Telugu somanchi usharani kathalu - anilvaranasi/indianlanguages GitHub Wiki
| ట్ర " న [. | స్ట ఫ్ వ ల. సోమంచి అషారాశకథలు. శా సిం " టై మః ఫ్ స్ కీ
షన. భి ష్ న్ నే సోనుంచి ఉషారాణి, బి.కామ్. టా. సాహితీ యువరత్న
(ఏ గ మూ, కళల మ. సోమంచి ఉషారాణ్ కథలు (గ అటిచావన్నున్సు . క మ ల. సోమంచి ఉషారాణి, బి.కామ్. సాహితీ యువరత్న
సోమంచి ఉషారాణి కథలు ప్రథమ ముద్రణ : 1999 ప్రతులు : 1000 వెల : రూ. 25/-= ల్ ల్ ల న. ముద్రణ : రా అనుపమ ్రింటర్స్ (గ 126, శాంతి నగర్, హైదరాబాద్ - 28, (౧ ఫోన్స్ : 3391364, 3304194 - / పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ స్ట్ ఆర్థిక సహాయంతో. న అన్ని హక్కులూ రచయిత్రివే, హో
ఉషారాణి కథారాణులు
సోం ఉషారాణి కధలు, సంపుటిగా వెలువడుతున్నాయి. అనేక పత్రికలలో ఇవి ప్రచురించబడి, ఆమెకు గుర్తింపు తెచ్చాయి. ఇటీవల కాలంలో కధకు ఊపు వచ్చింది. తెలుగు కధ గురించి కొందరు రచయితలు ప్రత్యేకంగా శ్రమిస్తున్నారు. నవలారచన కంటె, కథారచన నేడు ప్రాభవ్యం సంతరించుకుంది.
ఆధునిక మానవజీవితం అనేక సమస్యలతో నిండి, తీరిక లేని దుస్థితికి చేరింది. అటువంటి సమయంలో మనసుకు కాస్త ఆహ్హాదం కలిగించగలిగేది కధ. సంసార జీవితం రైతుల బాధలు, విద్యా సమస్యలు, (గామీణవాసుల జీవన విధానం, ఇలా అనేక ఇతి వృత్తాలతో కధలు సాగుతున్నాయి. సోమంచి ఉషారాణి కధలు కూడా ఈ కోవలోకే వస్తాయి.
అయితే ఆమె కధల్లో ఒక్క సంక్షిప్తత మాత్రమే కాకుండా ఒక సందేశం కూడా కొంత కనిపిస్తుంది. సహజత్వం, సంభాషణా చతురత, కథాగమనం, శిల్చం - వీటిలో ఉషారాణి చాలా పట్టుదలతో కృషి చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రతీ జీవిత సంఘటన క్రొత్తగా కథగా రూపొందించవచ్చు. ఆవిధంగా ఉషారాణి, జీవితంలోని చిన్నచిన్న సంఘటనలకు కూడా రూపురేఖలు కల్పించి కధలుగా మలిచారు. ఈమె కృషి ప్రశంసనీయం.
ఇందులో అన్ని కధలు రకరకాల తీరు తెన్నులు కలిగినా చదివించే శక్తీ ఆకర్షణా కలిగివున్నాయి. ఆవిధంగా శ్రీమతి ఉషారాణి అభినందనీయురాలు.
కళాప్రపూర్ల జ ర డా. పోతుకూచి సాంబశినరావు
13-118, గ. లయం కవాడిగూడ క్షి" ల్ న్న కల్పనా ధియేటరోవక క; లో సికింద్రాబాదు. *" "౩ క. పోన్ : 7533177 అలర ిల శైల
వాసొ ప్రభావతి, ఎమ్.ఏ. పిహెచ్‌డి. ఫోన్ : ఇలు, 4549175 కవయిత్రి, రచయిత్రి వాసా నిలయము రీజినల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ 11/2ఆర్.టి., మునిసిపల్ కాలని, మలక్‌పేట్ హైదరాబాదు - 500 036. కథామందారం 'శిఐ వచన సాహిత్యయుగం.. వచన. కవిత్వంతో పాటు నవల, కధవ్యాసం పారకలోకాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 10 సం॥ల క్రితము నవలకున్నస్టానం ఈనాడు కథకు దక్కింది. సుదీర్హకావ్యాన్ని చదినే ఓపిక జనానికి లేదు. అందుకే కధవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజాసమస్యలతో పాటు, వ్యవహారిక శైలి వాడుకలోకి రావడంతో పారకలోక హృదయాన్ని అయస్కాంతంలా ఆకర్షించే. శక్తి తెలుగు కధలో ఇమిడిఉంది. నవలను చదివే ఓపిక, అందులోని వర్షనల మధ్య దాగున్న కధను వెదికే ఓపిక కూడా పారకలోకానికి లేదు. అతి తక్కువ పేజీలతో చెప్పవలసిన అంశం సూటిగా హృదయాన్ని తాకడం వల్ల ఈనాడు కథ చదవడం అందరికి ఆమోదంగా ఉంది. కధారచనలో రచయిత, రచయిత్రి అన్న తేడా లేదు. ఎంతో మంది కొత్త రచయితలతో పాటు రచయిత్రులు కూడా ముందుకు వస్తున్నారు. కధకు పారకలోకంతో పాటు, పత్రికల ప్రోత్సాహం కూడా బాగానేఉంది. వివిధ దినవార పత్రికలలో వచ్చిన కధలు కధాసంకలనాలుగా వెలువడుతున్నాయి. అలా వెలువడుతున్న కొత్త సంకలనం శ్రీమతి సోమంచి ఉషారాణి కధలు. ఈవిడ చాలాకాలంగా నాకు తెలుసు. ఇది వరలో చక్కని కవితలను సంకలనం వెలువరించింది. ఈనాడు కధాసంకలనం వెలువడిస్తోంది. శ్రీమతి సోమంచి ఉషారాణి ఆదర్శగృహిణి. ఇంటి పని, వంటపని, పిల్లల పని చూసుకుంటూసాహిత్యం మీద అభిరుచిని పెంచుకుంది. పుస్తకాలు పరించడమే కాదు రచించే స్టితికి ఎదిగింది అంటే నేడు సామాన్య గృహాల్లో వస్తున్న సాహితీ సంచలనానికి ఉదాహరణ ఈమె జీవితం. ఒకనాడు భారతీయ సాహిత్యంలో ప్రసిద్ది వహించిన కథకి ఈ కధకి పోలికలేదు. అగ్నిపురాణంలో కధాలక్షణాలు చెప్పబడినా ఈ కధారూపం కనబడదు. పొళ్చాత్య ప్రభావంలా మన సాహిత్యంలో నిల్ఫిన కథానికా రూపమిది. ఈ కధానికకు ప్రధానమైంది క్టుప్తత. ఎంతక్తుప్తంగా రూపమిస్తే కధానిక అంత (ప్రాధాన్యతను సంతరించుకుంటుంది, కధను సాగదీస్తే నవల కానట్లే నవలను కుదిస్తే
కధానికకూడా కాదు. ఉషారాణి కధలలో ఆ క్లుప్తత ఆమె రచనకు వన్నై తెచ్చింది.
కధకు (ప్రధానమైన అంశం భాష అనవసరమైన పదాడంబరంతో, అలంకారాలతో బరువుగా కాకుండా తేటనీటిలో సాగే నదిగా సాగిపోయే జనజీవన భాష కావాలి. పెద్ద పెద్ద వాక్యాలు కాకుండా చిన్నచిన్న వాక్యాలతో స్పష్టమైన భావాన్ని అందించే వ్యావహారికభాష కావాలి. ఉషారాణి కధల్లో తేలికైన వ్యవహారికభాషేకాదు అలతి అలతి పదాలతో అర్ధవంతంగా సాగిపోతాయి అన్ని కధలు
కధకు అనవసరమైన వర్షనలు బరువు కాకూడదు. అనవసరమైన కధలకు తావీయకుండా సూటిగా కధాగమనం కలిగిన కధలు ఇవి. ఇందులోని కధలన్నీ చాలా గొప్ప కధలని చెప్పడం కాదు. మద్యతరగతి కుటుంబాలలోని సమస్యలను వివిధ కోణాలలో దర్శించి వర్షించిన కథలివి. కధలలో కావలసినంత వెరైటీఉంది. ఏ సమస్యను తీసుకున్నా సమర్థంగా చెప్పగల నేర్చరితనమున్న రచయిత్రి ఈమె. పారకలోకాన్ని చదివించేశక్తి ఆనందింపచేసే శక్తికూడా ఈ కదలకున్నాయి. అందుకే ఇవి ఉత్తమకధలు. శ్రీమతి ఉషారాణి ఉత్తమ రచయిత్రి అనడం అతిశయోక్తి కాదు
ఈ రచయిత్రి శీర్షికానామకరణంలోకూడా చాలా (శ్రద్ద వహించింది. కధకు అదికూడా ముఖ్యమే. అమ్మ, ఇది కథకాదు, తృప్తి మీనా, ఈ ప్రశ్నకు బదులేది, మనసు మూగద్ది, (ప్రేమలత, అంతరం, ప్రయాణం, ఈ తరం స్త్రీ మొదలగు విధంగా చాలా చక్కటి పేర్డు పెట్టుకుని వాటికి తగినట్టుగా కధను ముగించడం ఈమె రచనల్లో ప్రధానంగా కనబడుతుంది. కలంబలం ఉన్నవాళ్ళే అలానడిపించగలుగుతారు వస్తు వైవిధ్యం గల రచనలివి.
ఈనాటి సమాజంలో కొడుకులు తల్లితండ్రుల్ని సరిగా చూడకపోవడం 'ప్రధానసమస్యగా మారుతోంది. ఈ సమస్యను వర్షించడమేకాదు. ఆ కొడుకులో పశ్చాత్తాపం రావడం కూడా చూపించిన కథ “అమ్మ'.
ఈనాడు మగవారికంటే అడపిల్లను కనడమే నయం అన్న విషయం 'అమ్మాయే పుట్టాలి" అన్న కథలో వర్షించబడినప్పటికీ అబ్బాయిలు మరొక వైపు ఆలోచిస్తే కొడుకుల్లో కూడా ఉత్తములుంటారని నిరూపించిన కధ ఇది.
ఇది కధ కాదు" అన్న కధాంతంలో రచయిత్రి నిరూపించిన కారణాలు రచయిత్రి కధనానికి వన్నె తెచ్చాయి. తృప్తి కధలో పెంచి పెద్దవాడిని చేసిన కన్నతండ్రికి తద్దినం పెట్టడం కూడా భారమనుకున్న కొడుకులో పశ్చాత్తాపం కలిగించడం చెప్పబడింది. అలాగే 'మీనా' కధలో అనాకారిని, పేదరాలిని, యేచేయూత లేని యువతిని పెళ్ళి చేసుకుంటే అందులోనే ఉంటుంది నిజమైన ఆనందం' అని నిరూపిస్తుంది. ఈ సంపుటిలోని కధలలో అనేక సమస్యల చిత్రీకరణతో పొటు పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తాయి.
కధ ఆనందం కోసమే చదవడం అని కొందరంటున్నా జనసమస్యని, చెప్పడమే కాదు. పరిష్కారాన్ని చూపించడం ఉత్తమ కధా లక్షణం. పాఠకుని మనస్సులో కొత్తఊొరటతో పాటు వెలుగు నింపుతుంది. ఉషారాణి కధల్లో ఇదో ప్రత్యేక లక్షణం.
, కధారచనలో అందెవేసిన చేయిగా మరిన్ని ఉత్తమకధలు ఉషారాణి రచించాలని ఉత్తమ కధారచయిత్రిగా పేరుగడించాలని కోరుకుంటున్నాను. ఆమె కలం నుండి వెలువడిన ఈ “కధా మందారం' ప్రధమ కధా సంపుటికి స్వాగతం పలుకుతున్నాను.
వాసా ప్రభావతి.
