Telugu sri thalapaka annamacharya jeevitha charitra - anilvaranasi/indianlanguages GitHub Wiki

ల” 1 స ంం వ. స లేగ నేనో | క్షే. శ...

వ. స్టశల నళ ( 9 “ ఆీ స్టో లో నం. 4 చా ర య క ఇ వఫ అకుకుళలీతలు భవనములు తీఫోతి...

శ్రీ. తాళ్ళపాక ఆన్నమాచార్యుల జీవితచరిత్ర మూలము తాళ్ళపాక చినతిరువేంగళనాథుడు (చిన్నన్న) రచన డాక్టర్‌ కేసర్ల వాణి, ఎం.ఏ., పిహెచ్‌.డి. సంపొదకులు డాక్టర్‌ మేడసాని మోహన్‌, ఎం.ఏ., పిహెచ్‌.డి. డైరెక్టరు, అన్నమాచార్యష్రాజెక్టు, తి.తి.దే. మా, కార్యనిర్వహణా ధికారి తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి శ000

కలి! ₹ష1ఓగిలిగికక శ టడషంటిగగళంఓక శకకగ?షం॥గని! గగ 6౪ లి కు తికి! 3. 35% లవ తెల -_ అ॥॥ ౧1౧15 ౧656౧౧66 శ్‌ శ్రీజా 170. [౧6|10౪9 ౧౮౦|0440౧5 56169 110. 372 ౪1 ౬640౧ : 1990 న. 15 ౧౪-౧౧౧ : 1997 ే 2౧6 గ౧౪-౧౧౧| : 2000 కీ 000165 : 5,000 జ్ఞా య టికు గాన. ! బా శీ 6.10.. ని జీ మైత్రి గ౭50113006 0/: ల ౪ 96058 ౧4౦, 1.4.5. దం౦416 0గ106% ₹709౪490120౧4౧03, 7౮0౬ - 517 507. ౧/౧౮ &ఓ "104౧814 10021 064901404౧ 699, "1౫048 *- 517 507.

యుందుమాట శ్రీశ. 15వ శతాబ్దంలో సంక్తీర్తనమనే భక్తిమార్గం ద్వారా శ్రీ వేంకటేశ్వరుని మహత్వాన్ని, తత్త్వాన్ని ౩2,000 అధ్యాత్మ, శృంగార పదాల్లో రచించి తరించిన

మహాభాగవతోత్తముడు తాళ్ళపాక అన్నమాచార్యులు. రాగరేకుల్లో భద్రపరచబడిన తాళ్ళపాక అన్నమాచార్యుల 'సంక్తీర్షనలను, తాళ్ళపాక కవుల వాణ్మయాన్ని గ్రచురించడానికి తొలి ద్రయళత్నం తి.తి .చేవస్థానంచే 1935వ సం లో జరిగినది. మరియు తి.తి.దేవస్థానంచే 2949వ సం॥లో ప్రథ్రథమంగా అన్నమౌచార్య వర్ధంతి మహోత్సవాలు నిర్వహింపబడ్డాయి. వివిధ దశలలో కొనసాగుతున్న తొళ్ళపొక కవుల వాబ్మయ ప్రచురణ, అన్నమాచార్య 'సంక్రీర్సనల ్రచారానికి తి.తి.దేవస్థానంచే 1978వసం॥లో అన్నమాచార్య ప్రొజెక్టు స్థాపించింది. అప్పటినుంచి అన్నమౌచార్య సంక్తీర్సనలకు దేశవ్యాప్తంగా విశేష న్రచారం, ఆదరణ ఏర్పడింది. పాఠక లోకంలో అన్నమాచార్య పదసాహిత్యంపై భక్తి పాదుకొన్నది. “పదకవితా పితామహుడిని కీర్తి గడించిన తాళ్ళపాక అన్నమాచార్యుల సంక్షీర్సనల అధ్యయనానికి, పరిశోధనకు విస్తారమైన అవకాశం కలిగింది. ఈ సందర్బంలో అన్నమాచార్యుల జీవితచరిత్రను గురించి తెలుసుకోవాలనే ఆసక్త పాఠకలోకంలో ఉన్నది. మన భాగ్యవోషం వల్లి అన్నమాచార్యుల జీవితచరిత్రను వారి మనుమడు తాళ్ళపొక చినతిరువేంగళనాథుడు (చిన్నన్న) ద్వివదకావ్యంగా రచించాడు; ఈ ద్విపద కావ్యాన్ని శ్రీ వేటూరి ప్రభాకర శా స్తీగారి పరిష్కురణతో విపుల పీఠికతో తి.తి.దేవస్థానంచే *949వసం॥లో ప్రచురించింది. మరల 1978వ సం[॥లో శ్రీ గౌరిపెద్ది రామసుబ్బళర్మ గారి పరిష్కరణతో వెలువడింది. అన్నమాచార్య వాజ్మయ పరిశోధకురాలైన డా! కేసర్లవాణి వచన (గ్రంథంగా సరళ్లాలిలో రచించిన అన్నమాచార్య జీవితచరిత్రను 1990వ సం॥లో పొజెక్టు స్రచురణగా తితి చే. ముద్రించింది. ఇప్పుడు ఈ తృతీయముద్రణ మునుపటివలె అన్నమాచార్య సంగీత, సాహిత్యాభిమానుల మన్ననలు పొందగలదని మా అఆశంస.

“ఇతనికంటె మరి దైవముంగానము యెక్కడ వెదకిన నితండే! అతిశయమగు మహీమలళో వెలసెను అన్నిటికాధారము6 దానె। (ఆ-౩7౦) కార్యనిర్వహణా ధికొరి తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.

నివేదన

శ్రీ వేంకక్రేశ్వరస్వామివారి నందకాంశ సంభూతుడుగా ్రీశ.15 శ॥లో జన్మించిన మహాభక్తుడు తాళ్లపొక అన్నమాచార్యులు. వైష్ణవ తత్తా వను ప్రాశస్త్యాన్ని 32,000 పదాల్లో రచించి హరికీర్తనాచార్యుడని కీర్తి గడించిన మహానుభావుడితడు. ఆంధ్ర వాబ్బయ చరిత్రలో పల్లవి, చరణాలతో కూడిన పదరచన కితడు మార్గదర్శకుడై “పదకవితా పితామహుడని వినుతికెక్కాడు.

అన్నమయ్య పచాలను వారి సంతతి వారే రాగిరేకులపై చెక్కించి తిరుమల ఆలయ ప్రాంగణంలో “తాళ్లపాక అరిలో భద్రపరిచారున? కాలగర్భంలో కలసిపోగా మనకు లభించిన రాగిరేకులు మొత్తం 2,701 రాగిరేకులపై ఇంతటి విశాల సాహిత్యం లభించడం ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అపూర్వమైన విషయం. గత 4 శతాబ్దాలకు "పైగా తిరుమల ఆలయ _ ప్రాంగణంలో అసూర్యం పశ్యలుగా “తాళ్లపాక అరి లో నున్న రొగ్గిరేకులను 1922వ సం[లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు కనుగొన్నారు.

1985 సం! నుండి తిరునుల తిరుపతి దేవస్థానం వారు నేటి వరకు వివిధ దశలలో తాళ్లపాక అన్నమాచార్యుల, "జదతిరుమలాచార్యుల, చినతిరుమలాచార్యుల సంకీర్తనలను రాగిరేకుల నుండి పరిష్కరించి 32 సంపుటాలుగా. వెలువరించింది. మరియు తాళ్లపాక కవుల వాబ్బయాన్ని ప్రకటించింది.

తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలు 1978 సంక నుండి తి.తి.దే. అన్నమాచార్య ప్రాజక్ట్‌ ద్వారా భక్తలోకంలో విశేషవ్యాస్తిని పొందాయి. అందుకు ఆనుగుణంగా అన్నమాచార్య ప్రాజెక్ట్‌ ప్రచారం - పరిశోధన - ప్రచురణ విభాగాలతో తమ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నది.

వేడు పాఠకలోకంలో, భక్తలోకంలో అన్నమాచార్య సంక్రీర్తనలకున్న విశేష ప్రాశస్త్యాన్ని, (ప్రాచుర్యాన్ని తి.తి.దే... గుర్తించి తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలను, వాజ్మయాన్ని పునర్ముద్రైంచాలని సంకల్పించింది. ఇందులో భాగంగా తాళ్లపాక చిన తిరువేంగళనాథుడు రచించిన చ్విపదకృతి “అన్నమాచార్య జీవిత చరిత్ర 1990 సం॥లో వచన రూపంలో వెలువడింది. అన్నమాచార్య ప్రాజ్మ్ర్‌ పరిశోధకురాలైన డా| కేసర్ల వాణి ఎం.ఏ, సీహెచ్‌.డి. రచించిన ఈ పుస్తకం బహుజనామోదం పొందగలదని మూ విశ్వాసం. తిరువేంకటాచలాధిపుండు దావై యుండి పరిపాలనము సేయ భారకుండితండు. (170) “తిర్ధుపతి, డా॥ి మేడసాని మోహన్‌, ఎం.ఏ, పిహెచ్‌డి 29-4-97. డైరెక్టర్‌, అన్నమాచార్య (ప్రాష్య్ట్‌ తి.తి.దే. తిరుపతి.

కృతజ్ఞతలు జా

తిరుమల తిరుపతి దేవస్థానం సరమభాగనతోత్తముడైన తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తనల ప్రచారానికి 1978 సం॥ అన్నమాచార్యప్రాజెక్టు స్టాపించింది. ఆనాటి నుండి అన్నమాచార్య సంకీర్తనలకు విశ్వవ్యాప్త మైన ప్రచారం. ఏర్పడింది. అన్నమాచార్య సాహిత్య ఆధ్యయనం పట్ల పారక లోకంలో పరిశోధకులలో ఆసక్తి పెరిగింది. అన్నమాచార్య సాహిత్యంపై వివిధ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ సంద ర్భంగా తి.తి.దే. వారు అన్నమాచార్య నంక్రీర్తనలను, తాళ్లపొక కవుల రచనలను పునః ప్రకటించాలని సంకల్పించారు.

తాళ్లపాక చినతిరుగవేంగళవాథుడు (చిన్నన్న) రచించిన “అన్నమా చార్య జీవితచరిత్ర ద్విపద కావ్యాన్ని 1949 సం[లో &ీతే.. వేటూరి ప్రభాకర శాస్త్రిగారు, 1978 సం!లో క్రీశే గౌరి పెద్దిరామసుబ్బశర్మగొరలు పరిష్కురించగా తి.తి.దే. ప్రకటించింది.

1990 వం[లో అన్నమాచార్య ప్రాజెక్టు పరిశోధనావిభాగం తరపున “అన్నమాచార్య. జీవిత చరిత్ర ద్విపదను వచన (గ్రంథంగా రూపొందించే ఉవకాశం నాకు కలిగింది.

3990 సం[లో తి.తి.దే. ప్రకటించిన ఈ పుస్తకం ఈనాడు పునర్ముద్రింపబడుటకు అవకాశాన్ని కలిగించిన తి.తి.దే. యాజమాన్యానికి-

ఈ రచనకు ముందుమాట పొందుపరచిన తి.తి.దే. కార్యనిర్వాహకులు శ్రీ ఎం.3ఆర్‌: వినాయక్స్‌ ఐ.ఏ.ఎస్‌, గారికి-

“అన్నమాచార్య. జీవిత చరిత్రా ను వచన (గ్రంథంగొ వ్రాయుటకు ప్రోత్సహించిన అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌ డా! మేడసాని మోహన్‌ గారిక్రి-

ఈ రచన ముద్రణకు ఆమోదాన్ని తెలిపిన తి.తి.దే, ధార్మిక పుస్తక (ప్రచురణ సంఘానికి- ముద్రణలో తమ సంపూర్ణ సహకారాన్ని అందించిన శ్రీ ముదివర్తి కొాండమాచార్యులు గారికి- సకాలంలో (గ్రంథం ముద్రితమగుటకు తోద్చడిన (డెస్‌ మేనేజర్‌ శ్రీ ఎం. లక్ష్మణరావగారిక్రి వారి పిబ్బందికి నా కృతజ్ఞతలు, శ్రీ వేంకటగిరినాథుని చిత్తము లోపల నిలిపిన- 'దేవసమానుండు నాతండె ధీరుండు నాతండె పో [1-229) డా॥ కేసర్లవాణి, ఎం.ఏ, పిహెచ్‌.డి, అన్నమాచార్య ప్రాజ్ట్‌, తితి.దే., తిరుపతి.

యద్యడర్విభూతి మల్ఫత్త్వం శ్రీమదూర్హిత మేవ వా, ఛత్తదేవాఒవగచ్చ త్వం మమ తేజోంశ సంభనమ్‌. [భగవద్గీత - విభూతియోగము-4] శ్లోకం] విభూతి పంపన్నము, శ్రీమంతము, ఉల్సాహవంతము అయిన వస్తువు . (ప్రాణీ ఏది కలదో, అది తన తేజోంశ సంభూతమైనదిగా తెలుసుకొమ్ముని అర్జునునకు శ్రీకృష్ణపరమాత్మ ప్రబోధిస్తున్నాడు.

టే క గ టు తాళ్లపాక అన్ననూచార్యులు (1408 - 1503)

శ్రీతాళ్ళపసాక అన్నమాచార్యుల జీవిత చరిత్ర

విశ్వ(శ్రేయస్సుకోరే అధ్యాత్మచింతనకు నిలయం భరతభూమి. పర తత్త స్రైబోధనమే పరమావధిగా చేసుకొని ఎందరో మహానుభావులు ఈ కర్మభూమిపై అవతరించారు. సరమాత్మ తత్త్వాన్ని ప్రబోధించే మహాను భావుల ఉద్బోధలు నిత్యం ఈ వేదభూమిలో వినిపిస్తుంటాయి. కర్మ-భక్తి- జ్ఞానయోగాలనే మూడుమార్గాలు ఆధ్యాత్మిక క్షేత్రంలో సుప్రసిద్ధాలు. అందు లోను భక్తిమార్గమే విశేషవ్యాస్తీ పొందినది. మనజూతి జీవన (ప్రవాహంలో భక్తిమార్గాన్ని నారదుడు, శాండిల్యుడు, వ్యాసుడు మొదలైన మహర్షులు ప్రబోధించారు. ఉత్తర భారతదేశంలో తులసీదాస్‌, కబీరు, మారా, సూర్‌ దాస్‌, జయదేవుడు, లీలాశుకుడు భక్తితత్త్వాన్ని కావ్యాలుగా, గీతాలుగా రూపొందించిన ధన్యజీవులు.

దక్షిణభారతదేశంలో భక్తిమార్గాన్ని ప్రపత్తిరూపంలో ప్రబోధించినవారు భగవద్రామానుజులు. తమిళంలో వైష్ణవగీతాలకు నాలాయిర ప్రబంఛాలని వ్యవహారం. పన్నిద్దరు ఆళ్వార్డు విశిష్టాద్వెత సిద్దాంతాన్ని పాశురాలుగా చెలయించారు.. కన్నడంలో భాగవతధర్మాన్ని శ్రీశ 13వ శ నుండి హరిదాసులు 'పదగళు" పేరుతో విశేషప్రచారంలోకి తెచ్చారు.

తెలుగులో శివకవులయుగంలో అంటే శ్రీశ, 12 శ|లో 2న వాజ్మయం పదములుగా వెలసినట్లు. తెలుస్తున్నది. క్రీశ 13 శలో కృష్ణమాచార్యుని సింహగిరి నరహరి వచనములు ప్రసిద్ధి కెక్కినాయి. తర్వాత యాగంటినారి పదాలు తత్తా వ్రక్జీబోభకొలైన రచనలుగా గుర్తింపుపొందాయి.

శ్రీశు 15 శలో “పదకవితో క్రొత్త పుంతలు తొక్కింది.

నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనమ్‌ [భాగవతం-12-13-23]

లై శత్రు తాళ్ళపాక అన్నమాచార్యుల సర్వపాపాలను కడిగినేయగల భగవన్నామ పరమార్థాన్ని విశాలపద సాహిత్యంలో వెలయించిన ధన్యజీవి తాళ్లపాక అన్నమాచార్యుడు. అందమైన రామానుజాచార్య మతమును అందుకొవి విఠిచినొాండన్నమయ్యా విందువలె మూకును శ్ర్రీవేంకటనాథుని నిచ్చె అందరిలోందాళ్ళపాక అన్నమయ్యా [16 సంప్పు-1భా-23 సంకీర్తన] శ్రీశ. 15న శతాబ్దంలో శ్రీవేంక కేశ్వరాంకితంగా 32,000 పదాలను. రచించి వైష్ణనమతాన్ని పునరుజ్జీవింపచేసిన చరితార్జుడు అన్నమయ్య, వీరిపదాలు ఈ నాటికీ ప్రతినోటా విన్పిస్తుంటాయి. భృగవంతునియొక్క నామాన్ని, లీలలను, గుణగణాల్ని సంకీర్తన వాబ్మ యంలో పొందుపరచి ఆచంద్రతారార్కం తరిగిపోని శ్రీర్తిని పొందిన అన్నమయ్య జీవితచరిత్ర ఎందరికో మార్గదర్శకం, అన్నమాచార్య చరిత్ర రచనకు వీరి మనుమడు తాళ్ళపాక చినతిరు వేంగళనాథుడు రచించిన “అన్నమాచార్య చరితి ఆధారం. ఇది ద్విపద కొవ్యం. ఇతడు 'పెదతిరుములాచార్యుని నాలుగో కుమారుడు. “చిన్నన్న అని వ్యవహార నామం. తాతగారి జీవితచరిత్రను ప్రానూణికంగా రచించిననాడు. తెలుగు వాజ్బయంలో ద్విపద ప్రక్రియకు కావ్యత్వ సిద్ధి కల్పిరచినవాడు. తాత గారి జీవిత చరిత్రనే కాక పరమయోగి విలాసము, అష్టమహిషీకళ్యాణము, ఉషాపరిణయము అనే ద్విపదకావ్యాలను రచించాడు. ఇతడు ద్విపదకావ్య రచనలో దిట్టగా తెనాలి రామకృష్ణునిచే- “చిన్నన్న ద్విపద కెజంగును పన్నుగంబెద తిరుమలయ్య పదమున కెజంగున్‌” (అప్పకవీయం-3-2-25) అని కీర్తించబడినవాడు. తెలుగు వాబ్బయచరిత్రలో కవులచరిత్రను గ్రంథస్థం చేయడం అంతగా ల్‌ 4 ఆలవాటులేదు. తెలుగు సాహిత్యచరిత్రలో ప్రసిద్ధులైన తిక్కనగూర్చి కేతన,

జీవిత చరిత్ర గ

శ్రీనాథునిగూర్చి దగ్గుపల్లి దుగ్గన, రాధా మాధవకవి, పండితారాధ్యులగూర్చి

సోమనాథుడు పేర్కొన్నట్టు వారిగ్రంథాల ఆధారంతో వెల్లడి అవుతు ళా

న్నది. కొందరుకన్పలు కావ్యాలలో 'కృతికర్త్రృవంశం' అనే శీర్షికలో తమ

వంశచరిత్రను సంగ్రహంగా చెప్పివున్నారు.

తాళ్ళపాకవంశ ఖ్యాతికి మూలపురుషుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు. హరికీర్తనాచార్యుడు, పదకవితా సితామహుడు, పంచనూగమ సార్వభౌమ బిరుదాంకితుడతడు. 'అన్నమాచార్యచరితిను అన్నమయ్య మనుమడైన చిన్నన్న రచించినది కాబట్టి చారిత్రక, సాహిత్యపు విలువలుగల (ప్రామాణిక (గ్రంథమని చెప్పవచ్చును. తన వారే తనకథ వ్రాయునంతటి చరిత్ర, ప్రశస్తి గలవాడు అన్నమయ్య. కవి జీవితాన్ని ఇతివృత్తంగా స్వీకరించి జీవితచరిత్రను రచించిన తొలితెలుగుకవి కూడా తాళ్ళపాక వంశీయుడే కొవడం విశేషం.

“అన్నమాచార్య చరిత ద్విసద వ్రాతప్రతిని కడపజిల్లా రాయచోటి తాలుకా మడితాడు గ్రామనాసి శ్రీతాళ్ళపాక సూర్య నారాయణయ్యగారు పాత తాటాకు ప్రతిని అనుసరించి క్రీశ 1940 సంవత్సరంలో వ్రాసినారట. వీరు వ్రాతప్రతిని తిరుపతి శ్రీవేంకటేశ్వర ప్రాచ్యగ్రంథాలయానికి (0110 ఆందచేశారు. శీ.శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తాళ్ళపాక సూర్య నారా యణయ్యగారు అందించిన ద్విపద వ్రాతప్రతిని పరిష్కరించి క్రీశ 1949 సంవత్సరములో దేవస్థానం తరపున విపుల పీరికతో ముద్రించారు. తదుపరి క్రీశ 1966లో పీరిక మాత్రమే ద్వితీయ ముద్రణగా వెలువడింది. మరల శ్రీశ, 1978 సంవత్సరంలో ' తాళ్ళపాక వాజ్మయ పరిష్కర్తలైన శ్రీగౌరి పెద్ది రామసుబ్బశర్మగారి సరిష్కరణతో మూడోముద్రణను దేవస్థానంవారు వెలువరించారు.

ఈ ద్విపదకావ్యంలో అన్నమాచార్యుని పూర్వులనుండి అన్నమయ్య జననం, జీవితవృత్తాంతాలు, అన్నమయ్య పుత్రపొత్రాదుల వివరాలు, వారి రచనల వివరాలు పేర్కొనబడ్డాయి.

