Telugu sri narayana shathakam - anilvaranasi/indianlanguages GitHub Wiki

ఆతు. శే. స శ 7 న స సనా ష్‌ | జీ లీ ర! | య స్ప! | ఇ ల కో న. యట 0 డ్రై గగ ' న్‌ క , న్‌ 6 2కు రూ రూ బు. క టి లలల క స్త్‌ న్న? నే భ్‌. (ఓ న జైలీలోట్‌ టల్‌ ట్ట. 72 0 సైస్‌ దిళ్లల్లై .. జ్‌ ధ్‌ య కానన ప ౮ చా్గాంనరా- న గ? కు శే స! ్ళి స 4 శీ. స్‌ . | (| . | లి జ ప్రో శం ళ్‌. శ చ అల్‌ య గ. | ” ట్ట క్‌ . ళం న న జ! ళ ఆంతా ల లజలుక ఘవీయ వ్యాఖ్యా సహితం

నవ్వాఖ్వాన శత్రక్ర సాహిత్య వరంవర్‌ = ఢ శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీతము రాఘవీయ వ్యాఖ్యా సహితం వ్యాఖ్యాత శ్రీమాన్‌ కేవి. రాఘవాచార్యులు (విశ్రాంతాంధ్రోపన్యాసకులు) సంపాదకులు శ్రీ చల్లా సాంబిరెడ్డి, బి.ఎ, ఎల్‌ఎల్‌-బి. 55/ 5న 7111 ప్రచురణ శ్రీ పావని సేవాసమితి “శ్రీ సాయి నిలయము" - యస్‌.ఆర్‌.టి. 270, సనతీ నగర్‌ హైదరాబాద్‌ - 500 018. ఫోన్‌ : 3702898

టో నన సేవా సమితి ప్రచురణ నెం. 7 ౯ శ్రీ పావని ఎవాస ప్రచురణ నెం. ళా మ్‌ . 9, అలి బి సవ్యాఖ్యాన శతక స్తాహైత్త్వపరక్షిసర - 6 ఎలయయతచమ్యులాలయ నా (ప్రధమ ముద్రణము - 2002 | లం ఇ న్ని ఉ గ్లతులు 1000 జ ం ఎం44 న ఇ వ 901 సుల అయిన్న భ్‌ గ! కలి పైదలాబార్‌ తడ ౧.” 1 శ్రీ నారాయణ శతకము శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీతము వ్యాఖ్యాత శ్రీమాన్‌ కే.వి. రాఘవాచార్యులు ౪/10 00గ౧౫౭౧48/ ౧4౧౫66 ఎ. “గరగ డం662 28008 01106 816351౧009 0౫ = ౨% 5/1 5% 7గ౧౮42౧౮6౮| 0౧1౧౧౫ 5/10%80౧2[2/2౧౭ గి౭౧2౧౮|౬ ౦6/28! కడగా! త00/66440౧ 0౫ - ఫీడగడషకడ/! * 50౧4౧ ౮౧418 520/202/9/2020020%/2, గ్రరం/౧2026. "తిర /258ి 8/30[029గ *614/044 నీం2౧18020080/2, /649౧2026 ౬61166 0 = 8% 0114౬౬4 34048! గ౧డ6౦౦౫౪, 8%. ౬8 న౮౨19066 & గ|౩౧1౩ /6360/606 0/ - 6 గి2౪8౧| 56౪2 520౧101 (౧6౩) 5॥ 52; సీగజడగ - 5.౧.1. 270 520400204౯ - [1/66/2086 - 500 018, ౯౧౦౧౭. 3702898. 116 ౧286 6241౧0 = 62౧04004! 06 - గ5. 50/- 106 361100 21 = [001006 6/400103, క88110920౧21 [0/66[2046- 500 044, 89%0౧8. 7660000. గ॥౧166 &( 8841 ౧౬౧) ౧|1౧18౧, (౮612010 - 500 004, ౧౧౦౧6. 3232316.

న. వ. ౧662061

త 01012

[ల్‌ 20206412

కన ౫66721 5౪2000. స. ను! న 6౮/౫ 260021101%41 సగట

ఉట స సస! పగ (08645) 72929, 72353

మ సను ౨1. 104.02

శ్రీమతే నారాయణాయ నమః।

అనేకానేక మంగళాశాసనములు!

అతిగహనాలైన దార్మనిక మర్మాలను, ఉపాసనాప్రక్రియలను సాంప్రదాయిక సిద్దాన్తాలను సహితం సర్వజనహృదయంగమం చేయాలనే తలంపుతో ఆవిర్భవించిన అనర్హసాహిత్యమే స్తోత్రజాలం. అటువంటి స్తోత్ర లక్షణాలనే అనుసరించినా పద్యసంఖ్యా పరిమితిని బట్టి 'శతకాలు'గా పరిగణింపబడే స్తోత్రాలూ ఎన్నో ఉన్నాయి. తెలుగులో శతక వాజ్మయానికి ఒక ప్రత్యేకత ఉంది. లౌకిక - పారలౌకిక విషయాలను రెంటినీ సమస్కంధంగా శతక బద్దం చేయడం తెలుగులో చాలా (ప్రహతంగా ఉంది. సమాజస్వభావాన్ని అడుగడుగునా విక్లేషించి నీతిని గరపే వేమన - సుమతీ శతకం లాంటి వాటినే కాక, పసితనంలోనే దైవచింతనతోపాటు హృదయమార్హవాన్ని కూడా రంగరించిపోసే కృష్ణృశతకం లాంటివాటిని కూడా తెలుగింటి పిల్లలచే చదివించేవారు వెనుకటి గురువులు.

శతకవాబ్మయానికికున్న సూటిగా హృదయంలోనికి (ప్రవేశింపగల సామర్థ్యాన్ని గుర్రించియే దాశరథి శతకంలాంటి భక్తజనహృదయార్తిని ఆవిష్కరించే శతకరాజాలు

కూడా ఆవిర్భవించాయి తెలుగుభాషలో. తెలుగు జనుల హృదయాల్లో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ కోవకు చెందిన స్తోత్రలక్షణ లక్షితమైన నారాయణ శతకంలోని ప్రతి పద్యమూ మళ్ళీ మళ్ళీ పాఠకులను ప్రేరించి చదివించే లక్షణం కలిగి ఉందనడం ఉపచారవచనం కాదు. ఇది అవడానికి శతకమే అయినా, ఎన్నో సాంప్రదాయిక మర్మాలను వ్యక్తపరచిన (గ్రంధరాజం. ఇది వ్యాఖ్యాన సాపేక్షం కాకున్నా, వ్యాఖ్యానమూలంగా మరెన్నో అందాలు వెలికివచ్చే అవకాళం ఉన్నందున శ్రీమాన్‌ కె.వి. రాఘవాచార్యులవారు దానికి సంప్రదాయ వివరణ శైలితో కూడిన చక్కని వ్యాఖ్యను సంతరించి బంగారానికి తావిని చేకూర్చారు. ఒకమాట..... రెండవపద్యంలో 'జనస్తబ్బుండ' అని ఉంది. దానికి 'పుట్టుకతోనే మర్యాదనెరుగని సోమరిని' అని శ్రీ ఆచార్యులవారు వివరించడాన్ని బట్టి - బహుళః ఇది 'జనిస్తబ్బుండ' అని అయి ఉండవచ్చని మేం భావిస్తున్నాం. ఈ పద్యంలోని వ్యాఖ్యలో ద్వయమం త్రార్థవివరణం చేశారు. ఈ పద్యంలోను తర్వాతి పద్యంలోను నారాయణ శబ్దార్దాన్ని సాంప్రదాయికంగా వివరించారు. ఇలాగే (ప్రతిపద్యంలోను సాంప్రదాయిక వివరణలను - విడువకుండా చక్కటి వ్యాఖ్యను వెలయించి, ఈ శతకానికి సర్వ స్ప్రహణీయతను, ఉదాత్తతను దర్శింపజేశారు శ్రీ రాఘవాచార్యులవారు. వీరి కృషికి అనేక మంగళాశాసనపురస్కృతాభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి వ్యాఖ్యలతో చక్కటి శతకవాజ్మయాన్ని లోకానికి అందిస్తూన్లు ప్రకాశకులకు కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. సంస్కారవంతమైన పాఠకలోకం దాన్ని ఆదరించగలదని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ! (౧ చ్‌ ఇడా: స లా (/ (శ్రీతీత త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి)

సదాశయములుండటంవేరు పదిమందినికూడగట్టుకొని వాటి సాధనకు కృషి చేయటం వేరు సామర్థ్యము, బిక్ష నేర్చూ, ఓర్చు లేనిదే అది సాధ్యంకాదు ఇవన్నీ మూర్తీభవించి చేసిన ఉద్యోగానుభవం వినియోగించి శ్రీ పావని సేవా సమితి కార్మదల్శ అయి వయసు భారమనక సర్వకార్యక్రమాలకూ చక్కని రూపమిచ్చి జయావహముగా నడిపిస్తున్న మిత్రులు త్రీ గట్టుపల్లి చెంచు రామారావు గారికి (త్రీ జి. సిహెచ్‌. రామారావు సప్తతి ప్రవేశ సందర్భములో = చల్లా సాంబిరెడ్డి

శ్రీశోల వ్యాత్‌ ముందువూట

ఆం(ధ్రవాజ్యయంలో శతక సాహిత్యప్రక్రియ ఎంతో వైవిధ్యాన్ని సంతరించుకున్నది. ఇష్టదైవతాన్ని భక్తితో స్తుతించిన సంస్కృత స్తోత్రాల పద్దతులు తెలుగు భక్తి శతకాలలో గోచరిస్తుంటాయి. శతకప్రక్రియ నాటికీ, నేటికీ అనువాదంకాక, స్యోపజ్జకమై మకుట వృత్తసంఖ్యానియమితమై భాసిస్తున్నది.

నారాయణ శతకం శార్దూల మత్తేభవృత్తాలతో, నూట ఐదు పద్యాలతో భక్తి రసభరితమైనది. వెల్లంకి తాతంభట్టు, కస్తూరి రంగకవిలాంటి లాక్షణికులు దీన్ని పేర్కొన్నందువల్ల ఇది ప్రాచీన మైన శతకం. వేదళా(స్తాలను బాగా విని, వ్యాసభాగవతాన్ని పలుసార్హు పరించి, సంస్కృతస్తోత్రాలను పుక్కిట బట్టి, అంతకు ముందున్న శతకాల ఛాయను (గ్రహించి, శ్రీమన్నారాయణుని అను(గ్రహాన్ని పొందడానికి ఆర్తితో పద్యరచనాభ్యాసం చేసినట్టున్న శతకమిది.

ఈ శతకంలోని పద్యాలు సప్రశీర్షికలుగా విభక్త మైనందువల్లనూ, శాబ్దికంగా ఏ కవి శైలితోనూ సామ్యంలేనందువల్లనూ, గహనమైన శా(స్తార్జాలను లలితమైన అలతి పదాలలో (ప్రకటిస్తున్నందువల్లనూ కావ్యకళాభిజ్జత స్ఫురిస్తున్నది.

శతకం జగత్కారణుడైన పరబ్రహ్మతత్త్యాన్నీ, స్వరూపగుణవిభూతులనూ, దశావతారాలనూ అద్భుతంగా అవిష్కరిస్తున్నది. నారాయణుని నామం మంత్రరాజమనీ, తిరుమంత్రమనీ, అదిరహస్యమహిమను పాటిస్తుందనీ, శ్రుతి కళాసిద్దాంతమనీ “హరుని న్న(ద్రిజ నాంజనేయుని” మొదలైన భక్తులనెందరినో ఎడబాయకుంటుందనీ 'నామప్రభావదశకం' విశదీకరిస్తుంది. పరత్వ, సౌలభ్యాలను ప్రకటించిన శ్రీకృష్ణభగవానుని లీలలను హృద్యంగా చిత్రించడానికి 'కృష్ణావతారవింశతి" (ప్రత్యేకింపబడింది. భక్తి రూపాపన్నజ్ఞానోపాసనతో గమ్యమైనది మోక్షం కాబట్టి ' జ్ఞానవింశతి”. "మోక్షవింశతి" అనే వేర్వేరు శీర్షికలతో నారాయణుని విభనైశ్చర్యాలను విలక్షణంగా విశ్లేషిస్తూ (ప్రదర్శిస్తున్న పద్య శతక మిది.

ద్విత్వ నకార సంధులు, క్య్యార్ధక సంధులు, వైరి సమాస పదాలు సాధారణంగా నాటికావ్యభాషా'ప్రవాహంలో దొర్లినవే అనడం వింతకాదు. (ధ్రువు - దీవ్యత్‌), (పెను - సేవించు) యతి మైత్రి భంగమైనందువల్ల 128" వ పద్యంలోని మూడవపాదమూ, “94 వ పద్యంలోని రెండవపాదమూ, ప్రామాదికంగా జారినట్టు కనిపిస్తున్నది.

చిత్త శుద్దికల భాగవతోత్తము లెవ్వరూ ప్రాపంచిక భోగాలకోసం ఆరాటపడరు. కీర్తికోసం కక్కుర్రిపడరు. నిజనామోద్దాటనం చేసుకోరు.

భగవద్బ్చంధువు "నరహరి తనోర్జాస దాసస్య దాసః”అనే కాక 'దాసి' పదంతో తనలో (స్తైణాన్ని జాగరితం చేసి, మధుర భక్తి స్పోరకంగా వర్తిస్తూ కవిలోక మూర్చన్యుడవుతాడు.

నారాయణ శతకం బమ్మెరపోతన రచితమని జన్రుతి. శతకంలో కవిపేరు కానరానందువల్ల పండితులు, పరిశోధకులు పోతన రచన కాదంటారు.

“ఇది శ్రీ పరమేశ్చరకరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రి పుత్ర సహజపాండిత్య పోతనామాత్య (ప్రణీతం బైన నారాయణ శతకము సంపూర్ణము” అనే శతకాంతగద్యం, రెండు పాతకాగితపు వ్రాత ప్రతులలో కనబడుతుందట. తాళపత్ర (గ్రంథాలలో మాత్రం లేదట, [గ్రంధాంతంలో ఈ గద్యను వ్రాసినసిరా వేరుగా కనబడినందువల్ల, ఇది పోతనశతకమని విశ్చసించిన వారెవ్వరో తర్వాత దీన్ని చేర్చియుంటారని ఊహించారు. పోతనగారికి ప్రియమైన అనుప్రాసాలంకారాలు గానీ, భాగవతపద్య భావరచనా సౌందర్యంగానీ, నారాయణశతకంలో కనబడనందువల్లనూ ఇది పోతన రచన కాదన్నారు.

పోతరాజుగారు గోదావరికి పోయి చంద్రగ్రహణ సమయాన పట్టు స్నానం చేసి ధ్యాన మగ్బుడైనప్పుడు కాంతాసమేతుడైన ఒకరాజ పుత్రుడు సాక్షాత్కరించి, తాను శ్రీరామచంద్రుడననీ, తన పేర శ్రీమహాభాగవతాన్ని తెలుగు చేయుమనీ, భవబంధాలు తెగుతాయనీ ఆనతిచ్చాడు. వెంటనే పోతన ఆశ్చర్య పడి ఇలా అన్నాడు.

“పలికెడిది భాగవతమంట

పలికించెడి వాడు రామభద్రుండంట నేం

బలికిన భవ హరమగునంట

పలికెద వేరొండుగాథ పలుకగనేలా ” (భాగవతం. 1-16) అని.

పర్వదివసాల్లో గోదావరికి పోయి అవళ్యంగాస్నానం చేయడం ఆచారం. “ధర్మ పురి

లక్ష్మీనాధనారాయణా” (97ప.) అని ఈ శతకంలో ఉంది. కరీంనగరం జిల్లాలో ఉన్న ధర్మపురి గోదావరీ తీరాన ఉంది. ఆదిలక్ష్మీ నృసింహక్షేత్రం. బమ్మెరకు తక్కిన తీర్షక్షేత్రాలకంటె దగ్గరి క్షేత్రం ధర్మపురి. తాను తరచుగా పోయి తీర్ణమాడి, స్వామి దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తున్నందువల్ల, తన శతకంలో ఆస్వామిని విధిగా స్మరించాలనుకొన్నాడేమో!!కానీ 'నృసింహిపదం *చట్రం' లో ఇముడలేదు. కాబట్టి, “'లక్ష్మీనాధ' పదాన్ని పర్యాయంగా ప్రయోగించి ఉంటాడు.

సాహిత్య పరిశీలకులు 'ధర్మపురిలో ఉండే స్వామిమీద ఎవరో వ్రాసిన శతక మిది" అన్నారు.

'పోతనకు (బ్రహ్మ యన్నచో చాలదు “తలవాకిట వాణిగలపోడిమి చే వాడిమి కెక్కిన నలుమొగంబుల తక్కరి గొంటు” అని బ్రహ్మాండముగ విస్తరించి చెప్పిననే యీతనికి తృప్తి" అని పుట్టపర్తి నారాయణాచార్యులుగా రన్నమాట నిజమే.

నారాయణ శతకంలో పరబ్రహ్మను గూర్చి “బ్రహ్మాండావలిలోన సత్వగుణివై బాహ్యంబునందాదిమ బ్రహ్మాఖ్యంబరతత్యబోధములకున్‌ భవ్యాధినాథుండవై”(9) అన్న పద్యం గమనీయం.

ఏదేమైనా, నారాయణశతకం పోతన రచించాడనియే (ప్రతీతికదా! “భక్తి జ్ఞాన వైరాగ్యములు ఈశతకమున బీజరూపముననున్నవి...... పోతన భాగవతాంధ్రీకరణకు పూర్వము దీనిని చెప్పెనని ఊహింపవచ్చును” అన్నారు 'స్వామి శివశంకరస్వామి' వారు.

వాస్తవంగా, ఈ శతకరచనలో పొడసూపిన భావసౌందర్యం భాగవత రచనలో పరిపుష్టి చెందిన దనడం సమంజసం.

నీతి భక్తి భావబోధకాలైన శతకాలు బాలబాలికలను విజ్ఞాన వంతులుగా చేయడానికి అధికంగా ఉపయోగవడుతాయి. వేదశాగడ్రుతిహాస పురాణాల సారాంశాలను సం(గ్రహించుకున్న శతకాల సౌరభాన్ని పలుదెసల ప్రసరింప జేసే వ్యాఖ్యానాలను వ్రాయించి, నేటి యువకుల, భావిపౌరుల హృదయాలను జ్ఞాన గంధవిలసితాలు గా జేయడానికి ఉద్యమించిన శ్ర్రీపావని సేవాసమితి అధ్యక్షులైన చల్లా సాంబిరెడ్డిగారు సర్వదా సర్వథా అభినందనీయులు, శ్రీపావని సేవాసమితి పాలకవర్గ సభ్యులు బహుధా ప్రశంసనీయులు,.

నారాయణ శతకానికి వ్యాఖ్యానం రచించే అవకాశం నాకు కలిగించిన శ్రీ చల్దా సాంబిరెడ్డిగారికి ప్రత్యేకంగా నాహార్దిక ధన్యవాదాలు. ఈ వ్యాఖ్యను (వ్రాయడానికి ప్రేరకులైన సహృదయులూ, విద్వత్కవులూ అయిన శ్రీమాన్‌ ఉత్పల సత్యనారాయణాచార్యుల వారికి సప్రత్రయ నమస్సుమాంజలులు. శతక వ్యాఖ్యా పరంపరను పర్యవేక్షిస్తున్న పాండిత్యపాథోనిధులూ, ఆంధ్రవ్యాస బిరుదాంచితులూ అయిన (బ్రహ్మశ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య గారికి నా హృదయపూర్వకాభివాదాలు. రాఘవీయేతి వ్యాఖ్యేయం ్రణీతా౭జ్ఞానినా మయా; సౌగుణ్యం యది తత్పర్వ మాచార్యకరుణాఫలమ్‌॥ భాగవత చరణ రేణువు కే. వి. రాఘవాచారుఃలు ్ట్‌ ఇం(ద్రకుటీర్‌ 2-1-45, ప్లాట్‌ నం,101 నల్లకుంట, హైదరాబాదు - కక్ష చిత్రభాను శ్రీరామనవమి, 21-4-2002,

ఒక్క మూట శ్రీకృష్ణానుచింతనులు, పరమ ధార్మికులు అయిన శ్రీ, చల్చా సాంబిరెడ్డి మహోదయులు శ్రీ పావని సేవా సమితి పక్షాన భాగవత సుధాలహరి ప్రచురణ పరంపరలో తాలుతగా పోతనగారి గజేంద్రమోక్ష స్తనాన్ని విపుల వ్యాఖ్యాన సహితంగా ప్రచురించి ధన్యులయినారు. వారి సవ్యాఖ్యాన శతక యోజనలో కూడా పోతనగారి శ్రీనారాయణ శతకాన్ని చేర్చి, ఈనాడింత అద్భుతమైన వ్యాఖ్య వెలయింపజేయడం ద్వారా ఆ మహాత్ముని కీర్తిని దశదిశావ్యాప్తం చేసి అగణ్య పుణ్యులయినారు. తమ వదాన్యతకు, మాన్యతకు సాఫల్యం చేకూర్చుకొన్నారు. వారి శతక ప్రకాశన యోజన ఈ శతకవ్యాఖ్యతో పూర్తిగా సఫలమైనట్టుగా భావిస్తున్నాను. పోతనగారు శ్రీ కైవల్య పదంబు చేరుకొనడానికే మహానందాంగనాడింభకుడైన శ్రీకృష్ణ భగవానుణ్ని వేడుకొని శ్రీమదాంధ్ర భాగవత మకరందాన్ని మనకందజేశారు. ఆ భక్తాగ్రగణ్యుడు తానాశించిన (శ్రుతిశిరో భూషణములైన శ్రీకృష్ణుని శుభచరణాల సన్నిధికి చేరుకొన్నాడనడంలోను, దివ్య సూరులలో ఒకడై విరాజిల్దుతున్నాడనడంలోను సందేహం లేదు. భగవచ్చరణ సన్నిధికి చేరిన పరమభక్తుని ఆశీస్సులు మరింత శక్తిమంతములు, అమోఘము లవుతాయని శాస్త్ర (గ్రంధాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రచురణకర్త అయిన శ్రీ సాంబిరెడ్డి గారిపైన, శ్రీ నారాయణ శతక వ్యాఖ్యాత అయిన శ్రీ రాఘవాచార్యులగారిపైన పోతనగారి ఆశీర్వర్షం తప్పకుండా కురుస్తుందని నేను విశ్శసిస్తున్నాను. శ్రీమాన్‌ కె.వి. రాఘవాచార్య మహోదయులు శ్రీమద్వేదాంత దేశికుల వారి పాదుకా సహ్రమనే ఉ(ద్గంధానికి అనిదంపూర్వమైన విసృత వ్యాఖ్య వెలయించిన ఉద్దండ పండితులు. సంస్కృతాంధ్ర ద్రావిడాంగ్రభాషలలో నిష్టాతులు. శ్రుతి స్పృతి పురాణేతి హాసకాప్యశా స్త్ర (ప్రపంచాన్ని పుక్కిటబట్టీన సాహిత్య పాధోనిధి కుంభసంభవులు, అయినా నిగర్విచూడామణులు. శీల సమున్నతులైన సుగమ్యులు. పటాటోప మెరుగని పండిత ప్రకాండులు. ఇట్టి మహనీయుడు పోతన కృత శ్రీ నారాయణ శతకానికి వ్యాఖ్యాత కావడ౦ నా మటుకు నాకు హార్టిక ప్రసన్నతను చేకూర్చింది. ఇక ఈ శతక వ్యాఖ్యా సమాఖ్యను గూర్చి నేనేమి చెప్పగలను? బహుజ్జ్ఞతా ధురంధరులైన శ్రీమాన్‌ రాఘవాచార్యవర్యులు (ప్రాచీన పండితుల అగాధవివేచనను, _ వారి తత్త్వజ్ఞానాన్నీ సందర్భానుసారంగా తమ వ్యాఖ్యానంలో

నిక్షేపించి ఆంధ్ర భక్తి శతకవాజ్మ్నయక్షేత్రాన్ని సుసమృద్దమూ కృతార్థమూ చేశారనడంలో అత్యుక్తి లేదు. ఈ శతకంలోని ప్రతిపద్య వ్యాఖ్యానమూ ఈ విషయాన్నే నిరూపిస్తున్నది. ఒక్కొక్క పద్యానికి శ్రుతి పురాణశా(స్త్రాలంకార సమన్వితంగా సమకూర్చిన ఈ వ్యాఖ్య ఒక సుందర సువర్ల శృంఖల. అనేక నూతన విశేషాలను ఉటంకించి విద్వజ్ఞన హృదయాలలో పరితోషం సముత్పన్నం చేయడమే వ్యాఖ్యాతృ చూడాంత సాఫల్య మవుతుంది. పారకుల హృదయాలలో విశ్వాసాన్ని పాదుకొల్పే గురుతరభారం వ్యాఖ్యాత మోదనే ఉంటుంది. ఈ రెంటిని తత్త్వాభినివేశంతో సామర్ష్యవంతంగా ఈ (గ్రంధకర్త నిర్వహించారు. శ్రీమాన్‌ రాఘవాచార్యులుగారు శ్రీ వైష్ణవ సంప్రదాయ వేత్తలు. భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నులు, భగవన్నివ్యాపరులు. ఈ వ్యాఖ్యాన కార్యాన్ని భగవల్సేవగా భావించి శ్రీమన్నారాయణ చరణారవిందాలకు నివేదించి కార్యసిద్దిని పొందారు. సత్పురుషులు తమ కార్యసిద్ధికి భగవదను(గ్రహమే కారణమనుకొంటారు. కానీ, తమ బుద్ది వైదగ్ర్యమని భావింపరు. ఈ విషయమే వారి మున్నుడిలో పలుకుబడిలో, నడవడిలో కూడ కానవస్తుంది. శ్రీమాన్‌ రాఘవాచార్యులు గారు కేవలం సొహిత్య రంగంలోనే కాక, సాంసారిక రంగంలో కూడా శీల సమున్నతులై ఆదర్భ్శనీయులైనారు. వారి కుమారుడు శ్రీ కె.వి. రమణ ఐ.ఎ.ఎస్‌. మహోదయులు ఆం(ధ్రస్రదేశ్‌ ప్రభుత్వంలో ప్రఖ్యాతి కెక్కిన ఆఫీసరు. అయినా, ఆయన తండ్రిని చూడగానే పాదాభివందనం చేయక మానరు, ఇక వీరి అనుజులు తండ్రిని సేవించినట్టుగా వీరిని సేవించడం నేనెరుగుదును. ఒకానొక సాహిత్య సభలో ఈ సాధుశీలిని గూర్చి నేనప్రయత్నంగా చెప్పిన పద్యం ఇప్పటికీ గుర్తున్నది, - జననుత వర్తనుల్‌ పరమ సాధువులిద్దరు అగ్రజన్మునిన్‌ జనకునిగాగ కొల్చు సహ జన్ముల పేర్మిని ఉగ్గడింతునా? అనుజుని పుత్రుగా దలచు ఆ(గ్రజు కూర్మిని 'ప్రస్తుతింతునా? పనుపడుగాత! రాఘవుని (భ్రాతృత సర్వజనమ్ములందునన్‌ క క్షే ల్‌హారిగా శ్రీనారాయణ శతకాన్ని సుందర వ్యాఖ్యా సమంచితం చేసి అటు ౦తుణ్ని, ఇటు భక్తుడైన పోతన గారిని సంతుష్లిస వారికి దక్శిందో ఈ కారణంచేత ల పా మహాధాగ్యం్రీ రాఘవాదాద్యల శతక జగత్తులో ఈ శ్రీ నారాయణ శతకం సాన న్‌ ల వ సమ్మానణయమైన స్థానాన్ని పొందడం సత్యం. శ్రీ చల్లా సాంబిరెడ్డిగారి సదాశయాలు జయ(ప్రదాలు కావడమూ తధ్యం. ఉత్పల సత్యనారాయణాచార్య

నారాయణ రాఘవీయం ఆంధ్రవ్యాస, కవికులరత్నదీప, వైదికాగనూలంకార, పురాణ పరమేస్టి కవికుల వతంస, భాషాప్రవీణ, ఏలూరిపాటి అనంతరామయ్య ఎం.ఏ. తెలుగు, ఎం.ఏ సంస్కృతము, బి.ఇడి, రిటైర్డ్‌ గుంటూరు సంస్కృతకళాశాల ప్రిన్సిపాల్‌, డీన్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ ల్యాంగ్వేజెస్‌, వొగార్జున విశ్వవిద్యాలయము, అనంతసాహితి కార్యదర్శి, 16-1-24/6/సి/1 శ్రీసాయి ఎపార్ట్‌మెంట్స్‌, కమ్యూనిటీహాలు వద్ద, సైదాబాద్‌ కాలనీ, హైదరాబాద్‌ - 500 059, ఫోన్‌ నెం. క్ష072913 తేది 26.03.02 మ. ధరసింహాసనమై, నభంబుగొడుగై, తద్దేవతల్‌ భృత్యులై, పరమామ్నాయము లెల్ల వందిగణమై, (బ్రహ్మాండమాకారమై, సిరి భార్యామణియై విరించికొడుకై, శ్రీగంగ సత్పుత్రియె, వరుసన్నీ ఘన రాజసంబు నిజమై వరిల్లు నారాయణా. సుమారు అరవై సంవత్సరాల క్రితం తెలుగువారిలో అక్షరాస్యులలో ఈ పద్యం రాని వాడు ఉండేవాడు కాదు, అయితే, 'తల్లీ నిన్ను దలంచి' పద్యంలాగానే, ఇదికూడా తెలుగు వారికి మిక్కిలి ఇష్టమైన పోతనామాత్యుడు [వ్రాసినది అని చదివే వారికికాని, దీనిని చెప్పేవారికి కాని, చాలామందికి తెలిసి ఉండక పోవచ్చు. 'తల్లీ నిన్ను దలంచి" అన్నపద్యం ఎంత సూటిగా చదువరి హృదయాన్ని చదువులమ్మకు తిలియచేస్తుందో, ధరసింహాసనమై అన్న పద్యం అంత స్పష్టంగా పరమాత్మ(ప్రాభవాన్ని వర్షిస్తుంది. ఇంతకూ, ఈ పద్యం నారాయణ శతకంలోనిది. ఈ శతకం లోని పద్యాలు భాగవతంలోని పద్యాలంత ప్రాఢముగా ఉండని కారణముచేత, ఇది పోతన [వ్రాసినదా కాదా అనే విషయంలో చాలా తర్జనభర్జనలు జరిగాయి. ఏమైనా నారాయణశతకం పోతన (వ్రాసినదే అనిన ప్రజల హృదయాన్ని బట్టి, శ్రీచల్హా సాంబిరెడ్డిగారు అధ్యక్షులుగాగల శ్రీ పావని సేవాసమితి వారు తాము (ప్రచురించ దలచిన సవ్యాఖ్యాన దశశతకాలలో దీనిని చేర్చారు. మిగిలిన శతకాలకు లాగానే దీనికి ఉభయ వేదాంత (్రవర్తక శ్రీమాన్‌ శ్రీమదిత్యాది కే,వి.రాఘవాచార్యులవారు వ్యాఖ్యాతగా లభించటం సేవాసమితి చిత్తశుద్దికి ఫలం. శ్రీ రాఘవాచార్యుల వారు సంస్కృతాంధ్ర (ద్రావిడాది భాషలలో నిష్టాతులు. భాషా సాహిత్య వ్యాకరణాలంకారాది విషయాలలోనే కాక భక్తివేదాంత భగవత్‌ కాలక్షేప ప్రామాణిక (గ్రంధ పరిశీలనములలో నిపుణులు. ఈ వ్యాఖ్యలో 'ప్రతిపదార్థ భావ -

వశేషాంశ వివరణములు ఉన్నవి. ఈ విశేషాంశ వివరణములో అయాశతకముల ప్రత్యేకతను కవి హృదయమును కనుగొనుటలో వ్యాఖ్యాతకు గల పాండిత్యానుభవములను పురస్కరించుకొని తారతమ్యములు కన్ప్చింపవచ్చును. శ్రీనారాయణ శతకము శతక కర్త దృష్టిని బట్టి భాషాసాహిత్యాది విషయములకే కాక, తాత్విక విషయములకును ప్రాధాన్యమిచ్చిన శతకం, (ప్రతిపాద్య విషయమేది అయినా కవి ఇట్టీ దృక్‌పధము కలవాడైనప్పుడే కావ్యము గంభీరమైచర్వణ ఫ్రాడులకు సంతోషం ఇనుమడింప జేస్తుంది. వ్యాఖ్యాత పాండిత్యానుభవాదులను బట్టి కవి ఇంత ఉద్దేశించినాడా అని కూడా ఆయాతావులలో వ్యాఖ్యానము విస్మయం కలిగిస్తుంది. కవిః కరోతి కావ్యాని వ్యాఖ్యాతావేత్తి తద్రసం అనిన దానిని బట్టి సమర్జుడైన కవి తనకు గల ప్రతిభా వ్యుత్పత్త్యభ్యాసముల (ప్రాచుర్యాన్నిబట్టి అలవోకగా ఆప్రయత్నసిద్దముగా అనేక విషయములు నిక్షిప్తములు అయ్యేటట్టుగా అందమైన కవిత్వం చెప్పవచ్చు. వ్యాఖ్యాత వివరించిన విషయాలు ఒక్కొక్కపుడు కవికి కూడా విస్మయానందములు కలిగించవచ్చు. అట్టి వ్యాఖ్యాత ఒక రచనకు లభించటం ఆ రచయితా ఆభాషా దాని చదువరులూ చేసుకొన్న అదృష్టం. ఈ దృష్టితో చూచినప్పుడు, ఈ వ్యాఖ్యాత, నిస్సందేహముగా, అట్టి కోటికి ఎక్కదగినవారు. ఈ మాటకు ఈశళతకములోని ప్రతిపద్యవ్యాఖ్యానమూ ఉదాహరణమే అయినప్పటికీ, మొదటి పద్య వ్యాఖ్యానము వంటివి ప్రత్యేకించి పేర్కొనదగినవి. దానిలో శ్రీశబ్దమునకు, నారాయణ శబ్దమునకూ, ఆయన కళ్యాణ గుణగణములకు, రెండవ పద్య వ్యాఖ్యలోను, చేసిన వివరణము ప్రత్యేకించి పేర్కొనదగినవి. మూడవ పద్య వ్యాఖ్యానములో దాస్య వివరణం వంటివి చాలా ఉపయోగకరమైనవి. ఐదవ పద్యంలో విద్యలకు చేసిన వ్యాఖ్యానం విజ్ఞాన విలసితమైనది. పరబ్రహ్మ స్వరూపము తెలియని ధర్మరహితమైన పాండిత్యం పనికి రాని కుక్క తోకవంటిది. అని చెప్పటమూ, దానికి చేసిన వివరణమూ ఆచార్యులవారి అనేక సంవత్సరముల బోధనానుభవానికి ఫలం. ఈశ్వర సంహిత, శంకరాచార్యోక్తులు మొదలైనవి 'ప్రామాణికములుగా స్వీకరించటం వారి లోకజ్ఞతకు నిదర్శనం. ఇందులోని అవతార దళక వ్యాఖ్యానం మరీముచ్చటగా ఉన్నది. త్రివిక్రమత్వానికి వారు చెప్పిన నిరుక్తి ప్రశంసనీయమైనది. షడూర్ములకు పదిహేడవ పద్య వ్యాఖ్యలో వారిచ్చిన వివరణం. కేవల సాహిత్యగాండ్రకు తెలిసేది కాదు. దశావతారాలేకాక భగవంతుని అనేక అవతారాల ప్రశంస పురాణలలోనేకాదు, వేదాలలో కూడా స్పష్టముగా ఉన్నదని ఘంటా పధముగా చెప్పారు. ఆచార్యులవారు తాము ప్రతిపాదించ వలసిన విషయానికి సమర్థకంగా వేదాలు, శా(స్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, (ప్రాచీన వ్యాఖ్యలు

  • వీటినే కాక అంతగా ప్రచారంలో లేని తెలుగు రచనలనుకూడా వినియోగించుకొన్నారు.

ఇది వారి నిరంతర (గ్రంధానుశీలనాభ్యాసాన్ని తెలియచేస్తుంది. అకాండతాడవంకాకుండా సందర్భము దొరికి నప్పుడల్దా సాంప్రదాయిక విషయాలను వారు వివరించిన తీరు ముచ్చట గొలుపుతున్నది. ఇందుకు నామప్రభావ దశకమంతా ఉదాహరించదగినదే. అందులోనూ నారాయణ శబ్దార్థ విషయం. వీరి వ్యాఖ్యద్వారా మనకందించిన రత్నాలలో అష్టాక్షరాది వేణు గోపాలాష్టకం ఒకటి. దివ్య రూపదశకం, నామప్రభావదశకం, కృష్ణావతార వింశతి, జ్ఞానవింశతి ఆచార్యులవారి వ్యాఖ్యానశక్తికి నికషోపలాలు. ఎనభై రెండవ పద్యానికి ద్రాసిన వ్యాఖ్యలో ఆచార్యులవారు ఇచ్చిన ఉదాహరణలు రక్తి విరక్తి వాజ్ఞయాలలో వారికి గల నైపుణ్యానికి నిదర్శనాలు. ఎనబై ఐదవ పద్యం వ్యాఖ్యలో పేరు చెప్పకుండా కాకాయ కంకాయచ యోది తేష్టం, దాశాయ కీశాయచ, రాక్షస్రాయ - అని ఉదాహరించటం వారు విశ్చ గుణాదర్మాది చంపువులు బాగాపరిశీలించారనటానికి ఉదాహరణం. ఒక్క భగత్‌గుణ దర్పణం క్షుణ్మంగా చదివితేచాలు, సమస్త వేదోపనిషత్‌ శాస్త్రపురాణేతి హాసాంగ భాష్యాదుల పాండిత్యం కరతలామలకం అవుతుంది. ఈ రాఘవీయ వ్యాఖ్య బహువిషయ సంభరితమైనది. కడచిన కాలంలో గురువులవద్ద సంస్కృత కావ్యాదులు చదివేటప్పుడు వ్యాఖ్య ముఖ్యముగా మల్లినాధ వాఖ్య కూడా చదివించి, బోధించి, కంఠస్థము చేయించేవారు. దానితో పంచ కావ్యములు చదివితే చాలు, షట్టాస్త్రములు చదివితే కలిగే జ్ఞానము, సాహిత్యానికి సంబంధించినంతవరకు లభించేది. శ్రీపావని సేవాసమితి వారి పుణ్యమా అని శ్రీనారాయణశతకానికి అట్టి ఉత్తమ వ్యాఖ్య లభించింది. దీనిలో ధర్మ భక్తి జ్ఞాన వైరాగ్య సాహిత్య వ్యాకరణాలంకార ఛందోవిశేషాలకు అవసరమైన మేరకు చక్కని సమర్ధమైన సప్రమాణమైన వివరణము ఉన్నది. ఈ [గ్రంధము వ్యాఖ్యానముతో సహ తెలుగు ఎం.ఏ తరగతి వారికి పార్యగ్రంథముగా నిర్షయిస్తే ఆవిద్యార్థులకు అనేక విషయాలలో పాండిత్యం అలవడుతుంది. దీనిని (వ్రాయించినందుకూ, వ్రాసినందుకూ శ్ర్రీపావని సేవాసమితి వారినీ, శ్రీరాఘవాచార్యుల వారినీ అభినందిస్తున్నాను. శ్రీ ఆచార్యుల వారు పరిణతమైన వయస్సులో ఉన్నారు. వారి జ్ఞానం వృధాకారాదు. వారు ఇలా తమకు ఇష్టమైన (గ్రంధములపై ఓపిక ఉన్నంతవరకు నిమిషం పోనివ్వకుండా వ్యాఖ్యలు్రాస్తే లోకానికి అందించేవారు ఉన్నారు. నాదిపూవీ. భగవానుడు వారికి అట్టిసంకల్పం కలిగించుగాక. ఏలూరిపాటి అనంతరామయ్య

మానూట

శ్రీపావని సేవాసమితి చేపట్టిన సవ్యాఖ్యాన శతక (ప్రచురణ పరంపరలో శ్రీ, నారాయణ శతకము ఆరవది.

మా మొదటి (ప్రచురణ “మహాకవి” శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్యవారి గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్యతో శ్రీ కృష్ణశతకము వెలువడి పలువురి ప్రశంసలందు కొంది. ఇప్పుడు మరికొన్ని విశేషాంశాలతో పరివర్ధిత సంస్కరణ ము(ద్రణగా వెలువడుతోంది. ద్వితీయ (ప్రచురణ భక్త రామదాసు ప్రణీతము - దాశరధి శతకము, ఆచార్య యం. కులశేఖరరావు గారి మనసోల్దాస వ్యాఖ్యతో ప్రచురితమై, ద్వితీయ ముద్రణ అయినది. తృతీయ (ప్రచురణ - యథావాక్కుల అన్నమయ్య (ప్రణీతము “స్వేశ్చర శతకము” డా॥ముదిగొండ వీరభద్రయ్యగారి వ్యాఖ్యతో వెలువడి, ద్వితీయ ముద్రణ జరుగుతోంది. చతుర్ధ ప్రచురణ 'ఆంధ్రవ్యాస" బ్రహ్మశ్రీ ఏలూరిపొటి అనంతరామయ్య గారి వివేకానందినీ వ్యాఖ్యతో శ్రీ బద్దెన కవి ప్రణీతము - సుమతి శతకము వెలువడి, జనబాహుళ్ళములోనికి చొచ్చుకొని పోయి, ద్వితీయ ముద్రణ అయినది. మాపంచమ (ప్రచురణ ధర్మపురి శ్రీ శేషప్పకవి ప్రణీతము శ్రీ, నరసింహశతకము

  • జనప్రియ వ్యాఖ్యతో విద్వాన్‌, శ్రీ కసిరెడ్డి వెంకటపతిరెడ్డి గారిచే వ్యాఖ్య (వ్రాయబడి, మార్చి 2002 లో పారకులకు అందించినాము.

ఇప్పుడు మో ముందుకు వచ్చిన మా షష్ట ప్రచురణ శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీతము - శ్రీనారాయణ శతకము. దీన్ని రాఘవీయ వ్యాఖ్యాసహితంగా అందించిన శ్రీమాన్‌ కె.వి.రాఘవాచార్యులు గారు పరమ వైష్ణవాచార్యులు. నిష్ఫాగరిష్టులు. వేద శాస్త్ర పురాణ కావ్య నాటకాలంకారాది బహుశాస్త్ర పారంగతులు. వారి కలం నుండి ఈ వ్యాఖ్య లభించటం శ్రీపావని సేవాసమితి అదృష్టంగా భావిస్తున్నాము. వారికి శ్రీ పావని సేవా సమితి హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకొంటున్నది.

మరినాలుగు శతకాలు మికు అందించాలనే మా ప్రయత్నము త్వరలో సఫలమౌతుందని మా ఆకాంక్ష. అవి డా॥ రవ్వా శ్రీహరి గారి వ్యాఖ్యతో భరృహరి (నీతిశతకము); “ఆంధ్రవ్యాస శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్యగారి వ్యాఖ్యతో శ్రీ కాళహస్తీశ్చర శతకము; డా॥ కసిరెడ్డి వెంకటరెడ్డిగారి వ్యాఖ్యతో వేమన శతకము; డా॥ తిరుమల శ్రీనివాసాచారి గారి వ్యాఖ్యతో భాస్కర శతకము.

మా ప్రచురణల నుండి శ్రీకృష్ణశతకము; దాశరథి శతకము; మరియు సుమతి

శతకాలను ఆంధ్రప్రదేశ్‌లోని గ్రంథాలయాలకు డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్టిక్‌లైబ్రరీస్‌, హైదరాబాద్‌ వారి ఆర్డర్స్‌ ప్రకారం పంపటము జరిగినది. ఇది మాకెంతో (ప్రోత్సాహాన్నిచ్చింది. మిగతాశతకాలకు కూడ వారి ప్రోత్సాహము లభించగలదని ఆకాంక్షిస్తున్నాము.

సవ్యాఖ్యాన శతక సాహిత్య ప్రచురణతోపాటు, భాగవతములోని కొన్ని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యలు (వ్రాయిస్తున్నాము. ఈ దిశలో “శ్రీమద్భాగవత సుధాలహరి” అనుపేర శ్రీబమ్మెరపోతనామాత్య (ప్రణీతము - గజేంద్రమోక్షము - (సంస్కృత మూలసహితము) 'మహాకవి' - శ్రీమాన్‌ ఉత్పల సత్యనారాయణాచార్య వారి గోపీనయ నోత్పలార్చిత వ్యాఖ్యతో వెలువడి - పండిత (ప్రశంసలందుకొని - ద్వితీయ ప్రచురణ జరుగబోతోంది. ఈ పుస్తకాన్ని కూడ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లా (గ్రంధాలయాలకు, మరొకొన్ని ముఖ్యగ్రంధాలయాలకు డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ లైబ్రరీస్‌ వారి అర్జర్స్‌ ప్రకారం పంపటం జరిగింది. ఈ పరంపరలో (ప్రొఫెసర్‌ యస్‌. లక్ష్మణమూర్తిగారు, వరంగల్‌వారి వ్యాఖ్యతో 'రుక్మిణీ కళ్యాణము", మహాకవి శ్రీమాన్‌ ఉత్పల సత్యనారాయణాచార్య వారి కలం నుండి మరొక గోపీనయనోత్పలార్చిత వ్యాఖ్యతో “భక్తప్రహ్హాద” ప్రచురించాలనే మూ ఆకాంక్ష త్వరలో నెరవేరగలదని ఆశిస్తున్నాము.

బడి - గుడి అనే మా నినాదంలో '“బడి'కి సంబంధించినంతవరకు బాలబాలికలలో శతక పరన ప్రోత్సహించటానికి శ్రీపావని సేవాసమితి ప్రాధాన్యము నిచ్చినది, ఇంతవరకు ఈ జంట నగరాలలో శ్రీకృష్ణళతకము, సుమతి శతకము, వేమన శతకాలలో సోట్రీలు నిర్వహించి వేలాది విద్యార్థీనీ విద్యార్థులకు 'ప్రొత్సాహన్నిచ్చింది, ఇతర జిల్ళాలలోకూడ కొన్ని చోట్ట ఈ పరన పోటీలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరము (౧౮కి రెండుశతకాలలో ఒకే సారి పోటీలు నిర్వహిస్తున్నాము, ఇప శ్రి న [ శకము! దాశరధిశతకములు, పద్యానికి పది రూపాయలు ప్రథమ బహుమతి 1 ఇచ్చి, ఈ పోటీలకు ఒక్ష అర్థవంతమైన సంప్రదాయాన్ని నై కా గ్గా ఏిద్యార్థులక్రు పోటీల నిర్వహణలో ముఖ్యపాత్ర సాధన సాహిత్తి సవ న్‌ సంసల జెరిగినది జ్యా గుడి విషయం. శ్రీకృష్ణళతకము నుండి ఎంపిక చేసిన 50 పద్రా స్త ర్చహించినది. పోత్రే సత్యనారాయణాచార్యుల వారి వ్యాఖ్యతో “గానమాధురి ప్రార చుహికవి' ఉత్పల రత్నస్వామిగారి గానంతో ఆడియో క్యాసెట్‌ చేశాము, అలానే ద్‌ శ్రీమతి శవప్రి ఎంపిక చేసిన 37 పద్యాలను 'మహాక్షవి' శ్రీమాన్‌ ఇ త్పల సత ది శతకమున్సంత్ష

సనారాయల్తా.

ఉపోద్దాతముతో, బందరు శ్రీ సుందరకాండమూర్రిగ్యా న చార్యుల వారి విడుదలైంది. ఈ రెండు రొ సెట్స్‌ భద్రం తీకింంయం ల సమ్‌గొక వ్‌ 'సెషస్టెంబరు - 2001లో ఆవిష్కరింపబడినవి. ఆం్యవప్రైటోళహాోల ము౭ష్రా ఊంజల్‌

ఈ రెండుక్యాసెట్స్‌ ఉచితముగా ఇవ్వటానికి నిశ్చయించి ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్‌ వారి సహకారము కోరినాము. వారు దయతో అంగీకరించి 1200 క్యాసెట్స్‌ దేవాలయాలకు పంపిణీ చేయటానికి సహకరించారు. వారికి మాధన్యవాదములు తెలుపుకొంటున్నాము. శ్రీనారాయణ శతకానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియర్‌ స్వామి వారు అత్యంత అను(గ్రహముతో తమ మంగళాశాసనములను నూకు లభింపజేశారు. ఇది మా అదృష్టము, మా ఈ శతకసాహిత్య సవ్యాఖ్యాన (ప్రచురణకు శ్రీరామరక్ష వారికి మా సాష్టాంగ నమస్కారములు. మనము అనేక సందర్భాలలో అనేకమైన బహుమతులను మన (ప్రేమ పాత్రులకు అందజేస్తుంటాము. రకరకాల వస్తువులరూపంలో ఇచ్చే బహుమతులు చూడటానికో, వాడటానికో మాత్రమే పనికి వస్తాయి. ఇలాంటి ఉత్తమ భావాలుగల మిక్కిలి విలువైన తక్కువ ఖరీదులో లభించే అందమైన పుస్తకాలు బహాూకరిస్తే కంటికి ఇంపుగా ఉంటాయి. చదివినప్పుడూ మనిపిని ఉన్నతస్థితికి తీసుకొని వెళ్లుతుంటాయి. ఈ అలవాటు మనం ఇంకా పెంచుకోవాలి.

పరమ భాగవత రసికులై, శ్రీ, కృష్ణైక జీవనులై పరిణత ప్రజలైన 'మహాకవి' శ్రీమాన్‌ ఉత్పల సత్యనారాయణాచార్యవారు ఈ పుస్తకానికి “ఒక్కమాట' అను(గ్రహించారు. అ మహా విద్వాంసునికి సర్వదా కృతజ్ఞులము,

ఈ పుస్తకానికి 'వారాయణ రాఘవీయం" అనుగ్రహించిన ఆంధ్రవ్యాస, కవికుల రత్నదీప, వైదికాగమాలంకార, పురాణపరమేస్టి కవికుల వతంస, శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య మహోదయులకు కృతజ్ఞతలను తెలుపుకొంటున్నాము.

ఈ పుస్తకానికి ముఖప(త్రాలంకరణ కావించిన ప్రఖ్యాత చిత్రకారులు శ్రీ గంగాధర్‌ గొరిక్‌; ముచ్చటగా ఖ్రైప్‌ చేసిన ఫాంట్‌లైన్‌ గ్రాఫిక్స్‌ అధినేత్రి త్రీ మతి నిర్మలగారికి, సుందరముగా ముద్రించిన శ్రీసాయిరాం ప్రింటర్బ్‌ అధినేత శ్రీ, నాగేశ్వరరావుగారికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా కృతజ్ఞతలు.

జి.సిహెచ్‌.రామూరావ్ఫ కార్యదర్శి శ్రీసాయి నిలయము శ్రీపావని సేవాసమితి. ఎస్‌.ఆర్‌.టి.270, సనత్‌నగర్‌ హైదరాబాద్‌ - 500 018. ఫోన్‌.3702898.

శ్రీ నారాయణ శతకము శ్రీ రామామణిపాణిపంకజన్సుదు శ్రీతజ్ఞపాదాబ్ద, శృం గారాకారశరీర, చారుకరుణాగంభీర, సద్భక్ష మం దా, రాంభోరుహసత్రలోచన, కళాధారోరుసంపత్సుధా పారావారవిహార్య, నాదురితముల్‌ భంజింపు నారాయణా॥ క్ష అర్థం: శ్రీ... పాదాబ్ద! శ్రీ = లక్ష్మీదేవి అనే; రామామణి = నారీరత్నంయొక్క; పాణి పంకజ = పద్మాలవంటి హస్తాల యొక్క; మృదుత్రీతజ్ఞ = మార్తవశోభనెరిగిన; పాద + అబ్బ = పాదపద్మాలుగల వాడా! శృంగార + ఆకారశరీర = శృంగారమైన అవయవాలుగల శరీరము కలవాడా! చారుకరుణాగంభిర = అందమైన, అగాధమైన దయగలవాడా! సద్భక్త మందార = చక్కనిభక్తి కలవారికోరికలనీడేర్చే కల్పవృక్షరాజమా! ఆంభస్‌+ రుహపదత్రలోచన = కమలదళనయన! కళా-విహార! కళా = కళలకు; ఆధార = జీవనాడియైన; ఉరుసంపత్‌ = గొప్పవిభూతితో; సుధాపారావార = అమృతమయమైన సముద్రమందు; విహార = ఉల్దాసంగా విలసిల్టువాడా! నారాయణా = ఓ పరమాత్మా! నా దురితముల్‌ = నేను చేసిన పాపాలను; భంబింపుము = తెగనరకుము, తాత్పర్యం : శ్రీదేవి, తన కేల్పమ్ములచే మృదువుగా పాదకమలసేవ చేసే దివ్యమంగళ విగ్రహా! అపారదయా[క్షహృదయా! ఆ(శ్రితజన మందారా! పద్మదళాయతాక్షా! కళలకాధారమైన గొప్ప ఐశ్చర్యంతో సుధాజలధిలో స్వేచ్చగా విహరించే ఓ నారాయణా! నన్ను పాపబంధాలనుంచి విముక్తుణ్ణి చేయవయ్యా! వ్యాఖ్య : భవబంధవిమోచనమే ఈ శతకరచనోద్దేశం. శ్రీదేవి రామామణి. లక్ష్మీదేవి మాహాత్య్యాన్ని 'త్రీ” శబ్దం ప్రకటిస్తుంది. 1 అందరిచే ఆశ్రయింపబడుతుంది శ్రీదేవి. 2. తాను నారాయణుణ్ని ఆశ్రయిస్తుంది. 3. అశ్రితుల మాటలను తాను వింటుంది. 4. ఆ(శ్రితుల ఆర్తిని తన వల్లభునికి వివరిస్తుంది. 5 దోషాలను పోగొడుతుంది. 6. విశ్వమంతటా రమణీయగుణాలతో వ్యాపించి ఉంటుంది.

ణి నారాయణ శతకం

“తదిహ భవతీం శ్రీరితి విదుః” అందువల్ల నిన్ను "శ్రీ అన్నారు, అని శ్రీ శబ్దానికి ఆరు రకాలుగా వ్యుత్పత్తి చెప్పబడింది.

నారాయణుణ్ని ఆశ్రయించి తాను స్వరూపలాభాన్ని పొందడం, తన వల్ల ఆయనకు స్వరూప సిద్ధి కలుగడమే శ్రీ శబ్దానికి ముఖ్యార్థం. కాబట్టి “నారీణాముత్తమా వధూ?” (రా) అన్నట్టు శ్రీదేవి ఇంతులలో ఒజ్జ బంతి.

నారాయణుని పాదాబ్టాలు పాలేటి రాచూలి పట్టుకొమ్మలు.

శ్రీదేవి పద్మప్రియ, పద్మాలయ, పద్మముఖి, పద్మాక్షి పద్మనాభ (ప్రియ, వేయేల? ఆమె పద్మయే అని శ్రుతి సృతులు కీర్తస్తున్నాయి. శ్రీదేవి స్వరూపంలో చంద్రునిలాగా మృదుశీతముగ్రత్వగుణాలూ, అమృతం లాగా మాధుర్య గుణమూ, కల్పతరువు లాగా జౌదార్యగుణమూ శోభించడం అనితర సాధారణ విషయం.

“పాదారుంతుద మేవ పంకజరజశ్ళేటీ భృశాలోకితై

రంగమ్హాని రథాంబ! సాహసవిధా లీలారవింద గ్రహ: "(శ్రీ గుణరత్న కోశం = 42)

లక్ష్మీదేవి నివసించే పద్మమందలి పరాగం ఆమె పాదతలాలకు కంటకా[గ్రం లాగా బాధ పెడుతుందట. చెలికత్తెల చూపులు సోకితే అమె శరీరం వాడిపోతుందట. ఆమె చేతిలో విలాసంగా ధరించిన లీలారవిందమే సాహసంతో పెద్ద బరువును మోసినట్టు ఆమెకు అనిపిస్తుందట. అంతసౌకుమార్యంగల శ్రీదేవి కరకమలాల మార్దవశోభ ఎంతటిదో నారాయణుని చరణకమలాలకే తెలుస్తుంది.

“కమనీయరూపరేఖ్రా, రమణీయత జాలనొప్పు రమణీమణి య

క్కమలాలయ తన మృదుకర, కమలంబుల విభుని పాదకమలములొత్తన్‌” (ఆం.భాగ.2 స్కం౦ం.232)

శ్రీదేవి ఎంతో మృదువుగా పాదసంవహనం చేసినా. అతిసుకుమారంగా ఉండే నారాయణుని పాదకమలాలు కంది పోతుంటాయి;

“మలర్మగళ్‌ శ్రైవరుళ్ళ్మలర్‌ పానిల్‌ కిలన్టన” అని ఆళ్వార్లశ్రీ సూక్తి

“రసోవైసః్‌ “సర్వగంధః సర్వరసః (ఉపనిషద్వాణి)

నారాయణుడు సర్భరసస్వరూపుడు. శ్రీదేవి శృంగారరసాధిదేవత, కాబట్టి పరస్పరం ఉజ్జాలించే (ప్రణయభావాన్నీ, నిరంకుైశ్చర్యాన్నీ. నిరవధి కానందాన్నీ ప్రకటించే, శభాశ్రయమైన, అప్రాకృతశరీరం కలవాడు శ్రీమన్నారాయణుడు.

నారాయణుడు ఒక్కడే పురుషోత్తముడు. ఇతరజగత్తంతా స్రీ ప్రాయమే. కాబటి ఉపాయాన్నీ, ఉపేయాన్నీ - అంటే, భగవద్రతిని పొందడానికి సాధనాన్నీ, పొందదగిన

రాఘవీయవ్యాఖ్య క్రి ఫలాన్నీ - నిస్సంశయంగా వెల్లడించేది నారాయణుని స్వరూపం. అహంకారాన్ని నిరసించే దాస్య (మధుర) భక్తియే చేతనులు - జీవాత్మలు - ఉజ్జీవించడానికి హేతువని శేష శేషిత్వాన్ని స్వాభావికంగా ప్రదర్శించే సౌశీల్య, సౌందర్యమూర్తి శ్రీమన్నారాయణుడు.

“లక్ష్మ్యా సహ హృపీకేశో దేవ్యా కారుణ్యరూపయా।

రక్షకః సర్వసిద్దాంతే, వేదాంతేఒపి చ గీయతే!

దంపతులలో ఏ ఒక్కరినో ఎప్పుడూ ్రార్హించరాదు. సీతాదేవినొక్కరినే కోరి రావణుడు నశించాడు. ఒక్కరామదేవుణ్ని కోరి శూర్చణఖ (వికృతి) సుష్పనాతి అయిందికదా! అందువల్ల, కారుణ్యరూపిణియైన లక్ష్మీదేవితో కూడియున్న నారాయణుడే రక్షకుడని సర్యోపనిషత్సిద్దాంతం,.

రూపాన్ని చూస్తే గానీ గుణమేర్చడదు. దయకు ప్రధమోత్పత్తి స్థానమైన పాదాబ్బాల ప్రశంస తర్వాత, దయాగుణ్రశంస లక్షణంగా ఉంది. దయనిలిచి ఉండే స్టానం అంతరంగం.హేయగుణ మొక్కటీలేని అనంతకల్యాణగుణాలచే పరిపూర్ణుడు నారాయణుడు. దయాగుణమే లేకపోతే, ఇతర గుణాలకు విలువలేదు కదా! గుణాలన్నింటికీ దయాగుణ సహకారం అత్యావళ్యకం.

జ్ఞానంచేత కృత్యాకృత్యాలనూ, వాటివల్ల కలిగే ఫలాలనూ తెలుసు కోవచ్చు. శక్తిచే అపరాధులను దండించనూ వచ్చు. కరుణ ఎంతో గంభీరంగా ఉన్నందువల్ల ఆ జ్ఞాన శక్త్యాదిగుణాలు అందులో మునిగి పోయి, వాటిఫలంకూడా లభింపకుండడం చారుత్వం. శ్రీవేదాంతదేశికులు 'దయ'ను పరహితచింతనగా నిష్కర్షించారు.

దయాగుణం 'గంభిరి శబ్దప్రయోగం వల్ల మహాసము(ద్రమనీ, దానిలోనికి దిగడం సాధ్యం కాదనీ తెలుస్తుంది. దయకు గట్టువలె ఉన్న భగవంతుణ్ని త్రికరణశుద్దిగా నమ్మి ధ్యానిస్తే తాపత్రయం నశిస్తుంది. ఇహపరసుఖాలు కలుగుతాయి.

గట్టు మోదనే కదా చెట్టు ఉంటుంది. ఆకాళగంగాతీరాన వెలసిన ఇంద్రుని నందనోద్యానవనంలోనే మందారం, పారిజాతం, సంతానం, కల్పం, హరిచందనం అనే పేరుగల చెటు ఉంటాయి. ఆ దేవ తరువులు తమ నీడకు చేరిన వారికోరికలను, తలచినదే తడవుగా, సిద్ధింపజేస్తాయి.

“వృక్ష ఇవ స్తబ్లో దివి తిష్టత్యేకః” (నారాయణోపనిషత్‌

“నివాసవృక్షః సాధూనా మాపన్నానాం పరాగతిః (రామాయణం)

“వరుణో వారుణో వృక్ష” (వి.స.నామం)

“సమాశ్రితాత్‌ బ్రహ్మతరో రనంతాజ్‌ నిస్సంశయః పక్సఫలప్రపాతః”

త్త నారాయణ శతకం

ఇలా శ్రుతిస్కృతీతిహాసపురాణాలు భగవంతుణ్ని వృక్షంగా వర్షించాయి. తనను నీడలాగా అనువర్తించే వారికి తన సర్వస్వాన్ని ఇచ్చి, వారి అపరాధాలను సహిస్తూ వారిని వరించే పరబ్రహ్మను వృక్షమని కీర్తించాయి. ఆయన సాధువులు ఉజ్జీవింపదగిన వృక్షం. అపన్నులకు శరణం.

(బ్రహ్మమనే తరువును ఆశ్రయించిన వారి ఒడిలో పక్సమైన ఫలం పడితీరుతుంది.

సర్వకాల సర్వావస్త్రల్ణోనూ భగవద్ద్యానమగ్నులైన జనులు సద్భక్తులు. వారిపాలిట మాధవుడు మందారతరువు. భక్తుల ధ్యానోపాసనలవల్ల వారి సకలకర్మలు, సర్వపాపాలు అగ్గి బడిన దూదిలాగా బుగ్గి అవుతాయి. (ప్రారబ్దకర్మఅనుభవించక నశించదు కదా!

“తదా విద్వాన్‌ పుణ్య పాపే విధూయ, నిరంజన: పరమం సామ్యముసైతి దివ్యమ్‌” (ఉపనిషత్చూళ్తి

“తేషా మహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్‌, భవామి” (భగీ.12-7)

దాయాదులకు, ఆపస్టి చెందేరీతిగా, మముక్షువులైన సద్భక్తుల పుణ్యం. వారి మి(త్రులకు, పాపం వారి శత్రువులకు చెందుతుంది. ఇలాగా సద్భక్టులు -పరిశుద్దులై, గుణాష్ట్రకావిర్భావంవల్ల భగవంతునితో సమాన ధర్మాన్ని పొందుతారు, నారాయణుడు అవ్యాజాను[గ్రహంతో మోక్షఫలాన్ని ప్రసాదిస్తాడని సారాంశం,

తరువును తలచిన వెంటనే పత్ర పుష్పాలు స్ఫురించడం నైసర్గికం, కరుణ ఎంత గంభీర మైనదో అంభోరుహ పత్రం అంత విశాలమైనది. “పద్మకోశ ప్రతీకాశం హృదయం” అన్నట్లు పుండరీక సదృశం హృదయమైతే పుండరీక దళ సదృశాలు నయనాలు. హృద్గతాభిప్రాయాన్ని ముఖంమీద చమకింపజేసేవి లోచనాలేకదా! పుండరీకాక్ష నామం నారాయణునికి భాగధేయం. ఆనామసంక్షీర్తనం నరునిక్తి పాథేయం. ఆయనకు రుచి, మనకు శుచి.

“కప్యాసం పుండరీక మేవ మక్షిణీ” అనే ఛాందోగ్యోపనిషద్వాక్యానిక్రి “గంభీరాంభస్సముద్భూత సుమృష్టనాళ రవికరవికసిత పుండరీక దళామలాయతేక్షణ?” అని “వేదార్థసం[గ్రహం”లో వివరణ ఇచ్చారు భగవద్రామానుజులు.

వుండరీకం సితాంభోజం' అని అమరకోశమందు అనుశిష్టం. శబరస్వామి వారు 'రక్తాంభోజ' మని (శ్రుత్యర్థాన్ని వివరించారు. కాబట్టి 'పుండరీకాక్షుడు' అంటే తెల్లదామరల్ర వంటి కన్నులు కలవాడు అని కాదు. కెందామరలవంటి కన్నులు కలవాడు అనే అర్జ్రాన్నే పెద్దలు నిర్ణయించారు.

'అంభోరుహ పత్రలోచన' నామం శ్రీమన్నారాయణుని సర్వజ్జత్వ సర్వేశ్చరత్వ

సౌలభ్య వాత్సల్యాలను ఉద్బోధిస్తూ భక్తులను అనితర సామాన్యంగా కటాక్షిస్తుంది,

రాఘవీయవ్యాఖ్య బ్‌

“ఏకైకళో లంగాని ధియాఒనుభావయే త్పాదాది”.. (భాగ,2-1-13) “మానవా మౌళితోవర్ధ్యా దేవాశ్చరణత; పునః”

'మనుష్యులను వర్షిస్తే శిరస్సు నుంచి ఆరంభించాలి. భగవంతుణ్ణి వర్షిస్తే పాదాలనుంచి ఆరంభించాలి" అనే పద్దతిని బట్టి ఈ శతకకవి, చరణాలు మొదలుకొని చక్షుభుుర్యంతం వర్షించాడు.

తర్వాత “కారణం తు ధ్యేయః” అన్నట్టు విశ్చాయమాన పరాగంగల పద్మం నాభియందుండే మూలరూపాన్ని కళాధారోరుసంపత్సుధా పారావారవిహారా అని స్తుతించాడు.

“అసద్వా ఇదమగ్ర ఆసీత్‌, తతో వై సదజాయత” శ్రుతి. 'అసత్‌: అంటే కారణావస్ట. ప్రళయంలో జడాజడ ప్రపంచాన్ని ప్రకృతిని - సూక్ష్మంగా నేల, నీరు. నిప్పు అనే నామరూపవిభేదం లేకుండా భగవంతుడు తనలో భద్రపరచి ఉంచిన దశ

సత్‌ అంటే కార్యావస్ట, సూక్ష్మరూపంగా నామరూపరహితాలై తనలో లీనమై ఉన్న చిదచిత్తులకు బహుత్వాన్ని కల్పించి, "నామరూపాలనేర్పరచి, తాను వాటిలో అంతర్యామిలై ఉండిన దశు ఇదే సృష్టి సదసద్రూపాలు - స్థూల సూక్ష్మరూపాలు

  • రెండూ భగవంతునికి ఉన్నాయి. అవ్యక్తరూపంతో అన్నింటినీ భరించిన భగవానుడే, స్టూల చిదచిత్తులతో కూడి జగద్రూపంగా వ్యక్త మవుతాడు. అందువల్ల సర్వ" శబ్దవాచ్యుడు “సర్వవొ.(విసనా)

“కళా ముహూర్తాః కాష్టాశ్చాహోరాత్రాళ్ళ సర్వశః (తైటప)

కళలు, ముహూర్తాలు, కాస్ట్రలు అనే విభాగం కలిగిన కాలం భగవంతుని అధీనమై ఉంది. “అహమేవాక్షయః కాలః (భ.గీ10-33)

నాశరహితమైన కళాముహుర్హాదిమయకాలమూ భగవానుడే కదా!

సృజనాత్మకమే కళ కళలు పదహారు.

“కళాళ్ళ పంచభూతాని జ్ఞానకర్మేంద్రియాణి చ।

పంచ పంచ మన్మ్ఫ్ళేతి షోడశోక్తా మహర్షిభిః”

జ్ఞానేంద్రియాలు 5. కర్మేంద్రియాలు 5. మనస్సు. (నింగి గాలి, నిప్పు, నీరు, నేల) భూతాలు 5. మొత్తం పదహారు 16.

“జగ్భహీ పౌరుషం రూపం భగవాన్మహదాదిభిః

సంభూతం షోడశ కళ మాదౌ లోకసిసృక్షయాః (భాగ.310

6 నారాయణ శతకం

లోకాలను సృష్టించాలనే నంకల్పంతో నారాయణుడు మహదహం కారతత్త్యసముదాయంతో కూడిన షోడశకళలతో పురుష రూపాన్ని స్వీకరించాడు. “కళాస్సర్వే హరేరేవ” (భాగ.1.3.27) సర్వకళలు శ్రీహరివే. కళాధారమైనది కారణదశ, కారణం లేనిదే కార్యం ఆవిష్కరింపబడదు. నారాయణుడు సత్య సంకల్పుడు, అంటే ఫలించే కోరికకలవాడు. ఇచ్చాశక్తియే గొప్ప సంపద, ఇచ్చయే క్రియాశక్తికి మూలం,

“ఇచ్చా త ఏవ తవ విశ్వపదార్హసత్తా”. (వైస్తు

“ఇచ్చా గృహీతోలభిమతోరుదేహ:” (విపు

భగవంతుడు తన సంకల్పంచేతనే గొప్పరూప సంపత్తును స్వీకరిస్తాడు.చేతనా చేతనరూపజగత్తును తనలోనే ఇముడ్చుకొంటాడు.

“అంభస్యపారే” (అపారీ అంభసి.) (నారా.ఉప)

“ఏకస్తిష్టతి విశ్వాత్మా స తు నారాయణ్రభు?

(ప్రళయకాలంలో బ్రహ్మరుద్రులుగానీ, చంద్రసూర్యులుగానీ, భూమ్యాకాశాలుకానీ ఏవీ లేవని శ్రుతి. సకలస్రపంచం ఏకార్లవమైనప్పుడు అందు నారాయణుడొక్కడే సమాధిరూపమైన యోగనిద్రలో జగద్రక్షణచింత చేస్తుంటాడు.

ఈ విషయాన్నే పొదవి పొట్టం కట్టి పోతన ఇచ్చాడు.

“మహదహంకార తన్నాత్రసంయుక్తుండై

చారుషోడశ కళాసహితుండగుచుః.....

“మానితోదారజలరాశిమధ్యమునను, యోగని(ద్రావిలాసిడై యొప్పుచుండు॥

(భాగ 1-60) సుధాపారావార విహారుడు నారాయణుడేకదా।

“ఆపో నారా ఇతి ్రోక్తా ఆపో వై నరసూనవః।

తావదస్యాయనం పూర్వం తేన నారాయణ: స్మృతః”

నీటికి నారము లని పేరు. నీరు నరుని వల్ల జనించింది. నారములు స్థానంగా కలవాడు నారాయణుడని మనుస్కృతి విశదపరచింది.

“నరాజ్ఞాతాని తత్త్వాని నారాణీతి తతో విదుః

తాన్యేవ చఛాయనం నిత్యం తేన నారాయణ: స్కృతః॥” (పొద్మం)

నరునిచే కలిగిన తత్త్వాలు నారములు, అవి స్థానంగా కలవాడు నారాయణుడని మహాభారతంకూడా నిర్వచించింది.

రిజ్‌ - క్షయే' అనే ధాతునిష్పన్నం 'ర నాశంలేని నిత్యవస్తువుఅని 'నర'శబ్బార్థం, సమూహార్థంలో 'అణ్‌(ప్రత్యయం చేరగా అదివృద్ది, నరసమూహం '“నార'శబ్దం,

రాఘవీయవ్యాఖ్య ణౌ నారములకాశ్రయమైనవాడు, (పస్టీతత్పురుషు నారములు ఆ(శ్రయంగా కలవాడు (బ్రహువ్రీహి).

నారాయణ, వాసుదేవ, విష్ణు శబ్దాలు వ్యాపకమంత్రాలు. అందులోనూ “పూర్వపదాత్‌ సంజ్ఞాయా మగః"”అని ఇఅత్వం. కాబట్టి 'నారాయణ' శబ్దం సంజ్ఞావాచకం, మిగిలినవి సంజ్ఞావాచకాలు కావు. నారాయణమంగత్రం అష్టాక్షరి. నా=ం, రా=2 య=1, ఆకార్‌ మొత్తం 8.

“యస్మాన్నాణీయో న జ్యాయోజస్త్రి కళ్చిత్‌'. ఎవనికంటె సూక్ష్మవస్తువు గానీ, గొప్పవస్తువు గానీ లేదో ఆతడు నారాయణుడన్నది వేదవాణి.

ఈ శతకకవి 'నారాయణ' పదాన్ని మకుటంగా స్వీకరించి స్తుతింప ఆరంభించాడు. ఎందుకు? “నా దురితముల్‌ భంజింపు”మంటున్నాడు కదా! 'దురితం' అంటే నింద్యమైన కర్మ - పాపం. తెలిసో తెలియకో పాపపుణ్యకార్యాలను చేయకుండా జీవించలేడు మానవుడు. పాపం దుఃఖాన్ని , పుణ్యం సుఖాన్ని కలిగిస్తుంది.

“సుకృతం దుష్కృతం చైవ గచ్చంత మనుగచ్చతః' అన్నట్టు పోయేవాని వెంట పుణ్యపాపకర్మలు కూడా పోతాయి. కర్మలున్నన్ని నాళ్ళు జన్మ తప్పదు. ఏ కర్మలేని వానికే మరోజన్మ ఉండదు. మోక్షఫలం లభిస్తుంది.

అద్దానికి క్రమ్మిన దుమ్మును, మురికిని తొలగించడమే చేయవలసిన పని, కాని, (ప్రతిఫలనశక్తిని కూర్చడం కాదు. పొపపుణ్యాలను తొలగిస్తే ముక్తి తనంత తాను వచ్చితీరుతుంది. మరి దురితాలు తాలగిపోయేదెలా?

“ముహూర్త మపి యో ధ్యాయన్‌ నారాయణమనామయమ్‌

సోఒపి సిద్ధిమవాప్నోతి కింపునస్తత్సరాయణ:॥

ప్రధాన పురుషేళ్చరుడైన నారాయణుణ్ని ఒక్క ముహూర్త కాలం (48 నిమిషాలు) ధ్యానించినా కర్మబంధం తెగిప్తోయి-సిద్దినిపొందుతాడు. ఇక నారాయణుడే పాందదగిన వాడని ఆసక్తుడై ఉండే వ్యక్తికి లభించే భాగ్యమేమని చెప్పేది?

“యదర్ధ మంభోధి రమంథ్య బంధి చ” (స్తోత్రరత్నం)

ఎవరిని పొందడానికి నారాయణుడు సముద్రాన్ని మధించాడో, సేతు బంధం చేశాడో, ఎవరిపైన వ్యామోహంతో ఇల్లరికమైైన వసతి నేర్పరచుకొన్నాడో ఆ శ్రీరామామణి యొక్క పతిపారార్ట్యంతో శతక మారంభమయింది.

శకారం లక్ష్మి అస్లి బీజమైన రేఫం సంపత్కరం. ఈ కారం ఆనందార్జకం. నాదం సర్వేశ్వరుడు. బిందువు దుఃఖహరం. మంగళదీపరేఖయైన లక్ష్మీదేవి యొక్క బీజాక్షరం శ్రీ శబ్దం.

8 నారాయణ శతకం (శ్రియః పతిత్వ దయాళుత్వ అశ్రితమందారత్వ పుండరీకాక్షత్వ విశ్వాత్మ కత్వాదులచేత సర్వదేవతాసార్వభౌమత్వంగల నారాయణుని స్తుతిశతకకృతి ముఖాన శ్రీశబ్దం తిలకంగా అలంకృతం. మ, కడకుంబాయక నేయునోళ్ళుగల యాకాకోదరాధీశుండున్‌ గడముట్ట న్విముతింపలేక నిగుడన్‌ గ్రాలంగ నొప్పారు మి మ్మడరన్‌ సన్నుతొసేయ వాదు నళనే; యజ్ఞాని, లోభాత్ముండన్‌ జడుండ న్నజ్ఞుండ, నైక జిహ్వాండ, జనస్తబ్బుండునారాయణా॥! 2 అర్ధం : ఓ నారాయణా! వేయినోళ్ళుగల; ఆకాకోదర+అధీశుడున్‌=కాకి పొట్టవంటి మెత్తని కడుపున్న పాములకు దొరయైన ఆరదిశేపుడుకూడా; కడముట్టన్‌=సంపూర్షంగా; వినుతింపలేక = స్తుతింపజాలక; కడకున్‌ = చివరకు; సాయక = వదలిపెట్టక; నిగుడన్‌శ్రాలంగన్‌ఒప్పారు = చాగిలపడి చుట్టగా తిరిగి పడుకగా ఒప్పియున్న; మిమ్ము; అడరన్‌ = అతిశయంగా; సన్నుతి సేయ = స్తోత్రం చేయడానికి; అజ్ఞాని = శాస్త్రవిషయాలు తెలియని వాడను; లోభాత్ముండన్‌ = లుబ్బుడను; జడుండన్‌ = చైతన్యంలేని మొద్దును; అజ్జుడన్‌ = మూర్చుడను; న+ఏకజిహ్వాండ = వదరుబోతును; జనస్తబ్బుండ = పుట్టుకతోనే మర్యాదనెరుగని సోమరిని; నాదు వశమే = నాకుశకృ్యషువునా? తా; ఓనారాయణా! వేయినోళ్ళున్న అదిశేషుడుకూడా మిమ్ము సమగ్రంగా స్పుతింపజాలలేదు. మిమ్మువిడిచి మనజాలనూ లేదు. తుదకు తన దేహాన్ని మికు సెజ్జగా అర్చించుకొన్నాడు. ఇక శాస్త్రజ్ఞానంలేని, పేరాసగల, జడుడనూ, మూర్చుడనూ, ఒక్క _నాలుకున్నా బాగా వదరుబోతును స్త క్రర్రయేయకాయ ల! వ. వ్యాఖ్య : అనంతగుణసముద్రుజైన నారాయణుణ్ని స్పుతింప శక్యం కాదు. నారాయణుడు స్వరూపంతోనూ, గుణాలతోనూ నిస్సమాభ్యధికుడు. “బృహత్ష్యం చ స్వరూపేణ గుణైళ్ళ” (శ్రీభాష్యం). పరబ్రహ్మవాచ్యుడు. “సత్యం జ్ఞానం అనంతం (బ్రహ్మ. సత్యం, జ్ఞానం మొదలుకొని అనేకకల్యాణ గుణాలు కలవాడు పరబ్రహ్మ అని ఉపనిషద్వాణి. భగవంతుని స్వరూపస్వభావాలను మనసార అనుభవించి నోరార ప్రకటించడమే నుతి. “యద్ది మనసా ధ్యాయతి, తద్వాచా వదతి” (శ్రుత్రి) 'ప్రతికార్యానికి మొదట | గుణవిశిష్టమైన సంకల్పం” ముఖ్యాచారమయింది. సర్పరాజైన ఆదిశేషుడు సహస్రఫణామణిమండలమండితుడు.

రాఘవీయవ్యాఖ్య |

ఆయనకు దశశతపాణిపాదవదనాక్షిముఖుడైన భగవంతుణ్లి స్తుతించాలనే సంకల్పం కలిగింది. ఆయనకున్న వేయినోళ్ళలో ఒక్కొక్కనోరు, భగవద్గుణాలలో ఒక్కొక్క గుణాన్ని మాత్రమే అనుసంధించి ఆనందించింది. మనకు రెండు కన్నులున్నా చూపు ఒక్కటే అయినట్టు, సహస్రఫణికి రెండేసి నాలుకలున్నా రుచి ఒక్కటే. శేషుని వేయినోళ్ళు, “ఈ గుణమందే నాకు రుచి మెండు” అని గుణపక్షపాతంతో పరస్పరం కలహిస్తూ వేయిగుణాలను మాత్రమే అనుసంధించడంతో విశ్రమించాయి.

“యధా రత్నాని జలదే రసంఖ్యేయాని పుత్రక

తథా గుణా హ్యనంతస్యా ప్యసంభఖ్యేయా మహాత్మనః”

సము(ద్రం అనేక రత్నాలకు ఆకరంకదా! అలాగే భగవంతుడు, జ్ఞాన బలైళ్ళర్య వీర్యశక్తి తేజస్సాశిల్య వాత్సల్య మార్తవార్డవసౌహార్ద సామ్యకారుణ్య మాధుర్య గాంభీర్యాదార్య చాతుర్య స్టైర్య ధైర్య శౌర్య పరాక్రమాదికల్యాణ గుణాలు లెక్కకు మిక్కిలిగా కలవాడు అని మత్స్య పురాణం నొక్కి చెబుతుంది.

“సంఖ్యాతుం నైవ శక్యంతే గుణా దోషాళ్ళశార్‌జ్షిణ:

ఆనంత్యాజ్‌ (ప్రధమో రాశి, అభావాదేవ పశ్చిమః॥”

సర్వేశ్వరునికి కల్యాణ గుణాలు అనంతంగా ఉన్నాయి; హేయ గుణాలు లేనే లేవు. కాబట్టి ఆయన గుణదోషాలను లెక్కింపనెవరి తరమూ కాదు,

“ఇషుక్షయాన్నివర్తంతే నాంతరిక్షక్షితికయాత్‌!

మతిక్షయాన్నివర్తంతే న గోవిందగుణక్షయాత్‌!”

ధానుష్కుడు తన తూణీరంలోఉన్న బాణాలన్నీ ఒడిసిపోవడంవల్ల ఊరకుంటాడే కానీ, ఆకాశంలో చోటు లేక కాదు కదా! అలాగే స్తుతించేవాడు మనస్సుకు శక్తి చాలక చాలిస్తాడే కానీ, భగవంతునియందు గుణాలు లేక కాదు.

“గృణశానామాకరో మహాన్‌" అభిరామగుణాకరుడు నారాయణుడు

“శ్రీమన్నారాయణచరణా శరణం ప్రపద్యే,

శ్రీమతే నారాయణాయ నమః” ఇది ద్వయమంత్రం.

“షట్సదో౬టయం ద్విఖండ:”. ఆరు పదాలున్న (3+3)ఈ రెండు వాక్యాలలోనూ 'నారాయణ'" శబ్దం ఉంది. పూర్వఖండంలోని 'నారాయణ'పదం జనులందరు ఆశ్రయించడానికి తగిన దయావాత్సల్యసౌశీల్యసొలభ్యాదిగుణాలను బోధిస్తుంది. ఉత్తర ఖండంలోని 'నారాయణ” పదం అశ్రిత సౌకర్యాపాదకగుణాలను అంటే ఆశ్రయించిన వారికి సకల ఫలాలనిచ్చే పరత్వాన్ని బోధిస్తుందని పూర్వాచార్యులు ఉపదేశించారు.

శ0 నారాయణ శతకం “నారాయణ! కరుణామయ! శరణం కరవాణి తావకా చరణా। ఇతి షట్పదీ మదీయే హృదయసరోజే సదా వసతు॥” (విష్ణుషట్పదీస్తోత్రం) 'షట్పది' అంటే ద్వయమం(త్రం. మరొక అర్ధం తుమ్మెద ఈ షట్పది నాహృదయకమలమందే ఎల్లప్పుడూ ఉండాలి" అని శ్రీ, శంకరభగవత్సాదులు స్తోత్రం చేశారు కదా!

“తచ్చరితానురాగగుణ విస్ఫూర్తిన్‌ సహ(స్రాస్యసుం

దరతన్‌ బొల్ప్బగు శేషుండు న్నెరుంగడన్నన్‌ జెప్పలేరొండారుల్‌'

అన్నారు పోతనామాత్యులు (ఆం.భాగ.2 స్కం.203)

"ఓ వృషాచలపతీ! వేంకటేశ్చరా! వేయిపడగలూ, రెండువేలనాలుకలూ కలిగియుండి పరిశుద్దాత్ముడైన ఆదిశేషుడే నీ ఒకే ఒక్క దయాగుణాన్ని స్తుతింప సమర్భుడు కాలేదు. ఇప్పుడు ఆదయాదేవి మహిమను నేనెలా వర్షిస్తానో” అని శ్రీవేదాంతదేశికులు తమవినయాన్ని ప్రకటించారు.

“ఫణాసహస్రో ద్విసహ(స్రజిహ్వః

శుద్దాత్మకో భోగిపతిస్ట్రదీయామ్‌;

దయాం న దక్షో గదితుం, కథం వా

తా౦ వర్ణయా మ్యద్య వృషాద్రినాధ॥”

(దయాసహస్రమ్‌. (ప్రథమశతకమ్‌. 2వ క్టోకమ్‌)

ఈ శతకక్తర్తకూడా తన ఆకించన్యాన్ని వెల్లడిస్తూ నారాయణ స్తుతికి పూనుకొన్నాడు.

గొప్పు జ్ఞాన బలాలు కలిగిన సర్పరాజే వేయినోళ్ళున్నా (శ్రియఃపతిగుణాలను సమ(గ్రంగా కొలువజాలలేదు. మరి " మానుకొని మనజాలనూ లేదు. కడకు మ ష్యన సాగిలపడి తనస్వామి సౌకుమార్యానికి తగినట్టు, వేలచంద్రులను సెకగా పం చల్లని తెల్లని కాంతితో మెత్తగా ఎత్తుగా ఉండి పరిమళించే

జ్ఞగా పరిణమించి, సర్వేశ్చరత్వానికి ముఖ్యలక్షణభూతుడయ్యాడు. వాద. గయాసమయార్లో శ్రీపతికి దివ్యమందిరంగా, శయ్యగా, సింహాసనంగా,

  • వట్టుపుట్టంగా, దిండుగా, ఎండ, వానలనుపడనీయని గొడుగుగానూ, అనేక ఆకారాలను ధరించి దాస్యం చేయబూనుకొన్నాడు.

శేషు పరార్థత్వాత్‌” (వేదార్దసంగ్రహం).

వదల రసం పాటు పడేవాడు 'శేషుడు' అనీ, సర్వవిధ కైంకర్య నమైనందువల్ల 'అనంతు' డనీ సకల జనులచే యోగరూఢంగా వ్యవహరింపబడినాఢు కాకోదరాద్రీశుడు.

రాఘవీయవ్యాఖ్య శై జ్ఞానాధికులే భగవద్దుణాలను పూర్తిగా ప్రశంసింపలేనప్పుడు అజ్ఞాని నైన నాకు స్తుతింపసాధ్యమా? అన్నాడు కవి.

అజ్ఞాని : తత్త్యహితపురుషార్దాలు తెలియనివాడు. కర్మజ్ఞానభక్తిప్రపత్తులనే నాల్షింటిలో ఏ ఒక్క ఉపాయమందైనా శ్రద్దాసక్తులు లేనివాడు.

అజ్ఞానం మూడువిధాలు,

  1. జ్ఞానానుదయం: బాల్యదశలాగా జ్ఞానంకలిగే అవకాళంలేని స్టిత. వయష్సు పెరిగి జ్ఞానం కలిగినప్పుడు ఈ స్థితి తొలగిపోవచ్చు.

  2. అన్యథాజ్ఞానం : ఒక వస్తువును చూచి మరొక వస్తువుగా (భ్రమించే స్థితి. దేవాన్ని ఆత్మగా భావించడం, తాడును పాము అనుకోవడం. ఉపదేశాదులతో వస్తు స్వరూపాన్ని యధార్ధంగా తెలుసుకొన్నప్పుడు అన్యధాజ్ఞానం అణగిపోతుంది.

౩. విపరీతజ్ఞానం : న్షుద్రసుఖాలకు, దుర్వ్యసనాలకు మరుగడానికి కారణమైన అవివేకం. విషయచాపల్యానికి "హేతువైన విపరీతజ్ఞానాన్ని తొలగించుకోవడం దుస్పాధ్యం.

లోభాత్ముడు: తన ప్రయత్నం లేశమైనా లేకున్నా పురుషార్ధపరుడు కావాలనే గొంతెమ్మకోరికలున్నవాడు.

జడుడు: మెరపులాగా తళుక్కున తలంపులనాలకించే మనస్సు స్పందించక, తాను కదలక, కదలించక, శరీరంమాత్రం చెట్టులాగో, చట్టులాగో ఉండే వ్యక్తి,

రెండునాలుకలుండే పాముకు ప్రతికోటిగా ఉన్నమాట ఏకజిహ్వుడు. మానవులకు ఒక్కనాలుక గాక ఎక్కువ నాలుకలుంటాయా? అని వివాదిస్తే (న+ఏక జిహ్వుడు=) నైకజిహ్వుడు-వదరుబోతు అని అర్ధం.

"అహం త్వల్పస్తద్వ ద్యదిహ బహు జల్పామి” (పాదుకాసహ'్రం.10)

సత్పురుషుల వలె స్తుతిస్తాననుకొని, క్షుద్రుడనైన నేను ఏదో వాగుతున్నాను.

“న తే వర్ణయితుం శక్తా గుణాన్‌ జిహ్వా౭పి వేధసః” నీ గుణాలను వర్ణించడానికి చతుర్ముఖుని జిహ్వకు కూడా శక్తి చాలదు. నిన్ను స్తుతింప నావశమా? అని కవులు స్తుతించే శక్తి కలవారైనా ఉత్కృష్టవస్తువును కీర్తించడానికి ముందు తమ అహంకారాన్ని నిరసించుకొని, వినయాన్ని (ప్రదర్శించడం సత్కవుల సంప్రదాయంకదా! శా. నే నీదాసుండ నీవు నాపతివి నిన్నే కాని యొండెవ్వరిన్‌

ధ్యానింపం బ్రణుతింస నట్లగుటకు న్నా నేర్చు చందంబునన్‌ నీ నామస్తుతులాచరించు నెడల న్నేతప్పులుం గల్లినన్‌ వానిన్‌ లో(గొనుమయ్య, తండ్రి, విహితవ్యాపార, నారాయణా॥ 3 అర్ధం: విహిత వ్యాపార = విశేషంగా మేలైన కార్యాలను నిర్వహించే; ఓ నారాయణా! నేను, నీదాసుడను; నీవు, నా పతివి = నాస్వామివి. నిన్నే కాని ఒండు ఎవ్వరిన్‌ = నిన్ను

శ నారాయణ శతకం తప్ప మరొక్కరిని; ధ్యానింపన్‌ = మనస్సులో తలవను; ప్రణుతింపను = పాగడను. అట్టు ఆగుటకున్‌ = అందువల్ల నా నేర్పు చందంబునన్‌ = నాకు తెలిసిన రీతిగా; నీ నామస్తుతులు, ఆచరించు+ఎడలన్‌ = నీగుణాలను (పేర్లను) ప్రశంసించునప్తుడు; ఏతప్పులున్‌ కల్షినన్‌ = ఎట్టిదోషాలు దొరలినా; వానిన్‌ = వాటిని; ఓ తండ్రి! లోన్‌, కొనుమయ్య = చిత్తగింపుమయ్యా! తా: జగద్ధితకృత్యాలనాచరించే ఓ నారాయణా! నేను సేవకుడను. నీవు (ప్రభువవు. నిన్ను గాక మరెవ్వరినీ స్మరింపను. స్తుతింపనుకూడా. కాబట్టి, నా శక్తికొలది నీ నామసంక్షీర్తనం చేయునప్పుడు కలిగే నా తప్పులను క్షమించి స్వీకరింపుము తండ్రీ! వ్యాఖ్య : జగద్దితవ్యాపారుడు నారాయణుడు. నారాయణుడు. (ప్రపంచాన్ని సృష్టించి చరాచర పదార్దాలయందు. (ప్రవేశించి పాలించే సామర్థ్యం కలవాడు. “తత్సృష్ట్యా, తదేవానుప్రావిశత్‌', “అంతః (ప్రవిష్టశ్శాస్తా జనానాం సర్వాత్మా”. (తైఉప) సర్వ'స్రాణుల దేహమందున్నా పరమాత్మకు కర్మకరృత్వమూ లేదు. ప్రాణుల కర్మసలమాలిన్యమూ ఆయనకంటుకోదు. శరీరస్టోఒపి కౌంతేయ! న కరోతి న లిష్యతే” (భ.గీ.13-32) సర్వవ్యాపిమైన ఆకాశం, సూక్ష్మమైనందువల్ల దానియందున్న భూతజాలంచేత, మాలిన్యాన్ని పొందనట్టు నారాయణుడు అనేకదేహాల్లో ఉన్నా నిర్లిప్పుడుగా ఉంటాడు. యథా సర్వగతం సౌక్ష్య్యాత్‌ ఆకాశం నోపలిప్యతే॥ (భగీ. 13.33) “హరి సకల ('ప్రాణిహృదయంబుల యందును నంతర్యామియైయాకాళంబుభంగి నుండును, (ఆం.భాగ7.2ట వచనం). “న స్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయా। కథంచి దుపకారేణ కృతే వైకేన తుష్యతి;”. ఎన్ని అపకారాలు చేసినా దయాళువు కాబట్టి మనస్సులో ఉంచుకోడు. ఏదైన ఉపకారం స్వల్పంగా చేసిన్నా పరమోపకారంచేసినట్టు సంతోషిస్తాడు. ఏదేని మంచిని కనిపెట్టి రక్షించడానికి పూనుకొంటాడు. విభీషణునియందు దోషమేదెన ఉన్నా మిత్ర భావంతో వచ్చినందువల్ల ఆయనను విడువక కాపాడుతానన్నాడు కదా! “మిదత్రభావేన సంప్రాప్తృ్య న త్యజేయం కదాచన! దోషో యద్యపి తస్య స్యాత్‌" (రాయు.28-3)

రాఘవీయవ్యాఖ్య 13 కాబట్టి, “విహిత వ్యాపార” - సంబోధనాంత పదం, పద్యభావాన్నంతా పాదివింది. “న హే పాలన సామర్ద్యం బుతే సర్వేశ్చరం హరిమ్‌” (వి.పు.1-22-22 శ్రీ హరికి తప్ప ఇతరుల కెవ్వరికీ రక్షించేసామర్ష్యం లేదు. “త్రాణే స్వామిత్వ

మౌచిత్యం” అన్నట్లు రక్షణ విషయంలో స్వామిత్వం ఆవశ్యకం. కాబట్టి నారాయణుడు

స్వామి-ప్రభువు. సొమ్ము కలవాడు స్వామి. తనసొమ్మును కాపాడు కొంటూ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకొంటాడు. పాలించే సామర్శ్యం కలవాడు పతి-శేషి స్వామియొక్క సొత్తు, తొత్తు జీవుడు. “దొపభూతాః స్వత స్ఫర్వే హ్యాత్మానః పరమాత్మనః। నాన్యధా రక్షణం తేషాం బంధే మోక్షే తథైవ చః (హారీతస్మృతి) సమస్త జీవులు నారాయణునికే దాసభూతులు. సంసారబంధమందున్నా, మోక్షన్టానమందున్నా నారాయణుడే రక్షకుడు. “స్యోజ్జీవనేచ్భ్చా యది తే స్వసత్తాయాం స్పృహా యది ఆత్మదాస్యం హరేః స్వామ్యం స్వభావాచ్చ సదా స్మర"॥ నేను ఉజ్జీవించాలనేకోరిక్క నాకు 'సత్త అంటే శరీరధారణానుకూల వ్యాపారం ఉండాలనే ఆశ ఉంటే, పరమాత్ముడు స్వామి, జీవాత్ముడు దాసుడని ఎల్లప్పుడు తలచుకోవాలి అని వేదాంతశాస్త్రం బోధిస్తుంది. జీవులకు భగవద్ధాస్యమే స్వరూపసిద్దం. క్షే స్వరూపదాస్యం 2. గుణదాస్యం అని దాస్యం ద్వివిధం. 1 “ఇహ సం(గ్రహత; శ్రీమాన్‌ గోప్తా శేష సమాధికదర్శిద్రః। శరణం సర్వశరీరి (ప్రాప్య సేవ్యశ్చ సాధుభిర్భావ్యః లక్ష్మీపతి, రక్షకుడు, నియంత, తనతో సమానుడుగానీ, తన కంటె గొప్పవాడుగానీ లేనివాడు, ఉపాయభూతుడు, సమస్తవస్తువులు తనకు దేహంగా కలవాడు, సజ్జనులచే “సీవింపదగినవాడు. పొందదగిన వాడూ నారాయణుడే. నాకు నేను దాసుడనూ కాను. వేరేదానికి స్వామినీ కాను. సర్వేశ్వరుని సంకల్పంతో నిమిత్తంలేకుండా స్వతంత్రుడనూ కాను అని భావిస్తూ నారాయణ నామాన్ని స్మరించడమే జీవాత్మ యొక్క స్వరూపదాస్యం. 2. “గుణాధికీ హి విషయే గుణస్వారస్యవేదినః। _ రామే రామానుజ స్యేవ దాస్యం గుణకృతం భవేత్‌; శ్రీరామచంద్రస్వామి విషయమై లక్ష్మణుని రీతిగా, గుణాధికుడైన వాని విషయమై గుణస్వారస్యం తెలిసినవారికి గుణ మూలకమైన దాస్యముంటుంది.

నారాయణ శతకం న!

గుణాలు రెండురకాలు:

1 స్వరూపనిరూపకాలు ; వస్తుస్వరూపాన్ని తెలిపేగుణాలు.

  1. నిరూపిత స్వరూపకాలు - వస్తు స్వరూపంతెలిసిన తర్వాత ఆవస్తువును ఇంకా విశేషంగా తెలిపే గుణాలు.

“నిరపేక్షస్పతంత్రత్వం స్వామ్యం చాన్యస్య న క్వచిత్‌ న

నిరుపాధికస్వాతంత్ర్యమూ, స్వామిత్వమూ నారాయణునికి తప్పు మరొకరికి లేనేలేదు.

పరమాత్ముని జగత్కారణత్వం అనితరసామాన్యమైన గుణం కదా;

జీవాత్మకు జగత్సృష్టిస్టీతిలయాదులను చేసేగుణం లేదు.

“జ్ఞానానందమయస్వాత్మా శేషా హి పరమాత్మనః”

జ్ఞానం, ఆనందం స్వాభావికంగా ఉండే జీవుడు సర్వశేషిమైన నారాయణునికి సకల విధకైకర్యం చేసే శేషుడు - దాసుడు. “గుజైర్దాస్య ముపాగతః. శ్రీరాముని గుణాలచే ఆకర్షితుడనైన దాసుడనని లక్ష్మణుడు హనుమంతునితో అన్నాడు కదా!

గుణదాస్యంకన్న స్వరూపదాస్యం మిన్న.

అనన్యార్హ శేషత్వం జీవలక్షణం కాబట్టి ఈ కృతికర్త నారాయణుని తప్పు వేరొకరిని ధ్యానించను, స్తుతించనన్నాడు.

“యో నై స్వాం దేవతా మతియజతే ప్రస్వాయై దేవతాయై చ్యవతే, పాపీయాన్‌ భవతి, న పరాం ప్రావ్నాతి.”

తన ఇష్ట దేవతను పూజిస్తున్న వ్యక్తి వేరీదేవతను పూజిస్తే మొదట పూజించిన దేవతయొక్క అభిమానాన్ని కోల్పోతాడు. తర్వాత పూజించిన వేరే దేవతక్రూడా ఒక్కదాని మీద స్టిరబుద్దిలేక్ష మారుతున్న వ్యక్తి అని విశ్శసించదు. ఏదేవతా పట్టించుకోనందువల్ల పాపిష్టుడవుతాడు, సద్గతిని పొందలేడు" అన్సి 'శ్రుత్యర్హం.

“ముముక్షవో ఘోరర్రూప్రాన్‌ హిత్వా భూతపతీ నర,

నారాయణకళాః శాంతా భజంతి హ్యనసూయవ్య;”

(భాగశ-2-26) దని అర్జమిది _

“మోక్షార్థులైన వారలు ఘోరరూపులైన భూతపతుల విడిచి, దేవతాంతర నింద సేయక, శాంతులై నారాయణకధలయందే (ప్రవర్తింతురు” (ఆం.భాగు

దాసుడైనందువల్ల (కవి) నారాయల్బున్సి నామస్తుతులనాచ్రరిస్తా నన్నాడు. “ఏతావానస్య మహిమా” “స్వే మహిమ్ని ప్రతిష్టిత” (శ్రుతి)

రాఘవీయవ్యాఖ్య 15

“యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః;

బుషిభిః పరిగీతాని” - (వి.స.నా.పూర్వపీఠిక)

మహామహిమశాలి యైన నారాయణుని నామాలు ఆయన కల్యాణ గుణాల మూలంగా, దివ్యచేష్టితాలకారణంగా ఏర్పడినవే. బుషులు వాటిని అత్యాదరంతో స్తుతించారు.

లోకంలో స్తుతి చేయడం రెండు రకాలు:

స్తుతింపదలచిన వస్తువునందు లేని గుణాలను ఉన్నట్టుగా ఆరోపించడం ఒక విధమైతే, వస్తువునందు ఉన్న గుణాలను ఒక్కటినైనా విడువకుండా పూర్తిగా వర్ణించడం మరొక విధం.

సకల కల్యాణ గుణ పరిపూర్చుడైన శ్రీమన్నారాయణునియందు వేరేచోట ఉన్న గుణాలను ఆరోపించి స్తుతించే పద్దతి అసంగతం. ఇక అసంభ్యేయగుణాలను పూర్తిగా వర్షించడమూ అసంభావ్యమే.

అశక్య విషయాన్నైనా శక్యంగా భావించి చేయ ప్రయత్నించడం సాహసమనుకోక, (నానేర్చ్పు చందంబునన్‌) శక్య మైనంతవరకు స్తుతి చేస్తానని విన్న వించుకొన్నాడు ఈ సుకవి.

ఇక్కడ శ్రీకూరేశ మహాకవి. 'శ్రీస్తవం' లోని కమనీయ క్టోకం గమనీయం.

“యే వాచాం మనసాం చ దుర్లహతయా ఖ్యాతా గుణాస్తావకా3

తానేవప్రతి సాంబుజిహ్వ ముదితా వై మామికా భారతీ;

హాస్యం తత్తు న మన్మహే నహి చకోర్యేకాఒఖిలాం చంద్రికాం।

నాలం పాతుమితి ప్రగృహ్య రసనామాసీత సత్యాం తృషి” (4)

నోటితో ఉచ్చరించడానికీ మనస్సుతో స్మరించడానికీ శక్యం కాని మీ ప్రసిద్ధ గుణాలను స్తుతించడానికి నా నాలుక (వాక్కు/నోరు) నేడు ఉవ్విళ్ళూరుతున్నది. నేను మాత్రం అది పరిహాసొస్పదమనుకోను. ఎందుకు? అంటే, వెన్నెలను ఆస్వాదించి జీవించే చాతకపక్షి, వెన్నెలను పూర్తిగా (త్రాగడం నాకు చేతగాదని తలచి తననాలుకను పట్టుకొని (దప్పిదీర్చుకోక) ఉండదుకదా!

పిపాసగల చకోరి అమృతాస్వాదనం కోసం సిద్ధపడే రీతిగా, వాక్కు కూడా ఉదా సీనంగా ఉండక స్తుతింపగోరుతున్నదని భావం.

దాస్యలక్షణాల్లో స్తుతికావ్యరచన ఒకటి ప్రధానమైనది.

“పద్య మంగుళివిచ్చేద ఉరోవిన్యస్త మక్షరమ్‌;

తన్నామవహనం చైన దాస్యమేతచ్చతుర్విధమ్‌[”

16 నారాయణ శతకం 1 పద్య రచన (స్తుతి కావ్యం) 2 (్రేలుకోసుకోనడం (హింసించుకోవడం)3 ఎదలో మంత్రం పదిలపరచడం (మంత్రజపం) 4 పూజ్యని పేరు పెట్ట కోవడం, ఇందులో 'అంగుళివిచ్చేదం' ఆచరణలో లేదు. మళ్ళీ పుట్టిపెరుగనిది కాబట్టి దయాళువు దాన్ని కోరడని, అది నిరసింపబడినట్టు దేశికులు “సచ్చరిత్ర రక్షులో స్పష్టపరచారు. “పద్యగద్యగీత భావార్థములనైన, కమలనయనుదలప కలుషహరము”. (ఆం.భాగ.6.210 స్తుతిస్తున్నప్పుడు (శతకరచనలో) దోషాలు దొర్జితే వాటిని స్వీకరించు మని అయ్య! తండ్రి! అంటూ మనవి చేశాడు కదా! “అజ్ఞానా దధవా జ్ఞానా దపరాధేషు సత్సపి। (ప్రాయశ్చిత్తం క్షమ స్వేతి ప్రార్జనైకేవ కేవలమ్‌” (రహస్యత్రయసారం) తెలిసో తెలియకో తప్పులు చేసినా, క్షమించుమని 'ప్రార్ధించడమే అందుకు (ప్రాయశ్చిత్తం. “మాతా పీతా భ్రాతా నివాసః శరణం సుహృద్గతిర్షారాయణః” (సుబాలోపనిషత్తు) “ఈళ్చరం తం విజానీమ స పీతా స (ప్రజాపతిః స్వామిత్వేన సుహృత్ష్యేన గురుత్వేన చ సర్వదా; పితృత్వేన తథా భావ్యో మాతృత్వేన చ మాధవః” శ్రియతి స్వామిగా, స్నేహితునిగా, ఆచార్యునిగా, తండ్రిగా, చ్‌ల్లిగా సంభావ్యుడు. “పితేవ పుత్రస్య -- దేవ సోరుమ్‌” = (భగీ11-44 కుమారుని పట్ట తండ్రివలె, నీ నాతప్పులను ఓర్చుకొమ్మని పార్టుడు చన సారధిని ప్రార్జించాడు కదా! ల్‌ “తనయుల సంభాషణములు జనకునకుం గర్హయుగళసద్భూషణముల్‌ (ఆం.భా.గ7-140) జగత్తుకే తండ్రి కొబట్టి నారాయణుడు దోషబోగ్యుడే, మ. వెరయన్నిర్మలమైన సీస్తుతికధానీకంబు పద్యంబులో వొరుగుల్‌ మిక్కిలి గల్ళెవేనియుంగదు న్యోగంబె చర్చింపగా గుజుగత్చినను వంకబోయిన యడులగుజ్లెనంలేడెత్రం జెటకుంగోలకు. తీష్పు గాక్ష కలదే, చేదెందు 'నారాయ సీస్తుతికధాశఅనీకంబు = నీస్తోత్రకదాకదంబమైన; పద్యంబులోన్‌ = పరవ

రాఘవీయవ్యాఖ్య 17 ఒరుగుల్‌ = వంకలు, తప్పులు; మిక్కిలి = చాల; కల్లెన్‌ + ఏనియు = ఉన్నప్పటికీ; కడున్‌ = మిక్కిలి; యోగంబె = యుక్తమే - చర్చింపగా = విచారించగా కులు, కలు, ఐనను = కొద్ది కణపులు కలదైనా; వంక పోయినన్‌ = వంకరగా ఉన్నా; కడున్‌ గుజ్ఞు ఐనన్‌ = చాలాపొట్టిదైనా / రసంగల చెక్కు బాగా ఉన్నా, పేడు+ఎత్తినన్‌ = 'పైనతోడ్కమాత్రంగా పెరిగినదైనా; చెజుకున్‌ కోలకు = చెరకుగడకు; తీపు కాక = మాధుర్యం ఉండక; ఎందు = ఎక్కడనైనా;? చేదు = తిక్తరసం, కలదె = ఉంటుందా?

తా; ఓ నారాయణా! నిండుగా పరిశుద్ధమైన నిన్నుస్తుతించే కధలు చాలా ఉన్న పద్యకృతిలో తప్పులున్నప్పటికీ విచారిస్తే అది యుక్తమే అనిపిస్తుంది. చెజకుగడ చిన్న చిన్న కణుపులు, వంకర గుజ్జు కలిగి, పేడెత్తి ఉన్నా తియ్యగా ఉండక చేదుగా ఉంటుందా?

వ్యాఖ్య: నారాయణస్తుతికావ్యల అపశబ్దాలతో ఉన్నా అనుసంధేయమే.

భగవంతుని గుణాలను, లీలలను వర్షించే పద్యకాన్యంలో దోషాలున్నా అది రచయితనూ, పరితలనూ పావనం చేయక మానదు. వేద మంత్రాలలో స్వరలోపం, వర్ణలోపమయితే చదివే వారికీ, విన్నవారికీ దోషం అంటుకొంటుంది. స్పష్టంగా ఉచ్చరించాలి. లేకపోతే, “హసద్చిః క్రియతే కర్మ, రుదద్భి రనుభూయతే” అన్నట్టు సంతోషంతో పనిచేస్తాం. ఏడుస్తూ అనుభవిస్తాం. లక్షణంగా లేని, లౌకికభాషలో భగవత్కధలను, స్తోత్రాలను, రచించినా, పరించినా, లేదా శబ్దాలను అసాధువుగా (ప్రయోగించినా, చక్కగా పలుకకున్నా ఏదోషమూ కలుగదు. పావనత్వానికి హాని ఉండదు. చెరకు గడయే దీనికి దృష్టాంతం. చిన్న చిన్న కణుపులతో వంకరటింకరగా ఉన్నా. గుజ్జు ఉన్నా, పేడెత్తినా చెరకు తియ్యగానే ఉంటుంది. తిక్తంగా ఉండదు.

భగవద్విషయం పవిద్రమైనదే. వ్రాసినా చదివినా ఉద్దేశం నిష్కల్మషమైనదే కాబట్టి. తప్పులు దొరలినా దోషంకాదు. భగవదవతారాలనూ, చేష్టితాలనూ వర్ణించడం వల్ల, తెలిసికోవడంవల్ల జీవితం సఫలమవుతుంది. జన్మరాహిత్యమవుతుందని గీతాచార్యుని ఉపదేశం. (భగీ.49)

ఘన పురాషార్థప్రద మైన 'నారాయణ” పదం. రచనలో గానీ, ఉచ్చారణలోగానీ 'నారణం" గా దొరలింది. ఉన్న అక్షరాలను లోసం చేయడం, లేని మమకారాన్ని కూర్చడం దోషం కాదా? అంటే, ఉప్పుమడిలో పడిన వస్తువు ఉప్పే అవుతున్నట్టు ఉద్దేశ్యమంతా ఒక్కటే అవుతుందనీ, భగవద్విషయమైన ప్రక్రియ స్పృహణీయమనీ నంబిల్ళెస్వామి “ఈడు'వ్యాఖ్యానం,

నారదుడు వ్యాసమహర్షికి చెప్పిన మాట ఆదరణీయమే కదా!

నారాయణ శతకం 18 “తద్వాగ్విసర్లో జనతాఘవిష్టవో యస్మిన్‌ ్రతిళ్లోక మబద్ధవత్యసి నామాన్యనంతస్య యశళశో౭౦కితాని య చ్చృణ్వంతి గాయంతి గృణంతి సాధవగ (సం.భాగ1-5-11) “అసశబ్దంబుల గూడియున్‌ హరిచరిత్రాలాపముల్‌ సర్వపాప పరిత్యాగము సేయు” (ఆం,భాగ.1-5-95) అయితే, అపశబ్దాల రచనకు అనుమతిలభించిన దని భావించరాదు. ము చదువుల్‌ సెక్కులు సంగ్రహించి పిదపం జాలంగ సుజ్ఞాని మై నుదిలో( బాయక నిన్ను నిల్పందగు నామర్మంబు వీక్షింపండే మొదలం గాడిదీ చారుగంధవితతుల్‌ మోవంగ శక్యంబె కా కది సౌరభ్యపరీక్ష జూడ కుళలే యన్యక్త నారాయణా॥ క్‌ అర్థం: అవ్యక్త = ఇంద్రియాలకుగోచరించని, ఓ నారాయణా! మొదలన్‌ = మొదట; పెక్కుల్లు = అనేకములైనచదువుల్‌ = విద్యలను; సం(గ్రహించి = బాగా నేర్చి; పిదపన్‌ = తర్వాత; చాలంగ = పర్యాప్తంగా; సుజ్ఞానితై = మంచి జ్ఞానం కలవాడై; మదిలో = మనస్సులో; పాయక = వదలక్ష; నిన్ను; నిల్బన్‌ తగున్‌ = స్టిరపరచుకోదగును. ఆమర్మంబు = ఆరహస్యాన్ని; ఏీక్షింపడే = పరిశీలించడుకదా! గాడిద; చారుగంధవితతుల్‌ = మంచి వొసనగల విస్తారమైన (ద్రవ్య రాశులను; మోవంగ = మోయడానికి; శక్యంబె కాక 2 సామర్థ్యం కలదే తప్పు; అది = ఆ గార్జభం; సౌరభ్య పరీక్ష జూడ = సువాసనను పసికట్టడానికి; కుశల, ఏ = చాతుర్యం కలది అగునా? కాదు. తా; అవ్యక్తుడవైన ఓ నారాయణా! మొదట విద్యలను బాగా నేర్చి పిమ్మట యోగ్యమైన సమ్యక్‌ జ్ఞానంకలవాడై హృదయంలో నిన్ను సర్వదా స్మరిస్తూ నిల్చుకోవాలి. కాని నరుడు ఆమర్మాన్ని గమనించడు కదా! గంధపు చెక్కలు మోసేగాడిదకు వాటిబరువే తెలుస్తుంది కాని పరిమళాన్ని పసికట్టే పాటవమున్నదా? ల + విద్యలవల్ల జ్ఞానం పాండి భగవంతుత్ని హృదయ పీరాన ప్రతిష్టించాలని నారాయణుడు అవ్యక్తుడు, అన్నిటిలో ఉన్నా, ఇంద్రియాలకు గానీ, 'ప్రమాణాలకుగానీ తెలియరాని. వాడు. అవాజ్మానసగోచరుడంటారు. తన అసాధారాణాకారాన్ని తాను మాత్రమే తెలుసుక్షానేవాడ్డు. సర్వ భూతాలలో లలో, తిలలలో తైలం వలె ఉండి, అవి నశించినా వొటితో పాట్స న్య అక్షరుడు. ఆయనే ఆందరికి ప ంచని వాడే అవ్యక్తుడు, క్ష దరికి పరమగతి. ఆపరంధామూన్సిక్షి చేరినవారు | తిరిగి రారు. ఆ పరమపదమే నాది. ఎలోకంలోకీ

రాఘవీయవ్యాఖ్య 19

“అవ్యక్తోలక్షర ఇత్యుక్త, తమాహు:ః పరమాం గతిమ్‌,

యం ప్రాప్య న నివర్తంతే, తద్దాము పరమం మమ ॥(భ.గ.8-230

అని అందరు తన నాశ్రయించడానికి అవతరించిన శ్రీకృష్ణుడు బోధించాడు.

నీవు నన్ను దర్శించిన రీతిగా దర్శించడానికి ఎవరికీ శక్యం కాదు. నన్ను తెలుసుకోవడానికి అనన్యభక్తి ఒక్కటే సమర్షమయింది.

“భక్యా త్వనన్యయా శక్యః"”(భ.గ.11-54) అని గీతోపదేశం.

జ్ఞానం పక్తమైతే భక్తి కుదురుతుంది. దాన్ని భక్తరూపజ్ఞాన మంటారు. జ్ఞానాన్ని ఆర్టించడానికి పెక్కు చదువులు చదువాలి.

బుగ్యజుస్పామాధర్వణ వేదాలు (4), వేదాంగాలు - శిక్ష వ్యాకరణం, ఛందస్సు నిరుక్తం, జ్యోతిషం, కల్పమనే. (6) శాస్త్రాలు, మోమాంస, న్యాయం, పురాణం, ధర్మశాస్త్రం (4), ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వం, అర్ధశాస్త్రం (4) 'విద్యా హ్యష్టాదైైవ తాః” (3-6-29)

పద్ధెనిమిదివిద్యలు అని విష్ణుపురాణం చెబుతుంది,

వేదాంతళాస్త్రంలో సద్విద్యలు (32ముప్పది రెండున్నాయి.

అనేక విద్యలను సం(గ్రహించడం అంటే గురువువద్ద శ్రద్దతో సమగ్రంగా అభ్యసించాలి.

1 'గురుశుక్రూషయా విద్యా” గురువుగారికి కొంతకాలం సేవ చేస్తూ వినయంగా 'ప్రవర్తించడంవల్ల ఆయన దయాళుడై బోధిస్తాడు.

2.పుష్కలేన ధనేన వా' - వలసినంత ధనాన్ని సమర్పించి విద్యను నేర్వవచ్చు.

  1. 'అధవా విద్యయా విద్యా" - తనకు తెలిసిన విద్యను అవసరమున్న వ్యక్తికి బోధిస్తూ తనకు తెలియని, ఆయనకు తెలిసిన విద్యను సాధించవచ్చు.

“చతుర్దానోపపద్యతే" - విద్యార్థనకు. నాల్గవ విధానం లేదు. (శ్రద్దాసక్తులున్న సవినయుడు విద్యను చక్కగా అభ్యసిస్తాడు.

1 'ఆచార్యాత్‌ పాదమాదత్తే' - గురువునుంచి విద్యార్థి ఒక 1/4 భాగం విద్యను సం[గ్రహిస్తాడు.

  1. 'పాదం శిష్యః స్వబుద్దిత? - నేర్చినదాన్ని మననంచేస్తూ తన ప్రజ్ఞతో మరో 1/4 భాగం పెంచుకొంటాడు.

  2. 'పాదం సబ్రహ్మచారిభ్యః' - తోటి చదువరులతో చర్చిస్తూ ఇంకో 1/4 భాగం వృద్ది చేసుకొంటాడు.

4 'పాద; కాలేన పచ్యతే' - కాలక్రమంగా, అవిద్య 1/4 భాగం అనుభవంతో సమ(గ్రమవుతుందని అనుభవజ్ఞులన్నారు.

20 నారాయణ శతకం ఈ విద్యలన్నింటిని కలిపి మొత్తం, రెండే రెండు విద్యలుగా "ద్వే విద్యే వేదితవ్యే” పరమాత్మను తెలుసు కోవడానికి అవసరమన్నది ముండకోపనిషత్తు.

విద్య అంటే జ్ఞాన మని అర్ధం. శాస్త్రజన్యజ్ఞానాన్ని “అపరవిద్య"”గా, వివేక జన్య జ్ఞానాన్ని “పరవిద్య” గా బోధిస్తుంది ఉపనిషత్తు.

వేదళాస్తాదులనభ్యసించడంవల్ల - అపరవిద్యవల్ల - పరోక్షంగా పరబ్రహ్మను తెలుసుకొంటాడు. పరవిద్యవల్ల అక్షరశబ్దవాచ్యపరబ్రహ్మను ఉపాసనాత్మకమైన భక్తిరూపాపన్నజ్ఞానంచేత (ప్రత్యక్షంగా దర్శనసమానాకారంగా సాక్షాత్కారం చేసుకొంటాడు. శబ్దబ్రహ్మజ్ఞానం తర్వాత, పరబ్రహ్మసాక్షాత్కారానికి హేతు వైన ఉపాసనాత్మకభక్తిరూపజ్ఞానమే “సుజ్ఞానం”.

“మోక్ష ధీర్‌జ్ఞానమ్‌ ”.జ్ఞానమంటే మోక్షమందలిబుద్ది, అని అమరకోశం. శ్రీభాష్యం 'సర్వాపేక్షాధికరణం'లో బ్రహ్మసూత్రాన్ని (3-4-26)వివరిస్తూ జ్ఞానాన్ని సప్పాంశములతో విశదీకరించింది.

జ్ఞానం 1, వేదాంతవాక్యార్థజ్ఞానానికంటె భిన్నార్థం కలది.

  1. ధ్యానం, ఉపాసనం అనే పర్యాయపదాలు కలది.
  2. సాక్షాత్కారరూపమైన స్మృతి.

త్త అత్యంతప్రియమైనది,.

  1. ప్రతిదినం అభ్యసించడంవల్ల వృద్ధి పొందేది.

6 మరణించే దొకా అనుస్టింపదగినది.

  1. మోక్షఫలసాధనం.

స్హహ పూర్వకంగా నిరంతరం భగవర్ధ్యానం చేసే భక్తుడు సుజ్ఞాని.

“యేఒనన్య మనస శ్ళుద్దాః యే దాస్యైకమనోరధాః

తేషాం మే హృదయం విష్ణో వైకుంఠాత్సరమం పదమ్‌”

ల వేరే (ప్రయోజనాన్ని అపేక్షింపక భగవత్సేవ యందే మనస్సును లగించిన సుజ్ఞానుల హృదయంలో నివసించడమే వైకుంరునికి ఎక్కువ ఇష్టం. అందరి హృదయంలోనూ భగవంతుడు ఉన్నాడు. కాని,

“భగవచ్చరణద్వంద్వే భక్తి ర్యేషాం న విద్యతే।

తేషాం హృది స్థితో దేవః కంటకాగ్ర ఇవ స్థితః॥

భగవత్సాదాలను సేవించే భక్తి లేనివారి హృదయమందున్న నారాయణుడు

ముండ్ల మిద నిల్చియున్నట్టు అతివ్యసనంతో ఉంటాడని బ్రహ్మాండ పురాణం తెల్పుతుంది.

రాఘవీయవ్యాఖ్య 21 “మదిలో నిల్పడం' -అంటే మంత్రాన్ని అర్హం తెలుసుకొని ధ్యానించడం. నారాయణ” శబ్దంలోని అక్షరాల అర్జాలను 'మంత్రసృతి' తెల్పుతుంది. 'నా'కారార్డం: “నాస్తిక్యహానిర్జిత్యత్వం నేతృత్వం చ హరేః పదమ్‌। నాకారసేవినాం న్థాణాం మంత్రవిద్భిః ప్రకీర్తితః దేవుడు లేడనే బుద్దిని తొలగిస్తుంది. ఆదిమధ్యాంతరహితుడు, తనను భజించేవారిని

పరమపదానికి తీసుకొని పోతాడంటుంది.

'రో-“రంజనం భగవత్యాశు రాగహాని స్తతో ఒన్యతః। రాష్ట్రత్రాణాదికం చాపి ప్రాష్యతే రేఫసేనయా॥” భగవ(త్రేమను, వైరాగ్యాన్ని , రాష్ట్రరక్షణనూ కల్పిస్తుంది. 'య'-“యోగోద్యోగఫలం చాశు యకారాత్రాష్యతే బుధైః యక్షరాక్షసవేతాలభూతాదీనాం భయాపహః” యోగానుష్టాన ఫలాన్ని ఇస్తుంది. యక్షరాక్షస భేతాళ భూతాదుల భయం లేకుండా చేస్తుంది. 'ణ- వర్షనం చ తథా విష్ణో ర్వాణీ సిద్దిర్ల కారతః” 'ణ” కారం వల్ల భగవంతుణ్ని వర్షించే వాక్‌శుద్ది సిద్దిస్తుంది. అర్థం, (ప్రకరణం, లింగం, దేశకాలాల కౌచిత్యం, వీటన్నిటిని బట్టి శబ్దార్దాలు విభజింపబడుతాయి. నామాన్ని అర్థంతోపాటు అనుసంధిస్తున్నప్పుడు వేర్వేరు యోజన లందు వేర్వేరుగా ఫలహ్రాప్తి ఉంటుంది. నామహేతువులైన గుణాలనూ, శబ్దార్థ యోజననూ, విద్యల అంతస్పారాన్నీ హృద్యంగా అనుభవిస్తూ అనుశీలిస్తూ, ఆస్వాదిస్తూ ఉండడమే

ఆ మర్మవీక్షణం, ఎన్ని విద్యలు నేర్చినా సమ్యక్‌ జ్ఞానంతో వాటి రహస్యాలను తన అనుష్టానంద్వారా

సదస్యం చేయనివాడు తెలిసీ తెలియని వాడే.

