Telugu sparsha - anilvaranasi/indianlanguages GitHub Wiki
ఏజుట౦05 జో ము. స స్టే 1 ల్తక్తు (అ్వ టగ్ భం “సహజకవి మల్లెమాల [న మనసుపడి మక్కువతో సేకరించిన ర స ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం / సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ॥/ క్ ,. ఆనందంతో బహూకరిస్తున్నాం. న! ' - మల్లెమాల కుటుంబం యగుంనా . ॥ (|. ,! గో ॥| స.
స్పర్శ రచన వేణుసంకోజు తెలంగాణ జాగృతి ప్రచురణలు - హైదరాబాద్
2 వేణు సంకోజు యా ద్క షసె త్తస్పృకు జలా 7 థ్ రే ళా లో య ను ఆబాల, త్ గళ ల్భగ్గా్భం_ యా నల జే న్ లా లో 555గ%గి5[1% 20 2౧౪౧౦106 01 8[0గ 510౧౭5 0 6౧౪ 58౧%40)4 066౮ 2008 1000 ౧౦౧189 ౧౯౦19౧66 0౫ 012062౧2 ౭౩1011, ౪7/6. 6-11-310/12/4, 206 /00/ [౬8/0 9262, 54166గ7 2980 10/06/202464 - 36 ౫౧ 08 . 984886 82600. ౫1౪6 65180 : గం/4 5గ౧|౪49 . 984956 43728 & ౪11౮6 . 99597 31945 ం1గం౦ంగ౩ " 5౧౧౧౧29 గజ21., 0047801. 07౧ & ఓం 00౧27201 & 54/34 . 98485 53763 గం0౧౦౦౧|65 : 6౧6 52౧50004, 5 ఓ16౧, 8 0010 21 గ2667 న [14100604 506 001 06 : 99484 19881 నిగగ౧166 2. ఉ౧౮ద2గడ గిగ౧॥16౧5, 0౧99౧ 94) 126, 904040 1204౧ గర. 28 06 23391364 & 23304194
స్పర్శ 3 నామాట
నాకు కథానికలు రాయాలని చాలా రోజుల నుండి వుండింది. అయితే కవిగా ఒక గుర్తింపు రావటం వల్ల కవిత్వం వైపే మొగ్గటం జరిగింది. కవిత రాస్తున్న సమయంలో జీవిత సమస్యలన్ని అందులో ఇముడ్తలేవని (గ్రహించినపుడు కధానిక వైపు మను గుంజేది. అట్లా నేను రాసిన మొదటి కధానిక మీద రావిశాస్రి (ప్రభావం, రెండో కధానిక మీద బీనా దేవి ప్రభావం వుందని మిత్రులు అన్నారు. శ్రీ మోతుకూరి నరహరీ మిత్రబృందం ఆధ్వర్యంలో వచ్చిన “స్పందన పత్రిక నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలో పై కధానికల్లో రెండో దానికి బహుమతి కూడా వచ్చింది. కాని ఏ కారణం వల్లనో అది నాకు అచ్చు రూపంలో కనిపించలేదు. వ్రాతప్రతి దొరకలేదు.దీనితో కొంత నిరాశ కలిగి, ఆ నిశ కధానిక మీద కోపం గా కూడా మారింది. అందువల్లనేమో చాలా కాలం నేను మరి కథానిక జోలికి పోలేదు.
తిరిగి 2000 సంవత్సరంలో '“స్పర్శ' రాశాను. అది వెనువెంటనే “పత్రికలో ప్రచురితమైంది. ఆ కధానికలోని సీతారామయ్య సున్నిత మనస్తత్వాన్ని బాగా చిజ్రించానంటు మిత్రులు ప్రశంసించారు నాకు కొంత ఆత్మ విశ్వాసం పెరిగింది. దీనితో ప్రీ, పురుష సంబంధాలలో వుండే వైవిధ్యం వైపు నా దృష్టి మళ్ళింది. అట్లా కొన్ని కధానికలు రాశాను. కేసు కథానిక దాంపత్య సంబంధాల మీద రాసింది. అందులో 'సుధ' తన భర్త శాడిజం పట్ల విసుగెత్తుతుంది ఇక తప్పని పరిస్థితిలో
ణీ వేణు సంకోజు భర్త మీద చేసిన తిరుగుబాటు ఆమె కాపురాన్ని చక్కదిద్దుతుంది. అట్లే , *'మారు మరణం' కథానిక, ఇందులో మగవాడి కుట్రను అమలు చేసే క్రమంలో రవళి తన భర్తను చంపుతుంది, ఆ తర్వాత తానూ బలవుతుంది. 'గౌరవ1౦00నం) కధానికలో ఒక ఎనిదో తరగతి చదివే పిల్లవాడు ప్రదర్శించే స్టైర్యం మీదే నేను దృష్టి పెట్టిరాశాను. అట్లా ఇతర కథానికలు కూదా.
ఈ కధానికలను వ్రాత ప్రతి రూపంలో చూసి సలవాోలు ఇచ్చి ఫ్రోత్సహించినవారు మిత్రులు శ్రీ దేవులపల్లి కృష్ణమూర్తి, శ్రీ కె. జితేంద్రబాబు, శ్రీ డి. సూర్యకుమార్, శ్రీ గుడిపూడి సుబ్బారావు, శ్రీ ఎన్.కె. రామరావు, శ్రీ ఆర్. విజయకుమార్, శ్రీ వరిగొండ కాంతారావు, డాక్టర్ బెల్లియాదయ్యగారలు. వీరికి నా కృతజ్ఞతలు. వీటిని ప్రచురించిన 'పత్రికి, 'సంతకంి, 'సోయి' మొదలైన పత్రికా సంపాదకులకు నా ధన్యవాదాలు. (ప్రధానంగా 'స్పర్శ పేరుతో ఈ కథాసంపుటిని ముద్రించటానికి ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించిన వదాన్యులు 'తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి కల్వ కుంట్ల కవిత గారికి (ప్రత్యేక ధన్యవాదాలు.
వీటన్నింటిని 'స్పర్శ్ణ పేరుతో ఒక సంపుటిగా ముద్రించిన *'అనుపమ ప్రెస్ యాజమాన్యానికి, కార్మికులకు, డి.టి.పి బాధ్యతలను కళాత్మకంగా నిర్వహించిన ఘట్టుప్పల విజయ్ గారికి నా ధన్యవాదాలు.
ముఖ చిత్రం వేసిన ప్రముఖ చిత్రకారులు శ్రీ ఏలే లక్ష్మజ్ గారికి, లే అవుట్ డిజైన్ చేసిన మిత్రులు, చిత్రకారులు కూరెళ్ళ శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు.
20.12.2008.
నల్లగొండ.
- వేణు సంకోజు
స్పర్శ క్ కథా క్రమం
- మొర(0) న. ళ్గ ల స్పర్శ న. 16
- ఫంక్షన్ వంటల ల్
- సోమనాథోపాఖ్యానం . త్ర ర్. కేసు న. త్తి
- తడి - తడి న. ర్ర్ "7. గౌరవ100నం న. 64 8, పలాయనం వ. 78 ౦ స్టాంపు లం" 84
- మారుమరణం న. 90
స్పర్శ 7 మొర(0)
పొలం పొలమంతా రోధించింది. అలిసిపొయ్యింది. వారంగట్టు బాధకిక అంతన్నదే లేదు. వగచి-వగచి, అవమానభారంతో అలసి పోయ్యింది. జరిగిన దారుణానికి తనే కారణమైందని తలచుకుని, తలచుకుని, కుమిలిపాయ్యింది. వాతావరణమంతా చావు గౌలుతో అసహ్యంగా ఎట్లాగో మారిపోయ్యింది. ఊరంతా భయంకర నిశ్శబ్దం. ఊరువూరంతా వల్లకాడైనట్టుగా జనమంతా చేరారక్కడికి. మౌనంగా రోదిస్తున్నారు. అందరి ముఖాలూ పాలిపోయి వున్నై. శవమై ముకుందరావొక్కదే చితి మంటల్లో ప్రశాంతంగా దహిస్తూవున్నాడు.
ముకుందరావు. ఎంత అందగాడో అంతమంచివాడు.. ఎంత చదువు మీద మమకారం గలవాడో అంతగా సేద్యమంటే పడిచచ్చేవాడు. అవును చివరికి సేద్యం కారణంగానే చచ్చి వూరుకున్నాడు. స్పేహితులనూ, ఆత్మీయులనూ విషాదపు గదుల్లోకి విసిరిపోయినాడు. తన నొప్పులనుండి, అవస్తలనుండి, బాధలనుండి విముక్తుడైనాడు. అతడి మరణం అతడికే పరిమితమైదని అనుకున్నాడేమో! ఒక మీదట తనబాధల కారణంగా తన స్నేహితులు, బంధువులు చింత జెందవలసిన పనిలేదను కున్నాదేమో! తనదారి తాను వెదుక్కున్నాడు. తన పిల్లలను తలచుకున్నాడో లేదో! తన అవటితనాన్ని చేతగాని తనాన్ని యింకొంత కాలం వారికి చూపకూడదనుకున్నాడేమో! ఆఖరు (ప్రయాణం చేసే సాహసానికి ఒడిగట్టినాడు, కణ కణ మండే ఎర్రని కట్టెల మొద్దెనాడు- బూడిద ముద్దెనాడు.
ముకుందరావు-తల్లి దండ్రులకు ఒకడే కొడుకు- గోధుమ రంగు శరీరం నల్లని కురులు- సన్నని మీసం. చూపరులని ఆకర్షించేకండ్లు. డొప్పచెవులు. చాలినంత ఎత్తు. మెత్తని పలుకు. ఏదో ఆదర్శం కోసం బతుకుతున్న వాడీతడు- అ్న అభిమానంతో- వూరందరి మెప్పుపొందినాడు. పొలం ఐదెకరాలే అయినా ఐదారు జన్మలకు సరిపడా మిత్రబృందం ఆత్మీయుల ఆదరణ అధికంగా
8 వేణు సంకోజు గలవాడు. ఇవ్వాళ ఈ పని పెట్టుకున్నాడు.
ముకుందరావు. పనినితిని, పనినితాగి, పనిలోనే నిరంతరం నిమగ్నమౌతూ వుండేవాడు. అమితమైన (ప్రేమవుండేదితల్లిదండ్రులంటే. వాళ్ళకు యింకా యేదైనా చెయ్యాలనే ఆరాటంతోనే వుంటుండేవాడు. వాళ్ళ తిండి తిప్పల విషయం చూసుకునేందుకేనా తాను పుట్టింది? వాళ్ళకు తీరూన బట్టబాతలు కొని తెచ్చి పెట్టడం కోసం మాత్రమేనా తాను పుట్టింది? వదో-యింకేదో- యేదేదో చేసి పెట్టాలి తనకు జన్మనిచ్చిన వాళ్ళకు. వాళ్ళ రుణం తీర్చుకోవాలి. తాను వాళ్ళ కడుపున పుట్టినందులకు- అనుకుంటూ వుండేవాడు.
ముకుందరావు దరఖాస్తు చేయని ఉద్యోగం లేదు. వచ్చిన వుద్యోగం అంతకన్నాలేదు. తన తోటి వాళ్ళకు ఒకరిద్దరికి వుద్యోగాలు- ఐదారేళ్ళలో వొచ్చిన మాట నిజమే. తనకు రానందుకు బాధపడే వాదో లేదో-ఎవ్వరికీ యిప్పటి వరకూ తెలియదు. తనబాధను ఈ విషయంలో తానెన్నడూ ఎవరిత్యాగం ఏకరుపెట్టలేదు. ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. అవనిని నమ్ముకున్నాడు. మట్టిలో తాదాత్య్వంచెండంకోసమే తాను పుట్టాననుకున్నాడేమో వ్యవసాయం మీద పడ్డాడు.
కొడుకు బాధను దిగమింగు కుంటున్నాడని తెలిసి తల్లిదండ్రులు అనేకసార్లు బాధపడ్డారు. “మా వాడింకా పైసదువులు జదువుతాడేమో తెలుసుకొండ్రి నాయినా మేవెట్లనన్న కష్టపడి సదివిస్తం” అంటూ సాటిమిత్రులతో అని చూసారు. తనకింకా చదువుకోవాలని లేదని ఖచ్చితంగాచెప్పేసి నాడు ముకుందరావు. ఇంట్లోవున్న చెంబూ తపాలా అమ్ముకుని, బాంకులోనుకూడ తీసుకుని (ట్రాక్టరుకొనుక్కున్నాడు. జోరుగా వ్యవసాయంచేయసాగినాడు. ఐదెకరాలూ- పదిపంటలుగా విస్తరించినాడు. అనుభవంగడించిన పెద్దపెద్ద రైతుల మెప్పుపొంది నాడు. ఊరు వూరంతా అతడిని అక్కున చేర్చుకుంది. 'మానాయనే మాబాబే' అంటూ మురిసిపాయ్యింది. ఆడవాళ్ళయితే అతడిని చూసి చేతులను తలలకానించుకుని (ప్రేమతో మెటికలు విరుచుకునేవారు. వూరంతా, ముకుందరావుకు. బంధువులు లేదా స్నేహితులు
సౌభాగ్య ఎప్పటి నుండో యిష్ట పడుతూ వచ్చింది ముకుందరావును. అతడి అందాన్ని చూసి ఎంతగా ఆకర్షణకు లోనయ్యిందో అతడి గుణానికి అంతకన్నా అభిమానురాలయింది. ముకుందరావును ఎవరైనా పాగుడుతూవుంటే తెగమురిసిపోతూ, మరింతగా ఎవరైనా పొగడితే బాగుందుననుకునేది. అటువంటుప్పుడట్టా ఆమెకు ఆమె శరరం స్వాధీనం తప్పుతున్నట్టని పించే. ఆమె
స్పర్శ ర నరాలలో వొక విధమైన వొణుకు, అవమవాలలో తెలియనిప్రకంపనలు తోచేవి. ఊరిజనమేమిటి తన విషయం అసలు పట్టించుకున్నట్టేలేదు -తననతడికిచ్చి పెళ్ళిేచేయమన ఎవరైనా తక్షణం సూచిస్తే బాగుందుననుకునేది. అతడు కనిపిస్తే బాగుండునని, తనివి తీరాచూడాలని పదేపదే కోరుకునేది
ముకుందరావు పరిస్థితీ అదే. అయితే సౌభాగ్యలా బయట పడడు. ఆమెనా సౌంతం అదే పనిగా చూడాలని చాలసార్లేఅనుకున్నాడు. ఆమె తన నట్లా కొన్ని సార్లు చూసిందనికూడా తనకు తెలుసు. కాని ఆ మాత్రం చూసేసాహసంచూపలేక పోయినాడతడు. భయమని కాదు. బిడియం. వెరపుతో కూడిన విరహం వంటి వింతస్థితి. చొరవ చేసుకుని మాట్లాడదామని కూడ అనుకుని అనేక సార్లు విరమించుకున్నాడు.
చిన్ననాటి విషయంవేరు. అందరికీ ఒకటే బడి. ముందూ వెనకాల కావచ్చు కాని అందరూ ప్రాధమిక విద్య ఆ బడిలోనే చదివినారు. సౌభాగ్య బడిలో చేరే ప్రాయానికీ ముకుంద రావు అవతలి వూళ్ళో ఆరవ తరగతిలో చేరాడామె! ఆ విధంగా అంత చనువుగా అప్పుడే మాట్లాడుకోలేకచేరాయె ఇంటరు పూర్తి చేసిన ఇంతే - తనవన్నా పొడగరేంకాదు గాని పొడవే అనిపిస్తుంది. సూటిగా మొనదేలిన ముక్కు తనకన్నా ఎరుపు. ఆమె ఆడతనం తలచుంటేన అతడికి శరీరంలో ఒక విధమైన వేడి జనించేది. అతీంద్రియ అవేశమేదో అతడికి అనుభవమౌతున్నట్లనిపించేది. తనకు తానే మురిసిపోతూవుండేవాడు.
వీరిద్దరూ ఒకరి నొకరు యిష్టపడుతున్న సంగతి తెలియక ముందే యిరువురి తల్లిదండ్రులూ ఈ విషయంలో ఏకాభిప్రాయంతో వుంటూ వచ్చారు. తీరాయిప్పటికి సమయం వచ్చింది. విషయం ఒకానొక రోజున బహిరంగచర్చే అయ్యింద. అంతా ఆనందంగా తధాస్తు అన్నారు. పదిహేను రోజులకే ముహుర్తం అన్నారు. (ప్రతియింట్లో పెండ్లి వాతావరణం కనిపించింది.
మాటా ముచ్చటా అవసరం లేదన్నాడు. ముకుందరావు ప్రత్యేకంగా, సౌభాగ్యకుంటుంబం స్టితిగలదే. కోరినంతకట్నం యివ్వగలిగిందే. కాని ముకుందరావు అందుకు ఒప్పుకోలేదు. కట్నంససేమిరావొద్దంన్నడు. ఆమాటతో వూరి వారందరి ఆనందానికి మేరలేక పోయింది. ఆక్షణాన సౌభాగ్యకు ముకుందరావు వెయ్యిమంది అగ్రశ్రేణి హీరోలకన్న మొనగాడనిపించాడు. వివాహం కాకముందే అతడి ఆదర్శానికి, ప్రవర్తనకు మోకరిల్లింద సౌభాగ్య వివాహం అయ్యాక కార్యనికి వచ్చినప్పుడు సౌభాగ్యకన్న ముకుందరావే సిగ్గుతో
10 వేణు సంకోజు కనిపించాడు. ఎవరూ పలకరించక పోతే బాగుండుననుకున్నాడు. ముఖ్యంగా ఆడవాళ్ళు. ఊరివాళ్ళు వూరుకుంటురా - ఒక ఆట ఆడించారు ముకుంద రావు మీద కొంటె ప్రశ్నల వర్షంకురిపించారు. ఉక్కిరిబిక్కిరైపోయాడు ముకుంద రావు. అది గమనించిన సౌభాగ్య తెగమురిసిపొయ్యింది. ఆమెనంతగా అల్లరి పెట్టలేదు ఈ అమ్మాయిలు. ఆమె గడుసుగా తిరిగి వీళ్ళనే అల్లరి పెట్టగలదనుకున్నారేమో, పదటమంతా ముకుందరావు మీదే పడ్డారు.
సాభాగ్యకు ఒక తమ్ముడు-టెన్త్ చదువుతున్నాడు. వాడు రాని మీసం దువ్వుకుంటూ బావ- ముకుందరావును తనకు చేత నైనంతగా అల్లరి పెట్టచూస్తున్నాదు. అందుకు మురిసి పోయాడు ముకుందరావు. పెన్నుతీసుకుని వాడిమూలళికి మీసాలు రాసినాడు. ఎందుకండీ అని వారించక పోగా అక్క సౌభాగ్య బాగున్నాయని చప్పట్లుచరిచింది. ఆమె తల్లి దండ్రులు కూడ మురుసు _కున్నారందుకు.
కొన్ని సంక్రాంతులూ, దీపావళులూ వచ్చిపోయాయి. కాలాలూ, రుతువులూ మారాయి. సంసార సామ్రాజ్యాల్ని మక్కువతో మరింత మక్కువతో ఏలారు నవదంపతులు. ఊరికళ్ళన్నీ వాళ్ళమీదనే. వాళ్ళ కదలికల మీదనే. పెళ్ళయిన మూడోనెలనుంచే"నెల తప్పిందా అమ్మాయీ” అనో“ఏమైన విశేషమాబాబూ అమ్మాయి నిన్న బయటికి రాలేదు”అనో ఆరాతీయబోయేవాళ్ళే. సిగ్గుగానూ, ఒక విధమైన గర్వంతోనూ మూలలే వాడు ముకుందరావు'అమ్మ' కాబోవడం తలచుకుంటే నేచనుకట్టు మీద కొంగుజారేది. ఎవరిచంకలో బిడ్డను చూసినాతెలియకుండా తానా భంగిమలో నిలుచున్నట్లు పగటికలల కనేది సౌభాగ్య
పెళ్ళై రెండో సం॥లోకి అడుగుపెట్టంగానే పాపకలిగింది. పాప అచ్చం ముకుందరావులాగే అచ్చుగుద్దినట్లుంది. అందుకు ఎంతో మురిసిపొయ్యింది సౌభాగ్య. సౌభాగ్య ముఖకవలికలు రానందుకు కించిత్ నిరాశపడ్డాడు ముకుందరావు. ఆ మాటే సౌభాగ్యతో అంటే"పోదురూ”అంటూ జడతో లాలనగా కొట్టింది సౌభాగ్య ముకుందరావును. జన్మసార్ధకమైనట్లుగా ఒక విధమైన అనుభూతికి లోనయ్యాడు ముకుందరావు- తాతయ్యలూ, అమ్మమ్మా-నాన్నమ్మలూ అయికూర్చున్నందుకు తెగమురిసిపొయ్యారు వీరిరువురి- తల్లిదండ్రులూ. నర్ఫులే ఆపాటికి దేవదూతలు. డాక్టల్లే అపరగంధర్వులు. పాప వరాలమూట. పువ్వులతోట. నవ్వులపూట. కేరింతలపోరు. స్వర్గం దిగివచ్చినట్లుగా వూరు వూరంతా కదలదుమరీ! అందరికీ ఆపాప కోడలో, కూతురో అయికూర్చుంది.
స్పర్శ 1 కాసేపు రాణి అయ్యింది కాస్సేపు రూన్సీరాణి అయ్యింది. ఇంకాస్సేపు లక్ష్మి అయ్యింది. సర్వస్వం అయ్యింది.
మూడు సం॥ల వ్యవధిలో ముకుందరావు వ్యవసాయం మరింత అభివృద్ది చెందింది. తన పొలం పక్కన మరో మూడు ఎకరాలు కూడ కొన్నాడు మంచిపంటలే పండినై. ఈలోగా ఒక బాబుకుకూడా జన్మనిచ్చింది సౌభాగ్య, బాబుకు అచ్చంగా అమ్మ పోలికలొచ్చి నందుకు అమితానంద పడ్డాడు ముకుంద రావు. ఈమారు నిరాశపడ్డం సౌభాగ్య వంతయింది.
సరిగ్గా అటువంటి సమయంలో ప్రత్యక్షమయ్యాడు ప్రభాకర రావు. ఆయనే వీరికి తెలియదు, కాని వెంటవచ్చిన వ్యక్తి ఆ వూరి వాడే గనుక అతడేం చెబుతాడోనని ఎదురు చూడసాగారు. సౌభాగ్య ముకుందరావూ. పరిచయాల య్యాయి
ప్రభాకర రావు ఒక కాంట్రాక్టరు కమ్ వ్యాపారి. వ్యాపారం కన్న సేవాతత్పరత మెండు. ముకుంద రావు గురించి విని స్వయంగా సహాయపడటానికి, అప్పుపెట్టడానికి వచ్చాడు. చదివినవాదైన ఆ. యువకుడు వ్యవసాయాన్ని చేసట్టదమేగాకుండా, ఒక ఆదర్శ రైతుగా, అందరిమన్ననలు పొందిన ఉత్తమ పౌరుడుగా ఎదిగినందుకు గర్వంగా భావించి వచ్చాడు స్వయంగా ప్రభాకరరావు వాళ్ళింటికి. అది తెలుసుకుని సౌభాగ్యకు ఆనందంతో కళ్ళు వర్షించాయి. అప్పుడామె కంటికి భర్త మరింత ఎత్తులకెదుగుతూ అగుపించాడు. తాను కన్నకలలు ఈ విధంగా డేరబోవడం ముకుంద రావుకు మేలనీపించింది. కృతజ్ఞతతో ప్రభాకర రావుకు నమస్కరించాడు. అంతమంచి రెస్పాన్సుకు (ప్రభాకర రావు కూదా చలించాడు.
యాఖై వేలరూపాయల అప్పుపెట్టాడు ప్రభాకరరావు ముకుందరావుకి పది యిరవైవేల అప్పుచాలనుకున్న ముకుందరావుకు యిది చాల ఎక్కువ సొమ్మని పించింది! చాల ఎక్కువగా విశ్వసిస్తున్నారేమోనండీ! అన్నాడు. నమ్రతతో అదేంకాదు లక్ష యివ్వమన్నా యిస్తానంటూ డబ్బు తీయబోయాడు ప్రభాకరరావు. “చాలనండి, యిప్పటికే యిది చాలా ఎక్కువని అంటూ ప్రాధేయ పూర్వకంగా వాదించాడు ముకుందరావు.
అదనుకు వర్షాలు కూడ అంది వచ్చినై. ఊరంతా అలికారుభూమిని- వ్యవసాయదారులు ముకుందరావు సరే, హుషారుగా, పొయ్యాడు ముకుందరావు
12 వేణు సంకోజు సాయంత్రమైంది. ఎరుపెక్కిన కొద్ది నిమిషాలకే సూర్యుడు కందిపోయి, కమిలిన గాయంలాగున మారిపొయ్యాదు. వారం మీంచి ముకుందరావు కాలుజారింది. మెలికలు తిరిగిపడ్డాదు. 'అమ్మా అన్నాడు. లేవబోయాడు బాధతో మూల్గుతూనే. వశంకాలేదు. లేవలేక పోయాడు. విలవిల్లాడి పోయాడు. అక్కడున్న రైతులందరూ, ఆడామగా తేడాలేకుండా ముకుందరావుని చేతులమీద ఎత్తుకెళ్ళినారు వైద్యునివద్ధకి మూర్చపొయినాడు ముకుందరావు నొప్పులకు తాళలేక, పరీక్షించిన వైద్యుడి ముఖకవళికలు మారుతూవచ్చినై విషయం తేల్చుకునే ప్రయత్నం విరమించుకోకుండా తన పని తాను చేసుకుంటూపోతుఆన్నడు. ప్రమాదం పెద్దదే అయిందని రైతులకు అర్ధమౌతున్నట్లుగావుంది. ఒకరిద్దరు పరుగెత్తుకుని వెళ్ళి సౌభాగ్యకు వార్తనుచేరవేసినారు నెత్తికొట్టుకుంటూ క్షణాలమీద వైద్యునియింటికి చేరుకుంది సౌభాగ్య
అప్పటికీ అక్కడున్న వారందరూ అకాక్కయిపోయి. కూర్చున్నారు. ఏమి చేయాల్నో అంతుబట్టక ముకుందరావుకు స్పృహ వచ్చిం దగ్గరి నుండీ బాధ మిక్కుటమైంది. భరించలేక పోతున్నాడు. ఆదృశ్యంచూసిన సౌభాగ్య మరింత బిగ్గరగా రోదించసాగింది భర్తమీదపడి. పసి ప్లిలలు భయంతో. అక్కడి గంభీర వాతావరణానికి జడిసి, తల్లిని పట్టుకొని తండ్రిని చూస్తూ బిగ్గరగా రోదించ సాగినారు. ఆ దృశ్యంఅక్కడున్న వారందరికీ కంట తడి పెట్టించింది. కొందరు పసివాళ్ళను దగ్గరకు తీసుకుని సముదాయిస్తుండగా, ఆడవాళ్ళు సౌభాగ్య తల నిమురుతూ, దుఃఖించ వద్దని కోరుతున్నారు. కాని వాళ్ళే నిజానికి కళ్ళల్లో నీళ్ళు కుక్కుకుంటూ దుఃఖం లేదన్నట్టుగా ప్రవర్తించబోయి విఫలులౌతున్నారు
ముకుందరావు వెన్ను పూసకు దెబ్బతగిలిందని, హైదరాబాదుకు తీసుకుపోయి వైద్యంచేయించాలని తేలింది. అంతా నిర్జాంతపోయినారు. అశక్తతతో పసివాడికన్న కష్టంగా రోదించాడు ముకుందరావు సౌభాగ్యస్థితి చెప్పనలవి కానిదిగా మారింది
రోజులు, వారాలు, నెలలుగడిచినవి ఆస్పత్రిలోముకుంద రావుకు నయం కాలేదు. బహుశాకాదని చెప్పినారు వైద్యులు. హైదరాబాదులో వుంటూ, మధ్య మధ్య వెళ్ళివస్తూ డబ్బులకూ, తిండికీ వారు యాతనపడ్డారు. పొలం అమ్ముకున్నా అప్పులు తీరలేదు అప్పయినా తిరిగి తనకాళ్ళమీద తాను నిలబడగలిగితే చాలుననుక్సున్నాడు ముకుందరావు. కాని అది జరగలేదు. వెనక్కితిరిగి వచ్చేసినారు ఊరికి, ఊళ్ళోకి ప్రవేశిస్తుండగానే ఎందుకో శ్మశానికి పోతున్నట్టుగా
స్పర్శ 13 అనిపించింది సౌభాగ్యకు. ఊరిదారిని చూడంగానే బిగ్గరగా ఏడ్చినాడు ముకుందరావు. తనకూ, వ్యవసాయానికి రుణం తీరిందని కుమిలికుమిలి, పారలిపొరలి ఏడ్చినాడు. ఊరికానాడు పగలే చీకటయ్యింది. సూర్యుడనేవాడు రాలిపొయినాడు దయ్యాలు ఏల వచ్చి నట్లనిపించింది.
నిన్నటి వాతావరణం యివాళ వుండదు కదా! ఇవాళ చూపిన జెదార్యం ప్రజలు రేపుచూపలేక పోయినారు ముకురిదరావు కుటుంబం పట్ల. ఎవరి బాధలువారికి-ఎవరిస్థాయిలో వారిని వెన్నాడుతూవున్నవేనాయె.. అలుగక పోయినా బాగుండేది- ఆ ఖర్చులయినా తప్పేవనుకున్నారు. రైతులు. కాలంకాకుండా పొయ్యింది. చేతులకు పని తగిల్తేనే కదానోటికి (గ్రాసం దక్కేది. ఆకలి చావులు ఒకటీ అరా చోటు చేసుకుంటూనే వున్నై కరెంటు చార్జీలు కట్టలేక వూరి తొలి తరంరైతు- రామన్న ఆత్మహత్య చేసుకున్నాడు.
పిల్లలను ప్రైవేట్ స్కూల్ మాన్పించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది సౌభాగ్య. ఆమె అప్పటి సౌభాగ్యకాదు. బాగా నల్లబడి పోయింది. ముఖమ్మీద నునుపు లేదుసరే పసివాడి పోయినట్లయింది. పిల్లలవాలకం పూర్తిగా మారిపోయ్యింది. చిరిగిన బట్టలతో, రేగిన జుట్టుతో వికారంగా తయారైనారు. ఇక ముకుందరావు పిరిస్థితి చెప్పనేరాదు. ఊరంగా దేకుతూ వుంటే హృదయమున్న వారెవ్వరూ ఆ దృశ్యాన్నిచూసి తట్టుకోలేరు.
ప్రభాకరరావు తట్టుకోలేక పొయ్యాడు. అతడువూళ్ళోకి వచ్చాడన. గానే ముకుంద రావు గుండెలు గుఖిల్లుమన్నాయి. ఆవమానభారంగా కుంగిపొయ్యింది సౌభాగ్య తాను డబ్బు కోసం రాలేదని, చూసి పోదామని వచ్చానని ప్రభాకరరావు చెప్పిందే తడవుగా ఆ దంపతులిద్దరూ అతడి పాదాలమీద పడి కన్నీటితో కడిగినంత పని చేశారు. ఆ చర్యకి ముకుందరావు దుఃఖం ఆపుకోలేక చెల్లెమ్మా" అంటూ సౌభాగ్యను “బాబూ” అంటూ ముకుందరావును - దుఃఖించ వద్దని చెప్పలేక-చెప్పలేక చెబుతూ, యింకా అక్కడవుండలేక వెళ్ళిపొయ్యాడు.
ఎవరు మాత్రం ఎంతకాం సాయంజేస్తారు? రోజూవచ్చి పోయేవారికి ఎవరు మాత్రం ఎక్కడి నుండి జీవిగంజి తెచ్చిపోస్తారు? పరిస్టితులు దారుణంగామారినవి. తోచిన సహాయం బంధువులూ, మిత్రులూ, ఊరివాళ్ళూచేసినారు. ఆ స్థితి యింక వొద్దనుకుంది సౌభాగ్య పాల కోసం పిల్లలుకు చాయికోసం భర్త, రంపపు కోతతో తాను- “యింకెంత కాలం” అనుకుంది. తెల్లారేసరికి ఊరిబాటలో శవమై తేలిపోయింది సౌభాగ్య దెబ్బమీద చావుదెబ్బ తిన్నాడు ముకుందరావు.
114 వేణు సంకోజు అప్పుడుకాదు. నడుములు యిప్పుడు మరింత గట్టిగా విరిగినట్టు హతాశుడైపోయినాడు. సౌభాగ్య మృతికి కన్నీరుమున్నీరైనాడుసరే ఒకింత పిచ్చివాడుగా కూడ మరిపోయినాడు.
సౌభాగ్య తల్లిదండ్రులు పిల్లలను తాము పెంచుతామని అతికష్టంమీద ముకుందరావును వొప్పించి తీసుకపోయినారు. ఆ పిల్లలనాయనమ్మ, తాతయ్యల పరిస్థితి ఘోరాతి ఘోరమైపోయింది. అయినా తప్పదు," తీసుకుపోతే వాళ్ళ యినా బతికి గింత అన్నానికి నోచుకుంటారనుకున్నారు. తనకు అప్పుపెట్టిన వాళ్ళందరినీ పిలిపించుకొని ముకుందరావు వొప్పగింతలు పెట్టినాడొకరోజున, ఆరోజు వూరువూరుగాకుండా పోయింది. ఊరు దుఃఖసాగరమై పోయింది. ఎడారి యిసుక దిబ్బయి పోయింది వూరు ఒకరాయిలాగున, ఒకశిలువలాగున మారిపోయినాడు ముకుందరావు. ఒక్క ప్రభాకర రావుకు తప్ప అందరి బాకీలూ తీర్చానని అనిపించుకున్నాడు.
వారంరోజులు వాతావరణమంతా శ్మశాన నిశ్శబ్దమైంది. యాంత్రికంగా జనం సంచరిస్తూ వుండిపోయారు. ఎవరూ యింకెవరినీ ఆత్మీయంగా పలకరించుకోలేక పోయినారు. ప్రతి వొాక్కరూ యింకొకరినుండి తప్పించుకుంటూనన్నట్లు తిరగసాగినారు. అంధకారం తప్ప అఆపూరికి వెలుతురయ్యేయోగం లేదన్నట్టుగావుండి పోయినారు. కాలచక్రం ఆగి పోయిం దన్నట్టుగా వుంది వూరివాలకం.
“అయ్యో ముకుందరావు అయిపోయినాడు. బాయికాడ కరెంటు మోటరుకు కట్టేసుకోని కాలిపోయి- కుప్పగూలి పోయినాడం”టూ చూసినవారు రొప్పుతూ, పరుగెత్తుకుంటూవచ్చినారు. ముకుందరావుయిల్లు బార్గాతెరిచివుందిగాని ఎవ్వరూకనిపించలేదు. ముసలివాళ్ళిద్దరూ ఎక్కడికి పొయ్యింది తెలియదు. ఊరువూరంతా గాలించినారు. ముసలివాళ్ళ జాడతెలియలేదు. ముకుందరావు శవాన్ని ఊరివాళ్ళే ఛితిమీదికి చేర్చినారు. ముకుందరావు యింట్లో కనిపించిన ఉత్తరంలో వున్న ఫోను నెంబరుకు ఫోను చేసినారు కొన్ని గంటలకు వూరిజనం 'ప్రభాకర్‌రావు రాగానే అతనికి వుద్దేశించిన ఉత్తరాన్ని అతడి చేతికిచ్చినారు. అదిచదువుకున్న ప్రభాకర రావు కళ్ళవెంట కన్నీరు ధారగా (్రవిస్తూ వుంది. అప్పటికే అక్కడికి చేరిన సౌభాగ్య తల్లిదండ్రులనూ, పసిపిల్లలనూ చూసి వాళ్ళవద్దికి వెళ్ళి ఉత్తరాన్ని అమ్మాయి చేతిలో పెట్టినాడు.
స్పర్శ 15 అబ్బాయి చేతికి తలగోరు యిచ్చి సహాయపడుతూ ముకుందరావు ఛితికి నిప్పంటించి ప్రభాకరరావు తిరుగు ముఖం పట్టినాడు. పాపాయి చేతిలోని కాయితం ఛితిమంటలు ఎగిసే కొద్దీ ఎరుపు ఎరుపుగా మెరుస్తూ వుంది. ఆవెలుతురులో అమ్మాయి చేతినుండి ఉత్తరం తీసుకున్నాడు సౌభాగ్య తండ్రి అక్షరాల అందంగా, పొందికగా ముకుందరావంత గొప్పగా పెద్దలు ప్రభాకరరావుగారికి మాయందు దయతలచి, మా అభివృద్ధినికోరి, మమ్ములను వెదుక్కుంటూ వచ్చి, పెద్ద మనస్సుతో, వ్యవసాయం మీది (ప్రేమతో అంత పెద్దమొత్తాన్ని అడుగకుండానే అప్పుగాయిచ్చిన మీ బెదార్యానికి ఏమిచ్చిన నారుణంతీరదు. ఈలేమి అనారోగ్యదశలో, ఈఅవిటి స్థితిలో నన్ను నేనుమీకు ఆజన్మాంతం కుదువబెట్టుకున్నా తక్కువే కాని ఏం ప్రయోజనం, ఆవిధంగాకూడా నేను మీకు అదనపు భారమే అవుతాను. మా యిల్లు ఏపాటి చేస్తుందో తెలియదు. మా తల్లిదండ్రులను వొప్పించాను. వాళ్ళు మీకు అభ్యంతరం చెప్పరు. మాయిల్లు తీసుకుని ఈ జన్మకునన్ను రుణ విముక్తుణ్ణి చెయ్యండి. ఇటు మీరుణగ్రస్తుడు ముకుందరావు 2 “ఇది మీ అమ్మామ్మ తాతయ్యల వద్ద భద్రపరుచుకోవమ్మా' అని ఆ పాపాయిని సముదాయించినాడు. విషయమేమిటో ఆ పసి పాపకు అర్ధం కాలేదు. (రచనా కాలం 30, 06 2003)
16 వేణు సంకోజు స్పర్శ
ప్రజలు ఆమె వైపు తదేకంగా చూస్తూ పోతుంటారు. ఆమె వర్భస్సు అటువంటిది. ఆమె కట్టూ బొట్టూ తీరూ అటువంటిది. ఆమె రీవి అటువంటిది. శాపవశాత్తు ఆమె ఆ కొట్టుకు పరిమితమైనట్టుంటుంది. ఆమె గాజులు అమ్ముతూండటమనేది నిజం కాదు - కలలు అన్నట్టుంటుంది. గౌరవర్ణం, తీరైన అందం. విశాలమైన కళ్లు. అంతే అందమైన విగ్రహం, ముచ్చటైన పలువరుస. ఆ ప్రాంతానికింతా ఆమె అప్రకటిత రాణిలా వుంటుంది. అయితే యిష్పుడామె ఒక మౌన సామ్రాజ్ఞి. ఆశలు రాలిన వృక్షం. దిగులునే నెమరువేసుకునే ఏకాకి. తన పేరు మీద తానె రోసిన ఒక ఖిన్నురాలు. ఒక నాటి శ్రీనిధి. ఇవాళ కష్టాలకడలిలో మునిగిన గంగ - గంగాభవాని
సీతారామయ్య అడ్వకేటు. బార్లో నలుగురితో నవ్వుతూ, చలాకీగా మాట్లాడుతూ, ఉదయం నుండి సాయంత్రం దాకా ఎంతో బిజీగా ఉన్నానని పించుకుని ఇల్లు చేరుతుంటాడు. అలసి పోయినట్టుగా బోలెడంత ఆపసోపాలు పడుతుంటాడు. “హమ్మయ్య అంటూ నిట్టూరుస్తుంటాదు. చక్కరలేని టీ తాగి నడుం వాలుస్తుంటాడు.