ప్రస్తుత రచనలో 'అన్నమాచార్యచరిత్ర' ద్విపద, సంకీర్తనల ఆధారంగా క్రమానుగతంగా వివరించబడుతుంది,

శీ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల తాళ్లపాక : పొత్తపినాడు మండలం నడిబొద్దున తాళ్ళపాక (గ్రామం విరాజిల్లుతుం డేది. ఆ గ్రామంలో వెలసిన చెన్న కేశవస్వామి కరుణాకటాక్షములతో ఆ (గ్రామజనులు సుఖవంతులై జీవనం సాగించేవారు. ఇచ్చటి చెన్న కేశవస్వామి విగ్రహాన్ని జనమేజయుడు ప్రతిష్కించాడని కథనం. సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామం సన్మునులకు, అఖిల దేవతలకు నిజవాసమై వుండేదని అంటారు స్టలజ్ఞాలు. ఆ గ్రామవాసులు- కనుట గోవిందు మంగళ విగ్రహంబె వినుట నారాయణ వృత్తాంతచయమె చేయుట కౌస్తుభాంచిత పూజె తలయు సేయుట మాధవ శ్రీపాదయుగమె కుడుచుట వనమాలిగొను ప్రసాదంబె నడచుట నంద నందను నగరికినె కొని, దుర్విషయ సంగతి కలలోన (అన్న. చరిత్ర.ద్విపద-పుట-4) ఈలపక్క ఇందిరారమణపదైక మానసులుగా జీవనం గడిపేవారు. ఇంచటి మహోన్నత భగవత్స్పుసాదితమైన ఆత్మసంస్కారంతో ప్రకా శించే తాళ్ళపాక (గ్రామంలో అన్నమయ్య జన్మించాడు. అన్నమయ్య నందవరవైదిక ట్రాహ్మణవంశస్టుడు. బుగ్వేదులు, ఆశ్వలాయనసూత్రులు, భారద్వాజస గోత్రులు అయిన నారాయణసూరి లక్కమాంబా దంపతులకు శ్రీవేంకటేశ్వరుని వరప్రసాదిగా జవ్మించాడు అన్నమయ్య. నందవరీకులగాథ: నందవరీకులు క్రీశ 10వ శతాబ్దంలో కాశినుండి ఆంధ్రదేశానికి వలసవచ్చిన శుద్ధవైదిక (బ్రాహ్మణులని పరంపరాయత ప్రతీతి. క్రీశ 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలోని నందవరం అనే (గ్రామాన్ని నందుడనే రాజు పొలించేవాడు, ఈ రాజు కాశీయాత్రకు వెళ్ళినపుడు అక్కడ కొందరు

జీవిత చరిత్ర ర్‌ వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరీ ఉపాసకులు పరిచయం అయ్యారనీ, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలసవచ్చి నందరాజు ఆశ్రయంలో స్రీరపడ్డారని, నందరాజుచే తీసుకొనిరాబడిన వైదికులు కావడంచే నందవైదికులు అనీ, నందవరంలో నెలకొన్నవారు కావడంచే నందవరీకులుగా ప్రచారం పొందారని జనవాక్యం. కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడపజిల్లాలలో స్రిరపడ్డారని పరిశోధకుల అభిప్రాయం. తాళ్ళపాక (గ్రామనామం అన్నమయ్య వంశస్థులకు ఇంటిపేరుగా నిలిచినది. అన్నమయ్య వంశీకులు: భారద్వాజ గోత్రులైన అన్నమయ్య పూర్వుల ప్రస్తావన, నాలుగు తరాలకు సంబంధించిన వివరాలను చిన్నన్న అన్నమాచార్య ద్విపద వల్లను, అష్టమహిషీ కళ్యాణం వల్లను గ్రహించవచ్చును. భరద్వాజ బుషి ఓ నారాయణయ్య శ విఠలయ్య ళీ నారాయణయ్య (| విరలుడు శీ నారాయణుడు శ్ర నారాయణసూరి శ అన్నమాచార్య (అన్న. చరిత్ర. ద్విపద-పుట-5)

6 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల అన్నమయ్య పిచ్చ పితామహులు నారాయణయ్యు, విరలయ్యలు విష్ణు పదభక్తిరతులై _ తాళ్ళపాకచెన్న కేశవస్వామిని సేవించుకొంటూ. జీవితం గడిపేవారు. అన్నమయ్యకు ముందు నాలుగోతరంలో జన్మించిన నారాయణయ్య కథతో అన్నమాచార్య చరిత్ర ప్రారంభం అవుతుంది. నారాయణయ్యకు చిన్నతనంలో చదువుసంధ్యలు అబ్బలేదు. తండ్రి విఠలయ్య తనవద్ద ప్రయోజనంలేదని పక్కనే ఊటుకూరులో తన బంధువుల వద్ద ఉంచాడు. ఊటుకూరు నేడు కడపజిల్లా రాజంపేట తాలూకాలో ఉన్నది. అన్నమయ్య మనుమడు చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయని మోద కొన్ని సంకీర్తనలు కూడ రచించాడు. ఊటుకూరునందు. గురువులు నారాయణయ్యను- సొమదానే భేదదండా విత్యుపాయాశ్చతుష్టయమ్‌, (అమరకోశం 2-8-81) అన్నట్టు చతుర్విధ ఉపాయాలకు గురి చేశారు... అయినా బాలునికి చదువుపట్ల (శ్రద్ధకలుగలేదు. చివరకు గురువు “*నూజుమాటలు చెప్పి నులిపెట్టి చెక్కు మూజీపోసినంగాని నుడుగు నోరికిని రాకున్న విదియెట్టురా గొంటు వీని పోకలంజూడ నబ్బురమయ్యె నాకు నని యొక్కనాండు"”-

(అన్న. చరిత్ర. ద్విపద-పుట-5) నారాయణయ్యను కోదండమున (వేలాడదీశారు. కోల గగ్గెర విధించారు. గుంజిళ్ళు తీయించారు. కోదండం అంటే దూలానికి తాడు కట్టి (వేలాడ తీయడం. కోలగగ్గెర అంటే కాళ్ళు చేర్చికట్టి పసరమును కూలదోయునట్లుగా కూలద్రోయడం.' నారాయణయ్యను అయ్యవారు ఇంతటి కఠిన సరీక్షలకు గురిచేసినా-

జీవిత చరిత్ర 7 *క్రులాగు గావింప నెదురు మాటాడం జాలక కన్నీరు జార” (అన్న. చరిత్ర.ద్విపద-పుట-6) బాలుడు అవమానంతో (క్రుంగిపోయాడు. లేతమనస్సు గాయపడింది. నారాయణయ్య ఊటుకూరు (గ్రామశక్తి అయిన చింఛలమ్మగుడి సమీపాన పుట్టలో పాముందని మునుపే వినివున్నాడు. క,.“నీ నొ బాధకంటె నా పాము కజ' న నెగులెల్లగడంకేంయ ననుచు (అన్న చరిత్ర, ద్విపద.పుట-6) అని తలపోసి పుట్టలో చెయ్యి పెట్టాడు. నేడు ఊటుకూరునందు చింతలమ్మ ఆలయం కన్పించదు. కాని ఊటుకూరు శివాలయంలో ఒకగదిలో వున్న స్రీమూర్తి విగ్రహం '“చింతలమ్మ" అని స్థానికుల అభిప్రాయం, బాలుడైన నారాయణయ్యకు త్రికాల వేదినిద్లైన చింతలమ్మ_ ప్రత్య క్షమై ఓదార్చింది. సకలవిద్యలు తాళ్ళపాకలో వెలసియున్ను చెన్న కేశవుని అనుగ్రహంవల్ల పొందగలవనియు, “అడియును గాక మూడవ తరంబునను వదలవి, కీర్తి మొ వంశంబునందు పరమభాగవతుండు ప్రభవించు శౌరి వరననునేంు. 6462. ఆ26 (అన్న చరిత్ర, ద్విపద-పుటా-7) అని నారాయణయ్యను అనుగ్రహించి అంతర్జానమైనది. అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయణయ్య తాళ్ళపాకచేరి ఆశ్రితక్షేశనాశకుడైన చెన్న క్రేశవస్వా మిని సేవించి స్వామి అనుగ్రహంచే వేదవేదాంగపొరంగతుడై సకలవిద్యలు పొందగలుగుతాడు. సర్వజ్ఞాడని కీర్తి పొందుతాడు. నారాయణయ్య కుమారుడు నారాయణసూరి. ఇతడు సకల స ప మాంబ, విద్యాధురంధరుడుగా ప్రసిద్ధి కెక్కినవాడు. వీరి ధర్మపత్ని లక్క ఈము మాడుపూరు మాధనస్వామి భక్తురాలు. 3

8 తీ తొళ్ళపాక అన్నమౌ చార్యుల మాడుపూరను నూర మాధవమూర్తి తోడునీడై యాసెతో మాటలాడు (అన్నం చరిత్ర, ద్విపద.పుట-8) మాడుపూరు కడపజిల్లా సిద్దవటం తాలూకాలో ఉన్నది. అన్నమయ్య తండ్రి "పేరు *నారాయణసూరిగా చిన్నన్న పేర్కొనడాన్నిబట్టి తాళ్ళపాకవారు అన్నమయ్య జననానికి ముందే పండితవంశస్టులుగా శ్రీర్షించబడేవారని భావించవచ్చును. తిరువుల పయనం-అన్నమయ్య జననం: భాగవత సేవాపరాయణులైన నారాయణసూరి, లక్కమాంబలకు సంతానం లేకపోవడంచే తీవ్రవ్యధకు గురై- ఆ లక్కమాంబతో నా సూరివరుండు మేలిపంపదల నర్మిలిందెప్పదేలి కటకట వేవ్సురు గలుగంగనేమి కొడు కొక్కరుండైనంగుల ముద్ధరించు తనయుండు గల్లిన తన పుట్టులెల్ల గ్‌ ఉం గ ననయంబు సఫలమౌొనని యిటువంటి తనయులు లేమి నెంతయుంజింతనొంది (అన్నం చరిత్ర.ద్విపద-పుట-9) సర్వజనుల అభీష్టాలను నెరవేర్చే వేంక'కేశ్వరుని సేవింపగోరి కొండకు ప్రయాణమయ్యారు. తిరుమలచేరి స్వామిమందిరం ప్రవేశించి గరుడ కంబం వద్ద సాగిలిమొక్కారు. స్వామి వారికి తన నిజఖడ్గమైన నందకాన్ని కలలో (ప్రసాదించాడు. నందకాంశతో తమకు ప్వుతోదయమవుతుందని నారాయణ సూరి, లక్కమాంబలు తెలుసుకొంటారు. పరమానంద భరితులై ఆ పుణ్యదంపతులు తాళ్ళపాక చేరుతారు. స్వామి అనుగ్రహంచే--

జీవిత చరిత్ర 9

“రాజీవ నయను వరప్రసాదమున

దేజంబు నుతియు నెంతే విస్తరిల్ల లక్కమాంబకుంబుణ్యలావణ్యనిధికి

చక్కని గ్రహము లుచ్చమున మూండలర

అనుసమ అగ్హుంబునందు వైశాఖ

మున విశాఖను జగంబున నుల్లపిల్ల

జనియించె నన్నమాచార్యుండు"

(అన్న, చరిత్ర.ద్విపద-పుట-9) నారాయణసూరి, లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైనది. నారాయణసూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు.

“అన్నం బ్రహ్మేతి వ్యజానాల్‌* అనే శ్రుతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మవాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు. అన్నమయ్యకు అన్ననుయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయగురు, అన్న యార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు. లొళ్ళపాక సొహిత్యంలోను, శాసనాల్లోను కన్పిస్తాయి.

శ్రీమహావిష్ణువు వక్షస్హ్రలమందలి కౌస్తుభమే శరకోసయతిగా, వేంక 'పేశ్చరస్వామి. గుడిఘంట వేదాంతదేశికులుగా, స్వామి హస్తమందలి నందకమనే ఖడ్గాంశలో "పేయాళ్వారులు, అన్నమయ్యలు అవతరించారని ప్రాజ్ఞుల విశ్వాసం. అన్నమయ్య జనన కాలం గూర్చిన చర్చ:

అన్నమయ్య జననకాలాన్ని గూర్చి సాహితీ పరిశోధకుల్లో ప్రధానంగా రెండు అభిప్రాయాలు కన్పిస్తాయి.

అన్నమయ్య జనన సంవత్సరం 1) క్రీశ 1408 అనీ;

  1. శ్రీశ, 1424 అనీ;

'పై రెండు అభిప్రాయాలను పరిశీలిద్దాం. అన్నమయ్య జననకాలం

చర్చించడానికి ప్రధాన ఆధారాలు.

10 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల

  1. అన్నమయ్య జనన కాలాన్ని వివరిస్తూ తాళ్ళపాక చిన్నన్న

= వైశౌఖి మున విశాఖను జగంబున నుల్లపిల్ల జనియించె నన్నమాచార్యుండు” (అన్న. చరిత్ర.ద్విపద-ప్పుట-9) ం! ఎన్త్‌ జ =వ్ట్‌ అని మాస నక్షత్రాదులనే ఎర్కొన్నాడు. ఇందులో సంవత్సరం ఎర్కొన బడలేదు.

2, సంకీర్తనల రాగిరేకులమోది పారం:

అన్నమాచార్య సంకీర్తనల రాగిరేకుమాద ఈక్రింది వాక్యాలు మలచ బడాయి ;

65,

“స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శక వరుషంబులు 1346 అగు నేటి క్రోధి సంవత్సరమందు తాళ్ళపాక అన్నమాచార్యులు అవతరించిన పదారుయేండ్లకు తిరువేంగళనాథుండు ప్రత్యక్షమైతేను అది మొదలుగాను శాలివాహన శకనరుషంబులు 1424 అగునేటి దుందుభి సంవత్సర ఫాల్గుణ బహుళ 12 నిరుధానకు తిరువేంగళనాథుని మూదను అంకితము గాను తాళ్ళపాక అన్నమాచార్యులు విన్నపముచేసిన అధ్యాత్మశ్ళంగార సంక్రీర్తనలు.”

"పైన ఉదహరించిన రాగిరేకు మిది వ్రాతను ' బట్టి అన్నమయ్య నిర్యాణం శాలివాహన శకం 1424 (క్రీశ. 1503] అనగా దుందుభి ఫాల్గుణ బహుళద్వాదశి అని సంవత్సర, మాస, తిథి నామాలతో స్పష్టంగా తెలుస్తున్నది.

ఇక 1346" క్రోధి అన్నది అన్నమయ్య జననమా? వేంకకేశ్వరుని సాక్షాత్కారమా? అన్నది వివిధ అభిప్రాయాలకు అవకాశమిస్తున్నది.

రాగిరేకులమిది వ్రాత ప్రధానోద్దేశం అన్నమయ్య సంకీర్తన రచనా (ప్రారంభ పరిసమాప్తాలను తెలపడమేకాని అన్నమయ్య జనన మరణాలగూర్చి తెలపడంకాదు. ఈ _ సందర్భంలో ెదతిరునులయ్య సంకీర్తనల తాలి రాగిశేకులోని వాక్యాలుకూడ పేర్కొన దగియున్నవి.

జీవిత చరిత్ర 11

'శాలివాహనశక వరుషంబులు 1424 అగు నేటి దుందుభి సంవత్సర ఫాల్గుణ బహుళ 12 మొదలుగాను తాళ్ళపాక అన్నమాచార్యులుంగారు తమ కొమారుడు తిరునులాచార్యులణను దినమొక సంకీర్తన శశ్రీవేంకకే శ్వరునకు అంకితంచేసి చెప్పుమనంగొను విన్నసము చేసిన సంకీర్తనలు [అన్నమాచార్యులు పరమసదించిన నాటినుండి పెదతిరుమలాచార్యులు చెప్పిన కీర్తనలు.)

పై రాగిఠేకుల మాటలు సెదతిరుమలాచార్యుల సంకీర్తనల రచనా ప్రారంభాన్నే స్పష్టం చేస్తున్నాయి. ఈ దృష్టితో పరిశీలిస్తే అన్నమాచార్యులు శాలివాహనశకం 1330 సర్వధారినాము సంవత్సరం వైశాఖమాసం విశాఖ నక్షత్రయుక్త పూర్ణిమా తిథిని [9-5-1408] జన్మించాడని చెప్పవచ్చును. ఈ లెక్కప్రకారమే. తిరుమల తిరుపతి దేవస్థానంవారు అన్నమాచార్య జయంతి ఉత్సవాలను 1978 నుండి వైభవంగా నిర్వహిస్తున్నారు.

అన్నమాచార్య సాహితీ పరిశోధకులైన శ్రీయుతులు సాధు సుబ హ్మణ్యశాస్త్రి చాగంటి. శేషయ్య, గౌరిపెద్ది రామసుబ్బశర్మ, ఆచార్య జి.ఎన్‌.రెడ్డి, కామిశెట్టీ శ్రీనివాసులు శెట్టి, డా! ఎప్‌. గంగప్పగారలు చిన్నన్న ద్విపదను; రాగిరేకుల వ్రాతప్రతిని అనుసరించి అన్నమయ్య జననకొలాన్ని క్రీశ 1408 సంవత్సరంగానే నిర్ణయించారు.

తాళ్ళపాక కవుల రచనలను, సారస్వత సేవను లోకవిదితం చేసిన క్రీశ. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు క్రీశ. 1945 సం!$లో వేంక కేశ్వర వచనాలకు. పీరిక వ్రాస్తూ అన్నమయ్య జననం శ్రీశ. 1408గావే నిర్ణయించారు. కాని క్రీశ. 1949 సం1[లో 'అన్నమాచార్య చరిత్ర చ్విపద కావ్యానికి పీఠీక వ్రాస్తూ అన్నమయ్య శ్రీశ. 1424 నుండి క్రీశ. 1503 దాకా జీవించినట్లు ేర్కొన్నారు. వీరి కుమారులు డా! వేటూరి ఆనందమూర్తిగారు 'తాళ్ళపాకకవుల కృతులు-వివిధసా హితీ ప్రక్రియలు! [1975 సం!) అనే గ్రంథంలో అన్నమయ్య జీవితకాలాన్ని శ్రీశ 1424-1503 గానే నిర్ణయించారు,

12 త్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల అన్నమయ్య, పెదతిరునులయ్యల రాగిరేకులమోది వ్రాతను బట్టి, పరిశీలకుల భావసరణిని బట్టి అన్నమయ్య జననకాలం - శా.శకం 1330, శ్రీశ 1408 సంకీర్తనల రచనా ప్రారంభకాలం - శా,శకం 1346, క్రీశ, 1424 అన్నమయ్య నిర్యాణం - శా.శకం1424, (శ్రీశ]1503 అని నిర్ణయించ వచ్చును. అన్నమయ్య బాల్యం: హరి నందకాంశజుం డగుట డెందమున పరమ సుజ్ఞాన సంపద పొదలంగ (అన్న. చరిత్ర.ద్విపద-పుట-10) పసిబిడ్డడైన అన్ననుయ్య వెంకన్న ప్రసాదమని చెబితేనే ఉగ్గుపాలు ర! శ (తాగేవాడు. వేంకటపతికి మొక్కుమని చెబితేనే మొక్కేవాడు. వేంకట పతిమాద జోలపొడనిదే నిద్రపోదు. లక్కమాంబ భక్తిగీతాలు పాడుతుంటే పరవశించి పోయేవాడు. ఇలా అన్నమయ్య శిశుప్రాయంనుండి నేంకటపతి మోది ధ్యాసతో ప్రొద్దులు గడేపువాడు. అన్నమయ్యకు ఐదు సంవచ్సరాలు నిండాయి. నారాయణసూరి ఆర్యుల సమ్మతిని అన్నమయ్యకు ఉపనయనం చేయించాడు. క. అహినాయకొద్రి వెన్నుని వరముచే విద్య అన్నియును నమితంబు లగుచు జిహ్వారంగ సీమ తముందామె సొచ్చి వర్తనమూడందొడంగె (అన్న. చరిత్ర. ద్విపద-పుట-11) అన్నమయ్య ఆడినమాటెల్లా అమృతకావ్యంగా, పొడినదెల్లా పరమ గానంగా భాసించేది, చిన్ననాటనే వేంకటసతి మోద వింత వింతలుగా సంకీర్తనలు ఆలసించేవాడు, కాని అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామి

జీవిత చరిత్ర 13 ఆడేశం పొందినది తన పదహారవ సంవత్సరంలోనే! వేంకక్రేశ్చ్వరస్వామి ఆదేశం. ప్రకారం అన్నమయ్య తన పదహారో ఏటనుండి రోజుకొక్క సంక్రీర్తనకు తక్కువకాకుండా వ్రాయడం ప్రారంభించాడు. ఈ నిషయం రాగికేకులమోద తొలివాక్యాలవల్ల కూడా స్పష్టమవుతున్నది. అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు, వదినె చెప్పినపనులు అన్నీ విసుగువెందక చేసేవాడు, ఉమ్మడి కుటుంబాల్లో పనులు తప్పవు. అందుకనే ఎప్పుడూ దండె భుజాన తగిలించుకొని పాటలు పాడడం ఇంటివారలకు అంతగా నచ్చేదికాదు. ఒకనాడు అందరూ కలసి పశువులకు గడ్డితెమ్మని అన్నమయ్యను అడవికి పంపారు. అన్నమయ్య అడవికి వెళ్ళి పచ్చనిగజీకను చూశాడు, *పాపవల్లరుల శ్రీపతినామ హేతి నే పారందజుంగు యోగీంద్రు చందమున (అన్నచరిత్ర.ద్విపద.పుట-12) కొంత వచ్చికను కోసాడు. పచ్చికకోస్తున్నా మనసంతా శ్రీహరి మీదనే వున్నది. అందుకే మరికొంత పచ్చికకోయబోయిన అన్నమయ్యకు కడ(వేలు తెగి రక్తం కారింది. వేదనలో విరక్తి, భక్తి జనించాయి. వేదనలో వేదం ప్రభవించినట్లు ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తిరసావేశానికి నాంది పలికింది. లౌకీకబంధాల పై మమకొరం వీడిపోయి- అయ్యో పోయంబ్రాయము(గాలము ముయ్యంచు మనసున వనే మోహమతినైతి! తగు బంధులా తనకుందల్లులునుందండ్రులును వగలంబెట్టుచుందిరుగువారేకాక మిగుల నీరల పొందు మేలనుచు హరినాత్మ€ దగిలించలేక చింతాపరుండనైతి! (పంపుటం-1 సంకీ-179)

అని చింతించి-

తల్లియుందండ్రియు. దైవంబు గురువు

నెల్ల సంపదలునై యొల్ల చందముల

వనుంబ్రోచు శేషాద్రైనాథుని, గొలిచి

మనియెద్‌ ... ... . ౨.

(అన్ను చరిత్ర.ద్విపద-పుట-12)

అని నిర్ణయించుకొంటాడు. తిరుమల పయనం;

ఆ సమయాన అన్నమయ్య తిరునులకువెళ్ళే యాత్రికుల గుంపును చూశాడు. చేతిలో వున్న కొడవలిని పొజవేసి యాత్రికులగుంపులో కలసి పోయాడు. ఆ యాత్రికులు సనకాదులనే భక్తబృందం. నారు జింకచర్మపు కిరీటాలు పెట్టుకొన్నారు. కాకి బంగారు, పాటుటాకుల బట్టలు ధరించారు. ఫాలతలమున దట్టమైన ప్టనామాలు, శంఖ చక్రముదికలు, కాళ్ళకు కంచుటందెలు పెట్టుకొన్నారు. దండెలు మొటుకొంటూ చిటితాళాలు వాయిస్తూ భక్తిపారవశ్యంతో-

చవేదుకొందానూ వెంకటగిరి వేంకకేశ్వరుని!

ఆమటి మొక్కులవాండే ఆదిదేవుండే వాండు

శోమని పళ్యాలవాడే దురితదూరుండే॥

వడ్డికాసులవాండే వనజనాభుండే పుట్టు

గొడ్డురాండ్రకు బిడ్డలనిచ్చే గోవిందుందే!

_ఎలమింగోరిన వరాలిచ్చే దేవుండే వాండు

అలమేల్మంగా శ్రీవేంకటాద్రినాథుండే॥

(అన్న. చరిత్ర. పీఠిక-పుట-6)

అని చిత్రగతుల పాడుకొంటూ కొండకు పయనమవుతున్న యాత్రికులతో కలసి తిరుసతి చేరుతొడు అన్నమయ్య.

జీవిత చరిత్ర 15 తిరుపతి పొలిమేరలోకల గ్రామశక్తి తాళ్ళపాక గంగమ్మను సేవిం చాడు. ఈ తాళ్ళపాక గంగమ్మ (ప్రావీవదేవత అని స్థానికుల అభిప్రాయం. తిరుపతిలో ఇంకా తాతాయగుంట గంగమ్మ, అంకాళమ్మ, వేశాలమ్మ, కాళెమ్మ, నేరేళ్ళమ్మ, కావమ్ము, నూరలయ్య అనే గ్రామశక్తులు కొలువై వున్నారు. పూర్వం తిరుషతికి వచ్చే భక్తబృందం మొదట తాళ్ళపాక గంగ మ్మను “సేవించిన తరువాతనే తిరుమలను సందర్శించే ఆచారం వుండేది. నేటికీ తిరుపతిలో మేనెలలో (గ్రామశక్తి గంగమ్మజాతర వైభవోపేతంగా జరుగుతుంది. గంగమ్మను దర్శించిన అనంతరం అన్నమయ్య- 'అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము లందు వెలుగొంది ప్రభమారంగాను"

(పంపు-1-సంకీ-227) అని 108 తిరుపతులను కీర్తిస్తూ అచ్చటి చక్రవర్తి పీఠాలు, దేశాంత్రుల మరాలు, తపస్వుల గృహాలు, విశ్రాంతదేశాలను సందర్శిస్తాడు. తిరుమలకు పయనమవుతూ మార్గమధ్యంలోని _అళిపురిసింగరి, తల యేరుగుండు, ెదయెక్కుడు, కపురంపు కాలువలను సందర్శించాడు,

ఇక్కడ అళిపురిసింగరి, తలయేరుగుండు, కురువమండపం, పెద యెక్కుడు, కపురంపుకాలువ, మోకాళ్ళముడుపులను. గూర్చి వివరించడం సమంజసం. అళిపురి సింగరి:

4

కొండెక్కుడులో తొలిమెట్టుగల ప్రాంతం అళివురి. ఆడిపడి, అలిజరి అని వ్యవహారనామాలు._ ఇక్కడ వెలసీన నృసింహాస్వామిని అన్నమయ్య దర్శించాడు. తలయేరుగుండు:

కొండను ఎక్కేభక్తులు ఈగుండును తలతో, మోకొటితో తొకీ నమ స్కరిస్తే తలనొప్పి, కాళ్లనొప్పులువుండవని నక్ముకది ఈ గుండు మొద న!

16 త్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల ఆంజనేయస్వామినారిమూర్తి కన్పిస్తుంది. తలయేరుగుండు వద్దనే శ్రీ పాదాలు వున్నాయి. ఇచ్చటనెలకొన్న శ్రీపాదాలనుగూర్చి ఒక ఐతిహ్యం కలదు.