“అధీత్య చతురో వేదాన్‌ ధర్మశాస్తాణి మానవః

యో వై బ్రహ్మ న జానాతి దర్వీ పాకరసం యధా!”

నాలుగువేదాలనధ్యయనం చేసినా, ధర్మశాస్త్ర పారంగతుడైనా, సర్వ శాస్త్రసారమైన పరబ్రహ్మస్వరూపాన్ని ఎరుగని మానవుడు, వంట పాత్రలయందు మగ్నమైనా వంటకపురుచినెరుగని గరిటెలాంటివాడే,

“నాచ్చాదయతి కౌపీనం, న దంశమశకాపహమ్‌।

శునః పుచ్చమివానర్థం పాండిత్యం ధర్మవర్టితమ్‌॥”

వారాయణ శతకం ర2

నొచ్చికి గానీ ఈగలను దోమలను తోల్కొనడానికి. గానీ ఉపయోగపడని

కుక్కుతోకలాగా దర్మానువ్యెనరూపంగా ఉపయోగపడని పాందిత్యం వ్యర్థమేకదా!

“యథా ఇరశ్చందనభారవాహీ, భారస్య వేత్తా న తు చందసస్య |

ఏవం హి శాస్తాణి బహాన్యధీత్య చార్జేషు మూఢా; ఖఇరవద్వహంతి!!

(సుక్రుతం ఉ3) చందనపు చెక్కలను మోసే గాడిద వాటి భారాన్నే కాని సువాసనను మాత్రం తెలుసుకోదు. అనేక విద్యల నభ్యసించినా, వాటి మర్మాన్ని గ్రహించే యోగ్యత, సారాన్ని అనుభవించే కౌశలం లేని వ్యక్తి గాడిదయే. కదా!

ఒకప్పుడు మూఢుల్ని, మూర్చుణ్ని, గాడిదను తక్కెడలో ఒక వైపు ఉంచారు పెద్దలు, ఈ అధమవస్తువులకు తగినట్టు ఉత్తమవస్తువులు కావలసి వెదికితే మూడు వస్తువులు దొరికాయి, భగవత్తత్వాన్ని విరూసించేవేదం, దాన్ని తెలుసుకొనే విష్రుడు, తెలుసుకొనబడే. కేశవుడు. ఈ మూడింటిని రెండవవైపు ఉంచగనే తూనీక

సరిపోయింది. దీన్నే పెద్దలు ఇలా అన్నారు. “వేదో విప్రః కేశవన్చెకరాశి, మూఢో మూర్చో గార్జభన్నైకరాశిః” దేవతల్లో ప్రధానులు (బ్రహ్మ, విష్ణు రుద్రులు! ఈ్రి మూర్తులలో క అంటే

(బ్రహ్మను, "ఈశ అంటే రుద్రుణ్ని, వ అంటే (పీరిద్దరిని వహించేవారు కేశవుడు.

ఈనామం. నారాయణునికే తప్ప (బ్రహ్మ రుద్రులకు లేదు కదా!

ము లలియబ్బంబు కరాట మివ్వసుధ నెల్లన్మించెంటో నీ కథా

వళి కర్పూరమునించిన న్నితరమౌ వ్యర్భర్థకామోదముట్‌ "ెలుచంచూనిన యక్కరాటము. తుదిన్‌ బేతే కరాటంబె సో చబదిందీనరపత్రలోచప, ఘనశ్యామాంగ, నారాయణా॥ గ్‌ అద్ధం. : చలత్‌ + ఇండీవరపత్రలోచన = చలించే కలువరేకులలాంటి కన్నులు కలవాడా! ఘన శ్యామశఅంగ = మేఘంవలె నీలవర్షదేహంకలవాడా! ఓనారాయణా! వీ కథా + ఆవళి కర్బూరము నించివన్‌ = నీ కధల సముదాయ మునే పచ్చకర్పూరం నింపినట్టైతే; కబ్బంబు, కరాటము ౬ కాన్యమనే బరణి; లలిన్‌ = (క్రమంగా; ఈ వసుధన్‌, ఎల్లన్‌ = ఈఘామియందంతట; మించెన్స్‌పో = తళుక్కున మెరుస్తూ వ్యాపిస్తుంది కదా! ఇతరమౌ = వేరే? వ్యర్థ + అర్ధక + ఆమోదముల్‌ = పనికిరాని వస్తువులు వాసనలను; పెలుచన్‌ = మిక్కుటంగా; పూనినన్‌ ఇ కలిగియున్నట్టైతే: ఆ కరాటము = ఆ బరణి; తుదిన్‌ = చినరకు; బేతే = వ్యర్థంగా, కరశఅటంబె, పో ఇ చేతుల్లో మెలగేదే సుమా] తా: కలువరీకుల్లాగా చలించేకన్నులూూ సిలమేఘం లాగా శకీరమూ కలిగిన ఓ నారాయణా! నీకధల సముదాయమనే పచ్చకర్పూరం నింపెనట్టైే కావ్యమనే బరశి

రాఘవీయవ్యాఖ్య 23 వరుసగా వసుధనంతా తళుక్కున ఆవరిస్తుంది. ఇక వేరే నిష్ప్రయోజక ద్రవ్య వాసనలతో బాగా నిండిన ఆ బరణి, చివరకు చేతులతో పట్టుకొనే వస్తువే అవుతుంది సుమా!

వ్యాఖ్య: భగవత్కధలుగల కాన్యం ఆదరణజీయం.

నారాయణుడు తామరాకులవలె విశాలమైనకన్నులు కలవాడే 'ఇందీ;? అంటే లక్ష్మి ఆమె అసితేక్షణ. నల్లకలువలలాంటికన్నులు. కలది. సర్వేం(ద్రియాలను ఆకర్షించే కమలాక్షుణ్న లక్ష్మి వరించింది. ఆమె చూపులు పడగానే ఆయన కన్నులు ఇందీవరపత్రాలలాగా తరళాయమానమయ్యాయి. ఐశ్చర్యవంతమైన దృక్కులు కలవాడని అర్హం.

నీటితోనిండియున్న మేఘం నీలవర్లంతో శోభిస్తూ, జాదార్యంతో మిట్ట పల్దాలనకుండా అంతటా వర్షిస్తుంది. నల్లని వర్షం చల్లని దయకు సంకేతం. బౌదార్యమేమూర్తీభవించినట్టున్న ఘనశ్యామాంగుడు. కృపను. వర్షిస్తాడు. వసుధను సమస్తవస్తుసంపన్ననూ చేస్తాడని అర్ధం.

భగవంతుని కధావళియే పచ్చకర్పూరం. కావ్యమే కర్పూరంతో నింపిన బరణి. పచ్చకర్పూరం తెల్లగా ఉంటుంది. బరణీని తెరువగానే, దశదిశల సువాసన గుభాళిస్తుంది. ఇది తా(ద్రూప్యరంజక మైన ఆలంకారికవాక్యం.

నారాయణకధలతో నిండిన పుస్తకం పచ్చకర్పూరంలాగా నేలనాలుగుచెరగులా పరిమళిస్తూ స్వచ్చంగా ప్రకాశిస్తుంది. పుస్తకం హస్తభూషణమైనా, మస్తకంతో కుస్తీ పడుతుంది. జాడ్యాన్ని రూడిస్తుంది.

“శోత్రం దైవం. తర్రోత్రేణ హా విందతే - ద్రవిణం బ్రహ్మవర్చసమ్‌” (బ్బడు) భౌతికద్రవ్యంతో నిండిన వసుధను జ్ఞానద్రవ్యంతో ప్రకాశింప చేస్తుంది. కావ్యాన్ని విన్నా, చదివినా ధర్మం వ్యాపిస్తుంది. ధర్యవ్యాప్తిచే పాపం పంచబంగాళమవుతుంది. “ధర్మేణ పాపమపనుదతి” (శతి).

“కావ్యాత్‌ ధర్మప్రాప్తిః భగవచ్చరణారవిందస్తవాదినా” - (సాహిత్య దర్పణం),

భగవంతుని చరిత్రను ప్రకటించే కబ్బం, ఇహపరసుఖసాధనమనడం దబ్బరం కొదు. ఇతర రచనలను చదివితే ప్లాట్‌ పార్మ్‌ మీద పల్లిపలుకులు బుక్కినట్టే కదా!

విష్ణుకధలను చెప్పక ఆయన గుణాలనెన్నక, కేవలం రాజులచరిత్రను, రాజకీయధర్మాలను చెప్పినందువల్ల వేదవ్యాసమహర్షికి వగ వంత కలిగినదనీ, శ్రీహరి గుణవర్షనం చేయడం శ్రేయస్కరమనీ _ నారదమహర్షి ప్రబోధించాడు. ఆచార్యోవ దేశంవల్ల నారాయణబభోక్తియోగమనస్కారంతో వ్యానమహర్షి

2డీ నారాయణ శతకం భువనక్షేమంకరమైన శ్రీమద్భాగవతాన్ని రచించాడు. మోక్షార్హియైన శ్రీశుకునిచే చదివించాడు, ప్రకాశింప చేశాడు. నారదుడు వ్యాసునికి ఉపదేశించిన విధమిది- 'హరినామస్తుతి సేయుకావ్యము సువర్ణాంభోజహంసావళీ సురుచిభ్రాజితమైన మానససరఃస్పూర్తిన్‌ వెలుంగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచి(త్రార్జాన్వ్నితంబయ్యు శ్రీ కరమై యుండ దయోగ్యదుర్మదనదత్కాకోలగర్హాకృతిన్‌” (ఆం.భాగ5్‌ అ.94్త) భగవంతుణ్ని స్తుతించే కావ్యం బంగారు కమలాలతో, హంసలకులుకులతో (ప్రకాశించే మానససరస్సులాగా శోభిస్తుంది. భగవద్గుణాలను (ప్రశంసించని కృతి, శబ్దార్థాలంకారాలతోనూ, సరసగుణాలతోనూ మనస్సునాకర్ణించే రీతిగా ఉన్నా చూడడానికీ, వినడానికీ తగని, బాగా బలిసి ఆరచేకాకులతో, బుసకొట్టే విషసర్సాలతో నిండిన గోయిలాంటి ఆకృతికలదై సంపత్కరంగా ఉండదన్న మహర్షి మాట గమనార్హం. మ. మవమారన్నచలేంద్రజాధిపతికి న్మస్తాగ్రమూణిక్యమై మునికోపానలదగ్థరాజతతికి న్ముక్తిస్పురన్మార్గమై యెనయన్‌ సాయకశాయికింజననియై యేపారు మిన్నేటికీం జనిమూలంబగు నం నాదుమదిలో(జర్చించు, నారాయణా॥- 7 అర్థం : ఓనారాయణా! అచల + ఇంద్రజా + అధిపతికిన్‌ = పర్వతరాజపుత్రికకు పెనిమిటిర్రైన శివునికి; మస్త + అగ్ర మాణిక్యమై = జటాజూటమందు. శోభించే మాణిక్యమై; ముని కోప + అనల, దర, రాజతతికిన్‌ = కపిలమునియొక్క కోపమనే అగ్గిచే బుగ్గియైనరాజుల సమూహానికి; ముక్తి స్ఫురత్‌ + మార్గమై = మోక్షమనే పురుషార్దాన్ని పొందడానికి వెలుగుదారియై; ఎనయన్‌ = పొందికగా, సాయకశాయికిన్‌ = బాణాల మీద పడుకొన్న భిష్మాచార్యులకు: జనని ట్రై = కన్నతల్లియై; ఏపారు = బాగాశోభించే; మిన్నేటికిన్‌ = ఆకాశగంగకు; జని మూలంబు + అగు = పుట్టుకకు కారణమైన; అంఘి = పాదాన్ని; నాదు = నాయొక్క; మదిలో = హృదయమందు; మనము + ఆరన్‌ = మనసార; చర్చింతు = ధ్యానింతును. తొ : ఓనారాయణా! పార్వతీ పతికి చూడామణిగానూ, కపిలముని యొక్క కోపాన్నిచేత బూడిదయైన సగరచక్రవర్తి పుత్రులకు ముక్తిమార్గంగానూ, అంపసెజ్జపై పడుకొన్న భీష్మాచార్యుల కన్న తల్లిగానూ, ప్రసిద్ధి పొందిన ఆకాశగంగకు ఉద్గమస్టానమైన నీ పాదాన్ని నా అంతరంగంలో మనసారా ధ్యానిస్తాను.

రాఘఎయివ్యాఖ్య 25

వ్యాఖ్య: నారాయణుని పొదమహిమను. ప్రస్తుతించే పద్యమిది.

'నారరి అంటే ఉదకం. ఉదకాన్ని సృజించి తాను దానిలో అంతరాత్మగా ఉన్నాడు. కాబట్టి నారాయణుడని భగవంతునికి పేరు.

“స్వష్ట్వా నారం తోయ మంతస్టితోఒహం!

యేన స్యాన్మే వామ నారాయణేతి[[”

“అప వవ ససర్దాదౌ” - భగవంతుడు మొదట నీటినే సృజించాడు, అని మనుస్సృతి. “యా సృష్టి (ప్రష్టురాద్యా” (అభిజ్ఞానశాకుంతలం),

“తోయేన జీవాన్‌ వ్యససర్జ భూమౌ” నీటిచేత (ఉపలక్షితమైన భూతాలద్వారా) జీవులను భూమిమీద సృజించాడన్నది నాదాయణోపనిషత్తు,

నారాయణా!” అనే సంబోధనాంతపదం, ఈ పద్యభావతరంగిణీ 'ప్రకటనౌచిత్యాన్ని (ప్రదర్శిస్తుంది.

శివుడు గంగాధరుడు:

ఇం[ద్రసేనుడు యాగాదులు చేయడం వల్ల బలిచక్రవర్తిగా ప్రఖ్యాతుడయ్యాడు. శ్రీమహావిష్ణువు వామనమూర్తిదై అమహాబలివద్ద మూడడుగుల స్టలాన్ని యాచించి పొందాడు. 'త్రివిక్రముడై ఒక పాదంతో నేల నంతా ఆక్రమించాడు. రెండవపాదంతో ఆకాశాన్ని కొలిచాడు. ఆ శ్రీపొదం వ్యాపించి సత్యలోకానికి పోయినప్పుడు, ధర్మదేవతయ్‌ “వామపాదొంబుజాంగుస్తనఖప్రోతోవినిర్లతామ్‌! విష్ణుల (వివు.2-8- 109 శ్రీమహావిష్ణువు యొక్క ఎడమకాలి బొటనద్రేలునుంచి నఖరూపమైన ప్రవాహంగా = గంగ ఉద్భవించింది. బ్రహ్మదేవుడు ఆధర్మతీర్ణంతో విష్ణుపాదాన్ని భక్తితో కడిగి పూజించాడు. ఆ విష్ణుపాద ప్రక్షాళన చేత (ప్రవహించిన గంగా తీర్జాన్ని పరమశివుడు తన శిరస్సున ధరించి పవిత్రుడయ్యాడని “ఈశ్చర సంహిత” చెబుతుంది,

“ద్రనీభూత స్తదా ధర్మో హరిభక్త్యా మహామునే

గృహీత్వా ధర్మపానీయం. పదం నాధస్య తుష్టయే॥

న్లాళతం పరయా భక్త్యా దధార శిరసా హరష।

షావనార్హం జటామధ్యే యోగ్యోఒస్మీత్యవధారణాత్‌ః”

శ్రీమద్భాగవతసూక్షికూడా ఇలాగే ఉంది,

“యచ్చొచనిస్పుత సరిత్రవరోదకేన

తీర్జేన మూర్తి విధృతేన శివః శివోఒభూత్‌;”,

శ నారాయణ శతకం అధ్యాత్మరామాయణంలో వసిష్టుని మాటలు ఇలా ఉన్నాయి. శ్రీవిష్ణుపాదతీర్థాన్ని ధరించి పార్వతీపతి. నాతం'డ్రియైన (బ్రహ్మకూడా అమంగళం తొలగినవారై ధన్యులయ్యారు. “త్వత్సాదసలిలం ధృత్వా ధన్యో౭భూడ్షిరిజాపతి:। 'బ్రహ్మాఒపిమత్సితా తే హీ పాదతీర్థహతాశుభాః॥” కర్మపరిపాకం చేత (బ్రహ్మ మొదల్కొని అంతా అమంగళమే, అని (గ్రహించి విరక్తుడైన వ్యక్తికి (శ్రియఃపతియే గతి, “కర్మణాం పరిపాకత్యా దావిరించా దమంగళమ్‌। ఇతి మత్వా విరక్తస్య వాసుదేవః పరా గతిః అనే శబ్దప్రమాణమే స్పృహణీయం. విష్ణుపాదోద్భవ మైన గంగయే ముక్తి మార్గం: అయోధ్యాధిపతిమైన సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు. భృగుమహర్షివరంవల్ల కేశినికి అసమంజుడు అనే ఒక్క కొడుకు పుట్టాడు. సుమతికి (60) అరవై వేల మంది కొడుకులు పుట్టారు. అసమంజుడు గ్రూరుడైనందువల్ల రాజ్యం నుంచి బహిష్కృతుడు. అసమంజని కొడుకైన అంశుమంతుడు బుద్ధిమంతుడు. సగరచ్రవర్తి అశ్చమేధయాగం చేయడానికి వదలిన యజ్ఞాశ్ళం మరునాడే మాయమైంది. ఇంద్రుడు అశ్వాన్ని దొంగలించాడు. సగరుడు అశ్వాన్ని వెదకి తెమ్మని తన కుమారులైన సాగరులను పంపాడు, అరవైవేలమంది అంతటా వెదకినా, అశ్చం కనపడలేదు. వారు భూతహింసకు పాల్పడి భూమిని తవ్వుతూ పాతాళానికి చేరారు. అక్కడ కసిల మహామునిన్సీ, అశ్వాన్నీ చూచారు. కపిలుడే దొంగ అని వారు కేకలువేస్తూ మునిని కొట్టటోయారు. కపిలముని హుంకరించాడు. ఆయన కోసాగ్నికి సాగరులు భస్మమయ్యారు, సగరుడు చివరకు అంశుమంతుణ్ని పంపాడు. అతడు పినతం[డ్రులు తవ్వినతోవలోనే పోయి పాతాళంలో సాగరుల బూడిదకుప్పులను చూచి దుఃఖించాడు. అక్కడ సాగరుల మేనమామయైన గరుత్మంతుడు. కనిపించాడు. మొదట మీ తాతగారి యజ్ఞం పూర్తిచేసి, తర్వాత గంగాజలాన్ని మీ పినతండ్రుల భస్మరాశులమీద 'ప్రవహింపజేయుమని అంశుమంతునికి సలహా నిచ్చాడు గరుడుడు, అంశుమంతుడు కపిలమునిని వినయంగా 'ప్రార్జించాడు, యజ్జీయాశాన్ని సగరునికి అందజేశాడు, జరిగినదంతా చెప్పాడు, సగరుడు చాలా దుఃఖించాడు, యజ్ఞాన్ని పూర్తి చేశాడు.

రాఘవీయవ్యాఖ్య 27

తర్వాత ఎవరూ గంగాజలాన్ని ప్రవహింపజేయ సమర్దులు కాలేదు. అంశుమంతుని మనుమడు,దిలీపుని పుత్రుడైన భగీరధమహారాజు గోకర్లక్షేత్రంలో పెక్కేండ్లు తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తన తాతల బూడిదకుప్పలమీద గంగ (ప్రసరించాలనీ, తనకు సంతానం కలగాలనీ భగీరధుడు (ప్రార్జించాడు. (బ్రహ్మ రెండు వరాలను ఇచ్చాడు.

గంగ _భగీరధుని వెంట రాసాగింది. దారిలో జహ్నమహర్షియజ్జశాలను ముంచివేసింది. కోపంతో ఆముని గంగను తాగేశాడు. దేవతలూ ్రార్చించారు. జహ్నువు తన చెవిలోనుంచి గంగను విడిచాడు, కాబట్టి గంగకు 'జాహ్నవి' అని పేరు కలిగింది. భగీరధునివెంట పోయిన భాగీరథి - గంగ- భస్మరాశుల మీద (ప్రవహించింది. సాగరులు దేవతలై ఆనందించారు. గంగ దగ్రరాజతతికి ముక్తి స్ఫురన్మార్లమయింది.

“భగవద్విష్టుపాదాంగుస్టనిర్ణతస్య హి జలస్యైతన్మాహాత్మ్యమ్‌ "(వి.పు.4-4-30)శ్రీ విష్ణు పాదాంగుష్టంనుంచి నిర్లమించిన నీటికే ఇంతటి మహిమ ఉందికదా! భీష్ముని కన్నతల్లి గంగాదేవి:

సునందాప్రతీపులనే పుణ్యదంపతులకు ముగ్గురు పుత్రులు.

ఓ శంతనుడు 2. దేవాపి. 3. బాహ్హికుడు.

గంగాతీరాన తపస్సుచేస్తున్న ప్రతీపమహారాజును చూచిన గంగ మోహంతో స్తీ రూపందాల్చి వచ్చి ఆయన కుడితొడమీద కూర్చున్నది. ఏకపత్నీ (వ్రతుడైన ప్రతీపుడు “పుత్రులకు మాత్రమే యోగ్యమైన కుడితాడమీద కూర్చున్ననీవు నా పుత్రునికి భార్యవవుతావన్నాడు.”

  1. అపుడు 2. ధ్రువుడు 3. సోముడు. 4, ధరుడు 5. అనిలుడు 6. అనలుడు
  2. ప్రత్యూషుడు. 8. ప్రభాసుడు అనే అష్టవసువులు పత్నులతోకూడి వసిష్టుని ఆశ్రమానికి వెళ్ళారు. 'నందిని" అనే వసిష్టుని హోమధేనువు పాలు తాగినవాళ్ళకు జరామరణములుండవు. కాబట్టి ప్రభాసుని భార్యమైన 'యోగసిద్ధి' ఆ ధేనువును తస్కరించుమని కోరింది. ప్రభాసుడు వసువులందరు కలిసి నందినిని అపహరించారు. వసువులను 'మర్య్యలోకాన పుట్టండి' అని శపించాడు వశిష్టుడు.

ఇక్ష్వాకు వంశపురాజైన 'మహాభిషుడు' ఇంద్రసభలో గాలిచేత పైట జారిన గంగాదేవిని అభిలాషతో చూచాడు. ఈ చేష్టను గమనించిన (బ్రహ్మ 'మర్శ్యలోకంలో జన్మించు" మని మహాభిషుణ్ణి శపించాడు. అతడే శంతనుడు.

శప్తలైన అష్టవసువులు భూలోకానికి వస్తూ దారిలో గంగను చూచారు. పరస్పర వృత్తాంతాల నడిగి తెలుసుకొన్నారు. తాము పుట్టిన వెంటనే తమను నదిలో

నారాయణ శతకం 28

పారనేయమని వసువులు గంగను వేడుకొన్నారు ఒక్క కొడుకైనా దీర్దాయుష్మంతుడుగా ఉండకూడదా? అని గంగాదేవి కోరగా పెద్దతప్పుచేసిన (ప్రభాసుడంగీకరించాడు.

శంతను మహారాజు యువతిగా ఉన్న గంగను చూచి కామించాడు. అమె “ఏమిచేసినా మారాడకూడి దన్ననియమాన్ని అంగీకరించిన శంతనుణ్ని 'పెండ్డాడింది. తనకు పుట్టిన నిసుగును వెంటనే నదిలోకి విసదివేస్తుండేది. కట్టడికి వెరచిన శంతనుడు కిమ్మన లేదు. ఎనిమిదవ శిశువు పుట్టగానే ౬ పుత్రఘాతీ! ఈ శిశువును చంపనీయ'” నన్నాడు శంతనుడు. శపధం తప్పిన నీ వద్ద నేనుండననీ, పెద్దవాడైన తర్వాత నీ క్రప్పగిస్తాననీ పుత్రుణ్ని తీసుకొనిపోయింది గంగాదేవి.

“శంతనోరప్యమరనద్యాం జాహ్నవ్యాముదారక్రీర్తి రశ్లేష శాస్త్రార్థవి దృీష్మః పు్యత్రోఒభూత్‌.” (విపు.4-20-39)

శంతనునికి గంగాదేవి యందు జన్మించిన పుత్రుడే కీర్తిమంతుడూ, సకల శా(స్తార్ధవేత్త మైన భీష్ముడు,

గొంగేయుడు వసీష్టునివద్ద సకల విద్యలనభ్యసించాడు. ధర్మాత్ముడు, మహాపరాక్రమవంతుడు. యువరాజు తాను రాజ్యాన్ని త్యజించి, (బ్రహ్మచర్యవ్రతాన్ని పరి[గ్రహించి, దాశరాజుకూతురైన సత్యవతిని కామించ్సి కృశించిన తండ్రికి ఇప్పించి వివాహంచేసిన వీరసూనుడు, దేవతలు మెచ్చుకొన్న దేవవ్రతుడు. పితృభక్తిపరాయణుడై. తండ్రీచేత “స్వచ్చంద మరణం” వరంగా పొందిన లబ్బవర్డుడు.

కురుపితామహుడు దుర్యోధనుని పక్షాన పాండవులతో - పద్రిదినాలు పార్థునితో

  • యుద్ధంచేసిన వీరయోధుడు. ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసి ార్దసారధిచేత చక్రాన్ని ఆయుధంగా పట్టించిన ఆర్తప్రపన్నుడు. చాను మరత్రించే ఉపాయాన్ని పాండవులకు చెప్పిన ఉ్యాగధనుడు. శిఖండ్రిన్సి ముందుంచుక్షొన్సి అర్జునుడు బాణాలు వేస్తుండగా, శిఖండిని చూడగనే అస్త్రసన్యాసం చేస్పి అమరవీరుడ్డు, పార్టుడు ప్రయోగించిన శరపరంపరకు తూర్చుతలగా పడిన శరతల్పుడు, ఎవరేమిచ్చినా (గ్రహించక, కిరీటి బాణం వేయగా పాతాళంనుంచి పైకి వచ్చిన గంగోదకాన్ని మాత్రం పానం చేసిన గాంగేయుడు, సాయక్ష శాయిమై ఉత్తరాయణం వచ్చేదాక “మ్రూ విజయుంజేరెడు వన్నైకాడు మదినావేశించునెల్లప్పుడ్తువ్‌ అని 'ప్రస్తుతిస్తూపార్దసారద్ధిమ్స్వం మనస్సును చేర్చి పాఠరవళృస్థిత్రిలో ఉన్నవాడు,

శివునికి తలమానికమై, సాగర్రులక్రు ముక్తి మార్గమై, సాయకశాయికి కన్నతల్లి మైన మిన్నేటి పుట్టుకకు కారణమైనది పవిత్ర నారాయణ చరణమే,.“క్షాభిత్రాళిి కల్మషవ్రజామరనదీ జనక్ర క్ర్వోల పదా బ్ఞములో న్వు మృనష్తార స్తుతించినవారు పరిశుద్దాత్ములై పరమపదం సొంద్రుతారు కదా!

రాఘవీయవ్యాఖ్య 29 శా, నీవుతుండు చరాచరప్రతతుల న్నిర్మించి పెంపారంగా నీ పుణ్యాంగన సర్వజీనతతులన్నిత్యంబు రక్షింపగా నీ పాదోదకమీజగత్రయములన్నిష్పాపులంజేయంా నీ ఫెంపేమని చెప్పవచ్చు. సుగుణా నిచ్యాత్మ నారాయణా॥; 8 అర్ధం: నుగుణా = మంచిగుణాలుకలవాడా! నిత్యాత్మ = ఎల్లప్పుడు జ్ఞానస్వరూపంకలవాడా! ఓ నారాయణా! నీపుత్రుండు = నీకుమారుడైన బ్రహ్మ; చర అచరు ప్రతతులన్‌ = జీవ జడవస్తురాశులను; నిర్మించి ఇ సృజించి, పెంపారగా = వృద్ధిపొందగా; నీవుణ్య + అంగన = నీధర్మపల్నిభ్రైన లక్ష్మి; సర్వజీవతతులన్‌ = సమస్రజీవరాశులను, నిత్యంబు = ఎల్లప్పుడు; రక్షింపగా. = కాపొడగా, నీపాద + ఉదకము = నీచరణతీర్ణమైన గంగ, ఈ జగత్‌ + శత్రయములన్‌ = ఈ మూడులోకాలను; లోకాలయందుండే వారిని; నిష్పాపులన్‌ = పరిశుద్దులను; చేయగా = చేస్తుంటే; నీపెంపు = నీపెద్దరికం, వైభవం; ఏమని చెప్పవచ్చు = ఏమీ చెప్పరానిదికదా! తాం ఓ సుగుణా! నిత్వాత్మ! నారాయణా! నీ పుత్రుడైన చతుర్ముఖబ్రహ్మ జంగమస్టావర పదార్దాలను సృజిస్తుంటే, నీధర్మపళియైన లక్ష్మీదేవి సకల జీవరాశులను ఏమరకుండా రక్షిస్తుంటే, నీ పాదతీర్ధమైన గంగ ముల్గోకాలను పావనం చేస్తుంటే నీ మహిమ వర్లించనలవికానిది. వ్యాఖ్య : నారాయణమహిను వర్ణనాతీతం. నారాయణుడు సుగుణుడు. దోషంలేశమైనా లేనప్పుడు ఉన్నవన్లి జగదుపకార గుణాలే. సకల కల్యాణగుణ సముద్రుడు. ఆయన నిత్యాత్ముడు. “నిత్యం హి నాస్తి జగతి భూతం స్థావరజంగమమ్‌! బుతమేకం పురుషం వాసుదేవం సనాతనమ్‌॥ నారాయణుడు తప్ప స్థిరచరవస్తువులలో నిత్యమైనదిలేదు'అన్నట్టు నారాయణుడే నిత్యుడు. శాశ్ళతంగా ఉండేవాడు. అంతేకాదు దివ్యజ్ఞానమే శరీరంగా గల విభువు, “దివ్యబోధతను ర్విభువ. నారాయణుని పుత్రుడు. (ప్రష్ట చతురాననుడు, “కదా చిత్తస్య సుప్తస్య నాభ్యాం కామాదజాయచత। దివ్యమష్టదళం భూరి పంకజం పార్షివం మహత్‌॥”((బ్రహ్మాండపురాణం) యోగ నిద్రాముద్రితుడ్డైన నారాయణుని సంకల్పంచేత అతని నాభియందు పృధివీసంబంధమైన అష్టదళాలుగల పెద్ద పద్మం ఒకటి జనించింది. “యన్నాభిజాతా దరవిందకోశాల్‌ (బ్రహ్మావిరాసీద్యత ఏష లోకః (భాగశ0-24-3)

నారాయణ శతకం 30 నారాయణుని ఆనాబికములం నుంచి (బ్రహ్మదేవుడు జన్మించాడు. ఆయన వల్ల ఈలోకం జనించింది. శ్రుతి వాక్యాలలా ఉన్నాయి. “బ్రహ్మా దేవానాం ప్రధమ స్పంబభూవ విశ్వస్య కర్షా భువనస్య గోప్తా (ముం.ఉప) “సచింతయన్‌ ద్వ్యక్షర మేకదాఒంభ స్యుపాశ్రుణో ర్వ్విర్గదితం వచో విభుః స్పర్శేషు యత్‌ షోడశ మేకఏింశం, నిష్కించనానాం నృప! యద్దనం విదుః (భాగన స్కం-9 అ.6) బ్రహ్మకు, అంతాజలమయమే కాబట్టి ఏమి తోచలేదు, అంతలో అనీటినుంచి "తప, తప” అనే శబ్దం ఏనిపించింది. థైన్య జీవనులకు ఆశబ్దం గొప్పధనం. పెక్కేండ్లు 'బ్రహ్మతపస్పుచేయగా నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. వేదాలను నేర్పాడు. అజ్ఞానం చేతనే అండాంతర్వర్తిమైన చేతనాచేతన పదార్థాల సృష్టికంతటికీ. కర్త అయ్యాడు. తనక్షప్పగించిన సృష్టికార్యాన్ని, మళ్ళీ తండ్రి తెలియజేయనక్కరలేకుండా, నిర్వహించే పుత్రుడీ చతుర్ముఖుడు. లక్ష్మీదేవి పుణ్యాంగన. “స్యాద్దర్మమ'ప్తియాం పుణ్యం” (నిఘంటువు). పుణ్యశబ్దం ధర్మార్థకం. “రాఘపత్వే ఒభవత్సీతా, రుక్కిణీ కృష్ణజన్మని॥! అన్నట్టు నారాయణుడే అవతారమెత్తినా, నిత్యానహియినియైవెలసే ధర్మపత్ని లక్ష్మీదేవి. వామనావతారంలోనూ, (బ్రహ్మచారిగా ఉన్నా - “కృష్ణాజినేన సంవృజ్వన్‌ వధూం వక్షస్త్టలాలయామ్‌" = "వక్షస్థలంలో ఉన్న పల్నిని కృష్ణాజినంతో కప్పి పెట్టినా డన్నట్టు నిత్యసంబంధం కలది, 'శ్రీమన్నారాయణు" డనే పదంభోని 'మతుష్‌! ప్రత్యయం నిత్యయోగాన్నే బోధిస్తుంది. 'పవిత్రాణాం హీ గోవిందః పపిత్రం పరముచ్యతే। క. పదో ప ప్రొగౌనాం చ మంగళమ్‌ (భారతం-వన) లోకమాత. అజా అమె క్ర _ప్రస్రాయందు. వెలసిన మంగళ దేవత, పమెరుగద్సు, “వాత్సల్య నిర్భరతయా జననీ కువూరం స్తేన వర్ధయతి దష్ట్రయోధరా౭మి?” (గోదాస్తుత్రి చంటివాడు ప గ కరుణామయి. ంటీతో గంటు పెట్టినా కష్నైర్రవేయక చైతన్య స్తన్య మిచ్చి పెంచే ఉస్ట్ర మన్మందకటాక్షలబ్ద విభషబ్రహ్మేంద్ర గంగా ధరామ్‌” (శ్రీసూక్తం) లక్ష్మీకటాక్షం వల్లనే 'బ్రహ్మరుద్రేంద్రులు ఇశ్చర్య వంతులయ్యారు..

రాఘవీయవ్యాఖ్య తె

“మాతర్మైధిలి! రాక్షసీస్వయి తధైవార్రాపరాధాస్త్వయా

రక్షన్య్యా పవనాత్మజాల్లఘుతరా రామస్య గోష్టీ కృతా!

కాకం తం చ విభీషణం శరణమిత్యుక్తిక్షమౌ రక్షత;

సానః సాంద్ర కృతాగసః సుఖయతు క్షాంతిస్తవాకస్మికీ ";(శ్రీగుణరత్నకోశం)

“సీత్రా లక్ష్మీ ర్భవాన్విష్టు” అనికదా! వాల్మీకి వాక్సాకం.

శ్రీరామునితో కూడి యున్నవ్పుడు కాకానురుడు నీ తమ్మరొమ్మును చండచుంచువుతో పొడిచి హింసించాడు. అది క్షమించరానినేరమని [గ్రహించిన రాముడు (బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. మూడులోకాల్లోనూ. తిరిగి ఎవ్వడూ రక్షించలేనందువల్ల అతడు చివరకు శ్రీరాముని పాదాలకడ పడిపోయాడు. సీతమ్మ, పురుషకారంతో - రాముని కోపాన్ని తగ్గించి అను(గ్రహాన్ని హెచ్చించే లక్ష్యంతో - రామునిపాదాలకు మరింత దగ్గరగా కాకిని చేర్చినందువల్ల రాముడు రక్షించాడు. పతికి దూరంగా ఉన్నప్పుడు కూడా హనుమంతునితో “తప్పుచేయనివారెవరు? 'నకళ్చిన్నాపరాధ్యతి. తప్పుచేసినా క్షమించాలి” అని నచ్చ చెప్పి అశోక వనంలో మహాపరాధలైన రాక్షసప్త్రీలను ఆయనబారినుంచి కాపాడిన తల్లి సీతమ్మ,

విశేషేమి? అంటే, కాకిగానీ విభీషణుడుగానీ శరణుపాందినందువల్లనే శ్రీరాముడు వారిని రక్షించాడు. శ్రీరాముని దయ సహేతుకంకదా! హనుమంతుని బారినుంచి రాక్షసాంగనలను రక్షించిన సీతమ్మ దయ ఆకస్మికం. నిర్హేతుకం. కాబట్టి రాముని దయకంటె సీతామాత దయ చాలా గొప్పది అన్నారు శ్రీపరాశరభట్టరు.

దోషభూయిష్టులైన జీవులను శిక్షించకుంటే శాస్త్రధర్మం సజీవంగా నిల్వదని దండింప బూనుకొంటాడు భగవంతుడు. ఆయన ప్రక్కనే ఉండి

“రక్షింపు మనెడి వారిని

రక్షింపక యున్న సర్వరక్షకత వృధా।

శిక్షలు దొసంగుకు వేసిన

పక్షంబున నెట్టు నీకృపాగుణముండున్‌”!

అని వాదించి - భగవంతునిచేత సర్వ జీవతతుల దోషాలను క్షమింపదేసి, నిత్యం రక్షించే పుణ్యాంగన లక్ష్మీదేవి.

శ్రీవిష్టుపాదోదకమైన గంగ ముజ్జ్ఞగాలను పావనం చేస్తుంది.

లోకాలు అంటే లోకాల్గో ఉండే దేవ, మానవ, తిర్యక్‌, స్టావరాదులు.

  1. కృతకం_ 2. అకృతకం 3. కృతకాకృతకం అని లోకాలు మూడు,

  2. భూలోకం. 2. భువర్దోకం 3. స్వర్ణోకం అని ఒకవిధం.

32 నారాయణ శతకం భూలోకానికన్న (క్రింద ఉన్న లోకాలు “అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ మనే ఏడుకలసి ఒకలోకం. ముఖ్యంగా పద్నాలుగు లోకాలు, మూడులోకాలుగా సంక్షిప్తాలు. దివినుంచి భువికి దిగజారిన - గాం గతా - గంగకు స్వర్గలోకాన మందాకిని, భూలోకంలో గంగ, పాతాళంలో భోగవతి అనిపేర్చు. అనుకూలవతియైన భార్య, విధేయమైన సంతానం గల కుటుంబి పెంపు ఎంత ఇంపో! చూడసొంపే మరి. “ముకుందమాలిలోని *దారా వారాకరవరసుతా” (33) అనే శ్లోకం, ఈ పద్యరచనకు (ప్రేరకం కావచ్చు. శ్రీయామునాచార్యకృత *చతుళ్లోకి' లోని"కాంతస్తే పురుషోత్తమః ఫణిపతి:శయ్యాసనం, వాహనం వేదాత్మావిహగేశ్చరః” అనే శ్టోకమూ; 'గోదాస్తోత్రం'లోని "మాతా చేత్తులసీ, పితా యది తవ శ్రీవిష్టుచిత్తో మహాన్‌” అనే శ్టోకమూ ఇట్టివే. శ్రీ పుష్పదంతముఖపంకజనిస్పృతమైన శివమహిమ్నస్తోత్రం'లో “రథః క్షోణీ యన్హా శతధృతి రగేంద్రో ధనుః” అనే త్రిపురాంతకుని ఆడంబర శ్లోకమూ గమనార్హమే. రామదాసకృత “దాశరథి శతకం'లో “నీ సతి పెక్కుకల్ములిడ నేర్పరి” (89) అనే పద్యశైలికూడా ఇలాంటిదే కదా! శా _బ్రహ్మాండానలి లోన సత్వగుణి వై బాహ్యంబునం దాదిమ బ్రహ్మాఖ్యం బరతత్త్వబోధములకున్‌ భన్యాధినాథుండనై బ్రహ్మేంద్రామరవాయుభుక్పుతులకున్‌ భానింపరాకున్న నా జిహ్మవ్యాప్పుల నెన్న నాదువశమే. చిద్రూప, నారాయణా॥ ్ర అర్హం: చిత్‌ + రూప = ఓజ్ఞానస్వరూపా! నారాయణా! బ్రహ్మండ + ఆవలిలోన = ప్రకృతి మండలాన ఉన్న అండకోటిలోపల; సత్వగుణివై = శుద్ధ సత్వగుణంకలవాడవై; బాహ్యంబునందు = వెలుప్తల; ఆదిమ (బ్రహ్మ + ఆఖ్యన్‌ = మొదటి (బ్రహ్మఅనే పేరుతో; పరతత్ష్యబోధములకున్‌ = పరుడని తెలిపే యథార్థ జ్ఞానపద్ధతులకూ: భవ్య + అధినాథుండవై = ప్రపంచోత్పత్తికీ యోగ్యుడవైన గొప్ప (ప్రభుడవై: బ్రహ్మా + ఇంద్ర + అమర, వాయుభుక్స్‌ పతులకున్‌ = చతుర్ముఖుడు, శతమఖుడు అనే దేవరాజులక్సు, గాలిని మేసేసర్చరాజుకుకూడా; భావింపరాక + ఉన్నన్‌ = ఊహంపనలవికానప్పుడు; ఆ జిహ్మవ్యాప్పలన్‌ = కుటిలంగా - మాయతో వ్యాపించిన ఆమూర్తులను; ఎన్నన్‌ = (ప్రశంసింప; నాదు వశమే = నాకు శక్యమా?

రాఘవీయవ్యాఖ్య 338

తా: ఓ చిద్రూప, నారాయణా! బ్రహ్మాండసముదాయంలోపల శుద్దసత్వగుణంకలగి ఉన్నావు. వెలుపల 'ఆదిమబ్రహ్మ నామంతో పరతత్త్యజ్ఞానం కలిగించే శా(స్తాలకూ, విశ్ళసత్తకూ తగినమేటి ప్రభుడవై ఉన్నావు. అయినా నాకపతులకుగానీ నాగరాజులకు గానీ ఊహింపరాకుండా అలా మాయతో వ్యాపించిఉన్న తత్త్యాలను - మూర్తులను స్తుతింప నావశమా? = |

వ్యాఖ్య: నారాయణ చిద్రూపాొన్ని వర్లింపశక్యంకాదనే కవి యొక్క సవినయ విషయ ్రకటనౌచిత్యం,

నారాయణుడు చిద్రూపుడు, సర్వపదార్జాల స్వరూప స్వభావాలపట్ట విపుల జ్ఞానం కలవాడు. స్వయం(ప్రకాశుడు.

“య స్సర్వజ్ఞః సర్వవిత్‌ యస్య జ్ఞానమయం తపః” (ముం.ఉ) (సర్వవిత్‌ = సర్వ(ప్రపంచరూపేణ విద్యతే) సంకల్పరూపజ్ఞానంతో సృజించి, సర్వషప్రపంచ రూపంగా ఉన్నవాడు పరబ్రహ్మ

'బ్రహ్మాండ* మంటే పెద్దగోళం. (బ్రహ్మ శబ్దానికి ప్రకృతి అనే అర్హమూ ఉంది. (ప్రకృతి మండలంలో అనేక వేల అండవిశేషాలు లెక్క లేనన్ని ఉన్నాయి.

“అండానాం తు సహస్రాణాం సహ(్రాణ్యయుతాని చ।

ఈదృశానాం తధా తత్ర కోటికోట్యయుతాని చ”

అన్నట్టు అఖిలాండకోటి కలది బ్రహ్మాండం.

అండం పద్నాల్గు భువనాలుకలది. దానికి దశగుణితోత్తరం ఆవరణ సప్తకం ఉంది.

యదండ మండాంతరగోచరం చయ

ద్రశోత్తరాణ్యావరణాని యాని చ (స్తోత్రరత్నం) భూమి, జలం, అన్ని, వాయువు, ఆకాశం, భూతాలు, మహత్తు అనే ఏడు ఆవరణాలు ప్రతి అండాన్ని చుట్టుకొని ఉన్నాయి.

ఈ సప్త అవరణాలు ఒకదానికంటె మరొకటి పదేసి రెట్లు ఎక్కువగా అండావరణాలుగా ఉన్నాయి.

(బ్రహ్మండకోటిలో అణగియుండే దేవమనుష్యతిర్యక్‌ స్టావరాలలోను, వారి భోగ్యవస్తువులలోను, అణువుకంటె సూక్ష్మంగా అంతటా వ్యాపించి ఉన్నవాడు నారాయణుడు.

సత్వరజస్తమోగుణాలు కలది ప్రకృతి. ఈ ్రకృతియందు ఆబ్రహ్మస్తంబ పర్యంతమైన జీవ వర్గం - క్షేత్రజ్ఞసముదాయం, కట్టెయందు నిప్పులాగా, నువ్వులలో నూనెలాగా ఇమిడి ఉంది. జీవరాశి (ప్రకృతిబద్ధమని తాత్పర్యం కదా!

న! నారాయణ శతకం

“సత్వేన సర్వగో విష్ణుః సర్వాత్మా సదసన్మయః”

రజస్తమోగుణాలు. లేని ఒకే ఒక సత్వగుణం కలనారాయణుడు 'బ్రహ్మాండకోటిలోపలా, బయటా వ్యాపించి ఉన్నాడు ఆయన లోకంలో అవతరించినా, ఆయన రూపం అప్రొకృతం - శుద్ధ సత్వమయమే.

“న కర్మణా వర్ధతే నో కనీయాన్‌, న కర్మణా లిష్యతే పాపకేన” అని వేదమన్నట్లు భగవంతుడు పుట్టడం మనవలె పూర్వకర్మఫలాన్ని అనుభవించడానికి కాదు. అతణ్ని కర్మలు అంటవు.

“జగతాముపకారాయ న సా కర్మనిమిత్తజా” (విపు)

భగవంతుడు తన ఇష్టమైన రూపాన్ని ధరించడం లోకోపకారం కోసమే కదా!

శరీరంలోపల ఆత్మ ఇమిడిఉందికదా!మరి ఆత్మకూ పరమాత్మకూ భేదమేమి? అంటే “దారుణ్యగి ర్యధా తైలం తిలే తద్వత్సుమానపి।

'ప్రధానేఒవస్థితో. వ్యాప" కట్టైలోపల అల్షివలె, నువ్వుల్లో నూనెవలె మాత్రమే శరీరంలో సూక్ష్మంగా జీవాత్మ ఉంది.

“అంతర్చహిళ్ళ తత్సర్వం వ్యాప్య నారాయణ; స్థిత” - అన్నట్టు పరమాత్మ ప్రతి వస్తువునందు లోపటా, బయటా వ్యాపించి ఉన్నాడు. ఒకే వస్తువు లోసటా బయటా ఒకే సమయంలో ఎలా ఉంటుంది? అంటే అతడు సర్వాత్ముడు. “ఆత్మన్‌' శబ్టానికి శరీరమని అర్థం, “ఆత్మా యత్నోధృతిర్చుద్ది: స్వభానో (బ్రహ్మ వర్మ చ” (అమరం). జగత్తులోని ప్రతి వస్తువు శరీరంగా కలవాడనీ, ఆశతీరంలో అత్మగానూ ఉన్నాడనీ అర్థం. జీవాత్మకూడా అందులో వెలసిన పరమాత్మకు శరీరమే అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. “యస్యాత్మా శరీరం”, -

“సర్వవ్యాసిన మాత్మానం క్షీర సర్పిరివార్చితమ్‌” (శ్వేఉప) కణంద పాలుళ్‌ నెయ్యేపోలొ' - (తిరువాయ్‌ మొళి) పిండిన ' పాలలో నెయ్యిలాగా పరమాత్ముడు సర్వత్ర వ్యాపించిఉన్నాడని ఉభయ వేదాంతాల బోధ. థ్‌

“అయవిండే యధా వహ్నిః బిన్నస్త్టత్యభిన్నవత్‌;

తధా ఎల్చేమిదం దేవో హ్యావృత్య పరితిస్టత్రి” “అగ్గి అనేవస్తువు వేరీ. అయినా య

వ్యాపించి ఉంటుంది అగ్గి ఇనుప ప్న ఎగంధులోపలా, వలుపలా

గడ్డివాములో వేస్తే అది కాలిషోత్రుంది. ముక్కలోపలా సస ఒక ముక్కను

కదా! ఇక కొలిమిలోని అగ్గి వేరే బయట ఉప క టా అగ్గి వ్యాపించి ఉంది బయటా ఏకకాలంలో ఉండేశక్తి ఉన్నప్పుడు, అగ్గిక్రి వ. ఇన లవటా, ఆంతర్బ్చహిర్వ్యాప్తి ఉండడంలో ఆశ్చర్యమేమి? ల క్తి నిచ్చిన సర్వేశ్వరునికి

రాఘవీయవ్యాఖ్య కక్‌

'ఆదిమబ్రహ్మ' నారాయణుడే. “అదిజుడైన (బ్రహ్మ ఉదయం బునకాస్పదమైనవాడు” (భారతం)

యో (బ్రహ్మాణం విదధాతి పూర్వం

యో వై వేదాంశ్ళ ప్రహిణోతి తస్మై (శ్వే.ఉప)

చతుర్ముఖబ్రహ్మజన్మకు కారణుడై. ఆయనకు వేదాలను బోధించి జ్ఞాన జన్మనూ (ప్రసాదించాడు. కాబట్టి ఆదిమబ్రహ్మ నారాయణుడు.

“తదండ మభవద్దైెమం సహ(స్రాంచుసమ'ప్రభమ్‌ః

తస్మిన్‌ జద్జే స్వయం (బ్రహ్మా సర్వలోకపితామహ:”

తేజో మయమైన (బ్రహ్మాండమందు జన్మించాడు కాబట్టి హిరణ్య గర్భుడు" అంటే చతుర్ముఖబ్రహ్మ అన్నది 'మనుస్కృతి-

విష్ణు సహ(్రనామ భాష్యంలో శ్రీశంకరభగవత్సాదులు

“హిరణ్మయాండాంతర్వర్తిత్వాత్‌ హిరణ్యగర్భో (బ్రహ్మా విరించిః తదాత్మా” 'అండమందున్న చతుర్ముఖబ్రహ్మకు ఆత్మభూతుడు కాబట్టి హిరణ్యగర్భుడంటే విష్ణువు' అని వివరించారు. ఆదిబ్రహ్మపదమిట్టిదే.

“పురా నారాయణో దేవః స్వయంభూ: ్రపితామహః।

తతస్స భగవాంస్తోయే బ్రహ్మాణ మసృజత్‌ స్వయమ్‌” (భారతం).

(బ్రహ్మకు పితామహుడని. పేరు. ఆయనను సృజించిన నారాయణుడు 'ప్రపితామహుడు. కాబట్టి బ్రహ్మతండ్రియే ఆదిమబ్రహ్మ. “అహమాదిక్లి దేవానాం" (భంగీ.11-2) ఆదిదేవుడు నారాయణుడే.

తత్త్వాలు మూడు. చిత్తు, అచిత్తు ఈశ్వరుడు. జీవవర్గాన్ని =. చిత్తును 'పరాప్రకృతి అనీ, అచిత్తు అనే జడప్రకృతిని 'అపరాప్రకృతి' అనీ, ఈ రెండు 'ప్రకృతులతో ప్రపంచాన్ని సృజించేవాడు నారాయణుడు. “యయేదం ధార్యతే జగత్‌” (7అ 4 5) అని భగవద్గీత పరతత్వాన్ని బోధిస్తుంది.

'తత్త్య'మంటే ప్రమాణంచే బోధింపబడి భూతభవిష్యద్వర్తమానకాలాల్లోనూ వర్తించే “పదార్దం. అదే 'భూతభవ్యభవ్యత్ప్రభువు' గా వాచ్యమయింది. తత్త్వాలు మూడైనా

  • ప్రకృతి కంటె పరుడైన జీవునికంటెనూ, పరుడైనప్పటికీ - జీవఫ్రకృతులతో కూడిన నారాయణుడనే పరతత్వమొక్కటే అని వేదశాస్త్ర ప్రమాణాల వల్ల బోధపడుతుంది.

సాత్విక రాజస, తామసా లనే మూడింటిలో రాజస, తామస పురాణాలు, శాస్త్రాలు దేవతాంతరాలకు పరత్వాన్ని బోధిస్తున్నాయి. నారాయణుడు అ్రాకృతశుద్ధ సత్వగుణి, కాబట్టి సొత్విక పురాణాశాస్తాలు త్రిమూర్తులలో శ్రీహరికే మహిమ

36 నారాయణ శతకం అధికమంటున్నాయి. “సాత్వికేప్పధ కల్పేషు మాహాత్మ్యమధికం హరేః” అని మత్స్య పురాణం పేర్కొన్నది. “నారాయణ పరం (బ్రహ్మ తత్యం నారాయణ; పరః” (నారా.ఉప) “మత్తః పరతరం నాన్యత్‌ కించిదస్తి ధనంజయ” (భ.గీ.7.7) 'అర్జ్హునా! నాకంటె గొప్పదైన తత్వం ఒక్కటి కూడా లేదుసువూ! అన్న భగవంతుని ఉపదేశాన్ని ఆదరించి నమ్మిన అర్జునుడు,

“న త్వత్సమో౬ స్యభ్వధికః కుతోఒన్యః

లోకత్రయే ఒప్యప్రతిమప్రభావ!”(భ.గీ.11-43)

ముల్లోకాల్లో ఎక్కడా నీతో సమానుడే లేడు, స్వామీ! ఇకనీకన్న అధికుడెలా ఉంటాడు? అని ప్రస్తుతించాడు.

“వేదాహమేతం పురుషం మహాన్తం” (పురుషసూక్తం.

“పరాత్పరం పురుష ముపైతిదివ్యమ్‌” (ముం.ఉప)

అనే వేదవాక్కులు చెప్పినట్టే “త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరంనిదానమ్‌ - - - సనాతనస్య్యం పురుషో మతో మే”. (భ.గ్‌.11-18) అక్షర వస్తువుల్లో కెల్ల గొప్పవాడవు, సర్వప్రపంచానికి నీవే ఆధారభూతుడవు. ధర్మరక్షకుడవైన సనాతన పురుషుడవు నీవే అని నా అభి[ప్రాయమన్నాడు అర్జునుడు.

అండాధిపతియైన చతుర్ముఖ (బ్రహ్మను. ఆబ్రహ్మయొక్క ఆజ్ఞానువర్తియైన శివుణ్నీ విశ్చరూపశరీరంలో ఒక భాగాన ఇమిడి యున్నట్టు దర్శించి “బ్రహ్మాణ మీశం కమలాసనస్థ్రం” (భ.గీ.11-15) అని అర్జునుడు వర్షించాడు.

“జన్మాద్యస్య యతః(బ్రసూ.2”“యతో వా ఇమాని భూతాని జాయంతే. యేన జాతాని జీవంతి. యత్ర్రయంత్యభిసంవిశంతి.తద్ర్రహ్మా” (భృగువల్లి),

“యతస్సర్వాణి భూతాని భవనా దియుగాగమే।

యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే॥” (వి.స.నా.పూర్వపీరిక)

“ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై

ఎవ్చనియందు డిందు” (ఆం.భాగు)

అనే మొదలైన వేదశాస్త్ర పురాణవాక్యాలు ఏకకంరంగా సృష్టి స్టితి, సంహార, 'మోక్షప్రదానాలను చేసే వాడే పరబ్రహ్మ అని ప్రకటించాయి. ఇట్టి పరతత్త్వ లక్షణాలు కలవాడే కృష్ణభగవానుడు కాబట్టి అర్జునుడు “పరంబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్‌” (భ,గీ.10-12) అని ్రస్తుతించాడు.

కోటి నామాలు నారాయణుని యందు విశేషణంగా అన్వయిస్తాయి.. కాని నారాయణ శబ్దం విశేష్యమైనందువల్ల వేరే దేవతకు పేరుకు కూడా చెల్లదు కదా!

రాఘనీయవ్యాఖ్య 37 ఉద్దండ పండితుడైన శ్రీ అప్పయ దీక్షితులు 'నారాయణ' శబ్దానికి శివ" పరంగా అర్హం చెప్పడానికి చాలా (ప్రయత్నించాడు. చివరకు 'ణిత్వం చెప్పనీయకుండా బాధిస్తున్న దన్నాడు. కాబట్టి, ఆశబ్దమే దేవతాసార్వభౌముడని పరతత్వబోధచేస్తుంది. “అజస్య నాభావధ్యేకమర్పితం యస్మిన్నిదం విశ్ళం భువనమధి(శితమ్‌” (శ్రుతి). “యత్తత్పద్మమభూత్సూర్వం తత్ర బ్రహ్మా వ్యజాయత! (బబ్రహ్మణశ్చాపి సంభూత: శివఇత్యవధార్యతామ్‌; శివాత్‌ స్కందమభవ దేతత్సృష్టిచతుష్టయమ్‌॥” నారాయణుడు తన నాభికమలమందు చతుర్ముఖ బ్రహ్మను సృజించాడు. ఆ చతుర్ముఖుడు శంకరుణ్ని సృజించాడు. శంకరుడు కుమారస్వామిని సృజించాడు. = ఇలాగే లోక సృష్టి పైపైగా జరిగింది. కాబట్టి (బ్రహ్మాండావళికెల్ల నాభికమలమే మూలకందం౦ం. అని క్రుతి స్మృతులు బోధిస్తున్నాయి. భవ్యాధినాథుడైన ఈ పద్మనాభుడు తన పరిబ్రడిమస్వభావాన్ని - పరతత్వధర్మాన్ని తన మాయాబలం (గుణమయమైన _ ప్రకృతియొక్క సామర్ధ్యం) చేత జనులకు తెలియకుండా కప్పిపుచ్చుకొంటాడు. “ఆత్మానం మానుషం మన్యే రామం దశరధాత్మజమ్‌[” (రామాయణం). నేను దశరథ పుత్రుడను. మానవుడ నని శ్రీరాముడు చెప్పినాడు. “అహం వోబాంధవో. జాతః” నేను దేవుడనుగాను, మీ బంధువునే అని శ్రీకృష్ణుడు యాదవులతో చెప్పి, తన పరత్వాన్ని మరుగు పరచుకొన్నాడు కదా, నారాయణుడు ఇలా స్వేచ్చతో కల్పించుకొనే అంతర్వ్యాస్తి బహిర్వ్యాప్తియే 'జిహ్మవ్యాప్తు' అని కవి హృదయం, “తవాంతరాత్మా మమ చ యే చాన్యే దేహసంజ్జికాః। సర్వేషాం సాక్షిభూతోఒసౌ న (గ్రాహ్యః కేనచిత్‌ క్వచిత్‌॥” నారాయణుడు నీకూ, నాకూ, జీవులందరికీ అంతరాత్మయై, సాక్షిభూతుడుగా ఉన్నారు. ఆయన ఎవ్వరికీ, ఎప్పుడూ తెలుసుకొనళక్యం కాని వాడు అని బ్రహ్మ రుద్రునితో అన్నాడు. కాబట్టి బ్రహ్మేంద్రామరపతులకుగానీ, వాయువే ఆహారంగా ఉన్న అనంతుడు, వాసుకి, గుళికుడు, తక్షకుడు, కర్కోటకుడు, పద్ముడు, శంకుడు అనే సర్సరాజులకుగానీ ఆదిమబ్రహ్మయొక్క జిహ్మవ్యాస్తులు తెలియవు. మహామహులకే తెలియని పరబ్రహ్మయొక్క సూక్ష్మస్ట్రూలరూప ధర్మాలను తనకు వర్షింప శక్యం కాదని కవి విన్నవించుకొన్నాడు.

“భాగవతము తెలిసిపలుకుట చిత్రంబు శూలికైన తమ్మిచూలికైన। విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేటపరతు*;(భాగు) అంటూ జీవవేదనను పోతపోశాడు పోతరాజు ము ధర సించాసనమై నభంబు గొడుగై చద్దేనతల్‌ భృత్యుతై సర మామ్నాయములెల్ల వందిగణమై 'బ్రహ్మాండవూగారమై సిరి భార్యామణిటై విరించి కొడుకై శ్రీ గంగ సత్సుత్రిట్రై వరుస న్నీ ఘన రాజసంబు నిజమై పర్షిల్డు, నారాయణా॥ శం అర్థం: ఓ నారాయణా! ధర = భూమి; సింహాసనమై = రాజపీరమై; నభంబు = ఆకాశం; గొడుగైై = ఛత్రమై; తత్‌ దేవతల్‌ = ఆకాశవిహారులైన దేవతలు; భృత్యులై ఇ సేవకులై; పరమ + ఆమ్నాయములు + ఎల్ల = ఉత్కృష్టమైనవేదాలన్ని; వందిగణమై ఈ, స్తుతిపారకులసమూహసైై; (బ్రహ్మాండం = ప్రషంచం; ఆగారమైై = భవనమై, సరి = లక్ష్మీదేవ; భార్యామణిడైై = ధర్మపత్నిర్లై; విరించి = చతుర్ముఖబ్రహ్మ; కొడుకై శ్రీగంగ = సంపత్కరమైనగంగాదేవి; సత్‌పుత్రిక్సై = ఉత్తమపుత్రికర్షై; వరుసన్‌ = క్రమంగా; నీఘనరాజసంబు జ నీగొప్పరాజరీవి; నిజమై = సత్యమై వర్టిల్లు = వృద్దిబొందును. ని స్‌ ల కే తాప ఓ నారాయణా। నీ సింహాసనం భూలోకం. నీ ఛత్రం అకాశం. నీభృత్యులు దవతలు, నీ వందిమాగధులు వేదాలు, నీనగరు బ్రహ్మాండం. నీ పత్ని లక్ష్మి నీ పుత్రుడు ఏరించి. నీ పుత్రిక గంగ, నీ (ప్రాభవం (క్రమంగా చర్జిల్లుతుంది. గ ఉభయవిభూతి నాయకుని ్రాభవవైభవాలను ఉగ్గడించే పద్యమిది. క్‌ న్‌ రాజులు మారవచ్చు కొనీ వారు కూర్చుండే సింహాసనం మారదు. 0టుంది. ప . అచలమై. ల లీ పారమేస్ట్రం రాజ్యం. 'స్టిరా ధరా ధరిత్రీ ధరణి (అమరం). పటి రమైన భూమియే నారాయణుడు. అధిష్టించిన సింహాసనం. దైను ర్థరణీ లోకధారిత్ర* అన్నది వేదం. గ స్రోగొకృతకాకృతకృల్లోకాలన్నిటిక ఆధారపీరు భూమి. ష్‌ హొ రను '్రతిరీత్యా ఓంకారమే ఛనుస్సు. సర్వసిద్దిని కలిగించే భూమి ఆధనుస్సును ధరించేది కాబట భూమి “'ధనురరి ఎత “ధనుర్దరాడై విదహి పట నుర్దర “తస్య వాచకు ప... + తన్నో ధరా ప్రచోదయాత్‌. స్ట్‌ వాచకః ప్రణవః” అం చత్సదిత్తి నికో భగవంతుని వాచకమైన ్రణవాని ధరి వ్‌ టహ్మణ 'స్తివిదస్మృతః”(భగ) "త్వం వ్యాహృతి: ప్రధమత్త ట్‌ ॥ చెంది కాబట్టీ 'ధర' రాజాసనం. / (రణమా ప్రియస్తే (సత్ర,

రాఘవీయవ్యాఖ్య పం

“ఓం భూర్భువస్సువః” - అనే మూడు (భూః భువః సువః) వ్యాహృతులలో మొదటి వ్యాహృతి భూమి దానిపైన ఓంకార వాచ్యుడైన నారాయణుడ ధిస్టితుడయ్యాడు. కాబట్టి ఆయనకు “ధర సింహాసనం కదా!

రాజలక్షణమైన ఛత్రం ఆకాశం. ఆఛత్రచ్చాయలో సర్వద్రవ్య రాశి ఉంది. ఈ వసుంధర సర్వసస్యాఢ్యగా ఉంటుంది ఆయన గొడుగు నీడలోనే కదా!

ఆకాశ సంచారులైన దేవతలు ఆది దేవుని ఆధిపత్యాన్ని అతిశయింపబేసే సేవకులు.

“నమో రాజ్టేఒనమో2ధిపతయే ౬ధిపతిరసి”

“నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో దేవ ఏకో నారాయణ; న ద్వితీయో౭స్తి కళ్చిత్‌. స విష్ణురేవభవతి” - “నమో విష్ణవే సుమతిం భజామహే”. మొదలైన వాక్యాలు వైదికస్తుతులు.కాబట్టి రాజును మేల్కొలిపే వైతాళిక - వంది-గణమే వేద బృందం. అది భగవర్వైభవాన్ని స్పుతిస్తుంది.

అండకోటి గల ప్రపంచమే నారాయణుని రాజభవనం.

“శ్రియఃపతిః. శ్రీమతి శాసితుం జగజ్జగన్నివాసః" (మాఘకవి)

నారాయణునికి అభిమతమైన, అనురూపమైన స్వరూపరూపగుణవిభవై శ్చర్య శీలాదులు కలిగిన శ్రీదేవి దివ్య మహిషి - పట్టపురాణి.

పితృవాక్య పరిపాలకుడై, తండ్రి రాజ్యాన్ని విస్తరింపజేసిన నలువ - నాలుగు దిక్కులను మెడత్రిప్పకుండా సమీక్షించే చతుర్ముఖుడు పుత్రుడు.

తాను పుట్టిన తావునుంచి బయటపడి ఆప్యాయతతో ముల్లోకాలకు అమృత(ప్రాయమైన జీవనాన్ని - ఉదకాన్ని - ప్రసాదించి సర్వేంద్రియ సంతృప్తిని కలిగించే గంగాదేవి నారాయణుని పుత్రిక.

“పీతా ధర్మద్రవీ మర్ద్యె ర్యైర్గంగా భక్తితః సకృత్‌!

తేషాం కులానామయుతం భవాత్తారయతే (ధ్రువమ్‌॥”

గంగలో స్నానం చేస్తే మలనిర్మోచనమవుతుంది. గంగోదకాన్ని పానం చేసిన భక్తులకు భవరోగం పోతుంది. సద్గతి కలుగుతుంది - అని (బ్రహ్మాండపురాణం చెబుతుంది.

“రజో రాగాత్మకం విద్ది” (భగ) రాజసం రజోగుణ సంబంధి. రజోగుణం ఉబికితే కోరికలు కార్యరూపాన్ని దాల్బడం పరిపాటి.

ఒక్కడే తనయుడు. తనయ యొక్కతె. పరిమితమైన సంతానం, తనతో మొదలైన సామ్రాజ్యం తన సంతానం వల్ల రాజసం సెరిగి, అపరిమిత కీర్తి

నారాయణ శతకం శం ప్రతిష్టలను పొందుతూ వైరాజ్యమే తద్దర్మంగా వర్దిల్లుతున్నది. లక్ష్మీపతి రాజసం నిజంగా ఘనమైనదే కదా! కరీం నగర్‌ జిల్లాలోని ముప్పేరి తోట (గ్రామంలో శ్రీవేంకటేశ్వరస్వామి (బ్రహ్మోత్సవం. వైశాఖ శుద్ద మందు జరుగుతుంటుంది. వీధ్యుత్సవమప్పుడు భగవల్సేవకు ముందు, వెనుక ద్రవిడ, వేద పారాయణం జరుగుతుంది. ఇంక యజమానుడు. శ్రీరామిడి రాఘవరెడ్డితో పాటు. భజన పరులు మేళతాళాలతో భజనచేస్తుండేవారు. పూర్వం. మధ్యమధ్యన వారు “ధరసింహాసనమై” అనే ఈ పద్యాన్ని పలుమారులు రాగయుక్తంగా గళమెత్తి పరించే వారు. పద్యావర్తికి ఒకసారి “సమస్త రాజహరిబలగోవిందా” అంటూ ఎలుగెత్తి బాహువులు సైైకెత్తి శ్రీర్తిస్తూ కేల్మోడ్చేనారు. ఆ దృశ్యం సకలజన మనోనయనానందకరంగా ఉండేది. ఈ పద్యతైలి ప్రపాదగుణశోభితం. మాటలు నిర్చీజద్రాక్షలు కదా! అవతార దశకం మ. మగమీనాకృతి వారి జొచ్చి యసురన్మర్దించి యన్వేదముల్‌ మగుడం నెచ్చి విరించి కిచ్చి యతని న్మన్నించి యేపిరంధా? బగ పాధించిన దివ్యమూర్తి వని వే భావింతు నెల్లప్పుడున్‌ ఫిగరాజధ్వజ భక్తవత్సల జగత్కారుణ్య, నారాయణా॥ క్ష ఆర్థం : ఇగరాజధ్వ్యజ = పక్షీంద్రుడైన గరుడుడు టెక్కెంగా కలవాడా! భక్త వత్సల = ఆశ్రితులయందు మక్కువెక్కువగా ఉన్నవాడా! జగత్‌ కారుణ్య = ప్రపంచమందు- 'ప్రాణులందు - దయకలవాడా! నొరాయణా! మగ మీన+ఆకృతిన్‌ = మగటిమిగల చేప ఆకారంతో; వార్చిన్‌ = సముద్రమందు; చొచ్చి = ప్రవేశించి; అసురన్‌ = రక్కసుణ్ని; మరంఛి = తొక్కిపెట్టి (సంహరించి), అనేదముల్‌ ౨ దొంగలించిన వేదాలను, మగుడన్‌ = మళ్ళీ తెచ్చి; విఠించికి = (బ్రహ్మదేవృనిక్సి, ఇచ్చి; అతనిన్‌ = ఆబ్రహ్మను; మన్నించి = క్షమించి; ఏపారంగా = విజ్బంభించినవాడుగా; పగసాధించిన = పగదీర్చుక్రొన్న; దివ్యమూర్తివి = తేజోమ్సుల్తిన్సి అన్ని నేను ఎల్లప్పుడు, భావింతును ఇ తలుసాను. తాః ఓ గరుడధ్యజ। భక్తవత్సల! జగత్కారుణ్య! నారాయణా! న్నీ చేపరూపంతో మున్నీటిలో మునిగి వేదాపహారిక్షైన రొక్షసుణ్ని సంహరించా్య. ఆవేదాలను తెచ్చి, జ స్యయూర్తివని నేన్స సర్వదా స్మరిస్తాన్సు వ్యాఖ్య: మత్స్యావతారమూర్తిని స్టుత్త్యచ్చ పద్యం.

రాఘవీయవ్యాఖ్య శ

ఈ శతకంలో మొదట పదిపద్యాలతో కవి, నారాయణుని స్వరూప స్వభావాలను వర్లించాడు. ఆది దశకం తర్వాత అవతారదశకం వర్షితం.

“యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత।

అభ్యుత్చాన మధర్మస్య తదా౬౭ఒత్మానం సృజామ్యహమ్‌" (భగ)

అని భగవానుడు ఉపదేశించిన విధంగా, అధర్మం చెలరేగి ధర్మానికి గ్లాని కలుగుతున్నప్పుడు తాను అవతరించడం వల్లనే (ప్రపంచం సడ్గతిని పొందుతున్నది. పరబ్రహ్మ పరమాకాశంనుంచి దిగి రావడంకంటె ప్రపంచానికి సంభవించే పరమోపకారం మరొకటి లేదు కదా!

మొదటి ఉపకారం వేదోద్దరణం. “వేదో ఒ౬ఖిలోధర్మమూలం”. సకల ధర్మాలకు మూలకారణం వేదం, అన్నది గౌతమధర్మసూడత్రం. 'వేదైశళ్చ సర్వైరహమేవ వేద్య; అన్నట్లు వేదాలే భగవంతుని విచిత్ర ప్రవృత్తులను బోధిస్తాయి. అందుకే నారాయణుడు మొదట (బ్రహ్మను సృజించాడు. కొడుకును కన్న తర్వాత అతనికి చదువు నేర్పకుంటే కొడుకు సమాజునికి చీడపురుగవుతాడు. తండ్రి గుణాలనే చెరచేవాడవుతాడు.

లోకంలో ఎవడైనా తనకంటె మరొకడు గొప్పవాడు కాకూడదనుకొంటాడు. కానీ 'పుత్రాదిచ్చేత్‌ పరాజయ' మన్నట్టూ తనయుడు మాత్రం తనను మించినవాడుకావాలని తండ్రి కోరుకోవడం ఆజానజం,

“తేనే బ్రహ్మ హృదా య అదికవయే” (భాగు

(బ్రహ్మను సృజించిన పద్మనాభుడే సమస్త వేదాలను అతనికి (ప్రదానం చేశాడు. జన్మదాతయే జ్ఞానదొత అయితే జన్మసార్ధకమవుతుంది. జగన్నాధుడైన పితృదేవుని ఆజ్ఞను అక్షరాలా పాటించిన (బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు. వేద విద్య మూర్తీభవించింది.

అవతారాలెన్నో ఉన్నా ముఖ్యంగా పది చెప్పితే చాలు. దివ్యజ్ఞానం కలుగుతుందని అపాంతరతముడు ఆలోచించాడు. కావ్యాలలో తరచుగా దశావతారాలనే వర్షించారు కవులు,

భగవంతుని పది అవతారాలలో మొదటిది మీనావతారం.

“తదైక్షత, బహుస్యాం ప్రజాయేయేతి” (ఛాం-ఉపు

సృష్టికి ఉన్ముఖుడైన పరబ్రహ్మ తాననేకరూపాలుగా వ్యాపించాలని సమీక్షించాడు. జలాన్ని సృజించిన విభుడే జలశరీరకుడై సమీక్షించి పృధివిని సృజించాడని ఛాందోగ్యోపనిషద్వాక్యాలవల్ల తెలుస్తుంది.

నారాయణ శతకం జీ2 “తపసా చీయతే బ్రహ్మ” - (ముం.ఉఊ)”స తపోఒతప్యత, తత్సృష్ట్యా” (తై.ఉప) “తప - ఆలోచనే” అని ధాత్వర్దం. చింతించడం, ధ్యానించడం, సంకల్పించడమని (తపస్సుకు) అర్హం. 'వీయతే' అంటే లావవడం, ఉబ్బడం, అంకురించే బీజం ఉబ్బినట్టు" అని శంకరభాష్యం వివరించింది. సంకల్పమే సృష్టికి కారణం. మీనం జలచరం, చేపచూపుచురుకైనది. స్వచ్చమైనది. నీటిలో నుంచి చెంగున ఫైకి ఎగిరినప్పుడు తళుక్కునమెరిసే కన్నులతో దరులమీద ఉన్న వస్తురూపగుణాలను గమనిస్తుంది. చేపకు'ఈక్షణ' క్రియయే. ప్రధానం. నీటిలో దాచిన వేదాలను వెదుకడానికి వీక్షణమే అవసరం కాబట్టి మోనావతారానికి 'ప్రాధమ్యం. పద్యంలో వేదాలను అపహరించిన రక్కసుని పేరును నొక్కిచెప్పలేదు. పురాణాల్లో సోమకుడని ఒకచోట, హయగగ్రీవుడనే రాక్షసుడని మరాక చోట ఉండడం వల్ల కవి, ఆ పేరు చెప్పలేదేమో! ఒక అసురుడు వచ్చి ఏమరుపాటుతో ఉన్న చతుర్ముఖ బ్రహ్మనుంచి వేదాలను అపహరించాడు. వెంటనే సము(ద్రగర్భంలో దాగుకొన్నాడు. వేదాలు లేకపోతే భగవంతుని'సత్తాే ముప్పుకదా! అందుకే పౌరుషంతో ఆ(ప్రాకృతమీనాకారుడై అబ్బిలోకి ప్రవేశించాడు. నల్దిక్కుల నిరీక్షించాడు. మీనమూర్తి వేదాలను వెదుకుతూ వీక్షిస్తుంటే కమలనయనాలు కడలిలో పలుతావుల కమలవనమే సంభవించినట్టుండిందని దేశికులు అన్నారు. సర రుతిజాలమార్షణదశాదత్తక్షణైర్వక్షై రంతస్తన్వ దివారవీందగహనా న్యౌదన్వతీనామషాక్ష” (దశావతారస్తోత్రం) ( సముద్రంలో త్రన చూపులకానిన రక్కసుణ్ని తొక్కిచంపాడు మీనమూర్తి, దాలను తెచ్చి మళ్ళీ ఇచ్చినందువల్ల (బ్రహ్మ బతికి బట్టకట్టాడు. | ట్ర మౌర్తులకు వోని కలిగించినవాడ్తు బతికిచావడు. కాబట్టి దుష్టులను స్వ ఆణచి పగ దీర్చుకొంటాడు భగవంతుడనే భావాన్ని సర్వదా స్మరిస్తానంటున్నాడీ క్రి, ఇఖగరాజధజ, _ ధ్వజ భక్తవత్సల, జగత్కారుణ్య అనే మ్పూడ్హ విశేషణ పదాలు పద్యభావానుగుణంగా 'ప్రయోగించడంలో బౌచిత్యముంది. కశ్యప (జాపతియజ్ఞానిక్ర దేవతలూ, మునులూ సహకరించారు. వారు సమిధలూ, దర్భకట్టలూ మోసుకొచ్చారు. వాలఫఖిల, మునులు షప (' అంగుష్టప్రమాణ్యగర్రీరృల్తు వారు యధాశక్తి ఒకటి, రెండు పుల్లలు మోసుకొస్తుంట్రే క్ర స . నే ఇంటు కట్టిలమోప్పు మోస్సుక్షాన్సి వస్తున్న ఇంద్రుడు వారిని చూచి అవహేళన చేశాడు. వాలళి ం ల్యులు ఇంద్రునికి ప్రతిభటంగా

రాఘవీయవ్యాఖ్య త్తం మరొక ఇంద్రుణ్ని ఉద్భవింపజేయడానికి ప్రయత్నించారు. దేవేంద్రుడు భయపడి కళ్యపుణ్ని ప్రార్హించాడు. కశ్యపుడు మునులతో విజ్ఞాపనచేశాడు. వారు “మా ప్రతిజ్ఞ రిత్తపో” దన్నారు. కశ్యపుని (ప్రార్ధన వల్ల వాలఖిల్యులు తమ ప్రతిజ్ఞను, పన్షులకు ఇంద్రుడు” గా మార్చుకొన్నారు. తత్ఫలితంగా కళ్యపప్రజాపతికి తనయుడుగా వినతకు ద్వితీయగర్భమందు గరుత్మంతుడు జన్మించాడు. కనకగిరిసమానదేహుడు, అవ॥క్రవిక్రముడైన గరుడుడు మాతృదాస్యవిముక్తికోసం అమృతాన్ని హరించి తెస్తుండగా ఇంద్రుడు అతని మీద వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. గరుడుడు ఆ వజ్రాయుధాన్ని గౌరవించడానికి తన ఒక ఈకను మాత్రం అర్పించాడు. పక్షీంద్రునికి దేవేంద్రుడు మిత్రుడయ్యాడు.

గరుత్మంతుడు వేదాత్ముడు. ఆయన శిరస్సు త్రినృత్‌ అనే సామవేదభాగం. నయనేంద్రియం గాయత్రాఖ్యమైన సామం. పంచదశస్తోమమే ఆయన ఆత్మ వామదేవ్యమనే సామవేదశాఖయే ఆయన శరీరం. బృహత్సామం, రధంతరసామం అనేవి రెండురెక్కలు. యజ్జియాఖ్యమైన సామం ఆయన తోక. గాయ(త్ర్యాద్యేకవింశతి ఛందస్సులు ఆయన హృదయాద్యవయవాలు. వేదికయందుండే అగ్జిహోత్రాదులాయనకు గోళ్ళు. అంతరిక్షంలో ఎగురుతూ స్వర్గానికి చేరగల సమర్హుడు గరుత్మంతుడు.

అమృతభాండాన్ని అపహరించి, ఒక్క చుక్కబొట్టైనా ఆఅస్వాదించని అలౌల్యుడు. కన్నతల్లికోసం తన ప్రాణాన్ని లక్ష్యపెట్టకుండా శ్రద్దతో సేవ చేసే కొడుకును చూచి, మెచ్చుకొన్న నారాయణుడు ప్రసన్నుడై వరమడుగుమన్నాడు. “స్వామో! అజరామరుడనై మీకు వాహనంగా ఉండగల” నని గరుడుడు కోరినాడు. 'నాకు ధ్వజంగా కూడా నీవే ఉండా" అన్నాడు నారాయణుడు. వేదమయుడే ధ్వజంగాకల నారాయణుడు వేదాలను ఉద్దరించి జగదుపకొారకుడయ్యాడనే సాభిప్రాయసంబోధనాంతపదం 'ఖగరాజధ్వజు'.

భక్తవత్సల: తాను అంతకుముందుకన్న దూడలను సైతం దగ్గరకు రానీయక, అప్పుడే పుట్టిన లే దూడ శరీరానికి అంటియుండే మరికినంతా నాలుకతో భోగ్యంగా నాకుతూ లాలించే ఆవును 'వత్సలా” అంటారు. అవుకు ఉండే ఈ ప్రేమ గుణానికే 'వాత్సల్యం' అని పేరు. తననా(శ్రయించిన భక్తుల పట్ట భగవంతుడు వాత్సల్యం కలవాడు. అంటే, ఆ్థ్రితుల దోషాలను గుణాలుగౌ (గ్రహించే ప్రేమకలవాడని అర్ధం,

చిరకాలం తపస్సుచేసి సృష్టిరహస్యాలను తెలియజేసే వేదాలను, తండ్రినుంచి పొందిన బ్రహ్మ తంద్రితుడై పోగొట్టుకోవడం, ఆయనకు కలిగిన దోషం. నారాయణుడు ఈ దోషాన్ని భోగ్యగుణంగా మలచుకొని జ్ఞానపేటికలను తెచ్చి, పోగొట్టుకొన్న (బ్రహ్మకే తిరిగి ఇచ్చి, ఆయనను మన్నించడం 'ప్రేమచేతనే కదా! "

నారాయణ శతకం త్తేత్నీ

జగత్మారుణ్య:. విచిత్ర భోగ్య, భోక్షృవర్గ భోగోపకరణ, భోగస్టానరూపమే

జగత్తు. దీనికి 'లీలావిభూతి' అని పేరు. ఇది భగవంతుని కృపచే నిర్మితమయింది.

“క్రీడాతూలికయా స్వస్మిన్‌ కృపారూషితయా స్వయమ్‌;

ఏకోవిశ్వమిదం. చిత్రం విభుః శ్ర్రీమానజీజనత్‌;” (యాదవాభ్యుదయం). శ్రీమంతుడు సంకల్పమనే కుంచికను దయ అనే రంగులో ముంచి రచించిన చక్రమే విశ్వం,

నిత్య సూరులకు, ముక్తపురుషులకు ఆపదగానీ, దుఃఖంగానీ ఉండదు. కాబట్టి వైకుంఠంలో 'దయ' కు ప్రయోజనం లేదు.

'జగతి కాలమేఘాయితం' అన్నట్లూ మేఘం నీటిభారాన్ని మోయలేక కొండలయందు దిగి భూమి మీద వర్షించిన రీతిగా నారాయణుడు కారుణ్య భారాన్ని మోయలేక పరమాకాశంనుంచి దిగుతాడు, వేదాలు, అంటే శబ్దమనే జ్యోతిస్సు లేకపోతే జగత్తు అంధకారమయమే. కాబట్టి తమోగుణిలైన అసురుళ్ని అణచి, వేదాలనుద్దరించి, జగత్తును జ్యోతిర్మయం చేసిన నారాయణుడు జగత్కారుణ్యమూర్తి, ము అమరుల్‌ రాక్ట్షసనాయకుల్‌ కడణతో నత్యంతసొనుర్ద్యుభై

భ్రమరీదండము మందరాచలముగొం బాభోనిధిం ద్రచ్చణా

దమకించెన్‌ భువనత్రయంబును గిరుల్‌ దంతావళుల్‌ (మొగ్గినం

గమరంబై ధరియించి మించిన జగత్కల్యాణ, నారాయణా ॥ 2

అర్ధం : నారాయణా! అమరుల్‌ = దేవతలు; రాక్టసనాయకుల్‌ = పూర్వ దేవతలు;

కడకతోన్‌ = పట్టుదలతో; అత్యంత సొమర్భ్థ్యులై = మిక్కిలి శక్తి మంతులై; మందరాచలము = మందర మనే పర్వతం; భ్రమరీదండము కవ్వం; కాన్‌ = కాగా సాధస్‌ 4 నిది్‌ = జలనిధిని; (త్రచ్చంగా = చిల్కగా; భువనత్రయంబును = ముల్టోకాలుకూడ; తమకించెన్‌ = అదరిపోయెను; గిరుల్‌ = పర్వతాలు, దంతావలుఖ్‌ = ఏనుగులు; 'మొగ్గినన్‌ = ముందుకు వంగగా; కమరంబై = తాబేలువై; ధరియించి = మందరాచలాన్ని మోసి; మించిన = కోభించిన; జగత్‌కల్యాణ = జగన్మంగళ్ళుడా!

తా; ఓ నారాయణా! సురాసురులు శ్రద్దతో గొప్పసామర్మ్యం కలవారై మందరమనే పెద్దకొండను కవ్వంగా చేసి సముద్రాన్ని మధించగా, గరులూ, కరులూ 'మొగ్గినాయి. ముల్లోకాలూ కంపించాయి. అప్పుడు నీవు మేటి తాబేటి రూషాన్ని దాల్చి, మందర పర్వతాన్ని నీవీపుమీదనిల్పుకొని కుదురుగా శోభించిన జగత్కల్యాణుడవు,

వ్యాఖ్య; నారాయణుడు కూర్మావతారుడై ఇగత్కల్యాణుడయ్యాడు.

కూర్మం ఉభయచరం. భూమిమీదనూ నీటిలోనూ తన అవయవాలను బయల్పరచి

రాఘవీయవ్యాఖ్య త్తీ్‌ సంచరిస్తుంది. ఏదైనా అలికిడి వింటే, తపోనిష్టుడైన యోగి సకలం ముకుళించుకొని ధ్యానమగ్నుడైనట్టూ, తన అంగాలను లోపలికి ముడుచుకొని నిశ్చ్ళలస్థితిలో ఉంటుంది.

“ఈక్షణధ్యానసంస్పర్షుః మత్స్యకూర్మవిహంగమాః

రక్షంతి స్వాన్యపత్యాని”.

చేపలు ఈనుతూ (పిల్లలనుకంటూ), ఈదుతూ, పోయిపోయి. ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే తాబేళ్ళు తమ మనస్సులో తలచుకుంటే, సక్షులు పొదిగితే, వాటి పిల్లలు బాగా ఎదుగుతాయని విజ్ఞుల మాట.

దేవదానవులు అమృతంకోసం మందర పర్వతంతో కలశోదధిని మధించగా భగవంతుడు మహాకూర్మమై ఆ కవ్వపుకొండక్రింద కుదురుగా నిలిచాడు.

“దుర్వాసా: శంకరస్యాంశః” (విపు1-9-2)

శంకరుని అంశతో అవతరించిన మహర్షి దుర్వాసుడు. ఆయన ఒక విద్యాధరి చేతిలోని సంతాన మనే దేవతరువు యొక్క పూలమాలను చూచి, దాని వాసనకు ఉన్మత్తుడైై ఆమెనుంచి ఆపూలదండను తీసుకొన్నాడు. ఆదండను తన కంఠంలో ధరించి సంచరిస్తుండగా, ఐరావతగజాన్ని అధిరోహించిన దేవేంద్రుడు కనబడితే, ఆయనను తన పుష్పహారంతో అను[గ్రహించాడు దుర్వాసోముని. మమతాహంకారాలు కలిగిన వ్యక్తి మర్యాదలెరుగడు. దేవరాజు మహాప్రసాదమని పుష్పహారాన్ని తని శిరస్సున ధరించక హస్తిమస్తకంమీద పడవేశాడు. అది తొండంతో ఆమాలను దీసి వాసనజూచి నేలమీద వేసి తొక్కుకుంటూపోయింది. ముని(కి)ఆ(గ్రహం అంబరాన్ని అంటుకొంది.

“ఐశ్చర్యమదంతో నన్నవమానించిన నీవు నిశ్రీకుడవగుదువుగాక” అని దుర్వాసుడు శవీపతినీ శపించాడు. దేవతలందరు. నిర్వీర్యులయ్యారు. త్రైలోక్యరాజ్యసంపత్తు నిస్తేజముయింది. దేవాంతకులు అమరావతిపైన దండెత్తారు. దితిజులకూ, దివిజులకూ విరోచననందనుడైన మహాబలియే చక్రవర్తి అయ్యాడు.

నిలింపులందరూ నీరజాసనుణ్ని ముందుంచుకొని పాల్కడలికి ఉత్తర తీరానికి వెళ్ళి, నారాయణుణ్నీ ప్రార్ధించారు. కాసేపటికి ప్రత్యక్షమైన పరాత్పరుడు అమృతో త్సాదనకోసం దేవదానవులు కలసి సముద్రమధన౦ం చేసేవిధానాన్ని విశదపరచాడు. అజరామరత్వాలను.. కలిగించే నూతనద్రవ్యలాభంకోసం జ్ఞాతివైరాన్ని మరచి మహేంద్రుడూ, మహాబలీ ఒక్కటయ్యారు.

ఓషధులనన్ని తెచ్చి క్షీరాబ్టిలో వేశారు. కడలికడవలో చిల్కే కవ్వంకోసం తవ్వి ఎత్తిన మందరనగం నెత్తిన పడి సగం మిగిలారు. ఖగవాహనుడు దయచేసి

నారాయణ శతకం డీధ మందరగిరిని కందుకం లాగా ఎత్తి గరుడునిమీద పెట్టాడు. అతడు హరిగిరులను మోసుకొనివచ్చి కడలిగట్టుమీద దించాడు. ఒక తలగల పాములకు దొరయైన వాసుకిని కవ్వపు తాడుగా చేశారు. పుచ్చంవైపు పట్టే తుచ్చవృత్తి మాకు వద్దని దైత్యులు పడగవైపు పట్టారు. వేల్పులు తోకవైపు పట్టారు. భుజబలంకొలది కలశోదధిని తరచారు. మందరాగం[క్రింద కుదురు లేనందువల్ల, అది హరాత్తుగా బుడబుడ శబ్దంతో సయోధిలో మునిగింది. పయస్సు సైకి కెరలింది. దిగ్గజాలు (మొగ్గినాయి. (ప్రపంచం కంపించింది. ఈ విపత్కర పరిస్థితిలో నారాయణుడు మేటి తాబేటి రూపమెత్తి కాళ్ళను వెలికి, లోనికి ఆడిస్తూ కొండను ఎత్తి దానికి ఆధారంగా కుదురై నిల్బాడు. బలంతగ్గిన తరచేవారిలోనూ, తాడులోనూ తానే వ్యాసించాడు. “శ్షీరోదమధ్యే భగవాన్‌ కూర్మరూపీ స్వయం హరిః మంధనాద్రే రధిష్టానం (భ్రమతో =ఒభూన్మహామునే॥ (విపు) “ తరిగాండ్రలోన నొకండంట తరికడవకు కుదురు నాక ట్రాడును చేరుల్‌ తరికవ్వంబును తాన(ట హరి హరి హరిచిత్ర లీల హరియే యెరుంగున్‌[” (ఆం.భాగ.8-205) సురాసురులు మళ్ళీ తరచారు. హాలాహలమనే కాలకూటవిషం పుట్టి పొంగింది. అందరు అహీనుణ్ని (వాసుకిని) విడిచి పరుగెత్తారు. కైలాసగిరీశుణ్ని ప్రార్థించారు. దయాళువైన శంకరుడు వచ్చి హుంకరించి, నేరెడు పండులాగా గరళాన్ని గళంలో వేసుకొన్నాడు. స్ఫటికసంకాశుడు గరళకంరుడయ్యాడు. సజ్జనులకు సాధురక్షణమే భూషణం కదా! దేవదానవులు నిర్భయులై ఉత్సాహంతో తరువగా పాలవెల్లినుంచి మొదట కామధేనువు ఉద్భవించింది. తర్వాత ఉన్నా॥శ్రవం, ఐరావతం, కల్పతరువు, అప్పరోగణం, చంద్రుడు, పద్మాసన పద్మహస్తతైన లక్ష్మీదేవి, వారుణీదేవి, శ్వేతాంబరధారియైన ధన్వంతరి అమృతపూర్ణకలశంతో ఉద్భవించిన క్రమమిది. క్ష “సిరియు సుధయు. బడయ శ్రీవల్లభుండుదక్క సిద్ధించింది. మంగళపదం లక్షిక్రి నై ఎక్షస్టలంలో చేరడంవల్ల జగత్కల్యాణం జ క్ష్మికి నిరుపాధికం, మంగళదేవతాస్పర్శవల్ల శ్రీవల్లభుడు జగన్మంగళుడయ్యాడు. ణ్‌ లావ

రాఘవీయవ్యాఖ్య ॥ “తవ స్పర్శాదీశం స్పృశతి కమలే మంగళపదం తవేదం నోపాధేరుపనిపతితం శ్రీరసి యతః” (శ్రీగుణరత్నకోశం) ధ్వని గలది ఉత్తమకావ్యం. సంసారమే సముద్రం. కరణకళేబరాది ప్రదానం, శాస్త్రప్రదానప్రయత్నం సముద్రమధనం లాంటిది. “అమృతాక్షరం హరః” నిత్య జ్ఞానానందామలస్వరూపమైన జీవరాశిని అమృతశబ్ధంచేత ఉపనిషత్తు బోధిస్తుంది. సంసారసము[ద్రంనుంచి జీవవర్గాన్ని ఉద్దరించి, ముక్తిని పొందించే నారాయణుని ప్రయత్నమే వ్యంగ్యార్థం. శా భీమూకారవరాహమై భువనముల్‌ ఖీతిల్లి కంపింప ను ద్దా మోర్విం గొనిపోయి నీరనిధిలో దాంగున్న గర్వాంధునిన్‌ హేమాక్షాసురు వీ(కందాకి జయలక్ష్మిన్‌ గారవింపంగ నీ భూమిం దక్షిణదం్ట నెత్తిన నినుం బూజింతు నారాయణా! 13 అర్దం" ఓ నారాయణా! భీమ + ఆకార వరాహమై = భయంకరమైన రూపం గల 'కోడమనై; భువనముల్‌ = లోకాలు, భితిల్లి = భయపడి; కంపింపన్‌ = వణకగా; ఉద్దామ

  • ఉర్విన్‌ = కట్టులేని, సర్వసస్యాఢ్యయైన భూమిని; కొనిపోయి; నీరనిధిలో = సముద్రంల్‌ శ దాగియున్న; గర్వాంధునిన్‌ = గర్వంచేత కండ్డుకనపడని; పామ + అక్ష + అసు చ్‌ జు హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ని; వీశన్‌ = శౌర్యంతో; తాకి = మౌర్కొని; బయల, గౌరవింపంగన్‌ = సంహరించి, విజేతవుగా; ఈ భూమిన్‌ = కనబడుతున్న ఈ భూదేవి; దక్షిణ దంషష్ట్రన్‌ = సమర్థమైన కోర (కొమ్ముతో; ఎత్తిన = ఉద్దరించిన: నినున్‌ = నిన్ను; పూజింతును. తాః ఓనారాయణా! హిరణ్యాక్షుడు గర్వాంధుడు. లోకాలన్నీ వడవడ వణుకుతుండగా సర్వసస్యాలచే ఒప్పియున్న విశాలభూమిని తీసికొనిపోయి సము((్ర లో దాచుకొన్నాడు. అప్పుడు నీవు భయరికరమైన వరాహరూపొన్ని దాల్బావు. ఆరాక్షసుని పోరాడి విజయం షాధించావు. వాడియైన నీ కొమ్ముతో ఈ భూదేవిని ఉద్దరించావు. కాబట్టి నిన్ను సర్వదా పూజిస్తాను. వ్యాఖ్య: నారాయణుడు వరావోవతారుడై. భూమిని ఉద్ధరించాడు. “ట్రీ * (పురుషసూక్తం). 'హ్ర శబ్దం భూవాచకం. ట్ర తే లక్షీ ప రు ౮ సపత్సులైనా జగడమాడరు నారాయణునికి భూదేవి, లక్ష్మీదేవి ఇద్దరు భార్యలు. సపత్నులైనా జ ం భూదేవి అచ్యుతునికి చాలా ప్రియమైనది. అమె విపుల సుఫల. కాబట్టీ మాధవి, ఉర్వి అని భూమికి పేర్చు. లా ళా “విష్ణుపత్నీం మహీం దేవీం మాధవీం మాధవప్రియామ్‌! తవల్తభామ్‌॥” (మేదినీసూక్తం), లక్ష్మీ ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్ల క్త

శ నారాయణ శతకం “త్వన్మయాఒహం త్వదాధారా త్వత్సృష్టా త్వత్సమాశ్రయా। మాధవీమితి లోకోఒయ మభిధత్తే తతో హి మామ్‌॥”(విపు) నేను నీ ఆశ్రితురాలను. నీవు నన్ను సృజించావు. లోకం నన్ను 'మాధవి' అంటుంది. అని భూదేవి జగదాధారుడైన నారాయణుణ్ని స్తుతించిందన్నాడు శ్రీ పరాశరమహర్షి పత్ని పాతాళంలో పడి నికృష్ణదశలో ఉన్నప్పుడు పతి తగినపాటు పడి పల్నిని ఉద్దరించక ఉపేక్షిస్తాడా? బ్రహ్మకు గల నూరుదివ్యసంవత్సరాల అఆయుఃకాలాన్ని “పరి అంటారు. అందులో సగం కాలాన్ని 'పరార్ధం' అంటారు. “నిజేన తస్య మానేన ఆయుర్వర్షశతం స్కృతమ్‌। తత్పరాఖ్యం; తదర్హం చ పరార్హమభిధీయతే “|(వి,పు,) నారాయణుని నాభికమలంనుంచి చతుర్ముఖుడు పుట్టడమూ, తద్ద్వారా పద్మసదృళమైన లోక సృష్టి జధరుగడమూ 'పాద్మ' కల్పవ్యవహారమే. మత్స్య కూర్మావతారాలు పాద్మకల్పంలోనే జరిగినాయి. “ఏకమస్య వ్యతీతం తు పరార్థం బ్రహ్మణోఒనఘ,; తస్యాంతే ఒభూన్మహాకల్ప: పాద్మఇత్యభివిశ్రుతః॥[” “ద్వితీయస్య పరార్దస్య వర్తమానస్య వైద్విజ। వారాహ ఇతి కల్ఫోఒలయం (ప్రధమః పరికీర్తితః[” (వివ) 'పాద్మ మనే మహాకల్పం ముగియడంతో “పరార్టం” గడచింది, “ద్వితీయ పరార్థం' వరాహ కల్పంతో ఆరంభమై ఇప్పుడూ గడుస్తున్నది. సనక, సనంద, సనాతన, సనత్కుమారులు 'బ్రహ్మమానసపుత్రులు, మహాయోగులు. ఒకప్పుడు వారు వైకుంరుని దర్శనార్ధం వెళ్ళారు. ఒక చెక్కగాక రెండు చెక్కలు కలదే 'ద్వారం' అనబడుతుంది. ద్వార పాలకులైన జయవిజయులు ఆ యోగులను లోనికి ప్రవేశింపనీయక తరుమసాగారు. సనక సనందాదులు కామానుజాలయ్యార్లు. “ఊచుః సుహృత్తమదిదృక్షితభంగ ఈషత్‌ కామానుజేన సహసా త్ర ఉపఫ్లుతాక్షా” (భాగ.3-15-32 పురుషోత్తముణ్ని చూచే డింభకుల కోరికను భంగపరచడం వల్ల వారు కన్నెర్రచేసి జయవిజయులను “భగవద్యైరంగల మూడు రాక్షస జన్మలనెత డీ వె గ్రలనత్తండి” అని శపించారు. యోగులను పరాభవిస్తే యోగక్షేమాలుండవు కదా!

రాఘవీయవ్యాఖ్య శం జయవిజయులు మొదట దితిగర్భంలో హిరణ్యాక్షహిరణ్య కశిపులు = కవలలు- గా జన్మించారు. రెండవ జన్మలో రావణకుంభకర్ణులుగా, మూడవ జన్మలో శిశపాల దంతవక్రులుగానూ ('ప్రఖ్యాతులయ్యారు. హిరణ్యాక్షుడు విపులంగా ఉన్న భూమిని చాపను చుట్టినట్టు చుట్టి పాఠరావారంలో పడవేశాడు. నారాయణుడు యజ్ఞవరాహరూపాన్ని దాల్చి, హిరణ్యాక్షుణ్ని వధించి, భూమిని తనవాడికోరతో పైకెత్తినాడని పౌరాణికగాధ. 'ఉపనిషద్వాక్యమూ ఉంది. ఉద్దృతాఒసి వరాహేణ కృష్ణేన శతబాహునా” (తైనా.ఉప.) 'పృధివ్యప్పు లీయతే' ప్రళయంలో నీళ్ళు ముంచుకొని వస్తుంటే భూమి - చాపను చుట్టుతున్నట్టే - కనబడుతుంది. తామసప్రకృతిగల హిరణ్యాక్షునిగా, భూగోళం - బ్రహ్మాండం- వ్యక్తీకరింపబడింది. పునసృష్టియే భూమిని ఉద్ధరించడం. 'అద్భ్యః పృధివీ (ఉప) మాధవుడు, రొంపిలోకి దిగి చరించే సత్వం వరాహం కాబట్టి, రోత యనక రొంపిలోకి దిగి దేహమంతా బురదనీరు కారుతుండగా స్తబ్బరోముడై, దాక్షిణ్యంతో ధరణిని పైకి ఎత్తుకొని రావడం వరాహావతారవైలక్షణ్యం. సనకసనందాది మునులు యజ్ఞనరాహమూర్తిగా స్తుతించారని మిత్రసమ్మితం హృద్యంగా బోధిస్తుందికదా! శా. స్తంభంబందు వృసింహమై వెడలి యచ్చండాట్టహాసధ్వనుల్‌ దంభోళింగడునంగ హేమకశిపోద్దండాసురాధీశ్వరున్‌ శుంభద్గర్భము వ్రచ్చి వానిసుతునిన్‌ శోభిల్ల మన్నించి య జ్ఞంభారాతిని బ్రీతి. దేల్చిన నినుం జర్చింతు, నారాయణా॥ 14 అర్ధం: ఓ నారాయణా! స్తంభంబు + అందు = రాజనగరులోని స్తంభమందు; నృసింహమై = నరసింహనామరూపాలుకలవాడవై; వెడలి = ఆవిర్భవించి; ఆ చండ + అట్టహాస ధ్వనుల్‌ = శౌర్యంతో భయంకరంగా అరచిన అరపులు; దంభోళిన్‌ = పిడుగు (చప్పుడు)ను; కడువంగ = మించగా; హేమ కశిస + ఉద్దండ + అసుర + అధి + ఈశ్వరున్‌ = హిరణ్యకశిపు డనే గొప్పరాక్షసరాజుయొక్క; శుంభత్‌ + గర్భము = శోభించే కడుపును, వ్రచ్చి = చీల్చి; వాని సుతునిన్‌ = అతని కొడుకైన ప్రహ్లాదుణ్ని; శోభిల్లు = 'ప్రకాశించునట్లుగా; మన్నించి = ఉజ్జీవింపదేసి, ఆ + జంభ + అరాతిని = జంభాసురునికి పగవాడైన ఆ దేవేంద్రుణ్ణి: (ప్రీతిన్‌ + తేల్చిన = సంతోషపరచిన; నినున్‌ = నిన్ను; చర్చింతును = స్మరిస్తాను. తా : ఓనారాయణా! రాక్షసరాజభవనమందున్న స్తంభంలోనుంచి నరసింహుడని పేర్కొన. దగిన రూపంతో అవిర్భవించావు. (ప్రచండమైన అట్టహాసద్వనులు పిడుగుచప్పుళ్ళను ఆతిశయించగా హిరణ్యకళిపుడనే రాక్టసరాజు కడుపును చీల్చి

50... . నారాయణ శతకం వేశావు. ఆడహాక్తు ""తనూజుడైన ప్రహ్హాదుణ్సి. అతనిమాట నత్వమయ్యే త్‌తిగా యజైజదిచ్తారా చహడులణ్ణై .వ్రూజాదానలిలి చేతి వంచహివాచదాత్ర.. అట్ట యూ. ఎెల్ర్రావాలాలా స్మరిస్తాను. " వ్యాఖ్య: భగవంతుని అంతర్వ్యాప్తిని ప్రకటించే నరసింహవతారవర్లన., తల్లి! నీసుతుడు హిరణ్యాక్షుడు మహాశూరుడు. ఆయన వియోగానికి ఎందుకు దుఖిస్తావమ్మా? సర్వజ్ఞుడీశుడు, సర్వాత్ముడు, అవ్యయుడు యోగవియోగాలను స కల్సిస్తాడని మాతృమూర్తియైన. దితికి నీతులు చెప్పినవాడు హిరణ్యకశిపుడు. ఇతరులకు బోధించిన నీతిని తమ జీవనరీతిలో పాటించని వారూ అవకాశవాదులూ రాక్షసులేకదా! “నారాయణుండేత ద్విశ్చములోన లే” డని తానేలోకారాధ్యుడని తననే క్రీర్తించుమని సజ్జనులను హింసించిన చండశాసనుడు హిరణ్యకశిపుడు. “త్రిదైస్తి సంధ్యం” అని మాఘకవి చెప్పినట్టు దేవతలు ముప్పాద్దులు సంధ్యావందనంలో చేసే దిజ్బమస్కారాలను మాని వేసి, హిరణ్యకళిపుడేదిక్కున ఉంటే అదిక్కే నమస్కారంచేస్తుండేవారు. ు "పెరటియందు తులసి మొక్కలాగా హిరణ్యకశిపుని పుత్రునిగా జన్మించినవాడు (ప్రహ్లాదుడు. తాను తల్లిగర్భంలో ఉన్నప్పుడు నారదమహర్షి జ్ఞానోపదేశం చేశాడు. | భగవద్భాగవతకథలు వినేగర్భవతులకు సత్సంతానమే కలుగుతుంది. | “ఫ్రహ్లాద నారద పరాశర పుండరీక” అనే భక్తుల ప్రథమపంక్తిలో నారదుడు ద్వితీయుడై. ప్రహ్హాదుడు అద్వితీయుడుగా కీర్తిపబడినాడు. వ అంబుజోదరదివ్యపాదారవిందచింతనామృతపానవిశేషమత్తచిత్తుడు (ప్రహ్లాదుడు. ర్ట 'జీవునికీ, దేవునికీ విడదీయరాని సంబంధం ఉంది" అనే దృఢ మైన అధ్యవసాయంగల పరమభక్తుడు ప్రహ్లాదుడు. | డింభకా! చక్రి సర్యోపగతుడంటున్నావు కదా! ఇందున్నాడా? అని హిరణ్యకశిపుడు (| ఒక స్తంభాన్ని కొట్టాడు. వెంటనే పెళపెళార్భటులతో నిలువున చీలిపోయిన ఆస్తంభంనుంచి నరసింహమూర్తి ఆవిర్భవించాడు. “సత్యం విధాతుం నిజభృత్యభాషితం వ్యాప్తిం చ భూతే ప్వభఖిలేషు చాత్మనః | ” (భా.గ7-8-18) (బ్రహ్మదత్తవరాలకు భంగం కలుగకుండా, భక్తుడైన (ప్రహ్లాదునిమాట | సర్వాంతర్యామిగా సర్వత్ర వ్యాపించినవాడు నారాయణుడు. ఎందువెదకి చూస్తే | అందేఉంటాడన్న మాట - సత్యమని ప్రకటించడానికే అహోరాత్రాలసంధికాలంలో చరాచరవస్తువులలో కేవలం నరసింహమూర్తిగా వ్యాపించి ఉన్నప్పుడు, యాదృచ్చికంగా జడమైన స్తంభమే (బ్రహ్మకు నాయనమ్మయై శోభించింది.

7 ఖ్వ ల న షన న. ళా రాఘవీయవ్యాఖ్య [ యుల! ఆ వ్రరిదావాదా టైంచాదాయాడానా ట్యర్రాన్వుడా మాదొళ్చాంచచాలులు చ వమా టు డాలు వజ్రాల్దాంటి గోళ్ళతో ఉదరాన్ని చీల్చి సంహరించిన దృశ్యాన్ని చూస్తున్న దవతలూ, దేవర్షులూ “అహో బలం! అహోబలం!” అమూర్తిని, స్ఫూర్తిని (ప్రస్తుతించారు. "శీత్తత్తోడరుళ్‌ పెత్తు " - (నమ్మాళ్వార్ల శ్రీసూక్త అన్నట్టూ, ఒక కన్ను హిరణ్యకశిపునిపైన ఆగ్రహాన్ని ప్రస్రవిస్తుంటే, ఆక్షణాననే మరొక కన్ను (ప్రహ్హాదుని మోద అనుగ్రహాన్ని (ప్రస్రవించింది. పోతనకూడా ఇలాగే పెద్ద వచనంలో చివర - “ప్రహ్లాద హిరణ్య కశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీరరససంయుతుండును మహా(్రభావుండును నైన శ్రీ నృసింహదేవుండు”- అన్నాడు. నృసింహతాపిన్యుపనిషత్తు బోధించినట్టు, శరీరసంబంధంలేకుండా జ్యోతిర్మయుడై అంతర్వ్యాప్తిని ప్రకటిస్తూ , స్వయంగా తీక్ష్‌ణదం(ష్టలతోనూ, వజ్రనఖాలతోనూ, భీషణ సటా పటలంతోనూ, సరభసొట్టహాసంతోనూ ఆవిర్భవించిన వైకుంఠ కంరీరవుడు భక్తులను విలక్షణంగా కటాక్షించి, తన దివ్యరూపాన్ని ప్రదర్శించాడు.

(ప్రహ్హాదవరదుడైన నరసింహస్వామి కృపవల్లనే, హిరణ్యకశిపుని వధానంతరం,

జంభారాతియైన దేవరాజు నిర్ఫీకుడై మళ్ళీ స్వారాజ్యాన్ని ఏలుకొన్నాడు.

నృసింహావతారం కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నా అఘటిత ఘటనకు

('ప్రధమోదాహరణం అయింది. దేవుడు సర్వాంతర్యామి అని నిరూపించే సామర్థ్యం

జీవునికి ఉన్నదని ప్రకటించింది. సాధు పరిత్రాణమే ముఖ్య ప్రయోజనం,

దుష్కృద్వినాశనం ఆనుషంగికమనీ స్పష్టపరచింది. వైదికులు ప్రతి త్రయోదశినాడు

(ప్రదోషకాలంలో మౌన(వ్రతాన్ని పొటిస్తూ శ్రీ నృసింహస్వామిని ధ్యానిస్తారు.

“ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌। నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహమ్‌”

అనే శ్లోకాన్ని మాన్యులూ, సామాన్యులూ శుచిర్భూతులై సర్వదా పఠించడం

సంసారతరణోపాయం.

మ. మహియున్నాకనముం బద ద్వయపరీమాణంబుగాంబెట్టి యా గ్రహమొప్పం బలి మస్తకం బొక పచగ్రస్తంబుగా - నెమ్మితో విహరిం వింద్రవిరించిశంకర మహావిర్భూతదివ్యాకృతిన్‌ సహజంబై విలసీల్లు వామనలసచ్చారిత్ర నారాయణా ॥ కే

అర్థం: ఓనారాయణా! మహియున్‌ = భూమియు; అకసమున్‌ = ఆకాశంకూడా; పదద్వయపరీమాణంబుగాన్‌ = రెండడుగుల కొలతకు సరిపోవునట్టుగా; ఆ(గ్రహము =

ర్‌2 నారాయణ శతకం కోపము; ఒప్పన్‌ = ఒప్పునట్టుగా; బలిమస్తకంబు = వైరోచనునితల; ఒక పద'(గ్రస్తంబుగా = ఒక అడుగుచే ఆక్రమింపబడినట్టు; పెట్టి; నెమ్మితో = సంతోషంతో; విహరించి, లీలగా గ్రహించి; ఇంద్ర, విరించి ,శంకర, మహావిర్భూత దివ్య+ఆకృతిన్‌ = శతమఖుడు, చతుర్ముఖుడు, పంచముఖుడు. గొప్పగా ఆవిర్భవించి, ఆ(ప్రాక్సృతమైన ఆకారంతో; సహజంబై = స్వాభావికమై; విలసిల్లు = శోభించే. వామన = పొట్టి అందగాడా! లసత్‌+చారిత్ర = సొబగైన చరిత్ర కలవాడా! తాః ఓ నారాయణా! ఒక అడుగును నేలకొలతకూ, రెండవ అడుగును నింగిని కమ్ముకొన్నట్టు, మూడవ అడుగును బలిచక్రవర్తి శిరస్సును కోపందీర కప్పివేయునట్టు పెట్టి, నెమ్మదిగా విహరించావు. నాకేశుడు, సత్యలోకేశుడు, భూతేశుడు ఆవిర్భవించిన నీ దివ్యరూపం సహజమై వెలసింది. నీ చరిత్ర బ్రహ్మాండమంత (ప్రకాశించింది. వ్యాఖ్య : త్రివిక్రమావతారంగా పర్యవసించిన నామనావతార్రాళస్త్యమిది. మహాబలి దేవరాజును (త్రోసివేశాడు. మూడులోకాలకు తానే అధిపతి అయ్యాడు. ఇం(ద్రుని కష్ట నష్టాలను చూచిన తల్లి (అదితి) కడుపు చుమ్మలు చుట్టుకొంది. భర్త - కశ్యప బ్రహ్మ - చెప్పిన రీతిగా పండ్రెండు రోజులు అదితి క్షీరవ్రతనిష్టతో భగవంతుణ్ణి ధ్యానించింది. నారాయణుడు (ప్రత్యక్షమయ్యాడు. బద్దాంజలియై స్తుతించి తనకొరతను విన్నవించింది. “నేను నీకు కుమారునిగా జన్మిస్తాను. బలిమిన్‌ దైత్యుల జంపరాదు. వినయోపాయాలతో వారి రాజ్యాన్ని హరించి ఇం(ద్రునికిస్తాను. దుఃఖపడకు” మని అంతర్హితుడయ్యాడు భగవానుడు. కొంతకాలానికి అదితినోములపంటగా, ఇం(ద్రునికి తమ్ముడుగా వామన మూర్తి అవతరించాడు. వామనుడు మరుగుజ్జు అయినా చాలా అందగొడు. ఆయన మాటలూ, చేష్టలూ అద్భుతరసానికి ఆటపట్టులయ్యాయి. తన స్వరూపంచేత రక్షించే తనసొత్తును, మరొకడు జగ(త్రయీభువనశాసనకర్త నని మమకారంతో అభిమానిస్తున్నప్పుడు అతనిని దండించి, స్వాధీన పరచుకోవడం న్యాయమే. కాని మహాబలి “నానా మఖ [వ్రతదానప్రవణానువర్తి సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తి'కదా! “యజ్ఞో వై విష్ణుః” (శ్రుతియజ్జపురుషుడైన తనను యజ్ఞ విధానంతో ఆరాధిస్తున్న వాడే కదా! అడిగిన వస్తువును లేదనకుండా మిడుకకుండా దానంచేస్తే యజ్ఞఫలం లభిస్తుంది. 'మహియున్నాకసముం బదద్వయ పరీమాణంబుగా, బలిమస్తకంబొక పద(గ్రస్తంబుగాం బెట్టి' - అనే మాట క్రియాసాపేక్షకమై అర్హశక్తిభరితమయింది. “నాకు నొకటీ రెండడుగులమేరయిమ్ము - కోర్కెదీర (బ్రహ్మకూకటి ముట్టెద” (భాగ) అని

రాఘవీయవ్యాఖ్య వ! పోతన రచన, రెండింటిలోనూ త్రివిక్రమస్ఫురణ ప్రతీతమవుతున్నది. పోతన మాటలో తెలుగునుడికారపుసాంప్పు, శబ్దశక్తి పెంపు, ఇంపుగా ఉంది.

సంస్కృత భాగవతంలో - ద్వితీయస్కంధంలో - క్ష్మాం వామనేన జగ్బహే త్రిపద చృలేన” అని ఉంది. “బలిం ఛలయతే” అన్నాడు గీతగోవిందకర్త.

“ఏకక్రియా ద్వ్యర్థకరీ” అన్నట్టూ మూడులోకాలకు శాసకుడైన బలిని మూడడుగునేల నిమ్మని యాచించాడు. “తూలాదపి చ యాచకః” అన్నట్టూ, యాచకుడు దూదికన్న తేలిక, చులకనైనవాడు. ఇది పొట్టి వడుగు రూపంలో స్పష్టంగా కనబడుతూనే ఉంది. యాచ్చాఫలం అమోఘం. దాతకు యజ్ఞఫలాన్నీ, ప్రతిగ్రహీతకు అభీష్టసిద్దిపథకాన్నీ ఆచరణలో పెట్టాడు వామనుడు. దానవులకు ఆచార్యుడైన శుక్రాచార్యులు 'నీ సంపదనపహరింప వచ్చిన మాణవకుడు విష్ణుమూర్తి కాబట్టి దానమీయకు మని బోధించినా, సత్యవర్తనుడై బలి ధరణిని దానమిచ్చాడు.

దానజలధార నేలమీద పడడమే తడవుగ్మా వామను డింతింతై బ్రహ్మాండాంతసంవర్రి అయ్యాడు.

భూమ్యాకాశాలు రెండడుగులచే విక్రాంతాలైలే, మూడవ అడుగుకు స్టలమేది? అని అడిగాడు త్రివిక్రముడు. “ప్రాప్తనిగ్రహమునకు వెరవ' నన్నాడు బలి. వెంటనే దాన వీరానికి పరాకాష్టగా “నీ తృతీయ పదము నిజము నాళిరమున, నెలవుసేసి పెట్టు నిర్మలాత్మ” అంటూ తన తలను వంచాడు. 'ఆగ్రహమొప్ప' బలితలమీద అడుగు పెట్టి సుతలానికి పంపాడు.

బలిచక్రవర్తి దాతృత్వబలంతో “శ్రీపతికరంబు క్రిందగుట మీ( దైనాకరం బుంట మేల్లాదే” అంటూ అహంకరించాడు. కాబట్టి తానే క్రిందికి నెట్టబడినాడు.

“ఒక పదంబుక్రింద నుర్వి పద్మమునంటికొనిన పంకలవముకొమరు దాల్బె | నొకటి మీద తమ్మికొదిగిన తేటినా వెలసె మిన్ను” అన్నాడు పోతన.

రెండవపాదం సత్యలోకంలో చేరినప్పుడు (బ్రహ్మ, ఇదే తనపుట్టిల్లని ఆబ్బహత్సాదాన్ని అత్యాదరంతో ధర్మతీర్ధాలచేత అభిషేకించాడు.

“విష్ణు పదే పరమే మధ్వ ఉత్స” క్రుతి.

మనోజ్ఞమైన ఆపాదపద్మంనుంచి (స్రవించిన మధుధారలు ఆధర్మతీర్థాలతో కలిసి “విను వీథిన్‌ ప్రవహించె దేవనదినా విశ్వాత్ముకీర్రిప్రభన్‌ ” (భాగ)

ఆకాశానికెత్తిన పాదం ధ్వజమై, మందాకినీ సలిలం రెపరెపలాడే ధ్వజపటమై, బలిచక్రవర్తి బౌదార్యాన్ని ఊర్హ్యలోకాల్లో ప్రకటించడానికి ఎత్తిన పతాకగా ఉన్న దన్నారు దేశికులు.

ర్‌డ నారాయణ శతకం పరత్య్వాన్ని మరుగుపరచి సౌలభ్యమే ప్రకాశించే విధంగా వామనుడై అవతరించినా, లోకాలూ, లోకేశులూ ఆవిర్భవించిన అప్రాకృతమైన ఆకారం - తత్రివిక్రముడై (బ్రహ్మాండమంతా నిండిన స్వరూపం - బహిర్వ్యాప్తిని (ప్రకటిస్తూ సహజమై విలసిల్లింది. “తిరిత్యేవం త్రయో వేదాః కీర్తితా మునిసత్తమైః | 'క్రమతే తాన్‌ తథా సర్వాన్‌ త్రివిక్రమ ఇతి స్పృతః॥ అనే నిరుక్త రీతిగా, మూడువేదాలలో వ్యాపించి. ఉన్న వాడు త్రివిక్రముడు. “మధ్యే కదా తు న విచక్రమిషే జగచ్చేత్‌ త్వద్వి[క్రమైః కథమివ శ్రుతి రంచితా స్యాత్‌" (అతిమానుషస్తవం) స్వామి, మధ్యన ఒకప్పుడు ఈలోకాలను భిక్షావ్యాజంతో కొలువకపోతే వేదం నీ విక్రమాలచే ఎలా పూజింపబడుతుంది? అన్నారు శ్రీనవత్సాంకమి[క్రులు. అనేక విషయాలను చెప్పి ఎంగిలినోరైన వేదం భగవంతుని వి[క్రమాలను ప్రశంసించి పవిత్రం కావడానికే మూడడుగులచే ముల్లోకాలను కొలిచాడు. “విష్ణోః కర్మాణి పశ్యత్త యతో (వ్రతాని పస్సశే, ఇంద్రస్సృయుజ్య స్సఖా"ఇండద్రుని తోబుట్టువు ఉపేంద్రుడు. ఆయన నియమాలను చూచాను. మీరు ఆ విష్ణువు చేష్టలను చూడండి అన్నది వేదం. “య; పార్టివాని విమమే రజాంసి, . యోజస్కభాయత్‌ ఉత్తరం సదస్టం విచక్రమాణ (స్తేధోరుగాయః:” (బుగ్వేదం). గొప్ప ఆకారంతో విష్ణుమూర్తి పృథివికి సంబంధించిన పదార్జాలన్నీ ఒక్క అడుగుక్రింద ఇమిడే విధంగా కొలిచాడు. రెండవ అడుగును ఆకాశానికెత్తి అట్టను అతికించినట్టు కొలిచాడు. త్రివీక్రముడు. “"యస్యోరుషు. త్రిషు విక్రమణేషు, అధిక్షియంతి భువనాని విశ్వా” 'పాదాభిమానిమైన త్రివ్నిక్రముని అడుగులక్రింద అఖిలభువనాలు విలసిల్లాయి." అన్నది 'విష్ణుసూక్తం'. “చరణం పవిత్రం వితతం పురాణం యేన పూత స్తరతి దుష్కృతాని” అన్నట్టూ, వామన చరిత్ర అధ్భుతంగా కోభించింది. వామనుడు, త్రివిక్రముడై తన పాదము(ద్రను చిన్న - పెద్ద అనే భేదం లేకుండా ఒక్కఅణువునైనా వదలక, చీమ మొదలుకొని సత్యసీమాధిపతి వరకు, సమస్త వస్తువులమీద మృదువుగా ముద్రించి సర్వం శ్రీవైష్ణవం అని సైద్దాంతికంగా ఆచరించి (ప్రచారం చేశాడు. కాబట్టి 'అసచ్చారిత్రుడు'.