జవిధ్వం గల మంచికథ వైవిధ్యం గల మంచికథలు
కే10లో. గురజాడ. రాసిన “దిద్దుబాటు”తో అంకురించిన తెలుగు కధానిక అచిరకాలంలోనే ఆరోగ్యంగా పెరిగింది. ఈ శతాబ్దపు 'ప్రధమార్ధంలో శ్రీపాద, చింతా దీక్షితులు, కొడవటిగంటి, ముద్దుకృష్ణ మునిమాణిక్యం వంటి సిద్దహస్తులెందరో కలకాలం గుర్తుంచుకో గలిగిన కధలు రాశారు. అటుతర్వాత మధురాంతకం, పాలగుమ్మి, వాకాటి, యద్దనపూడి, పోతుకూచి వంటి వారెందరో కధాశిల్పానికి మెరుగులు దిద్దుతూ వచ్చారు. అయితే 1970 దళకం నుంచి సుమారు రెండు దశాబ్దాల పాటు తెలుగు కధకు గ్రహణం పట్టింది. ఫాస్ట్ర పుడ్‌లాగా చకాచకా చదివించే, సెక్స్, హారర్, (ధ్రిల్లర్ వంటి ఇతివృత్తాలతో వచ్చిన సీరియల్స్, నవలలు, కధానికను లూప్‌లైను మీదికి నెట్టాయి. అయితే సుమారు గత పదిసంవత్సరాలుగా పరిస్టితి మారింది. రాట్నచ(క్రంలో క్రింది ఆకు క్రమంగా పైకివచ్చి ఉచ్చస్టానం అందుకున్నట్లు తెలుగు కధానికకు పునరుత్చానం వచ్చింది. ఎందరో రచయితలు (స్త్రీ పురుషులందరూ రచయితలే. జెండర్ డిఫరెన్స్ లేదు) నూతనోత్సాహంతో మంచి కధానికలను రచిస్తున్నారు. అట్టివారిలో పరిమాణంలో చిన్నవే అయినా పసలో పెద్దగా వుంటున్న కధలను తరచు రాస్తున్న వారిలో సోమంచి ఉషారాణి ఒకరు. ఆమె రచించిన కొన్ని కధలను గతంలో నేను చదివాను. వాటిలో కొన్ని మంచి కధలు అనిపించాయి. అయితే ఇప్పుడు ఈ సంకలనం ద్వారా 17 కధలను వరుసగా చదవడం జరిగింది. ఈ కారణంగా ఆమె రచనాశైలినీ, ఒక రచయితగా చెప్పదలచుకున్న దానిని, చెప్పే విధానాన్ని తగినంతగా ఆకళింపు చేసుకోగల అవకాశం కలిగింది.
కధానికకు ప్రధాన లక్షణం ఒక ఇతి వృత్తాన్ని ఆధారం చేసుకుని తక్కువ వాక్యాలలో ఎక్కువ కధనాన్ని నడిపించడం. ఈ విషయంలో ఉషారాణి సిద్ధహస్తురాలు. ఈ పుస్తకంలోని 17 కధలలోనూ మూడు నాలుగు తప్పిస్తే మిగిలినవన్నీ మూడు పేజీలు మించని చిన్న కధలు. ఇవి సాంప్రదాయం పట్ట గౌరవం నుంచి, ఫెమినిజం పరిధిలోకి తొంగిచూస్తాయి. భార్యభర్తల, స్త్రీపురుషుల సంబంధాలు సహజంగా కనిపిస్తాయి కాని, ఎక్కడా అశ్షీలత, అసభ్యత కనిపించవు. కొన్ని మంచికధలు అనిపిస్తే మరికొన్నిటి ముగింపు మరువలేనిదిగాను ఆలోచింపజేసేవిగాను ఉన్నాయి.
మొదటికధ అయిన “అమ్మ” ముగింపు వినూత్నత్వంతో కూడి ఉంది. జీవితంలో మోసపోయినా కొడుకు బుద్ధిగా చదవాలని పైకి రావాలన్న ఆ తల్లి తపనను, (క్రమశిక్షణను భరించలేని రాజేష్ తల్లి పట్ట ద్వేషం పెంచుకొని ఆమెను వృద్ధాశ్రమానికి పంపాలని
అనుకొంటాడు. ఆమె ఇష్టానికి విరుద్ధంగా పగతో పెళ్ళాడుతాడు. ఆ ఇల్లాలే తల్లిని దగ్గర ఉంచుకోవాలంటే ఇష్టం లేక విడాకుల వరకూ వెళ్తాడు. అది తెలిసి భార్యను ఏలుకోవాలని అర్జిస్తుంది ఆ తల్లి. సాధారణ అత్తాకోడళ్ళ సంబంధాలకు విరుద్దంగా ఉన్నత వ్యక్తిత్వాలను కలిగిఉంటాయి ఇందులోని పాత్రలు. ఒక్క రాజేషే కాదు. ఈనాటి సమాజంలో వృద్ధులైన తల్లిదండ్రులను బయటికి పంపే పుత్రులే ఎక్కువగా కనిపిస్తారు. ఇటువంటి పుత్రులను చూసి, కొడుకు అని స్కానింగ్‌లో తేలితే అబార్షన్ చేయించుకోవాలనుకునే కోడలి ఇతివృత్తం కలది “అమ్మాయే పుట్టాలి” ఇదే ఇతివృత్తాన్ని మరోకోణంలో చూపిన మంచికధ “ఆడపిల్ల”.
అనాకారితనం ఎవ్వరి బాధ్యతా కాదు. కాని చేయని పాపానికి అనాకారులు ఆవహేళనకు గురి అవుతుంటారు. అయితే ఎడారిలో ఒయాసిస్‌ల వలె దేహసౌందర్యం కంటె అత్మసౌందర్యాన్ని ఆరాధించే సంస్కారవంతులు ఉంటారు. ఇటువంటి మంచికధ 'మీనా' కధనంలో కొత్తదనం ఉంది. “ఇది కధకాదు” కూడా అవహేళనకూ, వివక్షతకూ గురి యవుతుండిన ఒక మరుగుజ్జు, అనాకారిల వివాహానికి దారితీసే కధ. అయితే కొంచెం సినిమాటిక్ టచ్ ఉంది. “ప్రేమలత” కధకూడా ఆత శ సౌందర్యాన్ని ఆరాధించే ఒక ్రీమూర్తి కధ. కాని వాస్తవాలను (గ్రహించి ఆ (ప్రేమను సున్నితంగా తిరస్కరించిన సంస్కారహృదయుని కథ. కధనంలో, ముగింపులో నవ్యతున్న ఈ కధ ఒక మంచికధగా నిలుస్తుంది.
విద్యావిషయకంగా, సాంకేతికపరంగా సమాజం అభివృద్ధిచెందినా భారత స్త్రీ పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పురాలేదు. సమానత్వం మాట సరే - ఈ పురుషాధిక్య సమాజంలో ఆడవారు అడుగడుగునా అగచాట్టకు గురవుతూనే ఉన్నారు. ఇదే పరిస్థితి మగవారికి ఏర్పడితే? ఈ అంశం మీద ఎన్నో కధలు, నాటికలు, సినిమాలు గతంలో వచ్చాయి. “అంతరం” అంశాన్ని ప్రతిబింబించడమేకాక స్త్రీ పురుష సమానత్వ అవసరాన్ని చాటే చక్కని కధ.
(స్త్రీలందరూ సౌమ్యులూ, సహనశీలురూ కాదు. వాళ్ళలో కూడా ఉత్తముడైన భర్తనీ, అత్తమామలనూ, ఆడబడుచులనూ కాల్చుకుతినే దుష్టప్రవృత్తి గలవారూ ఉన్నారు. ఇటువంటి ఆఫ్‌బీట్‌ధేం వున్న కధ “బెటర్‌హాఫ్” - “బిట్టర్‌హాఫ్” అనిపించే ఈ కధలోని ద్వేషానికి కారణం, ముగింపు మాత్రం అంత సహజంగా అనిపించదు.
ఆలోచింపజేసే మంచికధ “ఏం”స్పెట్ ? తల్లిదండ్రులు చదువు విషయంలో తమ అభిప్రాయాలను పిల్లలమీద రుద్దుతూండడం తరచుగా జరిగే విషయం, _ ఇష్టంలేని చదువులను బలవంతంగా చదవవలసి రావడం వల్ల కలిగే పరిణామాలను చక్కగా చూపుతుంది ఈకధ,
తండ్రికి తద్దినం పెట్టడానికి తటపటాయించే తనయుడు తన కొడుకూ అదే బాటను
అనుసరిస్తుంటే పడే ఆవేదనకు దర్శణం “తృప్తి”. ఇలాగే మిగిలిన కధలన్నీ కూడా మంచి ఇతివృత్తాలనే కలిగిఉన్నాయి. అయితే “దాహార్హులు”, “శోభ” సినిమాటిక్ ప్రభావం ఎక్కువగా ఉన్న కధలు. “శోభ”లో మతిచలించిన భార్య మెంటల్ ఆస్పత్రిలో ఉండగా, చిన్న పిల్లల్ని సంబాళించలేక సతమతమవుతుండిన కృష్ణకాంత్ పెద్దల బలవంతంతో రాధను పెళ్ళాడుతాడు. ఆ తర్వాత అనూహ్యంగా శోభ బాగుపడుతుంది. ఉత్తమురాలైన రాధ కృష్ణ జీవితం నుంచి తప్పుకుంటుంది. అయితే అసలు విషయం (గ్రహించిన శోభ వారిద్దరినీ కలుపుతుంది. జా(గ్రత్తగా గమనిస్తే మంచిసినిమాగా రూపాంతరం చెందగల కధ ఇది.
“ప్రమాణం, 'ఈ తరం స్త్రీ కధలు కొందరు పురుషుల దుర్మార్గాలను గమనించి పురుషులంటే అసహ్యాన్ని పెంచుకున్న ప్రీ ఇతివృత్తాలతో ఫెమినిజం టచ్‌ని కలిగిఉన్నాయి అయితే వాటి కధనం వాటిని మంచికధల వరుసలో నిలబెడ్డుంది.
మొత్తం మీద ఈ 17 కధలలో కొద్దిమాత్రం సాదాసీదా కాగా, చాలా మటుకి మంచికధలుకాగా, కొన్ని మఠీ మంచికథలున్నాయి.. ఇంచుమించు ఇవన్నీ కూడా గతంలో వివిధ (ప్రాచుర్యంగల పత్రికలలో వచ్చినవీ, కొన్ని బహుమతులు పొందినవీ. తెలుగు పారకులకు ఒక మంచికధల పుస్తకాన్ని అందించిన సోమంచి. ఉషారాణి అభినందనీయురాలు. అమె నుంచి మరిన్ని మంచికధాసంకలనాలు వెలువడాలని ఆకాంక్షిస్తున్నాను.
= కె.ఆర్.3. మోహన్
"హైదరాబాద్ ది. 18-1-1999
లా గురించి...
నే ను విజయవాడలో శ్రీ వైవి.యన్. చైనులు, సీతమ్మ గార్లకు జన్మించాను. బి.కామ్ డిగ్రీ మెరిస్టైల్హా కాలేజీలో చదివాను. స్కూల్లో చదివే రోజులనుండీ కధలు వ్రాయడం అలవాటు ఉన్నప్పటికీ చాలామంది పెద్దరదచయితల రచనలు చదివాక రచనావిధానం పట్టుబడింది. నా కధలు చదివి సరిదిద్దేవారు లేకపోవడంతో కొన్ని సంఘటనలు విమర్శలకు గురికావచ్చు. సమాజంలో జరిగే మార్పులూ, సమస్యలూ తీసుకుని నాకు తోచిన పరిష్కారం సూచించాను. ఈ కధా సంకలనంలో ప్రచురించబడిన కధలన్నీ రెండు, మూడు తప్ప వివిధ పత్రికలలో (ప్రచురింపబడినవే | ఇంకా నేను (వ్రాసిన కధలు చాలా ఉన్నాయి.
