్పించి చెప్పగా వీరు వారిమీది నమ్మకంతో తాము నమ్మినవి, నిజమైనవి - ఉండవచ్చు. అయితే, వినినవెంటనే అవి అన్నీ సత్యములనే (భ్రాంతిలో పడిపోయి ్రవర్తించగూడదు. అలా ప్రవర్తిస్తే తమకూ ఇతరు లకూకూడా అపకారం కావచ్చు. కనుక తొందరపడకుండా, ఆ సంగతులు కొందరికి లాభనష్టాలు కలిగించగలవి అయినపుడు మరీ జాగరూకతతో, ఆలోచించి, పరిశీలించి, వాటిలోని సత్యాసత్యాలు తెలుసుకొని, తదనంతరమే వాటినిగురించి తాము మళ్ళీ ఇతరులకు చెప్పటమో, ఏమైనా చేయటమో చేయాలి కాని, దున్న యీవినదంటే దూడను కట్టినేయనున్నట్టు చేయగూడదు, అదిగో పులి అంటే ఇదిగో తోక అనగూడదు. సామాన్యంగా లోకం గతానుగతికం. పారమార్థికం కాదు. అందులోనూ వ్యక్తులవిషయంలో. వ్యక్తులలోనూ ్రీల విషయంలో జనులు దుర్దనులన్నాడు భవభూతి “యథా ప్రీణాం తథా వాచాం సొధుత్వే దుర్దనో జవ? అని. సీతకు వచ్చిన అవవాదు విచారించకుండా ప్రచారం చేసినందువల్ల, సీతారాములజీవితాలే దుఃఖమయములై పోయాయి. స్యమంతక మణికోసం కృష్ణుడు (ప్రసేనుని సంహరించాడనిన వాదు పోగొట్టుకొనటానికి శ్రీకృష్ణుడు ఎంతో (శ్రమపడవలసి వచ్చింది. నిప్పు లేనిదే సామాన్యంగా పొగరాదు కాని నిప్పులేని పొగలూ ఉంటాయి. పొగరాని మంటలూ ఉంటాయి. కని కల్ల నిజము తెలిసిన మమజుండె సో నీతిపరుడు మహిలో.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం [91 ఆన : తాంబూలం, తరుణి అధరం, గానం - వీటి ప్రాళస్య్యం చెప్పుబోతున్లాడు = క్త వీడెము సేయని నోరును

దేడెలయధరామృతంబు జెందని వోరున్‌ పాడంగ రాని నోరును బూడిదకిరవైన సొడుబొందర సుమతీ. 103 ప్ర :సుమతీ, వీడెము = తాంబూలము, చేయని = నమలని, వేయని, నోరును = వాయీ, చేడెల = ్రీలయొక్క, అధరామృతంబున్‌ = అధరశఅమృతంబున్‌ = క్రిందిపెదవిలోగల సుధను, చెందని = పొందని, నోరున్‌, పాడంగన్‌ = పొడన్‌+కన్‌ = గానం చేయటం, రాని = చేతకాని, నోరును, బూడిదకు = భస్మానికి, ఇరవైన = ఇరవు+ఐన = స్థానమైన, ప్తాడుబొందర = పాడైన గుంటరా. తా : సుమతీ, తాంబూలం వేసుకోని నోరూ, తరుణిఅధరామృతం అనని నోరూ, పాడటం చేతకాని నోరూ, నోరు కాదు బూడిదగుంట. వ్యా : తాంబూలంగురించి 54వ 78వ పద్యాలవ్యాఖ్యలో ఉన్నది. పొలతి పొందుగురించీ పలుమార్జ్డు ఈ శతకక్షర్త వ్రాశాడు. ఇహసుఖాలలో స్త్రీపురుషుల పొందు అగ్రస్థానం వహిస్తుంది. కనుక అతివల అధరామృతమానని నోరు బూడిదగుంట అన్నాడు. కళలలో సంగీతం ప్రశస్తమైనది. గానంవల్ల త్యాగరాజాదులెందరో తరించారు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణీ అన్నారు. మన దేవతలందరూ గానప్రియులు. పాడటం చేతకాని నోరు బూడిదగుంట అంటే, పాటప్రశస్తిని చెపుతుంది కాని, గాయకులు కానివారందరూ పనికిమాలినవాళ్ళని కాదు. ఆవ + వెలయాలికి మై(త్రి ఉండదని చెవుబోతున్హాడు : క, చవెలయాలివలన( గూరిమి గలుగదు, మథి గలిగెవేని. గడతేరదుగా పలువురు నడిచెడు తెరువున( బులు మొలవదు మొలిచెనేని సాదలదు సువుతీ, 104 (ప్ర: వెలయాలివలనన్‌ = వేళ్యమంచి, కూరిమి = మైత్రి, వలపు, కలుగదు = పుట్టదు, మణీ = ఇంకా, కలిగెనేనిన్‌ = కలిగెన్‌+ఏనిన్‌ = పుట్టీనట్టయితే, కడతేరదుగా = కడతేరదు+కా జవృద్ధిచెందదు కదా, పలువురు = అనేకులు, నడిచెడు = (త్రొక్కుతూ వెళ్ళీ, తెరువునన్‌ = దారిలో, పులు = గడ్డి మొలవదు = అంకురించదు, మొలకెత్తదు, మొలిచెనేనిన్‌ = మొలిచెన్‌+ఏనిన్‌ = మొలిచినట్టయినా, పొదలదు = పెరుగదు,

192 సుమతి శతకము తా £ సుమతీ, వేశ్యకు మైత్రి - వలపు కలుగదు, కలిగినా పెరుగదు. నలుగురూ నడిచేదారిలో గడ్డి మొలవదు, మొలిచినా పెరుగదు. వ్యా 2 వేశ్యకు విటునిమీద (ప్రేమపుట్టదు, పుట్టినా పెరుగదు. ఈ విషయం ఇదివరలోకూడా పలుపర్యాయాలు ఈ కవి పలురీతులలో చెప్పాడు. ఆమె చేసేవృత్తి అటువంటిది. ఆమె సొమ్ము సంపొదించటంకోసం ఆ వృత్తిని అవలంబించింది. సొమ్ము తీసుకొనటం సుఖమివ్వటం ఆ వృత్తిధర్మం. ప్రేమించటం విత్తం కోల్పోవటం ఆ వృత్తి లక్షణం కాదు. ప్రేమించటం ప్రారంభిస్తే విటునిదాకా రానేరాదు. ఆమెనుంచి అది ఆశించటం ఉల్లిపాయలబుట్టలో సాలగ్రామాలకోసం వెదకటం వంటిది. కల్గుపాకలో గంగతీర్థం కావాలనటంవంటిది. కాగా ఆమెకు వలపు కలుగక పోవటం, పెరుగక పోవటం

  • వీటికిచ్చిన ఉపమానం బాగున్నది. పలువురు నడిచేదారిలో గడ్డి మొలవనే మొలవదు, మొలిచినా పెరగదు. ఒకే రోజునకూడా ఎందరైనా రావాలని ఎదురు చూచే రోవెలదికి, ఇందళఠిమీదా ఎలా (శ్రేమ కలుగుతుంది? కలిగినా ఎలా పెరుగుతుంది? కూరిమి కావాలనుకొంటే, పోవలసినది వెలయాలివద్దకు కాదు అన్నంతవజకు ఈనీతి (గ్రహించదగినది. అవ : నమ్మరాని నాలుగు విషయాలు చెవుబోతున్లాడు : కు నెలయాలు సేయు బాసలు వెలయ/గ వగపొలిపాందు, వెలమచెలిమియున్‌, గలలోనం గన్న కలిమియు విలసితముగ నమ్మరాదు వినురా సుమతి. 105 వ్ర: సుమతీ, వెలయాలు = వెల+ఆలు = వేళ్ళ చేయు=చేసే, బాసలు = ప్రమాణాలు, అగసాలిపొందు = బంగారుపనివాని స్నేహమూ, వెలమచెలిమియున్‌ = వెలమవారితోడి "స్నేహమూ, కలలోనన్‌ = స్వప్నంలో, కన్న = చూచిన, కలిమియున్‌ = సంపదా, నమ్మరాదు = నమ్మన్‌ +రాదు = విశ్శసించగూడదు. వెలయంగన్‌ = వెలయన్‌+కన్‌ = స్పష్టముయేటట్టుగా, విలసితముగన్‌ = (ప్రకాళించేటట్టుగా వినురా = ఆలకించవయ్యా, తా : సుమతి, వేళ్య చేసే ప్రమాణాలు, ఆగసాలిమైత్రి, వెలమవారి స్నేహం, కలలో కనిపించిన సంపద - వీటిని విశ్చసించగూడదు. స్పష్టంగా విశదమయేటట్టు విను. వ్యా : ఈ పద్యంలో మూడురకాల వృత్తులు చేసేవారిలో ఒకరి (ప్రమాణాలూ, ఇద్దరి స్నేహమూ, కలలో కనిపించిన సంపదనూ నమ్మవద్దని హెచ్చరిస్తున్నాడు. ఈ శతకంలోని కులాలను పేర్కొన్న పద్యాల వ్యాఖ్యలు మళ్ళీ చదవండి. వాటిలో సూచించినట్లే ఈ పద్యంలోని కులవాచకాలనుగూడా వృత్తి వాచకాలుగా మాత్రమే నేడు [గ్రహించటం అవసరం,

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 193 సమలోష్టాళ్ళకాంచనులైన సన్న్యాసులమాట_ వేరు. మిగిలిన జనమంతా నాడూ నేడూ ఒకలాగే ఉన్నారు. విలువయిన వస్తువులతో నిరంతరం పనిచేసేవారు కొందరు వాటిని కాజేయాలని ప్రయత్నించటం వస్తూనే ఉన్నది. పరకామణిలో పనిచేసేవారు కొందరు, తిరుపతి వేంకటేశ్చరస్వామి కానుకలనే కాజేయాలని ప్రయత్నిస్తున్నారన్నవార్తలు అడపా తడపా చూస్తున్నాము. నిరంతరం బంగారంతో పనిచేసే కొందరిలోనూ కల అలాంటివారివల్ల, అందరికీ చెడుపేరు రావటస్టూ వింతకాదు. ్రల్లదుడైన యొక్కకులపాంపను చేసిన దావణదత్కులం బెల్లను దూషితం బగుట యేమి యపూర్వము అని భారతమే చెపుతున్నది. కనుకనే అగసాలిస్నేహం నమ్మవద్దంటున్నాడు. పునరుక్తి అయినా, ఇక్కడ ఆగసాలిపదం కులవాచకంగా కాక్క వృత్తివాచకంగా (గ్రహించాలి అని చెప్పుకోవాలి. బంగారపు పనివాని గురించీ కుట్టు పనివానిగురించీ ఒక హాస్యోక్తి ఉన్నది. సొంత యింటిలోని మనిషికి చేసే నగనుంచి అయినా కొంత బంగారం కాజేస్తాడట, బంగారపు పనివాడు, అలాగే సొంతయింటిలోని మనిషికి కుట్టే దుస్తులనుంచి అయినాకొంత గుడ్డ కాజేస్తాడట కుట్టు పనివాడు. నీవారిదికూడా కాబేస్తావేమని ఇట్టి ఒకని నడిగితే అలవాటు పోతుందని కాజేస్తానని సమాధానమిచ్చాడంటారు. వెలమవారి చెలిమినీ నమ్ముకూడదట. ఇదీ వృత్తి వాచకంగా (గ్రహించవలసినదే. వెలమవారు దొరతనం చేసినవారు. కనుకనే వారిని నేటికీ వెలమ దొరలంటూ ఉంటారు. అసలు దొరలంటేనే వెలమవారు అని అర్ధం. దొరతనం చేసేటపుడు, ఏ కాలం దొర లెవరయినా, ఏమి చేసినా దొరతనం నిలపటం కోసమే కాని, మరెందుకూ కాదు. దొరతనం కావాలనుకొన్న వారికి బంధువులు, మిత్రులు అనేదృష్టి ఉండదు. తమ దొరతనానికి అనుకూలురు మిద్రులు, వ్యతిరేకులు శత్రువులు. కనుక అట్టి వారి చెలిమి నమ్మరాదన్నది తదితరులు గమనించవలసిన అంళం. దాశరథులు, పాండవులు వంటి ఏ కొందరో తప్ప, ఏ దొరల చరిత్ర చూచినా ఏమున్నది? దొరతనం కోసం, ధరణీసా[ఘ్రాజ్యంకోసం అన్ని సంబంధాలు త్రెంచుకొనటమే కదా. కనుక ఇట్టి రాజకీయుల చెలిమి నమ్మవద్దని హెచ్చరిక. నిజజీవితంలోని జాగ్రదవస్థలోని కలిమియే చంచలమంటే కలలోని కలిమి సంగతి చెప్పాలా? కనుక దానిని నమ్మవద్దనటం సమంజసమే. అవ : ధనమూల మిదం జగత్తని చెవ్పుబోతున్లాడు: క _వేసరపు జూతి గానీ వీసము( దాంజేయవట్టి నీజీండి గానీ దాసికొడుకైన గానీ కాసులు గలవా(డె రాజుగదరా సుమతీ 106