శ్రురామానుజులవారు తిరుమలనంబివద్ద తలయేరుగుండుసమీపంలో రామాయణ _ రహస్యార్థాలను తెలుసుకొనేవారు. వారికి రహస్యార్థాలు వివరించే సందర్భంలో తిరుమలనంబికి మధ్యాహ్నం సమయములందు తిరునులకు వెళ్ళి స్వామి పూజచేయుటకు ఆటంకమేర్ప్చడుతూ ఉండినది. ఇందుకు తిరుమలనంబి బాధచెందగా స్వామి పాదములు తలయేరుగుండువద్ద (ప్రత్యక్షమైనట్టు ఐతిహ్యం. స్వామి పాదపద్మాలను అన్నమయ్య-

  1. బ్రహ్మకడిగిన పాదము (21-191)

*+2) ఈ పాదమే కదా యిలయెల్లంగొలిచినది (1-66) అని కీర్తించి యున్నాడు. కురువ మండపం;

తలయేరుగుండు. దాటిన తర్వాత కనిపించే నిశేషస్టలం కుమ్మర మండపం.

కురువనంబి, కురువరతినంబి అనే కుమ్మరిభక్తునిగూర్చి అన్నమయ్య కీర్తనల్లో "పేర్కొన్నాడు. ఈ కుమ్మరి ప్రతినిత్యం కుండలు చేయగా మిగిలిన బంకమట్టితో పూలుచేసి తొను కొయ్యతో తయారుచేసుకొన్న వేంకశేశ్వరుని పూజించేవాడు. తిరుమల అర్బామూర్తిని తొండమాన్‌ చక్రవర్తి బంగారు పూలతో అర్చించేవాడు. ఒకనాడు చక్రవర్తి సమర్పించిన బంగారు పుష్పాలు తొలగి కురువరతినంబి సమర్పించిన బంకముట్టిపూలు స్వామి చరణాలమోద నిలిచాయి. రాజు కుమ్మరివాని భక్తి విశ్వాసాలను తెలుసుకొని శరణు వేడుకొంటాడు.

“కురువి అంటే కొండమిోదికి వెళ్ళే కాలిత్రోవ. కాలిత్రోవలో కొపురం చేసే నంబి కాబట్టి 'కురువనంబి అని వ్యవహారం. అన్నమయ్య కురు

జీవిత చరిత్ర 17 వరతినంబిని గూర్చి కొండలలో నెలకొన్న కోనేటిరాయంవాండు (సంపు 1-సంకీ-151), కురువనంబి తిరుమల కురుననంబి (తాళ్ళపాక శేషాచార్యుల వ్రాతప్రతి ఆనే సంకీర్తనల్లో ప్రస్తావించాడు. పెద్దయెక్కుడు ఫి వా! ఇక్కడమెట్లు నిట్టనిలువుగా వుంటాయి. పల్లవరాయని మఠం : క్రీశ. 1287 ప్రాంతంలో నమ్మాళ్వారు మండసాన్ని నిర్మించిన వాడు పల్లవరాయడు. ఇతడు. చేపట్టిన నిర్మాణాల్లో పల్లనరాయని మఠం మరొకటి. కప్పురంపు కౌలువ : "పెద్దయెక్కుడు, మోకాళ్లముడుపులకు మధ్య ఈ కాలువవున్నది. అన్నమయ్య కప్పురంపుకాలున కమ్మనివాసనలు ఆఘ్రాణిస్తూ గుబురుగా ఆఅలముకొన్న బెట్లను, పూపొదలను, జలప్రవాహాలను చూసు కొంటూ మోకాళ్ళసర్వతం చేరాడు. ఆ సర్వతం చేరేటప్పటికి మధ్యాహ్న సమయం కావస్తోంది. అందునా" ఎన్నండు తల్లి పక్కెడసి యొండెడల నున్నట్టివాండు కాకుండుటవలన కడప వాకిలిదాటి కడయిండ్లకడకు నడచుట మునుపు నెన్నండులేదు గనుక పొదశ్రిందయార్చుండి పొాలయు లేంయెమటం దొడిగిన చెప్పులతోడవే మిగుల బడలిక నొక రాతిపై -..- (అన్నం చరిత్ర.ద్విపద-పుట-15) శయనించాడు.

18 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల మోకొళ్ల ముడుపు ; వేంకట3ైలము సాలగ్రామమయమైనది కనుక యాత్రికులు మోక్షాళ్లతో నడిచేవారని అంటారు. ఒక్కొక్కమెట్టు మోకాలి ఎత్తు కలిగి మోకాళ్లు ముడుచుకొంటూ ఎక్కడంవల్ల మోకాళ్లముదుపనే పేరు వచ్చిందని కూడ అంటారు. బాలఅన్నమయ్య అలసటను, ఆకలిని జగదంబ అలమేల్మంగ గమ నించింది. కరుణాపాంగ అలమేల్మంగ విలపత్కాంతులు వెదజల్లుచు ఒక _పెద్దముత్తెదునవలె బాలుడున్న ప్రదేశానికి చేరి సేదతీరుస్తుంది. సాలగ్రామమయ్‌ మైన తిరుమలను చెప్పుకాళ్లతో ఎక్కరాదని చెప్పి శారి, తాను భుజించిన ప్రసాదాన్నాలు పెట్టి కందర్పజనకుని సందర్శించే మార్గం సూచించి అంతర్భ్థానమవుతుంది. ఆన్నమయ్య అత్తటీ నలుదిక్కు అరసి యా శిశువు చిత్తంబులోన నచ్చెరువందుకొనుచు అ666. 26699 000 మీ పద్మ తన కేల విడు ప్రపసాదప్రభావమున పరమ సారస్వత పారీణుండగుచు పరస కవిత్వవాచాప్రాథి మెజపి యళలమేలుమంగకు నాశుమార్గమున సలలితంబుగ నొక్కశతకంబుంబెప్పె (అన్న. చరిత్ర.ద్విపద-పుట-18) శతకచర్చ ? ఈ శతకం వావిళ్లవారిచే 1947సం!$లో ప్రకటించబడింది. వీరు (ప్రచుర పరచిన “శ్రీవేంకటేశ్వర శతకం" లో “వేంకటేశ్వరా అనే పద్యాంతసంబోధన వున్నా తొళ్లపొకఘనుడు శతకమాలికను సమర్పించినది అలమేలుమంగకే!

జీవిత చరిత్ర 19 32,000 పదాలను శ్రీవేంక కేశ్వరాంకితంగా రచించిన అన్నమయ్య తొలిరచన శ్రీవేంకటేశ్వర శతకం కొనడం గమనించదగ్గ విశేషం. “వేంక 'పేశ్వర శతకోమని వ్యాప్తిలో వున్నా ఇందలి విషయప్రాధాన్యాన్ని బట్టి ఇది “మంగాంబికా శతకమే' యని శీ.శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు అభిప్రాయ పడ్గారు. డా అలమేల్మంగకు శతకం సమర్సించి మోకాళ్లముడుపునుండి అన్నమయ్య అలమేల్మంగ ఆశీర్వాదబలంతో తిరుమల చేరుకొంటాడు. తిరుమలలో దివ్యస్టలాలను సందర్శించుట .: పుష్కురిణి:- అన్నమయ్య తిరుమలలో మొదట సర్వపాపాలను ప్రక్షాళనం చేసే స్వామిపుష్కురిణిని పందర్శించాడు. ఈ స్వామిపుష్కరిణిగూర్చి వరాహ పురాణంలో- స్వామిపుష్కురిణీ స్నానం సద్గురోః పాదసేవనమ్‌, ఏకాదశీవ్రతం చాపి త్రయ మత్యన్త దుర్లభమ్‌. దుర్లభం మానుషంజన్మ దుర్లభం తత్ర జీవనమ్‌, స్వామిపుష్కురిణీస్నానం త్రయ ముత్యన్త దుర్లభమ్‌.

( అధ్యాయం-35-క్లోకం-26) అని ప్రస్తుతించబడి వుంది. స్వామి పుష్కరిణియందు స్నానము, సద్గురుని సమొజ్రయం, ఏకాదశీ వ్రతానుష్టానసిద్ధి అనే మూడుసంఘటనలు ఘుటి ల్లడం పుణ్యవిశేషం. ఎనఖైనాలుగులక్షల ప్రాణులలో మనుష్యజన్మ లభించడం దుర్లభం. క్రమంగా వర్థ్ణాశ్రమాలను నెరవేర్చడం దుర్లభం. అందును ఒక్క సొరి అయినా శ్రీస్వామి పుష్కర్షిణియందు స్నానమాచరించడం ఆత్యంత దుర్లభమని వరాహపురాణం,

అన్నమయ్య పరమపొవనం, అఖిండవైభవాలకు నిలయమైన

20 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల నావావిధాననోన్నతమైన యట్టి కోనేజు కడతెంచి .... .. = యట కృతస్నానుండై "సెనుపోబనాలు చూసెదు పోబవాలు గమపట్టు స్వామి పుష్కరిణి (అన్న. చరిత్ర. ద్విపద-పుట-18) పోయగాన్ని చూసి విస్మయంచెంది- డేవృనికి దేవికిని తెప్పలకోనేటమ్మ వేవేలు మొక్కలు లోకపొవవి నీకమ్మా (పంపు. 2-సంకీ-426) అని కీర్తిస్తాడు. అన్నమయ్య సంకీర్తనరాశిలో ఎందుకు నీకు ప్రియమో యీ తెప్పతిరువాళ్ళు దిందువడె సీరులతో తెప్పతిరువాళ్ళు (సంపు.2- పంకీ-143) అని పుష్కరిణిని వర్ణించిన మరో సంశ్రీర్తన కన్పిస్తున్నది. తిరుమలలో తెప్పోత్సవం ప్రతిమంగళవారం ఆర్జిత సేవగా, మరియు ఫాల్గుణశుద్ధఏకాదశి నుండి పూర్ణిమవరకు సర్కారు సేవగా నిర్వహించడం సంప్రదాయం. వరాహస్వామి ఆలయం : స్వామిపుష్కరిణిని ' శేవించి అన్నమయ్య వరాహస్వామి ఆలయం చేరాడు. తిరుమలకు వరాహ శ్షేతమని నామాంతరం. స్వామి పుష్కరిణికి వాయవ్యదిశయందు ఈ ఆలయం ఉన్నది. వరాహస్వామియే వేంకకేశ్వ రునికి తిరుములలో ఉండటానికి అనుమతి ఇచ్చాడని ప్రతీతి, అందుకు కృతజ్ఞతగా తొలుత వరాహస్వామిని సందర్శనం చేసుకొన్న తర్వాతనే వేంక ఓేశ్చరస్వామి. దర్శనం అని కట్టడీ ఏర్పడినట్లు పురాణాలు చెప్తున్నాయి.

జీవిత చరిత్ర 21 ఇప్పటికి తిరుమలలో తొలిపూజ, నైవేద్యాలు వరాహస్వామికే! వరాహస్వామి ఆలయ సందర్శన అనంతరం అన్నమయ్య "దగోపురానిక్రి నీడ తిరుగని చింతచెట్టుకు, కోరికలు ఇచ్చే గరుడకంబానికి సాగిలపడి నమస్కరించాడు. చంపకప్రదక్షిణం చేశాడు. పిదప ప్రసాదశాలకు చేరి తిమ్ముప్పనికి నివేదితమైన భక్ష్య భోజ్యాలు, వెన్నగాచిన నేతి వింతపచ్చళ్లు, దధ్యోదనాలు, అప్పాలు, పాలు, అతిరసాలను దాసులకు సమర్పిస్తున్న వైభవానికి- అవ్వేల్పు తళిఘలక్రిందం జిందంగాంజేత నూర్చిన నంటివచ్చు నొకవాంటి వెయ్యి వేతొక దేవళమున నొకయేటవైనను నున్నదే యనుచు - (అన్నం చరిత్ర.ద్విపద-పుట-20) ఆశ్చర్య మొందినాడు. ఈ వర్ణనను బట్టి అన్నమయ్య కాలంనాటికి తిరుమల న! ళం ఎంతవైభవంగా వెలుగొందినదో వూహించనగును. అట అన్నమయ్య శ్రీనివాసునికి నమస్కరించి, భాస్యకొరులను పొగడి, శ్రునరసింహుని సేవించి, జనార్హనుని సన్నుతించి, అలమేలుమంగకు అభివం దవాలు సలిపి, యాగశాలను కీర్తించి, ఆనందనిలయాన్ని దర్శించుకొంటాడు. అస్లే స్వామివారి కళ్యాణ మండపాన్ని, బంగారు గరుడుని, అశ్వ, శేష వాహనాలను తిలకిస్తాడు. తిరుముల ఆలయంలో నృసింహస్వామి ఆలయం ఈశాన్యదిశయందు వున్నది. నేటికీ ధనుర్మాస సందర్భంలో నెలరోజులు స్వామికి ప్రసాదనివేదన జరుగుతుంది. నాహనమండపంలోని గరుడవాహనంగూర్చి" ఇటు గరుండని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గనయిగిలె! ఆవి (పంపు, 1-సం-కీ-92)

22 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల శేషవాహనం గూర్చి వీండు గదే శేషుండు థ్రీవేంకటాద్రి శేషుండు వేడుక గరుడవితోంబెన్నుద్దైన శేషుండు! అని (పంపు-8-కీ-365) ఆశ్వవాహనం గూర్చి నీవు దురగము మాద వేర్ప్చు మరయ వేవేలు రూసము వెదచల్లితపుడు 8 అవి (సంపు-12-8-210) వివిధ వాహనాలను గూర్చి కీర్తించాడు. పిదప తట్టుపునుగు తయారుచేే ప్రదేశాన్ని సందర్శించాడు. తట్టుపునుగు తయారు చేసే ప్రదేశం చెంతనే బంగారుపళ్లెంలో చక్కెర లారగించుచు *వేంకటపతిని సేవించండి, కొను కలు సమర్పించండి, కొండలప్పకు దండాలు 'పెట్టండో అని పలుకుతున్న పంచవన్నియు రామచిలుకల పలుకు లాలకిస్తాడు అన్నమయ్య, స్వామివారి పట్టుపీతాంబరాలున్న శ్రీభండారాన్ని చూశాడు. తన పంచ కొంగున దాచు కొన్న ఒకకాసుతీసి బంగారు గాదెలకు నమస్కరించి స్వామికి సమర్పించాడు. బంగారు వాకిలిచేరి స్వామిని దర్శించి పులకితగాతుడయ్యాదు. ఈవర్థన లాధారంగా అన్నమయ్య కొలంనాడు తిరుమలలో భక్తులు శ్రీ వేంకశేశ్వరుని దర్శించుచుండిన (క్రమమే కాక, నాటి దేవాలయ పరి సరాలు కూడా విదిత మవుతున్నాయి. తిరుముల ఆలయ పరిసర వర్ధనలకు సంబంధించిన సంకీర్తనలు వీరి వాబ్బయంలో అనేకం కన్పిస్తాయి. మచ్చునకు ఒక సంకీర్తనా సేవించి చేకొన్నవారిచేతి భాగ్యము వేవేగ రారో రక్షించీ విష్ణుడీతందు! గరుడ గంభముకాడ కదుంబ్రాణాచారులకు వరము లొసంగీవి శ్రీవల్లభుండు తిరమై కో నేటిచెంతంద్‌ర్థఫలము లెల్ల పరుషల కొపంగీని పరమాత్ముండు!

జీవిత చరిత్ర 23 "పేనమొదలారివద్ద చిత్తములో సుజ్ఞానము నానాగతియిట్టించీవి నారాయణుడు కానుక 'పైండి గాదెలకాడం దననిజరూప్పు అనుక పొడచూపీని అభిలేశుందు! సన్నిధినర్భగ్భహాన చనవిచ్చి మాటలాడి విన్నపాలు వినీ శ్ర్రీవేంకళ్రేశుండు యెన్నికంబాదాలవద్ద యిహముంబరముంజూ పీ నున్ననల అలమేలుమంగ విభుండు!

(సంపు-3-క-513)

ఈ విధంగా అన్నమయ్య తిరునుల ఆలయపరిసరాలన్ని

తిలకించి బంగారువాకిలిచేరి శ్రీనివాసుని _ దివ్యమంగళవిగ్రహాన్ని సంద

రించాడు,

వైభవోన్నతమైన స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని సందర్శించి దేవ దేవుండితండే దివ్యమూరితి యేనలంజూచినందానే యీరూ సైవున్నాండు | వెంకటాచలముమో6ది విశ్వరూప విశేషము అంకెల ననంతావతారానైన నిశేషము |

(పంప్పు-10-$-50)) అని. కీర్తించాడు. సర్వాలంకారకోభితుడైన స్వామిని గూర్చి ఆనందాళిశయంతో

కంటింగంటి నిలువుచక్కనిమేను దండలును

నంటుంజూపులను జూచేనవ్వుమోము దేవుని

కనకపుంబాదములు గ్దెలు నందెలును

ఘనపీతాంబరము పైకట్టు కటారి

మొనసి యెడ్డాణంపు మొగపుల మొలనూలు

ఒనర నాభీకముల ముదర బంధములు |

(అన్న చరిత్ర పీఠిక-పుట-23)

ర్‌

వడ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల అని వినుతించాడు. స్వామి పాదపద్మాలను- ఈ పొదమేకదా యిలయెల్లగాలచినది యీ పొదమేకదా ఇందిరాహప్తముల కితవైనది ॥ (సంపు-1-కీ-66) అని శ్లాఘించాడు. స్వామివారి సుదర్శనచక్రాన్ని- మొక్కెద మిదివో మూండు మూర్తులును వొక్కరూపమ్టై వొవరెంజక్రము | (సంపు-2-కీ-516) అని స్తుతించాడు, తాళ్ళపాక అన్నమయ్యపుతుడు తాళ్ళపాక పెదతిరుములయ్య సుదర్శన చక్ర మాహాత్మ్యాన్ని 'సుదర్శ రగడ' అనేపేరుతో కావ్యంగా వెలయించాడు. శ్రుమహావిస్టువు పంచాయుధాల్లో ఒకటైన సుదర్శన చకక్రాన్ని- “ఒంకొరాక్షర యుక్తము చక్రము సాంకమధ్య వలయాంతర చక్రము సర్వఫలప్రద సహజము చక్రము పూర్వకోణ సంపూర్ణము చక్రము హర విరించి దివిజాశ్రయ చక్రము గురుగతి 'రెండవకోణపులుక్రము' (లఘుకృతులు-పుట-64) అని భక్తిప్రపత్తులతో కీర్తించాడు, తాళ్ళపాకలో చెన్న కేశవస్వామి ఆలయంముందట సుదర్శన చక్రం ప్రతిష్టించబడి వుంది. ఇంతేకాక తిరుపతి గోవింద రాజస్వామి ఆలయ- (ప్రాంగణంలో సుదర్శనస్వామి చక్రత్తాళ్వారు. మూలమూర్తి ప్రతిష్మితమై వున్నది. స్వామి దివ్యమంగళవి [గ్రహాన్ని ఆయుధాలను అన్నమయ్య పరిపరివిధాల కీర్తించి తన్మయత్వంలో-

జీవిత చరిత 25 కంటి నయ్యభిలాండకర్త నే నధికుల గంటి వాయఘము నిక్కము వీడుకొంటి (అన్న. చరిత్ర.ద్విసద-పుట-23) అని స్వామిని కీర్తించగా అచ్చటి అర్చకులు బాలుని భక్తితత్సరతకు ముస్ణులై తర్ణప్రసాదాలుఇచ్చి శరగోపంతో దీవించారు. వెంటనే- శ్రీహరి పాదతీర్థంబే వెడనిమందు మోహపొశాలుగోసి మోక్షమిచ్చేమందు ॥ కారమై కంటగించని కదుంజల్లని ముందు నూజవి కాచనియట్ల్టీ నున్నని ముందు ॥ పంకజాక్ష వేంకటరమణ ప్రపన్నుని మందు “పెంకించక తన దాసులంజేపక్టేముందు (అన్నం చరిత్ర-ద్విసద-పుట-34) అని. స్వామి ' తీర్రమహాథణ్మ్యాన్ని కొనియాడి ఆనాటికి ఒకమండపంలో విశ్రమించాడు అన్నమయ్య. తీర సందర్శనం: హే మరునాడు అన్నమయ్య తిరుమలమిద ప్రపిద్ధములైన కుమొరధారా తీర్థం, అమరతీర్థం, ఆకాశగంగ, జరహరతీర్థం, వలిఘ్నతీర్థం, విరబాతీర్థం, పొపవినోశనం, వైకుంఠతీర్థం, జాబాలితీర్థం, చక్రతీర్థం; తుంబురుతీర్థం, కాయరసాయనతీర్ధం, విష్వక్సేనతీర్థం, పంచాయుధతీర్థం, అగ్నికుండలీర్థం, 'బ్రహ్మతీర్థం, సప్తబు షితీర్ధం, పాండవతీర్ధం, దేవతీర్థాదులన్నింటిని సందర్శిం చాడు. ఈ ప్రసిద్రతీర్ధాల ప్రస్తావన వర్ణాహస్కొాంద పురాణాల్లో కన్పిస్తుంది. తిరుమలలో వెలసిన పుణ్యతీర్థాలను గూర్చి వరాహపురాణంలో - త్రిప్రా కోట్యోఒర్థకోటీ చ తీర్ధాని భువనత్రయే, తేషాం ప్రకృతిభూతాని తీర్థాన్య స్మిన్‌ హరేర్గిరొ. (వరాహపురాణం-41 అధ్యాయం-19 క్టోకం) అని పేర్కొనబడినది,

చ త్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల అన్నమయ్య సర్వతీర్థాలను సేవించి, స్నాన మాూచరిస్తూ జి ఆఆ ఆఆ ఆం ఆ తేటనీట ధవళంబుగా మును దాంట్టు చీర నుదెకి యారగవైచి యొకరాతి దండ నది యెండ నారెడు నంత లోపలనె శతకంబు కుతుకంబు సమకూరంేసీ (అన్న చరిత్ర.ద్విపద-పుట-24) ఇలా అన్ననుయ్య స్వామివారికి శతకాలను సమర్పించాడు. శతకమాహాత్మ్యం : అన్నమయ్య తీర్థస్నానం ముగించుకొని పండైండునానూలు తీర్చుకొని స్వామి సందర్శనానికి వెళ్ళాడు. ఆలయం మూసివుంది. వెంటనే- వేంకటపతి మోంద వివరస్తవముగ వేంకట శతకంబు విన్నవించుటయు (అన్న. చరిత్ర.ద్విపద-పుట-25) వెంటనే ఆలయం తలుపులు తేరచుకొన్నాయి. అర్చకులు అన్నమయ్య మహిమను గుర్తించారు. అన్నమయ్యను స్వామి సందర్శనానికి తీసుకు వెళ్ళారు. అన్నమయ్య అక్కడ చేంచే సివృన్న గరుడాళ్వారుని, విష్వక్సేనుని, సీతా లక్ష్మణ హనుత్సమేత శ్రీరామచంద్రుని సేవించాడు. వీరికి పేవైమొదలారను నామాంతరం కలదు. తిరుమల గర్భగుడిలో ఉత్సవమూర్తులతో ఈ _ మూర్తి పూజించబడులోంది. అధ్యయనోత్సవ సమయంలో ఈ దేవునకు ప్రత్యేకమైన ఆరాధన కలదు. అన్నమయ్య సంకీర్తనా వాబ్బయంలో ేనమొదలారికి సంబంధించిన రెండు కీర్తనలు కన్పిస్తాయి.

జీవిత చరిత్ర లా పటు శిష్ట్రప్రతిపాలకుండ వనంగ ఘటన నఖిలమును గాతువుగా | (సంపు-1-సంకీ-207) నీవేకా చెప్పంజూప నీవె నీవెకా శ్రీవిభు ప్రతినిధివి సేనమొదళారి ॥ (పంపు-1 సంకీ-255) స్వామి సన్నిధిలో వెలసిన హనుమంతుని గూర్చి కాబోలు అన్నమయ్య- ఓ పవనాత్మజ ఓ ఘనుండ బాపు బాపనంగ బరగితిగా | ఓ దశముఖహర నేంకటపతి పాదసరోరుహ పాలకుండా ॥ (సంపు-]1 భా-1-సంకీ-31) అని కీర్తించాడు. అన్నమయ్య అర్బకులవెంట వివిధ అర్భామూర్తులను సం సేవించి వేంకట గిరిపతి ఎదుట 'నిలిచాడు. “మురవైరి రెండవమూర్తి యో యనంగ గర మొప్పుచున్న వైఖానసోత్రముండు నంబి చెంగటయబీజనముపేయు తటీని పంబిన భక్తి నబ్బాలుండు మజీయు వెంకటప్పకు విన్నవించిన తొంటి వేంకటశతకంబుింం 4 44 (అన్న. చరిత్ర.ద్విపద-పుట-26) విన్నవించాడు. వెంటనే స్వామి ధరించిన ముత్యాలహారం క్రిందపడింది. ఆర్భకులు సంభ్రమంతో బాలునిమహిమను కొనియాడారు.

