Telugu sontha katha - anilvaranasi/indianlanguages GitHub Wiki

_ లర్యుల్న వ్యష్థననార్తి ఇదీ ల (ట్రావ్మాణ్యంకథ (| కమ్యూనిస్టు కథ . 'ప్రైక్ర . కార్టూనిస్టు కథ (స ్రం . సాహితీవేత్త కథ మ. ... జర్నలిస్టు కథ నీ. స శ్రీ ఎనభై వసంతాల 18: చర.. - | ష ' వ, ( ఫే. 1 య ష్‌

నాంత కథ రాంభట్ల కృష్ణమనార్తి ౧10|1102610౧5

య ళ్‌ వ సో బత తడ ఆ 5006121262 ళం (మ జ(0010బ2902 95%460యి క్రై కన టు. ఆ స 6డ1బ056 కట01ంజ6015 నో 94 2ళటేింకే : ఇ జంప్‌, 2001 [ గ ంఆంరుులై : సెక్‌22001 ౧6264018 € ౦40-765 1085 60౪7౪ పేట! : ఇడ "అటంకం ౦40-658 8819 ధరాలయ 0684 2: గ శయ్యా లొ శరా న ళా రక యంజతఉజ్వు? ప్వడల౭సి26 యం చా, శే నే క్ష రో 02 60916 : నగా సక్‌ంర12104186 ₹45]1102640115 1-9-289 /4, కయి ౦50866 ఇగయాజబంఉ్రడు క్ర4ల25264 - 500 044 వ. 040 - 760 7007 58120642 కెం01 కంజ56 తీ 82120146

అక్కుత భాండాగారం

సుద్‌ర్హ జీవన చక్రంలో

ఎన్నెన్నో అనుభవాలు

ఎదమీటే రాగాలు

ఓ నిరంతరాన్వేషికి

ప్రతిభామూర్తికి

బతుకు బాటలో

ఎదురైన రాగాలకు, విరాగాలకు

బంధాలకు, అనుబంధాలకు

వొమోడ్పు ఈ సాంతకథ

ఎనభై వసంతాల

కాలగమనానికి

పట్టిన దర్పణం.. _

సమకాలీనా చరిత్రలోని

బహుముఖ పార్శ్యాలకు

అక్షర నీరాజనం.

తేట తెన్లూళ్ల వచన రచన

ఒడుపులన్నుతుట్టి చూపే

అక్షరామృత కలళం

రాంభట్ల కృష్ణమూర్తి

ఎనబై రెండో పుట్టినరోజు

కానుకగా సగర్వంగా

సమర్చిస్తున్నాం ఈ సొంతకథ. డాక్టర్‌ గోవిందరాజు చక్రధర్‌ ష్టోక్యూటివ్‌ డైరెక్టర్‌. మీడీయాహొస్‌ పబ్లికేషన్స్‌

రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ అ 3

క్షి తొలి తెలివిడి న. క్‌ దె అక్షరాభ్యాసం న. 18 తె స్థానచలనం న. 26 జ్తీ జందెమెందుకు? లలలలం వే ర్‌ తొలి కొలువు . త్తే 6 కొవ్వలియుగం న. త్తం 7 లేఖకవృత్తి అం 53 8 మాతృ వియోగం . 61 9. _ గుడ్‌బై హైదరాబాద్‌ అంంంం రర 10. పాతాళవాసం . గన క్ష తొలి ఎన్నికలు న. 90 12. పుత్రికా జననం న. 99 13. పత్రిక నుంచి పరిశ్రమకు ..... 113 14. ఆర్మేనియా యాత్ర . 24 15. _ తత్వశా(స్తాధ్యాపన ల. [31 16. అరసం అలజడి న. 138 17. _ మాస్కోలో తెలుగు సైంటిస్టు .... 146 18, రాక్షస వివాహావశేషం ఉంంవ22 156 19, ఈనాడు ప్రిన్సుపొల్‌గా ఎం... 163 20, ఈనాడు సమ్మె న. 169 21... రిటైర్మెంటు లం 177 22, అరుణ పెళ్లి ఉం 666 181 23 . అమెరికా యాత్ర లల... 189 24, తృణజలూకా న్యాయం అంంలలం 194 2ర్క అద్వయవాదం య. 1099 26. బాంచ = బానిస న. 209 4 తి రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ

జ [ల చి ” స తలువు రం(ధ్రంలోంచి వారి నీడలు గోడమీద తలుకిందులుగా కనివిన్తూ ఉండేవి. వారు తలకెత్తుకున్సు కుండలు కిందివేవు, కాళ్ళు మీదికీ వుండేవి ఆ నీడల్లో - గోడలమీద నీడలలా తలకిందులుగా ఎందుక్కనిపిన్తున్నాయి? రాత్రిళ్ళు ఆడే తోలుబొమ్మలాట కన్నా పట్టపగలు గోడమీద ఆడే ఈ నీడబొమ్మలాట చాలా బాగుండేది “ఆ వీినాలకీినూా తొలి తెలివిడి రవీంద్రుడు విశ్వకవి తన కవితకు నోబుల్‌ బహుమతి పొందిన ఏకైక భారతీయుడు. ఏదో సందర్భాన ఆయన రాసిన గీతాన్ని దేశ నాయకులు జాతీయ గీతంగా స్వీకరించారు. ఆ గీతంలో పల్లవి ప్రధమ చరణాలను మాత్రం అధికారికంగా పాడుతారు. అంతే. పాడని భాగాన ఉన్న చరణంలో ఆయన తాత్వికత వ్యక్తం అవుతుందని విమర్శకులంటారు. పాడని చరణానికి స్వేచ్చానువాదం ఇది. పతన అభ్యుదయ బంధురపధాన పరుగులు తీసే యాత్రి నీ రధ చక్ర ధ్వనితో మార్గం మోగుతోంది దినరాత్రీ మూలంలో రధం, సారధి అన్నమాటలున్నాయి. రధి ప్రస్తావనలేదు. అంటే ఆ రథం వాహ్యాళికి స్వయంగా నడుపుకునే గుర్రపుసార్చు అయివుంటుంది. స్వయం సారధికి పతనోత్హాన మార్గాలు పట్టవలసిన పనిలేదు. మన దేశాన కాలిబాటలదగ్గర నుంచి ఘంటాపధాల వరకూ రకరకాల బాటలున్నాయి. వాటిని విడిచి ప్రత్యేకం బరకలు మెరకలదారి పట్టవలసిన పనిలేదు. పోలికలకు పరమాణు పర్వతాలను పేర్కొంటారు పెద్దలు. రెండింటిలోనూ పాదార్థికత ఒకటే. నేను కూడా చిన్న కవిని. అదే భావాన్ని నామాటల్లో చెప్పాలంటే అది ఇలా వుంటుంది. పడుతూ లేస్తూ పరుగులు తీస్తూ పయనించే చిరయాత్రీ శ్రేబవళ్లు నీపద ఘట్టనతో దద్దరిల్లినది ధాత్రీ, ప క్‌ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ

లక్షల సంవత్సరాలు పాదయాత్రతో భ్యూభమణంచేసిన గణ మానవుని కధ ఇది. రవీం[ద్రకవిది ఆధ్యాత్ష్యం. నాది ఆధిభూతం. ఆయన చూపు ఆత్మనిష్టం. నా చూపు వస్తు నిష్టం. అంతే తేడా. పదార్థానికి నాలుగు అవస్థలు, మూడు క్షేత్రాలు వుంటాయంటారు భౌతిక శాస్త్ర పండితులు, ఘనం, (ద్రవం, వాయువు, ప్లాస్మా అనేవి ఆ అవస్థలు. ప్లాస్మా అంటే జ్వాల. ఇవికాక మూడు క్షేత్రాలు కూడా వున్నాయి. అవి: భూమ్యాకర్షణ క్షేత్రం. విద్యుదయస్కాంతం. తాపాణ కేరాదక క్షేత్రం. మనిషి గురత్వాకర్షణక్షేత్రంలో పుట్టి క్షేత్రంలోనే బతుకుతున్నాడు. శిశువు పుట్టినప్పుడు భూమిని అతుక్కునే వుంటాడు. తరవాత తరవాత లేవబోయి పడుతూ వుంటాడు. ఇలా పడుతూ లేస్తూ కడకు నడక నేర్చుకుంటాడు. నడక అంటే పతన పరంపర అంటారు భౌతికశాస్త్ర వేత్తలు. స్పష్టంగా చెప్పాలంటే పతనోత్భ్టాన పరంపర.

ఈ పరంపరను పథానికి అన్వయించాడు విశ్చకవి. ఆ పధాన పయనించే పాదచారికి అన్నయిస్తున్నాను నేను. ఆయనది సబ్జెక్సివు భావన. నాది ఆబ్జెక్టివు భావన. మనిషి నిటారుగా నిలిచినప్పుడు గరిమనాభి రెండు పాదాల మధ్యన వుంటుంది. ఒకపాొదాన్ని ముందుకు జరిపినప్పుడు ఊర్హ్ష్యకాయాన్ని కూడా ముందుకు వంచుతారు. అప్పుడు గరిమనాభి కూడా ముందుకు జరుగుతుంది. తరవాత రెండోకాలిని కదిపేటప్పుడు గరిమనాభిని ఆ కాలిమీదికి తీసుకెళ్లవలసి వుంటుంది. అందుకోసం ఊర్త్యకాయాన్ని వెనక్కువంచవలసి వుంటుంది. ఇదీ పతనోత్భాన పరంపర.

ఊర్హృకాయాన్ని ముందుకు జరపడం.అంటే పతనం..ఈ ఊర్హ్యకాయాన్ని వెనకకు వంచడం అంటే ఉత్చానం. ఈ పతనోత్భాన పరంపరలే నడక. ఈ గురుత్వాకర్షణ శక్తి మానవుడు శైశవదశ నుంచీ ఎరుగును. మహాభారత యుద్ధంలో భీమసేనుడు ఆకాశం మీదికి విసిరేసిన ఏనుగులు నేటికీ భూమిచుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాయేకాని కిందపడలేదు అంటున్నారు పండితులు. భూమి సైన కొంతదూరం వరకే ఈ శక్తి పని చేస్తుంది. పైకి వెళ్లినకొలదీ భూమ్యాకర్షణ పలచబడుతుంది, దానికి కూడా ఒక పొలిమేరవుంటుంది. ఆ పొలిమేర దాటితే ఆకర్షణ ఉండదు.

మిగతా రెండు శక్తి క్షేత్రాల వివరాలు ఇక్కడ అప్రస్తుతం. రచయితల ఆత్మనిష్ట్ర వస్తునిష్ట భావనలు ఎలావుంటాయో చెప్పడం కోసం విశ్వకవీంద్రుని ప్రసిద్ద కవితను విశ్లేషించవలసి వచ్చింది. అందునా అందరికీ సుపరిచితమయిన కవితా ఖండికను తీసుకొనవలసి వచ్చింది. అంతేకాదు పదార్జానికున్న మూడు క్షేత్రాల్లోనూ ఒకటయిన గురుత్వాకర్షణం మన పూర్వులకు చిరకాలంగా తెలుసునన్న వాస్తవాన్ని కూడా ప్రసక్తానుప్రసక్తంగా పేర్కొనవలసివచ్చింది. అంతేకాని రవీంద్ర కవీంద్రుని ప్రసిద్ధ గీతం మీద విమర్శిద్దామన్న ఆలోచనతో కాదని మనవి,

ఇప్పుడింక నా కథాకథసాన్ని అందుకుంటాను. అది యాభయి అయిదేళ్లనాటి కధ. నేను మీజాన్‌ అనే తెలుగు దినపత్రికలో పని చేస్తున్నాను. దానికి అడివిబాపిరాజుగారు సంపాదకులు నన్నాక కధ రాయమన్నారు. తెలుగు కథకులు ముఖ్యంగా నవలాకారులు తమవంటింటి ఎల్లలు దాటలేదన్నాను. దానిమీద వాగ్వాదం పెరిగింది. ఆఖరికి చారిత్రక నేపధ్యంగల కధ రాశాను. దాన్ని బాపిరాజుగారు ప్రేమకథగా దిద్ది అచ్చువేశారు. అప్పటి నుంచీ కధలను కాని, నవలలనుకాని రాయడానికి యత్నించలేదు. ఇప్పుడు అర్హశతాబ్దం తరవాత సొంత కధ రాసుకొనడానికి యత్చిస్తున్నాను.

తూర్పుగోదావరి జిల్లా డెల్దా ప్రాంతాన్ని కోనసీమ అంటారు. ఒక నొడది మరుభూమిలా వుండేది,

“ఈ అపర భగీరథుడు ఆర్థర్‌, కాటన్‌ దొర ప్రతిభవీల్ల అశోకుని ఉద్దానంలాగ మారిపోయింది. అంతవరకూ 6 అ రాంభట్ల కృష్ణమూర్తి సౌంతకధ

న్యూనతాభావంతో కుమిలిపోయేజనం హరాత్తుగా ఆధిక్యభావాన్ని సంతరించుకున్నారు డెల్టా ప్రాంతం మూడు తాలూకాలు. కొత్తపేట, అమలాపురం, రాజోలు అన్నవి ఆ తాలుకాలు. అందులో అమలాపురానికి సెంట్రల్‌ డెల్టా అనిపేరు. ఆమలాపురానికి మూడు నాలుగు మైత్త దూరాన వుంటుంది అనాతవరం (గ్రామం. ఆ (గ్రామంలోనే నేను పుట్టాను.

తండ్రిని మేం బాబు అని పిలిచేవారం. అబ్బ, అయ్య, నాయన, నాన్న అనేవి తండ్రిని పిలిచే "పేర్లు. మా బాబు పెద్ద జ్యోతిష్కుడని అంతా అనేవారు. ఆయనకి జ్యోతిష్యమేకాదు వాస్తు ప్రశ్న శా(స్తాలు కూడా తెలుసునట. నా జాతకం ఆయనే రాళారు. నా జాతకం ఒక్కటేకాదు. ఇంట్లో వాళ్లు ఊరిలో వాళ్లు అందరి జాతకాలూ ఆయన రచనలే, ఈ జాతక చక్రాలు, కొన్ని శ్లోకాలు, మంత్రాలు వున్న పుస్తకం ఒకటే నాకు జ్ఞానం వచ్చిన తరువాత కనిపించింది. అప్పుడు దాన్ని తిరగవేశాను. అంతే ఆ తరవాత ఆ పుస్తకం ఏమయిందో ఎక్కడపోయిందో తెలీదు.

జాతకాలన్నీ తెలుగు సంవత్సరాలు, నెలలు, తిధులు, ఘడియలు, విఘడియల్లో వున్నాయి. అవి నాకర్థంకాలేదు. అంతేకాదు అంకెలు కూడా తెలుగంకెలు. అప్పటికి నాకు తెలుగంకెలు తెలియవు. ఈ అంకెలదొక చిత్రమయిన చరిత్ర, ఇప్పుడమల్లో ఉన్న ఆంకెలను మనం ఇంగ్లీషు ఆంకెలంటాం. ఇంగ్లీషువాళ్లు వాటిని అరబీ ఆంకెలంటారు. అరబ్బులు వాటిని 'హింద్‌సా” అంటారు, అంటే భారతీయ అంకెలని + అర్ధం. దశాంశమానం కూడా మన దేళానిదే. దీన్ని అరబ్బులు (గ్రహించి యూరోపీయులకు అందించారు. కాగా పశ్చిమాసియాకు చెందిన సుమేరులు షష్ట్యంస మానాన్ని కనిపెట్టారు. ఆ మానాన్ని నేటికీ కాలగణనంలో అందరూ వాడుతున్నారు.

బాబు రాసిన జాతకాల్లో గంటలు, నిమిషాలు కానరావు. ఘడియలు, విఘడియలు వుండేవి. అరవై విఘడియలయితే ఒక ఘడియ. ఘడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు. రెండు ఘడియలు ఒక ముహూర్తం. ఇదీ లెక్క. రామాయణంలో వాల్మీకి ముహూర్తాన్ని విరివిగా వాడుతాడు. ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు, ఇప్పుడు మన పెళ్లిళ్లూ శుభకార్యాలకు వినియోగించే ముహూర్తం ఇదే... ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు. నా పుట్టినరోజు సంగతి సరిగా తెలియదు కాని 1920వ సంవత్సరం మార్చి నెల అన్నంతవరకు తెలుసుకున్నాను.

నాకు నడకవచ్చింది. దాంతో ఓమాదిరి పరుగు కూడా చేతనయింది. మా అన్నయ్య నాకన్న మూడేళ్లు పెద్దవాడు. తన యీడువాళ్లతో కలిసి గుడికి బయలుదేరాడు, నేనూ వస్తానన్నాను. వాళ్లు వద్దన్నారు. నాది పరిసరాలను పరిచయం చేసుకునే వయస్సు, నా 'ప్రశ్చలకు జవాబులివ్వడం వాళ్లకు విసుగు. అంచాత వాళ్లు నన్ను వదిలి చకచకా నడిచిపోయారు. నేను వారి వెంట పరుగెత్తాను. సగందారిలో వారెటో మాయమయ్యారు. నేను గుడికి చేరాను. అక్కడ అన్నయ్యా లేడు ఆతడి నేస్తాలూ లేరు. నేను బాలుర బలాన్ని అందుకొని అంతా కలియదిరిగాను. ఒక మూల కొందరు (బ్రాహ్మణులు చెమటలు కారుతూ బెల్లందంచుతున్నారు. వారు నా చేతిలో బెల్లం ముక్క పెట్టారు.

సాధారణంగా దోర ఎండలు కాచేకాలాన దేవుడి పెళ్లిళ్లు చేస్తారు. ఆ దేవుడి పెళ్లి రోజుల్లో పానకం వడపప్పు పంచడం ఆనవాయితీ. గృహస్థులు ఇంట చిట్టిగారెలను వండి భక్తులకు పెడతారు. వాటిని దేవుడు *“పిల్లి"గారెలనేవారు. తరవాత్తరవాత అవి పిల్లి గారెలు కాదు పెళ్లి గారెలని అర్ధం అయింది. నా బాల బలమం'త్రం విన్న మా మేనమామగారు నన్ను చేతులమీద ఎగరవేస్తూ ఇంటికి తీసుకొని వచ్చారు. వద్దు అన్న వారి వెంటపడితే వారు ఎక్కడో తప్పించుకుని పోతారు అన్న సంగతి అర్ధం అయింది.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 7

ఇప్పుడెవరి వెంటా పడనవసరంలేదు. బాబు వెంట వుంటే మంచిది అనుకున్నాను. బాబు ఉదయం స్నానం చేసిన తరవాత బావిపక్కనే ముగ్గుతో యంత్రం వేసి పూజచేసేవారు. యంత్రం మీదున్న గళ్లలో పూలరేకులుంచి పూజ చేసేవారు. పెరట్లో ఒక నారింజ చెట్టుండేది. రోజూ ఒక నారింజ కాయకోసి తొనలు నైవేద్యం పెట్టేవారు. పూజ పూర్తి అయేదాకా అక్కడే కూర్చునేవాడిని. నైవేద్యం అయినతరవాత నారింజ తొనలు నాకిచ్చేవారు. నేనప్పటికి శావేజి మహాదశలోనే ఉండేవాడిని, మానవ చరిత్రను రాసిన మోర్గను ఆ చరిత్రను శావేజి, బర్బర అన్న రెండు మహాదళశలుగా విభజించాడు. ఒకొక్క మహాదశను మూడేసి అంతర్హశలుగా భాగించాడు. ఆదిమానవుల ఈ దశాలక్షణాలు చిన్న పిల్లల ఎదుగుదలలో ప్రతిఫలిస్తాయి. శావేజీలకు తిండి ఏది కనిపిస్తే దాన్ని నోటపెట్టుకునేవారు. బర్చరదళ విధ్వంసదశ. కనిపించినదానినల్లా పగలగొట్టి దాని రూపురేకలను గుర్తించడానికి చేసేయత్నం. ఈ రెండు మహాదశా లక్షణాలూ చిన్నపిల్లల్లో కనిపిస్తాయి. బాల్యం దాటిన తరవాత మనిషి పూర్ణ్షపురుషుడు అవుతాడు. పూర్ణపురుషుడంటే ఆధ్యాత్మిక వాది అని పెద్దల నిర్వచనం. ఆధ్యాత్మికతనుంచి ఎవరయినా పూర్షతను సాధిస్తే అది వైయక్తికం మాత్రమే. అధి భూతం ద్వారా సమాజాభ్యున్నతికి తోడ్పడేవాడు పూర్షపురుషుడని నామతం. అలాంటి పూర్ణపురుషుల నుంచే ప్రకృతి శాస్త్రాలు, మానవీయ శాస్తాలు వృద్ది పొందాయి. ఏమయినా శావేజి బర్బర మహాదశలో మనిషి సంపాదించిన ప్రత్యక్ష జ్ఞానం నుంచే తర్కజ్ఞానం పెరిగింది. ఆ తార్కిక జ్ఞానం నుంచి పెరిగిన ఆచార జ్ఞానమే నేటి సమాజాభ్యుదయానికి ఆధారం. పూర్ణపురుషులకు ప్రేరణ. ఒకరోజున గోడ టపాకాయలు పేలినట్టు చప్పుళ్లు వచ్చాయి. వీధిలోకి వచ్చిచూస్తే అనాతవరం శివారు (గ్రామం తగలబడుతోంది. అక్కడికి అడ్డదారిన రోడ్డుదగ్గర. బాబు రోడ్డు వైపు బయలుదేరారు. నేను ఆయన్ని అనుసరించాను. ఇద్దరమూ రోడ్డు మీద ఒక కల్వర్భమీద కూర్చున్నాం. ఆ టపాకాయ చప్పుళ్లేమిటి బాబూ అని అడిగాను. ఇంట్లో వెదుళ్లతో అటక కడతారు. అటకమీద కొబ్బరికాయలు నిలవుంచుతారు. మంట వెదురు కణుపుల దగ్గరకు వచ్చేసరికి టపాకాయలా పేలుతుంది. అటకమీది కొబ్బరికాయలంటుకుని చిచ్చుబుడ్డిలా ఎగిరి దూరానున్న ఇళ్లమీద పడతాయి అన్నారు. ఒకయింట నిప్పంటుకుంటే ఆయిల్లేకొక ఆ(గ్రామం దగ్గరనున్న పరిసర (గ్రామాలు కూడా ఈ కొబ్బరి కాయలవల్ల అంటుకుంటాయి. కోనసీమ కాలవల దేశం. జనమంతా నీరు చల్లి మంటలు ఎక్కువ వ్యాపించకుండా అరికట్టగలిగారు. ఆ తరవాత బాబును రకరకాల ప్రళ్షలడిగాను. ఆ ప్రశ్నలన్నింటికీ ఆయన జవాబు చెప్పేవారు. నేనడిగే ప్రళ్ళలకు అందరూ అలాగే జవాబులు చెబుతారనుకునేవాణ్లి. తరవాత పెద్దలను అడిగితే కసిరేవారు. కసిరి కొట్టేవారేకాని బాబులాగ జవాబులు చెప్పేవారిని ఆతర్వాత నేను చూడలేదు. మాయింటికి రెండిళ్ళావల ఒక ఆధ్యాత్మిక స్వామి దిగాడు. ఆయన తరంగాలు పాడుతూ వుండేవాడు. ఆపాట వినగానే ఆయింటికి పరుగెత్తేవాడిని. ఆయన పాడుతూ వుంటే పాట తాళానికి అనువుగా నా కాళ్ళు కదుల్లూవుండేవి, పాట అయిన తరవాత నాకు ఒక ఎండు ఖర్జూరం కాయ ఇచ్చేవాడు. ఆయన వల్లభ మతానుయాయి అనుకుంటాను. నన్ను శ్రీ లీలా వేణుగోపాల బాలకృష్ణ అని పిలిచేవాడు. నామకరణ సమయాన బాబు నాకు నరసింహం అని పేరుపెట్టారు. అది ఆయన తమ్ముని పేరు. ఆ పేరు మిగల్లేదు. వల్లబసన్యాసి పెట్టిన పేర్గో ఒముక్క మిగిలింది. అనాతవరం మా స్వగ్రామం కాదు. ఆది మా మాతామహుని ఊరు. పితామహుని ఊరు విశాఖజిల్లాలోని 8అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

ఒక కుగ్రామం. అది సర్వదుంబాలా అ(గ్రహారం. దాని అధిపతి మా పితామహుడు, మా మాతామహ పితామహుల పూర్వులు విజయనగర నంస్టాన ఉద్యోగులు, సలస్టానంలో జరిగే తిరుగుబాట్లను సామోపాయంతో పరిష్కరిస్తూవుండేవారు. అందుకు ప్రతిఫలంగా మా పూర్వులు ఒక అగ్రహారాన్ని సాధించారు. మాతామహుని పూర్వులు దొర అన్న బిరుదాన్ని సాధించుకున్నారు. ఈ ఉభయ కుటుంబాలకు మధ్య బంధుత్వాలు కూడా 'పెరిగాయి.

అప్పటికి గణావశేష ధర్మం నడుస్తూ వుండేది. అందులో ముఖ్యమైనది చెల్లైళ్ల పోషణ బాధ్యత అన్నలదన్న నియమం, మాతామహని పూర్వులు విశాఖజిల్లా చోడవరానికి పక్కనున్న ఫకీర్‌సాహెబుపేటలో స్థిరపడ్డారు. మా ఊరిపేరు పెదపూడి అ([గ్రహారం. ఇంటి పెద్దకొడుకు ఆ (గ్రామానికి మునసబు, కరణం బాధ్యతలను నిర్వహిస్తూ వుండాలి. ఆది నియమం. ఆలాగే మా మాతామహుని ఇంటి "పెద్దకొడుకు దొర బాధ్యతలను నిర్వహించాలి. ఆ నిర్వహణకు సంస్థానం నుంచి కొంత ఆర్థిక పరిహారం కూడా ముట్టుతూవుండేది.

దొరగారి దివాణంలో రేయింబవళ్లు అన్నదానం జరుగుతూ వుండేది. ఒకొక్కప్పుడు భూములమీద వచ్చే గింజలు చాలేవి కావు. సంస్థానం నుంచి వచ్చిన పరిహారం కూడా చాలేది కాదు. అలాంటప్పుడు సరిపెల్ల నారాయణ దొరవారు భార్యను పుట్టింటికి పంపించేవారు. ఆమె'మా పీతామహునికి మేనత్త. ఆమె రాగానే తండ్రి గాదెలు తెరిపించి బియ్యం పప్పులు బళ్లకెత్తి ఆమెకు పసుపు కుంకుమ కొత్తవీర యిచ్చి వెంటనే అత్తవారింటికి పంపేవారు. అదీ సరిపెల్లవారి కుటుంబానికీ రాంభట్లవారి కుటుంబానికి గల సంబంధం.

ఆనాడు మాకుటుంబాల్లో కన్యధారేగాని కన్యాశుల్కం వుండేది కాదు. కుటుంబ వ్యవహారాల్లో తుది మాట గృహిణిది. వివాహాలు బాల్యంలోనే జరిగేవి, శాస్త్ర (ప్రకారం వధువుకు అష్టవర్ష అవధి వున్నప్పటికీ ఆచారంలో అయిదారేశ్లకే పెళ్లి అయిపోయేది. మా బాబుకి అలాంటి పెళ్లే జరిగింది. పెళ్లి అయిన కొద్ది నెల్లకే ఆమె పోయింది. పునర్వివాహాన్ని మాబాబు దాటవేస్తూ వచ్చారు. తన పుట్టినింటి వారింటి పిల్లతో పెళ్లిచేయాలని మా నాయనమ్మ యత్నం. ఆయత్నానికి ఎదురు తిరిగారు మా బాబు. అఖరికి దౌొరవారి మనవడి కూతుర్ను మనువాడారు.

దొరగారి భార్యకూడా మానాయనమ్మకు ఏమాత్రం తీసిపోలేదు. తన పెద్దకొడుకు పెళ్లితో ఏదో పేచీ వచ్చింది. ఆయన భార్య కోనసీమ ప్రాంతానిది. అత్త ఆర్భటయుద్ధం, కోడలి మౌన యుద్దం. ఈ యుద్ధాలకు తెరిపికానరాలేదు. అందుకని ఆయన అత్తవారింటికి వలసవచ్చారు, దొరగారికి కోనసీమలో కూడా కొన్ని భూములున్నాయి. ఆ భూములుపెద్ద కొడుక్కి ఆధారాలయ్యాయి. ఆయనకు నలుగురు కొడుకులు. అందులో రెండవవారు మా మాతామహుడు. దొరగారి పెద్దకొడుకు పేరు చానమ్మ. మా పితామహుని పేరుకూడా అదే.

అగ్నిష్టోమయజ్ఞం చేసిన వానికి సోమయాజి అన్న బిరుదం వస్తుంది. సామాన్యులాయన్ని సోమాయలు అంటారు. అతని భార్యకు సోమిదమ్మ అన్న బిరుదం వస్తుంది. సామాన్యులామెను సోదెమ్మ అంటారు. అగ్నిష్టమం తరవాత చిత్‌చయన యాగం చేస్తారు. ఆయాగం చేసిన వారికి చయనయాజి అన్న బిరుదం వస్తుంది. సామాన్యులు చేను అంటారు. ముద్దుగా చేనమ్మ అని కూడా అంటారు. దారగారి పెద్ద కొడుకునీ మా పితామహుని కూడా చేనమ్మ అనేవారు. అంటే ఈ రెండు కుటుంబాల్లోన్తూ ఎవరో ఒకరు అగ్నిష్టోమచిత్‌ చయన యాగాలు చేసివుండాలి.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ అ9

నాకు తెలిసినంతవరకు మాకుటుంబంలో యజ్ఞయాగాలుచేసిన వారెవరూ లేరు. కనీసం వేదాధ్యయనం చేసినవారు కూడా లేరు. మరి మా మేనమామగారి కుటుంబంలో ఎవరయినా వున్నారేమో తెలీదు. ఏదోరకంగా చయనయాజి అన్నపేరు మా ఉభయకుటుంబాలకూ వచ్చింది. మాబాబు పెళ్లి చేసుకున్న దగ్గిర నుంచి మానాయనమ్మకు మా అమ్మకు మధ్య ఆర్భట మౌన యుద్దాలు సాగుతూ వచ్చాయన్నాను కదా ఆయుద్ధం మితిమీరినందువల్ల మా అమ్మా బాబూ ఇల్టువిడిచిపోయారు. మా బాబు కొంతకాలం ఏదో ఊరి కరణం లీవువేకెన్సీలో పనిచేశారు.

కరిణీకం అయిపోయిన తరవాత ఫారెస్టుగార్డుగా ఉద్యోగం సంపాదించారు. కొండవాళ్ల మందులు, మంత్రాలు, జోస్యాలు నేర్చుకున్నారు. ఆ వాతావరణం ఆయనకు పడలేదు. ఇంటికి తిరిగివచ్చి ఆస్తి పంచమన్నారు. మా తాత పొరుగూరి భూములూ, అప్పులూ ఇచ్చాడు. అయినకాడికి భూములు తెగనమ్మి అప్పులు తీర్చి మిగిలిన రొక్కం చేతపట్టుకొని అనాతవరానికి వలస వచ్చారు. నా మూడోయేట ఆయన పోయారు. అప్పటికి ఆయన తెచ్చుకున్న డబ్బు ఖర్చు అయింది పోగా దిండుకింద రెండువందల రూపాయలు మిగిలాయి. దిండుకింద నున్న డబ్బుతో ఆయనకు అంత్యక్రియలు చేశారు.

పెద్దకొడుకు అంత్యక్రియలకు వచ్చిన మాతాత స్వ అని చెప్పుకొనడానికి ఏమీ మిగలని మా స్వ(గ్రామానికి నన్ను కొనిపోయాడు. బాబు,పోయేనాటికి మా అమ్మ నిండు చూలాలు. బాబు పోయిన అయిదారురోజుల్లో ఒక ఆడపిల్లని ప్రసవించింది. మాబాబు తన వాటా అస్తి నము, గనుని అనాతవరానికి వలసవచ్చాడు. అంచాత మా తాతకు మామీద ఎలాంటి బాధ్యతాలేదు. తండ్రిపోయిన పిల్లల్నీ తోబుట్టువునీ పోషించే బాధ్యత మేనమామలది. అంచాత అమ్మ, పసిపాప, పెళ్లికాని అక్క, అన్నలను మా పెద్దమేనమామగారు హైదరాబాదు తీసుకువెళ్లారు. ఆయనకక్కడ ఉద్యోగం.

"పేరుకు అగ్రహారమేకాని అప్పటికే అయిదారు (బ్రాహ్మణుల ఇళ్లు శిధిలమై దిబ్బతేరాయి. నేను వెళ్లేసరికి మాది కాక మరో అయిదు (బ్రాహ్మణుల ఇళ్లుండేవి. అందులో రెండు కరణాల ఇళ్లు వారు ఇతర (గ్రామాల కరణాలు. మిగతా మూడిళ్లూ అన్నదమ్ములవి. ఏ ఇంటిలోనూ నా యీడుపిల్లల్లేరు. ఊరిలో ఎక్కువమంది గొల్లలు. నాలుగైదు ఇళ్లు కాపులవి. కోమట్టు పక్క ఊరిలోవుంటారు. ఈ రెండు (గామాలకూ కాస్త దూరంగా ఒక రాజుల కుటుంబం వుండేది. నాకు ఆటతోడు, మాటతోడు ఎవరూ లేరు. ఇంట్లో ఇల్లుపట్టిన ఇద్దరు మేనత్తలు, తాత, నాయనమ్మా వుండేవారు.

(బ్రాహ్మణవీధికి ఒకపక్క బాగా పెరిగిన రెండు రావిచెట్టు, వాటి కావల రామస్వామి కోవెల. ఊరంతా తాటాకు ఇళ్లు తప్పమరో రకం ఇళ్లు లేవు, (బ్రాహ, గణుల ఇళ్లు పొడుగ్గా వుంటాయి. కాపులవి చుట్టుగుడిసెలు. రామస్వామి కోవెల ఇటు పొడుగు ఇల్లూ కాదు చుట్టుగుడిసె కాదు. ఒకే ఒక గది పెద్ద అరుగూ వున్నది రామస్వామి కోవెల. (గ్రామసంబరాలు, ఆ కోవెల ముందు జరుగుతాయి. (గ్రామీణులకు కోవెల అరుగు ఒక క్రబ్బులాంటిది. నలుగురూ అక్కడికి చేరి ముచ్చట్లాడుకుంటూ వుంటారు. ఒకగది ఉంటుంది కాని ఆ గదిలో ఏమీ వుండదు.

కోవెలకు ఎదురుగా కమ్మరి కొలిమీ దాగర వుంటాయి. వాటి వెనక కమ్మర చుట్టు గుడిస. అక్కడి కమ్మర్లే వడ్రంగం కూడా చేస్తారు. ఆవూళ్లో అది ఒకటే కుటుంబం. చుట్టు గుడిసెల ఆఖర్న తెలకల గానుగ. బ్రాహ్మణ వీథికి ఆవలివైపు మంచినీళ్ల బావి. ఊరివారందరికీ ఆదొకటే బావి. బ్రాహ్మల ఇళ్లల్లో మౌత్రం నీటి బావులున్నాయి. అవి ఉప్పునీటి బావులు. ఊరికావల ఒక గెడ్డ వుంది. గెడ్డ అంటే వాగు అని

10 అ రాంభట్ల కృష్ణమూర్తి సాంతకధ

అర్ధం. అది ఒకప్పుడు కూలంకషంగా పారేదట. నేను చూసిన్నాటికి వానాకాలంలో తప్ప నీరుండదు. కొన్ని రోజులపాటు చెలమలు పనిచేస్తాయి. తర్వాత పనిచేయవు,

మా నాయనమ్మకు ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. ముగ్గురు కూతుళ్లను పుట్టింటి కుదురువారికే ఇచ్చింది. ఆందులో పెద్ద కూతురు సౌభాగ్యవతి. ఆమె సోమిదమ్మ. మిగతా ఇద్దరూ బాలవితంతువులు. మూడవ కోడల్ని కూడా అదే కుదురునుంచి తెచ్చుకుంది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, నలుగురు కొడుకులు. తాత (ప్రస్తావన లేకుండా నాయనమ్మను గురించే చెబుతున్నావేమిటి అని అడగవచ్చును. ఆనాడు మగువలు రాణీ రూపాయిలాంటివారు. మగవారు సత్తుపావలా కాసులాంటివారు. రాణీరూపాయృ్మచాక్కవువెండి. దానికి నేటికీ తులం వెండికి వుండే ధర పలుకుతుంది.

మా చినబాబు భీమబలుడని మానాయనమ్మ చెప్పేది. గరువులో పెసరకట్ట కడితే దాన్ని ఇద్దరు మనుషులు ఆయన తలకెత్తేవారు. ఆయన దాన్ని తలకెత్తుకుని వచ్చేవారు. ఆయనకు నలుగురితోనూ భోజనం పెట్టేది కాదు ఒంటరిగా పెట్టేది. ఆయన భోజనం చూసిన వారి దిష్టి తగలకుండా వుండేందుకు ఆపని చేసేది పెరట్లో బాగా పెరిగిన చల్లగుమ్మాడి మానువుండేది. పారుగూరి రాజులు ఆమాను కొట్టించి బండికెత్తించారు. అప్పుడు గరువునుంచి వచ్చాడు చినబాబు. బండినాగమీద చెయ్యివేసి ఎడ్లను కదలకుండా ఆపాడు తరవాత ఆ దుంగను బండిమీంచి కింద పడేశాడు. అదీ అతడి బలం.

నాకు నామకరణంలో ఆ చినబాబు పేరే పెట్టారు నరసింహం అని. ఉఫ్‌ అని ఊదితే కొట్టుకుపోయే వీడిని నా చిన్న కొడుకు పేరుతో పిలవలేను అంది మా నాయనమ్మ. అప్పుడు వల్లభసన్యాసి పెట్టిన పేరు వాడుకకు వచ్చింది. ఇల్లు పట్టిన మేనత్తల్గో పెద్దావిడపేరు పాపసోదెమ ట్ర ఆమెకు కాస్త రాయనూచదవనూ వచ్చును. ఆమెనన్ను బాలా అనిపిలుస్తూ వుండేది. ఇతరులు కృష్ణా అని పిలిచేవారు. కోపంవున్నా మానాయనమ్మ “కుష్టమ్మా” అని పిలిచేది. చల్లగుమ్మడి ఉదంతం తరవాత మా చినబాబు పోయాడు. రాచదిష్టితగిలి తన చిన్న కొడుకు పోయాడని నాయనమ్మ అంటూ వుండేది. నిజంగా దిష్టి అంటే దృష్టి దోషం ఉందా?

దిష్టిదోషం మీద నమ్మకం చాలా దేశాలలో వుంది. దృష్టి దోషపరిహారానికి చాలా ప్రక్రియలున్నాయి. దృష్టిదోష నివారణ ఒక హిందీ సినిమా పాటకెక్కింది. పారసీకులు దృష్టి దోష నివారణను “చష్మె బద్దూర్‌” అంటారు. చక్ష్మ అంటే కళ్లు - బద్‌ అంటే దోషం. దూర్‌ ఆంటే తాలగిపోవాలి అని అర్ధం. ఆ హిందీ సినిమాపొట బాగుందని తెలుగు సినికవులు చెష్మెబద్‌ దూర్‌ అన్న వాక్యాన్ని నమ్మవద్దూ అని పూరించుకున్నారు. మా చిన్నత్తయ్య నన్నెత్తుకుని ఏడిళ్ల పిల్లి కూనలా ఇంటింటికీ తిప్పుతూ వుండేది. ఇంటికి తిరిగి వచ్చిన తరవాత నాకు దిష్టి తీస్తూ వుండేది.

మావూరి ప్రధానవీధి తూర్పు పడమరలకు ఉంటుంది. అందుకని ఇళ్లు ఉత్తర దక్షిణవాసలుగా వుంటాయి. మాది ఉత్తరవాస. గోడలు మిద్దమట్టివే. ఆమిద్దెమీద పొట్టి స్తంభాల మీద వెదురు కర్రల పాకలా కట్టి దాన్ని తాటాకులతో నేస్తారు. ఇంటిముందు తొలి మెట్టుగా సదునుగల కొండరాయి, ఆపైన మరో మెట్టు, సింహద్వారం అటూ ఇటూ పెద్ద అరుగులు. సింహద్వారం దాటగానే పెద్ద సావడి. ఎడంవైపున పెద్ద భోషాణం. కుడివైపున చెక్కతో కట్టిన ధాన్యంగాదె. సావిడి దాటుతే పొడుగాటి పంచపాళి. దానికి రెండువైపులా రెండుగదులు,

ఎడంవైపునున్నది మాబాబు పడకగది. ఆ గదిలో పెద్దపందిరి పట్టెమంచం. నగిషీ చేసిన దుంగల్లాంటి

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 11

కోళ్లు తరణిపట్టిన పందిరి స్తంభాలు. 'ప్రతీస్తంభానికీ తరణిపట్టిన కొయ్య పళ్లెం. ఆపైన కొయ్య భరిణ. మంచం ఎక్కడానికి కొాయ్యమెట్టు. కుడివైపు గదిలో కూడా పెద్ద భోషాణం వుంది. ఒకపక్క మట్టిమెత్తిన బియ్యంపాణక. అదో ఆయుధాగారంలావుంది. భోషాణం కింద కత్తులూ పెద్ద కొడవళ్ళ్లూ గోడకు చేరవేసిన ఈటెలు, బల్లేలు ఆలుగులకట్టలు ఉన్నాయి కాని బాణం బద్ద కనిపించలేదు. బాణంబద్దతోపాటు నారికూడా పోయివుంటుంది. బాబు మంచం ఉన్నగదిని ఎవరూ తెరిచేవారు కాదనుకుంటాను. దానికి గబ్బిలాల కొట్టు అని పేరు. తలుపు తెరిచి లోనికి వెళితే టపటప రెక్కలసవ్వడితో గబ్బిలాలు ఈవలకు వచ్చేవి. ఆగదిలో ఉసిరికుండ వుండేది. ఉసిరికాయలు రుబ్బి ఆముద్ద కుండలోపలా వెలుపలా మెత్తి ఎండబెట్టేవారు. అది నూనెకుండ. గానుగ నుంచి వచ్చిన నువ్వుల నూనెను ఆ కుండలో నిలవవుంచేవారు, ఆ నూనెను బాలింతలకు వాడేవారు. ఇప్పుడు బాలెంతలెవరూలేరు. ఉసిరికుండ మాత్రం ఉంది. పంచపాళి కావల ఖాళీ స్థలం - ఒక దొండ పందిరి, దానిమ్మచెట్టూ, నారింజచెట్టూ వుండేవి. దానికావల నట్టిల్లూ వంటిల్లు మరోచివర శిథిలమైన గది. ఆపైన పెరడు రెండు నిమ్మచెట్టు, గన్నేరు చెట్టు చల్లగుమ్మడి చెట్టు, రెండు కొబ్బరిచెట్టు మునగ చెట్టు, ఒక పెద్ద టేకు చెట్టు ఉండేవి. పెరటి పంచకింద వేడినీళ్లగాగు. పెరటి చివర రెండు వరి మడులు వుండేవి. పెరట్లోంచి గెడ్డకుదారి. ఆదారికి ఇరువైపులా పంటచేలుండేవి. ఆ చేలు ఎవరివో నాకు తెలియదు నేనడగలేదు. మాతాత చెప్పలేదు. చివరనున్న వరిమళ్లకు పెరటి బావినుంచి తోడిన నీరును మళ్లించేవారు. పెరట్లో చెత్తాచెదారం పోయడానికి ఒకగాత వుండేది. కొంతకాలానికీ అది గెత్తంగా మారేది. నేను బక్కగా వుండేవాడిని, నన్ను పట్టెడేసి జబ్బలున్న జెట్టీగా తయారుచేయాలని మా మేనత్తలు నాయనమ్మ కోరిక, అందుకని రోజూ అన్నందగ్గర పేచీ. నా మట్టుకు నేను కడుపునిండా తినేవాడిని, వాళ్లకళ్లు నిండేట్టు తినాలని వాళ్ల కోరిక. ఈ సంఘర్షణలతో నా అన్నం రోజురోజుకూ తగ్గిపోతూ వుండేది. భోజనం దగ్గర మేనత్తల ధాష్ట్రీకాన్ని తగ్గించాలి. అందుకని కథ చెబితేకాని అన్నంతినను అని పట్టుపట్టేవాడిని. అక్కడున్న మా ఇద్దరు మేనత్తల్లో పెద్దావిడ పేరు పాపసోదెమ్మ అని ఇదివరకే చెప్పాను. ఆమెకు కాస్త్ర చదువు, లోకజ్ఞానం వుంది. చిన్నావిడ పేరు నారాయణమ్మ శుద్ద బోళా. బోళాయేకాని ముక్కుమీద కోపం ఉండేది. ఆమెకు చేతనయిన విద్యలు రెండు. ఒకటి తిట్లు. రెండు పిడిగుద్దులు. కోపం వస్తే చాలును ఎంతటివారినైనా తిట్టేది. కలయబడి కొట్టేది. అంతలోనే కరుణకలిగి అన్నంవండి ఆవకాయ వేసి పెట్టేది. (గ్రామంలోని కాపులూ గొల్లలూ కొందరు ఆవకాయ అన్నం తినాలని బుద్ధి పుట్టినప్పుడు నారాయణమ్మగారికి కోపం తెప్పించేవారు. పాపసోదెమ్మకు 'పేరాచ్చి పెద్దమ్మకధలు కొన్ని వచ్చును. అయితే ఆమెకు పెత్తనాలెక్కువ. తీరిక తక్కువ. అందువల్ల కధలు చెప్పే బాధ్యత మా తాతయ్యమీదపడింది. ఆయనకు కధలురావు. కాని రామాయణం వచ్చును. రోజూ అన్నం చగ్గర నాకు రామాయణ కధ చెబుతూవుండేవాడు. బాలకాండ, అయోధ్యాకాండ కథలు చెప్పిన తరవాత కథ ఆపేశాడు. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పడంవల్ల విసుగుపుట్టింది. అందుకని వాళ్లు అడివి నుంచి తిరిగి వచ్చాక చెపుతానన్నాడు. సరే అయితే నేను వారుతిరిగి వచ్చిన తరవాతే అన్నం తింటానన్నాను. తాతయ్యకు కథ చెప్పడం తప్పలేదు. బాలకాండం నుంచి యుద్దకాండం వరకు తిరిగి తిరిగి అవే కధలు 12 అ రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ

చెబుతూవుండేవాడు. రాముడు ధనుర్విద్యలో గొప్పవాడు. ఏడు తాటి చెట్టను ఒక్కబాణంతో కూల్చివేళాడు. ఇంట్లో విల్లులేదు కాని ఆలుగులున్నాయ్లి. ఒకరోజున “తాతయ్యా! నీకు ధనుర్విద్య వచ్చునా?” అని అడిగాను, రాదు అన్నాడు తాతయ్య, అయితే నేను నేర్చుకుంటాను ఒక విల్లు కట్టె ఇయ్యి అన్నాను. తాతయ్య ఒక వెదురు బద్దకు నులకతాడు కట్టి విల్లుచేసి చీపురుపుల్లల బాణాలు విడిచే విద్య నేర్పించాడు. మాకు పది మామిడిచెట్ట్లూ రెండు చింతచెట్లూ వున్న ఒక తోట వుంది. తాతయ్య ఉదయమే బయలుదేరి మా గరువులూ ఇతరుల పాలాలవెంట తిరగి పన్నెండింటికి ఇంటికి వచ్చేవాడు. వచ్చేటప్పుడు కనిపించిన తోటల్లోంచి కూరగాయలు తెంపి తెచ్చేవాడు, పిందెలు కోసేస్తూ వుంటే ఆయన్నేమీ అనలేక బాధపడేవారు రైతులు. ఉదయం తాతయ్య బయలుదేరిన తరవాత విల్లూ కొన్ని అలుగులూ తీసుకుని నేను తోటకు బయలుదేరేవాడిని. మామిడికాయలుంటే మామిడికాయలకూ లేకపోతే చింతకాయలకు బాణాలువేసేవాడిని. అలాకొంతసేపు బాణాలతో ఆడుకుంటూ వుంటే నాకోసం వెతుక్కుంటూ చిన్నత్తయ్య వచ్చేది. నా ఆట అంతటితో ముగిసిపోయేది. పొద్దు నడినెత్తికెక్కినప్పుడు పొయ్యివెలిగేది. అప్పుడు ఏవో కూరగాయలు పట్టుకునివచ్చేవాడు తాతయ్య, స్నానంచేసి గూట్టోంచి దేవతార్చన పెట్టెదింపి దానిముందు కూర్చునేవాడు. అది చిన్న ఇత్తడిపెట్టె. అందులో చిన్న చిన్న రంగురాళ్లు ఉండేవి. ఆ రాళ్లను తీసి ఒక పళ్లెంలో వేసి వాటిని కడిగేవాడు. ఆపెట్టెను కూడా కడిగి ఆ రాళ్లను మళ్లీ ఆపెట్టెలో అమర్చేవాడు. తరవాత పెరట్లోంచి కోసుకొచ్చిన గన్నేరు పూలతో పూజచేసేవాడు, పూజ అయిన తరవాత పెట్టెమూతపెట్టి గోడకు ఉండే గూట్లో పెట్టేవాడు. ఆగూటి మీద గోడకు నలుచదరంగా జేగురుపూసి ఆజేగురు మీద నాముతో లతలు గీసేవారు. దానికి దేవుని గూడు అని పేరు. స్త్రీల పూజకు మహాలక్ష్మి సింహాసనం అని ఉండేది. సాధారణంగా దాన్ని ఇత్తడితో చేస్తారు. మరీలేనివాళ్లు కొయ్యతో చేయించుకుంటారు. సింహాసనంలో నాలుగువైపులా నాలుగు బురుజుల్హాంటివి వుంటాయి. వాటికి బుడ్డికుండలనిపేరు. లోన ఒక ఇత్తడి పాదం, చేత వెన్నముద్ద చెంగల్వపూదండ బంగారు మొలతాడు పట్టుధట్టి అన్న పద్యానికి అనువుగా చేసిన ఇత్తడి బాలకృష్ణ విగ్రహం ఉంటాయి. ఇవి కాక కాస్త దళసరిగా ఉన్న ఇత్తడిపోతబిళ్లు అది దీర్చచతుర(స్రాకారంలో వుంటుంది. ఒకవక్క మామూలుగానే వుంటుంది కాని రెండోవక్క త్రికోణంతేలుతుంది. ఆబిళ్లమీద రెండు అడ్డగీతలుంటాయి. ఇదీ మహాలక్ష్మి సింహాసన వివరం, (స్త్రీలు సంప్రదాయ పరిరక్షకులు. బుడ్డికుండలు బౌద్దస్తూపాలకు ప్రతీకలని అంటారు కొందరు పెద్దలు. పాదముద్ర కూడా బుద్దపాదాన్నే సూచిస్తురదన్‌ కొందరంటే కొరదెరు విష్ణుపాదం అంటారు. కాస్తమందంగా వున్నబిళ్లను గౌరిదేవి అంటారు. ఒకనాడు ఆంధ్రదేశాన హీనయాన, మహాయాన బౌద్దాలు రెండూ వుండేవంటారు చరిత్రకారులు. బుడ్డికుండలు మహాయాన చిహ్నాలయితే ఇత్తడి పాదం హీనయాన చిహ్నం అనిపిస్తుంది. మా నాయనమ్మది మహాలక్ష్మి సింహాసనం. ఆమె దానికి పూజలు చేస్తూవుండేది. శంకరాచార్యుడు తన కాలానవున్న ఆరుమతాలను సంస్కరించాడు అంటారు. అందుకే ఆయనకు షణ్మతానాచార్య అన్న బిరుదం వచ్చిందంటారు. ఆయన సంస్కరించిన మతాలు యివి. శైవం, వైష్ణవం, శాక్తం, గొణావత్యం, సౌరం, కాపాలికం, పాషాణదధారణ అంటే వెడలోలింగకాయలేని * శైవాన్ని తప్తముదద్రాధారణ లేని వైష్ణవాన్ని మకార పంచకంలేని శాక్తాన్ని మాంసభక్షణలేని గాణాపత్యాన్ని, రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 13

తర్చణంలేని సౌరాన్ని కపాలభక్షణలేని కాపాలికాన్ని ఆయన స్టాపించాడు. అలా సంస్కారమైన షణ్మతాల చిహ్నాలే పంచాయతనం. ఇత్తడి పెట్టెలోవున్న నర్మదాబాణం శైవానికి, సాలగ్రామం వైష్ణవానికీ, పచ్చరాయి శాక్తానికీ, శోణభద్రం గాణాపత్యానికీ, స్ఫటికం సౌరానికి, ఇత్తడిపెట్టె కపాలానికీ చిహ్నాలు. తమిళులు ఆరోమతంగా కౌమారాన్ని పేర్కొంటారు. కౌమారం అంటే కుమారస్వామి. వారికి కుమారస్వామి భక్తి ఎక్కువ. భక్తికి అభ్యంతరం లేదు కాని వారి పంచాయతనంలో కుమారస్వామి చిహ్నం కానరాదు. శంకరుడు సంస్కరించిన షణ్మాతాలు అన్నపేరు తప్ప వారి పంచాయతనంలో స్మార్తుల్లాగ ఆయిదేరాళ్లు వుంటాయి. కౌమారానికి ఎలాంటి గుర్తూ కానరాదు. పిల్లవాడు మధ్యాహ్నం దాకా తిండిలేక మలమల్లాడుతున్నాడు అని, మీ మడీ ఆచారాలు మండిపోనూ అనితిట్టి చద్దికుండను పునరుద్దరించింది మా నారాయణ అత్త, రాత్రి మిగిలిన అన్నాన్ని ఒక కుండలో వేసి నీళ్ళు పోస్తారు. అది పులుస్తుంది. ద్రాన్ని చద్ది అన్నం అంటారు. ఆ నీటిని “తరవాణి” అంటారు. చెళ్లపిళ్ల వెంకటకాస్టిగారు “అంతర్వాణి తర్రవాణి” అన్న పద్యాలు కూడా చెప్పారు. కుండలోంచి దేవిన అన్నంమిద ఉ్హూ వామునూనె వేస్తారు. తరవాణి తాగుతారు. చద్దన్నం తరవాణి మత్తునిస్తాయి. పనిచేస్తే సరి లేకుంటే నిద్రవస్తుంది మా చినబాబు కంచం చాలా పెద్దది. ఆయన ముందు ఆవకాయ వేసుకుని దాన్ని చద్దన్నంతో కప్పేవారట. తరవాత గరిటెడు నూనెవేసుకుని చాన్ని కూడా కప్పి అమ్మా ఆవకాయ అనేవాడట - మా నాయనమ్మ మరోకాయ ఆవకాయవేసి మరో గరిటెడు నూనెపోసీదట. ఉప్పూ వామువేసుకుని కంచెడు చద్దన్నం తిని వ్యవసాయం పనులకు వెళ్లేవాడని మా నాయనమ్మ చెప్పేది. అలాంటివాడి పేరు పెట్టినందుకు అతడి తిండిలో పదోనంతయినా నువ్వు తినకపోతే ఎలా అనేది, రోజూ నాకు చద్దన్నం తినిపించే బాధ్యత మా చిన్నత్త్రయ్య తీసుకుంది. చద్దన్నం తిని నేనూ గరువుక్షు బయలుదేరేవాడిని. ఆక్కడ సొమ్ముల గుంటలతో కాస్త మాట్టాడి లేదా నా ధనుర్విద్యా ప్రదర్భనచేసి పడుక్షునే వాడిని. తోటలో ఓముసలి మామిడి చెట్టును బల్లమామిడి అనేవారు. దాని కొమ్మ ఒకటి నేలకు మూరెడు ఎత్తున బల్లలా వుండేది. తోటలో అది నా మంచం. నేలంతా దున్ని ఉండేది. చెట్ల నీడలుపడని (ప్రాంతాన చోళ్ళో అరికలో చల్లేవారు. తాతయ్య భోజనానికి వచ్చేవేళకు నేను ఇంటికి తిరిగివచ్చేవాడిని. భోజనం తరవాత తాతయ్య కాస్త సేపు నిద్రపోయే వాడు. నేనుకూడా సావిట్లోని భోషాణం మీద పడుకునేవాడిని. సింహద్వారం వేసివుండేది. అయినా దాని తాళం రం(్రంలోంచి వీథిలో నడిచేవారి నీడలు ఎదురు గోడమీద పడేవి. కాపు వనితలు, గొల్లవనితలు కుండలెత్తుక్షుని మంచినీటిబావికి బయలుదేరేవారు. తలుపు రంధ్రంలోంచి వారి నీడలు గోడమీద తలకిందులుగా కనిపిస్తూ వుండేవి. వారు తలకెత్తుకున్న కుండలు కిందివేవు, కాళ్లు మీదికీ వుండేవి ఆనీడల్లో పడుకునే వాడినే కాని నిద్రపోయేవాడిని కాదు. గోడమీద తలకిందులు బొమ్మలు చూసి వారు నిజంగానే తలకిందులుగా నడుస్తున్నారా అన్న అనుమానం వచ్చేది. తలుపు తీసిచూసేవాడిని, వారు మామూలుగానే కనిపించేవారు. గోడమీద నీడలలా తలకిందులుగా ఎందుక్కనిపిస్తున్నాయి? తాతయ్యనడిగాను. నాయనమ్మనడిగాను. అత్తయ్యలనడిగాను. అది అంతేనని అందరూ జవాబిచ్చారు. అడగడానికి ఇంకెవరూలేరు. ఎండవేళ నేను కూడా వీధిలో నడుస్తూ వుంటే నా నీడ కూడా అలా తలకిందులుగానే కనిపిస్తుందా? తెలుసుకోవాలంటే 14 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

నేను ఏకకాలంలో వీధిలోనూ భోషాణంమీదా వుండలేను. మరి ఈ రహస్యం తెలుసుకొనడం ఎలాగ? ఏమయినా ఆ నీడలు చిత్రంగా కనిపించేవి. నెత్తిమీద రెండు మూడు నిండుకుండలను పెట్టుకుని తల అటూ ఇటూ తిప్పుతూ మాట్లాడే నీడలు తమాషాగా వుండేవి,

రాత్రిళ్లు ఆడే తోలు బొమ్మలాటకన్నా పట్టపగలు గోడమీద ఆడే ఈనీడ బొమ్మలాట చాలా బాగుండేది. కొంతసేపటికి వీధిలోంచి ఎండపోయింది. తాతయ్యలేచి మొదటి మెట్టుగా వున్న రాతిమీద కూర్చుని రెంజో మెట్టు గోడకు చారగిలపడి తావళం తిప్పుతూ వుండేవాడు. నేను కూడా లేచి అక్కడికి వెళ్లేవాణ్ణి, అప్పుడు తాతయ్య నాకు పద్యాలు చెప్పేవాడు. అలాగ పోతనగారి గజేంద్రమోక్షం, రుక్కిణీకల్యాణం, 'ప్రహ్లాదచరిత్ర సంథ చెప్పించుకుని నేర్పాను.

తొలకరి వానలు పడ్డ తరవాత ఊరివారందరూ తమ అరకలు, ఎడ్లతో వచ్చి తాతయ్యకు మిగిలిన భూములన్నీ దున్నిపోవాలి. అది రివాజు. నేను కూడా ఆ నాగళ్లవెంట నడిచాను. సాయం(త్రందాకా ఆ నాగళ్లతో గరువులంతా కలియ దిరిగాను. నాగలి నేను కూడా పట్టుకుంటానన్నాను. వద్దు బూతా అనివారు వారించే వారు. మా తాతయ్యని బుగత అనేవారు. నన్ను చిన్నబుగత అనేవారు. నాతో కాస్త చనువుగా వుండేవారు కనక బూతా అనేవారు. భుక్త అన్నది అసలుమాట. భుక్త అంటే భుజించేవాడు యజమాని అని అర్థం. బ్రాహ్మణ భూకామందులను ఆపేర పిలిచేవారు.

గరువులనుంచి తిరుగుప్రయాణం వేళ అయింది. అప్పుడొకరు నా చేతికి మేడితోక నిచ్చాడు. అంతవరకూ వద్దు బూతా అని వారిస్తూ వచ్చారు. నా నస ఎక్కువవడంతో ఓ యువకుడు నా చేతికి మేడె యిచ్చాడు. దాన్ని బలంగా భూమిలోనికి వెళ్లేటట్టు నొక్కిపట్టాలి. నాకంత బలంలేదు. నాగలి తేలిపోయి ఎద్దుకాలికి కొట్టింది. కాలికి నెత్తురొచ్చింది. వాద్దంటే విన్నావుకాదు బూతా, సూడు ఇప్పుడేమయిందో అన్నారు. నాగళ్లను విప్పి ఎడ్లనిళ్లకు తోలి ఊరబావి వద్ద ఒళ్లు కడుక్కుని ఆంతా మా యింటికి వచ్చారు. అక్కడ వారందరికీ భోజనాలు.

ఆ సాయంత్రం అందరికీ పెద్ద పెద్ద విస్తళ్లలో అన్నం వడ్డించింది నాయనమ్మ. అన్నంలోకి ఆవకాయ, ఉల్లిపాయల పులుసు. నాక్కూడా చిన్న విస్తరి వేసి వాళ్ల సరసనే అన్నం పెట్టమన్నాను. నాయనమ్మ వినలేదు. వారి సరసన అన్నం పెట్టడానికి ఆచారం అంగీకరించదు. నాయనమ శ్ర నాకు పెట్టనంది. నేను మారాం పెట్టాను. తాతయ్య చెయ్యి చేసుకొనడంతో నాయనమ్మ ఒప్పుకుంది. చిన్న విస్తట్లో నాకూ అన్నం, ఉల్లిపాయ పులుసు, ఆవకాయ వడ్డించింది. రోజంతా నాగళ్లవెంట తిరగడంతో కాపులు, గొల్లలతో మాట్లాడుతూనే వున్నాను. ఆ పరిచయం తరవాత కూడా కొనసాగింది.

ఊరివారంతా భయపడే ఒక వ్యక్తి ఉన్నాడు - మనిషి ఎర్రగా ఉంటాడు. ఆజానుబాహుడు. అతన్ని అందరూ ఎ(రప్పులు అనేవారు. ఆయన అసలుపేరు అప్పల్నాయుడు. ఎ(ర్రప్పులు అంటే ఎర్రగా వుండేవాడనా, వెర్రివాడనా ఏమిటి అర్థం అని తాతయనడిగాను. అతడు ఎదిరించినవాళ్లను తంతాడు. అంచేత కొందరు ఎర్ర అప్పులు అంటే మరికొందరు వెర్రి అప్పులంటారు. అతడు రెండూను అన్నాడు. ఎవరింటిలోనయినా పెళ్లి నిశ్చయమైతే రాత్రి ఆయింటి ముందు గుమ్మెడపళ్లు పెట్టిపోయేవాడు అప్పులు. అవి ఎవరి పెరట్లోవో పొలాల్లోవో తెలీదు.

ఒకనాడు అపరాహ్లం నేను వీథి అరుగుమీద కూర్చున్నా. ఎక్కడి నుంచి వచ్చాడో అప్పులు తెలీదు, కోడిపిల్లను గద్ద తన్నుకుపోయినట్టు నన్ను బుజంమీద వేసుకుని పరుగులు పెట్టాడు. అతడు మావూరివాడు

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 15

కాడు. ఏవూరి వాడో నాకు తెలీదు. అతడికి కొంత భూమి వుంది. ఏతంబావి. గట్టున ఒక గున్నమామిడి ఉన్నాయి. నేలవైపునున్న కొమ్మమీద నన్ను కూచోపెట్టాడు. తంపట పెట్టిన ఒక ఎర్ర దుంపనిచ్చి తినుబుగతా అన్నాడు. తిన్నాను. తాను నా కెదురుగా వున్న ఒక తాటి బొందమీద కూర్చున్నాడు. దుంప తినడం అయింది. ఇప్పుడు రామాయణం చెప్పు అన్నాడు. నాకు రామాయణం కథ వచ్చునని అతడికెలా తెలిసిందో నాకు అర్హం కాలేదు. ఏమయినా సంక్షిప్తంగా బాలకాండ కథలు ఆరోజున చెప్పాను. కథవింటూన్నంతసేపూ కళ్లు చెమరిస్తూ తలూపుతూ వుండేవాడు. అక్కడికి కథ ఆపి “మరి నువ్వు నాకు కథ చెప్పు' అన్నాను. అప్పటికే అల్లూరి సీతారామరాజు పాటలను ,సొమ్ములగుంటల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ పాడేవారు. “అల్లూరి సీతారామరాజా నీ అల్లరి విని గుండె జల్లుమనె అల్లూరి సీతారామరాజా” ఈ పద్యపాదం నాకిప్పటికీ జ్ఞాపకం. సెబాస్టియన్‌ అనే దొర అడవిలో రోడ్డువేయించడం కోసం గుమాస్తాలు సర్వేయగ్రతోపాటు వచ్చి పని మొదలుపెట్టాడు. అందుకు బలవంతంగా కొండవాళ్లను పట్టుకొచ్చి కూలిపని చేయించేవారు. పగలంతా పనిచేసిన తరవాత కూలి యివ్వాలి. కాని వేలుముద్రలువేయించుకుని పొమ్మనేవారు. అదీ పితూరీకి మూలం. మరి మూ తాత కూడా ఊరివాళ్లందరితోను దున్నించుకుని కూలియివ్వడం లేదు కదా మరి పితూరీ పుట్టలేదెంచాత అని అడిగాను. కొండవాళ్లు కూడా అడివి జీవాల్దాగే రోజంతా తిరిగి అడివిలోనే తిండి సంపాదించుకుంటారు. ఇప్పుడు వారిని బలవంతంగా పట్టి తెచ్చి కూలిచేయించుకుని పొమ్మంటున్నారు. చేసిన కూలికి డబ్బులిస్తే దాంతో తిండి కొనుక్కొనవచ్చును కాని కూలియివ్వడంలేదు అన్నాడు.

గరువు దున్నితే మా తాత కూడా కూలియివ్వలేదు కదా అన్నాను. మరి వారు పితూరీ చేయలేదే ఎందువల్ల అని అడిగాను. సాయంత్రం మీ నాయనమ్మ అందరికీ కడుపునిండా అన్నంపెట్టిందికదా. కూలికి వచ్చిన కొండవాళ్లకు సాయంత్రం అన్నం "పెడితే పితూరీ వుండేదేకాదు అన్నాడు అప్పులు, తిండి లేకపోతే మనిషయినా పసరమయినా తిరగబడకతప్పదు అన్నాడు. అప్పుడు తెలిసింది అన్నానికి ఎంత మహత్తువుందో. అప్పటినుంచీ నాకు పనిచేసే వాళ్లమీద అభిమానం కలిగింది. చెమటోడ్చి పనిచేసినవారికి కడుపునిండా తిండి అవసరం అని (గ్రహించాను.

హైదరాబాదు నుంచి మా అన్నయ్య వచ్చాడు. ఇప్పుడు నేను ఒంటరిని కాను. అన్నయ్యతోడున్నాడు. నాకన్న పెద్దవాడు కనక పెద్దవాళ్లతో మాట్లాడుతాడు. ఈ సంగతి నాకు అనాతవరంలోనే తెలిసింది, ఏమయినా అన్నయ్య అన్నయ్యేకదా. వచ్చిన దగ్గరనుంచీ నాయనమ్మతోనే మాట్లాడుతూ కూర్చునేవాడు. పెద్దక్కయ్యకు ఒక ఆడపిల్ల పుట్టిందని వర్తమానం వచ్చింది. ఆమె నరిసీపట్నంలో ఉంటోంది. బావగారికి అక్కడి తాలూకాఫీసులో ఉద్యోగం, ఇది తాలికాన్ను. నేను, అన్నయ్య, పాపసోదెమ్మ, తాతయ్య బండిమీద నర్సీపట్నం బయలుదేరాం.

ఆ రోజుల్లో అన్నీ బాల్య వివాహాలు, పెద్దమనిషికాగానే పిల్లను కాపురానికి పంపించేవారు. మా పెద్దక్కయ్య పుట్టుక, పెళ్లికూడా ఈ అ(గ్రహారంలోనే జరిగింది. నర్సీపట్నం చేరేసరికి పిల్లపోయిందని తెలిసింది. పిల్ల ఉన్నా పోయినా బాలెంతే కదా. బాలెంతకు సాయంకావాలి. అందుకోసం అత్తయ్య అక్కడే వుంటానంది. రెండురోజులక్కడ వుందామని మేం నిర్ణయించుకున్నాం. అల్లూరి సీతారామరాజుకు శర్పీపట్నంతో కూడా సంబంధంవుంది. ఆయన్ని పట్టుకొనడానికి వచ్చిన స్కాట్‌ దొరలను సితారామరాజు ఒక్క బాణంతో చంపాడని చెప్పారు. పాలరాతితో కట్టిన వారి సమాధి ఈ వూరిలోనే వుంది.

ఆ సమాధి ఊరవతల వుంది. అక్కడకు నేనూ అన్నయ్యా బయలుదేరాం. సమాధి దగ్గర ఎరకల

16 అ రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ

వాళ్లు బసచేశారు. అది సంచార జాతి. వారు బసచేసినచోట చువ్వలు, ఈతచాపతో గూళ్లు కట్టుకుంటారు. వారు పందుల్నీ, గాడిదలను పెంచుతారు. గాడిదలు సామాన్దు మోస్తాయి. పందులు పండుగల ఆహారానికి పనికివస్తాయి. ఎరకల వాళ్లు గణకాలపు ఆచారాలను నేటికీ పాటిస్తూవుంటారు. దారల గోరీని ఈ గాడిదలు, పందులు యధాశక్తి పవిత్రం చేస్తూవుంటాయి. ఆదికాలపు వ్యవసాయంలో ఎరకలవారికొక చారిత్రక పాత్ర వుంది,

అజంటా గుహల ముఖద్వారాలు ఈ ఎరుకల గూడు ద్వారం శైలిని అనుసరిస్తూ చెక్కారు. ఈ రెండు ఉదంతాలనుబట్టి చూస్తే నేటి ఎరుకలవాళ్లు వ్యవసాయానికే కాకుండా స్టాపత్యానికీ కూడా ఆద్యులని రుజువవుతుంది. వారు చువ్వలను వంచి రెండుకొనలనూ నేలలో పాతుతారు. ఇలా రెండు మూడు చువ్వలను పాతిన తరువాత ద్వారంగా నిర్ణయించిన వైపు నేలలో అటు ఒక చువ్వా, ఇటు ఒక చువ్వా పాతి ఆ రెండు చువ్వలనూ కలిపి కడతారు. తరవాత ఆ చువ్వలను ఈతచాపతో కప్పి, ద్వారందగ్గర వంచిన చువ్వ్చలను ఇంటూ గుర్తులా కలుపుతారు. అదే ఆకారంలో అజంటారాళ్లను చెక్కారు.

నేను అగ్రహారానికి వచ్చిన కొత్తలో నగ్నంగానే ఉండేవాడిని. అక్కడ ఆ యీడులో కాపు పిల్లలు, గొల్లపిల్లలూ ఆడా మొగా అందరిదీ అదే ఆహార్యం. కాస్త పెరిగిన తరవాత గోచీలు 'పెట్టకునేవారు. నేనుమాత్రం గోచీ పెట్టుకోనన్నాను. (గ్రామంలో ఎక్కువమందికి గోచీయే నిత్యాహార్యం. నాకు మా మేనత్త పలచని బట్టతో చెడ్డీకుట్టింది. దండెంమీద బట్ట ఆరేసినట్లు ఆ చెడ్డీని నా మొలతాడులో దూర్చుకోవాలి. దానివల్ల మూరెడు వున్న చెడ్డీ మొలతాడుకు ఆవలా ఈవలా జానెడు జానెడు వేలాడుతూ వుండేది. మా అన్నయ్య నిక్కర్లు తొడుక్కునేవాడు.

తాతయ్య ఏదో పనిమీద ఎలమంచిలి వెళ్ళాలనుకున్నాడు. అది ఈ అ(గ్రహారానికి పాతిక మైళ్లదూరాన వుంది. అన్నయ్యను తన వెంట తీసుకువెళతానన్నాడు. నేనూ వస్తానన్నాను. వద్దు అంతదూరం నడవలేవన్నారు. నేను నడవగలను అన్నాను. నాకూ అన్నయ్యకూ చెరో గావంచా భుజాలమీద వేసి తాను మరో పంచ తలపాగాగా చుట్టుకున్నాడు. ఒక చెంబు మరో పంచా కొన్ని గావంచాలూ సంచీలలోవేసి పదపోదాం అన్నాడు. తాతయ్యకు చెప్పులున్నాయి. మాకులేవు. రాత్రి ఒక నాయుడు గారింట విశ్రాంతి తీసుకున్నాం. మర్నాడు మళ్లీ కాలినడకన బయలుదేరాం.

ఎలమంచిలిలో ఏదో యింటికి తీసుకెళ్ళాడు తాతయ్య ఆయింటి యజమానికీ మాకూ గల చుట్టరికాన్ని గురించి తాతయ్య చెప్పాడు. నాకు అది అర్ధం కాలేదు, మధ్యాహ్నం నేనూ అన్నయ్య ఊరుచూడ్డానికి బయలుదేరాం. మెయిన్‌ రోడ్డుమీదే కాస్తసేపు తిరిగి ఇంటిదారి పట్టాం. దారిలో ఒక నడివయసు పెద్దమనిషి తనచేతనున్న కూరగాయల సంచిని ఇంటిదాకా పట్రా అన్నాడు. నన్నుచూస్తే ఒక సామ్ముల గుంటడిలా అనిపించినట్టుంది. అప్పుడన్నయ్య కలగచేసుకుని మీ సంచీని మీరే మోసుకోండి అన్నాడు. నన్ను ఆయన కూలి అనుకున్నందుకు నవ్వుకుంటూ ఇంటికి వచ్చాం.

ఎలమంచిలిలో కూడా రెండు రోజులే ఉన్నాం. తరవాత తిరుగు ప్రయాణం. దారిలో నాయుడుగారింట విశ్రాంతి. తరవాత అ(గ్రహారానికీ చేరాం. వెళ్లిన తరవాత అన్నయ్యకు వాడుగు చేయాలని సంకల్పించాడు తాతయ్య: మా పురోహితునికి కబురంపి ముహూర్తం నిర్ణయించమన్నాడు. పురోహితుని వూరు అక్కడికి రెండు మైళ్లు, పెళ్లిముహూర్తాలు దొరకడం సులువుకాని వొడుగు ముహూర్తం అంత సులువుగా దొరకదు. మా పురోహితునిపేరు అమ్మమ్మ. విశ్చనాథ అమ్మమ్మ. ఆయన ముహూర్తం నిర్ణయించి ఒకరోజు ముందే ఇంటికి వచ్చాడు.

రాంభట్ల కృష్ణమూర్తి సొాంతకథ అ 17

ళీ హా స్తో పదో క] తెలుగుదేశంనుంచి అరవదేశానికీ, అరవదేశంనుంచి తెలుగుదేశానికీ వలనలు చిరకాలంగా సాగుతూ వచ్చాయి. అరవదేశంనుంచి తెలుగు నాటికి వచ్చిన బ్రాహ్మణులను ద్రావిళ్ళు అంటారు. ఆ ద్రావిళ్ళలో అయిదురకాల వారున్నారు. గోదావరి జిల్లాలో మమ్మల్లి కోనసీమ ద్రావిడులు అంటారు. తెలుగునాడంతటా తెలిసీన శ్రీశ్రీ, భాగవతుల నదొళివ శంకర శాస్త్రి అని పేరుగల ఆరుద్ర దిమిలి ద్రావిళ్ళు. వినా యినా. అష అక్షరాభ్యాసం మా అన్నయ్యకు ఎనిమిదేళ్లు. నాకు అయిదో ఏడు. మా అ(గ్రహారంలో పిల్లలెవరూ లేరని ఇంతకు ముందే చెప్పాను క దా, వొడుగుకి ఇద్దరు వటువులు కావాలి. ఆ వటువులను కూడా మా పురోహితుడే ఏర్పాటుచేశాడు. మా తాతయ్యే బ్రహ్మోపదేశం చేశాడు. మానాయనమ్మే తొలి భిక్షపెట్టింది. సర్రాజు పెళ్లిలో గుర్రాజుకో పోస అన్నట్లు ఆ ఉపనయన సంరంభంలోనే నాకు అక్షరాభ్యాసం కూడా జరిగింది. దానిక్కూడా మా తాతానాయనమ్మలే ఆధ్వర్యం వహించారు. వటువులు వెళ్లిపోయారు. పురోహితుడు అమ్మమ్మనా తల నిమురుతూ కంటతడిపెట్టుకున్నాడు. మీయింటికి ఆరు తరాలుగా పౌరోహిత్యం చేస్తూ వస్తున్నాం. ఆ పౌరోహిత్యం నాతోనే ఆఖరవుతుందను కుంటున్నాను. నీ వొడుగు అయేదాకా నేను ఉంటానో ఉండనో, నా ఆశీర్వాదాలు ఇప్పుడే ఇస్తున్నాను అన్నాడు. అమ్మమ్మకు ఇద్దరు కొడుకులు. వారిలో ఎవరికీ స్మార్తంరాదు. వారు ఇంగ్లీపు చదువుకున్నారు. అమ్మమ్మ తమ్ముని కొడుకు వేదం చదివాడు. అతడు ఘనాంత స్వాద్యాయి. సాధారణంగా వేదంచదివిన అవధానులూ, ఘనాంత స్వాధ్యాయులు స్మార్తకర్మలు చేయించరు. వారు 'శ్రాతకర్మలు చేయిస్తారు. అంచాత అమ్మమ్మ తమ్ముని కొడుకు కూడా స్మార్తకర్మలు చేయించడు. మా పినతండ్రి గజపతి నగరంలో ఉద్యోగం చేస్తున్నాడు. అన్నయ్యను చదువుకోసం అక్కడికి పంపించాలని తాతయ. క్‌ (| ్క్‌ అరలో ్య సంకల్పం, ఇంతవరకు ఆయనకు పిల్లల్లేరు, ఆయన్ని మేం ఆచిబాబు అనేవారం. ఇచి లీ అంటే తండ్రి అని అర్థం. ఆచిబాబు ఆంటే బాబులాంటి వాడు అని అర్థం. అలాగే ఫ్ర క అని అర్హం. పినతల్లిని మేం తోచ్చి అనేవాళ్లం, తోచ్చి అంటే తల్లితోటిదని అర్థం, మేం వాన న కట త 18 అ రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ

'ద్రొవిళ్లం. అంటే అరవదేశం నుంచి తెలుగునాడుకు వలసవచ్చాం. అంచాత మా నిత్య వ్యవహారంలో కొన్ని అరవ పదాలుంటాయి. తెలుగుదేశం నుంచి అరవదేశానికీ, అరవదేశం నుంచి తెలుగు దేశానికీ వలసలు చిరకాలంగా సాగుతూ వచ్చాయి. అరవదేశంనుంచి తెలుగునాటికి వచ్చిన బ్రాహ్మణులను (ద్రావిచ్హు అంటారు. ఆ 'ద్రొవిళ్లలో అయిదురకాల వారున్నారు. గోదావరి జిల్లాలో మమ్మల్ని కోనసీమ ద్రావిడులు అంటారు. విశాఖజిల్లాలో పెద్దద్రావిడులు అంటారు. మరొకరిని దిమిలి ద్రావిడులంటారు. వీరు విశాఖలో ఎక్కువ. వీరినే చిన్న ద్రొవిచ్సు అనికూడా అంటారు. తెలుగునాడంతటా తెలిసిన శ్రీశ్రీ, భాగవతుల సదాశివ శంకరశాస్త్రి అని పేరుగల ఆరుద్ర చిన్నద్రావిళ్లు, మూడోవారు ఆరామ దద్రావిళ్లు. చెళ్లపిళ్ల వెంకటళా(స్తిగారు ఈ కోవకు చెందిన 'ద్రావిళ్లు, ఇప్పటికి ముగ్గురయినారు. నెల్లూరుజిల్లాలో పుదూరు ద్రావిళ్లని వున్నారు. వీరిప్పటికీ తెలుగు, తమిళాలను కూడా మాట్లాడుతారు. వీరికి మద్రాసు దగ్గర. వేదం వెంకటరాయశాసస్తి. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌ ఈ పుదూరు 'ర్రావిడులే. ఈ అందరూ తెలుగునాట స్థిరపడిన అరవలు,. నెల్లూరు జిల్లాలోనే తుమ్మగుంట అన్నవూరు వుంది. వారికి తుమ్మగుంట (ద్రావిళ్లని పేరు. వీరు అరవబ్రాహ్మణ లెక్క ప్రకారం వడమలు. వడమలు ముదురుతే వైష్ణవం అన్న సామెత వుంది. వైష్ణవులు వీరితో సంబంధాలు చేస్తారు. గణావశేషాలు తెలుగువారికన్న అరవ్వారిలో ఎక్కువ. తమిళ్తనాడులో వలంగై ఇడంగై భేదాలు తీవ్రంగా వున్నాయి. వలంగై అంటే కుడిపమిట వారు. ఇడంగై అంటే ఎడంపమిటవారు. ఈ కుడి ఎడమల వారిలో న్యూనాధిక్య పోరాటం నిత్యం. స్త్రీలు కుడిపైట్‌ వేస్తే వారు వలంగైైలు, ఎడ పమిటవేసేవారు ఇడంగైలు. తెలుగునాట కుడిపైట వేసే బ్రాహ్మణులు పెద్దద్రావిళ్లు, వారిప్పుడు నిత్యం వేయడంలేదు. మత సంబంధ సందర్భాల్లో మాత్రం కుడిపమిట వేసితీరుతారు. కుడిపైట వారికి పెద్దవారని పేరు. తెలుగునాట గొల్లలు, చాకళ్లు, మాలలు కూడా కుడిపైట వేస్తారు. వొడుగునాడు పంచశిఖలని తలమీద ముందూ వెనకా ఈ పక్కా ఆపక్కా నడినెత్తిన కాస్త వెంట్రుకలుంచి తక్కిన తలను నున్నగా గొరుగుతారు. నెత్తిమీద కాస్త జుట్టు పెరగిన తరవాత జుట్టంతటినీ కలుపు క్షవరం చేస్తారు. అలా క్షవరం అయిన తరవాత అన్నయ్య చదువుకోసం గజపతినగరం వెళ్లాడు. నేనుకూడా గజపతినగరం వెళతానన్నాను. తాతయ్య ఒప్పుకొనలేదు. మళ్లీ నాకు ఒంటరితనం. మాయింట ఆనంద రామాయణం వుంది. అందులో బొమ్మలు, తోలుబొమ్మల శైలిలో వుంటాయి. ఆ పుస్తకం అంటే నాకిష్టం. దాన్ని అప్పుడప్పుడు తిరగేస్తూ వుండేవాడిని. మా ఊరిలో బడిలేదు. నాకు అక్షరాలు నేర్చంచమని తాతయ్యనడిగాను. పొరుగూరినుంచి కొందరు కోమటి పిల్లలను రప్పించి వారితో నాకు జతకలిపాడు. మరో వూరునుంచి గుంటవోనమాలు దిద్దించే ఒక పంతుల్ని రావించి మాకు అక్షరాలు నేర్పడానికి ఏర్పాటుచేశాడు. ఆరోజుల్లో మావాడికి భయం చెప్పండి అని పంతులుకప్పగించేవారు. పంతులు యధాశక్తి అరిచేతులో బెత్తం దెబ్బలు, కోదండాలు, గోడకుర్చీలు వేయించి తాడ పాయసాలు పెట్టి హింసించేవారు. ఆ హింసవల్ల పంతులొస్తున్నాడు అంటే చాలు పిల్లలు గజగజలాడేవారు. చదువుపేర ఇంకా చాలారకాల హింసలున్నాయి. ఓనమాలకు గుంటలు తవ్వాడు. చూపుడు వేలితో నడించేలును నొక్కిపెట్టి అక్షరం గుంటలో దిద్దాలి. దిద్దేటప్పుడు పంతులు చేతిని గట్టిగా నొక్కుతాడు. వేలికి నెత్తురుచార కనిపించే వరకూ నొక్కుతూ వుండాలి. నా రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ అ19

గుంట ఓనమాలు దిద్దేపద్దతి అది, పంతులు వేలునొక్కడం వల్ల నేను కెవ్వుమన్నాను. ఆకేక విని మాతాత వచ్చి చూశాడు. 'పెయ్యకట్టుతాటితో పంతుల్ని చితకబాదాడు. దానితో పంతులు పారిపోయాడు. అక్షరాలు నేర్చుకొనడానికి వచ్చిన జతగాళ్లు మరి కనిపించలేదు. నానస ఎక్కువ అయింది. అక్షరాలు రాయడం వస్తే నన్ను కూడా చదువుకు గజపతినగరం పంపిస్తారని ఆశ ఆ ఆశతో నా నస ఎక్కువయింది. ఒకరోజు తాతయ్య పలకాబలపం తెప్పించమన్నావా? కాగితం, కలం, సిరాబుడ్డి, రేణు పాత్రా యిచ్చేదా? మీ బాబులాగ గంటం తాటాకులతో ఏడుస్తావా అన్నాడు. ఆఖరి వాక్యంలో ఆయన విసుగు, కోపం అంతా కనిపిస్తుంది. తాటౌకు గంటం కోవాలన్నాను. అటకమీంచి తాటాకుకట్ట, గంటాలు కిందికి దింపించాడు. మాబాబు రాసుకున్న చాలా పుస్తకాలతో మా నాయనమ్మ వేడినీళ్లు కాచింది. కొడుకుమీద కోపం ఉన్నా ఆయన చదువుకునే తులసీ రామాయణాన్ని మాత్రం పూజలో పెట్టుకుంది. నాకు తెలుగు అక్షరాలే రావు. తులసీరామాయణం నాగరి అక్షరాల్లో వుంది. పైగా భాష హిందీ. పూజచేసేటప్పుడు పుస్తకం మీద నీళ్లుచల్లడంవల్ల కొంతమేర చెదలు తిన్నాయి. తెలుగక్షరాల్లో వున్న పుస్తకం కన్నా నాగరి అక్షరాల్లో వున్న పుస్తకానికి పవిత్రత హెచ్చు. తాతయ్య తాటాకు ఎలా పట్టుకోవాలో, గంటం ఎలా పట్టుకోవాలో చెప్పాడు. కొన్ని అక్షరాలూ వాక్యాలు రాసి చూపించాడు. మొత్తంమీద తాటాకుమీద రాయటం తెలిసింది. తెలుగున ఆనందరామాయణం అన్న అచ్చుపుస్తకం వుండేదని చెప్పాను కదా. అందులో బొమ్మలు తోలుబొమ్మల శైలిలో వుండేవి. ఆ బొమ్మలకింద పేర్టు ఉండేవి. వాటిని చదివి పెట్టమని తాతయ్యనడిగి ఆపేరులోని అక్షరాలను పుస్తకం తిరగేసి గుర్తుపట్టేవాడిని. తెలియని అక్షరాలను తాతయ్యనడిగేవాడిని. ఆనందరామాయణం ద్వారా చదవడం కూడా వచ్చింది. గుంట ఓనమాలు, కోదండాలు, గోడకుర్చీలు లేకుండా చదవడం రాయడం చేతనయింది. సంత చెప్పించుకున్న గజేంద్రమోక్షం, రుక్క్మిణీకల్యాణం, 'ప్రహ్ణాదచరిత్ర పద్యాలు కంఠతా వచ్చును. అలా చదవడం, రాయడం, వల్లించడం వచ్చాయి. వానలు పడేసరికి నేలంతా ఆకుపచ్చ పచ్చడంకప్పుకున్నట్టు కనిపించేది. గోర్టీలకటూ ఇటూ వున్న కంపలు పచ్చని గోడల్లా వుండేవి. తాటిపెండెల్లో అంత వరకు నిద్రపోయే నాభిదుంపలకు మొలకలెత్తి ఆమొలకలు తీగల్లాగ తాటి చెట్లకు ఎగబాకేవి, ఆతీగల చివరన హరివిల్లు తునకల్లాంటి పూలు పూసేవి, వాటినక్కడి పడుచులు గవిరమ్మ పూలనేవారు. వాటిని కోసుకొని సిగలో తురుముకుని గవిరమ్మ సంబరాలు వచ్చేస్తున్నాయని సంబరపడి పాటలందుకునేవారు. పచ్చదుప్పటి కప్పుకున్న నేలతల్లి పులకించి పోయినట్టే, గవిరమ్మ పూలుసిగలో తురుముకున్న పల్లె పడతులు కూడా పులకించిపోయేవారు. ఊరికొకమూల అమ్మవారి వనంవుంది. ఒక విష ముష్టిచెట్టు నాలుగు ఊడుగుచెట్టు కొన్ని బ(ర్రైంకచెట్లూ వున్నాయా వనంలో. వ్యవసాయ సమాజాన ఈ అమ్మవారి వనాలు ప్రపంచమంతటా వుండేవి. అమ్మవారు సౌభాగ్యదేవత. ఈవనాలు ఆమె ఆవాసం , ఈ వనంలో చెట్టు అల్లైకట్టినట్టు వుంటాయి. అల్లిమధ్య ఏమీ వుండదు. వనంలోని చెట్లనెవరూ కొట్టరు. ఇప్పుడు పురుషాధిక్యాన్ని పురుషదేవతలను ఆరాధించే దేశాల్లో ఒకప్పుడు జనం అంతా ఈ స్తీదేవతలనే అంటే అమ్మవారినే ఆరాధించేవారని చరిత్రకారులంటున్నారు. (గ్రామదేవత "పేరు ఏదయినా కావచ్చును. ఆమె సౌభాగ్యదేవత. ఆమెనంతా గారి అంటారు. గౌరికి ప్రాచీనకాలం నుంచీ వనాలే దేవాలయాలు - ఆమెకు (ప్రత్యేకం గుళ్లు ఉండవు. వ్యవసాయ కేంద్రాలయిన పల్లెల్లో తప్ప వర్తక కేంద్రాలయిన పట్నాల్లో గౌరి ఆరాధనలు కానరావు. రామాయణంలో గౌరిదేవి నివేశనం మిథిలానగరానికి ఆవలవుండేదని వాల్మీకి అంటాడు. పెళ్లికి ముందు తన సౌభాగ్య 20 అ రాంభట్ట కృష్ణమూర్తి సాంతకథ

వర్దనంకోసం చెలికత్తెలతో సీత గౌరీ పూజకు వెళ్లింది. ఊరిచివరనే వసతి కల్పించుకున్న రాముడు ఆసందర్భంలోనే సీతను చూశాడంటాడు వాల్మీకి. పెళ్లికి ముందు కన్యలు గౌరీ పూజ చేయడం ఆచారం. ఈ ఆచారం తెలుగునాట సంప్రదాయం పాటించే వారిలో నేటికీ కానవస్తుంది.

గౌరమ్మ సంబరాలకు ముందు వనంనుంచి మేళతాళాలతో ఘటాలు తెస్తారు. ఘటం అంటే జనభాషలో నిండుకుండ అని అర్ధం. మావూరిలో ఘటాన్ని తెచ్చి రామస్వామి కోవెల్లో ప్రతిష్టించేవారు. దాంతో సంబరాలు మొదలయేవి. రాత్రిళ్ళు రామస్వామి కోవెల ముందు వాలకాలు జరిగేవి. వాలకం అంటే జీవితం అని అర్ధం. తమిళంలో జీవితాన్ని వాళ్‌గ్లై అంటారు. ఇప్పుడు తెలుగున వాలకం అంటే వైఖరి అన్న అర్ధం వుంది. జీవితానుకరణమే నాటకం అంటారు పండితులు. వాలకం నేటి నాటకాలకు తొలి రూపం. ఈ రూపం తెలుగునాట మాత్రమేకాదు. ఈ శతాబ్దాదాది అమెరికాలో కూడా వుండేది.

వాలకం లాంటి నాటకాన్ని వారు వాడెవిల్‌ అనేవారు. ఆనాటక ప్రయోక్తగా చార్లీ చాష్టిన్‌ ప్రసిద్దికెక్కాడు. ౪2౪646౪116 అంటే 5*4గ621 "01% 50గ%9 అని నిఘంటువు లంటున్నాయి. వ్యంగ్య పాటలేకాదు అవి నాటికలు కూడా నని చార్లీ చాప్లిన్‌ రుజువుచేశాడు. జనం అప్పటికప్పుడు కథ చెప్పుకుని పాత్రలను నిర్ణయించుకుంటారు. తరవాత ఆపా(త్రల డైలాగులు స్వయంగా ఆసువుగా చెబుతారు. వాలకాలు చూడ్డానికి (గ్రామంలోని జనమంతా రామస్వామి కోవెల ముందు చేరుతారు. ఇంతలో మండుతున్న తాటికమ్మ నడుముకు కట్టుకుని ఒక పాత్ర వస్తుంది.

ఆ పాత్రకు కమ్మవాలకం అనిపేరు. కమ్మవాలకం కట్టినవాడు తాను మూర్చుడనని చెప్పుకుంటాడు. అమ్మవారి ఘనతను వర్షించి జనం మధ్య చుట్టూ తిరుగుతూ కొందరిని కమ్ముతోకొట్టి జనం మధ్య పెద్ద అల్లిని రంగస్టలంగా చేసుకుంటాడు. ఆఖర్న తనవల్ల అపరాధాలు ఏవయినా వాటిని కాయి తల్లీ అంటాడు. శాక్త పండితులు “భూమౌ స్థలితపాదాం భూమిరేవావ లంబనం త్వయిజాతా పరాధాని త్వమేవళశరణం మమ” అన్న ఫ్లోకానికి అనువాదంలా వుంటాయి కమ్మవాలకం డైలాగులు. జనం మధ్య పెద్ద అల్లి తయారవుతుంది. కమ్మ ఆరిపోతుంది. ఆ వాలకం నిష్కమిస్తుంది.

తరవాత అవసరమయిన పాత్రలు, పాటలు పదాలతో (ప్రవేశిస్తాయి. గ్రామంలో నిరంకుశంగా ప్రవర్తించిన కరణాలు, కాపులు, షావుకొర్ల పాత్రలు వస్తాయి. అందరికీ పరిచయంవున్న ఆయా వ్యక్తుల నడకలను, నడవడిని అనుకరిస్తూ వారి వాలకాన్ని కడతారు. చుట్టూ "పెండెం కట్టి నిలిచిన జనం అంతా చప్పట్టు కేరింతలతో తమ హార్షాన్ని. ఆమోదాన్ని వ్యక్తం చేస్తారు. ఆయాపాత్రలకు ఆధారాలయిన పెద్దలు ఏమీ చేయలేక తాము కూడా జనంతో పాటు నవ్వుతారు. మా ముత్తాత కాలంలో జరిగిన ఒక ఉదంతాన్ని మా తాత వివరించాడు, అది నాకు నేటికీ జ్ఞాపకం వుంది.

ఒకసారి మాతాత ఊరిబైటనున్న పెద్ద దిబ్బమీదికి తీసుకునివెళ్ళాడు. ఆదిబ్బమీద ఒక పనసచెట్టుంది. తాతస్వయంగా నాటిన పనసపిక్క ఇప్పుడు పెద్దచెట్టుగా ఎదిగింది, ఇక్కడి నుంచి చుట్టూ ఓసారి చూడమన్నాడు. చూశాను. భూమీ ఆకాశం కలిసిపోయినట్టుంది తాతా అన్నాను. ఒకప్పుడు ఆభూములన్నీ మనవేరా అన్నాడు. ఇప్పుడేమయ్యాయి తాతా అన్నాను, పోయాయిరా అన్నాడు. మా ముత్తాతకు నల్లమందు అలవాటు.శెసరగింజ సైజునుంచి మొదలై చిన్న చాక్లెటొసైజ్‌ వరకూ పెరిగింది. నల్లమందు సరఫరాదార్జు పారుగూరి వైళ్ళులు, ఆరోజుల్లో రొక్కం చాలా అరుదు. ఆర్నెల్లకొకసారి నల్లమందు కర్చుకింద అడిగిన భూమిని రాసేవాడు.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ. 21

మా తాత ఉబ్బులింగడు. కాని ముత్తాత మాత్రం చండశాసనుడు. ఆయనకు నల్లమందు సప్రయిచేసే షావుకారు ఎప్పుడూ ఆయన. వెంటే ఉండేవాడు. వాలకాల సంబరాల్లో ఒకసారి మాతాత చండశాసన వాలకం కట్టారు. మర్షాడు ఆ వాలకం కట్టిన వారిని రావిచెట్టు వేళ్లకు కట్టి కొట్టించాడు. మర్షాడు జనం ఆకొట్టిన వాలకాన్నే కట్టారు. అది చూసి జనం అంతా భగ్గునమండారు. పక్కనున్న షావుకారు ఇదిచూసి అమ్మవారి పూనకం అభినయించాడు. రామస్వామికోవెలకు కొంతభూమిని విరాళంగా రాయించాడు. జనం చల్లబడ్డారు. ఇది మా తాత చెప్పిన కథ. ఈవాలకాలు అప్పుడప్పుడు నిరంకుళులను దారికి తెచ్చేవి, వ్యవసాయాన్ని చేబట్టిన ప్రతి దేశంలోనూ వాలకాల్దాంటివి ఉండేవని చెప్పవచ్చును. బర్బ్చర ద్వితియాంతరంలోనే శృంగార, కరుణలను హాస్యంద్వారా అభినయించే కళలు అవతరించాయి. నాటకాలకు ఆదిరుపాలు ఈ వాలకాలు. బర్బర ద్వితీయాంతరంలో వ్యవసాయం, పశుపాలనా ఏకకాలంలోనే పుట్టాయి. ఆర్యులూమేచ్చులూ పశుపాలనను చేపట్టారు. ఇతరులు వ్యవసాయాన్నిచేబట్టారు. వ్యవసాయం ('ప్రధానమయినా పశుపాలన దానికి అనుబంధంగా వుండేది, వ్యవసాయాన్ని ఇంగ్లీషులో అగ్రికల్చర్‌ అంటారు. అగ్రికల్చర్‌ అంటే భూసంస్కృతి. సకల సంస్కృతులకూ మూలం భూ సంస్కృతి. తాటాకులు, గంటంతో రాతనేర్చుకున్నాను. బొమ్మలకింది శీర్షికల ద్వారా చదవడం నేర్చుకున్నాను. చదువురాత వచ్చింది కనక నన్ను కూడా గజపతినగరం పంపించడానికి ఒప్పుకున్నాడు తాతయ్య, మా పినతండ్రి ఆవూళ్లో ఉండేవారు. గజపతినగరంలో నన్ను ఎలిమెంటరీ స్కూల్లో వేశారు. ఆస్కూలు ఏటి వొడ్డున వుండేది. ఆఏరుకి చెంపావతి అని పేరు. ఏట్లో నీరు ఒక చెంపనేవుండేది. రెండో చెంపంతా ఇసక, ఇసకవైపే ఉండేది స్కూలు, స్కూలు పక్కన సంతతోట, చింతచెట్టూ, రెండు మూడు జువ్విచెట్లూ వుండేవి. మధ్య నుంచి రోడ్డుమీదికి దారి, సంతతోటవెనక ఆస్పత్రి. ఆస్పత్రి గేటురోడ్డుమీదికి వుండేది. అన్నయ్యమిడిల్‌ స్కూల్లో వుండేవాడు. అక్కడ ఏంచద్దువుతూ వుండేవాడో నాకు తెలియదు. ఆయన స్నేహితులు వేరు. మేం ఇద్దరం ఇంట్లోనే కలుసుకుంటూ ఉండేవారం, మా ఎలిమెంటరీ స్కూలు హెడ్‌మాస్టరుగారి పేరు సన్యాసయ్య, నేమాని సన్యాసయ్య, మోకాలు దిగని పంచ. అంతే ఆయన వేషం. నల్లగా వుండేవాడు. మూరెడుపిలక. ఒంటిపోస జందెం. స్కూల్స్‌ ఇన్‌స్పెక్టరుగారింట పనులు చేస్తూ ఉంటాడు. భోజన చంగుడు బులుసు రామజోగారావుగారి సహపంక్తిని భోజనం చేసిన వాడినని సగర్వంగా చెప్పుకునేవాడు. స్కూల్సు ఇన్‌స్పెక్టరుగారి చంటిపిల్ల చేతిలో ఓ జీడిమామిడి పండు పెట్టి ఆమె బంగారు సిగ్గుబిళ్లను కత్తిరించుకుపోయింది ఒక చచ్చడిభామ. ఆమె విజయ నరంది అయి వుంటుంది. ఆవార్తవినగానే సన్యాసయ్యగారు పరుగెత్తి ఆమెను సగం దారిలో పట్టుకున్నాడు. నన్ను వేసిన క్రాసులో నేర్చుకొనదగ్గదేమీలేదు. అందువల్ల ఈడుజోడు కలిసిన పిల్లలతో ఆడుకుంటూ ఉండేవాడిని. ఆటకు స్కూలు ఆటంకం, అందువల్ల ఏదో ఒక ఆటంకాన్ని వొదిలించుకోవాలి. నేను స్కూలునే వొదిలించుకున్నాను. ఇంట్లో యీసంగతి తెలిసింది. హెడ్‌మాస్టరుగారికి కూడా తెలిసింది. మాయిల్లు ఏటివొడ్డునే వుంది. ఒకరోజు బెత్తంపట్టుకొని నేమాని సన్యాసయ్యగారు మాయింటికివచ్చారు. ఆయన్ని చూసి నేను పెరటి గోడదువికి ఏటో పడ్డాను. ఆయన ఆ గోడదాకా వచ్చి నిన్నేమీ చేయనురారా అని బతిమాలాడు. ఆ బెత్తం విసిరెయ్‌ “వస్తానన్నాను. ఆయన బెత్తం విసిరేశాడు. ఆ బెత్తంపట్టుకుని ఒకరేవుదాకా వచ్చి రోడ్డెక్కి ఇంటికి వచ్చాను. ఆయన 22 తి రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ

బెత్తాన్ని ఆయనకిచ్చేశాను. ఆయన స్కూలుకు ఎందుకు రావడంలేదురా అని అనునయంగా అడిగాడు. నేనిప్పుడున్న క్షాసులో నేర్చుకోతగ్గవేమీలేవు. ఆవుకు నాలుగుకాళ్ళుండును. గడ్డిమేయును, నెమరువేయును, ఇవి పాఠాలు. నేను బోలెడు ఆవుల్ని చూశాను. అవన్నీ ఆపనే చేస్తూ వుంటాయి అన్నాను - అయితేనా క్లాసుకు వస్తావా అని అడిగారు సన్యాసయ్యగారు. నాక్టాసులో చూచిరాత, బొమ్మలు గీయడం, పద్యాలు చదవడం వుంటాయన్నాడు. అయితే వస్తానన్నాను. మర్నాటినుంచీ మూడోకాసుకు వెళ్లడం మొదలుపెట్టాను. చూచిరాతకు ఎక్సరొసైజు పుస్తకం, డ్రాయింగు పుస్తకం, కృష్ణశతకం, దాశరథీ శతకం, నరసింహ శతకం తెప్పించి ఇచ్చాడు ఆచిబాబు. హెడ్మాస్టరుగారి దస్తూరీ గుండ్రంగా వుంటుంది. పుస్తకంలో మేలుబంతి ఆయన రాసేవారు. నేను తాటాకు మీద గంటంతో రాయడం నేర్చుకున్నాను కనక నాదస్తూరీ కూడా గుండ్రంగా ఉండేది. ఆయన బోర్డుమీద కూరగాయబొమ్మలు గీసేవారు. నేను కూడా అలా గీయగలిగేవాడిని. పోతన్నగారి పద్యాలు బట్టీపట్టాను బ్‌ కనక నేను ఒక పద్యం కాదు, మూడు శతకాల్లోంచి మూడు పద్యాలప్పజెప్పేవాడిని. ఇక పోయి ఆడుకొమ్మనేవారు. తాటాకు మీద గంటంతో రాసేవారి లిపులన్నీ గుండ్రంగా వుంటాయి. తాటి చెట్టు ఆగ్నేయాసియాలో పెరుగుతాయి. ఆ ప్రాంత భాషలేవయినా లిపులు మాత్రం తెలుగులాగ గుండ్రంగానే వుంటాయి. సున్న అన్నది సంస్కృతం నుంచి వచ్చిన మాట. సంస్కృతంలో శూన్యం అన్న మాట తెలుగున సున్న అయింది. తెలుగు పదం అల్లి దీన్నే హళ్లి అనికూడా అంటారు. అల్లి కట్టడం అంటే గుండ్రంగా నిలబడ్డం. వర్తకులు రూపాయల స్థానంలో సున్న అంటారు. అణాల స్టానంలో హల్లి అంటారు. రాతలో అదికూడా సున్నాలాగే మొదలవుతుంది కాని పైకి ఒక తోకలా వెళుతుంది. చక్కగా సున్నాచుట్టడం చేతనయితే తెలుగు దస్తూరీ ముత్యాల కోవలా వుంటుంది. తెలుగు అక్షరాలన్నీ సున్నా దాని భాగాలతో తయారయినవే అన్న కిటుకు కొంతమంది నేస్తాలకు చెప్పాను. అలాగే 'ప్రతిపద్యానికీ ఒక బాణీ ఉంటుంది. ఆ బాణీలో పద్యం చదువుతే అది జ్ఞాపకం ఉంటుందని చెప్పాను. బొమ్మలు పెద్ద కష్టమైనవి కాదు. చూచిరాత పద్యాలు అప్పగింతతోనే తృప్తిపడేవారు సన్యాసయ్యగారు. అవి రెండూ చూసి ఇకపోయి ఆడుకోండ్రా అని ఆయనే అనేవారు. సంత తోటలో కాస్త సేపు కోతికొమ్మచ్చి ఆడుకునేవాళ్లం. గవర్నమెంటు ఆస్పత్రిడాక్టరు మీద పిల్లలకెందుకో కోపం. ఆయన పొట్టిగా, బొద్దుగా వుండేవారు. ఆయన్ని పిల్లలు పొట్టిపిచిక అనేవారు. ఆయన దుస్తులు తెలుపు, ఆస్పత్రిగోడలు తెలుపు. పిల్లల మనోభావాలకనువుగా సంతతోటవైపు ఉన్న గోడమీద బొగ్గుతో ఓ బొమ్మగీసి కింద పొట్టి పిచిక అనిరాసే వాడిని. ఒకొక్కప్పుడు ఈ బొమ్మలు రోడ్డువేపునున్న గోడలక్కూడా ఎక్కేవి. డాక్టరు మళ్లీ గోడలకు సున్నం వేయించేవాడు. అతడిమీద రోజుకోరకం బొమ్మగీసేవాడిని. అతడికి ట్రాన్సఫరు అవడంతో బొమ్మలు ఆగిపోయాయి. ఇప్పుడు ఆటతోడు మాటతోడుకు లోటులేదు అయినా ఒంటరితనం పోలేదు. ఏటికవతల గట్టున వెంకటాపురం అన్న ఊరుండేది. ఆగట్టుమీద ఊడుగచెట్టుండేవి. వానాకాలంలో ఊడుగపళ్లు పండుతాయి. పచ్చికాయ ఆకు పచ్చగా వుంటుంది. దోరకాయ ఎ(ర్రంగా వుంటుంది. పండు ళా అలనేరేడులాగ నల్లగా వుంటుంది. తొక్కమందంగా వుంటుంది. లోపల ముంజలాంటి గుంజు గింజ వురటాయి. ఆ ఊడుగుపళ్లకోసం అవలిగట్టుకు వెళ్లేవాడిని. ఆవలి గట్బనే దొరగారి తోట అన్నపేరుతో ఒక చిట్టడివి ఉండేది. అక్కడికి దుమ్ముల గుండ్డు వస్తూ వుంటాయని ప్రతీతి. వాటి అరుపు కలకల ల నవ్వినట్టు వుంటుంది. అది మాంసమేకాదు ఎముకలను కూడా నమిలేస్తుంది. నా రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ అ 23

మా ఆ(గ్రహారంలో ఆరేడేళ్లపాటు అలవాటయిన వంటరితనం అప్పుడప్పుడు సెలవేస్తూ వుంటుంది. అలాంటప్పుడు ఏటిగట్టువెంటే దొరగారి తోటకు బయలుదేరతాను. ఏటిగట్టు కొంతమేర దున్ని వేరుసెనగ వేస్తారు. అక్కడ మూడునాలుగు చెట్టు పెళ్లగించి ఇంకా ముందుకు పోతే శ్మశానం వస్తుంది. ఒకప్పుడు శవాలు కాలుతూ మంటలుంటాయి. మరొకప్పుడు మంటలారి నిప్పులు కణకణలాడుతూ వుంటాయి. అక్కడ నా ఒంటరితనాన్ని ఆస్వాదిస్తూ వుంటాను. ఆ నిప్పుల్లో పచ్చివేరుసెనగ కాయల్ని కాల్చుకుని తింటూ జీవన్మరణాలను గురించి ఆలోచిస్తూ వుండేవాడిని,

ఒకనాడు నేమాని సన్యాసయ్యగారు మావూరు వస్తావురా నిన్ను భుజంమీద ఎక్కించుకుని తీసుకువెళతాను అన్నారు. ఎందుకు అని ఆడిగాను. మాబాబు తద్దినం నువ్వాక భోక్తగా వుంటావని అన్నారు. నాకు వొడుగు కాలేదే అన్నాను. అయితే మీ అన్నయ్యని తీసుకెళతానులే అన్నారు. సన్యాసయ్యగారిది చల్లపేట అగ్రహారం. ఆయన అన్నయ్యను తీసుకువెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక అన్నయ్య చల్లపేట విశేషాలు చెప్పాడు. అక్కడివారంతా భీమసేన బకాసురులతో భోజనానికి పోటీపడతారు. కొండనుంచి కాస్త సదునుగావున్న రాళ్లను దొర్లించి తెచ్చుకుంటారు.

ఆ రాళ్లను ఇంటిముందు కూర్చొనడానికి ఉపయోగిస్తారు. రాయి పరిమాణాన్నిబట్టి ఇంటియజమాని గొప్పతనానికి వెలకడతారు. ఆవూరిలో అందరూ అయితే కావడిగాళ్ళ్లు లేకుంటే కొమ్ముగాళ్లు, అంటే కావడి వంకాయకూరను తినగలిగేవాడు కావడిగాడు. ఒకవైపు తట్టెడుకాయలకూర తినేవాడు కొమ్ముగాడు. ఇవీ వాళ్ల బిరుదులు. వారికి చేతనయిన విద్య పెళ్లివంటలు. సామాన్యంగా పెళ్లివారికి వండే వంట ఆ వంట వాళ్లకే సరిపోతుంది. వారు అలాంటి భోజనచంగులు కనక ఆవూరి బ్రాహ ణులకు ఎవరూ పిల్లనివ్వరు. అంచాత ఆవూరి వాళ్లు ఆవూరి పిల్లనే చేసుకుంటూ వుంటారు. పెళ్లికి వీలైన గోత్రాలవారే ఆ అగ్రహారంలో వున్నారు.

ఏ యింటనైనా ఆడపిల్ల పుడితేచాలు. ఆయింట కనకవర్షం కురుస్తుంది. పిల్లకు నెలల నయసులోనే పెళ్లిబేరాలు మొదలవుతాయి. పెళ్లీడు వచ్చేసరికి వేలంపాటలు ముదురుతాయి. ఆఖరికి ఎక్కువ పాటపాడిన వానికి పిల్లదక్కుతుంది. చల్లపేట ఆ(గ్రహారీకులకు పిల్లనిస్తే మనుగుడుపుల్లోనే దివాలాతీస్తారు.

(గ్రామముచేత నుండి పరికల్పిత ధాన్యములింటనుండి శ్రీ

రామకటాక్ష వీక్షణ పరంపరచే కడతేరెగాని మూ

రామయమంత్రి భోజన పరాక్రమమేముని చెప్పవచ్చు నా

స్వామి యెరుంగ తత్కబళచాతురి తొళ ఫలప్రమాణముల్‌

ఇది శ్రీనాథుడు చెప్పిన చాటువు. ఆయన కాలంలోనే కాదు మనకాలంలో కూడా రామయమం(త్రులు చల్లపేట కావిడగాళ్లవంటి భోజన చంగులుండేవారు. నేమాని సన్యాసయ్యగారికి అప్పటికి నలభైయేళ్లుపైనే ఉంటాయి. అయినా పెళ్లికాలేదు. పిల్లని కొనుక్కొనడానికి తగిన ధనం కూడబెడుతున్నారేమో తెలీదు.

చల్లపేట నుంచి తిరిగి వచ్చిన తరువాత మా అన్నయ్య చెప్పిన ముచ్చట్లివి. ఆనాడు ఆయన చెప్పిన విశేషాలు నేటికీ నాకు జ్ఞాపకం. శ్రీనాథుని చాటువు ఇప్పుడు అంతే.

అన్నయ్య ఏంచదువుతున్నాడో నాకు తెలియదు. నేనుమాత్రం ఎలిమెంటరీ స్కూల్లో మూడోక్టాసు

పాసయ్యాను. అందుక్కారణం నాపద్యపఠన పరిజ్ఞానం, వేసవిశలవులు వచ్చాయి స్మూలులేదు. గజపతి నగరం చుట్టు పక్కల దుమ్ముల గొడ్డు తిరుగుతున్నట్టు పుకార్లుపుట్టాయి. ఊరిచివర ఇద్దరన్నదమ్ములు 24 అ రాంభట్ట కృష్ణమూర్తి సొాంతకథ

రాజులున్నారు. అందులో పెద్దరాజుగారు పాడవరి, బలిష్టుడు. చిన్నరాజుగారు పొట్టి. ముక్కుమాత్రం పొడుగ్గా వుంటుంది. అందుకని ఆయన్ని అందరూ ముక్కురాజుగారు అంటూవుండేవారు. మాకు ఆయన వేటకథలు చెబుతూ వుండేవారు. అంతలో మూతిమీద దెబ్బతిన్న పులి ఒకటి అడివిలోంచి బైటికి వచ్చిందన్న పుకార్డు పుట్టాయి. పులి పంజాదెబ్బతిన్న నలుగురైదుగురు ఆస్పత్రిలోచేరారు. రాజులు ఆ పులిని చంపడానికి బయలుదేరారు. వారిదగ్గర తుపాకీలున్నాయి. రాజులిద్దరూ పులితిరిగే స్థలాలను గుర్తుపట్టి చెట్టమీద మాటేసుకుని కూర్చున్నారు. పులి కనిపించింది. పెద్దరాజుగారు గురిపెట్టి తుపాకి పేల్చారు. పులికిందపడింది. రాజుగారు చెట్టు దిగివచ్చారు. అది లేవలేదు. దగ్గిరకు వెళ్లి తుపాకీ మడమతో పొడిచారు. పులిలేచి పంజా విసిరింది వీపున తగిలింది పంజా. రాజ దెబ్బతినడం చూసిన ముక్కురాజుగారు చెట్టుదిగి వచ్చారు. పెద్దరాజు గారు బాధతో కిందపడ్డారు. పులికూడా పంజాతో కొట్టి కిందపడిపోయింది. ముక్కురాజుగారు పొలంగట్టుచాటునుంచి వెళ్లి పులిమీద గుళ్లు కురిపించారు. అది చచ్చింది. ఈ చప్పుళ్లు విన్న కొందరు పరుగెత్తుకుంటూ వచ్చారు. పెదరాజుగారు నెత్తురు మడుగులో వున్నారు. ముక్కురాజుగారు తుపాకీని పులిమీదపెట్టి పక్కన నిలబడ్డారు. కొందరు అరుస్తూ సహాయానికి పరుగులు పెట్టారు. కొందరు పెదరాజుగారికి డోలీకట్టి ఆస్పత్రికి తీసుకొనిపోయారు. మిగతావారు బండిని తెచ్చి పులి కళేబరాన్ని బండికెక్కించి దాన్ని ఈడ్చుకుంటూ వూళ్లోకి తీసుకుపోయారు. ఊరుచేరి బండిని రాజుగారి ఇంటిముందు ఆపారు. ముక్కురాజుగారు ఆస్పత్రికెళ్లి అన్నగారిని చూసి ఇంటికి తిరిగివచ్చారు. ఈవార్త మాకప్పుడే తెలిసిపోయింది. ఉత్సాహంతో రాజుగారింటికి పరుగెత్తుకుని వెళ్ళాం. అక్కడ ముక్కురాజుగారున్నారు. ఆయన కూడా మాతో ఆనందం పంచుకున్నారు. మమ్మల్ని ఒక్కోరినే పులిమీద కూర్చోబెట్టారు. మాలాగే చప్పట్టు కేరింతలు కొట్టారు. మర్నాడు ముక్కురాజుగారు పులి ఊరేగింపు. మేం బండి దరిదాపులకు కూడా వెళ్లలేకపోయాం. రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 25

వజ ఇక య్‌ నంధ్యావందనంలో అనీ వేచమం(త్రాలే. ఆ మంత్రాలకు అర్జం నాకెవరూ చెవ్పలేదు. అర్ధం తెలియని ఆ మంత్రాలు చదివి బండరాయినీ బడుద్ధాయినీ కొదలచుకొనలేదు అన్నాను. ఇన్లి శ్లోకాలనూ వేదవాక్కులనూ అర్ధంతో తెలునుకున్సువాడీవి నంధ్యావందన మంత్రాల అర్జాలు కూడా తెలునుకొనడం ఠష్టమా? అని ఆమె అడీగారు. కనా కనా స్తానచలనం టి

స్కూలులేదు. రోజంతా ఆటలు, అప్పుడప్పుడు అలవాటు ప్రకారం ఒంటరితనం. నిర్ణయం ఎవరు చేశారో తెలియదుకాని మా చిన్నత్తయ్య నన్ను ఇల్లెందుకు తీసుకెళ్లింది. ఆనాడు ఇల్లెందును ఇల్లెందులపాడు అనేవారు. ఇంగ్లీషులో సింగరేణికాలరీస్‌ అనేవారు. సామాన్యులు బొగ్గుట్ట అనేవారు. ఇప్పుడది ఖమ్మంజిల్లాలో వుంది కాని ఆనాడు ఖమ్మం, ఇల్లెందుకూడా వరంగల్‌ జిల్హాలోనే వుండేవి. కారేపల్లి దొరవారు పర్సా అనంతరామయ్యగారు. ఆయన ఇల్లెందులోనే వుండేవారు. మా చిన్నమేనమామ ఆయన దగ్గర పనిచేస్తూ వుండేవారు. అదో పెద్ద బంగళా,

ఆ బంగళాలోనే ఒక వాటాలో మాచిన్నక్క, బావ, అమ్మ ఉండేవారు. మాబాబు పోయిన తరవాత అమ్మదగ్గర ఉండడం ఇదే ప్రథమం. చిన్న మామయ్య, అమ్మమ్మ, అమ్మబెల్లెలు తోచ్చి, మామయ్యతోపాటు బంగళాలో ఉండేవారు. అక్కకి ఒక కొడుకు. అప్పుడు వాడికి మూడేళ్లు, ఇల్లెందుకు నాలుగుమైళ్లదూరంలో

స్‌ క! ఉసిరికాయలపల్లి అని ఓ లంబాడీ గ్రామం వుంది. అక్కడ దొరవారి ఆలమందను లంబాడీలు కాస్తూ వుండేవారు. బీడుకు ఎదురుగా ఒక పూరి ఇల్లు మాతాత, తోచ్చి అక్కడుండేవారు. ఆమె భారతం చదువుతూ వుంటే తాత వ్యాఖ్యానం చేస్తూ వుండేవారు. గుడిసెచుట్టూ కంచె.

ఇల్లెందు బంగళాలోనే మా బుల్లి మామయ్యకూడా వుండేవాడు. రోజూ ఉదయమే ఉసిరికాయలపల్లికి వెళ్లి ఒక మాయబుడ్డినిండా పాలుతెచ్చేవాడు. ఇది అతడి నిత్యకృత్యం. తాతయ్యకీ తోచ్చికీ ఏమయినా కావలసి వస్తే వాటిని పట్టుకువెళ్లేవాడు. అప్పుడు మా చెల్లికి నాలుగేళ్లు. బుల్లిమామయ్యకు పదమూడేళ్లు. వారిద్దరూ ఒకర్నొకరు విడిచి ఉండలేకపోయేవారు. నేనిక్కడికి రావడానికి ముందే ఇద్దరికి విషజ్వరాలు వచ్చి ఇద్దరూ చెరో ఆస్పత్రిలో చేరారు. ఇద్దరూ ఒకేరోజున పోయారు. ఆ తరవాత మూడు నాలుగురోజులకు మా తాతయ్యపోయారు. నేను వెళ్లకముందు జరిగిందిది.

26 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

నేను గజపతి నగరంలో. మూడోక్సాసు పాసు అయాను. కాని ఇక్కడ నాలుగోక్సాసులో చేరడానికి వీల్లేదన్నారు. ఇక్కడ నాలుగో క్లాసునుంచి ఉరుదు మాధ్యమం. ఇక్కడ మూడోక్షాసుదాకానే తెలుగు. ఉరుదు అక్షరాలు కూడా కావాలంటే నేర్పుతారు. ఆంచాత మళ్లీ నేను మూడోక్టాసులో చేరాను. క్లాసుటీచరు పొట్టిగా వుండేవారు. నాపేరు విని నువ్వో కృళ్ణమూర్తివి తయారయ్యావా అన్నారు. ఆర్‌ అంటే ఏమిటి అన్నాడు. నేనూ ఆర్‌. కృష్ణమూర్తినే అన్నారు. నేను రాంభట్ట కృష్ణమూర్తిని. ఆయన రావాడ కృష్ణమూర్తి, ఆయనది విజయనగరం దగ్గరి పూసపాటిరేగ. (ప్రొఫెసర్‌ రావాడ సత్యనారాయణగారితండ్రి.

పనిలేకుండావున్న మనిషికీ మర్కటానికీ తేడా తెలీదు. అందువల్ల నన్ను మూడో క్లాసులోనే మరో యేడాది చదివించారు. స్కూలుకు వెళుతున్నాను కాని అక్కడ చదివేదేమీలేదు. ఉరుదు అక్షరాలను మాత్రం నేర్చుకున్నాను. అసలా ఊరిపేరు ఇలెందులపాడు. పాడు అన్న తెలుగు మాటను ఉర్జూ చదువుకున్నవారు పహాడు అంటూవుండేవారు. పాడు అన్న (గ్రామాలన్నీ తెలంగాణాలో పహాడ్‌గా మారాయి. నిజాం రాజభాష ఉరుదు కనక పేర్గు ఉరుదు లిపికి అవగాహనకు మారితీరాలి. అలాగే కాస్త పెద్ద వూళ్లు సాయబులపేర ఆబాదులయ్యాయి.

ఊరిలో కాస్త చదువుకున్నవారంతా ఉరుదులో మాట్లాడుతూ వుండేవారు. ఉరుదు రాజభాష. రాజభాషలో మాట్టాడ్డం గౌరవ(ప్రదం అని చదువుకున్నవారి భావన. భారతదేశాన్ని ఏలిన ముస్లీం ప్రభువుల రాజభాష ఫారసీ. గోల్కొండ నవాబుల కాలంలోనూ, నిజాం నవాబుల కాలాన కొంతవరకు ఫారసీయే రాజభాషగా ఉండేది. నిజాం నవాబుల కాలంలోనే రాజభాష పారిసీ నుంచి ఉరుదుగా మారింది. ఉరుదు అంటే స్కందావారం - సైనికుల బస అని అర్ధం. హిందీ పునాదిగా అనేక భారతీయపదాలను ఇముడ్చుకున్న భాష ఉరుదు.

ఉరుదు పారసీక లిపిని స్వీకరించింది. హిందీ దేవనాగరి లిపిని వాడుతోంది. దేవనాగరి లిపిలో సంస్కృతపదాలను రాయవచ్చును, కాని ఉరుదులో సంస్కృత పదాలను రాయడం కష్టం. బ్రిటిషువారి కాలంలో కూడా సైనికభాష ఉరుదూగానే వుండేది. కాని లిపి మాత్రం ఇంగ్లీషు అక్షరాల్లోనే వుండేది. ఆనాడు సైనికభాషను “రోమన్‌ ఉరుదు” తెనేవారు. ఇంగ్లీషు లిపినే రోమన్‌లిపి అనికూడా అంటారు. సైన్యంలో సిక్కులెక్కువ. వారి పంజాబీ భాషను చాలా కాలం ఉరుదులిపిలోనే రాసుకునే వారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వారికి లిపి సమస్య వచ్చింది.

వారి భాషకు గురుముఖీ అన్న సాంతలిపి వుంది. అయితే దాన్ని వారు విరివిగా వాడేవారు కొదు. ఇప్పుడు తమ లిపినే వాడాలి అని నిర్ణయించారు. అంతవరకు తమ పాటలను నాగరిలో రాసుకునేవారు. ఇప్పుడు నాగరి వాడాలా, గురుముఖి వాడాలా అన్నవాదం ఉరుదులో సాగింది. చిరకాలం ఉరుదు లిపివల్లా రోమన్‌ ఉరుదువల్లా పంజాబీ మాటలూ, పేర్లు మారిపోయాయి. మేనకను ఉరుదులిపిలో రాస్తే అది మనేకా అవుతుంది. అలాగే స్మరణజిత్‌ సింగ్‌ అన్న మాట సింరంజిత్‌సంగ్‌-ఆయిపోయింది. స్మరణజిత్‌ అంటే శంకరుడు. లేదా మారజిత్‌ అన్న బిరుదుగల బుద్దుడు కావచ్చును.

ఇల్లెందులో కొన్ని నెలలపాటే ఉన్నాను. ఇల్లెందు చుట్టుపక్కల చాలా బొగ్గు గనులున్నాయి. నేను మరీ చిన్నవాడిగా వున్నప్పుడు ఉసిరికాయలపల్లైకు వెళ్లాను, దారిలో బొగ్గుగనులు దాటివెళ్లాలి. గనులదగ్గర నీరు తలకిందులు వానలా ఎగిసిపడుతూ వుండేది. ఆ నీటిని ఉర్జూలో పువ్వారా అనేవారు. ఇంగ్లీషులో ఫ్రొంటెన్‌ అంటారు. గనుల్లో చల్లదనానికి నీరు కావాలి. ఆ చల్లని నీటిని గనిని చల్లబరచడానికి వాడేవారు.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ త 27

గవిని చల్లబరిచిన ఆ నీరు వేడెక్కేది. అందుకని ఆ వేడినీటిని చల్లబరచడం కోసం ఫౌంటెనుతో ఎగజిముతారు. అప్పుడాదారి అంతా అడివిగా వుండేది. నేను అగ్రహారంలో ఉన్నప్పుడు అడివి ఎలా వుంటుందో ఎరగను. గజపతినగరంలో దారగారితోట ఓ చిన్న అడివిలా వుండేది. కాని అక్కడ రాళ్లుండేవికావు. ఇల్లెందు అడివిలో చెట్టు, రాళ్ల గుట్టలు కూడా వుండేవి. గని కార్మికులు రోజంతా గనిలో బొగ్గుతవ్వుతూ వుంటారు. సాయంత్రం ఇంటికి చేరుతారు. బొగ్గుగనిలో పనిచేయడంవల్ల బొగ్గు ధూళితో నల్లగా తయారవుతారు. వారి చేతుల్లో దీపాలుంటాయి. ఆదీపాలను చేతబట్టి ఇంటి దారిపడతారు. అసలేబొగ్గుతో నలుపెక్కిన మనుషులు. ఆపైన చీకటి. అంచేత వారు పట్టిన దీపాలు గాలిలో నడుస్తున్నట్టుంటాయి. చేతి దీపాలను వారు చిరాగ్‌లంటారు. అది ఉరుదుమాట. ఉరుదులో చిరాగ్‌ అంటే దీపం అని అర్ధం. ఆకాశాన ఎగిరే తెల్లని కొంగల బారులా రాత్రిపూట గాలిలో ఎగిరే అన్ని పక్షుల బారులా కనిపిస్తాయి ఈ చిరాగులు. ఊరికావల పెద్ద చెరువు వుంది. ఊరికి మంచినీరు ఆ చెరువునుంచే వస్తుంది. ఒకసారి వనభోజనాలకు అందరూ బయలుదేరారు. బొగ్గు గనుల్లో పనిచేసే ఇంజనీర్లు ఇతర ఉద్యోగులు ఈ వనభోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడి ఇంజనీర్లంతా మా బావకు స్నేహితులు. అందరూ కుటుంబాలతో సహా వచ్చారు. చెరువుకు ఆవలివైపు వంటలకు ఏర్పాటు. నేలను జంబుకానాలు పరిచి ప్రీలు ఒకవైపు పురుషులు ఒకవైపు జంబుకానాలమీద కూర్చున్నారు. బొగ్గుగని ఇంజనీర్లలో ఒకరు (గ్రామ ఫోను తెచ్చి పాటలుపెట్టారు. నేను గ్రామఫోను చూడ్డం వినడం అదే (ప్రధమం. “మేరేమౌలాబులాలో మదీనము ము” అనేపాట ఆనాడు చాలా ప్రసిద్ధికెక్కింది. ఆతరవాత తెలుగుకథల్లో కూడా ఆపాట ప్రస్తావన చదివాను. నేనూ నా యీడువారు అడవిలో చెట్లను చూస్తూ తిరిగాం. ఈలోగా కోతుల మందను చూసి వెనక్కు మళ్లాం. అప్పటికి భోజనాలు సిద్ధమయ్యాయి. ఇల్లెందులో ఎక్కువకాలం గడపలేదు. అనంతరామయ్యగారికి ఆరోగ్యం క్షీణించింది. “కాశ్యాం మరణాన్ముక్తి” అన్న సూత్రం గుర్తుకు వచ్చి కాశీయాత్రకు బయలుదేరారు. ఆయన ప్రయాణానికి ముందు మా అందర్నీ హైదరాబాదు మాపెదమేనమామ గారింటికి పంపించారు. ఒకరైలు బోగీని అద్దెకు తీసుకుని మా చిన్నమామయ్యా, మా బావ అనంతరామయ్యగారి పెద్దకొడుకు ఇతర మార్చలంతో కాశీకి బయలుదేరారు. మేం అందరం హైదరాబాదు చేరుకున్నాం. రైలు కాశీచేరకముందే అనంతరామయ్యగారు రైల్లోనే అంతిమళ్వాస విడిచారు. కాశీలో అంత్యక్రియలు అయిన తరవాత ఇల్లెందులో పనులు చూసుకుని మాపొవా, చిన్నమామయ్యా హైదరాబాదు వచ్చారు. నాకు ఉరుదురాదు. ఇంగిలీషురాదు. తెలుగుకూడా రాదు. నన్ను ఉరుదు స్కూల్లో వెయ్యాలని మాపెదమేనమామగారి అభీష్టం. అంచాత చెంగలరావు అనే ఉరుదు పండితుని దగ్గర ఉరుదు నేర్చుకొనడానికి ఏర్పాటుచేశారు. కాస్త ఉరుదు పరిజ్ఞానం వచ్చాక నన్ను ఉరుదు మూడోక్సాసులో చేర్పించారు. మూడోక్టాసుకన్నా తక్కువదుందా? ఉంది. కోస్తాలో దాన్ని ఇన్ఫెంటు అంటారు "హైదరాబాదులో సగీర్‌ అంటారు. అన్నయ్య నాకన్నముందే హైదరాబాదు వచ్చాడు. అతడిని తొమ్మిదో క్లాసులో చేర్పించడం కోసం నిజాంకాలేజీలో ఎకనమిక్సు లెక్బరర్‌గావున్న బారు రామన్నరసుగారికి అప్పగించారు మామయ్య. ఇద్దరూ 28 అ రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ

నిజాంకాలేజీ అధ్యాపకులు, ఆయనేం చెప్పాడో ఈయనేం తెలుసుకున్నాడో తెలియదు. కాని ఎనిమిదో క్లాసు పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేదు. మా మేనమామగారు నీకు చదువురాదు. కూలిచేసుకుని బతుకు అన్నారు. అప్పుడు నేటి ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణం మొదలయింది. అన్నయ్య అక్కడికి వెళ్లి రాళ్లు ఇటికలు మోసి రోజుకు పావలా కూలీగా చేరాడు.

తరవాత ఒక మిత్రుని సలహామేరకు మింటు కాంపౌండులో బాయిలర్‌లో బొగ్గు వేసే ఉద్యోగంలో చేరాడు. రాళ్లు మోసేటప్పటి కూలీయే జీతం అన్న గౌరవవాచకాన్ని సంతరించుకుంది. నెలకు ఏడున్నర జీతం. కాగా కూలికి వారాంతపు సెలవులుండవు, అంటే కూలీ వుండదు. ఇది ఉద్యోగం కనక వారానికోరోజు సెలవు వుంటుంది. ఉదయం టిఫిను తిని ఉద్యోగానికి వెళ్లేవాడు. మధ్యాహ్నం నేను భోజనం తీసుకెళ్లేవాడిని. హౌజులో సబ్బుతో చేతులు కడుక్కుని అన్నం తినేవాడు. నేను అదే హొజునీటితో టిఫినుక్యారియర్‌ను కడుక్కుని ఇంటికి వచ్చేవాడిని.

మేం అప్పుడు నాంపల్లిలో ఉండేవాళ్లం. స్టేషను దగ్గరనుంచి పబ్లిక్‌గార్జెన్‌కి వెళ్లేదారిలో ఒక ఫార్సీవారి ఇంట్లో స్కూలు వుండేది. తరవాత ఆయింటిని ఆఫార్సీవాళ్లే పానశాల అంటే బారుగా మార్చేశారు. నాంపల్లి స్టేషను నుంచి అబిడ్స్‌ వెళ్లేరోడ్డు మొగలో ఒక యింట నాలుగో క్లాసు నడిచింది. తరవాత ఆ యిల్లు ఒక హోటేలుగా మారింది. అయిదో క్లాసు నుంచి పదోక్సాసువరకు ఇంకో పెద్ద ఇంట్లో జరిగేది. ఆయిల్లు స్టేషనుకు ఎదురుగా వుండేది. తరవాత అది కూడా హోటేలుగా మారింది. ఆమూడు స్కూళ్లలోనూ నేను చదివాను. గజపతినగరంలో శని, ఆదివారాలు రెండురోజులు సెలవు వుండేది.

మా యింటికి దగ్గరలోనే వేమనాం[్ర భాషానిలయం అని ఒక (గ్రంథాలయం ఉండేది. మా మేనమామగారికి ఆ (గ్రంథాలయంలో సభ్యత్వం వుండేది. ఆయన సభ్యత్వం మీద మా అన్నయ్య పుస్తకాలు తీసుకుంటూ వుండేవాడు. నేను అక్కడే కూర్చుని పుస్తకాలు చదువుతూ వుండేవాడిని, తెలుగున ఆంధ్రపత్రిక మా(త్రవే వస్తూవుండేది. నేను దినవ(త్రిక చదివేవాడినికాదు. కృష్ణావత్రిక, వినోదిని, ఢంకా, ఆం(ధ్రవారపత్రికలాంటి వారపత్రికలువచ్చేవి.. అప్పుడప్పుడు వాటిని తిరగేస్తూ వుండేవాడిని. నేను చదివేవి ముఖ్యంగా కథల పుస్తకాలను, వారపత్రికల్లో పడే కథలను. నా పుస్తకాల చదువు అలా మొదలయింది.

భారతి, గృహలక్ష్మి అన్న మాసపత్రికలు ఇంటికి వస్తూవుండేవి. భారతి రాగానే నేను ముందు వినోద శిల్పం చదివేవాడిని. తలిసెట్టి రామారావుగారు గీసే వ్యంగ్య చిత్రాలంటే నాకిష్టం. ఆ తరవాత చదివేవి కథలూ కలగూరగంప. తరవాత్తరవాత వ్యాసాలు కూడా చదివేవాడిని. కవులమీద, కావ్యాలమీద విమర్శలుండేవి. అవికూడా చదివేవాడిని. భారతి, గృహలక్ష్మి చూడ్డం ద్వారా ఇంట నాయిష్ట్రాల్లో మార్పు వచ్చింది. నవలలు చదివేవాడిని. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు మహారాష్ట్ర నవలలను అనువదించేవారు. అందులో సింహగఢ యుద్ధం ఒకటి. ఆ నవల్లోని “గఢ్‌ ఆలాపన్‌ సింహగేలా” అన్న వాక్యం నాకిప్పటికీ గుర్తు

నాకు వొడుగు చేయాలని మామేనమామగారు నిశ్చయించారు. మహదేవపురం నుంచి పురోహితుని రప్పించారు. వటువుకు పలాశదండం కావాలి. అందుకని నాంపల్లి నుంచి నేటి ఉస్మానియా యూనివర్సిటీ స్థలానికి నడిచివెళ్లి ఒక మోదుగలారీని కొట్టి తెచ్చాను. లాఠీ అవసరంలేదు, చిన్న కొమ్మ సరిపోతుందన్నారు. నేటి విద్యానగరు నుంచి అంతా అడివే, ఇక్కడ అడివిలో మోదుగ చెట్టు, తునికి చెట్టు ఎక్కువ. ఒక సన్నని మోదుగ కర్రను కొట్టితెచ్చుకున్నాను. పెద్దల భాష చిత్రంగా వుంటుంది. పలాశదండం అని పేరు. దండం అంటే కర్ర. కర్ర అవసరం లేదంటారు.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ € 29

నేను మా అన్నయ్య వొడుగు చూశాను. అది చేయించిన పురోహితుని చూశాను. ఆయన మాయింటి పురోహితుడు. నా వొడుగుతో పోలిస్తే అది టూకీగా ఆయిపోయినట్లనిపించింది. మంత్రాలు కొంచెం ఎక్కువ వున్నాయి. గాయత్రికి ముందు ఇరవైనాలుగు ముద్రలు. తరవాత ఎనిమిది ముద్రలు వేయాలి, ఈ ముద్రలెందుకో వీటి అవసరం ఏమిటో నాకెవరూ చెప్పలేదు. మూడురోజులపాటు ఆయన త్రిసంధ్యల్లోనూ సంధ్యావందనం చేయించి వెళ్లిపోయాడు. అప్పటికి వేదమం త్రాలన్నీ నాకు కంఠస్థ ఆయ్యాయి. స్కూలుకు వెళ్లడం వల్ల మధ్యాహ్న సంధ్యావందనం సాధ్యంకాలేదు.

కొన్నిరోజులపాటు ఉభయసంధ్యల్లోనూ సంధ్యావందనం (శ్రద్దగా చేశాను. చలికాలం వచ్చింది. సాయం సంధ్యకష్టమనిపించింది. ఉదయం స్నానంచేసి సంధ్యావందనం చేసేవాడిని. తరవాత భోజనం చేసి బడికి వెళ్లేవాడిని. సాయంత్రం చలిబాగా ముదిరేది. చన్నీళ్ల స్నానంచేసి తడిగోచీకట్టుకుని గంటసేపు పట్టే సంధ్యావందనం చేసేసరికి ఒణుకుపుట్టేది. ఇంట్లో అధికారం మా తోచ్చి అంటే పిన్నిది. సంధ్యవార్చకపోతే రాత్రిభోజనం ఉండదు. (గ్రంథాలయంలో కందుకూరి వీరేశలింగం పంతులుగారి పుస్తకాలన్నీ తిరగవేయడం మొదలుపెట్టాను.

“స్థాణురయంభారహారః కిలాభూత్‌ అధీత వేదం నజానాతియోర్హ:” అనీ ఇలాంటివే మరి కొన్ని క్టోకాలు దొరికాయి. ఆ శ్లోకాలన్నింటినీ బట్టీ పట్టాను. పైళ్ళోకాన్ని నేను అనువదించుకున్నాను "అర్ధమెరగక వేదాల అధ్యయనము పరికి రాబండ మాదిరి బరువుచేటు.” ఒకరోజు సాయంత్రం స్నానం చేయలేదు. సంధ్యావందనం కూడా చేయలేదు. ఆరాత్రి తోచ్చి అన్నం పెట్టలేదు. నేను ఆకలితోనే ముణుచుకుని పడుకున్నాను. ఆమె కూడా రాత్రి నిద్రపోలేదు. తెల్లవారేసరికి ఆమె బింకం సడలింది. ఎందుకురా! సంధ్యా వందనం మౌనేశావు అని అనునయంగా అడిగారు.

అప్పుడు నేను చదివిన శ్లోకాలన్నీ ఏకరవుపెట్టాను. సంధ్యావందనంలో అన్నీ వేదమంతత్రాలే. ఆ మంత్రాలకు అర్ధం నాకెవరూ చెప్పలేదు, అర్హం తెలియని ఆ మంత్రాలు చదివి బండరాయినీ బడుద్దాయినీ కాదలుచుకొనలేదు అన్నాను. ఇన్ని శ్లోకాలనూ వేదవాక్కులనూ అర్థంతో తెలుసుకున్నవాడివి సంధ్యావందన మంత్రాల అర్జాలుకూడా తెలుసుకొనడం కష్టమా? అని ఆమె అడిగారు. నిజమే మరి. ఆమె వేసిన ప్రశ్చకు జవాబు దొరకేవరకూ చన్నీళ్ల స్నానం తడిగోచీ తప్పదన్న నిర్ణయానికి వచ్చాను. వీరేశలింగం పుస్తకాలన్నీ చదివాను,

30 అ రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ

నో మతోద్రేకాలు బాగా పెరిగాయి. రోడ్డు వేయడంకోనం తెచ్చి కువ్చలు పోసిన కంకరను బాడవ డాబామీదికి చేర్చాం. రాత్రి కరలను తాటిన్తూ పాటలు పాడుతూ బాడవలో చాలామంది ఉఊన్న్హారన్లు భ్రమ కలిగిన్తూ ఉండేవారం. బహదూర్‌యార్‌జంగ్‌ అన్సు నవాబు మంచి వక్త. అతడీ ఉపన్యాసాలు ముస్లింలకు ఉత్తేజం కలిగించేవి. కినాాయనాోా జందెమెందుకు* ఫీశలింగంగారి పుస్తకాలు, భారతి వ్యాసాలు చదివిన మీదట నాకు సంస్కృతం కొద్దికొద్దిగా అర్ధం అవసాగింది. సంధ్యావందనంలో అఘమర్షణ మంత్రాలున్నాయి. అఘం అంటే పాపం. మర్షణం- అంటే నిర్మూలించడం. సంధ్యావందనంలో ఒక్కొక్క అంగం నుంచి చేసిన పాపాలను ఏకరవుపెడుతూ ఏరోజు చేసిన పాపాన్ని ఆరోజునే కడుక్కుని, ఏరాత్రి చేసిన పాపాన్ని ఆరాత్రే కడిగేసుకుని 'ప్రతిపూటా కడుక్కొనడం కోసం ఫ్రెష్‌గా పాపాలు చేయవచ్చునని ఆ మంత్రాల అర్థం. మనస్సు, వాక్కు, చేతులు, పాదాలు, కడుపు, జననాంగంతో చేసిన పాపాలను అప్పుడే దులిపేసుకోవచ్చును. మా తోచ్చిక్కూడా కొస్త సంస్కృతం వచ్చును. ఈ మంత్రం చదివి ఈ పాపాలు చేసే శక్తి నాకు లేదన్నాను. అంతే ఆమె మారుమాట్టాడలేదు. నా వయసు అప్పుడు పన్నెండేళ్లు. సరే సంధ్యావందనం మానేసేమన్నారావిడ. కొన్ని రోజులయిన తరవాత సంధ్యావందనం లేనప్పుడు ఈ జందెం మాత్రం ఎందుకు అని అడిగాను. నీ యిష్టంరా అన్నారామె. అంతే మెడలోని జందెం తీసేశాను. వీరేశలింగం తరవాత చిలకమర్తి పుస్తకాలు పూర్తిచేశాను. వీరేశలింగంగారి ప్రహసనాలు కాస్త మొరటుగా వుంటాయి. కాని చిలకమర్తి ప్రహసనాలు మాత్రం సున్నితంగా వుంటాయి. అప్పుడే కన్యాశుల్కం నాటకం కూడా చదివాను. అందులో పొత్రలన్నీ చూసినవేనన్న అనుభూతి కలిగింది. అ(గ్రహారంలోనూ గజపతినగరంలోనూ ఆపాత్రల మధ్యనే నేను మసిలాను. మా హెడ్‌ మాస్టరు నేమాని సన్యాసయ్యగారూ, వారివూరు చల్లపేటా గుర్తుకు వచ్చాయి. నాటినుంచి నేటి వరకూ కన్యాశుల్కాన్ని చదువుతూనే వుంటాను. అది చదివినప్పుడల్లా నాకు కొత్తగా అనిపిస్తూ వుంటుంది. పుస్తకంలో కొత్తదనంలేదు. అది చదివినప్పుడల్లా నా విజ్ఞానం "పెరుగుతూ వస్తోందని తరవాత (గ్రహించాను. కన్యాశుల్కం ద్వారానే సోషల్‌ ఏంత్రోపాలజీ మీదా ప్రాగైతిహాసం మీదా నాకు ఆసక్తి కలుగుతూ వచ్చింది. న రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 31

ఈ చదువులవల్ల లైబ్రరీక్సార్కుతో నాకు పరిచయం బాగా పెరిగింది. నాక్కావలసిన పుస్తకాలు తీసుకుని పబ్లిక్‌గార్డైెన్‌కు వెళ్లి చదువుకునేవాడిని. దాన్ని ఆరోజులో బాగెఆమ్‌ అనేవారు. అందులోనే ఒకమూల జూ కూడా వుండేది. మరొకమూల ఆర్కియలాజికల్‌ మ్యూజియం ఉండేది అది నేటికీ అక్కడే వుంది కాని జూ మాత్రం మారిపోయింది. జూ ఒక్కటే కాదు బాగెఆమ్‌లో చాలా మార్పులు వచ్చాయి చెరువుల్ని పూడ్చివేశారు. ఒకచక్కని గులాబితోటను పీకి అక్కడొక భవనం కట్టారు.