194 సుమతి శతకము

ప్ర: సుమతీ, వేసరపు జాతి గానీ, వేసరము + జాతి + కానీ = కంచర గాడిదజాతి అనగా సంకరజాతి ఆయినా, తాన్‌ = తాను, వీసము = దేనిలో నయినా పదహారవవంతు, చేయనట్లి = చేయని + అట్టీ = విలువచేయని, వీతిండి = వేటీండి = వేటు + ఇడి = అవివేకి, కానీ = అయినా దాసి కొడుకైన గానీ = దాసి కొడుకు + ఐనన్‌ + కానీ = వెలకు కొన్న పనికత్తె కొడుకైనా సరే, కాసులు = దుగ్గానిలో పదవ భాగాలు, కలవాండె = కలవాండు + ఎ = ఉన్నవాడే, రాజు గదరా = రాజు + కదరా = ఏలిక కదయ్యా.

తా: సుమతీ, ఒకడు సంకరజోతికి చెందినవాడు కావచ్చును, రూకలో పదహారవవంతు విలువకూడా లేనివాడు కావచ్చును, బానిసకత్తె కొడుకైనా కావచ్చును, కాని వానివద్ద ధనం ఉంటే చాలు, అతడే ఏలిక అవుతాడు.

వ్యా £: ధనం ఎంత ప్రధానమైనదో, ధనముంటే లోపాలనుకొన్నవి ఎన్నైనా ఎలా (క్రమ్ముకొని పోతాయో చెప్పాడు. గతంలో ఒకనికి ఉత్తమపదవి రావటానికి మూడంశాలు ప్రధాన హేతువులుగా భావింపబడేవి అవి :1. జాతి 2, జ్ఞానం 3. ఉత్తములయిన జననీ జనకులు. ఈ పద్యంలో, అవి మూడూ లేకపోయినా, ధనం ఉంటే చాలు ఏలిక అవుతాడని చెప్పాడు. ఆ పరిస్థితిని అధిక్షేపించటమూ కావచ్చు, ధనానికి, ఇన్ని లోపాలు కప్పి పుచ్చి ఘనత తెచ్చే అవకాశం ఉన్నది కనుకు ధనం సంపాదించుకో అని ఉపదేశించటమూ కావచ్చు కవి అభిప్రాయం, ఈ మూడంశాలనూ కవి ఎలా పేర్కొన్నాడో పరిశీలించుదాము,

  1. ఒక మనిషి జాతి సంకర జాతి అయినా సరే అనేది. అతనికి నీతీ జాతీ లేదు అని, నేటికీ ఈసడించటానికి వాడుతుంటారు. ఒక జాతి ఉత్తమమో, అధనుమో అనటానికి అనేకకారణాలుంటాయి. అవి దేశాన్నీ, కాలాన్నీ బట్టి ఉంటాయి. కాని ఏ జాతి'ప్రత్యేకతా, విలువా దానికున్నవి కనుక, జాతుల ప్రత్యేకత నిలపాలి అనే అభిప్రాయం కొందరిలో ఉన్నది. ఇది పశువులలో, పక్షులలో, పండ్లలో, పువ్వులలో, వృక్షాలలో స్పుటంగా కనిపిస్తున్నది. సింహాలు, బెబ్బులులు మొదలయిన జంతువులూ, కొన్ని రకాల పక్షులూ నళించిపోతుంటే, వాటికోసం ఆభయారణ్యాదులు ఏర్పరచి, ఆ జాతులను రక్షించాలని (ప్రయత్నాలు చేస్తున్నారు. కాయలు, పండ్లు కూరలు, పువ్వులు - ఇలాంటివాటిలోని ఆక్కరలేని లక్షణాలు తొలగించి, కావలసిన లక్షణాలు చేర్చి, సంకరజాతులను సృష్టిస్తున్నారు. గింజలు లేనిద్రాక్షలు, పీచులేని కండగల మామిడిపంగ్లు, వింత వింత రంగుల గులాబీలు - ఇలా వస్తున్నవే. ఏ జాతి లక్షణాలు ఆ జాతిలో (ప్రత్యేకంగా కనపడుతూ ఉంటాయి. అయిన్నా మనుష్యులలో ఇన్ని జాతులుండటం వైరుధ్యాలకూ, విద్వేషాలకూ వినాశనానికీ కారణమవుతున్నది కనుక, ఎల్లమానవులనూ ఏకజాతిని

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 195 చేయాలనే ప్రయత్నాలు ఒకప్రక్క జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వేర్వేరు జాతులకు చెందిన కాయలకు, పువ్వులకు, మొక్కలకు, “ధాన్యాలకు, జంతువులకు, పక్షులకు, సాంకర్యం కల్పించి క్రాత్తవాటిని సృష్టించినందువల్ల, క్రొత్త సంకరజాతు లేర్పడుతున్నాయి కాని, ప్రాత జాతులు మళ్ళీ ప్రాతలక్షణాలతో కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే, మనుష్యులలో వేర్వేరు జాతులను కలిపినందువల్ల, పేరులు పెట్టినా, పెట్టకపోయినా, క్రొత్త లక్షణాలు గల జాతులేర్చడుతున్నాయి. జాతులు వేరయినందువల్ల శత్రుత్వాలు వస్తున్నాయి కనుక, ఒకే జాతిని చేద్దామనే ప్రయత్నం, సృష్టితీరుకు విరుద్ధమనే వారున్నారు. పోగొట్టవలసినది వైరుధ్యాన్ని కాని, వైవిధ్యాన్ని కాదని వీరు చెపుతారు. విరోధగుణం మనిషిలో ఉన్నపుడు, జాతిని బట్టి కాకపోతే మరొక కారణాన్నిబట్టి, వైరుధ్యం పెంచుకొంటాడు. భాష, ప్రాంతం, దేశం, ఇండం, దిక్కు, కలిమి, లేమి, రాజకీయం, మతం - మొదలయిన కారణాలతో పోరాడతాడు. అందుకు విరుగుడు ఒకే భాష్క ఒకే ప్రాంతం, ఒకే దేశం, ఒకే ఖండం, ఒకే దిక్కు, ఒకే రాజకీయ పక్షం, ఒకే మతం ఏర్పరచటానికీ, అందరినీ సంపన్నులనో, దరిద్రులనో బలవంతాన చేయటానికీ ప్రయత్నించటం కాదు. అట్టి ప్రయశ్నం సఫలం కాదు, జాతుల వైరుధ్యాన్ని పోగొట్టటానికి జాతి నిర్మూలనం కాని, జాతి సాంకర్యం కాని విరుగుడు కాదు. సద్గుణప్రచారమే కర్తవ్యమనే వారున్నారు. నిర్మూలనం అవాంఛనీయం అనే అభిప్రాయం ఉండబట్టే, రాక్షసయాగం, సర్పయాగం వంటి వాటిప్రయత్నాలు జరిగినపుడు, వాటిని మహర్షులు ఆపుచేశారని మన పురాణేతిహాసాలు చెపుతున్నాయి. పరాశరుడు తన తండ్రిని రాక్షసుడు చంపాడని రాక్షసయాగం ప్రారంభిస్తే, పులస్త్యుడు వచ్చి దానిని ఆపుచేశాడు. తన తండ్రి పరీక్షిత్తును తక్షకుడు కాటువేసి చంపాడని జనమేజయమహారాజు సర్పయాగం ప్రారంభిస్తే, ఆస్తీకుడు అనిన మహర్షి విరమింపజేశాడు. రాక్షసులను, పాములను కూడా ఉంచవలసినదే అని భావించారు. కనుక పోవలసినది జాతులమధ్య ద్వేషం కాని, జాతులు కాదని వీరు చెపుతారు. మన దేశంలో సాంకర్యం (ప్రశస్తలక్షణంగా ఇదివరకు భావించలేదు. కనుకనే యుద్ధం వల్ల వీరులు చనిపోతారు, అందువల్ల స్త్రీలు పాడైపోతారు, వారు పాడైపోతే సాంకర్యమేర్చడుతుంది. వర్షసొంకర్యంవల్ల నరకం వస్తుంది అని అర్జునుడంటాడు భగవద్గీతలో. ఆ దృష్టిలో కాన్ని జాతుల సాంకర్యంవల్ల ఏర్పడిన జాతికి చెందిన అతడు 'శ్రేష్టుడుగా భావించేవారు కారు, గాడిదా, గుజ్జమూ కలియగా ఏర్పడిన దానిని కంచర గొడిద అంటారు. దానికి వేసరము, వేసడము అనికూడా పేర్గు. అది సంకరజాతి కనుక, వేసరపు జాతి అంటే సంకరజాతి అని అర్ధం. ఒక మనిషి సంకర జాతికి చెంది ఉండవచ్చు. అయినా ధనం ఉంటే ఏలిక అవుతాడు అంటున్నాడు కవి. ఆధునిక విజ్ఞానం కాని, మన రాజ్యాంగం కాని, జాతినిబట్టి మనిషి ఎక్కువ తక్కువలు నిర్ణయించటం అంగీకరించవు.

196 సుమతి శతకము

  1. అలాగే, ఒక మనిషి వీజిండి కావచ్చు. వీజిండి అన్నది వేటిండి రూపాంతరం. వేటిండి అంటే వివేకం లేనివాడు అని అర్హం. ఎంత అవివేకి అంటే, అవివేకం కారణంగా అతని విలువ వీసము కూడా ఉండదట. వీసమంటే రూకలో పదునారవ భాగం. రూక అంటే చిన్నమెత్తు బంగారు నాణెము కాని, చిన్నమెత్తు వెండి నాణెము కాని, ఇక్కడ ఆ వ్యక్తిని తేలిక చేసి చెప్పదలచుకొన్నాడు కనుక, చిన్నమెత్తు వెండి నాణెంలో పదహారవ వంతనే అర్ధం చెప్పుకోవాలి. ఆపాటి విలువ కూడా లేని అవివేకి కావచ్చు అతడు. అయినా ధనం ఉంటే ఏలిక అవుతాడుట.

  2. జాతి - జ్ఞానముల తరువాత గౌరవం వచ్చేది ఏ జననీ జనకులబిడ్డ అనే దానిని బట్టి. ఆ మనిషి, వెలకుకొన్న పనికత్తె కుమారుడు దాసికొడుకు కావచ్చు. ఇది సంస్కృతం నుంచి వచ్చింది. సంస్కృత నాటకాలలో 'దాస్యాః పుత్ర' అన్న తిట్టు వినబడుతుంటుంది. దీనికి తెలుగే తొత్తుకొడుకు. తొత్తగుచుం బనుల్సలుపుదు న్నిజనూడెద దైవసాక్షిగన్‌ అని పింగళి సూరన. దాసి (క్రింది దాసి అనటానికి తొత్తు క్రింద జడి తొత్తు అంటారు. అట్టి దాసికొడుకు అయినా ధనం ఉంటే ఏలిక అవుతాడుట. మనదేశ చరిత్రలో బానిస సుల్తానుల వంశం ఒక్కటి ఉండనే ఉన్నది.