రాఘవీయవ్యాఖ్య ర్‌5్‌ మ. ధరణిన్‌ రక్తముహాహ్రదంబులెలమిం దైలోక్యనిర్పిష్టమై పరగం బైళృకతర్పణంబుకొణకై ప్రఖ్యాతిగాందీవ్రతన్‌ నిరువ య్యొక్కటి మారు క్షత్రవరులన్నేపార నిర్దించి ఈ త్పరశుభ్రాజితరానునానుము. కడున్‌ ధన్యంబు నారాయణా॥ 16 అర్థం: ఓనారాయణా! తీవ్రతన్‌ = ఉద్వేగంతో; ఇరువయ్యొక్కటి మారు = 21 సార్టు; క్షత్రవరులన్‌ = రాజప్రముఖులను, ఏపార = విజృంభణంగా, నిర్జించి = సంహరించి: పైతృక తద్పణంబుకొరకై = తండ్రి ఆత్మకు తృప్తి కలుగడంకోసం; ఎలమిన్‌ = వికాసంగా; ధరణిన్‌ = భూమియందు; రక్తమహాహ్రదంబులు = పెద్ద నెత్తురు మడుగులు; ప్రఖ్యాతిగాన్‌ = ప్రసిద్దిపొందగా; (్రైలోక్యనిర్దిష్టమై = ముల్గోకాలచే నిక్టేశింపం (్రేలెత్తి చూప) బడినదై; పరగన్‌ = ఒప్పగా; తత్‌ పరశుబ్రాజిత రామనామము = (రాజులను సరికిన) ఆ గండ్ర గొడ్డలిచే బాగా ప్రకాశించిన పరశురాముడు” అనే పేరు; కడున్‌ = మిక్కిలి; ధన్యంబు = కృతార్హమైనది. తావ ఓ నారాయణా! క్షత్రియసంబంధమైన ఉద్వేగంతో పరశురాముడు ఇరువయ్యొక్క సార్టు తిరిగి తిరిగి రాజులను సంహరించాడు. ఆ రాజుల రక్తంతో తండ్రికి తర్పణం విడువడానికి నేలమీద తొమ్మిది నెత్తురు మడుగులను ఏర్పరచాడు. ఈ కార్యం జగ(త్రసిద్ధమయింది. క్షత్రియులను నరికిన పరశువును - గండ్రగొడ్డలిని

  • ధరించినందువల్ల 'పరశురాము' డనే పేరు ధన్యమయింది. వ్యాఖ్య ; పరశురామావతార ప్రవృత్తి వర్షితం. బుచీకుడు భృగువంశోద్భృవుడైన మహాముని. ఆయన పత్ని గాధిరాజు పుత్రిక మైన సత్యవతి. ఆమె తనకూ తన తల్లికీ పుత్రులు కావాలని భర్తను వేడుకొన్నది. బుచీకుడు. రెండు వేర్వేరు మంత్రాలతో వేల్చించిన రెండు చరుపాత్రలను సిద్దంచేసి, మాధ్యాహ్నికస్నానానికి వెళ్ళాడు. పతి వచ్చేలోపల సత్యవతి (బ్రహ్మమంత్రసిద్ధ చరుపాత్రను తల్లికిచ్చింది. తాను క్షాత్ర మంత్ర సిద్దచరువును భక్షించింది. బుచీకుడు గమనించి తన భార్యకు (క్రూరుడైన కొడుకు పుడతాడని, అత్తకు (బ్రహ్మవిదుడు పుడతాడని తెలిపాడు. సత్యవతి తన కొడుకు సాధువై ఉండాలని పతిపాదాలు పట్టుకొంది. సరె! నీ కొడుకు సాధువ్హై నీమనుమడు తీభ్ర స్వభావుడవుతాడని అనుగ్రహించాడు. తత్చలితంగా సత్యవతికి జమదగ్ని పుట్టాడు. ఆమెళల్లికి విశ్వామిత్రుడు జన్మించాడు. జమదన్నికి రేణుకయందు భార్గవరాముడు క్షత్రియతేజస్సుతో జన్మించాడు. 'హైహయాధీశుడైన కార్తవీర్యార్టునుడు దత్తాత్రేయుని పూజించి సహ్రబాహుడైై సూర్యుని లాగా వెలిగాడు. ఆరాజు వేటకు పోయినప్పుడు జమదస్లి ఆశ్రమానికి

కర నారాయణ శతకం వెళ్ళాడు. అలసిపోయిన రాజుకూ, అతని అనుచరులకూ జమదగ్ని హోమధేనువు ద్వారా ఇష్టాన్నాలను కురిపించి అతిధ్యమిచ్చాడు. రాజు ధేనువును ఒంటికంటితో చూచాడు. అసూయ సర్వానర్థకంకదా! ఆహోమధేనువును బలాత్కారంగా హరించి రాజు మాహిష్మతీపురానికి చేరుకొన్నాడు.

ఆగ్రమానికి వచ్చి హోమధేనువు లేమిని గమనించిన భార్గవరాముడు కురారఖీముడై పోయి కార్తవీర్యార్టునుణ్ని చిత్రవధచేశాడు, తమ తండ్రిని చంపిన రాముడు లేని సమయాన కార్తవీర్యునిపుత్రులు వచ్చి ధ్యానమగ్నుడైన జమదన్నితలను నరికి వెళ్ళారు.

“మహారాజును చంపినపాపం పోవడానికి నిన్ను తీర్ణయాత్రకు పంపిన నీ తండ్రిని వైరంతో ఆరాజకుమారులు చంపిపోయారు రామా!” అని తల్లి రేణుక ముయ్యేడు (3౫౫2పే మారులు రొమ్ము బాదుకొంటూ ఏడ్చింది. ఊగ్రుడైన జామదగ్య్యుడు (బ్రహ్మఘాతకులైన ఆరాకుమారులందరినీ గండ్రగొడ్డలిచే నరికి వేశాడు. జగతిలో దుష్టప్రవృత్తిగల రాజులను ఇరువైయొక్క మార్దు వెదకి వెదకి వధించాడు. వారిరక్తంతో తన తండ్రికి తర్పణం విడిచాడు.

శమంతక పంచక మనే ప్రదేశంలో రాజులరక్తపుటేరులతో తొమ్మిది మడుగు లేర్పరచాడు. తండ్రి తలను మొండెంతో సంధించి గొప్ప యాగం చేశాడు. హోతకూ, బుత్విక్కులకూ భూమిని దానం చేశాడు; పిత్తాణం తీర్చుకొన్నాడు పరశురాముడు.

అంతరిక్షంలో జమదగ్ని సప్తర్షిమండలంలో సప్తముడుగా (ప్రకాశిస్తున్నాడు. (ల్రేతాయుగంలో సీతారాముల కల్యాణానంతరం శ్రీరాముని శక్తిని పరీక్షించడానికి తన ధనుస్సు నిచ్చాడు. పరశురామునినుంచి అందుకొన్న విల్దుతోపొటు, అతని యందావేశించి యున్న వైష్ణవ తేజస్సును శ్రీరాముడు పరి[గ్రహించాడు.

“అక్షయ్యం మధుహంతారం జానామి త్వాం సురేశ్చరమ్‌” (రామాయణం).

'ఓరామచంద్రా! నీవు మధుసూదనుడవు, పరమాత్ముడవని (గ్రహించాను; అని స్తుతించి నర్వశక్తులుడిగి సామాన్య మానవుడైపోయిన పరళురాముడు మహేం(ద్రపర్వతంమీద తపోధనుడై వెలిగాడు.

డనే పేరుగాంచి ధన్యుడయ్యాడు. నారాయణుని అవేశావతారుడు పరశురాముడు,

రాఘవీయవ్యాఖ్య ర్‌7 మ. వరుసం దాటకిజంపీ కౌశికు మఖస్వాస్ట్యంబు గావించి శం కరుచాపం బొగి. ద్రుంచి జానకి(దగం గల్యాణమై తండ్రి పం పరు దారన్‌ వనభూమి కే(గి జగదాహ్లాదంబుగా రావణున్‌ ధరణిం గూళల్చిన రామనామము కడున్‌ ధన్యంబు నారాయణా ॥ 17 అర్థం: ఓ నారాయణా! వరుసన్‌ = క్రమంగా; తాటకిన్‌ = ఆపేరుగల రాక్షసిని; చంపి; కౌళికు = విశ్వామిత్రునియొక్క; మఖ స్వాస్ట్యంబున్‌ = యజ్ఞ రక్షణను; కావించి= చేసి; శంకరు చాపంబు = శివుని ధనుస్సును; ద్రుంచి = విరిచి; ఒగిన్‌ = వరుసగా; జానకిన్‌ = జనకరాజు పుత్రిని (సీతను); తగన్‌ = యోగ్యంగా: కల్యాణమై = పెండ్లాడి; తండ్రి పంపు = పి(త్రాజ్ఞ;ః అరుదారన్‌ = నెరవేరునట్టుగా; వనభూమికి = అడవికి; ఏగి = సోయి; జగత్‌+ఆహ్ల్హాదంబుగా = లోకరంజకంగా; రావణున్‌ = లంకాధిపతిని; ధరణిన్‌ కూల్చిన = నేలగూల్చిన (చంపిన); రామనామము = రాముడనేపేరు; కడున్‌ = మిక్కిలి; ధన్యంబు = సంపత్కరమైనది. తా; ఓనారాయణా! శ్రీరాముడు తాటకిని చంపొడు. వరుసగా విశ్వామిత్రుని యాగాన్ని సంరక్షించాడు. శివధనుస్సునూ విరిచాడు. జానకిని పరిణయమాడాడు. తండ్రి ఆజ్ఞను పాటించి అడవికేగి లోకం సంతోషించేరీతిగా రావణుణ్ని సంహరించాడు. ఆరాముని పేరు సంపత్కరమయింది. వ్యాఖ్య : శ్రీరామావతార ఉదంతమిది. “నృసింహరామకృష్ణేపు షాడ్గుణ్యం పరిపూరితమ్‌” నరసింహ రామ కృష్ణావతారాలు పూర్జావతారాలని విజ్ఞులమాట. సూర్యవంశపురాజైన దశరథుడు పుత్రకామేష్టి చేశాడు. యజ్ఞపురుషుడిచ్చిన పాయసాన్ని తన ముగ్గురు పళ్ళులకు లక్షణంగా పంచి ఇచ్చాడు. నారాయణుడు. నిజాంశతో నాలుగు విధాలుగా అవతరించాడు. కాసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. కైకేయి దశరథునికి చిన్న భార్య. కొడుకులకు మధ్యమాంబ. సౌమిత్రులిర్వురిలో పెద్దవాడు పెద్దన్న తోనూ, చిన్నవాడు చిన్నన్నతోనూ జతగా పెరిగారు. విశ్యామిత్రమహర్షి తన యాగరక్షణకోసం శ్రీరాముణ్ని తన వెంట పంపుమని అడిగినందువల్ల దశరథుడు కులగురువైన వసిష్టుని అనుమతితో రామలక్ష్మణులను మునివెంట పంపాడు. దారికి అడ్డం వచ్చిన తాటకి అనే మహారాక్షసిని శ్రీరాముడు విశ్వామిత్రుని ఆజ్ఞాప్రకారం చంపి వేశాడు. మహర్షి రాకుమారులకు అస్త్ర శస్త్రవిద్యలను బోధించాడు. యాగానికి అంతరాయం కలుగకుండా తాటకీ తనయులైన సుబాహుణ్ని

56 నారాయణ శతకం బుగ్గిచేశాడు. మారీచుణ్ల్నీ దేశాంతరానికి ఎగుర గొట్టాడు దాశరధి. కౌశికుడు, యజ్ఞాన్ని యధావిధిగా పూర్తి చేశాడు.

“అరక్షన్మునీంద్రం 'క్రతో రంతరాయా

దఖండీచ్చ చండీశకాండాసనం యః॥”

రామలక్ష్మణులు మునివెంట మిధిలానగరానికి వెళ్ళారు,

“వత్స రామ ధను; పశ్య” అన్న విశ్వామిత్రుని మాటను పాటించి, శివుని వింటిని విరిచి, శ్రీరాముడు సీతమ్మను వైభవంగా వివాహమాడాడు.

కైకేయికి వరాలిచ్చిన తండ్రిని సత్యవంతునిగా చేయడానికి శ్రీరాముడు సీతాలక్ష్మణులతో వనవాసం చేశాడు. అక్కడ మహర్షుల గోడు విన్నాడు. సత్యం ధర్మం అనే రెండు పాదాలతో సంచరించాడు. లోకకంటకుడైన దశకంరుని కంర దళకాన్ని లుంరనంచేసి వైకుంఠానికి పంపి, జగత్తుకు ఆహ్హాదం కలిగించిన రాముడు సకల గుణాభిరాముడు.

భావనాసిద్ధమైన మనుష్యత్వమందు స్వాభావికమైన పరత్వాన్ని అభిమానించిన మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు. మహర్షిసేవచేస్తూ తమోగుణాన్ని నిరసించాడు. యాగరక్షణతో సత్వగుణాన్ని సమృద్ధపరచి, వైదేహికల్యాణానికి సిద్దమైన భద్రమూర్తి చండీశకాండాసనాన్ని ఇండించకలిగాడు. ఖండన (ప్రక్రియ హృదయంగమం,

'శివచాపం' పవిత్రమైన, వేదవేద్యుని వాచకమైన (ప్రణవమే,

“తస్య వాచకః 'ప్రణవ౯గ *ప్రణవో హి ధనుః అనే వాక్యాలు (ప్రామాణికాలు.

హస్తంతో లస్తకం పట్టి ఎత్తడమే కల్యాణం. ఈ ప్రక్రియ, భారాన్ని మోయనూకలడు,

ల్లు | |. తనచేతిలోనే ఉంది. ఇది అకారం. “అకారేణోచ్యతే విస్తు ది మి అర్హం.విడిపోయిన క్రింది ముక్క మకారం. ఇది

వాచకం. “మకా 1” స అత్యంతాభవంక మండా దట లే న్నన “షం మ్నది వాం కదా! ఈ గుణం - పురుషకారం = తో శోభించే లక్ష్మీకవ ర్ట శన రమోచ్యతే" 0. “ఉకారేణ

అ, ఉ, మ్‌ = (మ్‌. ఓంకారలక్షణలక్షితం సీతారామకల్యాణం,

దేహాన్ని అభిమానించక, కర్మజ్ఞానానుష్టానపరుడైనవాడ్తు జనకుడు, అతడు విదేహుడు. అతడు కన్నక్తీర్తి జానకి, అద్రి అప్రమేయమైన వైష్ణవతేజస్సు, “అప్రమేయ హ్‌ తత్తేజః యస్యసా జనకాత్మజా”, . ౦

రాఘవీయవ్యాఖ్య 59

బాలరాముని దెబ్బతిన్న మారీచుడు రావణునికి చెప్పిన హితవాక్యమిది. రాముడు మూర్తీభవించిన ధర్మమే. “రామో విగ్రహవాన్‌ ధర్మః” అన్నాడు. ధర్మమంటే ధనుస్సు. ధనుస్సు ఓంకారమే. అది కేవలం “ద్రష్టవ్యశ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యః” - అన్నట్టు బృహదారణ్యకం లోనే చూడదగినది.

“అగ్రే ప్రయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా।

పృష్టతశ్చ ధనుష్పాణిః లక్ష్మణోనుజగామ హః” (రామాయణం)

శ్రీరాముడు ముందు, సీత మధ్యన, తర్వాత లక్ష్మణుడు, ఇలా ఓంకారమే రూపందాల్చి అడవిలో సంచరిస్తుండగా చూచిన వాల్మీకి హ'అని చకితుడయ్యాడు,.

“*అ(గ్రతస్తే గమిష్యామి” రాయి రప్ప, రెల్హు ముల్లు రాముని పాదాలకు తగులకుండా, దారిని సుగమంచేస్తూ తానే ముందు నడువగలనని చెప్పిన రీతిగానే సీతమ్మ రామునికంటె ముందే లంకకు చేరుకొంది.

“నా(గ్యహతస్య లోకోల౭స్తి”

“యశ్చ హంతి ద్విజన్మానం యశ్చ విప్రేణ హన్యతే।

తావుభావధమౌ జ్లేయౌ పరలోకపరాజ్ముఖా॥

బ్రాహ్మణుణ్ణే చంపిన వానికీ (బ్రాహ్మణునిచే చంపబడిన వానికీ = ఇద్దరికీ - సద్గతి లేదని శాస్త్రం చెబుతుంది. బ్రహ్మపుత్రుడైన పులస్త్యునివంశంలో పుట్టిన రావణుని చేత హింసింపబడినవాఢు జటాయువు.

మిరు సీతను చూచారా? తెల్పండి అని రాముడు అడవుల్లో తిరుగుతూ దుఃఖించడం మానుషకృత్యంకాదా! సీతపోయినదారి తెలియని ఆరాముడు అధికారంలేని ఒక తిర్యక్‌ జంతువు - జటాయువు-కు. “గచ్చ లోకాన్‌ అనుత్తమాన్‌” = “ఉత్తమోత్తమలోకాలకు పొమ్మని మోక్షమార్లాన్ని చూపడం అతిమానుషకృత్యమేకదా!

“నానా విష్ణుం మోక్షదో నాస్తి దేవః” శ్రీమహావిష్ణువుతప్పమోక్ష మిచ్చే దేవుడు లేడు.

“అప్పు ప్లవంతి పాషాణాః మానుషా ఘ్నుంతి రాక్షసాన్‌!

కపయః కర్మ కుర్వంతి కాలస్య కుటిలా గతిః”

రాళ్ళు నీళ్ళల్లో తేలడం, మనుష్యులే రాక్షసులను చంపడం, కోతులు ఆర్జవంతో పనులుచేయడం ఆళ్ళర్యంగా ఉందే! ఇది కుటిలగతిగల కాల ప్రభావంకాక మరేమి? లోక్రవ్యవహారమంతా తారుమారుగా కనబడుతున్న దనుకొన్న రావణుడు, నిర్భీకుడై రామునితో యుద్దానికే తలపడ్డాడు. “గగనం గగనాకారం, సాగరః సాగరోపమః రామరావణయోర్యుద్దం రామరావణయోరివ"”. (రామా)

650 నారాయణ శతకం గగనానికి గగనమే, సాగరానికి సాగరమేసాటి. రామరావణులయుద్దం రామరావణులలాగా అనన్యంగానే ఉంది అన్నాడు వాల్మీకి, ఆమోధ్యలో మొలచిన గరికితోపాటు చరాచరపదార్జాలను తన వెంట వైకుంఠానికి తీసుకొని వెళ్ళిన పరంధాముడు శ్రీరాముడు. రాముని ఘనకార్యాలన్నీ ఆకాలంలో ఉన్నవారికి ఉపయోగపడినవే. కాని తమకు ఎవణసము[ద్ర తరణానికి హేతువైన సేతువు, ఎల్లకాలం సర్వజనులకు సంసార సముద్రతరణానికి హేతువవుతున్నది కదా! “సీత్రుం దృష్ట్వా సముద్రస్య (బ్రహ్మహత్యాం వ్యపోహతి” సేతువును చూస్తే (బ్రవ్మావాత్యలాంటి (కూర పాపాలుకూడా పంచబంగాలమవుతాయి. “యత్సురా పాపదశకచ్చేదసాధనతాం గతః 1 ససేతు ర్నకథం శక్త పాపపంచకభంజనే॥”(వి.గు.చంపువు) పదిపాపాలను (దశకంరుని) కూల్చడానికి సాధనమైన ఆరామసేతువు ఐదు పాపాలను - పంచమహాపాతకాలను తాలగింపజాలదా! అని చమత్కరించాడు విద్వత్కవి వేంకటాద్వరి, “తం వీక్ష్య సేతుమధునాఒపి శరీరవంతః స్వే షడూర్మి బహుళం జలధిం తరంతి” అన్నారు దేశికులు. శరీర ధారులెల్లరు ఈనాటికి కూడా సేతువును దర్శించి, గర్భంలో ఉండడం, పుట్టడం, పెరుగడం, మారడం, తరుగడం, నశించడం అనే ఆరుతరంగాల బాహుళ్యంగల సంసారసము(ద్రాన్ని తరిస్తున్నారు. భగవద్గీత లక్షణ (గ్రంథం. రామాయణం లక్ష్య[గ్రంధం. “జన్మ కర్మ చ మే దివ్యం” అన్నట్లు మాయామానుష విగ్రహుడైన రాముని దివ్య చేష్టలను తెలుసుకొంటే శ్రేయస్కరమనడం నిర్వివాదాంశం. కాబట్టీ రాముని నామం ఇంకెంతో ధన్యమైనది. మధురమైనది, ము. యదునంశంబున గృష్టుక[గ్రజు(డవై యాఖభిలశౌర్యోన్నతిన్‌ నుదవద్ధేనుకముపష్టికాద్యసురులన్‌ మర్దించి లీలారసా స్పదకేళీరతి రేవతీనదవకంజాతాంతభృంగంబనన్‌ విదితంబౌ బలరానుమూర్తి వని నిన్‌ వీక్షింతు నారాయణా॥ 18 అర్థం: ఓ నారాయణా! యద్యువంశంబునన్‌ = యాదవకులమందు; కృష్ణుకు = శ్రీకృష్ణునికి; ఆ(గ్రజుండవై = ముందు పుట్టినవాడవై; అన్నవై: ఆభీలశౌర్య+ఉన్నతిన్‌ = భయంకరమైన శూరత్వపుగొప్పతనంచేత; మదవత్‌+ధేనుక, ముష్టిక+ ఆది+అసురులన్‌ =

రాఘవీయవ్యాఖ్య 61 మదం కలిగిన ధేనుకుడు, ముష్టికుడు మొదలైన రాక్షసులను; మర్చించి = సంహరించి; లీలారస+ఆస్పద కేళీరతి = శృంగార రసానికి స్థానమైన ్రీడానందమందు; రేవతీ వదన కంజాత+అంత భృంగంబు+అనన్‌ = రేవతీ దేవి ముఖమనే కమలకర్షిక యందున్న తుమ్మెద యో అన్నట్టు; విదితంబు+బొజ తెలియబడుతున్న; బలరామమూర్తివి, అని; నిన్‌ = నిన్ను; వీక్షింతును = దర్శింతును.

తాః ఓనారాయణా! యదువంశమందు కృష్ణునికి ముందు జన్మించి అన్నవయ్యావు, భీతిగొల్చే మహాశౌర్యంచేత, మదించిన ధేనుకాసురుణ్ని, ముష్టకాసురుళ్న్ని, ఇకా రాక్షసులనెందరినో నేలమట్టం చేశావు. శృంగార[్రీడయందు రేవతీముఖకమల మందలి కర్షికయందుండే తుమ్మెదవో అన్నట్టు విదితమవుతున్న బలరామమూర్తి వని నిన్ను దర్శనం చేసుకొంటాను.

వ్యాఖ్య : బలరామానతార (ప్రశస్తి ఇదె.

భారతం దశావతారాలను “మత్స్యః కూర్మో వరాహశళ్ళ నారసింహళశ్ళు వామనః రామో రామశ్చ రామళ్ళ బుద్ధః కల్కీతి తే దశ” అని పేర్కొన్నది. కొందరు “రామో రామళ్చ కృష్ణశ్చ'” అంటారు. మరికొందరు “రామో రామళ్చ రామళ్ళ కృష్ణు కల్కిరేవ చ” అంటారు.

'శ్రీలక్ష్మీనృసింహ సహ(్రనామస్తోత్రం'లో “నమో మత్స్యస్వరూపాయ కచ్చపాయ నమోనమః ।; నమో యజ్ఞవరాహాయ శ్రీన్సృసింహాయ తే నమః ॥ విక్రమశ్రాంత లోకాయ వామనాయమహౌజుసే। నమో భార్గవరామాయ, రావణాంతకరాయ చఃనమస్తే బలరామాయ కంస ్రధ్వంసకారిణే । బుద్దాయ బుద్ధరూపాయ తీక్ష్యరూపాయ కల్కినే!” అని దశావతారాలస్తుతి ఉంది. శ్రీకృష్ణస్తుతి (ప్రత్యేకంగా లేదు కదా!

ఈ శతక కవి 'కృష్ణుక[గ్రజుడవై' అన్నాడు, బలరామకృష్ణులు ఒకరి కొకరు తోడుగా ఉండి అవతారప్రయోజనాన్ని నెరవేర్చినారు. భాగవతోత్తముణ్ని గొప్పగా గౌరవించేవాడు భగవంతుడు. భక్తనామసొహచర్యం భగవన్నామం, భగవంతుని పేరుతోకూడి భక్తుని పేరు ఉంటుంది. లక్ష్మణా[గ్రజః 'నమోఒస్తు రామాయ సలక్ష్మణాయ” అన్నట్టు అన్నదమ్ములిద్దరిని తలచి, తలపింప జేస్తున్నాడీ కవి.

“ఏష నారాయణ; శ్రీమాన్‌ క్షీరార్షవనికేతనః।

నాగపర్యంక ముత్సృజ్య హ్యాగతో మధురాం పురీమ్‌” (హరివంశం)

శ్షీరాబ్టిశాయి మైనత్రీమన్నారాయణుడు మొదట శేషుడనే తన పడకను ఎత్తి పంపి, తర్వాత తాను మథురాపురికి వచ్చాడట. ఆదిశేషుని అవతారాలను 'కృష్ణోపనిషత్తు' పేర్కొన్నది.

62 నారాయణ శతకం

“స ఏవ భగవాన్‌ భగవంతం బహుధా విప్రీయమాణః, అఖిలేన స్వేన రూపేణ యుగే యుగే తేనైవ జాయమానః స ఏవ సౌమిత్రి రైక్ష్వాకః స ఏవ భగవాన్‌ సంధికాలే శారదాభ్రసన్నికాశో రౌహిణేయో వాసుదేవ: సర్వాణి గదా ద్యాయుధశా'స్తాణి వ్యాచక్షోనైకాన్‌ రాజన్య మండలాన్నిరాచికీర్డు భూభారమఖిలం నిచఖాన”?

ఆది శేషుడు (ప్రతియుగంలోనూ భగవంతుని తోడ అవతరిస్తాడు. అతడే ఇక్ష్యాకు. వంశమం దవతరించిన సౌమిత్రి - లక్ష్మణుడు. ద్వాపర కలియుగ సంధికాలాన వసుదేవుని కుమారుడూ, రోహిణీ పుత్రుడూ, శరత్కాల మేఘంతో నమానమైైన తెల్లని శరీర వర్ణం కలవాడూ అయిన బలరాముడు గదాద్యాయుధశా'స్తాలను బోధించి, అనేకరాజుల సముదాయాన్ని నిర్హించి, అఖిల భూభారాన్ని తొలగించాడు.

“అనంతః ప్రధమం రూపం, లక్ష్మణశ్చ తతః పరమ్‌

బలభద్రసృతీయళ్ళ, కలౌ కళ్చి దృవిష్యతి॥”

అనంతుడనే పేరుతో ఉన్న ఆదిశేషుడే తర్వాత లక్ష్మణునిగానూ, ఆ పిమ్మట బలభద్రునిగానూ అవతరించాడని ' నారదీయపురాణం' లో శ్రీమన్నారాయణుడే మహర్షులతో చెప్పాడు.

భూదేవి (ప్రార్ధనా ఫలమే శ్రీకృష్ణావతారం

“భూమిర్హప్త నృపవ్యాజ దైత్యానీక శతాయుతై;

ఆక్రాంతా భూరి భారేణ బ్రహ్మాణం శరణం యయాౌ॥”(భాగ.10-1-17)

అది ద్వాపరయుగం, 'ద్వాపరం' అంటే సందేహం, ధర్మాధర్మ విషయం సందేహాత్మకంగా ఉండినకాలమది. రాక్షసులు రాజులరూపంలో వచ్చి గర్వంతో అతలాకుతలంచేస్తుంటే, భూమి భరించజాలలేదు. సజ్జనులను దూషించి వారి పాపా టూ పురవీధులను శుద్ది చేయడానికే పందులు పుట్టినట్టు

సు డానికి దుర్దనులు పుడతారు.

“సాధుపాపవిశుద్ధ్యర్థం దుర్దనః పరికల్పితః 1

(గ్రామవీధీవిశుద్ద్యర్థం సూకరః పరికీర్తితః ”

రాజు రాక్షసుడైతే మంత్రులు పెద్దపులులు. అతని భృత్యులు కుక్కలే. ఆరాజుపాలనలో ప్రజలు అలాగే ఉంటారు.

“రాజా రాక్షసరూపేణ వ్యాఘ్రరూపేణ మంత్రిణః

సేవకాః శ్వానరూపేణ, యధా రాజా తధా ప్రజా”

రాఘవీయవ్యాఖ్య 63

తండ్రిని చెరసాలలో బంధించిన వాడు కంసుడు. అతనిమామ రాజులనే బలి ఇచ్చే నరరూపరాక్షసుడు-జరాసంధుడు. (ప్రాగ్భుతిషాధిపతి మైన నరకుడు అదితి కుండలాలను తెంచి తెచ్చిన క్రూరుడు, పదహారు వేల కన్యకలను తెచ్చి చెరపట్టిన కామాతురుడు. శిశుపాలదంతవక్రులు దుష్టులు. జనుషాంధుడైన ధృతరాష్ర్రుడు ధర్మమందు ప్రవృత్తి అధర్మమందు నివృత్తి లేని వ్యామోహ పరవళుడు. అతని కొడుకులు నూర్లురు దురభిమానులు. సజ్జనులకు ఊపిరాడనీయని దుర్మతులు.

కాబట్టీ భూదేవి గోరూపం ధరించి (బ్రహ్మను ప్రార్దిస్తే, ఆ బ్రహ్మ దేవతలతో వెళ్ళి పాలకడలిగట్టున (ప్రత్యక్షమైన పరమాత్మునితో “అత్యంతభారపీడితయైన భూమిని కాపాడుమని వేడుకొన్నాడు.”

“ఏవం సంస్తూయమానస్తు భగవాన్‌ పరమేశ్చరః।

ఉజ్జహారాత్మన:ః కేశా సితకృష్ణా మహామునే॥

ఉవాచ చ సురానేతా మత్కేశా వసుధాతలే।

అవతీర్య భువో భారక్షేశహానిం కరిష్యతః ॥” (వివు.5-1-60,61

భూభారాన్ని తొలగించుమని స్తుతింపబడిన సర్వేశ్వరుడు ఆలోచిస్తూ తలమీద చేతినిపెట్టి, తెల్లని, నల్లని శిరోజాలను రెండింటిని పెరికాడు. ఈ నా రెండు కేశాలు నేల మీద అవతరించి భూమికి భారరూపమైన క్షేశాన్ని దూరం చేయగలవని దేవతలతో చెప్పాడన్నారు. శ్రీపరాశరులు.

'తా చాపి కేశౌ విశతాం యదూనాం

కులే ప్రియౌ రోహిణీం దేవకీం చః

తయోరేకో బలభద్రో బభూవ

యోజసౌ ద్వేతస్తస్య దేవస్య కేశ

కృష్ణో ద్వితీయః కేశవస్పంబభూవ కేశోయో౭సౌ వర్లిత:ః కృష్ణవర్షః॥” (భారతం)

'ఆరెండు కేశాలలో తెల్లనిది యదుకుల కాంతలైన రోహిణియందు, నల్లనిది దేవకియందు ప్రవేశిస్తుంది. ఒకడు బలభద్రుడైతే రెండవవాడు శ్రీకృష్ణుడు" అని పారాశర్యసూక్తి,

“కళయా సితకృష్ణకేశ, జాతః కరిష్యతి జనానుపలక్ష్యమార్లః” -

పరమపురుషుని శ్వేత కృష్ణకేశాలే బలరామకృష్ణులని శ్రీశుకసూక్తి

“శంఖచక్రభృదీశే తు శ్వేతవర్ణో మహాభుజః

ఆవిష్టు శ్వేతకేశాత్మా శేషాంశం రోహిణీసుతమ్‌”

6శ నారాయణ శతకం విష్ణుమూర్తి యొక్క శ్వేత కేశరూపం రోహిణీసుతుడైన రాముని యందు శేషావతారమై ఆవేశించింది. కృష్ణుడు సాక్షాత్తు వాసుదేవుడే' అంటుంది వరాహపురాణం. కళ్యపప్రజాపతియే వసుదేవుడు. కశ్యపుని పత్నులైన అదితి, కద్రువలే దేవకిగా, రోహిణిగా అవతరించి, వసుదేవుని భార్యలయ్యారు.

కంసుడు పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడు. అతని ఆర్లురు పుత్రులు విష్ణుభక్తులు. వారు హిరణ్యకశిపుణ్ని గౌరవించలేదు. కాబట్టి అతడు కోపంతో 'మీ తండ్రి చేతితోనే చంపబడుదురుగాక' అని వారిని శపించాడు. (హరివంశం)

ఈ అర్ల్గరిని వరుసగా దేవకీ గర్భంలో (ప్రవేశపెట్టుమని శ్రీమన్నారాయణుడు యోగని[ద్రను ఆజ్ఞాపించాడు.

“హతేషు తేషు కంసేన శేషాఖ్యోఒంశస్తతో మమ”.

కంసుడు క్రమంగా వారిని చంపిన తర్వాత నా అంశయైన శేషుడు దేవకీ గర్భంలో ఉంటాడు.

“గోకులే వసుదేవస్య భార్యాఒన్యా రోహిణీ స్టితాః

తస్యాస్ససంభూతిసమం దేవి! నేయస్త్రయోదరమ్‌॥” (విపు,

“గర్భ సంకర్షణాత్‌ సోఒధ లోకే సంకర్షశ్రేతి వైః

సంజ్ఞుమవాష్యతే వీరః శ్వేతాద్రి శిఖరోపమః”(వి,పు.5-1-76)

“ఓ మాయాదేవీ! దేవకీసప్తమగర్చాన్ని (కుక్షిస్టజంతువును) సంకర్షించి, గోకులంలో ఉన్న రోహిణీగర్భంలో నీవు స్థాపించు. సంకర్షితుడైనందువల్ల, శ్చేతశైలశిఖరంలాగా ఉండే ఈ వీరుణ్ని లోకం సంకర్షణుడని వ్యవహరిస్తుంది. దేవకికి అష్టమగర్భంలో నేను వరర్తువులో భాద్రపద కృష్ణ అష్టమినాడు నడిరేయి జన్మిస్తాను. వెంటనే ప్రవేశించే నవమీతిధియందు నీవు యశోదా గర్భంలో జన్మించు. వసుదేవుడదే రాత్రి నన్ను గోకులంలో యశోద ప్రక్కన చేర్చి, నిన్ను దేవకి ప్రక్కన చేరుస్తాడు. కంసుడు నిన్ను బండకు గొట్టడానికి యత్నించగానే, నీవు ఆకాశంలోకి ఎగిరిపోవాలి" అని చెప్పినట్లే యోగమాయచేసింది.

దేవకిది పిల్లలు పుట్టి చచ్చిపోయే కడుపు. నష్టసంచానంగల ఆమె గర్భంలో నాగపఫ్రతిష్టచేసినందువల్ల, అష్టమగర్భం నిలిచిందంటారు విజ్ఞులు. నేటికీ నాగసర్పాన్ని, పుట్టలో పాలుపోసి పూజిస్తే సత్సంతానంకలిగి క్షేమంగా ఉంటుందన్న భారతీయుల అధ్యవసాయం విస్మరింపరానిది.

“జ్ఞాన శక్తి బలైశ్ళర్య వీర్య తేజాంస్య శేషతః |

భగవచ్చబ్దవాచ్యాని వినా హేయైర్లుణాదిభిః 1” (వివు)

రాఘవీయవ్యాఖ్య రక్‌

జ్ఞానం, శక్తి బలం, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు అనే షడ్గుణాలు కలవాడే భగవంతుడు. ఇతరులయందు ఉపయోగింపబడే భగవచ్చబ్దం గౌణం.

“తత్ర పూజ్య పరార్డ్దోక్తిపరిభాషాసమన్విత:।

శబ్దోఒలయం నోపచారేణ త్వన్యత్ర హ్యుపచారతః॥” (విపు)

భగవాన్‌ పతంజలి; వ్యాసభగవానుడు అన్నచోట - ఆవ్యక్తులయందు షాడ్గుణ్య పూర్తిలేదు. కాని ప్రతిభా ప్రభావస్తంపన్నులైన మహాత్ములు. కాబట్టి జౌపచారికంగా, గౌరవంగా భగవచ్చబ్దం వారియందు ప్రయుక్తమవుతుంది.

ఆరుగుణాలు పూర్ణంగా ఉన్మిషితాలు కాబట్టి శ్రీకృష్ణావతారం పూర్ణావతారం.

1 జ్ఞానం అంటే సర్వవస్తుసాక్షాత్కారం.

“అహం సుతో వామభవం పృళ్నిగర్భ ఇతి శ్రుతః” (భాగ.10-3-41

శ్రీకృష్ణుడు చెరసాలలో శంఖచక్రాద్యాయుధాభరణాలతో ఆవిర్భవించిన వెంటనే తల్లి దేవకితో ఇలా అన్నాడు.

అమ్మా! స్వాయంభువమన్వంతరకాలాన నీవు పృల్ని'గా వసుదేవుడు 'సుతపా” అనే ప్రజాపతిగా ఉండి మీరు ఘఫోరతపస్సుచేశారు. అప్పుడిదే రూపంతో (ప్రత్యక్షమైన నన్ను మోక్షమడుగలేదు. నీలాంటి పుత్రుడు మా గర్భమందు జన్మించాలని మూడుసార్లు (ప్రార్థించారు. నాలాంటివాడు మరొకడు లేడు కదాః కాబట్టి నేనే మీకుమారుడనై 'పృళ్నిగర్భుడ'ననే పేరుపొందాను. రెండవసారి అదితి కశ్యపులుగా ఉన్న మీకు పుత్రుడనై వామనుడు (ఉపేంద్రుడు)అనే పేరు పొందాను. ఇప్పుడు, మూడవసారి మీకు పుత్రుడనయ్యాను.

నా అవతారాలు జ్ఞాపకానికి రావాలనే మీకు నేనీరూపాన్ని చూపాను, అని తెల్పిన సంగతి జ్ఞానగుణానికి తార్కాణం.

పూర్వం వివస్వంతునికి ఉపదేశించిన యోగశాస్త్రం, లోపించినందువల్ల మళ్ళీ, నీకు ఉపదేశించానన్నాడు. వివస్వంతుని జన్మ (ప్రాచీన మాయె. నీ జన్మఅర్వాచీనం కదా! నీ మాట పాసగే దెట్టా? అంటూ అర్జునుడాశ్చర్యపడితే, “నాకూనీకూ అనేక జన్మలు గడిచాయి, నాకు తెలుస్తుంది, నీకు తెలియదని శ్రీకృష్ణుడు బోధించడమూ జ్ఞాన గుణ లక్షణమే కదా!

  1. శక్తి అంటే అఘటితఘటనాసామర్థ్యం

శ్రీకృష్ణునికి విద్యను బోధించినగురువు 'సాందీపని' ఎప్పుడో మరణించిన గురు పుత్రుణ్ని తెచ్చి సాందీపని కిచ్చాడు. అంతేకాదు; పుట్టగానే గిట్టిన ఒక బాపనయ్యకొడుకులను, తాను వైకుంరంపోయి తనదేవేరులను మెప్పించి, తెచ్చి వారి తలిదండ్రుల కర్పించి, వారిని ఆనందపరచినందువల్ల శక్తి ప్రకాశితమయింది.

వన నారాయణ శతకం

  1. బలం, అంటే శ్రమలేకుండా అన్నింటిని ధరించే గుణం.

గోవర్దన గిరిని గొడుగులాగా ధరించాడు కదా:

4 ఐళ్చర్యం, అంటే తనను తప్ప తక్కిన వస్తువులను, వ్యక్తులను నియమించే కర్ఫత్వం. లెక్కించలేని యాదవజనాన్ని తన అదుపొజ్జలలో ఉంచడం వల్ల 'ఐశ్చర్యం' (ప్రకటితం.

  1. వీర్యం, అంటే సర్వజగత్కారణమైన, వికారరాహిత్యం.

గోవులను, గోపాలకులను ('బ్రహ్మమాయంచేసినా, ఆతడు చకితుడయ్యే రీతిగా, తొనే అవులుగానూ, లేగలుగానూ, ఆలకాపరులుగానూ, చద్దిమూటలతో కూడిన కోలలుగానూ అనేక రూపాలను ధరించాడు, గోగోపరక్షకుడు శ్రీకృష్ణుడు. అయినా నిర్వికారుడు.

6.జేజస్సు, అంటే పరాభిభవనసామర్హ్యం.

శ్రీకృష్ణుని ఎదుట బ్రహ్మరుద్రేంద్రాదిదేవతలందరు నిస్తేజస్కులయ్యారు.

“ఏతే చాంశకళాః పుంసః కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌” - (1-3-28)

అనే భాగవతంలోని ఈ శ్ఞాకం చైతన్య సం(ప్రదాయులకు (ప్రాణంలాంటిది. శ్రీకృష్ణుడే పరబ్రహ్మ ఆయన ఇతరావతారాలు అంశావతారాలనీ, కళావతారాలనీ ఈ వ్లోకం చెబుతుంది. ఇక్కడ '“అంశి అంటే గుణభాగం,.

శ్రీమన్నారాయణుడు. సృష్టి స్టితిలయాదికార్యాలకోసం పర్శ వ్యూహ, విభవ, ఆంతర్యామి, ఆఅర్భారూపం' అనే పంచావతారుడవుతాడు.

శ్రీమన్నారాయణుడే. పరుడు. వ్యూహం చతుర్విధం

వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ద' అనే నల్గురు వ్యూహమూర్తులు.

వీరిలో షడ్గుణాలు ఉన్నా, ఆయాకార్యానుసారంగా కొన్ని గుణాలే స్ఫుటంగా 'ప్రకాళిస్తాయి. మిగిలినవి అనువృత్తాలైనా స్ఫుటంగా ప్రకాశించవు. 'అహిర్చుధ్మ్యసంహిత' లో గుణోన్మేషానున్మేషాలు వివరించబడినాయి.

“తత్ర జ్ఞానబలద్వంద్వ్యా[ద్రూపం సొంకర్షణం విదుః |

ఐశ్వర్య వీర్యసంభేదా [ద్రూపం (ప్రాద్యుమ్నముచ్యతే॥

శక్తి తేజస్సముత్కర్హా దనిరుద్దీ తనుర్హరేః

ఏతే శక్తి మయా వ్యూహాః గుణోన్మేషస్వలక్షణా:॥”

  1. సంకర్షణునికి “జ్ఞానం, బలం” అనే రెండుగుణాలు ముఖ్యమైనవి. శాస్త్రప్రదానం, జగత్సంహారం ముఖ్యకార్యాలు. సంకర్షణుడు రుద్రుని యందు అశు్రవేశించి జగత్సంహారంచేస్తాడు. చేతనా చేతన మైన జగత్తును తనలో చేరే రీతిగా ఆకర్షించే వాడు కాబట్టి సంకర్షణుడని "పేరు. “సంకృష తీతి సంకర్షణ.

రాఘవీయవ్యాఖ్య 67

  1. ప్రద్యుమ్నునికి ఐళ్చర్యం, వీర్యం అనే రెండు గుణాలు ముఖ్యమైనవి. ధర్మోపదేశం, జగత్సృష్టి ముఖ్యకార్యాలు. 'ప్రకృష్ణం ద్యుమ్నం యస్య సః = 'ప్రద్యుమ్నః - వికారం పొందకుండా ఉండేవాడని అర్హం.

  2. అనిరుద్దునికి శక్తి తేజస్సు అనే రెండు గుణాలు ప్రధానమైనవి, తత్ష్యబోధ, జగద్రక్షణం (ప్రధానకార్యాలు.

“అవతారా హ్యసంభ్యేయా హరేః సత్వనిధేర్షిజాః (1-3-26)

“సత్వనిధేః = అనిరుద్దాత్‌, ఏతదనిరుద్దాఖ్యం రూపం నానావిధానామవతారాణాం నిదానం”. “అనిరుద్ధ వ్యూహమూర్తి నానావిధాలైన అవతారాలకు మూలకారణం, బీజభూతుడని వీరరాఘవీయవ్యాఖ్య.(భాగ)

4ఉ. ఈ మూడుమూర్తులకు మూలకందం షాడ్గుణ్యమూర్తి పరవాసుదేవుడు,

“ఛాదయామి జగత్సర్వం భూత్వా సూర్య ఇవాంశుభిః

సర్వభూతాధివాసశ్చ వాసుదేవస్తతవ స్కృతమ”

సూర్యుడు తన కిరణాలచేత సర్వజగత్తును కప్పివేసేరీతిగా ప్రపంచమంతా ఆవరిస్తున్నాను. సర్వభూతాలకు ఉనికి పట్టైన నన్ను వాసుదేవుడంటారని 'వాసుదేవ' శబ్దార్దాన్ని విశదం చేసింది భారతం.

“వాసుదేవః సంకర్షణ: ప్రద్యుమ్నః పురుషు స్వయమ్‌।

అనిరుద్ధ ఇతి (బ్రహ్మన్‌, మూర్తి వ్యూహోలభిధీయతే॥”(భాగ.12 స్కం.)

త్రీశంకర భగవత్పాదులు 'వి.స.భాష్యం'లో “చతుర్వ్యూహః” అనేచోట

“వ్యూహాత్మానం చతుర్జా వై వాసుదేవాదిమూర్తిభి;

సృష్ట్యాదీన్‌ ప్రకరోత్యేష విశ్రుతాత్మా జనార్హనః॥ ఇతి వ్యాసవచనాత్‌ చతుర్వ్యూహః"

వ్యాసుని మాటనుబట్టి, భగవంతుడు వాసుదేవాది మూర్తులతో చతుర్విధవ్యూహాలను పొంది సృష్ట్యాది కార్యాలను నిర్వహిస్తాడు అనడం గమనీయం,

శ్రీకృష్ణుడే సర్వకారణకారుడని 'బ్రహ్మసంహిత పేర్కొన్నది.

“ఈశ్వరః పరమః కృష్ణు సచ్చిదానందవి[గ్రహః।

అనాది రాదిగోవిందః సర్వకారణకారణమ్‌॥”

“బ్రహ్మణ్యో దేవకీపుత్రో (బ్రహ్మణ్యో మధుసూదనః-”

'అధర్వవేదళిఖ' శ్రీకృష్ణుడే 'పరబ్రహ్మ' అని స్ప్సష్టపరచింది.

“ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ” - (భగీ.8-13) అనే చోట “తాత్పర్యచంద్రిక” లో

“త్రిరాత్మా త్రిస్తభావశ్చ తధా (త్రివ్యూహ ఏవ చ।

పాంచరాత్రే తధా హ్యేషు భగవద్వాచకః స్మృతః॥”

6కి నారాయణ శతకం సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్దరూప భగవద్వ్యూహత్రయం అ,ఉమ అనే

మూడక్షరాలు కలిగిన ఓంకారంవలె, భగవద్వాచకమైనట్టు వివరింపబడింది. రథంమీదనూ, నీళ్ళల్లోనూ, దర్శన మిచ్చిన బలరామకృష్ణులను

“ఓం నమో వాసుదేవాయ నమః సంకర్షశాయ చ।

(ప్రద్యుమ్నాయ సమస్తుభ్య మనిరుద్దాయ తే నమః”

అని అక్రూరుడు స్తుతించాడు.

బలరాముడు అనంతుడు, హలాయుధుడు, సునంద ఆనే ముసలాన్ని - రోకలిని _ ఆయుధంగా ధరించేవాడు, తాలాంకుడు, గదా విద్యావిశారదుడు. నీలాంబరుడు, ఆయన స్వరూపగుణలీలాదులు లోకమర్యాదచే విలక్షణమైనవి.

ధేనుకముష్టికాద్యసురులన్‌ మర్చించినవాడు బలరాముడు.

గోపాలురు. గోవులను మేపుతూ, తాళవనంలో తాటిపండ్లను తెంపుతుంటే, ఆపండ్డు రాలిన చప్పుడు విని వచ్చిన, గర్దభాకారంలో ఉన్న, ధేనుకుడనే రాక్షసుడు బలరామునిరొమ్ముమీద తన్నినాడు. బలరాముడు ఆరెండుకాళ్ళను. బట్టి గిరగిర త్రిప్పి తాటి చెట్టుకు విసరికొట్టి చంపాడు.

(ప్రలంబుడనే రాక్షసుడు గోపవేషంతో వచ్చాడు. జంటలు జంటలుగా పర్టుగెత్తే పందెంలో పాల్గొన్నాడు. ఓడినవాడు గెల్బినవాణ్ని భుజాలమీద ఎక్కించుకొని భాండీరవటవృక్షానికి చేరే లక్ష్యంగా ఆడే ఆట ఇది. శ్రీదాముడు శ్రీకృష్ణుల్టు ఎక్కించుకొన్నాడు. ప్రలంబుడు బలరాముణ్నీ ఎక్కించుకొని ఆకాశానికెగిరి అగ్గి పర్వతాకారుడయ్యాడు. రాక్షసుడని (గ్రహించిన బలభద్రుడు ప్రలంబుని తలమీద పిడికిలితో (గ్రుద్ది చంపాడు.

శ్రీకృష్ణుడు మల్లయుద్దంలో చాణూరుణ్ని చావగొడ్తే బలరాముడు ముష్టికుడనే రాక్షసమల్లుణ్ని తలపైన, రొమ్ముమీద మోకాటితో పొడిచి, ఎత్తి, నేలకు విసరి కొట్టి చంపాడు. శ్రీకృష్ణుడు కంసుని జుట్టు పట్టి ఈడ్చి ప్రాణం తీస్తే వాని తమ్ముడైన సుమాలిప్రాణాలను బలరాముడు తోడేశాడు. రుక్మి అనే వ్యక్తి బలరామునితో జూదమాడి ఓడిపోయినప్పటికీ నేనే గెల్బాను' అని వాదించగా, వాని మిత్రులు పరిడ్హిగిలించి హేళనగా నవ్వినప్పుడు, బలరాముడు పొచికలతో రుక్కిని కొట్టి చంపాడు, ద్వివిదుడనే వానరుడు నరకానురుని మిత్రుడు. పదివేల ఏనుగులబలంగలవాడు. రైవతక పర్వతంమీద విహరిస్తున్న బలరాముని హలాన్ని, ముసలాన్ని లాగుకొని తిరస్కరిస్తున్న ద్వివిదుని ఆయువుపట్టుమీద (గ్రుద్ది మట్టి కరిపించాడు,

రాఘవీయవ్యాఖ్య రం

జాంబవతీ పుత్రుడైన సాంబుడు సుయోధనుని పుత్రిక యైన లక్ష్మణను వరించి హరించాడు. కౌరవులు దారిలో సాంబుణ్ని బంధించి తీసుకొనిపోయారు. బలరాముడు ఒక్కడే వెల్లి “ఉ(గ్రసేనుని అజ్ఞాప్రకారం సాంబుణ్ని విడిచి పెట్టం'డన్నాడు. రాజ్యార్హృత లేని యాదవులు కౌరవులను ఆజ్ఞాపించడమా॥! అని అధిక్షేపించారు. (క్రుద్దుడైన హలాయుధుడు కౌరవులతో పాటు హస్తినాపురిని గంగలో కలుపుతా' నంటూ ఒక్క పెట్టున ఆపురికోటపునాదిలోకి సీరాన్ని దించాడు. నగరం దొల్లింది.

“అద్యాప్యాఘూర్షితాకారం లక్ష్యతే తత్పురం ద్విజ!

ఏష ్రభావో రామస్య బలశౌర్యోపలక్షణవ। (వి.పు.5-35-37)

ఈనాటికీ గంగవైపు డొల్లినట్టు కనబడే హస్తినాపురం (డిల్లీ బలరాముని అభిలశౌర్యాన్ని గుర్తుకు తెస్తుంది.

సూర్యవంశపు చాజైన శర్యాతికి ఆనర్హుడు, ఆనర్హుని పుత్రుడు రైవతుడు, అరైవతుని పుత్రిక రేవతి. రైవతుడు తన పుత్రికకు తగిన మగడెవ్చడో చెప్పుమని బ్రహ్మదేవుణ్ని అడిగాడు.

“డేవదేవుండు హరి బలదేవుండనంగ, భూమి భారంబు మాన్చంగయిట్టినాండు.

సకల భూతాత్మకుండు నిజాంశంబుతోడ, యువతిమణి నిమ్ము జనమణికున్న తాత్మ" (ఆం.భాగ.9-3-73) అని బ్రహ్మ చెప్పాడు.

'ఆవనజ గర్భుపంపున' రైవతుడనేరాజు, తాను నీరధిలో నిర్మించిన కుశస్థలి అనే నగరానికి వచ్చి, బలభద్రునికి రేవతిని ఇచ్చాడు. కాబట్టి బలరాముడు రేవతీ రమణుడు. అతడు కామపాలుడు,

శృంగారక్రీడలో రేవతీ దేవి ముఖపద్మాన్ని అలంకరించే తుమ్మెదయో అన్నట్టు కోభించేవాడు బలరామమూర్తి.

సతీపతుల సమాగమాన్ని (ప్రకృతిసంపదయైన పద్మభృంగరూపసన్నివేశంగా వర్షించడం రసౌచిత్యం.

శవతీవదనం ఒక కంజాతంగా ఆరోపింపబడింది. 'కంజాతం' అంటె నీట పుట్టిన కమలం. సుఖాన్ని కలిగించేది.

రేవతి - 'రేవృప్ణవగతా. అటూ, ఇటూ కదలుతూ తేలి యాడడమని అర్థం, 'అంతం'అంటే దగ్గర, లోపల, 'భృంగం' అంటే నలుపును భరించే తుమ్మెద. వదనం ఉపమేయం. కంజాతం ఉపమానం. బలరాముడు ఉపమేయం, భృంగం ఉపమానం. తెల్లని దేహంమీద నల్లని వస్త్రాలను ధరించేవాడు కాబట్టి నీలాంబరుడు భృంగంగా ఆరోపింపబడినాడు. ఇది రూపకాలంకారం.

70 నారాయణ శతకం

ఉపమానోసమేయాలను రెంటిని వ్యవహరించి అభేదాన్ని చెప్పేది ఆరోపపద్దతి. ఉపమేయాన్ని చెప్పక, ఉపమానంతోనే ఆఉపమేయాన్ని వ్యవహరించడం అధ్యవసాయపద్దతి.

'అనన్‌' - సంభావనావాచకం. 'భృంగంబనన్‌ అని వర్షించడవవల్ల ఇది ఉశ్ర్రేక్షాలంకారం. ఉపమానం యొక్క గుణక్రియల సంబంధంచేత ఉపమేయం ఉపమానంగా తర్కింపబడింది. తాదాత్మ్యం సంభావితం.

వికసించిన కమలంయొక్క పరిమళంచేత ఆకర్షితమైన గండుతుమ్మెద, దాని సౌందర్యసొకుమార్యాలకు ముర్టయై, ఆకమలంమీద ్రాలీ, వ్రాలనట్టు పరిభ్రమిస్తూ, స్నిగహృూదయంతో మకరందాన్ని ఆస్వాదించి ఆనందించడం అనుభవైకవేద్యం కదా!

కాబట్టి రూపకాలంకారాను'ప్రాణితమైన ఉత్రేక్షాలంకారమున్న పద్యమిది, బలమూ రూపసంపదా కలవాడు బలరాముడని విదితం.

“బలం” ద్వితీయపాదమందు 'ర్రమణం” తృతీయపాదమందు వర్షించాడు కవి. వీరశ్ళృంగారరసాలను సముచితంగా ఆవిష్కరించిన అవతారమూర్తిగా బలరామమూర్తిని వీక్షించడం కైతకైపు. ము పురము ల్మూడును మూడులోకనులు నే ప్రాద్దున్విచారింపంద

త్పురనారినుహి మోన్నతుల్‌ సెడుటకై బుద్దుండ నై బుద్దితో

వరబోధద్రుమసేవ( జేయుటకునై వారిం బ్రబోధించి య

ప్పురముల్‌ గెల్చిన మీ యుపాయము జగత్సూజ్యంబు నారాయణా! 19.

అర్జం: ఓ నారాయణా! మూడులోకములు; ఏ ప్రొద్దున్‌ = ఎంతోకాలంనుంచి;

పురముల్‌ మూడును = త్రిపురాలును; తత్‌ పురనారీమహిమ+ఉన్నతుల్‌=ఆ త్రిపురా(సురు)ల స్త్రీల పాతివ్రత్యం యొక్క ప్రభావాలును; చెడుటకై = నళించేకోసం; విచారింపన్‌ = ఆలోచింపగ; బుద్దుండవై; బుద్దితో = ప్రజ్ఞతో; వరబోధద్రుమసేవన్‌ చేయుటకునై = ఉత్తమజ్ఞునమనే బోధవృక్షాన్ని సేవించడానికి: వారిన్‌ ప్రబోధించి = వారికి ఉపదేశించి; ఆపురముల్‌ గెల్చిన = ఆత్రిపురా(సురు)లను జయించినట్టి; మీ, ఉపాయము = మీపధకం, య్యుక్తి జగత్‌ పూజ్యంబు = లోకమాన్యమైనది.

తా; ఓ నారాయణా! మూడుపట్టణాలకు అధిపతులైన త్రిపురాసురులూ, వారినారీమణులూ అధిక ప్రభావంకలవారు. ఆ'స్త్రీల పాతివ్రత్యప్రభావం చెడిపోవడానికి లోకాలన్ని చాలాకాలం ఆలోచించాయి, తత్ఫలితంగా, లోకక్షేమంకోసం నీవు బుద్దునిగా అవతరించి, ఆత్రిపురవాసులకు చక్కగా బోధవృక్షాన్ని సేవించి తరించండి' అని జ్ఞానోపదేశం చేశావు. వారు నీ బోధ వృక్షాన్ని అక్షరాలా సేవింఛి నళించారు.

రాఘవీయవ్యాఖ్య ఖా (త్రిపురాలకు అపాయాన్ని తలపెట్టిన నీ ఉపాయంవల్ల లోకం హర్షించింది. నీయిక్తి స్తుతిపాత్రమయింది.

వ్యాఖ్య: బుద్దుని బోధ జగత్పూజ్యమని ప్రశంసితం.

త్రిపురాసురసంహారవృత్తాంతం వేదంలోనూ ఉంది.

“తేషామసురాణాం తిస్రః పుర ఆసన్నయ స్మయ్యవమాధ

రజతాధ హరిణీ తా దేవా జేతుం నాతిళశక్షువన్‌ --

--తిస్రః పురోభిల్వైభ్యో లోకేభ్యో ఒసురాన్‌ ప్రాణుదత"”.

(ఖై-సం.65ా02 (ప్ర.3.ఆనువాకం)

రాక్షసులకు పృ్పద్వీలోకంలో ఇనుముతోనూ, అంతరిక్షలోకంలో వెండితోనూ, ద్యులోకంలో బంగారంతోనూ దుర్గరూపంగా నిర్మింపబడిన మూడు పెద్ద పట్టణాలున్నాయి. అవి కామగమనం కలవి. దేవాసురయుద్ధంలో 'త్రిపురాలను దేవతలు జయింపజాలలేదు. దేవతలందరు కలిసి తమ తేజస్సుతో ఒక్ష బాణాన్ని సిద్ధం చేశారు. ఆబాణం యొక్క ముఖమందు అస్లిదేవుడు, శరీరమందు సోమదేవుడు, అలుగున విష్ణుమూర్తి ఆవేశించారు. ఆ(క్రూరబాణాన్ని నిర్ణయుడైన రుద్రుడు ప్రయోగించి (తిపురాలను భస్మంచేశాడు అని సంక్షిప్తార్థం.

యుగభేదంచేత పురాణాల్లో. వేర్వేరుగా. వర్ణింపబడిన ఈ విషయంలో విరోధపరిహారాలను గమనించాలి.

తారకాసురునికుమారులైన విద్యున్మాలి, తారకాన్షుడు, కమలాన్టుడనే ముగ్గురు అధిపతులు ఈ మూడు పట్టణాలతోపాటు సంచరించేవారు. ఆవి వ్రాలినచోట నగరాలన్ని నేల మట్ట మవుతుండేవి. రుద్రుడు సర్వదేవతాకమైన బాణాన్ని ప్రయోగించి త్రిపురాలను కాల్చివేశాడని మహాభారత కథ.

యధాహి చోరస్స తధాహి బుద్ద స్తధాగతం నాస్తిక మత్ర విద్ది 1

తస్మొద్ది యళ్ళంక్యతమః ప్రజానాం, న నాస్తికే నాభిముఖో బుధ; స్యాత్‌” (రామా.అయో-10-9-34)

'ోరుని వంటివాడు బుద్దుడు.అతడు నాస్తికుడు. (ప్రజలకు శంకింపదగినవాడు. కాబట్టి ధీమంతుడు నాస్తికునితో ప్రసంగించరాదు' అని రాముడు జాబాలితో అన్నాడు.

రామాయణంలో బుద్దుని ఉదంతం ఉంది కాబట్టి, బుద్దావతారుడువేరు, గౌతమ బుద్దుడు వేరు, అంటారు కొందరు. రామునికంటె ముందు బుద్ధావతారం అసంగతమైనందువల్లనూ, ఛందోభేదమున్నందువల్లనూ ఈ శ్లోకం ప్రక్షిప్త మంటారు.

72 నారాయణ శతకం

“తతః కలౌ సంప్రవృత్తే సంమోహాయ సురద్విషామ్‌ |

బుద్దో నామ్నా జినసుతః కీకటేషు భవిష్యతి॥” (భాగవతం)

కలియుగం వచ్చినప్పుడు రాక్షసులను సంమోహనంచేయడానికి కీకటదేశ మందు నారాయణుడు జనుడనే వ్యక్తికి పుత్రునిగా అవతరించి, బుద్దుడనే. పేరుతో వ్యవహరించగలడు.

“కలియుగాద్యవసరంబున రాక్షస సంమోహనంబు కారకు (మధ్యగయా 'ప్రదేశంబున) కీకట దేశంబున జినసుతుండ్రై బుద్ధనామధేయంబునం దేజరిల్లు” నని భవిష్యదవతారంగా చెప్పబడింది. (ఆంధ్రభాగు.

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతరిలో “మీనాకృతేకమరకోలనృషింహవర్షిన్‌” అనే దశావతార వర్లనగల శ్లోకంలో 'బౌద్దావతారం' లేదు.

శ్రీవేదాన్తదేశికులవారి 'దశావతారస్తోత్రం' లోనూ, 'దయాశతకం'లోనూ తొమ్మిదవ అవతారంగా శ్రీకృష్ణావతారమే వర్ణింపబడింది.

“వనజౌ వనజౌ ఖర్వః (త్రిరామీ సకృపోఒకృపః॥

అవతారా ద్దైవైతే కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌!”

అనే దశావతార శ్లోకం 'సకృపః అకృపఃి అంటే దయాళువు బుద్దుడు, నిర్హయుడు కల్కి అని స్పష్టపరచింది.

గీత గోవింద కర్త మైన జయదేవుని చేత 'కారుణ్యమాతన్వతే'” అని బుద్దావతారం సుళ్లోకితం.

'అగ్ని పురాణం” శాంతాత్ముడు, అంబకర్ణుడు, గౌరాంగుడు, అంబరావృతుడు, ఊర్హ్వ్య పద్మస్థితుడు, వరదాభయదాయకుడని బుద్ధమూర్తిని వర్షించింది.

మాయాదేవీశుద్దోదనుల పుత్రుడైన గౌతమ సిద్దార్టుడే బుద్దావతారుడని లోకం అంగీకరించడం గమనార్హం.

(బ్రహ్మాండపురాణం “బుద్దుడు జినసుతుడూ కాడు" అంటుంది.

“మోహనార్థం దానవానాం బాలరూపీ పధి స్టితః

పుత్రం తం కల్పయామాస మూఢబుద్ధి ర్హినః స్వయమ్‌॥”

రాక్షసులను సంమోహనం చేయడం కోసం (త్రోవలో హరి బాలరూపుడై యుండగా మూఢబుద్ధిగల జినుడు అతనిని పుత్రునిగా కల్ప్సించుకొన్నాడట,

“తతః సంమోహయామాస జినాద్యా నసురాంశకాన్‌!

భగవాన్‌ వాగ్భి రు[గ్రాభి రహింసావాదిభిర్హరిః।

రాఘవీయవ్యాఖ్య 73

'అహింసా పరమో ధర్మః” - “మాహింస్యాత్సర్వా భూతాని” లాంటి వాక్వాలతో హరి, పశువులను హింసించే యాగాలను నిరసిస్తూ జినుడు మొదలైన రాక్షసాంశగల వ్యక్తులను మోహింపజేశాడని (బ్రహ్మాండపురాణం విశదపరచింది.

రాక్షసులు తపస్సు, యజ్ఞయాగాది(క్రతువులూ చేసేవారు. వరాలను పొంది దొర్జన్యంతో సాధుసత్సురుషులను హింసించేవారు. జిహ్వరుచి మెండ్లై యాగాలపేరుతో జీవహింస చేస్తున్నప్పుడు భగవానుడు కరుణావరుణాలయుడైన బుద్దమూర్తిగా అవతరించి వేదబాహ్యవాక్యాలతో వాదించి, సమాజాన్ని సంస్కరించాడు.

రాక్షసుల ఆగడాలవల్ల లోకాలు తల్లడిల్లుతుండేవి. త్రిపురాసురులను, వారి భార్యలు పాతివ్రత్య మహిమవనల్ల, జయింపనెవ్వరికీశక్యం కాకపోయేది. పత్నులవ్రతం భంగమయ్యే విధంగా బోధించిన అవతారమే బుద్ధావతారం.

1ద్రుమ' శబ్దం శాఖలుకలది, వృక్షం అని అర్ధం, “వృక్షశ్చీదనాత్‌” - వేదింప బడేది వృక్షమని వ్యుత్పత్త్యర్హం. బోధద్రుమసేవ చేయడంవల్ల అసురపత్నుల పాతివ్రత్యం పరిచ్చిన్నమయింది. తత్ఫలితంగా, త్రిపురాసురులు చస్తేగాని ప్రపంచానికి శాంతి కలుగలేదు. కాబట్టి, ఉపాయంతో త్రిపురాలను గెల్చిన బుద్డ్దదేవుడు లోకారాధ్యుడయ్యాడు - కూచిపూడి నట్టువలు “రంగుగ పురికాంతల(వ్రతములు, భంగపరచు. బౌద్దావతారా” అంటూ నర్తిస్తారు.

మ. కలిధర్మంబున( బాపసంకలితులై గర్వాంధులై తుచ్చులై కులశీలంబులు మాని హేయగతులం గ్రొవ్వారు దుష్టాత్ములం బలిగా. చేయందలంచి ధర్మమెలమింబాలించి నిల్పంగ మీ వలనం గల్క్య్యవతార మొందంగల నిన్‌ వర్లింతు నారాయణా॥ 20

అర్ధం : ఓ నారాయణా! కలిధర్మంబునన్‌ = కలియుగ ధర్మంవల్ల: పాపసంకలితులై = పొపకార్యాలతోకూడిన వారై: గర్వ+అంధులై = గర్వం చేత గుడ్డివారై తుచ్చులై = నీచులై; కులశీలంబులు మాని = వంశాచారమర్యాదలను వదలివేసి; హేయగతులన్‌ = విడువదగిన - అసహ్యమైన నడవడుల చేత; క్రొవ్వారు = మదించే; దుష్ట+ఆత్ములన్‌ = దుర్దనులను; బలిగా. జేయన్‌ తలంచి = నశింపజేయబూని; ధర్మము, ఎలమిన్‌, పాలించి = ధర్మాన్ని - పుణ్యకర్మకలాపాన్ని బాగా పోషించి; నిల్పంగ = స్టిరంగా ఉంచునట్టు; మీ వలనన్‌ = మో సామర్థ్యంతో; కల్కి+అవతారం, ఒందగల = కల్కి భగవానుడవై ఇకముందు అవతరించగల; నిన్‌, వర్షింతును.

తాః ఓనారాయణా! కలియుగ మహిమవల్ల పాపాత్ములై, గర్వాంధులై, నీచులై కుల(క్రమాగత ఆచార సంప్రదాయాలను పాటించకుండా దుర్భరమైన నడవడుల

74 నారాయణ శతకం చేత బాగా బలసిన దుష్టాత్ములను నీఖడ్డానికి ఎరగా చేయగలుగుతావు. అధర్మాన్ని రూపు మాపి, మళ్ళీ ధర్మం స్టిరంగా నిల్పడానికి నీ సామర్ష్యం వల్ల 'కల్కి'గా అవతరించగల నిన్ను వర్షిస్తాను

వ్యాఖ్య: కలియుగంలో అవతరించే కల్కి భగవానుని వర్ణన ఇది.

కల్కి భగవానుని అవతారం ఇంకా రాలేదు. త్రికాలజ్ఞులైన బుషులు భవిష్యత్కాల విషయాలను పురాణాలలో తెలిపారు. కలిప్రభావంవల్ల ఈయుగంలో చేయవలసిన పనులను చేయక, చేయరాని పనులను చేస్తూ ప్రజలు పాపిష్టులవుతారు. ఏలికలూ, ఏలుబడిలో ఉన్న జనులూ, అందరు గర్వాంధులై అవినీతికి, అధర్మానికి పాటుపడుతారు.

నారాయణుడు కల్క్య్యవతారమందు అశ్వారూఢుడై కరవాలంతో దుష్టాత్ములను సంహరిస్తాడు. అధర్మాన్ని తొలగించి, ధర్మసంస్టాపన చేస్తాడని భవిష్యత్సురాణకధనం.

“అధాసౌ యుగసంధ్యాయాం దస్యుప్రాయేషు రాజసు;

జనితా విష్ణయళసో నామ్నా కల్కిర్ణగద్దురుః॥/” (భాగవతం)

కృతయుగంలో ధర్మం నాలుగుపాళ్ళు, త్రేతాయుగంలో _మూడుపాళ్ళు, ద్వాపరయుగంలో రెండుపాళ్ళు, కలియుగంలో ఒక్కపాలే ఉంటుందనేది ఆర్షవాక్యం.

ఈ శ్చేతవరాహకల్పంలో 28వ మహాయుగమిది. ఇక్కడ యుగసంధి అంటే కలియుగానికి చివరిభాగం, కృతయుగానికి ఆరంభకాలం. ఈ మధ్య కాలంలో పాలకులూ, పాలితులూ సామాన్యంగా దొంగలై జీవిస్తారు. అధర్మం విజృంభించే ఈ సందర్భంలో నారాయణుడు 'విష్టయశు'డనే వ్యక్తికి పుత్రునిగా అవతరించి “కల్కి అనే పేరుతో సమాజసంక్షేమంకోసం వ్యవహరిస్తాడు. తత్పర్యవసానంగా, సామాజికులు ఆదర్శజీవనులై, విశ్శశ్రేయోభిలాషులై చారిత్రక పురుషులవుతారు అని పురాణాలు (ప్రకటిస్తున్నాయి.

“హరే రామ హరే రామ రామ రామ హరే హతశే।

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరి హరే (కలిసంతరణోపనిషట్సొ

విభవావతీర్గులైన రామకృష్ణనామాలు (44428), పరతత్య్యమైన హరి నామా (8) కలిసి యున్న ఈ షోడళనామమం త్రాన్ని శుచి ర్ఫ్భూతులై, ఏకాగ్రచి తు ని క జపించేవారికి కలికల్మషం నశిస్తుందని హిరణ్యగర్ము డు తన పు తు (సక ప (గ ఉపదేశించాడు. ఫె పుత్రుడైన నారదమహరికి

దశావతారాలే కాక్క భగవంతుని ఆ సశ వేదాలలో కూడా స్పష్టంగా ఉంది. చేకావతారాల (ప్రోంస ఫురాణాల్లోనేకాదు,

రాఘవీయవ్యాఖ్య 5 దివ్యరూపదశకం మ. ఇరనొందన్‌ సచరాచరప్రతతుల న్నెన్నంగ శక్యంయబు కా కరయన్‌ పద్మభవాండభాండచయము న్నారంగ మీకుక్షీలో నరుదార న్నుదయించు. బెంచు నడంగున్న న్నారికేళోదృవాం తరవాఃపూరముచందమొంది యెపుడున్‌ దైత్యారి నారాయణా ॥ 21 అర్థం'* దైత్వారి = అసురులకు శత్రువైన; ఓ నారాయణా! పద్మభవ+అండ భాండ చయమున్‌ = బ్రహ్మాండకటాహసముదాయాన్ని: ఇరవు+ఒందన్‌ = స్ర్రిరంగా ఉంచుటకు; సచరాచరప్రతతులన్‌ = చేతనాచేతనాలతో కూడిన (ద్రవ్యరాశులను; ఎన్నంగ = లెక్కింప; ఊహింప; శక్యంబు కాక = సామర్థ్యం చాలక; ఆరయన్‌ = విచారింపగా:; ఆరంగన్‌ =. హితంగా; ఎపుడున్‌ = ఎల్లప్పుడు; ఆనారికేళ+ఉద్భవ+అంతర వాఃపూరము, చందము+ఒంది = ప్రసిద్దమైన టెంకాయలో ఉదయించే లోపలి జలపూరం రీతిగా; అరుదారన్‌ = అద్భుతంగా: అప్పుడప్పుడు; మీకుక్షిలో = మీకడుపులో; ఉదయించున్‌ =ఉద్భవిస్తుంది; పెంచున్‌ = పెరుగుతుంది; కాపాడుతుంది; అడంగున్‌=ఇమిడిపోతుంది. తా: ఓ నారాయణా! బ్రహ్మాండమంతా స్టావరజంగమాత్మకమే.. దానిలోని చరాచరవస్తుసముదాయాలను లెక్కింపశక్యంకాదు. అది స్టిరంగా ఉండదు. కొబ్బరికాయలో. నీరు పుట్టి, పెరిగి. అడగారినట్లు మీ బొజ్జలో బ్రహ్మాండం ఉద్భవిస్తుంది, వృద్ది చెందుతుంది. లీనమవుతుంది.

వ్యాఖ్య: నారాయణుని దివ్యరూప వర్లన.

చరాచరపదార్జాలతో నిండి, పంచాశత్కోటి విస్తీర్సమైనది బ్రహ్మాండం.

1 చర పదార్హమంటే చేతనకోటి. జీవాత్మలు, బద్దులు, ముక్తులు, నిత్యులు అని జీవాత్మలు మూడువిధాలు. అనాదికర్మబంధంవల్ల సంసారంలో పరిభ్రమించే వారు బద్దులు. మోక్షోపాయాన్ని అనుష్టించి, మోక్షం పొందిన వారు ముక్తులు. కర్మబంధంలేకుండా, సంసారగంధశూన్యులై, వైకుంరంలో భగవంతుణ్ణి సేవిస్తూ, ఆనందానుభవపరీవాహంలో మగ్నులైన అనంతగరుడవిష్పుక్సేనాదులు నిత్యాత్మలు.

జీవుడు అణువుగానూ, జ్ఞానానందామలస్వరూపుడుగానూ ఉంటాడు. శరీరంకంటె భిన్నుడు. ఉత్పత్తివినాశరహితుడు,

“ఏషోఒణురాత్మా చేతసా వేదితవ్యః” (ముం.ఉ) అన్నట్టు జీవాణుత్వం స్వాభావికం,

  1. అచర పదార్థం అంటే అచేతనం. జ్ఞానంలేని వస్తువు. దీనిచేత ఏర్పడే ఫలాన్ని చేతనుడనుభవిస్తాడు. అజ్ఞానియైన జీవుడు ప్రాకృతిక ఫలాన్ని ఆసక్తితో అనుభవిస్తాడు.

76 నారాయణ శతకం జ్ఞానియైన జీవుడు దాన్ని అనుభవించి, ఇది నిస్సారం, క్షణభంగురమని (గ్రహించి త్యాగం చేస్తాడన్నది శ్వేతాశ్వతరోపనిషత్తు,

“అజోహ్యేకో జుషమాణో ఒనుశేతే

జహాత్యేనాం భుక్తభోగా మజోన్యః”

అచర పదార్దం మూడు విధాలు 1. త్రిగుణం 2 కాలం 3. శుద్దసత్త్యం.

  1. త్రిగుణం : సత్మ్య రజస్తమోగుణాలు కలిగిన ప్రకృతి సతతపరిణామంకలది. (ప్రకృతి, మూడుగుణాలు ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు, మహదహంకారాది అనేక తత్త్యాలుగా మారుతుంది. (ప్రపంచంలో దేహాద్యచేతనపదార్జాలన్ని పంచభూతాలతో కూడినవే, సత్వరజస్తమోగుణాలు మూడు సమానంగా ఉంటే ప్రళయమేర్పడుతుంది.

  2. కాలం : జడవస్తువు. అయినా విభువు, అంటే విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. కాలానికి సత్వరజస్తమోగుణాలు లేవు. నిమిషాలు మొదల్కొని యుగాంతం నరకు కాలవిభాగాలున్నాయి. (ప్రపంచంలో కలిగే పరిణామాలు - మార్పులు - కాలాధీనాలే. భూతభవిష్యద్వర్తమానవ్యవహారాలన్నిటికి కారణం కాలమే. భగవత్సంకల్పాధీనపరిమాణం తప్ప, కాలపరిణామం వైకుంఠంలో లేదు,

3 శుద్ధసత్వం : రజస్తమోగుణాలు లేని ఒకే ఒక శుద్ద సత్వగుణానికి ఆధారమైన ఈ (ద్రవ్యం వైకుంరంలోనే ఉంటుంది. భగవంతుడు ఈ లోకంలో అవతరించినప్పుడు ఆయన్న రూపం. శుద్దసత్వమయమే. వైకుంరంలోని చట్టు. చెట్టు, గోప్పురాలు, నూప్పురాలు సకల వస్తువులూ శుద్ద సత్వమయాలై ప్రకాశిస్తుంటాయి. పరబ్రహ్మ సృష్టి స్థితిలయాలనే మూడు దశల్లోను చరాచరవస్తువులతో కూడి ఉంటాడు. కాబట్టీ, చిదచిద్విశిష్టుడు నారాయణుడు, చరాచరమయమైన (బ్రహ్మాండాన్ని నియమించేవాడు కాబట్టి నారాయణుడు అఖిలాండకోటి (బ్రహ్మాండనాయకుడు. ఈ (బ్రహ్మాండభాండచయం స్థిరంగా మార్పు లేకుండా ఉండదు. ఇది సూక్ష్మ రూపంలోనో, స్టూలరూపంలోనో ఏదో ఒక రూపంలో ఎప్పుడూ ఉండనే ఉంటుందనే మాట సత్యం.

సర్వభూతాలకు షడ్భావవికారాలు ఉంటాయి.

  1. ఉండడం 2. పుట్టడం 3. పెరగడం 4. మారడం 5. తరుగడం 6. నశించడం అంటే అదృశ్యమవడం. ఇది సృష్టివైచిత్రి. శః

అహం కృత్నస్య జగతః ప్రభవః ప్రళయస్తధా”- (భగ. 7,

“జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్‌” (భారతం)

నూక్ష్మరూపంగా నిక్షిప్తమైన (బ్రహ్మాండం నారాయణుని కుక్షిలో నుంచి క్రమంగా ఉద్భవిస్తుంది, వృద్ధి పొందుతుంది. తిరిగి ఆయన కుక్షిలోనే క్రమంగా లీనమవుతుంది.

రాఘవీయవ్యాఖ్య ళా ఇది చక్షురింద్రియగోచరమయ్యేది కాదు. ఎంతో ఎత్తుగా ఉన్న కొబ్బరి చెట్టుమీది బొండాలోనికి నీరెలాచేరుతుందో? ఆ ప్రక్రియ కంటికి కనబడదుకదా! నీటితో నిండిన కాయలోని నీరు క్రమంగా అణగారి, కొబ్బరి ఘనంగా ఏర్పడుతుంది.

“నారికేళఫలస్యాంతర్చీజం బాహ్యదలైరివ” (వి.పు.1-2-60. చిప్పు జుట్టుతో దట్టంగా కప్పబడిన కొబ్బరి బీజంతో, ప్రాకృతిక సప్తావరణాలతో వ్యాపించిన బ్రహ్మాండాన్ని పోల్చాడు శ్రీపరాశరమహర్షి

కొబ్బరి చెట్టుకు 'నాళికేరం' అని పేరు. నీటికి 'తలతన్యత' అంటే ప్రదేశంలో ప్రొకే గుణం ఉంది. చెట్టుకు వేర్లు మొదల్కొని కాండంలోనూ, కొమ్మల్లోనూ, రెమ్మల్లోనూ, కాయవరకు సన్నని రంధ్రాలు ఉండే నాళికలుంటాయి. నేలలోని నీరు 'తలతన్యత' వల్ల చెట్టువేర్లను పట్టుకొని నాళికల ద్వారా ఎత్తుకు ఎగబ్రాకి కాయలోకి చేరుతుంది.

ఈ ప్రక్రియ చెట్లకన్నిటికీ సామాన్యమే. ఆయినా నేలలో ఉండే నీరు, నాళికీయత వల్ల ఎత్తులో ఉన్న కాయలోనూ కనబడుతున్న కారణంగా టెంకాయను 'నాళికేరం" అంటారు. ఈ పదం (నాళికేరం) వ్యత్యస్తమై “నారికేళం' గా రూపొందింది.

ఈ పద్యంలో ఉపమాలంకారం భాసిస్తుంది.

నారాయణుని. కుక్షిని నారికేళంతోనూ, దానిలో ఉద్భవించే భాండచయం నారికేళంలోని వాఃపూరంతోనూ పోల్చబడింది.

ఉపమేయం కుక్షి. ఉపమానం నారికేళం.

'భాండచయం' ఉపమేయం “వాఃపూరం' ఉపమానం.

“చందం' ఉపమావాచకం. 'ఉదయించు' సాధారణధర్మం.

ఉపమానోపమేయాలకు మనోజ్ఞంగా సాదృశ్యాన్ని వర్ణిస్తే ఉపమాలంకారమవుతుంది. తెలియని విషయాన్ని ప్రసిద్దమైన విషయంతో పోల్చి బోధించడం కవి(తా) చమత్కృతి. ను. దళదిందివరనీలనీరదసముద్యద్భాసితాకార, శ్రీ

లలనాకౌస్తుభచారువక్ష విబుధశ్హాఘోద్భనస్థానకో మలనాభిచరణారవిందజనితాన్నూయాద్య గంగా! లస జ్ఞలజాతాయతనేడత్ర నిన్ను మదిలో. జర్చింతు నారాయణా॥ 22 అర్థం = దళల్‌ - ఆకార! దళత్‌ = వికసిస్తున్న; ఇందీవర = నల్లకలువపూవు వలె; నీలనీరద = నల్లని మేఘం వలె; సముద్యత్‌ = పైకి వ్యాపిస్తూ? భాసిత = ప్రకాశించిన; ఆకార = రూపం కలవాడా! శ్రీలలనా -వక్ష! శ్రీ లలనా = లక్ష్మి అనే (స్త్రీచేత, కౌస్తుభ

78 క కసుభమ చా ్‌ వతలచే * రు == కొ అం నాభీ = పాకీ నియాడబడే కొ దమైన, వక్ష = నా ఆ కలి నుంచి; రణ దేహం: ఉరస్సు క రాయణ మ్నాయ+ ఆద్య ; చరణ+అర, కలవాడా లవాడా! వి శతకం గ స్‌ ౫ వే వింద = 1! కోమ, బుధ లసత్‌-నేత దాభ్యాస వపా ల-గ శ్చాఘా' (త! లసత్‌ = ససం చేసిన దకమ గా! కోమళ +ఉద్ద నత్ర = కన్నులు క = ప్రకాశిస్తున్న: మొదటి ర నుంచి మల = ఉద్భవస్థాన గ నారాయ రాయ = కమ। శై గం, ఉద ణ్‌ క్రాస్తుభవ ణుడు ణా! మదిలో లాలవలె గాము యించిన ఖో ణికలిగిన రమణీ ఇందీవరదళశా = హృ ; ఆయత గంగకల 1 కొనియౌగే రూప యోరసు; సముడు ృదయంలో నా వాడా! ఠి జనించిన కోమల పప్రధమం ద్భవాని క్లశపరుడు చర్చింతు. + పులాయలనేలుడు ల పద గా చతు కి కారణ 4 ను. న్న కవి. సౌందర్యం , గంగజని ససించిన దేవతలు ఇన ఫి నారాయణుని అ గల ర వా చతురు ందర్యవర్ష న రెండు టో ప్రత్యంగ ఇమూర్తి దపదు త శిండవది సర్వాంగ సౌ లు ఒక వర్లన ర్తిని శ్రెడు, గ్ల ందర్యాన్ని టి ఏయ ధ్యానించే వ ర్తనం అంగిందయ ల్‌ నాముదాయి. ంగానికి పయోగించి గిసౌంద వరిం గాన్నే పదలర్యము ర కవులు వర్షి ర్యవర్ణనం ( చడం. బై వర్షించ ఇక్కడే" ఉవికల్పనోపగొవం క్స్‌న్తారు లం అంగపంద జీస్తుది స్వీటి (ప్రధమచర గాంగిభా నటీ ౦దర్య మ స అభిరామరూ, ణఇంలోనే భావసంకే దేంంంపదేలోర స్పృహాణీయం. పాన్ని ఇందీ భావుకుల కలన చే నా. భోగం కాలే ప్రాణం న హృదయా ందే ళల వికసిస్తున్న ం సల్వేశ్వరునికి ఆ ప్రనీరదం న్ని రంజి సాక ర్త భంది పున ని సమర్పిత ఉపమ పంచానికి వం అధికారి అందరు వంది. సందోగొతే మయిం నమ బర్శణలిమోగ నిమి ఫీయజాలదు: ॥ వహిసా, ౦ అంత వికానిి' వావి | 0” యహ సందేశ అంత నారు కదా స్సారా న్ని ని పనీరదం అనో దే వల్ల గౌర ఘన! త్తు నింక టిసు రభ 7 ఈ స నమూ న్‌ స్తుంది. ఉంట, సప్త న్నాడు న “యే సడి. త్తు మేఘా క ళల బ్‌ తపా ఘనశా శ్యాషు ద్చి నాని శ. నాం త్త సముడు ం తే లః పురి డు శృమసి శ స వ్వ కాదు. రణం” సమసి ఇ అని తరాం ప్రస తప్తస్పృష్థ స్తు ష్టికే చడం

రాఘవీయవ్యాఖ్య 79

తరులు, ఓషధులు ఊర్జంగా పెరిగి వీర్యవంతమవడానికీ, జంతుజాలం ఆనందో(ద్రేకాన్ని చెందడానికీ మొగులువన్నెయే. కారణం. ఇలాంటివన్నెకాడు నారాయణుడు,

“నీలతోయదమధ్యస్టా విద్యుల్లేఖేవ భాస్వరా” అన్నట్టు నీలమేఘం మధ్యలోని మెరుపులాగా, శ్రీ రామామణి నారాయణుని వక్షస్థలంలో శోభిస్తుంది. “లక్ష్మీ విద్యుల్లలితం” (రా.చం.) "లక్ష్మీ విద్యుల్లలిత వపుషం” (హంససందేశం),. సువిశాలమైన శ్రియఃపతివక్షస్టలం సకలచేతనులకు చైతన్యస్తన్యమిచ్చే లక్ష్మీదేవికి నివాసస్టలం.

“వేదాంతాస్తత్య్యచింతాం మురభిదురసి యత్సాదచిహ్నైస్తరంత్రి” (తీగు.రు ఉపనిషత్తులు పరతత్త్యచింతను, నారాయణుని వక్ష్యస్టలమందున్న లక్ష్మీదేవి పాద చిహ్నాలను చూచి విరమించుకొన్నాయట. జీవవర్గానికి చిహ్నమైన కౌస్తుభమణిక్రూడ్తా శోభించే మహోరస్కుడు శ్రీమన్నారాయణుడు.

“ఆత్మాన మస్య జగతో నిర్లేమగుణామలమ్‌:

బిభర్తి కౌస్తుభమణిస్వరూపం భగవాన్‌ హరిః!

శ్రీవత్ససంస్థ్రానధరం అనంతేచ సమా్థ్రితమ్‌।

ప్రధానం” (1-22)

చిత్కళాచైతన్యచిహ్నమైన కౌస్తుభమణియే కాక, విచిత్రమైన మూల ప్రక అచిత్తు అనే తత్త్వానికి సంకేతమైన, ప్రదక్షిణ 1క్రమంలో ఉండే తెల్లన్సి రోమాల కూడిన శ్రీవత్సమనే సుడికూడా నీలనీరదశ్యాముని ఉరఃస్టలమంద్రు రాజిల్చ్య్యు అని విష్ణు పురాణం అ(్త్రభూషణాధ్యాయంలో విశదీకరిస్తున్నది ఇంది

భోక్తా భోగ్యం (్రేరితారం చ మత్వా (శ్వే.ఉం ప్రధానపురుష్యర్య, _ (5. అన్నట్టూ భోక్తయైన చేతనుణ్నీ, భోగ్యమైన ప్రకృతినీ, కొ రెంటిన్సీ స్వ తం) నిర్వహించే ఈశ్వ్చరత్వాన్నీ, ఒకే చోట ఒకే సమయాన సేవించే విధంగా చాక్‌ంగా వర్షింపబడింది కదా! ఉ గవుక్ష

పొక్కిలి పసిబిడ్డడు అమ్నాయాద్యుడు. ఆమ్నాయ, , ఎమౌమ్నార్వ్య్య్ట్ల వై రూఢౌ” అని 'లఘుశబ్దేందుశేఖరం'లో నాగేశభట్టు చెప్పినాడ్సు, స న వ్వ్‌

'మ్నా' ధాతువుకు 'అభ్యాసం' అని అర్ధం. ఎల్లప్పుడు “భ్యసింపబజ్ష్వ వేదానికి 'ఆమ్నాయ'” మని పేరు. (కుతి + కాబట్ట

“యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై" (8 తేనే టవ ఆదికవయే” (భాగవతం). అనే ప్రమాణానుసారంగా, 'ట్రహ్మవ్ష్య్య్ట వ్రపానాయ నుంచి వేదాలను మొదటనేర్భుకొన్నాడు. కాబట్టి, వేదర్శా ట్రైవ న్‌ చం ('ప్రఖ్యాతమయింది. సౌటవిద్యం గా

80 నారాయణ శతకం అండాంతర్వర్తియైన దేవమనుష్యాదిసృష్టికంతటికీ కర్తమైన చతుర్ముఖబ్రహ్మను, ప్రతి ('బ్రహ్మండమందూ సృష్టించిన పద్మం నాభియందు కలవాడు; పద్మంలాంటి మృదువైన నాభికలవాడు నారాయణుడు. భవభంగ, ధవళాంగ, కమల సంగ, విమల తరవారి పూరసంభృత తరంగ మైన గంగను ఉద్భవింపజేసిన సుకుమారాంఘిపద్ముడు నారాయణుడు. వికసిస్తున్న కెందామరలలాంటివి ఆయన విశాల నయనాలు. బహుముఖప్రయోజనాలు గల ఈ దివ్యావయవాల పాలకువలే పృధగ్భావనగా పద్యంలో వర్ణింపబడినాయి. చక్కని అంగసౌస్టవంగల ఈ సుందరమూర్తిని చమకంగా తిలకించి, పులకించి, నమకం చెప్పని వాడెవడు? తలచిన మాత్రాన ఘోరాఘరాశులను భస్మంచేసే భద్రమూర్తి, బుధులేమిటి? విబుధులచేతనూ శ్ఞాఘ్యమానుడేసుమా! ను, జగదాధారక భక్తవత్సల కృపాజన్మాలయాపొంగ, భూ గగనార్కేందుజలాత్మపావకమరుత్కాయా, ప్రదీపప్రయో గిగణస్తుత్య మహాఘనాశన, లసద్గీర్వాణసంసేవితా, త్రిగుణాతీత, ముకుంద, నాదుమదిలో దీపీంపు నారాయణా! 23 అర్థం : జగత్‌+ఆధారక = పుట్టుతూ గిట్టుతూ ఉండే ప్రపంచానికి కారణమైన వాడా! భక్తవత్సల = భక్తులయందు ప్రేమకలవాడా! కృపాజన్మ+ఆలయ+అపొంగ = దయకు పుట్టిల్లైన్‌ కడకన్నులు కలవాడా! భూగగన - కాయా! భూ = నేల; గగన = నింగి; అర్క = సూర్యుడు, ఇందు = చంద్రుడు; జల = నీరు; ఆత్మ = జీవుడు; పావక = అగ్మి; మరుత్‌ = గాలి; కొయా = శరీరంగా కలవాడా! ప్రదీప ప్రయోగి గణస్తుత్య = దీపాలను వెలిగించిన పరమయోగుల సమూహం చేత స్తోత్రం చేయదగినవాడా! మహా+అఘనాశన = పెద్ద పాతకాలను నళింప జేసేవాడా! లసత్‌ + గీర్వాణ, సంసేవితా = ప్రకాళించే దేవతలచే, సేవింపబడేవాడా! క్రిగుణ+అతీత = సత్వగుణరజోగుణ తమోగుణాలనే మూడింటిని మించిన వాడా! ముకుంద = మోక్ష ఫలాన్ని ఇచ్చేవాడా! నారాయణా! నాదు = నా యొక్క; మదిలో = హృదయంలో; దీపింపు = ప్రకాశింపుము. తా; విశ్చసృష్టిస్టితి లయాలకు కారణుడు కాబట్టి నారాయణుడు జగదాధారుడు. భక్తులయందు వాత్సల్యంకలవాడు. కృపాకటాక్షం కలవాడు. జగచ్చరీరుడు. ఉజ్జులుడు, మహాయోగులచే స్తుతింప దగిన వాడు. మహాపాపనాశకుడు. దేవరాజులచే సేవింపబడేవాడు, త్రిగుణాత్మకమైన ప్రకృతికి అధ్యక్షుడు. మోక్షదాత. జ్యోతీరూపుడైన సర్వేశ్చరుణ్ని, సంబోధనతో ప్రార్ధిస్తూ కవి తన హృదయంలో (ప్రకాశించుమన్నాడు. వ్యాఖ్య : కల్యాణగుణాలతో దీపించే నారాయణుడు తన ఎదలో దీపించాలవి కని ప్రార్ధించే పద్యమిది.

రాఘవీయవ్యాఖ్య 91

జగదాధారకుడు నారాయణుడు అనడం అర్జవాదమూ కాదు. అతివాదమూ కాదు. “సర్వస్య లోచనం శాస్తం” ఇంద్రియాలకు గోచరించని పరమాత్ముణ్ని చూడడానికి, అందరికి కన్నులాంటి శాస్త్రాన్ని భగవంతుడే ప్రసాదించాడు. “మానం ప్రదీపమివ కారుణికో దదాతి” - “శాస్త్రాద్వేద్మిజనార్దనం” అన్నట్టు ఆప్తవాక్యం. శబ్దప్రమాణ౦వల్ల భగవంతునిగుణవిభూతులను (గ్రహించడం లోకపరిపాటి.

ద్యౌస్పచంద్రార్కనక్షత్రం ఖం దిశో భూర్మహోదదధిః

వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహ్హాత్మనః॥” (భారతం)

నారాయణుడు సర్వత్ర వ్యాపించి, వసించి, ప్రకాశిస్తున్నందువల్ల వాసుదేవ నామం ఆయనకు అన్వర్హమయింది. ఆయన తన వీర్యం - ప్రభావం - చేతనే స్వర్గాన్నీ, సూర్య చంద్ర నక్షత్రాలతో కూడిన ఆకాళాన్నీ, భూమినీ, సముద్రాన్నీ, దిక్కుల నన్నిటినీ ధరిస్తున్నాడు. కాబట్టి జగదాధారకుడాయన. భక్తుల దోషాలను భోగ్యంగా స్వీకరించి, వారిని (ప్రేమతో సాకేవాడు భక్తవత్సలుడు. (ఈ పదవివరణం 'ప్రధమావతార పద్యంలోనే దర్శనీయం). వస్తువుయొక్క స్వరూపస్వభావాలను చూచేది నయనేంద్రియం.

తనను ఇష్టపడేవారినీ, తనకిష్టమైన వస్తువులనూ చూడగానే అవి కంటిలో (ప్రవేశించి పరావర్తనం చెందుతాయి. తన నాశ్రయించిన రూపగుణక్రియలన్నీ స్పష్టంగా కనబడుతాయి. వెంటనే దయారసం ఉద్గమిస్తుంది. కంటిమీది రెప్పల (శ్రిందినుంచి జాలువారి, కంటినిండా వ్యాపించి, కడకన్నులద్వారా ప్రసరిస్తుంది. కాబట్టి కడకంటి చూపును 'అపాంగదృష్టి' అంటారు. అపాంగం కృపకు జన్మస్ట్రానం. 'దయ' అనేది భగవంతుని (ప్రధానగుణం. “తదైక్షత”. అనే (శ్రుతి సంకల్పరూపమైన ఆయన దయాగుణాన్నే ప్రకటిస్తుంది.

“స్వధ్యానాయ మనళ్చ బుద్ది మనఘాం దత్వాఒనుగృహ్ద్హాతి నః

సంసారే తదపి (భ్రమేమ యది, కిం కుర్వీత సర్వేశ్వరః?”

దయాళుడైన నారాయణుడు తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి శా/స్తాన్నీ, తన నారాధించడానికి శరీరాన్నీ, తనను మనస్సున నిల్పుకొని ధ్యానించడానికి పరిశుద్ధమైన బుద్ధినీ మనకు అను(గ్రహించాడు. అయినా మనమీ సాంసారిక విషయాలలోనే పరిభ్రమిస్తుంటే, ఇంక భగవంతుడేమి చేయాలి? అంటారు భగవద్గుణానుసంధాన పరులు.

నారాయణుడు జగత్కాయుడు.

రై నారాయణ శతకం “అస్నర్మూర్దా చక్తుషీ చంద్రసూర్వ్యా, దిశన్షోత్రే వాగ్వివృతాళ్చ వేదాః! వాయుః (ప్రాణో హృదయం విశ్వమస్య ప ద్భ్యాం ష్నదివీ హ్యషసర్వృభూతాంతరాత్మా॥ (ముం.ఉ.ఏ-తు “అసౌ వై లోకోగ్షిః - ద్యాం మూర్చానం యస్య విప్రా వదంతి” అనే శ్రుతి స్మృతి వాక్యాలు 'అస్టిని ద్యులోకంగా బోధించడంవల్లు, పరబ్రహ్మకు ద్యులోకం శిరస్సు. చరిద్రసూర్యులు కన్నులు. దిక్కులే చెవులు, వేదాలే మాటటు, వాయువే ప్రాణం, విశ్యాంతరాళం హృదయకోళం, భూమి పొదస్టానీయర౦, ఆత్మకూడా ఆయనకు శరీరమే. సర్వప్రాణులకు నారాయణుడంతర్యామి, సర్వాత్ముడు. కాబట్టి కవి 'భూగగనార్కేందు జలాత్మపావకమరుత్కాయా!' అని సంబోధించారు, ప్రదిప 'ప్రయోగి గణస్తుత్యుడు నారాయణుడు. యోగీంద్రులు భగవద్దర్గన కాంక్షతో. నిద్రాహారాలు మాని (గ్రామైకరాత్రంగా సంచరిస్తారు. ఒకనాటిరా'త్రి 'సరోయోగో పెనుగాలివానలో పయనించలేక “తిరుక్కోవలూ”రనే దివ్య క్షేత్రంలో ఒక. చిన్న వాకిలి అరుగుమీద పడుకొన్నాడు. భూతయోగి కూడా అలాగే భగవన్నామస్మరణతో తిరుగుతూ అక్కడికే వచ్చాడు. మేరప్య తటాలున మెరసినందువల్ల అరుగుమీద పడుకొన్న వ్యక్తి కనబడినాడు. "ఏమండీ! ఇక్కడ, ఈ 'పెనుగాలివాన కురుస్తున్నందువల్లు విశ్రమించవచ్చా” అని అడిగాడు. “"సర్జుకొందాం రండ" అన్నాడు పడుకొన్న యోగి లేచి కూర్చొంటూ. ఆ చిన్న తిన్నె మీద ఇద్దరు కూర్చొని, ధ్యానమగ్నులయ్యారు. కాసేపటికి 'భ్రాంత యోగి క్షటిక చీకట్లో దారి తడవుకొంటూ, అవేదిక దగ్గరికే వచ్చాడు. “తలదాచుకోవడానికి ఇక్కడింత చోటు దొరుకుతుందా?” అని అడిగినంతలోనే అ గద్దెమీద కూర్చొన్న ఇద్దరు లేచినిలబడి ఆగంతునికి 'స్వాగతం' పలికారు, ఆ ముగ్గురు యోగులు నిలబడి, సిర్హిస్తలై ఉండగా, నారాయలుడు మెచ్చి, ఆ ముగ్గురి నడుమ చొచ్చి ఆనందంతో చిందులు త్రొక్కసాగాడు. ఒత్తిడి పెరిగింది. రాపిడికి ఒడలు నొప్పి మిమ్కుటమయింది. ఈ దుర్దినాన సూర్యుడు కనబడడు, గాలికి దీపమారిపోతుంది. ఏరీతిగ నైనా వచ్చిన వ్యక్తిని చూడాలని తలచారు. న సరోయోగి జ్ఞాన దీపాన్ని వెలిగించాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ సరోయోగి వెలిగించిన జీవం కుంభజ్యోతి, భూమిని ప్రమిదగానూ, సముద్ర జలాన్ని నెయ్యిగానూ, వాడిమయూభఖుడైన సూర్యుణ్ని. వత్తిగా. చేసిన దీపంతో ఛగవంతుణ్ను "సేవించాడు, చక్రధారికి నీరాజన మళ్చించాడు.

రాఘవీయవ్యాఖ్య 83

“ధరణి పంతియ సముద్రంబులు నేయి

యరుణదీపముజేసి యరుణాశుతతుల

గౌరాబు చక్రయబు కై బూన్పినట్టి

నీరజాక్షునకిత్తు నీరాజనంబు” (పరమ యోగి విలాసం, ద్విపదకావ్యం)

భూత యోగి విశుద్ద జ్ఞానదీపంతో దర్శించి, నివాళిపట్టాడు. భక్తిని ప్రమిదగానూ, ఆర్తిని నెయ్యిగానూ, శ్రీహరి దర్శన జనితానందాన్నే వత్తిగా చేసి జ్ఞానోజ్జులదీపాన్ని నారాయణునికి అర్చించాడు.

“ప్రేమ పంతియ, మితిలేని భక్తియే చమురు

నానంద భరిత హృదబ్దంబె వత్తి

గానానరించి వికాసమై యాత్మ6

దిరమొందు జ్ఞానంబు దీపంబుజేసి

పెరిమె నారాయణార్పితముగావించె” (చిన్నన్న డ్విపదకావ్యం)

ఇద్దరు యోగులు వెలిగించిన జ్ఞాన దీపాల కాంతి ఆధారంగా మూడవ యోగి భగవద్దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని చూచి, లక్ష్మీదేవిని చూచాను. సువర్ల శరీరుడైన లక్ష్మీనాధుణ్నీ చూచాను. స్వామి ధరించిన సుదర్శన పాంచబన్యాలనూ దర్శించాను. ఇంక నాకు కోరదగినదే ముంటుంది? అని మురిసిపోయాడు.

“సిరిగంటి, చెన్ను మించిన మేనుగంటి” అని శ్రీ తాళ్ళపాక తిరువేంగళనాధకవి 'దివ్యప్రబంధి చాయను సం(గ్రహించాడు.

ముదలాళ్వారు లని పేరుగాంచిన దైవీ గుణ ప్రపూర్జులైన ముగ్గురు యోగులు, ప్రాకృత నేత్రాలతో శ్రీమన్నారాయణ మూర్తిని ఈ లోకంలో దర్శించిన, సాందృష్టిక మనే దీపార్భనతో స్తుతించిన భాగ్యవంతులు.

మహాయోగుల జ్ఞాన వైరాగ్య దీపకాంతులలో (ప్రకాశిస్తూ నతులూ, నుతులూ పాందదగినవాడు నారాయణుడు.

“యథాజగ్ని రుద్దతశిఖ: కక్షం దహతి సానిలః

తధా చిత్తస్ట్రితో విష్ణుః యోగినాం సర్వకిల్చిషమ్‌!” (విపు)

జ్వాలతో కూడిన అగ్గి గాలితో కూడి, గడ్డివామును కాల్చివేసే రీతిగా యోగుల హృదయంలో ఉండే విష్ణుమూర్తి సర్వపాపాలను నశింపబేస్తాడు.

ఇందిరా సుందరీ వరుడు వందారు బృందారక సందోహ సంసేవితుడు. (ప్రకృతిలో సర్వత్ర వ్యాపించి ఉన్నా, దాని గుణత్రయం లేపనం కోసమైనా లేళ మాత్రం అంటని వాడు కాబట్టి నారాయణుడు త్రిగుణాతీతుడు.

ప్‌ఖ నారాయణ శతకం “పరమాత్మని గోవీందే. భక్తి రవ్యభిచారిణీః 'పప్రయచ్చతి నృణాం ముక్తిం మా జీ భూదదత్రసంశయః (ైష్ణవధర్మం) పరమాత్ముడు. గోవిందుడు. ఆయనను స్టీరమైన భక్తితో సేవిస్తే మోన్షమనే పురుషార్దాన్ని ప్రసాదిస్తాడనడంలో సందేహమే ఉండవద్దు, సత్కవులీ నారాయణ పరంజ్యోతిని పద్మకోళ (ప్రతీకాళమైన తమ హృదయంలో ప్రకాశించాలని (ప్రొర్జించడం 'ప్రశంసనసీయమే. కదా! తా భూతన్రాతమునంబుజాసనుందవై పుట్టించు. విష్ణుందవై ప్రీతింబ్రోతు. హరుండనై చెబుతు. నిర్ఫేద్యుండనై తైగుణో పేతం ఖై పరమాత్మవై నిలుతు నీ 'సంపెన్వరులగానర బ్బాతోచ్భూత సుజాతపూజితపదొబ్దశ్రేష్ట నారాయణా॥ 2క్త అర్ధం. : అబ్బాతో = పదాబ్ద, అప్‌+జాత = నీటపుట్టిన కమలంనుంచి; ఉద్భూత = పుట్టిన (బ్రహ్మచేతనూ; సుజాత = దేవతల చేతనూ; పూజిత = పూజింపబడిన; పద+లబ్జ = పద్మొలవంటి పొడాలు కలనోడా! శ్రేష్ట = మిక్కిలి తేజస్సు కలవాడా! ఓనారాయణా! అంబుబ+ఆసనుడవై = కమలమే. పీరంగా కల (బ్రహ్మావై, భూతన్రాతమున్‌ = భూత సముదాయాన్ని - జగత్తును; పుట్టింతు. = సృజిస్తావు. విష్దుండవై: ట్రీతిన్‌ = దయతో; 'ప్రోచు = కొపాడుతావు. హరుండనై = రుద్రుడవై చెజబుతు = సంహారిస్తావు; నిళ్ళేద్యుండవై జ భేదింపదానివాడనై: 'ఖ్రైగుణశఉపేచంటై = మూడు గుణాలతో కూడిన (ప్రకృతియుక్తుడపై; పరనూతష్హై = స్టిరచరాలకు ఆత్మమై నిలుతు = ఉంటావు, సీ పెంపు = సీ మహిమ; ఎవ్వురున్‌ కానరు = ఎవరికీ తెలియదు. తాః బ్రహ్మాది దేవతలు పూజించే పొదపద్మాలు కలిగిన అమిత తేజళ్ళాలినైన ఓ. నారాయణా! నీవు చతుర్ముఖట్రహ్మవై పృధివ్యాదిభూతవర్లాన్ని. సృజిస్త్రావు, విష్ణమూర్తివై శ్రద్ధతో ప్రపంచాన్నీ పొలిస్తావు. రుద్రుడవై సంహరిస్తాను. దేశకాలాదులచే అసరిచ్చేద్యుడపు. ప్రకృతిసంసర్లుడవు. జీన ప్రకృతులను నియమించే పరమాత్ముడవు, నీ మహిమ ఎవరికీ తెలియదు. వ్యాఖ్య : భగవంతునివిభూతివర్లన “తత్సృష్ట్వా. తదేవానుస్రావిశత్‌ అనే (గ్రుతిరీతిగా విశ్వాన్ని సృజించి, దానిలో అంతర్యామిగా ఉన్నవాడు నారాయణుడు. బ్రహ్మమ సృజించి, అతనిలో అంతర్యామిగా వెలసి ప్రపంచాన్ని సృజిస్తాడు. ప్రపంచాన్ని పాలించే సామర్థ్యం విష్ణుమూర్తిదే, రుద్రునిలో అవేళించి ప్రళయం చేస్తాడు. “సృష్టిసిత్యంతకరణీం బ్రహ్మవిష్ణుశివాత్మికాం। ససంజ్ఞాం యాతి భగవానేక ఏవ జనార్ధనజో (వి.పు.1-2-6%)

రాఘవీయవ్యాఖ్య 85 ఒక్క జనార్దనుడే జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకోసం (బ్రహ్మ విష్ణురుద్రులనే మూడు సంజ్ఞలను ధరిస్తాడని శ్రీ పరాశరమహర్షి సూక్తి

ఈ చోట ఇలా ఉంటాడని గానీ, ఈ సమయాన ఉంటాడని గానీ, ఈ రూపంలో ఉంటాడనిగానీ చెప్పనలవి కాదు కాబట్టి నిర్భేద్యుడు భగవంతుడు.

“మ యాలధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్‌।

హేతునాఒనేన కాంతేయ! జగద్విపరివర్తతేః” (భుగ్‌ 9-10)

ఓ అర్జునా! నేనే ఈ జగద్వ్యాపారానికి అధ్యక్షుడను. నానిమిత్తంగా ప్రకృతి స్థిరదరరచనను చేస్తుంది. ఈ కారణంగా జగన్నాటకం అవిచ్చిన్నంగా సాగుతున్నది. కాబట్టి తైగుణోపేతుడు భగవానుడు.

పరామాయస్య సః = పరమః పరమళ్చాసౌ ఆత్మాచ = పరమాత్మా, అని విగ్రహవాక్యం. ఉత్కృష్టసంపదగల లక్ష్మి గలవాడు పరమాత్ముడు. ఆయన ఉభయ విభూతులకు నాయకుడు. కాబట్టి నారాయణుని (ప్రాభవ వైభవాలు ఎవరికీ గోచరించవు.

ఈ విషయాన్నే శ్రీ వ్యాస భగవానుడు ఎలా విశదీకరించాడో గమనిద్దాం,

“స ఏవేదం జగద్దాతా భగవాన్‌ ధర్మరూపధృత్‌!

పుష్టాతి స్టాపయన్విశ్వం తిర్యబ్బరసురాదిభి:॥

తత; కాలాన్షిరుద్రాత్మా యత్సృష్టమిదమాత్మనః॥।

సన్నియచ్చతి తత్కాలే ఘనానీక మివానిలః” (భాగ. 2-10-426,43)

పోతనామాత్యుడు. దీని భావాన్ని పోతపోశాడు. (భా.గ. ద్వి.స్కం. 274)

“ఇరవొందన్‌ (ద్రుహిణాత్మకుండయి. రమాధీశుండు విశ్శంబును

సిరతంజేసి హరిస్వరూపుండయి. రక్షించున్‌ సమస్త ప్రజో

త్కర సంహారముసేయునప్పుడు హరాంతర్యామిమై యింతయున్‌

హరియించున్‌, పవనుండు మేఘముల మాయం జేయుచందంబునన్‌॥ ను. వరనాభీధవళాంబుజోదరమునన్‌ వాణీశు. గల్పించి య

ప్పురుషశ్రేష్టుని ఫాలముందు. శివునింబుట్టించి యామేటికిం బరమోత్తంసముగా వియత్తలనదిం బాదంబులంగన్న మీ సరి యెన్వారలు మీరు దక్కంగ రమా సాధ్వీశ నారాయణా॥ 25 అర్థం : రమా సాధ్వీ+-ఈళ = సార్వియైన రమాదేవికి భర్తమైన వాడా! ఓ నారాయణా! వేర -నన్‌, వర = శ్రేష్టమైన; నాభీ = పొక్కిలి యందలి; ధవళ + అంబుజ = తెల్లని కమలం యొక్క, ఉదరమునన్‌ = గర్భమునందు; వాణీ+ఈశున్‌ = సరస్వతీపతియైన

86 నారాయణ శతకం (బ్రహ్మను; కల్పించి = వేడుకతో పుట్టించి; ఆ+పురుష్రేష్టుని ఫాలమందు = ఆ బ్రహ్మనుదుటినుంచి; శివునిన్‌; పుట్టించి; ఆ మేటికిన్‌ = ఆ శ్ఞాఘ్యమూర్తికి, పరమ+ఉత్తంసముగా = ఉత్కృష్టమైన భూషణంగా; వియత్‌తల నదిన్‌ = ఆకాశ గంగను; పాదంబులన్‌ = (స్వేయ) చరణాలయందు; కన్న = పుట్టించిన; మీసరి = మీతో సమానం; మీరుదక్కగ = మీరు కాక; ఎవ్వారలు = ఎవరు ఉన్నారు?

తాః ఓ లక్ష్మీపతి! నారాయణా! నీనాభియందున్న స్వచ్చమైన కమలంయొక్క గర్భమందు. వాగీశుడైన బ్రహ్మను, ఆ (బ్రహ్మ ఫాల ప్రదేశంనుంచి శివుణ్ని పుట్టించావు. ఆ శివునికి భూషణంగా ఆకొశగంగను నీ పాదాలయందు కన్నావు. మీకు సొటివారు మీకే కాక మరెవ్వరున్నారు.

వ్యాఖ్య : వారాయణుడు నిస్సమాభ్యధికుడని వర్గ.

“యన్నాభిజాతా దరవిందకోశాత్‌” అన్నట్టు చతుర్ముఖ బ్రహ్మనారాయణుని నాభీకమలగర్భమందు ఆవిర్భవించాడు. ఆ బ్రహ్మఫాలతలమందు. శివుడు ఉద్భవించాడు. అ శివునికి శీరోభూషణంగా నారాయణుని నామచరణం నుంచి గగనగంగ ఉద్గమించింది. ఇదంతా నారాయణుని సంకల్పంవల్ల సంభవించిందే కాబట్టి ఆయనకు అయనే సాటి అని అనన్యాలంకారోక్తి వైచిత్రిగల పద్యమిది. ము ప్రభ మీనాభి జనించినట్టి విలసత్చద్మోరుసద్మంబునం

ట్రభవంబైన విరించిఫాలజనితప్రప్వేదసంభూతుంటై

యభిధానంబుసు. గోరి కొాంచెను భవుండార్యేశులూహింపంా

నభవాఖ్యుండవు నిన్నెలుంగ నశమే యబ్బాక్ష నారాయణా॥ 26

అరం : అప్‌+జ+అక్ష = తామరసాక్ష! ఓ నారాయణా! (ప్రభ = తేజస్సువల్ల; మీ

నాభిజనించినట్టి = మీ బొడ్డునుంచి పుట్టిన; విలసత్‌, పద్మ+ఉరు, సద్మంబునన్‌ = వికసిస్తున్న కమలమనే గొప్ప భవనమందు; ప్రభవంబైన = జన్మించిన; విరించి -భూతుండ్జై విరించి = బ్రహ్మయొక్క, ఫాల = నుదుటినుంచి; జనిత = ఉదయించిన; ప్రస్వేద = చెమటవల్ల; సంభూతుండై = ఉద్భవించి: భవుండు = శివుడు; అభిధానంబును = పేరును; కోరి = వాంఛించి, కాంచెను = పొందెను. ఆర్యా+ఈశులు = రుద్రులు; ఊహింపగా = తర్కింపగా; అభవ+ఆఖ్యుండవు = పుట్టనివాడు అనే పేరు కలవాడవు; నిన్ను ఎరుంగవశమా।

తొ: పద్మనయనా! ఓ నారాయణా! తేజస్సువల్ల మీ నాభినుంచి జనించిన పద్మ మనే భవనమందు ఉద్భవించిన (బ్రహ్మయొక్క నొసట పుట్టిన చెమట నుంచి శివుడు పుట్టినాడు. నాకు పేరు పెట్టమని కోరగా (బ్రహ్మ శివునికి నామకరణం చేశాడు. ఏకాదశరుద్రులు భావించినట్టు జన్మ లేని వాడవు నీవే. నిన్ను తెలియ వశమా!

రాఘవీయవ్యాఖ్య 87

వ్యాఖ్య : నారాయణుడు “అభవుడు' అని వర్లన.

అబ్బాన్షుడు, ఆబ్జ్బనాభుడు నారాయణుడే. ఆయన ప్రభ అనవధిక్షం. అబ్బయోని విరించి, అంటే భూతాలను సృజించే బ్రహ్మదేవుడు, పద్మంనుంచి ప్రభవించిన విరించి, మొదట సనక సనంద సనాతన, సనత్కుమారులను సృజించిన, వారిని 'ప్రజాస్పృజత' అని ఆదేశించాడు,

నారాయణ పరాయణులైన ఆ పరమ యోగులు '్రజను సృజించమన్నారు. (బ్రహ్మకు కోపం వచ్చింది. “ధియా నిగృహ్యమాణోఒపి (భ్రువోర్మధ్యాత్‌ ప్రజాపతేవ (భాగ. 3-12-7). బుద్ధితో ఎంతో నిగ్రహించినా, కోపం విజృంభించింది. చెమట పట్టింది. కనుబొమలు ముడిపడినాయి. అప్పుడే -

“భ్రుకుటీకుటిలాత్తస్య లలాటాత్‌ క్రోధదీపితాత్‌!

సముత్పన్నస్తదా రుద్రో మధ్యాహ్నార్కసమ(్రభః॥” (విపు. కం7-12)

“నామ దేహీతి తం సోఒధ ప్రత్యువాచ ప్రజాపతిః

రుద్రస్ట్యం దేవ నామ్నాసి మారోదొర్యమావహ॥” (విపు. కంర)

బ్రహ్మయొక్క ఫాలప్రదేశం నుంచి మధ్యాహ్నమార్తాండునితో సమానమైన ప్రచండతేజస్సుగల నిసుగు జనించింది. నాకు పేరు పెట్టమని (క్రమంగా ఏడ్వడంవల్ల 'రుద్రుడని నామకరణం. చేశాడు (బ్రహ్మ ఏడ్వకు, ధైర్యంగా ఉండుమన్నాడు.

“నామాని కురు మే ధాతః! స్టానాని చ జగద్గురో!” (భాగ 3-12-8)

నాకు పేర్టు పెట్టి, స్థానాలను కల్పించుమన్నాడు. పదకొండు పేర్లను పెట్టి, స్టానాలనూ ఏర్పరచాడు విధాత. వీరే ఏకాదశరుద్రులు.

ఏకాదశరుద్రులు :;

మన్యు, మను, మహాకాల, మహత్‌, శివ బుతధ్వజ, ఉరురేతస్‌, భవ, కాల, వామదేవ ధృతవ్రతులని (ఏకాదశరుద్రుల)పేర్చు.

ఏకాదశ రుద్రాణులు :;

ధ్కీ వృత్తి అశనా, ఉమా, నియుత్‌, సర్పిః ఇలా, అంబికా, ఇలావతీ, సుధా, దీక్షా - అనేవి రుద్రుల పత్నులనామధేయాలు.

ఏకాదళస్థానాలు : చంద్రుడు, సూర్యుడు, అలి, వాయుప్పు జలం ఆకాశం, భూమి, ప్రాణం, తపస్సు, హృదయం, ఇంద్రియాలు, మ ధను

'ఓ రుద్రా! ఏకాదళ నామ పత్నులతో ఆయా స్టానాల్ల్‌ నివసించి, 'ల్రజ సృజించు'మని పితామహుడు నిర్దేశించాడు. ఇది రౌ 'ద్రసృష్టి

88 నారాయణ శతకం పుట్టుక కలవాడు 'భవుడు పుట్టుక లేనివాడు అభవుడు. శివుడు. 'భవుడు, నారాయణుడు 'అభవుడు' అనడానికి పద్యంలో భవుడు 'విరించి ఫాలజనిత (ప్రస్వేద సంభూతు"డని హేతువాక్యాన్ని కూర్చాడు కవి. కాబట్టి, ఇది వాక్యార్హహీతుక కొవ్యలింగాలంకారం. తాను మాత్రం 'అభవుడై' అందరినీ 'పప్రభవింపజేసిన నారాయణుని ప్రభావం ఎవరికీ తెలియశక్యం కాదు. ము. పటుగర్భాంతరగోళభాగమున నీ బ్రహ్మాండభాండంబు ప్రొ కటదివ్యాద్భుతలీలందాల్చి మహినుం గల్పాంత మంభోధిపై వటపద్రాగ్రముంటెంది యొప్పిన మిము న్వర్లింప(గా శక్యమే నిటలాక్షాంబురుహాసనాదికులకు న్నిర్వాణ నారాయణా॥ 27 అర్ధం : నిటలా - కున్‌! నిటల+అక్ష = ఫాలనేత్రుడైన శివుడు; అంబురుహ+ఆసన = కమలాసనుడైన (బ్రహ్మ; ఆదికులకున్‌ = మొదలైన వారికి కూడా? నిర్వాణ = పరమగతియైనవాడా! ఓ నారాయణా! కల్ప+అంతము = ప్రళయ కాలంలో; మహిమన్‌ = సామర్థ్యంతో; పటుగర్భ+అంతర, గోళభాగమునన్‌ = సమర్డమైన కుక్షిలోపలి గోళ 'ప్రదేశమందు; ఈ బ్రహ్మాండభాండంబు; ప్రాకట దివ్య+ఆద్భుత లీలన్‌ = వెల్లడించే దివ్యమైన, ఆశ్చర్యకరమైన విలాసంతో; తాల్చి = ధరించి; అంభోధిపై = సముద్రమందు; వటపత్ర +అ(గ్రమున్‌ = మళ్లి ఆకుమీద; చెంది, ఒప్పిన = ఉండి శోభించిన; మిమున్‌ = మిమ్ము; వర్షింపగా = ప్రశంసింపగా; శక్యమే = సామర్థ్యం కలదా? తా; భవునికీ, పద్మభవునిక్సీ అందరికీ పరమగతియైన ఓ నారాయణా! (ప్రళయకాలాన అద్భుతమైన దివ్యలీలను వెల్లడించే మహినుతో ఈ (బ్రహ్మాండభాండాన్ని మీ కుక్షిలోపల నిక్షేపించుకొని ఏకార్లవమందు వటపత్రంమీద శాంతంగా ఉండే మిమ్ము వర్షించడానికి ఎవరికీ శక్తి చాలదు. వ్యాఖ్య : వటసప్రశాయిశాంతరూసం నర్లితం. సర్వజగజ్జననరక్షణజక్షణలకు ఏకైకకారణుడు నారాయణుడే. సృష్టికి ఉదయకల్పమనీ, (ప్రళయానికి క్షయకల్పమనీ పేరు. “ఆ(బ్రహ్మస్తంబపర్యంతా: జగదంతర్వ్యవస్టితాః। ప్రాణినః కర్మజనితసంసారవళవర్తినః॥” (విధ. 75) (బ్రహ్మదేవుడు మొదలు తృణంవరకు ప్రకృతిమండలంలో ఉన్నవారే. సమస్త (ప్రాణులు కర్మచేత ఏర్పడే సంసారానికి వశ్యులై ఉండడం ఆజానజం, కాబట్టి (బ్రహ్మరు(ద్రేంద్రాదిజీవులందరికీ పరమచరమగతి పరమాత్ముడే. (ప్రళయకాలంలో

రాఘవీయవ్యాఖ్య 89 జగమంతా ఏకార్లవంగా మారుతుంది. అప్పుడు ఒక్క నారాయణుడే తప్ప (బ్రహ్మరుద్రులుగానీ, చంద్రసూర్యులుకానీ, భూమ్యాకాశాలుగానీ ఏవీ ఉండవని శ్రుతి. "ఏకో హ వై నారాయణ ఆసీత్స్‌ న బ్రహ్మా నేశానో, నాన్నీషోమౌ నేమే ద్యావాప్పదివీ”.