మేం నాంపల్లి రెడ్‌ హిల్సులో వుండేవాళ్లం. అక్కడి నుంచి బాగెఆమ్‌ చాలా దగ్గర. రైలుపట్టాలు దాటితే గేటు. ఉదయమే బయలుదేరేవాడిని. ఒకొక్కప్పుడు గేటు తెరవడం కాస్త ఆలస్యం అయేది అది తెరిచేవరకు వుండి లోపలికి వెళ్లేవాడిని. లోన తోటమాలీలు తప్ప సామాన్య జనం ఉండేవారు కాదు "హైదరాబాదు ఎప్పుడు నిద్రపోయేదో నాకు తెలియదు. కాని తెల్లవారి పదకొండింటికికాని లేచేదికాదు. ఆఫీసుల్టో అప్పుడు పని మొదలయేది. దుకాణాల తలుపులు అప్పుడు తెరిచేవారు. ఛాయ్‌ఖానాలు కూడా అప్పుడే తెరిచేవారు.

మాలీలు ఒక చిన్న పడవమీద చెరువుల్లో దిగి చిరిగిపోయిన ఆకులను, రేకలు రాలిపోయిన బొడ్డులను ఏరి గట్టున పడవేసే వారు. ఏరిపారేసిన బొడ్డుల్జో, ఎండిపోయిన బొడ్డూ ముదిరిపోయిన బొడ్డూ వుండేవి నాకోసం కొన్ని పూలుకోసి యిచ్చేవారు. కొన్ని మంచి తామరాకుల్ని కూడా తీసుకుని ఇంటికి వచ్చేవాడిని తామరగింజలకు రంధ్రంచేసి హారం గుచ్చుకుంటారు. శ్రీవైష్ణవులకు తామరహారం మహాట్రీతి. వేయికి పైగా తామరగింజలను సేకరించి సీతారాంబాగులోని ఒక వైష్ణవస్వామికిచ్చాను. పచ్చిగింజలు తినడానికి చాలా బాగుంటాయి.

ఒక చెరువుగట్టున సంపెంగ వుండేది. పేరుకు తీగేకాని ఆ తీగెలు చెట్టుకొమ్ములంత లావున పెరిగాయి, అలాంటి పెద్ద తీగ నెక్కి కూర్చుని పుస్తకం చదువుకొనడం నాకు సరదా. ఇప్పుడు జూబ్లీహాలు వున్న ప్రాంతాన ఆనాడు గులాబీ తోట వుండేది. రకరకాల గులాబీ మొక్కలు ఆతోటలో ఉండేవి. ఒకప్పుడామొక్కల ముళ్లు తప్పించుకుంటూ తోట మధ్యకు పోయి అక్కడ చదువుకుంటూ కూర్చునేవాడిని. వేగుచుక్క (గ్రంధమాల, ఆంధ్రప్రచారిణీ (గ్రంధమాల (ప్రచురించిన నవలలన్నీ చదవడం అయిపోయింది.

బెంగాలీ రచయిత పాంచ్‌కౌడీ దేవ్‌ రాసిన డిటెక్టిన్‌ కధలు అంటే నాకు ఇష్టం. ముందు కధలు తరవాత నవలలు. ఆ తరవాత నాటకాలు అయిపోయిన తరవాత కావ్యాలు, వ్యాసాలు, ఇతర పుస్తకాలు ఇదీ నా పుస్తకపరన పద్దతి. వేమనాంధ్ర భాషానిలయానికి కొమ్మువరపు సుబ్బారావుగారు కార్యదర్శిగా వుండేవారు. సభ్యత్వం లేకపోయినా నేను పుస్తకాలు తీసుకెళ్లిచదువుతున్న సంగతి ఆయనకు తెలియదు. పాఠకుల రిజిస్టరులో ఎక్కడా నా పేరు ఉండదు. నాకూ (గ్రంధాలయ గుమాస్తాకు కుదిరిన అవగాహన అంతే.

మూడోక్షాసు పాసయ్యాను. నాలుగోక్టాసులో చేరాను. అది కొత్త బిల్లింగు. అక్కడ స్కొటు బృందంలో చేరాను. ఖాకీ చొక్కా, నిక్కరు, మేజోళ్లు మామూలే కాని శిర్మస్తాణాలు మాత్రం మారుతూ వచ్చాయి. కొంతకాలం నీలిరంగు తలపాగా, మరికొంత కాలం ఎర్రని ఫెజ్‌టోపీ, మరికొంతకాలం బెండుసన్‌ హేటు వుండేది. స్కొటు టోపీ ఏనాడూ లేదు. నేనొక బృందానికి లీడర్ని. స్కొట్టలో తెలుగు, ఉరుదు, కన్నడం, మహారాష్ట్ర యువకులుండేవారు. అందరం తరచు క్యాంపులకు వెళుతూ వుండేవారం, మా స్కొటు టీచరు

పేరు జగన్నాధ ప్రసాద్‌ మిశ్ర ౩2 అ రాంభట్ల కృష్ణమూర్తి సొాంతకథ

జంబూరీలు, విద్యాప్రదర్శనలు గోషామహల్‌ స్టేడియంలో జరిగేవి, అక్కడేనాకు ఆదిరాజు వీరభద్ర రావుగారితో పరిచయం అయింది. ఆయన వివేకవర్దని స్కూలు స్కాటు మాస్టరు. సాధారణంగా ఆస్కూలును చాదర్‌ఘాట్‌ స్కూలు అని పిలిచేవారు. కొమర్రాజు లక్ష్మణరావుగారి అంతేవాసుల్లో ఆదిరాజు వారు ఒకరు. ఆయన పలచగా, పొట్టిగా, నల్లగా వుండేవారు ఆయనతో నాకు పరిచయం పెరిగేనాటికి వార్టక్యం వచ్చింది. ఆయన రోమని వార్దక్యంవల్ల రోమాలు తెల్లబడ్డాయి. నల్లని శరీరం, తెల్లనిరోమాలు. ఆయన్ని ఒకసారి చూస్తేవాలు మరుపురారు.

అప్పుడు చేతిపనుల క్లాసు ఒకటుండేది. దాన్ని దస్త్‌కారీ అనేవారు. అట్టలతో పనులు- దస్త్‌కారీ టీచరు చెప్పిన పనులను (శ్రద్దగా చేసేవాడిని. అందువల్ల నామీద అతడికి అభిమానం పెరిగింది. అలాగే 'డ్రాయింగు మౌస్టరుక్కూడా అభిమాన విద్యార్థిని. డ్రాయింగు మాస్టరు ఒక కన్నడిగ. మాక్షాసులో ఇంకో ఇద్దరు కూడా బొమ్మలు బాగా గీసేవారు. అందులో ఒకనిపేరు మన్ఫూరు. మరొకనిపేరు హరిదాసు. తరుచు వీల్లింటికి వెళుతూ వుండేవాడిని. హరిదాసు నాంపల్లిలోనే సిబిఐ క్వార్టర్సులో వుండేవాడు. మన్సూరు హబీబ్‌నగరు రేకుల ఇంట్లో వుండేవాడు. వాళ్లకో గేదె ఉండేది.

మన్సూరు బొమ్మలు గీయడమేకాదు, రంగులుకూడా వేసేవాడు. నేనుకూడా తరుచు అక్కడికేవెళ్లి రంగులువేసేవాడిని, పూలకొమ్మలు (క్రోటన్‌ కొమ్మలు తెచ్చి వాటిని చూస్తూ బొమ్మలు గీసేవాళ్లం. అప్పుడప్పుడు మన్ఫూరు అమ్మగారు టీ కాచి యిచ్చేవారు. నాకు టీ యిచ్చేవారు కాదు. పాలు యిచ్చేవారు. నాకు టీయిస్తే వారికి పాపం తగులుతుందనేవారు. టీలో నీరుంటుంది కదా, నేను (బ్రాహ్మడిని. తురకనీరు (బ్రాహ్మణునికి యిస్తే పాపం వస్తుందనేది ఆమె, మరి పాలలోకూడా నీరుంది కదా అంటే అందుకే నీకు ఎర్రగా కాచిన పాలు యిస్తున్నా ననేవారు.

అప్పటికి నావయస్సు పదిహేనులో పడింది. అయిదోక్షాసులోకి వచ్చాను. స్కూలు భవనం మారింది. నాటి నాంపల్లి హైస్కూలు భవనంలో రాయల్‌ హోటలు వెలిసింది. అప్పటికే హెచ్‌.జి. వెల్సు రాసిన (ప్రపంచ చరిత్ర చదివాను. దాని అనువాదకునిపేరు గుర్తులేదు. అలాగే చిలుకూరి వీరభద్రరావుగారి దక్షిణ భారతచరిత్ర చదివాను. ఉర్దూ చరిత్ర పార్య(గ్రంధానికీ నేను చదివిన పుస్తకాలకూ చాలా తేడా కనిపించింది. అలాగే వారానికి ఒక పీరియడు మతబోధ వుంటుంది. దాన్ని దీనియాత్‌ అంటారు. క్రిష్టియన్‌ స్కూళ్లలో బైబిలు క్లాసు వుంటుంది. ఇక్కడ హిందువులకు నీతిశాస్త్రం చెబుతారు.

నాటీ పాఠాల్లో నేర్చుకొనదగ్గ విషయాలేవీ కనిపించలేదు. మా తెలుగు మాస్టరుగారి పేరు పరసా తిరుమలరావు గారు. ఆయన భుక్తాయాసంతో వచ్చేవారు. తెలుగు మాస్టర్హు ఎక్కడయినా అంతే అనుకుంటాను. పెద్ద కాసులకు పారాలు చెప్పమని నన్ను పురమాయించేవారు. ఆ సమయంలో ఆయన ఒక కునుకు తీసేవారు. ఇటీవల అగ్రహారం వెళ్ళినప్పుడు మా బాబు పుస్తకాల్లో తాతంభట్ట రాసిన సులక్షణసారం దొరికింది. అది చదివి పద్యలక్షణాలు నేర్చుకున్నాను. అప్పటికే ఆసువుగా పద్యాలల్లడం చేతనయింది. వేమన (గ్రంధాలయంలో తెలుగు కావ్యాలన్నీ చదివాను.

భారతంలో విరాటోద్యోగపర్వాలు మాత్రమే చదివాను. భాగవతంలో అక్కడక్కడ ఘట్టాలు తప్ప సమ(గ్రంగా ఏనాడూ కూచుని చదవలేదు. కావ్యాల పరనంవల్ల పద్యకవితలో గొప్పదనం ఏమీ లేదనిపించింది. పూర్వకవులు ఆయా ఛందస్సుల్లో అనేక సమాసాలను తయారుచేసి వుంచారు. ఆ పద బంధాలను సమాసాలను కవులు స్వేచ్చగా వాడుకున్నారు. మహాభారత రచయితలైన కవిత్రయం కూడా కన్నడ

రాంభట్ల కృష్ణమూర్తి సొాంతకథ € 33

మహాకవి పంపని పదబంధాలను, సమాసాలను యధాతధంగా తీసుకుని వాడుకున్నారు అందుకని కవితకు ప్రత్యామ్నాయం మీద ఆలోచన మళ్ళింది. అప్పటికే పాలకవర్గంలో స్వమతాభిమానం, అన్యమత ద్వేషం మొదలయింది. అన్న సంపాదనకు ఆధారంగా ఏదో వృత్తిలోకి దిగడం ఉచిత మనిపించింది. మా అన్న,౩రు, బావగారు మెకానిక్‌ వృత్తి చేపట్టారు. నేను కూడా అదే వృత్తిలోకి దిగుదామనుకున్నాను. స్కూలు మానేశాను. ఉరుదు మాధ్యమంలో నాలుగోక్సాసు పాసయ్యాను. అయిదులో చేరి చదువు మానేశాను. నాలుగో క్సాసులో వుండగానే మున్షీ 'ప్రేంచంద్‌ కధలను ఉర్జూలో చదివాను. (ప్రేంచంద్‌ మీద అభిమానం పెరిగింది. ఆనాడు గొప్ప ఉరుదూ కవులు, రచయితలు కాయస్సులు. కాయస్టుల భాషనూడా ఉరుదే, (స్త్రీలు హిందూ సంస్కృతి రక్షకులుగా ఉండేవారు. లండనులో వోడ్‌హౌస్‌ వారి (ప్రచురణలను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికవారు అచ్చువేయడం ప్రారంభించారు. ఒక్కొక్క పుస్తకం ఆయిదు రూపాయలకు అమ్ముతూ వుండేవారు. చక్కని బైండు అట్టపెట్టెతో సహా పంపించేవారు. మెదకు జిల్లాకు చెందిన ఒక జాగీర్చారు కుటుంబీకుడు ఆ సంపుటాలు తెప్పిస్తూ వుండేవాడు. అతడి పేరు జ్ఞాపకం లేదు. అతడు మల్లేపల్లిలో ఉండేవాడు. నాకన్నా కాస్త పెద్ద. చదువుకోసం ఈ వూరు వచ్చాడు. ఏం చదువుతున్నాడో నాకు తెలియదు. వేమన (గ్రంధాలయంలో నాకు పరిచయమయ్యాడు. స్వయంగా వొండుకుంటూ వుండేవాడు. ఆయన తెప్పించే పుస్తకాలు చదవడం కోసం తరుచూ వెళుతూ వుండేవాడిని. ఒక్కొక్కప్పుడు అక్కడే భోంచేసేవాడిని. "మంచి ఇంగ్లీషు రాయడం చదవడం ఎలా” అన్న పేరుగల పుస్తకంలో తెలుగువారి నాటకాలను గురించి ఒక వ్యాసం వుంది. అది నేటికీ నాకు జ్ఞాపకం, దీపం కొంతిలో జిగజిగలాడే ఆహార్యంతో నటకుడు రంగప్రవేశం చేస్తాడు. అతడు మెల్లగా “గాత” అంచుకు చేరి చిన్నగా దగ్గి తల ఎగరేస్తాడు. దాంతో బంయ్‌మని హార్మనీ మోగుతుంది. నటకుడు చేయి పయికెత్తి “పొతాళంబునకేగినన్‌” అన్న పద్యాన్ని అందుకుని పొవుగంటసేపు అరోహాా, అవరోహణ ఆకారాలతో సంగీత సాధన చేస్తాడు. హాల్లోవారు చప్పట్లు కొడతారు. ఈలలు “౫ వన్సుమోర్లతో మళ్ళీ పాడిస్తారు. ఇదీ ఆ ఇంగ్లీషు రచయిత చెప్పిన సమాచారం. శ్రీశ్రీకూడా ఈ వ్యా చదివినట్టున్నాడు. నటకుడు చెయ్యి ఆకాళంకేసి ఎత్తి పాతాళంబునకేగినన్‌ అన్న పద్యాన్ని చదువుతాడు అంటూ తెలుగువారి నాటక ప్రదర్శనను ఉదాహరిస్తాడు. తీరిక దొరికినప్పుడల్లా ఆ మిత్రని ఇంటికి వెళుతూ ఉండేవాడిని, నాకు ఇంగ్లీషు కొద్దిగా మాత్రమే వచ్చును, సందర్భాన్నిబట్టి కొన్ని శబ్దాలకు అర్దాలు బోధపడతాయి. మరికొన్ని శబ్దాల అర్జాలను అడిగి తెలుసుకునేవాడిని. అర్ధం అయిన మేరకు ఆ మిత్రునితో దాన్ని చర్చిస్తూ వుండేవాడిని. నాతో చర్చించడంకోసం ఆయన కూడా ఆ పుస్తకాలను చదివేవాడు. “ఏకస్తపః ద్వయోర్విద్యా” అన్నారు పెద్దలు. తపస్సు ఒంటరి సాధన, విద్యకు ఇద్దరు కావాలని ఆ మాటకు అర్ధం, పరనం వల్ల మా మైత్రి గట్టిపడింది. వోడ్‌హౌస్‌ పుస్తకాలే కాకుండా తెలుగు పుస్తకాలను గురించి కూడా చర్చించేవాళ్ళం మా మేనమామగారు ఇంటిని నాంపల్లినుంచి సీతారాంబాగుకు మార్చారు. బాగు ఆవరణకు కాదు. (ప్రహారి ఆవల ఇళ్ళు ఉన్నాయి. వాటిలో ఒకటి పంచాంగం వెంకట వరదాచార్యులుగారు అనే ఒక ఆయుర్వేద వైద్యునిది. ఆ యింట్లో వుంటూ అక్కడికి కాస్త దూరాననుండే నివేశన స్థలాన్ని కొన్నారు. అది ఒక నవాబుగారి 34 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

స్థలం గజం పావలా చొప్పున పన్నెండువందల గజాలు కొన్నారు. నిజాం కాలేజీలో ఆయన మిత్రులంతా గగన్‌మహల్‌లో అదే ధరకు స్థలాలు కొనుక్కొని ఈయన్ని కూడా అక్కడే తీసుకొమ్మన్నారు.

కాని ఆయన వినలేదు. ఇప్పుడు కొన్న స్టలం దేవస్థానం పక్కన ఉంది కనక అదే తనకు నచ్చిందన్నారు అక్కడ ఇల్లు కట్టడం కోసం కోనసీమనుంచి వడ్రంగులను రావించారు వారు అయిదుగురు అన్నదమ్ములు. వారు అసలు సెట్టిబలిజలు. కులవృత్తిని చేపట్టడం 14-16 శతాబ్దాల మధ్యనుంచీ దేశమంతటా అలవాటయింది. వ్యవసాయదారులు మాత్రం జన్మభూమికి అతుక్కుని వుంటారు. కాని ఇతరులు జీవిక ఎక్కడ గడుస్తే అక్కడే సిరపడుతూ వుంటారు.

మా మేనమామగారికి పిల్లల్లేరు. అందుకని ఆయన పెద్దమేనగోడలి కూతురును పెంచుకొనడానికి తెచ్చుకున్నారు. ఆయన పెద్దమేనగోడలు అంటే మాపెత్తల్లి కూతురు. అంటే అక్క. మా మాతామహనికి అయిదుగురు కూతుళ్లు, అందులో పెద్దకూతుళ్లిద్దరూ ఒక్కొక్క బిడ్డను ప్రసవించి కళ్లుమూశారు. మూడవది మా అమ్మ నాల్గవ కూతురుకు సంతానం కలగక ముందేభర్త పోయాడు. అయిదవ కూతురుకు సంతానం నిలవలేదు అందుకని ఆమె మరిది కొడుకును దత్తత తీసుకున్నారు. మా అమ్మకు మాత్రమే సంతానం వుంది

ఇప్పుడు మా మేనమామగారు పెంచుకున్న అమ్మాయికి నేను, మా అన్నగారు మేనమామలం. కొత్త ఇల్లు తయారయిన తరవాత నూత్న గృహప్రవేశం. ఈ అమ్మాయిని మా అన్నగారికిచ్చి పెళ్లిచేయడం ఆయన ఉద్దేశ్యం. పిల్లకప్పుడు ఎనిమిదేళ్ళు వస్తాయి. మా అన్నగారికి అప్పుడే పెళ్ళి ఇష్టం లేదు. అమ్మాయికి ఇప్పుడు ఎనిమిదేళ్లు, ఆలస్యం చేస్తే కన్యాదాన ఫలం దక్కదు, ఆలస్యం అయేకొద్దీ కన్యాదశ మారి రోహిణి, గౌరీ దశలకు చేరుతుంది. మా అన్నగారి వయసు అప్పుడు పందొమ్మిదేళ్లు,

మేం ఉండే ఇల్టు దత్తాత్రేయ గుట్టకు వెళ్లేదారి మొగలో వుండేది. సీతారాంబాగులో వున్నంతకాలం నేను వెనకనున్న గుట్టల మీద తిరుగుతూ ఉండేవాడిని. నా చిన్నతనాన అలవడిన ఒంటరితనానికి మరో రూపం అది. దత్తాత్రేయగుడికి పూజా పురస్కారాలు ఉండేవికావు. అందువల్ల ఆగుడికి ఆదాయం ఉండేదికాదు. ఆదాయంలేని మనిషి నెవరూ పలకరించరు, దేవుడయినా అంతే. అది మంగళహాట్‌ నుంచి ఆసిఫ్‌ నగరు వరకూ పోయే-రోడ్డు. ఆరోడ్డు మీద ఒకటి రెండు గడ్డివాములుండేవి. జలసేచనతో వ్యవసాయం ఉన్నచోట వరి గడ్డివాములుంటాయి. హైదరాబాదు వాములు వేరు.

అడవి భూములమీద ఒక జాతి గడ్డి నడుమెత్తు పెరుగుతుంది. ఆ గడ్డిని కోసి కట్టలుకట్టి బళ్లమీద తెచ్చి అమ్ముతారు. నగరంలో పశువులకు అదే గడ్డి ఆహారం. అమ్మకానికి వచ్చినప్పుడు ఆ గడ్డిని కొని కొందరు వాము కడతారు. సాధారణంగా లోధాలు వాములు కట్టి గడ్డి వ్యాపారం చేస్తారు. ఆ గడ్డి వాముకీవల అయిదు వాటాలుగల ఇల్లు వుండేది. ఆయిల్టు రోడ్డువైపున నాలుగు మలిగీలున్నాయి. మలిగీ 'సైజుగేటు. అది దాటితే అంగణం. తరవాత మెట్టు, వరండా, ఆయిదువాటాలు కనిపిస్తాయి. మలిగీలమీద డాబా. డాబామీదికి మెట్టు లోపలనుంచే వున్నాయి.

ఆ వాటాల్లో రెండు కోనసీమ నుంచి వచ్చిన వడ్రంగి కుటుంబాలవి. ఒకటి ఓనూత్న దంపతులది. మరొకటి విద్యార్థులుగా వున్న అన్నదమ్ములది. ఆఖరిది సుబ్రహ్మణ్యశాస్త్రి అని పేరుగల ఓ సంస్కృతపండితుని యిల్లు. విద్యార్థులు మహబూబునగర్‌ జిల్లా క్యాతూరునుంచి చదువుకొనడానికి వచ్చారు. వారిలో పెద్దతడిని వీరన్న అనీ, చిన్నతడిని రామచంద్రయ్య అని పిలిచేవాళ్లం. అప్పటికి మత

రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ అ€ 35

వాతావరణంలో మార్పు వచ్చింది. ఆ బాడవకు తరుచు నేను వెళుతూ వుండేవాడిని విద్యార్థుల ఇంట ప్రతివారం భజన జరుగుతూ వుండేది. భజనానంతరం (ప్రసాదం,

ఆ భజన సంఘానికి నేను కోశాధికారిని, ఆదిలో కొబ్బరికాయముక్కలతో మొదలయిన (ప్రసాదం స్వీట్సు దాకా పెరిగింది. వీరన్న రామచం(ద్రయ్య బాగా పాడేవారు. (క్రమంగా వారిలో నాటకం వేయాలన్న ఉత్సాహం పెరిగింది. బలిజేపల్లి వారి నాటకం వేయాలని సంకల్పం. అందులో లోహితుని పొత్ర నాకు యిచ్చారు. అప్పటికి నాకు మోచేతి దగ్గర కంతిలా లేచి దానికి ఆపరేషను అయింది. అంచాత దానికి కట్టు వుంది. ఆకట్టుతోనే నాటకంలో వేషం వేశాను. కాలకౌశికుని విస్తళ్ల కోసం మర్రిచెట్టెక్కితే పడ్డాను, చెయ్యివిరిగింది అని కట్టును సమర్థించాను,

అక్కడ గడ్డివాముల్ని వేయడం ఒక కళ. వాముకైవారం చాలా వుంటుంది. ఎత్తు ఒక మేడంత ఉంటుంది. వాముకొక వైపు కంటికి కానరాని సందు వుంటుంది. ఆ సందు ద్వారా వాము మధ్యకు చేరవచ్చును. అక్కడ ఒక గది పట్టు స్టలం ఖాళిగా ఉంటుంది. ధూలొపేట లోధ్‌ యువకుడు గణేశ్‌సింగు వాము మధ్యన మాకు కర్రసాము నేర్చేవాడు. దత్తాత్రేయ దేవాలయానికి సాయంత్రం చిన్న సంచుల్లో ఇసక తరలించే వారం. రాత్రి ఆ ఇసకను నెరిపి ఆ ఇసకలో సాములు కుస్తీలు నేర్చుకునేవారం. అర్హరాత్రిదాటిన తరవాత ఇసకను బస్తాలకెత్తి కిందికి తెచ్చుకునేవారం.

మతోద్రేకాలు బాగా పెరిగాయి. రోడ్డు వేయడం కోసం తెచ్చి కుప్పలు పోసిన కంకరను బాడవ డాబామీదికి చేర్చాం. రాత్రి కర్రలను తాటిస్తూ పాటలు పాడుతూ బాడవలో చాలామంది ఉన్నారన్న భ్రమ కలిగిస్తూ ఉండేవారం. బహదూర్‌యార్‌ జంగ్‌ అన్న ఒక నవాబు తన బిరుదులను విసర్జించి బహదూర్‌ఖానుగా మారాడు. అతడు మంచి వక్త, ఆతడి ఉపన్యాసాలు ముస్లింలకు ఉత్తేజం కలిగించేవి. ఒకనాడు బందరు నిజాం సంస్థానంలో ఉండేది. ఇప్పుడా బందరు తమకు కావాలని బందరులోనే ఉపన్యాసాలిచ్చాడు బహదూర్‌ఖాన్‌.

ఒకసారి ఆయన ఉరుదూ ఉపన్యాసాన్ని నేను బందరులోనే విన్నాను. బందరు చుట్టుపక్కల నుంచి చాలా మంది ముస్లింలు ఆయన ఉపన్యాసం వినడానికి వచ్చారు. అడుగడుగూ చప్పట్లతో సమావేశం మారుమోగింది. అయితే ఆయనచేసీన ఉరుదూ ఉపన్యాసం వచ్చిన వారిలో ఎంతమందికి అర్థం అయిదో నాకు తెలియదు. బహదూరుఖాను హైదరాబాదులో ఒక ముస్లిం వలంటీరు సంస్థను నిర్మించాడు. తరవాత పుట్టిన రజాకారు సంస్థకు ఆదిమూలం, దానికి ఖాక్సారులని పేరు. వారి ఆయుధం గుర్తు షావల్‌ అంటే పార.

మా మేనమామగారు కట్టిన ఇంటికి ఎదురుగా ఓ గోరీల దొడ్డి వుంది. ఆ గోరీల దొడ్డే ఖాక్సార్ల శిక్షణకేంద్రంగా తరవాత మారింది. బహదూర్‌ఖాన్‌ ప్రసంగాలవల్ల మతోద్రేకాలు బాగా పెరిగాయి. ఇక్కడ బాడవలో రక్షణ ఏర్పాట్లు బాగా పెరిగాయి. ఆ బాడవలో అరవైడెబ్బయి మంది 'సాయుధులున్నారన్న పుకారు వ్యాపించింది. అందువల్ల ఆరోడ్డు మీద ముస్లింల రాకపోకలు ఆగిపోయాయి. ఒక మూల ఈరక్షణ యత్నాలు సాగుతున్నా నాటకం వేయాలన్న చర్చ కుతూహలం మానలేదు. ఈసారి నాటకం సతీసావిత్రి. పాత్రల దగ్గర ఏకీభావం కుదరలేదు.

నేను స్కూలు మానేశాను. ఆదాయం ఇవ్వగల వ్యాపకం ఏదీ పెట్టుకొనలేదు. ఇల్లెందులో ఉన్నప్పుడూ హైదరాబాదు వచ్చిన కొత్తలోనూ ఒకటి రెండు మూకీ సినిమాలు చూశాను, అగ్రహారంలో ఉన్నప్పుడు

36 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

చూసిన తోలుబొమ్మలాటకు ఈ మూకీ సినిమూలకు నాకు ఖేదం కనిపించలేదు బొమ్మలాడించేవాళ్లు తెరవెనక నుండి బొమ్మల వాకోవాక్యాలు చెప్పుతూ సందర్భోచితమైన శబ్దాలు చేస్తూ వుండేవారు మూకీ సినిమాలో వ్యాఖ్యాత ఒక మూల కూర్చుని కధా కధనం వాకోవాక్యాలు ఘనవాద్య ధ్వనులు చేస్తూ వుంటాడు అదోకళ. (ద్రష్టలను తన కధలోనికి గుంజుకునేవాడు. మేం నాంపల్లిలో వున్నప్పుడు మాట్లాడే ఒక హిందీ సినిమా వచ్చింది. మా మేనమామగారు ఆ సినిమాకు ఇంటిల్లిబాదినీ తీసుకువెళ్ళారు. నాటి సినిమాహాలుపేరు మోతీమహలు. తరవాత కొన్నాళ్లకు అది కాలిపోయింది. గోషా(స్తీలకు చెక్కలతో కట్టిన మిద్దైమీద కూర్చొనడానికి ఏర్పాట్టున్నాయి. ఫిల్మును నడిపించే కేబిన్‌ మిద్దెమార్గంలోనే వుండేది. మంటలు కేబిన్‌లో పుట్టి మిద్దె అంతటికీ వ్యాపించాయి. సాహసిక అయిన ఒక స్త్రీ తన చీరె విప్పి మిద్దెపిట్టగోడకు కట్టి దాని సాయంతో కిందికి దిగింది. తరవాత మరికొందరు (స్రీలు ఆ చీరద్యారా దిగగలిగారు అంతే, చీర అంటుకుంది. కొందరు సాహసించి మిద్దె మీంచి కిందికి దూకారు. చాలా మంది మిద్దెమీద కాలిపోయారు. చాలామంది స్రీ పత్తా దొరకలేదు. నిపుణులు షార్ట్‌సర్‌క్యూట్‌. నుంచి అగ్గి అంటుకుందని నిరూపించారు. దాంతో ప్రభుత్వంవారు సినిమా ఇనస్పెక్టరు అన్న పేర ఒక ఎలక్షికల్‌ ఇంజనీరుని నియమించారు. ఆ విషాదం తరవాత చాలా కాలం వరకు మోతీమహలు సినిమాహాలు మూతపడింది. తరవాత దిల్‌షాద్‌ టాకీసు అనే కొత్తపేరుతో మొదలయింది. ఆ తరవాత సినిమా హాళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. నాకు ఆదాయంలేదు. దాంతో ఆసక్తికూడా సన్నగిల్లింది. బాడవలోని భజన బృందం వేయబోయే నాటకం మీద ఏకీభావం కుదరలేదు. అందుకు కారకులైన వారికి జంతుపా(త్రలిచ్చి దివాంధం అన్న "ఏర ఒక పద్యకావ్యం రాశాను. ఆ కావ్యాన్ని ఆయింటపడేశాను. దాని కర్త యెవరై ఉంటారు అన్న మీమాంస జరిగిన తర్వాత వారి కన్ను చిట్టిశాస్తుర్త మీద పడింది. శాస్తుర్డు ఆ కావ్యం చదివి వాళ్లకు నన్ను చూపించారు. నేను అజ్ఞాత వాసానికి వెళ్లిపోయా. ఆఖరికి నా ఉనికి కనిపెట్టి కావ్యనాయకుడు నన్ను కసి దీరా కొట్టాడు అందుకు నేను బాధపడలేదు. ఆ కావ్యం సద్యః ఫలితాన్నిచ్చింది అని సంతృప్రిపడ్డాను సంస్కృత పండితుని గురించి కాస్త వివరణ అవసరం, అతడు మా మామయ్యకు మేనమామ కొడుకు. విజయనగరం సంస్కృత కళాశాలలో సాహిత్య శిరోమణి చదివాడు. వ్యాకరణాచార్యుడు తాతారాయుడు శాస్తిగారికీ తర్కాచార్యుడు పేరి లక్ష్మీనారాయణగారికీ అభిమాన శిష్యుడు ఈ ఆచార్యులిద్దరికీ (బ్రిటిషు ప్రభుత్వం వారు మహామహోపాధ్యాయ బిరుదం ఇచ్చారు. ఆ సంస్కృత పండితుని అసలు పేరు మంధా సుబ్రహ్మణ్యశాస్త్రి. అందరూ చిట్టి శాస్తుర్డు అంటూ వుంటారు. నేను మాత్రం చిట్టీ అని పిలుస్తూ వుండేవాడిని. చదివింది సంస్కృతమే అయినా హానావా సూటూ, గిరిజాల జుట్టూ, నోట సిగరెట్టూ ఇదీ ఆయన వేషం. ఆ జుట్టేమిటి అంటే అది భావకవిత్వ శిరోజ నిక్షేపసం అంటూ వుండేవాడు. ఆయనకు ఇంగ్లీషురాదు. తెలుగు కూడా రాదు. రాదు అంటే తెలుగు సాహిత్య సరిచయంలేదు. ఆధునిక భావకవుల కవితలు ఎంకి పాటల్టాంటివి వచ్చును. హైదరాబాదు వచ్చిన కొద్ది రోజులకే జనభాష ఉరుదు మాట్టాడ్డం నేర్పాడు. మా మామయ్య అప్పుడు సంస్కృతం ఎం.ఎకి చదువుతున్నారు. ఆయనకు సంస్కృతం ట్యూపషను చెప్పేందుకు మేనమామ కొడుకును రావించుకున్నారు. నిజాం కాలేజీలో ఉరుదు అధ్యాపకుని పేరు ఆగా హైదర్‌ హసన్‌. వాళ్లమ్మూయికి హిందీ నేర్పమని లాలా రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ అ ౩7

చిట్టిని నియోగించారు. ఆగా సాహెబ్‌కి ఒక ప్రత్యేకత వుంది. ఆయన ఉరుదు మాట్లాడుతూ వుంటే వినడానికి ఉరుదూ అభిమానులు దిల్లీ, లక్నోలనుంచి వచ్చేవారు. చిట్టిశా(స్త్రి ఉరుదువిని శాస్త్రీ సాబ్‌ నాతో రోజూ అరగంట మాట్లాడుతూ వుండండి అని చెప్పాడాయన. అచిరకాలంలో ఆగాసాహెబ్‌లాగ రాయల్‌ ఉరుదు మాట్లాడడం నేర్చాడు చిట్టి. ఆనాడు బంజారాహిల్సు మీదున్న నవాబు లందరూ కూతుళ్లకు, బేగంలకు ఆయన్ని హిందీ ట్యూటరుగా నియమించారు. అగా సాహెబ్‌ కూతుర్ని హిందీ మధ్యమ పరీక్షకు తరిఫీదు చేశాడు. ముగ్గురు విద్యార్హులుంటే పరీక్ష కేంద్రాన్నిచ్చేవారు. ఆందువల్ల తనతమ్ముడిని చాలా కాలం నుంచీ తయారు _చేస్తూ వచ్చాడు నీపేరు కూడా ఇచ్చాన్రా అని రేపు పరీక్ష అనగా ఈనాడు నాతో చెప్పాడు. అయితే చిట్టీ సిలబసు ఏమిటని అడిగాను. బాలకృష్ణ బనవీర్‌ అన్న పుస్తకాలన్నాడు. భాగవతంలో కృష్ణుని బాల్యం చదివాను. బనవీరనేది దాసీపన్నాకధ. చిలకమర్తి అనువదించిన టాడ్‌ దొర రాజస్థాన్‌ కధావళి అదివరకే చదివాను. మర్నాడు పరీక్ష రాశాను. నాగరి అక్షరాలు అదివరకే తెలుసును, పరీక్షాఫలితాలు వెలువడేనాటికి నేను హైదరాబాదులోలేను. ఏదో ఊరికి వెళ్ళాను. ఆగాసాహెబ్‌గారి అమ్మాయి నేను ఇద్దరం ఫస్టుక్సాసులో పాసయ్యాం. చిట్టిశాస్తుర్లు తమ్ముని 'పేరు భాస్కరం. అతడు సెకండుక్సాసులో పాస్‌ అయాడు. ఫసుక్షాసులో పాసైనందుకు నాకు నెహురూ ఆత్మకధ బహుమతిగా వచ్చింది. దాన్ని భాస్కరం అందుకున్నాడు. అది తనదగ్గర ఉందన్నాడు. కాని పుస్తకాన్ని నేను ఏనాడూ చూడలేదు. నేను పుట్టిన అనాతవరమే అతడి స్వగ్రామం. ఎప్పుడో ఆవూరు వెళ్లినప్పుడు భాస్కరంగారికి హిందీలో బహుమతి వచ్చిందని అక్కడి వారు చెప్పగా విన్నాను. అంతే. చిట్టీ నాకు సంస్కృతం చెబుతావా అని ఆడిగాను. ఆయన వెంటనే నాకు రామశబ్దం చెప్పాడు. సరేనని సాయంత్రం అకారాంత పుల్లింగో కుక్కళబ్ద: అని అప్పజెప్పాను. అయితే పందిశబ్దం ఎప్పుడు అప్పజెపుతావు అని అడిగాడు. నువ్వు హరిశబ్దం చెప్పలేదు కదా అన్నాను. నీకు సంస్కృతం రాదురా అన్నాడు. ఆయన పుస్తకాల రాక్‌లోంచి ఓ పుస్తకం పైకిలాగి కొండలమీదికి పోయాను. అది అగస్త్య పండితుని (ప్రతాపరుద్రీయం, కొండమీద కూర్చుని నాయక నాయికా లక్షణాలను చదివాను. మర్నాడు ఆ పుస్తకం తీసుకెల్లి ఆ లక్షణాలను ఏకరువు పెట్టాను. అయినా నీకు సంస్కృతం రాదురా అన్నాడు చిట్టిశా(స్తి. సరే అయితే ఒక ఒప్పందానికి వద్దాం అన్నాను, అదేమిటి అన్నాడు చిట్టి. ఒక పుస్తకాన్ని పైకితీసి తెరిచి రెండు పేజీలు చదివి నాకు చెప్పు అన్నాను. చిట్టిశాస్తుర్ణు చెప్పాడు. అలా సంస్కృత కావ్యాలు, వాటి కర్తలు, కావ్య ఇతివృత్తాలు నాకు తెలిశాయి. ఆతడు చదివిన కావ్యనాటకాలంకార (గ్రంధాలపేరు, గ్రంధకర్తలపేర్డు, గ్రంధ ఇతివృత్తం నాకు తెలిశాయి. నాటక కర్తల్లో శూద్రకుడు భవభూతిమీద అభిమానం కలిగింది. బాణుని మీద కూడా నాకు గౌరవం పెరిగింది. ఒకసారి కృష్ణదేవరాయ (గ్రంధాలయంలో తిక్కన భారతాన్ని గురించి ఆయన్ను మాట్లాడమన్నారు ఆయనకు తెలుగు కావ్యాల పరిచయంలేదు. ఎలా మాట్లాడాలో తెలియడంలేదు. అప్పుడు నన్ను పిలిచి తిక్కన కవిత్వం గురించి చెప్పమన్నాడు. తిక్కన కవితను గురించి నాకు తోచినది చెప్పాను. అంతే. అది గుర్తుంచుకున్నాడు. గ్రంధాలయోపన్యాసానికి చాలా ప్రశంసలు వచ్చాయి. అప్పటి నుంచీ తెలుగు కావ్యాలను గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు నన్ను అడుగుతూ వుండేవారు. దాంతో చిట్టితో నాకు చనువెక్కువయింది. 38 తి రాంభట్ట కృష్ణమూర్తి సాంతకధ

కొత్త ఇల్లు తయారయింది. పునాదుల దగ్గర నుంచి సున్నంతో కట్టారు. సీలింగు తారస్‌ ఇటికలతో కట్టారు. దాన్ని మద్రాసు టెగ్రీస్‌ అంటారు. గృహ్రవేశంనాడు ఆవుని. ఇంట నడిపించాలట. అందుకోసం పాడియావును కొన్నారు. దానికోమూల చిన్న పాక వేశారు. పెల్లి అయిన రెండు వారాలకు మా అమ్మమ్మ పోయింది. మనవనికీ ముని మనవరాలికీ జరిగిన పెళ్లి కళ్ళారాచూసి కన్నుమూసింది. అంత్య[క్రియలన్నీ అయిన తరవాత రేకులతో ఒక జౌట్‌హౌస్‌ లాంటిది వేశారు. ఆ బౌట్‌హౌస్‌లో మా అమ్మను, అన్నయ్యను ఉంచారు నేను అక్కడ ఉండడానికి వీల్లేదు అన్నారు.

నన్ను వారాలు చేసుకుని బతకమన్నారు. ఒక స్కూల్లో చదువుకుంటూ యాచిస్తే ఎవరయినా వారాలిస్తారు. నేను యేస్కూల్లోనూ చదవడంలేదు. అంచాత నేను ఆ యింటనే మాధూకరం మొదలు పెట్టాను. వొడుగునాడు చెప్పిన మంత్రం అప్పుడు పనికి వచ్చింది. ఒక అంగవ(స్త్రం బుజంమీద వేసుకుని భవతి భిక్షాం దేహి అన్నాను. అలా అన్నప్పుడు ఏంచేయాలో మా అత్తకు తెలియలేదు. (బ్రాహ్మణ సంప్రదాయాలు, ఆచారాలు తెలిసిన మా పిన్నమ్మ అప్పుడు చెప్పారు. పప్పుఅన్నం, కూరఅన్నం, మజ్జిగఅన్నం మూడు ముద్దలు జోలెలో వేయండి అన్నారు. నేను బుజం మీంచి అంగవస్తం తీసి దాన్ని జోలెలా చేశాను. ఆమె మూడు ముద్దలు వేశారు. ఆ ముద్దలు నాకు పగలూ రాత్రీ సరిపోయాయి.

సాయంత్రం మామయ్య అడిగారు. వారాలు చెప్పుకున్నావా అని. లేదన్నాను. మాధూకరం మాత్రం ఎందుకు అని ప్రశ్నించారు. నిజమే అంతంత ముద్దలు తినలేను. అందుకని కరతల భిక్షం తరుతల వాసం అన్నాను. ఖాళీ స్థలంలో ఒక రేగు చెట్టంది. మూడు నాలుగు సీతాఫలం చెట్టున్నాయి. అన్నయ్యకు పెళ్లి బహుమతిగా ఒక సైకిలు కొని యిచ్చారు. అన్నయ్య దాన్ని అమ్మేసి ఉద్యోగాన్వేషణకు వెళ్లిపోయాడు. మా అమ్మ ఒక్కతీ ఆ బౌటుహౌస్‌లో వుండి ఏంచేస్తుంది. అందుకని పాతఇంటికి వెళ్లిపోయింది.

ఆమె వెంట నేను కూడా పాతఇంటికి వెళ్లిపోయాను. మామయ్య, మామగారు సకుటుంబంగా వచ్చారు. ఆయన మామయ్యకు శాక్త గురువు, ఆయన సలహామీద నలభైరోజుల చండీయాగాన్ని ప్రారంభించారు మామయ్య. ఆ నలభైరోజులూ నిత్యసంతర్పణ. నేనూ చిట్టి శాస్తుర్లూ అతని తమ్ముడు భాస్కరం నిత్య అతిధులం నేనూ భాస్కరం బజారు పనులు చేయడానికి ఉండాలి. చిట్టిశాస్త్రీ భాస్కరం, మామయ్యకు మేనమామకొడుకులు. పెద్దమ్మ కూతురు భర్త భోజనాలకు వచ్చేవారు. అమ్మ ఇక్కడే వుండేది.

చిష్ణీచమన్‌లో అలజడి ఎక్కువయింది. ఖాక్సార్లకు ఆయుధ శిక్షణ శిబిరం మొదలయింది. వారి సాముగరిడీలు కవాతులూ అక్కడే. వారి భోజనాలకు వంటలు కూడా అక్కడే. ఇదంతా చూసిన తరవాత చండీయాగాన్ని ఒక నెల కుదించారు. భోజనాలు కొత్త యింట్లోనే కాని పడకకు పాతయింటికి వచ్చేవాడిని. మామయ్య సికిందరాబాదు జీరాలో ఒక యిల్టు అద్దెకు తీసుకుని మకాం అక్కడకు మార్చారు. రోజూ ఆవుకు నీరుపట్టిగడ్డి వేసే బాధ్యత నాకూ భాస్కరానికీ అప్పగించారు. రాత్రి కొత్తయింటికి మేం కాపలా. రాత్రి అక్కడే పడుకునేవారం.

ఉదయం లేవగానే ఆవుసేవలో పడేవాళ్తం. పక్కనే భూమి అమ్మిన నవాబ్‌సాహెబ్‌ ఇల్లు. మమ్మల్ని గోడ అవతలినుంచి రెండు కళ్లు కనిపెడుతున్నాయనిపించింది. గోడ దగ్గరకెళ్లి చూశాం. ఆమె అటునుంచి గోడపైనుంచి చూస్తూ కోస్తా తెలుగుభాషలో పలకరించింది. రాకపోకలు గేటుద్వారా చేయకండి. ఇక్కడ నిచ్చెన వేశాను. గోడ యెక్కి నిచ్చెన మీద నుంచి లోనకు రండి, మాగేటు నుంచి రోడ్డుమీదకు వెళుదురుగాని అన్నారు. మేం గోడయెక్కి నిచ్చెన మీదుగా అవలకు దిగాం, ఆమె వంటింటి దాకా తీసుకువెళ్లి మాకు టీ యిచ్చింది.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ అ 39

ఆమె ఏలూరులో పుట్టి పెరిగింది. నవాబు సాహెబు బేగంలలో ఒకతె. ఇక్కడ కోస్తా తెలుగు మాట చెవిని సోకలేదు. తెలంగాణా తెలుశు ఆమెకు పూర్తిగా అర్హం అయేది కాదు. రోజూ వారి గేటులోంచి వచ్చి నిచ్చెన మీదుగా కొత్త యింట్లో దిగాలి. వెళ్లిపోయేటప్పుడు మళ్లీ అదే దారి. కాగా ఒక అరగంటసేపు ఆమెతో తెలుగు మాట్లాడాలి. అదీ షరతు. నవాబు సాహెబుక్కూడా ఏలూరు తెలుగు తెలుసు. చిప్తీ చమన్‌లో అయిదు వందలమంది ఖాక్సార్డు శిక్షణ పొందుతున్నారు, మీరు వారి కంట పడ్డం అంత మంచిది కాదు అని నవాబ్‌సాహెబ్‌ కూడా అన్నారు. కొద్దిరోజుల తరవాత పాడియావునీ ఇంటిని కూడా అమ్మివేశారు మామయ్య. అనాతవరంలో ఎనిమిదెకరాల భూమి కొన్నారు. చిన్న మామయ్య, తోచ్చిని అనాతవరం ఇంట్లో వుండమని పంపించారు. కొత్తగా కొన్న భూమిని సాగుచేసే బాధ్యతను తన తమ్ముడు అంటే చిన్నమామయ్యకు అప్పగించారు. దేవస్థానం పక్కన వుండాలన్న మోజు ఆయనకు తీరిపోయింది. నేను మెకానికల్‌ లైనులోకి వెళదామను కున్నాను. కాని బావ, అన్నయ్యా ఆ రంగంలోకి రావద్దన్నారు. నా పోషణబాధ్యత తమది అన్నారు. 40 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

అ మా ముని నిన్ను చూడాలంటోంది వస్తావా అన్హాడు పావయ్య తాత. ఆయన వెంట బయలుదేరాను. మునల్లి నాపేరడిగింది. చెప్పాను. యాదవుల దేవునిపేరు. గంటలో వదిసార్లు ఆ పేరు పారాయణం చేసింది. రాత్రి అక్కడే ఉండిపోయాను. వేదకాలవు ఆతిథ్యంలాగ ఒక అమ్మాయిని తీనుకువచ్చారు. కామన తొలి కొలువు నల్లగొండకు పదిహేను మైళ్ల దూరాన ఉంది కనగల్టు అక్కడొక నది, దాని పేరు నాకు గుర్తులేదు. దానికి వరద పెనుప్రళయంగా వస్తుంది. దానిమీద ఒక వారధి కట్టాలని ప్రభుత్వ సంకల్పం. అందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పునాదుల్లో సిమెంటు దిమ్మలు వేశారు. సీసం దిమ్మలు వేశారు. అవి వరదలో కొట్టుకొనిపోయాయి. అఖరికి గతళతాబ్ది మూడోదశకం ఆఖరున హైదరాబాదు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీవారు ఆ పని చేపట్టారు. ఆ సంస్థ యజమాని పేరు లాయక్‌ అలీ. ఆ కంపెనీయే హైదరాబాదు రాష్టంలో కొన్ని ఫ్యాక్టరీలను కట్టింది. లాయకలీ కొంతకాలం హైదరాబాదు ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు. కనగల్‌ దగ్గర నది మీద పరిశోధనలు చేసి అక్కడ అరన్నై అడుగుల లోతునుంచీ పునాది వేయాలని నిర్ణయించారు. అది "హైదరాబాదులో తొలి కాంక్రీటు వంతెన. ఆ వంతెన నిర్మాణానికి కోనసీమనుంచి వచ్చిన వడ్రంగిపనివాళ్లలో పెద్దవాడు నారాయణ సకుటుంబంగా కనగల్లుకు బయలుదేరాడు, మీరు కూడా వస్తారా అని నన్నడిగాడు. న! వస్తానని నేను కూడా బయలుదేరాను. అక్కడ నది ఇసకలోనే రకరకాల పూరిళ్లు కట్టారు. మేం ఓరకంగా కాస్త పెద్ద పూరింటిలోనే దిగాం. వందల సంఖ్యలో కూలీలు పనిచేసేచోటు వారికి కావలసిన సంభారాలతో దుకాణాలు వెలుస్తాయి. వాగులోకి దిగే రోడ్డుకిరువైపులా దుకాణాలు వెలిశాయి. సాయంత్రం కాగానే (ప్రతి కూలీకి పైసలందుతాయి. ఆరాత్రి తిండికీ మర్నాటి తిండికీ కావలసిన సంభారాలను ఆ దుకాణాల్లో కొనుక్కుంటూవుంటారు. కనగల్టు చేరిన తరవాత రెండు రోజులు నారాయణ అతిధిగానే వున్నాను. నారాయణకు పద్నాలుగేళ్లకూతురు ఉంది. నాకు అన్నం వడ్డించడానికి ఆమెను నియోగించారు. ఆ అమ్మాయి అతిమర్యాద, ఆకారణ ఇకిలింపులు చూస్తూ ఉంటే ఇంట్లోంచి వీలయినంత త్వరగా వెళ్లిపోవాలని అనిపించింది. డా రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ అ 41

మూడోరోజున మిమ్మల్ని తీసుకొచ్చిన పని యిది ఇది అని చెప్పి నాచేత దొంగలెక్కలు రాసిపెట్టమని అడిగాడు. నారాయణ పెద్దమే'స్త్రీ. కార్పెంటర్‌ ఇనపచువ్వల పనిని గుత్తకు తీసుకున్న వాళ్లలో అతడొకడ్పు, దొంగలెక్కల ప్రస్తావన రాగానే నేను ఖస్సుమన్నాను. అతడంతకన్నా ఎక్కువ ఖస్సుమని రెండు రోజులు ఊరికే తిన్నావు, చాలు వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపో అన్నాడు. ఆ మాటకోసమే ఎదురు చూస్తూ వున్నాను. అదింత తొందరలో వస్తుందనుకోలేదు. నా బట్టలు ఒక జోలె సంచిలో వున్నాయి. ఆ సంచీ బుజాన వేసుకు బైటికి వచ్చాను. బస్స్ఫుటిక్కెట్టుకు కొంత పోగా ఇంకా కొంత డబ్బు ఉంది.

అక్కడున్న రెండురోజుల్లోనూ కొందరు ఉద్యోగులతోనూ స్థానిక కూలీలతోనూ పరిచయం ఏర్పడింది. ప్రాజెక్టు ఉద్యోగి దగ్గరకు వెళ్లి రాజభాషలో మాట్లాడి ముందు ఓ చిన్న గుడిసెను సంపొదించుకున్నాను. ఆయన్నే అడిగి టీ కాచుకొనడానికి, అన్నం వండుకొనడానికి, కొన్ని గిన్నెలు బియ్యం వగయిరాలు కొన్నాను. శ్లాబులు కొట్టి బిగించే పనిని ఒప్పుకున్నాను. ఎల్లివోయిన పాపయ్య అని ఒక వృద్దునితో నేను సరదాగా మాట్లాడుతూ వుండేవాడిని. అతడినీ మరొకడినీ కొలువులోంచి తీసివేశారు. అతడికి రోజుకు పావలా కూలి. అతడు దగ్గరే వున్న పల్లెలో యాదవుల పెద్ద. ఇప్పుడు ఆకులు దూసిన చెట్టయ్యాడు.

మనిషి ఆరడుగులుంటాడు. జెబ్బలకింద చర్మం గంగడోలులాగ ఊగులాడుతూ వుంటుంది. అతడి మేకల, గొర్రెల మందలుపోయాయి. ఎదిగి వచ్చిన కొడుకులు పోయారు. భార్యమాత్రం వుంది. ఆవృద్దులు ఒకరికొకరు తోడుగా బతుకుతున్నారు. పాపయ్య ను నా దగ్గరే పనిచేయమన్నాను. నీకు రోజుకు అర్హరూపాయి కూలి ఇస్తానన్నాను. అతడు గుడ్ల నీళ్లుకుక్కుకుని వొద్దయ్యా నాకు చారానే ఇయ్యి చాలు అన్నాడు. ఉదయం నాకు పాలు తెచ్చేవాడు. పాపయ్య తెలుగు వినముచ్చటగా వుండేది. గసడదవాదేశాన్ని అక్కడే విన్నాను.

సాయంత్రం ఇంటికి పోయేముందు పాపయ్యా! ఎప్పుడొస్తావు అని అడిగేవాడిని, రేకల వారంగ పారొస్తనయ్యా అంటూ వుండేవాడు పాపయ్య, సాయంత్రానికి మేకులు కొట్టి ఎనిమిది శ్లాబులు తయారయేవి, శ్లాబుకు పావలాకూలి. ఒకొక్కప్పుడు పదిశ్చాబులు కూడా తయారయేవి. మర్నాడు ఆ శ్చాబులను వాంతెనమీదికి తీసుకెళ్లి సారామట్టంతో సరిచూసి అమర్చాలి. సారామట్టం అంటే స్పిరిట్‌ లెవెల్‌. పక్కనున్న స్తంభాలను వడంబంవేసి నిలువుగా వుండేట్లు సర్దాలి, ఇదీ మా పని. రానురాను పదిళశ్చాబులు తయారయేవి. పాపయ్యకు అర్ధరూపాయి కూలి ఇస్తానంటే వద్దని ఏడ్చేవాడు.

నేనతడిని గౌరవంగా చూసేవాడిని. పాపయ్య తాతా అని పిలిచేవాడిని. ఒకనాడు మా ముసిలి నిన్ను చూడాలంటోంది వస్తావా అన్నాడు. ఆయన వెంట బయలుదేరాను. ముసిలి నా పేరడిగింది. చెప్పాను. యాదవుల దేవుని పేరు. గంటలో పదిసార్లు ఆపేరు పారాయణం చేసింది. రాత్రి అక్కడే ఉండిపోయాను. మర్రిపళ్లలా కాచిన పాలు కంచున్దాసుడు తాగాను. వేదకాలపు ఆతిధ్యంలాగ ఒక అమ్మాయిని తీసుకు వచ్చారు. అది తెలంగాణా ఆచారం. ఆమెను ఒల్లనన్నాను. ఆమెను ఆశీర్వదించి వెళ్లిపొమ్మన్నాను. తెల్లవారిన తరవాత ఇద్దరం పనిచేసే ఏటికి చేరుకున్నాం.

ఆ వంతెన దగ్గర సుమారు నెల రోజుల పాటు పనిచేశాను. రోజుకు పదిళశ్లాబులు చాలా ఎక్కువే. అంతకుముందు ఏ కార్చెంటరూ ఆస్టాయిని అందుకొనలేదు. అంతేకాదు వంతెనమీదికి తీసుకెళ్లిన తరవాత స్పిరిట్‌ లెవెల్‌కి సరిదిద్దడం దగ్గర అరగంట పట్టేది. అలాగే స్తంభాలను వడంబానికి అనువుగాసద్దడానికి కూడా కొంత సమయం పట్టేది, దీనితో సూపర్‌ వైజర్లకు నా పనిదగ్గర ఎక్కువ సేపు ఉండవలసిన పనిలేకుండా పోయింది. వారు పని పరీక్షించేందుకు రాగానే నవ్వుతూ గ్రీటింగ్స్‌ ఇచ్చేవాడిని, దీనితో వాళ్లకు నామీద ఓ సద్భావం కలిగినట్టు కనిపించింది.

42 అ రాంభట్ల కృష్ణమూర్తి సాంతకధ

అంతకుముదు మందకొడిగా నడిచే పని చకచక సాగింది ఆదశలో ఇంక పనిమానేస్తానని సూపర్‌వైజర్లతో చెప్పాను. ఎందుకు వెళతావు ఇక్కడే వుండు, నీకు నెలకు డెబ్బయి అయిదు రూపాయల జీతంమీద ఉద్యోగం ఇస్తాం అన్నారు. నాపని గురించి ఇంజనీర్లతోను అధికారులతోను చెప్పినట్టున్నారు. వారి అనుమతి మీద నాకీ ఉదో, ఖగ వార్త తెచ్చారు. అయినా నేను వెళ్లడానికే నిశ్చయించుకున్నాను. నాకు కాదు పాపయ్యకు చిన్న ఉద్యోగం ఇమ్మని చెప్పి బయలుదేరాను. నేను కొన్న గిన్నెలు, సరుకులు అక్కడే విడిచిపెట్టి "హైదరాబాదుకు చేరుకున్నాను హైదరాబాదుకు తిరిగి రాగానే స్నేహితుల ద్వారా మరో ఉద్యోగం దొరికింది. దేశంలో టీని వ్యాప్తే్చేయడంకోసం ఒక సంస్థ చాలా రోజుల నుంచీ పనిచేస్తోంది. ఊరిలో కొన్ని [ప్రాంతాలను గుర్తించి అక్కడ స్టాను వెలిగించి ఇద్దరు టీ తయారుచేస్తూ వుంటారు ఒకరు టీ లాభాలన్తు గురించి ఉపన్యసిస్తూ వుంటారు. జనం చేరుతారు. ఆ జనానికి ఒకొక్క కప్పుచొప్పున టీ పంచుతారు. టీ కావలసిన వారిక్తీ తమ దగ్గర నున్న చిన్న టీ పొట్లాలను పంచుతారు. టీ చేపే పద్దతిని ఇదివరకే ప్రదర్శించారు కదా - చేసిన టీని ఇంటింటికీ తీసుకెళ్లి పోసేవారు. ఒక బృందం ఉదయం టీ చేస్తే మరో బృందం సాయంత్రం చేసి పంచేవారు. ఒకో ప్రాంతాన ఇలా కొన్ని నెలలపాటు జరిగేది టీకాచి ఇంటింటికీ తీసుకళ్ళో బృందం. ఆ బృందానికి ఒక సూపర్‌వైజరు వుండేవారు. ఊరిలో ఇలాంటి బృందాల పర్యవేక్షణ నియామకాలకు ఒక ఆఫీసరు ఉండేవాడు. ఇలాంటి ఉద్యోగం కోసం ఒక మిత్రునితో సైకిలుమీద భువనగిరికి వెళ్లాం. అక్కడ ఆఫీసరు ఆ మిత్రునికి చుట్టం. టీ బృందం ద్వారా ఆఫీసరు ఇంటి అడ్రసు తెలుసుకొని ఉదయాన్నే అక్కడికి వెళ్ళాం. మిత్రునికి ఉద్యోగం వచ్చింది. అందుక్కావలసిన విద్య మెట్రికు, టీ ప్రచారం చేశారు. ఆ ప్రచార ఫలితాలెలా వున్నాయో తెలుసుకోవాలి. (ప్రచారానికీ ఫలితాలు తెలుసుకొనడానికీ కూడా స్టాటిస్టిక్సు వినియోగం తప్పదు. వంతెన పని నుంచి తిరిగివచ్చిన తర్వాత స్టాటిస్టికల్‌ సర్వేకోసం నాగపూర్‌ నుంచి బోర్డు ఆఫీసరు ఒకరు వచ్చారు. ఆయన సర్వేయర్లకోసం ఎదురు చూస్తున్నాడని తెలిసి నేనాయన దగ్గరకు వెళ్ళాను. అదివరకు టీ పోసిన ఇళ్ల నెంబర్లు ఇచ్చి స్టాటిస్టికల్‌ 'ప్రశ్శలున్న కార్డులు నాచేతికిచ్చాడు ఆ యిళ్లకు పోయి 'ప్రశ్చలకు సమాధానాలు తీసుకుని రావాలి. అంటే ఆ కార్డులను నింపి తీసుకురావాలి. ఒక అద్దెసైకిలు తీసుకుని నగరం అంతా తిరగాలి. నాకు పాతబస్తీ కార్డులను యిచ్చాడు. నీకు హైదరాబాదు బాగా తెలుసుకదా అందుకని ఈ కార్డుల సమాచారం నీవు తీసుకురా, అద్దె సైకిలు కిరాయి నేనిస్తాను అన్నాడు. ఒక కార్డుకు పావలా, సైకిలు కిరాయి అర్ధరూపాయి. ఇదీ నియమం. ఈ డబ్బు హైదరాబాదు సిక్కాకాదు. కల్ట్దారు. అంటే బ్రిటిషు రూపాయలు, పాతబస్తీలో ఏ ప్రశ్నకూ ఎవరూ జవాబు చెప్పరు. ప్రశ్నకు వచ్చే ప్రత్యుత్తరం మళ్లీ ప్రశ్నే, నెంబరు వెతుక్కుంటూ ఓ యింటికి వెళితే ఓ కుర్రవాడు దొరుకుతాడు. యజమాని పేరు, ఆదాయం, వయసు, ఇతరుల సంగతి కావాలి, కుర్రాడికి ఓపదహారేళ్లు వుంటాయి. మీనాన్న వయసు ఎంత అంటే పాతిక అంటాడు. మీ అమ్మ వయసు ఎంత అంటే పదహారు అంటాడు. తండ్రి ఉద్యోగం నెలజీతం సహేతుకంగానే కనిపిస్తుంది. ఇంట్లో వున్న వారి సంఖ్యా సహేతుకంగానే వుంటుంది. టీ సమాచారం ఎలా తెలిసింది అన్న ప్రశ్న ఒకటి వుంటుంది. పత్రికల్లో ప్రకటన, హోర్డింగులు తదితరాలు. నాకు వచ్చిన సమాధానాల్లో ఎక్కువ హోర్డింగులు. ఆనాడు పత్రికా పరనం పాతబస్తీ యేమిటి నగరంలోనే తక్కువ, తెలుగున గోలకొండ పత్రిక, ఇంగ్లీషులో డక్కన్‌ క్రానికల్‌ పత్రికా వుండేవి. లు

తెలుగులోనూ ఉరుదులోనూ ఆనాడు విద్వాంసులు చాలా తక్కువ. ఎక్కువమంది నిరక్షరులు. నేను రాజుకు పదికార్డులు పూర్తి చేసేవాడిని. అప్పుడప్పుడు ఆఫీసరు చెక్కింగుకు వచ్చేవాడు. తనుకూడా సైకిలు ఎక్కి ఈ నెంబర్ల ఇళ్లు చూపమనే వాడు. నేను చూపే వాడిని. ఆయన స్వయంగానే వేసిన ప్రశ్చలక్కూడా అవకతవక జవాబులే వచ్చేవి. ఇలాంటి సమాధానాలు వచ్చినప్పుడు. ఈ కార్డులెలా నింపావు అని అడిగేవాడు. అవకతవక ప్రశ్నలను సహేతుకంగా విశ్లేషించి నింపేవాడినని జవాబు ఇచ్చాను. ఆయన తన ఆఫీసులో ఉద్యోగం ఇస్తానన్నాడు. జీతం ఎనభైరూపాయలు

ఆయన అభిమానానికి కృతజ్ఞతలు చెప్పి నేను రాను అని వినయంగా చెప్పాను. కనగల్‌ ఉద్యోగం హాలీ సిక్కా అయితే ఇది కల్దార్‌ రూపాయలు. ఈ రెండు ఉద్యోగాలూ నేను బతకగలను అన్న విశ్వాసం పెంపొందించు కునేందుకు మాత్రమే చేశాను. అంతే, ఏపని అయినా ఎక్కడయినా చేయగలను అని తెలుసుకున్నాను. మళ్లీ నా పుస్తక పరనం, నేర్చినదంతా మి(త్రులకు చెప్పడం అన్న వ్యాసంగంలో పడ్డాను. నాకు చిత్రకళ అంటే అభిమానం. ఆ విద్య నేర్చుకొనడానికి సాధనకు కూడా ఖర్చు ఎక్కువ. అర్హసాధ్యమైన విద్యలు నాకు పనికిరావు.

"హైదరాబాదులో (బ్రిటిషువారి రెసిడెంటు ఉద్యోగి వుండే ప్రాంతానికి రెసిడెన్సీ బజొరు అని పేరు. ఆ బజారులో నిజాం నవాబు చట్టాలు పనిచేయవు. అక్కడ (బ్రిటిషువారి పాలన, నాంపల్లి గౌరీశంకరవర్మ అనే ఆయన ఆంధ్రపత్రికలు, భారతులు అమ్మే దుకాణం ఆ బజారులోనే వుంది. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయం అన్న (గ్రంధాలయం ఆ బజారులోనే వుంది. చదువుకున్న తెలుగు వారికి ఆ (గ్రంధాలయం సమావేశకేంద్రం. (గ్రంధాలయం బిటిషుపాలన (ప్రాంతంలో వుండేది. అక్కడ జరిగే సమావేశాలకు ముందు నిజాం పోలీసుశాఖ అనుమతి పొందవలసి వుండేది.

ఆ (గ్రంధాలయానికి ఇరవై సంవత్సరాలుగా బిదురు వెంకటశేషయ్య అనే ఆయన కార్యదర్శిగా వుండేవారు. ఆయనకు అలంకార శాస్త్రాల మీద అభిమానం. అందుకని అనేక అలంకారళా(స్తాలను (గ్రంధాలయానికి తెప్పించారు. సంస్కృతాన దాదాపు మూడువందల అలంకార శాస్త్రాలు ఉన్నాయి. అందులో అత్యధిక భాగం కాత్మీరంలో పుట్టాయి. (గ్రంధాలయంలో తీరిక సమయం కాస్త వుంటుంది. ఆ సమయంలో నేను శేషయ్యగారికి ప్రశ్నలు వేస్తూ వుండేవాడిని. ఆయన జవాబులతో నాకు ఆలంకారిక సమస్యలు కాస్తకాస్త అర్ధం అవుతూ వుండేవి,

(గ్రంధాలయ వార్షికోత్సవాలకు (ప్రముఖ సాహిత్యవేత్తలను రావించి ఉపన్యాసాలు ఇప్పించడం ఆనవాయితీ. గ్రంథాలయ రజతోత్సవం 1928లో జరిగింది. దానికి కొవ్యకంర చణపతిముని అధ్యక్షత వహించారు. ఆనాడు ప్రచురించిన రజతోత్సవ సంచికను చదివాను. ఆరజతోత్సవం నాటికి నేను హైదరాబాదు రాలేదు. నాంపల్లి వేమన ఆం(ధ్రభాషా నిలయంలో కన్న ఇక్కడ పుస్తకాలు ఎక్కువ వున్నాయి. తెలుగేకాక సంస్కృతం, ఇంగ్లీషు పుస్తకాలు కూడా వున్నాయి. (గ్రంధాలయం తలుపులు తెరవగానే లోనికి వెళ్లే మొదటి వాడిని నేనే. అలాగే తలుపులు వేసేటప్పుడు ఆఖరివాడినీ నేనే.

వైదిక కర్మలు చేయించే వారిలో రెండు రకాల వారుంటారు. ఒకరు యజ్ఞకర్మలను చేయించగలుగుతారు. వారిని శ్రాతులంటారు. మరొకరు గృహ్యకర్మలు మాత్రమే చేయించగలుగుతారు. వారిని స్మార్తులంటారు. తెలుగున వైదిక (బ్రాహ్మణుల గురించి ఒక సామెత ఉంది. అది - బులుసులేని యజ్ఞం, బలుసులేని తద్దినం ఉండదు అని. బులుసు ఒకానొక వైదిక బ్రాహ్మల ఇంటిపేరు. బలుసు

44 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

అన్నది ఒకానొక కంపలాంటి చెట్టు ఆకు. నేతిమత్తును ఇది తగ్గిస్తుందంటారు. అబ్లికాల సందర్భంగా నేతిని ఎక్కువ తింటారు. బలుసాకు పచ్చడి చేస్తారు.

సాధారణంగా తెలుగునాట యజుర్వేదులు ఎక్కువ. అంచాత వేదాలను చదవ దలుచుకున్నవారు యజుర్వేదాన్నే అభ్యసిస్తారు అలా తమ వేదాన్నే అభ్యసిస్తే దాన్ని స్వాధ్యాయం అంటారు. రుగ్వేదులు, సామవేదులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ రెండు వేదాల్లోనూ పారంచెప్పే వాళ్లు లేనందువల్ల వాటినెవరూ నేర్వరు. ఆశీర్వచనానికి అవసరం అయే ఒకటి రెండు సూక్తాఘన రుగ్వేదం సామవేదం నేర్చుకుంటారు స్మార్తులు. (శ్రాతులకు అలాకాదు వారు హొత్రం ఉద్గీధ నేర్చి ఉండాలి. అంటే రుగ్వేద సామవేదాలను నేర్చి తీరాలి,

రుగ్వేదానికి ఛందస్సు అనే మారు పేరు కూడా వుంది. వేద ఛందస్సును అక్షర ఛందస్సు అంటారు. పద్యాలు ఫ్లోకాలకు ఉపకరించే ఛందస్సును గణ ఛందస్సు అంటారు. తెలుగు పద్యాలు, పాటలకు ఉపకరించేదాన్ని మాత్రా ఛందస్సు అంటారు. వేదపద్యాలను రుక్కులంటారు. గాయత్రీ రుక్కుకు పాదానికి ఎనిమిది అక్షరాలు, మూడు పాదాలు ఉంటాయి. యజుర్వేదానికి ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అని మూడు స్వరాలుంటాయి రుగ్వేదానికి ఈ మూడు స్వరాలే కాకుండా ఫ్లతం అనే మరో స్వరం కూడా వుంటుంది. ఫ్లతం మూడక్షరాల కాలం. ఒక ్రస్వాక్షరాన్ని పలికే కాలానికి అక్షరం అనిపేరు. దీర్జానికి రెండు అక్షర కాలాలు. మూడు అక్షరకాలాలయితే దాన్ని సప్టృతం అంటారు. అంటే అక్షర కాలానికే మాత్ర అని పేరు. యజుర్వేదంలో వున్న ఉదాత్త అనుదాత్త స్వరితాలను కూడా మాత్రా ఛందస్సులోనికి మార్చుకొనవచ్చును. ఉదాత్తం అంటే ఒకటిన్నర మాత్ర. అనుదాత్తం అంటే అర్థమాత్ర. స్వరితం అంటే ఒక మాత్ర. ఇలాగ వేద చందస్సులను అయిదు మాత్రలకు కుదించవచ్చును. మాత్రాఛందోరహస్యం అభ్యాసంతో అలవడుతుంది.

శాక్త మంత్ర [గ్రంధాలకు మంత్రశాస్తం అని పేరు. అది గుప్త శాస్తం. ఆ శాస్త్రం తెలిసినవారు బెంగాల్లోనూ, కేరళలోనూ ఉన్నారని ప్రతీతి. తెలుగునాట కూడా కొందరుండేవారు. అయితే వారు అరుదు. అలాంటి అరుదయిన వ్యక్తుల్లో ఒకరు లక్ష్మీనరసింహ (శ్రౌతిగారు. ఆయన ఈ శతాబ్రి ప్రధమ దశకంలో సికిందరాబాదు మహంకాళి గుడిలో శ్రీ చక్రస్టాపన చేయడానికి వచ్చారు. శ్రీ చ(క్రస్థాపనవల్ల మహంకాళికి మహాశక్తి ప్రతిపత్తి కలుగుతుంది. నాటి నుంచి ఆయన ఆ గుడిపక్కనున్న హోటల్లోనే ఉంటున్నాడు.

ఆయన స్వస్థలం కోనసీమ. నేటికి సుమారు ఏడు శతాబ్దాలకు పూర్వం తమిళనాడు నుంచి శ్రాతస్మార్తాలెరిగిన (బ్రాహ్మణులు వలస వచ్చారు. వారిని కోనసీమ (ద్రావిడులని పిలుస్తున్నారు. వారిక్కడ మూడు వందల అరనై ఇళ్లతో ఒక (గ్రామం నిర్మించుకున్నారు. దానికి పెద్ద ఊరు అని అర్ధం ఇచ్చే "పేరూరు అని పేరు పెట్టుకున్నారు. ఒకనాడు ఆ గ్రామాన ఇంటికొక ఘనాపారి, ఒక శ్రౌతీ వుండేవారని ప్రతీతి. ఇప్పటి సంగతి చెప్పనక్కరలేదు. స్వస్థానాన్ని విడిచి పరాయి (ప్రాంతాలకు వలస వెళల్లినవారికి తమ వారిమీద ఎనలేని అభిమానం ఉంటుంది.

కోనసీమ ద్రావిళ్లను విశాఖ జిల్లాలో పెద్ద (ద్రావిళ్లంటారు. భూ మార్గాన కాక సముద్రయానం ద్వారా విశాఖలో దిమిలిరేవు చేరిన బ్రాహ్మణులను అదే గ్రామం పేర పిలుస్తారు. వారిని చిన్న ద్రావిడులనికూడా అంటారు. ఇలాగే తెరలు తెరలుగా మరి కొన్ని బ్రాహ్మాణ బృందాలు వలస వచ్చాయి, అలాంటి వారిలో ఒకపెద్ద బృందం తొలుత తోటల్లో దిగారు. వారిని తోటరవలనీ, ఆరామ (ద్రావిడులనీ కూడా పిలుస్తారు.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 45

తరవాత పుదూరు ద్రావిడులు, తుమ్మగుంట ద్వారా వచ్చారు. వారు బసచేసిన ఊళ్లపేర్లతో వారు ప్రసిద్దులు ఈ వూళ్లు నెల్టూరుజిల్లాలో ఉన్నాయి. హైదరాబాదులో కొంతమంది స్వస్థానాభిమానమూ, మంత్రశాస్త అభిమానమూగల వారు (శ్రౌతిగారిని హోటేలుగది నుంచి కిందకు దింపుకొచ్చారు. అలాంటి వారిలో మా బావగారు అగ్రగణ్యులు. హొటేలు నుంచి ఆయన్ను తిన్నగా మాయింటికి తీసుకుని వచ్చారు. ఆరాత్రే ఆ బృందానికి శాక్తదీక్షకు ఏర్పాట్టు జరిగాయి. (బ్రాహ్మల్లో చిన్న, బెస్తల్లో పెద్దా - ఈ ఇద్దరికీ పనిభారం ఎక్కువ అంటారు. నాకు ఆరాత్రి నుంచే పనిమొదలయింది. అశ్చశాల, గజశాల, గోశాల, వాల్మీక, శృంగాటకాల నుంచి పంచ మృత్తికలను తెమ్మన్నారు. అలాగే కొన్ని సమిధలు కావాలన్నారు. అప్పుడు మేం సీతారాంబాగు వెనక నుండే వాళ్లం. మాయింటి వెనకన కొండలు. ఆరాత్రి వారు కోరిన సమిధలు, మృత్తికలు చీకట్లో స్పర్శ సహాయంతో వెతికి తెచ్చాను. దీక్షాగారానికి వారు లోనుంచి గడియవేసుకున్నారు. మళ్లీ ఏమన్నా కావలసి వస్తుందేమోనని నేను ఆ గదిదగ్గరలోనే పడుకున్నాను నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియదు. మరునాడు ఉదయం మా బావ చిట్టిశాస్తుర్హు దగ్గర ఆరాత్రి దీక్షా విధానం అంతా ఏకరువు పెట్టాను. దీక్షా విధానం అంతా నాకు తెలిసి పోయినందుకు వారికి ఆశ్చర్యం కలిగింది ఆసంగతి 'శ్రౌతిగారికి చెప్పారు. ఆయనో నిమిషం మౌనంగా ఉండి సరే వాడి సంగతి నేను చూసుకుంటాను మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. నేను అదివరకే శాక్త తంత్రాలమీద కొన్ని పుస్తకాలు చదివాను. 'శ్రౌతిగారికి చిక్కడపల్లిలో మకాం ఏర్పాటుచేశారు. ఓ రెండు గదుల ఇల్టు అది. గదులు దాటిన తరవాత బావి. కాస్త బయలు. నాడు ఆయింటికి అద్దె రెండురూపాయలు. ఆయింట ఒక రాత్రి గడిచిన తరవాత ఆయన టాంగా వేసుకుని మా యింటికి వచ్చారు. నేను నీకోసం వంకాయలు, చిక్కుడు కాయలు కొన్నాను. ఆ కూరంతా ఎవరు తినాలి. లే బట్టలేసుకుని టాంగా ఎక్కు అన్నారు. అప్పటికే యింటకావలసిన సంభారాలన్నీ సమకూరాయి. ఆయనతోపాటు నాలుగు పెట్టెలున్నాయి. వంటకు కావలసిన కొన్ని గిన్నెలు ఒక గ్యాస్‌ స్టా వున్నాయి. ఆరాత్రి ఆయనే వంటచేశాడు. చిక్కుడుకాయ వంకాయకూర చేశాడు. చారువుంది. భోజనానంతరం కాస్త సేపు మాట్లాడుకున్నాం. తరవాత పడుకున్నాం, ఆయన నాలుగ్గంటలకే లేచి కాలకృత్యాలు తీర్చుకున్నారు. టీ పెట్టారు. టీ అయింది లేరా అని నన్ను లేపారు. ఆ ఉదయం పెట్టెల్లో వున్న పుస్తకాల వైనాలను నాకు వివరించారు. ఆపెట్టెల తొళం చేతులు నాకిచ్చి నీక్కావలసిన పుస్తకం తీసుకుని చదువుకొమ న్నారు. పుస్తకాలన్నీ చేతి రాతవి. అచ్చుపుస్తకాలు లేవు. పూర్వ మీమాంసా సూత్రాలు, శబరీ స్వామి వ్యాఖ్య, పెద్ద శ్రౌత (గ్రంధం ఇలా ఒక పెట్టెలో వేదాలకు సంబంధించిన పుస్తకాలున్నాయి. తరవాతి పెట్టెల్లో శాక్త తంత్రాలు ఆయా దేవతల పూజా విధానాలు, దీక్షా విధానాలు వున్నాయి. కాగితం పుస్తకొలన్నింటికి చక్కని బైండువుంది. కొన్ని తాళపత్ర (గ్రంధాలు కూడా వున్నాయి. ఆపెట్టెల్లో “సర్‌జాన్‌ వుడ్రాఫ్‌” రాసిన ఉత్తరం ఒకటుంది. కొన్ని తంత్రాలకు పేర్లు మాత్రమే మిగిలాయి. వామకేశ్వర తంత్రం 36 పటలాలున్న పుస్తకం కూడా వుంది. అసలది అరవైనాలుగు పటలాల (గ్రంధం. పెట్టెల్లోని పుస్తకాలన్నీ ఒక్కొక్కటే పైకి తీసి దుమ్ము దులిపాను. తిరిగి ఆ పుస్తకాలను తీసినచోటనే యథాపూర్వం సర్దిపెట్టాను. శ్రౌత[గ్రంథం మాత్రం కాస్త తిరగేశాను. ఇలా చదువుతూ కూర్చునే సమయం 46 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

కాదనుకున్నాను. ఏ పని చేస్తూ వున్నా రుగ్వేద స్వరాలు వేరు అన్నమాట మనసులోనే సుళ్లు తిరుగుతూ వుంది. నాకు రుగ్వేద పారం చెబుతారా తాతగారూ అని అడిగాను. ఆయన నవ్వి చెబుతాను కాని నీకు రాదురా అన్నారు. ఎందుకని రాదు తాతగారూ అన్నాను “మేం బండ మనుషులం. మాకు శబం మీద తప్ప అర్ధంతో పని ఉండదు. నీక్సు అర్ధం కావాలి. అందుకనే నీకురాదురా అన్నాను - నీకు కావలసిన రుక్కులు కొన్ని అవసరం అయినప్పుడు చెబుతాను” అన్నారు. ఆ సాయం(త్రం సికింద్రాబాదు వెళ్లారు. అక్కడ పాత జైలు వెనక కొన్ని పాత పుస్తకాలు దారుకుతాయి. ఆయన నాగరి లిపిలో వున్న రుగ్వేద సంహిత తెచ్చారు. కాగితాలు చేత్తో చేసినవి, ఖద్దరు కాగితాలు. కాస్త మందంగా వుంటాయి. వాటిని కుట్టలేదు. బైండు చేయలేదు. కాగితాలకు అంకెలు మాత్రం వున్నాయి. అంకెలవార్‌గా బొత్తిపెట్టి వాటిమీద అదే సైజు బల్ల చెక్కలను పెట్టి తాడుతో గట్టిగా కట్టారు. తాడు విప్పి ఒకొక్క కాగితమే తీసి చదువుకోవాలి.

నీకు అర్ధం మీద ధ్యాస. ఇది చదువుకో, నీక్తు అర్హం తెలిస్తే తెలిసిన మేరకు నాకు చెప్పు వింటాను అని ఆ పుస్తకం నాకిచ్చారు. వేదమే కాదు పెట్టెల్లో ఎన్నో తాంత్రిక (గ్రంథాలున్నాయి. అవన్నీ సంస్కృతంలోనే వున్నాయి. అయితే ఆ (గ్రంధాల్లో వున్న సాంకేతిక పదాల అర్ధం ఆయనకు తెలుసు. ఆ సందర్భంగానే నేను వేసిన ప్రశ్నలకు మాత్రం వివరంగా జవాబు చెప్పేవారు. ఇంకో ఇద్దరు యువకులను చేరదీసి ఓ సుముహూర్హాన మా ముగ్గురికీ శాక్త దీక్ష యిచ్చారు. శాక్తంలో కూడా తాలిమం(డత్రం గణపతి మంత్రమే. తరవాత నాకు మాత్రం పూర్ణదీక్ష యిచ్చారు.

పూర్షదీక్ష అంటే నేటి చదువుల్లో మాస్టరు డిగ్రీలాంటిది. కొత్తగా దీక్షితులైన బృందం ప్రతి శుక్రవారం శ్రీచక్రపూజ చేసేవారు. ఓనెల రోజులపాటు తాతగారే వారిచేత పూజ చేయించేవారు. తరవాత లలితా సహ్రనామపూజ, ఆ సహస్రనామాలు నీవు చదివి పూజచేయించమని నాకు అప్పజెప్పారు. నడుముకు ఆసరాలేనిదే ఇంతసేపు పీటమీద కూర్చోలేనురా - పూజలన్నీ నీవే చేయించు అని నాతో అన్నారు. నవావరణ శ్రీచక్రపూజ లలితాసహస్ర నామాలు, ఆదయిన తరవాత కొన్ని వేదరుక్కులు చదవవలసి వుంటుంది.

శాక్తంలో రెండు ప్రధానమయిన శాఖలున్నాయి. ఒకటి వామాచారం. ఇది ఆదిశాఖ. ప్రాచీనం కూడా. వామ అంటే ఎడమ అని అర్హం వుంది కనక తద్విరుద్దమయిన ఆధునిక శాఖను కొందరు దక్షిణాచారం అంటారు. నిజానికి వామాచారశాఖ ఒకటి. కౌళాచార శాఖ రెండవది. వామ అంటే ప్రీఅని అర్ధం. వామకేశ్చర తం(త్రానుసారం అంటే శక్తి పూజా నియమం “వామీభూత్వాయజేత” అంటే (స్త్రీత్వాన్ని ఆవహించుకుని పూజించాలని అర్థం. వామీభూతానికి రెండు పద్ధతులున్నాయి. ఒకటి (స్త్రీత్వాన్ని ఆవహించుకొనడం. రెండు 'ప్రీలాగ వేషం వేయడం.

మొదటిది కరిన సాధనవల్ల మాత్రమే సిద్దిస్తుంది. రెండవది సులభం. తెలంగాణాలో (గ్రామదేవత పూజారులు మగవారు. వారు మీసాలు తీసేస్తారు. జుట్టును జడవేసుకుంటారు. కళ్లకు కాటుక, మెడలో గవ్వలపేరు, చీరకడతారు. చేత ఒక జంగెడ. దానిలో పసుపు, కుంకం తదితర పూజా వస్తువులు వుంటాయి. కొందరిజుట్టున జడలు కట్టించుకుంటారు. ఇది కనిపించినంత సులభం కాదు. స్త్రీత్వాన్ని ఆవహించుకున్న మహానుభావుడు ఒక్కడే. ఆయన దక్షిణేశ్చర కాళీ పూజారి శ్రీ, రామకృష్ణపురమహంస. నిజమైన వామాచారాన్ని పాటించిన వాడు, కనిష్టికాధిప్పుడు అతడొక్కడే.

కౌళం అన్నమాట కులం నుంచి పుట్టింది. కౌళులు సామాజికంగా వచ్చిన కులాలను గుర్తించరు. శాక్త దీక్షితులందరిదీ ఒకటే కులం. శాక్తేయులు కాని వారిని మొదటగా పశువు అని పేర్కొలిటూ వుంటారు.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 47

మనిషికి ప్రకృతి కొన్ని పాశాలు పెట్టింది. మనిషి తనకు తాను కొన్ని పాశాలు పెట్టుకున్నాడు. పాశబద్దుడు నక పశువు అయ్యాడు. శాక్తంలో పంచమకారాలు వుంటాయి. వాటిని ఒల్లనివారు ఓ కొత్త సమయాన్ని ర్పరుచుకున్నారు. దాన్ని సమయాచారం అంటారు. శాక్తేయుల పంచమకారాల్లోనూ (ప్రధమ మకారం మద్యం. సమయాచారులు మద్యానికి బదులు పాలు వాడుతారు. అంతే - మిగతా మకారాల జోలికి పోరు. కౌళికుల్లో కొందరు (బ్రాహ్మణులు ఆచరణలో మద్యం వరకు స్వీకరిస్తారు. తరవాతి మకారాలుండవు. స్త్రీలు కొద్దిగా తాగి ఇష్టమున్నవారికి సమర్పిస్తే దానికి అళిపాత్ర అని పేరు. అళిపాత్ర మిదం తుభ్యం దీయతే పిసితాన్వితం. పశుపాశ సముచ్చేదం కారణం భైరవోదితం” అన్న మంత్రం అందరూ చదువుతారు. క్షీరపాయి శాక్తేయులూ, మద్యపాయి శాక్తేయులూ కూడా ఈ శ్లోకాన్ని చదువుతారు. ఛేదించుకొనవలసిన పాశాలను భైరవుడు పేర్కొన్నాడు. మనిషి తనకు తాను వేసుకున్న పొశాలు ఎనిమిది. వాటిని భైరవుడు ఛేదిస్తాడు. అంటే వాటి ఛేదనకు భైరవతత్త్యం అలవరుచుకొనవలసి వుంటుంది. ఆ పాశాలు ఇవి - ఘృణాశంకాభయం లజ్జా జుగుష్పాచేతి పంచమీకులం శీలంచ జాతించ ఆప్టాపాశా: ప్రకీర్తితా. ఇవీ ఆ ఎనిమిది పాశాలు. ఆదికాలపు గణమానవునకు ఈ పాశాలుండేవి కావు. ఈ ఎనిమిదింటిలో ఘృణా అంటే జాలి. ఒకని మీద జాలి పడడం గొప్పకాదు. జాలి కలగవలసిన అవసరం కల్పించకుండా వుండడం గొప్పదనం. గణదశ తాలిరోజుల్లో ఏడుస్తున్న ఏ శిశువుకయినా ఏ స్త్రీ ఆయినా పాలుకుడిపేది. అదీ ఘృణలేని దశ తాతగారి దగ్గర నేను చేసేపని ఒక్కటే. అది పుస్తకాలు చదవడం. ఆయనకు తెలిసిన విషయాలను అడిగి తెలుసుకొనడం. అంతే. తాతగారు జంటనగరాల్లో వున్న కౌళకూటాలకు నన్ను తీసుకువెళ్లారు. అక్కడ చిత్‌ చయనయాగం చేసిన ఒక సోమయాజి కనిపించాడు. మరికొందరు వేద సంస్కృత పండితులు కనిపించారు. అనేక కులాలవారు కనిపించారు. నగరంలో పేరు మోసిన పుణ్యస్త్రీలు కనిపించారు. మతాంతర వర్తకులు కూడా కనిపించారు. గోస్టిలో శాక్తతంత్రాల మీద చర్చలు జరిగాయి. ఆ చర్చలతోపాటు కన్యాశుల్కంలో బైరాగి వరించిన కూటం కనిపించింది. సాయంత్రం అయేసరికి చిక్కడపల్లిలోనే వుంటున్న ఒక లెకరరుతో కలిసి (గ్రంథాలయానిక్తి బయలుదేరేవాడిని. దారిలో వల్లూరి సుబ్బరాజు అనే ఒక ఇంజనీరు కలిసేవాడు. మా కుళల (ప్రశ్నలు జవాబులు ఛందోబద్దంగా జరిగేవి. దానితో ముగ్గురికీ ఆసుధార పదునెత్తింది. లెక్బరరు పేరు బేతనభట్ల విశ్చనాధం. ఆయనకు సంగీతం మీద కూడా ఆసక్తీ, ప్రవేశం కూడా వుంది. మేం ఇద్దరం తప్పనిసరిగా వెళ్లేవాళ్లం. సుబ్బరాజు తీరికవున్నపుడు మాత్రమే కలిసేవాడు. [గ్రంధాలయ కార్యదర్శి భారం ఇరవై సంవత్సరాలు వహించిన బిరుదు వెంకటశేషయ్యగారు తమ భారాన్ని మరెవరైనా తీసుకోవాలన్నారు. వార్షిక సమావేశం వచ్చింది. కాని కార్యభారం వహించేందుకు ఎవరూ ముందుకురాలేదు. అప్పుడు వల్టూరి బసవరాజుగారు మా యిద్దరి పేర్లూ సూచించారు. చర్చల పర్యవసానంగా మా యిద్దరినీ సంయుక్తకార్యదర్శులుగా ఎన్నుకున్నారు. నేను ఎక్కువ సమయం వెచ్చిస్తూ వుండేవాడిని. విశ్చనాధంగారికి అంత తీరిక వుండేది కాదు. నాక్సు వేరేపని లేదు. నాకు చిత్ర కళమీద అభిమానం. దానికి పెట్టుబడి అవసరం. అది నా వద్ద లేదు, అందుకని చిత్రశా(స్తాన్ని చదవడం ద్వారా ఆ కోరిక తీర్చుకోవాలనుకున్నాను, అందుకని (గ్రంథాలయానికి చిత్ర శాస్త్రాలను తెప్పించాను. 48 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

ధ్ర అప్పటికి నేను అద్వయితినే. శంకరతత్పం ద్వారా నిరీళ్ళారవాది నయ్యాను. అదే ళంకరతత్వంతో నేను భౌతికవాదినయ్యాను. రెండింటికీ శంకరుడే గురువు. (గ్రంథాలయానికి ఎదురుగా మాస్కో వుస్తకళాల ఊండేది. దాని నిర్వావాకుడు కె.సి. గువ్ల ఆయన అణా (గ్రంధమాల ప్రచురణకర్త కూడా. శననిపనాకీమనూాా-.. కొవ్వలి యుగం

అది కొవ్వలియుగం. ఆయన నవలలు డజను రూపాయిచొప్పున రైళ్లలో అమ్మేవారు. మధ్యతరగతి పల్లెటూరి స్రీలకు సైతం పరనాసక్తి కలిగించాయి ఆ నవలలు. చదువూ సంస్కారం గలవారు కొవ్వలి పుస్తకాలను మెచ్చరు. (గ్రంధాలయ పారకులు ఆ పుస్తకాలనే కోరేవారు. రెండు వారాలకే అవి శిధిలం అయిప్రోయేవి. అందువల్ల కొవ్వలి పుస్తకాలను కొంటూనే ఉండాలి. కార్యవర్గానికి ఈ పద్దతి నచ్చలేదు. అందుకని వారు కలి పుస్తకాలను [గ్రంధాలయంలో నిషేధించాలన్నారు. నిషేధాన్ని నేను వ్యతిరేకించాను. నిషిద్రఫలం మీద మోజెక్కువవుతుంది.

కార్యవర్గంలో దీనిమీద చాలా చర్చ జరిగింది. కొవ్వలి పుస్తకాలను ప్రామాణిక (గ్రంథాలతో పోల్చి ప్రసంగాలిప్పించడం మంచిదని నా వాదన. కార్యవర్గం ఆందుకు అంగీకరించింది. (గ్రంథాలయానికి వచ్చే తెలుగు పండితులకు కొవ్వలి పుస్తకం సంపుటులిచ్చి చిలకమర్తి తదితర నవలా రచయితల నవలలను తెప్పించి ఈ రెండూ నవలలను పోలుస్తూ ఆ వారం రోజులూ ఉపన్యాసాలిప్పించాం. నేనూ విశ్చనాథంగారు కూడా ఉపన్యాసకుల్లో చేరాం. ఆ వారం (గ్రంథాలయం ఉపన్యాసాలతో హోరెత్తింది. మేం ఉదాహరణకు తీసుకున్న పుస్తకాలకు డిమాండు పెరిగింది.

కొత్త పుస్తకాలు కొన్నప్పుడు వాటిని పండితుల కిచ్చి వాటి సమీక్షను ఓ ఆరటావు కాగితం మీద రాయించి నోటీసు బోర్డు మీద పెట్టేవారం. ఈ పనుల వల్ల పారకుల విమర్శనా శక్తి పెరుగుతూ వచ్చింది. నిషేధం వల్ల నిషిద్ధ వస్తువు పెరుగుతుందేకాని తరగదు. (ప్రతిషేధంవల్ల అనుకున్న పని సిద్ధిస్తుంది. తృణజలూకాన్యాయంగా విజ్ఞాన పధాన పయనించినట్టు (ప్రతిషేధ ప్రషిద్ద న్యాయం ద్వారా ఉన్నతోన్నత స్తరాలకు చేరు కొనగలుగుతాం. ప్రతిషేధ ప్రతిషిద్ధ న్యాయాన్ని ఇంగ్లీషులో నెగేషన్‌ ఆఫ్‌ నెగేషన్‌ అంటారు. ఇదొక తాత్విక సమస్య,

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 49

విశ్చనాథంగారూ నేనూ కలిసి (గ్రంధాలయానికి కార్డు ఇండెక్సు కేటలాగు తయారు చేద్దామనుకున్నాం. మా ప్రణాళికకు మరికొందరు సాయం చేస్తామని వచ్చారు. పుస్తకాల 'ప్రకారంగాను, [గ్రంథకర్తల వారీగాను కార్డులు రాయడం మొదలుపెట్టాం. నేను సంస్కృత పుస్తకాలు తీసుకున్నాను. నాకు దేవనాగరి లిపి చదవనూ రాయను వచ్చును. అందుకని సంస్కృత (గ్రంధాలను ఎంచుకున్నాను. కార్డు రాయడానికి ముందు పుస్తకం కొద్దిగా చదివి వషయం తెలుసుకునేవాడిని. ఆ కేటలాగు ఆ తరవాత ఎంతవరకు ఉపయోగించిందో తెలియదు. మా యింటికి భారతి, గృహలక్ష్మి వస్తూ వుండేవి. వాటిని నేను చాలా ఆసక్తిగా చదివేవాడినని ఇదివరకే రాశాను. భారతిలో చుక్కలు అని గొబ్బూరి వెంకటానంద రాఘవరావుగారు పురాణ గాధలను వివరించేవారు. ఆయనకు చిన్నతనంలోనే ఉత్తరం రాశాను, ఆ పుస్తకం వుంటే పంపండని. భారతివారు ఆ వ్యాసం పడ్డ కాగితొలను ప్రతినెలా పంపించేవారు. అలా వచ్చిన కాగితాలను ఓ పుస్తకంగా కుట్టి నాకు పంపించారు. నా అసక్తిని అభినందిస్తూ ఒక ఉత్తరంతో పంపిస్తూ ఈ పుస్తకం మీకు నా బహుమానం అని రాశారు. నా సంయుక్త కార్యదర్శి పదవికి ఏడాది నిండింది. వార్షికోత్సవానికి సన్నాహం అవులోంది. వార్షికోత్సవ ఆహుతునికి లేఖలు రాయడం పాత కార్యదర్శి పని. నేను నా అభిమాన రచయిత గొబ్బూరి వెంకటానంద రాఘవరావుగారిని కార్యవర్గం అనుమతితో ఆహ్వానించాను. (గ్రంథాలమీదా, (గ్రంథాలయాలమీదా చక్కని ఉపన్యాసం చేశారు. ద్వయితమయిన మాధ్వం నాపుట్టమతం. ఆయినానా అభిమాన సిద్దాంతం ఆద్వయితం అని ఆయన చెప్పారు. అప్పటికి నేనూ అద్వయితినే. శంకర తత్వం ద్వారా నిరీశ్చరవాదినయ్యాను. అదే శంకరతత్వంతో నేను భౌతిక వాదినయాను. రెండింటికీ శంకరుడే గురువు. (గ్రంథాలయానికి ఎదురుగా మాస్కో పుస్తకశాల వుండేది. దాని నిర్వాహకుడు కె.సి. గుప్త, ఆయన అణా(గ్రంధమాల ప్రచురణకర్త కూడా. అక్కడే నాకు ఆళ్వారు స్వామితో పరిచయమయింది.

ఆ పుస్తక శాలలో కూర్చుని పుస్తకాలు చదివేవాడిని. నా నిరీశ్చర వాదం, భౌతిక వాదం నన్ను మారిజ్టజం వైపు మళ్లించాయి. మా బావగారు తాండూరులో వుండేవారు. శాక్త దీక్షలకు మూలకారణం ఆయన, హైదరాబాదు వార్తలు నాకు ఉత్తరాల ద్వారా తెలియపరుస్తూ వుండు అని ఆయన నాకు చెప్పారు. ఉత్తరాన్ని ఉత్తరంగా కాకుండా ఒక పత్రికలాగ తయారుచేసి పంపేవాడిని. అలా పంపే ఉత్తరాలకు హర్కారా అని పేరుపెట్టాను. ఇది మహారాష్టపదం. చిలకమర్తి అనువదించిన మహారొష్ట నవలల్లో ఈ మాట తరుచు కనిపిస్తూ వుంటుంది.

హర్కారా అంటే వార్తావహుడు అని అర్ధం. ఉత్తరంలో ప(త్రికాలక్షణాలన్నీ పాొదివేవాడిని. వార్తలు, వ్యాఖ్యలు అప్పుడప్పుడు కార్టూనులు, పద్యాలు, జోకులు అన్నీ వుండేవి. తొలిలేఖకు పైన లోగోతోబాటు సంపుటం, సంచిక సంఖ్య, రాసిన రోజు తారీకు రాసేవాడిని. తరవాత దాన్ని వారపత్రికగా మార్చాను. పత్రికంతా నాచేతిరాతే. ఇలా కొంతకాలం హర్కారా నడిచింది. శాక్తగ్రంథభాధ్యయనము, యాజనం (క్రమంగా తగ్గుతూ వచ్చింది.

వాత్స్యాయనుడు అరవైనాలుగు కళలను పేర్కొన్నాడు. జయ మంగళ వ్యాఖ్యలో చిత్ర లక్షణాలను

వివరిస్తూ ఒక శ్లోకం యిచ్చాడు, ఆ భ్లోకం ఇది - రూప భేదాః ప్రమాణాని భావ లావణ్య యోజనం

సాదృళ్యం వర్షికా భంగం ఇతి చిత్రషడంగకం అని. అంటే చిత్ర కళకు ఆరు అంగాలుంటాయి. ఒక

మనిషికి మరో మనిషికి రూపంలో తేడాలుంటాయి. ప్రమాణాలు అంటే కొలతలు. చిత్రాలకు శిల్పాలకు 50 తి రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ

కూడా కొలతలుంటాయి. ఈ కొలతలను జానలతో కొలుస్తారు. అలా కొలిచి గీసిన ఆకృతిని కాయ మానాండకం, ముఖాండకం అంటారు.

ఆంగిక ఆహార్య సాత్వికాల ద్వారా భావం వ్యక్తం అవుతుంది. దానికి భావయోజనం అనిపేరు. ఇక లావణ్య యోజనం. దీన్ని మహాకవులే స్పష్టంగా నిర్వ్చచించ లేకపోయారు. లవణం నుంచి వచ్చేది లావణ్యం. మన శరీరంలో వుండే రకరకాల క్షారాలు ఆయా ఆంగాలకు పుష్టిని, అందాన్ని ఇస్తాయి. ఆ అందానికే లావణ్య యోజనం అని పేరు. మనం అనేక వృత్తులు, అంతరాలు గల వ్యక్తులను చూస్తూ వుంటాం. అలాంటి వారి బొమ్మల్ని చూసినప్పుడు ఇతడు ఉపాధ్యాయుడు. ఇతడు ఉద్యోగి అని చెప్పగలుగుతాం అలా చెప్పగలగడానికి తోడ్పడేదే సాదృళ్యం. రంగుల తీరు వర్షికాభంగం .

ఈ షడంగాలనూ వివరిస్తూ షడంగ చిత్ర కళ అని ఓ పెద్ద వ్యాసం రాశాను. ఆ వ్యాసాన్ని (గ్రంధాలయంలోనే చదవాలనుకున్నాను. శ్రీమతి సంగం లక్ష్మీబాయి చిత్రకారిణి. సమావేశానికి ఆమెను అధ్యక్షత వహించమన్నాను. తమ్ముడూ నేను సభలో మాట్టాడలేనంది. నాకూ అదే అవస్థ అన్నాను. వ్యాసం ఒక ఎక్సర్‌సైజ్‌ పుస్తకంలో రాశాను. (ప్రేక్షకులను చూస్తే సభాకంపం. కాని ముఖానికి పుస్తకం అడ్డుపెట్టుకుని చదివినా మౌట్టాడినా సభాకంపం బాధించదన్నాను. నేను అలాగే మాట్టాడేశాను. ఆమె అధ్యక్ష పలుకులక్కూడా ఆ పుస్తకాన్నే వాడుకున్నారు.

అడివి బాపిరాజుగారు అప్పుడు మీజాన్‌ అనే తెలుగు పత్రికకు సంపాదకునిగా వున్నారు. ఆ కార్యాలయం ఏసిగార్డ్‌లో వుంది. అక్కడికి వెళ్లి వ్యాసాన్ని ఆయనకు చూపించాను. ఆయన అంతా చదివి యంగ్‌మాన్‌్‌ బాగుంది అన్నారు. షడంగాలను ఆరురోజులు ధారావాహికంగా అచ్చువేశారు. యంగ్‌మాన్‌! అప్పుడప్పుడు కనిపిస్తూ వుండు అన్నారు. మీజాన్‌ కన్న కొంచెం ముందు డక్కన్‌ క్రానికల్‌కి అనుబంధంగా తెలంగాణా అన్న తెలుగు పత్రిక మొదలయింది. దానికి విశ్వనాధ సత్యనారాయణగారి తమ్ముడు రామ్మూర్తి సంపాదకుడు.

రామ్మూర్తిగారు సంస్కృత పండితులు. వార్తాపత్రిక రాయసాలు ఆంధ్రభాషను భ్రష్టం చేస్తున్నారని ఆయన నమ్మకం. ఆంధ్రభాష మడిని కాపాడ్డం కోసం ఉభయభాషా (్రవీణులను (ప్రూపురిడర్తుగా

ళా నియమించారు. ఆ పత్రికలో పనిచేసేవారిలో నా మిత్రులున్నారు. నాటి సాహిత్య సేవకుల మీద ఒక హాస్యనాటిక రాసి ఆ పత్రికకిచ్చాను. ప్రూఫ్‌రీడర్లతో సరదాగా మాట్లాడేవాడిని. వారి ఉభయభాషా ప్రావీణ్యం సోకకుండా ఆనాటిక అచ్చు అయింది. కాని ఆ రాత్రి ఆక్కడే ఉండిపోవలసి వచ్చింది, రజాకార్‌ స్రష్ట బహదూర్‌ యార్‌ఖాన్‌ మరణించాడు. ఆయన అభిమాన గణం రోడ్లమీద పడ్డారు.

“అరసున్నల వ్యయంబులు భరమైైన సమాసములు విభక్తులు సంధుల్‌ దరి గొలుచుతా - వెంకయ గురువరునకు నిరతమేటికోల్లిడు” మని మహాకవి కృష్ణశా(స్తి శాసించినా ఆ సంగతి తెలిసిన వారిక్కడ ఎవరూ లేరు. అంచాత తెలంగాణా పత్రిక కొద్ది రోజుల్లోనే కన్నుమూసింది. నేను మాత్రం అప్పుడప్పుడు మీజాన్‌ పత్రికకి వెళుతూ వుండేవాడిని.

బెజవాడలో (అప్పటికి విజయవాడగా మారలేదు) అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. దాని (ప్రధాన కార్యదర్శిగా చెదలవాడ పిచ్చయ్య ఎన్నికయ్యాడు. హైదరాబాదులో కూడా ఆ సంఘాన్ని స్థాపించడం కోసం వచ్చాడు. ఆళ్వారు స్వామిని అందుకు తగిన ఏర్పాట్టు చేయమన్నాడు. స్వామి నన్ను పుస్తకశాలలో కలిసి యీసంగతి చెప్పాడు. కాస్త ఆలోచించి పిచ్చయ్యతో సహా మీజాన్‌ ఆఫీసుకెళ్లి బాపిరాజుగారిని

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 51 భళంయ్య (గ్రంరాలవ్రా / నా (విమ '* (4 0.10.సటరి టై

కలవమన్నాను. అంతే, బాపిరాజు అధ్యక్షులుగా సబెడిటర్జు కార్యవర్గంగా తెలంగాణా అభ్యుదయ సంఘం ఏర్పడింది.

ఈ సంఘానికి కార్యదర్శి ఆళ్వారు స్వామి. బెజవాడ అభ్యుదయ రచయితల సంఘం సభ్యుడు (ప్రయాగ కోదండరామశా'స్తి. కమ్యూనిస్టు పార్టీ ప్రజాశక్తి అన్న పత్రికకు డిక్షరేషను తీసుకున్నారు. బాపిరాజుగారి చేత దానికి లోగో రాయించుకు రమ్మని శాస్త్రిని పంపించారు. శాస్త్రి, బాపిరాజుగారి చుట్టూ చాలాసార్జు తిరిగాడు. పనికాలేదు. పుస్తకశాల్జో కలిసి అంతా చెప్పాడు. అప్పుడు నేను లోగో గీసి బాపిరాజుగారికి చూపించాను. యంగ్‌ మాన్‌ బాగుంది అన్నారు. దానిమీద ఆయన సంతకం తీసుకుని శాస్రికిచ్చాను. బాపిరాజుగారి పేరే రాయాలి అని ఆయనకు చెప్పి పంపించాను. అది ఆయన పేరు మీదే వచ్చింది.

స్మ రచన జర్నలిజం కళాశాల ప్రచురణలు

దిద్దుబాటు - శ్రీ జియస్‌. వరదాచారి రూ.70 (పత్రికల వార్తల తీరుతెన్నులను విశ్లేషించే వ్యాసాలు) నాటి పత్రికల మేటి విలువలు రూ.50 శ్రీ పొత్తూరి వెంకటేశ్చరధావు తెలుగు పత్రికారంగం : నిన్న-నేడు-రేపు రూ. 70 (వ్యాస సంకలనం) అప్పుడు - ఇప్పుడు - శ్రీ జి. కృష్ణ రూ. 70 రిపోర్టర్ల కోసం రూ.15 ప్రతులకు : రచన జర్నలిజం కళాశాల కేశవ్‌ మెమోరియల్‌ ఎడ్యుకేషనల్‌ క్యాంపస్‌, నారాయణగూడ హైదరాబాద్‌ - 500 029 ఫోన్‌ : 3222364 52 అ రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ

అవ్పుడు ఏ నందర్భం వచ్చిందో తెలియదు కాని నిజాం నవాబును నారాయణగూడా బౌరస్తాలో ఉరితీయాలని ఒక నంపాదకీయం రాశాను. మర్ప్చాడు కుందూరు ఈళ్చురదత్తు, బావిరాజుగారికి ఫోను చేశారు. బాపిరాజూ నిన్సెందుకు ఉరితీయరాదు? అని ఆయన (వళ్చించాడు. అదేమిటోయ్‌ అ వేళాకోళం అన్హారు బాపిరాజుగారు. నాయనా. లేఖక వృత్తి ('ప్రజాజ్తి పత్రికలో పనిచేయడంకోసం విద్వాన్‌ విశ్వానికి పిలుపు వచ్చింది. స్వస్థలంలో కొన్ని సద్దుబాట్లు చేసుకొనడానికి ఒక నెల రోజులు 'సెలవుపెట్టాడు ఆరాత్రి షిప్టు విశ్వానిది. అందుకని బాపిరాజుగారే ఆపషిప్ప చెయడానికి నిర్ణయించుకున్నారు. ఆ సమయాన నేనక్కడున్నాను. యంగ్మాన్‌ విశ్చం స్థానంలో నిన్ను నియమిస్తున్నాను అన్నారు. షిస్ట ఈ రాత్రినుంచే అన్నారు. వార్తా పత్రిక ముక్కూమొహం యింతవరకు నాకు తెలియదన్నాను అందుకే ఈ రాత్రి మనిద్దరమూ పిప్పుచేద్దాం అన్నారు. ఇద్దరం అక్కడి నుంచి బాపిరాజుగారి ఇంటికి వెళ్లాం, బాపిరాజుగారి మకాం నాంపల్లి రెడ్‌హిల్సులో. మీజాన్‌ ఆఫీసు ఏసిగాక్ట్స్‌లో. ఆరాత్రి బాపిరాజుగారింటనే భోజనం చేశాను వారి అమ్మగారు అన్నం సెట్టాను బాబూ అన్నారు. సెట్టాను అన్నమాట అక్కడ తొలిసారి విన్నాను. తరువాత్తరవాత అది పశ్చిమగోదావరి జిల్లా నియోగి (బ్రాహ్మల పరిభాష అని అర్థం అయింది. భోజనానంతరం బాపిరాజు ఒక పరుపుచుట్ట, మరచెంబు, కాఫీ ఫప్లాస్కు తీసుకున్నారు. ఇద్దరం టాంగా ఎక్కిబయల్టేరాం. మీజాన్‌ ఆఫీసున్న ఖుస్రూ మంజిల్‌ ఒక కొండమీదుంది. కౌండచేరిన తరవాత ఇరవై మెట్టెక్కాలి టాంగామెట్లదాకా వచ్చింది. టాంగాదిగి పరుపుచుట్టా, మరచెంబూ నేను పట్టుకున్నాను. కాఫీ ప్లాస్కు బాపిరాజుగారు పట్టుకున్నారు మెట్టెక్కాం. మెట్లెక్కగానే పెద్దహాలు. హాలుకావలనున్న పొడుగాటి వరండాలో మూడు భాషల మీజాన్‌ పత్రికా సిబ్బంది కుర్చీలు టేబుల్సు వున్నాయి. బాపిరాజుగారు హాల్లోనే పక్కపరిచారు. ప్లాస్కు తీసి తానో కప్పుతాగి నాకో కప్పు కాఫీ యిచ్చారు. సిగరెట్టు తీసుకుని వెలిగించుకున్నాం. సిగరెట్టపెట్టెతీసి నాకో సిగరెట్టిచ్చి తానొకటి నోటపెట్టుకుని అగ్గిపుల్ల వెలిగించారు. కుర్రవాళ్ళు ఆయన్ని మామయ్యగారు అంటారు. పెద్దలాయన్ను బాపిబావ అనేవారు. నేను చిన్నవాడినీ ప్ర 3 రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 5

కాను పెద్దవాడినీకాను. అందువల్ల ఆయన్ను బాపిరాజుగారు అనేవాడిని. నాటి వార్తా సంస్థ కార్యాలయం ఎక్కడో ఉండేది. వార్తలు ఆ కార్యాలయానికి వస్తూ వుంటాయి. వారు ఆ వార్తలను టైపు చేసి సైకిలు 'మెసంజర్ల ద్వారా పత్రికా కార్యాలయాలకు పంపిస్తూ వుంటారు, వార్తలు వచ్చే వరకు కబుర్జాడుకున్నాం. వార్తలు వచ్చాయి. అందులో వోవార్తను ఏరి నాచేతికిచ్చి యంగ్మేన్‌ దీన్ని తెలుగులోకి అనువదించి ఇయ్యి అన్నారు. కాగితం అందుకున్నాను. నాకు ఇంగ్రీషురాదు. అయినా కొన్ని ఇంగ్లీషు పుస్తకాలు చదివి విషయం (గ్రహించగలిగాను. ఈ కాగితంలో వార్త వుంది. ఇది కూడా కూడబలుక్కుని చదివితే విషయం అర్ధం అవుతుంది. ఆ సమాచారాన్ని ఇంకొకరికి చెప్పే తెలుగు భాష రాస్తే సరిపోతుందనుకున్నాను. ఆ కాగితాన్ని బాపిరాజుగారికి చూపించాను. యంగ్మెన్‌ బాగుంది అన్నారు. ఆరాత్రి ఆలా రెండుమూడు కాగితాలు తెలుగున రాశాను. ఆరోజుల్లో ఫైనల్‌ ప్రూపు రాసినవాడే చూసుకోవాలి. బాపిరాజుగారు (ప్రూపు గుర్తులు చెప్పారు. నేను రాసిన వార్తల (ప్రూపులు చూశాను. తరవాత ఇద్దరం కంపోజింగ్‌ రూంకి వెళ్ళాం. బాపిరాజుగారు పేజ్‌ మేకప్‌ చేయించారు. పేజి ప్రూపు చూశాం. బాగానేవుంది. అప్పటికి ప్రింటర్‌ మీద ఇంగ్లీషు మీజాన్‌ నడుస్తోంది. ఓ గంటలో మిషన్‌ ఖాళీ అయింది. అప్పుడు తెలుగు మీజాన్‌ మెషిన్‌ ప్రూపు తీసి ఇవ్వగలిగారు. బాపిరాజుగారు ఆ మెషిన్‌ ప్రూపు చూసి ఎన్ని పేపర్టు ప్రింటు చేయాలో మేనేజిమెంట్‌ నిర్ణయించిన అంకెను వేసి స్టయిక్‌ ఆర్డరు రాసి సంతకం పెట్టారు. అప్పటికి తెల్లవారి పోయింది. మేం హాల్లోకి వచ్చి పక్కచుట్టి ఫ్లాస్కూ మరచెంబూ తీసుకుని బయలుదేరాం. మర్నాడు నైట్‌ డ్యూటీ శ్రీనివాస చక్రవర్తి గారిది. నేను కూడా ఆయన వెంట వెళ్లాను. బాపిరాజుగారిలాగ పక్కచుట్టా, మర చెంబూలేవు. మేం తిన్నగా మా విభాగానికి వెళ్లి కుర్చీలమీద కూర్చున్నాం. క్రితం రాత్రి నా అనుభవాన్ని వివరంగా చక్రవర్రిగారికి చెప్పాను. నా అనువాద పద్దతిని చక్రవర్తిగారు మెచ్చుకున్నారు. ఏదయినా ఇంగ్లీషు మాట అర్ధంకాకపోతే డిక్షనరీ చూడవద్దు అన్నారు. పక్కనున్న వాడిని అడిగి తెలుసుకొండి. అందులో న్యూనత లేదు. ఒకే పదానికి చాలా అర్జాలుంటాయి. డిక్షనరీ ఆ అన్ని అర్జాలనూ ఇస్తుంది వార్తకు సరిపడు అర్ధం వెతకడం కష్టం. పక్కనున్న వాడిని అడిగితే టకీమని చెప్పేస్తాడు. తెలియని విషయాన్ని గురించి తోటివారి నడగడం జర్నలిజంలో న్యూనతకాదు. అందుకని ఒకేమాటకు అర్ధం ఎన్నిసార్లడిగినా తప్పులేదు అని చెప్పారు. తరవాత శీర్షికాక్షరాల నెంబర్లను వివరించారు. లీడుకు వాడే అక్షరాలను, బాడీకి వాడే అక్షరాలను వివరించారు. పేజ్‌మేకప్‌లో ఒకేపాయంటు శీర్షికలను పక్కనే పెట్టరాదు. (ప్రధాన శీర్షిక ఇవ్వదగ్గ వార్త ఏదో, ఎంచుకొనడం ఎలాగో పారం చెబుతూ కూర్చున్నారు. ఇంతలో వార్తాహరుడు న్యూసు కాగితాలు తెచ్చాడు. ఆరాత్రి చక్రవర్తిగారి వెనక నేను కంపోజింగ్‌ రూముకు వెళ్లాను. ఆయనతో చర్చించి నేనే పేజ్‌మేకప్‌ చేయించాను, పేజి ప్రూపు వచ్చింది. అందులో వార్తా దోషాలేకాదు అద్వర్‌టైజ్‌మెంట్ట (ప్రూపుదోషాలు కూడా చూడాలి. వాటిని చూసిన తరవాతనే ఓకే చేయాలని చక్రవర్తిగారు చెప్పారు. ఒకే మిషను మీద ఇంగ్లీషు తెలుగు పత్రికలు రెండూ అచ్చు అవుతాయి. ముందు ఇంగ్లీషు అచ్చుకావాలి. అది అయిన తరవాతనే తెలుగు వేస్తారు. తెలుగు మిషిను (ప్రూపురావడానికి చాలా ఆలస్యం అవుతుంది. అది వస్తేకాని 'ప్రింటార్డరిచ్చి సంతకం చేయాలి, తెలుగు ప్రూపురీడర్లు ఇద్దరుండేవారు. ఒకాయన జె. నరసింహారావుగారు. ఆయన నాటకాల్లో ఆడవేషాలు వేసేవారు. చ(క్రవర్తిగారికి బాగా పరిచయం. ఆయన జ్యోతిష్యుడు కూడా. ఆయనే లెక్కలు 54 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

కట్టి నా పుట్టినరోజు మార్చి 24అనీ సంవత్సరం 1920 అనీ నిర్దారణ చేశాడు. నేను 1951లో శ్రీలంకకు తీసుకున్న పాస్‌పోర్టుకు అదే పుట్టినరోజు యిచ్చాను. అప్పటి నుంచీ ఆ తేదీయే ఖాయమయింది. రెండో పఫ్రూపురీడరు యువకుడు. అతడిపేరు సింగరాజు లింగమూర్తి. అతడు తరువాత నవలాకారుడయ్యాడనీ ఆ నవలలకు బహుమతులు కూడా వచ్చాయనీ తెలిసింది.

నెల అయిపోయింది. జీతం తీసుకుని ఇంట్లో కూర్చున్నాను. ఒకనాడు చకక్రవర్తిగారు, తిరుమల రామచంద్రుడు మా యిల్లు వెతుక్కుంటూ వచ్చారు. బాపిరాజుగారికి ఎదురుగా కనిపించినవాడే పెళ్లికొడుకు అనే తత్వం. ఈనెల రోజుల్లోనూ నీకూ మాకూ మనసులు బాగా కలిశాయి. విశ్చం స్థానంలో మరొకరిని వేయాలికదా, బాపిరాజుగారు ఎవర్ని వేస్తారో ఆ వచ్చేవాడు ఎలా వుంటాడో తెలీదు. అందుకని అప్పుడప్పుడు ఆఫీసుకువచ్చి కనిపిస్తూ వుండు అన్నారు. నిజమే. సహచరులతో నేను కలిసి పోయాను, కొత్త వ్యాపకాన్ని వెతుక్కునే కన్న కాస్త అలవాటయిన ఈ వ్యాపకమే మేలు అనుకున్నాను.

మిత్రుల సలహా పాటించి అప్పుడప్పుడు మీజాన్‌ ఆఫీసుకు వెళుతూ వుండేవాడిని. విశ్చం స్థానంలో నన్నే నియమించారు బాపిరాజుగారు. జీతం అరవైరూపాయలు - ఇతరులకెంతెంత ఇస్తున్నారో నాకు తెలియదు. తెలుసుకొనడానికి యత్నం కూడా చేయలేదు. బాపిరాజుగారికి మాత్రం నెలకు రెండువందల రూపాయలు. అంతవరకు ఎడ్వర్‌టైజు డిపార్టుమెంటులో పని చేసే బుద్దవరపు చినకామరాజుకూడా ఎడిటోరియల్‌ సెక్షన్‌లోకి వచ్చి చేరాడు. అతడు బాపిరాజుగారికి మేనల్టుని వరస. అతడు నిత్యరుణానందస్వామి. గొప్ప అప్పారావు. దైన్య కళా కుళలుడు,.

మీజాన్‌ తొలిరోజుల్లో సబెడిటర్హు చాలా మందే ఉండేవారు. (క్రమంగా ఒకరొకరే ఇతర పత్రికల్లో చేరి పోయారు. ఇక్కడిక తెలుగుపత్రికలు లేవు. డక్కన్‌'క్రానికల్‌, హైదరాబాదు బులిటన్‌ అన్న రెండు ఇంగ్లీషు పత్రికలుండేవి. అందులో డక్కన్‌ క్రానికల్‌ నేటికీ వుంది. దాని అనుబంధ తెలుగు పత్రిక తెలంగాణా అంతరించిన చాలా కాలానికి ఆంధ్రభూమి అనే పత్రిక వెలువడింది. ఇంగ్లీషు మీజాన్‌ సంపాదకీయం రాసేది. దాన్ని ఉరుదు, తెలుగు మీజానులు అనువదించేవి. అంతేకాని తెలుగు, ఉరుదు మీజానులు స్వతంత్రంగా రాసేవి కావు,

పత్రిక వచ్చిన కొత్త రోజుల్లో ఇంగ్లీషు సంపాదకీయాన్ని అనువదించే వారు. మేం అనువదించి పెడతాం లెండి అని సబెడిటరులంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. ఎడిటరే ఎడిటోరియల్‌ రాయాలన్న ఒక దుర్‌భ్రమ ఆంధ్రప్రభలో పుట్టింది. అలాంటిది బాపిరాజుగారిలో కూడా వుండేది. మీజానులో ఒక్క ఇంగ్లీషు ఎడిటరు తప్ప మిగతా ఇద్దరెడిటర్జు స్వతంత్రంగా తమ భాషలో ఎడిటోరియల్‌ రాసే వీలులేదు. బాపిరాజాగారికి ఎడిటోరియల్‌ అనువాదం మోజు తీరగానే సబెడిటర్లను ఆఅనువదించమనేవారు. ఎడిటోరియలు ముట్టబోమని వారు ఒట్టు పెట్టుకున్నారు.

నా ఉద్యోగం ఖాయం అయిన తరవాత మీ ఒట్టులో యంగ్మెన్‌ లేడు కాబట్టి అతడిని విడిచిపెట్టండని బాపిరాజుగారు ఆర్జించారు. మిగతా వారు అందుకు అంగీకరించారు. నాటినుంచీ ఎడిటోరియల్‌ అనువాదం నావంతు అయింది. నాకు (క్రమంగా ఉరుదు సిబ్బందితో పరిచయం పెరిగింది. నాకు ఉరుదు వచ్చును. అప్పుడప్పుడు ఉర్హు మీజాన్‌ చదివేవాడిని. ముగ్గురికీ వార్తలొకలాంటివే వస్తాయి. కాని ఉరుదు మీజాన్‌లో రజాకార్ల అనుకూల వార్తలెక్కువ వుండేవి, (గ్రామాల నుంవి పత్రికలో ప్రచురణకు గాను చాలా వార్తలు పోస్టులో వచ్చేవి.

ఆ వార్తలు వచ్చిన కవర్తన్నీ చింపేసి వచ్చేవి. ఎవరు చింపుతున్నారో అర్ధం అయేదికాదు. ఈ విషయాన్ని గురించి మిత్రులతో చర్చించాను. చింపే వారెవరో ఎందుకు చింపుతున్నారో వారికీ అంతుపట్టలేదు.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ € 55

ఒకరోజున మేనేజరు సెలవుపెట్టాడు. టపా అంతా మేనేజరుదగ్గరకే వచ్చేది. ఆయన రాలేదు కనక అయ్య వారు డబ్బులు యిస్తే వారి వార్తలను ఇక్కడి పత్రికలు అలవాటు చేశాయని మాకు అర్హం + వరకు తెలంగాణా భాషలిపి అర్ధంకాక ఆ వార్తలనెవరూ పట్టించుకునేవారు కాదు. ఉరుదు పత్రిక అనధికారంగా రజాకారు పత్రిక అయినప్పుడు తెలుగు మీజాన్‌ ఆంధ్రమహాసభ వార్తలను ఎందుకు వేయకూడదు. అని నేను ప్రశ్నించాను. బాపిరాజుగారు, మిగతావారు నాతో ఏకీభవించారు. తెలంగాణా భాష లిపికూడా కోస్తాభాష లిపులకు కాస్త భిన్నంగా వుంటుంది. ఆరెండూ నాకు తెలుసును. యత్నిస్తే అనేక భాషలు, లిపులు తెలిసిన రామచం(ద్ర లాంటివారికి తెలుసుకొనడం కష్టం కాదు. నేను రోజూ ఆ లేఖలు చదివి వాటిని పత్రికా భాషలో తిరగ రాసేవాడిని. ఆ వుత్తరాలలో కొన్ని స్టానిక ఇబ్బందులకు సంబంధించినవి వుండేవి. మరికొన్ని దొరలు, రజాకార్ల దురంతాలను గురించి విపులంగా చెప్పినవి వుండేవి,

ఈ రెండు రకాల లేఖలను రెండు వేర్వేరు సంచులలో పెట్టి ఆసంచులమీద బురద గొడ్డు, నాగుపాములు అని రాసేవాడిని. నాలుగు బురదగొడ్లకు రెండునాగుపాముల లెక్కన ఫీడు చేయాలన్న నియమం ఏర్పరుచుకున్నాం. ఓసారి రెండుమూడు నాగుపాములను కలిపి కట్టారు. సోదరుల కరోరకృత్యాలు అని ఎనభైపాయింటు శీర్షిక పెట్టి అచ్చుకిచ్చాడు రామచంద్ర. ఆ వార్త చాలా మందిని ఆకర్షించింది సంపాదకీయ రచన నావంతు. కొన్నాళ్ళు ఇంగ్లీషు శీర్షికకు తెలుగు అనువాదం తాలిపేరా అనువాదం. అంతే ఆ తరువాత అంతా స్వకపోల కల్పితం.

ఆ తరవాత విషయం ఇంగ్లీషుకు భిన్నం, అలా నడిచేవి ఎడిటోరియళ్లు కడవెండిదొడ్డి కొమరయ్యను హత్యచేసినప్పుడు బేనరు అదే, అమరజీవి బొమ్మవేశాం. నేను లేచింది లేచింది ఒక విష్ణవజ్వాల అని పాటరాశాను. బాపిరాజుగారు దాన్ని చూసి కాస్త మైల్టుచేయి అన్నారు. కాస్త పలచన చేసిన పాట అచ్చుకిచ్చాను, అదే సమస్య మీద సంపాదకీయం రాశాను. జనగాం తాలూకాలో ఆకునూరు, మాచిరెడ్డిపల్లె అన్న రెండు (గ్రామాల్లో రజాకార్డు పోలీసులు బీభత్సం సృష్టించారు. ఇళ్లల్లో దూరి (స్రీలమర్మావయవాల మీద సిగరెట్లతో కాల్చారు. జనాన్ని చారలు తేరేలా కొట్టారు.

ఇంట్లో జొన్టలగూనల్లో, నూనె దుత్తల్లో మూత్ర పురీషాలు నింపారు. డాక్టరు జయసూర్య తన చెల్లెలను సమాచారం సేకరించమని ఆగ్రామాలకు పంపాడు. ఆమె తిరిగి వచ్చి పెద్ద నివేదిక తయారుచేసింది. ఆ నివేదికను స్టానిక పత్రికలతోబాటు హిందూ పత్రికకు కూడా పంపారు. ఆ నివేదికను నేనే అనువదించాను. దాన్ని తెలుగు మీజాన్లో అచ్చువేశాం. (ప్రభుత్వ సమాచారశాఖ ఆ నివేదికను ఖండిస్తూ ఒక ప్రకటన చేసింది. ఇక్కడి పత్రికలేవీ ఆ ప్రకటన జోలికి పోలేద్చు. హిందూ కూడా దాన్ని బుట్టదాఖలు చేసింది.

నివేదికను ఉటంకిస్తూ ఆ ఖండనను కూడా నేనే అనువదించి వేశాం. ఖండననుఅచ్చువేసే విధానం ఇది కాదు అని సమాచార శాఖ వారు బాపిరాజుగారికి ఒక ఉత్తరం రాశారు. మాకు పత్రికామర్యాదలు మీరు నేర్చనక్కరలేదంటూ బాపిరాజుగారు జవాబు లేఖ రాశారు. అప్పటికి ఆ సమస్య పరిష్కారం అయింది. ఆం(ధ్రమహాసభలు రెండు ఉండేవి. ఒకటి రావినారాయణ రెడ్డి అధ్యక్షతనున్న ఆంధ్రమహాసభ, దీనిలో పల్లెటూరి నిరక్షరులు సైతం సభ్యులుగా వుండేవారు. ఆ సభ్యత్వం చీటీని భద్రంగా ఉంచుకుంటూ వుండేవారు. ఆ చీటీని చూపిస్తే దుష్టులు హడలెత్తేవార్సు,

__సంగం చిట్టీ అనాడు సౌభ్రాతృత్వానికి చిహ్నంగా వుండేది. ఏసంగపానిక్షి అన్యాయం జరిగినా వందమంది సంగపోళ్లు వచ్చి ఆదుకుంటారనీ గ్రామీణులు భావించేవారు. రెండోది జాతీయాంద్ర మహాసభ. దీనికి క దొలయ 56 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

భూస్వాములు, లాయర్జు లాంటి వారు నాయకులు ఆస్తులుగలవారు సభ్యులు. వారికి పత్రికలకు ఉత్తరాలు రాయడం నామోషీ ప్రెస్‌ కాన్ఫరెన్సులు ఆనాడు ఎవరికీ తెలియవు తెలంగాణాలో నిరక్షరత ఎక్కువ. అక్కడికీ ఆంధ్రసాహిత్య పరిషత్తు పేర ఒక సంఘం పనిచేస్తూ వుండేది. వారు తెలుగు భాషా ప్రచారం చేస్తూ వుండేవారు. అది బస్త్రీలకే పరిమితం. ఆకునూరు, మాచిరెడ్డిపల్లి దురంతాలమీద నివేదిక తయారు చేసిన సరోజినీదేవి పెద్దదూతురు ఆ నివేదికను పట్టుకుని గాంధీగారి దగ్గరకు వార్జా వెళ్లింది. గాంధీగారు ఆ నివేదిక చదివి (ప్రెస్‌ కాన్ఫరెన్సును ఆహ్వానించారు అంతర్జాతీయ పత్రికా ప్రతినిధులు కూడా దానికి హాజరయారు. అప్పుడు హిందూ పత్రిక కూడా ఆ నివేదిక సారాన్ని ప్రచురించింది ఆకునూరు, మాచిరెడ్డిపల్లి గ్రామాలు జనగాం తాలూకాలోనే వున్నాయి జనగాం ప్రజల వీరోచిత పోరాటాలు అని చిన్న పుస్తకం ప్రకటించిన కమ్యూనిస్టుపార్టీ ఈ చిన్ని (గ్రామాల ఊసెందుకెత్తలేదో తెలియదు. జాతీయాంధ్ర మహాసభవారు పత్రికలకు వార్తలు పంపరు, పత్రికలతో ఎలాంటి సంబంధాలూ పెట్టుకొనరు వార్తలను స్వయంగా రాసి పంపిస్తూ ఇతర ఆంధ్రమహాసభ వార్తలను వేస్తున్నందుకు మాత్రం జాతీయాంధ్ర మహాసభ నేతలకు మీజాను మీద కన్నెర్రగా వుండేది. జొతీయాం[ద్ర సభ అ(గ్రనేతల్లో ఒకరు మందుముల నరసింగరావుగారు. ఆయన రయ్యత్‌ అన్న ఉరూ పత్రికకు సంపాదకులు ఆయన మీజాన్‌ పాలసీ ఏమిటని పదునెనిమిది సంపాదకీయాలు రాశారు. మీజానంటే తెలుగు మీజాన్‌. నరసింగరావుగారి తమ్ముడు రామచందద్రరావుగారు. ఆయన ఒకనాటి ఆం(ధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు. అంతకుముందు మా మేనమామ దగ్గరకు వచ్చి తెలుగు నేర్చుకునేవారు. ఆ సంగతి నాకు తెలుసు. నర్సింగరావుగారి సంపాదకీయాలమీద దరియాప్తు జరిగింది. అడివి బాపిరాజుగారికి నోటీసు యిచ్చారు. అప్పుడు బాపిరాజుగారు ఓ పెద్ద జవాబును ప్రభుత్వానికి పంపించారు. నరసింగరావుగారికి తెలుగు సరిగా తెలియదు అన్నది తొలి జవాబు. తిరుమల రామచంద్ర, శ్రీనివాస చక్రవర్తి తెలుగు భాషా వైదుష్యం గురించి రాశారు. అసలే తెలుగు అంతంత మాత్రం వచ్చిన నరసింగరావుగారికి మా సాహిత్యభాష అసలే అర్థం అయివుండదని తేల్చారు. దాంతో ప్రభుత్వం తృప్తిపడింది. నాది ఉడుకురక్తం, దుడుకుదనం. అప్పటికి సర్‌మిర్దా ఇస్మాయిల్‌ హైదరాబాదుకు ప్రధానిగా వచ్చారు. ఆయనకు ప్రెస్‌ సహాయకునిగా కుందూరి ఈ డు బాగెఆమ్‌ అనిపేరుగల ఉద్యానానికి రెండు నిలువుల ప్రహరీ శ్యరదత్తుగారు కూడా వచ్చారు. నొ న ోడకటింారు వుండేది. ఈ ప్రహరీ తోట అందాన్ని హరిస్తూందని ప్రహరీని కూల్చి పిట్టగోడలాంటి పొట్టి బ్బంచారు. అది గోషాభేషజులకు నచ్చలేదు. మీ తోచనవ రూనలాటి ఆ నచ్చనితనం అనేక రూపాల వ్యక్తం అవుతూవుండేది. నాకు రదు స్పుడు జే మ ఇంగ్లీషు పేపర్లకు బొమ్మలుండేవి కావు. ఉరుదు పత్రికకు అలాంటి ఆ న న్‌ ర ల కొక్కిరాయి గీతల్ని ఒక ఉరుదు మిత్రుడు చూశాడు. అదే కొక్కిరి 0 అటయేలీక మనిషిని ప్పి ్ర యిస్తావా అని టిస్యూపేపరు, స్పెషలు ఇంకూ తెచ్చియిచ్చాడు. ఇస్మాయి దా చూశాను. అందుకని బొమ్మగీసి యిచ్చాను. న మీజాన్‌ ఆ తరవాత ఇంకో రెండు మూడు కొక్కిరాయి గీతలు ఉర్జూవారికి ఇ యిచ్చాను. దాం పత్రిక రిపేజి. అంతే. రెండోపేజీలో సంపాదకీయం, మా 'శ్రానుసైజు నాలుగు పేజీలు. వార్తలకు తొ లిపేజీ ఆఖ సాంతకాలక్‌కు సరిపోయేది. బాపిరాజుగారిది ధూపదీపాలు, తిరుమల రామచంద్రునిది నుడినానుడి, కాలమ్బికు సరి ఏ. బాపరా లా

చక్రవర్తిగారిది నర్తనశాల. కామరాజుది కలంపోటు, బొమ్మకంటి సుబ్బారావు టైంబాంబులు. నా శీర్షిక "పేరు మిర్చీమసాలా. అందులో కొక్కిరాయి మాటలు, పాటలు ఉండేవి. మూడోపేబీ బాపిరాజుగారి నవల డెయిలీ సీరియల్‌: అప్పుడు ఏసందర్భం వచ్చిందో తెలియదు కాని నిజాం నవాబును నారాయణగూడా చౌరస్తాలో ఉరితీయాలని ఒక సంపాదకీయం రాశాను. మర్నాడు కుందూరు ఈశ్వరదత్తు, బాపిరాజుగారికి ఫోనుచేశారు. బాపిరాజా నిన్నెందుకు ఉరితీయరాదు? అని ఆయన ప్రళ్నించాడు. ఆదేమిటోయ్‌ ఆ వేళాకోళం అన్నారు బాపిరాజుగారు. ఇవాళ నీ ఎడిటోరియల్‌ చదువుకున్నావా అని ఈశ్చరదత్తు అన్నారు. మా యంగ్మన్‌ రాశాడు ఏముంది? అని బాపిరాజు అంటే ముందు చదివి నాకు ఫోనుచెయ్యి అని ఈళశ్వరదత్తుగారు ఫోను నెంబరిచ్చారు. బాపిరాజుగారు మౌనంగా ఫోను దగ్గర నుంచి వచ్చారు. కాగితం మీద రాయడం మొదలుపెట్టారు. ఆలా హజ్రత్‌ మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ బహద్దరు చిరంజీవులై చిరకాలం వర్ధిల్లాలి అని రాసి ఎంతపనిచేశావయ్యా ఈ బ్రాహ్మణాశీర్యాదంతో నవాబుగారు చిరకాలం బతికి పోతారు! అన్నారు. ఇలాగే ఒకొక్క ఆళీర్వాదవాక్యం తరవాత తన ఆశీర్వాద మహత్తును ్రశంసించుకుంటూ సంపాదకీయం ముగించారు. దొరికిన పత్రికలన్నీ పోగుచేసి పరశురామ ్రీతిచేశారు కుందూరి ఈళ్చరదత్తుగారు. ఆసంగతి అప్పుడుచెప్పారు. బాపిరాజుగారు సెలవుపెట్టి వెళ్ళారు. బాపిరాజుగారు లేనప్పుడు చ్రవర్తిగారు మాకు పెద్ద. ఆ సమయంలో ప్రూపురీడర్లకు మేనేడ్మెంటుకు ఏదో గొడన వచ్చింది. ఆ సంగతి తెలుసుకొనడానికి వెళ్లిన చక్రవర్తిగారి మీద మేనేజరు దురుసుగా ప్రవర్తించాడు. ప్రూపురీడర్హు చాలాకాలంగా జీతం పెంచమని కోరుతున్నారు. చక్రవర్రిగారిమీద అసభ్యంగా ప్రవర్తించడంతో మేం వాకౌటుచేశాం. ఆ వాకౌటు సమ్మెగా పరిణమించింది. ఈ పత్రికలతోపాటు దక్కన్‌ ఎకానమిస్టు అన్న పక్షపత్రిక కూడా వుండేది. దాని ఎడిటరు "పేరు దక్షిణామూర్తి. యువకుడు. మమ్మల్ని సమర్దించినందుకు ఆయనపై చేయిచేసుకున్నారు. దక్కన్‌ రేడియోలో పనిచేసే భాస్కరభట్ల కృష్ణారావుతో పత్రిక నడపాలని యత్నించారు. అతనేదో తంటాలు పడుతూవుండేవాడు. మేం నాంపల్లి స్టేషనుకు ఎదురుగా ఓ పార్కుంటే అందులో సమావేశం అవుతూవుండే వాళ్లం. ఒకరోజు పత్రికలో ఓ వార్త! బొమ్మకంటి సుబ్బారావు భార్య భర్తకు ఉత్తరం రాసింది, ఆ ఉత్తరం అంతా మీజానులో అచ్చు అయింది. దాని శీర్షిక శ్రీవారికి అని. ఇది భాస్కరభట్ల ఘనత, మేం నవ్వుకున్నాం. కాని కుర్రవాడు సుబ్బారావు చాలా బిడియపడ్డాడు. ఇలా మా వాకౌట్‌ సమ్మె పదునెనిమిది రోజులు సాగింది, బాపిరాజుగారు వచ్చారు. ఆయన మేనేజ్మెంటుతో మాట్లాడారు. ఆరాత్రి నుంచే పనిలోకి వెళ్లాలని బాపిరాజుగారు నిర్ణయించారు. మేనేజ్మెంటు గూండాల్లా ప్రవర్తిస్తూ ఉంటే రాత్రిపూట ఎవరు వెళతారు? నేను వెళతానని ముందుకువచ్చాను. ఒంటరిగా బయలుదేరాను. కొండమీంచి కొందరు నన్ను పరిశీలిస్తున్నారు. మెట్లెక్కి తిన్నగా నా కుర్చీదగ్గర కెళ్ళాను. భాస్కరభట్ల కంగారుపడుతూ లేచి నిలబడ్డాడు. ఆయన్ని కూర్చుండమని చెప్పి టీ తెప్పించాను. అతడు టీ తాగిన తర్వాత ప్రశాంతంగా వెళ్లిరమ్మన్నాను. నా వెనకాల ఎంతో బలగం వుంది అనుకున్నారట. అందుకే నేనంత ధాటీ వచ్చానని అనుకున్నారట. ప్రూపురీడర్లకు జీతాలు పెంచారు. రాత్రిపని అయిన తర్వాత మేం ఇంటికి పోవడంకానీ, టేబుల్సుమీదే కునుకుక్షానీ తీయవచ్చును. మేకప్‌ అయినపేజీ ప్రూఫుమీదే మేం సంతకం పెడితేచాలు. మెషీన్‌ (ప్రూపు అవసరంలేదు, కొన్ని కోర్కెలను సాధించుకున్నాం. ఒకరోజున పావుతక్కున్న పన్నెండింటికి వెళ్లాను. మేనేజరు పీలిచి ఇప్పుడు టైమెంత అయిందని అధికారస్వరంతో అడిగాడు. నేను ఆతడి టేబులుమీద కూర్చుని నా 58 తి రాంభట్ట కృష్ణమూర్తి సొంతకధ

ఆకర పైలెట్‌ చేయమన్నాను. ఆ మాటవిని కుర్చీమీంచి లేచి బాపిరాజు యే క్యాహై అంటూ పరుగెత్తాడు. ్చోందంతా విని నువ్వే అక్కడ నిలవేస్తే ఎలా? నాతో చెప్పవలసిందన్నారు. కదలీ మేం ఎన్ని గంటలకు వచ్చినా, ఎన్ని గంటలకు వెళ్లినా మేనేజరు కలగచేసుకునేవాడు దు. దక్షిణామూర్తిమీద చెయిచేసుకున్నందుకు అతడు వెళ్లిపోయాడు. ఆ పత్రిక ఆగిపోయింది. బాఎరాజుగారు ప్రతిరోజూ ధారావాహికంగా రాసిన నవలలను అచ్చువేయించుకున్నారు. ఆఫీసుమెట్లెక్కగానే పాడుగ్గా కాళీ స్థలం ఉండేది. ఒక చివర వేపచెట్టు, అక్కడ కొన్ని బండలు వేసుకుని మేం మధ్యాహ్నం టీ, ఫలహారాలు చేసేవారం. స

సాధారణంగా ఆ సమయానికి తల్దావరుల శివళంకరశాస్త్రిగారు. కురుగంటి సీతారామయ్యగారు వచ్చేవారు. దానికి మేం నీం మహల్‌ దర్చారని పేరుపెట్టుకున్నాం. కోణంగి అన్న నవల్లో నన్ను హీరోని చేస్తున్నానన్నారు. మేం నీంమహల్‌ దర్భారులో మాట్లాడే మాటలు ఆ రోజు సీరియల్టోకి చేరిపోయేవి. తల్దావరుల వారు చెత్తబుట్ట బోర్లించి నేను గీసిన కొక్కిరి గీతల్ని, లల్లాయి పాటల్నీ సాపుచేసి తన సంచీలో దాచుకునేవారు. అది ఆయన అలవాటు. ఆయన చెప్పే గాసిప్పులను సాహిత్య సమాహారం శీర్షికకింద రాసేవాడిని.