ఈ ధనం ఉంటే అనే భావం కాసులు కలవాడు అనే మాటల ద్యారా చెప్పాడు. కాసు ఆఅంటేదుగ్గానిలో నాలుగవ భాగమని ఒక అభిప్రాయం. పదవ భాగమని ఒక అభిప్రాయం, దుగ్గాని ఆంటే దుగ + కాని = రెండు దమ్ముళ్ళు, టంకము ఒక నాణెము.

ఊరక పజ్జనుండాొదిగి యుండిననైన దురాత్మకుండు వి

ష్కారణ మోర్వలేక యపకారము సేయుట్నవానివిద్యగా

చీరెలు మారుటంకములు చేసెడి వైనను బెట్టె మండంగా

జేరి చినింగిపోం గొణుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా, ఇత్యాదులలో (ప్రయుక్తమైనది. ఒకవాడు టంకములు తయారుచేసే సాల టంకసాల. టంకమునకు పదహారు డబ్బులు కనుక, ఆ లెక్క ప్రకారం ఇక్కడ కాని అంటే దమ్మిడి అని శర. అదే దమ్మిడి అంటే, అయిదుకాసుల నాణెమనీ, రెండు కాసుల నాణెమనీ,

రెండభి'ప్రాయాలున్నాయనీ శర. కాసు అంటే ధనము అని కూడా అర్ధం. శర. చెపుతున్నది. డబ్బు ఒకనాడు ఒక నాణెమయినా, నేడు ధనం అనే అర్థంలో వాడుతున్నాము. దబ్బు లేనివాడు డుబ్బుకు కొజుగాడు, రూక లేనివాడు పోక చేయలేడు - ఇవి సామెతలయినాయి. దమ్మిడీకీ కానికీ ఇటీవలి వరకూ మరో వ్యవహారమూ ఉన్నది, నయాపైసలు రాని వరకూ. రెండు దమ్మిడీలు ఏగాని - మూడు దమ్మిడీలు లేదా రెండేగానులు ఒక కాని, రెండు కానులు లేదా ఆరు దమ్మిడీలు అర్హణా, రెండర్హణాలు లేదా పన్నెండు దమ్మిడీలు లేదా పైసలు ఒక అణా. రెండణాలు బేడ. రెండు బేడలు ఒక

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 97 పావులా. రెండు పావులాలు అర్హరూపాయి. రెండర్టరూపాయలు ఒక రూపాయి. వీటిలో కొన్నింటికి ఒక జంత్రీ, సంగ్రహళ్టుకంకూడా ఉంది. “ఒక కాని ఒకే కానీ, రెండు కానులు అర్హణా, మూడు కానులు ముక్కానీ, నాల్గుకానులు ఒక్కణా” అని. కాని ఏగానులను చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు పద్యంలో పెట్టారు. ఒక యేగానికి చిన్ని కుర్రవికి వనాయుష్కర్మ గావించి, దా నికినై కాని యొసంగి, తక్కు నగముందెమ్మన్న నాచేత లే దకటా నా/గను క్షౌారవుంగృతికి దానంగీకృతిం దెల్పు లౌ భ్యకులాయంబగు ముద్దరాలి చరితం బాలించితే తిర్పతీ - అని. డబ్బు ధనం అనే అర్థంలోనూ కవుల పద్యాలలో కెక్కింది - డబ్బే పుష్కలమై కరండమున నుండన్న్వాండు తావెన్ని త బ్పిబ్బుల్యోయిన లోకమెల్ల నవురా భేష్ఫేషు శాబాసటం చబ్బం దాతనుగూడ మెచ్చు నిళవాం డర్జానహీనుండుగా వెబ్చెబ్బేయని చీదరించు నిదియే యీ లోక మర్యాదరా - అని దామోదరీయం. ఏ నరునకు విత్తముగల దానరు(డు కులీమడధికు డాద్యుండత(డే ధీనిధి ధమ్యుండు వేర్చరి వానాగుణగణము కాంచనంబున నిలుచున్‌ అని భర్శహరి కూడా చెప్పాడు. అవ : చదువు, పాటలు, కూటమి, మాటలు - ఎట్టివి తగనివో చెప్పుబోతున్న్లాడు = క. శుభముల వొందని చదువును నభినయముగ రాగరనము నందని పాటల్‌ అభిలాష లేనికూటమి పభ మెచ్చవి మాటలెల్ల చప్పన సుమతీ, 107 ప్ర ; సుమతీ, శుభములన్‌ = మంగళములను, ఒందని = పొందని, చదువును = విద్యా, అభినయముగన్‌ = సూచింపదగిన అర్జాన్ని సూచించేటట్టుగా, రాగరసమున్‌ = రాగం యొక్క రుచిని, ఆందని = అందుకొనని, పొందని, పాటల్‌= గేయాలూ, అభిలాషలేని = వాంఛ - కోరిక లేని, కూటమి = కలయికా, సభ = కొలువు కూటము, మెచ్చని = 'ప్రశంసింపని, మాటలు = పలుకులు, ఎల్లన్‌ జ అన్నీ, చప్పన = రసహీనములు, పనికిమాలినవి, తా : సుమతీ, శుభములు కల్గింపని విద్య నిష్ప్రయోజనం. సూచింపదలచిన భావాన్ని సూచించేటట్టుగా రాగం యొక్క రుచిని కలిగించని పాటలు ఇంపైనవి కావు, వాంఛలేని ప్రీ పురుషుల కలయిక సంతోషం కలిగించదు. సభవారు (ప్రశంసించని వక్తసలుకులు రుచిలేనివి.

198 సుమతి శతకము వ్యా: కవి ఈ పద్యంలో, నాలుగు అంశాలు ఉండవలసిన విధంగా ఉంటే రసవంతములు, అలా ఉండకపోతే రసహీనములు అని చెప్పాడు. వాటిలో మూడు విద్యలకూ, ఒకటి శరీరసౌఖ్యానికీ సంబంధించినవి. ఆ మూడింటిలోనూ మళ్ళీ రెండు సాహిత్యాదులకీ, ఒకటి సంగీతానికీ సంబంధించినవి. శాస్త్ర - భాషా - సాహిత్యాది విషయాలలో మొదటిది మంగళముల నివ్వని చదువు. విద్యవల్ల లభించే మంగళములు కొన్నింటిని భోజచరిత్ర చెపుతున్నది : మాతేవ రక్షతి పితేన హితే నియుంక్తే కాంతేవ చాభిరమయత్యపనీయ ఖేదమ్‌ ॥ లక్ష్మీం తనోతి వితనోతి చ దిక్షు కీర్తిం, కిం కిం న పొాధయతి కల్పలతేన విద్యా - తల్లిలా రక్షిస్తుంది, తండ్రిలా హితకరమైన పనులు చేయిస్తుంది, కాంతలా చింత పోగొట్టి సంతోషపెడుతుంది, నలుదిక్కులా కీర్తిని వ్యాపింపజేస్తుంది. లక్ష్మిని పెంచుతుంది. కల్పవృక్షంలా విద్య సాధించలేనిదేమి ఉంటుంది ? అని. కనీసం వీటిని సాధించని విద్య నిష్ప్రయోజనం. ఆభినయముగ రాగరసము నందని పాటల్‌ ఇంపైనవి కావు అనటంలో రెండు అంశాలు చెప్పాడు. ఒకటి : పాట, రాగం యొక్క రుచిని అందించాలి, ఆ రాగరసం సూచించ వలసిన దేనినో సూచించేదిగా ఉండాలి. అంటే, రాగం వల్ల సూచింపబడే అనుభూతి ఒకటి ఉంటుంది. ఆ పనికి పాట సాయపడాలి, లేకపోతే, అది ఇంపుగా ఉండదు. దీనివల్ల సంగీతంలో రాగానుభవం ప్రధానం కాని సాహిత్యం కాదు. సాహిత్యం సహకారకం, ఆంతే, రాగరసం అందించగల గాయకుడుంటే, సాహిత్యం తెలియకపోయినా అది సాధ్యమయేది అందువల్లనే. శిశుపశుఫణులకు గానరసం తెలిసేది ఇందువల్లనే. పాట ఇంపు కావటానికి రాగమూ, రాగరసం అందించటానికి పాటా, ఇవి కలిసి సూచ్యార్జాన్ని సూచించటం బాగానే ఉంది. కాని మరొకటి వట్టీమాటలతో మెప్పించటం. ఇది చాలా కష్టమైన విషయం, నేనమ్మా మాటకారినని నిలిచినవాడు, సభను మెప్పించగలగాలి. మాటకారితనానికదే నిదర్శనం. ఆ మెప్పు రాలేదో, వానిమాటకారి తనం కేవలం చప్పనిది, వట్టి పిప్పి. మేధకూ, పొటకూ, మోటకూ సంబంధించిన కళానందంనుంచి కవి మనల్ని టక్కున శరీరానందం దగ్గరకు తీసుకు పోతున్నాడు. ఈయనకు ఇది తెలుసు, ఇది తెలియదు అని లేదు. 101 వ పద్యంలో వలపుండాలి వనితకు, లేకపోతే, ఆనందం అతనికుండదన్నాడు. 92లో అన్యాసక్తురాలి కలయిక తగదన్నాడు. 36లో అన్యుడు అనుభవించినది పనికిరాదన్నాడు. 76లో ఆ మాటే ముదలకించినవాడు, ఈ పద్యంలో వలపుమాట అలా ఉంచు, కనీసం అభిలాష ఉండాలి-కూటమికి అంటున్నాడు.

వివేకానందివీ వ్యాఖ్యాసహితం 199 ఏమిటి నీతిశతకంలో ఈ గోల అడుగడుక్కీ? అని విసుక్కోరు నీతి విచక్షణులు, ధర్మా విరుద్ధమైనంత వరకూ తృతీయ పురుషార్థం పరిహరణీయం కాదు. పైగా, మొదటి పద్యంలోనే చేసిన (ప్రతిజ్ఞలో అభిలజనులు బౌర్లా యనంగా ధారాళమైన నీతులు చెపుతానన్నాడు కాని, ఏ కొందరు జనులో జౌరా అనగా కాదు. ఆవ : నుఖదుఃఖాది ద్ధుంద్రుచక్రం తిరుగుతూ ఉంటుందని చెవ్పుబోతున్హాడు = క... సరసము విరసము కొజకే పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొజుకే పెరుగుట విరుగుట కొజుకే ధర తగ్గుట హెచ్చుకొజుకె తథ్యము సుమతీ, 108 ప్ర : సుమతి, సరసము = సంతోషం కలిగించే మాటలాడటమ్మూ, చేష్టలు చేయటమూ, విరసము కౌటికే = విరసము కొజుకున్‌ + ఏ = దుఃఖము కలగటంకోసమే; పరిపూర్ణ = నిండైన, సుఖంబులు = సౌఖ్యాలు, అధిక = ఎక్కువ ఆయిన, బాధల కొజకే = దుఃఖాల కోసమే; పెరుగుట = వృద్ధి చెందటం, విరుగుట కొటుకే = తునిసి పోవటానికే; ధర = వెల, తగ్గుట = తక్కువ కావటం, హెచ్చుకొజుకె = పెరగటం కోసమే, ఎక్కువ కావటం కోసమే, తధ్యము = నిజం. తా ౩ సుమతీ, సంతోషం కలిగించే మాటలాడటం, చేష్టలు చేయటం దుఃఖం కలగటానికే నిండైన సౌఖ్యాలు కలగటం అధికములైన కష్టాలు అనుభవించటానికే, వృద్ది చెందటం క్షీణించటం కోసమే, వెల తక్కువ కావటం ఎక్కువ కావటానికే. ఇది నిజం. అంటే సంతోషం తరువాత దుఃఖమూ, సుఖం తరువాత కష్టమూ, వృద్ది తరువాత క్షీణతా