ప్రళయ కాలంలో ప్రపంచాన్ని ఉపసంహారంచేసి నారాయణుడు తన గర్భగోళంలో భద్రపరచి నిర్భరుడై ఉంటాడు. మైనానికి అద్దిన బంగారు పిసర్ల లాగా, కర్మవాసనాబీజాలతో సమస్తవస్తుమయమైన జగజ్ఞాలాన్ని జక్షించిన ఆ బొజ్జ ఎంత విశాలమయిందో! కుక్షినిక్షిప్తమైన (బ్రహ్మాండాన్ని క్షయకల్పాంతంవరకు భరించే ఆ మూర్తి ఎంత సహానశక్తి కలదో!

“వటస్య పత్రస్య పుటే శయానం” అన్నట్టు ఆ బృహద్రూపి పాల కడలిలో తేలియాడే మజ్జి యాకు మీద ప్రశాంతంగా ఉంటాడట. అంటే విశ్శంభరుణ్ని తనపైన భరించే ఒక్క చిన్న మజ్జియాకే పెద్దదైన ఆ మహిమ ఎంత దివ్యమైనదో! ఎంత అద్భుతమైనదో! ఆ నిర్వాణస్థితిని ఎవ్వ్సరూ వర్లింప సమర్జులు కారని కవి తలపోత.

“వైతే స్వరూపం విదురాత్మనస్తే

అజాదయోఒనాత్మతయా గృహీతాః

అజోఒనుబద్దః సగుజైరజాయా

గుణాత్పరం వేద న తే స్వరూపమ్‌॥ (భాగ. 10-40-3)

అజాదులన్నీ అనాత్మలే. అంటే, జడరూపాలుగా ఉన్నవాటికీ నీవే ఆత్మవు, (బ్రహ్మ దేవుడు కూడా రజోగుణయుక్తుడు. జీవజడప్రకృతుల గుణాలకన్న పరంగా ఉన్న నీ (శ్రీమన్నారాయణ) స్వరూసమహిమను ఆ (బ్రహ్మదేవుడూ తెలుసుకొనజాలడు అని అక్రూరుడు స్తుతించాడు కదా!

“ముక్తి! కైవల్యనిర్యాణ శ్రేయోని'శ్రీయసామృతమ్‌” (అమరం). తుదకు, సమస్త వస్తువులముక్తికి నిమిత్తమైనవాడు నిర్వాణుడు. అతడు నారాయణుడే.

మ. _సనిశేషోరుసునర్లబిందువిలసచ్చక్రాంకలింగాకృతిన్‌ భవుచే నుద్దవుచే. బయోజభవుచే. బద్మారిచే భానుచే ధ్రువుచే నా దివిజాధినాయకులచే దీన్యన్మునీంద్రాళిచే నవదివ్యార్భృనలందుచుందువు రనూనానీశ నారాయణా॥ 28 అర్హం : రమానారీ+ఈశ = లక్ష్మీపతీ! ఓ నారాయణా! సవిశేష - ఆకృతిన్‌! సవిశేష = విశేషంగా? ఉరు = గొప్పదైన; సువర్ణ = మంచివన్నె - బంగారంతో; బీజాక్షరాలతో; బిందు = చిద్రూపంతో, బిందురూపంతో; విలసల్‌ = శోభిస్తున్న; చక్రశఅంక = సుదర్శన

ళం నారాయణ శతకం రూపంతోనూ; లింగ ఆకృతిన్‌ = లింగరూపంతోనూ, భవునన్‌ = శంకరునిచేతనూ ్క ఉద్ధవుచేన్‌ = ఉద్దవునిచేతనూ, పయోజభవృచేన్‌ = కమలోద్భవుడైన (బ్రహ్మచేతనూ / పద్మశ+అరిచేన్‌ = తమ్ముల పగవాడైన చంద్రునిచేతనూ; భానుచే = స్రూర్యునిసతనూ, (ధ్రువునిచేతనూ, అ దీవిజ+అధినాయక్షులచే = ఇం(ద్రాద్యమరవరుల సూ దీవ్యత్‌+*మునీంద్ర + అఖిచే = (ప్రకాశించే మునీశ్చరుల సమూహాలచేతనూ, నవదివ్య+అర్భన = కొత్తగా శోభించే పూజలను; అందుచు ఉందువు = పొందుతుంటావు. తా: లక్ష్మీపతీ! ఓ నారాయణా! శీవుడు, ఉద్ధవుడు. చతురాననుడు, చంద్రుడు, సూర్యుడు, (ధ్రువుడు, దేవతలు, మునులు విశేషంగా బీజ బిందువులతో శోభించే బంగారు సుదర్శనరూపాన్ని, భింగాకృతిని, కొత్తగా దివ్యమైన అర్భనలను చేస్తుంటే అద్భుతంగా స్వేకరిస్తుంటావు. వ్యాఖ్య : ఉపాననకు సులభమైన వారాయణరూపం వర్ణితం. భక్తులు మనసార పూజించడానికి యోగ్యమైన విధానాలుగల శొ(స్తప్రమాణాలను భగవంతుడు. కృపజేశాడు, ఆ ప్రమాణదీపంచేత భగవంతుని మంత్ర యంత్ర తంత్ర రూపాలను తెలుసుకొని అర్చించడానికి జీవులకు కరణకళేబరాలిచ్చాడు. మంత్ర బీజాక్షరాలనూ, తేబోనాదధ్యాన బిండువులనూ ఆయా (షట్‌ కోణాలలో లిఖించి ఆ పైన చక్రాకారంలో ఉండే ఆవరణాలతో నిర్మింపబడిన సుదర్భ్శనాది యంత్రాలను ప్రతిష్టించి ఆరాధించడం దేవతార్చన. కొందరు ద్వాదళలింగాలలో ఇష్టమైన ఒక లింగాకృతినీ దివ్యంగా అర్చిస్తుంటారు. సహ(్రనామాలతోనూ, మంత్ర బీజాక్షరాల పునశ్చరణతోనూ, చిద్రూపమైన బిందువును ప్రాణాయామంలో, (భ్రూమధ్యన దృష్టి నిలిపే ద్యానయోగంతో, మానసపూజ చేయడమూ శాస్త్రవిధి, “భువోర్మధ్యే 'ప్రాణమావేళ్య సమ్యక్‌ స తం పరం పురుషముషైత్రి దివ్యమ్‌[ (భగ,8-10) ప్రకృతిబద్దమైన ఆత్మకు అంటే తనను మం[తజపంతో (అంగన్యాసకర న్యాసవిధితోపాటు) వుద్దిని కల్పించుకొని దేవుణ్ని పూజించడం ఆచారవిధి, "ద్రేవో భూత్వా దేవం యజేత్‌ొ" అనేది నియతి కదా! నవవిధాలైన భక్తిరూపక్రియలలో 'అర్భనం' మధ్యస్థానం వహించింది. “శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదాసేవనం, అర్చనం, వందనం, దొస్యం సభ్య, మాత్మనివేదనమ్‌,” 'అర్చనిలో.. శ్తీర్తనం' వాచికం, *ప్రప్రదనం' ('ప్రార్థనామతి) మానసికం; 'ప్రసూనార్పణం' కాయికం; ఈ మూడు ప్రక్రియలు ముడిపడి ఉంటాయి.

రాఘవీయవ్యాఖ్య 9 షోడశోపచారాలలో 'జౌపచారికం' అంటే కొంచెం ఎడంగా ఉండి, తాకక, కర్పూరనీరాజనాలర్పించడం, వీవనలు విసరడం ఉంటుంది. 'సాంస్పర్శికం' తాకి అభిషేకించడం, చందనం, పూవులు సమర్ప్చించడమూ, 'ఆభ్యవహారికం' అంటే అన్న ఫల శ్రీరాదులను నివేదనగా అర్పించడమూ, 'సాందృష్టికం' అంటే, ధూపదీపాలుంచడం మొదలైన పూజా విశేషాలు నిత్యప్రత్యగ్రంగా ఉంటాయి. “జ్ఞానినో జ్ఞానయజ్జేన యజంతి జ్ఞానవి[గ్రహమ్‌॥ అన్యే చ సంస్కృతాత్మాన;ః విధినా విహితేన తే, యజంతి త్వన్మయాస్తాం వై బహుమూర్షేకమూర్తికమ్‌॥ త్వామే వాన్యే శివోక్తేన మార్గేణ శివరూపిణమ్‌! బహ్వాచారభేదేన భగవన్‌ సముపాసతే ॥ (భా.గ. 10-40-678) జ్ఞానయజ్ఞంతో జ్ఞానవంతులు, జ్ఞానవి[గ్రహాన్ని పూజిస్తారు. ఇతరులు విధి విహితంగా అనేక మూర్తులుగానూ, ఏకమూర్తిగానూ ఉన్న నిన్ను తృన్మయులై పూజిస్తారు. మరికొందరు. శివుడు చెప్పిన పద్దతిలో శివరూపుడవైన నిన్నే అనేక ఆచారవిశేషాలచేత ఉపాసిస్తారు, అని అక్రూరుడు స్తుతించాడు కదా! బ్రహ్మోత్సవాల్లో నవాహ్షికంగా బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలూ, బుషులూ, భక్తజనులూ నవరా(త్రులుగా చేసే అర్బనలను అత్యాదరంతో స్వీకరిస్తాడు శ్రీమన్నారాయణుడు, “పరిపూర్ణోఒపి భగవాన్‌ భక్రైర్యత్కించిదీరితమ్‌। సాపేక్షవ త్తదా దత్తే తేన ప్రీతో దదాత్యలమ్‌॥” అన్నట్టు, పూర్ణుడూ, అవాప్తసమస్తకాముడైన పురుషోత్తముడు “తత్కురుష్పు మ దర్భణమ్‌” అంటూ, భక్తులు అర్పించిన అల్పవస్తువులనూ ప్రీతితో స్వీకరించడంవల్ల ఆయన సౌలభ్యంయొక్క యాదార్ష్యం ప్రకటితం. ఈ పద్యంలో (ధ్రువుచే - దీవ్యత్‌ అనే మూడవ పాదంలో యతిమైత్రి చింత్యమే.

మ. సర్వంబున్‌ వసియించు నీతనువునన్‌ సర్వంబునందుండ(గా సర్వాత్మా! వసీయించుదీవని మదిన్‌ సార్జంబుగా. జూచి యా గీర్వాణాదులు వాసుదేవు(డనుచున్‌ గీర్తింతు రేప్రాద్దు నా శీర్వాదంబు భవన్మవానుహిమ లక్ష్మీనాధ నారాయణా॥ 29

అర్ధం : ఓ లక్ష్మీనాధ! నారాయణా! నీతనువునన్‌ = నీ రూపమందు; సర్వంబున్‌ = సమస్తం; వసియించు = ఉంటుంది; సర్వాత్మా! = అన్నిటికీ ఆత్మైనవాడా! ఈవు = నీవు; సర్వంబునందు. = ప్రతిపదార్థము నందు; ఉండగా, వసిశ+యించుదు = నివసిస్తూంటావు, అని, మదిన్‌ = మనస్సునందు; సార్ధంబుగా = అర్థవంతంగా; చూచి;

థై వారాయలణ శతకం ఆ శీర్వాణ+అదులు = ఆ దేవతలు మొదలైనవారు: వాసుదేవుడు, అనుచున్‌; ఏప్రొద్దున్‌ = ఎల్ల కాలం? కీర్షింతురు; భవత్‌+మవామహిమ = సీ గొప్పు వైభవం: ఆశీర్యాదంబు నా యోగక్షేమాలను కల్పిస్తుంది. చావ ఓ. లక్ష్మీనాధ! నారాయణా! సీ యందు. అన్నీ ఉంటాయి. నీవు అన్నిటియందు ఉంటావు. నీవు సర్వాత్ముడనని సహృదయులైన దేవతలు మున్నగువారు అర్జనంతంగా. వాసుదేవ డంటూ సర్వదా విన్ను క్షీర్లిస్తుంటారు. నీ మహామహిమ (ప్రపంచానికి ఆశిర్యాదమే. వ్యాఖ్య: నారాయణుడు. సర్యాత్ముడని వర్ణితం. నొరాయణునీకి జగమంతా శరీరమనీ, జగత్తున కంతటికీ నారాయణుడు "అత్మ అనీ సర్వాత్మన్‌ో శబ్దానికి అర్హం. “అత్మాయత్నో ధృతిర్చుద్ది: స్వభావో బ్రహ్మ వర్మ చ” (అమరం) అని, 'ఆత్మన్‌' శబ్దానికి అనేకార్దాలున్నాయి. “అంతు 'స్టవిష్టు. ఛాన్సే జనానాం సర్వాత్మా" జనులందరిలోపల ప్రవేశించి శాసించే. వాడు కాబట్టి నారాయణుడు సర్వాచ్ముడని (శ్రత్యర్థం, “సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ; ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనఃో (భక్‌ 6-29 యోగసిద్దుడైన మహాత్ముడు సర్వభూజాలయందు పరమాత్మను, పరమాత్మయందు సర్వభూతాలను, అంటే ఏకత్వంలో నొనాత్వాన్ని, నానొత్యంలో ఏకత్యాన్ని దర్శిస్తాడు. కాబట్టీ ఎచ్చుతగ్లులు. లేకుండా అతడు అన్నింటిని సమానంగా చూస్తాడు, సమడర్శనుడు' అంటే, మా - లక్ష్మి - తో కూడియున్నవాడు 'సముడు' సర్వత్ర 'లక్ష్మీసనాధు'ని దర్శిస్తాడని అర్ధం, “మయి శే తేషు చాప్యహద (భగ9-29 నాయందు వాదు, వారియందు నేను ఉంటాను. “సర్వం సమాష్షోషి తతోటసి సర్వ (భ.[.11400) అంతటా వ్లీనే వ్యాపించి ఉంటావ్సు కాబట్టి 'సర్వ' శబ్దవాచ్యుడవు సీను అంటుంది. గీతామాత, “మనోఒస్య చైవం చక్షుః" మహాత్ములకు మనస్సే దివ్యవేత్రం. సర్వాత్ముడు' నారాయణుడే అవి మనోనేత్రంతో చూచిన దేవతలూ, బుషులూ సార్థకమైన 'వాసుదేవుడనే పేరుతో కీర్తించారు. “వసత్యాత్మా జగత్యత్ర తస్మిన్వసతి వా జగళ్‌” జగమందు ఆత్మగా వసించేవాడు, జగత్తు తనయందు. వసించేవాడు. “వాసువు.

రాఘవీయన్వాఖ్య 93 'దీవ్యతీతి దేవః” అంతటా ప్రకాశించేవాడు దేవుడు. 'వాసుళశ్చాసౌ దేవళ్ళ = వాసుదేవః" జగమంతటా ఉండే, ప్రకాశించే వాడు వాసుదేవుడని వ్యుల్పత్త్యర్థం. “వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సుదుర్లభు" (భుగీ) లోకంలో కన్నులకు కనబడుతున్నా, అద్భుతలీలలను ప్రదర్శిస్తూ నోరార ఉపదేశిస్తున్నా, సర్వం వాసుదెవుడే అనే అధ్యవసాయంగల మహాత్ముడు చాలా అరుదు, అని వాపోయీడు శ్రీకృష్ణభగవానుడు. వాస్తవంగా, వాసుదేవునిమహిమ లోకాలకు యోగక్షేమాలను కలిగిస్తుంది, అనడం రెండు వాదాలకు తావులేని మాట. “వాసనా ద్వాసుదేవస్య వాసితం తే జగత్రయమ్‌! సర్వభూతనివాసోసి వాసుదేవ నమోజస్తు తే” అన్న వ్యాసమహర్షి ననుసరించి, మనమూ ముప్పాద్దులు “ఒమ్‌ నమో భగవతే వాసుదేవాయ” అనే 'ద్వాదశాక్షరి'ని జపం చేద్దాం. ము. గగనాద్యంచితపంచభూతమయమై కంజాతజాండావళిన్‌ సగుణబ్రహ్మమయాఖ్యతం దనరుచున్‌ సంసారివై చిత్కళా సుగుణంబై విలసిల్దుదీవు విపులస్తూలంబు సూక్ష్మంబునై నిగమోత్తంసగుణానతంస సుమహానిత్యాత్మ నారాయణాః క అర్ధం . నిగమ+ఉత్తంస = వేదాలే భూషణాలుగా కలవాడా! గుణ+అవతంస = కల్యాణగుణాలే అలంకారంగా కలవాడొ! సుమహా = గొప్పు మహస్సు (తేజస్సు) కలవాడా! నిత్య+ఆత్మ = మార్పులేని - ప్రకృతిబద్ధంకాని = ఆల్మే కలవాడా! ఓ నారాయణా! ఈవు = నీను కంజాతజ + అండ + ఆవలిన్‌ = (బ్రహ్మండే సముదాయమందు; గగన+ ఆది + అంచిత, పంచభూతమయమై = ఆకాశం మొదలైన వాటిచే ఒప్పిన ఐదు బూరాల వకృతిడై; సగుణ (బ్రహ్మమయ+ఆఖ్యతన్‌ = గుణాలతో కూడిన బం ; పూర్జుడ వనే పేరుతో; తనరుచున్‌ = ఒప్తుతూ; సంసారివై = ప్రసంచ మందున్న డవై; చిత్‌ కళా సుగుణంబై = జ్ఞానకళలో సుగుణమై. విపుల స్తూలంబునై కే విస్తారమైన స్టూలరూప్రమై; సూక్ష్మంబునై = మిక్కిలిచిన్న రూపమై; విలసిల్లుదు క ప్రకాశింతన తా: వేదశాస్త్ర ప్రతిపాద్యుడా! కల్యాణగుణాలంకారుడొ 1 బృహ దూ శ న వలవాడా! నిత్యాత్మ! నారాయణా! నీవు బ్రహ్మాండమందు క వై చిత ల్‌ పంచభూతాల రూపమై సగుణబ్రహ్మం' అనే పేరులో వ్యాపమి ” ర్‌ లాం సంపన్నుడనై స్థూల సూక్ష్మ రూపాలతో శోభిస్తుంటాను. వ్యాఖ్య ; నారాయణుని విరాడ్రూపవర్లన.

ర్క నారాయణ శతకం శబ్దప్రమాణగమ్యుడు నారాయణుడు, “అజాయమానో బహుధా విజాయతే” పుట్టుక లేనివాడు అనేక రూపాలను ధరిస్తాడు అన్నది పురుషసూక్తం. “బృహత్త్యం చ స్వరూపేణ గుట్టెళ్ళ” (శ్రీభాష్యం). నిరవధిక స్వరూపమూ, నిరతిశయగుణాలూ కలవాడు. పరబ్రహ్మ తేజస్సుకు ఎల్లలు లేవు. “అజో నిత్యః శాశ్ళ్యతో జయం పురాణః అంటుంది ఉపనిషత్తు. కాబట్టి పుట్టడం, 'పెరుగడం, మారడం లాంటి షడూర్ములు లేని, నిత్యాత్ముడు, నారాయణుడు. ఆయనకు స్వరూప గుణ విభూతులు లేవని భావించరాదు. ప్రపంచమంతా నారాయణుని స్వరూపమే. “భూస్తోాయమన్నిః పవనః ఇమాది ర్మహానజాదిర్మన ఇంద్రియాణి! సర్వేంద్రియార్జా విబుధాశ్ళ సర్వే యే హేతవస్తే జగతో ౬౦గభూతా:” నేల, నీరు, నిప్పు, గాలి, నింగి, అహంకారం. మహత్తత్వం, ప్రకృతి, పురుషుడు, మనస్సు, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, వాటికధిష్టాన దేవతలు, సమస్త చరాచర జగత్తు, దాని వ్యవహారకారణం మొదలైనవన్నీ నారాయణుని అంగరూపాలే. “అన్నిర్ముఖం తేఒవని రంఘ్రి రీక్షణం సూర్యో నభో నాభి రధో దిశః శ్రుతిః! ద్యౌః ఖం సురేంద్రా స్తవ బాహవో జర్షనాః కుక్షి ర్మరుత్‌ప్రాణబలం ప్రకల్పితమ్‌॥” “రోమాణి నృక్షాషధయ. శ్ళిరోరుహా మేఘాః పరస్యాస్టినఖాని తేలద్రయః। నిమేషణం రాత్యహనీ ప్రజాపతి ర్మేడ్రస్తు వృష్టిస్తన వీర్య ఇష్యతే॥” (10స్కం, 40 అధ్యా. 13, 14) అగ్నీ నారాయణునిముఖం, భూమి పాదాలు, సూర్యచంద్రులు నయనాలు, ఆకాశం నాభి, దిక్కులే చెవులు, స్వర్గమే తల, దేవేంద్రాదిదేవతలు బాహువులు, సముద్రం కడుపు, గాలి ప్రాణశక్రిరూపంగా సంకల్పితాలు. ఓషధులూ, తరువులూ భగవంతునిరోమాలు, మేఘాలు తలవెంట్రుకలు, పర్వతాలు ఎముకలు గోళ్ళు, రేయింబవళ్ళు రెప్పలు మూయడం తెరువడం, ప్రజాపతి శేఫం, వృష్టియే వీర్యం - ఇలా విశ్వమంతా నారాయణుని శరీరమనీ, ఇదే ఆయన స్టూలకార్యరూపమనీ శ్రీమద్భాగవతం విశదీకరిస్తుంది. విశ్వమే సగుణబ్రహ్మగొ సంభావితం, సూక్ష్మరూపంగా సర్వభూతాలహృదయంలో అంతర్యామిగా ఉన్నాడు. ప్రపంచానికీ పరమాత్మకూ శరీరశరీరిభావసంబంధముంది.

రాఘవీయవ్యాఖ్య 95 “ఈశ్వర: సర్వభూతానాం హృద్దేశేఒర్జున! తిష్టతి। 'భ్రామయన్‌ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా!” (భగ) సర్వభూతాలహృదయంలో పరమాత్ముడున్నాడు “అధోనిష్ట్యావితస్త్యాం తు నాభ్యాముపరితిష్టతి” (తై.నా.ఉ.) శరీరంలో కంఠానికి (క్రింద, నాభికి జేనెడుమీద తామరమొగ్గలాంటి, అంగుష్టమంత మాంసపుముద్ద అధోముఖంగా ఉంటుంది. ఇదే హృదయపద్మకోశం. దీనిలోపల జీవాత్మతోపాటు పరమాత్మ ప్రవేశిస్తాడు. శరీరమొక బస్సు. పరమాత్మ చోదకుడు (డ్రైవరు. కర్మ అనే ధనంతో దాని ఫలమనే టిక్కెట్టు కొని జీవుడనే ప్యాసెంజర్‌ ఆబస్సెక్కుతాడు. టిక్కెట్టుకు తగినంత దూరపుస్టేజీవరకు బస్సుమీద త్రిప్పి దించేస్తాడు. నారాయణుడూ సంసారియే. గొప్పకుటుంబి. ఆయనకు కర్మల ఫలమందు అపేక్ష లేదు కాబట్టి కర్మలు ఆయనను అంటుకోవు. “న మాం కర్మాణి లింపంతి, నమే కర్మఫలే స్పృహా (భ.గీ4-14) జీవుడు కర్మపరాధీనుడైన సంసారి కాబట్టి దాని ఫలరూపమైన సుఖదుఃఖభోగాన్ని అనుభవించి తీరుతాడు. కుమ్మరి. పురుగు బురదలోనే. తిరుగుతున్నా, దాని శరీరానికి బురద అంటుకోదుకదా! తామరాకు నీటిలోనే ఉన్నా, నీటి తడి తాొమరాకుకు అంటదు. అలాగే తామరసాక్షునికి కర్మ అంటదు. నారాయణుడు సంసారమందు ఏరూపంలో ఉన్నా ఆయనది శుద్ద సత్త్వ్యగుణం కలిగిన రూపం. అది పంచోపనిషణ్మయం. “పరమేష్టీ పుమాన్విశ్వో నివృత్త స్సర్వ ఏవ హీ” ఇది బీజాక్షరాలతోనూ సంకేతితం. 1 షాం, పరమేష్ట్యాత్మకం 2, యాం, పురుషాత్మకం 3. రాం, విశ్యాత్మకం 4, వాం, నివృత్తాత్మకం 5. లాం, సర్వాత్మకం,. ఇలా సగుణబ్రహ్మమయమైన (బ్రహ్మాండమందు. నారాయణుడు స్టూలసూక్ష్మరూపాలతో, చిత్కళాసుగుణంగా విలసిల్దుతాడని ఈ సుకవి విశదతమంగా స్తుతించాడు. నామ ప్రభావదశకం ను. ఎలరారన్‌ భవదీయనామకథనం బేమర్యుచిత్తంబులో( బొలుపారం దగిలుండెనేని యఫఘముల్‌ పొందంగ నెట్లోపెడున్‌ కలయం బావకుచేతబట్టువనడు నక్కాస్ట్రంబుపై( గీటముల్‌ నిలువన్నేర్చునె భక్త్రపోషణకృపా నిత్యాత్మ నారాయణా॥ య

$గ్ర నారాయణ శతకం

అర్ధం ; భక్తపోషణకృపా = ఆశ్రితజనులనుపోషించడమందు దయగల వాడా! నిత్య+ఆత్మ = స్థిరమైన ఆత్మకలవాడా! నారాయణా! ఎలరారన్‌ = ఉత్సాహంగా, భవదీయ నామకథనంబు = నీనామ సంకీర్తనం; ఏ మర్ష్యు చిత్తంబులో = ఏ మనిషియొక్క మనస్సునందు, పాలుపారన్‌ = అందంగా; తగిలి+ఉండెన్‌+ఏని = వీడకున్నటైైతే; అఘముల్‌ = పాపాలు; ఎట్టు, పొందంగన్‌, ఓపెడున్‌ = ఎలా ఉండజాలును? కలయన్‌ = ఆంతటా వ్యాపించి; పావకుచేత = అస్టిచేత; పట్టుబడు = తగులబడే; ఆ+కాష్టంబుపైన్‌ = ఆకట్టెమీద;. కీటముల్‌ = పురుగులు; నిలువన్‌, నేర్చునే = నిలువళక్యమా? (బ్రతుకజాలునా?

తా; భక్తులను రక్షించే దయగలవాడా! నిత్యాత్మ! ఓ నారాయణా! మనిషి హృదయంలో నీనామజపం తగిలి ఉంటే, పాపాలు ఎలా పట్టుకొని ఉంటాయి? అగ్గి తగుల్కొని అంతటా మండుతున్న కజ్జమీద క్రిమికీటకాదులు. నిలిచి బ్రతుకజాలునా?

వ్యాఖ్య: నారాయఃం నామమాహాత్మ్వం వర్లితం.

భగవంతుని అను(గ్రహానికి పాత్రమైన పాండవుల వంశంలో జన్మించిన 'శతానీకు" డనేరాజు ప్రజారంజకంగా రాజ్యాన్ని పాలించేవాడు. ప్రజలకు పారమార్థికమైన (శ్రేయస్సును. కూడా కలిగించాలనే భావనతో శౌనకమహర్షి దగ్గరికి పోయి 'ప్రార్హించాడు. “రాగాదిభి రనిర్దితై:" (విష్ణధర్మం). రాగద్వేషాది దుర్గుణాలచే ఇంద్రియలోలురై సంసారంలో అట్టడుగున పడియున్న ఈలోకులు సులభంగా ఉజ్జీవించే ఉపాయమేదైనా ఉందా? అని అడిగాడు. 'పాపం ఎక్కువగా ఉన్నందువల్ల కర్మణ్జ్డానభక్ష్యాది సాధనాలను అనుష్టించజాలరు, పాపభూయిష్టులైన వారు కూడా ఈ కలికాలంలో సులభంగా పవిత్రులై ఉజ్జీవించడానికి భగవన్నామ సంక్షీర్తనమే ఉపాయ'మని ఆ మహర్షి చెప్పాడు.

“ధ్యాయన్‌ కృతే, యజన్‌ యజ్ఞః త్రేతాయాం, ద్యాపరేఒర్భయన్‌!

యదాష్నాతి తదాప్న్పోతి కలౌ సంక్తీర్య కేశవమ్‌॥ (వి.పు.6.2.)

కృతయుగంలో ధ్యానిస్తూ (త్రేతాయుగంలో యజ్ఞాలుచేస్తూ ద్వాపరయుగంలో పూజిస్తూ పొందిన ఫలాన్ని, కలియుగంలో భగవన్నామాన్ని కీర్తిచినంతమాత్రంచేతనే పొందుతాడు మానవుడు అని మహర్షులతో చెప్పాడు వ్యాసమహర్షి

“అత్యంతదుష్టస్య కలే రయమేకో మహాన్గుణః

కీర్తనాదేవ కృష్ణస్య ముక్తబంధః పరం వ్రజేత్‌” (విపు. 6.3.31)

కడు దుష్టమైన కలియుగంలో ఇదొక్కటే గొప్పగుణం. శ్రీకృష్ణభగవానుని

రాఘవీయవ్యాఖ్య 9 నామాన్ని క్తీర్తించడంవల్లనే ప్రకృతి బంధం విడిపోతుంది. పరమపదం లభిస్తుంది అన్నాడు పరాశరమహర్షి

“నందంత్యుదిత ఆదిత్యే నందంత్యస్తమితే రవా।

మనుష్యా నావబుద్ధ్యంతే ఆత్మనో జీవితక్షయమ్‌॥”” (రామాయణం)

లోకంలో మనుష్యులు ప్రొద్దు పొడవగానే సంపాదించుకోవడానికి అవకాశం వచ్చిందనీ, (ప్రొద్దు (క్రుంకగానే సుఖించడానికి వీలుకలిగిందనీ సంతోషిస్తారు. కానీ ఆయుష్యం వ్యర్థంగా గడచిపోతున్నదని విచారపడరన్నాడు వాల్మీకి,

“సంసారే కిం సారం? కంసారేశ్చరణకమలపరిభజనమ్‌”

కంసారియైన శ్రీకృష్ణుని పాదారవింద భజన చేయడమే సంసారంలో సారమన్నాడు లీలాశుకుడు.

శాస్తంచేతమాత్రమే బోధింపబడే మోన్షానందం అష్రత్యక్షం. భగవన్నామ సంక్షీర్తనానందంమాత్రం ప్రత్యక్షసిద్దంకదా!

“తద్యథేషీక తూలమగ్నా (ప్రాతం (ప్రదూయేత”

శుద్రమనస్సుతో భగవంతుణ్ని ధ్యానిస్తూ నోరారచేసే నామసంకీర్తనం, నిప్పురవ్వ బూరుగుదూదికుప్పను కాల్చినట్టు, పాపరాళిని బుగ్గి బూడిదచేస్తుంది. మూడక్షరాల నామాన్ని స్మరిస్తే ముక్తి లభిస్తుంది.

సూర్యవంశీయుడైన విశ్చరథునిపుత్రుడు, క్షత్రబంధువు మహాపాపిష్టుడు. బుషులను హింసించేవాడు. నరమాంసభక్షకుడు. ఒకప్పుడు ఒక మహర్షి దప్పికతో సరస్సుదగ్గరకు పోయి కాలు జారి అందులో పడ్డాడు. ఈ పాపిష్టుడు ఆ మహర్షిని చూచిన వెంటనే (భ్రూరభావం సన్నగిల్లింది. కాబట్టి ఆయనను నీటినుంచి వెలికితీశాడు. అడవిలోనే ఉపచారాలు చేశాడు. మహర్షిని స్పృశించిన క్షణంలోనే ప్రశాంతత ఏర్పడింది.

యోగదృష్టితో ఘోరాకారుని వృత్తాంతాన్ని తెలుసుకొన్న మహర్షి అతనితో (క్రూరకృత్యాలను మానుమని చెప్పాడు. అతడు వీలుగాదన్నాడు.

“చింతాం చకార స మునిః క్షత్రబంధా దయాపర?”

మహర్షి ఎలాగైనా క్షత్రబంధువును సన్మార్గునిగా చేయతలచాడు.

'బంధు' ఉత్తర పరమైతే నీచార్ధకం. నీచుడైన క్షత్రియుడనే అర్ధం కలది 'క్షత్రబంధు' నామం. “ఓయి, క్షత్రబంధూ! నీవు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, గోవిందా! అంటుండవయ్యా” అని గోవిందనామోపదేశం చేశాడు. అతడు అలాగే, గోవింద నామాన్ని ఉచ్చరించడంవల్ల తర్వాతి జన్మలో ఉత్తమజన్మాన్ని పొందాడు. పూర్వజన్మ స్మరణ కలిగి ఉండడంవల్ల గోవింద నామాన్ని కీర్తించాడు. మోక్షం పొందాడు. (విష్ణధర్మ పురాణం 97 అధ్యాయం)

98 నారాయణ శతకం

పాపిష్టుల్లో అగ్రేసరుడైన _ క్షత్రబంధువు నిత్య _ సూరులనుభవించే మోక్షసామ్రాజ్యభో గాన్ని పాంద గలిగాడు. అంటే ఇదేమి కొత్తగా లభించినది కాదు. తాను అజ్ఞానంచేత పోగొట్టుకొన్న వస్తువును భగవన్నామ సంక్షీర్తన మహిమచేత తిరిగి పొందగలిగాడని భావం.

“పార్యద్వయేఒస్లి సందీప్తే యథాకాష్ట్రే పిపీలికా!” అన్నట్టూ రెండువైపులా అగ్గి తగిలిమండే కట్టెమీద చీమలు, కీటకాలు నిలిచి (బ్రతుకజాలవు. అలాగే, మానవుని మనస్సు నారాయణనామక్షీర్తనమందు మగ్నమైతే పూర్యోత్త రాఘాలన్నీ అతనియందు పొందికగా ఉండజాలవు. కీటకాలవలె పాపాలు నశించి పోతాయని భావం.

కీటకాలు నిల్వవు. పాపాలు నిల్వవు" అనే రెండు, వేర్వేరు సామాన్య ధర్మాలను రెండు వాక్యాల్లో బింబ ్రతిబింబరూపంగా చెప్పడంవల్ల ఈ పద్యం (సాధర్మ్య) దృష్టాంతాలంకారసజ్జ్టితం.

మ. కలయం దిక్కులు నిండి చండతరమై కస్పారు మేఘౌఘునుల్‌ వెలయన్‌ ఘోరసమీరణస్పురణచే చే పాయుచందంబునన్‌ జలదంభోళిమృ గాన్ని తస్కరరుజాశత్రూరగనవ్రాతముల్‌ దొల(గు న్మీదగు దివ్యమంత్రపఠనన్‌ దోషఘ్న నారాయణా॥ 32

అర్ధం : దోషఘ్న = పాపాలను నళింపజేయువాడా! నారాయణా! కప్పారు, మేఘ+ఓఘముల్‌ = నల్లని మొగుళ్ళ గుంపులు; దిక్కులు, కలయన్‌ = దిక్కులంతట; నిండి = వ్యాపించి; చండతరమై = కడుతీ(వ్రమై; వెలయన్‌ = మెరువగా; ఘోర, సమీరణ, స్ఫురణచే = దారుణమైనగాలి వీచడంచేత; వే = వేగంగా? పాయు, చందంబునన్‌ = తొలగిపోయే రీతిగా? జల-ద్రాతముల్‌! జల = నీటియొక్క; దంభోళి = పిడుగులయొక్క; మృగ = (క్రూరజంతువులయొక్క; అద్ది = నిపష్తుయొక్క; తస్కర = దొంగలయొక్క; రుజా = రోగాలయొక్క; శత్రు = పగతురయొక్క; ఉరగ = పాముల యొక్క; (వ్రాతముల్‌ = సముదాయాలు; మీదగు, దివ్య మంత్ర పఠనన్‌ = గుణాలు ప్రకాశించే మీనామ మంత్రాన్ని చదువడం చేత; తాలగున్‌ = విడిపోతాయి.

తా; దోషాలను పోగొట్టే ఓ నారాయణా! నల్లని మేఘాలు దిక్కుల నిండా వ్యాపించి ప్రచండమై వెలయగా మహావాయువు వీచడంచేత వేగంగా తొలగిపోయే

రీతిగా నీరు, పిడుగులు, మృగాలు, అగ్గి దొంగలు, రోగాలు, శత్రువులు, పాములు

వీటన్నిటివల్ల కలిగే బాధలన్నీ నీ నామ మంత్రాన్ని పఠించడంచేత తొలగిపోతాయి. వ్యాఖ్య : నారాయణ నుంత్ర జపంవల్ల ఈతి బాధలన్నీ తొలగుతాయని వర్ణితం. పరులను హింసించడం, పర'స్త్రీలను పరి(గ్రహించడం, పరద్రవ్యాన్ని అపహరించడం,

రాఘవీయవ్యాఖ్య ంం అసత్యం పలుకడం, తిన దగని వాటిని తినడం, తనను తాను గొప్పగా చెప్పుకోవడం లాంటి అకృత్యాలను చేయడం దోషం. సర్వప్రాణులను తననువలె చూడడం, ఇతరులకు సహాయపడడంలాంటి కృత్యాలను చేయకపోవడమూ దోషమే. తన దోషాలను తాను తలచుకోవడం భయహేతువు. భగవంతుని .గుణాలను అఆనుసంధించడం అభయహేతువుకదా! మొదట అవివేకంచేత చెప్పరానన్ని పాపాలను చేసి తర్వాత నేనెన్ని నరక బాధలను అనుభవించాలో, అని దిగులు పడుతుంటారు. చేసిన దోషాలకు కలిగే ఫలం అనుభవించక తప్పుదు. ఆ పాపాల ఫలమే నీరు, నిప్పు మృగ వ్యాళ శత్రు, తస్కర, వ్యాధి రూపంగా కలిగే బాధలు. వాటిని అనుభవిస్తున్నప్పుడు మహాదుఃఖం కలుగుతుంది. మనస్సులో పెనుభూతంలాగా భయమావరిస్తుంది. అందుకే

“యన్నామసంక్తీర్తనతో మహాభయాత్‌

విమోక్షమాప్నాతి న సంశయం నరః”

మహర్షులు, నామసంక్షీర్తనమే మహాభయాన్ని నివారించడానికి ప్రబల హేతువని నిస్సంశయంగా నమ్ముమంటున్నారు.

“యత్రాష్టారసంసిద్దో మహాభాగో మహీయతే!

న తత్ర సంచరిష్యంతి వ్యాధిదుర్భిక్షతస్కరాః;”

నారాయణ మంత్ర - అష్టాక్షరీమంత్ర సిద్ధుడు సర్వలోకపూజ్యుడు. ఆయన ఉన్న పరిసరాల్గో కరువు, కాటకాలు, రోగాలు, ఈతి బాధలుండవన్నారు.

“సంకీర్య నారాయణశబ్దమాత్రం

విముక్తదుఃఖాస్సుఖినో భవంతి”

నారాయణ అనే నామాన్ని క్రీర్తించినంత మాత్రాన సకల దుఃఖాలు తొలగినవారై సుఖంగా జీవిస్తారని మహానుభావుల మాట.

ఈ పద్యమందు వస్తుప్రతివస్తూపమాలంకారం ఉంది.

“దివ్య మంత్ర పఠనం, సమీరణ స్ఫురణం' అనే పదాలకు సాదృళ్యం ఉంది.

శత్రూరగ (వ్రాతముల్‌, మేఘౌఘముల్‌ో అనే శబ్దాలకు సాదృశ్యం ఉంది.

“పాయు, తొలగు" అనే ఒకే అర్ధం గల రెండు క్రియా పదాలచే సామాన్య ధర్మం చెప్పబడింది. 'చందంబునన్‌ - ఉపమావాచకం ఉంది. పెనుగాలి వీచుటచే మేఘాలు పాయుచందాన, దివ్య మంత్ర పఠనచే శత్రూరగ వ్రాతముల్‌ తాలగును; అని ఏక వాక్యంగా ఉంది కదా! ఈ పద్యంలో 'శత్రోరగ' అచ్చు తప్పు ఉంది. శత్రూరగ' (సవర్ష దీర్హమేకాదేశమైన) పదం సాధువు.

100 నారాయణ శతకం ము. కలుషాగాధనినాశకారి యగుచుం గైవల్యసంధాయియై నలి నొప్పారెడు మంత్రరాజమగు. నీ నానముంబు ్రేమంబుతో నలరన్నెవ్వని వాక్కునం బొరయదే నన్నీచుఘోరాత్మయున్‌ వెలయన్‌ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ నారాయణా॥ 33 ఆర్ధం : వేదాత్మ = వేదమే ఆత్మగా కలవాడా! నారాయణా! కలుషూఅగాధ వినాశకారి, అగుచున్‌ = ఎన్నరాని పాపాన్ని నశింప జేస్తూ: కైవల్య సంధాయియై = మోక్ష మొనగూర్చేదై; నలిన్‌+ఒప్పారెడు = గౌరవంగా ఉండే; మంత్ర రాజము+అగు = మంత్రాలలో శ్రేష్టమైన; సీ నామంబు; ధ్రేమంబుతో = భక్తితో; అలరన్‌ = ్రకాశింపగా; ఎవ్వని; వాక్కునన్‌ ఇ వాగింద్రియం '- నాలుక - ఉన్న నోటియందు; పొరయదేని = పలుకబడక పోతే; ఆ నీచు, ఘోర+ఆత్మయున్‌ = ఆ అధముని దుర్భరమైన శరీరం కూడా; వెలయన్‌ =. (ప్రకాశించగా; అదియ = అదే - అఆనోరే) భూరుహ, కోటరంబు, సూ = వెట్టుతొజ్జసుమూ! తొ : వేదాత్మ! నారాయణా! అనంత పాపరాశిని నశింపచేసేదవుతూ మోక్షాన్నీ ప్రసాదించే, గౌరవంతో కూడిన మంత్రరాజమూ అయిన నీ నామాన్ని ఎవడైనా నోట పలుకక పోతే, ఆ నీచుని ఘోర శరీరం చెట్టుగానూ, నోరు చెట్టు తొజ్జగానూ చూడతగినదే. వ్యాఖ్య ఏ నారాయణనామం ్రేనుతో అనుసంధేయం, ధర్మాధర్మాలను తెలిపేది వేదం. “విందంతి యతో ధర్మాధర్మావితి వేదః” వేదం శబ్దరూపం. శబ్దం శరిరమైతే, అర్హం ఆత్మ. అర్ధసహితమైనదే శబ్దం. వేదాత్ముడంటే వేదమే శరీరంగా కలవాడు. వేదానికి విషయమైనవాడని భావం. “నాఒవేదవిన్మనుతే తం బృహంతమ్‌”" అనే (శ్రుతిరీతిగా, వేదం తెలియని వ్యక్తి వేదవిషయమైన దైవస్వరూపాన్ని తెలుసుకొనలేడు. వేదశాఖాగ్రమందు. వికసితమంత్రపుప్పుం ఇలా పరిమళిస్తుంది. “నారాయణాయ విద్మహే, వాసుదేనాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్‌" పూచేదీ, పరిమళించేదీ పుష్పం. మననం చేస్తే రక్షించేది మంత్రం. “ఒమిత్యగ్రే వ్యాహరేత్‌ ; నమ ఇతి పశ్చాత్‌! నారాయణాయేత్యుపరిష్టాత్‌” - ఓమ్‌ మొదట, తర్వాత 'నమఃి ఆ పైన 'నారాయణాయ' అని నారాయణ నామమంతత్రాన్ని ఉచ్చరించే విధానాన్ని వేదం బోధిస్తుంది. 1 ఓమ్‌ నమో నారాయణాయ" - అష్టాక్షరి 2. 'ఓమ్‌ నమో భగవతే వాసుదేవాయ" - ద్వాదళశాక్షరి

రాఘవీయవ్యాఖ్య 101

  1. ఓమ్‌ నమో విష్ణవే - షడక్షరి

అంతటా వ్యాపించి ఉండే భగవంతుని స్వరూప స్వభావాలను తెలిపేవి కాబట్టి, ఈ మూడింటిని 'వ్యాపక మంత్రా" లంటారు వేదవిదులు.

అవ్యాపకమంత్రాలకంటె వ్యాపక మంత్రాలు (శ్రేష్టమైనవి.

ఈ మూడు వ్యాపకమంత్రాలలో పరమార్షాన్ని - జీవేశ్చరసంబంధాన్ని బోధించే అష్టాక్షరినే 'మంటత్రరాజ' మంటారు. దీనికే తిరుమంత్రమనీ మూల మంత్రమనీ పేరు. తక్కిన రెండు వ్యాపకమంత్రాలలో “రక్ష్యరక్షకభావం' పూర్షంగానూ, విశదతమంగానూ లేదంటారు విజ్ఞులు. 'ఓమ్‌' శబ్దం అత్యల్పమయిన్నా, నిగూఢమైన అర్హం కలది,

1 మంత్రార్ధం : 'ఓమ్‌' భగవద్వాచకం. 'అ, ఉ,. మ” అనే మూడక్షరాలున్న శబ్దమిది. “కా దీప్తి, “కిం పరాయణమ్‌” అనే (ప్రశ్నకు అక్షరాద్దీప్తి రుచ్యతే' “వాతాద్విష్ణోర్భలమాహు అని సమాధానం. (ప్రకాశించేది అక్షరం. గాలికి స్పర్శగుణం ఉంది. కాబట్టి అక్షరాన్ని ఉచ్చరించడం స్పర్భవల్ల. అది సర్వత్ర వ్యాపించే శీలం కలిగిన భగవంతుని ప్రయత్నానికి బలమిస్తుందంటారు భగవద్విషయవేత్తలు.

'అవ' రక్షణీ - అని ధాత్వర్హం. అన్ని శబ్దాలకు కారణమైన అకారం “అక్షరాణా మకారో౭స్మి” (భ.గీ) అన్నట్టు సర్వలోకరక్షకుడైన నారాయణుడనే అర్హమిస్తుంది. ఉకారం లక్ష్మీవాచకం. మకారం జీవవాచకం.

“అకారేణోచ్యతే. విష్ణుః ఉకారేణ రమోచ్యతే।

మకారేణ తయోర్హాస ఇతి ప్రణవలక్షణమ్‌[”

మకారం, కకారంనుంచి 25వ అక్షరం. ప్రకృతికి చేతనత్వం లేని లక్షణాలు 24 ఉన్నాయి. మహత్తు, అహంకారం, బుద్ది మనస్సు (4. పంచమహాభూతాలు (5) జ్ఞానేంద్రియాలు (5) కర్మేంద్రియాలు (5) శబ్ద స్పర్శ రూపరసగంధాలనే ఇం(ద్రియార్జాలు (5) జీవుడు మాత్రమే చేతనత్వంగల 25 వ తత్త్వం.

లక్ష్మీదేవి పతిక్షీ, సుతునికీ మధ్యన ఉండి వారి ఆలన, పాలన చూస్తుంది నారాయణుడు సర్వదా లక్ష్మీసమేతుడు కాబట్టి నారాయణునికి జీవుడు కూడి యుంటేనే ఆనందం, “అకారార్థాయైవ స్వమహమ్‌” - విశేష మేమంటే, ఉకారానికి “ఏవి కారార్థమూ ఉంది. ం

అ = శ్రియః పతికొరకు, ఉ = మాత్రమే, మ్‌ = జీవుడు దాసుడై ఉన్నాడు. పరమాత్మకు దాస్యం చేయడమే జీవాత్మ స్వరూపం.

రక్షింపబడే జీవుడు, రక్షకుడైన నారాయణునికే సేవచేయడమే మోక్షఫలమని ఓంకారార్థం.

102 నారాయణ శతకం ఉకారార్థం నమః పదంలో ఉంది.

అకారార్థం నారాయణ పదంలో ఉంది.

మకారార్థం “ఆయ” (చతుర్థీ విభక్తి 'ప్రత్యయం)లో ఉంది.

॥ “నమః పదంలో రెండక్షరాలున్నాయి. (అవి రెండు పదాలే) మః = నాకు గానీ, ఇతరులకు గానీ దాసుడను, న = కాను. భగవంతుణ్ని పొందడానికి మూడు ఆటంకాలున్నాయి.

  1. స్వరూపవిరోధి : జీవుడు నారాయణునికే దాసుడను అనుకోక నేను, నాది" అని అహంకరించడం.

  2. ఉపాయ విరోధి : నారాయణుడే ఉపాయమని విశ్చసించక కర్మ, జ్ఞాన, భక్తులే ఉపాయాలని నమ్మడం.

  3. (ప్రాష్య విరోధి : పొందదగిన మోక్షానందాన్ని కోరక, లౌకిక సుఖాలను పొందగోరడం.

ఈ మూడు రకాల విరోధులను నశింపజేసేది 'నమః' పదం. 'నాకేమీ లేదు, అంతా నీదే, నేను నీవాడనే' అని ప్రార్హిస్తూ భగవద్దాస్యం చేస్తుంటే రక్షకుడు 'మోక్షమిస్తాడని అర్ధం.

  1. నారాయణ = నారశ+అయన

  2. పదార్జాలన్నిటికి పరమ గతిత్రైనవాడు.

రై అన్ని వస్తువులకు అంతర్యామితైైనవాడు నారాయణుడు.

“ఆయ” = కొరకు సర్వదేశు సర్వకాల, సర్వావస్టలయందు శ్రీమన్నారాయణుని కొరకు సర్వక్రైంకర్యం చేస్తుంటాను అని భావం,

“దీయమానార్థ్హశేషిత్వం సంప్రదానత్వమిష్యతే”

ఈయబడే వస్తువుకు (ప్రతిగృహీతగా ఉండడం సంప్రదాన మనబడుతుంది, పరులిచ్చిన దాన్ని (గ్రహించడమూ, తెలుపడమూ ఉచితం కాదు. అయినా, సర్వేశ్చరుడు తనకు సమర్పించినంతమా(త్రాన తనకు శేషభూతమైన వస్తువును తానే రక్షించుకొనే రీతిగా సమర్చించడాన్నిబట్టి వ్యాపకమం[త్రాలయందున్న చతుర్ధీ విభక్తిని సం(్రదానార్థపరంగా అహిర్చుద్న మహర్షి వ్యాఖ్యానం చేశాడు.

“పదత్రయేఒత్ర సంక్షేపాద్భావ్యాఒనన్యార్హ శేషతా!

అనన్యోపాయతా స్వస్య తథా ఒనన్యపుమర్ధతా॥”

'ఓమ్‌ నమో నారాయణాయ' అనే ఈ మం(త్రరాజమందున్న మూడు పదాలచేత

  1. అనన్యార్హశేషత్వమూ 2) అనన్యోపాయత్వమూ 3) అనన్య ప్రయోజనత్వమూ సం(గ్రహంగా తెలుపబడినాయి.

రాఘవీయవ్యాఖ్య 103

ఎనిమిది అక్షరాలు అనే ఎనిమిది దారాలతో, మూడు పదాలు అనే మూడు పురులు. వేసిన మంగళసూత్రం లాంటిది 'మంత్రరాజం. ఇది భర్తర్షైన వారాయణునిచేత భార్యయైన జీవునిగళమందు. బంధింపబడిన పవిత్రబంధం,

దేవుడు. స్వతంత్రుడు, జీవుడు పరతంత్రుడు. కాబట్టి తిరుమంత్రాన్ని అనుసంధించుకొంటూ, “దేవరవారికైంకర్యంకోసం దాసుణ్ని అంగీకరించండి, స్వామీ!” అని ప్రార్జించి, దంఠం సమర్పించి ఆత్మనివేదనం చేయాలి “మూలమంత్రేణ స్వాత్మానం దేవార్రైన నీవేదయేత్‌” అని భగవద్రామానుజులు 'నిత్యగ్రంథం' లో అను(గ్రహించారు.

తన ఆనందంకోనం కాక, భగవంతుని అనందంకోసమే భగవంతుడు తనతో సేవ చేయించుకొనే రీతిగా జీవుడు ప్రార్ధించడం పరమార్థం, దీన్నే భరన్వాసం, శరణాగతి అంటారు.

నారాయణునికంటె అధిక మహిమ కలది ఆయన నామం, 'నామి" బంగారు ముద్ద అయితే 'నామం' గళంలో థరింపడగిన అభరణమే.

“ఐహలొకికమైశ్సర్యం స్వర్గాద్యం పారలౌకికమ్‌!

కైవల్యం భగవంతం చ మంత్రో లయం సాధయిష్యతి[”

ఈ మం(త్రం ఆయా అధికారులకు ఇహలోకైశ్చర్యాన్నీ స్వర్గాదిపరలోకైశ్చర్యాన్నీ, అత్మానుభవరూపమైన కైవల్యాన్నీ, భగవట్రైంకర్యరూపమైన మోక్షవలాన్నీ సాధించిపెడుతుంది.

“సాంకేత్యం షారిహాస్యం చ స్తోభం హేళనమేవ చ

వైకుంఠనామ([గ్రహణ మశేషాఘవినాశనమ్‌॥ (భాగవతం)

తన సంతానానికి పేరు పెట్టి పిలిచినా, పరిహాసంగానో, హేళనగానో ఆ పేరు చెప్పినా, భగవన్నాముం సంపూర్ణంగా పాపాలను అణచివేస్తుంది.

ఊఈ మంథ్రరాజం కలుషాగాధవినాశకారి.

అనాదిగా చేయబడిన పలురకాల పాపాలన్నీ తేనెతెట్టెకు ఈగలు ముసరినట్టు ఆత్మను ఆవరించి, నేనేముందు అనే భావంతో ఫలమీయడానికి సిద్ధంగా ఉంటాయి నేతి కుండకు పట్టిన చీమల రీతిగా పాపాలు వ్యాధిరూసంగా దేహాన్ని ఆవరించి ఉంటాయన్నారు శ్రీవిష్ణుచిత్తులు. అణిషదిమాణంగా ఉండే జీవుడు అగాధమైన పాప సముద్రంలో పడి దరిచేరలేక దుఃఖపరంపరచే క్షోభిస్తుంటాడు. జీవుడు ఆంతపాపం చేసే శక్తి కలవాడా? అంటే, కొన్ని వేల బ్రహ్మ కల్పాలకాల మనుభవించినా తీరనంత పాపరాశిని జీవుడు అర్హక్షణంలో చేయగలుగుతాడు. "“యదర్రృహ్మకల్పనియుళాను భవేఒప్యనాశ్యం” అన్నారు. శ్రీవత్సాంకమిశ్రులు,

104 నారాయణ శతకం “మేరుమందరమాత్రోలపి రాశిః పాపస్య కర్మణః కేశవం వైద్య మాసొద్య దుర్వాాధిరివ నశ్యతి॥” మేరుపర్వతం, మందరపర్వతంలాగా “పెరిగిన పాపరాశి కూడా, గొప్ప వైద్య 'ప్రభావంచేత గడ్డువ్యాధి నశించినట్టు, భగవంతుని సంకల్పశక్తిచేత నిళ్ళేషంగా నశించిపోతాయట. “"రోగాపద్భయదుఃశేభ్యో ముచ్యంతే నాత్ర సంశయః అపి నారాయణేత్యేత చృబ్బమాత్రప్రలాపినః॥” (నారదీయమ్‌ 1386) . నారాయణ" శబ్దాన్ని ఉచ్చరించినంతమాత్రాన మానవులకు రోగాలూ, ఆపదలూ ఉండవు. జీవితంలో భయమూ, దుఃఖమూ లేకుండా వారు సుఖంగా బతుకుతూ, అంతంలో ముక్తిని పొందుతారు. “వ్యక్తం హీ భగవాన్‌ దేవః సాక్షాన్నారాయణః స్వయమ్‌! అప్టాక్షరస్య రూపేణ ముఖేషు పరివర్తతే॥” (నారదీయమ్‌ 1-32) నారాయణుడే స్వయంగా భగవంచుడనే విషయం స్పష్టం. ఆతడే అష్టాక్షర మంత్రస్వరూపుడుగా జపించేవారివాక్కులందు. నివసిస్తుంటాడు. ఇంత ్రభావమున్న మం(త్రరాజమైన నామం వాక్కునందాలపించనివాడు ఘోరాత్ముడుకదా! అతనినోరు చెట్టు తొజ్జయే అంటున్నాడు కవి. తరుకోటరం, నిష్ట్రయోజక మని భావం, ప్రకృతి అనే వృక్షానికి అహంకారం కొమ్మలైతే, ఇంద్రియాలు తొజ్జ(లు)గా చెప్పింది భారతం, “అవ్యక్తవీజ ప్రభవో బుద్దిస్కంధమయో మహాన్‌! మహాహంకారవిటపః ఇం[ద్రియాస్తరుకోటరః॥” (అశ్చమేధపర్వం) వాగింద్రియం 'భూరుహకోటర' మన్నాడు కవి, మానవజన్మ నెత్తి కూడా, నారాయణనామస్మరణ చేయని దయనీయ స్థితిని పొందడం శోచనీయమే కదా! “నారాయణేతి నామాస్తి వాగస్తి వశవర్తినీ। తథా౭పి నరకే ఘోరే పతంతీతి కి మద్భుతమ్‌॥” పవిత్రమైన నారాయణ మంత్రముంది. దాన్ని పలుకడానికి తగిన నాలుక తన వళంలోనే ఉంది. అయినా లోకులు దాన్ని ఉచ్చరించక నరకంలో పడుతున్నారే! వీమాశ్ళర్యం! 'భూరుహకోటరం' అనడంవల్ల ఆత్మస్వరూపనాశక మని సారార్థం. వస్తూత్రేక్షాలంకారం,

రాఘవీయవ్యాఖ్య 105 మ. పరమంబై పరతత్వమై సకలసంపత్సారమై భవ్యమై సురసిద్దోరగయక్షపక్షిమునిరక్షోహృద్గుహాభ్యంతర స్టీరసుజ్ఞానసుదీసమై శ్రుతికళాసిద్దాన్నమై సిద్దమై సరి లేకెప్పుడు నీదునామమమరున్‌ సత్యంబు నారాయణా॥ 34 అర్ధం : ఓ నారాయణా! పరమంబై = ఉత్కృష్టమై, పరతత్త్యమై = పరత్యాన్ని బోధించేదై సకల సంపత్‌ సారమై = సమస్త సంపదలలో (శ్రేస్టమై; భవ్యమై = మంగళకరమై; సుర-దీపమై! సుర = దేవతల; సిద్ధ = సిద్దుల; ఉరగ = నాగుల; యక్షుల; పక్షుల; మునుల; రాక్షసుల; హృత్‌+గుహ+ అభ్యంతర = హృదయమనే గుహలోపల; స్థిర = చలించని; సుజ్ఞాన = మంచిజ్ఞానమనే; సుదీపమై = సుజ్యోతియై; శ్రుతికళా సిద్దాంతమై = వేదవేదాంతశాస్తాలచే నిళ్ళ్చయింపబడినదై; సిద్దమై = యత్నించకయే పాందదగినదై; నీదు = నీయొక్క; నామము = పేరు; ఎప్పుడు = నిత్యం; సరిలేక = సాటిలేక; అమరున్‌ = ఒప్పియున్నది. సత్యంబు = సత్యం.

తా ; ఓ నారాయణా! నీ నామం చాలా ఉత్కృష్టమైనది. యథార్ధవిషయాన్ని బోధించేది. సకలభోగాల సారమైనది. దేవ, దానవ, యక్ష పక్షి, ముని, సిద్దుల హృదయాలలో జ్ఞానజ్యోతి మైనది. వేదశాస్తాలచే నిశ్చయింపబడినది. సిద్దమైనది. సత్యమిది.

వ్యాఖ్య : నారాయణనామంతో సొటిమైన వామం లేదు.

“నోరునొవ్వంగ హరిక్షీర్తి నుడువడేని, కలుగనేటికి తల్లుల కడుపుచేటు” (భాగ) అన్నాడు కదా! భక్తపోతన. శాస్త్రాలు బోధించిన కర్మ, జ్ఞాన, భక్తి యోగాలను ఆచరించడం సామాన్య మానవునికి అసాధ్యమే. మాన్యులైనా జీవితాంతం అనుస్టింపగా ఎప్పుడోగాని అవి ఫలితమీయవు, మీదు మిక్కిలి వాటిని ఆచరిస్తుండగా లోపాలేవైనా జరిగితే మహాప్రమాదం. 'భగవంతుడె సిద్దోపాయ” మని తలచి శరణాగతి ప్రపత్తి చేయడం మంచిదే. కానీ, దానికి గొప్ప విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం శిధిలమైతే (బ్రహ్మాస్త్రం లాంటి ఆ శరణాగతి కూడా ఫలించదు. కాబట్టి మాన్యులకూ, సామాన్యులకూ దేశ, కాల, నియమాలేవీ లేకుండా భగవన్నామసంకీర్తనం చేయడానికి అధికారం ఉంది. "యాతి బ్రహ్మ సనాతనమ్‌” అన్నట్టు ధర్మార్టులకు ధర్మాన్నీ, ధనార్జులకు ధనాన్నీ, కామార్డులకు కోరిన వాటినీ ఇస్తూ చివరకు మోక్షప్రాప్తికి సొక్షాదుపాయమైన భగవన్నామసంకీర్తనమే పరమోపాయం.

“కిం మృష్టం? సుతవచనం. పునరపి మృష్టం తదేవ సుతవచనం” అన్నట్టు తండ్రికి తన కొడుకు ముద్దుమాటలకంటె అతిప్రియమైైనది వేరే ఉండదు కదా!

106 నారాయణ శతకం అలాగే 'ప్రెయపుత్రప్రాయులైన మానవుల నోటినుంచి తననామసంకీర్తనవైభవాన్ని వినడంకంటె వేరే ఆనందం జగత్సాతద్రైన భగవంతునికి ఉండదు. శ్రీరామచరాద్రస్వామి, కుశలవులు. గానం. చేసిన రామాయణాన్ని. ఏని ఆనందపరవశుడై “మమాపి తద్భూతికరం ప్రచక్షతే” (నాకు కూడా శుభాన్ని కలిగిస్తుంది అని ప్రశంసించాడు కదా! మహర్షులు అనేకమార్షాలచేత ఉపాస్యుడెనడో పురాణాలలో (ప్రకటించారు. వాల్మీకిమహర్షి శ్రీరామావతారవైభవాన్నీ, పరాశరమహార్షి శ్రీ కృష్ణావతార వైభవాన్నీ కీర్తించారు. శ్రీ శౌానకమహర్షి అర్భ్బావతార వైభవాన్నీ "తాం భజేత్తాం పిచింతయేత్‌' అని ప్రశంసించాడు. 'శ్రుతులూ బోధించాయి.

“స 'బ్రహ్మా స శివస్పేంద్రః సోఒక్టరః పరమస్స్యరాటో' అని సామాన్యశబ్దాలతో తెల్పినా, సందేహం. తీరక చివరకు "ఏకో హ వై నారాయణ అసీతో' అని స్పష్టపరచాయి. అంటే, నారాయణ నామమే పరతత్మ్యమని ఉపనిషత్సమన్సయసిద్దాంత౦వల్ల తెలుస్తుంది.

“కిం తత్ర బహుభిర్మండ్రై: కిం తత్ర బహుభిర్వతైః

నమో నారాయణాయేతి మండత్రస్సృర్వార్దసాధకః/” (నారదీయం. 1-40

సరిలేని ఈ మంత్రాన్ని వదలి వేరే వివిధమంత్రాలచేత 'ప్రయోజనమేమీ “నమో నారాయణాయ”. అనే మంత్రం సకల సంపత్వారమైనది, సర్వప్రయోజనాలనూ సిద్దింపచేస్తుందని అర్జసూక్తి,

“అశుభాని నిరాచష్టే తనోతి కుభసంతతిమ్‌;

స్మృతిమాత్రేణ యత్పుంసాం బ్రహ్మ తన్మంగళం పరమ్‌!” (విప్పు)

'బ్రహ్మఅంటే పరమాత్మా తపో వేదో (బ్రహ్మ (బ్రహ్మాబ్బజే ద్విజే” (నా.రమాల) నిఘంటువును బట్టి నారాయణుడని అర్థం,

స్మరించినంతమాత్రాన అకుభాలను తొలగించి శుభపరంపరలను కూర్చే స్వభావం కలవాడు నారాయణుడు. ఆయన మౌాంగల్యభాక్కు. ఆయన నామం భవ్యవాక్కు.

“నారాయణ సరం జ్యోతి” అన్నట్టు దేవదానవ సిద్దోరగయక్షపక్షిమునుల హృదయాల్లో సమ్యక్‌జ్ఞానదీపమైనది నారాయణశబ్దం. సర్వవేదాంతవిజ్ఞాన మురళ్ళితార్థమయింది నారాయణపరబ్రహ్మతత్వం. కాబట్టీ శ్రతికళాసిద్ధాంత మన్నాడు

“జలధిసుతయా సార్జం దేవో జగత్పరిపాలయన్‌!

పరమపురుషు సిద్దోపాయః 'ప్రతీష్టభరః సతామ్‌॥”

రాఘవీయవ్యాఖ్య 107

సర్వజ్ఞుడూ, సర్వశక్తుడూ, పరమకారుణికుడూ, లక్ష్మితో కూడి నిత్య విభూతినీ, లీలావిభూతినీ పరిపాలించే పరమ పురుషుడు, భక్తుల రక్షణ విషయ భారాన్నంతా తనపైన పెట్టుకొన్నవాడు కాబట్టి నారాయణుడే సిద్దోపాయం. భక్తి ప్రపత్తులు సాధ్యోపాయాలు కాగా, వాటిచే సంతోషించి సర్వభారాన్ని వహించే నారాయణుడే నిత్యమైన, నిరపాయమైన ఉపాయమని భావం,

“ప్రసాదన స్యోపాయత్వే శాస్రీయేఒపి ఫలం ప్రతి;

కరృత్వావ్యవధానాద్యైః సిద్దోపాయప్రధానతాః”

శాస్త్రంలో చెప్పబడిన ఫలాలను పొందడం కోసం సాధ్యోపాయమే కారణం, అయినా ఫలాన్ని ప్రసాదించడంలో ఫలదాత, ఆలస్యం చేయవచ్చు. “సర్వరక్షణభారం నీదే స్వామీ! నిరంతరం నేను నిన్నే స్మరించే విధంగా నీవే సంకల్పించుకో, ప్రభూ!” అని తన రక్షణ విషయమై తన ప్రయత్నాన్ని వదలుకొని ఆర్తితో, నామసంక్షీర్తన చేయడమే సిద్దోపాయ మని రహస్యత్రయసారం లోని సిద్దోపాయశోధనాధికార మనే భాగం విశదీకరిస్తుంది.

“యధా సర్వేషు దేవేషు నాస్తి నారాయణాత్పరః

తధా సర్వేషు మంత్రేషు నాస్తి చాష్టాక్షరాత్సరః/” (1-42)

సకల దేవుళ్ళలో నారాయణుణ్ని మించిన దేవుడు లేడు. అలాగే సర్వ మంత్రాల్లో నారాయణమంత్రాన్ని మించిన మంత్రమే లేదు అని నారదీయ కల్స [గ్రంధం బోధిస్తుంది.

గజేంద్రుడు స్వగతనిష్టలో ఉండి, అంటే తనను తాను రక్షించుకొంటానని పెక్కేండ్డు నీరాటంతో పోరాటం సలిపాడు. చివరకు 'లావొక్కింతయు లేద'ంటూ 'నీవే తప్ప ఇతః పరంబెరుగ” నని పరగతనిష్టను అనుష్టించాడు. అంటే సిద్దోపాయనిప్పుడయ్యాడు. రక్షితుడయ్యాడు.

'న తత్సమశ్చాభ్యధికళ్ళ దృళ్యతే' అన్నట్టు, నారాయణనామమంత్రానికి గీటైన, మేటిమైన మంత్రమే లేదు. ఇది సత్యం.

“సకారో జీవనిర్దేశ స్తకారః పరవాచకః॥

తయో స్పంసర్గశక్తిర్యస్తస్మాత్సత్యముదాహృతమ్‌॥"

సకారం జీవుడు, తకారం పరబ్రహ్మ. ఆరెంటిని చేర్చేశక్తియే యకారం. ఇది 'సత్య' శబ్దార్రమంటారు ప్రాజ్జులు,

“తాని హ వా ఏతాని త్రీణ్యక్షరాణి. సతీయ మితి. తద్యత్సత్రదమృత మధ యత్త న్మర్యమధ యద్యం తేనోభేయచ్చతి యదనేనోభే యచ్చతి తస్మాద్యమ్‌” (ఛాంఉ)

108 నారాయణ శతకం

సత్యమనేది మూడక్షరాలపదం. 'సకారం” అమృతం అంటే చేతనం. 'తకారం' మర్త్యం అంటే అచేతనం. 'యమ్‌' అంటే చేతనాచేతన పదార్దాలను నియమించేది. పరబ్రహ్మవాచకమే. సత్య" మని బోధ.

'సత్యం' శపధాన్ని బోధిస్తుంది.

“భూత్యోర్షబాహురద్యాత్ర సత్యపూర్వం (బ్రవీమి వ॥।

హే పుత్రశిష్యాః శృణుత నమంత్రో ఒష్టాక్షరాత్చరః॥”

ఓ శిష్యులారా! పుదత్రులారా! రెండు చేతులను జోడించుకొని ఎత్తి (ప్రమాణం) శపధంచేస్తూ చెబుతున్నాను. అష్టాక్షరమంత్రంకంటె ఉత్కృష్టమైన మంత్రం లేదుసుమా! వినండి? అని బుషులు ఈ నామాన్ని ఆదరించి, మనలను ఆదరించుమని బోధించారు.

మ. _అధికాఘఫౌఘతమోదినాకరమునై యద్రీంద్రజాజిహ్వకున్‌ సుధయై వేదవినూత్నరత్నములకున్‌ సూత్రాభిధానంబునై బుధసందోహమనోహరాంకురమునై భూదేవతాకోటికిన్‌ విధులై మీ బహునామరాజి వెలయున్‌ వేదాత్మ నారాయణా! 35 అర్ధం : వేదాత్మ = వేదజ్ఞానస్వరూపా! ఓనారాయణా! మీబహునామరాబి = మీ, అసంఖ్యాకమైన నామసముదాయం; అధికశఅఘ+ఓఘ, తమస్‌+దివాకరమునై = గొప్పపాపరాశి అనే కటిక చీకటికి వేవెలుగై: అద్రి+ఇందద్రజా, జిహ్వకున్‌ = పర్వతరాజు పుత్రిక యొక్క నాలుకకు; సుధయై = అమృతమై; వేద వినూత్న రత్నములక్రున్‌ = వేదమంత్రాలనే నవ రత్నాలకు, సూత్ర+అభిధానంబునై = సూత్రనామధేయమై; బుధసందోహ మనస్‌+హర, అంకురమునై=విద్వత్‌ బృందాల మనస్సును చూరగొనే మొలకయై; భూదేవతా కోటికిన్‌ = (బ్రాహ్మణుల సమూహానికి; విధులై = అవశ్యాచరణీయాలై, వెలయున్‌ = శోభించును. తాః వేదాత్మ! ఓ నారాయణా! మీ బహునామావళి మహాపాపరాపలనే ఆంధకారానికి ఆదిత్యరశ్శియె, పార్వతీరసనకు అమృతమై, వేదమంత్రాలనే నూత్న రత్నాలకు సూత్రనామమై, పండితుల మనస్సునాకర్షించే అంకురమై, 'బ్రాహ్మణులనిత్య కర్మ విధానాలై విరాజిల్లుతుంది.

వ్యాఖ్య : నారాయణ నామావళిప్రభావం ఉల్లేఖితం.

మనం కొన్ని తెలిసిచేస్తాం. కొన్ని తెలియక చేస్తాం. చేసే కర్మలలో దోషాలెన్నో లోపాలెన్నో కలుగుతుంటాయి. పాపకర్మలవల్ల కలిగే శోక్రమోహాదులనూ, కష్టనప్టాదులనూ, ఆధివ్యాధులనూ అనుభవించడమే తప్ప ఈ పని చేసినందువల్లనే ఈ ఫలమిప్పుడనుభవిస్తున్నామన్న జ్ఞానమూ లేదు. మనను ఆవరించియున్న

రాఘవీయవ్యాఖ్య 109 అవిద్యామహిమ అంతగొప్పదన్లు మాట. అనుభవిస్తున్నది ఏ కర్మఫలమో మనకు తెలియనప్పుడు, నారాయణనామాన్ని స్మరిస్తూ పనులు చేయడం శ్రేయస్కరం. సూర్యరశ్శివల్ల కటిక చీకటి చీలిపోయే రీతిగా భగవన్నామస్మరణవల్ల పాపరాశి తొలగిపోతుంది. అవిద్యాంధకారం అణగిపోతుంది. అఘౌఘమనే తిమిరతతికి భగవన్నామావళి పప్రభాకరదీప్తిలాంటిదన్నాడు కవి.

పార్వతి శ్రీవష్లుసహ(్రనామాలను పారాయణం చేస్తుంటే వచ్చిన మహేశ్చరునికి సేవచేసి, సేదదీర్చీ, 'ప్రభో! విష్ణుసహస్ర నామావళిని లఘువుగా పారాయణం చేసే ఉపాయం ఉంటే తెల్పండి" అని ప్రార్జించిందట. వరాననే! ఎంతమంచి విషయాన్ని కోరినావో! నా మనస్సున రమించే రామునియందే శ్రీరామరామరామ అంటూ నేనూ రమిస్తాను. (ప్రతిరామనామం సహ(స్రనామాలకు సమానం అన్నాడట మహేశ్చరుడు.

విష్ణుః పర్వతానామధిపతిః' అన్నట్టు శ్రీమహావిష్ణువు కొండలకు అధిపతికదా! కాబట్టి, కొండరాచూలు భూతభప్యభవత్‌[ప్రభునామసుధనే ఆస్వాదిస్తుంది.

“సూత్రే మణిగణా ఇవ” అన్నట్టు రత్నాలు, సూత్రానికి కూర్చబడి దానియందు ఆధారపడి ఉంటాయి. అలాగే వేదమంత్రాలకు (బ్రహ్మసూత్రం ఆలంబనం. “జన్మాద్యస్య యతః” అనే జగత్కారణత్వాన్ని సూచించే (బ్రహ్మసూత్రమందు “యతో వా ఇమాని భూతాని జాయంతే” ఇత్యాది వేదమం(త్రరత్నాలన్నీ ఆధారపడిఉన్నాయి. సూత్రమే నామం. ఆ నామధారి కాబట్టి నారాయణుడు సూత్రధారి.

“తస్య ధీరాః పరిజానంతి యోనిమ్‌” (శ్రుతి). బుధులంటే ధీరులు. సమ్యక్‌ జ్ఞానసంపన్నులు, బుధవర్గంయొక్క మనోభూమికలో ఉద్భిదమైనదే భగవన్నామరాజి, 'అంకురం' అంటే కనబడేది, లక్ష్యమన్న మాట. “ధ్యానావస్టితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః” (భాగ. 12స్కం.) ధ్యానావస్తలో ఉన్న యోగుల మనస్సుకు లక్ష్యమైనది ధ్యేయమూర్తియే కదా!” కారణం తు ధ్యేయః అన్నట్లు అఖిలభువన జన్మస్టేమభంగాదిలీలలకు కారణమైన పరబ్రహ్మమే ధ్యేయం కదా!

'భూదేవతలంటే బ్రాహ్మణులు. ఎవరి నోట బ్రహ్మ (వేదం) ధ్వనిస్తుందో వారు (బ్రాహ్మణులు. తమ వర్షఆ(శ్రమాలకు తగిన కర్మలను ఆచరించడం విధి. సమస్త కర్మలు సర్వేశ్వరుని ఆరాధనలే. పుండరీకాన్షుణ్ని స్మరించేవాడు బయటా లోపలా శుచిర్భూతుడవుతాడు.

“ధ్యాయేన్నారాయణం దేవం స్నానాదిషు చ కర్మసు!

(బ్రహ్మలోకమవాప్నోతి న చేహావర్తతే పునః॥

10 నారాయణ శతకం స్నానంతోనే కర్మ ఆరంభమవుతుంది. కాబట్టి స్నానాది కర్మల నాచరిస్తున్నప్పుడు కూడా నారాయణనామాన్ని స్మరిస్తుండాలని దక్షసృతి బోధిస్తున్నది. ముప్పొద్దులు అనుష్టించే సంధ్యావందనంలోనూ కేశవాదిచతుర్వింశతి (24 నామాలను అనుసంధించడం విధియే. ప్రతికర్మను, అది ముగిసిన వెంటనే 'సకలం పరస్మై నారాయణాయేతి సమర్శయామి" అని భగవంతునికి సమర్పించడం లాంటివి విధులే కదా! నారాయణ నామచింతనచేత మానవుడు ఇహపరసుఖాలను పొందుతాడు. అతనికి పునర్జన్మ ఉండదని (శ్రుతిస్టృతులు బోధిస్తున్నాయి ఉల్లేఖాలంకారం. మ. పొనర న్య్ముక్తికి6 'ద్రోన వేదములకుం బుట్టిల్హ మోదంబునం దునికి ష్టానము నిష్టభోగములకున్నుతృత్తి యే ప్రొద్దునున్‌ ఘనపాపంబులవైరి షడ్రిపులకున్‌ గాలావసానంబు మీ వినుతాంఫ్రుద్వయపద్మసేనవగదా విశ్వేశ నారాయణా? 36 అర్థం . విశ్చశఈశ = స్థిరచరరూపమైన విశ్వాన్ని నియమించేవాడా! ఓ నారాయణా! పానరన్‌ = పొల్పుగొ, మీ వినుత+అం(ఘ్రిద్వయపద్మసేవన = స్తుతిపబడే మీ పాదకమలయుగళ సేవయే కదా! ముక్తికిన్‌, [త్రోవ = మోక్షానికి దారి, వేదములకున్‌. పుట్టిల్లు = వేదాలకు జన్మస్థానం; మోదంబునందు = అనందవిషయంలో, ఉనిక్సి స్థానము = నివాస స్టలం; ఇష్టభోగములకున్‌, ఉత్పత్తి = కోరిన సుఖాలను కలిగించే తావు; ఏ 'ప్రొద్దునున్‌ = సర్వకాలాల్లోనూ, ఘనపాపంబులవైరి = మహాపాపాలకు విరోధి; షట్‌ రిపులకున్‌ = ఆర్లురు శత్రువులకును; కాల+అవసానంబు = కాలాంతకం తొ; విశ్శనియామకుడవైన ఓనారాయణా! యోగ్యంగా స్తుతింపబడే మీ పాదకమల ద్వయాన్ని సేవించడమే మోక్షమార్గం. అది వేదాలకు పుట్టిల్లు ఆనంద ధామం. ఇష్టసుఖానుభవాలకు ఇరవు. సర్వదా మహాపాతక్రాలకు విరోధి. కామాదిశత్రు షడ్వర్గపుబతుకు ముగిసే తావు, వ్యాఖ్య : నారాయణచరణకములపరిభజనం ఉల్లేఖితం. ఇది నామప్రభావసందర్భం. అష్టాక్షరి లోని మధ్యమ నమః - పదార్ధ వివరణమే ఈ పద్యం. “ద్వ్యక్షరస్తు భవేన్నృత్యుః, 'త్యక్షరం (బ్రహ్మ శాశ్యతమ్‌; మమేతి ద్వ్యక్షరో మృత్యుః న మమేతి చ శాళ్ళతమ్‌॥” (భారతం, శాంతిపర్వం (13-4) మృత్యువుకు కారణం 'మమ' (నాది) అనే రెండక్షరాలపదమే, శాశ్వత బ్రహ్మహ్రాప్తికి 'న మమ' (నాది కాదు) అనే మూడక్షరాలే హేతువు, ప్రతివస్తువు భగవంచునిదే.

రాఘవీయవ్యాఖ్య శ “మమ నాధ యదస్తి యోఒస్మ్యహం సకలం తద్ది తవైవ మాధవ;” (స్తోత్రరత్నం) అన్నట్టు 'నేను, నాది అనేదంతా నీదే కదా స్వామీ* అని అను

సంధానం చేయడమే 'నమః” పదార్దం.

“నంతవ్యః పరమళ్శ్ళేషీ శేషా నంతార ఈరితాః। నంతృనంతవ్యభావో యం నప్రయోజనపూర్వకః॥” (అహిర్చుద్ద్యసం,) గొప్పవాడూ, నమస్కరింప దగినవాడూ శేషి అనబడుతాడు. నమస్కరించేవారు

'శేషభూతులు'. నమస్కరించడం, నమస్కరింపబడడమనే భావం ఒక

ప్రయోజనాన్నిబట్టికాక గొప్పవానిపట్ల కొద్దివానికి స్వభావసిద్ధంగా ఉండవలసిన

పద్ధతి. సర్వానర్జాలకు మూలమైన అహంకారమమకారాలు రెండూ నశించే క్రమమిది.

'నమవి పదం అఖండం. ఇది అవ్యయం. “నమః అనేది సఖండం.

  1. అఖండ “'నమః' పదాన్ని ఓంకారంతో అన్వయించి, “ఓమ్‌నమః అనుసంధిస్తే భగవత్రాప్తికి ఉపాయం నమస్కారమని అర్హం,

నమన్కొారం, శరణాగతి సమానార్దకాలు.

“సర్వేషామేవ లోకానాం పితా మాతా చ మాధవః

గచ్చద్వమేనం శరణం శరణ్యం పురుషర్జభాః॥” (భారతం అరణ్య)

సమస్తలోకాలకు మాధవుడే తల్లి, తండ్రి కాబట్టి, ఓ పురుష పుంగవులారా! మీరు శరణ్యుడైన ఈయనను. శరణు పొందండి అని మార్కండేయుడు ఉపదేశిస్తే.

“ఏవముక్తాస్తయః పార్దా యమౌ చ భరతర్జభ।

(ద్రౌపద్యా సహితాస్సర్వే నమశ్చక్రుర్దనార్హనమ్‌:” (అరణ్యపర్వం 192-56)

(ద్రౌపదితో కూడి పాండవులందరు జనార్హనునికి నమస్కరించారు. శరణాగతి చేశారు.

  1. 'నమో నమవి - సఖండపదాన్ని అఖండపదంతో అన్వయిస్తే రక్షణోపాయం. నన్ను రక్షించుకొనే స్వాతంత్ర్యం నాకు లేదు. అది భగవంతునికే ఉన్నదని అర్థం.

“అమృతస్యైష సేతు? (శుతి). సినోతి - బద్నాతి - స్వస్మిన్‌ సర్వం చిదచిద్వస్తు జాతం ఇతి, సేతు;

చిదచిద్విశిష్టమైన జగత్తునంతా తనయందు బంధించుకొనేది అనే వ్యుత్పత్తినిబట్టి పరబ్రహ్మను సీత్రువుతో పోల్చింది ఉపనిషత్తు. ఈవలిగట్టునుంచి ఆవలిగట్టుకు చేరడానికి సేతువెట్ట్లు ఉపాయమో, అట్లే ప్రకృతి మండలంనుంచి పరమ పదం చేరడానికి పరమాత్మయే ఉపాయం. “నాన్యః పంధా అయనాయ విద్యతే” మోక్ష ప్రాప్తికి 'నమః” పదార్థమైన భగవత్సాదసేవకన్న వేరే మార్గం సున్న(లేదు) కదా!

క్ష2 నారాయణ శతకం

3). 'నమఃి - సభిండపదాన్ని నారాయణపదంతో అన్వయించి, నమో నారాయణాయ అని ఉచ్చరిస్తే కైంకర్యమందు స్వార్హత్వనివృత్తి సిద్దిస్తుంది. నా కోసం కాక, శ్రీమన్నారాయబునికోసమే సర్వవిధసేవలను చేయగలనని అర్ధం.

“భవాంస్తు సహ వైదేహ్యా గిరిసానుషు రంస్యతే।

అహఠథ సర్వం కరిష్యామి జాగ్రతః స్వపతశ్ళ తే॥” (రామా)

'స్వామీ! నీవు సీతతో కూడ కొండ చరియలయందు. విహరించు, నీవు మెలకువతో ఉన్నా, ని(ద్రిస్తున్నా నీకు సర్వవిధకైంకర్యాలను చేయగలనన్నాడు లక్ష్మణుడు.

“బద్దాంజలిపుటాస్పర్వే నమ ఇత్యేవ వాదినః”

వైకుంఠంలో నిత్యసూరులూ, ముక్తపురుషులూ అందరు చేతులు జోడించుకొని దోసిలొగ్గి - 'నమః” అని స్తుతిస్తుంటారట. “తద్విప్రాసో విపన్యవో జాగ్భృవాంస స్పమింధతే” అన్నది వేదం.

“పంధా నకారజఉద్దిష్టో మః (ప్రధాన ఉదీర్యతే।

విసర్లః పరమేశస్తు తత్రార్దో బయం నిరుచ్వతే।

అనాదిః పరమేశోఒజయం శక్తిమాన్‌ పురుషోత్తమః

తత్రాప్తయే ప్రధానోఒయం పంధా నమననామవాన్‌॥”

న కారానికి మార్గమనీ, మకారానికి ప్రధానమనీ, విసర్లకు పరమాత్మ అనీ అర్ధం, భగవంతుణ్ని పొందడానికి నమస్కారం ప్రధానమైన మార్గమని భావం. (అహిర్చుద్భ్యసంహిత.,)

“చిత్తాలంఘన సౌకర్యకృపోత్తంభకతాదిభిః।

ఉపాయత్వమిహ స్వామిపాదయో రనుసంహితమ్‌॥”

ధ్యాన విషయమై [గ్రహించడానికి సుకరమవడంవల్లనూ, కృపోద్బలక మవడంవల్లనూ, భోగ్యతాతిశయంవల్లనూ భగవత్స్చాదాలయందే ఉపాయత్తం అనుసంధింపదగినది.

“లోకవిక్రాంతచరణౌ శరణం తేఒవ్రజం విభో॥” (శ్రీతంత్రం.)

లోకాలను కొల్చిన మీ పాదాలనే ఉపాయం - రక్షకం - శరణం- గా పొందాను. ఇలా పాదాలను అనుసంధించడం దివ్యమంగళవి[గ్రహానికి ఉపలక్షకం, విశ్వేశుని పాదాలే చేతనులు ఆశ్రయించడానికి యోగ్యమైనవి. హస్తగ్రహణంకంటె పాద(గ్రహణం దయాహేతువు కదా! అపరాధచక్రవర్తిని శ్రియఃపతి విడిచినా ఆయన పాదాలు విడనాడక దృఢంగా రక్షించే గుణాధిక్యం కలవి, “సన్యాసస్త్యాగ ఇత్యాహుః ప్రపత్తి శరణాగతి; న్యాసం, త్యాగం, ప్రపత్తి శరణాగతి అనే పదాలన్నీ

రాఘవీయవ్యాఖ్య 113 భగవత్పాదపద్మద్వయాన్ని సేవించాలనే భావాన్నే బోధిస్తాయి. కాబట్టి, విశ్వాత్మకుని పాదాలు ముక్తినివాసకవాటభేదాలు. నమకపాఠమంతా అందెలరవళిలాగా ఆనందనిలయమయిందే కాబట్టి వినుతవినూత్ననూపురితవేదాలసదనం భగవత్సాదద్వయం. మోదప్రమోద ఆనందాలకు నిలయం, వేదం (ప్రమాణమయితే పాదం ప్రమేయం కదా! ఇష్టభోగోత్సాదక మైనందువల్ల పాదద్వయం విశ్శజనానుమోదనం. “ప్రపన్నాఘౌఘవిధ్వంసి చరణౌ శరణం గతః అన్నట్టు శరణాగతుల ఘనపాపాలను ధ్వంసం చేస్తుంది శ్రీపాదద్వయం. కామ॥క్రోధలోభమోహ మదమాత్సర్యాలనే అంతశ్ళత్రువులకు అది కాలాంతకం. “ధర్మార్హకామమోక్షాఖ్యం యఇచ్చేభ్రేయమాత్మన:ః ఏకమేవ హరేస్తత్ర కారణం పాద సేవనమ్‌॥” (భాగవతం) పురుషార్థ చతుష్టయ రూపమైన (శ్రేయస్సును పొందగోరే వారికి శ్రీమన్నారాయణుని పాదకమలసేవయే ప్రధానమని నారదమహర్షి బాల(్రువునికి ఉపదేశించాడు కదా! “న చలతి భగవత్సాదారవిందాల్లవనిమేషార్హమపి స వైష్ణవా[గ్రఇ” భగవంతుని పాదారవిందాలను ఆరనిమిషమైనా విడువక చింతించే వ్యక్తి విష్ణుభక్తుడన్నది శ్రీమద్భాగవతం. ఉల్లేభాలంకారం. మ. భవరోగంబులనుందు పాతకతమోబాలార్కబింబయు క ర్మవిషజ్వాలసుధాంశుగామృ తతుషార వ్రాతపాథోధిమూ ర్తివి కైవల్యసదావలోకవకళాదివ్యాంజన శ్రేస్టమై భువిలో మీదగు మంత్రరాజమమరున్‌ భూతాత్మ నారాయణా॥ 37 అర్థం : భూత+అత్మ = [ప్రాణులకు అత్మ అయినవాడా! ఓనారాయణా! కర్మ- మూర్తివి! కర్మవిషజ్వాల = కర్మఅనే విషజ్వాలకు; సుధా+అంశు గ = చంద్రుణ్ని పొందిన; అమృత తుషార వ్రాత = అమృతం వలె శీతల సముదాయంగల/చల్లని అమృతరాళియైన; పొధోధిమూర్తివి = సము(ద్రమే ఆకారంగా కలవాడవు; ఓ నారాయణా! మీదు+అగు = మీదైన; మంత్రరాజము = ్రేస్టమైన మంత్రం: భువిలో = భూలోకమందు; భవరోగంబుల మందు = జన్మరోగాలకు సాంసారిక వ్యాధులకు జౌషధం. పాతక తమస్‌ + బాల +అర్కబింబంబు = పాతకాలనే చీకటిపట్ట ఉదయభానుబింబం. కైవల్య పద+ అవలోకన కళా దివ్య+అంజన (శ్రస్టమై = ముక్తిస్థానాన్ని చూచే కళకు. (శ్రేష్టమైన దివ్యాంజనమై; అమరున్‌ = ఒప్పియున్నది. తా; సర్వభూతాలకు ఆత్మయైనవాడా! కర్మ అనే విషజ్యాలకు చంద్రుణ్ని పొందిన శీతలామృతరాశియైన సముద్రరూపం కలవాడవు. ఓ నారాయణా! మీ

కడ నారాయణ శతకం మం(త్రరాజం సంసారవ్యాధులకు జాషధం. పాతకమనే ,అంధకారానికి ఉదయ భానుబింబమై, మోక్షస్టానాన్ని దర్శించే కళకు కండ్లకు పెట్టుకోగా బాగా ప్రకాశించే కొటుకగా ఒప్పియుంది.

వ్యాఖ్య : - మంత్రరాజమహిమ ఉల్లేఖాలంకారసజ్జితం.

భగవంతుడు ఆత్మగాలేని ్రాణిగానీ, పదార్ధంగానీ లేనేలేదు. సర్వభూతాలు భగవంతునికి శరీరాలేకదా!

“ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఒర్జున. తిస్టతి” (భ.గీ) అనడం వల్ల నారాయణుడు భూతాత్ముడు. సకలభూతాలు ఈ సంసారసము[ద్రంలోనే తమ తమ కర్మలకు తగిన ఫలాన్ని అనుభవించడానికి జన్మిస్తాయి, నశిస్తాయి.

నారాయణుడు పాధోధిస్వరూపుడు 'పా-రక్షణే' ధాత్వర్థంవల్ల 'పాతి భూతానితి పాధ;ః" భూతాలను రక్షించేది. కాబట్టి 'పాధః' అంటే నీరు. లేదా పీయతే ఇతి పాధః' అనే వ్యుత్పత్తినిబట్టి త్రాగేనీరు అని అర్ధం. పాధోనిధి అంటే సముద్రమన్నమాట.

“అంభోనిధి' (వి.స.నా.) అనే పదానికి 'భగవద్గుణదర్పణం” వివరించినవాక్యమిలా ఉంది. “పాతాళాంభసి అభిలజగదాధారపీరకమరాత్మనా నిధీయతే - స్వయం నిక్షిష్యతే' ఇతి 'అంభోనిధిః' పాఠోధి కూడా అంతే. పాతాళజలమందు అభిలజగత్తుకు ఆధారపీఠంగా _తాబేటిగా, తనను తానుంచుకొన్నాడు కాబట్టి పాధోధిమూర్తి నారాయణుడే.

విషంగానీ అమృతంగానీ జనించింది సము(ద్రంలోనే కదా! అలాగే సంసారంలో సుకృతదుష్కృతాలూ సంభవిస్తాయి. అందులోనూ మొదట విషరూపమైన పాపకర్మ ఫలమే సంభవిస్తుంది. విషయమూ, అమృతమూ రెండు పరస్పర విరుద్ధపదార్థాలు, విషానికి విరుగుడు మందు అమృతం. ఈ సంసారంలో అవిద్య అనే విషమెక్కినందువల్ల సర్వేశ్చరునికి చెందిన ప్రతివస్తువు, నేను కానిది నేనుగానూ, నాది కానిది నాదిగానూ కనబడుతుంటాయి. విషం మింగినవాణ్నీ చంపుతుంది కానీ విషయాలు, వాటిని తలచుకొన్నంతనే చంపుతాయి. తలచిన కోరిక తీరడానికి ఆటంకమేర్చడితే కన్నులు నిప్పులు చెరుగుతాయి. కోపంవల్ల వివేకం నశిస్తుంది. దానివల్ల బుద్ధి చెడి ఆత్మ వినాశనానికి హేతువవుతుంది. కాబట్టి నారాయణ నామామృతాన్ని సేవిస్తే అవిద్య అనే కర్మరూపవిషం విరిగిపోతుంది.

“హా నః పూర్వం వాక్రవృత్తా న తస్మిన్‌,

తేన ప్రాప్తం గర్భవాసాదిదుఃఖమ్‌॥” (ముకుందమాల)

పూర్వజన్మలో మనవాగింద్రియం - నాలుక - నారాయణమంత్రాన్ని జపించలేదు

రాఘవీయవ్యాఖ్య 115 కాబట్టి ఈ జన్మ ప్రాప్తించింది. జపిస్తే జన్మలేక పోయేది కదా! అని శ్రీకులశేఖరులకు పశ్చాత్తాపం కలిగింది.

'భవి మంటే జన్మ జన్మిస్తే మరణం తప్పదు. జననమరణరూపమైన పరిభ్రమణమే. 'భవం*. సంసారమని అర్థం. దేహం ్రకృతియొక్క వికారమే. ఎల్లప్పుడు మారుతుంటుంది. ఎన్నడో ఒక నాడు పాత చొక్కా" లాగా విడువదగిన ఈ దేహంలో ఉన్న జీవుడు * ఆదేహమే ఆత్మ' యని (్రమపడడం భవరోగం. అది చచ్చిపోతుందేమో అని మందులు తింటూ దేహాన్ని కాపాడుకొనే యత్నంచేస్తుంటాడు. ఎన్నిమందులు తిన్నా తుదకు కృళించి నళించిపోయేదే కాని దేహం స్థిరంగా నిల్ఫేది కాదు. జీవాత్మ పరమాత్మతో చేరి సుఖంగా ఉండాలంటే మంత్రరాజమే మహౌషధం. ఇది భవరోగాలనూ, జనన మరణాలనూ దూరం చేస్తుంది. భవరోగాలు ఆరు.

1 దేహాన్నే ఆత్మగా అభిమానించడం, 2. తానే స్వతంత్రుడనే బుద్ధి. 3. భగవంతునికంటె ఇతరులకు చెందిన వాడననే భావం. 4, తనను తానే రక్షించుకొంటాననుకోవడం, 5. ఆభాసబంధువులపై అంటే, బంధువులలాగా కనబడే దేహబంధువులపైన ఆసక్తి 6. విషయాలను అనుభవించాలనే ట్రీతి. ఈ రోగా లెన్నిమందులు తిన్నా తగ్గవు. “చేతసి నమో నారాయణా యేత్యముం మంత్రం సష్రణవం (ప్రణామసహితం (ప్రావ్తయధ్వం ముహుః” (ముకుందమాల).

'ఒమ్‌ నమో నారాయణాయ అనే సర్వ శ్రేష్టమైన మంత్రాన్ని జపిస్తూ మనస్సులో అర్జాన్ని భావిస్తుండాలి. ఈ మంత్రరాజమే 'భవభయప్రధ్వంసనైకాషధం.”

రాశీభూతపాతకం గాఢంగా పేరుకొన్న చీకటిలాంటిది. అది పదార్థాన్ని యథార్హంగా ఉన్నదున్నట్టుగా కనబడనీయదు. సమ్యక్‌ జ్ఞానానికి ప్రతిబంధకంగా ఉండేది దురితం. ఉదయభానుబింబం చీకటిని తొలగించినట్టే, సూర్యమండలమధ్యవర్తియైన నారాయణుని మంత్రం _.మహాపాతకరాశిని ధ్వంసం చేస్తుంది.

“నమో నారాయణాయైన ముచ్చరన్‌ భక్తిభావతః।

రజస్తమోమోహజాతాన్‌ జా(గ్రత్స్వప్షసుషుప్తికాన్‌;

వాజ్మనఃకాయజాన్‌ దోషాన్మం'త్రేజైతేన నిర్హహీత్‌”

మంత్రరాజం, దాన్ని జపించే వ్యక్తి పాతకాలనన్నిటినీ భస్మం చేస్తుందని 'వాయుపురాణం'" బోధిస్తుంది.

'తజ్ఞపస్తదర్హభావనమ్‌' (సతంజలియోగసూత్రం). *జపం' అంటే మంత్రాన్ని అనుసంధిస్తున్నప్పుడు దానిఅర్భాన్నికూడా భావించడం.

116 నారాయణ శతకం “జకారో జన్మవిచ్చేదః, పకారః పాపనాశనః। తస్మాజ్ఞప ఇతి(ప్రోక్తః జన్మపాపవినాశకః॥” జపమనే పదానికి జన్మపాపాలను నశింపజేసేదని అర్హం. “అంజనం' అంటే కన్నులకు పెట్టేకాటుక. అది వస్తువును స్పష్టంగా చూపే కళాషప్రక్రియ. దివ్యాంజనం కని, విని, ఎరుగని నిధి నిక్షేపాలను కనబరుస్తుంది. 'అష్టాక్షరి' మోక్షస్టానాన్ని కనబరచే కళాత్మకమైన దివ్యాంజనం. కాబట్టి మంఢత్రరాజం శ్రేయః(ప్రాప్తికరౌషధమే. రూపకాలంకార(ప్రాణి తోల్లేఖాలంకారం. మ. వరుసన్‌ కర్మపిపీలికాకృతతనూవల్మీకనాళంబులో( బరుషాకారముతో వసించిన మహాపాపోరగ్రేణికిం బరమోచ్చాటనమై రహస్యమహినుం బాటింపుచున్నుండు మీ తిరునుంత్రంబగు మంత్రరాజమమరుందిన్యాత్మ నారాయణా॥ 38 అర్థం. : దివ్య+ఆత్మ = అఫప్రాకృత స్వరూపంగల; ఓ నారాయణా! వరుసన్‌ = (క్రమంగా; కర్మ-లోన్‌, కర్మ పిపీలికా = కర్మలు అనే చీమలచేత; కృత = చేయబడిన; తనూ వల్మీక నాళంబులోన్‌ = శరీరమనే పుట్టయొక్క రం(ధ్రంలోపల; పరుషశఆకారముతో = ఘోరరూపంతో; వసించిన = కాపురమున్న; మహాపొప+శఉరగశ్రేణికిన్‌ = గొప్ప పాపాలు అనే పాముల సమూహానికి? పరమ + ఉచ్చాటనమై = లేపి దూరంగా తరిమి వేసే మహామం(త్రమై; రహస్య మహిమన్‌ = గోప్యమైన మావాత్య్యాన్ని: పాటింపుచున్‌, ఉండు = ఆచరిస్తున్న: మీ; తిరుమందత్రంబు+అగు = 'తిరుమం([త్ర' మనే వైష్ణవ పరిభాషజన్న; మంత్రరాజము గొప్పమంత్రం; అమరున్‌ = ఒప్పియున్నది. తా: దివ్యాత్మ! ఓ నారాయణా! (క్రమంగా కర్మలనే చీమలచేత చేయబడిన పుట్ట అనే దేహం యొక్క రంధ్రంలో క్రూరమైన ఆకారాలతో నివసించిన ఘోర పాపాలనే పాముల సమూహాన్ని లేపి దూరంగా-తరిమి వేసే మహామంత్రమై రహస్య మహిమను పొటిస్తున్న మీ తిరుమంత్రమనే పరిభాష గల మంత్రరాజం ఒప్పియుంది, వ్యాఖ్య : తిరుమంత్రం రహస్యమహిమ కలది. దేహం ఒక పుట్ట. పుట్టకు రంధ్రాలున్నట్ట్లు దేహానికి నవ(9) రంధ్రాలున్నాయి. చీమలవల్ల పుట్ట ఏర్పడుతుంది. కర్మలవల్లదేహం మొలకెత్తుతుంది. దేవ, మానవ, పశు, పక్ష్యాదులుగా జన్మించడానికి పూర్వజన్మలలో చేసిన కర్మయే బీజమని 'కపూయచరణాః అనే (శ్రుతివాక్యాల వల్ల విశదమవుతుంది. క్రమంగా “చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనయట్టు” కర్మలవల్ల కలిగిన దేహాలు పాపాలకు నెలవులు, 'పాప* శబ్దార్థం పాము. 'పాపటేడు' అంటే సర్సరాజుకదా! అది

రాఘవీయవ్యాఖ్య 17 పాములపుట్ట. దేహం పాపాలబుట్ట. ఏ పుట్టలో ఏ శేషుడో అన్నట్టు దేహంలో ఏవో ఘోరపాతకాలుంటాయి. మాంత్రికుల మంత్రోచ్చాటనతో పాములు పుట్టలోనుంచి లేచి పారిపోతాయి. మంత్రరాజం, దాని ననుసంధించే వ్యక్తిశరీరంలో ఆవహించి ఉన్న మహాపాపరాశిని తొలగించి, తిరిగి దరిచేరకుండా చేస్తుంది.

“బ్రహ్మహత్యాం తరతి, తరతి వీరహత్యాం, స్వర్షస్తేయాత్‌ పూతో భవతి. వృషలీగమనాత్‌ పూతో భవతి, పిత్చదేవమనుష్యాణామపకారాత్‌ పూతో భవతి, సర్వధర్మ పరిత్యాగ పాపాత్‌ సద్యః శుచితా మాప్షుయాత్‌” అనే తొలిపలుకుల రీతిగా, మంత్రరాజానుష్పాత సకలపాపొలనుంచి విముక్తుడవుతాడు.

పాపాలకు పరిహారముందికదా! అని తెలిసి చేసిన పాపాలకు మాత్రం నిష్కృతి లేదు సుమా! “బుద్ధిః కర్మానుసారిణీ” అన్నట్టు పాపకర్మల (ప్రాబల్యం మంచి పనులను చేయనీయదు, మంత్రోపదేశం పొందేబుద్ధి పుట్టనీయదు కదా! అందుకే “ఉత్తిష్ట! జాగ్రత!” అన్నది వేదం. బుభుక్షువు కాక్క ముముక్షువు అంటే మోక్షాన్ని కోరేవాడు తెలుసుకో దగిన రహస్యాలు మూడు. 1. మంత్రరాజం (తిరుమంత్రం) 2, మంత్రరత్నం (ద్వయమంత్రం). 3. చరమళ్టోకం. ఈ మూడింటిలోనూ 'ప్రధమరహస్యం తిరుమంత్రం.

(శ్రియఃపతి, అనాదియైన కర్మప్రవాహంలో పడి లెక్కలేని దుఃఖాలను పొందుతూ మ్ష(ద్రవిషయాలకు ఆశపడిన అత్మలనూ, వాటిని సాధించుకోవడానికి వారుపడేపాట్టనూ గమనించాడు. మనసు కరిగింది. వాస్తవంగా పరమ పురుషార్థాన్ని తెలుసుకొన్నట్టెతే బద్దాత్మలు, సాధనానుష్థానం నిత్యాత్మలవలె నిత్యసూరులవలె - తన కైంకర్యం చేసి బాగు పడేఅవకాశముందనుకొన్నాడు (శ్రియఃపతి, నరనారాయణరూపంతో అవతరించి, తానే శిష్యాచార్యులుగా వెలసి, తానే తనకు ఉపదేశించుకొని, లోకానికి వెల్లడించిన మూలమంత్రమే తిరుమంటత్రం. దీని వివరణలే మిగత రెండు రహస్యాలు. (క్రమంగా అనుష్టించే శక్తి సన్నగిల్లిన సమాజాన్ని శ్రీమన్నారాయణుడు సమీక్షించాడు.

“యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జిత మేవ వాః

తత్తదేవావగచ్చ త్వం మమ తేజోఒంశసంభవమ్‌॥” (భీ)

'శ్రీమంతమై వృద్ధిపొందే దంతా నా తేజస్సు యొక్క అంళవల్ల కలిగినదే అని (గ్రహించు'మని తానే గీతాచార్యుడుగా అవతరించి నొక్కి చెప్పాడు కదా!

“పూర్చోత్సన్నేషు భూతేషు తేషు తేషు కలౌ ప్రభుః

అనుఫ్రవిశ్య కురుతే యత్సమీహిత మచ్యుతః॥”

118 నారాయణ శతకం

సర్వేశ్వరుడు తానింతకు ముందు సృజించిన వాటిలో ప్రవేశించి తన ఇష్టాన్ని నెరవేర్చుకొంటున్నాడన్నట్టు, పరాంకుశ పరకాలాదిరూపాలతో నూత్న దశావతారాలుగా అవతరించి, మేఘాలు సముద్రజలాన్ని పానంచేసి జీవులకు ఉపయోగపడే మధుర జలాన్ని వర్షించే రీతిగా, వేదాలలోని సారభూతార్జాలను అందరికి తెలియజేశాడు. అంతేకాదు. మన దక్షిణ భారతదేశంలోనే నాథ, యామున, రామానుజ, వేంకట నాథ, రమ్యజామాతృమునీత్యాది అనేకాచార్యులుగా వెలసి, విశిష్టాద్వైత సెద్దాంతాన్నీ ప్రవర్తింపచేశాడు.

(31వ పద్యం నుంచి పేర్కొన్నదేకాక) మంత్ర రాజ మహిమ చాలా గొప్పది. ఈ మంత్రం జీవాత్మ స్వరూపాన్ని, దానికి తగిన పురుషార్దాన్నీ తెల్పుతుంది. 'స్వరూపం” ఆంటే పాదాలను సాదరేఖలు వదలని రీతిగా, వస్తువునెన్స్షడూ వదలని స్థితి. శేషత్వపారతంత్ర్య క్రైెంకర్యాలే స్వరూపానుగుణమైనవి. 'శేషత్వ' మంటే దాస్యం. పరమాత్మకు అధీనుడై మెలగడమే 'పారతంత్ర్యం” కైంకర్యం. అంటే సేవచేయడం. రహస్యం ప్రకటిస్తే సదస్యమవుతుంది.

“ఆద్యం తు త్రక్షరం బ్రహ్మ త్రయీ యత్ర ప్రతిస్టితా।

స గుహ్యోఒన్యస్రివృద్వేదో యస్తం వేద స వేదవిత్‌॥” (మనుస్మృతి 11-265)

మూడక్షరాలుగల మొదటి అక్షరమైన వేదం - (ప్రణవం - ఓమ్‌ -లో మాత్రం బుగ్యజుస్పామవేదాలు మూడు ఆంతర్గతాలు, బుగాదివేదాల కంటె విలక్షణమైన, రహస్యమైన వేదం ఇది. దీన్ని తెలుసుకొన్న వాడు మూడు వేదాలను తెలుసుకొన్న వాడవుతాడు.

న్యాసవిద్యయందు (ప్రత్యక్షంగా ఆత్మసమర్పణమూ తెల్పబడుతుంది,

“హవిర్భహీత్వాఒత్మరూపం వసురణ్యేతి మంత్రతః

జుహుయాత్రృణవేనాగ్నా అచ్యుతాఖ్యే సనాతనే॥”

'ఆత్మ' అనే హవిస్సును వసురణ్య అనే మంత్రంతో [గ్రహించి అచ్యుతుడు అనే అన్ని యందు 'ప్రణవం' తో హోమం చేయాలి. ఈ న్యాస విధానం (ఆత్మసమర్చణం) 'తపసా మతిర్తిక్రమాహుః' తపస్సులలోకెల్ల శ్రేష్టమైనదని యాజ్జిక్యు పనిషత్తు బోధిస్తుంది. జీవునికి సర్వేశ్యరుణ్ని తెలుసుకొనడంవల్ల (పరస్వరూపజ్ఞానంవల్ల) మంచి పరిళుద్ది కలుగుతుంది. “క్షేత్రజ్ఞస్యేశ్చరజ్ఞానాత్‌ విశుద్ధి: పరమా మతా” అని (యాజ్ఞవల్క్యస్మృతి3-34), తిరుమందత్రంలోని ఆద్యక్షరం (ఓమ్‌) శేషత్వానుసంధానాన్ని తెల్పుతుంది. ఇక (ప్రణవార్థానుసంధానం ఇలా ఉంది.

రాఘవీయవ్యాఖ్య 119 “ఈ దృశ పరమాత్మాఒజయం ప్రత్యగాత్మా తధేదృశః। తత్సంబంధానుసంధానమితి యోగః ప్రకీర్తితః” (శాండిల్య స్మృతి) 5-17), పరమాత్మస్వరూపమిలాంటిది. ఆత్మస్వరూపమిలాంటిది. ఈ ఉభయులకున్న

సంబంధమిటువంటిదనే విధమయిన యోగాన్ని 1'ప్రణవం' బోధిస్తుందని శాండిల్య

మహర్షి తెల్పాడు.

  1. 'ఓమ్‌' అనే పదం పార్టునిరథాన్ని సమీక్షించుమంటుంది. (అ) శ్రీకృష్ణుడు పరమాత్మ(మ) అర్జునుడు జీవాత్మ ఈ ఉభయులకూ ఆశ్రయణీయమైన రధం (ఉ) రుక్కిణి స్టానంగానూ భావించాలి. ఇంక ఇది చిదచిదీశ్చరతల్త్వాన్నీ తెల్పుతుంది.

“తదంతర్భావాత్‌ త్వాం న పృథగభిధత్తే 'శ్రుతిరపి” (శ్రీగుణరత్నకోశం),

ఓలక్ష్మీ! నీవు సర్వదా నారాయణునితో చేరి యుండడంవల్ల శ్రుతికూడా నిన్ను ప్రత్యేకంగా పేర్కొనడం లేదు. అంటే “భాస్కరేణ ప్రభా యధా” అన్నట్టు సూర్యునితో సూర్యకాంతి విడువక ఉండే విధంగా, లక్ష్మి నారాయణునితో కూడి ఉంటుంది. కాబట్టి భగవంతుణ్ని పేర్కొంటే భగవతిని కూడా పేర్కొన్న భావం ఉంటుంది. భగవద్వాచకమైన 'అ” కారమందు తత్పత్నీసంబంధం అర్జాత్సిద్ధమే కదా! ఇలా మకారం జీవాత్మ అనీ, ఉకొరం రథం - ప్రకృతి అనీ, జీవ, ప్రకృతులను రెంటిని నియమించే పరమాత్మ అకారమనీ బోధిస్తుంది. 'ఓమ్‌” అనే మొదటి పదం.

  1. 'నమః' శిబ్దార్థం పారతంత్ర్యాన్ని తెల్పుతుంది. పాదుకల నిచ్చి నేను తిరిగివచ్చే దాకా రాజ్యం చేయుమని శ్రీరాముడు ఆదేశిస్తే భరతుడు రామునికి పరతం(త్రుడై ఆయన కోసం కాచుకొని యున్నాడు. అట్టే శత్రుఘ్నుడు భరతునికి పరతంత్రుడైయున్నట్టు రామాయణం వల్ల తెలుస్తుంది.

  2. నారాయణశబ్దార్థం పొరార్ట్యాన్ని ' ప్రబోధిస్తుంది.

'నారాణాం అయనః' అనే తత్పురుషవల్ల ఆత్మలకు ఆశ్రయ భూతుడని అర్థం. ఇది ధారకత్వాన్ని తెల్పుతుంది,

'నారాః అయనం యస్య సః అనే బహుగ్రీహివల్ల ఆత్మలనే ఆశ్రయంగా (గ్రహించి, వాటిలో అంతరాత్మగా ఉంటాడని అర్థం, ఇది వ్యాపకత్వాన్ని తెల్పుతుంది. ఎలాగైనా, “అపి వృక్షాః పరిమ్భానాః” రామవిరహాన్ని భరించని చెట్లూ జంతువులూ వాడిపోయి, బాధపడినట్ట్లూ - నేను నిన్ను గానీ నీవు నన్ను గానీ విడిచి యుండలేమన్నట్టూ - బోధించేది తిరుమంత్రంలోని మూడవపదం.

క) 'ఆయ'" అనే (నారాయణాయ పదమందున్న) చతుర్జీవిభక్తి (వ్రత్యయం, లక్ష్మణ స్వామి వలె, జీవుడు ప్రార్ధించదగినదీ, దేవుడు ఎక్కువ ఇష్టపడేదీ అయిన కైంకర్య భావాన్ని తెల్పుతుంది. ప్రణవం స్వరూపాన్ని, నమః ఉపాయాన్ని, నారాయణా య తురీయఫలపురుషార్థాన్ని బోధిస్తుంది.

120 నారాయణ శతకం

తిరుమంత్రం పరమాత్మతో జీవాత్మలకు గల తామ్మిది విధాల సంబంధాలనూ తెల్పుతుంది.

పరమాత్మ జీవాత్మలు

1 పిత 1. పుత్రులు

  1. రక్షకుడు 2. రక్ష్యులు

38 కేషి 3 శేషులు

4 భర్త త్తే భార్యలు

  1. జ్ఞేయుడు 5. జ్ఞాత

6 స్వామి 6 సొమ్ములు

7, ఆధారం 7. ఆధేయులు

& ఆత్మ 8 శరీరాలు

9, భోక్త 9, భోగ్యులు

  1. 'ఓంకారం'. పితాపుత్ర, రక్ష్యరక్షక, శేషశేషి. భార్యాభర్శ, జ్ఞాతృజ్టేయ సంబంధాలను (5) నిరూపిస్తుంది.

  2. 'నమఫి పదం స్వస్వామిసంబంధాన్ని తెల్పుతుంది.

3, 'నారాయణాయ' పదం ఆధారాధేయభావ దేహాత్మ భావ భోక్సృభోగ్య భావ సంబంధాలను ప్రతిపాదిస్తుంది.

అర్ధపంచకాన్ని పాటించడంకూడా రహస్యమహిమయే.

1 ఆత్మ స్వరూపం - జీవుడు దేవునికే దాసుడు.

  1. పరమాత్మ స్వరూపం - దేవుడే అన్ని విధాలా రక్షకుడు.

3 ఉపాయ స్వరూపం - దేవుడే గతి అని విశ్శసించడం.

4 విరోధిస్వరూపం - మోక్షానందానుభవాన్ని ఆటంకపరచే వాటిని త్యజించడం.

  1. ఫలస్వరూపం - పొందదగినది మోక్షసా(మ్రాజ్యం.

తిరుమంత్రరహస్యమహిమను గురువునాశ్రయించి తెలుసుకోవలసిందే.

“మంత్ర రాజమిమం విద్యాద్గురువందనపూర్వకం।

లప్బైవం మంత్రరాజానం మాం గచ్చేచ్చరణం నరః॥

అనే నైవ తు మంత్రేణ స్వాత్మానం మయి నిక్షిపేత్‌!

మయి నిక్షిస్తకర్తవ్యః కృతకృత్యో భవిష్యతి॥” (సాత్యకితంత్రం)

ఆచార్యునికి దండం సమర్సించి ఈ మంత్రాన్ని ఉపదేశం పొందాలి, ఉపదిష్టుడైన వ్యక్తి శరణాగతిజేసి, తన ఆత్మరక్షణభారాన్ని నా పై ఉంచితే కృతకృత్యుడు కాగలడని భగవంతుడే తెల్పినాడు.

రాఘవీయవ్యాఖ్య 121 “గురుం '్రకాశయేత్‌ ధీమాన్‌ మంత్రం యత్నేన గోపయేత్‌! అ(ప్రకాశప్రకాశాభ్యాం క్షీయేతే సంపదాయుషీ॥” బుద్దిమంతుడు గురువును ప్రకాశింపజేయాలి. మంత్రాన్ని (శ్రద్దతో కాపాడుకోవాలి.

గురువును ్రకాశింపజేయకుంటే జ్ఞానసంపద క్షీణిస్తుంది. అనధికారులకు ఉపదేళొస్తే

ఆయుస్సు క్షీణిస్తుందని శాస్త్రం చెబుతుంది.

మ. హరుని న్నద్రిజ నాంజనేయుని గుహున్నయ్యంబరీషున్‌ (ధ్రువుం

గరి. బవ్లాదు విభిషణాఖ్యుని బలిన్‌ ఫఘంటాశ్రవున్నారదున్‌ గర మొప్ప న్విదురున్‌ "బరాశరసుతున్‌ గాంగేయునిన్‌ ద్రౌపదిన్‌ నరు నక్రూరుని. బాయకుండును భవన్నామంబు నారాయణా॥ 39 అర్ధం : ఓ నారాయణా! భవత్‌+నామంబు = నీపేరు; హరునిన్‌ = శంకరుల్ని; అద్రిజను =పార్వతిని; ఆంజనేయుని; గుహున్‌; ఆ+అంబరీషున్‌; (ధ్రువున్‌; కరిన్‌ = గజాన్ని; ప్రహ్హాదు; విభీషణ +ఆఖ్యుని = విభీషణుడనే పేరు కలవాణ్ని; బలిన్‌ = ఇంద్రసేనుణ్ని; ఘంటాశ్రవున్‌ = ఘంటాకర్ణుణ్ను: నారదున్‌; విదురున్‌; పరాశరసుతున్‌ = వ్యాసుణ్ని; గాంగేయునిన్‌ = భీష్ముణ్ని? (ద్రౌపదిన్‌; నరున్‌ = అర్జునుణ్ని; అక్రూరుని; కరము, ఒప్పన్‌ = చాలా యోగ్యంగా; పాయక, ఉండును = విడువక ఉంటుంది. తాః ఓ నారాయణా! నీ నామం శివుణ్ని, పార్వతినీ, ఆంజనేయుడు మొదలైన భాగవతోత్తములనూ విడువక వుంటుంది.

వ్యాఖ్య : భగవన్నామాన్ని అనవరతం అనుసంధించే మహానుభావులను 'పేర్కొన్న పద్యమిది.

  1. హరుడు : “శ్రీరామస్య మనుం కాళ్యాం జజాప వృషభధ్వజః”

కాళీక్షేత్రనాధుడైన విశ్వేశ్వరుడు రామతారకనామాన్ని సదా జప్యంగా (గ్రహించాడు.

ఆ మందత్రప్రభావంవల్ల శ్రీరామరూపంలో ప్రసన్నుడైన నారాయణుడు శివునితో ఇలా

అన్నాడు.

“ముమూర్తోర్రక్షిణే కళ్లే యస్య కస్యాపి వా స్వయమ్‌,

ఉపదేక్ష్యసి మన్మంత్రం స ముక్తో భవితా శివ!”

'కాశీ నగరంలో మణికర్షికయందు గంగాతీరంలో ఐదు[క్రోసుల దూరంలోపల మృతి జెందే జంతువులకు కుడి చెవిలో నీవు రామతారకమంత్రముపదేళశించగలవు. ఆ జంతువు ముక్తి పొందగలదు. (రామతాపిన్యుపనిషత్తు. అందుకే, “కాశీ మరణాన్ముక్తి” “రేవాతీరే తపః కుర్యాత్‌, మరణం జాహ్నవీతటే” “నర్మదా నదీ తీరంలో తపస్సు చేయాలి. కాశీక్షేత్ర మందలి గంగా తీరంలో చావాలి” అని ప్రసిద్ధి.

122 నారాయణ శతకం

“వైష్ణవానాం యధా. శంభుః” పరమశివుడు శుద్ద శ్రీవైష్ణవుడని భాగవతం (12స్కం.) పేర్కొన్నది.

  1. అద్రిజ : భగవన్నామ. సంకీర్ష్సయందు అత్యంతాసక్తికలది పార్వతి. రామచరిత్రను గూర్చి ఆమె అడగడమూ, శివుడు రాముని'ప్రాభవవైభవాలనుగూర్చి ఆమెకు వివరంగా చెప్పడమే కాక, “శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమేః। సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!” అని పురుషోత్తమునిగూర్చి తెలుసుకొన గోరే పార్వతిని ప్రశంసిస్తూ రామనామమాహాత్య్యాన్ని కూడా ఆమెకు తెలిపాడు కదా!

  2. అంజనేయుడు : మూర్తీభవించిన రామనామమే ఆంజనేయుడనడం అతిశయోక్తి కాదు. “యత్ర యత్ర రఘునాధకీర్తనం! తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్‌” ఎక్కడ రామనామసంకీర్తన జరిగితే, ఆక్కడ బాష్ప వారి పరిపూర్ణలోచనుడై శిరస్సున అంజలి బద్దుడై వెలసి ఉంటాడు.

  3. గుహుడు : అటవికులకు రాజైన గుహుడు నాగరికులకు రాజైన శ్రీరామునికి సఖుడు. సీతారామలక్ష్మణులవృత్తాంతాన్ని భరతునికి వివరించిన మహానుభావుడు. “గుహో గహనగోచరః” అన్నాడు వాల్మీకి. వేదాంతవనసంచారిమైన పరబ్రహ్మను దర్శించినవాడట గుహుడు.