పేరు లాయరే గాని దమ్మిడీ ఆదాయం లేని సీతారామయ్య ఖర్చులకేమీ కొదవలేదు. అవసరానికి మించిన ఆదాయం - ఆదాయమంటే వారసత్వ సంపద వుంది. ఊరికే వుందడమెందుకని ఎల్ఎల్బీ తరువాత ఎలెలెం కూడా చేశాడు ఊరికే వుండటమెందుకని హిందీ విద్వాన్ రాశాడు. ఊరికే వుండటమెందుకని సంగీతం గురించి వ్యాసాలు, బోలెడు పుస్తకాలు చదివాడు. వేల కేసెట్లు, వందల సీడీలు కొన్నాడు. సంగీతసాధన చెయ్యడుగాని వినడం గంటల తరబడి చేస్తాడు గాయకుడినని కూడా అనుకుంటాడు గనుక పాడతాడు. పాట చెబితే సినిమా
స్పర్శ 17 పేరు, సంగీత దర్శకుడిపేరు, గాయకుల పేర్లు కంరోపారంగా అప్పజెపుతాడు. డొక్క శుద్ధితో పాటు ధారణశక్తికూడవుంది గనుక ఆయా సందర్భాను సారం తనకు నచ్చిన కవితోక్తులను ఉటంకిస్తూవుంటాడు.
శ్రీనిధికి యిద్దరు కొడుకులు. అందులో ఒకడు డాక్టరు, యింకాకడు ఇంజనీరంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే, తన యిద్దరు కొడుకుల మధ్య ఆమె ఒక అక్కో చెల్లెలో అని పిస్తుంది గాని అమ్మ అనిపించదు. ఆమెకు అభ్యంతరం లేదు గాని ఆమె యేదైనా యాడ్ కార్యక్రమంలో పాల్గొంటే మాత్రం సీతారామయ్యకు సుతరాము యిష్టం వుండదు. ఆమె అందమే కాదు. ఆమె పరిమళం, ఆమె దగ్గరితనం కూడా అంగుళం దూరమైనా అతడు భరించలేడు. “ఇటువంటి భర్తలు కూడ వుంటారా అనిపించేంతటి అంధ్ర (ప్రేమాసుకక్తి అతనిది.
శ్రీనిధికి తను అందగత్తెననే స్పృహతోబాటు భర్రకన్న తెలివిగలదానినన్న అభిప్రాయం పెద్దది. అయినా సరే, ఆమె మీద అనురాగం హెచ్చుతుందే గాని సీతారామయ్యకు తగ్గదు. ఆ మాత్రం అహం, అంతటి అందగత్తెకు గాక మరెవరి కుంటుంది? ఆమెకు వుండి తీరవలసిందేనని కూడా అనుకుంటాడతడు. మునుపటి కన్న మిన్నగా ఆరాధిస్తుంటాడు. పిసరంత కూడా లెక్కలేదామెకు సీతారామయ్య అంటే. అ తృణీకార భావాన్ని. భరించటమే. కాదు, అభిమానిస్తుంటాదు కూడ అతడు.
ఇద్దరు సంతానం కలిగాక, భార్యకు బాధకలుగుతుందని చెప్పి అతడే కు.ని, ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆమె కళ్లు కాస్త భారంగా కనిపించినా భరించలేడే! ఆమె పెదాలు వణుకుతాయేమో ఎప్పుడైనా అనిపిస్తేనేదీ విలవిలలాడి పోతాడే- ఆమెకు చెమట పడుతుందేమో ననిపించినంత మాత్రాననే సహాయ పడేందుకు జేబు రుమాలు రెడీగా వుంచుకుంటాడే- అటువంటామెను ఏకంగా ఆపరేషన్ చేయించి వేధించడమే! అసంభవం అనుకున్నాడు. ఒక కొడుకే చాలని తానన్నప్పుడు శ్రీనిధే సిద్ధంకాలేదు. బలవంతంగానైతేనేమి, ఆమె కోరింది గనుక రెండవ సంతానానికి పూనుకున్నాడు. అంత అపురూపంగా చూసుకున్నాడు సీతారామయ్య భార్య శ్రీనిధిని. పిచ్చిగా ఆరాధించాడు.
18 వేణు సంకోజు
ఒక కొంత కాలంగా శ్రీనిధిలో మార్చును గమనించి లోలోపనే కుమిలిపోసాగాడతడు. ఆమె అతికష్టంగాగాని పెదవి మీదికి కాస్తంత నవ్వ తెచ్చుకోదు. తన అభిరుచుల్లో దేనినీ గుర్తించదు. ముక్తసరిగానే మాట్లాడుతుంది. అన్నం తినేటప్పుడు కూడ పరధ్యానంగా వుంటుంది పడకమీద యాంత్రికంగా వుంటుంది.
ఆమె భుజాలు పట్టుకొని, ఆమె కడుపులో తల పెట్టి భోరున ఏడవాలని పించింది. సీతారామయ్యకు, తనను కనికరించమని, (ప్రేమను వర్షించమని ప్రాధేయ పడాలనిపించింది. కాని ఆమె తన పక్కన నిలబడేందుకైనా యిష్టం కాదన్నట్టు సంచరిస్తున్నదే! అలిగిన తాజ్‌మహల్ లా వుంటున్నదే!....
అవును, తన పాలిట ముంతాజ్మహలే ఆమె ముంతాజ్ మహల్నిమించిన తాజ్‌మహల్ ఆమె కోటాను కోట్ల తాజ్‌మహల్ ఆమె. ఎందుకిట్లా మౌనంగా, మ్లానంగా వుంటున్నది? ఎప్పటిలా తాజా పరిమళం వీచదేమి ఆమె వద్ద? ఆమె కదలికల్లో ఆనాటి నాదాలేవి? ఆమె పాదాలలో అప్పటిలయలు- విన్యాసాలేవి?
బుర్రవేదెక్కి పోతున్నది సీతారామయ్యకు. ఎంత ఆపుకున్నా ఆగని దు:ఖంతో లోలోపలే దగ్ధమై పోతున్నాడు. అగరువత్తిలా కాలిపోతున్నాడు.
తన వల్ల ఏమైనా తప్పు జరిగిందా? తనలో అంతకు మునుపెన్నడూ కానరాని లోపమేమైనా బయట పడిందా? తనంటేనే ఆమెకు మొహంమొత్తిందా? ఇంత కన్నా యింకేం ఆలోచించలేక పోయాడతడు. అతని వశంకాకుండా పోతున్నదిక. స్వయంగా అడుగుదామని అనేక మార్లు నోటిదాకా వచ్చింది. కాని, సాహసించలేక పోయాడు. సాహసించడానికే ముంది? ఆమెలో అటువంటి అభిప్రాయం ఎదుకుంటుంది? అంతా తన వికారంగాని..... అనుకునిమిన్న కున్నాడు తనను తాను సంభాళించుకో జూశాదు. కాని కుదరలేదు. కుదరక పోయినా తప్పదు భరించవలసిందే.. కళ్లు అనూహ్యంగా చెమ్మగిలుతుంటే, ఎవరికీ అగుపించకుండా జాగ్రత్త పడ్డాడు.
ఏం లోటు చేశాడు తను? ఆమె కోసం ఒక అందమైన ఇల్లు కట్టించాడు. ఇల్లంతా పాలరాతితో, గోడలనిండా అద్దాలతో, డబ్బుకని ఎక్కడా రాజీపడకుండా చూసుకున్నాడు. గదిలో ఏమూలనున్నా అనేక అద్దాలలో అందాలతో శ్రీనిథి ఆకృతులు అనేకానేకం అగుపించేలా చూసుకున్నాడు. ఆమెకు బంగారం మీద మక్కునని [ష్రాఫ్ బజారునే ఆమె దోసిళ్లలో గుమ్మరించినంత పనిచేశాడు. ఆమె
స్పర్శ 19 కోసం సర్వస్వం వదలుకొనేందుకు సన్నద్ధమయ్యాడు. ఆమెకున్న చీరలూ, జాకెట్లూ అంతంత మాత్రపు ట్రక్కులకెత్తలేము. లారీలైతేనే సరిపోతాయన్నంతగా కొని పెట్లాడు. ట్
కారణం ఏదైతేనేం, ఎడం అనేది ఏర్పడిందని అర్ధం కావడానికి చాలాకాలమేమి పట్టలేదు సీతారామయ్యకు శ్రీనిధి తనను ఉద్దేశ పూర్వకంగానే దూరం చేసుకుంటున్నదన్న విషయం అత్యంత బాధాకరమైనదే, దుర్భరమైనదే అయినా సత్యం లోక విధితం కావడమన్నది అంతకాన్న దుస్సహమైన దనుకున్నాడు సీతారామయ్య, అందుకనే ఏమీ జరగనట్టుంటున్నాడు. ఇది మరో ఘోరంగా, అసహ్యంగా అనిపించింది శ్రీనిధికి. తన అసహ్యాన్ని వ్యక్తపరుస్తూనే వుంది ఏదోరకంగా. దాన్ని భరించేందుకే సిద్ధపడ్డ సీతారామయ్య అంతటి అవమానాన్ని కూడా జీర్ణం చేసుకోవడానికి అలవాటు పడ్డాడు. 'ఒక మగవాడికి యింతటి సహనమా' అని ఉక్రోషంతో ఊగిపోయింది శ్రీనిధి.
ఆ రోజంతా కాలుగాలిన పిల్లిలా యిల్లంతా కలియ దిరిగాడు సీతారామయ్య, ఆ ఒక్క రోజుననే వెయ్యిసార్లు మరణించి నంతటి బాధకలిగింది. కలుపులు బిగించుకుని కూర్చున్నాడు. నిజంగా మరణించడానికి యింతకన్న కారణంగాని, సందర్భంగాని వుండవనుకున్నాడు. అందుకోసం ఏర్పాట్లు చేసుకునే నిర్ణయాని కొచ్చాడు.
తలుపు చప్పుడైంది.
వెళ్ళి తలుపు తీశాడు.
ఎదురుగా శ్రీనిధి.
అలసిన అందం. అహం మాత్రం తగ్గలేదు. ముఖంలో ఎటువంటి భావమూ లేదు. నదురూ బెదురూ లేదు. చాల క్యాజువల్‌గా లోనికి ప్రవేశించింది. గదిలోకి వెళ్లి ఈజీచైర్లోవాలింది. ఒక అందమైన గున్న ఏనుగులాగా, ఒక లేలేత తెల్లని గుర్రంలాగా ఆమె కుర్చీలో వాలింది తలుపు వేసుకోలేదు కళ్లు మూసుకోలేదు. ఒక పిల్ల జమిందారులాగా విద్యుత్ కాంతికి మెరుస్తూ రంగులీనుతూ వుంది.
మొట్ట మొదటిసారి ఆ అందాన్ని చూడలేక పోయాడు సీతారామయ్య తొలిసారి శ్రీనిధి ఆతనికి అందవిహీనంగా అగుపించింది. తన చేజేతులా పాలరాతి తాజ్‌మహల్‌ను చిదిమేసినట్లుగా పళ్లు కొరుక్కున్నాడు. ఆ దృశ్యానికి దూరంగా కదలిపోయాదు.
20 వేణు సంకోజు మరునాడు ఇల్లంతా మౌనం పాటించింది. ఇంటిల్లిపాది యంత్రాలైపోయారు. అంగుళం అంగుళం నేలా ఉక్కబోతతో విసిగిపోయింది.
ఏమీ జరగనట్టే ఉండి పోయింది. శ్రీనిధి.
ఏమీ ఎరుగని సంతానం - శ్రీకాంత్, శ్రీధర్‌లు తల్లిదంద్రులను తిరుపతికి తీసుకెళ్లేందుకని వచ్చారు. - తమ తమ కార్యక్షేత్రాల నుండి కిటికీ సందుల్లోంచి గాలి చొరబడినట్లు ఒకింత అలజడి.
హడావిడంతా ఆనాడు కారు గదైవరు కనకయ్యదే అయ్యింది.
ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత ఆనందంగా, అందంగా మసలుకొన్నది ఆనాడు శ్రీనిధి. తిరుమల మీదంతా ప్రమోద్గమే చిరంజీవులకు. ప్రకృతి రమణీయతకు ముగ్ధులై వారు ఫోటోలు తీశారు. తీయించుకున్నారు. ఆడారు, పాడారు, పరుగులెత్తారు పాడటమెందుకంటే తండ్రి చేత పాడించటం కోసం. ఎప్పుడూ అడగగానేవారి కోర్కెను తీర్చే సీతారామయ్య ఆనాడు పూర్తిగా విఫలుడయ్యాడు. తొలిసారి చిరంజీవులు తమ తండ్రి ముఖంలో విషాదాన్ని రవంత కంటతడిని చూసి నిర్చాంతపోయారు.
“ఏం నాన్నా ఆరోగ్యం బాగాలేదా?” అని అడిగాడు - ఒక విధమైన భయమూ బాధతోకూడ. అదేం లేదంటూ మెత్తగా అబద్ధం చెప్పి తప్పుకున్నాడు సీతారామయ్య. అంతటితో వాతావరణమంతా గంభీరంగా మారిపోయింది. అంతా అక్కడి నుండి బయలుదేరి యిక తాముంటున్న కాటేజీకి చేరుకున్నారు.
పిల్లల పలకరింపు తోనే తెల్లవారింది సీతారామయ్యకు. వాళ్ల కళ్లు ఎర్రబారి వారి తీరులో ఎంతో మార్చు. అది గమనించిన సీతారామయ్య ఎలాగో ఫీలయ్యాడు. అనునయంగా 'అదేమిటి నాన్నా అలా వున్నారు?” అనే వంతు తనదైంది.
“మనం యిక్కడ ఒక్క క్షణం కూడా వందకూడదు బయలుదేరునాన్నా! అన్నారు.
“ఏం నాన్నా - యిక్కదేమైనా బాధ కలిగిందా? ఎవరైనా మీకు యిబ్బందేదైనా కలిగించారా? అడిగాడు సీతారామయ్య చిరంజీవులనుద్దేశించి.
“బాధ, యిబ్బంది మీకు నాన్నా మాకు కాదు అన్నారు. చిరంజీవులు.
స్పర్శ 2]
నిర్దాంతపోయాడు సీతారామయ్య తన కొడుకుల మాటలు విని. “అదేమిటి నాన్నా-నాకేం జరిగిందని అలా బాధపడుతున్నారు? అనడిగాడు తన బాధను కప్పిపుచ్చుకునే విఫలయత్నం చేస్తూ.
“వాలు నాన్నా చాలు. ఇంతకాలం మీరు అనుభవించిన నరకం, భరించిన రంపుపు కోత చాలు. మేమెక్కడ బాధపడతామోనని మిమ్మల్ని మీరు వంచించుకోవడం యికచాలు. ఉన్న ఫళంగా బయలుదేరండి అంటూ తండ్రి చేయిపట్టుకొని అర్ధించారు.
సీతారామయ్యకు దు:ఖం ఆగలేదు. ఇద్దరు కొడుకులను పట్టుకొని పసివాడిలా ఏడ్చాడు అంతటి దుఃఖం లోనూ, మరి మీ అమ్మ... (ఏమౌతుందన్నట్లుగా) అడిగాడు.
“ఆమె మా అమ్మకాదు” ఒక్క సారే జవాబిచ్చారు చిరంజీవులు. శ్రీనిధి, డైవరు కనకయ్యా కనిపించలేదు
చిరంజీవులు (దైవు చేయగా సీతారామయ్య తిరుగు ప్రయాణం చేశాడు.
“మీదింకా నడీడు వయస్సే. ఈ పరిస్థితిలో మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినంత వరకు మీరే నిర్ణయం తీసుకున్నా మాకెటువంటి అభ్యంతరమూలేదు. పూర్తిగా సమ్మతమే” అన్నారు పిల్లలు.
ఏ దుస్టితైతే, ఏవిష ఘడియ అయితే, ఏ లజ్ఞాకరమైన సందర్భమైతే రాగూడదని, వచ్చినా దాచివేయాలని తాను యింత కాలమూ తాపత్రయపడుతూ వచ్చాడో అదిరానే వచ్చింది. స్వంత కొడుకులే యివాళ తల్లిని అసహ్యించుకుంటున్నారని కుమిలి పోసాగాడు సీతారామయ్య.
మరునాడు ఎవరి కార్యక్షేత్రానికి వారు వెళ్ళిపోయారు పిల్లలిరువురూ
ఎన్నడూ లేని ఏకాంతాన్ని భరింపరాని ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు సీతారామయ్య, ఇంటిలోని ప్రతి తలుపూ, ప్రతి కిటికీ రెక్కా ప్రతి ఫ్రేమూ, ప్రతి మూలా, 'ప్రతిగదిలోని పెయింటింగులూ, అలంకరణలూ, అన్నీ తనను అపహాస్యం చేస్తూ, గేలి చేస్తున్నట్టున్నాయి. అన్నింటిలోనూ ఆమె ముద్ర మిక్కిలిగా పరిహరిస్తున్నట్టు, చిత్ర పధగావిస్తున్నట్టుగా వుంది.
22 వేణు సంకోజు
మూడు రోజుల్లో ఆ యింటిని విడిచి వేరే అద్దె యింటికి మారాదు సీతారామయ్య. అపరాధ భావంతో ఒక దోషిలాగా, ఒక కాందిశీకుడి లాగామారాడు. ఎవరినైనా కలుసుకోవడం, ఎవరితోనైనా మాట్లాడడం మానేశాడు. తనకు తానుకూడా అందుబాటులో లేనట్టుగా, యిరుకు - యిరుకుగా భావిస్తూవుండిపోయాడు.
రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి.
సడెన్‌గా ఒక రోజు లాయర్ నోటీసు వచ్చింది. మూడు నాలుగు ముద్రలతో రీడైరెక్టయిన విషయాన్ని స్పష్టం చేసిందది. దానిని అందుకుంటూ ఆశ్చర్యపోలేదు సీతారామయ్య. సజలనేత్రుడు మాత్రం అయ్యాడు. “ఆమెకు నేనేం అన్యాయం చేశాను” అనుకున్నాడు లోలోపలే,
రాజేంద్ర తన చిననాటి మిత్రుడే. ఫోను చేసిందే తడవుగా వచ్చి వాలాడు. పిచ్చివాడా - నిన్ను దేవుడి వంటి నిన్ను కాదని కామాంధురాలై కన్నకొడుకులను కూడ వొద్దని వెళ్ళిపోయిన, కాదు లేచిపోయిన ఆమె కోసంయింకా తాపత్రయ పడతావేమిటి? అవివేకం కాకపోతే.... అన్నాడు లాయరురాజేంద్ర.
“దయచేసి లేచిపోయింది వంటి మాటలు వాడకురా” అన్నాడు సీతారామయ్య కళ్లు వత్తుకుంటూ.
“నీ ఖర్మ. ఇంకా పలచనౌతావా? ఆమె కాదంటే ఏ చేస్తావో? గద్దెస్తున్నట్టుగా ప్రశ్నించాడు రాజేంద్ర.
“ఆమె యిష్టాన్ని ఎప్పుడూ కాదనను. కాని నేనుగా ఆమెకు విడాకులివ్వను. ఆర్తి నిండిన స్వరంతో, గొణుగుతున్నట్టుగా, ఎవరికో నివేదించుకున్నట్టుగా చెప్పాడు సీతారామయ్య.
“అయితే యిష్పుడేం చేద్దామంటావ్”? విసుగును దాచుకోలేక అడిగాడు రాజేంద్ర. “నీవే ఏదైనా ఆలోచించు” జవాబిచ్చాడు సీతారామయ్య,
“అయితే, ఒక మధ్యవర్తి ఉన్నాడు. బాగా చదివినవాడు. పెద్ద మనిషి ఆయనతో చెప్పించి చూద్దాం- ఆఖరి ప్రయత్నంగా'- అని రాజేంద్ర అన్నాడో లేదో “వెంటనే ఆ పని చేయరా ఎంత ఖర్చయినా సరే అని ఆశగా అన్నాడు సీతారామయ్య. కోర్టు ఆవరణ ఏ మార్చు లేకుండా - ఎడారికాని ఎడారిలాగా- అడవిగాని అడవిలాగా - మనషులను బలిచ్చే కబేళాలాగా, వికృతంగా,
స్పర్శ | 23 వికారంగా, హడావిడిగా వుంది. ఏ కొందరి ముఖాల్లోనో (నల్లకోట్లు) తప్ప అందరి ముఖాల్లోనూ దైన్యత.
దూరాన చెట్టుకింద శ్రీనిధితో మాట్లాడుతూ జడిపూడి సత్యారావు. ఆమె తలవంచుకుని నేలను చూస్తూనే, కాదంటూ, తల అడ్డంగా తిప్పుతూ, సమాధానమిస్తున్నది.
“అమ్మా! ఆలోచించు. ఇటువంటి తొందర పాట్లు, అనూహ్యసంఘటనలు జరుగుతుంటాయి. వస్తుంటాయి. పోతుంటాయి. రామయ్యకేంకాదు. నీకే అన్యాయం. జరుగుతుంది. వయస్సులో నీకంటే కనీసం నాలుగు పదుల పెద్దవాన్ని ఇవి చేతులే అయినా కాళ్లని ప్రాధేయపడుతున్నాను. జీవితంలో చాల డక్కాముక్కీలు తిన్నాను. చాలమంది జీవితాలను దగ్గరగా పరిశీలించాను. నీ రత్నాల్లాంటి యిద్దరు కొడుకులను తలచుకో. ఆలోచించి ఆఖరు మాట చెప్పు. దయచేసి అభిప్రాయమార్చుకో” అంటూ బ్రతిమాలాడు సత్యారావు,
ఆఖరు మాటగా, తల ఎత్తకుండానే, కాదంటూ తన అడ్డంగా ఊపింది- శ్రీనిధి. దూరంగా నిలిచి వున్న సీతారామయ్య, రాజేంద్రల వద్దకు వచ్చి విచారవదనంతో వివరించాడు సత్యారావు.
“అయితే నష్టపరిహారం అడిగిందా? - ప్రశ్నించాడు రాజేంద్ర
“ఆ అడిగింది. రెండు లక్షలు” అన్నాడు సత్యారావు.
“ఓస్ అంతేనా! ఇరవై లక్షలడిగినాయిచ్చేవాళ్లం” అని మిక్కిలి సంతృప్తిని వ్యక్తం చేశాడు రాజేంద్ర. 'పాపం' అని గొణిగాడు సీతారామయ్య,
“అవును పాపమే మరి! పొయ్యేకాలం కదా!” అని విసుక్కున్నాడు రాజేంద్ర “కనీసం ఐదు లక్షలన్నా యిద్దాం రాజేంద్రా' అని ప్రాధేయ పూర్వకంగా అడిగాడు సీతారామయ్య.
“అక్షర్లేదు, ఇస్తానంటున్నావు గనుకయింకో యాఖైవేలు ఎక్కువిడ్దాం. ఆ అహంకారికి అదే ఎక్కువ” అని రాజేంద్ర అనబోతుంటే-
“వద్దు రాజేంద్రా ఆమెను అహంకారి అనకు. ఆమె అహంకారి కాదు. దురదృష్టవంతురాలు” అన్నాడు గాద్గదికంగా సీతారామయ్య, అతని తీరుకు సత్యారావు కళ్లుచెమర్చాయి.
24 వేణు సంకోజు విజ-ఐలు మంజూరై మూడు సం॥లు గడిచాయి.
అతికష్టం మీద రాజేంద్ర, సత్యారావులు కుదిర్చిన సంబంధం యిష్టపడ్డాడు సీతారామయ్య, పునర్ వివాహానికి మంగతాయారు ఒకటే కండిషన్ పెట్టింది. - రామేశ్వరం చూపెడితేనే వివాహం చేసుకుంటానని.
“శనేశ్వరం తప్పుతుందంటే రామేశ్వరం ఒక్కసారేమిటి- ప్రతియేడూ చూపెట్టుకొస్తాడు మావాడు” అన్నాడు రాజేంద్ర. అందరూ ఘోల్లుమన్నారు.
నిరాడంబరంగా జరిగింది పునర్వివాహం.
అన్న ప్రకారం సీతారామయ్య మంగతాయారు కోరిన ప్రదేశాలన్నీ చూపెట్టాడు- తాను విడిచి పెట్టిన యింటిని తప్ప ఆమె కూడ రెట్టించలేదు. అది అతనికి ఎంతో నచ్చింది. తాను వూహించిన సుఖాలకు, సౌఖ్యాలకు అతడు వారసురాఖిని చేసినందుకు కృతజ్ఞతా పూర్వకంగా ఎవ్వరూ ఊహించనంత (ప్రేమతో చూడసాగింది. పిల్ల వాళ్లు కూడ ఆమెనే స్వంత తల్లికన్నమిన్నగా భావించారు.
దేవీ నవరాత్రులప్పుడు జనం రద్దీ ఎక్కువగా వుంటుంది గనుక రద్దీలేని సమయంలో కనకదుర్గ దేవాలయానికి వెళ్లారు మంగతాయారు, రామయ్య ఒకచోట ఆగిపోయాడు సీతారామయ్య - మంగతాయారు. గాజులు తెచ్చుకుంటానంటే అతని చూపులు శ్రీనిధి మీదికి మళ్లాయి. ఆశ్చర్యపోయాడు. ఒకింత గతుక్కుమన్నాడు కూడ ఆమె వాలకం చూసి (దైవరు కనకయ్య మూడునెలలకే వదిలి పెట్టాడని కర్టాకర్జిగా వినియున్నాడు.
ఆకొట్టూ ఈ కొట్టూ చూసి మంగతాయారు సహజంగానే శ్రీనిధి కొట్టుకు వెళ్ళడాన్ని దూరాన్నుంచే గమనించసాగాడు రామయ్య.
“క్రార్రులో వచ్చినట్టున్నావు చెల్లీ దృష్టిని మరల్చకు” అంటూ, కోరిన గాజులు తొడుగుతూ. ఉచిత సలహాయిచ్చింది మంగతాయారుకు శ్రీనిధి ఉరఫ్ గంగాభవాని. మంగతాయరు చేతి గాజులను లాలనగా నిమురుతూ సజల నేత్రుడయ్యాడు సీతారామయ్య: ఇప్పుడతని చేతి వేళ్ళకు మళ్ళీ తోచీ తోచని శ్రీనిధి స్పర్శ!
గ(నంతకం” మానవత్రిక ఆగస్టు 200%)
స్పర్శ 25 ఫంక్షన్ యి
ఇంకెవరైనా పిలిచి వుంటే ఆలోచించేవాడిని. కాని పిలిచింది శ్రీధర్. శ్రీధర్ని ఎట్లా కాదనగలను? అనారోగ్యంగా వున్నా జ్వరం కాస్తున్నా వెళ్లి రావల్సిందే. బయలుదేరాను. నూట నలఖై కిలోమీటర్లు ప్రయాణం చేయవలసిందే. తప్పదు. ఇదేమంత పెద్ద పండుగ కాదు. అరుదైన వేడుక అంతకన్నా కాదు. వెళ్ళకపోతే కొంపలేమీ అంటుకుపోవు. కాని, గౌరవం- అతడి పట్ల అతడి తీరు పట్ల, అతడి భావాల పట్ట కార్యాచరణ పట్ల.
శ్రీధర్‌కి ఒక్కతే కూతురు. ఫ్యామిలీ ష్లానింగ్ చేయించుకున్నారు. అమ్మాయి సాధారణంగా వుంటుంది. ఆకర్షణీయమైన కళ్ళూ గట్రా ఏమీ వుండవు. ఫలానా రోజు మా డాటర్ బర్త్‌డే. మాధవ్ నీవు తప్పక రావాలి. ఎక్కువ మందినేమీ పిలవడం లేదు. ఫంక్షన్లో ఆర్భాటాలేమీ వుండవు. ఆర్భాటాలు నాకు నచ్చవు అనేకంటే నాకా స్తోమత కూడా లేదనేదే సిసిలైన సత్యం అంటూ ఫోన్ పెట్టేశాడు శ్రీధర్.
'్రాంక్గా మాట్లాడటం, నిక్కచ్చిగా వుండటం, అట్లా అని చాలా కరినంగా కాకుండా మృదువుగా వుండటం, చల్లని-మెల్లని నవ్వును పెదాల మీంచి జారిపోనివ్వకుండా కాపాడుకోవడం శ్రీధర్ విలక్షణత్వం.
కండక్టర్ టిక్కెట్టు గురించి అడగటంతో ఆలోచనల్లోంచి కాస్త లోకంలో కొచ్చాను. ఏంచేసినా, ఎక్కడెక్కడికి వెళ్ళినా తిరిగి మన లోకంలోనే కదా మనం వచ్చి వాలేదంటూ చాలా సింపుల్‌గా ఆరాతీస్తాడు శ్రీధర్. అతడు వేదాంతి కాని నిర్వికల్పునిలా, సన్యాసి కాని సాధువులా, సనాతనుడైన ఆధునికునిలా తోస్తాడు. తనుకు నచ్చిందేదో అలవోకగా, నిస్సందేహంగా చేస్తాడు. పుస్తకాలు విరివిగా చదువుతాడు. ఐదారు భారతీయ భాషలు ఇష్టపడతాడు. ఇవి చాలవన్నట్లు
26 వేణు సంకోజు (ఫెంచోకటి. అన్నింటికన్నా (ఫెంచి మద్యం గొప్పదని చదివిన తొలి రోజుల్లో మద్యం బాగానే సేవించేవాడు వన్ ఫైన్ మార్నింగ్ హరాత్తుగా దాన్ని మానేశాడంటే తిరిగి ఎన్నడూ ఇకదాని జోలికి పోలేదు.
ఫంక్షనంటే మాధవ్- పార్టీ గట్రా వుంటుందనుకునేవ్. అదేమీ లేదు.” స్వాదిష్ట్ ఏవం పౌష్టికారక్ భోజన్” తప్ప మరేమీ వుండవు. అట్లా అని రావటం మానేసేవ్ నీక్కూడా అవేవీ అంతగా రుచించవని నాకు తెలుసు. నీవు రావటం మాత్రం జరగాలి అని గట్టిగా కోరాడు శ్రీధర్.
శ్రీధర్ మాటలో మెత్తగా శాసించే గట్టితనం, ఇట్టే అంగీకరించే భోళాగుణం వున్నాయి ఏకకాలంలో. అసహనంగా వుంది బస్సులో ఎంతోసేపు కాలేదు బయలుదేరి. కానీ, చాలాసేపే అయినట్టుగా వుంది. జ్వరం తగ్గేట్టు లేదు. మాత్రలు కరిగాయో లేదో గాని చెమటలు... ఒకటే చెమటలు! ఉక్కపోస్తున్నట్లుంది బస్సు. ఒకటా, రెండా నూట నలఖై కిలోమీటర్లు. పై నలబై కిలోమీటర్ల దూరమైనా కడచినట్లు లేదు బస్సు. ఉండకూడనంత అసహనంగా వుంది. అయినా వెళ్ళాలి, తప్పదు. శ్రీధర్ కోసం దేన్నయినా భరించక తప్పదు.
చిన్నప్పటినుండీ శ్రీధర్ ఒకవిధంగా పేదరికాన్ని తింటూ, నంజుకుంటూ గడిపాడు. ఎప్పుడూ తనకన్నా తక్కువగానే మసలుకుంటూ వచ్చాడు. తన స్వతంత్ర ఉనికిని చాటుకునే ప్రయత్నం కాన్నియస్గా చేయకుండా లో ప్రాఫైల్తోనే మెలుగుతూ వచ్చాడు. తనకు తనదూన విలువ, తగిన స్థానం దక్కలేదని ఎన్నడూ కుమిలిపోలేదు సరికదా కనీసం కోరనైనా కోరలేదు
నాన్న చిన్నతనంలోనే పోయాడు. అమ్మ-రత్నమ్మ వంట మనిషిగా బతుకీడుస్తూ అతడిని డిగ్రీదాకా చదివించింది. ఊహ తెలిసినప్పటినుంచీ తల్లికి సాయపడుతూ, పందిళ్ళలో -పెళ్ళి పేరంటాలలో అమ్మ వంటలు చేసి (శమిస్తుంటే, రెక్కల కష్టానికి ప్రతిఫలంగా దక్కిందానితో గడుపకుపోతుంటే, చూస్తూ, ఆమెకు ఆసాంతం రుణపడి వుంటాననుకుంటూ వచ్చి, తోచిందెదో అప్పుడప్పుడూ రాస్తూ, ఎల్లప్పుడూ చదువుతూ వచ్చాడు శ్రీధర్. కొన్నాళ్ళకు జర్నలిస్టుగా స్థిరపడ్డాడు.
జర్నలిస్టుగా వుండటమంటే ఒక ఉద్యోగంలో వుండటంగా అనిపించలేదు అపర్జకు- శ్రీధర్ ఇల్లాలికి. ఇంకో ఫీల్డు ఎన్నుకొమ్మని పోరుపెట్టుకునేది. నవ్వి ఊరుకునేవాడతడు. రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేది అపర్డ, అతడు
స్పర్శ 27 సహిస్తూ, వీలయితే సముదాయిస్తూ పోయేవాడు. ఫర్నిచరూ, బంగారం అంటూ కోరికల చిట్టా పరిచేదతని ముందు అప్పుడప్పుడు. అవన్నీ సాధ్యంకావని , అలా సాధ్యమైనప్పుడు తప్పకుండా తెచ్చుకుందానునే వాడతడు. ఎందుకు సాధ్యంకావని గొడవ పెట్టుకునేది.
ప్రతినెలా తల్లికి డబ్బులు పంపుతూ వుండేవాడు శ్రీధర్. అలా కుదరదని, ఆమే వచ్చి తమ వద్దవుండిపోతే ఆర్థికంగా కలిసొస్తుందనేది అపర్హ. కానీ వచ్చిన రెండుమూడు రోజులకే సొంత వూరికి వెళ్ళక తప్పేది కాదు తల్లికి. తనను చెడ్డదని ప్రచారం చేసేందుకే అట్లా వెళ్లిందనేది అపర్డ. శ్రీధర్ నుంచి ఎటువంటి స్పందనా వుండేది కాదు. జుత్తు పీక్కున్నంత పని చేసేదామె.'అలాగా' అంటున్నట్టుగా ఆ ఒక్క అమాయకపు చూపుకు అవకాశమిచ్చేవాడతడు. అయినదానికీ, కానిదానికీ అపర్జ విసుక్కోవడమే కాక అప్పుడప్పుడు బావురుమంటుండేది. ఆమె కోరికల్ని తీర్చలేకపోతున్నందుకు బాధపడినా, అవి తగనివని సమాధానమిచ్చుకుంటూ పోయేవాడు శ్రీధర్.
పెళ్లయిన రెండో యేడు నుంచే చిన్నపాటి ప్రచ్చన్న యుద్ధం కొనసాగింది అపర్ణ. శాంతి జెందానే ఊపుతూ వచ్చాడు శ్రీధర్. శాంతించలేకపోయిన అపర్ణ ఒకరోజు ఇల్లు విడిచి వెళ్లిపోయింది. కోపంతో తన తల్లిగారింటికి చేరి వుంటుందనుకున్నాడు శ్రీధర్. తరువాత ఆమె అక్కడికి చేరలేదని, ఎవరితోనే ఇంకోచోట కలిసి వుంటోదని తెలుసుకున్న శ్రీధర్ మౌనంగా వుండిపోవడం కన్నా
ఎప్పుడో నెల రెండు నెలల తరువాత మిత్రులకు తెలిపాడు జరిగిన విషయం- చాలా ప్రశాంతంగా, కాస్త గంభీరంగా శ్రీధర్. అవాక్కయ్యాం అందరం. నేనైతే అతడి ముఖంలోకి చూడలేకపోయాను ధైర్యం చేసి. ఆశ్చర్యమేమంటే, మమ్మల్నే ఓదార్చేట్టుగా వున్నాయతని చూపులు!
నేను బాత్రూంలో వుండగా ఫోన్ అదేపనిగా మోగింది. త్వరత్వరగా స్నానం ముగించుకొని బయట పడ్డాను. ఆశించినట్టుడానే మళ్లి ఫోన్. లైన్లో శ్రీధర్. అతడు చెప్ప్తండటం ప్రారంభించగానే ఏకకాలంలో ఆశ్చర్యానికి, చనువుకొద్దీ ఒక విధమైన ఆగ్రహానికి గురయ్యాను. 'చ-ఏం పని చేశాడితడు” అనుకున్నాను. ఎంత పని చేశాడు - కాదు- ఎంత గొప్ప పని చేశాడితడు అనుకున్నాను. గొప్ప పని కాక మరేమిటి? “నేనయితే ఇట్లా చేసి వుందేవాడినా' అని ప్రశ్నించుకున్నాను. కాదని క్షణంలోనే నామనస్సు చెప్పుకుంది. ఆలోచనల్లో పడ్డాను.
28 వేణు సంకోజు
“అదేమిటి మాధవ్ నీ స్పందన లేదు- మౌనం పాటిస్తున్నావు. విచారంగాని ప్రకటించడం లేదు కదా- ఛీ ఇతడితోనా దోస్తానా -అని గాని అనుకోవడం లేదు” కదా అంటూ శ్రీధర్ గట్టిగా అడుగుతూ వుంటే, ఆలోచనల్లోంచి కొంచెం తేరుకునే 'ప్రయత్నంచేస్తూ, 'లేదు,లేదు” అని ముక్తసరిగా రెండుమార్లన్నది మాత్రం గుర్తు. ఆ తరువాత అతడు మరికొద్ది క్షణాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. అయితే, అకొద్ది క్షణాలు కూడా నేను ఆలోచనల్లోనే మునిగిపోయి, అతడు చెప్పిందేమిటో (గ్రహించలేకపోయాను.