సమ్మె తరవాత నైట్‌ డ్యూటీవారు మర్నాడు ఉదయం బారెడు పొద్దెక్కేవరకు ఉండవలసిన అవసరం ఇప్పుడులేదు. రాత్రి డ్యూటీలో ఎప్పుడు పని ముగుస్తే అప్పుడే ఇంటికి వెళ్లిపోవచ్చును. అందరూ ఆఫీసుకు దగ్గరగా నాంపల్లిలోనే వుండేవారు. నేను మాత్రం చిక్కడపల్లిలో ఉండేవాడిని. పగటిషిస్ట అయిన తరువాత అందరితో కలిసి నాంపల్లి దాకా వెళ్లేవాడిని. అక్కడి నుంచి శ్రీకృష్ణదేవరాయాం[ధ్ర భాషా నిలయానికి అక్కడి నుంచి చిక్కడపల్లి ఇంటికి. రాత్రి షిస్ట అయితే నేరుగా ఇంటికి, లక్షీకాపూల్‌: బషీర్‌బాగ్‌: హైదర్‌గూడా నుంచి చిక్కడపల్లికి నా రూటు.

ఒకనాడు అర్ధరాత్రి హిమాయత్‌ నగరులో ఒక టీస్టాలు ముందర జనం, పోలీసులు ఉన్నారు. నన్ను చూసి పోలీసులు ఆపారు. ఈరాత్రి వేళ ఎక్కడికెళుతున్నావని గద్దించారు. ఇంటికి అన్నాను. ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నారు. ఆఫీసు నుంచి అన్నాను. రాత్రివేళ ఏ ఆఫీసు అన్నారు. మీజాన్‌ ఆఫీసు నుంచి అన్నాను. ఆపేరువినగానే వారు ఎటెంక్షన్‌ అయారు. ఒక పోలీసు చాయ్‌ తెచ్చియిచ్చాడు. మరో పోలీసు ఇంటివరకూ వచ్చి దిగబెడతానన్నాడు. అతని సహాయం అవసరంలేదని మృదువుగానే చెప్పి నేను బయలుదేరాను.

రాత్రిపూట రజాకార్డు మారుమూల బస్తీలమీద దాడిచేస్తూ వుండేవారు. ఆ దాడిదారులకు ఎస్కార్టు పోలీసులు. వారినే ఇప్పుడు చూశాను. ఆనాటి నా దుస్తులు తొమ్మిది మూరల ఖద్దరు ధోవతి. మోకాలి కిందికి వచ్చే పల్నాటి ఖద్దరు లాల్ఫీ, ఖద్దరు వూలు వాస్కోటు, ఖద్దరు శాలువా, బుజాలమీద పడే జుత్తు అన్ని వెరసి మరో మనిషి బరువు వుండేవి, ఇన్ని వున్నా పల్నాటి ఖద్దరు ఓ విధంగా కామాయంలా కనిపించేది. అప్పుడప్పుడు అదే వేషంతో బస్సు, ఎక్కేవాడిని. బస్సులో వున్న కొందరు ముస్లింలు లేచి నాకు సీటు యిచ్చేవారు.

ఆ మర్యాద ఎందుకో నాకు అర్ధం అయేదికాదు. అలా మర్యాద చూపేవారు స్థానికులు కారు. భోపాలు నుంచి వలస వచ్చిన ముస్లింలు. ఇతర రాష్ట్రాల నుంచి ముస్లింలను రప్పించి వారికి వసతులు కల్పించి హైదరాబాదును ముస్లిం రాష్ట్రంగా చేసుకోవాలన్న యత్నం అది, మర్నాడు ఆఫీసులో ఉర్దు సహచరులకు

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 59

బస్సు మర్యాదచెప్పి కారణమడిగాను. అప్పుడొకమిడ్రుడు తన తలపైనున్న రాంపురీ టోపీ తీసి నాకు పెట్టి అద్దం దగ్గరకు తీసుకెళ్లాడు. ఇప్పుడర్హం అయింది. ముస్లిం మతపండితుల వేషం అది. వారి దృష్టినా లాల్బీదగ్గర ఆగేది. ధోతీ పైజామాలా కనిపించింది.

ఇంతవరకు నా ఉద్యోగం పత్రికారచన ముచ్చట్టతోనే అయింది. నా శాక్త సిద్దాంతం ముచ్చట్టుకాని ఇంటిముచ్చట్టు కాని ఎత్తుకోనేలేదు. శ్రౌతిగారు చిక్కడపల్లిలో ఇల్లు కట్టుకుని అందులోకి వెళ్ళారు. ఆయన ఉండే రెండురూపాయల ఇంటిని నేను తీసుకున్నాను. సీతారాంబాగు నుంచి అమ్మను ఈ యింటికి తీసుకుని వచ్చాను. మా చిన్న అక్కయ్య ఒక కొడుకునూ కూతుర్ని కని ఇరవైఏళ్లకే కన్నుమూసింది. చిన్నక్కయ్య కొడుకు అమ్మమ్మ దగ్గరే వుండేవాడు. అతడు కూడా మా అమ్మతోనే వచ్చాడు. ఉస్మానియా టెక్నికల్‌ కాలేజీ (ఓటీసీ)లో చదువుతున్నాడు.

ఇంట్లోచేరిన కొద్దిరోజులకే పొరుగింటివారితో పేచీ వచ్చింది. అప్పుడు కట్టడం ఇంకా పూర్తికాని ఒక ఇంట్లో ప్రవేశించాను. ఆక్కడింకా బావి తవ్వకం పూర్తికాలేదు. తలుపులకు గొళ్లేలులేవు. కిరాయి పదిరూపాయలు. అయినా ఆ యింట్లోనే చేరాం. ఇల్లెందు నుంచీ పరిచితుడైన ఒక మహారాష్ట్ర కుర్రవాడు మాయింటనే వుండి చదువుకుంటూ వుండేవాడు. వాడిదీ మా మేనల్టుని యీడే. అతడు కూడా ఓటీసీలోనే చేరాడు. ఆ యిద్దరూ పొరుగింటి నుంచి నీళ్ళు తీసుకువచ్చేవారు. ఆనాడు చిక్కడపల్లిలో ఇళ్లు చాలా తక్కువ. ఎక్కువ భాగం మైదానం,

చిక్కడపల్లిలో ఒక పాలవ్యాపొరి కొడుకు చాలా చురుకైనవాడు. ఒక దున్నపోతునెక్కి షికార్డు కొడుతూ వుండేవాడు. ఆ కుగ్రవాడికి ఇంగ్రీషు నేర్పడానికి సులువైన మార్గముందా అని మా మేనల్టుడడిగాడు. అప్పుడు నేను బేసిక్‌ ఇంగ్లీషు రీడర్లు కొనుక్కొచ్చి యిచ్చాను. ఆ కురర్రవానికి వీళ్లు ఇంగ్లీషు ఎంత నేర్పారో అతడెంత నేర్చుకున్నాడో తెలియదు. కాని ఆయువకుడు బొంబాయి పారిపోయాడని తెలిసింది. తిరిగి వచ్చిన తరవాత వేషం మారి పోయింది. పాంటు, షర్టు, కోటు. ఇక్కడికి వచ్చిన తరవాత ఏదో ట్యుటోరియల్‌ కాలేజీలో చేరాడు. అప్పుడప్పుడు పాత మిత్రులంతా కలుస్తూ వుండేవారు.

'శ్రౌతిగారి యింట శుక్రవారాలు శ్రీ చక్రపూజలు జరుగుతున్నాయి. నాకు వృత్తివల్ల తీరిక ఆసలు లేదు. అందుకని ఆ పూజలకు నేను హాజరు కాలేకపోయేవాడిని. కాగా తీరిక దొరికినప్పుడు ఆయనదగ్గరున్న తంత్రాలను చదువుతూ వుండేవాడిని. శ్రౌతిగారితో చర్భజరుపుతూ వుండేవాడిని. నాకు ఆదాయం వుంది కనక అమ్మని, పెద్దక్కయ్యను చూడ్డానికి పంపించాను. ఆమె అక్కడ అక్కయ్యకు పురుడుపోసింది. మా స్వగ్రామానికి వెళ్లి అత్తగారిని చూసింది. కోనసీమలో పరిచితులను చూసింది. అందర్నీ చూసి ఆఖరికి సికింద్రాబాదులో తమ్మునియింటికి వచ్చింది.

60 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

స్‌ ఖ్హ మై అబుల్‌కలాం ఆజాద్‌ పోస్ట్‌ చేయని ఉత్తరాలను కాళ్ళీర్‌ దాల్‌ నరస్సులో ఒక గది బోటు తీనుక్రుని వాటిని నసంన్కరించి అచ్చు కీచ్చాడు. ఆ వుస్తకం తామ్మిదినెలల్లో నలభైవేల ప్రతులు అమ్ముడు పోయింది. ఆజాద్‌ వుస్తకాన్సి అచ్చువేసిన ఢిల్లీ కంపెనీ అనుమతి లేకుండా ఓ హైదరాబాదీ దొంగతనంగా ఆ వుస్తకం అచ్చు వేశాడు. ోకీమమాాలకమినాా మాతృ వియోగం అప్పుడు బావగారు ఆముదాలవలసలో పనిచేస్తూ వుండేవారు. కూతురికి పురుడు పోసింది. అక్కడి నుంచి మా పితామహుని ఊరికి వెళ్లి అత్తగారిని చూసింది. అక్కడి నుంచి కోనసీమ వెళ్లి తన పరిచయస్తులందర్నీ చూసింది. మా అన్నయ్య వొదిన వున్న వూళ్లకు వస్తానంటే ఎప్పటికప్పుడు ఏదో సాకు చెప్పేవారు. అన్నయ్యకొక కొడుకు పుట్టాడు. మనవడిని చూడాలని ఆమె కోరిక. అది తీరలేదు. చూడవలసిన వారినందర్నీ చూసి తిరిగివస్తూ సికింద్రాబాదులో దిగి పెద్ద తమ్ముని ఇంటికి వెళ్లింది. మా వాదినగారు, మనవడు అక్కడున్నారు. ఆమె తిరిగి వచ్చిన రెండ్రోజులకు మా తాత ఆబ్ల్టికం. ప్రతియేటా తండ్రి ఆబ్దికానికి తమ్మునియింటికి వెళుతూ వుండేది. ఆయన ఆబ్టికం ఆయిన రెండో రోజు మాబాబు ఆబ్దికం. ఈ రెండు ఆబ్టికాలు అయిన తరవాత ఆమె తిరిగి స్వగృహానికి వచ్చేది. ఆమె మరో రోజు అక్కడ ఉందామన్నా మా పెద్దమామయ్య ఉండనిచ్చేవారు కాదు. అది ఆమెమీది కోపంతో కాదు. మా బాబు పోయిన తరవాత నుంచి ఇరవైయేళ్లకు పైగా ఆమె తమ్ముని సంరక్షణలో వుంది. మా అన్నావదినా వేరేకాపురం వుంటున్నా ఆమెను తీసుకెళ్లడంలేదు. నేను పెళ్లి చేసుకోలేదు. (ప్రాజ్ఞాణ్మి కాలేదు. అందుకని ఆమెమీద రుసరుసలు. అంతే. అక్కడ కోడలు, మనవడు వున్నారు. వాళ్లను విడిచి వెళ్లడం ఎవరికయినా బాధాకరంగానే వుంటుంది. ఆమెకు జ్వరం వచ్చింది. భోజనం వేళకు జ్వరం తగ్గుతుంది, తర్వాత మళ్లీ జ్వరం. ఆమెకు మందులిచ్చే డాక్టరుకు ఆ జబ్బు యేమిటో అంతుపట్టడంలేదు. ఈ సంగతులు తెలిసి ఆమెను చూడ్డానికి ఒకరోజున నేను వెళ్లాను. కోడలి ఆరోగ్యం, మనవడి ఆరోగ్యం సరిగా లేదు. అది సైకలాజికల్‌ జబ్బు అని నాకు ఆర్ధం అయింది. ఏజాతి వైద్యునికయినా క్లినికల్‌ సైకాలజీ మీద కాస్తంత పరిచయం ఉండి తీరాలి. అమ్మా నేనిప్పుడు ఉద్యోగం చేస్తున్నాను. పెళ్లి చేసుకుంటానన్నాను. రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 61

నా మాటలకు ఆమె రియాక్షన్ను పరికించాను. ఇంటికి వచ్చి బావతో చెప్పాను. ఆయన అమ్మను అక్కయ్యా అని పిలిచేవాడు. ఆమెకు బావ పెత్తల్లి కొడుకు అవుతాడు. బావా! మీ అక్కయ్య ఆఖరి గడియల్లో వుంది, ఒక వందరూపాయలు పక్కన పెట్టి వుంచు అన్నాను. నేను అపశబ్దాలు కూసినందుకుతిట్టాడు. ముందు వందరూపాయలు పక్కన బెట్టి తరవాత నీయిష్టం వచ్చినట్టు తిట్టు. అది చాలకపోతే కొట్టు అన్నాను. వెంటనే ఓ వందరూపాయలనోటు తీసి పక్కింట్లోనే వున్న ఆయన మేనమామ కొడుకు చేతికిచ్చి జా(గ్రత్త చెయ్యి అన్నాడు. ఆమెకు అన్ని కోరికలూ తీరాయి. ఒకే ఒక కోరిక మిగిలివుంది. ఆ కోరిక కూడా తీరుతుందని తెలుస్తే నిశ్చింతగా కన్నుమూస్తుందని అర్ధం అయింది. ఆమె దగ్గర కూర్చుని అమ్మా నేను ఉద్యోగం చేస్తున్నాను కనక పెళ్లిచేసుకొనడానికి అభ్యంతరంలేదు అని చెప్పాను. ఆమాట విని ఆమె కళ్ళు మెరిశాయి. మర్నాడు బావమేనమామ కొడుకుల్లో చిన్నవాడిని నాతో మీజాన్‌ ఆఫీసుకు తీసుకువెళ్లాను. అక్కడ నా సీటు చూపించాను. ఇది ఎందుకు చూపించావన్నాడు. చూపించాలనుకున్నాను చూపించాను అంతే అన్నాను. ఆరాత్రి నుంచే నాకు నైట్‌ డ్యూటీ. రాత్రి పదయింది. ఆ కుర్రవాడు వచ్చాడు. అతడెందుకు వచ్చాడో నాకు అర్ధం అయిపోయింది. అతడిని మాట్టాడనీయకుండా కబుర్హు చెబుతూ టీ తెప్పిస్తూ వచ్చాను. రాతపూర్తి అయింది. అప్పుడడిగాను. అమ్మ ఎన్నింటికి పోయిందని. రాత్రి ఎనిమిదింటికే పోయిందన్నాడు. అన్నయ్యకు వార్త వెళ్లిందా అన్నాను. వెళ్లిందన్నాడు. నిత్యకర్మలు దశాహం లాంటివేమీలేవు. పని సగంలో ఆపివచ్చానని అన్నయ్య వెళ్లిపోయాడు. నేను మీజాన్‌ డ్యూటీకి వెళ్ళాను. కొద్దిరోజులకు అన్నయ్య కొడుకుపోయాడు. అప్పటికి వొదిన అస్వస్థత అలాగే వుంది. శ్రీనివిసచక్రవర్తిగారు తాను రాసిన వ్యాసాలకు మరికొన్ని జతచేసి నర్తనశాల “పేరునే ఒక పుస్తకాన్ని అచ్చువేయించుకున్నారు. దానికి వరంగల్లు కోటలోని హంసల తోరణాన్ని నేను ముఖచిపత్రంగా వేశాను. ఆ పుస్తకావిష్కరణకు తలపైన గాంధీ టోపీ పెట్టుకుని నేను హాజరు అయాను. పత్రిక, (గ్రంధాలయం స్నేహితులతో మాటలు నిత్యకృత్యం. స్వాతంత్ర్యం రెండు మూడేళ్లలో రాగల అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు మన దేశాన్ని ఎలా రూపొందించుకోవాలన్న చర్చలు మొదలయ్యాయి. మేం రాజకీయాల్లో లేకపోయినా వృత్తిరీత్యా మేం నిత్యం రాజకీయాల్లోనే మునిగితేలుతున్నాం. స్వతంత్ర భారతం ఎలా వుండాలన్న కలలు నాక్కూడా వున్నాయి. తిండి కలిగిన కండగలదోయ్‌ కండగలవాడేను మనిషోయ్‌ అని గురజొడ అప్పారావుగారు చెప్పిన మాటతోనే ముందు ప్రణాళికా రచన చేస్తే బాగుంటుందనిపించింది. చారిత్రక యుగంలో ఇనపనాగలి వాడకానికి రావడంతో పంటభూమి బాగా పెరిగిందంటున్నారు శాస్త్రజ్ఞులు. వ్యవసాయం ఆంటే భూసంస్కృతే సకల సంస్కృతులకు మూలం అంటారు. వ్యవసాయాన్ని పెంచాలంటే నాగళ్లను లాగే వృషభశక్తికి బదులు యాంత్రిక శక్తిని ఉపయోగించవలసి వుంటుంది. అలాంటప్పుడు ఇప్పుడున్న వృషభ శక్తినేం చేయాలి అన్న 'ప్రష్ష వస్తుంది. వృషభాలను తినడం నేర్చుకొనాలి. యూరపులో ఆపనే చేస్తున్నారు. వృషభాన్ని ఆహారంగా వాడితే ఆవులకు ఇంకా పుష్టికర ఆహారం పెట్టి పాడిని పెంచవచ్చును. గొడ్డు ఆవులను, పాలు తక్కువిచ్చే ఆవులను కూడా యూరపులో ఆహారానికి వాడుతారు, మనకు తూర్చునా పడమరనా సముద్ర తీరం చాలా వుంది. చేపలు విత్తని పంట. మామూలు దోనెలకు బదులు యాంత్రిక పడవలను చేపలవేటకు వినియోగిస్తే మన జనాభా ఇబ్బడి ముబ్బడి అయినొ ఆహారానికి 62 అ రాంభట్ల కృష్ణమూర్తి సొాంతకథ

లోటుండదు. సముద్ర తీరమే కాకుండా నదులు సరస్సులలో కూడా చేపలను పెంచవచ్చును. ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్‌ అని అప్పారావుగారే ప్రశ్నించారు. తిండికి ముందు కొరత లేకుండా చేస్తే అప్పుడే జనం జల్టు కొని కళలెల్ల నేర్చుకొనగలుగుతారు. దేశి సరకులను నింపగలుగుతారు.

భారతదేశాన పశుగణం ఎక్కువ. ఆ పశుగణం నుంచి ఉత్పన్నమయ్యేవి తోళ్లుమాత్రమే. అందుకని ఎడ్లనీ దున్నలనీ తిను. ఆవుల, గేదెలపాలు తాగు. ఈ పనిచేసినప్పుడు దేశియులెవరూ ఈసురోమని ఉండరు అని నా వ్యాసాల సారాంళం. బాపిరాజుగారవి చూసి ముక్కు మీద వేలేసుకున్నారు. వేదకాలాన మన దేశాన గేదెలు దున్నలు లేవు. ఆవులు ఎడ్జు మాత్రమే ఉండేవి. వేదకాలపు యజమానులు రుత్విజులు, పురోహితులు, రుషులు ఆవుల్ని, ఎడ్లను మాత్రమే తినేవారు. వారు యజ్ఞాలలో విశసించే పశువులవే. బాపిరాజుగారు ఆ వ్యాసాలనంతటితో ఆపమన్నారు.

నా అభిప్రాయాలు నాలుగోదశకంలోనే కాదు ఈ తొమ్మిదో దశకంలోనూ అలాగే వున్నాయి. వాటిలో మార్పు ఏమాత్రమూ లేదు. మన దేశాన ఉత్పాదక దాసులు వేరు అని చరిత్రకారులంటున్నారు. వారు వుంటే ఎలా వుండేవారో? బరువుబళ్లులాగే ఎడ్డలావుండేవారు. బళ్లులాగే ఎడ్లకు అర్రులు పుళ్లుపడి ఈగలు ముసురుతూ వుంటాయి. కళ్లు వునులు కట్టి దోమలు ముసురుతూ ఉంటాయి. చెవులలో గోమారులుంటాయి. వాటిని తోలుకొనడానికి దానికున్న సాధనం తోకమాత్రమే. పూర్వం పశువుకు బానిసకు పెట్టేతిండి పేరు ఒకటే - అదే (గ్రాసం. బరువు బండి ఎద్దు కన్న పుష్టిగా పెంచి తినడం మంచిది కదా?

జాతీయ నాయకులను ప్రభుత్వం నిర్బంధంలో ఉంచింది. గాంధీజీ దంపతులను ఆగాఖాన్‌ (ప్రాసాదంలో ఉంచారు. ఆజాద్‌, నెహురూ లాంటినాయకులను అహ్మద్‌నగర్‌కోటలో నిర్బంధించారు. అబుల్‌ కలాం ఆజాద్‌ అప్పుడు కాంగ్రెసు అధ్యక్షుడు. ఆయన నిరంతర ధూమపాయి. గాంధీగారి ఎదటనే ఆయన సిగరెట్టు కాల్చుకొనడానికి అనుమతి సంపాదించుకున్నారు. ఆయన తెల్లవారుజాము నుంచి తొమ్మిది అయేవరకూ టీ తాగుతూ వుంటారు. ఆయనది ఓ ప్రత్యేకమైన చైనా టీ. ఆయన టీ కోసం బొంబాయి అంతా గాలించారు ప్రభుత్యోద్యోగులు. దాంతో చియాంగ్‌షేకు ఇక్కడికి వస్తున్నారని వుకారు పుట్టింది.

అహ్మద్‌నగరు కోటలో అడుగుపెట్టగానే జైల్‌ మాన్యూల్‌ తిరిగేశారు ఆజాద్‌. జైల్లో సిగరెట్టు నిషేధం అని వుంది. అంతే తన జేబులోంచి సిగరెట్టు పెట్టే అగ్గిపెట్టే తీసి జైలర్‌ టేబిల్‌ మీద పడేసి ముందుకు సాగాడు. ఆయన ఇతర సామగ్రితోపాటు సిగరెట్టు దిండ్డు కూడా వచ్చేవి. సిగరెట్టు నిషిద్దం కదా అందుకని ఆ సిగరెట్టను ఆజాద్‌ నెహురూకు పంపించేసేవాడు. ఆయన తెల్లవారు జామునలేచి టీ కాచుకునేవాడు. పాలు పంచదారాలేని టీని కొద్దికొద్దిగా ఉదయం తొమ్మిది వరకూ తాగుతూ వుండేవాడు. ఆ సమయాన వచ్చేవారికి ఆ టీనే ఇచ్చేవాడు. వారు ఇదేం టీ అని వింతపడేవారు.

ఆజాదు రోజూ ఉత్తరాలు రాస్తూ వుండేవాడు. అవి పోస్టుచేయని ఉత్తరాలు. నాటి ముస్లింలీగు కోశాధికారికి ఆ వుత్తరాలు. బ్రిటిషు ప్రభుత్వంతో చర్చలు జరపవలసిన తరుణం వచ్చింది. ఆజాద్‌ కాం(గ్రెసు అధ్యక్షుడు. అందువల్ల ఆయన్ని మాత్రమేకాక అందర్నీ విడిచిపెట్టారు. ఆజాద్‌ గేటుదరిదాపులకు వచ్చేసరికి జైలరు లేచి ఆయనకు వినయంగా వందనం చేశారు. ఆయన టేబిలుమీద సిగరెట్టు పెట్టె వుంది. ఆజాద్‌ ఒక సిగరెట్టు తీసుకుని నోటపెట్టుకున్నాడు, జైలర్‌ వెలిగించాడు. అతడికి షేక్‌హాండ్‌ ఇచ్చి నడిచివెళ్లిపోయాడు ఆజాదు.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 63

ఆ పోస్టు చేయని ఉత్తరాలను కాశ్మీరు దాల్‌ సరస్సులో ఒక గదిబోటు తీసుకొని వాటిని సంస్కరించి అచ్చుకిచ్చారు. ఆ సంస్కరణకు నెల రోజులు పట్టింది. ఆ పుస్తకం వచ్చింది. తామ్మిదినెలల్లో నలభైవేల ప్రతులు అమ్ముడుపోయాయన్న వార్త పత్రికలకు వచ్చింది. అది చూసి నేనాక ఉర్జూ పుస్తకాలయానికి వెళ్లి కాపీ కావాలని అడిగాను. వారంరోజుల్లో వస్తుంది మీ కాపీని రిజర్వు ఎసుకోండి అన్నాడు. కాపీ ఖరీదు ఆరురూపాయలు. పైసలిచ్చి రశీదు తీసుకున్నాను. వారం తరవాత పుస్తకం చేతికి వచ్చింది. అది వచ్చిన మూడు నాలుగు రోజుల్లో మరోవార్త,

ఆజాద్‌ పుస్తక్షాన్ని అచ్చువేసిన ఢిల్లీ కంపెనీ అనుమతిలేకుండా ఓ హైదరాబాదీ దొంగతనంగా పుస్తకం అచ్చు వేశాడు. నేను కొనుక్కున్న పుస్తకం ఆదొంగ అచ్చు పుస్తకమే. ఢిల్లీ పుస్తకశాలాధిపతులు పోలీసులతో వచ్చి అచ్చయిన పుస్తకాలన్నింటిని స్వాధీనం చేనుకున్నారన్నది ఆ రెండోవార్త. ఈ పుస్తకాన్ని అనువదించడానికి ప్రయత్నించవద్దు అని ఆజాద్‌ ప్రవేశికలో రాశారు. నిజమే ఆ పుస్తకానువాదకునికి మూడు భాషల్లో పాండిత్యం వుండాలి. ఉరుదు వ్యాసాల మధ్య పారసీక అరబ్బు పద్యాలు ఆ భాషా సామెతలు వుంటాయి.

తెలుగున చెళ్లపిళ్లవారి వ్యాసాలు కూడా అలాగే వుంటాయి. ఆయన కధలు గాథలమధ్య శ్లోకాలు, భ్ఞైకపాదాలు, మరెక్కడివో సాంకేతిక పదాలుంటాయి. శైలి మామూలు మాటల్లాగే వుంటుంది. అక్కడికి వెళ్లినపని ఏమయింది? ఇది ప్రశ్న. కుర్వీత బుధ సోమయో: ఇది జవాబు. సంప్రదాయవాద బ్రాహ్మణులకు మాత్రమే ఆ వాక్యార్థం తెలుస్తుంది. “న కుర్యాత్‌ శనిభౌ మేషు, కుర్వీత బుధ సోమయో:” అంటే క్షవరానికి శని మంగళ వారాలు పనికి రావు. బుధ సోమవారాలు పనికివస్తాయని అర్ధం.

అబుల్‌ కలాం ఆజాద్‌ నిరంతర సిగరెట్‌పాయి. తెల్లవారి లేచినప్పుడొక అగ్గిపుల్ల గీసి సిగరెట్టు వెలిగించుకుంటాడు. తరవాత దీపం నుంచి దీపం వెలిగించినట్టు సిగరెట్‌తోనే సిగరెట్టు ముట్టిస్తూ వుంటాడు, నిద్రపోయే ముందు మాత్రమే సిగరెట్టు ఆర్పేస్తారు. అదీ ఆజాద్‌ అలవాటు. కాం(గ్రెసు నాయకుల సమావేశం తరుచు గాంధీగారి బసలో జరుగుతూ వుంటుంది. అలాంటి ఒక సమావేశంలో గాంధీజీ ఒక మట్టిచిప్ప తెచ్చి ఆజాద్‌ ముందు పెట్టారు. ఎవరో ఆయన సిద్దాంతంపై ప్రళ్నిస్తే సిద్దాంతంకన్న ఆజాద్‌ గొప్పు అన్నారు.

ఇది గాంధీసూక్తి. సిగరెట్లను గురించి ఒక పాత్రికేయుడు అడిగిన (ప్రచ్నకు పిండుకునే శక్తి మీ చేతులకున్నప్పుడు బట్టలు తడుస్తాయన్న దిగులెందుకు అని ఆయన జవాబిచ్చాడు. నేను ఆజాదంటి నిరంతరహోతను కాదు, కాని సిగరెట్లు ఎక్కువే కాల్ఫేవాడిని. ఆ అలవాటును ఒక్కసారి మానకూడదు అని డాక్టరులంటారు. వారి సలహా ఎలా వుందంటే ఓ నవాబుకు ఒకనిమీద కోపం వచ్చి శిరచ్చేదం చేయమన్నాడు. చచ్చిపోతాను దొరా అలాచేయొద్దని మొత్తుకుంటాడు. అప్పుడు నవాబు ఒక్కసారి తల నరకవద్దు ప్రతిరోజు కొద్దికొద్దిగా కోస్తూ వుండు అన్నాడు.

కొందరు డాక్టర్ల సలహా ఆ నవాబు తీర్పులా వుంటుందన్న మాట. ఆడాక్టర్లకు మనిషిలో వుండే ఆత్మస్థయిర్యం ఎలాంటిదో తెలీదు. ఆయుస్సు నాలుగు రకాలుగా వుంటుందంటాడు చరక మహర్షి ఆ రకాలు : సుఖం - అసుఖం. హితం, అహితం. సుఖాసుఖాలు శారీరకమయినవి. హితాహితాలు మానసికమయినవి. వైద్యుని నోటివెంట వచ్చిన ఒక మాట ప్రాణం పోయగలుగుతుంది. తీయగలుగుతుంది కూడా. యాభైయేళ్ల నా సిగరెట్టు అలవాటును ఓ క్షణంలో మానేశాను. అలా మానేసి నేటికి పది సంవత్సరాలు గడిచాయి.

శ్రి 64 'అ రాంభట్ల కృష్ణమూర్తి సొాంతకధ

నేను నేటికీ రెండు ఉరుదు పుస్తకాలను కాపాడుకుంటున్నాను. ఒకటి అబుల్‌ కలాం రాసిన గుబాలెఖాతిర్‌ అని పేరున్న పోస్టుచేయని ఉత్తరాలు. మరొకటి మఖ్లూం మొహియుద్దీన్‌ కవితల సంపుటం ఆయన షష్టిపూర్తికి తెచ్చినది. అన్నీ పంపిణీ అయిపోయిన తరవాతనేను అడిగాను. అప్పుడాయన తన స్వంతానికి వుంచుకున్న ప్రతిని నాకు యిచ్చాడు. మఖూంమొహియుద్దీన్‌ గురించీ ఆయనకు నాకూ గల అనుబంధం గురించీ తరవాత ముచ్చటించుకుందాం. ఇప్పుడు మౌలానా ఆజాద్‌ పుస్తక (ప్రస్తావనతో పాటు మఖ్టూ ప్రస్తావన వచ్చింది. అంతే. దేశానికి స్వాతంత్ర్యం కనుచూపు దూరాన వుంది. జిన్నా నాయకత్వాన ముస్తింలకు ప్రత్యేక స్పతంత్రదేశం కావాలన్న ఉద్యమం బలపడుతున్నది. భౌగోళికంగా వారు కోరేది ఉత్తరానవుంది. ముసల్మానులకు నీవేదిక్కు ఉస్మాన్‌ అని హైదరాబాదు నవాబు కవితలు రాశాడు. అందువల్ల దక్షిణాదినున్న తన రాజ్యానికి కూడా స్వతందత్రరాజ్య ప్రతిపత్తి కోసం యత్నాలు సాగుతున్నాయి. యుద్దం ముగిసి ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. అసలు మూడు భాషల మీజాన్‌ పత్రిక పుట్టుకకు ఆశయం కూడా అదే. ఇంగ్లీషు మీజాన్‌లో ఆ వాదన మొదలయింది కూడా. పరిస్థితులను గమనించిన బాపిరాజుగారు ఉద్యోగం మానేసి వెళ్లిపోయారు. సబెడిటర్లలో మిగతావారు వెళ్లిపోవడానికి సిద్దంగా వున్నారు. నండూరి నారాయణరావు అని ఒక 'జాత్సాహిక యువకుడు సమాచార శాఖలో పనిచేస్తున్నాడు. ఆయనతో నాకు పరిచయం వుంది. శ్రీనివాసచక్రవర్తిగారితో సంప్రతించి ఆయనను నైట్‌ ఎడిటరుగా నియమించమని మేనేజ్‌మెంటుతో చెప్పాం. ప్రభుత్యోద్యోగులను నియమించే సంప్రదాయం వుంది. మా సమ్మెకాలంలో డక్కన్‌ రేడియో ఉద్యోగి భాస్కరభట్ల కృష్ణారావును నియమించారు కదా? బాపిరాజుగారు వెళ్లిపోయిన తరవాత ముందు కామరాజు తరవాత తిరుమల రామచంద్రుడు ఆ తరవాత బొమ్మకంటి సుబ్బారావు వెళ్లిపోయారు. నేనూ, శ్రీనివాసచ(క్రవర్తి మాత్రమే మిగిలాం. చక్రవర్తిగారూ నేనూ పగటి డ్యూటీ, రాత్రిడ్యూటీ నండూరి నారాయణరావు, రాజకీయాలు వేడెక్కాయి. ఆదశలోనే మేనల్లుడు ఓ,టి.సిలో చదువుతూ హరాత్తుగా పోయాడు. దాన్లో నాకు హైదరాబాదు విడిచిపెట్టి పోవాలనిపించింది. చ'క్రవర్తిగారి పరిస్థితి అలాగే వుంది. అయినా పంటి బిగువున పనిచేస్తూనే వచ్చాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి కంప్లెయింట్లూ లేవు. నైట్‌డ్యూటీ చేసే నండూరి నారాయణరావుకి తెలుగు మీజాన్‌ చదివి వార్తలను గురించి ప్రభుత్వానికి నివేదిక పంపించే ఉద్యోగం. ఇంగ్లీషు మీజాన్‌లాగే వుంది అని రోజూ రాసి పంపేవాడు. కనక ఎలాంటి కంప్టెయింట్లు తలెత్తేవి కావు. దేశం రెండుముక్కలయింది. ఆగస్టు అర్హరాత్రి భారతదేశం స్వతంత్రమయిందని ప్రకటించారు. ఆ స్వాతంత్ర్యం బోలెడన్ని సమస్యలను మోసుకొచ్చింది. ఇండియానుంచి పాకిస్తాన్‌కీ, పాకిస్తాన్‌ నుంచి ఇండియాకు కాందిశీకుల వరదలు పారుతున్నాయి. రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 65

శ్రా బెజవాడ రాజకీయాలు చి(త్రంగా ఉండేవి. కాంగైను భూస్వాములు, కమ్యూనిన్దు యువకులకు తమ పిల్లల్దిచ్చేవారు. కమ్యూనిస్టులు స్త్రీని గౌరవిస్తారు. తిట్టరు కొట్టరు. కట్టుకానుకల బేరాలాడరు. అట్టవోనం పెళ్ళినొల్లరు. ఆధునిక దండ పెళ్లిళ్లే కావాలంటారు. ఆచార్యత్వం దగ్గర మాత్రం తమవాడే వుండాలని ఉభయుల కోరిక నా ఆబార్యత్వానికి ఉభయుల అంగీకారం ఉంది. ఆకా నినా గుడ్‌బై హైదరాబాద్‌ ఫిబ్రవరిలో నేనూ చక్రవర్తిగారు మా ఉద్యోగాలకు రాజీనామాలిచ్చాం. మరెవరినయినా మీరే చూసి వారికి ట్రయినింగుయిచ్చి వెళ్లండంది మేనేజ్‌మెంటు. మిలిటరీలో పనిచేసిన పీడుగు వెంకట నారాయణకు వారం రోజులపాటు ట్రయినింగు ఇవ్వడానికి నేను ఉండిపోయా. చక్రవర్తిగారు వెళ్లిపోయారు. నాకు బందరు అడ్రసు ఇచ్చి అక్కడ కలుద్దామన్నారు. మీజానుకు వెళ్లేటప్పుడు హైదరుగూడా నుంచి, వచ్చేటప్పుడు సుల్తాన్‌బజారు నుంచీ రావడం నా అలవాటు. ఆనాడలా వస్తూవుంటే ఓ యువకుడు టీ స్టాలముందు నన్ను వాటేసుకున్నాడు.

అప్పుడే రేడియోవార్త గాంధీజీని హత్యచేశారు అని ఆ యువకుడు ఏడుస్తూ చెప్పాడు. నేను తేరుకొని లైబ్రరీకి వెళ్లిదాన్ని మూయించాను. అక్కడి నుంచి తిన్నగా నారాయణరావు ఇంటికి వెల్లి గాంధీ హత్యమీద ఒక సంపాదకీయం, ఒకపాట రాసీ అతనికిచ్చాను. గాంధీజీది చిన్నబ్లాకు కూడా ఆఫీసులో వుంది అని చెప్పాను. గాంధీజీని తురకలే చంపేశారని నారాయణరావు కోపంతో ఊగిపోతు అన్నాడు. కాదు చంపినవాడు మనవాడే అయివుండాలని నేనన్నాను. (బ్రాహ్మడు మాత్రమే ఇంతటి దురంతానికి తెగించగలడని కూడా

అన్నాను. తరవాత రేడియోలో ఆమాటే చెప్పారు. నేను చిన్న సంచీలో బట్టలు పెట్టుకుని రైలెక్కాను. ముందు బెజవాడలో దిగాను. రైవిస్‌ కాలవ ఆవలి ఒడ్డున ఒక (ప్రెస్సుంది. అదే అభ్యుదయ సంఘం ఆఫీసు, అక్కడికి వెళ్ళాను. నేనెవరినీ ఎరగను. పైగా బెజవాడే నాకు కొత్త అక్కడ నలుగురైదుగురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకరు నల్లగా పలచగా వున్నాడు. అందరిమీదా వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడుతున్నాడు. నేను హైదరాబాదు నుంచి వస్తున్నానని

66 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

చెప్పాను. ఆయన వ్యాఖ్యల మీద నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను. అవి విని అతడు నువ్వు రాంభట్ల కృష్ణమూర్తివా అన్నాడు. నువ్వు తెన్నేటి సూరివా అని నేనన్నాను.

ఇద్దరం ఒకరిపేరాకరం తెలుసుకున్నాం. తెన్నేటి సూరిని గురించి చక్రవర్తిగారు చెబుతూ వుండేవారు. అలాగే నన్ను గురించి కూడా సూరికి చెబుతూ వుండేవారు కనకనే మేం ఒకర్నొకరు మాటలు మాత్రం విని గుర్తించుకున్నాం. అక్కడ శారద అన్న "పేరుతో నవలలు రాసే నటరాజన్‌ ఆనే హోటలు కార్మికకవి కూడా వున్నాడు. ఆతనికి లౌ లెటర్సు రాస్తూ వచ్చిన మరో రచయిత పేరు రాంషా, ఇంటిపేరు దర్భా అని గుర్తు. వారిద్దరూ వున్నారు.

చ|క్రవర్తిగారు బందరులో ఉన్నారు. అక్కడికి వెళ్ళాను. ఆయన చిన్న కొడుకు స్కూలు పుస్తకం చదువుతున్నాడు. అదో నీతి పారం. పారం చివరన బోల్డ్‌ టైపులో అట్టు చేయుట్‌ మంచి అలవాటు అని వుంది. కుర్రవాడు నాన్నా ఏ అట్టు - రవ్వ అట్టా, పెసర అట్లా అని అడిగాడు. నాకు కుతూహలం కలిగి (గ్రంధకర్త పేరు చూశాను. విశ్చనాధ సత్యనారాయణగారు! నాకు ఆశ్చర్యం వేసింది. ఇది మామూలే అన్నారు చ'క్రవర్తిగారు. మామూలు బడి పంతులు పార్య (గ్రంధం రాసి ప్రసిద్దుల పేరు కొనుక్కుని ఆపేరుమీద అమ్ముకుంటారు.

అమ్ముడు పోయిన పుస్తకాలకు వచ్చిన డబ్బులో విద్యాశాఖాధికారులకు వాటాలుంటాయన్నారు చ|క్రవర్తిగారు. విశ్చనాధ వారు భక్తసులభుడు. ఆయనకు ఏదో సన్మానం ఏర్పాటు చేసి శాలువ కప్పితేచాలు వరాలిచ్చేస్తాడు. పెద్దల పేరు కొనుగోలు చేసే కిటుకు అది అన్నారు. బాపిరాజుగారు భీమవరంలో వుంటారు. అక్కడికి వెళదాం అన్నారు చక్రవర్తిగారు. మేం బందరునుంచి భీమవరానికి బయలుదేరాం. ఆయన అక్కడ కూడా లేరు. మదరాసులో వుంటారని తెలిసింది. అందుకని అక్కడి నుంచి మద్రాసు ప్రయాణం.

చక్రవర్తిగారికి మల్లాది రామకృష్ణశా(స్తిగారితో బాగా పరిచయం. మద్రాసులో రైలుదిగి వారింటికి వెళ్ళాం. అప్పటికి శాస్త్రిగారు ఇంట్లోనే వున్నారు. మేం స్నానం చేసి బట్టలు మార్చుకున్నాం. మధ్యాహ్నం కలుసుకుందామని చెప్పి ఆయన తన పనిమీద వెళ్లారు. మేం పార్క్‌హోటేల్లో కాఫీతాగి పానగల్‌ పార్కులో వున్న నాగలింగ వృక్షం కింద నున్న సిమెంటు బెంచీమీద కూర్చున్నాం. మధ్యాహ్నం భోజనం చేసి శాస్రిగారింటికి వెళ్ళాం. అప్పటికి శాస్త్రిగారు వచ్చారు. అక్కడ సావిట్లో ముగ్గురం కాస్త సేపు పండుకున్నాం. మధ్యాహ్నం లేచి బావిదగ్గర ముఖం కడుక్కుని మళ్లీ బైటపడ్డాం. మళ్లీ మా మకాం అదే నాగలింగ వృక్షం కింద నున్న సిమెంటు బెంచీ. సాయంత్రం అయింది. పార్కులో జనం చేరుతున్నారు. శాస్త్రిగారు వచ్చారు. ఆయనకో నిర్లీతమైన స్థలం వుంది. ఆయన వెంట మేం కూడా అక్కడికి వెళ్లాం. అక్కడ పింగళి నాగేందర్రావుగారు, దైతాగోపాలం, బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు, డైరెక్టరు జగన్నాథ్‌గారు ఉన్నారు. శాస్త్రిగారు వారిని మాకు మమ్మల్ని వారికీ పరిచయం చేశారు. రాత్రి వరకూ మాటలు సాగాయి. పార్కుమూసే సమయమయింది.

నాగలింగం చెట్టుకింద కూర్చుంటే ఏం తోస్తుంది? జనగాం (ప్రజల వీరోచిత పోరాటాలు గుర్తుకు వచ్చాయి. అక్కడి ప్యూడల్‌దొరల విలాసాలను కామిక్‌ కధలా చిత్రించాలని అనిపించింది. అంతే. పెన్సిలుతో ఆకధను చిత్రించడం మొదలుపెట్టాను. చిత్రాల్లో ఏక్షను ఉంటుంది. అక్కడే డైలాగులుంటాయి. ఆలా ఓ కధను కంప్లీటు చేశాను. చక్రవర్తిగారు చూశారు. బాగుందన్నారు. అసలు కామిక్‌ కథలను నడిపించే విధానం ఇదేనా అని ఆయన్నడిగాను. ఆయన ఆ బొమ్మలను రామకృష్ణశాస్రిగారికి చూపించారు, ఆయన బొమ్మలు చూశారు. మాట్లాడలేదు.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 67

మర్నాడు సినిమాటోగ్రాఫీమీద పుతోవ్కిన్‌ రాసిన పుస్తకం తెచ్చియిచ్చారు. పుష్కిన్‌ రాసిన ఒక కవితను ఏనిమేట్‌ చేయడానికి పుతోవ్కిన్‌ తొంభైఆరు బొమ్మలను గీశాడు. ఆ బొమ్మలు చూడమన్నారు. నాయత్నం సరియైన దారిలోనే వుందనిపించింది. చిత్రాలను ఇంకాచిత్రిక పట్టవలసి వుంటుంది. లెనిన్‌ గ్రాడ్‌లో పీతర్‌ దగ్రేట్‌ వెనక కాళ్లమీద నిలిచిన గుర్రంమీద కదనానికి కదిలిన శిల్పం వుంది. పుష్కిన్‌ పాత్ర ఒకటి అక్కడికి వచ్చి ఆ శిల్చం చుట్టూ పిట్టగోడకు ప్రదక్షిణం చేస్తాడు. తరవాత నిలిచి ఆ విగ్రహం వైపు ధూ అని ఉమ్ముతాడు. అంతే ఆ గుర్రానికి జీవం వచ్చినట్టు కదిలి ముందుకాళ్లతో ఆ వ్యక్తితలమీద కొడుతూ వెంటపడుతుంది కొంతదూరం పరుగెత్తిన తరవాత ఇంక శక్తిలేక ఆ వ్యక్తి పడిపోతాడు. ఇదీ ఆయన తీయబోయే షాటుకు వేసుకున్న చిత్రాలు. తరుముతున్న గుర్రాన్ని ఆశిల్బం నీడ ద్వారా సాధించాడు. గుర్రం ముందు కాళ్లు, అడుగునుంచి ఆ వ్యక్తి తలకాయ ఒకదాని తరవాత ఒకటి చిత్రించడం ద్వారా కాళ్లతో తలను చితగ్గొట్టుతున్నట్లు చేయగలిగాడు. ఆ తొంభైఆరు చిత్రాలు క్రమంగా ముందుకురికే నీడతో ఆయన సాధించిన (గ్రేట్‌ షాట్‌ నాకు అర్ధం అయింది అది డైరెక్టరు జగన్నాధ్‌ పుస్తకం. కామిక్‌ కధల పద్దతి అర్ధం అయింది కాని, వాటిని సాధించడానికి తగిన సమయం కాదు, చిత్రకళాభ్యసనానికి ధన కొలాలు రెండూ బాగా కర్చు అవుతాయి. అందుకని చిత్రశాస్తాలను చదివి కుతూహలం తీర్చుకున్నాను. ఇప్పుడు కూడా చిత్రశా(స్తాన్నే చదివాను. నాకు తొలుత సురవరం (ప్రతాపరెడ్డిగారు జక శ్లోకం యిచ్చారు. “టంకణం ద్విగుణం లాక్టాలాక్షా దశ గుణం జలం వహ్మినాపాచయేదర్ధం రసోదివ్యోప జాయతే” చిత్రకారులు వాడే లక్కరంగు తయారు చేసుకునే యోగం ఇది. తీసుకెళ్లిన డబ్బు అయిపోవచ్చింది. బాపిరాజుగారు మద్రాసులోనే వున్నారు. ఆయన పాండీ బజారులోనే సకుటుంబంగా వున్నారు. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు తమ బావగారింట్లో వున్నారు. బాపిరాజుగారు వారి అతిధిగా వున్నారు. బాపిరాజుగారు ఎవరితోనో సినిమాక్సి ప్లాను వేస్తున్నారు. రాత్రి పొద్దుపోయేవరకు ఆమాటలేసాగాయి, ఇంతలో బాపిరాజుగారి భార్యకు స్వాస్థ్యం తప్పింది. అప్పుడు డాక్టరు గోవిందరాజుల సుబ్బారావుగార్ని తీసుకుని రమ శ్రంటుందావిడ. సుబ్బారావుగారు లజ్‌లో ఉంటారు. డాక్టరుగారింటికి వెళ్లి పన్నెండుగంటలకు తలుపుతట్టాం. ఆయనకు బాపీరాజుగారి భార్య అస్వస్థత, బాపీరాజుగారి ఆతురత వివరించాం. ఆయన్ది హోమియోపతి వైద్యం. ఆయన చిన్న సీసాలో మాత్రలిచ్చి ఇవి వేసుకుని నిద్రపొమ్మని చెప్పాడు. తాను రేపు పొద్దున్న వస్తానని చెప్పమన్నాడు. డాక్టరును వెంటపెట్టుకుని రాకుండా మందు మాత్రమే తెచ్చినందుకు కినిసి ఆఖరికి ఆమందే తీసుకుని నిద్రపోయిందామె. మేం మళ్లీ మాంబళం రామకృష్ణశాస్రిగారింటికి చేరుకున్నాం. డాబామీద దీపం వెలుగుతోంది. మేం తిన్నగా డాబామీదికి వెళ్ళాం. జరిగినదంతా ఆయనకు చెప్పుకున్నాం. ఇప్పుడు బాపిరాజాగారి ప్లాను ఫలించదు, పత్రికల్లో పనిచేయడం మాకిష్టం లేదు. విద్వాన్‌ విశ్వం కోడంబాకంలో ఉంటాడు. అక్కడ ఓపూట ఆతిధ్యం. విశ్చం, సంస్కృతం చదివాడు. స్రోరాదేలో చాలా పరిచయం వుందని కామరాజు చెబుతూ వృంటే విన్నాను. సంస్కృతం సంగతి నాకు తెలియదు కాని కాస్త చీకటి పడితే బైటికి రాలేడు. వచ్చినా తోడుండాలి. అదీ ఆయన భయతత్వం. మళ్లీ పానగల్లు పార్కు నాగలింగం వృక్షం కిందనున్న సిమెంటు బల్ల మా స్మస్తాన చక టో రు ఇ ౫ "చ్రిజ్రినం. చక్రవర్తిగారెటో వెళ్ళా, చ. 658 9 రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ

నేను ఒక్కడినే కూర్చున్నాను. శ్రీనాధుని కాశీఖండం మనసులో సుళ్లు తిరుగుతోంది. రేవాతరంగళీకర 'సేవాహేవాకపాక శిశిర మరుత్ర్రస్తావ

శిశిర మరుత్‌ ప్రస్తావ పరికంప్యమాన జటావలి అయిన నారదుడు వింధ్యనగం ఎక్కుతున్నాడు. వెనకవీణ పట్టుకొని ఒక గంధర్య కాంత. నారదుని మహతి ఆయన వెనక గాలిలో వుంటుంది. ఆ క్షణాన అతని భావాలకనుగుణమైన రాగాన్ని మీటుతూ వుంటుంది. వీణ మీద దృష్టి లగ్నం చేసి తన వీణను మీటుతూ గంధర్వ కాంత వీణావాదన విద్య నేర్చుకుంటూ వుంటుంది. కార్డంత కాగితం తీసుకుని ఈ రెండు పద్యాలకు సన్నని పెన్సిలు ములికితో రూపకల్పన చేశాను. ఆ కార్డు చిత్రాన్ని చూసి బాబూ నువ్వు దేశద్రోహివి అన్నారు శాస్త్రిగారు.

ఇంత గొప్ప చిత్రాన్ని రి(ప్రొడ్యూస్‌ చేయడానికి వీల్లేకుండా గీశావు, అది దేశద్రోహం కాదా అన్నారు. మళ్లీ నువ్వు దీన్ని పెద్ద సైజులో గీయలేవు. నీవే కాదు మరే చిత్రకారుడూ దీన్ని చూసి పెద్దదిగా గీయలేడు. అంటే అది దేశద్రోహమే కదా అన్నారు. నేను సాయంత్రం రావడం కాస్త ఆలస్యం కావచ్చును. అంతవరకు మన బృందాన్ని మాటల్లో పెట్టడం నీవంతు అన్నారు. జిన్నా ఒకసారి నెహ్రూని పీటర్‌పాన్‌ అన్నాడని దానికి తెలుగేమిటి అని అడిగాను. అది ఒక ఇంగ్లీషు నాటకంలో పాత్ర, ఆ పొత్ర ఎప్పటికీ పసివానిగానే వుంటుంది. ఆమాటను నేను పాపం పసివాడు అని తెనిగించుకున్నానన్నాను.

అది విని పింగళి నాగేందరరావుగారు ఈ మాటను నేను ఎక్కడైనా వాడుకుంటానన్నారు. సాయంత్రం ఆరున్నర ఏడయేసరికి పార్కుకు తాళాలు వేస్తారు. పార్కు పక్షులు మరికొస్తసేపుండడం కోసం పార్కుబైట రెండు మూడు సిమెంటు బెంచీలు పచ్చనాకుల కుండీలుగల చిన్న దీవి వుంటుంది. ఆదీవికి రామకృష్ణశా(స్త్రిగారు పక్షితీర్థం అని పేరు పెట్టారు. అది పక్షి తీర్థం కాదు తక్షశిల అని తాను "పేరు పెట్టినట్టు ఆరుద్ర అంటాడు. అసలయిన తక్షశిల పార్కులోనే ఒక మూల వుండేదని నా అనుభవం. గోర్కీ చెప్పినట్టు విశ్చమే మా విశ్శవిద్యాలయం.

ఒకరోజు తిరుమల రామచంద్రుని ఇంటికి అతిధులంగా వెళ్లాం. ఆయన ఇల్టు ఉన్న సందుపేరు అక్బర్‌జా బజారు. ట్రిప్తికేనులో వుంది. అక్కడ భోజనం అయిన తరవాత బీచ్‌కి వెళ్ళాం. అక్కడ బూర్గుల రామకృష్ణారావుగారు కనిపించారు. ఆయన్నన్ను చూసి ఏమయ్యా నీరసంగా కనిపిస్తున్నావు అన్నారు. నేను ఉన్న విషయం చెప్పాను. ఆయన నొచ్చుకున్నారు. ఆయన హాల్‌ మకాం రాయపేటకు బయలుదేరాం. వెళ్లగానే భార్యను పిలిచి వంటచేయమన్నారు. భోజనానికి కూర్చున్నాం. ఆయన అన్నంమీద చేయివేసి తనకు ఉద్యోగమిచ్చే స్థితి కలిగినప్పుడు కోరిన కొలువిస్తానన్నారు. ఆంతే ఆతరవాత ఆయన్ని కలవలేదు. అది నా ఈగో.

ఆయన కార్యదర్శి అవసరాల కామేశ్వరరావు నడిగి రామకృష్ణారావు దంపతుల యోగక్షేమాలు తెలుసుకుంటూ వుండేవాడిని. కాంగ్రెసులో అతివాద, మితవాద (గ్రూపులుండేవి. అతివాదులు నుంగం బాకంలో ఒక మేన్సన్‌లో శిబిరంపెట్టినట్టు తెలిసింది. ఆ శిబిరాధ్యక్షుడు మాడపాటి రామచం(ద్రరావుగారు. చక్రవర్తిగారికీ సంగతి చెప్పి నేను మేన్షన్‌ చేరాను. అక్కడ నన్ను బాగా ఎరిగినాయన వల్తూరి బసవరాజుగారు. శను తెలుగు శిబిరంలో భోజనానికి చేరాను.

తెలుగు శిబిరంలో అంతా తెలంగాణా యువకులు. వారికి లర భోజనం. అంటే సాంబారు మజ్జిగ అన్నం. పక్కనే మహారాష్ట్ర వలంటీర్లకు గోధుమరొట్టెలు. అంరో, అం లూ మిడి పళ్ల రసం ఒక స్వటు

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ అ 69

వారి భోజనం. రెండోరోజు ఈ కుర్రవాళ్లందర్నీ వెంటబెట్టుకుని మహార్యాష్ట్ర మెస్‌కి వెళ్లాం. అక్కడి వంటవాళ్లు మీ మెస్‌ వేరేవుంది అక్కడికెళ్లండి అన్నారు. మాక్కూడా రొట్టె, ఆంరస్‌ కొవాలి అని డిమాండ్‌ చేశాం. కొంత తర్జన భర్ణన తరవాత మాక్కూడా రొట్టెలు, స్వీటు, ఆంరస్‌ వడ్డించారు. తెలుగు యువకులు తృప్తిగా భోంచేశారు. నేను భోజనానికి మేన్షన్‌కి వెళ్లిన సంగతి తిరుమల రామచంద్రునికి తెలుసును. సెట్టి ఈశ్వరరావు ప్రభలో రామచంద్రుడు, వీవైఎల్‌ నరసింహారావు మరొకరితో నిత్యసంబంధం పెట్టుకుంటూ వుండేవాడు. దానికి రెడ్‌సెల్‌ అన్న నిక్నేమ్‌ కూడా వచ్చింది, ప్రత్యేక హైదరాబాదు ర్యాష్టం కావాలని కమ్యూనిస్టులు కూడా తీర్మానం చేశారన్న ఒక వార్తా శకలాన్ని పట్టుకుని వివైఎల్‌ నరసింహారావు వచ్చాడు. నేను అక్కడున్న హైదరాబాదు ఉర్హు పత్రికలన్నీ తిరగేశాను. అలాంటి వార్త కానరాలేదు. ఆసంగతిని మాడపాటి రామచంద్రరావు ప్రభృతులకు తెలియజెప్పాను. అప్పటికప్పుడే దాన్ని ఖండిస్తూ వారిచేత ఓ ప్రకటన ఇప్పించి నరసింహారావును పంపించేశాను. దీన్తో మెస్సుల్లో పితూరీ పుట్టించిన వాడిని నేనే అని తెలిసి పోయింది. రామచంద్రరావు ఉ(గ్రుడై మహారాష్ట్ర మెస్‌ నిర్వాహకునికి చీవాట్టు పెట్టాడు. ఇటుపై నుంచి ఒకటే మెన్‌. రొట్టె, అన్నం, రొట్టెల్లోకి స్వీటు, ఆంరస్‌. సాంబారు పెరుగు కావలసిన వారందరికీ వడ్డించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఏమయినా నేనక్కడుండడం మహారాషష్ట్రాయకులకు ఇష్టంలేదు. బసవరాజుగారూ సూర్యదేవర రాజ్యలక్ష్మిగారు బెజవాడ నుంచి ఓ వీక్షీకి డిక్షరేషన్‌ తీసుకున్నారు. దానిపేరు తెలుగు దేశం. దాన్ని నడిపించదగువారి కోసం చూస్తున్నారు. నువ్వెళ్లినడుపుతావా అని అడిగారు బసవరాజాగారు. నడుపుతానన్నాన్నేను. మరయితే ఇప్పుడే బయలుదేరు అన్నారు. నాతో వచ్చిన చక్రవర్తిగారి సంగతి చెప్పి ఆయనకో వంద ఇవాలన్నాను. నూట యాబైరూపాయలు తీసుకుని మాంబళంలో చ్రవర్తిగారికి నూరు రూపాయలిచ్చి నేను బెజవాడ బండి ఎక్కాను. పత్రికా కార్యాలయం అడ్రసుకు వెళ్లి బసవరాజుగారిచ్చిన ఉత్తరాన్ని రాజ్యలక్ష్మిగారికి అందించాను. నేలమీద జంబుఖానా దానిమీద డస్కు - ఇదీ నా ఆఫీసు, నేను బాగా ఎరిగినవ్యక్తి పత్రికా మేనేజరు. ఆయన సోషలిస్టు పార్టీలో వుండేవాడు. కాంగ్రెసు అతివాదులంటే వారే కద. ఆయన కూడా ఒక డస్కు. అది ఆయన ఆఫీసు. నేను తొలిసారి బెజవాడ వచ్చినప్పుడు మొగల్రాజపురం వెళ్లి అక్కడ కమ్యూనిస్టు మెస్‌లో భోజనం చేశాను. తెలంగాణా వారి వసతి తోసం ఒక పొడుగాటి షెడ్డు వుండేది. అక్కడ రావి నారాయణరెడ్డిగారిని పలకరించి బందరు వెళ్లాను. మద్రాసు నుంచి తిరిగి వచ్చేసరికి అషెడ్డు లేదు. ్రెస్సులేదు. టెలిప్రింటరులేదు. ప్రెన్సంతా చిందరవందరయింది. రాజ్యలక్ష్మీదేవిగారు ముందు ఆఫీసు కోసం ఒక ఇల్లు తీసుకున్నారు. గాంధీనగరంలోనే మయూరా హోటెలుకెదురుగా మేడమీది పోర్టన్ను ఆఫీసుకు ఎంచుకున్నారు. ఇక్కడి నుంచి పిలుస్తే హోటలు నుంచి కాఫీ వస్తుంది. హోటల్లో నా కోసం ఈజీ చెయిరు, దాని మీద ఒక బల్ల రాసుకొనడానికి వున్నాయి. నేను రాత మొదలుపెట్టాను. ఏలూరు రోడ్డు మీద ఒక (ప్రెస్సుంది. దాని యజమాని ఓ వృద్ధ ఖద్దరుధారి. తెలుగుదేశం కూడా అదే ప్రెస్సులో ఆచ్చవుతుంది. మేటరు తీసుకెళ్లి ఇచ్చేవాడిని, (ప్రూపులు కుర్రవాడు తెచ్చియిచ్చేవాడు. 70 అ రాంభట్ల కృష్ణమూర్తి సొాంతకథ

స్టేషను రోడ్డులో ఒక రెడీమేడ్‌ గార్మెంట్‌ స్టోరుండేది. అక్కడ పనిచేసే సేల్సుమన్‌ పేరు ప్రసాదరావు. అతడు మా మేనేజరుకు బావమరిది, ఆయన భార్య పురిటికి పుట్టింటిక్నెంది. ఇప్పుడతనొక్కడే వుంటున్నాడు. ఇల్లు బందరు రోడ్డుమీదున్న క్షీరసాగరం బిల్డింగు. అందులో మేడమీదనున్న ఒక భాగం. నేను మక్షాం అక్కడికి మార్చాను. అదే బిల్లింగులో కింద నున్న ఒక పోర్టనులో చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారున్నారు. నేను పత్రికలో పనిచేసేవాడినని తెలియగానే శా(స్తిగారి మనవడొచ్చి మిమ్మల్ని పిలుస్తున్నారు తాతయ్య అన్నాడు.

నేను వెళ్లి ఆయనకు నా గోత్ర ప్రవరలు చెప్పి అభివాదం చేశాను. ఆ యింట వెంకటశళాస్త్రిగారి ఇద్దరల్డుళ్లూ ఇద్దరు కూతుళ్లూ మనవలూ వున్నారు. శాస్త్రిగారు వీధి గదిలో మంచం మీద పడుకుని ఉంటారు. పక్కనాక కుర్చీ. నాలాగ వచ్చే వారు ఆకుర్చీమీద కూర్చుంటారు. శాస్త్రిగారికి ఆ వయసులో ఆయన మాటలను విని అర్ధం చేసుకొనగలవారు కరువయినట్టు నాకు అర్ధం అయింది. నేను అనేక విషయాల గురించి ప్రశ్నలు వేసేవాడిని. వాటన్నింటికీ ఆయన సమాధానాలిస్తూ వుండేవారు.

ఒకరోజు ఫోటో(గ్రాఫరును తీసుకుని మొగల్రాజపురం ప్రజాశక్తి నగరు సందర్శించాను. అక్కడ పోలీసులు చేసిన బీభత్సాన్ని ఫోటోలు తీయించాను. గాంధీ, నెహురూ, పటేల్‌ చిత్ర పటాల బొమ్మలకున్న కళ్లను పోలీసులు బాయెనెట్లతో పొడిచారు. ఫాంటు స్టాండులను కక్కోసులుగా వాడారు. ఇది పోలీసులు స్వయంగా చేసి వుంటారని తోచదు. వారి ప్రోత్సాహంతో పోలీసుల లంకలు చేసిన పని అని తోస్తుంది. ఆ ఫోటోలతో ఒక పెద్ద వ్యాసం రాసి తెలుగుదేశం పత్రికలో ప్రకటించాను.

పన్నెండు పేజీల టాబులాయిడు పత్రిక. బాలురు, విద్యార్థులు, మహిళలకు ప్రత్యేక వ్యాసాలున్నాయి. రాజకీయం ప్రధానం. సాహిత్యం మీద కూడా రాయాలి. ఇవి కాక ప్రతివారం సంపాదకీయం. ఈ అన్నింటినీ నేనే రాసేవాడిని. ఒకటి రెండు వారాలయే సరికి రాజ్యలక్ష్మీదేవిగారు పిడికిటి రామకోటయ్యగారనే స్వాతంత్ర్య సమరయోధుని నాకు అసిస్టెంటుగా నియమించారు. ఆయన ఎంఎ చదివాడు. కాని స్వతంత్రంగా రాజకీయాలమీద యేమీ రాయలేడు. హిందూ పత్రిక నుంచి తనకిష్టుయిన వ్యాసాన్ని అనువాదం చేసేవాడు.

ఆ వ్యాసాన్ని యధాతథంగా వేస్తే ఈ పత్రికలో రెండు మూడు పేజీలవుతుంది. ఆ సంగతిని రామకోటయ్య గారికీ రాజ్యలక్ష్మీదేవిగారికీ ఓపిగ్గా వివరించాను. అలాగే ఆ పత్రికలో పడిన వార్తలను అనువదించే వాడాయన. ఇది వారపత్రిక. దిన పత్రిక కాదు. ఆ వార్త అచ్చు అయి చేతికి రావడానికి వారం పడుతుంది. అప్పటికి ఆ వార్త మురుగుకంపు కొడుతుంది. దానివల్ల పారకులకేమిటి ప్రయోజనం? పాపం రామకోటయ్యగారు నెలరోజులకే పని విరమించుకుని వెళ్లిపోయారు. తరవాత కాజ రాధాకృష్ణఅనే ఆయన చేరారు.

రాధాకృష్ణ శర్మగారు భక్తకవి. అందునా ఆయన కృష్ణభక్తుడు. ఆయన భక్తి పద్యాలు రాస్తానంటాడు, వాటికీ పత్రికలో స్టానం లేదు. నాకు పని భారం తగ్గించాలని రాజ్యలక్ష్మీదేవిగారి ఉద్దేశం. శర్మగారు రెండు వారాల కన్న ఉండలేకపోయారు. ఆయనకు ప్రూపులు చూడ్డంరాదు. అందువల్ల నాపని భారం తప్పలేదు. నా పాత మిత్రులకు ఈ కొత్త ఎడ్రసు యిచ్చాను. అంచాత నాకు ఉత్తరాలు వస్తూ వుండేవి, (ప్రజాశక్తి విధ్వంసవార్త ప్రచురణ తరవాత ఈ పత్రికలో ఎవడో మనవాడే ఉన్నాడన్న పుకారు పుట్టింది.

అటు జైలుకుకాని ఇటు అజ్ఞాత వాసానికి కాని వెళ్లని సన్నకారు కమ్యూనిస్టుల్లోంచి పుట్టింది ఈ పుకారు. పైగా నవయుగం పేర కమ్యూనిస్టు యువజన సంఘం నుంచి వెలువడే పత్రిక ఇక్కడే అచ్చుఅవుతూ వుండేది. ఈ పత్రిక మూల స్థానం గుంటూరు, కాని అచ్చు మాత్రం బెజవాడ. యువజన పత్రికా,

రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ అ 71

తెలుగుదేశం ఒకే ఫ్రెస్సులో అచ్చయేవి. నేను అప్పుడప్పుడు ఏవో చిట్కాలు కూడా రాసి యిస్తూ వుండేవాడిని. ఈ పత్రిక ప్రింటుకోసం ఇద్దరు వస్తూ వుండేవారు. ఆ యిద్దరివల్దా యువజన సంఘాలకు మనవాడెవడో అర్థం అయిపోయి వుంటుంది. ప్రపంచ దేశాల రాయబార కార్యాలయాలవారు అంతర్జాతీయ సమస్యలమీద తమ అభిప్రాయాలను వివరిస్తూ వార్తా వ్యాసాలను అన్ని పత్రికలకూ పంపిస్తూ వుంటారు. వల్టూరి బసవరాజుగారు మ(ద్రాసునుంచి బెజవాడ వచ్చారు. అప్పటికి యుగోస్టావియా నాయకుడు టిటోకు రష్యన్‌ నాయకుడు స్టాలిన్‌కు మనస్పర్థలు వచ్చాయి. ఆ స్పర్థలమీద తమ అభిప్రాయాలను వివరిస్తూ (బ్రిటిషువారు ప్రకటించిన వార్తా వ్యాసాన్ని వెయ్యమని బసవరాజుగారు నాకిచ్చారు. దాన్ని నేను అనువాదం చేసి తెలుగుదేశం పత్రికలో ప్రచురించాను. మరుసటి వారం టిటో, స్తాలీన్‌ స్పర్థల మీద రష్యా వార్తా వ్యాఖ్యానం పోస్టులో వచ్చింది. టిటో, స్తాలిన్‌ స్పర్థల మీద ఉభయుల్నీ వ్యతిరేకించే ఇంగ్లీషు వారి వ్యాఖ్యను చూశారు. ఇప్పుడదే సమస్యమీద ఇది సోవియట్‌ వ్యాఖ్య అని ఇంట్రో రాసి ఆ వ్యాఖ్యను అనువదించి అచ్చుకిచ్చాను. అది వచ్చింది. ఇది జర్నలిజం పద్దతి కాదన్నారు బసవరాజుగారు. మన పత్రికలో తప్పులెక్కువ వస్తున్నాయి. అందుక్కొరణం మీరాత కంపోజిటర్లకు తెలియదు. కనుక మీరాతను విడివిడి అక్షరాల్లో రాసేవారిని నియమిస్తామన్నారు. శుభం. నేను వారం రోజులు సెలవుపెట్టి విశాఖపట్నం వెల్లిపోయాను. మరీ అత్యవసరం అయితే తంతి పంపండి అని విశాఖ ఎ(డ్రసు 'మేనేజరుకిచ్చి నేను రైలెక్కాను. బసవరాజుగారు పత్రికా వ్యవహారాలన్నీ తామే చూసుకుంటామని డస్కు దగ్గర కూర్చున్నారు. ఆమరుసటి వారం పత్రికరాలేదు. 'పెస్సుకసలు మేటరే వెళ్లలేదు. ఆయన రాసిన ఒక వ్యాసాన్ని దస్తూరి బాగున్నవారిచేత రాయించి (ప్రెస్సుకు పంపారు. అయినా ్రూపులు ఇంత ఘోరంగా ఎందుకున్నాయి అని ప్రెస్సువారిమీద కస్సుబుస్సుమన్నారు. నాకు రోజుకో టెలిగ్రాం చొప్పున వచ్చాయి. వారం తరవాత నేను వచ్చాను. ఆఫీసుకెళ్లాను. నేను వేలుపెట్టనని ఆయన లేచారు. నేనొక్కడినీ పన్నెండు పేజీల పత్రికను రాయలేనని వల్ఫూరి వారు సూర్యదేవర వారు భావించేవారు. అందుకని నాకన్న కాస్త ఎక్కువ జీతంమీద శ్రీనివాసచక్రవర్తిగారిని పత్రికలో నియమించాను. నావి కమ్యూనిస్టు భావాలని ఆ యిద్దరికీ నమ్మకం - నాకు కమ్యూనిస్టు నాయకుల దగ్గరనుంచి ఆదేశాలందుతున్నాయని రాజ్యలక్ష్మీ దేవిగారి నమ్మకం, అందుకని ఆ నమ్మకాన్ని బలపరిచే ఆదేశాలను తెలుసుకోవాలని నాకు వచ్చే కవర్లను చింపి చదివేవారు. మర్నాడు పొరపాటయిందండీ అడ్రసు పూర్తిగా చదవకమునుపే కవరు చింపానని ఉత్తరం నా కిచ్చేవారు. నిజానికి కోస్తా కమ్యూనిస్ట్రలెవరితోనూ నాకు పరిచయాలు లేవు. హైదరాబాదులో మాత్రం అలాంటి వారితో పరిచయం వుంది. నా వైపు నుంచి ఆది మామూలు పరిచయమే. హైదరాబాదులో కొందరు కాంగ్రెసు నాయకులతో పరిచయం వుంది. ఆ పరిచయం వల్లనే మేన్షన్‌ మెస్సులో చేరగలిగాను. హైదరాబాదులో కమ్యూనిస్టు విద్యార్థుల ర్యాలీలను ఆపడం కోసం కొన్ని రోడ్లను అడ్డుకునేవారు. అలాంటి దళలో కారులున్న పోలీసు ఆఫీసర్లు నాకు ఆఫీసువరకు లిప్టు యిచ్చేవారు. నా శుద్డ ఖద్దరు వేషం పోలీసుకారులో వెళ్లడం చూసి నన్ను రజాకారుగానే భావించేవారు. న అలాంటి భావనగల కొందరు కుర్రవాళ్ళు పోలీసులకు ఏదో చెప్పి నన్ను పోలీసు రాణాకు పంపించారిక్కడ. ఒక భయంకర రజాకార్ను అరెస్టు చేయించాం అని తమ నాయకునికి చెప్పారు, కుర్రాళ్లు ననన 726 రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

చేసిన వర్షనను బట్టి ఆ కాంగ్రెసు నాయకుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. నన్ను చూసి ఆశ్చర్యపోయాడు కుర్రవాళ్లను మందలించి నన్ను సగౌరవంగా తెలుగుదేశం ఆఫీసుకు చేల్చడు. నాటి బెజవాడ రాజకీయాలు చిత్రంగా వుండేవి. కాంగ్రెసు భూస్వాములు, కమ్యూనిస్టు యువకులకు తమ పిల్లల్నిచ్చేవారు. అందుకు కారణం ఏమిటి? కమ్యూనిస్టులు (స్త్రీని గౌరవిస్తారు. తిట్టరు కొట్టరు. కట్నకానుకల బేరాలాడరు. అట్టహాసం పెళ్లి నొల్లరు. ఆధునిక దండ పెళ్లిళ్లే కావాలంటారు. నాటి పెళ్లిపెద్దలు యువజనులు, విద్యార్థులు. పెళ్లిపద్దతిమీద కాం(గ్రెసువారికి అభ్యంతరం వుండేది కాదు. ఆచార్యత్వం దగ్గర మాత్రం తమ వాడే వుండాలని ఉభయుల కోరిక. నాది శుద్దఖద్దరు వేషం, కాం(గ్రెసు భావాలు కాదు. అయినా నా ఆచార్యత్వానికి ఉభయుల అంగీకారం వుంది. ఇలాంటి పెళ్లిళ్లను ఆత్మగౌరవ వివాహాలనేవారు. మహాత్మాపూలే, రామస్వామి నాయకర్ల పద్దతి అది. నాటి యువజన నాయకుడు యస్వీ నరసయ్య అతని బావమరిది కూచిపూడి వెంకటేళ్చరరావు. అతడిపెళ్లి, నరసయ్య అజ్ఞాతంలో ఉన్నాడు. పెళ్లి నా ఆచార్యత్వాన జరిపించాలని ఆయన అభీష్టం. ఆత్మగౌరవ వివాహాలనడమేకాని తంతు ఎలా నడుపుతారో నాకు తెలియదు. ఆర్యసమాజ (బ్రహ్మ సామాజికులు కూడా ఇలాంటి పెళ్లిళ్లే జరిపిస్తారు. ఆర్య సామాజికులు వేదమంత్రాలు చదువుతారు. అన్ని రగిల్బి హవనం చేస్తారు. బ్రహ్మసామాజికులు ఉపనిషత్తులు చదువుతారు. మూడు శ్లోకాలు, నాలుగు పద్యాలు, నా ఉపన్యాసంతో పెళ్లి అయింది. అప్పటి నుంచీ నాకు ఆచార్యత్వం డిమాండు పెరిగింది. గంట గంటన్నర ప్రయాణం కాగల (గ్రామాల్లో చాలా పెళ్లిళ్లు చేయించాను. ఎన్ని పనులు ఎలా చేసినా ఉదయం ఒక గంట వెంకటశా(స్తిగారితో గోష్టి నిరాఘాటంగా జరిగేది ఆయన మంచం కింద సాహిత్యం సంచీ ఒకటి వచ్చేది. మర్నాడు ఆది పోయి కొత్తది వచ్చేది. అంటే కమ్యూనిస్టు పరిభాషలో ఆయన మంచం సాహిత్యానికి ఒక డెన్‌లా పనిచేస్తూ వుండేదన్నమాట. కొత్త సంచీ యిచ్చి పాతసంచీ పట్టుకుపోయేవాళ్ల పేర్లు తరవాత తెలిశాయి. హైదరాబాదు మీద పోలీసు ఏక్షను జరిగింది. నిజాం నవాబు భారతదళాలకు లొంగిపోయాడు. పత్రికను హైదరాబాదు తరలించడానికి యత్నాలు మొదలుపెట్టారు. నన్ను కూడా రమ్మన్నారు. కాని నేను రానన్నాను. ఇక్కడ ఉన్నంతకాలం పనిచేస్తానన్నాను. నాకు వివాహం చేయాలని మా మేనమామగారి సంకల్పం. అందుకోసం ఒక సంబంధాన్ని ఆయన ఖాయం చేసుకున్నారు. ఒకరోజున స్టేషను కొచ్చి కలవమని ఉత్తరం. నేను వెళ్లాను. టిక్కెటు తెస్తాను, పిల్లని చూడడానికి నువు కూడా రా అన్నారు. మీరు నిర్ణయించారు చాలునన్నాను. ఒకవేళ పీల్లనిన్నాల్లకపోతే? అన్నారు. అలా అయితే నాకు వివాహ యోగ్యత' లేదని అర్ధం అన్నాను. కాలేజీ నుంచి వచ్చి స్నానం చేయనిదే మంచినీళ్లయినా తాగనొల్లని మామయ్య బెజవాడ ప్లాట్‌ఫాంమీద ఇడ్డీలు కొని తిన్నారు. నీక్కూడా తెస్తానన్నారు. నేనిప్పుడు రానన్నాను. రేపు బయలుదేరి వస్తానన్నాను. మర్నాడు బయలుదేరి ఆయనిచ్చిన అడ్రసుకు చేరాను. అక్కడ స్నానాదికాలు ముగించుకున్నాను. ఆ మధ్యాహ్నం పెళ్లికూతురి పెద్దన్నగారింటికి బయలుదేరి ఇద్దరమూ వెళ్ళాం. అంటే పెళ్లికూతురితో ఇంటర్‌వ్యూ, పెళ్లికూతురి పెద్దన్నగారు, ఆయన కుటుంబం, తండ్రిగారూ అందరూ వీధి అరుగుమీదే ఎదురుచూస్తూ కూర్చున్నారు ఆవీధి అరుగుమీదే వారికెదురుగా మరో అరుగుమీద మేం కూర్చున్నాం. పెళ్లికూతురి కనక నవ ప్ర ౦తకథ తి 73 రాంభట్ల కృష్ణమూర్తి సా

పెద్దన్నగారు అందర్నీ పరిచయం చేశారు. ఆయనా, భార్యా, సంతానం కాక ఆయన నాన్నగారు కూడా వున్నారు. మామయ్యకీ ఆయనకూ ఇదివరకే దేఖీలయినట్టున్నాయి. కొత్తవాడిని నేనొక్కడినే కనక పరిచయం చేయవలసిన ఆవసరం రాలేదు, పరిచయాల తరవాత వీధి నాటకాల్లో హీరోయిన్‌ ముందు పట్టుకున్న తెర ఒక్కసారి తీసేసినట్లు తలుపుచాటునున్న పెళ్లికూతురి ప్రవేశం.

ఎదుటి అరుగుమీద ఇంక కాళీలేదు. ఇవతల ఆరుగుమీద నేను, మామయ్య, పెళ్లికూతురి తండ్రి

ముగ్గురమే ఉన్నాం. అంచాత ఈవలి అరుగుమీదే జాగా వుంది కనక ఆమె ఈ అరుగుమీదే కూర్చుంది. ప్రవేశం అయింది. తెరలో ఇంకెవరూ లేరు (ప్రవేశానికి. కనీసం కలకలం కోసమైనా ఎవరూ లేరు. ఆఖరికి నేనే నోరువిప్పాను. నీ పేరేమిటి అని పెళ్లికూతుర్ని అడిగాను. సుభద్ర అని చెప్పింది. మళ్లీ నిశ్శబ్దం. ఆమె ఎలాగా ప్రశ్నించలేదు. ఆమె బలగం నుంచి ప్రశ్నలు వస్తాయేమో అని చూశాను, రాలేదు. ఇంతవరకు ఓ డజనుమందితో ఇంటర్‌వ్యూలు చేసి వుంటాను. ఇలాంటిదింతవరకూ చేయలేదు.

వంట చేయడం వచ్చునా అన్నాను. ఏకాక్షర (ప్రత్యుత్తరం వచ్చింది. చదువుకున్నావా? ఆరోక్టాసుదాకా చదివాను. చింతచెట్టు కింద చితుకులేరుకొచ్చి మూడురాళ్లపాయ్యి మీద వంటచేయగలవా అని అడిగాను. ఈ ్రశ్ళక్కూడా ఆమే జవాబు చెప్పింది. మిగతావారు నోరు మెదపలేదు. నేను వేసిన ప్రళ్ళ ఆర్ధం ఆయినా కాకపోయినా చేయగలను అని ఆమె అంది కనక ఇక ప్రశ్చలనవసరం ఆనిపించింది. పెల్లిచూపుల్లో నిర్ణయాధికారం వధువుది, వరునిదికాదు ఆని నా అభిప్రాయం. ఈవిషయంలో నా అభిప్రాయం కిందటే ఏర్పడింది.

ఇంక అడిగేదేమీలేదన్నాను. అంతవరకు ముళ్లమీద కూర్చున్నట్టు అనీజీగా వున్నవారు ఒక్కసారి లేచారు. లేచినవారు ఇంట్లోకి వెళతారనుకున్నాను. తలుపు తాళం పెట్టి వీధిలోకి బయలుదేరారు. మామయ్యకూడా వారిననుసరిస్తూ ఉన్నందున నేనూ అటే అడుగువేశాను. వారు పెద్ద పెద్ద అంగలు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడికి అన్నాను. సినిమాకి అన్నారు మామయ్య, ఇంతలా ఒకనాటి చెప్పట్టల డొంకలాగ వ్యాపిస్తూన్న సినిమాసంస్కృతిని చూసి ఆళ్ళర్యం కలిగింది. అమ్మాయి ఎలా వుంది అని నన్ను మామయ్య అడిగారు. ఎలా వున్నా అనువుగా మలుచుకునే శక్తి నాకుందన్నాను.

సినిమా హాలు చేరాం. సినిమా పేరు కాజల్‌, హిందీ చిత్రం. కాజల్‌ అంటే కళంకం అని అర్ధం, అదెంతమందికి అర్థం అయిందో నాకు తెలియదు. కథలోని కళంకం ఆపాదితమే కాని వాస్తవం కాదు. సినిమా చూసిన తరవాత మామయ్య వాళ్లతో మాట్లాడారో లేదో తెలీదు కాని నేనుమాత్రం విడిదికి చేరాను. మర్నాడు తిరుగుప్రయాణం. నేను బెజవాడలో దిగిపోయాను. మామయ్య సికిందరాబాదు వెళ్లిపోయారు. బెజవాడలో అందరికీ చెప్పాను పెళ్లిచేసుకోబోతున్నానని. నాకు ఆతిధ్యం ఇస్తున్న (ప్రసాదరావు భార్య ఏనుగమహలే పురుటికి వెల్లింది,

(ప్రసాదరావు దగ్గర భోజనం, పడక, చెళ్లపిళ్ల వెంకటశా(స్త్రిగారితో గోస్టి నిత్యకృత్యాలు. శాస్త్రిగారు రాసిన ఒక గాధను తెలుగుదేశం పత్రికలో అచ్చువేశాను. చక్రవర్తిగారు తెలుగుదేశంలో పనిచేస్తూనే వున్నారు. కాబోయే పెళ్లిద్వారా రాబోయే చుట్టాలు ఒకరొకరే వచ్చి హాజరు వేయించుకుంటున్నారు. వెంకటళాస్తిగారింట నాకు బ్రహ్మచారిగారని పేరు, పెళ్లి నిశ్చయం ఆయిన తరవాత ఆ పేరు మారలేదు. పెళ్లి అయిన తరవాత కూడా వారు అలాగే పిలిచేవారు. పేరులోన యేమి పెన్నిధి యున్నది అంటారు. ఒకనాడాపేరు ప్రాణానికి (ప్రత్యామ్నాయం,

తా 74 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

తెలుగుదేశం ఇంకా మారలేదు. అందులో నేనూ చక్రవర్తిగారు యధాప్రకారం పనిచేస్తున్నారె. పెళ్లికి ముహూర్తం నిర్ణయం అయింది. ఫిబ్రవరి మూడు. అప్పటికి రమ్మని వర్తమానం. పెద్దాయన చ।(కవర్తిగారి ఆశీస్సులు తీసుకుని బయలుదేరాను. కాకినాడలో పెళ్లికూతురు పెద్ద అన్నగారి ఇంటనే పెళ్లి. అక్కడికి దగ్గరలోనే వున్న ఒక ఇంటిని విడిదికి యిచ్చారు. విశాఖపట్నం నుంచి అక్కయ్య బావగారు వచ్చారు. హైదరాబాదు నుంచి అందరూ వచ్చారు. పెళ్లి ముహూర్తం ఉదయం తొమ్మిదిన్నరకి అనుకుంటాను. కనక జనం అక్కడికి వెళ్ళారు. విడిది ఖాళి.

పేరూరు ఘనాపారీగారి తమ్ముడు సోమయాజులుగారు పురోహితుడు. విడిదిలో ఆయనతోపాటు నేను, మామయ్య మాత్రమే ఉన్నాం. అక్కడ స్నాతకంపేర సమావర్తన మంత్రాలు మొదలుపెట్టారు. కొన్ని మంత్రాలయిన తరవాత నేను పీటమీంచిలేచి నిలబడ్డాను. ఏమిరా లేచావేం అని మామయ్య అడిగారు. ఆ మంత్రాల్లోని పాపాలు నేను చేశానా అని ప్రశ్నించాను. మామయ్య ఆ మంత్రాలను మల్లీచదవమన్నారు. అవి వినేసరికి ఆయనక్తే జుగుప్స కలిగిందనుకుంటాను. మరి ఏంచేద్దామన్నారు. ఇలాంటివింకా వున్నాయన్నాను

అప్పుడు పురోహితుడే ఒక ఉపాయం సూచించాడు. తాను ముందు మంత్రం సంగతి చెవిలో చెబుతాను నువ్వు తల ఊపుతే మంత్రం చదువుతాను లేకుంటే ఆ మంత్రమూ ఉండదు కర్మా ఉండదన్నాడు. పెళ్లిని ఆమోదించేది మహిళలు వారికి కావలసినవి జీలకర్ర, బెల్లం, మాంగల్య బంధనం, తఆం(బ్రాలు. ఈ మూడింటికీ వేదమంధత్రాలు ఎలాగూ లేవు. ఇవి ముఖ్యం కనక వీటి సందర్భంగా చదివే మంత్రాలు లేవు కనక అదే సమయంలో మిగతా మంత్రాలను చదివేస్తే సరిపోతుందన్నాను. ఈ పద్దతినిద్దరూ ఒప్పుకున్నారు.

పెళ్లితంతులు, మంత్రాలు అన్నీ ఓ గంటలోపే అయిపోయాయి. సదస్సులో దుళశ్ళాలువలవారు, కంకణాల వారు, సింహ లలాటాలవారు కూడా వున్నారు. వారు ఆ స్పీడుకు ఆశ్చర్యపోయారు కాని సోమయాజులుగారికి పెళ్లి చేయించడం తెలీదని ఆనగల సాహసం ఎవరికీ లేదు. పైగా మా మేనమామగారు సంస్కృత పండితుడు. ఆయన చిరునవ్వులతో అన్నింటికి ఆమోదసూచకంగా తల ఊపుతున్నారు. మిగతా కార్యక్రమాలు ఒక అరగంటలో పూర్తి అయ్యాయి. అప్పుడు వడ్డనలు. వంటలు, వడ్డనలు అంతా ఆ చిన్న 'పెరటిలోనే. పెరడంతకీ మందులు చల్లారు.

ఉదయం నుంచీ పెల్లివారి నిర్లక్ష్యాన్ని చూస్తూనే వున్నాను. ఆకలి దహిస్తోంది. ఏదో కలుపుదామని అన్నం ముందుకు తీశాను. ఆ అన్నంమీద మరికొంత అన్నం కప్పాను. గుమ్మడికాయ కూర వండారు. ఆకూరైనా కాస్త తిందామని చూశాను. ఆకూరను కూడా అన్నంతో కప్పాను. ఇక ఏదో తింటున్నట్టు నటిస్తూ కూర్చున్నాను. అందరి భోజనాలూ అయ్యాయి. వారితోపాటు నేనూ లేచాను. వీధి అరుగుమీదకు వచ్చాను. కన్యాదాత బావమరిదిగారు అందరికీ వక్కలాకులు పంచుతున్నారు. అందరితోపాటు నాక్కూడా ఇచ్చాడు. ఏం చేయగలను లోపలికి వచ్చి పైజామా లాల్చీ వేసుకున్నాను.

మా బావదగ్గరకు వెళ్లి బావా పదిరూపాయలుంటే ఇయ్యి అన్నాను. ఆయనిచ్చాడు. రాత్రి బెజవాడలో కలుస్తాను అని చెప్పి రైలు స్టేషనుకు బయలుదేరాను. రైలుకింకో పావుగంట టైముంది. టిక్కెటు తీసుకుని రైలెక్కాను. బెజవాడలో దిగి తిన్నగా క్షీరసాగరం బిల్లింగుకు వెళ్లాను. వెంకటశా'స్తిగారి చిన్నల్లుడు దీక్షితులు మనవలు నా చుట్టుముట్టారు, సోడా తాగుదాం పదండని దారితీశారు. వారు (స్ట్రాంగు సోడా కావాలని పురమాయించారు. అది కొట్టగానే పేలింది.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 75

(లే ర అజ్ఞాతవాసానికి వెళ్లే వ్యక్తుల భార్యలు కూడా అజ్ఞాతవానం చేయక తప్పుదు. బంధువుల ఇళ్లకు ఆమెను రానీయరు. ఆమెకు ఆళ్రయం ఇస్తే ఆమె వెనుకనే పోలీనులు కూడా వస్తారని భయం. ఆశ్రయానికి వచ్చిన అమ్మాయిపేరు కమల. ప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు మాకీనేని బనవవున్సయ్యగారి చెల్లెలు. అజ్ఞాతవానంకోసం మా ఇల్లు సురక్షితమైనదని నాయకుల నమ్మకం. కనాన పాతాళ వాసం

చిన్నచిన్న గాజుపెంకులు జుత్తుమీద, ముఖం మీద పడ్డాయి. వెంకటశాసస్త్రిగారి దగ్గరకు వచ్చాను. ఆయనకు నమస్కరించి దీవించండి అన్నాను. పెళ్లి ఎలా జరిగింది అన్నారాయన. వేదమం(త్రాలను అనుసరించడం ఇప్పుడు సాధ్యంకానిపని. పైగా నేటి వివాహాలు (స్త్రీల ఆమోదం పొందాలి. వారు ముఖ్యంగా మూడు కర్మలను ఆమోదిస్తారు. వాటికి వేదమం(త్రాలుండవు. ఒకటి జీలకర్ర బెల్లం. రెండు సూత్ర ధారణ మూడు తలంబ్రాలు. స్రీలు ఆమోదించేది, హర్షించేది ఈ మూడింటికే నన్నాను. అది విని శాస్త్రిగారు నవ్వారు.

ఈ రాత్రి హైదరాబాదు వెళ్ళీ పెళ్లివారిని కలుసుకోవాలన్నాను. ఆందరిదగ్గరా సెలవుతీసుకుని స్టేషనుకు బయలుదేరాను. బెజవాడస్టేషనులో హైదరాబాదు ప్లాట్‌ఫాం మీదికి వెళ్ళాను. అంతా ఆ ప్లాట్‌ఫాం మీద వున్నారు. రైలు ఇంకా రాలేదు. వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ వుంటే రైలు వచ్చింది. బెజవాడ నుంచి సికిందరాబాదుకు అంతకుముందే నాకు టిక్కెటు తీసుకున్నాడు భావ. తెల్లవారిన తరవాత పోలీసు డ్రస్సులో వున్న ఓ కాంగ్రెసు వలంటీరు కనిపించాడు. పోలీసు ఆక్షను అయిన తరవాత అతడికి ఈ ఉద్యోగం వచ్చినట్టుంది.

సికింద్రాబాద్తు చేరుకున్నాం, అంతా తిన్నగా ధాన్‌ బజారు చేరాం. మామయ్య జీరా ఇంటిని విడిచిపెట్టిన సంగతి నాకు తెలీదు. ధాన్‌ బజారు జనరల్‌ బజారుకున్న సందుల్లో ఒకటి. బావ చిక్కడపల్లిలో నేనుండే పూసల నరసయ్య ఇంట ఉంటున్నాడు. నేను సాధ్యమయినంత తొందరగా వెళ్లిపోవాలిమ్ల[దాసులో లాచేసిన ఒక కుర్రవాడు ఒక వారపత్రికకు డిక్షరీషను తీసుకున్నాడు. దానికి ఎడిటరుగా వస్తానని చెప్పాను.

76 అ రాంభట్ట కృష్ణమూర్తి సొాంతకథ

అది యువజన సంఘం నాయకత్వాన నడపాలని వారి ఆశయం. డిక్షరేషను తీసుకున్న యువకుడే ఆ పత్రికకు మేనేజరు. ఆయన జార్జి టౌన్‌లో ఓగది అద్దెకు తీసుకున్నాడు.

నాకు యిచ్చిన అడ్రసు ఆ గదిదే. ఓ వారంరోజుల తరవాత సికిందరాబాదునుంచే మదరాసుకు బయలుదేరాను. అక్కడి పత్రిక పేరు సందేశం. మేనేజరు మి(త్రునిపేరు గోపాలరావు. రైలుదిగి ఎడ్రసు ప్రకారం గమ్యంచేరాను. సందేశం లోగోను గీసి బ్లాకు మేకింగుకిచ్చాం. అక్కడకు దగ్గరలోనే బిగ్‌స్టీటులో ఓ ప్రెస్సును ఖాయం చేశాడు గోపాలరావు. అక్కడికి తూర్పు యూరపు దేశాల నుంచి సమాచార లేఖలు వస్తూవుండేవి. ఇద్దరం చర్చించుకుని పన్నెండు పేజీలకు డమ్మీ నిర్ణయించుకున్నాం.

నేను వెళ్లినతర్వాత గోపొలరావు నన్ను లయోలా కాలేజి స్లేగ్రాండుకు తీసుకెళ్ళాడు. అక్కడ బాసుతో భేటీ. బెజవాడలో ఉన్నప్పుడు జీతం నూటయాబై. ఇప్పుడది నూటపాతిక. ఒప్పుకున్నాను. పని మొదలుపెట్టాను. యుద్ధం రాకముందు, కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ అన్న సంస్థ ఉండేది, యుద్ధానంతరం దాన్ని కమ్యూనిస్టు ఇన్‌ఫర్మేషనుగా మార్చారు. దాని తొలి సంక్షిప్త నామం కమిన్‌టర్న్‌. రెండోదాని సంక్షిప్త నామం కమిన్‌ ఫార్మ్‌. అప్పుడా సంస్థకు కార్యదర్శిగా జ్ఞానోవ్‌ వుండేవాడు. ఆయన పేరు ఉచ్చరించడం రాక జడనోవ్‌ అనే వారు.

ఆ సంస్థ పక్షాన ఒక పత్రిక వెలువడుతూ వుండేది. అది రాయల్‌ సైజు పేపరుమీద ప్రింటు అవుతూ వుండేది. అందులో జ్ఞానోవ్‌ వ్యాసం ఒక పేజీ ప్రమాణంలో ఉండేది. అలాగే తూర్పు యూరపుదేశాల నుంచి కూడా కొన్ని పత్రికలు వస్తూ వుండేవి. ఆందులో నాకు నచ్చినదేదయినా వుంటే దాన్ని అనువదించేవాడిని. రచ్చబండ రాజకీయాలు అన్న శీర్షిక కింద ఓ వ్యాసం రాస్తూ వుండాలన్నారు. (గ్రామజీవితాన్ని నేనెరగను. కృష్ణాజిల్లా గ్రామీణ భాష నాకు తెలియదు. అయినా ఆ శీర్షికను రాసి తీరాలి. (గ్రామీణ పెత్తందార్ల దురంతాలు, పేదల బాధలమీద పాటలు రాసేవాడిని.

నాడు వచ్చే సంచికల్లో కధలు కూడా వుండేవి. ఆ కధలను అనువదించి వేసేవాడిని. కొన్ని శీర్షికలను గోపాలరావు కూడా రాస్తూ వుండేవాడు. చైనా అంతఃకలహంలో మావో ఎ(ర్రసేన విజయం సాధించింది. అంతవరకూ చైనాను పాలించినవారు పారిపోయారు. చైనాకోమింటాంగ్‌ నాయకుని, మావో పుట్‌బాల్‌లాగ తన్నుతున్నట్టు ఒక కార్టూను గీసి దాన్ని ముఖచిత్రంగా వేసి ఆ వారం సందేశాన్ని ప్రచురించాం. సోవియట్‌ నుంచి వచ్చిన సాహిత్యంలో చిన్న ఇంగ్లీషు రష్యన్‌ నిఘంటువొకటి, ద్వితీయ ప్రపంచ సంగ్రామం కార్టూన్ల పుస్తకం ఒకటి నన్ను బాగా ఆకర్షించాయి.

కార్టూను కింద వ్యక్తుల పేర్చుంటాయి. వ్యక్తులు నొకు తెలుసును. వారి పేర్లను కూడబలుక్కుని చదివేవాడిని. అలా కొన్ని రష్యన్‌ అక్షరాలను నేర్చుకున్నాను. వాటి సాయంతో నిఘంటువులో రష్యన్‌ పేర్లు చదివే వాడిని. వాటి సాయంతో రష్యన్‌ సంస్కృత తత్సమ పదాల పట్టిక రాసేవాడిని. వద అంటే నీరు. వదవురుత్‌ అంటే ఉదావృతం. సుడిగుండం. వదాపద్‌ అంటే ఉదపాతం - జలపాతం అని అర్ధం. ఇలా సందర్భాన్నిబట్టి మరి కొన్ని అక్షరాలను నేర్చుకున్నాను. విశ్రాంతి సమయాన ఇంగ్లీషు - రష్యన్‌ నిఘంటు పఠనం చేస్తూ ఉండేవాడిని.

ఆనాటిదే మరో పుస్తకం. దాన్ని నేటికీ కాపాడుకుంటున్నాను. చాకోస్ణావక్‌ ఆర్కియాలజిస్టు బెద్రిక్‌ హ్రోబ్నీకి డెబ్బయి అయిదో ఏట అచ్చువేసిన అభినందన (గ్రంథం, ఆయన నాటి ఆర్యభాషల వ్యాకరణాలను చదివి హిట్టయిట్‌ భాషను వెలుగులోనికి తెచ్చాడు. హిట్టయిట్టు అన్నది బైబిలు పదం, హత్తిఖత్తి అని ఇతరులనేవారు. వారు మాత్రం తమదేశాన్ని క్షత్రదేశం అని పిలుచుకునేవారు. వారు ఆదిలో వైదికార్యుల్లాగ

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 77

పశుపాలకులే. కాళ్యపి అంటే కాస్పియన్‌సే ప్రాంతపు కౌళికులు. కొన్ని ఆవులను తోలుకుని నల్లసముద్రం మీదుగానే నేటి టర్కీకి చేరారు.

వారు, తమ పశుపాలనకు "అనుబంధంగా వ్యవసాయం కూడా చేబట్టి కుళశహార అన్న ఒక నగరాన్ని కట్టుకున్నారు ఆ నగర తాలిపాలకుని పేరు నాటి లిపిననుసరించి “త్రబర్నస్‌” అవుతుంది. అది ఆర్యభాషు ఆ మాటను మన ఆర్యభాష సంస్కృతానికి అన్వయించుకుంటే రుతుపర్ల అవుతుంది. అదే దేశాన ఫ్రిగియన్లు కూడా ఒక నగరాన్ని నిర్మించుకుని రాజ్యం స్ట్రాపించుకున్నారు. ఫ్రిగియన్లను వైదికార్యులు భృగువులు, భార్గవులు అన్నారు. ఈ ఫ్రిగియన్ల గాధ ్రీకు పురాణాన వుంది. ఆ పురాణాల (ప్రకారం ఒక ఊరిజనం తమకు రాజుకావాలన్నారు. రేపు ఉదయం ఈ (గ్రామానికి ఎవరొస్తే అతడే రాజు అని ఒక వృద్దుడు జోస్యం చెప్పాడు.

మర్నాడు బండితోలుకుంటూ ఒక వ్యక్తి (గ్రామప్రవేశం చేశాడు. జనం అతడినే తమ రాజుగా ఎన్నుకున్నారు. అతనిపేరు గోర్డన్‌. సంస్కృతంలో గోవర్దనుడు. అతని కొడుకే పట్టినదల్హా బంగారం అయే “మిదాసస్‌”. గ్రీకులు అతడిని మిదాస్‌ అన్నారు. గోవర్ధనుడు తన గురువులపేర ఆంగిరా అన్న నగరాన్ని కట్టించాడు. అదే నేడు టర్కీలో అంకారా పేరున వుంది. ఆ భార్గవుల జాతివారే సోవియటు యూనియనుకు దక్షిణాన వున్న ఆర్మీనియన్సు అని (గ్రీకు పండితులంటున్నారు. రుతుపర్జుడు రాజ్య నిబంధనల కర్ర, యూరపు రాజులు నేటికీ అవే నిబంధనలను పాటిస్తున్నారు.

హోబ్నీ క్షత్రభాషను చదవగలిగాడు. క్షత్రభాష అతి (ప్రాచీన సంస్కృతం అని, రష్యను అతి నవీన సంస్కృతం అనీ ఆయన నిర్దారణ. ఆదిలో జర్మన్హు ఆర్యభాషలను ఇండో జర్మన్‌ భాషలన్నారు. రష్యన్లు ఇండోస్టావు భాషలన్నారు. రష్యన్‌ భాషలో నూటికి తొంభై అయిదు పదాలు తత్సమాలు. మన వైదికార్యులు మాత్రం సంస్కృతం, సంస్కృత జన్యభాషలను ఆర్యభాషలన్నారు. ఆర్య అన్నది భాషా వాచకమే కాని జనవాచకం కాదు. ఆర్యభాషలు ఎనబైకి పైగా వున్నాయి.

పోబ్నీ అభినందన సంచిక చదివిన తరవాత నాకు ప్రాచీన నాగరికతలమీద అభిమానం కలిగింది, అప్పజెప్పిన పని చేసుకొని పోవడమేకాని ఆనవసరంగా తెలిసిన వారిని కలుసుకొనకూడదు అని నాక్రు ఆదేశాలు. ఎదుటి వారికి తెలియకుండా పనులు చేసుకుని పోవడమెలాగ. అలాంటి విద్యను కమ్యూనిస్టు పార్టీ పరిభాషలో “టెక్‌” అంటారు. టెక్టిక్‌కి సంక్షిప్త పదం టెక్‌. ఈ టెక్‌ని గురించి నాకో లేఖ వచ్చింది. అది చదివిన తరవాత దాన్నెవరో చాదస్తుడు రాసినట్టు అనిపించింది. ఆ లేఖ తెచ్చిన గూఢచారునితో ఇది రాసిన వైదిక బ్రాహ్మణుడెవరు అన్నాను. అంతే రాత్రికి రాత్రి బసలు మారిపోయాయి.

ఆ సంగతి నాకు తరవాత తెలిసింది. కందుకూరి వీరేశలింగంగారి జీవితచరిత్ర చదువుతే చాలు గూఢచర్య సిద్దాంతాలు అర్హం అవుతాయి. (బ్రిటిషు ఇండియా (ప్రాంతాలకూ నిజాం సంస్థానానికి గల సరిహద్దు ప్రాంతాన ఒక బాలవితంతువుందని తెలిస్తే చాలు. ఆమె పునర్వివాహానికీ, చదువుకొనడానికి సిద్ధంగా వుందని తెలిస్తే ఆమెను రాజమండ్రికి రావించేవారు. ఆ రావించడాన్ని గోప్యంగా వుంచేందుకు ఆయన అనుసరించిన టెక్‌ చాలా గొప్పగా వుంటుంది. ఒక అమ్మాయిని మధిరనుంచి రాజమండ్రికి రప్పించిన విధానాన్ని ఆయన వివరించారు.

ఆయన తన శిష్యులను బృందాలుగా విభజించేవాడు. ఆ బృందం అమ్మాయిని కలిసి ఆమె భవిష్యత్తును వివరిస్తారు. ఊరువిడిచి వెళ్లడానికి పథకాన్ని వివరిస్తారు. అనుకున్న సమయానికి ఆపథకాన్ని అమలు జరుపుతారు. మొదట ఏదో పద్దతిలో మజిలీ చేరుతారు. అక్కడొక బృందం సిద్దంగా వుంటుంది.

78 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

అమ్మాయిని ఆ బృందానికి అప్పగించి తాము తప్పుకుంటారు. రెండో బృందం అక్కడ సిద్దంగా వున్న వాహనం మీద నిక్షీతస్టానానికి చేరుస్తారు. అక్కడ మూడో బృందం వుంటుంది. ఇలా ఒక బృందం సంగతి రెండో బృందానికి తెలీదు. యానపద్ధతి, మజిలీ తెలీదు.

ఇలాగ అంచెలంచెలుగా దారులు మారుస్తూ వాహన పద్దతులు మారుస్తూ అమ్మాయి రాజమండ్రి చేరుతుంది. ఏ ఒక్క బృందానికీ అంతిమ లక్ష్యం తెలియదు. ఇలా బాలవితంతువులను తన ఆ(శ్రమానికి తేవడమేకాదు. తనకు కావలసిన పుస్తకాలను తెప్పించుకునే పద్ధతికూడా అద్భుతంగా వుంటుంది. చాలా మంది వీరేశలింగంగారి మీద భక్తిని 'ప్రదర్శిస్తారే కాని ఆయన పుస్తకాలను చదవరు. ఏమయినా గూఢచర్యంలో కూడా శిక్షణ కావాలి. అలాంటి శిక్షణ కమ్యూనిస్టు షార్టీకున్నట్టు నాకు తెలియదు.

పని బాగానే జరుగుతోంది కాని ఒక రాత్రి జ్వరం వచ్చింది. లేవలేకపోయాను. గోపాలరావు నన్ను రాయపేట ఆస్పత్రిలో చేర్చాడు. అది తీవ్రమయిన మలేరియా. ఆస్పత్రిలో ఎన్నిరోజులున్నానో నాకు తెలియదు. రేపు నిన్ను డిళ్చార్టి చేస్తున్నామని డాక్టరు చెప్పాడు. ఈ మలేరియాక్సి చాలా కాలం మందు తీసుకొనవలసి వుంటుందన్నాడు. మా పాక్రిన్‌ అన్న మందు రాసియిచ్చి ఈ మాత్రలు మూడు నెలలైనా రోజుకొకటి తప్పకుండా వేసుకోవాలన్నాడు. ఈ మందువల్ల శరీరానికి పచ్చని రంగు వస్తుంది. దాన్ని ఓరోగంగా భావించవద్దు అని డాక్టరు చెప్పాడు. మర్నాడు మిత్రుడొచ్చి తీసుకెళ్లాడు.

రూంకి వెళ్లగానే ఒక ఏపిల్‌ కోసి యిచ్చాడు. జ్వరం తగ్గినవారికి జవసత్వాలు పుంజుకొనడం కోసం ఏపిలు పళ్చు యిస్తారు. గోపాలరావు నాకు అలాగే ఇచ్చాడు. ఏపిలు ముక్కలు తిన్న కొద్దిసేపటికే వాంతి అయింది. వాంతిలో ఏపిలు ముక్కలే వున్నాయి. తిరుమల రామచంద్రునికి నా జ్వరమూ డిన్‌చార్జి సంగతులు ఎలా తెలిశాయోగాని ఆయన టాక్సీ తీసుకొచ్చి నన్ను తన ఇంటికి తీసుకుపోయాడు. జ్వరం వల్ల చాలా నీరసించిపోయాను. అక్కడ రామచంద్రుడు, అనంతమ్మగారు నాకు సేవలు. ఆమె నన్ను అన్నగారు అంటుంది. ఆయన బావగారు అని పిలుస్తారు.

ఓవల్టీన్‌ కరప(ష్రంలో అనేక భాషలుంటాయి. ఆభాషలను చదవడానికి యత్నించడం నాచిన్ననాటి సరదా. హైదరాబాదులో ఉండగా ఒకనాడు ఓవల్లీన్‌ ఎంబ పుష్టికరవాద పానకవు. హాలు బార్లీ ముంతాద అనీ ఓవల్టీన్‌ ఘనతను చెప్పే కన్నడ ప్రకటనను ఆశువుగా చెప్పాను. అప్పటి నుంచి మా అన్నగారికి కన్నడం వచ్చుననేవారు అనంతలక్ష్మిగారు. మా బావగారికి కన్నడం రాదు అంటాడు రామచంద్రగారు. ఇద్దరి మధ్యా పెరిగిన ఆ భాషా వైరంలో మాచెల్లాయిగారే గెలిచారు. నాకు మాత్రం కన్నడంరాదు. ఆది వాస్తవం. ఆమె నాతో కన్నడం మాట్లాడ్డానికి ఏనాడూ యత్నించలేదు.

మా మేనమామగారికి ఆ ఎడ్రసు ఎలా దొరికిందో తెలీదుకాని ఒకనాటి ఉదయం నా భార్యను, పరుపుచుట్టను, బట్టల పెట్టెను పట్టుకుని దిగారు. ఆమెను అనంతమ్మగారికి అప్పజెప్పి ఆయన వెళ్లిపోయాడు. అప్పటినుంచి ఆయిద్దరూ రోజూ అద్దె ఇళ్లవేటకు వెళ్లి వస్తూవుండేవారు. ఆఖరికి ట్రిప్టికేన్‌ హైరోడ్డులో ఓ యిల్లు ముప్పయిరూపాయలకు దొరికింది. అది వన్‌రూం టెనమెంటు. మీ మరదలికి అవసరమైన భాజనాలు వంట నేర్చి నాకు తెలియపరుస్తే భోజనానికి వస్తాను అని చెప్పాను. గిన్నెలు పశ్లేలు వగైరాలకు భాజనాలు అని పేరు. తెలంగాణాలో వాటిని బాసన్హు అంటారు.

ట్రిప్లికేన్‌ హై రోడ్డులో మాకు దొరికిన ఇంటి ముందరే ట్రాముస్టాప్‌ వుంది. (ట్రిప్లికేనులో రెండు వర్గాల వారు ఎక్కువ మంది ఉన్నారు. ఒకరు శ్రీ, వైష్ణవులు, రెండు ముస్లింలు, అక్కడ కూరగాయల నుంచి బట్టల వరకూ సకల రకాల వ్యాపారాల్గోనూ ముసింలున్నారు. ఆ దుకాణాలకు వెళ్లి నాకు వచ్చిన

రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ అ 79

"హైదరాబాదీ ఉరుదులో మాట్లాడితే ఆ దుకాణదారులు చాలా గౌరవంగా చూసేవారు. నేను హైదరాబాదీని, టీ తాగుతాను. మద్రాసులో టీ ఒక్క ముస్లిం హోటళ్లలోనే దొరుకుతుంది. అంచాత నాకు తప్పనిసరి కాఫీపొనం తప్పింది. ఇంట కాఫీ, టీ రెండూ వుండేవి. ఇల్బాలు కోననీమ పిల్ల, అక్కడ జనం టీనే తాగుతారు. చుధ్యతరగతి వారిలో కొందరు కాఫీపాయులున్నారు. అలాంటి ఇంటినుంచి వచ్చింది ఇల్లాలు. తరవాత ఆమెకూడా టీకి అలవాటు పడింది. ట్రిప్టికేన్‌లోనే తాపీ ధర్మారావుగారుంటున్నారు. వారి పెద్దబ్బాయి మోహనరావు జనవాణిని వారపత్రికగా నడుపుతున్నాడు. రామచంద్రుని ఇల్గుకాక ఇల్లాలు వెళ్లే మరో ఇల్లు తాపీధర్మారావుగారిది. అక్కడే సెట్టి ఈశ్వరరావు తరుచు కనిపిస్తూ వుండేవాడు. ఆయన విశాలాంధ్రపేర ఒక మాసపత్రికను నడుపుతూ వుండేవాడు. మోహనరావు, ఈశ్చరరావులు జగమెరిగిన కమ్యూనిస్టులు. అప్పుడు అనిసెట్టి సుబ్బారావు రాసిన ఒక వ్యాసం పత్రికల్లో వచ్చింది. డయలెక్షిక్సు సమస్య మీద రాసిన వ్యాసం అది. డయలెక్టిక్సులో నెగేషన్‌ ఆఫ్‌ నెగేషన్‌ అని ఒక న్యాయం ఉంది. నాడు ఆ పేరును తెలుగులోకి ఎవరూ అనువదించలేదు. ఇప్పుడనువదించారు. కాని కాస్త సాహిత్యం తెలిసిన వారికి ఆమాట బూతులా ధ్వనిస్తుంది. ఆఫనాసియెవ్‌ అన్న తత్పశా(స్త (ప్రొఫెసరు రాసిన పుస్తకంలోని తర్కాన్నే అనిసెట్టి తన వ్యాసంలో పేర్కొన్నాడు. ఆ పుస్తకానికి సోవియట్‌ యూనియన్‌లో ఏనాడో కాలదోషం పట్టింది. కాని అది నేటికీ కమ్యూనిస్టు పాఠశాలల్లో పార్యగ్రంధంగా ఉంది. అనిసెట్టి రాసిన వ్యాస సారాంశం ఇది - ఆదిమ కమ్యూనిజాన్ని బానిస సమాజం నెగేట్‌ చేసింది. ప్యూడలిజం బానిస సమాజాన్ని నెగేట్‌ చేసింది. ప్యూడలిజాన్ని పెట్టుబడిదారీ విధానం నెగేట్‌ చేసింది. పెట్టుబడిదారీ విధానాన్ని సోషలిజం నేగెట్‌ చేసింది. సోషలిజాన్ని కూడా మరొకటి నెగేట్‌ చేస్తుంది. అలా నెగేట్‌ అయే సోషలిజం కోసం మనమెందుకు ధన ప్రాణాలను పోగొట్టుకొనాలి? లేదా నెగేషన్‌ ఆఫ్‌ నెగేషన్‌ అన్న న్యాయం సోషలిజంతో ఆగిపోతుందా అని సెట్టి వాదం. దానికి జవాబు ఎవరు రాయాలి? అప్పుడు వాసిరెడ్డి భాస్క[ర్రావు వచ్చాడు. ఆయనచేత జవాబు రాయించారు. నాకు మార్కిజం మీద అభిమానం వుంది. మాస్కో ప్రచురణలు కొన్ని చదివాను. మార్క్స్‌తత్వశా(స్త్రం, నిరీళ్ళర వాదం, భౌతిక వాదం కూడానని తెలిసింది. అందువల్ల దానిమీద అభిమానం పుట్టింది. కమ్యూనిజానికి ఆధారం మార్క్సిజం. సరేకాని కమ్యూనిజం ఒక రాజకీయ సిద్దాంతం. రాజకీయాలు నా మనసుకెక్కవు. మార్కురాసిన మహాగ్రంధం పెట్టుబడి. అది రాజకీయ అర్ధళా(స్తం. కౌటిల్యుడు కూడా తాను రాసిన రాజనీతిశా(స్తానికి అర్ధశాస్త్రం అని పేరుపెట్టుకున్నాడు. ఈ పేరులవల్ల రాజకీయం, అర్ధశాస్త్రం రెండింటికీ అవినాభావ సంబంధం వుందని తెలిసింది. చిన్నప్పటినుంచీ అర్ధం ఎన్ని అనర్థాలకు దారితీసిందో, తీస్తుందో చూశాను. దానివల్ల వ్యక్తిగత అర్ధం మీదా రాజకీయాల మీదా అనాసక్తి కలిగింది. వయసూ అనుభవం పెరిగిన కొలదీ ఈ అనాసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. కమ్యూనిస్టులకు రాజకీయ అర్హశా(స్తాలమీదా, మార్క్సిస్టు తత్వశాస్త్రం మీదా ముందు శిక్షణ నిచ్చి ఆ తరవాత కమ్యూనిస్టుపార్టీలో సభ్యత్వం ఇస్తారని విన్నాను. ఇంతవరకు నాకలాంటి శిక్షణ ఎవరూ ఇవ్వలేదు. వీరేశలింగంగారి పుస్తకాల పుణ్యమా అని నాకు టెక్‌బాగా తెలుసును. కొంత రహస్య గోపనం కూడా తెలిసింది. మనదేశాన నీతి అంటే రాజనీతి అని అర్ధం, అంతేకాని ప్రత్యేకంగా సామాజిక నీతి, వైయక్తిక నితి అనేవి లేవు. ఆనీతులు మనకు (క్రయిస్తవం ద్వారా సంక్రమించాయి. ఆంటే పళ్ళ్చిమ విద్యలో (క్రయిస్తవ 80 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

మత భావనలు అంతర్లీనంగా వుంటాయి. ఆ అంతర్లీన భావాల ద్వారానే నీతి మన నరాల కెత్తింది. మనకు ధర్మంలో అంతర్భాగం నీతి. ధర్మం అన్నమాటకు చాలా అర్జాలున్నాయి. అర్జాలు ఎన్ని ఉన్నా (ప్రధాన అర్ధం మతం అని, ధర్మం నాలుగు రకాలు. వర్షధర, గం, ఆ(శ్రమధర్మం, వర్ణాశ్రమధర్మం, ఆపద్దర్మం, ఆపద్దర్మాన్ని ఆపర్ఫూనిజం అనవచ్చును.

మేం ఆదిలో ఓ చిన్న గదిలో వుండేవాళ్లం. తరవాత ఓ పెద్ద గది వాటా కాళీ అయింది. ఆ వాటాలోకి మారాం. బెజవాడలో ఉండగా శ్రీనివాసచ(క్రవర్తిగారి మేనత్త కొడుకు రంగాచారితో పరిచయం అయింది. రంగాచారి కమ్యూనిస్టు. గిరీళంలాంటి మనస్తత్వం గల మనిషి యువజన పత్రిక సంపాదకుడు. అజ్ఞాతవాసానికి వెళ్ళాడు. ఆతని భార్యను పదినెల్ల పిల్లను తెచ్చి నా రక్షణలో ఉంచాడు. ఆమెను తెచ్చిన కొద్దిరోజులకే చెళ్లపిళ్ల వెంకటశా(స్తిగారి రెండవ కుమార్తెను తీసుకువచ్చాడు. ఆమెను మనోవ్యాధి చికిత్సకోసం తెచ్చాడు. అలా ఇద్దరతిధులు వచ్చారు.

అజ్ఞాత వాసొనికి వెళ్లే వ్యక్తుల భార్గలు కూడా అజ్ఞాత వాసం చేయకతప్పదు. బంధువుల ఇళకు ఆమెనకొనీయరు. ఆమెకు లయం స్త్‌ ఆమె ఎనక పోలీసులు కూడా వస్తారని చ భం ఆ(శ్రయానికి వచ్చిన అమ్మాయిపేరు కమల. (ప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు మాకినేని బసవపున్నయ్యగారి చెల్లెలు. అజ్ఞాతవాసం కోసం మా యిల్లు సురక్షితమైనదని నొయకుల నమ కం. చెళ్లపిళ్ల వెంకటశా'స్రిగారికి నామీద చాలా నమ్మకం వుంది. అందుకని వైద్యం కోసం చిన్న కూత్తురును పంపీంచారు, ఆమేకున్న జబ్బు తనమీద తనకు జాలి.

దాన్ని ఇంగ్లీషులో సెల్ఫ్‌ పిటీ అంటారు. ఆమెకు ఇవ్వవలసిన మందు ఒకటే. అది ఆత్మవిశ్వాసం. శరత్చంద్ర ఛటర్జీ రాసిన నవలలను ఆమెచేత చదివించాను. (స్త్రీలకు ఆ నవలలవల్ల ఎంతో ఆత్మ విశ్వాసం కలుగుతుంది. రెండు మూడునెలల్లో ఆత్మవిశ్వాసం కుదిరింది. మా మెనల్టుడు పల్లవరంలో ఒక తోళ్ల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఆలగప్ప చెట్టియార్‌ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చ్రాలా రకాల టెక్నాలజీలున్నాయి. కాని ఆ టెక్నాలజీల్లో సీటు దొరకలేదు. లెదర్‌ టెక్నాలజీ ఖాళీగా వుంది. ఆదే తీసుకో పరవాలేదని ఆదివరకు వచ్చినప్పుడు (ప్రోత్సహించాను.

ఇప్పుడు ఆ టెక్నాలజీ పాసై లెదర్‌ ఫ్యాక్టరీలో ఎఫ్రెంటిస్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం పల్లావరం వెళ్లిపోతారు. నిత్యం ఇద్దరు అతిధులు . శనివారం రాత్రి నుంచీ నలుగురు అతిధులూ వుంటారు. మాది వన్‌రూం టెనమెంటు. వండిన పదార్దాలను మధ్యన పెట్టి అందరం చుట్టూ కూర్చుని కావలసినవి వడ్డించుకుని తినేవారం. తిన్న తరవాత ఎవరి పాత్రలు వారు కడుక్కుని తుడిచి భద్రపరుచుకునేవారం. నాకు పగలంతా పత్రిక పని. వచ్చేటప్పుడు పిల్లకు (ద్రాక్షపళ్ళు, పెద్దలకు బిస్కట్లు తెచ్చేవాడిని,

అలా రెండుమూడునెల్టు గడిచింది. అప్పుడప్పుడు తాత్కాలిక అతిధులు వచ్చేవారు. సరియైన డెన్‌ దొరికేవరకు ఒకరోజో, పూటో మాకు అతిధులుగా వుండేవారు. టెక్‌ పరిభాషలో డెన్‌ అంటే స్థావరం అని అర్థం. నేను బెజవాడలో పనిచేసేటప్పుడు నా జీతం నూటయాభై. పెల్లి అయి సందేశంలో చేరినప్పుడు జీతం నూట ఇరవై అయిదు. అతిధులను పంపించినప్పుడు వారి పోషణకు కొంతమొత్తం కూడా పంపించి వుంటారు. ఆ సంగతి రంగాచారికే తెలియాలి. అతడు గిరీశంలాంటి వాడని ఇదివరకే చెప్పానుకదా. అతిధుల పోషణక్కూడా నా ఆదాయంలోంచే సద్దేవాడిని.

మన అజంటా గుహకుడ్య చిత్రాల్లాగా శ్రీలంకలో కూడా సీగిరియా అనే చోట గుహకుడ్య] చిత్రాలున్నాయి. ఆ చిత్రాలను. కాపీ చేసి తెచ్చే పనిని అడివి బాపిరాజుగారికి అప్పగించింది మద్రాసు

తనా రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 81

ప్రభుత్వం. పెద్దవారందరికీ ఆయన బాపిబావ. చిన్నవారికి ఆయన బాపిమామయ్య. అంతేకాదు ఎదుటనున్నవాడే పెళ్లికొడుకు అన్న మనస్తత్వం ఆయనది. మద్రాసు ప్రభుత్వ ఆదేశం ఆయనకు బెజవాడలో అందింది. చాలా మంది యువకులు బాపిమామయ్యను కలిసి సింహళ ప్రయాణానికి తమని కూడా తీసుకువెళ్లాలని కోరారు. ఎవరినీ కాదని చెప్పే అలవాటు ఆయనకు లేదు.

(ప్రభుత్వ లేఖరాగానే ఆయన ముగ్గురు సహాయకులను ఎంచుకున్నారు. ఒకడు పిలకా నరసింహమూర్తి రెండు గోవిందరాజులు నాయుడు, మూడు కోడూరి రామ్మూర్తి. ఈ ఎంపిక అయినవారితోన్తూ జౌత్సాహిక యువకులతోనూ ఫోట్రో దిగారు. ఇలా ఫోటో దిగారన్న వార్తను పత్రికలు ప్రచురించాయి. ఆ వార్తను శ్రీనివాసచ'క్రవర్తి చూశారు. నాకు ఆ యేడే పెళ్లి అయింది. పెళ్లి అవగానే కమ్యూనిస్ర ప్రార్టీ “కవరు” పత్రికలో పనిలో చేరాను, సింహళ ప్రయాణం నాకు ఒక విధంగా రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆలోచించి నన్ను కూడా సింహళ బృందంలో చేర్చాలని పట్టుపట్టారు.

బాపిరాజుగారు తీసుకెళతానంటే మాత్రం నువ్వు వొద్దనకుండా అంగీకరించు అని నాక్సు వర్తమానం పంపారు. బాపిరాజుగారు మ్యద్రాసు వచ్చారు. ఆ సంగతి నాకు మీజాన్‌ మి(త్రుడు బ్చిస్సి కామరాజు చెప్పాడు. బాపరాజుగారు అప్పటికే తన బృందంతో పాటు లంకకు పొసుపోర్టులు, వీసాల్ప స్రంపొదించి ఇనాకులేషన్టు కూడా తీసుకుని సిద్దంగా వున్నారు. ప్రయాణముహూర్తం ఇంక మూడురోజుల్వంది. అప్పుడు చెప్పారు బాపిరాజుగారు ప్రయాణావసరాలన్నీ పూర్తిచేసుకొమ్మని. లంకకు పాసుపోర్టు యిచ్చే అధికారి పోలీసు డైరెక్టరు జనరలు,

వీసా యిచ్చే అధికారి మద్రాసు (ప్రభుత్వ హోం కార్యదర్శి. ఇనాకులేషను చేసి సర్టిఫికైటు యిచ్చే అధికారి మునిసిపల్‌ కార్పొరేషను డాక్టరు. ఈ ముడు పనులూ నేను ఒక్కరోజులో పూర్తి చేసుకోవాలి. ముందు పాసుపోర్టు దరఖాస్తును పోలీసు డైరెక్టరు జనరల్‌ కార్యాలయంలో ఇచ్చాను. ఆది సిఐడి శాఖ. ఇంటికి వచ్చి ఎంక్వయిరీ చేసిన తరవాత రిపోర్టు యిస్తారు. ఆ రిపోర్టు ఆధారంగా నికు పాసుపోర్టు వస్తుందన్నాడు. నేను చేస్సే ఉద్యోగం ఎలాంటిదో ఇల్లాలికి తెలియదు. ఎంక్షయిరీకి ఇంటికి వస్తే పొ సుపోర్టు సంగతేమోకాని నాకు మరప్రవేశం ఖాయం.

ఏమీ తోచలేదు, ఐడీ డిపార్ట్‌మెంట్‌ అంతా కలియతిరిగాను. ఒకచోట పెద్ద కుడిమి నుదుట విభూతి పట్టీలు, ట్రువుల మధ్య త్రికోణాకారంగా కుంకుమబొట్టుగల వ్యక్తి కనిపించాడు. ఆయన ఉపయోగ పడగలడన్న అభిప్రాయం కలిగింది. శివానందలహరి, సౌందర్యలహరి శ్లోకాలను మెల్లగా గొణుగుతూ ఆయన ముందు పచార్డు మొదలుపెట్టాను, ఆయన్ను క్రీకంట చూస్తున్నాను. ఆయన నావేపే చూస్తున్నాడు. నాకు తమిళం రాదు, ఆయన నన్ను పిలిచి కూర్చోమని కుర్చీ చూపాడు. అక్కడ కూర్చున్నాను. పొన్‌పోర్టు కోసం వచ్చాను. రేపేముహూర్తం అన్నాను.

నా దరఖాస్తు ఆయన దగ్గరుంది. ఆయన రేపు ఎంక్వయిరికి వస్తానంటున్నాడు అని చెప్పాను. అయితే ఉండు అనిచెప్పి ఆయన దగ్గరకు వెళ్లాడు. నా పేరుకు రెండు సైనా రెండు కిందా గల అప్లికేషన్లను నేను చూస్తానని చెప్పి తీసుకున్నాడు. నా అప్లికేషను తీసి, ప్రశ్నలు మొదలుపెట్టాడు. నేను కధలు రాస్తాను, కవిత్వం చెబుతాను, బొమ్మలు కూడా గీస్తాను అని ప్రస్తుతానికి సింహళం గుహాకుడ్యాలను కాపీ చేసే

“బృందంలో వున్నానని చెప్పాను. మాది హైదరాబాదు అనీ, మేనమామగారు తెలుగు, సంస్కృతం లెకృరరనీ చెప్పాను. ఈ బృందంతో వెళితే నాలుగు డబ్బులొస్తాయన్నాను.

మాటల సందర్భంలో ఏయే పత్రికలకు రాస్తూ వుంటావని అడిగాడు. మద్రాసులో నానోటికొచ్చిన

82 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

పత్రికల పేర్లన్నీ ఏకరువు పెట్టాను. అంతా విని ఆయన సందేశానికి రాస్తూ వుంటావా అన్నాడు. వారు

ఎంత ఇస్తారు అని నేనడిగాను. ఆయనకాస్త్ర ఆలోచించి ఏమీ ఇయ్యరన్నాడు. అప్పుడు నాకు కవి చౌడప్ప

పద్యం గుర్తుకు వచ్చింది. ఆది చదివి ఇంగ్లీషులో దాని భావం చెప్పాను. ఆయన హాయిగా నవ్వి కాఫీ

తెప్పించాడు. నీ అప్లికేషన్ను చేజ్‌ చేయడం నీవల్ల కాదు. నువ్విక్కడే వుండు నేను పాస్‌ పోర్టు తెచ్చియిస్తానని "చెప్పి వెళ్ళాడు. ఓ అరగంటలో పాస్‌పోర్ట్‌ వచ్చింది.

అది పట్టుకుని ఫోర్టు సెంట్‌ జార్జికి బయలుదేరాను. అక్కడ హోంమినిస్టరు లేడు. హోం మంత్రి గది దగ్గర పెద్ద క్యూ. లంక వీసా కోసం ఎవరయినా వస్తే వారికి జాగు లేకుండా వెంటనే వీసా ఇయ్యి అని సెక్రటరీగారు తన డిప్యూటీకి చెప్పి వెళ్ళారు. అక్కడి ఎటెండరు నా పాస్‌పోర్టు తీసుకుని వీసా ముద్ర వేయించి నాకు తెచ్చియిచ్చాడు. ఇప్పటికి పాస్పోర్టూ, వీసా వచ్చాయి. ఇంక ఇనాకులేషను సర్టిఫికెట్టు కావాలి, అక్కడి నుంచి ట్రిష్టికేనుకు వచ్చాను.

(ట్రిప్టికేనులో నా ఉరూ పాండిత్యం పనిచేస్తుంది. అక్కడో మునిసిపల్‌ డాక్టరు బోర్డు చూశాను. ఆయన్ని దర్శించి నా గోడు వినిపించాను. ఆయన ముందు నాకు టీ ఆఫరు చేశాడు. తన దగ్గరున్న రిజిస్టరును పరిశిలిస్తే రెండు వారాల కిందట ఖాళీ ఉంది. అక్కడ నాపేరు రాసి రెండు సర్టిఫికెట్లు యిచ్చాడు. అందుకు నా కృతజ్ఞత ఎలా చెప్పాలి, ఆలోచించాను. మున్నింలలో రాజనం వుంటుంది. జేబులోంచి అయిదురూపాయలు తీసి టేబిలుమీద పెట్టాను. నాకు ఇవాళ పని జరిగితే యతీము పిల్లలకు మిరాయి పెడతానని మొక్కుకున్నాను. నా మొక్కును కూడా మీ చేతుల మీదుగానే తీర్చండి అన్నాను. యతీం అంటే అనాధ.

అన్నీ ఒకరోజులోనే అయిపోయాయి. అప్పుడు బాపిరాజుగారిని కలిశాను. పాస్పోర్టు, వీసా, హెల్త్‌ సర్టిఫికెట్లు వచ్చాయని చెప్పాను. అన్నీ ఒక్క రోజులోనే సంపాదించగలిగావా? అని ఆయన అడిగారు. ఎలా సంపాయించగలిగావు అన్నారు. నాకున్న పనికిరాని విద్యలు ఇప్పుడు పనికివచ్చాయి అన్నాను. ధనుష్కోటి వరకూ రైలు ప్రయాణం, అక్కడ దిగి ఎవరి సామాను వారు తలకెత్తుకుని ఓడరేవుకు వెళ్లాలి. నేను రెండుజతల బట్టలు మాత్రం సంచీలో వేసుకున్నాను అంతే. సింహళీయులు కూడా తమిళుల్లాగే గూడారు కడతారు. నాది 'పైజామాలాల్చీ. రెండు లుంగీలు కూడా తీసుకున్నాను.

ఓడలో చిత్రకారమి(త్రులు ఓడ ఉద్యోగుల స్కెచ్చిలు గీయడం మొదలుపెట్టారు. సముద్రయానం పదునెనిమిది మైళ్లు మాత్రమే. ఆవలి రేవును తలైమన్నారు ఆంటారు. మేం దిగే సరికి మాకు బస యేర్పాటు చేసిన సింహళం అధికార్డు స్వాగతం చెప్పారు. అక్కడి నుంచి రైలు, అనూరాధావురంలో దిగాము. అక్కడ మమ్మల్ని తీసుకెళ్లడానికి కారు సిద్దంగా వుంది. అనూరాధాపురం గెస్టుహౌసులో మాకు బస. నేను తప్ప అందరూ కాఫీ రాయుళ్లు, తెల్లవారగానే టీ, కెటిల్‌, కప్పులూ వచ్చాయి. అది బ్లాక్‌ టీ. అక్కడ పాలు దారకవన్నారు. అక్కడ కిల్లీ బడ్డీల్లాంటి దుకాణాలున్నాయి.

అందరూ అక్కడికెళ్ళారు. అక్కడ కాఫీ బిళ్లలున్నాయి. మరుగుతూన్న నీటిలో ఆ బిళ్లలు వేస్తే కాఫీ డికాషను వస్తుంది. గొల్లభామ మార్కు పాలడబ్బాలున్నాయి. ఆ డికాషనులో డబ్బాపాలు కలుపుకుంటే కాఫీ వస్తుంది. పాలడబ్బాలో వున్న చక్కెరే సరిపోతుంది. నేను తప్ప అందరూ ఆ కాఫీనే చేసుకుని తాగారు. చిన్న సైజు గొల్లభామ డబ్బాలుండేవి. ఒకసారి కాఫీకి అలాంటి రెండుమూడు డబ్బాలు కొని కాఫీలో కావలసినంత కలుపుకుని మిగతాది పారేసేవారు. వారు చేసే దుబారా ఖర్చు అంతా బాపిరాజుగారే భరించేవారు.

రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ అ 83

చదివేసేవాడిని. నేను మీజానులో పనిచేసేటప్పుడు అబుల్‌ కలాం ఆజాద్‌ రాసిన స్ట నా సం. పుస్తకం కొనుక్కున్నానని చెప్పాను కదా! ఆజాద్‌ తెల్లవారుజాము నాలుగింటికి లేచి బ్దాక్‌ స్టకునె కాని ర దాకా. టీని చప్పరిస్తూ ఉండేవాడు. ఆయన నాలగున్నరకే టీ చేసుకుంటాడన్న సంగతి విన్న కంగు నాయకులు ఆశతో అక్కడికి వెళ్లేవారు. ఆయన వారికీ ఆ బ్లాక్‌ టీనే ఇచ్చేవారు. అది వారికి గొంతు దిగేది కాదు. పాపం టీ తాగడం తెలియనివారు. అసలు టీ రుచి తెలుసుకోవాలంటే బ్లాక్‌ టీనే తాగాలంటాడు ఆజాద్‌. సింహళం టీ చాలా రుచిగా వుంటుంది. అశోకుడు లంకకు పంపించిన బోధివృక్షం అంటును ఆనాడు అనూరాధాపురంలోనే నాటాడు అది నేటికీ చిలవలు పలవలుగా పెరుగుతూనే వుంది, బాపిరాజుగారూ నేనూ ఆ బోధి వృక్షాన్ని చూడ్డాని వెళ్ళాం. ఆచెట్టు ఊడలు దిగింది. అంటే మర్రి చెట్టులా కాదు. నేలకు దగ్గరగా ఉన్న కొమ్మచుట్టూ గ్‌డలు కట్టి ఆ గోడల మధ్య మన్ను నింపుతారు. కొమ్మ అక్కడ నేలలో దిగి పెద్ద చెట్టగా తయారయేది. అలా వందల చెట్టు పెరిగాయి. మేం ఆ బోధి వృక్షాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూవుంటే బైట బోధివృక్షం కాంపొండు గోడ దగ్గర జట్కాబళ్లను ఆపేవారు. అక్కడ మన యువ చిత్రకారులు అ జట్కా గుర్రాల స్కెచ్చిలు గీస్తూ. కూర్చున్నారు. లోకోభిన్నరుచి: ఏం చేస్తాం అనూరాధాపురంలో ప్రాత శిల్పాలు చూడ్డానికి నేనూ బాపిరాజుగారూ బయలుదేరాం. చిత్రకార మిత్రులు ఊరంతా తిరిగి ఒక్ష అయ్యరు హోటల్ని కనిపెట్టి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు. ఇడ్లీ కావాలన్నారు. అరిటాక్షుల్లో తెచ్చాడు. కాదు ప్లేట్లు కావాలన్నారు. ఇడ్లీ తిని కాఫీ తాగారు. యజమాని వచ్చి ప్లేట్లు గ్లాసులు కడిగించాడు, అందరం ప్లేట్లను కడిగాం. కఫీ స్లైసులు కడిగాం. అక్కడ వేడివేడి కఫీ గ్లాసుకు పెదిమలు తగలరాదు. గ్లాసు ఎత్తి గొంతులో పోసుకోవాలి, ఎంగిలి చేస్తే మన్నుతో తోమి క్రడ్రగాలి' అయ్యరు హోటలు మర్యాద అది. లంకలో ట్రిఫిన్సు ఇడ్డీకాదు, ఇడియాప్పం. దాన్గోక్రి కొబ్బరికోరు, కారం. అది కంటికి నదురుగొ వుంటుంది. ఇడియాప్పం తెల్లగా వుంటుంది. కొరం కలిపిన కొబ్బరికోరు కుంకం రాసిలా వుంటుంది. చూడ్డానికి చాలా అందంగా వుంటుంది. లంకలో టిఫిను, టీ ఇవి రెండూ నాకు బాగా నచ్చాయి. కాని నొ సహచరులకది ఏకాదశి, లంకలో బడ్డీ కొట్లక్రు పోక గెలలు వేలాడుతూ వుంటాయి. కొన్ని గెలలు పసుపు పచ్చని కాయలతో వ్రంటాయి. ఇంకొన్ని ఎరకాయలతో ఉంటాయి. వికొక పెద్ద పెద్ద ఎండు చేపలు కూడ్రా వేలాడుతూ వుంటాయి. తమలపాక్షుల్సు పెద్దగా వుంటాయి. తమలపాక్తుల్లో వాల్రిబ్వి పచ్చికాయలనే కత్తిరించుకుని వేసుకుంటారు. మూడురోజులు అనూరాధాపురంలో ఉన్నతరువాత కారులో 'సేగిరియాకు తీసుకెళ్లారు. అక్కడి గౌెస్టపౌసులో మాక్సు మకాం, అక్కడి గృహ కుడ్యాలు మరమ్మత్తుల్లో వున్నాయి. అందుకని ఆ గుహను మూసివుంచారు. కొలంబో నుంచి లంక పురాతత్వశాఖ డ్రైంక్టర పర్ణవితరణే వచ్చాడు, వ్యు శైల్ని ఆదరించి టెక్నీషియన్ల చేత ఆ గుహలను తెరిపించాడు. లోపల రాత్రి మీద మట్టితో భ్రూ్చి బ ంధంచేసి అలా తయారయిన కుడ్యం మీద చిత్రాలు గీశారు. ఆ భూమీ బంధం చిత్రాలు పదిహేన్సవందల సంవత్సరాల నాటివి. అక్కడక్కడ భూమి బంధం ఉబ్బింది. అలాంటి చోట్ల కుడ్యానికీ రాత్రి మధ్య ఖాళీ ఏర్పడుతుంది. చిన్న నాళికల ద్వారా ఆ భాళీకి ప్రత్యేకమైన జిగురున్స పంపించి అక్కడ దూద్రివేస్ప కట్టు కటినటు దూదిని అద్ది అది రాలకుండా ఉండేందుకు చెక్కలు పెట్టి కర్రతో బోటు పెట్టరు, న కా

అది చూస్తూ వుంటే చిత్రాలకు గాయాలయినట్టు ఆ గాయాలకు మందువేసి కట్టుకట్టినట్టు అనిపించింది టెక్నీషియన్లు ఆ కట్టు విస్పారు. లోనవున్న చిత్రాలు బైటపడ్డాయి. ఆ గుహ శ్రీగిరికి పళ్ళ్చిమం వైపున వుంది. మధ్యాహ్నం ఒంటిగంటనుంచి ఆ కుడ్యానికి ఎండ తాకుతుంది. పదిహేనువందల సంవత్సరాల నుంచీ ఎండకి ఎండుతున్నా రంగులు వెలియలేదు. అప్పుడు వేసిన రంగుల్లా తాజాగా కనిపించాయి నేలమీంచి ఆ కొండ మూడు వందల అడుగుల ఎత్తువుంది. ఆ కొండ పేరు సింహగిరి. లంక భాషలో సీగిరియా.

కొండకు ఆవలివైపున కూడా మెట్టున్నాయి. ఆ మెట్టు రాజప్రాసాదానికి వెళతాయి. కాని మేమటు వెళ్లలేదు. మెట్ల చివర రెండు సింహాల ్రతిమలున్నాయి ఆ ప్రతిమల మధ్యనుంచి రాజప్రాసొదానికి ద్వారం. అంటే అదే సింహద్వారమన్నమాట. ఆ కోటకట్టించింది చిత్రాలు గీయించింది పిత్శఘాతక తిస్ప అనే మహారాజు ఆయన తండ్రి కుబేరుని లాంటివాడు. అతడిని చంపి అలకాపురిలాంటి ఆ కోటను కట్టించాడు. అలకాపురి మీద గంధర్వ కాంతలు భ్రమిస్తూవుంటారు. అందుకనే గుహా కుడ్యం మీద గంధర్వ కాంత చిత్రాలను గీయించాడు.

తిస్స అన్నపేరుగల రాజులు చాలామంది ఉన్నారు. కనక ఇతనికి చరిత్రకారులు పితృఘాతక తిస్స అని పేరు పెట్టారు. తండ్రిని చంపి ఆయన రాజ్యానికి వచ్చాడు. తండ్రి సంపాదించి పెట్టిన ధనంతో తిస్స తానే సాక్షాత్తు కుబేరుడయినట్టు భావించి వుంటాడు కుబేరునిలాగ అలకాపురిని నిర్మించలేదు కొని తనకోటకు సింహగిరి అని పేరు పెట్టుకున్నాడు. అలకాపురి మీద గంధర్వాప్పరసలు తిరుగుతూ వుంటారని కాళిదాసు వర్షించాడు. ఆ వర్షనను అనుసరించి కొండకు సరీగా నడుమనున్న నరదను కాస్త వెడల్పు చేయించి ఆ నరదలో కుడ్యచిత్రాలను గీయించుకున్నాడు.