  4. అంబరీషుడు : నాభాగుని కుమారుడైన అంబరీషుడు రాజర్షి ద్వాదశీవ్రత మాచరించి భాగవతోత్తములకు మృష్టాన్నం పెట్టే సమయంలో దుర్వాసుడు వచ్చాడు, స్నానానికి వెళ్ళిన ముని ఆలస్యం చేళాడు. ద్వాదశి ఘడియలు - తిథి - మించక ముందే పారణ చేయాలి కాబట్టి, పెద్దలు చెప్పిన రీతిగా ఉదక పారణం చేశాడు అంబరీషుడు. దుర్వాసుడు వచ్చి, పారణ చేసినాడనే కోపంతో 'మహాకృత్య'ను సృజించి, అంబరీషునిపైకి ప్రేరేపించాడు. వెంటనే రాజు భగవన్నామస్మరణ చేయడంవల్ల శ్రీ మహావిష్ణునక్రం వచ్చి కృత్యను సంహరించింది. చక్రం దుర్వాసుని వెంట పడింది. బ్రహ్మరుద్రేంద్రాదులూ మునిని రక్షింప లేకపోయారు. తుదకు విష్ణు మూర్తిని శరణు వేడాడు. 'నా హృదయం నా భక్తుల అధీనంలో ఉంటుంది. కాబట్టి అంబరీషుణ్నీ వేడుకా'మ్మన్నాడు విష్ణుమూర్తి, దుర్వాసుడు రాజును క్షమించుమని ప్రార్ధించాడు. రాజు చక్రానికి నమస్కరించి, తపసిని కాపాడుమని ప్రార్ధిస్తే చక్రం యథా స్టానానికి చేరుకొంది.

“హరి యని సంభావించును, హరి యని దర్శించు నంటు నాఘ్రాణించున్‌!

హరి యని రుచి గొనం దలయను, హరిహరి! ఘనునంబరీషు నలవియె సొగడన్‌”

(భాగ 986)

రాఘవీయవ్యాఖ్య 122

ఈ (ద్రువుడు : ఉత్తానపాదునికి సునీతి యనే భార్య యందు జన్మించాడు. (ధ్రువుడు ఒకప్పుడు తండ్రితొడమీద కూర్చున్నాడు. సవతితల్లి సురుచి తనను దూషిస్తుంటే ఏమీ మాటాడని తండ్రి అంకసీము నుంచి లేచి తల్లిని సమీపించాడు. సునీతి భగవద్ద్యానమే మహాభాగ్యమవి బోధించింది. తపస్సుకోసం బయల్దేరాడు. దారిలో నారదుడు (ధ్రువునికి వాసుదేవమంత్రాన్ని ఉపదేశించాడు. అతని ఘోర తపస్సువల్ల దేవతలకు [ప్రాణనిరోధమయింది. భగవంతుడు సమాధిష్టుడైన (ధ్రువుని కపోలతలాన్ని వేదమయశంఖంచేత అంటించాడు. అతడు చైతన్యాన్ని పొంది భగవంతుణ్ని స్తుతించాడు.

“నీకు మొైక్కెదనత్యంతనియమమొప్ప। భవ్యచారిత్ర, పంకజపదత్రనేత్ర

చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార! యవ్యయానంద, గోవింద, హరి, ముకుంద” భగవదాజ్ఞా (ప్రకారం చిరకాలం రాజ్యమేలాడు. తుదకు అత్యున్నతస్టానమైన (ధ్రువ పదాన్ని పొందాడు.

“తారామయం భగవతః శింశుమారాకృతి[ప్రభో

దివిరూపం హరేర్యత్తు తస్య పుచ్భే సితో ధ్రువః” (వి.పు,29.0)

ఆకాశమందు, వ్యాపకుడైన భగవంతునినక్షత్రమయమైన మొసలిఆకారం ఉంది. ఆళింశుమారాకృతిచక్రపుచ్చమందు ఉండి (్రువుడు త్రిలోకచూడామణి అయ్యాడు.

  1. కరి : ద్రవిడాధీశుడైన ఇంద్రద్యుమ్నుడు, అగస్య్యమహర్షి వచ్చినప్పుడు లేచి గౌరవించనందువల్ల శస్తుడై ఏనుగయ్యాడు. వనంలో పరివారంతో సంచరిస్తూ దాహం వేసినందువల్ల ఒక సరస్సులోకి దిగాడు. దేవలునిచేత శప్తుడైన హూహూ నామ గంధర్వుడు ఈ సరస్సులో మొసలిగా ఉండి ఏనుగుకాలు పట్టుకొన్నాడు. నీరాట వనాటములకు 'పెక్కేండ్డు పోరాటం జరిగింది. బలం తగ్గిన కరి దైన్యంతో హరిని నీవే తప్ప నితః పరం బెరుగి 'రావే! ఈశ్వర! కావనే వరద! సంరక్షించు భ(ద్రాత్మకా! అని మొరపెట్టుకొంది. మకరిని (ద్రుంచి హరి కరిని కాపాడాడు.

  2. ప్రహ్హాదుడు : హిరణ్యకళిపుడనే రాక్షసునికి కలిగిన ప్టాదుడు, అనుహ్హాదుడు, సంహ్లాదుడు, (వ్రహ్హాదుడనే నలుగురు పుత్రులలో సంతతతశ్రీనారాయణ పాదపద్మయుగళిచింతామృతాస్వాదసంధానుడైన (ప్రహ్హాదుడు, వెదకి చూస్తే నారాయణుడు లోపటా బయటా, అంతటా ఉన్నట్టు తెలుస్తుందని బోధించి, తండ్రిని తరింపజేసిన భక్షాగ్రేసరుడు,

  3. విభీషణుడు : రావణాసురునితమ్ముడు విభీషణుడు.

“అపంథానం తు గచ్చంతం సోదరోఒపి విముంచతి” (మురారికవి,)

నారాయణ శతకం శంతీ దుర్మార్షప్రవర్తకుణ్ని తోబుట్టువుకూడా వదలుకొంటాడనే న్యాయానికి ర్యార్కాలంగా నిల్చాడు. నిర్ఫీకుడై హితం చెప్పినా వినని లంకేశుణ్ని విడిచిపెట్టి, (రామునికి శరగాగతిచేసి సశ్రీకుడయ్యాడు. అన్న లింగ ప్రతిప్టచేశాడు. తమ్ముడు రంగనాధుణ్ని పుత్రుడు. వైరోచని గురువు చెప్పినా వినక, ఆడిన మాటను తప్పక మూడడుగుల నేలను అడిగిన వామనమూర్తికి ధారవోశాడు. నేల అంతా ఒక అడుగుకు, నింగి ఒక అడుగుకు సరిపోయింది. మూడవ అడుగు నీయడానికి స్థలమే లేనందువల్ల 'త్రివిక్రముని అడుగును తన తలమీద ధరించి రసాతలానికి చేరిన సద్దర్ముడు. బలికి భంగపొటు లేకుండా అతనివాకిట గదాపాణిలై. నిల్బాడు భగవానుడు.

  1. ఘంటాథ్రవుడు : కుబేరుని పరిచారకుడైన ఘంటాకర్టుడు మహా భయంకర పిశాచం. మాంసభక్షకుడు. అపరమృత్యువు. విష్ణు దూషకుడు. “సతతం దూషయన్‌ విష్ణుం ఘంటా మాబధ్య కర్ణయోః” (హరివంశం). విష్ణువు పేరు వినరాకుండా చెవులకు గంటలు కట్టుకాన్నాడు. కైలాసవాసుడైన పరమశివుణ్ణి పూజించి ముక్తి నిమ్మని కోరాడు. అందరికి మ్యక్తినిచ్చేవాడు ఒక్క విష్ణువే. సంశయం లేదు.

“ముక్తిప్రదాతా సర్వేషాం విష్ణురేవ న సంశయః

ముక్తిం ప్రాప్నహి గోవిందాత్‌ నరనారాయణా(శ్రమే॥” (హరివంశం)

నరనారాయణాశ్రమమైన బదరీవనానికి పోయి. నారాయణుణ్నీ ఆరాధించి మ్యుక్తిని పొందుమని మహాదేవుడు చెప్పాడు. బదరిలో తపస్సు చేశాడు. శ్రీకృష్ణుడు (ప్రసన్నుడై దివ్యరూపాన్ని (ప్రదర్శించాడు.

“తలపునం జూచిన చూపును, వెలింజూచిన చూపునొక్కవిధమయి. యున్నన్‌, నెలకొని ఘంటాకర్ణుడు, నలినాక్షుని నామకీర్తనం బొనరించెన్‌॥” (ఉ. హరివంశం.) ఘంటాతశ్రవుడు పిశాచరూపాన్ని విడిచాడు. పరంధామానికి చేరుకొన్నాడు.

  1. నారదుడు : బ్రహ్మపుత్రుడు. దేవర్షి (త్రిలోకసంచారి. మహతి అనే వీణను ధరించేవాడు. నిరంతరం నారాయణనామసంక్షీర్తనం చేసేవాడు. 'కలహభోజను'డని ఖ్యాతి బడసీన వాడు. తగవుల చేతనైనా లోకాలకు మేలు చేసేవాడు. మహోపకారి.

13, విదురుడు : 'మాండవ్యు'డనే మునిని రాజభటులు చోరుడని తెస్తే రాజు 'కాజ్డు' వేయించాడు. మరణించిన ముని 'నాకీ శిక్ష ఎందుకు వేశావు? అని యమధర్మరాజును అడిగాడు. చిన్నతనాన నీవు తూనీగలను పట్టి సూదికి కుచ్చి కొరత వేసి నందువల్ల ఈ శిక్ష నీకు కలోగిందన్నాడు యముడు. ఆంత మాత్రానికే

రాఘవీయవ్యాఖ్య 125 ఇంత శిక్ష విధిస్తావ? అని కోపంతో 'నీవు శూద్ర ప్రీ యందు పుట్టు మని మాండవ్యుడు యముణ్ని శపించాడు. యముడే విదురుడు. అంబిక యొక్క దాసియందు వ్యాసునికి పుట్టిన పుత్రుడే విదురుడు. ధృతరాష్రుడూ, పొండురాజూ, విదురుణ్న అనుగు తమ్మునిగానే సంభావించారు. విదురుడు నీతిపరుడు. ధీమంతుడు, కృష్ణభక్తుడు.

  1. పరాశరసుతుడు : బ్రహ్మ మాట రీతిగా, వసిష్టుని మనుమడైన పరాశర మహర్డికి సత్యవతి యందు సద్యోగర్భాన కృష్ణద్చైిపాయనుడు జన్మించాడు. పుట్టిన వెంటనే తల్లి తలచుకొన్నప్పుడు తాను కనబడుతానన్న మాటను చెప్పి వెళ్ళాడు. “శమ్యా్రాసం” వ్యాసుని ఆశ్రమం. శ్రీశుకమహర్జికి తండ్రియైన వ్యాసుని మరొక పేరు అపాంతరతముడు. వేదాలను విభజించడంవల్ల వేదవ్యాసుడన్న పేరు రూఢి అయింది. సకలపురాణకర్త. కౌరవవంశాన్ని వృద్దిని పొందించాడు. భారతీయ సంస్కృతి వైయాసికి. భాగవతాన్ని. కీర్తించాడు. 'ధ్యేయో నారాయణస్సదా' అని బోధించాడు.

  2. గాంగేయుడు : అపుడు, (ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు (ప్రత్యూషుడు, 'ప్రభాసుడనే అష్టవసువులు కళత్రసహితంగా వసిష్టుణ్ని సేవించారు. (ప్రభాసునిభార్య వసిష్టునిహోమధేనువుయొక్క _సౌశీల్యానికి ఆశ్చర్యపడి తనకది కావాలని కోరింది. ప్రభాసుడు తోటివారి సహాయంతో ఆ ధేనువును తస్కరించాడు. వసిష్టుడు యోగదృష్టితో (గ్రహించాడు. వసువులను “'మర్య్యలోకంలో పుట్టి డని శపించాడు.

'ప్రతీపుడనే రాజు తపస్సు చేస్తుంటే గంగానది స్త్రీ రూపంతో వచ్చి అతని తొడమీద కూర్చుంది. ఏకపత్నీవ్రతుడైనందువల్లనూ, పుత్రారోహణకు అర్హమైన కుడితాడమీద కూర్చున్నందువల్లనూ, తన పుత్రునికి భార్యవవుతావన్నాడు ప్రతీపుడు,

బ్రహ్మసభలోకి గంగ వస్తుంటే గాలిచే ఆమె కొంగు తొలగింది. సభ్యులలో మహాభిషుడు గంగను బాగా చూచాడు. (బ్రహ్మదేవుడు గమనించి అభిషుణ్ని 'మనుష్య లోకంలో పుట్ట మని శపించాడు.

అభిషుడు (ప్రతీపమహారాజుకు పుట్టి శంతనుడన్న పేరు వహించాడు. యువతిగా విహరిస్తున్న గంగను శంతనుడు చూచి మోహించాడు. ఆమె ఏమి చేసినా తానేమీ అనకూడదనే నియమం పెట్టింది. శంతనుడు ఒడంబడినాడు. గంగను పరిణయించాడు.

వసువులు అంతకు ముందే తమవృత్తాంతాన్ని గంగతో చిప్ప, తమను తొందరగా కడతేర్చుమని (ప్రార్ధించారు. కాబట్టి పుట్టగానే శిశువులను (క్రమంగా

2వ నారాయణ శతకం ఏడుగురిని ఆమె గంగలోకి విసరివేసింది. (ప్రభాసుడనే వసువు ఎనిమిదవ శిశువు. “పుత్రఘాతీ! ఈ శిశువును చంపనీయొనన్నాడు శంతనుడు. రాజా, శపధం తప్పింనదువల్ల తానుండనని గంగ శిశువుతో పాటు వెళ్ళిపోయింది. సకలవిద్యలను నేర్పించి, పెద్దవాడైన తర్వాత గంగ వుత్రుణ్ని శంతనునికి అప్పగించి పోయింది. ఎక్కువ దోషం గల 'ప్రభాసుడే గాంగేయుడై చిరకాలం జీవించాడు. శంతనుడు దాశరాజపుత్రియైన సత్యవతిని కామించి కృళిస్తుంటే గమనించిన తనయుడు “సత్యవతీ సంతానమే రాజసింహాసన మధిస్టించడం నిశ్చయం” అని భీష్మ మైన (బ్రహ్మచర్యదీక్షను వహించి ఆమెను తెచ్చి తండ్రికి పెండ్లి చేశాడు. దేవవ్రతుడు, భీష్ముడని పొగడుతూ దేవతలు శాంతనవునిపైన పూలవాన కురిపించారు. తండ్రి స్వ్పచ్చందమరణుడవవుతావని దీవించాడు. మహాపరాక్రమశాలి. ధర్మాధర్మాలను జీవితంలో అనుభవించిన మహాత్ముడు భిష్ముడు. శ్రీకృష్ణునిఆజ్ఞవల్ల ధర్మరాజుకు రాజధర్మాలను బోధించాడు కురుపితామహుడు. ఉత్తమధర్మంమాత్రం విష్ణువును సహస్రనామాలతో అర్చించడమే అని శ్రీకృష్ణునిముందు శ్రీ విష్ణుసహ(స్రనామస్తోత్రం చేసినవాడు గాంగేయుడు. దక్షిణాయనంలో (అస్త్రసన్యాసం చేసి) అంపశయ్య మీద పడుకొన్న భీష్మాచార్యులు లోక సంగ్రహార్థం ఉత్తరాయణ కాలందాకా వేచి యుండి స్వచ్చంద మరణుడయ్యాడు.

  1. (ద్రౌపది : పాంచాల రాజైన (ద్రుపదుడు సంతానార్థియై క్రతువు చేస్తుంటే, అగ్నికుండంలోనుంచి 'ధృష్టద్యుమ్ను'డనే పుత్రుడూ, 'ద్రౌపది" అనే పుత్రికా పుట్టారు. ఈమెకు యాజ్ఞసేని, కృష్ణ అని పేర్చున్నాయి. మత్స్యయంత్రాన్ని ఛేదించిన అర్జునునికి భార్య అయింది. 'ఒక ఫలం తెచ్చామమ్మా!' అంటే కుంతి 'ఆ ఫలాన్ని ఐదుగురూ అనుభవించండి" అని గమనించక అన్నది. తత్పలితంగా (ద్రౌపది పంచభర్శక అయింది. జూదంలో పాండవులు ఓడిన తర్వాత ఏకవస్తయైన (ద్రౌపదిని సభలోకి ఈడ్చించాడు దుర్యోధనుడు. దుళ్ళాసనునిద్వారా వస్త్రాపహరణం చేయించాడు. మానభంగం జరుగుతున్నా, అమరకల్పులైన ఐదుగురు మగలు సభలో నేలగీతలు గీస్తూ కూర్చున్నారు.

“బలవతి సతి దైవే బంధుభిః కిం విధేయమ్‌?” భగవంతుడు అండగా ఉంటే బంధువులతో నేమి పని? అనుకొన్నది పాండవసల్ని.

“శంఖ చ(క్రగదాపాణే! ద్యారకానిలయాచ్యుత!

గోవింద పుండరీకాక్ష! రక్ష మాం శరణాగతామ్‌” అని శరణాగతి చేసింది (ద్రౌపది. శ్రీకృష్ణుడు ఆమెను, మానభంగంకాకుండా వస్త్రరూపంలో వచ్చి, సంరక్షించాడు.

రాఘవీయవ్యాఖ్య 127 అవతారాన్ని చాలించే సమయంలో శ్రీకృష్ణుడు, “నామసంక్షీర్తనంతో ప్రపత్తి చేసిన 'ద్రాపదికి తగినట్టు సహాయమేమో చేయనందువల్ల, ఆమె బుణం చక్రవడ్డితో పాటు "పెరుగుతున్న దని విచారపడినాడట,

  1. నరుడు: బదరికాశ్రమంలో నరనారాయణులుగా అవతరించినవారే ద్వాపరయుగంలో నారాయణుడు. శ్రీకృష్ణుడుగానూ, నరుడు అర్జ్హునుడుగానూ ఉద్భవించారు. పృధా పుత్రుడు కాబట్టి పార్టుడని పేరు. ఆపదలు ఆపదలు కావు. భగవంతుణ్ని స్మరింపజేసేసంపదలే అవి, దైవాన్ని స్మరించనికాలమే ఆపత్కాలమని దృఢవిశ్శాసంకలవారు పాండవులు, పాండవమధ్యముడు పార్టుడు. తన నాశ్రయించినవారి నమ్మకానికి తగినట్టు శ్రీకృష్ణుడు 'పొండవపక్షపాతి' యని ఖ్యాతి వహించాడు. కురుక్షేత్రయుద్దంలో శ్రీకృష్ణుడు పార్థసారథిలై భగవద్గీ తాశాస్తాన్ని బోధించాడు. సంశయాత్ముడైన నరునికి విశ్వరూపాన్ని ప్రదర్శించి, నరుడు నిమిత్రమాత్రుడనీ స్పష్టపరచినాడు పార్ధసారథి. నరునికి త్రికరణశుద్ధిగా ఆశ్రయించ దగినవాడు నారాయణుడే, నరునికి అతడే బలం అన్న అనుభూతికలవాడు అర్జునుడు. “మా మేకం శరణం (వ్రజ' అని శ్రీకృష్ణుడు 'చరమార్ధప్రదాత' కావడానికి ముఖ్యకారకుడు నరుడు.

  2. అక్రూరుడు: ద్యాపరయుగాన. గాందినీ శృఫల్కదంపతులకు పుట్టిన పుణ్యపురుషుడు ఆక్రూరుడు. మధురానగరనివాసి. బృందావనంలో ఉన్న రామకృష్ణులను తోడ్కొని రమ్మని కంసుడు తనను పంపినప్పుడు, “చీకటి తొలగి నామొగాన పొద్దుపొడిచింది. ఈనాడే కదా! “అద్యమే సఫలం బన్మ సుప్రభాతా చ మే నిశా” గోవిందునిసందర్శనంవల్ల నాజన్మ సఫలమవుతుందని మురిసి పోయినవాడు అ(ర్రూరుడు,

'బృంద' లో బలరామకృష్ణులచే అలింగితుడై, ఆతిధ్యాన్నీ పొందిన వాడు. మధురకు వచ్చే సమయాన రథందిగి అక్రూరుడు, యమునాజలంలో స్నానం చేస్తున్నప్పుడు ఆనీటిలో శేషశాయి యైన శ్రీమన్నారాయణుణ్లి దర్శించాడు. లేచి రధంవైపు చూస్తే దానిమీద రామకృష్ణులు అలాగే ఉండగా కేల్మోడ్చాడు.

“పన్నగాధీశతల్పా! కృపాకల్ప! వందారు కల్పా! నాకు నీవిలసత్పాదయుగంబు జూపి కరుణ న్వీక్షింపు లక్ష్మీపతీ[!” అని స్తుతించిన పరమభక్తుడు.

ఈ 18 గురు, భగవన్నామాన్ని స్మరించక విడువ దలచుకొన్నా, అది వీరి జిహ్వా(గ్రాన నర్తించక మానదు కదా! నామవైభవమట్టిది.

128 నారాయణ శతకం 'అంకానాం వామతో గతిః అన్నట్టు 18 సంఖ్యలో, 8 జకారాన్ని 1 యకారాన్ని సూచిస్తుంది. భగవన్నామస్మర్తలకు ఇహపరలోకాల్టోనూ జయం కలుగుతుందనే ధ్వని విలసితమాపద్యం, శా, శ్రీకిన్మందిరమ్లైన వక్షము సురజ్యేస్టోదృవస్తాననా భీకంజాచము చంద్రికాంతర సుధాభివ్యక్తనేత్రంబులున్‌ లోకమ్తత్యమరున్నదీజనకమాలోలాంఘ్రయున్‌ గల్లునా లోకారాధ్యుండవైన నిన్నెపుడు నాలో చూతు నారాయణా ॥ 40 అర్థం: ఓ నారాయణా! శ్రీకిన్‌ = లక్ష్మీదేవికి; మందిరమైన = సిరనివాసమైన; వక్షము = భుజాొంతరం; సురజ్యేష్ట - జాతము, సురజ్యేష్ట = దేవతలలో పెద్దవాడైన (బ్రహ్మదేవునికి; ఉద్భవన్థాన = జన్మదేశమైన; నాభీకంబాతము = బొడ్డుతామర; చంద్రికా - నేత్రంబులున్‌, చంద్రికా+అంతర = చం(ద్రకాంతిలో ఉన్న; సుధా = అమృతాన్ని; అభివ్యక్త = వెదజల్టుతున్న; 'నేత్రంబులున్‌ = కన్నులు; లోకస్తు- (ఘియున్స్‌ లోకస్తుత్య = జనులచేన్హుతింవదగిన; మరుత్‌*నదీ జనక = దేవనదికి ఉద్గమన్థానమైైన; మాలోల+అంఘ్రియున్‌ = లక్ష్మిదేవికి (ప్రియంగా వశమైన పాదాలున్ను; కలుగు = కలిగియున్న; ఆలోక+ఆరాధ్యుడవైన = సకలలోకాలకు పూజ్యుడవైనః నిన్ను; నాలో; ఎపుడు, చూతు = ఎన్సుడు చూస్తాను? ఎప్పుడు చూస్తుంటాను? తా: ఓనారాయణా! సిరికి మందిరమైన డెందమూ; (బ్రహ్మకు పుట్టుచోట్రైన నాభీకమలమూ, వెన్నెల (ప్రసరించేకన్నులూ, లోకులచే స్తుతింప దగినవీ, లచ్చికి మచ్చికణైన పాదాలూ కలిగి, సకలలోకారాధ్యుడవైన నిన్ను నాలో ఎపుడు చూస్తాను? వ్యాఖ్య: నొముజపానికి పర్యవసానం నామిన్వరూసదర్భనం. భగవంతునినామాలన్నీ ఆయనస్వ్పరూపరూపగుణవిభవైశ్చర్యశిలాదులనే (ప్రకటిస్తాయి. ఒక పేరుతో పిలిస్తే ఆపేరుగల వ్యక్తి తనకు అభిముఖుడవుతాడుకదా! కాబట్టీ నామప్రభావానికి పరాకాష్ట భగవత్సాక్షాత్కారమే. “హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితం” అన్నట్టు హృదయకమలమందున్న నారాయణుణ్ని చూడడానికీ నానుజపమే ఆవశ్యకం, బాహ్యదృష్టిని వారించుకొని అంతర్ముఖుడై ధ్యానిస్తే ధ్యయమూర్తికి అను[గ్రహం కలుగుతుంది. నారాయణుడు సకలలోకారాధ్యుడు. సర్వసంపదలు మూర్తీభవించిన శ్రీదేవి, నారాయణుని గుండెలో గూడు కట్టుకొన్నది. సృష్టికర్తయైనబ్రహ్మ జన్మించిన స్థలం నారాయణుని నాభీకమలం, “యళథా ప్రవ్ణాదనాచ్చంద్రః” అన్నట్లు చల్లని వెన్నెల లాగా దయారసా మృతోదారాలైనవి ఆయన నేత్రాలు. దేనమానవాది లోకాలకు స్పోత్రపాత్రమైనవి భగవత్సాదాలు. అవి

రాఘవీయవ్యాఖ్య 129 సకల భూతాలకు ధారక పోషకమ్రైన మిన్నేటి ఊటలు. అంతే కాదు, జగన్మాతను తమ సౌందర్యసౌకుమార్యాలచే ఆకర్షించి, ఆమెచే ప్రియంగా లాలింపబడేవి మాలోలుని పాదాలు. దివ్యావయవసౌందర్యవిశిప్పుడు శ్రీమన్నారాయణుడు. వాగ్రూపంగా మంత్రాన్ని అనుసంధిస్తున్నప్పుడు అంతరంగంలో ఆ మంత్రార్జాన్ని సంభావించడమే, సగుణుడైన, సర్వాంగసుందరుడైన నారాయణుని రూపసందర్భనానికి ముఖ్యహేతువు. “కదా ను సాక్షాత్కరవాణి చక్షుషా” ఎప్పుడు చూస్తానో అని ఆర్తితో అంతర్ముఖుడైతే, ధ్యానమగ్నుడైతే, ధ్యేయమూత్తిని ఎప్పుడూ చూస్తుంటాడు. రూపముంటే నామమేర్చడుతుంది. అయినా, నిలిచేది నామం. రూపాన్ని నిల్చేది నామం. కాబట్టి, నామరూపాలలో నామానికే ప్రభావమూ, ప్రాధాన్యమూ ఉంది.

“ధ్యాయంతి యే విష్ణుమనంత మవ్యయం - తే యాంతి సిద్దిం పరమాం చ వైష్ణవీమ్‌॥” సాలోచనులై లోపలి చూపుతో ధ్యానం చేసేవారు, సారసలోచనుని కృపాకటాక్షానికి పాత్రులౌతారు, శ్రీ, వైష్ణవసిద్దినీ పొందుతారన్నాడు శ్రీ కులశేఖరుడు.

కృష్ణానతార వింశతి శా. విందుల్విందులటంచు. గోపరమణుల్‌ వవ్రేపల్లెలో బిన్ననాః డందెల్‌ మైయంగ ముద్దుమోమలర నిన్నాలింగితుం జేయుచో డెందంబుల్‌ దనివార రాగరసవీటీలీలలన్‌ దేల్చు మీ మందస్మేరముఖేందురోచులు మమున్మన్నించు. నారాయణా! 41 అర్ధం : ఓ నారాయణా! 'వ్రేపల్లైలో = (వ్రేతల (గొల్లల) పల్లెలో; గోపరమణుల్‌ = గోపస్రీలు; పిన్ననాడు = చిన్నతనాన; అందెల్‌ ('మైయంగ = నూవురాలు రవళించగా; ముద్దు మోము+అలరన్‌ = మొగము ముద్దు ముచ్చట గొల్పగా - అందమైన మొగం వికసింపగా; విందుల్విందులు+అట+అంచు = విందులు, విందులు అంటూ; నిన్ను; ఆలింగితున్‌, చేయుచో = కౌగిలించుకొన్నప్పుడు; డెందంబుల్‌, తనివార = చిత్తరంజకంగా

  • హృదయాలు ఆనందించునట్లుగా; రాగరసవీటీలీలలన్‌ తేల్చు = (ప్రేమపూర్ణమైన శృంగార చేష్టలతో ఆనందింప జేయునట్టి; మీ మందస్మేర ముఖ+ఇందు రోచులు = చిరునగవులొలుకు మీ ముఖచం(ద్రకాంతులు; మమున్‌ = మమ్ములను; మన్నించున్‌ = ఉజ్జీవింప జేస్తాయి. తా: ఓ నారాయణా! నందగోకులంలో చిన్నప్పుడు అందెలు సవ్వడిచేస్తుంటే, ముద్దులొలికే ముఖం చూడముచ్చట గొల్పుతుంటే, గోపికలు విందులు, విందులు అంటూ నిన్ను కౌగిలించుకొన్నప్పుడు వారి మనసుదీర శృంగార క్రియలతో సంతోషింపజేసే నీ మందహాసముఖచందద్రకాంతులు మమ్ము కాపాడుతాయి.

130 నారాయణ శతకం వ్యాఖ్య ౨ త్రీ కృష్ణువిబాల్యలీల(ల)ను వర్షించే సద్యమిది.

నారాయణుడే శ్రీకృష్ణుడుగా అవతరించాడని హరివంశం చెబుతుంది.

“పష నారాయణః శ్రీమాన్‌ క్షీరార్లవనికేతనః॥

నాగ పర్యంక ముత్సృజ్య హ్యాగతో మధురాంపురీమ్‌॥”

అనే సూక్తి ఇక్కడ అనుసంధేయం. (ఈ శ్ఞోకార్ధం 18వ పద్యంలో వివృతం)

“కృష్ణం ధర్మం సనాతనమ్‌” సనాతనధర్మరూపుడు కృష్ణుడని అర్థం.

'సనాతన తమవి అనే నామభాష్యంలో “సనా పురాణేఒ౭పి తనతి రూపం పురాణతమః; పురా అపి నవః పురాణః, సదాతనత్వేఒపి తదాతనత్వవత్‌ నిత్యనూతన భోగ్యః" పురాణ పురుషుడే అయినా కృష్ణుడు నిత్యనూతనంగా అనుభవింపదగినవాడన్సి శ్రీపరాశరభట్టర్‌ పలుకడం స్మరణీయం. "కృష్ణు శబ్దానికి సదా నందుడని అర్థం, ఆనంది లోకులకు అనందాన్నే ప్రసాదిస్తాడు.

శ్రీరామచంద్రస్వామి రూప వైభవాన్ని వాల్మీకి భగవానుడు వర్షించాడు. “రూపొదార్య గుణైః పుంసాం దృష్టిచిత్తాపహారిణమ్‌”. ఈ సూక్తికి వ్యాఖ్యానం ఇలా ఉంది, “రూపం విగ్రహః పుంసొంకఠినచిత్తానామపి, కిముత స్త్రీణామితి భావః యద్వా, పుంశబ్దేన (ప్రీపుంససాధారణ మాత్మమాత్రముచ్యతే; పుమానే కో వ్యవస్థిత ఇతి విష్ణుపురాణీ ప్రయోగాత్‌, తేన సురనరతిర్యగాదిభేదభిన్నానాం స్త్రీ పుంనపుంసకభేద భిన్నానాం సర్వేషాం దృష్టిచిత్తాపహారజక్త:” (గోవిందరాజీయం).

(స్త్రీ పురుష భేదం లేకుండా, సర్వప్రాణుల కన్నులను, మనస్సును చూరగొనే రూప. గుణ సౌందర్య వైభవం కలవాడుగా రాముడు కీర్తింపబడినాడు. దండకారణ్య వాసులైన తాపసులు సర్వాంగ సుందరుడైన శ్రీరామచంద్రస్వామిని సేవించి 'అలింగామో భవంతం" మిమ్మాలింగనం చేసుకొంటాం స్వామీ! అన్నారట,

“భవాంతరే కృష్ణావతారే యూయం గోపికాభూత్వా మా మాలింగథ - కృష్ణావతారంలో మీరు గోపికలుగా జన్మించి నన్ను అలింగితుని చేయండి” అన్నాడట. (ఆథర్వణిక కృష్ణోపనిషత్తు.

'్రేపల్లెలో బాలకృష్ణుడు కాలియందెలు ఘల్లు ఘల్లుమని 'మైగుతుంటే, ముగ్ర మోహనమైన ముఖారవిందంతో అందరినీ ఆకర్షించేవాడు. దివ్యావయవాల అమరిక చేత ఏర్పడిన అపూర్వ లావణ్యమనే సాముదాయిక శోభతో అందరికి విందులు కూర్చువాడు బాలకృష్ణుడు.

ముద్దు లొలికే ముఖం కన్నులకు విందు, మంజీరాల శింజితాలు చెవులకు విందు, విచిత్ర స్నిగ్ధ విగ్రహం డెందానికి విందు. మధురగంధిమందహాసం నాసికకు

రాఘవీయవ్యాఖ్య 131 విందు. 'కృష్ణాగ అనే పసిడి పలుకు రసనకు విందు. సర్వేంద్రియాలు సంతృప్తి చెందినా, త్వగింద్రియానికి తాకితేగాని తృప్తి యుండదు. కాబట్టీ మంగళాంగుణ్ని చూచిన వెంటనే విందులు, విందులూ అంటూ గోపాంగనలు ఆలింగనం చేసుకొనేవారు. అప్పుడు కృష్ణుడు బాలుడే అయినా, గోపికల డెందం కందళించి ఆనందభరిత మయ్యేరీతిగా మగ పోడిమితో సింగారపు చేష్టలు చేస్తూ చిరునవ్వుల వెన్నాలను చిందించేవాడు, ఆ మోము, ఆ రవళి, ఆ లీలలు, ఆ చిరునవ్వులు మనకూ విందులై పుష్టిన, తుష్టినీ కలిగిస్తాయి కదా! వెల్లపూడి మణి పెద్దామాత్యుని పద్యమూ కమనీయమే. “అందము గుల్కునీయలసయానము మాటలు తేనె సోనలన్‌ జిందు నృుదుస్మితంబు సుధ జిందు గటాక్షములౌర మించుకున్‌ విందులు కౌగిలింత కడు వింతయటంచును గోపకాంతలా నందముతోడ బల్కుదురు నాధ! భవన్మహిమానుభావముల్‌॥” (కృష్ణకర్ణామృతం, 1-27) శా విందుల్వచ్చిరి మీయశోదకడకు న్వేగంబె పొామ్మయ్యయో నందానందవ! చందనాంకురమ! కృష్ణా! యింక బోవేమి మా మందం జాతర సేయంబోదమిదె రమ్మాయంచు. మిమ్మెత్తుకో చందంబబ్బిన నుబ్బకుండుదురె ఘోషస్తీలు నారాయణా! డై అర్థం. : ఓ నారాయణా! మీ యశోద కడకున్‌ = మీ తల్లియైన యశోదవద్దకు; విందుల్‌ = చుట్టాలు; వచ్చిరి. వేగంబె పొమ్ము అయ్య= తొందరగా పోవయ్యా! ఓనంద+ఆనందన = నందునికి ఆనందమైన వాడా! ఓ చందన+అంకురమా = ఓ శ్రీ గంధపు మొలకా కృష్ణా! ఇంకనూ పోవేమి? మా మందన్‌ = మా రేపల్లెలో; జాతర సేయన్‌, పోదము, ఇదె రమ్మా అంచు, మిమ్ము ఎత్తుకో, చందంబు = విధం; అబ్బినన్‌ = కలిగినచో; ఘోష స్రీలు = గొల్లపల్లై పడతులు; ఉబ్బక+ఉండుదురె = పొంగకుందురా! తా: ఓ నారాయణా! మీ తల్లియైన యశోద దగ్గరికి చుట్టాలు వచ్చారు. శీఘ్రంగా పోవయ్యా! ఓ నందానందన! ఓ చందనాంకురమా! కృష్ణా! ఇంకా పోవేమి” మా గొల్లపల్లెలో జాతర సేయపోదాం, రావయ్యా! అంటూ గొల్లపల్లె పడుచులు నిన్నైత్తుకొనే భాగ్యమబ్బగానే ఉబ్బిపోతారు కదా! వ్యాఖ్య; గొల్లపల్లె పడతుల భాగ్యగరిమ వర్లితం,. నందనందనుడు మందలో సంచరిస్తూ అందరికి విందుగా ఉండే వాడు. శ్రీ కృష్ణుణ్ని పుత్రునిగా పొందడంవల్ల ఆనందాన్ని అనుభవించిన వాడు కాబట్టి,

132 నారాయణ శతకం నందగోపాలునికి '“నందు'డనే సార్హక నామం కల్గిందని పెరియ వాచ్చాన్‌ పిళ్లై మూవాయిరప్పడి వ్యాఖ్యలో నంద శబ్దాన్ని వివరించారు. శ్రీకృష్ణుని బాల్య లీలలను చూచి మహానంద సాగరంలో మునిగిన అదృష్టశాలి ఈనందుడు. ఈ అంశాన్ని "ప్పరుమాళ్‌ తిరుమొళి'లో శ్రీకృష్ణుణ్ని చూచి, నీ తండ్రి ఎవరు? అని అడిగితే, తన వేలితో నందగోపుణ్ని చూపొడని త్రీ కులశేఖరాళ్వారన్నారు. నందునికి ఆనందాన్ని కూర్చే వాడు కాబట్టి కృష్ణుడు, నందానందుడనే ఖ్యాతిని పొందాడు. “యో నందః పరమానందో యశోదా మౌక్తిగేహినీ” (ఆధర్వ-కృ-ఉ) పరబ్రహ్మ శ్రీకృష్ణుడనీ, మోక్షలక్ష్మియే యశోద అనీ, పరమానందమే నందుడనీ ఉపనిషత్తు ఉద్దోషిస్తుంది. భవభూతి. చెప్పినట్టు, దంపతుల ఆనంద[గ్రంఠథియే అపత్యంకదా! కాబట్టి, నందుని ఆనందమే శ్రీకృష్ణుడు. గొల్లలు జాతర చేసుకోవడం వారి ఆచారం. తమ దగ్గరికి వచ్చిన కృష్ణునితో ఒక పడతి 'నందానందన! యశోద ఇంటికి విందులు వచ్చారు. త్వరగా పోవయ్యా!' అని చెప్పింది. 'విందు" అంటే మృష్టాన్న భోజనం. ప్రియమైన బంధువునూ నిందు” అనడం వ్యావహారికం. కృష్ణుణ్ని చందనాంకుర మని సంబోధించింది ఓ మగువ, అందరినీ, తుదకు తనను నరికిన గొడ్డలిని కూడా, పరిమళంతో ఆహ్హాద పరచేది చందన తరువు, సర్వప్రాణులకూ, కడకు 'యది వా రావణః స్వయమ్‌' అన్నట్లు తన విరోధికి కూడా అతడాశ్రయిస్తే చాలు, ప్రేయః శ్రేయస్సులను సమకూర్చేవాడు సర్వేశ్వరుడు. శ్రీకృష్ణ భగవానుడు బాలుడు కాబట్టి అతడు చందనపు మొలక. అది ఉన్నతావు నుంచి కదలదు. ఒకరు ఆ మొలకను సున్నితంగా ఎత్తుకొని పెరిగే చోట ఉంచవలసినదే కదా! గోపాలునికీ గొల్లలకూ ఉన్న వాసనా బలమలాంటిది. కాబట్టి, ఓ చందనాంకురమా! చెప్పినా ఇక్కడనే ఉన్నావు, న్లంక పోవేమయ్యా! అన్నది. లేదా మనమందలో జరిగే జాతరకు పోదాం రా! రావయ్యా అంటూ ఆ తాయ్యలి చిన్ని కృష్ణుణ్ని ఎత్తుకొన్నది. ఆచందనాంకురాన్ని ఎత్తుకొనే చందమే అందం. రొండికెత్తు కోవడంవల్ల ఒత్తుక పోవడం సాధారణం, మెదుపడం, మర్దనంవల్ల విస్తరించే చందన పరిమళం లాగా ఆ ఎత్తుకొనే చందం మనోహరమైనది. అలాంటి బాలగోపాలకృష్ణుని దర్శన, స్పర్శన భాగ్యమబ్బిన ఘోషస్త్రీల శరీరం పులకరించక, ప్రత్యంగం వ్యాకోచించక ఉండదు కదా! ఘోష అభీర పల్లీ స్యాత్‌ (అమరం), ఘోష శబ్దానికి 'గొల్లపల్లె' అని అర్ధం. భగవంతుణ్ని ఎత్తుకో గలిగిన సౌభాగ్యవతులు ఆ ఘోషస్త్రీలు.

రాఘవీయవ్యాఖ్య 133 శా అన్నా కృష్ణను! నేండు వేల్చులకు మీ/దన్నార మీచట్లలో

వెన్నల్‌ ముట్టకుమన్న నాక్షణమున న్విశ్వాకృతిస్పూర్తివై

యున్నన్‌ దిక్కులు చూచుచున్‌ బెగడిని న్నోలిన్నుతుల్‌ సేయుచువ్‌

గన్నుల్‌ మూయ యశోదకున్‌ జిజుతనై కన్పింతు నారాయణా॥క3

అర్ధం : అన్నా! కృష్ణమ! నేండు, వేల్పులకు, మీందు, అన్నారము = ఈ వేళ దేవతల

(నైవేద్యం) కోసం, అన్నాం. ఈ చట్లలో = ఈ కడవల్లో, వెన్నల్‌, ముట్టకుము, అన్నన్‌, ఆ క్షణమునన్‌, విశ్శశఆకృతి స్ఫూర్తివై = విశ్వాకారంతో ప్రకాశించిన వాడనై; ఉన్నన్‌; దిక్కులు చూచుచున్‌, బెగడి = బెదరిః నిన్నున్‌, ఓలి = వరుసగా; నుతుల్‌ = స్తోత్రం, చేయుచున్‌; కన్నుల, మూయ = మూసుకొన్నప్పుడు; ఓ నారాయణా! యశోదకున్‌, చిజుతవై = చిన్నవాడవై; కన్నింతువు.

ఈ పద్యారంభానికి ఈ విధముగా అర్థము చెపుతారు : అన్నా, కృష్ణను, నేండు = ఈ దినము; ఈ చట్లలో వెన్నల్‌ = ఈ కుండలలోని వెన్నపూసలు; మీందు అన్నారము = నియమించిన ముడుపు అనినాము - అని, ఇది వేంకటేశ్చరస్వామికి మీదు కట్టినాము అని వ్యవహారము, కనుక ఈ వెన్న ముట్టకుము అనటం స్వరసం.

తా: అన్నా! కృష్ణమ! ఈ వేళ వచ్చిన వెన్న దేవతలకోసము మీదుకట్టినామన్నాం. మీద పెట్టిన ఈ కడవల్లోని వెన్నను ముట్టకు, అన్నంతలోనే విశ్వరూపాన్ని దాల్బావు. నాలుగు. దిక్కులు చూస్తూ బెదరిపోయి నిన్ను స్తోత్రంచేస్తూ కన్నులను

బాసుకొన్నప్పుడు యశోదకు చిన్న బాలుడవై కన్పిస్తుంటావు.

వ్యాఖ్య : శ్రీకృష్ణుని స్వరూపం అప్రాకృతమని తెలిసే పద్యం.

పరత్వం కప్పిపుచ్చి ఒక రాత్రి ఒకతెకు పుత్రుడై పుట్టి మరొకతెకు పుత్రుడై పెరిగాడు శ్రీకృష్ణుడు. సౌలభ్యసాశీల్యగుణాలను వెల్లడించడానికే గొల్లకులంలో పుట్టిన తాను అతిమానుషకృత్యాలను చేసి పరత్వాన్నీ (ప్రకాశింపబేశాడు.

“అజాయమానో బహుధా విజాయతే” కర్మాధీనమైన పుట్టుకలేని వాడే అయినా, మత్స్యకూర్మాద్యనేకరూపాలలో పుడుతాడని భగవంతుణ్ని గూర్చి (శ్రుతులు చెబుతున్నాయి.

“అజోఒపిసన్నవ్యయాత్మా భూతానామీశ్చరోఒపి సన్‌,

ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా॥”

కర్మల వల్ల కలిగే పుట్టుక, గిట్టుక నాకు లేదు. సర్వభూతాల్లను శాసించేవాడను. అయినా నా సంకల్పంచేత నా పరమేశ్వర స్వభావాన్ని విడువకుండా ఆ్రాకృత దివ్య శరీరంతో పుట్టుతుంటాను. అని భగవద్గీత (4-6)లో శ్రీకృష్ణుడు తన అవతార రహస్యాన్ని (ప్రకటించాడు.

134 నారాయణ శతకం

కుడి, ఎడమ తెల్వనివారే అయినా గొల్లలు “పొడిని పవిత్రంగా భావిస్తారు. పాలు, పెరుగు, వెన్న ఉన్న కడవలను అంటు, ముట్టు తగుల కుండా ప్రత్యేక స్థలంలో భద్రంగా ఉంచుతారు. ఉట్టమీదనూ పెడతారు.

ఒకనాడు యశోద 'అన్నా! కృష్ణమ్మూ! నేడు దేవతలకు నైవేద్యం పెట్టాలను కొన్నాం, కాబట్టి ఉట్ల మీద చట్లలో ఉన్న వెన్నను నీవు ముట్టకూడదు. ఉచ్చిష్టం చేయకూడదు అని చెప్పింది. అంతే. వెంటనే వేలుపులటెనాకంటెను, వేలుపు మతియెవ్వడనుచు పాలు, పెరుగు, వెన్న అన్నీ తనకే చెందవలసిన పదార్జాలని తల్లి గ్రహించే రీతిగా ఆ, వేలుపుదొర విశ్చరూపాన్ని (ప్రదర్శించాడు.

దేవకీ వసుదేవులు అనుభవించ నోచుకోని కన్నయ్య ముద్దుముచ్చట్లనూ, ఆట పాటలనూ చూచి ఆనందించే యశోదానందుల సుకృతమలాంటిది.

“ద్రోణో వసూనాం ్రవరో ధరయా సహ భార్యయా!

కరిష్యమాణ ఆదేశాన్‌ (బ్రహ్మణస్తమువా- హ॥” (భాగవతం, 10.850)

పూర్వజన్మలో ద్రోణుడనే వసుశ్రేష్టుడే నందుడు, ఆయన భార్యయైన ధర యే యశోద, వారు (బ్రహ్మదేవునితో మేము భూలోకంలో జన్మించినప్పుడు అనాయాసంగా దుర్గతిని దాటడానికి విష్ణువుమీద ('ప్రమమయజభక్తిని (ప్రసాదించు మన్నారట, (బ్రహ్మదేవుడు 'తథా౭స్తు' అన్నాడని శ్రీశుక మహర్షి పరీక్షిన్మహారాజుతో చెప్పాడు.

కారాగృహంలో దేవకీ వసుదేవులకు స్వస్వరూపంతోనే ఆవిర్భవించిన కృష్ణుడిచ్చట నందకీశోరుడై విశ్చరూపాన్ని (ప్రదర్శించాడు. కృష్ణావతారంలో మొట్టమొదట విశ్వరూపాన్ని యశోదకే చూపాడు కదా!

“తస్యైషఆత్మా వినృణుతే తనూంస్వాం” అని కఠోపనిషత్తు చెప్పింది. సర్వేశ్చరుడే తానై తన విశ్చరూపాన్ని దర్శింపజేస్తే సాక్షాత్కరించడానికి సాధ్యం గాని, స్వప్రయత్నంతో ఎంతగొప్పవారికైనా ఆది అసాధ్యమే.

“న చక్షుషా పశ్యతి కశ్చ నైనమ్‌” (శ్రుతి)

“న మాంసచక్షుషా (ద్రష్టుం బ్రహ్మభూతస్స శక్యతే” (స్మృతి) అనే వాక్యాలు కూడా ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయి.

“ఇం రోదసీ జ్యోతిరనీకమాశాస్పూర్యేందువహ్నిశ్చ్వసనాంబుధీంశ్చ।

ద్వీపాన్నగాంస్తద్దుహిత్తూర్వనాని భూతాని యాని స్థిరజంగమాని॥

సా వీక్ష్య విశ్ళం సహసా రాజన్‌! సంజాతవేపథుః।

సంమీల్య మృగశాబాక్షీ నేత్రే చాసీత్సువిస్మితాణ (భాగు 10.7. 37, 38)

రాఘవీయవ్యాఖ్య 1135 యశోదకు అ రూపంలో, ఆకాళం, జ్యోతిర్మండలాలు, దిక్కులు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, సముద్రాలు, ద్వీపాలు, పర్వతాలు, అడవులు, చరాచర (ప్రాణికోటి కూడా కనిపించడంవల్ల భయంతో శరీరం కంపించింది. "కృష్ణా! నారాయణా!” అంటూ ఆ క్రాల్గంటి కన్నులు మూసుకొంది. క్షణంలో “కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌” అని స్పష్టంగా తెలిపిన ఆ నల్లనయ్య మెల్లగా, అమ్మా! అంటూ, యశోదముందు చిన్న పిల్లవాడై కనిపించాడు. శ్శా ఉల్లోలంబులుగా. గురుల్‌ నుదుటిపై నుష్పాంగ మోమెత్తి ధ మ్మిల్లంబల్లల నాడ రాగరససమ్మిశ్రంబుగా నీవు శ్రే పల్లెందాడుచు గోపగోనివహగోప స్త్రీలయుల్లంబు మీ పిల్లంగ్రోవిని జుట్టి రా దిగుచు నీపెంపొస్పు వారాయణా॥ 44 అర్థం : ఓ నారాయణా! కురుల్‌ = వెంట్రుకలు; నుదుటిసైన్‌ = నొసలుమీద; ఉత్‌+లోలంబులుగాన్‌ = ఎగురుతున్నట్టుగా; ఉప్పాంగ = సైపైకి రాగా; మోము+ఎత్తి = మొగమెత్తి! ధమ్మిల్లంబు = కొప్పు; అల్లల నాడ = అటు ఇటు కదలుతుంటే? రాగ రస సంమి(శ్రంబుగా = రాగం (ప్రమ); రసం (సింగారం) కలిసి ఉన్నట్టుగా; నీవు; (వ్రపల్లెన్‌ = రేపల్లెలో. తాడుచు = ఒక విధంగా సంచరిస్తూ: గోప, గోనివహగోపష్త్రీల = ఆలకాపరులు, ఆలమందలు, గొల్ల పడతులు, వీరియొక్క; ఉల్లంబు = మనస్సు: మీ పిల్లం[గ్రోవిని చుట్టి = మీ మురళీరవాన్ని అనుసరించి; రాన్మ్‌ తిగుచు = వచ్చేరీతెగా రంధ్రాల మీద (గ్రేళ్ళను కదల్చుతున్న (మోగించే): నీ పెంపు = నీ మహిమ; ఒప్పు" = తగియున్నది, తా : ఓ నారాయణా! నీ ముంగురులు స్టెకి ఎగురుతూ నొసట చెలరేగుతుంటే మొగమెత్తి. నీకొప్పు కేశపాళం - జారి అల్లలనాడు తుంటే, (ప్రేమ, సింగారం కలబోసినట్టు నీవు రేపల్లెలో సంచరిస్తూ అలమందలు, ఆలకాపరులు, ఆ భీరయువతులు మనసుపడి నీ పిల్లన (గ్రోవి చుట్టూరా చేరి తిరిగే రీతిగా మోగించే నీ పెంపు ప్రశంసనీయం, వ్యాఖ్య ; మురళి మోహనుని రూసనర్లన, గోకులమంతా ప్రతిబింబిస్తున్న గోపాలకృష్ణుని లీలా విహారానికి ఆబాల గోపాలం ఆకర్షితమవుతున్నది, కన్నయ్య వీధుల్లో సంచరిస్తున్నప్పుడు అతని నుదుటిపైన అలకలు పదేపదే ఫైకి చెలరేగుతున్నాయి, కాభట్టి ముంగురులు ముఖాన్ని కప్పివేయకుండా మధ్యమధ్యన మొగమెత్తుతుంటాడు. అప్పుడు అతని కొప్పు విడిపోయ నర్రిస్తున్నట్టు సంచరిస్తుంటాడు. 'తోయంపు గురులతోడ దూగేటి శిరసు,

136 నారాయణ శతకం చింత కాయల వంటి జడలగములతోడ, (మైయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ” (అన్నమయ్య) అన్నట్లు, ముగ్ధ మోహన రూపంతో విహరిస్తూ మురళీ నాదామృతాన్ని అందరికీ మనోహరంగా పంచిపెడ్డున్నాడు.

పిల్లన (గ్రోవికి సప్త స్వరాలను పలికించే రంధ్రాలుంటాయి. ఆ రంధ్రాల మీద మృదువుగా ఉన్న చిన్న (వ్రేళ్ళనానించి, మూస్తూ తెరుస్తూ ఉంటే, జగన్న్మోహనమైన నాదం ఉదయిస్తుంది. మురళీ మోహనుని రూపం (ప్రేక్షకులకు (ప్రేమను జనింపచేస్తే ఆయన సింగారంగా మోగించిన వేణునాదం రసజనకనుయింది. రాగరసమి(శ్రమంగా కన్నయ్య పిల్లంగ్రోవిని 'మ్రైగిస్తుంటే గోవుల, గోపాలకుల, గోప'స్త్రీల చెవుల ద్వారా ఆనాదామృతం హృదయంలోకి ప్రవహించింది. వారి ఉల్లం ఉబికి ఉరకలేస్తుంది. మనస్సు మారి నమస్సు పలుకుతుంది. 'మనస్సు తమది కాదని ఎవరి మనస్సు వారికి చెబుతూనే పరుగుదీసి, మురళిమనోహరుని చుట్టూ (ప్రదక్షిణం చేస్తుంటుంది. “వంశస్తు భగవాన్‌ రుద్రః” రుద్రుడు శ్రీకృష్ణుని చేతి పిల్లన[గ్రోవిగా ఆవిష్కృతుడన్నది అఆథర్వణిక కృష్ణోపనిషత్తు,

“హ్రదిన్యో - హృస్యత్వచోఒ్రు ముముచుస్తరవో యధార్యాః” అని వ్యాసుడంటే *నలినోదర భక్తునిగని కులజులు నందాశ్రుజలము గురియు పగిది, (ఘ్రూకులు పూదేనియలొలికెడు, నభినాక్షునిచేతివంశనాళము[మైతన్‌” అని పోతన పలికోడు,

తమ నీరుత్రాగి వృద్ది పొందిన వేణువు, శ్రీకృష్ణుని అధరసుధాపానం చేత తమకూ ధన్యత్నాన్ని సంపొదించిందని నదులు పులకించాయట, ఆర్యుల లాగా చెట్టు ఆనందబాష్పాలను విడిచాయట, ఎందుకు? తమవంశంలో పుట్టిన వేణువు తమ కులానికంతకు ధన్యతను సంపాదించిందని పోతన దీనికి ఇలా రూపకల్పన చేశాడు,

భగవద్భక్తుణ్ని కని ఆకులంలో ఉద్భవించిన వారు ఆనందా(శ్రువులను కురిసేలాగా, కృష్ణుని వేణునాదంవల్ల తరువులు మకరంద వ్యాజంతో అ(శ్రువులను కురుస్తాయట.

ఇలా స్థావర జంగమాలను వేణునాదంతో సళపరచుకొనే శ్రీకృష్ణుని తత్త్వాన్ని ఆబాలగోపాలం ప్రస్తుతిస్తుంది, ను, కసచొప్పన్‌ పసిమేసి ప్రొద్దు గలుగం గాంతారముంబాసి య

స్పృసియున్నీనును వచ్చుచో నెదురుగా బైకొన్న గోపాంగనా కననద్వృ త్ర యోధరద్వయహరి ద్రాలేసనామోదముల్‌ పసిగొంచున్‌ బసిగొంచు. వచ్చుటలు నే భానింతు నారాయణా; 5

రాఘవీయవ్యాఖ్య 137

అర్ధం : ఓ నారాయణా! పసి = ఆలమంద; కసవు = గడ్డిని; ఒప్పన్‌ మేసి = బాగాతిని; ప్రొద్దు గలుగన్‌ = (ప్రొద్దుఉండగా) మలిసందవేళలో; కాంతారమున్‌ = అడవిని; పాసి = విడిచి; ఆ పసియున్‌ = ఆ గోగణమూ; నీవును; వచ్చుచోన్‌ = నీవూ వస్తుండగా; ఎదురుగాన్‌; పైకొన్న = మీదపడిన; గోపా-ముల్‌ గోప+అంగనా = గోపస్రీ(ల) యొక్క: రసవత్‌ = చిప్పిలుతున్న రసం (పస) గల; వృత్త = గుండ్రని; పయోధర ద్వయ = రెండు చన్నులయందలి; హరి[ద్రాలేపన = పసుపు పూత యొక్క; అమోదముల్‌ = వాసనలను; పసిగొంచున్‌ = ఆఘ్రాణిస్తూ; పసిగొంచువచ్చుటలు = ఆలమందనుతోడ్కొని రాకడ(ల)ను; నేను భావిస్తుంటాను.

తా : ఓ నారాయణా! దినమంతా గడ్డిని బాగా మేసి సందెవేళ ఆ పశువులూ, నీవూ అడవి నుంచి తిరిగి వస్తుంటే, నీ కెదురుగా వచ్చిన గోపికల గాలి నీ మీద సోకింది, వారు సింగారంగా గుండ్రని రెండు చన్నులందు పూసుకొన్న పసువు, కుంకుమ జవ్వాది పూతల సువాసనలను ఆఘ్రాణిస్తూ ఆలమందను నీవు తోల్కొని వచ్చే దృశ్యాలను స్మరిస్తుంటాను,

వ్యాఖ్య : శ్రీశృష్ణుల్ని గోపొలునిగా వర్ణించే పద్యం,

శ్రీకృష్ణునికి గోవులను పాలించడం పరమ్రీతికరం, సర్వేశ్చరుడు రామావతారంలో అరణ్యంలో సంచరించాడు. కృష్ణావతారంలో అవులను మేపుతూ అరణ్యంలో సంచరించాడు. "ఆరణ్యకా” లనే వేదాంత వనాలలో సంచరించే = గోచరించేవాడు సర్వేశ్వరుడు,

తన దర్శనాన్ని కోరే (ధ్రువాదుల లాంటి ఏ ఒకరిద్దరు భక్తులకోసమో కాక్క కోరకున్నా తానే ఉండబట్టలేక ఆనతారాదులనెత్తి వచ్చి సకల జనులకు యోగక్షేమాలను కల్పిస్తూ నిత్యసన్నిహితుడు అవడం, వాత్సల్య మనే దయానిశేషార్యమే కదా! కాబట్టి, పొదుగులో పాలు నిరడిపోయి. సలుపుతుంటే ఉండలేక తనంతట తానే నేలమీద పాలను కార్చే గోవులాంటి స్వభావం కలనాడు నారాయణుడంటారు విజ్ఞులు.

తొలిసంజలో తోల్కొని పోయినపశువులు - ఆవుల గుంపులు, దూడల మందలు = పగలంతా అడవిలో పచ్చిగడ్డి బాగా కడుపు నిండా మేశాయి, మలిసంజ కాగానే గోగణమూ, గోపాలుడూ అడవినుంచి పల్లెకు తిరిగి రావడం ఫరిపాటిక్షడా!

పశువులే ముందుపోళుంటే పనుల కాపరి వాటి వెరటటి పోతుంటాడు. ఆలకాపరులక్షు అవులే ఆచార్యులవలె అర్జవాన్ని బుజుమార్లాన్ని చూపిస్తాయి,

గతాన్‌ పశూనాం సహజన్మబంధుతాం

గృహాశ్రయం (ప్రేమవనేషు బిభ్రతః।

138 నారాయణ శతకం దదర్శ గోపానుపధేను పాండవః

కృతానుకారానివ గోభిరార్డవే॥(కిరాతార్టునీయం 4 సర్గ -13)

అర్జునుడు పశువుల దగ్గరున్న గోపాలకులను చూచాడట. వారెలా ఉన్నారు? అంటే, “గోపాలకులకు పుట్టినప్పటి నుంచే గోవులతో బాంధవ్యముందట. ఇండ్లల్లో ఉండవలసిన ధ్రేమ వారికి అడవుల్లో నివసించడమందే ఉందట. కపటం లేకుండా ఉండే విషయంలో పళువులచేత పరిహసింపబడుతున్నారట. "పశువులు కూడా వాటి కాపరులను, ఎంత అమాయకులో కదా వీరు అని వెక్కిరిస్తున్నటులుంటారని 'భారవి' సూక్తి,

శ్రీకృష్ణ పరమాత్మ కూడా, గోవులవెంట బోవడమూ, అడవులకేగడమూ, అక్కడనే భుజించడమూ దోషం కాదా? అంటే ఉదరపోషణపరులైన జ్ఞానహీనులకు దోషావహాలు కాని జ్ఞానాధికులకు అవి దోషాన్ని కలిగించవు.

"తేజోవిశేషేణ ప్రత్యవాయో న విద్యతే” అన్నట్టు సామాన్యులు చేసే పనులనే మహాతేజళ్ళాలురు చేసినా, వారి ప్రభావ విశేషం చేత అవి దోషావహాలు కావు అని ధర్మశాస్త్రం.

పశువులవెంట వచ్చేవారికి పశువుల గాలి, ధూళి సోకడం నైసర్గికం. పశువులూ, వాటికాపరిమైన కృష్ణుడూ పల్లెకు వస్తున్నప్పుడు గోపస్త్రీలు ఎదురయ్యారు. ఆ గోసస్తీలగాలి గోపాలునిపై సోకింది. పడతులు పరిమళ (ద్రవ్యాలను పయోధరాలకు లేపనం చేసుకోవడం పరిపాటి. కాబట్టి వారి చందనహరిద్రాలేపనాదులసువాసనలు కృష్ణుణ్ని పులుముకొన్నాయి. ఆ సువాసనావాసితుడైన గోపొలచ(్రవర్తి గోవులను మందకు తోల్కొంటూ వస్తున్నసుందరసన్నివేశం సంస్తవనీయమేకదా! ఇది ఈ కవి సుకృళమే, శా. చన్నుల్‌ మీందికి చౌకళింస నడుముంజన్వాడ కందర్ప సం

పన్నాఖ్యంబు నటించు మాడ్కి కబరీభారంబులూటాడగా విన్నాణంబు నటింప గోపజనగోబృందంబుతో వచ్చు మీ వన్నెల్‌ కన్నుల ముంచి గ్రోలుటలు నే వర్ణింతు నారాయణా! 46 అర్థఠ : ఓ నారాయణా! చన్నుల్‌ మీదికి చౌకళింప = చనుగుబ్బలు చెంగలింపగా; నడుమున్‌। జవ్వాడగా ఇ అల్లల్లాడగా; కందర్భ సంపన్న+అఖ్యంబు = కామసంపద అనేది; నటించు నూడ్కి = నాట్యం చేసే రీతిగా; కబరీ భారంబులు = కేశపాశాలు; ఊటాడగా = విడిపోయి కదలుతుగగా; విన్నాణంబు = చాతుర్యం; నటింప; గోపజన గోబ్బందంబుతో వచ్చు! మీ, వన్నైల్‌ = శోభించే కాంతులను; కన్నుల ముంచి గ్రోలుటలు = నేత్రపర్వంగా సేవించడాన్ని, నేను వర్షింతును.

రాఘవీయవ్యాఖ్య 139 తా : ఓ నారాయణా! శ్రీకృష్ణుడు గోవులతోనూ గోపజనంతోనూ వస్తున్న

అందమైన దృళ్యమిది. గోపికల గుబ్బచన్నులు సంచలిస్తున్నాయి. వారి నడుము

సన్నగా ఉండడంవల్ల తీగలాగా అల్లల్హాడుతున్నది. సిగముడులు విడిపోయి ఊడల్టాగా

కదలుతున్నాయి. కామపురుషార్థం స్వేచ్చగా నటిస్తున్నట్టున్నది. ఇంతనేర్పుతో

నటిస్తూ గో గోపజనాలతో వస్తున్న మీ తేజోరాశులు కన్నులనే గిన్నిలతో ముంచుకొని

(త్రాగదగినవిగా ఉన్నాయి. ఈ ఉదంతాన్ని ఉగ్గడిస్తాను. అన్నాడు శతకక్తర్త వ్యాఖ్య వ గోసాలకృష్ణుని సౌశీల్యగుణవర్లన.

గోపాలకృష్ణుడు దేవాదిదేవుడు. ఆయినా తన పరత్వాన్ని భావించక, సౌలభ్య సౌశీల్యాది గుణాలతో చిన్న పెద్ద అనే తర తమభావాన్ని ప్రదర్శించక, ఆశ్రితులందరితో కలిసి మెలసి తిరిగి మహోదారహృదయుడు. పరత్వం అతిశయించడం వల్ల గానీ, లేదా జీవులు చేసే పాపాల వల్ల గాని వేల్పుల దొర మనస్సులో నిగ్రహం కలుగక పోదు. కలుగుతుంది. “"సుతప్త మపి పానీయం పునర్గచ్చతి శీతతాం”

నీరు, వేడిేచేయబడినా మళ్ళీ కొంత సేపటికి చల్లబడుతుంది.

అలాగే, భగవంతునికి నిగ్రహం కలిగినా అది తాత్కాలికమే.

ఎక్కువ కాలం నిలువదు. ఆయన చూపుచల్లనిదే

“మహతః: మందైః సహ నీరం(ధ్రేణ సయ్రేషు సౌశీల్యం”

సౌశీల్యమంటే, గొప్పవాడు తక్కువ స్టితిలో ఉన్నవారితో మనస్సులో ఏమాత్రం సంకోచం లేకుండా కలిసి తిరుగడమన్నమాట.

నిత్యసూరులు అనంతగరుడవిష్పకొ్‌సీనాదులు - మాత్రమే అనుభవింప సాధ్యమైన తనస్వరూపరూపగుణాదులను సామాన్యులకు - గొల్లవారికి కూడా అను[గ్రహించడం కృష్ణావతారప్రాశస్త్యం.

గోవులు, గోపికలు, గోపాలురు, పిల్లలు, పెద్దలు వీరందరితో కలిసి కృష్ణుడు అహ్హాదకరంగా జీవనయాత్ర సాగించడం గోకుల భాగ్యమే.

“గోప్యో గావో బుచః” (అథర్వ - కృ ఉప)

తత్పూజార్థం సంభవంతు సుర(స్రియః” (సం,భాగు)

“హరిపూజార్థము. పుట్టుడు, సురకన్యలు భూమియందు సుందరతనులై” - (ఆంధ్రభాగ,) శ్రుతులూ, దేవతలూ, బుషులూ గోవులుగానూ, గోపాలురుగానూ, గొల్లభామలుగానూ పుట్టి, వేద ప్రతిపాద్యుడైన శ్రీకృష్ణపురబ్రహ్మను విడువకుండా సంచరిస్తూ సంశ్షేషించి ఆనందించడం మహాభాగ్యమేకదా।

140 నారాయణ శతకం

కచకుచకటితటాలు కందర్పునిసంపత్తు. కామపురుషార్హం స్పైరవిహారంచేస్తున్నట్టు చన్నులు చౌకలళిస్తున్నాయి. నడుము జవ్వాడుతున్నది. కబరీభారాలు అంటే కేశపాశాలు ఊటాడుతున్నాయి. “"పౌశస్తు మృగపశ్వాదిబంధనే, కర్ణాంతే శోభనార్థః స్యాత్‌, కచాంతే నికరార్థకః” (హైమనిఘంటువు), పాశమంటే తాడు. కర్షపాశమంటే ్రేస్టమైన చెవులు, కేశపాశమంటే సిగముడి. "కం వృణోతీతి కబరీ” శిరస్సును చుట్టి ఉండేది. కొప్పు అని అర్థం. సిగ ముడి ఉన్నప్పుడూ, ముడి విడిపోయి విరబోసి ఉన్నప్పుడు కూడా అందంగానే ఉంటుంది.

“బంధే 'ప్రంసిని ఛైకహస్తయమితాః పర్యాకులా మూర్చజా:” శకుంతల కణ్వాశ్రమంలోనిచెట్లకు కుండతో నీరుపోస్తుంటే సిగముడి విడిపోయింది. వెంటనే ఆమె ఒక్కచేళ్తోనే గజిబిజిగా ముడివేసుకొంది. దుష్యంతుడా కొప్పును చూచి ముగ్గుడై ఆహా! ఎంత అందం! అని వర్షించాడు,

“అపి తురగసమీపాదుత్పతంతం మయూరం

న స్త రుచిరకలాపం బాణలక్షీచకార

సపది గతమనస్కశ్చిన్నమాల్యానుకీన్లే

రతివిగళితబంధే కేశపాశే ప్రియాయాః॥” (రఘువంశం)

రకరకాల పూలతో అల్లబడిన మాలచేత అలంకృతమైన కైకేయి. కేశపాళశం సంభోగసమ్మర్హంచేత విడిపోయిందట. తర్వాత పడకనుంచి లేచిన ఆమె యొక్క పూలు జారిపోయి విప్పారిన కురులను చూచిన దశరధునిహృదయం పరవశమయిందట. కొంత కాలానికి -వేటాడబోయిన దశరథుడు, పింఛం విప్పుకొని ఆడుతూ గుర్రందగ్గరినుంచి పోతున్న నెమిలిని చూచినప్పుడు కైకేయియొక్క విడిపోయిన కేశపాళం గుర్తుకు వచ్చినందువల్ల స్తబ్బుడై, నెమిలిపైన బాణాన్ని విడువక నిలిచాడట.

శ్రీకృష్ణుడు గోపజనగోబ్బందంతో విన్నాణంగా నటిస్తూ వస్తుంటే ఆ వన్నెలు చిన్నాలు కన్నుల పండువుగా ఉన్నాయి. 'కన్నుల ముంచి గోలుట' అంటే దర్శించి ఆనందించడమే.

“లోచనాభ్యాం పిబన్నివ” (రాయు. 19-6) అన్నట్టు గోపాల కృష్ణుణ్ని చూచి కన్నులు ఆ తేజః పుంజాన్ని - ఆ సౌందర్య రసాన్ని జుర్రుకొన్నాయి. కనుదొప్పలతో జుర్రుకొనవలసింది అందమే కదా! "సదా పశ్యంతి సూరయ?” అనే శ్రుతిరీతిగా రెప్పపాటులేకుండా పరమపదనాధుణ్ని దర్శించే నిత్యముక్తులకు కూడా ఈ విధమైన తృప్తి కలుగకుండవచ్చు. కన్నులు సాధనాలు మాత్రమే. మాంస చక్షువులతో గోపాలుని దివ్యమంగళవి[గ్రహాన్ని దర్శించి తృప్తిని పొందవలసిన ఫలభోక్తలు సంసారులే కదా!

రాఘవీయవ్యాఖ్య 41 మ. పెరుగుల్‌ ద్రచ్చుచు నొక్క గోపిక మిముం బ్రేమంబునంజూచి రా గ రపావేశత రిత్త ద్రచ్చనిడ నాకవ్వంబు నీవు న్మనో హరలీలల గనుగొంచు ధేనువని యయథయ్యాబోతునుంబట్టి తీ వరవృత్తాంతములేను పుణ్యకథగా వర్లింతు నారాయణా! త్త అర్ధం : ఓ నారాయణా! ఒక గోపిక పెరుగుల్‌ ద్రచ్చుతూ మిమున్‌ ప్రేమంబునన్‌ చూచి; రాగరస+ఆవేశతన్‌ = (ప్రేమరసావేశంతో; ఆకవ్వంబున్‌ = రిత్తన్‌ = ఉత్తకుండలో; 'తచ్చన్‌, ఇడన్‌ = తరచడానికి ఉంచగా; నీవున్‌ = నీవు కూడా; మనోహరలీలన్‌ = మనస్సును (ఆగోపికచేష్టు హరించిన భావంతో; కనుగొంచు = చూస్తూ: ధేనువు అని = ఆవు అనుకొని; ఆంబోతుకున్‌ = ఎద్దును కూడా; పట్టితి = పట్టుకొంటివి. ఈ వరవృత్తాంతములు = (శ్రేష్టమైన ఈ ఉదంతాలను; ఏను పుణ్యకధగా; వర్రింతును = ('ప్రశంసిస్తాను. తా : ఓ నారాయణా! తరుణియొకతె పెరుగుదరచుచు నిన్ను (ప్రేమతో చూచింది. ప్రేమలో మునుగడంవల్ల ఆ గోపిక కవ్వాన్ని పెరుగులేని' ఉత్త కడవలో పెట్టి చిల్కడానికి త్రిప్పుతుంది. ఇక నీవు కూడా ఆ మనోహర లీలన్‌ చూస్తూ ఆవు అనుకొని ఆబోతును పట్టుకొన్నావు. ఈ గొప్ప (భ్రాంతిమూలకమైన) చిత్రమైన ఉదంతాన్ని నేను పుణ్యకథగా వర్షిస్తానంటున్నాడు కవి. వ్యాఖ్య : అన్యోన్యమనోహరవృత్తాంతవర్లన. చిత్తాన్ని ఆకర్షించేది 'చిత్రం' ఒక్క మనస్సు పరవశమైతే ఇంద్రియాలు. ప్‌ పనినీ చక్కగా. చేయలేవు. “మనః ప్రగ్రహ ఏవ చ” ఇంద్రియాలు గుర్రాలైతే, మనస్సు వాటిని" నియమించే కళ్ళెమే అని "కరోపనిషద్వాణి. కళ్ళెం సడలిపోయింది అంటే గుర్రాలు తమ ఇష్టం..న్లచ్చినట్టు చెలరేగుతాయి. సర్వేంద్రియాలు సర్వేశ్చరునికి అభిముఖమై నిల్చినప్పుడు (ప్రాకృతికపదార్జాలమీద ధ్యాస ఎలా ఉంటుంది? ఉండనే ఉండదు. ఒక గోపిక పెరుగును చిల్కడానికి సిద్ధపడింది. అంతలోనే అక్కడికి వచ్చిన కృష్ణునిమీద ఆమె దృష్టి పడింది. దృష్టి మారితే సృష్టి మారుతుంది. గోపిక చూపు గోపాలునిపై ప్రసరించగానే మనస్సు అటే పోయి నిలిచింది. అది తిరిగి రాలేదు, కాబట్టి ఆ గోపిక పెరుగు ఉన్న కడవ అనుకొని, పెరుగులేని ఉత్త కడవలోనే కవ్వం పెట్టి తరచసాగింది. “సర్వగంధః, సర్వరసః” శ్రుతి చెప్పిన రీతిగా. శ్రీకృష్ణునిరూపం రాగరసమయమై ఆగోపికను ముంచెత్తింది. ఆమెచిత్తరువు బొమ్మ అయింది. ఇది మనోహరలీల. ఈ

142 నారాయణ శతకం లీలను కృష్ణుడూ చూచాడు. “యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్‌” (భగ. 4-11) ఎవరే విధంగా నన్నాశ్రయిస్తారో వారిని నేనావిధంగానే అను[గ్రహిస్తానన్నాడు కృష్ణుడు.

ఆ బొమ్మను చూచిన క్షణంలోనే కృష్ణునికీ రిమ్మ పుట్టింది. ఆయన మనస్సు ఆమెను అను(గ్రహించింది. కాబట్టి, పాలు పితుకడానికి ఆవును పట్టుకొంటాననుకొన్న కృష్ణుడు ఆబోతును పట్టుకొన్నాడు. ఆయన హృదయం గోవువెంట దగులు కోడెభంగి అన్నట్టు భక్తపరాధీన మయింది. ఇది వరవృత్తాంతం.

ఆశ్రయణీయుడైన కృష్ణుడు గోపికలుండేచోటికే వచ్చి సిద్దసాధన తత్పరులకంటె కూడా యజభేష్ట వినియోగార్హంగా గోపికలకు స్వాధీనుడవడం వల్ల ఎంతో ఉత్కృష్టమైనదీ వృత్తాంతం. పుణ్యమూర్తి గోపాల చక్రవర్తి పుణ్య భాజనులు గోపజనులు, ఈ పుణ్యకథను కృతికర్త ఇప్పుడు, (వర్షింతును - తద్ధర్మార్థక (క్రియాపదప్రయోగం వల్ల) ఇక ముందు కూడా వర్లిస్తానన్నాడు.

ఈ పద్యానికి మాతృక శ్రీలీలాశుకుని శ్లోకం.

“రాధా పునాతు జగదచ్యుతదత్తచిత్తా

  • మంథాన మాకలయతీ దధిరిక్తపా(త్రే।

తస్యాః స్తనస్తబకచంచలలోలదృష్టి

ర్రేవోఒపి దోహనధియా వృషభం నిరుంధన్‌ 1” (శ్రీకృష్ణకర్ణామృుతం-2.25)

'అచ్యుతునియందు దత్తచిత్తమైన రాధ, పెరుగును త్రచ్చడానికని కవ్వాన్ని పెరుగులేని బానలో పెట్టి త్రిప్పుతున్నది. ఆమె స్తనస్తబకం (పూలగుత్తుల లాంటి పయోధరద్వయం) మీద మాటిమాటికి చూపు నిల్పిన కృష్ణుడు కూడా, పాలు పిండడానికి ఎద్దును దాయకట్టాడు. ఆరాధామాధవులు ప్రపంచాన్ని పావనం చేతురుగాక అని శ్లోకార్థం, శా. కేలన్‌ గోలయు( గూటి చిక్యము నొగింగీలించి వెత్తంబునం

బీలీసింఛము. జుట్టి నెన్షడుమునం బింఛావళిన్‌ గట్టి క ర్లాలంకార కదంబనుచ్చమధుమత్తాలీస్వవంబొప్ప నీ వాలన్‌ గాచిన భావమిట్టిదని నే వర్లింతు నారాయణా॥ డ్రి అర్థం : ఓ నారాయణా! కేలన్‌ = చేతియందు; కోలయున్‌ = కజ్ణిను; కూటి చిక్కమున్‌ = చద్ది ఉట్టినీ; ఒగిన్‌ = వరుసగా; కీలించి =అమర్చి; నెత్తంబునన్‌ = శిఖరమందు; పీలీపింఛమున్‌ = పక్షితోకను; చుట్టి; నెటీ+నడుమునన్‌ = అందమైన నడుమునందు; పింఛ+ ఆవలిన్‌ = నెమిలి ఈకల సముదాయాన్ని; కట్టి; కర్ణా-స్తనంబు

రాఘవీయవ్యాఖ్య 143 కర్త = చెవులయందు; అలంకార = భూషణంగా ఉన్న; కదంబ గుచ్చు = కడప పూలగుత్తియందలి; మధు = మకరందంచేత; మత్త = మదించిన; అలీ స్వనంబు = తుమ్మెదల (మోత; ఒప్ప; నీవు, ఆలన్‌ = ఆవులను కాచిన = మేపుతూ కాపరిగాఉన్న; భావము = రూషమున్న తీరు; ఇట్టిది అని నే వర్షింతు.

తా ; ఓ నారాయణా! చేతిలో చద్దిమూటనూ, కట్టెనూ పట్టుకొని, తలపాగకు బర్జిపింఛాన్ని చుట్టి, నడుముకు నెమిలి ఈకలను కట్టి, చెవులకు శోభగూర్చే కడప. పూల గుత్తి యందున్న పూదేనెను ఆస్వాదించి మదించిన తుమ్మదల రుంకార ధ్వని ఒప్పుతున్న నీవు ఆవులగాచిన రూపసంపద ఇట్టిదని నేను వర్షిస్తాను.

వ్యాఖ్య : ఆలకాపరిటైన కృష్ణువిరూపసంపద వర్ణితం.

ఓగిరపుమూటను కర్రకు తగలించి చేత్తో పట్టుకొన్న రూపమది. తలకు నెమిలి పింఛం ఉంది. మొలచుట్టూ నెమిలి తోక ఈకలు కట్టి ఉన్నాయి. పూదేనియను (త్రాగి మదించిన తుమ్మెదలు జుమ్మని (మోగుతున్న కదంబ పుష్పగుచ్చాలు కర్షభూషణాలుగా ఉన్నాయి. పసులకాపరులెందరో ఉన్నారు కాని గోపాలకృష్ణుని ఈ రూపవైభవం (ప్రత్యేక శోభను సంతరించుకొన్నందువల్ల సంస్తవనీయమయింది.

శ్రీకృష్ణుని దివ్య శరీరం త్రిజగన్మోహనమైన నీలకాంతితో దేదీప్యమానంగా ఉంటుంది.

“ఆసీదనుజ్‌యితశిఖభావళకంఠశోభం, మాంగల్యదం ్రణమతాం మధువైరిగాత్రమ్‌" (గోదాస్తుతి 22).

పసుపు రంగు, నీలిరంగు, ఆకుపచ్చరంగు - ఈ మూడు వన్నెల కలయికతో మధువైరిగాత్రశోభ మయూరకంఠశోభలా స్నిగ్గమయింది.

(శ్రుతి స్కృతులు కూడా భగవద్వి[గ్రహం అతసీపుష్పసంకాశ మనీ, మయూరగ్రీవాస దృశమనీ, కృష్ణపింగళ మనీ వర్లిస్తున్నాయి.

“బుతగ్‌ం సత్యం పరం (బ్రహ్మ పురుషం కృష్ణపింగళమ్‌” (నారా.ఉప)

“భగవద్వి[గ్రహస్య అతసీ పుష్పసంకాశతయా ప్రతిపాదనాత్‌, అతసీపుష్పస్య మయూరగ్రీవాసదృశతయా కృష్ణపింగళవర్షత్వాత్‌ కృష్ణపింగళత్యోపపత్తిః” (భాష్యం.)

“నమస్యే పరమానందవపుషం కృష్ణపింగళమ్‌।

నారాయణం జగన్నాథం వాసుదేవమనామయమ్‌” (యోగార్లవం,)

గోపాలకృష్ణునిశరీరం దేవమనుష్యశరీరసజాతీయంగా కనబడుతున్నా, ప్రాకృతికము, పాంచభౌతికమూ కాదు.

“న తస్య ప్రతిమా మూర్తిః మాంస మేదో ఒస్టిసంభవా” (వాయుపురాణం)

“న భూతసంఘసంస్టానః దేహోఒస్య పరమాత్మనః” (భారతం)

144 నారాయణ శతకం ఆలకాపరి రూపమైనా, ఆది దివ్యమంగళవి[గ్రహం. గోపార్భక వేషంతో ఉన్నా, ఆ బ్రహ్మవర్చస్సు కన్నులకు ' రెప్పపాటు లేకుండా 'సేవించదగినది. యౌవనాన్ని విడువనిది. బర్హిపింఛంతోనూ, భూషణాలతోనూ పరస్పరం జగడమాడే శిరోజాలు కలది. ఇం(ద్రియాలను మత్తెక్కించే విలాసం కలది కదా! అని దేశికులు స్తుతించారు (గోపాలవింశతి). “అనిమేషనిషేవణీ య మక్షోరజహద్యావన మానిరస్తు చిత్తే కలహాయితకుంతలం కలాపైః కరణోన్మాదకవిభ్రమం మహో మే॥ (10) సామగానలోలుడైన గోపకిశోరుడు, జామ్మని [మైగేతుమ్మెదలనాదాన్ని వింటూ గోవులను కాచే భావం రమణీయం. పూదేనెకోసం వచ్చే తుమ్మెదల రుంకారం, వాటి రెక్కలు సెకనుకు మూడు వందలనుంచి నాలుగువందల సార్హు కంపించడంవల్ల శబ్దతీవ్రత . ఎక్కువగా ఉండి, కొంచెం భయాన్ని కలిగిస్తుంది. మధువును పానం చేసి మదించిన తుమ్మెద రెక్కల పౌనపున్యం తక్కువగా ఉండడంవల్ల, రుంకారం సంగీతం లాగా శ్రావ్యంగా ఉంటుంది. షట్పదాలు అంటే తుమ్మెదలు షడ్ఫుజొకారంలో ఉండే తమ గదిని మధుమయం చేస్తాయి. షట్స్పదాన్ని ద్వయమంత్రమంటారు. ఆ ద్వయమంత్రాన్ని అనుసంధించే ఆచార్యులూ, బుషులూ,. సత్పురుషులూ షట్పదాలే. తుమ్మెదల రెక్కలు సత్పురుషులకుండే జ్ఞానవైరాగ్యాలకు (ప్రతీకలు. “బుషయో౭పి తదాదేశాత్‌ కల్చ్యంతాం పళురూపిణః పయోదానముఖేనాఒపి విష్ణుం తర్పయతే. సురాః” (భాగ) అన్నట్టు, బుషులకళలే గోవులు, దేవాంశజులే గోపాలురు కదా! దేవర్షులైన తుంబురు నారదులు మొదలైన గాయకులు, షడ్గుణ పరిపూర్జుడైన గోపాల కృష్ణుని కర్ణాలంకార కదంబ గుచ్చమధుపానం చేసిన బంభరాలు జుమ్మని మధురాలాపన చేస్తుంటే, వింటూ ఆవులను కాచినభావం స్పృహణీయం. శా. _కాళిందీతటభూమి నాలకదుపుల్‌ కాలూ(ది మేయన్‌ సము త్తాలాలోలతమూలపాదపశిఖాంతస్థుండవై వేణురం ధ్రాలిన్‌ రాగరసంబునిండ విలసద్రాగంబు సంధించి గో పాలన్రాతము గండు/గోయిలలుగా. వర్షింతు నారాయణా! డ్త్ర అర్ధం : ఓ నారాయణా! కాళిందీ తటభూమిన్‌ = యమునా నదీతీర ప్రదేశమందు; ఆలకదుపుల్‌ = పసుల మందలు; కాలు+ఊదిమేయన్‌ = పూనికతో గడ్డి మేస్తుండగా;

రాఘవీయవ్యాఖ్య 145 సముత్తా-డవై సం+ఉత్తాల+ఆలోల = బాగా పొడవై మరుగ్గుగాఉన్న; తమాల పాదపశిఖా = కానుగు చెట్టుకొన కొమ్మయొక్క; అంతఃస్టుండవై = లోపల ఉన్నవాడవై: వేణు రం(్ర+అళిన్‌ = పిల్లనగ్రోవి ఛిద్రాల సముదాయమందు; రాగ రసంబునిండ = శృంగార రస పూర్ణంగా; విలసత్‌ + రాగంబు = కోభించే రాగాన్ని; సంధించి = ఆలపించి; గోపాల వ్రాతము = ఆలకాపరుల సమూహం; గండు, కోయిలలుగా' = పుంస్కోకిలలుగా; వర్షింతు ఇ (ప్రశంసిస్తాను.

తా £: ఓ నారాయణా! యమున అనే ఏటిగట్టున ఆలమందలు నెమ్మదిగా మేత మేస్తుంటే నీవు, చాలా పొడవై దట్టంగా ఉన్న చీకటి చెట్టు కానకొమ్మలోపల కూర్చున్నావు. పిల్లన[గ్రోవి వివరాలలో శృంగారరసభరితమైన శోభనరాగాన్ని ఆలపించావు. గోపాలురందరు. అలాగే నిన్ను అనుకరించారు. కాబట్టి వారందరినీ గండు కోకిలలుగా వర్షిస్తాను అన్నాడు కవి.

వ్యాఖ్య : గోపాలకృష్ణుడు వేణువును ఊదేవర్లన.

నందనందనునికి కాళింది ఆటపట్టు. భగవత్కైంకర్యానికి అన్వ్నయించిన భాగ్యవతి యమున.

“యమునాం చాతిగంభీరాం నానావర్తయుషాకులాం।

వసుదేవో వహన్‌ కృష్ణం జానుమాత్రోదకో యయెౌ॥” (విపు)

అనేకజలచరాలతోనిండి, వలునుడులు తిరిగే లోత్చెన నీటితో (ప్రవహించేయమునానది, నందగోకులానికి శ్రీకృష్ణ రమాత్ముణ్ని నెత్తి మీద ఎత్తుకొని పోతున్న వసుదేవునికి మోకాళ్ళబంటి నీళ్లున్న దారిని కల్పించింది.

“వల్లవీ వదనోచ్చిష్ట పవిత్రాధరవిద్రుమః” ఐదు లక్షల గొల్లచెలువలతో, శ్రీకృష్ణుడు వారి విరహతాపం తీరే రీతిగా జలక్రీడల ననుభవించడానికి యమున తేటనీటితో నిండుగా దరులొరసి ప్రవహించింది. వారి గండూషణస్నానాదులచేత అతి పవిత్రంగా వెలసింది. “యమునా సాక్షిక యౌవనం యువానమ్‌” గోపీజన వల్లభునికి రమణీమణులు. దొరికేది యమునా తీరాననే కదా! కాబట్టి శ్రీకృష్ణుని యౌవనవైభవాభియోగానికి సాక్షిణిగానూ గోచరించేది యమునయే.

ఆ ఏటి గట్టుమీద అఆలమందలన్ని పచ్చగడ్డిని బాగా మేస్తున్నాయి. అక్కడ దళసరి ఆకులతో దట్టని చీకటిని కల్పించే కానుగు చెట్టు (తమాల తరువులు) ఉన్నాయి. అందులో ఎత్తైన ఒక చీకటి చెట్టు మీదికొమ్మల్లో కనబడకుండా కూర్చున్న నల్లనయ్య మెల్లగా పిల్లనగ్రోవిని ఊదుతూ దాని సుషిరాలను కొనన్రేళ్ళతో సొగసుగా మూస్తూ తెరుస్తూ సింగారంగా (మోగిస్తున్నాడు.

146 నారాయణ శతకం పిల్లనగ్రోవి రం(ధ్రాలనుంచి సప్త స్వరాలను పలికిస్తారు గాయకులు. “సరిగమపదని" అనే ఏడు స్వరాలలోనే సంగీత శాస్త్రం వెలసింది.

'షడ్డ' స్వరాన్ని పలికేది 'స' 'బుషభి' స్వరాన్ని '6%, 'గాంధార' స్వరాన్ని 'గ* మధ్యమ” స్వరాన్ని 'మ', 'పంచమి' స్వరాన్ని ప 'ధైవత' స్వరాన్ని 'ద* 'నిషాద' స్వరాన్ని “ని పలుకుతుంది.

“పుష్పుసాధారణే కాలే పికః కూజతి పంచమమ్‌” (అమరం)

వసంతర్హువులో కోకిలలచేత విస్తరించేది పంచమస్వరం.

గోపాలచ(క్రవర్తి తమాలపాదపశిఖాంతఃస్టుడై శృంగారరసభరితమైన ముగ్ధ మోహనరాగాన్ని గీతవాద్యలయ సామ్యంగా వేణువాదన చేస్తుంటే, గోపాలకులందరు ఆయనను అనుకరించారు. మావి చివుళ్ళను మెక్కి చెట్లపైన కనబడకుండా ఉండి కుహుకుహూ ధ్వనినిమాత్రం మధురంగా స్ఫురింపచేసే గండు కోయిలలలాగా గోపాలకులున్నారని కవి వర్షించడం కమనీయమే కదా! శా. రాణించెన్‌ గడునంచు నీ సహచరుల్‌ రాగిల్లి సోలంగ మీ

వేణుక్వాణము వీనులంబడి మనోవీధుల్‌ బయల్‌ ముట్టంగా ఘోణాగ్రంబులు మీంది కెత్తుకొని లాంగూలంబులల్లార్చి గో శ్రేణుల్‌ చిందులు గ్రొక్కి యాడుటలు నే జర్చింతు నారాయుణా। 50 అర్ధం : ఓ నారాయణా! మీ వేణుక్వాణము = మీ వేణునాదం; వీనులన్‌, పడి = చెవులలో పడి (విని); కడున్‌ = బాగుగా; రాణించెన్‌. అంచు = ఒప్పియుండెను అంటూ; నీ సహచరుల్‌ = నీతోటివారు. అనుయాయులు; రాగిల్లి = రంజిల్లి; సోలంగ = వివశులు కాగా; మనోవీధుల్‌ = మానసిక స్థితులు; బయల్‌ ముట్టగా = ఆకాశానికి చేరగా; ఘోణా+అ(గ్రంబులు = ముఖాలు; మీదికెత్తుకొని; లాంగూలంబులు = తోకలు; అల్లార్చి = పైకిలేపి జాడించి; గోశ్రేణుల్‌ = పసుల మందలు; చిందులున్‌ + తొక్కి: గంతులు వేసి; ఆడుటలు; నేన్‌ = నేను; చర్చింతును = వర్షింతును.

తా ఏ: ఓ నారాయణా! నీ మురళీరవం వీనులవిందు చేయగా బాగా రాణించిందంటూ నీ అనుయాయులు రంజిల్లి వివశులయ్యారు. ఆలమందలు ఆ వేణునాదాన్ని విని వాటి మనోవీధులు ఆకాళాన్ని చేరుకోగా అంటే ఉత్సాహం ఉరకలేయగా, మోరలెత్తి తోకలను లేసి జాడించి గంతులు వేస్తూ ఆడసాగాయి,. ఈ మనోజ్ఞదృళ్యాన్ని వర్షిస్తాను, అన్నాడు కవి,

వ్యాఖ్య : మురళీనాదమాధురిని వర్గించేపద్యం.

రాఘవీయవ్యాఖ్య 147 సంగీతం ఆపాతమధురం. గానం చెవికి సోకగానే హృదయం ఉగర్రూతలూగుతుంది. పాటవిన్నంతసేపు ఇంద్రియాలు ఉద్దీసితాలవుతాయి. మనస్సుకు మధురమైన అనుభూతి కలుగుతుంది. శిశువైనా, పశువైనా, పామైనా గానరసంలో మగ్నమై మైకంతో ఉండడం ఆజానజం. శ్రీకృష్ణుడు అధరాన చల్లని పిల్లన(గ్రోవి నానించి, ముఖ వాయువుతో ముఖరీకృతమైన నాదాన్ని స్వరాలతో మేళవించి ఆలపిస్తుంటే, సర్వశ్రుతిపేయమైనందువల్ల తోటి గోపాలకులు ఆహా! భళా! అంటూ పరవళులయ్యారు. పశువులకు ఉత్సాహం ఉరకలేసింది. భూనభోంతరాళాన్ని పావనం చేస్తున్న మురళి నాదతరంగాల వైపు మెడసాచి మొగమెత్తుకొని చూచాయి ఆలమందలు, వీనుల ద్వారా మేనులో చేరిన నాదమాధుర్యానికి అంతరంగం తురంగలించింది. కాబట్టి పశువులు కాలూది నిలబడలేక తోకలు పైకెత్తి చిందులు త్రొక్కి ఆడసాగాయి. ఇట్టి మనోజ్ఞభావవీచికలతో కవి ఉల్లం పల్లవిస్తే అది పద్యమై పరిమళించడం పరిపొటి. ఇక్కడ పోతన పద్యం స్మరణీయం. “నవమాధుర్యముకల్లు కృష్ణుమురళీనాదామృతస్యందముల్‌ సెవులంజొచ్చి హృదంతరాళముల భాసీల్లన్‌ సవత్సంబులై యువిదా! మేపులకుందొటుంగి మృగగోయూధంబునుత్కంరతో దివికిం గంఠమునెత్తి లో వదలు( బో దేహేంద్రియవ్యాస్తులన్‌[” (భాగ10) ము. పసులంగాపరి యేమెబుంగు మధురప్రాయోల్లసద్వత్త వా గ్విసరారావము మోవిదా వెదురు గ్రోవింబెట్టినాండంచునిన్‌ గసటుల్‌ సేయం నాండు గోపికల తద్దానంబులన్‌ నున్మథ వ్యసనాసక్తల జేయుచందములు నే వర్లింతు నారాయణా॥ 51 అర్థం : ఓ నారాయణా! పసులన్‌ కాపరి = పశువులకాసే వాడు; మధురా రానము మధురప్రాయ. = ఆత్యంత మధురమైన; ఉల్లసత్‌+వృత్త = పైకేశోభించి ఆవరించే; వాక్‌+విసర+ఆరావము = వాక్ష్రసారధ్వని; ఏమి, ఎయుంగు = ఏమెరుగును? తాన్‌ = ఆలకాపరి: వెదురు(గ్రోవిన్‌ = పిల్లన(గ్రోవిని; మోవిన్‌ = అధరమందు; పెట్టినాడు; అంచు = అంటూ; నిన్‌ = నిన్ను; కసటుల్‌ సేయగన్‌ ఆడు = (ఎగతాళి) పాపం తగిలే మాటలనాడుతున్న; గోపికల = గోపస్త్రీలను; తత్‌ + గానంబులన్‌ = ఆ వేణుగానాలచేత; మన్మథ వ్యసన+ఆసక్తలన్‌ = కామాతురత కలవారినిగా; చేయు చందములు = చేసే రీతులను; నేను వర్షింతును. తా £ ఓ నారాయణా! అతి మధురమైన, పైకి వ్యాపించే వాక్ర్రసార ధ్వని పసులకాపరికి ఏమి తెలుస్తుంది? తాను పిల్లన(గ్రోవిని పెదవికి ఆనించాడు. అని

148 నారాయణ శతకం నిన్ను హేళనగా మాటాడే గోపికలను ఆ పిల్లన[గ్రోవిని ఊదిపాడిన పాటల చేతనే కామ. పురుషార్థమందు. (శ్రద్దకలవారినిగా చేసిన రీతులను చక్కగా కీర్తిస్తాను. అన్నాడు కవి. వ్యాఖ్య వ వేణుగోపాలుడు వ్రేతలను మదనాసక్తలమ చేసే వర్ణన : ఆకాశం శబ్దగుణం కలది. పెదవి దాటితే పృధివి దాటుతుంది అంటుంది లోకం. ఆడిన మాటకు అంతరిక్షంలోకి వ్యాపించే శక్తి ఉంది. లోక వ్యవహారమంతా మాటచేతనే జరుగుతుంది. మాటకే ఇంతశక్తి ఉంటే, పాటకు జగత్తునే గమ్మత్తుగా మల్చే శక్తి ఉంది అంటే అతిశయోక్తికాదు. ధ్వని తరంగాల, కాంతి తరంగాల వ్యాపకశక్తిని సం(గ్రహించే దూరశ్రవణ దర్శన యం్రాలున్న ఈనాడు ఆబాలగోపాలం, మధుర (ప్రాయోల్లనద్వృత్తవాగ్వినరారావాన్ని గమనించి ప్రవత్తిస్తున్నదంటే ఆశ్చర్యపడనక్కర లేదు కదా! ఈ పసులకాపరికి నిజముఖమారుతపూర్ణరం[ద్రాల ద్వారా శబ్దాలను (ప్రసరింపజేసే సంగతి ఏమి తెలుస్తుందని తాను ఆ పిల్లంగ్రోవిని (క్రింది) పెదవికి అనించి పెట్టాడు? అని గొల్లభామలు వేణుగోపాలుణ్ని దెప్పి పొడిచారు. ఈ సూటి పోటు మాటలు ఆ పసుల కాపరికి ఏమాత్రం ఈసుకలిగించలేదు. ధీర లలితుడైన ఈ సామగానప్రియుడు, తన వదనవాయువుతో పూరించిన మురళీరంధ్రాలను అంగుళ్యగ్రాలతో కప్పుతూ విప్పుతూ అద్భుతంగా నినదింప చేశాడు. హరి మురళిరవామృతం సోకగనే “గరులెల్ల జలములయ్యెన్‌ దరులెల్లను బల్లవించె ధరణి గగన భూచరులెల్లరు చొక్కి” నారు. శబ్దాన్ని ప్రసారంచేసే జ్ఞానమే లేదని కసటు మాటలాడిన గొల్లగోతులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అనంగ (శ్రీడలందు ఆసక్రలయ్యారు. “కామిగాని మోక్షగామిగా”డన్నట్టూ గోపికలను కామపురుషార్థవ్య(గ్రలను చేసిన వేణుగానసరణులను ఈ సుకవి వర్ణిస్తాననడం గమనీయంకదా!। మ, జడ యెంతే/ దడవయ్యె. జెయ్యి యలసెన్‌ శైలంబు నూ చేతులం దిడుమన్నన్‌ జిరునవ్వుతో వదలినవ్‌ హీనోక్తి గీపెట్ట వె క్కుడు గోవుల్‌ బ్రియమంద నింద్రుడడలంగోవర్దనాద్రీంద్రమువ్‌ గొడుగై యుండగ( గేలయబూనితి గదా గోవింద నారాయణా॥ 852 అర్థం : ఓ నారాయణా! ఓ జడ = తెలివిలేని నిశ్చలుడా! ఎంతేన్‌ తడవు అయ్యెన్‌ = ఎంతో ఆలస్యమయింది, చెయ్యి అలసెన్‌ = నీ చెయ్యి అలసింది; మా చేతులందు; శైలంబు ఇడుము = పర్వతాన్ని పెట్టుము; అన్నన్‌ = అనగానే; చిరునవ్వుతో =

రాఘవీయవ్యాఖ్య శతం మందహాసంతో; వదలినన్‌ = (గుట్టను కొద్దిగా) వదలిన వెంటనే; హీన+ఉక్తిన్‌ = మాటరాక; క్షీ పెట్టన్‌ = కియ్యని అరవగా; గోవుల్‌ = పశువులు: ఎక్కుడు = అధికంగా; ప్రియము అందన్‌ = సంతోషింప; ఇంద్రుడు = దేవరాజు; అడలన్‌ = భయపడగా; గోవర్దన + అద్రి +ఇంద్రమున్‌ = గోవర్దన మనే గిరిరాజును; గొడుగై ఉండగ = ఛత్రమైనట్టు, కేలన్‌ = చేతితో; పూనితి = పట్టుకొన్నావు కదా!

లా ; ఓ నారాయణా! చైతన్యం లేనివాడా! చాలా కాలమయింది. నీ చేయి అలసిపోయింది. పర్వతాన్ని మా చేతుల్లో పెట్టు, మేమెత్తుకొంటామని గోపజనులు తమ చేతులను గుట్టకానించారు. నీవు చిన్నగా నవ్వుతూ ఆ పర్వతాన్ని తిన్నగా వదులిడిచావు. గోపజనులకు నోట మాట పెకులలేదు. "కీ" అని అరచారు. గోవులు సంతోషించే రీతిగా, ఇంద్రుడు భయపడే విధంగా గోవర్హన మనే గొప్పగుట్టను, గొడుగుగానే చేత్తో పట్టుకొన్నావు కదా! గోవింద!

న్యాఖ్య : గిరిధరుని చాతుర్యం వర్షితం.

శ్రీకృష్ణుడు ఏడేండ్ల బాలుడు. గొల్లలు పరంపరగా ఏడాది కొక్కసారి జరిపే ఇం[ద్రయాగాన్ని. ఆపి. వేసి, గిరిరాజును పూజించుమని వారికి బోధించాడు. బాలకృష్ణుడే కొండమీద దేవునిగా వెలశాడు. గొల్లలతో తానూ కలిసి, కొండ దేవరను పూజించి మహా నైవేద్యాలనూ పెట్టాడు. ఆ నైవేద్యాలనూ తానే అరగించాడు. ఇంద్రునికడుపు మండింది. సంవర్త్రక మనే (ప్రళయకాలమేఘాలను విడిచాడు దేవరాజు. ఉరుములు మెరుపులతో రాళ్ళవాన ఎడతెగని ధారగా కురిసింది. గోవులూ, గోపజనులూ ఆపన్నులయ్యారు. కృష్ణా! గోపాలా! కాపాడవయ్యా! అని వారు ప్రార్హించారు. రాళ్ళవానను రాళ్ళతోనే అడ్డగించాలనుకొన్నాడు నీలపు డాలు నేలు మెయినిగ్గులు గల్గిన బాలుడు.

“క్షుతృడ్వ్యధాం సుఖాపేక్షాం హిత్వాతైర్రజవాసిభిః।

వీక్ష్యమాణో దధారా!ద్రిం సప్తాహం నాచలత్పదాత్‌! (భాగ. 10.25)

లీలామానుష వి[గ్రహుడాగిరీంద్రాన్ని కుడిచేత్తో లేవనెత్తి గొడుగు లాగా పట్టుకొన్నాడు. ఒక్క అడుగైనా ముందుకో, వెనుకకో వేయకుండా నిశ్చలుడై నిలబడ్డాడు. గోగోపసంఘాలు సామగ్రితోపాటు వచ్చి భయపడుతూ గుట్ట క్రింద నిలిచారు. చాలా సేపయింది, నీ చెయ్యి అలసిపోయింది. ఆ పర్వతాన్ని మేమెత్తుకొంటాం. మా చేతుల్లో పెట్టమంటూ గొల్లలు తమ చేతులెత్తి గుట్టను పట్టుకొన్నారు. చతురనటమూర్తి లేనగవుతో నగాన్ని చయ్యన వదలివిడిచాడు. వారు గుట్ట బరువుకు నోటమాటరాక పండ్లిగిలిస్తూ 'కీ అని మొరపెట్టారు.

150 నారాయణ శతకం ఈ సందర్భాన పోతన భావ, రూప, రచనా సౌందర్యాన్ని గమనిద్దాం. “బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జూలండోయని దీనిక్రింద నిలువన్‌ శంకింపంగాం బోల దీ శైలాంభో నిధిజంతుసంయుతధరాచ(క్రంబుపై. బడ్డ నా కేలల్లాడదు బంధులార! నిలుండీక్రిందన్‌ (బ్రమోదంబునన్‌!” “వహరిదోర్షండము. కామగుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్‌ పరగం జాటెడు తోయబిందువులు గోపాలాంగనాపాంగ హా సరుచుల్‌ రత్నచయంబుగాగ నచలచ్చత్రంబు శోభిల్లై ద డ్లిరిభిద్దుర్మదభంజిరై జలధరాక్షిన్నప్రజారంజిల్రై॥” (భాగం (ఛత్రాకం = పుట్టగొడుగుకాదు. సానయవరూపకాలంకారంచేత. గిరియే, మానవులు. వానలో విప్పి పట్టుకొనే గొడుగుగా ఆవిష్కృతమైన అద్భుతశిల్పమిది. అస్తు. శ్రీకృష్ణభగవానుడేడు దినరాత్రాలెత్తి పట్టుకొన్న గుట్ట (క్రింద నిర్భయంగా నివసించిన గోగోప సంఘాలకు ఆహారని(ద్రావసరాలే కలుగలేదు. గోకులాన్ని కాపాడినందువల్ల ఆ గోత్రానికి “గోవర్టనగిరి” అనీ, శ్రీకృష్ణునికి 'గోవర్ధనోద్దరణు' డనీ అన్వర్హనామమేర్చడింది.

మూడులోకాల కధిపతి ననే గర్వంకల ఆఖిండలునికి హడలెత్తింది. వెంటనే ఆయన కామధేనువుతో, దేవతలతో వచ్చి శ్రీకృష్ణపురమాత్మను క్షమింపు' మని పాదాలపై పడి ్రార్జించాడు. కామధేనువు పాలతోనూ, ఇంద్రుడు ఐరావతంతెచ్చిన మిన్నేటి జలంతోనూ శ్రీకృష్ణురమాత్మను అభిషేకించి గోవింద నామంతో పూజించినట్లు పురాణగాధ. -

మ. లలితాకుంచితవేణియందడవి మొల్లల్‌ జాణ ఫాలస్టలిన్‌

దిలకం బొయ్యన జాజ( గుండలరుచుల్‌ దీపింప లే/జెక్కులన్‌ మొలక న్నవ్వుల చూపులోరగిల మేమ్మువ్వంకలన్‌ బోనంగా వలిగైకొందువు గాదె నీవు మురళీ నాట్యంబు నారాయణా॥ 53 అర్థం : ఓ నారాయణా! లలిత+ఆకుంచిత వేణియందు = అందంగా ముడువబడిన జడయందు; అడవిమొల్లల్‌ జాజి; ఫాలస్ట్రలిన్‌ = నుదుట; తిలకంబు = బొట్టు; ఒయ్యన జాజు = తిన్నగా జాఆ; కుండలరుచుల్‌ = కర్ణాభరణాలైన కుండలాలకాంతులు; లే, చెక్కులన్‌ = లేత చెక్కిళ్ళయందు; దీపింప = (ప్రకాశింపగా? మొలక నవ్వుల చూపులు = చిరునవ్వులతో కూడిన చూపులు; ఓరగిల = ప్రక్కలకు వాలగా; మేను = శరీరం;

రాఘవీయవ్యాఖ్య 151 మువ్వంకలన్‌ పోవగా = మూడు మల్కలుకాగా; నీవు; మురళీ నాట్యంబు = వేణువునూదుతూ చేసే నృత్యం; నలిన్‌ = యోగ్యంగా; కైకొందువుగాదె = చేపడ్డావుకదా!

తా £: ఓ నారాయణా! నీవు మురళీ నాట్యానికి పూనుకొన్నప్పుడు అందంగా ముడిచిన జడలోని అడవి మొల్లపూలు జాజుతుంటాయి. నుదుట పెట్టిన బొట్టు మెల్లగ జాజుతుంది. కుండలాల కాంతులు స్నిగ్టకపోలాలపైన (ప్రకాశిస్తాయి. మొలకనవ్వుల చూపులు ఓరగిల్లుతాయి. దేహంమూడు వంకల తిరుగుతుంది. నీ సంకల్పానికి యోగ్యంగా నాట్యం చేస్తావు.

వ్యాఖ్య :; మురళీనాదవినోదివర్లన.

క్రియాశక్తి ఇచ్చాశక్తిని అనుసరిస్తుంది. శ్రీకృష్ణభగవానుడు సత్యకాముడు, సత్యసంకల్పుడు “నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి” (భ.గీత. 3.22). ఆయనకు మూడులోకాల్లో పొందవలసిందిగానీ, పొందబడనిదిగానీ లేదు. కాబట్టి కర్తవ్యమనేది ఆయనకు లేదని వేరీ చెప్పనక్కర లేదు. అయినా అందరి లాగా తానూ లోకవ్యవహారాలను నిర్వర్తించాడు. "లోకసం[గ్రహకర్మకు తార్కాణంగా తననే శ్రీకృష్ణుడు నిరూపించుకొన్నాడు. గోకులంలోని బృందాననంలోని ఆయన లీలలన్ని అద్భుతాలు, అతిమానుషాలు. ఎన్ని కడగండ్లు కలిగినా, ధైర్యంగా వాటిని ఎదుర్కొంటూ ఎల్లప్పుడు ఆనందంగా ఉండేవాడు. ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తూ ఆదర్శ ప్రాయంగా ఉంటాడు.

సంకల్ప సిద్దుడైనందువల్ల శ్రీకృష్ణుడు స్వేచ్చగా గైకొన్న మురళీనాట్యభంగిమ జగన్మోహనంగానే ఉంటుంది. మురళీ వాదనకు అనుగుణంగా ఉన్న అఆమూర్తిత్వమూ, ఆనటనాచాతుర్యమూ ఆననుకరణీయం.

పాయలు దీసిన కురులతో పాము తీరల్లిన జడను లలితంగా ముడిచి తుజిమిన అడవి మొల్లపూలు జూరిపోతుంటాయి. అలలాటాన పెట్టిన కస్తూరి తిలకం తిన్నగజాజుతుంటుంది. లేతబుగ్గ చెంపలమీద చెవుల కుండలాల కాంతులు తళుకు లీనుతుంటాయి. మొలక నవ్వులతో ఓరచూపులు జతగూడుతుంటాయి. ఆ కేకరాలోకనాలవరకున్న చతుర ప్రక్రియల ఒక్క ముఖారవిందంలోనే గోచరిస్తుంటాయి. అధరమందానించిన వేణువును, సవ్యాపసవ్యకరాంగుళులు సుషిరాలను మూస్తూ తెరుస్తూ కర్ణామృతంగా నినదింపచేస్తుంటాయి. వదనం వామభాగానికి వంచి ఉంటుంది. డాకాలిమీద కుడికాలు అడ్డంగా సాచి ఉంటుంది. మురళిని పూరిస్తున్నప్పుడు శ్రీకృష్ణునిమేను మూడు వంపులతో ఉంటుంది.

నాట్య భంగిమలో 'త్రిభంగి' ఒకటి. తల, నడుము, కాళ్ళను కొంచెం వంచి విలాసంగా నిలుచున్న సం నివేశం,

శ52 నారాయణ శతకం

“త్రిభంగీసమితం గాత్రం పొదొ చ స్వస్తికీకృతా!

వక్షస్థః ఖటకో వామో దక్షిణశ్చాలవల్లవః।

ఉత్తానశిరసస్తస్య త్రిభంగీకరణం తధా॥ః” (భరతకోశం)

ఇలా, (త్రిభంగ్‌ లక్షణంగా నిల్చి మురళీ నాట్యం చేస్తున్నప్పుడు, గా 'త్రంలో శిరస్సు ప్రధానమైనది. పద్యంలో మొదట '్రయుక్తమైన లలిత శబ్దం (విశేషణం) వల్ల బాలకృష్ణుని కరచరణాది అంగవిన్యాసమే కాక భ్రూనేత్రాది విక్షేపాలూ సూచితాలే. "సుకుమారతయాంగానాం విన్యాసో లలితం భవేత్‌” అని కావ్యాలంకార సం(గ్రహం.

“స్తుక్షుమారవిధానేన _ భ్రూనేత్రాదివిక్రియా సచివకరచరణాంగవిన్యాసో లలితమ్‌” (అమర సుధవ్యాఖ్య) అని, లలిత శబ్దానికి వివరణ. కాబట్టి, ఈ నాట్య భంగిమలో ముడిచిన జడనుంచి పూవులు జారడం, ఉన్న చోటునుంచి బొట్టుకారడం, కపోలాలయందు కుండలాలకాంతులు (ప్రసరించడం, మేను మువ్వంకలు పోవడం, అపూర్వమనోహరవిన్యాసమేకదా! శా. మా పాలంగడుగ్రావ్వి గోపికలతో మత్తిల్లి వర్తించు వే

మా సాలెంబుల వచ్చియుండుదు వెసన్మాపాలలో నుండుమీ మాపాలైన సుఖాబ్ధిలో మునుగుచున్‌ మన్నించి తా గొల్లలన్‌ మాపాలం గలనేల్ప వీవె యని కా మన్నింతు నారాయణా॥ 5% అర్థం ; ఓ నారాయణా! మా పాలన్‌ కడు॥క్రొవ్వి = మా గోవుల క్షీరాలతో బాగాబలిసి; గోపికలతో; మత్రిల్లి = మదించి; వర్తింతువే! మాపాలెంబులు = మా పల్లెల్లో: వచ్చి ఉండుదువు; వెసన్‌ = వెంటనే; మా పాలలోన ఉండు = మా పక్షాన ఉన్నట్టి; మీ మా పాలైన = మీకు మాకు విభక్తమైన: సుఖ+అద్దిలో = సుఖసముద్రంలో; మునుగుచున్‌ = అవగాహిస్తూ; ఆ గొల్లలన్‌ = ఆగోపజనులను; మన్నించితి = కాపాడితివి. (కాబట్టి) మాపాలన్‌ కల వేల్చవు = మా దగ్గర ఉన్న దేవుడవు; ఈవె అని కా = నీవే అని కదా! మన్నింతు = ఆదరంతో భావింతును.

తా ; ఓ నారాయణా! మా అవుల పాలు త్రాగి బాగా బలిసి, గోపికలతో మదించి (ప్రవర్రిస్తుంటావు. మా పల్లెల్లో వచ్చి ఉంటావు, మాపక్షాన ఉండే మీ, మా భాగమైన సుఖజలధిలో మునుగుతూ ఆ గొల్లలను క్షమించి కాపాడావు. మా పాలిట దేవుడవు నీవే అని కదా గౌరవిస్తాను.

వ్యాఖ్య : గోపకుల వేలుపు శ్రీకృష్ణభగనానుడని వర్గితం,

గొల్లవారికి ఇలువేల్పు నందనందనుడు. ఆయన దయాళువై తనంతతానే

రాఘవీయవ్యాఖ్య 153 నందగోక్షులానికి వచ్చియున్నాడు. ఆనాటినుంచి ఆ పల్లెలోని ప్రతి గృహంలో పాడి వృద్ధి అయింది. పాలెన్నో నెయ్యి అంతే లభిస్తున్నదట. “యదా చ కృష్ణ ఉద్భూతస్తదాప్రభృతి మే గృహేః యావద్దుగ్ధం సముద్భూతం తావదేవ ఘృతం భవేత్‌” కాబట్టి గోపాలకృష్ణుడు గొల్లల ఇండ్లల్లో ఉన్న పాలను త్రాగి జిడ్డుగా, దొడ్డుగా బలిశాడు. గోపికలకు మదనగోపాలుడయ్యాడు. “అహోభాగ్య మహో భాగ్యం నందగోపవ్రజౌకసామ్‌। యన్మిత్రం పరమానందం పూర్ణం (బ్రహ్మ సనాతనమ్‌॥” అన్నట్లు ఆయన సుఖమే వారిసుఖం. (వ్రజవాసులందరికి ఆ పరబ్రహ్మ మిత్రధేయంగా ఉండడం వారి భాగధేయం. 'పాలు” పదాన్ని అవృత్తి చేసిన (శ్లేషతో కూడిన) యమక మనే శబ్దాలంకారం కల పద్యమిది. మ. ఒక కాంతానుణికొక్కండీవు మటియు న్నాక్కర్తై కొక్కండవై సకలస్రీలకు సంతసంబలర రాసక్రీడ తన్మధ్య క ల్పకమూలంబున వేణునాదరస మొప్పంగా. బదార్వేలగో సికలంజెంది వినోద మొందునెడ నీ పెంపాప్తు వారాయణా॥ 55 అర్ధం : ఓ నారాయణా! ఒక కాంతామణికి = ఒక ్రీకి; ఈవు = నీవు; ఒక్కండవు; మరియున్‌ ఒక్కర్తుకు; ఒక్కండవై; రాసక్రీడ; సకల(స్త్రీలకు = ్రీలందరికి; సంతసంబు లలరన్‌ = సంతోషంకలుగగా; తత్‌ + మధ్యకల్పక మూలంబు = ఆరాసలీలకు నడుమ ఉన్న కల్పతరువు యొక్క ఆలవాలం; సవేణు నాదరసము = మురళీనాద రసంతో కూడినదై; ఒప్పంగా = కోభించగా; పది + ఆర్వేల గోపికలన్‌ చెంది; వినోదము, ఒందున్‌, ఎడ = వినోదాన్ని (ఆనందం) పొందుతున్నప్పుడు; సీ పెంపు = నీమహిమ; ఒప్పున్‌. తా ; ఓ నారాయణా! ఒక్కొక్క గోపికకు నీవు ఒక్కొక్కడవై వృత్తాకారంగా బారుదీరి మగువలందరు మురిసిపోతుంటే, ఆ రాసమండలానికి నడుమ కల్పతరువు క్రింద నీవు వేణునాదాన్ని సరసంగా పూరించావు. ఇలా (16) పదారువేల గోపికలతో కూడి వినోదిస్తున్నప్పుడు నీ వైభవం సకలలోక శ్ఞాఘనీయమయింది, వ్యాఖ్య : శ్రీకృష్ణుని రాసక్రీడ వర్లితం. రసమయమైైనది రాసలీల, “రసగ్గ్‌హ్యావాయం లబ్బాఒనందీ భవతి” 'ముక్తపురుషుడు రసికుడైన భగవంఛుణ్ని పొంది (బ్రహ్మానందాన్ని పొందుతా”డని ఉపనిషద్వాణి. “సర్వాస్తాః కేళశవాలోక సరమోత్సవనిర్సృతాః జహుర్విరహజం తాపం (ప్రాజ్ఞం ప్రాప్య యథా జనాః!”

154 నారాయణ శతకం ముముక్షువులు పరమజ్ఞానిర్రైన సత్సురుషుణ్ని పొంది సంసారబాధనుంచి ముక్తులయ్యే రీతిగా, గోపికలందరు శ్రీకృష్ణుని దర్శనస్పర్శనాదులవల్ల పరమానందాన్ని పొంది విరహతాపంనుంచి విముక్తటయ్యారని భాగవతం (10.32-9) విశదీకరిస్తుంది. “రాసోత్సవ స్పం(ప్రవృత్తో గోపీమండలమండితః। యోగేశ్స్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ష్యయోఃః” (భాగ 10.33.3) నారికి నారికి నడుమ యోగేశ్వరుడైన కంసారి, మళ్ళీ తన కిరువైపుల ఇద్దరు ఇంతులచొప్పున మండలాకారంగా సల్పిన మంజా క్రీడయే రాసక్రీడ. ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క కృష్ణుడుగా ఒక్కడే అనేకరూపాలతో ప్రకటితుడై ఆడుతూ పాడుతూ సకలగోపికలను ప్రేమపూర్ణ్వమైన ఆనందజలధిలో ఓలలాడించాడు. ఆరాసమండలం నడుమ ఒక కల్పవృక్షమున్నది. ఆ చెట్టు క్రిందను తాను మురళీగానం చేస్తూ నిలిచాడు. మండలాకారంగా నృత్తగానాలతో తిరుగుతూ ఉంటే, ఆ మురళీగానరసంతో ఆ చెట్టుకున్న పాదు నిండిపోయింది. ఎంత రాసిక్యమో! ఎంత మధురిమయో! ఇది ('ప్రేమసేవ, త్యాగంతో కూడి నిర్మలమైన ఆత్మ సంయోగ మనక తప్పదు. ఇలా పదహారువేలగోపికలందరికీ తానందరై వినోదించిన చందం సకల జన మనోనయనానందకరం. “అంగనా మంగనామంతరీ మాధవో మాధవం మాధవం చాంతరేణాంగనా! ఇళ్ధ మాకల్పితే మండలే మధ్యగః సంజగౌ వేణునా దేవకీనందనః।” (కృష్ణకర్ణామృుతం 2. ఆ. 35) మ, లలితంబైన భవత్తమావిలసనన్‌ లావణ్యదివ్యానృుతం బలుంగు ల్వారంగ నీ కటాక్షమునందామందంద గోపాంగనల్‌ తలంపుల్‌ పాదులు కట్టి కందళిత నూత్నశ్రీలు వాటింతురా నలల్‌ శీవెలు వైత్రవిస్ఫరణ మౌ నీయొప్పు నారాయణా॥ 56 అర్థం : ఓ నారాయణా! లలితంబు ఐన = సుకుమారమైన; భవత్‌+తనూ, విలసనన్‌ = నీ శరీరవిన్యాసంవల్ల: లావణ్య దివ్య+అమృతంబు = సౌందర్యమనే అలౌకికమైన అమృతం (జలం); నీకటాక్షమునన్‌ = నీ కన్నుల కొలకుల నుంచి; అలుగుల్‌ పారగ = పాయలైసారగా; గోపాంగనల్‌ = గొల్లపడుచులు; తాము, అందు, అందె = వారక్కడక్కడనే; తలపుల్‌ = కోరికలు; పాదులుకట్టి కందళిత, నూత్నశ్రీలు = మొలకలెత్తిన కొత్త సంపదలుగల; ఆనెలతల్‌ తీవెలు = ఆ స్త్రీలు అనే లతలు; చైత్ర

రాఘవీయవ్యాఖ్య 155 విస్ఫురణమౌ = చిత్రంగా శోభించే: నీ ఒప్పు =నీ సమ్మతిని; పాటింతురు = అంగీకరించి అనుసరిస్తారు. నీ ఒప్పు వసంతవికాసమే.