28 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వేంకకేశ్వరశతక చర్చ :

తాళ్లపాకచిన్నన్న ద్విపద ఆధారంగా పరిశీలిస్తే అన్నమయ్య అలమేలు మంగకు నాశుమార్గమున

సలలితంబుగ నొక్క శతకంబుంజె ప్పె (అన్న, చరిత్ర.ద్విపద-పుట-18) అని అలమేలునుంగాంబికా శతకాన్ని, వేంకటపతిమోంద వివరస్తవముగ వేంకట శతకంబు విన్నవించుటయు (అన్న. చరిత్ర.ద్విపద-పుట-25) అనుటను బట్టి వేంకటేశ్వర శతకాలను చెప్పినట్టు తెలుస్తోంది.

_ కథాసందర్భాన్నిబట్టి చిన్నన్న పేర్కొన్న ఈ రెండు శతక్షాలు వేర్వేరని స్పష్టమవుతున్నది. కాని ఇందులో వేంకకేశ్వర శతకం ఒక్కకే లభ్యం. ఇందులో ఆలమేల్మంగాంబికాస్తుతి, మహామ హిమాన్వితమైన జగన్మాతృ వైశిష్ట్యం వర్ణించబడినది. ఈ శతక అంకితాంక పద్యం కూడా అమ్మవారికి పమర్పింప బడినదియే! కనుక మనకు లభ్యమైన వేంకక్రేశ్వర శతకమే 'మంగాంబికాశతకం' అని అభిప్రాయ పడవచ్చును, స్వామితీర్ధ పందర్శన సమయంలో అన్నమయ్య చెప్పినట్లుగా "పేర్కొనబడిన వేంక కేశ్వరశతకం లభించలేదు,

అన్నమయ్య స్వామివారి ప్రసాదాలను స్వీకరించి ఆ రోజుకు నరా హస్వామి ఆలయంలో _ విశ్రమించాడు. తిరిగి ద్వాదశినాడు స్వామిని సందర్శించుకొని తిరువీథులవెంట కోవెలచుట్టి నారాయణ నామస్మరణ చేస్తూ ఒక పంచతిన్నెపై విశ్రమించాడు. పంచసంస్కార దీక్ష

ఆ ద్వాదశి స్వామి అన్నమయ్యను అనుగ్రహిరచిన దినం. వైష్ణవమత స్వీకారానికి స్వామి సంకల్పం పొందినరోజు, ఆ రోజుల్లో ఘనవిష్టువు

జీవిత చరిత్ర 209 అనే వైష్ణవయతి తిరుమలలో నివసించేవాడు. అతడు మహాభాగవతుడు. వైష్ణవతత్త్వాన్ని ప్రబోధించేవాడు. ద్వాదశిరాత్రి స్వామి యతికి * కలలో కనిపించి-

న తాళ్లపాకాన్న

మయ నామకుండైన మద్భక్తుండాకండు

వడుగు నల్లనిచిన్నవాడు న న్నెపుడు

నడుశక సంకీర్తనము సేయు నెపుడు

ముద్దుగారెడునాండు మోహనంబైన

మద్దికాయలనాండు మనవాండె వాండు

గుదిగొన్న నునుపట్టుకుచ్చుల దండె

ముదమున నిజభుజంబున నించువాండు

కడువేగ రేపు నీకడ కేంగుదెంచుం

దడయక నీవు ముద్రాధారణంబు

గావింపు నామాబుగా వాని కనుచు ॥

(అన్న. చరిత్రద్విపద-పుట 270) అని స్వామి తన ముద్రికలు యతికి ఇచ్చాడు. స్వామివారి భక్త వాత్సల్యానికి ఆనంద పరవశుడైనాడు ఘనవిష్ట్ణువు. మరుదినం యతి సంధ్యావం దనాదులు ముగించుకొని స్వామి సమర్పించిన శంఖ చక్రముద్రికలతో యజ్ఞశాలకు చేరాడు. అచట అన్నమయ్యా

శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి | దేవకీసుత దేవ వామన గోవిందా గోపగోపీనాథా | పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి | (సంపు.3-కీ527)

230 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల అంటూ భగవత్సంకీర్తనలు ఆలసిస్తున్నాడు. ఘనవిష్టువు స్వామి చెప్పినట్లు బాలుని “ఆనవాళ్ళు గమనించాడు. సంతృప్తిచెందాడు. బాలుని సమీపించి స్వామి ఆదేశించినట్లు-

వేదమార్గాను సారమున

నాతని శంఖచక్రాంకితుంజేసి

రీతిగాలయంచసంస్క ఎతులు"

(అన్న. చరిత్రద్విపద-పుట-28) గావించాడు. నాటినుండి అన్నమయ్య అన్నమాచార్యుడయ్యాడు. వైష్ణవంలో పంచసంస్కారాలు అతి ప్రధానాలు,

తాపః పుండ్రః తథా నామ మంత్రో యాగశ్చ పంచమః,

అమీ పరమసంస్కారా పారమైకాంత్య హేతనః తాపము (రెండు భుజముల ముద్రికల ధారణ), పుండ్రము (ముఖ మున మరియు భుజము, వక్షస్థ్రలాదులందు కలిపి మొత్తం ద్వాదశోర్థ్వ పుండ్రములు), నామము ((దీక్షాసమయము. నుండి శ్రీనివాస దాసః' ఇత్యాదిగా నామముతో వ్యవహరింప బడుట), మంత్రము (ఓ0 నమో నారాయణాయ), యాగము (భగవదారాధన పద్ధతి) ఇవీ పంచసంస్కారాలు. వెషవం ;

విష్ణువే ప్రధానదైవతంగా కలిగిన మతం వైష్ణవం. భగవద్రామూనుజులు

వైష్పవమత స్థాపనకు అవతరించిన దివ్యమూర్తి. అన్నమయ్య వీరిని ఈము దైవంగా స దైవంగా భావించాడు. సర్వవిద్యాపారంగతులై, విశిష్టాద్వెత సిద్దాంత ప్రవర్త కులై ప్రకాశించారు. క్రీశ 10-11వ శతాబ్దాల కాలంలో దక్షిణభారతంలో జైన, బౌద్ధ, శైవమతాల వ్యాష్తీ ఆధికంగావుండేది. క్రీశ 13వ శతా బ్రంలో రామానుజులు తిరుమలను వైష్ణవపుణ్య క్షేత్రమని నిరూపించి వైఖానస ఆగమం (ప్రకారం ఆలయ ఆగమవిధానాలు కట్టిడి చేశాడు. రామానుజుల విశిష్టాద్వెతతత్త వ్రమే అన్నమయ్యకు ఘననిష్టువు ప్రబోధించాడు.

జీవిత చరిత్ర ర వైష్ణవమత ప్రాశస్త్యం గూర్చి- వలెనను వారిదె వైష్ణవము యిది వలపుందేనెవో వైష్ణవము | యెదుటను శ్రీవేంక కేశ్వరు నామము వదనము చేర్చుట వైష్ణవము ॥ (11-405) ఇరవుగ శ్రీవేంక కేశ్వరు మతమే సిరుల నమ్ముదురు తీవైష్ణవులు (31-409) సహజవైష్ణవాదార వర్తనుల సహవాసమె మాసంధ్య ॥ (1-10) కోవిదు శ్రీవేంకకేశుంగొలిచి ెద్దలకృప వావివర్తనగలవాండువో వైష్ణవుండు ॥ (1-59) వైష్ణవులుగాని వారలెవ్వరు లేరు విష్ణుప్రభావ మివిశ్వమంతయుంగాన (1-36) ఉమ్మడి మోసేవ సేసుకుండేటి వైష్ణవుల సమ్ముఖాన ేవించుకే చాలడా నాకు ॥ (3-28) అని అన్నమయ్య పలుకీర్తనల్లో శ్లాఘించాడు. అన్నమయ్యవల్లనే తాళ్ళపాకవారు వైష్ణవం స్వీకరించి ధన్యులై నారు. ఈ విషయాన్నే అన్నమయ్య మనునుడు చినతిరుములయ్యా ఎట్టి హితోపదేశకుండెటువండి దయాళువు అట్టె తాళ్ళపొకన్నమాచార్యులు || పచ్చితామసుల మమ్ముంబరను సొత్త్వికులంగొ యిచ్చటనె సేసినాండు యెంతచిత్తము 6

32 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల యిచ్చగించి మాకులాన నెన్నండులేని వైష్ణవ మచ్చముగాంగృప సేసె నన్నమాచార్యుండు ॥

(సంపు-16-భా-]-కీ-52) అనే కీర్తనలో ప్రస్తావించాడు.

“అన్నమయ్య జీవితచరిత్ర ద్విపదలో అన్నమయ్య వైష్ణవ దీక్షా స్వీకా రము, తాళ్లపాకకు చేరడం, వివాహం చేసుకోవడం కన్పిస్తున్నది. ఈ సందర్భంలో ద్విపద కావ్యంలో కొంత భాగం శిథిలమైనట్లు తోస్తున్నది.

అన్నమయ్య వైష్ణవమత స్వీకారం తర్వాత కొన్ని సంవత్సరముల పాటు తిరుమలలోనే గడిపినట్లు భావించవచ్చు. అన్నమయ్య ఎనిమిది సంవత్సరాల పీన్నవాడుగ తిరుమలకు వస్తాడు. అట తాళ్లపాకలో నారాయణసూరి, లక్క మాంబలు అన్నమయ్యకోసం పరితపించారు. తుదకు స్వామి అనుగ్రహంచే అక్కమాంబ నారాయణసూరి దంపతులు తిరుమలకు చేరారు. తిరుమలలో తన పుత్రునికోసం వెదికారు. వైష్ణవదీక్ష పొంది, శంఖ చక్రముద్రికలు ధరించి స్వామిపై సంకీర్తనలు ఆలపిస్తున్న అన్నమయ్యనుచూచి ఆ తల్లిదండ్రులు పరవశించిపోయారు. భక్తవత్సలుడైన వేంకటవిభుడు తన తనయునిపై కురిపించిన అనుగ్రహానికి తన్మయు లవుతారు. తను బిడ్డ కారణజన్ముడని

(గ్రహించారు. అయినా కడుప్పుతీపితో అన్నమయ్యను తొళ్లపొక రమ్మని

ఆహ్వానిస్తారు. నిరంతరం హరిచరణ స్మరణాసక్తుడగు అన్నమయ్య తల్లితో

తాళ్లపాకకు. వెళ్ళుటకు ఇష్టపడడు. తల్లిమాటను కాదనలేడు. అందుకే తిరుములవాసుని-

బల్లిదులు నీకం పెంబరులున్నారా నన్ను

దొల్లిటిబారి నింకందోయకుమో యయ్య

(సంపు-]11-1-సంకీ-65)

అని వేడుకొంటాడు. ఆనాడు అన్నమయ్యకు కలలో స్వామి ఆదేశం వినిపించింది.

పరచింత లుడిగి నాపైనె విన్యస్త

భరుండవై యుండ శుభంబు లన్నియును

జీవిత చరిత్ర 33 ననఘాత్మ నినుంజెందు నని వరం బిచ్చి జననివాక్యము' ద్రోయంజనదు కుమార! పోయి రమ్మనిన నప్పుడు మేలుకాంచ యా యచ్యుతునింగొనియాడి (మొక్కుచును జననియుందాను నిచ్చలుందొంటిపురికి జనుదెంచి నిజనివాసముంబవేశించె. (అన్న చరిత్ర.ద్విపద-పుట-28-29) తాళ్లపాకలో అన్నమయ్య : న్‌! స్వామి ఆదేశం ప్రకారం అన్నమయ్య తాళ్లపాక చేరుకొంటాడు. తిరుమలవీడినా, తాళ్లపాకచేరినా అన్నమయ్య భగవత్సం క్రీర్తన గానాన్ని, నారాయణనామస్మరణాన్ని విడనాడలేదు. నవవిధ భక్తిమార్గాలలో ఒకటైన సంకీర్తన భక్తిమార్గాన్ని అనుసరిస్తున్న వాడు, ఆరాధిస్తున్ననాడు అన్నమయ్య, భక్తిరసామృత సింధువులో- కనాను లీలాగుణాదీనాముచ్చెర్భాషాతు క్రిర్తనమ్‌”. అన్నట్లు భగవన్నా మాన్ని, లీలల్ని, గుణాలను క్రీర్తస్తూ తాళ్లపొకలో భగవత్తత్త వ్రబోధనకు త్రీకొరం చుట్టాడు- ఈతని మూలమెపో యిలంగల ధనములు యాతండు మాకుంగలండు యెంతలేదు ధనము.

(22457) మాయకిదె సహజము మాయను "గెలువరాదు మాయానాథుంగొలిచితే మన్నించు నాతండేం

(2-240) కలవి రెండే. భూమి కామనిధానంబులు జలజాకుండు నతని శరణాగతియు.

య (38-412)

94 త్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల హరిగొలిచినవారి కమరు నన్నిసుఖాలు గరిమతో వారలభాగ్యమే భాగ్యము.

(3౩-119) అని అనేక విధాలుగా పరతత్త్వాన్నిగూర్చి తాళ్లపాకలో ప్రబోధించ సాగాడు. యౌవనదశలో అన్నమయ్య పైరాగ్యగీతాలు పాడడం (గ్రామస్తులకు వింతగా తోచినది. బంధుజన పరిహాసమూ తప్పలేదు. అన్నమయ్య వివాహం ;

అన్నమయ్య వైఖరిని ఆతని తల్లిదండ్రులు గమనించారు. పర్య వసానంగా పెండి ప్రయత్నాలు చేయసాగారు. ఫలించలేదు. ఏ వేళంజూచిన నితండు శ్రీరామ గోవింద హరి యనుకొనుచుండుంగాని యలవోక సంసారమది యిచ్చందనకు వలెననండది యెటువంటి గొంటైన నాచారముల దాసరయ్యను జూచి చూచి యే గతియడుచుల నిచ్చు ననిన, (అన్న, చరిత్ర.ద్విపద-పుట-29) చివరకు భగవదనుగ్రహంచే- ఆజం ఆం వారిజోదరుండు దారియు మొనంజూపి తనదు భక్తునకు నన్నయార్యునకుంగన్యకల నిమ్మనిన నన్నన్న యని వారు నరుదందికొనుచు తిరుములమ్మను నొక్కతిరువాలుంగంటి నరుదైన యక్కలమ్మను నొక్కకన్య క్రన్నన నాగమోక్త ప్రకారమున జెన్నుగాంబెండ్లింద్లు చేసి రంతటను. (అన్నం చరిత్ర.ద్విపద-పుట-29)

జీవిత చరిత్ర 3క్‌

అన్నమాచార్యుడు గృహాస్టాశమధర్మాన్ని నిర్వర్తిస్తూ భగవంతుని "సేవలో నిమగ్నమయ్యాడు.

అన్నమయ్య భక్తికి అనురక్తికి వేంకటవిభుందు పరవశించి పోయే వాడు. అన్నమయ్య స్వామి ఆదేశంప్రకారం పదహారోయేట నుండి రోజు కొక్క సంకీర్తన రచిస్తూ సంక్రీర్రనయజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాడు. పల్లవి, చరణాలతోకూడిన శ్రీర్తనకు తెలుగువాజ్బయచరిత్రలో ఫ్టీరత్వం కర్పించాడు. ఆహోబల ప్రయాణం:

సంక్రీర్రనయజ్ఞాన్ని నిర్వహిస్తున్న అన్నమయ్యకు భగవత్తత్త్వాన్ని ఉద్చోధించే వేదాంతరహస్యాలను తెలుసుకోవాలనే సంకల్పము కలి గింది. ప్రసిద్ధవైష్ణవక్షేత్రమైన అహోబలానికి పయనమయ్యాడు. అహోబలం కర్నూలు జీల్లా సిరివోలు మండలంలో రుద్రవరంగ్రామానికి ఐదుమైళ్ళ దూరంలో నల్లిముల కొండల మధ్య కుదుర్కొని వున్నది. అహోబలనర స్థాపకుడైన ఆదివన్‌ శఠకోసయతిని అన్నమయ్య ఆశ్రయిస్తాడు.

అహోబలనృసింహుడు తానే గురువై త్రిదండాలను, మంత్రాలను శఠకోపయతికి అనుగ్రహించాడు. హయగ్రీవానుగ్రహాన్ని పొంది సన్యా సియ్టు వేదాంతదేశికుని సంప్రదాయానుచరుడై వైష్ణవనుత ప్రచారకుడుగా శ్రీర్తిపొందినవాడు శరకోపముని,

రాయలకాలంనాటి. శాసనాల్లో శఠరకోపయతుల మరప్రస్తానన కనిపిస్తుంది... తిరుపతిలో వైష్ణవనుత ప్రచారానికి శ్రీనుద్రామాను జులు, వేదాంతదేశికులు, శఠకోపయతులు, వ్యాసతీర్జులు ఎంతగానో కృషి చేశారు. అన్నమయ్య శఠకోపయతి వద్దనే విశిష్టాద్వైత వేదాంతం అధ్యయనం _ చేశాడు. నృసింహమంత్రాన్ని పొందాడు. ఆ మంత్ర ప్రభా వంచే అన్నమయ్య నేంకశ్రేశ్వరునినలె. విశేషంగా అహోబల నృసింహుని ఆరాధించాడు. శ్రీవేంకశేశ్వరునిపై కాక అహోబల నృసింహునిపై రచిం చినన్ని సంకీర్తనలు మరే ఇతర దైవంపై రచించలేదు. అన్నమయ్య 32,000

36 త్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తనల్ని రచించాడని ద్విపద ఆధారంగా స్పష్ట మవుతున్నది. ముస్పె రెండు అక్షరాల నృసింహ మంత్రపరన ప్రభావంచే అక్షరానికి వేయివంతున 32,000 సంకీర్తనలు రచించినాడని తాళ్ళపాక వాబ్బయ పరిష్కర్త లైన శ్రీ గౌరి పెద్ది రామసుబ్బశర్మ గారి అభిప్రాయం. అన్నమయ్య శరకోపయతిని- చూడుండిందరికి సులభుండు హరి తోడునీడయగు దొరముని యితండు | కరుణానిధి రంగపతికింగాంచీ వరునకు వేంకటగిరిపతికి నిరతి నహోబల నృశేసరికింద శృరుడంగు శరకోసముని యితందు (117) అని స్తుతించాడు. నృసింహ సంకీర్తనలు : అన్నమయ్యపదాల్గోని నృసింహసంకీర్తనలను స్టూలముగా పరిశీలిద్దాం. ప్రావీన వాబ్బయంలో జగద్గురువు శ్ర్రీశంకరాచార్యులు రచించిన , 'శ్రీలక్ట్మీవృ సింహస్తోత్రం' ప్రసిద్ధమైనది. తెలుగువాబ్బయంలో ఎజ్జన మ్షైమాాలంలో లక్షీ శ్రిన్ఫృపింహావతార వైభవం గూర్చి విపులంగా ది. ల్‌! య్‌ శతకవాబ్బయంలో నృసింహునిపై ధర్మపురి నరసింహశతకం (శేషప్ప కవి కృతం), సింహాద్రినారసింహ శతకం (గోగులపాటి కూర్మనాథకవి). తరిగొండ వృసింహశతకం మొదలుగా ఎన్నో శతకాలు వెలిశాయి. జానపద వాజ్మయంలో, యక్షగానాల్లో నృసింహుడు *నరహరి'గా, చ్‌ న! శ్రీమహాలక్ష్మి 'వెంచులక్ష్మి'గా వినుతికెక్కారు.

' అన్నమయ్య లక్ష్మీనృసింహుని దివ్యస్వరూపాన్ని, అవతార విశేషాల్ని, వివిధ క్రేత్రమహాత్మ్యాల్ని వర్ణిస్తూ ఎన్నోకీర్తనలు విరచించాడు. అన్నమయ్య ఎగువ, దిగువ అహోబల క్షేతమూర్తులనే కాక సింహాద్రి, వేయి ' నూతల (ఓగునూతల), వేదాచలం, కనకగిరి బొమ్మి రెడ్డిచెర్లలో నెల కొన్న నృసింహస్వామిని కీర్తించాడు. అన్నమయ్య నృసింహుని, రాముని,

జీవిత చరిత్ర 97 కృష్ణుని, ఏదైవాన్ని కీర్తించినా అందరికీ తుదిచరణాల్లో శ్రీవేంక కేశ్చరునితో అభేదత్వాన్ని కల్పించి కీర్తించాడు. అహోబల సంకీర్తనలు ఫి అన్నాది జగమున కాభళము అనేకాద్భుతం బౌభళము తగు శ్రీవంకటధామ విహారం బగు శుభాంచితం బౌభళము | (సంప్పు-10 సంకీ-29) ఎగువ అహోబలం ; పెదయౌబళసుంగొండంబెరిగీనిదే వదలక కొలిచితే వరము లిచ్చీని (సంపు-11-1-సంకీ-23) అహోబలపరిసరాల్లో వెలసియున్న నవనారసింహులను- జ్యాలాఒహోబల మాలోల క్రోడ కారంజ భొర్గవాః యోగానంద చృత్రవట పావనా నవమూర్తయః. అని పూర్వులు స్తుతించి వున్నారు. అన్నమయ్యకూడా- నవనారసింహా న్లో నమో నాశితీర యప రసింహా భవనాశి యహొోబలనారసిం (్ర-సంకీ-453) అనే కీర్తనలో నవనార సింహ శ్షేత్రాలైన జ్వాల, వీర యోగా నంద, కాను గుమాని (కారంజ్ర, మట్టైమళ్ళ, భార్జోటి, ప్రహ్లాద, క్రోడాకార, మాలోల చృసింహులను క్రీర్తించియున్నాడు.. భవనాశి తీరంలో సాగే లక్షీ శ్రన్ఫుసింహుల లీలావిహారాలను కూడా అన్నమయ్య అనేక సంక్రీర్తనల్లో. కీర్తించాడు. మచ్చునకు ఛ్‌ ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జూణలే వీరు చెంత రమాదేవింగూడె శ్ర్రీనరసింహుండు |

3కి శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల

భవనాశిలోని నీరు పైంజల్లులాడుకొంటాను

నవకపు సిరులను నవ్వుకొంటాను

జవళింగిమ్మావులు సన్నలంజూపుకొంటాను

చివన నిందిరనంటె శ్ర్రీనరసింహుండు. (సంపు-11-1-క-216) నృసింహజయంతి వ

జగతి వైశాఖశుద్ధచతుర్హశి మందవార

మగణితముగంగూడెనదె స్వాతియోగము ॥

(సంపు-10 సంకీ-285)

చెంచెతపదం :

కవయంగవలెనంటీ కాంగలించేనా నీ

వువిదలందలంచక వుండనోసేవా ॥

పారిటాకులుంగట్టి పారనోపేవా

యేరులెల్ల దాంటి కొండలెక్కనో సేవా ॥

(12-225) ఇలా నృసింహస్వామి యొక్క మాహాత్మ్యాన్ని, లీలలను, ఉత్సవ విశేషాలను సంకీర్తనల్లో. కీర్తించి రించాడు అన్నమయ్య.

అన్నమయ్య అహోబలం ఆదివన్‌ శరకోపయతివద్ద వేదాంత రహస్యాలు తెలుసుకొన- హరిపూజ హరిసేవ హరి క్రీర్తనంబు హరిమననము ధ్యాన మనిశంబుందనకు ఘనతర సకల భోగంబులుగాంగ మనుచు వాల్మీకి రామాయణ మెల్ల రాగంబుతో ననురాగంబుతోడ బాగుగా గంధర్వు బాగుగాంజదివి పాట లన్నియుందనపాట సీమ్మటన పాటపాటనె పాటపాడి చూపంలగను (అన్న. చరిత్ర.ద్విపద-పుట-30) తుంబురుడో, నారదుడో, గంధర్వుడో అని అన్నమయ్యను సర్వజనులు ప్రస్తుతించేవారు. ద్విపదలో అన్నమయ్య రచించినట్లుగా పేర్కొనబడుతున్న “రామాయణం” లభించలేదు. _ కాని అన్నమయ్య సంకీర్తన రాశిలో రామాయణకథతో ముడివడిన శ్రీర్తనలు ఎన్నో వున్నాయి.