  • ఇలా మారుతూ వస్తూ ఉంటాయని భావం. వ్యా : ఈ పద్యంలో ఒక గొప్ప జీవన సత్యాన్ని చెప్పాడు కవి. పగటి తరువాత రాత్రీ రాత్రి తరువాత పగలూ వస్తుంటాయి. అలాగే సరసవిరపాలూ, సౌఖ్యబాధలూ, వృద్ధి క్షయాలూ, తగ్గహెచ్చులూ,.చక్రంలా తిరుగుతుంటాయి. ఇదే భావం మహాభారతం కూడా చెపుతున్నది - సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖమ్‌, చక్రవత్పరివర్తంతే దుఃఖాని చ సుఖాని చ - సుఖం తరువాత దుఃఖం; దుఃఖం తరువాత సుఖం వస్తుంది, సుఖదుఃఖాలు చక్రంలా తిరుగుతుంటాయి - అని. కాళిదాసుగారు కూడా మేఘసందేశంలో - కస్యై కొంతం సుఖముపనతం దుఃఖమేకాంతళతో నా నీచైర్గ్ళచ్చత్యుపరి చ దశా చక్రనేమిక్రమేణ -

200 సుమతి శతకము కేవలం సుఖం ఎవరికి వచ్చింది ? కేవలం దుఃఖం గాని ఎవరికి వచ్చింది ? చక్రపుపట్టాలా దశ ఒకప్పుడు [క్రిందికి వెడుతుంటుంది, మరొకప్పుడు పైకి పోతూ ఉంటుంది - అని చెప్పారు. ఈ పద్యంలో అందం ఎక్కడ ఉన్నదంటే సరసం - విరసం పరిపూర్ణసుఖాలు - అధికబాధలు పెరుగుట - విరుగుట ధరతగ్గుట - హెచ్చుట చెప్పిన నాలుగింటిలో మొదటిమూడు ఉన్నత స్థానం నుంచి నీచ స్థానానికి రావటం చెప్పి, నాలుగో దానిదగ్గర ఒక్కసారి క్రిందిస్టాయి నుంచి పైస్టాయికి వెళ్ళటం చెప్పాడు. అన్ని విషయాలూ సెరిగినవి తరగటం ఉంటుంది కాని, ధరలకు మాత్రం ఎప్పుడూ పెరగటమే స్వభావమనీ, ఎప్పుడైనా విపరీతమై తరిగితే, వెంటనే పెరగక తప్పదనీ సూచించాడు. దీనినిబట్టి ధరల పరిస్టితి ఈ రోజులలోనే కాక ఆ రోజులలోనూ ఇలాగే ఉంటుండేదేమో అనిపిస్తుంది. అవ 7? లక్ష్మీ రాకపోకలగురించి చెప్పుబోతున్లాడు : క. సిరిదా వచ్చివ వచ్చును సరసంబుగ వారికేళ సలిలము భంగిన్‌ సిరిదా. బోయిన బోవును కరి మింగిన వెలగపండుకరణీని సుమతీ 10 ప్ర: సుమత్తీ, సిరి = లక్ష్మి = సంపద, వచ్చినన్‌ = వస్తే సరసంబుగన్‌ = రుచితో, ఆనందంతో, నారికేళ సలిలము భంగిన్‌ = కొబ్బరి కాయలోనికి నీరులా, తాన్‌ = తాను, స్వయంగా, వచ్చును = వస్తుంది; సిరి, పోయినన్‌ = వెళ్ళిపోతే, కరి = ఆ పేరుగల ఒక పురుగు, (మింగిన = తినివేసిన, వెలగపండు కరణిని = వెలగపండులోని గుజ్ఞాలా, తాన్‌ = స్వయంగా, పోవును = వెళ్ళిపోతుంది. తా : సుమతీ, సంపద రాదలచినపుడు కొబ్బరికాయలోనికి రుచి కల నీరు వచ్చినట్టు తనంతతానే ఎలా వచ్చిందో తెలియకుండా ఆనందంతో వస్తుంది. వళ్ళిపోయేటప్పుడు వెలగపండులోనికి వెళ్ళినట్టు తెలియకుండా (ప్రవేశినీచి, గుజ్జును కరి అనే పురుగు తినివేస్తే గుజ్జాపోయినట్టు తనంతతానుగా వెళ్ళిపోతుంది. వ్యా : లోకంలో సంపద కలిగినపుడు మనుష్యులు పొంగి, విర్రవీగుతుంటారు. అది పోయి పేదరికం వస్తే క్రుంగి కుమిలిపోతుంటారు. అవి రెండూ అనవసరం అని చెప్పటానికి, అద్భుతమైన దృష్టాంతాలతో సంపద రాకపోకల (క్రమం వివరిస్తున్నాడు.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 201 కొబ్బరికాయలోకి నీళ్ళు ఒకరి ప్రయత్నంవల్ల రావు. వాటంత అవి వస్తాయి. మామూలు నీళ్ళలాగే ఉంటాయి కాని, వీటిలో రుచి ఉంటుంది. ఆది విశేషం, సంపద కూడా వచ్చినపుడు, వీరు ప్రయత్నించారు కదా అని రాదు. ప్రయత్నం ఉంటుంది, ఉండవలసిందే కూడా, కాని ప్రయత్నించిన వారందరికీ సంపద రాదు. ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో స్పష్టంగా తెలియదు. అలా వచ్చిన కొబ్బరినీళ్ళలాగే రుచిగా ఉంటుంది. పోయినప్పుడు మళ్ళీ ఇంత గుట్టు చప్పుడు కాకుండానే పోతుంది. వెలగపండులో గుజ్జు ఉంటుంది. వెలగపండు చూడటానికి అన్ని పళ్ళలాగే అదివరకున్నట్టే ఉంటుంది కాని, ఆ గుజ్జు ఎలా పోయిందో తెలియకుండా పోతుంది. అందుకు కారణం దానిని కరి 'మింగివేసింది. కరి అంటే అదో రకం పురుగు. అది లోపలికెలాగో ప్రవేశించి, దానిని తినివేస్తుంది. సంపన్నుని పరిస్థితి బాగానే ఉన్నదని అందరూ అనుకొంటూ ఉంటారు. ఎందువల్లనో ఎలాగో అతని సంపద క్షీణించి వట్టి డొల్లలా ఆతడు మిగిలాడని జనం హఠాత్తుగా తెలుసుకొంటారు. కరి అంటే ఏనుగనుకొని, ఏనుగు వెలగపళ్ళు తింటుందనీ, దానికడుపులో పండు పండులా ఉండగా లోపలిగుజ్ఞు హరించుకుపోతుందని, పండులాగే ఉన్న వెలగడొల్లను ఏనుగు బయటికి వదులుతుందనీ, జనం అనుకొనేవారు. ఇదంతా కల్పించుకొన్న కథే అని తరువాత తెలుసుకొన్నారు. కారణం పురుగని తెలుస్తున్నా, గుజ్జు పోయిన (క్రమం జనానికి తెలియదు. అలాగే సంపద పోవటం గురించి. ఈ సంపద పోవటానికి ఈ సంపన్నుల తెలివి తక్కువ, అజాగ్రత్త వంటివి కారణాలు కాదు. వచ్చినంత గూఢంగానూ అది పోయిందంతే. కనుక్క దీనిరాక పోకల గురించి పాంగుక్రుంగులనవసరమని చెప్పటానికి ఈ పద్యం వ్రాశాడు. శతకం ఇంకొక్క పద్యంతో పూర్తి అయిపోతున్నది కనుక, 108 వ పద్యంలో పరిస్థితులు చ్రనేమి క్రమంలో మారుతుంటాయనీ, సంపద ఇలా వచ్చి అలా పోతుంటుందనీ, 109 వ పద్యంలో దానికోసం అపుడూ ఇపుడూ పొంగు క్రుంగులు వద్దనీ, అనాసక్త - యధాలాభ - సంతుష్టి ఉపదేశించి, కొసమెరుపులాంటి, భరతవాక్యం వంటి మహోపదేశంతో 120వ పద్యం చెపుతున్నాడు. సరసంబుగకు సలలితముగ అనే పాఠాంతరం ఉన్నది. ర - ల (ప్రాస కవికభిమతమో కాదో. ఆవ: స్రీలపై వాదులు, బాలురతో చెలిమి, నుగుణ వినక్రనం, ఉవకారనింద వద్దని చెప్పుబోతున్హాడు : క్త స్రీలయెడ వాదులాడకు

బౌలురతో చెలిమి చేసి భాషింసకుమీ

మేలైన గుణము విడునకు

యేలిన పతినింద సేయకెన్నండు సుమతీ. 110

202 సుమతి శతకము (ప్ర : సుమతి, ఎన్నడు = ఏనాండూ, స్త్రీల యెడన్‌ = స్త్రీల + ఎడన్‌ = (స్త్రీల విషయమై, వాదులు = ఆపవాదులు, ఆడకు = సలుకకు; బాలురతోన్‌ = చిన్న పిల్లలతో, చెలిమి చేసి = 'స్నేహంచేసి, భాషింపకుమీ = మాటాడకు; మేలైన = మేలు + ఐన = ఉత్తమమైన, గుణము = లక్షణం, విడువకు = విడిచిపెట్టకు, ఏలిన పతిన్‌ = నిన్ను పోషించిన ప్రభువును, నిందసేయకు = నింద + చేయకు = నిందించకు, దూషించకు. తా : సుమతీ, ఎన్నడూ (స్రీలప్టై అపవాదులు వేస్తూ మాటాడకు, అభం సుభం తెలియని చిన్న పిల్లలతో స్నేహంచేసి వారితో మాటాడకు. నీలోని సుగుణాలను విడిచిపెట్టవద్దు. నిన్ను పోషించు ఏలికను నిందిస్తూ మాటాడకు, వ్యా £ ఎవరైనా చివరి మాటలు చెప్పేటప్పుడు, వినే వారికీ చెప్పే వారికీ కూడా మహోపకారకములై ముఖ్యమైనవి చెపుతారు. ఈ పద్యం చివరి పద్యం కనుక నాలుగు వేదాల వాక్కుల వంటి నాలుగు వాక్యాలు చెపుతున్నాడు. వాటిలో మొదటిది : స్త్రీలపై అపవాదులు వేసే మాటలు పలుకవద్దు - అన్నది. స్త్రీలపై అపవాదు అంటే వారి నర్తనం మంచిది కాదు అనటం, ఏ వాదు ప్రచారంలోకి తెస్తున్నారో, అది చాలొ తీవ్రమై, చాలా జీవితాలమీద దాని దుష్ప్రభావం చూపగలది ఐ ఉంటుంది. స్రీలు అపవాదులకు చాలా త్వరగా తరచుగా గురి అవుతుంటారు. ఒకరు ఉత్తములని నమ్మింపలేము కాని, అభములని చెపితే చాలు, జనం ఇట్టే నమ్ముతారు. అందులో స్తీ విషయమైతే మరీ చట్టున నమ్ముతారు. వారొపై వాదు వేయటమంటే, కొన్ని కుటుంబాలకే వంశాలకే అప్రతిష్టా, ఎన్నో జీవితాలకు చిక్కులూ కల్పించటమన్నమాట. సామాన్యంగా వాదులు నిరాధారాలే అయి ఉంటాయి, -ఈర్జ్వ్యాసూయామాత్సర్యాది కారణాలవల్ల జయలుదేరుతుంటాయి. కనుక స్త్రీలపై నిందలు వేయటం తగదనటం తగినదే. బాలురతో చెలిమి చేసి భాషించవద్దనటం యుక్షమే. సమానశీల వ్యపనేషు సఖ్యం, సమానమైన శీలమూ వ్యసనమూ కలవారితో సఖ్యం చేయమన్నారు. బొభవఖిత్వ మకారణ హాస్యం, స్రీషు వివాద మవజ్ఞవపేవా, గార్హభయానమనంన్కృళ వాణీ - షట్సు వరో లఘుతాముపయాతి - చిన్నవారితో స్నేహం, నిష్కారణంగా నవ్వుతుండటం, స్త్రీలతో తగవులాట, సజ్జనులు కొని వారిసేవ, గాడిద నెక్కిపోవటం, సంస్కార రహితములైన మాటలు పలకటం - ఈ ఆరింటివల్లా మనిషి చేలిక అయిపోతాడు అన్నారెవరో, కనుక బాలురతో చెలిమి చేసి మాటాడటం తగదు. లేని ఉత్తమగుణాలు సంపొదించుకొంటూ ఉండవలసి ఉండగా ఉన్న ఉత్తమ గుణాలు విడిచి పెట్టటం తగదుగాక తగదు.