ఆ గుహాకుడ్య చిత్రాలు చూడ్డానికి వచ్చిన ప్రముఖ భారతీయులను తిస్స ఎందుకు గీయించాడు అని పర్షవితరణే అడుగూ వుండేవాడు. అలవాటు ప్రకారం మమ్మల్ని కూడా అడిగాడు. కాళిదాసు శకాలను చదివిన వారం ఇద్దరమే. అడివిబాపిరాజుగారు, నేనూ. అందుకని పర్లవితరణే ప్రళ్ళకు మేం జవాబు చెప్పగలిగాం. మా జవాబు విని పర్ణవితరణే ఆనందించాడు. ఆ గుహను మాకు అప్పజెప్పి టెన్నీషియనులు వెళ్లిపోయారు. కొండ కింద గెస్టుహౌసు. అక్కడ మా మకాం, ఉదయం టిఫిను అయిన తరవాత కొండ ఎక్కేవారం. భోజనానికి దిగేవారం.

భోజనానంతరం రెండూ, రెండున్నరకు మళ్లీ కొండ ఎక్కేవారం, వెలుతురున్నంతవరకు పనిచేసేవారం. మేం తొలిరోజునే చేయరాని పని చేశాం. కుడ్యచిత్రంమీద కాపీ చేసే షీటును పరిచి పెన్సిలుతో అండకరేఖలు గీసుకున్నాం. అండకరేఖలంటే జౌట్‌ లైన్సు. నిజానికి అలా జాట్‌లైన్సు గీసుకొనకూడదు. మనిషిని ఎదురుగా పెట్టుకుని అతడి అండకరేఖల్ని గీసినట్లే కుడ్య చిత్రాలను కూడా ఎదురుగా కూర్చుని ఈజిలు మీద బోర్టుపెట్టి అండకరేఖలను తీసుకోవాలి. ఇప్పుడు మేం చేసింది తద్విరుద్ధం.

గెస్టహౌసులో బాపిరాజుగారు ఎందుకో వంట ఇంట్లోకి వెళ్ళారు. అక్కడ వంటవాడు పెద్ద ఎండుచేపను ఎండుకొబ్బరిని తురిమినట్టు తురుముతున్నాడు. తొలిరోజున అలాంటి భోజనమే చేశాం, ఆ క్షణాన బాపిరాజుగారు స్నానం చేసి గాయత్రీ జపం చేసుకున్నారు. వంటపని తాము చేబట్టారు. ఆయనకు సహాయకుడను నేనే. ఉదయం టిఫిను మాత్రం ఇడియాప్పం, కొబ్బరికోరు పొడి పచ్చడి, ఆంచాత మేమిద్దరం తప్ప తక్కిన వారు కొండ మీద పనికి పోయేవారు.

నేను వంట ఇంట్లో వుండవలసిన అవస్తరం లేదు. నాది ఆయనకు నైతిక సపోర్టు మాత్రమే. అందువల్ల

నా రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ అ 85

నేను గెస్టుహొసుముందు కాగితం, పెన్సిలు పట్టుకుని కూర్చునేవాడిని, అక్కడినుంచి చూస్తే ముందు చిన్న అడివిలాంటి చెట్టు, కొండమీదికి రాతిమెట్టు, ఆ తరవాత ఇనపమెట్టు, ఆ మెట్లకు ఇరుదిశలా ఇనపజాలీ గోడ కడకంటా వుంటాయి. అసలు గుహదగ్గర ద్వారం దానికిరువైపులా జాలీగోడ, ఈ దృశ్యాన్ని గీస్తూ కూర్చునేవాడిని. ఇంతలో సహచరులు కొండదిగి వచ్చేవారు. అందరం భోజనం చేసేవారం. భోజనానంతరం కాస్త విశ్రాంతి. మధ్యాహ్నం అందరం కొండకు బయలుదేరేవారం. ఉన్న బొమ్మల్లో అన్నిటికన్నా పెద్ద బొమ్మను నేను కొపీచేశాను. అన్నిటికన్నా చిన్న బొమ్మను బాపిరాజుగారు కాపీచేశారు. శాస్త్రప్రకారం గీసిన బొమ్మకు అండకరేఖలను జాజురంగుతో దిద్దాలి, అలా దిద్దడానికి రంగులు కుంచెలు మాకు అందుబాటులో వుండేవికావు. కుడ్యచిత్రాలను కాగితంమీదికి ఎక్కించాలంటే వాటికి రంగులతో కోటింగులిస్తూ పోవాలి. కాని మావెంట వచ్చిన చిత్రకార మిత్రులు ఆయిలు కలరు పద్లతిని వాటర్‌ కలరు వేయడం మొదలుపెట్టారు పని తేలిక కోసం. అది పద్ధతి కాదని బాపిరాజుగారికి తెలుసును, కాని వారినేమీ అనగలస్థ్రితిలో లేరాయన, వారిపద్దతి ప్రకారం బొమ్మలు త్వరగా అయిపోతాయి. ఉన్న సమయంలోనే ఆయన తొనెంచుకున్న చిత్రాన్ని పూర్తిచేసుకున్నారు. నేను నా బొమ్మను తాకలేదు. డిష్పులు, రంగులు, బ్రష్షులు వీటికి కాళీలులేవు, అంచాత నేను మద్రాసు వెళ్లిన తరవాత బొమ్మను పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాను. చిన్న కాగితం మీద రంగుల స్కీమును రాసుకుని దగ్గరపెట్టుకున్నాను. అండకరేఖలను మాత్రం జాజుతో పూర్తిచేసుకొనగలిగాను. బొమ్మలు పూర్తి అయ్యాయి. ఇంక ప్రయాణం తరవాయి. చిత్రకారమిత్రులు పెట్టే దుబారా ఖర్చుల వల్ల తెచ్చుకున్న డబ్బు హరించుకునిపోయింది. అప్పుడు సీగిరియాలో ఉన్న పురాతత్వాధికారి వద్ద రెండువందల రూపాయలు అప్పుతీసుకున్నారు బాపిరాజుగారు. అప్పుపత్రం మీద సంతకం పెట్టడానికి అంటే తోడు సంతకానికి చిత్రకార మిత్రుల్లో ఎవరూ ముందుకురాలేదు. అందరికీ బదులుగా నేనే సంతకం పెట్టాను. సీగిరియాలో చిన్న బౌద్దాలయం వుంది. ప్రతిసాయంత్రం బాపిరాజుగారూ, నేనూ వెళ్లేవారం. ఆ గుడి అధిపతిగా ఒక యువభిక్షువు వున్నాడు. మాకు సింహళ భాషరాదు. ఆ భిక్షువుకు ఇంగ్లీషు రాదు. అతనికి కొద్దిగా పాళీ వచ్చును. సంస్కృతం మాటలు కొన్ని పాళీ వచ్చిన వారికి అర్ధం అవుతాయి. మేం ఆయనతో ఓ అరగంటసేపు మాట్లాడేవాళ్లం. మా మాటలు ఆయనకు అర్ధం అయినట్టు కనిపించేది. అలాగే ఆయన మాటలు మాక్కూడా అర్థం అయినట్టనిపించేది. అదో తీయని గుర్తు. మాకు బుద్దుని మీద అభిమానం, గౌరవం వున్నాయి. ఆయనకు భారతీయులమీద గౌరవాభిమానాలున్నాయి. అంతే. వచ్చేటప్పుడు సీగిరియాలో బస్సు ఎక్కాం. దారిలో దంబుల్లా వుంది. అక్కడ కొండలాంటి బండ వుంది. ఆ కొండ ఎక్కితే మరో పెద్ద బండ కనిపిస్తుంది. బండకూ కొండకూ నడుమ మనిషి పాొకివెళ్లగల సందుంది. ఆ సందు నుంచి దూరాం. లోనికి పోయిన కొలదీ బండకీ కొండకీ మధ్య వివరం విశాలమవుతూ వచ్చింది. అక్కడ మేం లేచి నిలుచున్నాం. రాతిబండ నడుమ బొట్టుబొట్టూ నీరుపడుతూ వుంటుంది. ఆ నీటిని ఒక (డ్రమ్ములో పట్టుతున్నారు. గుహ మూతపడే తావున మహాపరినిర్వాణ విగ్రహం వుంది.

ఆ వి(గ్రహానికి కింద పరుపు దిండులాగ చెక్కిన మరో రంగురాయి వుంది. మహాపరినిర్వాణ విగ్రహం పొడవు సుమారు నలభై అడుగులు. ఈ వి([గ్రహం అక్కడ చెక్కినది కాదు. బైటచెక్కి గుహకు చేర్చిన విగ్రహం. మనిషి పాకి వెళ్లే సందు నుంచి ఈ మహా విగ్రహాన్ని ఆ గుహలోకి ఎలా పంపించివుంటారు. అది నాడే కాదు నేటికీ నాకు అర్ధం కాలేదు. సన్నని కంత నుంచి వి[గ్రహాన్నేకాదు పరుపురాతిని కూడా పంపించి లోనకు వెళ్లిన తరవాత శయాన వి(గ్రహాన్ని ఆ పరుపు శయ్యమీదికి ఎలా ఎక్కించారు.

86 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

ఇది అసంభవం కాదు కాని ఎంతటి సాముదాయక (శ్రమ ఆ కర్మకు అవసరం అయిందో ఊహిస్తే ఆళ్ళర్యం అనిపిస్తుంది. వెస్టరు దీవుల మీది వి[గ్రహాలు. లెబనాన్‌ కొండ మీది బాల్చిక్‌ దేవాలయ శిలలు వాటి నిర్మాణ శ్రమ కన్న ఏమాత్రం తీసిపోని శ్రమ ఈ దంబుల్లా మహాపరినిర్వాణ వి([గ్రహానికి కూడా పట్టిందని అర్హం అయినప్పుడు బౌద్ద భిక్షువుల కర్మశక్తిని అభినందించక తప్పదు. దంబుల్లానుంచి బస్సుమీదనే అనూరాధాపురం చేరాం. అక్కడ రైలుబండి.

వచ్చేటప్పుడు మేం శ్రీలంక అతిధులం, తిరిగి వెళ్లేటప్పుడు మేం సొమాన్య జనులం. రైల్లో మేం సంచులు, బుట్టలమధ్య సద్దుకున్నాం. కొసకు తలైమన్నారు చేరాం. మన దేశం నుంచి లంకకు వెళ్లీవారు ధనుష్కోటి రేవులో ఓడెక్కుతారు. లంక నుంచి మన దేశానికి వచ్చేవారు తలైమన్నారు రేవులో ఓడెక్కుతారు. అక్కడ మేం ఓడెక్కాం. ఓడ ధనుష్కోటిలో ఆగింది. ధనుష్కోటి, తలైమన్నారుల మధ్య దూరం పద్దెనిమిది మైళ్లు ఓడ ఎక్కినప్పుడు అక్కడి ఉద్యోగులతో ఇది వరకే పరిచయం అయింది. వచ్చేటప్పుడు మా చిత్రకారమి(త్రులు అక్కడి ఉద్యోగుల స్కెచ్చిలు గీశారు.

వెళ్లేటప్పుడు పలకరింపులయిన తరవాత హమాలీల చేత మా సామాన్ని ఉచితంగా దింపించారు. శీవు నుంచి ధనుష్కోటి రైలుస్టేషము వరకూ ఎవరి సామాను వారే మోసుకున్నారు. నా సొమాను చిన్న సంచీ. అందువల్ల బొమ్మలు వేసిన కాగితొలకట్టను నాకప్పగించారు. ధనుష్కోటి స్టేషనులో బాపిరాజుగారి పరిచితులు పలకరించారు. ధనాభావం వల్ల మేమిద్దరం ఉండిపోయి మిగతా వారిని పంపించేద్దామను కున్నాం. అంచాత వారికి మాత్రమే టిక్కెట్టు కొన్నాం. ఇప్పుడు బాపిరాజుగారి పరిచితుల సాయంతో మాక్కూడా ఇదే బండికి టికెట్టుతెచ్చాం.

వచ్చేటప్పుడు డబ్బు బాపిరాజుగారి దగ్గర వుండేది. వెళ్లేటప్పుడు డబ్బు నా అధీనం చేశారు. మాటిమాటికీ కాఫీలు కట్‌. బాపిరాజుగారికి మాత్రం అదనంగా ఒక కాఫీకి మాత్రమే శాంక్షను. కాఫీలాగే సిగరెట్టు కూడా పరిమితమయిపోయాయి. బండి ఎగ్మూరు చేరింది. కామరాజు, స్టేషను ష్లాట్‌ఫాం మీదికి టాక్స్సీని తెచ్చాడు. బాపిరాజుగారి సామాను చిత్రాలు అన్నీ పట్టుకుని బాపిరాజుగారి శిష్యురాలు రత్నాల కమలాబాయిగారింటికి వెళ్ళాం. అక్కడ నేను అండకరేఖలు మాత్రమే గీసిన కాగితం, సంచీ తీసుకుని రిక్షామీద ఇంటికి వెళ్ళాను.

నేనుండేది ట్రిప్లికేన్‌ హైరోడ్డుమీద. అదే రోడ్డుమీద ట్రాంస్టాపు దగ్గర అద్దాలు, ప్రెవడ్‌ దుకాణం వుంది. దాని యజమాని ఒక కన్నడ ముస్లిం. ట్రాం వచ్చేవేళకు ఎదురుగా నిలబడి నన్ను దిగమనేవాడు. అతనితో రోజు అరగంటసేపు ఉర్చులో మౌట్టాడాలి. ఆయన ఉరుదు నేర్చుకునే పద్దతి అది. నేను గీసిన బొమ్మ కొలతలు చెప్పి నాకు ఆ కొలతలు గల ప్టయివుడ్‌ కావాలన్నాను. ఆయన కుర్రవానిచేత దాన్ని ఇంటికి పంపించాడు. అండకరేఖలు గీసిన షీటును ఆ బోర్డుకు అమర్చాను. రంగులూ, బ్రష్పులు, డిష్టులు వెంటనే వున్నాయి.

ఇంటికి చేరిన తరవాత అక్కడి బడ్డీకొట్టు, సీగిరియాకొండ సరిగా మధ్యనున్న గుహాకుడ్యం. అక్కడ పనిలో నిమగ్నం అయిన మేము ఇవన్నీ ఇండియనింకు చిత్రాలు గిశాను. నేను గెస్పుపొసులో కూర్చుని కాండ, అడివి చిత్రానికి మాత్రం రంగులు వేశాను. కొన్ని ఫోటోగ్రాపులు కూడా సంపాదించాను. మా యాత్ర గురించి పెద్ద వ్యాసం రాశాను. వర్ణచిత్రం మినహా నా దగ్గరున్న ఇతర చిత్రాలతో ఆ వ్యాసాన్ని ఆంధ్రప్రభకు ఇచ్చాను. ఆంధ్రప్రభ మిత్రులు ఆ వ్యాసాన్ని ప్రముఖంగా ప్రకటించారు. ఆ వ్యాసాన్ని ఆం(ధ్రమహిళాసభ వారి పత్రిక పునర్ముద్రించింది.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 87

నేను గీసిన వర్ణ చిత్రాన్ని మత్రం ఫ్రేం కట్టించుకుని రత్నాల కమలాబాయిగారు సభలో తానుండే గది గోడకు పెట్టారు. బొమ్మలు లేకుండా మరో రెండు మూడు చిన్న పత్రికలు ఆ వ్యాసాన్ని ముద్రించుకున్నాయి. ఆంధ్రప్రభలోని మిత్రులంతా వ్యాసాన్ని మెచ్చుకున్నారు. ఒకే ఒక మిత్రుడు ఆయన పేరు నాకిప్పుడు గుర్తులేదు, ఇంటిపేరు మాత్రం ఆకొండి. ఆయన నా వ్యాసం చదవలేదన్నాడు - వ్యాసానికి ఉన్న తొలి పేరా ఆంతా ఒకటే వాక్యం అందుకని చదవలేదన్నాడు. ఆతని మాట నాకు ఒక పారం అయింది. ఆ తరవాత నుంచీ దీర్ధవాక్యాలు మానేశాను.

కలం కాగితం మీద పెట్టినప్పుడల్లా ఆ మిత్రుని మాటనా చెవుల్లో ధ్వనిస్తూ వుంటుంది. నార్లవెంకటేశ్చరరావుగారు వి.ఐ.పీలకు ఇచ్చే స్పెషల్‌ రెమ్యూనరేషను నలభైరూపాయలకు పెంచారు. కాని ఆ రెమ్యూనరేషను ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. ఆయన ఊళ్లోలేరు. ప్రభమిత్రులు నా వ్యాసానికి ఆ వి.ఐ.సీ రెమ్యూనరేషను ఇచ్చారు. అనాడది గొప్ప రెమ్యూనరేషనే మరి. ఆరోజుల్లోనే ఒక మిత్రుడు హర్షిభట్టు. రాసిన రతి రహస్యానిక్రి ఒక సంస్థ్రానాధీశ్వరుడు చేసిన తెలుగు అనువాదాన్ని అచ్చువేశాడు. దాన్ని ప్రభకు రివ్యూకు పఫంపించాడ్తు

తిరుమల రామచయద్రుడు ఆ పుస్తకాన్ని పట్టుకుని నాదగ్గర కొచ్చారు. దీన్ని మీరే రివ్యూ చేయాలన్నారు. చేస్తాను కొని దాని కింద మీపేరే వుండాలన్నాను. అందుకాయన ఒప్పుకున్నారు. రివ్యూ వ్యాసం రాశాను. దాన్ని ఆనాడున్న వారప్రత్రికలన్నీ పునర్ముద్రించుకున్నాయి. అది కామశాస్త్ర చరిత్ర. వాత్స్యాయనుని ప్రత్యేకత, అలాగే గుడిగంటల ఘ్రీదకూ రామచంద్రుని పేర రాసిన రివ్యూ ప్రసిద్దికెక్కింది. మార్క్సిస్టు దృక్పధంతో నేను రాసిన తొలి రివ్యూ అది. దానిమీద చాలా వాదోపవాదాలు చెలరేగాయి. అవి చెలరేగుతాయని నాకు తెలుసు.

వేదం అంటే తెల్రిిడి. జ్ఞానం. జ్ఞానానికే వేదం అని పేరు. మనిషి నేర్చిన తాలి తెలివిడి అన్నం. అంచాతనే వేదాలు అన్నానికి బ్రహ్మ అని పేరుపెట్టాయి. అన్నం మనిషిచేత ఏపనైనా చేయంచగలుగుతుంది.

, పురాణాలు పేర్కొన్న బ్రహ్మాస్త్రం ఈ అన్నా(స్త్రమే అయివుంటుంది. ఈ అన్నా(స్తం ఎలాంటి ఘనకార్యాలు సాధించిందో మాన్వ్యని 'ప్రాకృరిత్రను చదువుతే తెలుస్తుంది. ఏక[క్రియాద్య్యర్హకరీ అన్నట్టు మాకొత్త కాపురం ఎలా వుందో చూడ్డానికీ తన బిడ్డను అక్కడి డాక్టర్లకు చూపడానికీ మా వొదినగారు వచ్చారు.

తల్లి దగ్గర పాలు లేవు. పిల్ల పోతపాలు తాగదు. పాలు తప్ప ఇతర తిండ్లకు తగ్గ వయసులేదు. అదీ సమస్య, రాయపేట హాస్పిటల్‌ సూపరింటెండెంటుగా పనిచేసిన డాక్టరు గంటి వినాయకరావుగారి దగ్గరకు పిల్లను తీసుకెళ్ళారు. ఆయన పరీక్షించి చూసి పెంకెతనం తప్ప మరేమీలేదు అన్నారు. మందులు వగైరాలు అవసరం లేదన్నారు. పిల్లనింటికి తెచ్చిన తరవాత నాకీ విషయం చెప్పారు. పిల్లకు పాలు నేను పడతాను అన్నాను. సీసానిండా పాలు తీసుకుని తోటికోడల్లిద్దరినీ బైటికి పంపించి వేశాను. బ్రహ్మాస్త్రప్రయోగం చేయాలి కనక తలుపు లోనుంచి గడియవేశాను.

పిల్ల ఏడుస్తోంది, ఏడ్చినప్పుడల్లా పాలపీక నోటికందించేవాడిని. నేను ఒక నవల తీసుకుని చదువుకుంటూ కూర్చున్నాను. అలా కొంతసేపు కసరత్తు చేసిన తరవాత పీక నోటబెట్టి పాలు తాగడం మొదలుపెట్టింది. మధ్యమధ్య మళ్లీ ఏడుపు. ఎట్టకేలకు పాలన్నీ అయిపోయాయి. పొట్టనిండింది. నిద్రవచ్చి హాయిగా పడుకుంది. ఏడ్చు వినరాలేదు. కనక పిల్ల ఏమయిందో అని తోటికోడళ్లు భైటనుంచి తలుపు బాదడం మొదలుపెట్టారు తలుపు తీశాను, ఇంకా అయిదు పేజీలున్నాయి. అవికూడా చదివిన తరవాత తలుపుతీద్దామనుకున్నాను. పక్కమీద ఖాళీ సీసావుంది.

88 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

వీ లు ల్‌ క లై పాదరాబాదు వెళ్లిపోయారు. అవి రేషను రోజులు. రేషనులో ఇచ్చేవి ఉప్పుడు లే గ , మద్రా స అం రిక ఉప్పుడు బియ్యం అంటే చాలా ఇష్టం. మా మేనల్టుడు పల్హావరంలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. మా అక్క ముగ్గురు పిల్లలతో వచ్చింది. ఆమెకు పచ్చిబియ్యం కావాలి.

బ్బాకులో ఆ బియ్యం చాలా ఖరీదు. బ్లాకులో కొనడం ఇష్టంలేదు. పైగా వచ్చే స్టయిఫండు చాలదు కూడా. అందువల్ల నా సలహా అడిగాడు. ఆరోగ్యం పేర మకాం పల్లవరానికి మార్చాను.

మదరాసు రేషనులో సగం గోధుమలు, సగం ఉప్పుడు బియ్యం ఇచ్చేవారు. అరవ్వారు గోధుమ రొట్టెలు చీయలేరు. చేయగలిగినా తినలేరు. మాకు లేషనులో వచ్చిన ఉప్పుడు బియ్యం కౌంత ఇచ్చి వారి గోధుమల బరువు తగ్గించేవారం. ఉప్పుడు బియ్యాన్ని రవ్వగా మార్చి మినుములుకొని రుబ్బి ఆ పిండిలో రవ్వ కలిపి పోళి చేసేవారం, పోళిని ముక్కలుగా కోసి సాంబారుతో పగటిపూట తినేవారం. మిల్కు పౌడరు కొని పాలుగా మార్చి మజ్జిగ చేసేవారం. రాత్రి భోజనానికి గోధుమరొట్టెలు. రొట్టెలు తిన్న తరవాత మూడు గ్లాసుల చిక్కని మజ్జిగ తాగాలి. అదీ నియమం.

దీనితో బ్లాకులో పచ్చిబియ్యం కొనవలసిన అవసరం లేకుండా కాలం గడిచింది. యాభై రెండులో ఎన్నికలు. స్వతం[త్ర భారతంలో తొలి ఎన్నికలు, ఎన్నికల ప్రచారం కోసం (ప్రజాశక్తిని బైవీక్షీగా తేవాలని నిశ్చయించారు. నాకు బెజవాడ ఆహ్వానం వచ్చింది. సందేశం పత్రిక పనితీరింది. నీకిష్టం వుంటే ప్రజాకక్తికి రావచ్చు లేదా ఆక్కడే మరో కొలువు చూసుకొనవచ్చునన్నారు. హైదరాబాదులో మీజానులో పనిచేసేటప్పుడు నేననుభవించిన స్వేచ్చ మళ్లీ నాకు నందేళంలో దొరికింది. అందువల్ల బెజవాడకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నేను కర్మర్షిని. కర్మలోనే నాకానందం.

బెజవాడ బయలుదేరాను. మద్రాసులో ఉన్నప్పుడు నేను నవలలు చాలా చదివాను. సం(గ్రహించాను కూడా. బెజవాడకు బయలుదేరేటప్పుడు సేకరించిన నా లైబ్రరీని అక్కడే విడిచిపెట్టాను. బెడ్రిక్‌ హ్రోబ్సీ అభినందన (గ్రంధం, యుద్ధచరిత్రను ప్రతిబింబించే రష్యన్‌ కార్టూన్ల పుస్తకం తీసుకుని తక్కినవన్నీ అక్కడే విడిచిపెట్టాను. బెజవాడలో రంగాచారి ఒక ఇల్టు వెతికిపెట్టాడు. అప్పటికి చెళ్లపిళ్ల వెంకటశా(స్తిగారు పోయారు. "హైదరాబాదులో లక్ష్మీనరసింహ (శ్రౌతిగారు కూడా పోయినట్టు వార్త ఆయన పుస్తకాలన్నీ ఎవరికందినవి వారు ఎత్తుకుపోయారు.

ఈసారి నాకు వంద రూపాయలు జీతం నిర్ణయించారు. నేను తెలుగుదేశంలో పనిచేసే రోజుల్లో ఓ పెద్దమనిషి నాపేరును వోటరు లిస్టులో రాశాడు. అందువల్ల తొలి ఎన్నికలకు బెజవాడలో నాకు వోటు వుంది. ఆనాడు ఎన్యూమరేటరుగా వచ్చినాయన హైస్కూలు హెడ్‌ మాస్టరు. ఆయన నా కులం అడిగాడు. నేను చెప్పను అన్నాను. ఆయన నా కులం దగ్గర ద్రావిడ అని రాశాడు. టైపిస్టులకు అచ్చువాళ్లకు అది అర్థం కాలేదు. నాటి ఉద్యోగులు చర్చించుకుని అది గౌడ అయివుంటుందని నిర్ణయించారు. అంచాత

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 89

షు నీ లో అదంతా నీకనవసరం. నేను చెప్పినట్టు విశాలాంధ్ర వటం గీయి అన్హారు నుందరయ్యగారు. నేను కమ్యూనిస్టుని. నేను చేయబోయే పని వివరాలు తెలునుకునే హక్కు నాకు వుంది. లేకుంటే పటం మీరే గీనుకోండని పెన్సిలూ రబ్బరూ విసిరికొట్టాను. నుందరయ్యగారు కూడా విసురుగా నాలుగడుగులు వేశారు. అక్కడినుంచి వెనక్కి తిరిగి నవ్వుతూ వచ్చారు. ననా. తొలి ఎన్నికలు ఎన్నికలకు ముందు కమ్యూనిస్టు పార్టీ మీదున్న నిషేధాన్ని తొలగించారు. చాలామంది ఎన్నికల రంగంలోకి దిగారు. ఎన్నికల వ్యాసాలు, వార్తల మీద నేను పెట్టిన శీర్షికలు గేయ ఛందోబద్ధంగా వుండేవి, యువకులు వాటిని నినాదాలుగా వాడుకునేవారు. బెజవాడ నుంచి హరీంద్రనాధఛటోపాధ్యాయ పార్లమెంటుకు స్వతంత్రునిగా నిలిచాడు. అతడిని కమ్యూనిస్టు పార్టీ బలపరిచింది. ఆయన మెడలో హార్మొని వేసుకుని పాటలు పాడుతూ ఎన్నికల ప్రచారం చేసేవాడు, నాటి ఆహారమంత్రి కెయం,మున్నీ మనిషికి కొమ్ముమొలుస్తే మునిషి అవుతాడని తాపీధర్మారావుగారు అంటూవుండేవారు. ల ఆకలిచావులు, రాయలసీమలో కరువు ముమ్మరంగా వుంది. కాని కేంద్ర ఆహారమంత్రి మునిషీగారు మాత్రం పురైలరాసిమీద నిలబడి ఆకలిచావులు లేవు, కరువుల్లేవు అని ప్రకటిస్తున్నట్లు ఒక కార్ట్దూను గీశాను. రాయలసీమ కరువుమీద చాలా వార్తలు వస్తూ వుండేవి. కరువుకు గురెన సైతుల ఫోటోలు కూడా పంపేవారు. వాటిని పత్రికలో వేయాలి. ఆబొమ్మల్ని చూస్తూ వుంటే కరువనేది కానరాదు. అంతా ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపించే వారు. తిండి లేక బక్కచిక్కి బొంబాయిలో పెవ్‌మెంట్లమీద పడుండేవారి ఫోటోలు వేసింది బ్లిట్ట్‌ పత్రిక న అసలు కరువు ప్రాంతంనుంచి వచ్చే ఫోటోలను చూస్తే అది కరువు అన్న భావన ఎవరికీ కలగదు. బొంబాయి సేన్‌మెంట్టమీదనున్న వారి బ్లిట్ట్‌ ఫోటోలు కరువును కళ్లకు కడతాయి, మామూలు జర లిజానిక్ష ఫోటో జర్నలిజానికీ వున్నతేడా అది. కమ్యూనిస్టు కేడర్లకే కాదు లీడర్లకుకూడా ఈ తేడా తెలత ఎలాగనిపించింది. బక్కచిక్కిన పశువులను తోలుకుంటూ మూటాములే నెత్తికెత్తుకుని పోయే జనం నన ము ర! 90 రాంభట్ల కృష్ణమూర్తి సొంతకగ

పైదవారిన చెట్టు క మ్మల పైనుంచి చూస్తున్న రాబందుల్ని చూపిస్తూ రాయలసీమ కరవు మీద ఒక్క

టి కార్టూన్లను ఢిల్లీ పత్రిక వేసింది. వతి న శంకర్స వీక్తీ నుంచి అని కిందరాశారు. ఆ రెండు కార్టూన్లను కమ్యూనిస్టు దేశాల నేను కాని 'ప్రప చ ఎంచాయి. కాన్ని మాస్కోపత్రికలు కూడా పునర్ముద్రించాయి. అయితే కష్టపడి గీసింది అభ రు. య వ్యాప్తంగా పేరువచ్చింది మాత్రం శంకర్‌ వీకీకి. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కమ్యూనిస్టు వరీ ర స యంగా గెలిచారు. నాటి ఎన్నికల్లో జనరల్‌ రిజర్వుడు అభ్యర్థులిద్దరూ ఒకే నియోజక గె ర్లమెంటుకు పోటీ చేసేవారు. దేశంలో నెహ్రూ కన్నా ఎక్కువ వోట్లు రావినారాయణరెడ్డి, ఉప్పల మల్ఫూర్లకు వ చ్చాయి.

ఈ తాలి ఎన్నికల్లో చిత్రాలు చాలా జరిగాయి. అప్పుడు నియోజక వర్గం వారీగా బేలట్‌ పేపర్లు అచ్చయేవి బెజవాడ కోసం అచ్చు అయిన బేలట్టు ఏలూరులో పడ్డాయి. నాడు ఏలూరు కూడా జంట నియోజక వర్గం - జనరల్‌ అభ్యర్థిగా శాంరి రామ్మూర్తిగారు, రిజర్వు అభ్యరిగా బి.యన్‌, మూర్తి నిలబడ్డారు. ఇద్దరూ కాంగ్రెసు అభ్యర్థులే. పోలింగులో ఇద్దరూ గెలిచారు. అయితే రామ్మూర్తిగారి కన్నా బి.యస్‌. కీ ఎక్కువ వోట్టు వచ్చాయి. అంచాత ఆయన్ని జనరల్‌ అభ్యరిగా డిక్షేరు చేశారు. మూర్తికన్న తక్కువ

స్లై వున్నాయన్ని రిజర్వు అభ్యర్థిగా డిక్షేరుచేశారు. ల విశాఖ దగ్గరున్న పరవాడ నియోజకవర్గంలో ఎనమండుగురు నిలబడ్డారు. అందరికీ వోట్టు దాదొపు సమానంగా వచ్చాయి. కమ్యూనిస్టు అభ్యర్హి పోతిన సన్యాసిరావు గెలిచినట్లు డిక్షేరు చేశారు. కాగొ ఎవరికీ పోలైన వోట్లలో ఆరోవంతు రాలేదు. అందుకని అందరికీ డిపాజిట్టు పోయాయి. చెరుకువాడ నరసింహం పంతులు అని ఓ వృద్ధ కాంగ్రెసువాది. ఆనాటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. నాడు ఎంఎల్‌ఏ అంటే ఒక యూనివర్సిటీ డిగ్రీ లాంటిదనుకునే వారు. ఆయన మీరు గెలిచినందుకు మూడక్షరాలే వచ్చాయి. నాకు ఆరక్షరాలు అంటే ఎమ్మెల్యే డిఫీటెడ్‌ డిపాజిట్‌ లాస్ట్‌ అనేవారు.

ఆయన గొప్ప వక్త. కాంగైసు ఎంఎల్‌యేఅను గురించి అయనో మాట పదేపదే చెబుతూ వుండేవారు. మూ పాలిటీషియన్ల బుర్రకు కాంస్టిపేషను, నోటికి డయారియా అంటూ ఉండేవారు. గంటలు గంటలు ఉపన్యాసాలిస్తారు కాని తామేం చెబుతున్నారో తమకే తెలీదు. ఇంక జనానికేం తెలుస్తుంది? పొలిటీషియనులు గీత చెప్పిన కర్మవాదుల్లాంటివారు. కర్మణ్యే వ్యాచికారస్తే మాఫలేషు కదాచన. ఈ భ్లోకొన్ని పూర్తిగౌ రమలు _రుపుతారు. వారి దృష్టిలో కర్మవాదం అంటే ఉపన్యాసాలివ్వడం అంతే. ఉపన్యాస ఫలితాలతో వారి మిత్తంలేదు.

కమి (ప్రచారంకోసం పెట్టుకున్న ప్రజాశక్తి ద్వైవారపత్రిక తాత్కాలికం. గా ఏక్రీక్ష ్రిస్తులు గణనీయంగానే అసెంగ్లీకి ఎన్నిక అయ్య ఇది డు గసయన్నారు దానిపేరు విల చేయడం. ఈ ఆశయాన్ని ప్రతిఫలించేందుకు కొత్త పత్రి రిక టప్పుడు ఆఖరి వొంపు ._ రాం్యర్ర 'ప్రజాశక్తికీ విశాలాంధ్రకీ లోగోను నేనే డిజైను చేశాను రాన్ని న్స టుంది. 'ప్రదక్షిణ క్రమంగా వుంటుంది. ఆది సామాన్యం. నొ లోగోలో చివరి వంపు తద్విరుద్ధంగా వొ ర '0| జూ, న వ మా య సా పై యి స యాయి. చర్చించారు కి క విశాలాంద్ర పటం వుండాలని నిర్ణయించారు. వ్లిశాలాం[్‌ తాలం రాంభట్ల కృష్ణమూర్తి సాంతకర్‌ తీ 91

మీద సాధికారంగా మాట్లాడగలవారు సుందరయ్య గారాక్కరే. ఒక గదిలో భారతదేశపటం వేలాడుతోంది. పెన్సిలు కాగితం రబ్బరు తీసుకుని నేనూ సుందరయ్యగారూ ఆ గదిలోకి వెళ్లాం. విశాలాంధ్రలోక్తి ఏతు ప్రాంతాలు వస్తాయో ఆయన చెప్పసాగారు. నేను గుర్తుపెట్టుకుంటున్నాను.

ఇప్పుడు చెన్నరాష్ట్రంలో వున్న ఆంధ్ర జిల్లాలు, అవికాక ఒరిస్సా నుంచి గంజాం, బరంపురం, క్రోర్రాా ట్టి జిల్దాలు. మధ్యప్రదేశ్‌ నుంచి బస్తరు, చాందాజిల్లాలు. కర్ణాటక నుంచి కోలారు, తుముకూరు, సిరిగుప్ప జిల్లాలు, హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణా జిల్లాలు ఇవన్నీ కలిపితే అది విశాలాంధ్ర అవుతుంది, ఆ పటం తయారుచెయ్యి అన్నారు సుందరయ్యగారు. ఏమిటన్నట్టు ఆయన కళ్లు ప్రశ్నించాయి. మనది జాతీయపార్టీ కదా ఒరిస్సా, కర్ణాటక కా(మ్రేడ్సుతో చర్చించారా అన్నాను.

అదంతా నీకనవసరం. నేను చెప్పినట్లు పటం గీయి అన్నారు. నేను కమ్యూనిస్టుని. నేను చేయబోత్రు

పని వివరాలు తెలుసుకునే హక్కు నాకు వుంది. లేకుంటే పటం మీరే గీసుకోండని పెన్సిలూ రబ్బరూ విసిరికొట్టాను. సుందరయ్యగారు కూడా విసురుగా నాలుగడుగులు వేశారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి నవ్వుతూ వచ్చారు. పెన్సిలూ, రబ్బరు తీసి నాకందించారు. కామ్రేడ్‌, అవన్నీ నేను చూసుకుంటాను అని నవ్వుతూ చెప్పారు. నేనూ నవ్వు ముఖం పెట్టి ఆయితే రెండు మూడు పటాలను నేను మళ్లీ గిస్తాన్స లెండి అన్నాను.

కమ్యూనిస్టు నాయకులు నవ్వరు. కేడర్లు వారిముందు నవ్వరు. వీరుభయులూ నవ్వుతూ మాట్టాడుక్రుంటే

అది వార్త అవుతుంది. ఆనాటి సంభాషణ వార్తే మరి. కాగా ఎక్కడా (ప్రచురణ కాలేదు. అంతేతేడా, మరుసటి వారం సుందరయ్యగారు ఢిల్లీ వెళ్ళారు. వచ్చారు. నన్ను పిలిచి ఒరిస్సా జిల్లాలు మూడూ త్రీస్స్సి పటం గీయమన్నారు. అది గీశాను. దాన్నాయనకిస్తూ వచ్చే వారం మరొకటి గీస్తానులెండి అని నవ్వుతూ అన్నాను. ఆయన మళ్లీ ఢిల్లీ వెళ్ళారు. కర్ణాటక జిల్లాలు మూడుతోబాటు బళ్లారి జిల్లా కూడా పోయింది. బస్తరు, చాందాలను కూడా తీసేశారు.

మూడువారాలపొటు మూడు విభిన్న రూపాలతో మూడు విశాలాంధ్ర పటాలు అచ్చు అయ్యాయి.

అప్పటికే కమ్యూనిస్టు పార్టీలో విష్ణవళక్తులెవరు అన్న సమస్య మీద చర్చలు మొదలయ్యాయి. పెద్ద పరిశ్రమల కార్మిక వర్గం విప్ణవశక్తి అని లెనిన్‌ అన్నాడు. రష్యన్‌ విప్లవానికి తోడ్పడిన వారు లెనిన్‌ నిర్మించిన ఎలక్షోసిలా కార్మికులు, అప్పటివరకూ సేంట్‌పీటర్స్‌ బల్ల్‌ అన్న పేరును లెనిన్‌[గ్రాడుగా మార్చారు, పెద్ద పరిశ్రమల కార్మికులే విష్ణవళక్తులు అని వాదించేవారిని రష్యా అభిమానులన్నారు. 1949లో కర్షక విప్లవంతో చైనా సోషలిస్టు రాజ్యంగా మారింది, అంచాత రైతులే విప్లవళక్తులంది మరో వర్గం.

ఈ రెండో వర్గాన్ని అభిమానించే వారిని చైనా పంధీయులనేవారు. ఆదిలో కమ్యూనిస్టు పార్టీలో నాయకులు కేడరు కూడా కొందరు మేధావులతో ఉండేది. రష్యా చైనా పంథాలుగా విడిపోయిన పార్టీల్లో క్రమంగా మేధావుల సంఖ్య తగ్గసాగింది. అదీగాక నాయకుల్లోను కేడర్లలోనూ రైతాంగం నుంచి ఎక్కువ సంఖ్యగల వారు చైనాను అనుసరించారు. రైతువర్గం నుంచి వచ్చిన వారు నగరాల్లో కార్మికులకు నాయకత్వం వహించడం సాధ్యం కాలేదు. అందుకని పార్టీలో (ట్రేడుయూనియన్లలో పనిచేయడానికి మేధావులమీదనే ఆధారపడవలసి వచ్చింది. చైనా వర్గానికి ఆ సమస్య లేదు,

కమూనిసులు తెలుగులో ఒక ప్రత్యేక మాండలికం వాడుతారు. నేను సందేశంలో పనిచేసేరోజుల్లోనే ఆ సంగతిని కనిపెట్టాను. టైనా విప్లవం విజయం కాగానే మావో సేతుంగ్‌ విరోధాలను గురించి అని ఒక

92 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని చదివాను. దాన్ని తెలుగులోకి అనువదించమని నాకు ఆదేశం ఇచ్చింది. నాకు కమ్యూనిస్టుల మాండలికం తెలియదు. అందువల్ల ఆ పుస్తకాన్ని నేను అనువదించలేను - అని తప్పుకున్నాను. అప్పుడు కంభంపాటి సత్యనారాయణగారు దాన్ని అనువదించారు. నేను ఆయన అనువాదాన్ని చూడలేదు. చూసికూడా చేసేదీ లేదు. తూర్పు దేశాలవారు ఒక విషయాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా వర్గీకరిస్తారు. మావో కూడా 'ప్రాచ్యుడే మరి. మౌలిక వైరుధ్యం, అమౌలిక వైరుధ్యం, అంతరంగ వైరుధ్యం, బహిరంగ వైరుధ్యం, శాత్రవ వైరుధ్యం ఆశాత్రవ వైరుధ్యం, ఇలా సాగుతుందీ ఆ వైరుధ్య విశ్లేషణ. తర్కంలో అభావం ఆంటే లేనిది అని అర్థం. దాన్ని నాలుగుగా వర్గీకరిస్తారు పండితులు. (ప్రధ్య్వం సాభావం, (ప్రాగభావం, అత్యంతాభావం, అన్యోన్యాభావణ. ఇలాగ లేనిదనాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణాన్ని శ్రీనాధుడు హీళన చేస్తాడు. పత్రికకు సంపాదక వర్షం వుంది. దాని అధ్యక్షుడు మద్దుకూరి చం[ద్రశేఖరావుగారు. ఆయన మితభాషి మృదుభాషికూడా. తెలుగు సాహిత్తంలో ఆయనకు అభినివేశం, అభిమానం కూడా వుంది. నేను తరుచు ఆయనతోనే మాట్టాడుతూ వుండేవాడిని. సందేశంలో పనిచేసేనాటికి చాలా శ్లోకాలు, పద్యాలు కంరస్థంగా వుండేవి. ఇప్పుడు వాటి సంఖ్యా తగ్గింది. జ్ఞాపకానికి మూలం అభ్యాసం, ప్రాక్టీసు. అభ్యాసానికి పునాది అవసరం, వినియోగం. నేను తరుచు చంద్రశేఖర రావుగారితో మాట్టాడుతూ వుండేవాడిని, పత్రికకు డిక్షరేషను తీసుకున్నవాడు కొట్రగడ్డ రాజగోపాలరావుగారు. ఆయన చిట్టిగూడూరులో సంస్కృతం చదివారు. ఆయన నేను రాసిన నామవాచకాల వర్షక్రమం దిద్దుతూ వుండేవారు. ఆయనలో సంస్కృత సంస్కృతి నాకేనాడూ కనిపించలేదు. పత్రిక ఎడిటరు, ్రింటరు, పబ్లిషరుగా ఆయన పేరే వుంది. ఆయన కూడా పత్రిక సంపాదక వర్గసభ్యుడు. ఆఫీసులో ఆయన దర్శనం అరుదు. ఏటుకూరి బలరామమూర్తిగారు సంపాదక వర్గానికి మరో సభ్యుడు. ఆయన పూర్వులు ఏటుకూరి కరణాలు. [గ్రామ నామాలు అన్ని కులాల వారికీ వుంటాయి...వొటినిబట్టి కుల నిర్ణయం చేయరాదు. కమ్మవారి చరి(త్రకారుడు (ప్రసిద్ధ కమ్మవారి పట్టికలో ఏటుకూరి బలరామమూర్తిగారి పేరును కూడా చేర్చారు. తెలుగు వారి ఇంటిపేర్సు మూడు రకాలు. (గ్రామనామాలు, ప్రసిద్ధ పురుష నామాలు, బిరుదు నామాలు. ఇందులో ప్రసిద్ద వురుష నామాల ద్వారా కులం కొంత తెలియగల అవకాశం వుంది. బలరామమూర్తిగారిక్షి చరిత్ర, తత్వశాస్త్రం వచ్చునంటారు. కమ్యూనిస్టు పార్టీ ఆగ్రనాయకులకు అర్థం కాని విషయాలు ఆ రెండే. మరొక సభ్యుడు కంభంపాటి సత్యనారాయణగాదు. ఆయన్ని అందరూ సీనియరు అంటారు. అదేపేరు ఇంటిపేరు గలవారు మరొకరుండేవారు. ఆయన్ని జూనియరు అనే వారు. జైలూ, రహస్య జీవితాలనుంచి తిరిగి వచ్చిన చాలా మంది, కమ్యూనిస్టుపార్టీ నుంచి వెళ్లిపోయారు. జైలూ, రహస్యవాస కాలంలో కమ్యూనిస్టు పార్టీ చీలికకు పునాదులేర్పడ్డాయి. పారిశ్రామిక కార్మిక వర్లమే విష్ణవ శక్తి అనేవారు రష్యా పంధీయులు. పేదరైతాంగమే విష్ణవశ్తక్తి అనేవారు చైనా పంధీయులు. వీరు భావసామ్యంగల వారిని కూడగట్టుకొనడం మొదలుబెట్టారు. (ప్రజాశక్తి పాతకాపులు కొందరు విశాలాంధ్రలో చేరారు. నేను ఇంగ్లీషులో వచ్చిన వార్తలను అనువాదం చేయడమే కాక రాజకీయ కార్టూన్లు గీయడం, రాజకీయ వ్యంగ్య కవితలల్లడం ఆదనంగా చేన్తూ వుండేవాడిని. నేను నాడు రాసే గేయూలను గురించి రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 93

మెచ్చుకునేవారుకాని, నొచ్చుకునేవారుకాని కానరాలేదు. కాగా కార్టూన్హు చూసి మాత్రం వ్యాఖ్యలు చేసేవారు. ఉపసంపాదక వర్గంలో కొందరు కార్ష్‌మార్కుకే సలహాలివ్వగల మహానుభావులున్నారు. అలాంటి వారు "నా కార్టూన్లకు సలహాలిస్తూ వుండేవారు. నాకు కంరగతమయిన తెలుగు పద్యాలు, సంస్కృత ఫ్టకాలు ఏమయినా కార్టూన్ల విషయంలోనూ, వ్యంగ్య కవితల రచనలోనూ నేను స్వతం'త్రుడిని. మీజాన్‌ కాలం నుంచీ ఈ స్వతంత్రత నిర్విఘ్నంగా సాగుతూ వస్తూవుంది. నేను కవితల కింద శశవిషాణం అని రాసేవాడిని. కార్టూన్లకు కృష్ణ అని మాత్రమే సంతకం పెట్టేవాడిని. శశవిషాణం అన్న పేరుమీద మాత్రం చాలామంది వ్యాఖ్యలు చేసేవారు. ఆమాటకు అర్థం తెలియక, కొందరు ఎద్దేవా చేసేవారు. నేను ఏ వ్యాఖ్యనూ పట్టించుకునే వాడిని కాను. అజ్ఞాతంలో వుండడం నాకిష్టం. మీజూన్‌లో “అబ్నబీ” అని రాసేవాడిని. స్వాతంత్ర్యం రాకముందు మద్రాసు ఎసెంబ్లీలో ఒకే ఒక తెలుగు కమ్యూనిస్టు సభ్యుడుండేవాడు. అతడి పేరు పిల్లలమర్రి వెంకటేశ్వర్లు. లేబరు నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యాడు. ఇప్పుడు చెన్నపట్నం శాసనసభలో దాదాపు యాభైమంది కమ్యూనిస్ట సభ్యులున్నారు. పొట్టిశ్రీరాములు ప్రత్యేకాంధ్రర్యాష్టం కోసం నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. ఆ శిబిరాన్ని టంగుటూరి 'ప్రకాశంపంతులూ, బులుసు సాంబమూరీ నిర్వహిస్తూ వుండేవారు. గుంటూరు నుంచి స్వామీ సీత్తార్తారి (గొల్లపూడి సీతారామశాస్త్రి మరో నిరాహార శిబిరాన్ని నెలకొల్పారు. ఆ శిబిరం నుంచి చాలా ఆసకాలు వెలువడుతూ వుండేవి. సంఘటనల విలంబాన్ని సహించలేరు రాజకీయులు. శ్రీరాములు పరిస్థితి క్రమంగా శ్షీణిస్తున్నది. రాజకీయుల్లో ఆందోళన పెరుగుతోంది. దేశం మనసంతా పొట్టి శ్రీరాములమీద కేంద్రీకరించింది. ఊపిరి బిగపెట్టిన దేశం నిట్టూర్పు విడిచింది. పొట్టి శ్రీరాములు కన్సుమూశాడు. బెజవాడలో రైళ్లు ఆగిపోయాయి. సె అంతా రోడ్డపేయ్రేవచ్చాడు. క కష్టమే చ మళ్లింది. జనం స వాగెన్ల మీద పడ్డారు. ఇది తనది అని తెలిసిన అర్భకునికి కూడా ఏనుగుబలం వస్తుంది. గూడ్సు వాగెన్లలోని బియ్యం బస్తాలను, ఇతర వస్తువుల బంగీలను నెత్తికెత్తుకుని జనం పరుగులు పెట్టారు. రైలుస్టేషను నుంచి బైటికి వెళ్లేదారిన నిలిచిన మొగదల వర్తక ప్రముఖులు జనం బుజంమీదున్న బంగీలను పడేయించుకుని వారిచేతుల్లో రూపాయలు పెట్టారు. కొన్ని బియ్యం బస్తాలను గూడ్సుయార్జు ప్రహరీ వరకు తెచ్చి ఆ బస్తా గోడమీద బెట్టి ఆవలికి దిగి బస్తానెత్తుకుని పోవాలి. గోడ ఆవల దుర్చలులైన బిచ్చకత్తెలు బియ్యం కోసం అల్లాడుతున్నారు. అప్పుడు పోలీసులే ఒక బ్లేడుతో బియ్యం బస్తా కోసీవారు. బియ్యం జలపాతంలా బైటికి వచ్చింది. వాటిని చెంగున పట్టి ముడి వేసుకున్నారు బిచ్చకత్తెలు. అదివరకు బియ్యం బస్తా తెచ్చినవాడు విస్తుపోయి ఆ దృశ్యం చూస్తూ వుంటే, పోయి ఇంకో బస్తా తెచ్చుకో అని పోలీసులు గద్దించారు, ది(గ్భాంతుడై చూస్తూ వున్నవాడు పరుగెత్తి మరో బియ్యం బస్తాను పట్టుకువచ్చాడు. ఆ బస్తాను గోడమీదపెట్టగానే బస్తా కోత, బియ్యం వరద, బిచ్చకత్తెల మూటలు, కధంతా మామూలు. ఈలోగా విద్యార్థులు రైల్వే కేంటీను మీద పడి వాళ్ల చేత కాఫీ కాయించి నిలిచిపోయిన రైళ్లలో జనానికి కాలీ, ఫలహారాలు పంచడం మొదలుపెట్టారు. మరో విద్యార్థి బృందానికి బట్టల బేళ్లు దొరికాయి. వాళ్లు చీరలు, ధోతులను, నిలిచిపోయిన (ప్రయాణీకులకు పంచిపెట్టారు. ఇలాగ అపరాహ్ణానికే గూడ్సు వాగెన్ను ఖాళీ అయిపోయాయి, ల త. 949 రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథధ

సాయంత్రం అయేసరికి పోలీసులు రంగప్రవేశం చేశారు. గూడ్సు వాగెన్త నుంచి లూటీ చేసిన వస్తువులన్నింటినీ లారీలకెత్తించారు. ఒక గంటలో పోలీసుల పని ముగిసింది. గుడిసెవాసులు తమ యింటికి తీసుకెళ్లిన సరుకును స్వాధీనం చేసుకున్నారు. లూటీ సరుకు గుడిసెలు చేరకుండా మధ్యలోనే దారి మళ్లించి తమ గోదాములకు చేర్చిన వర్తకులమీద దాడులు జరిగినట్లు సామాన్యులకు తెలియదు. ఆరోజు సంపూర్త బందు. ఉత్సాహవంతులు విశాలాంధ్ర ప(త్రికకూడా బందు అన్నారు. ప్రస్‌ కార్మికులు మాత్రం వచ్చారు నేను చొరవ తీసుకుని కనీసం నాలుగు పేజీల పత్రికనయినా తెద్దాం అని (ప్రెస్‌ కార్మికులతో వాదించాను. అందుకు కార్మికులు అంగీకరించారు. ప్రెస్‌ వర్కర్సుతో సహా చాలామంది రిపోర్టరులు అయ్యారు. నేను ఆ రిపోర్టులను అక్షరబద్దం చేశాను. మర్నాడు ఉదయం బైటికి వచ్చిన పత్రికలు నిమిషాల్లో అమ్ముడుపోయాయి. తెలుగు శాసన సభ్యులు మద్రాసు అసెంబ్లీని దద్దరిల్లడేశారు. రాత్రంతా మద్రాసు, ఢిల్లీల మధ్యసం ప్రతింపులు సాగాయి. ఆంధ్రర్శాష్ట్రం ఏర్పరచడానికి ఢిల్లీ అంగీకరించింది. సన్యాసిగాడి పెళ్లికి జుట్టు దగ్గర నుంచీ ఎరువే అని మనకొక సామెత వుంది. ర్యాష్ట్రం వస్తుంది రాజధాని ఏది అన్న ప్రశ్నమీద పెద్దచర్భలు సాగాయి, బెజవాడ రాజధాని కావాలని కృష్ణా జిల్లా భూస్వాములవాదం. కొందరు విశాఖపట్నాన్ని రాజధాని చేయాలన్నారు. కృష్ణాజిల్లా జమీందార్డు అందరికీ నూజివీడులో భవంతులున్నాయి. కనక దాన్ని రాజధానిని చేస్తే ఆ భవంతుల్లో కొన్నింటిని కార్యాలయాలుగా మలుచుకొనవచ్చునని ఇంకొందరు వాదించారు. ఆఖరికి కర్నూలు రాజధాని చేయాలని టంగుటూరి (ప్రకాశం పంతులుగారు నిర్ణయించారు. మద్రాసు సెక్రటేరియటును చీల్చారు. కర్నూలుకు తరలించారు. అక్కడ ఉద్యోగులకు నగరాన్ని నిర్మించారు. కమ్యూనిస్ర పార్టీ శాసన సభ్యుల సంఖ్య ఎక్కువే అయినా నాటి పాలకపక్షం కాంగ్రైసే. అందువల్ల కాం[గ్రెసు నాయకులతో మంత్రివర్గం ఏర్పడింది. ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాళం పంతులుగారు. కర్నూలు రాజధాని మీద నేను రోజుకో వ్యంగ్యకవిత అల్లుతూ వుండేవాడిని. కార్టూనులు గీస్తూ వుండేవాడిని. నాటి వ్యంగ్య కవితలకు చాలా ప్రచారం వచ్చింది. అది శళవిషాణం గీతాలపేర (ప్రచురితమయింది. నాటి కర్నూలు ఆంధ్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు తరిమెల నాగిరెడ్డి ఆనాడు వార్తలు పంపడానికి టెలిఫోనే సాధనం. అదయినా మూడునిమిషాలు అంతే. ప్రతి రోజూ కనిసం అయిదారుగురు కమ్యూనిస్టు సభ్యులు మాట్లాడేవారు. విశాలాంద్ర లేఖకునిగా తాళూరు వెంకటకృష్ణ వెళ్లాడు. ప్రతిరోజూ కర్నూలు ఫోనును నేను రిసీవు చేసుకొనేవాడిని. మర్నాడు పత్రికలో తన ప్రసంగం ఒక్కమాట పాల్గుపోకుండా అంతావచ్చిందని శాసన సభ్యులు సంతృప్తిపడేవారు. నేను లేనప్పుడు నా సహచరుడొకడు తీసుకునే వాడు. అలాంటి సందర్భాల్లో శాసన సభ్యులు పత్రిక వార్తల మీద చాలా అసంతృప్తి పడేా య ఫో సూ ర్త నేను తీసుకుని రాస్తే సంతృప్తి పడేవారు. మరొకరు తీసుకుని రాస్తే రిపోర్టు సరిగా రాయలేదని ఫిర్యాదులు చేసేవారు. ఇలా ఎందుకు జరుగుతున్నదో ఎవరికీ అర్హం అయేదికాదు. ఫోను టైము చాలదు. దాన్ని మరికొంచెం పెంచమని కోరేవారు. అయితే నాడు మూడు నిమిషాలకన్న ఎక్కువ సమయం చెన్పదానిక్‌ వీలులేదని ఫోను అధికారుల ద్వారా తెలియవచ్చింది. మూడు నిమిషాల్లోనే వార్తలను పంపించుకొండన్నార్ను ఫోనులో వార్తలు తీసుకొనడానికి నేనొక ప్రత్యేకపద్దతిని అనుసరించేవాడిని. వెంకటకృష్ణ ఫోనురాగానె లా

నేను ప్రశ్నలు వేసేవాడిని. సభ్యుని పేరు, అతడు మాట్లాడిన అంశం ఏమిటి? మాటల మధ్య సామెతలు, జోకులు ఏమున్నాయి. ముందు ఈ (ప్రశ్నలకు సమాధానాలు నోటుచేసుకునే వాడిని. తరవాత మరో సభ్యుని ప్రసంగం. ఇదీ నా పద్దతి. ఆయన తీసుకున్న సబ్లెక్టు మీద ఏం మట్లాడుతారో నాకు తెలుసు. వారి ప్రత్యేకత సామెతలు, జోకులు,

సభ్యులేం ప్రసంగిస్తారో నేనే రాసి మధ్య వారి సామెతలు, జోకులు ఆతికేవాడిని అంతే. ప్రతీసబ్లెక్టు మీదా కమ్యూనిస్టు పార్టీకి నిర్దిష్ట అభిప్రాయాలున్నాయి. ఆవి సభ్యులకే కాదు నాకూ తెలుసును. ఆ సమస్యమీద ఎవరు మాట్లాడినా ఒకలాగే వుంటుంది. వారి ప్రత్యేకతల్లా వారు వాడిన సామెత, పేల్చిన జోకు ఆంతే. వాటిని నేను జాగ్రత్తగా రాసుకునే వాడిని. అందువల్ల నా రిపోర్చ అందరికీ బాగానచ్చేది. నొ సహచరులకు ఈ కిటుకు తెలీదు. కమ్యూనిస్టులందరిదీ ఒకటే మాట. ఒకటే భాష ఆ సంగతి నొకు తెలుసును.

శాసనసభ సెషను ఒకటి విశాఖపట్నంలో జరపాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్షనాయకుడు తరిమెల నాగిరెడ్డి, ఉపసనాయకుడు మోటూరి హనుమంతరావు. విశాఖ సెక్షనులో ప్రారంభోపన్యాసం ఉపనాయకుడు చేయాలని నిర్ణయించారు. విశాఖకు కూడా లేఖకుడుగా తాళ్లూరి వెంకటకృష్ణ వెళ్ళాడు. (ప్రతిపక్షనాయకుని (ప్రారంభోపన్యాసం కనక ఫోను కాల వ్యవధి తొమ్మిది నిమిషాల వరకు పొడిగించారు. ఫోనులో చెప్పిన వార్తను నేను ఎనిమిది గ్యాలీల వరకు రాశాను. తన ప్రసంగవార్త చాలా బాగా వచ్చిందని మోటూరి మెచ్చుకున్నారు.

ఆ మెప్పు ఆయినా తన ఆంతరంగికుల దగ్గర మాత్రమే. అప్పటికీ నేనెవరి మాటా వినను అని చాలామందికి కోపం. నిజానికది కోపం కాదు, ఈర్ష్య. మనుషులను కులాలవారీగా గుర్తించడం పల్లే జనానికి అలవాటు, అలాగే మనుషుల్ని మురాలవారీగా గుర్తించడం కమ్యూనిస్టు నాయకులకు ఆలవాటుగా కనిపిస్తుంది, నన్ను మద్దుకూరి చంద్రంగారి మురావానిగా ముద్రవేసినట్టు అనిపించింది. మురాలను ఎదిరించడానికి ప్రతిమురా నిర్మాణం సాధనం కాదని చంద్రంగారు అంటూ వుండేవారు. ఇప్పటి పరిస్థితుల్లో మురా ఉపేక్ష ఒకటే మార్గం.

చం(ద్రంగారికి సాహిత్యంలో అభిమానం , అభినివేశం కూడా వుంది. పద్యాలు కాని శోకాలు కాని వినియోగంలో వున్నప్పుడే ధారణలో ఉంటాయి. లేని పక్షంలో అవి ధారణలోనే మాసిపోతాయి. వాటిని నేను ధారణలో ఉంచుకొనడం కోసం సాహిత్యం ఎరిగిన ఏకైక వ్యక్తి చంద్రంగారితో మాట్లాడుతూ ఉంటాను. ఆ సన్నిహితత్వానికి మురా అని ముద్రవేసినట్టనిపిస్తుంది. యూరపులో కులాలు, సెక్టుల రూపంలో వుంటాయి. ఒకప్పుడు మురాతత్వం, కులతత్వానికి సెక్టేరియనిజం అన్న పేరును వాడేవారు,

తొలి ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీకి వచ్చిన బలం నుంచి అధికారం అందుబాటులో వస్తోందన్న భావం కలిగింది. ఈసారి ఎన్నికలు వస్తే అధికారం హస్తగతం అవుతుందన్న నమ్మకం కుదిరింది. అందుకని

అసెంబ్లీలో కొందరు మిత్రులతో కలిసి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి గెలిచారు. దానివల్ల కేంద్రం ఆంధ్ర అసెంబ్లీని రద్దుచేసి నడిమం(త్రపు ఎన్నికలకు ఉత్తరువు జారీ చేసింది. ఈ ఉత్తరువు కమ్యూనిస్టు వర్గాలకు సంతోషం కలిగిస్తే ఇతర వర్గాలకు భయం కలిగించింది. ఏమయినా వాస్తవాన్ని గుర్తించక తప్పదు. ॥ నీ ఫైన రానకీయపక్టం కొం(గ్రెసు, కమ్యూనిస్టు పార్టీకి ఆనేక కారణాలవల్ల తొలి ఎన్నికల్లో ఎక్కువ . అంతకుముందు అరణ్యవాస, అజ్ఞాత వాస క్షేశాలు అనుభవించిన కమ్యూనిస్టుల

96 అ రాంభట్ల కృష్ణమూర్తి సొాంతకథ

మీద సామాన్య జనానికి జాలిపుట్టుక్రుని వచ్చింది. ఆ జాలివల్ల జనానికి కమ్యూనిస్టులతో తాదాత్మ్యం కలిగింది. ఆంతే. అయితే అది సహజ బలమేనని కమ్యూనిస్టులూ, కాం(గ్రెసువారు కూడా భావించారు. అధికారాన్ని చవిచూసిన కాం(గ్రెసులో మురాలు నెలకొన్నాయి. కొన్ని మురాలకు కొత్తపార్టీలనే నామకరణం కూడా జరిగింది.

ఈ మురాలను ఏకీకరిస్తేనే కాని కమ్యూనిసృలను గెలవడం సాధ్యంకాదనుకున్నారు అనుభవశాలురు. అందుకని అందరూ ఏలూరులో సమావేశమ్యారు. ఆ సమావేశానికి నేను కూడా వెళ్తాను. వారి నిరయాల వార్తలు సేకరించడం కోసం కాదు. ఆ నాయకుల స్కెచ్చిలు గీసుకొనడం కోసం. మున్ముందు ఈ నాయకులమీదే నేను కార్టూన్లు గీయవలసి వుంటుందని నాకు తెలుసును. అక్కడ ప్రతి ప్రధాన నాయకునిదీ రెండు మూడు స్కెచ్చులు గీసుకున్నాను. నాపని అయింది. నా ధ్యాసంతా వారి స్కెచ్చిలమీదనే కాని వారేం చర్చించారో నాకు తెలియదు.

బెజవాడ తిరిగి వచ్చి పనిలోపడ్డాను, పత్రిక వెలువడిన తాలిరోజుల్లో పత్రికను ఇళ్లకు పంపాలని నేను అన్నాను. అందుకు సంపాదక వర్గనేతలు అంగీకరించలేదు. అందరు పారకుల్హాగే మిరు కూడా చందా కట్టండి అన్నారు. ఈ నాయకుల వైఖరి చూస్తూ వుంటే “మర్కటస్య సురాపానం మధ్యేవృళ్చిక దంశనం...” అన్న శ్లోకం జ్ఞాపకం వస్తూ వుండేది. ఏమయినా గిరీశం చెప్పినట్టు ఆత్మానుభవం అయితేకాని తత్వం బోధపడదు. అంతవరకు ఓరిమి వహించడం మంచిదనుకున్నాను. కొద్దీరోజులకు నాయకులు దిగివచ్చారు.

మేం పత్రిక ఉచితంగా ఇస్తాం. కాని, డిష్టిబ్యూషన్‌ కుర్రవానికి ఇవ్వవలసిన రెండు రూషహాయలూ మీరు చెల్లించండి అన్నారు. సబెడిటర్లలో ఎక్కువ మంది వ్యవసాయ కుటుంబాలనుంచి వచ్చారు. వారికి వారి పాలాల్గో పండించే గింజలు వచ్చేవి. చాలా మంది బెజవాడలో పూరిళ్ళు కూడా కట్టుకున్నారు. నేను మాత్రం శ్రమైక జీవిని. కమ్యూనిస్టు పరిభాషలో 'ప్రాలిటేరియన్ని. కాని నాయకులు మేధాకర్మరులను పెటీ బూర్జువా ఇంటలెక్చువల్స్‌ అని పిలిచేవారు. కమ్యూనిస్టు మేనిఫెస్టోలో పెటీబూర్చువా నిర్వచనం మరో విధంగా వుంది.

పెటీబూర్జువా తన కేపిటల్‌ని ప్రతిగంటా ప్రతిరోజూ ప్రతివారం ప్రతినెలా పెంచుతూ పోతాడంటుంది కమ్యూనిస్టు మేనిఫెస్టో. నాలో అలాంటి లక్షణాలు లేవు. అయినా పెద్ద నాయకులు కూడా నన్ను పెటీ బూర్జువా ఇంటలెక్చువల్‌ అంటూ వుంటారు. ఎందుకో అర్ధం కాదు. లెనిన్‌ ఒకసారి “ప్రాలిటేరియన్‌ ఇంజనీర్స్‌ ఆఫ్‌ జెర్మని” అన్న ప్రయోగం చేస్తాడు. మన దేశాన కమ్యూనిస్టు అగ్రనాయకులంతా వ్యావసాయక వృత్తినుంచి వచ్చిన వారే, వ్యవసాయకులకు సాధారణంగా చదువునూ, మేధనూ ఏవగించుకొనడం తరతరాల అలవాటు,

కర్షక జాతి ఈ లక్షణం ఒక భారతదేశంలో మాత్రమే కాదు. ప్రపంచమంతటా వుందనిపిస్తుంది. సోవియట్‌ యూనియన్‌లో కార్మిక వర్గం, కర్షక వర్గం నుంచి వచ్చిన వారికి దరఖాస్తు "పెట్టిన మరుక్షణంలో పార్టీమెంబరుషిప్పు వచ్చేది. ఇండియాలో కూడా అంతే. ఇక్కడ కార్మిక వర్గం అంటే రిక్షా కార్మికులు. 'థ్రెస్సు కార్మికులు, అంతే. యూరపులో గనికార్మికులు, పెద్ద ఫ్యాక్టరీ కార్మికులుండేవారు. ఇక్కడ పెద్ద పరిశ్రమలు చాలా తక్కువ. కర్షక వర్గం నుంచి వచ్చిన నాయకులు మన దేశాన ట్రేడు యూనియన్‌ ఉద్యమంలోకి రారు. ఆ ఉద్యమం వారికి అర్ధం కాదు.

అందుచేతనే కర్షక వర్గం నుంచి వచ్చిన నాయకులకు 1949 నాటి చైనా విప్లవం పెద్ద ఆశాజ్యోతిగా

రాంభట్ల కృష్ణమూర్తి సాొంతకథ అ 97

అవుపించింది. విప్లవం కావాలంటే కార్మికులే అయివుండవలసిన పనిలేదు. కర్షకులు కూడా విష్ణవశక్తులే అన్న వాస్తవాన్ని చైనా నిరూపించిందని కమ్యూనిస్టుల్లో ఓ రైతాంగ వర్గం ఆ సిద్దాంతాన్ని తలకెత్తుకుంది. అలాంటి వారి కంటికి చదువుకున్న వారు మేధావులు, విష్ణవ విరోధులుగా కనిపించే వారు. తత్వశా(స్తం ముఖ్యంగా డయలెక్షికల్‌ మెటీరియలిజానికి తమ పద్ధతిలో భాష్యం చెప్పుతున్నారు.

చైనా వర్లీయుడయిన ఓ పెద్దనాయకుడు తనను గొప్ప విప్లవ నాయకునిగా భావించుకునేవాడు. గొప్ప కమ్యూనిస్టు నాయకుడే గొప్ప కవి కాగలడు అని ఒక సిద్దాంతాన్ని (ప్రతిపాదించాడు. కవి కావాలంటే ఏం చదవాలని నన్నడిగాడు. నేను పెద్దబాలశిక్షనూ, కవిచౌడప్ప శతకాన్నీ చదవమని కొనియిచ్చాను. ఆయన వాటిని చదివాడు. తెలుగులో పెద్దబాలశిక్ష లాంటి గొప్ప పుస్తకం వున్నట్లు నాకింతవరకూ తెలియదే అన్నాడు. కవి చౌడప్పశతకం పూర్తిగా అర్ధం కాలేదు కాని కవి చాలా సూటిగా చెప్పాడని మెచ్చుకున్నాడు.

98 అ రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ

స్ట గ ర. శ్రీశ్రీత్‌ అహవాం ఎక్కువ. ఆంధ్రప్రభ నంపాదకునికి కూడా అవాం తక్కువేమీ కాదు. శ్రీశ్రీ నరానరి ఎన్సికల (ప్రచారానికి గన్నవరం వస్తానన్హాడు. అది వుబ్బలవల్లి నుందరయ్యగారి నియోజకవర్గం. శ్రీశ్రీ తానూ వ్రనంగించాలని ఉత్సాహవడ్డాడు. ఆయన ఉత్సాహం చూసిన నభానిర్వాహకులు మైకు అతనికిచ్చారు. మైకు దగ్గరకు వెళ్ళి సోదరులారా! మీరు వుచ్చలపల్లి నుందరయ్యగారికి వోటేయకండి అన్నాడు. నను. జ్‌ పుత్రికా జననం

ఇల్లాలు పురిటికి సికిందరాబాదు వెళ్లింది. సాధారణంగా పిల్లను తొలిచూలు కాన్పునకు కన్నవారు తమ ఇంటికి తీసుకుని వెళతారు. అలాంటి సంప్రదాయాలన్నీ మామేనమామగారి భార్య పాటిస్తూ వుండేవారు. అప్పుడు మామేనమామగారు సికింద్రాబాదులో ఉండేవారు. 1954 ఫిబ్రవరి 14వ తేదీన ఆడపిల్ల పుట్టిందని మా మామయ్య ఉత్తరంరాళారు. జన్మనక్షత్రం ఆరుద్ర అన్నారు. కొద్దిరోజుల తరవాత ఎగ్రపిల్ల ఏంచేస్తోంది అని నేను ఉత్తరం రాశాను. ఆ ఉత్తరం చూసి ఆయన, పిల్లకు ఆరుణ అని నామకరణం చేశారు.

అదే సంవత్సరం మేలో ఆయన దత్తపుత్రునికి ఉపనయనం. అందుకని అంతా కోనసీమకు వెళుతూ నన్ను కూడా అక్కడకు రమ్మన్నారు. కోనసీమలో సుభద్ర పిల్లనెత్తుకుని కన్నవారింటికి వెళ్లింది. ఆమె స్థస్థలం కొత్తషేట.చాలూకాలోని ఏనుగ్రుముహల్‌: అక్కడామె అమ్మా, నాన్నా, తమ్ములూ, చిన్నన్నా ఉన్నారు. ఆమె వెంట మా అక్కయ్య కూడా వుంది. తల్లి దగ్గర పాలులేవు. పోతపాలు పట్టాలి. కాలవలు విప్పారు. నీరు ఈరానీ టీ రంగులో వుంటుంది. ఆ నీటినీ, దాన్లో కలిపిన పాలను అరుణ ముట్టలేదు. అక్కడి నుంచి అనాతవరానికి, టర్కీటవల్‌ నీళ్లలో తడిపి జట్కాకు కట్టేవాడిని. అది ఆనాటి వేడికి పదిహేను నిమిషాల్లోనే ఆరిపోయేది. జట్కామీదే ముక్తేళ్ళరం చేరాము.

అక్కడ కొంతసేపు ఇసకలో నడిచి, పడవ ఎక్కాం. ఆవలి వొడ్డు నుంది బస్సు. ఆక్కడ బస్సెక్కి కాకినాడకు బయలుదేరాం. కోనసీమలో ఉన్నంతసేపూ అరుణ నీరూ, పాలూ ముట్టలేదు. బస్సు రామచండద్రపురానికి వచ్చింది. అక్కడ ఒక సోడా దుకాణం దగ్గర గ్ధాసెడు నీరు సంపాదించాను. ఆ నీటకలిపిన పాలు తాగింది. కోనసీమలో మంచినీరు కూడా ముట్టలేదు మా అరుణ అని నేను జోక్‌ చేస్తూ

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ € 99

ఉండేవాడిని. కోనసీమ జనాన్ని నేను లంకేయులు అంటూ వుండేవాడిని. కొత్త కాలవల నీళ్లు ఎర్రగా వుండేవి. లంకేయులు రక్తపాయులు అనేవాడిని. నేను ఆ లంకలోనే పుట్టినా, పుట్టి మూడేళ్ళు మాత్రమే అక్కడున్నాను. ఆ కాలాన నేను అనాతవరం పాలిమేరకూడా దాటలేదు. నా ఇరవైతొమ్మిదో ఏట పెళ్లి చేసుకున్నాను. కోనసీమ నుంచి వచ్చిన కమ్యూనిస్టు నాయకుల్ని నేను మీ జిల్దా అల్టుడిని మర్యాద చేయండి అంటూవుండేవాడిని. అనాతవరం నుంచి కాకినాడ, అక్కడినుంచి బెజవాడ చేరుకున్నాం. అదే ఏట నవంబరులో గురజాడ జయంతి సమావేశం వెలిదండ్త హనుమంతరాయ లైబ్రరీలో జరిపారు. నిర్వాహకుల్లో అత్యధికులు కమ్యూనిస్టులు. ఆ మీటింగుకు అహ్పారావుగారి చిత్రపటం వేయాలని అనిపించింది. డ్రాయింగు పేపరు, (బ్రషులు, రంగులు వున్నాయి. కొమర్రాజు లక్ష్మణరావుగారు ప్రచురించిన విజ్ఞాన సర్వస్వంలో అంగుళంన్హుర సైజున గురజ్యాడ అప్పారావుగారి చిత్రం వుంది. దాని ఆధారంగా మధ్యాహ్నం రెండింటికి స్కెచ్చి మొదలుపెట్టాను. సాయంత్రం అయిదింటికి రంగులువేయడం కూడా పూర్తి అయింది. ఆ పటం మీద కృష్ణమూర్తి అని మాత్రమే సంతకం పెట్టాను. నేను సహజంగా నాపేరు రాయను. ఆ చిత్రపటం పట్టుకుని మీటింగుకు వెళ్ళాను. నేను గీసిన బొమ శైలు కాని, రాసిన పాటలు కాని భద్రపరుచుకునే అలవాటు నాకు లేదు. అప్పటికే సహచరులందరికీ నామీద ఈర్ష్య, కొందరికి కోపం కూడా. మీటింగు అయిన తరవాత ఆ చిత్రపటాన్ని మిత్రుడు అవసరాల సూర్యారావు తీసుకుపోయాడు. మళ్లీ ఆ బొమ్మను ఇరవైఏళ్ల తరవాతనే చూశాను. బుచ్చిబాబు బెజవాడ రేడియోలో పనిచేస్తూ వుండేవారు. ఆయనకు ఒకసారి అప్పారావుగారి బొమ్మకావలసి వచ్చింది. అది నొదగ్గరున్నట్టు ఆయనకు తెలిసింది. నాదగ్గర కొచ్చారు. అప్పారావుగారి చిత్రం నేను గీసిన మాటనిజమే. కానీ అది నాదగ్గర లేదు. అవసరాల సూర్యారావు దగ్గర వుండవచ్చును అన్నాను, ఆయన అక్కడకు వెళ్లి బొమ ౩ తీసుకున్నారు. పని అయిపోయిన తరవాత ఆయనకు తిరిగి ఇచ్చి వేశారు. సూర్యారావు అప్పుడు గురజాడ రచనలు పరిశీలించేవాడు. నేను అహిరావుగారి వర్లచిత్రం గీశానని శ్రీనివాసచక్రవర్తి గారికి తెలుసును. ఆయనాక రోజు పనిమీద సూర్యారావు ఇంటికి వెళ్ళారు. అక్కడ కనిపించింది నేను గీసిన చిత్రం. ఇది పబ్లిక్‌ ఆస్తి. దీన్ని నీదగ్గరుంచుకొనడం మంచిది కాదు అని ఆయన ఆ చిత్రాన్ని తీసుకుపోయారు. అభ్యుదయ రచయితల సంఘ పునరుద్ధరణ తరవాత సంఘానికి హిమాయత్‌నగర్‌లో ఒక రూమ్‌ అద్దెకు తీసుకున్నాం. చక్రవర్తిగారు అప్పటికే హైదరాబాదు వచ్చారు. కొడుక్కిక్కడ ఉద్యోగం వుంది, ఆయన ఆ చిత్రాన్ని తెచ్చి అభ్యుదయ రచయితల సంఘ కార్యాలయంలో పెట్టారు. సంఘ కార్యస్థానం హిమాయతునగరు నుంచి మరో చోటికి మారింది. అలా మారిన చోట చిన్న (గ్రంధాలయం కూడా వెలిసింది. కొని అది కాలం చెల్లిన భవనం. ఓ పెద్ద వానకు ఆ భవనం కూలిపోయింది. అష్టుడు లెబ్రరీలో కొన్ని పుస్తకాలతోపాటు అప్పారావ్ట్లారి వత్రం కూడా దౌదికాయి.ఆ చిత్రాన్నానాడు విశాలాంధ్ర విజ్ఞాన సమితి ఎడిటర్‌గా వున్న యేటుకూరి ప్రసాద్‌గారు దాన్ని విజ్ఞాన సమితి (గ్రంధాలయంలో పెట్టారు. అలాగే నేను గీసిన కార్టూన్‌ కటింగులు, కార్టూన్‌ కవితల కటింగులు కొందరి దగ్గర వుండవచ్చును. నాదగ్గర మాత్రం ఏమీలేవు. ఎన్నికల (ప్రచారం ఊపందుకుంది, ఆంధ్రపత్రిక, గురజాడ అప్పారావుగారి మీద పడింది. ఆంధ్రప్రభ శ్రీశ్రీ మీద పడింది, అప్పారొవుగారూ, శ్రీశ్రీ వీరిద్దరూ సూపర్‌కమ్యూనిన్సలని ఆ పత్రికలు భావించివుంటాయి. “కన్యాశుల్మం రచన్న ఎవరిది” ఆని జయంతి కుమార స్వామిరాసిన లేఖను ల నక 10069 రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

ప్రచురించింది అది 13 3.1955వ తేదీ అప్నటి నుంచీ 24.4.1955వరకూ సాగాయి: కన్యాశుల్కం శ్రీనివాసాచార్యులు అనే పండితుడు తెలుగు నాటకీయత కల్పించాడని ఆ వాదం.

కన్యాశుల్క కర్తుత్వం గురజాడ అప్పారావు, గోమరం శ్రీనివాచార్యుల మధ్య జరిగింది ఆ లేఖల్లో, ఆం(ధ్రప్రభ కమ్యూనిస్టుల మీద ధారావాహికంగా పదునెనిమిది సంపాదకీయాలు రాసింది. అందులో తాలి సంపాదకీయం తాలి వాక్యం ఇది. “కమ్యూనిస్టుల కరోరకృత్యాలు. ఇది యమకం కోసం రాసిన మాట కాదు” ఈ వాక్యం మీద శ్రీశ్రీ “ఆహా ఏమి కంపు సొంపు” అని వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యానం సంపాదకునికి నషాలం అంటింది. రెచ్చిపోయి తరవాతి సంపాదకీయాల్లో శ్రీశ్రీ మీద విరుచుకుని పడ్డాడు. శ్రీశ్రీకి అహంత ఎక్కువ.

ఆంధ్రప్రభ సంపాదకునికి కూడా అహం తక్కువేమీ కాదు. సంపాదకుని సంగతి మనకక్కరలేదు. శ్రీశ్రీ సరాసరి ఎన్నికల ప్రచారానికి గన్నవరం వస్తానన్నాడు. అది పుచ్చలపల్లి సుందరయ్యగారి నియోజక వర్గం. శ్రీశ్రీ తానూ (ప్రసంగించాలని ఉత్సాహపడ్డాడు. ఆయన ఉత్సాహం చూసిన సభా నిర్వాహకులు మైకు అతనికిచ్చారు. అప్పటికే దెబ్బతిన్న అహం ఆయన్ని ఆవహించింది. మైకు దగ్గరకు వెళ్లి సోదరులారా మీరు పుచ్చలపల్లి సుందరయ్యగారికి వోటేయకండి అన్నాడు. ఆ వాక్యాన్ని వివరించడానికి'యత్నిస్తూంటే నిర్వాహకులు మైకు ఆఫ్‌ చేశారు.

ఆయన్ని వెంటనే ఒక కారెక్కించి బెజవాడకు తోడిచ్చి పంపించారు. అక్కడున్న మద్దుకూరి చం[ద్రంగారు నన్ను పిలిచి ఆరుద్రకు తెలియబరుస్తాను కాని అతడు వచ్చేవరకు ఈయన్ని మీకప్పజేబుతున్నానన్నారు. ఒక సానుభూతిపరుని గది ఖాళీగా వుంది. శ్రీశ్రీని ఆ గదికి తీసుకెళ్ళాను. నేను చాలా బిజీ. వీరమాచినేని వెంకటాద్రి చౌదరి అని ఒక మిత్రుడున్నాడు. అతడు సుందరయ్యగారు కొనే పుస్తకాలన్నీ చదువుతాడు. వాటిని గురించి ఎవరితో మాట్లాడాలన్నా ఎవరూ వినేవారు కాదు. అందుకని ఆతనికి పిచ్చి చౌదరి అని పేరు పెట్టారు. అతడిని తోడుగా నియమించాను.

నేను వెళ్లి అతడిని భోజనానికి పంపి వచ్చేవరకు శ్రీశ్రీకి కాపుగా వుండేవాడిని. ఇంగ్లీషు, తెలుగుకవులను గురించి నేను ప్రశ్నలు వేస్తూ వుంటే ఆయన జవాబులిస్తూ వుండేవాడు. మానసికంగా దెబ్బతిన్నా మతి పూర్తిగా పోలేదు. ఆయన చేత తినిపించడం మహాకష్టం అయిపోయింది. నేను కూడా కవిత్వం గాలుకుతానని ఆయనకు తెలుసును. కవీ! నా కవితమీద నీ కామెంటు ఏమిటి అన్నాను. నీలో ఒకరు కాదు ఇద్దరు కనిపిస్తున్నారన్నాడు. వారెవరో అన్నాను. ఒకరు తోలేటి వెంకటరెడ్డి. రెండు కృష్ణశా(స్త్రిగారు అన్నాడు.

కృష్ణశా(స్త్రిగారిని నేనెరుగుదును. ఆయన కవితలు కూడా తెలుసును. కాని తోలేటి వెంకటరెడ్డెవరో ఆయన కవితలెలాంటివో తెలీదు. తరవాత్తరవాత తెలిసింది. వెంకటరెడ్డి సినిమా పాటల రచయిత అని. ఆయన పాటను చాలా త్వరగా రాస్తాడట. కృష్ణశాస్త్రిగారు పాటకు చిత్రిక పెట్టటానికి వొట్టి వారాలేకాదు. ఒకొక్కప్పుడు నెలలుకూడా అవుతాయి. నాకు ఒకొక్కప్పుడు ధారవస్తే వార్తలు రాసినట్టే పాటలు రాసేస్తాను. దక్షిణాఫ్రికా కాంగ్రైసు మేనిఫెస్టో ప్రింటర్లో వచ్చింది. దాన్ని వార్తగా అనువదించాలి. కాస్త చదివిన తరవాత రాత మొదలుపెట్టా, మేనిఫెస్టో అంతా ఛందోబద్ధంగా నడిచింది. చిత్రిక పట్టడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు.

మద్రాసులో నేను పనిచేసిన సందేశంలో స్తాలిన్‌మిద పాటరాశాను. అది నూట ఇరవై లైన్లలో వుంది. మల్హారెడ్డి ఆ పాట చదివి ఒక్కచోట కూడా తటపటాయించని ఈపాట ఎవరు రాశారన్నాడు. పాటకింద

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 101

రచయిత పేరు లేదు, అయితే నేనే రాసి వుంటానులే అన్నాను. ఇది ఆయితే నేను రాయాలి. లేకుంటే మౌ గురువుగారు రాయాలి. ఆ పాట రాయగల మూడోవారు లేరు అన్నాడు. నువ్వే రాశావేమో కవీ అన్నాను. పత్రిక డేటు చూసి నేనప్పటికింకా కవిని కాలేదు అన్నాడు. ఆయితే మీ గురువు రాసి వుండాలన్నాను. మా గురువుకు ఇంతటి పొలిటికల్‌ క్లారిటీ లేదే అన్నాడు. అంతేకాని నేను రాశానని ఒప్పుకోలేదు.

మల్దారెడ్డి అహంత అలాంటిది. అది శ్రీశ్రీ ఆహంతకు ఏమాత్రం తీసిపోదు. ఆరుద్ర మద్రాసు

నుంచి కారు వేసుకుని వచ్చాడు. శ్రీశ్రీని తన వెంట తీసుకునిపోయాడు. చాలా కాలం తరవాత ఆ వారం రోజుల వృత్తాంతం కావాలని ఆరుద్ర అడిగితే నేను రాసి పంపించాను. శ్రీశ్రీ ఆరుద్రకు మేనమామ. శ్రీశ్రీ పుట్టింది పూడిపెద్దివారింట. శ్రీరంగం వారింటికి దత్తుడుగా వెళ్ళాడు. అందువల్ల చిన్నతనంలొ వారు దూరదూరంగా పెరిగారు. ఆ కారణంవల్ల వారు మేనమామ మేనల్టునిలా ప్రవర్తించరు.

ఆ ఎన్నికల్లో నేను రోజుకో రాజకీయ కార్టూను గీసేవాడిని, ఆ కార్టూను కింద రాజకీయ వ్యంగ్య కవిత ఉండేది. విశాలాంధ్ర రాగానే ఉత్సాహవంతులైన యువకులు ఒక వెదురు తడికకు ఓ కాగితం అంటించి నాటి కార్టూన్‌ను బ్లో ఆప్‌ చేసి వీలయితే వ్యంగ్య కవితను రాసి ఊరిలో ప్రధాన కూడళ్లలో (ప్రదర్శించే వారు. ఆ విధంగా నా అభిమానులు కూడా తయారయ్యారు. విశాలాంధ్ర కార్టూన్లకు తట్టుకొ నలేక ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలు కూడా కార్టూనిస్టలను తెప్పించుకున్నాయి. ఆ కార్టూనిస్టులకు తెలుగురాదు. తెలుగునాటి రాజకీయాలు అసలు తెలీదు.

ఏమయినా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ కూడా కార్టూన్ను వేయడం మొదలుపెట్టాయి. ఆ ఎన్నికలు కార్టూన్ల యుద్దంలా తయారయ్యాయి. ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారన్నది సమస్య కాదు. కార్టూన్సు గెలిచాయని కచ్చితంగా చెప్పవచ్చును. నాటి నుంచి తెలుగు పత్రికలకు కార్టూను కూడా ఒక అంగం అయింది. కార్టూనిస్టు కూడా పత్రికా రచయితల్లో ఒక సభ్యుడయ్యాడు. కార్టూను కింద ఓ వ్యంగ్య కవితకు కూడా ఓ ప్రత్యేకత ఏర్పడింది, ఈ రెండు అంశాలూ వార్తా పత్రిక అంగాలయ్యాయి. వాటికి స్థానాలు కల్పించిన ఘనత విశాలాంధ్ర పత్రికది.

కొర్టూనులో నేను కృష్ణ అని సంతకం చేసేవాడిని. వ్యంగ్య కవితలకు “శశవిషాణం” అని సంతకం పెట్టేవాడిని. నావల్ల సంస్థకు పేరు రావాలి కాని సంస్థ ఆధారంగా నాకు పేరు రావడం అనైతికం అని నొ అభిప్రాయం. అందుకని సర్వనామం లాంటి కృష్ణ అన్న పదాన్ని ఎంచుకున్నాను, అలాగే శశవిషాణం అన్న కలం పేరు పెట్టుకున్నాను. శశవిషాణం అంటే కుందేటి కొమ్ము అని అర్ధం, కుందేలుకు కొ మ్ములుండవు- భర్శ్యహరి మూర్థపద్దతిని వివరిస్తూ కుందేటి కొమ్మును ప్రస్తావిస్తాడు. “తివిరి ఇసుమున తెలంబు తీయవచ్చు. తవిలి మృగతృష్ణలో నీర్రు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ముసాధించవచ్చు. అసాధ్యాలను సాధించవచ్చును: కాని చేరి మూర్భని మనసు రంజింపరాదు” అంటాడు ఏనుగు లక్ష్మణకవి.

భర్శృహరి మూలంలో “జ్ఞానలవదుర్విదగ్రం (బ్రహ్మాపినరం నరం జయతి అంటాడు. పనిచేసే సంస్త ద్వారా పేరు గణించడం నాకిష్టంలేదు, నా వ్యక్తిత్వం ద్వారానే నాకు పేరు రావాలి అన్నది నా వుద్దేశం. అందుకని నేను జనాంతికంగానే వుంటాను కాని రంగం మీదికి రాను. కీర్తీ ధనమూ పరస్పరం మార్పిడి చేసుకునే టంకాల లాంటివి. అందుకని నేను ఆ రెండింటికీ దూరంగా వుంటాను. అది నా తత్వం. అది మంచిదా చెడ్డదా అన్న మీమాంసలోకి వెళ్లను.

అవసరానికి మించిన అర్థమే సకల అనర్జాలకూ మూలం అని నా అభిప్రాయం, నేను పుట్టినప్పుడు నిర్ధనుణ్ని. నిర్దనునిగానే పెరిగాను. పరిమిత వేతనంతో పలు ఉద్యోగాలు చేశాను. తాత్వికంగా పురుషుడు న 1026 రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

ఉదాసీనుడు. ఇప్పుడు అర్హబలం, అంగబలంతో తాను (క్రియాశీలుడన్న భ్రాంతితో వున్నాడు. వర్గసమాజం మొదలైన నాటి నుంచీ ఈ (భ్రాంతి ప్రపంచ వ్యాప్తం అవుతూ వచ్చింది. అర్హ అంగబలాలకే రాజకీయం అని పేరు. ఆ రాజకీయం ముందుగా (క్రియాశీల అయిన స్త్రీమీద (ప్రయోగించాడు పురుషపుంగవుడు.

వేల సంవత్సరాల అనుభవంవల్ల (స్త్రీ తనను తాను మరిచిపోయింది. తాను ఉదాసీనురాలు అన్న భ్రాంతిలో పడిపోయింది. ఈ (భ్రాంతి ఎక్కువకాలం ఉండదు. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆంధ్రలో కమ్యూనిస్టులు ఓడిపోయారు. ఎన్నికల (ప్రచార సందర్భంలో (భ్రాంతి ముదిరి ఒక అ(గ్రనాయకుడు మహిళలమీద విరుచుకు పడ్డాడు. మేం అధికారానికి వస్తే భూస్వాముల భార్యల మెడలమీద కాడిపెట్టి పొలాలు దున్నిస్తాం అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞకు పార్టీనాయకులంతా విస్తుపోయారు. తరవాత ఆయన తూనా బొడ్డూ అనుకున్నాడు.

ఏం లాభం. ఆ మాట మెరుపు వేగంతో జనంలో పాకింది. ఫలితం ఎన్నికల్లో ఓటమి. జెరూసలెంలో వేలింగ్‌వాల్‌ అని ఒక గోడ వుంది. ఒకానొక పర్వదినాన మహిళలు ఆ గోడను పట్టుకుని ఏడుస్తూ వుంటారు. ఈ ఆచారం హీబ్రూ క్రైస్తవ మతాలకు పూర్వమే పుట్టింది. నేటికీ ఆది సాగుతూనే వుంది. కమ్యూనిస్టు పార్టీ అభిమానులకు నేను వేలింగ్‌వాల్‌ని అయాను. పార్టీ ఓటమికి నా కార్టూన్‌లే కారణం అని వారి నమ్మకం. వేలింగ్‌వాల్‌ దగ్గర శోకం కల్లశోకం. చారిత్రకంగా వ్యవసొయం తొలినాళ్లలో పుట్టిన శోకం అది.

ఇల్లాలికి పురిటిరోజులు - నేను మేనేజరు దగ్గరకు వెళ్లి రెండువందలు అప్పుతీసుకున్నాను. ఇల్లాలు అచ్చమాంబ ఆస్పత్రిలో పదిరోజులు ముందే చేరింది. అది విఐపీ గది. ఆ గదిని ఈమెకు కేటాయించారు. డాక్టరు సర్వసన్నాహాలుచేసి సిద్దంగా వుంది. సిజేరియన్‌ అవసరంలేకుండా సుఖప్రసవం అయింది. “కవలలు” ఇద్దరూ ఆడపిల్లలు. కమ్యూనిస్టు పార్టీలో పనిచేసే నువ్వేమిస్తావులేవోయ్‌ అని కావలసిన మందులన్నీ ఆమే తెప్పించి ఇచ్చేది. నేను ఒక సజ్జలో పళ్లు, పూలు వందరూపాయలు పెట్టి ఆమెకు అందించాను. పిల్లలకు డూమెక్సు పాలు.

ఇంటి అద్దె ముష్పయిరూపాయలు. నా జీతం నూటపదిహేను. కమ్యూనిస్ట్ర పార్టీ తాలిరోజుల్లో సెల్టులనేవి వుండేవి. జైళ్లనుంచీ, అజ్ఞాత వాసం నుంచీ బైటకు వచ్చిన తరవాత సెల్టులను (బ్రాంచీలుగా మార్చారు. సెల్లు కాలంతో నాకు ప్రత్యక్షానుభవం లేదు. వినికిడి మాత్రమే. ఇప్పుడు (బ్రాంచీలు ఆయినా వాటికింకా మునుము పెట్టలేదు. పత్రికకు సంబంధించిన మేనేజ్‌మెంటు బ్రాంచీలలో పనిచేసేవారు. ఒక సెల్టుగొ పనిచేస్తున్నట్టు నాకు అనుమానం వచ్చింది. 'విశాలాం[ద్రలో పనిచేసేవారు కొందరు పూరి ఇళ్లలో వుంటున్నారు. నాకు తగింది ఆ పూరిల్లేనని ఆ సెల్లు నమ్మకం.

ఆ నమ్మకంతోనే వారో తీర్మానం చేళారు. వీడికి ముష్పయిరూపాయల అద్దె ఇల్లు ఎందుకు అని. కర్గాకర్షిగా ఆ సమాచారం అందింది. నిజమే మరి. పిల్లలపాలకే నెలకు డెబ్బయిరూపాయలవుతోంది. దాంతో మాకు నిత్య ఏకాదళీవ్రతంలా వుంది. అచ్చమాంబ దగ్గరకు వెళ్లి ఈ సంగతినే చెప్పుకున్నాను. ఆమె నవ్వి ఇప్పుడు గేదెపాలు పట్టవోయ్‌ పరవాలేదు అన్నారు. గేదె పాలలోకి దిగాను, పిల్లల్లో ఒకతె పీల. మరొకతి బొద్దు. పీలపిల్ల డూమెక్సు సరిగా తాగేదికాదు. గేదెపాలు ఆ పిల్లకు నచ్చాయి. బొద్దుపిల్లకు ఆ పాలు పడినట్టు లేదు. డీహై(డ్రేషను లక్షణాలు కనిపించాయి.

మేం పిల్లను తీసుకుని రిక్షాలో అచ్చమాంబ ఇంటికి వెళ్ళాం. ఆమె ఆ పిల్లనెత్తుకుని అదే రిక్షాలో ఆస్పత్రికి వెళ్లింది. మేం మరో రిక్షాలో ఆమె వెంట బయలుదేరాం. ఆమె అప్పటికి పిల్లకు ఇంజెక్షను ఇచ్చింది. ఆమెను మాచేతుల్లో పెట్టి వెంటనే ఇంటికి వెళ్లమంది. నాకు అర్థం అయింది. అక్కడి నుంచి

తలా రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ త 103

తిన్నగా ఆఫీసుకు బయలుదేరాను. నాతో సందేశంలో పనిచేసిన గోపాలరావు కనిపించాడు. అతడిని నేను పాల్టీ అని పిలిచేవాడిని. జేబులో సైసలేమాత్రం వున్నాయి అని అడిగాను. ఓ పదిరూపాయలనోటు ఇచ్చాడు. అది తీసుకుని వెంటనే ఇంటికి బయలుదేరాను. దారిలో ఒక సహచరుడు సైకిల్‌పై వస్తున్నాడు. అర్జంటుగా ఇంటికి రావాలి సైకిలెక్కు అన్నాడు. అర్జైన్సీ ఏమిటో నాకు తెలుసును. నువ్వు సైకిల్‌ దిగు ఇద్దరం నడిచే వెళదామన్నాను. ఇద్దరమూ ఖననక్షేత్రానికి వెళ్లి అంత్యక్రియలు చేశాం. ఆ పిల్ల బతికివున్నప్పుడు ఇద్దరూ తొట్టెలో కేరింతలు కొడుతూవుండేవారు. పెద్దపిల్లవారిని చూసి చెయ్యి ఊపుతూ తిక్కతిక్కపాపలు అనేది. చిన్నచిన్న పాపలు అని ఆమె ఉద్దేశం. అందుకని మిగిలిన పాపకు నేను “తిక్క” అని పేరు పెట్టాను. నార్ల చిరంజీవి ఆ పాపకు కరుణ అని పేరు పెట్టాడు. చిరంజీవి పూరిల్లు మాయింటి పక్కనే వుండేది. నాటి విశాలాంధ్ర మేనేజరుకు పంతులు అని పేరు. అది అజ్ఞాతకాలపు పేరు. ఆయన సహజంగా చాలా సౌమ్యుడు. కాని మారిన పరిస్థితుల్లో ముఠా పిశాధిష్టితుడు. అప్పు ఎప్పుడు తీరుస్తావు అని రోజుకు రెండుమూడుసార్హు తన గదికి పిలిపించుకుని మరీ అడిగేవాడు. సహనం ఇంకిపోయింది. సహజ ఉ(గ్రం నన్నావహించింది. రాజకీయులందరూ అపరిణిత నరులు అన్నాను. ఆ మాటవిని ఆయన నిర్విణ్నుడయాడు. అది ఆఫీసంతా విద్యుత్తులా పాకింది. సీనియరుగారు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఎమిటి నువ్వు రాజకీయులందరూ అ పరిణిత నరులన్నావట అని అడిగారు. అవునన్నాను నేను. మరి మనం కూడానా అన్నారాయన, మనం రాజకీయులం కాదు విష్ణవకారులం అన్నాను. దేర్‌ యు ఆర్‌ అంటూ ఆయన వెళ్లిపోయారు.

సీనియరుగారు చరిత్ర విద్యార్థి. ఎం.ఏ చదువుతున్నప్పుడు సిపాయి పితూరీమీద ప్రశ్న వచ్చింది. సావర్కరు రాసిన ప్రధమస్వాతంత్ర్య సంగ్రామం అన్న రహస్య ప్రతిని ఆయన చదివారు. ఆ సంగతులనే ఆయన జవాబులో రాశారు. అంతే దొరతనం వారు ఆయన్ను ఉన్నతవిద్యనుంచి డిబార్‌ చేశారు. అందువల్ల ఆయన కూడా విష్ణవకారుడే. మార్క్సిజం అన్నది రాజనీతి శాస్త్రం మాత్రమేకాదు. ఆయన స్వయంగా కనిపెట్టింది చారిత్రక భౌతికవాదం, దాని సాయంతోనే అంతవరకు తలకిందుగా వున్న తత్త్వశాస్తాన్ని, అర్థళశాస్త్రాన్ని, విప్లవ శా(స్త్రాన్ని వాటి కాళ్లమీద నిలబెట్టగలిగాడు.

రష్యను కధలను, నవలలను తెలుగులోనికి అనువదించి విశాలాంధ్ర అచ్చువేస్తూ వుండేది. దానికో (ప్రత్యేక ప్రచురణాలయం ఉండేది. నాకు భూముల్లేవు. ఇతర ఆదాయం వనరులు లేవు. నన్ను మీరు పెటీబుర్జువా ఇంటలెక్చువల్‌ అన్నప్పటికీ నేను 'ప్రాలిటేరియన్ను. చదువుకున్నవాడు ప్రాలిటేరియన్‌ కాడన్న (భ్రాంతిలో వున్నారు మీరు. మార్కునే కాదు లెనిన్‌ని కూడా సరిగా అర్థం చేసుకొనడంలేదు. ఆయన జర్మన్‌ ఇంజనీర్లను ప్రాలిటేరియన్‌ ఇంజనీర్లు అని సంబోధించాడు.

(ప్రముఖ రష్యన్‌ వ్యంగ్యరచయిత రాసిన పుస్తకాన్ని నాకిచ్చారు. దాన్ని గొప్పవారి గోత్రాలన్న పేరున అనువదించాను. అనువాదం కోసం రాత్రి డ్యూటీ వేసుకునేవాడిని, నాతోపాటు అవసరాల సూర్యారావు కూడా వుండేవాడు. అయిదున్నర, ఆరింటికి బయలుదేరి రైవిస్‌ కాలువ గట్టునున్న హోటెల్లో ఇడ్తీలు తిని కాఫీ తాగి ఇంటికిపోయేవాడు. అక్కడి వరకూ నేను కూడా వెళ్లేవాడిని కాని ఇడ్లీ తినేవాడినికాదు. కాఫీ మాత్రం తీసుకునేవాడిని. కాలవ ఆవల ఆయన ఇల్లు, ఒకనాడు కాలవ దాటిన తరవాత సైకిల్‌ గుద్దడంవల్ల చెయ్యి విరిగింది. న

విరిగిన ఎముకలను అతికే విద్య పుత్తూరు రాజులకు వంశపారంపర్యంగా వస్తోందని అంటారు. ఆ రాజుల కుటుంబాలు కొన్ని బెజవాడలోని ముత్యాలంపాడులో వున్నాయట. సూర్యారావు ఆ రాజుల దగ్గరకు

క 104 అ రాంభట్ట కృష్ణమూర్తి సొంతకధ

వెళ్లి కట్టుకట్టించుకున్నాడు. చేయి విరగడం వల్ల పని చేయలేడు. కనక విశాలాంధ్ర ఉద్యోగం నుంచి వాన్నించార్కు అయన కూడా నాలాగే కలం కార్మికుడు. ఉద్యోగం లేకపోతే బతుకే లేదు. ఆయనే

త్తగా ఆ 0 జాడ అవా?ారా; గారి ఆ ఆయన ఆ పరిశోదన పనిని చేబట్టా న్‌ వుగారి రచనలను పరిశోధిస్తానన్నాడు. సబెడిటర్‌ జీతం మీదనే

ఈ పనిని కనీసం రెండేళ్లు లాగుతానని నాతో చెప్పాడు. సూర్యారావు సిగరెట్టు నోటబెట్టుకుని అగ్గిపుల్ల యాచనకు బయలుదేరేవాడు. విశాలాంధ్రలో సిగరెటు కాల్బేవారు ఎక్కువ మంది లేరు హెలాం ట్‌వూళు అతడికి అగ్గిపెట్టె అందించేవారు. ఆయన సిగరెట్టు కాల్చుకుని అగ్గిపెట్టెను తన (డ్రాయర్లో పడేసేవాడు. ఏక్సిడెంటు అయిన తరవాత ఆయన డస్కుతెరిచి చూస్తే అందులో డజనుకు "పైగా ఆగ్గిపెట్టెలు కనిపించాయి. ఇదోరకమయిన మానసిక రుగ్మత. నాటువైద్యం నుంచి మామూలు వైద్యానికి మళ్లడం వల ఇయి కొంతవరకు బాగుపడింది. చరం ఎల్లి బయ్యా

హైదర్గాబాదు ర్మాష్ట్రంలో మూడు ముఖ్య భాషా (ప్రాంతాలున్నాయి. అవి తెలంగాణా, మరార్వాడా, కర్ణాటక అని. ఆ భాషా ప్రాంతాలను తమ భామ్‌ రాష్ట్రాల్లో కలిపి నిజాం రాష్ట్రాన్ని రద్దు చేయాలని కేంద్రం నిర్హయించింది. అందువల్ల ఆంధ్ర, తెలంగాణా కమ్యూనిస్టు పార్టీల సంయుక్త సమావేశం జరపాలన్న నిర్ణయం చేశారు. సంపాదక సిబ్బందికి ఒకరిని డెలిగేటుగా పంపగల అవకాశం వుంది. ఇంతవరకూ జరిగిన సభల్లో డెలిగేటు ఎంపికపై చర్చలు జరిగేవి. ఇప్పుడలాంటి చర జాడలు కానరావడం లేదు. హైదరాబాదు మీద ఎవరికీ ఆసక్తి కానరాలేదు. అంతా కలిసి నన్ను జలే వెళ్లమన్నారు.

హైదరాబాదు భాష వేరు. వేషం వేరు. భోజనం కూడా వేరే. అందువల్ల హైదరాబాదు వెళ్లడానికి ఎవరికీ ఇష్టంలేదు. ఉన్న డెలిగేషను అవకాశాన్ని వినియోగించకుండా మానడర కూడా ఇష్టంలేదు. కనక అందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు. మహాసభ అంటే ఎలా వుంటుందో నాకు తెలియదు. చిన్నప్పటి నుంచీ తెలియని అంశాల్లో వేలుపెట్టి తెలుసుకొనడం నాకు అలవాటుగా మారింది. అందువల్ల పార్టీ సభను గురించీ డెలిగేట్ల గురించీ పార్టీ ఎన్నికలను గురించీ తెలుసుకొనడానికి అవకాశం కలుగుతుంది. పైగా హైదరాబాదును చూసి చాలా కాలం అయిందికూడా.

“హైదరాబాదు సరోజినీ నాయుడు హాలు సభాస్త్రలం. దానికి ఎదురుగా వున్న భవనాన్ని కూడా తీసుకున్నారు. నేను మా అన్నగారింట దిగాను. కనక నివాసానికీ, భోజనాలకూ ఎక్కడ ఏర్పాట్టు చేశారో నాకు తెలియదు. ఆంధ్ర డెలిగేషను నాయకుడు మద్దుకూరి చంద్రంగారు. పూర్వం మీజానులో నేను నైటు ఎడిటరుగా నియమించిన నండూరి నారాయణరావును చూడ్డానికి బయలుదేరాను. ఆయన సమాచారశాఖలో పనిచేస్తున్నాడు. ఎమ్మెల్యేలందరినీ ర్యాష్టపర్యటనకు ఏర్పాటు చేశారు బూర్లులవారు. వారి వెంట నువ్వు కూడా వెళతావా అని అడిగాడు నారాయణరావు.

వెళతానన్నాను. ఆయన వెంటనే ఫొనెత్తి టూరు ఇంచార్జి అధికారికి నా పేరూ హోదా చెప్పారు. మర్నాటి నుంచే ప్రయాణం మొదలు. ఉదయం బస్సులు అసెంబ్లీ నుంచి బయలుదేరుతాయి. జర్నలిస్టులింకా వున్నారా అని అడిగాను. ఒకే ఒకడున్నాడన్నాడు. అతడు మహార్యాష్ట్ర వారపత్రిక ఎడిటరు. పేరు పారక్‌. నేను చం(ద్రంగారి దగ్గరకు వెళ్లి ఆజంటా, ఎరోలా లాంటి కళాక్షేత్రాలు చూడ్డానికి ఇది మంచి అవకాశం అని చెప్పాను. సభకు నీ హాజరీ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్లు అన్నారాయన. అప్పటికి రెండురోజుల సమావేశం అయింది. ఒకనాడు చిక్కడపల్లిలో దున్ననెక్కి విహరించే యువకుడు కనిసించాడు.

అతడు తొలుత కాంగ్రెసులో చేరాడు. వార్డు కాంగ్రెసు అధ్యక్షతను ఆకించాడు, ఫలితం లేకపోయింది.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 105

ఇంతకన్న కమ్యూనిస్టు పార్టీ మెరుగు అనుకున్నాడు. హెలిసింకే ప్రపంచ శాంతి డిక్షరేషను మీద సంతకం చేశాడు. నేను సందేశంలో వుండగానే ఈ వార్త చూశాను. ప్రముఖ కాం(గైసు నాయకుడు సత్యనారాయణరెడ్డి అని వుంది ఆవార్తలో. ఆ తరవాత అతడు కమ్యూనిస్ట్రపార్టీలో చేరాడు. నన్ను చిన్నప్పటినుంచీ ఎరుగును కనక “ఇంపీరిలిస్పు ఏన్వాయ్‌” అన్నాడు. ఆంధ్ర నాయకులమీద తెలంగాణావారి అభిప్రాయం అలా వుండేది ఆనాడు. తొలిరోజునే తెలంగాణాలో చాలామంది నాకు పరిచయమయ్యారు. నాయకుల ఉపన్యాసాలు విన్న తరువాత “సద్దుబాటులకు సలాం సలాం సరిదిద్దుబాటు మా బలం బలం” అంటూ పొట రాశాను. తెలంగాణా యువకులు కాస్త ప్రాక్టీసుచేసి సభలో ఆ పాటనుపాడారు. నేను నిజాం రాష్ట్ర పర్యటనకు బయలుదేరాను. ఉదయమే (ప్రయాణం. ఓ గంటగంటన్నర తర్వాత బస్సులాగుతాయి. అక్కడ నాహ్హా అంటే టిఫిను, టీ. మళ్లీ ప్రయాణం. దారిలో మరొక సారి టీ. ప్రయాణం భోజనాల వేళకు హాల్టు, శాకాహార మాంసాహార భోజనాలు. వి(శ్రాంతి మధ్యాహ్నం రెండున్నరకు. టీ, ఫలహారం తిరిగి ప్రయాణం. రోత్రి సాంస్కృతిక కార్యక్రమాలు. తరవాత ని(ద్ర-పగలంతా ఆయా (ప్రాంతాల అభివృద్ది కార్యక్రమాల సందర్శనం. ఇలా జరిగింది మా యాత్ర. చారిత్రక స్థలాలు కనిపించిన్సుడు తెలుగు ఎమ్మెల్యేలకు నేను గైడుగా వుండేవాడిని. బౌరంగాబాదులో బీబీకా ముక్చరా చూశాం. అది చిన్నసైజు తాజ్మహలు. అక్కడికి అరవైమైళ్ల దూరం వుంది అజంటా. పర్యాటకుల కోసం ఒక గెస్పుహౌసు కట్టారు కాని అది గుహలకు చాలా దూరం. మేం అక్కడికి వెళ్లలేదు. ఆ గుహా కుడ్యాలమీద కొన్ని చిత్రాలు ఛిన్నమైపోయాయి. ఒకప్పుడు డాక్టర్‌ బర్డ్‌ అనే అధికారి వుండేవాడు. అతడు అందమయిన చిత్ర భాగాలను కోసి అమ్ముకునేవాడు - ఆవిధంగా చిత్రాలు ఛిన్నమయ్యాయి. డాక్టరు బర్డ్‌ కత్తి పడకముందు చిత్రకారులు తీసుకున్న నకళ్లు వేలువెచ్చిస్తే ఇప్పుడు కొన్ని దొరకవచ్చును. ఒక గుహలో సేలింగ్‌మీద కుబ్దకూమ్మాండ చి(త్రాలున్నాలయ్టి. వాటికి సరీగా కింద గట్టులాంటి కట్టడం వుంటుంది. ఆ గట్టుమీద నిలిచి కుబ్బకూష్మాండులను చూస్తే అవి మామూలుగానే కనిపిస్తాయి. గట్టుదిగి ఎడంవైపునుంచి చూస్తే కుబ్బకూష్మాండులు కోపంతో మనవైపు చూస్తున్నట్టు కనిపిస్తుంది. గట్టుకు ఆవలివైపు నుంచి చూస్తే పకపక నవ్వినట్లు కనిపిస్తాయి. ఇది చిత్రకళలో సృష్టించిన దృక్‌భ్రాంతి. ఆప్టికల్‌ ఇల్యూజన్‌: శిల్పంలో కూడా ఇలాంటి దృగ్ర్రాంతిని సాధించారు అజంటా కళాకారులు. మొదటి గుహలోనే పెద్ద సుఖాసీన బుద్ధవిగ్రహం మంది. గుహల్లోపల చీకటి వుంటుంది కనక గుహల పాలకులు ఎలక్‌ట్రిక్‌ టార్చిలలో మాకు చూప్‌ంచారు. టార్భి నేరుగా ముఖం మీద వుంటే బుద్దుని మోము ప్రశాంతంగా కనిపిస్తుంది. అదే కొస్త ఎడం వైపు ఫోకస్‌ అయితే ఉగ్రంగా ఉదాసీనంగా కనిపిస్తుంది. ఫోకస్‌ కుడివైపున అయితే ప్రసన్నంగా, దరహాసంగా కనిపిస్తుంది. అప్పుడు అర్థం అయింది వి(గ్రహాన్లి ప్రతిష్టించిన తరవాత జరిగే ప్రాణ ప్రతిష్ట తొలుత టార్చిని కుడి ఎడమలకు తిప్పినట్టు ముఖభావాలు మారుతాయి. అందుక్కారణం ఏమిటి? పెదిమలు చెక్కినప్పుడు మనకున్నట్టు అవి సమానంగా వుండవు. పెదవులనడుమ గీతగీస్తే రెండు అర్థభాగాలూ సమానంగా వుండవు. ఒక అర్ధభాగం రెండో అర్థభాగం కన్న కాస్త ఎత్తుగా వుంటుంది. ఆ వైపు పడే నీడ పొడుగ్గా వుంటుంది. అంటే పెదవులు సాగినట్లు భ్రాంతి కలుగుతుంది. అది చిరునవ్వు అవుతుంది. గుడిలో దేవుని ముఖం ముందు దీపాన్ని ఇటూ అటూ తిప్పే ఉద్దేశ్యం అదే. అజంటా కొండమీంచి చిన్న జలపాతం వుంది. ఆనీరు వాగులా ప్రవహిస్తుంది. ఆ వాగుకు భోగీర అని పేరు. మేం జలపాతం చూడ్డానికి వెళ్ళాం. నిత్య నీటి ధారవల్ల రాళ్లు పాకుడు పట్టాయి. నాకు 106 అ రాంభట్ట కృష్ణమూర్తి సాంతకధ

కాలుజారింది. కింద పడకుండా చేతిని ఆసరా చేసుకున్నాను. చేతికో గులకరాయి గుచ్చుకుంది. ఆ రాతిమీద మూడు సున్నాల్లాంటి మచ్చలున్నాయి. దానికి నేను ముక్కంటి అనిపేరు పెట్టుకున్నాను. చిత్రాలూ, శిల్పాలూ లేని కొన్ని గుహలున్నాయి. అవి భిక్షకుల నివాసగృహాలు. అందులో రెండుగదులున్నాయి. ఒకటి లోపలి గది. అక్కడ నీరు పడుతూ వుంటుంది. అది స్నానాలగది. రెండో గదిలో మంచం అంత రాతి అరుగు వుంటుంది. అది శయనకూటం. ఒక గుహలో బుద్దుడు తాళప్రమాణంగా కనిపిస్తాడు. చేత భిక్షాపాత్ర. యశోధర భిక్షవేస్తూ వుంటుంది. ఆమె బుద్దుని నడుము దగ్గరకు వస్తుంది. పక్కన రాహుల్‌ యశోధర మోకాలి దగ్గరకు వస్తాడు. అజంటా చిత్రకారుల పెర్‌స్పెక్టివు విధానం ఇది. మామూలుగా చూస్తే ఇందులో విశేషం కనిపించదు. అంతశ్ళేతనను బట్టి చూస్తే బుద్దుడుసాల 'ప్రాంపవులా కనిపిస్తాడు. ఇవి చిత్రాలు. భారతీయ పెరొస్పెక్టివు సిద్దాంతం ఈ చిత్రాల వల్ల తెలుస్తుంది. అజంటా నుండి తిరిగి జొరంగాబాదుకు వచ్చాం. అక్కడ వ్మస్తాలకు రంగులద్దే రంగ్రేజూ బజూరు వుంది. ఆది తెలుగు బజారు. రం,గేజిబందరూ తెలుగువారు. అక్కడినుంచి “వెరోలా”కి ప్రయాణం అయ్యాం. ఎరోలాని మనవారు ఎల్లోరా అంటారు. అజంటాను అజంతా అంటారు. ఇంగీషు ద్వారా పేర్టు నేర్చుకుని ఆభాషా మర్యాద ననుసరించి పేర్లను పలకడం మనకు అలవాటు. అంతేకాని స్థానికులను అడిగి వారి ఉచ్చారణ తెలుసుకొనడం చిన్నతనంగా భావిస్తాం, అది తెలుగువారి తెలుగుతనం. ఇంగ్లీషు భాషాదాస్యం._ ఎరోలాలో అద్భుత శిల్పం క్రైలాసనాథాలయం. నలభై అడుగుల ఎత్తున్న ఒక కొండను ముప్పయి అడుగుల చౌకం, నలభై అడుగుల ఎత్తు వున్న స్తంభంలా చెక్కారు. మూడువైపులా కొండకీ, స్తంభానికీ నడుమ పదిహేను అడుగుల స్థలం వుంటుంది. ఆ ఏకాండీ స్తంభం మీద మూడంతస్తుల దేవాలయాన్ని చెక్కారు. అంతస్తునుంచి అంతస్టుకు మెట్టు, వాతాయనాలు, స్తంభాలు, అన్నీ శిల్పాలు, ఈ ఆలయాన్ని నిర్మించడానికి మూడు శతాబ్దాలు పట్టిందంటున్నారు పండితులు. ఈ మూడంతస్తులూ ఏకాండిరాయి. పెద్ద కోనేరు దానినడుమ వికసించిన కమలంలాంటి గుడి. గట్టు నుంచి గుడికి రాతినడవ. రజాకార్ల హయాంలో రజాకార్లు ఆ జల కమలీశ్చరాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. దానికి జాతీయోద్యమ చరిత్ర వుంది. కోనేరుదాకా బస్సులు వెళ్లవు, బస్సులు అక్కడికి ఒక ఫర్లాంగు ఈవలనే ఆగిపోయాయి. అక్కడి నుంచి ఆలయకుడ్యం దాకా మాదిగవాడ. వాళ్ళు తోళ్లను ఎండబెట్టుకునే పెరడు వెంబడి అందరం కాలినడకన బయలుదేరాం. ఎంఎల్‌ఏలంతా ముక్కులను రుమాళ్లతో మూసుకుని తోళ్ల పెరడు దాటారు. ఆ తోళ్ల పెరడు సమీపించేసరికి కాళ్లు ఆగిపోయాయి. ఇది నిజమా దృగ్భాంతా? ఆపెరటినిండా రకరకాల భంగిమల్లో అజంటా సుందరీగణం కానవచ్చింది. అజంటా కుడ్యాలను విడిచి ఆ భామలు ఇక్కడ తోళ్లు ఆరవేయడానికి వచ్చారా? నాకు బాణభట్టు లీలాసుకుడు గుర్తువచ్చారు. బాణకాదంబరిలో మాతంగకన్య అందాన్ని బహుధా (ప్రస్తుతిస్తాడు. అలాగే మాతంగ కన్యాం మనసా స్మరామి అన్నవాడు కాళిదాసా? లీలాసుకుడా? ఎవడయితేనేమి అందాన్ని ఆర్థం చేసుకొనగలి మహానుభావుడు. జల కమలీశ్చరాలయానికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు కల్లింతలు చేసుకున్నాను. అజంటా చూడకముందు షింహళంలోని సీగిడియా కుడ్యచిత్రాలు చూశాను. అవి ఇంత అందంగా కనిపించలేదు. మహార్యాష్ట్రంలో తిరిగేటప్పుడు భూములు రంగురంగుల్లో కనిపించేవి. గాలివల్ల చెట్ల ఆకారాలు చిత్రకారుల చిత్రణలా కనిపించేది. బెండ్సూరా (ప్రాజెక్టు, షోలాపూరు కూడా చూశాం. షోలాపురంలో తెలుగు తంతువాయులు ఎక్కువ. మహార్యాష్ట్ర జిల్లాల పర్యటన ఒక వారం అయింది. రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 107

హైదరాబాదు తిరిగి వచ్చాం. ఒక రోజు హైదరాబాదులో విశ్రాంతి. తరవాత కర్ణాటక పర్యటన. బీదరులో కాన్ని మసీదులు, సమాధులు చూశాం. గుల్బరగాలో ఖాజామెయినుద్దీను చిప్తీ సమాధి ప్రసిద్ది చెందింది. రాయచూరు కోట, అక్కడి నుంచి తుంగభద్ర ప్రాజెక్టు హంపి అక్కడి హజూరు రామదేవాలయం విరూపాక్షాలయం తిరిగి చూశాం. నాడు వ్యవసాయానికి నీరు తెలుగువారికి కావాలి. జలసేచన సాగువారికి తెలుసును, కర్ణాటకుల ప్రధాన ఆహారం జొన్నలు. శ్రీనాధుని కాలాన పల్నాటి జానపదులు కూడా “జొన్నకలి జొన్న్మయంబలి జొన్నన్నము జొన్నపిసరుజొన్నలు తప్పన్‌ సన్నన్నము సున్నసుమీ” అనేవారు. ఆనాడు తెలుగునాట పల్నాటికే ఆ (ప్రశస్తి వుండేది. సర్జలు, కొర్రలు, అరికెలు, రాగులు కళింగాం(ధ్రాన 'ప్రసిద్దికెక్కాయి. సన్నబియ్యం కృష్ణా గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితం. మూడవవారం తెలంగాణా పర్యటన. ముందు ఆదిలాబాదు కుంతల జలపాతం చూశాం, ఆ జలపాతం (ప్రీ స్నానం చేసి ఆరవేసుకున్న జుత్తులా వుంటుంది. అందువల్లనే ఎవరో భావుకుడు దానికి కుంతల జలపాతం అని పేరుపెట్టాడు. అక్కడ గిరిజన (గ్రామాలెక్కువ. సరిహద్దు జిల్లా అయినందున మహారాష్ట్ర (ప్రభావం కనిపిస్తూ వుంటుంది. ఇంగ్లీషు వాళ్లు ప్రావిన్సులు ఏర్పరచినట్టు నిజాం సర్కారుకూడా సుబాలు ఏర్పరచింది. వరంగల్లు కరీంనగరు, ఆదిలాబాదు ఈ మూడుజిల్లాలను కలిపి దాన్ని వరంగలు సుబా అనేవారు. పూర్వం జిల్లాకో హైస్కూలూ, సుబాకు ఒక జూనియరు కాలేజి ఉండేవి. సిర్పూరులో కాగితం మిల్టు, సిర్‌సిల్కు మిల్లూ అక్కడి పరిశ్రమలు. జలసేచనకు కట్టిన నిజాంసొగరు చెరువుకింద జలాధారం పంటలు పండేవి. అక్కడే పంచదార మిల్టుకూడా వుంది. ర్యాష్టమంతటా చిన్న సైజు వ్యవసాయం. జలసేచనకు ఎక్కువ మోటబావుల మీద ఆధారపడేవారు. వ్యవసాయ సమాజంలో మహిళలది ప్రధాన పాత్ర. భూస్వామి పేరుకు దొరకాని పెత్తనం అంతా దొరసానిది. వృద్ది అన్న సంస్కృత పదం పాళీ ద్యారా వచ్చి తెలుగున వడ్డీగా స్థిరపడింది. వడ్డీకి అచ్చతెలుగు మాట “నాము”. బుద్దుని కాలం నుంచీ వడ్డీ వ్యాపారం అంతా (స్రీలది. వడ్డీ వ్యాపారం చేసే స్త్రీలను నాపసానులనేవారు. నాము అన్న మాటకు రెండర్భాలు ఉన్నాయి. ఒకటి సుద్ద అని అర్హం. రెండోది వడ్డీ, సుద్ద అన్న అర్థంలో నాపచేను అంటారు. వడ్డీ అన్న అర్ధంలో నాపసాని అంటారు. నాము, పొము, వేము, పేము ఇవి ఒకే జాతి మాటలు. వరంగల్లులో కోట శిధిలాలు, సహహ్రస్తంభ దేవాలయం, రామప్పదేవాలయం చూడదగ్గ స్థలాలు. అజంటా శిల్ప చిత్రకారులకు మదిలో మెదిలే రూపు మాతంగ కన్యలది. వరంగల్లులో శిల్పులకు మదిలో వుండే రూపం పాములవారిది. అంటే నాగకన్యలది. భారతీయ కళలు వైయక్తికం కావు, సామాజికం. అండకరేఖలు గీయడానికి అనేక శిల్పాచార్డులుండేవారు. రామప్పదేవాలయ నిర్మాణానికి వాడిన ఇటుకలు నీటిలో మునగవు. అవి తేలుతాయి. ఆ ఇటుకలకు గట్టితనమూ వుంది. బరువును మోయగల క్షమత కూడా వుంది. నీటిలో మునగని తేలిక దనం కూడా వుంది. సందర్శకులు రామప్పగుడి నుంచి సావనీర్హుగా ఇటుక ముక్కలు తెచ్చుకౌనడమేకాని మన సివిలింజనీర్హు ఆ ఇటుకల కిటుకును పరిశీలిస్తే తెలుగు శిల్పుల ఖ్యాతి దేశవ్యాప్త్రమవుతుంది కదా! చదువుకున్న తెలుగువారికి పనిచేస్తే పాపం అన్న మనస్తత్వం వున్నట్టు కనిపిస్తుంది. ఏనకేనాప్యుపాయేన డిగ్రీ సంపాదిస్తారు. అంతే ఆ తరవాత పని చేయరు. అది తెలుగుతత్వం. ఒకనాటి కాకతీయకళ తెలుగు కళకు వరువడిగా నిలిచింది. వరంగల్లు కోట శిధిలాల్లో కానవచ్చిన హంస పద్మ శిల్పాలను చిన్నతనంలో విశాఖ జిల్లా శ్రీమంతుల ద్వారాల మీద చూసిన గుర్తు. తెలుగు మాటాడే ప్రాంతమంతా ఆనొడు కాకతీయ సంస్కృతిని అనుసరించేదని ఈ ఉదంతంవల్ల తెలుస్తుంది. ఆనాటికి ఈనాడు తెలుగు [ప్రాంతమంతా ఒకే పాలన కిందికి వచ్చింది. ఆయితే ఇది తెలుగుతనం అని 108 అ రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ

చెప్పుకొనదగ్గదేదీ ఇంతవరకూ ఆవిర్భవించలేదు. ఆనాడు అంతరించిన తెలుగు పట్నం నేటికీ ఆవిర్భవించలేదు. తెలుగు నగరం లేనందువల్ల తెలుగు నాగరికత ఎక్కడుంటుంది.

భూర్చూమిరచలానంతా ధరా విశ్చంభరాస్త్రిరా అంటుంది అమర నిఘంటువు. భూమికదలదు. సిరంగా వుంది. విశ్చమంతటినీ అదే మోస్తోంది అనేవి మన నమ్మకాలు. మన నమ్మకాలు మాత్రమేకాదు. ప్రపంచంలో అందరి నమ్మకాలు అవే. ఈ సహహ్రాబ్దంలో మాత్రమే భూమికి సంబంధించిన అనేక వాస్తవాలు తెలియవచ్చాయి. అయినా (ప్రాచీనత మీద మనకున్న భక్తి వాస్తవాలను చూడనొల్లదు. నేటికి అయిదు సహ్రాబ్బాలకు ముందే సూర్యచంద్రులు (గ్రహాలు కావన్న వాస్తవాన్ని అసురులు కనిపెట్టారు. సూర్యుడు పెద్ద నక్షత్రం. భూమి ఆ నక్షత్ర (గ్రహాల్లో ఒకటి. చంద్రుడు (గ్రహంకాదు. భూమికి ఉప(గ్రహం.

ఈ తత్వమెరిగిన అసురులు సామాన్యుల కర్థం అయిన ఆకాశ పంచాంగాన్నే చేసి చాంద్రమానం ప్రకారమే నెలకు ముప్పయి రోజులు చేశారు, అలాగే (గ్రహపంచకాల పేరుతో నెలకు ఆరువారాలు చేశారు. ఈ సంస్కరణలతో చాంద్ర, సౌరమానాల యుగాన్ని సులభం చేశారు. ఆనాడు అసురులు వ్యవసాయ రక్షకులుగా వుండేవారు. వ్యవసాయానికి రెండు మానాలూ ఆవసరం. ఆ రెండింటినీ మన పంచాగకర్తలు అయిదేళ్లకోసారి కలుపుతూ వుంటారు. అలా కలిసిన ఏటికి యుగం అని పేరు. ఆయేటి తొలిరోజును మనం యుగాది అంటూ వుంటాం, యుగాది అన్న పేరు ఇంకా (బ్రతికే వుంది.

మనది వ్యవసాయ దేశం అని సగర్వంగా చెప్పుకుంటూ వుంటాం. కాని సామాన్యులకు అవసరం అయే ఆసుర పంచాంగాన్ని మాత్రం పది నిలువుల లోతున పాతి పెట్టాం. అసుర పంచాంగం (ప్రకారం సంవత్సరానికి మూడువందల అరవైరోజులవుతాయి. (గ్రగరియన్‌ కేలండరుకూ, ఆసుర పంచాంగానికీ అయిదురోజులు తేడా. అందుకని ఆ అయిదురోజులను యుగాది ఉత్సవాలుగా నిర్ణయించారు అసురపండితులు, ఆవారం ఆటవిడుపు లెక్కల్లోకి రానిరోజులు. ఇలాగ ప్రతి సంవత్సరమూ యుగాది రాగల జనపంచాంగాన్ని రచించారు అసుర పండితులు. వారి సంస్కరణలో యుగాది అన్న మాటమిగిలింది.

మన పండితపామరులూ, పామర పండితులూ కూడా మనకు అయిదువేల సంవత్సరాల చరిత్ర వుందని గుండెలు బాదుకుంటూ చెబుతారు కాని వెయ్యేళ్లకో ఘట్టం చొప్పున అయిదు చారిత్రక ఘట్టాలను చెప్పమనండి చూద్దాం. (క్రయిస్తవ సహస్రాబ్బాలు అంటే మిలీనియంలు రెండుగడిచి మూడోది వచ్చింది. అది మనం ఘనంగా చెప్పుకుంటున్నాం. మన పండితులు గుండెబాదుకుంటూ చెప్పే మిలీనియంలు అయిదు గడిచిపోయి మనం నేటికీ భూర్భూమిరచలానంతా ధరావిశ్చంభరాస్త్రిరా అనుకుంటూనే వున్నాం. చెరుకువాడ నరసింహం పంతులన్నట్టు మన బు(ర్రకు కాన్టిపేషను, నోటికి డయోరియా.

విన్సెంటు స్మిత్తు భారతీయులను ఆర్య ద్రావిడ అని విభజించాడు. ఆ విభజనకు ఆధారం ఏమిటి? బ్రిటిషువారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి సామాజిక సమాచారం ఇవ్వగల మేధావులు (బ్రాహ్మణులు మా(త్రమే. వైదికార్యులు తమ వేదవేదాంగాలను యావద్భారతానికీ విస్తరించదలుచుకున్నారు. వేదాంగాలకన్నా వేదాలు ముఖ్యం. వేదాంగాలను అక్షరబద్ధం చేయవచ్చును. వేదాలను గురుముఖతః నేర్వాలికాని అక్షరబద్ధం చేయరాదు. “బ్రాహ్మాణులు వేదాధ్యయన అధికారం తమకు మాత్రమే ఉంచుకొనడం ద్వారా వేదాల పవిత్రతను కాపాడుకుంటున్నారు” అంటాడు కార్ల్‌మార్కు.

అందుకోసమని నాటి భారతీయుల్లో సంస్కృతోచ్చారణ, స్వరాలలో స్పష్టత (ప్రాతిపదికపై జనాన్ని పరిశీలించారు. అందరికన్నా తక్కువ స్థాయి వున్నవారిని ఆదర్శంగా చేసుకుని దేశాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఉత్తరాదివారిలో గౌడులు అంటే బెంగాలీలు కొన్ని అక్షరాలను, స్వరాలను పలకలేరు. ఉత్తరాదిన అలాంటి వారిని వెతికి సారస్వత కాన్యకుబ్బ మైథిలీ గొడ ఓడ్ర బ్రాహ్మణ లైదుగురికీ

రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ అ 109

పంచగౌడులని వైదికార్యులు పేరు పెట్టారు. కాశ్మీరు, పంజాబు, రాజస్టానీలు సారస్వతులు. కాన్యకుబ్ద మధ్యప్రదేశం వారు కాన్యకుబ్టులు. బీహారు వారు మైధిలీలు. బెంగాలీలు ఓర్రులు. ఈ అయిదుగురూ పంచగౌడులు.

దక్షిణాదిన తమిళులు చాలా అక్షరాలను పలకలేరు. కనక వారిని ఆదర్శంగా చేసుకుని గుజరాతు, మహారాష్ట్ర ఆంధ్ర, కర్ణాటక, తమిళులైదుగుర్నీ పంచద్రావిడులన్నారు. తమిళులను (ద్రావిడులనేవారు. దక్షిణాదివారిలో ఈ పంచద్రావిడులకూ మరికొన్ని లక్షణాలున్నాయి. వీరు మాంసం తినరు. వీరికి వ్రతనియమాలు ఎక్కువ. దక్షిణాన వున్న కేరళలీయులను తమిళుల్లో కలిపారు. ఆర్య, గౌడ, ద్రావిడ అన్న మాటలు భాషా వాచకాలే కాని జాతి వాచకాలు కావు. దక్షిణాదితో కలిపిన మహారాష్ట్ర గుజరాతీలు ఆర్యులు. ఆంధ్ర, కర్ణాటక, తమిళ, కేరళ భాషలు ఆర్య భాషలు కొవు.

'ర్రావిడ అన్నమాట తమిళానికి సంస్కృతీకరణం. హిట్టయిట్‌ శ్రీటు లిపులను చదవగలిగిన చెకోస్టోవాక్స్‌ పురాతత్వవేత్త బెడ్రిక్‌ హ్రోబ్నీ సింధు లిపి కూడా సంస్కృతమేననుకున్నాడు. ఇంటా బైటా వేదాలకు వచ్చిన కీర్తి అలాంటిడి. ఆయన దక్షిణాది నాలుగు భాషలనూ సుమేరాసుర భాషలన్నాడు. సుమేరు దేవనామాలు, స్టలనామాలు చెలుగు నాడంతటా వినిపిస్తూ ఉంటాయి. అగద, అసురభాషలు రెండూ తాలినాటి 'సెమిటెక్‌ మాండలికాలు. తమిళంలో సెమిటెక్‌ పదాలే కాదు అక్కడి సంస్కృతి కూడా కానవస్తుంది. తమిళ ప్రాచీనతను స్టాపించుకొనడం కోసం గోండ్వానా, లెమూరియాలను చెప్పుకుంటారు.

సంస్కృత పదాలు తెలుగున ఇమిడినట్టు మరే దక్షిణాది భాషలోనూ ఇమడవు. వేదకాలం నాటి గోధనానికి వాడే “సుమ్న” అన్నమాట కళింగాంధ్ర ఆవుల కాపరులనోట “సొమ్ములు"గా వినవస్తూనే వుంది. ఈ దేళానికి జంబూద్వీపం అని పేరుంది. జంబూ అంటే నేరేడు. కళింగాం(ధ్రలో సామాన్యుల "పెళిళలో నేరేడు కొమ్మకావాలి. ఎందుకు? జంబూద్వీపానికీ నేరేడు కొమ్మకూ సంబంధం వుందా? ఇలాంటి ప్రళ్నిలకు సమాధానాలు చెప్పవలసిన బాధ్యత చరిత్రకారులమీద వుంది. ఆచారం సత్యానికి గీటురాయి ఆంటాడు కార్ల్‌ మార్కు. తెలుగునాటనున్న అనేకాచారాలు మన చరిత్రకు ఆధారాలు.

శక్రనీతికన్న ఆపద్ధర్మం గొప్పది, నావెంట పర్యటించిన మహార్యాష్ట్ర జర్నలిస్టు తమ సమాజంలో వచ్చిన మార్పులను గురించి వివరించాడు. మహారాష్ట బ్రాహ్మణులు కొంతకాలం రాజ్యాధికారం చెలాయించార్సు, పరువంబు కలిమి దొరతనము పలచనబడ్డాయి. అధికార కాలంలో లంకంత ఇళ్లు కట్టుకున్నార్వు. ఇప్పుడాయిళ్లకు మరమ్మత్తులు చేయించుకునే స్తోమత కూడా లేదు. (బ్రాహ్మణేతరులు అధికారంలోకి వస్తున్నారు. వారిలో చైతన్యం పెరుగుతోంది. అగ్రజులకు రక్షణ తరుగుతోంది. మహారాష్ట మాలలక్రు మహార్‌లు అని పేరు. వారినుంచే ఆ నికి మహార్‌ రాష్ట్ర అంటే మహారాష్ట అని పేరువచి?న కనిపిస్తుంది. రాత్రి వే వే పట్టు

మహార్డు ఆది నుంచీ యుద్ధనిపుణులు. భారతసైన్యంలో మంచి పదవుల్లో వున్నారు. సైన్యంలో పనిచేసేవారు అందమైన భార్యలను కోరుకుంటారు. మహారాష్ట్ర బ్రాహ్మణ స్త్రీలు అందకత్తెలు. సైనిక ఆఫీసర్లకు తమ పిల్లల్నిచ్చి పెళ్లిచేస్తే తమ బిడ్డలకు సులువుగా పెళ్లి ఆవడమేకాకుండా తమకు రక్షణకూడా అమరుతుందని భావించారు. నాగపూరులో జరిగిన బ్రాహ్మణ మహాసభ ఇలాంటి తీర్మానం చేసింది, పారక్‌ కూడా ఆ సభకు హాజరయ్యాడు. లంకంత ఇళ్లున్న బ్రాహ్మణులు తమ ఆవరణల్లో మహారు నివసించడానికి ఏర్పాట్టు చేశారు. గతంలో సమాజ సంస్కరణలు చేయనందుకు ఇది ('ప్రాయళ్చిత్తం. ౯

నిజాం ర్యాష్టపర్యటన తరవాత బెజవాడ వెళ్లాను. మూడువారాల పైనయింది. ఆ కాలానికి సెలవు చంద్రంగారు మంజూరు చేశారు. ఈలోగా విశాలాంధ్రలో మార్పులు వచ్చాయి. చం(ద్రంగారు విశాలాంధ్ర 110 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

ఎడిటరు పదవికి రాజీనామా యిచ్చారు. ఆయన స్థానంలో మోటూరి హనుమంతరావుగారు ఎడిటరు పదవిలోకి వచ్చారు. ఎడిటరంటే ఎడిటోరియలు రాసేవాడు అన్న (భ్రమ విశాలాంధ్రలో కూడా వుంది. కొత్త ఎడిటరుగారు లౌక్యులు. లౌక్యానికి భాష్యం చెబుతాడు రామప్పంతులు. తెలియని చోట చేస్తే మోసం, తెలిసినచోట చేస్తే లౌక్యం అంటాడు రామప్పంతులు. చంద్రంగారికి లౌక్యం తెలియదు కాని హనుమంతరావుగారు లౌక్యులు.

మురాతత్వం బాగా ముదిరింది. దేశం రిపబ్లిక్కు అయిన తరవాత జరిగిన రెండవ ఎన్నికల్గో కేరళలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఇయమ్మెస్‌ నంబూద్రిపాద్‌ ముఖ్యమంత్రి అయాడు. భారత భూభాగాన్ని కాళిదాసు అద్భుతంగా వర్షించాడు. అస్తిత్తరస్వాం దిశిదేవతాత్మ హిమాలయో నామ్యగాధిరాజ:ః పూర్వాపరౌ వారిని ధింజగాహ్య స్థితప్పధివ్యా ఇవమానదండః అన్నాడు. ఈ శ్లోకంలో మానదండం ఆంటే రూళ్లకర్ర కాదు. బంగాళాఖాతం, అరేబియా సము(ద్రాలను తూచడం కోసం పట్టిన తులాదండంలా వుందని కాళిదాసు భావన. జగాహ్య అంటే కొలతే కాదు తూకం కూడాను అని అర్ధం.

ఆ మౌనదండం లాంటి హిమాలయాన్ని ఒక చెట్టు కొమ్మ అనుకుంటే ఆ కొమ్మకు పట్టిన తేనెపట్టులా వుంటుంది భారతదేశపటం. ఆ తేనెపెరను మహాభల్లూకం కబళించడం 'మొదలుపెట్టిందని పత్రికలు వ్యాసాలు, కార్టూను (ప్రచురించాయి. రష్యాను భల్టూకంతో పోలుస్తారు 'ప్రపంచ రాజకీయులు. కేరళ విజయాన్ని ప్రస్తుతిస్తూ “జయకేరళ జయకేరళ జయకేరళధాత్రీ” అని పాటరాశాను. సెట్టి ఈశ్వరరావు సహకారంతో ఢిల్లీలో వున్న కైరరీయులు ఆపాటను తమ భాషలోనికి అనువదించుకుని బృందగానం చేశారని ఈశ్వరరావు నాకుత్తరం రాశాడు.

ఆ పాట నాకిప్పుడు గుర్తులేదు. కాని ఆ పాటలో నేను సంస్కృత పదాలెక్కువ వాడాను, కైరరీయులభాష కూడా సంస్కృత భూయిష్టంగా వుంటుంది. ఎవరినుడ్దేశించి పాటరాళశానో వారు మెచ్చుకున్నారు. చాలుననుకున్నాను, కేరళ ప్రభుత్వం ఏర్పడిన తరవాత కాంగ్రెసు అధ్యక్షుడు ధేబర్‌ కేరళ పర్యటనకు వచ్చాడు. అతడి పర్యటన వ్యయం ఎవరు భరించారు అన్న ప్రశ్న శాసనసభలో వచ్చింది. ఆ ఖర్చును కాం(గ్రెసువారే భరించారని నంబూద్రిపాద్‌ స్వయంగా చెప్పారు. అది టెలీప్రింటరు మీద నేను చదివాను. నాచేతుల్లో వేరే మేటరుండడంవల్ల ఆ కాగితాన్ని నేను చింపలేదు.