శ్రీధర్‌కి దగ్గరగా వెళ్లగలిగిన వాళ్ళం- ఇంచుమించు ఆరాధనా భావంతో మసలుకోగలిగిన వాళ్ళం- ముగ్గురు, నలుగురు మిత్రులం వున్నాం. అయితే అతనికి మేం మాత్రమే మిత్రులమా? కాదు. అనేక మంది మిత్రులు +శ్రేయోభిలాషులున్నారు. ఆమాట కొస్తే మైత్రే అతనికి కరగని, తరగని స్థిరాస్తి. అతదజాత శత్రువు అవునో కాదో గాని శత్రుచ్భ్చాయలు కూడా కనిపించవు అతడెవరితో మాట్లాడినా, ఎవరిని పలకరించినా నింపాదిగా, చిరునవ్వుతోనే అలరారాడు. చేతనైన సాయం చేసిపెట్టినవాడే గాని ఎన్నడూ ఏదీ అర్ధించి ఎరుగడు. అయితే, శ్రీధర్ తొలిసారి పరోక్షంగా కోరిన మేరకే నేనూ, మిత్రులం కలిసి ఒక అమ్మాయిని చూసి, ఆమెతో మాట్లాడి,రెండో సంబంధమైనా సరేనన్న ఆమె సమ్మతితో సర్వసన్నద్ధమై వున్నాం ఈవిడ చాలా బాగుంటుంది. వయస్సును మించిన గాంభీర్యం, హుందాతనం. చురుకైన కదలిక. ఏవిధంగా చూసిన శ్రీధరే ఈమె వల్ల అదృ్భష్టవంతుడౌతాడని అందరం అనుకున్నాం. అదే విషయం అతడికి చెప్పాం. ఫోన్లోనే అతడు బిడియపడి పోయాడు. “ఇక ఈ సంబంధం పక్కా అని మేం మురిసిపోయాం,
ఇది జరిగిన కొన్ని రోజులకే మనవాడి నుంచి ఫోన్. ఏమనాలో, ఏవిధంగా స్పందించాలో పాలు పోలేదు. నేనైతే ఒకవిధంగా డిస్టర్చ్ అయిపోయాను. “ఎందుకు చేసి వుంటాడు శ్రీధర్ ఈ పని" అని పరిపరి విధాల ఆలోచించాను. ఎంత ప్రయత్నించినా సమాధానం దొరకలేదు. ఎక్కడో ఈతడిది చెప్పుకోలేని బలహీనత వుండి వుండాలి కాకుంటే ఇట్లాంటి నిర్ణయం ఎందుకు తీసుకుని వుంటాడనిపించింది.వెంటనే మిత్రులు- రఘు, వేణులతో మాట్లాడాను. వారికి కూడా ఫోన్లు వచ్చాయని. వారు కూడా ఇటువంటి తర్జనభర్జనకే లోనయినట్లు చెప్పారు. అందరం కలిసి వెళ్లి శ్రీధర్‌తో ముచ్చటించి రావాలనుకున్నాం.
స్పర్శ 29 ఎప్పటిలాగే శ్రీధర్ -ఏమీ జరగనట్టు, సాదాసీదాగా, భోళాగా చిరునవ్వును
వాడనీయకుండా, ముఖంలో ఎటువంటి భావమూ ద్యోతకం కానీయకుండా.
ఆశ్చర్యంతో పాటు ఇసుమంత ఆ(గ్రహానికి లోనవడం మా వంతయింది.
ఏం మిత్రమా-ఏమిటి కధా? అడిగాం.
“ఏముంది -నేను తప్పు చేశాను. పొరబాటు తనదే తిరిగి వచ్చేస్తానంది. ఏమనాలప్పుడు నేను? ఛల్! చేసింది చాలు వెళ్ళిపొమ్మనాలి. జరిగిందానికి పశ్చాత్తాప పడుతున్నందుకు లోపలికి రమ్మన్నాను, అంతే” అన్నాడు శ్రీధర్.
“ఎలా చేయగలిగావు శ్రీధర్ ఈపని ? నీకామె మీద కొంచెం కూడ కోపం కలగలేదా? దీనిని క్షమించడమంటామా? జాలిపడటమంటామా? త్యాగం చేశాననుకుంటున్నావా?” అని నిలదీశాం.
“కాదు, మీరనుకుంటున్నదేదీ కాదు. నేనొక సామాన్య -సాధారణ వ్యక్తిని. నాకూ రాగ ద్వేషాలుంటాయి. అయితే ఇంతకన్నా ఏం చేయవలసి వుంటుందంటారు? పశ్చాత్తాపంతో తిరిగొచ్చిన భార్యను తిరిగి అగాధంలోకి తోయవలసి వుంటుందా” అని ఎంతో ఆర్టత నిండిన స్వరంతో అడిగాడు శ్రీధర్.
“భార్య! ఎవరి భార్య? ఎప్పటి భార్య? ఎందుకని వెళ్ళింది? ఎవరితోనో వెళ్ళిపోయినా వాడిని కూడా ఎందుకని వదిలేసింది? తిరిగి ఎందుకు వచ్చింది?” సామూహికంగా ప్రశ్నల పరంపర
“ఏదో కారణం చెప్పొచ్చు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? మరింత మనస్తాపం - ఇంకొంచెం బాధ. అంతేకదా! అడిగి తెలుసుకుని కూడా ఇంతకన్నా చేయగలిగిందేముంది?” తిరిగి ప్రశ్నించాడు శ్రీధర్ కూల్‌గా.
“ఆమె వెళ్ళిపోయి మేలు చేసిందని కదా అనుకున్నాం. ఆమెకూ నీకూ వేవ్ లెంగ్ల్ కలవదని కదా అనుకున్నాం. ఆమె ఇష్టాలు, దాష్టీకం ఏవీ నీకు సరిపడవని కదా అనుకున్నాం” అడిగాం
“ఇమ్మెచ్యూరిటీ అని కూడా అనుకున్నాం కదా!” అన్నాడు శ్రీధర్.
“ఎవరిది ఇమ్మెచ్యూరిటీ ఇప్పుడు ఆమెదా? నీదా?-”
30 వేణు సంకోజు
“నాది కూడా కావచ్చు. పశ్చాత్తాపం చెంది వుండక పోతే--” ఆమె తిరిగి వచ్చేది కాదు కదా!తిరిగి ఆమె మాత్రం ఎక్కడికి వెళ్లగలదు? ఆమె ఆత్మాభిమానం చంపుకుని కదా తిరిగి వచ్చింది ఆమెనిప్పుడు ఏమని మాత్రం ఏమిటి ప్రయెజనం?
“ఆమె తెలివిగా నటిస్తూ వుండవచ్చు కదా” అన్నాం మేం.
కావచ్చు. అయినా, ఆమె నటనతో, యధార్ధంతో నాకు పనేమిటి? తనంతట తానే వెళ్లిపోయింది. తనంతట తానే తిరిగి వచ్చింది. తన చర్యలకు తనదైనతర్మం తన వద్ద వుందే వుండవచ్చు. ఆమె స్థాయిలో ఆమె ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వుండవచ్చు అవి ఆమె దృష్టిలో తప్పు కాకపోవచ్చు. మనకవి తప్పుగా అనిపించవచ్చు. ఆమె ఆమెలాగే ఆలోచించి వుండవచ్చు. అందుకే ఆ విధంగా ప్రవర్తించి వుండవచ్చు. ఆమె తప్పాప్పులు తేల్చి చెప్పగల ఇంగితం మనకు వుంటే వుండవచ్చు కాని, తేల్చి చెప్పే అధికారం మనకు మాత్రమే వుంటుందా?”- సాలోచనగా అన్నాడు శ్రీధర్.
“మేమైతే నీలా ప్రవర్తించి వుండగలిగే వాళ్లం కామేమో! కనీసం నామట్టుకు నేను నీలా ప్రవర్తించి ఆదరించి వుండేవాడిని మాత్రం కాదు” చాల కరింనంగా అన్నాడు రఘు.
“ఇంకా అమ్మాయి దొరకదేమో, అమ్మాయిని ఇవ్వజూపరేమోనని మనవాడికి అనుమానం వచ్చి అలా ్రవర్తించి వుంటాడు” అన్నాడు కొంచెం కసిగా వేణు
అది విని నిరాస్తకంగా, ఒక బలహీనమైన నవ్వులాంటి ప్రతిస్పందనను కనబర్బాడు శ్రీధర్. అతనిలో ఎటువంటి అసహనమూ ధ్వనించలేదు.
సుమారు ఆరు సంవత్సరాల తరువాత తిరిగి వచ్చిన అపర్జలో ఎటువంటి మార్పూ కనిపించలేదు. ఇల్లు మార్చనందుకు , పెద్ద పోర్షన్లోకి మారనందుకు నిలదీసింది. పెద్ద ఇల్లొకటి కట్టనందుకు, కనీసం కట్టిన ఇల్లయినా కొనుగోలు చేయనందుకు గోలచేసిందామె. ఇది జీవితాంతం తప్పనితీరేనని అనుకున్నాడో ఏమో శ్రీధర్ - అపర్ణ ఏం చేసినా, ఏమని మాట్టాడినా వినీ వినట్టుండి పోయేందుకు అలవాటు పడ్డాదనిపిస్తుంది చూసేవారికి. ఆమె ఎంత రుసరుసలాడినా నిమ్మళంగా ఆమెతో కాపురం చేశాడు. ఆ దాంపత్య ఫలమే 'సహన'- ఆమె పుట్టినరోజు ఫంక్షనుకే నా ప్రయాణం!
స్పర్శ 31 చేతిలో ఒక (ఫెంచి పుస్తకం - లుంగీ, బనియన్‌తో సాదాసీదాగా ప్రత్యక్షమై చాలా ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నాడు శ్రీధర్. ఒక రోజు నాతో శ్రీధర్ - పెద్ద తాత్వికుడు తరహాలో మాట్లాడుతూ-” ఎప్పటికైనా నేనొకరోజు సదెన్గా నీ ముందు మహారచయితగా ప్రత్యక్షమౌతాను మిత్రమా అని అన్నమాటలు గుర్తొచ్చాయి. ఆరోజు ఎంతో దూరం లేదనిపించిందెందుకో! ఇంతలోనే, బాగా ఆలస్యంగా వచ్చారేమిటని నిలదీసింది అపర్ణ నన్ను. సహన-బొమ్మలతో ఆటలో
మునిగితేలుతూ వుంది. (పత్రిక జినెంబర్ 2006)
32 సోనునాథోపాఖ్యానం అను రోడ్డు రోలరోదంతం (రచనాకాలం 21-01-05) ఎంత ప్రయత్నించినప్పటకీ అతడెప్పుడూ సరాసరి ప్రవేశించలేడు. అతడి ముందు ఇద్దరు ముగ్గురంతటి ఒక ఆకారం బరువుగా, భారంగా లోనికి ప్రవేశించిం తరువాత బహుశా ఒక నిమిషానికి అతదు ప్రవేశిస్తాడు రొప్పుతూ. మరది ఆతడి కడుపా మజాకా! గుండ్రంగా, ఎత్తుగా, బరువుగా, గమ్మత్తుగా ఉంటుందది. కార్యాలయంలో అతని తీరేవేరు. ఈ మధ్యకొంచెం చెవుడుకూడా వచ్చిందికదూ, హాట్హాట్మంటూ అటెండర్లతో మరీజోరు చెవుడు వచ్చే వయస్సా! అంటే కాక పోవచ్చు. కాని ప్రమాదం జరిగేందుకు వయస్సు మీద పడాలనేం రూలు లేదుకదా! అయినా అతగాదేమైనా (ప్రమాదాల కతీతుడాయేం? ఇంకానయం, ప్రమాదానీకే ప్రమాదం జరిగినట్టు ఒకే ఒక పర్యాయం ఏదోమేలైందన్నట్టుగా ఈ లేటు వయస్సులో కొంచెం బలంగానే జరిగింది. రోడ్డు ప్రమాదం. సరే తనంతట తనువును ఢీకొన్న పూణ్యానికి ఒక సైకిలు ఏకీలు కాకీల వూడి బెండు మిద బెండై కూర్చున్నదది వేరు విషయం! తన స్కూటరు మాత్రం అంతగా చెదిరిపోలేదు. తనలాగే కాస్తంత బెదురుకోవడం తప్ప. ఇప్పటికీ అదికోలుకోలేదు. రోడ్జెక్కేందుకు మొండికేసి మొరాయిస్తూనే ఉంది. అది సిగ్గనే
స్పర్శ 33 అనుకూంటాడు మనవాడు. నూటికి నూరు పైసల అమాయకత్వం, ప్లస్ మొండితనం మరింత సోమరితనం కలగలిసి పోయిన సర్వేశ్వరరావు ఉరఫ్ పొట్టేశరాన!
స్కూటరు కూడ నంజు కొచ్చిన కుర్రాడిలాగ, పౌష్టికాహారలోపంతో పొట్ట మాత్రం వుబ్బి, కాళ్లూ చేతూలు సన్నబడిట్టుందంటే దానికి ఒకింత చరిత్రలేక పోలేదు. అదేం యిప్పటిదా? దెబ్బయిల నాటి మోడల్. దాని స్పేర్‌పార్ట్స్ దొరకవు సరే, రిపేరు చేసేందుకు ముందుకొచ్చేవాడుంటే ఒట్టు. ఒకటి ముట్టుకుంటే దాని యింకొక 'అవయవం' చేతికొస్తుంది. రిపేరు కూడ సర్వేశ్వరరావు విషయంలో స్వయంపాకం వంటిదే. ఇంకొక నరమానవునికి సాధ్యం కాని కూసు విద్య అని తానే సగర్వంగా చెప్పుకుంటాడు. అల్లల్లాడుకుంటూ అది ఓండ్రకాని- ఘీంకారంకాని - గాండ్రింపుకాని - సకలింపుకాని సరికొత్త భయంకరమైన మోతతో పోతూవుంటే కర్ణభేరి పగిలిపోకుండా (్రతి ఒక్కరూ. జా([గ్రత్త పడవలసిందే. ఏవో ఫైళ్ళు రాసిపెట్టి, కొంతడబ్బు కూడ ముట్టజెప్పేట్టుగా దానిని బేరానికి కుదుర్చుకున్నవాడు ఇంటికి తోలుకు పోయిన మరునాడే తెచ్చిపెట్టిన విషయం చెప్పుకోనవసరం లేదు. _దొంగలు కూడ దానిని తోలుకు పోలేరు. అభిమానధనుడైన సర్వేశ్వరరావు, ఇక ఎన్నడూ దానిని అమ్మకానికి పెట్టిన పాపాన పోలేదు. గిట్టని వాళ్ళు ఏదో అంటుంటారు దాని బాపతు రెండువేల రూపాయలు ఇప్పటికీ బాకీ పడ్డావట అని ఎవరైనా సర్వేశ్వరరావు నడిగినప్పుడు అతడు నిర్వేదంతో నవ్వేనవ్వును జన్మజన్మలకూ మనం మరువంగాక మరువం!
ఇప్పుడు కొంచెం రంగు కూడ చేసిన సర్వేశరావు మెడకు అదనపు అందంగా ఒక తొడుగు రానేవొచ్చింది. స్పాండి లేటిస్ పుణ్యమా అన్నట్టు అది అతని కంరసీమను ఎంతో ఆప్యాయంగా అలంకరించి, అలంకరించుకొని, వదలకుండా వుంది. అసలే పొట్టతోకొట్టు మిట్టాడుతున్న మనవాడు- అది ధరించాక, మరమనిషి కింద మెడను తిప్పకుండా వింతగా తిరుగుతూ వుంటే ఆ దృశ్యం పరమ అద్బష్ట వంతులకు గాని లభ్యం కాదుమరి!
సర్వేశ్వరావు ప్రభుత్వ కార్యాలయంలో చిరుద్యోగి. అయితే పైరవీలు చాల పెద్దవే చేశాడు. ఎన్నింటికోతూగాడు కొన్ని ఫలించినై మరికొన్ని ఫలించలేదు, మామూలు కింద కొంతా, అప్పు కింద కొంత ముట్టిన మాట మాత్రం అబద్ధంకాదు. చివరాఖరుకు సర్వేశ్వరావుకు అప్పు మాత్రం పెరిగింది. సహజంగానే పెద్దదైంది. ప్రాజాంతకంగానూ మారింది.
34 వేణు సంకోజు
సర్వేశ్వరావుకు అనుకూలత కాదోగాని భరించే భార్య మాత్రం వనగూడింది. కనీస కర్తవ్యంగా ఆమె ఒక కొడుకునూ, ముగ్గురు కూతుళ్ళనూ కనిచ్చింది. అన్యాయం కదా లెక్క తప్పిందంటారేమో! ఆమె తప్పేమిలేదు. నేను కోరుకున్నదదేనంటూ తెగేసి ప్రమాణం చేసి మరి చెప్తాడు సర్వేశ్వరావు కనుకనే పిల్లలను గారాబంగా కాదు అతి గారాబంగా పెంచాడు. ఎంచక్కా వాళ్ళు వరుసగా బియ్యే ఒకరు, ఇంటరు వొకరు, టెన్త్ ఒకరు ఫెయిలై ముగ్గురూ పెళ్ళిడుకొచ్చి ఇంట్లో వంటగదిలో తల్లికి బుద్ధిగా సహకరిస్తూ తండ్రిగారు తెస్తాడనుకొనే సంబంధాల కోసం వెయ్యేసి చొప్పున మూడు వేల కళ్ళతో మున్నూటరవై యైదు రోజులూ (శ్రద్ధగా ఎదురు చూస్తువున్నారు. సర్వేశ్వరావు తెచ్చే సంబంధాలు మాత్రం తక్కువచేసేవా? చూడొచ్చే అబ్బాయిలకు నచ్చితే అమ్మాయిలకు నచ్చరు అమ్మాయిలు మెచ్చితే అమ్మాయిలు అబ్బాయిలకు నచ్చరు ఇరువురూ రాజీ పడితే తలిదండ్రులు మెచ్చరు. అందరికీ నచ్చితే కట్పకానుకలతో చిక్కులు. ఈతంతు విజయవంతంగా ఒక దశాబ్దకాలంగా జరుగుతూనే వచ్చింది. సరిగ్గా ఈ ఆలోచనలతోనే, బాధతోనే మనస్తాపంతోనే, భయంతోనే, గందరగోళంతోనే వచ్చింది. పరధ్యానంతోనే, తడవ తడవకూ చెమట్లుపట్టి కళ్ళుబైర్లు కమ్మి బీపీ రైస్ అవడంతోనే కదా సర్వేశ్వరావుకు ప్రమాదం జరిగింది.
సర్వేశ్వరావు మాత్రం ఏమాత్రం ఏంచేస్తాడు పాపం. ఆస్పత్రి పాలుకాకుందా ఎట్లావుండగలడు? ఆయనేం హనుమంతుడా? లేక సింహబలుడా? ఒక ఐరన్మానా- కాకుంటే సూపర్మూనా? కాడుగనుకనే నెలరోజుల పాటు ఆస్పత్రి సేవచేశాడు. నర్సులను అదోమాదిరిగా పలకరించేందుకు అలవాటుపడ్డాదు. తీరాడి స్పార్జి అయిన రోజున మగవాడనే స్పృహ వుండి కూడ-కంటతడి పెట్టాడు. ఎడబాటును భరింపలేక అదిగో అప్పటి నుండే మనవడికి ఎడతెగని టెలిఫోను సంబంధాలు, తెరిపిలేని సంపర్కులు.
ఒక చలాకీ నర్సు పుణ్యమా అని సర్వేశ్వరావు కష్టాలన్ని గట్టేక్కె విధంగా ఒక అమ్మాయికైనా పెళ్ళిజరిగి, ఐటిఐ చేసిన కొడుక్కి ఒక రోలింగ్ షట్టర్ల షాపు పెట్టుకునే అవకాశం కలిగే విధంగా బ్యాంకు అప్పుయింప్పించే ఆసామీదోరికాడు. ఇంకేం నెలరోజుల పాటు క్రమం తప్పకుండ బార్లూ -బీర్లూ అయ్యాయి. చికెన్ సిక్స్టిఫైవ్లూ, మటన్కరీలూ అయ్యాయి. బిర్యాన్యాలూ- డబుల్కా మీటా అయ్యాయి. బావా - బావమరదీ అన్న వరుసలూ కుదిరాయి. చెల్లికాని చెల్లి అయిన నర్సుకు కొంత పర్సు ఫలించింది. అయితే, ఏం వ్యాపారం చేయాలో ఆలోచిస్తూనే వుండిపోయారు.
స్పర్శ 35
రోజులిలా గడుస్తూ వుండగా, సర్వేశ్వరావును అప్పులవాళ్ళు జలగల్లా వీక్కుతినే ప్రమాదం మరింత మరింత ముదురుతూవుండగా, ఒక శుభముహుర్హాన, బారునుండి బయటికొస్తుండగా వాస్తు దండకం చదవడం 'ప్రారంభించనే ప్రారంభించాడు- ఏడేళ్ళనాటి శని వెనక్కితగ్గడమేనా. పీడా విరగడైపోవడమేనా శుభలగ్నాలు సమీపించడమేనా. ముక్కోటిదేవతలు దీవించడమేనా, అన్ని తాగిందంతా దిగిపోయి, దిగచెమటు కారుతున్నాయి. అంతదాకా గాలిలో తేలిపోతున్నావాడు కాస్తా మైకం వదలి నేలమీద పాతుకు పోయినట్టునిల్చున్నాడు. _ నిల్చున్నవాడు నిల్చ్బున్నట్లే నిర్చాంతపోయాడు. తేరుకోగానే-
అన్నా! నువ్వు చెప్పిందంతా నిజమంటవా? నా దరిద్రం పోతదంటవా? నన్నీ శనిగాడు విడుస్తడంటవా? నా బిడ్డలకు పెండ్లిల్లు గుదురచయంటవా? నాకోడుకు సెటిలయితడంటవా?”అని శరవరంపరగా ప్రశ్నల వర్షం కురిపించాడు సర్వేశ్వరావు.
అన్నింటికీ అవునంటూ- సాక్షాత్తూ శ్రీమన్మహా విష్ణువు లాగాన ఆభయహస్తంచూపిస్తూ మందస్మిత వదనారవిందుడై నిలుచున్నాడు సోమనాధం, ఆతేజస్సును భరించలేనన్నట్లుగా చేతులు జోడించి మోకరిల్లినంత పంజేశాడు సోమనాధం. ఇవన్నీ చేస్తుంటే కాస్త మొహమాటమైనా ఆసహ్యంగా! కలిసి అందరూ కలిపి సోమనాధం గారింటికి చేరారు.
రాత్రి పన్నెండు గంటలదాకా కాయితాలెన్నో ఖరాబు చేశారు. గళ్ళుగీశారు. లెక్కలు కట్టారు. వేళ్ళు లెక్కపెట్టారు. భుజాలు తడుముకున్నారు. కాస్సేపు విప్పారిన ముఖాలు- మరి కాస్సేపు ఆందోళన ఇంకాస్సేపు భయం- అనుమానం, ఆతరువాత ఆశ...ఇట్లా అనుకుంటూనే తెల్లారిపోయింది. అర్జాంతరంగా ఆనాటికా కార్యాన్ని వాయిదా వేసుకొని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.
మరునాడు మధ్యాహ్నం బ్యాంకు ఆసామి యింట సమావేశమయ్యారు ఆస్పత్రికి సెలవుపెట్టి నర్సమ్మ సిట్టింగుకు సరిపడా అనుపానాలు ఆప్యాయంగా అమర్చింది. సోమనాధంగారు సోమయాజి అవునో కాదోగాని మద్యం, మాంసం ముట్టరు. నర్సమ్మ చేతి వంటలు మాత్రం మాంచి రుచిగా భావించి, ముఖ్యంగా పకోడీలు పసందుగా మెసెవారు. వేదాంతం కూడ వెలగ బెట్టారు- వంటకాల మీద కోడిలో 'ప' లేదు. గనుక 'రహితం' అన్నారు. పకోడీలు హాసహితం' గనుక స్వహితం అని వాక్రుచ్చారు. నర్సమ్మకళ్ళూ, సోమనాథం గారి కళ్ళూ
36 వేణు సంకోజు అనుకోకుండా, అప్రయత్నంగా కలిసి మెరిసినై, తెగ మురిసినై కాసేపు చేష్టలుడిగి పోయారిరువురూ.. 'స్మాల్పెగ్గా, లార్ట్పెగ్గా' అంటూ తేల్చుకొకుండి వుండి పోయారు బ్యాంకా సామా, సర్వేశ్వర్రావూ మూడురోజులిలాగే గడిచిపోయినై. ఇక లాభం లేదని, సర్వేశ్వర్రావు యింట్లోనే సిట్టింగనుకున్నారు.
“ఇంత తెలిసి యుండి ఈ మేలరా? అని వివేకం హెచ్చరిస్తున్నా సోమనాధం మనస్సు నర్సమ్మ మీదికే పోబోయింది . తిరిగి సంస్కారం అడ్ష్దొచ్చి తమాయించుకుంటూ నడవసాగాడు. పూర్వం సర్వేశ్వర్రావు చేసి పెడతానన్న సైరవీ పనిచేసి పెట్టవా, అప్పుపేరిట తీసుకున్న సామాగ్రి ముట్టజెప్పక తిరుగుతూవున్న విషయం మెరమెరమంటూనే వుంది-సోమనాధం మనస్సులో అటువంటి వాడు నర్సంమ్మకు చేరువకావటం తలచుకుంటే మరింత అక్కసుగా అనిపించింది.” లేకి ముండాకొడుకు అనుకున్నాడు నోట్లోనే అట్టా అనుకొన్నందుకు వికారంగా కూడా భావించాడు. తనలో తానే లాభంలేదిక, దానిని అతనికి అంటగట్టి తీరంలసిందే ననుకున్నాడు. అందుకిక అదేరోజు ముహూర్తంగా ఎంచుకున్నాడు. ఆలోచిస్తుండగానే నడకవేగం పెరిగింది. నిమిషాల్లోనే సర్వేశ్వర్రావు ఇల్లు చేరాడు. అప్పటికే అక్కడికి బ్యాంకాసీమి చేరుకోవడం మొదటి పెగ్గుకు ఉపపక్రమించదమన్నవికానే అయ్యాయి.
సర్వేశ్వర్రావు ఇంటి వాలకుం మహఘోరంగా అనిపించింది. సోమనాథానికి అసలే అది చిన్న టౌను అందులో మళ్ళి పాతబస్తీ, పైరవీల మీద, పై అదాయం మీద ఉన్న [శ్రద్ధ సర్వేశ్వర్రావుకి ఇంటి మీత లేకపోయింది. పాత ముతక వాసనగొడుతుందక్కడ. అది చాలదన్నట్లు మున్సిపాలిటీ కాల్వ దివ్యంగా పారుతూ వుంటుంది. నిత్యం ఇరవైనాలుగ్గంటలూ చుట్టు (ప్రక్కల నుండే గుడిసె వాసులు జూదాలాడుతూ తాగితూలుతూ, మట్టిలో దొర్లుతూనన్నట్టు వుంటారు. వారి మధ్యే సర్వేశ్వర్రావు మసలుకొంటాదు. చాల తెలివైన వాడి ననుకుంటూ వారి కన్న చాల ఉన్నతంగా వున్నానుకుంటూ. మురుస్తుంటాడు. ఆ కుటుంబ సభ్యుల దీన స్థితికి గతుక్కుమన్నాడు సోమనాధం.*ఒద్న, చలించిపోవద్దు” అని హెచ్చరిక చేసుకున్నాడు, చెడిపోయేవాడిని అర్బకుడిని. పెద్దమ్మ చూపులు పడ్డవాడిని ఎవ్వడూ బాగు పర్చలేడని తనకుతానే భరోసా యిచ్చుకున్నాడు.
ఎవరికంటిని వారి వేలితోనే పోడవాలని ముందుగానే ఆలోచించుకుని వున్నాడు గనుక సర్వేశ్వర్రావు సొంత బంధువునే (తోడళ్ళుడినే) ఎక్కుపెట్టాడు నసోమనాధం లక్ష్యంమీదికి. బలరామారావును ఎక్కడా సీనులో ప్రవేశ
స్పర్శ 3౩7 పెట్టకుండానే గ్రంధం నడిపించాడు. పంచాంగం ముందుపెట్టాడు. ముహూర్తాలు లెక్కించాడు. సంకల్పం చదివాడు. భేషైన వ్యాపారం దొరికిందని (ప్రకటించాడు. అదృష్టం కొద్దీ ఆరోజేతనకు అది తటస్థ పడిందన్నాడు.దివ్యంగా వుందన్నాదు. ఉచితంగా లభ్యమైనట్టు, చాలచౌక ధరకే లభిస్తుంది గనుక ఇక అంతాజయమే, అంతా(ద్రవ్యమే, అంతా లాభమేనంటూ కరచాలనం చేశాడు. దరిద్రం వాదులుతుందని సర్వేశ్వర్రావుకి గర్వంగాతోస్తుంటే, ఒకమంచి పనికి లోను మంజురు చేయించగలుగుతున్నాని బ్యాంకాసామి పోంగిపోయాడు.
“ఇంతకి ఏం వ్యాపారం?” అని ఇద్దరూ ఒకే సారి అడిగారు -బ్యాంకు ఆసామి, సర్వేశ్వర్రావు కూడ. అప్పుడు విప్పారిన ముఖంతో, ప్రశాంతంగా, గంభీరంగా, భగవద్గీత చెప్పిన కృష్ణభగవానుని మాదిరిగా, సావధానంగా వివరించాడు సోమనాధం.
“కొంతకాలం కొందరు తెలివైన వాళ్ళు బోరింగుల వ్యాపారం చేసి లాఢపడితే, ఇంకొందరు ఇంకొంతకాలం క్రేన్ల వ్యాపారం చేసి డబ్బు గడించారు. మరికొందరు ప్రోక్షెయినర్ల వ్యాపారంచేసి సొమ్ము చేసుకొన్నారు. పనికాహర పధకమని గోల 'పెడుతున్నారు. మనుషులకే పనివ్వాలి బతుకుతెరువు కల్పించాలంటున్నారు-కదా! ఇప్పుడిక అసలు సిసలైన బిజినెసు-రోడ్డురోలర్ల బిజినెసు” అని ఒక పాజ్ ఇచ్చాడు సోమనాథం-చిన్నపాటి కమర్షియల్ ్రేకులాగా!
అప్పటిదాకా నోరెళ్ల బెట్టుకుంటూ, ఆశ్చర్యం మీద ఆశ్చర్యం ప్రకటిస్తున్నట్టుగా ఉండిపోయిన బ్యాంకాసామి, సర్వేశ్వర్రావు ముఖాల్లో ఒకింత అనుమానం మరింత విస్మయం కావొచ్చాయి. వాళ్ళేదో అడడబోయేలోపున్నే-
“నాకు తెలుసు మీరీ రియాక్షన్ యిస్తారని. వస్తున్నా- అక్కడికే వస్తున్నా! రోడ్డు రోలర్ల బిజినెసేమిటనే కదా మీ అనుమూనం- అదే చెస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వాల తీరే మారిపోయింది. ప్రపంచ బ్యాంకు చెప్పేది వినందే, పెట్టే షరతులు అంగీకరించందే కుదరదు, బతుకు తెరువులేదు అధికారంతో వుంటూ, బతికి బట్టకట్టాలంటే బ్రిడ్జీలూ, ఫైవోవర్లతో పాటు, గ్రామ గ్రామానికీ- దేశమంతటా రోడ్లు వేయవలసిందే, రోడ్డు వేయాలంటే మరి రోడ్డు రోలర్లతోనే కదా పని!” అంటూ అంత దివ్యమైన సలహా యిచ్చి ఉపాయం చెప్పినందుకు తనకు తానే మురిసిపోతూ, తనను తానే అభినందించుకుంటున్నట్లు చాల యిదిగా ముఖం పెట్టాడు సోమనాథం.
38 వేణు సంకోజు
ఫారిన్ సరుకు మెల్లమెల్లగా మత్తెక్కించినట్లు, కిక్ యివ్వసాగిందిరువురికీ సోమనాధోపాఖ్యానం అను రోడ్డు రోలర్ బిజినెస్. సంతోషం పట్టలేక, తమకోటా పూర్తయిన సంగతికూడ మరిచి, చెరో లార్డ్ పెగ్గులాగించారు. సర్వేశ్వర్రావు, బ్యాంకాసామి ఆదనంగా.
నిజమే సుమా - లేటెస్టు వ్యాపార రహస్యమిది. రోలింగు షట్టర్లూ-గిట్టర్లూ బలాదూరు ఇంటి రీమోడలింగులు, పిల్లర్లూ, రోడ్డు వైపున షాపులు వెయ్యడాలూ- ఇప్పట్లో అయ్యే పనికాదు అప్పులు తీరేపని అంతకన్నాకాదు. రోడ్డు రోలరు తెచ్చుకోవడం, కిరాయకు తిప్పుకోవడం రోజురోక్కం లెక్కించుకోవడం. భలే ఐడియా భలే బాగుందంటూ చప్పట్లు చరిచాడా బ్యాంకాసామి. బ్యాంకాసామి అంతటోడికే ఐడియావచ్చిందంటే ఇంక దానికి తిరుగుండనక్కరలేదని అనుకున్నాడు సర్వేశ్వర్రావు, అంతటి మేలుకు పూనుకున్నందుకు వినమ్రంగా చేతులు జోడించాడు సర్వేశ్వరరావు సోమనాధానికి. తన లోను సద్వినియోగం కాబోతున్నందుకు అంతకన్నా ఆనందం ప్రకటించాడు బ్యాంకాసామి మరొకమారు బలికి సంసిద్ధమైన మేకను చూసి నట్టుగా సర్వేశ్వర్రావును చూస్తూ కసితీరా, తృప్తిగా మూల్దాడు సోమనాధం.
డైవరును కాస్త దిగమని, ఆగివున్న రోడ్డు రోలరెక్కి కూర్చున్న సర్వేశ్వ!ర్రావుని చూసి కాళింగ మడుగులో కృష్ణుణ్జి వూహించుకుని సంబూరపడిపోయారు పిల్లలు. అన్థానంలో అలా భర్తను చూసి కొత్తగా పెళ్ళయినప్పుడు సంబరపడ్డంతగా ఆనందంతో తడిసి ముద్దయిపోయింది ఇల్లాలు. ఇకరేపటి నుంచి ఆస్థానం నాదేనని లోలోపలే మురిసిపోయాడు కొడుకు. ఈసం॥రం తన పెళ్ళి ఖాయమని పెద్దకుమార్తె అనుకుంటుంటే తమ వంతుకోసం వేగిరపడుతున్నట్టుండి పోయారు చిన్నన్మూయిలిరువురూ.
ఇక ఈ బిజినెసు నీదే నాయనా నాడ్యూటి నేను చేసుకుంటాను, నీ బిజినెస్ నీవు చూసుకొమ్మంటూ, బొచ్చు కుక్క పిల్లగొలుసు చేతికిచ్చినంత సుతారంగా తన కొడుక్కి రోడ్డు రోలరును అప్పగించాడు సర్వేశ్వర్రావు దానినందుకుంటూ మెలికలు తిరిగి పోయాడు కుర్రాడు.
స్పర్శ 39
గొడవ ఎంతకూ సద్దుమణగలేదు. సర్వేశ్వర్రావు వారిని వారించ లేక పోయాడు. కొడుకూ, కూతుళ్ళూ, ఇల్లాలేకాదు, వీధి వీధంతా అలసిపోయింది. వాళ్ళు మాత్రం ససేమిరా అన్నారు. ఆసామి అనదగు బలరామారావు తక్కువగానే మాట్లాడుతున్నాడు. కాని, అతని కూతురూ, కొడుకూ ఇల్లాలితో బాటు వెంట వచ్చిన వీధిలోనివారు గట్టిగట్టిగా అరుస్తున్నారు. ఇంకేం వినేదిలేదు, వెంటనేదాన్ని తెచ్చుకొండని హెచ్చరిస్తున్నారు.
“అదేం కుక్కపిల్లా, కోతిపిల్లా -తెచ్చుకొని యింటి ముందు కట్టి పడేసుకోవటానికి?” అంతే రెచ్చిన స్వరంతో ప్రశ్నించింది సర్వేశ్వర్రావు ధర్మపత్ని
“అదే. మేము కూడా అడుగుతున్నం. బండ్లు వొచ్చిపోయేటందుకు కష్టమైపోతున్నది. అసలే ఇరుకు సందులు, బజారోల్లు తీసిపారయ్యమంటున్నారు. ఎంతకాలం ఆ టన్నుల బరువున్న ఇనుప సామాన్ని మా ఇంటి ముందట, మా బస్తీల పెట్టుకోవాలె?”” అని గద్దించింది బలరామారావు సలి
“అమ్మేటి నాడు తెలనదా అది ఇనుపసామానని? అంటగడ్తిరి గద మాకు. మరి ఆ మాత్రం ఓర్సుకొండ్రి. మామ మాటల్టెప్పి మెడకు జుట్టినట్టుకాదు, సంపాయించిందేందో మాది మాకు కక్కినంకనే అది గదుల్తది మీకాణ్జించి.”
“ఆ సంపాదన! ఇంతాంత సంపాదనకాదు. రొండు-మూడు ట్రిప్పులు మీవాడే తిరిగెగదా! మేం వాడుకున్నదెంత? కిరాయవచ్చిందెన్నడు? కొనుక్కునే టప్పుడే వుండాలె తెలివి. ఆశకు పోయి పున్నానికే వచ్చిందనుకుంటిరికదా? ఇప్పుడెట్ల వాల్లనంటున్నరు? తిక్క తిక్క మాటలు గట్టిపెట్ట, మర్యాదగ మాయింటి ముందట్నించి ఆ పాడు సామాన్ను పట్టుకపోండి..”
“వివ్రమ్మో! మాటలు జాగర్త! అక్కవని తమాయిస్తుంటె అరుసుడెకృవైంది. పాడు సామానని ఇయ్యాలంటున్నావ్? ఎట్లమ్మతివానాడు సామానుమాకు? నా మొగణ్ణి బెలాగాబణ్జిజేసి, వాస్తు గీస్తనుకుంట వొచ్చినోడు- సోమనాథమో సింగినాధమో ఎక్కడవాయె? రమ్మనాయిన్నే అడుగుత. అడుగుతనాయింకేమన్నంటె నిలువెల్ల గడుగుతనా?..
“ఈ మనాయన ఎందుకొస్తరమ్మా? కొనుక్కున్నోల్లు తమవొస్తువను తాము పట్మపోవాలెగని...” విసుక్కున్నాడు బలరామారావు.
40 వేణు సంకోజు
“వస్తువలేదు గిస్తువలేదయ్యా. ఏదో పరాయోల్లుగాదు, అక్క బావలే గదాని నమ్మినందుకు మమ్ముల నిలువున ముంచుతారు? మీగ్గూడ పిల్లలున్నరు. ఎవలగతి ఎవలు జూడబోయిండద్రు? నువ్వప్పుల పాలై ఎంతబాగగుదువబెట్టిన నీ యినుప సామాను- నీపెంద్దామే అంటుందిగదా యినుపసామానని, అసుంటివస్తువను నీ బాక్కింద జమగట్టిన పాపిష్టి-పాడు సామాన్ను మాకంట గడుతారు? తెలిస్తై ఎక్కడ బెదుస్తదోనని మొకం దప్పిస్తారు? నడుమొచ్చిన బ్యాంకోని బాగోతంసరే! అప్పియ్యమంటే అడ్డమైన నీ రోడ్డు రోలరును- నీ పెండ్లామంటున్న పాత నుపసామాన్ను ఇప్పిస్తాడు? ఎవడెవడు ఎంతెంత దిన్నరింద్ల? ఎక్కడున్నుందాయిసుంటి అన్నాలం? ఒగదిక్కు అప్పుకేమొ రొండింతల మిత్తయితాది? నిమ్మలంగా బ్యాంకోడేమో తబాదలై పోతాడు. లబాదిబా మొత్తుకొనేది మేమా? ఎట్లయ్యేదుంటే అట్లయితది. ఉంటే ఆ ఇనుప సామాను మీయింటి కాజ్జే వుంటది. లేకుంటే ఎట్ల అప్పు జేపిచ్చిండ్రో అట్లనే, గా బ్యాంకుకాడికే చేర్చిచ్చుండ్రి- మాకు సమ్మందంలేదు” అని ఖరాఖండిగ చెప్పి, 'ఓఅయ్యా' అని మొగుణ్ణి, *ఓపిల్లలూ' అని సంతానాన్ని ఇంట్లోకి గెదిమింది సర్వేశ్వర్రావు పత్ని- కోళ్ళను గెదిమినట్లు లోపలికి చేరి తలుపులు గాభాల్న మూసేసింది.