వివేకానందినీ వ్యాఖ్యాసహితం 203

చివరిది, నిన్ను పోషించిన వానిని నిందించకు అన్నది. ఇది చాలా (ప్రధానం. ఉత్తముడు ఎవరినీ నిందించగూడదంటే, ఒకడు నీలోని సుగుణమేదో చూచి, మంచి హృదయం కలవాడు కనుక నిన్ను పోషిస్తుంటే, కృతజ్ఞుడనై ప్రత్యుపకృతికి (ప్రయత్షించనలసినవాడవు, ఆయననే నిందించటమంబే కృతఘ్నత అవుతుంది. కృతఘ్నుని మాంసం కుక్కలు కూడా ముట్టవు. కనుక, ఆ ఏలిన వానిని నిందించి కృతఘ్నుడవు కావలదు - అని చెపుతున్నాడు. ఇలా కృతజ్ఞతా మాహాత్మ్యం ప్రకటించి, ఇంత చక్కని శతకాన్నిచ్చి, తెలుగు లోకాన్ని తనకు కృతజ్ఞతా బద్దం చేసుకున్నాడు.

  • స్తప్తీ -

అనుబంధం - 1 సుమతి శతక నీతులు నీతి పద్యం అంతఃపురకాంతలతో మంతనములు మానుము తర్‌ అక్కణకు రానిచుట్టము (గ్రక్కున విడువంగ వలయుంగదరా 2 అగసాలిపొందు నమ్మరాదు 105 అడవిని దోడరయకొంటి నరుగకు డీ అడిగిన జీతంబియ్యని ... మడి దున్నుక బ్రతుకవచ్చు 3 అడియాస కొలువు6 గొలువకు త్తి అధరము కదలియు ... పాపము ర్‌ అనుమానమైనచోటను మనుజునకును నిలువందగదు 53 అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాండు నేర్పరి 16 అప్పిచ్చువాండు చొప్పడిన యూరనుండుము 6 అప్పుగొని చేయువిభవము .. మీందః గీడు దెచ్చుర 7 అభినయముగ రాగరసము నందనిపాటల్‌ చప్పన 107 అభిలాషలేని కూటమి చప్పన 107 అమ్మాయని పిలిఛి యన్నమడుగనినోరు కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర _ ]1 అల్టునిమంచితనంబు లేదు 8 అవివేకికి కవిత్వము గానము వినిపించుట వృథా 72 అకలి యుడుగని కుడుపు రోత 10 ఆకొన్నకూడె యమృతము త్ర ఆవాహనవిసర్దనలు చేయనిదొరను కొలువరాదు థద్ర ఇంతులు వలతురని నమ్మకెంతయు మదిలో శీర్‌ ఇచ్చునదె విద్య 11 ఇమ్ముగ+ జదువనినోరు కుమ్మరి మనుగద్రవ్వినట్టి గుంటర 12 ఇరుసున గందెనబెట్టక పరమేశ్చరుబండియైనం బాజదు 30 ఉత్తమగుణములు నీచునకెత్తెజంగునం గలుగనేర్చు 14 ఉదకము(ద్రావడుహయమును జేరంజనకుర 15 ఉర్వీశ్చరుకరుణ నమ్మి యుబ్బకు మదిలో గ్గాా

అనుబంధం -1; సుమతి శతక నీతులు 205 ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషునిం గొల్వంగూడదు గం ఎప్పుడు నెడతెగకపాలు నేజు చొప్పడిన యూరనుండుము 7 ఎప్పుడు సంపదగలిగిన నప్పుడు బంధువులు వత్తురు 20 ఏజకుమీ కసుగాయలు క! ఏలినపతి నిందసేయకెన్నడు 110 ఒక యూరికి నాక కరణము నొక తీర్చరి 22 ఒల్లని పతి విడువనొల్లనివాండే గొల్లండు 23 ఒల్లని సతి విడునొల్లనివాండే గొల్లండు 23 ఒరు గదిసిన సతిం గవయకు 76 ఓడల బండ్డును వచ్చును ఓడలు నాబండ్లమీంద నొప్పుగ వచ్చున్‌ డడ ఓడలు బండ్డును వలెనే వాడంబడుం గలిమిలేమి 2డీ కడు నిలం బురుషార్థపరుండు కావలె 13 కని కల్ల నిజము తెలిసిన మనుజాండెపో నీతిపరుండు 102 కప్పకు నాఆగాలైనను దప్పదు మఠి దుఃఖమగుట 27 కమలములు లేనికొలంును హీనము ర్‌శీ కరణము గరణము నమ్మిన మరణాంతకమౌను 29 కరణము దన సరి కరణము మటి నమ్మక మర్మమీక మనవలె 29 కరణముల ననుసరింపక విరసంబున దిన్నతిండి వికటించుం జుమీ 30 కరణము వైదికుండైనను మరణాంతకమౌను ర్‌ కరణము సాదై యున్నను లెక్కగొనరు 3కే కరి మదముడిగినను లెక్కగొనరు రె]ే కజవైనను బంధుజనులకడ కేగకుమీ 100 కలకంరకంరి కన్నీరొలికిన సిరి యింట నుండనొల్లదు 38 కలలోనం గన్న కలిమి నమ్మరాదు 105 కవి కాని వాని ద్రాత వృథరా 33 కాదన్నవాండె కరణము రెడీ కాదుసుమీ దుస్సంగతి 35 కాముకుడు తనిసి విడిచిన కోమలి. బరవిటుండు గవయణంగోరుట తగదు 36 కాసులు గలవా6ండె రాజుగదరా 106 కించిత్తు నల్లికుట్టిన మంచానికి పెట్టువచ్చు శ౦

206 సుమతి శతకము కుజనులతోడన్‌ విడువక కూరిమి సేయకుము త్తి కుడువకుమీ శత్రునింటం గూరిమితోడన్‌ 62 కులకాంతతోడ నెప్పుడు కలహింపకు 38 కులకాంత తోడ వట్టి తప్పు ఘటియింపకుమీ 38 కూరిమిగల దినములలో నేరము లెన్నండును గలుగ నేరవు 89 కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు 29 కొంచెపు నరుసంగతిచే నంచితముగ. గీడు వచ్చు త్త కొజగాని కొడుకుపుట్టినం గొజగామియె కాదు తండ్రి గుణముల! జెజచున్‌ 42 కోటకు. బ్రాణంబు సుభటకోటి ఏప్ర కోమలి నిజము లేదు 8 కోమలి విశ్వాసంబు బొంకుర న! ఖలునకు నిలువెల్ల విషము గదరా ర్‌5్‌ గడనగల మగని జూచిన నడుగులకును మడుగులిడుదురతివలు క! గడనుడుగు మగనింజూచిన నడపీనుగు వచ్చె ననుచు నగుదురు శ్రీశ గర్వింప నాలిం పెంపకు భా గాథలు పెక్కాడువాండె కావ్యుండు 34 గుడిమణియము సేయంబోకు త్తి గొల్లని సాహిత్య విద్య లేదు 8 చదువని యా నీచు జేర జనకుర క్ష్‌ చనవించుక లేనిచోట మనుజునకును నిలువందగదు 53 చింతింపకు గడచినపనికి కర్‌ చీటికి ప్రాణంబు వ్రాలు 93 చీరయె శృంగారమం్రు 68 చుట్టములు గానివారలు చుట్టములము నీకటంచు ... ఆ(శ్రయింతురు గట్టిగ (ద్రవ్యంబుగలుగ త్త చేడెల యధరామృతంబు జెందనినోరు బౌడిద కిరవైన పాడుబొందర 103 చేతులకు6 దొడవు దానము 48 జగడము చోటన్‌ మనుజునకును నిలువందగదు 53 తడవోర్చిన నాడలోర్చినం జెడిపోయిన కార్యమెల్లం జేకురు త్త

అనుబంధం -1; సుమతి శతక నీతులు 207 తడవోర్వక యొడలోర్వక కడువేగం బడిచిపడినం గార్యంబగునే త్త తన కలిమి యింద్రభోగము ర్‌2 తన కోపమె తన శత్రువు 50 తన చావు జగత్ర్రళయము ర్‌లై తన దుఃఖమె నరకమం[్రు 50 తన పుత్రుని విద్య పెంపు మనసున వర్లింపరెట్టి మనుజులు ర్‌ తన పెరటి చెట్టమందును మనసున వర్లింపరెట్టి మనుజులు ర్‌ తన యూరితపసితపమును మనసున వర్షింపరెట్టి మనుజులు ర్‌1 తన లేమియె సర్వలోక దారిద్ర్యంబున్‌ 52 తన వలచిన యదియె రంభ క్‌2 తన వారికెంత గలిగిన దనభాగ్యమె తనకుంగాక 60 తనవారు లేనిచోటను మనుజునకును నిలువందగదు 53 తన శాంతియ తనకు రక్ష 50 తన సంతోషమె స్వర్గము 50 తన సతిరూప్పున్‌ మనసున వర్షింపరెట్టి మనుజులు 5్‌1 తన్నుం గూర్చిన సతికడకును రిత్త చేతుల మతిమంతులు చనరు 70 తప్పించుక తిరుగువాండు ధన్యుడు 1కి తమ తమ నెలవులు దప్పిన దము మిత్రులు శత్రులౌట తథ్యము 28 తములము సేయని నోరును హీనము ర్‌4 తమ్ముల బిలువనినోరు కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర క్ష తజచుగ సతి గవయం బోకు తగదుర 75 తలదడవి బాసంజేసిన విలయాలిని నమ్మరాదు ర్‌6 తలపొడవు ధనముంబోసిన వెలయాలికి నిజము లేదు ర్‌6 తలమాసిన నొలుమాసిన వలువలు మాసినను బ్రాణవల్లభునైనన్‌ గులకాంతలైన రోంతురు క్‌7 తవిలి చను పందినేయని వివిధాయుధకొాశలంబు వృథరా 33 తాంకొందక నిచ్చువాండె దాత 9 తాననుభవింపనర్థము మానవపతి& జేరు. గొంత మజి భూగతమౌ 58 తానెక్కిన బాజని గుజ్జము గ్రక్కున విడువంగ వలయు. గదరా ర

208 సుమతి శతకము తెగనాడవలదు సభలను 69 తెల్లని కాకులును లేవు 8 తేకవ గలవాండె వంశతిలకుండు త్రి తేలు మీటకున్నను లెక్కగొనరు 31 తోడు దొరకని తెరువు రుద్రభూమి త్తం దగ్గజ కొండెము చెప్పెడు (ప్రెగ్గడ పలుకులకు రాజు 'పప్రియు(డ్లై మటి

తానెగ్గు ప్రజ కాచరించుట బొగ్గులకై కల్పతరువు. బొడుచుట ర్‌ం దయచుట్టంబౌ 50 దాసి, రంభ, మంత్రి, తల్లి అనునట్టు కులకాంత యుండనగును 71 దూజకుమీ బంధుజనుల దోషము సుమ్మీ 21 దొర యుండనియూరు రుద్రభూమి రం ధర తగ్గుట హెచ్చుకొఆకె 108 ధీరులకు6 జేయు మేలది .... గౌరవమును మటథి మీందట