నా సీనియరు సహచరుడొకడు ఆ వార్తను రాశాడు. మనసులో ఉన్నదే సోదెలో వస్తుందన్నట్టు మర్నాడు డబుల్‌ కాలం హెడింగుతో ఆ వార్త వచ్చింది. ధేబర్‌ పర్యటనకు ఆయిన వ్యయం ప్రభుత్వమే భరించినట్టు ముఖ్యమంత్రి నంబూద్రిపాద్‌ అసెంబ్లీలో స్వయంగా చెప్పినట్లు వుంది. అది అచ్చుతప్పుకాదు. ఆలోచన తప్పు. అదే రోజు పత్రికలో ఒక చిన్న బాక్సు ఐటంలో చిన్న అచ్చుతప్పు పడింది. దానికి లిఖితపూర్వకంగా సంజాయిషీ కోరుతూ ఎడిటరుగారి నుంచి నాకు శ్రీముఖం వచ్చింది. నేను ఫైనల్‌ (ఫ్రూపు చూసి దిద్దాను. అది క్యారీ కాలేదు.

నేను కంపోజింగ్‌ సెక్షనుకు వెళ్లి ఆ ప్రూపు వెతికి పట్టి ఇది కంపోజిటర్‌ పొరపాటు అని నిరూపించాను. పనిలో పనిగా ధేబర్‌ వార్త (ప్రస్తావించి అంతదారుణమయిన తప్పునేం చేశారని అడిగాను. జా(గ్రత్తగా ఉండమని ఓరలుగా చెప్పానన్నారు. మద్దుకూరి చం(ద్రంగారి రిజిగ్నేషన్ను ఆయన అసమర్థతగా భావించి ఉంటారని నాకనిపించింది. ఇక్కడ ఎక్కువకాలం ఉండడం మంచిది కాదన్న నిశ్చయానికి వచ్చాను. సబెడిటర్లలో కొందరు ద్రోహులున్నారని ఎడిటరుగారు ఒక నిర్దారణకు వచ్చారు. ఆ ద్రోహుల్టో అ(గ్రగణ్యుడిని నేను అని ఆయన అభిప్రాయం.

ఈ పరిస్థితులలో నేను 1958 ఫిబ్రవరి 14న రిలీవయ్యాను, చంద్రంగారు నా యోగక్షేమాలు ప్రతిరోజూ

రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ అ 111

కనుక్కుంటూ వుండేవారు. నేను కలం కార్మికుడను మాత్రమే కాదు. గంప కార్మికుడను కూడా అని భరోసా యిచ్చాను. నేను అంతకు ముందు చేసిన పనులు చెప్పాను. మా అన్నగారికి ఒక ఇంజనీరింగు దుకాణం వుంది. ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నానన్నాను. నేను కార్టూన్లు వేశాను. పాటలు రాశాను. కొన్ని పుస్తకాలకు కవరుడిజైన్సు చేశాను. లెక్కలు పరిష్కారం అయినప్పుడు వీటికి ఆంటే కార్టూను వగైరాలకు ఏమివ్వమంటావు అని అడిగాడు మేనేజరు. వాటి విలువ తెలియనివారు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదన్నాను. రాజీనామా ఇచ్చినా కొంత కాలం ప్రతిరోజూ ఆఫీసుకు వెళుతూ వుండేవాడిని. ఎకౌంట్టు సెటిల్‌ కాగానే ఇక వెళ్లడం మానేశాను. ఢిల్లీ నుంచి సెట్టి ఈళ్చర్రావు ఉత్తరం రాశాడు. ఒక పత్రికకు వారానికి రెండు కార్టూన్లు గీయాలి. వెయ్యి రూపాయలజీతం. కార్టూన్లను మా మనిషే తెచ్చుకుంటాడు అంటున్నారని ఆ ఉత్తరం. నేను నో ధాంక్స్‌ అన్నాను అంతే. ఉప్పులూరి కాళిదాసు అని మద్రాసులో ఓ ప్రముఖుడు ఉండేవాడు. ఆయన ఆనందవాణి అనే ఒక వారపత్రిక నడిపిస్తూ వుండేవాడు. ఆయనదో విచిత్ర తత్వం. ఆయనకు తెలియని ప్రముఖులెవరూ లేరు, ఆయన ఆనందవాణిలో పనిచేయని జర్నలిస్టులేడు. ఆయనతో ప్రత్యక్ష పరిచయం ఉండనవసరం లేదు, ఆయన గిరీశంలాంటి ప్రాప్రకాలజ్ఞాడు. ఆయనది కూడా విజయనగరమే. నేను విశాలాంధ్రనుంచి రిలీవు కాగానే ఆయన ఇంటికి వచ్చాడు. ఆయన్ని గురించి ఇదివరకే వినివున్నాను - చూడలేదు అంతే. రాజాజీ తమిళంలో రామాయణం రాశారు. ఆ రామాయణాన్ని తమిళంనుంచి తెలుగులోకి రాయాలని ఆయన రిక ఆ పనిని తన బుజాన వేసుకున్నాడు కాళిదాసు. తిరుపతిలో ఓ తమిళ తెలుగు పండితునిచేత అనువాదం చేయించాడు. అది తమిళమూకాదు తెలుగూ కాదు. ఆ భాషను సంస్కరించి తెలిగీకరించాలి. రాజాజీ తాను తమిళంలో రాసిన రామాయణాన్ని తానే ఇంగ్లీషులోకి అనువదించుకున్నాడు కాని ఆ యింగ్లీషు నుంచి తెలుగుకు అనువదించడానికి వీల్లేదు, తమిళం నుంచే తెలుగు చేయాలి. ఇది రాజాజీ కోరికట, ఆ తమిళానువాదాన్ని తెలుగులోకి అనువదించడం కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చానన్నాడు. నిజమే, బెజవాడలో చాలా మంది రచయితల దగ్గరకు వెళ్ళాడు. వాళ్లు నా పేరు చెప్పారట. సరే ఏమిస్తావు అన్న అడిగాను. అతడు రెండువందలిస్తాను అన్నాడు. నేను మూడన్నాను. కొంతసేపు బేరం సాగింది. సరే ఒక వందరూపాయలిచ్చి రాత మొదలుపెట్టమన్నాడు. నాకు విజయనగరంలో పని వుంది. తిరిగి వచ్చాక మిగత్రా డబ్బు యిస్తానన్నాడు. విజయనగరం నుంచి వచ్చాడు. నా రచన చూశాడు. అతడికి నచ్చింది. ఇంక కాస్త్ర మాత్రమే మిగిలింది. ఇంకో వందయిచ్చాడు. నాతత్వం ఆయనకు తెలిసిపోయింది, నేనింత వరకూ చేసిన పనికి ఇంత కావాలని ఎవరినీ అడగలేదు. ఆ సంగతి అందరికీ తెలుసును. నా పనికి వారే వెలకట్టేవారు అంతే యిచ్చేవారు. ఆంతే కాని నా పనికి ఇంత కావాలి అని వెలకట్టుకొనడం నాకు తెలీదు. " నేను బెజవాడ విడిచి హైదరాబాదు వెళ్లిపోయాను. ఇల్లాలినీ పిల్లల్నీ అదివరకే పంపించేశాను, హైదరాబాదులో మా అన్నగారు ఓ బిజీనెస్‌ ప్రారంభించాను. దానికి నీ సాయం కావాలని అది వరకే ఉత్తరం రాశారు. అందుకని ఇల్లాలూ పిల్లలూ ఆయింటికే వెళ్ళారు. సామాన్గుకూడా ఎప్పుడో పంపించేశాను. నేను 1959 మేడే నాడు హైదరాబాదు చేరాను. ఆ మిగతా భాగం కూడా రాసి వుంచాను, నేను కాకినాడ వెళ్లిను. ఆ సమయాన ఇంటికి వచ్చి ఇంట్లో వారి యోగక్షేమాలరసి, ఆనందవాణి వస్తోందా అని అడిగి ఆ మిగిలిన కాగితాలు షెల్ళుమీద ఉన్నాయని చెప్పి తీసుకునిపోయాడు కార్యసాధకుడు కాళిదాసు. 112 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

గో ల మ సౌలభ్యంకోనం పెట్టే ముహూర్తాలు ఆనవాయితీగా మారాయి. వల్లె జీవనానికి అనువైన ముహూర్తాలవి. పెళ్లి ముహూర్తాలు మాఘాది వంచకాల్లో ఎక్కువ పెడతారు. మాఘమానంనుంచి జ్యేష్టం వరతూ వును అయిదు నెల్లకూ మాఘాది వపంచకాలని పేరు. ఆ మాసాల్లో స్పానాలకు వేడినీళ్లు అవనరం లేదు. పడకలళకు చాపలుంటే చాలును. ఉక్కపోస్తే తాటాకు వింజామరలతో స్వయం సహాయం చేనుకోవచ్చును. ఇన్సి సౌకర్యాలు వల్లెలో ఉంటాయి. ానకినాాలకినూా--. జి జి పత్రిక నుంచి పరిశ్రమకు నేను పార్టీ మహాసభకు వచ్చినప్పుడు మా అన్నగారు మరికొందరూ నేను హైదరాబాదులో ఉన్నప్పుడు అద్దెకు తీసుకుంటూన్న ఇంట్లోనే వుండేవారు. అప్పుడాయన గుంటీ కంపెనీలో పనిచేస్తూ వుండేవారు. బర్కత్‌పురాలో ఇళ్లు కడుతున్నారు. మూడు గదుల ఇంటికి అప్లికేషను పెట్టు అని వాళ్ల బాసు గుంటీ చెప్పాడట. అప్లికషనుతోపాటు నూటయాభైరూపాయలు కూడా కట్టాలి. ఇల్లు రాకుంటే డిపాజిటు పోతుంది. ఏం చేయాలి అని నన్ను సలహా అడిగాడు. పరవాలేదు కట్టు, అవసరం అయితే నేను బూర్లుల రామకృష్ణారావుగారితో మాట్లాడుతాను అన్నాను. ఇప్పుడు బర్కత్సురా త్రీ ఆర్జీలోనే ఉంటున్నారు. మా అన్నగారికి నలుగురు పిల్లలు. నాకు ఇద్దరు. అంతా ఆడపిల్లలే. అందరూ నారాయణగూడా బాలికల ఉన్నత పారశాలలోనే చేరారు. ఒకప్పుడు దానికి ఉన్నత బాలికా పాఠశాల అని పేరు. ఆరోజుల్లో తెలుగు మేస్టరు నటరాజ శర్మగారు. ఆయన బక్కగా పొట్టిగా వుండేవారు. పంచ, క్షోజ్‌కాలరు కోటు, తలమీద మద్రాసు తలపాగా. ఇదీ ఆయన వేషం, ఆ స్కూలు గేటు ముందు కొందరు కు(ర్రవాళ్లను చేర్చి ఈ స్కూలు విద్యార్థులయినా అధ్యాపకులయినా పొడ.గువారు అయితేనే ప్రవేశం లేకుంటే ప్రవేశంలేదు అంటూ నినాదాలు చేసేవారం. తరవాత ఆ పేరును బాలికల ఉన్నత పారశాల అని మార్చారు. చార్మినార్‌ చౌరాస్తా దగ్గర ఓ పెద్ద స్థలం వుండేది. వీధివైపు కొన్ని మలిగ్‌లు, ఆ స్థలంలో ఓ బంగళా ఉండేవి. మా అన్నగారు ఒక మలిగీని అద్దెకు తీసుకున్నారు. అద్దె పదిహేను రూపాయలు. వెనక పెద్ద రేకుల షెడ్డు వేసుకున్నాడు. అన్నగారు కొన్ని లేతు మిషిన్తను పెట్టారు. తరవాత కొందరు మిత్రుల ప్రోద్చలంతో రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 113

దాన్ని ఇండస్టియల్‌ కో ఆపరేటివు సొసైటీగా చేశారు. మిత్రులంతా పొలిటీషియనులు. పనులు (ప్రారంభించక ముందే తమకు సిటింగు ఫీజులు కావాలని కో ఆపరేటివ్‌ మెంబర్జు, డైరెక్టర్టు డిమాండు మొదలుపెట్టారు. అక్కడ లెక్కలు చూడమని నన్ను మా అన్నగారు నియమించారు. ఒకసారి డైరెక్టర్ల మీటింగు జరిగింది. ఆ మీటింగులో డైరక్టర్లకు సిటింగు ఫీజు యివ్వాలని తీర్మానించారు. నేను మినిట్స్‌ తీర్మానాలను రాశాను. మీటింగు అయింది. నేను లెక్కలు కూడా చూస్తూ " వుండేవాడిని కదా. నాదగ్గరకు సిటింగు ఫీజు కోసం అందరూ వచ్చారు. నేను మినిట్సూ తీర్మానాలూ చూపించి ఆపరేటివు కాజు ఏదీ అని అడిగాను. అది మీరు నిర్ణయించలేదు అని నేనన్నాను. వారు సిగ్గుపడి వెళ్లి పోయారు. నేను హైదరాబాదు ఎమ్మెల్యేలతోపాటు మూడువారాలు గడిపాను. ఛోటా రాజకీయుల సంగతి నాకు బాగా తెలుసును అని వారు గుర్తించారు. మళ్లీ వారాప్రస్తానన తేలేదు. తర్వాత కోపరేటివ్‌ రద్దు అయింది. నా వృత్తికి సంబంధించిన ఉద్యోగం హైదరాబాదులో కూడా దొరుకుతుంది. మా అన్నగారు వ్యవసాయానికి అవసరం ఆయిన పంపులు, డీజిల్‌ ఇంజన్లు, ఎలక్ట్రికల్‌ మోటార్ల వ్యాపారం చేపట్టారు. ఆ దుకాణానికి అనుబంధంగా వర్కుషాపును కూడా పెట్టారు. ఆయన జీవితం మొదలుపెట్టింది మెకానికుగా కనక తత్సంబంధ వ్యాపారం చేబట్టారు. నాకు పరిచయం వున్న వృత్తిలో ఉద్యోగం చేసే కన్న తన వ్యాపారంలో సహాయకునిగా ఉండమని కోరారు. ఆయనకు నలుగురు ఆడపిల్లలు. వారికి పెళ్లిళ్లు చేయాలంటే అందుకు తగినంత ఆస్తికావాలి. వ్యాపారం ద్వారా ధనం సంపాదించాలంటే పన్ను కట్టవలసిన అవసరంలేని పద్ధతులవలంబించాలి. ౦దుకు రెండే మార్గాలున్నాయి. ఒకటి భూవసతి వుండాలి. భూమ్మీద వచ్చిన ఆదాయానికి పన్నుండదు. మావసతి కరిగిపోయిన కాలంలో మేం పుట్టాం. భూవసతి లేకుంటే రెండో మార్గం బినామీ భాగస్వామి. న్నగారు నన్ను బినామీ భాగస్వామిగా ఎంచుకున్నారు. ఆయన నలుగురు ఆడపిల్లల పెళ్లి చేయాలి. పం ఒకే కుటుంబంగా వుంటున్నాం కనుక నలుగురు ఆడపిల్లలు కొదు ఆరుగురు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాలి. పెళ్లియిడు వచ్చేవరకూ వారి చదువులు చూడాలి. మా బాధ్యతలను అనుసరించి నేను ఉమ్మడి కుటుంబంలోనే వుండాలని నిర్ణయించుకున్నాను. వ్యాపారం మొదలుపెట్టడానికి ముందు గుంటీ కంపెనీలో వ్యవసాయం ఇంజెన్లను రిపేరు చేస్తూ వుండేవాడు. రాత్రీ పగలూ పనిలో నిమగ్నుడయేవాడు. పనిలో అలసట కనిపించకుండా వుండేందుకు కంపెనీ యజమాని ఆయనకు రమ్ము అలవాటు చేశాడు. నాకు సిగరెట్టు అలవాటు. ఆయన ముందు నేను సిగరెట్టు కాల్బను. నా ముందు ఆయన తాగరు. ఇదీ మా నీతి, ప్రతీ నెల మొదటి తారీకున నాజేబులో యాభైరూపాయలు పెట్టేవాడు. అంటే అది నాకిచ్చే జీతం అన్నమాట. ఏది కొన్నా పిల్లలందరికీ కొనేవాడిని. అప్పుడప్పుడు తోటికోడళ్లు ఇద్దరికీ చీరెలు కొనేవాడిని. ఈ కొనుగోళ్లన్నీ నాకు వచ్చే యాభైరూపాయల్లోనే. ఫ్యాక్టరీలో పనులు రోజురోజుకూ పెరిగేవి, కిర్ణోస్కర్‌ వారు సరఫరా చేసే పంపులను రాష్టంలో వాటర్‌వర్క్స్‌ కోసం అమర్చడం పని మా ఫ్యాక్టరీకి వచ్చేది, విశాఖపట్నం, కర్నూలు వాటర్‌ వర్కులకు పంపులను మేమే అమర్చాం. అమర్చేపనులను పర్యవేక్షించడానికి నేను వెళుతూ వుండేవాడిని, అలాగ నేను విశాఖపట్నం, కర్నూలు, ఆదోనికి వెళ్ళాను ఒకొక్కచోటికి రెండుమూడుసార్లు కూడా వెళ్లవలసి వచ్చేది. 114 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

నేను మీజాన్‌లో పనిచేసేటప్పుడు ఖద్దరు కట్టేవాడిని. ధోవతి-లాల్చీ, వెస్టుకోటు వైన ఖద్దరు శాలువ. ఇదీ నా వేషం. పెళ్లి అయిన తరవాత పాదుపు అవసరం అనిపించింది. ఖద్దరు ఖరీదు ఎక్కువ. కనక ఎమ్మెస్‌ ఫిఫ్టీఫైవ్‌ బట్టతో పైజామా లాల్బీలు కుట్టించుకునేవాడిని, హైదరాబాదులో ఫ్యాక్టరీలో చేరిన తరవాత లేతు మిషిన్త మధ్య తిరగవలసి వచ్చింది. ఇక్కడ పనికి పైజామాలాల్చీలు పనికిరావు అని తెలుసుకున్నాను. ఖాకీ పంట్లాములు, తెల్లటి చొక్కాలు టక్‌ చేసుకునేవాడిని. ఇదివరకు చెప్పులుండేవి. ఇప్పుడు బూట్టు వేస్తున్నాను.

షాపు సికింద్రాబాదులో వుండేది. ఫ్యాక్టరీ చార్మినారు చౌరస్తాలో. షాపవుకీ ఫ్యాక్టరీకి కూడా భాగస్వాములుండేవారు. మా అన్నగారు రోజులో కొంతకాలం ఇక్కడా మరికొంతకాలం అక్కడా వుండేవారు. నేను మాత్రం రోజంతా ఫ్యాక్టరీలోనే వుండేవాడిని, భాగస్వాముల మీటింగు సాధారణంగా దుకాణంలో జరిగేది. అలాంటి మీటింగున్నప్పుడు నేను కూడా వెళ్లేవాడిని, మినిట్సు, బేలన్స్‌ షీట్లు, ఇన్‌కంటాక్సు రిటర్న్‌ కాగితాల మీద సంతకాలు పెడుతూ వుండేవాడిని. కాని ఆ కాగితాలను పరీక్షగా ఎప్పుడూ చదివేవాడను కాను. నాది కాని ఆదాయాన్ని తెలుసుకొనడానికి యత్నించేవాడిని కాను.

అదే కాంపొండులో వున్న నవాబ్‌సాబ్‌ బంగ్లాలో స్మాల్‌ ఇండీస్‌ ఇన్‌స్టిట్యూట్‌ వుండేది. వారు చిన్న పరి(శ్రమల నిర్వాహకులకు అనేక అంశాలమీద సలహాలిస్తూ వుండేవారు. అప్పుడప్పుడు కొన్ని సబ్టెక్టులమీద రెండేసి వారాల శిక్షణ కూడా ఇస్తూ వుండేవారు. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మా ఫ్యాక్టరీనుంచి నేను హాజరవుతూ వుండేవాడిని, ఉత్పాదనకు వాడే ముడిసరుకు నిర్వహణ మీద ఒక క్లాసు జరిగింది. దానికి నేను హాజరయ్యాను. శాస్త్రీయ నిర్వహణ పద్దతులు చిన్న పరిశ్రమలకు ఎలా తోడ్పడతాయి అన్న దానిమీద సెమినారు పెట్టారు శిక్షణ తరవాత,

ఆ సెమినారులో నా ప్రసంగం ఇన్‌స్టిట్యూట్‌ వారికి బాగా నచ్చింది. దానితో ఆ సంస్థలో పనిచేసే ఇంజనీర్లందరితోను నాకు స్నేహం పెరిగింది. అదే సంస్థలో చిన్న పరిశ్రమలకు సంబంధించిన 'మరో రెండు మూడు అంశాలమీద కాసులు జరిగాయి. ఆ క్లాసులకు హాజరయిన పరిశ్రమల ప్రతినిధులు నన్ను లీడరుగా ఎన్నుకుంటూ వుండేవారు. యధాప్రకారం శిక్షణ తరవాత సెమినారు. అందులో నా ప్రసంగం వుండేవి. ఆవిధంగా ఇతర చిన్న పరిశ్రమల యజమానులు చాలా మందితో నాకు పరిచయమూ, స్నేహమూ ఏర్పడ్డాయి.

కమ్యూనిస్టు పార్టీ ఆఫీసు హిమాయత్‌నగరులో వుండేది. అక్కడికి తరుచు వెళుతూ వుండేవాడిని. మా ఫ్యాక్టరీ వున్న కాంపౌండు యజమాని ఎప్పుడో పోయాడు. బంగ్ధా వెనక వైపునున్న పోర్షనులో బేగం సాహెబా వుంటోంది. ఆ కాంపౌండులోని స్థలాలను అమ్మాలని ఆమె నిశ్చయించుకుంది. అంతకు ముందే సుందరయ్యగారు మా ఫ్యాక్టరీ చూసి ఇక్కడి స్థలాలమ్ముతే నాకు చెప్పు అన్నారు. ఇప్పుడు బేగం సాహెబా అమ్మడానికి సిద్ధంగా వున్నట్లు తెలిసింది. కనక ఈ వార్తను సుందరయ్యగారిక్షందించడం కోసం నేను విజయవాడ బయలుదేరాను. సుందరయ్యగారికి స్థలాల సంగతి చెప్పాను. ఆయన ఆలోచించి -

నువ్వు మూడువేల గజాలకు ఎగ్రిమెంటు చేసుకో, నేను లీలద్వారా నీకు పదివేలు పంపిస్తానన్నారు. నేను తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన రెండురోజులకు లీల వచ్చి పదివేలిచ్చి వెళ్ళారు. నేను గజం పదిహేను రూపాయల చొప్పున మూడు వేల గజాలను కొనడానికి ఎగ్రిమెంటు పష్రం రాయించుకున్నాను. ఆడ్వాన్సుగా పదివేలిచ్చాను. కొద్దిరోజులకు చైనా, ఇండియా భూభాగాన్ని ఆక్రమించింది. దానితో 'తమ భూమిని రక్షించుకొనడం కోసం ఇండియా యుద్దానికి దిగింది. చైనా చర్యను గర్జిస్తూ నీలం రాజశేఖరరెడ్డిగారు బహిరంగ (ప్రకటన చేశారు. ఆ ప్రకటన పార్టీ చీలికకు ఆంకురారోపణ అయింది.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 115

వైనావారు ఇక్కడికి వచ్చి భూములను స్టానిక ప్రజలకు పంచిపెడితే అప్పుడేమవుతుంది? అది దురాక్రమణా? అన్న ప్రశ్నలు వేసి ఈ పార్టీకి భవనమూ అక్కర్లేదు స్థలమూ అక్కరలేదన్నారు. ఎలాగా ఎ(గ్రిమెంటు చేసుకున్నావు కనక నేను నారాయణతో చెబుతాను. అతడు కొంత తీసుకుంటాడు మీరు ఇంకొకరిని తెచ్చుకుని ఆ భూమిని మీ ఫ్యాక్టరీ కోసం కొనుక్కోండి అన్నారు. నారాయణ ఆదిలో విశాలొంధ్ర మేనేజరుగా వుండేవాడు. తరవాత కాచీగూడా వైశ్యాహాస్టల్‌ బిల్జింగ్‌ మలిగీలో చిన్న ప్రెస్సు పెట్టుకున్నాడు. 'ఫెస్సుకోసం అతడు స్థలం కొనడానికి సిద్దంగా వున్నాడు. అప్పటికే ఇంజనీరింగు ఇండస్ట్రీ నడుపుతున్న కోకా చలపతిరావుగారిని కలుపుకుని ఎగ్రిమెంటు చేసుకున్న భూమంతటినీ మేం తీసుకున్నాం. అందులో నూటయాభై గజాల స్థలం రోడ్డుమీదికుంది. ఆ స్థలం ప్రతీవారికీ కావాలి అందుకని సుందరయ్యగారితో మాట్లాడి ఆ స్థలాన్ని లీలపేర రిజిస్టరు చేయించాను. రెండువందల ఇరవై అయిదుగజాలు నా పేరన తీసుకున్నాను. రెండువేల పైచిలుకు పరిశ్రమ పేర రిజిస్టరు అయింది. ఈ రిజిస్టేషము పనంతా నాచేతుల మీదుగానే జరిగింది. కొత్తభూమిలో షెడ్డు వేసి ఫ్యాక్టరీని అక్కడికి తరలించాం. ఫ్యాక్టరీలో మోటారు వైండింగు కూడా మొదలయింది. ఎలక్‌్రికల్‌ ఇంజనీరు పేరు బాలాజీ సింగు. అతడి షాపు సికిందరాబాదులో వుంది. అక్కడ పనిచేసే కుర్రవాళ్లను ఏజ్‌వల్క్స్‌ ఉద్యోగులుగా నియమించాడు. ఇద్దరు కొత్తవాళ్లను కూడా తీసుకున్నాడు. తెలంగాణాలో చాలా మోటబావులకు ఎలక్ట్రిక్‌ పంపులను అమర్చి వరిచేలు వేయడం మొదలుపెట్టారు. వ్యవసాయాదాయం అదివరకు కన్నా రెట్టింపయింది. సిర్పూరు పేపరు మిల్సులో చాలా మోటర్లు కాలిపోయాయి. వాటిని రీవైండు చేయడానికి తెచ్చుకోవాలని నేనూ బాలాజీసింగూ, సిర్ఫూరు కాగజ్‌నగరుకు వెళ్లాం. అక్కడి ఇంజనీర్లతో మాట్లాడి పద్నాలుగు మోటర్లను రివైండు చేయడానికి తెచ్చుకున్నాం. వారి ఎలక్షిక్‌ ఇంజనీరు ఒక మద్రాసీ. మీకు రివైండింగు ఫెసిలిటీస్‌ ఏమున్నాయని 'ప్రల్నించాడు. బాలాజీ సింగు అన్నింటికీ జవాబులు చెప్పాడు. ఆ జవాబుల్లో వాస్తవాలకన్న కోతలెక్కువున్నాయి. అయితే నేను వచ్చి మీ ఫ్యాక్టరీని చూస్తానన్నాడు ఆ ఇంజనీరు. ఒప్పుకొనక తప్పదు కదా! ఆర్డరు మీకే యిస్తున్నాం. మీరు వెళ్లండి, మోటార్జు పంపిస్తాం అన్నాడు. ఫ్యాక్టరీ చూడ్డానికి వస్తున్నట్లు ఇంజనీరు ఉత్తరం వచ్చింది. అతడు వస్తానన్న రోజున తనకు పనుందని బాలాజీసింగు పారుగూరికి వెళ్ళాడు. న సిర్పూరు ఇంజనీరు స్థానికంగా ఓ ప్రముఖ ఇంజనీరింగు కంపెనీ ప్రతినిధిని వెంటపెటుకుని వచ్చాడు. అతడు కూడా ఎలక్ట్రికల్‌ ఇంజనీరే. ఇప్పుడేం చేయాలి? గుంటీ కంపెనీవారు కొంతకాలం కిందట ఎలక్ట్రిక్‌ మోటార్లను తయారుచేయడానికి ప్రయత్నించి కారణాంతరాలవల్ల ఆ వింగును మూసేశారు. నేను దాన్ని అదివరకే చూశాను. గుంటీ కంపెనీ మేనేజరుకు ఫోనుచేసి ఆ వింగు తాళంచేతులు తీసుకుని ఈ ఇంజనీర్లను ఆవింగులో తిప్పి చూపించాను. వైండు చేసిన తరవాత మోటార్లను వార్షిష్‌ టాంకులలో పె ట్టాలిక దా?ఆ టాంకులేవీ అని అడిగాడు సిర్పూరు ఇంజనీరు. వార్షిష్‌ టాంకులు పాతపద్దతి. ఇప్పుడాపద్దతలేదన్నాను. ఈ సంగతి ఎక్కడో చదివిన గుర్తు కనక ధైర్యంగా చెప్పాను. స్థానిక ఇంజనీరు నామాటను బలపరుస్తూ తమ మోటార్ల కంపెనీ ఆపద్దతిని ! సి న తరవాత వారంరోజుల్లో క! వం... వల రు ఇంజనీరు సంతృప్తే పడ్డాడు. వైర్‌గేజిని వైండింగ్‌ చుట్లను ఒక పుస్తకంలో న ఖో యి. మౌటర్లు విప్పేటప్పుడు వై గ్‌ ట్ట స్తకంల్‌ నమోదు చేసి వుంచుతాం. బాలాజీసింగు ఆధ్వర్యాన ఆ క కన వక 116 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

మోటర్లన్నింటి వైరింగూ విప్పేశారు. అప్పుడు బాలాజీ ఎక్కువ డబ్బు కోసం పేచీపెట్టాడు. బేరం కుదరలేదు. తాను తర్భీదిచ్చిన కుర్రాళ్లను తీసుకుని పనిమానేసి వెళ్లిపోయాడు. ఇక్కడ కొత్తగా రిక్రూటు అయిన ఇద్దరు కుర్రాళ్లు తప్ప పాతవాళ్లందరూ బాలాజీసింగు వెంట వెళ్లిపోయారు. మా అన్నగారికి మెకానికల్‌: ఇంజనీరింగులో పరిచయం వుంది కాని ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగుతో అసలు పరిచయం లేదు. వైండింగు షాపు నిర్వహణ బాధ్యత నేను తీసుకున్నాను. విశాలాంధ్ర బుక్‌ ( న్నా [ హౌసులో ఆడెల్‌ ఎల|క్షికల్‌ ఇంజనీరింగనే పేర ఓ ఆరు వాల్య్నూముల పుస్తకం వుంది. దాన్సింతకు బి ్య్‌ స్త న్ని ముందు తిరగేసి చూశాను. ఇప్పుడు చదవాలని నిర్ణయించుకున్నాను. పుస్తకాలయం సుల్తానుబజారులో వుంది. రోజూ మధ్యాహ్నంవెళ్లి ఆ పుస్తకాలను అక్కడే చదివేవాడిని. ఇక్కడ కుర్రవాల్లిద్దరూ వైండింగు పనిమీద ఉండేవారు. వారికి ఎప్పుడైనా ఏదయినా అనుమానం వస్తే నాకు తెలిస్తే చెప్పేవాడిని. లేకుంటే మళ్లీ అడెల్సు పుస్తకాలు చదివి చెప్పేవాడిని, ఒకసారి ఒక మోటరు వైండింగు పూర్తి అయింది కాని కనెక్షన్లు ఇచ్చి స్విచ్చి వేస్తే కదలలేదు. అప్పుడు నన్ను పిలిచారు. మోటారు వైండింగంతా పరిశీలించి చూశాను. ఏమీ అర్ధంకాలేదు. రాంగ్‌ కనెక్షన్లు అనుకుంటున్నాను, అవి విప్పి రీకనెక్టు చేయండి అన్నాను. తెలిసి ఆ మాట అనలేదు. యదాలాపంగా అన్నాను. వారు కనెక్షన్లు విప్పారు. రీకనెక్షను నిజంగా సరిగా లేదని వారే గుర్తించారు. కరీంనగరు జిల్లాలో ఎక్కువ మోటారుపంపులు నడుస్తున్నాయి. అక్కడ పంపులు కాలిపోవడం కూడా ఎక్కువే. కాలిన మోటారును తెచ్చి రైతులు అక్కడే కూర్చునేవారు. రీవైండింగ్‌కోసం పట్నం వస్తే మేం వనిచేయడానికో రెండురోజులు పడతాయి. మీరు తీసుకెళ్లి పంపు కనెక్షను ఇవ్వడానికి మరో శెండురోజులవుతాయి. ఇలా ఒకవారం తడి లేకుంటే ఎంత నష్టం. ఆ నష్టం నీకొక్కడికే కాదు. దేశానికి కూడా నష్టం అని చెప్పేవాడిని. మీ దగ్గర కాస్త చదివిన పిల్లలుంటే పంపించండి వారికి మోటారు రివైండింగు పని నేను నేర్పుతాను అని చెబుతూ వుండేవాడిని. నేను చెప్పేమాటలు కొంతకాలానికి వారితలకెక్కింది. రెండు మూడుజిల్హాల కుర్రవాళ్లు వచ్చారు. శెండు మూడువారాల్లో వారు మోటారు వైరింగు నేర్చుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. పల్లెలనుంచి మాకు రాకీ ఆగిపోయింది. రా లాభం ఆగిపోయినందుకు బాధపడలేదు. రైతులు తమ పనులను తామే రా " లి చేసుకొనగలిగినందుకు సంతోషం కలిగింది. మాదగ్గరున్న ఇద్దరు పిల్లలకు వారు కావలసిన టూల్సు శ్రీసుకొని సొంత షాపులు పెట్టుకోండని కొంత డబ్బు కూడా యిచ్చి వైండింగు షాపును వైండు చేశాం. వారు కొంతకాలం కలిసి పనిచేసారు. తరవాత విడిపోయారు. డీజిల్‌ ఇంజన్లు పంపుల పనుల్లో ఫ్యాక్టరీకి మంచిపేరు వచ్చింది. అందువల్ల కేస్ట్‌ ఐరన్‌ పోతపని వుంటే బాగుంటుందనిపించింది. బెజవాడలో ఆ పనులుచేసే అన్నదమ్ములు మా ఫ్యాక్టరీలో కూడా ములుగా చేరారు. వారి సహకారంతో చిన్న కుపోలాను పెట్టి కేస్ట్‌ ఐరన్‌ పనులు మొదలుపెట్టాం. భాగన్వ పెగ్‌ ఐరన్‌ అని కూడా అంటారు. తెలుగువారు బీడు అంటారు. కోత్తగా చేరిన భాగస్వాములు కేస్ట్‌ బర శ పనివారిని తీసుకువచ్చారు. ఇంజనీరింగ్‌ పరీక్షయిచ్చిన యువకుడు మాతో చేతులు బెజవాడ నుం కలిపాడు. అతడు ఒక కొత్త కంపెనీని నెలకొల్పాడు. దానికి పేరును, లోగోను నేనే యిచ్చాను. పేరు "కాకతీయ కర్షక్‌ ఇండస్ట్రీస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌”. వారు కూడా ముందు పంపుల కంపెనీ లేతులతో ఆ కాంపొండులోనే పని ప్రారంభించారు. బీడు పని చురుకుగా తయారీ మొదలుపెట్టారు. కొన్నిలల రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ అ 117

సాగడంలేదు. పిగైరన్‌ షెల్సు వస్తే తప్ప లేతుపని సాగదు. ఇదిలావుండగా బెజవాడ భాగస్వాములు సెలవుమీద వెళ్ళారు. వారి సెలవు కాలంలో బీడు పనుల పర్యవేక్షణ నాకప్పగించారు. పనివారితో నేను కూడా అక్కడే వుండి వారి పనిని రెండు రోజులు పరిశీలించాను. బెజవాడ మేస్త్రీ కావాలని పనిని మందకొడి చేస్తున్నట్టు అనిపించింది. షెల్స్‌ ఎన్ని చేస్తావు కోర్టు ఎన్ని చేస్తావు, అని మేస్రీని అడిగాను. అతడు అంకెలు చెప్పాడు. | నేను యన్‌ఐయస్‌ఐ ఆఫీసుకు వెళ్లి మెటలర్టిస్టు సలహాదారును తీసుకుని వచ్చా. ఆయనకు పనిచూపించి ఇప్పుడున్న కార్మికులతో రోజుకు ఎన్ని షెల్సు, ఎన్ని కోర్డు తయారవుతాయి అని అడిగాను. మేస్త్రీ చెప్పిన దానికన్న రెట్టింపు పని అవుతుందని ఆయన అన్నాడు. అవసరం అయితే నేను నువ్వూ కూర్చుని పనిచేసి చూపిద్దాం అన్నాడు. మేస్రీకి వేరుదారి లేకపోయింది. పని రెట్టింపు అయింది. మెటలర్జీ విభాగం మేనేజరుగా నన్ను నియమించారు. సెలవుమీద వెళ్లిన భాగస్వాములు తిరిగి వచ్చారు. మా ఉత్పాదన చూశారు. మే'స్త్రీతో మాట్లాడుకున్నారు. తాములేకున్నా పని జరుగుతుందని తెలుసుకున్నారు. సికింద్రాబాదులో ఇంజనీరింగు దుకాణం వున్న ఒకాయన మా వర్కుషాపులో భాగస్వామిగా వుండేవాడు. ఆయన మౌలాలీలో పరిశ్రమల కోసం ప్రభుత్వం కట్టిన షెడ్డును ఇదివరకే తీసుకున్నాడు. ఇప్పుడు బెజవాడ భాగస్వాములనూ వారివెంట వచ్చిన పనివారినీ తీసుకుని ఓ కొత్త ఫ్యాక్టరీని స్థాపించుకున్నాడు. మా అన్నగారు చందూలాల్‌ బారాదరీ ఇండస్టియల్‌ ఎస్టేటులో ఒక షెడ్డును తీసుకుని రెండు కుపోలాలు పెట్టి ప్రతిరోజూ హీటు తీసుకొనడానికి ఏర్పాటు చేశారు. ఆ ఇండస్ట్రీకి నన్ను మేనేజరుగా నియమించారు. ఐఎస్టై మిత్రుని సహకారంతో స్టాటిస్టికల్‌ చార్చును పెట్టి పనిమొదలుపెట్టాను. ఉదయమే భోజనం, టిఫిను మూటకట్టుకుని బస్సుమీద చార్మినారు వరకు ప్రయాణం. అక్కడి నుంచి రిక్షా ఆటో ఏది దొరికితే దానిమీద చందూలాల్‌ బరాదరీ ఇండ్నస్టియల్‌ ఎస్టేటుకు ప్రయాణం. ఎనిమిదిలోపున , చేనక్కడికి చేరాలి. ఎనిమిదింటికి ఫౌండ్రీ తాళాలు తెరవాలి. అంతకుముందు కొందరు, ఆ సమయానికి కొందరు కార్మికులు వచ్చేవారు. వారు రాగానే ఒక బృందం నిన్నటి అచ్చులను ఇసకలోంచి తీసి వరసగా పేర్చేవారు. మరొక బృందం మరో కుపోలాలో నిప్పురగిల్బేవారు. పేర్చిన అచ్చులను నేను పరీక్షించి పాడైనవాటిని తీసి అందుకు కారణాలను పరిశీలించి చార్చులో నమోదు చేసేవాడిని, ఇండస్ట్రియల్‌ డిపార్టుమెంటు వారూ యస్పైయస్టై వారూ సందర్భకులను తీసుకుని వచ్చేవారు. పోతపోసిన అచ్చులను నా స్టాటిస్టికల్‌ చార్జును చూపించి జంటనగరాల్లో వున్న ఉత్తమోత్తమ ఫౌండ్రీ ఇది అని చెబుతూ వుండేవారు. నాకు మంచి మెటలర్టిస్టు అని పేరు కూడా వచ్చింది. మధ్యాహ్నం భోజన విరామం. భోజనానంతరం మళ్లీ పని. ఉదయమే అచ్చులు పైకి తీసిన తరవాత కోత్త.మౌల్టుల రామింగు. అంటే ఇసక దిమ్మిస. ఇది అయేసరికి బీడు కరిగేది. దాన్ని అచ్చుల్లో పోయడం మొదలు. ఒకొక్కప్పుడు నేను కూడా పనివారితో కలిసి అచ్చుల్లో కరిగిన బీడు పోసేవాడిని. అలాంటి సమయాలలో ఇసకలో కాస్త తేమవుంటే బీడు చిటపటలాడుతూ రవ్వలు చిమ్మేది. ఆ రవ్వలు మోకాలికి తాకేవి. అక్కడున్న ప్యాంటుకు చిల్లులు పడేవి. సాయంత్రం ఆ ఎస్టేటు యజమానులతో కలిసి ఈ సంవత్సరం ఇండ(స్టియల్‌ ఎగ్జిబిషన్‌లో చందూలాల్‌ బారాదరీ పేరు కూడా కనిపించాలనేవాడిని. ఆ రోజుల్లోనే సందర్భం గుర్తులేదు కాని రామోజీరావుగారు పరిచయం అయారు. ఆయనప్పుడు మలక్‌పేటలో వుండేవారు. మార్గదర్శి చిట్‌ఫండే కాకుండా హోర్షింగుల వ్యాపారం కూడా వుండేది. ఆ వడ్రంగి వర్కుషాపు 118 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

ఇంటి ఆవరణలోనే వుండేది.

ఎగ్జిబిషనులో పాల్గొనే ఇండస్ట్రీల పేర స్టాండులను చేయించమని రామోజీరావుగారిని అడిగాను. హోర్షింగు వ్యాపారం ఆయన భార్య రమాజేవి 'పేరన ఉంది. ఆ వ్యాపారం మేనేజ్‌మెంటును ఆవిడే చూస్తూ వుండేవారు. ఈ ఏర్పాటు సంగతి అన్ని యూనిట్ల యజమానులకు తెలిసింది. తమ యూనిటు పేరు ఇండ్యస్టియల్‌ ఎగ్జిబిషనులో కనిపిస్తుందని తెలియడంతో వారిలో ఉత్సాహం పెరిగింది. ఆదివరదాకా నామమాత్రంగా ఉన్న యూనిట్లు కాస్త కార్యకలాపాలను పెంచారు. ఎగ్టిబిషనులో తాము చేసే ఉత్పాదన కూడా వుండాలన్న పట్టుదల పెరిగింది.

డాక్టర్లు అప్పుడప్పుడు స్కూళ్లకు వెళ్ల ఆరోగ్యాలు పరీక్షిస్తూ ఉంటారు. మా పిల్లలు చదువుతున్న బాలికల ఉన్నత పాఠశాలకు కూడా వెళ్ళారు. మారెండో అమ్మాయి కరుణను చూసి ఈ అమ్మాయి గుండెలో రంధ్రమున్నట్టుంది అన్నారు. ఆ సంగతి అమ్మాయి చెప్పగా మేం మా కుటుంబ వైద్యుని దగ్గరకు తీసుకువెళ్ళాం. ఆయన నిశితంగా పరిశీలించి గుండెలో రంధ్రముందన్నాడు. వెంటనే. ఆపరేషను చేయడం మంచిది అన్నాడు. గుండె ఆపరేషను (ప్రస్తుతం ఢిల్లీలోనూ వెల్టూరులోనూ చేస్తారు. మీరు వెల్లూరుకు వెళ్లేటట్టయితే అక్కడి ఆస్పత్రి సూపర్నింటుకు ఉత్తరమిస్తాను అన్నాడు. మేం వెల్లూరినే నిశ్చయించుకున్నాం.

వెల్లూరు ఆస్పత్రి సూపర్నెంటు పేరు అమృతలింగం. పిల్లని వెంటనే తీసుకుని రండని వెల్లూరి నుంచి జవాబు వచ్చింది. మా అన్నగారి పెద్దమ్మాయి మెడిసిన్‌ చదువుతోంది. మాకు మేనల్టుని వరస అయిన కుర్రవాడు ఒకడు ఇంజనీరింగు చేశాడు. ఆ యిద్దరికీ కొద్దినెల్లుగా 'ప్రేమసాగుతోంది. హరాత్తుగా అది బెడిసింది. మా అన్నగారికి సమస్యలను డబ్బుతో పరిష్కరించడం తెలుసును. ఇది డబ్బుకులొంగని సమస్య, ఏంచేయాలో ఆయనకు తోచలేదు. ఆ సమస్య నాదగ్గరకు వచ్చింది. ఆ సమస్యను ఒకరోజులోనే నేను పరిష్కరించాను. మేనల్టుడు కిర్షోస్కర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. వెల్లూరు తాను వెళతానన్నాడు. కరుణ వయసు అప్పుడు పదకొండేళ్లు. ఆమెను వెల్లూరు తీసుకెళ్ళాడు. అక్కడ పరీక్షలన్నీ అయ్యాయి. కిర్ణోస్కర్‌ వారి మద్రాసు డిపో రెసిడెంటు ఇంజనీరుకు మా ఏర్పాట్లు చూడమనిచెప్పి తిరిగి వచ్చాడు. మమ్మల్ని వెంటనే వెల్లూరు వెళ్లమన్నాడు. మద్రాసులో కిర్గోస్కర్‌ ఇంజనీరు మమ్మల్ని స్టేషనులో కలుసుకుని వారింటికి తీసుకెళ్ళాడు. అక్కడ స్నానాలు భోజనాలు అయిన తరవాత వెల్లూరు రైలెక్కించాడు. వెల్లూరు ఆస్పత్రికి వెళ్లాం. అప్పటికే కరుణ అక్కడి డాక్టర్లు, నర్సులకు బాగా పరిచయం అయింది. నాపుస్తకాలమీద అరుణ కన్న కరుణ ఎక్కువ ఆసక్తి చూపేది. సైకాలజీ రిడిల్సు అక్కడి డాక్టర్లకు, నర్సులకు చెబుతూ వుండేది.

ఇద్దరు నది దాటుదామనుకున్నారు. ఒడ్డునున్న నది ఒక మనిషిని మాత్రమే మోయగలదు. అయినా వారానదిని దాటేశారు. ఎలాగ? దీని సమాధానం కోసం వారు ఆలోచనలో పడిపోయేవారు. అప్పుడు కరుణ నవ్వుతూ ఆయిద్దరూ ఆనదికి అటొకరు ఇటొకరు వున్నారు. ఇద్దరు నది చాటాలన్నప్పుడు ఆయిద్దరూ కలిసికట్టుగా వెళ్లినట్టు అనిపిస్తుంది. అది మనస్తత్వం చేసిన చమత్కారం అని జవాబిచ్చి నవ్వేది.” సైకాలజీ యాజ్‌ యు మేలైక్‌” అన్న పుస్తకంలో మనస్తత్వ చమత్కారాలన్నీ కరుణకు తెలుసును.

ఆపరేషను ఫలితాలు ఎలా వుంటాయని మేం డాక్టర్ని అడిగాం. ఆయన ఫిఫ్టీఫిష్టీ అన్నాడు. ఆపరేషన్ను వాయిదావేస్తే మరో ఆరేళ్లు బతకవచ్చునన్నాడు. నా భార్య సుభద్రా నేనూ చర్చించుకున్నాం. ఆపరేషను

రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ అ 119

వాయిదావేస్తే ఫిల్ల రోజురోజుకూ మృత్యువుకు దగ్గరౌతోందన్న భావం మరీ బాధాకరం. కనక ఇప్పుడే ఆపరేషను చేయడం ఉత్తమం అని నిర్ణయించుకున్నాం. కరుణ కూడా నిర్భయంగా ఆపరేషనుకు సిద్దమయింది. ఆమెను ఆపరేషను ధియేటరుకు తీసుకువెళ్ళారు. నెత్తురు కావాలన్నారు, తన నెత్తురు తీసుకోండని చెప్పింది సుభద్ర. మేం ఒక గదిని తీసుకున్నాం. మా పెద్ద మేనల్టుడు మద్రాసులో ఉంటాడు. మా మేనగోడలూ, ఆమె భర్తా వారింటికి వచ్చారు. అక్కడ తెలిసింది మేం వెల్టూరులో ఉన్నామనీ కరుణకు ఆపరేషననీ. ఆవార్త తెలియగానే వారిద్దరూ వెల్లూరువచ్చారు. నేను పిల్లను తీసుకుని వెల్లూరు ఆస్పత్రికి వెళ్లినట్టు ఎలా తెలిసిందో కంభంపాటి సత్యనారాయణగారు (సీనియరు) కూడా వెల్లూరు వచ్చారు. ఆ గదిలో అయిదుగురం వున్నాం. సుభద్ర నెత్తురిచ్చివచ్చింది. ఆరోజు గడిచింది. ఆపరేషను చక్కగానే జరిగింది కాని నెత్తురు మెదడుకెక్కలేదు. అందుకని అవయవాలు కదపలేదు. కళ్లు తెరచి చూడలేదు. ఇంకా ఓరోజు చూద్దాం అన్నారు డాక్టర్లు. రెండోరోజున శ్వాసకూడా స్తంభించింది. ఇంక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే తిరుగు ప్రయాణానిక్కూడా టిక్కెట్టు తెచ్చుకోవాలి. ఆ వూరు నాకు కొత్త ముందు సమాధి స్థలానికి వెళ్లి గొయ్యితీసి వుంచమని కాపరితో చెప్పివచ్చాను. తరవాత పిల్లని తీసుకొనడానికి వెళ్ళాను. నన్ను చూసి డాక్టరు కాస్త కంగారుపడినట్టు కనిపించాడు. నాముక్కు వెంట నెత్తురొస్తోంది. ఆ సంగతి నాకు తెలియదు. డాక్టరు ముక్కుమీద ఒక ఐసుముక్క పెట్టాడు. నర్సు నెత్తురు తుడిచేసింది. పిల్ల కాయాన్ని తీసుకుని టాక్సీలో బయలుదేరాను. బొందలగడ్డలో గొయ్యి తవ్వి సిద్ధంగా వుంచాడు “హరిశ్చంద్రుడు”. అక్కడినుంచి స్టేషనుకు వెళ్లి అయిదు టిక్కెట్టు మద్రాసుకు తీసుకున్నాను. ఇంకో గంటలో రైలు వుంది, ఆస్పత్రికి వచ్చి అందరం బయలుదేరి రైలెక్కాం. ఎగ్మూరు స్టేషనులో సీనియరుగారు దిగి వెళ్లిపోయారు. మేం నలుగురం ఎలక్రిక్కు రైల్లో పల్దావరం వెళ్లాం. మామేనల్లుడు పల్దావరంలో ఉంటున్నాడు. నేను వెళ్లగానే స్నానానికి కూర్చున్నాను. షవరు తిప్పి దానికింద కాసేపు వుండే సరికి మేనల్టుడు వచ్చాడు, సుభద్ర అన్నగారు పోయినట్టు హైదరాబాదుకు వచ్చిన ఉత్తరాన్ని మద్రాసుకు పంపించారు, ఇప్పుడు అత్తయ్యకు ఈ వార్త చెప్పడం మంచిదా కొదా అన్నాడు మేనల్లుడు. అత్తయ్యనిటు పిలు అన్నాను. సుభద్రరాగానే ఆమెను కూడా షవరు కిందికి లాగి ఇప్పుడు మనం "హైదరాబాదు వెళ్లడంలేదు. కాకినాడ వెళుతున్నాం అన్నాను. మీ అన్నపోయాడు అని ఉత్తరం వచ్చింది అన్నా. ఆమాట వినగానే అంత వరకూ శోకాకులమయిన ముఖం మామూలుగా అయిపోయింది. పల్లెజనం అగ్గిని ఆర్భడం కోసం ఎదరగ్గిపెడతారు. అలాగే ఇది ఎదురు శోకం. దీన్లో శోకం పోయి మామూలు పరిస్టితి నెలకొంటుంది. షవరు కిందినించి లేచి పొడిబట్టలు కట్టుకుని భోజనాలు చేశాం. మేనల్లుడు కొకినాడకు టిక్కెట్టు తెచ్చాడు. పల్గావరం నుంచి కాకినాడకు చేరాం. అక్కడి కర్మలన్నీ పూర్తి అయేదాక్షా వుండి అవి అయిన తరవాత హైదరాబాదు చేరాం. మేం ఇంటికి చేరాం. మా వార్తలన్నీ గమనిస్తూ వున్నట్లుగా రామోజీరావుగారు ఇంటికి వచ్చి పరామర్శించారు. చందూలాల్‌ బారాదరీ ఇండష్టీలు ఎగ్జిబిషన్‌లో తొలిసారి చేరాయి. వాటికి ఖ్లండింగ్‌ బోర్డులు చేయించి పెట్టమని వెళ్లేముందు రామోజీరావుగారికి చెప్పాను. ఆయన బోర్డులు చేయించి ఎక్టిబిషనులో చందూలాల్‌ బారాదరీ స్టాలుకు అందించారు. గర్భశోకం కలిగినవారిని పుట్టింటివారు తీసుకువెళ్లాలట. అది ఆచారం. ఇప్పుడు సుభద్రకే కాదు సుభద్రతల్లికి కూడా గర్భశోకం కలిగింది. అందువల్ల సుభద్రను మా అక్క తనింటికి తీసుకువెళతానంది. ఆమె చిన్న కొడుకు బిహెచ్‌ఇఎల్‌లో పనిచేస్తున్నాడు. అక్కడ ఒక క్వార్దరులో ఉంటున్నాడు. అతడికి వండిపెట్టడానికి మా అక్కవచ్చింది. మా 120 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

రాక సంగతి తెలిసి బిహెచ్‌ఇఎల్‌ నుంచి చిక్కడపల్లికి వచ్చి మమ్మల్ని తీసుకువెళ్లింది. దారిలో ఒకసారి ఎగ్టీబిషనుకు వెళ్లి బారాదారీ స్టాలును చూసుకున్నాను. చిన్న మేనల్సని ఇంట మూడురోజులు గడిపి బర్కత్పురాకు తిరిగివచ్చాం. వచ్చిన దగ్గరనుంచీ పెళ్లిపనుల్లో నిమగ్నం అయింది సుభద్ర. సాధారణంగా మా ఇళ్లల్లో పెళ్లి ముహూర్తాలు అర్థరాత్రి పెడుతూ వుంటారు.

సౌలభ్యం కోసం పెట్టే ముహూర్తాలు ఆనవాయితీగా మారాయి. పల్లె జీవనానికి అనువైన ముహూర్తాలవి. పెళ్లి ముహూర్తాలు మాఘాది పంచకాల్లో ఎక్కువ పెడతారు, మాఘం నుంచి జ్యేష్టం వరకూ వున్న అయిదు నెల్లకూ మాఘాదిపంచకాలనిపేరు. ఆ మాసాల్లో స్నానాలకు వేడినీళ్లు అవసరంలేదు. పడకలకు చాపలుంటే చాలును. ఉక్కపోస్తే తాటాకు వింజామరలతో స్వయం సహాయం చేసుకొనవచ్చును. ఇన్ని సౌకర్యాలు పల్లెలో వుంటాయి. అదే నగరాల్లో అయితే జనం ఆ సమయానికి వస్తారు కాని పల్లెల్లో వారం పదిరోజులు ముందు నుంచీ వుంటారు. అయినా పెళ్లిముహూర్తాలు అర్ధరాత్రికే పెడతారు.

పెళ్లి అయింది. ఆ యింట ప్రతి అంగుళం కరుణను గుర్తుకు తెస్తూ వుంటుంది. అందుకని ఇల్లు మారుద్దాం అన్న నిర్ణయానికి వచ్చాం. నేటి బాగులింగంపల్లి నాడు రాజబంధువు నివేశనం. అది డెబ్బయి అయిదు ఎకరాల స్థలం. ఒక పక్కన రాజబంధువు ప్రాసాదం వుంది. మరోవైపు ఈతకొలను, కొలను ఎండిపోయింది. కొలను వొడ్డున బట్టలు మార్చుకొనడానికి గదులు. ఆ గదులు శిథిలావస్థకు చేరాయి. అవిప్పుడు అసాంఘిక శక్తుల నిలయాలు, ఆ భూమిలో మామిడిచెట్టు వెలగచెట్టుకూడా వుండేవనడానికి ఆధారాలు మిగిలాయి.

ఆ స్థలం చుట్టూ ప్రాకారం. ఒకవైపున పెద్ద గవని అది శిధిలంగా నిలిచింది. దానికి ఒక పక్కన చిక్కడపల్లి. ఆ చిక్కడపల్లి చివరన అంటే తోట ప్రాకారానికి ఆనుకున్న నేల ఆది ఉత్తరాదినుంచి వచ్చిన భంగీల గుడిసెల బస్తీ. ప్రాకారం అక్కడక్కడ కూలిపోయింది. గోడవైపు చిక్కడపల్లి వైపున ఇళ్లు కట్టే మేస్త్రీలకు గుడిసెలు వుండేవి, గుడిసెల కోసం స్వాధీనం చేసుకున్న స్థలంలో చిన్న పక్కాయిళ్లను నిర్మించుకున్నారు. అలా నిర్మించుకున్న ఇళ్లను మధ్యతరగతి వారికి అమ్మేవారు. అలా అమ్మిన చిన్నయింటిని రిటైరయిన వ్యవసాయాధికారి కొనుక్కున్నారు.

ఆ యింటి యజమాని జగడాల కోరు అని ప్రతీతి. బర్కత్పురా నుంచి హవేలీకి వెళ్లేందుకు మధ్యనున్న కాలవకు ఒక వంతెన కట్టారు. వంతెనకావలివైపున శిథిలగవని, ఆది దాటితే చింతలతోపు. ఆ తోపులో కొంతదూరాన (ప్రాకారం గండి. ఆ గండికి ఎదురుగా వుంది ఆ యిల్టు, ఆయింటి యజమానిని కలిసి అద్దెకు తీసుకున్నాను. ఇంటదిగిన తరవాత తెలిసింది. ఆయన నిజంగా నిజాయితీగల ఆఫీసరని, ఆయన ఎగ్రికల్చరల్‌ (గ్రాడ్యుయేటు. అనేక ర్యాష్టాల్లో ఉద్యోగాలు చేశారు. ఆయన తన పెళ్లిలో మామగారు ఇవ్వజూపిన వరశుల్కం తాకలేదు. తన బట్టలను తాను కుట్టుకుంటాడు. ఆయన భార్య సుగుణమణి. ఆమె దుర్గాబాయి మహిళాసంఘంలో పనిచేస్తూ వుంటారు. భూషణంగారు కూడా అక్కడ రకరకాల పనులు చేస్తూవుంటారు. ఆ పనికి ఫలితం ఒల్లరు. దుర్గాబాయికాలనీలో నివేశన స్థలం ఇస్తామన్నారు. ఆయన వొల్లనన్నారు. చిక్కడపల్లిలో ఆయన ఇంటిని చూసినప్పుడల్లా ఇది అగ్గిపెట్టలావుంది అంటూ వుండేవాడిని. అంతకు ముందు ఒక లాయరు ఆయింట వుండేవారు. ఆయన నూటపాతిక రూపాయలు అద్రేయిచ్చేవారు. ఇప్పుడాయన నూటయాభైకావాలన్నారు. నేను ఒప్పుకున్నాను.

నేను ఇంట్లో ప్రవేశించేముందు నాకు (న్తుశ్యాస్రుళ్య భేదాలు లేవనీ వ్యక్తిగతంగా సిగరెట్టు కాలుస్తాననీ పుస్తకాలంటే నాకు అభిమానం అనీ చెప్పాను. ఇంట్లో నాకన్న ముందు రామకృష్ణ మఠంవారి పుస్తకాలు కొన్ని (ప్రవేశించాయి. ఇవన్నీ మీవే అన్న ఓ కాగితం ఆ పుస్తకాలమీద వుంది. తోటలోంచి కాలనదాటితే మా

రాంభట్ల కృష్ణమూర్తి సొాంతకథ అ 121

అన్నగారి ఇల్లు ఆ యింటి నుంచి ఓ యాభైగజాల్లో మా మేనమామగారి ఇల్లు వున్నాయి. బిహెచ్‌యిఎల్‌లో వున్న మా రెండో మేనల్లుడు పెళ్లి మా అక్కయ్యకొక సమస్యగా మారింది. వాడు పనిచేసే కంప్యూటరు డివిజనులో ఓ అమ్మాయికూడా పనిచేస్తోంది. ఆమెను లవ్వాడాడు మావాడు.

అమ్మాయికి తండ్రిలేడు. తల్లి వుంది. ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. చెల్లెలికి పెళ్లి చేయాలి. తమ్ముడిని చదివించాలి. ఇవీ ఆమె బాధ్యతలు. ఈ రెండు బాధ్యతలు తీరిన తరవాత ఆమె తన పెళ్లిసంగతి ఆలోచిస్తుంది. హైదరాబాదుకు మా శాఖవారు ఎవరు వచ్చినా మా మేనమామగారిని కలవడం ఆనవాయితీ. ముంబాయి నుంచి ఒక పెద్దమనిషి ఇక్కడ చుట్టాలింటికి వచ్చాడు. ఆనవాయితీగా ఆయన మా మేనమామగార్ని కలుసుకున్నాడు. ఆయన కూతుర్ని ముంబాయిలో తమయింటి పక్కనున్న కుర్రవానికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉభయ కుటుంబాలు అంటూ వుండేవి.

ఇప్పుడుభయులకూ పెళ్లీడువచ్చింది. కాని కుర్రవాడు ఆ అమ్మాయిని ఒల్లనన్నాడు. అదీ సమస్య ఆ పిల్ల తండ్రి మామేనమామగారిని చూడ్డానికి వచ్చి యా ఉదంతాన్ని కూడా చెప్పారు. మామయ్య నాకు కబురు పెట్టారు. వెళ్లాను, రెండోమేనల్లుని పెళ్లి బాధ్యత నేను తీసుకున్నానన్న సంగతి ఆయనకు తెలుసును. నేను వెళ్లగానే కథంతా చెప్పి నా సలహా అడిగారు. అమ్మాయికి జ్వరం అన్నారు. అయినా ఆమెను తీసుకొస్తాం అన్నారు. ఆమె వచ్చింది. రంగు చామనచాయ, కనుముక్కుతీరు చక్కగా వున్నాయి. మావాడు ఆరడుగుల ఎత్తు. పిల్లకూడా మామూలుకన్న ఎత్తుగానే వుంది.

మా వాడి లన్‌నసంగతి అమ్మాయితో చెప్పాను. కలిసి ఉద్యోగాలు చేసేటప్పుడు అలాంటి లవులుంటాయి. అవి ఫలితమవడం అరుదు అని ఆమె చెప్పింది. ఆమె కూడా బొంబాయిలో ఏదో ఉద్యోగం చేస్తోంది. మావాడి సంగతులన్నీ చెప్పిన తరవాత తనకు అభ్యంతరం లేదంది. వాడిని కలిసి వాడికీ విషయం చెప్పాను. మీ ఆఫీసు అమ్మాయి ఆశయం గొప్పదే. కాని ఆమె ఆశయం నెరవేరేసరికి ఆమె తల నెరుస్తుంది. ఆమెకోసం నువ్వు తలనెరిపించుకొనడం ఎందుకన్నాను. బొంబాయి అమ్మాయితో నేను మాట్లాడాలి అన్నాడు. మా అన్నగారి అల్లుని తోడిచ్చి. బొంబాయి పంపాను.

ఇద్దరూ బొంబాయి వెళ్లారు. ఒక హోటల్లో అబ్బాయి, అమ్మాయి సమావేశానికి ఏర్పాటు చేశారు, అబ్బాయి, అమ్మాయి ఒక టేబిలు దగ్గర కూర్చుంటే మిగిలిన వారు కనుచూపు దూరంలో ఇంకో టేబిలు దగ్గర కూర్చున్నారు. ఓగంట అయింది. అంతాలేచారు. మావాడు పెళ్లికి తన అంగీకారం తెలియపరిచాడు. పెళ్లి హైదరాబాదులో. మా అక్కా, జావగారు, పిల్లలూ మ(ద్రాసునుంచి వచ్చారు. పెళ్లి అయింది. ఆలుమగలు బిహెచ్‌ఇఎల్‌ క్వార్టరులో కోపురం పెట్టుకున్నారు. చిక్కడపల్లి ఇంట్లో నేను, సుభద్ర, అమ్మాయి అరుణ మేం ముగ్గరమేవున్నాం. పిల్లకు తోడులేరు. అది మౌన శోకం,

పిల్లకు వ్యాపకం కల్పించడం కోసం కమ్యూనిస్ట్రపార్టీ విద్యార్థి సంఘంలో చేర్చించాను. అంతవరకు మందకొడిగా వున్న అమ్మాయి చురుకుపుంజుకుంది. నేను ఫ్యాక్టరీలో ఎజియివర్క్స్‌లోనే కొకుండా కాకతీయ కర్షక్‌ ఇండస్ట్రీస్‌ ప్రయివేటు లిమిటెడులో కూడా భాగస్వామిగా ఉన్నాను. ఆ కంపెనీ నుంచి నెలకు అయిదువందలజీతం నిర్ణయించారు మేనేజ్‌మెంటువారు. నేనింతవరకూ చేసిన ఉదో, గాలలో ఇదే అత్యధిక జీతం. అమ్మాయితోపాటు కమ్యూనిస్ట్ర పార్టీలో నా కార్యకలాపాలు కూడా పెరగసాగాయి. పార్టీసభ ఏలూరులో జరుగుతోంది. నేను అబ్బర్వరుగా ఎన్నికయ్యాను.

ఇంటికి తిరిగివచ్చిన తరవాత పార్టీ మహాసభ పట్నాలో జరుగుతోంది అని తెలిసింది. ఒకనాడు పార్టీ ఆఫీసులో నువ్వు డెలిగేటుగా పట్నావెళ్ళాలన్నారు. అది ఫిబ్రవరి నెల, పట్నా టెంపరేచర్‌ రెండు డిగ్రీలకు

122 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

అనలేను కవరులో టురష్యా టోపీతీసుకుని పట్నా వెళ్లాను. నేనూ. మహేంద్రా కలిసి వెళ్లాం. పరిచిన “పంప షు సప లన్నీ అయిపోయాయి. మేం ఒక గుడారంలో వరిగడ్డి మీద టార్బాలిన్‌ న్నాం. సూటు, ఓవరుకోటు, రష్యాటోపీ చలిని ఆపలేకపోయాయి. మా

గుడారం ఎదురుగానే టీ కుంపటివుంది. లేవగానే ఆకుంపటిముందు కూర్చునేవాళ్లం.

అంతకుముందే నన్ను ఇండోసోవియట్‌ కల్చరల్‌ సొసైటీ “ఇస్కస్‌” ర్యాష్ట్రప్రధానకార్యదర్శిగా ఎన్ను కున్నారు. అది వరకు ఆ సంఘం ఆంధ్రలో మాత్రమే ఉండేది. హైదరాబాదులో ఆ సంఘం పెట్టడానికి కొన్ని ఇబ్బందులుండేవి. అవి ఆంతరించాయి. కనక "హైదరాబాదులో ఎన్నుకున్నవాడే ర్యాష్టమంతటికీ (ప్రధాన కార్యదర్శిగా వుండాలని అదివరకే తీరా గనించుకున్నారు. ఇప్పుడు మక్టూం మొహియుద్దీన్‌ పట్టుబట్టి నన్ను ప్రధానకార్యదర్శిగా ఎన్నిక చేయించాడు. అటు ఆంధ్రజిల్హాలకు, ఇటు తెలంగాణాజిల్లాలకు అంగీకారం కలిగిన వాడిని నేనొక్కడినే, అందువల్ల నన్నే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు.

పట్నా కాన్ఫరెన్సులో ఇస్కస్‌ పీస్‌ కమిటీల కార్యకర్తల (ప్రత్యేక సమావేశాలు జరిగాయి. పీస్‌కాన్ఫరెన్సును హైదరాబాదులో జరపాలని నిర్ణయించారు. ఆకాన్ఫరెన్సుకు ఏర్పాట్లు చేసే బాధ్యత నాకప్పగించారు. హైదరాబాదు సిటీ కమిటీకి కార్యదర్శిగా మక్టూం మోహియుద్దీన్‌ ఉండేవాడు. ఆతని స్థానంలో కార్యదర్శిగా మహేంద్రను ఎన్నుకున్నారు. (బ్రైెజరరుగా మోహితొసీను ఉండేవాడు. ఆతని స్థానంలో నన్ను (టైెజరరుగా ఎన్నుకున్నారు. మక్టూం, మోహితొసేన్లిద్దరూ ర్యాష్ట్ర కమిటీకి వెళ్లారు.

హైదరాబాదు తిరిగి వచ్చిన తరవాత హిమాయత్‌నగరులో అరసం అంటే అభ్యుదయ రచయితల సంఘం కోసం తీసుకున్న గదిని తాత్కాలికంగా పీస్‌ కమిటీ కార్యాలయంగా మార్చాం, రెండునెల్లకోసం టెలిఫోన్నుకూడా తీసుకున్నాం. నేను తరుచు అదే ఆఫీసులో గడిసేవాడిని. ప్రిపరేటరీ కమిటీకి అధ్యక్షుడు మహేంద్ర. నేను కార్యదర్శిని. అరుణ తోడులేని ఒంటరిదయి పోయిందన్న బాధ సుభద్రను దహిస్తూ వుండేది. మనం వికలాంగులంకాలేదు కనక మరోయత్నం. చేద్దామన్నాను. మామేనల్లుని పెళ్లినాటికే ఆమె గర్భవతి అయింది.

ఇప్పుడామెను జయసూర్య భార్య ద్వారకాబాయి నర్సింగ్‌ హోంలో చేర్చారు. ఒకనాటి సాయంత్రం వేళ అక్కడి నుంచి నాకు ఫోను వచ్చింది. అరుణ ఉద్వేగంతో నాన్నగారూ నాకు తమ్ముడు పుట్టాడు అంది. ఆమె ఉద్వేగం సహజం, మా అన్నగారికి నలుగురు కూతుళ్లు. కరుణపోవడంతో అరుణ ఒంటరిదయింది. కాని తన అక్కలకులేని ప్రత్యేకతిప్పుడు తనకు ఉంది. అందుకనే ఉద్వేగం, వార్త ఇంతకు ముందే బర్కత్సురా వెల్లింది. నేను అర్జంటు పనులను చూసుకుని స్వీట్సు కట్టించుకుని బయలుదేరాను. అప్పటికి బర్కత్పురా అంతా అక్కడే వుంది.

శాంతి మహాసభ గాంధీ భవనంలో జరిగింది. మహాసభ సందర్భంగా మల్లిక్‌ ఒక కవితాసంకలనాన్ని తెచ్చాడు. ఆ సంకలనం మహాసభలో అమ్ముడుపోయింది. అప్పటికి అభ్యుదయరచయితల సంఘం పునరుజ్జీవితం కాలేదు. అందుకు సన్నాహాలు మాత్రం జరుగుతున్నాయి. సన్నాహకులు అటు ఇస్కస్‌లోనూ ఇటు శాంతిసంఘంలోనూ కూడా పనిచేస్తూ వుండేవారు. ఈ అన్నిసంఘాల్లోనూ కమ్యూనిస్టుపార్టీ యువజన సంఘం వారు గణనీయమైన పాత్ర వహించే వారు. పీస్‌ సంఘంవారు మహాసభను జేగీయమానంగా జరిపించినందుకు హైదరాబాదును అభినందించారు.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 123

ఆర్మేనియా దేశానికీ ఆంధ్ర దేశానికీ గల పోలికలను వివరించాను. మా తెలంగాణా కూడా మీలాగే కొండల బండల భూమి అన్నాను. ఆర్మేనియా వారు మనలాగే బిగ్గరగా మాట్లాడతారు. అది వ్యవసాయదారుల నహజ లక్షణం. రైతులు తమ తమ పొలాల్లో వని చేసుకుంటూనే మాట్లాడుకుంటారు. ఆర్మేనియాలాగే మన వరంగల్లు ఠూడా ముస్లిం దండయా(తను చూసింది. నీనా యమునా. ఆర్మేనియా యాత్ర

ఇష్క్‌ కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నాయి. ఆర్మేనియా నుంచి ఇద్దరు మైత్రీరాయబారులు వచ్చారు. వారిలో ఒకాయన కవి. రెండో ఆయన ఫిలాసఫీ (ప్రొఫెసరు. వీరిద్దరితో హైదరాబాదులో సభలు నిర్వహించిన తరవాత నాగార్జునపాగరు ఆనకట్ట సొరంగంలోంచి ఆవలగట్టుచేరి గుంటూరు వారికి అప్పగించాలి, వారిని అక్కడికీ ఇక్కడికీ తిప్పడానికి రావిసుబ్బారావుగొరు కారుతో సహకరించారు, ఆర్మేనియా మిత్రులు బయలుదేరిన దగ్గరనుంచి నాగొర్జునసాగరు చేరేవరకు నేను దిగ్నాగుని తర్కాన్ని గురించి మాట్లాడుతూనే వున్నాను.

ఆర్మేనియన్‌ మిత్రుడు తత్వశాస్త్రంలో ప్రత్యేకంగా తర్కాన్ని తీసుకున్నాడు. దిగ్నాగుని తర్కంగురించి నాకు అంతగా తెలియదు కాని తెలిసినంతవరకు ఆయనకు వివరిస్తూ వచ్చాను. అమృతసర్‌లో జరిగిన ఇస్కస్‌ మహాసభలో ఇండియాలోని రాజ్యాలకు సోవియట్‌ రాజ్యాల ఘనిష్ట స్నేహం ెంచుకొనడం కోసం జతలను ఏర్పరచారు. ఆంధ్రకు ఆర్మీనియాతో జత కలిపారు. కారు సాగరు సొరంగం దగ్గర దిగి సారంగ మార్గాన ఆవలకు చేరాం. అక్కడ కారుతో కొండేపూడి శ్రీనివాసరావు సిద్దంగా వున్నాడు. ఆర్మేనియన్‌ మిదత్రులను వారికి అప్పగించి అదే సొరంగం గుండా నడిచి మా కారెక్కాం.

నాకు నారాయణ ప్రసాద్‌ అన్న వ్యక్తితో దోస్తీ ఎక్కువయింది. ఆయనకు ఇస్కస్‌లో ఏదో నాయకస్టానంలో వుండాలన్న కోరిక, కాని ఆయన్ని తెలంగాణా జనం ఒల్లరు అని మక్టూంకు తెలుసును, కనక నాకు సహాయకంగా డాక్టర్‌ పద్మాళాస్త్రి వచ్చారు. ఆమె సిటీ కమ్యూనిస్టునేత, అమొలక్‌రాం పత్ని. ఆమె చిరకాలంగా హైదరాబాదులో వుంటున్నారు. ఇస్కసుకు పార్టీ గైడ్‌ మహేంద్ర. ఆర్మేనియా నుంచి ఇద్దరు మిత్రులు

124 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

వచా అవిం క దరి కూడా ఇద్దరు మిత్రుల్ని తమ దేశానికి ఆహ్వానిస్తూ ఆర్మేనియన్‌ నాయకులు

ఆందో * నల ఇన్కస జనరల్‌ సెక్రటరీని. భారత ప్రతినిధుల్లో నేను ఉండకతప్పదు. వెళ్లి విసా తీసుకున్నం. వారే రెండు. * ఢిల్లలొోనే పాసుపోర్టులు తీసుకున్నాం. సోవియటు ఆఫీసుకు ఆంధ్రకియాన్‌ న వద్‌ కలో అతస్మాకం ఇచ్చారు. అక్కడున్న ఉద్యోగులలో ఒకనిపేరు కాబుల్‌లో ఆగిప్రొతుంది. మా విమానం ఎ ఆసుకున్నాను. ఇద్దరం విమానం ఎక్కాం, ఆ విమానం ము త మర్షాడు బయలుదేరుతుంది. మేం ఏర్వేస్‌వారి హోటల్లో దిగాం.

ర్నాడు ఏర్వేస్‌ వారు ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లారు.

అకు కిసాన్‌ రాబర్థాని తాష్‌ఖంద్‌లో ఆగింది. మేం హైదరాబాదు నుంచి వస్తున్నాం కనక చూానిక ఇంటలప్రిటర్నిచ్చారు. ఏర్పోర్ట దగ్గరలోనే వున్న హోటల్లో విశ్రమించాం. ఊరు వీర ౦ చాలదన్నాడు దుబాసి. చాలా కాలం తరవాత మళ్లీ ఉరుదులో మాట్టాడాను.

'ద్రరావుగారు కూడా ఉరుదులో మాట్లాడ్డానికి యత్నించారు. ఆయన మాటలను నేను తిరిగి దుబాసికి అర్ధమయ్యే ఉరుదులోకి అనువదించే వాడిని. హిందీ మాట్లాడినా అసలు ఉరుదువారికి తెలీదు. అలాంటిది ఆంధధ్రజిల్లాల్లో మాట్లాడే ఉరుదు ముక్కలు వారికి అసలు అర్థం కావు. ఏడు నుంచి బయలుదేరి ఎరవాన్‌ చేరుకున్నాం. ఎరవాన్‌ నగరాన్ని ఉరర్హులు రెండువేల న్‌ ఏందల సంవత్సరాల కిందట నిర్మించారు. మేం వెళ్లడానికి కొద్దిరోజుల ముందే నగరానికి ఇరవై

దల డెబ్బయి అయిదవ జన్మదినోత్సవాన్ని చేసుకున్నారు. నగరం తొలిపేరు ఎరబూని. ఇప్పుడు

ఎరవాన్‌ అంటున్నారు. ప్రపంచంలోని అతి ప్రాచీన నగరాల్లో అదొకటి. ఉరర్తులు బీవర్‌ డాముల్డాంటి డయకులను నిరి గ్మంచడంలో నిపుణులు. మన వేదంలో కనిపించే వృత్రుడు ఈ ఉరర్హుజనానికి చెందినవాడే. ఉరర్హుజనాన్ని వేదం వృదత్రునిగా వర్షించింది.

ఉరర్హురాజు అర్లిష్టివేసిన శాసనళిల నాటి కోటవైపు వెళ్లేదారిలో రోడ్డుమధ్యన వుంది. ఆర్మీనియన్లు రెండు తెగల వారు. ఒక తెగను హయస్‌ అంటారు. మరో తెగను ఆరమ్‌ అంటారు. హయస్‌ తెగల (ప్రాబల్యం ఉన్న రోజుల్లో ఆ దేశానికి హయస్తాన్‌ అనిపేరు. ఇప్పుడు ఆరమ్‌ ప్రజల (ప్రాబల్యం కనక దానికి ఆర్మీనియా అన్న పేరుంది. ఆర్మీనియన్లు మంచివర్తకులు. వారు సకల దేశాల్లోనూ కానవస్తారు. బొంబాయి, "హైద్రాబాదు, మద్రాసు, కలకత్తాలో ఆర్మేనియన్‌ స్ట్థావరాలున్నాయి. యూదులు గొప్ప వర్తకులు. అలాంటి యూదులకన్నా మించినవారు ఆర్మేనియన్హు,

మాకు ఒక హోటల్లో చెరో గది ఇచ్చారు. ఆ హోటలు కిందనే రెస్టోరెంటు వుంది. ఉదయమే ఇంటర్‌ ప్రటర్‌ వచ్చేవాడు. అప్పటికి మేం స్నానం చేసి (డ్రస్సు వేసుకుని సిద్ధంగా వుండేవాళ్లం. ముందు కిందకు వెళ్లి ఫలహారాలు, ఆ తరవాత ఏదో ఒక ప్రాంతం చూడ్డానికి ప్రయాణం. క్రీస్తుపుట్టిన మూడువందల సంవత్సరాలకే ఆర్మేనియన్లు (క్రయిస్తవ మతం పుచ్చుకున్నారు. అప్పటికి (గ్రీకులు రోమన్లలో కొందరు మాౌ(త్రమే (క్రయిస్తవాన్ని స్వీకరించి అజ్ఞాతంలో వుండేవారు. (క్రయిస్తవాన్ని అందరికన్నా ముందు స్వీకరించిన ఘనత తమదేనని చెప్పుకుంటారు.

ఆర్మేనియా (ద్రాక్ష సారాయికి ప్రసిద్ధి. మేం వెళ్లిన మర్నాడే వైన్‌ కర్మాగారానికి తీసుకెళ్లారు. వైన్‌ని ఊరబెట్టే పీపాలు భూగృహంలో వుంటాయి. (ద్రాక్షపళ్ల తాజా రసం పోయడానికి కొన్ని పీపాలున్నాయి. ఆ

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 125

రసంకాస్త మాగిన తరవాత మరో పీపాకి వెళుతుంది. ఇలాగే రకరకాల పీపాలన్నీ ఆ భూగృహంలో ఉన్నాయి. ఒకసారి మక్సింగోర్కీ ఆ భూగృహాన్ని చూడడానికి వచ్చాడు. ప్రతి పీపానుంచీ కొద్ది కొద్దిగా చవిచూస్తూ కడకంటా వెళ్ళాడు. అప్పుడు మెట్లెక్కి పైకి రావాలనుకున్నాడు చాలా యత్నాలు చేశాడు. రాలేకపోయాడు. అప్పుడు బొగ్గు ముక్క తీసుకుని ఆరారాత్‌ పర్వతాన్నయినా సుఖంగా ఎక్కవచ్చును కాని ఈ ద్రాక్షాసవ గిడ్డంగి మెట్టెక్కడం మాత్రం సాధ్యం కాదు అని గోడమీద రాశాడు. ఉగ్గుగిన్నెలాంటి చిన్న గాజు పాత్రల్లో ఒకొక్క పీపానుంచి (ద్రాక్షాసవ తీసి మాకిచ్చారు. గోర్కీ అంతటి మహానుభావుడే చేయలేని పనిని మాచేత చేయించడానికి యత్నించవద్దు అని ఆ గిడ్డంగినుంచి త్వరగానే బయటపడ్డాం. ఆర్మేనియా వైనుకున్న 'ప్రశస్తే అలాంటిది మరి. మన అజంటా, ఎరోలా గుహల్లాగ కొండలో దాలిచిన చర్చిని చూడ్డానికి వెళ్ళాం. అది వారి తొలిచర్చి. ఆ చర్చిదగ్గర గొర్రెలను బలియివ్వడం రివాజు. ఆర్మేనియాలో గొర్రెలను కబేలాలో తప్ప మరే యితర ప్రదేశాలలోనూ కొయ్యడానికి వీల్లేదు. అంటే చట్టం ఒప్పుకోదు. కనక మొక్కుబడులను చెల్లించుకొనడం కోసం భక్తులు గొర్రెలను తెస్తారు. వాటిని చర్చిలో తిప్పి చాకుతో చెవికి గాటుపెట్టి ఆ నెత్తురుతో 'క్రాసువేసి ఆ గొర్రెను తీసుకుపోతారు. తరవాత దాన్ని కబేలాలోనే కోసి మాంసాన్ని భక్తులకు ఇస్తారు. భక్తులు ఆ ప్రసాదాన్ని బంధుమిత్రులకు పంచిపెడతారు. మన దేశానకూడా ఆలాంటి చట్టమూ, ఆరోగ్యవాతావరణం గల కబేలాలు వుంటే ఎంత బాగుండును అనిపించింది. మన దేశాన్న మాంసం తినేవారి సంఖ్య చాలా ఎక్కువ. దేవతల మీద నమ్మకాలు కూడా చాలా ఎక్కువే. మనదేశాన కోళ్ళు, గొర్రెలను మొక్కుకునేహారిని మూర్చులు, మూఢవిశ్వాసులు అని నిందించి జంతుబలి నిషేధించాలని వాదించే మహానీఖాపులే కాని వారు అధిక సంఖ్యాకుల ఆహారంమీద దాడి చేస్తున్నారన్న వాస్తవాన్ని ఎరగరు పాపం. బైబిలు తొలి ప్రవక్త ఆబ్రం తన కొడుకును దేవునికి బలి యివ్వబోతే ఆ బాలుని స్థానంలో గొర్రెను దేవుడు పెట్టాడన్న కధ వుంది. ఆ కథననుసరించి ముస్టింలు వందలాది గొర్రెలను బలియిచ్చి, బ్రీదు జరుపుకుంటారు. అఆబ్రహాంని వారు అబూబకర్‌ అని పిలుస్తారు. అంటే గొర్రెపిల్ల తండ్రి అని ఆమాటకు అర్ధం, ఆర్మేనియా కొండలు బండల దేశం. రైతులు కావిళ్లతో మన్ను తీసుకువెళ్లి కొండబండలమధ్య హోస్పి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆర్మేనియన్లకు దేశాభిమానం హెచ్చు. ఆ దేశాన ఒక శిల్పి ఎనిమిది అంచులున్న ఒక గుడిని నిర్మించాడు. అలాంటి భవనాన్ని మాదేశాన కూడా నిర్మించమని ఆ శిల్పిని ఎత్తుకుని పోయారు. మరొక దేశంలో అలాంటిది నిర్మించనని చెప్పి ఆ శిల్పి ఆత్మహత్య చేసుకున్నాడు, టర్కీదేశపు తురకలు దండెత్తి ఆర్మేనియాలో వున్న ఆచర్చిని ధ్వంసం చేశారు. ఆ చర్చి బాగాఉన్న రోజుల్లో ఒకరు కొయ్యమీద ఆ గుడి శిల్పాన్ని చిన్నగా చెక్కి దాచుకున్నాడు. మరో పాదిరీ కాగితంమీద ఆ చర్చి బొమ్మని గీసుకున్నారు. ఈ రెండింటినీ సంగ్రహించి కొయ్యతో ఆ చర్చిమాడల్ని తయారుచేయించారు. దాన్ని మ్యూజియంలో పెట్టారు. మాకే కాని మీలాంటి స్వాతంత్ర్యం వస్తే మా వరంగల్టులోని స్త్వయంభునాధ దేవాలయ శిధిలాలు ఆధారంగా ఆ దేవాలయాన్ని మేం నిర్మించుకొనగలం అన్నాను. దేవాలయ వాస్తువులో చం[ద్రఫలకం దొరుకుతే గుడికొలతలన్నీ మాకు తెలుస్తాయి అన్నాను. చందద్రఫలకొన్ని మూన్‌స్టోన్‌ అంటారు. జీర్జోద్దారణ చేయడానికి మా శాస్త్రాలు తోడ్పడతాయి. కాని ఏం లాభం మా ప్రభుత్వం మీలా సోషలిస్టు ప్రభుత్వంకాదు అన్నాను. సోవియట్‌ యూనియనులోని ప్రతి రాష్ట్రంలోనూ “ప్రావదా” అన్న పత్రిక వుంటుంది. ఇక్కడ కూడా 126 అ రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ

ఆర్మెనిస్కాయా ్రావదా అన్న పత్రికవుంది ఆ పత్రికా కార్యాలయానికి నన్ను తీసుకెళ్ళారు - ఆ పత్రిక ప్రధాన సిబ్బంది నన్ను ఇంటర్‌వ్యూ చేశారు, ఆర్మేనియాదేశానికీ ఆంధ్రదేశానికీ గల పోలికలను వివరించాను. మా తెలంగాణా కూడా మీలాగే కొండల బండల భూమి అన్నాను. ఆర్మేనియా వారు మనలాగే బిగ్గరగా మాట్లాడుతారు. అది వ్యవసాయదారుల సహజ లక్షణం. రైతులు తమ తమ పొలాల్లో పనిచేసుకుంటూనే మాట్లాడుకుంటారు. ఆర్మేనియాలాగే మన వరంగలు కూడా ముస్లిం దండయాత్రను చూసింది.

ఆర్మేనియా మీద టర్కీవాళ్లు దండయాశ్రచేసి ఒక్క ఎరవాన్‌లోనే పదిహేను వేల మందిని ఊచకోతకోశారు. రాజుగారి సేనాని ఆయుధాగారాన్ని తెరిచి మాతృదేశాన్ని రక్షించండి అని ప్రజలను కోరాడు. జనం ఆయుధాలతో తురకలను తరిమికొట్టారు. ఆసేనా నాయకుడు రాజరికపు కాలంవాడే అయినా అతడిని ఆర్మేనియన్లు విష్ణవకారునిగా భావిస్తారు. విష్ణవమ్యూజియం ద్వారం మీద ఆ సేనాని నిలువెత్తు చిత్రపటం వుంది. అతడిపేరు ఆంధ్రానిక్‌ ఆరే నియాభాషలో ఆంధ్రఆంటే అ(గ్రజుడు. అ(గ్రేసరుడు అని అర్ధం.

ఆనాటి ఆర్మెనిస్కాయా ్రావదాలో తొలి పేజీ అంతా నా ఇంటర్‌వ్యూతోనూ, ఫోటోలతోనూ నిండిపోయింది. అంతకుముందు ఆంధ్రను సందర్శించిన ఆర్మేనియా మి(ష్రులు ఒక కొండగుహలా కట్టినచోట మాకు విందు చేశారు. ఫిలాసఫీ ప్రొఫెసరు యూనివర్సిటీ ముఖ్య'ప్రొఫెసర్లను పిలిచాడు. అక్కడ నన్ను తత్వశా(స్తాలు బాగా తెలిసినవానిగా పరిచయం చేశాడు. భారతీయ తత్వశా(స్తాలమీద కొందరు ప్రొఫెసర్లు ప్రశ్నలు వేశారు. వాటికి నాకు తెలిసిన మేరకు జవాబులిచ్చాను. నాటి విందు ఒక విద్యా గోస్టిలా సాగింది. వారి ప్రాచీన (గ్రంధాలయం పేరు మతనదరాన్‌. దాన్నీ తిరిగి చూశాను.

హౌవెన్నె తౌమాన్యాన్‌ ఆనే ఆయన ఆర్మేనియన్ల జాతీయకవి. ఆయనకీ మన గురజాడ అప్పారావుగొరికీ పోలికలున్నాయి. ఆయన అఆనుష్‌ అన్న ఒక విషాదాంత నాటకం రాశారు. దాన్ని ఆర్మేనియన్సు తమ జాతీయనాటకంగా భావిస్తారు. అక్కడ గోడమీద (ఫ్రేముకట్టిన చిన్న పిల్ల చిత్రం వుంది ఆ పిల్లగాధ మన పూర్షమ్మలాంటిదే. ఆనాడు అక్కడ కూడా బాల్య వివాహాలుండేవి. అమ్మాయి తండ్రి “వరదాపేత్‌” ఆంటే పురోహితుడు. ఓ ముసిలి జమీందారుకిచ్చి పెళ్లి చేయబోగా ఆమె కూడా మన పూర్ణమ్మలాగే దేవునిలో కలిసి పోయింది.

ఆర్మేనియా, సోవియట్‌ యూనియనులో ఒక రాష్ట్రంలాంటిదయినా రష్యన్హు వారిని సమానంగా చూడరు. తమ పెద్దన్నతనాన్ని ప్రదర్శిస్తూ వుంటారు. ఇది ఆర్మేనియన్లకు కాస్త బాధాకరంగా వుంటుంది. నేను వెళ్లిన రెండోరోజే ఈ సంగతిని (గ్రహించాను. మొట్టమొదట భారతదేశాన్ని, సందర్శించిన పాశ్ళాత్యుడు ఆఫనాసీని కెతిన్‌ అన్న రష్యను జాతీయుడు. ఒక ఆర్మేనియను విద్వాంసుడు క్రీస్తుశకం (ప్రధమ సహ'స్రాబ్లిలోనే భారతదేశాన్ని సందర్శించి తన అనుభవాలను (గ్రంథస్థం చేశాడు. ఆ (గ్రంథం వతనదరానులో నేను చూశాను. ఆర్మేనియా నుంచి బయలుదేరేముందు వారి టీవీలో నన్ను మాట్లాడమన్నారు.

నేను ఇంగ్లీషులో మాట్లాడితే దానికి దుబాసీ చేసిన అనువాదమే టీవీలో నానోట (ప్రసారమయినట్టు తీశారు. భారత రష్యను సంబంధాలు అయిదు వందల ఏళ్లనాటివయితే ఆంధ్ర ఆర్మేనియన్‌ సంబంధాలు అయిదువేల సంవత్సరాలనాటివి అన్నాను. ఆంధ్రశబ్బానికి జన్మనిచ్చిన శునళ్ళేపుని గాధను వివరించాను. వర్తక, వాణిజ్యాల్గో ఆర్మేనియన్ల గొప్పదనం వివరించాను. హైదరాబాదులో ఆర్మేనియన్ల ఖనన క్షేత్రం వుందన్నాను. దాన్నిబట్టి ఆర్మేనియన్లు ఇక్కడ చాలా కాలం నివసించారని రుజువవుతుందన్నాను. నేను

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 127

మీదేశం నుంచి గొప్ప విలువైన వస్తువును తీసుకుపోతున్నానన్నాను. అది నా కొడుక్కి పెట్టదలిచిన పేరు “ఆర్మెన్‌" అని చెప్పాను. ఆర్మేనియానుంచి మాస్కోకు బయలుదేరాం, అది ఆదివారం. నీకొడుక్కి నామకరణం ఎలా చేస్తావు అని అడిగాడు దుబాసి. నేను మరిచిపోయాను అంటూ విమానాన్ని పదినిమిషాలు ఆపమని చెప్పి వెనక్కు వెళ్ళాడు. ఒక ఆర్మీనియన్‌ షాంపేను సీసాతో తిరిగి వచ్చాడు. మీవాడికి ఆర్మేనియన్‌ ద్రాక్షాసవంతోనే ఆర్మెన్‌ అని పేరు పెట్టాలని ఆ సీసా నాకిచ్చాడు. ఆర్మేనియా నుంచి మాస్కో వచ్చాం. క్రైమ్లిన్‌కి దగ్గరలోనే వున్న ఉైనియన్‌ హోటెల్లో మాకు బస ఏర్పాటు చేశారు. ఎరవాన్‌ హోటెల్లో ఎప్పుడూ జనం మాటలు వినిపిస్తూవుండేవి. మాస్కో హోటల్లో అంతా ప్రశాంతం. ఆర్మేనియన్లు జానపదులు. రష్యన్గు నాగరికులు. మాస్మ్కోవెళ్లిన రోజే మేం ఊరి వెంట కాలినడకను బయలుదేరాం. దారిలో ఎదురయిన కొందరు స్త్రీలు, పురుషులు వచ్చి నన్ను కావలించుకుని ఆర్మేనియన్‌ భాషలో ఏదో అంటూ వుండేవారు. మా దుబాసీకి రష్యన్‌ తప్ప ఆర్మేనియనురాదు. అప్పుడు అలాంటివారు అభినందించినప్పుడు నేను “స్నోరాకలుత్సున్‌” అంటూ వుండేవాడిని. ఆ మాటకు ధాంక్యూ అని అర్ధం. ఈ ఒక్క ఆర్మేనియన్‌ మాటలోనూ మరికొన్ని ఇబ్బందులు వచ్చాయి. నన్ను నిలబెట్టి ఏదో మాట్లాడేవారు. అది నాకు అర్ధం కాదు. అందుకు చిరునవ్వు చిందిస్తూ తల ఊపుతుండేవాడిని అందరూ నన్ను పట్టుకునేవారు కాని వీరభద్రరావుగార్ని ఎవరూ పలకరించేవారు కాదు. అప్పుడర్హం అయింది. మాస్కోలోని ఆర్మేనియన్హు నన్ను టీవీలో చూశారు. ఆర్మేనియన్‌ ప్రసంగం నేనే చేశానని వారు భావించారు. సోవియట్‌ వారు బృందం నాయకునికి ప్రత్యేక గౌరవం ఇస్తారు, బృంద సభ్యులకిచ్చే మర్యాదలు వేరు. మేం ఇద్దరమే కనక సరిపోయింది. లేకపోతే బృందనాయకునికి 'ప్రత్యేకకారు, ప్రత్యేక దుబాసీని ఏర్పాటుచేసేవారు. పెద్దగదులున్నా మా ఇద్దరినీ ఒక గదిలో వుంచలేదు. నాక్షు 'ప్రత్యేకగది. ఆర్మెన్‌స్కాయా ప్రావదా ఇంటర్వ్యూ నా ఒక్కనితోనే జరిగింది. అలాగే టీవీకార్యక్రమం కూడా నా ఒక్కనిత్రోనే జరిగింది. ఎందుకంటే ఏకవ్యక్తి బృందానికి నేను నాయకుడిని. మాస్కోలో చూడవలసిన ప్రదేశాలనన్నింటినీ చూపించారు. భారత - రష్యా సాంస్కృతిక సంఘం కార్యాలయానికి తీసుకెళ్లారు. ప్రతీచోటా మా ఫోటోలు తీసేవారు. అక్కడి నుంచి బయలుదేరే సమయాన్సిక్షి ఆ ఫోటో(గ్రాపులను అందించేవారు. కొందరు కెమేరాను చూడగానే ఫోటోగ్రాపుకు అనువుగా భంగిమలను మార్చుకుంటూ వుంటారు. నాకు ఫోటోలమీద ప్రత్యేక శ్రద్ధ లేదు. అంతవరకు వెనకనున్న వారు కెమేర్రాన్సు చూడగానే ముందువరసలో కనిపిస్తారు. నేను కెమేరాను లక్ష్యం చేయను. దానికోసం ఆంగిక్త సాత్విక భావాలను ప్రదర్శించను. అది నా అలవాటు. మాస్కోనుంచి రైలులో లెనిన్‌ (గ్రాడ్‌ బయలుదేరాం. ఒక పెట్టె రెండు మంచాల హోటలు గదిలాగ వుంది. తెల్లవారేసరికి రైలు లెనిన్‌[గ్రాడు చేరింది. జారుచక్రవర్తుల పరిపాలనా కాలాన కట్టిన ఒక ఇంగ్లీషు హోటల్లో మాకు బస ఏర్పాటు చేశారు. నీవియానదిలో అనేక దీవులమీద కట్టిన నగరం లెనిన్‌ గ్రాడ్డ్‌ రోడ్లన్నీ వంతెనలు, ఒక చిన్న దీవిని పూర్వం జైలుగా వాడేవారు. ఆ దీవిని పీటర్‌పాల్‌ దుర్గం అని పిలుస్తారు. ఆ జైల్లో మక్సింగోర్కి కూడా కొంతకాలం గడిపాడు. రాజసౌధం పొడవుగా ఉంటుంది, అదిప్పుడు హెర్మిటేజ్‌ అనేపేర పెద్దమ్యూజియంగా వుంది. ఆ మ్యూజియం అంతటినీ స్థానికులు చూడగలరు కాని పర్యాటకులకు సాధ్యంకాదు. ఒకచోట పీటర్‌ ది గ్రేట్‌ శిలా విగ్రహం వుంది. ముంగాళ్లనెత్తి నిలబడ్డ గుర్రంమీద వుంటుంది పీటర్‌ 128 అ రాంభట్ల కృష్ణమూర్తి సొాంతకథ

విగ్రహం. ఆ విగ్రహం చుట్టూ పిట్టగోడ. ఆ వి(గ్రహాన్ని అవమానపరిచిన ఒక జానపదుని గురించి పుష్కిన్‌ కవిత్వం రాశాడు. ఆ జానపదుడు పిట్టగోడచుట్టూ తిరిగి పీటర్‌వైపు తూ అని ఉమ్ముతాడు. అంతే గుర్రానికి రోషం వచ్చి వాడి తలను ముంగాళ్లతో చితగ్గొాడుతుంది. ఈ కవితకు సినిమా రూపం యిచ్చాడు పుదోవ్‌కిన్‌. దాన్ని చిత్రించడం కోసం పుదోవ్‌కిన్‌ వేసుకున్న స్కెచ్చెస్‌ చూపడానికే రామకృష్ణ శాస్త్రిగారు ఆ పుస్తకం తెచ్చి యిచ్చారని ఇదివరకే రాశాను. ఇప్పుడు పీటర్‌ రాజసాన్నీ ఆయనెక్కిన గుర్రపుభీకరాన్నీ ప్రత్యక్షంగా చూశాను

లెనిన్‌ (గ్రాడు ఇంపీరియలిస్టు రాజధాని. రాజధాని హంగులన్నీ ఉన్నాయి. భూస్వాములు కన్యకల స్కూలు అక్కడే వుంది. ఆ స్కూలులో ఆఖరి గది, విప్లవం తరవాత లెనిన్‌ ఆఫీసుగా పనిచేసింది. నిరాడంబరమయిన ఆ గదిని కూడా చూశాం. హెరిటేజ్‌లో రెండుమూడు గదులకన్న ఎక్కువ చూడ్డానికి వీలులేకపోయింది. లెనిన్‌ (గ్రాడు కమ్యూనిస్టు పార్టీ నాయకునితో ముచ్చటించిన తరవాత తిరిగి మాస్కోకి. చేరుకున్నాం. మాస్కోలో విమానం ఎక్కి ఢిల్లీ వచ్చాం కాని ఢిల్లీలో దిగలేదు. హైదరాబాదు విమానం కోసం రెండుమూడు గంటలు అక్కడే కాలక్షేపం చేసి హైదరాబాదు విమానం ఎక్కాం, మేము తిరిగివస్తున్న సంగతెవరికీ రాయలేదు.

అందుకని విమానాశ్రయం దగ్గరకెవరూ రాలేదు. మేమిద్దరమూ ఒక టాక్సీ తీసుకుని చిక్కడపల్లిలోని మా యింటికి వచ్చిన తరవాత వీరభద్రరావుగారు కాస్త రిఫ్రష్‌ ఆయి గుంటూరుకు బయలుదేరారు. వచ్చిన తరవాత వారం రోజులకు మా అన్నగారినీ, నా మిత్రుడు నారాయణ'ప్రసాదుగారినీ పిలిచి ఆర్మేనియా ద్రాక్షాసవం సాక్షిగా నెలల పిల్లవానికి ఆర్మెన్‌ అని 'పేరు పెట్టాను. మా అన్నగారిని మా అమ్మ సూరీ అని పిలుస్తూవుండేది. అందుకని పిల్లవాని ఇంటిపేరు సూరి అని మార్చాను. మా మేనమామగారు కుమార్‌ అన్నమాట కలిపారు.

మా అన్నగారికి నలుగురు ఆడపిల్లలు. కొడుకుల్లేరు. ఆయన పేరు నిలపడంకోసం మా వదినగారి మేనల్టుళ్లు కొందరికి సూర్యనారాయణరావు అని పేరు పెట్టారు. నాకొడుక్కి కూడా అదే పేరు పెట్టమన్నారు. ఆయన పేరు సూర్యనారాయణరావు. అది సామాన్యమైన పేరు. ఒక కుర్రవాడికి ఆపేరు పెట్టినంతమాత్రాన ఆయన పేరు నిలవదు. చిన్నప్పుడాయన్ని పెద్దలందరూ సూరీ అని పిలిచేవారు. తరవాత ఆయన వ్యాపారంలో దిగిన తరవాత సూరీ ఇండటస్టీస్‌ మొదలుపెట్టారు. సూరీ పంపులు, సూరీ ఇంజన్ను తయారుచేసే వారు. అందుకని ఆ పేరుకు ఓ ప్రత్యేకత వుంది. కనక ఆ ప్రత్యేకతను నిలబెట్టాలని నా ఉద్దేశం.

తాను పెట్టిన పేరును నేను మార్చబోను అన్న నమ్మకంతో మా మేనమామగారు పిల్లవానికి 'ప్రద్యుమ్నకుమారని పేరు పెట్టారు. నేను ఆర్మేనియా నుంచి ఆర్మెన్‌ అన్న పేరును తీసుకువచ్చాను. కనక మా మేనమామగారు పెట్టిన పేరు మొత్తం కొట్టిపారీయకుండా కుమార్‌ అన్నభాగాన్ని ఉంచాను. దాంతో కుర్రవాడి పేరు ఆర్మెన్‌కుమార్‌ అయింది. ఇంటిపేరు ఆధునిక పద్దతి (ప్రకారం ఆఖర్న వస్తుంది. సూరి అన్న ఇంటిపేరు తెలంగాణాలో కొందరు బ్రాహ్మణులకు ఉంది. అలాంటివారిలో సూరిభగవంతంగారు (ప్రముఖులు. పాతపద్దతి ప్రకారం ఆయింటిపేరు ఆదిలో వుంది. మావాడిది ఆధునికపద్దతిన ఆఖర్న వుంటుంది.

నాపేరు ఇంటిపేరుగా గలవారు ఆదిలాబాదులో వున్నారు. వారు జ్యోతిష్యులు, పంచాంగ కర్తలు కూడా, వారిపేరున రాంభట్ల వారి పంచాంగం ప్రతి యేటా వస్తూవుంది. (బబ్రాహ్మాణుల్టో ఒకేయింటి పేరుగల

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 129

వారు రెండుమూడు శాఖల్లో కనిపిస్తారు. వేదం వారూ, వేదులవారు, శిష్టావారూ, శిష్ట్టావారు భిన్న శాఖల (బ్రాహ్మణుల్లో కనిపిస్తారు. (గ్రామనామాలు ఇంటిపేర్లుగా గలవారు అన్ని కులాల్లోనూ కానవస్తారు. అసలు తెలుగు వారి ఇంటిపేర్లు మూడు రకాలుగా వుంటాయి. ఒకటి (గ్రామనామం. రెండు ప్రసిద్ధ పురుషనామం, మూడు బిరుదనామం. ఇవే తెలుగు నాట ఇంటిపేర్లకు మూలం, నేను పర్యటనకు వెళ్లినప్పుడు ఆ పర్యటన కధను పత్రికల్లో రాసే అలవాటులేదు. అలవాటు తప్పిరాసిన ఉదంతం ఒకే ఒకటి వుంది. అది నా లంక ప్రయాణగాధ. ఆనాడు నేనొక పత్రికను ఎడిట్‌చేస్తూ వున్నా ఆ న్‌ శ్ర పత్రికలో పర్యటన కధ రాయలేదు. ఆంధ్రప్రభలో రాశాను. ఇప్పుడు ఆర్మేనియా గాధను రాయలేదు కాని యౌపాన్నాన్‌ తౌమాన్యాన్‌కీ, గురజాడ అప్పారావుగారికీ గల పోలికలను వివరిస్తూ విశాలాంధ్రకు వ్యాసం పంపాను. ఆర్మేనియా నుంచి తిరిగి వచ్చిన తరవాత ఇస్కస్‌ కార్యకలాపాలు పెరిగాయి. తెలంగాణాలో చాలా ప్రాంతాలకు ఇస్కస్‌ వ్యాపించింది. అందువల్ల సభను తెలంగాణాలో జరపాలని నిర్ణయించాం. ఆర్మేనియా నుంచి తిరిగి వచ్చిన తరవాత నన్ను ఆర్గనైజేషన్‌లోకి తీసుకోవాలని నాయకులు అనుకున్నట్టున్నారు. అందుకు అనువుగా ముందు నన్ను ఎడ్యుకేషన్‌ డిపార్‌మెంటులో వేశారు. అంతవరకూ చ ఎడ్యు న్‌ నగరనాయకులుగా ఉన్న మఖ్టూంని మోహిత్‌ సేన్‌ని ర్వాష్రకమిటీకి తీసుకోవాలనుకున్నారు. ముందు నగర కమిటీ సభను జరిపించాలి. ఆసభలో ఎన్నికలు జరిపించాలి, అలాగే సభ జరిగింది. మఖ్లూం స్థానంలో న! మహేం[ద్రను కార్యదర్శిగా ఎన్నుకున్నారు. మోహిత్‌ సేన్‌ స్థానంలో నన్ను కోశాధికారిగా ఎన్నుకున్నారు. మోహిత్‌కు ఎడ్యుకేషనుమీద అభిమానం, ఆయన మార్క్సిస్టు అధ్యయనకేంద్రాన్ని స్థాపించాడు. అక్కడ మార్క్సిజంమీద ప్రసంగాలు జరుగుతూ వుండేవి. దానికి వార్షికోత్సవాన్ని కాస్త ఘనంగా చేయాలనుకున్నాడు. ఢిల్లీనుంచి భవానీ సేన్‌ను పిలిచారు. మద్రాసునుంచి ఒకరు, కేరళనుంచి మరా ని ( , 0 కరు వచ్చారు. ఆంధ్రనుంచి సీనియరుగారినీ, ఏటుకూరి బలరాం మూర్తిగారినీ ఆహ్వానించారు. వీరంతా మార్క్సిజంలో ఏదో ఒక అంశంమీద పత్రాలు రాసుకువచ్చారు. సమావేశానికి కామ్రేడ్‌ భవాసిసేన్‌ అధ్యక్షత వహించాడు. తొలిరోజున అధ్యక్షోపన్యాసం తరవాత ఇద్దరు ప్రసంగించారు. మలిరోజున మరో యిద్దరి ప్రసంగాలు అయ్యాయి, నన్ను కూడా మాట్లాడమని కోరారు. నేను పత్రం ఏదీ రాయలేదన్నాను. పరవాలేదు ఆసువుగొనే మాట్లాడు అన్నాడు భవానీసేన్‌. నేను ఫోక్‌ ఫిలాసఫీ ఆఫ్‌ ఆంధ్ర అన్న అంశంమీద మాట్లాడాను. పద్నాలుగూ పదహారు శతాబ్దాల మధ్య తెలుగున జానపద తాత్వికులు చాలామందిపుట్టారు. నా చిన్నతన 0లో వారి తత్వాల పుస్తకాలు అణాబేడకు దొరికేవి. ఇప్పుడవి అమ్మేవారూ లేరు, కొనే వారూ లేరు చిన్నతనంలో వారి తత్వాలను విన్నాను. ఆనాటి తాత్వికులు సాంఖ్య సిద్దాంతానికి చాలా 'ప్రచారమిచ్చారు. ఆ తత్వాల్గో సాంఖ్యం నిరీశ్యర వాదం. శుద్దబౌతికవాదం. నా ఆసుప్రసంగం భవానీసేన్‌కు బాగా నచ్చింది. నేను ఢిల్లీ వెళ్లినప్పుడల్హా కాద్రేడ్‌ నీ ప్రసంగాన్ని అక్షరబద్ధం చేస్తే బాగుంటుందనేవాడు. కామ్రేడ్‌ నేను దక్షిణాది 'బ్రాహ్మ్జి, న్‌ వేదాలను వల్తించడమే తప్ప రాయం, చదవ [ పలాస త ఏ గాయం బ్ర అన్నాను. ఆ మాటకు ఇద్దరం నవ్వుకున్నాం. నేను ఇంగ్లీషులో ఫోక్‌ ఫిలాసఫీ న్నా శ "నతి కాయిత దర్శనం. నా (ప్రసంగం నాటికి దేవీప్రసాద ఛటోపాధ్యాయరాసిన లోకాయతం అ, న్న వస్త న్ని ను చదవలేదు. తెలుగు తాత్వికులు, దేవుడినీ, కులాల హెచ్చుతగ్గుల్నీ, పురోహితుల 'ప్రాధాన్యాన్నీ ఒప్పుకునేవారుకాదు. ఆ తత్వాలు పాడేవారు కూడా ఆ మూడింటినీ తిరస్కరించేవారు. న ను 1306 రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

ర మనవారి లెక్కల (వ్రకారం అనుమానం రెండోదళ అనుమానం అంటే (ప్రమాణానికి రెండోదళ అని అర్ధం. అంతేకాని ళంక అని అర్జం కాదు. దన్సే హేతువాదం అనికూడా అంటారు. హేతువాదమే నర్వన్వం కాదు. దానికి ఆధారం (ప్రత్యక్షం. వ్రత్యక్తజ్ఞానం ఎంత విశాలంగా వుంటే తర్భజ్తానం అంటే హేతువాదం నత్యానికి అంత దగ్గరగా వుంటుంది. మూడోదళను ళజ్ఞం అన్హారు. శజ్జం అంటే వేదం అని బ్రావ్మాణ పండితులూ, శబ్దం అంటే ఆప్తవాక్యం అని బౌద్ధ, జైన వండితులూ అంటాడు. మార్క్సిస్టులు మాత్రం సామాజికార్థళ ఆచరణ అంటే ఆచారం అని చెబుతారు. ఆాాయాాయనాా జి తత్వశాస్తాధ్యావన నేను డయలెకిక్సు మీద పారాలు తెలుగులో చెప్పాను. ఉరుదులో అచ్చయిన మాస్కో పుస్తకాలు చూసి ఉరుదులోకూడా పాఠాలు చెప్పాను ఇంగ్లీషులో పాఠాలు చెప్పాను. ఆనాడు మార్క్సిస్ట్ర అధ్యయనం మీద కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది. అందుకని ఫిలసాఫికల్‌ సెమినార్‌ పేర పదిరోజుల సమావేశం జరపాలని నిశ్చయించింది. ఆ సెమినార్‌కి హైదరాబాదు నుంచి నన్నూ, మఖ్టూంనీ పిలిచారు. (విజయవాడ నుంచి బలరామమూర్తిగొరు వచ్చారు.) ఆనాడు పార్లమెంటు మెంబరు ఈశ్వరరెడ్డిగారు జనపధం ఇరవైనాలుగో నెంబరు బంగొళాలో వుండేవారు. అది మాకు బస. సిమినారు జండేల్‌వాలా. మూ నాహ్తా భోజనమూ పడకా జనపధంలోనే. ఆగృహ నిర్వహణ అంతా కా్రుడ్‌ ఘాటే చూసేవారు. చండ్రరాజేశ్వరరావుగారు కూడా అక్కడే వుండేవారు. ఆ సెమినారులోనే నాకు దేవీ ప్రసాద్‌ ఛటర్జీ పరిచయం అయ్యాడు. తమిళనాడు నుంచీ కేరళనుంచీ ఇద్దరు వచ్చారు ఢిల్లీలో మఖ్టూంకి చాలా మంది కవి మిత్రులుండేవారు. సాయంత్రం ఆ మిత్రులతో కవితాగోస్టి రాత్రి భోజనాలవేళకు కామ్రేడ్‌ ఘాటే గంట వాయించేవాడు. ఆ ఘంటానాదం విని భోజనానికి వెళ్లేవారు సాయంత్రం మఖ్తూంరాగొనే ఆయన నోటిని వాసన చూసేవాడు. ముషాయిరా అంటే కవితా గోస్టిలో స! చుక్కపడందే నోట ముక్కరదు రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ అ 131 ౮

ల్‌ ది. మఖ్టూం, ఘాటేను అత్తగారు అంటూ వుండేవాడు. నిజమే ఆయనది అత్తగారి పెత్తనంలాగే వుంటుం: ఇ అది చలికాలం. మేం సూటుమీద ఓవరుకోటు కూడా వేసుకునే వారం. ఒకరోజున మనం అత్తగా ని ఎదురుగానే కవితా గోప్టి పెట్టుకుందామన్నాడు మఖ్దూం. ఇద్దరం బజారుకెళ్లి రెండు క్వార్టర్లను తీసుకు ం వాటిని ఓవరుకోటు జేబులో పెట్టుకున్నాం. మరో జేబులో వేరుసెనగకాయలు నింపుకున్నాం. బంగాళా రోడ్డువైపు ఒక చెట్టు వుంది. ఆ చెట్టు కిందకు చేరి కూర్చున్నాం. మఖ్టూం గజల్స్‌ పాడేడు మధ్యమధ్య మాటలు, సీసామూత విప్పి ఒక గుటక. నాకు పాటరాదు. పద్యాలు చదివేవాడిని. మేం కూర్చున్న చెట్టుకు ఎదురుగానే వరండామీద కుక్కను వెంటబెట్టుకుని పచార్జు చేస్తూ వుండేవాడు ఘాటే సీసాలయిపోయాయి. లేచాం. బంగళాపక్కనే రోడ్డు. ఆ రోడ్డుమీద ఓ పక్కన కాలవ. అక్కడిదొకొ నడిచివెళ్లి సీసాలను కాలవలో పడేసి తిరిగి వచ్చాం. వచ్చిన కాస్సేపటికి ఘంటానాదం. భోజనాలకు వెళ్లాం. మాబుద్ధిమంతనాన్ని ఘాటే ప్రశంసిస్తూ మా పాటలు పద్యాల సంగతి సియార్‌ తదితరులకు వివరించి చెప్పాడు. అవును వాళ్లు ఇద్దరూ బుద్ధిమంతులు అన్నాడు సిఆర్‌: అలాగ ఇరవైనాలుగు జనపధ్‌లో మౌ కీర్తి నిలిచిపోయింది. సెమినార్‌కు వచ్చిన మిత్రుల్లో తమిళనాడు నుంచి వచ్చిన మిత్రుడు ప్రాచీన తమిళ కావ్యాలలో భూతవాదుల ప్రస్తావనలున్నాయని ఆ కధలను చెప్పాడు. భూతవాదుల ప్రస్తావన మా కావ్యాల్లో కూడొ వుందని నేనన్నాను. ఒక్క భూతవాదులే కాదు హేస్రువాదుల ప్రస్తావన కూడా వుంది. వీరిని భౌతిక హైతికులనేవారు. మలయాళ మిత్రుడు ఈ దేశానిక్ర వచ్చిన సర్వ అనర్జాలకూ శంకరాచార్యుడే కారణం అని ఉపన్యసించాడు. తమిళమిత్రుడు భౌత్రిక హైతిక తత్వాలను, మలయాళ మిత్రుడు శంకరాచార్య తత్వాన్నీ విడమరచలేదు. సమ్లావేశాన్సిక సజ్బాద్‌ జహీర్‌ క్రూడ్లా వచ్చాడు. అతన్నందరూ బన్నే భాయి అంటారు. సమావేశానికి వచ్చిన స రచయితల సంఘపు ం మురియాళ నాయకులు సద్దాద్‌, జహీర్‌, మఖ్ళూం వీరు ముగ్గురూ అభ్యుదయ విధానానిి గురి బీ నరుజ్జేవనబాధ్యులు, వీరు ముగ్గురూ ఢిల్లీలోనే వున్న ఇతరులూ కలిసి పునరుజ్జీవన అలా న చర్చిస్తూ వుండేవారు. ఆ చర్చ సెమినార్‌ చర్చల తరవాత మరోచోట జరిగేది' ంటప్పుడు నేనొక్కడినే జనపధాన్సిక్రి తిరిగివచ్చేవాడిని. కామ్రేడ్‌ ఘాటే మభ్లూం మూతిని వాసన చూసేవాడు. భూతవాదం అంటే మెటీరియలిజం అని రం. పూడ బ్ర దూరంగొ వుండేవారు. అలాగే హే తువాదు అర్థం, పూర్వపండితులు భూతవాదులకు ల ్త్‌ భూతవాదు ల క్కూడా, వాతువాదులని చార్వాకులని కూడా అనేవారు. శాతవాదులను అనువదించుకున్నారు సల్టీమలో ఎగాన్ట్‌లంటారు. ఆ మాటను మనవారు అజ్జేయవాదం అని అను న్నారు. తవాదులు (ప్రత్యక్ష ప్రమాణం తప్ప మరో (ప్రమాణాన్ని అంగీకరించరు. అంస్కృతాన జ్ఞాతా అంటే తెలిసినవాడ్తు. జ్ఞానం అంటే ని అర్తం. ఆజ్జేయం అంటే తెలుసుకునే అవసర, లేస్‌ తెల్రవిడ్తి జ్షేయం అంటే తెలియదగింది అ రు ఇంగ్లీషు భాషలో మిగతావి తెలుస అన ని అర్థం. మన వాళ్లు ఒక్క ప్రత్యక్షం చాలు అన్నా." (ర తెలుసుకొనవలసిన అవసర, 6 మూడు దళలున్నాయంటారు. ఒకటి ఐంద్రియ (౦ లేదన్నారు. అంతే. పండితులు జ్ఞానానికి “ నం. దీ క ణం నేత్రం ప్రధానం. "పం దీన్నే మనవారు ప్రత్యక్షం అన్నారు. సర్వంద్రియా మనవారి లెక్కప్రకారం అనుమాన ని అర్దం. ఆంతే 0 రెండోదశ అనుమానం అంటే ప్రమాణానికి రెండో దశ ఆ సం. అంలేకాని శంక అని అరం కాదు. ద్రీనే, + దమే శ్ర! (ప్రత్యక్షం, (ప్రత్యక్ష జ్ఞానం ఎంత విశాలంగా వుంటే తర్కజ్ఞానం అం 12 అంచనా అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

హేతువాదం సత్యానికి అంత దగ్గరగా వుంటుంది. మూడోదళను మనవారు శబ్దం అన్నారు శబ్దం అంటే వేదం అని బ్రాహ్మణ పండితులూ, శబ్దం అంటే ఆప్త వాక్యం అని బౌద్ద, జైన పండితులూ అంటారు మార్క్సిస్టులు మాత్రం మూడోదళను సామాజికార్థిక ఆచరణ అంటే ఆచారం అని చెబుతారు. నిజానికి (ప్రత్యక్షానికి చారిత్రక స్టాయి ఆచారం. కొన్ని ఆచారాలు వేల సంవత్సరాలుగా ఆచార రూపంగా వస్తూ ఉంటాయి. వ్యవసాయం నేర్చిన తొలిదినాల్లో విత్తులు నాటినప్పుడు ఆ విత్తులు మరణించినట్టు భావించి కల్ల శోకాలు పెట్టేవారు. ఆ కల్ల శోకాలు నేటికీ మిగిలివున్నాయి. జెరూసలెళ నగరాన ఒక శోకకుడ్యం వుంది. నేటికీ నాట్ట తరుణాన స్త్రీలు ఆగోడకు తల ఆనించి కల్ల శోకాలు పెడతారు. ఆ శోకకుడ్యాచారాన్ని బట్టి తొలినాటి వ్యవసాయోత్సవాల్లో ఒక పార్యం తెలియవస్తుంది. చారిత్రక నిర్ణయాలు చేయడానికి నేటికీ నిలిచివున్న ఆచారాలు తోడ్పడతాయి. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తరవాత మఖ్దూం కాళిదాసు కవితలు కొన్ని ఉరుదులోకి అనువదించాలను కున్నాడు అందుకు మేఘదూతాన్ని తీసుకున్నాడు. దానికి ఇంగ్లీషులో రెండు మూడు అనువాదాలున్నాయి. వాటిని తెప్పించి చూశాడు చర్మణ్వతీనదీ ప్రస్తావన శ్లోకానువాదం మూడుపుస్తకాల్లొనూ ఒకలాగే వుంది రంతిదేవుడు ఎద్దులను కోయించి వాలిచిన చర్మాలనుంచి కారిన నీరు చర్మబ్వతీనదిగా మారిందని అనువదించారు. మఖ్టూం ఆ అనువాదం సరిగా లేదన్నాడు. చర్మం వాలిచిన జంతువు ఎద్దుకాదు ఆవు అయివుండాలన్నాడు. అప్పుడు నేను మల్లినాధ సూరి వ్యాఖ్యానాన్ని సంపాదించి చూశాను. వ్యాఖ్యలో సురభి తనయాం గవాం ఆలంభనం విశసనం అని వుంది. ఆవు అని అర్ధం చెప్పడానికి ఆ ముగ్గురు అనువాదకులూ శంకించారు. అందులో ఒకరు నెహురూ సోదరి విజయలక్ష్మి భర్త పండిత్‌. అసలు వేదకాలాన గోవు అన్నమాటనే వాడేవారు. తరవాతి కాలాన ఎద్దును అనడ్యాన్‌ అంటూ వుండేవారు. కవుల పొగడ్తల్లో ఎద్దును మొగ ఆవు అంటే పుంగవ అనేవారు. రాజపుంగవ, కవి పుంగవ లాంటి పదాలను సృష్టించుకున్నారు. రంతిదేవుడు సత్రయాగంలో రోజుకు ఇరవై ఒక్క వేల ఆవులను విశసించి వాటిని వొండించి వడ్డనచేయిస్తూ వుండేవాడు. అందుకోసం పదిహేనువేలమంది వంటవాళ్లు రేయింబవళ్లు పనిచేస్తూ వుండేవారు. రంతిదేవుడు పురువంశరాజు. సంకీర్తి కొడుకు. పరశురాముడు ఇరవై ఒక్క దండయాత్రలో క్షత్రియులను సంహరించాడు. అందుకని రంతిదేవుడు ఇరవై ఒక వెయ్యి ఆవులను వధించి కొన్ని నెలలపాటు సత్రయాగం చేసి వేలాది బ్రాహ్మాణులకు భోజనాలు పెట్టాడు. నాటి గోచర్మాలనుంచి కారిన నీరు చర్మబ్వతీ నది అయింది. అది రంతిదేవుని కీర్తి పతాకంలా వుంది రంతిదేవుడు చాలా దయాళువు. అందువల్లే చర్మబ్వతీ నది రంతిదేవుని కీర్తి పతాకంలా వుందని కాళిదాసు వర్షించాడు. రంతిదేవుడు షోడళ మహారాజుల్లో ఒకడు. ఆయన శుద్ధ శాకాహారి. సత్రయాగం ఎంతకాలం నడిచిందో తెలియదు కాని, కొనడానికి దేశాన గోవులులేవు. తన దగ్గర ధనం లేదు. రాజ్యం పోయింది రాణువపోయింది. అన్నీ పోయిన తరవాత ఓ ముంతెడు నీరు సంపాదించుకుంటే ఆ ముంతకూ చేయిచాచాడు ఒక యాచకుడు. ఆముంతెడు నీరు యాచకునికి యిచ్చి తృప్తిగా కన్ను మూశాడు రంతిదేవుడు. ఒక గదిని అద్దెకు తీసుకున్నాను. అయన తన ఏస్తూంయా గా చిన త నిష స్తకాలు తెద్దువుగాని నా పుస్తకాలు తెస్తానన్నాను. ఇప్పుడు కొదు ఢిల్లీ వెళ్లాలి. తిరిగి వచ్చి పుస్త! స్ట లా తడల రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ అ 13

అన్నాడు. సరేనన్నాను. నాకు రెండు బాధ్యతలున్నాయి. ఒకటి ఇండోసోవియట్‌ కల్చరల్‌ సొసైటీ. దానికి నేను ప్రధానకార్యదర్శిని. రెండోది పార్టీ రాజకీయ తరగతులు. నేను తత్వ శాస్తం బోధించాలి. ఈ పనులమీద జిల్హాలకు పోవలసి వస్తుంది.

తత్వశా(స్తపారాలు చెప్పమని నన్ను శ్రీశైలానికి వెళ్లమన్నారు. హైదరాబాదు నుంచి కర్నూలు అక్కడినుంచి శ్రీశైలం బస్సుమీద 'ప్రయాణం. రాత్రి తామ్మిదింటికే కర్నూలు చేరాను. శ్రీశైలం బస్సు తెల్లవారుజామున. కర్నూల్లో బస్సుదిగిన తరవాత కంచి గరుడసేవ. శ్రీశైలం చేరేసరికి పది పదిన్నర అయింది. పాఠశాల నాయకుడు స్వామిరెడ్డి, ఇంత ఆలస్యంగా వస్తే ఎలా అని అడిగాడు. ఏం చేస్తాం. అలా వుంటుంది నాయకుఖ తత్వం. ర్యాష్టపతి పదవికి ఎన్నికలు జరిగాయి. సంజీవరెడ్డిగారి మీద వి.వి.గిరిగారు గెలిచారు. ఆ రెండు పేర్లూ తత్వాలకు ఒదుగుతాయి.

కర్నూల్లో కూర్చుని ఓ తత్వం రాసుకున్నాను. దాని తాలిచరణం ఇది. “బతుకునిచ్చెన కాదు జీవా

పరమ పదసోపానపటమందు పావా. నిలువునిచ్చెన లెక్కి నీలిగేవు కులికేవు. పక్కనే పొంచున్న పెనుపాము కానలేవు. గుత్తపుల్లరి మేసి కొవ్వుపట్టిన తగరు గిరిని ఢీకొన శిరసు నురుసును రుసౌతాది". ఇంకా ప్రారంభం కాని ఒక సినిమా హాలులో క్టాసు. నేను వెళ్లేసరికి అంతా ఉత్కంరతో ఉన్నారు. ఇవాళ పారం ఏమిటని అడిగాను. తత్వశాస్త్రం అని జవాబు, కర్నూలు జిల్లా తత్వాలకు ప్రసిద్ధి. మీలో ఎవరికయినా తత్వాలు తెలుసునా అని ప్రశ్నించాను. ఒక పలితకేశుని చూపించారు.

ఆ పెద్దాయన ఒక తత్వం పాడాడు. ఇంకా ఎవరికైనా తత్వాలు వచ్చునా అని అడిగాను. మీరు పాడండి అని కొందరన్నారు. నాకు పాడ్డం రాదు చదువుతాను అన్నాను, నేను రాసుకుని వెళ్లిన తత్వాన్ని వినిపించాను. జీవా అంటే సంజీవ అనీ, గిరి అంటే వరాహగిరి వెంకటగిరి అని అందరికీ అర్థం అయిపోయింది. దాంతో వారికి ఉత్సాహం వచ్చింది. ఆ తత్వం చెప్పండి. మేం రాసుకుంటాం అన్నారు. అందరూ నిలబడి పాడేటట్టయితేనే డిక్టేట్‌ చేస్తా అన్నాను. అందుకు వారు ఒప్పుకున్నారు. నేను పాట చెబితే రాసుకున్నారు. తత్వశా(స్తపారం డయలెక్టికల్‌ మెటీరియలిజం.

పారం ఆయిన తరవాత రాత్రి గెస్టహొసులో పడక. మర్నాడు తాలి బస్సుకు బయలుదేరాను. బస్సులో ఎవరో పత్రిక చదువుకుంటున్నారు. పత్రికలో మఖ్టూం ఫోటో కనిపించింది. రైల్లోను బస్సుల్టోను వార్తాపత్రికలను జబర్హస్తీగా యాచించే అలవాటు నాకు లేదు, ఆపత్రిక ఆచేతిమీద నుంచి ఈచేతిమీదకు మారుతూ దగ్గరకు వచ్చింది. అప్పుడు సక్కవానిచేతిలో పత్రికవైపు చూశాను. మఖ్టూం ఢిల్లీలో మరణించాడు. హైదరాబాదుకు ఆయన కాయం వచ్చిందని ఆ వార్త, దాదాపు సాయంత్రానికి హైదరాబాదు చేరుకున్నాను. గేటుదగ్గరకెళ్లేసరికి మఖ్టూచాచా ఇక లేడు అని బావురుమంది అరుణ.

అరుణమా ఆమ్మాయి. ఆమె మళఖ్టూం కాయం వెంట ఖనన వాటిక వరకు వెళ్లింది. ఖననం అయిన తరవాత ఇంటికి వచ్చింది. ఆమెనడిగి ఖనన ప్రదేశానికి బయలుదేరాను. నాంపల్లి ఒంటిమీనార్‌ మసీదు దగ్గరున్న ఖనన క్షేత్రం. ఆయన సమాధి జాజిపూల పందిరికింద వుంది. ఎక్‌ చమేలీకె మడ్వేంతలే అని ఆయన రాసిన పాట చాలా ప్రసిద్ధం. ఆయనిప్పుడు ఆచమేలీకి మండువా కిందనే దీర్హనిద్ర పోతున్నాడు. మా ప్లానులూ పధకాలు అన్నీ ఆయనతోనే పోయాయి. అద్దెగదిలో వుంచిన పుస్తకాలు సామాన్లు తీసుకుని వెళ్లమని ఆయన కొడుకు నుస్రత్‌ మొహియురద్దీన్‌తో చెప్పాను.

ముస్లింలకు మనలాగ చిన్న కర్మ, పెద్దకర్మ, దళాహాలు, ఏకాదశాహాలూ వుండవు, బంధువులు మిత్రులు

134 త రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

'శ్రాద్ధభోజనం చేస్తారు. అది కుల్చాపాయా భోజనం. బన్నులాంటి రొట్టెకు కుల్చా అని పేరు. పాయా అంటే మేకకాళ్ల సూపు. కమ్యూనిస్టులు, సాహిత్య మిత్రులు ఆ భోజనానికి వచ్చారు. నేను కమ్యూనిస్టు మిత్రుని మా(త్రమే కాదు. సాహిత్య మిత్రుని కూడా. కమ్యూనిస్టు పార్టీ కొన్ని సందర్భాలను పండుగలా జరుపుతుంది. అలాంటి సందర్భాల్లో కవితలను (ప్రోత్సహించే వాడు మఖ్టూం. అలాంటి ఒక రోజున ఒక మిత్రుని ఉరుదూ కవిత, నా తెలుగు కవిత పూర్తి అయేవరకూ జెండా వందనం చేయనివ్వలేదు. మఖ్లూం మామూలు గద్యకు ఒదగడు. ఆయన పోయినప్పుడు ప్రసిద్ధ జర్నలిస్టు ఖాజా అహ్మద్‌ అబ్బాస్‌ ఆయన్ను గురించి చెప్పిన మాటలు ఇవి. మఖ్టూజ్వల(త్ర్రబా దీప్తజ్వాల హిమళీతల తుహినమాల ఆయన విష్ణవకాహళి మంజీర రుణం రుణారవళి, ఇలాగే ఆయన అభిమానులు ఉదాత్త భాషలో తమ భావాలను వ్యక్తం చేశారు. ఆయనొక కవితను అల్టుతే వెంటనే ఎవరికో ఒకరికి వినిపించేవాడు. కవిత పూర్తికాగానే దాన్ని వినిపించడానికి మిత్రులదగ్గరకు బయలుదేరేవాడు. దారిలో తానెక్కిన రిక్షావానికి ఆ కవితను వినిపించేవాడు. హైదరాబాదులో ఉరుదు తెలిసిన రిక్షావారిలో మఖ్టూంను ఆయన కవితలను ఎరగనివారు లేరంటే అది సహజోక్తి మన పండితులు సాహిత్యాన్ని మూడుముక్కల్లో వివరిస్తారు. ఆ ముక్కలు “సత్యం శివం సుందరం” అనేవి. ఈ మూడుమాటలకు వారు ఆధ్యాత్మిక వ్యాఖ్యానం చేస్తారు. నాది అద్వయ అధిభూతవాదం,. మార్క్సు కూడా సాహిత్యానికి మూడే మాటలు చెబుతాడు. అవి సౌందర్యం, వాస్తవికత, తాత్వికత అనేవి. కావ్య వస్తువు కావ్యచ్చందం - వీటి సమన్వయమే అవి. కావ్య వస్తువును ఇంగ్లీషులో కంటెంట్‌ అంటారు. ఛందాన్ని ఫార్మ్‌రూపం అంటారు. ఇదో తాత్విక అభివర్గం. కంటెంటు అండ్‌ ఫార్మ్‌ని తెలుగున వస్తు ఛందం అనవచ్చును. మళఖ్టూం చారగర్‌ అనే అందమయిన ప్రణయగీతాన్ని రాశాడు. దానికి దేశవ్యాప్తంగా 'పేరు వచ్చింది. దాని శీర్షిక చారగర్‌ అని. ఆ గీతాన్ని ఆదే ఛందంలో అనువదించాలనుకున్నాను. నేనూ మఖ్టూం రాజబహదూర్‌ కూర్చున్నప్పుడు నా అభిమతం వెల్లడించాను. సాధ్యంకాదు అన్నాడు రాజబహదూర్‌. నేను సిగరెట్టు పెట్టెమీద “జూజిపూ దీవెజంపాలలో పానవాటీకి దూరాన ఆ మూలలో” అని రాసి చూపించాను. బాగుంటే పూర్తిగా అనువదించు అన్నాడు మఖ్టూం - నేను సరేనన్నాను. కొని ఆయన జీవితకాలంలో అనువదించలేకపోయాను. రాజబహదూర్‌ ఆయన గీతాల తెలుగు అనువాదాలను పుస్తకంగా తేవాలన్నాడు. మజళఖ్టూం బతికి ఉండగానే ఆయన గీతాలు కొన్ని మల్లారెడ్డి అనువదించాడు. అన్నీ తన అనువాదాలతో పుస్తకం తేవాలన్నాడు మల్లారెడ్డి. మేమందుకు నిరాకరించాం. మఖ్టూం తెలుగు గీతాలకో పీరిక రాశాడు. ఆ పీరికలో చాలా గీత భాగాలను ఉదహరించాడు. ఇంగ్లీషులో రాసిన ఆ పీరికను నేను తెలుగుచేశాను. ఆ గీత భాగాలను కూడా అనువదించాను. అందులో రక్స్‌ ఒకటి. అప్పుడు నేను చారగర్‌ పూర్తిచేశాను. మఖ్లూం “రక్స్‌” అన్న కవితను కూడా పూర్తిగా అనువదించాను. దానినడక రావణాసురుని శివతాండవ స్తోత్రంలా వుంటుంది. చారగర్‌ అన్న కవితకు నేను భిషక్‌ అని శీర్షిక పెట్టాను. అన్ని విషయాలమీదా సలహాలిచ్చేవారిని చారగర్‌ అంటారు. అలాంటి వారిని మనవారు భిషక్‌ అంటారు. అతడు చేసే పనిని భేషజం అంటారు. రావణుడు తన కవితను తాండవానికి అన్వయిస్తే మఖ్టూం తన కవితను వృత్తానికి అన్నయించాడు. పంచచామర వృత్తం సంస్కృతంలోనే కాదు. పారసీకంలో కూడా వుంది. రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 135

ఈ వృత్తంలో నేను తెలుగు పాటలు కూడా రాశాను. తెలుగుకు సంస్కృతం ఎలా ఒదుగుతుందో ఉరుదుకు ఫారిసీ అలా ఒదుగుతుంది. మన దేశాన ఛందస్సులు మూడు రకాలు. ఒకటి అక్షర ఛందస్సు. రెండు గణ ఛందస్సు, మూడు మాత్రా చందస్సు. వీటి వివరాలు మును సందు తెలుసుకుందాం. రామోజీకి పత్రికను నిర్వహించాలన్న అభిలాష గాఢంగా వుంది. నాతో పరిచయం కాకముందు ఆయన ఒక ఇంగ్లీషు వారపత్రికను నడిపి పద్దెనిమిది వేలను పత్రికార్పణం చేశాడు. ఎనభైవేలు నీపేరున బ్యాంకులో వేస్తాను నువ్వు ఒక హాస్య మాసపత్రిక నడుపుతావా అని నన్నడిగాడు.

వినోదిని అనే పేర డిక్షరేషను కూడా తీసుకున్నాడు. నేను రెండు నెలలు ఆలోచించి పత్రిక పెట్టడానికి ముందు మార్కెటింగును అధ్యయనం చేయాలి అని సలహాయిచ్చాను. అప్పుడాయన అన్నదాత అని ఒక వ్యవసాయక మాసపత్రికకు డిక్షరీషను తీసుకున్నారు. ఈ పత్రికను నిర్వహించదగిన వాడిని సూచించు అన్నాడు. నేను నార్లచిరంజీవి పేరును సూచించాను. ఆయనను రామోజీకి పరిచయంచేశాను. చిరంజీవికి సహాయకునిగా సయదుల్‌రెడ్డి అనే యువకుని తీసుకున్నారు. నెలలు గడుస్తున్నాయి. పత్రిక ఎప్పుడు వస్తుందో తెలీదు. రామోజీకి విసుగెత్తింది.

చిరంజీవి పత్రిక తేలేడు అని తేలిపోయింది. ఆయన ఎనిమిది నెల్లహాయిగా గడిపాడు, ఆయన పేరును సూచించినందుకు నువ్వే అన్నదాతను తీసుకురా అన్నాడు. అప్పుడు నేను రంగంలోకి దిగాను.

ఒక సంవత్సరానికి ప్లాను చేశాను. పత్రికలో రాయవలసిన వ్యవసాయ సమస్యల లిస్ట్‌ తయారు చేశాం. నేను వ్యవసాయ చరిత్రను రాస్తానన్నాను. పంపుసెట్ట్ల నిర్వహణ మీద మా అన్నగారి పేరున నేనే వ్యాసాలు రాశాను. విషయసూచిక పక్కన సంపాదకీయాన్ని రాసేవాడిని. ఆ సంపాదకీయం ఆ సలానికి సరిగా సరిపోయేది. ఇలా ఒక ఏడాది గడిచింది. న్‌

రెండో సంవత్సరానికి పన్నెండు మాసాలకు రాయదగ్గ వ్యాసాల పట్టిక తయారు చేశాం. నేను వ్యవసాయ చరిత్ర, పంపుసెట్ట నిర్వహణ వ్యాసాలను మానేశాను. కాగా సంపాదకీయం మాత్రం నెలనెలా రాస్తూ వుండేవాడిని. ఎంతచేసినా సర్క్యులేషను పెరిగేది కాదు. వ్యవసాయదారులు గొప్ప కంజర్వేటివులు మాంధాతల కాలం నుంచీ మేం వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం మీద మాకొకరు చెప్పాలా అంటూ వుండేవారు. సర్క్యులేషను లేకుంటే పరవాలేదు. నేను నా వారికోసం ఆ మాత్రం నష్టాన్ని భరించగలను అనేవాడు రామోజీ.

రాష్ట్ర ఇస్కస్‌ మహాసభను వరంగల్టులో జరపడానికి నిళ్చయించాం. ఆంధ్ర అంటే అగ్రజుడు అని అర్ధం. అందువల్ల ప్రతీ ఆంధ్రుడూ తానే అగ్రజుడు గానూ అ(గ్రేసరుడు గాను ఉండాలని కోరుకుంటారు. అవి ఆంధధ్రత్వ లక్షణం. ఇస్కన్‌కి పార్టీ గైడు కె.ఎల్‌. మహేంద్ర. ఈ ర్ట మహాసభ అయిన తర్వాత జాతీయ మహాసభ జరుగుతుంది. మహాసభ విజయానికి వరంగలు కార్యకర్తలు చాలా సహాయం చేశారు. ఆ సభలో తిరిగి నన్నే (ప్రధానకార్యదర్శిగా ఎన్నుకున్నారు. ప్రాంతీయ కార్యదర్శుల ఎన్నిక కూడా సజావుగానే జరిగిపోయింది.

ఇస్కస్‌ కార్యదర్శి అనేది గౌరవపదవి. రాజకీయాలు నా ఒంటికి పడవు. ఎలాంటి పదవి వచి?నా దాని సాయంతో ఇసకపిండి తైలం తీయగల రాజకీయ సమర్జులున్నారు. అలాంటివారికి ఇంత కే ఒకే వ్యక్తి ఒకే పదవిలో వుండడం నచ్చదు. ఆ సంగతి నాకు తెలుసును. కాని ఏం చేయగలను అభ్యుదయ రచయితల సంఘ పునరుద్దరణ బాధ్యత నాకు అప్పజెప్పాలని నాయత్వం ఆలోచిస్తోంది. వారి ఆలోచన.

ల 1366 రాంభట్ల కృష్ణమూర్తి సాంతకధ

కర్ణాకర్లిగా తెలియవచ్చింది. ఇస్కన్‌ జాతీయ మహాసభ పట్నాలో జరిగింది. ఆ సమావేశంలో అజయ ఘోష్‌ భార్యను కార్యదర్శిగా ఎన్నుకోవాలని నిర్ణయించారు.

(ప్రాంతీయ కార్యదర్భుల్లో నన్ను ఎంచుకున్నారు. సభకు కాస్త ముందు ఆమె సహాయ కార్యదర్భ్శులంతా పురుషులే, స్త్రీలు లేరు అని గొాణగడం మొదలుపెట్టింది. అప్పుడు నేను తప్పుకుంటాను ఆ స్థానంలో పద్మావతీ శాస్తిని జాతీయ కార్యదర్శిగా చేస్తే బాగుంటుందని మహేంద్రతో చెప్పాను. ఆ మార్పును నాటి నాయకులందరికీ అందించారు అలాగ ఆ సమస్య పరిష్కారం అయింది. పద్మాళాస్తి చాలా సంతోషించింది. ఆ పనిని చాలా కాలం నుంచీ ఆశిస్తూ వచ్చిందామె. మహేంద్రకు నన్ను రచయితల సంఘం నిర్మాణానికి కేటాయిస్తారని తెలుసును.