తా : ఓ నారాయణా! సుకుమార మైననీ శరీరావయవవిన్యాసంవల్ల సౌందర్యమనే అప్రాకృతజలం (అమృతం) నీ కనుగొలుకులద్వారా అలుగు ల్పారుతుంటే; గోపికలు అక్కడక్కడనే భావాలనే పాదులు కట్టారు. నూత్నసంపదలంకురించిన ఆనెలతలే లతలు. చిత్రంగా శోభించే నీ ఒప్పును వారు పాటిస్తారు.

వ్యాఖ్య: భగవంతునిప్రవృత్తిని గోపికలు అనుమతించేవర్లన.

బాలకృష్ణుని శరీరం చాలా సుకుమారమైనది. ఆశరీరావయవాలనుంచి తళతళకాంతులీనుతుంటాయి. ఆఒయ్యారం చూస్తున్నకొద్ది పెరుగుతుంది. “సుకుమారతయాంగానాం. విన్యానో లలితం భవేతి' హస్తపాదా ద్యవయవాలనొయ్యారంగా ఉంచడమే 'లలితి లక్షణం.

నడకలో, ఉనికిలో, సంభాషణంలో సంవీక్షణంలోనూ ప్రకాశించే ఇష్టమైన వికారమే విలసనం లేదా విలాసం.

“యానస్థానాసనాదీనాం ముఖనేత్రాదికర్మణాం।

విశేషస్తు విలాసస్స్యా దిష్టసందర్శనాదినా;” అని 'విలాస' లక్షణం.

ఆ శరీరంలో సర్వాంగాలయందు. మిన్నేటి జలం లాగా లావణ్యం తొణికిసలాడుతుంది. భగవంతుని ప్రత్యవయవశోభ అసాధారణం. ఒక అవయశోభను చూస్తున్నప్పుడు 'నన్ను విడిచి వేరొక చోటికి పోవద్దు' అని నిర్బంధిస్తున్నట్లుగా వేరొక అంగశోభను చూడాలనే తలపే కలుగదు. అట్టి (ప్రత్యంగశోభయే సౌందర్యం.

'కంబరామాయణం'లో శ్రీరాముని ప్రత్యంగశోభ ఇలా వర్షింపబడింది. “తోళ్‌ కణ్ఞార్‌ తోళే కణ్డార్‌...తాళ్‌ కణ్డార్‌ తాళే కణ్ఞారొ” -

బాహువులను చూచేవారు బాహువులనే చూచారు. పాదాలను దర్శించేవారు పాదాలనే దర్శించారట. 'లావణ్యం' అంటే సుందరమైన అవయవాలకలయిక వల్ల ఏర్పడే సముదాయ శోభ, శ్రీ పరాశరభట్టర్‌ శ్రీరంగనాధుని లావణ్యాన్ని చూచే తననేత్రాన్ని చమత్కారంగా సంబోధించి వర్షించారు.

“త్వాం సౌభ్రాత్రవ్యతికరకరం రంగరాజాంగకానాం

తల్దావణ్యం పరిణమయితా విశ్శపారీణవృత్తి ॥”(శ్రీరంగరాజస్తవం.89)

'ఓమందచక్షూ! స్వామి దివ్యావయవాలన్నిటిలోగల సౌందర్యాన్ని ఎలా అనుభవించాలని శంకించకు. అనురాగంగల సోదరుల పరస్పర సంబంధం, ఇతరులకు వారితో సత్సంబంధాన్ని కలిగించే రీతిగా స్వామిలావణ్యం, అవయవాలమధ్య, పరస్పరసంబంధం కలది కాబట్టి అన్ని అవయవాల శోభను పూర్తిగా నీవు అనుభవించేటట్టు చేస్తుంది. అని పూర్వశతకంలో వర్షితం.

156 నారాయణ శతరం

అహిర్చుద్ద్యసంహిత లావణ్యాన్ని ఇలా నిర్వచించింది.

“భూయిస్టం తేజ ఏవాద్భిర్బహులాభిర్భృదూకృతమ్‌!

చక్షురానందజననం౦ం లావణ్య మితి కధ్యచే॥” (52అధ్యా)

'“అధికజలంతో మృదువుగా చేయబడిన, నయనాలకానందాన్ని కలిగించే గొప్ప తేజస్సు 'లావణ్యం' అనబడుతుంది.

గోపడింభకుని దివ్యావషయవపరస్పరసౌందర్యమనే దివ్యామృతం ఆయన కడకన్నులనుంచి అలుగులు పారింది.

శ్రీశరకోపముని “ముడిచ్చోదియామ్‌ ఉనదు ముకచ్చోది మలర్‌న్హదువో”(తి.వామొ.)

“శ్రియఃపతీ! నీకిరీట శోభగా నీముఖశోభ వికసించిందా? లేక, నీ ముఖ శోభగా నీకిరీటశోభ మారిందా?” అని వర్షించారు.

జలమధికమై కట్టకొనకున్న దారినుంచి అలుగులు పారినట్టే ఆవయవాల సాముదాయక తేజుపుంజం కనుకొలకులనుంచి (ప్రసరిస్తుంది.

"చ్వదీక్షణసుధాసింధువీచివిక్షేపశీకరైః” - (దేవరాజాస్టకం) తిరుక్కచ్చినంబి “భగవంతునినేత్రాలను అమృతనదులతో పోల్చిన విషయం” గమనీయం,

నయనాంచలాలనుంచి దొరలిన ఆలావణ్యదివ్యామృతాన్ని గోపికలు తమ శరీరలతలు ఏపుగా ఎదుగడానికి తమ తలపు (భావా) లనే పొదుల్లో నిల్బారు. “రమణీయం (ప్రసన్నాంబు సన్మనుష్యమనోయథా” (రా.బాల:) బురదలేని స్వచ్చమైన నీరు మంచిమనిషియొక్క మనస్సులాగా రమణీయంకదా!

'తలపులు' అంటే భావాలు. రసజ్ఞానయోగ్యమైన మనోవికారమే. భావం.

“నిర్వికారాత్మకే చిత్తే భావః (ప్రథమ వి[క్రియా” (సాహిత్వ్యదర్పణం.)

నిర్వికారంగా ఉన్న అంతకరణంలో (యౌననారంభంలో) మొట్టమొదట కలిగే కోరికను తెలిపేది 'భావం” అని విశ్చనాధకవిరాజు అన్నాడు.

వికారంయొక్క అనుభవాలు శరీరంలో కనబడకుండా, కేవలం మనస్సులో కలిగే వికారం 'భావి మని ఇలా ఉదాహరించాడు.

“సఏవ సురభిః కాలః సఏవ మలయానిలః

సైవేయ నుబలా; కింతు మనోఒన్య దివ దృళ్యతే;” (సాద)

“ఆవసంతకాలమే ఇది. ఆమలయానిలమే ఇది. ఆ అబలయే ఇది. కాని మనస్సు మాత్రం అది కానట్టున్నది,

'పాదు'లంటే మొక్కలచుట్టూ. నీరు నిల్వడానికి కట్టే గుంటలు. పాదులు కట్టడంవల్ల (కోరికలీరెత్తికొత్తశోభను సంతరించుకొంటాయి తీగలు, ఆనెలతలే ఈ తీవెలు. ఇది చైత్రవిస్ఫురణం,.

రాఘవీయవ్యాఖ్య శేర్లో “చిత్రం వా ఏతత్కర్మ' అనే (శ్రుతివాక్యంవల్ల చిత్రవిచిత్రమైన ఈ కార్యకలాపం భగవంతునికి ఇష్టమైనదే, సమ్మతమైనదే అనీ తెలుస్తుంది. “గో శబ్దానికి 'ఇంద్రియ' మని అర్ధం. ఇంద్రియాలచేత భగవంతుని లావణ్యామ్చతాన్ని పానంచేసేవారు. గోపికలు అని వ్యుత్సత్య్యర్ణం. (గోభి; భగవద్రూపగుణసౌందర్యామృతం పిబంతీతి = గోష్యః : గోపాల భగవత్కటాక్షంవల్ల లతలలాగా లలితంగా ఉండే గొల్లనెలతలు, భగవత్ష్రయత్నానికి అడ్డుతగులకుండా ఆయన సమ్మతిని అనుమతిస్తారు. స్వామి ఇష్టమున్నట్టు తమను ఉపయోగించుకోవడానికి అంగీకరించేవారు గోసస్త్రీలని సారాంశం. “పరార్డైక ప్రవృత్తి శేషత్వం. పరాధీన ప్రవృత్తి పొరతంత్యం.” ఈరెండూ స్వరూపంగా కలజీవులు గోపికలని పూర్వాచార్యులు బోధించారు. 'చిత్రం'అంటే, చిత్తాన్ని హరించేది. “చిత్రా నక్షత్రం భవతి” (క్రుతివాక్యం) చిత్ర తారాస్వరూపం సగం కన్యకు సగం తుల కు వర్తిస్తుంది. 'తులిలో (ప్రమాణం, (ప్రమేయం, రెండూ ఉంటాయి. బాటురాయి. ప్రమాణమైతే వస్తువు [్రమేయమవుతుంది. సమతౌల్యంగా ఉండే బింబప్రతిబింబధర్మమే చిత్రం. “విష్ణోర్విచిత్రాః ప్రభవంతి మాయా?” విష్ణుమూర్తి మాయలే చిత్రవిచిత్రాలుగా ఉంటాయి. “దేవకీ సుతుకోర్కె త్రీవెలు వీడంగ, వెల(దికి మెయిదీగ వీడందొడలా” ఈ, సమౌలంకార సజ్జితమైనదే చిత్రం. చిత్రమే వైత్రం. బాలకృష్ణుని లీలాస్రవృత్తి చైత్రవిస్పురణమే. చిత్రానక్షత్రంతో కూడిన పున్నమ కలనెలను వ్రైత్రమాసమంటారు. “సత్రం శ్రీమానయం మాప; పుణ్యః పుప్పితకాననః (ర,ఆయా 'వపుర్మందారస్య [ప్రథమకుసుమోల్దాససమయవా (శ్రీరంగరాజస్తవం 90) శ్రీరంగనాథుని శరీరమనే మందారతరువుకు మొదటి పూవుపూచే సమయం అని తారుణ్యశోభను వర్లించారు. శ్రీ పరాశరభట్టర్‌: “ఇవ్విడత్తిల్‌ అవయవస్ఫూర్తిహితుతయా పుస్ఫోత్పత్తి కాలమాకవుమ్‌, అవయవసౌందర్యస్పూర్తిహిచతుతయా అన్ష పుష్పవికాసమాకవుమ్‌” ఇక్కడ, భగవంతునిఅవయహాలస్పూర్తి పూవు పుట్టేకాలమనీ, అవయవ సౌందర్యం స్ఫురించడంవల్ల పుష్పవికాసమనీ, శ్రీవాధూల రాఘవాచార్య వ్యాఖ్య - తారుణ్యశోభను వివరించింది.

158 నారాయణ శతకం చైత్రమాసంలోనే తరువులు విరులతో అలరారుతుంటాయి. అది వసంతర్హువే,. “వసంతే పుష్పసమయ:”" (అమరం) లోకులకు యౌవనవికాసానికి కాలపరిమితి ఉంది. శ్రీకృష్ణుడు నిత్యయౌవనుడుకదా! అందువల్ల “బుతూనాం కుసుమాకరః” (భగ) తాను ఎల్లప్పుడూ “వసంతర్హువునే” అని స్పష్టపరచాడు. “స్రైత్రవిస్ఫురణమౌ నీయొప్పు నారాయణా!” అన్నాడు ఈ కవీశ్చ్వరుడు. రూపకాలంకారంతో సమాలంకారం దీపించిన పద్యమిది. శా లీలన్‌ పూతనప్రాణవాయువులు పాలిండ్లందు వెళ్లించి, దు శ్చీలుండై చను బండిదానవు వెసం జిందై పడం దన్ని యా రోలన్మద్దులు గూల్చి ధేను దనుజున్‌ రోజంగ న్‌ల్గించి, వే కూలన్‌ కంసునింగొట్టీ గోసికల కోర్కుల్‌ దీర్తు నారాయణా॥ 57 అర్ధం: ఓ నారాయణా! పూతన (ప్రాణవాయువులు = పూతనలఅనేరాక్షసి ,యొక్క (ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనే పంచ విధాలైన గాలులను; లీలన్‌ = (క్రీడగా పాలిండ్లయందు; వెళ్ళించి = దేహంనుంచి పోగొట్టి; దుళ్ళీలుండై చను = దుష్టస్పభావంతో బతుకుతున్న; బండి దానవుని = శకటాసురుణ్ని: వెసన్‌ = వేగంగా; చెందై = శిధిలమై; పడన్‌, తన్ని ; ఆరోలన్‌ = (తల్లి తనను కట్టివేసి) ఆరోటితో; మద్దులు = రెండు మద్ది చెట్లను; కూల్చి; ధేను దనుజున్‌ = ధేనుకాసురుణ్ని; రోజుంగ నీల్లించి = చంపి; కంసునిన్‌; వే, కూలన్‌ కొట్టి = వేగంగా ఈడ్చి చంపి; గోపికల కోర్కెల్‌ తీర్తువు. తా : ఓనారాయణా! పూతన చనుపాలను (త్రాగి అలవోకగా ప్రాణాలను తీశావు. దుర్గుణంగల శకటాసురుణ్ని ఎగిరి ముక్కలై పడేలాగా తన్ని చంపావు. రోటి నీడ్చుకొంటూ పోయి రెండు మద్దిచెట్టను కూల్చావు. ధేనుకాసురుణ్ని దమ్ము ఎగపోస్తూ నేలకొరిగే లాగా చేశావు. కంసుణ్నీ అతని సింహాసనర నుంచి జుట్టు పట్టి లాగి కొట్టి మట్టికరిపించావు. గోపికల కోరికలనీడేర్చావు. వ్యాఖ్య : శ్రీకృష్ణుడు శిష్టరక్షణకోనం దుష్టులను శిక్షించిన వర్లన. దేహంలో ఉండేవాయువులు సాధారణంగా ఐదు. (ప్రాణవాయువు హృదయంలో ఉంటుంది. ఇది కడుపులోకి అన్నపానాలను ప్రవేశింపజేస్తుంది. అపానవాయువు గుదస్టానంలో ఉంటుంది. ఇది మలమూత్రరేతస్సులను [క్రిందికి తోసేస్తుంది. వ్యానవాయువు శరీరమంతటా ఉంటుంది, ఇది రక్తాన్ని, చెమటను, రెప్పపాటును పుట్టిస్తుంది. ఉదానవాయువు కంఠమందు ఉంటుంది. ఇది ధ్యనిని మోదికి తెప్పించి

రాఘవీయవ్యాఖ్య 159 మాటలను పుట్టిస్తుంది. సమానవాయువు నాభియందు ఉంటుంది, ఆహారాన్ని జీర్షింపజేస్తుంది. దేహాధారులు ఈ పంచవాయువులతో జీవిస్తుంటారు, వీటిన పంచప్రాణాలంటారు.

పూతన అనే రాక్షసి కంసునిప్రేరణతో ఇష్టమైన రూపాన్ని ధరిస్తూ పసిపిల్లల ప్రాణాలను తీస్తూ (వ్రేపల్లైకు వచ్చింది. రాత్రిపూట నందునింటికి సుందరమైన స్త్రీ రూపాన్ని ధరించి బాలకృష్ణుళ్లు విషపూధితమైన చనుపాలనిచ్చి చంపడానికి ప్రవేశించింది. రోహిణీయకోదలు పూతన సౌందర్యాన్ని చూచి ముస్టలయ్యారు. కన్నులు మూసుకొన్న చిన్ని కృష్ణుణ్ని చంకకెత్తుకుని అతని నోటిలో స్తనాన్ని పెట్టింది పూతన. దాని రెండు చన్నులను. రెండు చేతులతో గట్టిగా పట్టుకొని, కృష్ణుడు దాని పాలతో పాటు పంచప్రాణాలముకూడా పీల్చేశాడు.

“గాఢం కరాభ్యాం భగవాన్‌ ్రపీడ్య తత్రాణైస్సమం రోష సమన్వితోఒపిబత్‌' (భాగశ0స్కం.6 అధ్యా]11ళ్లు

శ్రీకృష్ణుడు పరివర్తనోత్సవం. నాడు అంటే, - నక్షత్రాన్ని బట్టి జన్మదినం - పుట్టినతర్వాత 27వ దినం (81గ%640 నాడు, యశోదాదేవి పేరంటానికి వచ్చిన సువాసినులకు కానుకలను, వాయనాలనిస్తున్న సమయమది. అది వరకే, ఒక విచిత్రమైన బండిక్రింద శ్రీకృష్ణున్ని పడుకోపెట్టింది. అతడు, యకోదపాలకోసం ఏడుస్తూ తనచిన్న పాదాలనెగురవేస్తున్నా. సత్కారంచేయడంలో తన్మయులైనందువల్ల ఎవరూ వినలేదు, కనలేదు.

“రుదన్‌ స్తనార్డీ చరణా వుదక్షిపతో (భాగ.10-7-60)

శ్రీకృష్ణుని మృదువైన చిన్నపాదం తగుఅడంతోనే రక్కసుడు ఆవహించి యున్న ఆ బండి ముక్కలు ముక్కలుగా విరిగి ఎగిరి పడింది. బండిమీద పాలు, పెరుగు, వెన్నతో నిండి ఉన్న భాండాలన్నీ చెల్బా చెదరైై పడిపోయాయి.

"తస్య పొదప్రహారేణ శకటం పరివర్తితమ్‌।

విధ్వస్తకుంభ భాండం తద్విసరీతం పపాత వై" (విపు)

“విధ్వస్త నానారసకుష్యభాజనం

వ్యత్యస్తచక్రాక్షవిభిన్నకూబరమ్‌"* (భాగ10-7-74) ॥

ఒకనాడు యశోద శ్రీకృష్ణునికి చనుపాలను (త్రాగిస్తుంటే, పాయ్యిమీద పాలు పొంగిపోయే దృళ్యాన్ని గమనించింది. శ్రీకృష్ణుణ్ని తృప్తి పరచకయే క్రింద కూర్చుండబెట్టి పొలను దించడానికీ పాయ్యి దగ్గరికి పోయింది.

సాంసారికవ్యామోహం సర్వేశ్చరసన్నిధిలో ఉండనీయదుకదా!

160 నారాయణ శతకం బాలకృష్ణునికి కోపం వచ్చింది. దగ్గరున్న కజ్జతో నిండుగా పెరుగుతో ఉన్న కుండను పగులకొట్టాడు. తల్లి వచ్చి చూచింది. భయంతో కృష్ణుడు పరుగెత్తాడు. యశోద కజ్ఞను చేత పట్టుకొని శ్రీకృష్ణుణ్ని పట్టుకోవడానికి వెంట పరుగెత్తింది. ఎలాగో పట్టుబడిన కృష్ణుణ్ని తాడుతో కట్టి వేయ యత్నించింది. జగజ్ఞాలములున్న బొజ్జను కట్టవళమా! ఎన్ని త్రాళ్ళు తెచ్చి అతుకులు పెట్టినా, ఎప్పటికీ రెండంగుళాలు తక్కువ అవుతుండడం అందరికి వింతగా కనబడింది. అలసిపోయిన తల్లి స్తితిని చూచి కన్నయ్య తానే దయతలచి కట్టుబడ్డాడు. త్రాటి యొక కొనతో అచేతనమైన రోటిని ఎలా కట్టివేసిందో, మరొక కొనతో పరమచేతనుడైన కృష్ణభగవానుణ్ని అలాగే కట్టివేసింది. యశోద రోషంతో “యది. శక్నోషి గచ్చ త్వమతిచంచలచేష్టిత” - (విపు “ఓరి చంచలుడా! సామర్యముంటే ఇప్పుడుపోరా!” అంటూ, తన ఇంటిపనులలో మనగ్నమయింది. స్వతంత్రుడు పరతంత్రుడయ్యాడు. ఇతరులను బంధంనుంచి విడిపించడానికి తాను బంధితుడవడమే దామోదరలీల. “దామోదరాయ నమః” నలకూబరుడు, మణిగ్రీవుడనే యక్షులు కుబేరుని కుమారులు. వారు సౌందర్యం ఐశ్చర్యసంపన్నులు, రుద్రునిఅనుచరులు. అఖర్వగర్విష్టులై అచ్చర లేమలతో కూడి నగ్నంగా గంగానదిలో జల'క్రీడలు సలుపుతుంటే నారదమహర్షి చూచాడు. అప్సరలు వెంటనే బట్టలు కట్టుకొన్నారు. కాని యక్షరాజపుత్రులు మాత్రం దిగంబరులుగానే ఉన్నారు. "పెద్దలు కనబడగానే వారిని భయభక్తులతో గౌారవించక మదాంధులై ప్రవర్తించేవారు మద్ది చెట్టుగా ఉండడంమేలు' అని దేవర్షి శాపమిచ్చాడు. వారికి శ్రీకృష్ణుని సాన్నిధ్యం (ప్రాప్తించినప్పుడు పూర్వసితికలుగగలదని శాపవిమోచనాన్నీ తెలిపాడు. మహాభక్తుడైన నారదునిమాటను సత్యం చేయడానికి రోటికి కట్టివేయబడిన శ్యామసుందరుడు, నందుని ఇంటి ముందు యమళార్డునము లనే పేరుగాంచిన రెండు మద్ది చెట్ల మధ్య నుంచి రోటిని లాగుకొని పోతుంటే రోలుకు తట్టుకొన్న చెట్టు పెళపెళార్భటులతో, కూకటి (వ్రైళ్ళతో 'పెకిలినేలకు ఒరిగాయి. ఆచెట్టలోనుంచి అన్ని సమానతేజ సంపన్నులైన ఆ ఇద్దరు పురుషులు బయటకు వచ్చి శ్రీకృష్ణభగవానుని సన్నిధిలో బద్దాంజలులైై స్తుతించి పురుషార్థపరులయ్యారు. ధేనుకాసురుణ్ని, కంసుణ్ని సంహరించిన సంగతి 18వ పద్యంలో వ్యాఖ్యానింపబడింది, శ్రీకృష్ణలీలలు గోపికల కోర్కెలను సిద్ధింపచేశాయి, అనడం స్వభావోక్తియే.

రాఘవీయవ్యాఖ్య 161 మ. రసనాగ్రంబున నీదు నామరుచియున్‌ రన్యుంబుగా. జెవ్లుకు న్నసలారంగ భవత్కథాభిరతియున్‌ హస్తాబ్బ్దయుగ్మంబులన్‌ వెస నీపాదసుపూజితాదియుగమున్‌ విజ్ఞాన మధ్యాత్మకున్‌ వెసనిం పొందనివాండు దాణుశువు సూ వేదాత్మ నారాయణా॥ 58 అర్ధం: ఓ వేదాత్మ ! నారాయణా! రసన+అ(గ్రంబున = నాలుకచివర; రమ్యంబుగా = ఆడునట్టుగా? నీదు నామరుచియున్‌ = నీపేరునాస్వాదించడమూ; చెన్నకున్‌ = రెండుచెవులకు; నసలు+ఆరంగ = దురద తీరునట్టుగా; భవత్‌+కథా+అభిరతియున్‌ = నీ కథలయందు ఆసక్తి ఉండడమూ; హస్త + అజ్జయుగ్మంబులన్‌ = కరకముల ద్వయంతో; వెసన్‌ = శీఘ్రంగా; నీపాదసుపూజిత + ఆదియుగమున్‌ = నీ పాదాలను పూజించడం మొదలైనవి. (ఈ సమాసపదం సాధువుగా లేదు) ఆధ్యాత్మకున్‌ = మనస్సుకు; విజ్ఞానము = శుద్దిని కలిగించే ఆచారనిస్ట్రు వెసన్‌ = వెంటవెంట; ఇంపు = ఆనందం; ఒందనివాడు; తాను; పశువుసుమా! తా : ఓ వేదాత్మ! నారాయణా! జిహ్వాగ్రాన నామసంక్షీర్తనమే రుచించడం ఇంపు; చెవుల నసనస దీరే రీతిగా నీ కథలను వినడమందు ఆసక్తి ఉండడం ఇంపు; కేల్పమ్ములతో నీపాదపూజచేయడమే సొంపు. జ్ఞానం గల చిత్తం విజ్ఞానసహితమవడం ఇంపు. వీటిని ఇష్టపడని వ్యక్తి కేవలం పశువేసువమూ! వ్యాఖ్య : దేహసంపదమ భగవచ్చేనకోసం నినేదించడమే మానన లక్షణమని వర్లన. నాలుకకు రెండు చేష్టలున్నాయి. ఒకటి మాటాడడం, రెండవది రుచినెరుగడం. ఈ జిహ్వీంద్రియమే మనిషికీ పశువుకూ తొరతమ్యాన్ని తెల్పుతుంది. పశువుకు నాలుక ఉన్నా భగవన్నామరుచినెరుగదు. పశువుకు వెన్నుబాము తిర్యక్‌ - అడ్డం = గా ఉంటుంది కొబట్టి దానికి ఆలోచించేశక్తి శూన్యం. కాబట్టి వాటి నాలుకకు తిండి రుచి మెండు. భగవత్కధలను వినే ఆసక్తి కూడా వాటి చెవులకు కలుగదు, నాలుగు పాదాలతోనడవడమే తప్ప చేతులతో పూజించే స్వరూపంగానీ, స్వభావంగానీ పశుదేహనిర్మాణక్రియలోనే లేదు. జ్ఞానమే లేనప్పుడు దాన్ని అనుష్టించే ప్రక్రియనూ పళువెరుగదుకదా! కాబట్టి వివేకకీనులను పశువులంటారు. “విచిత్రా దేహసంపత్తిః ఈశ్చరాయ నివేదితుమ్‌। పూర్వమేవ కృతా రాజన్‌! హస్తపాదాదిసంయుతా'” చేసిన కర్మ ఫలితంగా, విచిత్రమైన కరచరణహృదయమేధలతో కూడిన మానవునిదేహసంపద భగవంతునిసేవకోసమే నిర్మింపబడింది" అని శాస్త్రం బోధిస్తుంది.

162 నారాయణ శతకం

భగవంతుడు అచేతనంలాగా పడియున్న జీవులకు మంచిబుద్దిని, మనస్సును, వాక్కును, జ్ఞాన కర్మేంద్రియాలతో కూడిన కరణకళేబరాన్ని ప్రసాదించాడు. సర్వేశ్చరునికి వినియోగించే విధానాన్ని తెలిపే శా'స్తాన్నీ అనుగ్రహించాడు. కాబట్టి భగవంతునికోసం దేహసంసత్తిని వినియోగించక పోవడం (ద్రోహమే.

రుచికి మరగిన చేపగాలానికి తగిలి నళిస్తుంది కదా!

“భగవద్గుణానుసంధానం అభయహేతు:” అన్నట్టు నరరూపంలో ఉన్న పశువే అనదగినా, పాపభీతితో నరుడు "దయాసింధో! బంధో!నిరవధిక వాత్సల్యజలధే!” (స్రోత్రరళ్నం) అని, జిహ్వకు నామరుచిని కలిగిస్తే అతనికి భయం పోతుంది, మోక్షసా(మ్రాజ్యమూ లభిస్తుంది.

కర్లేంద్రియం దుర్వినియోగమైతే ముస్తుతప్పుదు.

సాధు జంతువైన లేడి పిల్లనగ్రోవినాదానికి లొంగిపోయి. కిరాతునికి బందీ అవుతుందికదా! కాబట్టి చెవులతో భగవద్గాధలను వినాలి. జన్మజన్మాల పాపాలన్నీ తాలగిపోయి. అస్తిక్యం జనిస్తుంది. రూపానికి ఆశపడి శలభం (దీపపు పురుగు- మిడత) నశిస్తుంది. స్పర్శకోసం దంతి (ఏనుగు) గుంతలో పడుతుంది. వాసనకు ఆసపడిన తుమ్మెద (మోగి (మోగి ఉస్సురంటుంది.

శబ్దప్ప్రర్ణరూపరసగంధాలనే విషయాలుకలిగిన ఇంద్రియాలకు వశుడై మానవుడు చెడిపోతాడు.

కర్మేంద్రియాలలో ముఖ్యమైన చేతులతో భగవంతుని పూజ, భజన చేయడం వల్ల దుష్కర్మ నశించి ముక్తి లభిస్తుంది.

“కమలాన్షునర్చించు కరములు కరములు.

శ్రీనాథు వర్షించు జిహ్వ జిహ్వ” (ఆంధ్రభాగవతం),

'అత్మన్‌' శబ్దానికి దేహం, మనస్సు, బుద్ధి, జ్ఞానం, జీవాత్మ, పరమాత్మ అని నానార్జాలున్నాయి.

మంచి చెడ్డలను గ్రహించడమే వివేకం. మానవజీవనాన్ని మూడు రకాల తాపాలు ఆవరించి ' ఉన్నాయి.

  1. ఆధ్యాత్మికతాపాలు: మానసికాలైన ఉన్మాదమూర్చాదులూ, దేహానికి కలిగే రోగాలూ - ఆధివ్యాధులు.

  2. ఆది భౌతిక తాపాలు: మృగ, వృళ్ళికసర్పాది భూతాలవల్ల కలిగే బాధలు,

  3. అధిదైవికాలు: భూకంపం, తుపాను, పిడుగులవల్ల కలిగే ఉపద్రవాలు.

“తాపత్రయామయదవానలదహ్యనానమ్‌” _ (కూరేశుల వరదరాజన్తవం) తాపత్రయమనే కార్చిచ్చులో పడి కాలిపోతున్న మానవునికి 'కష్టాలనుంచి కడతేరే

రాఘవీయవ్యాఖ్య 163 దెట్లా? దైవమా!” అనే జ్ఞానం చీకట్లో మెరుపులాగా స్ఫురిస్తుంది. ఈ వివేకమే బీజంలాగా మనస్సున నాటుకొని ఆత్మరక్షణోపాయమైన నారాయణుణ్ణి ప్రార్థిస్తాడు. జ్ఞానుల ధ్యానయోగవిధానమే విజ్ఞానం. “౧120006 15 116 1951 0 11౧041660అ-ా -- అచరణమే జ్ఞానానికి గీటురాయి.

“యాన్యనవద్యాని కర్మాణి, తాని సేవితవ్యాని, నో ఇతరాణి

యాన్యస్మాకం సుచరితాని, తాని త్వయోపాస్యాని” (ఉపనిషత్తు)

“నివు మంచి పనులనే చేయాలి. దురితాలను చేయరాదు. మేమాచరించిన వాటిలోనూ సుచరితాలనే (గ్రహించి పాటించు” మని జ్ఞాన పూర్ణుడై జీవితంలో అడుగిడబోయే. శిష్యునికి 'విద్యాస్నాతకవ్రతోత్సవ" సమయాన ఆచార్యుని అనుశాసనమిది. కాబట్టి, వేదాంతశాస్త్రమే ఆధ్యాత్మ విద్య,

“అనుష్టాననిత్యత్వం స్వాతంత్ర్య నుపకర్షత్రి” (ఉత్తరరామచరిత్ర).

నిత్యానుష్థానం స్వేచ్చగా ప్రవర్రించనీయదన్నాడు భవభూతి.

ఈ శరీరం విజ్ఞానాత్మకమైన పరబ్రహ్మకు వినియోగించడమే ఇంవు, సొంపు.

“కంజాక్షునకుగాని కాయంబు కాయమే” అన్నాడు కదా భక్తపోతన.

"జిహ్వే. కీరయ కేశవం, మురరిపుం చేతో భజ, శ్రీధరం

పాణిద్వంద్వ సమర్చయ, " అచ్యుతకథాః శ్రోత్రద్వయ త్వం శృణు!

కృష్ణం లోకయ లోచనద్వయ! హరేర్గ్షచ్భాంఘ్రియుగ్మాలయం

జిఘ్ర (ఘ్రాణ ముకుందపాదతులసీం, మూరన్‌! నమాధోక్షజమ్‌'॥

అని శ్రీకులశేఖరమహారాజు తన ఇంద్రియాలకు హితాన్ని బోధించాడు. ను. వరకాళిందితరంగడోలికలలో వైకుంఠధామంబులో

వెరనొస్పార నయోధ్యతో మథురలో (వ్రేపల్లెలో ద్వారకా

పురిలో నాడెడు భంగి నాదు మదిలో భూరిప్రసన్నాననాం

బురుహంబొప్ప నటించు టొప్పును సితాంభోజాక్ష నారాయణా॥ 59

అర్ధం: సిత+అంభోజ +అక్ష = తెల్లకొమరపూలలాంటి కన్నులు కల వాడా!

ఓనారాయణా! వరకొళింది - లలో వర శ్రేష్టమైన; కాళింది = యమునయొక్క; తరంగ = అలలు అనే; డోలికలలో = ఊయలలోనూ, వైకుంర ధామంబులో = పరమ పదంలోనూ; వెరవు ఒప్పార = ఉపాయానుగుణంగా; అయోధ్యలో; మథురలో; (్రేపల్లెలో = నందగోకులంలోనూ; ద్వారకొపురిలోనూ;? ఆడెడు భంగి = నటించేరీతిగా? నాదు = నాయొక్క; మదిలో = చిత్తంలో; భూరి = గొప్పు ప్రసన్న+అనన+అంబురుహంబు = వికసించిన కమలంలాంటి వదనం; ఒప్ప, నటించుట = తగినట్టు ఆడుట; ఒప్పును = యోగ్యమగును.

16డీ నారాయణ శతకం

తా : ధవళాంభోజాక్ష! ఓనారాయణా! ఉత్కృష్టమైన యమునా నదీ వీచికలు అనే డోలికలలోనూ, వైకుంఠంలోనూ, అయోధ్యలో, మధురలో, నందగోకులంలోనూ, చ్యారకాపురిలోనూ నీవాడుకొన్నావు. అలాగే నాహృదయంలోనూ వికసిత వదనకనులంతో నటించడమూ నీకు యోగ్యమే.

వ్యాఖ్య 2 భక్తుని సహృదయం భగవంతుడు నివసించే దివ్యక్షేత్రంగా వర్ణితం.

శ్రీకృష్ణుడు యమునానదిలో గోపికలతో కూడి జలక్రీడలాడుతూ, ముఖోచ్చిష్టజలాలను పరస్పర వదనారవిందాలమీద చిమ్ముకోవడం వల్ల కాళింది పుణ్య తీర్థక్షేత్రమయింది.

“వల్లవీవదనోచ్చిష్టపవిత్రాధరవిద్రుమః” అన్నట్టు భగవద్భాగవతోత్తముల గండూషాదులచేత అతిపవిత్రమయింది యమునా జలం.

“వైకుంరే తు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతిః।

ఆస్తే విష్ణురచిన్యాత్మా భక్రైర్భాగవతై: సహ॥” (భగవచ్చాస్త్రం)

శ్రీమన్నారాయణుడు నిత్యసూరులతోనూ, ముక్త పురుషులతోనూ శాశ్వతఆనంద తేజః ప్రవాహంలో క్రుంకులిడుతూ, అంగరంగభోగాలను అనుభవించే యోగ్యమైన పరంధామం వైకుంఠధామం.

శ్రీ మహావిష్ణువు “అభజత్‌ భరతాదిభేదమీశు” (పాదుకాసహ(స్రమ్‌) తనను నాలుగు. విధాలుగా విభజించుకొని అఆయోధ్యానగరంలో దశరథ పుత్రులుగా జనించాడు. అప్పుడు -

“యళ్ళ రామం న పశ్యేత్తుయం చ రమోన పళ్యతిః

నిందితః స వసేళ్లోకే స్వాత్మాఒప్యేనం విగర్హతేశ” (రామాయణం)

శ్రీరామచం(ద్రస్వామిని చూడనివాడు, రామునిచే చూడబడనివాడు లోకనిందితుడేకాక, తనను తానే నిందించుకొనేవాడట. ఇలా రామ భరతలక్ష్మణశ్యతుఘ్నులు నలుగురూ సమవయస్కులైన నాగరిక బాలురతో జనమనోనయనానందకరంగా ఆటలాడుకొన్న క్షేత్రం సాకేతనగరం.

గోగోపగోపీజన సంఘంతో కూడి అడిన శ్రీకృష్ణుని రాగరసభరితాలైన లీలలచే నిస్తులమైన పల్లె (వ(తల)పల్లె.

“నాకేశస్త్రి పురాంతక; కమలభూరన్యే చ నాకాలయాః

కాకాకారజుషో ముహుః కబళయం త్యుచ్చిష్టమిష్టం తవ” (ఆనందమందాకిని)

యమునగట్టున చెట్టునీడలో శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి పెరుగు సద్దులను తిని, ఆడుకొంటున్నప్పుడు (బ్రహ్మరుద్రేంద్రాదిదేవతలు కాకులరూపంలో వచ్చి

లాఖుబయవ్యాఖ్య [165 భగవద్భాగవతోత్తముల ఉల్ళిష్టాన్నంలోని మెతుకులను మాటిమాటికి (ఏరుకొని) తింటున్నట్టు దర్శించి, వర్శించిన ఉద్దండ విద్యత్కవి శ్రీమధుసూదన సరస్వతి యతీశ్చరుడు.

“దలితం మధురం, ఫలితం మధురం, మధురాధిపతే రఖిలం మధురకు”

(శ్రీమధురాష్ట్రకం) కౌమారవస్థలో ధనుర్యాగ మందు పాల్గొనేవ్యాజంతో వచ్చి అవక్రమపరా(క్రమాన్ని ప్రదర్శించిన శౌరిక్రీడలతో ఆభిలంమధురమైన ముక్తి క్షేత్రం మధురానగరం.

“సుఖం స్వపుర్యాం నివసన్‌ ద్యారకాయాం శ్రియఃపతిః

సర్వసంపత్సమృడ్దాయాం సంవృతో వృష్టి పుంగవైః॥

రేమ షోడశ సాహ(్రపత్షీనామేకవల్లభః।

తావంతి బి(భ్రద్రూపాణి తద్దహేషు మహక్రిషుః” (భాగవతం. 10 స్కం.90అ)

నిత్యయువకుడై, అష్టమహిషీమణులతోనూ, షోడశసహ(స్రాధిక పురంధ్రులతో - ఒక్కొక్కపత్నికి ఒక్కొక్క. పతిగా = కూడి విశ్చరూపధారియైన శ్రీరుక్కిణీశుని సరసవినోద కేళీవిలాస విహారాలకూ, సకల సంపదలకూ నిలయమై, ప్రకృతి బంధనివారక మయింది ద్వారకా క్షేత్రం.

“అహం వసామి వైకుంరే యోగినాం హృదయే రవౌ।

మద్చక్షా యత్ర గాయంతే తత్ర తిష్టామి నారదః” అన్నట్టు

భగవంతుడు వైకుంరంలోనూ సూర్యమండలంలోనూ, యోగుల హృదయంలోనూ, తనను భజించే భక్తుల అంతరంగంలోనూ ఉంటాడు.

'భగవి చృబ్దం పరిపూర్ణవస్తువును తెల్పుతుంది. 'భక్త' శబ్ధం విడిపోయిన వస్తువును తెల్పుతుంది, తననుంచి విడిపోయిన వస్తువు - జీవవర్గం - తనకు అభిముఖంగా ఉండాలని తలచేవాడు భగవంతుడు. భగవంతుడా! నీ సన్నిధి చేరడానికి ఇంక “కాలం కుజుగాదో” కాలం దగ్గరపడదా? అనే ఆర్తితో ప్రార్ధించేవాడు భక్తుడు. భక్తిరూపమైన జ్ఞానం కలవారి హృదయంలోనే “మయి తే తేషు చాప్యహమ్‌' “స చ మమ ప్రియ” (భగీత) అన్నట్టు యధేచ్చగా ఉంటాడు,

“కలౌ కృతయుగం తస్య కలిస్తస్య కృతే యుగే!

యస్య చేతసీ గోవిందో యస్య చేతసి నాచ్యుతము (విధ.109-57)

ఎవని హృదయంలో గోవిందుడు ఉంటాడో అతనికి కలియుగం కృతయుగమవుతుంది. అలాగే ఎవని హృదయంలో అచ్యుతుడు ఉండడో అతనికి కృతయుగం కూడా కలియుగమవుతుందన్న విషయం గమనీయం,.

166 నొరాయణ శతకం “షట్పదీ మదీయే హృదయసరోజే సదా వసతు" (శ్రీవిష్టుషట్స్పది) “శ్రీరంగరాజభృంగో మే రమతాం మానసాంబుజే”. (శ్రీరంగరాజస్తవం) భగవంతుడు తను మనస్సులలో స్టిరనివాసమేర్చరచుకొని ఆనందించడంకోసమే

మహనీయులైన పూర్వాచార్యులు ప్రార్థించినట్లే, ఈ శతకకర్త కూడా 'నాదుమదిలో

భూరి(ప్రసన్నాననాంబురుహంబొప్ప నటించుటొప్పునని నారాయణుణ్ని ప్రార్రించడం భృశం ప్రశంసనీయం.

శా. చల్లల్వేరొక యూర నమ్ముకొనునానం బోవుచో. ద్రోననీ

వుల్లాసంబున నడ్డకట్టి మదనోద్యోగాములాపంబులన్‌ చల్లన్‌ జల్లని చూపవు జలుమని గోపస్రీలపై. జల్లు మీ చల్లం బోరుతెజంగు. జిత్తమున నే(ంజర్చింతు. నారాయణా॥ 60 అర్ధం: ఓ నారాయణా! చల్లల్‌ = పాలు, పెరుగు, చల్లమొదలైనవాటిని; వేరొక యూరన్‌ = మరొకగ్రామంలో: అమ్ముకొను ఆసన్‌ = అమ్ముకొనే ఆశతో; పోవుచో = పోతున్నప్పుడు; ఉల్లాసంబున = కుతూహలంతో; నీవు; (త్రోవన్‌ = దారియందు: అడ్డకట్టి = ఎదురుగా నిల్చి; మదన+ఉద్యోగ +అనులాపంబులన్‌ = కామాన్ని (ప్రేరేపించే మాటలను; చల్లన్‌ = వెదజల్లగా - పలుకగా; గోపస్రీలపై జల్హుమని = ఒళ్ళు జల్టుమని పులకించునట్టు: చల్లని చూపు; చల్టు(తున్న)మీ చల్లన్‌ పోరుతెజంగు = మీ చల్లని ప్రణయకలహపద్దతిని; నేను; చిత్తమున = మనస్సునందు; చర్చింతు = ధ్యానింతును; స్మరిస్తాను. తా + ఓ నారాయణా! గోపికలు వేరే ఊళ్ళో చల్లలమ్ముకొనే కోరికతో పోతున్నారు. నీవు వారిదారికి అడ్డంగా నిల్భావు. వారితో కామాన్ని ఉద్దీసింపజేసే సంభాషణ జరిపావు. అప్పుడు వారి ఒళ్ళు జల్టుమనే రీతిగా చల్లని చూపు(ల)ను వారిమీద ప్రసరింప చేశావు, నేను మీ ప్రణయకలహపద్దతిని మనస్సులో స్మరిస్తుంటాను. వ్యాఖ్య : గోవస్తీలయందు శ్రీకృష్ణువివాబ్లభ్యం వర్లితం. శ్రీవేణుగోపాలునిఆద్భుతకృత్యాలను. గొల్లపడతులు ఎల్లప్పుడు స్మరించేవారు. శ్రీకృష్ణానుస్మరణమే వారిమనుగడకు ధారకం, పోషకం, అనుస్మరణం అంటే శ్రీకృష్ణుని అసంఖ్యాక నామాలను - గుణ గణాలను నిరంతరం గానం చేయడం. అదివారిజీవిత భాగధేయం. “ఉద్గాయతీనామరవిందలోచనం (వ్రజాంగనానాం దివమస్పృళశద్ద్యనిః। దద్నశ్చ నిర్మంథనళబ్దమి(శ్రితో నిరస్యతే యేన దిశామమంగళమ్‌[” (భాగవతం 10-46-47), ప్రాతఃకాలంలో గోపికలు మధురకంరంతో శ్రీకృష్ణుని లీలలను గానంచేస్తూ పెరుగును చిల్కేవారు. వారిగానద్వని పెరుగును చిలికే

రాఘవీయవ్యాఖ్య 167 ధ్వనితో కలిసి మిన్ను ముట్టేది. తత్ఫలితంగా దశదిశలవ్యాపించిన అమంగళం తొలగిపోయి పవిత్రత ఏర్పడేది. “విశ్రేతుకామా కిల గోపకన్యా మురారిపాదార్పితచిత్తవృత్తి॥ దధ్యాదికం మోహవశాదవోచత్‌ గోవిందదామోదరమాధవేతి" (శ్రీకృష్ణకర్ణామృతం. 2ఆ.56) ఒక గొల్లపడుచు పాలు, పెరుగు అమ్మడానికి పోయింది. ఆమె మనస్సు శ్రీకృష్ణుని యందే మరులుకొని యుండడంవల్ల వీధిలో “పాలోయమ్మపాలు, పెరుగోయమ్మ పెరుగు” అనడానికి మారుగా “గోవిందా! దామోదరా! మాధవా!” అని కేకలు వేస్తూ సంచరిస్తుండింది. ఇంత ముగ్రస్నిగహ్బదయాలుగల గోపకన్యకల కోరికలను శ్రీకృష్ణుడు తీర్చకుండా ఎలా ఉండగలడు? వారి చిత్తవృత్తులకు అనుగుణంగా (ప్రవర్తించేవాడు. శ్రీకృష్ణుడు, వేరే ఊరికి చల్లలమ్మబోయే గోపికలను దారిలో అడ్డగించేవాడు. మదనోద్దీపకాలైన మాటలతో హృదయాలను మథించేవాడు. వారి మృదువైన మనస్సులు వెన్నముద్దలుగా తేలియాడేవి, అంతలోనే వారి ఒళ్ళు కూడా జల్లు మనే రీతిగా చల్లని చూపులను వెదజల్లేవాడు. ఆదయాతరంగితాంతరంగం, ఆసంభాషణాచాతుర్యం, ఆకటాక్షవీక్షణం, _ ప్రణయాన్వితమైన పోరుగా ధ్యానయోగ్యమైనదేకదా! తమజాతి ధర్మకార్యాలను నిర్వహిస్తూనే, తమహృదయాలను శ్రీహరి చరణారవిందాలయం దర్పించే గోపికలను యథావకాశంగా తృప్తిపరచే నటపరిబ్బథుడు గోపీజనవల్లభుడు. ఆయనదివ్యజన్మకర్మలను తత్త్యతః తెలిసికొన్నవాడు పునర్జన్మను పొందడనీ, తననే పొందుతాడనీ (భ.గీత) నొక్కి చెప్పిన శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే కదా! “న బుద్ధిభేదం జనయేత్‌” అన్నట్టు భేదబుద్ధి కలుగకూడదు, కలిగించకూడదుకదా! “అష్టాక్షరాదివేణుగోపాలాష్టకం” సర్వదా ఆనుసంధేయం, 1 ఓంకారవర్థాత్మకవిశ్చమూర్తిం, (బ్రహ్మర్తిభి: సేవితపాదపద్మమ్‌। శ్రీద్యాదశాంతాఖ్యపురాధివాసం, శ్రీవేణుగోపాలమహం. స్మరామి॥ 2. నరార్చితం శ్రీమథురాపురీస్టితం పద్మాక్షమాలాసుగదాధరం వరమ్‌; నాగాదిభిర్లోపకులైళ్ళ "సేవితం, శ్రీవేణుగో పాలమహం స్మరామి॥ 3, మోక్షప్రదం భోగకరం యశస్కరం వైరాగ్యసిద్ధి ప్రదమాత్మవేదినే! అష్టాంగయోగాద్యణిమాదిసిద్ధిదం, శ్రీవేణుగోపాలమహం స్మరామి తమ్‌!

168 నారాయణ శతకం 4 _నామార్దబోధం నవవీతలోలుపం సోమాదిభిర్వందితపాదపంకజమ్‌। భామాపతిం సుందరరుక్మిణీప్రియం, శ్రీవేణుగోపాలమహం స్మరామి తమ్‌॥ 5. రాజత్ప్సభామండలమండితాంగకం, నీలామ్చుదం తం వరదేహభాస్వరమ్‌। శ్రీవేణునాదైర్భవరోగనాళనం, శ్రీవేణుగోపాలమహం స్మరామి తమ్‌॥ 6. యక్ష్యైరై సిద్దగజైశ్ళ పూజితం గంధర్వసంఘాప్పరసామతిప్రియమ్‌ త్రీ గోపకన్యారమణం మనోహరం శ్రీవేణుగోసాల మహం స్మరామి తమ్‌॥ 7. _ఇొవర్షసంశోధినిజాభిధానం శ్రీయోగిహృత్పంకజచిత్రభానుమ్‌। శ్రీ సన్నిధిష్టం మురళీధరం తం శ్రీవేణుగోపాలమహం స్మరామి॥ 8. యతిశ్చరారాధిత నైజరూపం బాలైశ్ళ్చ వృద్దెస్తరుణైర్మనుష్వైః। భక్త్యా సమభ్యర్చితదివ్యమూర్తిం శ్రీవేణుగోపాలమహం స్మరామి జ్ఞాన వింశతి:

మ. కలయవ్వేదములున్‌ బురాణములు బ్రఖ్యాతంబుగా తెల్పి మీ నలనన్‌ భక్తివిహీముందైన పిదపన్‌ వ్యర్థప్రయత్నంబె పో గులకొంతామణి గొడ్డు నోయిన గతిం గ్రావ్వారు సస్యయబు దా ఫలకొలంబున నీచపోపుపగిదిన్‌ పద్మాక్ష! నారాయణా॥ 61

వై అర్థం : పద్మాక్ష = నీరేజనయనా 1! ఓ నారాయణా! మో వలనన్‌ = మీపక్షాన;

ప్రదములున్‌ పురాణములు; కలయన్‌ = అంతటా; ప్రఖ్యాతంబుగా; వెల్లడి అగునట్టు; ల్సి; పిదపన్‌ = తర్వాత; భక్తి విహినుండు = భక్తి ఏమాత్రం లేనివాడు; అయిన = అయితే; కులకాంతామణి = కుల స్త్రీ: (పతి). గొడ్డుపోయిన గతిన్‌ = సంతానవతికాని విధంగానూ; శ్రొవ్వారు సస్యంబు = ఏపుగా ఎదిగినపైరు; తాన్‌ ఫలకాలంబునన్‌ = పండేసమయాన; ఈచపోవుపగిదిన్‌ = గింజపట్టక పొల్టు అయిన రీతిగానూ; వ్యర్థప్రయత్నంబె పో = చేసినకృషి నిష్టలమే సుమా! తా : పద్మాక్ష! నారాయణా! నీవు వేదాలనూ, పురాణాలనూ (ప్రాకటంగా తెల్పిన తర్వాత, భక్తిలేనివాడుగా అయితే, ఆప్రయత్నమంతా కులకాంత గొడ్రాలైనట్టూ, 4 గ ల బలంగా. పెరిగిన వరిపైరు తీరాపండేకాలాన గింజపట్టక ఈడ్చుకపోయినట్లూ

నిష్ర్రయోజనమే. చ

వ్యాఖ్య : శాస్త్రజన్యజ్ఞానం భక్తిరూపంగా పరిణమిప్తే ప్రయోజనకరమని వర్ణితం.

రాఘవీయవ్యాఖ్య 169 అనేకసంశయాలను తొలగించి, పరోక్షంగా ఉండే పదార్థాన్ని దర్శింప చేసేది శాస్త్రం. శాస్త్రమనేలోచనం లేనివాడు అంధుడే అంటుంది పంచతంత్రం.

“అనేక సంశయోచ్చేది పరోక్షార్దస్య దర్శనం;

సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్త్యంధ ఏవ సః”

వేదపురాణాదిశాస్త్రాలను ఎంతోకష్టపడి అధ్యయనంచేసినా భక్తిరూపమైన జ్ఞానంకలుగక, శుష్క(వేదశాస్త్రుజ్ఞానం ఏర్పడితే, ఆప్రయత్నమంతా అగ్నిలో కాక బూడిదలో ఆజ్యం పోసినట్లే అవుతుంది. వాస్తవంగా, భగవంతుని పాదసంసేవాసక్తియే జ్ఞానం.

“బోధావిర్భావనిదానముల్‌ చదువులయ్యా!కావు” అన్నాడు మహాకవి ధూర్జటి.

“ఉపదేక్ష్యంతి తే జ్ఞానం” అన్నట్టు పెద్దలు జ్ఞానోపదేశం చేయగలరు. కాని భక్తిని ఉపదేశించలేరుకదా!

“ముక్తిం దదాతి కర్షిచిన్న తు భక్తయోగమ్‌” (భాగవతం) ఎప్పుడో ముకుంద భగవానుడు ముక్తినైనా (ముం,కుం, = ముక్తిని, భుక్తిని)ి ఇస్తాడు. కాని భక్తిని మాత్రమీయ(లే'డు అంటాడు వ్యాసమహర్షి బుషభావతారకథలో. అందుకే మహాజ్ఞానులు కూడా “భవతు మమ పరస్మిన్‌ శేముషీ భక్తిరూపా” 'పరమాత్ముని యందు నాకు భక్తి రూపమైన జ్ఞానం కలుగాలి' అని ప్రార్ధించారు.

భక్తివిహీనుడే అయితే అతనికి బోధించిన ప్రయత్నం వ్యర్హమేకదా! అంటూ కవి రెండు ఉపమానాలిచ్చాడు.

  1. “కులకాంతామణి గొడ్డు వోయినగతి” - వివాహశుభకార్యం నూతన వధూవరులకేర్చడే ఒక పవిత్రబంధం. అది (ధర్మార్ధకామాలు అనే) త్రివర్గఫల సాధనం, "ధర్మప్రజాసంపత్త్యర్థం స్రియముద్వహే” ఆపస్తంబసూత్రం.. ధార్మిక సంతానం కలుగడంకోసం 'స్రీని పెండ్లాడుతానన్నదే వరుని సంకల్పం. “ప్రజాతంతుం మావ్యవచ్చేత్సీః” సంతానమనే దారాన్ని తెంపకు మని గుర్వనుశాసనం.

“అంతఃకరణ తత్త్యస్య దంపత్యోః స్ప్నేహసంశ్రయాత్‌!

ఆనంద (గ్రంథిరేకో ఒయమపత్యమితి బధ్యతే” (ఉరా.చు

ఆలుమగల (ప్రేమకు ఏకాశ్రయమూ, వారి మనస్సులను లాగి కలిపివేసే హర్షపు ముడియే సంతానం, అన్నాడు భవభూతి. కాబట్టి, సంతానవతి కావలసిన మగనాలు గొడ్రాలైతే నిష్ప్రయోజనం. అలాగే, భక్తి భరితుడు కావలసిన వేదపురాణాధ్యాయి భక్తిహీనుడైతే ని'స్ర్రయోజనం.

170 నారాయణ శతకం 2 “సస్యంబు దా ఫలకాలంబున నీచపోవుపగిది”: = నారు పెట్టి నీరుపోసి, ఎరువు బాగా వేయడంవల్ల ఏపుగా ఎదిగిన పచ్చని వరిపైరు ఫలించే సమయాన పాలు వోయక తాలుగా మిగిలితే చేసిన కృషి అంతా వ్యర్థమే. అదే రీతిగా, జ్ఞానబోధ భక్తిగా ఫలించక పోతే చేసిన పరిశ్రమ నిరర్ధకమే కదా! “నాహం వేదైర్ష్న తపసా న దానేన న చేజ్యయా! శక్య ఏవం విధో (ద్రష్టుం దృష్టవానసి మాం యథా” (భగీ. - 11-53) వేదాధ్యయనం కానీ, తపస్సు కానీ, దానం కానీ, యాగం కానీ ఎంత చేసినా, అర్జునా! నీవు నన్ను చూస్తున్నట్టునూత్రం చూడడానికి యోగ్యుడు కాడు, అన్నాడు శ్రీకృష్ణభగవానుడు. జ్ఞానమున్నా, భక్తి లేనివానికి భగవద్దర్శనం కలుగదు. జ్ఞానసహకృతమైైన భక్తి ముక్తికి హేతువు. శా _స్నావంబుల్‌ సదులందుంేయుట గజస్నానంబుచందంబగున్‌ మౌనం బొప్ప జపీంచువేద మటవీమధ్యంబులో నేద్చగున్‌ నానాహోమములెల్ల బూడిదలలోనన్వేల్చు నెట్రైచను న్నీ వామోక్తియు నీ పదాబ్బరతియున్‌ లేకున్న నారాయణా॥ 62 అర్దం: ఓ నారాయణా! నీ నామ+ఉక్తియు = నీనామోచ్చారణం; నీపద+అబ్బరతియున్‌ = నీపాదకమలాలయందు ఆసక్తికూడా; లేకున్న; నదులందు స్నానంబుల్‌ చేయుట; గజస్నానంబుచందంబు +అగున్‌ = ఏనుగుస్నానం చేసినట్టవుతుంది. మౌనంబు+ఒప్ప = ఎవరితో మాటాడకుండా ; జపించు వేదము = చేసేవేదాధ్యయనం; అటవీమధ్యంబులోన్‌ = అడవినడుమ; ఏడ్పు అగున్‌! నానాహోమములు ఎల్ల = పలుయాగాలన్నీ;: బూడిదలలోనన్‌; వేల్చు = హోమముచేసే? నెయ్యి, ఐచనున్‌: వ్యర్థమగును అని భావం. తా : ఓ నారాయణా! నీనామస్మరణమూ, నీపాదపద్మాలకు సేవజేసీ వ్యగ్రతా లేకుండా గంగాగోదావరీలాంటి నదులందు స్నానం చేస్తే అది గజస్నానంలాగా నిష్పలమవుతుంది. వేదాలను వల్లైేనేయడమూ అరణ్యరోదనమే అవుతుంది. యాగాలెన్నిచేసినా ఆప్రక్రియ బూడిదలో హోమంచేసిన నెయ్యిలాగా వ్యర్థమవుతుంది. వ్యాఖ్యః నారాయణ నామస్మరణతోవే సర్వకర్మలను ఆచరించేధర్మం నర్లితం. భగవ(్రీత్యర్థం చేసే కర్మలన్నీ స్నానంతో ఆరంభమవుతాయి. సర్వవర్థాలవారికీ, ఆశ్రమాలవారికీ సాధారణమైన స్నాన విధి ఐదు (5) విధాలు. “స్నానం హి పంచ పుణ్యాని కీర్తితాని మహర్షిభిః అస్నేయం వారుఖం (బ్రాహ్మం వాయవ్యం దివ్యమేవ చ (ధర్మశాస్త్రం)

రాఘవీయవ్యాఖ్య 171

  1. ఆగ్నేయం : హోమ భస్మలేపనం చేసికోవడం,

  2. (బ్రాహ్మం: మందత్రపూతమైన నీళ్ళను చల్టుకోవడం.

3౩. వాయవ్యం: గోధూళిని సోకించుకోవడం.

  1. దివ్యం: ఎండలోనైనా, వానలోనైనా నిల్చియుండడం.

  2. వారుణం: జలస్నానం.

జలస్నానం చేసే అవకాశం లేని అశక్తులకు ఆగ్నేయాదిన్నానవిధులు నాలుగు. శక్తిమంతులకే వారుణీ స్నానం విధిగా ఆచరణీయం. సూర్యోదయంకంటె ముందే స్నానం చేయడం ఆరోగ్యకరం. వర్చస్సు కలుగుతుంది.

గంగా యమునా కావేరీ లాంటి పుణ్యనదీజలాల్లో స్నానంచేస్తే శరీరానికి మాత్రం బాహ్యశుద్ది ఏర్పడుతుంది. కాని ఆత్మశుద్ధి కలుగదు. తీర్హయా'త్రచేసినామని గొప్ప చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి, నారాయణనామాన్ని స్మరిస్తూ స్నానం చేయడం వల్ల బాహ్యశుద్ది, ఆంతఃశుద్ది కలిగి సత్వగుణం పెరుగుతుంది.

“ధ్యాయే న్నారాయణం దేవం స్నానాదిషు చ కర్మసు;

(బ్రహ్మలోకమవాస్నోతి న చేహావర్తతే పునః (దక్షస్కృతి).

స్నానాదికర్మల నాచరిస్తున్నప్పుడు నారాయణున్ని ధ్యానించే వ్యక్తికి భగవత్రాప్తి కలుగుతుంది. ఇక సాంసారికబాధయే ఉండదు.

యత్సృథివ్యాం రజస్వ మాంతరిక్షే విరోదసీ।

ఇమాంస్తదాపో వరుణ; పునాత్వఘమర్హణః॥ (అఆఘమర్షూసూక్తం)

'స్వర్గ మర్త్య పాతాళలోకాల్లో ఎన్నో జన్మలెత్తి ఏయే పాపాలు చేశామో, వాటినన్నింటిని పోగొట్టి జలాధి దేవతలైన వరుణ శబ్ద వాచ్యుడైన శ్రీమన్నారాయణుడు మమ్ము పరిశుద్దులను చేయుగాక అని ధ్యానిస్తూ జలన్నానం చేస్తే భగవంతుని అను([గ్రహం కలుగుతుందని వేదవాణి.

ఏనుగు గంభీరజలంలో స్నానమాడి గట్టెక్కిన తర్వాత తొండంతో దుమ్ము ధూళిని ఎత్తి తనదేహంమీద చిమ్ముకుంటుంది. కాబట్టి 'గజస్నానం' ఆంటే వ్యర్థమని అర్థం. రజోవృద్దియేకాని సత్య్యవృద్ది కాదు. నారాయణనామస్మరణ లేకుండా పుణ్యనదీజలాల్గో తిర్ణమాడితే గజస్నానంలాగా నిష్ప్టలమవుతుంది.

అడవిలో ఏడిస్తే విని, అనునయించి, ఆదరించే ఆస్పుడుండడు. కాబట్టి, 'అరణ్యరోదనం' అంటే 'నిష్టయోజన" మని అర్థం. హృదయాన్ని పరమస్తిమితంగా పరంధాముని పొదారవిందాలయందు లగింపజేయక, ఆయననామాన్ని స్మరించక వేదాలను అధ్యయనం చేసినా వల్లెవేసినా అది అరణ్యరోదన మవుతుంది.

172 నారాయణ శతకం “య ద్వేదాడౌ స్ప్వరః 'ఫ్రోక్తు వేదాంతే చ ప్రతిష్టిత” (క్రుతి. వేదపరనానికి ముందు. హరిః ఓమ్‌" అని ఆరంభించాలి. పరనానంతరం “హరి: ఓమ్‌" అని ముగించాలి. “సవిసర్ల్గం హారిపదం (ప్రణవాత్పూర్వమిష్యతే। హరి ఫదే విసర్షస్య న సంధిః 'ప్రణవోత్తరే! ” (శిక్షాప్రాతిశాఖ) ఓంకారానికి ముందు విసర్షతో కూడిన హనిపడాన్ని ఉచ్చరించాలి. 'హారిః ఓమ్‌" అనే పదంలో విసర్గకు సంధిలేదు. “వేదస్యోపశక్రమే విద్వా నవసానే ఒప్యతంద్రితః। ఉచ్చరేత్‌ ప్రణవం బ్రహ్మ రక్షామై ఛందసాం 'స్ఫుటమ్‌ (శిక్షాప్రొం నారాయణుడు అధ్యయనంచేత సంతుష్టుడై ఫలాన్ని (ప్రసాదించడంకోసం విద్వాంసుడు వేదాధ్యయనానికి ముందూ, తర్వాతనూ ప్రణవాన్ని స్ఫుటంగా ఉచ్చరించాలని "కారిక బోధిస్తుంది, “న వేదయజ్ఞాధ్యయనై ర్నదానైర్న చ క్రియాభిర్నతపోభి రుగ్రైన (భగ యజ్ఞపురుషుడు, యజ్ఞభోక్త (ప్రభువైన నారాయణుని చరణకమల సంస్మరణరహితంగా జ్యోతిష్టోమాదిక్రతువులనెన్ని చేసినా ఆఫ్రయత్నమంతా అగ్గిలోకాక, బుగ్గిలో పోసేనేతిధారలాగా నిరర్ణకమేకదా! సర్వకర్మసమారాధ్యుడైన నొారాయణున్ని స్మరిస్తూ స్నానాది సమస్తకర్మల నాచరించడం శ్రేయస్కరం, ఈ పద్యానికి మాతృక ముకుందమ్రాలలోని క్లోకం. “ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదప్రతాన్యన్వహమ్‌ మేదశ్ళేదఫలాని పూర్తవిధయ:ః సర్వే హుతం భస్మని; తీర్షానామ్థువగొహనాని చ గజిస్నానం వినా యత్సడ ద్వంద్వాంభోరుహసంస్కృతిం విజయతే చేవస్ప నారాయణః (26) మ. అలనీటం దగురొంపిపై( జిలికిన న్నానీటనే పాయు నా యిల పాసంబులు దుర్భరత్వము మహహియంబునంబొచదినన్‌! బలువై జీవుని దొప్పందోగినవి యీ బాహ్యంబునం బాయునే పాలియుంగాక భవళత్సుపాదజలముంబ్రోక్షీంప నారాయణా! ళ3. అర్థం: ఓ నారాయణా! అలనీటందగురొంపి = నీటిలో ఉండే ఆబురద; సైన్‌ చిల్కినన్‌ = మీదపడితే; ఆ నీటనే = ఆరొంపిగలనీటితోనే; పాయునా, = పోతుందా? ఇల = ఈ సంసారంలో; పాపంబులు; దుర్భరత్వము = భరించరానివిగా? మహా హేయంబునన్‌

రాఘవీయవ్యాఖృ 173 = గొప్పరోతగా, పొందినన్‌, బలువై = బలిసి; జీవుని; దొప్పందోగినవి = ఆవరించినవి. తలమున్కలైనవి; భవత్‌ సుపాదజలమున్‌ = నీ పావనమైన చరణతీర్జాన్ని; ప్రోక్షింప = చల్లినచో, పొలియున్‌ కాక = నళించునే తప్ప; ఈ బాహ్యంబునన్‌ = ఈ ప్రాకృతిక జలంతో; పాయునే = లొలగిపోవునాి

తా : ఓ నారాయణా! నీటిబురద, రొంపి మీద పడితే, ఆబురదనీటితోనే కడిగితే పోతుందా? ఈ బాహ్యశరీరంమీద పడిన రొంపి శుద్ధజలంతోనే క్షాశితమవుతుంది. అలాగే దుర్భరంగా బలసి, శరీరంలోపల ఉన్న జీవుణ్ని చెడగొట్టే మహాపాతకాలు, భగవత్సాదతీర్జాన్ని. (ప్రోక్షిస్తేనే నశిస్తాయి.

వ్యాఖ్య : భగవత్సాదతీర్థప్రోక్షణవల్ల పాపాలు నశిస్తాయని వర్ణితం.

పాపరాశి రొంపి లాంటిది. రొంపి మీద పడితే దేహమంతా కంపుగొట్టి భరించరానిదిగా ఉంటుంది. హేయమైన విషయవాసనతో బలిసిన పాతకాలు, కరణకళేబరాలను అధివ్యాధులకు గురిచేస్తాయి. జీవయా[త్ర దుర్భరమవుతుంది.

“మేరు మందర తుల్యాని పాపాని వివిధాని చ

కేశానాశ్రిత్య తిష్టంతి” .

పర్వతాల్దాగా బలిసిన రకరకాల పాపాలు దేహధారి తలమీద వెండ్రుకల నాశ్రయించి ఉంటాయి. షోడళకర్మలలో (సగం) అష్టమకర్మ ఉపనయనం. “గర్భాష్టమేషూపనయీత” (అపస్తంబసూత్రం). జీవుడు గర్భంలో ప్రవేశించినప్పటినుంచి ఎనిమిదేండ్ల ప్రాయంలో అతనిని జ్ఞానార్జనకు యోగ్యునిగా చేసే సంస్కారమే ఉపనయనం.

జ్ఞానదృష్టి ఏర్పడడమే రెండవజన్మ - ద్విజన్మ - గొ భావించింది. ధర్మశాస్త్రం. “అన్నప్రాశన కర్మతో జీవునికి రుచులు అధికమై, దేహంతోపాటు విషయవాసన "రుగుతుంది. తత్ఫలితంగా అవహించిన పొతకాలనాశనంకోసం 'కేశఖండనం' (చాలకర్మ) విధింపబడింది.

జ్ఞానప్రాప్తికి ప్రతిబంధకమైన పాపరాశిని నశింపజేసే క్షౌరకర్మను 'మంగళకర్మ' అన్నారు. కాబట్టి, అన్నప్రాశనం తర్వాత ఉపనయనంకంటె ముందు 'ాలకర్మ' విధి విహితమై ఆచరింవబడుతున్నది. జ్ఞానగమ్యుడైన కేశవునిదర్శన, స్పర్శన,రూపాద్యర్భన చేయడానికి ముందు కేశవపనం (క్రారం) చేసుకోవడం శిష్టాచారం. వ్రతదీక్షకు, యజ్ఞదీక్షకు పూనుకొనే మాన్యులూ, సామాన్యులూ 'మంగళకర్మ' నాచరించడం పరిపాటి.

'క్షీశ్రానాం వపనం నాస్తి నారీణాం వ్రతసత్రయోః

మహాదోపేషు. సర్వేషు ఛేదయే దంగుళద్వ్యయమ్‌॥” (ఆచారకాండు

174 నారాయణ శతకం

సుమంగళులకు మాత్రం (వ్రతాదులనాచరించడానికైననూ కేశవపనకర్మను శాస్త్రం విధించలేదు. సర్వదోషపరిహారార్థం. వారికి రెండంగుళాల శిరోజాలను మాత్రం కత్తిరించివేయడం శాస్త్రవిహితం,

“విష్ణు పాదాబ్బసంభూతా గంగా (త్రిపథగామినీ” - శ్రీవిష్ణుపాదకమలములయందు ఉద్గమించి స్వర్లమర్శ్యపాతాళలోకాల్లోనూ. ప్రవహిస్తున్న గంగయే ఈ జలమని భావిస్తూ “తిర్థరాజాయ నమః” అని స్మరిస్తూ ఆజలంతో శిరస్నానం చేయాలి. స్నానం దేవపూజకు యోగ్యతను కల్పిస్తుంది. దేహపరిళుద్ధి బాహ్యమైనది. కేశవ, నారాయణ, మాధవనామస్మరణం చేస్తూ మూడుసార్హు ఆచమనం చేసి - తీర్ధం పుచ్చుకొని - గుండెను తడిపితే, అంత; (కరణ) శుద్ది ఏర్పడుతుంది. ఉపలక్షణంగా చెప్పిన ప్రోక్షణకు అర్ధమిదే. అగ్నలాగా తేజస్విని చేసే ఈశుచిర్భూతప్రక్రియ నిత్యం కొనసాగాలి.

భగవత్పాదజలప్రోక్షణతో పాపాలు నశిస్తాయనే కవి ఆధ్యవసాయం శాస్త్రసమ్మతం. మ. తనచిత్తాబ్బము మీపదాబ్బములకుందాత్సర్యసద్భక్తి తం

తన బంధించిన బంధనంబుకతనం దుష్ఫావపుంజంబులె క్లైను విచ్చిన్నములై యడంగు మహిమోల్లాసాబ్దియైవట్టి దా సున కింపొందును మోక్షవైభవము దా సుల్లోక నారాయణా॥ - 64 అర్థం : సుక్టోక =' శోభనమైన కీర్తికలవాడా! ఓ నారాయణా! తన చిత్త +అబ్బము = తన మనస్సు అనే కమలాన్ని; మీ పద+అబ్బములకున్‌ = మీ చరణ సరోజాలకు; తాత్పర్య సత్‌ భక్తితంతున = అకమలాలనే పట్టుకొని ఉండే ఉత్తమ భక్తి అనే దారంచేత; బంధించిన బంధంబుకతనన్‌ = కట్టిన కట్టుకారణంగా; దుష్పాపపుంజంబులు ఎల్లను = చెడ్డపాపరాళులన్నీ; విచ్చిన్నములై అడంగు = తెగిపోయి. నశిస్తాయి. మహిమ+ ఉల్బాస+ అబ్దియైనట్టి = (ప్రభావంతో సముద్రమంత సంతోషంగల; దాసునకు = భక్తునకు; మోక్షవైభవము = ముక్తి సంపద; ఇంపు, ఒందును = సుగమమగును, తావ సుళ్లోక ఓనారాయణా! మనస్సరోజాన్ని మీ చరణసరోజాలకు తగిలియుంచే నా ఆనే సారో ముడివేసినముడివల్సి మహాపాతకాలన్నీ ఛిన్నాభిన్నాలై రూ సంతసంతువ్వాతరంగుడైన భక్తునికి ముక్త్యైశ్చర్యం సుగమమవుతుంది. పాపాలు అణగిపోయే మహిమచేత ఆనంద సము(ద్రమైన 'మోక్షవైభవం భక్తునికి - దాసునికి - చాలా ఇష్టమైనదని కూడా అన్సయించవచ్చును. వ వ్యాఖ్య: చిత్తావికీ భగవత్సాదాలకూ సంయోగమైతే ముక్యైశ్వర్యం లభిమ్తందని ర్లితం. '

రాఘవీయవ్యాఖ్య 175

పువ్వును పువ్వులతో విడిసోకుండాచేయాలంటే మంచిదారంతో మనోహరంగా కట్టాలి. ఇది చిత్తాబ్దం. అవి పదాబ్బాలు.వీటిని భక్తిఅనే సూత్రంతో ఒక్కచోట బంధించాలి. అదే మోక్షవైభవం.

పద్మకోశప్రతీకాశమయింది హృదయం. ఆహృదయపుండరీకగత మైనదే మనస్సు. మనస్సు సము(ద్రంలాగా గంభీరమయింది. పర్వతం లాగా ఉన్నతమయింది.అద్రికంటె, అబ్టికంటెనూ అధికుడు మనస్వి.

“తుంగత్వ మితరానాద్రౌ నేదం సింధావగాధతా।

అలంఘనీయతా హేతు రుభయం తన్మనస్విని;” (శిశుపాలవధ - 2-48)

కాని మనస్సుకు చంచలత్వముంది. కాబట్టి మానవుని బంధమోక్షాలకు మనస్సే కారణం...విషయ్థుసంగమున్న మనస్సు సంసారబంధాన్ని కలిగిస్తుంది. విషయాలను వదలి భగవద్విషయాన్నే అవలంబించిన మనస్సు ముక్తిని కలిగిస్తుంది.

“మనఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః!

బంధాయ విషయాసంగి ముక్ష్యై నిర్విషయం మనః”

మనస్సునే చూడలేని మనం భగవంతుణ్ని కంటితో చూడగలమా?

“న చక్షుషా పశ్యతి కళ్ళ నైనం” అన్నట్టు భగవంతుణ్ని కంటితో ఎవ్వడూ చూడలేడు. అత్యంతసూక్ష్మమైన మనస్సు యోగయుక్తమైతే లౌకిక మనోవ్యాపారాలను నియమిస్తుంది. పరమాత్మనూ అనుభవింపజాలుతుంది.

“దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్షయా సూక్ష్మదర్శిభిః” - అని శ్రుతి.

భగవంతుడు. సుశ్లోకుడు “తస్య నామ మహద్యళ” (యాజ్జిక్యుపనిషత్తు). నిఖిలజగజ్జననాదిలీలత్వ, సర్వరక్షకత్వక్షీర్తి భగవంతునికే తప్ప మరొకరికి లేదుకదా! అట్టి మహాయశస్విని (గ్రహించే అర్హత మనస్సుకు ఉంది.

“హృదా మనీషా మనసా ఒభిక్షస్తో య ఏనం విదురమృతాస్తే భవంతి”.

“హృదితి భక్తిరుచ్యతే”. భౌతిక వృత్తులను నిరోధించేధృతికలది 'మనీట్‌ అని భాష్యం. భక్తి ధృతిగల మనస్సుమాత్రమే సర్వేశ్చరుణ్మి (గ్రహిస్తుందని తెలిసి అనుష్టించే యోగులు అజరామరులౌతారు. మోక్షాన్ని పొందుతారన్నది నారాయణోపనిషత్తు.

“సదా విళ్లేషభీరుత్వం పరమా భక్తిరుచ్యతే” భగవంతుని వియోగం కలుగుతుందేమో అని ఎల్లప్పుడు భయపడే చిత్తవృత్తిని సద్భక్తి లేదా పరమభక్తి అంటారు.

“మోక్షసాధనసామ[గ్ర్యాం. భక్తి రేవ గరీయసీ” మోక్షసిద్ధికి ఉప యోగపడే

176 నారాయణ శతకం సకలసాధనాలలో భక్తియే శ్రేష్టమైన దన్నారు భగవత్పాదులు. కాబట్టి చిత్తాన్ని నారాయణచరణాలతో సంయోగపరచిన వెంటనే సకలపాపాలు డుల్లిపోతాయి. సద్భక్తిమహిమను _ పాటిస్తూ ఆనందజలధివిలోలవీచికలలో ఓలలాడే. దాసుడు సాయుజ్యమనే మోక్షసా(మ్రాజ్యాన్ని అవశ్యంగా పొందుతాడు. ను. తనువుంజీవుండు నేకమైన పీదసన్‌ ధర్మక్రియారంభు(డై యనయంబున్మది( దన్నెజణుంగక తుదిన్నామాయచే మన్నుండై తనుతత్త్వాదివియోగమైన పిదపం దానేర్చునే నీదు ద ర్థన మింపారంగ భక్తివైభన మహాసంకాశ నారాయణా॥ 65 అర్థం: భక్తివైభవ = భక్తిసంపదకలవాడా! మహాసంకాళ = చాలా దగ్గజగా ఉండేవాడా! మహా+అసంకాళ = సమానుడులేని గొప్పవాడా[భక్తి వైభవ మహాసంకాశ = భక్తి సంసదచేత గొప్పగా ప్రకాశించే వాడా! ఓ నారాయణా! తనువున్‌ + శరీరం; జీవుడున్‌ = ఆత్మయు; ఏకమైన పిదపన్‌ = ఒక్కటైన తర్వాత; ధర్మక్రియా+ఆరంభుడై= ధర్మాలను ఆచరించడానికి యత్నించేవాడైై అనయంబున్‌ = ఎల్లప్పుడు; మది = మనస్సున; తన్ను = తనను; ఎయుంగక = తెలుసుకోలేక; తుదిన్‌ =చివరకు; ఆమాయచేభగవత్సంకల్పంవల్ల కలిగిన ప్రకృతి చేత; మగ్నుడై = భౌతిక విషయాలయందు మునిగిన వాడై తను తత్మ్య+ఆది వియోగమైన పిదపన్‌ = దేహేంద్రియాదులచే విడిపోయిన పిమ్మట: తాన్‌ = ఆజీవుడు; నీదు దర్శనము; ఇంపారగ నేర్చునే = ఇష్టమున్నా పొందగలడా? తా : భక్తివైభవ! మహాసంకాశ! నారాయణా! దేహం, ఆత్మ ఒక్కటైన తర్వాత ధర్మాచరణకు పూనుకొన్నవాడై అవశ్యంగా తనను తాను తెలుసుకోలేక ప్రకృతిలో మగ్నుడౌతాడు. దేహేంద్రియాలను సడలి విడిపోయిన తర్వాత ఆజీవుడు నీ దర్శనం చేసుకోగలడా! వ్యాఖ్య : ప్రాక్సృతికభోగపరనశునికి భగవద్దర్భనం దుర్లభనుని కవి ఆశయం. భక్తి ఈశ్చరసంపద. “భక్త్యా త్వనన్యయా శక్యః” (భగీ) భక్తికి చిక్కిన శ్రియ మరి దేనికి చిక్కడు, దొరకడు, "భక్తి క్రీతోజనార్హనః” భగవంతుడు భక్తికి అమ్ముడుసోతాడు. స్ధహపూర్వమనుధ్యానం భక్తి రిత్యభిధీయతే "ధ్యానం, ఉపాసనమొదలైన శబ్దాలచే వాచ్యమై, స్మృతిపరంపరారూపమ్తైన జ్ఞానవిశేషమే భక్తి, భక్తవైభవంచేత భక్తునికి పరతంత్రుడౌతాడు భగవంతుడు. - అని 'సంకాశొ శబ్దానికి సమానం, సమీపం, బాగా ప్రకాశించడం 'నార్జ్ధాలున్నాయి. భగవంతుడు అద్వితీయుడు. పదార్జాలన్నిటియందు అంతరాత్మగా సన్నిహితుడై వెలిగేవాడు.

రాఘవీయవ్యాఖ్య 177

ప్రకృతి, జీవుడు, పరమాత్మ, ఈమూడు నాశం లేనివి. జీవుడు (ప్రకృతితోనూ పరమాత్మతోనూ ఉంటాడు. తనువంటే దేహం, భోగసానం. భోగోపకరణాలు ఇంద్రియాలు. భోగ్యాలు శబ్బాదివిషయాలు. తనువు, జీవుడు ఒక్కటవడమంటే ప్రకృతిబద్దుడన్నమాట. “శరీరమాద్యం ఖలు ధర్మసాధనం” (కుమారసంభవం) అన్నట్టు ధర్మాచరణకు ('ప్రధానసాధనం శరీరం.

“మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిశ్నా” (శ్రుతి

దేహంమీది వ్యామోహంవల్లు మనస్సు, వాక్కు, చేతులు, కాళ్ళు, కడుపు, శిశ్నం ధర్మాధర్మకార్యాలను చేస్తుంటాయి. చివరిరెండింటికి - ఉదరానికి జిహ్వాచాపల్యం, శిశ్నానికి ఉపస్త్రాపల్యం ఉంటుంది. ఈ రెండు రుచులు మెండై జీవుడు సంసారంలో పడరాని పాట్టు పడుతాడు.

విషయభోగలాలసుడైన జీవుడు తానెవడో తనను త్తెలుసుకోలేడు. తనకు దగ్గజనే ఉన్న పరమాత్మనూ భక్తితో సేవింపలేడు. భోగస్టానమైన దేహమే ఆత్మ అనుకొంటాడు. ఇలా మాయా మగ్నుడై - ప్రకృతిబద్దుడై చేసిన ధర్మాధర్మక్రియలు

  • పుణ్యపాపకర్మలు - జన్మపరంపరకు కారణమవుతాయి. శరీరం జీర్ణమై,

ఇం(ద్రియాలు శిధిలమైనప్తుడు జీవుడు కొట్టు మిట్టాడుతాడు. మరణించిన తర్వాత

కొత్త చొక్కాను ధరించే రీతిగా జీవుడు మరొక దేహాన్ని ధరిస్తాడు. అంటే మరొక జన్మనెత్తునేకాని భగవత్సాక్షాత్కారాన్ని పొందలేడు కదా!

మ. తనకున్‌ సాత్వికసంపదన్వితమహాదాసోహభానంబునన్‌ అనయంబున్మది నన్యదైవభజనం బారంగ దూలింపుచున్‌ జనితాహ్లాదముతోడ నీచరణముల్‌ సద్భక్తి పూజించి నిన్‌ గమగొన్నంతనె కల్మషంబులడంగుం గర్మఘ్న నారాయణా॥ -66

అర్హం: ఓ కర్మఘ్న = కర్మలను నశింపజేయువాడా! ఓనారాయణా! అనయంబున్‌ = ఎల్లప్పుడు; సాత్త్విక -భావంబునన్‌! సాత్విక సంపత్‌+అన్విత = సత్ష్యగుణసంపత్తుతో కూడిన; మహాదాసోహభావంబునన్‌ = దాసుడ ననే గొప్పతలంపుతో; మదిన్‌ = ఎదలో: అన్యదైవభజనంబు = ఇతరదేవతలను సేవించడాన్ని; ఆరంగ = పూర్తిగా; తూలింపుచున్‌ =. తొలగించుచు; జనిత+ఆహ్హాదముతోడ = కలిగినసంతోషంతో: నీచరణముల్‌ = నీపాదాలను; సద్భక్తి పూజించి = స్థిరమైన భక్తితో అర్చించి; నిన్‌ కనుగొన్నంతనె; తనకున్‌ = జీవునికి; కల్మషంబులు = పాతకాలు; అడంగున్‌ = నళించును.

తా £ కర్మలను నళింపజేసే నారాయణా! సత్యగుణసంపన్నమైన “దాసోఒహం'” అనే గొప్పభావంతో సర్వదా మనస్సులో దేవతాంతరభజనను మానుకొంటూ

క78 నారాయణ శతకం సంతోషంగా నీపాదాలను ఉత్తమభక్తితో పూజించి నీ సాక్షాత్కారం పొందగానే జీవునికి సకల పాపాలు నళిస్తాయి.

వ్యాఖ్య : భగవంతునిసాక్షాత్కారమైన వ్యక్తి శుద్దాత్ముడని కవిభావన.,

కర్మల నాచరించకుండా మానవుడు ఉండలేడు. ముఖ్యంగా దేహయాత్ర సాగదు. “న హి కళ్ళిత్‌ క్షణమపి జాతు తిస్టత్యకర్మకృత్‌” (భ.గీ. 3-5)

“శరీరయాత్రాపి చ తే న ్రసిద్యేదకర్మణః (భగ) అని భగవానుడే విశదపరచాడు,

సత్కర్మల నాచరించే వ్యక్తి స్పర్గసుఖాన్ని పొందుతాడు. దుష్కర్మల నాచరించేవాడు నరకయాతనను అనుభవిస్తాడు. పాపకర్మలు ఇనుప సంకెళ్ళెతే, పుణ్యకర్మలు బంగారు సంకెళ్ళు. ముక్తిని పొందడానికి ప్రతిబంధకాలు. పునర్జన్మకు హేతువులు. కర్మలఫలాన్ని ఆశించకుండా విధిగా కర్మలను ఆచరించి 'శ్రీకృష్ణార్వ్ణణమస్తు' అని అర్పిస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. ఆకర్మలన్నీ వేయించిన విత్తనాల్దాగా మొలవక, ఫలమిచ్చేశక్తిని కోల్పోతాయి. కాబట్టీ నారాయణుడు కర్మఘ్నుడు.

రజస్తమోగుణాలు కలవారు అహంభావం కలవారు. తానే గొప్పవాడనీ, ఇతరులు తనకంటె చాలా తక్కువ స్థాయి కలవారని అఖర్వగర్భంతో ప్రవర్తించడమే అహంకారి లక్షణంకదా! సతృగుణసంపన్నులు చాలా నమ్రులై (ప్రవర్తిస్తారు. భగవంతునికే కాక, భగవద్భక్తులకు కూడా సేవకుడననే (క్రమమైన భావం కలగియుండడమే దాసోహం అనే వైష్ణవపరిభాషకు అర్హం.

మోక్షార్దులు నారాయణ మూర్తినే భజిస్తారు.ఇతరదేవతలను చిత్తగించరు.

“మముక్షవో ఘోరరూపాన్‌ హిత్వా భూతపతీనధ।

నారాయణకళాాశాంతా భజన్తి హ్యనసూయవ:"”॥ (భా.గ.1-2-26)

అన్నట్టు విష్ణుభక్తులకు వేరే దేవతలయందుగానీ ఆయాదేవతలను ఉపాసించే వారియందు గానీ అసూయాద్వేషాలుమాత్రం ఉండవు.

(త్రికరణశుద్ధిగా శ్రీమన్నారాయణచరణారవిందాలను పూజిస్తుంటే జీవులకు భగవత్సాక్షాత్కారం కలుగుతుంది. సర్వపాపాలు నళించినందువల్ల పరిశుద్దాత్ములై శాళ్ళతానందాన్ని పొందుతారు. స మ. పరికింపన్‌ హరిభక్తిభేషజునకున్‌ భవ్యయబుగా మీద మీ

చరణాంభోరుహదర్భవంబు గలదే 'సంప్రీతి వెట్లన్నందా ధరలో( జోరు,డుగన్నదుస్తర పరద్రవ్యంబుపై నాశలం బొరయన్నేర్చునె దుర్లభంబగు గృపాంభోజాక్ష నారాయణా ॥ 67

రాఘవీయవ్యాఖ్య [179 అర్హం : కృపా+ఆంభస్‌+జ+అక్ష = దయతోకూడిన కమలనయనా! ఓనారాయణా! పరికింపన్‌ = ఆలోచింపగా; హరిభక్తిభేషజునకున్‌ = భగవద్భక్తి అనే దంభంగల వ్యక్తికి; భవ్యంబుగా; యోగ్యంగా; మీద = ముందుజీవితంలో; మొిచరణ+అంభస్‌*రుహ దర్శనంబు = మీపాదనీరేజాలను దర్శించడం; సంప్రీతిన్‌ = (మి) కృపతో; కలదే = సంభవించునా? ఎట్టు అన్నన్‌; ధరలో = లోకంలో; చోరుడు = దొంగ; తాన్‌, కన్న = చూచినట్టి; దుస్తర పరద్రవ్యంబు పైన = దాటిపోలేని ఇతరుల (ద్రవ్యం మీద, ఆశలన్‌ = (కలిగే) కోరికలతో; పొరయన్‌ నేర్చునె = పొందగలుగునా? దుర్లభంబు అగు = పొందశక్యం కాదు.

తా : కృపాపూర్ణకమలనయనా! ఓనారాయణా! హరిభక్తి అనే దంభం కల వ్యక్తికి జీవితంలో భగవద్దర్శనం కలుగదు. ఎట్టనగా, దొంగ పరద్రవ్యాన్ని చూచి ఆశపడితే దాన్ని పొందలేడు. అది దుర్ల్షభమే.

వ్యాఖ్య : కపటభక్తుడు కమలాన్షుణ్నీ పొందలేడని వర్ణితం.

నిజంగా భక్తిలేకున్నా లోకులు తనను హరిభక్తుడని నమ్మడానికి జప, తపో,[వ్రత దానాదులను చేస్తూ లోకులను వంచించడం భక్తిభేషజం. అది దొంగభక్తి

సూర్యకిరణాలశక్తిని హరించి వికసించే తామరపూవుల్లాంటి కన్నులు గల హరి, తనమీద చూసే (ప్రేమ, భక్తి ఎలాంటిదో చూడకుండా ఉంటాడా? దయారసమొలికే హరి నరసిజనయనాలనే మోసగించే భక్తి భేషజానిమీద అవి కృపను కురిపిస్తాయా?

హరి" అంటే విశ్వాన్ని హరించే హృదయంకలనారాయణుడే.

“క్తశవః కేశిహా హరిః” (విష్ను సనా) ఆయనమీద నిరతిశయప్రీతి కలిగి యుండడమే భక్తి ఆ (ప్రేమ, అభక్తి వేరేకోరికలను పొందడానికి సాధనంకారాదు. సద్బుద్దితో నిరంతరం హరిని స్మరిస్తూ లోక కల్యాణంకోసం సత్కర్మలను ఆచరిస్తే, ఆయనను తెలుసుకోవడానికి, దర్శించడానికి ఉండే (ప్రతిబంధకాలను అవ్యాజాను([గ్రహంచేత తొలగించే హరి దయను, దర్శనాన్ని దాంభికప్రవృత్తిగల వ్యక్తి పొందగలడా? పొందలేడు.

సామాన్యంగా ఇందుకు దృష్టాంతాన్ని ప్రదర్శించాడు కవి,

లోకులు కష్టార్దితమైన (ద్రవ్యాన్ని గది నుంచి దాటిపోకుండా, భద్రం గా నిక్లేసిస్తారు. పరధనానికి ఆశపడి దాన్ని అపహరించడానికి ప్రయత్నించే దొంగకు ఆధనం పట్టుబడదు సరికదా! తానే భటులకు పట్టుబడి చెరసాల పాలవుతాడు. చోరునికి పరద్రవ్యం ఎలా దుర్లభమో, అలాగే భక్తి భేషజునికి భగవద్దర్శనం దుర్లభమేకదా!

180 నారాయణ శతకం మ. పరనుజ్ఞానవివేకపూరితమహాభవ్యాంతరాళంబునన్‌

పరగన్నీనిజనామముంత్ర మొనరన్‌ భక్తి న్ననుష్టింపుచున్‌

దురితాన్వేషణకాలభూతము వెసన్‌ దూలంగ వాకట్టునా(

దరుగున్‌ భవ్యపదంబునొందుటకునై యన్యక్త నారాయణా॥ 68

అర్ధం. : అవ్యక్త = స్పష్టంగా కనబడనివాడా! ఓ నారాయణా! పరమా-నన్‌! పరమ

= ఉత్కృష్టమైనుజ్ఞాన = జ్ఞానంచేత; వివేక = మంచిచెడులభీదపరిశీలనంచేత; పూరిత = నిండిన; మహాభవ్య+అంతరాళంబునన్‌ = గొప్పయోగ్యమైన హృదయమందు; పరగన్‌ = ్రవర్తించేవిధంగా; నీనిజనామమంత్రము = నీస్వీయనామమంతత్రాన్ని; ఒనరన్‌ = ఒప్పుగా; భక్తిన్‌, అనుష్టింపుచున్‌ = సంతత ప్రీతితో అనుసంధానంచేస్తూ: దురిత+అన్వేషణ కాల భూతము = పాపాలను వెదకే మృత్యువు; వెసన్‌ = వేగంగా; తూలంగ = పైన పడగా; వాకట్టువాండు = వాళట్ళియమంగల మౌని; భవ్యపదంబున్‌+ఒందుటకునై = భద్రమైన ముక్రిస్టానాన్ని పొందడానికి; అరుగున్‌ = వెళ్ళును.

తా : అవ్యక్తనారాయణా! పరమజ్ఞాన వివేకభరితమైన హృదయంలో నీ నామమంత్రాన్ని భక్తితో జపిస్తూ మరణించే మౌని పరమపదాన్నే పొందుతాడు.

వ్యాఖ్య: ధ్యానమగ్నుడైన మౌనికి వైకుంఠప్రాప్తియే అవి వర్లన.

“వాయుః సర్వగతో మహాన్‌" అన్నట్టు అంతటా వ్యాపించియున్న గాలివలె విశ్చవ్యాప్తుడైన భగవంతుడూ నయనగోచరుడు కాడు. కాబట్టి నారాయణుడు అవ్యక్తుడు.

“వేదాంతవాక్యార్డ జ్ఞానంకన్న భిన్నమైన అర్హం కలది జ్ఞూనం. ధ్యానోపాసనాదిశబ్దవ్యాన్యమైనది, ప్రత్యక్షతాపన్నస్మృతి రూపమైనది, అహరహం అభ్యసించడం వల్ల వృద్ధి పొందేది, మరణం దాకా అనుష్టింపం యోగ్యమైనది. మోక్షఫలసాధనమైనది జ్ఞానం” అని శ్రీభాష్యం (3-4-26) నిర్వచించింది. ల 'జాతిదుష్టం, ఆశ్రయదుష్టం, నిమిత్తదుష్టం' అనే త్రివిధదోషం లేని ఆహారాన్ని బవించడం వల్ల రజస్తమస్సులడగిపోయి, సత్త్యగుణవృద్ధిచేత నిర్మలమైన మనస్సు బాగోగులను పరిశీలించడం వివేకం” అని “సర్వత్ర ప్రసిద్ధ్యధికరణం” బోధిస్తుంది.

వివేచనాశక్తినల్ల దేహం వేరు, ఆత్మవేరు అనీ, దేహం నశిస్తుంది. ఆత్మ శాశ్ళ్రతంగా ఉంటుందనీ తెలుస్తుంది.

“తస్మిన్‌ యదన్రస్తదన్వేష్టవ్యం. తద్వావ విజిజ్ఞాసితవ్యం”. (ఛాం.ఉప.8-1-1-) పట్టణం మధ్యన రాజగృహమున్నట్లే శరీరంలో పరమాత్మకు ఆవాసభూతమైన దహరమనే హృదయ పుండరీకం ఉంది. ఆపుండరీక మధ్య భాగంలో పరంజ్యోతిగా

రాఘవీయవ్యాఖ్య 181 వెలిగే వేల్పును అన్వేషించాలి, ఉపాసించాలి. అర్జాత్‌, బహిర్ముఖంగా ఉన్న ఇంద్రియాల వ్యాపారాన్ని అణచివేసిన మనస్సుతో అంతర్ముఖుడై వాక్కును ధ్యేయమూర్తిమంత్రాన్ని జపించడానికి మాత్రమే నియమించి, భక్తితో ధ్యానించడమే పరమజ్ఞానం : “పరాంతకాలే, పఠరిముచ్యంతి సర్వే” - (నారా.ఉప) జ్ఞానులకుగానీ అజ్ఞ్జానులకుగానీ మరణం తప్పదు. అజ్ఞానులు అవివేకంతో పాపకార్యాలకోసం ఆలోచిస్తారు. వాటికి తగిన సాధనాలకోసం అన్వేషిస్తారు. జ్ఞానులు వివేకంతో ఆప్రయాణాదనువర్తమానులు అంటే దేహాన్ని విడిచి జీవుడు వెళ్ళిపోయేవరకు భగవంతుణ్ఞై ఉపాసిస్తుంటారు. ప్రాణులు చేసిన పాపకర్మలను వెదికే మృత్యుదేవత యముడు. “గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్‌'. ఆకాలభూతం ఎప్పుడు హరాత్తుగా మీద తూలి, జట్టు పట్టి ఈడుస్తుందో అని భావిస్తూ మానవుడు సదా ధర్మం ఆచరిస్తునే ఉండాలి అన్నది హితోపదేశం'. అజ్ఞాని దేహపతనానంతరం నరకానుభవాన్ని పొంది, తర్వాత ఆ లోకానికే వచ్చి మరొక దేహాన్ని ధరిస్తాడు. పరమజ్ఞానవివేకభరితుడైన వాబ్నియమశీలుడు దేహం పతనం కాగానే చక్కగా పరమపదాన్ని - మోక్షస్టానాన్ని - పొందగలుగుతాడు. మ. సరిఘోరాంధకబోధకారణవిపత్పంసారమాలిన్యమున్‌ పరమానందసుబోధకారణ లసద్భన్మంబుపై నూ(ది యా నిరతజ్ఞానసుకాంతిదర్ప్భణమున న్నిస్సంగు(డై తన్నుదా వనరయంగొాంచినవాండు నిన్ను6 గనువాండబ్బ్దాక్ష నారాయణా॥ 69, అర్థం; అప్‌+జ+అక్ష్ర = నీరజ నయనా! ఓనారాయణా! ఘోర+శఅంధక, బోధకారణ విపత్‌ సంసార మాలిన్యమున్‌ = కటికచీకటివంటి అజ్ఞానం వల్ల కలిగిన కష్టాలతో కూడిన సంసారకల్మషాన్ని; పరమ+ఆనంద సుబోధకారణలసత్‌ భస్మంబు = పరమానందాన్ని కలిగించే జ్ఞానం వల్ల ప్రకాశిస్తున్న బూడిదను; పైన ఊది = మీద తొలగించి, ఆనిరతజ్ఞాన సుకాంతి దర్పణమునన్‌ = ఆ, సంగంలేని జ్ఞాన మనే స్వచ్చ కాంతి గల ఆద్దమందు; నిస్సంగుడై = నిర్లిప్తుడై; తన్ను తాన్‌ : కాంచినవాడు = చూచినవాడు; అరయన్‌ = విచారించగా; నిన్నున్‌; కనువాడు = చూచేవాడవుతాడు. తా : అబ్బాక్ష! నారాయణా! అజ్జానంవల్ల కలిగే సంసారమాలిన్యాన్ని, ఆనందాన్ని కలిగించే జ్ఞానంతో తొలగించుకొని నిస్సంగుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. మలినమైన అద్దంమీద బూడిద చల్లి తుడిచివేసినవాడు అద్దంలో తనను చూచుకోగలుగుతాడు.

182 నారాయణ శతకం

స్వచ్చమైన దర్పణంలో తనను చూచుకొన్ననాడు తన పక్కకున్నవ్యక్తిని కూడా దర్పణంలోనే చూస్తాడు. కర్మసంగరహితుడైన జ్ఞాని ఆత్మసాక్షాత్కారాన్నీ, పరమాత్మసాక్షాత్కారాన్నీ పొందగలుగుతాడు.

వ్యాఖ్య : ఆత్మసాక్షాత్కారం, పరమాత్మసాక్షాత్కారానికే హేతువని నర్లితం. అజ్ఞానాంధకారంవల్ల చేసిన కర్మలఫలమే ఆపదలు సంభవించడం. ఇది సహజమైన (ప్రకృతి కల్మషం. ్రారబ్బకర్మకు వశులై మహాపురుషులు కూడా అధి వ్యాధులతో బాధపడుతారు. సత్పురుషుల సహవాసంవల్ల, హఠాత్తుగా వారిలో పరివర్తన కలుగుతుంది. ఉత్తమగురుబోధవల్ల జ్ఞానులవుతారు. అగ్ని కట్టెలను భస్మం చేసే రీతిగా, జ్ఞానం సర్వకర్మలను భస్మం చేస్తుంది. ఆపైన ఫలాపేక్షలేకుండా విధిగా కర్మనాచరించడమే నిష్కామకర్మ అవుతుంది. నీటిమీద తామరాకు లాగా, సంసారంలో ఉన్నా సంగరహితడవుతాడు.

“న కర్మణా లిప్యతే సాపకేన” - శ్రుతి.

“బహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్షా కరోతి యః;

లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా॥” (భ.గీ.5-10)

కర్మఫలాసక్తుడు గాక సర్వకర్మలను సర్వేశ్వరుని. పైన ఆరోపించి, అంటే భగవదారాధనగ్గా భావించి, వ్యవహరించే వ్యక్తి నీటిచేత తామరాకులాగా వాటిచే స్పృశింపబడడు.

“యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్‌” అన్నారు. శ్రీశంకరభగవత్సాదులు,

కరృత్వాభిమానమూ, కర్మఫలభోకృృత్వాభిమానమూలేని కర్మిష్టి యొక్క జ్ఞానం స్వచ్చమైన అద్దంలాగా మెరుస్తుంది. “యథాఒదర్శో మలేన చ” (భ.గ.3-38) అన్నట్టు అద్దం స్నిగ్రమైన దయినా దుమ్ము ధూళి పడి మలిన మవడం ్రకృతిసిద్దం. కర్మ కౌశలం. కలవాడు అద్దంమీద పౌడరు చల్లి శుభ్రంగా తుడిచివేస్తే అద్దం నిగనిగలాడుతుంది. దానిలో బింబం ప్రతిఫలిస్తుంది కదా! అలాగే నైష్కర్యసిద్దిని పొందిన వ్యక్తియొక్క జ్ఞానం నైగనిగ్యం గల దర్చణం లాంటిది. అజ్ఞాన దర్శణమందు “మేను వేరు, నేను వేరు” గా ప్రతిభాసిస్తుంది. కాబట్టి నిస్సంగుడు, నిర్లిప్తుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తికి పరమాత్మను దర్శించే భాగ్యం కలుగుతుంది,

“యత్ర నిర్లిప్త్రభావేన సంసారే వర్తతే గృహే,

రాఘవీయవ్యాఖ్య 183 ధర్మం చరతి నిష్కామః తత్రైవ రమతే హరిః” అన్నట్టు, సంసారంలో నిర్లిప్తుడైన నిష్మామకర్మానుష్టానపరుని హృదయం భగవన్మందిరమే అవుతుంది. “సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం” అనే ఉపనిషద్వాక్యం ఈ విషయాన్నే విశేషంగా వివరిస్తుంది. మ. పరుషాలాపము లాడనోడి మది నీపాపార్దనారంభుండై నిరసించేరికి. గీడుసేయక మదిన్నిర్ముక్తకర్ముండునై పరమానందనిషేధముల్‌ సమముగా ఖావించి వీక్షించు నా పరనుజ్ఞాని భవత్భపంబొరయునో పద్మాక్ష నారాయణా॥ 70 అర్ధం ; ఓ పద్మాక్ష = కనుదమ్ములుకలవాడా! నారాయణా! ఈ పాప+ఆర్జన+ఆరంభుడై = పాపకార్యాలకు యత్నించు వాడై; మదిన్‌ = మనసులో, నిరసించి = తిరస్కరించి; పరుష + ఆలాపములు = నిష్టురపుమాటలను; ఆడన్‌ ఓడి = పలుకలేనివాడై; ఏరికిన్‌; కీడుసేయక = ఎవ్వరికీ చెరుపు చేయక; మదిన్‌ = హృదయంలో; నిర్ముక్త కర్ముండునై = ఫలాపేక్షలేని కర్మలనాచరించువాడై; పరమ+ ఆనంద, నిషేధముల్‌ = శ్రేష్టమైన, సంతోష విషాదాలను; సమముగా = సమానంగా; భావించి; వీక్షించు = చూచే; ఆపరమజ్ఞాని = ఆసమ్యక్‌జ్ఞానం క్షల వ్యక్తి: భవత్‌ కృపన్‌ = నీ దయను; ఫొరయున్‌ = పొందును. తా : ఓ పద్మాక్ష ! నారాయణా! పాపకర్మలను ఆచరించడానికి యత్నించిన వ్యక్తి ఆలోచించి, ఎవరితోనైనా కరినంగా మాటలాడడమూ, కీడుసేయడమూ మానుకొంటాడు. రాగద్వేషాలు లేకుండా కర్మలనాచరిస్తూ సుఖదుఃఖాలను, సంతోషవిషాదాలను సమానంగా భావించే పరమజ్ఞాని నీ కృపకు పాత్రుడవుతాడు. వ్యాఖ్య : పరమజ్ఞాని భగవత్కృపకు పొత్రుడయ్యే విధానం వర్ణితం. మానవుడు స్త్రీ పుత్ర, ధన, కీర్తి ప్రతిష్టలకోసం చేసే కార్యాలు (ప్రేయోరూపమైనవి. ఆపాత రమణీయమై దుఃఖాంతంగా ఉండే ప్రొకృతభోగాలను అనుభవించడానికి తనశక్తిని దుర్వినియోగం చేస్తాడు. ఈ (ప్రేయస్సాధనకర్మలన్నీ పునర్జన్మకు హేతువులు, మరుజన్మకు బీజం కాకుండా, మోక్షసాధనకు ఉపయోగపడే కర్మ శ్రేయోరూపమైనది. తనకంటె పూర్వులైన పెద్దలు ఆచరించిన కార్యాలను చూచిగానీ, వైచక్షణ్యంతో కానీ (ప్రేయథ్ష్రేయస్సుల భేదం తెలుసుకొంటాడు. (ప్రేయఃకర్మలను నిరసిస్తాడు. (శ్రేయోమార్గావలంబియై నియతకర్మలను అనుస్టిస్తాడు మానవుడు. అసక్తోహ్యాచరన్‌ కర్మ పరమాప్నోతి పూరుషు”- (భగీ3-19) కర్మఫలమందు భోగ్యతాబుద్ధీలేకుండా, అనాసక్తుడై విహితకర్మలనాచరించే వ్యక్తి శాశ్చతానందాన్ని కలిగించే పరలోకాన్ని పొందుతాడు. మాట మనిషిన్వభావాన్ని తెల్పుతుంది. వాక్సారువ్యం మనిషియొక్క

184 నారాయణ శతకం మనోమాలిన్యాన్ని సూచిస్తుంది. నలుగురితోకలిసి అడేమాట - మంతీ కూడా 'ఫ్రస్తావయజ్ఞ' మనబడుతుంది. దీనికి కావలసింది నోటి మంచితనమే. “సత్యం (బ్రూయాత్‌, ప్రియం బ్రూయాత్‌” అన్నట్టు ఇతరులతో పరుషంగా మాటాడక, మనస్సులోనైనా ' పరులకు కీడుసేయ తలపెట్టక, సత్యమూ, ప్రియమూ అయిన మాటలతో మధురంగా సల్హాపంచేస్తాడు.

కర్మలు నాలుగువిధాలు:

  1. విహితకర్మలు : వర్ణాలను, ఆశ్రమాలను బట్టి శాస్త్రం విధించిన కర్మలు.

నిత్య, నైమిత్తిక కర్మలు, విహిత కర్మలు.

  1. కామ్యకర్మలు: పశుకాముడు, స్వర్గకొముడు, స్వారాజ్యకాముడు చేసే కర్మలు.

  2. (ప్రాయశ్చిత్తకర్మలు: విహిత కర్మలనాచరింప నందువల్ల కలిగే, పాపాలను

పోగొట్టే కర్మలు.

  1. నిషిద్ధకర్మలు : (ప్రాణిహింసను తలపెట్టిన 'అభిచారి కర్మలు,

“న హ వై సశరీరస్య సతః ప్రియాప్ర్రియయోరపహతిరస్తే,

అళరీరంవా వసంతం న ట్రియాప్రియే స్పృశళతః” (శ్రుతి)

మోక్షమందు బుద్దిగల జ్ఞాని ప్రియా ప్రియ - కామ్యనిపిద్ధ - కర్మలచే కొట్టబడడు.

“త్యక్షా కర్మఫలాసంగం నిత్యతృష్తో నిరాశ్రయః

కర్మణ్యభిప్రవృత్తోఒపి నైవ కించిత్కరోతి సః॥ (భ.గ్‌.4-20)

కర్మఫలాభిసంధిరహితుడై ఎవరినీ ఆశ్రయింపక, తృప్తిగా నిత్యకృత్యాలను నిర్వహిస్తున్నా, అతడేమీ చేయనివాడే. ఆకర్మలవలన పుణ్యపాపాలుండవు.

ఈ నిర్ముక్తకర్ముడు ఆయాచితంగా (ప్రాప్తించిన సుఖదుఃఖాలు, మానావమానాలు. మణులు - మట్టి బెడ్డలు, ప్రియాప్రియాలు మొదలైన ద్వంద్వాలయందు సమబుద్దితో వ్యవహరిస్తాడు.

“సమత్వ మారాధన మచ్యుతస్య” అన్నట్టు సంతోషవిషాదాలలోనూ సమబుద్ధితో వ్యవహరించే జ్ఞాననిష్టాపరుడు, సర్వకర్మలను భగవదారాధన దృష్టితో ఆచరిస్తాడు. తన యోగక్షేమాలను దైవాయత్తం చేస్తాడు. పద్మాన్షునికటాక్షాన్ని పొందుతాడు. మ. ఒరులం దన్ను వెలుంగు నియ్యెజలుకయు న్నొప్పార నేకాంత మం

దరయంబైపడు నన్యభామినులపై నాకాంక్షదూరత్వమున్‌ నురణావస్థను నీదు నామములి సన్మానంబునందో(యటల్‌ ఫరలోనన్నివి దుర్లభంబులు సుధాధానూక్ష నారాయణా ॥ గ్గ

రాఘవీయవ్యాఖ్య 185

అర్ధం : సుధాధామ + అక్ష = అమృతకిరాణాల్లాంటి చల్లని చూపులు కలవాడా! (ముక్తిగహనయనాలుకలవాడా! చల్లని, వేడి చూపులుకలవాడా!) ఓనారాయణా! ఒరులన్‌ = ఇతరులను; తన్నున్‌ = తనను; ఎజుంగు = తెలిసికొనే: ఈ+ఎటుకయున్‌ = ఈజ్ఞానం; ఒప్పారన్‌ = యోగ్యంగా; ఏక+అంతమందు = ఒకేనిశ్చయమందు; ఆరయన్‌ = విచారిస్తుండగా, పైపడున్‌ = (శరీరం) మీద పడునట్టి; అన్యభామినులపైన = పరకాంతలమీద; ఆకాంక్షదూరత్వమున్‌ = కోరిక లేకుండడం, మరణ+అవస్టను= చస్తున్నప్పుడూ; నీదు నామములె = నీగుణదీస్తులైన పేర్లే; సన్మానంబునన్‌ = గౌరవంగా (శ్రద్ధతో; తోచుటల్‌ = స్కృతికిరావడం; ఇవి = ఈ ధర్మాలు, ధరలోనన్‌ = లోకమందు; దుర్రభంబులు = సులభమైనవి కావు.

తా : ఓ సుధాధామాక్ష ! నారాయణా! తానెవరు? పరులెవరు? అని విచారించే జ్ఞానమూ; పరకాంతలపసైన వ్యామోహరాహిత్యమూ; దేహావసానదశలోని నామస్మరణా సక్తియూ లోకంలో దుర్లభాలు.

వ్యాఖ్య : జ్ఞానిలక్షణాలను తెలిపే పద్యమిది.

వ్యక్తి సంఘజీవి, సాంఘికధర్మాలననుసరించి, వైయక్తికజీవితాన్ని గఢడుపడం తనకూ, సంఘానికీ శ్రేయస్కరం. వ్యక్తితధర్మాలను పరిశీలించి, ఆదరంతో అవలంబించిన వ్యక్తి సమాజానికి ఆదర్శ పురుషుడవుతాడు. సమాజం ఆయనను మహాజ్ఞానిగా గౌరవిస్తుంది. జ్ఞానికి స్వ, పరభేదం ఉండదు. "అత్మవత్‌ సర్వభూతాని” సర్వ్యషప్రాణులను తనను వలె చూచుకొంటాడు. అందరియందు, దేహభేదాలను గణింపక్క సమదృష్టికలిగి యుంటాడు.

“విద్యావినయసంపన్నే (బ్రాహ్మణే గవి హస్తిని।

శుని చైవ శృపాకే చ పండితాః సమదర్శినః ॥ (భ.గీ.5-18)

విద్య, వినయం - ఈరెండూ - కలిగిన బ్రాహ్మణుని యందూ, కుక్క మాంసం తినే వ్యక్తియందూ; గోవు, ఏనుగు, కుక్క, మొదలైన జంతువులందుకూడా జ్ఞానులు సమదృష్టి కలిగి ఉంటారు.

“ఆత్మాపమ్యేన సర్వత్ర సమం పశ్యతి” - (భ.గీ.6-32)

పరులకష్టాలను గానీ, సుఖాలను గానీ తనవిగానే భావిస్తూ ఇతరులు తనపట్ల ఎట్టు ప్రవర్తించాలని కోరుతాడో, అట్టే తాను ఇతరుల పట్ట ప్రవర్తించడం “ఆత్మాపమ్యం”. విశ్చమానవసొ(భ్రాత్రానికి ఆత్మాపమ్యమే ఆత్యావళ్యకం,

ఆత్మతత్త్యమెరిగి అన్ని సముని - శ్రీమంతుని - నారాయణుని స్వరూపాలే అన్న అధ్యవసాయం కలిగిన జ్ఞానులనే 'ఏకాంతులు' అని వ్యవహరిస్తుంది లోకం. స్వపరభేదం లఘుబుద్దులకు ఉంటుంది.

186 నారాయణ శతకం

స్వ, పర భేదం లేని జ్ఞానం కలవారు వ్యవహారదశలోనూ సమవర్తనులై ఉంటారా? అనే ప్రశ్నకు ద్వితియచరణమే. సమాధానం.

ప్రకృతిలో జాతి, గుణ, ద్రవ్య (క్రియా రూపాలయందెక్కడనూ సమానత్వం కనబడదు. ఏకోదరులలోనూ ఏ ఇద్దరి రూపాలు ఒక్క రీతిగా ఉండవు. అందుకే 'సమత' భావానికే పరిమితం.

సమతాభావం లేని అజ్ఞానులు, కామాంధులై స్త్రీల విషయంలో స్వకీయ పరకీయ భేదం లేకుండా, స్టైరవిహారం చేస్తుంటారు. కామాంధులు ప్రకృతికృపణులుకదా!

“సంసారోఒయమతీవ విచిత్ర? (శంకరభగవత్సాదులశ్రీసూళి.

భార్యాపుత్రాదిబంధాలతో కూడి అతివిచిత్రమైన ఈ సంసారంలో” ఉన్న మానవునికే తత్త్యచింతన, నిత్యానిత్యవివేచన అత్యావశ్యకం. గర్భంలో ఉండడం, పుట్టడం, పెరుగడం, మారడం, క్షీణించడం, నశించడం - అనే షడ్భావవికారాలు దేహధర్మాలే కాని ఆత్మధర్మాలు కావు. (ప్రకృతి సహజపరిణామంనల్ల సంక్రమించే

  • కాలక్రమేణ శరీరానికి బాల్య, కౌమార, యౌవన, వార్దక్యాలు అనే - మార్పులు కలుగుతుంటే, మానవుని 'ప్రవర్తనకూడా వాటికి అనుగుణంగా సాగుతుంటుంది.

“యౌవనే విషయైషిణామ్‌” కవికుల గురువన్నట్టు యువకుడైన వ్యక్తి గృహస్ట్రాశ్రమాన్ని బసినదమే ధర్మం. 'చతుర్జామాశ్రమాణాం. తు గార్హస్ట్రం (శైష్టముచ్యతే”

(బ్రహ్మచర్య, గృహస్ట్ర వానప్రస్థ, సంన్యాస మనే నాలుగాశ్రమాలలో ద్వితీయాశ్రమం అద్వితీయమైనదని శాస్త్రం బోధిస్తుంది.

వరుడు తన వృత్తిప్రవృత్తులకు అనుకూలవతిలైైన వధువుగళసీమలో మంగళసూ(త్రంకట్టి మూడుముళ్ళువేసిి నవోఢగా, సుమంగళిగా, గృహలక్ష్మిగా పాణిగ్రహణం చేసే శుభముహూర్తంలో ఆనూతనదంసతులకు కలిగే ఆనందం న భూతో న భవిష్యతి.

వ్యక్తులు విషయాలకు బలికాకుండా, సమాజం [క్రమపద్దతిలో నడవడానికీ, నిత్యనైమిత్రిక కామ్యవ్రతాచరణానికీ, కులదీపకమైన సత్సంతానాన్ని పొంది పిత్తూణం తీర్చుకోవడానికీ స్వధర్మపరాయణులైన ఇతరాశ్రమస్టులకూ, తైర్జికులకూ ఆతిధ్యమిచ్చి యధోచితంగా సహకరించడానికీ ఏర్పడిన భార్యాభరృసంబంధం, సాంఘికంగానూ, ధార్మికంగానూ ఎంతో పవిత్రమైనది కదా!

“బుతావృతౌ స్వదారేషు సంగతిర్యా విధానతః

(బ్రహ్మచర్యం తదేవోక్తం గృహస్టాశ్రమవాసినామ్‌॥” (విజ్ఞానేశ్చరీయం)

రాఘవీయవ్యాఖ్య 187

'సంతానార్హమై బుతుకాలంలో నియమితశుభరాత్రియందు తన భార్యతో సంగమించే గృహస్ట్రధర్మం (బ్రహ్మచర్యమే' అని యాజ్ఞవల్క్య స్మృతి కూడా బోధిస్తుంది. అందుకే-

“ధర్మావిరుద్దొ భూతేషు కామో ఒస్మి భరతర్జ్షభ” - (భ.గ?-11)

ధర్మానికి విరుద్దంగాలేని కామపురుషార్థాన్ని తానే అని భగవద్వాక్యం. కాబట్టి భార్యాభర్తల విషయాన్ని విషముయం చేసే పరదారాభిగమనాన్ని శాస్త్రం దూపిస్తుంది. సంఘం శిక్షిస్తుంది.

కామపురుషార్జాన్ని దుర్వినియోగం చేస్తే జ్ఞానవిజ్ఞానాలు నాశనమవుతాయి. అది ఆసురికం అవుతుంది. దాన్ని సద్వినియోగంచేస్తే దైవిక మవుతుంది.

ఒంటరిగా ఉన్నాడని వలచి వచ్చి కౌగిలించుకొనే పరకాంతను మనస్సులో నైనా కోరక్క విదలించుకొనే _బుద్ధికలవాడు “లేడు ప్రవరాఖ్యుడు దక్క మరొక్కండెక్కడన్‌”

పెద్దపులిమైనా నారాయణస్వరూపమే, అని దూరంనుంచే నమస్కరించేవాడు జ్ఞానయోగి.

“యా ట్రీతి రవివేకానాం విషయేష్వనపాయినీ।

త్వామనుస్మరతః సా మే హృదయాన్మాపసర్పతు॥ (భాగవతం,)

అవివేకులకు విషయాలయందెంతటి తీవ్రమైన ఆసక్తి ఉంటుందో,

అంతటి ఆసక్తి నిన్ను స్మరించే నా హృదయంనుంచి తాలగకుండా చేయవయ్యా, సుధాధామాక్షా! అని ప్రార్ధించే వాడు జ్ఞానయోగి.

దేహాత్మవిచారంలేని అజ్ఞానులు మృత్యువంటే భయపడుతారు.

“కృతకృత్యాః ప్రతీక్షంతే మృత్యుం పప్రియమివాతిధిమ్‌” అన్నట్టు జ్ఞానులు మాత్రం, ఆత్మబంధువుకోసం ఎదురు చూస్తున్నట్లే, మరణంకోసం సంతోషంగా ఎదురుచూస్తుంటారు.

బంగారాన్ని వన్నె - వాసి (చూడడానికి చూపించడానికి గీటు రాయి మీద పదే పదే రాపిడి చేసేవాడు లాభపడుతాడు. అలాగే, భగవన్నామాన్ని జన్మలో నాలుకకు అభ్యాసం చేయిస్తే అది జరామరణావస్థలోనూ అఆనామాన్నైే స్మరించడం వల్ల జన్మ సఫలమవుతుంది.

“మరణదశలో నన్నే స్మరిస్తూ దేహాన్ని విడిచే వ్యక్తి నాస్ట్రితినే నిస్సంశయంగా పొందుతా” డన్నాడు శ్రీభగవానుడు. (భగీ.8-5)

స్వపరజ్ఞానం, పరకాంతానపేక్ష మరణమాసన్నమైనప్పుడు భగవన్నామస్మరణ, ఇవి జ్ఞాన యోగులకే తప్ప అనితరసాధారణవిషయాలు కదా!