జీవిత చరత రి రాజాశయం థి అన్నమయ్య విఖ్యాతిని టంగుటూరును పరిపాలించే సాళువ నరసింహ రాయలు విన్నాడు. అన్నమయ్యను తనకొలువుకు రమ్మని ఆహ్వానిస్తాడు. ఇట సాళునవంశజుల గూర్చి ప్రస్తావించడం సమంజసం. విజయనగరరాజులకు, తిరుమల శ్షేత్రానికి వున్న అనుబంధం ప్రసిద్ధ మైనది. శాశ్వతమైనది. విజయనగరాధిశులైన సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలవారు తిరుమల ప్రభువునకు "అనేక క్రైంకర్యాలుచేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకొన్నారు. తిరుపతి-సాళువవంశం : సాళువవంశ్యులు విజయనగరపాలకుల్లో రెండవనంశానికి చెందినవారు. సాభువరాజు విజయనగరాన్ని క్రీశ, 3485 నుండి (క్రీశ2504 వరకు పాలించారు. ఈ కాలంలో ప్రసిద్ధ వైష్ణవశ్తేతమైన తిరుమల తరు 4 పతులు వైభవోపేతంగా వెలుగొందాయి. సొళువాన్నయులలో ప్రసిద్ధుడు నరసింహరాయలు. మహామండలేశ్వర, కేదిని మాసరగండు కటారి, సాళువ బిరుదాంకితుడు. 'సాళ్వ' అన్న బిరుదు వీరికి వంశనామంగా నిలిచిపోయినది. తిరుమలలో క్రీశ, 1456 నుండి శ్రీశ 1500 వరకు సాళువ నరసింహరాయల, తదనుయాయుల దానశాసనాలు కన్పిస్తాయి. అన్నమయ్య-సాళువ నరసింహరాయలు : అన్నమయ్య సంకీర్తన వాజ్బయంలో సాళువవంశ్యుల ప్రస్తావన ఎక్కడా కనిపించదు. కాని చిన్నన్న ద్విపద ఆధారంగా మాత్రమే సొళువ నరసింహ రాయల ప్రస్తావన కన్పిస్తుంది. ఇతడు ఇంచుమించు అన్నమయ్యకు సమువయస్కుడు. ఇతని పరిపాలనా కాలం క్రీశ. 1486-1491 సం[లని చారిత్రకులు నిర్ణయించారు. సాళ్వ నరసింహరాయలు “టంగుటూరు'కు దండనాథుడుగా ఉండే | వాడు. టంగుటూరు కడప జిల్లా రాజంపేట తాలూకి “పాత్తపనాడు ర మండలంలో వున్నది. “తాళ్లపాక (గ్రామం కూడా పొత్తపినాడు మండలం లోనిదే! అందువల్లనే సాళువ నరసింహరాయలు అన్నమయ్య సంకీర్తనల్సు రి నూహాత్మ్యాన్ని గూర్చి వినడం తటస్థించినది.

త్త శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల ఆ వార్తవిని విని యట్టి మహాను భావునింగన బాళలిబడుచు డెందెమున అంకకల. అ940థ ధళంల అ09ళ6 69090 / పరివారవాద్య సంభ్రమము ఆరెట్టింసం యా తాళ్లపాకాన్నమయ్యకు సాగి చేతులు మొగిచి మచ్చికంబూజచేసి శ్రీకృష్ణుమన్ననంగ్రీడి భూచక్ర మేకచక్రంబుగా నేలినపగిది న్లాలాగు మాసహాయము నాకు6గలుగ నేలుదు ధరయెల్ల నేకచక్రముగ నన్ను మన్నించి విన్నప మాలకించి క్రన్నన మాయూరికడ కేంగుదెంచి మాకు బుద్దులు, సెప్పి మాచేయుపూజ వేకొాన మమ్ము రక్షింపరే =

(అన్న. చరిత్ర.ద్విపద-పుట-31) , అని సాళువ నరసింహరాయలు అన్నమయ్యను వేదుకొంటాడు.

సహజవైష్ణవభక్తి సలిపెడువాని సహవాసమైన దోసము -లేదటంచు -

(అన్న. చరిత్ర.ద్విపద-పుట-31) అని అన్నమయ్య కూడా విచారించుకొని సాళువ నరసింహరాయల కోరికను మన్నించి టంగుటూరు. చేరుకొంటాడు. నరసింహరాయలు అన్నమయ్యకు టంగుటూరులో వెలసియున్న కేశవమూర్తి ఆలయ సమీపంలో ఒకనగరు నిర్మించి ఇచ్చాడు. సాళువ నరసింహరాయలు అన్నమయ్యను హితునిగా, గురువుగా బంధువుగా భావించాడు-

పాొవనుండగు తాళ్లపాకన్నమయ్య దీవెన అంది వర్ధిలుచు నా రాజు _

(అన్న. చరిత్ర.ద్విపద-పుట-32) ెనుగొండరాజ్యావికి ప్రభువైనాడు. రాయలు అన్నమయ్యను టంగుటూరు నుండి పెనుగొండకు రప్పించాడు. ఒకనాడు రాయలు అన్నమయ్యతో-

జీవిత చరిత్ర శః

వెన్నుని పై విన్నవించిన లోక

సన్నుతంబైన నూసంకీర్తనములు

(అన్న. చరిత్ర.ద్విపద-పుట-32)

వినాలని కోరాడు. అన్నమయ్య రాయల కోరికను మన్నించి-

తేనెలపై తేట తిన్ననివెజకు

పానకముల నేరుపజచినమేలు

చక్కెరలో తీపు చల్లందెమ్మరలు

చిక్కని కపురంబు జీవరత్నములు

కలయమృతంబు మోంగడమోింది. చవులు

చిలుకుచుంగవులెల్లజేయెత్తి మొక్క

సింగార మొకకుప్పంజే సినరీతి,

(అన్న. చరిత్రద్విపద-పుట-33) రంగైన రాగవ్థములతో కర్ధపేయంగా ఎన్నోసంకీర్తనలు వినిపించాడు. ఆతని సంకీర్తన రచనాస్రతిభకు రాయలు ముదమందాడు. అన్నమయ్యను అనేక విధాలుగా సంభావించాడు.

సొళ్ళ నరసింహరాయలు అన్నమయ్యకు ెనుగొండలోనే తన నగరు సమాపంలోనే ఒక నగరు నిర్మింపచేశాడు. వైష్ణవధర్మ వ్యాప్తికి రాజాశ్రయం ఉపకరిస్తుందనే అభిప్రాయంతో అన్ననుయ్య కూడా అంగీకరించాడు. పెనుగొండలో నిర్మించిన తన నగరిలో వుంటూ అన్నమయ్య సంకీర్తనల ద్వారా విశిష్టాద్పెత మతవ్యాప్తిచేయసాగాడు. రాజధిక్కారం శ

అన్నమయ్య పదాలు శ్రుతులై, శాస్త్రముకై, వేంకటైల వల్లభ రతి (శ్రీడారహస్యాలై కీర్తిని పొందాయి. ఒకనాడు సొళ్వనర సింహరాయలు అన్నమయ్యను కొలువుకు ఆహ్వానించాడు. వేంకటవల్లభుని పై మధురపదా లను వినిపించమని ప్రార్థించాడు. సభలో కవులు విద్వాంసులు, గాయకులు, సామంతులు, దండనాథులు కొలువైవున్నారు. అన్నమయ్య రాజు కోరికను మన్నించి-

శం శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల ఏమొకా చిగురుటధరమున యెడనెడంగస్తురి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదుగదా | కలికి చకోరాక్షికింగడకన్నులు గెంపై తోచిన చెలునం బిప్పుడిదేమో చింతింపరె చెలులు నలువునంబ్రాణేశ్వరు పై నొంటిన యా కొనచూపులు నిలువునంబెరుకంగ నంటిన నెత్తురు గాదుగదా ॥ పడతికి చనుంగవ మెజుంగులు పైపైబయ్యెద వెలుపల కడుమించిన విధమేమో కనుంగొనరే చెలులు ఉడుగని వేడుకలోంబ్రియుండొత్తిన నఖిశశి రేఖలు వెడలంగ వేసవికాలపు వెన్నెల గాదు గదా 1 ముద్దియచెక్కుల కెలంకుల ముత్యపుజల్లుల చేర్పుల నొద్దికలాగు లివేమో వూహింపఠె చెలులు గద్దరి తిరువేంకటపతి కామిని వదనాంబుజమున అద్దిన సురతపుయైమటల అందము గాదుగదా ॥ (సంపు. 12-సంకీ. 82) అనే మధురభక్తి సంభరితకేర్తన భావబంధురంగా సొడివినిసించాడు,. "పై సంకీర్తన భావవివరణ :; __అప్పుడే స్వామిమందిరం నుండి నెడలివచ్చిన నాయికతో చెలికత్తెలు పరాచకాలు ఆడటం ఇందలి వస్తువు. నాయిక కనుగొనల అరుణీము, చనుగన మెటుగులు, చెక్కిళ్లపై జాజీన ముత్యాలజాలరుల వంటి చెముటబిందువులను చెలులు గమనిం చారు. కారణం ఏమిటని వూహించి చెలిని ఆటపట్టించడం ఇందలి సారాంశం. నాయిక పల్లవాధరంమిద కస్తురి నిండినది. అది భామిని విభునకు వ్రాసిన పత్రిక యని తలచారు. కలికీ కనుగొనలు ఎర్రబారాయి. వింతఅం రాసి సంతరించుకొన్నాయి. సతి పతిపై నాటిన కొనచూప్పులను నిలువుగ పెరికి నప్పుడు అంటిన నెత్తురుగా కనుగొనల ఎరుప్పును భావించారు. పడతికి చనుగవ మెటుగులు పయ్యెద చెరగుమించి వ్యాపించాయి. (సియుడు

జీవిత చరిత త్త చెలి చనుగనపై జఒత్తిన నఖశశి రేఖలను వెదచల్లిన వేసవికాలపువెన్నెలలని వూహించారు, ముద్దియ చెంపలకు ఇరువైపుల ముత్యాలజాలరుల ఆభర తాలు ఆమరి నట్టున్నాయి. అవి వేంకటపతి కామినిని కౌగిటచేర్చి అద్దిన సురతపు వేళల చెమటల అందమని తలసోశారు. దివ్యషపంతులు అలమేల్మంగ్యా శ్రీనివాసుల రతిపారవశ్యాన్ని తదైక్యాన్ని అన్నమయ్య _ నుధురసంకీర్తనగా వినిపించాడు. సాళువ నరసింహరాయలు “ఇది కవిత్సం'బని మెచ్చి- అనుపమంబైన (ద్రోణాదార్యు మహిమ గనియు6దౌపదితండ్రి గర్వించినటుల, (అన్న. చరిత్ర.ద్విపద-పుట-36) అన్నమాచార్యుని మహత్త్వ్యమంతయు వినికూడా “పదరక నేంకటపతిమింద నుడువు సదముల రీతి నాపై నొక్కపదము చెప్పుమూ...... అని అన్నమయ్యను కోరాడు. (అన్న. చరిత్ర.ద్విసద-పుట-36) వెంటనే అన్నమయ్యా ఎల ఆఆ ఆఆ ఆ. బెవు లిరుగేలా నప్పళింపుచు మూసీ హరిహరీ యనుచు సరమపతివ్రతాభావంబుయబూని హరి ముకుందునింగొనియాడు నొ జిహ్వ నినుంగొనియాడంగ నేరదు (అన్న. చరిత్ర.ద్విపద-పుట-37) అని- గరిమల నెరంగరుగాక మానవులు సిరులందియ్యని నోరంజేంయ మేసేదా ॥ హరి నారాయణ యనియెడి నోరను ధర నితరుల పేళ్లు దడవు బెట్టు

శశ శ్తీ తాళ్ళపాక అన్నమాచార్యుల సరవితో వేదములు చదివేటి నోరను పరులమాంది సదాలు పాడేదా॥ (సంపు-౩-సంకీ- 456) నరహరి కీర్తన నానిన జిహ్వ వొరుల నుతింపంగ నోపదు జిహ్వ

(సంపు-2-సంకీచ 44) అని పరిపరివిధాల తలపోసి నరసింహరాయల యొక్క నైచ్యప్పు సలుకులకు ఖిన్నుడై రాజాశయంలో లభించే భోగాలను

పల్లకీలు నందలాలు పడివాగె తేజీలు

వెల్లివిరి మహాలక్ష్మీ విలాసములు

తల్లియాకె మగనినే దైవమని కొలిచేము

వొల్లంగే మాకేసిరులు వొరు లియ్యవలెనా, న్న!

(సంపు-10-సంకీ-94) అని రాజుకు తేటతెల్లం చేసి అన్నమయ్య సభనుండి నిష్క్ర్విమించాడు. నరసింహరాయడు ఈ ధిక్కారాన్ని సహించలేకపోయాదు. భటులచే అన్నమాచార్యుని బంధింప చేశాడు. అన్నమయ్యకు మూరురాయ గండ సంకెలవేయించి చెరసాలలో బంధించాడు. అంత అన్నమయ్య -

ఆశటివేళలను నలపైన వేళలను

తేంకువ హరినామమే దిక్కు మరిలేదు ॥ కొఅమాలి 6వున్నవేళ కులము చెడినవేళ చెజివడి ంవొరులచే. జిక్కినవేళ ఒటిపైన హరినామ మొక్కటే గతిగాక మజచి తప్పినవైన మరిలేదు తెరంగు.

జీవిత చరిత్ర టీస్‌ సంకెళంబెట్టినవేచ చంసంబిలిచినవేళ అంకిలిగా నప్పుల వారాంగినవేళ వెంక కేకు నామమే విడిపించ గతిగాక మంకుబుద్ధింబౌరలిన మరిలేదు తెజంగు ॥

(పంపు. 1- పంకీ-158) అని ఆర్తత్రాణపరాయణుడైన స్ర్రీవేంకటవిభుని ప్రార్థించగా సంకెళ్లు వీడి పోతాయి. భటులు ఈ విషయం రాయలకు తెలిపారు. రాజు మిత్రత్వాన్ని మరచి తిరిగి సంకెల వేయించాడు. అన్నమయ్య తీరని జవేదనతో--

నీ దాసుల భంగములు నీవు చూతురా యేదని చూచేవు నీకు వెచ్చరించనలెనా

(పంపు.3-సంకీ-266) అని స్వామిని వేడగా శృంఖలలు వూడిపోయాయి. రాజు ఈ చర్యకు భయ(భాంతుడై అన్నమయ్య చరణాబ్దములకు సాగిలిమొక్కీ-

అపరాధి నపరాధి నన్నమాచార్య కృపంజూడు నను నీవు కృషణశరణ్య వీ వలిగిన నల్లు నీలనర్జుండు నీవు మెచ్చినమెచ్చు నీరజోదరుండు నాయర్థమంతయు నన్నమూాచార్య వీయందె కంటిమి నిక్కంబు గాంగ నని పట్లముహిషితో ....

ఉం,

(అన్న. చరిత్రద్విపద-పుటలు-39,40) అన్నమయ్యను. వేడుకొని రాచమర్యాదలతో ఆదరించాడు. అన్నమయ్య రాజును క్షమించి-

ధ్యాయన్‌ కృతే యజన్‌ య్హై స్త్రేతయాం ద్వాపరేఒర్చయన్‌, యడదాప్పోతి తదాప్నోతి కలో సంకీర్త్య 'కేశవమ్‌, (విష్ణుపురాణం)

శశ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల కృతయుగంలో ధ్యానంవల్లను, త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల వల్లను, ద్వాపరంలో అర్భనాదులవల్లను, కలియుగంలో హరి సంకీర్తనలవల్లను జనులు ముక్తి పొందుతారు. హరిభక్తులను సేవించు. భాగవతావమానం భగవదవమానాన్ని మించి నదని రాయలకు ఉద్చోధిస్తాదు. రాజాశ్రయంవీడి తిరుమలకేగి స్వామికి “శృంగారమంజరిని సమర్పించాడు. అన్నమయ్య రచించిన లఘుకృతుల్లో లభ్యమైన వాటిలో ఇది ఒకటి, తాళ్లపాకనారు. ద్విపదప్రక్రియలోనే కాక ద్విసదభేదమైన మంజరీద్విపదలో కూడా రచనలు చేశారు. మనకు ఉపలబ్ధములైన తాళ్లపాక మంజరులు- క్షే శృంగారమంజరి 2. సుభద్రాకళ్యాణము (తాళ్లపాక తిన్ముక్క) 3. చక్రవాళమంజరి (పదతిరుమలయ్య) శృంగారమంజరి 517 పంక్తులు గల నుంజరీ ద్విపదకావ్యం. స్వామిపై మరులుగొన్న ఒకబాలిక విరహావస్థను అనుభవించి ఆపై స్వామి సన్నిధిని చేరడం ఇందలి వస్తువు. మనోజ్ఞమైన రచనా సంవిధానంతో కూడుకొన్న నిండురచన. అన్నమయ్య తిరుమలలో స్వామికి మధురభక్తి పరమైన శృంగార సంకీ ర్తనలు ఎన్నో వినిపించాడు, ఆన్ననుయ్య భావనాచమత్కృతికి మరుగురుడు తన్మయుడై- జగతి వీ శృంగార సంకీర్తనముల కగపడీ మంచి ప్రాయపువాండ నయితి వని వేంక పేశ్వరుండన్నమాచార్యు. గనుగొని వాక్టుచ్చి, - గారవించాడు. (అన్న. చర్‌త్ర.ద్విపద-పుట-42)

జీవిత చరిత్ర త్తే తిరుమలలో శ్ర్రీవేంకకేశ్చరస్వామికి ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మో చ్చవాల్లో అన్ననుయ్య పాల్గొనేవాడు. అంతేకాక దేశసంచారము చేసీ అనేక క్షేత్రమూర్తుల పై ఎన్నో సంకీర్తనలు రచించాడు. అన్నమయ్య దర్శించిన క్షేత్రమూర్తులను గూర్చి, ఉత్సవాది విశేషాదులను గూర్చి ప్రత్యేకంగా వ్రస్తావించబడుతుంది. అన్నమయ్య మహిమలు : అన్నమయ్య- అలం ఆం ఆ ఆ శ్రీ వైలనాథు పావనవినుతి ప్రభావంబుచేత జగతిపై సకలవాచా శుద్ధికలిగి (అన్నం చరిత్ర.ద్విపద-పుట-42) జీవనం సాగిస్తుండేవాడు. అతని నోటివెంట వచ్చినమాట అక్షరాల జరిగేది. ఒకరోజు స్వామికి వైవేద్యంగా మామిడిపళ్లను సమర్పించి తాను ఆరగించగా పండ్లుపుల్లగా వున్నాయి- అన్ఫుతంబు తోయబుట్టువగు పద్మ మోవి నన్ఫుతంబు తనినోన నాను సెమ్ననికి (అన్నం చరిత్ర.ద్విపద-పుట-43) జీడిపులుసుకాయలు సమర్పించానని బాధచెందాదు. వెంటనే ఆ జీడిమామిడి చెట్టును తాకి “దీని పళ్ళు తియ్యనిపళ్ళు అగుగాక అని నేంకటపతిని ప్రార్థించాడు. ఆ జీడిమామిడిపళ్లు తియ్యనిపండ్లు అయ్యాయి. ఈ సన్నివేశాన్ని స్ఫురింపచేసే కీర్తన కూడా కందు. కరము జీడిపులుసు గలిగిన మామిడి కరము సోకీనయంతనే సరవింజక్కెరవలెంజవిగలిగించువాని చనవరి సుతుండితండే | (అన్ను చరిత్ర, పీరిక-పుట-65) ఇలాగే. ఒక ేదబ్రాహ్మణుండు తన కొమార్తె వివాహానికి అన్నమయ్యను. ధనం అర్థించాడు. అన్నమయ్య వశళ్యవాక్కువల్ల ఒ్య

త్తే శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల రాజు ఆ బ్రాహ్మణకన్య పరిణయానికి ధనం సమకూరుస్తాడు, ఇలొ అన్నమయ్య మహిమలను తెలుసుకొని జనులు-- “*వెలువొందు వాగురు శ్ర్రీపాదరక్ష తలవిడి తమ యాపదల వీడికొవిరి (అన్న. చరిత్ర,ద్విపద-పుట-44) అన్నమయ్య-పురందరదాసు: అన్నమయ్య ద్విపద ఆధారంగా మనకు తెలుస్తున్న మరొక ప్రధాన ఘట్టం అన్నమయ్య _ పురందరదాసుల చెలిమి. అన్నమయ్య - పురంద రదాసుల చెలిమిని గూర్చి ప్రస్తానించడానికి ముందు తెలుగు, కన్షడ దేశాల రాజకీయ, సాహిత్యపరమైన పరస్పర అనుబంధాన్ని గూర్చి, హరిదాస కూటమిని గూర్చి ప్రస్తావించడం సమంజసం, అన్నమయ్య సంకీర్తనలలో వైష్ణవ సంప్రదాయమే కాకుండా విరలారాధన సంప్రదాయం కూడా కన్పిస్తుంది. తెలుగు, కన్నడ సాహిత్య సంప్రదాయాల అనుబంధం అనాదిగా వున్నదే! దీనికి కారణాలు: ' క. తెలుగుకన్నడదేశాలు వైసర్గికంగా ఒకే భూభాగాన్ని అంటి పెట్టుకొని వుండడం. 2. తెలుగు, కన్నడ భాషలు ఒకే భాషాకుటుంబానికి చెందినవి కావడం. తె, రాజకీయంగా. ఈ రెండుదేశాలను పల్లవులు, చాళుక్యులు, విజయనగరాధిపళులు పాలించడం కారణాలుగా చెప్పవచ్చును. విజయ నగర చక్రవర్తులు శ్రీవేంకకేశ్వరస్వామి. భక్తులు కావడంవల్ల కన్నడిగు లకు తిరుపతితో అనుబంధం పెరగడానికి వీలైంది. సాళ్వ నరసింహ రాయల కాలంలోనే అన్నమయ్య పదాలు విజయనగర ప్రాంతంలో వ్యాష్టిని పొందాయి. విజయనగరాధీశుల కాలంలో కర్ణాటాంధ్రప్రాంతాలు రెండూ కలసిమెలసి వుండేవి.