నా మొదటి కధ 'మీనా" ఆంధ్రజ్యోతి (1977)లోనూ, నా మొదటి సీరియల్ నవల 'వర్షం
కురిసినరాత్రి' ఆంధ్రసచిత్రవారపత్రిక (1978)లోనూ మానాన్నగారి ఆశీస్సులతో యేలేశ్చరపు ఉషారాణి అనే పేరుతో ప్రచురింపబడినవి. 1977లో వివాహమయ్యాక హైదరాబాదు వచ్చిన తరువాత శ్రీవారి సహకారంతో, ఆనాటి ఆంధ్రభూమి వీక్షీ ఎడిటర్ శ్రీ సి, కనకాంబర రాజుగారి ప్రోత్సాహంతో, ఆంధ్రభూమిలో అనేక వ్యాసాలూ, కధలూ, సింగిల్‌పేజీ కథలూ ('ప్రచురింపబడి సోమంచి ఉషారాణిగా గుర్తింపువచ్చింది. ఆంధ్రభూమి మాసపత్రికలో “శాంతి' నవల వచ్చింది. కొన్ని నవలలు మిస్సయితే, కొన్ని అసంపూర్ణంగా ఉన్నాయి. నవల ('ప్రాయాలన్న ఆశ ఉన్నప్పటికీ గృహిణిగా బాధ్యతలు నిర్వహించడంతో అంత సమయాన్ని కేటాయించ లేకపోతున్నాను. ఇరవై ఏళ్ళకు పైగా నేను చేస్తున్న సాహిత్యకృషికి గుర్తింపుగా 'సాహితీయువరత్న' (విశ్శసాహితి) అవార్డూ, మనోరంజని నుండి నందమూరి తారకరామారావు స్మారక మనోరంజని సాహితీఅవార్డూ 1097లో అందుకున్నాను. వారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు, కవయిత్రిగా అయిదేళ్ళనుండే వచన కవిత్వం (్రాస్తున్నప్పటికీ అనేక కవిసమ్మేళనాలలో పాల్గొనడం, 'కవితాశరాలు" కవితా సంకలనం వెలువడడం, శ్రీ పోతుకూచి సాంబశివరావు గౌరి ప్రోత్సాహంతో 'విశ్శసాహితి' సాహితీ సాంస్కృతిక సంస్థలో జీవిత సభ్యత్వంతోపాటు, వారు నిర్వహించే వివిధ పోటీలలో నా కవితలకూ, వ్యాసాలకూ, మినీ కధలకూ అనేకసార్లు బహుమతులు రావడం జరిగింది. అందుకు వారికి సర్వదా కృతజ్ఞురాలను.
ఈ కధా సంకలనం వెలువడడానిక్షి (ప్రేమతో అంగీకరించిన శ్రీవారు శ్రీ యస్.యస్.వి. పురుషోత్తంగారికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తమ విలువైన సమయాన్ని వెచ్చించి, నా కధలను వ్లేషిస్తూ ముందుమాట వ్రాసిన శ్రీ డా॥ పోతుకూచి సాంబశివరావు గారికి శ్రీ కెఆర్‌౩. షూహన గారికీ శ్రీమతి వాసా ప్రభావతి గారికీ నా కృతజ్ఞతాభివందనములు, పుస్తక ప్రచురణకు అంగీకరించి, ఆర్థిక సహాయ మందించిన తెలుగు యూనివర్శిటీ వారిక్షీ 'ప్రచురణకర్తలకూ నా ధన్యవాదములు.
సోమంచి ఉషారాణి, 107/3 ఆర్‌టి., విజయనగర్ కాలనీ, హైదరాబాదు - 500 057.
“శీ యవ వే . " క న | | [1 | “1 రం. (| శ చనన రా . ౬ మ .... క వా _ . ర సనా సన్ మనల ట్ ల క్ని యయ చ ము స. న. ర క్ర సా ల్. సంలు శ న న్‌ా న వ శ్రమ. స్ప ల నం. " . మం నం. టా ళా, జ్జ మా ర నం మో మల నే ర ము వ క. ట్ నై క! గ ( న ౯ ము సై మ లలో సక న సైస్ మ ర జ. స ఎ లు షీ సు... రడీ! తాపచ॥ి తక ] నం వ్ కీశే లైన నా తల్లిదండ్రులు యేలేశ్వరపు సీతమ్మ, వై.వి.యన్, వైనులు గారికి, అనురాగస్కృతిలో రచయిత్రి
సోమంచి ఉషారాణి 1 అమ్మ 'ఆంధ్రభూమి' వీక్లీ 'స్టాందర్ట్ కధల పోటీలో సాధారణ ప్రచురణ కధి' అమ్ల కక కళ అమ్మా!” బాటనవేలికి రాయి తట్టుకోవడంతో అప్రయత్నంగానే నోట్లోంచి వచ్చింది ఆ పిలుపు రాజేష్‌కి. అంతేకానీ అమ్మ గుర్తుకు వచ్చికాదు.
“హలో రాజేష్! గుర్తున్నానా?”
దెబ్బ తగిలి, రక్తం కారుతున్న కాలికేసి బాధగా చూసుకుంటున్న రాజేష్ ఆ పిలుపుకి ఉలిక్కిపడి తలెత్తి చూశాడు, ఆమెని చూడగానే పాతరోజులు గుర్తు వచ్చి సంతోషపడబోయి, అంతలోనే తల్లి గురించి ఎక్కడ అడుగుతుందోనని ముఖం దించేసుకున్నాడు.
“భలేవారు అంటీ |! మిమ్మల్నెలా మర్చిపోతాను” నవ్వబోయాడు.
“ఏమోలే | కన్న తల్లినే మర్చిపోతున్నారు ఈ రోజుల్లో” నవ్వుతూనే అన్నా చెంప ఛెళ్ళుమన్నట్టు చూశాడు రాజేష్
“అమ్మ కులాసాగా ఉందా ?” ఏమీ ఎరగనట్టే అడిగింది.
“అమ్మ....అమ్మ...” ఏం చెప్పాలో తెలియక తడబడ్డాడు.
“అలా కంగారుపడతావేం ? ఇక్కడికి దగ్గరే మా ఇల్టు. రా” ఆజ్ఞాపిస్తున్నట్లే అంది రాజేష్ తల్లికి ప్రాణ స్నేహితురాలైన వసుంధర. ఎందుకో కాదనలేకపోయాడు రాజేష్
వసుంధర అతడి కాలి బొటనవేలిని శుభ్రంగా కడిగి, తుడిచి, టించర్ అయొడిన్ వేసి, దూదిపెట్టి గాజుగుడ్డతో నీట్‌గా కట్టుకట్టింది. ఆ తరువాత వేడివేడిగా కాఫీ ఇచ్చింది.
“ఇప్పుడు చెప్పు. అమ్మ ఎలా ఉంది ?” రెట్టించింది.
“అమ్మ... నా దగ్గర లేదు” తలవంచుకుని నసిగాడు,
“ఏం ఎందుకని ? మీ అమ్మకి నువ్వు ఒక్కడివే అనుకుంటాను. నీ దగ్గర లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది ?” ఆశ్చర్యంగా అడిగింది.
“అదీ....అదీ... ఆశ్రమంలో ఉంటానంటేనూ....” అంతే, రాజేష్ చెంపలు పేలిపోయాయి. అనుకోని పరిణామానికి రాజేష్ బిత్తరపోయాడు,
“మీ అమ్మ ్రాణస్నేహితురాలిగా మీ అమ్మ చేయలేని పని నేను చేశాను. నువ్వు అలా కోపంగా చూస్తే బెదిరిపోవడానికి నేను మీ అమ్మని కాను. అసలు అవిడ ఆశ్రమంలో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది ?” తీవ్రంగా అంది.
“అమ్మా ! అమ్మా ! అమ్మా! అసలు మా స్వవిషయాలలో కలుగచేసుకోవడానికి మీరెవరు ? ఆవిడ తల్లికాదు. ఒక రాక్ష...” ఆవేశంగా అంటున్న రాజేష్ అక్కడ అనుకోకుండా
సోమంచి ఉషారాణి 2 అమ్మ
“ఏం అగిపోయావేం ? కానీయ్ ఆవిడ వినకూడదని అనలేదుగా 1”
“అవును. ఉన్నమాటే అన్నాను. చిన్నప్పటినుంచీ స్వేచ్చగా ఆడుకోనీయకుండా, సరదాగా స్నేహితులతో కబుర్జు చెప్పనీయకుండా, ఎలా దండించేదో, ఎంత కట్టుదిట్టం చేసేదో మీకు తెలియదా ? నాకు మాత్రం ఇష్టాయిష్టాలూ, కోరికలూ ఉండవా ? ఎప్పుడు చదువూ, చదువూ, చదువూ ! అందరితోటీ దాంగా, పోలీసు అడాలనీ, గాలిపటాలు ఎగరేయాలనీ, బాంబు టపాసులు కాల్బాలనీ, జైంట్‌విల్ ఎక్కాలనీ, రంగులరాట్టుం తిరగాలనీ ఇలా ఎన్ని కోరికలను సమాధి చేసందో మీకు తెలుసా ? ఆ సరదా ఇప్పుడు రమ్మంటే వస్తుందా ?” ఆవేశంగా అంటున్న రాజేష్ గొంతు జీరబోయింది.
“రాజేష్ ! ఆసలు నువ్వు ఏం మాట్టాడుతున్నావో....”
“నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. అవిడేదో కష్టపడి ఒకపూట తినీ, తినకా నన్ను చదివించి, గొప్ప వాణ్ణిగా చేసిందంటారా ? అదేదో గొప్ప త్యాగం అని నేననుకోవడం లేదు, కన్నతల్లిగా అది అవిడ బాధ్యత. అలాక్షాకుండా నన్ను నా మానాన రోడ్డుమీద వదిలేసినా బాగుండేది,
నా కోరికలని సమాధి చేసుకుని, పట్టుదలగా చదివాను. మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను. అది నా శ్రమ ఫలితమే కాన్సీ అవిడ గొప్పతనమేమీ కాదు. అఖరికి నొ పెళ్ళి విషయంలోనూ. నాక్తు స్వేచ్చ లేకుండా చేయాలని చూసింది. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్ళిచేయాలని చూసింది.
ఆవిడమీద నా క్రసి తీర్చుకునే అవకాశం వచ్చింది. ఆ అమ్మాయిని చేసుకోనన్నాను. మాటిచ్చానంది నేను ఒప్పుకోలేదు. కక్షకొద్దీ వేరే కులం అమ్మాయిని వివాహం చేసుకుని వచ్చాను. ఆవిడ గుండె పగిలేలా ఏడిస్తే చూసి సంతోషించాలనుకున్నాను. కానీ అవిడ అలిగి ఆశ్రమానికి వెళ్ళిపోయింది. నా తప్పేం ఉంది ?* నిర్భయంగా, నిర్మొహమాటంగా తను చెప్పదలుచుకున్నది చెప్పేశాడు.
“రాజేష్ ! నిన్సు ఒక ఉత్తమ వ్యక్తిగా సంసా,.రవం, ఉద్దేశ్యంకానీ, నీ వ్యిల్నాని అరికట్టాలని కాదు. న న్ ల. అవిడ
ద్ద ర్జా ర్న ఒకే ఒక ఆత్మీయుడిగా, ప్రాణంలో ప్రాణంగా నీ (శ్రేయస్సు ఆశించి, ఆవిడ నిన్ను అభిమానించడం పొరపాటైందన్నమాట ! కానీ నీకు తెలియని నిజం మీ అమ్మ ఒక దగాపడిన ఆడది | లోకానిక్తీ కన్నవారికీ భయపడి, తానే ఆ నేరమేదో చేసినట్టుగా దూరంగా పారిపోయివచ్చింది. ' అవిడ ఇక్కడ భర్రపోయిన వ్యక్తిగా పరిచయం చేసుకుంది. ఆమె ఆత్మస్టైెర్యానికీ అవిడ గుండెనిబ్బరానిక్తీ వ్యక్తిత్వానికీ జోహార్జు అర్చించాలి. మరో ఆడడదైతే అబార్షన్ చేయించుకొని, మళ్ళీ పెళ్ళి...”