188 నారాయణ శతకం “చంద్ర సూర్యా చ నేత్రే” అన్నట్లు నారాయణునినయనాలు చంద్రసూర్యులు. శీతోష్టాలను సమానంగా సహించే, వహించే. దృష్టి కలవాడు నారాయణుడు. సుధాధామాక్ష సంబోధన, ఈ పద్యభావాన్ని ఆవరిస్తున్నది. ము. వెరవొప్పన్‌ బహుశాస్త్రమంత్రములొగి న్వీక్షించి వేతెల్సి మీ వరనామామృతపూరనూనుచు6దగన్‌ వైరాగ్యభావంబునన్‌ సరినశ్రాంతముంగోరువారు. పిదసన్‌ సంసారమాతుఃపయో ధరదుగ్దంబులు గ్రోల నేరరు వెసన్‌ దైత్యారి వారాయణా॥ 72 అర్ధము: ఓ. దైత్య+అరి = ఓరాక్షసాంతకా! నారాయణా! వెరవు, ఒప్పన్‌ = ఉపాయంగా; బహుశాస్త్రమంత్రముల్‌? ఒగిన్‌ = (క్రమంగా: వీక్షించి = బాగా చూచి; వే = వెంటనే; తెల్పి; మీ, వరనామ+ అమృత పూరము = మీ పావననామమనే అమృత(ప్రవాహాన్ని: ఆనుచు = పానంచేస్తూ తగన్‌ = యోగ్యంగా; వైరాగ్యభావంబునన్‌ = రాగ ద్వేషాలు లేని మనస్సుతో; ఆశ్రాంతమున్‌ = ఎల్లప్పుడు; సరిని = అవసానాన్ని; కోరువారు; పిదపన్‌ = మరణానంతరం; సంసారమాతు:+పయస్‌+ధర, దుగ్రంబులు = (ప్రపంచంలో తల్లి చనుపాలను; వెసన్‌ = శీఘ్రంగా; (క్రోల నేరరు = (త్రాగలేరు.. తా : ఓ రాక్షసవైరి! నారాయణా! అనేక శాస్త్రమంత్రాలను (శ్రద్ధతో (క్రమంగా సాధించి, ఇతరులకు తెల్పి, (శ్రేష్టమైన మీనామామృతాన్ని పానం చేసి, యోగ్యంగా రాగద్వేషాలు లేని మనస్సుతో జీవితాంతాన్ని సతతంకోరీ వారు, మరణానంతరం సంసారంలో తల్లిపాలను (త్రాగ లేరు. పునర్జన్మను పొందరని తాత్పర్యం. వ్యాఖ్య: వైరాగ్యభానం కలనారిక్షి పువర్దన్మ ఉండదనే పద్యమిది. మానవుడు చిన్నతనాననే అహంకారాభిమానాలను వదలుకొని, తనసందేహాలను నివారించగలసర్వజ్ఞుడనే దృఢవిశ్వాసం కలిగి, వినయంతో గురువుదగ్గరికి వెళ్ళి, పాదాభివందనం చేయాలి. తన కోరికను విన్నవించాలి, “సంవత్సరం తదర్హం వా మాసత్రయమథా౭పి వా! పరీక్ష్య వివిధోపాయై:ః కృసయా ని;స్పృహో వదేత్‌!” గురువు మూడుమాసాలో, ఆరుమాసాలో, ఒక్క సంవత్సరమో అంతేవాసీకి గలశ్రద్దను పరీక్షిస్తుంటే, ఆపరీక్షోపాయాలకు తగినట్టు సహనంతో ప్రవర్తించాలి. గురువు విద్యార్దులందరికి ౭క్కరీతిగనే విద్యను బోధిస్తాడు, వారిలో (ప్రజ్ఞామేధాశక్తులు రెండూ ఉన్నవాడే నేర్పరి అవుతాడు. నేర్పినదాన్ని (గ్రహించేశక్రియే కాక గ్రహించిన దాన్ని, ధారణచేసే శక్తి కూడా ఉండడం సత్సాత్రలక్షణం. “పాత్రవిశేషే న్యస్తం గుణాంతరం (వ్రజతి శిల్పమ్‌” (మాళవికా - 1-6)

రాఘవీయవ్యాఖ్య 189 స్వాతి చినుకు చిప్పలో పడి ముత్యమైనట్టు, గురువు యోగ్యునికి చెప్పిన విద్య విశేషగుణాన్ని పొంది భాసిస్తుందని కాళిదాసమహాకవిసూక్తి, ఉపదిష్పుడైన ఛాత్రుడు మంత్రాన్ని పునః పునరనుశిలనం చేయాలి. ఈ ప్రక్రియనే అభ్యాసమంటారు.అనేక శాస్త్రాలను పరిశీలించాలి. వాటిలోని సంశయం, పూర్వపక్షం, సిద్దాన్తం అనే చర్చల వల్ల అనెక విషయాలు అవగాహన మవుతాయి. ఇది వీక్షణక్రమం. బోధకు విషయం విద్య, శాస్త్రజన్యమైనది జ్ఞానం. అనుభవవిషయం విజ్ఞానం. తత్ఫలితంగా (ప్రాపంచికవిషయాలపట్ల ఏహ్యభావం కలుగుతుంది. సుఖానికి పాంగక, దుఃఖానికి క్రుంగక్క మనస్సును నిగ్రహించే సామర్థ్యం ఏర్పడుతుంది. తాను అనుభూతజ్ఞానమార్గంలో 'ప్రవర్తిస్తుంటే, తన నడవడిని లోకం సం(గ్రహిస్తుంది. తనకు తెలిసిన విషయాన్ని చెప్పకయే, తన ఆచరణద్వారా లోకానికి తెల్పినవాడవుతాడు. జ్ఞానానికి చరమసీమ భగవన్నామస్మరణమే. రాగద్వేషాలు అణగారిన పరిశుద్దమనస్సు బహిర్ముఖంగా పరుగెత్తక అంతర్ముఖంగా మరలడమే వైరాగ్యభావం. “అభ్యాసవైరాగ్యాభ్యాం తన్నిరోధ:” (పతంజలి) “అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ తు గృహ్యతే” (భ.గీ.6-35) అభ్యాసవైరాగ్యాలవల్లనే చంచలమైన మనస్సుని(గ్రహింపబడుతుంది. “వైరాగ్యబోధా పురుషస్య పక్షివత్‌” (వివేకచూడామణి) గగనాన విహరించడంకోసం పక్షికి రెండు రెక్కలాధారాలైనట్టు, ముక్తి సౌధాన్ని అధిరోహించఛడంకోసం వ్యక్తికి జ్ఞాన వైరాగ్యాలు రెండు ఆధారాలన్నారు శ్రీ శంకరాచార్యులు. కాబట్టి వైరాగ్యభావంతోనే తనదేహయా(త్ర సరి-ముగిసి-పోవాలని కోరే వ్యక్తికి తన జననపదవీజాంఘికత్వం శాశ్చతంగా వదలిపోతుంది. భావగతమైనదే భాగవతధర్మం కదా! శా. వేదంబందు సునిశ్చయుండగు నుహావేల్పెవ్వ (డో యంచు నా వేదవ్యాసపరాశరుల్‌ వెదకిన న్వేజొండు లేండంచు మీ పాదాంభోజము లెల్ల ప్రొద్దు మదిలో భావింతురత్యున్నతిన్‌ శ్రీదేవీనదనారవిందనుధుపా శ్రీరంగ నారాయణా॥ 73 అర్థం : శ్రీదేవీ వదన+అరవింద మధుపా = లక్ష్మీదేవిముఖమనేకమల మందలి మకరందాన్ని పానంచేసే భృంగమా! శ్రీరంగా! ఓనారాయణా! అవేదవ్యాసపరాశరుల్‌ = ప్రసిద్దులైన కృష్ణద్వైపాయనుండు, ఆయన తండ్రియైన పరాశరమహర్షి వేదంబందు = వేదనముందు; సునిశ్చయుండగు = ప్రతిపాద్యుడైన; మహావేల్పు = (మిశ్రసమాసపదమిది) గొప్పదేవుడు; ఎవ్వండో; అంచు; వెదకినన్‌ = పరిశోధించిన తర్వాత; వేలు+ఒండు =

1900 నారాయణ శతకం మరొకడు; లేడు; అంచు; మోపాద+అంభోజములు = కమలాలవంటి మోపాదాలను; మదిలో = హృదయంలో; ఎల్ల (ప్రొద్దు = సర్వకాలాల్లో: అతి+ఉన్నతిన్‌ = మిక్కిలి భక్తితో; భావింతురు = ధ్యానింతురు.

తా : శ్రీదేవీ ముఖపద్మచంచరీకా! శ్రీరంగా! వేదప్రతిపాద్యుడైన మహాదేవుడెవ్వడో అని పరాశర పారాళశర్యులు వేదమందు అన్వేషించిన పిమ్మట మరొకడు లేడని ఓ నారాయణా! మీ చరణారవిందాలనే తమడెందంలో నిత్యం మహోన్నతంగా ధ్యానిస్తుంటారు.

వ్యాఖ్య ఏ నారాయణుడే గొప్పదేవుడని బుషులు ధ్యానించే నర్లన.

శ్రీదేవికి పర్యాయపదాలు లక్ష్మీదేవి, పద్మాదేవి. “లక్ష్మీః పద్మాలయా పద్మా కమలా శ్రీ” (ఆమరకోశం). పద్మయొక్కముఖం కూడా పద్మమే, అంటే, తామరపూవు.

“తామరలన్న నీవలపుదారికి దారియు తెన్ను లేదు, పొం

దామర యామెమోము, తెలిదామర యాయమకన్నుదోయి, చెం

దామర యామెకేలుగవ, తామరలన్‌ మజులన్‌ జయించుకాం

తామరవాహినీ వికచతామరసంబులు నామెకన్‌జిగుల్‌![”

(కవిసమ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణ)

తామరపూరేకులలోని మకరందాన్ని పానంచేసేది తుమ్మెద లేదా తేనెటీగ. ఇందిందిరం లాగే, ఇందిర మొగంలో ఉన్న సొగసుల మిసిమినంతా ఆస్వాదించే వాడు నారాయణుడు.

శ్రీరంగ = శ్రీదంగనగరమందు. వెలసిన దేవా! పరమపదవాసం వలన కలుగదగిన పరమాత్మరతిని - (బ్రహ్మానందాన్ని కలిగించేది 'రంగం' “రతింగతో హరిస్తస్మాద్రంగ మిత్యభిధీయతే”. సామాజికులందరు ఎంతో ఆసక్తిని పొందుతారు కాబట్టి 'రంగం” “రజ్యంతే ఒస్మిన్‌ సర్వే సామాజికాః ఇతి రంగం” ఈ రెండు వ్యుత్చత్తులను రంగశబ్దానికి చెప్పవచ్చు.

శ్రీరంగ మనేది విమానం, అది ప్రణవాత్మక౦. (ప్రణవంలోని అకారంచేత భగవంతుడు, ఉకారంచేత లక్ష్మీదేవి, మకారంచేత జీవుడు సూచింపబడినట్సే శ్రీరంగా విమానంలో భగవంతుడైన శ్రీరంగనాథుడు, లక్ష్మీదేవి. జీవసంఘాతాత్మకమైన కాస్తుభరత్నం ఉండడంవల్ల ప్రణవాకారమైనది శ్రీరంగవిమానం.

రంగశబ్దం నాటకరంగాన్ని సూచిస్తుంది. మహానటుడు రంగనాయకుడు.

“దేవో నః శుభమాతనోతు దశథా నిర్వర్హయన్‌ భూమికాం

రంగే ధామని లబ్బనిర్భరర సైరధ్యక్షితో భావుకై:” (దశావతారస్తోత్రం)

అని శ్రీవేదాంతదేశికులు స్తుతించారు.

రాఘవీయవ్యాఖ్య 191 ఊరు, పేరు, మందిరం - మూడింటినీ శ్రీరంగ ఇబ్బం తెల్పుతుంది. శ్రీరంగ విమానంతోపాటు శ్రీరంగనాధుడు శ్రీరంగక్షేత్రంలో వెలసినాడని పురాణ ప్రసిద్ధం. వ్యాసమహర్షి “ప్రాంశుడు, పయోదనీలతనుభాసితుడు, ఆగమపుంజపదార్థ తత్త్వనిస్సంశయకారుడు, భారతీవంశవివర్జనుడు, (త్రిదశవందితుడు. ఈ సాత్యవతేయునిజన్మకు కారణభూతుడు పరాశరమహర్షి “పరాన్‌ శృణాతీతి పరాశర

ఈ తండ్రికొడుకు లిద్దరు, హరిహర హిరణ్య గర్భులనే (త్రిమూర్తులలో గొప్ప దేవతామూర్తి ఎవరో కదా! అని వేదాలను పరిశీలించారు. వేదాలన్నీ పరతత్తాన్ని ప్రతిపాదిస్తాయి.

“సర్వే వేదా యత్పద మామనంతి”(కఠోపనిషల్స్‌,

ఇం(ద్రియాలు దైవిక విషయాలను సట్టించుకోవు. అనుమానాది శాస్త్రప్రమాణాలు యధార్థాన్ని తెల్బవు. వేదాలే పరబ్రహ్మను ప్రకటిస్తాయి.

“నేంద్రియాణి, నానుమానం, వేదా హ్యేవైనం వేదయన్తి”,

“ఫ్రత్యక్షాగమ. మాహాత్మ్యాత్‌ అనుమానం ్రమాణతామ్‌!

యాతి నైవాన్యథా తస్య నియతత్వం క్వచిద్భవేత్‌॥

“న చానుమానాదీనామాగమం వినా ప్రామాణ్యం ధర్మాదిషు తదగోచరత్వాత్‌

(విష్ణుతత్త్యనిర్ణయం).

(ప్రత్యక్షప్రమాణంవల్ల (కంటితో స్పష్టంగా ఒకసారి చూచినందున) అనుమానం (ప్రమాణమవుతుంది. కేవలం ఊహజనితమ్రైతే అనుమానానికి గౌరవముండదు. కాబట్టి ధర్మాధర్మవిషయాలు వేద(ప్రమాణం లేకుండా, కేవలం శాస్త్రప్రమాణాలవల్ల గోచరించవు.

“నారాయణః పరబ్రహ్మ తత్త్వం నారాయణః పరః”

“బృహత్తే విష్ణోస్సు మతిం భజామహే”.

“తద్విప్రాసో విపన్యవో జాగ్భవాంసః సమింధతే విష్ణిర్యత్పరమం పదం”

“సర్శభూతస్థ మేకం నారాయణం, కారణరూపమకారపరబ్రహ్మోమ్‌”.

“యద్వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాన్తే చ ప్రతిస్థితః

తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్చరః॥

'వైకుంఠవాసుడు, సకలదేవతలచే స్తవనీయుడు, విశ్వవ్యాపి, జగత్కారణభూతుడు, 'ప్రకృతికంటె పరుడైన జీవునికంటె పరుడైన నారాయణుడే ఓంకార వాచ్యుడైన పరబ్రహ్మ అని శ్రుతిశతవాక్యాలు ప్రతిపాదిస్తున్నాయి.

192 నారాయణ శతకం పరులు అంటే వేదబాహ్యులను ప్రమాణాలనే రంపాలతో హింసించేవాడు. 'పరాశరుడు” అన్వర్హనామధేయుడు. చిదచిదీశ్చరతత్తాలను బోధించే 'పురాణరత్నం' అని ప్రసిద్ధిపొందిన 'విష్ణుపురాణాన్ని' లోకానికి అనుగ్రహించినమహర్షి పరాశరుడు. “ఆలోడ్య సర్వశాస్తాణి విచార్య చ పునః పునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణ: సదా॥” (భారతం). వేదాలను వింగడించి, ఉపనిషత్తులను పరిశీలించి, భగవద్గీతను విని, 'బ్రహ్మసూ(ళత్రాలను సమకూర్చి, పురాణాలను రచించి, ఎన్ని విధాల తరచి తరచి చూచినా పరతత్త్యంగా కనబడుతున్న నారాయణుడే ధ్యానింప దగినవాడు” అని వేదవ్యాసమహర్షి లోకాన చాటినాడు. “న తత్సమశ్చాభ్యధికశ్చ్ళ దృశ్యతే” (శ్రుతి). “సంచింతయేత్‌ భగవతశ్ళరణారవిందం వజ్రాంకు శధ్వజసరోరుహలాంఛనాఢ్యమ్‌” (భాగవతం-3-28) నారాయణునికన్న మించిన దేవుడు మరొకడు లేడని నిర్ణయించి, ఆదేవదేవుని పాదపద్మాలనే ఎదలో పదిలపరచుకొని, సర్వకాల సర్వావస్టలయందు భజించే భాగధేయులు వేదవ్యాస, పరాశరమహర్షులు. ను సుతదారాప్తజనాది విత్తములపై శూన్యాభిలాసుండు నై యతనోద్రేకయుతంబులై పాదలః నట్వై యింద్రియ(న్రాతముల్‌ మృతింబొందించి దమంబునన్‌ శమమునన్‌ మీరంగ వర్తించుని ర్లతసంపారి భనత్భపం బొరయునో కంజాక్ష నారాయణా! 74 అర్థం : ఓ కంజ+అక్ష = ఓ నీరజనయనా! నారాయణా! సుత, చార+ఆప్రజన+అఆది విత్తములపై = కొడుకు, పెండ్లాం, ఇతవరిమొదలైన తెలిసిన వారిమీదనూ: (ద్రవ్యం మాదనూ; శూన్య+అభిలాషుండును, ఐ=కోరిక లేనివాడై; యతన+ఉ(దేక యుతంబులై = ఆరంభ విజృంభణలతో కూడినవై; పాదలు = వృద్ధిబొందు; అయ్యె, ఇంద్రియ(వ్రాతముల్‌ = ఆయాఇంద్రియాలసముదాయాలను; దమంబునన్‌ = నిగ్రహంతో; మృతిన్‌, పాందించి = నిర్జీవం చేసి; శమంబునన్‌ = శాంతితో; మీరంగ = అతిశయంగా; వర్తించు = మెలగే; నిర్ణతసంసారి = సంసారంనుంచి బయటపడిన వ్యక్తి భవత్‌, కృపన్‌ = నీదయను; పొారయును = పొందును. తా : ఓ నీరేజాక్ష! నారాయణా! పు(త్రకళత్రసుమిత్రహితపరిచితవిషయమై, (్రవ్యంపట్ట ఖ్యాతిలాభానురాగాదివాంఛను విడనాడి, ప్రయత్నోద్రేకాలతో వర్షిల్తే ఇంద్రియాలను నిగ్రహంతో నిర్జించి, శాంతితో వర్తించే (ప్రకృతిబంధవిముక్తుడు నీ కృపకు పాత్రుడౌతాడు. క్‌

రాఘవీయవ్యాఖ్య 193

వ్యాఖ్య ఏ జ్ఞానానుష్టానవరుడు భగవంతునిదయకు పాషత్రడని వర్ణితం. దేహేం([ద్రియాలు బహిర్ముఖాలుగా నిర్మితాలు. శబ్దస్పర్శరూపరసగంధాలనే విషయాలు ఇంద్రియాలనే గుట్టాలకు భోగ్యవస్తువులు, ఆహారాలు,

“పరాంచి ఖాని వ్యతృణోత్‌ స్వయంభూ

స్తస్మాల్‌ పరాజ్‌ పశ్యతి నాంతరాత్మన్‌ ౪” (కరోపనిషత్‌)

పరిసరాల్లో చూచిన ఆహారాన్ని తినడానికి గుజ్టాలు, కళ్ళెం ఎంతబిగబట్టి నిరోధించినా, విజృంభించి ఎగబడినట్టే ఇంద్రియాలు ఆబాహ్యవిషయాలసైకి పరుగిడుతుంటాయి. కాబట్టి, అంతర్యామిమైన పరమాత్మవైపు చూచే భాగ్యం కలుగదు.

ఏ ఇంద్రియమైనా మనస్పంయోగంలేకుంటే దానివిషయాన్ని (గ్రహించజాలదు. కాబట్టి, సాతికాహారాన్ని భుజించేవ్యక్తి వివేకం కలిగి, స్థిరమైన అధ్యవసాయంతో మనస్సును ని(గ్రహించే శక్తిమంతుడవుతాడు.

'దమ' మంటే వాక్చన్షుఃశ్రోత్రజిహ్వాఘాణాలనే బాహ్మేంద్రియాలను నిషిద్ధ విషయాలవైపు పరుగెత్తనీయని ఒక జ్ఞానసాధనం.

“దమేన. దాన్తాః కిల్చిష మవధూన్వంతి, దమేన (బ్రహ్మచారిణ; సువరగచ్చన్‌” (తై.నా.ఉప) - దమం చేతనే బాహ్యేంద్రియనియమనశీలురు - దాంతులు - తమపాపాలను పొగొట్టుకొంటారు. నైస్టిబ్రహ్మచారులు దమం చేతనే స్వర్గానికి పోగలిగారు.

“ఇమేన శాంతాః శివమాచరంతి, శమేన నాకం మునయో౬న్వవిందన్‌” (ఖై.నా.ఉప)

  • కామవాసన, కోపోద్రేకాదిదుర్లుణవృత్తులు లేనందువల్ల కలిగే మనఃశాంతిని 'శమ' మంటారు. శమంకలవారు = శాంతులు - మంగళకరమైన పురుషార్ధాన్ని సాధిస్తారు. శమమనే జ్ఞానసాధనతో మునులు మోక్షఫలాన్ని పొందినారని శ్రుత్యర్థం.

“ఇంద్రియవ్రాతముల్‌ మృతి బొందించడి మంటే ఇం(ద్రియాలను బాహ్యవిషయాలనుంచి మళ్ళించి అంతరాత్మాభిముఖంగా మలచడమే, దమ, శమసాధనానుష్టానపరునికి దారాపుత్రాదులు ముక్తికి. దారి చూపేవారు. కారని సంసౌరంపట్ల విరక్తి కలుగుతుంది.

“మాతాపితృపతి(భ్రాతృదారాపుత్రాదయోఒపి వా!

ఏకైకఫలలాభాయ, సర్వలాభాయ కేశవః॥”

తల్లి, తండ్రి, పతి, పత్ని, పుత్ర మిత్రాదులు అభాసబంధువులు. వీరిలో ఒక్కొక్కరివల్ల ఒక్కొక్క లాభం కలుగవచ్చునేమోకాని, సకలలాభాలను సమకూర్చేవాడు సర్వేశ్వరుడు అని (గ్రహించి పరమాత్మయందు రక్తుడవుతాడు.

194 నారాయణ శతకం “పరమాత్మని యో రక్తః విరక్తోఒపరమాత్మని” - పరమాత్మయందు రక్తికలవాడు, (ప్రాపంచిక విషయాలపట్ట విరక్తుడవుతాడు. ఇలాంటి జీవన్ముక్తుడు భగవత్కృపచేత తర్వాత ముక్తపురుషుడవుతొాడనడం నిశ్చప్రచం. ను. ప్రమదంబారంగ పుణ్యకాలగతులన్‌ భక్తిన్నమపష్టింపుచున్‌ నమరన్నన్నసునర్లగోసలిలకన్యాధారుణి గ్రాము దా నములాన్నూయనిధోక్తి భూసురులకున్‌ సన్మార్గుండై యిచ్చునాః డనురేం ద్రార్భితవైభవోన్నతు(డగున్నామీంద నారాయణా ॥ గర్‌ అర్ధం : ఓ నారాయణా! ప్రమదంబు, ఆరగ = నిండుసంతోషంతో; పుణ్యకాలగతులన్‌ = పర్వదినాలు వచ్చినప్పుడు; భక్తిన, అనుష్టింపుచున్‌ = భక్తియోగాన్ని ఆచరిస్తూ; అన్న, సువర్హ్మ గో, సలిల, కన్యా ధారుణి, గ్రామ దానములు = అన్నం, బంగారం, ఆవు, ఉదకం, కన్య, భూమి, ఊరు దానాలను; ఆమ్నాయ విధా+జక్తిన్‌ = వేదం చెప్పినరీతిగా; భూసురులక్రున్‌ = (బ్రాహ్మణులకు; సత్‌+మార్లుడై = ధర్మప్రవర్తనుడై; ఇచ్చువాడు; ఆమీద = మరణానంతరం; అమర+ఇం(ద్ర+అర్భిత, వైభవ+ ఉన్నతుడు, అగున్‌ = దేవప్రముఖులచేత పూజింపబడిన గొప్ప సంపద కలవాడవుతాడు. తా ; ఓ నారాయణా! పర్వదినాలలో సంతోషంగా శ్రద్దా భక్తులతో అన్నం, బంగారం, ఆవులను, ఉదకాన్ని, కన్యను, భూమిని, (గ్రామాన్ని వైదిక విధానంగా భూదేవతలకు ధార్మిక వర్తనుడై దాన మిచ్చే జ్ఞానవంతుడు, ముక్తాత్ముడై దేవ (ప్రముఖులచేత పూజితుడై గొప్ప ఐశ్చ్వర్యవంతుడవుతాడు. వ్యాఖ్య : దాతయైన జ్ఞానయోగి దేవపూజితుడవుతాడని వర్లన. జ్ఞానసంపన్నుడు ఏకాదశి, పున్నమ, అమావాస్య, రవిసంక్రాంతి మొదలైన పర్వదినాలలో భక్తితో యథాశక్తి దానాలను చేస్తాడు. “దాతవ్య మితి యద్దానం దీయతే౬ నుపకారిణే | దేశే కాలే చ పాత్రచ తద్దానం సాత్ష్యికం స్పృతమ్‌” ॥ (భ.గ.17-20) శస్తుర యాలి అనే దృఢ నిశ్చయంతో దానం చేయాలి. 'నేను ఈ కార్యం ఉపరాగ (గ్రహణం) వష్యడు వం లేకుండా, పుణ్యతీర్రక్షేతాలయందు. దానం తీసుకొనే వ ఎ ౪ $ది పుణ్యకాలాలయందు, దానం చేయాలి, సక్తి (ప్రత్యుపకారం చేయని వాడై యుండాలి. సదాచారనిష్టులైన శ్రోత్రియులకు గానీ, బీదలకు, వికలాంగులకు గానీ కర్తవ్యతాబుద్ధితో ఇచ్చే దానం సాత్ష్యికదానమవుతుంది. సా స త్యికదానం చేసేవాడు సన్మార్లుడు.

రాఘవీయవ్యాఖ్య 195 “న విద్యయా కేవలయా తపసా కేవలేన చ। యత్ర వృత్తం హ్యుభే చైతే తద్ది పాత్రం ప్రచక్షతే” కేవలం విద్య ఉన్నా, ఒక్క తపస్సు ఉన్నా 'పాత్ర" శబ్దం చెల్లదు. విద్యా తపస్సులు రెండింటితోపాటు నడవడి బాగుంటే, ఆ వ్యక్తియందు 'పాత్ర' శబ్దం అన్సర్హమవుతుంది, అని ధర్మశాస్త్రం. “యజ్లే తపసి దానే చ స్ట్రితిః సదితిచోచ్యతే; కర్మ చైవ తదక్రీయం సదిత్యేవాభిధీయతే ॥"(భ.గి.17-27) యజ్ఞతపోదానాలయందలి నిష్ట సత్‌ అనబడుతుంది. ఆ వేదోక్త కర్మనిష్ట కూడా భగవ్రీత్యర్థంగా చేయబడినప్పుడే భగవద్రూపమైన 'సత్తుగా చెప్పబడుతుంది. భగవానుడు ఇట్టి కర్మయందు దైవత్వాన్ని బోధించాడు. “అభిగ మ్యోత్తమం దానం ఆహూ యైవ తు మధ్యమమ్‌! అధమం యాచమానాయ, సేవాదానం తు నిష్పలమ్‌॥” సత్సాత్రునిదగ్గరికి పోయి. దానం చేయడం ఉత్తమం. ఆయనను తనవద్దకు రప్పించి దానం చేస్తే అది మధ్యమం. అడిగినవానికి దానం చేస్తే అది అధమం. మనకెప్పుడైనా పనికి వస్తాడనుకొనబడే వ్యక్తికీ, సేవ చేసిన వ్యక్తికీ ఇచ్చేది కూలి, లేదా పారితోషికమవుతుందే కాని, అది దానమూ కాదు, దాన ఫలమూ ఉండదు. అన్నదానం మొదల్కొని (గ్రామదానం వరకు ఈ పద్యంలో చెప్పబడిన సప్తదానాలు ఉత్తరోత్తరంగా (శ్రేష్టమైనవి. దాత దానంచేసే స్వీయవస్తువుమీద తన స్వత్వాన్ని (హక్కును) వదలుకొని దానగ్రహీతకు స్వత్వాన్ని కలిగిస్తాడు. కాబట్టి దాతృత్వాన్ని 'త్యాగం' అంటారు. దాన సమయంలో ్రతిగ్రహీతను గూర్చి దాత, “శ్రీమహావిష్ణవే తుభ్యమహం సం్రదదే; న మమ” - విష్ణుస్వరూపుడవైన దీనిని నీకోసం ఇస్తున్నాను; నాది కాదిది; అని త్యాగం చేస్తాడు. జలాలు స్థానంగా కలవాడు నారాయణుడు. జలోపలక్షితాలైన సమస్త వస్తువులకు ్రష్టమ్రైనవాడు, ఆవస్తువుల ఉనికికి హేతువైన వాడు నారాయణుడు. కాబట్టీ నారాయణరూపమైన జలంతోనే ఏ వస్తువైనా ధారాపూర్వకంగా దత్తమనవుతుంది. “నారం (జ్ఞానం) ఏతి (జానాతి)ఇతి = నారాయణ” సమస్తజ్ఞానాశ్రయుడు నారాయణుడు. కాబట్టి త్యాగమహిమ ఖైలోక్యసంతర్చియైన నారాయణున్ని సంతృప్తి పరుస్తుంది. ఇది వేదశాస్తోక్త విధానం. 'కర్మ'లో వలె 'కర్మవిధానం'లోనూ లోపం ఉండరాదుకదా।

196 నారాయణ శతకం దాత కీర్తిశేషుడైన తర్వాత దేవయానమార్గంగా శ్రీ వైకుంరం చేరుకాంటాడు. భాగవతంలో ఇలా ఉంది -

“క్షణేన మర్ర్యేన కృతం మనస్వినః సంన్యస్య సంయాంత్యభయం పదం హరే? - అల్పాయుష్కులైన మనుష్యులు, చేసిన కర్మలను త్యాగం చేసి, భగవత్సన్నిధిలో శాశ్ళతానందాన్ని పొందుతున్నారని కల్పాయుష్కులైన దేవతల (ప్రశంసకు పాత్రమైనది భారతీయసంస్కృతి.

సన్మార్లుని దేహయాత్ర గడచిన మీదట, జీవయాత్రా విధానాన్నీ ఈ పద్యంలోని నాల్గవ చరణం తెల్పుతుంది.

“ఏషసంప్రసాదోఒస్మాచ్చరీరాత్‌ సముత్హాయ పరంజ్యోతి రుపసంపాద్య స్వేన రూపేణా భినిప్పద్యతే” - (ఛాందోగ్యం).

భగవదారాధనగా సత్కర్మల నాచరించిన జీవుడు శరీరంలోనుంచి వెడలి పరంజ్యోతిస్సును పొంది స్వస్వరూపావిర్భావంకలవాడవుతాడు (్రుత్యర్హం).

“తత్పురుషోఒ మానవః సఏనాన్‌ బ్రహ్మ గమయతి”

అతివాహికుడుగా, అమానవుడుగానూ, విద్యుత్పురుషుడుగానూ (క్రుతిచెబుతున్న విష్ణుసేవకుడు మాత్రమే భగవథ్రీతిపాత్రులైన ఈ జీవులను పరబ్రహ్మ దగ్గరికి తీసుకొని పోతాడు.

“సవీతం దేవయానం పంధానం ఆపద్య అస్టిలోకమాగచ్చతి, స వాయులోకం, సవరుణలోకం, సఆదిత్యలోకం, సఇంద్రలోకం, సప్రజాపతిలోకం, సబ్రహ్మలోకం” - (కౌషీతక్యుపనిషత్‌ - 1అ-3)

ఆమానవునితోకూడి ఆజీవుడు, దేవయానమార్గగామిలై[క్రమంగా అగ్ని, వాయు, వరుణ, ఆదిత్య, ఇంద్ర, ప్రజాపతి లోకాల్లో ప్రవేశిస్తూ చివరకు పర(బ్రహ్మలోకానికి చేరుకొంటాడు.

“వాతాంపమద్‌. గ్లావిద్యుద్వరుణేంద్రధాతృమహిత:” అన్నట్టు, దేవలోకాల్లోకి ప్రవేశించే ఈ ముక్తాత్మను ఆయాదేవలోకాధిపతులు సాదరంగా ఎదుర్కొని, ఘనంగా పూజించి, వైభవంగా సాగనంపుతారు. “త్యాగేనైకే అమృతత్వమానశు?”" త్యాగమహిమచేత జీ

సగమహిమచేత జీవుడు మోక్షసామ్రాజ్యాన్ని పొందుతాడు.

“అర్భిరాదినా తత్ర్రధితే;” (బ్రసూ)అని, చతుర్థాధ్యాయంలో, అర్చిరాద్యధికరణాలయందు శ్రీవ్యాసభగవానుడు ఈవిషయాన్ని వివరంగా బోధించాడు.

“ఇదం జ్ఞాన ముపాథ్రిత్య మమ సాధర్మ్యమాగతాః।

సల్లేఒ పి నోపజాయంతే, ప్రళయే నవ్యధయంతి చః” (భగీ.14-2)

రాఘవీయవ్యాఖ్య [187 జీవులు ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి, నాతో సమానమైన స్వరూప, స్వభావాలను పొందిన వారై సృష్టికాలంలో పుట్టరు, ప్రళయ కాలంలో నళించరు - అన్నాడు శ్రీకృష్ణభగవానుడు. మ. _ఇలనెవ్వారి నునంబులో నెజుక దానెంతెంత గల్గుండు నా కొలదింజెంది వెలుంగుచుందు కలయ న్లోవింద నీరూపులన్‌ అలర న్నంబుమితంబులై సరసిలో నంభోరుహంబుల్‌ దగన్‌ నిల నొప్పారెడు చంద మొందె దెపుడు న్నీలాంగ నారాయణా॥ 76 అర్హం : నీల+అంగ = శ్యామవర్లశరీరుడా! ఓ నారాయణా! ఇలన్‌ = లోకంలో; ఏవారి మనరిబునన్‌ = ఎవరెవరిచిత్తమందు; ఎలుక = జ్ఞానం, తాన్‌ = అది; ఎంతెంతన్‌: కల్లి, ఉండున్‌ = ఏ పరిమాణంలో ఉంటుందో; ఓ గోవింద! నీ రూపులన్‌ = నీ మూర్తులతో; ఆ కొలందిన్‌, చెంది = ఆ పరిమితిని బట్టి, కలయన్‌ = అంతట; వెలుంగుచుందు = ప్రకాశిస్తుంటావు. ఎపుడున్‌ = ఏకాలాననైనా; అంభస్‌+రుహంబుల్‌ = నీరేజాలు (తామరలు) తగన్‌ = యోగ్యంగా; సరసిలో = కాలనులో (జలాశయంలో) అంబుమితంబు లై = నీటికొలదికలవై; అలరన్‌ = వికసింపగా; ఇలన్‌ = లోకమందు; ఒప్పు, ఆరెడు చందము = ఒప్పిదమైన రీతిగా? ఒందెదు = పొంది ఉంటావు. తా : శ్యామవర్హ శరీరంగల ఓ నారాయణా! లోకంలో ఎవరిమనస్సున జ్ఞానం ఎంత పరిమితి కలిగి ఉంటుందో, అంత మాత్రమే నీ రూపాలతో ఓ గోవింద! సరస్సులో తామరకమలాలు జలపరిమితాలై వికసించేరీతిగా, (ప్రకాశిస్తుంటావు. నీరుకొలది తామర అంటే నీరెంతలోతుంటే తామర పువ్వునాళం అంత పొడవు ఉంటుంది అనీ అర్హం చెపుతారు. వ్యాఖ్య 2 జ్ఞానానుగుణంగా భగవద్రూపమలరే వర్ణన. సర్వతోముఖమైనది నీరు. ఏ పొత్రలో (గ్రహిస్తే ఆపాత్రకొలది అకారం కలిగి యుండడం నీటి స్వభావం. “యావత్సలిలం తావత్కమలం” అన్నట్టు సరస్సులో నీరే మాత్రముంటే ఆ మాత్రం తామరలుంటాయి. నిన్న నిలువెడు నీరున్నా వికసించిన తామరకమలాలు, రాత్రి వానపడి నందువల్ల నేడు తాళష్రమాణంగా పెరిగిన నీటి ఉపరితలంలోనూ అట్లే వికాసంగా గోచరిస్తాయికదా! నీరు కొలది తామర' లున్నట్లే, భక్తి రూపజ్ఞానం ఎవరిహృదయంలో ఎంత ఉంటే, “అభిలభువనజన్మస్టేమభంగాదిలీల, వినత వివిధభూత(వ్రాతరక్షైకదీక్షు' కలిగిన పరబ్రహ్మకూడా, అంతమాత్రమే రూపంకలవాడై (ప్రకాశిస్తుంటాడు.

198 నారాయణ శతకం అజ్జానులయందు దేవుడుండడని కాదు. “కంటకా([గ్రఇవస్టితః” వారి హృదయంలో ముండ్లమీద నిలిచియున్నట్టు ఉంటాడు.

రావణుడెత్తినా లేవని లక్ష్మణున్ని ఆంజనేయుడు లేవనెత్తాడు.

“ఈశ్చరః సర్వభూతానాం హృద్దేశేఒర్జున! తిష్‌రతి” (భ.గీ.18-61)

భగవంతుడు సర్వప్రాణులహృదయప్రదేశమందు ఉంటాడు.

“యే యధా మాం ్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్‌” (భ.గ.ఉ-11)

ఎవరే కోణంతో కొలిస్తే విశ్శతోముఖుడు ఆ కోణమానానికి తగినంత ఆకారంతో (ప్రకాశిస్తుంటాడు.

“వరమహాద్భుతమైన వైష్ణవజ్ఞానంబు

తిరముగా నెవ్వరు తెలియగలరు?” (భాగ.6-176)

నిదర్శనాల్లంకృతపద్యమిది.

జ్ఞానంకొలది గోవిందునిరూపాలు (ప్రకాశిస్తాయి. ఇది ఉపమేయవాక్యార్హం, నీటికొలదితామరలు వికసిస్తాయి. ఇది ఉపమానవాక్యార్హం.

ఈ రెండు వాక్యాలు బింబప్రతిబింబభావంగా ఉన్నాయి. తామరలొప్పారెడు చందంగా గోవిందునిరూపాలు వెలుగుతుంటాయనడంవల్ల ఉపమేయ వాక్యార్థ ధర్మమందు ఉపమానవాక్యార్థధర్మం అభేదంగా ఆరోపితం, విశిష్ట ధర్మాల కైక్యారోపం చేసినందువల్ల ఇది వాక్యార్థవృత్తి నిదర్శనాలంకారం.

మ. మదిలో మత్తమభక్షిపీళముపయిన్‌ నూనాధ మీపాదముల్‌

గదియం జేర్చినవానికేనొాడయఃడన్‌ గాదంచు నత్యున్నతిన్‌

పదిలుండై సమవర్తి నృత్యువునకున్‌ బారంబుగా. బల్కు మీ

పద సద్మార్భకు లెంత వుణ్యులొ కృపాపారీణ నారాయణా॥ 77

అర్ధం ; మానాధ = లక్ష్మీపతీ! కృపాపారీణ = దయాపూర్ణా! ఓ నారాయణా! మదిలోన్‌

= మనస్సులోన; ఉత్తమభక్తిపీళముసయిన్‌ = గొప్పభక్తి అనే ఎత్తైన వేదికమీద; మీపాదముల్‌ కదియన్‌ చేర్చినవానికి = మీచరణాలను సమానంగా కూర్చి ఉంచిన వానికి; ఏను=నేను; ఒడయండన్‌,_ కాదు, అంచున్‌ = ప్రభువును కాను అంటూ; సమవర్తి =యముడు; అతి+ఉన్నతిన్‌ = కడుగొప్పుగా; పదిలుండై; స్టైర్యంకలవాడై; మృత్యువునకున్‌ = మృత్యుదేవతకు; పాఠంబుగా, పల్కు = బోధించును; మిపదపద్మార్చకులు = మీ చరణకమలాలను పూజించేవారు; ఎంతపుణ్యులో.

తా : ఓ లక్ష్మీనాధా! దయాళూ! నారాయణా! ఎదలో భక్తిని పీఠంగా వేసి దానిమీద మాపాదపద్మాలను కడకతో చేర్చికొాల్చే భక్తునికి నేను దొరను కాదు.

రాఘవీయవ్యాఖ్య 1909 అంటూ యముడు పదిలముగా మృత్యుదేవతకు బోధిస్తాడు. వాస్తవంగా, మోపాదకమలసేవాపరులు ఎంత సుకృతులో కదా!

వ్యాఖ్య: భగవత్సాదపద్మార్భకులు పుణ్యాత్ములని వర్లితం.

పుణ్యాత్ములు పాపాత్ములు అందరు మరణానంతరం ఒకేలోకానికి వెళ్ళరు.

“నావిరతో దుశ్ళరితాత్‌ నాశాంతో నాసమాహితః।

నాశాంతమానసో వాజపి, ప్రజ్ఞానే నైన మాప్ప్షుయాత్‌॥”

వెడునడవడిని మానక, ఇంద్రియ చలనముడుగక, ఏకా(గ్రచిత్తంలేక అన్నిటియందు వ్యాపించే మనస్సుకలవాడు పరమాత్మను పొందలేడు - అని యముడు నచికేతునికి ఉపదేశించాడు.

“అయం లోకో నాస్తి నపర ఇతి మానీ పునః పునర్వశమాపద్యతే మే”

“సర్వే చైతే వశం యాంతి యమస్య భగవన్‌ కిల” - ఇత్యాది వాక్యాలు, “ఈలోకమూ లేదు, పరలోకమూ లేదు". అనే దురభిమాని, ఇలాంటి జనులందరు యమునికి వశమవుతారని బోధిస్తున్నాయి.

“శప్రమానస్య యత్సాపం శపంతమనుగచ్చతి” - తిట్టు పడేవాని పాపం తిట్టేవానితో కూడి పోతుంది. సాధువులను దూషించేవారూ, ఆచారహీనులూ యమునిఆజ్ఞవల్ల రౌరవాది సప్తనరకాలను పొందుతారని (శ్రుతిస్పృతులు బోధిస్తున్నాయి.

భగవద్భక్తులు యమలోకానికి వెళ్ళరు. వైకుంఠానికి వెళ్ళుతారు.

భగవంతునిస్వరూపగుణవిభూతులందు నిరతిశయ్రీతిరూపమైన ధ్యానవిశేషమే భక్తి ధ్యానవిశేషమంటే తైలధారవలె ఎడతెగకుండా నిరంతరస్పృతిరూపమై, జీవుడు శరీరాన్ని విడిచేవరకు - వైకుంఠానికి ప్రయాణం చేసేవరకు - ప్రతిదినం అనుష్టింపగా వృద్ది పొంది, అంతిమస్మృతివరకు ఉండే జ్ఞానపరంపర.

“ఆ పీరాన్మాళిపర్యంతం పశ్యతః పురుషత్తమమ్‌।

పాతకాన్యాశు నశ్యంతి, కిం పునస్తూపపాతకమ్‌॥”

భక్తులు తమహదయంలో భక్తిపీరంమీద ధ్యేయమూర్తిని (ప్రతిష్టించి ఆపాదమస్తకం సేవిస్తుంటారు. కాబట్టి వారి మహాపొతకాలన్నీ నశిస్తాయి. ఇక ఉపపాతకాలవిషయం చెప్పేదేమి? అన్నట్టు భక్తులు పావనమూర్తులు.

“విష్ణునామధరః పుణ్యో నామధారీ స ఉచ్యతే॥”

విష్ణు నారాయణ అనే భగవద్వాచకమైన నామాన్ని ధరించినవాడే 'నామధారి “నామైన నామ నామ మే” భగవన్నామమే నామమనబడుతుందని (అరుణపారం) శ్రుతి బోధిస్తుంది. కాబట్టి 'నామధారి'యే పుణ్యుడు కాదు, ఆయనను ఆపేరుతో పిలిచేవారుకూడా అజావికీళునివలె పుణ్యాత్ములవుతారు.

200 నారాయణ శతకం

'సమవర్తిన్‌' శబ్దానికి, ధర్మాధర్మాల పుణ్యపాపాల విషయమై పక్షపాతం లేకుండా, సమానంగా వర్తించే 'యమధర్మరాజు' అని అర్హం. మృత్యువు మొదలైన భృత్యులే యమకింకరులు.

"స్వపురుష మభివీక్ష్య పాశహస్తం

వదతి యమః కిల తస్య కర్ణమూలే।

పరిహర మధుసూదన'ప్రపన్నాన్‌

'ప్రభురహ మన్యనృణాం న వైష్ణవానామ్‌"॥

యమధర్మరాజు పాశహస్తుడైన తన కింకరుణ్ని పిలిచి, 'శ్రీమన్నారాయణుని శరణు జొచ్చిన వారి వద్దకు పోవద్దు, నేను తక్కిన నరులకే గాని విష్ణుభక్తులకు ప్రభువును కాను' అని రహస్యంగా చెబుతాడట.

“దేవం శార్‌బ్లధరం విష్ణుం యే '్రపన్నాః పరాయణమ్‌!

న తేషాం యమసాలోక్యం, న చ తే నరకాకసః॥

శార్‌జ్ఞధరుడైన విష్ణుమూర్తిని పూజించే ప్రపన్నులకు యముని దర్శనం కాదు. వారు నరకానికే పోరు, అని వైష్ణవ, వామన పురాణాల ప్రామాణ్యం ఉంది. నిజంగా, నారాయణుడెంతదయాళుడో, ఆయన పాదపద్మార్భకులెంత పుణ్యులోకదా!

మ. కులమెన్నం గొలదేల యేకులజుండుం గోత్రాభిమానాభిలా షులునజ్ఞానము. బాసి జ్ఞానము మదిన్‌ సంధించి శుద్దాత్ముండై యలరారం బరుసంబు సోంకునినుమున్‌ హేమాకృతిస్తోనుమై వెలయున్నాగతివాండు ముక్తి కరుగున్‌ వేదాత్మ నారాయణా॥ 78

అర్ధం : ఓ వేదాత్మ! నారాయణా! కులము = జాతిలోని ఒక తెగను; ఎన్నన్‌ = గణించడం; కొల = పాపం, అది, ఏల = ఆకులమెన్నడం ఎందుకు? ఏకులజుండున్‌ = ఏ కులమందు పుట్టినవాడైనా; గోత్ర+అభిమాన+అభిలాషలున్‌ = వంశాహంకారవాంఛలను; అజ్ఞానమును, పాసి = త్రోసి, జ్ఞానముమదిన్‌ సంధించి = వివేకాన్ని ఎదలో సమకూర్చి; శుద్ధ+ఆత్ముడై = నిర్మలాత్ముడై; అలరారన్‌ = ప్రకాశించగా; పరుసంబు = స్పర్శవేధి అనే వస్తువు; సోక్టున్‌ = తాకునట్టి; ఇనుమున్‌ = ఆయసలోహం; 'హేమ+అకృతి స్తోమమై = మొత్తం బంగారు రూపమై; వెలయున్‌ = మెరయును. ఆ గతి వాడు = ఆర్‌తిగా ప్రకాశించే శుద్దొత్ముడు; ముక్తికి ఆరుగున్‌ = మోక్షాన్ని పొందును.

తా: వేదాత్మ! ఓనారాయణా!-కులాన్ని తలచే పాపమెందుకు? కులగోత్రాలమీద అభిమానాభిలాషలుండడం అజ్ఞానం. ఏకులజుడైనా అజ్ఞానాన్ని (త్రోసివేసి, జ్ఞాన మయమైన హృదయంతో శుద్దాత్ముడై ప్రకాశిస్తాడు.

రాఘవీయవ్యాఖ్య 201

స్పర్శవేధి సోకిన ఇనుము, బంగారు రూపంతో మెరిసే రీతిగా జ్ఞానాన్ని సంధించిన వ్యక్తి శుద్దాత్ముడైతే ముక్తిని పొందుతాడు.

వ్యాఖ్య : ఏకులజుడైనా శుద్దాత్ముడైతే ముక్తిని పొందుతాడని వర్ణితం.

చేతనులు చేసిన పుణ్యపాపకర్మలకు అనుగుణంగా భగవంతుడు కల్పించే దేహాలన్ని పంచభూతాత్మకాలే. దేహమూ దేహంలో ఉండే జీవుడూ కలిసి 'ఒక్కడు" అని వ్యవహరిస్తుంటాం.

“చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగళు” - (భగీ.-4-13)

(బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే నాలుగు వర్జ్ణాలను నేను సత్తాదిగుణ కర్మలను బట్టి సృజించాను అన్నాడు శ్రీకృష్ణభగవానుడు. కాబట్టి ఈ విభజన వర్షసాంకర్యం, వృత్తిసాంకర్యం కలుగకుండా భగవంతుడు నిర్మించిన వ్యవస్థ. ఈ నాలుగు వర్ణాలలో పూర్వ పూర్వులకు నియమాలు అధికం అవికూడా గీతోపదిష్టాలే.

వర్ణాలలో శూద్రుడు, యుగాలలో కలి ఉత్తమం అంటారు. శూద్రననికి నియమాలు తక్కువ. కాబట్టి చెడిపోయే అవకాశాలు తక్కువ. బ్రాహ్మణునికి నియమాలు ఎక్కువ. పతనావకాశాలూ ఎక్కువ.

“స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్దిం లభతే పరామ్‌” - (భ.గీ.18-45)

“స్వకర్మణా తమభ్యర్చ్య సిద్దిం విందతి మానవః (భ.గీ.18-46)

మానవుడు, తన విహితకర్మను భగవదారాధనగా నిష్కాముడై ఆచరిస్తే చిత్తశుద్ది కలిగి జ్ఞానయోగ్యతచేత ముక్తిని పొందుతాడని విశదపరచాడు శ్రీభగవానుడు.

“సత్కులజాతా వయమిత్యన్యే, తేషు కలిం పరిపూర్షం మన్యే” అన్నట్టు మీది ఆకులం, మాది ఈ కులం. అని కులగోత్రాభిమానాలు కలిగి మనుగడ సాగించడం నిండు అజ్ఞానమే.

“అవజ్ఞార్థ మనర్జాయ భక్తజన్మాదిచింతనమ్‌।

శాస్త్రవ్యవస్థామాత్రార్ణం న తు దూపష్యతి క్వచిత్‌" (రహస్యత్రయసారం)

అవమానించాలనే ఉద్దేశంతో భక్తులకులగోత్రాలను విచారించడం అనర్థకరం, శాస్త్రవ్యవస్త్రకోసం విచారిస్తే అది దూష్యం కాదు.

“న శూద్రా భగవద్భక్తాః విప్రా భాగవతా స్స్యృతాః

సర్వవర్షేషు తే శూద్రాః యే హ్యభక్తా జనార్దనే॥”

భక్తులు శూద్రులు కారు. వారు భాగవతులుగా పరిగణింపబడతారు. భక్తులు కాని వారు శూద్రులుగా భావింపబడతారు.

“శృపచోపి మహీపాల! విష్ణుభక్తో ద్విజాధికః |

విష్ణుభక్తివిహినస్తు యతిశ్చ శృపచాధమః॥”

202 నారాయణ శతకం

శృపచుడు - కుక్క మాంసం తినేవాడు - విష్ణుభక్తుడైతే ద్విజునికంటె అధికుడే. విష్ణుభక్తిలేనివాడు యతీశ్వరుడైనా శృపచునికంటె అధముడే. “భక్తిహినంబు లైన జ్ఞాన, వాచా,కర్మకాశలంబులు నిరర్థకంబులు”(భాగం

“ఏకులజుడైన నేమి? యెవ్వడైన నేమి? అరుదైన భూతదయానిధియగువాడే, తగిలి వేంకటేశుదాసుడైనవాడు”. (అన్నమాచార్యులు)

“జ్ఞానవిహినస్సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన”

“జ్హానాదేవ తు కైవల్యం” జ్ఞాన రహితుడెన్ని జన్మలెత్తినా ముక్తిని పొందలేడు. జ్ఞానంచేతనే మోక్షం లభిస్తుంది, అన్నారు శ్రీ శంకరాచార్యులు.

మధ్వమతస్టాపకులైన ఆనందవర్ధనాచార్యులు "అమలాభక్తిశ్చ తత్పాధనమ్‌” - భక్తియే మోక్షసాధన మన్నారు. మార్గాలు వేరైనా అందరిగమ్యం ఒక్కటే కదా!

“నాహం దేవో న మర్త్యో వాన తిర్యక్‌ స్థావరోఒపి వా।

జ్ఞానానందమయస్వ్వాత్మా శేషో హి పరమాత్మనః॥” (సచ్చరి'త్రరక్ష

జ్ఞానానందమయమైనది ఆత్మ. అది సురనర తిర్యక్‌ స్థావరాలలో ఏదీ కాదు. ఆత్మ కేవలం పరమాత్మకు దాసభూతమే.

ఆత్మకు జ్ఞానాన్ని కలిగించే అవసరముండదు. అది శుద్దమైనది, అమలమే.

“యధోదపానకరణాత్‌ క్రియతే న జలాంబరమ్‌।

సదేవ నీయతే వ్యక్త మసతః సంభవః కుతః”॥

బావిని (త్రవ్వినంతమాత్రాన నీటిని సృజించడంలేదు. ఉన్న నీటిని పొందడానికి దాన్ని ఆవరించిన నేల పొరలను తొలగించడమే అవసరం. ప్రాకృతిక బంధాలను తొలగిస్తే శుద్దాత్మ గోచరమవుతుంది కదా! అందుకే కవి 'అజ్ఞానముబాసి జ్ఞానము మదిన్‌ సంధించి" అన్నాడు. కులగోత్రాభిమానాలు అజ్ఞానంవల్ల కలిగినవే. ఈ అజ్ఞానాన్ని మనస్సునుంచి తొలగించాలి, త్రోసి వేయాలి. అందరి ఆత్మఅమలమైనది, జ్ఞాన ఆనందమయమైనది, అనే జ్ఞానాన్ని చిత్తాని కెక్కించాలి అన్నాడు.

అజ్ఞానం అంతరిస్తే జ్ఞానం ఆవరిస్తుందా? జ్ఞానం కలిగితే అజ్ఞానం పోతుందా? ఇది విచారణీయం. అయోమయవిషయం కదా!

ఇనుము అజ్ఞానసదృశమనీ, పరుసం జ్ఞానసదృళమనీ వర్షితం. ఈ రెండింటిని ఒండొంటితో సోకించే ప్రయత్నం కర్మసిద్దాంతం. సోకిన వెంటనే - సత్కర్మనాచరిస్తే అజ్ఞానం తొలగుతుంది. జ్ఞానం ప్రకాశిస్తుంది. మనస్సు నావరించిన తమస్సు పాసిపోతుంది, సత్ష్యం వృద్దిచెందుతుంది. హేమాకృతిగా వెలుగుతుంది మనస్సు, శుద్దాత్ముడు - నిర్మలమైన మనస్సు కలవాడు అవుతాడు నరుడు. ఈ గతివాడు సద్గతుడు కదా!

రాఘవీయవ్యాఖ్య 203 మ, _నిరతానందనియోగులై నియతులై నిర్భాగ్యులై నీచులై కరుణాహీనమనస్కులై మలినులై కష్టాత్ములై నష్టులై పరుషవ్యాధినిబద్దులై పతితులై భగ్నాంగులై మ్రగ్గువా రరయ న్నిన్నాగి నాత్మయందిడనివారబ్దాక్ష నారాయణా॥ 79 అర్ధం: అబ్జాక్ష = పుండరీకాక్ష ! ఓ నారాయణా! నిరత+ఆనంద నియోగులై = ఎల్లప్పుడు మోద (ప్రమోదాలను పొందువారై; నియతులై = భాగ్యవంతులై నియమంకలవారై; నిన్నున్‌, ఆత్మయందు, ఇడనివారు = చిత్తంలో నిల్చుకోనివారు; ఆరయన్‌ = ఆలోచిస్తే; ఒగిన్‌ = (క్రమంగా; నిర్భాగ్యులై = దరిద్రులై; నీచులై = క్షుద్రులై; కరుణాహీనమనస్కులై = నిర్ణయులై; మలినులై = కల్మపులై; కష్టాత్ములై = కష్టపడే శరీరం కలవారై; నష్టులై = కష్టించినా ఫలం దక్కని వారై; పరుష వ్యాధి నిబద్దులై = దారుణరోగ (గ్రస్తులై; పతితులై = పడినవారై;' భగ్గ+శఅంగులై = విరిగిన అవయవాలు కలవారై; మ్రగ్గువారు = చచ్చేవారు. తా : అబ్బాక్ష! ఓ నారాయణా! సదానందభరితులై భాగ్యవంతులై నియమనిష్టలతో నిన్ను ఎదలో పదిలపరచుకోలేని వారు భాగ్యహీనులవుతారు. (క్రమంగా, వారు నీచులు, నిర్ణయులు, మలినులు, కష్టాత్ములై నష్టపడతారు. దారుణరోగగ్రస్తులై, సమాజంలో పతితులై, వికలాంగులై చస్తారు. వ్యాఖ్య : భోగభాగ్యులై భగవంతుత్ని ఉపొసించనివారు చెడిపోతారని వర్లితం. “భాగ్యం స్త్రీ నియతిర్విధి:” (ఆమరకోశం) 'నియతి' శబ్దానికి భాగ్యమనే అర్థముంది. పూర్వజన్మపుణ్యంవల్ల కొందరు భోగభాగ్యాలను నియమంగా అనుభవిస్తున్నారు. ఆనందమయజీవితాన్ని గడుపుతున్నారు. భాగ్యాన్ని - (ద్రవ్యాన్ని - మందసంలో భద్రపరచుకొన్నట్లే ఆభోగభాగ్యాలను అనుభవించే జన్మను ప్రసాదించిన పరమాత్మను కృతజ్ఞతాభావంతోనైనా అంతరంగాన ప్రతిష్టించుకొని సర్వదా సంస్మరించడం జీవునిలక్షణం. సర్వాత్ముడెలాగైనా అందరిహృదయంలోనూ ఉన్నాడు. ఆజ్ఞానం లేక 'ఇది మాధనం, మేమనుభవిస్తుంటాం' అని అహంకారంతో మాధవుణ్ని మనస్సున క్షణమైనా చింతించని వ్యక్తులు జీవన్సృతులే. స్పృతి లేకపోతే మిగిలేది మృతియే. సర్వానర్థాలకు నిదానం దరిద్రం. భాగ్యవంతులై భగవద్ద్యానం చేయని జీవులు మొదట నిర్భాగ్యులవుతారు. (క్రమంగా సమాజంలో నీచ, నికృష్ణజీవనులవుతారు. ఇంకిపోయిన జీవనం (నీరు) వల్ల వారి గుండె ఎండి బండబారుతుంది. పాపకర్ములవుతారు. కష్టపడినా ఫలితం వారికి దక్కదు. ఘోరవ్యాధి పీడితులవుతారు. సర్వాంగాలు శిధిలమై కడకు వారు దీర్హనిద్రపోతారు.

204 నారాయణ శతకం భగవద్విషయ'ప్రావీణ్యులైన శ్రీ శరకోపమునుల శ్రీ సూక్తి స్మరణీయం. “ఏకచ్చత్రాధిపత్యం విదధతి కిల యే భూతలే తేఒపి కాలే నీలశ్వాదష్టపాదాస్యతఘటశకలా భిక్షుకా ఏవ హి స్యుః అస్మివ్టేహేఒపి సర్వైర్దగతి సువిదితా ఏవ తస్మాత్తు యూయం శ్రీమన్నారాయణస్య స్మరత పదయుగం నిత్యముజ్జీవనాయ” ॥ (4-1టై చిరకాలం ఏకచ్చత్రాధిపతులైన మహారాజులు కూడా ఒకప్పుడు శత్రువులచే

పరాజితులవుతారు.. వారి భోగభాగ్యాలనూ పగతురు అపహరిస్తారు. ఎక్కడనో

తలదాచుకొని, లోకులు చూస్తారనే సిగ్గుతో రాత్రి భిక్షాటనకోసం బయళ్టేరుతారు. దారిలో చీకటికి కానరాని నల్లకుక్కను తొక్కుతారు. అది వారిని వెంటనే కరుస్తుంది. వారిచేతిలో ఉన్న బిచ్చపు చిప్ప హరాత్తుగా నేలమీద పడి బొచ్చెలవుతుంది. బాధతో బావురుమంటూ ఎలుగెత్తి ఏడుస్తుంటే, ప్రజలందరు వచ్చి వారిని చూడడం వల్ల సిగ్గుతో తలెత్తుకోలేరు. కాబట్టి, ఓ చేతనులారా! నశ్చరమైన (ప్రాకృతిక ఐశ్వర్యాలను ఆశించక, ఈ జన్మలోనే శ్రీమన్నారాయణుని దివ్య పాదారవిందాలను సర్వదా ధ్యానిస్తూ ఉజ్జీవించండి అని బోధించారునమ్మాళ్యారు (తిరువాయిమొళి).

ఈ పద్యం శ్రీ యధావాక్కుల అన్నమయ్యగారి (125) పద్యరచనను పోలి ఉంది.

“ఖలులై యాచకులై విరుద్ధవికటాకారాంగులై పంగులై

బలహీనాతురులై రుజాపటలతాపచ్చన్నులై ఖిన్నులై

చలనాందోళిత చిత్తులై మలినులై జాత్యంధులై మందులై

యిల జన్మించెద రాత్మ నిన్లిడనివారీక్షింప సర్వేళ్చరా॥”

మ. ఘనభోగాస్పదులై గతాఘమతులై కారుణ్యులై ముక్తులై ధనక్షీర్తిపదులై దయాభిరతులై ధర్మాత్ములై నిత్యుతై మనుజాధీశ్వరులై మనోజనిభులై మాన్యస్థులై స్వస్థులై యొనరన్నొప్పెడునారు నీ పదరుచిన్నూహించు నారాయణా! 80

అర్థం: నీ పదరుచిన్‌, ఉహించు, ఓ నారాయణా! నీ పదరుచిన్‌ = నీచరణ రుచితో; ఘనభోగ+ఆస్పదులై = గొప్పసుఖాలకు స్టానభూతులై; గత+ఓఘమతులై = సిరబుద్దులై; కారుణ్యులై = దయాళురై; ముక్తులై = బంధాలను (త్రెంచుకొన్నవారై; ధనక్తీర్తి ప్రదులై; దయా+అభిరతులై = దయాసక్తులై ధర్మాత్ములై = ధార్మికులై; నిత్యులై = శాశ్చ్వతులై; మనుజ+అధీశ్వురులై = నరేంద్రులైః మనస్‌+జ, నిభులై = మన్మధునితో సమానులై; మాన్యస్టులై = గౌరవపా(త్రులై; స్వస్థులై = ఆరోగ్యవంతులై; ఒనరన్‌, ఒప్పెడువారు = యోగ్యంగా జీవించేవారు.

రాఘవీయవ్వ్యాఖ్య 205

తా : నీ పదరుచిని ఊహించే నారాయణా! నీ పదరుచితో గొప్పభోగాలకు ఆస్పదులై, స్టిరమతుల్తై దయాళురై, ముక్తులై, ధనకీర్తులను వితరణం చేయువారై, కరుణాసక్తులై, ధార్మికులై, నిత్యులై, నరాధిపతులై, మన్మధునితో సమానసుందరులై, మాన్యస్టులై, స్వస్టులై యోగ్యంగా జీవిస్తుంటాలు.

వ్యాఖ్య : భగవత్సాదాభిరుచికలవారు సకలశుభాలను అనుభవిస్తారని వర్లన. భక్తులందరు భగవంతుని పాదారవిందమందలి అమృతాన్ని ఆస్వాదిస్తుంటారు. భక్తులమనస్సు అనే మధుపం భగవంతుని పాదరుచిని చూడగలుగుతుంది. “విష్ణోః పదే పరక మధ్వ ఉత్పఫి - భగవంతుని పాదకమలంనుంచి మకరందం ప్రవిస్తుందని శ్రుతి బోధిస్తుంది.

తన పొదరుచి ఎలా ఉంటుందో తానూ రుచి చూడాలని కాబోలు, వటపత్రశాయిలైన బాల ముకుందుడు తన కరారవిందంతో పదారవిందాన్ని ముఖారవిందాన చానిపి చాక్కుతుంటాడు. బహుశుమకరందాస్వాదనతో తన ఉదరంలో ఉన్న చేతనాచేతన పదార్థాలను ఉజ్జీవింప చేసే అభిరుచి, ఆసక్తి కలవాడు నారాయణుడు.

“రుచి” శబ్దానికి రుచి, కాంతి అనే అర్జాలున్నాయి.

భగవత్సాదారవిందచింతన, జ్ఞానసంపన్నుల జిహ్వకు అమృతపానం చేసినట్టుంటుంది. వారి హృదయం, శరీరమంతా (బ్రహ్మ వర్చస్సుతో దేదీస్యమానమవుతుంది. వారిజీవనతరువు మూడుపువులు, ఆరుకాయలతో వృద్దిబౌందుతుంది. వారు గృహభోగం మొదలు శయ్య, వస్త్ర ఆభరణ, (స్త్రీ పుష్ప, గంధ, తాంబూలములనే అష్టభోగాలను అనుభవిస్తారు. వారు నవనవోన్మిషిత ప్రజ్ఞాశాలురై, కరుణాంతరంగులై, (ప్రతి బంధకాలేమీ లేని వారవుతారు. ధనధాన్యాదులను దానం చేసి వదాన్యులై వంశానికి కీర్తిని ఆపాదిస్తారు. భూతదయాసక్తులై ధర్మకార్య నిర్వహణధురంధరుల్లై శాశ్వతులవుతారు. సద్గుణభూషితులై ప్రజానాయకులవుతారు. సౌందర్యంలో కందర్చసదృశులై, లోకమాన్యులై అనామయులై ధన్యజీవులవుతారు.

ఈ పద్యశైలికి సర్వేశ్చరశతకంలోని (109) పద్యశైలికి మైత్రి ఉంది,

“సకలాధీశ్చరులై గణాధిపతులై సర్వజ్ఞులై నిత్యులై

అకళంకాత్మకులై మహామహిములై యంభోజగర్భాండర

క్షకులై యుండుదు రెల్లవారును భవత్సద్భక్తినానాగణా

ధికలీలావిధి నంతరంగముల వర్తింపంగ సర్వేశ్చరా॥”

206 నారాయణ శతకం

మోక్షనింశతి:

మ, విదితాన్నూయనికాయభూతములలో విజ్ఞానసంపత్కళా స్పదయోగీంద్రమనస్పరోజములలో బ్రహ్మేంద్ర దిక్పాలక త్రిదశవ్రాతకిరీటరత్నములలో దీపించుచున్నట్టి మో పదపద్మంబులు భావగేహమున నే భావింతు నారాయణా 81

ఆర్థం : ఓ నారాయణా! విదిత+ఆమ్నాయ నికాయభూతములలో = తెలిసిన వేదాలు లక్ష్యంగాగల ప్రాణులలో విజ్ఞాన సంపత్‌ కళా+ఆస్పద యోగీంద్ర మనస్‌+సరోజములలో = విజ్ఞాన సంపత్తు అనే కళకు ఆస్పదమైన యోగీశ్చరుల హృదయపుండరీకాలలో;

(బ్రహ్మా+ఇంద్ర, దిక్పాలక, త్రిదడశవ్రాత కిరిటరత్నములలో = చతుర్ముఖుని, శతమఖుని,

దిక్సతుల, దేవతాగణాల మకుటాలయందలి మణులలో; దీపించు చున్నట్టి = ప్రకాళిస్తున్న;

మీ పద పద్మాలను = మీ చరణారవిందాలను; నేను; భావగేహమున = మనో మందిరంలో: భావింతును = స్మరిస్తుంటాను.

తా : ఓనారాయణా! ప్రసిద్ధమైన వేదమందిరాల యందలి ప్రాణులలో, విజ్ఞాన సంప'ద్రూపకళకు స్టానభూతులైన మహా యోగుల మనస్సరోజాలలోనూ, బ్రహ్మేంద్ర దిక్పాలక దివౌకసుల కిరటాలయందలి మణులలోనూ ప్రకాశిస్తున్న మీ పాదకమలాలను నా హృదయసదనంలో స్మరిస్తుంటాను.

వ్యాఖ్య : భగవంతుని సాదసద్మాలు ్రకాశించే ప్రదేశాలను ఉల్లేఖించిన పద్యమిది.

వ పవక మహర్షులు కర్మ జ్ఞానాలు అనే రెండు రెక్కలున్న పక్షులై ఇంద్రుని

ద్ద (ప్రార్ధించారనే (శ్రుతి వాక్యాలున్నాయి. “వయస్సుపర్ణా ఉపసేదు రింద్రం ప్రియమేధా బుషయో. నాథమానాః” “సచాగ్‌ం శిక్యః పురోవాచోపనిషదింద్రో జ్యేష్ట ఇం'ద్రియాయ బుషిభ్యః” ఇంద్రుడు మహర్షులకు జ్ఞానసామర్థ్యం కలుగడానికి వేదవేదాంతాలను బోధించాడు. మహర్షులకు వేదమే శరణం. ఆశ్రయమైనది. వేదవేద్యుడైన పరబ్రహ్మ అనే ఆకాశంలో విహరించే పక్షులైన మహర్షులు వేదనీడాధిరూఢులు. (వేదమనేగూటిలో ఉన్నవారు) కాబట్టి, “విదితాన్నూయనికాయభూతములు' అని కవి వాక్కు, “ఆచార్యాద్దైన విదితా సాధిష్టం పాపతో" (ఛాం.ఉ.) “స్వాధ్యాయాద్యోగమాసీత, యోగాత్‌ స్వాధ్యాయమావసేత్‌। స్వాధ్యాయయోగసంపత్త్యా గమిష్యతి పరాం గతిమ్‌"

రాఘవీయవ్యాఖ్య 207

ఆచార్యోపదిష్టమైన విద్యయే. శ్రేష్టమైనది. భక్తియోగమందు స్టిరుడై వేదాన్ని అధ్యయనం చేస్తాడు వేదపురుషుడు. పరస్పరవేద యోగసంపత్తిచేత మోక్షం పొందేవారు వేదపురుషులు. “చరణం పవిత్రం వితతం పురాణం” అని అధ్యయనం చేసే వేదమూర్తుల అంతరంగమందు భగవత్సాదపద్మాలు స్థిరంగా (ప్రకాశిస్తుంటాయి.

యోగీంద్రులు విజ్ఞాన సంపత్కళాస్పదులు. శాస్త్రం భూరి నిజస్వరూపమతయే స్వారాధనార్ధం వపుః” (విశ్శగుణాదర్శ చంవువు). భగవంతుడు తనస్వరూపాన్ని తెలుసుకోవడానికి గొప్పశా(స్తాన్ని కల్పించాడు, తనను పూజించడానికి మనకు ఈ శరీరాన్ని అను[గ్రహించాడు.

“ద్వే విద్యే వేదితవ్యే ” అన్నట్టు రెండు-పర, అపర - విద్యలను తెలుసుకోవాలి. అపరావిద్య: వేదవేదాంగళశా[స్తాభ్యాసం, అధ్యాత్మవిద్యను చక్కగా అర్హం చేసుకొనే యోగ్యతను కల్పిస్తుంది. పరబ్రహ్మను పరోక్షంగా తెలుసుకొనే జ్ఞానమిది.

పరావిద్య: ఉపనిషద్విద్య, అధ్యాత్మవిద్య లేదా వేదాంతళాస్త్రం.

భక్తి లేదా ఉపాసనచేత పరబ్రహ్మను సాక్షాత్కారంగా పొందే జ్ఞానమిది.

జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చేది విజ్ఞానం. 'యమ, నియమ, ఆసన, (ప్రాణాయామ, (ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగయోగం విజ్ఞానసంపత్కళాస్పదం. 'కం లాతీతి కళా' పరబ్రహ్మను ఆకర్షించేది. భగవత్రాప్తికి సాధనమిది. యోగీశ్చరులు ఈ సాధనలో వాయువును క్రమబద్దంచేస్తూ కామ, క్రోధ, భయ, స్వష్షు, స్నేహ, అత్యశన, వైచిత్య, వ్యాధి, ఆలస్య, లోభాలు అనే పది (10) విఘ్నాలను దాటి, బాహ్యేంద్రియాలను అంతర్ముఖంగా చేస్తారు. నిగ్రహించిన మనస్సును వఏీకా[గ్రంగా ధ్యేయమూర్తిమీద లగ్నం చేస్తారు. ధ్యానానుసంధాననిష్టలో ఉన్నప్పుడు పాములు ప్రాకినాపుట్టలు పెరిగినా తెలియని స్థితిలో ఉండడమే సమాధి దశ “సమే ఆధీయతే, ఇతి సమాధి" శ్రీనాథుని యందు ఏకాగ్రంగా ఉంచబడిన మనస్సు తేజోవంతమవుతుంది. కాబట్టి,

“తత్ర ప్రత్యయైకతానతా ధ్యానమ్‌”. (యోగసూ(త్రం. 3-2)

“శా(స్తోక్తదేవతా ఆలంబనేషు అచల: అఖభిన్నజాతీయై రనంతరితః ప్రత్యయ సంతాన ఏకా(గ్రతేతి యమాహుః” (మహాభాష్యమ్‌)

యోగులకు ధ్యానమే బలం. యోగీంద్రులు అణిమ, మహిమ, గరిమ, లఘిమ, (ప్రాప్తి. (ప్రాకామ్య, ఈశిత్వ, వళిత్వాలు అనే అష్టసిద్దులనము పొందుతారు. వీటితో వారనుకొన్నవాటిని పొందుతారు.

206 నారాయణ శతకం “ఏతా నక్పా గుణాన్‌ ('ప్రాష్య కధంచిద్యోగినాం వరాః | ఈశా: సర్వస్య లోకస్య దేవానప్యతిశేరతే ॥"(భారతం. అను.145 అ) యోగీంద్రులు అష్టసిద్ధులను సాధించి (ప్రపంచాన్ని శాసించే సమర్దుల్లై దేవతల కంటె మించి శోభిస్తారు. “ధ్యానావస్ర్రిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః”(భాగవతం 12 స్కం.) పాదాలు వి[్రహానికి ఉపలక్షణంకదా! ధ్యానపరమైన మనస్సుచేత యోగిపుంగవులు జ్యోతిర్మయుడైన పరబ్రహ్మను దర్శిస్తారనీ, తత్ఫలితంగా వారు ముక్తిని పొందుతారనీ అన్నది నిర్వివాదాంశం. “యం (బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుత: స్తున్వ్నంతి దివ్వైస్సవై ర్వేదైః సాంగపద[క్రమోపనిషదైర్గాయంతి యం సామగాఃొ (భాగవు 'బ్రహ్మేందాది దేవతలందరు దివ్యంగా స్తోత్రం చేస్తూ నారాయణుని పాదపద్మాలకు నతమస్తకులై దండవత్ర్రణామం చేస్తుంటారు. అప్పుడు దేవతల కిరీటాల యందలి (ప్రత్యుప్తమణులలో భగవత్సాదపద్మాలు ్రతిఫలిస్తుంటాయి. అలాగే, భక్తిరూపాపన్నజ్ఞానంతో భగవంతుణ్ని కీర్తిస్తున్స ఈ కవిచంద్రుడు, తనహృదయపద్మమందు వెలసి యున్న నారాయణపాదపద్మాలను సర్వదా సంస్మరిస్తానన్నాడు. ముక్తి లభిస్తుందనే ఆత్మప్రత్యయం ప్రశంసనీయం.

మ. వెలయన్‌ యౌవనకాలమందు నురుండున్‌ వృద్దాస్యకాలంబునన్‌ బలురోగంబులు నంత్యమందు యముండుం బాధింస నట్టైన యూ పలు జన్మంబులు చాలదూలితి ననుంబాలింపనే దేవ మీ ఫలితానంద దయావలోకనము నా సైజూపు నారాయణా ॥ 82

అర్జం: ఓ నారాయణా! మరుండున్‌ = మన్మథుడు; యౌవనకాలమందు = తరుణ

'ప్రాయమందు; వెలయన్‌ = ప్రకాశింపగా; వృద్దాప్యకాలంబునన్‌ = ముసలితనాన;

పలురోగంబులు; అంత్యమందు = మరణదశలో; యముండున్‌ = దండధరుడుకూడా;

బాధింపన్‌ = వెతలపెట్టగా: అట్టెన = అలాంటి; ఈ పలు జన్మంబులు; చాల; తూలితి = ఎత్తి అనుభవించాను. దేవ! ననున్‌; పొలింపవే! మీ ఫలిత+ఆనందదయా+అవలోకనము = మీ పూర్ణానందంతో దయా దృష్టిని; నాపైన్‌; చూపు = ప్రసరింపబేయుము.

తా : ఓ నారాయణా! వయస్సులో మన్మధుని విజ్బంభణం, వార్టక్యంలో రోగాలబాధ, మరణదశలో యమయాతన కలిగే ఇలాంటి జన్మలు చాలా ఎత్తాను, మిత్తి వాతపడ్డాను, నన్ను కాపాడవా దేవా! మీ పండిన ఆనందంతో నాపై కృపాదృష్టిని సారింపుము.

రాఘవీయవ్యాఖ్య 209 వ్యాఖ్య : కవి, తనకు జన్మరాహిత్యాన్ని ప్రసాదించుమని దేవుణ్ణి ప్రారించే పద్యం. జీవులకోసం ఏర్పడిన సుఖం రెండురకాలు 1. (ప్రేయము 2 శ్రేయము,

“అన్యవ్రేయోఒన్యదుతైవ. ప్రేయః తే ఉభే నానార్జేపురుషగ్‌ంసినీత” (కరో)

1 ప్రేయస్సు: ప్రీతికరమైన భోగం 2,శ్రేయస్సు: కల్యాణకరమైన మోక్షం, పరస్పర

విలక్షణ (ప్రయోజనాలు కలిగిన ప్రేయః శ్రేయస్సులకు - రెండింటికీ మానవులను

ఆకర్షించేశక్తి ఉంది.

భోగలాలసమ్తైన మానవపప్రకృతి స్త్రీ పురుష వ్యామోహంతో సంసారమనే ఊబిలో కూరుకొని పోతుంది - ఇంద్రియాల తృప్తికోసం వెంపర్లాడే జీవనదశ యౌవనం, “తరుణ స్తావత్తరుణీసక్త” యువకుడు యువతియందాసక్తుడైనట్టే “తరుణీ తా వత్తరుణాసక్షా" యువతికూడా యవకునియందు ఆసక్తయై, (క్రమంగా వారు అన్యోన్యాకర్షితులవుతారు.

వనితల అంతస్సౌందర్యంకంటె బాహ్యసౌందర్యమే మొదట ఆకర్షిస్తుంది. యువతి విద్యుల్లతావి[గ్రహ. చం(ద్రాస్య, చంచరీకచికురు కురంగనయన, వేయేల? సానబెట్టిన మకరాంకుశస్త్రమే.

“చన్నులపెంపు, పాదజలజమ్ములకెంపు, మనోహరమ్ములౌ

కన్నుల సొంపు, మైయగరుకంపు, కనుంబొమ వంపు, శ్రోణులన్‌

తిన్నెైలనింపు, నెన్షడల తీరనిజంపు, నఖాళితెంపు, పల్‌

'క్రాన్నన యింపు, ముంగురుల గుంపు దలంప వరింప కెట్టగున్‌?”

“మాటలనవచ్చు. వచ్చునే మనసు నిలువ”

“వయసువాండంట ఆమీంద వైష్ణవ్రుండంట” అనుకొంటూ, హావభావచేష్టలతో విలాసానికి నిల్చిన వగలాడిని చూచి,

“తలోదరి! తవాపాంగైః శ్రీత మేకం జగత్రయమ్‌;

త్వాం వినా స తు కందర్సః కం దర్శ మవలోకతే॥”

ఓ తన్వీ! నీ చూపులతో ముల్లోకాలు ఓడిపోయాయి. నీవు లేకపోతే మన్మథుడు ఎవరిని జూచుకొని గర్వపడతాడు? అని నానలేక యువకుడు అశ్షేషశేముషితో నోరు జార విడువడం చెలరేగినమారుని లక్షణంగాక మరేమి?

“మరుండాచార్యుండుగా విశీర్ణకబరీమాల్యాళి పుష్పాంజలి

స్ఫురణల్లాం దదుపేతభృంగనినదస్తోమంబు గానంబుగా

వరమంజీరరవంబు తాళగతిగా వర్దిల్లు శాతోదరీ

సురతవ్యత్యయవేగతాండవ మొనర్చుం జింతితాభిష్‌టమున్‌"।

210 నారాయణ శతకం

ఇలా రతిసుఖసారమైన యువతిశరీరాన్ని కౌగిట జేర్చీ భాగ్యం ఏకాంతంగా లభించినా, ఇస్సీ అని త్రోసి వేసే గృహస్టుడు “లేడ ప్రవరాఖ్యుడు దక్క మరొక్కండెక్కడన్‌”

నిగనిగలాడుతూ బంగారుకడ్డీలాగా ఉన్న శరీరం వయస్సు ఉడిగి శ్రథసంధి జర్జరమవుతుంది. శరీరం జర్జ్దరీభూతం, ముగ్గుబుట్టలాంటితల, పండ్డు ఊడిపోయిన బోసినోరు, ఆయినా మూడు కాళ్ళ ముదుసలికి ఆశ పెరుగుతూనే ఉంటుంది. అందుకే ఇలా అన్నారు.

“అంగం గళితం, పలితం ముండం, దశనవిహీనం, జాతం తుండమ్‌,

వృద్దో యాతి గృహీత్వా దండం, తదపి న ముంచత్యాశాపిండమ్‌॥”

కన్నులు కనబడక, తిన్నది అరుగక, వాతపిత్త శ్లేష్మాది రోగాలతో మాట పెగలక, మలమూత్రవ్యాధులతో పక్కతడుస్తుంటే, కట్టుకొన్నది గానీ, కన్నవారుగానీ ముక్కుమూసుకొని వెక్కిరిస్తూ చీవాట్లు పెట్టే దుర్భర దశ కలది వృద్దాప్యం.

జరాజర్జరితశరీరంనుంచి జీవుడు, యమపాళంతో గుండె గూడు కదలి, విడిపోవడమే అంత్యదశ ఆయమయాతన వర్ణనాతీతం. ఉన్నవానికి తెలియదు, పోయేవాడు చెప్పలేడుకదా! ఇలాంటి అనేకజన్మలు చాలా తూలితినన్నాడు కవి.

స్వశక్తితో పుట్టడం, గెట్టడం కాని పని. పుట్టించి గిట్టించే వాడొక్కడుండాలి. వాడు పుట్టవూ చావూలేనివాడై ఉండాలి. వాడూ పుట్టువుకలవాడంటే అనవస్తాదోషం సంభవిస్తుంది.

కర్మఫలానుభవానికి కాక, కేవలం తన సంకల్పంతో ధర్మసంస్థ్టాపనకోసం పుట్టే సర్వస్వతం[దత్రుడు పరమాత్ముడు. ఆయన “అర్జునా! నీకూ నాకూ ఎన్నో జన్మలు గడిచాయి. పూర్వజన్మల సంగతి నాకుమాత్రం తెలుసు, నీకుతెలియవు' అన్నాడు. (భంగీ4-5)

(బ్రహ్మవిద్యయైన గీతాశాస్త్రం మీదనూ, గీతాచార్యునిమీదనూ, గీతను అను(గ్రహించిన వ్యాసభగవానుని మీదనూ, భక్తి విశ్వాసాలు కలవారే ఆస్తికులు అని విజ్ఞులమాట.

బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే” (భ.గీ.7-19)

అనేక జన్మల సాధన ఫలితంగా ఒకనికి జ్ఞానోదయ మవుతుంది. అదే అతని చివరి జన్మ. దేహాంతమందు ఆజీవుడు దేవునిసన్నిధికి చేరుతాడు.

“శ్రేయో హి ధీరోలభిప్రేయసో వృణీతే” (కరోప)

వివేకవంతుడు ప్రేయస్సుకంటె (శ్రేయస్సువే వరిస్తాడు అన్నట్టు కవి, పునర్జన్మ

రాఘవీయవ్యాఖ్య న విశ్వాసమూ, పరలోకజ్ఞానమూ కలిగినవాడు కాబట్టి, ఈ జన్మలో దేవుణ్ణి జన్మరాహిత్యం కోసం 'నన్ను పాలించు, దయతో చూడుమనిె (ప్రార్ధించాడు. “లౌకిక మొల్లక నన్నాలోకించు ప్రపన్నులకును లోబడి కరుణా లోకనముల బోషింతును, నాకాశ్రితరక్షణములు వైసర్గికముల్‌” అని శ్రీకృష్ణభగవానుడే ఉద్దవునికి (తన) స్వభావాన్ని ప్రకటించాడుకదా! మ, బలుకర్మాయతపాశబంధవితతిన్‌ బాహాపరిడ్రేణికిన్‌ జలయం త్రాన్వితబంధయాతనగతిన్‌ సంసారకూపంబులో నలరం ద్రిమ్మరుచుండు నన్ను నకటా! యార్తుండనై వే(డెదన్‌ వెలయన్నీ కృపచేత. జేకొనవె నన్‌ వే వేగ నారాయణా॥ 83 అర్ధం: ఓ నారాయణా! బలు = అధికమైన; కర్మ+ఆయతపాళబంధవితతిన్‌ = కర్మలు అనే పొడవైన (త్రాటిచేకట్టిన ముడుల సముదాయంతో: బాహాపరి శ్రేణికిన్‌ = బాహువులలాగా ఎక్కువగా నున్న బొక్కెనల వరుసకు; జలయంత్ర+అన్విత బంధయాతనగతిన్‌ = నీటి మరతో కూడిన బంధం చేత తీవ్రమైన గమనం రీతిగా? సంసారకూపంబులోన్‌ = సంసారమనే నూతిలోన; అలరన్‌ = బాగా; (వికాసంగా); త్రిమ్మరుచుండు = తిరుగుతుండే; నన్నున్‌, అకటా! ఆర్హుండనైజబాధపడుతున్న వాడనై; వేడెదన్‌ = ్రార్ధింతును. వెలయన్‌ = ప్రకాశంగా; నీకృపచేత = నీదయచేత; నన్‌ = నన్ను; వే వేగ = అతిశీఘ్రంగా, చేకొనవే = చేదుకొనుము. తా : ఓనారాయణా! త్రాటితో బొక్కెనలను వరుసగా కట్టివాటిని జలయం[త్రంతో అమర్భగా అది రాట్నంవలె తిరుగుతున్నట్టు, అనేక కర్మపాళశబంధాలతో సంసారమనే బావిలోనే తిరుగుతున్న నేను నిన్ను అర్తితో ప్రార్ధిస్తున్నాను. నీవు దయతో నన్ను అతివేగంగా నీ సన్నిధికి చేర్చుకోవయ్యా! వ్యాఖ్య: సంసారకూపంలో తిరుగుతున్న తనము ఉద్దరించుమని కవి ప్రార్ధన. సంసారం ఒకనుయ్యి. నూతిలోని నీటిని తోడివేయడానికి ఒకపొడవైన (త్రాటి = తీగ-తో యాభై అరవై బొక్కెనలను వారంలాగా గుది గూర్చి అనేకభుజపంక్తులు కలిగిన ఒక చక్రానికి అమరుస్తారు. ఆచక్రానికి జలయండత్రంతో ఒక గట్టి బంధం ఉంటుంది. జలయంత్రం తిరుగుతున్న కొలది ఆచ(క్రమూ తిరుగుతుంటుంది. అప్పుడు హారంగా కట్టిన బొక్కెనలు నీటిలో క్రమంగా మునిగి నీటిని పైకి తెచ్చి దోనెలోపోసి, అధోముఖంగా నూతిలోకి నీటిని తేవడానికి తిరిగి పోతుంటాయి. బాహాపరి్రేణికి నూతిలో తిరుగడమే పని. కొందరు దీన్ని రాటపు బావి అంటారు. ముఖ్యంగా ఇది 'కూపయంత్రఘటికాన్యాయ' మని ప్రసిద్ది.

212 నారాయణ శతకం

హారంలాగా ఉన్న బొక్కెనల ఊర్చ్వాధోగమనం జననమరణపరి[భ్రమణం. _ఈజననమరణరూపచ॥క్రానికి, జలయంత్రరూపమైన కాలచక్రానికి గొప్ప అనుబంధం ఉంది. సంసారమనేపెద్ద నూతిలోనే జననమరణరూపచ(క్ర పరిభ్రమణం, కాలచక్రం తిరుగుతున్నంతవరకు జరుగుతుంటుంది.

ఇలా పరిభ్రమించడానికి కీలకమైనది బంధం. అదే కర్మబంధం.

“కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్లుబై:” (భగీ3-5)

అనుక్షణం మారుతుండే ప్రకృతి యొక్క గుణాల చేత ప్రతివ్యక్తి ఏదో కర్మను = పనిని - చేస్తుంటాడు.

కర్మలు సంచితం, ఆగామి, ప్రారబ్దం అని మూడు విధాలు.

సంచితం - జన్మజన్మలనుంచి సంసాదించి పెట్టుకొన్న కర్మరాళి.

“సుకృతం దుష్కృతం చైవ గచ్చంతమనుగచ్చత:” - జీవుడు ఇంద్రియాలతో మంచి, చెడ్డ కర్మల ఫలితాన్ని - సంస్కారాన్ని - తీసికొనిపోతాడు.

“శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్కామతీశ్వరః।

గృహీఖ్షైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్‌॥ (భగ.15-8)

జీవుడే శరీరాన్ని వదలి మరొక శరీరాన్ని పొందినప్పుడు, పూలున్నచోటు నుంచి గాలి గంధరేణువులను తీసుకొని పోయే విధంగా, ఇంద్రియ విషయవాసనలను సంస్కారాలను తీసుకొని పోతాడు.

కర్మ జన్మకు బీజం - విత్తు కదా! కర్మల ఫలాన్ని అనుభవించడానికే జన్మనెత్తడం ఆవశ్యకం,

“తద్య ఇహ రమణీయచరణాః కపూయచరణా అభ్యాశోహయత్తే రమణీయాం కపూయాం యోని మాపద్యేరన్‌” - (చాం.ఉ.)

పుణ్యజీవులు పుణ్యజన్మను, పొపులైతే శునక సూకరాది జన్మను పొందుతారట.

  1. ప్రారబ్ధం: ఆత్మనంటిపెట్టుకొని ఉన్న సంచితకర్మరాశిలో నుంచి కొంత - బియ్యపుబస్తాలోనుంచి నేడు వండుకోవడానికి తీసుకొన్నమానెడు బియ్యంలాగా - ప్రత్యేకించి ఈ జన్మలో అనుభవిస్తున్నదే. దీన్ని పూర్తిగా అనుభవించేంతవరకు జీవుడీ దేహంలో ఉంటాడు.

  2. ఆగామి: ప్రారబ్దకర్మననుభవిస్తున్న (ఈ) జన్మలోనూ చేస్తున్న కర్మ మళ్ళీ సంచితకర్మరాళిలో కలిసి, రాబోయేజన్మల్లో అనుభవానికి వచ్చేది.

బాహాపరి'శ్రేణికి జలయంత్రంతో కూడిన బంధయాతన రీతిగా, బహుజన్మల సంచితమైన, సుదీర్హమైన కర్మపాశంతో దేహబంధమేర్చడిన జీవుడు (బ్రహ్మాదిలోకాలతో కూడిన ఈ సంసారకూపంలో జననమరణరూపచ(క్రంగా పరిభ్రమిస్తాడు.

రాఘవీయవ్యాఖ్య 213 అనేకజన్మల సుకృతంవల్ల కలిగిన ఈ మానవజన్మలో -

1 దృప్తప్రపన్నుడు, - స్వర్గంలో గానీ, నరకంలో గానీ తననెక్కడ పడవేసినా సరే, తాను భగవంతుని చరణారవిందస్మరణ చేసే రీతిగా తనను అను[గ్రహించాలని పరమాత్ముణ్ని వేడుకొంటాడు. ఆయన

“వైకుంరవాసేపి న మేభిలాషు” - అంటాడు.

  1. అఆర్హప్రపన్నుడు, - ఈ ప్రకృతి బంధంనుంచి విముక్తుణ్ని చేసి, త్వరగా తన పాదసన్నిధిలోకి చేర్చుకోవాలని ఆర్తితో ప్రభువును ఫ్రార్థిస్తాడు.

ఈ సుకవి, ఆర్తితో 'నన్ను వేగంగా నీ దగ్గరికి చేర్చుకొ'మ్మని వేడుకొన్నాడు. రూపకాను(ప్రాణితోపమాలంకారమున్న పద్యమిది.

మ. మనుహంకారవికారసన్నిభమహామత్తాదిలోభాంధకా

రముచే ముక్తికి నేంగుమార్గమెజు(గన్‌ రాదింక నాలోవ నీ

విములాపాంగదయాదివాకరరుచిన్‌ వెల్లింపు మింసార నో

కమలానందవిహారవక్షలలితా ! కంజాక్షననారాయణా 1 8కే

అర్థం : కమలా+అనంద విహార ఛక్షలలితా = లక్ష్మీదేవి ఆనందంతో విహరించే,

వక్ష్టలంచేత అందమైనవాడా = అందమైన వక్షస్థలంకలవాడా! కంజ+అక్ష = వారిజనయనా[!నారాయణా! మమహంకార = అంధకారముచే; మమ = మమకారమూ; హంకార = అహంకారమూ అనే; వికార = ప్రాకృతిక వికారాలతో; సన్నిభ = సమానమైన; మహా = గొప్ప మత్త+ఆది=మదమూమొదలైన: లోభ+అంధకారముచే = లోభమనే చీకటి చేత; మ్యుక్తికిన్‌, మోక్షానికి; ఏగు = వెళ్ళే! మార్గము = త్రోవ; ఎటుగన్‌ రాదు = తెలియరాదు; ఇంక; నాలోన = నాహృదయంలోపల; నీ విమల+అపాంగ దయా = నీ పరిశుద్ధమైన కడకంటితో దయ అనే; దివాకర రుచిన్‌ = సూర్యకాంతిని; ఇంపార + మనోజ్ఞంగా; వెల్షింపుము.

తా: లక్ష్మీదేవి ఆనందంతో విహరించే భుజాంతరంచేత శోభించేవాడా! ఓ నీరజనయనా!నారాయణా! మమకార అహంకారాలనే వికారాలతో సమానమైన మదమాత్సర్యలోభాలనే అంధకారంచేత ముక్తిని బడసే దారి తెలియరాదు. కాబట్టి. నీ కటాక్షంతో దయాభాస్కరునికాంతిని నా హృదయంలో ఇంపుగా ్రకాశింపజేయుము.

వ్యాఖ్య : మోక్షమార్గాన్ని (ప్రకాశింపజేయుమని కవిప్రార్ధన.

సుమసుకుమారశరీరర్రైన కమలాదేవి నారాయణుని వక్ష్యస్థలంలో ఉల్లాసంగా విహరిస్తుంది; అంటే ఆయన ఉరఃస్తలం ఎంత మృదువైనదో, ఎంతవిశాలమైనదో కదా! దయారూపిణియైన లక్ష్మీదేవికి అను(గ్రహించడమేకాని ని[గ్రహించడం తెలియదు.

214 నారాయణ శతకం ఎదలోవే కముల కాపురం చేస్తున్నది కాబట్టి కమలాకాంతుడు కంజాన్షుడయ్యాడు. హార్దమైన దయార్దతాభావాదులు కన్నుల్లో స్ఫురిస్తాయి.

౯౭౦6 15 1066 01 ౧౧1౧6."

కమలానందవిహారానికి కారకుడు దివాకరుడు, సూర్యకిరణాలు సోకితే కమలాలు వికసిస్తాయి. నిశాకరుని కిరణాలు సోకితే అవి ముడుచుకుపోతాయి. సూర్యచంద్రులే నేత్రాలుగా ఉన్నవాడు కాబట్టి కంజాక్షుని కన్నులు అరవిరిసిన తామరలున్నట్టు ఉంటాయి.

నిండుచూపు ని(గ్రహానికి, కడకంటి చూపు అను[గ్రహానికి సంకేతం. అందుకే కవి అపాంగదయాదివాకరరుచిని వెల్షింపుమున్నాడు. అపాంగదృష్టియే దయ. అదే సూర్యకాంతి.

మోక్షమార్లాన్ని కనుక్కోవడం మానవునిక్తర్తవ్యం. కాని ఆదారిని కానరాని చీకటి కమ్ముకొన్నది. ఈ చీకటి, కాలప్రభావంచేత కలిగింది కాదు. మానవ ప్రకృతి జన్యగుణాలచేత ఏర్పడింది.

ఇది హృద్గతమైనది, కాబట్టి కన్నుల్లోకి కప్పుకొని వచ్చింది. చీకుకు ద్రారి కనబడదుకదా!

“'మమకారం' అంటే "నాది" అనే భావం. ఈ మేడలు మడిమాన్యాలు నావి ఇతరులకు గాక నాకుమాత్రమే అనుభవించే హక్కు ఉంది. అని ప్రకటించడం భోకృృత్వాభిమానమని అర్థం.

'ఆహంకారం' అంటే 'నేను అనే భావం. ఇంత భూమి, ధనం

  • స్ట్రిరచరాస్తులను సంపాదించాను. మంచి చెడ్డలు తెలిసి నేను మసలుకోవడంవల్లనే లోకం దృష్టిలో గొప్ప ప్రజ్ఞావంతుడనయ్యాను, అని గర్వించడం - కరృత్వాభిమానమని అర్ధం.

“'హంకారం' అంటే అభిమానం, అహంకారం, (శబ్దరత్నాకరం).

“హంకారములకెల్ల నాటపట్టు” (చంద్రాంగదచరి(త్ర).

జీవాత్మ, పరమాత్మలకన్న భిన్నమైన ప్రకృతి, వికారాస్పదమైనది.

“మనుజపతిం వా దిగధిపతిం వా, జలజభవం వా జగదధికం వా-

మమతాహంకృతి మలినో లోకో, నిందతి నిందతి నిందత్యేవ॥

మమకారాహంకారాలచేత మలినుడైన మనిషి నరేంద్రుబ్నీ, దేవేంద్రుల్నీ, (బ్రహ్మనైనా, వాని అబ్బనైనా లక్ష్యపెట్టక, నిందిస్తుంటాడు. “వెప్ణ్లవకులగుణదూషణచింతాం, మా కురు నిజకులశీలాహంతాం” - అన్నట్టు,

రాఘవీయవ్యాఖ్య 215 విష్ణుభక్తులకులగుణాదులను దూషించేవాడు, తనకులశీలాదులను నాశనం చేసుకొన్నవాడవుతాడు.

ప్రకృతివికారమైన మమతాహంకారాలకు ద్నీటైనవి మదమత్సరలోభాలు. “నష్టే నయనే కస్యాలోకః చిత్తే మత్తే కస్య వివేక?” అన్నట్లు కన్నులు పొరలు కప్పి చెడిపోతే దేన్నీ చూడలేవు. చిత్తం, మత్తెక్కితే మేలు కీళ్ళు ఎంచదు కదా!

“న చ లోభాత్పరో వ్యాధి” లోభంకంటే లోకంలో వేరే వ్యాధి లేదు. తన (ద్రవ్యాన్ని తాను అనుభవింపడు. మరొక్కణ్ని అనుభవింపనీయడు సరికదా! పరుల (ద్రవ్యం కూడా తనకే చెందాలని పేరాసతో ఉంటాడు లోభి,

“లోభ్రాత్‌ క్రోధః (ప్రభవతి, లోభాత్కామః ప్రజాయతే।

లాభాన్మోహశ్చ్ళ నాశళ్ళ, లోభః పాపస్య కారణమ్‌ః”

లోభంవల్ల కామ'క్రోధాలు తలెత్తుతాయి. అజ్ఞానం ఆవరిస్తుంది. సకల పాపాలు చేయడానికి 'ప్రేరకమై. లోభం సర్వనాశనం చేస్తుంది.

భక్తిరూపమైన శేముషి కలవానికే మోక్షమార్గచింతన కల్గుతుంది. (బ్రహ్మ విద్యకు అంగమైన అర్చిరాదిగతిని స్మరించే యోగంవల్ల హృదయపుండరీక మందున్న పరమాత్మ ్రసన్నుడవుతాడు. హార్దానుగ్రహంవల్ల జీవాత్మస్తానమైన హృదయాగ్రాన అద్భుతమైన వెలుగు ద్యోతకమవుతుంది.

“శతం చైకా చ హృదయస్య నాడ్యః, తాసాం మూర్చాన మభినిస్సృతైనా।

తయోర్ష్యృమాయన్నమృతత్వమేతి, విష్పుజ్నన్యా ఉత్క్రమణే భవంతి” (కర)

హృదయంలోని నూట ఒక్క నాడులలో మస్తకాభిముఖంగా ఉండే ఒక్క సుషుమ్నానాడి ద్వారా (ప్రకాశించే మార్గం కలవాడై, భక్తుడైన జీవుడు శరీరం నుంచి ఊర్చ్వ్యభాగంగా వెడలి అమృతస్వరూపమైన మోక్షం పొందుతాడు. ఈ విషయాన్ని “త దోకోఒ. ధికరణం” (బ్రసూ.క ఆ-2పా-16సూ) లో 'శ్రీభాష్యం' విపులంగా విశదీకరిస్తున్నది.

ఇది రూపకాలంకృతపద్యం.

మ. పరిపంథిక్రీయ నొత్తి వెంటంబడు నప్పాపంబు( దూలించి మీ చరణాబ్దస్థితిపంజరంబు శరణేచ్చం జొచ్చితిం గావు మీ బిరుదుం జూడుము మీరు సూడ(గ భవద్చృత్యుండు దుఃఖంబులం బొరయ న్మీకపకీర్తిగాదె శరదంభోజాక్ష నారాయణా ॥ 85 అర్థం : శరత్‌+అంభన్‌+జ+అక్ష = శరదృతువులోని కమలాల వంటి కన్నులు కలవాడా! నారాయణా! మీ చరణ+అబ్బస్థితి పంజరంబు = మీ పాదపద్మాలు అనే స్థిరమైన పంజరం,

216 నారాయణ శతకం శరణ+ఇచ్చన్‌ = రక్షక మనే కోరికతో; చొచ్చితిన్‌; పరిపంధిక్రియన్‌ = శత్రువు చేసినట్టు; ఒత్తి = నెట్టి; వెంటబడు; పాపంబు = పాపాన్ని; తూలించి = తొలగించి; కావుము = రక్షింపుము; మీ బిరుదున్‌ = మీ ప్రవర్తనను బట్టి కలిగిన పేరును; చూడుము; భవత్‌+భృత్యుండు = మీసేవకుడు; మీరు సూడగ; దుఃఖంబులన్‌ = ఆపదలను; పారయన్‌ = పొందుతుంటే; మీకు; అపకీర్తి కాదె = మీకు చెడ్డపేరు ఏర్పడుతుందికదా!

తా : శరత్కాలపద్మాలలాంటి నయనాలుకలవాడా! ఓ నారాయణా! మీపాద పద్మాలనే స్థిరమైన పంజరంలోకి రక్షకమనే వాంఛతో ప్రవేశించాను.

శత్రువు వెంటబడి నెట్టి తరుముతున్నట్టున్న పాపాన్ని తొలగించి కాపాడుము. మోకు గొప్ప బిరుదు ఉంది. ఆలోచించుము, మీరు చూస్తుండగా మీ సేవకుడు ఆపదలపాలై దుఃఖపడుతుంటే మీ కపకీర్తి కాదా?

వ్యాఖ్య : శరణాగతరక్షకుడ వనే బిరుదును సార్థకంచేయుమని కనివిజ్ఞప్తి,

శరదృతువులో సరస్సులందలి నీరు గంభీరంగానూ, సన్మనుష్యుని మనస్సులాగా ప్రసన్నంగానూ ఉంటుంది. ఆతేటనీటిఉపరితలాన కెందామరలు (ప్రకృతి రంజకంగా వికసిస్తాయి. హంసలు రమణీయంగా కులుకుతూ జలాశయాల్లో ఓలలాడుతాయి. శరత్కాలాన వికసించిన కెందామరలవంటి కన్నులు కలవాడు నారాయణుడు, సౌందర్య, సౌకుమార్య, సౌశీల్య, సౌలభ్య, వాత్సల్యాది కల్యాణగుణ దీక్షాదక్షుడు అంభోజాక్షుడు.

జీవితం తామరాకుమీది నీటిబిందువులాగా చంచలమైనది. మృత్యువుకు దయాదాక్షిణ్యాలు లేవు. దానికి కబభళించడమే పని. ప్రాణప్రయాణవేదనాదో దూయమాన మానసునికి పుండరీకాక్షునిస్మరణ కలుగుతుందని నమ్మకమేమి? స్వస్ట్రచిత్తుడుగా ఉన్నప్పుడే తనచిత్తాన్ని భగవదాయత్తం చేయడం వివేకవంతునిలక్షణం. మానవజన్మకు మోక్షమే ప్రయోజనం. లౌకికవిషయాసక్తునికి మోక్షం దుర్లభం కదా।

“సంప్రాప్తే సన్నిహితే కాలే న హీన హి రక్షతి డుకృళ్‌ కరణే” -

'కృళ్‌ ధాతువుకుండే పదిలకారాలూ, యజన్త యజ్‌లుగన్నాలూ వల్లెవేస్తూ ఉంటే చావుకాలం దాపురిస్తే శబ్దశాస్త్రం రక్షించదు. గోవిందుణ్ని భజించుమని బోధించారు భగవత్పాదులు.

“కాణాదంబు 'ప్రాణాదంబు, కాపిలంబు చాపలంబు, మీమాంస హింస, వ్యాకరణం బశరణంబు - మోక్షార్డులకయ్యవి ప్రతిబంధకములే” అని విష్ణుచిత్తుడు కేవలం భగవత్సైంకర్యపరుడై యుండెనని 'ఆముక్తమాల్యద' యందు వర్షితం. చిల్లర దేవతలను కొల్బేవారికి చిల్లర సుఖాలే దొరుకుతాయి. ఆ దేవతలకు ఆ కోరికలు దీర్చే శక్తి కూడా నారాయణుడిచ్చినదే కదా!

రాఘవీయవ్యాఖ్య 217

“మామేవ యే (ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే” 'నన్నాశ్రయించిన వారికే (ప్రకృతిబంధవిముక్తి' అని బోధించాడు శ్రీకృష్ణభగవానుడు,

'సాధారణంగా ఒక చిన్న పిట్ట గూటిచిక్కును విడదీయలేని మనం, మన కర్మబంధాన్ని విడదీసుకోగలమా? ఆ నారాయణుని కాళ్ళు పట్టుకొనే ఊడ కొట్టించుకోవాలి." (భగవద్విషయావతారిక)

అందుకే ఈ శతకకర్త శరణేచ్చతో నారాయణుని పాదపద్మమనే పంజరంలో (ప్రవేశించాడు. పంజరమన్నందువల్ల స్వచ్చమైన అతని మనస్సే పక్షి అని గమనీయం,

“కృష్ణు త్వదీయ పదప౦ంకజ పంజరాంతమద్వైనవ మే. విశతు మానసరాజహంసః” (ముకుందమాల),

శత్రువులెవ్వరూ చేరరాని వజ్రపంజరంలాంటిది భగవత్సాదపద్మం.

ప్రకృతిలో పాపాలన్ని జీవుని వెంటబడి తరుముతుంటాయి. తుదకు కుంభీపాకానికి (నరకానికి) తీసుకొని పోయి హింసకు గురి చేస్తాయి. కాబట్టి పాపాలు పరిపంథులు, ముముక్షువులకు విరోధులు.

“నామీ నః ప్రభవంతి పాపరిపవః స్వామి నను శ్రీధరగ్‌ - (ముకుందమాల. 12)

శ్రీధరుడు మనప్రభువుకదా! మన మాయన నాశ్రయిస్తే ఈ పాపపరిపంధులు మనలనేమీ చేయలేర్లు. వారీ భయంతో పారిపోతారు, అంటారు శ్రీకులశేఖరులు.

“ఒక్కసారి మనం భగవత్సాదాలను పట్టుకుంటే, మనం విడువదలచుకొన్నా అవి మనలను విడవవుి అంటారు ఆళ్వార్డు.

శరణుజొచ్చినవారిని కాపాడే ధర్మజ్ఞుడు భగవానుడు, "“విదితస్సహి ధర్మజ్ఞః శరణాగతవత్సలః” (రా.సుంఎ 'శరణాగతవత్సలు'డని బిరుదు.

“కాక్రాయ కంకాయ చ యోదితేష్టం

దాశాయ కీశాయ చ రాక్షసాయ”

కాకాసురుడు, జటాయువు, గుహుడు, సుగ్రీవుడు, విభిషణుడు - మొదలైన వారిని కాపాడడంవల్ల ఆ బిరుదులు వచ్చాయి స్వామికి.

“కిం తు త్వదగ్రే శరణాగతానాం

పరాభవో నాధ! నతేఒనురూపమ్‌” (ఆళవందార్‌ స్తోత్రం -25)

ప్రాకృతిక బంధాలచేత దుఃఖాల పాలై నీయెదుటికి వచ్చి శరణుజొచ్చిన వారిని శరణాగతరక్షకు'డన్న బిరుదు ఉన్నవాడు, రక్షించడంలేదనే అపకీర్తి నీకు తగదు స్వామి! అని శ్రీయామునాచార్యుల సూక్తి

218 నారాయణ శతకం ఇలా జీవుడు దేవునితో, రక్షిస్తాడనే దృఢ విశ్వాసంతో, చేసే సంవాదనను 'ప్రార్ణనా మతిః ప్రపత్తి” అని పప్రపన్నునిలక్షణంగా శాస్త్రం అనుమతించింది.

మ. సతతాచారము సూనృతంబు కృపయున్‌ సత్యంబునున్‌ శీలమున్‌ నతి శాంతత్వము చిత్తశుద్దికరము న్నధ్యాత్మయున్‌ ధ్యానమున్‌ ధృతియున్‌ ధర్మము సర్వజీవహితముం దూరంయబు గాకుండ న మ్ముతికిం జేరున మీనివాససుఖమున్‌ మానాథ నారాయణా॥ 86.

అర్ధం. : మానాధ = శ్రీపతీ! నారాయణా! సమ్మతికిన్‌ = (ప్రజ్ఞావంతునికి; సతత+ఆచారము= ఎల్లప్పుడు శుచిగా మెలగడం; సూనృతం = సత్య, ప్రియవాక్యం, కృపయున్‌ = దయ; సత్యంబునున్‌ = యధార్హవచనం; శీలమున్‌ = చక్కని నడవడి; నతి = నమ్రత; శాంతత్వము = శాంతభావం; చిత్త శుద్దికరమున్‌ = మనస్సును నిర్మలంగా ఉంచడం; అధ్యాత్మయున్‌ = ఆత్మజ్ఞానం; ధ్యానమున్‌ = సంతతస్కృతి; ధృతియున్‌ = ధైర్యం; ధర్మము = వేదశాస్త్రచోదితలక్షణం; సర్వజీవహితమున్‌ = సకలప్రాణులకు మేలుచేయడం; మినివాస సుఖమున్‌ = మీ సన్నిధి (లో ఉండడమనే) సుఖం; దూరంగాకుండ; చేరువగా ఉంటాయి.

తా : మానాధ! నారాయణా! ప్రాజ్ఞనికి సతతాచారంమొదలు పద్నాలుగు లక్షణాలు అవళ్యంగా ఉంటాయి. దుర్మతికి ఇవి దూరంగా ఉంటాయి. సమ్యక్‌ జ్ఞానంకలవానికి దగ్గరగా ఉంటాయి.

వ్యాఖ్య : సమ్యక్‌ జ్ఞానం కలవ్యక్తియందు ఉండే లక్షణాలను వర్ణించే పద్యం.

మోక్షధర్మాలలో ఆచారమే (ప్రధమంగా పరిగణింపబడింది.

“సర్వాగమానామాచారః (ప్రథమం పరికల్ప్యతే” (వి.స.నా.ఉత్తరపీరికు

1 సతతాచారం: “బ్రాహ్మ ముహూర్తే ఉత్తిస్టేత్‌” ఉషుకాలాన మేల్కొనడం, దంతధావనం, స్నానం చేయడమూ ఆరోగ్యానికీ, ఆచారానికీ ప్రధానమైనవి.

“అభ్యంగమాచరేన్నిత్యం స జరాశ్రమవాతహా” - నిత్యమంటే ఇక్కడ (ప్రతి వారమని ఆర్థం. పురుషులు (ప్రతి శనివారం, స్త్రీలు ప్రతి శుక్రవారం తలంటు స్నానం చేస్తే ముసలితనం రాదు. వాతరోగమంటదు. శరీరం చురుకుగా ఉంటుందట,

నిత్యమంటే. ప్రతిదినమనీ చెప్పే వారున్నారు. డా. ఆచంట లక్ష్మీపతిగారు ప్రతిదినమూ అభ్యంగన స్నానమందుకే చేసేవారు.

“ఉద్దరతి భక్తజనానితి ఊర్చతాశ్రయణ సూచితశక్తిమ్‌”

“ఉత్ధం తత్పుండ్రమూర్ష్యం జనిమరణతమఃఖండనం మ్‌ండనం నః"అన్నట్టు

రాఘవీయవ్యాఖ్య 219 ఆత్మ యొక్క ఊర్చ్వ్యగమనాన్ని సూచించే ఊర్చ్యపుండ్రధారణం, కర్మసాక్షి యైన సూర్యునికి నమస్కరించడం, సంధ్యావందనం ఆరోగ్యదాయకం.

“సంధ్యాహీనో ఒశుచిర్నిత్యమనర్హ, స్సర్వకర్మసు” (దక్షస్టృతి) సూర్యనమస్కారం, సంధ్యావందనం చేయనివాడు అంటరానివాడని ఆచారకాండ చెబుతుంది.

“ఆచారహీనం న పునంతి వేదాః” ఆచారపరుడు కాని వ్యక్తిని వేదమంత్రాలు కూడా పావనం చేయలేవని 'వసిస్టస్టృతి' వాక్యం,

శుచిర్భూతుడు సర్వకర్మలను చేయడానికి అర్హుడుకదా!

  1. సూనృతం: 'సూన్ఫతం ప్రియే సత్యే” (అమరం) ప్రియమైన, సత్యమైన మాట. “అనుద్వేగకరం వాక్యం సత్యంప్రియహితం చ యత్‌” (భ.గీ.17-15) మాటాడేవానిక్తీ, వినేవానికీ చిత్తక్షోభం కలిగించరాని మాట.

“వరం కూపళశతాద్వాపీ, వరం వాపీ శతాత్కతుః వరం (క్రతుశతాత్తుత్రః"

నూరునూతులకంటె దిగుడుబావి, నూరుబావులకంటి ఒక (క్రతువు, నూరు(క్రతువులకంటె ఒక సుపుత్రుడు మేలు. “తత్సుత శతకంబు కంటె ఒక సూనృతవాక్యము మేలు చూడంగన్‌” (భారతం,)

3 కృపః వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః”(రామాయణం), దీనుల దుఃఖాన్నీ, కష్టాలనూచూచి చిత్తం (ద్రవించి కన్నీరొలుకడం దయాలక్షణం = దయాళువుకు త్యాగబుద్ది ఉంటుంది.

  1. సత్యం: సకారం జీవవాచకం, తకారం (ప్రకృతి వాచకం, 'యం” అంటే అజీవ ప్రకృతులరెంటినీ నియమించే సామర్థ్యం. కాబట్టి సత్యం” పరబ్రహ్మవాచకం. కాబట్టి “సత్యేన లోకాన్‌ జయతి” సత్యవాక్సాలకుడు లోకాలను జయిస్తాడు.

సత్యం (ప్రామాణికవ్యవహారం. (ధర్మసూక్ష్మమిలా ఉంది.)

“న తధ్యవచనం సత్యం నాతథ్యవచనం మృషా;

యద్భూతహితమత్యంతం తత్సత్యమితరన్నృషాః” ఉన్నదున్నట్టు చెప్పడం సత్యమూ కాదు. అబద్ధం అసత్యమూ కాదు.

“భూతహితంబుకై పలుకుబొంకును” సత్యమే అవుతుంది.

మునిఆశ్రమంలో తలదాచుకొన్న బాటసారుల విషయాన్ని అ ముని యధార్థంగా దొంగలకు చెప్పగా, వారు ధనం దోచుకొని బాటసారులను చంపివేశారు. ఆ పాపమంతా మునినెత్తిమోద పడిందని శ్రీకృష్ణుడు పార్గునికి చెప్పాడు (భార-కర్షప) కాబట్టీ, హింసను నివారించే అసత్యం సత్యంగా పరిగణితం,

  1. శీలం: సచ్చరిత్ర. ఏ యెండకాగొడుగు పట్టడం కాదు.

220 నారాయణ శతకం

“మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మనామ్‌” - మనస్సు, మాట, చేష్ట (మూడు)త్రికరణాలు. ఒకే బుజుమార్గంలో, సామాజిక ధార్మికవిషయాలను అతి(క్రమింపక, (ప్రవర్తించడం “శీలం.

  1. నతి: దాంభికంగా ప్రవర్తించక, (ప్రవాహంలో ప్రబ్బలిచెట్టులాగా, సమ్రతతో వర్తించడం.

  2. శాంతత్వం: జ్ఞానకర్మేంద్రియాలను విషయాసక్తంకాకుండా మనస్సును నిరోధించి, వాటిని సమాజ(శ్రేయస్సుకోసం ఉపయోగించేరీతిగా భద్రపరచుకోవడం శాంతస్వభావం.

8 చిత్తశుద్దికరం: మనస్సును నిర్మలంచేసుకునే విధానం. వివేకం, విమోకం, అభ్యాసం, క్రియా, కల్యాణం, అనవసాదం, అనుద్దర్దణం అనే సాధన సప్తకం వల్ల మనస్సుకు శుద్ది కలుగుతుంది. సర్వత్ర ప్రసిద్ద్యధికరణం' - (శ్రీభాష్యం) లో విశదీకృతం.

  1. అధ్యాత్మ: ఆత్మపరమాత్మల స్వరూపజ్ఞానం, “అధ్యాత్మ విద్యా విద్యానామ్‌” (భ.గీ10-32) జననమరణరూపమైన సంసారబంధంనుంచి విముక్తి నొందే జ్ఞానం. ఇది వేదాన్తశా(స్తోపదిష్టం.

  2. ధ్యానం: యోగకృత్యం తు యోగానాం ధ్యానమేవ పరం బలమ్‌” మధుకైటభుల వలె కలిసియున్న రాగద్వేషాలను నివృత్తి చేసి మనస్సును దైవాభిముఖంగా మలచి, అవిచ్చిన్నస్పృతి కలిగియుండడం.

  3. ధృతి: ధృతిర్షష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు న సీదతి",

ధైర్యం, సూక్ష్మ దృష్టి మేధ, కార్యకారణ సామర్థ్యం = ఈ నాలుగు గుణాలున్నవాడు విజయాన్ని సాధిస్తాడు. అందులో ధృతి గుణానికే (ప్రాథమ్యం క. కార్యాన్ని విఘ్నాలెన్ని కలిగినా నెరవేర్చీదైవీసంపద కల్గిన మనోధర్మం

12, ధర్మం: “యతో ఒభ్యుదయని శ్రేయససాధనం ధర్మః”(కణాదవైశేషికసూత్రం,)

సామాజికజీవనగతిలో దైనందినాభివృద్దికీ, మోక్షానికీ సాధనమైనది ధర్మం.

'ధరతీతి ధర్మః (కర్రర్హక వ్యుత్పత్తి ధర్మో విశ్చస్య జగతః ప్రతిష్టా |

సమస్త ప్రపంచాన్ని నిలిపేది ధర్మం. “ధ్రియతే అనేన ఇతి ధర్మః(కరణవ్యుత్పత్తి).

వేద శాస్త్రాలు చెప్పిన విధి నిషేధాలను పాటించడం ధర్మం.

“ధర్మేణ పాపమపనుదతి.” ధర్మమాచరిస్తే పాపం తొలగుతుంది.

రాఘవీయవ్యాఖ్య 221

“అక్షైర్మాదీవ్యః” = జూదమాడకుము,.

“కృషిమత్కృషస్వ” - కష్టపడి పనిచేయుము.

“విత్తే రమస్వ” - కలిగిన కలిమితో తృప్తిపడుము.

బోధిస్తే ధర్మం, ఆచరిస్తే కర్మం అవుతుంది.

  1. సర్వజీవహితం: నకల (ప్రాణులకు మేలు చేయడం. దీనికి దయాక్షమాదానగుణాల సహకారమావళ్యకం.

  2. భగవన్నివాససుఖం: భగవంతుని సన్నిధిలో తాను ఉండాలనో లేదా తన హృదయపద్మసద్మంలో భగవంతుడు నివసించాలనో కోరడం జీవలక్షణం. “నిధి సుఖమా? రాముని సన్నిధి సుఖమా?” (త్యాగరాజు)

"ఇవేన మే సంతిస్టస్వ స్యోనేనమే సంతిస్టస్వ” (శ్రుతి)

సర్వేశ్వరా! నీవు సకల కల్యాణ గుణాలతో సుఖంగా నాయెదలో ఉండవయ్యా! అని వేదమూర్తులు అంజలి ఘటించి వేడుకొంటారు. భగవదుపాసనవల్ల ఆయనగుణాలే తనకు సం(క్రమిస్తాయని వేదవిహితం.

మ. భవనాశిన్‌ గయ తుంగభద్ర యమునన్‌ భాగీరధిం గృష్ష వే త్రవతి న్నర్మద పెన్న గౌతమి సయోరాశిన్వ్నియద్దంగయం దవగాహంలబున నైనపుణ్యములు బెంపారంగ నేండిచ్చటన్‌ భవదంఘస్మరణంబునం గలుగుపో పద్మాక్ష నారాయణా॥ 87

అర్ధం : ఓ పద్మాక్ష = ఓ అంభోజనయనా 1! నారాయణా! భవనాశిన్‌ = భవనాశియనే పేరుగల నదియందు; గయ, తుంగభద్ర, యమున, భాగీరధి, కృష్ణు వేత్రవతి, నర్మద, పెన్న, గౌతమి = గోదావరి; పయోరాళిన్‌ = సము(ద్ర మందు; వియత్‌+గంగ = ఆకాశగంగ యందు; అవగాహంబునన్‌ = స్నానంచేత; ఐన = కలిగిన; పుణ్యములు = సుకృతాలు; నేడు; ఇచ్చటన్‌ = ఉన్నచోటనే; భవత్‌+అంధఘ్రి స్మరణంబునన్‌ = మీ పాదాలను ధ్యానించడంచేత; పెంపారంగ = అతిశయంగా; కలుగు పో = సంభవించును కదా!

తా : ఓ పద్మాక్ష! నారాయణా! భవనాళమొదలైన పవిత్రనదులయందు స్నానం చేయడంవల్ల కలిగే పుణ్యరాళి, ఈనాడు ఉన్నచోటున మీ చరణస్మరణవల్టనే సమృద్దిగా కలుగుతుందిసుమా!

వ్యాఖ్య వ పవిత్రనదులందు తీర్ధమాడిన పుణ్యం, వారాయణచరణస్మరణవల్ల కలుగుతుందని వర్ణితం, ల

త్రివిశ్రముని వామపాదమందు ఉద్భవించిన ఆకాశగంగ భగీరధుని తపః ఫలితంగా దివినుంచి భువికి వచ్చి, పెక్కు పేర్లతో, నదీనదాలుగా ప్రవహించింది.

నారాయణ శతకం

222 నదులు తూర్పు దిక్కుకు, నదాలు పడమటి దిక్కుకు (ప్రవహిస్తూ సముద్రంలో సంగమిస్తున్నాయి.

పుణ్యభూమి, కర్మభూమియైన భారతదేశంలో, పద్యంలో పేర్కొన బడిన భవనాశి మొదలైన ద్యాదశనదీనదజలాలు పౌరులకు యోగక్షేమాలను కల్పిస్తున్నాయి. వాటిపరీవాహప్రదేశాలు తీర్టస్టలాలుగా ప్రసిద్ది పొందాయి. భారతీయసంస్కృతికి ఆయువుపట్టువులయ్యాయి.

“ఉశతీరివ మాతరః” - అవి కన్నబిడ్డల అభ్యుదయార్థం పాటుపడుతున్నట్టున్న తల్టులట.