ఓ అమ్మా అదేం గుదురదు. బ్యాంకోల్లు మెవెక్కడ వెట్టుకొందు మాయినుప ఏనుగున్నట్టుండ్రు- అయినా, ఇంద్లనో, పోలాలనో జప్పుజేసుకుంటం గాని యినుప సామానెందుకు జప్తు చేసుకుంటమంటుండ్రు. “తలుపుదెరువు” అంటూ మొత్తుకో సాగారు బలరామారావు తరపు మనుషులు.
తలుపు ఎంతకూ తెరుచుకోలేదు.
లోపల్నుంచి తిట్లు, శాసనార్థాలు వినిపిస్తూనే వున్నాయి- “ఈల్ల పీనిగెల్ల- మాపిల్లలోలిగనే ఈల్ల పిల్లలపెండ్లిల్లు పెటాకులు గాను- ఈల్లయిండ్లుగూలి నేల మట్టంగాను- ఈల్ల యిండ్లల్ల రొందేసి రోడ్డు రోలర్లు మొలువ -ఈల్లంత శిలుమెక్కి సావ...”
ఎంతసేపటికీ తలుపులు తెరచుకోక శాపనార్థాలు ఆగకపోవడంతో గత్యంతరం లేక బలరామారావూ, అతని తాలూకు మనుషులూ వెనుదిరిగి పోయారు.
స్పర్శ శే బ్యాంకు నుండి వచ్చిన ఒకవ్యక్తి తలుపు తట్టసాగాడు. అంతకు ముందు నుంచే కొనసాగుతున్న తిట్టు, శాపనార్థాలతో పాటు లోపల్నుంచి అమ్మాయిల రోదనలు కూడ వినిప్పిస్తున్నాయి పల్చ్బపల్బగా. “మొత్తుకొని సచ్చినా తలపుల్టీసేది లేదు. ఆ జ్లేవడి సావుండ్రి” అంటూ గట్టిగా వినిపించింది సర్వేశ్వర్రావు యిల్తాలి అరుపు. చేసేది లేక తెచ్చిన నోటిసును తలుపులకు అంటించి వెళ్ళాడు బ్యాంకు ఉద్యోగి. ఇంగ్లీషులో వుందది. సారాంశమేమంటే, అప్పు తీర్చలేదు. జీతంలోకూడ జమచేయించే అవకాశం లేదన్నారు గనుక వారం రోజుల్లో అప్పు తీర్చకపోతే ఇల్లు జప్పచేయబడుతుంది- సామానులతో సహ. (రచనాకాలం 22]. 1. 2005
గ2 వేణు సంకోజు ల కేసు
అందరూ అవాక్కయి వున్నారు.
అందరి ముఖాల్లోనూ ఇక పెద్ద విషాదచ్చాయ
(మళ్ళీ ఏమై వుంటుందా'- అనుకుంటూ!
వినకూడనిదేదో వినవలసి వస్తుందనుకుంటూ భయపడసొగింది సీతమ్మ
ఫోన్ రిసీవరు పెట్టేసి మౌనంగా కూర్చున్నాడు పరాభి.
సుధ కూడ ఏదో శంకిస్తూ, ఫోన్ తన అత్తగారింటి వద్ద నుండే కావచ్చు ననుంకూంటూనే అడిగింది - “ఎక్కడి నుండి నాన్నా ఫోను? తనే చేశాడా?” అని కూడ అడిగింది.
మౌనంగానే జెనన్నట్టుగా తలూపాడు పఠాభి. అతని మౌనంతో నముద్రాలంతటి ఘోష _ తుఫాన్లంతటి అలజడి, ప్రపంచయుద్దాలోని అణుబాంబులంతటి విధ్వంసం. ఎన్నెన్నో వున్నాయి. అవ్యక్తమైన కసి. తనమీద తనకే అసహ్యం, ఏమీ చేయలేని తన అశక్తత మీద తనకే తెలియని ఉక్రోషం. కలుగుతున్నాయి. తను ఒక ఆడ కూతురును కన్నందుకే కదా తనకీ రంపపు కోత! ఫోనొస్తే భయం, ఉత్తరమొస్తేదడ, ఆ వూరి నుండి ఏవ్యక్తి వచ్చినా వణుకు. ఎన్నాళ్ళు-ఎన్నాళ్ళీ విధంగా? ఎన్నిసార్లు ప్రాధేయపడాలి? ఎంత మందిని (బతిమాలాలి? ఒకమారు వియ్యంపురాలిని ఇంకొకమారు వియ్యంకుడిని, అనేక మార్లు అల్లుడుగారిని “అల్లుడు గారిని” ఆనుకోవాల్సి వచ్చినప్పుడు “గారిని” అనుకోబుద్ధికాలేదు పరాఖికి. ఎంత లోకువై పోయాదతడు! ఒక బిడ్డను కని గర్వంగా పెంచినందుకు- సంతోషంగా సొకినందుకు - డిగ్రీదాకా చదివించి నందుకు, కంప్యూటర్ జ్డానం కూడ కలిగించినందుకు, అన్ని విధాలా- అవతలి వారు అడిగిన ప్రకారమే-ఉన్నంతలో అన్ని లాంఛనాలతో వైభవంగా పెళ్ళి
స్పర్శ 43 చేసినందుకో- ఒకఅయ్య- చఛ అయ్యకాదు రాక్షసుడు-పెనుభూతం- మానవమృగం చేతిలో పెట్టినందుకు- అందుకే కదా తాను అంతగా లోకువైంది. అంతగామెత్తబడింది! తలచుకుని, తనూ, తన భార్యా, వగచి-వగచి, బిడ్డముందు కన్నీళ్ళు కార్చలేకా, కళ్ళనీళ్ళు కళ్ళల్లోనే ఇంకించుకోలేకా-ఎంతటి నరకయాతన అనుభవించారు! ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఇలా? ఆలోచనలో పడిపోయాడు పఠాథధి!
“ఏమైందండీ-ఏమిటిలా డీలా పడిపోయారు? ఎప్పుడూ వుండేదేకదా! కొత్తేముంది ఇందులో? అంతకుముందు ఉత్తరం రూపంలో ఒక నరకకూసం మన ఎదుట నిలిచింది. అంతకన్న పూర్వం ఒక మనిషే వచ్చి మన గుండెల్లో గునపం లాంటి వార్తను గుచ్చి మరీపోయాడు. అంతకంటే ఇదేమీ పెద్దది కొత్తది అయివుండదు కదా!....”
“లేదు సీతా ఇది పాతది కాదు. నిన్నూ-నన్నూ- మన కుటుంబమంతటినీ కుంగదీసే మాట, తలెత్తుకుని తిరగనీయబోని అభాండం, ఎవరితోనూ పంచుకోలేని, కనీసం చెప్పుకోలేని లజ్ఞాకరమైన విషయం.” పిడికిళ్ళు బిగించలేకా, వూరుకోనూలేకా, ముఖాన్నిన రెండుచేతుల్లోకి తీసుకుని, పిసుక్కుని- పిసుక్కుని, ఏద్బ్చలేకాా అణచుకోలేకా, చివరకు ఒక్క పెట్టున బోరున రోదించసాగాడు పరాఖభి.
మళ్ళీ నిశ్శబ్దం. సీతమ్మా, సుధాశవిషయం ఎమైవుంటుందా” అని, పరాభి ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ వుండిపోయారు.
లేచి బయటకు నడిచాడు పరాఖి.
“ఎక్కడికండి?”-భయం అధికమౌతుండగా అడిగింది సీతమ్మ.
“చావటానికైనా లేదు కదా!-తండ్రిని గనుక ఆపనిచేయలేను” అన్నాడు పరాభి. అందులో కసివుందా అంటే వుండవచ్చు. బాధ, అసహ్యం, అసహనం, వుండవచ్చు ఇవేవీ లేకపోవచ్చుకూడా. నిర్లిప్తత కాని ఉద్రేకం, ఉద్రేకమని స్పష్టంగా తోచని ఒక తెగింపు. మళ్ళీ కూత్తులు ముఖం చూసే ధైర్యం లేని ఒక అసహాయత అవమానం తాలూకు ఒక విధమైన జాలి... అన్నీ వుండవచ్చు.
సుధ ఇంట్లోనే వుండి పోయింది తన గదికి తాను పరిమితమౌతూ అపరిమితంగా కుమిలిపోతూ ఏకకాలంలో, తన అత్తవారింటిని ఎవరైనా తగులబెడితే బాగుండునని, తన తండ్రిని ఏ గంధర్వుడో వచ్చి కాపాడితే
ప. వేణు సంకోజు బాగుండుననీ అనిపించిందామెకు, ఉన్నపళంగా మృత్యుదేవత వచ్చి తన నుదుటిని ముద్దాడి మెత్తగా లాలించి తనని స్వర్ధానికి కాకపోయినా నరకానికైనా సరే, కొనిపోతే బాగుండుననిపించింది. ఇక్కడి నరకం కన్న పరలోకం అనబడే నరకం అంత నరకంగా ఏమీ వుండక పోవచ్చునని కూడ ఆ క్షణంలో ఆమెకు అనిపించింది. అప్పుడే నిద్రలోంచి లేచి, గుక్కట్టి ఏడుస్తున్న తన రెండవ పాప హర్ష తిరిగి తననీ లోకంలోకి పడద్రోసినట్లుగా ఆమె తేరుకుంది- తేరుకోవడమేమిటి? తిరిగి దుఃఖఖంలోకి, యమయాతనల్లోకి కూరుకుపోయింది!
గదిలో గుస-గుసగా మాట్లాడుకున్నారుసీతమ్మా- పరాఖభి కొన్ని నిమిసాలు. ఏమి చేయాలో తోచడంలేదు వారికి. ఒక పెద్ద గండంగానూ, తమ పరిస్థితి ప్రస్తుతానికి ఒక అగ్ని గుండమే అన్నట్టుగానూ వుంది-వారికి.
“వోలీసులకు చెప్తే యింకేమైనా వుందా!” విచారిస్తాం మీ అమ్మాయిని స్టేషనుకి పంపించడంటూ ఇంటికి వస్తారు. వీధికి వున్న కళ్ళు చాలక ఒక్కొక్కరికీ వెయ్యేసి కొత్త కళ్ళచాప్పున ఊరంతా కళ్ళ పర్యంతమై చూపుల గాయాలు చేసి రక్కి చంపుతుంది. లక్షల నోళ్ళుగా తెరచుకొని, గూబలు పగిలిపోతుంటే దిక్కులు పిక్కటిల్లేట్టగా కాకపోయినా, అనునయిస్తూనే అన్నట్టుగా, సానుభూతిని కూడ ప్రకటిస్తూ వున్నట్టుగా- ప్రశ్నల వర్షం కురిపించి, పిడుగుపాటుకు గురిచేసినంత పనిచేసి విడుస్తుంది. ఎన్నికళ్ళకు -ఎన్నెన్ని నోళ్ళకు, ఎంతటెంతటి ఎకసెక్కాలకు జవాబివ్వాలి! ఎందుకు తనూ, తన భార్యా తన కూతురూ- చేయని నేరానికి దోషుల్లా నిలబడాలి. ఎంతకని ఓపిక వహించాలి? ఎందుకని మంద్రస్వరంతో బలహీనంగా మాట్లాడాలి? ఎవరేమన్నా దెప్పి పొడిచినాా అంతా తమ తప్పేనంటూ, తమకూతురే దోషురాలన్నట్టుగా ప్రవరిస్తూ-సర్వం తెలిసినట్టుగా, ప్రత్యక్ష సాక్షులైనట్టుగా మాట్లాడే వారి ముందు, కలగజేసుకొని జూస్తున్న వారి ముందు తలదించుకొనవలసి రావాలెందుకు? అనుకోసాగారు పరాఖి దంపతులు.
“పోలీసులకు కంప్లెయింట్ చేశానన్నాడా- చేయబోతున్నానన్నాడా?” కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అడిగింది సీతమ్మ.
“'చేశానన్నట్టే చెప్పాడు'-పఠాభి జవాబు,
“ఇట్లా ఎన్నిసార్లు బెదిరించలేదూ?”-సీతమ్మ ప్రశ్న.
“ఈసారి నిజంగానే చేశానని, పోలీసుల రాకకోసం ఎదురుచూస్తూ వుండండంటూ ఫోను పెట్టేశాడు” అన్నాడు పరాఖి.
స్పర్శ జ్ భయం, అసహ్యం, అసహాయత, ఆక్రోశం అన్నింటికీ గుర్తుగా రెండు మూడు
కన్నీటి బిందువులు రాలిపడ్డాయి సీతమ్మ కళ్ళనుండి. కుష్పగూలినంత
పనైందామెకు. 'పరమేశ్వరా అనే పదం కూడా ఆమె నోటి వెంట రాలింది.
“నాన్నా -ఆయనేదో ఉపద్రవంకొత్తగా తెచ్చిపెట్టవచ్చు కానీయండి. కానున్నది క్లాకమానదు. నేనింకా మునుపటి లాగా భయాన్ని "భరిస్తూ, అతడిని సహిస్తూ, ఒంటిమీద ఎప్పటికప్పుడొక సరికొత్త నరకాన్ని అంటించుకుని తిరగలేను. నేనిప్పుడు దేనికైనా సిద్ధపడివచ్చాను. మీరు కూడా అలాగే సిద్ధంకండి” ఆవేశంగా అన్నది సుధ!
“ఎట్లా సిద్ధం కాగలమమ్మా? ఏమని చెప్పాలినీకు?” మనిసి ముక్కలై పోతున్నట్టుగా, గాలితో మాట్లాడుతున్నట్టుగా అన్నాడు పరాఖి.
“విడాకులు అనే కదా నాన్నా అని వుంటాదు-నేను కోరుకున్నది అదే కదా! ఇప్పటిదాకా అది నెరవేరలేదు. ఇప్పుడు వాళ్ళే కోరుతున్నారు. నేనందుకు సిద్ధమే”-తెగేసి చెప్పింది సుధ.
“విడాకులు తనుకాదు మనమే కోరుతున్నామనీ, తాము కలిసివుందా మన్నందుకే నీవు హత్యాప్రయత్నంచేశావని, అతడు తప్పించుకోగా, పారిపోయివచ్చావని కంస్లెయింటిచ్చాడటమ్మా పోలీసులకు”- గాద్దదికంగా అన్నాడు పఠాఖి,
“అబద్ధం ఆ పని చేసింది అతడు”. చావును తప్పించుకొని వచ్చిందినేను. ఈ విషయం పక్కవారిని అడిగితే అక్కడికక్కడే తేలిపోతుంది డిఫెన్సులో పడినట్టుగా చెప్పింది సుధ.
“తేలిపోతుంది! ఎంత బాగా నమ్ముతున్నావమ్మా! మనమూ మనమూ విచారించబోతే ఎవరనా ముందుకొచ్చి విషయం మాట్లాడవచ్చు. చొరవ చేసుకుని అతడిని మందలించనూవచ్చు. పోలీసుల దాకా వెళ్ళిందంటే ఎవరు ముందు కొన్తారమ్మా _నీ అమాయకత్వంగాని! చూసినా, విన్నా- ఏమీచూడనట్టు, ఏదీ విననట్టు వుండిపోవడం కన్న వాళ్ళు మాత్రం ఏంచేయగలరు? మనకోసం స్టేషను మెట్లెక్కుతారా? సాక్షి సంతకాలు చేస్తారా? బెదిరింపులకో-ప్రలోభాలకో (ప్రయత్నించకుండా వుంటారా మోసం, దగా చేయబూనినవాళ్ళు? ఇవన్నీ తట్టుకోవడానికి ఎవళ్ళు మాత్రం సంసిద్ధులౌతారు? వాళ్ళకు మాత్రం వాళ్ళ సంసారాలూ-బాగోగులూ వుండవా? వాళ్ళను మాత్రం ఇబ్బంది పెట్టే
డం వేణు సంకోజు హక్కుపమైనా వుందా మనకు? ఏం చేయగలం తల్లో”- జాలిగా బిడ్డ తల నిమురుతూ అడిగాడు పరాఖి. సుధ అప్పటిదాకా గుండె దిటవు కలదానిగా నిలబడింది కాస్తా, టపటపా కన్నీరు కారుస్తూ, ఇద్దరు బిడ్డల వంక దీనంగా చూస్తుండి పోయింది. వర్ష-తల్లి కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తుంటే, హర్ష-కేరింతలు కొడుతూ తన తల్లితో ఏదో ముచ్చట్లాడబోతున్నది. అసలు విషయం తల్లి ద్వారా చూచాయగా తెలుసుకుందితసుధ. తాను వున్నదానికన్న ఎక్కువ ఇంట్రోవర్ట్‌గా అగుపిస్తాడు నిరంజన్. పి.ఎస్,సి. పరీక్ష రాశానని, రేపో మాసో ఫలితాలు వెల్లడవడం, ఇంటర్వ్యూలు జరిగి జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరడమే తరువాయి అంటూ వివాహమాడాడు సుధను. పెళ్ళి చూపులప్పుడు కట్నం వద్దని, బాహ్యసౌందర్యంకన్న ఆంతరిక అందమే తనకిష్టమని అందరి హృదయాలనూ చూరగొన్నాడు. ఎంతో కలివిడిగా అందరితో మాట్లాడి హుందాగా వ్యవహరించాడు. పెళ్ళి అయిన తరువాత ఒకటికి రెందుసార్సు ఇంకా అనేక పర్యాయాలు -ఎప్పుడు వచ్చి వెళ్ళినా ఆనందంగా వుంట్లూ అందరినీ ఆనంద పరుస్తూ వచ్చాడు. పి.ఎస్.సి. లో సెలెక్షన్ వస్తుందని, లక్షరూపాయలు కావాలంటూ వచ్చి కూర్చున్నాడొకనాడు. ఆకస్మికంగా పరాఖికి పెళ్ళిేచేయగల స్తోమత తప్ప కట్నకానులకు ఇచ్చే తాహాతులేదని తెలుసు. ఆమాట అతడు వివాహానికి ముందే స్పష్టంగా చెప్పియున్నాడు. అయినా, అల్లుడు అనవసరంగా అడగలేదుకదా, ఉద్యోగం కోసమే కదాని, తన.పి.ఎఫ్. లోంచి పార్టిఫైనల్ కోసం దరఖాస్తు చేసుకుంటే యాఖై ఐదువేలు చేతికందాయి. అందులోంచి ఐదువేలు తన అవసరాలకోసం అట్టిపెట్టుకొని యాఖైవేలు అల్లుడికి అందజేశాడు. “అంతే ఏర్పాటైతే బాగుండును" అన్నాడు నిరంజన్. ఎటువంటి మొహమాటమూ లేకుండా చివుక్కుమున్నది పఠాభి మనస్సు. అయినా తమాయించుకుని, “అదికాదు అల్లుడూ, నావల్ల అయ్యింది అంతే. అంతా ఇచ్చేశాను- అని ప్రాధేయ పూర్వకంగా చెప్పాడు. “అబద్ధ మెందుకూ? ఐదువేలు అట్టి పెట్టుకున్నారటకదా!” నిలదీస్నున్నట్టుగా అన్నాడు నిరంజన్. అసహ్యంగా అనిపించింది పఠాఖికి. “సీశ్రా-ఆ ఐదువేలుకూడా తెచ్చి అల్లుడుగారికివ్వు” అన్నాడు పరాభి- ఏదో
స్పర్శ ప్ నేరస్తుడు నేరాన్ని అంగీకరిస్తూ, పోలీసుల ముందు వికారంగా నిలబడ్డట్టు.
“వద్దు -వద్దు, ఆ ఐదువేలతో నా పని అవుతుందా? ఇంకా యాఖైవేలకోసం నేనే ఎవడికాళ్ళో పట్టుకోవాలి తప్పదు అంటూ లేచి వెళ్ళాడునిరంజన్. జరిగిందానికి పశ్చాత్తాపపడుతున్నట్టుగా వుండిపోయారు పఠాఖీ, సీతమ్మా!
“ఇట్టా ఎన్ని కాలేజీలని మారుస్తారు అల్లుడుగారూ- ఈ సంవత్సరంలోనే ఇది రెండవది. గత సంవత్సరం ఒక కాలేజీ. అంతకుముందొక రెండు కాలేజీలు. ఆ స్రవంతి కాలేజీలో తీసుకున్న అడ్వాన్సు ముప్పయివేలు తీరనేలేదు. ఇప్పుడు కాలేజీ కూడా మారుస్తానంటే ఇదో ఇరవై వేలూ, తీర్చేస్తోమత లేకుండా అప్పులు చేసుకుంటూ పోతే ఎట్లా?” కొంచెం అనునయంగా, బాధగా- అయిష్టంగా, అర్ధింపుగా నన్నట్లు అడిగాడు పరాఖి.
“గమనిస్తున్నానండీ - మూడేళ్లకే నేను మురికి అల్లుడినై పోయాను. వద్దంటే ఇద్దరు ఆడపిల్లల్ని మీ బిడ్డ కన్నదికదూ -అందుకూ లోకువైపోయాను. నేను ప్రభుత్వ కాలేజీ ఉద్యోగం సంపాదించలేక పోయాననే కదా ఈ చులకన భావం. దీనికి కారణం ఎవరంటారు? లక్ష రూపాయలివ్వమంటే మూల్గుతూ-ముక్కుతూ యాఖైవేలిచ్చారు. అవతలివాడది నామొహాన్నే విసిరికొట్టాడు. అయితే, ఆడబ్బేదో అట్లాగే వుండి -పిల్లల్ని పొదుగుతూ వుంటుందనుకున్నారా? మాట్లాడితే డబ్బిచ్చానో -డబ్బిచ్చానో అని గుర్తుచేస్తుంటారు , నాకోసం -నా వాళ్ళకోసం కాకపోయినా, మీ కూతురుకోసం, మీ మనవరాళ్ళకోసం ఒళ్ళంతా గొంతు చేసుకుని, అరిచి- అరిచి పారాలు చెప్పుకొస్తున్నాను. ప్రైవేటు కాలేజీల్లో. ఏవోరెండో- కాకపోతే మూడో క్లాసులు ఆరవ్వచ్చు రోజుకి-నాలుగో, ఐదో, ఆరంటే నావల్ల కాదు. నేనేం మీలాగా ఎస్టీటిని కాదు నోరెత్తకుండా పనిచేసుకుంటూ పోవడానికి, కాన్పులు చేయించాను. వురుళ్ళుపోయించాను. రక్తం ధార పోశాను, అందుకు ఇంతయింది. ఇందుకు అంతయిందంటారు. నాకేం కట్న కానుకలిచ్చారా? తులాభారం చేశారా? లోకంలో ఎవరూ ఏ అల్లుడికీ, కూతురికీ చేయంది చేస్తున్నారా? అద్వాన్సుగా తీసుకున్నది కూడా అప్పే!” గట్టి-గట్టిగా అరిచాడు నిరంజన్.
“కొంచెం నిదానంగా మాట్లాడండల్లుడు గారూ, అడ్వాన్సయింది, అప్పయింది తేడా లేకుండా పోయేది తీర్చినప్పుడు కదా! మేం కట్న మిచ్చినట్టుగాని, ఆర్థికంగా తూగినట్టు గానీ ఎప్పుడైనా ఎవరితోనైనా అన్నామా?” సంజాయిషి చెప్పుకుంటు న్నట్టుగా అన్నాడు పఠాఖి.
ఉరి వేణు సంకోజు
“మీరుండండి, ఏమయ్యా-మేమేమీ చేయలేదా? ఏమీ అదనంగా ఇవ్వలేదా. యశోదా ఆస్పత్రిలో మీ అమ్మగారు చేరినప్పుడు అయిన ఇరవైనాలుగు వేల బిల్లు మీ మావయ్య కాదా కట్టింది? నిన్నగాక మొన్న మీ నాన్నాగారికి అపొలోలో చేయించిన వైద్యానికి అయిన పదిహేనువేలు ఎక్కడినుంచొచ్చాయి?”-అవేశంగా, ఎన్నడూలేనంతటి ఉచ్చస్వరంతో, సజల నేత్ర అయి అన్నది సీతమ్మ.
“సీత్రా నువ్వూరుకో. అల్లుడుగారి మనస్సులో వుండేదేదో అననీ. అయ్యా! పురుళ్ళు పోయించటం మా బాధ్యతే. బట్టలూ, బంగారం కొని పెట్టడం మావంతే. అదేదో ఆవేశంగా, బాధకొద్దీ అన్నమాటలను పట్టించుకోకు.మేం అదనంగా చేసిందేమీ లేకపోగా మీకొక దమ్మిడీ అయినా ఇచ్చిన వాళ్ళం కాము. పొరబాటున స్వతంత్రించి ఏదో చెప్పబోయాను. ఏమీ అనుకోకు నాయనా” అని పరాఖి అంటుండగానే కలుగజేసుకుని-
“స్వతంత్రం కాదు అలుసు. నేనంటే అలుసు మీకు ఇదే చేస్తున్నాను. ఏకాలేజీలోనూ నేను నా ప్రమేయంతో చేరలేదు. నాకు బయట పదివేలి వేస్తామంటున్నా ఐదేసి వేలకు మీరే కుదిర్చారు. అడ్వాన్సులూ - రాద్దాంతాలూ నాకు తెలియవు. అవేవో, మీరు చూసుకోండి -మానండి, నాకనవసరం. ఈసారి ఎవరి ప్రమేయమూ లేకుండా ముఖ్యంగా మీ ప్రమేయం అస్సలు లేకుండా, నాకుగా నేను ఒక కాలేజీ వెదుక్కుంటున్నాను. నాకు మీ కూతురూ వద్దు, మీ వ్యవహారమూ వద్దు. మీ సంబంధానికో నమస్కారం ఇందటితో మీ బాగోతం కట్టి పెట్టండి” అంటూ విసురుగా వెళ్ళిపోయాడు నిరంజన్.
చూపులకు నిరంజన్ చాలహుందాగా, అందంగా వుంటాడు. ఎరితోనైనా తాపీగా మాట్లాడతాడు. అతనిలోని ఒక విధ్వంసకుడు భూతద్ధంలో కాదు గదా ఎక్స్‌రేలతో కూడ బయటపడడు. వివాహమైన రెండు మూడునెలలనుండే అతనిలోని విధ్వంసకుడు కళ్ళు తెరిచాడు. కాళ్ళూ -చేతులూ -అన్నింటికీ పనిచెప్పాడు.
సుధ బక్కపల్చగా, నాజూకుగా, చలాకీగా, అందంగా, ప్రసన్నంగా వుంటుంది. ఆమె నవ్వు, అందమైన పలువరస-ఆమె అందాన్ని మరింత పెంచేట్టుగా వుంటాయి. అందంతోపాటు తెలివైన సుధకు చదువన్నా ఏదైనా ఉద్యోగ రంగంలోకి ప్రవేశించాలన్నా ఇష్టం. గోషాలో పెట్టడమనేది ఒకటీ తక్కువగాని సుధ ఎవరి ఎదుటపడ్డా. ఆఖరుకు ఆమె కన్నతండ్రితో చనువుగా వున్నా సహించేవాడుకాదు నిరంజన్. అటువంటప్పుడు ఆమెను ఉద్యోగంకోసం
స్పర్శ షి బయటకు పంపుతాడా? ససేమిరా అన్నాడు. ఏవో ఉద్యోగాలకోసమని ఎన్నెన్నో దరఖాస్తులు చేసిందామె. కొన్నింటికి రెస్పాన్స్ వచ్చింది. చిన్నవీ, చితకవీ అయినా సరే, ఉద్యోగాలన్న తరువాత చన్నీళ్లకు వేన్నీళ్ళు తోదన్నట్టుగా, ఆర్ధికంగా సహాయకారి కాగలదని ఎంత చెప్పినా నిరంజన్ వీనిపించుకోలేదు. ఎంతో సఫకేషన్కి గురైంది సుధ. మానసికంగా చితికిపోయింది కొంతకాలం. ఇక వాటి జోలికి పోవడం మానేసింది.
ఇంట్లో సుధకు ప్రత్యక్ష నరకాన్ని చవి చూపిస్తుంటే నిరంజన్‌ని ఆతని తల్లిదండ్రులే వారింప జూశారు. కాని ఫలితం లేకపోయింది. తండ్రి పెంపకంలో కొంత స్వేచ్చగా పెరిగిన సుధకు పుస్తకాలంటే ఇస్టం. వాటికీ దూరం చేశాడు నిరంజన్. ఒంటరిగాకూర్చుని నిర్వ్యాపారంగా ఉండటమిష్టం నిరంజన్‌కి. పుస్తకాల్ని ఆమె చేతుల్లోంచి లాక్కుని విసిరికొట్టేవాడు. అదేమంటే తనమీద మోజు తీరిందని, తనను అవాయిడ్ చేయజూస్తుందని కొత్త నిందలు వేయబూనేవాడు. సుధకు వ్రాయడంలో కూడ కొంత (్రవేశంవుంది."“ఎవడి కోసమే ఈ రచనలు?” ఎవడిమీదనే నీ విరహం?” అంటూ గుద్దురిమి, కనీసం ఆమె వ్రాసిందేదో చూడనైనా చూడకుండా చించేసేవాడు. ఒకనాడేదో తాపత్రయం కొద్ది తాను వ్రాసుకున్న వాక్యాలు తాత్వికంగానూ, కొంచెం లోతుగానూ వున్నాయనిపించి, భర్త చించేసిన కాయితాలను ఒకచోట చేర్చి, తిరిగి వాటిని అతికించి చదువు కోబోతుంటే గమనించిన నిరంజన్-పైశాచికంగా ప్రవర్తించి, చిరుగుకొకటి చొప్పున ఆమె శరీరాన్ని కొవ్వొత్తితో కాల్చాడు. బాధ భరించలేక నోల్లో గుడ్డలు కుక్కుకుని ఏద్చింది సుధ. కాలిన గాయాలు మానేదాకా తన పుట్టింటికి వెళ్ళిపోయింది.
జరిగినదంతా తెలుసుకున్న తల్లి దండ్రులు కుమిలి కుమిలి రోదించారు. సుధ జీవితాన్ని ఆమె నిర్ణయానికి వదిలేయటానికి అంగీకరించారు. విడాకులు కోరింది సుధ. ఏమీ చెప్పలేదు నిరంజన్. అవుననీ కాదనీ చెప్పకనాన్చుతూ వచ్చాడు. వారం, నెల, ఆరు నెలలు గడిచాయి. ఉన్న ఉద్యోగం పోయి బవిరి గడ్డంతో వికారంగా, ఫకీరులాగా మారి వచ్చాడు. మళ్ళీ మొదటికొచ్చింది వ్యవహారం. వడ్చులూ-తీర్చులూ అయ్యాయి. బుద్దొచ్చిందన్నాడు. ఎవ్వరూ నమ్మలేదు. నమ్మలేదన్న విషయం అతనికీ తెలుసును, కాని సుధకు తప్పిందికాదు. మనసూ, ఆత్మా అనేవాటినన్నింటిని చంపుకుని వెళ్ళింది. సంసారసాగరంలోకి-దుఃఖపు ఊబిలోకి - ఒక అలలాగ -ఒకపీడకల లాగ- రెక్కల్దెగిన పక్షిలాగ-గాయపడిన కూనలాగ-సుధ!
50 వేణు సంకోజు చిన్నపాటి పట్టుచిక్కింది గనుక ఇక విజృంభించాడు నిరంజన్, మెత్తగా అగుపిస్తూనే కన్పించని కత్తితో నిత్యం ఒక కొత్తవిధంగా, ఏదోవాక నెపంతో కోస్తూ-వస్తున్నట్టుగా -విసిగిస్తూ -రాచి రంపాన పెడుతూ వచ్చాడు. ఉన్నట్టుండి ఉద్యోగం మానేశాడు. ఉన్నపళంగా స్థలం మారుద్దామనేవాడు. ఆరు నెలలకో చోటు మార్చి మార్చి విసిగించాడు. ఈ కాలేజీ బాగోలేదంటే- ఆ కాలేజీ సరిపడదని, చేజారిపోయిన ఉద్యోగానికల్లా పరాభిదే కారణమంటూ వచ్చాడు. ఈలోగా పరాఖి ఉద్యోగ విరమణ కూడా చేశాడు. ఆదాయం సగమైంది కాని అవస్థలు రెట్టింపయ్యాయి. ఒక్కగానొక్క కూతురనుకుంటే జీవితానికి సరిపడా నరకయాతనే మిగిలింది. ప్రభుత్వ చాకిరీ చేసి-చేసివెన్నుపూస విరిగినంత పనైంది. అల్లుడి దయవల్ల పిడికెడు గుండె కాస్తా చిల్లు-చిల్లు అయ్యింది. కూతురు స్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతా వుంది. వివాహ వ్యవస్థ మీదా రోత కలుగుతూ వుంది. అటువంటి స్థితిలో కూతురు ఆకస్మికంగా ఒకనాడు ఇంటికి రావడం, మరునాడు ఫోనురావడం- కలరావ్యాధి-చికున్‌గున్యా, డెంగ్యూలు తగ్గకుండానే టైపాయిడ్ మీద టైపాయిడ్ మొదలైనట్టుగా పరిస్థితి దాపురించి నట్లయింది. భయంకరమైన దిగులు ఎన్నడూ లేనంతగా ప్రారంభమైంది.
ఇదంతా [గ్రహించిన సుధ-తండ్రి తెలియజేయలేని, తెలియజేయాలంటే నోరు రాని విషయాన్ని తన తల్లి ద్వారా తెలుసుకున్నది గనుక ఒక నిర్ణయానికి వచ్చింది. దుఃఖించి, శుష్కించి పోవడం వల్ల ప్రయోజనం లేదని, కన్నీళ్ళు కడిగేసుకుని ఇక బయలుదేరింది.
“అదేమిటమ్మా-ఎక్కడికీ ప్రయాజం?”-పరాఖీ, సీతమ్మా ఒక్కసారే అడిగారు సుధను.
“అత్త వారింటికి-చాల కాన్ఫిడెంటుగా జవాబిచ్చింది సుధ.
“ఈ స్థితిలోనా? అందునా ఈ ఫోను వ్యవహారం”-అంటూ చెప్పలేకా, దాచలేకా సతమతమయ్యాడు పఠాభి.
“నాన్నా-ఆసలేం జరిగిందో, ఆయనేం మాట్లాడిందీ నాకు తెలియదు. తెలుసుకోవాలని కూడ నాకిప్పుడు లేదు. నా కాపురాన్ని నేను చకృబెట్టుకోగలనో లేదో 'గాని, నాకుగా నేను నిలబడగలననే ధైర్యం వచ్చింది. అదిచాలు, నాకింక ఎటువంటి బెరుకూ లేదు. మీరేం బాధ పడకండి. భయం అంతకన్నా పెట్టుకోకండి. త్వరపడి నేను ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడను. నావెంట
జ ఇష య నా. గ 2 22 గ తల కి ఆక్లి న హూ సి ల ₹ స్పర్ళ వా ర] సైతం ఎవ్వరూ రాకండి. నేను ఒక్కదాన్న ఈ వ్యవహారం తేల్చుకోదలటుం న్నాను” అంటూ బిడ్డ లనిద్దరినీ వెంటబెట్టుకుని బయలుదేరింది. కుడిచేతిలో ఒక చేసంచి, ఎడమచేతిలో పెద్దమ్మాయి వర్షను పట్టుకుని, చిన్నపాప హర్షను చంకనెత్తుకొని, ఆమె అలాగుండె నిబ్బరంతో వెళ్ళుతుంటే, ఏమీ తోచక, అడ్డగించి ఆమెను ఆపనూలేక చూస్తూ వుండిపోయారు. సీతమ్మా, పరాఖి.
“ఏం ఎందుకొచ్చినట్టు? ఎవడికోసమైతే వెదుక్కుంటూ వెళ్ళిపోయావో వాడి దర్శనం కాలేదా? అయినా, ఆశ్రయం ఇవ్వను పొమ్మని తన్ని తరిమేశాడా? ఎటూ దిక్కు లేక పాతమొగుడే దిక్కని, సిగ్గూ లజ్ఞా లేక తిరిగి వచ్చావా?” రెచ్చగొడుతున్నట్టుగా అరిచాడు నిరంజన్,
మౌనంగా ఇంట్లోకి నడిచింది సుధ. అత్తగారు చేసంచిని తీసుకుని వర్షను అక్కున చేర్చుకుంటే, మావయ్య ఒళ్ళోకెళ్ళి వాలింది హర్ష అలా అదే పనిగా అరుస్తూనే వుండిపోయాడు నిరంజన్. చేతికి ఏవస్తువు అందితే అది నోటుబుక్కూ-పెన్నూ-పెన్సిలూ-కంపాస్బాక్సు-టీ కప్పు-ఏవి తోస్తే దాన్ని తీసుకుని నేలకేసి కొడుతూ, అసలింక తనకేదీ పట్టదన్నట్టు, లోపలికెళ్ళి తన పనేదో తను చేసుకుంటూ పోయింది సుధ. 'నాన్నా' అంటూ పిల్లలు సమీపిస్తే, కసిరికొట్టాడు నిరంజన్
“పిల్లలేమన్నారు?” అడిగారు తల్లిదండ్రులు.
“మీరు మాట్లాడకండి. మీరంతా వొకటే. ఆ పిల్లలంటే నాకసహ్యం. నాకిప్పుడు ఆడ జాతంటేనే అసహ్యం కలుగుతున్నది” కేకలేస్తున్నట్టుగా అన్నాడు నిరంజన్.
“వీడి ఖర్మ అన్నట్టుగా పసిపిల్లలను తీసుకుని పక్కకు తొలగిపోయారు తల్లి దండ్రులు.
పగలు కాస్తా సాయంత్రంలోకీ, సాయంత్రమేమో రాత్రిలోకీ జారుకున్నాయి. అంతసేపూమౌనం కాకుంటే (ప్రేలాపన లాగా నిరంజన్ అరుపులు. మధ్య మధ్య ఆటలాడుకుంటూ అల్లరల్లరిగా తిరుగాడుతున్న పిల్లలమీద కసురుకోవడం, ఆ స్థితిని వింతగా గమనించి పిల్లలు దూరం తొలగిపోవడంతో సరిపోయింది.
“నాగదిలోకి రావద్దు” అంటుండగానే విసురుగా, బలంగా తలుపులు తీసుకుంటూ లోపలికి, ప్రవేశించి పక్కలు పరిచింది సుధ.
2 వేణు సంకోజు అంతటి బలాన్ని తెగువను తొలిసారి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాని అనిపించింది నిరంజన్‌కి. నివ్వెరపోయాడు, కాని, ఆ ఫీలింగ్‌ని వ్యక్తం చేయకుండా దాచుకునే విఫలయత్నం చేశాడు. “ఎవడబ్బసామ్మో ఇక్కడ దాచినట్టు పీకలదాకా నొక్కొచ్చింది. కనీసం తినమనైనా అనలేదు. బరితెగించింది కదా” అన్నాడు సుధ నుద్దేశించి నిరంజన్. ఆమె రోశపడలేదు.
చిరాకూ, అవమానం, కసితీరా ఆమెను కొట్టి చంపేస్తే బాగుండునన్న భావాలు కలిగినై నిరంజన్‌కి. కాని సాహసించలేదు.