జస " ప్రచురణలు రూ,

  1. అనువదించడం ఎలా - డాక్టర్‌ గోవిందరాజు చక్రధర్‌ 90 . 2. జర్నలిస్తులకోసం - డాక్టర్‌ గోవిందరాజు చక్రధర్‌ 70 లు
  2. పచారం పొందడం ఎలా? - డాక్టర్‌ గోవిందరాజు చక్రధర్‌ 70
  3. మంచి జర్నలిస్టు కావాలంటే. - డాక్టర్‌ గోవిందరాజు చక్రధర్‌ 70 ల
  4. సొంతకథ - రాంభట్ల కృష్ణమూర్తి 80 ' 6. చింతన - డాక్టర్‌ పొత్తూరి వెంకటేశ్చరరావు 50 (7, చిరస్మరణీయులు _ డాక్టర్‌ పొత్తూరి వెంకటేశ్వరరావు 50 ' 8. పతితపావని, థ్రిల్లింత - డాక్టర్‌ కాకాని చక్రపాణి 50 క్కో సంపుటి) ' (కధల సంకలనాలు) (ఒక్క్‌ 9 ర్ట లనారా - డాక్టర్‌ కొకొని చక్రపాణి 60 | (ఘోస్ట్‌ రచయితలపై నవల) - డాక్టర్‌ గోవిందరాజు చక్రధర్‌ . ' 10. గోరంత దీపం - డాక్టర్‌ కాకాని చక్రపాణి 30 (నవల) - డాక్టర్‌ గోవిందరాజు చక్రధర్‌ ' 11. సంహిత (సాహిత్య వ్యాసాలు) = డాక్టర్‌ డి. చంద్రేఖర రెడ్డి 100
  5. బలవంతులు - డాక్టర్‌ డి. చంద్రోఖర రెడ్డి 30 | (ఆ్రో-అమెరికన్‌ కవితలకు అనువాదం) | ,
  6. ౧౫౦62200 5జ0)178్రర2 - 0౬ 6. ల కబ్లజు.. 450 జడే 115 60063 రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 137 ళా

ధ్ర౭ై క ఖై శ ర్ట మ క్ష ర లీ పాతనంఘం నాయకులు ఒకరొకరే విరసంలో చేరి కొత్త ప్రకటనలు చేయటం మొదలు పెట్టారు. అనువుగానిచోట అధికులమనరాదు అన్న నూక్తిని మననం చేసుకుంటూ అరసం వుననృష్టికి మార్గాలమీద చర్చలు మొదలుపెట్టాం. గజ్జల మల్తారెడ్డికి కూడా అరనం పునరుద్ధరణ బాధ్యత ఇచ్చారు. ఇద్దరమూ కలిసి దేశంమీదవపడి ఉవన్యాసాలివ్వడం మొదలు పెట్టాం. మల్లారెడ్డి వక్త. నేను కాను. వీసాల సి అరసం అలజడి పట్నా నుంచి తిరిగివస్తూ విజయవాడలో దిగాను. విశాలాంధ్ర కార్యాలయానికి వెళ్లాను. హైదరాబాదులో సెవెన్‌స్టార్‌ సిండికేట్‌ అనే ఒక సాంస్కృతిక సంస్థ అభ్యుదయ కవులకు సమ్మానం చేయ సంకల్పించింది. ఆ సంస్థకు నిన్ను కూడా కార్యదర్శిగా చేర్చుకొమ్మని చెప్పాం. వారంగీకరించారు. నీవు హైదరాబాదు వెళ్లాక వారిని కలవమని చెప్పారు. ఆ సమావేశానికి వచ్చిన వారితో మాట్లాడి అభ్యుదయ రచయితల సంఘాన్ని పునరుద్దరించమని నాకు చెప్పారు. ఆఖరి అభ్యుదయ రచయితల సంఘం సభ విజయవాడలోనే 1955లో జరిగింది. నేనప్పుడు అక్కడే వున్నాను. సిండికేటు నాయకుని పేరు శాండిల్య. ఆ సమావేశం సత్కారాల్లో నాది ఆరోవేలు పాత్ర. అయినా అరసం పునరుద్దరణ సంగతి పూర్వ నాయకులందరికీ చెప్పాను. వారికి బస ద్వారకా హోటల్లో సత్కారాల అనంతరం అనిసెట్టి నాయకత్వం వహించాడు. ఓ చిన్న కాగితం తీసుకొని మినిట్టు రాయడం మొదలుపెట్టాడు. సభకు విద్వాన్‌ విశ్వం అధ్యక్షత వహించాడు. అరసం పునరుద్దరణ మీద చర్చలు జరిగాయి. అది సెప్టెంబరు నెల. శ్రీశ్రీ అక్టోబరులో పునరుద్ధరణ సభను ఏర్పాటు చేయాలన్నాడు. రష్యన్‌ విష్ణవానికి అక్టోబరు విష్టవం అని కూడా పేరు. అది వినగానే అందరూ నావైపు చూశారు. ఆ సమావేశానికి వచ్చిన వారిలో కమ్యూనిస్టు పార్టీ తరపున మాట్లాడగలవాడిని నేనొక్కడినే. అందుకే అందరూ నావైపు చూశారు, అనిసెట్టి సుబ్బారావు ఓ కాగితంమీద రాస్తున్నాడు. సభకు ముందు ఒక ఎక్సరొసైజు బుక్కు తెప్పించుకోమన్నాను. అక్కర్లేదు అన్నాడు అనిసెట్టి. ఆరసంలో ఆయన సీనియరు. నేనూరుకున్నాను. ఆ రాత్రి శ్రీశ్రీ అధ్యక్షుడుగా విరసం ఏర్పడింది. మర్నాడు 138 అ రాంభట్ట కృష్ణమూర్తి సొాంతకధ

అనిసెట్టి నన్ను కలిసి ఒక ప్రకటన ఇవ్వాలన్నాడు. నిన్నటి సమావేశ మినిట్సు కానీ, వచ్చిన వారి పేర్గు సంతకాలు కానీ ఏమీలేవు. అనిసెట్టి రాసిన ప్రకటన మీద నేను సంతకం మాత్రం చేశాను. అక్కడితో ఆ పని అయింది. పాత సంఘ నాయకులు ఒకరొకరే విరసంలో చేరి కొత్త ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. అనువుగానిచోట అధికులమనరాదు అన్న సూక్తిని మననం చేసుకుంటూ అరసం పునసృష్టికి మార్గాలమీద చర్చలు మొదలుపెట్టాం. హైదరాబాదులోనూ విజయవాడలోనూ చర్చలు మొదలయ్యాయి. పార్టీ నాయకులు గజ్జల మల్లారెడ్డికి కూడా అరసం పునరుద్దరణ బాధ్యత యిచ్చారు. ఇద్దరమూ కలిసి దేశం మీద పడి ఉపన్యాసాలివ్వుడం మొదలుపెట్టాం. మల్లారెడ్డి వక్త, నేను వక్తను కాను. కాని నేనుకూడా మాట్లాడాలి. నాది సాహిత్య విశ్లేషణ. అభ్యుదయ రచయితల సంఘ పునర్నిర్మాణానికి ఇక్కడే కాదు - ఢిల్లీలో కూడా యత్నాలు మొదలయ్యాయి. చర్చలకోసం నేనూ, మల్గారెడ్డి ఢిల్లీ వెళ్ళాం. అక్కడ అరసం నిర్మాణ సమస్య మాత్రమే కాదు. ఆ్రో ఏషియా సాహిత్య సంఘ నిర్వహణ సమస్య కూడా చర్చకు వచ్చింది. ఆఫ్రో ఏషియా సాహిత్య సంఘ సమావేశం కజకిస్తాన్‌లోని తాష్కెంటులో జరుపుతున్నారు. చర్చలకు వచ్చిన వారిలో కొందరిని ఆ మహాసభకు పంపాలని ఢిల్లీ నాయకులు నిర్ణయించారు. ఆంధ్ర నుంచి నేను మల్దారెడ్డి పేరును సూచించాను. బీహార్‌ నుంచి కన్హయ్యను వారు నిర్ణయించారు. నేను అక్కడే మరి కొన్ని రోజులుండవలసి వచ్చింది. ర్యాష్ట్రాల నుంచి వచ్చినవారి సమావేశం ఏర్పడింది. వచ్చిన ప్రతినిధుల్లో కొందరికి హిందీ మాత్రమే తెలుసును. కొందరికి ఇంగ్లీషు తెలుసును. కొందరికి ఆ రెండు భాషలూ తెలియవు. కలకత్తా నుంచి వచ్చిన ప్రతినిధికి బెంగాలీ తప్ప మరో భాష రాదు. అందుకని తన వెంట ఓ దుబాసీనీ తెచ్చుకున్నాడు. సమావేశంలో అతడు బెంగాలీలో ఒక వాక్యం చెబితే ఆయన గారి దుబాసీ ఆ వాక్యాన్ని ఇంగ్లీషులో చెప్పేవాడు. ఇది రైళ్లలో మందులమ్మేవారి పద్దతిగా మారింది. నేను ఆ పద్ధతిని విమర్శించాను. వారి (ప్రసంగాలు అపి, హిందీ వారిని మాట్లాడమన్నాను. బెంగాలీలు బీహారీలను చిన్నచూపు చూస్తారు. బెంగాలీలను నేను మందలించినందుకు బీహారీలు వాలా సంతోషించారు. బీహారు బృందంలో బక్కపలచని పొట్టివాడొకడు ముండశిరస్కుడున్నాడు. అతడి ముందు బీవారీలంతా బాబాబాబా అంటూ అణకువుగా వుంటున్నారు. ఇంతకీ అతడెవరు? అజయ ఫవనంలోకి అలాంటి వాడెలా వచ్చాడు. నాకు కుతూహలం కలిగి అతడినే అడిగేశాను. ఆతని పేరు వాగార్జున్‌: మంచి కవి. ఆయన పుస్తకాలను బీహారు యూనివర్శిటీలు పాఠ్య (గ్రంధాలుగా పెట్టాయి. తియనకు సంస్కృతం కూడా వచ్చును. నేను శ్రీనాధుని పద్యాలు రెండుమూడు చదివాను. ఇది తెలుగా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆయన తెలుగు పదాలున్న పండిత రాయలి ఫ్లోకం చదివి 9 తెలుగు పదాల అర్థం తెలుసుకున్నాడు. తాను రాసిన మేఘసందేశం అన్న పొందీ వ్యంగ్య కవిత నాకు 'నిపించాడు. మేం ఇద్దరం స్నేహితులమయిపోయాం. ఆయనతో సన్నిహితంగా మెలిగే నాకు కూడా "రవం యిచ్చారు బీహారీలు, ఆక్కడ చర్చలు అయిన తరవాత నేనొక్కడినే హైదరాబాదుకు తిరిగివచ్చాను. ॥ఫ్రో ఏషియన్‌ సంఘం గురించి చర్చించడం కోసం మరోమారు ఢిల్లీ వెళ్లవలసి వచ్చింది. అప్పుడు ఎల్లారెడ్డి లేడు. నేనొక్కడినే వెళ్లాను. అది ప్రత్యేక సమావేశం. ఆఫ్రో ఏషియన్‌ సంఘం గురించి చర్చలు జరిగాయి. సమావేశానికి భీష్మ సాహిణి బన్నే భాయి కూడా వచ్చారు. ఆ్రో ఏషియా సంఘాన్ని మలేషియాకు మార్చాలనుకున్నారు. నువ్వు అక్కడ పనిచేస్తావా తా రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 139

అని అడిగారు. నాకింకా హైదరాబాదులో చేయవలసిన పనులు చాలా వున్నాయి మలేషియాకు మకాం మార్చలేను అని చెప్పాను. తరవాత ఆఫ్రో ఆసియా సంఘాన్ని ఆర్ల్గనైజు చేయడానికి సజ్ఞాద్‌ జహీర్‌ హైదరాబాదు వచ్చాడు. హైదరాబాదులో నార్ల చిరంజీవి ఇంటికి వెళ్లాం. చిరంజీవి అరసం విరసం కలిసి పనిచేయాలని ఒక కవిత రాశాడు.

"హైదరాబాదులో ఆయన ఒక మిత్రుని ఇంట దిగాడు. ఆ మిత్రునితో సహా మేం బెజవాడ బయలుదేరాం. అక్కడ బెజవాడవారు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ(ఫ్రో ఏషియన్‌ సభ కోసం కొంతమంది లాయర్లను పిలిచారు. నాడు విజయవాడ రేడియో డైరెక్టరు ఒక ముస్లిం. ఆయన బన్నేభాయిని రేడియోకి ఆహ్వానించాడు. తరవాత సభను నేను నిర్వహించాను. ఆఫ్రో ఏషియా అని వుంది కనక జపానుతో మైత్రి చేయాలనీ, ఏష్షియాలో అది ప్రముఖ దేశం అనీ ఉపన్యాసాలు చేశారు. ఆఫ్రో ఏషియన్‌ సంఘం సంగతి సభ ఏర్పాటు చేసిన యువకులకెవరూ చెప్పలేదనుకున్నాను.

అభ్యుదయ రచయితల సంఘ నిర్మాణానికి ప్రాతిపదికగా మేం దేశమంతటా తిరిగి ఉపన్యాసాలిచ్చాం. మల్లారెడ్డి వక్త, పైగా ఆయన వ్యంగ్య కవితలు (గ్రంధ రూపంగా వచ్చాయి. తన (ప్రసంగంలో తన కవితలను ఉదాహరిస్తూ ఆయన మాట్లాడగలడు. ఆయన (ప్రసంగం సహజంగా అందర్నీ ఆకర్షిస్తుంది. నేను వక్తని కాదు. నేను కూడా వ్యంగ్య కవితలను రాసినా కవితలు నాకు జ్ఞాపకం వుండవు. ఇవి నా మైనస్‌ పాయింట్టు, అయినా నేను మాట్లాడాలి. ఎవరికీ తెలియని విషయాలను నేను ఉపన్యసించేవాడిని. ఆ అంశాలు అందర్నీ ఆకర్షించేవి.

సమావేశాలు లేనప్పుడు మేం తీవ్రంగా విభేదించేవారం. ఆయన కమ్యూనిస్హ్రు పార్టీనాయకుడే కాని మార్క్సిస్టు తత్వశాస్త్రం ఆయనకు తెలియదు. ఆ సందర్భాలు వచ్చినప్పుడు మేం విభేదిస్తుంటాం. అది చూసి యువకులు మాకు ఉప్పు నిప్పు అని పేర్చు పెట్టారు. అంతకు ముందు నేను నార్ల చిరంజీవిని కవీ అని పిలిచేవాడిని. ఆయన పోయిన తరవాత మల్హారెడ్డిని కవీ అని పిలిచేవాడిని. నేను కవితలు రాస్తాను కాని నన్ను నేను కవి అని చెప్పుకొనను. కవికి ఆహమిక వుండాలి. అది నాకు లేదు. ఆ సంగతి నాకు తెలుసును. అందుకని నేను కవిననిపించుకోను.

శ్రమకు తగ్గ ఫలితం సోషలిజంలో మాత్రమే దొరుకుతుందన్న భావం ఆనాడు దేశ వ్యాప్తంగా వుంది, సోషలిజానికి ఉదాహరణగా నిలిచింది సోవియట్‌ యూనియన్‌. సోషలిజానికి మార్గదర్శకం మార్క్సిస్టు శాస్త్రం. అంటే తత్వశాస్త్రం. ఆ తత్వశా(స్తాన్ని చిరకాలంగా రాజకీయాలకు అనుసరిస్తూ వస్తున్నారు మార్క్సిస్టులు. ప్రకృతికి, సమాజానికీ, మనుషుల చైతన్యానికీ వరిస్తుంది మార్క్సిస్టు తత్వశా(స్త్రం. ఇంతవరకు ఆ తత్వశాస్తాన్ని సాహిత్యానికి ఎవరూ అన్వయించలేదు. ఇప్పుడు అభ్యుదయసాహిత్యానికి మార్క్సిజాన్ని అన్వయించాలి.

సాహిత్యానికి మార్క్సిజాన్ని అన్వయిస్తూ నేను ఒక ప్రణాళికను తయారుచేశాను. రాజకీయాన్వయానికి అలవాటుపడినవారందరూ ఆ (ప్రణాళికను తిరస్కరించారు. దాన్ని రెండు మూడుసార్హు వడగట్టి ఒక్క రూపవస్తు అభివర్గం మాత్రమే వుంచి రాశాను. అప్పటికే నామీద సాహిత్యం అంటే తెలియని వారు కోపంతో ఉన్నారు. అప్పుడు వడగట్టిన ప్రణాళికకు మల్లిక్‌ ప్రణాళిక అని పేరు పెట్టాను. అతడే దాన్ని సభికుల ముందుకు తెచ్చాడు. మల్లిక్‌ యువకుడు. కథలు, వ్యాసాలు రాయగలడు. అభ్యుదయ సంఘ పునరుద్ధరణలో ఆది నుంచీ ఉన్నాడు. తలా 140 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

మొత్తానికి మల్లిక్‌ ప్రణాళికను విజయవాడలో ఆమోదించారు. దాన్ని తీసుకుని హైదరాబాదు వచ్చాను. దాన్ని అగ్రనాయకులు ఆమోదించారు. రచయితల ఉద్యమానికి రాజకీయ సారధిగా ట్రేడు యూనియన్‌ నాయకుడు ఎలమంచిలి విజయకుమార్‌ను నియమించారు. ఆయన సారధ్యంలో ఒక సమావేశం జరిగింది. అప్పటికి నక్సలైట్లకు సాహిత్య కవచంగా వున్న విరసంని కలుపుకొని రావాలని కొందరు సీనియర్లకు ఆశలున్నాయి. అందుకని ప్రణాళికలోని సోవియట్‌ ప్రస్తావనను తీసివేశారు. విరసం వారికి ఆదర్శం చైనా. చైనా రష్యాల మధ్య పొరపొచ్చాలున్నాయి.

కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఇస్టాంతో పోల్చాడు హెచ్‌.జి.వెల్సు. ఇస్లాంలో కూడా చీలికలు వచ్చాయి. అలాగే కమ్యూనిస్టు పార్టీల్లో కూడా చీలికలు వచ్చాయి. చీలిన తునకలను ఇస్టాంలో ఆతకడం కష్టమే కాదు అసంభవం కూడా. దాన్ని ఆదర్శంగా పెట్టుకుని పుట్టిన కమ్యూనిస్టు పార్టీలోనూ అంతే మరి. ఆ సంగతి నాకు తెలుసును. కనిపించిన పుస్తకమల్లా చదవడం నాకు అలవాటు. రాజకీయాలు తప్ప మరో సామాజిక చైతన్యరూపాన్ని వాసన కూడా చూడకపోవడం కమ్యూనిస్టు నాయకుల అలవాటు. ఈ అలవాట్లను ఎవరికి వారు పదిలంగా కాపాడుకుంటున్నారు.

మార్క్సిస్టు సిద్దాంతం 'ప్రకారం సాహిత్యం ఒక సామాజిక చైతన్య రూపం. వ్యక్తి చేతనం వేరు, సామాజిక

చేతనం వేరు. చాలామంది యువరచయితలకు ఈ సంగతి తెలీదు. నా రచనలతో సామాజిక చైతన్యాన్ని సృష్టిస్తాను అంటూ వుంటారు. మార్క్సిజం మీద మోజు. దాన్ని తెలుసుకొనడానికి బద్దకం. ఇది నేటి యువకుల సామాన్య లక్షణం. రచన వ్యక్తి చైతన్యం కాదు సామాజిక చైతన్య రూపం. మార్క్సిస్టు సిద్దాంతం (ప్రకారం ఆ చైతన్యం రెండు రకాలు. ఒక సంఘటన చూసినప్పుడూ విన్నప్పుడూ తక్షణమే చేసిన వ్యాఖ్యకు సామాజిక మనస్తత్వం అని పేరు.

ఆ సంఘటన పూర్వాపరాలను జాగ్రత్తగా ఆలోచించి చేసిన వ్యాఖ్యను సామాజిక చైతన్యం అంటారు. సామాజిక మనస్తత్వానికీ సామాజిక చైతన్యానికీ వున్న తేడాయిది. సామాజిక చైతన్యరూపం అయిన సాహిత్యం ఎవరు సృష్టించినా అందులో మూడు అంశాలు వుండి తీరుతాయి. అవి ఒకటి సౌందర్యం. రెండు వాస్తవికత. మూడు తాత్వికత. ఈ మూడూ పారకునికి విజ్ఞానదాయకాలు. అందులో సౌందర్యాంశ చదవాలన్న కోరికను కలిగిస్తుంది. వాస్తవికాంశం విజ్ఞానదాయకం. తాత్వికాంశం వివేకదాయకం. అంటే సొహిత్యం వల్ల ఆనందం, విజ్ఞానం, వివేకం కలుగుతుంది.

సాంప్రదాయక కవులు విజ్ఞాన, వివేకాంశాలను విస్మరించి కవిత్వ లక్షణం ఆనందమొక్కటే అంటారు. కావ్యంలో వాస్తవికతా తాత్వికతా ఉన్నా వాటిని నంవ్రదాయ పండితులు గుర్తించలేకపోయారు. ఆలంకారికుల్లో క్షేమేంద్రుడు మాత్రం విజ్ఞానదాయకమయిన వాస్తవికతను గుర్తించాడు. దానికి ఆయన బాచిత్యం అనిపేరు పెట్టాడు. “ఉచితం ప్రాహురాచార్యాః సదృశం కిలయస్య యత్‌ ఉచితస్య చయోభావస్త్ర దౌచిత్యం ప్రచక్షతే” అంటాడు. సదృశాన్ని చిత్రిస్తే దాన్ని జౌచిత్యమంటారని క్షేమేంద్ర మతం. వాస్తవమైనప్పుడే సదృశత్వం అలవడుతుంది. జాచిత్యాన్నే నేను వాస్తవికత అంటాను.

వాస్తవికత అధిభూతం. దాన్ని అనుసరిస్తే కవి ఆధ్యాత్మ దృష్టికి విరుద్దంగా తయారవుతుంది కావ్యం. విశ్చనాథ సత్యనారాయణగారు వేయిపడగల్లో వాస్తవికతను అనుసరించాడు. ఫలితం వేయిపడగలుగా విస్తరిల్లిన సాంప్రదాయక కథలో ఒకొక్క పడగను పోగొట్టుకుని ధర్మారావు రూపంలో ఆఖరి పడగ ఒక్కటే మిగిలింది. అందుకనే ప్రాచీన కవులు వాస్తవికతను దూరంగా ఉంచుతారు. అభూత వర్షనలతోనే కాలక్షేపం లా రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 141

చేస్తారు. కాని వాస్తవికత జోలికి వెళ్లే సాహసం చేయరు. వాస్తవికత అధిభూతం. వారి ఆధ్యాత్మికతకు విరుద్దం. ఆ సంగతి పూర్వులకు తెలుసును.

ఈమధ్య ్రాకృశ్చిమ పండితులు భౌతికవాదులను, మెటీరియలిస్టులను తిట్టుగా ప్రయోగిస్తూ వచ్చారు అయితే శా(స్తాల విషయం వచ్చినప్పుడు ఆ మాటలు వాడక తప్పదు. అందుకని ఆ మాటలు వాడవలసి వచ్చినప్పుడు వాస్తవికత, రియలిజం అంటూ వస్తున్నారు. మూడు కావ్యలక్షణాలే కాకుండా రూపం వస్తువు అన్న (ధ్రువాభివర్గ కూడా వుంది. అభివర్గం అంటే కేటగిరీ. (ధ్రువాభి వర్గ అంటే పోలార్‌ కేటగిరీ, ధ్రువాభి వర్గంలో ఒకటి నేయం అవుతుంది. రెండోది అనుయాయం. (ధ్రువాభివర్గాల్లో ఎప్పుడూ నేయం ప్రధాన పాత్ర వహిస్తుంది,

ప్రపంచాన (ప్రప్రథమ (గ్రంధం ఆర్యభాషలో పుట్టింది. అదే వేదం. రుగ్వేదంలోని పురుషసూక్తాన్లి పళ్చిమపండితులు వేదిక్‌ జెనిసిస్‌ ఆంటారు. అంటే వేద సృష్టి గాధ అని అర్ధం. పళ్చిమ పండితుల బైబిల్‌ పురాణం సృష్టిగాధతో మొదలవుతుంది. వేదంలోని పురుషసూక్తం కూడా అలాగే సృష్టిగాధ, వేదం అంటే తెలివిడి, జ్ఞానం అని అర్ధం. ఆ గాధ ప్రకారం ముందు సొమగానానికి అనువైన రుక్కులు పుట్టాయి తరవాత రకరకాల ఛందస్సులు పుట్టాయి. రుగ్వేదం అధర్వణవేదం ఈ రెండూ ఛందస్సులు. ఆహారాన్ని పచనం చేసే క్రియకు యజ్ఞం అనిపేరు.

వారి అనుభవాలూ తెలివిడీ ఈ ఛందస్సుల్లో నిక్షిప్తమై వుంది. తరవాత యజుస్సు పుట్టింది. ఇది యజ్ఞవిధానాన్ని సాంకేతికతను వివరిస్తుంది. దీనికి ఛందస్సులేదు. ఇది వచన కవిత, వచన కవితకు ఛందస్సు ఉండదు కాని ఒక బాణీ వుంటుంది. యజ్ఞ విధానాన్ని తేట మాటలో చెప్పాలి కనక ఛందస్సును విడనాడి వచన రూపాన్ని స్వీకరించారు వేదరుషులు. ఇక్కడ అ(గ్రిమం అయిన వస్తువు తన రూపాన్ని నిర్ణయించుకుంది. వచనమయినా ఛందస్సు అయినా చదవడానికీ ధారణకీ అనువుగా కొన్ని స్వరాలను కల్పించుకున్నారు. వేదాలది అక్షర ఛందస్సు.

సంస్కృత శ్లోకాలూ, తెలుగు పద్యాలు గణ ఛందస్సులు. తెలుగు పాటలు మాత్రా ఛందస్సులు. ఈ ఛందస్సులను జాగ్రత్తగా పరిశీలిస్తే కావ్య వస్తువు తన రూపాన్ని ఎలా నిర్ణయించుకుంటూ వచ్చిందో అర్థం అవుతుంది. మార్క్సిస్టు సూత్రాలూ, అభివర్గాలూ, ప్రకృతికీ సమాజానికీ మనిషి మేధకూ సమానంగా వర్తిస్తాయి. సాహిత్యానికి లెనిన్‌ ప్రతిఫలన సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. ప్రకృతీ సమాజం రచయిత మేధలో ప్రతిఫలిస్తుంది. ఆ ప్రతిఫలనాన్ని (గ్రంధస్థం చేస్తే దాన్ని ప్రతిరుచి అంటారు. ఇవి శాక్త పదాలు.

మార్క్సిస్టు సాహిత్య సూత్రాలను వివరిస్తూ అనేక సభలు పెట్టిన తర్వాత గుంటూరులో అభ్యుదయ రచయితల మహాసభ సమావేశం అయింది. ఆ సభలో కొత్త ప్రణాళిక మీద చర్చ జరిగింది. ప్రణాళికలో సోషలిస్టు వాస్తవికతను ధ్యేయంగా తీసుకోవాలన్నమాట వుంది. కమ్యూనిస్టు భీష్మునిలాంటి పులుపుల శివయ్యతాత అసలు సోషలిస్టు సమాజమే లేనిది సోషలిస్టు వాస్తవికత ఎక్కడ నుంచి వస్తుంది అని ప్రల్నించాడు. రష్యాలో సోషలిజం రాకముందే గోర్కీ “అమ్మ” నవల రాశాడు. దాన్ని సోషలిస్టు వాస్తవికమని అంతా ఉదాహరిస్తున్నారన్నాడు.

మార్క్సిస్టు డయలెక్టికల్‌ మెటీరియలిజం, హిస్టారిక్‌ మెటీరియలిజం క్షుణ్మంగా ఎరిగిన వారు యళ్నిస్తే సోషలిస్టు వాస్తవికతను రచనల్లో చూపించగలుగుతారు. కమ్యూనిస్టు పార్టీలో అత్యధికులకు మార్క్సిజం పరిజ్ఞానం తక్కువ. దాన్ని రాజకీయాలకు అన్వయించడం కాస్త తెలుసును కాని సాహిత్యానికీ అన్వయించడం అసలు తెలియదు. డయలెక్టికల్‌ ఫిలాసఫి క్షుణ్మంగా ఎరిగిన వారు నేటికీ అరుదే. చారిత్రక

142 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

భౌతిక వాదం సరే సరి. చెప్పనక్కరలేదు. ప్రణాళికను చూసినవారు ఇది సాహిత్యంలా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు నిజమే మరి. భూత అభ్యుదయ రచయితల కోసం రాసిన ప్రణాళికలో రాజకీయాలు తప్ప సాహిత్య ప్రస్తావన ఆరటం పెట్టి నా కానవచ్చేది కాదు. అలాంటి ప్రణాళికలకు అలవాటు పడినవారికి మార్కిస్టు త్వశా(స్త అభివర్గాలతో రాసిన (ప్రణాళిక సాహిత్యంలా కనిపించడంలో ఆశ్చర్యం ఏముంది. మహాసభలో

నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నారు. నాకు చిన్నప్పటి నుంచీ తత్వశళాస్తాల మీద అభిమానం ఎక్కువ. అందువల్ల డయలెక్టికల్‌ మెటీరియలిజం మీద పార్టీ పారశాలల్లో ఫిలాసఫీ పాఠాలు చెప్పేపని ఇదివరకే అప్పగించారు.

అభ్యుదయ రచయితల సంఘం పక్షాన రచయితలకు పాఠశాలలు నడపడం కోసం ప్రణాళికలు వేశాం. కొంతమంది చదువుకున్న యువకులు అనేక సాహిత్య సమస్యల మీద చర్చలు జరుపుతూ వుండేవారు. పూర్వతరం రచయితలకు కొత్త ప్రణాళిక్ష అర్ధంకాని భాషలా కనిపించేది. ఆందువల్ల పాఠశాలలు అవసరం లేదన్నారు. అసలు ప్రణాళికలో పేర్కొన్న అభివర్గాలమీద సీనియర్లకు కూడా శిక్షణ అవసరమనిపించసాగింది. పంట బిగువుమీద కొంతకాలం సభలు నిర్వహించారు. కొందరు తమ కవితలను అచ్చువేయించుకున్నారు. అంతె.

సోవియట్‌ అధికారం వచ్చిన తరవాత లెనిన్‌ పేర మాస్కోలో సామాజిక శా(స్త్రాధ్యయన పరిషత్తు ఏర్పడింది. దాన్ని సామాన్యులు కమ్యూనిస్టు పారశాల అనేవారు. హోచిమిన్‌ అదే పారశాల విద్యార్థి. తొలినాటి పార్య ప్రణాళికలెలా వున్నాయో తెలియదు. కాని నాకు తెలియవచ్చేనాటికి ఏడాది, ఆర్నెల్లు మూడు నెల్ల కోర్సులుండేవి. విద్యార్థి యువజన స్టాయిగల వారిని ఏడాది కోర్సుకు పంపేవారు. అంతకన్న కాస్త సైవారికి ఆర్నెల్లకోర్సు. నాయకులకు మూడు నెల్ల కోర్సు ఇదీ పద్దతి. నన్ను మూడు నెల్ల కోర్సుకు పంపుతామన్నారు. నేను వెళ్లనన్నాను. నేను ఏడాది కోర్సు వాడిని. కనీసం ఆర్నెల్లకైనా పరవాలేదు.

ఆఖరికి నన్ను ఆర్నెల్ల కోర్సుకు పంపడానికి ఒప్పుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, పంజాబీ భాషల వారిని భాషకు ఇద్దరేసి వ్యక్తులను ఎన్నుకున్నారు. ఇందులో ఇద్దరు తెలుగు, ఒక బెంగాలీ, ఒక పంజాబీని ఆర్నెల్లకూ మిగిలివారిని సంవత్సరం కోర్సుకు నిర్ణయించారు. అంటే సంవత్సరం కోర్సు వారు ఆరుగురు. ఆర్నెల్ల వారు నలుగురు వెరసి పదిమంది. ఈ పదిమంది బృందానికీ ఒక బెంగాలీ కార్యకర్తను నాయకునిగా నియమించారు. ఆతడు వచ్చిన నెల రోజులకే ఆస్పత్రిలో చేరాడు. రష్యన్‌ పద్దతి ప్రకారం ఒక బృందానికి నాయకుడనేవాడుండాలి.

సాధారణంగా నాయకునితోపాటు ఉపనాయకుని కూడా ఢిల్లీలోనే నిర్ణయిస్తారు. అలాంటి నిర్ణయం జరగలేదు. అప్పుడు నేను అందరినీ ఆహ్వానించి ఒక నాయకుడిని ఎన్నుకొనవలసిన అవసరాన్ని వివరించాను. తెలుగు వారిలో నేనూ, కోడు/1ంటి గోవిందరావూ ఉన్నాం. ఇద్దరమూ ఆర్నెల్లవారమే. నాయకుని ఎన్నిక (ప్రస్తావన వచ్చినప్పుడు పంజాబీ కా[మ్రేడు గోవిందరావు పేరు చెప్పాడు. ఆరవ కొద్రేడ్‌ నా పేరు చెప్పాడు. ఆరవ కామ్రేడును మలయాళీవారు. ఒక బెంగాలీ యువకుడూ సమర్హించాడు. వోటింగు తప్పనిసరి అయింది. నేను నాయకునిగా ఎన్నికయ్యాను.

మేం అక్కడికి వెళ్లేసరికి మూడునెల్ల తెలుగు బృందం ఒకటుంది. దానికి కేయల్‌ మహేంద్ర నాయకుడు. మా బృందం 1974 డిసెంబరులో బయలుదేరింది. బయలుదేరే రోజున ఢిల్లీ టెంపరేచరు ఆరు డిగ్రీలు. సూటు ఓవర్‌ కోటు, టోపీ వున్నా చలిని తట్టుకొనడం కష్టం అయింది. మాస్కోలో దిగినప్పుడు టెంపరేటరు మైనస్‌ ఆరుడి'(్రీలు. ఆయినా చలి లేదు. ఢిల్లీలో గాలి వీచడంవల్ల చలి అనిపించింది.

వకు ననన క కప నన న కన రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 143

మాస్కోలో గాలిలేదు. అందుకని ఓవరు కోటు వేసుకొనవలసిన అవసరం కానరాలేదు. ముందు ఊరి చివరనున్న ఒక దాబాకి వెళ్ళాం. అదో క్వారంటైను లాంటిది. డాక్టర్లు మమ్మల్ని పరీక్షించారు. మాలో ఎవరికీ సాంక్రమిక రోగాల్లేవు, అక్కడే మూడు నాలుగు రోజులున్నాం. మేం వెళ్లగానే అక్కడి దాబా రక్షకులు సువనీర్‌ సువనీర్‌ అన్నారు. నేను వారికి ఇండియన్‌ సిగరెట్టిచ్చాను. రష్యన్‌ సిగరెట్లకు ఘాటు వుండదు. ఇండియన్‌ సిగరెట్టు వారికి చాలా యిష్టం. సిగరెట్టిచ్చినందుకు నన్ను ప్రత్యేకంగా చూసేవారు. వారితో మాట్లాడ్డానికి భాషరాదు. మనసులు కలిసిన చోట భాష నామమాత్రమే అవుతుంది. లంకలో బౌద్ద భిక్షువుతో భాష రాకుండానే అరగంటసేపు మౌట్టాడేవాళ్లం. ఒకొక్క భాషవారం ఇద్దరేసి వున్నాం కనక భాష ప్రాతిపదికగా మాకు గదులు కేటాయించారు. అంటే దాబా నుంచి ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చేశామన్నమాట. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో యాభై దేశాల వారున్నారు. మేం ఉన్నచోట నుంచి నూరు గజాల దూరంలో ఒక పార్కువుంది. అక్కడి నుంచి నూరు గజాల దూరాన మెట్రో స్టేషను. ఓ యాభై గజాల దూరాన మెయిన్‌రోడ్డు. బస్సులు నడుస్తాయి. మేం వచ్చేసరికి వున్న తెలుగు బృందం నుంచి దారులూ, దుకాణాలు, మెట్రో పద్దతులు నేర్చుకున్నాం. పదిహేను రోజులకొకసారి స్టెపెండు ఇస్తారు. స్టైపెండులోంచి కొంత పార్టీ లెవీ చెల్లించాలి. స్థానిక పార్టీకి కాదు ఇండియన్‌ పార్టీకి. దానికి ఇన్‌స్టట్యూట్‌ లోనే ఏర్పాట్టున్నాయి. భోజనశాల, కాఫీశాల, సాయంత్రం ఫలహార శాల, ఒక దుకాణం, క్షవరశాల, ఆస్పత్రి అన్నీ అక్కడున్నాయి. చలికాలపు ఓవర్‌కోట్టు, బూట్లు కూడా ఆ దుకాణంలో దొరుకుతాయి. వారంలో ఏదో ఒక రోజున సినిమా వుంటుంది. ఒక (ప్రసంగం వుంటుంది. ఉదయం ఫలహారం అయిన తరవాత పాఠశాలకు వెళ్ళాలి. భోజన సమయందాకా పాఠాలు నడుస్తాయి. భోజనం తర్వాత మల్లీ పారాలుంటాయి. న్‌ ప్రతి దేశంవారు తమ దేశాన కమ్యూనిస్టు పార్టీ స్థాపకదినోత్సవాన్ని జరుపుకొనవచ్చును ఆ ఉత్చవానిక్షి శతత జేశాఆ బృంద నాయకుల్లి సాధారణంగా పిలుస్తారు. నన్ను నాయకునిగా ఎన్నుకున్న తరవాత ఇటాలియన్‌ బృందం తమ పార్టీ జయంతిని జరిపారు. నాకు ఆహ్వానం వచ్చింది. వెళ్ళాను. నా వంతు వచ్చేసరికి తెలుగుభాషను గురించీ దానికి ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అన్న పేరు ఎందుకు వచ్చిందో చెప్పి ఒక తెలుగు పాట పాడాను. ఆ రోజునుంచీ ఇటాలియన్‌ నాయకుడూ, నేనూ ఓ అరగంట సేపు మాట్లాడుకుంటూ వుండేవారం. పశ్చిమాసియాలో అగద, యూరపులో ఇటాలియన్స్‌, మన తెలుగు సంగీత భాషలు. నాకు ఇటాలియను భాష రాదు. ఆయనకు తెలుగురాదు. ఇద్దరం కమ్యూనిస్టులం. మేమున్నది యాభయి దేశాల కమ్యూనిస్టులు కలిసి వుంటున్న భవనం. అనేక విషయాల్లో ఏకీభావంగల వారి మధ్య భాషలు వేరయినా వారు మాట్లాడుకొనగలుగుతారు. అది చారిత్రకానుభవం. స్వానుభవం కూడా. మానవజాతి చరిత్రలో శావేజి మహాదశ ద్వితీయాంతర్హళలో జనం భూభ్రమణానికి బయలుదేరేవారు, ఆ (భ్రమణంలో అనేకులు కొత్తవారు కలిసే వారు. వారి భాషలు వేరు. అయినా ముఖాముఖీ కలిసేవారు. అప్పుడు వారెలా మాట్టాడుకునేవారో ఆర్యుల వేదం చెబుతుంది. “సంగచ్చద్వం సంవద ధ్వంసం వోమనాంసి జానతాం” అంటుంది వేదరుక్కు. ఆ జనం కలిసి 144 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

నడుస్తారు. కలిసి మాట్లాడుకుంటారు. కలిసి ఒకరి మనస్సును ఒకరు తెలుసుకుంటారు అని ఈ రుక్కుకి అర్థం. కలిసి ఏడడుగులు వేస్తే సఖ్యం కలుగుతుంది అంటారు. ఈ ఉదాహరణలను బట్టి చూస్తే లక్ష్యశుద్రిగల వారి భాషలు వేరయినా ఒకరి మనసు ఒకరికి తెలుస్తుందని చరిత్రలో అనేక ఉదంతాలు చెబుతున్నాయి. మేం కూడా కలిసినప్పుడల్హా అరగంటసేపు మాట్టాడుకునేవాళ్తం అంటే అందులో ఆళ్ళర్యం లేదు. మరోసారి అరబ్బుల పార్టీ నిర్మాణ దినం వచ్చింది. వారు నా వద్దకు వచ్చి మీరొక కల్చరల్‌ ప్రోగ్రాం ఇవ్వాలని కోరారు. వెంటనే సమావేశం జరిపి చర్చించాం. ఇక్కడున్న అయిదు భాషల వారిలోనూ ఏదో ఒక భాష మాత్రమే తీసుకుని పాట పాడ్డం మంచిది కాదనుకున్నాం. అప్పుడు నేను అరబ్బీలో రెండు మూడు పదాలను ప్రయోగిస్తూ ఉరుదు భాషలో ఒకపాట తయారుచేశాను. చాలా ్రసిద్దమయిన ఒక పల్లవిని అందరం ప్రాక్టీసు చేశాం. నేనో ఎర్రరుమాలు చేతబట్టుకొని ఉర్‌ర్‌ర్‌ అంటూ రంగమీదికి వచ్చి పాట చరణం చెబుతాను. దాంతో నేను వెనక్కి, జనం పల్లవితో ముందుకు వస్తారు. “దమాదం మస్త్‌ ఖలందర్‌ ఆయారే మస్త్‌ ఖలందర్‌” అనేది పల్లవి. అందరం నిత్య దుస్తుల్లోనే వున్నాం. తమిళ, మలయాళీ సోదరులు మాత్రం వారి జాతీయ దుస్తులు వేశారు. అంటే గళ్లలుంగీలు కట్టారు. మూడు చరణాలు అల్లాను. అవి ఇవి మేరా నాం హై నిక్సన్‌ యారో దునియాకా జాదూగర్‌ టోపీమే ఖర్లోష్‌ టటోలా కూద్‌పడాకీ సింగర్‌ దమాదం మైహుం పూంజీకా రఖ్యాలా సామ్రాజీ సర్దార్‌ ఇన్టిలాబ్‌ కామై దుష్మన్‌ హుం మావో మేరే యార్‌ దమాదం మైహుం మలికుల్‌ మౌత్‌ రెభయ్యా జంగ్‌ ఖోరోంకా యక్కా. మైహుం మలికుల్‌నూ త్‌ రె భయ్యా జంగ్‌ భోరోంకా యక్కా. వియత్‌నాంమె లాతే. ఖాయీ అహిల్‌ అరబొసె ముక్కా. రెండేసి లైన్సు ద్విపదల్హా నడుస్తే ఆ తరవాత పల్లవి వస్తుంది. ఇందులో మలికుల్మాత్‌ అహిలె అరబ్‌ అన్నవి అరబ్బీ పదాలు, మలికుల్మౌత్‌ అంటే మృత్యురాజు అని అర్థం, అహిలె అరబ్‌ అంటే ఆరబ్బీ భూమివాడు. లేదా అరబ్బీ వాడు అని అర్థం. పాటవాళ్లకెంత అర్ధం అయిందో తెలియదు కాని చప్పట్లతో హాలు హోరెత్తింది. ఆ తరవాత నన్ను చూసిన వారు జేబురుమాలును తలపైన తిప్పుతూ హుర్‌ర్‌ర్ర్‌ అంటూ వుండేవారు. రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 145

టో భారతదేశాన నూట ఇరవైరకాల పంచాంగాలు అమల్లో ఉన్నాయి. చాంద్ర, సౌర, నక్షత్ర, బృహస్పతి మానాలు బతికి ఉన్దాయి. అంతేకాదు చాలా శకాలు కూడా వున్నాయి. ఇన్లి విభేదాలతో వును జనానికి భారతీయులని పేరు. ఇండియాకు స్వాతంత్ర్యం రాగానే నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహంరూ ముందు పంచాంగ నంన్కరణ కావాలనుకున్నాడు. ఆసంస్కరణ కోసం (ప్రసిద్ధపండితుడు మేఘనాధ సాహా అధ్యక్షతన కమిటీని వేశాడు. ఆయన శకాలన్సింటినీ వరిళిలించి చారిత్రకత ఉన్స శకం ఒక్కటే అని నిర్ధారణకు వచ్చాడు. అదే శాలివాహన శకం. ాావకకాాకటేననాా. మాస్కోలో తెలుగు సైంటిసు కోలాచలం సీతారామయ్యగారు అని ఒక సైంటిస్టు మాస్కోలోనే వున్నారు. ఆయనా జయప్రకాశ్‌ నారాయణ అమెరికా వెళ్లి అక్కడ చదువుకున్నారు. వారు ఆమెరికా కమ్యూనిస్టు పార్టీలో సభ్యులు. సోవియట్‌ యూనియన్‌ ఏర్పడిన తొలిరోజుల్లో కొత్త రాజ్యానికి సైంటిస్పులు కావాలి. అందుకని మాస్కోకు వచ్చి స్టిరపడదలుచుకున్న శా(స్త్రవేత్తల కోసం (ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అప్పుడు సీతారామయ్యగారు మాస్కో వచ్చారు. ఆయన పెట్రోలియం శాస్త్రవేత్త, సెళ్లేయి రామయ్య అనే పేర ఆయనక్కడ స్థిరపడ్డాడు. ఆయన్ని చూడ్డంకోసం మిత్రుడు జయప్రకాశ్‌ నారాయణ అప్పుడప్పుడు వచ్చేవాడు, ఆయన ఒక రష్యాస్త్రీని వివాహమాడాడు. నేను వెళ్లేనాటికి ఆయన రిటైరు అయ్యాడు. ఇంట్లో ఒక అల్మార నిండా తెలుగు పుస్తకాలున్నాయి. నేనింట్లో అడుగు పెట్టగానే ఆయన భార్య చేతులు జోడించి నమస్కారమండీ బాగున్నారా అని అడిగారు. ఆమె కట్టుబొట్టూ మాట తీరూచూస్తే వైదిక బ్రాహ్మణస్త్రీలా కనిపించింది. స్టాలిన్‌ మరణానంతరం ఆయన ఇండియాకు వచ్చారు. ఆయన అన్నగార్లూ వారి పిల్లలూ ఇక్కడున్నారు. ఆ పిల్లల్లో కొందరిని నేనెరుగుదును. ఆయనకు వ్రాత్యస్తోమంచేసి మెడలో జందెం వేసి బంగారంతో నాలుకకాల్చి అప్పుడంతా సహపంక్తిన భోజనాలు చేశారు. తన వారినందరినీ సంతృప్తిపరిచే పద్దతి యిది. 146 అ రాంభట్ట కృష్ణమూర్తి సొాంతకథ

ఆయనకు ఇద్దరు కూతుళ్లు, వారి పేర్టు కృష్ణవేణి, నీలవేణి. నేను వెళ్లినప్పుడు వారు ఇంటలేరు. ఏవో పర్యటనల్లో వున్నారు. వారిద్దరూ కూడా నాటక కళాకారిణులు. శ్రీశ్రీ, కవితలను ఆయన వారికి నేర్పాడు. ఆయన తెలుగు బాగానే మాట్టాడుతాడు కాని అప్పుడప్పుడు ఉచ్చారణలో రష్యన్‌ చాయలు కనిపిస్తాయి. కార్మికులు రిటైరయిన తరవాత వేరేపని చేస్తే రెండు జీతాలూ వస్తాయి. మేధావులకు అలాంటి సౌకర్యం లేదు. దానివల్ల మేధావులు చాలా బాధపడుతూ వుంటారు. ఆ సంగతి నాకు అక్కడ తెలిసింది. సోషలిజం పతనానికి ఇదో కారణం అయివుంటుంది.

మా క్షాసుటీచరూ ఫిలాసఫీ టీచరూ ఒక్కరే. ఆయన పేరు గ్రిగర్యాన్‌. ఆర్మేనియా దేశస్థుడు. నాకు తత్వశా(స్తం మీద అభిమానం వుంది. ఒకరోజు ఆయన్నడిగాను మార్కు ఏషియాటిక్‌ మోడ్‌ ఆఫ్‌ (ప్రొడక్షన్‌ గురించి రాసినట్టు చదివిన గుర్తు, దాని గురించి తెలుసుకోవాలనుంది అన్నాను. ఏషియాటిక్‌ మోడ్‌ ఆఫ్‌ (ప్రొడక్షను వుంది. మా తత్వశా(స్త్రవేత్తలు ఒప్పుకుంటారు. కాని అర్ధశా(స్త్రవేత్తలొప్పుకొనరు. అర్ధశా(స్త్రవేత్తలు ఒప్పుకొనకపోతే రాజకీయులు దాన్ని అసలు ఒప్పుకొనరు అన్నాడు.

మనం ఇప్పుడు ఫిలాసఫీని గురించి చర్చిస్తున్నాం. ఫిలాసఫర్హు ఒప్పుకున్న మేరకు చెప్పండి చాలును అన్నాను. నాకు రెండు వారాలు టైమివ్వండి కొన్ని పుస్తకాలను చదవాలి అన్నాడు. సరేనన్నాను. జ్ఞానం రెండు రకాలు. ఒకటి మనకు కావలసిన సమాచారం ఎక్కడ దొరుకుతుంది అన్న ప్రశ్నకు రాగల జవాబు

  • ఒకటి అది నాకు తెలుసును అన్న జవాబు. రెండు ఆ సమాచారం ఏ పుస్తకంలో దొరుకుతుంది అనేది. శ్రిగర్యాన్‌ రెండో పద్దతిని చేబట్టి పుస్తకాలు చదవాలన్నాడు. అందుకోసమే రెండు వారాలు కావాలన్నాడు. పెట్టుబడిదారీ విధాన రాజకీయార్ధశా(స్తం ఆ పుస్తకం.

బల్గేరియా అర్థశా(స్త్రవేత్త వార్గా ఆ పుస్తకం రాశాడు. అంటే తన మాతృభాష అయిన బల్లేరియాలో రాశాడు. ఆ (గ్రంధం మున్నుడిలో ఏషియాటిక్‌ మోడ్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ వివరణ వుంది. పెట్టుబడిదారీ అర్హశాస్తానికి అది ప్రామాణిక (గ్రంధం. అందులోని మున్నుడి తీసేసి మిగతా (గ్రంథాన్ని రష్యన్‌లోకి అనువదించారు. దాన్ని ప్రపంచభాషలన్నింటిలోనూ అనువదించి అచ్చువేశారు. మన దేశంలో కూడా అదే ప్రామాణిక అర్థశాస్త్రం బల్లేరియా నుంచి మున్నుడిని ఆనువదించి దాన్ని తిరిగి ఇంగ్లీషు చేసి నాకు చెప్పాడు (్రిగర్యాన్‌. నేను లాంగ్‌ హేండులో రాసుకున్నాను.

నేను మాస్కోకు వెళ్లడానికి కాస్త ముందు కేపిటలిజానికి పూర్వపు కేపిటల్‌ రూపాలు అన్న పుస్తకాన్ని కొనుక్కున్నాను. దాన్ని ఇంగ్లీషువారు అచ్చు వేశారు. లార్సన్‌ ఎండ్‌ విషార్ట్‌ కంపెనీది ఆ పుస్తకం. విశాలాంధ్ర పుస్తకాలయంలోనే పాతికరూపాయలకు కొన్నాను. తిరిగి వచ్చిన తరవాత నా నోట్సునీ ఆ పుస్తకాన్నీ జాగ్రత్తగా చదివాను. ఆదిమ సమాజానికి ప్రథమ వర్గ సమాజానికీ మధ్యనున్న దశ ఆది వ్యవసాయసమాజం. ఆ సమాజంలోనే పనికి తిండి అన్న సూత్రం వుండేది. ఆ కాలంలోనే ఇది మనుషులు చేసినవేనా? అనిపించే కట్టడాలను నిర్మించారు.

శంఖంలో పోస్తేనేగాని తీర్థంకాదు అని మనకో సొమెత వుంది. అలాగే అర్ధశాస్త్రం అంగీకరిస్తేనే కాని అది మార్క్సిజం కాదు అన్నది కమ్యూనిస్టు సామెత. పెట్టుబడిదారీ విధానానికి ముందున్న సామాజికార్థిక రూపాలు అన్న పుస్తకం పదిహేనేళ్లు రేయింబవళ్లు అధ్యయనం చేసి తీసుకున్న నోట్సును జర్మనీలో (గ్రుండెస్సీ అనేవారు. ఆ నోట్సులో చిన్నభాగం కేపిటలిజానికి పూర్వపు సామాజికార్థిక రూపాలన్న పుస్తకం. దీన్ని ఇటాలియన్హు 1955లోనే తమ భాషలోకి అనువదించుకున్నారు. 1965లో ఇంగ్షీషువారు (ప్రకటించారు. నేను కొన్నది రెండో ఎడిషను.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 147

ఆనాడు అంతర్జాతీయ కమ్యూనిస్టు సమితి అనేదుండేది దాన్ని సంక్షిప్తంగా కొమింటర్న్‌ అని పిలుస్తూ వుండేవారు. మార్క్సురాసుకున్న నోట్సును రష్యన్‌లోకి అనువదించి 1942లో ప్రకటించారు. అది అచ్చుకాగానే స్తాలిన్‌ కమింటర్న్‌ను సమావేశపరిచాడు. సామాజికార్థిక రూపాల్లో ఏషియాటిక్‌ రూపం ఒకటి. జలసేచనతో వ్యవసాయం దాని ప్రధాన లక్షణం నాటి కొమింటర్న్‌లో ఆసియా ప్రతినిధి ఒక చైనా నాయకుడు. ఏష్షియాటిక్‌ పద్ధతిమీద ఆయన అభిప్రాయాన్ని అడిగారు. మాకు వర్షాలు సరిపోతాయి. ఇరిగేషను అవసరంలేదు అనేది ఆయన సమాధానం. ముదిమది తప్పిన ముసిలాయన ఏదో రాశాడు. ఆయన మీద గౌరవంగల వారు దాన్నోరకం ప్యూడలిజంగా చెప్పుకొనవచ్చునన్నాడు ఆ చైనా నాయకుడు. అది ద్వితీయ ప్రపంచయుద్ధం ముమ్మరంగా సాగుతున్న రోజులు. ప్రశాంతంగా ఆలోచించడానికి అనువుకాని రోజులవడంచేత ఆ సమస్యను అంతటితో పరిష్కరించి పారేశారు. అప్పటినుంచీ సమాజ పరిణామంలో బానిస సమాజానికి 'ప్రధమస్థానం వచ్చింది. బానిస సమాజం తరవాత ప్యూడలు సమాజం. మన దేశాన బానిసలున్నారు కాని ఉత్పాదక దాసుల్లేరు. అలాగే ప్యూడల్సు కూడా లేరు. అందువల్ల మనకు చరిత్ర సీమరాణీ బావుటాతోపాటే పుట్టింది. సీమ రాణీ బావుటా పెట్టుబడిదారీ విధానం కన్న ముందున్న భారతచరిత్రలో నేర్చుకొనదగ్గదేదీ లేదు. వ్యవసాయం పశుపాలన ఏక కాలాన పుట్టాయంటుంది ప్రాకృరిత్ర. ఆర్యులు, మ్రేచ్చులు పశుపాలన చేపట్టారు. మ్లేచ్చులంటే హిమిటో సిమెటిక్కులు. ఇనుము కనిపెట్టడంతో ఇతరులు పెద్ద పెట్టన ఇరిగేటెడ్‌ వ్యవసాయం చేబట్టారు. దాన్నే మార్క్సు ఏసియాటిక్‌ మోడ్‌ అన్నాడు. ఏషియాటిక్‌ అంటే ఏషియా అంతటా అని అర్హం కాదు. ఆసియాలోని సుమేరులో అలాంటి వ్యవసాయమే ఉండేది. ఆఫ్రికా ఉత్తరప్రాంతాన అలాంటి ఉత్పత్తి విధానం ఉండేది. భారతదేశాన పంజాబు, సింధు ప్రాంతాన ఆ విధానం ఉండేది. ఏసియాటిక్‌ మోడ్‌ ఆప్‌ 'ప్రొడక్షనులో వ్యవసాయభూమి అంతా సమాజానిది. ఆ భూమి ఎవరికి సొంత ఆస్తికాదు. నివేశన స్థలం మాత్రం వ్యక్తి సంత అస్తి, వ్యక్తికి స్వత్వం ఉన్నదాన్నే రుణానికి హామీగా అంటే తాకట్టు పెట్టగల అధికారం వుండేది. “బుణానుబంధరూపేణ పశుపత్తి సుతాలయా;” అన్న ధర్మసూత్రం అంటుంది. ట్ట ట్ర నవచ్చును. భారతదేశాన వ్యవసాయక్షేత్రాలమీద ఎవరికీ ఆస్తి హక్కులేదు అంటాడు మార్కు. అంతేకాదు. "*ఓనరు” అని అరం ఇచ్చే మాట భారతదేశాన ఏ భాషలోనూ కానరాదు అని మార్క్సు ఎంగెల్బులిద్దరూ అంటున్నారు. ప' డ ప టి అలాంటి ద్ద న్నారు. ఇప్పుడు మన దేశాన వైదిక పదం ఒక అర్జాన వాడుకలో వుంది. ఆ పదం “యజమాని” అని అది వేగాలో బహుళంగా వాడిన చూట. వేదపరిభాషలో యజ్ఞం అంటే సాముదాయకవంట. స్‌ యజ్ఞనాయకుని యజమాని అనేవారు. నాటి వైదికుల భోజనం పశువు. కాల్చిన పశుమాంసం. పశుపొలన కన్న ముందే మనిషి కుండలు చేయడం నేర్చాడు. బర్భర మహాదశ 'ప్రథమాంతరంలోనే కుంభకారులు తయారయ్యారు. ద్వితీయాంతరంలో పశుపాలన, వ్యవసాయం పుట్టాయి, ఆర్వులూ, 'మ్రేచ్చులూ పుష్టికరమైన పళుపాలన చేబట్టారు. పశుపాలనకు స్థిరత వుండదు, పశువులకు పచ్చికలీల్ల వెతుక్కుంటూ నిరంతర సంచారం వారికి తప్పనిసరి. సంచారజీవులక్తు కుండలు గుదిబండలవుతాయి. అందువల్ల ఆర్యులు: మ్లేచ్భులూ బార్చిక్యూ - భూలమాంసం తినేవారు. న తననన 148 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

ఆర్యులు పశువులను 'ెంచుతే, మేచ్చులు మేకలు, గొర్రెలను పెంచేవారు. పశుభోజనం తయారు చేయడానికి ముఖ్యులు ముగ్గురు ఒకడు రుగ్వేదం నేర్చిన హోత. రెండు సామవేదం నేర్చిన ఉద్గాత మూడు యజుర్వేదం నేర్చిన ఆధ్వర్యుడు ఈ ముగ్గురికీ నాయకునిలాంటివాడు యజమానుడు యజమానుడంటే యజ్ఞం చేసేవాడు అని అర్ధం. హోత, ఉద్గాత, ఆధ్వర్యుడూ మూడు వేదాలను చదువుతూ వుంటే మిగతా వారికి యజమానుడు పనులు చెబుతూ వుంటారు. వ్యవసాయం పుట్టిన తరవాత మడి గట్టున కూర్చుని పనులు పురమాయించేవాడు యజమానుడయాడు. నేనక్కడున్నప్పుడు మరో మూడునెల్ల బృందం చచ్చింది, దానికి కాగ్రేుడ్‌ దాసరి నాగభూషణరావు నాయకుడు. ఆ బృందంలో పంజాబీలెక్కువ వారు అక్కడ ఫౌండేషను డే ఉత్సవాలు చూశారు. ఫౌండేషను జే అంటే వారిదేశాన కమ్యూనిస్టు పార్టీ పుట్టినరోజు అని అర్ధం. ఆరోజున మాత్రమే తోటి కమ్యూనిస్టు బృందనాయకులను ఆహ్వానించి ఉత్సవం చేస్తారు. కొత్తగా వచ్చిన పంజాబీలు జలియంవాలాబాగ్‌ దినాన్ని జరపాలని నాయకునిమీద ఒత్తిడి తెచ్చారు. తెలుగువారు ఎవరు వచ్చినా ముందు నాతో పరిచయం పెట్టుకుంటారు. ఉదయాన్నే నేను టీ పెడతాను. తొమ్మిదయితేనే కాని కేంటీను తెరవరు. లేవగానే నా రూముకు వస్తే బ్బాక్‌టీ దొరుకుతుంది ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చినరోజే దాసరి రూంకివచ్చారు. వంజాబీలు జలియంవాలా రోజు జరపాలని పట్టుబడుతున్నారు. ఏం చేయాలి అని అడిగాడాయన. క్లాసులు నడిచే అంతస్తులోనే పెద్ద గది ఒకటుంది. అక్కడ జరుపుకొనవచ్చునని చెప్పాను. కాగా దానికి పర్మిషను తీసుకోవాలి అని వివరంగా చెప్పాను. ఆయనకు ఎడ్మిని(స్టేషను గది చూపించాను. ఆ సమావేశానికి మా బృందం కూడా వెళ్లింది. పంజాబీలు ఉరుదులో ఉపన్యాసాలిచ్చారు. మా బృందంలో వున్న పంజాబీలకు తప్ప ఉరుదెవరికీ అర్ధం కాదు. అదే పంజాబీలు తమకు ఇండియన్‌ ఫిలాసఫీ కావాలన్నారు. కామ్రేడ్‌ దాసరి ఎడ్మిని(్ట్రేషను నుంచి పరి శ్రషన్‌ తెచ్చాడు. అసలా క్ధాసు ఎలా వుంటుందో అన్న కుతూహలంతో నేను కూడా మూడురోజులు ఆ క్లాసుకు వెళ్లేందుకు పర్మిషన్‌ తెచ్చుకున్నాను ఇండియన్‌ ఫిలాసఫీ తెలిసిన ప్రొఫెసరు పేరు అనికయెవ్‌. నాకు ఫిలాసఫీ అంటే అభిమానం అని (గ్రిగర్యాన్‌ ఆయనకు చెప్పాడు. నేనా క్లాసుకు వెళ్లాను. నేనా క్లాసులో కూర్చునేందుకు పర్మిషను ఇవ్వమని ఆనికయెవ్‌ విద్యార్థులను అడిగాడు. అందుకు వారు అంగీకారం తెలియపరిచారు. ఇది ఆ ఇన్‌స్టిట్యూట్‌ మర్యాద. నేను కాస్త ఆలస్యంగా వెళ్లాను. అప్పటికే బోర్డుమీద సంచభూతాల పేర్లున్నాయి. అవి దెయ్యాలుకావు. పదార్థరూపాల పేర్లు అని అనికయెవ్‌ కుస్తీ పడుతున్నాడు. ఇంతట్లో కాఫీట్రేక్‌ అక్కడ అనికయెవ్‌ వీరికెలా చెప్పాలి అని నన్నడిగాడు. ఈరోజు పంచభూతాలంటే అర్ధం చెప్పలేకపోయాను. ఈ పారాలెలా నడుస్తాయో నాకర్థం అవడం లేదన్నారు. ఆరోజునుంచీ అనికయెవ్‌తో ఓ ఆర్హగంట మాట్లాడేవాడిని. ఆయనకు దేవీ ప్రసాద్‌ చటర్టీ మంచి స్నేహితుడు. దేవీ ప్రసాద్‌ నాక్కూడా స్నేహితునిలాంటి వాడే. అందుకని రోజూ అరగంట ఇండియన్‌ ఫిలాసఫి మీద చర్చించుకునేవాళ్లం. మాస్కోలో రోడ్డు చాలా వెడల్పుగా వుంటాయి. అందుకని జనం రోడ్డుమీద తిరగరు. భూమి లోపల రహదారులుంటాయి. ఒకొక్కప్పుడు అవి రెండుమూడుగా చీలుతాయి. ఆ చీలుదారులు ఎటువెళతాయో స్పష్టంగా రాసి వుంటుంది. ఆ దారులు మాస్కోకు అధోజగత్తు, ఆ జగత్తులో ఒకసారి నన్నాకరు అటకాయించారు. నాచేతినున్ను గడియారాన్ని చూపుతూ యప్పాన్‌ యప్పాన్‌ అంటూ తన చేతిగడియారం కాలు రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ అ 149

తీసి యాభైరూబుల్సు నోటు, గడియారం చూపించారు. నాచేతి గడియారం యిస్తే ఆయన తన గడియారాన్న కాకుండా పైన యాభైరూబుల్సు కూడా ఇస్తానంటున్నాడు. నాచేతినున్నది సీకోజపాను గడియారం, నీ భాష నాకర్థం కాదు అని తెలుగులో చెప్పి తప్పించుకున్నాను. చేతులు చూసి ఫలితాలు చెప్పేవారు, చిన్న చిన్న లాటరీలు ఆ అధోజగత్తుకు అలవాటు. ఈ గడియారం అనుభవం అయిన తరవాత (గ్రిగర్యాన్ను అడిగాను. ఈ పాతాళ దెయ్యాలను ఒదిలించే మంత్రం ఏదీ లేదా అని. అప్పుడాయన నవ్వుతూ నాకు మంత్రోపదేశం చేశాడు. ఆమంటత్రమిది: “యా కమ్యూనిస్త” అని. అంటే నేను కమ్యూనిస్టును అని ఆ మంత్రానికి అర్ధం. ఒక రోజున చాలా మంది నన్ను చుట్టుముట్టారు. అప్పుడే మంత్ర ప్రయోగం చేశాను. చిటికలో దెయ్యాలు మాయం. మాస్కో ప్రచురణాలయంలో స్వెత్చానాద్దెనిత్‌ అని ఒక మహిళ ఉద్యోగం చేస్తూ వుంటుంది. ఆమె తెలుగు నేర్చుకొనడం కోసం రెండుసార్లు హైదరాబాదు వచ్చింది. ఆమెతో నాకు పరిచయం ఉంది. ఆ సంవత్సరం తెలుగుయుగాది మార్చి 24. ఆది ఆదివారంకూడా, ఆమె నాకు ఫోనుచేసి ఈ రోజు యుగాది అని గుర్తుచేసింది. మంచు బ్రహ్మాండంగా కురుస్తోంది. ఇండియాలో యుగాదికి ఎండలు ముదురుతాయి. 'స్వెత్లానా చెప్పేవరకు ఇది తెలుగు పండుగన్న ధ్యాసేలేదు. ఈరోజు మాయింట భోజనానికి రా అని పిలిచింది. దారిచెప్పింది. రెండు స్టేషన్ల ఆవల వాళ్ల ఇల్లు, నేను మంచు (డ్రస్సు వేసుకుని మెట్రోలో బయలుదేరాను. టిక్కెట్‌ మూడు కోపెక్కులు, మెట్రో స్టేషను దగ్గరే మూడు కోపెక్కు బిళ్లలు దొరుకుతాయి. అది మన పూర్వపు అర్ధణా ఆంత వుండే రాగినాణెం. ఒకసారి పాతాళ స్టేషనుకు వెళితే ఎన్ని స్టేషనులయినా మారవచ్చును. నేను రెండు స్టేషన్లుమారి గమ్యం చేరాను. ఆమె కూడా చలి ముస్తాబు చేసుకుని పైమెట్టుమీద నిలబడి చూస్తోంది. ఆమే నన్ను గుర్తుపట్టి పిలిచింది. అప్పుడామెను గుర్తుపట్టాను. అక్కడికి కాలివేటు దూరాన ఆమె ఇల్లు, ఆయింట పన్నెండో అంతస్తులో వుంది ఆమె యిల్లు, అప్పటికి వంట పూర్తి అయింది. మంచు దట్టంగా పడుతోంది. తెలుగు కవులు కోయిల కూతలను, మామిడికాయలను, వేప పూతను వర్షిస్తారు. ఇలా చెబుతూ ఈ రోజు తారీకు ఎంత అని అడిగాను. అది మార్చి 24వ తేదీ. ఆరే ఇదినా పుట్టినరోజు అని గుర్తుకొచ్చింది. మంచుదిబ్బల మధ్య ఉగాది. ఉగాది నాడే నా పుట్టిన రోజు. అందునా ఆదివారం అవడం చూసి నాకు నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వుతున్నావంది స్వెత్సానా. మాదేశాన సామాన్య జనం అనుసరించే చాంద్రమానం తేదీలకు, సౌరమానాన్ని అనుసరించే (గ్రిగరియన్‌ కేలండరుకూ ఇంత తేడా వుందా అనిపించి నవ్వు వచ్చిందన్నాను.

భారతదేశాన నూట ఇరవైరకాల పంచాంగాలు అమల్లో ఉన్నాయి. చాం(ద్ర, సౌర, నక్షత్ర, బృహస్పతి మానాలు బతికి వున్నాయి. అంతేకాదు చాలా శకాలు కూడా వున్నాయి. ఇన్ని విభేదాలతో వున్న జనానికి భారతీయులని 'పేరు. ఇండియాకు స్వాతంత్ర్యం రాగానే నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహురూ ముందు పంచాంగ సంస్కరణ కావాలనుకున్నాడు. ఆ సంస్కరణ కోసం ప్రసిద్ధ పండితుడు మేఘనాధ సాహా అధ్యక్షతన ఒక కమిటీని వేశాడు. ఆయన శకాలన్నింటినీ పరిశీలించి చారిత్రకత ఉన్న శకం ఒక్కటే అని నిర్ధారణకు వచ్చాడు. అదే శాలివాహన శకం.

ఈ శకానికి శాలివాహన శకమని పేరు మార్చి ఓ రాజు మట్టిబొమ్మలతో సైన్యాన్ని నిర్మించి ఆ బొమ్మ "సైన్యంతో శకులను జయించాడనీ ఆందువల్ల శాలివాహన శకవిజయ సంవత్సరాల పేరు ఆ +కానికి వచ్చిందనీ అంటారనీ కథ కల్పించారు. శకం అన్నపేరు శకుల నుంచే వచ్చిందని చరిత్రకారులు కూడా

150 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

అంటున్నారు. చాంద్రమానం నుంచే నెలలకు పేరు వచ్చాయి. అందుకని నెలల పేరు మార్చలేదు. చాంద్రమాన పంచాంగాల్లోని అధిక మాసాలను, క్షీణమాసాలను విడిచి పెట్టి సొరమాసంతో సమన్వయాన్ని సాధించారు. సాహాకమిటీ సంస్కరించిన పంచాంగాన్ని (ప్రభుత్వం మాత్రమే వాడుతోంది. ఒకనాడు ఇరాకులో వర్దిల్లింది సుమేర రాజ్యం. ఆనాటి స్టలనామాలూ దైవనామాలు తెలుగునాట కనిపిస్తున్నాయి. ఆ(ఫ్ట్రేలియా దగ్గరున్న న్యూగినీ సరసన టోబ్రియాండ్‌ అనే దీవులున్నాయి. ఆ దీవరుల భాషలోని కొన్ని పదాలు, కొన్ని ఆచారాలు తెలుగున కనిపిస్తాయి. అలాగే తెలుగు వారి అత్తను గురించి ఎంగిల్స్‌ రాసిన పుస్తకంలోని సమాచారం నేటికీ తెలుగు తోలుబొమ్మలాటల్లో దర్శనం ఇస్తూ వుంటుంది. ఆ బొమ్మలాటలోనే టోబ్రియాండ్‌ భాషాపదాల ప్రయోగం కూడా కనిపిస్తుంది. మన అధికార్డు, చరిత్రకార్డు తాత్తుకింద బడితాత్తులు. మన దేశాన ఉత్పాదక దాసుల్లేరు. కాని వేదకాలం నుంచీ వందలాది గృహదాసులుండేవారు. అందువల్ల భారతీయ పండితుల నుంచి పామరులదాకా అందరూ తమ పనిని తాము చేసుకొనరు. ఆ పనులను చేయడానికి దాసదాసీలను నియమించడం అలవాటయింది. ఈ అలవాటువల్ల భారతీయులకు పని అంటే పాపంగా మారింది. మహర్షులు కూడా తమ దగ్గరున్న సీనియరు శిష్యులచేత పారాలు చెప్పించి వారిచ్చిన గురుదక్షిణను తాము స్వీకరించేవారు. తనను మించిన శిష్యుడుంటే అతడిని ఆసాధ్యమైన గురుదక్షిణ కోరి అతడిని శాశ్ళతదాసునిగా చేసుకునేవారు. విశ్వామిత్రుని పెద్ద శిష్యుడయిన గాలవుని నుంచి న్యాయమైన గురుదక్షిణ స్వీకరించి ఆతడిని ముక్తుని చేయడం గురువుకిష్టం లేదు. అందువల్ల ఆసంభవమైన గురుదక్షిణ అడిగాడు. ఒక చెవి నల్లగాను తక్కిన శరీరమంతా తెల్లగాను వుండే ఎనిమిది వందల గుర్రాలను గురుదక్షిణగా సమర్పించమన్నాడు. గాలవుడు యయాతిని ఆశ్రయించాడు. యయాతి తన కూతురు మాధవిని యిచ్చి ఈమె నీకు సహకరిస్తుందని చెప్పాడు. మాధవి ముగ్గురు రాజులకు ఒకొక్క కుమారుని కని మొత్తం ఆరువందల గుర్రాలను సంపాదించి గాలవునికిచ్చింది. గురుదక్షిణకింకా రెండొందల గుర్రాలు కావాలి. అప్పుడు మాధవి ఈ ఆరువందల గుర్రాలతోపాటు నన్నుకూడా మీ గురువుకిచ్చి ముక్తుడవు కమ్మంది. గాలవుడలాగే చేసి గురుదక్షిణ యిచ్చి ముక్తుడయ్యాడు. దేనినుంచి ముక్తి? దాస్యం నుంచి. వేదకాలాన కొడుకు, శిష్యుడు, దాసుడు, ఈ ముగ్గురికీ భేదం లేదు. ఒకొక్కప్పుడు కొడుకునీ శిష్యుడినీ దాసుడనే పిలుస్తూ వుంటారు. పురాణాలలో గాలవుడికి ఈ మూడు హోదాలు కనిపిస్తాయి. భారతీయులకు దాస్యం అస్తిగతం అయిపోయిందని చెప్పడం కోసమే ఈ కథను చెప్పవలసి వచ్చింది. స్వెత్హానా దగ్గర నాలుగైదు గంటలు లోకాభిరామాయణంతో గడిచింది. తరవాత ఇన్‌స్టిట్యూట్‌కు చేరుకున్నాను. ఆదివారం వస్తే ఇలా కాలక్షేపం అవుతూ వుండేది. మాస్కో తెలుగు అనువాద విభాగంలో పనిచేస్తున్న రాచమల్లు రామచంద్రారెడ్డి ఇంటికి కాని, ఫిలాసఫీ ప్రొఫెసరు (గ్రిగర్యాన్‌ ఇంటికి కాని వెళ్లేవాడిని. ఎక్కడికీ వెళ్లవలసిన ఆవసరం కానరానపుడు ఇన్‌స్టిట్యూట్‌ లైబ్రరీలో పుస్తకాలు తిరగేస్తూ వుండేవాడిని. ఆఫనాసియెవ్‌ రాసిన డైలెక్టిక్సు చదివాను. ఆ రచన అస్తవ్యస్తంగా కనిపించింది. దాని సర్కులేషను రద్దుచేశారని తరవాత తెలిసింది. ఒకనాడు తత్వశా(స్తం పాఠంలో సామాజిక మనస్తత్వం, సామాజిక చైతన్యాలను వివరించారు. మనిషిలో మొట్టమొదట ప్రతిఫలించేది సామాజిక మనస్తత్వం. అది తక్షణమే కలుగుతుంది. దాన్ని శాస్టీయంగా రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 1561

విశ్లేషించినమీదట కలిగే రూపాన్ని సామాజిక చైతన్యం అంటారు. చైతన్యం అనేది ఒక తాత్విక అభివర్గం. మన దేశాన చాలామంది యువకులకు చైతన్యం అంటే సరియైన తాత్వికార్థం తెలియదు. చైతన్యం అంటే స్పృహ. ఎవేర్నెస్‌ అని యువకులనుకుంటూ వుంటారు. నా కవిత్వంతో సామాజిక చైతన్యాన్ని సృష్టిస్తాను అన్నమాట తరుచు వినబడుతూ వుంటుంది. కొన్ని మాటలకు రెండేసి అర్జాలుంటాయి.

ఒకటి సామాన్యపదం. దాన్ని బేనల్‌ వర్డ్‌ అంటారు ఇంగ్లీషులో, రెండోది శాస్తీయార్థం. ఆలోచన, బుద్ది, సంస్కృతి అన్న మాటలు చైతన్యం కిందికి వస్తాయి. అవి వ్యక్తి చైతన్యాలు, ఇవే మాటలు సామాజికార్ధంలో ప్రతిఫలిస్తే వాటిని సామాజిక చైతన్య రూపాలంటారు. ఆ సామాజిక చైతన్య రూపాలు ఏడు అని కొందరు, అయిదు అని కొందరంటారు. రష్యాతో సహా పశ్చిమ దేశాల్లో “విత్రి” అన్నది ఒక సామాజిక చైతన్యరూపం. మన దేశాన నీతికి ప్రత్యేక స్టానంలేదు. నీతి అనేది పళ్చిమ దేశాల్లో క్రైస్తవ మతం ద్వారా వచ్చింది. మన దేశాన కూడా ఇంగ్లీషు పాఠశాలల్లో చదివిన వారికి తెలియకుండానే నీతి అనేది ఒకసామాజిక చైతన్యరూపంగా మనసున హత్తుకుంది.

మనదేశాన సామాజిక చైతన్య రూపాలను పురుషార్థాలు అంటారు. అవి మూడే, ధర్మ, అర్హ, కామాలు. కొందరు పండితులు పురుషార్జాలను నాలుగుగా వర్షిస్తారు. వారి లెక్కప్రకారం నాలుగోది మోక్షం, ఆది మనిషి మరణించిన తర్వాత మాత్రమే అమల్లోకి వచ్చే పురుషార్ధం. బౌద్దుల నిర్యాణానికి ప్రతిగా మన పురోహితులు సృష్టించిన పురుషార్ధం మోక్షం. వాల్మీకి తన రామాయణాన్ని కామార్ధగుణ సంయుక్తంగా, ధర్మార్ధ గుణ విస్తరంగా రచిస్తానన్నాడు. ఆ శ్లోకాన మోక్ష ప్రస్తావనలేదు.

తమిళ పురోహీతులు పెళ్లి మంత్రాల్లో ధరే గచ అర్జేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య అంటే నాతిచరామి అని వధువులచేత అనిపిస్తారు. ఇది సహగమనానికి పురోహితులు అజ్ఞానంతో ఇచ్చే లైసెన్సు. భర్త శవంతో పాటే దహనం చేస్తే మోక్షంలోకూడా అంటే చావులో కూడా భర్తను అనుసరిస్తాను అని చెప్పిస్తారు. మన తెలుగు సినిమాలో ఈ వాక్యం తరుచు వినిపిస్తూ వుంటుంది. సినిమా నిర్మాతలకు డైరెక్టర్లకు డబ్బులెక్కించడం తప్ప వారు స్కీప్పులో రాసే మాటలతో పనిలేదని దీన్ని బట్టి తేలుతుంది, 'పైగా మన నిర్మాతలంతా గొప్ప హేతువాదులు కూడాను.

మోక్షాలను గురించీ పరలోకాన్ని గురించీ, (గ్రంధాలు రాసేవారిని.గురించి వాలీ గకి రామాయణంలో ఇలా రాశాడు, దానం సంపాదించడం కోసం మేధావులు (గ్రంధాలు రాస్తూ వుంటారు. అంతేకాని పరం అనేది ఎక్కడాలేదు అంటాడు అరణ్యకాండంలో రాముడు తన తండ్రికి పిండాలు పెట్టే సమయంలో, రామునికి జాబాలి మహర్షి ఈ హితవు చెబుతాడు. జాబాలి పురోహితుడు కాడు మంత్రి. గతాగత కాలాల నెరింగిన మహానుభావుడు జాబాలి ఒక్కడేనని వళిష్పుడంటాడు. చేదునిజాన్ని కూడా నిర్భయంగా చెప్పగల మహాత్ముడాయన,

సామాజిక మనస్తత్వం, సామాజిక చైతన్యం లెక్చరు విన్న తరవాత తమకు సామాజిక మనస్తత్వం కూడా చెప్పాలన్నారు మిత్రులు. నేను సామాజిక మనసత్వం చెప్పే ప్రొఫెసరు కావాలని అడిగాను. ఆఫీసువారు పంపిస్తామన్నారు. సామాజిక చైతన్యమే మనకర్ధం అవడంలేదు. సామాజిక్ష మనస్తత్వం ఏం అర్థం అవుతుంది. అది మనకు వద్దని సహచరులు చెప్పేశారు. ఆ అంశానికి టైంటేబిలు తయారయింది. ఒక యువకుడు అధ్యాపకుడు. విద్యార్థిని నేనొక్కడినే. ఒక నియమాన్ని ఉల్లంఘిస్తూ మన పారం మొదలుపెడదామన్నాడు, క్లాసులో సీగరెట్లు తాగకూడదు. ఉల్లంఘన అది.

త 152 అ రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ

క్లాసు రూము లోపల నుంచి గడియపెట్టుకున్నాం. అతడు ఆర్మేనియను - నా సంగతి ముందే తెలుసుకున్నాడు. నువ్వు నాకు ్రాయిడు సైకాలజీచెప్పు, నీకు నేన. సోషల్‌ సైకాలజీ చెబుతానన్నాడు. నేను బేసిక్‌ రైటింగ్స్‌ ఆఫ్‌ సింగ్మండ్‌ ప్రాయిడు అన్న పుస్తకాన్ని చదివాను. ముఖ్యంగా అతడి టోటెం అండ్‌ టాబూ చదవాలన్న కోరిక నాకు చాలా కాలం నుంచీ వుంది. అవే కాకుండా ఆయన బేసిక్‌ రైటింగ్స్‌ అన్నీ చదివాను నేను ఓ ఆరగంట ఆయనకు పారం చెబితే నాకతను అరగంట సోషల్‌ సైకాలజీ పారం చెప్పేవాడు ్రాయిడు యూదు మతస్తుడు. నిరీశ్చరవాది. కాని యూదులందరిలాగే స్తీద్వేషి తరవాత సోషల్‌ సైకాలజీ మీద మాస్కోవారు ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తక రచయితల్లో నాకు పారం చెప్పిన యువకుడు కూడా వున్నాడు. జనంలో ప్రచులితంగా వున్న మూడవిశ్వాసాలన్నీ సోషల్‌ "సైకాలజీలో భాగాలే. ఆ విశ్వాసాల మూలాలను తవ్వి తీసి రాస్తే అది సోషల్‌ కాంషన్‌నెస్‌ అవుతుంది. అలాంటి ప్రయత్నం మన దేశాన సరిగా జరగలేదు. మనది వ్యావసాయక సమాజం. మనది జానపద సంస్కృతి జానపద సంస్కృతిలో ఎక్కువ భాగం అంధవిశ్వాసరూపంలోనే వుంటుందీ. అసలు మన రచయితల్లో ఎక్కువమంది సోషల్‌ సైకాలజీ స్థాయిలోనే వున్నారు. విప్లవ విజయం తాలి రోజుల్లో లెనిన్‌ సెంట్‌ పీటర్సు బల్ల్‌లో వుండే వాడు. తరవాత ఆ నగరానికే లెనిన్‌ గగ్రాడ్‌ అని పేరు మారింది. రాజధాని మాస్కోలో ఆయన కోసం అక్కడ ఒక పెద్ద ఇల్గును ఎంపిక చేశారు. ఆయనకు ఆ యిల్టు చూపించారు. లెనిన్‌ ఇల్లంతా కలియతిరిగి గోర్కీని ఈ ఇంట్లోకి మార్చండి అని ఆదేశించాడు. ఈ అందమైన ఇంట్లో గోర్కీ వుంటే మరికొన్ని గొప్ప రచనలు చేస్తాడు అన్నాడు లెనిన్‌, నేనా యింటికి వెళ్లి చూశాను. చాలా అందంగా ఉంది. తోటవైపు వరండాలో పొడుగాటి డైనింగ్‌ టేబిలు వుంది. చుట్టూ కుర్చీలు. ఒకచోట పెద్ద కుర్చీ. ఒకప్పుడు ఏనుగు ఆ కుర్చీలో కూర్చుని వుంటుందనిపించింది. దాని పక్కన ఒక ఎత్తయిన స్టూలు, గోర్కీ ఆయింటికి మారిన తరవాత అతని కొడుకును ఆయనకు సెక్రటరీగా నియమించాడు. కోడల్ని గృహ పాలకురాలిగా నియమించాడు. ఈ ఏర్పాట్లన్నీ చేసిన తరవాత మాస్కోలో ఒక చిన్న యింట మకాం పెట్టాడు లెనిన్‌: ప్రతిరోజూ సాహితీవేత్తలు ఆయన్ని చూడ్డానికి వస్తూ వుండేవారు. వారంతా ఆ డైనింగ్‌ టేబిలు వద్దనే కూర్చునేవారు. గోర్కీ పక్కనున్న స్టూలుమీద ఆయన మనవరాలు కూర్చునేది. రచయితలతో మాట్లాడేటప్పుడు నేనెవరినమ్మా అని మనవరాలిని అడిగేవాడు. బారు బారు మీసాల బామ్మవి అనేది. అందరూ నవ్వేవారు. కల్పనా పద్ధతిని చిన్న పిల్లల నుంచి నేర్చుకోవాలి అనేవాడు గోర్కీ. మనవరాలికి బామ్మదగ్గర చాలా చనువు. ఈయనా బామ్మలాంటి వాడే కాని బారుమీసాలుండేవి. అందుకని తాతని బారుమీసాల బామ్మ అనేది. ఆయన పుస్తకాల గదిలో ముప్ఫయి ఆరువేల పుస్తకాలున్నాయి. అందులో ఎన్ని చదివాడో తెలియదు. కాని ఆ పుస్తకాల్లో ఆయన వ్యాఖ్యలుండేవి. ఒక యూరోపీయ వేదాంతి తినాలి. బాగా తినాలి, పుష్టిగా తినాలి అని రాశాడు. ఆ వాక్యం దగ్గర గోర్కీవ్యాఖ్య. నువ్వు పందివి అని. ఆయన చదివిన పుస్తకాల్లో ఇలాంటి వ్యాఖ్యలు కనిపిస్తూ వుంటాయి, గోర్కీ ఆసలు "పేరు మక్సిం మస్కిమోవిచ్‌ పెష్కోవ్‌. పెష్కోవ్‌ అనేది ఇంటిపేరు. కాగా ఆయన ఇంటిపేరును గోర్కీగా మార్చుకున్నాడు. ఒక వర్లక్రమంలో గోర్కీ ఆంటే కొండ. ఇంకో వర్షక్రమంలో గోర్కీ అంటే చేదు అని అర్ధం. సత్యం ఎప్పుడూ ఎల్లరకూ చేదుగానే వుంటుందంటాడు గోర్కీ. అందుకని సత్యవాది అనే అర్ధంలో గోర్కీ అని పేరు పెట్టుకున్నాడు. సత్యం ముత్తెరుంగులు, ప్యూడల్‌ సత్యం, రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 153

కేపిటలిస్టు సత్యం, సోషలిస్టు సత్యం అని, ప్యూడల్‌ సత్య నిర్వచనం వ్యాసునిది. ఆయన సత్యబ్రూయాత్‌, 'ప్రియం(బ్రూయాత్‌, నబ్రూయాత్‌ సత్యమప్రియం అంటాడు. కేపిటలిస్టు సత్యప్రవాచకుడు రుడ్యార్ట్‌ కిప్లింగ్‌ ఆయన మతం (ప్రకారం సత్యం ఒక నగ్న కన్య, మూడు నిలువుల లోతు నుంచి పైకి తీసిన నగ్నకన్య, ఆమెనొక పెద్దమనిషి చూస్తే మొహం అయినా తిప్పుకుంటాడు లేకుంటే అద్దకం లంగానయినా కప్పుతాడు. అంటే పెద్ద మనిషి అన్నవాడు నగ్నసత్యాన్ని చూడరాదు చూడనీయరాదు అని అర్హం. మూడోది సోషలిస్టు సత్యం. అదెప్పుడూ చేదుగానే వుంటుంది. అందుకనే గోర్కీ తన పేరును చేదు అని పెట్టుకున్నాడు. చేదుకు పక్షపాతం లేదు. రాజు, పేద భేదం లేదు. అందరికీ చేదుగానే వుంటుంది. ఒకసారి గోర్కీ పనిమీద ఊరెళ్ళాడు. సెక్రటరీగా పనిచేస్తున్న గోర్కీ కుమారుడు తీరిగ్గా ఒక కథ రాశాడు. దాన్ని ఒక పత్రికకు పంపాడు. ఎడిటరు కథ చదివాడు. చాలా బాగుంది. కిందపేరు చూళాడు. మక్సిం మక్సిమోవిచ్‌ పెష్కోవ్‌ అని వుంది. పెద్దాయన ఏదో ధ్యాసలో సంతకం పెట్టాడనుకుని కథ కింద మక్సిం మక్సిమోవిచ్‌ గోర్కీ అని అచ్చువేశాడు. గోర్కీ తిరిగి వచ్చిన తరవాత పోస్టులో పురస్కారం వచ్చింది. తానేమీరాయలేదు. ఈ పురస్కారం తనకెందుకు అనుకున్నాడు గోర్కీ, సెక్రటరీని పిలిచి సంగతి అడిగాడు. ఆ కధ నేను రాళాను. పేరు నీది వేసి పురస్కారం నీకు పంపించారు అన్నాడు. పురస్కారంలో కనీసం సగం నాకిచ్చెయ్‌ అన్నాడు. అలాంటివాడు చిన్నతనంలోనే పోయాడు. గోర్కీ కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. డఊొరడించవచ్చినవారిని చూసి కొడుకు పోయినందుకు నేనేడ్వడంలేదు. రష్యా ఒక గొప్ప కధకుడిని కోల్పోయినందుకు ఏడుస్తున్నానన్నాడు. ఆతడు రాసిన కధనూ, పురస్కార ఉదంతాన్నీ అందరికీ చెప్పాడు. రష్యాలో గోర్కీ పేరుమీద ఒక సాహిత్య పాఠశాలను నిర్వహిస్తున్నారు. నేనా పాఠశాలకు వెళ్లాను. ప్రిన్సిపాల్‌ లేడు. వైస్‌ ప్రిన్సిపాల్‌ను ఇంటర్‌వ్యూ చేశాను. స్కూలుకు దరఖాస్తులు నేరుగా రావు. రాష్ట్ర రచయితల సంఘం ద్వారా వస్తాయి. దరఖాస్తుల్లో అధికభాగం కవులు, కవిత్వానికి కష్టథడవలసిన ఆవసరంలేదు అన్నాడాయన. అన్నింటికన్నా ఎక్కువ కష్టం సాహిత్య విమర్శ. దీనికి చాలా తక్కువ దరఖాస్తులు వస్తాయి. ఆ తరవాత నాటకాలు, కధలు, నవలలకు దరఖాస్తులు వస్తాయన్నాడు ఆయన, ప్రాక్టీసు కోసం పర్యటన చేస్తున్నప్పుడు రెండు మూడు స్థానిక సాహిత్య సంఘాలను సందర్శించాను. నాకు సాహిత్య విమర్శ అభిమాన వస్తువని చెప్పినప్పుడు స్విచ్చివేస్తే బల్బు వెలిగినట్లు నామీద గౌరవభావం కనిపించింది. నాకు చాలా ్రళ్ళీలు వచ్చాయి. నాకు తెలిసిన మేరకు వాటికి జవాబులు చెప్పాను. తెలుగుసాహిత్యం పదవ శతాబ్ది నుంచీ దొరుకుతోందన్నాను. మాస్కోలో వేసంగికి దినాలు దీర్ధం. రాత్రులు ్రస్వం. కాలాన్ని తెలుఘుకొనడానికి గడియారం ఒక్కటే సాధనం. మాస్కో కన్న లెనిన్‌ గ్రాడ్‌లో రాత్రులు మరీ దీర్హం. ఆ రాత్రులను వారు వైట్‌ నైట్స్‌ (శ్చేతరాత్రులు) అంటారు. రాత్రుళ్లు పార్కుల్లో కూర్చుని పుస్తకాలు పత్రికలు చదువుకుంటూ వుంటారు. ఓరోజు మిత్రుని దగ్గరకు వెళ్లి బాగా రాత్రి అయిన తరవాత మెట్రో కోసం నడిచివస్తున్నాను. ప్రశాంతంగా వున్న ఆ రోడ్డుమీద ఇద్దరు ఆడపిల్లలు కనిపించారు. అర్ధరాత్రి ఆడపిల్లలు రోడ్డుమీంచి నడిచిపోగలిగినప్పుడ్రు మనకు స్వతంత్రం వచ్చినట్లు లెక్క అని గాంధీగారు ఓసారి అన్నట్టు గుర్తు, ఈ పిల్లల్ని చూసినప్పుడు ఆమాటలు గుర్తుకువచ్చాయి. అందులో ఓ పిల్ల నేను వచ్చేదారిలోనే నిలబడింది. నేను దగ్గరకు రాగానే ఆ పిల్ల సిగరెత్‌ సిగరెత్‌ అంది. నేను హైదరాబాదువాడిని. జేబులోంచి 154 అ రాంభట్ట కృష్ణమూర్తి సొంతకధ

సిగరెట్టుపెట్టెతీసి సిగరెట్టను ముందుకు జరిపి సగౌరవంగా చేతిని ఆమె ముందు పెట్టాను. ఒక సిగరెట్టు నోటపెట్టుకుని మరొకటి తీసి తన సంచిలో చేసుకుంది. తన స్నేహితురాలిని పిలిచి ఆమెకు రెండు సిగరెట్టిచ్చింది. ఆమెకూడా మొదటిపిల్లలాగే ఒకటి నోటనబెట్టి మరొకటి సంచిలో వేసుకుంది. అప్పుడు నేను సిగరెట్టు పెట్టెను జేబులో పెట్టుకున్నాను. అప్పుడు మొదటి అమ్మాయి స్పీచ్కీ స్పీచ్కీ అంది.

నేను అగ్గిపుల్ల వెలిగించాను. వారు సిగరెట్టు ముట్టించుకుని వెళ్లిపోయారు. వారు హోటెల్‌ రష్యానుంచి వస్తున్నారని అనుకున్నాను. విదేశీయులకు పణ్య వసతి గృహం అది. ఆ హోటల్లో డాలర్లే చలామణీలో వుంటాయి. డాలర్హు సంపాదించడంకోసం ప్రభుత్వం డాలరు షాపులను నెలకొల్పింది. అక్కడ వస్తువులన్నీ డాలర్లకే అమ్ముతారు. అధికార మార్చిడి లెక్కన డాలరుకు ఎనభయి కోపెక్కులు మాత్రమే ఇస్తారు. అనధికారికంగా డాలరుకు రెండు రూబుళ్లు, ఒకప్పుడది మూడు రూబుళ్లకు కూడా పెరుగుతుంది. నాకు కనిపించిన పిల్లలు హోటెల్‌ రష్యా నుంచి వస్తున్నట్టనిపించింది.

వేదకాలాన అతిధి వస్తే లేగదూడను వండి భోజనం పెట్టేవారు. తన భార్యతో వారికి శయ్యా సౌకర్యం కూడా అమర్చేవారు. తెలంగాణాలో అతిధికి శయ్యా సౌకర్యం కలిగించే ఆచారం వుండేది. అందుకోసం దొరలు ఆడపాపలను, దాసీలను పోషించేవారు. ఇతరులు తమవారిలోనే ఆ పనికి ఒకరిని నియమించేవారు. రష్యన్హు పణ్యాతిధి గృహాన్ని గోత్సనిత్య అంటారు. అతిధిని గోస్తీయ అంటారు. అది అచ్చం సంస్కృతపదం. అది వేదకాలం నాటి పిల్లలనే మాట అనుకుంటాను. గోస్తీయ అంటే అతిధి. పిల్లల భాషలో ఆవును దాంగిలించే వాడని అర్హం. ఇంగ్లీషులో అతిధిని గువేక్ట్‌ ఆంటారు. గవేష్టి అంటే ఆవును వెతికేవాడని అర్ధం.

రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ అ 155

(శై మేం అంతర్జాతీయ అతిభులం కనక చుంబనాళీర్వాదంలో ప్రథమస్తానం మాది. మా బృందనాయకుడిని నేను కనక మును ముద్దు నాది. ఇది కూడా గణావశేషమే, ఆర్య గణాల ఆచారాలను వేదాల్లో బాలా తక్కువ వర్థించారు. కాగా గృవ్యా నూత్రాల్లో ఈ ఆచారాల (ప్రస్తావన కానవన్తుంది. వరుని గణం వారందరూ పెళ్ళి మంత్రాలలోని గంధర్వుని లాంటివారు. కనాన హు అట్‌ రాక్షస వివాహావశేషం సంస్కృతంలో గోఘ్న అంటే ఆవును చంపేవాడు అని అర్ధం. కాని ఆ మాటను అతిధి అన్న అర్ధంలో వాడుతూ వుంటారు, వేద పురుషులు ఆతిధికి వాండి పెట్టే లేగదూడ ఆచారం నుంచి పుట్టినవీ మాటలు. అంతేకాని శయ్యా సౌకర్యానికి చెందిన మాటలు ఏ ఆర్యభాషలోనూ కానరావు. రష్యన్లది కూడా ఆర్య భాషే శయ్యా సౌఖ్య ఆచారానికి మాట లేకపోవచ్చును కాని ఆచారం వుంది. పణ్యాతిధి గృహాలున్నప్పుడు పణ్యశయ్యా సౌకర్యం కూడా వుండి తీరుతుంది. ఒకసారి పుట్టిన ఆచారం ఆనాటి పరిస్థితులు మారినా అంత తేలిగ్గా మారదు. మనిషి అస్తిత్వం మారిన వెంటనే ఆచారం మారదు. స్కూలు అయింది. ఇంక జనం నుంచి నేర్చుకునేదుంది. మాస్కోకు దగ్గరలోనే వున్న మరోచిన్న నగరానికి తీసుకువెళ్ళారు. ఆనాడు ఆ వూళ్ళో పెళ్ళి, సోషలిజం ఏర్పడిననాటినుంచీ చర్చినీ, మతాధిపత్యాన్ని నిషేధించారు. యువజన సంఘ అధ్యక్షులుగా ఎన్నిక అయినవారు పెళ్ళి రిజిస్టారుగా వ్యవహరిస్తారు. ముందు రిజిస్ట్రారు ఆఫీసుకు వెళ్ళాం. రిజిస్ట్రారు ఒక అమ్మాయి. ఆమెకింకా పెళ్ళి కాలేదు. నీకు పెళ్ళయితే ఎవరు రిజిస్టరు చేస్తారని అడిగాను. యువజన సంఘ ఉపాధ్యక్షురాలు అక్కడే వుంది. ఆమె రిజిస్టరు చేస్తుందంది. మతాన్ని నిషేధించారు కాని ఆచారాలను నిషేధించలేదు. పెళ్ళి మెరవడి వస్తోంది. వధూవరులు అలంకరించిన కారులో వస్తున్నారు. బంధు మిత్రులు కారు వెనక పెళ్ళి వారితో నడుస్తున్నారు. అందులో కొందరు వేటకట్టులాగ ఉత్తరీయాలు వేసుకున్నారు. మరి కొందరికి అవి లేవు. ఉత్తరీయాలున్నవారిని అడిగాను. ఏమిటీ వేషం అని, మేం ఆడపెళ్ళి వారం అని సగర్వంగా చెప్పారు. ఆ వేషం రాక్షస వివాహ అవశేషం అని నాకు అర్ధం అయింది. తెలుగునాట ఇలాంటి ఆచారం కులాచారం వంశాచారంగా వుంది. వధూవరుల సంతకాలయ్యాయి. అందరూ హాల్లోకి వచ్చారు, ఆతిధులంతా కకక కననననమపునత నవస కనకం! 156 అ రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ

ఉగ్గుగిన్నెలాంటి చిన్న గిన్నెలో (ద్రాక్షాసవం తాగి వధువు చెక్కిలి ముద్దు పెట్టుకోవాలి. వధువు కూడా అలాంటి చిన్న గ్లాసుతోనే వైన్‌ చవి చూడాలి. మేం అంతర్జాతీయ అతిధులం కనక చుంబనాశీర్యాదంలో ప్రధమస్థానం మాది. మా బృందనాయకుడిని నేను కనక మును ముద్దు నాది. ఇది కూడా గణావశేషమే. ఆర్య గణాల ఆచారాలను వేదాల్లో చాలా తక్కువ వర్షించారు. కాగా గృహ్య సూత్రాల్లో -ఈ ఆచారాల (ప్రస్తావన కానవస్తుంది. వరుని గణం వారందరూ పెళ్ళి మంత్రాలలోని గంధర్వుని లాంటివారు. ఏదో ఒక రూపానున్న ఆచారం మన దేశాన కానరాదు కాని రష్యను ఆర్యుల్లో నేటికీ కాన వస్తున్నందున నాకు చాలా ఆనందం కలిగింది. రష్యా మనలాగే వ్యావసాయకదేశం. ఒకప్పుడు మనలాగే భూమి సామాజిక ఆస్తిగా వుండేది. గ్రామీణులు మనలాగే చదువుకు దూరం, మనలాగే ఒకనాడు రష్యాలో కూడా ఆసియాక ఉత్పత్తి విధానం వుండేదేమో తెలియదు. ఆసియాక ఉత్పత్తి విధానంలో జలసేచనద్వారా వ్యవసాయం చేయడం ప్రధానాంశం. రష్యాలో జలసేచన లేదు. వారి వ్యవసాయం మంచుమీద ఆధారపడి వుంటుంది. మంచు పడడానికి ముందు విత్తనాలు ఇలుకుతారు. మంచుతీసిన తరవాత అంకురాలు పాటమరిస్తాయి. అంకురాలు చూస్తూ వుండగానే బెత్తెడు జానెడు మూరెడు బారెడుగా పెరుగుతాయి. వేసవిలో కొన్ని పంటలకు నీరు అవసరం, అప్పుడు స్పింక్షర్లతో తడుపుపెడతారు. మేం అలా తడుపెట్టిన సుగర్‌ బీటు పొలాలను చూశాం. అక్కడ భూస్వాముల్ని బోయర్లనేవారు. తాల్‌స్తాయి రాసిన నవలల్లో అక్కడి (గ్రామజీవనం వివరంగా తెలియవస్తుంది. విష్ణవం వచ్చిన తరవాత కార్మికుల్లో సమాన ప్రతిపత్తి కల్పించారు రైతులకు. పీటర్‌ దగ్రేట్‌ కాలాన క్రెమ్లిన్‌ కోట కట్టడానికి ఇటాలియన్‌ కూలీలు వచ్చారు. వారు ఆలుగడ్డలతో వోద్కా తయారు చేసేవారు. పీటర్‌ చక్రవర్తి వోద్కా కర్మాగారం కట్టించాడు. ప్రతిరైతూ వారానికి ఏడు లిట్టర్ల వోద్కా కొనాలని ఆజ్ఞలు జారీచేశాడు. క్రైమ్లిన్‌ నిర్మాణానికి వచ్చిన ఇటాలియన్ల ద్వారా వోద్కా సుఖరోగాలూ (గ్రామసీమలకు వ్యాపించాయి. రష్యాలో పెట్టుబడిదారీ విధానానికీ, పరిశ్రమలకూ ఆద్యుడు పీటర్‌ దగ్రేట్‌ అని అక్కడి వారు చెబుతారు. నేటి టర్కీలో ఒకనాడు ప్రవర్తిల్లిన క్షత్రభాష ఆతి ప్రాచీన సంస్కృతం అనీ రష్యాలో నేడు వాడకలో వున్న భాష అత్యాధునిక సంస్కృతి అని బెడ్రిక్‌ హ్రోబ్నీ అంటాడు. రష్యన్‌ భాషలో సంస్కృత తత్పమాలు నూటికి తొాంభయి అయిదు కనిపిస్తాయి. ఒక ప్రాంతీయ పెళ్లి తంతునే చూడగలిగాను. దేశమంతటా పోలికలు ఇంకా వుంటాయి. మేం వెళ్లిన రెండు వారాలకే ఆస్పత్రిలో చేరిన బెంగాలీ మిత్రుడు ఆరోగ్యం పుంజుకుని బైటికి వచ్చాడు. మేం డిసెంబరు ఆఖరివారంలో వచ్చాం. ఆగస్టు ఆఖరివారంలో భారత ప్రయాణం. పంజాబు మిత్రుడు బండెడు సామాను కొన్నాడు. ఏర్‌పోర్టులో లగేజీ వసూలు చేస్తే వుంటుందని వందరూబుళ్లను జా(గ్రత్తచేసి వుంచాను. మా వెంట ఒక సంవత్సర విద్యార్థినికూడా తీసుకువెళ్ళాలనుకున్నాను. ఈ సంగతి సెక్యూరిటీ వింగులో చెప్పాను. పైసలు మిగులుతే వాటిని లెవీకింద ఇమ్మని చెబుదాం అనుకున్నాను. ఈ సంగతి తెలిసి లగేజీ తగలకుండా నేను చూస్తాను అనీ సెక్యూరిటీ మిత్రుడన్నాడు. ఢిల్లీలో దిగిన తరవాత బెంగాలీమి(త్రుడు టాక్సీ చేసుకుని ఆజయ్‌ భవనానికి వెళ్ళాడు. మాబృందానికి నాయకునిగా ఆయన్ని నియమించారు. కనక ఆయన రిపోర్టు యివ్వాలి అందుకని అక్కడికి వెళ్లాలి. సర్దార్టీ కోసం ఆయన మిత్రులు ఏర్‌పోర్టుకు వచ్చారు. ఓ రెండు గంటల్లో హైదరాబాదు వెళ్లే విమానం వుంది. అందుకని నేనూ కోడుగంటి గోవిందరావుగారూ ఏర్పోర్చులో కూర్చొనడానికి నిశ్చయించాం. రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 157

హైదరాబాదు ఏర్పోర్టు బోయన్‌పల్లి వేపు వుండేది. అక్కడ దిగి ఆటోచేసుకున్నాం. నేను చిక్కడపల్లిలో దిగాను. ఆయన మఖ్బూం భవన్‌కి వెళ్ళాడు. నేను ఇంట అడుగుపెట్టేసరికి తొట్టెలో ఒక చిన్న కుర్రాడున్నాడు. తొలిసారి ఆర్మేనియా నుంచి వచ్చేసరికి ఇంట్లో ఓ కుర్రవాడున్నాడు. అతడు నా కొడుకు. ఇప్పుడున్న వాడు మా అన్నగారి మనవడని తెలిసింది. స్నానాదికాలయిన తరవాత మళఖ్యూం భవనానికి వెళ్ళాను. భోజనం అయిన తరవాత కాస్త విశ్రాంతి తీసుకుని ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడ ఇంకో ఇద్దరు టెనెంట్సు చేరి వ్యాపారం చేసుకుంటున్నారు. మా అన్నగారు వ్యాపారాన్ని కట్టిపెట్టే ఉద్దేశంలో వున్నట్టు తెలిసింది. అదివరకు కాకతివారుండే 'షెడ్డును నాపేరునున్న స్థలంలో కొంతభాగాన్ని అమ్మేశారు. ఆయన లేతులు ఇతర మెపిన్లను తీసుకుని మెయిన్‌ షెడ్డును నాపేర రాశాడు. ఆరోజునుంచీ ఫ్యాక్టరీకి రోజూ వెళ్లేవాడినికాను. అప్పుడప్పుడు వెళ్లేవాడిని అంతే. ఈనాడు విశాఖపట్నంలో మొదలయింది. దానికి ఏబీకే ప్రసాదును ఎడిటరుగా నియమించారు. రామోజీని కలిసినప్పుడు నాకీసంగతి తెలిసింది. రామోజీ! అతడినెందుకు ఎడిటరుగా నియమించావు అని ప్రశ్నించాను. ఆతడివల్ల చాలా సమస్యలు పుడతాయన్నాను. సమస్యలు పుట్టాయి. వాటిని పరిష్కరించుకున్నాను కూడా అన్నాడు ఆయన. ఆరసం మహాసభ జరపవలసి వుంది అన్నాను నేను. అప్పుడే వద్దు హైదరాబాదు ఎడిషను వచ్చిన తరవాత పెడితే నీకు నచ్చిన వార్తలు రాసుకొనవచ్చునని రామోజీ సలహా. ఈలోగా విశాఖపట్నంలో పార్టీ ర్యాష్టసభను నిర్వహించాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. ఆ సంగతి తెలిసి నన్నూ, గజ్జెల మల్గారెడ్డినీ విశాఖపట్నంలో తన అతిధిగా వుండమన్నాడు రామోజీ. అక్కడున్న హోటళ్లలో ఒక పెద్ద హోటల్లో మాకు బస ఏర్పాటు చేశాడు. హోటల్‌నుంచి పార్టీ సభకు వచ్చి పోవడానికి కారును ఏర్పాటు చేశాడు. సభ మొదలయింది. మేం కారులో సభకు వెళ్లేవాళ్లం. భోజనాలూ, పడకా హోటల్లోనే. ఈ వైభవాన్ని ప్రదర్శించేవాడు మల్లారెడ్డి, సభ మూడురోజులు జరిగింది. ఈ సభను గురించి ఒక్క అక్షరం కూడా ఈనాడులో రాలేదు. సభ అయిన తరవాత అ(గ్రనాయకులకు వాల్తేరు క్షబ్బులో డిన్నరు ఏర్పాటు చేశాడు రామోజీ, ఆ డిన్నరుకు ఈనాడు ఎడిటరు ఏబీకే ప్రసాదుకూడా వచ్చాడు. ఆ విందులో ఎవరూ వార్తల ప్రస్తావన చేయలేదు. విశాఖసభలోనే మహాసభకు డెలిగేట్టను ఎన్నుకున్నారు. మహాసభ విజయవాడలో జరుగుతుంది. మహాసభకు పాటలు రాయాలని నేనూ, మల్దారెడ్డీ నిర్ణయించుకున్నాం. రాష్ట్ర మహాసభకు జాతీయ మహాసభకు మధ్య ఎక్కువ వ్యవధానంలేదు. నేనూ, మల్గారెడ్డీ ఒక హోటల్లో మకాం పెట్టాం. మాస్కోలో వుండగా చాలా సార్టు ఇంటర్నేషనలు పాడవలసిన అవసరం కలిగింది. ఇంటర్నేషనల్‌ బాణీ అందరిదీ ఒకలాగే వుండాలి. దాని అనువాదం మాత్రం తమ తమ భాషల్లో ఉండవచ్చును. యాభైదేశాల కా(మ్రేడ్సుతో గళం కలిపి పాడ్డానికి తెలుగున ఇంటర్నేషనలు అనువాదం కాలేదు. కొన్ని అనువాదాలు జరిగాయి. అవి “చప్పట్టోయ్‌ తాళాలోయ్‌ దేవుడి గుళ్ళో బాజులోయ్‌” అన్న బాణీలో అనువాదం అయాయి. కనక ఎవరూ పాడ్డానికి సాహసించలేదు. దానికో పల్లవి వుంది. దాన్ని మాత్రం అనువదించారు. “ఇంటార్నేషనాలే” అన్న చరణం ్రెంచిభాషలోనే వుంటుంది, ఈ పల్లవిని అందరితో గొంతుకలిపేవాడిని. అందరు భారతీయుల సంగతి నాకు తెలీదు కాని నాకు మాత్రం ఇంటర్నేషనల్‌ పాడలేనందుకు చాలా చిన్నతనం అనిపించేది. 1955 మధ్యంతర ఎన్నికల్లో గెలిచేశామనీ ప్రభుత్వం ఏర్చరుస్తే ఎవరెవరు 15% ఉి రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ

పంగ వాదాల నాం పోససోలిమ ఏమిటని నాయకులు కలలుకనేవారు. కాని ఇంటర్నేషనల్‌ హిస్తారికల్‌: మైటీరియల్‌జం పుకు అవను లీ తత్వశాస్త్రం అర్ధం కాదు. డయలెక్టిక్సు అర్థం కావు. హ్‌స్త్రో 0. రాజకీయాలూ రాజుకీయాలు వ్రతివలించే అర్జశ్యాన్తం వుంటే చాలుననే మనస్తత్వం మన కా(మ్రడ్లది. స్ట

ఇంటర్నేషనల్‌ను అదే బాణీలో అనువదించాలన్న పట్టుదల ఎక్కువ అయింది. అది నీకు సాధ్యంకాదు మానెయ్యి అని చెవులోని జోరీగలా రొ, 'దపెట్టేవాడు మల్లారెడ్డి. అలాగే మృతవీరుల సంస్మరణ పాటలు పల్లెటూరి చావుశోకాల్లా పాడేవారు. అదీ నాకు సిగ్గుగానే వుండేది. రెండు పరస్పర విరుద్ద రసాలను రంగరించి పాటరాయాలని నామతం, ఒక కామ్రేడ్‌ పోయినందుకు శోకం సహజం. ఆయన పోయిన పరిస్టితులమీద రౌద్రం కూడా వుండాలని నేను అనుకునేవాడిని. ఇది సాధ్యం కాదని మల్లారెడ్డి వాదన. ఆఖరికి నీలం రాజశేఖరరెడ్డి నాతో ఏకీభవించి ప్రోత్సహించారు.

వారంరోజుల మధనానంతరం రెండు పాటలనూ సాధించాను. మల్దారెడ్డి ఎర్రజెండామీద పాటరాశాడు. అప్పటికి పాతకాలం నాటి ప్రజానాట్యమండలి గాయకుడు మోహనదాసు ప్రజానాట్యమండలివారికి తరిఫీదు యిస్తూ వుండేవాడు. ఎంపిక చేసిన నలుగురైదుగురికి ఇంటర్నేషనలు బాణీని నేర్పాడు. అలాగే ఎర్రజెండా గేయాన్ని కూడా బాణీ కట్టాడు. తొలి రోజున జెండావందనానికి పార్టీ సభ్యులనే కాకుండా అభిమానులను పెద్దలను కూడా ఆహ్వానిస్తారు. అంటకత్తెర వేసిన తలా, చిన్న పిలకా, రుద్రాక్ష తావళం ఉన్న ఒక పెద్ద మనిషి వచ్చి తిన్నెమీద కూర్చున్నాడు.

నేనప్పుడు జీన్సు, అలాంటిదే కోటు, బుజాలమీదికి వాలేజుట్టూ ఒక హిస్పీవేషంలో ఉన్నాను. తిన్నెమీద కూర్చున్న పెద్దాయన పేరు విశ్చనాధశళా(స్తిగారు. ఆయన లాయరు పార్టీ అభిమాని అని తెలిసింది. నేను దగ్గరకు వెళ్లి నాపేరు చెప్పి నమస్కరించాను. నీగురించి విన్నానోయ్‌ కాని ఈ వేషంలో వుంటావని ఊహించలేదోయ్‌ అన్నారాయన. కాస్త మాట్లాడిన తరవాత నీకు బ్రాహ్మణ సంస్కారం చాలా వుంది నువ్వు కమ్యూనిస్టువెలా అయ్యావోయ్‌ అని అడిగాడు. అధికారంలోకి రావడం రాజకీయాల ధ్యేయం. నాకు బ్రహ్మణ సంస్కారం వుందికనుక వేదవాక్యం (ప్రకారం ఎగర్రజెండాను చేతబట్టాను.

వేదవాక్యం వమ్ముకాదు గదా? ఎర్రజెండా ఎవరి చేతనుంటుందో వారే దేశాధిపతులౌతారని అధర్వవేద౦ం అంటుంది. అందుకని నేను ఎర్రజెండాను చేతపట్టానన్నాను. ఆ రుక్కును చదివాను. ఆ రుక్కు ఇది - అధ్వరణ వేదం పదకొండవకాండం- పదవసూక్తం - తాలిరుక్కే ఇలా వుంటుంది.

ఉత్తిష్టత సన్నహ్యధ్వముదార్చాఃకేతుభిస్సహ

సర్పా ఇతరజనారక్షాంస్యమి[త్రానను ధావత

ఈశాంవో వేదరాజ్యం త్రిషంధె అరుజైజేతుభిస్సహ

ఇతరులకు ప్రవేశం ఆరోజు ఒక్కటే. ఆతర్వాత రిసెష్టనులో కూర్చుని ఫలానా వారిని కలవడానికి వచ్చానని చెప్పాలి. అప్పుడు వలంటీర్లు లోనికివచ్చి కలవడానికి వచ్చినవారి ఊరూ 'పేరూ చెబుతారు. మర్నాడు విశ్చనాథశా(స్తిగారు బందరు నుంచి వచ్చారు. నాకోసం వలంటీరును పంపారు. నేను రిసెష్టను గుడారంలోకి వెళ్ళాను. ఆయన సంతోషంతో లేచి నిన్న నువ్వు చదివిన రుక్కు అధర్వవేదంలో వుందోయ్‌. నువ్వుచూపిన రుక్కును నేనుకూడా ఉపయోగించుకుంటూ వుంటాను అన్నారు. కాస్తసేపు పిచ్చాపాటీ ఆయన అటువెళ్లారు. నేను సభలోకి చేరాను. మా అమ్మాయి ఫారెన్‌డెలిగేట్ల దగ్గరుంది. ఆమెకు కొంచెం రష్యను వచ్చును. తూర్పుయూరపు దేశాలు చూసింది.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకఠ అ 159

విశాఖపట్నం ఈనాడు పత్రికలో సమ్మె మొదలయినట్టు తెలిసింది. ఆ సమ్మె వివరాలను పరికించి చూస్తే ఒక ప్రసిద్ధ తెలుగు సంపాదకుని వ్యూవాోన్ని గుర్తుకు తెస్తోంది అక్కడి ట్రేడు యూనియన్లు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యానవున్నాయి. ఈనాడు సమ్మెకు కూడా కమ్యూనిస్టులు నాయకత్వం వహిస్తున్నారని రామోజీ అంటున్నారు ట్రేడు యూనియన్ల సంగతి నాకు తెలియదు అందని నేను చేయగలిగిందేమీలేదు. ఇక్కడి నాయకులతో భేటీమాత్రం చేయించగలనన్నాను. వారితో నీవు వివరంగా మాట్టాడుతే మంచిది అన్నాను వారేం మాట్లాడుకున్నారో తెలియదుకాని సమ్మె ఆగిపోయింది

విశాఖ ఈనాడులో ఎడిటరు దగ్గర నుంచి కంపోజిటరు వరకూ అందరూ నక్సలైటు భావాలుగలవారు. అభ్యుదయ రచయితల సంఘంలో నక్సలైట్లను కూడా కలుపుకొని రావాలని సంఘం కోసం రాసిన ప్రణాళికను కూడా రద్దుచేయాలని కొందరు నామీద వొత్తిడి తెచ్చారు. ఆ వాత్తిడికి నేను లొంగలేదు. తెలంగాణా సాయుధపోరాట విరమణతప్పు అని వాదించే రోజులెరుగుదును. నాకు రాజకీయాలమీద ఆసక్తిలేకపోయినా ఆత్మానుభవం అయితే కాని ఈ ఉగ్రవాదులకు తత్వంబోధ కాదని నాకు తెలుసును. అందువల్ల వారికి ఆత్మానుభవం అయేవరకూ ప్రేక్షకారిత్వం వహించక తప్పదు.

'పేక్షకార్తిత్వం కాక అసం ప్రేక్షకారిత్వం వహిస్తే ఏమవుతుందో పంచతంత్రకధలు వేనోళ్ల చెబుతున్నాయి. శాపాలు వాస్తవం అవుతాయని పూర్వకాలప్పండితులనుకుంటూ వుంటారు. అలాగే కవిత్వం వల్ల జనం ఒక్కసారి చైతన్యవంతులైపోతారని ఆధునిక యువకులనుకుంటూ వుంటారు. అరసం ప్రణాళికను వ్యతిరేకించిన ఒక యువకవి “నక్సలైటూ కలిసి రావయ్యా” అని పాటరాళాడు. ఆపాట మాత్రమే పుస్తకాల్లో మిగిలింది. అంతే. వారు కలిసిరాలేదు. వీరు కలిసిపోలేదు. ఒక వ్యక్తివల్ల సమాజం మారదు. ప్రతితరంలోనూ కొందరు వ్యక్తులు తాము మార్చగలమనుకుంటూ వుంటారు. అంతే.

మోహనదాసు తరిఫీదు చేసిన కొందరు యువకులు, ఆయనా, నేనూ అంతర్జాతీయ అతిధులతో గొంతుకలిపి ఇంటర్నేషనలు పాడాం. అనువాదంలో నేను అనుసరించిన గణాలను కాగితాలమీద వివరిస్తొ అడిగిన వారికిస్తూ వచ్చాను అంతే కమ్యూనిస్టు పార్టీలో చదువుకున్నవారి సంఖ్య అతి స్వల్పం. ఒక్క కమ్యూనిస్టు పార్టీయే కాదు. జాతీయోద్యమకాలం నుంచీ రాజకీయులు చదువును ఉపేక్ష చేస్తూ వచ్చారు" అదే ఉపేక్ష కమ్యూనిస్టుపార్టీకి కూడా సంక్రమించింది ఇది వాస్తవం, అయినా నాయకులు మొక్కుబడిగొ పార్టీ స్కూళ్లు నడిపిస్తారేకాని ఆ స్కూలుకు వచ్చిన వారిలో ఎందరికి చదువు వచ్చిందని చూడరు.

కమ్యూనిస్టుపార్టీ రాష్ట్రమహాసభ, జాతీయమహాసభ కూడా ముగిశాయి. ఫ్యాక్టరీషెడ్డును నాపేర రాశారు మా అన్నగారు. ఇది వరకు టెనెంటుగావున్న కాకతికర్షక కంపెనీ వారినుంచి అద్దెతీసుకుంటూ వుండేవాడీని. యిప్పుడు కూడా అలాంటి అద్దెలద్వారానే జీవయాత్ర సాగించాలనుకున్నాను. మాస్కోనుంచి తిరిగి వచ్చిన తరవాత రాజకీయ పారశాలలు, అరసం సభలు ఎక్కువయ్యాయి. అరసం సభలకు మల్లారెడ్డి జతగా వుండేవాడు. అరసానికీ, రాజకీయ పారశాలలకు కూడా పార్టీగెడు ఒక్కరే, ఆయన ఎలమంచిలి విజయకుమార్‌. ఆయన (ట్రేడు యూనియన్‌ బాధ్యుడు.

అరసం మహాసభను (ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుపుతూ వుండాలి. గుంటూరు సభ జరిగి రెండేళ్లు జరిగిపోయాయి. అసలు భారతీయ అభ్యుదయ రచయితల మహాసభ 1936నాటి కాంగ్రెసు మహాసభలో ఆవిర్భవించింది. నాటి కాం(గ్రెసు మహాసభాధ్యక్షుడు పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ అరసం (ప్రారంభసభకు

  • అంటే 36నాటి కాంగ్రెసు మహాసభకు అబ్బూరి రామకృష్ణారావుగారు, సోమంచి యగ్గెన్నగారు హాజరయ్యారు.

న. 160 9 రాంభట్ల కృష్ణమూర్తి సాంతకధ

ఆనాడు ఇండియన్‌ లిటరేచరు అన్న పత్రికను నిర్వహించాలనుకున్నారు. నిర్వాహకుల్లో ఒకరుగా అబ్బూరి వారిని ఎన్నుకున్నారు.

ఇప్పుడు జరపబోయే అరసం మహాసభల్లో ఈ ఇద్దరినీ సమ్మానించాలని సభ్యులు తీర్మానించారు. యగ్గెన్నశా(స్తిగారు బొంబాయి మున్సిపాలిటీలో ఆఫీనరుగా పనిచేస్తున్నారు. రామకృష్ణారావుగారు "హైదరాబాదులోనే వున్నారు మహాసభ నిర్వహణకు కావలసినంత ధనం సమకూరలేదని, దాశరధి కృష్ణమాచార్యులను కూడా మహాసభకు ఆహ్వానించాలని పార్టీ అ(గ్రనాయకుల సలహా. ఆయనప్పుడు మద్రాసులో వుంటున్నాడు. ఆయనకు రానూపోనూ విమానం టిక్కెటు, ఇక్కడ మంచి హోటల్లో బస కల్పించాలని ఆయన కోరిక. ఈ పనికి వందలు కాదు వేలు కావలసి వుంటుంది.

ఇలాంటి సాంస్కృతిక సమావేశాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. కనక ఇప్పుడు అప్పుచేసి అయినా విశిష్ట అతిధులను సత్కరించాలి అన్నారు అ(గ్రనాయకులు. నాకు తెలిసిన దారి ఒకటే అది మిదత్రుడు రామోజీరావు దగ్గర అప్పుతీసుకొనడం. ఆయన దగ్గర మూడువేలు తీసుకుని మహాసభ జరిపొం. దాశరధి కృష్ణామాచార్యులను, అబ్బూరి రామకృష్ణారావుగారిని, సోమంచి యగ్గెన్నళా స్రిగారినీ సమ్మానించాం. కోరీలోని గాంధీ జ్ఞానమందిరంలో సభ జేగీయమానంగా జరిగింది. ఆ సమావేశంలోనే పురిపండా అప్పలస్వామిగార్ని గౌరవాధ్యక్షునిగా ఎన్నుకున్నాం.

రామోజీరావు సలహామేరకు ఈనాడు హైదరాబాదు ఎడిషనుకు అభ్యుదయ రచయితల సంఘం పుట్టుపూర్యోత్తరాలను గురించి పెద్ద వ్యాసం రాశాను. రాజకీయనాయకుల సలహామేరకు సాంస్కృతిక సంఘాల సహాయార్థం కనీసం మూడువేలు మంజూరుచేయమని ప్రభుత్వానికి రాసి నెలరోజులపాటు నిత్యదర్భ్శనం చేసుకుంటూ వచ్చాను. నొకు లౌక్యం తెలీదు. రామప్పంతులు చెప్పినట్టు పెద్దిపాలెం లౌక్యుల సహాయం తీసుకొనడం అంతకన్నా తెలియదు. గవర్నమెంటుతో వ్యవహారం ఎలా వుంటుందో నాకు తెలుసును. అయినా అగ్రనాయకుల సలహాను పాటించి నెలరోజులు తిరిగాను. అది పార్టీ (క్రమశిక్షణ. తప్పదు మరి.

రామోజీరావు చేపట్టిన పనులకు ఆకాశమే హద్దు అంటూ ఉంటాడు. ఆయన జర్నలిస్టులకు ఒక కళాశాల నడపాలని నిశ్చయించి నన్ను ప్రిన్సిపాల్‌గా రమ్మన్నాడు. ఎలిమెంటరీ స్కూళ్లు తప్ప ఎరగని నన్ను ఒక కాలేజీకి ప్రిన్సుపాలుగా రమ్మంటే కాదనలేకపోయాను. స్కూళ్లు, కాలేజీల్లో చదువుకున్నందుకు విద్యార్థులు ఫీజు కట్టాలి. రామోజీరావుగారి కాలేజీకి ఎంపిక అయిన వారికి ఆయనే ఉపకారవేతనం యిచ్చి చదువుచెబుతారు. కాలేజీ మొదలుపెట్టడానికి ముందు విద్యార్థుల ఎంపిక, అబిట్స్‌లో వున్న మార్గదర్శిభవనం రామోజీరావుగారి ఆఫీసు. అందులో వున్న ఓగది కళాశాల.

ఆ భవనం నాకు చిరపరిచితం. అక్కడి నుంచే అన్నదాత పత్రికకు ప్లానులు, రచనలు సాగాయి. అన్నదాతకు రెండేళ్లు సంపాదకీయాలు రాశాను. ఒక ఏడాది వ్యాసాలు రాశాను. ఆ భవనంలో జర్నలిజం క్లాసులు మొదలయ్యాయి. పత్రికలో వార్తలు వ్యాసాలకన్నా ముఖ్యమయినది సంపాదకీయం అని కొందరి నమ్మకం, స్వాతంత్ర్యం రాకముందు ఆ మాట నిజమే. వార్తా సంస్థలు ఆనాడు (ప్రభుత్వం అజమాయిషీలో వుండేవి. జాతీయోద్యమానికి దిశా నిర్దేశం చేసే బాధ్యతను సంపాదకుడు నిర్ణయించేవాడు. అందువల్ల సంపాదకీయానికి, సంపాదకునికీ ఆనాడు ప్రత్యేకత వుండేది. వృత్తుల వారి కష్టనప్టాలను పత్రికలు ప్రతిఫలిస్తాయి. ఈ ఫ్ర (ప్రాముఖ్యం తగ్గింది.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ అ 161

తద్వారా సంపాదకునికి కూడా (ప్రాధాన్యం తగ్గింది. రామోజీ కొన్నిరోజులపాటు సంపాదకీయాలు లేకుండా పత్రిక నడిపాడు. తరవాత ఇక్కడే సంపాదకీయాలు రాయించి విశాఖపట్నానికి పంపించేవాడు. అది విశాఖపట్నంలో వున్న సంప్రాదకునికి నచ్చేదికాదు. నచ్చకపోయినా పంపిన సంపాదకీయాల్ని వేయకతప్పదు. సోమాజీగూడాలో పరిశ్రమల ఇనస్పెక్టరుండే భవనంలో ముందున్న స్థలంలో పత్రికాకార్యాలయం తయారయింది. వాసయోగ్యంగా చేయడానికి మరికొంత వ్యవధికావాల్సి వుంటుంది. అది అన్ని విధాలా సిద్ధం అయినప్పుడు కాలేజి అక్కడికి మారుతుంది. డిజిటల్‌లాక్‌ ఉన్న (బ్రీఫ్‌కేసులో నోట్సు, మధ్యాహ్నభోజనం పట్టుకుని వెళ్లేవాడిని. అఢహీ రామకృష్ణారావుగారు పాఠాలు చెబుతానని వచ్చారు రామోజీకి పరిచయం అయన. ఇంకొకరిద్దరు కూడా వచ్చేవారు. వారానికి ఒకటి రెండు రోజులు వారు వచ్చేవారు. వారంలో ఎక్కువ రోజులు పారాలు నేనే చెప్పేవాడిని. నేను 1944లో పత్రికలో పనికి చేరాను. ఆనాడు నేను జర్నలిజం మీద పుస్తకాలేవీ చదవలేదు. ప్రసిద్ద జర్నలిస్టుల ప్రసంగాలు వినలేదు. కాగా కోటంరాజు రామారావుగారు ఒకనాడు మీజాన్‌ ఆఫీసుకు వచ్చి జర్నలిజం మీద ఒక గ్యాలీ ప్రూపు తెచ్చియిచ్చారు. తరవాత బెజవాడలో తెలుగుదేశం పత్రికలో పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన వచ్చి అదే గ్యాలీ ప్రూపు యిచ్చారు. నాలుగేళ్లు మీజానులో పనిచేసిన తరవాత తెలుగుదేశం వారపత్రికలో పని మొదలుపెట్టాను, ఆ తరవాత మద్రాసునుంచి సందేశం వారపత్రిక. దాని రూపురేకలు నేనే నిర్ణయించి మూడున్నరేళ్లు పనిచేశాను. తెలుగుదేశం, సందేశం వారపత్రికల రూపురేకల నిర్ణయం దగ్గర నుంచీ కడకంటా నేనే పనిచేశాను. 1952లో పార్లమెంటుకు తొలి ఎన్నికలు వచ్చాయి. కమ్యూనిస్టుపార్టీ మీద నిషేధం తొలగింది. గతంలో వున్న (ప్రజాశక్తిని బైవీక్లీగా పునరుద్ధరించారు. ఎన్నికలయిన తరవాత విశాలాంధ్ర లక్ష్యాన్ని స్ఫురణకు తెచ్చే విశాలాంధ్ర పత్రికలో పనిచేశాను. ఇన్ని పత్రికల్లో పనిచేసినా జర్నలిజం మీద నేను ఏ పుస్తకమూ చదవలేదు. ఏ విద్య అయినా ముందు అభ్యాసంతో మెరుగుపడుతుంది. అభ్యాసం శాస్త్రంగా మారుతుంది. మూడుదశళాబ్దాల అనుభవం ఉంది. దానికి ఒకరకంగా శాస్త్రీయ ప్రతిపత్తి వచ్చింది. ఫీల్లు వర్కు డస్కువర్కు ఈ రెండింటిలోనూ అసలు వార్తను పట్టుకొనే మార్గం ఒక్కటే. ఒక రాజకీయుడు అరగంటసేపు ఉపన్యసిస్తాడు. అతడి ఉపన్యాసాన్ని షార్టహేండ్‌లో రాసుకుని దాన్ని అక్షరరూపానికి మారుస్తే మూడు గ్యాలీల మేటరవుతుంది. పత్రిక పేజీలో సగం ఆ వారకే సరిపోతుంది. అందుకని దాన్ని షార్టుహేండులో రాసుకున్నా ముఖ్యమయిన అంశాలను నోటుచేసుకున్నా ఒకటే. ఆ వార్తను ఆనాడు కేటాయించదగ్గ స్థలానికి కావలసిన మేరక్తే విస్తరించవచ్చును. మనకు వార్తా సంస్థల నుంచి వచ్చే వార్తలు ప్రాధాన్యం మేరకు కుదింపుచేసే వస్తాయి. దాన్నే మనం అనువదిస్తాం. న. 162 అ రాంభట్ట కృష్ణమూర్తి సాంతకధ

తృష్ణాజిల్లా రాజకీయుల నంగతి నాకు బాగా తెలునును. వారు ఠకాం(గ్రెను కావచ్చును. కమ్యూనిన్టులు కావచ్చును. వారందరిదీ వ్యూడల్‌ మనస్తత్త్వం. ఏ దేళంలోనయినా వ్యవసాయ కుటుంబీకుల మనస్తత్వం అలాగే వుంటుంది. రామోజీ వ్యవసాయ కుటుంబీకుడే కాని ఆయనది పెట్టుబడిదారీ మనస్తత్త్వం. ఆయన కూడా బిన్సతనంలో కమ్యూనిన్దు అభిమానిగా వుండేవాడు. ఎాాయిదాకటీకనాాా ఈనాడు ప్రిన్సుపాల్‌గా నునం న్యూస్‌ పేపరును వార్తాపత్రిక అంటున్నాం. హిందీ వాళ్లు దాన్ని సమాచారపద్రం అంటారు. ఏమయినా న్యూస్‌ అన్న ఇంగ్లీషు మాటకు వార్త అన్న తెలుగు మాట రూఢం అయిపోయింది. కందుకూరి వీఠేశలింగంగారు. వార్తను వృత్తాంతం అనేవారు. అసలు వార్త అన్నమాట వృత్తికి సంబంధించింది. మహాభారతంలో “వార్తయందు జగము వర్తిలుచుండును” అన్న పద్యం ఉంది. దాన్ని న్యూస్‌ అన్న అర్థంలో ఆంధ్రపత్రిక సంపాదకీయం తలమీద రాసేవారు. దాంతో వార్త అంటే న్యూస్‌ అన్న అర్ధం రూఢం అయింది. వార్త అంటే వృత్తులకు సంబంధించినది అని అర్ధం. రొజు అయినవాడు ఏం నేర్చుకోవాలి అన్నప్పుడు అన్వీక్ష ( (త్రయీవార్హా దండనీతి అనే నాలుగు విద్యలనూ నేర్వాలని కౌటిల్యుడంటాడు. వీక్ష అంటే చూపు. చూపులకు అంటిపెట్టుకుని ఉండేది అన్వీక్ష, అంటే భౌతికతత్వం అని అర్ధం. భౌతిక వాదం, భూత వాదం అను మాటలకు తరతరాలుగా నికృష్ణార్ధాలను కల్పిస్తూ వచ్చారు పండితులు, భూతవాదులు ఇంద్రి యాల క వచ్చిన జ్ఞానాన్నే తప్ప మరో రకం జ్ఞానాన్ని ఒల్లరు. కనక ఆమాట దురర్దాన్ని సంతరించుకుంది, భూతవాదాన్ని ఇంగ్లీషులో ఎగ్నాస్టిసిజం అంటారు. అది గ్రీకు పదం, దాని తెలుగు అనువాదం అజ్జేయవాదం. అంటే "తెలుసుకొనవలసింది ఏమీ లేదని అరం. జ్ఞానానికి మూడుదళలు. ఒకటి ౦(ద్రియజ్ఞానం. రెండు హేతుజ్ఞానం. మూడు సామాజికార్థిక ఆచార జ్ఞానం. ఈమూడు దశలకూ పునాది ె 0(ద్రియజ్ఞానం. ఇంద్రియజ్ఞానం మీద ఆధారపడి వుంటుంది హేతుజ్ఞానం. ఇంద్రియజ్ఞానం ఎంత విశాలంగా వుంటే హేతుజ్ఞానం అంత విశాలంగానూ వుంటుంది. హేతుజ్ఞానం ఎంత స్పష్టంగా వుంటే సామాజికార్థిక ఆచారజ్ఞానం అంత స్పష్టంగానూ వుంటుంది. భౌతికవాదాన్ని ఇంగ్లీషులో మెటీరియలిజం అంటారు. అది భూతవాదం నుంచి పెరుగుతూ నేడు ళా లా ప తకధ తి 163 రాంభట్ల కృష్ణమూర్తి సొం

డయలెక్టికల్‌ మెటీరియలిజం దాకా వచ్చింది. ఇదంతా వీక్షనించి పెరిగిన దశ. కనక దాన్ని అన్వీక్ష అన్నారు. అది ఆయాకాలం నాటి భూతవాదం పెరుగుదలకు పేరు. త్రయీ అంటే వేదాలు. వార్త అంటే వృత్తులూ వాటి నుంచి ఉత్పన్నమయే ధనం. వృత్తి నియమాలను ధిక్కరిస్తే అమల్లోకి వచ్చేది దండనీతి. ఇవీ రాజు నేర్చుకొనవలసిన విద్యలు అంటాడు కౌటిల్యుడు. ఇప్పుడు వార్త అన్నపదం న్యూసుకు రూఢం అయిపోయింది. సమాజం నల్లశానపు రాయిలాంటిది కాదు. ఆది షాబాదు పారలరాయిలాంటిది. ఇందులో ముఖ్యమైనవి మూడు పారలు కనిపిస్తాయి. ఒకటి కాస్త చదువునీ, ఆధునికతనీ సంతరించుకున్న నాగరికపార. చదువుకు కాస్త దూరం అయిన జానపదపొర. అసలు ఆధునికతను ఎరగని తరుజన గిరిజనపొర. ఈ షారల్లో ఆయా జనాలు తమ జీవనానికి అనుసరించే వృత్తులుంటాయి. వారు చేపట్టే వృత్తులనూ, ఆయా వృత్తిదారుల మనస్తత్వాలను పత్రికల్లో పనిచేసేవారు ఆకళించుకోవాలి. ఈ మూడుపొరల్లో ఒకరకంగా మత్స్యన్యాయం కానవస్తూ వుంటుంది. తెలియని చోటచేస్తే మోసం, తెలిసినచోట చేస్తే లౌక్యం అంటాడు రామప్పంతులు కన్యాశుల్కం నాటకంలో. మూడు పారల్లోనూ ఆఖరిదయిన తరుజన గిరిజన పారను అందరూ యధాశక్తి మోసం చేస్తో వుంటారు. ఈ పారలోని వారు అడివిలోని కాయకసురు ఆకూ అలమ తింటూ వుంటారు. అప్పుడప్పుడు వేటాడుతూ వుంటారు. పోడు కొట్టి చిన్న వ్యవసాయం కూడా చేస్తూ వుంటారు. తమకు అనువయిన స్థలంలో పోడు కొట్టి దాన్ని తగలబెట్టి ఆభూమ్మీద విత్తనాలు అలుకుతారు. ఈ వ్యవసాయం ఒక ఏడు మాత్రమే. తరవాత మరో చోట పోడు వ్యవసాయం, ఇలా పదిహేనేళ్లు సాగుతుంది. అప్పటికి తొలిపోడులో అడివి పెరుగుతుంది. అప్పుడు తొలినాటి మాదిరిగానే పోడుకొట్లి తగలబెట్టి మళ్లీ వ్యవసాయం చేస్తారు. తరుజనులకు జానపదులు నాగరికులకున్నంత విజ్ఞానం ఉండదు. కొని తరుజనుల చారిత్రక జ్ఞానంలో ఆవంతకూడా నేటి నాగరికులకు జానపదులకు వుండదు. అదే చిత్రం. తరుజనులు బతికేది అడివిమీద, వారు వ్యవసాయం కోసం అడివిని కొడతారు. పదిహేనేళ్తపాటు అడివిని పెంచి పోషిస్తారు. ఆ సంగతి తకులనులపడు వ్యవసాయం ద నుంది. న జానపదులు, నాగరికులూ అవసరార్థం భూజల సంపదలను వినియోగించవలసి వసే ఆ సంపదలను పునరుజ్జీవించడం అటుంచి అవి నామరూపాలు లేకుండా నశించే వరకు ఆ సంపదలను పీల్చి పిప్పిచేసే వరకూ ఆగరు, నేలలు ఎడారులై భూగర్భంలో కూడా తడి ఆరిపోయినప్పుడు గుండెలు బాదుకుంటూ శోకాలు పెడతారు. మన జానపదులకూ నాగరికులకూ చరిత్ర తెలియదు. ఒకనాడు సస్యశ్యామలంగొ ఉండే భూములు ఇప్పుడు ఎడారులెందుకయ్యాయో తెలీదు. ఒకనాడు కూలంకషంగా పారే నదులు ఇప్పుడు మురిక్కాలవలుగా ఎందుకు మారాయో తెలీదు. నొటి మంత్రి మండలి వెంకట కృష్ణారావుగారు అఖిల భారత తెలుగు మహాసభ జరిపిస్తున్నారు? అక్కడ నిత్యం తెలుగు సంస్కృతిమీద ఉపన్యాసాలు, సమ్మానాలు, సత్కారాలు జరుగుతూ వుంటాయి. జర్నలిజం కాలేజీ కుర్రాళ్లను ఆ సభలకు వెళ్లి తమకు తోచినట్టు వార్తలను రాసుకుని రమ సి పంపేవాడిని. ఆ సభాప్రాంగణంలో తెలుగు ప్రముఖుల చిత్రపటాలు పెట్టారు. కమ్యూనిస్టు పార్టీ పుణ్యమా అని కందుకూరి, గురజాడ, గిడుగు ఈముగ్గురు వైతాళికులూ చీకటిలోంచి వెలుగులోకి వచ్చారు. కాని తెలుగు మహాసభ ప్రాంగణంలో ఆ ముగ్గురి చిత్ర పటాలూ లేవు, ల 164 అ రాంభట్ట కృష్ణమూర్తి సాంతకధ

బోనాల పండుగల్లో అమ్మవారికి సమర్పించే తొట్టెల్లాగ వెదురుబద్దలతో ఒక తొట్టెను కట్టి ఆ తొట్టెమీద ముగ్గురు వైతాళికుల చిత్రపటాలను అలంకరించి వీరు తెలుగువారేనా? అని ప్రళ్నిస్తూ ఆతొట్టెను మహాసభ (ప్రాంగణంలో పెట్టారు తెలుగు అభ్యుదయరచయితల సంఘంవారు. మహాసభకు వచ్చేవారంతా ముందు ఆతొట్టెను సందర్శించి తరవాత ఉపన్యాసస్థలికి వెళ్లేవారు. బాల్యంలోనే పట్టుకో అని ఇంగ్లీషులో ఒక సామెత వుంది. విద్యార్థి దళలోనే పిల్లలకు కాం(గ్రెసు, కమ్యూనిస్టు అన్న ముద్రలుండేవి.

దేశమును (ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా అని కమ్యూనిస్టు విద్యార్థులు పాడుతూ వుంటే మాతెలుగు తల్లికీ మల్లెపూదండ అని కాంగ్రెసు విద్యార్థులు పాడేవారు. ఆరోజుల్లో కాం(గ్రెసు విద్యార్థులు కామ్రేడ్‌ కందుకూరి, కామ్రేడ్‌ గురజాడ, కార్రేడ్‌ గిడుగు అని హేళనగా అంటూ వుండేవారు అది అనాటి కాం(గ్రెసు సంస్కృతి విద్యార్థిదళలో చాలా మిలిటెంటుగా వుండేవారు మండలి కృష్ణారావుగారు మంత్రిపదవిలోకి వచ్చినా కాని ఆ చిన్ననాటి మిలిటెన్సీ ఏమాత్రం కగ్గలేదు. తగ్గలేదు.

నా చిన్నతనంలో రాజకీయాలున్నాయి కాని రాజకీయ విద్యార్థి సంఘాల్లేవు. స్కూలు ప్రార్థనతో మొదలయేది నేను తొలుత స్కూల్లో కాలుపెట్టింది గజపతినగరంలో. నాటి (ప్రార్ధన “కింగ్‌ జార్జి ఘనుని రమారమణుడేలు ననవరంతం” అని. ఇది గాడ్‌ సేవ్‌ ద కింగ్‌కి అనువాదం. ఏదో బడిపంతులుగారు అనువదించివుంటారు. ఆ తరవాతి స్కూలు ఇల్లెందు. ఆ తరవాత హైదరాబాదు. అక్కడ “ఆలా హజ్రత్‌ నిజాముల్‌ ముల్క్‌మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బహదూర్‌ ఆసఫ్‌జా సాబే ఆయురారోగ్యాలు కోరే ఉరుదూ పాట. ఆ తరవాత ప్రార్ధనా లేదు. స్కూలూ లేదు.