సోమంచి ఉషారాణి 3 అమ్మ
“ఆ పని చేసినా బావుండేది” గొణిగాడు రాజేష్
“మీ అమ్మ జీవితం ఎందుకలా అయిందని కానీ, ఆవిడ నీకోసం తన సుఖాలన్నీ త్యాగం చేసిందనీ ఎప్పుడైనా ఆలోచించావా ? ఒంటరిగా వెడుతుంటే ఓ దుర్మార్గుడామెను బలవంతంగా లాక్కుపోయి ఆమె జీవితాన్ని నాశనం చేస్తే ఇంట్లోవాళ్ళూ. బయటివాళ్ళూ కూడా ఆమెని అసహ్యంచుకుంటుంటే, రచ్చకెక్కి తన కుటుంబ పరువు తీయకుండా మౌనంగా బయటికి వచ్చేసింది. నిన్ను అలా వదిలేస్తే ఆటలూ, అల్లరి మరిగి ఎక్కడ రౌడీగా మారతావో, ముందూ వెనకా ఎవరూ లేని నీ జీవితం ఏమైపోతుందోనని ఆవిడ భయపడడం తప్పంటావా ? మనసు రాయి చేసుకొని, నీ మనసు నొప్పించి, నిన్ను సంస్కారవంతుడిగా తీర్చిదిద్దాలనుకోవడం నేరమంటావా ?”
“పోనీ వసూ | ఇప్పుడవన్ని ఎందుకూ ? నా గురించి నేనెప్పుడూ బాధపడలేదు. బాబూ! ఒక్క కోరిక బహుశా ఆఖరిది తీరుస్తావా ?” ఆర్తిగా అడిగింది రాజేష్ తల్లి రాధిక,
“నువ్వింత కష్టపడి, నీ జీవితాన్ని వెచ్చిస్తే నా చదువూ, సంస్కారం ఏమైపోయాయి ? అమ్మా [” అంటూ లోలోపలే కుమిలిపోతున్న రాజేష్ ఏమిటన్నట్టు చూశాడు.
“నువ్వు నన్ను 'అమ్మా* అని పిలవకపోయినా నేను బాథపడను బాబూ ! కానీ నీకూ, కోడలికీ పడటం లేదనీ, విడాకులదాకా వెళ్ళిందనీ విన్నాను. అది నేను భరించలేను. ఆమెకు విడాకు లిచ్చి కుసంస్కారిగా మారకు, ఈ ఒక్క విషయంలో నా కోరిక తీర్చు. నీ మాటల ప్రకారం నేను ఒక తల్లినే కాదనుకుంటే, “అమ్మగా పిలిపించుకునే అర్హతే నాకు లేదనుకుంటే నీ ఇష్టం. నా పెంపకంలోనే ఏదో లోటుందనుకుంటాను' అని రాధిక లోపలికి వెళ్ళిపోతుంటే
“అమ్మా | నన్ను క్షమించమ్మా ! నీ కోరిక తప్పక తీరుస్తాను. కానీ నువ్వూ నాతో ఉండాలమ్మా![ నా భార్యకూ, నాకూ ఆ విషయంలోనే గొడవ జరిగేది. తల్లినే గౌరవించని వ్యక్తివి నువ్వు పెళ్ళాన్నేం (ప్రేమిస్తావు ? వెళ్ళి మీ అమ్మని తీసుకురమ్మ'ని నీ కోడలు గొడవ భరించలేక...” తల్లికాళ్ళపై పడ్డాడు రాజేష్
తల్లి సంతోషంతో కొడుకుని లేవనెత్తి “అలాగే బాబూ 1” అంటుంటే రాదేష్ వసుంధరా రాధికని ఆరాధనగా చూశారు.
'ఏ తల్లిమీద కక్షకొద్దీ ఆమె కిష్టంలేని పెళ్ళి చేసుకొన్నాడో ఆ తల్లే విడిపోతున్న తమని కలపాలని ఒకే ఒక కోరిక కోరింది. అదేనేమో 'అమ్మ! అనే పదంలోని మాధుర్యం ! భార్యని తీసుకురావడానికి వెడుతూ రాజేష్ సంభ్రమంగా అనుకున్నాడు.
అతల
సోమంచి ఉషారాణి అమ్మాయే పుట్టాలి వమ్నాయ పుట్టా అరుర్భాయు ర్రట్టాలి కక హ్వా 1 ఇదెక్కడి చోద్యమే ఇ స్కానింగ్‌ల్లా ఆడపిల్ల అని తొలొస్తే అబార్జన్ చేయించుకోవడం విన్నాముకానీ మగ పిల్లవాడు అని తెలిసీ అబార్జన్ చేయించుకోవడం ఎక్కడా వినలేదు, కనలేదు, అయినా....” “అత్తయ్యా ! ప్లీజ్! నా మాట కాదనకండి నాకు మగపిల్లవాణ్ణి కనడం ఇష్టంలేదు” దుఖాన్ని దిగమ్రింగుకుంటున్నట్టు పెదవులు వణుకుతున్నాయి. ఛాతీ ఎగిరెగిరి పడుతోంది. “నువ్వేం మాట్టాడవేరా అబ్బాయ్! నువ్వు మాకు ఒక్కగానొక్క కొడుకువి. నీతో ఈ వంశం అంతరించాల్సిందేనా?” ఆవిడ గొంతులో అంతులేని ఆవేదన, ఆక్రోశం ఉన్నాయి. “నేను ఎంత చెప్పినా తన అభిప్రాయం మార్చుకోనంటోంది. ఆమె మనసుకేదో గట్టి దెబ్బ తగిలినట్టుంది. మనం నచ్చజెప్పినా ప్రయోజనం వుంటుందనుకోను” రాజశేఖరం సాలోచనగా అన్నాడు. “అమ్మా రాణీ! ఈ ఒక్కసారీ నా మాట వినమ్మా! ఆ తరువాత నీ ఇష్టం”. “మావయ్యా! దయచేసి నన్ను ఈ విషయంలో మాత్రం బలవంతం చేయవద్దు, నా మాట వినకపోతే ఈ ఇంట్లో వుండడానికి వీల్లేదు అనేంత సంస్కారహీనులుకారు మీరు. అందుకే నేనింతగా పట్టుబడుతున్నాను” కన్నీళ్ళతో అర్జించింది రాణి, “పుత్రస్య గతిర్నాస్తి' అనేది నేటి నానుడి! నేను చెప్పే విషయాలు వింటే మీకు నిజానిజాలు తెలియడమేకాక నేనెందుకింత పట్టుబడుతున్నానో అర్ధమవుతుంది” శ రల 3 “ఏం చేస్తున్నారు ?” శ్వేత అత్తగారిని నిలదీసింది. “ఉప్మా చేస్తున్నాను” తల దించుకుని తప్పు చేస్తున్నట్టుగా అంది సావిత్రమ్మ. కోడలికి సంజాయిషీ ఇచ్చుకోవడం, ఆమెతో మాటలుపడడం ఆమెకే వరిపాటే 1 “అదే ఎందుకు చెస్తున్నారు ? అని అడుగుతున్నాను. మిమ్మల్ని నాకు చెప్పకుండా ఏమీ చేయవద్దని ఎన్నిసార్హు చెప్పాలి ? ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వండి తగలేస్తే నెలకి సరిపడ తెచ్చిన సరుకులు పదిరోజులుకూడా రావు. ఇదే అఖరిసారి చెప్పడం” విసురుగా అనేసి అక్కడినుండి వెళ్లిపోయింది. “మీ మావగారు ఆకలేస్తోంది. టిఫిన్ చేసిపెట్టమని నోరు తెరిచి అడిగారమ్మా!” అని చెప్పలేకపోయిన తన నిస్సహాయతకు మనసులోనే కుమిలిపోయింది సావిత్రమ్మ. విశ్చనాథం, సావి(త్రిలకు చాలాకాలం పిల్లలు పుట్టలేదు. ఎన్నో నోములు నోచి, ఉపవాసాలు వుండి, కటిక నేలపై పడుకుని, ఎవరు ఏది చెబితే ఆ దేవుళ్ళకి మొక్కి చివరకు పండంటి కొడుకుని కని మురిసిపోయారా దంపతులు. నేలపై నడిస్తే ఎక్కడ కందిపోతాడోనని గుండెలమీద పెట్టుకుని పెంచారు. ఆ
సోమంచి ఉషారాణి ర్ అమ్మాయే పుట్టాలి తరువాత మరో కొడుకు, కూతురు పుట్టారు. వాళ్లని ఏ లోటూ రాకుండా సెంచారా దంపతులు. వాళ్ల చదువులు, పెళ్లిళ్ళు అయ్యేసరికి విశ్చనాధంగారు రిటైరయ్యారు.
ఫ్లాట్ కొంటామని కొడుకులిద్దరూ ఆయన దగ్గర డబ్బంతా తీసేసుకున్నారు. ఇప్పుడు నెలనెలా ఆయనకి వచ్చే పెన్షన్ తప్ప ఆయన దగ్గర అస్ట్రేమీ లేదు,
తమ ఇంటికి డబ్బు ఇచ్చారన్న కృతజ్ఞతయినా లేక కోడళ్ళు ఏదో సణుగుతూనే వుంటారు. కొడుకులు మాట్టాడరు. విశ్చనాధంగారికి గుండెనొప్పి వచ్చింది ఒకసారి. ఆయన రెస్టు తీసుకుంటూ జాగ్రత్తగా వుండాలని చెప్పడంతో ఆయన మరో ఉద్యోగంలోకి వెళ్ళలేకపోయారు.
“ఏమండీ టిఫిన్ తీసుకోండి” సావిత్రమ్మ పీలుపుతో ఆయన ఆలోచనలనుండి బయటపడ్డారు.
“నాకు అకలి చచ్చిపోయింది సావిత్రి, తినాలని లేదు” బాధను అణచుకుంటున్నట్టు అంటున్న భర్తను చూడగానే సావిత్రికి కడుపులోనుండి దుఃఖం తన్నుకువచ్చింది. అయినా భర్తముందు బయటపడక, చాలా సౌమ్యంగా నవ్వుతూ అంది.
“భలేవారే ! ఆ పిల్ల మాటలు పట్టించుకుంటే ఎలా ? మనమ్మాయి అంటే బాధపడ తామా ? ఇదీ అంతే ! తీసుకోండి”
భార్య (ప్రేమగా పెడుతుంటే తినకపోతే, ఆమె మనసు కష్టపడుతుందని తీసుకున్నాడుకానీ ఆయనకి గొంతు దిగలేదు.
“అమ్మాయిని పండక్కి పిలవాలి. కొత్తగా పెళ్లయింది. వాళ్ళత్తగారు వాళ్ళనికూడా పిలిస్తే బావుంటుంది. అబ్బాయిలతో చెప్పండి” సావిత్రికి మామూలుగాకూడా సౌమ్యంగా, మెల్లగా మాట్టాడడం అలవాటు. ఆవిడ ఎంత బాధవైనా బయటకు కనబడనివ్వదు.
“అలాగే ! ఇదిగో నువ్వు కాస్త తిను. మధ్యాహ్నం అన్నం సరిపోయింద్ లేదో!” అని సగం తిని స్టేటు భార్యకందించాడు. అసలు ఆమె కడుపునిండా అన్నం తినలేదనే తనకి ఆకలివేస్తోంది, టిఫిన్ చేయమన్నాడు. ఆవిడ ఏనాడూ నోరుతెరిచి తనకిది కావాలీ అని అడగకపోవడంవలనే ఆమెకి ఖరీదైన చీరలు, నగలు ఏవీ కొనిపెట్టలేకపోయాడు.
“విన్నారా వాళ్ళ మాటలు ? వయసు మీదపడినా ముచ్చట్టకేం కొదవలేదు. పైగా కడుపునిండా తిండి పెట్టడం లేదని ఎలా అంటున్నారో చూశారా * పెద్దకోడలు అరుపులతో తెల్లబోయారు.
“భీలీ ! ఎన్నేళ్ళు వచ్చినా ఇద్దరికీ సిగ్గులేదు. సంపాదించేవాళ్ళకన్నా తినేవాళ్ళు ఎక్కువ వున్నప్పుడు కాస్త జా(గ్రత్రగా ఖర్చుపెట్టాలన్న ఇంగిత జ్ఞానం వుండక్కర్ణా” పెద్దకొడుకు సత్యం విసుక్కున్నాడు.