భూరిసుఖావహమునగును ఈ నడువకుమీ తెరువొక్కటన్‌' 62 నయమున. బాలుం (ద్రావరు ౮4 నరపతులు మేర దప్పిన మరణాంతకమౌను 65 నవరసభావములు లేనినాతుల వలపు వృధరా 33 నవ్వకుమీ తల్లి దండ్రి నాథులతోడన్‌ 67 నవ్వకుమీ పరసతితో 67 నవ్వకుమీ విప్రవరులన్‌ నయమిది 67 నవ్వకుమీ సభలోపలన్‌ 67 నాతికి మానంబు తొడవు నయముగ త్ర నారియె నరులకు రత్నము 6కి నిర్వహణము లేనిచోట నిలువకు గ్ల నీతియ తొడవెవ్వారికి తరి నీరే (ప్రాణాధారము 68 నుడువకుమీ యొరులమనసు నొవ్వం 62 నెపములు వెదకును గడపటం గపటప్పు దుర్దాతి పొందు క్ష

అనుబంధం -1; సుమతి శతక. నీతులు 209 నోరే రసభరితమైన నుడువులకెల్లన్‌ 68 పగ వలదెవ్వరితోడను 69 పతికడకు రిత్త చేతుల మతిమంతులు చనరు 70 పతిలేని గృహము రుద్రభూమి ం్రం పరధనముల కాసపడకు 73 పరధనముల కాసపడనివాండు పరముండు ౯2 పరనారీసోదరు(డు పరముడు 72 పరసతికూటమి గోరకు 73 పరసతి సుశీల యైనను బరుసంగతినున్న నిందపాలగు క్ష పరసతులగోస్టినుండిన పురుషుండు గాంగేయుండైన భువి నిందపడున్‌ 74 పరిపూర్షసుఖంబు లధిక బాధలకొటుకే 108 పరునాత్మం దలంచు సతి విడుము 75 పరుల కనిష్టము సెప్పకు 76 పరులకు మర్మము సెప్పకు 100 పరులకు హితుండు పరముండు 72 పరులలిగిన నలుగనతండు పరముండు 72 పరులు తనుం బొగడ నెగడువాండు పరముండు 72 పర్వముల సతుల6 గవయకుము 77 పలికి బొంకకు 97 పసిపాపలం బొందువాండు పసరము 32 పాపపు దేశంబు సొజకు 97 పాము గఆవకయున్నను లెక్కగొనరు తె్రే పాములతో జెలిమియన్న బొంకుర 43 పాఅకుమీ రణమందున 21 పిటికికి దచళవాయితనముం బెట్టకు 100 పూరణము లేనిబూరె వృథరా 37 పెరుగుట విరుగుటకొజకే 108 'పేరణమును లేనిలేమ పృథివీస్టలిలో వృథరా 37 పొరుగిండ్లకు బనులు లేక పోవకు మెపుడున్‌ 76

210 సుమతి శతకము పొల్టున దంచిన బియ్యము లేవు 8 పోదుసుమీ కీర్తికాంత పొందిన పీదపన్‌ 35 (ప్రాశొన్న నూతియుదకము రోంత 10 'ప్రాయంపుటాలి€ .... దానె పంపుట 25 బాలురతో చెలిమిచేసి భాషింపకుమీ 110 బోటికి. బ్రాణము మానము ర భయమునను విషమ్మునైన భక్షింతురుగా రక భయమే చూపంగవలయు బాగుగ రక భామలవలపున్‌ బొంకుర గ భూతలనాథులకు. దొడవు బొంకమి శీర భూమీశుల నమ్మికలును బొంకుర శై భూమీశుల పాలం జేరు శరం మండలపతిసముఖంబున మెండైన ప్రధాని యుండవలయును 90 మంత్రి గలవాని రాజ్యము తంత్రము చెడకుండ నిలుచును ర్న మంత్రివిహీనునిరాజ్యము జంత్రపుంగీలూడినట్టు జరుగును 9 మగువకు మనసియ్య వలదు 69 మదమున నుప్పాంగుచుండు మత్తేభంబున్‌ జేర జనకుర శే5్‌ మది యొకని వలచియుండంగ మదిచెడి యొక (క్రూరవిటుండు మానక తిరుగున్‌92 మదిలో! గోపించురాజుం గొల్వకు తా మజటుమాటలు పలుకుసుతుల మన్నింపకుమీ గర్‌ మాటకు( బ్రాణము సత్యము 93 మానఘనుండాత్మ ధృతి సెడి హీనుండగువాని నాశ్రయించుట తగదు ర్న మిక్కిలి రొక్కము లియ్యక చిక్కదురా వారకాంత శ మీఆకుమీ గురువులాజ్ఞ 21 ముడువకుమీ పరధనములు 62 ముప్పునం బ్రాయంపుటాలు ... మీందం గీడు తెచ్చుర 6 మే/కలపాడియును రోంత 10 _మేలెంచని మలినుండు, పుల్కసుండు, సొన్నారి, క్షురకుడు - వీరిని హితులుగా ఏలిక స్వీకరింపరాదు 9 మేలైన గుణము విడువకు 110

అనుబంధం -1; సుమతి శతక నీతులు లకక మొదవుకడ నున్నవృషభముం జేరం జనకుర కేక (మొక్కిన వరమీనివేల్సు (గ్రక్కున విడువంగవలయులదరా 2 రణమునం జొచ్చునదే మగతనంబు 1 రమణుల చనుమొనలమీ6ద రాయని మేనున్‌ హీనము రడ లావు గలవానికంటెను భావింపంగ నీతిపరుండు బలవంతుండా 98 లేదు సుమీ సతులవలపు లేశము త్రెడ్‌ వగవంగా వలదు లేమి వచ్చినపిదపన్‌ ళం వరిపంట లేని యూరు రుద్రభూమి రం వజపైన చేను దున్నకు 100 వేల్పుకడకు రిత్తచేతుల మతిమంతులు చనరు 70 వలపు పుట్టని సతిని విటుండు బలవంతముగా అనుభవించుట

సుఖకరము కూడ కాదు 101 వసుధేశుకడన్‌ లేదన్నవాండె చనవరి రెక్తీ వాదడచినవాండె పేడి 8 వాదుకు వచ్చునదే కీడు సుమ్మ |. వాదుసుమీ యప్పిచ్చుట 8ర్‌ విధవ యింట. దీర్చరిడైనను మరణాంతకమౌను ర6ర్‌ వినందగు నెవ్వరు సెప్పిన 102 వినినంతనె వేగపడక వివరింపందగున్‌ 102 వీడెము సేయనినోరు బూడిద కిరవైనపాడు బొందర 103 వీరణమును లేనిపెండ్తి వృథరా 37 వెనుకటిగుణమేల మాను? 26 వెజపేజు౮గని భటునేలకు ౯ర్‌ వెలమచెలిమి నమ్మరాదు 105 వెలయాలివలనం గూరిమి గలుగదు; మజి గలిగెనేని గడతేరదు 104 వెలయాలు సేయుబాసలు నమ శ్రైరొదు 05 వేముల తియ్యందనంబును బొంకుర త్త వేల్పుకడకు రిత్తచేతుల మతిమంతులు చనరు 70 వైద్యుడు చొప్పడిన యూర నుండుము ళా వ్రేకటియగు లంజపడుపు విడువని (బ్రతుకు రోత క0 శుభముల నొందని చదువు చప్పన 107

212 సుమతి శతకము సద్గురు కడకున్‌ రిత్తచేతుల మతిమంతులు చనరు 70 సభ మెచ్చని మాటలెల్ల చప్పన 107 సరసము విరసముకొటుకే 108 సరిగాని గోస్టి సేయకు 73 సర్పమునకు రోగమైనం దప్పదు మథి దుఃఖమగుట 27 సిరి చెడి చుట్టంబుకడకు. జేరకు 73 సిరి దా బోయిన బోవును కరి (మింగిన వెలగపండు కరణిని 109 సిరి దా వచ్చినవచ్చును సరసంబుగ నారికేళసలిలముభంగిన్‌ 109 సుంకరి, జూదరి, అగసాలి, నటుడు, వెలయాలు, అంగడివాడు, వామహస్తుడు

  • వీరిని నమ్మకు 63 సుకవీశ్వరులున్‌ మెచ్చునదె నేర్పు శ సుతుకడకు రిత్తచేతుల మతిమంతులు చనరు 70 సోంకోర్చువాండె మనుజుండు త్తి (ప్రీలయెడ వాదులాడకు 110 హిమధాముడు లేనిరాత్రి హీనము ర్‌డ

అనుబంధం -2 సూక్తిశ్లోక సూచిక అంతకోపి హి జంతూనా 17 కామ ఏష్రోధ ఏష 142 అగ్నిహోత్రం గృహంక్షేతం 139 _ కార్యేషు మంత్రీ 176 అజ్ఞానతిమిరాంధస్య 138... కార్యేషు దాసీ 140 అజ్ఞానామవనీభృతాం 62 _ కొలవిద్రోత్రియో రాజా శ్‌ అజ్జేభ్యో (గ్రంధినః (్రేష్టాః 53 కుపుత్రో జాయేత 129 అతిపరిచయాదవజ్ఞా 97, 150. కోశవానాచార్యః ర్‌3 అదత్తదానాచ్చ భవేద్‌ 169 క్షిపేద్‌ వాక్యశరాంస్తీవ్రాన్‌ శ్ర అదర్శనే దర్శనమాత్ర 147 క్షుధాతురాణాం న రుచిర్న పక్వః 20 అద్వేష్టా సర్వభూతానాం 144 ఇలానాం కంటకానాంచ 105 అధమాః కలిమిచ్చంతి 180 గతం న కోచామి 88 అభిగమ్యోత్తమం దానం 21 గురుర్పవ్మా గురుర్విష్ణుః 137 అమర్శ్యాః సన్సు మరా వా 25 జాతా జాతా యదుత్కుష్టం 129 అర్హమా(త్రాలాఘవేన 163 జ్ఞాతిశ్చేదనలేన కిం 188 అర్జానామార్దనే దుఃఖం 108 _ జ్ఞానాదేవ హి కైవల్యం 156 అవ్యాకరణపాండిత్యం 60,157 _ తం జ్ఞానపణ్యం వణిజం 64 అహో ఖలభుజంగస్య 104 తత్ర త్రీణి న కర్తవ్యం 125 ఇతరపాపఫలాని 124 తత్రమిత్రన వస్తవ్యం 15 ఇయం గేహే లక్ష్మీః 166 _ తద్విద్ది ప్రణిపాతేన 112, 138 ఈశావాస్యమిదం సర్వం 143,144 తులేన కించిత్తులయా చ షై ఉత్కర్జు స చ ధన్వినాం 12 దాతవ్యమితి యద్దానం 2 ఉపకారిషు యస్పాధుః 35. దాతృత్వం ప్రియవకృృత్వం 30 బుణం కృత్వా ఘృతం పిబేత్‌ 16 _ దారిద్రాద్ధియమేతి 132 బుణం యాచ్నా చ వృద్ధత్వం 17 దాసి భృత్యస్సుతో బంధుః 100 కచధార్యం దేహధార్యం 130 దూరస్థాః పర్పతా రమ్యాః 97 కపిరపి చ కాపిశాయన 35 _దైవేతీర్టీ గురౌ మంత్రే ం్రం కర్తా కారయితా చైవ 65 _ ధనినః శ్రోత్రియో రాజా శే5 కస్యైకాంతం సుఖముపనతం _ 100 ధర్మావిరుద్దో భూతేషు 103142