లైట్లార్చేసింది సుధ.
తిరిగి వెలిగించాడు నిరంజన్.
మళ్ళీ ఆర్పేసే ముందు ఇక చూపు చూసింది సుధ-నిరంజన్ వైపు. కూడా చూడలేక పోయాడు నిరంజన్. “మ్తళ్ళీ లైట్లు వెలిగించావో...” అన్నట్టు ఆర్బేసింది, ఇక సాహసించలేకపోయాడు నీరంజన్.
ఇరువురూ నడుం వాలారు కాని ఎవ్వరూ నిద్రకు ఉపక్రమించ లేదు. రెండు అగ్ని గుండాలుగా మండుతున్నారు లోలోపలే. కళ్ళు మూసుకునే ఎవరికి వారు ఆవేశంతో-వేగిపోతున్నారు. గది కూడా వేడెక్కినట్టుగా ఉక్కబోసి దిక్కుతో హైరానా పడుతున్నట్టుగా ఉంది. తన చుట్టూ వేడినే తిప్పుకుంటూ ఫాను సొమ్మసిల్లి పోతున్నట్టుగా వుంది. కాలం ఆగిపోయినట్టుగా కూడ వుంది. మౌనం మాత్రమే చోటు చేసుకుని పదిలంగా పరుచుకున్నట్టుగా వుంది.
గంట గడిచింది. రెండు గంటలు గడిచినవి. మూడుగంటలు ... సుధలేచి నిరంజన్ ఫ్యాంటును విష్పదీయడం ప్రారంభించింది. అతడు ముడుచుకు పోసాగాడు. బలంగా లాగేసింది.
“ఏమిటిది అజ్జలేకుండా? అని గద్దించబోయాడు. అండంర్వేర్ని కూడ లాగి పారేసింది. లేచి చెంప చెళ్లుమనిఫించబోయాడు. చెయ్యి పట్టుకుని విరిచేసినంత పనిచేసింది. 'కుయ్యో మొగ్రో' అని మొత్తుకుంటుంటే, తాను లేచి, అంతకు ముందే సిద్ధంచేసుకున్నకత్తిని తీసి, లైటువేసి, ఎడమచేతిని అతని తొడల మధ్యకు పొనిచ్చి... పట్టుకుని కత్తిని ముందుకు తెచ్చింది-కోసేసేందుకన్నట్టుగా. -
స్పర్శ 5్3
“హోహో అంటూ పెద్దపెట్టున అతగాడు అరవబోతుంటే మూతి పగిలేట్టుగా చాచికొట్టి - “ఏరా ఈపనిచేస్తే హత్యాయత్నానికి పూనుకున్నానని కంప్లెయింటు ఇచ్చావు కదా...”
“లేదు-లేదు, నేను కంప్లెయింటు ఇవ్వలేదు. ఇచ్చానని అబద్ధం చెప్పినాను” వణికిపోతూ, ఏడుస్తూ, చెమటలు కక్కుతూ, చేతులు జోడిస్తూ, మూతి పగిలిందేమోనని నిరంజన్
“ఏం ఫరవాలేదు. ఇప్పుడు చెయ్యరా పోలీసులకు ఫోను-నేను ఆపనే చేయబోతున్నాను” అంటూ, అంగీనికూడ విష్పదీయ సాగింది సుధ. నివారించే ధైర్యం చాలక ఎక్కడ కత్తికి పని చేప్తందో నన్న భయంతో పిరికి-పిరికిగా పిచ్చి- పిచ్చిగా, అతలా కుతలమైపోతూ, అంగీని తానే విప్పేసుకున్నాడు. అంతకుముందే బనియన్లేదు.
“నాది తప్పే-నన్ను క్షమించు-నేనేమీ పోలీసులకు ఫోను చేయను. నిన్నింక హింసించను-నామానాన నన్నాదిలేయి. నీకు దండం పెడతాను. నీజోలికి రాను. నీ కాళ్ళు పట్టుకుంటా నంటూ కాళ్ళవైపు సమీపించబోయాడు నిరంజన్. ఆమెదూరం తొలగుతూ ఒక మూలను చూపించి అక్కడ కూలబడమన్నట్టుగా సైగచేసింది. ఆ పని చేయబోతూ ప్యాంటును చేతిలోకి తీసుకొాబోయాడు.
“ఊం అదక్కడపెట్టు. అంతసీను లేదు నీకు. నీకిదే శాస్తి. తెల్లారేదాకా ఆ మూలనే పడి చావు. కదిల్తే నీగతి అంతే' అంది మహోగ్రంగా.
లైటు ఆర్బేయబోయాడు నిరంజన్. తొలిసారి ఆరాత్రి అతనికి తన భార్యే ఒక పరాయి స్త్రీగా-ఒక మృత్యుదేవతగా, భయంకరంగా అగుపించింది. సిగ్గూ, బిడియం ఒక్కసారిగా అనిపించసాగాయి.
వెంటనే అతని ప్రయత్నాన్ని అడ్డగిస్తూ లైటు వెలిగించింది సుధ.“ఈ లైటు ఇట్లాగే వెలుగుతూ వుంటుంది తెల్లారేదాకా. నిద్రపోతావో- మేల్మొని చస్తావో నీ ఇష్టం. నేను మాత్రం నిద్రపోను అంది సుధ.
“నేను కూడా నిద్రపోను. నాబుద్ధి తక్కువై ఇటువంటి అభాండం వేశాను. నాతప్పుకాయి” అంటూ చెంపలు చెళ్ళు చెళ్ళున కాయించు కోసాగాడు నిరంజన్.
- రేపటి నుంచి నా (ప్రవర్తన మార్చుకుంటాను. నీకు అవమానం కలిగించే, వాని కలిగించే ఏపనీ చేయను. కాలేజీకి సరిగ్గా హాజరై అప్పుల పాలు కాకుండా
54 వేణు సంకోజు చూసుకుంటాను. మీ తల్లిదండ్రులను నానా హింసలు పెట్టాను. అవన్నీ మనసులో పెట్టుకుని కత్తికి పనిచెప్పొద్దు ప్రమాణం చేస్తున్నానంటూ మళ్ళీ రోదన చేయసాగాడు.
ఆమె మాట్లాడలేదు. ఆమె మౌనం ఆతనికి మరింత వణుకు పుట్టించింది. తన వంటిని, తన దిగంబరత్వాన్ని- తన లజ్ఞాకరమైన పరిస్థితిని చూసుకుని తనకు తానే కుళ్ళిపోయినట్టుగా, కంపుగొడుతున్నట్టుగా భావించి, గతుక్కుమంటూ వుండిపోయాడు నిరంజన్.
తెల్లగా తెల్లారింది.
వాలేజీకి రెడీ అయిన వాడల్లా- యజమాని ముందు బానిసలాగా ఆమె అనుమతి కోసం అన్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు నిరంజన్.
“వోయి చావు” అన్నట్టుగా చూసింది సుధ.
తోక ఆడించుకుంటున్నట్టు బయలుదేరాడు నిరంజన్,
పఠాఖభికి ఫోనుచేసిలోనాన్నా రాత్రికి రాత్రే పోలీసుకేసు సెటిల్ చేసినాను. నిశ్చింతగా వుండండి. ఇక వఇబ్బందీ లేదు” అంటూ ఫోను పెట్టేసింది సుధ.
(ఆలంగాణ నోయి” జూలై - నెప్టెంబర్ 2007)
స్పర్శ ర్5్ తడి తడి
'ఆమె వచ్చి మళ్లీ స్మోల్ట్ చేసి పోయింది సారో అన్నాడు కుమారన్ దీనంగా మధుసూదనరావు గారితో.
మధుసూదనరావు గారికి ఒకింత జాలి కలుగుతూనే మరొకింత నవ్వుకూడ వచ్చింది. కాని దానిని బయట పడనీయకుండా జాగ్రత్త పడుతూ - 'అట్లాగా అన్నాడు.
“అవున్సార్ ఎప్పుడొచ్చిన ఇంకా ఎక్కున తిట్లుతిడుతున్నది సార్. చెవులు క్లోస్ చేసుకుంటున్నాను వినలేక. సిటీకంతటికి వినపడేటట్లు షొట్ చేస్తుంది సార్. 'అరే చేతగానోదా, పింజారీ వెధవా” అని మొదలుపెట్టి ఏమేమో తిడతావు౭టది సార్. చాలా స్మోల్టింగ్స్కి అర్ధాలే తెలియవు సార్ నాకు. నీకింకేం కాలేదురా ముందుంది నీ పండగ అంటున్నది సార్. కేసు విత్‌డ్రా చేసుకోకపోతే గండిపేట. మీరాలం టాంక్, మంజీరా సరిపోవు గనుక కొత్తగా వచ్చిన కృష్ణా నీళ్లన్నీ తాగిపిస్తాదంట సార్ అంటూ భయం- భయంగా, సిగ్గు-సిగ్గుగా, అవమాన భారంతో కుంగిపోతూ, కొంచెంకొచెం వణికి పోతూ కూడ చెప్పసాగాడు కుమారన్.
“నేనూపొంచగలను కుమారన్ అక్కడ ఏం జరిగిందో, ఇప్పుడు నిబ్బరించుకొని, ఓపిక వహించడం కన్న మార్గం లేదు కదా! మీరు ఎదురు దాడిగానన్నట్లు మీకు చేతనైన తిట్లకు లంకించుకున్నా ప్రమాదమే. జెండర్ బయాస్ అంటూ యింకో కేసు పెడుతుంది. మీ మీద ఆడదని చూడకుండా రోడ్డు మీద అసహ్యంగా ప్రవర్తించాడని రివర్స్ గేర్కొస్తుంది,” అని వారించబోయాడు మధుసూదనరావు
“ఇప్పుడు మాత్రం అది తప్పుతుందంటారా? నేనక్కడినుండి సైలెంట్‌గా వస్తున్నప్పుడే అటువంటి హింటొకలి యిచ్చింది. బస్తీవాళ్లని సాక్షం వుండమంటూ అరిచింది. అంతకు ముందే ఈమె వాలకం ఒకటికి రెండు మార్లు చూసి వున్నారు. గనుక ఆ అనుభవం చేత ఎవడు పెట్టుకున్న పీడ అనుకుంటూ
ర్6 వేణు సంకోజు ఎవరిళ్ళకు వాళ్లు వెళ్లి తలుపులు వేసుకున్నారు. అది కొంత రిలీఫవుగా ఫీలవుతున్నాను” అంటూ నిట్టూర్చాడు. కుమారన్.
“ఇంతకీ కేసు ఎంతవరకొచ్చింది?” అడిగాడు మధుసూదనరావు.
“ఇంకా ఫైనల్ స్టేజికి వచ్చే హోప్స్ కనిపంచలేదు సార్, వాయిదాల మీద వాయిదాలే పడుతున్నాయి. లైఫ్ మీద విరక్తి కలగతా వుంది సారొ అంటూ కళ్ళ నీళ్ళ పర్యంతమయ్యాడు కుమారన్,
“చఛ అదేంటి కుమారన్ - అట్లా నిరాశ పడితే ఎట్లా? లైఫీజ్ లార్డర్ దన్ ఎవ్రీ థింగ్ కదా! అంత యిదై పోయేదెందుకు? యూ విల్ విన్. మీ బాధలు తొలగిపోతాయి. త్వరలో విడాకులు పొందుతారు” అంటూ సాంత్వనగా మాట్లాడాడు మధుసూదనరావు
“నాకా నమ్మకం లేదు” సార్ ఇప్పటికి నిండామునిగిపోయాను. నాకళ్ళకిప్పుడు దేవతలూ- దేవాలయాలూ ఎలాగూ కనపడవు. దయ్యాలూ భూతాలు కూడా కనిపించీ, గీ పెట్టి, రక్కి చంపబోయి అలసిపోయాయి, వాటికైనా కొంత కనికరం - జాలి వుంటాయేమోగాని నీలమ్మకు కొంచెం కూడ వుండవు సార్. ఆమె రాక్షసి- వూతన-తాటకి - మందుల మారి మందర- యమకింకరిణి...” అంటూ పళ్ళు కొరికాడు కసిగా కుమారన్.
తానా పేపరు ప్రకటన యివ్వడమెందుకూ? ఆమె స్పందించడమెందుకూ? ఒక సంకేత స్థలంలో ఇరువురూ కలుసకోవడ మెందుకూ? ఆమె అంత వినయంగా, అంతకన్న అందంగా, ఆకర్షణీయంగా, చలాకీగా, ముద్దుగా, బొద్దుగా అగుపించడ మెందుకూ? ఆమెను రెండవ వివాహం చేసుకోవడ మెందుకూ? అని తనను తానే ్రశ్నించుకుంటూ, విమర్శించుకుంటూ,
అసహ్యించుకుంటూ కూడ వుండిపోతున్నాడు కుమారన్. పిచ్చెత్తి పోతున్నది తన మీద తనకు రోజు రోజుకూ. కత్తిపీటతో గొంతు తెగ్లోసుకోవాలనిపిస్తున్నది. ఒక్క చుక్క పోటాసియం సైనైదైనా లేనందుకు కసిగా కూడ అనిపిస్తున్నది.
అంతకన్నా ఏం చేయగలడుతాను? వయస్సు మీరిపోయిన వాదాకాడు. ఎంత (బ్రతిమాలాడు అరుంధతిని! ఎంతగా భంగపడ్డాడు! కాళ్ళు పట్టుకోవడమొక్కటే తక్కువ. చెప్పుకోకూడదుగాని, యించుమించు అంతపనీ చేశాడు ఒకరకంగా. అయినా కనికరించలేదు సరికదా - కసిరి కొట్టింది. కుమారన్లు ఒకరికి వందమంది దొరుకుతారు కాని కోరినంత మాత్రాన ఉద్యోగాలు దొరకవని ఎంత
స్పర్శ 57 ఖరాఖండిగా అంది అరుంధతి! నిర్దాతపోయాడు తాను. తననామె అంతహీనం చేసి, అవమానించినట్టుగా మాట్లాడుతుందని కలలో కూడ వూహించలేదు. కాని, ఇలలలో జరిగిందదే.
“మగవాడినని అహంకరిస్తావేమో! మరేం ఫరవాలేదు. ఉద్యోగం ముఖ్యమా సంతానం ముఖ్యమా- సంసారం ముఖ్యమా అని నిలదీస్తే ఓ ఉద్యోగమే ముఖ్యమని ఖచ్చితంగా చెప్తాను. మాయిష్టం. మీ పిల్లలనుకుంటే మీ వద్దే పెంచుకోండి. నా పిల్లలు కూడ అని గుర్తిస్తే నావెంట రానీయండి. దేనికైనా సిద్ధమే”- అన్నది అరుంధతి తెగింపుగా.
ఆడదానిలాగా చెంపల మీంచి నీళ్ళు కారుతుంటే తుడుచుకున్నాడు కన్నీళ్ళను కుమారన్. అంతలేసి మాటలు అమె ఎలా అనగలుగుతున్నదా అని ఆశ్చర్య పడుతూ ఆ(ర్ధంగా- దీనంగా మూలిగాడు,
సర్దుకుంటూ, కన్నీళ్ళను కప్పిపుచ్చుకుంటూ, కలిగిన కోపం కన్న ఎక్కువ కోపంతోనన్నట్టు, విసుగుతో, ఏం చేస్తున్నదో తనకు తెలియని ఒక పిచ్చి ఉద్రేకంతో కసురుకుంటూ ఏమేమో అంటూనే పోతున్నది అరుంధతి. ఎన్నడో అప్లై చేసుకున్నాను. అపై అపై నో రిప్లై అంటూనే గడిచిపోయింది. ఇన్నాళ్ళు వేచి వేచి, విసిగి వేసారి, జీవితంలో యిక ఉద్యోగయోగం లేదని భావించిన చాన్నాళ్లకు వెయ్యి వెలుగులను గుమ్మరిస్తూ, లక్ష ఆశలను చిగురింపజేస్తూ, కోటి కోర్కెలు ఈడేరినట్టుగా, ఒక్క ఉద్యోగం- ఒక్కగానొక్క టీచర్ పోస్టు వచ్చింది నాకు, అదీ నా సొంతగడ్డమీద, దానిని ఎట్టి పరిస్థితిలోనూ వదలుకోను. ప్రాణం పోయినా సరే చేరి తీరతాను. ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటాను. ఎల్లప్పుడు మగడి మీద- ఒక మగవాడి మీద ఆధారపడి వుండే దీనావస్థ నుండి, దుర్చలత నుండి, అశక్తత నుండి బయట పడతాను. ఉత్పత్తి క్రమంలో నేనూ ఒక భాగస్వామినౌతాను. నాబతుకంటూ నేను బతికే ఒకే ఒక్క అవకాశాన్ని అరుదైన అవకాశాన్ని జారవిడుచు కోలేను. ఇప్పుడు కాకపోతే ఇక నాకీ జన్మలో యిదికాదు కదా, మరే వుద్యోగమైనా అలభ్యమే. నా ఏజి దాటిపోయింది. నాఅదృష్టం కొద్దీ నాకీ బాక్లాగ్ పోస్టు దొరికింది. ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు దొరికింది!
మీకిక్కడి నుండి+ ట్రాన్స్ఫర్ కాదు. నాకిక్కడ ప్రభుత్వ ఉద్యోగంరాదు. నా పుట్టినూరికి, కేరళకు నేను వెళ్ళిపోతాను. నా ఉద్యోగంలో నేను చేరిపోతాను. మీ కేరళ అనుకుంటే, మీ మనిషిననుకుంటే, మీకిష్టం వుంటేనే అక్కడికి రండి. కాని నాకు తెలుసు - మీ కేరళ మాది కాదిప్పుడు. మీకది చుట్టపు చూపు కావచ్చు.
58 వేణు సంకోజు కాని నాబతుకూ చావూ అదే. నాస్వర్ణం- నరకం అదే. నాకు మొగడైనా, పిల్లలైనా, తలైనా, తండ్రయినా, ఒక్కమాటలో- యిక అన్నీ నాకు ఉద్యోగం తరువాతనే” అంటూ రొప్పుతూ, ఊగిపోతూ, జాలిగా-బాధగా- ఉక్రోషంగా- అమాయకంగా- అశక్తంగా ఆగ్రహంగా, ఏమిటీమిటోగా ప్రవర్తిస్తూ, కొన్ని మాటలు తెలుగు9లో, మరికొన్ని మాటలు మళయాళంలో అంటూనే వుండిపోయింది అరుంధతి.
నేను కాదననను అరూ -నేన్నీకు అన్యాయం చేస్తానా? ఎప్పుడైనా డామినేట్ చేశానా? మేల్షావనిజంతో ప్రవర్తించానా? నీ మనసునెప్పుడైనా నాప్పించానా? పిల్లలను గాని తక్కువ చేసి - చూశానా? ఈ ఇంటిని నీ పేరనే కదా రిజిష్టర్ చేయించాను? మా అమ్మనూ- నాన్ననూ సరిగా చూడలేదని గాని. నాకేదో తక్కువ చేశావని గాని ఎప్పుడైనా - ఏదైనా అన్నానా? నీ ఉద్యోగమ్మీద నీకు గల (పేవను- ఇష్టాన్ని కాదనను. రెండు వేల కిలోమీటర్ల దూరం మధ్య రెందు కాపురాలుగా మనం ఎలా వేగుతామో ఆలోచించమంటున్నాను. నీకేం తక్కువైందని ఇంత కరోరమైన నిర్ణయం తీసుకుంటున్నావు?” అర్ధింపుగా అన్నాడు కుమారన్.
“అదిగో ఆ మాటే వద్దంటున్నాను. బతికినంత కాలం ఒక భార్యగానే, కేవలం ఒక మగవాడి మీద ఆధారపడిన దానిగానే వుండలేను. నేను స్వతంత్రంగా బతకడం నాకు కావాలి. నాకారణంగా మిమ్మల్ని ఉద్యోగం మానేయమనలేను, నా వెంటా, పిల్లల వెంటాపడి రమ్మనలేను. అట్ ది సేం టైం నేనిక్కడ కేవలం హౌజ్వైఫ్గా వుండిపోలేను. నాకూ రంపపు కోతగానే వుంది. మీమీద నాకెటువంటి కంప్లెయింట్స్ లేవు. మీరు ఒక భర్తగా అన్నీ చేశారు. కాదనను. కాని నా జీవితానికి- నావ్యక్తిత్వానికి- నన్ను నన్నుగా నిలబెట్టే నా ఉద్యోగానికి నడుమ అడ్డుగోడగా “భర్త” అనే అతడు నిలవడమనే విడ్డూరాన్ని లేదా మీ భాషలో అను బంధాన్ని భరించలేకనే తెంచుకోవాలనుకుంటున్నాను. అవున్నేను చంపుకోవాలనే అనుకుంటున్నాను అయితే మీరనుకునే ఆత్మీయతలను కాదు ఒక అడ్డంకిని మాత్రమే తొలగించుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ లీవ్మిటు మై ఫేట్. ఫర్ది (ప్రజెంట్ ప్లీజ్ లీవ్ మీ అలోన్...” అంటూ చేతులు జోడించి నమస్మరిస్తున్నట్టుగా కోరింది అరుంధతి.
భారంగా - బలహీనంగా - దినంగా - బేలగా- పిల్లలవైపు జాలిజాలిగా - కన్నీటిపర్యంతమై చూస్తూ-వారిని చేరబిలుచుకుంటూ, విరిగిన ఎముకల గూడులాగ, హృదయం మాయమైన ప్రాణిలగా- మౌనంగా - మ్లానంగా గది నుండి బయటకు నడిచాడు కుమారన్.
స్పర్శ 59
పిల్లలిద్దరూ - అబ్బాయీ, అమ్మాయీ, చిన్నవాళ్లు. ఏమీ అర్ధం కావటంలేదు వాళ్ళకు. తొలిసారి యింట్లో ఒక తుఫాను వంటి పరిస్థితిని చూశారు వాళ్ళు. ఆప్యాయంగా తండ్రి గుండెలకు హత్తుకున్నారు. బోరున ఏడ్పొస్తే, భుజానికి నోరు పెట్టుకుని, ఆపుకోలేక- ఆపుకోలేక, పిల్లలెక్కడ భయపడతారోనని పిల్లలకన్నా ఎక్కువ తానే భయపడిపోతూ దుఃఖించాడు కుమారన్. తొలిసారి పెదాల మీదికి పరమేశ్వరి అన్న మాట దొర్లింది. ఎమ్మెన్రాయ్లూ, (పేమ్చంద్లూ కళ్ళలోమెదిలారు. ఏమైంది తనకు? ఏమైపోతున్నాడు తాను. గోవుకన్నా అమాయకంగా, మూగగా రోధిస్తున్నాడు. బయటపడాలి. ఈ స్థితి నుండి అనుకుంటున్నాడేగాని! ఎంతకీ బయట పడలేక పోతున్నాడు.
అనాదే అరుంధతి ప్రమాణం. తనేమైపోయినా ఫరవాలేదు- తన పిల్లలు మాత్రం తల్లిలేని అనాధలు కారాదనుకున్నాడు గనుక పిల్లలను ఆమె వెంటే పంపించే నిర్వహణ నిర్ణయం తీసుకుని వున్నాడు. అరుంధతి మీద కోపం - జాలి-కసి-క్రార్యం- ఏకకాలంలో అనేక అభిప్రాయాలు కలుగుతూ వచ్చాయి ఈఐదారు రోజులుగా. అన్నింటిలోకీ గౌరవ భావమే నిలిచి వెలిగింది. అసలేమీ జరగనట్టు, ఒక స్నేహితురాలిని సాగనంపుతున్నట్టు ప్రశాంతంగా బయలుదేరాడు రైలు స్టేషనుకి. పిల్లలిద్దరూ రెండు - మూడు రోజులుగా షాపింగుతో ఆనందించి యున్నారు. కొత్త బట్టలతో ప్రయాణపు ఉత్సాహంతో మరింత ఆనందంగా అగుపిస్తున్నారు. ఆ తీరుకు గుందెలనిసేలాగున ఏడ్చేవంతు, ఏడ్పును కనిపించకుండా దాచుకోక విఫలమయ్యే విపలమయ్యే వంతు ఇప్పుడు అరుంధతిదయ్యింది. ఎక్కడా దారి పోడవునా సంభాషణకు తావులేకపయింది. మౌనమే రాజ్యం చేసింది. ఒక జీవితాంతం ఈ మౌనమే సుదీర్ధంగా రాజ్యం చేస్తుందేమోనని భయపడసాగిందేమో, గంభీరంగా మారిపోయింది అరుంధతి ముఖం.
అరుంధతి అందకత్తె మాత్రమే కాదు, విద్యావతి, గుణవతి కూడా. ఆమెలోని అనుకూలవతిని చూసి తెగమురిసిపోవడం వల్లేనేమొ 'ఈ ఎడబాటు” అనుకున్నాడు. కుమారన్. కుమారన్ది ఇప్పుడు దిటవుగుందె అయిపోయింది. దేనికీ చలించడే మోనన్నట్టుగా వుండి పోయాడు. అంతసేపూ అరుంధతి మౌనంగా వుండిపోయింది కాస్తా రైలు కంపార్టు మెంటులోకి వెళ్ళి కూర్చున్న తరువాత ఏదేదో చెప్పసాగింది - పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ - అవి ఏమీ అర్ధం కావడంలేదు కుమారన్కి 'ఆరోగ్యం-వేళకి భోజనం - ఫిల్దర్ కాఫీ" వంటి పొడి పొడి మాటలు తప్ప ఏమీ గుర్తుండటంలేదు. నిజానికతడు అమెను
60 వేణు సంకోజు వింటున్నాడే గాని అంతా అల్లుకుపోతున్న దృశ్యం ముందు (శ్రవణ సౌభాగ్యాన్ని కోల్పోయినట్టున్నాడు. పిల్లల కేరింతలు - చేతులూపడాలు - దృశ్యాదృశ్యంగా రైలు కదలడాలు తప్ప ఏమీ కనిపంచడంలేదు- వినిపించడంలేదు. పెద్దకేకే అయినా రైలు కూత అతని చెవిని సోకనేలేదు. రైలు కదలి మెల్లమెల్లగా వేగం పుంజుకుని కొన్ని క్షణాలు గడిచాక గాని పొడిపొడి మాటల మధ్య "పెళ్ళి అన్న మాట కూడ దొర్లటం అస్పష్టంగా వినిపించింది కుమారన్కి. ఈలోగా రైలు కన్పించినంత మేర పట్టాలు దాటి తన జీవితంలాగే ఒక్కసారే చిన్నదైపోయి చివరకు కనుమరుగైపోయింది.
మళ్ళీ కోర్టు కేసు. మళ్ళీ నీలమ్మ తిట్లూ శాపనార్థాలతో అరుంధతి ఆలోచనల నుండి ఈలోకానికొచ్చిపడ్డాడు కుమారన్. మళ్ళీ అవే ఆలోచనలు.
ఒకటికి రెండుమార్లు వెళ్ళొచ్చాడు కేరళకు. అరుంధతి చాల హుషారుగా, హుందాగా,అభిమానంగా, ఇష్టంగా, పిల్లల మధ్య తల్లిగా, ఒక దేవతగా కూడ అగుపించింది కుమారన్కి. రెందుసార్లూ ఇదేవరుస.
తన పరిస్టితికేంగాని, ఆమె అనందాన్ని, ఉత్సాహాన్ని చెరిపివేయకూడదనీ అనుకున్నాడు కుమారన్. పిల్లలు కూడ అదే స్కూల్లో చేరి ముద్దుగా చదువుకుంటూ, బొద్దుగా ఎదుగుతున్నారు. వాళ్ళే గనుక తన వద్దవుడి వుంటే ఈ ఆర్నెల్లలో ఏమైపోయి వుండేవాళ్ళో! ఎటొచ్చితనే వుండలేక పోతున్నాడు. అరుంధతి లేని యిల్లు అడవిగాచిన వెన్నెలగా అనిపించింది కాని అమె మాత్రం చాలా బాగా అడ్జెస్టు అయిపోయింది. అది అతనికి మహా అంతుబట్టని విషయంగా అనిపించింది.
“సెలవులుంటే వుండిపోరాదా' అని అరుంధతి అడిగినప్పుడు అతడి ప్రాణం ఎంత విలవిల్లాడి పోయిందో అతడికే తెలుసును. కాని , తన ఎమోషన్స్‌ని బిగ్గరగా అదిమి పట్టుకున్నాడు. సెలవులస్సల్లేవని అబద్ధం చెప్పాడు. ఆమె కూడ బలవంత పెట్టలేదు.
అరుంధతి స్థిత ప్రజ్ఞత్వం మీద ఎంతో గురి, అభిమానం కుమారన్కి. ఆమె నుండి అ లక్షణాన్ని నేర్చుకోవలసిందే ననుకున్నాడు గనుక కొంత కష్టమైనా అలా ప్రవర్తించడానికే అలవాటుపడ్డాడు. ఇక మీద అదేకదా తనను రక్షించాలి అని కూడా అనుకున్నాడు.
స్పర్శ 61
తనకన్నా కొంచెం వయస్సులో ఒకటీ అరా సంవత్సరాలు చిన్న వయస్సు వున్న కుర్రవాడు స్కూల్లో అరుంధతితో ఆప్యాయంగా, చనువుగా కలిసి తిరుగుతూండటం తొలిసారి చూసినప్పుడు మనస్సు చివుక్కుమంది కుమారన్కి. గుండెలో సూదులు కసికసిగా గుచ్చినట్లయింది. కాని ఏం చేస్తాడు? మిన్నక్షున్నాడు రెండవసారి వచ్చి చూసినప్పుడు అంత బాధ అనిపించలేదు. అతడి గురించి అరుంధతి కూడ చాల యిష్టంగా, అభిమానంగా మాట్లాడింది. అతనికి కొన్ని కళలున్న విషయం చెప్పింది. అతడు కవి, చిత్రకారుడని పరిచయం చేసినప్పుడామె బుగ్గలు ఎరుపెక్కడం అతను గమనించాక యిక తాను శాశ్వతంగా ఆమెకు దూరమయ్యే క్రమం లీలగా ద్యోతకమవసాగింది. అప్పటి నుంచే యిక వెళ్ళలేక పోయాడు కేరళకు. ఆమె ఉత్తరాల మీద ఉత్తరాలు రాసింది. వాటికి చాలా ఆలస్యంగానూ, ముక్తసరిగానూ సమాధాన మిచ్చాడతడు. కొన్నిటికి జవాబివ్వలేదు కూడ. ఆమె కూడ కొంతకాలం తరువాత రాయడం మానేసింది.
అనుకోకుండా ఒకరోజు కుమారన్కి తీవ్ర జ్వరంకాచింది. మధు సూదనరావూ, పక్కవాళ్ళూ చూసి, ఆస్పత్రిలో చేర్చారు. వైరల్ ఫీవర్. వారం రోజులకి గాని తగ్గలేదు. ఈ వారం రోజులూ అతడొక నరకం కాని నరకాన్ని చవిచూశాడు- ఒంటరిగా తొలిసారి. తోడు లేనిదే ఇక బతకటం కష్టమని అప్పుడే బాగా అనిపించింది. అంత వరకూ మిత్రులూ,బంధువులు చెబితే అతడు వినియుండలేదు. కానిప్పుడు బాగా అర్థమైంది. ఆ వారం రోజులూ అరుంధతి అనురాగం, ఆమెలోని అమ్మగుణం, ఆలితనం క్షణక్షణం కళ్ళల్లో కదలాడాయి. ఉద్యోగం మానేసి ఆమె దగ్గరికే వెళ్లిపోయి శేష జీవితం గడిపేద్దామా అని కూడ అనిపించింది. కాని ఎంతకాలం ? వారం పదిరోజులూ, నెలా-రెన్నెళ్ళూ. ఆ తరువాత తను తన భార్యకీ పిల్లలకీ భారమైపోడూ?
ఒకరి మీద ఆధారపడి ఐతకటమే! అసాధ్యం అనుకున్నాడు. అయినా తన (భమకానీ, అరుంధతికిప్పుడు తన మీద అంతటి మమకారం వుందా? ఆ యువకుడు- కళాకారుడు-ప్రతిభావంతుడి ముందు తాను వెలవెల బోడూ? అయినా తన మూర్ధత్వంకాని ,కోరి తనననుండి తాను దూరమై, తీరా ఎడం కాస్తా పెరిగాక వాళ్ళు మరింత దగ్గరయ్యాక యిప్పుడు అటువంటి ఆలోచనలను చేయడమేమిటి? అప్సర్డ్ అనుకున్నాడు. పత్రికల్లో ప్రకటన యిచ్చాడు. నీలమ్మ అనే నరకం మెడకు చుట్టుకుంది. అయితేనేం, ఒంటరితనం కన్న ఇది కొంత మేలేననుకున్నాడు. కాని భరిపంరాని నరకమైంది.
62 వేణు సంకోజు
ఒకనాడు యథావిధిగా కార్యాలయం నుండి సాయంత్రం యింటికొచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసి గతుక్కుమన్నాడు. నీలమ్మ తను అనుకున్నట్టుగా విడోకాదు. ఆమె మాజీ భర్త అనే అసలు భర్తతో తన ఇంట్లోనే ఆనందకేళిలో ఓలలాడసాగింది. కుమారన్ రాకను వాళ్ళు గమనించనేలేదు.
శారీరక వాంఛ తీర్చుకోవడం తప్పుకాదు. నీలమ్మ మీద ఆ విషయంలో అతనికెటువంటి ద్వేషమూ, అభ్యంతరమూ లేవు. కాని తనను మోసగించినందుకే బాధ. భర్త వుండి విధవనని వచ్చి ఇన్నాళ్ళు విధవరాలిగా నటించి తనను మోసగించినందుకు కుంగిపోయాడు. జీవితంలో మరణం కన్న మోసగించబడటం, ఓడిపోవడమన్నది చాల పెద్ద మరణాలనుకున్నాడు. ఎందుకు చేశారిదంతా నీలమ్మ వాళ్ళు? తన అస్తి కోసం. ఇది దాస్తూ వచ్చారింత కాలం. డబ్బును. గుంజే ప్రయత్నంచేస్తూ చుట్టాల పేరిట ఇంటిని చిన్నపాటి క్ల్షబ్బునూ, బారునూ చేస్తున్నారని విసిగిపోయి కదా తను ఈమెను వద్దనుకుని విడాకులు కోరాడు. కేసు తనకనుకూలంగా మారుతున్నదని కొత్త ఎత్తు వేశారు.
నీలమ్మ ఆమె ప్రియుడనబడే- మాజీ అనబడే-అసలు భర్ణ చూడకుండానే బయటికి నడిచాక ఒక్క క్షణం కూడ వుండలేకపోయాడు. మధుసూదనరావు గారినీ, లాయరు గారినీ యధాప్రకారం కలిశాడు-కుమారన్.
తెల్లవారే సరికల్లా వీధిలో సంచలనం. ఏమైవుంటుంది- ఎందుకైవుంటుంది- అనుకుంటున్నారు.
మొద్దుబారి- మాట పడిపోయినట్లుగా ఒక పక్కన బీరువాకు ఆనుకుని దరిద్ర దేవత లాగా జుట్టంతా రేగి కూర్చుంది నీలమ్మ. ఆమె పక్కన అటు యిటుగా ఆమె బంధువులు.
కమిలినట్టుగా బిగుసుకు పోయిన శరీరంతో శవంగా మారిన కుమారన్ నడింట్లో పడుకున్నట్టుగా, ఎవరైనా పిలిస్తే దయచేసి కాస్సేపు నన్ను డిస్టర్బ్ చేయకండంటునట్టుగా వున్నాడు.
మధుసూదన రావు గారు ఉత్తరం చదవసాగారు 'స్లీజ్ లీవ్ మీ అలోన్” అంటూ మొదలు పెట్టి ముక్తసరిగా కొన్ని విషయాలు (వ్రాసియున్నాడందులో కుమారన్. జీవితం తనను ఓడించలేదని, ఉద్యోగం ఓడించిందని రాసుకున్నాడు. తనను అక్కున చేర్చుకున్న స్నేహితులకు, బంధువులకు కృతజ్ఞతలు
స్పర్శ 63 చెప్పుకున్నాడు. ' తనిప్పుడు మరణించిన ఇల్లు తన పిల్లలకు చెందుతుందని, ఈ మధ్యనే మియాపుర్‌లో కొన్న యిల్లు నీలమ్మకు దక్కుతుందని రాశాడు. తనను “'ెధవి అని నిరూపించేందుకు నీలమ్మ విధవగా మారివుంటుందని కూడ అభిప్రాయపడ్డాడు. కోర్టులోని కేసును విత్‌డ్రా చేసుకుంటున్న విషయం, లాయర్ని అప్పటికే ఆ విషయమై సంప్రదించిన విషయం రాసుకున్నాడు. తన భార్య సమక్షంలోనే అంత్యక్రియలు జరగాలని, తన శరీరానికి తన తనయుడే నిప్పుపెట్టాలని, వారిని రమ్మని టెలిగ్రాం యిచ్చానని, ఆ విషయం దగ్గరుండి చూసుకొమ్మని ప్రత్యేకించి మధుసూదన రావును కోరాడు. తనలాగే తన పిల్లలను ఎప్పుడొచ్చినా ఆదరించాలనే మాటలు చదువుతున్నప్పుడు మధుసూదన రావు కళ్ళవెంట నీళ్ళు జలజల రాలి ఉత్తరంలోని అక్షరాల మీద పడి తడితడి అయ్యాయి.
(వత్రిక జులై ౨005)
64 వేణు సంకోజు గౌరవన100నం! మార్చి మార్చి చూస్తున్నాడతడు వంద రూపాయలనోటును. చూస్తున్న కొద్దీ మరింత వెలితిగా, అయిష్టంగా, అసహ్యంగా అనిపిస్తున్నది. మధ్యలో ఒక పెద్దమనిషి లాంటి. వ్యక్తి తీసుకొమ్మని గట్టిగా చెప్పడంతో తీసుకోవలసి వచ్చిందిగాని, అసలు పనికిమాలిన వంద రూపాయలనోటును తను తీసుకోవలసిందేకాదు. ఈవయసాొకటి. తాను చిన్నవాడై పోవడమే పెద్ద చిక్కయి పోయింది. హాస్టల్లో ఎవరి పనుల మీద వాళ్ళు, ఎవరి గొడవలో వాళ్ళు, ఎవరి ఆట పాటల్లో వాళ్ళు వుండి పోయారు. కొందరు బట్టలు ఉతుక్కుంటుంటే, కొందరు వళ్ళు కడుక్కోటానికి స్నానానికి ఉషక్రమిస్తున్నారు. గదుల్లో ఏదీ ఎక్కడుం డాల్సినచోట అక్కడలేదు. ఎందుకుంటుంది? ఉంటే అది మగపిల్లల హాస్టల్ ఎట్లా అవుతుంది? అందరూ ఎవరి వ్యాపకాల్లో వాళ్ళున్నా రాజశేఖర్ మాత్రం అందుకు భిన్నంగా, ఒంటరిగా, ప్రశాతంగా, మరికొంత గంభీరంగా ఉన్నాడు. అది అతడి సహజమైన ధోరణే అన్నట్టు, అండుకు తామంతా అలవాటు పడ్డవాళ్ళమే అన్నట్టున్నారు తోటివాళ్ళు. ప్రశాంతంగా, దీర్ధాలోచనల్లో రాజశేఖర్ నల్లగా, బక్కపల్చగా హుషారుగా, తీక్షంగా చూస్తూ, మౌనంగా ఉండిపోయాడతను. వయస్సును మించిన లక్షణాలు తోచీతోయకుండా ఉన్నాయ తనిలో. అతడక్కడి - తోటి హాస్టల్ మేట్స్‌ని అంతగా పట్టించు కోడేమో అన్నట్లు ఉన్నాడుగాని తోటి వారుమాత్రం అతడిని పట్టించుకుంటు, అతడి పట్ల గౌరవభావం 'ప్రకటించుకుంటూ, తమతమ కోలాహలాల్లో, మునిగి తేలుతూ వుండి పోయారు. అతడిని డిస్టర్చ్ చేయరాదని ఎప్పటినుంచో తీర్మానించుకున్నట్టు వుంటున్నారు.