“అత్యాశనా దతీపానాత్‌ యచ్చ ఉగ్రా త్రతిగ్రహాత్‌”

ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కువగా తిని, త్రాగి. ఇష్టంవచ్చినట్టు తిరిగినందువల్ల కలిగిన వ్యాధిరూపపాపాలను కెరటాల రూపంలో ఉన్నచేతులతో నఖిశిఖపర్యంతం తుడిచి వేసి, దేహపుష్టినీ, సర్వకర్మసమారాధనకు యోగ్యమైన చిత్తపుద్దినీ కలిగిస్తాయన్నది శ్రుతి.

గైరికాది ధాతువులతోనూ ఇరుదరుల యందున్న తరుమూలాలతోనూ ఒరసి, రకరకాల రసాయనాలున్న నేల పొరలలో దారలుతూ పారే ఏటి నీటిలో మునిగి చేసేస్నానం ఎన్ని పుణ్యాలకు మూలమో! పర్వదినాలలో సముద్రస్నానం చేయడం ఎంతో సుకృతం కదా!

స్నానం చేసే సమయంలో గోవింద! పుండరీకాక్ష! నారాయణ! అంటూ ళిరః స్నానం చేయకపోతే అది, గజస్నానం. లాగా నిష్పలమవుతుందని ఇదివరకే చెప్పబడింది కదా! ధనాన్ని వెచ్చించి, కాలాన్ని వ్యయంచేసి, (శ్రమకోర్చి దూర తీరాలకు పోయి సంసాదించుకొన్న పుణ్యరాశి, ఒక్క నారాయణ చరణారవిందాలను ఉన్నచోటనే నిశ్చలంగా స్మరిస్తే క్షణంలో చిత్తానికి హత్తుకొంటుంది.

“యమో వైవస్వతో రాజా యప్తవైష హృది స్థితః

తేన చేదవివాదస్తే మా గంగాం మా కురూన్‌ గమః”'(మనుస్పృతి)

దేహాంతంలో పరలోకాన యమునిచే బాధపడుతామనే భయపడి పాపాలను చేయకుండడం, సూర్యుడు వెలిగే పగలు పాపాచరణకోసం భయపడడం, ఈ రెండింటినీ నిర్లక్ష్యంచేసే వారైనా రాజాకు భయపడి పాపం చేయరు. ఈ మూడింటినీ లక్ష్యం చేయనివారుకూడా అంతర్యామికి భయపడి పాపం చేయరుకదా!

'యము” డంటే చేతనాచేతనాలను నియమించే పరమాత్ముడు.

సూర్యమండలమధ్యవర్తి యైన నారాయణుడే. వైవస్వతుడు. ప్రకృతిని

రాఘవీయవ్యాఖ్య 223 ఆనందింపజేసేవాడు రాజు, అందరి హృదయాల్లోనూ ఉండేవాడు పరమాత్ముడే. “ను స్వతందత్రుడను కాబట్టి అంతా నాదే” అంటూ భగవంతునితో వివదించే వారికి, తాము చేసిన అపరాధాలకు 'ప్రాయళ్ళిత్తంగా, తీర్భయాత్రచేయడం, పవిత్రనదీ జలాల్లో క్రుంకులిడడం ఆవశ్యకం.

'నీ హృదయకమలమందున్న (అంతర్యామి) పరమాత్మతో నీకు వివాదం లేకుంటే గంగాది తీర్చాలకుగానీ, కురు దేశాది పుణ్యక్షేత్రాలకు గానీ వెళ్ళవద్దు' అని పెద్దలు ఉపదేశిస్తుంటారు.

స గంగా స గయా సేతుః స కాశీస చ పుష్కరమ్‌ః

జిహ్యాగ్రే వర్తతే యస్య హరి రిత్యక్షరద్వయమ్‌॥” (హర్యష్టకం)

'హరి" అనే రెండక్షరాలు నాలుకమీద నర్తించిన వ్యక్తి (లక్షణయా) గంగలాగా పవిత్ర తీర్చుడవుతాడు. గయాక్షేత్రంవలె పితృదేవతలను పిండోదకాలతో తృస్తిపరచి అభ్యుదయాన్ని పొందుతాడు. రామకార్యార్థులై కపివరులు కట్టిన వారధి (సేతువు) లాగా శ్రీ హరికృపకు పాత్రుడవుతాడు. కాశివలె భగవంతుని నామవైభవాన్ని చాటే భాగవతశిఖామణి అవుతాడు. పం(డైండు సంవత్సరాలకు ఒక్కొక్కనది యందు బృహస్పతి ప్రవేశించే పుష్కరక్షేత్రంలాగా, తానే సాక్షాత్కరిస్తాడు. (ప్రారబ్ధకర్మ ఫలాన్ని అనుభవిస్తున్న ఈజన్మలోనే భగవదం[ఘైి. స్మరణచేస్తున్న ప్రాణి, మరణానంతరం సాయుజ్యమనే మోక్షానందాన్ని పొందుతాడుకదా! కాబట్టి -

“ప్పధివ్యాం యాని తీర్జాని పుణ్యాన్యాయతనాని చ।

తాని సర్వాణ్యశేషాణి, హరి రిత్యక్షరదయమ్‌॥”

సకలతీర్హక్షేత్రాభిగమనంవల్ల కలిగే పుణ్యాలన్నీ, ఒక్క హరినామ స్మరణ పుణ్యంలో ఇమిడి ఉన్నాయనడం రెండువాదాలకు తావులేని మాట.

“స్యాద్ధర్మ మ'స్రియాం పుణ్యం” - పుణ్యమంటే ధర్మమే (ఆమరకోశం). సకల శా(స్తావగాహిర్రైన ఈ శతకకవి ధన్యజీవులలో మూర్దన్యుడు. ను. ధర గ్రామాధిపునింటిదాసుండు వెసం దా ద్రోహముంజేసినన్‌

పరగం జెల్లుట సూచి తీభుననసంపాద్యుండవైనట్టి మీ వరదాసానళిదాసదాసినని దుర్వారాఘముల్‌ జేసితిన్‌ కరుణం జేకొని కావుమయ్య త్రిజగత్కల్యాణ నారాయణా॥ 88 అర్థం: త్రిజగత్‌ కల్యాణ = ముల్లోకాలకు మంగళకరుడా! నారాయణా! ధరన్‌ = లోకంలో; (గ్రామ+అధిపుని ఇంటి దాసుడు = ఒక ఊరి దొరయింటీ సేవకుడు; వెసన్‌ = త్వరగా; తాన్‌: ద్రోహమున్‌ = అపకారాన్ని; చేసిన్‌ = చేసినప్పటికీ; పరగన్‌, చెల్లుట,

224 నారాయణ శతకం సూచితి + పప్రసిద్ధంగా ఒప్పిదమై సాగిన దాన్ని చూచాను. దుర్వారాఘముల్‌ = ఘోరపాపాలను; చేసితిన్‌; చేసినాను. ఈ భువన సంపాద్యుండవైనట్టి = ఈజగత్తును కల్పించినవాడవైన; మో = మీయొక్క; వరదాస+ఆవలి = గొప్పసేవకుల సమూహాలకు; దాస, దాసిని = "సేవకులైన వారికి సేవకురాలను; అని = తలచి; కరుణన్‌ = కృపతో; చేకొని = కైకొని; కావుము+అయ్య = కాపాడుము, తండ్రీ!

తా : ముజ్జగాలకు మేలుచేసి ఓ నారాయణా! ప్రపంచంలో ఒక్క (గ్రామాధికారి ఇంటి సేవకుడు (ద్రోహంచేసినా, ప్రసిద్దంగా చెల్లిన విషయాన్ని గమనించాను. నేను తొలగించరాని అపచారాలను కుప్పలుకుప్పులుగా చేశాను. ఈ ప్రపంచాన్ని రచించిన దొరవైన మాకు ప్రియులైన పరిచారక సమూహాలకు పరిచర్య చేసే వారికి పరిచారిక నని భావించి నన్ను దయతో చేపట్టి రక్షింపుము తండ్రీ!

వ్యాఖ్య: భగవద్దాప. దాస దాసి యైన తనను కాపొడుమునే కవిపద్యమిది. భాగవతధర్మం అతిగహనమైనది. భోగబుద్దిని విడిచి భగవంతుని ట్రీతికోసమే సకలసేవలు చేసే యోగబుద్ధిగల వ్యక్తులను - భగవంతుని భక్తులను - భాగవతులంటారు, భాగవతోత్తముడు. 'దాసుడు” అనే పేరుతో వ్యవహరిస్తాడు.

“త్రీమద్భాగవతార్చనం భగవతః పూజావిధేరుత్తమమ్‌” (రామానుజసూక్తి భగవంతునికి దాసులుగా ఉండడమే కాదు, భగవద్దాసులకు దాసులుగా వర్తించడమే జీవితపరమార్థం. మనమెన్నో అపరాధాలు చేసిన, చేస్తున్న మొనగాళ్ళమే కదా! భగవంతుడు (ప్రభువు, స్వతంత్రుడు, అపరాధ చక్రవర్తులు ఎంతప్రార్హించినా, ఆచక్రధారి వారిని (శిక్షాశాస్త్రంరీతిగా) నరకంలోకి (త్రోసి వేయనూ వచ్చు.

“సిద్ధిర్భవతి వా నేతి సంశయోచ్యుత సేవినామ్‌।

న సంశయో౭స్తి తద్భక్తపరిచర్యారతాత్మనామ్‌॥

అచ్యుతుణ్ని సేవించిన వారికి సిద్ధికలుగుతుందో లేదో అనుమానమే. ఆయన భక్తులను సేవించేవారికి అనుమూన మక్కర్లేదు.

“వినా భాగవతాపచారం మోక్షవిరోధో నాస్తి”

భగవద్భక్తులకు ఆపచారంచేయకపోతే మోక్షం పొందడానికి ఆటంకమే లేదు, అని పూర్వాచార్యసూక్తి భాగవతులు ఆమోదిస్తే భగవంతుడు అంగీకరిస్తాడు.

“విధేయాత్మా” అని విష్ణుసహ(్రనామాల్లో పరమాత్ముడు తనదాసులకు విధేయుడుగా ఉంటాడనే ఒక సపేరుందికదా!

భక్తుడు వినయవిధేయతలతో ఎంత॥క్రిందికి ఉంటే, దాసభావానికి అంత ఉత్కర్హ, భొన్నత్యం ఉంటుంది. (మూడవ పద్యం వ్యాఖ్యలో దాస్య విధం ఉంది.) శ్రీకులశేఖర మహారాజు (ముకుందమాలలో) -

రాఘవీయవ్యాఖ్య 225 “త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ!” తనకంటె ఆరు అంతస్థుల పైన ఉన్న భగవద్దాసానుదాసు

లకు తాను దాసుడుగా గుర్తించుమని జగన్నాధుణ్ని (ప్రార్థించాడు.

“యః సప్త్రపర్వవ్యవధానతుంగాం, శేషత్వకాష్థామభజన్మురారే?

శ్రీ శరకోపసూరికి సప్తపురుషవ్యవహితమైన దాసత్వం అభిమతమయింది. ఆ శరకోపనామాన్ని ధరించిన భక్తులు అష్టపురుష వ్యవధానం ఉన్న దాసత్వ అధ్యవసాయంకలవారే అని శ్రీవేదాన్తదేశికులు'పాదుకాసహ(్రం'లో దాసత్యోత్కర్జను ఉగ్గడించారు.

దాసీత్వ విషయం: పతివిషయంలో పల్నికి అనన్యార్హత్వం, అనన్యభోగ్యత్వం, అనన్యశరణ్యత్వం అనే ఆకారత్రయసంపద సంభవిస్తున్నట్లే, దేవునిపట్ట జీవునికీ వర్తిస్తుంది. సమాధియోగమందు సాక్షాత్కరించిన పురుషోత్త్రమునిసర్జోషంతో సుఖమూ, విశ్లషంతో దుఃఖమూ పొందడం: ఆయన చేతనే నిర్వహింపబడడం స్త్రీ ధర్మంగా చెప్పబడింది.

“* స ఏవ వాసుదేవోఒసౌ సొక్షాత్పురుష ఉచ్యతే!

'స్ర్రప్రాయమితరత్సర్వం జగద్ర్రృహ్మపురస్సరమ్‌॥”

వాసుదేవుడొక్కడే పురుషోత్తముడు, బ్రహ్మతోకూడిన ఈ జగమంతా స్త్రీప్రాయమే”.

“స్వామిత్వాత్మత్వశేషిత్వపుంస్తాద్యాః స్వామినో గుణాః |

స్వేభ్యో దాసత్వదేహత్వశేషత్వ'్త్రీత్వదాయినః 1”

స్వతంత్రుడైన భగవంతునికీ, పరతం(త్రులైన చేతనులకూ స్వామిత్వం దాసత్వం; ఆత్మశరీరభావం; శేషిశేషత్వం; పుంస్త్రం - 'ప్రీత్వం; ఇత్యాదిగా శా(స్తోక్తం. కాబట్టి

'దాసుణ్ని' అనడంకంటె 'దాసిని' అని భావించడంలో శేషత్యోత్కర్హయేకాక,

ఆకారత్రయసంపత్తూ ప్రాప్తిస్తుంది. దాసీభావనగల భక్తులయెడ భగవంతుడు

“గోవువెంటందగులు కోడెభంగి” ఉంటాడని భాగవత మధురభావన. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి రక్షణకోసం సుతలలోకాన కావలి ఉన్నట్టే,

మహాదేవుడు భక్తత్రాణుడై బలిసుతులలో పెద్దవాడైన బాణాసురునిఇంటికి సపరివారంగా

కావలి ఉన్నట్టు పరాశరవ్యాసకృతులవల్ల తెలుస్తున్నది.

బాణాసురుణ్ని కాపాడడానికి శ్రీకృష్ణునితో ప్రమథాధిపుడు యుద్ధంచేసి “జృంభణ శరపాతముచే శంభుడు” ఆవలింతలతో ని(ద్రాపరపవశుడయ్యాడు. బాణుని వేయి చేతులను (రెండు-వి.వు) నాలుగు మిగులునట్టుగా (భాగ) శ్రీకృష్ణుడు నరికి వేశాడు. అవ్వ్పుడు “సమానాధికవస్తుళూన్యుండవైన నిన్ను నేనునుం బ్రహ్మయు౦

226 నారాయణ శతకం బరిణతాంతఃకరణులైన మునిగణంబులును భజియించుచుందుము” అని ఈశ్వరుడు శ్రీకృష్ణుణ్ని సన్నుతించాడు. ్రహ్హాదునివంశంలో పుట్టినవారిప్రాణాలను మాత్రం తీయనన్నాడు శ్రీకృష్ణభగవానుడు (భాగవతగాధు.

ఒక్క శోణపురాధీశుడు బాణాసురుడు, సర్వభువనాధిపుడు నారాయణుడు. ఒక్క (గ్రామాధిపుని ఇంటికి దాసుడైనంత మాత్రాన యుద్దానికి తలపడిన ద్రోహం చేసినా, శంకరునిమాటను కాపాడాడు. ఆయన తప్పును ఒప్పుగానే చూశాడు కదా! శ్రీకృష్ణుడు. అది 'ప్రసిద్దవిషయం.

ఈ కవి, జన్మజన్మలలో చేసిన తప్పులు కుప్పలు కుప్పలు అయినా, నారాయణునికి తప్ప మరెవ్వరికీ తెలిసిన విషయం కాదు. ఆతప్పులు దుర్వారమైనా, తాను కరుణిస్తే నివారింపబడుతాయి.

ఆ వ్యక్తి ఒకరియింటికి దాసుడు. అందులో పౌరుషం మెరుస్తున్నది. ఈవ్యక్తి (త్రిజగత్కల్యాణుడైన నారాయణునిదాసబ్బందాలకే దాసులైనవారికి దాసి. ఇందులో (పైణం జాగృతమవుతున్నది.

భక్తి ప్రణయంగా పరిణమించడంవల్ల విరహసంగమ(ప్రవృత్తులతో అంతరంగాన్ని సింగారింపజేసి, భగవదనుభవాన్ని పొందడం దాసిధర్మం. దాసదాసీభావతారతమ్యాన్ని వలపుల తలపులతో తలకెక్కించడంవల్ల పురుషోత్రమునిచిత్తం మెత్తపడుతుంది. హృదయం స్పందిస్తుంది. అలాంటప్పుడు కల్యాణమూర్తి కరుణతో కరగ్రహణం చేసి దాసిని కావకుండా ఉంటాడా? ఇలాంటి అధ్యవసాయగాంభీర్యం ఈ కవికేసరికే సరి. మ. గణుతింపన్‌ బహుధర్మశాస్త్రనిగమూఘంబెప్పుడున్ని న్నకా

రణబంధుండని చెప్ప నత్తెజంగు దూరం బందకుండంగనే(

(బ్రణతుల్‌ జేసెద( గొంతయైన; గణుతింసంబాడి లేకుండినన్‌

బుణమా నానుతి, నీవు శ్రీపతివి వీకే లప్పు? నారాయణా॥ 89

అర్ధం: ఓ నారాయణా! బహు ధర్మశాస్త్ర నిగమ+ఓఘంబు = అనేక ధర్మ శా(స్తాలనూ,

వేదాలనూ, గణుతింపన్‌ = పరిశీలించగా; నిన్ను, ఎప్పుడున్‌, అకారణబంధుండు = కారణంలేని చుట్టం; అని, చెప్పన్‌; ఆ తెటుగు = ఆ పద్ధతి; దూరంబు, అందక, ఉండంగ = ఆందనంతదూరంగా ఉంటుంటే; నే, ప్రణతుల్‌, చేసెదన్‌ = నేను దండాలు పెడుతాను. కొంతయైన; గణుతింపన్‌ = లక్ష్యపెట్టడం; పొడి = న్యాయం, లేకుండినన్‌ = లేకుంటే; న్నా నుతి = నా స్తోత్రం/శతకం; బుణమా = అప్పు అవుతుందా? నీకు, ఏల, అప్పు = నీకెందుకు బుణమవుతుంది? నీవు; శ్రీపతివి = లక్ష్మీనాధునివి,

తా : ఓ నారాయణా! ధర్మశాస్తాలూ, వేదాలు నిన్ను అకారణబంధువని

రాఘవీయవ్యాఖ్య 227 బోధిస్తున్నాయి. ఆ బంధు మార్గం దూరంకాకుండా నేను దండం పెడుతాను. నీవు దాన్ని లక్ష్యపెట్టడం న్యాయం. లేకపోతే, నేను చేసే నుతి - స్తోత్రం నీకు బుణంగా పరిణమిస్తుందనుకొంటే, లక్ష్మీపతికి బుణమెందుకవుతుంది? - కాదని తాత్పర్యం.

వ్యాఖ్య 2 నారాయణుడు నిరుపాధికబంధువని వర్లన.

లోకంలో మాతాపితృకళత్రపు(త్రాదులు అభాసబంధువులు. ఆభాసటంధువులమీద ఆసక్తి భవరోగాల్డో ఒకటి (37వ పద్యవ్యాఖ్యలో ఉంది).

“బుణానుబంధరూపేణ పశుపత్నీసుతాలయాః।

బుణక్షయే క్షయం యాంతి కా తత్ర పరివేదనా!”

పశుపత్నీసుతాదిబంధుత్వం జన్మాంతరబుణసంబంధాలచేత ఏర్పడింది. ఇది అనుబంధమేకాని సంబంధం కాదు. ఆ బుణానుబంధం, బుణం తీరగానే నశిస్తుంది. ఈ దేహబంధువుల పట్ట అత్యాసక్తిగానీ, (వారు నళించగానే) దుఃఖపడడంగానీ నిరర్హకం.

స్వరూపంచేతనూ, స్వభావం (గుణాల) చేతనూ బృహత్త్యం కలవాడు శ్రీమన్నారాయణుడే. అతడే జిజ్ఞాస్యుడు. “లోకవత్తు లీలాకైవల్యమ్‌” (బ్రసూ.2- 1-33) లోకంలో అధికారులు లీల కోసం బంతిఆట అడేరితిగా, పరబ్రహ్మకూడా ఏప్రయోజనం ఆశించక, కేవలం లీలకోసమే జగత్సృష్ట్యాదికం చేస్తుంటాడు.

“సర్వేషాం తు సనామాని కర్మాణి చ పృథక్‌ పృథక్‌!

వేదళబ్టేభ్య ఏవాదౌ పృథక్‌ సంస్టాళ్ళ నిర్మమే॥” (మనుసృృతి)

అపరబ్రహ్మ అన్నింటికి నామధేయాలను, కార్యాలను, రూపసంనివేశాలను వేర్వేరుగా వేదాలయందలి శబ్దాలను బట్టి సృజించాడు.

“వైషమ్యునైర్చణ్యే న సాపేక్షత్వాత్‌” (2-1-34)

జీవులు చేసుకొన్న కర్మలనుబట్టి వారిని ఉత్తమలోకవాసులనుగానో లేదా అధమలోకవాసులనుగానో భగవంతుడు సృజిస్తాడు.

“సాధుకారీ సాధుర్భవతి, పాపకారీ పాపో భవతి” (బృహదా.6-4-5)

మంచిపని చేసేనవాడు మంచివాడుగా పాపకార్యాలను చేసినవాడు పాపిగా జన్మిస్తాడని ఉపనిషద్చోధ. ఇలా సృజించడంవల్ల సర్వేశ్వరుడు పక్షపాతం, నిరయకలవాడని భావించడానికి అవకాశం లేదని 'బ్రహ్మసూత్రం' విశదీకరిస్తుంది.

“తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్‌' తాను సృజించిన చేతనావేతనవర్గంలో తానూ ప్రవేశించిఉంటాడు. అని శ్రుతివాక్యార్థం.

“ఏష నారాయణ; కృష్ణు ఫాల్గుణళ్ళ నరః స్పృతః।

నారాయణో నర్భూవ సత్త్యమేకం చ్విధాకృతమ్‌"॥ (భార.ఆది)

228 నారాయణ శతకం

శ్రీకృష్ణుడు నారాయణుడు. పార్టుడు నరుడు. ఈ నరనారాయణుల సత్త్వం ఒక్కటే అయినా, అది రెండు విధాలుగా చేయబడింది. జీవాత్మ పరమాత్మలది నశించని తత్త్యంకదా!

“యస్యాత్మా శరీరం, యః ఆత్మానం అంతరో యమయతి” అనే (శ్రుతి వాక్యం వల్ల జీవాత్మపరమాత్మలకు శరీరాత్మభావసంబంధం ఉందని తెలుస్తుంది. కాబట్టి నారాయణుడు ఆత్మబంధువు.

(38వ పద్యవ్యాఖ్యలో నవవిధసంబంధం స్పష్టమయిందికదా[

“ఉరు'క్రమస్య స హి బంధు$ిత్తం” (విష్ణుసూక్తంి,. “ఇత్సముక్తప్రకారేణ స హీ బంధుః స ఖలు సర్వేషాం సుకృతినాం బంధుభూతః హితకరో వా, తస్య పదం ప్రాప్తవతాం న పునరావృత్తి” అన్న (ప్రకారంగా సుకృతాత్ములందరికీ బంధువైనవాడు

హితకరుడు సర్వేశ్వరుడు. ఆయన స్టానాన్ని / పాదాన్ని పొందినవారికి పునర్జన్మ లేదు. అని సాయణభాష్యం.

“స ఓతః (ప్రోతశ్ళ విభుః ప్రజాసు” సర్వప్రజలయందు నారాయణుడు 'పడుగు పేక లాగా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి జీవాత్మ పరమాత్మలది నిత్యసంబంధంకదా!

“స నో బంధుర్దనితా స విధాతా” అతడే నిజమైన బంధువు, లోకంలో తండ్రి, పుష్రుని దేహ మాళత్రానికి ఉత్సాదకుడు. కాని నారాయణుడు తండ్రికి కూడా తండ్రియేకదా!' ఎందతందతందై” - అనీ, "సపితుః పితా సత్‌” జగన్నిర్మాతకాబట్టి, అందరికీ బంధువైనవాడు ఒక్కవ్యక్తికి మాత్రమే బంధువనే భావన కలుగనేరదు. అందువల్ల వేదశా'స్తాలన్నీ అవాప్తసమస్తకాముడైన నారాయణుడు అకారణబంధువని నొక్కి వక్కాణించాయి.

అందరికీ హితకరుడైనప్పుడు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని మాత్రం కటాక్షించడం దూరాలోచనయే కాని దురాలోచనమాత్రం కాదు కదా!

అందుకే ఈ కవి, తనను కటాక్షించడానికి నతులూ నుతులూ అర్చిస్తా నన్నాడు. సుఖం కోరేవాడు (శ్రమపడడం న్యాయం. పరిశ్రమించేవాడు జీవుడు. ఫలదాత నారాయణుడు. ప్రార్థించిన - స్తోత్రం చేసిన - వానికి కొంతనైనా ఫలమీయకుంటే, ప్రార్టితుడు బుణపడి ఉంటాడు.

“గోవిందేతి యదా[క్రందత్‌ కృష్ణా మాం దూరవాసినం।

బుణం ్రవృద్ధ మివ మే హృదయాన్నాపసర్పతి॥” (భార-ఉద్యోగ.)

(ద్రౌపది “గోవింద!పుండరీకాక్ష!' అని (ప్రార్ధించింది. శ్రీకృష్ణుడు వెంటనే వలువల నిచ్చి ఆమెను మానభంగంనుంచి రక్షించాడు. అయినా, తనను నుతిస్తూ,

రాఘవీయవ్యాఖ్య 229

రెండుచేతులు స్టెకెత్తి 'ప్రణతులర్పిస్తుంటే తాను ఆమె దగ్గరికి పోయి. దర్శన

మోయక, దూరంగా ఉన్నందువల్ల తనమీద చక్రవడ్డితో పాటు బుణభారం పెరుగుతున్నదని శ్రీకృష్ణుడు బాధపడినాడట. ఆ, జ్ఞానం ఈకవికి పుష్కళంగా ఉంది. కాబట్టి తాను చేసిన నుతిని (ఈశతకాన్నిి బుణంగా భావించకూడదనీ, సిరిటెంకి కలవానికి అప్పు ఎందుకుంటుందనీ, ఒక వేళ ఉన్నదనుకొన్నా సిరికలవాడు అప్పు దీర్చుకొనే సమర్భుడనీ కవి చమత్కారంగా (ప్రారిస్తున్నాడు.

బహుకార్యధురంధరుడైన నారాయణుడు బహుశః ఏమరుపాటు చెందినా, శ్రీదేవి పురుషకారంవల్ల తనకు మోక్షలక్ష్మిని (ప్రసాదిస్తాడని వ్యంగ్యార్థం,

“విశ్చ్శతళశ్చక్షురుత విశ్వ్శతోముఖో విశ్చతోహస్త ఉత విశ్చతస్పాత్‌” (శ్రుతి)

“సర్వతః పాణిపాదం తత్సర్వతో ఒక్షిశిరోముఖమ్‌!

సర్వతః శ్రుతిమల్టోకే సర్వమావృత్య తిష్టతి;”(భ.గ.13-14)

నారాయణుడు అంతటా చేతులు, కాళ్ళు, కన్నులు, తలలు, ముఖాలు చెవులు కల్షి విశ్వమంతటా ఆవరించి - వ్యాపించి ఉన్నాడు. ఏకార్యమైనా ఆది యెంత రహస్యమైనదైనా సర్వాంతర్యామికి తిలియకపోదు. తప్పక శ్రీపతి కవినుతిని

(గ్రహిస్తాడు. జయలక్ష్మిని తనకు అను[గ్రహిస్తాడనే సాభిప్రాయమైన శ్రీపతి పదప్రయోగం

వల్ల అభివ్యక్తం.

మ. కరినాధుండు జలగ్రహగ్రహణదు:ఖాక్రాంతు(డై యీశ మీ శరణంబన్న( గృశానుభానుశతతేజస్పూూర్తి యైవట్టి మీ కరచక్రంబున నక్రకంఠము వెసన్‌ ఖండించి మంచెల దయా పర సద్భక్త భయానకప్రకరనత్రాకట్య నారాయణా॥ 90

అర్ధం: ఓ నారాయణా! దయాపర = దయాళూ! సత్‌*భక్త భయానక 'ప్రకర సత్‌ ప్రాకట్య = భక్తవరుల యొక్క భయభీతులందు ఉనికిని ప్రకటించే వాడా! కరినాధుండు = గదేంద్రుడు; జల - డై, జలగ్రహ = మొసలి యొక్క; (గ్రహణ = పట్టుచేత; దుఃఖ+ఆశ్రాంతుడై = దుఃఖపడినవాడై: ఈ+ళ! ఓ ప్రభూ]! మీ, శరణం = మిరే రక్షకం, ఉపాయం; అన్నన్‌ = అనగానే; (అది-ఆశరణం. కర్షపదం.) కృశాను, భాను, శతృ తేజస్‌+స్ఫూర్తి ఐనట్టి = నూరు అగ్నులయొక్క నూరుసూర్యులయొక్క, తేజస్సులాంటి తేజస్సుతో ్రకాశించునట్టి; మీకరచ[క్రంబున = మీచేతిచక్రంచేత; నశక్రకంరము = మొసలితలను; వెసన్‌ = త్వరగా; ఖండించి = నరికివేసి; మంచెన్‌ = (కరినాథుణ్ని) బకికించెను.

తా : ఓ నారాయణా! దయాళూ! భక్తులకు ఆపదలు కలిగినప్పుడు నీ ఉనికిని

230 నారాయణ శతకం వెల్లడించేవాడా! గజేంద్రుడు మకరపు పట్టుతో దుఃఖపడి, ఓ సర్వేశ్వరా! 'మీరే శరణ” మని [ప్రార్జింపగా, అది అనేకాగ్నుల, సూర్యుల తేజస్సులాంటి తేజస్సుతో ప్రకాశించే మీచేతిచక్రంతో మొసలితలను నరికి గజేంద్రుణ్ని రక్షించింది.

వ్యాఖ్య : భగవంతుణ్ని శరణువేడడమే జీవించడానికి ఉపాయనుని సోదాహరణ కథనం,

భగవంతుడు దయాళుడు. భక్తులు అపదలచే బాధపడుతున్నప్పుడు తన సత్తను ప్రకటిస్తాడు. భంగ్యతరంగా చెప్పితే, ఆర్తత్రాణపరాయణుడు నారాయణుడు, అని భావం. దీనికి గబేంద్రమోక్షమే ఉదాహరణం. నీటి మడుగులో అడుగు పెట్టిన గజేంద్రుని పాదాన్ని మకరం పట్టి పీడించినప్పుడు; “ఈశ్చర! కావవే వరద!” అనే ప్రార్థన గజేంద్రుణ్న రక్షించింది.

“నక్రాక్రాంతే కరీం(ద్రే ముకుళతనయనే మూలమూలేజతిఖిన్నే

నాహం నాహం న చాహం న చ భవతి పురస్తాదృశోమాదృశేషు!

ఇత్యేవం త్యక్తహస్తే సపది సురగణే భావశూన్యే నమస్తే

మూలం యత్రాదురాసీత్‌. (స దిశతు భగవాన్‌ మంగళం సంతతం నః)

మకరపు పట్టుతో బాధపడుతూ పెక్కేండ్లు పోరాడి డస్సిపోయింది ఒక మదగజం. దానికండ్లు మూతపడ్డాయి. దుర్భరదుఃఖంనుంచి కాపొడేవాడు దేవుడని నమ్మింది. ఆ దేవునిపేరూ, ఊరూ, తెల్వదు. లోకాలనన్నిటిని సృజించి, రక్షించి, లయంజేయడానికి ఆదికారణం ఎవ్వడో వాణ్ని ఆర్తితో మూలా! మూలా! అని మొరపెట్టీింది ఆమకరపీడిత మత్తేభం.

ఇంద్రుడు తాను మూలకారణం కానని అంగలార్చాడు. శివుడూ, (బ్రహ్మ దేవుడూ తమకు జగత్కారణ లక్షణాలే లేవని రాలేక చేతులు ముడుచు కొన్నప్పుడు మూలమే ఆవిర్భవించింది. ఆమూలమే ఈశుడు.

“తాం పద్మినీ మీమ్‌” అని శ్రీసూక్తి ఈకారం లక్ష్మీవాచకం,

“ఈ+-ఈశళః = ఈశః అంటే శ్రియఃపతి. అలవైకుంఠంలోని ఒక మూలనుంచి ఈనేలకు దయతో ఒకజంతువును రక్షించడానికి దిగివచ్చిన శ్రీపతి 'త్వర'ను భక్తిరసానికి ఏతమెత్తిన పోతనకవిమాత్రమే అక్షరాలా సాక్షాత్కరింపజేశాడు.

ఆ వైకుంరుడు భాస్కరకోటితుల్యమై, సహ్రారళిఖాతితీవ్రమైన సుదర్శన మనే చక్రంతో నక్రకంరాన్ని లుంరనంచేశాడు.

“సంతమేనం తతో విదుః” శ్రుతి రీత్యా, నారాయణుడు అర్తత్రాణపరాయణుడుగా తనను తొను ప్రకటించుకొన్నారు.

రాఘవియవ్యాఖ్య 231 “శరణ” శబ్దానికి గృహం, రక్షణం, ఉపాయం అని నానార్థాలున్నాయి. “అన్యధా శరణం నాస్తి" అని శరణాగతి" చేసిన వ్యక్తికి ఆపదలనుంచి విముక్తి, అంత్యదళలో వైకుంర(ప్రాప్తి అవశ్యంగా కలుగుతుంది. శా ఏ భావంబున నిన్‌ దలంచె గజయూథేంద్రుండు ఆపన్ను(డై యేభావంబున ద్రాపదయ్యెడ రనూధీశా యనె న్వాయసం బే భావంబున నీశరణ్య మనెనో యీ నీకృపాదృష్టిచే నా భానంబున నీతలంపు(గలుగ న్నాకిమ్ము నారాయణా॥ త్త అర్థం: ఓ నారాయణా! గజయూధ+ఇంద్రుడు = ఏనుగులగుంపులో (శ్రేష్టుడు; ఆపన్నుడై = ఆకస్మాత్తుగా బాధకలిగినవాడై; ఏ భావంబున = ఏ ఉద్దేశంతో; నిన్‌ తలంచె = నిన్ను స్మరించాడో; (ద్రౌపది = (ద్రుపదుని కూతురు)పాండవపత్చి. ఆయెడ = వలువలనీడ్చిన వేళ; ఏభావంబున = ఏ ఆశయంతో, రమా+అధి+ఈశా= లక్ష్మీనాధా; అనెనో) వాయసంబు = కాకాసురుడు; వఏీభావంబున = వీయభిప్రాయంతో; నీశరణ్యము = నీవే రక్షింంయోగ్యుడవు; అనెనో, ఆ భావంబున = రక్షకుడవనే ఆ బుద్దితో; ఈ నీకృపాదృష్టిచే = ఈ నీదయాలోకనం చేత; నీతలంపు = నీ స్మరణ; కలుగన్‌; ఇమ్ము = నాకు కలుగునట్టు చేయుము. తా : ఓ నారాయణా! గజేంద్రుడు ఆపదకు గురిర్లై ఏ భావంతో నిన్ను స్మరించాడో; (ద్రౌపది ఏ ఆశయంతో కౌరవసభయందు 'రమాధీశా! అని ఆర్తితో పిలిచిందో; కాకాసురుడు ఏ ఉద్దేశ్యంతో నీవే దిక్కు అని మొరపెట్టాడో, ఆ భావంతో నే నీ కృపాదృష్టిచేత నాకు నీ స్మరణ కలుగనిమ్ము వ్యాఖ్య : శరణాగత రక్షకుణ్ని స్మరించేశక్తివి అనుగ్రహించుమని కని ప్రార్థవ, ఒక మొసలి - చిన్న నీటి పురుగు తనను పట్టి బాధిస్తుంటే గజేంద్రుడు తనను రక్షించడానికి పరమాత్ముడు వస్తాడని “నీవే తప్పనితఃపరంబెరుగను' అని శరణాగతి చేసింది. భగవంతుడు సంకల్పమాత్రంచేత మొసలిని వధింపవచ్చు. కాని తనరాకకోసం ఎదురుచూచే ఆగజేంద్రుని కోరిక తీరదు కదా! “నాహం కళేబరస్యాస్య (త్రాణార్హం మధుసూదన; కరస్థకమలాన్యేవ పాదయోరర్పితుం తవ"॥ అన్నట్టు సరస్సులో ఉన్న కమలాలను (తొండంతో) తన చేతితో భగవత్సాదారవిందాలపై అర్పించాలని స్మరించాడేకాని, తన దేహాన్ని రక్షించడానికి కాదు. మొసలివల్ల గజేంద్రునికి కలిగిన బాధ తనకే కలిగినట్టు భావించి త్వరగా వచ్చి సాక్షాత్కరించాడు భగవానుడు. (ద్రౌపది, కౌరవసభలో తనకట్టుపుట్టాన్ని పట్టి దుళశ్ళాసనుడు ఈడ్వగా,

232 నారాయణ శతకం 'మానసంరక్షకుడు. శ్రీకృష్ణుడే. అనే దృఢవిశ్వాసంతో 'రమాధీశా' అని అంజలి ఘటించింది. ఆమె, శరణాగతి చేసినందువల్ల అక్షయ వస్త్రాలతో అనన్యార్డురాలుగా ఆదరణపొందింది. తిర్యక్కులలో నికృష్ణరూపమైన కాకి సీతమ్మ రొమ్మును చండచంచువుతో పొడిచినందువల్ల శ్రీరాముడు గడ్డిపరకను మహాస్తంగా (ప్రయోగించాడు. శ్రీరాముడేది చేత పట్టినా అదే మహాయుధమవుతుంది. “అస్త్రామాస తృణం ప్రియాద్రుహి, తృణామాస స్మరారే ర్రనుఃో “ప్రాణేభ్యోపి గరీయసీ” తనప్రాణాలకంటె ప్రియురాలైన సీతమ్మను బాధించిన పచ్చి అపరాధియైన కాకాసురునిపై ప్రయోగించిన గడ్డి పోచయే మహాస్త్రమయింది. శివునిధనుస్పుకూడా గడ్డి పరకలాగా రామునిచేతిలో నిస్సారమయింది. మూడులోకాల్లో తిరిగినా గత్యంతరం లేనికాకి, *రామపాదమే. శరణ్‌ మని వచ్చి కాళ్ళమీద పడినందువల్ల కాపాడబడింది. “దురాచారో౭౬పి సర్వాశీ కృతఘ్నో నాస్తిక; పురా సమాశ్రయే దాదిదేవం (శ్రద్ధయా శరణం యది॥ నిర్ణాషం విద్ధి తం జంతుం! ప్రభావాత్పరమాత్మన;”॥ అతడు, మొదట ఎంత నాస్తికుడైనా కృతఘ్నుడూ, దుష్టవర్తనుడూ, సర్ఫభక్షకుడూ అయినా, భగవంతునిపై (శ్రద్ధతో శరణుపొందినట్రైతే అతని మొదటి నడవడిని గమనించక, ఇతడు నిర్దోషి అని పరమాత్మ భావించి అను(గ్రహిస్తాడట. “భూయిష్టాంతే నమ జక్తిం విధేమ” అనే ఉపనిషన్మంత్రంలో “తే భూయిష్టాం' అని అన్వయించి, నమః అనే క్తిమాత్రమే భగవంతునికి గొప్ప సంతోషాన్ని కలిగిస్తుందని పాండిత్య పాధోనిధులు (ప్రవచిస్తారు. శ్రియఃపతి గజేంద్రుని పట్ట ఆర్తి నిర్వాపణాన్ని, (ద్రొపది విషయమై జాదార్యాన్ని, ఆర్ర్రాపరాధియైన కాకి పట్ట క్షమాగుణాన్ని ప్రకటించడానికి, శరణాగత రక్షకుడు అనే భావమే నిదానం. ఆభావంతోనే భగవంతుణ్ని స్మరించే యోగ్యత తనకు అను[గ్రహింపుమని కవి (ప్రార్హించాడు. “యమే వైష వృణుతే తేన లభ్యః” - అనే శ్రుతి వాక్యస్రకారం భగవంతుని కృప ప్రసరిస్తే జీవునికి ఆయనను స్మరించే యోగ్యత కలుగుతుంది. శా నీలగ్రీవుండు చేతి పున్క విడిచె న్నీయింతి భిక్షంబునన్‌ నీలగ్రీవుండు యీశ్వరాఖ్య(దనరె న్నీనొమజప్యంబునన్‌ నీలగ్రీవుండు మించి త్రుంచె. బురముల్‌ నీప్రాపు సేవించివన్‌ నీలగ్రీవముఖాబ్దభాస్కర కృపొనిత్యాత్మ! నారాయణా ॥ 92

రాఘవీయవ్యాఖ్య 233

అర్ధం : కృపా నిత్య+ఆత్మ = దయయే నిత్యస్వరూపంగాగలవాడా! ఓ నారాయణా! నీలగ్రీవుడు = నీలకంరుడైన శివుడు; చేతిపున్క = చేతియందంటుకొన్న తలపురైను; నీ ఇంతి భిక్షంబునన్‌ = నీ పత్నియైన లక్ష్మీదేవి పెట్టిన బిచ్చంతో; విడిచెన్‌: నీలగ్రీవుడు = శితికంఠుడు; నీనామాన్ని జపించినందువల్ల; ఈశ్వర+ఆఖ్యన్‌ = ఈశ్చరుడనే పేరుతో; తనరెన్‌ = (ప్రసిద్దిని పొందాడు. నీలగ్రీవుడు = కాలకంఠుడు; నీ ్రాపుసేవించివన్‌ = నీ ఆశ్రయాన్ని పొందినందువల్ల; మించి = ప్రకాశించి; పురముల్‌ = త్రిపురాలను; త్రుంచెన్‌ జు ధ్వంసంచేశాడు. నీలగ్రీవముఖ+ అబ్బ భాస్కర = శ్రీకంరుని ముఖాలనే కమలాలకు సూర్యుని వంటివాడా!

తా : ఓ కృపానిత్యాత్మ! నీలగ్రీవుని ముఖకమలవికాసానికి సూర్యునివంటివాడా! ఓ నారాయణా!నీలగ్రీవుడు తన అరచేతికి అంటుకొన్న కపాలాన్ని లక్ష్మి పెట్టిన భిక్షతో విడిచిపెట్టాడు. అతడు నీ నామజపంవల్ల ఈశ్వరుడనే పేరుతో శోభించాడు. కాలకంరుడు నిన్నాశ్రయించినందువల్ల తేజోవంతుడై మూడుపురాలను దహించి వేశాడు.

వ్యాఖ్య : నారాయణుడు దేవ దేవుడనే ఉద్నాటించాడు కవి,

నారాయణుడు దయామూర్తి, కాబట్టి సూర్యుడు కమలాల వికాసానికి కారకుడైనట్టే నీల[గ్రీవునిముఖోల్దాసానికి ముఖ్యకారకుడు నారాయణుడు. శివునిఆనిష్టాలను పోగొట్టి, ఇష్టాలను కలిగించినవాడు నారాయణుడు,

తత్పురుష. (తూర్పుదిక్కున) అఘోర (దక్షిణం వైపున) సద్యోజాత (పడమరదిక్కున)వామదేవ (ఉత్తరం వైపున) ఈశాన (ఊర్హృభాగాన) సంజ్ఞలుగల పంచముఖాలతో ్రకాశించేవాడు పరమళివుడు.

అమృతంకోసం సముద్రాన్ని మథించినప్పుడు మొదట ఉప్పతిల్లిన హాలాహల మనే కాలకూటమనే విషాన్ని జగద్రక్షణార్థం(మింగినప్పుడు కంఠం నల్లబడినందు వల్ల నీల(గ్రీవుడయ్యాడు.

ఒకప్పుడు తనవలె ట్రహ్మకు కూడా ఆయిదు(5)తలలున్నందువల్ల చాలా మంది భ్రమపడే. అవకాశం కలుగుతుందని తమోగుణాభిభూతుడైన రుద్రుడు, తన తండ్రియని యోచింపక, నిరపరాధిమైన (బ్రహ్మయొక్క ఒక తలను త్రుంచివేశాడు.

“బ్రహ్మణస్తు శిరళ్ళిన్న మంగుళ్య[గ్రనఖేన హ” (స్కాం-పు-కాశీఖండం)

'నిరపరాధియైన నాతలను (త్రుంచినఫలితంగా నీవు 'కపాలివి కాగలవు" అని బ్రహ్మ రుద్రుణ్ని శపించాడు,

“యస్మాదనపరాధస్య శిరళ్ళిన్నం త్వయా మమ।

తస్మాచ్చాపసమాయుక్తు కపాలీ త్వం భవిష్యసిః”

234 నారాయణ శతకం

“'బ్రహ్మహత్య" అనే గురుపాతకంవల్ల (బ్రహ్మకపాలం శివుని అరచేతికి అంటుకొన్నది.

“కపాలపాణి ర్విశ్వాత్మా చచార భువనత్రయమ్‌।

నాత్యాక్షీచ్చాపి తం దేవం (బ్రహ్మహత్యా సుదారుణా!”

అది మొదలు కపాలపాణి ముల్లోకాల్లో భిక్షాటనం చేశాడు. కపాలం నిండలేదు. దారుణమైన (బ్రహ్మహత్యాపాతకం ఆయనను వదలలేదు.

“కాపాలికో యయౌ దేవో నారాయణనికేతనమ్‌

కాపాలికుడైన శివదేవుడు ఒకనాడు బదరికాశ్రమానికి చేరి నారాయణున్ని సేవించాడు. "“క్షీరోదమధనోద్బూతాం (ప్రాహ పద్మాలయాం హరిః

ప్రియే పళ్యాబ్దనయనే ధన్యాజఒసి సుభగేఒనఘే[॥”

నారాయణుడు లక్ష్మీదేవితో * ఈకాపాలికుని స్టితిని చూడు" మన్నాడు.

“ఇత్చం వదతి గోవిందే విమలా పద్మయా తయా।

మనోరధవతీ నామ భిక్షాపాత్రే సమర్పితా॥[” (కాశీఖండం - స్కాందం)

వెంటనే లక్ష్మీదేవి విమలమైన - పాతకాన్ని నశింపచేసే - 'మనోరధవతి" అనే భిక్షను పెట్టింది. కపాలం నిండింది.

“విష్ణుప్రసాదాత్‌ సుశ్రోణి, కపాలం తత్సహ'్రధా।

స్ఫుటితం బహుథా యాతం స్వష్షలబ్దం ధనం యధా॥” (మత్స్యపురాణం)

విష్ణుమూర్య్యను(గ్రహంవల్లు, కలలో దొరికిన ధనం చెల్లా చెదరైనట్టే, కపాలం చేతి నుంచి జారిపడి వేయి ముక్కలయింది.

దక్షయజ్ఞాన్ని ద్వంసంచేసినతర్వాత రు(ద్రునిళూలం తపస్సు చేస్తున్న నరనారాయణులను తాకింది. శూలతేజస్సుచేత నారాయణునికేశాలు. 'ముంజు" వర్ణమయ్యాయి. ముంజకేశుడు హుంకరిస్తే ఆశూలం పోయి శివుని చేతిలో పడింది.

“అథ రుద్రము పాధావత్తా వృషీ తపసాన్వితౌ।

తత ఏనం సముద్భూతం కంరే జుగ్రాహ పాణినా॥

నారాయణః స విశ్వాత్మా తేనాస్య శితికంరతాగ” (భార.శాంతి, = 342 అ114 1/2)

వెంటనే రుద్రుడు నరనారాయణులపైన విరుచుక పడ్డాడు. నారాయణుడు తనచేతితో రుద్రుని గళాన్నిగట్టిగా పట్టాడు. అందువల్ల రుద్రుని గళం నీలవర్షంగా కమిలిపోయింది. శితికంరుడు, నీలగ్రీవుడు అనే అన్వర్థనామం శివునికేర్పడిందని మోక్షధర్మం స్పష్టంచేసింది.

రాఘవీయవ్యాఖ్య 235 “త్వం హి రుద్ర! మహాబాహో! మోహశాస్తాణి కారయ! దర్శయిత్వాఒల్స్బమాయాసం ఫలం శీఘ్రం ('ప్రదర్శయ॥”

“మహాబాహో! రుద్రా! నీవు జనులను మోహింప జేసే శాస్త్రాలను ప్రవర్తింప జేయుము. కొద్దిశ్రమతో శీఘ్రంగా ఫలమిచ్చే మార్గాన్ని ప్రదర్శించుము' అని నారాయణుడు ఆదేశించాడు.

“బ్రహ్మాదయః సురాస్పర్వే విష్ణుమారాధ్యతే పురా;

స్వం స్వం పదమనుపప్రాప్తాః కేశవస్య ప్రసాదతః

(బ్రహ్మరుద్రేందధ్రాదులు విష్ణుమూర్తిని ఆరాధించి తమతమ పదవులను పొందారు. “తదా దర్శితపంధానౌ సృష్టిసంహారకారకాః” బ్రహ్మకు సృష్టికోసం, రుద్రునికి సంహారంకోసం ఈశ్చరత్వాన్ని ప్రసాదించాడు. విష్ణుమూర్తి అని భారతం - కర్షపర్వం విశదం చేసింది.నీలగ్రీవుడు రామనామాన్ని జపించి భగవదను(గ్రహాన్ని _ పొందడంవల్ల ఈశ్చరుడనే పేరుతో (ప్రఖ్యాతుడయ్యాడు. (ఈవిషయం కొంత 39వ పద్యంలో వ్యాఖ్యాతం.)

ఎవరికి ఈశ్శరత్వం ఉన్నా అది అవధిలేని అతిశయంకలది కాదు. ఒక్క నారాయణునికే 'ఇంతకుపైన లేదు" అన్నట్టు నిరవధికాతిశయమైన -ఈశ్వరత్వం ఉంది.

నీలగ్రీవుడు త్రిపురా(సురు)లను జయించడానికి సకలదేవతల తేజస్సును ఒక్కరాళిగా (గ్రహించాడు. ముఖ్యంగా నారాయణున్ని సేవించి, నారాయణాశస్తాన్ని ప్రయోగించాడు. ఇనుము, వెండి, బంగారంతో నిర్మింపబడిన మూడుపురాలను ఒక్కచోట చేర్చి దహించాడు.

రాజసతామసపురాణాలలో (బ్రహ్మకూ, శివునికీ పరత్వం చెప్పబడింది. వేదమూలమైన సాత్విక పురాణాలలో నారాయణునికే అసాధారణమైన సర్వేశ్చరత్వమూ, పరత్వమూ స్టాపింపబడింది. రాజస తామస పురాణాలను విరోధాధికరణ న్యాయంగా (గ్రహించడం ఆవశ్యకంకదా!

మ. నిను వర్లింపనివాడు మూ(/ వదిలో నీనామమున్‌ వీనులన్‌

విని మోదింపనివాండు చెవు మరి నిన్‌ వేడ్కన్‌ మనోవీధినిన్‌ గని పూజింపనివాండు నాశకరు(డౌ కర్మక్రియారంభుఃడై తనలోః గాననినాండు నీచమతిపో తత్ప్వజ్ఞ నారాయణా॥ 93 అర్ధం : ఓ తత్మజ్ఞ = విశ్సరహస్యం తెలిసినవాడా!నారాయణా! నిను వర్షింపనివాండు మూంగ = నిన్ను అక్షరాలాస్తోతంచేయనివాడు నోటనాలుకలేనివాడు. నీ నామమున్‌

236 నారాయణ శతకం వినులన్‌ విని మదిలో మోదింపనివాండు చెన్హు = నీపేరు చెవులతో విని కూడా మనస్సులో సంతోషించనివాడు బధిరుడే. మరి = ఇంక నిన్‌ వేడ్కన్‌ = నిన్ను కుతూహలంతో; మనోవీధినిన్‌ = హృదయమందు; కని = చూచి, పూజింపనివాడు = భక్తితో ఆరాధించనివాడు; నాశకరుండౌ = ఆత్మ నాశకుడేకాక పరులను చెడగొట్టేవాడవుతాడు. కర్మక్రియా+ఆరంభుడై = కర్మచేయ పూనుకొన్నవాడై; తనలోన్‌ = అంతరంగంలో; కానని వాండు = చూడనివ్యక్తి: నీచమతి, పో = కొంచెపు బుద్ధి కలవాడే సువూ!

తా : ఓ తత్ప్యజ్జ!నారాయణా! నిన్ను వర్షింపని వ్యక్తి మూగవాడు. నీపేరు చెవిలో పడగానే సంతోషింపని వ్యక్తి చెవిటివాడు. నిన్ను మానస దృష్టితో చూచి పూజింపని వ్యక్తి ఆత్మనాశకరుడు. కార్యాలను చేయబూను కొని అంతరంగమందు నిన్ను గానని వ్యక్తి న్లుద్రబుద్దికలవాడు.

వ్యాఖ్య ఏ; వారాయణున్ని భజించని వ్యక్తులు పామరులు, అంటున్నాడు కవి.

నారాయణగుణవిభూతులను స్మరించినవాని జీవితం ధన్యమవుతుంది. భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు ఆంటారు కొందరు. ఆయన సగుబణుడు, సాకారుడంటారు మరికొందరు, ఈతత్త్యం భగవంతునికి తప్పు మరెవ్వరికీ తెలియదు. కాబట్టి తత్త్వజ్ఞుడు భగవంతుడే.

సగుణ, నిర్గుణ వాదాలన్నీ ఉపాసనలోని భేదాలే కాని ఉపాస్యుడైన భగవంతుడొక్కడే బుభుక్షువులైనా ముముక్షువులైనా అంటే సంసారసుఖాన్ని అనుభవించాలని కోరేవారైనా, సంసారబంధం నుంచి విముక్తిని కోరీవారైనా, భగవంతుణ్ని భజించవలసిందేకదా!

“క ఉత్తమళ్ళోక గుణానువాదాణ్‌

పుమాన్‌ విరజ్యేత వినా పశుఘ్నాత్‌?” (భా.గ.10 స్కం)

ఉత్తమ శ్లోకుడైన నారాయణుని గుణ గణాలను గానం చేయడానికి, కథలను వినడానికి పశుహంతకుడు-కసాయివాడు-తప్ప విముఖుడెవడుంటాడు? కసాయివాడైనా భుక్తికోసం కంసారిని సంస్మరించక ఉండలేడేమో!

అపళుఘ్నాత్‌ (= అపగతా శుక్‌ యస్మాత్‌ సః = అపళుక్స్‌ ఆత్మా, తం హంతి) ఆత్మఘాతకుడు విముఖుడు కావచ్చును, అంటే అతడు అదే సుఖమనుకొని దైవచింతన చేసి యుండవచ్చునుకదా! ఇంతకు దైవచింతన లేని దెవరు? అంటే పశువులను చంపే సాధనం. చైతన్యంలేని ఖడ్గం, కురారం అని వ్యాసోక్తి ఈ,సుకవి నిర్వేదంతో చెప్పిన పద్యమిది. నోటిలో నాలుక లేదు కాబట్టీ మూగవాడు భగవంతుణ్ని వర్ణింప లేడు. బధిరునికి భగవన్నామం చెవుల్లోకి చొచ్చినా హృదయంలోకి (ప్రవేశించదు, కాబట్టి హర్షించడు, నాశకరుడు ఉన్మాదుడు కాబట్టి చంచలమనస్సుతో

రాఘవీయవ్యాఖ్య 237 చక్రిని కనలేడు, పూజింపలేడు. ఉచ్చస్టితిగతిలేని మతికలవాడు నీచమతి. కాబట్టి దిగజారిన బుద్దికలవాడు అంతర్ముఖుడెలా అవుతాడు? ఆత్మారాముణి ఎలా కనుగొంటాడు? కాననివాడే కదా! వ్యతిరేకాన్వయ పద్దతిగానూ చెప్పదగిన పద్యమిది. మ. నిమ నర్లింపని నీచబంధమతి దా నిర్మగ్నమూఢధాత్ముండై పెను దైవంబులంగోరి తా మనమునన్‌ సేవించు చందంబు తా ననలంబారిన భూతియందు వెలయన్నాజణ్యాహుతుల్‌ పూని వే ల్పిన చందంబున వ్యర్ధమై తనరు. జూ చిద్రూప నారాయణా॥94 ఆర్హం : ఓ చిత్‌+రూప = ఓ జ్ఞానమూర్తి! నారాయణా! నిను వర్షింపని = నిన్ను స్తుతించని; నీచబంధమతి = మందమతి; తాన్‌; నిర్మగ్గమూఢ+ఆత్ముండై = అజ్ఞాన మందు మునిగినవాడై; పెను ధైవంబుల కోరి = పెక్కు దేవతలను ప్రార్ధించి, తాన్‌? మనమునన్‌ = మనస్సునందు; సేవించు చందంబు = ధ్యానించే విధం; తాన్‌; అనలంబు+ఆరిన = అగ్గి ఆరిపోయిన; భూతియందు = బూడిదలో; వెలయన్‌ = ప్రకాశంగా; ఆజ్య+ఆహుతుల్‌, పూని = నేతిధారలను పోసి; వేళ్చిన చందంబున = హోమం చేసిన రీతిగా; వ్యర్థమై, తనరు = నిష్పలమవుతుంది; చూ=సుమా। తా ఏ ఓ చిద్రూపా! నారాయణా!న్షుద్రబుద్దికలవాడు. నిన్ను స్తుతించడు. మూఢమనస్కుడై అనేక దేవతలను (ప్రార్టిస్తాడు. మనస్సులోనూ ధ్యానిస్తాడు. ఈ విధానం అగ్గి ఆరిపోయిన బుగ్గిలో ఆజ్యధారను పోసినట్టు వ్యర్థమవుతుంది సుమా! వ్యాఖ్య : 'పెక్కుదేవతలను భజించడం మూఢలక్షణ మంటున్నాడు కవి, జ్ఞాన - జ్యోతి రూపంతో వెలిగేవాడు నారాయణుడు. కర్మబంధుడు జీవుడు. పుణ్యకర్మలనాచరించిన వ్యక్తికి దొడ్డబుద్ది, పాపకర్మలను చేసిన వ్యక్తికి నీచబుద్ధి ఉంటుంది. కర్మానుబంధిఫలదానరతుడు నారాయణుడే. నీచకర్మలచేత కట్టుబడిన వ్యక్తికి నారాయణుణ్ని వర్షించే బుద్ధి పుట్టదు. అజ్ఞానం నిండుగా కమ్ముకొని ఉంటుంది. తత్ఫలితంగా అనేక దేవతలను కొలుస్తాడు. అగిలో ఆజ్యం పోస్తే ప్రజ్వరిల్హుతుంది కాని బూడిదలో ఎంతపోస్తే నేమి ప్రయోజనం? (ద్రవ్యనష్టమేకాక కాలమూ వృధా, (శ్రమకూడా ఫలమీయదు. పెక్కుదేవతలను పూజిస్తే ఏదేవతకూ అతనిమీద విశ్వాసం ఉండదు. ఒక్క ధ్యేయమూర్తి మంత్రంతో “స్వాహా అంటూ, అగ్నికుండంలో ఆజ్యాహుతులు వేస్తే “అగ్నే నయ సుపథా రాయే అస్మాన్‌” అన్నట్టే, మోక్షం లభిస్తుంది. “మౌఢ్యాత్‌ భస్మన్యేవ జుహోతి సః” (భాగ.3-29-3) కపిలుడు దేవహూతికి భక్తియోగం తెలిపాడుకదా!

238 నారాయణ శతకం “మూఢుడై యుచితభక్తిని నన్ను భజింపండేని, యమ్మనుజుండు భస్మకుండమున మానక వేల్చినయట్టివాండగున్‌” (అం.భాగ.3-29-955) మ. నిను వర్లింపనిజిహ్వు దాంబదటికా? నీలాభ్రదేహాంగకా నిను నాలింపని చెన్ను దాంబదటికా? నీరేజపద్రేక్షణా నిను(బూజింపనికేలు దాంబదటికా? నిర్వాహకక్ష్మాతలా నిను. జింతింపని యాత్మ దొంబదటికా నిర్వాణ నారాయణా॥ 95 అర్ధం : నీల+అ(భ్ర దేహశఅంగకా = నీలమేఘంవనంటి శరీరావయవాలుకలవాడా! నిను వర్షింపని = నిన్ను స్తుతించనట్టి; జిహ్వ = నాలుక; తాన్‌ = అది; బదని (టకా = చెట్టులోనే పుట్టి పెరిగిన మరొక చెట్టా? నిష్టలమా? నీరేజ ప'్రేక్షణా = తామరసదళనయనా? నినున్‌ ఆలింపని = నిన్ను విననట్టి; చెన్ట = (శ్రవణేంద్రియాలు; తాన్‌, బదటికా? నిర్వాహకక్ష్మాతలా = భూ తలాన్ని వహించేవాడా! నినున్‌ పూజింపని; కేలు = చేయి; తాన్‌, బదటికా = నిష్ప్రయోజనం. నిర్యాణ నారాయణా = మోక్షసుఖ (మిచ్చే) దేవా! నినున్‌, చింతింపని = స్మరింపని ఆత్మ = మనస్సు, తాన్‌, బదటికా = నిష్ప్రయోజనం. తా : ఘనశళ్యామశరీరుణ్ని వర్షించనినాలుక బదనికయా? నీరేజ పత్రేక్షణుని కధలను వినని చెవులు అంటే శ్రవణేంద్రియం బదనికయా? నిర్వాహక క్ష్మాతలుని పూజసేయని చేతులు బదనికలాంటివా? మోక్షదాతలైన నారాయణుణ్ని స్మరించని మనస్సు బదనిక కదా! వ్యాఖ్య ఏ వారాయణ సేనకు ఉసయోగపడని కర్మజ్ఞానేంద్రియసముదాయం నిష్టలమని కవి భావన. ఒక చెట్టులో మట్టి చేరి దానిలో పక్షుల ద్వారా లేక గాలిద్వారా విత్తు (లు) పడితే చెట్టు మొలుస్తుంది. ఆది తీగయో వృక్షమో కావచ్చు. కాని దానికి నేరుగా ఆవోరం - లవణ రసాయనాలసారం - సరిగా అందక తొందరగా అంతరిస్తుంది. పరాన్నభుక్కుగా ఉన్న ఈ నిష్ఫలతరువు బదనిక (బదటిక) 'బదటికి అనేది పలుకుఖేదం, స్తుంది. క్తీని కల్పిస్తుంది. నీలాభ్రవర్షంగల దేహాంగాలు కలిగిన నారాయణుడు చేతనాచేతనవర్లాలకు భుక్తినీ, ముక్తినీ కల్పిస్తాడు. అలాంటి భగవంతుణ్ని నోరార కీర్తిచనివాడు 'కలుగనేటికి తల్టుల కడుపుచేటు' అంటాడు కవిపోతన - | అవుతుందా కాదా?

రాఘవీయవ్యాఖ్య 239 తామరరసదళనయనుని గుణవిభూతులను ఆలింపని చెవులు చెవులు కావు. అవి బదనికలాంటి వవునా కాదా? “విష్ణునాకర్షించు. వీనులు వీనులు” కదా! భూభారనిర్వాహకునికి పూజ చేయక పోతే అవి చేతులుకావు. బదనికలే కాక మరేమి? “కమలాక్షునర్చించు కరములు కరములు” అన్నాడు కదా! భక్తపోతన. మోక్షసుఖాన్ని కలిగించే నారాయణుని గూర్చి నిశ్చలచిత్తంతో ధ్యానం చేయకుంటే అది చిత్తం కాడు. చిత్తం చెత్త కాకూడదు. “మధువైరి దవిలిన మనము మనము” అని భాగవతసూక్తి “అరయ తనదుజిహ్వ హరి పేరు నుడువదు, చిత్తమతని పాదచింతం జనదు। తలంప తమకు ముక్తి తంగేటి జున్నాకో? సకల విష్ణుభక్తులకునుబోలెః (భాగ స్కం.190) జీవుడు యాత్రికుడు. శరీరం రధం. పది ఇంద్రియాలు అశ్వాలు, పదకొండవ ఇంద్రియమైన మనస్సు కళ్ళెం. నియంత భగవానుడు. (ప్రతిపదనుంచి పదకొండవతిధి ఏకాదశి. అది హరివాసరమన్నారు పెద్దలు. కాబట్టి ఏకాదశీతిధినాడైన మనస్సును భగవద్ద్యానంలో మగ్నం చేస్తే సర్వేంద్రియాలు ఆయన కభిముఖంగా ఉండి, వాటికర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తాయికదా! అలాగా చేయకుంటే శరీరమే ఒక చెట్టు, ఆచెట్టులోనే ఉన్న మనస్సు బదనికలాగా వ్యర్థమైనదే. చిత్తమొక్కటి బదనిక అయితే, ఇంద్రియాలన్నీ బదటి(ని;కలవుతాయనడం యుక్షమే. హరిని స్తుతించే జిహ్యయే జిహ్వ. భగవంతునికి అర్చింపబడే చిత్తమే చిత్తం. భగవంతుని పూజించే చేతులే చేతులు. ప్రశంసాపాత్రము'లని “విష్ణుధర్మ' సూక్తి, “సా జిహ్వా యా హరిం స్తాతి, తచ్చిత్తం యత్తదర్పితమ్‌। తావేవ చ కరౌ శ్ఞాఘ్యౌా యౌ తత్పూజాకరౌ కరౌ॥” శా నీవే తల్లిని నీనె తండ్రివరయన్నీవే జగన్నాథు(డౌ నీవే నిశ్చలబాంధవుండ నరయ న్నీవే మునిస్తుత్యుండౌ నీవే శంకరమూలమంత్రమరయన్‌ నీవే జగత్కర్తవున్‌ నీనే దిక్కనువారినారలె కడున్నీనారు నారాయణా॥ 96 అర్ధం: ఓ నారాయణా! నీవే తల్లివి తండ్రివి; అరయన్‌ = విచారింపగా, నీవే; జగత్‌+నాధుడవు; నీవే; నిశ్చలబాంధవుండవు = స్థిరమైన చుట్టానివి. నీవే; మునిస్తుత్యుండవు = మునులచే స్తుతింపదగినవాడవు; శంకరమూలమం(త్రము = సుఖంకలిగించడానికి ఆది కారణమైన మంత్రం, నీవే. జగత్‌కర్తవున్‌ = విశ్శనిర్మాతవుకూడా నీవే దిక్కు = గతి; అనువారూ, వారి సంబంధులే; నీ వారు = నీభక్తులు,

240 నారాయణ శతకం

తా : ఓ నారాయణా! నీవే తల్లివి, తండ్రివి, జగత్పతివి, ఆప్తబంధుడవు, మునుల చే స్త్రోత్రంచేయదగినవాడవు; నీవే సుఖ్రాప్తికి మూలమం(త్రం. విశ్శనిర్మాతవు నీవే, నిన్ను శరణు పొందినవారూ, వారి సంబంధులుకూడా నీవారే.

వ్యాఖ్య : 'పరమాత్ముడే పరమగతి' అనేవారు సరమభక్తులని పేర్కొన్నాడు కవి. భక్తులకు నారాయణుడే సర్వవిధబంధువు. తల్లి, తండ్రి, రక్షకుడు అతడే.

“సర్వేషామపి లోకానాం పితా మాతా చ మాధవః

గచ్చధ్వమేనం శరణం శరణ్యం పురుషర్షభ్రాః;” (భార.అర.189-52)

“క్షేశనాశకుడైనకేళశవుడే మాకు దిక్కు అనే భక్తులూ, వారిని ఆశ్రయించిన వారూ భగవంతునికి నేదిష్టులు.

“పద్మనయనుమిోంది భక్తియోగం బెల్ల

ముక్తియోగమనుచు మొదలెలుంగు

వారి వారి వారి వారి జేరిన వారి

'తోవంబోవవలదు, దూతలారః॥” (భాగ.6-191)

అని యముడు తన దూతలకు బోధించాడు కదా!

“త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుళ్ళ సఖా త్వమేవ

త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ॥” అని ్రార్హించే ప్రపన్నులూ, వారి సంబంధ సంబంధులూ భగవద్చంధువులే.

మ. అపరాధంబులు నిన్ను నమ్మి విను మే నాజన్మపర్యంతమున్‌ విపరీతంబుగం జేసినాండ నిశ నీవే దిక్కు నాలోనికిన్‌ గపటంబింతయు లేక దండధరుకుం గట్టీక రక్షింపు మీ కృపకుంబాత్రుండనయ్య ధర్మపురి లక్ష్మీనాథ నారాయణాః 97.

అర్ధం: ధర్మపురి = ధర్మమే గృహంగా కలవాడా! లక్ష్మీనాథ = శ్రీపతీ! నారాయణా!

( ః్‌ = వ్యత్యస్తంగా! లెక్కకుమిక్కిలి; చేసినాడను; ఇక; నాలోనికిన్‌ = నా అంతరంగానికి; నీవే, దిక్కు = శరణం, గతి; కపటంబు = వ్యాజం; ఇంతయులేక; దండధరుకున్‌ = యమునికి; కట్టు+ఈక = బంధించనీయక; రక్షింపు; మీ కృపకున్‌ పాత్రుడను; అయ్య = తండ్రీ,

తా ; ఓ ధర్మగహ్‌! లక్ష్మీనాధా! నారాయణా! జన్మించినప్పటినుంచి. నిన్ను రమైటాను. ఎనలేని, ఎనలేని అపరాధాలను చేశాను. ఇప్పుడు నా మనస్సుకు నీవే

గ? యముడు బంధించకుండా అవ్యాజంగా కాపాడుము, అయ్యా! సీదయకు షాత్రుడను.

రాఘవీయవ్యాఖ్య బశ! వ్యాఖ్య : అపరాధియైన తనను రక్షింపుమని కనిభగవంచుణ్ని ప్రార్ధించే పద్యం. ధర్మపురి తీర్హక్షేత్రం. గోదావరీతీరాన ఉన్నది. లక్ష్మీనృసింహక్షేత్రమిది.

ఈ కవికీ, ఆక్షేత్రానికీ ఉన్న సంబంధం విచారణీయం. పురం అంటే గృహం, శరీరం అనే అర్జాలున్నాయి. కాబట్టి ధర్మమే గృహం శరీరంగా కలవాడనతగును. లేదా, “ప్యూపాలన పూరణయోవ” అనే ధాత్వర్థాన్ని బట్టి, ధర్మాన్ని పాలించేవాడు. జీవుడు అనేక జన్మలెత్తుతాడు.దేవుణ్ని నమ్ముతుంటాడు, పాపాలు చేస్తూ ఉంటాడు. చేయతగినవి చేయకుండడమూ, చేయకూడని పనులను చేయడమూ విపరీతకృత్యాలుగా భావింపబడుతాయి.

“దోషో యద్యపి తస్య స్యాత్‌" శ్రీరాముడు, మిత్రభావంతో శరణుపాందిన వ్యక్తిని, అతనికి దోషమున్నా, రక్షించకుండా విడిచి పెట్టనన్నాడు. శ్రీకృష్ణావతారంలోనూ భగవానుడు సర్వధర్మాలను త్యజించి తననే శరణుపాందితే సర్వపాపాలనుంచి విముక్తుణ్ని చేస్తానన్నాడు. ఈ మాటలను నమ్మి విపతీతంగా నేరాలు చేశాడు. ఇప్పుడు శరణాగతుడయ్యాడు.

పాపాలు చేసిన వ్యక్తిని యముడు దండిస్తాడు. అది 'కట్టు' అంటే నియమం. పాపాత్ముడనే వ్యాజంతో యముడు బంధించకుండా తనను కాపొడుమని వేడుకొంటున్నాడు.

“న నిందితం కర్మ యదస్తి లోకే సహ(్రశోబయం న మయా వ్యధాయి।

సోఒహం విపాకావసరే ముకుంద! (క్రందామి సంప్రత్యగతిస్తవా(గ్రే!”(స్పోతరత్నం 23) లోకంలోనూ శాస్త్రంలోనూ నింద్య [క్రూర కర్మలెన్ని ఉన్నాయో వాటిలో నేను చేయనిది లేదు. ఆపాపాలు పండినప్పుడు నాకు గత్యంతరమూ లేదు. కాబట్టి ఓ ముకుంద! నీ యెదుట ఇప్పుడే మొరపెట్టుకొంటున్నాను “అనుత్తమం పాత్ర మిదం దయాయాః” నీదయకు పా(త్రుడను” అన్నారు శ్రీయామునాచార్యులు -

“లక్ష్మ్యా సహ హృపీకేశో దేవ్యా కారుణ్యరూపయా। రక్షకః సర్వసిద్దాన్తే వేదాంతేషు చ గీయతే” - అన్నట్టు లక్ష్మీనాధుడే రక్షకుడు కదా! శా, చెల్లంజేసితి పాతకంబులు మదిన్‌ శ్రీనాథ మీనామముల్‌ పొల్లుల్‌ బోవని నమ్మి పద్యశతమున్‌ బూర్లంబుగా( జెప్పితిన్‌ చెల్లంబో నను నమ్మె వీ(డని దయండేసట్టి రక్షింపుమీ తల్లిం దండ్రియు. నీవుగాక యొరులే తర్కింప నారాయణా! 98 అర్థం : ఓ నారాయణా! పాతకంబులు = పాపాలు; చెల్లన్‌, చేసితి = వాటి ఫలాలను పొందునట్లుగా చేశాను. ఓ శ్రీనాథ = ఓ లక్ష్మీపతీ! మీ నామముల్‌ = మోపేర్లు పాల్టుల్‌,

242 నారాయణ శతకం పోవు = వ్యర్హంకావు; అని; మదిన్‌, నమ్మి = మనస్సులో విళ్శసించి; పద్యశతమున్‌ జ నూరుపద్యాలను; పూర్ణంబుగా; నిండుగా; చెప్పితిన్‌; చెల్లన్‌, పో = చెల్లనీగాక; అది అట్టుండనీయండి. “వీడు, నన్ను నమ్మె' అని, దయన్‌ = కృపతో: చేపట్టి = కైకొని; రక్షింపుమీ = కాపొడుమీ. తర్కింప = విచారింపగా; తల్లిందండ్రియు = తల్లి మరియు తండ్రికూడ; నీవుగాక = నీవు తప్ప: ఒరులే = ఇతరులౌతారా?

తా : ఓ నారాయణా! పాపాలను, వాటిఫలాలను అవశ్యం అనుభవించక తప్పవన్నట్టు చేశాను. ఓ లక్ష్మీపతీ! మో నామాలు రిత్తబోవని యెదలో నమ్మినాను. పూర్ణసంఖ్యగల నూరు పద్యాలతో నిన్ను స్తుతించాను. ఆపాపాలు చెల్లనీగాక. “వీడు నన్ను నమ్మినా"డని కృపతో [గ్రహించి నన్ను రక్షింపుము. తల్లివి, తండ్రివి నీవే కాబట్టి వేరే వారెలా నన్ను కాపాడుతారు?

వ్యాఖ్య : నమ్మిన వ్యక్తిని చే(త)పట్టి రక్షించేశక్తిమంతుడు శ్రియఃపతి.

చేసిన కర్మలకు ఫలమనుభవించక తప్పుదు.

“అశుభస్యాస్పదమపితవ స్మారం స్మారం గుణగణమితీచ్చ్భామి గత భీః” (స్తోత్రరత్నం - 58) 'పాపరాశికి జన్మభూమిగా ఉన్న నేను నీ కల్యాణగుణాలను పలుమారులు తలిచినప్పుడు, చేసిన పాపాలు నన్నేమి చేస్తాయని భయంవీడి, బగవంతాుణ్ని (ప్రార్దించాడు శ్రీయామునాచార్యులు. అలాగే ఈకవి భగవన్నామసంక్షీర్తనఫలం అమోఘమని నమి శ్రనాడు. పాపాలన్నీ పటాపంచలౌతాయని విశ్వసించి, అనేక గుణవిభూతులను కీర్తిస్తూ: నారాయణ నామంతో భగవంతుణ్ని వందసార్లు స్మరిస్తూ (నారాయణ) శతకాన్ని పూర్తిచేశాడు.

పాపాలు పండే అవకాశమున్నా, భక్తుని నమ్మకాన్ని వమ్ముచేయక భగవంతుడు కృపతో కటాక్షిస్తే వేచిన విత్తనపు గింజలకు మొలిచే శక్తి నళించేరీతిగా, పాపాలకు ఫలించేశ్తి నశిస్తుంది. అచ్యుత, అనంత, గోవింద నామాలను స్మరిస్తే భవరోగమే నశిస్తుంది.

“పితా త్వం మాతా త్వం” (స్తోత్రరత్నం) అన్నట్టు జగజ్జననకారణుడైన నారాయణుడే పాపాలను తొలగించి, శాశ్సతసుఖాన్ని ప్రసాదించగలడు. ఆ సామర్ష్యం నాన్యతోదర్శనీయం.

మ. నరపింహాచ్యుత వాసుదేన వికసన్నాళీకపత్రాక్ష భూ ధర గోవింద ముకుంద కేశన జగ్రాతాహితల్సాంబుజో దర దామోదర తార్‌క్ష్యృవాహన మహాదైత్యారి వైకుంరముం దిర పీతాంబర భక్తవత్సల కృపన్‌ దీవింపు నారాయణా॥ ంం్ప

రాఘవియవ్యాఖ్య 243

అర్ధం. : నరసింహ! అచ్యుత! వాసుదేవ! వికసత్‌+నాళీకపత్ర+అక్ష = వికసిస్తున్న కమలదళాల లాంటి కన్నులు కలవాడా! భూధర = భూమిని ధరించినవాడా! గోవింద =. గోవులను కాపొడేవాడా! ముకుంద = ముక్తిని, భుక్తిని కల్పించువాడా! కేశవ! జగత్‌+త్రాత = (ప్రపంచాన్ని రక్షించేవాడా! అహితల్చ = పాముసెజ్జకలవాడా! అంబుజ+ఉదర = కమలం కడుపున కలవాడా! దామ+ఉదర = దమమనేనియమంకలవారికి ఉన్నతస్థితిని కృల్సించువాడా! తార్‌క్ష్యృవాహన = గరుడవాహనా! మహాదైత్య+అరి = గొప్పరాక్షసులకు శత్రువైనవాడా! వైకముంరమందిర = వైకుంరమందుకాపురంకలవాడా! పీత+అంబర = పచ్చని పట్టు పుట్టంకట్టేవాడా! భక్త వత్సల = భక్తుల దోషబోగ్యుడా! నారాయణా! కృపన్‌ = దయతో; దీవింపు = ఆశీర్వదింపుము.

తా : నరసింహాచ్యుత వాసుదేవాది నామాలచే 'ప్రసిద్దిసొందిన ఓ నారాయణా! దయతో కాపాడుము,

వ్యాఖ్య : నామానళితో భగవంతుణ్ని క్షీర్రించిన పద్యమిది.

ఒక్క క్షణకాలమైనా భగవంతుణ్ని చింతించక పోతే భక్తునికి చాల కష్టమనిపిస్తుంది.

“యన్ముహూర్తం క్షణం వాఒపి వాసుదేవో న చింత్యతే।

సా హానిస్తన్మహచ్చిద్రం సా భ్రాంతి; సా చ వి[క్రియా॥”

  1. నరసింహుడు: “ఆకంరమాదిపురుషం కంరీరవముపరి” (కామాసికాష్టకం) అన్నట్టు, భక్తుల మాటను సత్యంగా నెరవేర్చడానికి పూర్వకాయం మానవరూపంగానూ, ఉత్తరకాయం సింహరూపంగానూ ప్రకటించుకొని దుష్టశిక్షణచేసిన విష్ణుమూర్తి యొక్క అద్భుతావతారమిది,

  2. అచ్యుతుడు: “చ్యవనోత్పత్తియుక్తేషు (బ్రహ్మేంద్రవరుణాదిషు |

యసా శన్నచ్యవసే స్టానాత్తస్మాత్సంకీర్య్యతే ఒచ్యుత:”

బ్రహ్మేంద్రాదులతో సమానంగా అవతరించినా, వ్యూహంలోకూడా, తనస్టానంనుంచి జరుగక, స్థిరంగా ఉండేవాడు అచ్యుతుడు.

“యస్మాన్నచ్యుతపూర్వోహమచ్యుతస్తేన కర్మణాః"

తాను జారక, తనను ఆశ్రయించిన పరమభక్తులను చేపట్టి జారవిడువనివాడు.

3.వాసుదేవుడు; “ఛాదయామి జగత్సర్యం భూత్వా సూర్య ఇవాంశుభి;

సర్వభూతాధివాసశ్చ వాసుదేవస్తతః స్మృతః (భారతం)

సమస్త లోకాలను, సూర్యుడు కిరణాలచే ఆవరించియున్నట్టే,. భగవంతుడు ఆవరించి సమస్త భూతాలకు ఉనికి పట్టువయినవాడు.

“సర్వత్రాసా సమస్తం చ వసత్యత్రేతి వై యతః।

తతస్స వాసుదేవేతి విద్వద్భిః పరిపఠ్యతే॥” (విపు)

244 నారాయణ శతకం తానంతటా వసించేవాడు, తనయందన్నీ వసిస్తాయి. కాబట్టి భగవంతునికి "వాసుదేవుడు" అని వ్యవహారనామం.

  1. వికసన్నాళిక పత్రాక్షుడు: “రామః కమలప'త్రాక్షు” వికసిస్తున్న తామరలవలె, ఆశ్రితుల(్యశ్రమను తొలగించే అందమైన కన్నులు కలవాడు.

  2. భూధరుడు: “ఉద్ధృతాసి. వరాహేణ”. (శ్రుతి) నీటమునిగియున్న భూమిని ధరించి పైకి తెచ్చిన వరాహమూర్తి

“సదాధారప్పథివీం ద్యాముతే మామ్‌ (శ్రుతి)

భూమి ఉపలక్షణం సత్పదవాచ్యుడైన పరమపురుషుడు భూమినీ, ఆకాశాన్నీ ధరించినవాడు.

ఈ గోవిందుడు: “గాః - వాచః విందతీతి గోవింద” స్తోత్రవాక్కులను పొందేవాడు.

  1. ముకుందుడు: “ముం,కుం దదా తీతి ముకుంద” ముక్తినీ, భుక్తినీ ఇచ్చేవారు.

&. కేశవుడు: "సూర్యస్య తపతో లోకాన్నే: సోమస్య చాప్యుత।

అంశవో యత్ర్రకాశంతే మమైైతే కేశసంజ్ఞితాః॥

సర్వజ్ఞాః కేశవం తస్మాన్మ మాహుక్షిజసత్రమాః”

లోకాలను తపింపజేసే సూర్యుని యొక్క, ప్రకాశించే అగ్జియొక్క, ఆహ్హాదపరచే చంద్రుని యొక్క కిరణాలే నారాయణుని కేశాలుగా పేరు పొందాయి, అలాంటి (ప్రశస్తకేశాలు కలవాడు కేళవుడు.

  1. జగత్రాత : జగ(ద్రక్షకుడు

  2. అహితల్పుడు 2 పాముపడక కలవాడు

11 అంబుబోదరుడు: పద్మంలాంటి ఉదరం కలవాడు, లేదా పద్మం ఉదరమందుకలవాడు.

  1. దామోదరుడు: దమమంటే ఇం(ద్రియని[గ్రహసామర్థ్యం, దమమే దామం, (దామేన ఉదీర్యతే యస్మాత్సళ ఇంద్రియసంయమం కలవారికి ఉన్నతస్థితిని కల్ప్సించేవాడు దామోదరుడు, (భారతం) న

“దమాత్సిద్ధిం పరీప్పంతో మాం జనాః కామయంతి హః

దివం చోర్వీం చ మధ్యం చ తస్మాద్దామోదరోహ్యహమ్‌[”

  1. తార్‌క్ర్యవాహనుడు: మాతృదాస్యనిముక్తికై అమృతభాండాన్ని సాహసంతో తెచ్చినా, ఒక్క బిందువునైనను ఆస్వాదించని అలౌల్యప్రవృత్తికి సంతోషించిన నారాయణుడు గరుత్మంతుణ్ని వాహనంగా వరించి స్వీకరించాడు.

రాఘవీయవ్యాఖ్య 245

14, మహాదైత్యారి: దంభ దర్పాలుకలిగిన మధు, కైటభులనే గొప్ప రాక్షసులను వధించినవాడు.

  1. వైకుంరమందిరుడు: అనేకావతారాలెత్తినా , వైకుంరమందు. స్టిరమైన కాపురమున్నవాడు. రా

  2. పీతాంబరుడు: పస్పుపచ్చనిపట్ట ధోతి కట్టుపుట్టంగా కలవాడు.

  3. భక్తవత్సలుడు: “ఫ్రపన్నాన్‌ మాధవః సర్వాన్‌ దోషేణ పరిగృహ్యతే।

అద్యజాతం యధావత్సం దోషేణ సహ వత్సలామ్‌॥”

ప్రసన్నుల దోషాలను, ఆవు లేదూడ మురికిని వలె, భోగ్యంగా పరి(గ్రహించి, వారిని పరిశుద్దులుగా జేసీ అదిపురుషుడు.

  1. నారాయణుడు : జయసూచకమైనది పద్దెనిమిది (18) సంఖ్య, ఆ నామాలతో ఆర్హత్రాణపరాయణుబ్ని స్తుతించి, తనను కటాక్షించుమని కవి (ప్రార్హించాడు. మ. కడకంటం గడలేని సంపద లొగింగావింపు లక్ష్మీ! పా

ల్కడలిన్‌ బన్నగశాయివై భువనముల్‌ గల్పించు. సత్పుత్రునిన్‌

బొడమన్‌ జేసిన నాభిపంకజ జగత్చుణ్యాత్మ భాగీరథీ

పడతింగన్న పదారనిందముల నే భావింతు నారాయణా! 100

అర్ధం : ఓ నారాయణా! పొల్కడలిన్‌ = పాలసము[ద్రమందు; పన్నగశాయినై =

పాముమీద పవళించినవాడనై; భువనముల్‌ = లోకాలను; కల్పించు = సృజించే; సత్‌ పుత్రునిన్‌ = (శ్రేష్పుడైన కుమారుణ్ని; పాడమన్‌ జేసిన = పుట్టించిన; నాభిపంకజ = బొడ్డున కమలంకలవాడా! జగత్‌+పుణ్య+ఆత్మ = జగమే పవిత్రమైన శరీరం కలవాడా! భాగీరథీ = భాగీరధి, అనే పడతిని (గంగను); కన్న = ఉద్గమింప జేసిన; పద+ఆరవిందములనే = పాదకమలాలనే; భావింతు = స్మరింతు, ఓ, లక్ష్మీఈశ = శ్రియః పతీ! కడకంటన్‌ = కటాక్షంతో; కడలేని = అంతంలేని; సంపద = భాగ్యాలను; ఒగిన్‌ = (క్రమంగా; కావింపు = కలిగింపుము.

తా : ఓనారాయణా! కీరాబ్టిలో శేషశాయివై లోకాలను సృష్టించేమంచి తనయుళ్ని పుట్టించిన పొక్కిలి తామర కలవాడా! (ప్రపంచమే పవిత్రదేహంగా కలవాడా ; గంగాదేవిని ఉద్భవింపజేసిన పాదపద్మాలనే ధ్యానిస్తూంటాను. ఓ లక్ష్మీశా! అపాంగ దృష్టితో అనంతభాగ్యాలను (క్రమంగా కల్పించుము.

వ్యాఖ్య : (బ్రహ్మనూ భాగీరథినీ కన్నవాడు బహుఖాగ్యదాత అనే వర్ణన, పాలకడలిలో శేషతల్పాన పవళించిన స్వామియొక్క పొక్కిలి యందు ఒక్క కమలముంది. ఆ నాభికమలమే విశాయమానమైన రజః పుంజం కలిగిఉంది. కాబట్టి ఆకమలంనుంచి లోకాలను సృజించే ్రష్టను ఉద్భవింప జేశాడు నాభిపంకజుడు.

246 నారాయణ శతకం “యస్య ప్పధివీ శరీరం” అనే (శుతిప్రకారంగా, ప్రవంచమే పరమాత్ముని పవిత్ర శరీరం. అవిశ్వాత్మకుని పాదాలు కూడా సుగంధసుకుమారమకరంద భరితారవిందాలను పోలిఉన్నాయి. లోకాలను పావనంచేసే భాగీరధి ఆయన చరణారవిందాలనుంచి ఉద్గమించింది, అంటే, ఆపాదాలెంత పవిత్రమైనవో కదా! కాబట్టి అందరు ఆ పాదారవిందాలనే ఎదలో నిల్పుకొని ధ్యానిస్తుంటారు.ఒక పుత్రుణ్ని, ఒక పుత్రికను కన్నభాగ్యశాలి లక్ష్మీశుడు. ఆయన సిరిగలవాడైనందువల్ల, కటాక్షిస్తే ధనధాన్యపశ్చన్నభో గారో గ్యైశ్చర్యాదులు క్రమంగా ఒన గూడుతాయి. కాబట్టి, లక్ష్మీశుడు భుక్తినీ, ముక్తినీ తనకు కటొక్షిస్తాడనే దృఢాధ్యవసాయంతో కవి, ఆయన పాదారవిందాలనే సర్వదా సంస్కరిస్తుంటా నన్నాడు. “ధ్యాయంతి యే విష్ణు మనంత మవ్యయం, ..... తే యాంతి సిద్ధిం పరమాం చ వైష్ణవీమ్‌॥” అన్నారు శ్రీకులశేఖరులు. ను. తపముల్‌ మంత్రసమస్తయజ్ఞఫలముల్‌ దానక్రియారంభముల్‌ జపముల్‌ పుణ్యసుతీర్హసీవఫలముల్‌ సద్వేదవిజ్ఞానమున్‌ ఉపవాసవ్రతశీలకర్మఫలముల్‌ ఒప్పార నిన్నాత్మలో నుపమింపంగలనవారికే కలుగు వేయున్నేల? నారాయణా॥ 101 అర్ధం : ఓ నారాయణా! తపముల్‌? మం(త్రసమస్త యజ్ఞఫలముల్‌ = వేదమంత్రాలతో పూర్ణమైన యజ్ఞాలవల్ల కలిగే పుణ్యాలు; దానక్రియా+ఆరంభముల్‌ = దొనం చేసే (ప్రయత్నాలు; జపముల్‌; పుణ్యతీర్థస్నాన ఫలముల్‌ = పవిత్రమైన నదీజలాల యందు స్నానం చేయడం వల్ల కలిగే ఫలాలు; సత్‌ వేద విజ్ఞానమున్‌ = పరబ్రహ్మను తెలిపే వేదాన్త శాస్త్రమందలి అనుభవజ్ఞానం; ఉపవాసవ్రత శీలకర్మఫలముల్‌ = భగవత్సన్నిధిలో నియమంగా ధ్యానం చేసే స్వభావంగల కార్యం వలని ఫలాలు; వేయున్‌, ఏల = వేలమాటలెందుకు? ఆత్మలో = మనస్సులో; నిన్ను; ఉపమింపంగలవారికే = ఇవన్నీ నారాయణ నామస్మరణం వల్ల కలిగే ఫలంతో సమానమైనవని భావించిన వారికే; కలుగు = పొందును. తా : ఓ నారాయణా! జపతపః ఫలాలు, సకల యజ్ఞఫలాలు, దానకర్మ ఫలాలు, సర్వతీర్థస్నానఫలాలు, వేయిమాటలేల? వేదాన్తవిజ్ఞానఫలమూ, ఉపవాసంవల్లనూ. నోములనోచడంవల్లనూ, సచ్చరిత్రవల్లనూ. కలిగే ఫలాలన్నీ ఒక్క నారాయణ నామాన్ని స్మరించడంవల్ల కలిగే ఫలంతో సమానమైనవి. వ్యాఖ్య : భగవన్నామస్మరణచేసినవారికే సకలకర్మల ఫలాలు కలుగునని కని ఆశయం.

రాఘవీయవ్యాఖ్య 2శీ7 భగవంతుణ్ని స్మరించకుండా అభీష్టసిద్దికోసం ఎన్నేండ్లు కాయక్షేశానికోర్చి తపస్సు చేసిన్నా అది నిష్ప్రయోజనమే. “ఇమ్టాపూర్తాని కర్మాణి సుబహూని కృతాన్యపిః భవే హేతూని తాన్యేవ, హరేర్నామ తు ముక్తిదమ్‌॥” (బోధాయనసంహిత) ఇష్టం: దర్శపూర్షమాసాది శ్రాతకర్మలు, పూర్తం: వాపీకూపతటాకారామనిర్మాణాదిస్మార్తకర్మలు. ఇష్టాపూర్తకర్మలన్నీ సంసారబంధాలకు - పునర్జన్మలకు హేతువులే. నారోయ్‌ణున్ని సంతతం స్మరిస్తే భవబంధాలు తెగిపోతాయి. మోక్షఫలం సిద్దిస్తుంది. నారాయణస్మరణ చేయనివారు, నూరు ఆశ్చమేధయాగాలను, నూరు వాజపేయ యజ్ఞాలను చేసినా, సద్గతిని పొందలేరు. “అశ్వమేధశతైరిష్ట్యా, వాజపేయ శతైరపి। న ప్రాప్నువంతి సుగతిం నారాయణపరాజ్ముఖాః” (నృసింహపురా) దివ్యక్షేత్రసందర్శనంవలనిఫలమూ, సర్వతీర్థస్నానఫలమూ, వేయేల; “సముద్రకోటిగంభీరః తీర్ధకోటి సమాహ్యయ: | కోట్యశ్చమేధపాపఘ్నః, యజ్ఞకోటిసమూర్చనః॥” (పద్మపురాణం) భగవదర్భన, కోటియజ్ఞాలఫలసదృళశమనడం అతిశయోక్తి కాదు. శా శ్రీనారాయణ యన్నంజాలు దురిత డ్రేణిన్నినారింపగా నానందస్థితి గల్గువంచు. నిగమార్జ్థానేక మెల్లప్తుడువ్‌ నానాభంగుల( జెప్ప నేమ విని శ్రీనరాయణా! యంచుని న్నేనే నెప్పుడు గొల్తు(బ్రోవళదె తండ్రీ! నన్ను నారాయణా! 102 అర్ధం : ఓ నారాయణా! దురిత ్రేణిన్‌ = పాపరాశిని; నివారింపగా = పోగొట్టడానికి; శ్రీనారాయణ । అన్నన్‌ చాలు = లక్ష్మీనారాయణ! అని తలచిననూ సమర్హమైనది. ఆనంద స్టితికలుగున్‌; అంచు =అంటూ; నిగమ+అర్ధ+అనేకము = వేదార్థాలబాహుళ్యం; ఎల్లప్పుడున్‌ నానాభంగుల = అనేకవిధాలా; చెప్ప; నేను, విని, శ్రీనారాయణా! యంచు; నిన్నే, నేను, ఎప్పుడు, కొల్తు = ధ్యానింతును; తండ్రీ! నన్ను, 'ప్రోవగంె = కాపాడుము. తా వ ఓ నారాయణా! శ్రీనారాయణా! అని స్మరిస్తే సకల పాపాలు తాలగిపోవడమే కాక శాశ్వత ఆనంద స్థితి కలుగుతుందని అనేక వేదార్జాలు అనేక విధాలా చెప్పుగా విన్నాను. శ్రీనారాయణా! అంటూ నిన్నే ఎల్లప్పుడు ధ్యానిస్తుంటాను. తండ్రీ! నన్ను కాపాడుము. న్యాఖ్య ; శ్రీ వారాయణవ్మరణవల్ల శాశ్వతానందస్థ్రితి కలుగుతుందని కవి ఆశయం.

246 నారాయణ శతకం

ఈకృతికర్తకు వేదశా(స్త్రాలమీద ఎనలేని, ఎన్నలేని విశ్వాసముంది. ఈ విశ్వాసంకలవాడే ఆస్తికుడు, లేనివాడు. నాస్తికుడు.

“శ్రోత్రం దైవం, శ్రోత్రేణ హి తద్విందతే, బహుధా శ్రోతవ్యం”

అని బృహదారణ్యకోపనిషద్వాక్యాల రీతిగా, వైదికమంతా దైవికం. అది జ్ఞానద్రవ్యం. వెవులతో వినదగినదేకాని కనదగినది కాదు, అందుకే అనేకపర్యాయాలు, అనేకులు చెప్పగా వింటూనే ఉండాలి. వినగా వినగా, (ప్రత్యక్షసమానాకారదర్భ్శన మవుతుంది. దీనినే భగవత్సాక్షాత్కారమంటారు.

“అస్మై దేవాసో వపుషే చికిత్సత యమాశిరాదంపతీ వామమతశ్చులో్లే గ

దేవతలుకూడా జ్ఞానగమ్యుడైన, లక్ష్మితో కూడియున్న నారాయణుణ్ని ఆది దంపతులను సేవించి అందమైన భగవదనుభవాన్ని పొందుతారన్నది యజుర్వేదం. దంపతులలో ఏ ఒకరినో సేవించడం ఆసురలక్షణమంటారు.

“జగత్కుంటుంబినం దేవం నారాయణ మనుత్ర్తమమ్‌।

క్షీరాబ్టిశాయినం నిత్యం లక్ష్మీనాధం నమామ్యహమ్‌॥” అని, శ్రీనారాయణుడే ధ్యేయుడు. భగవన్నామస్మరణకు దేశ కాలనియమాలుండవు,

“న దేశనియమో రాజన్‌! న కాలనియమస్తథా।

విద్యతే నాత్ర సందేహో, విష్ణోర్నామానుకీర్తనే”; (స్కాంద పురాణం) అన్నదే సిద్దాంతం.

శ్రీమహావిష్ణువును ఉపాసిస్తే పాపాలూ పోతాయి. శాశ్ళతానందమే. ఉనికిగా గలలోకాన్నీ పొందుతాడన్నది “విష్ణుధర్మోత్తర(పురాణ)ం.

“విధూతపాపాస్తే యాంతి బ్రహ్మలోకం సనాతనమ్‌”

“యే నృశంసా దురాత్మానః పాపాచారరతాస్తథా।

తేఒపి యాంతి పరంధామ నరా నారాయణాశ్రయాః”

నరులెంత పాపిష్టులయినా నారాయణుణ్ని ఆశ్రయిస్తే పరంధామాన్ని - వైకుంఠాన్ని పొందుతార్నది నృసింహపురాణం,

“అధ పాతకభీతస్వ్యృం సర్వభావేన భారత;

విముక్తాన్యసమారంభో నారాయణపరో భవ॥”

ఓ భారతీయుడా! పొతకాలనుంచి భయపడిననీవు, మరొకటి వేరే ఏదీ ఆలోచించక, ఆచరించక, సర్వవిధాలా నారాయణ మూర్తినే శరణు పొందుమని 'భారతం' నొక్కి వక్కాణించింది.

“సకృదుచ్చారయేద్యస్తు నారాయణ మళతంద్రితః।

శుద్దాంతః:కరణోభూత్వా నిర్యాణమధిగచ్చతి [” (పద్మపురాణం)

రాఘవీయవ్యాఖ్య 249 అ(ప్రమత్తుడై ఒక్కసారి 'నారాయణా!” అని ఆర్తితో ప్రార్టించినవాడు పరిశుద్దాంత:కరణుడవుతాడు. మోక్షఫలాన్నీ పొందుతాడు. “బద్దః పరికరస్తేన మోక్షాయ గమనం(ప్రతి। సకృదుచ్చారితం యేన హరి రిత్యక్షరద్వయమ్‌ః” (హర్యష్టకం) మోక్షమార్గంలో పయనించడానికి అవసరమైన సాధనసామ॥ిని కష్టపడి కూడబెట్టుకోనక్కరలేదు. ఒక్కసారి మనసార 'హరి" అనే అక్షర ద్వయాన్ని ఉచ్చరిస్తే అది అన్నింటినీ సిద్ధంచేసి పెడుతుంది. ఇలా వేదశాస్త్రపురాణాలయందలి నునిశ్చితార్జాన్ని విన్నవాడు కాబట్టి 'త్రీనారాయణా! అని సర్వదా స్మరిస్తూ ఉంటాడట ఈకవి. 'పితేవాభిరక్షతాత్‌”

  • తండ్రిలాగా రక్షించడం శ్రీనారాయణునిధర్మమే అన్నాడు. ఉపాయం - సాధనం నారాయణ స్మరణమే. ఉపేయం - సాధ్యం కూడా శ్రీనారాయణుని సన్నిధానమేకదా। మ. కలితాఘౌఘవినాశకారి యగుచుంగైవల్యసంధాయిటై నలి నాప్పారెడు మంటత్రరాజనుగు నీనానముంబు ప్రేమంబునన్‌ అలరన్నెవ్వని వాక్కునం బొరయదో యన్నీచుదేహంబు డా వెలయన్‌ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ[నారాయణా॥[103 అర్హం ; ఓ వేదాత్మ = ఓ వేదమూర్తి! నారాయణా! కలిత+అఘ+ఓఫఘ, వినాశకారి, అగుచున్‌ ఇ (కూడిన) సంచితమైన పాపరాశిని నళింపజేస్తూ: కైవల్యసంధాయియై = మోక్షఫలాన్ని సమకూర్చునదై; నలిన, ఒప్పు, ఆరెడు = కడు యోగ్యంగా ఉండే; మం(త్రరాజము, అగు ఇ మంత్రాలలో శ్రేష్టమైన; నీ నామంబు = 'నారాయణ' అనే నీ పేరు; అలరన్‌ = స్ఫుటంగా; ఎవ్వని; వాక్కునన్‌ = వాగింద్రియమైన నాలుకమీద; సొరయదో = శ్రీర్తిపబడదో; ఆ, నీచు, దేహంబు = అక్షుద్రుని శరీరం; తాన్‌ = ఆ శరీరం, అదియే; వెలయన్‌ = స్పష్టంగా; భూరుహకోటరంబు = (మ్రానితొజ్జయే; సూ జ సుమా, తా : ఓ వేదాత్మ ! నారాయణ! మంత్రరాజమైననీనామాన్ని భక్తితో అనుసంధానం చేసినవ్యక్తికి సకలపాపరాశి నశిస్తుంది, మోక్షసా'మ్రాబ్యమూ లభిస్తుంది. ఆత్యంత యోగ్యమైన నీనామాన్ని ఉచ్చరించనివాని దేహమే ఒక చెట్టు, వాని నోరు అచెట్టుకున్న తొజ్జయే సుమా! వ్యాఖ్య : మందత్రరాజమైన నారాయణనామాన్ని అనుసంధించని నోరు మ్రామ తొట్టగా వర్ణితం, మానవుడు ఒక వృక్షం, ఆ వృక్షమూలమే మంత్రం. ఆమూలాన్ని అతిశ్రద్ధతో

250 నారాయణ శతకం రక్షించుకోవాలి “తస్మాన్మూలం యత్నతో రక్షణీయమ్‌” అంటుంది దేవీ భాగవతం. చెట్టుకు తొట్ట ఏర్పడితే అది కల్పగా ఉపయోగపడదు. పైగా మొత్తం చెట్టు నశించడానికి కారణమవుతుంది. మంత్రరాజమైన నారాయణ నామాన్ని ఉచ్చరించని వ్యక్తి సమాజంలో గౌరవం, ఆదరం, అభిమానం తక్కువ కలవాడనీ, అతని నోరు, చెట్టు తొజ్జలాగా, ప్రలాపాలతో ఆత్మనాళశక మవుతుందనీ వర్షించాడు కవి. నీచుణ్నీ రూపకాలంకారంతో శోభింపజేశాడు. (ప్రపత్తే ర్లక్షణీ మంత్రే విధా వాక్యాంతరేషు చ। భాష్యాదౌ సంప్రదాయే చోపాయత్వం (బ్రహ్మణి స్థితమ్‌” ప్రపత్తిలక్షణమందూ, మంత్రమందూ, విధియందూ, ఇతర వాక్యాలయందూ, భాష్యాదులందూ, సంప్రదాయమందుకూడా పరబ్రహ్మమే సిద్దొపాయం - మోక్షోపాయమనీ భగవచ్చాస్త్రం బోధిస్తుంది. కాబట్టీ “వదామి నారాయణనామ నిర్మలమ్‌ స్మరామి నారాయణతత్త్య మవ్యయమ్‌॥ (ముకుందమాల) అన్నట్టు పర్వదా నారాయణనొమాన్ని స్మరిస్తూ ఉండాలి. ఈపద్యం, రెండు,మూడు పదాల, ప్రత్యయాలభేదంతో (33) ముప్పదిమూడవ పద్యంగా పునరుక్తమయిందని చెప్పనక్కరలేదుకదా! మ. రమణీయంబుగ నాదిమంబు నవతారంబున్‌ భవద్దివ్యరూ పమునామామృుతమున్‌ దలంప దశక ్రాప్తయ్యెంగృష్లావతా రము సుజ్ఞానము మోక్షమున్‌ ద్వివిధసంప్రాప్పిన్‌ శతాంధ్రాఖ్యకా వ్యము నర్పించితి మీ పదాబ్బములకున్‌ వైకముంఠ!నారాయణా॥ 104 అర్థం : ఓ వైకుంర|నారాయణా! ఆదిమంబున్‌ = మొదటిది; అవతారంబున్‌; భవత్‌+దివ్యరూపము = నీదివ్యమైన ఆకృతి; నామ+అమృతమున్‌ = అమృతం వంటి నామం, తలంప = విచారించగా; రమణీయంబుగ = అందంగా, దశక ప్రాప్తి అయ్యెన్‌ = ఒక్కొక్కటి పది పద్యాలతో ఏర్పడినది. కృష్ణావతారము; సుజ్ఞానము; మోక్షమున్‌; ద్వివిధ సం'ప్రాప్తిన్‌ = పదికి రెట్టింపు అవడంతో; శత+ ఆంధ్ర ఆఖ్య కావ్యమును = ఆంధ్రభాషయందు. వంద పద్యాలు గల శతకమనే కావ్యాన్ని; మీ, పద+అబ్బములకున్‌ = మీపాదపద్మాలకు; అర్చించితి = సమర్పించాను. గ తా : ఓ వైకుంఠ! నారాయణా! ఆదిమదశకం, అవతారదశకం, నీదివ్య రూపదశకం, నామ(ప్రభావదశకం అని ఈ నాలుగు విషయాలు పదేసి పద్యాలతో అందంగా సమకూరినాయి.

రాఘవియవ్యాఖ్య 251 కృష్ణావతార వింశతి, జ్ఞాన వింశతి, మోక్షవింశతి, అనే ఈ మూడు విషయాలు ఇరవై యేసి పద్యాలతో కూడి ఆంధ్రభాషలో నూరు పద్యాలు రచింపబడినాయి, ఓ నారాయణా! ఈశతకావ్యాన్ని మీ చరణారవిందాలకు సమర్పించాను. వ్యాఖ్య: శతకరచనావిధానాన్ని వివరించి, కవి తనకొవ్వాన్ని నారాయణుని పాదపద్మాలయందు సమర్పించాడు.

ఈ పద్యరచనతో కవి, తన శతకాన్ని విషయసౌలభ్యంకోసం సప్రశీర్షికలు కలదిగా విభజించినట్లు స్ఫురింపజేశాడు.

1 అదిదశళకం: ప్రప్రధమంగా జగత్కారణుడైన పరబ్రహ్మయొక్క వైచిత్రిని పది పద్యాలలో రమణీయంగా వర్షించాడు,

  1. అవతారదళశకం : ప్రసిద్దమైన భగవంతుని దశావతారాలను పది పద్యాలలో అద్భుతంగా వర్షించాడు.

  2. దివ్యరూపదశకం: శ్రీమన్నారాయణుని విశ్చరూపవైభవాన్ని పద్యదశకంలో గరీయః ప్రతిభతో చిత్రించాడు.

  3. నామ(్రభావదశకం: నాల్లవదశకంలో భగవంతుని గుణవిభూతులను అమృతాయమాన౦గా అస్యాదించాడానికి యోగ్యమైన నామమహిమను హృద్యంగా స్తుతించాడు.

క. కృష్ణానతారవింశతి: పరత్వ, సౌలభ్యాలను ప్రదర్శించిన శ్రీకృష్ణుని లీలలను ఇరవైపద్యాలలో కమనీయంగా వర్ణిస్తూ మధురభక్తిరసామృతాని కేతమెత్తాడు.

  1. జ్ఞానవింశతి: ఇహలోకపరలోకసుఖాలను అవిష్కరించే సుజ్ఞాన విషయాన్ని వింశతి పద్యాలలో సుగమంగా భాసింపడేశాడు.

  2. మోక్షవింశతి: ఉభయ విభూతి నాయకుడైన శ్రీమన్నారాయణుని నిర్హేతుక జాయమాన కటాక్షంచేత లభ్యమయ్యే మోక్షమనే పరమపురుషార్థాన్ని విలక్షణంగా విశదపరచాడు.

“అన్నిర్వై వాక్‌" వాక్కును అగ్నిగా బోధిస్తుంది వేదం.

శబ్దాహ్యయజ్యోతిచేత పరంజ్యోతి (ప్రకటితమవుతుంది. సప్తావరణాలతో కూడిన ప్రకృతిమండలం పరిదృశ్య్వమానవమవుతుంది.

“సప్తప్రాణాః (ప్రభవంతి తస్మాత్సప్తార్బిషన్సమిధన్సవ్త జిహ్యాః సప్తఇమే లోకా యేషు చరంతి ప్రాణా గుహాశయాన్నిహితా స్పప్త సప్త” “అతస్సముద్రా గిర యశ్చ సర్వేఒస్మా త్యందతే సింధవస్సర్వరూపాః”॥ (శ్రుతి)

'సహ్తార్షవ సృష్తకులాచలాళ్ళ

సప్తర్షయో ద్వీపవనాని సప్త*॥ (స్పృతి)

హృదయగుహయందు వెలిగే పరంజ్యోతివల్ల సప్త (ప్రాణాలు -

252 నారాయణ శతకం సప్త వై శీర్షణ్యాః ప్రాణాః” అన్నట్టు తలయందు. చక్తురాది సప్తసంఖ్యగల ప్రాణాలు - సప్తార్చిస్సులు, సప్తసమిధలు, సప్తజిహ్వలు, సప్తలోకాలు, సప్తద్వీపాలు, సప్తర్హులు, సప్తసముద్రాలు, సప్తగిరులు, సప్రవనాలు, సప్తనదులు (ప్రభవించినట్టు, వేయేల? సహ్తాహంగా కాలచక్రం పరిభ్రమిస్తున్నట్టు శబ్బప్రమాణం ఉంది కదా!సఖ్యమూ సాప్తపదీనమే. ఆది కావ్యమైన రామాయణ మహార్షవం సప్తకాండలతో సందీప్తమేకదా! శబ్దజ్యోతి సప్తవిభక్తులతో, ్రిథా వచనబద్ధమై ఆకాశగుణమై విశ్చంలో శక్తిమంతంగా వెలుగుతున్నది. సప్త కింజల్కాలు కలిగి వందరేకులతో వికసించిన ఈ శతకకావ్యశతప(త్రాన్ని శ్రీనారాయణచరణారవిందాలయందు. సమర్పించి ధన్యుడయ్యాడు, కవులలో మూర్హన్యుడయ్యాడు. శా నీమూర్తుల్‌ గన నీకథల్‌ విన( దుదిన్‌ నీ పాదనిర్మాల్యని మా మోదంబునెలుంగ, నీచరణతోయంబాడ, నైవేద్యముల్‌ నీమంబొప్ప భజింప, నీజపము వర్లింపన్‌ గృసంజేయవే శ్రీమించన్‌ బహుజన్మజవ్మనులకున్‌ శ్రీయాదినారాయణా॥ _ 105 ఆర్ధం: శ్రీ ఆదినారాయణా = సంపత్కరమైన ఆదిదేవుడవైన ఓ నారాయణా! బహుజన్మజన్మములకున్‌ = అనేక జన్మాలకు; (శ్రమించన్‌ = జ్ఞానలక్ష్మి ప్రకాశింపగా; నీ మూర్తులే కనన్‌ = నీ రూపాలను చూడడానికి; నీ కధల్‌ వినన్‌ = నీగాధలు వినడానికి; తుదిన్‌ = చివరకు, సీపాదనిర్మాల్యనిష్థా+ఆమోదరిబును+ఎజుంగ = నీచరణాల యందర్పింపబడిన తులసీ పుష్పమాలికలను స్టిరవియమంతో ఆఘ్రాణించడానికి; నీచరణతో యంబు+ఆడన్‌ = నీ పాదతీర్చాన్ని సేవించడానికి; నైవేద్యముల్‌ నీమంబు+ఒప్ప భజింప = అనుభవింపదగిన పదార్థాలను నీకు నియమంగా సమర్పించి 'సేవించడానికి; నీజపము వర్షింపన్‌ = నీ నామమం్రాన్ని పునఃపునః ఉచ్చరించడానికి, నీ గుణ జాలాన్ని స్తుతించడానికి; కృపన్‌ చేయవే = దయతో అను[గ్రహించుము. తా : ఓ శ్రీదేవీయుక్త ఆదినారాయణా! జన్మజన్మలలోనూ నీరూపాలను కనడానికి, నీ కధలను వినడానికి, నీ పాదనిర్మాల్యాన్ని ఆఘ్రాణించడానికి, నీచరణ తీర్జాన్నీ నీకు నివేదించిన ్రసాదాన్నీ సేవించడానికి, నీనామాన్ని జపించడానికి, నీగుణశీలాదులను క్రీర్తించడానికి దయతో జ్ఞానలక్ష్మిని ప్రకాశింపజేయుము. వ్యాఖ్య ఏ శ్రీమన్నారాయణుసేనచేయదగిన జ్ఞానాన్ని ప్రసాదించుమని కవి ఆకొంక్ష

రాఘవీయవ్యాఖ్య 253

ఇదివరకన్ని జన్మలయ్యాయో, ముందు ఎన్ని జన్మలననుభవించాలో తెలియదు. జ్ఞానం కలిగిన జన్మయే చివరిజన్మగా సంభావితం,

జీవాత్మయొక్క స్వరూపధర్మం భగవత్మైంకర్యం. అదే మోక్షధర్మం.

“సోఒశ్నుతే సర్వాన్కామాన్‌ సహ బ్రహ్మణా విపళ్చితా”(తై.ఉ.ఆనంద వల్లి)

భగవంతుని స్వరూపగుణశీల విభూతులనన్నింటిని ఆయనతోడ ఉండి సేవిస్తూ ఆనందంగా తానూ - జీవుడూ పొందడమే సాయుజ్యమనే మోక్ష లక్షణం.

“బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం (ప్రపద్యతే! (భగ)

అనేక జన్మలసాధన ఫలితంగా జ్ఞానోదయమైన వ్యక్తికి భగవత్సాన్నిధ్యం.. లభిస్తుంది.

భగత్సేవకు నోచుకోని జీవితం నరకతుల్యమే.

“భోగాః పురందరాదీనాం తే సర్వే నిరయోపమాళో।

పరమపురుషార్థపరులచే, దేవేంద్రాదులయొక్క సుఖభోగస్ట్రానాలైన స్వర్గాది లోకాలు కూడా రౌరవాది నరకలోకాలతో సమానంగా భావింపబడుతాయి.

దివిలో ఉన్నా, భువిలో ఉన్నా ఇతరాపేక్ష లేకుండా శ్రీమన్నారాయణునికి చేసే నిత్య, నిరవద్య కైంకర్యమే సర్యోత్రమపురుషార్థం. దీనికి మించి మరేదీ వేరే లేదనే దృఢాధ్యవసాయంగల మహనీయులు, వైకుంరంలో ఉండే అనంత గరుడాది నిత్యసూరులచేతనూ ప్రియమైన అతిధులుగా సేవింప బడుతారు, సత్కరింపబడుతారు.

“యే (బ్రహ్మన్‌! భగవద్దాస్యభోగైకనిరతా: సదా

తే (ప్రియాతిధయ: ప్రోక్తా శ్రీవైకుంరనివాసినామ్‌"॥ (శ్రీశాస్త్రం)

భగవంతుని అనంతగుణాలన్నీ వైకుంఠంలో కంటెను ఈలోకంలోనే పుష్కలంగా ప్రకాశిస్తుంటాయి. ఆ గుణాలను పుష్కలంగా అనుభవించడానికే కొందరు మహాతు [లు “వైకుంరవాసేఒపి న మేలభిలాషు” ఈలీలా విభూతియందు జన్మించడం శ్రేయస్కరం, వైకుంఠంలో ఉండాలనే కోరిక కూడా మాకు లేదు' అంటారు.

“లక్ష్మణో లక్ష్మిసంపన్న:” అన్నాడు వాల్మీకి మహర్షి

కందమూల ఫలాదులను (త్రవ్వి, నింపి తేవడానికి గడ్డపార తోను, గంపతోను శ్రీసీతారాములవెంట బయల్టేరిన లక్ష్మణుడు లక్ష్మిసంపన్నుడట,

“భవాంస్తు సహ వైదేహ్యా గిరిసానుషు రంస్యతే।

అహం సర్వం కరిష్యామి జాగ్రతః స్వ్పపతళశ్ళ తే॥” (రామాయణం)

'కొాండచరియలయందు నీవు సీతాదేవితో వినోదంగా విహరిస్తుంటే మీయిర్వురికి

బైర్‌త్త నారాయణ శతకం నిద్రిస్తున్నా, మేల్కొనియున్నా, నేను సర్వవిధాలా క్రైంకర్యం చేయగలను అని లక్ష్మణుడు శ్రీరాముణ్ని స్రార్డించి, తన - జీవాత్మ - ఉద్దేశం తెల్పుతాడు. ఇది సమ్యక్‌జ్ఞానం. “స్తా హి శ్రీరమృతా సతామ్‌” సత్పురుషులకు కింకరత్వభావమే ప్రధానమైనది. అదే జ్ఞానలక్ష్మి, , 'శ్రీమించన్‌, అంటే జ్ఞానం, సుందర సుకుమార సుగంధ భరితమై ఉండా'లని అర్ధం. వేరే విషయాలమీద మనస్సును పోనీయక ఏకాగ్రంగా ఉంచడమే జ్ఞానానికి సౌందర్యం. తాను అనుభవించాలనే బుద్ది లేక పోవడం, జ్ఞానానికి సౌకుమార్యం. నిరతిశయమైన ప్రేమ కలిగి ఉండడం, జ్ఞానానికి గల సౌగంధ్యం. జ్ఞానలక్ష్మి ప్రకాశిస్త్రే సర్వేంద్రియాలు ఇతరత్ర ్రసరించక, సర్వేశ్చరునికి అభిముఖంగా ఉంటాయి. కన్నులు, కమళాక్షుణ్ని చూస్తాయి. వీనులు, విష్ణుకధలనే వింటాయి. నాసిక భగవత్సాదతులసీపుష్పాలనే మూర్కొంటుంది. భగవత్పాద తీర్చమాడి శరీరం, (త్వక్కు) తాపత్రయాన్ని శమింపజేసుకొంటుంది. రసన, ముకుందుని తీర్ధ ప్రసాదాలనే స్వీకరిస్తూ, ఉత్కంఠతో వైకుంరుణ్మై క్తీర్తిస్తుంది. అంతరంగం హృషీకేశుని నిరంతరచింతనలో మగ్హమవుతుంది. ఇతరజలాలన పేక్తించని చాతకపక్షి, వాన నీటికోసమే ప్రతీక్షించే రీతిగా, ప్రపన్నుడు ఇతరవిషయాలను అపేక్షించక, ఆలోచించక్త శ్రీమన్నారాయణుని దివ్యానుగ్రహంకోసమే నిరీక్షిస్తాడు. “నీపద్యావళులాలకించు. చెవులున్‌ నిన్నాడు వాక్యంబులున్‌ నీ పేరంబని సేయు హస్తయుగముల్‌ నీమూర్తిపై చూపులున్‌ నీ పాదంబులపాంత (మొక్కు శిరముల్‌ నీసేవపై చిత్తముల్‌ నీపై బుద్దులు మాక్సు నిమ్ము కరుణన్‌ నీరేజపత్రేక్షణాః” అనే భాగవత (10స్కం) పద్యం ఇచట స్మరణీయం. దేవుడు అవాప్త సమస్తకాముడు, సర్వపూర్ణుడు, చేతనుని దగ్గరినుంచి ఏదైనా స్వీకరించవలసిన ఆవశ్యకత, కొరత ఆయనకు లేదు. చేతనుడు అకించనుడ్తు, కాబట్టి దేవునికీయడానికి తనది అనే వస్తువొక్కటి కూడా ఈయనకు లేదు. కావ్య కళామర్శ్మజ్ఞుడైన ఈకృతికర్త సకలసుకల మైన సాహిత్యసంపద్విశిష్టంగా భగవద్రూపగుణవిభవైశ్వర్యశీలాదులను వర్ణించడానికి, భక్తి రూపమైన శేముషిని కృప జేయుమని శ్రీమన్నారాయణమూర్తిని (ప్రార్ధిస్తూ నారాయణ శతకాన్ని 'శ్రీమించన్‌' ముగించాడు. శళచ్యళందాన్నా జయ శ్రీమన్నారాయణ, మ!

తాము సంపాదించిన ఆస్తిని, సంపత్తిని తమ సంతానానికి . సం(క్రమింపజేసే తల్లిదండ్రులు ఈ లోకంలో కోకొల్లలు. భగవచ్చింతనతో ధర్మబద్ధమైన జీవనం అలవరచుకొన్నవారే భగవన్నామ మహిమ వల్ల ఇహపరసౌఖ్యాలు (ప్రాప్తింప జేసుకో గలుగుతారు. అట్టివారే తమ సంతతికి భౌతిక సంపత్తిని, భక్తి సంపత్తిని కూడ సం(క్రమింపజేసినందున యోగ్యులైన తల్లి దండ్రులవుతారు. వారు ధార్మికులు - సత్కర్ములు - చరితార్జులూ కూడా. ॥ అలాంటివారి ఇళ్లల్లో ఆబాలగోపాలానికి శ్రీనారాయణశతకము శాంతి సుఖ సౌభాగ్యాలను చేకూరుస్తుంది. శ్రీ బమ్మెరపోతనామాత్య (ప్రణీతము, శ్రీనారాయణ శతకము .. భగవత్రాప్తికి శరణాగతి వినా శరణ్యము లేదనీ, ఇందుకు భగవన్నామస్మరణ ఒక్కటే మార్గమనీ బోధన చేస్తోంది. స్వామి శివశంకరస్వామి వారి మాటలలో 'భక్తి జ్ఞానవైరాగ్యములు | . . ఈ శ్రీనారాయణ శతకమున బీజరూపమున నున్నవి," అనునది .. నీతి, భక్తి బావబోధకాలైన శతకాలు బాలబాలికలను ॥ విజ్ఞానవంతులుగా చేయడానికి అధికంగా ఉపయోగపడతాయి, అని | అంటున్నారు శ్రీనారాయణ శతకమునకు వ్యాఖ్య వ్రాసిన శ్రీమాన్‌ కె.వి.రాఘవాచార్యుల వారు. ఇది అమూల్యనిధి - దీనిని మో ఇంటనిలిపి, మా సంతతికి ఒంటబట్టించి మిరు ధన్యులు, మాన్యులు కావాలనేదే శ్రీపావని సేవాసమితి ఆకాంక్ష " చల్లా సాంబిరెడ్డి, బి.ఏ., ఎల్‌ఏల్‌బి సంపాదకులు. |