జీవిత చరిత్ర త్త (శ్రీశ. 13వ శతాబ్దంలో కన్నడదేశంలో నరహరితీర్థులచే అంకురార్పణ చేయబడిన హరిదాసకూటమిని శ్రీశ. 15వ శతాబ్దంలో శ్ర్రీపాదరాయలు పరిపుష్టం చేశాడు. తదుపరి వైష్ణవభక్తి తత్త్వాన్ని, కర్ణాటక హరిదాస సంప్రదాయాన్ని దేశం నలువైపులా వ్యాసింపచేసినవాడు పురందరదాసు. ఇతని కాలం శ్రీశ. 1484-1564 అని, క్రీశ 1470-1564 అని భిన్నాభిప్రాయాలున్నాయి.. పురందర దాసు అన్నమయ్యను వార్ధకంలో దర్శించాడని చెప్పవచ్చు. అన్నమయ్య మహామహిమాన్విత కవితాశక్తిని భక్తి తత్పరతను విన్న _ పురందరధాసు అన్నమయ్యను దర్శించడానికి తిరుమలకు నచ్చాడు. అన్నమయ్యను దర్శించి సొక్షాత్తు వేంకకేశ్వరుని అవతొరనుని స్తుతించాడు. అన్నమయ్య దాసులవారిని కౌగిలించుకొని. “నీవు సంధ్యవార్చుకోవడానికి ఆ స్వామితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి అన్ని 'విరలుని అవతారిమని కీర్తించాడు. అన్నమయ్య 32,000 పదాలు రచించగా, పురందరాసు 4,75,000 పదాలు రచించాడని కన్నడ _ పండితుల అభిప్రాయం. అన్నమయ్య = పురందరదాసుల కీర్తనల్లో భావసామ్యాలుగల అనేక. కీర్తనలు కన్పిస్తాయి. కొన్ని ఉదాహరణలు- అన్నమయ్య ఫ్‌ తినరావి కొనరాని దేవలోకపుంబండు మనసున తలంచితే మలిగించే పండు. [సంపు 13-సంకీ-284] పురందరదాసు : హణ్టు బందిదె కొళ్ళిరో నీవీగ షై బో బా చిన బాలక్కష్త నెం దై ఇ ౦ చ (క. 732) అన్నమయ్య వ్‌ ఊరకే దొరకునా వున్నతోన్నత సుఖము (సంపు-2 పంకీ-04)

50 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల పురందరదాసు : సుమ్మనే బరువుదే ముక్తి (& 79) అన్నమయ్య ఫి పారకుమోవో మనసా పంతము విడువకు మీ మనసా (పంపు-2- పంకీ-177) పురందరదాసు : బేడ మనవె బేడి కొంబెవో వాను కొడదిరు కపటది మనప (క 633) అన్నమయ్య థ్‌ అదిగో విజయనగరమందు వాడల వాడల వెదజల్లె వరములు విట్టలుండు (పంపు-3-సంకీ-229) పురందరదాసు : శరణు వినగి శరణెంబరు విఠల కరుణ వారిధి ఎన్నకాయె విఠల (కీ. 543) అన్నమయ్య రచనలు ; యోగమార్గంబున వొక కొన్ని బుధులు రాగిల్ల శృంగారరపరీతింగొన్ని వైరాగ్యరచనతో వాసింపంగొన్ని సారసనేత్రుపై సంకీర్తనములు

“సా ఇ బీనిత చరిత్ర పో ట్‌ షరి. వైదూబాడో్‌. సరసత్వమునందాళశసముఖముల్‌ గాలగ చై పరమతందత్రములు ముప్పదిరెండువేలు ప్రవిమల ద్విపద ప్రబంధరూసమున నవముగా రామాయణము, దివ్యభాష నా వేంకటాద్రి మాహాత్మ్య మంతయును గావించి రుచుల శృంగారమంజరియు శతకముల్‌ పదిరెండు సకలభాషలను ప్రతిలేని నానా ప్రబంధముల్‌ చేసి (అన్న. చరిత్ర.ద్విపద-పుట శీర్‌-46) సిరివరుని మెప్పించాడు. ఇందులో మనకు లభ్యమైనవి దాదాపు 14,000 సంకీర్తనలు, శృంగారమంజరి, శ్రీ వేంకటేశ్వర శతకాలు మాత్రమే! మిగి లిన రచనలు-ద్విపదరామాయణం, సంస్కృత వేంకటాద్రి మాహాత్మ్యం, పదకొండు శతకాలు, ప్రబంధాలు కాలగర్భంలో కలసీపోయాయి. అన్నమయ్య సదకవితారీతులు : అన్నమయ్య పదకవితారీతుల్నీ చర్చించడానికి ముందు క్రీశ. 15వ శతాబ్దం నాటి ఆంధ్రవాజ్బయచరిత్రను, రాజకీయన్యవస్టను_ గూర్చి పరిశీలిద్దాం. ఆంధ్రవాజ్బయచరిత్రలో. శ్రీశ. 15 శతొబ్దము ప్రబంధయుగం, అష్ట్రాదశవర్థనలు, రసాలంకారాది విశేషాలు, వ్యంగ్య వైభవం, కవితా చమ చ్కృృతులతో నిండిన ప్రబంధాలు. వెలువడుతున్న కాలం. రాజకీయంగా పరికిస్తే మహమ్మదీయుల దండయాత్రలలో ఛిన్నాభిన్నమైన మతవ్యవస్థ. ఇలాంటి సమయంలో వైష్ణవమత ప్రాశస్త్యాన్నిచాకే సాహిత్యాన్ని సుస్థిరం చేయడంకోసం అన్నమయ్య పదప్రక్రియను చేపట్టినట్లు వెల్లడవుతున్నది. అన్నమయ్య నుహాభక్తుల కోవకు చెందినప్పటికీ కేవలం స్తోత్ర ప్రాయ ములైన భక్తి పాటలు పాడినవాదు కాడు. సంగీతవేత్త ,అయినప్పటిక్ష నాదప్రధానమైన రచనలే సాగించినవాడు కాదు. మహాకవి అయినప్పటి

52 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల కొవ్యాలే అల్లినవాడుకాడు. భక్తుడు, గాయకుడు, కవి అయిన అన్నమయ్య రాశిలో, వాసిలో మిన్నయైన భావ ప్రధానరచనలు చేసినవాడు. ఆంధ్ర వాబ్బయచరిత్రలో పదప్రక్రియకు ఒక నిర్దుష్టమైన స్థానం కల్పించి “పదకవితా పీతొమహుడివే ప్రశస్తిని పొందినవాడు, అన్నమయ్య సంకీర్తనలలో అధికములు శృంగారరస ప్రధానములు. కొన్ని ఆధ్యాత్మకాలు. అధ్యాత్మ సంకీర్తనలు | అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనలను గూర్చి చినతిరుమలయ్య- పావనములు హరిభక్తి వి భాపనములు పర్వమంత్ర పరను రహస్యో ద్భావనములు గాయక విక రాననములు తాళ్లపాక యన్నయ పదముల్‌, (సంక్రీర్తనలక్షణం-పద్యసంఖ్య-8) దేహాత్మేశ వివేకో త్సాహంబును లోకవేద ధర్మాధర్మా ద్యూహా పోహంబులుంగల యా హరి సంకీర్త వంబు లధ్యాత్మంబుల్‌. (సంకీర్తన లక్షణం-సద్యసంఖ్య-64) అని పంకీర్తనలక్షణ (గ్రంథంలో వివరించాడు. భగవద్భక్తితత్హ్వాన్ని అనేకవిధాలుగా సంకీర్తనల్లో పొందుపరిచాడు అన్న మయ్య. నిష్కామకర్ముడై శ్రీవేంకటేశునిపై అచంచలమైన భక్తీ విశ్వాసంతో ప్రబోధాత్మకములైన సంకీర్తన లెన్నింటినో రచించాడు. భాగవతంలో "పేర్కొన్న నవవిధభక్తి భేదాలను తన సంకీర్తనల్లో ఉదాహరించాడు. వేదప్రమాణాలను, పరతత్త్వాన్ని, దేహ-దేహి అనుబంధాన్ని, శరణాగతిని, మాయాతత్త్వాన్ని, పరంజ్యోతిస్వ్రరూపాన్ని అనేక విధాలుగా కీర్తించాడు.

జీవిత చరిత్ర ర్‌ి మచ్చునకు కొన్ని సంకీర్తనలు : సర్వభోగాలను అనుభవించిన సిమ్మట పరతత్త్వచింతనకు ప్రయత్నిం చడం అవివేకం. సముద్రే శావ్తకల్లోలే స్నాచు మిచ్చతి మూఢధీః తథైవ శాన్తే సంపారే జ్ఞానమిచ్చతి దుర్మతిః, అనే సూత్రార్ధ (ప్రకాశికలోని భావాన్ని - కడ లుడిపి వీరాడంగొందలంచు వారలకు కడలేవి మనసునకుయడమ యొక్కడిది (సంపు. 22-3-పంకీ-97) అని సులభంగా బోధించాడు. సంసార జంబాల పటలిలో చిక్కుకొన్న జీవికి భగవత్స్వ రూపాన్ని తెలుసుకోవడం అసాధ్యమే! భగవత్స్వరూపాన్ని సతతసత్యవ్రతులు, సంపూర్ణ మోహవిరహితులు మాత్రమే తెలుసుకోగలరని-- ఇతరులకు నిను నెజంగందరమా పతత సత్యవ్రతులు పంపూర్ణమోహ విర హితు లెటుంగుదురు నిను-నిందిరా రమళణొం (సంపుషసంకీ-252) అని క్రీర్తిస్తాడు. జీవునిరక్షణ దేవునియొక్క కర్తన్యమే అని- పొమ్ముగలవాండు తన సొమ్ముచెడనిచ్చునా కమ్మి నీ పొమ్మను నేను కాపాడవే హరి. (సంపు-3;పంకీ-437) అని వేటతెల్లం చేశాడు. కర్మబంధాన్ని త ప్పించుకోవడం భగవంతునికికూడా తప్పదని-

54 శ్రీ శాళ్ళిపాక అన్ననూచార్యుల సామావ్యమా పూర్వపంగ్రహంబగు ఫలము నేమమునంెనగొనియె నేండు నీవనక 8 జగతింబ్రాణులకెల్ల సంపారబంధము తగుల బంధించు దురితంపుంగర్మమున మగుడ మారుకు నూరు ముగున వీ వురముపై తెగి కట్టి రెవ్వరో దేవుండ వనక, (పంపు-11-3-సంకీ-73)

అని చమత్కరిస్తున్నాడు.

అన్నమయ్య నిశ్చల మనస్కుడై భగవంతుని పరిపరివిధాల ఆరాధించి

తరించాడు. అందుకే సకలశాంతికరము సర్వేశ నీపై భక్తి (3-377);

నాకేల విచారము నాకేల యాచారము (3-384), హీనుండ నే నధికుండ

వన్నిటానీవు (2-433), నిత్య సుఖానందమిదె నీ దాస్యము (10-78)

మొదలుగా అనేక ప్రబోధాలను మానవాళికి అందించాడు.

అన్నమయ్య సంకీర్తనలు "ద్రవిడవేదాంతమిని. క్రీర్తిపబడుతున్న ం ను! 4 ఆళ్వారుల పాశురాలతో సరిపోల్చదగినవి. వైష్ణవభక్తీి సాహిత్యంగా ఆళ్వారులు వెలయించిన దద్రవిడవేదాన్ని అన్నమయ్య _ అనేక సంకీర్తనల్లో నిక్షేపించాడు.

శృంగార సంక్షీర్తనలు ఫ్‌

అన్నమయ్య శ్రీవేంక పేశ్వరుని పరతత్త్యంగా భావించి శృంగారభక్తి భావనలో ఎన్నో వేల శ్రీర్తనలు రచించాడు. అశాశ్వతమైన లౌకికవిషయాలను విడిచి పరమార్థమునందే నునసు నిలిపి సోపానక్రముంగా పరమాత్మయందు తన్మయీభావం పొందడమే మధురభక్తి లక్ష్యం, వైష్ణవంలో గో సికాభక్తి ప్రసిద్ధమైనది. “పుమాన్‌. విష్ణు రితి ఖ్యాతః స్రీప్రాయ మితరం జగత్‌" అన్న _ వైష్ణవసంప్రదాయాన్నే అన్నమయ్య అవలంబించినాడు. వీరి పద రాశిలో జీవాత్మ సరమాత్మసంయోగానితై సరితపించడం అనేక విధాలుగా ఉళ్లేఖించబడింది. దీనికి కారణం-

జీవిత చరిత్ర క్‌ “సామాన్యజనులు తత్త్వదృష్టితో దైవమును చూచి కొలిచి తరించుట వలనుగాని పని, వారి వారి అనుభవములకు తగిన శృంగారలీలలనైతే మధురముగ చేపట్టి పాడుకొనగలరు. అందుకనియే అన్నమయ్య శృంగార దృష్టితో వైన వేంకటేశ్వర నామాంకిత కీర్తనసాగించి కృతార్థులగుదురు గాక యని గుడజిహ్వికా న్యాయముతో ఈ శృంగార సంక్రీర్తనలరాశిని ెంచినట్టున్నదో అన్న శ్రీగౌరిపెద్ది రామసుబ్బశర్మగారి మాటలు ఇట అనుసంధించ తగియున్నవి. " (శృంగార సంకీర్తనలు-12 సంపుటం, పీఠిక పుట-24) అన్నమయ్య శృంగార సంకీర్తనలు సంయోగాన్ని వర్ణించిన పట్టుల సంయోగాంతముగా. ముగించడం సహజమే! విప్రలంభ సంకీర్తనలు కూడా ఏదో ఒక విధంగా చరమచరణంలో సంయోగాంతముగానే సమౌప్తమవు తొయి. క్రీర్తనలందు సైతం స్వామితోడి దీర్షకాలిక వియోగాన్ని" సహింపలేని చిత్తవృత్తి అన్నమయ్యది. అన్నమయ్య శృంగారసంకీర్తనల్లో అష్టవిధ నాయికొభేదాలు, సంభోగ విప్రలంభ శృంగార వర్ణనలు విశేషంగా చోటుచేసుకొన్నాయి. ఉదా : ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మజీ యిదిగాక వైభవం బింక నొకటి కలదా ఆతివజన్మము సఫలమై పరమయోగివలె నితర మోహా పేక్షలిన్నియును విడిచె సతికోరికలు మహాశాంతమై యిదె చూడ సతత విజ్ఞాన వాసవవోలె మండె,

(సంపు, 32-సంకీ-17) అనే సంకీర్తన అలౌకిక శృంగారపరమార్థాన్ని వివరించే మధుర సంకీర్తన. నాయిక స్వామితో తాదాత్మ్యం చెందడానికి చేస్తున్న (ప్రయత్నమిది. జీవాత్మ పరమాత్మవిషయకమై పొందుచున్న ఆనందము అనంతము, దివ్యముని నాయికాపరంగా వెల్లడించబడినది.

56 శ్రీ తాళ్ళిపాక అన్నమావార్యుల అలమేల్మంగా శ్రీనివాసుల దివ్యలీలా వైభవాలను మధుర మనోజ్ఞ భావంతో ఎన్నోవేల శృంగార పంకీర్తనలుగా రచించి తరించిన ధన్యజీవి అన్నమయ్య, అన్నమయ్య పదాల్లోని దేశికవితలు : నావొవిధ దేశంబుల వానా కవిబుద్ధి వర్ధనా రచనలచే మావిత తావక రాగము తో నలరున్‌ దేశిపదము దొరలకు మెచ్చె. (సంకీర్తన లక్షణగ్రంథం-పద్యపంఖ్య-68) ఏ వాబ్బయంలోవైనా పద్యంకంటు పదమే ముందు పుట్టిందనడం నిర్వివాదొంశం, జనపదులు కష్టసుఖాల్లో భావావేశాలకు లోనయినపుడు వారిగుండె లోతుల్లోంచి ఆప్రయత్నంగా వెలువడే పాటలే జానపద గేయాలు. జానపద'గేయాలు సులభశైలిలో సాగే రచనలు. అన్నమయ్య _ ప్రధానో ద్దేశ్యం సామాన్యుల్లో వైష్ణనముతం ప్రచారంచేయడం. ఇందుకు భాష భావం ఆలంబనాలు. భాగవత తత్త్వాన్ని సామాన్యులకు తెలిపే ప్రయత్నంలో అన్నమయ్య పదాల్లో అనేక విధాలైన జానపదరీతులు చోటుచేసుకొన్నాయి. అన్నమయ్యకు పూర్వపు దేశికవిత్వం న నన్నయ భారతంలో దేశిచ్చందోరీతులైన తరునోజ, మధ్యాక్కరలు కనిషీస్తాయి. నన్నెచోడుని కుమారసంభనంలో ఈశ్వరుని ఆంకమాలికలు, ఉవిదలింపు మిగుల వూయల పాటలు (4-89), ఆలతులు (4-12), గౌడుగీతాలు (6-85), రోకటి పాటలను (6-87) ప్రస్తావించాడు. పాల్కురికి పోమన (క్రీశ. 12 శతాబ్ది) పండితారాధ్య చరిత్రలో తుమ్మెద, ప్రభాత, పర్వత, ఆనంద, శంకర, నివాళి, వాలేశు, గొబ్బి, వెన్నెల పదాలను, బనవపురాణంలో కోలాటం, చాంగుబళా, జోలపదాలను ఎట్టి ఎర్కొన్నాడు.

జీవిత చరిత్ర క? కృష్ణమాచార్యుడు దేశరీతికి చెందిన అనిబంధపదాలను రచించినవాడు. ఆతని రచనలైన వచనపంకీర్తనం తులసీమాహాత్మ్యం, నృసింహవచనాలు, రామనామసంకీర్తనలు, తర్వాతి వాగ్గేయ కారులకు మార్గదర్శక మైనాయి. గ గ మ్‌ శ్రీశ. 14వ శతాబ్దంలో నాచనసోమన వసంతవిలాసంలో జూజరపాట లను ప్రస్తావించాడు. పోతన భాగవతంలో బాలు నంకించి పాడే పాటలను (10-355), గోవిందుమోది పాటలను (10-505) ప్రస్తావించాడు. శ్రీనాథుడు భీమేశ్వరపురాణంలో యక్షగానసరళిని పేర్కొన్నాడు. అన్న మయ్య కాలానికి పూర్వం కనిపించే లిఖిత పూర్వక జానపద నాబ్మయం ఇదే. దేశికవితా ప్రక్రియకు. చెందిన మేలుకొలుపు, సువ్విపాటలు, అల్లో నేరేళ్లు గొబ్బి, జాజర, సోది, తుమ్మెద, చిలక్క తందానలు, ఏల, కోలాటం, ళా చందమామ, శోభనం, హారతి, నివాళి, ధవళ, ఉయ్యాల, లాలి జోల, మంగళ, సాసముఖాలు, కూగూగులు, తాత్త్వికాలు, చాగుబళాలు - ఇవేకాక బాలక్రీడాసంకీర్తనలు, దివ్యనామ. సంకీర్తనలు, వృత్త్యాత్మక సంకీర్తనలు, కులనాచక గేయాలు, ఉత్సవ సంకీర్తనలు మున్నగు జానపద గేయఫణితులు అన్నమయ పదవాజ్బ్మయంలో కన్పిస్తాయి. ఉదాహరణకు కొన్ని గేయాలు- మేలుకొలుపు ; మిన్నక వేపాలుమాని మేలుకోవయ్యా సన్నల వీయోగనిద్రచాలు మేలుకోనయ్యాః (-374) కోలాటం ; వెట్టివలపు చల్లకు విష్ణుమూరితి నొతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి. (2-24)

ర్‌కి శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల దశావతారగేయాలు : పదియుంబదియులాను పరమాత్ముండితవికి వెదకి చవ్చలు దెచ్చి విందులిస్టై పేయరే.1 పొలపుపైంబారెవట బురద మే నంటనట యిలమన్ను మోచెనట యీ దేవుండు నెలవైన రాకాపి వెత్తుటందోంగినాండట కల పవ్నీరెల్లయో సి కడుగరే దేహము. (26-335) చాగు = బళా: చక్కవితల్లికి చాంగుబళా తన చక్కెర మోవికీి చాయగుబళా. (22107) కోభనం ; పాడఠే పోబనొలు పడంతులాల వేడుక లిద్దరికి వెలెయూడరే. (24-436) అంగన లీశే యారతులు ఆంగబజ గురునకు నారతులూ, (25-346) బాలక్రీడా సంకీర్తనలు : బండి వించి పిన్నపాపలతో వాడి దుండగీడు వచ్చె దోబూచి. (12-227)

జీవిత చరిత 59 దివ్యనామ సంకీర్తనలు : భగవంతుని నామం ఒక్కకే దివ్యనామం. భగవన్నామాన్ని పొదాం తంలోగాని లేదా చరణాంతంలోకాని వుంచి భక్తులు సామూహికంగా కీర్తించడానికి అనువయినవి దివ్యనాను సంకీర్తనలు, పాల్కుర్కిసోమన పండితారాధ్య చరిత్రలో శంకరపదాలను పేర్కొ న్నాడు. ఆంధ్రవాగ్గేయకారుల్లో ప్రథముడని "చెప్పదగ్గ కృష్టమూచార్యులు రామన్ఫసింహనామాలు నవ్రాసినవాడే! భగవంతుని దివ్యనామాలను అన్నమయ్య అనేక సంకీర్తనలలో రచిం చాడు . చతుర్వింశతి కేశవాదినామాలు, రామ, హనుమంత, చెన్నకేశవ, విఠల మొదలైన దివ్యనామ సంకీర్తనలు వీరి సాహిత్యంలో చోటుచేసుకొ న్నాయి, మచ్చునకు రెండు సంకీర్తనలు : నమో నమో లక్ష్మీనరసింహ క్‌ -348) నమో నమో సుగ్రీవ నరసింహ (2 పంతగాండు మిక్కిలి నీ పవవజుందు రంతుకెక్కె మతంగపర్వత పవనజుండు - (౧0-273) వృత్త్యాత్మక సంకీర్తనలు : అన్నమయ్య పండిత పామరజనరంజకుడైన వాగ్గేయకారుడు. భక్తి తత్త్వాన్ని ప్రచారం చేయడంకోసం దేశసంచారం చేశాడు. జానపదులను ఆకట్టుకోవడం కోసం కొన్ని వృత్త్యాత్మక గేయాలు (వ్రాశాడు. మచ్చునకు కొన్ని కీర్తనలు : వ్యవసాయం : పంటల భాగ్యులు వీరా బహు వ్యవసాయులు అంటి ముట్టి యిట్లంగాపాడుదురు ఘనులు, (3359)

60 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వర్తకం : వాడల వాడల వెంట వాండినో వాండివో నీడ నుండి చీరలమ్మే నేం బేహారి (1-275) గొల్లెత వ కుందణంపు మై గొల్లైత తా నెందును బుట్టని యేతరి జాతి (12-92) వైద్యం : కొనరో కొనరో మిరు కూరిమి మందు వునికి మనికికెల్ల నొక్కే మందు (11-237) కులనాచకాలు ; పొడవైన శేషగిరి బోయనాయండు విడువ కిందరింగాచు వెడబోయనాయండు (1-460) ఈ విధంగా అన్నమయ్య పదాల్లో వివిధ జానపదగేయరీతులు చోటుచే సుకోవడానికి కారణం అతదు. దేశపర్యటనమొనర్చి జనజీవన సాహిత్యాన్ని బాగా ఆకళింపు చేసుకోవడమే! " భాషావిశేషాలు : అన్నమయ్య శిష్టవ్యవహారం, సొమాన్య ప్రజావ్యవహారంలో ఉన్న భాషకు, (గ్రాంథికానికి మూడింటికీ (ప్రాధాన్యం ఇచ్చాడు. పండితుల్ని మెప్పించడానికి సంస్కృతంలో కొన్ని క్రీర్తనలు, వేంకటాచల నూహాత్మ్యం రచించాడు. శిష్ట్రులకు (గీతి కలిగించడానికి శిష్టవ్యవాహారిక భాషను, జానపదుల్ని ఆలరించడాననికి (గ్రామ్య భాషను సంక్రీర్తనల్లో ఉపయోగించాడు. అన్నమయ్య పదాల్లో పామరభాష ప్రథమస్థానాన్ని ఆక్రమించినది. వ్యావహారిక పదప్రయోగానికి *ఉచ్చారణ' ప్రాణం లాంటిది.

"జీవిత చరిత 61 మచ్చునకు కొన్ని ప్రయోగాలు : గనము (24-21), వాయిదాలు (17-403), కాపీరాలు (29-230), రుకిమిణి (26-233), పొస్తకాన (14-386) మొదలైన వ్యావహారిక పదాలు; ఈరుందియ్యంబేను వచ్చు (29-260), తల్లికి లేని ముద్దు దాదికా (8-163), ఉప్పు చిందినుమడించె (13-468), కట్టువదలిన క్రేపు (12-75), రొమ్మునకుంపటి (18-373), చేపట్టుకుంచము (10-176) వంటి జాతీ యాలు; అంగళ్లుముంగిళ్లు (14-162), అనలు కొనలు (92-228, ఒజిపో మెజపో (12-129) , చింతలు సిలుగులు (3-126) వంటి జంటపదాలు; కన్నుల మొక్కు (24-472), వలపుబండ్ల వచ్చు (26-221), అట్టలు గట్టినవ్వు (15-178), కారపు బొంకులు (26-257), వలపుగంపడాట్టు టీ (26-18) మొదలైన సజీవభావబంధుర ప్రయోగాలను గ్రంథస్థం _ చేసిన ధన్యజీవి అన్నమయ్య. దేశసంచారం ఆంధ్రవాగ్గేయకారుల్లో అనేక దివ్యస్థలాలను సందర్శించిన ఘనత లాళ్ళ “పాక అన్నమయ్యదే! అన్నమయ్య ప్రధానంగా రాయల సీమలోని కర్నూలు, _ అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలను; గుంటూరు, నెల్లూరు జిల్లాలను, కర్ణాటకలోని కలశాపురం, మతంగాద్రి, విజయనగరం; తమిళనాడులోని కంచి, శ్రీరంగం, చిదంబర క్షేతాలను దర్శించాడు. రాయలసీమలో కర్నూలు జిల్లాలో వెలసియున్న అహోబలన్ఫసీంహుని, చాగలమళ్టి, వెలిగోడులలో వెలసియున్న చెన్న కేశవుని; అనంతపురంజిల్లాలో కదిరి నృపింహుని, గుత్తి రఘురాముని; కడపజిల్లాలో ఓగునూతల నృసింహుని, ఒంటిమిట్ట కోదండ రాముని, కోన చెన్న కేశవుని, గాలివీడు నేంకకేశ్వరుని, చింతకుంట చెన్నకేశవుని,

62 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల దేవునికడప వేంకకేశ్వరుని, నల్లబల్లి చెన్నకేశవుని, నందలూరు సౌమ్య నాథుని, పులివెందల రంగ నాయకుని, పాలగిరి, "పెదచెప్పల్లి, "పెద్దము డియం, ప్రొద్దుటూరు, పోట్లదుర్తి, మాచనూరు, మాడుపూరు, వత్తలూరు, పంబటూరు, నెలిగోడు, చాగలమరులలో నెలకొన్న చెన్న కేశవ స్వామిని, . చిత్తూరుజిల్టాలో తిరుపతి గోవిందరాజుని, హనుమంతుని, శ్రీ రాముని, తిరుమల వేంకకేశ్వరుని, వాయల్పాడు శ్రీరామచంద్రుని; నెల్లూరు జిల్లాలో ఉదయగిరి శ్రీకృష్ణుని గండవరం గోపాల కృష్ణుని; గుంటూరుజిల్లాలో కుజునూతల చెన్నుని; కర్ణాటక ప్రాంతంలో మతంగాద్రి హనుమంతుని, విజయ నగరం విఠలుని శ్రీరామ, శ్రీకృష్ణ నారసింహులను కీర్తించాడు. ఇంతేకాక తిరుముల సరిసరాలైన అంజనగిరి, శేషాద్రి, వేంకటాద్రి, గరుడాద్రి, చేదాద్రులను; మరియు భవనాశి, తుంగభద్ర, పుష్కరిణితీర్థం, భూపతిచెరువు మొదలైన తీర్దాలను తన సంకీర్తనల్లో పేర్కొన్నాడు. (వ [గ అత ర్వా తాళ్లపాక్ష చుట్టూవున్న సోమశిల, గద్దెరాతి, ఎజ్జశిల, దొంగల సాని, గుబ్బలికొండ కనుమలను కూడా (ప్రస్తావించాడు. తాళ్లపాక చుట్టూ షట్బక్రాకృతిలో వున్న ఈ కనుమల్లోని ప్రతి కనుమదగ్గర చెన్న కేశ్వరాలయా నాయని స్థానికుల ద్వారా తెలుసుకొన్నట్టు శ్రీగౌరిపెద్ది రామసుబ్బ ర్మగారు అన్నమాచార్య శృంగారసంకీర్తనలు 32వ సంపుటం. పీరెకలో చర్చించియున్నారు. ( పంపుటం-12, ద్వితీయ పరిష్కరణ పీఠిక పుటలు 39-40) ఈ విధంగా అన్నమయ్య బహుదేశ సంచారంచేసి వివిధ క్షేత్రదైవతా లకు తిరుమల వేంకటేశ్వరస్వామికి అభేదప్రతిపత్తి పాటిస్తూ ఆనేక కీర్తనలు రచించాడు.