తక్షణం పరిష్కరించ వలసిన విషయమేదో కొలిక్కిరానట్టుగా ఏం చేస్తే బాగుంటుందో తేల్చుకోవాలన్నట్టుగా ఉన్నాడు రాజశేఖర్. అతడికి పద మూడో యేడు ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. పిల్ల రజనీకాంత్ లాంటి విలక్షణత్వం,
స్పర్శ 65 ప్రత్యేకత ఏదో తొణికి లాడుతున్నట్టుగా వుందతని ముఖ వర్చస్సు, పదమూడోయేట ఇరువై మూడోయేట వుండే హుందాతనం ద్యోతకమౌతున్నది.. పరిణతితోస్తున్నది.
రాజశేఖర్‌ని వెదుక్కుంటూ వచ్చాడు రఘు - జర్నలిస్టు, కౌంచెం హదావిడిగా నడుస్తూనే, ప్రశాంతమైన నవ్వు ముఖంతో పలకరించాడు రాజశేఖర్‌ని.
“జరిగిన విషయం మిత్రులకు చెప్పావా?” అడిగాడురఘు.
నవ్వలేని ఒక నవ్వలాంటి కవళికతో “లేదు” అని జవాబిచ్చాడు రాజశేఖర్. ఆపొట్టి ఏకపద సమాధానంలో- “చెప్పవలసిన అవసరం వుందా?” అనే ప్రశ్న కూడ ధ్వనించేట్టుగావుంది.
ఆ తీరుకు ముగ్భడై పోయాడు రఘు.” ఎంతటి స్థిత ప్రజ్ఞత!” అనుకున్నాడు.
“మీ వార్డన్ ఉన్నాడా?”
“ఇందకు ముందు ఇక్కణ్ణే తిరుగులాడిండు”
“ఏం, అతడుంటే ఎంత, లేకుంటే ఎంత? పరిస్థితులేమైనా మారుతాయా వుంటే దండికొట్టడం మాసేయాలని నిర్ణయించుకుంటాడా? హఠాత్తుగా దయా(్ధ పహృదయుడై పోతాడా? విద్యార్థులను అనాథలుగా అంటరాని వాల్ళుగా, అర్భకులుగా గాక మన మనుషులుగా చూడటం ప్రారంభిస్తాడా? నీతివంతమైన జీవితాన్ని మించిన-సుఃఖం, సంతోషం, సౌభాగ్యం వుండవనే నృవ తెచ్చుకుంటాడా? ఒక్కమాటలో - అతడికిటువంటి విషయాలు పట్టింపు అవుతాయా?” అని అడుగుతున్నట్టుగా ఉందా జవాబు కనీసం రఘుకి అట్లా అనిపించింది. లేదా వినిపించినట్లని పించింది.
ఆశ్చర్యానికి లోనౌతున్నాడు రఘు. ఇదే గనుక ఇంకొకరి విషయంలో జరిగివుంటే ఈ పాటికి టాం టాం వేసుకుని వుందేవాడు. పెద్ద ఘనాపాటి కింద తనను తాను పరిగణించుకుని, తోటి వారి ముందు గొప్పలు పోయి వుండేవాడు. అభినందనలు పొందటంలో అతనికి ఎంతటి నిరీహ? ఒక బాలమునిలా ఎంతటి నిర్మోహం తోవున్నాడు! అనుకున్నాడు. ఆలోచనల్లోంచి తేరుకున్న తరువాత ఇక హాస్టల్ విద్యార్భలందరినీ ఒక చోట సమావేశపర్పాడు రఘు, సరిగ్గా ఆసమాయానకికక్కడ వార్డెన్ కూడ ్రత్యక్షమవడంతో అతడిని కూడ కాస్త
66 వేణు సంకోజు వుండమని కోరాడు. జరిగినదంతా మంచి ఉత్మంరతో చెప్పాడు. ఈ రోజు రాజశేఖర్ స్కూల్‌కి ఆలస్యం కావడానికి గల కారణం అదేనని వివరించాడు. పిల్లలంతా ఆవేశంతో, ఆర్ధంగా, శేఖర్ వాళ్ళకంటికి. ఆరాధన భావం పెరిగింది వారికి తడిమీద.
వార్టెన్కి మాత్రం ఇదే మీ (్రిల్లింగ్గాగాని, ఇష్టంగా గాని తోచలేదు. అతని వాలకం చూసి 'ఐ(ర్రై ముందు సంగీతం వినిపించానా ఏమిటి* అనుకున్నాడు రఘ “మాష్టారు విన్నరుకదా మన వాడిగొప్పదనం” అని అడిగాడు అతడి అంతరంగమేమిటో పారేసుకున్నదేదో వెదుకుతున్నట్టు బయటికెళ్ళిపోయాడు. పిల్లలంతా అతని చేష్టలకు ఘౌల్గున నవ్వారు.
ఎవరినీ, దేనినీ లెక్క చేయకుంగా, సాధ్యమైనంత వేగంగా, శక్తులన్నింటినీ కూడ దీసుకుని పరుగెత్తుతున్నాడతదు. జుత్తురేగిపోతుంటే. కాళ్ళకు చెప్పులు కూడ లేకుందా,చేతిలో ఒక కవరుతో ఎవరో వెంటపడి తరుముతున్నట్లు పరుగు లంకించుకున్నాడతడు. జర్నలిస్టు రఘు కంటపడ్డాడతడు.
“ఎందుకీ పరుగు? ఎవరీ పిడుగు? అని ఒక క్షణం ఆలోచించి, తన స్కూటర్వేగం. పెంచాడు రఘు. అది పాత ఎనఖైలనాటి మోడల్స్కూటర్, ఎందరెన్ని విధాల జోకు చేసినా రఘు సేవచేసిన ఇష్టసఖిగా భావిస్తాడేమో!-అమ్మో ఈ బండిని, ఈ బుజ్జికొండను అమ్మేయడమా! అని సమాధానమిస్తాడు. గేలిచేసినా భరిస్తాడు. మధ్య మధ్య అది మొండికేసి మొరాయిస్తూ వుంటుంది. సరిగ్గా వార్తా కధనాలను పంపాల్సిన సమాయాల్లో కూడ ఇబ్బంది పెట్టి విసిగి ద్రోహానికి ఒడికడుతుందా? సరిగ్గా ఇటువంటి సమయాల్లో విసిగిస్తుందా- రేపే బేరం పెట్టాలి-ఎవడో ఒకడికి-ఎంతకో అంతకు అమ్మిపెట్టాల్సిందే తప్పదు. వెధవది స్వామి అనుకుంటాడు. అనుకున్న క్షణంలోనే, కాకపోతే, ఐదు-పది నిమిషాల్లోనే అది తేరుకుని, బుద్ధి తెచ్చుకున్నదానివలె బాగైకూర్చుంటుంది.
హమ్మయ్య! అనుకుంటూ మళ్ళీదర్జాగా గరుత్మంతుని మీద శ్రీమాన్ మహా విష్ణువు బయలు దేరినట్టు, గాలిలో తేలిపోతున్నట్లు, బయలుదేరుతాడు రఘు అంతటి స్వామి భక్తి పరాయణున్ని అమ్మేయాలని అనుకున్నందుకు బాధపడతాడు. దానివైపు బొలిబొలిగా చూసుకుంటూ, తోలుకుంటూ, గమ్యస్థానంమీద దృష్టినుంచుతాడు. సరిగ్గా అటువంటి సయమంలో పరుగు లంకించుకున్న ఒక కు(రవాడు...
స్పర్శ 67
ఇంతకీ ఎవరీ కుర్రవాడు? ఏంచేసి పారిపోతూ వుండవచ్చు? ఒంటిమీద బట్టలు కూడ కొంత మురికిగానే ఉన్నాయి. మనిషి మామూలుగానే నల్లగా వున్నవాడు కాస్తా చెమటలు కక్కుతూ కొంచెం శంకించవలసినట్టుగానే వున్నాడు. బహుశా దొంగ అయివుంటాదు. మాంచి తెగింపుతో పరుగెడుతున్నాడు. ఎవరో వెనుకవుండి పురమాయించి వుంటారు. దూరాన్నుండి గమనిస్తూవుండివుంటారు. అతడివద్దకత్తో మరేదైనా మారణాయుధమో వుండి వుండవచ్చుకూడ. సరే ఏదుంటేనేం, ఏమైతేనేం, అతడి సాహసమేమిటో చూసి కనుక్కోవలసిందే ననుకున్నాడా.
కొంతకొంత తెరిపియిస్తూ ఇబ్బంది పెడుతున్న స్కూటర్‌ను పక్కన పడేసి తనవెంటబయలుదేరిన ఫోటోగ్రాఫర్ బైకు మీదకూర్చోని బయలుదేరాడు రఘు. అదికొత్తగా, మెత్తగా, దర్జాగా, యమస్వీడుగా దూసుకుపోయింది. నిమిషాల్లోనే కు(ర్రవాడిని పట్టుకోబోయాడు.
“ఏందుకు పరుగెత్తుతున్నావ్-ఏమిటీ కధ? అని అడిగేలోపుననే కుర్రవాడు బైకునెక్కి ఫోటో (గగ్రాఫర్కీ, రఘకీ మధ్యయన కూర్చోని “పోనీయండి” అన్నాడు. అతని వద్దనున్న కవరును చూపుతూ 'దీన్ని అందజేయాలె, తొందరగ పోనీయండి సార్” అన్నాదు.
“ఏముందీకవరులో?”
“నాక్రుతెలువదు” / “ఎవరిది”
“ఒకాయనది. ఒకముసలాయనది. పడిపోయింది. ఆయన చూసుకోలేదు. ఆయనకూడ ఒక బండిమీద వెనుకకూచోనివున్నడు. చేతినుంచిపడిపోయింది.
ఈ వివరాలు చెబుతున్నప్పుడు అతనిలో ఒకగాభారా, ఒక ఆరాటం వంటివి కనిపిస్తున్నాయి. దానిని చేరవేసేపనికి దూరమమవుతున్నానన్న విసుగు “ఏమిటీ ప్రశ్నలు” అనే అభిప్రాయం వ్యక్తమౌవుతున్నది. స్పష్టాతి స్పష్టంగా పిలియన్ (డ్రైవర్‌గా ప్రయాణిస్తున్న ప్రతి ముసలాయననూ “సార్ ఈ కవర్ మీదా” అని అడగబోతున్నాడు రఘు. అడగబోతున్న ప్రశ్నలను అద్దుకుంటున్నట్లు చూసునంతా ఒక ముసలి వ్యక్తి కోసమే నిలిపి, ధ్యాసనంతటినీ కవరు నందజేసే పనిమీదే కేంద్రీకరిస్తున్నాడు. అడగబోయిన ప్రతి వివరానికీ ముక్తసరిగా, అసహనంగానే జవాబిస్తున్నాడు. దీనికన్నా కాళ్ళమీద పరుగెత్తితేనేబాగుండునన్న భావాన్నికూడ తన ప్రవర్తనద్వారా వ్యక్తంచేస్తున్నాడు.
68 వేణు సంకోజు అతని ఆరాటాన్ని చూస్తుంటే రఘుకి కూడ మతిపోతున్నట్లవుతున్నది కుర్రవాడి థమ ఫలించి తీరాలని అతడూ కోరుకోసాగాడు. “న్సీక్సు చెప్పుల్లేవా?” “వైప్పులతోపాటు పుస్తకాల బ్యాగును కూడ అకృడ్జే వదిలిపెట్టి ఊరుకుత్తున్నా” “ఎనిమిదోక్షాసు” “ఈ కవరు పోగొట్టుకున్నాయన తెలియనట్లుంది కదా” “ఆవును, ఎనుక నుంచి చూసిన. సరిగ్గ కనపడలే. దొరుకుతడోలేదో” “లేదో! అంటున్నప్పుడు అతని ముఖం వివర్షమైంది.అతని మిషన్ ఫెయి లయినట్లు చిన్నబుచ్చుకుంటున్నతీరు కనిపించింది. ఒకటి-రెందు-మూడు కిలోమీటర్ల దూరం బైకుమీద ప్రయాణం చేశారు ముగ్గురూ. ఇక లాభం లేదనుకుని బైకును ఆపమన్నాడు రఘు. “ఇదేమిటి- ఇక ప్రయాణాన్ని-ప్రయాణాన్ని విరమించుకున్నట్లేనా అన్నట్లుగా చూడ సాగాడు కుర్రవాడు. “నీ పేరేమిటి.” “రాజశేఖర్” (ఇదెందుకో ఇప్పుడు అన్నట్టుగా) చెప్పాడు. “ఈ కవరులో ఏముందో తెరిచిచూద్దామా?” అడిగాడు రఘు అనుమకికోసం వేచియున్నట్టుగా - రాజశేఖర్‌ని .. ఇందులో ఏముందో చూసుకుంటూ కూర్చుంటే ఇక సరిపోయినట్లే- ముసలోడు దొరికేదిలేదు. తాను అందజేయబోయేది అంతకన్నాలేదు- అనుకుంటూ 'ఊ' అని మాత్రం అన్నాడు నిజానికి ఆ కవరులో ఏముందో తెరచి చూసేందుకు అస్సలు ఇష్టపడ లేదు రాజశేఖర్ ఇకదాన్ని అందజేసే వీలు కాస్తా లేకుండా పోయిన తరువాత తన ఇష్టంతో ఒకరికి పనేమిటి? అనుకుంటున్నట్లుగా ఉండిపోయాడు, “నీవేమీ దిగులు పడకు, దీన్ని అందజేస్తాం. ఇందులో ఎస్.ఐ.గారికి ఫోనుచేస్తున్నానంటూ సెల్లో మాట్లాడాడు రఘు. విషయం చెప్పిన తరువాత,
స్పర్శ 69 అర్ధమనస్కంగా చూస్తున్న రాజశేఖర్ ముందు కవరు తెరిచి చూశాడు. అందులో రెండు ఎల్్ఐ.సీ. పాలసీలు. మూదుఫిక్స్డ్ డిపాజిట్ సర్లిఫికెట్లు ఒకబాందు, పదకొండు రూపాయలు (పది రూపాయల ,నోటూ, ఒక రూపాయి నోటూ) దబ్బుంది. పాలసీలు, సర్లిఫికెట్లు, బాండూ కలిపి లెకృస్తే ఐదున్నర లక్షల రూపాయల విలువైన పత్రాలని తేలింది. ఇవేవీ పట్టింపుకాలేదు రాజశేఖర్‌కి.
వివరాలన్నీ చూసి*ఈ కవరు ఒక రిటైర్డ్ హెడ్మాష్టర్ది రాజశేఖరొ అన్నాడు రఘు.
“అతడు ఎవరైతే మనకెందుకు? అతడి వస్తువును అతడికి అందజేయడమొక్కటే మన బాధ్యత” అన్నట్టు చూశాడు రాజశేఖర్.
“ఒకమాట చెప్పు, ఈ కవరు దొరకంగానే ఇందులో ఏముందో చూడాలని అనిపించలేదా?” అడిగాడు రఘు.
“అస్సలు అనిపించలేదు”
“ఒకవేళ చూసి వుంటే, ఇందులో ఈ ముఖ్యమైన పత్రాలు కేవలం పదకొండు రూపాయలు కాకుండా చాల డబ్బువుండివుంటే అతనికోసం పరుగెత్తినా కనిపించకపోయిం తరువాత నీ వద్దనే వుండిపోతే, ఏమనిపించేది?”
“ఒకరి సొమ్ము మనకెందుకు?” చాల పౌరుషంగా అన్నాడు రాజశేఖర్. ఆమాటలువిని స్టన్ అయిపోయాడురఘు. అతనిలో వీసమెత్తు ఆశ కనిపించలేదు. ఏదో ఆవేశం, అటువంటి ప్రశ్న వినాల్సివచ్చిందనేరోషం, కనిపించాయి అ తనికళ్ళల్లో
“వీడురామొనగాడు!” అనుకున్నాడు
“అడుగుతున్నానని అనుకోవద్దు మీకాస్టేమిటి?”
“ఎస్.సి”
-“మీఇలైక్కడ?
“ఇక్మణ్ణే-హస్టల్లవుంటున్న,
“క్లాసులోనీది ఎన్నవర్యాంకు?”
70 వేణు సంకోజు “ఫస్టు”
“మీ ఆమ్మా నాయన ఉన్నారా?”
“ఉన్నరు. ఊళ్ళవుంటరు. కూలిపనిచేస్తరు.”
ఇంతలో ఒకకానిస్టేబుల్ బండిమీద ఒక ముసలాయనతో వచ్చి రఘుకి సెల్యూట్చేసి తనను పరిచయం చేసుకుంటూ ఎస్.ఐ.గారు పంపించారని చెప్పాడు. బండిదిగుతూనే సదరు హెడ్మాష్టరు ఆబగా తనకవరును, అందులోని కీలక పత్రాలను చూసుకున్నాడు.
అంతదాకా గాబరావుండిపోయిన అతని ముఖం చప్పునచల్లారి, తెప్పని తెల్లారి నట్లు వెలిగింది. చెమటల్లో తడిసిముద్దయిపోయివున్నాడు.
“థ్యాంక్స్ సార్” అంటూ రఘుకి కృతజ్ఞతలు చెప్పాడు.
“నాక్షుకాదు ఈ బాబుకి చెప్పండి ఈ బాబే మీకవరును అందజేయడం కోసం కొన్ని గంటలు కష్టపడ్డాడ” అంటూ, అతని మీద కలుగుతున్న కోపాన్ని తమాయించుకున్నాడు రఘు.
“థ్యాంక్యూ బాబూ” అని చెప్పి బయలుదేరబోయాడు హెడద్మాష్టర్,
“ఆగవయ్యా స్వామి! కొన్ని గంటల నుంచి తన పుస్తకాల సంచీని, చెప్పులను కూడ ఎక్కడోవదిలేసి, కిలోమీటర్ల దూరం మీ కోసం పరుగెత్తినవాడికి ఉత్తధ్యాంక్స్ చెప్పడమేమిటి? అని నినదిస్తున్నట్టుగా అడిగాడు రఘు “సారీ సారీ” అంటూ జేబును తడిమిచూసుకుని, వెదకి వెదకి - పదిరూపాయల” నోటును తీసి
ఇవ్వబోయాడు
అదేమిటయ్యా దానం చేస్తున్నట్టు! ఐదు లక్షల రూపాయల విలువైన డాక్యు మెంట్లు పోగొట్టుకున్నవ్యక్తిని పట్టుకొని ఇచ్చినవాదికి పట్టుమని పదిరూపాయలా ఇచ్చేది! వంద ఇవ్వండి” అంటూ డిమాండు చేశాడు రఘు. గత్యంతరంలేక వందరూపాయలనోటిచ్చి వెళ్ళిపోయాడు హెద్యాష్టర్. ఆనోటును తీసుకునేది లేదన్నాడు రాజశేఖర్. తన తాసత్రయమంతా అందుకోసం కాదన్నట్టుగా చెప్పాడు. అయినా సరే తీసుకొమ్మని సముదాయించాడు రఘు. ఒకవిధమైన అపరాధ భావం కనిపించింది రాజశేఖర్ ముఖంలో నిజంగానే ముసలాడి వద్దినుంచి, ఒక కక్కుర్తి మనిషి వద్దినుంచి, ఒక పిసినారి వద్దినుంచి డిమాండ్‌చేసి
స్పర్శ లే మరీ తీసుకున్నాడు. అట్లాకాకుండా ఆ వందరూపాయలేవో తానే ఇచ్చివుంటే బాగుందేదనిపించింది. సరే తానెలాగూ అతని భవిష్యత్తును గురించి ఆలోచించనున్నాడు. మనసులో కొంత ప్రణాళిక సిద్ధంకానే అయ్యింది.
రాజశేఖర్ వాలకం చూస్తుంటే ఆడబ్బు తీసుకోవలసి వస్తున్నందుకు కంపరంగా ఉన్నట్లుంది. ఏంచేయాలి- అనుకుంటూ,*ఓకే నీకీ డబ్బు ఇష్టంలేకపోతే మీహాస్టల్లో నీకు నచ్చిన వాళ్ళకి పుస్తకాలు కొనివ్వ అన్నాడురఘు.
ఈ మాటనచ్చింది రాజశేఖర్‌కి. వందరూపాయలనోటుతీసుకున్నాడు
“సార్-మనం వచ్చిన కాడికి మల్లా లిష్టిస్తరా?” అర్ధించాడు రాజశేఖర్- అర్ధించుటయే ఎరుగని వాడు అర్థించిననాడు అన్నచందంగా
“ఓ ఘర్ అంటూబైకుమీద మధ్యలో కూర్చోబెట్టుకుని బయలుదేరాడు.
“స్ఫూల్‌కి లేటయ్యింది కదా, మీసార్ ఏమీఅనడా?” అడిగాడు రఘు
“ఎందుకనడూ!” ఎదురుప్రశ్చస్తున్నట్టుగా జవాబు చెప్పాడు రాజశేఖర్
“ఏం చెప్తావుమరి?”
“లేటయిందనిచెప్తాొ
“అదే, ఎందుకు లేటయిందంటే*
“నావల్లనే లేటయిందని చెప్తా
“ఈ జరిగిన విషయం చెప్పవా?”
“మెప్పుపొందటానికా?”
అవాక్కయినంత పనైంది రఘుకి. ఎందుకాకుర్రవాడు అంతగా నచ్చుతున్నాడు తనకు! చేసిన పనిని, కాదు, మంచిని వెంటనే మరచిపోవాలని, అక్కడే విడిచి వేయాలనే ఆలోచన-ఎంత ఉన్నతంగా వుంది! ఎంతలా ఎదిగిపోయాడు! తను వ్రాయబోయే ఫైల్ చేయబోయే ఈ స్టోరీకి తన మనస్సులో కొంతయినా ఒకింత చిరుగర్వంగా ఉంటుందేమో! వీడికి అస్సలు లేదేమిటి? పదమూడోయేట ముప్పయ్యేళ్ళవ్యక్తికి కూడ వుండనంతటి ఉదాత్తత!
72 వేణు సంకోజు
“నిస్సందేహంగా ఈ కుర్రవాడిది వైరాగ్యంకాదు, వైరాగ్యమేవుంటే ఆకవరును అందజేసేందుకు అంతలాఎందుకు తాపత్రయ పడతాడు? తన ప్రాణానికి దక్కిన అస్తులు-చెప్పులూ, పుస్తకాలను విసిరిపారేసి, ఒక నియంత్రించిన సైనికుడిలా ఎందుకు అదే పనిగా పరిగెత్తి దానిని అందజేసేంతదాకా పట్టువదలని విక్రమార్శుడైపోతాడు? రోడ్డుమీద ఎందరులేరు? ఎవరూ పట్టించుకోని పనిని తానే ఎందుకు పట్టించుకున్నాడు? వాట్ ఎ గ్రేట్ ఫెల్లో!” అని తర్మనితర్మం చేసుకున్న రఘు-
“*వద్రివిం తరువాత నువ్వేమి కావాలనుకుంటున్నావ్?”
“ఐ.పి.ఎస్”
“వయస్సులో చిన్నవాడై పోయాడు గాని... అతనికొక - గౌరవవందనం![ -_
మనస్సులో ఆత్మీయంగా అనుకున్నాడు రఘు.
(రచనా కాలం * 22 07 2007)
స్పర్శ 73 సలాయనం?
అంతదూరం (ప్రయాణం చేసి, వెంట వుండి శుశ్రూసలు చేసి, వీధి దాకా వచ్చి వీధి మలుపున ఆగిపోయింది సంయుక్త. అట్లా అవుతుందని తెలుసు “చక్రవర్తికి
- అడిగి ప్రయోజనం వుండదని కూడ తెలుసు. అయినా తీరా ఇంతదాకా వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టకుండా తిరిగి వెళ్ళిపోవడం బాగుండదేమో! "అన్నట్టుగా కళ్ళతోనే ప్రాధేయ పూర్వకంగా అడిగాడు చక్రవర్తి. * ముందే చెప్పాను కదా! అటువంటి కండిషన్ మీద అయితేనే వెంట వస్తాను. లేదంటే ఎవరినైనా తోడు పంపిస్తానని” అంటున్నట్టుగా కళ్ళతోనే, కొంచెం కోపం, కొంచెం విసుగు, బౌలెడంత జాలి, పిడికెడు దయతో నన్నట్టు చూసింది సంయుక్త.
అడుగుముందుకేయలేక, మానలేక, ఆమెను వెనక్కి వెనక్కి చూస్తూ, చూడలేక, గట్టిగా చూపులను మరల్చుకోనూలేక, నడవలేక మానలేక తన ఇంటివైపు నడిచాడు చక్రవర్తి తనను తాను ఎంతో సముదాయించుకోబోయినా అతని మనస్సు అతని మీదనే తిరుగుబాటు చేయసాగింది. ఆమెను ఆ వయస్సులో “ఆమె మానాన ఆమెను” వదిలిపెట్టి శాశ్వతంగా దూరం కావడం అతనికి ఇష్టం కాలేదు. కళ్ళు ఆర్తితో, అనిర్వచనీయమైన అలజడితో పూడుకుపోతుంటే అంతా జలమయంగా ఊరంతా ప్రవాహంలో కదలాడుతున్నట్టుగా, అల్లుకుపోతున్నట్టుగా అగుపించసాగిందతనికి.
సంయుక్తకూ, తనకూ ఎడం పెరిగింది. ఆమెకూ తనకూ శాశ్వతంగా ఎడబాటు కానుంది. ఆమెను ఇకమీద చూడకుండా, వారించినా వినకుండా ఆమె చేసే సేవలు యికపై పొందకుందా, ఆస్థితిని అతడు అనుభవిస్తూ వుండి పోకుండా, ఎందుకు తన స్వంత యింటికి చేరుకోవడం? ఏం సంబంధాలు వున్నాయి గనుక మిగిలి అక్కడ? తన పిల్లలకు ముప్ఫై సం॥ల పైనే వచ్చి వుంటుంది వయస్సు వాళ్ళు చిన్నప్పుడనగా వెళ్ళిపోయాడా మెతను! వాళ్లు తనని
74 వేణు సంకోజు గుర్తించే ప్రసక్తి వుండదు. గుర్తించినా మాంచి కసి పెంచుకుని వుంటారు తన మీదా,(వాళ్లదృష్టిలో) తాను చేసిన క్రౌర్యం మీద. వాళ్ళయపేర్లయినా తెలియవు తనకు తన వూరు తీరే వూహించని విధంగా గుర్తుపట్టనంత రీతిలో మారిపోయింది. ఆనాటి తన అందాల దేవి- రమాదేవి కూడ తన లాగే వృద్ధురాలై వుంటుంది. రోషంతో, కసిగా, దీనంగా మహోద్రేకంగా విరుచుకుపడవచ్చు తనపైన. తన సంతానం సహకరిస్తుండగా తనను బయటకుతరిమేయనూ వచ్చు. అటువంటప్పుడు తన ఈ (ప్రయాణానికి అర్ధమే ముంటుంది? అందరిచేతా తిరస్మరించబడటం ఖాయమేమోననిపించే బతుకు - అదేం బతుకు? చావుకన్న భయంకరంగా రూపు కట్టేబతుకు కొరకేనా తాను ఇంత దూరం ఆయాసపడుతూ వచ్చింది? అని కూడా అనిపించింది అయినా తప్పదు, సాహిసించి ముందుకే నడిచాడు. సంయుక్త కనిపించనంత దూరం నడిచాడు. తనది అనుకున్నయింట్లో తన గతేంకానున్నది తెలియదు. ఇల్లు గుర్తుపట్టడం కొంచెం కష్టమే అయ్యింది చక్రవర్తికి. ఎవరినీ త్రన్స గుర్తుపట్టలేకపోతున్నాడు. ఇతరులెవ్వరూ తనని గుర్తుపట్టే ప్రసక్తే లేదు, ఇంట్రి ముందు అల్లరల్లరిగా పిల్లలు. తనను ఎంత మాత్రం పట్టించుకోని పిల్లలు. ఆటలో మునిగి తేలుతున్న పిల్లలు. ఎంతగొప్పది బాల్యం! ఎంత తీయగా, హాయిగా వున్నారు వీళ్లు! ఏ అరమరికలూ లేవు. ఏ బాదరబందీ లేదు తరువాత ఏం కానున్నదోపట్టింపు లేదు. ఏమైనా ఫరవాలేదనే ధీమాతో వున్నారు. దేనినీ లెక్క చేయవలసిన వని లేదు - దేనికీ వెరిచేది లేదన్నట్టుగా వున్నారు నవ్వుతున్నారు. గెంతుతున్నారు, చప్పట్లు చరుస్తున్నారు ఒకరి వీపున ఇంకొకరు తడుముకుంటూ వున్నారు. పిర్రలు వాయించుకుంటూ వున్నారు కొంచెం సేపు వాళ్ళను చూస్తూనే వుండి పోయాడు చక్రవర్తి అప్రమత్నంగా “నీకివన్నీ కుదరవిక- నీ జీవితానికివన్నీ ఏనాడో చెల్లుబాటై పోయినని- నీవు గాడి తప్పిన బండివి - నీ మీద నీకేజాలిలేని మొండివి” అన్నట్టుగా అనిపించింది అతనికి, అతనికతడే పెద్ద శత్రువుగా, ఆప్రకటిత నేరస్తుడిగా భావించాడు. ఒక దీర్హనిట్టూర్చు విడువడం కన్న అతని వల్ల కాగలగింది మాత్రమేముంది! ఇంటిలోనికి పోబోతూ గడప వద్ద కొన్ని క్షణాలు ఆగిపోయాడు చక్రవర్తి. ఒక బిచ్చగాడిలా అతని వాలకం. అట్లా అనుకుంటారేమోనని జంకాడు. అట్లాగే అనుకున్నట్టున్నారు. వాళ్ళు. అతడిని ఎవరూ పలకరించలేదు. బిచ్చగాళ్ళనుపలకరిస్తారు కూడానా? అని పించింది. దగ్గద స్వరం వినిపింపజేస్తూ దీనంగా అవమానంగానన్నట్లు నిలబడ్డాడు అక్కడే. ఇంట్లో ఎవరి పనిమీద
స్పర్శ 75 వాళ్లువుండిపోయారు ఈ లోపల ఎవరో అతడిని కసిరికొట్ట బోతుండగా కొంచెం దృష్టిసారించింది రమాదేవి. నిర్దాంతపోయింది. ఏకకాలంలో ఆమెను కసి, అసహ్యం, ద్వేషం, ఇంకా ఏవేవో ఆవహించినై. తరిమేయబోయింది కాస్తా తమాయించుకుంది. ఏమీ చేయలేక, నిలబడే ఓపిక లేక అరుగుమీద ఇంటి ముందే కూలబడి పోయాడతడు. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఈలోగా ఎవరో వచ్చి అతడిని పొమ్మనబోతుండగా వారించింది. అంతే. తలుపులు వేసుకున్నారు. చాలసేపే అయ్యింది. తలుపులు మాత్రం తెరుచుకోలేదు.
ఇంత తన పనైపోయింది. మరణం కూడతనను వెక్కిరిస్తున్నట్టుగా అనిపించింది. తన మీద జాలిపదే అర్హత ఎలాగూ లేదు. ఇప్పుడటువంటి అవకాశం కూడ పోయింది ఉదయం అనగా ఇల్లుజేరిన అతడిని పట్టించుకోలేదు తలుపులు. విధిలేకవెనుదిరిగాడు. ఏవోఫోన్లు, చేసుకున్నాడు పబ్లిక్‌బూత్ నుండి టీలు గతికాడు ఒకటి-రెండు సార్లు రాత్రివడుగంటల (ప్రాంతంలో ఎవరో అతని వద్దకి వెళ్లి చక్రవర్తిని నీవేనా అని అడిగాడు. అవున్నట్లుగా తలూపాడతడు. “లే నీతో మాట్లాడాలి. కద నీవు వెళ్ళిన ఇంటి వాళ్ళతో నీ గురించి మాట్లాడాలి” అన్నాడు. అతడి కళ్ళలో ఏదో ఆశసన్నటి మెరుపు!
“ఈతడు. సరే, ఇంతకీ నీవెవరవు?” ప్రశ్నించింది రమాదేవి. “నాపేరు రాజేంద్ర, మా అమ్మ, నాన్నలు పంపిస్తే వచ్చాను అర్జంటుగా” అన్నాడు. అప్ప్స్ అమ్మనాన్నలెవరని” అడిగింది రమాదేవి
“మా అమ్మగారు రుక్మిణి. మా నాన్న కృష్ణమూర్తిగారు. వాళ్ళాయన గారికి వదిన, అన్నయ్య అవుతారు” జవాబిచ్చాడు రాజేంద్ర కొంచెం విసుగ్గా.
రాజేంద్ర ఒక వైద్యుడు. ఒక యాత్రికుడు, ఒక చిత్రకారుడు, కొంత నిర్లక్ష్యం ఇంకొంత పరిశీలనా దృష్టి. కొంత అణుకువ. అంతకన్న రెట్టింపు తిరుగుబాటుతత్వం గలవాడు. అయిష్టంగానే అమ్మమాటమీది గౌరవంతోవచ్చాడు. కాని వీరి తీరు అతనికి ఎంత మాత్రంనచ్చటం లేదు. చక్రవర్తి అంటే మరింత ఉక్రోషంతోనన్నట్టున్నాడు
“అక్కగారన్నాా బావగారన్నా నాకు అపారమైన గౌరవం, కాని ఇంతకాలం తరువాత ఈ మనషిని- ఈ కిరాతకుణ్ణి- ఈ పాపిష్టిని - రోగిష్టిని చేరదీయమనటం అదెట్లా న్యాయం?” కన్నీరు ప్రవహిస్తుండగా వూగిపోతూనన్నట్లు అడిగింది రమాదేవి.
76 వేణు సంకోజు
“అదేమో నాకు తెలియదు. ఇదుగో ఐదువేలు. ఇతని కేన్సరు మందులకు సరిపోతయ్యోలేదో నాకు తెలియదు. తీసుకుంటామంటే ఇస్తాను. లేదంటే నా దారిన నేను పోతాను” తేల్చి చెప్పండి తొందరగా అంటున్నట్టుగా అడిగాడు రాజేంద్ర.
అందరూ ముఖాలుచూసుకున్నారు. ఎవ్వరికీ ఆ వాతావరణం నచ్చటం లేదు. ముఖ్యంగా చక్రవర్తి అక్కడ వుండి పోతాడేమోనని భయపడసాగారు రమాదేవి ఎటూ తేల్చుకోలేకపోయింది. దిష్టితీసిపారేసిన అన్నం పిడతాలా అట్లా వడివుండి పోయాడు చక్రవర్తి. ప్రాణం విడవటం ఒక్కటే తరువాయి అన్నట్టుగా వుండిపోయాడు.
వీళ్లతడిని చేరదీసేట్టులేరు అనుకున్నాడేమో రాజేంద్ర, అక్కడ నుంచి కొంచె రిలీఫ్ కోసం, అన్నట్టుగా బయటకు వచ్చాడు. ఇంట్లోనేకాదు, బయటకూడా అతనికి భయంకరమైన ఉక్కగా వుంది 'నచ్చని ప్రదేశమే అంత అనుకున్నాడు.
లోపలి నుంచి ఒక అబ్బాయి వచ్చి, “ఏమండీ ఈయనకు మాకూ ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ వుందని అతడు అంటున్నా మాకుమాత్రం లేదు. ఇన్నాళ్లు ఇతగాని కారణంగా మా చావు మేము చచ్చాం ఇక మీదట అతని బతుకుతో మాకు పనిలేదు. అతని రోగాలు రొప్టుల్లో మాకు నిమిత్తం లేదు. అదతనికి అర్ధమయ్యేలా చెప్పనైనా చెప్పండి లేదా వెంటతీసుకొని పొండి”
“వెంట తీసుకొని పోవడానికి నేనెవరినయ్యా? నీవతని సంతానం ఇది అతని ఇల్లు. మీనాయన - మీ యిష్టం. ఉందనిస్తే ఉంటాడేమో, లేదంటే పోతాడేమో! మధ్య నాకేమిటి?” అన్నాడు కసురుకుంటూ రాజేంద్ర. తెచ్చినడబ్బు అక్కడ పెట్టిరంధిలేకుండా బయలుదేరాడు.
ఆప్రాంతమంతా చాలాసేపుమౌనం రాజ్యం చేసింది. ఎవరికీ ఏమీ తోచలేదు. మెల్లమెల్లగా ఒకరూ ఇద్దరుగా వూళ్ళోవాళ్లు రాసాగారు చక్రవర్తి ముఖంలోకి చూసి అనేక విధాలుగా మాటలు అనసాగారు.
“చావుదలకొచ్చినావా?ొ ఒకరు
“ఇంకా బతికే ఉన్నావా? ఇరవై యేండ్ల కిందనే పోయి వుంటావనుకున్నామే” మరొకరు *ఈ స్థితిలో ఏం పాముకుందామనే యిక్కడికొచ్చి దిగినావు? పొలమూ- పుట్రా? ఆస్తా- పాస్తా? ఏమొగంబెట్టుకొని ఏమని ఆలోచించి వూడిపడ్డావు? వాళ్లు
స్పర్శ 77 నీకు బ్రహ్మరధం పడతారనేనా? నీకు సరే సిగ్గులేదు. అన్నీ వదిలేసి, తెగతెంపులు చేసుకున్నావాయో! వాళ్ళకు మాత్రం ఉండదనుకున్నావా?”
ఇట్లా, వైనవైనాలుగా అతడిని మాటలతో కడిగి పారేస్తున్నట్టుగా, చెరిగేస్తున్నట్టుగా ఆరా తీయబోయారు. అన్నింటికీ అతని వద్ద ఒకటే సమాధానం- మౌనం. ఆ మౌనం చూసి అక్కడి వారెవ్వరికీ బాధగాని, జాలిగానీ కలగలేదు. పైగా అతని మీద కసే అనిపించింది.