అప్పుడే చిన్నకొడుకు శివం, కోడలు స్వప్న ఆఫీసునుండి వచ్చారు. స్వపష్నకూడా ఉద్యోగం చేస్తుండడంతో ఆ పిల్లకి తను సంపాదిస్తున్నానని అహంకారం చాలా వుంది.
“అమ్మా! ఈ రోజు నాకొక ఇంక్రిమెంట్ వచ్చింది. స్వీటు తీసుకోమ్మా! నాన్నా! మీరు కూడా” అని చిన్నకొడుకు స్వీటు ఇచ్చేసరికి పెద్దకొడుకు అన్న మాటలు వదిలేసి, నవ్వుతూ తీసుకున్నారు.
అతణ్ణి పక్కకి పిలిచి, “ఇప్పుడా ముసలాళ్ళకు స్వీటు ఎందుకివ్వడం.? కేపు ఏ షుగరో
॥ అవ్మాూయే పుట్టాలి నొమంచి ఉషారాణి నానా నాననా ననన వస్తే ఎవడ్డు చాకిరీ చేస్తాడు ?” అంది స్థష్ట్మృకృవంగా చాకిరీ చేయవలసింది నేనేగా!” శ్వేత
“సకేనుమ్మా హాయిగా ఉద్యోగా / టుంటే సావిత్రమ్మ, విశ్శనాధంలకి అనగానే అదేదో జొక్ అయినట్టు నలుగురూ నవ్వుకుం స్వీటు చేదుగా అనిపించి తినషకపయారు క పిలవడం గురించి ప్రస్తావించాడు విశ్వం.
ఆ రాత్రి భోజనాలదగ్గర మూతుర్ని నమా. ర్చుపెట్టేది మీరు. వండి వార్చి పెట్టేది
“నాన్నా ! మాకు చెప్పడం దేని: ? డబ్బు ఖ టన ర్చుతో తనకేం సంబంధం
ప నట్లు చేసుకోండి అన్నాడు సత్యం. డబ్బు ఇ 4. న్ద అమ్మ. మీ ఇష్టం వచ్చినట్టు త మూతి తిప్పుకున్నా భర్తమాటలకు లోలోపలే లేదని నిర్మాహమాటంగా చెప్పాడు. శ్వే కోవడమే ఇష్టంలేదు. వ ద్లాశమంలో ఎలా సంతోషించింది. ఆమెకసలు వాళ్లని ఇంట్లో వుంచుకోవ టా య ది చేర్చించాలా అని ఆలోచిస్తోంది అందుకు తగిన అవకాశం కోసం ఎదురుచూస్తూ వుంటుం ఇ
బి “అలా అంటే ఎలారా ? నాన్నగారి దగ్గర ఎంత డబ్బుందో మీకు మాత్రం తెలీదా? ఇంటికి అరా రాకు నిదపడుచు. వాళ్ల అత్తగారు వాళ్ళందరినీ పల్చి బట్టలు పెట్టాలి. చెప్పబోయింది. బావిత్రవ్మ నర్థృ ఇంకా ఏమిటమ్మా చాదస్తాలు ? ఇవన్నీ డబ్బున్న వాళ్ళకి, ఏదో మనకి ఉన్నంతలో వాళ్ళిద్దరికీ పెడదాం, రమ్మనండి. శయ శ ఓ
ఆరోజు ఉగాది పండుగ అందరూ తలస్నానం చేసి ఉగాది పచ్చడి తిని, కాఫీలు 'త్రాగుతున్నారు.
“అత్తయ్యా! అనవసరమైన ఖర్చు పెట్టకండి. ఏదో ఒక్ష స్పీటు, హాటు కొద్దిగా చేయండి” శ్వేత అథారిటీగా అన్నా మెల్లగా అంది. ఆ మాటలు సావిత్రమ్మ కూతురు చెవినపడ్డాయి.
“నాన్నా! ఇప్పుడు అప్పుచేసి బట్టలు పెట్టకపోతే ఏమైంది? ఈ అప్పులు ఎవడు తీరుస్తాడు? వాళ్ళకేమున్నా బట్టలకు కరువా ? వ్రాల్రానే వున్నాయి” సత్యం తండ్రిని మందలించడం కూతురి చెవిన పడకపోలేద్రు,
“అదేమిట్రా ఇలాంటి బట్టలు తెచ్చావు. బావుండదురా [౫ విశ్శనాధం చిన్నబుచ్చు కున్నట్టు అన్నాడు,
“మీరిచ్చిన డబ్బుకు ఇంతకన్నా మంచివి రావు. ఇష్టమైతే పెట్టండి. లేకపోతే మానేయండి” విస్పుర్తుగా అనేసి, లోపలికి వెళ్లి భార్య చేతిలో తళతళా మెరిసిపోయే మంచి ఖరీదైన చీర పెడుతుంటే ఆ ఇంట్లో తల్లిదండ్రుల 'పరిస్తత్ర ఏమిటో, వాళ్ళు అనుభవిస్తున్న బాద ఏమిట్రో వాళ్ళ పర్రిస్థిత్తి పడుతున్న అవమానాలు, న్‌జైనా సలహా చెప్పబోయినా “మీరు మౌకు చెప్పేదేమ్పిట్రిగి అ్ర్ట తీసిపారయేడం, వెకిలిగా నవ్వుకోవడం ఆ ఇంటే ఆడ్రపడుచుగొ ఆమెక్షి ఆకళింపు చేసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. అయనకి బీ మీరు ఎలాంటి బట్టలు పెట్టినా సంతోషంగా కట్టుకుంటాను. కానీ న. క్ర బట్టలు... ఆయన్ని అవమానించడమే అవుతుంది, అందుకని అయనకి పత స్పై ఇచ్చియండి. నేనిలా అంటున్నందుక్తు బాధపడవద్దు. ఇంటి ఆడపడుచుగా
" మర్యాదా నామీదక్తూడ్రా వున్నాయి” ఆని తండ్రికి కొంత్ర డబ్బిచ్చింది. వా ళ్ళకి
నోయంచి ఉషారాణి 7 అమ్మాయే పుట్టాలి తీసుకోవడం ఇష్టం లేకపోయినా గత్యంతరం లేదు.
ఉగాది అలా గడిచిపోయింది. మర్నాడు కూతుర్నీ, అల్లుణ్లీ సాగనంపుతుంటే “అమ్మా! మీరు కొన్నాళ్ళు మా ఇంటికి రండి. మీకు అన్నయ్యలెంతో నేనూ అంతే!” అందామె అల్లుడుకూడా ఇద్దరినీ రమ్మని మరీ మరీ చెప్పాడు.
ఆడపడుచు. భర్త ఆటో తీసుకురావడానికి వెళ్ళగానే “మేము సరిగా తిండిపెట్టడంలేదు, చూడడంలేదని అన్నారా మీ అమ్మా, నాన్నా? అంత ఇదిగా వుంటే వేలకువేలు కట్నం ఇచ్చి పెళ్ళిచేశారుగా నీ దగ్గరే వుంచుకో!” అంటూ కయ్యానికి కాలుదువ్వింది శ్వేత.
“ఈ ప్పాట్‌కి నాన్నగారూ డబ్బిచ్చారు. ఈ ఇంట్లో వుండే హక్కు వాళ్ళకీ వుంది” ఆడపడుచు ఊరుకోలేకపోయింది,
“నీ హద్దుల్లో నువ్వుండు.హక్కులగురించి నాకు చెప్పడానికి నువ్వెవరు ?” శ్వేత గయ్‌మంది.
“అమ్మా! నాన్నా నాతో వచ్చేయండి” కూతురు కన్నీళ్ళతో అంటుంటే, “నువ్వేం బాధపడకమ్మా! మాకిక్కడ బాగానే వుంది” అంది సావిత్రమ్మ. విశ్వనాదంగారికి డైరీ 'బ్రాసుకోవడం అలవాటని, అందులో ఆయన కష్టసుఖాలు ఏరోజు కారోజు వ్రాసుకుంటారనీ, అది అనుకోకుండా తను చదివాననీ ఆమె చెప్పలేదు.
ప
“మా అమ్మా, నాన్నా పడే బాధలు చూస్తూ ఇంతకన్నా అధ్వాన్నంగా తల్లిదండ్రుల్ని అవమానపరుస్తూ, వాళ్లనొాక అనవసర వస్తువుగా భావించేవాళ్ళెందరి కధలో వింటూ ఇంకా కొడుకుని కనమంటారా?” వెక్కిపడుతూ అడిగింది రాణీ. అత్తగారు ఆమెని దగ్గరకు తీసుకుని ఓదార్పారు.
“నువ్వు చెప్పింది నిజమేనమ్మా! కానీ అందరూ అలా వుండరుకదా ! మీలాంటి కొడుకులూ, కోడళ్ళూ వున్నారు. అందుకే మాలాంటి వాళ్ళం ఇలా అయినా వున్నాము. అదీకాక బ్రూణహత్య మంచిదికాదు. అఆడయినా మగయినా అభంశుభం తెలియని పసివాళ్ళని ఆదిలోనే అంతం చేయడం సమంజసమా చెప్పు”.
“ఎలా జరిగేది అలా జరుగుతుంది. వున్నాము నరకం నుండి తప్పించేది పుత్రుడంటారు. కాబట్టి కొడుకుకోసం ఆత్రపడతారుతప్ప రేపు తమనేదో ఉద్దరిస్తారనీ, అందలం ఎక్కిస్తారనీ పిల్లల్ని కనరమ్మా!” మావగారు నచ్చచెప్పారు.
“అవును రాజీ | అమ్మా, నాన్నా చెప్పింది నిజమే ! వాళ్ళమీద అత్యాళలు పెట్టుకోక, మన కర్తవ్యం మనం నెరవేర్చినప్పుడు ఆడయితే ఏమిటి, మగయితే ఏమిటి ? నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, ఆపై నేనున్నానని శ్రీకృష్ణులవారు గీతలో చెప్పలేదూ?” రాజశేఖరం చెప్పిన తీరుకు వాతావరణం తేలికపడి, అందరూ తృప్తిగా నవ్వారు.