214 సుమతి శతకము ధైర్యే సాహసే లక్ష్మీః 188 _ భిషా౬ స్మాద్వాతః పవతే 119 నందయతీతి నందనః 168 _ భూనాయకం వా ధననాయకం వా112 న గృహం గృహమితి 16ఠర మనోజవం మారుత 87 న జాతు కామః కామానాం 142 మశకా మత్కుణా రాత్రౌ ఠ్‌బై న పశ్యామో ముఖీ దంష్ష్రాం 17 _ మాదేవ రక్షతి పితేవ 198 న స్మరత్యపకారాణాం 131 _మృతో౬ ప్యర్థం న నేష్యామి 25 న బంధుసంబంధిజనం 42 యథా రాజా తథా ప్రజా 120 న శౌర్యం శార్యమిత్యేవ 26 యథా స్త్రీణాం తధావాచాం 190 నాకవిత్వమధర్మాయ 61 _ యదేవ రోచతే మహ్యం 80 నాత్యర్థమర్థార్థయా 21 యద్యదిష్టతమం లోకే 169 నీచాశ్రయో న కర్తవ్యః 181 యస్మిన్‌ జీవతి జీవంతి 29 నైషాం దారేషు కుర్వీత 89 యస్య యస్య హి యో భావ 38 పంచమేఒహని షస్టే వా 21 యాచ్చా మోఘా వరమధి 181 పతిర్దాయాగ్‌ం (ప్రవిశతి 129 యా దాతు; సొమ్యతా సేయం 22 పత్రం పుష్పం ఫలం తోయం 187 రక్షేత్‌ ఖ్యాతిం పున; 68 పరోపకారః పుణ్యాయ 144 _ లోకయాత్రా భయం లజ్జా కేర్‌ పితృభి[ర్రాతృభిక్నైతాః 136 వయమిహ పరితుష్టా 9ం పున్నామ్నా నరకాత్‌ 163 వర్దార్థమష్టా ప్రయతేత 53 పుస్తకం వనితా విత్తం 69 వస్తేణ వపుషా వాచా 107 పుస్తకస్టా చ యా విద్యా 53. వింశతేర్యా (త్రింశతేర్వా 52 (ప్రజానాం వినయాధానాద్‌ 149 వికారహేతా సతి 22 ప్రథమవయసి పీతం 18 విద్యావిహీనః పశుః 31 ప్రభుప్రసాదే సత్యాశాం 154 _ విద్వానేవ విజానాతి 157 ప్రయోజనమనుద్దిశ్య 7 వినా భీష్మం వినా రామం క47 (ప్రయోజనాపేక్షితయా 153 విశ్రామో హృదయస్య 52 ప్రస్తావసదృ్భళం వాక్యం త్ర విశ్యామిత్ర పరాశర 143 బాలసభఖిత్సమకారణహాస్యం 202 _ శర్వరీదీపకళ్ళంద్రః 103 బిభృయాద్చంధుమధనం తై శాంతితుల్యం తసో నాస్తి 9గ్ర భాగ్యవంతం (ప్రసూయేథా: 121 శిశుర్వేత్తి పవర్వేత్తి 91 భీమకాంతైర్చ్పృపగుణై: 14 శునాం చ పిశునానాంచ 0

అనుబంధం -3; సూక్తిపద్యసూచిక 215 వైశవేభ్యస్తవిద్యానాం 103 సర్వథా వ్యవహర్తవ్యం ౯ శార్యేణ లోకసేవ్యత్వం 26 సర్వేషామేవ శౌచానా 143 పస్టిర్రశాంతరే లభ్యా 25 సహసా విదధీత 98 సకృదేవ ప్రపన్నాయ 5 సుఖస్యానంతరం దుఃఖం 199 సత్యం (బ్రూయాత్‌ ప్రియం 133 _ స్థానస్థితస్య పద్మస్య ర్‌5్‌ సత్యాఒనృతా చ పరుషా 122 _ న్థానస్టితస్య మిత్రాయే ర్‌ర్‌ సబంధుర్యో హితే యుక్తః 155 స్మితపూర్వాభిభాషీ చ క25 సమానశీలవ్యసనేషు సఖ్యం 202 _ స్కృతే సీదంతి గాత్రాణి 16 అనుబంధం - 3 సూక్తిపద్యసూచిక అంతిపురము చుట్టరికంబు 89 కళ్యాల పదిలంబు గాని క్ష52 అక్షరజ్ఞుడు గాని 31. కాకేమి తన్ను దిట్టెనె కైక అనువు గానివేళ శ7 కారే రాజులు 67 _ అప్పరఃస్తీలలో 188 కొండెములు చెప్పువారికే 110" అసదృశముగ నరివీరుల 26 _ కొలచేదిన్‌ వగ లేకనే 22 ఆపదలందు ధైర్యగుణ 30 _ క్షమియించువారి. గని క31 ఇది వాజ్యయతపోభూమి 151 గురువులరాక క్ష ఇనుము విరిగెనేని 115 గొడ్డుటావు. బితుక 22 ఇయ్యా ఇప్పింపంగల 65 చంపం దగినయట్టి 35 ఇల లోభినెంత వేడిన 19 _ చుట్టమైనవానిం జట్టున శై ఊరక సజ్జనుండొదిగి 196 _ జ్ఞాతజయమందంేని 188 ఎచ్చుగాం గుచ్చితులున్న 185 డబ్బే పుష్కలమై 197 ఎట్టి సాధ్వులకును శీ9 _తగినవేషంబు తను6 దాను కడం ఎదిరికి హితమును 128 తనువున విరిగిన శ43, 115 ఏ నరునకు విత్తము 197 లొత్తగుచుం బనుల్‌ కే96 ఒక కాని ఒకే కానీ 197 దక్షత లేనియింటికిం కర66 ఒక యేగానికి 197 దానము భోగము నాశము 90, 108 కఠినకఠినములవు 43 ధరణీభృన్మణిమౌళి 27 కన్నుదో౧+& నన్య 142 ధర సింహాసనమై నభంబు 38

216 సుమతి శతకము నక్కలు బొక్కల వెదకును 36 భూపసభాంతరాళమున ర6 నీటిలోన మొసలి 47 మచ్చిక లేనిచోట 102 నెమ్మిగలవారి నొల్లరు 162 మాటలచేత దేవతలు 129 నేరములెన్ని గల్లినను 19 మాయాళీలురు చంచ 134 పగ యడంగించుటెంతయు.. 33,131 న్సృప్ప్రునం గాలకింకరులు కశ పగణకు వెన్నిచ్చినచో 26 మొదలు చూచినం గడు 36 పతి ప్రయత్నంబుతో 15%. రంజన చెడి పాండవు 181 పలికెడిది భాగవతమట 2 రాజగృహంబుకంటె 90 పసుపుంగుంకుమ 75 ల్రాచి పరాంగనల్‌ వర [డ2 పాటకు వినుటయే [24 వండంగాం దిన్స బూరెల లాగా పాడిగలిగిన నిహ 164 ఇ పెలువంగండక 162... నన సమస్తజీవులకుం 150 పుట్టంధుండవు పెద్ద ౩8 వానికి విద్యచేత సిరి [11 పుట్టుకతోడుతం గరమున 30 విద్య లేనివాండు వింతపశువు 31 పురుషుండు రెండు తెజంగుల 164. విధిసంకల్పముచేత 14 'పేదలయ్యును గడు 19 వెలది జూదంబు పానంబు 115 పేదవడినబంధు శం వెలనాటివాండ6 123 పోవనుద్యోగికిని 155 శార్యమున్నదేని 26 ప్రల్లదుండైన యొక్క 193 సంపదలు గల్లు 22, 132 బెడిదముగ. గత్తి 115 సమయమమూల్యమొక్క 151 (బ్రాహ్మణాచారంబు 126 ససి చక్కంగం బ్రియుండు 136 అనుబంధం 4

ఉదాహరించిన కథల సూచిక అపకారికి ఉపకారి శ్రీరామునినేర్పు కధ 34 _ ధ్యానసిద్ధి - కల్టుకైపు కద అసందర్భోచితప్రసంగకథ 27 మగని వలవని బహుల కధ కీర్‌ కొట్టినా కరవనిపాము కథ 59 _ యాదవనాశనానికి పుట్టినముసలం కథ127 క్రూరుని ఆపదలో కాపాడరాదన్న తేలు కథ 161 _ వాలఖిల్యలనవమానించిన ఇంద్రునికధ126 సుడిమణియముచేసి కుక్క అయిన కధ్మ 8 వోటుకోసమైనా అబద్దమాడని వనితకథ 49 తండ్రి మెచ్చని భారవికధ 97 శ్షత్రువుమనిషిని నమ్మని సర్దార్‌ పటేల్‌ కధ 51

అనుబంధం -5 ఏలూరిపాటి అనంతరామయ్య గురించి జననం వ 30-06-1935 కలం పేరు ;.. అనంతం జననీ-జనకులు ఏ. లక్ష్మీదేవమ్మ, సుబ్బయ్యగారలు స్వర్గస్థులు జన్మస్టలం వ తోగుమ్మి, కొవ్వూరు తాలూకా, ప.గో. జిల్లా విద్యాభ్యాసం 2 1 సంస్కృత పారళాల, పొడగట్టపల్లి తూ.గో.జిల్లా 2) ఆంధ్రగీర్యాణ విద్యాపీరం, కొవ్వూరు, ప.గో, జిల్లా 3) ప్రభుత్వ బోధనాభ్యసన కళాశాల, రాజమహేంద్రవరం డిగ్రీలు ఏ భాషా ప్రవీణ, ఎం.ఏ. (సంస్కృతము), ఎం.ఏ. (తెలుగు), బి.ఇడి బిరుదులు ;.. "కవికులరత్న దీప” శ్రీశ్రీశ్రీ సీతారామయతీంద్రులవారిచ్చినది. “ఆంధ్రవ్యాస” నరసాపురం శ్రీ, వేంకటేశ్వర ధార్మికకేంద్రంవారిచ్చినది. "వైదికాగమాలంకార” కుర్తాళం పీరాధిపతులిచ్చినది ఉద్యోగాలు: 1) 1953-65 ప.గో. జిల్లా ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులు 2) _ 1965-68 ఏలూరు సర్‌ సి.ఆర్‌-ఆర్‌. కళాశాల సంస్కృతోపన్యాసకులు 3) _ 1968-70 వెంకటగిరి విశ్వోదయ కళాశాలాంధ్రశాఖాధ్యక్షులు శ) 1970-90 గుంటూరు డా, కె.వి. సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌ 5) 1990 మార్చి 27 నుండి 1991 ఆగస్టు 31 వరకు గుంటూరు శ్రీ శారదా నికేతనం మహిళా ఓరియంటల్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ 6) 199] సెప్టెంబరు 1 నుండి 1994 జూలై 31 వరకు గుంటూరు డా| కెవిశె, సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌ అభిరుచులు సంగీతం సాహిత్యం, నటనం చిరునామా కార్యదర్శి, అనంతసాహితి, ఇం.నెం. 16-1-24/సి/6/1, ఎఫ్‌-2, (గ్రాండ్‌ఫ్లోర్‌్‌ శ్రీ సాయి ఎపార్ట్‌మెంట్స్‌, కమ్యూనిటీహాలువద్ద, 'సైదాబాద్‌కాలనీ, హైదరాబాదు = 500 059. ఫోన్‌ : 4072913 ఇతర విశేషాలు : భద్రాచల సీతొారామకళ్యాణ గగనవాణి దూరదర్శన ప్రత్యక్ష వ్యాఖ్యాత. 1973 నుంచి కొన్నేళ్ళు గుంటూరు రచయితల సహకార సంఘం ఉపాధ్యక్షులు, 1979లో పురాణేతివోసానువాద పరిశోధన ప్రచురణలకు సాధనముగా అనంతసాహితి స్థాపన, కార్యదర్శిత్సం 1979-83 ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమో సభ్యత్వం, సంస్కృత సంబంధి సలహా సంఘ సభ్యత్వం నాగొర్జున విశ్వవిద్యాలయంలో : సంస్కృత కళాశాలల తరపున మొదటి అకడమిక్‌ కౌన్సిల్‌ సభ్యత్వం. 1980 నుండి 1993 వరకు డీన్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ లెర్నింగ్‌. ఈ పదవికారణంగా సెనేట్‌లో, అకడమిక్‌ కౌన్సిల్‌లో, అకడమిక్‌ సెనేట్‌లో సభ్యత్వం 1982-83 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పురస్కారం ముఖ్యమంత్రి శ్రీ కె. విజయభాస్కరరెడ్డి నుంచి పొందిన ముగ్గురు (ప్రాచ్య కళాళశాలోపాధ్యాయులలో ఒకరు. 1983-84 పెదముత్తివి శ్రీ లక్ష్మీపతి స్వామివారి దేవస్థాన గౌరవాస్ట్రాన కవి