ఇంట్లోని అతని మనవలూ, మనవరాండ్రూ అతడు కూర్చొన్న ఛాయలకైనా రాలేదు. దూరదూరం తాలగిపోతూ అతడిని చూస్తూ జడుస్తూ, రోదిస్తూ కూడ ఉండిపోయారు. ఎంతైనా మనిషికదా. పిల్లలను చూసి అతడి మనస్సు కొటుకులాడింది. కాని ఎవరు రానిస్తారు? సంతానమే దూరం తొలగిపోయి, అతడిని తరిమేస్తుంటే! భార్య రమాదేవి తన ముఖంలో ఏభావాన్నీ వ్యక్తం చేయకుండా వుండిపోయింది. ఆమె కళగా లేదు. కళా విహీనంగానూ లేదు. అది విరక్తో నిరంజనత్వమో, ఏహ్యభావమో - ఏదీ అర్ధం కాకుండా వుండిపోయింది. జరుగుతున్న దేనికీ తాను సాక్షురాలే కాదన్నట్టుగా వుండి పోయింది. కుటుంబ సభ్యులు మాత్రం ముక్తకంరంతో అతడిని యింట్లో వుండనిచ్చే ప్రసక్తిలేదని చెప్పారు
రాత్రికి బయట అరుగు మీదే చక్రవర్తి జీవితం పరుచుకుపోయింది, అన్నింటికీ సిద్ధమై వచ్చిన అతడికి నిద్ర రాకపోయినా కొంచెం విశ్రాంతిగానే అనిపించింది. అరుగు మీద జఒరిగినంతసేపు రమాదేవి ఆలోచనలే అతడి తనువంతా ముసిరినవి, మురిసిపోయేట్టు చేసినవి,
ఆటలాడే ప్రాయం నుండి స్థిరపడే వయస్సుదాకా ఎటువంటి లక్ష్యం లేకుండా తిరిగాడు చక్రవర్తి. అన్ని అలవాట్లు దురలవాట్లు స్వంతమైనవి. పెళ్ళిమాత్రం ఇష్టంకాలేదు. చదువు మధ్యలోనే ఆపి నాటకాలంటూ తిరిగాడు. కనపడ్డసినిమాలూ చూశాడు. అతడు తప్ప ఇంట్లోని అన్నదమ్ములూ, అకృచెల్లెండ్రు గొప్ప చదువులు చదివి గొప్పగా సెటిలయ్యారు. ప్రశాంత జీవితం అనాడే అతనికి రుచించలేదు. స్థిరనివాసమనేదే అతనికి నచ్చలేదు. నెలకు రెండు వూళ్ళయినా తిరిగి వచ్చాడు. సిగరెట్లు మద్యం విషయంలో నెలకు రెండు బ్రాండులనైనా మార్చాడు. నిజానికతనికేదీ రుచించలేదు. కొన్ని వేల సార్లు ప్రశ్నించుకున్నాడు రుచి అనేది ఏమిటని. ఆరు కాకపోతే అరవై రుచులు! ఏదీ తనకు రుచించలేదు- అనిశ్చతత్వం (ప్రేమను గురించి ఆలోచించని రోజులేదు. అది వ్యర్థం
78 వేణు సంకోజు అనుకున్నాడు. కాదు అనుకున్నాడు. తేల్చుకోలేననుకున్నాడు, ఇంట్లో వాళ్ళు కుదిర్చిన సంబంధాలన్నింటినీ వదులుకున్నాడు. బాగోలేక కాదు యిష్టంలేదన్నాడు. ఒక మారు అదే ప్రశ్చవేసింది రమాదేవి. అర్ధంకావడమేమిటి? కాకపోవడమేమిటని ప్రశ్నించాడు చక్రవర్తి. *ఈ ప్రపంచం, ఇంతటి సృష్టియిప్పటి వరకు అర్ధమైందెవరికి? అని ఎదురుప్రశ్న వేశాడు. మౌనంగా వుండిపోయింది రమాదేవి. రమాదేవి అందగట్టె కిందేలెక్క కాని చక్రవర్తికి ఆమె వున్నదానికన్న అమితంగా నచ్చింది. సడెన్‌గా ఒక రోజు ఆమెకు తన ఇష్టాన్ని తెలిపాడు. ఆమె ఒక్కసారి ఉలిక్కిపడ్డది. అప్పటికే ఆమె వివాహితకావడం అందుకుకారణం ఆమె మృదువుగా తిరస్కరించింది. అది అతనికి మరింత నచ్చింది. ఆమెను రోజూ దర్శనం చేసుకోవడం ప్రారంభించాడు. ఆమెకు కూడా విసుగుంటుంది కదా! ఒక రోజు బంధువులతో తనకు జరుగుతున్న తియ్యని సంకటం గురించి చెప్పింది. ముందు వారించి, తరువాత దేహశుద్ధి చేసారు చక్రవర్తినివాళ్లు, కొంతకాలం పూళ్లు తిరిగివచ్చి అదే పదం (ప్రేమ పధం పూనాడు చక్రవర్తి ఒకానొక బలహీనమైన క్షణంలో లొంగిపోయింది రమాదేవి ఆమె భర్తకు ఏమి చెప్పకున్నాడో చక్రవర్తి, ఏమిచ్చుకున్నాడోగాని, అతగాడే వూరొదిలి వెళ్ళిపోయాడు. ఇల్లూ, వాకిలీ, వూళ్లూ, ప్రపంచం అన్నీ రమాదేవే అయిపోయాయి చక్రవర్తికి, అమెతో గడిపిన పదేళ్లలో ఇరవై ఎకరాలు హరీమనిపించాడు. ఇద్దరు బిడ్డలూ, ఒక కొడుకు కలిగారు. కళ్లనిండా తనువు నిండా సర్వేసర్వత్రా నిండిపోయిన రమాదేవిని ఒకనాటి రాత్రి నిర్ధాక్షిణ్యంగా వదిలిపెట్టి, కరోరమైన సుదీర్ణమైన చీకట్లోకి ఆమెను నెట్టి మవాభినిష్టమనం చేశాడు చక్రవర్తి. అన్నీ ఒక్కటొక్కటిగా గుర్షొచ్చినై, ఆకాశం నిండా చుక్కలు లేవు, చం(ద్రుడు లేడు అసలు ఆకాశమే లేనట్టుగా ఆనాటి మహదానంద ప్రదాయిని, తన పాలిట దేవకన్య, అనిర్వచనీయమైన సౌందర్యాల రాశి, అప్పరస, రమాదేవి నవ్వుతూహాయిగొలుపుతూ కనిపించింది గక్రవర్తికి. ఆ క్షణంలో చావు మూడితే బాగుండుననిపించింది. ఆ తియ్యటి వుటాల్లో మృత్యువొడిలోకి ఊయలలూగుతున్నట్టు చేరిపోదామనుకున్నాడు కాని అందుకు విరుద్ధంగాముక్కు నుండి రక్తం పడింది. “భగవాన్” అనుకున్నాడు ఎగపోత - దిగపోతలతో అప్పుడా సమయంలో సంయుక్తే వుండి వుంటే ఎంతో దయతో జాలితో (ప్రేమ వుందో లేదో తెలియదు) సుభ్రూషలు చేసేది. సపర్యలు చేసేది. ఛాతీ నిమిరేది.
స్పర్శ 79 మందులిచ్చేది. ఒక నర్సులా చేసేది
ఇరవైయేళ్లక్రితం పరిచయమైన వ్యక్తి సంయుక్త, అనూహ్యంగా ఒక రోజున నాటం ముగిసిన తరువాత పరిచయమైంది. ఆమె కంపెనీ కారణంగా సిగరెట్ అలవాటుయింది. రాత్రి ఒంటిగంట సమయం. కొట్లన్నీ మూసివేసి మూడుగంటల కాలమైనా గడిచి వుంటుంది సిగరెట్ కాల్చాలి. కాని అప్పటికే ఆమె వద్ద సిగరెట్టు నిండుకున్నాయి. అదుగో అక్కడ తారసపడ్డాడు ఆమెకు చక్రవర్తి ఒకటి అనుకుంటే నాలుగు సిగరెట్లు అందించాడామెకు. అందుకామె ఎంతో సంతోషించింది గంటలతరబడి మాట్లాడుకున్నారు. చంద్రుడూ, వెన్నెలా, చీకట్లు, అలవాట్లు, వేషాలు- వెధవ్వేషాలు, భూమి మీద ఆకాశం కింద వుండగల ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నారు. తెల్లగా తెల్లారిపోయే దాకా మాట్లాడుకున్నారు. ఇక ఆమెతో బాటే బయలుదేరి వెళ్లిపోయాడు చక్రవర్తి. అప్పటి నుంచీ యాత్ర యాత్ర. ఈ యాత్రలో ఆమె ఈతడినిష్టపడిందో, ఈ తడామెనే యిష్టపడ్డాదో తెలియదు గాని ఇద్దరూ కలిసి పోయారు. కలిసి వుండటానికి అలవాటు పడ్డారు. ఇద్దరి మధ్యా పదిహేను సం॥;ల తరం వున్నా లెక్కచేయకుండా కలిసి వున్నారు.
సంయుక్త అందగత్తె కావచ్చునుగాని రమాదేవంతటి అభిమానవతి కాదనిపించింది చక్రవర్తికి, గొప్పనటి కూడకాదు. కాని స్రీ పాత్రలు గల నాటకాలకోసం అడిగిన ఏ కంపెనీ వారికి పేచీలు పెట్టకుండా నాటకాలాడటంలో సహకరించేది. వాళ్ళు కూడ ఏదోలా రక్తి కట్టించుకొనేవాళ్లు నాటకాలను ఏమాట కామాటే నాటకాల్లో అంతర్జాటకాల వంటి వాటిని మాత్రం ఆమె ఇష్టపడేది కాదు. మోజులు - ఫోజుల వంటి వాటికి దూరంగానే వుండేది. అటువంటి సంయుక్త చక్రవర్తిని మాత్రం కాదనలేక పోయింది.
నాటకాలు లేని రోజుల్లో జీవికకోసం ఇబ్బందులు పడకుండా దర్జాగా దర్జీపని చేసుకొనేది సంయుక్త, ఆమె బాటలోనే నడిచే (ప్రయత్నం చేసిన చక్రవర్తి ఆమెకన్న మేంచి దర్జీగా తయారైనాడు. జీవితాంతం ఇరువురి వృత్తీ అదే అయ్యింది. సంయుక్త యాభయ్యపడిలో పడగానే నాటకాలవాళ్లు ఆమె పేరెత్తకుండా పత్తాలేకుండా పోయింది. మరో అమ్మాయిని కుదుర్చుకున్నారు. అది తెలిసిన సంయుక్త నవ్వి పూరుకుంది
సంయుక్త తనను తాను చెడగొట్టుకుందా లేక తనే ఆమెను చెడగొట్టాడా అనుకున్నాడు చక్రవర్తి, ఇద్దరూ కలిసి (ప్రేమని పంచుకున్నార్రా, చెడును పంచుకున్నారా అని వితర్మించుకున్నాడు. శరీరంలోని అణువణువూ తప్పులు
80 వేణు సంకోజు తీస్తున్నది. మొనదేలిన చువ్వలతో కుచ్చి కుచ్చి చంపుతున్నట్లున్నది పెద్ద పెట్టున అరిచి గీపెట్టాలనిపిస్తున్నది. యువ యాతనేమో అనిపిస్తున్నది.
ఇక్కడ గాకుండా పరలోకంలో వేరేగా వుంటుందా యమయాతన? ఇంతకన్న బాధగా నరకంగా వుంటుందా? రమాదేవి, సంయుక్తలతో గడిపిన సుఖంకన్న గొప్పగా స్వర్గం వుంటుందా? ఉంటే వీలుందా? ఉంటే రంభాద్యప్సర సలెందుకక్కడ? వృత్తులూ-్రవృత్తులూ దేనికి? చేసి చేసి ఏంచేస్తారు? వేగి వేగి ఏమౌతారు? మృత్యువును జయిస్తారా? మృత్యువు వేరే వుంటుందా? బాధే మృత్యువు కాదా? మృత్యుబారి నుండి తెలిసీ, తెలియక కూదా బయట పదేందుకే కదా ప్రయత్నాలు - జెషధాలు, కళలు, సర్వస్వం! తమ మృత్యువు నుండి పారిపోయాడా లేక జీవితంనుండా? మృత్యువును ఆహ్వానించాడా కాక మృత్యువు లోనే చరిస్తూ వచ్చాడా? మృత్యువు మంచిదా. జీవితమా? రెండింటిలో తాను దేనిని లక్ష్యపెట్టి మరిదేనిని అలక్ష్యం చేశాడు? గొప్పజీవితాన్ని గడపాలనుకోవడం మంచిదా - జీవితాన్ని జీవితంగా స్వీకరించడం మంచిదా? గొప్ప జీవితమంటే ఏమిటి- కొన్ని రాళ్ళు వెనుకేసుకోవడం, భద్ర జీవితం- గౌరవపురస్సరమైన జీవితం- స్థలాలు- భూములు-పుట్రాసేకరించుకోవడం అవుతామా? ఇంతకూ తను ఇన్నినాళ్లుగా జీవించాడా? అది జీవితం అవుతుందా అసలు! పరిపరి విధాల ఆలోచనలు అతడిని చుట్టుముడుతున్నాయి.
“ఇక మీరు తిరిగి వెళ్లవద్దు” అని సంయుక్త ఎందుకన్నది. ఇరవయ్యేళ్లుగా తను ఆమె మాటకు ఎందుకు కట్టుబడి వున్నాడు? వేలు- లక్షల సార్లు రమాదేవి ని తలచుకొని తలచుకొని లోలోపల కుమిలి-కుమిలి ఎన్నిసార్లు చచ్చిబతికాడు.
అంత్యక్రియలు అనేవి సంతానం చేయకపోతే అతనికి స్వర్గప్రాప్తివుండదా? ఆ స్వర్గం ఎక్కడుంది? ఎల్లావుంటుంది? తను అన్యాయం చేసిన సంతానం మాత్రం తన కెందుకు తల కొరివి పెడుతుంది? వదిన దయామయురాలు ఐదువేలు పంపింది. బతుకు అనేదుంటే పని కొస్తుందని, చస్తే ఖర్చులకైనా వస్తుందని! ఆమె రుణం తీరుతుందా? తీరకపోతే తనేమౌతాడు? తన కారణంగా అన్యాయమైన రమాదేవి నరకం చూసిందా, స్వర్గం కొంతయినా కనిపించిందా? స్వర్గ నరకాలు రెండింటిలో సంయుక్త స్థానమెక్కడ? స్వర్గమంటే ఇష్టంలేని, నరకమంటే భయంలేని తన స్థానమెక్కడ? సంయుక్త చెప్పినంత మాత్రాన, తన ప్రమేయం లేకుండానే తన రమాదేవికీ, పిల్లలకూ అన్యాయం చేశాడా? జగన్నాటకానికి తెర ఎత్తేదితల్లయితే, తెరదించేది ఆలా? ఇంతకీ నా ఆలిఎవరు? రమాదేవా?
స్పర్శ 81 సంయుక్తా? ఇంటికి చేరితే మౌన వహించిన రమాదేవిది తప్పా? చస్తేకనీసం తలకొరివి అప్పుడైనా సంతానం వద్దకి చేర్చితే న్యాయమనుకున్న సంయుక్తది ఒప్పా? నాటకంలో భాగంగా పాత్ర చిత్రంగానే ప్రవర్తించిందా సంయుక్త? తెర దించేముందు అనవసరంగా రంగప్రవేశం (ఊళ్ళోకి) చేసిన పాత్రాతనది? అంతా అయోమయం అనిపించసాగినది చక్రవర్తికి, కళ్లుమూతలు పడుతున్నవి. శరీరంలోని ప్రతి అణువూముక్క చెక్కలై విరిగి పడుతున్నబాధ. దుర్భరమైన యాతన కీళ్లూ-నరాలూ తెగిపోతున్న అనుభవం. వెలుగుకాని చీకటి కాని దృశ్యాలు భూమికాని జలమూకాని చోట పడవేసిన అనుభూతి. కోరికలూ కాని విరక్తీకాని అనుభవం. కదలికా కాని స్తబ్ధతాకాని అనుభవం. మంచీ లేని చెడూ లేని గాత్రం. మనసుకీ- హృదయానికీ -మెదడుకూ- ఆత్మకూ ప్రాణం. పైనుంచి కిందకీ, కింది నుంచి పైకీ వింత ప్రయాణం. శూన్యం అవని, పదార్ధంగా మిగలిని ప్రాంతంలోకి అడుగు! అదే (ప్రేమలోకా? అనురాగంలోకా? ఇష్టంగానా? అయిష్టంగానా? వెలితిగానా? పూర్ణంగానా?
అరుగుమీంచి శవాన్ని ఒక పక్కకు గడ్డిలోకి దాచి పడుకోబెట్టారు. నిన్న మనిషిగా వచ్చిన వ్యక్తి ఉదయానికి శవమయ్యాడు. అతనిలా ఆలోచించాలంటే శవం పారేసేదేనా? పూడ్చిశాల్చేయవలసిన వస్తువా? ఎముకల్లో దాగివుంటాయా కోర్కెలు రక్తంలో ప్రసరిస్తాయా? అవేమోకాని అతడినక్కడి నుండి తీసేయమన్నాడు అబ్బాయి- చక్రవర్తి కొడుకు. అప్పుడా సమయంలో రమాదేవి పరిస్థితి వేరు. దు;ఖంకాని దుఃఖం, ఆవేదన కాని ఆవేదన; బంధంకాని బంధం తెగని బంధం! కాని పేగు బంధం మాత్రం వ్యతిరేకిస్తున్నది. అతడి నీ తప్పుపట్టలేదు తను. అతడికేం చేశాదని, ఏమి పట్టించుకున్నాడని తండ్రి?
నలుగురూ. నానా విధాలుగా మాట్లాడుతున్నారు. అవునంటున్నారు. కాదంటున్నారు. కాని అబ్బాయి మాత్రం ససేమిరా అంటున్నాడు. బిడ్డలు రానైతే వచ్చారు కాని దూరం నుంచే కన్నీరు పెట్టుకొంటున్నారు. మీద పడి ఏడ్చే సాహసం ఎవరూ చేయలేదు. ఊళ్ళో వాళ్ళు కూడా సమీపించటానికి అంత సుముఖంగా లేరు.
శరీరమంటే ఏమిటి- నశించేది సమసిపోయేది. చక్రవర్తి లేకుండా పోయాక ఇక శరీరమే కదా మిగిలింది? అయితే మట్టికి, కాకుంటే మంటకు సంబంధించిందౌతుంది శరీరం. మనుషులు తీసి పారేస్తారు. పాడెకు కడతారు. మోసుకుపోతారు. కాని ఎవరు మోయాలి? ఎవరెందుకు మోస్తారు. శరీరం
82 వేణు సంకోజు ఎగరదాయెను! శరీరం కనీసం తనంత తాను నడవదాయును. “ఎట్లాఇప్పుడీ పీడ”! అనుకుంటున్న సమయంలో రుక్మిణీ, కృష్ణమూర్తివచ్చారు. రాజేంద్రకూడా వచ్చాడు. అంతా గంభీరంగా వున్నారు శవానికి తప్ప అక్కడ ప్రతి వొక్కరికీ కలవరమే
“సీకే పుణ్యం నాయానా! ఒక అనాధ శవం అనుకో, ఎంతయినా నీకు జన్మనిచ్చాడు. నీకేమీ మేలు చేయక పోవచ్చు తెలియని కీడు కూడా చేయవచ్చు. కొడుకు లేకపోతే అదివేరే విషయం ఉండి కూడా కాదనడం బాగుండదు. పెద్దమనుసుచేసుకో” అని బుజ్జిగింపుగా చెప్పింది పెద్దమ్మ. కొడుకు అవునూ అనలేక, కాదూ అనలేక కంతడి పెట్టుకున్నాడు. అతడి కన్న తల్లి బోరుమని ఏడువడంతో మరింత రోదించాడు అబ్బాయి. కాని అతని మనస్సు అంగీకరించలేదు. కనుక బెననీ, కాదనీ అనలేక పోయాడు
పరిస్థితి గమునించిన కృష్ణమూర్తి అడుగు ముందుకేసి, అందరూ వినేట్టుగా ఒక మాటన్నాడు. మంచివాడో, చెద్దవాడో చివరకు తన ఇంటి వద్దే ప్రాణాలు విడిచాడు. అతడు ఎటువంటి వాడైనా నా తమ్ముడు. కొడుకు కాదంటే నేనే తలకొరివి పెడతాను అన్నాడు. దాంతో ఒక్క పెట్టున అందరూ బోరుమని ఏడ్చారు. అంతకు ముందు రాజేంద్ర ఇచ్చి వెళ్ళిన ఐదువేల రూపాయల కట్టను కొడుకు ముందు ఉంచింది రమాదేవి. ఇంకో ఐదువేలకట్టను దాని పక్కన చేర్చింది రుక్కిణమ్మ.
శవయాత్ర సాగింది తెలిసిన వారు ఒక విధంగా అనుకుంటే తెలియనివారు ఈ శవమేమిటి ఈ ఇంటి ముందు నుంచి అని తర్మించుకున్నారు.. ఏదీ పట్టించుకోని శవం నిద్రిస్తూ కలగంటున్నట్టుగా వుంది 'కలలో (ప్రేమ కనిపిస్తుందా'-అని తనలోతాను అనుకుంటున్నట్టుగా వుంది. తన కొడుకు “తలకొరివి పెట్టడనుకొన్నానే' అని ఆశ్చర్య పడుతున్నట్టుగా వుంది. కన్నీరు కార్చకుండానే దుఃఖిస్తున్నట్టుగావుంది.
దు;ఖభారమెంత? ఎవరి దు.ఖ స్దాయి ఎంత?” శవమైన చక్రవర్తికి దుఃఖం ఉన్నట్టేనా? లేకుంటే దు:భితులు ఎవరు? రమాదేవా? సంయుక్తా? సంతానం నరే. వారి దు.ఖం సాపేక్షం. కొంచెం అణచివేసుకోలేక దు;ఖించింది రుక్మిణమ్మమరిది చావుకు, పైకి గంభీరంగా కనిపించినా లోలోపలే దుఃఖించాడు కృష్ణమూర్తి, మిగతా జనంలో ఎక్కడా దు;ఖఛాయలు లేవు
స్పర్శ 33
శవాలు పోయే ప్రాంతాల్లో దుఃఖం వొలుకుతుందా అసలు ? ఏమో వొలుకుతుందేమో! ఆత్మీయుల దుఃఖంతో తడిసి ముద్దవుతాయెమో (ప్రాంతాలు! “దు-ఖమంటే ఏమీ చేయలేని అశక్తతా” అన్నట్టుంది శవం.
అంతా స్మశానవాటిక కొచ్చారు దహనక్రియలతంతు జరిగిపోతూనే వుంది. కొంత యాంట్రికతా, కొంత బంధుత్వ బాధ్యతా ద్యోతకమౌతున్నాయి. పట్టింపులేని శవం ఎట్లా పడుకోబెడితే అట్లా ఒదిగిపోయింది. కట్టెల మీద సేద దీరింది. అది విశ్రాంతా? అది అంతమయాత్రా? ఇంతకీ అంతిమయాత్ర చేసేది ఆత్మా- శరీరమా? ఆత్మకాని శరీరం ఎక్కడి నుంచి ఎలా వచ్చింది? ప్రశ్నలు మిగిలి పోతున్నట్టుగా వాతావరణం.
తలకొరివి పెట్టాడు తనయుడు. ఇష్టంగానా, అయిష్టంగానా? అనే ప్రశ్నలతో సంబంధంలేదు. “ఇంకా డబ్బు కావాలంటే అడుగు నాయనా, నేను సర్జ్హుతాను” అంది పెద్దమ్మ “వద్దు పెద్దమా చాలు” అన్నాడు అబ్బాయ్యి అప్పుడా సమయంలో అతడిని తండ్రి తాలూకు భావన లేవో మెదులుతూ, కొంచెం కెలుకుతూ, కొంచెం ఆ(ర్ధపరుస్తువున్నాయి. “ఎంతయినా తమ్ముడు కదానేనే పూనుకుంటాను” అన్న పెదనాయన మాటలు గుర్తొచ్చి కళ్ళు చెమరుస్తున్నాయి.
“ఇంతకీ చక్రవర్తి ప్రయాణం ఏమౌతుంది? అంతిమ ప్రయాణమే? మహాభినిష్మముణమా? పలాయనమా? ఇతదేమీ సాధించనట్టులేదు. రెండు విధాలా (్రేమనేమో ఆశించినట్టుగా పొందాడా? ఏదీ పొందని, లక్ష్యంలేని అంతిమయాత్ర మహాఖభినిష్టమణం అవుతుందా? ఇది పలాయనమేనేమో” అని రుక్మిణమ్మ అనుకుంటుండగా దూరం నుంచి ఒక ట్రీ మంటల వైపు చేతులెత్తి వీడ్కోలు చెప్తూ కనిపించింది. ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. ఆమె ఎక్కడి నుంచి వచ్చి ఎందుకు వీడ్మోలు చెప్తున్నది తెలియదు. చూడలేని, తగులబడుతున్న శవం మాత్రం వీడ్కోలు పొందుతూ ...
గసంతకం?” మాన వత్రిక జూన్ 2008)
84 వేణు సంకోజు ద! స్టాంపు!
అంతవరకూ అతని గురించి ఎవరికీ తెలియదు- అతని చూపుడు వేలూ,
దానికి అంటించుకుని తిరుగుతున్న రెవెన్యూ స్టాంపు తప్ప. అంతడంటే అందరికీ ఒక విధమైన చులకనభావమే బోలడంత
సానుభూతికూడ. అందుకే నెల పొడుగునా అతనికి అప్పులు పెడుతూనే వుంటారు. అప్పుచేయడమంటే తప్పు చేయడమేనని అతనికి బహుబాగా తెలుసును. ఆ విషయం కొందరితో అనేక సార్లు చెప్పుకున్నాడు కూడ. అయినా అప్పు అనే తప్పుచేస్తూనే వచ్చాడు. విషయం తెలిసిన వాళ్ళకు తెలుసును అది అనివార్యమైన తప్పేనని. అయితే, అటువంటి అవసరాలేమిటో వాళ్లకు కూడ అంతగా తెలియవు. తెలుసుకోవలసిన అవసరం కూడ వాళ్ళకు అంతగా ఎందుకుంటుంది? ఎవరి వ్యవహారాలు వాళ్ళవి వెరి అవసరాలు వాళ్ళవి. ఎవరి గుహలూ- కలుగులూవాళ్లవి. ఎవరి కార్లూ పుకార్లూ వాళ్ళవి.
అవును- ఆమెడికల్ కాలేజీలో ముడొందల మంది మాంచి జీతగాళ్ళు వాళ్ళకి పదీ- పరకా అంటే చిటికిలోపని. ఆ పదీ పరకామే మనకధానాయకుడు వీరయ్యకు స్వర్గసమానం, లేకుంటే భయంకర నరకప్రాయం. మొకం మీద ఎక్కడా బాధలూ-విషాదాలు అణువణువునా విస్తరించివుంటుంది అయితేనేం, ఎవ్వరూ కనుక్కోలేక పోయారు. ఎందుకంటే అతని అరుదైన సాహసం గొప్పది. అన్ని యాతనల నూతన తన పంటికింద అదిమిపెట్టి చేతనైనట్టుగా తోటివారికి ఆనందాన్ని పంచి యిస్తూ వచ్చాడు
వీరయ్యతోపాటు ఉద్యోగం చేస్తున్న ప్యూన్లూ, రాంబాయిలూ, ఆయాలూ బాగానేవున్నారు. అందరికీ యితనిదో చెప్పుకోలేని బాధ అదేదో తెలుసును కాని బాధ స్వరూపం మాత్రం తెలియదు న్థాయి అంతకాన్న తెలియదు. వాళ్ళకు
స్పర్శ 85 తెలిసిందల్లా ఒక్కటే, వాళ్ళమో వీరయ్యకు ఆర్థిక సహాయం చేయగలిగిన స్థితిలో లేరు. ఉండరు కూడ. అసలు వీరయ్య వాల్భదాకా తన కష్టాల జాడల్ని ససేమిరా మోసుకుపోడు. తన గోడును ఏనాడు కడుపారా వెళ్ళబోసుకోడు.
ఒక నాడు మాణిక్యమ్మ-( వార్డులను ఊడ్చే ఆమె) అడగబోయింది వీరయ్యను, విషయం ఏమిటా-అని ఆరాతీయబోయింది. జవాబుగా వీరయ్య ఒక డాక్టరు గారు చెప్పిన సినిమాకధలోని ఒక ఘటన చెప్పి, ఆమెను కడుపుబ్బ నవ్వించి తప్పించుకున్నాడు.
వీరయ్య ఐదుదాకా చదివి ఇక జీవితానికి వరమింతేనని విరమించుకున్నాడు. హాయిగానో మాయగానో అటెండరయినందుకు శివుణ్ణి, ఏడుకొండల వాడినీ, బ్రవ్మాంగారినీ తలచుకొని, చేతులు జోడించి మిన్నకున్నాడు. అప్పటికే అర్ధమైపోయిందతనికోనొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి” అనటంలోని గడుసు-తనం-మోసం!- అది చదివినాడే అందులో ఏదో నమ్మబుద్ధి కాని విషయం వుందని. * తప్పించుకు తిరుగడమనే మాటే అతనికి మింగుడుపడదనిపించిది. కాని, నిత్యవ్యవహారంలో అతడు కూడా ఏదో విధంగా తప్పించుకునే తిరుగుతున్నాడేమో! అట్లా ఆలోచించబోతే కెలికి నట్లే అయ్యేదివీరయ్యకు. నీళ్ళు నమిలి మిన్నకుండేవాడు. ఒంటరిగా ఏ చెట్టుకిందికో చేరి మౌనంగా ఉండిపోయేవాడు. తాను చెట్టయినా బాగుండుననిపించేది. కదలకుండా- ఉన్నచోటున ఉంటూనే లోకానికి ఏదైనా పువ్వో-పత్రో-కాయో- పండో అందించుకోగలిగేవాడ. పొద్దంతా కుమిలి కుమిలి తిన్న విషాన్ని రాత్రిళ్ళు కక్కుకుని ఊరుకునేవాడు. ఇంతకూ అదెలా సాధ్యమిప్పుడు! కళ్ళల్లో నీళ్ళు సుళ్ళుతిరిగేవి. కడుపులో సుడిగుండాలు రేగి-చెలరేగి ఈడ్చి- జాడిచ్చి కొట్టనట్టుగా అనిపించేది. ఆ విలయంలో కొట్టుకుపోతే బాగుందుననిపించేది.
“ఏం వీరయ్య- జీతం తీసుకున్నావా? అడిగాడు డా॥ మల్లికార్జునరావు. “ లేదుసార్ ఇదిగో...” అని చేయి చూపించాడు వీరయ్య . చేతి చూపుడువేలుకి రెవెనూ స్టాంపు అంటించి ఉంది. “ఓకే వెరీగుడ్, నీ తీరే గొప్పదయ్యా! అందరూ జీతం తీసుకున్న తరువాతనే నీవు తీసుకుంటావు. అందరికీ చెల్చివలసిన అప్పులన్నీ చెల్లించిన తరువాతనే- మిగిలింది తీసుకొని వెళ్ళి పోతావు. దటీస్వెరీగుడ్” అంటూ మల్లికార్జునరావు మెచ్చుకున్నాడు.
ప్రతినెల అంతే. నెలపొడుగుతాచేసిన అప్పులన్నీ అందరికీ చెల్లించే విధంగా, అందరికీ తనలేదు- తన దరిద్రం - తన గోస - తను తలదించుకోవలసిన క్షణం
86 వేణు సంకోజు అగుపించకుడదని, బహుశా, ఎప్పుడు చివరికే తన జీతం తీసుకుంటాడు. అవును ఎట్టాగొ తను జీవితానికి- అసలు సిసలైన జీవితానికి చివరివాడే కదా! చిన్న పెద్దా ఉద్యోగులందరినీ పలకరిస్తూ-ో అయ్యా తమరు తీసుకున్నారు కదా! అమ్మా న్వు తీసుకున్నావు కదా! భాయిసాబ్ ఆప్ లియేనా” అని పేరు పేరునా అరుసుకొని, సూపర్నెంటు కూడ తీసుకున్న తరువాతనే తీసుకునేవాడు జీతాన్ని తాపీగా తీసుకునే వాడంటే- సర్వస్వం ఇచ్చుకునే వాడన్న మాట!
అందరూ జీతాలు తీసకున్న తరువాత ఒక్కరొక్కరుగా చేరేవాళ్ళు సూపర్నెంటు దగ్గరికి అప్పులు పెట్టిన వాళ్ళు, వీరయ్య సిద్ధంగా కూర్చుని వుండేవాడక్కడ బలికి సిద్ధంచేయబడిన మేక- మెడలో తడితోనన్నట్లు తక్కువైతే ఆరుగురు, ఎక్కువైతే ఎనిమిది మంది మంచి తనం కలిగిన కోతగాళ్ళు తన ఎదుట! నిజానికి వాళ్ళేమీ తనకు అన్యాయం చేసిన వాళ్ళు కాదు. తను ఆర్ధించందే అప్పెందుకు పెడతారు? కాని టంచనుగా కల్లంకాడ సిద్ధమైనట్టుగా అవుతారు. అదీ బాధ పోనీ కుదరదందామా- తరువాత రేపట్నుం చెట్లా? వాళ్ళదగ్గరికే కదా- తను వెళ్ళవలసింది.- చేయి చాపవలసింది, వాళ్ళే కదా తన చేతిని నింపపోయినా అందులో నాలుగు నోట్లు రాల్బవలసింది!
అన్ని కట్టింగులూ పోను వీరయ్యకు నాలుగు వేలు ముడుతాయి జీతం కింద మూడు- మూడున్నర వేల దాకా అప్పు చేస్తాడు వీరయ్య, వరుసగా పేర్లు చెప్తాడు అక్కడ కూర్చుని-ఈ అయ్యగారికి ఏడొందలు, ఆ అమ్మకు ఎనిమిది, ఈ సారుకు నూట యాభై... చిన్నపద్దులన్నీ అయిపోయాక పెద్దపద్దులు పూర్తిగా చెల్లిస్తాడు. మిగలకపోతే రెండోనెలకది సిలకొ! దయతలచి అతడే కనీసం ఐదొందలు వుండనీ వీరయ్య వచ్చేనెలలో యిద్దువుగాని” అంటే అవే దక్కొలు. అవే మిగులు. అదే జీతభత్యాలు అవ జీవిత సత్యాలు!
అందరికీ తెలిసిన వ్యవహారమే యిదంతా అందరూ అలవాటు పడిన వారే. నమ్మకమనే మాటకు ఒక మంచి అర్ధమైపోయాడు వీరయ్యవాళ్ళకు* మాట మీద నిలబడే మనిషంటే వీరయ్య” అని పేరు తెచ్చుకున్నాడు వీరయ్య. అడిగితే చాలు వీరయ్యకు అప్పు పుట్టనిస్థితే ఉండదు. * నిర్భయంగా అప్పుతీసుకోవీరయ్య. అని వీపు తట్టని వారుండరు.
కదా! ఏది ఆగినా ఆగకపోయినా కాలం ఆగదు కదా! తేదీలు మారిపోకుండా వుండవుగ వస్తువులు నిండుకునే తీరుతాయి. జేబులు ఎంత నిండుతాయో అంతకన్నా వేగిరం-విధిగా-కాళీ అవుతూనే వుంటాయి. మళ్ళీఫైలీతారీఖు-
స్పర్శ 87 మరలా జీతాలరోజు వచ్చే తీరుతుంది
“ఏం వీరయ్యా!” అనే పలకరింపులోనే ఆయావారల అసలు విషయాలు తెలుస్తూనే వున్నాయి. అప్పుల చెల్లింపుల విషయం ధ్వనిస్తూనే వుంది. అదేనవ్వు అదే హుందాతనపు భరోసా చూపు. ఆచూపుడు వేలుకు ఎప్పటిలాగే అంటించిన రెవెన్యూ స్టాంపు- ఏమాత్రం నలిగి పోకుండా, నింపాదిగా, నిర్లజ్జగా, అప్పుపెట్టిన అందరి ముఖాల్లోనూ అదే అభినందన పురస్సరమైన చల్లనిచూపు వీరయ్య మీద.
ప్రతివొక్కరినీ ప్రతిమాసం కలుసుకొని చూపించినట్టుగానే తన కుడిచేతి చూపుడువేలుకు చూపించివచ్చిన చెక్కు చెదరని రెవెన్యూస్టాంపును చూపించివచ్చాడు. ఎక్కువ వుషారుతనం గాని, కించిత్తుబాధగాని నాడూ కనిపించవు కదా!
ఎప్పటి లాగే అందరూ జీతాలందజేసే సూపర్నెంటు వద్దికి చేరుకున్నారు. ఎప్పటిలాగే జాతీయ నాయకుల బూజుపట్టిన చిత్ర పటాల వెనుక రెండు బలిసిన బల్లలు ఒకదాని నొకటి ఆకర్షించుకునే విధంగా సయ్యాటలాడుకుంటున్నాయి సూపర్నెంటు మాసిన టేబులంతా వెగటు కాగితాలతో, చిక్కి జీర్ణమై 'పీగుట బయటపడ్డట్టుగా కాగితాలతో సర్వవికారం గొడుతున్నాయి.
అందరికన్న ముందుగా వచ్చి కూర్చునే వీరయ్య ఆనాదక్కడికి చేరలేదు. ఎవ్వరో ఏదో పనిచెప్పినట్టున్నారనుకున్నారు. అప్పులు పెట్టిన అధికారాలు, దొక్టర్లు, అందరినీ అడిగేవాడుకాడుకదా వీరయ్య- కేవలం అధికారులు, డాక్టర్లనే అప్పు పెట్టమని కోరేవాడు టంచనుగా ప్రతినెలా తెచ్చియిచ్చేవాడు. కొందరు స్వయంగా వచ్చి ఆఫీసులోనే తీసుకుని వెళితే మరికొందరు అధికారులవడ్దికి వీరయ్యే వెళ్ళి వినయ విదేయతలతో ముట్టజెప్పి వచ్చేవాడు. బాగా ఆలస్యం కావడంతో ఈరోజు ఆ పెద్ద ఆఫీసర్లు కూడ వచ్చారు. వీరయ్య జాడ మాత్రంలేదు.
చాలా వరకు కార్యాలయాల్లో అంతే విషయం వాళ్ళలో వాళ్ళు గొనుక్కుంటారుగాని అడగవలసిన వాళ్ళను మాత్రం అడగరు - అడిగితే ఆఖరున తప్ప. ఈ రోజు అంతే అయ్యింది.“ఏం సూపర్నెంటుగారూ వీరయ్య రాలేదేం జీతానికి “అని” వీరయ్య ఈరోజు అందరికన్న ముందే జీతం తీసుకున్నాడుసార్” అన్నాడు” మరి ఆచేతికి రెవెన్యూ స్టాంపువుంది కదా,” అవున్ఫారో, విషయం చెప్పొద్దాన్నాడు.” “ఇప్పుడు సా॥6.30 అయ్యింది. మేమంతా యిందాకట్నుంచి ఇక్కడే వున్నాం చెప్పవేం?” కోపంగా అడిగారు అప్పుపెట్టినవాళ్ళు
88 వేణు సంకోజు
“జీవితంలో నన్నెన్నడు ఏదీ కోరని వీరయ్య ఈ రోజు ఒకేఒక్క కోరిక కోరాదుసార్. తను జీతం తీసుకన్న విషయం సా॥6గంటలదాకా ఎవరికీ చెప్పవద్దని కావాలంటే అప్పును తన యింటి వద్ద వసూలు చేసుకొమ్మని తనమాటగా చెప్పమన్నాడు ” అని తలదించుకునే సమాధానమిచ్చాడు సూపర్షెంటు
ఒకరినొకరు ముచ్చటించుకుంటూ చర్చించుకోసాగారందరూ. అదంతా “ఇకరు' అనే మహా చలనచిత్రంలోని ఒక దృశ్యాన్ని తలపిస్తున్నది. అదిగుడిసెకాదు. పూర్తిగా కవేలు ఇట్లా కాదు. రెండింటి మిశ్రమంగా వుంది. అక్కడి వారి ఎవరి ముఖాల్లోనూ కనీసం గదిగువ మధ్య తరగతి వాలకాల్లేవు. అంతా పేదనుంచి నిరుపేద తనమే ఒలుకుతూ వుంది. దుఃఖం చెందుకు కూడ వాళ్ళలో కన్నీరు కరువైవుంది. అందరూ ఒక అమ్మాయిని పట్టుకుని హృదయ విదారకంగా రోదిస్తూ శోకాలు పెడుతున్నారు.