(ఆంధ్రభూమి వీక్లీ అఅలఅి
సోమంచి ఉషారాణి 8 ఇది కధ కాదు సోమంచి ఉషారణి 8 _ ఇది కధ కాదు కక లో పలికి రావచ్చునా సార్ ?” “రండి”. తలొంచుకొని ఏకాగ్రతతో ఏదో ఫైలు చూస్తున్న ప్రముఖ సైక్రియాట్రిస్ట్ డా. మేఘనాధ్ తలెత్తి నవ్వుతూ ఆహ్వానించాడు. “నమస్కారం ! నా పేరు నవీన, ఇతను ఉదయ్” అని తన పక్కనున్నతన్నీ, తననీ పరిచయం చేసుకున్నాడో ఆజానుబాహుడైన యువకుడు. “చెప్పండి, ఏమిటి విషయం ?” గంభీరంగా అడిగాడు డా. మేఘనాద్. “నమస్కారం చేయి” అని మెల్లిగా ఉదయ్‌కి చెప్పి, అతడు నమస్కరించగానే, డాక్టర్‌తో - “ఇతనే నేను చెప్పిన వ్యక్తి” అన్నాడు. “నాలుగు రోజుల (క్రితం అపాయింట్‌మెంట్ తీసుకున్నది మీరేగా ! ఏమిటి సమస్య?" "డా. మేఘనాధద్ ఉదయ్ కేసి నిశితంగా చూస్తూ అడిగాడు. ఉదయ్‌ని కాసేపు బయట కూర్చోమని, లోపలికి వచ్చి డాక్టర్‌కి చెప్పసాగాడు నవీన్. “మనిషిని చూశారుగా 1 చాలా పొట్టి. వాళ్ళింట్లో ఎవరైనా పొట్టి వాళ్ళున్నారేమో పోనీ అంటే అందరూ సమంగానే ఉంటారు. మనిషి ఎదగలేదు కానీ మనసు బాగానే ఎదిగింది. అన్నీ తెలుసుకానీ ఎప్పుడూ, ఏదో ఆలోచిస్తూ, పరధ్యానంగా ఉంటాడు. చదువు ఫరవాలేదు, కానీ ఏ పని మీదా శ్రద్ద లేదు. ఒకటి చెబితే ఇంకోటి చేస్తాడు...” “అతనికి తక్గిగండ్రులు ?” మధ్యలో అడిగాడు డా. మేఘనాథ్. “ఉన్నారు డాక్టర్ ! తల్లిదండ్రులు, ప ఏమిటంటే. “* ' బకీదొడులు, ఒక అన్న, చెల్లెలు అందరూ ఉన్నారు. దురదృష్టం ఇంతలో బాగా అరిచి గోలపెడుతున్న ఒకమ్మాయిని తీసుకుని వచ్చారు. ఆ అమ్మాయి అరుపులు చాలా దూరం వినిపిస్తున్నాయి. మూ బయట హడావిడికి డాక్టర్, నవీన్ ఒక్కసారి లేచి బయటకు వచ్చారు. ఆ అ శ్రి (వ పట్టుకోలేకపోతున్నారు. గింజుకుంటూ అరుస్తోంది. నా న వదలండి.” న సరూ చేసుకోరు. నే చల్చిపోతాను. నన్ను ఆపద్దు. నన్ను “య గొ పట్టుకున్న డాక్టర్ని “ఏయ్ నన్నెందుకు పట్టుకున్నావు ? పెళ్ళి చేసుకుంటావా ? హాయ్ బలే బలే | ఆహా నా పెళ్ళియంట 1! ఓహో నా 'పెళ్ళ్చియంట !” సంబరంగా ఎగిరింది. అంతలోనే ఏడుసూ “నాక్సీ జనలో ౩ అం ళ్ళి ణి / రా శైల్ పెళ్ళికాదు. కనీసం చావనివ్వండి అంది హృదయవిదారకంగా, ఆమె తండ్రి, నవీన్, కాంపా ఇంజెక్షన్ చేశాడు న; బేకమెర ననూ గట్టిగా పట్టుకుంటే డాక్టర్ ఒక జ్ర + బి ట్టగాన మగత ఆవ ఊపిరి పీ ల్ఫుక్షున్నారు. బి రించింది. అందరూ తేలిగ్గా ఆ అమా శ్రయి. తండ్రి గుడ్డనీరు కుక్కుకుంటూ, దుఃఖాన్ని దిగమింగటానికి
సోమందిఉషారడి కరు (ప్రయత్నిస్తున్నాడు. ఆయనకి కాసిని మంచి నీళ్ళిచ్చి, రిలాక్స్ కమ్మని ధైర్యం చెప్పి, డా. నార్, నవీన్ లోపలికి వెళ్ళారు.
“ఎస్ | చెప్పండి” అన్నాడు డా. నాధ్.
“ఉదయ్ విన్నప్పుడు అమాయకంగా ఉన్నా చురుగ్లానే ఉండేవాడు. అతని తరువాత చెల్లెలు పుట్టాకే అతని పరిస్థితి ఇలా మారిపోయిందని అమ్మ చెప్పింది. మేము చిన్నప్పుటి నుండి పక్క వాటాల్లోనే ఉండేవాళ్ళము. చంటిపిల్లనో, అందంగా ముద్దుగా ఉన్న ఆడపిల్లనో తల్లిదండ్రుల దృష్టంతా ఆమె మీడే ఉండేది. ఉదయ్ గురించి అసలు పట్టించుకోకపోగా ఆ పిల్ల కాస్త -ఈ' మనే సరికి ఉదయ్‌ని ఉత్తపుణ్యానికే కేకలేసేవారు వాళ్ళ అమ్మా, నాన్నా ! అటు అన్నగారు పేచీ పెట్టీ అలిగీ, పంతం పట్టీ అన్ని సాధించుకునేవాడు. ఒక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులతనికి భయపడేవారు.”
“మరి ఉదయ్ పేచీ పెట్టేవాడు కాదా ?” ఆశ్చర్యంగా అడిగారు.
“పేవీయే | భలే వారు డాక్టర్ !” చిన్నగా నవ్వాడు నవీన్.
“ఉదయ్‌కి ఆ అవకాశమే లేదు. అతని మనస్తత్వమూ అలాంటిది కాదు. అన్నగారు వదిలేసిన బట్టలూ, చదివేసిన పుస్తకాలూ, చెల్లెలు తినకుండా మానేసిన అన్నమూ అన్నిటిలోనూ సెకెండ్ హేండే ! చదువు విషయంలో కూడా అంతే |! అతన్ని పట్టించుకునే వారే లేరు. మార్కులు తక్కువ వస్తే మటుకు చావగొట్టేవారు. తనలో తానే మధనపడుతూ పరధ్యానంగా, ముభావంగా ఉండే అతనికి స్నేహితులూ లేరు. ఏమడిగినా ఉలుకూ పలుకూ లేకుండా ముంగిలా కూర్చునే అతన్ని టీచర్చు దండించేవారు. అతన్ని సానుభూతితో అర్థం చేసుకుని అనునయించే వారు లేరు.
“ఆ చిన్న వయసులో అందరిలానే నేనూ అతన్ని అర్దం చేసుకోలేకపోయాను. ఉదయ్ అన్నగారినీ, చెల్లెల్నీ వాళ్ళేం తప్పు చేసినా, మార్కులు తక్కువ వచ్చినా ఏమి అనకపోవడమే కాక, 'వాళ్ళు చూడు ఎంత ఏక్టివ్‌గా ఉన్నారో, నువ్వూ ఉన్నావు ఎందుకూ ? మూటా మంతీ లేదు మూగి వెధవా, పొట్టి సన్యాసీ" అని హీనంగా మాట్లాడేవారు... దానితో 'నేను నిజంగా అలాంటి వాడినేనేమో 1” అన్న ఆత్మ న్యూనతాభావ౦ పెరిగింది. పిల్లల్లో ఇటువంటి తేడాలు చూపించడం వలన కూడా మనిషీ ఎదగకపోయే అవకాశం ఉందనుకుంటాను. కాదంటారా ౪” నవీన్ మధ్య మధ్యలో బాధపడినా చివరకు దృఢంగా అన్నాడు.
“అఫ్‌కోర్స్ ! కొంతవరకు మీరు చెప్పినవే కారణం కావచ్చు. వారి వంశంలో పొట్టివాళ్ళు ఎవరూ లేరా |” సందేహంగా అడిగాడు.
“నేను కనుక్కునే వచ్చాను. డాక్టర్ ! పెద్ద పొడవు కాకపోయినా ఇంత పొట్టివాళ్ళు మాత్రం ఎవరూ లేరట 1! మీకో సంఘటన చెబుతాను. ఒకసారి వీధిలో *ఐస్'ఫ్రూటో బండి వచ్చింది. ఉదయ్ చెల్లెలు పేచీ పెట్టి కొనుక్కుంది. దెబ్బలాడి అన్నగారూ కొనిపించుకున్నారు. చిన్నతనపు చాపల్యంతో ఉదయ్ "అమ్మా! నాకూ...” అనబోతుంటే, “భీ ఛీ ఏం పిల్లలో ! ఏది చూస్తే అది అడ్డమైన వెధవకీ కావాలి. అందరికీ కొనాలంటే డబ్బుండద్దూ ?” అని విసుక్కుంది డాక్టర్ ఆ కన్నతల్లి! ఆ సమయంలో ఉదయ్ ముఖం చూస్తే హృదయమున్న ఎవరికైనా ద్రవించకమానదు. ఒకటేమిటి రోజుకి అలాంటి
నషఊమంచి ఉషారాణి 10 ఇది కథ సంఘటనలు ఎన్నో ! ఆ తల్లిదండ్రులకి 'అయ్యో పిల్లాడికి ఎదుగుదల లేదు. తమ ప్రవర్తన వల్ల వాడేమైపోతాడో అన్న దిగుల్లేదు. అసలు ఎవరికైనా చూపిద్దామనే ఆలోచనే లేదు. ఇలాగైతే అతని భవిష్యత్తు ఏమటి డాక్టర్ ?” నవీన్ గొంతులో ఆత్మీయతా, ఆందోళనా కనిపించింది.
“ఇంతవరకూ ఏ డాక్టర్‌కూ చూపించలేదా ?” విస్మయంగా అడిగాడు.
“నో డాక్టర్ 1 నాకు జ్ఞానం తెలిసిన దగ్గర నుండి ఉదయ్ అంటే ఏదో అభిమానం. అది జాలంటారో, సానుభూతి అంటారో నాకు తెలియదు. కాని అతనితో స్నేహంగా ఉండడం నాకు తెలిసిన విషయాలు అర్ధమయ్యేలా చెప్పడం అంతకన్నా ఏం చేయగలను ? నేను చదువుకునే రోజుల్లో నుండి అతన్ని మంచి సైక్రియాట్రిస్ట్‌కి చూపిరచాలని ఉండేది కానీ, “ఆ అబ్బాయి తల్లిదండ్రులకి లేని బాధ నీకెందుకు ? లేనిపోని గొడవ" అని మందలించడంతో ఊరుకున్నాను. ఇప్పుడొక ఉద్యోగస్టుణ్మి అయ్యాను. నాకాళ్ళ మీద నేను నిలబడేంత స్వతంక్రుణ్ణి అయ్యాను. ఇప్పుడు కూడా నాకు పట్టనట్టు ఉండడం ఎందుకో దారుణమనిపించింది. వయసు పెరగడం వలన మనిషి ఎదగకపోయినా మీ ట్రీట్‌మెంట్‌తో మామూలు మనిషై అందరిలా అలోచిస్తూ మిగతావారి కన్నా తాను ఏమీ తక్కువ కాదు అన్నభావం అతనిలో కలిగిజే నా కంటే సంతోషించేవాళ్ళు ఎవరూ ఉండరు.” ఆవేదనగా చెప్పిన నవీన్ దీర్దంగా నిట్టూర్చాడు.
“లోకంలో ఇంకా మీలాంటి సంస్కారులు ఉన్నారు కనుకే ఈ దేశం ఇలా ఉంది. నా ప్రయత్నం నేను చేస్తాను. అతన్ని ఇక్కడే వదిలేయండి. అతడు మామూలు మనిషీ అవుతాడన్న నమ్మకం నాకుంది. బైదిబై! అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు ? అంటే ఉద్యోగం
“ఏదో చేస్తున్నాడు డాక్టర్ | ఎన్నో అవమానాలూ, అవహేళనలూమధ్య తన కర్తవ్యాన్ని సరిగా నిర్వర్రించలేకపోతున్నా.... * య
క్ర . అతన క్కడే వదిలేయండి. నా (ప్రయత్నం చేస్తాను.”
దాంక్యూ డాక్టర్! వస్తాను” అని డాక్టర్‌కి షేకొహండ్ష్ చ్చి ఉదయ్‌కి ఇ అక్కడ చేర్చి వెళ్ళిపోయాడు నవీన్. టె జు ధైర్యం చెప్పి,
ఆ ఇప్పుడు చెప్పండి. మీ అమ్మాయి అలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి ?” ఆమె తండ్రిని లోపలికి పిలిపించి అడిగాడు డా, మేఘనాథ్,
లీ చ్ / నాధ స లొకంలో అందవిహీనంగా, అదీ ఒక పేదింట్లో పుట్టడం శాపం డాక్టర్! నా పేరు
చ్ద “లి మౌఖయి పేరు అరుణ. నాది చాలా చిన్న ఉద్యోగం. ఏ నెల వచే జీతం అ నెలే సరిపోయేది. స్వమ్సుంది ? మా న్ బ్ర ప్రతివాళ్ళూ రావడం కట్టా డ్ న! పెళ్ళికాకపోవడానిక్రి వరకట్నమే కారణం.