జర్నలిస్టు కాలేజీలో తాలి బృందం శిక్షణ అయింది. విశాఖపట్నం ఈనాడు ఎడిటరుగా పనిచేసిన ఏబీకే ప్రసాదును మరికొందరు సబెడిటర్లను హైదరాబాదు పిలిపించారు. విశాఖ ఎడిషనుకు సబెడిటర్జు కావాలి. హైదరాబాదులో శిక్షణ పూర్తి చేసుకున్న వారిని తీసుకుని నేను విశాఖపట్నం వెళ్ళాను. ఇంతవరకు జరిగింది కాలేజి శిక్షణ. ఇప్పుడు స్టాలీ శిక్షణకోసం అక్కడ వారం రోజులున్నాను. విశాఖపట్నం చాలా మారింది నేను కమ్యూనిస్టు పార్టీ విశాఖ సమావేశానికి వచ్చిన నాటికన్నా మారింది, ఆసలు నాచిన్నతనంలో రైల్లో వస్తే వాల్తేరులోదిగి మరోరైల్లో విశాఖకు వచ్చేవారం.

ద్వితీయ ప్రపంచయుద్ధ కాలం నాడే అనుకుంటాను విశాఖపట్నం రైల్వే స్టేషన్ను రద్దుచేశారు. అలాగే తూ ర్పుగోదావరిజిల్లాలో నోమగుండం - కొకినాడ రైల్వేలైను వుండేది. అది కూడా యుద్ధకాలాన రద్దయింది. అలాగే యుద్దాలు వచ్చినప్పుడు జీళం గెలిచినా ఓడినా మార్పులు తప్పనిసరిగా వచ్చితీరుతాయి. ఇది చరిత్ర. ప్రధమ ప్రపంచ సంగ్రామం ముగిసినప్పుడు రమ్యాలో వసనం వచ్చింది. ద్వితీయ ప్రపంచ సం(గ్రామం తరవాత మన దేళానికి స్వాతంత్ర్యం వచ్చింది. చరిత్రను పరిశీలించి చూస్తే ఇలాంటి మార్పులు మనకెన్నో కనిపిస్తాయి.

ధాంవ్సన్‌ ఫ్రాండేషనువారు బెంగుళూరులో రెండు వారాలు జర్నలిన్న శిక్షణశిబిరం

1 నుకున్నారు. లండను దగ్గరవున్న ఓ చిన్న టౌనులో వుంది ధాంప్సన్‌ ఫౌండేషన్‌ కార్యాలయం. నిర్వహించాల న్నా ళమ డు రామోజీరావు. మర్నాడే శిబిరం ప్రారంభం. నేను విమానంలో ఆ శిబిరానికి ను ో న్‌ స్వావాకులు నన్ను కలిశారు. నాలాగే వచ్చినవారందరికీ ఓ హోటల్లో చేరుకున్నా ల్లో ఇ మూవేశం హాలు వుంది. శిబిరానికి నచ్చిన వారు ఓ పదిహేనుమందిదాకా వున్నారు. ఇలను పత్రికల ధ్రతినిధిగా వ్చిన వాడిని నేనక్కడ

రాంభట్ల కృష్ణమూర్తి సాంతకధ అ 165

ధాంప్సన్‌ ఫౌండేషన్‌ ప్రతినిధే మాకు పాఠాలు చెప్పేవాడు. తరవాత మాలో మేమే చర్చలు, చేసుకునేవాళ్లం. మద్రాసునుంచి ఒక తమిళ పత్రిక సంపాదకుడు వచ్చాడు. అతడి పేరూ నా పేరూ ఒకటే. ఆయన ఎడిటరే కాకుండా పత్రిక యజమానికూడా. అప్పటికే బెంగుళూరులో ఆం(ధ్రప్రభ ఎడిషను వుంది. వచ్చిన వారిలో పబ్లిక్‌ రిలేషన్సు వారు ఎక్కువ, నెల్లూరి నుంచి ఒక తెలుగు అమ్మాయి వచ్చింది. ఆమె కూడా పబ్లిక్‌రిలేషనే. ఆమె అమెరికాలో పుట్టిపెరిగింది. తెలుగు సరిగా రాదు. తెలుగును ఇంఫ్రూవు చేసుకొనడం కోసం నాతో మాట్టాడుళూవుండేది.

ప్రతీ పత్రికకూ న్యూస్‌ ఎడిటరన్న హోదా ఒకటుంటుంది. ఆ న్యూస్‌ ఎడిటరు బాధ్యతలేమిటి. అతడి బాధ్యత ఫాలో అప్‌. ప్రభుత్వాలు, బ్యాంకులు కొన్ని పనులకు రుణాలిస్తూ వుంటాయి. ప్రెస్‌ కాన్ఫరెన్సులుపెట్టి ఆ రుణాలను గురించి చెబుతూ వుంటారు. ఈ రుణాల్లో కాలనియమం గల రుణాలు కొన్ని వుంటాయి. ఆ రుణాల సంగతి పత్రికల్లో వస్తుంది కాని ఆ రుణాల ఫలితం ఏనాడూ పత్రికలకెక్కదు. ఒక్కరుణాలేకాదు కాల నియమంగల అనేక వార్తలు వస్తూ వుంటాయి. అలాంటి ఫాలోఅప్‌ పత్రికల్లో కానరాదు. అలాంటి పత్రికలకు న్యూస్‌ ఎడిటరు లేడన్నమాట.

న్యూస్‌ ఎడిటరు కాల నియమం గల వార్తలకు ఒక డైరీని నిర్వహిస్తూ వుంటాడు. ధాంప్పన్‌ ఫౌండేషను ప్రతినిధి న్యూస్‌ ఎడిటరు ఒక పత్రిక సాధించిన ఘనతను గురించి ఒక ఉదంతాన్ని వివరించాడు. లండనుకు దగ్గరలోనే ఉన్న చిన్న నగరంలో ఒక పత్రికవుంది. ఒకనాటి రాత్రి ఒక కుర్రవాడిని ఆఫీసులో వుంచి న్యూస్‌ ఎడిటరుతో సహా సిబ్బంది అంతా డిన్నరుకు పోయారు. డిన్నరంటే సహజంగా బీరు విస్కీల్లాంటివుంటాయి. ఆ రాత్రి డిన్నరు తరవాత వారు తిరిగివచ్చారు. ఫోన్లేవయినా వచ్చాయా అని న్యూస్‌ ఎడిటరు కు(ర్రవాణ్లే అడిగాడు. ప్రాప్రయిటరుగారి ఫోను వస్తే మీరు డిన్నర్‌కెళ్లారని చెప్పాను అన్నాడు.

న్యూసెడిటర్‌ వెంటనే వాటికన్‌కి ఫోను చేయి అని కుర్రవానితో చెప్పాడు. కుర్రవాడు వెర్రిమొహం పెట్టాడు. అయినా చెప్పింది చేయాలి కదా? వాటికన్‌ ఫోనుమీద ఉంది సార్‌ అన్నాడు కుర్రవాడు. పోపు ఎలా వున్నారో అడుగు అన్నాడు న్యూస్‌ ఎడిటరు. కుర్రవాడు పోస్‌ ఎలా వున్నారు అన్నాడు. నీకెలా తెలిసింది అని అవతల నుంచి వచ్చిన జవాబు. ఆ సంగతినే కుర్రాడు న్యూస్‌ ఎడిటరుకు చెప్పాడు. న్యూస్‌ ఎడిటర్‌ ఫోనందుకున్నాడు. పోప్‌ ఇప్పుడే ప్రభువులో కలిశాడు అని అవతలనుంచి జవాబు. మర్నాడు పోపు మరణవార్త బేనరుగా పత్రిక వెలువడింది.

ఆ చిన్న బస్తీ పత్రికనుంచే ప్రపంచ పత్రికలన్నీ ఆ వార్తను తీసుకున్నాయి. ఓ చిన్న పత్రికకే ఈ వార్తముందుగా ఎలా వచ్చింది అన్న సంశయం చాలా మందికి వచ్చింది. మర్నాడు తెల్లవారగానే 'ప్రాప్రయిటరు పత్రికాఫీసుకు వచ్చి న్యూసెడిటరును అభినందించాడు. న్యూసెడిటరు తన న్యూస్‌ డైరీని తీసిచూపాడు. నెలరోజుల నుంచీ పోవ్‌కి అనారోగ్యం. డాక్టరు ఆయన్ని చూసిన తరవాత చెప్పిన సమాచారం అంతా ఆ డైరీలో వుంది. డాక్టర్ల కధనాలను జాగ్రత్తగా గుర్తుంచుకున్న న్యూస్‌ ఎడిటరు ఈ రోజున పోప్‌ కన్నుమూయవచ్చునని రాసుకున్నాడు.

న్యూస్‌ ఎడిటరు ఫాలో అప్‌ డయరీవల్ల చిన్న టౌన్‌ పత్రికకు ఆనాడు (ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది.

ఇప్పుడు ప్రతీ పత్రికకూ న్యూసెడిటరు ఒకడుంటాడు. టెలీఫ్రింటరు మీద వచ్చే వార్తా కాపీలు చింపి

అనువాదంకోసం సబెడిటర్లకు పంచిపెడతాడు, పంచిపెట్టని కాగితాలు టెలిప్రింటరు పక్కనే వుంటాయి.

మాకాలేజీ ఈనాడు బిల్లింగు డాబా మీద కట్టిన ఒక హాలు. నేను ఎందుకో న్యూస్‌ రూంలోకి వచ్చాను. 166 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

కిందపడిన కాగితాలను యాదృచ్చికంగా చూశాను. యువతుల మరణాల రిపోర్టు వచ్చినప్పుడు వాటిని డౌరీడెత్‌ కోణం నుంచి కూడా చూడాలని నాగర్వాలా ఉత్తరువు.

నాగర్వాలా బొంబాయి పోలీసు అధికారి. ఆయన అన్ని పోలీసు స్టేషన్లకూ ఈ ఉత్తరువు జారీచేశాడు. అప్పటికి ఆంధ్రలో వరకట్నం హత్యలు వార్తలకెక్కలేదు. బొంబాయిలోనూ గుజరాతులోనూ వరకట్నం హత్యలు పెరుగుతున్నాయి. ఆ వార్తను చింపి న్యూసెడిటరుకు యిచ్చాను. ఆయన దాన్ని చూసి చింపి పారేశాడు. నేను క్లాసురూంకి వెళ్లిపోయాను. ఈ ఉదంతాన్ని బట్టి చూస్తే న్యూసెడిటరుకు ఫాలోఅప్‌ ఒక్కటేకాదు. ముందుచూపు కూడా వుండాలని విదితం అవుతుంది. ఒక రాష్ట్రంలో పుట్టిన సాంఘిక రుగ్మత అక్కడే అణిగిపోదు.

ఏబీకే ప్రసాదు, వాడకట్టు హనుమంతరావు, తాళ్ళూరి వెంకటకృష్ణయ్య, పొత్తూరి వెంకటేశ్వరరావు ఈ నలుగురికీ ఎడిటరు హోదా ఇచ్చాడు రామోజీ, పొత్తూరి తప్ప తక్కిన వారంతా విశాలాంధ్రలో పనిచేసినవారే. విశాలాంధ్రలో నేనుండగా ఆఖర్న చేరినవాడు ఏబీకే, అందుకని అతడిని అందరూ బుడ్తోడు అంటూ వుండేవారు. హనుమంతరావు ఆఫీసు ట్రెపిస్ట. టీవీకే అంటే తాళ్ళూరి వెంకటకృష్ణ రిపోర్టరు. నేనప్పుడు డస్కు వర్కర్ని. అదికాక కార్టూన్లు గీసేవాడిని. కార్టూను పొటలురాసేవాడిని. పొత్తూరి వెంకటేశ్వరరావును ఎరుగుదును. అంతే.

విశాలాంధ్ర నుంచి నేను మానేసిన అయిదేళ్లకు కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలింది. చీలిన కొత్తపార్టీకి సిపియం అని పేరు వచ్చింది. పై మొదటి ముగ్గురూ చీలిక వర్గంలో చేరారు. కొద్దికాలం తరవాత చీలికవర్గం ఉ(గ్రత్వం పెరిగి సుమారు ముప్పయి ముక్కలయింది. పార్టీమీద నిషేధంవున్న రోజుల్లో నేను మద్రాసు నుంచి వచ్చే కవరు పేపరు సందేశంలో పనిచేశాను. ఈ పార్టీకి గొప్ప చీలిక యోగం వుందని అప్పుడే (గ్రహించాను. అంచాత చీలికవర్గాలతో సత్సంబంధాలువున్నా వారి భావాలతో నేను ఏకీభవించలేదు. అందువల్ల కొందరు నన్ను అమిత్రునిగానే చూసేవారు.

సబెడిటర్జు, కంపోజిటర్హు ఇలా అందరిలో అతివాద రాజకీయ వాతావరణం అలుముకుంటోంది. ఎడిటర్ల సంఖ్య బాగానే వుంది. నన్ను కూడా ఎడిటర్లలో ఒకడిని చేశారు. ఇప్పుడు ఎడిటర్ల సంఖ్య అయిదయింది. ఈ అయిదుగురిలోనూ ఒకరిని ఎడ్మినిగ్టేటివు ఎడిటర్ని చేయాలని రామోజీ సంకల్పించారు. ఆ సంగతి నాకు చెప్పినప్పుడు అందుకు పొత్తూరిని నియమించమని సలహాయిచ్చాను. పొత్తూరికి వాతావరణం పడలేదు.

పొత్తూరి ఈ పదవిని అంగీకరించలేదు. రానున్న పరిణామాలను ఊహించగలిగాడు. ముందే మేల్కొని తన పదవికి రాజీనామా యిచ్చి వెళ్లిపోయాడు. అప్పుడు ఎడ్మిని(స్టేటివ్‌ ఎడిటరు బాధ్యత నీకు తప్పదన్నాడు రామోజీ. కృష్ణాజిల్లా రాజకీయుల సంగతి నాకు బాగా తెలుసును. వారు కాంగ్రెసు కావచ్చును. కమ్యూనిస్టులు కావచ్చును. వారందరిదీ ప్యూడల్‌ మనస్తత్వం. ఏదేశంలోనయినా వ్యవసాయ కుటుంబీకుల మనస్తత్వం అలాగే వుంటుంది. రామోజీ వ్యవసాయ కుటుంబీకుడే కాని ఆయనది పెట్టుబడిదారీ మనస్తత్వం. ఆయనమీద నాకభిమానం మెండు.

ఆయన కూడా చిన్నతనంలో కమ్యూనిస్టు అభిమానిగా వుండేవాడు. కమ్యూనిస్టు పరిభాషలో పెట్టుబడిదారుడన్న మాట ఓపెద్ద తిట్టులాంటిది. కాని నిజానికి ప్యూడలిజంకన్న పెట్టుబడిదారీ విధానం వేయిరెట్లు ఎక్కువది. ఆ పెట్టుబడిదారీ విధానంలోనే (ప్రజాస్వామ్యం పెరిగింది. అది అంటే (ప్రజాస్వామ్యం

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 167

లేనందువల్లనే ఏడుదశాబ్దాలపాటు ఏలిన సోవియట్‌ సోషలిజం కూలిపోయింది. అయినా కమ్యూనిస్టు నాయకులు ప్రజాస్వామ్యం మనకు అచ్చిరాదు అంటూనే ఉన్నారు. నిజమయిన పెట్టుబడిదారీ విధానంలో పరిశ్రమలు మూతపడనవు.

మనదేశాన ప్రభుత్వాధికార గణంలో ప్యూడల్‌తత్వం ఊడలుదిగుతోంది. అందుకనే ప్రభుత్వ పరిశ్రమలన్నీ దివాలా తీస్తున్నాయి. పరిపాలనా శాఖ నుంచి అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ప్యూడల్‌ధాష్టీకం, అలసత్వం తాండవమాడుతూ కనిపిస్తుంది, తన పనిని తాను చేసుకునేవాడు స్వతంత్రుడు. తన పనులకు ఇతరులమీద ఆధారపడే వాడు పరతం(త్రుడు అని భమిడిపాటి కామేశ్చరరావుగారు అంటూ వుంటాడు. కొత్త బియ్యే పాత బియ్యే అన్న వ్యాసంలో గడ్డంచేసుకొనడం దగ్గర ఈ సూక్తిని ప్రవచించాడాయన.

కొందరు మహా 'నసు'లుంటారు. వారు అవసరమున్నా లేకపోయినా మీకేటండీ మీరు గొప్పవారు అంటూ వుంటారు. అలాంటి వారికి ఒకరితో పనిపడిందనుకోండి. వారు మహా 'నసులుగా అవతారం ఎత్తుతారు. వారిపని అయేదాకా నసపెడుతూనే వుంటారు. మహానసుడంటే వంటవాడు అన్న అర్హం వుంటుంది. వారు ఊహాభక్ష్యాలు వండుతూ లొట్టలు వేస్తూ వుంటారు. అలాంటి ఊహాభక్ష్యాలను ఉరుదులో ఖయాలీపులావు ఆంటారు. మల్లారెడ్డి కమ్యూనిస్టుపార్టీ హోల్‌ైమరు. ఆయనకు పార్టీ నుంచి హోల్ష్‌ట్రెమర్‌ ఆలవెన్సు వస్తుంది.

నాకు ఎప్పుడూ హోల్ష్‌టైమరు యోగం పట్టలేదు. అందువల్ల హోల్ష్‌టైెమరు అలవెన్సులను గురించీ ఇతర పెర్కులను గురించీ నాకు తెలియదు. అభ్యుదయ రచయితల సంఘం నిర్మాణ సమయాన ఇద్దరం కలిసి ప్రయాణాలు చేస్తూ వుండేవాళ్లం, ఆ (ప్రయాణం ఖర్చుల్ని పార్టీ భరించేది. పార్టీ ఆఫీసు కార్యదర్శి పైసలు నాచేతికిచ్చేవాడు. లెక్కలను నేనే అప్పగించేవాడిని, మల్హారెడ్డి జిల్లా స్పాయినాయకుడు. నాకు అలాంటి పార్టీపదవులేవీలేవు. ప్రయాణ సమయంలో ఆయన కొంత డబ్బు అడిగి తీసుకునేవాడు. నేను దాన్నికూడా లెక్కల్లో చూసేవాడిని.

నేనొక నాయకుడినెరుగుదును. ఆయన బస్సు చార్జీలు తీసుకుని లారీలమీద ప్రయాణాలు చేసేవాడు. అరసం పనులు చేయాలంటే నాకిచ్చే ఆలవెన్సుచాలదు. అలవెన్సు మీద ఇంకో రెండు వందలుంటే సరిపోతుంది. కనక రామోజీరావుగారితో చెప్పి నాకు రెండువందలకు సరిపడే ఉద్యోగం ఇప్పించు అన్నాడు మల్గారెడ్డి, మల్లారెడ్డికి రామోజీతో బాగా పరిచయం వుంది. తన ఉద్యోగంకోసం ఆయనే అడగవచ్చును అయినప్పుడు ఈ తడక రాయబారమెందుకు. రాజకీయులకింతో అంతో కౌటిల్యం వుంటుంది. ఇది కౌటిల్య (ప్రయోగం అని నాకు తెలుసును.

రామోజీతో చెప్పి డెయిలీ మినీ కవితలను 'ప్రవేశపెట్టాం. కవిత ఒక స్టిక్కును మించరాదు. దాని ఎంపిక మల్లారెడ్డిది, అచ్చు ఆయిన కవితకు అయిదురూపాయల పారితోషికం. ఆ పనికి ఆయన కోరింది రెండు వందలే. అందుకని ఆయనకు రెండువందల జీతం ఖరారయింది. ఈనాడులో కవిత పడిందంటే చాలు వచ్చే పారితోషికం అయిదురూపాయలే అయినా కీర్తి అయిదువందల విలువచేస్తుంది. అంచేత పెద్దపెద్ద వారు మినీ కవితలను పంపించేవారు. వచ్చిన కవితలను చదివి ఒక దాన్ని ఎంపికచేసేవాడు మల్లకవి,

168 అ రాంభట్ల కృష్ణమూర్తి సొాంతకధ

జ ష్‌ ట్య ఈనాడు సిబ్బంది ఒకరోజు రోజంతా ఈనాడులోనే ఉండిపోయింది. నమ్మెవారు ఆఫీసుకు ఎదురుగా రోడ్డు 'పేవుమెంటుమీద బైఠాయించారు. ఈనాడు సిబ్బందికి వోటలునుంచి భోజనాలు వచ్చాయి. రామోజీ ఇంటినుంచి రెండు పరువులు తెప్పించాడు. ఎసీగదిలో ఆయన్న్హా నేనూ నిద్రపోయాం. సిబ్బంది అంతా ఆ రాత్రి అక్కడే నిద్రించింది. నమ్మె మొదలయిన రెండోరోజునే టీవీ కృష్ణ రాజీనామా వంవీంచి వెళ్ళిపోయాడు. పా యినా ఆన్‌ ఈనాడు సమ్మె

సమ్మె జరిగే సూచనలు కానవస్తున్నాయి. అది జరిగితే సమ్మె ఇష్టంలేని వారిమీద బెదిరింపులు బ్బాక్‌మెయిల్‌ల (ప్రయోగాలు జరుగుతాయి. అందుకని అలాంటి వాటికి లొంగని నాకు తెలిసిన ఇద్దరిని ఈనాడులో చేర్చించాను. సమ్మె మొదలయింది. రాజకీయాలు తెలిసిన మల్లారెడ్డి స్వస్థలం కడపకు తరలిపోయాడు. పత్రికకు కావలసిన మేటరంతటినీ నేను ఒంటిచేత్తో రాయగలనని విశాలాంధ్ర అనుభవం వున్న ముగ్గురు ఎడిటర్ల నమ్మకం. ఈనాడు ఇతర ప్రెస్సుల్లో కంపోజు అయి ్రింటవుతోందేమోనని సమ్మె నాయకులు ్రెస్సులను గాలించారు.

(పైస్సు సెక్షను వారెవరయినా వస్తే వారిని ఘౌరావు చేసి వెనక్కి పంపించేవారు. రామోజీరావు కారును కూడా గేటుదగ్గర ఆపేస్తారని ఆయన గుర్తించాడు. అందుకని సైకిలుమీద ఆఫీసుకు వచ్చాడు. ఆయనిలా వస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు. ఆయన బిజినెస్‌ ప్రారంభించిన తొలిరోజుల్లో ఇంటినుంచి ఆఫీసుకు సైకిలుమీదే వచ్చేవాడు. ఆఫీనుదగ్గర కారు వుండేది. బిజినెన్‌ వ్యవహారాలమీద ఎవర్నయినా కలుసుకోవాలంటే కారు మీద వెళ్లేవాడు. ఆఫీసు పని అయిన తరవాత అదే సైకిలుమీద ఇంటికి వెళ్లేవాడు.

అదే సైకిలు ఇంత కాలానికి మళ్లీ అక్కరకు వచ్చిందని నవ్వుతూ నాతో అన్నాడు. ఇతర ప్రెస్సుల్లో ఈనాడు పనిజరగడం లేదని తెలిసినా నేను అక్కడ వుండడం ఎప్పటికయినా దెబ్బే అనుకున్నారు. అందుకని సమ్మెనాయకులు మఖ్టూం భవనానికి వెళ్లి మీ నాయకుడు మా సమె, ని విచ్చిన్నం చేయాలని చూస్తున్నాడని కధలల్లి చెప్పారు. వారు నాకు ఫోను చేశారు. మఖ్టూం భవనం నాయకులు కూడా మల్హారెడ్డి సలహాలాంటిదే యిచ్చారు. వారితో కాస్తసేపు వాదించాను. లాభం లేదనిపించింది. కమ్యూనిస్టు పార్టీనుంచి విరమిస్తున్నానని లేఖ రాశాను,

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 169

కమ్యూనిస్టు పార్టీలు బర్తరపులు చేయడమేకాని రాజీనామాలు అంగీకరించరు. బర్తరిపు చేయాలంటే నాదుళ్ళీలాన్ని ఏకరువు పెట్టాలి. అలా ఏకరువుపెట్టదగ్గ తప్పులు నేనేవీ చేయలేదు. అందుకని నాకు బాగా చగ్గరవాడయిన కెఎల్‌ మహేంద్రను పంపించి రాజీనామాను విత్‌డ్రా చేయించారు. సమ్మెనాయకులకు కమ్యూనిస్టు పార్టీవల్ల ఆశించిన సహాయం దొరకలేదు. అందుకని అందరూ కట్టగట్టుకుని సిపిఐఎం ఆఫీసుకు వెళ్లారు. అసలు డిమాండ్డ్లులేని సమ్మె ఇల్లీగలు అని సిపియం నగర కార్యదర్శి చెప్పాడు. ఆయన ఇటీవలే లా కూడా చదివాడు ఈనాడు సిబ్బంది ఒకరోజు రోజంతా ఈనాడులోనే ఉండిపోయింది. సమ్మెవారు ఆఫీసుకు ఎదురుగా రోడ్డు పేవుమెంటుమీద బైరాయించారు. ఈనాడు సిబ్బందికి హోటలునుంచి భోజనాలు వచ్చాయి. రామోజీ ఇంటినుంచి రెండు పరుపులు తెప్పించాడు. ఎసిగదిలో ఆయనా, నేనూ నిద్రపోయాం. సిబ్బంది అంతా ఆ రాత్రి అక్కడే నిద్రించింది. ఉదయం అందరికీ టీ, ఫలహారాలు వచ్చాయి. సమ్మె మొదలయిన రెండో రోజునే టీవీ కృష్ణ రాజీనామా పంపించి వెళ్లిపోయాడు. డిమాండ్డ్భులేని సమ్మె నిరర్ధకం అని రుజువయింది. అసలు డిమాండ్డు లేకపోలేదు. ఉన్నాయి. వాటిని కాగితం మీద పెట్టడానికి వీల్లేక తమ శక్తిని ఉత్రేక్షించుకున్నారు పాపం. మిగిలిన ఇద్దరు ఎడిటర్లూ రాజీనామా లేఖలను ట్రెపుచేసి పంపించారు. గేటుపక్కనే వున్న సెక్యూరిటీకి అందించారు. వారి రాజీనామాను ఆమోదిస్తూ వచ్చి ఎకౌంటును సెటిలుచేసుకొమ్మని ఎడ్మిని(స్టేటివు ఎడిటరుగా లేఖలు టైపు చేయించాను. కింద చీఫ్‌ ఎడిటరు రామోజీ సంతకం చేయాలన్నాను. ఇప్పటికే నామీద అందరికీ కన్నెర్ర. నేను సంతకం పెడితే వాళ్లు కళ్లు నెత్తురు కురుస్తుంది. అందుకని మీరే సంతకం చేయండన్నాను. న రామోజీ సంతకంతో వారి రాజీనామా ఆమోదలేఖలు వారికి అందాయి. వారు ఎకౌంటు డిపార్చుమెంటుకు వెళ్లి తమకు రావలసిన డబ్బు తీసుకుని వెల్లిపోయారు. వారు మళ్లీ ఈనాడులో అడుగుపెట్టలేదు. అప్పుడు ఒక పంజాబీ ఈనాడు పర్సనల్‌. ఆఫీసరుగా వుండేవాడు. అతడి 'పేరు చావలా. కొత్తవాడిని ఉద్యోగంలోకి తీసుకోవాలంటే అతడికి కావలసిన అర్హతలతో ఒక లేఖను ఎంప్తాయమెంటు ఎక్సేంజికి పంపాలి, ఉద్యోగిని తీసెయ్యాలన్నా ఒక పై ఉద్యోగి సమక్షంలో అతడిని ఇంటర్‌వ్యూచేసి చట్టబద్దంగా అనర్హతను నిరూపించాలి. న సమ్మెలో పాల్గొన్న కొందరు బెదిరింపులకు భయపడిన వారున్నారు. వారు పనిలోకి తిరిగి వస్తామన్నారు. ఆలాంటి వారిని ఇంటర్వ్యూలు చేసేటప్పుడు నేను కూడా ఉండాలనేవాడు. సమ్మెలో పాల్గొన్నవారిలో లీడరు నేటరు క్ష వాలని వ న్నారు. ఎంప్లాయిమెంటు ఎక్సేంజివారు చిత్రమైన వ్యక్తులు. ఒక అనుభవం అది, రాస్త్ర ఒక సైకిలు ప్యూన్ని పంపించారు. ఆ పర్సనల్‌ ఆఫీసరుతో నా కార్యద[ ని నిగ వచ్చాడు. సంపాదకీయాలు రాస్తానన్నాడు. ఆయన కమ్యూనిస్టు, కడపజిల్లా వుంటాయి. ఈనాడు వ వుంది. రాబకీయ సమస్యలమీద కమ్యూనిస్టులందరి భావాలు ఒకేలాగ జనబాహళ్య అభిష్రయా ల నా చి జాతీయ పత్రిక. జాతీయ పత్రిక సంపాదకీయం వుండాలి. అందుకని జాతీయ ఇంగ్లీషు పత్రికల సంపాదకీయాలను చదివి అవి (ప్రజా బాహుళ్య భావాలను ఎలా ప్రతిబింబిస 'హన చే తెలుగున సంపాదకీయాలు రాయాలి. 'ప్రతిబింబిస్తున్నాయో అవగాహన చేసుకుని క. 1709 రాంభట్ల కృష్ణమూర్తి సాంతకధ

మల్డ్చారెడ్డికి ఇంగ్రీషురాదు. అందుకని ఇంగ్లీషు పత్రిక సంపాదకీయాలను తెలుగులోకి తర్జుమా చేయగల ఒక సబెడిటరును ఆయనకు సహాయకునిగా ఇచ్చారు. ఆయనకు హిందీ బాగా వచ్చును. అంచాత హిందీ జాతీయ పత్రికలను తెప్పించుకుని వాటి సంపాదకీయాలను చదువుకునేవాడు. ఈ రెండు భాషల సంపాదకీయాలూ ఆకళించుకుని తెలుగు సంపాదకీయాలు రాసేవాడు. అయితే అంతర్జాతీయ సమస్యలమీదా ఆర్థిక సమస్యల మీదా ఆయనకు అవగాహన లేదు. అందుకని ఆ సమస్యల మీద నేను రాసేవాడిని. కాగా ఆదివారం పత్రికలో నేను కావ్య పురాణాలను రాజకీయాలకన్వయిస్తూ రాసేవాడిని.

మనకు స్వాతంత్ర్యం రాకముందు ప్రముఖ సంపాదకుడు ట్రైల్వీ మహాభారతాంశాలను నేటి రాజకీయాలకు అన్వయిస్తూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో సంపాదకీయాలు రాసేవాడు. నేను మీజాన్‌ పత్రికలో పనిచేసే రోజుల్లో బైల్వీ సంపాదకీయాలను చదువుతూ వుండేవాడిని. ఆయన ముఖ్యంగా మహాభారతాన్నే ఉదాహరిస్తూ వుండేవాడు. ఆ శైలి నాకు నచ్చింది. ఆదివారం సంపాదకీయం నేనే రాస్తూ వుండేవాడిని, టైల్వీకి మహాభారతం ఆధారమయితే నాకు పురాణాలు కూడా ఆధారం,

నేను మొదలుపెట్టిన ఫస్ట్‌పేజీ ఫస్టుకాలంలోని “టూకీగా” అనే శీర్షిక, ఆదివారం సంపాదకీయం ప్రత్యేకత నిరంతరాయంగా సాగుతున్నాయి. అలాగే గజ్జలమల్హారెడ్డి మొదలుపెట్టిన పుణ్యభూమి అనే శీర్షిక కూడా కాస్త శైలీ భేదంతో సాగుతూనే వుంది. సాగుతూనే ఉంటుంది. ఆదీ ఈనాడు ప్రత్యేకత. రచయితలు మారినంత మాత్రాన శీర్జిక స్వభావం, శైలీ మారకుండా ఉండేది ఒక్క ఈనాడులో మాత్రమే. అందుకు పత్రికా నిర్వాహకులను అభినందించక తప్పదు. ఈ కళను నేను ఎర్రాప్రగడీయం అంటాను.

ఆనాడు సమ్మెలో దిగినవారంతా మార్క్సిస్టులు, మార్క్సిస్టు లెనిస్టులు. వారి ప్రధానమైన డిమాండు జర్నలిస్టులకు స్వేచ్చ కావాలని. అది అప్రకటిత డిమాండు. అయినా తప్పులేదు. డయలెక్టికల్‌ సూత్రాలు కాకుండా డయలెక్షికల్‌ కేటగిరీలు కొన్ని వున్నాయి. అందులో ఒకటి ఫ్రీడం అండ్‌ నెససిటీ అనేది. డయలెక్టిక్సుకు తెలుగున గతితర్కం అంటున్నారు. మెటీరిలిజం తత్వవేత్తలకు చాలా కాలంనుంచీ తెలుసును. మేటర్‌ అంటే పదార్ధం: మేటరుకు మోషను ఉంటుంది.

మోషన్‌ అంటే గతి. పదార్డ్దానికీ, గతికీ అవినాభావ సంబంధం ఉంది కనక దాన్ని గతితర్కం అని అనువదించారు. డయలెక్షిక్సు భారతీయులకు కూడా తెలుసును. మనదేశాన భూతవాదం అన్నమాటకు కొన్ని దురర్జాలు కల్పించారు మన పండితులు, అందువల్ల నేను మెటీరియలిజాన్ని భూతవాదం అనను. భూతవాదం అన్నా భౌతికవాదమన్నా ఒకటే. భూతవాదానికి మన పండితులేకాదు పశ్చిమ పండితులుకూడా దురర్జాలు కల్పించారు. భూతవాదాన్ని ఇంగ్లీషులో ఎగ్నాస్టిసిజం అంటారు. దానికి ఆజ్టేయ వాదం అని అనువదించారు పండితులు.

జ్ఞాతా అంటే తెలిసినవాడు. జ్ఞానం అంటే తెలివిడి. జ్ఞేయం అంటే తెలుసుకొనదగ్గది. అజ్జేయం అంటే తెలుసుకొనదగ్గదికాదు అని అర్ధం. అంచేత అజ్ఞేయం అంటే అజ్ఞానం అన్న అర్ధం వస్తుంది. ఆ యీకారణాలవల్ల మేటర్‌ అంటే పదార్ధం అని, మెటీరియలిజం అంటే పాదార్థిక వాదం అనీ నేను అనువదించుకుంటున్నాను. డయలెక్టికల్‌ మెటీరియలిజం బుద్ధునికి తెలుసును. ఏకతను రెండు పరస్పర విరుద్దాంశాలుగా చీల్చి ఆ విరోధాల ద్వారా ఏకతను చూడ్డమే డయలెక్టిక్సు సారం, ప్రాణం, ఆత్మ అంటాడు లెనిన్‌. అందుకని నేను డయలిక్టిక్సును అద్వయవాదం అంటాను.

బుద్దునికి అద్వయవాది అన్న బిరుదం వుంది. బుద్దుడు పాదార్థిక అద్సయవాది. రాసి గుణపరిణామ

రాంభట్ట కృష్ణమూర్తి సాంతకథ అ 171

విపరిణామ సూత్రం భారత పౌరాణికులకు తెలుసును. ఈ సూట్రానికే విష్ణవ సూత్రం అన్న పేరుంది. పురాణాల్లో భూదేవి పాపభారం పెరిగినప్పుడు విష్ణువద్దకు వెళ్లి ఈ పాపభారాన్ని భరించలేకుండా ఉన్నానని మొరపెడుతుంది. పాపరాసి ఇంకా పక్పం కాలేదు అది పక్పమయే వరకు ఓపికపట్టు అని సలహా ఇస్తాడు విష్ణువు. ప్రతిరాసికీ ప్రకృతిసిద్దమైన ఒక మితి వుంటుంది. రాసి మితిమీరినప్పుడు గుణపరిణామం వస్తుంది. ఆ పరిణామాన్నే ముందంజ అని కూడా అంటారు.

ఇంగ్లీషులో కేటగిరీ అన్న మాటకు తెలుగులో అభివర్గం అంటారు. స్వేచ్చ అవసరం అన్న అద్వయవాద అభివర్గం ఒకటి వుంది. కొంత మంది మార్క్యేయులకు ఈ అఖభివర్ల పేరు తెలుసును. కాని దాని అర్ధం, అన్వయం తెలీదు. అభివర్గాల్లో రెండేసి పదాలున్నప్పుడు దాన్ని ద్రువాభివర్గం అంటారు. ఇంగ్లీషులో పోలార్‌ కేటగిరీ. రెండు అంశాలున్నప్పుడు అందులో ఒకటి నేయం అవుతుంది. రెండవది అనుయాయ అవుతుంది. స్వేచ్చ అవసరం అన్నది (ధ్రువాభివర్గం. ఇందులో అవసరం అన్నది నేయం. స్వేచ్చ అన్నది అనుయాయి.

అవసరాన్ని సాధించడమే స్వేచ్చ అంటాడు లెనిన్‌: రియలైజేషన్‌ ఆఫ్‌ నెససిటీ ఇట్సెల్ఫ్‌ ఈజ్‌ ఫ్రీడం. జర్నలిస్టులకు స్వేచ్చ కావాలన్న నినాదం ఇప్పుడు వినవస్తూ వుండేది. ఈనాడు సమె గ్రనాయకులు సమ్మెకు ముందూ, సమ్మెలోనూ, సమ్మెతరవాత కూడా ఇదే నినాదం చేస్తూ వుండేవారు. సమ్మెనాయకులు వారి అనుయాయుల్లో ఎక్కువ మంది మార్క్సిస్టులూ, లెనినిస్టులుకూడా. వారికి స్వేచ్చ అవసరం అన్న అద్వయవాద అభివర్గం సంగతి తెలిసి వుంటుందనే అనుకోవాలి. వాళ్లలో చాలా మంది కమ్యూనిస్టు పారశాలకు వెళ్లిన వారే అనుకుంటాను.

మల్గారెడ్డికి అనువాద సహాయకుడు ఒకరోజు రాలేదు. అప్పుడు ఇండియన్‌ ఎక్స్‌'పైస్‌ పత్రికను నాదగ్గరకు తెచ్చి సంపాదకీయాన్ని అనువదించి పెట్టమన్నాడు. నేను భావానికనుగుణమయిన భాషలో అనువదించాను. అది చూసి ఇది బాగానే వుంది అని అచ్చుకిచ్చేశాడు. మర్నాడు ఆ సంపాదకీయాన్ని చూసిన రామోజీ ఆళ్ళర్యపోయాడు. అది ఎక్స్‌ప్రెస్‌ సంపాదకీయానికి తెలుగు వెర్షన్‌. అంతే ఏం కవీ ఇలా చేశావు అంటే రాంభట్ల అనువాదం చూస్తే చాలా బాగుందని అదే యిచ్చేశాను అన్నాడు. ఆ ఉదంతంవల్ల పనిలో దగ్గరదారులు వెతికే దశకు వచ్చాడని అర్థం అయింది.

ఆశ లావు పీక సన్నం. ఇది కళింగాంధ్ర సామెత. అందుకని రామోజీతో చెప్పి మ” లీడర్‌ రైటర్ని కూడా నియమించాను. అతడికి భాషా జ్ఞానం వుంది. ఇంగ్లీషు వచ్చును. పాలీటెక్టిక్‌ చదివాడు. ఒక నాడు నా డయలెక్టిక్స్‌ పాఠాలకు అతడు కూడా హాజరయ్యాడు. అతని పేరు యం.వి.ఆర్‌.శాస్తి, పొడి అక్షరాల పేరు తప్ప పూర్తి పేరు నాకు తెలియదు. మల్లకవికి పని భారం కాస్త తగ్గింది. ఈనాడు సంపాదకీయాలకు నేను ముద్దు పేర్లు పెట్టుకున్నాను.

మల్హారెడ్డి రాసే సంపాదకీయాలకు “చెత్త” అనిపేరు. “సి” అనేది దాని పొట్టిపేరు. శాస్తి రాసే సంపాదకీయానికి “మహాచెత్త” అని పేరు. దాని పొట్టిపేరు “ఎంసి”. నేనురాసే ఆదివారం సంపాదకీయానికి “పరమ చెత్త” అని పేరు, దాని పొట్టిపేరు “పిసి”. కంపోజిటర్లకు పొట్టిపేర్లు తెలుసును. వారు సి రాలేదు ఎంసీ రాలేదు అంటూ వుండేవారు. స్వాతంత్ర్యం రాకముందు వార్తాసంస్థలమీద పరాయి (ప్రభుత్వం అజమాయిషీ వుండేది, ఆనాడు రాయటరు సంస్థ అంతర్జాతీయ వార్తలందిస్తూ వుండేది. జాతీయ వార్తలకు ఒక దేశీ వార్తాసంస్థ ప్రభుత్వ ఆజమాయిషీ కిందే వుండేది.

నాడు జాతీయోద్యమం ముమ్మరంగా సాగుతూ వుండేది, ఆ ఉద్యమవార్తలను ఈ వార్తా సంస్థలు

172 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

చెవి కావు పారు కైనుత గల పత్రికలు మాత్రమే పెట్టుకునేవి. అదయినా జిల్లాకు ఒక వం 4 కరులకు అధికారులతో పరిచయాలుండేవి. ఆ పరిచయాలను వారు వరసే రణకు కాక 'పైరవీలకు ఉపయోగించుకునేవారు. అలాంటి విలేకరులను నేను చాలామంది కి జాతీయోద్యమం మీద సమ([గ్ర సమాచారం తెలిసివుండేది. మనలొ వచ్చిన తరవాత రాయటరు లాంటి విదేశీ సంస్థను మినహాయిస్తే స్వదేశీ సంస్థలన్నీ మన ప్రభుత్వం ఆజమాయిషీ కింద వుండేవి, అలాటప్పుడు రాజకీయ పరిజ్ఞానంగల సంపాదకునికీ, సంపాదకీయాలకు ప్రాముఖ్యం పోయింది. పత్రికలు దేశ ఆర్హిక వ్యవస్థ దిశగా మళ్ళాయి. స్వాతంత్ర రాకముందు మూడవేల పత్రికలు అమ ు గస క్‌ గ్రగలుగుతే చాలు. ఆదాయ వ్యయాలు రెండూ సరిపోయేవి, దాన్ని

ఇంగ్లీషులో బి.ఇ,పి అనేవారు. బిఇపి అంటే బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌, ఆదాయవ్యయాలు సమానం అని అర్హం. ఈనాడు (ప్రారంభం అయినప్పుడు తెల్లకాగితం కూడా గిట్టేది కాదు.

అలాంటప్పుడు పత్రికలో పనిచేసేవారు కూడా అడ్వర్ష్‌బైజులు వేస్తూ వుంటే ఇది కమర్షియల్‌ 'పేపరయిపోయిందనే వారు. కమ్యూనిస్టు ఉద్యమం ముమ్మరంగా వున్న రోజుల్లో యువకులు బడ్డీకొట్టు యజమాని కూడా బూర్జువా అనీ, కేపిటలిస్టు అనీ నిందించేవారు. విష్ణవభావావేశం ఎక్కువ అయినప్పుడు బడ్డీ కొట్టను ధ్వంసం చేసిన ఉదంతాలను నేనెరుగుదును. ఇప్పుడు సంపాదకుడు సంపాదకీయాలకన్నా సమాజంలోని సకల వృత్తుల సమాచారాలకు, ఆ సమాచారాన్ని సంపాదించే రిపోర్టర్లకూ ప్రాధాన్యం పెరిగింది. కొన్ని పత్రికలింకా ప్యూడల్‌ భావాలతోనే నడుస్తున్నాయి.

పత్రికారంగాన ఒకనాడు ఒకరకం వర్ష వ్యవస్థలాంటిది ఉండేది. రాయటర్‌ పంపిన వార్తలను రాసేవారు అ(గ్రజన్ములు. వార్తా సంస్థల ద్వారా వచ్చే దేశీయ వార్తలు రాసే వారు క్షత్రియుల్హాంటివారు. దేశీయ వార్తల్లోనే చిల్లర మల్లర వార్తలు రాసేవారు వైళ్యులు. తెలుగులోనే వచ్చే వార్తలకు ముఫసిల్‌ వార్తలని “పేరు. ఆ వార్తలను రాసేవారు నాల్గవ జాతిలాంటివారు. సాధారణంగా ఇంగ్లీషు సరిగారాని వారిని ముఫసిల్‌ ఎడిటరుగా వేసేవారు. ముఫసిల్‌ ఎడిటరుకు ఇంగ్రీషురాకపోయినా జిల్లాల సంగతి తెలిసి వుండాలి. విశాలాంధ్రలో ఒక పెద్ద రచయిత నాగరకర్నూలు, కర్నూలు జిల్లాలో వుందని రాశాడు.

ఇప్పటి పత్రికల్లో చాలా మార్పులు వచ్చాయి. ఎలకక్ష్రానిక్‌ మీడియం వచ్చిన తరవాత పత్రిక దెబ్బతింటుందా అన్న చర్చలు జరుగుతున్నాయి. విజ్ఞానార్జనలో పుస్తకానికి ఎంత (ప్రాముఖ్యం వుందో పత్రికకీ ఆంత ప్రాముఖ్యం వుంటుంది. ఎలకక్ష్రానిక్‌ మీడియాలు తాత్కాలికాలు. రేడియో వార్త, టీవీ వార్త మరోసారి వివరంగా తెలుసుకుందాం అంటే సాధ్యం కాదు. ఇప్పటికీ దేశాన కొన్ని లక్షల (గ్రామాలకు విద్యుత్తు లేదు. ఎలక్షిక్‌ సమాచారం అక్కడికి చేరదు. చిన్న[గ్రామాలకు తరుజన గిరిజన (ప్రాంతాలకు చేరీ సంషంగ అంటే కమ్యూనికేషను చేరే సాధనాలు పెరగలేదు.

ఒకనాడు జాతీయోద్యమం ద్విముఖంగా జరిగేది. సమాజ సంస్కరణలు, స్వాతంత్ర్య సమరం జమిలిగా సాగేవి. స్వాతంత్ర్య సమరానికి ఈ సంస్కరణలు గుదిబండల్లా వున్నాయని సమరనాయకులు అనుకున్నారు. స్వాతం(త్ర్యం వచ్చిన తరవాత చట్టాలతో సమాజ సంస్కరణలు చేయవచ్చుననుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చింది. చట్టాలు పుట్టాయి. కాని సంస్కరణలు మాత్రం జరగలేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన దేశ జనాభా ముప్పయికోట్టు స్వతంత్ర పరిపాలన జరిగిన ఈ యాభయ్యేళ్లలోనూ జనాభా మాత్రం పెరిగింది. అదిప్పుడు నూరుకోట్లకు చేరింది.

రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ అ 173

స్వతంత్రం అంటే ఏమిటి? ఈ ప్రశ్నమీద నేటివరకూ దేశాన ఉమ్మడి అభిప్రాయం పుట్టలేదు. స్వాతంత్ర్యం అంటే రామరాజ్యం అన్నారు. అవునవును ఇప్పుడు శంబూకవధలు యధేచ్చగా సాగవచ్చునని కొందరన్నారు. ప్రతీ భర్తా భార్యకు అగ్ని పరీక్ష "పెట్టవచ్చునని ఇంకొకరన్నారు. వరకట్నం ఇవ్వరాదు తీసుకొనరాదు అన్న చట్ట నిర్మాణం స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే జరిగింది. నాటి నుంచీ వరకట్న దహనాలు దినదిన ప్రవర్తమానమవుతూనే ఉన్నాయి. స్త్రీలు అర్ధరాత్రే కాదు పట్టపగలే నిర్భయంగా ఉండలేకపోతున్నారు. కమ్యూనిస్టులకు సంస్కరణలమీద నమ్మకం లేదు. కాంగ్రెసు వారికి విప్లవంమీద నమ్మకం లేదు. తృతీయ పంధీయులకు యీ రెండింటిమీదా నమ్మకంలేదు. నమ్మకం వున్నా లేకున్నా యీ దేశానున్న (ప్రతివాడూ రాజకీయజీవి. నేను కూడా అంతే. ఆర్థిక వ్యవహారం రాజకీయాల ద్వారా వ్యక్తం అవుతుందంటాడు లెనిన్‌. మనదేశాన రాజకీయాలకు నీతి అని పేరు. రాజకీయ శాస్త్రాలను నీతిశాస్త్రాలు అంటారు. బృహస్పతి శు(క్రకామందకాదుల (గ్రంథాలను వారిపేర్లతో నీతి అని పిలుస్తుంటాడు. నీతి అంటే రాజనీతి అని అర్ధం. (కౌటిల్యుడు తన రాజనీతి శాస్త్రానికి అర్ధశాస్త్రం లని పేరు పెట్టుకున్నాడు. కారల్‌ మార్క్సు తన అర్ధశా(స్తానికి రాజకీయ అర్ధశాస్త్రం అని పేరుపెట్టకున్నాడు.) ఈ కారణాలవల్ల మనిషికి ఇష్టం వున్నా లేకున్నా రాజకీయునిగా బతకక తప్పదు. వాల్మీకి ధన (ప్రాముఖ్యాన్ని చెప్పిన మహాకవి. ఆయన “ధనమార్దయకాకుత్స - ధనమూలమిదం జగత్‌. అంతరం నైవజానా మినిర్దనశ్యమృతళ్యచ” అంటే రామా డబ్బు సంపాదించవయ్యా. ఈ జగతికి ధనమే మూలం. ధనం లేనివానికీ చచ్చినవానికీ తేడా నాకు తెలీదు అంటాడు. మార్కులెనిన్‌ల సిద్దాంతం ప్రకారం శాస్త్రాలు రెండు రకాలు. ఒకటి ప్రకృతిశా(స్తాలు. వీటికి ఇంద్రియ జ్ఞానం -ఆధారం. వీటిని వాస్తవ శా(స్తాలు లేదా పాదార్థిక శాస్త్రాలు అంటారు. రెండు భావశాస్తాలు. వీటిని సామాజిక చైతన్యరూపాలు అంటారు. అవి ఐదు. రాజకీయ అర్థశాస్త్రం, చరిత్ర, సామాజికశా(స్తాలు, మతం, నీతి. పశ్చిమదేశాలన్నింటా నీతి అని ఒక ప్రత్యేక సామాజిక చైతన్య రూపం వుంది. మన దేశాన ఉన్న యీ రూపాలు మూడు మాత్రమే. వాటిని ధర్మం, అర్ధం, కామం అంటారు. వీటిని పురుషార్థాలు అని కూడా అంటారు, వాల్మీకి చెప్పినట్టు దానం సంపాదనకోసం మేధావులు బౌద్ధనిర్వాణానికి మోక్షం అని పేరు పెట్టి దాన్ని నాలుగో పురుషార్ధం చేసుకున్నారు. వాల్మీకి ఈనాలుగో పురుషార్థం ఊసెత్తలేదు. పురుషార్థాలు మూడింటిలో ఏదీ స్వతహా స్వతం(త్రంకాదు. ప్రతీ పురుషార్థం మరో దానితో కలుస్తేనే అది అమలవుతుంది. అందుకనే వాల్మీకి ధర్మార్జాలను కామార్జాలను జంటగా ప్రస్తావిస్తాడు. కామార్ధగుణ సంయుక్తం ధర్మార్ధగుణ విస్తరం సముద్ర మివరత్నాఢ్యం సర్వ(స్రుతి మనోహరం"”గా రామాయణ రచన చేస్తానంటాడు. ధర్మం ఆంటే మతం, నీతి, రీతి, దానం, స్వభావం లాంటి చాలా అర్జాలు ఉన్నాయి. ఉత్తరాది వారు ధర్మం అన్నమాటను మతం అన్న అర్హంలోనే వాడుతారు. అందువల్ల అర్హసంబంధంలేని ధర్మం ఆధర్మం. ధర్మ సంబంధంలేని అర్థం అనర్ధం అని మనం చెప్పుకొనవచ్చును. ధర్మం అంటే మతం అన్న అర్థంకూడా వుంది కనక మతానికి పునాదిరాళ్లుగా వున్న మన కులాలు కూడా అర్జ్రాధీనాలే, అంచాత కులరాగ ద్వేషాలు ఉచ్చనీచాలు వీటిలో మార్పులు రావాలంటే అవి ఉపన్యాసాలతోనూ, నినాదాలతోనూ మారవు. అవి ఆర్థిక సంస్కరణలవల్ల మాత్రమే మారుతాయి. 174 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

అయిదో దశకం తొలినాళ్లలో నేను మద్రాసు నుంచి వెలువడే సందేశం అనే కమ్యూనిస్టు కవరు పేపర్ని నిర్చహించేవాడిని, అది మద్రాసు స్టేషను పక్కనున్న రోడ్డులో అచ్చవుతూ వుండేది. దాన్ని దళిత నాయకుడు బియస్‌ మూర్తి మేనల్టుడు నిర్వహిస్తూ వుండేవాడు. నిజానికి దాని యజమాని బియస్‌మూర్తే. నేను ప్రూపులు చూడ్డానికి వెళ్లేవాడిని. సాయంత్రం పేవుమెంటుమీద కుర్చీలు వేసేవారు. మేమక్కడ కూర్చుని సాహిత్య చర్చలు, కవితా గోప్టి జరుపుతూ వుండేవారం. మీ పత్రిక ఆర్నెల్లు చదువుతే చాలు. నేను విదేశాంగమంత్రిత్వ శాఖను నిర్వహించగలుగుతాననేవాడు. తరవాత ఆయన కేంద్రమంత్రి ఆయాడు.

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మామిడికుదురని ఒక ఊరు. అది కాలవపొడుగునా మైలు దూరం వ్యాపించిన ఊరు. ఆ ఊరిలో ఆనాటికి ఆరువందల మంది దళిత [గగ్రాడ్యుయేట్సు ఉండేవారు. బియస్‌మూర్తి కవి. ఆ జిల్లావాడే. బోయిభీమన్న జర్నలిస్టు, కవి. తొలుత తాపీధర్మారావుగారు నిర్వహించే జనవాణి పత్రికలో పనిచేశారు. తరవాత ఆంధ్రప్రభలో పనిచేశాడు. తూర్పుగోదావరిలోని కోనసీమ (బ్రాహ్మణ సంస్కృతి. అక్కడే ఎక్కువమంది దళిత విద్వాంసులు తయారయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో క్షత్రియ, బ్రాహ్మణ సంస్కృతి,

నా మీజాన్‌ కొలువు నైట్‌ డ్యూటీతో మొదలయింది. ఆ రాత్రి బాపిరాజుగారి ఇంట్లోనే భోజనం చేశాను. బాపిరాజుగారి తల్లిగారు అన్నం వడ్డించారు. ఆమె వితంతువు. వికేశికూడాను. ఆమె అన్నం సెట్టనా బాబూ అన్నారు. తొలుత ఆమాట నాకు అర్ధం కాలేదు. తరవాత్తరవాత అర్హం అయింది. పశ్చిమగోదావరి జిల్లాలో అన్నం పెట్టరు. సెట్టుతారు. ఈ సంస్కృతి జిల్లా అంతటా వుందో లేదో తెలియదు. నాకు పరిచయం అయిన వారందరూ అలాగే అనేవారు. శ్రీవైష్ణవులు అన్నం పెట్టరు, సెట్టరు. అన్నం ఉంచుతారు. ఇలాగే ఆయా జిల్లాలకు కొన్ని ప్రత్యేకతలుండి వుంటాయి.

సంస్కారం, సంస్కరణ, సంస్కృతి అన్నవి ఒకే కోవకు చెందినమాటలు. రష్యాలో విష్ణవ విజయానంతరం లెనిన్‌ సాంస్కృతిక విష్టవాన్ని ప్రారంభించాడు. చైనా విసష్ణవ విజయం తరవాత మావో 'సేతుంగ్‌ చైనాలో సాంస్కృతిక విష్ణవానికి మునుముపెట్టాడు. సోవియట్‌ సాంస్కృతిక విప్లవానికీ, చైనా సాంస్కృతిక విష్ణవానికీ చాలా భేదం వుంది. సంస్కార పరంపరలనుంచి సంస్కృతి పెరుగుతుంది. మనదేశాన స్వాతంత్ర్య ఉద్యమం, సంఘసంస్కరణలు జమిలిగా నడిచేవి. అవి కొద్దిరోజులు సాగాయి. తరవాత సంస్కరణలకు సలాం కొట్టారు. మన నేతలు స్వాతంత్ర్యం వచ్చిన తరవాతనైనా ఆపని చేపట్టలేదు.

అద్వయ వాదంలో రాసి గుణ పరిణామ విపరిణామం అని ఒక న్యాయం వుంది. దీన్నే విష న్యాయం అని కూడా అంటారు. ప్రతిరాసికీ ఒక మితి ఉంటుంది. ఆ రాసి మితిమీరిన మరుక్షణం ఆ రాసి గుణంగా పరిణమిస్తుంది. ఎంగెల్సు డ్దయలెక్షిక్స్‌ ఆఫ్‌ నేచర్‌ అన్న పుస్తకంలో రసాయనశా(స్త. ఉదాహరణలు కొల్లలుగా యిచ్చాడు. రసాయనిక అణువుల్లో ఒక అణువును చేర్చినా తీసివేసినా రసాయన పదార్థంలో గుణ పరిణామం వస్తుందని అనేక ఉదాహరణలిస్తాడు. విష్ణవవాదులు రాసిని ఆసలు గుర్తించరు. అదే చిత్రం. రకరకాల సంస్కరణలు కూడా రాసి లాగే ఫలిస్తుంది.

శిశు జననం కూడా విష్ణవమే. గర్భధారణ అయిన నాటినుంచీ శిశువులో రకరకాల రాసి పేరుకుంటూ వస్తుంది. దానిమితి తొమ్మిదినెలలు నిండినప్పుడు శిశుజననం అవుతుంది. శిశుజననం విప్లవమేకద. నా చిన్నతనంలో ఎర్రగొల్లలనే వారు భాగవతం కట్టేవారు. అందులో వారు పిండోత్పత్తి క్రమం వివరించేవారు. వారం వారానికి పిండం రాసిఎలా పెరుగుతూ వస్తుందో వివరించే వారు. పిండం రాసి అలాగ పోగవుతూ

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 175

తామ్మిదినెలలకు రాసి మితిమీరినప్పుడు గుణపరిణామం శిశూాదయం అవుతుంది. మాతృగర్భం రాసి మనకు కానరాదు.

రాజకీయాల్లో ఏకాభిప్రాయం గలవారు పదుగురు అయితే అదో బృందం అవుతుంది. అలాంటి బృందాలు పెరుగుతే అదొక పార్టీ అవుతుంది. నేటి రాజకీయాలననునరించి అధికారంలోకి రావడానికి అవసరమైన మితి చాలా దూరాన వుంటుంది. ఆ మితిని మీరుతేతప్ప అధికారానికి రావడానికి అవసరమయిన గుణాత్మక పరిణామం రాదు ఈ అద్వయసూత్రం మీద దేశీయ కమ్యూనిస్టులకు మాత్రమే కాదు రష్యన్‌ కమ్యూనిస్టులకు కూడా సరి అయిన అవగాహన లేదు. డయలెక్టికల్‌ మెటీరియలిజాన్ని గురించి మున్ముందు విపులంగా (ప్రస్తావిస్తాను.

మధ్యాహ్నం (బ్రేక్‌ సమయంలో రామోజీ తన గదిలోనే ఫలాహారం చేసేవారు. తరవాత ఆయన సన్నిహితులు ఓచోట ఈ ఫలాహారానికి చేరేవారు. గజ్జలమల్లారెడ్డి ఆ బృందాన్ని చేరి మాటకచేరీ చేస్తూ వుండేవాడు. ఆ బృందానికి కాయకల్ప చికిత్స అని పేరుపెట్టారు చలసాని ప్రసాదరావు. అతడికి నేను ముద్దుగా బద్రుద్దీన్‌ అని పేరు పెట్టాను. చిన్నతనంలోనే టైఫాయిడ్‌ జ్వరం వస్తే నొటు వైద్యం చేశారు. దానితో బధిరత్వం వచ్చింది. అది వచ్చేవరకు చదువుకున్నాడు. బధిరత్వం వచ్చిన తరవాత చదువు మానేశాడు. వాళ్లనాన్న అతడిని విశాలాంధ్రలో పనిచేయించండని పెట్టాడు.

అతడికి చెవుడువుంది కాని చురుకయిన వాడు. తొలుత విశాలాంధ్ర మేనేజరు దగ్గర ఆఫీస్‌బాయిగొ పెట్టారు. కాఫీ సిగరెట్టలాంటివి తెచ్చి పెడుతూ వుండేవాడు ఒకరోజున ఏదో పనిమీద రైల్వేస్టేషనుకు పంపాడు. ఆపని చేసుకుని రాగానే ఓల్డ్‌సిటీలో వున్న "పేపరు గోడౌను కెళ్లి రెండురీల్సు బండిమీద వేయించుకుని తెమ్మన్నాడు. ఇప్పుడు ఎండమండిపోతోంది అన్నాడు బద్రుద్దీన్‌, అప్పుడు మేనేజరు ఎండవానలకు జంకక పనులు చేసేవాడే కమ్యూనిస్టు అని చెప్పాడు. అది విని నువ్వు నాకన్నా పెద్ద కమ్యూనిస్టుమి అనుభవళాలివి నువ్వెందుకు వెళ్లి తేవు? అన్నాడు.

ఆ ప్రశ్ళకు కంగుతిన్న మేనేజరు బద్రుద్దీన్‌ను ఎడిటోరియల్‌ సెక్షనుకు పంపాడు. నాపక్కనే ఒక స్టూలు వేసి అతడిని కూర్చోపెట్టాను. నేను కార్టూన్లు గీస్తూవుంటే చూసి యక్షప్రళ్ళలు వేసేవాడు. వాటికి నేను జవాబులు చెబుతూ వుండేవాడిని. నేను కాస్త ఆలోచనలో పడి పనిసాగక పోతే కాఫీకావాలా అనేవాడు. కాఫీ వద్దు టీకొవాలనేవాడిని, అతడు పరుగెత్తుకెల్లి టీతెచ్చి పెట్టేవాడు. ఈ బొమ్మలు నేను కూడా వేయగలనా అనేవాడు. కాగితమూ, పెన్సిలూ యిచ్చి బొమ్మగీయమనేవాడిని. బొమ్మల్ని గురించి అనేక ప్రశ్శలడిగేవాడు. నేను ఓపిగ్గా చెప్పేవాడిని,

కొద్దిరోజుల తరవాత వాళ్లనాన్న వరంగలులో వ్యాపారం చేయడానికి వెళ్ళాడు. ప్రసాదరావు వెళుతూ నేను ఉత్తరాలు రాస్తే సమాధానాలు ఇస్తావా అనిఅడిగాడు. ఇస్తానని చెప్పాను. అతడు వరంగలుకి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరవాత చిత్రకళమీద మనసుపుట్టింది. చిత్రకళాశాల హైదరాబాదులో వుంది. ఆ కళాశాలలో చేరి ఉత్తీర్ణుడయాడు. ఫోటోగ్రాఫీని ఆష్టనలుగా తీసుకున్నాడు. తరవాత బి.యే చదివి ఇన్ఫర్మేషను శాఖలో చేరాడు. అతడు మంచి రచయిత, కొన్ని పుస్తకాలు రాశాడు. ఈనాడులో ఒక ఫీచరును రాస్తున్నాడు. చతుర, విపుల ఎడిటరు.

తలా 176 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

జర్చలిన్టు రిటైర్మెంటు వయను అరవై ఏళ్లు. నేనివ్రుడు ఎడ్మిన్యిస్టేటివ్‌ ఎడీటర్డై. నీబ్బందిలో ఎవరినయినా ర్నిఖైరు చేయించాలంటే వారికి ఆదర్భప్రాయంగా వుండాలని ఇవ్చుడు నేను ర్విటైరవుతున్హానన్హాను. నేను ఈనాడులో పనిచేన్తున్సందుకు కన్సైర్రగల వాడు ఇంటా బైటా చాలామంది వున్హారు. నేను ఈనాడు నుంచి ర్నిటైరయ్యానన్సు వార్త విని అందరూ హోయిగా నిద్రించి వుంటారు. నమా ఇకీమూాా రిబైర్బెంటు మల్చాడ్డి మాట కచేరీలో ఎలాంటి చర్చలు వస్తూ వుండేవో నాకు తెలియదు కాని ఒకనాడు అక్కడి నుంచి నేరుగా నా దగ్గరకు వచ్చాడు. ఈనాడు సంపాదకుడిని నేను కాని నువ్వుకాదు. నేను సంపాదకీయాలు రాస్తున్నాను. నువ్విక్కడ పనిచేసేవాళ్లను డిష్టర్స్‌ చేయడం తప్ప మరేమీ చేయడంలేదన్నాడు. రామోజీ నిన్ను డిస్మిస్‌ చేద్దామని కూడా అనుకుంటున్నాడు అని ఉచ్చైస్వ్తరంతో ఉపన్యాసం మొదలుపెట్టాడు. అప్పటికి నా ఓరిమి నశించింది. ఓకాలిబూటు విప్పి టేబిలుమీద పెట్టాను. మరొక్క మాట నీ నోటి వెంట వస్తే ఇది నీ దవడకెక్కుతుంది అన్నాను. చుట్టూ వున్నవారు మామాటలను విస్తుపోయి వింటున్నారు. నేను ఈనాడులో ఉండడం చాలా మందికి కన్నెర్రగా వుందని నాకు తెలుసును, మల్లారెడ్డి మాట కచేరీల్లో అలాంటి చర్చలు చాలా జరిగి వుంటాయి. మల్గారెడ్డిని నేను కవీ అని పిలుస్తాను. కన్నెర్రగలవారిలో కవి కూడా వున్నాడని నాకు తెలుసును. నేను సమస్యల పరిష్కారానికి పోరాడుతాను కాని నాకోసం ఎన్నడూ పోరాడలేదు. ఎడ్మిని్టేటివ్‌ ఎడిటరు పదవి వచ్చినప్పుడు జర్నలిస్టు విధి నిషేధాలను వివరించే పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకం ప్రకారం జర్నలిస్ప రిట్ర్మైంటుకు ఆరవై ఏళ్లు మితి అని వుంది. నాకు అరవై యేళ్లు వచ్చాయి. నేను రిటైరుకావచ్చును. అందుకని నేను రిటైరవుతున్నానని ప్రకటించాను. రామోజీకి ఆ సంగతి తెలిసి నీకూ, నాకూ ఒకసారే రిటైర్మెంటు అన్నాడు. అప్పటికి నవ్వి ఊరుకున్నాను. సబెడిటర్లంతా నాకు వీడ్కోలు చెప్పడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ వీడ్కోలు సభకు రామోబీని పిలిచారు, ఆయన వచ్చారు. అంతమంది ముందూ నావల్ల ఏమయినా తప్పుజరిగిందా అని ప్రళ్నించాడు. నీకూ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 177

నాకూ రిటైర్మెంటు ఒకసారే అన్నమాటను ఆ సమావేశంలో కూడా అన్నాడు. కవి తనవల్లనే నేను రిటైరవుతున్నానని ఊహించగలిగాడు. మేమిద్దరం కొట్లాడుకుంటూ వుంటాం. మళ్లీ కలుస్తాం అన్నాడు. నా రిట్ర్మైంటుకు ఎవరూ కారణంకాదు. జర్నలిస్టుకు రిటైర్మెంటు వయసు అరవై ఏళ్లు. నేనిప్పుడు ఎడ్మిని'్టేటివ్‌ ఎడిటర్ని. సిబ్బందిలో ఎవరినయినా రిట్టైరు చేయించాలంటే వారికి ఆదర్శప్రాయంగా వుండాలని ఇప్పుడు నేను రిటైరవుతున్నానన్నాను. నేను ఈనాడులో పనిచేస్తున్నందుకు కన్నెర్రగల వారు ఇంటా బైటా చాలా మంది వున్నారు. నేను ఈనాడు నుంచి రిటైరయ్యానన్న వార్త విని అందరూ హాయిగా నిద్రించి వుంటారు. విశాలాంధ్రనుంచి నేను రిజైను చేశాను. ఆ పత్రికాధిపతులు నా రిజిగ్నేషను ఉపసంహరింపచేయడానికి రెండునెలలు యత్నించారు. ఇక్కడ రిజైను చేయలేదు. రిటైరయ్యాను అంతే. అధికారికంగా రిటైరయినా ఆదివారం సంపాదకీయాలు రాస్తూ ఉన్నాను. నేను మాస్కో నుంచి రాగానే మా అన్నగారు ఫ్యాక్టరీ స్థలం, షెడ్డు నా పేర రాశారు. ఫ్యాక్టరీలో లేతులు ఇతర పరికరాలను ఆయన తీసుకున్నాడు. ఫ్యాక్టరీ పేరున ఉన్న టెలిఫోన్ను నేనింటికి తెచ్చుకున్నాను. ఇప్పుడా ఫోన్ను ఆయన తీసుకొనిపోయారు. ఫోను తీసుకుపోతే నాకభ్యంతరం ఉండేదికాదు. రామోజీకి ఫోనుచేసి నీ ఫ్రెండుకు కావాలంటే ఫోను తెప్పించుకొమ శని ఫోను చేశాడు. మా అన్నగారి ఫోనువార్త విని రామోజీ విస్తుపోయాడు. అదివరకే నేను ఫోనుకోసం దరఖాస్తు చేసి వున్నాను. ఇప్పుడు జర్నలిస్టు కోటాలో ఇమ్మన్నాను.

ఈ లేఖలు రామోజీ చేతిమీదుగానే నడిచాయి. ఆ దరఖాస్తుల్లో నా హోదా ఎడ్మినిఫ్రేటివు ఎడిటరు అని వుండేది. 'ప్రభుత్వశాఖల గుమాస్తాలకు తమవద్దనున్న అప్లికేషనుమీద సంతకం పెట్టి పంపేయడం అలవాటు. అలాంటి గుమస్తాలను ఉర్జూలో నకల్‌నవీస్‌లనే వారు. వారిని గురించిన ఒక సామెత కూడా వుంది. అది నకల్‌నవీస్‌కొ అఖిల్‌ నదారద్‌ అని. అంటే సంతకాలు పెట్టి పైకి పంపించే గుమస్తాలకు తెలివి తేటలుండవని అర్ధం. జర్నలిస్టు ఎక్రెడిటేషను ఇన్ఫర్మేషను శాఖనుంచి తెస్తే జర్నలిస్టు కోటాలో సేరువేసి ఫోనుయిచ్చే సంగతి ఆలోచిస్తాం అని జవాబు వచ్చింది. అప్పుడు రామోజీ ఘాటయిన లేఖ రాశాడు.

నా ఎడిటరును నియమించుకునే అధికారం నాదా, సమాచార శాఖవారిదా? అని 'ప్రళ్నించాడు. అంతే. వెంటనే నాకు ఫోను వచ్చింది. నాటి నుంచి నేటి వరకు ఫోనుబిల్లుల మీద “రాంభట్ల కృష్ణమూర్తి ఎడిటరు ఈనాడు” అని వుంటుంది. నా నెంబరు ఫోను బుక్కులో ఉండదు. అదివరకు స్కూలు పలితాలు విడుదల చేసినప్పుడు ఎన్నికల ఫలితాలప్పుడు నాయింటికి ట్రంకుకాల్సు వచ్చేవి. పత్రికలకు అందిన వార్తలన్నీ ఎడిటరునడిగితే తెలుస్తాయి అని జనం నమ సకం. చీఫ్‌ ఎడిటరుగా వున్న రామోజీ పర్సనల్‌ ఫోన్‌ నెంబరుకూడొ లిస్టులో వుండదు. అలాగే నా ఫోను నెంబరుకూడా లిస్కలో కానరాదు.

నా పుట్టిన రోజు ఇల్లాలికి తెలియదు. పిల్లలకు తెలియదు, నేను మాస్కోకు వెళ్లినప్పుడు ఆనవాయితీగొ రామోజీ పుట్టినరోజు శుభాకాంక్షల కార్డు పంపించాడు. ఆ కార్డువల్ల నా పుట్టినరోజు పిలలకు తెలిసింది. అంచాత నాకు షష్టిపూర్తి చేయాలని నిశ్చయించారు. షష్టిపూర్తి అట్టహాసాలు నాకిష్టంలేదు. అందరం ఫోటో తీయించుకుందాం అది చాలునన్నాను. మా అన్నగారి అల్టుడు ఓ పైజామా, ఒక లాల్చీ తెచ్చియిచ్చాడు. అన్నగారి అల్టుడూ, అమ్మాయి మాతోనే ఫోటో స్టూడియోకి వచ్చారు. చాలామంది పషష్టిపూర్తిని ఓ పెళ్లిలా అట్టహాసంగా జరుపుకుంటారు. ఆనాడు పెళ్లి చేసుకున్నట్లు నటన కూడా చేస్తారు.

అసలు మన పంచాంగాలు (ప్రభవాది సంవత్సరాలు మనవికాదనిపిస్తుంది. చరిత్రకు తెలిసిన తొలి కాలగణకులు సుమేరులనిపిస్తుంది. కాలగణనంలో షష్ట్య్రంశమానం విరివిగా కనిపిస్తుంది. ఈ షస్ట్య్రంశమాన్ని

న 1786ల రాంభట్ల కృష్ణమూర్తి సొాంతకధ

వాడినవారు సుమేరులు, ఆ మానం (ప్రకారం మన (ప్రభవాది సంవత్సరాలు అరవయ్యే. అవే తిరిగి తిరిగి వస్తూ వుంటాయి. వాటి (ప్రకారం పుట్టినరోజు మళ్లీ అరవైయేళ్లకు అదే సంవత్సరం, నెల, తిధి తిరిగి వస్తాయి. దాన్ని షష్టిపూర్తి అంటారు. ఒకప్పుడు సగటు ఇరవై ఏడేళ్లు, ఆ కాలాన మనిషికి అదే ఏడు, నెల, తిధి తిరిగి రావడం అరుదుకదా? నాడు పుట్టిన పండుగ షష్టిపూర్తి, ఇప్పుడు మనిషి సగటు వయసు అరవై సంవత్సరాలకు పెరిగింది. అయినప్పుడు నేడు షష్టిపూర్తి పండుగ సామాన్యం అయిపోయింది. అదీకాక ఈ పండుగను ఆలుమగలిద్దరూ కలిసి చేయించుకుంటారు. ఇందులో మగనికి మాత్రమే అరవైయేళ్లు వచ్చాయి. కొందరు దంపతులు మల్లీ పెళ్లినాటి ముచ్చట్టన్నీ తీర్చుకుంటారు. ఇది అర్ధంలేని ఆర్భాటం అని నేను అనుకుంటాను. షష్టిపూర్తికి బదులు యాభయియేళ్ల వైవాహిక దినోత్సవాన్ని చేసుకంటే అర్ధవంతంగా వుంటుందని నేననుకుంటాను. అప్పుడు మళ్లీ పెళ్లి ఉత్సవం జరిపించుకొనడం చాలా అర్ధవంతంగా కనిపిస్తుంది అని నేనంటాను. నాకు పెళ్లికాకముందునుంచీ, నేను కమ్యూనిస్టు తరహా దండల పెళ్లిళ్లకు ఆచార్యత్వం వహిస్తూ వచ్చాను. కమ్యూనిస్ట్ర వర్గాల్లో ఈ సంగతి అందరికీ తెలుసును. నరసీపట్నం తాలూకా కమ్యూనిస్టు సభను ఏర్పాటుచేశారు. ఆ సభకు ర్యాష్ట్ర కమిటీ కార్యదర్శినీ, నన్నూ ఆహ్వానించారు. నాటి రాష్ట్ర కమిటీ కార్యదర్శి నల్లమల గిరి ప్రసాదరావు. ఆ సభాసందర్భంలో నరసీపట్నం తాలూకా నాయకుని కుమారుని పెళ్లి అందుకని గిరిప్రసాదుగారితో నేను కూడా బయలుదేరాను. పెళ్లి అయిన తరవాత చింతపల్లి గిరిజన గ్రామానికి వెళ్లాం. అది అడవిలో ఎత్తయిన ప్రదేశాన కట్టుకున్న (గ్రామం. దారి పొడవునా ఆనప పొదులు కనిపించాయి. అవి చేదు ఆనపపాదులు. నాగస్వరాలకు ఉపయోగించే కాయలవి. బహుశా ఆకాయలు అమ్మకానికే కాని వాడకానికి అయి వుండదనిపించింది. వాడకానికైతే గుండుకాయలు పనికివస్తాయి. ఆకాయల్లో నీళ్లు నింపుకుంటారు. చింతపల్లిలో గిరిజనులు కాఫీ తోటలు నాటి ఆ తోటల్లో పనిచేస్తారు. నేను వెళ్లగానే ఒక గిరిజనుని దగ్గర కొన్ని మాటలు నేర్చుకున్నాను. అక్కడి పండుగలు ఉత్సవాలను గురించి నేర్చుకున్నాను. వాళ్ల గురువును గొరిగాడు అంటారు. ఏంత్రోపాలజిస్టులితడిని మెడిసిన్‌ మెన్‌ అంటారు. మరొకని పేరు చుక్కమూర్తగాడు అంటారు. ప్రతీ పని ప్రారంభానికి అతడి సలహా వారికి కావాలి. అతడి సలహాలేనిదే ఏ పనీ చేయరు. నర్సీపట్నం నుంచి అనకాపల్లి వచ్చాను. అనకాపల్లిలో బంధువులున్నారు. వారిని నా చిన్ననాడు చూళాను. అందులో ఇప్పుడెందరు సజీవులై వున్నారో తెలీదు. అక్కడ కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుకు వెళ్లాను. నేను మాస్కోలో వుండగా నా రూంయేటు అయిన కోడుగంటి గోవిందరావు కనిపించాడు. రైతుసంఘనాయకుడు వైవి కృష్ణారావుగారు కనిపించారు. ఆ సమయాన రైతులు సహాయనిరాకరణోద్యమాన్ని నిర్వహిస్తున్నారు అంతకుముందు విశాఖలో కార్మికమహాసభ జరిగింది. ఆ మహాసభ కోసం ఒక పాట రాళాను, అది చూసి మా రైతులమీద పొట ఎందుకు రాయవు అని అడిగారు కార్మిక సమస్యలను గురించి కాస్త తెలుసును. నేను కార్మికునిగా కూడా పనిచేశాను, రైతు సమస్యలు అసలు తెలీదు. తెలియని వర్గంమీద పాట ఎలా రాయాలి అన్నాను. రేపు రాత్రి రైతుల బహిరంగ సభ వుంది దానికిరా తెలుస్తుంది అన్నాడు. సరేనన్నాను. కొందరు బంధువుల ఇళ్లకు వెళ్లి చూశాను. అనకాపల్లిలో ఒక హోటల్లో రూం చూసి పెట్టాడు మా తమ్ముడు. అంటే మా మేనమామగారి చిన్న అల్లుడు. ఆయన ఇన్‌కంటాక్స్‌ శాఖ ఆఫీసులో పనిచేస్తున్నాడు. అతడికి నలుగురమ్మాయిలు, ఇంటికి వెళ్లి పిల్లల్నీ మరదలుని రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ అ 179

చూశాను. అక్కడ భోజనం చేశాను. మరునాడు రాత్రి రైతుల సమావేశానికి వెళ్లాను. నేతల (ప్రసం గాలు విన్నాను.

ఆ ప్రసంగాలన్నీ విన్న తరువాత పల్లవి వచ్చింది. విశాఖపట్టంలో రామోజీ డాల్ఫిన్సు అనే హోటలు నిర్మించాడు. ఆ హోటలు ప్రారంభోత్సవానికి నేను వెళ్లలేదు. నా నర్సీపట్నం ప్రయాణం సంగతి ఆయనకు తెలుసును. డాల్ఫిన్సు హోటల్లో మూడురోజులు నా అతిధిగా అక్కడ ఉండు అన్నాడు. సరేనన్నాను. అనకాపల్లి నుంచి విశాఖకు బయలుదేరాను. రైలుదిగి తిన్నగా డాల్ఫిన్సుకు వెళ్ళాను. మేనేజరు నాకు చిరపరిచితుడు. హోటల్‌ బాయ్‌ నన్ను ఓ డబుల్‌ గదికి తీసుకెళ్ళాడు. వెంటనే సర్వరు వచ్చి ఏం కావాలి అని అడిగాడు. టీ కొవాలన్నాను. భోజనానంతరం కాస్త విశ్రాంతి. తరవాత కిందకి దిగి ఈనాడు ఆఫీసుకు వెళ్లాను.

నేను డాల్ఫిన్సులో వున్నట్టు కొంతమంది మిత్రులకు తెలిసిపోయింది. నున్ను చూడ్డానికి ఆ మిత్రులు వస్తూ వుండేవారు. నేను తొలి బృందం (ట్రెయినీలను విశాఖకు తీసుకుని వెళ్లాను. నాడు ఆఫీసు ఎలా వుందో నేడు కూడా అలాగే వుంది. మిత్రులు నాకు రేడియో ప్రసంగం ఏర్పాటు చేశారు. ఒకనాటి మధ్యాహ్నం కారా మేస్టారు వచ్చారు. నాకు కొంట్రడిక్షన్సు గురించి చెబుతారా అని అడిగారు. మావో ఆన్‌ కాంట్రడిక్షన్‌ అన్న పుస్తకం రాశాడు. అది నేను చదవలేదని ఆయనకు చెప్పాను. తరవాత ఇద్దరం సాహిత్యాన్ని గురించి ముచ్చటించుకున్నాం. తిరుగు ప్రయాణంలో బెజవాడలో దిగాను. ఆక్కడొకరోజు ఉన్నాను.

రైతులమీద నేను రాసిన పాట విశాలాంధ్రకు యిచ్చాను. దాన్ని వెంటనే కంపోజింగుకిచ్చేశారు. విజయవాడనుంచి హైదరాబాదు ఇంటికి వచ్చాను. విశాలాంద్రకు రాజీనామా యిచ్చి తిరిగివచ్చినప్పుడు మా అన్నగారి కుటుంబమూ నాకుటుంబమూ కలిసే వుండేది. అన్నగారి ఫ్యాక్టరీలో నేను పనిచేస్తూ వుండేవాడిని. అసలు నేను రషా నుంచి తిరిగి వచ్చినప్పుడు ఫ్యాక్టరీ స్థలం షెడ్డూ నాపేరరాసి లేతులు ఇతర టూల్సును ఆయన తీసుకున్నాడు. ఆ ఒప్పందం అయిన తరవాత ఫ్యాక్టరీలో ముగ్గురు నల్గురు కిరాయిదార్లు చేరారు. అది నేను వాడుకోలేదు. అదంతా నాపేర బ్యాంకులో జమ అయేది. అలా వచ్చిన కిరాయి డెబ్బయి ఎనభైవేలకు చేరింది. మా అన్నగారికి నలుగురు ఆడపిల్లలు, ఆయన స్థాపించిన సంస్థలోనే నేను పార్‌ట్నరుగాను డైరెక్టరుగానూ వుండేవాడిని. ఈపదవులన్నీ బినామీవి. ఆ సంగతి నాకు తెలుసును. ఆయనింకా కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభిద్దామనుకున్నారు. ఆ దళలో నేను ఈనాడులో చేరాను. దాంతో ఈ బినామీ ఆదాయం ఆగిపోయింది. నేను ఈనాడులో ఉన్నప్పుడే నాపేర ఒక కారు తీసుకుంటానన్నాడు. నా దగ్గర నుంచి పదివేలు తీసుకున్నాడు, అన్నగారి కూతుళ్లపెళ్లిళ్సు అయ్యాయి. నా కూతురు పెళ్లికావాలి.

తెలుగునాట బ్రాహ్మణుల్లో దాదావు యాభ్జై శాఖలున్నాయి. ఏశాఖ వారు ఆ శాఖలోనే సంబంధబాంధవ్యాలు పెట్టుకుంటారు. (బ్రాహ్మణుల్లో ప్రధానళాఖలు రెండు. అవి నియోగి, వైదీకి అనేవి.

వైదీకుల్లోను, నియోగుల్లోనూ శ్రైన వైష్ణవ మాధ్వమతాలనుంచి ఇంకా శాఖలు పెరుగుతూ వున్నాయి. ఈ మూడు మతాల్లో ఏదీలేనివారిని స్మార్తులు అంటారు. ఈ శాఖల వారిది ప్రత్యేక కుల మనస్తత్వం. అందువల్ల వీరిని శాఖలు అనడానికి బదులు కులాలు అనడం సబబు. సంబంధ బాంధవ్యాలకు ముందుచూసేది శాఖలని. తరువాత వర్షం పరిగణనకు వస్తుంది. పెళ్లికి ఈ పద్మవ్యూహం నుంచి బైటపడాలి.

180 అ రాంభట్ట కృష్ణమూర్తి సొంతకధ

హం స్‌ో ఏల క్ష ట్య కులాలవారీగా చూస్తే బ్రావ్మాణులు మైనారిటీవారు. మైనారిటీలు భ(ద్రతకోనం ఐకమత్యాన్చి పెంచుకుంటారు. మైనారిటీలు అయినవ్పటికీ బ్రాహ్మణుల్లో ఆ లక్షణం కానరాదు. రాజకీయ పరిభాషలో చెవ్చుకోవాలంటే ఇద్దరు బ్రాహ్మణులుంటే మూడు పార్టీలు వుడతాయి. బ్రాన్మాణ మనస్తత్వాన్ని ఎరిగిన నంన్కృత కవి ఒక ళ్లోకం రాశాడు. బ్రావ్మాణులు, పాములు, ఏనుగుల అనేకత, అతినిద్రత, మందబుద్ధివల్ల లోకం భదంగా వుందన్చుది ఆ శ్లోకం అర్థం. తా కపపకాణడపికూా అరుణ పెళ్ళ

రౌజరికాల కాలంలో నియోగులు రాజోద్యోగులుగా వుండేవారు. వారికి లోకజ్ఞానం మెండు. సాధారణంగా వీరు పట్నవాసులై వుంటారు. ప్రభుత్యోద్యోగాలకు తగిన చదువులు చదువుతారు. వైదికులకు రాజులు అ(గ్రహారాలు, మాన్యాలూ, భోజ్యాలు, ఖండ్రికలు ఇవ్వడంవల్ల వీరు పల్లెలను అంటిపెట్టుకుని వుంటారు. వీరి చదువు స్వాధ్యాయం కాని, తర్కవ్యాకరణ మీమాంసాదులు కాని, సంస్కృత కావ్య నాటకాలంకారాలు కాని అయివుండేది. ఈ చదువులు ప్రభుత్యోద్యోగాలకు పనికి రావు. వీరి ఆవాసం పల్లెలు కనక వీరికి లౌకిక జ్ఞానం తక్కువ వుంటుంది. నియోగులకది ఎక్కువ. వారిని లౌక్యులని కూడా అంటారు.

ఈ దేశాన కులమతాలను జమిలగా కట్టి మాట్లాడుతూ వుంటారు. ఇక్కడ ప్రతీకులమూ ఒక మతం లాంటిది. అందరూ (బ్రాహ్మణులే అయినా నియోగి, వైదీకులు కలవరు. అలాగే మాలలూ, మాదిగలు కలవరు. ఈ దేశాన కులం మొక్క ఎప్పుడు వేళ్లూనిందో తెలియదు కాని ఆందరూ కులం నిర్మూలం కావాలని నినాదాలు చేస్తూ వుంటారు. మంత్రాలకు చింతకాయలు రాలవు, నినాదాలకు కులాలు తూలవు. కుల వటవృక్షానికి ఎనిమిది లక్షల సంవత్సరాల నుంచీ ఊడలు దిగుతూనే వస్తున్నాయి.

కమ్యూనిస్టు విద్యార్థి యువజన రంగాల్లో మా అమ్మాయి అరుణ పని చేసింది. తూర్పు యూరపు దేశాలు తిరిగి వచ్చింది. ఢిల్లీ కమ్యూనిస్టు పార్టీ నాయకులందరితో పరిచయం వుంది. నేను కులాలను లెక్కించను. చదువు సంస్కారాలను చూస్తాను. అంతే, అందుకని కొందరు యువకమ్యూనిస్టులు ఆమెను పెల్తిచేసుకుంటామని వచ్చారు. అందులో ఒకడు నువ్వు చదువుకున్నావు. నువ్వు ఉద్యోగం చేసి కుటుంబ

యలు రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 181

బాధ్యత వహిస్తే నేను పార్టీలో పనిచేస్తానన్నాడు. నువ్వే ఉద్యోగం చేస్తే పార్టీలో నేను పూర్తి కాలం పనిచేస్తానంది అరుణ. పార్టీలో చదువుకున్న మహిళల్లేని లోటు తీరుస్తానంది.

ఈ మాటలు వినగానే పెళ్ళాడుతామని వచ్చిన వారంతా చల్లగా జారుకున్నారు. నేను కమ్యూనిస్టును శాస్త్రీయంగా చేసే పెళ్లిళ్లు నాకు నచ్చవు అని మా బంధువుల్లో ప్రచారం జరిగింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న స్వకుల యువకుడొకడు పెళ్లికి ఇండియావచ్చాడు. అతడు అమ్మాయి పోస్టుగ్రాడ్యుయేట్‌ అయివుండాలి అన్నాడు. మా కులంలో స్త్రీ విద్యను ప్రోత్సహించరు. ఎక్కువమంది కన్యలకు ఎనిమిదేళ్లు రాకముందే పెళ్లిళ్లు చేసేస్తారు. అతడి తలిదండ్రులకు మా అమ్మాయి సంగతి తెలిసింది. ఆమెను చూడ్డానికి వచ్చాడు. అతనివెంట మేనమామలున్నారు. అతడి ప్రశ్నలకు అమ్మాయే జవాబిచ్చింది.

అంతకుముందు పెళ్లిచూపులకు వెళితే అబ్బాయి వేసిన ప్రశ్చలకు అమ్మాయికి బదులు ఆమె తండ్రి జవాబులిస్తూ వచ్చారు. ఇక్కడ అమ్మాయే స్వయంగా జవాబు చెప్పడం ఆయనకు నచ్చింది. ఒకప్పుడు వారికి భూవసతులు ఉండేవి. ఇప్పుడులేవు, ఆయితే అతడి మేనమామలకు భూవసతులున్నాయి. అందుకని పెళ్లిమాటల్లో పెద్దరికం మేనమామలది అయింది. అబ్బాయికి అమ్మాయి నచ్చింది. మా అరుణకు అమెరికొ వెళ్లడం ఇష్టంలేదు. వాళ్ళమ్మ అవుగాములను విడమరచి చెప్పడంవల్ల ఈ పెళ్లికి ఒప్పుకుంది. అబ్బాయికి ఉపనయనం కాలేదు. ఏడేళ్లనుంచీ అమెరికాలో వుంటున్నాడు.

మా శాఖను ఇక్కడ కోనసీమ దద్రావిడులంటారు. విశాఖలో పెద్ద (ద్రావిడులంటారు. కోనసీమలో లేరు కాని విశాఖజిల్లాలో చిన్న (ద్రావిళ్లు కూడా వున్నారు. వారిని దిమిలి ద్రావిడులంటారు. ఆ శాఖలో ప్రముఖులు బ్రిటిషు ఏలుబడిలోనే వ్యవసాయశాఖ డైరెక్టరుగా పనిచేసిన బి.వి.నాథ్‌, శ్రీశ్రీ, ఆరుద్ర వగయిరా. పెద్ద 'ద్రావిళ్లలో ప్రముఖులు మహామహోపాధ్యాయ తాతాసుబ్బరాయశా'స్త్రి, హరికధా పితామహ అజ్జాడ, ఆదిభట్ల నారాయణదాసు వగైరా. నిరతాన్నదాతలయిన సరిపెల్ల నారాయణదొర, డొక్కా సీతమ్మకూడా ఈ శాఖకు చెందినవారే. మా అగ్రహారికులు కన్యాశుల్కంలో అగ్జిహోత్రావధానుల్హాటివారు.

(బ్రాహ్మాణ వివాహాల్దోకూడా వేదమంత్రాలు తక్కువ, వేడుకలెక్కువ వుంటాయి. వేడుకల్లో డిక్టేటర్లలా వ్యవహరిస్తారు మగపెళ్లివారు. మా అన్నగారి పెద్దమ్మాయి పెళ్లికి ముహూర్తం ఆదివారం ఉదయం పదిన్నరకు పెట్టించమన్నాడు వరుడు. చిక్కడవల్లిలో తాడేపల్లి నుబ్బయ్యశా(స్తిగారని ముహూర్త శా(న్త్రం (గ్రహళశాంతులెరిగిన పండితుడున్నాడు. ఆయన నాకు చాలాకాలం నుంచీ పరిచయం. ఆయన దగ్గరకెళ్లి నా సమస్య చెప్పాను, అయితే మూడురోజుల తరవాత రా అన్నాడు. మూడురోజుల తరవాత వెళ్లాను. మీ కోనసీమ వాళ్లు కాకి దంతాలు లెక్కిస్తారయ్యా, వారికి జవాబుగా ఈ శ్లోకాలు అని ఒక లిస్టు యిచ్చాడు.

ఈసారి కూడా ఆయన దగ్గరకే వెళ్లాను. ఆయన కృష్ణమూర్తీ నీకూతురి పెళ్లికి నాకు నచ్చిన ముహూర్తం పెడతాను అన్నాడు. హాలు పెద్దది కావాలి మావాళ్లు చాలా మంది వస్తారన్నారు మగపెళ్లివారు. ఎంత తిరిగినా హాల్ప్సు దొరకలేదు. చిక్కడపల్లిలో మా శాఖవారి హాలు ఒకరోజుకు దొరికింది కాని వరుని తరుపువారు రెండు రోజులు కావాలన్నారు. కొసకు రెండోరోజు కూడా దొరికింది. ముహూర్తం ఉదయం పదింటికి పెట్టాడు. అది భోజన ముహూర్తం. మా వారికన్న మీ వారెవరూ ముందు భోజనం చేయడానికి వీలులేదు అని షరతు పెట్టారు. పక్కనే ఒక హోటలుంది. ఆ హోటెల్లో నా మిత్రులకు భోజనాలేర్పాటు

చేస్తానన్నాను. రెండుచోట్ల భోజనాలు పనికిరావు అన్నారు. శుభలేఖలను పెద్దవారి పేరుతో రాయడం ఆనవాయితీ. 182 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

అదే ఆనవాయితీ ప్రకారం మా అన్నగారు వాదినగార్ల పేర శుభలేఖలు అచ్చువేయించాను. మొగపెళ్లివారి షరతులవల్ల బంధువులకు తప్ప మి(త్రులకు శుభలేఖలు యివ్వలేదు. పెల్లి హాల్లోనే రిజ్మిష్ట్రారు కోసం ఒక కుర్చీ టేబిలు ఏర్పాటు చేశాం. రిజిస్ట్రారు పదకొండింటికి వచ్చాడు. పెళ్లి రిజిస్టరు అయిపోయింది. అది చిన్న హాలు. పైగా ఆ హాలుకు వచ్చే దారి కాస్త ఇరుకు, రోడ్డుమీద రద్దీ ఎక్కువ అయింది. ఆ జనంలోంచి ఈదుకు రాలేకపోయారు కొందరు. అలా రాలేనివారు నా కూతురి పెళ్లి అని తెలిసి కష్టపడి వచ్చారు. అంతే.

హాల్లో ఎక్కువమంది (స్త్రీలు, రామోజీరావు దంపతులు వచ్చారు. రమాదేవిగారు మహిళల మధ్య నుంచి వేదిక వరకూ వచ్చి అక్షతలు వేసి వెళ్లారని ఎవరో చెప్పగా విన్నాను. రామోజీరావుగారు హాలుకు ఎదురుగా ఉన్న గోడకు ఆనుకొని నిలుచున్నారు. మొగపెళ్లివారిలో ఒకరికి రాజకీయాలమీద ఆసక్తి వుంది. ఆయన రామోజీరావుగారిని లోనికి వచ్చి కుర్చీమీద కూర్చోండని ఆహ్వానించాడు. దానికి ఆయన మేం ఆడపెళ్లివారం ఇక్కడే నిలబడి వుంటాం అని సమాధానం ఇచ్చారు. ఓ కుర్రవాడు నాకీ డైలాగులు చెప్పాడు. అప్పుడు నేను హాలు బైటకు వెళ్లి ఆయన్ను చూశాను. మార్గదర్శి చీఫ్‌ కృష్ణమూర్తి కూడా పెల్లికి వచ్చాడు.

ఆయన కారు ట్రాఫిక్‌ జాంలో చిక్కుకుంది. ఆయన ఒక సూట్‌కేసు బహుమతిగా తెచ్చాడు. ఆయన కారులోనే కూర్చుని (డ్రైవరు చేత బహుమతి పంపాడు. ఆ సంగతి తెలుసుకొని నేను జనవాహిని ఈదుకుంటూ వెళ్లి ఆయన్ను కలుసుకున్నాను. ఈనాడు నుంచి ఫోటో (గ్రాఫరు కేశవులు వచ్చి ఫోటోలు తీశాడు. నేను ధోవతి కట్టి కండువా కప్పుకున్నాను. కండువా తాలగించి జందెంలో వున్న నన్ను ఫోటో తీయమన్నాను. ఇలాంటి దృళ్యం మళ్లీ కనిపించదు అన్నాను. కేశవులు ఫోటో తీశాడు. వాటితో ఆల్బంలు చేసి యిచ్చాడు. ఒకటి మాకు, మరొకటి మొగ పెళ్లివారికి. ఆనాడు వీడియోకి వ్యవధానం లేదు.

పెళ్లి నిశ్చయం అయిన తరవాత అన్నగారిని డబ్బు అడిగాను. డబ్బెక్కడుంది? నీ పేరుతోనే కారు కొనేశాను కదా అన్నాడు. పెళ్లి కుదిరిందని తెలిసి ఆయన ఫోను తీసేసుకున్నాడు. అప్పుడు మరో ఫోనుదగ్గరకు వెళ్లి పెళ్లి నిశ్చయమయిన సంగతి రామోజీకి చెప్పాను. మా అన్నగారి సంగతి ఆయనకు అదివరకే తెలుసును. రామోజీతో కొంత డబ్బుకావాలని అడిగొను. ఎంత అన్నాడాయన. పదివేలు చాలును అన్నాను. నువ్వు వస్తావా నన్ను పంపించమంటావా అని అడిగాడు, నేనే వస్తాను అన్నాను. వెళ్లి తెచ్చుకున్నాను. ఆ డబ్బుతోనే పెళ్లివెచ్చాలకు మునుము పెట్టాను. అన్నగారు పెళ్లిలో ఒకసారి ముఖం చూపించి వెళ్లిపోయారు. అది ఆయన తత్వం,

పెళ్లిలో తమకు సరియైన మర్యాదలు జరగలేదని మా వదినగారు తోటికోడలు దగ్గరన్నారు. పెళ్లి పెద్దలు వారే. అతిధిమర్యాదలు నిర్వహించినవారు వారేకద. ఏం చేస్తాం. పెళ్లిళ్లలో నిష్టూరాలు ఏవైపునుంచి యే రూపంలో వస్తాయో ఎవరికెరుక. ఈనాడు వాళ్లచేత మాకు రాజమండ్రికి టిక్కెట్టు తెప్పించి పెట్టమన్నారు మగపెల్లివారు. ఈనాడు వాళ్లకి విమానం టిక్కెట్టు తప్ప రైలుటిక్కెట్టు తెప్పించే ఆనవాయితీ లేదన్నాను. అప్పటికి ఆ సమస్య ముగిసింది. మేం ఆడపెళ్లివారమండీ అని రామోజీ అన్నమాట మొగపెళ్లి వారిమీద దురాయి కట్టులా పనిచేసింది. పెళ్లి ప్రశాంతంగా ముగిసింది.

తాత పేరు మనవనికి వస్తుంది. ఇది ఆనవాయితీ. మా అల్టునిపేరు చం(ద్రశేఖరకా(స్తి. ఆయన తాత జస్టిస్‌ చంద్రశేఖరశా'స్తి, అంటే పెద్ద కొడుకు తనకు కొడుకు పుడితే తండ్రి పేరు 'పెట్టితీరుతారు. మొదటి బిడ్డ (స్త్రీ అయితే ఈ పద్ధతి వర్తించదు. ఒక తండ్రికి ముగ్గురు నలుగురు కొడుకులుంటే పెద్దవాని పెద్దకొడుక్కే తన పేరు వస్తుంది. తరవాతి మగపిల్లలు తొలి పురుష సంతానానికి తన అన్నపేర్డు పెడతారు,

రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ అ 183

ఇది ఆనవాయితే. ఇది ఆంధ్రత్స్వ ఆనవాయితీ. ఆంధ్ర అంటే అ(గ్రజుడు అ(గ్రేసరుడు అని అర్థం సామాజిక శా(స్త్రవేత్తలకు మాతృస్వామిక పితృస్వామిక సమాజాలే తెలుసును.

సమాజంలో స్వామిత్వాలు మూడున్నాయి. మూడోది భ్రాతృస్వామిక సమాజం. దీని ఉనికి సామాజిక శా(స్త్రవేత్తలకు సరిగా తెలియదు. పశ్చిమాసియాలో దిగృధా తీరాన అరఫ అనే పట్నం వుండేది. ఆ పట్నవాసులు హుగర్రులు. వారిది (బ్రాతృస్వామిక సమాజం అని చరిత్రకారులంటున్నారు. మనదేశాన సింధు రాష్ట జనం కూడా ఆంధ్రులూ భ్రాతృస్వామికులూ అయివుంటారు. సింధు ర్యాష్ట్రం ఇప్పుడు పాకిస్తానులో వుంది. మనదేశ జనులకు రెండుపేర్చు తప్పనిసరిగా వుంటాయి. ఒకటి తన పేరు. రెండవది ఇంటిపేరు. మహారాష్ట్రలకు తనపేరు, తండ్రి పేరూ ఉంటాయి.

ఈ రెండుపేర్లూ అయిన తరవాత ఇంటి పేరు వస్తుంది. బాల గంగాధర టిలక్‌లో బాల స్వంతపేరు. నిజానికి అది మాధవరావు అని. తండ్రిపేరు గంగాధరరావు. ఇంటిపేరు టిలక్‌, తన పేరును కాస్త కురచన చేసుకొనడం కోసం కేళశవనామాల్లో ఏ పేరున్నా దాన్ని బాల అని రెండు అక్షరాలకు కుదించుకుంటారు. వారు లౌకికులు కనక రావు అని పెట్టుకుంటారు. రావు అనేది రాజళబ్దానికి మహారాష్ట్ర ప్రాకృతం. నంన్కృతంలో వత్స అన్నపేరుందనుకోండి ఆ వత్స కొడుకు వాత్పుడవుతాడు. మనవడు వాత్స్యాయనుడవుతాడు.

స్వాతంత్ర్యానికి పూర్వం కాం(గ్రెసు సెక్రటరీ పేరు కృపలానీ, ఆ ప్రాకృత పదాన్ని సంస్కృతీకరిస్తే అది కృపలాయన అవుతుంది. ఆ మాటకు కృపల మనవడని అర్ధం. బీజేపీ నాయకుని పేరు అడ్వానీ. అంటే అడ్వ మనవడు అడ్యాయనుడు అని అర్థం. సింధీలపేర్టు తెలుగు ఆచారాలను బట్టి చూస్తే ఈ ఇరువురికీ ఆంధ్ర సంపర్కమూ, (భ్రాతృస్వామ్యమూ ఒకనాడు ఉండి ఉంటుందనిపిస్తుంది. ఆం(ధ్రులార్యులా? ఆర్య అనేది భాషా వాచక పదం. సింధీలు ఆర్యులే కాని తెలుగులు ఆంధ్రులు కారు. భాషరీత్యా వీరు (ద్రావిడులని లింగ్విస్టు పండితుల నిర్ణయం, మరిక ఆర్యాచారం ఎలా వచ్చింది?

పెళ్లి అయన తరవాత తిరపతి, బెంగుళూరు, మ'ద్రాసులను సందర్శించి హైదరాబాదుకు వచ్చారు. అరుణకు అదివరకే పాస్పోర్టు ఉంది. అమెరికా వెళ్లి వీసాకు కావలసిన కాగితాలు పంపిస్తానన్నారు శాస్త్రి, వీసాకోసం నేనూ, అరుణా మద్రాసు వెళ్ళాం. అక్కడ అన్నానగరులో మా మేనల్టుడున్నాడు. అక్కడదిగి అమెరికన్‌ కాంసలేట్‌కే వెళ్లాం. కాంసలేట్‌ గేటుదగ్గరే అక్కడ పనిచేస్తున్న మిత్రుడు కనిపించాడు. లోపలికి

వెళ్లి కాగితాన్నీ దాఖలు చేసిన తరవాత ఆమి(త్రుడు వచ్చి మమ్మల్ని కాంటీనుకు తీసుకెళ్లాడు. అది కాన్సలేట్టోనే వుంది. అక్కడి ఉద్యోగికి మేం అతిధులం కనక మాకు (ప్రవేశం దొరికింది.

మధ్యాహ్నాన ఆఫీసు మూసేస్తారు. మళ్లీ మూడింటికి తెరుస్తారు. వీసాకోసం వచ్చినవారు ఈ మధ్యకాలంలో భోజనం చేసి రావచ్చును. కాన్సలేట్‌కి దగ్గరలోనే ఈనాడు ఆఫీసువుంది. భోజనానంతరం అక్కడికి కూడా వెళ్లాం. మూడింటికి ఒక ఎన్వలప్‌ ఇచ్చారు. దాన్ని అమెరికన్లు తెరిచిచూడాలి, తెలిసివున్న ఒక టట్రావలేజెన్సీకి వెళితే వారు ఆ కవరును ఎమి(గ్రేషను ఆఫీసులో నమోదు చేసి తెచ్చియిచ్చారు. రాయపేటలో అల్లుని పెదనాన్న డాక్టరు వినాయకరావుగారు ఉన్నారు. ఆయన పెళ్లికి రాలేదు కాని శుభలేఖను ఆయన పేరుమీదే అచ్చువేశారు. ఇది మన ఆంధ్రత్వానికీ బ్రాతృస్వామ్యానికీ ఒక ఉదాహరణ.

ఆ రాత్రి అమెరికా నుంచి ఫోను వచ్చింది. వీసా వచ్చిన సంగతి అరుణ చెప్పింది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. మర్నాడు రైల్లో హైదరాబాదు చేరాం. ప్రయాణాలకు మంచిరోజులు, మంచి గడియలు

184 అ రాంభట్ల కృష్ణమూర్తి సొాంతకధ

చూస్తారు కదా అలాగ ఓ సుముహూర్తాన అరుణ అమెరికా బయలుదేరింది. అక్కడికి సుఖంగా చేరినట్టు ఫోను వచ్చింది. (భ్రాతృస్వామ్యంలో పెద్ద భ్రాతమాట సుగ్రీవాజ్ఞలాంటిది. అది అనుల్లంఘనీయం. పెళ్లి సుఖంగా జరిగిపోయింది. అమ్మాయి అమెరికా చేరింది కనక ఇంక సుగ్రీవాజ్జలేవీ లేవు. నేను ఈనాడులో ఇప్పుడు పనిచేయడంలేదు. అంటే నిర్షీత సమయాల్లో ఆఫీసుకు వెళ్లడంలేదు.

ఆదివారం సంపాదకీయాలు మాత్రం రాస్తున్నాను. హైదరాబాదులో “ఏబిసిడి” అన్న సంస్థ ఒకటుంది. ఆపాడి అక్షరాల విస్తరణ ఏమిటంటే “ఆంధ్రబ్రాహ్మాణ కమ్యూనిటీ డెవలప్మెంట్‌” అని, అన్ని కులాలకు రిజర్వేషన్సు రాయితీలు వస్తున్నాయి. అందుకని (బ్రాహ్మణులను బిసిల్లో చేర్చి తమకు కూడా తగిన రిజర్వేషనులివ్వాలని ఏబిసిడి వారు తీర్మానించారు. (ప్రభుత్వం బిసిలకు రిజర్వేషన్లను ఇస్తామన్న తరవాత బీసీల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. బ్రాహ్మణులకు రిజర్వేషనులివ్వాలంటే వారి (ప్రత్యేకతలకు ఇంగ్రీషు అక్షరాలు చాలవు,

కులాలవారీగా చూస్తే బ్రాహ్మణులు మైనారిటీవారు. మైనారిటీలు భద్రతకోసం ఐకమత్యాన్ని పెంచుకుంటారు. మైనారిటీలు అయినప్పటికీ బ్రాహ్మణుల్లో ఆ లక్షణం కానరాదు. రాజకీయ పరిభాషలో చెప్పుకోవాలంటే ఇద్దరు (బ్రాహ్మణులుంటే మూడు పార్టీలు పుడతాయి. 'బ్రాహ్మాణ మనస్తత్వాన్ని ఎరిగిన ఒక సంస్కృత కవి “బ్రాహ్మణానాం అనేకత్వం సర్పాణాం అతినిద్రతా గజానాం మంద బుద్ధిశ్చ త్రయో; లోకోపకారకః” అన్నాడు. ఈ శ్లోకానికి వేరే అర్ధం రాయనవసరంలేదు. బ్రాహ్మణులు, పాములు, ఏనుగులు, అనేకత, ఆతి నిద్రత, మంద బుద్ధివల్ల లోకం భద్రంగా వుంది.

(బ్రాహ్మణులు తమ ఇంటిపేరుకు బదులు 'ప్రవరలో మండల రుషి పేరును ఇంటి పేరుగా స్వీకరిస్తే గౌడద్రావిడ బ్రాహ్మణుల మధ్య భ్రాతృత్వం పెరగగల ఆవకాశం వుందంటాడు వాసిష్టగణపతిముని. ఆయన కౌండిన్య గోత్రజుడు. ఆ గోత్రానికి మండల రుషి వసిష్టుడు. అందుకనే ఆయన వాసిష్టగణపతి అయాడు. మా మండల రుషి ఆలగీరసుడు. కొంతకాలం నేను కూడా కృష్ణాంగీరసుడనయాను. ఆ పేరు అయోమయంగా తయారయింది. ఈ మండల రుషిపేరు త్రయార్జేయులు ఉన్నంతకాలం పనిచేస్తుంది. డబ్బు కక్కుర్తితో సగోత్ర వివాహాలు చేసుకొనడానికి ఆనువుగా ప్రవరను పెంచుకుంటున్నారు.

పంచార్జేయ సప్తార్షేయ ఏకాదశార్నేయ ఇలా ప్రవరను పెంచుకుంటే గోత్ర రుషి పేరు మారదు. తద్వారా గోత్రంపేరు మారదు. అలా మారని గోత్రం కొత్తగోత్రం కింద లెక్క. వైదికార్యులు పశుపాలకులు. పెద్దమందను మేపడం ఒకనివల్ల అయే పనికాదు. ఇప్పుడు అమెరికాలోని మంద కాపరుల్లాగ అంటే కాబాయిల్లాగ గుఢర్రాలెక్కి చాలామంది ఆలమందను మేపేవారు. ఈ మంద సాధారణంగా కొండ కనుమల్లో మేస్తుంది. కాపర్లకు ఒక నాయకుడుంటాడు కదా ఆ వ్యక్తికి గోత్ర రుషి అని పేరు. గోత్రం అంటే కొండ (గోత్రం అంటే ఆలమందలు మేసే పచ్చిక బయలు అని కూడా అర్ధం.) ఆ గోత్రం కాపర్తనాయకునికి గోత్ర రుషి అని పేరు. ప్రవర అంటే ప్రముఖుల పేరు అని అర్ధం. పూర్వం పెద్ద మందలను పాలించినవారు హీరోలు. అలాంటి ముగ్గురు హీరోలను చెప్పుకొనడం నాటి మర్యాద. ఆదిలో అలాంటి ముగ్గురు హీరోలు ముగ్గురు ప్రవరులుగా వుండేవారు. వ్యక్తి ప్రవరలో ముఖ్యులు ముత్తాత తాత తండ్రి వీరు ముగ్గురే. అలాగే ఆలమందల కాపర్లలో కూడా చెప్పుకొనదగ్గ వారు ముగ్గురే. ఆదే 'త్రయార్నేయం.

ఆంధ్రుల్గో భ్రాతృస్వామిక సామాజికులుంటారని చెప్పడమే నా ఉద్దేశ్యం. కొని ఆం(ధ్రులంతా

రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ అ 185

(బ్రాతృస్వామిక సామాజికులే కావలసిన పనిలేదు, 'సైంధవుల్లో (భ్రాతృస్వామిక సమాజ లక్షణాలు కనిపిస్తున్నాయి కనక వారు ఆం(ధ్రులై వుంటారన్నాను. ఆంధ్ర అనేది ఆర్యపదం. తెలుగు దేశానికీ తెలుగు జనానికీ ఆంధ్ర అన్న పేరుంది కాని వారి భాష ఆర్యభాష కాదు. తెలుగు లిపిలో సంస్కృతాన్ని స్పష్టంగా రాయడానికి కావలసినన్ని అక్షరాలున్నాయి, అలాగే * ద్రావిడ” భాషను కూడా స్పష్టంగా రాయగల అక్షరాలు కూడా వున్నాయి. (ద్రావిడ భాషలో తమిళానికి మూలం మ్లేచ్చభాష అని నా అభిప్రాయం.

పశ్చిమాసియాలో ఒకనొడు సంస్కార భాషలుగా పేరొందిన అగ్గడ, అసుర, ఈలం భాషలు మూడూ మ్లేచ్చభాషలు. ఈ త్రిభాషా పండితులు యత్నిస్తే ఈమూడు భాషలూ తమిళానికి మూలం అని తెలుస్తుంది. దక్షిణాది భాషలు నాలుగింటిలో తెలుగు కన్నడాలకు, తమిళ మలయాళాలకు పోలికలు కనిపిస్తాయి. అదే పశ్చిమాసియాలోని సుమేరు, అరట్టభాషలు రెండూ తెలుగు, కన్నడాలకు మూలం అనిపిస్తుంది. తెలుగు దేశాన స్థల నామాలూ దైవ నామాలు, సుమేరు నామాలే, ఇన్ని పేర్లు తమిళ మలయాళాలలో కానరావు, తమిళ పదాలు కొన్ని తెలుగున కానవస్తాయి.

పశ్చిమాసియా భాషల్లో పరస్పర ఆదాన ప్రదానాలుంటాయి. ఒకప్పుడు సుమేరును ఏలిన అగద భాష (ప్రభావం సుమేరు మీద చాలా వుంది. ఆ భాషను సుమేరు మాండలికంగా ఆనాడే పండితులు గుర్తించారు. వారు అగద భాషకు “ఏమసల” అని పేరు పెట్టారు. ఏమసల అంటే సరళ భాష అని అర్ధం. సంగీత భాష అని కూడా అంటారు. సంగీత భాష అని పేరు పడ్డ భాషలు మూడే. అవి - అగద, ఇటాలియన్‌, తెలుగు. ఈ మూడు అజంత భాషలు. ఈ భాషల (ప్రభావం వేదాలమీద కూడా వుంది. దాన్ని చూసి తమిళం వేదాలకన్నా ప్రాచీన భాష అని వాదిస్తారు తమిళులు,

తమ భాష ప్రాచీనతను చెప్పుకొనడం కోసం గోండ్వానా లెమూరియాలను కూడా ఉదాహరిస్తూ ఉంటారు. తమిళ భూమి ఇదేననీ ఇక్కడనుంచే పళ్చిమాసియాకు వెళ్లిందనీ చెప్పుకొనడానిక్కూడా వెనుకాడరు, తమిళం మ్లేచ్చభాష అయితే వేదాలు ఆర్యభాష. వేద భాష భారత దేశంలోనే పుట్టి యూరపు దేశాలకు వ్యాపించిందని వేదవాదులంటారు. వేదవాదులు, తమిళవాదులూ తమ తమ భాషలను గురించి చేసే ఉత్రేక్షలివి, చారిత్రకంగా ఇరువురూ పశుపాలకులు. ఇరువురూ పరద్వేషులు. ఇరువురికీ కావలసినంత అహంభావం వుంది.

ఏబిసిడి తీర్మానాన్ని చూసిన తరవాత నాలో హాస్యం పొటమరించింది. బ్రాహ్మణులు చేరవలసింది, నేస్తం కట్టవలసిందీ బడుగు కులాలతో కాదు. దళిత కులాలతో నేస్తం కడితే బాగుంటుందంటూ ఈనాడు ఆదివారం సంపాదకీయంలో రాశాను. వీరశైవ మహాకవి పాల్కురికి సోమనాధుడు బ్రాహ్మణులను తాటిమాలలన్నాడు. సోమనాధుడు శివకులాన్ని తప్ప మరో కులాన్ని అంగీకరించడు. కాని కులాల హెచ్చుతగ్గులను అంగీకరిస్తాడు. ఆందుకనే ఆయన (బ్రాహ్మణులను తాటిమాలలన్నాడు అంటే మెడలో తాడు అంటే జందెం వున్న మాలలని ఆయన అర్ధం.

సోమనాధుడు (బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టాడు. శివమతం తప్ప అన్య మతాలను అంగీకరించని వీరశైవమతాన్ని స్వీకరించాడు. శైవ సంస్కారానికి ముందు అతడు అగ్రజుడు. దళితుల్లో అగ్రజులు మాలలు. ఈవిధంగా కులాభిమానం చూపించుకున్నాడు. నిజానికి ఆయన (బ్రాహ్మణులను దళితులతో పోల్బవలసివుంటే వారిని ఆయన తాటిమాదిగలు అని వుంటే బాగుండేది అని నేనన్నాను. మాదిగలకు, (బ్రాహ్మణులకు చాలా పోలికలున్నాయి. ఇరువురూ జంతువుల చర్మాలను ఒలుస్తారు. ఇరువురు తొలిచిన చర్మాలను పదునుచేస్తారు,

186 అ రాంభట్ల కృష్ణమూర్తి సాంతకధ

(బ్రాహ్మణులు యజ్ఞంలో మేకను యూపస్తంభానికి కడతారు. దాని చర్మం వొలుస్తారు. ఒకప్పుడు వారు మెడలో వేసుకునే జందెం నేటి జందెంలా నూలుది కాదు. అది తోలుపటకాగా వుండేదని బాలగంగాధర తిలక్‌ అంటాడు. ఆయన వైదికార్యులమీద రెండు పుస్తకాలు రాశాడు. ఒకటి ఆర్యుల ఉత్తరద్రువావాసం. రెండవది మృగవ్యాధ నక్షత్రం. మృగశిరా నక్షత్రాన్ని మృగవ్యాధ అంటారు. ఇంగ్రీషులో ఒరయన్‌ అంటారు. ఆ నక్షత్రమండలం వ్యాధునిలా వుంటుంది. నడుముకు బెల్టు పెట్టుకున్నట్టు మూడు నక్షత్రాలు వరసగా వుంటాయి.

వైదికార్యులు పని అంటే కర్మచేసేటప్పుడు తోలుపటకాను నడుముకు బిగించుకునేవారు. పని అయిన తరవాత తీసి మెడలో వేసుకునేవారు. మెడలో దండలా వేసుకుంటే వొంగినప్పుడు కిందపడిపోతుంది. అందుకని మొలనుంచి విప్పి జందెంలా వేసుకుంటారన్నాడు. వాడుగు చేసినప్పుడు వటువుకు తోలుసటకానే జందెంలా వేస్తారు. తోలు పటకా లేకపోతే ఒక తోలు ముక్కను జందానికి కడతారు. ఈ ఆచారం నేటికీ సొగుతూనే వుంది. ఈ తోలును ఎవరు తయారు చేస్తారు? బ్రాహ్మణులే స్వయంగా తోలు వొలిచి పదును పెట్టి పటకాచేస్తారు.

కులమతాల మతలబు అన్న శీర్షికతో వెలువడింది ఆ సంపాదకీయం. అది 1983 మార్చి 13 ఆదివారం నాడు వెలువడింది. ఇది ఏబిసిడి సభ్యుల్లో ప్రకంపనాన్ని సృష్టించింది. అనేక బస్తీలో ఈనాడును దహనం చేశారు. న్యాయస్టానాల్లో ఈనాడుమీద పదికేసులు దాఖలయ్యాయి. "హైదరాబాదులో ఈనాడు కార్యాలయం ఎదుట దహనానికి యత్నించారు. కాని సఫలీకృతులు కాలేకపోయారు. రామోజీరావుగారు ఆపది కేసులను హైకోర్టుకు తెప్పించుకున్నారు. టిలకు రాసిన రెండు పుస్తకాలను తెమ్మన్నారు న్యాయమూర్తులు,

కేసులు వేసినవారెవరికీ టిలకు పుస్తకాల సంగతి తెలియదు. వారి తరపున వాదించడానికి వచ్చిన

న్యాయవాదులకసలు తెలీదు. వాడుగునాడు తోలుముక్కను జందానికి కడతారన్న సంగతి అందరికీ తెలుసును. అయినప్పుడు బ్రాహ్మణులకూ మాదిగలకు ఆ దివ్యవృత్తి ఒకటే అనడంలో దోషమేముంటుంది? న్యాయమూర్తులు ఆ కేసులన్నీ కొట్టేశారు. చాలా కాలం తరవాత మి(త్రుడు పొత్తూరి వెంకటేశ్చరరావు కూతురు పెల్లికి ఆహుతుల్లో నేనూ ఉన్నాను. అక్కడికి వచ్చిన మిత్రులందరికీ నన్ను పరిచయం చేశాడు. కులమతాల మతలబు రచయిత ఈయనేనన్నాడు.

మిదత్రులంతా నాదగ్గరకు వచ్చి ఆ సంపాదకీయం మీరు రాశారని తెలిసి వుంటే మేం ఆందోళనచేసే వారమే కాదు అన్నారు. స్వకులంవాడు స్వకులాన్ని తిట్టితే తప్పులేదు. కాని పరాయి కులంవాడు కులంపేరు చెప్పి తిడితే దాన్ని సహించకూడదు. ఇది చాలా కాలం నుంచి వస్తున్న రివాజు. ఈ సంగతి నాకు చాలా కాలం నుంచీ తెలుసును. ఒకనాడు (బ్రాహ్మణుల్లో వైదీకి, నియోగి వివాదాలకు అవధానాలు అస్త్రాలుగా పనిచేశాయి. కొప్పరపు కవులు, తిరపతి వెంకటకవులు నాయకులు.

ఈ శాఖాయుద్దాలు నాలుగోదళకం (ప్రారంభంలో హైదరాబాదుకు కూడా చేరాయి. ఆయితే ఆనాడు హైదరాబాదులో కవులు వేళ్లమీద లెక్కించగలవాలే వుండేవారు. ఆనాడు సాహిత్య కురుక్షేత్రం శ్రీకృష్ణదేవరాయాం(్ర భాషానిలయం, ఇక్కడ ఆ యుద్దాన్ని చల్లార్భడంలో నా పాత్రకూడా ఉంది. నాటి పద్యా(స్తం ఒకటి నేటికీ నాకు గుర్తు. “ఎవరురా మా అమాత్యుల నీసడించి కలము పట్టెడు మొనగాడు తెలుగునేల” ఈ పద్యకర్త నెల్లుట్ల రామకృష్ణామాత్యుడు. (బ్రాహ్మాణశాఖా యుద్దం కోస్తా జిల్లాలనుంచి "హైదరాబాదుకు పాకినా ఇక్కడ నిలతాక్కుకొనలేకపోయింది.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 187

మన దేశాన నీతి అంటే రాజనీతి అని అర్ధం. సామాజిక నీతి అన్న భావనలేదు. సెమెటెక్‌ మతాల్లో సామాజిక నీతి అన్న భావన ఉన్నది. (క్రయిస్తవ పారళాలల్లో ఒకరోజు బైబిలు క్లాసు వుంటుంది. 'క్రయిస్తవేతరులకు నీతి అన్న విషయం వుండేది. ఉరుదు పాఠశాలల్లో కూడా ముస్లింలకు దీనియాత్‌ అనే విషయాన్ని బోధిస్తూ వుండేవారు. దీనియాత్‌ అంటే దైవశాస్త్రం అని అర్ధం. బందరు నోబుల్‌ కళాశాల 'క్రయిస్తవాధ్వర్యాన నడుస్తూ వుండేది. ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ పేరు దర్భా నిత్యానందశా'స్తి. ఆయన తండ్రి సకుటుంబంగా (క్రయిస్తవ మతం పుచ్చుకున్నాడు. మతం మారకముందు శాస్త్రికి వొడుగయింది.

వొడుగయిన తరవాత కొన్ని వేద పన్నాలను కావ్యాలను నేర్చాడు. మతం పుచ్చుకున్న తరవాత ఇంగ్లీషులో పెద్ద చదువులు చదివి నోబుల్‌ కాలేజీకి ప్రిన్స్‌పాలయ్యాడు. ఎన్ని చదువులు చదివినా పేరు మాత్రం మార్చుకొనలేదు. ఆయన ప్రిన్సిపాల్‌గా ఉన్నంతకాలం (క్రయిస్తవ విద్యార్థులకు బైబిలు క్లాసు వుంటే (క్రైస్రవేతరులకు తాను భగవద్గీతాపారాలు చెప్పేవాడు. ఉరుదూ స్కూళ్లు ముస్లిమేతరులకు నీతి కధలు చెప్పేవారు. ఆ క్లాసుకు అఖ్ఞాఖియాత్‌ అని పేరు. నీతిశాస్త్రం అని దాని అర్థం. నేను మూడు నాలుగు తరగతులు ఉరుదులో చదివాను. అఖ్లాఖియాత్‌ క్లాసులో టీచర్లతో యుద్దాలు కూడా చేశాను,

మా నీతి శాస్త్ర టీచరు ఒక కన్నడిగుడు. ఆతడి పేరు శంకర్రావు. ఒకసారి ఆయన ఏకలవ్య కధను చెబుతూ అతడి పేరును “అక్టాదియా” అన్నాడు ఉరుదులో. దకారవకారాక్షరాలు దాదాపు ఏకరూపంలో వుంటాయి. నేను ఆయనతో ఆ మాట అక్టాదియా కాదు ఏకలవ్య అని సరిదిద్దాను. ఆయనకు (బ్రహ్మాండమైన కోపం వచ్చింది. ఉరుదు క్హాసులో “నల్లైతమనా” అన్న మాటకు అర్ధం వివరిస్తూ నళ్ల్‌లంటే అసలు ఖర్జూరం చెట్టు అని అర్ధం అంతే కాని మామూలు చెట్టు అనరాదని చెప్పాడు టీచరు. నఖ్లైతమన్నా అంటే కోరికల చెట్టు. దీన్ని మేం కల్పవృక్షం అంటామన్నాను. టీచరు కుపితుడయ్యాడు.

భారతదేశాన ఎధిక్సు ఆఖ్ఞాఖియాత్‌ ఒక సామాజిక చైతన్యరూపంకాదు. ఆ సంగతి నాకు తెలుసును. అయినా నేను చదివిన పద్యాలు కైకాల వల్ల సామాజిక నీతి కాస్త వంటపట్టింది. నాపేరనున్న ఫ్యాక్టర్‌ స్థలం ఆనాడు ఇరవైలక్షలు చేస్తుంది. దాన్ని సుందరయ్య గారు కావాలన్నారు. నిజానికి ఆయన ప్రోద్చలంతోనే ఆ స్థలానికి బయానా యిచ్చాను. అప్పుడాయన స్టం వద్దన్నాడు. ఇప్పుడు కావాలన్నాడు. దానికాయన ఆరులక్షలిస్తానన్నాడు. ఒప్పందం అయింది. స్థలం స్వాధీనం కాకముందే ఆయన మరణించారు. ఆయన అనుయాయులు నీతికి నిలవలేకపోయారు. అప్పుడో యింత ఇప్పుడోయింత యిస్తూ వచ్చారు,

188 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

అనం ల న్‌ ఉచ్చా వారాంతాన ఒక రోజు బజారువని. మరొక రోజు బంధుమిత్ర దర్భనం. ఇదీ అమెరికా, మాల మన వాళ్ళు పాటించే వద్దతి. నా చిన్సతనంలో నేటి అమెరికాలాగే ని, ఆదివారాలు రెండూ సెలవు దినాలుగా వుండేవి. అదివారం (యిస్తవులకు వుణ్యదినం. స్థానిక జనులకు శనివారం వుణ్యదినం. అందువల్ల నేటి అమెరికాలాగ నాటి ఇంగ్రీషుపాలనలో మనకి కూడా వ లో శని ఆదివారాలు సెలవుగా వుండేవి. ఇంతకీ సెలవు అంటే ఏమిటి? కానూ అమెరికా యాత్ర అగ్నీ సలం సాభధీనం చేస లే లం న ం చేసుకున్న నాటి నుంచీ నెలకు మూడువేలు యిస్తూ వచ్చారు. ఏమిటిది అంటే వడ్డీ అన్నారు. ల ని లమీద ఒక ఫ్లాటు తీసుకున్నాను. ఆ కంతులు కూడా చెల్లిస్తూ వచ్చారు. ఫ్లాటు రిజిష్ట అ వాత లెక్కలను తేల్చుకోవాలికదా. వడ్డీ అని పేరు పెట్టి యిచ్చిన మొత్తాన్ని కూడా కలిపి లెక్కలు వేశారు. ఆదేమిటంటే ఒక్కసారి చేతికి డబ్బు వస్తే నువ్వు ఖర్చుపెట్టేస్తావని కొంచెం కొంచెం ఇస్తూ వచ్చాం అని ఒక మహానాయకుడు జవాబిచ్చాడు. అర్ధం రాజకీయాల ద్వారా వ్యక్తం అవుతుందంటాడు లెనిన్‌. నాకు రాజకీయాలమీద ఆసక్తి లేదు. అర్ధం మీద కూడా అంతే. స్తం స్వాధీనం చేసిన అయిదేళ్లకు ఆర్థిక వ్యవహారం పరిష్కారం అయింది. అద్దె ఇంటినుంచి కొత్త ప్లాటులోకి ఉగాది నాడు మారాం. పాడ్యమినాడు గృహప్రవేశం చేయరాదు అని కొందరన్నారు. పాడ్యమి మంచిది కాకపోతే ఆరోజున ఉగాది పండుగ ఎందుకు వచ్చింది అని వారిని అడిగాను. పంచాంగాలమీద మీకున్న నమ్మకాన్ని నేను కాదనను. మీరు పండుగను ఈ దుర్షినాన కాక రేపు చేసుకోండి అని సలహా యిచ్చాను. దుర్దినాలు చైత్రమాసంలో రావు. కారుమబ్బులు కమ్మి తుంపరలు పడుతూన్న రోజుకు “దుర్షినం” అని పేరు. అదే అర్ధంతో కావ్య వర్షనలున్నాయి. నూతన గృహప్రవేశం అయింది. అమ్మాయి ఆమెరికా రమ్మని చాలాకాలంగా కోరుతూ వచ్చింది. ఇప్పుడు కొత్త యింటచేరాం. అందుకని ఆమెరికాకు వెళదాం అని నిశ్చయించుకున్నాం. మదరాసు వెల్లి వీసాలు తీసుకున్నాం. మా వాలక్షాలు చూసి మల్టిపల్‌ ఎంట్రీలతో అయిదేళ్లవరకు అక్కరకు వచ్చే వీసాలిచ్చారు. మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశం లండను 'ప్రయాణంలాగ ఊరగాయలు వగైరాలు తీసుకుని మేం క్రషసనపన నకకనన వన ననన. పు రాంభట కషమూర్తి సాంతకథ అ 189 ళు అజాన్‌

అమెరికాకు బయలుదేరాం. అరుణ అక్కడినుంచి టిక్కెట్టు పంపించింది. మేం హైదరాబాదు నుంచి సాయంత్రం బయలుదేరి బొంబాయి చేరాం.

మా ప్రయాణం జర్మన్‌ ఏర్‌లైను వారి లూఫ్స్‌ హంసమీద. బొంబాయిలో దిగగానే జర్మన్‌ ఏర్రైనువారు ఏర్పోర్టు పక్కనే వున్న హోటలుకు పంపారు. ప్రాంక్‌ఫర్డ్‌ విమానం తెల్లవారుజామున. అంతవరకూ హోటల్‌లో రెస్టు తీసుకొనవచ్చును. అక్కడ కాఫీ, టిఫినులాంటి వాటికోసం నూట ఇరవై రూపాయల విలువున్న కూపన్లిచ్చారు. మేం సాయంత్రం భోజనాలు చేసే బయలుదేరాం. నేను మాత్రం టీ తీసుకున్నాను. ఇల్లాలుకు అది కూడా అవసరం లేకపోయింది. మేం కాస్త నడుంవాల్చాం. బస్సు వచ్చింది. పెట్టైలెత్తుకుంది. మేం అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాం.

విమానం (ఫ్రాంకృర్డ్‌ చేరింది. అక్కడ అయిదు గంటలుండాలి. అప్పుడు బోస్టన్‌ విమానం బయలుదేరుతుంది. ఈ అయిదు గంటలూ కంచి గరుడసేవ, విమానంలో వాయు ఆతిధేయినిలుంటారు. వారికి అతిధేయంతోపాటు నిషిద్ధ వస్తువులను తీసుకొని వెళ్లేవారి మీద ఓ కన్నేసి వుంచే బాధ్యత కూడా వుంటుంది. బంగారం వజ్రాల లాంటి వాటిని రహస్యంగా చేరవేసేవారు కొత్తవారు అయితే వారి ముఖాలు అప్పుడే తెలిసిపోతాయి. కొందరు (ప్రతి పావుగంటకూ బాత్రూం టాయలెట్టకు వెళుతూ వుంటారు. తమ సరుకు భద్రంగా వుందో లేదో చూసుకుంటారు.

రహస్యంగా దాచిన వస్తువులు జారిపడిపోయే అవకాశం వుండదు. అయినా అలాంటి వస్తువులను తీసుకువెళ్లేవారికి భయం వల్ల తర్కం పనిచేయదు. గడియలు సంవత్సరాల్దాగ కనిపిస్తాయి. అలాంటి వారిని కనిపెట్టి చూస్తూ వారు గమ్యం చేరడానికి ముందే ఈ వాయు అతిధేయినిలు అక్కడికి వర్తమానం అందజేస్తారు. నేను మాస్కోలో ఫిలాసఫీతోపాటు గూఢచర్య పద్దతులను గురించి కూడా తెలుసుకున్నాను. విమానంలోనూ (స్రాంకృర్ట్‌లోనూ కదలికలేకుండా ఉన్నందువల్ల బోస్టనులో ఇంటికి చేరిన తరవాత మూ(త్రం బందయింది.

ఇక్కడ అవసరం అయినప్పుడు డాక్టరు దగ్గరకు పరుగెత్తవచ్చును కాని అమెరికాలో కొత్తవారి పేర్లను తమ ఆస్పత్రిలోనే పేర్డు నమోదు చేసి ఆవసరమయినప్పుడు వైద్య సేవలందించడం కోసం సుంకం చెల్లించాల్సివుంటుంది. అమెరికన్‌ భారతీయుల్లో డాక్టర్టు కూడా చాలామందే వున్నారు. అయినా వారి సలహాలను అడగకూడదు వారు వీరికి మందులివ్వకూడదు. అందుకని అరుణ ఏడాక్టరినీ సలహా అడగలేదు. వారు మెసాచూసెట్లో ఒక తాజా డెవలపె శంటులో ఇల్టు కట్టుకున్నారు. వెళ్లీ వెళ్లగానే ఆ డెవలప్మెంటునంతా తిప్పి చూపించింది ఆరుణ,

అంతా తిరిగి చూసి ఇంటికి వచ్చిన తరువాత ఏ డాక్టరు మందులూ సలహాలు అవసరంలేకుండానే మళ్లీ మామూలు పరిస్థితికి చేరాను. అమ్మాయీ, అల్లుడూ వున్న డెవలప్మెంటుపేరు ఏటల్‌బరో, వీరున్న వీధికి శాండల్‌వుడ్‌ (ఢ్రైవ్‌ అని పేరు పెట్టుకున్నారు. నేను చూసిన మేరలో ఇంకా రెండు మూడు స్టూలు ఖాళీగా వున్నాయి. అప్పుడు నేను సిగరెట్టు కాల్చేవాడిని. ఒకనాడు ఆ డెవలప్మెంటు అంతా తిరిగాను, ఇండియాలాగ కిల్లీ బడ్డీలాంటిది ఎక్కడా కానరాలేదు. వీకెండులోనే నా సిగరెట్లు కూడా కొనితెచ్చేది అరుణ. అక్కడ శని, ఆదివారాలు సెలవు.

అక్కడ వారానికి అయిదురోజులే పని, శని, ఆదివారాలకు వారాంతం అని పేరు, జీతం సంవత్సరానిక్తి నియమితం అవుతుంది. వారం వారం బట్వాడా అవుతుంది. వారు పనిచేసేది అయిదురోజులే. ఇప్పుడు

190 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

'ప్రపంచం అంతా వారం అంటే అయిదురో జలే. ఏళ్లకిందట వశ్చిమాసియాలో అసురు కాని లెక్క మాత్రం ఏడురోజులకు. ఇప్పటికి ఆరువేల ఆరువారాలుండేవి. పశ్చిమాసియాలో ఎ లు అయిదురోజుల వారాన్ని పాటించేవారు. వారి నెలకు ॥ జాతు వ్యవసాయం, న్ని జాతులవారు భాషల వారు ఉన్నా వారందరి వృత్తీ ఒక్కటే. అదే వారాంచాన ఒకరో పటం ర బజారు పని, మరాకరోజు బంధుమిత్ర దర్శనం. ఇదీ అమెరికాలో మనవాళ్ళు ఆదివార క ఆగ వ 0లో నేటి అమెరికాలాగే శని, ఆదివారాలు రెండూ సెలవుదినాలుగా వుండేవి. నాటి క యుస్తవుల స పదినం. స్థానిక జనులకు శనివారం పుణ్యదినం. అందువల్ల నేటి ఆమెరికాలాగ డు ఇంగ్షషుబాల, నకి కూడా శని ఆదివారాలు సెలవుగా వుండేవి. ఇంతకీ సెలవు అంటే ఏమిటి? ఖర్చు అని ఆ మాటకు అర్ధం. దాని వాడుక రకరకాలుగా వుండేది. ఎన్ని రకాలుగా ఆ పదాన్ని వాడినా ఖర్చు కోసం డబ్బు అనే అర్ధం. ఇప్పుడు పనే అన్న మాట విద్యార్థుల్లో ఆటవిడుపు అని రూఢం అయింది. అధికారులు తమ కెందివారికి ఏవేవో పనులప్పజెబుతారు. అంతా విని ఆ చిన్న ఉద్యోగి చేతులు దోయిలించి మరి సెలవు ఇప్పిస్తారా అంటాడు. అధికార చెప్పిన పనులన్నీ చేసుకుని రావడానికి అయ్యే ఖర్చు ఇప్పిస్తారా అని దానర్ధం. ఏనుగుల రాస్వా క సగారు తమ కాశీయాత్ర చరిత్రలో అయిన ఖర్చు వెచ్చాలను "సెలవు అనే వాడేవారు. ఖర్చు అన్న తెలుగుమాట కాదు. అది ఉరుదూ మాట. ఉరుదు వాళ్తులోకి రా తలుగు వారంతా సెలవు అనే వాడేవారు. ” చి కపూర్వం పూర్వం వీధిబళ్లలో పి ప్‌ ర్‌ు ఆడుకొనడానికి షొమ్మనేవారు. అయితే ఆటవిడుపు డబ్బులిస్తేనే వారిని ఆ . వారు తమ ఆట సమయాన్ని కొనుకు).నే ఆటవిడుపులకు సెలవులని పేరు వచ్చి పె [నేవారన్నమాట. అందువల్లనే కొనుక్కున్న తదు. అలా వచేచే వేసంగి 7 ్చింది. నాటి ప్రభుత్వ స్కూళ్లలో సెలవులకు డబ్బులివ్వవలసిన అవసరం " వే వేసంగి సెలవులు, క్రిసిమస్‌ సెలవులూను. నాటి వీధి బళ్లు నేటి (ప్రైవేటు పారశాలల్హాగ ధనమూలాలు. ఆనాడు సర్కారీ స్కూళ్లు పల్లె వ 6 స్కూళ్లు పల్లెలకు పాకలేదు, హైదరాబాదులో వారాంతపు సెలవు ఆదివారం కాదు. శుక్రవారం. మేం అమెరికాలో ఉండగానే ఇక్కడ హైదరాబాదులో మా అన్నగారు పోయారని వార్త వచ్చింది. మాది రిటర్న్‌ టికెటు అది కన్‌ఫర్మ్‌ అవడానికి కనీసం పదిరోజులు పడుతుంది. కొత్త టికెట్టు తీసుకుని బయలుదేరుదామంటే మా దగ్గర ధనంలేదు. అమ్మాయి కొన్న రౌండు టిక్కెటు ద్వారా అమెరికాకి వెళ్ళాం. అమ్మాయికీ, అల్టునికీ కూడా కొత్త టిక్కెటు కొనిపెట్టగల స్తోమత లేదు. మా అన్నగారి కూతుళ్లు నలుగురిలో ముగ్గురు అమెరికాలోనే ఉన్నారు. అందులో పెద్దమ్మాయి ఆదాయం ఎక్కువ. ఆ ముగ్గురూ వెంటనే "హైదరాబాదుకు బయలుదేరారు. వారు తిరిగి వచ్చిన తరవాత వారిని పరామర్శించడానికి తెలంగాణా భాషలో మందలించడానికి మేం బయలుదేరాం. పెద్దమ్మాయి, చిన్నమ్మాయి లాస్‌ ఏంజెలిసులో వున్నారు. మూడో అమ్మాయి టెక్సాస్‌లోని హ్యాస్టన్‌లో వుంది. అందుకని మేం లాస్‌ ఏంజెల్సులో ఒక వారం హ్యాస్టన్‌లో మూడురోజులూ వుండి అరుణ దగ్గరకు చేరాం. ఈదారి ఖర్చులను కూతురూ, అల్టుడూ భరించారు. లాస్‌ ఏంజెల్సులో హాలీవుడూ అక్కడ ప్రసిద్ద స్టూడియోలూ చూపిస్తానన్నాడు పెద్దల్లుడు. ఇప్పుడు అవన్నీ తిరిగి చూసే స్టితిలో లేను అన్నాను. లా రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ త 191

శరత్కాలం వచ్చింది. మన దేశాన అది వెన్నెలకు ప్రసిద్ది కాని యూరపు అమెరికాల్లో అది ఆకురాలు కాలం అంటారు. మనకది శిశిర రుతువు. యూరపు అమెరికాల్లో శరత్కాలం, హేమంతం, వసంతం మూడేకాలాలు. వేదాల్లో కూడా మూడే కాలాలు. శతం జీవే శరదో వర్ధమాన: శతం హేమంత: శతము వసంత;ః అని ఆశీర్వదిస్తారు. అమెరికాలో శరత్కాల సౌందర్యాన్ని * వాడ్డానికి మెసాచూసెట్‌ రాష్ట్రానికి వస్తారు. పండుటాకులు కొన్ని పసుపురంగులోను మరికొన్ని ఎర్రరంగులోనూ ఉంటాయి. కిందరాలిన ఆకులు పసుపూకుంకాలు కుప్పలు పెట్టినట్టుంటుంది.

నేను పిడకలవేట పేర ఉదయంలో రాసిన వ్యాసాలను అచ్చువేశారు. ఆ పుస్తకానికి నేను పారుటాకులని పేరు పెట్టాను. పారుటాకుల అందం యూరపు అమెరికాల్లోనే కనిపిస్తుంది. నేను అడపాతడపా రాసిన వ్యాసాలకు పారుటాకులన్న పేరును ఖాయం చేసుకున్నాను. పారుటాకులు రెండో సంపుటానికి వ్యాసాలు సిద్దంగా వున్నాయి. ఆకురాలు కాలాన్ని అమెరికన్లు ఫాల్‌ అంటారు. మేం ప్రత్యేకంగా ఫాల్‌ చూడ్డానికి అడవులకు వెళ్లలేదు కాని అనేక ప్రాంతాలకు బంధుమిత్ర దర్శనాలకు వెళ్లేటప్పుడు అడుగడుగునా ఫాల్‌ అందాలు చూస్తు వెళ్దాం.