జీవిత చరిత్ర 63 సంకీర్తనల్లోవి ఉత్సవ విశేషాలు :

“ఉత్సూతే సుఖమితి ఉత్సవ” - ఆనందాన్ని అధికంగా కలిగించే దని ఉత్సవాంకు అర్ధం. ఉత్‌ + పవః = ఉత్సవః సొంసారికమైన దుఃఖసాగరాన్ని తరింపచేసేది, మంగళకరమయినది, ఉత్కృష్ట మయినదని ఉత్సవానికి అర్ధం.

॥ ఉత్సవాలు రెండు రకాలు. 1. మూలవిగ్రహానికి జరిగేవి 2, ఉత్సవ విగ్రహానికి జరిగేవి. వీటిలోను సామాన్య ఉత్సవాలు, పర్యోత్సవాలనేవి రెందు దకాలు.

వేంకటగిరిమీద స్వామివారికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, వర్వో త్సవాలు వైభవంగా జరుగుతుంటాయి.

నిత్యోత్సవాలలో సుప్రభాతసేవ, తోమాలసేవ, కొలువు, అహ్టోత్రరశత సహస్రనామార్చనలు, నివేదనలు, సర్వదర్శనం, ఏకాంత సేవా కైంకర్యాలు చేరుతాయి.

వారోత్సవాలలో బుధవారంనాడు జరిగే సహస్రకలశాభిషేకం, గురు వారంనాడు జరిగే తిరుప్పావడ, శుక్రవారంనాడు జరిగే అభిషేకోత్సనాలకు

ప్రాధాన్యం వృన్నది.

ఇక పర్యోత్సవాలలో బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఉట్ల ఉత్సవం,

డోలోత్సవం, రథోత్సవం, కళ్యాణోత్సవం, తెప్పోత్సవం, పుష్పయాగం, దీపా వళి, ఉగాది, శ్రీరామపట్టాధి షేకం, అనంతపద్మనాభ చతుర్దశి, విజయదశమి, కోడై తిరునాళ్‌, వనభోజనోత్సవం, కౌముదీమహోత్సవాలు సంకీర్తనల్లో

"పేర్కొనబడ్డాయి.

అన్నమయ్య పదాలు కేవలం భక్తి మార్గాన్ని ప్రబోధించుననే కావు,

వీరిసదాల పరిశీలన, పరిశోభనలవల్ల ఆనాటి తిరునుల ఆలయ విశేషాలు,

చారిత్రక రాజకీయ, సామాజిక విశేషాలుకూడ తెలుసుకోవచ్చును,

64 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల అన్నమయ్య సాళ్వ నరసింహరాయల కొలువు వీడి తిరుముల చేరి స్వామివారికి 'శృంగారమంజరి'ని సమర్పించి తదుపరి అచట జరిగే బ్రహ్మో తృవాలను సేవించేవాడని-- “ప్రతివత్సరంబు తప్పక వృషభాద్రి- పతికింగావించు నా బ్రహ్మోత్సవములు "పేవించుకొనుచు - , (అన్న చరిత్ర.ద్విసద-పుట-42) అనే పంక్తులవల్ల తెలుస్తోంది. కనుక బ్రహ్మోత్సవాలను గూర్చి పరిశీలిద్దాం. (బ్రహ్మోత్సవం : తిరుమలలో బ్రహ్మోత్సవం అనాదిగా జరుగుతున్న ఉత్సవ విశేషం. ఈ ఉత్సవాలను బ్రహ్మదేవుడు మొదటిసారిగా జరిపించాడనే అభిప్రాయంతో బ్రహ్మోత్సవాలనే పేరు స్థిరపడినట్లు తెలుస్తోంది. లంతేకాక నవబ్రహ్మలు నవాహ్నికదీక్షతో తిరుమలలో ఉత్సవాలను జరిసించడం, వేంకకేశ్వరుని పరబ్రహ్మ స్వరూపునిగా భావించడం, ఇక్కడ జరిగే ఉత్సనా అన్నింటిలోను బ్రహ్మోత్సవం వైభవంగా జరుపబడే ఉత్సవం కావడంచే “బ్రహ్మోత్సవాలు అని "పేర్కొనబడుతున్నట్లు వివిధ అభిప్రాయాలు ఏర్పడ్డాయి. (బ్రహ్మోత్సవాలను గూర్చి ఉపనిషత్తుల కాలంనుండి పారమాత్మకోప నిషత్తులోనుు వరాహ పద్మ, భవిష్యత్పురాణాలలోను, ఆగ్గమప్రక్షీర్ణకాధికా రంలోను (ప్రస్తావించబడి వుంది. (బ్రహ్మోత్సవాల సంఖ్య : బ్రహ్మోత్సవాలు నేడు సంవత్సరానికి ఒకసారి, అధికమాసం వచ్చే సంవత్సరాలలో రెండుసార్లు జరుగుతున్నాయి. కాని చారిత్రకంగాను అన్నమయ్య పదాల ఆధారంగాను పరిశీలిస్తే (బ్రహ్మోత్సవాల సంఖ్యలోను, రోజుల సంఖ్యలోను, ఉత్సవ విశేషాలలోను తేడా కన్పిస్తున్నది.

జీవిత చరిత్ర 66 తిరుమలలో క్రీశ 966 సం! నుండి శ్రీశ 1606 సం[॥ వరకు లభించిన శాసనాలను పరిశీలిస్తే సంవత్సరానికి ఏ్‌దో ఒక్కనెలలో తప్ప మిగిలిన 11 నెలల్లోను బ్రహ్మోత్సవాలు జరిగేనని తెలుస్తున్నది. అన్నమయ్య పదాల ఆధారంగా పరిశీలిస్తే బ్రహ్మోత్సవం సంవత్సరానికి - ఒక్కసారి మొత్రమే జరిగేదని (గ్రహించవచ్చును, నానా భూములవారు నమ్మి త్రీవేంకటపతి గానవచ్చి యేటనేట ఘనులయ్యేరు. (సంపు-3+సంకీ-383) అనే వొక్యాలు ఇందుకు నిదర్శనం. బ్రహ్మోత్సవాల రోజులసంఖ్య థి ఛిరునముల కాసనాణను పరగీల్న్న్టే (బ్రహ్మోత్సవాలు 9 రోజులకు తక్కువగొకుండా 14 రోజులపాటు జరిగేవని తెలుస్తోంది. అన్నమయ్య పడాలనుబట్టి (బ్రహ్మోత్సవాలు 16 రోజులుపొటు నిర్వ హింపబడేవని తెలుస్తోంది. బ్రహ్మోచ్చవ సమయంలో జరిగే వాహన సేవలను గూర్చి అన్నమయ్య- తిరునీథుల మహెరపీ దేవదేవుడు గరిమలమించిన సింగారముల తోడను ఉరుదండెలమై నేగీ దేవుండిదే తొలునాడు సిరుల రెండననాడు శేషుని మీద మురిపేన మూడోనాడు- ముత్యాల సందిరి ్రీంద పారి నాలుగోనాడు పువ్వుగోవిలలోను . గక్కున నయిదవనాడు గరుడిని మొదను యొక్కెను ఆరవనాడు యేమగు మోదను చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను యిక్కున దేరును గుట్ట మెనిమిదోనాడు 1

66 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల కనకపుటందలము కదిసి తొమ్మిదోనాడు "పెనచి పదోనాడు సెండ్లిపీట యెవపి శ్రీవేంక కేశుడింతి యళలమేల్మంగతో నవితల నడుమును వాహనాలమీదను (13-192) అని వర్ణించాడు. పురాణాలలో, సంకీర్తనల్లో కన్పించే బ్రహ్మోత్సవ వర్ణనల్లో తేడా కన్పిస్తున్నది. అన్నమయ్య _ సంకీర్తనల్లో వర్ణించిన తిరుదండెలు, ముత్యాల పందిరి, పుప్వుగోవిల, కనకపుటందలం నేటి మనుష్యాందోళిక, మౌక్తిక మండపం, కల్పవృక్షం, పల్లకీవాహనాలకు నామాంతరాలుగా కన్పిస్తున్నాయి. పురాణాల్లో చెప్పబడిన హంస, సింహ, సర్వభూపాల, హనుమద్వాహనాల (ప్రస్తావన అన్నమయ్య పదాల్లో కన్పించదు. వాహన సంకీర్తనలు ; వీడులదే శేషుందు శ్రీవేంకటాద్రి శేషుండు వేడుక గరుడనితో బెన్నుద్దైవ శేషుండు ॥ (సంపు-3-కఓ365) గరుడవాహనం : ఇటు గరుడవి నీవెక్కినను పట పట దిక్కులు పగిలె (౧-92) గజవాహనం : ఏపున నేనుగువెక్కివిదె దేవుడు (13-58) ఈ వాహనసంకీర్తనలను బ్రహ్మోత్సవ సమయంలో ఆలపించేవారని భావించవచ్చు.

జీవిత చరిత్ర 67 కల్యాణోత్సవం : స్వామివారికి జరిగే ప్రధాన ఉత్సవాలలో కల్యాణోత్సవం ఒకటి. స్వామివారి కల్యాణోత్సవానికి సంబంధించి క్రీశ 1546, శ్రీశ. 1554 సం॥[లలో తాళ్ళపాకవారు వేయించిన 2 శాసనాలు కన్పిస్తున్నాయి. ఈ రెండు శాసనాలలోను కల్యాణోత్సవం జరిగే రోజులగురించి, విధానం గురిం చిన విశేషవివదణలున్నాయి. అన్నమౌచార్యుని దౌహిత్రుడైన 'దేవణూరి వేంకటాచార్యుడు శ్రీపాద రేణుమాహాత్మ్యంలో- శ్రీలలరంగ మంగనును శ్రీహరి కెన్నండు ధారనోయుచో6 దాళులపాక యన్ననుయ దాంగడిగెం బదముల్‌ ధరిత్రి మౌ తాళుల పాక చిన్నన పదంబులు పాడిన నాండె సర్పరాట్‌ శ్రైలవిభుందు తత్పదరజంబును నూకు నాసంగంెల్లదేః శకుంతలాసరిణయంలో- '“అమ్మహాదేవుండు మదీయమాతామహవంశ శిఖారత్నంబగు. నన్న మాచార్యునకు జామాతరుం.. డనిపించుకొని, భవదీయ సంకీర్తనంబు క లాలించిన కర్ణంబుల నితర సంకీర్తనంబు లాలించనని ప్రతిజ్ఞ గావించె' అని పేర్కొన్నాడు. "పై గగంథాధారాలనుబట్టి తాళ్ళపాక వంశీయులే తిరుమలలో కల్యా ణోత్సవానికి ప్రధానకారకులని చెప్పవచ్చును. సంకీర్తనల్లో కల్యాణోత్సవం : అన్నమయ్య కల్యాణోత్సవ సమయంలో ఆచరించే ఆగమ విధానాలను, ఆచారాలను భక్తితత్త్వంతో. కీర్తించాడు. బ్రహ్మోత్సవ సంకీర్తనలో - *=పెనచి పదోనాడు సపెండ్లిపీటి (13-192)

68 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల అని పేర్కొనడాన్నిబట్టి కల్యాణోత్సవం బ్రహ్మోత్సవం తర్వాత నిర్వ హింపబ డేదని తెలుస్తోంది. అన్నమయ్య దివ్యదంపతులైన అలమేల్మంగా శ్రీనివాసుల కల్యాణమహోత్సవాన్ని అవేక సంకీర్తనల్లో వర్ణించాడు. వివాహ సమయంలో కానవచ్చే బాసికాలు కట్టడం, పెండ్లి పీట, తెరకట్టడం, మంగళాష్టకాలు, కంకణ ధారణ, ముహూర్తం, అక్షింతలు, తలంబ్రాలు, కొంగుముళ్చు, సేసలు, విడేలు, చదివింపులు, ఆరతులు, శోభనాలు మొదలైన ఆచారాలన్నింటిని సంకీర్తనల్లో (ప్రస్తావించాడు.

అన్నమయ్య తిరుమలలో జరిగే ఉత్సవాలనే కాక తిరుపతి, దేవునికడప, ఓగునూతల, అహోబలం, గండవరం, చిదంబరం, విజయ నగర క్షేత్రాలలో జరిగే ఉత్సవాలను కూడ సంకీర్తనల్లో ప్రస్తావించాడు.

అన్నమయ్య తిరుమలలో జరిగే ఉత్సవాలనే కాక తిరుపతి, దేవునికడప, ఓగునూతల, ఆహోబలం, గండవరం, చిదంబరం, విజయ నగరక్షేత్రాలలో జరిగే ఉత్సవాలను కూడ సంకీర్తనల్లో పేర్కొన్నాడు.

అన్నమయ్య దేశసంచారంచేస్తూ ప్ర సిద్ధదేవాలయాల ఉత్సవ విశేషాలను ముందుతరాల వారికి అందించిన మహనీయుడు. తాళ్ళపాక వారి కైంకర్యాలు :

తిరుమలలో వేంకటవిభునికి జరిగే సుప్రభాతం, ఏకాంత సేవలలో తాళ్ళపాక వంశస్థులు పాల్గొనే ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఏకాంత బవలో తాళ్ళపాకవారికి స్వామివారి తాంబూలం, ప్రసాదం ఇస్తారు. తిరుమలలో జరిగే కల్యాణోత్సవాలలో తాళ్ళపాకవారు అన్మువారి పక్షాన కన్యాదాతలుగా వ్యవహరించడం నేటికీ ఆచారంగా వుంది. తిరువీథులలో జరిగే ఉత్సవాలలో కూడా తాళ్ళపాక వారికి ప్రత్యేక మర్యాదలున్నాయి. ఇవేగాక ఉగాది, దీపావళి పర్వదినాల్లో బంగారువాకిలివద్ద జరిగే స్వామివారి చాంకర్యాలలో తాళ్ళపాకవారివి ప్రత్యేక హారతులున్నాయి. ప్రత్యేకించి ఉగాది మొదలు 40 రోజుల 'పాటు జరిగే నిత్యోత్సవాలలో తాళ్ళపాక వారికి (ప్రత్యేక సత్కారాలున్నాయి. ఈ నలభైరోజుల కాలంలో సంకీర్తన భాండాగారంవద్ద హారతొసేవ వున్నది.

జీవిత చరిత్ర 69

అన్నమయ్య కేవలం స్వామివారి ఉత్సవవైభవాలను గూర్చి. సంకీర్తనలలో క్రీర్తించడమే కాక తనవంశంవారి నందరిని ఉత్సవాలలో భాగస్వాములుగా చేపి తరింపచేసిన ధన్యజీవి. సంకీర్తన భాండాగారము

కవుల కృతులను రాగిరేకులమాద బ్రాయించే ఆచారం తెలుగుదేశంలో తాళ్ళపాక కవృలకు పూర్వంకాని, తర్వాతకాని లేదు. ఈ పద్ధతికి తాళ్ళపాక వంశజులే. ఆద్యులు. భారతదేశంలో కావ్యాలను తామఫలకాలమోద బ్రాయించే. సంప్రదాయం ప్రాచీన కాలంలో వున్నట్లు తెలుస్తున్నది. కనిష్కుడు కొన్ని బౌద్ధమత (గ్రంథాలను రాగిరేకుల మోద వ్రాయించినట్లు హ్యుయ్యాన్‌త్సాంగ్‌ పేర్కొన్నాడని, సాయణాచార్యుల వేదభాష్యం కూడా రాగిశేకుల మోదికి ఎక్కినట్టు ఒక ఐతిహ్యం వుందని డిసి సర్కార్‌ పేర్కొన్నారు. 24122 తంకణుయా 3? ౨.6. కొయ్యి వో న. 1965, ౨౭౬6-8770) లఘుకావ్యాలను శిలలమౌద చెక్కించే సంప్రదాయం వుందని, కొంచీపురంలోని కచ్చ'పేశ్వరాలయంలోని ఒక శిలాస్తంభంమోద మయూరుని సూర్యశతకం చెక్కబడి వుందని శ్రీ ఆర్‌, ఎస్‌ పంచ ముఖిగారు. ఉగ్గడించారు. (4 మణం&! రం%8658 0£ కం కంమణ! వఏంజడంట 02 2614 లజ. 1978, వెడ్‌&రం45.)

. _ తాళ్లపాకకవుల సాహిత్యాన్ని రాగిరేకులమోద వ్రాయించి తిరుమల ఆలయ ప్రాంగణంలో భద్రపరచిన గడికి “తాళ్లపాక అర అని పేరు. తాళ్లపొక అరలోని తాళ్లపొకకవుల సాహిత్యాన్ని గూర్చి మన ప్రొచీనకవు లెవ్వరూ ప్రస్తావించలేదు. మొట్టమొదట ప్రస్తావించినవాడు విదేశీయుడైన ఎ.డి. కాంబెల్‌. అతడు క్రీశ 1816లో వ్రాసిన మాటలు :

లలి లారి భుజం 4 ఇలుంవిలు 01 పంం09 69క్రైతగరిరే 09 50116 మంగ82ు6ే ఏ%606టూ 08 002067 226 6టు. 268అ6కీ స 6 ఫై1005 0828 ౧౮ & *2ముట్స' 0 ౨220న 12 6 1200016 0% చం 92006 ఏ జ కంజడు క రేలుళంం6 2 22676 ఓం? చే ౧ళుగ్తుం6 01 అయు[9196 మయ్య

70 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల సళళ *ంగలు చం లంంలైడంగ 008 హాండళ56 01 ఈం008 ౦70100 & 00” ౪5 అంం%ు చ6 *0016 60160600 ౪/83 శంయుడి 90 60026210 ంచు102 సేళల ₹0మునంంగం స్రసుగ9 056 0 చం ౨160”.

(ఆయు 81 05 గంయిక్రంం 14080826 సే” ఉం. రం) వౌటకో మెయరం 1816, కెడ్‌జడకడ5. )

తిరుమలలో స్వామివారి ఆలయంలో విమానప్రదక్షిణ ప్రాకార మండ పాన్ని ఆనుకొని ఉత్తరం వైపున భాస్యకారుల గుడిప్రక్కన సంకీర్తన భాండాగారంలో రాగిరేకులను భద్రపరిచారు. ఇందులో లభించిన రేకుల వివరాలు--

తాళ్ళపాక అన్నమయ్య- 2289

తాళ్ళపాక "పెదతిరుమలయ్య- 205

తాళ్ళపాక చినతిరుమలయ్య' = 87

ఇవికాక సన్న, ెద్దరేకులు- 170

మొత్తం రేకులు- 2701

సంక్రీర్తనల్ని రాగిరేకులనోదికి ఎక్కించడం సాధారణ విషయం కాదు. సంకీర్తన భాండాగార వ్యవస్థగూర్చి మొదటగా శ్రీశ. 1530 నాటి తాళ్ళపాక శాసనంలో కనిపిస్తున్నది.

క్రీశ. 1530 నాటి శాసనంలో అచ్యుతరాయడు బ్రహ్మోత్సవ సమయంలో సంకీర్తన భాండాగారం ముందు నైవేద్య సమర్పణకు ఏర్పా టుచేసినట్లు ప్రస్తావింపబడింది. శ్రీశ. 1545, (శ్రీశ 3558 సం॥ నాటి శాసనాలలో కూడా సంకీర్తన భాండాగారంగూర్చిన ప్రస్తానన కనిపిస్తుంది. ఈ సంకీర్తన భాండాగారానికి దీపాలు, వైవేద్యం సమర్పించటం; జీతం, (ప్రసాదాలు ఇచ్చి సంకీర్తనలను పాడేవారిని నియమించటం, సంక్రీర్తనలను వినేవారికి పన్నీరుబుడ్డు, చందనతాంబూలాదులు ఇవ్వటంగూర్చి కలదు.