- (“ఇల దగ్గర బేరం కుదరకపోవడం, దానితో బ్రిక్ ట్ 92 శ! ? అఎసె ఈ రోజు... రో పొడ లకపోయాడాయన, అయి ౦ న వర్రి ! ఆమె తప్పకుండా మామూలు మనిషవుతుంది. కొన్సాళ్ళు ఇక్తుడ ఉండనీయండి. పెళ్ళికాకపోయినా "ైర్వంగా (బతికే న్నాళ్ళు ఇక్క ధైర్యం చెప్పారు. ఖిగా బ్రతిఃలా ఆమెను తయారు చేస్తాను" డాక్టర్ కాని .. మీ ఫీజో నసుగుతూ అన్నాడాయన,
సోమంచి ఉషారాణి 11 ఇటి కథ కాదు
“నేను బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఫీజే తీసుకుంటాను. కానీ మీ లాంటి వాళ్ళ దగ్గర మాత్రం కాదు” అన్నాడు.
అరుణకి మెలుకువ రాగానే మళ్ళీ గొడవ చేయసాగింది. తండ్రి నర్సు ఏం చెప్పినా వినిపించుకోవటం లేదు.
“నీ పెళ్ళి జరుగుతుంది”. నిశ్చలంగా అన్నాడు డా. నాథ్.
“నేను నమ్మను. నన్నింకెవరూ మోసం చేయలేరు. పాండి. మీరందరూ పొండి. నన్ను చావనివ్వండి”. పెద్దగా ఏడవసాగింది.
“లేదమ్మా ! నీ పెళ్ళి తప్పకుండా జరుగుతుంది. కానీ నువ్విలా అరిచి గోల చేయకూడదు. బుద్దిగా ఉంటే నీ పెళ్ళి నేను జరిపిస్తాను. ఓ.కె. 1” డా. నాధ్ నవ్వుతూ ధైర్యం చెప్పాడు.
శం 3
నాధ్ మరునాడు ఉదయ్ కేసు టెకప్ చేశాడు. అడిగిన (ప్రశ్నలకి భయపడుతూ, తడబడుతూ, నట్టుతూ, బాగా ఆలోచించుకుని సమాధానాలు చెప్పాడు ఉదయ్.
“చూడు ఉదయ్ ! నువ్వు అందరిలానే మామూలు మనిపివే ! చాలా తెలివైన వాడివి. మంచివాడివి మన లాల్‌బహదూర్ శాస్త్రిగారు తెలుసా నీకు ?” తెలుసన్నట్టు తలూపాడు ఉదయ్.
“ఆయన ఎంత పొట్టిగా ఉండేవారు ? అయినా ఎంత తెలివైన వారు, ఎంత గొప్ప "పేరు తెచ్చుకున్నారు. నువ్వు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా ఉండాలి. ఈ లోకంలో కుంటి వాళ్ళు, గుడ్డివాళ్ళు, ఎన్నోరకాల వికలాంగులు ఉన్నారు. వాళ్ళంతా ఎంత ధైర్యంగా, సాహసంతో, జీవితాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని బ్రతుకుతున్నారో నీకు తెలుసా ?”
ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఎందరో మహానుభావుల గురించి తెలియజెప్పి అతని మీద అతనికి నమ్మకమూ, ఆత్మవిశ్వాసమూ కలిగేలా చేశారు.
నవీన్ కూడా రోజూ వచ్చి అతనికి స్నేహం, ఆత్మీయతతోపాటు ఎన్నో విషయాలు, జోకులు చెబుతూ నవ్వించేవాడు.
ఇద్దరి కృషి ఫలితంగా ఉదయ్ చాలా త్వరగానే మామూలు మనిషయ్యాడు. స్వయంగా, త్వరగా ఆలోచించుకుని సమాధానాలు చెప్పగలుగుతున్నాడు._ నవీన్ చాలా గర్వంగా ఫీలయ్యాడు.
నవీన్ ఫీజు చెల్లించబోతుంటే “ఒక స్నేహితుడిగా నువ్వింత బాధ్యత తీసుకుంటే ఒక డాక్టర్‌గా నేను మాత్రం నా కర్తవ్యం నిర్వర్తించలేనా ! నిన్ను చూస్తుంటి నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను చూసి గర్విస్తున్నాను |” వెన్ను తడుతూ, నవ్వుతూ అన్నాడు డా, మేఘనాధ్.
ఉదయ్ వెళ్ళిపోబోతూ ఏదో చెప్పాలని చెప్పలేనట్టు సంశయంగా, బిడియంగా నిలబడిపోయాడు. డాక్టర్‌కే, నవీన్‌కీ అర్ధం కాలేదు.
“వెప్పు ఉదయ్ ! మళ్ళీ భయపడుతున్నావా ? కమాన్ స్పీక్ అప్ ! నీ మనసులో ఉన్నమాట రక్కున చెప్పేయమన్నానా ?” డా. నాధ్ ధైర్యమిస్తున్నట్టుగా నవ్వుతూ చూశాడు.
సోమంచి ఉషారాణి 12 ఇది కథ కాదు "నేను అరుణని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను” ఈసారి నిర్భయంగి, దృధంగా. చెప్పాడు ఉదయ్.
డాక్టర్, నవీన్ ఉదయ్‌లోని ఆత్మవిశ్వాసానికి సంభ్రమాశ్చర్యాలతో ఒకరినొకరు చూసుకున్నారు.
అరుణ, ఉదయ్ ఇద్దరూ స్నేహంగా ఎన్నో కబుర్హు చెప్పుకునేవారనీ, కట్నం తీసుకోకుండా అరుణని, ఉదయ్ పెళ్లి చేసుకుంటానని చెప్పాడనీ, అలాగే అతను కూడా అందరిలాంటి మనిషేననీ, కొందరు కుసంస్కారులూ, కుచించుకుపోయిన మనసు గల వాళ్ళందరి కన్నా గొప్పవాడనీ ఎన్నో ధైర్య వచనాలు చెప్పిందనీ అన్నీ చెప్పాడు ఉదయ్.
“ఉదయ్ ! అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం...”
“నవీన్ ! నా మీద నాకు ఆమాత్రం నమ్మకముంది. అరుణకి బాహ్య సౌందర్యం లేకపోవచ్చు. ఆమె ఆత్మ సౌందర్యం నాకు నచ్చింది. నా నిర్ణయానికి తిరుగులేదు. మా పెళ్ళి పెద్దలు కూడా మీరే | మేము రిజిస్టర్ మేరేజ్ చేసుకోవాలనుకున్నాము.”
ఉదయ్ నిబ్బరంగా చెబుతుంటే అక్కడికి వచ్చిన అరుణ, ఆమె తండ్రి తృప్తిగా నవ్వారు. అరుణ సిగ్గుపడుతూ తల వంచుకుంది.
డాక్టర్ ఆనందానికైతే అవధిలేదు. తను తీసుకున్న కేసు సక్సెస్ కావడం కంటే డాక్టర్‌కి గర్వకారణం ఏముంటుంది ? ఏ ఫీజు అంత ఆత్మ సంతృప్తిని ఇష్టలీదేనూ 1! ఆ సాయంత్రం అందరికీ చంద్రోదయ వేళ అయింది కానీ, అరుణ ఉద జీవితాలలో 'అరుణోదయ'మైందని సంతోషంతో ఎవరిళ్ళకు వారు బయలుదేరారు.
ఇది కేవలం కధ కాదు. ఎంతో మంది జీవితాలలో నిత్యం జరిగే సంఘటనలే ! సంఘర్షణలే |
ముఖ్యంగా ఉదయ్ తల్లిదండ్రుల లాంటివారు ఈ కధ చదివేకన్నా తమ సంతానాన్ని సమానంగా చూసి, ఆదరించిననాడు ఇది కథ కాదు.
పక్కింటి వాళ్ళు ఏమైైనాపోయినా తమకు పట్టనట్టు తమ కాయుస్సు, తమ కాయుర్దాయం అన్నట్టు ఉండకుండా ఉన్నప్పుడు ఇది కథ కాదు.
కట్నమే పెళ్ళికి పరమావధి అనీ, అందమే జీవితానికి ఆనందమనీ భావించని నాడు ఇది కేవలం కధ కాదు ]
అందరికన్నా తను పొట్టిగా ఉన్నాననో, పొడుగ్గా ఉన్నాననో, నల్లగానో, అందవికారంగానో, అంగవైకల్యంతోనో ఉన్నానని తమలో తాము కుంగీపోతూ 'ఇన్‌ఫీరియారిటీ కాంప్లైక్స్'తో చిన్నబుచ్చుకోక, 'తామూ ఇతరుల కన్నా వేటిలోనూ తీసిపోము' అని తలచిననాడు ఇది కధ ఎందుకు అవుతుంది ?
డాక్టర్లంటే కేవలం డబ్బు గుందే యం్థాలుగా వూరి మంచితనం, మానవత్వం
మచ్చుకైనా కానరాని శ్ర రోజుల్లో డా, నాద్ వంటి డాక్టర్దూ ఉంటే ఇది ఒక కధ మాత్రమే
ఎలా అవుతుంది ? ఇది కేవలం కధ కాకూడదు. ఈ క్ చదివిన కొందరిలో అయినా
మార్చురావాలి | (ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక) అతల
సోమంచి ఉషారాణి 13 తృప్తి త్స అక కక ణా యనా శంకరం !”
ఆఫీసుకి బయలుదేరడానికి సైకిలు తీస్తున్న శంకరం విసుగ్గా తల్లికేసి చూశాడు. ఆవిడ చెప్పబోయేదేమిటో అతనికి తెలుసు.
“గ్రపు మీ నాన్నగారి తద్దినం. (బ్రహ్మంకి చెప్పావా ?” బాధో, భయమో తెలియనట్టు శాంతమ్మ గొంతు ఒణికింది.
అమ్మా ! ఈ తద్దినాలూ, బ్రహ్మలూ నావల్ల కాదు. ప్రస్తుతం నా దగ్గర పదిరూపాయలు కూడా లేదు. నీ దగ్గర ఏమైనా ఉంటే తీయి” చిరాగ్గా అంటున్న శంకరాన్ని గుడ్డ నీరు కుక్కుకుంటూ చూసిందావిడ.
వకు తెలియంది ఏముందిరా ? క్రిందటేడు సంవత్సరీకాలకి ఉన్న బంగారమంతా కరగబెడితివి.”
“అమ్మా! నాకు ఊరంతా అప్పులే. ఈ సంసారం ఈదడమే నావల్ల కావడం లేదు. మీ ఆయన చెప్పించిన బోడి చదువుకి ఇక తద్దినాలకీ, 'శ్రాద్దాలకు ఆయనేమన్నా మూట ఇచ్చాడు కనుకనా ఖర్చు పెట్టడానికి. అంతగా అయితే తలస్నానం చేసి, ఇన్ని నువ్వులు, నీళ్ళు వదులుతానులే” అనేసి సైకిలెక్కి వెళ్ళిపోయాడు.
కొడుకు మాటలకి శాంతమ్మ గుండె పగిలేలా ఏడ్చింది. 'కన్న తండ్రిని అంతమాట అంటాడా ?' అని తలచుకుని, తలచుకుని వగచింది.
“భోజనానికి రండి. అవతల నేను బజారుకి వెళ్ళాలి” ఏ గోడకో, క్రుర్చీకో చెబుతున్నట్టు పిలిచింది చండిక.
“నేను తిననమ్మా 1! నా కడుపు నిండిపోయింది” అంది శాంతమ్మ ఇంకా కుమిలిపోతూనే ! కొడుకుచేత అంతమాట అనిపించుకుని తాను ఎలా బ్రతికుందో ఆమెకీ అర్ధం కాలేదు.
“అంత ఏడవడానికి ఆయన అన్నదాంట్లో తప్పేముంది ? నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటుంది. “మోసేవాడికి తెలుస్తుంది కావడి బరువని” కష్టపడి సంపాదించేవాళ్ళకి తెలుస్తుంది. తద్దినమంటే మాటలా ? ఎంత ఖర్చు ఎంత హడావిడి ! మీకు మాత్రం తెలియదా ? చిన్నపిల్లలా ఏడ్చి సాధిద్దామనుకుంటున్నారా ఫ౫ విసురుగా అంది చండిక,
“వదినా ! అమ్మతో మాట్లాడే విధానమా అది ? అత్తగారన్న గౌరవం లేకపోయినా సాటి మనిషిగా...” అప్పుడే వచ్చిన వనజ అవేశంగా లోపలికి వచ్చింది. ఆమె అత్తవారిల్టు అక్కడికి దగ్గరే ! తల్లిని చూసి పోవడానికి వస్తూ ఉంటుంది.