చెకోస్టావియా దేశపు ప్రసిద్ద పురాతత్వ వేత్త బెడ్రిక్‌ హ్రోబ్నీ అభినందన (గ్రంధం 1950లో నాకందింది. ఆనాటి నుంచి నేను సుమేరు సంస్కృతీ, సింధు పురాసంస్కృతుల మీద అభిమానం పెంచుకున్నాను. అమెరికాలో వుండగా పశ్చిమాసియా సుమేరులమీద కొన్ని పుస్తకాలను కొనుక్కున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు టీవీ చూడ్డం ఒకటే కార్యక్రమం. అక్కడ వార్తా పత్రికలను కొంటే వాటిని వొదిలించుకొనడం పెద్ద సమస్య అవుతుంది. పత్రిక సాధారణంగా కిలోబరువు తూగుతుంది. అక్కడ ఇక్కడ లాగ చిత్తుకాగితాలు ఏరేవారు కొనేవారు వుండరు.

అందువల్ల ఆదివారం పత్రికను అప్పుడప్పుడు చూస్తూ వుండేవాడిని. గత శతాబ్దంలో హెన్రిక్‌ స్తీమన్‌ అన్న ఒక ఆర్కియాలజిస్టు ఇల్లియడు ఆనుపానులు తెలుసుకోవాలని యత్నించాడు. ఆయన యత్నఫలితంగా వెలువడిన పురావశేషాలు ఆధారంగా ట్రాయి యుద్ధ గవేషణ పేర టీవిలో ఒక ధారావాహిక వెలువడింది. ఆ సీరియలు నెలరోజులపాటు నడిచింది. ఆ తవ్వకాల్లో ఇల్లియడు యుద్దం సంగతి కానరాలేదు. కాని నాటి తవ్వకాలు ప్రపంచ చరిత్ర గతిని మార్చివేశాయి. ఆ సీరియల్‌ను నిర్మించిన వాడు మైకేల్‌ వుండ్‌ అనే యువకుడు. సీరియల్‌ ఆఖర్న సీరియల్‌లో చూపిన విశేషాలమీద అతడే రాసిన పుస్తకం దొరుకుతుందన్నాడు.

ఆ పుస్తకం ఎడ్రసుకు ఫోను చేసింది అరుణ, ఆ పుస్తకం ఇంటికి తెచ్చియిచ్చారు ఆ పుస్తకం ప్రచురణకర్తలు. ఆ పుస్తకం ఖరీదు ముప్పయి డాలర్గు, ఆ పుస్తకంలో హిసార్లిక్‌దిబ్బ పురాతన ట్రాయినగరం కనుకుని తవ్వారనుంది. ఒకనగరం ఒకటిగా ఏడు నగరావశేషాలు కనిపించాయి. కాని (ట్రాయి యుద్ధం కొడ కానరాలేదు. హిసార్లిక్‌ దిబ్బనే కాకుండా హిట్టయి (ప్రాంతాలను కూడా తవ్వగా (ట్రాయికీ, హిట్టయిట్‌ రాజులకు మధ్య సాగిన రాజకీయ పత్రాలు దొరికాయి. ఏజియన్‌ సముద్రంలోని క్రీటుదీవిని కూడా తవ్వి

అనేక విశేషాలను బైటపెట్టాడు సీమన్‌:

శ్రీటు దీవి ఒక రాజ్యం, దాని రాజధాని క్నోసిస్‌ నగరం. అంటే జ్ఞాననగరం అని ఆమాటకు అర్ధం.

ఆనాడు గ్రీకులు తమ సౌరమతాన్ని 'క్రీటు నుంచే (గ్రహించారు. సౌరమతానుయాయులు గ్రీకులు, శ్రీటులు మాత్రమే కాదు. హిట్టయిట్లు అసీరియన్లు కూడా సౌరులే. అసీరియన్లనే మన పౌరాణికులు అసురులన్నారు. 192 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

క్రీటు దీవి తాలిపాలకుని పేరు “మినోస్‌”. ఆయన తాలి ధర్మశా(స్తకర్త అనీ, తాలి ఓడల నిర్మాత అనీ గ్రీకు చరిత్రకారులంటున్నారు.

భారతదేశ పూర్వ చరిత్రకు పశ్చిమాసియా ఒక ప్రధాన స్థావరం. ఈ సంగతిని ఇంతవరకూ మన చరిత్రకారులు గుర్తించలేదు. నిజాం నవాబు కాలంలో పురాతత్వశా(స్త్ర అధిపతిగా పనిచేసిన యాజ్ఞానీ మాత్రం మన దేవాలయాల వి[గ్రహాలమీద పశ్చిమాసియా వి([గ్రహాల (ప్రభావంవుందని రాశాడు. పళ్చిమాసియా విగ్రహాలు జంతువులవయినా, మనుషులవయినా వాటికి రెక్కలు వుంటే ఆ రెక్కలు దివ్యత్వ చిహ్నాలని యాజ్ఞానీ అంటాడు. అలాంటి రెక్కల వి[గ్రహాలు మన దేశాన కూడా కానవస్తాయి. ఏ చరిత్రకారుడూ చేయని పనిచేసిన యాజ్ఞానీ ప్రశంసనీయుడు.

సింధు సీళ్లలో పెద్దమూపురం, గంగడోలు గల వృషభం కనిపిస్తుంది. అది సీళ్లమీద చెక్కినది మాత్రమే. చికాగో యూనివర్సిటీకి చెందిన రెక్కల వృషభం అసలయిన అనపోతు. దాని ముఖం మానవముఖం. తలమీద పెద్ద కిరీటం వుంటుంది. ఆ కిరీటం మీద మూడు జతల శృంగాలుంటాయి. అసలు శృంగాలు దివ్య చిహ్నాలు, అందునా మూడు జతల శృంగాలు దివ్యత్వంలో ఏ స్థాయికి చెందుతుందో వేరే చెప్పనక్కరలేదు. ఆది ఆసుర అనబోతు. అనబోతు అంటే దివ్య వృషభం అని ఆర్ధం. అనుద్యుదేవుడు, అతనికి సంబంధించిన పోతు అనబోతు.

శ్రీస్తు పూర్వం మూడవ సహా'్రాబ్టిలో అగ్గడరాజు సర్రుకిన్‌ భూమధ్య సముద్రం నుంచి అరేబియా సముద్రం వరకు తన సా(మ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ఆయన మనవడు నారంసిన్‌ శృంగకిరీటాన్ని ధరించి తానే దేవుడనీ, అందరూ తననే పూజించాలనీ రాజశాసనాన్ని జారీచేశాడు. సర్రుకిన్‌ని అగ్గడ వంశస్టాపకుడు అంటారు చరిత్రకారులు. సర్రుకిన్‌ తరవాత ఆయన మనవడూ, అసుర రాజులందరూ శృంగకిరీటాలను ధరిస్తూనే వచ్చారు. మూడు జతల శృంగాలున్న పెద్ద పెద్ద రెక్కలువున్న అనబోతు ప్రతిష్టించిన వారు అసురచ(క్రవర్తులే.

పశ్చిమాసియాలో సుమేరులు బంకమట్టి పిడకలమీద తుంగకాడతో రాసేవారు. ఆ రాతకు కీల లిపి అనే పేరు పెట్టారు పురాతత్వ వేత్తలు. ఆనాడు పళ్చిమాసియాలో ఏడుభాషలు మాట్లాడే జనమంతా బంకమట్టి పిడకలమీద సుమేరు లిపిలోనే రాసేవారు. ఆనాడు అక్కడ రకరకాల ఆర్యభాషలు, మ్రేచ్చభాషలు చెలామణిలో వుండేవి. ఆనాడు మైతాణులనే ఆర్యులు నేటి సిరియాను పాలిస్తూ వుండేవారు. ఆ మైతాణులనే శేదాలు మైత్రా వరుణులు అన్నాయి. బంకమట్టి పిడకలమీద రాత మన దేశానికి కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. బొద్దపండితులు పాళిలో పిటకాలన్నది ఈ పిడకలనే.

లా రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ తి 193

నా విజ్ఞానార్థన తృణ జలూకా న్యాయాన జరిగింది. తలకు తగిలిన ఎవయాన్సి తెలునుకొనేదాకా ఆరాటం. తెలునుకున్లు తరువాత తృణ జలూకంలాగ మరో గడ్డిపరకను అందుకొనడం. అందుకనే నేను గోర్కీ ఎిళ్ళువిద్యాలయంలో శ్యాస్తాలను తృణజలూకా న్యాయంగా అభ్యసీంచాను అని అంటున్సాను. అంటే నాది న్వాయం గురు, న్థయం శిష్య ఎఐద్యా వద్ధతి, కనా, తృణ జలూకా న్యాయం నాకు స్కూలింగు లేదు. కాని చదువంటే ఇష్టం. ఈ విశ్వమే నాకు విశ్శవిద్యాలయం అంటాడు

మక్సిం గోర్కీ. నాకు కూడా అదే విశ్చవిద్యాలయం. గోర్కీ విద్యార్దన ఎలా చేసేవాడో నాకు తెలీదు. నేను

మాధత్రం తృణ జలూకా న్యాయాన్ని అనుసరిస్తూ విద్యార్దన చేశాను. తృణ జలూకను తెలుగులో ఏమంటారో

నాకు తెలీదు కాని తృణ జలూకాలను చాలా చూశాను. ఆ న్యాయాన్ని గురించి విన్నాను. తృణ జలూకాలు

వానాకాలం మొదలయినప్పుడు గడ్డిపరకలమీద కనిపిస్తూ వుంటాయి. జలూకం అంటే జలగ.

నీళ్లలో వుండే జలగ మనిషి పిక్కను పట్టి నెత్తురు పీలుస్తుంది. కడుపు నిండేవరకు నెత్తురు పీలుస్తూనే వుంటుంది. తృణ జలూకం నెత్తురు పీల్చదు. శరీరాన్ని సాగదీయడంలో దానికి నీటి జలగ లక్షణాలున్నాయి. అంతే. నీటి జలగకూ గడ్డి జలగకూ, గల పోలిక అంతవరకే. ఆది నిరంతర పాదయాత్రలా కనిపిస్తుంది. దాని గమ్యం ఏమిటో తెలీదు. అది గడ్డిపరకలమీంచి సాగుతూ వుంటుంది. చిన్నప్పుడు వాటిని చాలాసేపు చూస్తూ వుండేవాడ్డి. అది ఒక గడ్డిపరకమీద నిలిచి శరీరాన్ని సాగదీస్తుంది. ముందున్న మరో పరకను అందుకుంటుంది. వెనక శరీరాన్ని కూడా ఆముందు పరకమీదికి తీసుకుంటుంది. అక్కడ మళ్లీ శరీరం సాగతీత, మరో పరకనందుకొనడం. వెనక శరీరాన్ని ఆ పరక మీదికి చేర్చుకొనడం. మళ్లీ ముందున్న మరోగడ్డి పరకను అందుకొనడం. దాని మీదకు వెనక శరీరాన్ని కూడా తెచ్చుకొనడం, ముందు గరికను అందుకొనడం అంతా మామూలే, అది పడదు, పరుగులు తీయదు, ప్రయాణం ఆగదు, నా విజ్ఞానార్హన ఆ తృణ జలూకా న్యాయాన జరిగింది. తలకు తగిలిన విషయాన్ని తెలుసుకొనేదాకా ఆరాటం, తెలుసుకున్న తరవాత తృణ జలూకంలాగ మరోగడ్డిపరకను అందుకొనడం అదే పద్ధతి. అందుకనే 194 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

నేను గోర్కీ విశ్చవిద్యాలయంలో శా(స్తాలను తృణజలూకా న్యాయంగా అభ్యసించాను అని అంటున్నాను. అంటే నాది స్వయం గురు, స్వయం శివ్య విద్యా పద్దతి. ఆ పద్హతినే తృణ జలూకా న్యాయం అంటారు తర్కశా(స్త పండితులు. నా పతనోత్థాన బంధుర పదాన యాత్రకు కారణం అది.

నేను నిరీశ్వరవాదిని. భౌదికవాదిని కూడా. ఈ రెండింటిని ఒకరి నుంచే నేర్చాను. అతడే శంకరాచార్యుడు. ఆతడి తత్వం నాలుగు మహావాక్యాల్లో వుందంటారు పెద్దలు. తత్వమసి. ఆయమాత్మా (బ్రహ్మ. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఆహం (బ్రహ్మాస్మి ఇవీ ఆ మహావాక్యాలు. ఆయన వాదం నుంచే నేను మరో మహావాక్య చతుష్టయాన్ని ఎంచుకున్నాను. అవి అవిద్య, (భ్రాంతి, మాయ, మిధ్య. చారిత్రకంగా చూస్తే మన దేశాన దేవుడులేడు. క్రీస్తు శకం ప్రధమ సహస్రాబ్దిలోనే మనకు దేశవిజేతల ద్వారా దేవునితో పరిచయం కలిగింది.

పశ్చిమాసియా మ్రేచ్చభాషా కూటంలో మూడు ఏకేశ్ళర మతాలు పుట్టాయి. హీబ్రూ, అరమాయిక, అరబ్బీ భాషలు ఆ ఏకేశ్ళర మతాలకు జన్మనిచ్చాయి. అందులో అరబ్బీమతమయిన ఇస్లాంతో మన దేశానికి తొలి సంపర్కం కలిగింది. ఆ మ్రేచ్చ మతాలకు పరమసత్యం, చరమ గురువు లక్షణాలున్నాయి. సృష్ట్యాది నుంచీ దైవభావాలూ ఉన్నాయి. వాటిని చెప్పిన గురువులూ ఉన్నారు. కాగా మ్లేచ్చకూటాలూ వర్షించిందే పరమసత్యం, దాన్ని చెప్పిన వాడే చరమగురువు అని వారంటారు.

ఈ పరమ సత్యం చరమగురు కూటంలో పుట్టిన ఆఖరి మతం ఇస్లాం. ఆ మతం భారతీయ తాత్వికులను ఆకట్టుకుంది. దాని ఆధారంగా దక్షిణాదిన మూడు ఏకేశ్చరమతాలు పుట్టాయి. అవి వీరశైవం, వీరవైస్ణవం, మాధ్వం. శ్రైవానికి బసవేశ్వరుడే చరమగురుడు. శైవమే పరమసత్యం. బసవపురాణమే పవిత్ర (గ్రంధం. వీరవైష్ణవమే పరమసత్యం. ఆ సూరి రామానుజస్వామి చరమగురుడు. శ్రీ భాష్యం పవిత్ర (గ్రంథం. అలాగే ధ్వైతమే పరమ సత్యం. మధ్య్వాచార్యుడే చరమగురుడు.

మ్రేచ్చకూటాల్టోలాగానే మనవారు అనుసరించిన మతాల్లో వీరశాఖలు, సాధుశాఖలు కూడా వున్నాయి. మన వారికి ఆదర్శంగావున్న ఇస్లాంలోలాగ మహమ్మదు ప్రవక్తలాగ బసవేశ్వరుడు, రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు దైవవక్తలు. ఇందులో మ్రేచ్చమతాల్లాగే శైవం కన్నడాన్ని, వైష్ణవం తమిళాన్ని తమ మత భాషలుగా స్వీకరించాయి. ఒకనాడు వీరైవభాష తెలుగ్గా వుండేది. తరవాత అది కర్ణాటకాన్ని మతభాషూ స్వీకరించింది. దైవ (ప్రవక్తను వారు సబీ అంటే వీరునంబి అంటున్నారు. అది మ్లైచ్చ పదం.

శంకరుడు నిర్వచించిన భౌతిక వాదం ఏ రూపాన ఉంటుంది. అమ్మరూపొన వుంటుంది. లాటిన్లు అమ్మను “మాతర్‌ొ' అంటారు. ఇంగ్లీషు జర్మన్‌ భాషల్లో 'త'కారంలేదు. అందుకని దాన్ని వారు మేటర్‌ అంటారు. ఫారసీ ఆర్యభాషలో కూడా తకారం లేదు. అందుకని వారు మాదర్‌ అంటారు. ఆర్యభాషల్లో మాతర్‌ అంటే పదార్ధం అన్న అర్ధం వుంది. అందుకని శంకరుడు దేవుని అవిద్య అన్నాడు కాని దేవతను అనేక విధాల స్తుతించాడు. దేవుడు అవిద్యకాని దేవత అవిద్యకాదు ఆది కంటికి కనిపించే పదార్థం.

శాక్తతత్వం పశ్చిమాసియా నుంచి భారతదేశానికి వచ్చింది. పశ్చిమాసియాలో సుమేరు నాగరికత ఎనిమిది వేల సంవత్సరాల నాటిది అని చరిత్రకారులంటున్నారు. సుమేరులే తాలి వ్యవసాయకులని కూడా అంటున్నారు. వ్యవసాయం నుంచి రాజ్యం పుడుతుంది. సుమేరులో తొలుత నగర రాజ్యాలు తలెత్తాయి. నగర నిర్మాణానికి ముందు నగర నాయకి గుడిని కట్టేవారు. అది మనగుడి లాంటిది కాదు. మేరువు టవర్‌. నగరదేవత గర్భగుడి మేరువు మధ్య వుంటుంది.

రాంభట్ట కృష్ణమూర్తి సొాంతకథ అ 195

లలితాసహహ్ర నామాల్లో “సుమేరు శృంగ మధ్యస్ట్రా శ్రీమన్నగర నాయికా” అన్న పేరుంది. ఆ నాయకి సెచే నగరానికి పెట్టేవారు. నగరనాయిక దేవునిలాగ ఊహ కాదు. అది ప్రత్యక్షపదార్హం. చంద్రునికి పదహారు వళిలని మన పండితులంటూ వుంటారు. పాడ్యమినాడు కనిపించేది ఒక కళ. ఆ కళకే చంద్రకళ అని సేరు సుమేరులు చంద్రుని “నన్న” అంటారు చంద్రకళను ఇనన్న అంటారు. లలితాసహస్ర నామాలన్నీ ఆ ఇనన్న పేరులే శంకరాచార్యుని సౌందర్యలహరి తదితర దేవతాస్తోత్రాలు ఆ లలితవే ఇవి మ్రేచ్చ దేవునిలాగ “భావన” కాదు అలాగే ఆ దేవుని ఆదర్శంగా పుట్టిన మన త్రిమతాల్లో ఊహలు కావు పాడ్యమి నాటి ఆ ఒక్కకళ నూలుపోచలా వుంటుంది అందుకే అది కనబడగానే సాంప్రదాయకులు ఒక నూలుపోగును పైకి విసురుతారు. ఆ కళను తెలంగాణా జానపదులు “నన్నపోచ” అంటారు నన్న నల్ల అయింది వారి నోట. ఆ నన్నపోచను నేటికీ ఆదిజాంబవులు ఆరాధిస్తున్నారు. సింధు నాగరికత నిర్మాతలే తమను జాంబవులనుకుంటున్నారు. ఆ జాంబవుల నుంచే మన దేశానికి జంబూ ద్వీపమన్న పేరు వచ్చింది.

తెలుగునాట ఊరికో అమ్మవారు వుంటుంది. ఆ లెక్కన కొన్ని వేల అమ్మవార్డు తయారవుతారు. వీరంతా భిన్న దేవతలు కారు ఒకే దేవత భిన్ననామాలు అంతే. అసలు దేవత చంద్రకళ ప్రాక్చరిత కాలాన హీబ్రూలు బాల్‌ అన్న పేర ఆ దేవతను కొలిచేవారు హిట్టయిట్టు సిబిలిపేర ఆ దేవతను ఆరాధించేవారు. లాటిన్హు వీనసు అనే వారు, శ్రీకు ఆ(ఫ్రోడైట్‌ అనే వారు. శంబరులు సుక్క అన్నారు. వజ్రయాన బౌద్దులు తార అన్నారు సింధు నాగరిక విధ్వంసం తరవాత భారతీయార్యులు బాలాత్రిపుర సుందరి అన్నారు. ఇలాగ ఎన్ని పేరు మారినా మాత ఒక్కతే. ఈ మాతే బాలాజీ - వెంకటేశ్వరస్వామి అయింది,

గ్రీకు తాత్వికులూ, భారతీయ కణాదుడు పదార్థాన్ని అణువులుగా చూశారు. ఆధునిక భౌతికవాదులు కూడా పదార్థాన్ని అణువులుగానే భావిస్తున్నారు. వారు భావించే అణువులు నాలుగు. అవి ఘనం, జలం, వాయువు, ప్లాస్మా అనేవి, ప్లాస్మా అంటే జ్వాల, పశ్చిమాసియా అసుర వనిత “క్రపిలా” పంచభూత సిద్దాంతాన్ని ఆవిష్కరించింది. అవి - ఆకాశం, వాయువు, అగి, జలం, పృథ్వి. ఈ అయిదింటికీ పంచభూతాలు అని పేరు కపిలా సిద్దాంతానికి పంచభూత వాదం అని పేరు ఇవి అణువులుకాదు. మహాభూతాలు భూతం అంటే పుట్టినది అని అర్ధం

కాపిలతాత్వికులు పంచ మహాభూతాలతోపాటు మహాకాలం కూడా వుందంటారు. అంటే కాలం కూడా పదార్హమే అని వారి భావం. వాయువు కంటికి కానరాకున్నా త్వగింద్రియానికి గోచరిస్తుంది. ఆపైనున్లు మహాభూతం ఆకాశం. తెలుగు తాత్వికులు దాన్ని బైలు అంటారు. దానికి పైనున్న కాలం వ్యాఖ్యలకు అందదు కాని ఐన్‌స్టైన్‌ పండితుడు ఆకాశానికీ కాలానిక్సీ అవినాభావ సంబంధాన్ని గుర్తించాడు. కాగా ఆ సంబంధాన్ని పంచ మహాభూతతత్వాన్ని బోధించిన కపిలాయే గుర్తించింది.

ఆమె భూతవాదానికి ఇరవైనాలుగు తత్వాలున్నాయి. ఆ తత్వాల నెత్తిన ఆత్మని పెటి భూత దర్శన లక్షణాన్ని తారుమారు చేశారు పండితులు మూలతత్వానికి సాంఖ్యం అని పేరు. అది నిరిశ్వర తత్వం ఇరవైనాలుగు తత్వాల నెత్తిన ఆత్మను రుద్ది దానికి సేష్ళరసాంఖ్యం అని పేరుపెటారు. దానికే యోగం అని మరోపేరు. కపిలాభర్త పేరు ఆసురి, కుమారుని పేరు పంచళిఖుడు, అతడు నిరీశ్చర సాంఖ్యానికీ సంబంధించిన షష్టిక తంత్రం అన్న పుస్తకం రాశాడు. సాంఖ్యతత్వాన్ని గజిబిజి చేశారు పండితులు? పామరులు దాన్ని కాపాడుకుంటున్నారు.

న. 196 అ రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథధ

ఆత్మ అన్నది ఒక భావమే కాని పదార్ధం కాదు. మనలో పదార్థమూ వుంది. భావమూ ఉంది. అందువల్ల మనకూ సకల చరాచరాలకు మూలం ఏమిటి? భావమా, పదార్థమా అన్న 'ప్రళ్ళీ పుడుతుంది. ఆ ప్రళ్ళనే పండితులు తత్వశాస్త్ర మౌలిక ప్రళ్ళీ అంటారు, దానికి వచ్చే జవాబు భావన అంటే ఆ తత్వశాస్త్రం ఆధ్యాత్మికం అవుతుంది. ఆ 'ప్రళ్ళకు జవాబు భూతం అంటే అది అధిభూతం అవుతుంది. మొదటి జవాబు సత్యం అయితే మన శరీరంతోసహా ఈ విశ్ళమంతా భావన మాత్రమే అవుతుంది. మన పళ్ళకు రెండో జవాబు వస్తే ఈ చేతన జడ విశ్చమంతటికీ పదార్థమే మూలం అవుతుంది. అంటే విశ్చమంతా పొంచభౌతికమే కాని భావన కాదు అని తేలుతుంది. పదార్జాన్ని జడం అంటారు మన పండితులు. అలాగే భూమికి స్థిరా అని పేరుపెట్టారు. పదార్థం జడమూ కాదు. అది నిత్యచలన శీలం. చలనాన్ని ఇంగ్లీషులో మోషన్‌ అంటారు. మోషన్‌కు మనం గతి అని అనువదించుకుంటే మనకు తెలియకుండానే ఆ గతిమీదకు ఆత్మవచ్చి కూర్చుంటుంది. గతి సుగతి అవుతుందా దుర్గతి అవుతుందా అన్న ప్రళ్న ఉదయిస్తుంది, దొన్నుంచి పుణ్యపాపాలు పుట్టుకొస్తాయి. వీటితో భౌతిక వాదం రంగుమారి ఆధ్యాత్మిక కందకంలో పడిపోతుంది. మన దేశాన భూతవాదం పళ్చిమదేశాల్లో ఎగ్నాస్టిక్సు అనే వాదాలు చిరకాలంగా సాగుతున్నాయి. అవి రెండూ పాదార్థిక వాదాలు, అయినా అవి సమ(గ్రమయిన వాదాలు కావు. తత్వరూపం ఎలాంటిదయినా దాని శరీరవాదంతోపాటు జ్ఞానవాదం కూడా వుంటుంది. జ్ఞానం మూడు దశలుగా వుంటుంది. ఆ దళలు - ప్రత్యక్షం, తార్కికం, సామాజికార్థిక ఆచరణ. ఇందులో ప్రత్యక్ష జ్ఞానం ప్రాధమికం. దీన్నే ఇంద్రియజ్ఞానం అంటారు. ప్రత్యక్ష ప్రమాణం అని కూడా అంటారు. ఎగ్నాస్టక్సును మనం అజ్జేయవాదం అని అనువదించుకుంటున్నాం. అజ్జేయం అంటే ఇంక తెలుసుకొనదగ్గదేమీ లేదని అర్ధం. రెండోదయిన తార్కిక జ్ఞానానికి హేతువాదం అని పేరు కూడా వుంది. ప్రత్యక్ష జ్ఞాన, వైశాల్య గంభీరాలమీద ఆధారపడి వుంటుంది హేతువాదం. అందువల్ల అదికూడా సత్యమనిపించుకొనజాలదు. మూడోదళ సామాజికార్థికాచరణ. ఇది తర్కం వడబోసిన ప్రత్యక్షం లాంటిది. అందుకని సామాజికార్థిక జ్ఞానమే సత్యానికి గీటురాయి అంటారు కార్ష్‌మార్క్స్‌, లెనిన్లు, ఈ మూడుదశల్లోను నిగ్గుతేలిందే సత్యం, శంకరుని మహావాక్య చతుష్టయం లాగే మాయావాక్య చతుష్టయం కూడా వుంది. అది అవిద్య, భ్రాంతి, మిధ్య మాయ అనేవి. ఈ మాయా వాక్యచతుష్టయాన్ని మహావాక్య చతుష్టయానికి అన్నయించి చూస్తే మిగిలేది నాగార్జునుని తత్వమే. అంటే శూన్యం, కాని ప్రకృతి శూన్యాన్ని సహించదు. కనక ఆయన మహావాక్య చతుష్టయం కూడా మాయే అనుకోవలసి వుంటుంది. ఆత్మ అంటే తన అని అర్ధం. ఆత్మగౌరవం, ఆత్మకధ, ఆత్మసంతృప్తిలాంటి మాటల్లో ఆత్మకు తన అన్న అర్ధమే అతుకుతుంది. అంచాత ఆయన కూడా బుద్ధునిలాగే అనాత్మ వాది అనవలసి వుంటుంది. అయినప్పుడు రామానుజొాచార్యులనారు శంకరుని ప్రచ్చన్నబౌద్దుడు అనవలసిన అవసరంలేదు. అలాగే మదా చార్యులు నీలాటి రేవు భాష వాడాల్సిన అవసరం లేదు. శంకరుడు ఆర్యపదమే. ఆయన మాతర వాది. అంటే మెటీరియలిస్టు అని నిస్సంశయంగా చెప్పుకొనవచ్చును. పదార్డాన్ని విశ్లేషిస్తే నాలుగు అవస్థలు, మూడు శక్తి క్షేత్రాలు వున్నాయని స్పష్టం అవుతుంది. ఆ క్షేత్రాలు ఇవి - గురుత్వాకర్షణ శక్తి క్షేత్రం, విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం, తాప కేంద్రక శక్తి క్షేత్రం. ఇలాగ శక్తి పదార్థంలో వుంది కాని భావనలోనూ, మతాలలోనూ లేదు. విశ్వానికి బ్రహ్మాండం అని పేరు రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ త 197

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా ఆది మధ్యాంతరహితా అని అంటూ వుంటారు. నిజమే విశ్వానికి ఆది, మధ్య, అంతం అనేవి లేవు. ఆకాశం అనేది ఉన్న చోట పదార్ధం ఉండితీరుతుంది. పదార్ధంలేని చోట ఆకాళం కూడా వుండదు. (గ్రహాలు ఆత్మ ప్రదక్షణం, సూర్యప్రదక్షణం కూడా చేస్తూ వుంటాయి. సూర్యుని చుట్టూ తిరిగే (గ్రహాలకు ఉప(గ్రహాలు కూడా వున్నాయి. మన భూమికి ఉపగ్రహం చంద్రుడు. ఈ (గ్రహాప(గ్రహాలను కలుపుకుని దాన్ని సూర్యకుటుంబం అంటారు. కుటుంబంతో సహా సూర్యుడు ఆరుద్ర నక్షత్రం వైపు చండవేగంతో కదులుతున్నాడు.

ఆరుద్ర నక్షత్రం బడ్డీకొట్టు పిప్పర్మెంటు సీసాలాంటిదయితే, సూర్యకుటుంబం పిప్పర్మెంటులాంటిది. ఆరుద్ర సీసాలో ముప్పయి ఆరువేల సౌరకుటుంబం పిప్పర్మెంట్లు పుడతాయి. దీన్ని బట్టి విశ్చరూపం అర్థం అవుతుంది. మనం పాలపుంత అని చెప్పే గెలాక్సీల్లో కోట్టసంఖ్యలో నక్షత్రాలున్నాయి. వాటిలో ఆరుద్రలాంటివి లక్షల సంఖ్యలో వుంటాయి. చుక్కలకీ చుక్కలకీ మధ్యనున్న బయలును మన పూర్వులు అంతరిక్షం అన్నారు. ఆరుద్ర సంగతిని గుర్తుంచుకుంటే అంతరిక్ష వైశా్యమెంతో ఊహించవచ్చును. ఆ అంతరిక్షంలో భూతంలేని శూన్యం లేదు.

ఈ మహావిశ్వాన్ని మూడక్షరాల్లో వర్లిస్తూ వుంటారు మన వారు, ఆ అక్షరాలు మనందరికీ తెలిసినవే. అవే ప్రకృతి. మనం అంతరిక్షం నుంచి భూమికి దిగివస్తే సముద్రాలు, పర్వతాలు, అడవులు, ఎడారులు సకల జీవరాసులతో నిండి నిబిడీకృతమయివున్న ఈ భూగోళాన్ని ప్రకృతి అంటాం. ప్రాకృతమయిన ఈ భూగోళం ఆత్మ ప్రదక్షణం చేసుకుంటూ సూర్యునిచుట్టూ కూడా ప్రదక్షిణం చేస్తోంది. భూమి, ఆత్మ, 'ప్రదక్షిణానికి పట్టేకాలం ఒకరోజు. భూమికి ఉపగ్రహమయిన చంద్రుని ప్రదక్షిణకాలం ఒక నెల, చంద్రునితో భూమి సూర్య ప్రదక్షిణకాలం ఏడాది.

భూమి ఇంత వేగంతో తిరుగుతూ వుంటే కొండలు కూలిపోవా? సముద్రాలూ నదులు ఒలికిపోవా? అన్నప్రళ్ళలు వస్తాయి. నిజమే వస్తాయి. కన్యాశుల్కం నాటకంలో సారాపాక వెనకనున్న తోటలో ఇలాంటి ప్రశ్నా, సమాధానాలే జరిగాయి. నాటి వాకోవాక్యాలకు నేను బృహత్తోటోపనిషత్తు అని రాశాను. నేటి జనం ఆ స్టాయిలో లేరు. వీరు బాగా పెరిగిపోయారు. అందుకని ఆ 'ప్రశ్ళ్నలకు జవాబు అనవసరం. మన శాస్త్రాలు చెప్పినట్టు భూమి అచలంకాదు. అది సుజలా సుఫలాంతో పాటు సుచలాం కూడా,

(ప్రపంచ తాత్వికుల్లో అత్యధికులు భావవాదులు. కొద్దిమంది మాత్రమే భౌతిక వాదులు. మన దేశాన అతి ప్రాచీన కాలంలోనే భౌతిక తత్వం ప్రాచుర్యానికి వచ్చింది. అసలది పుట్టింది పశ్చిమాసియాలో. అందునా ఆ తత్వప్రయోక్త ఒక స్త్రీ, పళ్చిమాసియాలోనే తాలి వ్యవసాయ నాగరికత పుట్టింది కాని తరవాత ఎక్కువ మంది మ్లేచ్చ భాషా సంస్కృతులవారు ఆ దేశాన పెరిగారు. తరవాత ఆ తత్వం వేదకాలాన మనదేశానికి వచ్చింది. వేదరుషులూ, మ్లేచ్చులూ పశుపాలకులు. పశుపాలన సమాజంలో పశువులను మేపుటలో కాని పచనంలో కాని (స్త్రీలకు పనిలేదు.

అందువల్ల పళుపాలన, అన్న దాతృత్వం రెండూ పురుష బాధ్యతలయ్యాయి. దాంతో పురుషులకు అధిక్యతాభావం అంకురించింది. (స్త్రీలను వారు దాసీలుగా పరిగణించారు. అంచాత ఆరోజుల్లో పుట్టిన పాంచభౌతిక సిద్దాంతం అటు మ్రేచ్చులకూ ఇటు ఆర్యులకూ నచ్చలేదు. అది దాసీతత్వంగా మిగిలిపోయింది. అది తాలి భౌతిక తత్వం. అందునా పాంచభౌతికత నిర్మాత స్రీ అయినందున అక్కడా ఇక్కడా నిరాదరణ పాలయింది. అక్కడ దానికిపేరు కూడా లేదు. కాగా ఇక్కడ దాన్ని అటు తిప్పీ ఇటు తిప్పీ భావవాదంగా మార్చారు. పంచభూత తత్వక్రి (స్త్రీ అనీ, ఆమె పశ్చిమాసియాదనీ నేననడంలేదు,

198 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

(1 ల్ల ! గ ఆనీ న్‌ మనిషి నిటారుగా నిలవగలగడం ఒక ఎవిన్హవం. మనిషి తన భావాలను భా ద్వారా తెలియచేయగలగడం ఇంకొక ఎన్లవం, వస్త్రధారణ అవనరమ*। ఆలోచించడం మరో విన్లవం. (ప్రాఠ్టర్విత యుగాల్లో మనిషి సాధించిన విన్హవాల కోకొల్లలు. ఖాద్య, అఖాద్య వన్తు నిర్ణయం మరో విస్సవం. ఇలా చూస్తూపోళ మానవ చరిత అంతా ఎఐిన్లవాల మయం అని మనకు అర్థం అవుతుంది. ానీనాాంనమీమోాా అద్వయవాదం డయళెక్టిక్సు భారత తాత్వికులకు కూడా తెలుసును అనిపిస్తుంది. డయలెక్టిక్సు భావవాదానికీ, భౌతిక వాదానికీ కూడా అన్వయిస్తాయి. డయలెక్టిక్సు సూత్రాలను కనిపెట్టిన తాలి తాత్వికుడు హెగెల్‌ అని అంటాడు కార్ష్‌మార్క్స్‌, అయితే ఆయన డయలెక్టిక్సును భావవాదానికి అనువర్తించాడు. ఆ డయలెక్టికల్‌ సూత్రాలను భౌతికవాదానికి అన్నయించారు మార్క్స్‌, 'ఎంగెల్పు'. లెనిన్ను “డయ” అన్నది (గ్రీకు పదం. సంస్కృతంలో అది “ద్వయ” అవుతుంది. మన దేశాన డయలెక్టిక్సు తెలిసిన తాత్వికుడు బుద్దుడు. మన వాళ్ళు డయలెక్టిక్సును అదయవాదం అన్నారు, మన దేశాన మార్క్సిస్టు భావాలు నాలుగో దళకంలో పెరిగాయి. అప్పుడు వారు భౌతికవాదాన్ని నేర్చుకొనడం మొదలుపెట్టారు. పదార్హం నిరంతర చలన శీలం. ఆ చలనాన్ని అవగతం చేసుకొనడానికి మూడు డయలెక్షికల్‌ సూత్రాలు ఉన్నాయి. కనక ఆనాడు నిరంతర చలనశీల పదార్జాన్నీ దాని సూత్రాలను గతితర్కం అని అనువదించారు. గతి అన్నమాటకు మన దేశాన చాలా ఆర్జాలున్నాయి. భావవాదం నుంచి పుట్టిన మాటలూ అర్జాలు అవి. ఏమయినా బుద్దుని ప్రతీత్య పునరుత్పాదన అన్న సూత్రం డయలెక్షిక్సును సూచిస్తుంది. అందువల్ల డయలెక్టీషియన్‌ అన్న అర్థంలో బుద్దునికి ఆద్వయవాది అన్న పేరు వచ్చింది. కనక డయలెక్షిక్సును నేను అద్దయవాదం అంటాను. “ఏకతను పరస్పర విరోధాంశాలుగా విడదీసి ఆ విరోధాల ద్వారా ఏకతను చూడ్డమే డయలెక్టిక్సు సారం, హృదయం, ఆత్మ” అని లెనిన్‌ అంటాడు. అంటే రెండు అంశాలు పరస్పరం సంఘర్షించినా అవి రెండు కావు, నిజానికి ఒకటే అని లెనిన్‌ నిర్భ్చచన సారం. అందువల్ల రెండుగా కనిపించినా అవి రెండుకాదు ఒక్కటే అని చెప్పడానికి ఆద్వయం అన్నమాటను మన తాత్వికులు వాడుతూ ఉంటారు. బుద్దుడు అద్వయవాది, అలాగే శంకరుడు కూడా అద్వయవాది. రాంభట్ల కృష్ణమూర్తి సొాంతకథ అ 199

భావవాదాన్ని నాగార్జునుడు శూన్యవాదం అంటే, శంకరుడు ఆత్మను అవిద్య, (భ్రాంతి, మాయ, మిధ్య అని నాలుగు వాక్యాలతో కొట్టెపారెస శక్తితత్వం పేర భౌతిక వాదాన్ని సమర్థించాడు. నాగార్జునుడు తేటమాటల్లో భావవాదాన్ని సూన్యం అంటే శంకరుడు సెల్ఫ్‌ సైకో ఎనాలిసిస్‌ ద్వారా భావవాద అవిద్య, భ్రాంతి, మాయ, మిథ్యలను తొలగించి తాత్వికులను భౌతికవాదం వైపునకు మళ్లించాడని నా అభిప్రాయం. అందుకనే నిరీశ్చర భౌతికవాదాలు రెండూ శంకరుని నుంచే నేర్చుకున్నానని చెప్పుకున్నాను. అలాగ జటిలమయిన తాత్విక సమస్యలను అర్ధం చేసుకొనగలుగుతున్నాను.

సోషలిస్టు సోవియట్‌ సమాఖ్య అవతరించిన తొలిరోజుల్లో ఐక్యత, సంఘర్షణ అన్న న్యాయం

('ప్రధమన్యాయంగా వుండేది. అద్వయవాదానికి అది గుండెకాయలాంటిదని లెనిన్‌ నిర్వచించాడు. కనక మావో సెతుంగ్‌ వైరుధ్య సూత్రాన్నే ప్రధానంగా తీసుకుని వైరుధ్యాలమీద అని ఒక పుస్తకం రాశాడు. 1942లో కొమిటాంగ్‌ ప్రభుత్వం మీద విజయం సాధించాడు మావో. 1951లో ఆ పుస్తకం మా చేతికి వచ్చింది. కమ్యూనిస్టులకు ఒక (ప్రత్యేక మాండలికం ఏర్పడింది. ఆ మాండలికం నాకు రాదు. పుస్తకం చదివాను కాని అనువాదం చేయ'లేను' అని తప్పించుకున్నాను.

వైరుధ్యం మౌలికం - అమౌలికం, అంతరంగం- బహిరంగం, శాత్రవం - అశాత్రవం అని ఇలా వైరుధ్యాన్ని బహుధావర్లీకరిస్తాడాయన. ఈ వర్గీకరణ మనదేశ తాత్వికుల వర్గీకరణంలా అనిపించింది.

చైనా కూడా మనలాగ తూర్పుఖండం అంటే ఆసియా దేశమేకదా, పోలికలు ఎక్కడికి పోతాయి. అవి కమ్యూనిస్టు పార్టీమీద నిర్బంధం రోజులు, నేను మద్రాసులో సందేశం అన్న కవరు పత్రికలో పనిచేస్తున్నానప్పుడు. పార్టీలో చేరడానికి ముందు రాజకీయ పారళాలల్లో శిక్షణ పొందాలి.

అలాంటి శిక్షణ నాకెవరూ ఏనాడూ ఇవ్వలేదు. కనీసం అలాంటి శిక్షణ పొందివుంటే కమ్యూనిస్టు

మాండలికం ఇంతో అంతో తెలిసివుండేది. పార్టీలో నాకు యాభైయేళ్లు దాటాయి. అనేక రాజకీయ పారశాలల్లో మార్క్సిస్టు తత్వశాస్త్రం, భారతీయ తత్వశా(స్తాలమీద పాఠాలు చెబుతూ వచ్చాను. ఆ పారాలు నాకు తెలిసిన జర్నలిస్టు భాషలోనే చెబుతూ వచ్చాను. నేనొక వ్యంగ్య నవలను తెనిగించినప్పుడు పార్టీ మాండలికం ఒకటి ఉందని తెలిసింది. ఆ నవల్లో లెస్సెజ్‌ ఫెయిర్‌ అన్న (ఫ్రెంచి మాట వచ్చింది. దాన్ని నేను చిత్తానుసార వ్యాపారం అని అనువదించాను. అది చూసిన ఒక వృద్ద నాయకుడు హిహి అని ఈసడించాడు. దాన్ని స్వేచ్చా వాణిజ్యం అనాలట,. | అదయవాదం ప్రకృతికీ, సమాజానికీ, వ్యక్తి చైతన్యానికీ కూడా వర్తిస్తుంది. అంతేకాదు మానవ చరిత్ర అవగాహనను కూడా సుగమం చేస్తుంది అంటారు. వైరుధ్యాలను కనిపెట్టడం కోసం ఏకతను అంటే వ్యక్తిని నిలువునా గొడ్డలితో చీల్చడం కాదు. అతడి సామాజిక చైతన్యంలోగల వైరుధ్యాన్ని చూడాలి. అంటే ఆతడిలోనే ఒక అంశం మీద అనుకూల, ప్రతికూల భావాల సంఘర్షణను గమనించాలి. పూర్వం రుషులు ఇలాంటి సంఘర్షణనే తపస్సు అనేవారు.

ఈ సంఘర్షణ ఎలా సాగుతుంతో ఏ దశలో ఆ సంఘర్షణ ఆగుతుందో తెలుసుకొనడానికి ఒక చారిత్రక సమస్యను తీసుకుని చర్చిద్దాం. వానరుడు నరుడుగా ఆవతరించడానికి ముందు వానరుడు తన కరచరణాలతో అన్నం కోసం ప్రకృతితో ఘర్షణ పడ్డాడు. ఆ ఘర్షణతో గొంతు ముడివిడివడింది. మూగికేకలు మాటలుగా మారాయి, వానరుడు నరునిగా మారడంలో కర్మపాత్ర అని ఎంగెల్సు ఓ వ్యాసం రాశాడు. కర్మ అంటే లేబరు అని అర్ధం. నరావతారం తాలిదళకు శావేజి మహాదళ అని పేరు. ఆ మహాదళ ద్వితీయాంతర్హశ ప్రారంభం వరకు గణ వివాహాలుండేవి.

200 తి రాంభట్ల కృష్ణమూర్తి సొాంతకథ

అన్నతవకు గద నరుములు ఆలుమగలుగానే వ్యవహరించేవారు. ద్వితీయాంతరంలో శకుని తినేవారు. ఆ దశలోనే వారు భూభ్రమణం చేశారు. రకరకాల గణాలతో సంబంధాలేర్పడ్డాయి. ఒక గణంలో వున్న స్రీ పురుషులు, అన్నా చెల్లెళ్లు. వారి మధ్య మనువు నిషెధించారు గణమాతలు. ఈ నిషేధానికి ముందు గణమాతలు గణ(భ్రాతల్లో ఎంతో ఘర్షణ జరిగింది. ఆ సంఘర్షణ ఫలితమే గణ వివాహాల నిషేధం. నిషేధంతో సమస్య పరిష్కారం కాలేదు. మళ్లీ సంఘర్షణ. నిషేధ పాలనకోసం కొన్ని గణాల కలయికతో (భ్రాత్రం పుట్టుక (భ్రాత్రంలో కూడిన గణాలూ, కూడని గణాలూ వుండేవి. గణాలు, స్తావరాలు కూడిన గణాల్లోని పురుషు లంధరూ మరో కూడిన గణంలోకి అల్టురికం వెళ్ళేవారు. గణకాంతలందరికీ ఆ గణపురుషులు అన్నలు. చెల్లెళ్లను పోషించవలసిన బాధ్యత అన్నలది. గణాలకు అల్టురికంగా వెళ్లిన పురుషులకు అక్కడే పడకా, భోజనం. కాని వారు కూడా మించి అన్న సంపాదన చేయాలి. ఈ అన్నం తమ చెల్లెళ్లకోసం అంటే తమ పుట్టుకగణానికి వెళుతుంది. ఈ కర్మలను, సంబంధాలను నిర్ణయించి అమలు జరపడం కోసం ఎంత సంఘర్షణ ఎంతకాలం జరిగి వుంటుందో ఇప్పుడు ఊహించడం సాధ్యం కాదు. సంఘర్షణ | వ్యక్తిలో తపస్సు రూపంలో వుంటుంది. సమాజంలో రెండు బృందాల రూపంలో వుంటుంది. నేటి రాజకీయాల్లో సంఘర్షణ రెండుపార్టీల రూపంలో వుంటుంది. కాని నేడు మార్క్సిస్టులకు అద్వయవాదం బొత్తిగా తెలియదు. తెలిసివుంటే మూడో (ఫ్రంటుకోసం అంగలార్చేవారు కాదు. అంతేకాదు ఆ పెద్దలే సింగిల్‌ పోల్‌ అన్న మాటను కూడా వాడుతున్నారు. భౌతికశాస్త్రంలో ఓనమాలు కూడా ఎరగనివారే ఏక[ర్రువం అన్న మాటను నిస్సంకోచంగా వాడగలుగుతారు. ఇదివరకు నంనుర్షణను ఏకత నుంచి వేరుచేయగలమన్నట్టుగా మాట్లాడుతూ వుండేవారు. సమైక్యత, సంఘర్షణ న్యాయానికి ఉదాహరణగా విమర్శ, ఆత్మ విమర్శ అన్న జవాబిస్తూ వుండేవారు కమ్యూనిస్టు నాయకులు. నాకు తెలిసినంతవరకు ఈ విమర్శా ఆత్మ విమర్శా ప్రతి సమావేశంలోనూ జరిగేది. తరవాత నాయకులు కేడర్ని “ఆత్మవిమర్శ” చేసి పారేసేవారు. విమర్శ అంటే పైపైన ఒకటి రెండు నిర్షయాలను ప్రస్తావించుకుని సభను ముగించుకునేవారు. "అంతేకాదు రాజకీయ పాఠశాలలు కూడా అరుదయ్యాయి. ఈ పరిస్థితి పార్టీ ఎదుగుదలను సూచిస్తోందా? తరుగుదలను సూచిస్తోందా? ఏమయినా కేడరును ఎడ్యుకేట్‌ చేసే పద్దతిలో లోపం ఉంది. మహాభారత యుద్దంలో ఆనాటి చిన్నా చితకా పాలకులందరూ నాటి కౌరవపాండవ కూటాల్లో సర్దుకున్నారు. కమ్యూనిస్టు నాయకులు చాలా కాలం నుంచీ రెండు పార్టీలను శత్రువులుగా భావిస్తూ వస్తున్నారు. ఇద్దరుంటే ఆది యుద్దం. ముగ్గురు అంతకన్నా ఎక్కువుంటే అది యుద్ధం కాదు దొమ్మీ అవుతుంది. సరేకాని ఆ దొమ్మీ భాగస్వాములు ఎవరు? దామ్మీలో భాగస్వాములు వుండరు. ఆ సత్యాన్ని వామపక్ష నాయకులు గుర్తించలేకపోతున్నారు. లేకపోతున్నారనే కన్న గుర్తించనొల్లరు అనడం సబబనుకుంటాను, వారి తత్వం టైలెక్టిక్సు అయివుంటుంది. అభివృద్దికి ఆధారం ఆద్వయవాదం. తపస్సుకు ఒక్కడు చదువుకు ఇద్దరు కావాలి అంటారు పెద్దలు. పురాణాలు తపస్సు అన్నమాటకు విపరీత అర్జాలు చెప్పాయి. మనిషికి ఆహార ని(ద్రాభయాదులు కావాలి, ఆ సంగతిని శాస్త్రాలన్నీ బోధిస్తాయి. తపస్సుదగ్గరకు వచ్చేటప్పటికి తపస్సు నెలలు, సంవత్సరాలు సాగుతుందంటారు. ఓ చెట్టుకింద కూర్చుని తపస్సుచేసుకుంటూ వుంటే శతాబ్దాలూ, సహశస్రాబ్బాలు రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 201

గడిచిపోయాయంటారు. కొందరు పసుల చుట్టూ పుట్ట మొలుస్తుందని అంటారు. రుషికి ఆహార అవసరంలేదు కాని పుట్టలు పెట్టే చీమలకు ఆహారం కావాలే అదెలా వస్తుంది, 0 రుషులు కూడా శర ధారులే. మరి వారికి ఆహార నిద్రాదులు ఎలా తీరుతాయి? తపశ్నిలను దుళింది వారాణాలు బెప్బి అతిశయోక్తులను అటుంచితే అసలు తపస్సంటే ఏమిటో తెలుసుకు. తపన, తపస్సు అంటే ఆలోచన బుర్రను వేడెక్కించడం, మనసును మధించడం, ఆ పనికి సంస్కృతంలోనూ. ఇంస్టీసులోను ఉన్న పేర్లలా వుంచి ఆలోచిస్తే ఆ ఆలోచనకు సమాధానం అద్వయవాదం ద్వారానే డారుకుతుంది. తనలో తానే ఒక సమస్య మీద మధన పడుతూ ఉండడానికే తపస్సు అని పేరు. పలువురి ఆలోచనలలో చేసే మధనానికి రాజకీయ మంత్రాంగం అని పేరు, మంటత్రాలోచనకు బహిరంగ సలాలు ఉత్తమం. న ఈ మధనం, ఈతపస్సు ద్వారానే మేధావులు ప్రకృతి పదార్థ రసాయన రహస్యాలనెన్నింటినో ఆవిష్క రించారు. అలాంటి ఆవిష్కరణల ద్వారానే సమాజం పెరుగుతూ వస్తోంది. సమాజ సంస్కృతుల పెరుగుదట వెదురు బొంగులాగ నిటారుగా సాగదు. సమాజం, సంస్కృతులు శంఖ వృత్తాల్లా పెరుగుతాయంటుంది అ ద్వయవాదం. చిన్న మండలం వ్యాసాన్ని ఎత్తునూ పెంచుకుంటూ పైకి ఎలా వెళుతుందో ఊహించుకుంటే దానికే శంఖవృత్తం అని పేరు. మన అభివృద్ది ఇదే విధంగా పెరుగుతుంది. ఆంటే పెరుగుదల ఘంటస్తంభంలా వుంటుందని కాదు. పూర్వం సుమేరులు, మేరువులను అంటే టవర్సును నిర్మించేవారు. ఆ మేరువులు కింద విశాలంగాను ఎత్తుగాను వుండేవి. పోనుపోను వైశాల్యము ఎత్తు తగ్గుతూ వచ్చేది. ఈ మేరువునే బైబిలు టవర్‌ ఆఫ్‌ బాబిల్‌ అంది. సామాజికాభివృద్ధి శంఖ మేరువు. ఈ మేరువుకు తలకిందుగా వుంటుంది. కింద వైశాల్యం ఎత్తూ తక్కువగా వుండి పోను పోను వైశాల్యం ఎత్తూ పెరుగుతూ వుంటుంది. అదీ సామాజిక శంఖ వృత్తం. సమాజం ఏకాండి కాదు. అది పొరలు పొరలుగా వుంటుంది. ఇది వర్గ సమాజం కనక ఆ పొరల్లో మత్స్యన్యాయం వుంటుంది. వుండి తీరుతుంది. ఇలాగ ఈ పారలమధ్య జరిగే సంఘర్షణ ద్వారా సమాజాన్ని చూడగలగడమే అదయవాదం. ఏకతా పరస్పర సంఘర్షణ న్యాయం అద్వయవాదంలో ఒకటి, నేలమీద పడిన విత్తనం మొలకెత్తిన దగ్గరనుంచీ సంఘర్షణ సాగిస్తూ వుంటుంది. ఆహార సంపొదన కోసం వేళ్లు లోలోపలికి వెళుతూ వుంటాయి. పైన పుట్టిన ఆకులు క్లోరోఫిల్‌ ద్వారా సూర్యరస్మిని తింటూ వుంటాయి. నిజానికిది ఆ మొక్క అభివృద్ధి సంఘర్షణ, ఘర్షణ అంటే ముష్టి ఘాతాలూ, కర్రదెబ్బలు అన్న అర్ధం కాదు. మనిషిలోలాగే మొక్కల్లో కూడా పెరగడానికి పెనుగులాట. శిశువు భూపతనమయిన నాటినుంచీ గురుత్వాకర్షణ శక్తితో పెనుగులాట. వర్గసమాజంలో ఎక్కడికక్కడ వర్షసంఘర్షణలు సాగుతూనే వుంటాయి. సంఘర్షణ పదార్థ లక్షణం. వర్గం సమాజ లక్షణం, వర్గ సంఘర్షణ పరిష్కారం అయినా సంఘర్షణ ఆగదు. ఆ సంఘర్షణ రంగం మారుతుంది. మనిష్షి పుట్టి పదిలక్షల సంవత్సరాలయింది అంటారు శాస్త్రవేత్తలు, ఆందులో ఎనిమిదిలక్షల సంవత్సరాల అనుభవంలోంచి దైవ భావాలు, పురాణ కథా బీజాలు పుట్టాయంటాడు మార్క్సు. ఈ కొలమంతా ఆదిమ కమ్యూనిస్టు దశలో వుంది సమాజం, చేతనయినంత శ్రమ, అవసరమైనంత అనుభవం ఇదీ కమ్యూనిస్ట్ర మనుగడ్ర సూత్రం. | పదివేలేళ్లకిందట సమాజంలో వర్గాలు పుట్టేవరకు గణసమాజమే వుండేది. తరువాత ఆసియాక సమాజం, 202 అ రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ

ఆ సమాజంలోనే వర్ల భావాలు పెరిగాయి. వర్గభావాలు పక్షమై దాస సమాజం అంటే బానిస సమాజం అవతరించింది. ఆ సమాజం తరవాత ప్యూడల్‌ సమాజం, పెట్టుబడి దారీ సమాజాలు వచ్చాయి. పెట్టుబడి దారీ సమాజంమీద విజయం సాధించిన రష్యాలో సోషలిస్టు సమాజం పుట్టి ఏడు దశాబ్దాలపాటు సాగింది. అక్కడిప్పుడు సోషలిజం లేదు. సమాజం వుంది. దానికి రాజకీయులు ఏం పేరు పెడతారో తెలీదు.

లక్షల సంవత్సరాలుగా జనంలో సమేకత, సంఘర్షణ న్యాయానుసారమే సమాజం మారుతూ వచ్చింది. సమేకత, సంఘర్షణ అనేవి రెండుగా అనిపిస్తున్నాయి కాని అవి రెండుకావు ఒకటే. ఈ సంగతి తెలియని కమ్యూనిస్టు పెద్దలు నిన్నటి వరకూ కాంగ్రెసుతో సమేకతను సాధించాం. నేటి నుంచీ మనం సంఘర్షణకు దిగాలి అని తీద్మానించారు. సమైక్యత (యూనిటీ) అంటే సహకారం అన్న (భ్రమవల్ల చేసినది ఆ తీర్మానం. ఇంగ్రీషులో యూనిటీ అంటే సహకారంలాంటి అర్ధం వుంది. అందుకని లెనిన్‌ “యూనికొ' అన్నాడు.

స్పిట్‌ ఆఫ్‌ ద యూనిక్‌ ఇన్‌ టు మ్యూచువలీ కాంట్రడిక్షరీ ఏస్పెక్ట్‌ అంటాడు. సంఘర్షణ అభివృద్ధి లక్షణం. రాజకీయాల్లో అంటరానితనం ఉండదు. ఉండకూడదు. అంటరానితనం పాటించేవారు క్రమంగా మరుగుజ్ఞుగా మారుతారే కాని వారిలో ఎదుగుదల వుండదు. దూరంగా వుండి తమ పవిత్రతను కాపొడుకొనవచ్చుననుకొనడం అవిద్య. అలా అనుకుని మడికట్టుకున్న వారు ఎదుగూ బొదుగూ లేక కుబ్బులూ కూష్మాండుల్లా మారిన వారు మనకు కనిపిస్తూనే వున్నారు. అలాంటివారు శారీరక మానసిక శక్తుల్ని (క్రమంగా కోల్పోవడం తథ్యం.

నా చిన్నతనంలో ఎ(ర్రగొల్లలనే భాగవతులుండేవారు. వారు రాత్రిపూట కాగడాల వెలుతురులో భాగవతం కట్టేవారు. వారు పిండోత్పత్తి క్రమం వివరించేవారు. మధ్యమధ్య హాస్యానికి పురాణకథలకు వ్యాఖ్యానాలు చేసేవారు. మనకు సృష్టి స్టితిలయాలకు ముగ్గురు దేవుళ్లున్నారు. అందులో (బ్రహ్మ సృష్టికర్త. సృష్టికి పూర్వం పాలసముద్రంలో నిద్రపోతూ వుండేవాడు విష్ణువు. విష్ణువంటే ఎవరు కృష్ణమూర్తేకద. కృష్ణమూర్తి మా ఎర్రిగొల్లోడే కద! విష్ణుమూర్తి బొడ్డులోంచి ఒక తామరకాడ లేచింది. పువ్వుపూచింది.

ఆ పువ్వులోంచి పుట్టాడు బ్రహ్మ. విష్ణుమూర్తి కొడుకు బ్రహ్మ. బ్రహ్మ అంటే ఎర్రిగొల్లేడేకద. ఆయన నోట్లోంచి, చేతుల్లోంచి, తాడల్లోంచి, పాదాల్గోంచి పుట్టిన బ్యామ్మర్జు, రాజులు, కోమట్టు, కాపులు మా ఎర్రిగొల్లేశ్లే కదా! గొల్లోనికి పుట్టిన గొల్టోళ్లే ఈ ప్రపంచమంతా. అయినప్పుడు మేం గొప్పంటే మేం గొప్ప అని కాట్లాడుతారెందుకు. ఈ (ప్రపంచమంతా ఒకటే కులం. వారే ఎర్రిగొల్లోళ్లు. అందర్నీ పుట్టించిన వాడు (బ్రహ్మ అనుకున్న వాళ్లు ఎర్రిగొల్లలు కాక మరేమవుతారు? అని ప్రశ్నిస్తారు.

తరవాత పిండోత్పత్తి (క్రమం వివరిస్తారు. దంపతుల శుడక్రశోణితాలు కలిపిన తాలివారం అది చింతపండుగుజ్ఞు, 'పెరుగులా వుంటుంది. ఈ గుజ్జు దినదినమూ మారుతూ తొమ్మిదినెలల తరవాత పిల్లవాడిని (ప్రసవిస్తుంది అంటారు. చింతపండు గుజ్జులా వున్న ఈ పిండం వారం వారం ఏరూపాన మారుతూ వస్తుందో వివరిస్తారు. పిండోత్పత్తి క్రమం ఎరగని వారు సృష్టి అంతా (బ్రహ్మ దేవుడే చేసేడన్సి భ్రమ పడుతూ వుంటారు అనివారు చెబుతారు. నా చిన్నతనంలో విశాఖ జిల్హా కుగ్రామంలో విన్న ఎ(ర్రగాల్ల భాగవతం యిది.

అద్వయ సూత్రాల్లో మరొకదాని పేరు “రాసిగుణ పరిణామ విపరిణామం”. గర్భంలో కలిసిన శుక్రసోణిత బిందువులు ఏయే రూపాలు మారుతూ పెరుగుతుందో తెలీదు. కాని తొమ్మిది నెలలు నిండిన తరవాత శిశువు పుడతాడని తెలుసును. భూపతనమై (క్రమక్రమంగా పెరుగుతూ యువకుడవుతాడు,

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 203

ఆ యువకుడు ఆనురూపవతి అయిన కన్యను మనువాడుతాడు. ఆ దంపతులు సృష్టి ప్రారంభిస్తారు. ఈ సృష్టి చక్రం ఇలా సాగుతూనే వుంటుంది అని పిండోత్పత్తిపేర సృష్టి (క్రమాన్ని వివరిస్తారు.

ఈ అద్వయసూత్రానికి విష్ణవ సూత్రం అనికూడా పేరుంది. ఈ సూత్రానికి సంతృప్తికరమయిన వివరణ ఇక్కడి కమ్యూనిస్టు నాయకుల దగ్గర దొరకలేదు. మాస్కోలో రష్యన్‌ తత్వశాస్త్రవేత్తల దగ్గరా దొరకలేదు. కాగా మన పురాణాల్లో ఒక ఉదాహరణ కనిపిస్తుంది. పాపం పెరిగిపోయినప్పుడు భూదేవి గోరూపాన విష్ణుదేవుని దగ్గరకు వెళుతుంది. భూదేవి గోరూపం ధరించనక్కరలేదు. గో అంటే భూమి అన్న అర్ధం వుంది. అప్పుడు విష్ణువు గోవును చూసి పాపం ఇంకా పరిపక్వం కాలేదంటాడు.

ప్రతీ రాసికీ ఓ పక్షదళ వుంది. ఆ దశ వస్తే తప్ప గుణపరిణామం రాదు. అందుకని విష్ణువు ఆ మాట అన్నాడు. గోదేవి పాపభారం మోయలేననలేద్దు పాపం పక్సం అయేవరకు ఓపికపట్టమని విష్ణువు అనలేదు, అద్వయం వాదం తెలిసిన పౌరాణికులు ఈ కథను కల్పించారు. పౌరాణికులకు రాసి గుణ పరిణామ విపరిణామ సూత్రం తెలుసునని ఈ ఉదంతాన్ని బట్టి వ్యక్తం అవుతుంది. ప్రాకృశ్చిమ ఖండాలకు చిరకాలంగా ఆదాన ్రదానాలున్నాయి. ఇరువురిదీ ఆర్య భాషే సంస్కృతికి వాహిక భాష వాతావరణం మాత్రం వేరు.

రష్యాలో రాసి పక్సదశకు చేరిందని లెనిన్‌ (గ్రహించాడు. ఈ రోజు తొందరపాటు, రేపు ఆలస్యం అవుతుంది కనక ఈ రాత్రే కార్యరంగానికి దిగండి అంటాడు. రష్యన్‌ విష్ణవం కూడా రాసి గుణ పరిణామ విపరిణామ సూత్రానుసారమే జరిగింది. మహా మహావాళ్లనే తికమక పెట్టింది ఈసూత్రం. రష్యా విప్లవంతో ఈ సూత్రం పూర్తి అవగాహనకు వచ్చింది. అభివృద్ధి ఎప్పుడూ పైపైకే పెరుగుతుంది. కాని కిందికి రాదు అని కమ్యూనిస్టు పండితులంటూ వుంటారు. లెనిన్‌ కూడా శంఖవృత్తం సంగతి చెప్పాడే కాని ఆ సూత్రంలోని విపరిణామం సంగతి చెప్పలేదు.

విష్ణవం ద్వారా పుట్టిన సోషలిస్టు పాలన ఏడుదశాబ్దాలపాటు అప్రతిహతంగా సాగింది. ఆ తరవాత రాసిలో తగ్గుదల మొదలయి తదనుకూల పరిణామం అవతరించింది. రాచరికపు రష్యా, సోషలిస్టు రష్యాల

ట్‌ ఉత్చాన పతనాలను స్పష్టంగా వివరిస్తూంది ఈ విష్ణవసూ(త్రం. కమ్యూనిస్టు పండితులు గుణ పరిణామాన్ని మాత్రమే ఆవగాహన చేసుకొనగలిగారు. కాని మనకు తెలియకుండా జరిగిన రాసి పరిణామాన్ని చూడలేకపోయారు.

నేటి పెద్ద పెద్ద ఎడారులు ఆదినుంచీ అలాలేవు, ఒకనాడా భూములు అడవులతోనూ, కేదారాల తోను నిండివుండేవని భూచరిత్రకారులంటున్నారు. పశ్చిమాసియాలో స్పమేరుక్తు ఉత్తరాన ఒక చిన్న ఎడారివుంది

44 87 క్ష దానిపేరు ఈడెన్‌. ఒకనాడది పేరునుబట్టి “ఏదేను” తోట అయివుంటుంది. ఇప్పుడది తేళ్ళు, మం (డ్రగబ్బలకు రక్షణనిచ్చే ఎడారి. ఒకనాడు ఆసియా, యూరపులకన్నా పెద్దదిగా ఉండిన పసిఫిక్‌ ఖండం హీమనదాల వల్ల సముద్రంగా మారింది. ఆ ఖండంలోని పర్వతాలు నేడు పసిఫిక్‌ దీవులుగా మిగిలాయి.

బర్బ్చర ద్వితీయాంతరంలో ఆవల అనుభవంతో పందుల దుక్కి అయిన తరవాత వాటిని అడవులకు ల యకుపోయేవారు. తరవాత పందిధుక్కి భూముల్లో విత్తనాలు నాటేవారు. పంటకోసుకున్న తరవాత అడవుల ప 4 రా క పందులను. జ వడు టా వా వః త శు ఎరుకలవార్తు అంటున్నాం. సంపాదన చేస్తారు 2 ర్వ ॥ వ్‌ 4 క్‌ స్టే కట్టుకుంటారు. వారిలో స్రీలు అన్న

రారు. పురుషులు పిల్లలను ఆడిస్తారు. (ప్రల వృత్తి సోది చెప్పడం. వారి చువ్వలగూడును 204 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

అనుకరిస్తూ ఆజంటా గుహలు మలిచారు. (వేల సంవత్సరాలనుంచీ ఎరుకల బతుకుల్లో మార్పు రాలేదు. నేటికీ వారు గణదశలోనే కనిపిస్తారు. నిజానికి ఎరుకలవారు తాలి వ్యవసాయదారులు, పండితులనే సంస్కృతి ఎరుకల వారకి లేదు. కాని బౌద్ద గుహలు మలచడానికి ఎరుకల గుహలే ఆదర్భంగా నిలిచాయన్న సత్యాన్ని అంగీకరించక తప్పదు. అలాగే ఎరుకల సోదె పురాణాలకూ, కావ్యాలకూ ఎక్కింది. పందులనుంచి వ్యవసాయం నేర్ఫుకున్నారు అంటే పండితులున్నారు. ఎరుకలవారినుంచే బౌద్దస్తపతులు గూళ్ళు చీలవరం నేర్చువన్నాన అంటే నాం న చ శ రాసి గుణ పరిణామ విపరీణామ సూత్రానికున్న రెండు అంచులను తెలుసుకొనాలేకాని ప్రతీదీ పెరుగుతుందే కాని తరగదు అని సిద్దాంతీకరించడం ఆద్వయవాదం అనిపించదు. అద్వయవాదాన్ని అర్ధంచేసుకుని అమలుచేయడం హర్షణీయమే కాని గుణపరిణామానికి అవసరం అయిన రాసిమీద నిరంతరం అ(ప్రమత్తతను పాటించవలసి వుంటుంది. లేకపోతే విస్లవం ఎంత హఠాత్తుగా వచ్చిందో విష్ణవ 'ప్రతీఘాతం కూడా అంత హఠాత్తుగానూ వచ్చి పడుతుంది. మూడో సూత్రాన్ని నెగేషన్‌ ఆఫ్‌ నెగేషన్‌ అంటారు. బూతాడక దొరకు నవ్వు పుట్టదు అని మనకో పద్యం వుంది. ఈ సూత్రానికి చేసిన అధికారానువాదాన్ని చూస్తే తెలుగు సాహిత్య పరిచయం వున్న వారికి నవ్వు పుట్టితీరుతుంది. నెగేషన్‌ సూత్రానికి తెలుగు అనువాదం “అభావం అభావం” అని చేశారు. ఈ అభావం అన్న మాట వినగానే శ్రీనాధుని రాజమండ్రీ ఆశువు గుర్తుకొస్తుంది. మరొక చాటుకారుడు చెప్పినట్టు దొరలకు నవ్వుపుట్టించే పద్యమిది. ఆ అనువాదం విన్నప్పుడల్లా నాకు నవ్వు పుడుతుంది. నెగేషన్‌ అన్న మాటను “నిషేధం” అని అనువదించుకున్నారు కేరళీయులు. బెంగాలీలు ఆ మాటను ప్రతిషేధం అని అనువదించుకున్నారు. మనదేశాన ప్రాచీన తర్కాన్ని గౌతమ న్యాయం అంటారు. గదాధర న్యాయానికి నవ్యన్యాయం అని పేరు. నవ్య న్యాయకర్త గదాధారుడు బెంగాలీవాడు. నవ్యన్యాయం కేంద్రం నవద్వీపం. కంఠాభరణ నాటకంలోని వెర్రి రామశాస్త్రి తర్కం చదవడం కోసం ఈ నవద్వీపానికే వెళ్లి వచ్చాడు. పూర్వం మన దేశాన నాలుగు విద్యా కేంద్రాలు ఉండేవి. విద్యార్థులు ఆ కేంద్రాలకు వెళ్లేవారు. తర్కానికి నవద్వీపం, వ్యాకరణానికి కొళీ, సాహిత్య రసాలంకారాలకు కాశ్మీరం, తత్వశా(స్తాలకు దక్షిణాపధం కేంద్రాలుగా వుండేవి. ఆలాగే పదునెనిమిదో శతాబ్దం వరకు సంస్కృతం మేధావుల భాషూ వుండేది. ఆ భాష కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకూ మేధావులందరికీ తెలిసిన భాష సంస్కృతంలో వున్న (గ్రంథానికి ప్రామాణికత ఉండేది. అక్బరు దివాను రాజా తోడరుమల్లు నాటి న్యాయసూధత్రాలను తోడరానందం పేరిట సంస్కృతంలో రాసి దానికి ప్రామాణికతను కల్పించాడు. హిందూ రాజుల కాలాన రాజళాసన భాష సంస్కృతం. మూడో అద్వయ న్యాయాన్ని మనం ప్రతిషేధ ప్రతిషిద్ధ న్యాయం అని అనువదించుకొనవచ్చును. ఆకులు పెరుగుతున్న రెమ్మను చూడండి. చిగురుతొడిగి ఆకులు పెద్దవగుతున్న కొలదీ కింది ఆకులు పండుతాయి. పైనున్న చిగురాకులు పెరిగి కిందనున్న పారుటాకులు రాలుతాయి. పైన మరో చిగురుపుడుతుంది. పుట్టిన చిగురు పెరుగుతున్న కొలదీ కిందనున్న ఆకులు ముదిరి పారుటాకులై రాలిపోతాయి. ఒకనాడు పారుటాకును ప్రతిషేధించిన చిగురు కాలక్రమాన తానే ప్రతిషిద్ధం ఆయిపోతుంది. ఈ ప్రతిషేధ ప్రతిపిద్ద న్యాయం “పెరుగుదలను వెల్లడిస్తుంది. నిషేధం అంటే ఒక వస్తువో ఆచారమో లేకుండా చేయడం అని అర్ధం. అదివరకు వస్తువూ ఆచారమూ లాలా రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ త 205

ఉన్న స్థలం శూన్యం అయిందన్నమాట. ప్రకృతి శూన్యాన్ని సహించదు. అందుకని వస్తువునో అధారాన్న్‌ ప్రతిషేధించాలి కాని నిషేధించరాదు. ఇది రాజకీయులు నేర్చుకొనవలసిన సూత్రం, స్వాతంత్ర;ద్య, కాలాన స్వయం సేవకులు కల్లు పాకలు, సారా పాకల దగ్గరకు వెళ్లి కల్లుమానండోయ్‌ బాబూ కట్లు తెరవండోయ్‌ అని పాటలు పాడుతూ సత్యాగ్రహం చేసేవారు. స్వాతంత్ర్యం వచ్చింది. తెల్లదొరతనం స్థానే నల్లదొరతనం వచ్చింది. కల్టు, సారా నిషేధించింది. ఫలితం ఏమయింది? తాగుడు ఎక్కువయిందేకాని తగ్గలేదు. చట్టం దారుణంగా విఫలమయింది. ఆ వైఫల్యం నుంచి పారాలెవరూ నేర్చుకొనలేదు. చట్టం చేయడం కష్టం కాదు. దాన్ని అమలు చేయడానికి (ప్రస్తుతమున్న సిబ్బందికన్న ఇబ్బడి ముబ్బడి సీబ్బంది కావాలి. లేదా జనాన్ని విజ్ఞానవంతుల్ని చేయాలి, స్వాతంత్ర్యం వచ్చిన తరవాత తాగుడును చాలా సార్టు నిషేధించారు. చాలాసార్లు నిషేధం ఎత్తివేశారు. కల్గుకాంపొండులకు బదులు నీరా దుకాణాలను పెడితే బాగుంటుందని ఎవరో సూచించారు. అది విని ఐసరె బచ్చా అనుకున్నారు మంత్రులు. ఇది ఎలా వుంది అంటే పాలముంత నిచ్చి చల్లముంతలు నిషేధించినట్టుగా వుందని కొంతకాలానికి తెలుసుకున్నారు. దాంతో నీరా బందయింది. నా చిన్నతనంలో ప్రతియింటా తరవాణి కుండలుండేవి. చెళ్లపిళ్ల వెంకటశా(స్త్రిగారు అంతర్వాణి, తరవాణి అని పద్యాలు కూడా చెప్పేవారు. తరవాణి తేలిక బీరులా వుండేది. సంస్కృతంలో మద్యం అంటే పండితులు చెప్పే కల్టు కాదు. అది'బీరు. బీరునే మద్యం అనేవారు, బీరును పండితులు (ద్రవాన్నం అంటారు. వేదకాలాన కూడా బీరు వుండేది. బీరు యజ్ఞాన్ని సౌత్రామణి అనేవారు. సీతారాములు గుహుని సాయంతో గంగదాటిన తరవాత మరో నది వస్తుంది. ఆ నదిని దాటబోయే ముందు సీత నదికి దండం పెట్టి మేం నిన్ను సురక్షితంగా దాటగలిగితే నీకు నూరుకుండల బీరు అర్చించుకుంటాను అని మొక్కుతుంది. బీరుమీద లైసెన్సు తీసేసి బీర్రుతో సారాను ప్రతిషేధిస్తే (ద్రవాన్నమయిన బీరువల్ల జనారోగ్యం పెరిగివుండేది. నిషేధించడం సులభం. కాని ప్రతిషేధించడానికి చదువు, సంస్కారం కావాలి. అది రాజకీయులకుండడం అరుదు. ఏమయినా నిషేధం వేరు, ప్రతిషేధం వేరు. ప్రతిషేధం అద్వయవాదం, అద్బయసూత్రాలు ప్రకృతికీ సమాజానికీ, వ్యక్తికీ సమానంగా వర్తిస్తాయి. అంతేకాదు చరిత్రకు కూడా వర్తిస్తాయి. అన్నాచెల్లెలు మనువు కూడదనీ, చెల్లెళ్ల పోషణబాధ్యత అన్నలదనీ నిర్ణయించడానికి కొన్ని శతాబ్దాలపాటు మధనపడవలసి వచ్చింది. కనకనే ఆ నిర్ణయం నేటికీ అమల్లో వుంది. ఆనాడు వారు మనువుల విషయంలో చేసిన నిర్ణయాలు ఎలాంటి సవరణలూ లేకుండా నేటికీ అమలు జరుగుతున్నాయంటే ఆ నిర్ణయాలు చేయడం కోసం వారు ఎన్ని వందల సంవత్సరాలు మధనపడ్డారో అవగతమవుతుంది. మనిషి నిటారుగొ నిలవగలగడం ఒక విప్లవం. మనిషి తన భావాలను భాషద్వారా తెలియచేయగలగడం ఇంకొక విప్లవం. వస్త్రధారణ అవసరమని ఆలోచించడం మరో విష్ణవం. ప్రాక్సరిత్ర యుగాల్లో మనిషి సాధించిన విప్లవాలు కోకొల్లలు. ఖాద్య అఖాద్య వస్తు నిర్ణయం ఇంకో విష్ణవం. ఇలా చూస్తూ పోతే మానవ చరిత్ర ఆంతా విప్లవాల మయం అని మనకు అర్థం అవుతుంది. ఈ విష్ణవాలన్నీ దేవుని ప్రసన్నం చేసుకున్న రుషులవల్లా, దేవుళ్లవల్లా జరిగాయని పౌరాణికులు అంటారు. అది వారి అవగాహన. వారి విజ్ఞానం అంతవరకే పరిమితం, న. 206 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

ఆ కాలంలో జనం జెయింట్స్‌ అంటే రాక్షసుల్లా వుండేవారనీ, మున్ముందు వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసేవారు పుట్టుకొస్తారని కాలజ్ఞానం తత్వవేత్తలు అంటూ వుంటారు. జెయింట్సూ రాక్షసులూ, కుబ్బులూ, కూష్మాండులూ పురాణాల్లోనే కాని భూమిమీద కనిపించరు. అసురులు పశ్చిమాసియాలో వుండేవారు. బైబిలు వారిని అసీరియన్లంది. వారు ఆనాడు వ్యవసాయ క్షేత్రాలను కాపాడేవారు. కేదారాల రక్షకులు కనక వారికి రాక్షసులన్న బిరుదు వచ్చింది. ఒకప్పుడు వారు పూర్వ దేవులు. ఆర్యభాషే మాట్టాడేవారు. తరవాత వారు మచ్చ భాషను అలవరచుకున్నారు.

రాజ్యం ఉన్నప్పుడు రాజపురుషులుంటారు. రాజపురుషులున్నప్పుడు లంచాలు, అ(క్రమార్దనలు వుంటాయి. అవి కొత్తకాదు. రాజ్యం పుట్టినప్పటి నుంచీ వున్నాయి. రాసి గుణ పరిణామ విపరిణామం అన్న అద్వయ సూత్రం (ప్రకారం లంచాలు అ(క్రమార్దనల రాసి పెరిగి పెరిగి మితిమీరినప్పుడు గుణ పరిణామ రూపం పెద్ద ఉత్పాతం వచ్చి తీరుతుంది. ఆది భూతవాదలక్షణం. దాన్నెవరూ నిరోధించలేరు. డయలెక్టీషయన్లు అంటే అద్వయవాదులందరికీ ఈ సంగతి తెలుసును. పురాణకాలమయితే భూదేవి ఈపాటికే మొరపెట్టేది.

ఏకంసత్‌ విప్రాః బహుధావదంతి, నిజం ఒకటే. కానీ మేధావులు దాన్ని రకరకాలుగా వర్షిస్తారు. అలాగే మనిషి అంటే పలువురు పలురకాలుగా వర్షించారు. ఎన్ని వర్షనలున్నా రెండే వర్షనలు అనుభవంలో కనిపిస్తాయి. ఒకటి రాజకీయ జీవి. రెండు మత జీవి. రాజకీయాలను పూర్వం పండితులు నీతిశాస్త్రం అనేవారు. శుక్రనితి, బృహస్పతి నీతి, కామందక నీతి అనే నీతి శాస్త్రాలు చాలా పుట్టాయి. రాజ్యం నీతి వల్ల నిలిచేరోజులు ఏనాడో అంతరించాయి. అంచాత ఆ మాటకు కాలదోషం పట్టింది.

అర్ధం రాజకీయం ద్వారా వ్యక్తం అవుతుందంటాడు లెనిన్‌. అంతకన్నా చాలాకాలం ముందున్న కౌటిల్యుడు తాను రాసిన రాజకీయ శాస్త్రానికి అర్ధశాస్త్రం అని పేరు పెట్టుకున్నాడు. మార్కు కాలానికి వచ్చేసరికి రాజకీయ, అర్థశా(స్తాలు అవతరించాయి. అర్హసంబంధంలేని రాజకీయం ఉండదు. మన పురుషార్దాలు మూడింటిలో మధ్యన ఉన్నది అర్ధం, అర్ధంతో కలిసినప్పుడే ధర్మం, కామం వ్యక్తం అవుతాయి. ధర్మం అంటే మతం అని అర్ధం. దీన్ని బట్టి చూస్తే మనిషి రాజకీయజీవి మాత్రమే కాదు. మతజీవి అని కూడా తేలుతుంది.

నేను చిన్నప్పుడు మతాంగమయిన యోగాసనాలు వేసేవాడిని. భ్రూమధ్యదృష్టి నాసికాగ్రదృష్టి సాధించేవాడిని. ఆఖరికి హఠయోగం చదివి లంబికా యోగసాధన కూడా చేసాను. ఆ తరవాత మంత్రశాస్త్ర (గ్రంథాలను చదివే అవకాశం దొరికింది. ఆ శాస్త్రంలో వూర్షదీక్షితుని కూడా అయాను. ఆ దశలో (గ్రంథావలోకన సాధన ఎక్కువై శంకరాచార్యుని ద్వారా నిరిశ్చరవాదిని, భౌతికవాదినీ అయాను. నా చిన్నతనంలో అన్నవరం కొండమీద సత్యనారాయణ స్వామి వెలిశాడని విన్నాను. మా ఆగ్రహారానికి దగ్గరలో కొండపాలెం అనే ఊరి కొండమీద మరో దేవుడు వెలిశాడు.

చిన్నతనంలోనే కొద్ది నెలలు బందరులో వుండేవాడిని. అప్పుడు సముద్రపు ఒడ్డున పాండురంగడు వెలిశాడని పుకారు పుట్టింది. ఆది రోజుల్లోనే కీరపండరిక్షేత్రం అయిపోయింది. నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్లి పాండురంగని ఉద్భవాన్ని చూసివచ్చాను. అదేరోజుల్లో రజాకారు విధాత బహదూర్యార్‌జంగ్‌ బందరు వచ్చాడు. ఆయన ఉరుదులో మహోత్తేజకర ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం అక్కడ ఎంతమందికి అర్థం అయిందో నాకు తెలియదు. కాని ఆయన ఉద్రేక ఉపన్యాసం నాకు మాత్రం అర్ధం అయింది.

రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ అ 207

దేవుళ్లను మొలిపించే కిటుకు స్టపతులందరికీ తెలుసును. ఆనాడు నాకు తెలియదు కాని ఈనాడు ఆ కిటుకు నాకూ తెలుసును. దేవాయతన నిర్మాణం, దుర్గ నిర్మాణం లాంటి నిర్మాణాలమీద భోజుడు సమరాంగణ సూత్రధార అన్న [గ్రంధాన్ని రాశాడు. ఆహవ మల్లసోమేశ్వరదేవుడనే చాళుక్య మహారాజు అభిలషితార్ద చింతామణి అన్న పేరున నూట ఎనిమిది అంశాలమీద సర్వస్వం లాంటి (గ్రంధాన్ని రాశాడు. కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయానికి నేను సంయుక్త కార్యదర్శిగా వున్నప్పుడు తెప్పేంచి చదివాను.

ఇప్పుడా (గ్రంధాలు (గ్రంధాలయంలో ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఆరోజుల్లోనే రసవైశేషిక సూత్రం అన్న పుస్తకాన్ని తిరువేం్యడ్రం మహారాజు [గ్రంధభాండాగారం వారు అచ్చువేశారు. రసమంటే ఏమిటి? అల్కెమీకి సంబంధించిన పాదరసానికి చెందినదా, సాహిత్యానికి సంబంధించిన రసాలకు చెందినదా? ఏదయినా పరవాలేదని ఉత్తరంరాసి ఆ పుస్తకాన్ని తెప్పించాను. ఆ (గ్రంధకర్త పేరు 'భదంత' నాగార్జునుడు. దానికి వ్యాఖ్యాత నరసింహయతి అన్న పండితుడు. తీరా పుస్తకం వచ్చిన తరవాత తిప్పిచూస్తే అది రసవాదమూ కాదు. అలంకారశాస్తమూ కాదు. అది షడ్రసాలకు సంబంధించిన రుచుల పుస్తకం.

భదంత నాగార్జునుడు బౌద్దభిక్షువు. కణాదుని వైశేషిక సిద్దాంతానుసారం ఆయన ఆ పుస్తకాన్ని రాశాడు. వైశేషిక సిద్దాంతం (గ్రీకుల అణువాదంలాంటిది. పదార్థం ఎన్ని అణువులుగా వున్నా ఆఖరికి మిగిలేది ఒక్కటే అణువు. దానినుంచే అణువులన్నీ పుడతాయి. తిరిగి దానిలోనే లీనం అవుతాయి. ఇదీ వైశేషిక సిద్దాంతం. నాగార్జునుడు రసాలు అంటే రుచులను విశ్లేషించి అవన్నీ ఆఖరికి క్షారం నుంచే పుట్టి క్షారంలోనే లీనమవుతాయని చెప్పాడు.

దాన్ని లైబ్రరీకోసం కాదు, నాకోసం తెప్పించుకున్నాను. దాన్ని ఒక మీమాంసా పండితుడు చూసి ఇది నీకు రర్షమయిందా అన్నాడు. అయిందన్నాను. నువ్వు చదివేశావు కదా! ఇది నాకిస్తావా అని అడిగాడు. అయ్యా స్వకరించండి అని ఇచ్చేశాను. నాజేబులో అపుడు సైసలేవు. వుంటే ద సహా పుస్త య్యా. చదివిన తరవత ఏ పుస్తకాన్నయినా ఎవరతన లది ప్న కుమారుడు పంచశిఖుడు రాసిన షష్టికతంత్రాన్ని కొన్నాను. ఓ పెద్ద మనిషి కొనగానే కైంకర్యం చేశాడు. అతనికి అలాంటి పుస్తకాలు చదివే అలవాటు లేదని నాకు తెలుసు.

న. 208 అ రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ

(యప ష్య టో స గ లే సా లో ఆరుద్ర కవి రచయిత వరిళోధకుడే తాని తొందరపాటు ఎక్కువ. దశరథుడు వుతకామష్టిని చేసినట్లు ఆరుద్ర కీర్తికామేష్టి చేశాడు. అరనం నిర్మాణానికి ముందు ఆయన్ను కలిని బభర్చలు జరిపాం. అవి నఫలం కాలేదు. నర్ఫలైట్టను కూడా కలువుకోవాలని ఆయన వాదం. ఒకసారి విడిపోయిన కమ్యూనిస్టులు తిరిగి కలవడం అనంభవం అని ఆయనకు తెలీదు. నాల. బాంచ - బానిస సత్రికల్లో చేరగానే మతరంగం నుంచి రాజకీయ రంగానికి చేరినట్లయింది. అప్పటికి స్వాతంత్ర్యం నాలుగేళ్ల దూరాన ఉంది. బ్రిటీషు వారి రాజ్యంలో జనాభా పెరగలేదు. వందేమాతరం పుట్టినప్పుడు జనాభా త్రింశత్కోటి. అంటే ముప్పయికోట్టమంది. తెలుగువారు “ముక్కోటి” ఆంధ్రులు, ఆరోజుల్లోనే నేను రాసిన ఒక వ్యాసంలో నాలుగుకోట్ట ఆం(ధ్రులని వుంది. వెంటనే వావిలాల గోపాలకృష్ణయ్యగారి లేఖ. ఆంధ్రులు నాలుగుకోట్ట్లుకాదు మూడుకోట్టేనని, అప్పుడు నేనాయనకు లేఖ రాశాను. నాటి ఆంధ్రుల లెక్కలో తెలంగాణా లేదు. తమిళ దక్షిణ జిల్లాల్లేవు. బొంబాయి, ఒరిస్సా, కలకత్తాల్లో పనిచేస్తున్న తెలుగువారి లెక్కల్లేవా? అని రాశాను ఆయన నా అంకెను ఒప్పుకుంటూ జవాబు రాశారు. అప్పుడింక తిండిమీదికి కలం మళ్లింది. స్వతంత్ర భారతంలో అన్నం లేనితనం ఉండరాదని నా అభిప్రాయం. మనకున్న వనరులను వివరిస్తూ మన ఆహారం అలవాట్లను మార్చుకోవాలని నేను వ్యాసాలు రాశాను. మన యుద్దాల్లో వాడే అఆ(స్తాలను పరికించి చూస్తే తిరుగులేని అస్త్రం బ్రహ్మాస్త్రం అని తేలుతుంది. (బ్రహ్మాస్త్రం అంటే ఏమిటి? అన్నం బ్రహ్మేతి వ్యజానాత్‌ అంటారు పెద్దలు. అంచాత (బ్రహ్మాస్త్రం అంటే అన్నాస్తం అని అర్ధం. తెలంగాణాలో ఒకప్పుడు బిచ్చగాళ్ల హీన నినాదం ఒకటి వుండేది. దొరా నీ బాంచెను కాలుమొక్తా “నీ లంజపియ్యి దింటా నీ ఉచ్చతాగుతా” ఇదీ ఆ హీన నినాదం. దీన్ని బట్టి బానిసలను చేసే పద్ధతి ఇది అని తేలుతుంది. ఆ విధానాన్నే సభ్య భాషలో బ్రహ్మాస్త్రం అన్నాను. ఈ హీన నినాదంలో “బాంచను” అన్న మాట ఒకటుంది. బ్రవ్మోస్త పీడితుని మాటలో వున్న “బాంచ” అంటే బానిస దాసుడు అని అర్ధం. బాంచ అనేది పారసీక భాషు నాగరిక భాషలో అదే బానిస అయింది. నిఘంటువులో బానిస అంటే వంటవాడు అన్న అర్ధం వుంటుంది. అంతే. మనుషులను బానిసలుగా మార్చుకునే విధానాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన దేశాన డా రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ € 209

బానిసలు ఎలా వుండేవారు? వారివల్ల మన దేశ రాజకీయాలు ఏరూపును తెచ్చుకున్నాయి. మనకు సం(క్రమించిన బానిస సంస్కృతి రూపం ఎలా వుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం. చారిత్రకంగా మనదేశాన ఉత్పాదక బానిసలులేరు. జూదాల్లో ఓడిపోయిన వారూ, అప్పులు చెల్లించలేకపోయినవారు గృహదాస్యం కోసం బానిస అంగళ్లకు వెళ్లేవాఎ. అలాంటి వారు పెక్కురు బౌద్ధ భిక్షుక సంఘంలో చేరేవారు. మరికొందరు జైన గృహదాసులయేవారు.

అప్పు కావలసినవాళ్లు దాన్ని తిరిగి తీర్చుకుంటాం అన్న నమ్మకం కలిగించాలి. అందుక్కావలసిన అయివేజు చూపించాలి. హామీలు, అయివేజులు లేని భూకా పకీరుకు ఎవరూ అప్పు ఈయరు. అప్పు తీసుకున్నవాడు ఎలాంటి హామీ చూపించాలో ధర్మశా(స్తాలు చెప్పాయి. ఆ హామీ, అయివేజులకు రుణానుబంధం అని పేరు. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయా అంటుంది ధర్మశాస్త కొరిక. ఈ అనుబంధాలను చూపించవచ్చును. లేదా అప్పు తీరేవరకు తాకట్టు పెట్టవచ్చును. తాకట్టు పెట్టతగ్గ వస్తువులు ఇవి. పశువులు, భార్య, పిల్లలు, ఇల్లు, భూమి ప్రస్తావన లేదు.

ఈ నాలుగూ నాటి వ్యక్తిగత ఆస్తి, ఈ ఆస్తిని అమ్మవచ్చును, తాకట్టు పెట్టవచ్చును. లేదా దానం చేయవచ్చును. పూర్వ మీమాంసాళా(స్త్రంలో రాజాయజ్ఞం చేసినప్పుడు ఏయే దానాలివ్వవచ్చును అని శిష్యుడు తన గురువునడుగుతాడు. అప్పుడు గురువు ఈ నాలుగింటికి తోడుగా ఆస్తరణాలను కూడా చేర్చాడు. ఆస్తరణాలు అంటే ఫర్నీచరు. అప్పుడు శిష్యుడు భూములో అంటాడు. భూమి రాజుగారి ప్రయివేటు ఆస్తికాదు కనక భూమిని దానం చేసే హక్కు రాజుకు లేదు అంటాడు. ఈ సంగతిని డాంగే పార్లమెంటులో చెబితే రాజకీయులు పల్లికిలించారు.

ఆరోజుల్లో మనదేశాన ద్యూత ధర్మాసనాలూ, వేశ్యా ధర్మాసనాలు ఉండేవి. జూదంలో, గెలుపోటములలో వచ్చే తగాయిదాలను ఈ ధర్మాసనాలు తీర్చేవి. అలాగే వేశ్యా వృత్తి తగాదాలు ఆధర్మాసనానికి వెళ్తేవి.

జి కీ (ల ధర్మాసనం తీర్పులవల్ల అందరూ బానిస అంగళ్లకు చేరేవారు. అలా చేరబోయే ఒక జూదరిని మృచ్చకటికం నాటకంలో వసంతసేన ఆదుకుంటుంది. ఆ జూదరి బౌద్ద భిక్షుకుడవుతాడు. శకారుని పాలబడ్డ వసంత సనను కాపాడాడు. ఆ కాలాన ఎక్కువమంది యువకులు ద్యూత, వేశ్యా ధర్మపీరాల ద్వారా బానిస అంగళ్లకు చేరేవారు.

న ]

మన నిఘంటువులు బానిస, బానిసడు అంటే వంటవాడు అని అర్జాలు చెప్పాయి. కాని స్లేవు అన్న ఇంగ్లీషు మాటకు బానిస అన్న మాట రూఢమైపోయింది. నిజానికది బానిస, బానిసీడు నుంచి పుట్టిన మాట కాదు. అది పార్సీ మాట. పార్సీలో “బాంద్‌చ” అంటే బంధితుడు అని అర్ధం, సంస్కృతంలో 'క' 'ప్రత్యయంలాగే పారసీలో “చ” అంటే చిన్న అని అర్ధం. ఆ భాషలో బాగ్‌ అంటే తోట. బగీచ్రా అంటే పార్కు అని అర్ధం. తెలంగాణాలో భిక్షుకులు బాంచ అన్న మాటను నేటికీ వాడుతున్నారు. ఆ బాంచ అన్న మాట బానిసగా మారివుంటుంది సభ్య భాషలో,

సింధునాగరికత కాలం నాడు జనం పట్నాలు నిర్మించారు. జల సేచనతో వ్యవసాయం చేశారు కాలవలు తవ్వారు. నౌకాశ్రయాన్ని కూడా కట్టుకున్నారు. ఆ పనులు చేసిన వారిని బానిసలనడం సబబు కాదు. బానిసలకు ముందు నొటి సమాజం అది. మార్క్సు ఆ సమాజానికి ఆసియాక సమాజం అని పేరు

"పె స న క్‌ ఆ సమాజంలో జల సచన పనులను అందరూ చేసేవార్తు, ఆనాడు పని చేసేవారిని ఆల, అలు , తరవా, త పండితులు ఆ మాటలకు బానిస అన్న అర్భాలు కల్పించారు. వారి లెక్కప్రకారం ఇల్లాలు అంటే గృహదాసి అన్న అర్ధం వస్తుంది. ాననునానానానాయారామనయయు. 210 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ

సింధునాగరికత తరవాత వైదికార్యులు మధ్యాసియా, పశ్చిమాసియా, ఇరాన్ల నుంచి భారతదేశానికి వచ్చారు. వారి వెంట వచ్చిన స్త్రీలు పరిమితం. ఇక్కడ స్టిరపడిన తరవాత స్టానిక (స్త్రీల వల్ల పిల్లల్ని కన్నారు. అలా పుట్టిన పిల్లల్ని దాసులన్నారు. వారు గృహదాసులు. సంస్కృత నాటకాల్లో “దాస్యాఃపుత్రః:” అనేది పెద్దతిట్టు ఈ తిట్టును బట్టి నాటి గృహదాసులు పరిస్థితి పోదా ఎలా వుండేదో ఊహించవచ్చును. వేదకాలాన పుత్ర, శిష్య, దాస అన్న ఈ మూడు మాటలకూ అర్ధం ఒకటే,

దాసులు గృహపతి ఉచ్చిష్టం తిని బతకాలి. అంతేకాని అతడికి ప్రత్యేకం తిండి పెట్టరు. (బ్రాహ్మణ కుటుంబాల్లో ఇల్లాలు ఆంటే గృహదాసి భర్త ఉచ్చిష్టం తిని బతకాలి. వితంతువులు నిత్యం ఏకభుక్తం చేయాలి. పురాణాలను చూస్తే వధువు వెంట వందలాది దాసదాసీలను అరణంగా పంపించారని వుంటుంది. ఆనాడు దాసదాసీజనం ఎంత ఎక్కువగా వుంటే ఆ యజమానికి అంత గౌరవం వుండేది. రామాయణంలో దశరథుడు అశ్వమేథం చేసినప్పుడు భోజనానికి (బ్రాహ్మణులు వచ్చారు. వారిలో ఒకొక్కరికి వందకు తక్కువకాని దాసులుండేవారు. - వాల్మీకి ఈ దాసులను నాధవంతులు అన్నాడు.

నాధవంతులంటే నాధుడుగల వారని అర్ధం. నాధుడంటే యజమాని అని అర్ధం. ఎంత ఎక్కువమంది దాసదాసీ జనాన్ని వుంచుకుంటే అంతగొప్ప. దశరథునికి ముగ్గురు పట్టవురాణులు కాక ఏడువందల యాభైమంది భార్యలుండేవారు. రాముడు అడివికి బయలుదేరేముందు ఈ వందలాది అమ్మల అనుమతి కూడా తీసుకున్నాడని వాల్మీకి అంటాడు. ఈ ఉదంతాలను బట్టి చూస్తే ఈ దేశాన “అలంకార” బానిసలుండేవారని అర్హం అవుతుంది. ఒక వ్యక్తి గొప్పదనానికి ఆలంకారప్రాయులయిన బానిసలు వీరు.

భారతచరిత్ర తొలినాళ్లలో బుద్దధర్మం రాజకీయాలను శాసించింది. ఆత్మవిశ్వాసంగలవారు బౌద్దసంఘాల్లో చేరేవారు. మరి కొందరు చేతివృత్తులను చేబట్టేవారు. జనంలోని ఎక్కువమంది బౌద్దసంఘాలు, వృత్తి సంఘాల్గ్లోను సర్దుకొనడంతో కడమవారు అలంకార బానిసలుగా రాజాశ్రయం పొందేవారు. వృత్తి సంఘాలు, బౌద్దసంఘాలవల్ల మన వాణిజ్యం అంతర్జాతీయం అయింది. దేశ చరిత్రలో దాన్ని స్వర్ణయుగం అనవచ్చును. తరవాత భారతీయ భిక్షుక సంఘాలు బౌద్దసంఘాలను ప్రతిషేధించాయి. ఆనాడు బౌద్ధంలో వచ్చిన చీలికలిందుకు తోడ్పడ్డాయి.

ఈ కొత్త భిక్షుక సంఘాలను మనం సనాతన భిక్షక సంఘాలని పిలుచుకుందాం. సింధునాగరిక విధ్వంసాన్ని మన పురాణాలు త్రిపురదాహం అన్నాయి. నాట్య శాస్త్రం రాసిన భరతముని తన శిష్యులకు తరిఫీదు యిచ్చి వారితో త్రిపుర దాహనాటకాన్ని ఆడించానని చెప్పుకున్నాడు. మన దేశాన పుట్టిన తాలి నాటకం అదే. ఆ నాటకాన్ని తరవాత ప్రదర్శించినట్టు ఏ సంస్కృత [గ్రంథంలో నయినా వుందేమో నాకు తెలియదు. త్రిపుర దాహం తరువాత మన దేశాన పెద్ద ఎత్తున వ్యవసాయం చేసిన దాఖలాలులేవు. వ్యవసాయం పెరిగిన నాడే రాజ్యం ఏర్పడుతుంది. నగరం, నాగరికత కూడా పుడతాయి.

మనకు స్వాతంత్ర్యం వచ్చేనాటికి మన దేశాన చిన్నా చితకా రాజ్యాలు చాలా వుండేవి. పూర్వం రాజదర్పారుల్లో వుండే అలంకార దాసుల్ని తరవాత అలంకార రాజపురుషులనే వారు. ఆ రాజ పురుషులనే ఇప్పుడు రాజోద్యోగులంటున్నాం. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరవాత చిన్నా చితకా రాజ్యాలు భారత ప్రభుత్వంలో లీనం అయిపోయాయి. ఆనాడు మొత్తం రాజ్యాలలోని రాజపురుషులకన్న ఈనాటి రాజపురుషులు చాలా ఎక్కువ. స్వాతంత్ర్యం నాటికున్న దేశ జనాభా ఈ అయిదు దశళాబ్దాలలోనూ మూడు రెట్టు పెరిగింది.

అయినప్పుడు రాజ్యంలో పనులు చేసే రాజపురుషుల సంఖ్య కూడా ఆ నిష్పత్తిలో పెరగాలి కదా. పెరిగింది. ఆ పెరుగుదలతోపొటు చారిత్రక సంస్కృతిని వొంటపట్టించుకున్నాయని వేరే చెప్పవలసిన

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 211

పనేముంది. ఒక (గ్రామోద్యోగి ఘనతను సురవరం '(ప్రతాపరెడ్డిగారు “బారాకద్దూ” పేర ఒక కద రాశారు. ఆ కథా నాయకుడు ఓ చిన్న రాజపురుషుడు. ఇప్పుడు రాజపురుషులు లక్షల్లో వున్నారు. వారిలో చాలామందికి అలంకారికత చారిత్రకంగా సంక్రమించి తీరుతుంది. మనది ఘనచరిత్రగల భరతఖండం గదా!

రాసి గుణ పరిణామ విపరిణామ సూత్రం ప్రకారం ఈ రాసికి మితి ఎక్కడ? ఆ మితి మీరిననాడు రాగల గుణ పరిణామం రూపురేకలేమిటి అన్న (ప్రశ్నలు పుడతాయి. రాసి సంఖ్యా వాచకంగా పెరిగినంత మాత్రాన గుణ పరిణామం రాదు. ఇలా పెరిగిన, 'పెరుగుతూన్న రాసి కర గతుల రాసికాదు. ఆలంకారికుల రాసి, అంతా కాకపోయినా అత్యధిక భాగం ఆలంకారకం. అందువల కేవల జనరాసిని మాత్రమేకాక ఆ

ళా రాసిలో కర్మకుల సంఖ్య ఎంత. ఆలంకారికుల సంఖ్య ఎంత అని బేరీజు వేసుకోవాలి.

ఆ రెండు రకాల రాసి సంఖ్యనూ బేరీజు వేసుకున్నాక అందులో ఉపయుక్త సంఖ్య మితిని మీరినప్పుడు వచ్చే గుణపరిణామం ఒకలాగ వుంటుంది. నిరుపయోగ సంఖ్య మితిమీరినప్పుడు రాగల గుణ పరిణామం మరొకలాగ వుంటుంది. చారిత్రకంగా ఆలంకారిక దాసులన్నానే కాని వారు దాసులుకారు. రాజ పురుషులు. పారసీక భాషనుంచి వచ్చిన రెండు మాటలకు తెలుగున బహుళ (ప్రచారం వుంది. అవి - నౌకర్తు, చాకర్ణ్లు

క్‌ ్‌! నౌకరు అంటే జీతగాడు. పనిచేసినా చేయకపోయినా నెల తిరిగి వచ్చేసరికి జీతం తీసుకుంటాడు. చాకర్‌కు చాకిరీయే కాని జీతం ఉండదు. కాని వార్షిక పరిహారం వుంటుంది.

నౌకరీకి విశేషణాలు లేవు కాని చాకిరీకి చాలా విశేషణాలు ఉన్నాయి. బండెడు చాకిరీ, ఇంటెడు చాకిరీ, అరవ చాకిరీ, + కక చాకిరీ, వీరికి జీతం వుండదని ఈ విశేషణాలవల్ల తెలుస్తుంది. ఇందులో అరవచాకిరీకి

ఇ అవసరం. అది అరవ చాకిరీయా అరువు చాకిరీయా? అరవ్యారి దగ్గర తెలుగువారు చాకిరీ చేసిన దాఖలాలు ఏవీ కనిపించవు. కనక అది వ్వారి దగ్గ త + ౯౯ అది అరువు చాకిర్‌ అయివుంటుంది. చాకిరీకి జీతం వుండదు. క్షణ పరిహారం కూడా వుండదు. అలాంటి దాన్ని అరువు చాకిరీ అంటారు. గ్‌ ॥ చన ధనం ఆనవాయితీ లేని ఇళ్లల్లో వితంతువులు తెల్లవారి లేచిన దగ్గరనుంచి యింటెడు చాకిరీ స్తారు. (శ్రోత్రియుల ఇళ్లల్లో వితంతువులకు కడుపునిండా తిండికూడా వుండదు ఏకభుక్తం కూడాను. వారికి ఏడాదికొక వస్త్రం ఇస్తారు. నౌకర్లచేత పరిహారం లేని పని చేయించుకుంటే దా వెట్టి కిర్‌ ల చా అంటారు. ఆసలు చాకిరీ అంటే పరిహారం లేని పని అరం. అలాంటిదానికి వెటి న్ని వెట్టి వెట్టి పూడలిసు థ్‌ ట్టి అని కూడా పేరు. ఈ జ ల్యాడలిస్టు సమాజం ఉండే ప్రదేశంలోనూ వుండేది, అసలు వెట్టి ఎక్కడ ల్‌ లక్షణంగా గుర్తించాలి. టీ ఎక్కడ వున్నా దాన్ని ప్యూడ కౌటిల్యుడు తన అర్హశా(స్తంలో ప్రభు చారచక్షువు శ్‌ ర్త స (ప్రభుత్వ ధన తస్కరులను పట్టుక్షునే పద్దతిని చెప్పాడు. కౌటిల్యుడు ౦ కాలంల్‌ గనుల తవ్వకాన్ని ప్రయివేటు వరకు, తీసిన ఖని 'ర్తకులకు అప్పజెప్పేవాడు. అతడు తవ్వి ఖణజానిక్రి పెర్సెంటేజీ పరిహారం వుండేది. అంటే నేటి సాధారణంగా భాషలో గనులను లీజాకిచ్చేవాడన్నమాట. (ప్రభుత్వ పనులను లీజుకు తీసుకునేవారు మోత్రు లెక్కలు చూప్పి బరు వర్తకులయి వుంటారు. వారు తప్పుడు ఇ ౦చకుండా వుండేందుకు ఒక చట్టం కూడా చేశాడు. తప చేసి సిరచ్ళేదం, ఆస్తి బపు శిక్ష . తప్పుడు లెక్కలు చేసినట్టు రుజువైతే ఏ కాంట్రాక్టరయినా త స అంతర్జాతీయ కూ చస వే డను అనుమానం వస్తే ఆయన చారులు రంగంలోకి దిగుతారు. ఇప్పుడు సదే ర్త ఆ ఖనిజాల కాంట్రాక్టరు దగ్గర కొంత ధనం దాచుకున్నట్టు స్వరళానికి తిరిగివచ్చినట్టు చెప్పి తాను దాచిన ధ హా న్న తన వెంట కొందరు మిత్రులను కూడా తీసుక సాన ఎమ్మటాడు. అతడు ఒక్కడూ వెళ్లడు. డు. కాంట్రాక్టరు నీమొహం నేనెప్పుడూ చూడలేదు. ననన శ మ 212 అ రాంభట్ల కృష్ణమూర్తి సాంతకథ

నువ్వు నాదగ్గర డబ్బు దాచడమేమిటి పోపో అని కసురుతాడు. అప్పుడతడు మిత్రుల ముందు గుండెలు బాదుకుంటూ రోదిస్తాడు. వీధినపోయే వారంతా ఆ యింటి ముందు గుమికూడుతారు.

ఆ వార్త పట్నం అంతా పాకుతుంది. మరునాడు ఆ కాంట్రాక్టరు ఇంటిముందు చిన్న డేరా వెలుస్తుంది. బాధితుడు ఆ గుడారంలో నిరాహార దీక్ష పూనుతాడు. ఆతని మిత్రులు ఆయనకు సహాయకులుగా అక్కడే కూర్చుంటారు. వీరిని చూడ్డానికీ, గుండెకోతను వినడానికి పట్నం జనం తిరునాళ్ల వరసల్హాగ కదిలివస్తూ ఉంటారు. ఆ వీధిలో రద్దీ ఎక్కువ అవుతుంది. కాంట్రాక్టరు శ్రేయోభిలాషులు వచ్చి వాడి డబ్బు వాడికిచ్చేస్తే ఈ గొడవ వాదుల్తుందని సలహా యిస్తారు. అసలువాడు నాదగ్గర డబ్బు దాస్తే కదా ఇవ్వడానికి అని కాంట్రాక్టరు వాదిస్తాడు.

వాడు దాచానని చెప్పే డబ్బు పెద్దమొత్తం కాదు. ఆ మాత్రం డబ్బు వాడి ముఖాన కొడితే గొడవ తగ్గుతుంది కదా అని సలహా ఇచ్చారు. నిజమేనని కాంట్రాక్టరు డబ్బిచ్చి దండం పెడతాడు. గుడారం లేచి పోయింది. పట్నంలో కలకలం సద్దుమణిగింది. కాంట్రాక్టరుకు ప్రభుత్వం నుంచి పిలువు వచ్చింది. పరదేశికి డబ్బు చెల్లించడమే అందుకు తిరుగులేని సాక్ష్యం. (ప్రభుత్వం చేసిన చట్ట (ప్రకారం కాంట్రాక్టరు స్థిరచరాస్తుల జప్పు. నేరం రుజువవడంతో శిరచ్చేదం. ఇది కౌటిలీయార్హశా(స్తం నుంచి తీసిన కథ.

వేదకాలం ఆఖరిదళలో విశ్వామిత్రుని తాతలు నలుగురూ రాజధానులు కట్టుకుని రాజ్యాలేలారు. అందులో ఆఖరి తాత వసువు. ఆయన గిరివ్రజం అన్న రాజధాని కట్టి మగధరాజ్యాన్ని నిర్మించాడు. మగధ రాజ్యం ప్రస్తావన అధర్వణ వేదంలో వుంది మహాభారతంలో మగధను పాలించినవాడు జరాసంధుడు. వేదాలు నాలుగురకాల రాజ్యాలను వర్షించాయి. నాటి మగధ భోజకం అనే రాజ్యం. చరిత్ర కాలాన హర్యంక వంశీయుడైన బింబిసారుడు మగధరాజ్యాన్ని స్థాపించాడు. నాటి నుంచీ మగధ మహాసా(మ్రాజ్యంగా విస్తరిల్లింది.

నాటి నుంచి అశోకుని కాలం వరకు అంతర్జాతీయ ఖ్యాతి గాంచింది. మగధ, మౌర్యుల తరవాత అంతటి విస్తారమయిన సా(మ్రాజ్యం మళ్లీ పుట్టలేదు. మౌర్యుల కాలొన వారి ఏలుబడి దక్షిణాదికి కూడా పాకింది. మౌర్యులు నాలుగు శతాబ్దాలపాటు భారతదేశాన్ని ఏలారని చెప్పవచ్చును. చతురుదధి వేలా వలయిత అని చెప్పుకొనడానికి మన దేశానికి ఎల్లలుగా నాలుగు సముద్రాలు లేవు. ఉత్తరాన పెద్దగోడ పెట్టినట్టుగా హిమాలయ పర్వత (శ్రేణి వుంది. దేశాన నూట ఇరవై భాషల జనం వున్నారు.

ఈ దేశపు నైసర్గిక సంపద చరిత్రకు పూర్వమే అనేకులను ఆకర్షించింది. ఒకనాడిది అల్లుళ్ల దేశంగా ప్రసిద్ధికెక్కింది. సముద్ర మార్గంగా వచ్చిన వారిలో ఎక్కువమంది కేరళ తీరానికి చేరేవారు. అలా వచ్చిన వారికి స్థానికులు అల్టుని మర్యాదచేసేవారు. ఆ దేశాన నేటికీ హీబ్రూ అల్టుళ్లు, క్రైస్తవ అల్టుళ్లు, ఇస్లాం అల్లుళ్ళు వున్నారు. భూమార్లాన వచ్చిన అల్టుళ్లు ఉత్తర రాష్ట్రాల్లో స్టిరపడి వుంటారు. అలాంటి వారికి స్థానికులు అల్టుడు అన్న బిరుదిచ్చినట్టు కానరాదు.

ముస్లింల దండయాత్రలతో ఈ దేశమంతా అల్టుళ్ల దేశంగా మారింది. దండెత్తి వచ్చిన ముస్లింలు రాజ్యాలేలి ఇక్కడే స్థిరపడ్డారు. దక్షిణాదిన దేవగిరి యాదవ రాజ్యాన్ని, ఓరుగంటి కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించారు. చరిత్రలో ముస్తిం యుగాన్ని మనం అల్లుళ్ల యుగంగా భావించవచ్చును. విదేశాల నుంచి ఈ దేశానికి వచ్చి రాజ్యాలేలేవారిని ఇల్లరికపు అల్లుళ్లుగా భావించవచ్చును. తమిళ, కేరళ భాషల్లో అల్గుళ్లను మాపుళ్ళైలంటారు. ఆమాట కేరళలో మోప్టాగా మారింది.

తరవాత పళ్చిమ దేశాలనుంచి వర్తకులు రానారంభించారు. వీరు ఈ దేశ సంపదను దోచుకొనడానికి

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 213

వచ్చారు. తమ దోపిడికి గౌరవ ప్రతిపత్తి కల్పించుకొనడం కోసం రాజకీయ అధికారాన్ని సంపాదించు కున్నారు. రెండువందల ఏళ్లపాటు (బ్రిటిషు వాళ్లు రాజ్యమేలారు. వారి రాజ్యకాలంలో తమ రాజకీయ కార్యకలాప్టాలు నిర్వహించగల వారికి తరిఫీదు ఇవ్వడం కోసం పాఠశాలలను, విద్యాశాలలను నెలకొల్పారు. వారీ దేశాన్ని కొల్లగొట్టి తమ దేశానికి తీసుకుపోతారే కాని ఇక్కడ స్త్రీరపడరు. వారీ దేశసంపదను ఎంతలా కొల్లగొడుతున్నారో వారు స్థాపించిన పాఠశాలల్లో చదివి తెలుసుకున్నారు ఇక్కడి వారు. వారు చెప్పిన చదువు ఆధారంగా ఈ దేశజనం ఎంత బడుగుదళలో వున్నారో తెలుసు కొనగలిగారు. వారి చదువువల్లనే ప్రపంచం ఎంత విశాలమయినదో అర్థం చేసుకున్నారు. తమ దేశ సంపదలు ఎంత విలువైనవో తెలుసుకున్నారు. ఈ సంపద రెక్కలు కట్టుకుని విదేశాలకు ఎగిరిపోతున్నదని (గ్రహించారు. తద్వారా తమ రెంత పేదవారైపోతున్నారో (గ్రహించారు. వారు స్థాపించిన విద్యాశాలల్లో చదువుకున్నవారు ప్రపంచ చరిత్రను అవగాహన చేసుకున్నారు. తమ పరతం(త్రం వల్ల తమ వ్యక్తిత్వాన్ని ఎంతలా కోల్పోతున్నారో తెలుసుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమం (ప్రారంభించారు. ఆ ఉద్యమంలోంచి పుట్టినదే బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతం. ఆయన గీతం కోసం గీతం రాయలేదు. ఆనంద మఠం అన్న నవలలో గీతం అది. నాటి ప్రభుత్వం ఆనందమరం నవలను నిషేధించింది. అయినా నా చిన్నతనాన వందేమాతరం నినాదాలు వింటూ వుండేవాడిని. నాకన్న పెద్ద కుర్రవాళ్ళు వందేమాతరం అని అరుస్తూ పరుగులు పెట్టేవారు. వందేమాతరం అంటే ఏమిటో నాకు తెలిసేది కాదు. అప్పుడు నేను గజపతి నగరంలో ఎలిమెంటరీ స్కూల్లో చదువుతూ వుండేవాడిని నాక్తు అక్కడ కూడా స్థిరతలేదు. గజపతినగరం నుంచి నాటి నిజాం సంసాపనం వరంగల్లు జిల్లా ఇలైందుకు వెళ్ళాను. అక్కడ మా చినమేనమామగారు పరసా అనంతరామయ్యగారీనే మొఖాసాదారువద్‌ పనిచేసూ వుండేవారు. ఆయన తమ్ముడు పట్టాభిరామయ్య గారు, ఆయన కొడుకు ఖద్దరు బట్టలు కట్టేవాడు. శ రోజూ పత్రికలు చదివేవాడు. వందేమాతరం నినాదం గురించి అతడిని అడిగాను. అతడు చెప్తాడు ఆ ఉద్యమాన్ని గురించి, నేను బాగా చిన్నవాడిగా ఉన్నప్పుడే అల్లూరి సీతారామరాజు కథ, పాటలు తెలుసుకున్నాను. ఇప్పుడు వందేమాతరం సంగతీ, కాం(గ్రెసు ఉద్యమం సంగతీ తెలుసుకున్నాను. అక్కడ స్కూల్లో మళ్లీ మూడోక్టాసులో చేరి పాసు అయ్యాను. నాకు ఎక్కడా స్థిరత లేదన్నాను కదా, అక్కడి నురచి మా పెద్ద మేనమామగారున్న హైదరాబాదు చేరాను, అక్కడ ఉరుదు స్కూల్లో చేరి మళ్లీ వహిదా చదివి పాసయ్యాను. అయిదో క్లాసు చదువుతూ స్కూలు మానేశాను. గ్‌ శ స్కూలు మానేసిన తరవాత నాకు కాస్త స్వేచ్చ అలవడింది. నాడు ఆర్యసమాజం ఒకటే దేశభక్తుల కేంరుంగా వుండేది వషోమా దసనలో సం చేశాను. వారి సహాయంతో నిషిద్ధ ఆనందమఠం | . నాకు హిందీ రాదు. రాత్రికి రాత్రి కూర్చుని దీక్షగా దేవనాగరి లిపిని నేర్చుకున్నాను. ఉరుదు వచ్చును కాబట్టి హిందీ సులభంగా అర్థం అవుతుంది. పడ, దక్ష న పన్నాసుల కథ, వారు దేశమాత విగ్రహం ముందు చేరి ఈ వందేమాతరం గితం ఆ నవల చదివిన తరవాత తెలిస న సస పదాలున్నాయి. కనక అవి సులువుగానే అర్థం అయాయి. సింది. భారతదేశం జనాభా ఆనాడు ముషుయికోటు అని కంఠ కల కల నినాదకరాళ ద్వాత్రింశత్కోటి భు లే స్తే ర గిర్‌ కోటి వందేమాతరం గీతం తెలుగులను ఎకు వైష్టర్థారకరలే నో నగరంలో ఆ సంగతి తెలిసింది గవ ప్రభావం చేసినట్లు అనిపిస్తుంది. న 214 అ రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ

బంకింబాబు గీతంలో భారత జనాభా (త్రింశత్కోటి అయితే నాటి తెలుగుల జనాభా మూడుకోట్టు. అందుకని ముక్కోటి తెలుగులం ఒక్కటై నిలుచుంటే అన్న పాటలు పుట్టాయి. బంకింబాబు రాసిన నవల తెల్లదొరల రాజరికంలోనే పుట్టింది. ఆయన వందేమాతరం గీతం రాసిన సుమారు వందేళ్లకు మనదేశం తెల్లదొరల కానరాని సంకెళ్లనుంచి విముక్తం అయింది. మనకు స్వాతంత్ర్యం వచ్చిన నాటికి దేశ జనాభా లెక్కకడితే అదే త్రింశత్‌ కోటి అని తేలింది.

బంకింబాబు పాటలోని లెక్క చలనంలేని శిలాక్షరంలా కనిపించింది. స్వతంత్ర భారతాన ఈ యాఖైయేళ్లలోనూ మన జనాభా మూడురెట్టు పెరిగింది. ఇప్పుడు భారతీయుల శతకోటి కంఠాలున్నాయి. పనిచేయగల ద్విశతకోటి కరాలున్నాయి. సుమారు వందేళ్ల బ్రిటిషు పాలనలో జనాభా అంతస్థిరంగా ఉండడానికి కారణం ఏమిటి? శిశుమరణాలు ఎక్కువయ్యాయా? తిండిలేక జనం చచ్చేవారా? ఆనాడు అంటే స్వాతం(త్ర్యం వచ్చిన నాడు మనవారి సగటు వయస్సు ఇరవై ఎనిమిది సంవత్సరాలు. ఇప్పుడది అరవై ఆయిదు సంవత్సరాలు. ఆనాడు తిండిలేక జనం, పశువులు కూడా రాబందులకు ఆహారమయ్యేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో రాయలసీమ క్షామం చాలా మందికి గుర్తు ఉండే వుంటుంది. నాటి ఆహార మంత్రి కేయం. మునిషీ పురైల రాసిమీద నిలబడి ఆకలి మిథ్య, చావులు మిథ్య అని ఉపన్యసిస్తున్నట్టు కార్టూనుగీశాను. అదే కాలాన కరువుబారిన పడ్డ రాయలసీమ జనం ఎముకలు తేరిన పశువులను తోలుకుంటూ పోతూ వుంటే ఎండుచెట్టు కొమ్ముల మీద రాబందులా దృశ్యాన్ని తిలకిస్తున్నట్లు మరో కార్టూను గీశాను.

స్వాతంత్ర్యం వచ్చింది. పడమటన కొంతభాగం పాకిస్తానుగా మారింది. తూర్పున మరికొంత భూమి బంగ్లాదేశంగా మారింది. అలా మన భూమి తగ్గింది. అయినా పెరిగే జనాభాతోపాటు పంటలు కూడా పెరుగుతూ వచ్చాయి. జనాభాతోపాటు సాక్షరత కూడా పెరుగుతూ వచ్చింది. కాగా చదువుకున్న వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలన్న ఆ పాతకాలపు ఆలోచన పెరగలేదు. దానివల్ల యువత అసంతృప్తి కూడా పెరుగుతూ వచ్చింది. చదివి డిగ్రీ తెచ్చుకొనడమే దేశోద్దారణం అన్న భావం పెరుగుతూ వచ్చింది.

ఈ దేశోద్దారకులను పిలిచి ఉద్యోగాలిచ్చే బాధ్యత ప్రభుత్వానిదే అన్న భావన యువతలో గాఢంగా నొటుకుంది. డిగ్రీలూ, గోల్డుమెడల్పూ ఎందుకూ పనికిరావని యువత భావిస్తోంది. తొలినాటి సాహిత్యం, సినిమా కథలూ, విద్య వ్యర్థం అన్న భావన కలిగిస్తున్నాయి. చదువుకున్న వారందరిలోనూ అసంతృప్తి, ఆ అసంతృప్తి ఎందువల్లనో వారికే తెలియదు. చదువువల్ల విజ్ఞానం పెరగాలి. కాని ఆది పెరగడంలేదు. అహంత మాత్రం పెరుగుతోంది. మనస్సు రథి అయితే సారధి బుద్ది అవుతుంది. నేడు యువతలో మనసులేదు.

మనస్సు స్టానంలో చిత్తం ఉంది. చిత్తం రథి ఆయినప్పుడు సారథి అహంత అవుతుంది. అహంత అంటే ఈగోయిజం అని అర్ధం. నా రచనలతో (ప్రపంచాన్ని మార్చేస్తాను. ఈ కవితలతో సమాజాన్ని మార్చేస్తాను. నా ఉచ్చ్వాస నిశ్వాసాలతో విప్లవాన్ని తెస్తాను అంటోంది యువతి. అలా అనడంలో తప్పులేదు. అంతకుముందు సమాజాన్ని ప్రపంచాన్ని గురించిన తెలివిడి తమలో ఎంత ఉందీ అని ఆలోచించడం మంచిది అనుకుంటాను. మనతోపాటు అనేక దేశాలు స్వాతంత్ర్య సమరాలను చేశాయి. స్వతం[త్రను సాధించాయి.

అవిప్పుడు ఎలా వున్నాయి. మనలాగే అన్నపుష్కలత గల జనాభా వుందా? సుస్టిరత వుందా? ఘనకార్యాలేవయినా సాధించాయా? మనతోపాటే స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న దేశాలు ఇప్పుడెలా వున్నాయి. మనం కూపకూర్మాలం కాదు. ఇరుగు పొరుగు దేశాలను అవగాహన చేసుకొనగల శక్తి మనకుంది.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 215

మనదేశం మీద అసంతృప్తిని పెంచుకొనడానికి బదులు మనకు ప్రపంచ జ్ఞానం వుంది, పనిచేయగల రెండు చేతులున్నాయి అని తెలుసుకొనడం మంచిదని నేను భావిస్తున్నాను. రిటైరయిన తరవాత పుస్తక పఠనం . ఏంగెల్సు ఆరిజన్‌ ఆఫ్‌ ఫేమిలీ పుస్తకం చదివిన తరవాత అలాంటి పుస్తకం మనకుంటే చాలా బాగుంటుందనుకున్నాను. కాని మనకు (ప్రయివేటు ప్రాపర్టీ స్టేటులేదు. పుస్తకాలు చదువుతూనే వున్నాను. తరవాత మోర్గన్‌ రాసిన ఏన్సెంట్‌ సొసైటీ చదివాను. అప్పుడా రెండు పుస్తకాలు కలిపి రాస్తే బాగుంటుందనుకున్నాను. ప్రాచీన సమాజ లక్షణాలు కొన్ని మన పురాణాల్లో కానవస్తాయి. గణ సమాజ అవశేషాలు తెలుగు సమాజాన చాలా కనిపిస్తాయి. వాటితో ఎంగెల్సు, మోర్గన్లను కలిపి రాత మొదలుపెట్టాను. రాసిన కాగితాలను చింపుకుంటూ మళ్లీ మళ్లీ రాయడం మొదలుపెట్టాను. మూడేళ్ల తరవాత పుస్తకానికి ఒక రూపం వచ్చింది, అప్పుడు దాన్ని ప్రింటుకిచ్చాను, దానికి జనకథ అని పేరు. మల్గారెడ్డి ఉదయం ఎడిటరుగా ఉన్నప్పుడు నన్నాక కాలం రాయమన్నాడు. ఆ రాతలను కొన్ని ఎంచి పారుటాకుల పేర పుస్తకం వచ్చింది. నేను విశాలాంధ్రలో వందలపాటలు రాశాను. కార్టూన్లు గీశాను. రాసిన వాటిని కట్‌ చేసి భద్రపరిచే ఆలవాటు నాకు లేదు. అంతేకాదు. నేను కవిని కానని కూడా అంటూ వుంటాను. అది చాలా మందికి నచ్చదు. అయినా అదినా తత్వం. చీమకుర్తి శేషగిరిరావు గారు తెలుగు విజ్ఞాన సర్వస్వంలో పనిచేస్తూ వుండేవారు. ఆయన తెలుగు గోష్టి అనే పేర ఒక సంస్థనడిపేవారు. తెలుగు చరిత్ర సంస్కృతి మీద గోష్టి జరిగేది. ఆసక్తిగల వారు అందులో సభ్యులు. నేను కూడా సభ్యుడనే. ఆయన ఆ గోస్టికి అధ్యక్షులు. నన్ను ఉపాధ్యక్షునిగా ఆయన నియమించాడు, ఆయన పోయిన తరవాత నేనధ్యక్షుడినయ్యాను. అక్కడ చేసిన ఉపన్యాసాలు ఆధారంగా వేదభూమి అన్న పుస్తకం రాశాను. దాన్ని చరిత్రకారులు బియన్‌ శాస్త్రిగారు అచ్చు వేశారు. అది తెలుగు గోస్టి ప్రచురణ. స్వతంత్రదేశంలో రిఫార్క్‌ త్వరగా జరుగుతాయి. నాకు చదువు లేదు. మా అన్నగారికి చదువులేదు. మా అన్నగారికి నలుగురు ఆడపిల్లలు. పెద్దమ్మాయి డాక్టరు. రెండో అమ్మాయి ఎమ్మే. మిగతా ఇద్దరూ (గ్రాడ్యుయేట్సు. మా అమ్మాయి ఎమ్మే పొలిటికల్‌ సైన్సు. అబ్బాయి ఇక్కడ బియస్సీలో చేం తరవా, త నా బేటీ చది బయోమెడికల్‌ ఇంజనీరింగులో ఎమ్మెస్‌ చేశాడు, మా అన్నగారి రెండో అమ్మాయి వృన్నారు. ్ర౯ఖిను పెళ్లి చసుకున్నాడు. ఇప్పుడు నా కూతురూ, కొడుకూ ఇద్దరూ అమెరికాలోనే శ్రీశ్రీ తన సొంతకథకు అనంతం అని పేరుపెట్టుకున్నాడు. మనిషిలో ఊపిరున్నంతవరకూ ఏక్షథ ఆయినా ఎవరికథ ఆయినా అనంతమే. మనిషి తాను చేసే ప్రతి పనికీ శాశ్ళతత్వం ఊహించుకుంటాడు. ప్రతీ శాశ్చతత్వమూ సాపేక్షం మాత్రమే. అలాగే మన ఆలోచనలూ, ఊహలు, నిర్లారణలూ కూడా సాపేక్షమే. చిరయు మృతియులేని జనునట్లు ప్రాజ్ఞుండు ధనము విద్య గూర్చవలయుం'డ్రు. ధర్మమాచరించదగు మృత్యుచేతలపట్టి ఈడ్వవడిన వానివోలె.” తెల పఫ్రైతాలో పద్యం, నేను హైదరాబాదులో ఉరుదు మీడియం మూడోక్లాసులో చేరినపుడు మా విని నువ్య స్ట్‌ న పాపా తిరుమలగావుగారు ఈ పద్యం చదివారు. వెంటనే ఆ పద్యాన్ని చదివాను. అది హఠాత్తు నట్లు అన్నాడాయన, నాపన్నెండో ఏట విన్న యీ పద్యం ఎందుకో నాక్స అంటారు, వినియోగం నేం పద్యానికయినా, భావానికయినా వినియోగం వుంటే అది గుర్తుంటుంది 216 9 రాంభట్ట కృష్ణమూర్తి సొంతకథ

కన్యాశుల్కం నాకు సోషల్‌ ఏంటత్రోపాలజీమీద ఆసక్తి కలిగించింది. నాతో సమాన ఆసక్తికలవాడు చాలా కాలానికి పరిచితుడయ్యాడు. అతనిపేరు ఏటుకూరి ప్రసాద్‌. సోషల్‌ ఏంత్రోపాలజీ మీద పుస్తకాలను ఇద్దరం కొనేవారం. వాటిని చదివి చర్చించుకునేవారం. తెలుగు సాహిత్య మెరిగిన వారిలో సోషల్‌ ఏంటత్రో పాలజీ మీద ఆసక్తిగల వారు తాపీధర్మారావుగారు. ఆయనతో నాకు మద్రాసులోనే పరిచయం అయింది. తరవాత ఆయన హైదరాబాదులో స్థిరపడ్డారు.

ఏటుకూరికి కూడా ఆయనతో పరిచయం అయింది. ఆయన ఏంటత్రోపాలజీమీద మూడు పుస్తకాలు రాశారు. అవి - పెళ్లీ దాని పుట్టుపూర్యోత్తరాలు, దేవాలయాల మీద బూతు బొమ శలెందుకు, ఇనపకచ్చడాలు. 'పెళ్లిళ్లమీద ధర్మారావుగారిత్తో మేం చర్చించేవారం. ఆయన బాబూ నాకు వెస్టర్‌ మార్కు పుస్తకం దారికింది. అది తప్పుల తడక అని తరవాత తెలిసింది. మీరు దాన్ని సరిదిద్దుకోండి అన్నారు. తాపీధర్మారావుగారి జీవితం, రచనల మీద పిహెచ్చీ (గ్రంథం రాశాడు ప్రసాద్‌. దాని ఆవిష్కరణ సమయాన హఠాత్తుగా ఆరుద్ర వచ్చాడు.

ధర్మారావుగారి పుస్తకాల్లో చాలా తప్పులున్నాయి. వాటిని సరిదిద్గుతూ ధారావాహికంగా వ్యాసాలు రాస్తానని (ప్రకటించారు. సమావేశంలో ప్రకటించడమే కాదు. ఆయన వ్యాస పీఠం శీర్షికలనే ప్రకటించాడు. ఆ తరవాత నేను మాట్లాడాను. రాత మొదలుపెట్టే ముందు ఈ పిహెర్టీ పుస్తకం చదివి రాత మొదలుపెట్టమని సలహా యిచ్చాను. ఆయన చదివినట్టున్నాడు. ఆయన ప్రకటించిన రాతలు రాయలేదు. తరవాత చాలాకాలానికి “గుడిలో సెక్సు” అనే పేర ఒక పుస్తకం రాశాడు. దాన్ని రామోజీకి అంకితమిచ్చాడు.

ధర్మారావుగాగ్గి దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు అన్న పుస్తకం ఆధారంగా మారు భాషలో రాసిన పుస్తకం అది. అంతే. ఆరుద్ర కవి, రచయిత, పరిశోధకుడే కాని తాందరపాటు ఎక్కువ. దశరథుడు పుత్రకామేస్టిని చేసినట్టు ఆరుద్ర క్షీర్తికామేష్టి చేశాడు. ఆరసం నిర్మాణానికి ముందు ఆయన్ను కలిసి చర్చలు జరిపాం. అవి సఫలం కాలేదు. నక్సలైట్లను కూడా కలుపుకోవాలని ఆయనవాదం. తాను చిన్ననాటి నుంచీ కమ్యూనిస్టుని అంటాడు, కాని ఒకసారి విడిపోయిన కమ్యూనిస్టులు తిరిగి కలవడం అసంభవం అని ఆయనకు తెలీదు.

ఇప్పుడు రాజకీయాల్లో థర్డ్‌ ఫ్రెంటు అనీ లెప్ట యూనిటీ అనీ నినాదాలు చేస్తున్నారు కాని అందులో ఏదీ సాకారం కాలేదు. కాబోదు. దారి[ద్రంలోనూ, మూర్ధత్వంలోను కలిసేవారు చాలా "మంది వున్నారు. కాని మాలమాదిగలు, బ్రాహ్మణులు మాత్రం కలవరు. అలాగే రాజకీయాల్లో కూడా కలవని వారు కొందరున్నారు. అయితే ఆ వేర్పాటు తాత్కాలికం మాత్రమే. ఇప్పుడు పుస్తక పఠనం నానాటికి తగ్గుతోంది. ఇందుకు కారణం ఏమిటి? చదవదగ్గ పుస్తకాలు రాకనా? పుస్తకాల మీదా, చదువుమీదా ఆసక్తి లేకనా? ఏమో తెలీదు.

ఇప్పుడు సాహిత్య సంఘాలు చల్లబడ్డాయి. సమ్మాన సంఘాలు మాత్రం రోజురోజుకూ పెరిగి పోతున్నాయి. తెలంగాణాలో భోజన సంభారాలకు సాహిత్యం అని పేరు. ఇప్పుడు సాహిత్యానికి సాహిత్యం దొరకదు..సమ్మానాల పేరుమీద కావలసినంత “సాహిత్యం” సమకూరుతుంది. అందుకని దానికి గిరాకీ పెరిగింది. అనంతానికెక్కడో అంతం కల్పించాలి. పాఠకుని ఓరిమికి నమోవాకాలు.

రాంభట్ల కృష్ణమూర్తి సొంతకథ అ 217

||| జత్తులో . కం. క6ట1464గ06%64 4% 80180 (శ) 810101 గ౧||౬ 1౬౬ (కం/ |౮౫౮600౯-508 244, [12160౧64 01591 (4.8) 11/5. మల్లిఖార్జున పార్‌ బాయిల్డ్‌ బన్నీ రైస్‌ మిల్‌ మునుగోడు - 508 244. నల్లగొండ జిల్లా లీ నే న య! ద్దు దు సాయిబాబా థియేటర్‌ న్‌ా క్ష వైన్‌ షాప్స్‌ అసోసియేషన్‌ సూర్యాపేట డు నో 218 అ రాంభట్ల కషమూరి సాంతకణ

౦౦[౧|7౧4౦10గ| [న్‌ ల నానన సం. 6-6-36, ₹జాయండ028622 ౫4పిం0గస04 - 508 001 20106 : (086829) 22777. 22277 న ల బాన 214 సం. 40%, ౨00) కం ఆ5 044 ౧0.11, చుట ముడ82% న = 500 029 016 : 765 2/77 6611 : 98480 14777 వాకా రాంభట్ల కృష్ణమూర్తి సొంతకఠథ అ 219

0£004% 210% 920518 0040816 09౧౫౯ . "009. 664 1090114, [11క్రంగ4: స. 441 వేర్‌ 2322323232 క 155,854 క4651,[11/110 త చక్కటి ౧౧౧66 1160౧/ మరియు కగ[ింకా |2(6౧4| ఇవ్వబడును తా విద్యార్థిని, విద్యార్థులకు వాీస్టల్ట్‌ మరియు కళాశాలలు వేరువేరుగా కలవు | | ౯ 24గలో ప్రశ్షలపై అవగాహన కలిగించే విధంగా 24 మరియు 8 ౧౧45 (౮65110౧ 02౧% ఇవ్వబడును ఆ విద్యుత్‌ కోత సమస్యలేకుండా అన్ని వోస్టల్స్‌కు, కాలేజీలకు 6 [౪/జనరేటర్స్‌ కలవు ౨౦[500671550 60౪. ౮౮౫10 6౦1౬158655. కొ? 442 00.00 3౮011002 00౬18666 గ్గ 0౧౧: (0౪4 [10501121 స్తీ గ [60%04. ల్ల 54014040] ౮౮1108 ౦00౬68౬ రీ గి2గ2611 4౬601104. నన 220 అ రాంభట్ల కృష్ణమూర్తి సొంతకధ

ము 10. ॥ జ్‌ | ము? (కో ఈ. షు ఎన: భా” మ ర. / తా మ శ్‌? జే స్లో ౯ , న. / మ వ న యి నో | | టే. . శ లో యం. | జై ॥ కుమారుడు ఆర్మెన్‌ కుమార్‌ సూరి, కుమార్తె అరుణ, అర్ధాంగి సుభద్ర టీ మరాలు శైలజలతో రాంభట్ల కృష్ణమూర్తి చిన్న మనమరాలు శ్రీవాణి, పెద్ద మనమరాలు ౨ క

వ! 1 నో న యను.. -. న శ టస్‌.2 (ఖో. లీ స స మ ళో శై మ శ స టి 1 స స న్‌ న. . న. | | వ స్తు. ? న్‌ న [౫ 11 నట యా. ఖు. షై. త్ల! న సీ రే / ఖ్‌ . నం తో ణే న. ః 1 ం . యా స జీ న ళు ఖై శ | ము. శశ వ వన నల నలభై పళ్ళవయస్సులో

. టు ఖ్‌ నే తే [ 1954లో రాంభట్ల జ్య | షన చిత్రకారుడిగా రాంభట్ల

పు భయము. సు న. వూ వట ర్‌ స గ ౪ (జ మ స్‌ . /” ఖ్‌ న నస ఛ్‌! టీ. .. || శే బు? వి టీ య గ్‌ వ్‌ వే] టే | ళ్శ .. 1 లి 1! యు | - [| /! 1. 1975లో రష్యా నుంచి వచ్చా

వా ప సల ల ల (| భి షే ్‌ే న. సట స సజల ఉత హస క్ష ఆరుద్రతో రాంభట్ల టీ భీష్మ సాహి గజ్జల మల్లారెడ్డితో

ల. శ క ౯ జ. ఖు ల? | డ్య న్‌ ఆవంత్స సోమసుందర్‌తో నో స్తాతతణ ( హి వో! కార ఖ ప జీ స శ ము క్‌ స్ట ఆ నా. ల నా గ ౧ 1 స సనారు లవ ధర్వారవు.. ౫ (ఆ / ఖీ గ్‌ శ జై నా సై ఎ న్న వ నలు ల న . రంల క / జ్‌ ఇ మం ము; స్త న... న ల తాపీ ధర్మారావు జయంతి సభలో రాంభట్ల. వేదికపై స విశాలాంద్ర పబ్లిషింగ్‌ హౌజ్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీ రాజేశ్వర రావు కూదా ఉన్నారు.

న్‌ ఆ. కుమార్తె అరుణ పెళ్ళిలో యజ్ఞోపవీత ॥ | యం నా శ్ర కాడ్‌ నిడమర్తి ఉమారాజేశ్వర రావుతో

లోక ఒ

  1. సా శె గ న. లీ ॥ య ఖీ ( న వ వ అధ శీ | ౯. ఇ యా. "ట్ట ఏ?! శ ల త స టు న రా న చం పళ ను | ॥ జె తన ర్తా! ద: ఫా | 0. లే | గస న. క్‌ క్ష వస లట. స మ హి క క [ల బా మవ టం... నని 1. యల ల ,. న ఖె జబమానాా పనన యూ రష్యా పర్యటనలో రాంభట్ల | ల ఖ్దే | (| య. లో స శని 6 మస జ 181 త్రం ౪ న్‌! య. నో ళీ (. ॥ న. " | ర క ఈ మం ఈటీ గ్‌ న మ రయ్య (గ్ర౦ధా సుందర స్ట రందాలఖ. ఆక్షేనియా పర్యటనలో రాంభట్ల ఆ నన్‌ యో?

రాంభట్ల కృష్ణమూర్తి . శా. మయమెదడొక అపూర్వ జ్ఞాపకాల ఈ. గ్‌ వా విజ్ఞాన సర్వస్వం. అందుకే కాస ఆయన కదిలే (గ్రంథాలయం. " ” //. నఖ ప్రవంచాన్నే. పాఠశాలగా క వే మలచుకుని ప్రాచీన సాహిత్యం జ [రా నుంచి ఆధునిక విజ్ఞాన శాస్త్రాల న్న రో శ్‌ వరకూ బెపోసన పట్టారు. మ న ప్ల! “తెలుగులో తొలి రాజకీయ లాలా క్త కార్టూనిస్టు ఆయనే. మీజాన్‌, క విశాలాంధ్ర, ఈనాడు పత్రికల్లో ' _ . _ వివిధ హోదాల్లో పని చేశారు. జనకథ, పారుటాకులు, వేల్పుల -. కథ్మ: వేదభూమి ఆయన రచనల్లో కొన్ని. పిడకల వేట, గరిక పరకలు, మథనం శీర్షికలతో పలు పత్రికల్లో వందల వ్యాసాలు రాశారు. 1920 మార్చి 24న అమలాపురం దగ్గర్లోని అనాతవరం అగ్రహారంలో జన్మించారు. ఎన్నో కష్టాలు పడ్డారు. జీవితంలోని అన్ని పార్య్వాలనూ చవిచూశారు. విదేశాలకు వెళ్ళారు. కమ్యూనిస్టుగా బతికారు. సాహితీ ఉద్యమాల్లో పాల్గొ . న్నారు. వయసు పైబడినా నవయవ్వనుడ్డు. ఎనఖై వసంతాల - | . అనుభవాలకు అక్షర రూపం ఈ సొంత కథ. సమకాలీన చరిత్రలోని ముఖ్య ఘట్టాలకు దర్పణం ఈ 'సొంత కథ. ”