జీవిత చరిత్ర 71 నిత్యం తిరుమంజన సమయంలోను, బ్రహ్మోత్సవం, రథోత్సవసనముయాల్లోను ఈ _ సంకీర్తనలు ఆలపించే పద్ధతిని ఏర్పాటుచేశారు. గ్రీష్మోత్సవంలో “సంకీర్తనలు అరుళుప్పాడు" ఏర్పరచారు. (అరుళుప్పాడు అనగా దయ నర్ధించి పాడే పాటలతో కూడిన ఉత్సవం) తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలోకూడా సంకీర్తనల గానానికి ఏర్పాట్లు చేశారు. ఈ సంకీర్తన భాండాగారం ద్వారానికి ఇరువైపుల అన్నమయ్య, పెద తిరుమలయ్యల శిల్పమూర్తు లున్నాయి. సంకీర్తన (ప్రక్రియకు, ఇతర రచనలకు శాశ్వతస్థితి కల్చించడానికై “తాళ్ళపాక అరి ను _ ఏర్పాటుచేసి క్రైంకర్యాదులు నిర్వహించడంపట్ల తాళ్లపాకవారు జరిపినకృషి “నభూతో నభవిష్యతి". కీ.శే సాధు సుబ్రహ్మణ్య శాస్త్రిగారు సంకీర్తన భాండాగారం నుండి సంకీర్తనల రాగిరేకులను మొట్టమొదటగా క్రీశ. 1922 సంవత్సరములో శరలించి వ్రాతప్రతులను సిద్ధంచేశారు. తాళ్లపాకకవుల జీవితవిశేషాలను, _ కృతులను, భగవత్‌ క్రైంకర్యాలను శాసనస్థ ఆధారాలతో నిరూపించారు. తాళ్ళపొక సంకీర్తనల పరిష్కరణ - ముద్రణ : తాళ్లపాక వాబ్మయాన్ని పండిత వి. విజయరాఘవొచార్య, వేటూరి ర ప్రభాకరశాస్త్రి, ఏ.వి. శ్రీనివాసాచార్యులు, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ: స = జ్స గారలు జగన్నాథరావు, గౌరి పెద్ది రామసుబ్బశర్మ, కామిశెట్టి శ్రీనివాసులు పరిష్కరించారు. తాళ్ళపాకసా హిత్యాన్ని తిరుమల తిరుపతి దేవస్టానంవారు (శ్రీశ 1935 ౭౮ పొక సంవత్సరంనుండి ప్రకటిస్తున్నారు. శ్రీశ. 2935 సంవత్సరంలో తొళ్ళి లఘుకృతులు మొదటి సంపుటంగా (క0 ఛాయ 01 ₹2118 0812 ౦6టు), 1936-1937 సంవత్సరములలో అన్నమాచార్య, సెదతిరునులా చార్య సంకీర్తనలు 2,3 సంపుటాలుగా ముద్రింపబడ్డాయి.. 1947 సం! నుండి అన్నమాచార్య సంకీర్తనలు పరిష్కరణ సంవిధానంతో సంపుటాలుగా ప్రకటింపబడుతున్నాయి. 1947 సం[లో ప్రకటింపబడిన 4వ సంపుటం

72 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల మొదలుకొని 1992 సంవత్సరంవరకు తాళ్ళపాకవారి సంకీర్తనలు 32 సంపుటాలుగా వెలువడ్డాయి. ఇందులో 16వ సంపుటం చినతిరుమలయ్యది; 21, 23 సంపుటాలు సపెదతిరుములయ్యవి. అవిపోను 4వ సంపుటం నుండి 32వ సంపుటం వరకు అన్నమయ్యవి. వీటిలో 5 నుండి 11వ సంపుటం వరకు అధ్యాత్మ సంకీర్తనలు. 4వ సంపుటము మరియు 12వ సంపుటంనుండి 32న సంపుటం నరకు శృంగార సంకీర్తనలు. మొత్తం అన్నమయ్యవి అధ్యాత్మ, శృంగారసంకీర్తనలు కలసి 26 సంపుటాలుగా వెలువడినట్టు లెక్క, ఇక 3౩ సంపుటాలు ము(దైింపవలసి వున్నది. అన్నమయ్య--

సారసనేత్రుపై సంక్షీర్తవములు

సరసత్వమువందాళ సముఖముల్‌ గాంగ

పరమ తంత్రములు ముప్పది రెండువేలు

(అన్న. చరిత్ర.ద్విపద-పుట-45) రచించివట్టు ద్విపద ఆధారంగా తెలుస్తున్నది. కాని రేకులద్వారా మనకు లభించిన శ్రీర్సనలు దాదాపు 14,000. మిగిలిన సంకీర్తనలు కాలగర్భంలో కలసిపోయాయి. తాళ్ళపాక వంశస్తులు : వన

సీరినరు మెప్పించి చెలి యాదేస్ఫ-

వరమునందనయంత వారియిత్రకుల

నరస యాచార్యు నున్నత యశోధనుని,

తిరుమలాచార్యుని ధీవిశారదుని

గౌంచ్వి వారును దవ కరణి విద్యలను

గాంచనొంబరు భక్తికలిమించెంపాంద

శారికథాసుధా సల్గాప గరిమ

ధారుణి నసెంతయుందనరారు చుండె,

(అన్న. చరిత్ర.ద్విపద-పుట-46)

జీవిత చరిత్ర ౫ తాళ్ళపాక వంశభ్యాతికి మూలపురుషుడు అన్నమయ్య. అన్నమయ్య సతీమణి, పుత్రపొత్రాదులుకూడా కవులుగా, సంకీర్తనాచార్యులుగా ఆంధ్ర సాహిత్యచరిత్రలో సుస్థిరస్టానం సంపాదించుకొన్నవారే! తాళ్లపాక తిమ్మక్క 1 ఈమె అన్నమయ్య మొదటిభార్య. 'సుభద్రాకళ్యాణము' అనే గేయ కావ్యాన్ని రచించినది. తొలి తెలుగు కవయిత్రి, నుంజరీ ద్విపదకావ్యమైన సుభద్రాకళ్యాణం స్త్రీజనోపయుక్తమైన మధుర గేయ రచన. ఈకావ్యం 1947 సం1లో దేవస్టానంవారిచే ప్రకటింపబడినది. తాళపాక నర సింగన్న ; ఛా ఇతడు అన్నమయ్య సెద్దకుమారుడు. వీరి కృతులు అలభ్యం. “కవి కర్ణరసాయనకర్త” వీరేనని పరిశోధకుల అభిప్రాయం, తాళ్లపొక పెదతిరువముులయ్య ; ఇతడు అన్నమాచార్యుని ద్వితీయ పుత్రుడు. శ్రుమద్వేదమార్గ ప్రతి ష్టాపసనాచార్య, వేదాంతాచార్య, కవితార్కికకేసరి ఇత్యాది బిరుదాంకితుడు. వీరి సాహిత్యం మొత్తం 205 రేకుల్లో లభించినది. రచనల వివరాలు : అధ్యాత్మ సంకీర్తనలు జాలా 76 రేకులు శృంగార సంకీర్తనలు ఆలా 89 రేకులు నీతి (సీనపద్య) శతకము ఎం 10 రేకులు చక్రవాళ మంజరి న్‌ 2 రేకులు సుదర్శన రగడ అ శ రేకులు శృంగార దండకము అం 3 రేకులు

7డ్త శ్రీ తాళ్ళపాక అన్నమాచార్వుల రేఫ అ కారన్నిర్భయము ఆం 4 రేకులు వేంకకేశ్వరోదాహరణము ఆజ ౩ రేకులు వృత్తపద్యశతకము ఆం 7 రేకులు వైరాగ్య వచన మాలికా గీతములు ఆం 10 రేకులు

భగవద్గీత (తెలుగువచనము) ఎస్‌, వి, యూనివర్శిటి వారిచే 1978 సంకలో ప్రచురింపబడినది.

హరివంశము అలభ్యం

(చిన్నన్న అష్టమహిషీ కళ్యాణంలో పేర్కొన్నాడు)

సంకీర్తన లక్షణవ్యాఖ్య అలభ్యం.

శ్రీవేంకకేశ్వర ప్రభాతస్తవము : 1945 సం[లో ప్రకటితమైన వేంకశేశ్వర వచనములతో ఇదిప్రచురితమైనది. తాళ్ళపాక చినతిరుమలాచార్యుడు :

ఇతడు తాళ్ళపాక "పెదతిరుములయ్య సెద్ద కునూరుడు. వీరి సాహీత్యం 37 'రేకులలో లభించినది. అష్టభాషాచక్రవర్తి బిరుదాంకితుడు.

శృంగార సంకీర్తనలు - 20 రేకులు 1962 సం॥లో 'ప్రకటితం.

అధ్యాత్మ సంకీర్తనలు - 10 రేకులు 1962 సం॥లో ప్రకటితం.

అష్టభాషాదండకము - ౩ రేకులు 1935 సం॥లో ప్రకటితం. సంకీర్తన లక్షణము - 4 రేకులు 1935 సం!లో ప్రకటితం. తాళ్ళపాక అన్నయ్య :

"పెదతిరుమలాచార్యుని. రెండవ కుమారుడు. ఈతరీడన్ని విద్యల యందు నరయ మున్నింటి యన్నయార్యునించబోలు నన్నయాచార్యుండిని కీర్తిని పొందాడు. మతప్రచారంకోసం గుంటూరుకు తరలి వెళ్ళినట్లు శాసనాలద్వారా తెలుస్తున్నది,

జీవిత చరిత్ర 75 తాళ్ళపాక సెదతిరువెంగళనాథుడు : సంగీత సత్కవిత్వాధికుడు. ఇతడు స్వామిసన్నిధిలో క్రీర్తనలు పాడు చుండగా. స్వామి ఆడుచుండెడివాడట. రేవణూరి వేంకటాచార్యుండు శకుంతలా. పరిణయములో “విశేషించియు. నత్తిరుపంగళ నాధుండు సెంకీర్తనంబులు పొడిన నాడం దొడంగె నని ప్రస్తావించాడు. తాళ్ళపాక చినతిరువేంగళనాథుడు (చిన్నన్న) : ఈయన సెదతిరుమలయ్య నాల్లవ కునూరుడు. వీరి రచనలు- అన్నమాచార్య చరిత్ర-ద్విపదకావ్యము - 1949 సం!లో ప్రకటితం. -1978సం!లో ద్వితీయ ముద్రణ పరమయోగి విలాసము - ద్విసదకావ్యము - 19388సం!లో ప్రకటితం. అష్టమహిషీ కళ్యాణం - ద్విపదకావ్యము - 1937సం!లో ప్రకటితం, ఉషాకళ్యాణము - ద్విపదకావ్యము - 1938సం!లో ప్రకటితం, కోనేటి తిరువెంగళనాథుడు : “పెదతిరుమలాచార్యుని. చిన్న కుమారుడు. శ్రీ వైష్తవాచార్యుడని, వేదమార్ల ప్రతిష్థాపనాచార్యుడని కీర్తిని పొందినాడు. తాళ్ళపాక తిరువేంకటాచార్యుండు (తిరువేంగళప్పు : ఈయన చినతిరుమలాచార్యుని కుమారుడు. వీరి రచనలు - అమరుకను, గురుబాలప్రబోధిక, సుధానిధి. 'నేవణూరి చేంకటాచార్యుడు ; అన్నమాచార్యుని దౌహిత్రుడు. నీరి రచనలు - శకుంతలా పరిణయము, . శ్రీపాద రేణుమాహాత్మ్యము మొదలగునవి.

76 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల అన్నమయ్య మొదలుకొని ఐదుతరాలవరకు అంటే ఒకటిన్నర శతా బ్లైకాలం అవిచ్చిన్నంగా _ వివిధప్రక్రియల్లో అనేక గ్రంధాలను రచించి తెలుగుభాషా సాహిత్యాలకు ఎనలేనిసేవ చేసినవారు తాళ్ళపాకకవులు. “తాళ్ళపాకవారి సాహితీ మందిరమునకు మతము పునాది. సంస్కృ తాంధ్రములు కట్టడపు శిలలు. సంకీర్సనాది సాహితీ ప్రక్రియలు సోపా నములు. అందలి యారాధ్య దైవము శ్ర్రీవేంకక్రేశ్వర స్వామి. ధర్మార్ధ కామమోక్షములు నాలుగు ప్రాకారములు, మధుర కవితలు ద్యారంవాకిళ్ళు. సార్వజనీనమ్యు సార్వకాలికమునగు ఉత్తమ భావసంపద తన్మందిరశ్ర్రీభండా రము. ఆ కవులే యర్బకులు. భక్తియే భగవత్రసాదము.. గానమే స్వామి కంగరంగ భోగములు, రసిక వర్యులే యాత్రికులు. ఇదియే వారి కవితా స్వరూపము” అన్న డా! వేటూరి ఆనందమూర్తిగారి మాటలు చిరస్మరణీయాలు. అవతార సమాప్తి : అన్నమాచార్యులు శ్రీశ 1503లో దివ్యధామం అలంకరించాడు. అది దుందుభి సంవత్సర ఫాల్గుణ బహుళ ద్వాదశి. అన్నమయ్యను వారి వంశస్టు లందరు గురువుగా, దైవంగా భావించి పూజించారు. అన్నమయ్య వల్లనే తాము పునీతులమైనామని చాటిన ళా ర; కీర్తనలు తాళ్ళపాకవారి సంకీర్తనల్లో కన్పిస్తాయి. తి.తి. దేవస్థానం అన్న మాచార్య ప్రాజెక్టువారు ప్రతినెల 'బహుళద్వాదశి", ప్రతిసంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశినాడు వర్థంతి ఉత్సవములు జరపడం ఆనవాయితీగా వున్నది. అన్నమయ్య _ నిర్యాణతిథిని పురస్కరించుకొని తాళ్లపాకవారు రచించిన కీర్తన- దినము ద్వాదశి నేందు తీర్ధదినసము నీకు జనకుండ అన్నమాచార్యుండ విచ్చేయవే॥ అవంతగరుడముఖ్యులైన సూరిజనులతో ఘననారదాది భాగవతులతో

జీవిత చరిత్ర 77 దనుజ మర్దనుండైన దైనశిఖాముణితోడ వెనుకొని యారగించ విచ్చేయవే! వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి లోకపు నిత్యముక్తులలోన నుండి శ్రీకాంతతోడ నున్న శ్ర్రీవేంకకేశుంగూడి యీకడ నారగించ వింటికి విచ్చేయవే॥! సంకీర్తనముతోడ సనకాదులెల్లయాడ పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి లంకె శ్రువేంకటగిరి లక్షీ శ్రవిభుండు నీవు నంకెల మాయింటి విందు లారగించవే | (2-151) అన్నమయ్యను హరియవతారమని, అప్పని వరప్రసాదియని అన్నమయ్య పుత్రసౌత్రులు శ్రీర్తించారు. హరి యవతార మాతండు అన్ననముయ్య అరయ మా గురుండీతండన్నమయ్య |! వైకుంఠనాథుని వద్ద వడింబాడుచున్న వాండు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య ఆకపపు విష్ణుపాదమందు నిత్యమై వున్నవాడు ఆక డీకడందాళ్ళసాక అన్నమయ్య | క్షీరాబ్దిశాయి నిక్షే సేనింపుచునున్నవాండు ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య ధీరుడై సూర్యనుండల తేజమువద్ద నున్నవాండు ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య ॥ యీవల పంసారలీల యిందిరేశుతో నున్నవాండు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య భావింప శ్రీవేంకటేశు పొదములందె వున్నవాడు హావ భావమై తాళ్ళసొక అన్నమయ్య ॥ (2100)

78 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల అప్పని వరప్రసాది అన్నమయ్య అప్పపము మాకె కలడన్న మయ్యా ॥ అంతటికి నేలికైన ఆదినారాయణుందన యంతరంగాన విలిపీ నన్నమయ్యా సంతసొవనణొలువొందె పనక సనందనాదు అంతటీవాండు తొళ్ళపాకన్నమయ్యా | బిరుదు సెక్కెములుగాంటెక్కు సంకీర్తనములు హరిమాంద విన్నవించె నన్నమయ్యా విరివి గలిగినట్టి వేదముల యర్థమెల్లా ఆరసి వెలిపినాందు అన్నమయ్యా | అందమైన రామానుజార్య మతమును అందుకొని నిలిచినాండన్నమయ్యా విందువలె నూకును శ్ర్రీవేంకటనాథుని విచ్చె అందరిలోందాళ్ళపాక అన్నమయ్యా

(6-1-23)

శరణంటి మాతనీ సమ్మంధమువలయేసి మరిగించి మమునేలి మన్నించవే ॥ సకలవేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నిముంబాడి పావనుండైన అకలంకుండు తాళ్ళపాకన్నమాచార్యుల పెకరిత్టై యేలిన శ్ర్రీవేంకటనిలయ | వారదాది పసనకపనందవాదులవలె సేరుపడి వెన్నుంబాడి "పెద్దలైనట్టి ఆ రీతిందాళ్ళపాకన్నమాచార్యుల చేరి యేలినయట్టి శ్రీవేంకటనిలయ 1

జీవిత చరిత్ర 79 పామవేద సానుగానసస్తస్వరములమ బాముతో నీసతి విన్నుంబాడిన యట్టి ఆముకొన్న తాళ్ళపాకన్నమూచార్యుల వేమరు మెచ్చిన శ్ర్రీవేంకటవిలయా ॥ (2-24) ఇవి అన్నమాచార్యుల సంబంధముతో గొప్పవారమైనామని చెప్పుకొన్న సంక్రీర్తనలు. పంగీతసాహిత్యముల మేలుకలయికతో శ్ర్రీవైష్ణవమత ప్రచారానికి, ఆంధ్రసారస్వత సేవకు తాళ్ళపాక అన్నమయ్య గావించిన సేవ ఎనలేనిది. 0. 4000. 40000. తిరు వేంగళనాథ విరచిత పద్భక్ష విభవాన్నమాచార్య చరితంబు జగదేక సన్నుతం బగుచు వాచక్ర శంఖాంక యశముతోంగూడ నాచంద్రతారార్కమై యుందు(౬గాక. (అన్నం చరిత్ర.ద్విపద-పుట-47) అన్న చిన్నన్న వాక్యాలే చిరస్మరణీయాలు. ఈ చ + ఈ ప

80 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల ఉపయుక్త గ్రంథసూచి

  1. అనంతకృష్ణశర్మ, రాళ్ళపల్లి (పరిష్కర్తలు) అధ్యాత్మసంకీర్తనలు అన్నమాచార్య విరచితములు సంపుటములు 10, 11 తి,తి, దేవస్టాన ప్రచురణలు ర్‌
  2. అనంతకృష్ణశర్మ, రాళ్లపల్లి (పరిష్కర్త శృంగార సంకీర్తనలు అన్నమాచార్య విరచితములు పంపుటములు 13, 14 తి.తి. దేవస్తాన ప్రచురణలు. ళ్‌ తె, అనంతకృష్ణశర్మ, రాళ్ళపల్లి రామసుబ్బశర్మ, గౌరిపెద్ది (పరిష్కర్తలు)- శృంగార పంకీర్తనలు అన్నమాచార్య నిరచితములు సంపుటములు 19, 20, 22 తి.తి. దేవస్టాన ప్రచురణలు. ళ్‌
  3. ఆనందమూర్తి, వేటూరి తాళ్లపాకకవుల కృతులు- వివిధ పాహితీ ప్రక్రియలు ప్రభాకర ప్రచురణలు 'హదరాబాదు, 1974.
  4. ఆనందమూర్తి, నేటూరి తాళ్లపాక కవుల పదకవితలు- భాషాప్రయోగవిశేషాలు

జీవిత చరిత్ర 91 ప్రభాకర ప్రచురణలు 'ప్టైదరాబాదు, 1976 6. కొండమాచార్యులు, ముదివర్తి అమృతపారము త్యాగరాజ ప్రింటర్స్‌, తిరుపతి, 1986. 7. గంగప్ప, ఎస్‌. తెలుగులో పదకవిత శశీ ప్రచురణలు శ్రీవివాసనగర్‌, గుంటూరు, 1983. 8. గోవిందరాజు, చిట్రాజు తాళ్లపాక అన్ననుయ్య సంకీర్తవలలో- ఉత్సవవి శేషాలు శ్రీనివాస ప్రచురణలు రామసముద్రం, 1987. 9. తులజు పుట్టపర్తి శ్రీరామానుజుల జీవితచరిత్ర కాచిగూడ, హైదరాబాదు, 1984. 10. నాగభూషణం, రాంపల్లి తిరుపతిక్తేత్ర సాహిత్యపమీక్ష పవన్‌కునూర్‌ ప్రచురణలు తిరుపతి, 1983. కై పార్ధసారథి భట్టాచార్యులు, ఎ. వరాహపురాణం ఎస్‌.వి. ప్రాచ్య పరిశోధనాలయ పంస్థ తి.తి.దేవస్థావములు, 1056.

82 శ్రు చాళ్ళపొక అన్నమాచ్నార్యుల

  1. పెదతిరుమలయ్య, తాళ్లపాక శ్రీమద్భగవద్గీత ఎస్‌. వి. విశ్వవిద్యాలయ ప్రాచ్యపరిశోధనాలయం తిరుపతి, 1978.

  2. ప్రభాకరశాస్త్రి, వేటూరి (పరిష్కర్త) శృంగారసంకీర్తనలు సంపు-4 అధ్యాత్మపంకీర్తనలు సంపు-5 అన్నమాచార్య విరచితములు తి.తి.దేవష్థాన ప్రచురణలు, 1947, 1950.

  3. ప్రభాకరశాస్త్రి, వేటూరి (పరిష్కర్త) అన్నమాచార్య చరిత్రము ప్రథమముద్రణ తితి.దేవస్టాన ప్రచురణ, 1949.

  4. బోలసుబ్రహ్మణ్యం, జూలకంటి వేంక టేశ్వరుడు-అన్నమయ్య చంద్రమౌళి ప్రింటర్స్‌ తిరుపతి, 1983.

  5. మోహన్‌, జి. ఎస్‌.

య! వలి జు ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రపీద్ధపుణ్యక్షేత్రాలు దేవాలయాలు శ్రీనివాప ప్రచురణలు కళ్యాణదుర్గం, 19856.

జీవిత చరిత్ర 83

  1. రజనీకాంతరావు, బాలాంత్రపు ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర విశాలొంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ విజయవాడ, 1975.

  2. రామసుబ్బశర్మ, గౌరిపెద్ది (పరిష్కర్త) శ్రుతాళ్లపాక అన్నమాచార్యుల బీవితచరిత్రము మూడవముద్రణ తి.తి.దేవస్టాన ప్రచురణ, 1978.

  3. రామసుబ్బశర్మ, గౌరి పెద్ది (పరిష్కర్త) అధ్యాత్మపంకీర్తనలు అన్నమాచార్య విరచితములు సంపుటములు 1, 2,3 తితి. దేవస్తానముల ప్రచురణ,

  4. రామసుబ్బశర్మ, గౌరి పెద్ది (పరిష్కర్త శృంగారసంకీర్తనలు + అన్నమాచార్య విరచితములు 29, 30, 31 తతి. దేవప్టాన ప్రచురణలు.

  5. రాఘవయ్య, తిరువాయిపాొటి ఆళ్యారుల దివ్యవైభవము తి.తి. దేవస్థాన ప్రచురణ, 1980.

8డీ శీ తాళ్ళపాక అన్నమాచార్యుల 22. రాఘవేంద్రస్వామి యాజర్య '.. కర్ణాటక హరిదాప సాహిత్య కన్నడ పాహిత్యపరిషత్తు ధార్యాడ 1952. 23. లక్ష్మణయ్య, సముద్రాల అన్నమాచార్య సంకీర్తనామృతము (ప్రథమ, ద్వితియ భాగములు 1982, 10983. 24. లీలావతి, పొన్నా అన్నమాచార్య సంకీర్తనల్లోవి- జానపదగేయఫణితులు, పాన్నాపబ్లికేషన్స్‌, 1986. 25. వాణి, కేసర్ల అన్ననుయ్య అంతరంగంలో- అలమేల్మంగ తి.తి.దేవప్టాన ప్రచురణ, 1986. చా ల 26. విజయరాఘవాచార్యులు, బి. ఆదినారాయణ నాయుడు బి (పరిష్కర్తలు)- తాళ్లపాక లఘుకృతులు తి.తి.దేవస్థానప్రచురణ మద్రాసు - 1935. .

శీవిత చరిత్ర రస్‌

  1. వేంకటరామానుజస్వామి, పరవస్తు శ్రువేంకటాచలమాహాత్మ్యము తి.తి.దేవస్టానప్రచురణ, 1976.

  2. శ్రీనివాసాచార్యులు, ఏ.వి. (పరిష్కర్త అధ్యాత్మపంకీర్తనలు. అన్నమాచార్యవిరచితములు సంపు-6, 16 శృంగారపంకీర్తనలు పంపు-15,16,17 తి.తి. దేవస్తానప్రచురణ.

కకష. గ్‌

  1. శ్రునివాసులుశెట్టి, కామిశెట్టి (సంపాదకులు) తాళ్ళపాక అన్నమయ్యపాటలు తి.తి. దేవస్తానప్రచురణ, 1976,

య!

  1. శ్రీనివాసులు శెట్టి, కామిశెట్టి అన్నమాచార్యులు త్రువివాస బాలభారతి తి.తి.దేవస్టాన ప్రచురణ, 1982.

31 శ్రీవివాసులుశెట్టి, కామిశెట్టి (సంష్తాదకులు) తాళ్ళపాక అన్నమాచార్యుల జయంతి సంచిక తి,తి.దేవస్టానములు, 1978.

  1. పర్యోత్తమరావు, కె అన్నమయ్య - శ్రీపాదరాయలు అన్నమయ్య - పురందరడాసు పారిజాత ప్రచురణలు తిరుపతి, [982.

86 త్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 33. పీతారామమ్మ, ఓరుగంటి తొళ్ళపాక "పెదతిరునులయ్య కృతుల సవినుర్శక పరిశీలన పుభద్రాగ్రంథమూల తిరుపతి 1985. మం1ఎవ ;

  1. ₹స్టజాడ వ8ల0త8యడటం8 ₹. క05య106028 701%], వం! కరంటు డు8003, 1937.
  2. షట వెలలటడంటతటం8ు వయకు. కంద? ౦ గసిఖ&డ, 70]. 1 గరా రలడ5టుతండం:ం 197/9.
  3. నల్రుం యుణరు &. 20 కతు! ప మంత మిడ వం వ2ంళెళు& మటెయలయ్య/2 వెంగ04పే సెతీడరటటంట 1982. జతయ్య (గ్రంధాల ఫా న్‌. ధు ల్‌ శా ష్ష్‌ వచో -

ల ॥ 7౫౦. ౧611910649 గ౧౮౦|0261009 586/189 ౦0. 372 కా?ం6 మొ. 10/- నా. భ్‌ టి. స మ మ ప సుర | న. స్‌ టో న. క న్న్న యే | సస | 1 హ్‌. గ న్‌ గ్‌ ! [్రీట్ష క ల ల . అ ళం హో (| పంసడాన నం ॥ న్న లా యాం. జ! ళ్‌ .. [019066 0/ 0! 1/4 56002 గ౭౦, 1.గ.5., 65౪6061/6 ౦గ106! ]1౫.౦6/౭౩౧8౧౭గ౧౩ 206 నిగగ౧!66 2 .1.0.01866, 110021. ఇ . |