1985 ఫిబ్రవరిలో హైదరాబాదులో జరిగిన ప్రపంచ హాస్యరస మహాసభలో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి తరపున పాల్లొనిన ఆంధ్ర హాస్యరచయితలలో ఒక ప్రతినిధి యుజిసి సహాయంతో సంస్కృతాం(ధ్ర జైమిని భారతాలపై పరిశోధన. తెలుగు హాస్య రచనకు ఏటా తెలుగు విశ్శవిద్యాలయం ఇచ్చే శ్రీబలుసు బుచ్చి సర్వారాయుడు స్మారక పురస్కారం జంఘాలశాస్త్రి క్షాలోకయాత్ర రచనకు 1989 శుక్త సంవత్సరాదినాడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ యన్‌.టి. రామారావుచే. 1990 వ్రమోద సంవత్సరాదినాడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ మర్రి చెన్నారెడ్డిచే సంస్కృత పండిత సత్కారం, 1990లో (1) అన్నవరం శ్రీ వీఠవేంకట సత్యనారాయణస్వామివా ర శతజయంత్యుత్సన ప్రత్యేక సంచికకూ, (2) శ్రీ అన్నవరం క్షేత్ర చరిత్రకూ సంపాదకత్వం, రెండవదాని ఇద్దరు రచయితలలో ఒకరు కూడా. 1990-91 గుంటూరు చిన్మయారణ్యం పబ్లికేషన్‌ టస్ట్‌ అధ్యక్షత, 1994 జూన్‌ 1 నుంచి హైదరాబాదు నివానం. 1995 డిసెంబరు 15, 16, 17 తేదీలలో హైదరాబాదులో సష్టీపూర్తి మహోత్సవం, 1996 మార్చి 20 నుంచి సెస్టెంబరు 16 వరకు ఇంగ్లాండు, అమెరికాలలో తెలుగువారి ఆవ్వోనంపై పర్యటనం. అమెరికాలో ఆనంతసాహితి శాఖ ఏర్పాటు. అనుబంధం - 6 ఏలూరిపాటి అనంతరామయ్య రచనలు మూడవ సారి అచ్చై ఉన్నవి చారుచర్య పరిణయ హరిచందనం రెలడవసారి అచ్చై ఉన్నవి శ్రీ విష్ణుపురాణం 1, 2, 3, న సంపుటాలు శ్రీ నూర్కండేయపురాణం 1వ సంపుటం జైమినిభారతం - అశ్చమేధ సర్వం శ్రీస్కాందపురాణ సూతసంహితశివమాహాత్మ్య ఖండం ఆకాశవాణిసూక్తి ముక్తావళి మొదటిసారి అచ్చె ఉన్నవి శ్రీ మార్కండేయ పురాణం 2, 3 వ సంపుటాలు శ్రీ బ్రహ్మవైవర్తపురాణ - ప్రకృతిఖండం త్రీదత్తాత్రేయవజ్ర కవచం నిలకంఠత్రిళతి - కలివిడంబన = సభారంజన - వైరాగ్యశతకాలు గజేంద్రమోక్షణం౦ం నలపాక దర్పణం - నలమహారాజు సంస్కృత కృతికి తెలుగు ఉమాపరిణయం - కాళిదాసు కుమార సంభవ శ్లోకాలతో సహ సుమతిశతకం - వివేకానందినీవ్యాఖ్యాసహితం మూడన సారి అచ్చు కావలసినవి జంఘాల శాస్త్రీ క్మ్మాలోకయా(త్ర శ్రీ విష్ణు పురాణం 1వ సంపుటం

రెండవసారి అచ్చు కానలసినవి శ్రీవరాహపురాణం త్రీ స్కాందరేవాఖండం శ్రీ వామన పురాణం శ్రీ ట్రహ్మావైవర్తపురాణం బ్రహ్మ - గణపతి ఖండాలు శ్రీమద్భాగవతం 7వ స్కంధం శ్రీ మద్భాగవతం 10వ స్కంధం పూర్వార్హం శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచం పంచవటి = గేయకావ్యం దామోదరీయం - పద్యకావ్యం అభినవ భగీరథుడు - కధలు ముందుచూపు = నాటిక ఆకాశవాణి మార్కండేయపురాణం మొదటిసారి అచ్చు కొవలసినవి బహుధాన్య ఆధ్యాత్మిక వార్త ఈశ్వర ఆధ్యాత్మిక వార్త శ్రీ బ్రహ్మవైవర్తపురాణం - శ్రీకృష్ణ జన్మఖండం క-7 సం. శ్రీ మార్కండేయ పురాణం 4-7 సం, శ్రీమద్భాగవతం 1-6, 89,10 ఉ, 11,12 సం, శ్రీస్కాంద సూతసంహిత జ్ఞానయోగఖండం శ్రీస్కాంద సూతసంహిత ముక్తిఖండం శ్రీస్కాంద సూతసంహిత యజ్ఞవైభవఖండం త్రీ లింగ మహాపురాణం పురాణార్హ సంగ్రహ రాజనీతి చతుర్వర్గ సం(గ్రహం - క్షేమేంద్రుని శ్లోకాలు, పద్యాలు, తెలుగు వివరణం దర్చదళనం - క్షేమేంద్రుని 700 వ్లోకాలు, పద్యాలు, తెలుగు వివరణం గుంటూరు పొటలు - జూనపదూలి పాటలు శ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి - పద్యకావ్యం శ్రీ వామన రామాయణం = గేయ రామాయణం వేడి వెన్నెల = గేయాలు కస్తూరీభిక్ష - పద్యకావ్యం సంస్కృత సాహిత్య చరిత్ర - ఆచార్య బలదేవోపాధ్యాయ హిందీ (గ్రంథానికి తెలుగు వ్యాస సంపుటాలు అకాశవాణి ప్రసంగాలు అమరవాణి ప్రసంగాలు - ఆకాశవాణి సంస్కృత (ప్రసంగాలు అమృతవిద్య - నాటికలు రంగులసంగరం = గేయ నాటికలు మగతనం మాట ఏమిటి? - కథలు లోకాలోకనం జరిగిన కథలు శ్రీకూర్మపురాణం 1-4 సంపుటాలు

220 సుమతి శతకము అనుబంధం - 7 శ్రీ పావని సేవా సమితి ప్రచురణలు

  1. శ్రీకృష్ణ శతకము 2 గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్యా - జగత్కళ్యాణ సంహిత సహితము. వ్యాఖ్యాత ఏ; 'మహికవి' శ్రీ. ఉత్పల సత్యనారాయణాచార్య, వెల రూ. 75/-

  2. భక్తరామదాసు ప్రణీతము. ; దాశరథి శతకము మానసోల్దాసవ్యాఖ్య - వ్యాఖ్యాత: ఆచార్య ఎం. కులశేఖరరావు వెల రూ. 50/-

  3. యధానాక్కుల అన్ననుయ్య ప్రణీతము సర్వేశ్వర శతకము వ్యాఖ్యాత ; డా। ముదిగొండ వీరభద్రయ్య వెల రూ. 50/-

&. బమ్మెర పోతనానూత్య ప్రణీతము గజేంద్ర మోక్షము సంస్కృతమూల సహితము గోపీనయనోత్సలార్చిత వ్యాఖ్యా సహితము - వ్యాఖ్యాత ఏ “మహాకవి” శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్య వెలరూ. 100/- ప్రాప్తి స్థానం

శ్రీ పావని సేవా సమితి ఎన్‌.ఆర్‌.టి. 270, సనత్‌నగర్‌, హైదరాబాద్‌ - 500 018 ఫోన్‌ : 3702898 ర్యాద్రళ్యత ఓ

తాము సంపాదించిన ఆస్తిని సంపత్తిని తమ సంతానానికి సం(క్రమింపజేసే

తల్లిదండ్రులు ఈ లోకంలో కోకొల్లలు.

భగవచ్చింతనతో ధర్మబద్ధమైనజీవనం అలవరచుకొన్నవారే, భగవన్నామమహిమవల్ల ఇహపరసౌఖ్యాలు ప్రాప్తింపజేసుకోగలుగుతారు. మూలం ధర్మబద్ధమైన జీవనం.

దానికి మూలం నీతి. నీతి అనేమాటకు పొందించేది, ఉపాయం అని అర్జాలు. నీతి దేనిని పొందిస్తుంది? ఇహపరాలను. ఎలా? విద్య యొసంగును వినయంబ వినయమునను

బడయు పాత్రత, పొత్రతవలన ధనము, ధనమువలనను ధర్మంబు, దానినలన

వైహికాముష్మికసుఖంబు లందు నరుండు అని భారతం. ధర్మబద్ధమైన జీవనానికి అవసరమైన ఉపాయం చెపుతుంది. అట్టినితులు అనేకం చెప్పే నీతి శతకాలు చాలా ఉన్నాయి వాటిలో తలమానికమయినది సుమతిశతకం. కారణం, ఇందులోని నీతులు

అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోనూ అన్ని వయస్సులలోనూ ఉన్నవారికీ

ఉపయోగకరమైనవి. అయితే, వీటికి కాలాన్నీ దేశాన్నీబట్టి (క్రొత్తవివరణం అవసరమవుతుంది. ఆ పని ఈ సుమతి శతకానికి ఏలూరిపాటి అనంతరామయ్యగారు వ్రాసిన వ్యాఖ్య చేస్తున్నది. ఎప్పుడో సుమారు ఏడువందల సంవత్సరాలక్రితం వ్రాసిన ఈ శతకం ఇంత కాలం ఇన్ని కోట్ట తెలుగువారి నాల్కలపై నిలిచి వీరి జీవితాలను తీర్చిదిద్దుతున్నతీరు దీని ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఇందులోని పద్యాలు ఎంత సులభభాషలో ఉన్నట్టు కనిపిస్తాయో వాటిలోని భావాలు అంత గంభీరమైనవి, ఎంత

సులభములుగా కనిపిస్తాయో అంత సారవంతమైనవి, భాష అంత పటువైనది.

ఎన్నో పదాలకు అర్జనిర్ణయంచేసే _ సందర్భంలో శబ్దారత్నాకరమూ, .

సూర్యరాయాంధ్రనివుంటువూ ఇందులోని పద్యాలను (ప్రామాణికములుగా ఉదాహరించాయి. ఆ వివరాలు కొంత వరకూ వ్యాఖ్యలో ఉన్నాయి. ఇప్పటికి ఈ

శతకంపై ఇద్దరు పరిశోధనచేసి ఎం.ఫిల్‌ డిగ్రీలు తీసుకొన్నారు. దీని పేరు సుమతిశతకం |

అంటే మంచిబుద్ది కలిగించే శతకం. బంగారానికికూడా మెరుగుపెట్టటం అప్పుడప్పుడు అవసరం. బుద్ది ఎంత మంచిదయినా దానికి వివేకం, యుక్తాయుక్తజ్ఞానం, మెరుగునిస్తుంది. అందువల్ల ఆనందం కలుగుతుంది. వివేకానందినీ వ్యాఖ్య ఆపని చేస్తుంది. వ్యాఖ్యాత బహుపురాణేతిహాసాదిగ్రంథాలనుంచి ఇచ్చిన ఉదాహరణ క్టోకపద్యాలూ కథాంశాలూ మరింత మెరుగునిస్తాయి. ఇందులోని నీతులకూ, ఉదాహరించిన శ్జోకాలకూ పద్యాలకూ కథాంశాలకూ ఇచ్చిన అకారాది పట్టికలు చదువరులకు చాలా ఉపయోగిస్తాయి.

ఇది అమూల్యనిధి. దీనిని మీయింట నిలిపి మీ ఒంట బట్టించుకొని, మీసంతతికి ఒంటబట్టించి మీరు ధన్యులు మాన్యులు కావాలనేదే శ్రీపావనిసేవాసమితి ఆకాంక్ష,

= సంపాదకుడు ౧/౧ -

శ్‌ ల వ. ;