ఇంటిముందు పక్క పక్కన పదుకోబెట్టిన రెండు శవాలు- వీరయ్య అతని భార్య రత్నం ఆమె పేరని స్త్రీల శోకాల వల్ల తెలియ వస్తున్నది. బిడ్డ శ్యామల అమాయకంగా, అసహాయంగా, భయం-భయంగా, బెరుకు- బెరుకుగా అందరినీ చూస్తూ-ఎవరినీ చూడలేకనూ, ఎట్లాగో అగుపిస్తున్నది.
సరాసరా జీతాలు తీసుకొని యింటికొచ్చిన వీరయ్య యింతకు పూనుకున్నాడన్నమాట. శవాల తలల వద్ద తెచ్చుకున్న జీతం, అప్పుపెట్టిన వారిపేర్చు రొక్కం రాసివున్నాయి. సూపర్నెంటు చేతనే రాయించుకున్నాడట. అప్పు ఎగగొట్ట బుద్ధిలేదు గాని తన కూతురును ఒక్కసారి వాళ్ళందరూ చూసి పోవాలన్న ఒకే ఒక్క దురాశతో ఆపని చేశాడట,ఆరు సం॥రాల క్రితం ఎక్కడో బజాట్లో గడ్డం గీయించుకున్న పాపానికి ఒడి గట్టిన ఎయిడ్సు తన భార్యకు కూడ సోకిందట. ఒక నెలక్రితం తీసుకున్న నిర్ణయం ప్రకారం" చారులత” అనే అనాధలను పెంచే కేంద్రంలో చేర్చించాడట, ఆ కేంద్రం ఎయిడ్స్‌కు గురైన వారి పిల్లలను చేరవీస్తుంది. ఆ పిల్లలకు విద్యాబుద్దులతో పాటు ఆరోగ్యాన్ని కూడ సమకూర్చే ప్రయత్నం చేస్తుంది.
శ్యామలకు ఎయిడ్స్వుందో తెలియదు. కేంద్రం వాళ్ళు బయటపెట్టరు. అది మరింత బాధాకరమైన విషయమైంది వీరయ్యకు. ఇకతనకూ తన భార్యకూవశంకానంతగా తయారైంది మానసికక్షోభ. అది శరీరధర్మాను సారంబయటపడటం ప్రారంభమైంది. వీధిలోని వాళ్ళు వార్నింగ్ గోయిచ్చారు.
స్పర్శ 89 వీధి ఖాళీ చేయకతప్పలేదు కదా పేదవాళ్ళ జీవితం! దానినే ఖాళీచేశారు వీరయ్య- భార్యతో సహా! డబ్బూ-కాయితం రెపరెపలాడుతూ లోకాన్ని వెక్కిరిస్తున్నాయి. అప్పుపెట్టిన వాళ్ళు బిక్క బిక్కుమంటూ చోద్యం చూస్తూ వుండిపోయారు. భరింపరాని వాసన కొడుతూ అగరువొత్తులు మాత్రం వెలుగుతూ పొగకక్కుతున్నాయి. (రచనా కాలం = 2412 07)
90 వేణు సంకోజు మారు మరణం
ఏమై వుంటుందా? అనుకుంటున్నారు. ఏమైనా తెలియవచ్చు ననుకుం టున్నారు. ఎప్పుడూ కనపడని వీళ్ళు ఈ రోజు చాల మందే అగుపిస్తున్నారను కుంటున్నారు. ఆ వచ్చిన వాళ్ళు అందరిలోనూ ఆగ్రహం పొంగుకు రావడానికి విస్తుపోతున్నారు ఒకదశలో ప్రిన్సిపాల్ గారి బయటా అంతా గందరగోళంగానూ, కదంతొక్కుతున్నట్టుగానూ వుంది అసలే బయట ఉక్కగానూ, ఎండపెట పెటలాడుతున్నట్టుగానూ వుంది.
ప్రిన్సిపాల్‌గారు ఒకరిని సముదాయించబోతుంటే, మరాకరు ఆగ్రహంతో అంతెత్తు లేస్తున్నారు ఒక పురుషునికి విషయం వివరించబోతుంటే ఇంకొక స్త్రీ లేచి మరేదో విషయం ఆరా తీయబోతూ వుంది. రోజూ వుందే వాతావరణమే అయినా ఆ రోజు మరింత వేడిగానూ, ప్రజల్ని చెమట పట్టిస్తూనూ వుంది. ఎవరి పనుల్లో వాళ్ళు - ఎవరి గదుల్లో - తరగదుల్లో వాళ్ళు వుండబోతూనే, వుండలేకపోతున్నారు. తలా ఒక చెవిని అవతలి వాళ్ళ నోటికందిస్తున్నట్టుగా వున్నారు. తలా ఒకరికన్నును ప్రిన్సిపాల్గారి గది మాదనే కేంద్రీకరించి చూడగలరేమోనని ప్రయత్నా ప్రయత్నంగా వుంటున్నారు. అంతా అనుకోవడమేగాని ఏమీ తెలిసి రావడం లేదు. అంతా గొణుక్కోవడం - విసుక్కోవడం - పెదాల్ని చప్పరించడం.
అసలే ప్రిన్సిపాల్ గారిది కొంచెం దురుసుతనం. ఎవరిని ఏమని పాదయ్యారో ఏమో! ఎవడికేమి వచ్చిపడి చచ్చి వుంటాడోయేమో! తెలిసి చస్తే కదా! కనీసం క్లూ వంటిదైనా బయట పడి చస్తే కదా! అనుకుంటాం గాని - అందరికీ అన్నీ తెలిసి చావవు. అందునా, తెలుసుకోవాలనుకున్న సమయానికి అస్సలు తెలిసి చావవు. సూపరెంటుగారికి అప్పుదే తొందర పుట్టాలా? డిటివోకి పొయ్యి
స్పర్శ 91 చావమంటాడంటూ విసుక్కున్నాడొక రికార్డసిస్టెంటు. “అర్జంటట- అర్జెంటు - ఇప్పుడే నాలుగు ఉత్తరాలో ఏమో - టైపు చేసిచ్చి చావమంటున్నాడంటూ విసుక్కొంది పరిమళ. టిసీలకనీ, స్మాలర్షిప్పులకనీ యిప్పుదేనా ఎగబడి చావడం ఈ పిల్లలు? పైగా విద్యార్థులట - విద్యార్థులు! అయిందానికీ కానీ దానికీ బందులూ, ఊరేగింపులని తయారు! ఇప్పుడు మాత్రం చడీ చప్పుడు లేకుండా, తమకదేదీ పట్టి చావదన్నట్టుగా తిరుగుతున్నారు” తొందరగా యివ్వండిసార్- తొందరగా చెయ్యండి సార్” అంటూ ఒకటే అరుపు ఈలోగా ఏదైనా తెలిసి చస్తే కదా! అబ్బే - ఎందుకు తెలిసి వస్తుంది? ప్రిన్సిపాలా - మజాకా? ఎందుకు తేలుస్తాడు? ఏదో వుండే వుంటుంది గూడుపురానీ - కాకపోతే పల్లీ బరానీ ! అందుకేనేమో - ఆ వచ్చిన వాళ్ళు అంత గట్టిగా కూర్చున్నారు! అంతకన్న గట్టిగా నిలదీస్తున్నారు! చచ్చి వూరుకుంటున్నాడు నా కొడుకు! నీళ్ళు నముల్తాడు నా కొడుకు! ఊళ్ళో మనిషి స్నానం చేసేట్టుగా ఎండలకి చెమటలు పట్టి చచ్చినా వాడి మొకం మీద, పిసరంత తదడైనా కనిపించేది కాదు. అటువంటిదిప్పుడు ఎన్నిదస్తీలైనా చాలవన్నట్టు మొకాన్ని - దరిద్రపు మొకాన్ని ఒకటే తుడుచుకుంటున్నాడు - వేగలేక చస్తున్నాడు నా కొడుకు!” ఎన్నడూ కుదురుగా సీట్లో కూర్చోనీ, ఏ పనీ చక్కగా చేయని రాజారావుకు ఈ రోజు చాల కోపంగా, సహజంగానే పిన్సిపాల్ మీద ఎప్పటిలాగే అసహనంగా వున్నాడు పిల్లల మీద తన ఆగ్రహాన్ని చూపలేడు గనుక ప్రిన్సిపాల్ మీద తన కోపాన్ని వ్యక్తం చేసుకుంటున్నాడు. ఇటువంటి సందర్భాలు అతని చక్కని సమాలవుతాయి. ఇదే కోవలో యింకొందరు పనిదాంగలైన క్లర్కులు. నిజాయితీగా తమ పని తాము చేసుకుపోయే క్ల్షర్ములకు “ప్రిన్సిపాల్‌కి అండగా ఎవరూ లేక పోయారుకదా' అన్న బాధతో వున్నారు. ఇక జన్మకో శివరాత్రి లాగున ఏదో ఒక రోజున పారం చెప్పి చేతులు దులుపుకునే కొందరు లెక్చరర్లకు ఉక్కబోతకే ఉక్కబోత ఎక్కువౌతున్నట్టుగా ఆతురత ఎక్కువౌతున్నది. ఏదైనా తెలిస్తే బాగుండనిపిస్తున్నది. |! /! |!
రవళి చామన ఛాయకు వన్నె పెట్టే వింతయిన గోధుమ వర్ణంతో అన్నట్టు వుంటుంది. విశాలమైన కళ్ళు. గంభీరమైన దృక్కులు పలుకే బంగారమైనట్టుగా వుంటుంది. వయస్సు మూడు పదులలోపే. పిలిస్తే పలకదు- నడిస్తే కదలదన్నట్టుగా నాజూకుగా వుంటుంది. ఏదైనా పనిచేస్తే అవయవాలు కందిపోతాయన్నట్టుగా అభిప్రాయాన్ని కలిగిస్తూ తిరుగాడుతూ వుంటుంది. చాలా మందికి ఆమె తీరు ఆశ్చర్యాన్ని గొలుపుతుంది- అసలింతకీ ఆమె ఏమైనా పని
92 వేణు సంకోజు చేయగలదా? ఆమెకేమైనా పని చెప్పనా? అని అనుకుంటారు. చాలా సార్లు ఆమె ఎవరేది చెప్పినా వినదు. విన్నా విననట్టుగా, పట్టించుకోకుండా, ఉన్నచోటు నుండి కదిలి మరో చోటుకి - కళాశాల ఆవరణలో ఎక్కడో ఒక చెట్టుకిందికి చేరుతుంది. “అశోక వనంలో సీతలాగా ఈ అమ్మాయికి ఎన్ని కష్టాలో!” అనుకునేవారు. చెప్పుకోలేని బాధలేవో కుంగదీస్తూ వుండవచ్చుననుకునేవారు. పిలిచి మరి పనిచెప్పేవారుకాదు.
ఇంతకీ ఈ సుకుమారికి, ఈ బాధామయికి, ఈ పోస్టు ఎట్లా యిచ్చారు? ఎట్లా సాధ్యమైందిది? అని అనుకున్నారు. ఒక సారి కాదు అనేక సార్లు. అయితే, ఎవ్వరూ, ఏనాడు అడగ సాహసించలేదు. ఆమె వాలకాన్ని బట్టీ ఆమె బ్యాగ్రౌండ్ చాల పెద్దది కావచ్చుననుకున్నారు. కాకపోతే, ఒక మొగవాడికి మాత్రమే యిచ్చే నైట్‌వాచ్‌మెన్ పోస్టును ఆమెకిట్లా ఖాయం చేస్తారనుకున్నారు. చేశారు సరే, పేరుకు మాత్రమే ఆమె పోస్టు అదనీ, పని మాత్రం డేటైంలోనే ఒక అటెండరుగా చేస్తుందని- ఏకంగా ప్రిన్సిపాళ్ళచేతనే ఎట్లా ఒప్పించగలరని కూడా అనుకున్నారు. రవళి వచ్చి చేరింతరువాత ముగ్గురు ప్రిన్సిపాళ్ళు మారారు. అందులో ఒక ప్రిన్సిపాల్ ఆమెను తనకు చెందిన డ్యూటీయే చేయాలని పట్టుబట్టాడు. మూడు రోజులు నిశ్శబ్ద యుద్ధం జరిగింది. ఒకటికి పదిమంది కాదు యాభై మందొచ్చి ప్రిన్సిపాల్‌కి నయాన ముందు, భయాన తరువాత ఏదో చెప్పారు. చివరికామె ప్రిన్సిపాల్ రూమ్ వద్దే తలుపు తీసి, తలుపుమూసే పనికి కుదర్చబడింది. కాని ఆమె తీరుమారలేదు. పిలిస్తే పలకదు, నడిస్తే కదలదు. పేపర్ వెయిట్‌ను పట్టుకుంటే ఇసుక లారీనీ మోసినంత ఆయాసపడటం మానలేదు. టీ కోసం పురమాయిస్తే ఏకంగా నల్లగొండ నుండి హైదరాబాదుకు ప్రయాణం చేసినంత 'శొందరిగా తెచ్చివ్వడం తప్ప, తగ్గలేదు. ఇక ఆమెకు జన్మలో టి తెమ్మని చెప్పవద్దని తీర్మానించుకున్నారు అధికార్లు.
రవళికి అప్పుడప్పుడూ కళాశాలలో అయ్యే బదిలీల్లో స్థల మార్పులు - ఒక డిపార్టు మెంటు నుండి మరో డిపార్టుమెంటుకి, లేదా కార్యాలయానికి బదిలీ అయితే, ఆమెకేం బాధ? ఆమె ఎక్కడకని బదిలీ అయిందో ఆ శాఖ వాళ్ళు బాధపడాలిగాని! 'బఐహుశా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇట్లాంటి వారి జాతొకటి పెరిగి పెద్దదై శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది కాబోలు! ఇటువంటి వారి సేవలు మరిచి, తత్ సంబంధికులే ఆమె పనిని పంచుకుని, ఉత్త పుణ్యానికి ఆమె నెలనెలా పక్కాగా జీతపు రాళ్ళు వచ్చేలా చూడాలి కాబోలు!” అని లోలోపలే బావురుమనుకునేవారు కొందరు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా, కావాలనే,
స్పర్శ 93 ఉద్దేశ్యపూర్వకంగానే ఈ అమ్మాయి యిట్లా చేస్తుందని కూడా కొందరనుకోవడం జరిగింది. అందుకు వారి వద్ద తగు ఆధారాలున్నట్టుగా భోగట్టా! వారి ప్రకారం, రవళి ప్రవర్తన కళాశాలలోనే, కళాశాల ఆవరణలోనికి ప్రవేశించగానే అట్లామారిపోతుంది. కళాశాల ఆవరణదాటిందే తడవు - ఆమెది అంతులేని స్వేచ్చ. ఇంకా చెప్పాలంటే విచ్చలవిడి స్వేచ్చ కూరగాయల మార్కెట్లో ఆమె మాట్లాడే తీరుకు నివ్వెరపోవలసింది. బట్టల బజారులో బేరం చేసే ఆమె తీరు (గ్రహించవలసిందే. ఆటో (డ్రైవర్ల మీద అజమాయిషీ వంటి ప్రవర్తన, విద్యార్థి లోకం మీద చిన్న చూపు ... అబ్బో ఆమె తీరే వేరు. “నా దారి రహదారి ...” అన్నట్టుగా వుంటుందని స్వీపర్ రంగమ్మ చెబుతుంటే ఎవరైనా విని తీరాల్సిందే. ఆమె విజయ రహస్యం ఒకటి చెప్పింది గౌర్మ- సాటి అటెండర్లు చిన్నపాటి అప్పులు పెడుతుందని, ఇస్తేగాని తీసుకోదని, నోరు తెరిచి ఎన్నడూ ఆడగదని. అట్లా సౌమ్యంగా వుంటుందనుకుంటే పొరబాటు. బజాట్లో వుంటుంది - మజా - ఆమె తడాఖా చూపిస్తే చాలు ఆకాశం ఫెళ్ళుఫెళ్ళున కూలి పోవాల్సిందేనని!
ఈ మధ్య బదిలీ మీద యింకో ప్రిన్సిపాల్ గారొచ్చారు. చాలా నిక్కచ్చి. సూటియైన మనిషి. స్వయంగా పనిచేసి యితరులూ చేసి తీరవలసిందేననే రకం, ఎవరూ కళాశాలకు ఎక్కువగా శ్రమించి చెమటలు కక్కవలసిన పనిలేదంటాడు. ఎవరి డ్యూటీ వాళ్ళు ఖచ్చితంగా చేస్తే చాలునంటాడు. ఎవరిక్లాసు తీసుకోవడం పంతుళ్ళ వంళతు. ఎవరి క్లాసులకు వాళ్ళు హాజరై విద్యా విషయకమైన వాటికి దూరం కాకపోవడం విద్యార్థుల వంతు. ఆఫీసులో ఏదీ పెండింగులో వుంచక పోవడం, కళాశాల పని సమయాలకన్న అధికంగా పనిచేయవలసిన 'పని లేదని/ అవసరం లేదని స్పష్టంగా చెబుతాడు.
అన్నీ బాగున్నాయిగాని, రవళికి ఈ వాతావరనం బెడిసి కొడుతున్నది. ఉక్కబోత మిక్కుటమైంది. ఏదీ మింగుడు పడటం లేదు. ఎప్పటి లాగే ఒకరికి పది మందీ - పదికి యాఖై మందీవచ్చారు - వెళ్ళారు. రవళి ప్రిన్సిపాల్ గదికీ తన పూర్వపు డిపార్టు మెంటుకీ - యిటు నుండి అటూ, అటు నుండి యిటూ వారం రోజులుగా తిరిగి - తిరిగి కాళ్ళు అరిగినట్రై - బొబ్బ లెక్కాయి కూడా,
అదే వ్రసన్న వదనం. అదే రీవిగా పలకరింపు. అదే హుందాతనం. అదే గాంభీర్యం. అదే ఆర్జరు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ప్రిన్సిపాల్‌గా, లెక్చరర్లు లెక్సరర్లుగా, ఆయా పోస్టుల్లో భర్తీ అయిన వారు ఆయా పోస్టుల్లో - పని చేయక తప్పదు. ఎక్కువ అక్కర లేదరి. తక్కువ అసలు కుదరదు. ఒకరి పని - మరొకరు
రశ వేణు సంకోజు చేయవలసిన పని లేదు. దానిని అలా చూసి తీరవలసిన పని తనకు అంతకన్నా లేదు.
అదే యిప్పుడు రవళికి పెద్ద గొడవగా మారింది. “ఏమిటి సాహసం? ఏమిటీ దౌర్దన్యం? ఎందుకింత దురుసుతనం? - * చిరాకు - చిరాకుగా, కసి-= కసిగా వుండింది వారం రోజులు, మెల్లగా యిప్పుడు భయం వంటిది మొదలైంది
ప్రిన్సిపాల్ గది తలుపులు తట్టిన చప్పుడు. సరిగ్గా సమయం తొమ్మిదిన్నర గంటలైంది. (పదిన్నర -, పదకొండు గంటలకు గాని వచ్చే అలవాటు లేదు రవళికి. వారం రోజులుగా మారినవి ఆమె సమయాలు. అందరికన్నా ఆలస్యంగా వచ్చి అందరి కన్నా ముందుకు వెళ్ళిపోయే” దిక్కు "లేదిప్పుడు, అందరికన్నా ముందుగా వచ్చి అందరికన్నా ఆలస్యంగా కాకపోయినా, అందరితోపాటు బయట పడవలసి వస్తున్నది. అసహ్యంగా, ఆగ్రహంగా వుంది. “ఏమిటీ పాడుపీడ?” అనిపిస్తున్నది. ఏదో ఖాలేని భద్రత కలిగిన ప్రభుత్వోద్యోగం, సమయపాలన వల్ల 'పీడి అనిపిస్తున్నది. తన పోస్టులోనే తాను పని చేయవలసి రావడం - “యాతన = కాదు నరకం” అనిపిస్తున్నది.
“ఎవరు?” - లోపల్నుంచి ప్రశ్న.
“నేను సార్ - రవళిని” మంద్ర స్వరంతో అనుమతి కోసం రవళి అర్ధింపుగా
- లోనికి ప్రవేశించిన రవళి ముకుళిత హస్తాలతో వినమ్రంగా నిలబడి “సార్ - కలెక్టరు గౌరు ... * అని, తన. మాటలు తనకే బలహీనంగా విన్పిస్తున్నట్టు అంటుండగానే “అం మాట్లాడానమ్మా - నీవు వెళ్ళివచ్చిన సంగతి కూడా చెప్పాడు. తప్పదని ఆయనే అన్నాడు. నీకు చెప్పి వుంటాడు కదా! ఒక పని చేయి- ఒక్కదానివే చేయలేవు రాత్రి డ్యూటీని. అందుకని ప్రతి రోజూ యిద్దరు వుండేట్టు ఏర్పాటు చేస్తున్నా. రాత్రి రెండో సినిమా దాకా అన్నట్టు చేయి డ్యూటీ సాయంత్రం ఆధు నుండి. తరువాత సులేమాన్ చేస్తాడు ఉదయం దాకా ...”” అంటూ రవళికింకేం అవకాశం యివ్వకుండా మాట్లాడాడు. ఆమెకు “సరే సార్” అని బయటపడటం కన్న మార్గంలేకపోయింది.
కొంత కాలం ఏడుస్తూ, శాపనార్థాలు పెట్టుకుంటూ డ్యూటీ చేసింది రవళి. వారం - పది రోజులు - నెల రోజులు గడిచాయి రవళి మీద అంతకు ముందు
స్పర్శ 95 అవసరాన్ని మించి సానుభూతి చూపించిన వారు యిప్పుడు తగ్గారు. రవళి పేరు చెప్పి తాము కూడా పనుల నుండి తప్పించుకు తిరిగిన వారు - ధన్యులం అనుకున్న వారికి యిప్పుడు తిక్క కుదిరిందనుకున్నారు సంబంధిత శాఖల వారు ఇతరత్రా పనులను ఎగగొడుతూ వచ్చిన వాళ్ళు యిప్పుడు అభిప్రాయాలు మార్చుకున్నారు. పనులను ఎగగొడుతూ వచ్చిన వాళ్ళు యిప్పుడు అభిప్రాయాలు మార్చుకున్నారు. స్వాముల మయ్యామని నెపం చూపి- రాయితీలు పొందిన వారికి వెసులుబాటు కరువైందిప్పుడు ప్రిన్సిపాల్ గారు “స్వామి” అని సంబోధిస్తూనే “పని - బాధ్యతలను మించిన భక్తి లేదని” ప్రవచించడం ప్రారంభించాక, నటించనైనా నటిస్తామని పనిని నటించిన వారికి కూడా పనిప్పుడు (బ్రహ్మాండంగా అలవాటైపోయింది.
అందరి విషయం ఏమిటో గాని రవళికిప్పుడు నైట్ డ్యూటీ యేమేలనిపిస్తున్నది. ఒకటికి రెండు మార్లు తాగి, వచ్చే పోయే వాల్ళతో కాలక్షేపం చేసి పది దాటింతరువాత చిన్న కునుకు కూడా తీస్తుందో లేదో రిలీవర్నంటూ వచ్చి సులేమాన్ ఆప్యాయంగా పలకరిస్తాడు. రోజంతా ఖాళీ. రాత్రి 12 నుండి నిద్రకూ అవకాశం. ఇంత తనకేం కావాలి? ఇంతకాలం ఇటువంటి అధికారిగాదు రాలేదెందుకు? తన డ్యూటీ మీద ఖచ్చితంగా ప్రవర్తించలేదెందుకు? ఏం - తనకు మాత్రం బుద్ధి లేకపోయిందెందుకు? ఈ పదులూ- యాభై మంది గాళ్ళు తనకెందుకిట్లా మోసం చేసి సాయపడ్డా మనుకున్నారంటూ తన పూర్వపు చేష్టలను తిరగ చూసుకోనారంభించింది రవళి.
రవళికిప్పుడు కాలక్షేపం వచ్చి వెళ్ళేవాళ్ళు ఎక్కువయ్యారు. పరిచయస్తులు కాస్తా కొందరు మిత్రులుగా కూడా అగుపిస్తున్నారామెకు,. చనువులూ, ఆప్యాయతలూ పెరిగనట్లనిపిస్తున్నది. 'మేడమ్” కాస్తా 'సిస్టర్‌గా కొందరికి, “రవళి సిస్టర్'గా కొందరికి పరిచయాలు పెరిగినవి. ఒకరిద్దరికి మాత్రం ఆమె కేవలం “రవళి మాత్రమే అయి, ఎదిగిపోయినట్లుగా భావించనప్పుడల్లా ఆమె వెన్ను పూసలో వేడి జనించటం ప్రారంభమైంది.
రవళి రాత్రి డ్యూటీల పట్ల కళాశాల సిబ్బందిలో కొందరికి కాదు చాలా మందికి రకరకాల అనుమానాలు, కసి ప్రారంభమయ్యాయి, కొన్నిశాఖల వాళ్ళు ప్రిన్సిపాల్‌ని నిందించుకున్నారు కూడ రవళిని 'డే ట్రైమ్లోనైనా' తమ ముందు తిరుగాదడకుండా చేసినందుకు ఆమె అందంగా నవ్వుతుందని, అంతకన్నా చలాకీగా వుంటుందనీ, చలాకీగా పలకరించి అంతకన్నా చలాకీగా వీడ్కోలు
96 వేణు సంకోజు చెబుతుందని, ఆ వీడ్కోలులో యుగాల పొడుగు సానుభూతి కాదు సహానుభూతి, తాపం కాదు సానుతాపం కలుగుతాయని ఒక్క రొక్కరూ చెబుతుంటే కొందరి నవ నాడులూ తమను పిచ్చి-పిచ్చి పీక్కుతున్నట్టూ, అందుకా ఆనందం పొందలేక విలవిల్లాడిపోయారు - కొందరు. కొందరు మాత్రమే ప్రిన్సిపాల్గారి నిక్కచ్చితనాన్నీ కార్యదీక్షా దక్షతను మెచ్చుకున్నారు. అయితే, అనేక కారణాలుగా, నొచ్చుకున్న వారే ఎక్కువ. త ళ |!
రవళి ఒక రోజున కళాశాలకు గర్భందాల్చి మెట్లెక్కుణూ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కొందరు ముక్కున వేలేసుకున్నారు. కొందరు చత్వారపు కళ్ళజోళ్ళను సరిచేసుకున్నారు. కొందరు చూపు మరల్చకుండా అలాగే తదేకంగా, ఎవరేమనుకుంటే మాకేం అన్నట్టుగా చూస్తూ వుండి పోయారు,
రవళి కళాశాలలోనికి ప్రవేశించింది, ట్రిన్సిపాల్తో ఏదో మాట్లాడనూ మాట్లాడింది, సరేనని అనిపించుకోవడమూ చేసినట్టుంది. తిరిగి ఒక ధీరగా, కించిత్తు గీరగా, నిశ్చలంగా, నిర్భయంగా (కొందరది సిగ్గు మాలిన పని అనుకున్నారు అది వేరే విషయం) వెళ్ళిపోనూ వెళ్ళిపోయింది.
ఆమె తిరిగి అలా వెళ్ళిపోవడంతోనే అనేకులకు అనేక అనుమానాలు స్ఫురించటం - వ్యాప్తి చెందటం - కలవరపరచడం - అసూయకూ - ఆక్రోశాలకూ తావివ్వడం ప్రారంభమైంది. నిన్నటి విధవరాలు ముఖం మీద యివాళ బొట్టా - నాజూకుగా? అదే అవసరమైతే ఉద్యోగంలో చేరిననాడే ఎందుకు పెట్టుకోలేదు? ఇన్నాళ్ళకు ఏమవసరమనిపించింది? ఈ కడుపేమిటి? అది తమకు అనవసర విషయం అనుకుంటూనే అసహ్యించుకోసాగారు. నైట్ వాచ్మెన్ సులేమాన్ పని కాదనుకున్నారు. మరెవడు వాడు? కుమార్ అట! ఎవరీ కుమార్? అయినా తమకెందుకు అనుకుంటూనే కుమార్ ఎవడై వుంటాడో శెలుసుకోబోయారు. ఈ (ప్రాంతం వాడే కాని ఊరు యిది కాదట! మరేవూరు? ఏదైతేనేం అని కూడ వెంటనే అనుకున్నారు. కాని అట్లా అనుకోబుద్ధి కాలేదు. ఐదు నెలలుగా పరిస్థితులు మారాయట. రవళి రాత్రి పన్నెండు దాకా కళాశాల డ్యూటీ తరువాత కుమార్‌తో కలిసి డ్యూటీ అట! ఛ! ఇదేమిటిట్లా అని అనిపించినా, అట్లా అనుకునే తీరారు వాళ్ళు. “సంఘం పట్ల ప్రేమగ” అని వెటకారంగా కూడ మాట్లాడుకున్నారు. కాని, “ప్రేమ” అనే చివరి మాట దగ్గర నట్టుబడిపోయారు. ఎవరి చేతిలోనో కట్టుబడిపోయినట్టు చట్టుబడిపోయారు.
స్పర్శ 97
రవళి జంకూ గొంకూ వంటి మాటలకే తావివ్వకుండా తిరిగింది. ధైర్యంగా, ఆనందంగా తిరిగింది. కుమార్‌తో కనిపించకపోయినా, ఎక్కడా ఆ ప్రసక్తిని అంగీకరించకుండా చిరు నవ్వు రువ్వింది. కవ్వించినట్టుగా ప్రవర్తించింది. అరు నెలలకు ఆమెకొక కొడుకు కలిగాడని స్వీట్లు పంచింది తప్ప ఎవ్వరినీ ఆహ్వానించలేదు. ఇల్లు చూపించలేదు. కార్య క్షేత్రం నుండి కార్యక్షేత్రం దాకా స్నేహం అనిపించింది.
96 ఈ ఉ
మంచి ప్రిన్సిపాల్‌గా, గట్టి ప్రిన్సిపాల్‌గా, ఎవరికీ తలవంచని ప్రిన్సిపాల్‌గా తన విద్యుక్త ధర్మాన్ని ఏ తేడా రాకుండా నిర్వహించిన ప్రిన్సిపాల్ మీదికి అంత మంది వచ్చి నిలదీస్తున్నారు. విషయం ఏమిటో అతనికీ అప్పుడే తెలిసింది.
ఇప్పుడు డ్యూటీ చేస్తున్న రంగయ్య అనే నైట్ వాచ్మేనే రవళిని తల్లిని చేసిన శేఖర్. ఆమె దృష్టిలో అతడొక ధర్మ్శదాతగా, పుత్ర (ప్రదాతగా, రాత్రిళ్ళను అనందమయమైన డ్యూటీలను చేయించిన ప్రియుడు. రవళికి కృష్ణయ్యతో వివాహం అయిన నాటి నుండే ఆమె మీద అతనికి ప్రేమ అనే కన్నుంది. అది ఆమే (గ్రహిస్తే మాత్రం ఏమిటి? ఒక వివాహిత. మిన్నకుంది. చనువివ్వకుండా జాగ్రత్త పడింది. కాదు చాల కాలం జాగ్రత్త పడుతూ వచ్చింది.
కళాశాలలో నైట్ వాచ్‌మెన్‌గా కృష్ణయ్యకు మంచి పేరుంది. సౌమ్యుడు, ఏ పని చెప్పినా కాదనడు, టీలూ గీలూ జాగ్రత్తగా తెచ్చి పెట్టేవాడు. దేటైమ్లో కూడ కొద్ది సేపు మధ్యాహ్నం పూట వచ్చి, ఫైళ్ళూ - గియిళ్ళూ మోసి పెట్టి వెళ్ళేవాడు. అతని యిల్లు ఎవరికీ తెలియదుగాని అందరి యిళ్ళూ అతనికి తెలుసును.
రాత్రిళ్లు కళాశాల నైట్ డ్యూటీకి కృష్ణయ్య అంకితమైతే, మెల్లమెల్లగా రాత్రిళ్ళు రవళి బ్యూటీకి కుమార్ అంకితం అవుతూ వచ్చాడు. అరుదుగా కలుసుకోగలిగేవాడు కొన్నాళ్ళు తరువాత వీలయినప్పుడల్లా,
“ఎంత కాలమిట్లా? అడిగింది రవళి.
“అడ్డు తొలగేదాకా” అన్నాడు కుమార్.
“ఏమిటడ్డు” అడిగింది - రవళి,
“ఏమిటి కాడు ఎవరు- అని అడుగు” అన్నాడు కుమార్,
98 వేణు సంకోజు
“ఎవరా? ఎవరు మరి?” అమాయకంగా, కొంచెం బెరుకుగా కూడ అడిగింది రవళి.
“న్స్ భ్రర్రూ అని కూల్‌గా జవాబిచ్చాడు కుమార్.
నిర్దాంతపోయింది. భయం చోటు చేసుకుంది ఆమెలో, ఇంకా ఏమైనా చెబుతాదేమో, ్రిన్సిపాల్తో మాట్లాడి డ్యూటీ వేళలు వగైరా మార్చిస్తాడేమో ననుకుంది. ఇటు వంటి దారుణమైన ఆలోచన ఆమెకు వచ్చి వుండదు.
“ఏమిటి కుమార్ నువ్వు మాట్లాడుతున్నది?” అని అడిగింది ఎటూ తోచక.
“నీవు చేయవలసింది” అన్నాడు కుమార్,
"నేనా? అంటూ ఏక కాలంలో భయం, విస్మయంతో కూడిన ప్రశ్న ఆమె శరీరం వణకసాగింది. చెమట్లు కమ్మినై. కళ్ళు చీకట్ల మయంకంగా, ఎట్లాగో అయిపోయింది రవళి,
“ఏమో నాకు తెలియదు. ఏమాలోచిస్తావో, ఎట్లా సాధిస్తావో నాకు తెలియదు. నాకు నీవు తప్పదారి లేదు. నాకసలు ఉద్యోగమే లేదు నిన్ను విడిచి వుండలేను. ఈ దొంగబతుకుకన్న ఒక కిరాతకం మేలనుకుంటున్నాను. ఒక మాట మాత్రం నమ్మకంగా చెప్పగలను, అన్నీ చేను చూసుకుంటాను కోర్టులూ - గీర్టులూ ఏమైనా సరే, ఎందాకా అయినా సరే. నా చేతులు ఎక్కడికైనా చేరగలవు. నావాళ్ళు నా కోసం, కాదు మన కోసం, ఎంతకైనా తెగించి మనకు మేలు చేసి పెట్టగలరు. నీవు కృష్ణయ్య విషయం చూసుకో. ఆ ఉద్యోగం సంపాదించుకో. ఆ యేర్పాట్లన్నీ నేను చేస్తాను. నీవు నమ్మినా నమ్మక పోయినా యిది నిజం. నీవు చేసినా మానినా, నేనైనా కృష్ణయ్యను లేకుండా చేయగలను. అమృతమూ నీ చేతిలో వుంది. విషమూ నీ చేతిలో వుంది. ఉపయోగించుకో. ఎంతో కాలం మన వ్యవహారం దాగదు. ఈ దాగుడు మూతలు సాగవు” ఖరాఖండిగా చెప్పాడు కుమార్, కుప్పకూలిపోయింది రవళి.
ఒక రోజు కృష్ణయ్య మరణ వార్త కళాశాలకు తెలిసింది. అంత్యక్రియలు కూడా అయిన మూడు రోజుల తరువాత.
ఎంత హెల్టీగా వుండేవాడు! ఎంత సిన్సియర్‌గా, ఎంత హ్యాప్పీగా పనులు చేసేవాడు. ఇసుమరిత విసుగులేదు ముఖంలో, ఏమ్రైందతనికి? గుండె
స్పర్శ 99 పోటున్నట్టు ఎన్నడూ చెప్పలేదే. బీపీ వున్నవాడిలా అనిపించలేదే? ఎన్నడూ, ఏ వ్యాధితో నవిసిపోలేదే అనుకున్నారు. కొన్నాళ్ళకు, బహుశా ఐదారు నెలల తరువాత, కంపాష్షనేట్ గ్రౌండ్స్ మీద రవళి నైట్ వాచ్‌మెన్‌గా కళాశాలలోకి ప్రవేశం. ఈ మధ్య హఠాన్మరణం- వివాదాస్పదమైన మరణం. చల్లని మరణం. ఆమె స్థానంలో ఆమెకు వారసులెవ్వరూ - తనుతప్ప లేరు గనుక, అన్నగా, రవళి ఏకైక సంతానపు సంరక్షకుని బాధ్యతను తీసుకుని ఉద్యోగంలో కంపాష్షనేట్ (గ్రౌండ్స్ మీద చేరాడు. పైగా అతనికి చెవిటి వాడన్న సర్టిఫికెట్ కూడా అదనంగా వుంది. ఇదంతా చేసింది వీడేనని, వీడసలు బంధువు కాదని వాదిస్తున్నారు. అసలు బంధువులుగా క్లెయిమ్ చేస్తున్నవాళ్ళు. సర్టిఫికెట్ల గురించీ - యితర వివరాల గురించీ తరచి చూస్తూనే - ఒక మరణం కాదు రెండు మరణాలు అంటూ విస్తు పోతున్నాడు ప్రిన్సిపాల్! భు లలా నా ఫ్య జ గ గ గ లి పానగల్“
5026502 . వా, తస “2 00//60600౧0 07540౧7635 అ (| | ల యన.
0)/ ౪6౧౯ 52040/4 స టా. స్వాతంశ్ర్రానంతరం తెలుగువాళ్ళ జీవితం గూర్చి లా రాయటానికి పూనుకున్న కథకుల్లో వేశు నంకోజు ఒకరు. షా కవిగా, వక్తగా, నభా నిర్వావాకునిగా అందరికీ తెలిసిన యై వేణు నంకోజు నమాజు శాస్తజ్ఞునిగా కూడా స్పర్భ' కథానికా ల నంపుటిలో కనిపిన్తున్నారు. వారి పొత్రలు వాస్తవ జీవితవు | ట్రతినిధులు. నన్నివేశ సంఘటనల కల్పన కూడా ఎ వాస్తవికమైనదే. శీధిలమవుతున్న మానవ నంబంధాల వట్ల సంవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, జీవితంలో చైతన్యాన్ని యః కోరుకునే రచయిత కావడం మూలంగా ముగింవుల విషయంలో [గా వ్రత్వేక (శ్రద్ధ తీనుకున్నారు. వీటిని చదివిన తరువాత పాఠకులకు 1 ఒక నమకాలీన జీవితం ్రధానంగా. మధ్య తరగతి జీవితం - అనుభవంలోకి వన్తుంది. రు
నాడా ఆ; లా క భై లక. క న ” 4/ 1 14 1