“ఒయబ్బో | పిల్లి కళ్ళు మూసుకుని పాలుత్రాగుతూ తన్నెవరూ చూడలేదనుకున్నట్టు
నిశాచముంచి ఉషారాణి [14 తృప్తి సోమంచదిఉషారాకి లే. నువ్వు మీ అత్తగారితో ఎంత సౌమ్యంగా ఉంటావో నాకు తెలియదు కనుకనా ! అయినా ఇది మా కుటుంబ విషయం ఇందులో కలుగజేసుకునే హక్కు నీకు లేదు” చేతులు త్రిప్పుతూ మూతి విరిచింది చండిక. ఆమెకాపేరు ఎవరు పెట్టారో కాని సార్రకమయింది. “ఇది నా పుట్టిల్లు! ఒకప్పుడు నేనూ ఈ కుటుంబంలో మనిషినే! నా తల్లిని ఏమన్నా అంటే కలుగజేసుకునే హక్కు నాకెప్పుడు ఉంటుంది” రోషంగా అంది వనజ. ' “చండికా ! నువ్వు రెడీయేనా ? త్వరగా రా! మళ్ళీ టిక్కెట్టు దొరకవు” అంది ప్రక్కింటి చండిక స్నేహితురాలు మీనాక్షి చండిక విసురుగా అక్కడినుండి వెళ్ళిపోయింది. వనజ తల్లిని ఓదార్చి విషయం తెలుసుకుంది. ఆమె మనసు చివుక్కుమంది. తండ్రి తద్దినం పెట్టకపోతే తనను అత్తారింట్లో ఎంత చిన్న చూపు చూస్తారో ఆమెకు తెలుసు. అదికాక ఈ రోజు అత్తగారు అడగనే అడిగింది. 'రేపేగా మీ నాన్న తద్దినం అని, అందుకే ఏ సంగతి తెలుసుకుందామని వచ్చింది. _ సంగతి తెలుసుకుని వనజ కూడా కంటతడి పెట్టుకుంది. తల్లిని ఏమని ఓదారుస్తుంది ? అమె భర్త చేతికి పైసా ఇవ్వడు తనేమైనా పుట్టింటికి చేరవేస్తానేమోనని అత్తగారి నిఘా ఒకటి 1 న ఉండనే ఇప్పటికే “ఓ పండక్కి పిలవడం ముద్దు ముచ్చటా ఏం లేవని ఇంట్లో వాళ్ళ సాధింపు గ్ భి | రంద్ర తద్దినం కూడా పెట్టకపోజే అత్తారింట్లో తననెంత చులకనగా శా తలచుకుంటే వణుకువస్తోంది. క్రాన్సి డపి కో లొ ఓదార్భగలదు? మా ఆడపిల్ల | ఏం చేయగలదు. తల్లిని ఎ కిక అంతా వారి నిర్వాకమేనమ్మా! అదివరకు అన్నయ్య అలా ఉండేవాడు కాదు. లే గ రల, చీరలకీ డబ్బులెక్కడినుండి వస్తాయో! ఏడాది కొకసారి తద్దినం పెట్టలేదూ ॥| అక్కసుగా అంది వనజ వదినగారి నుద్దేశించి గ “పోనీ లేమ్మా | ఎవరి హప్రా శారు. న వాళ్ళేపోతారు. అయ నేనూ చచ్చాననుకుంటాను.” వేదాంతిలా అంది మ నతో పాటు అందరినీ శాసిసూ. ఆజాపిసూ 1 అయిపోయింది! తలిని చున పంత రాన్ని ఒక త్రాటిపై నడిపించిన అమ్మ ఎలొ న ౦ వనజకి, ఎ స అన్నం తినడానికి అంగీకరించలేదు. 9త బ్రతిమిలాడినా ఆవిడ ఆ పూట కొడుకు మాటలే పదే పదే వివిన కష్టపడ్డారని! ్రిందపడితే వినిఫిస్తున్నాయి. వాడికోసం ఆయన చిన్నప్పుడు ఎంత నొప్పెట్టిందా నాన్నాగ్ అని నడుము రాసేవారు... నడుష్రుఖ. ట్ నడుము లాగుతున్నాయోనని కాళ్ళు రాసేవారు, స్తుంటే ముచ్చటపడినా కాళ్ళెక్కడ ఒకసారి పెద్దజబ్బు చేసి శ్రి ద 0దా మీదా అయితే నిద్రా హారాలు మానేసి, పక్కనే కూర్చున్నారు. వాడి చదువుకోసం ఓవర్ టైమ్” చేస ర్! మానిసి, పక్క సరదా లేదు, ఓ యాత్రా లేదు. తిండిమీదా * ఆం గ్యం పొడుచేసుకున్నారు. ఓ ఆశా. నిద్రమీద ధ్యాహిలేవు ఎంతసేపూ
సోమంచి ఉషారాణి 15 తప్త పిల్లలగురించి ఎంత కష్టపడ్డారని !
అయితే వెనుక ఆస్ట్రిపాస్టులు లేకపోవడం వలనా, పిల్లల చదువులక్తి, పెళ్ళిళ్ళకు ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోవడం వలనా ఏమీ మిగల్బకపోయిన మాట వాస్తవమే ! అయినా అటువంటి కష్టజీవిని, కన్నతండ్రిని అంతమాట అనడానికి వాడీకి నోరెలా వచ్చింది ? వనజ అన్నట్టు...
ఛ! పరాయిపిల్లని తనెందుకు అనుకోవాలి ? “తన బంగారం మంచిదైతే ఇంకొకరిని అనవలసిన పనేముంది ?” నిట్టూర్చింది శాంతమ్మ.
'అమ్మా! ఆకలేస్తోంది అన్నంపెట్టు' అంటూ చిన్నకొడుకు రవి రావడంతో శాంతమ, శకి లేవక తప్పలేదు.
రవికి అన్నం పెడుతూ, “రేపు నాన్నగారి తద్దినంరా ! అన్నయ్య డబ్బు లేదంటున్నాడు. నీ దగ్గరేమైనా...” ఆశగా అంది శాంతమ్మ.
“అమ్మా! నేను సంపాదించేదంతా అన్నయ్య చేతిలోనే పోస్తున్నాను. నా దగ్గర ఏముంటుంది ? అయినా అన్నయ్య పొద్దున చీర కొనుక్కోమని వదినకు రెండొందలిస్తుంటే చూశానే!” అగ్నిలో మరో సమిధవేసి వెళ్ళిపోయాడు రవి.
తల్లి ఎందుకలా ఉందో ఎంత బాధపడుతోందో, తిన్నదో లేదో ఏమో అక్కరలేదా తనయుడికి! ఎవరికీ తెలియకుండా బాంక్‌లో డబ్బు దాచుకుంటున్న విషయం అతనికొక్కడికే తెలుసు.
తల్లికి తెలిస్తే కూతుళ్ళకి ఎక్కడ దోచిపెడుతుందోనని, అన్నగారికి తెలిస్తే ఇంకే ఇర్చులంటాడోనని ఇంతే వస్తుందని కొంతే అన్నగారికిచ్చి, మిగతాది బాంకులో వేసుకుంటాడతను.
“ఆ తండ్రి తద్దినం పెట్టకపోతే నష్టమేమిటి ? చచ్చిన మనిషి వస్తాడా ? చూస్తాడా ? అన్నీ మూఢనమ్మకాలు! అయినా అది అన్నయ్య బాధ్యత |! తనదేం ఉంది'అని తేలిగ్గా మనసుని జోకొట్టి ఆ విషయం అంతటితో వదిలేసి తన పనిలోకి వెళ్ళిపోయాడు రవి. అయితే చిన్నప్పుడు తన కన్నీళ్ళు తుడిచిన కన్నీళ్ళతో అతనికి సంబంధం లేకపోయింది
4 ర 3
ఆ రాత్రి అన్యమనస్కంగా పడుకున్న శంకరానికి కలత ని(ద్రపట్టింది.
కొన్నేళ్ళు గడిచాయి. కొందరు తమ జీవితానికి చరమగీతం పాడితే, కొందరు ఈ భూమ్మీద ఏదో పుట్టి మునిగిపోతున్నట్లు ఏం బావుకుందామనో హడావిడిగా నేలమీద పడ్డారు.
“కృష్ణా! రేపు మీ అమ్మ దినంరా! బ్రహ్మంకి చెప్పావా. రేపు సెలవు పెట్టావా ?” శంకరం అడిగాడు.
కృష్ణ సూటిగా తండ్రికేసి చూసేసరికి శంకరం తల 'త్రిప్పునున్నారు. చిన్నప్పుడు తల్లిదండ్రుల మాటలు, నాయనమ్మ పడిన బాధ కృష్ణకి బాగా గుర్మున్నాు, శ్రి శ్ర [| ద౦'డ్రులకి తద్దినం పెట్టలేదు, కాఫీ శ్రన్న సొత్రు ఆక్టా |
“సారీ నాన్నా! రేపు ఆఫీస్‌లో ఆడిటింగ్ ఉంది అం. యు అయుకా స్తు
తృప్తి సోమంచి ఉషారాణి 16 సుక్షుని ఆఫీసుకి రోజుల్లోనే లేవు. ఇప్పుడేమిటి నాన్నా వ నమ డు, నిప వేసోయాడు మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయని వ్ ఖ్ శంకరానికి అబ్బాయికి చేయమని ఎందుకు చెబుతున్నారు ?* రాధ విసురు నీళ్ళు తిరిగాయి. ఇ ది. పైగా ర వు యదా ర ర న వవ్లేళంట్రైని ఎన్ని మాటలన్నాడు. తండ్రి నిజానికి పెద్దకొడు గా చదివించాలని చూసేవాడు. ఏమడిగినా విసుక్కోకుండా కొనిచ్చేవాడు. తనని బా రాత్రనక్సా పగలనకా కష్టపడేవాడు, కానీ తనేం చేశాడు ? చెబులాడు 7 ఈ రోజు తనదాకా వచ్చేసరికి కొడుక్కి ఏ ముఖం పెట్టుకుని నీతులు య్ ్సళ్ళో ఆరోజు భోజనం చేయకుండా బయటకు వెళ్ళిపోయి, తిరిగి తిరిగ, చివ క్ పెట్టిద్దామని నిర్ణయించుకుని ఇంట్రికి వచ్చాడు. “అమ్మా క్షమించమ్మా! అమ్మా... శో వచ్చిన “ఏమిటండీ కలవరిస్తున్నారు, ? ఏన్ట్రా కలవచ్చిందా ? తెల్లవారురూమున కలలు నిజమౌతాయట1[” చండిక దీర్హం తీస్తుంటే శంకరం ఉలిక్కిపడ్డాడు, డక ఒక్క ఉదుటున లేచ్చి వెళుతున్న భర్తని విస్తుపోల్చు చూస్తుండి పోయింది చం హారం “అమ్మా! నన్ను క్షమించమ్మా! నిన్న తొందరపడ్డాను. నా పాపానికి పరి లేదమ్మా!” పడుకున్న తల్లి కొళ్ళమీద పడిన శంకరం రోదించసాగాడు. ట “ఒరేయ్ శంకరం! ఏమిట్రా ఇది ? నాన్నగారు గుర్తు వచ్చారా ?” త్రను కూడా కం తడిపెడుతూ, క్రొడ్డుక్సు త్రం నిమిరిందా కన్నతల్లి. అదే తల్లిలోని (ప్రేమ మహత్యం! నిన్న కొడుకు అన్నమాటలు, త్రన్సు పడిన బాధా అంతా క్షణంలో మర్చిపోత్రుంది, డు “అమ్మా! నాన్నగారి తద్దినానికి ఏర్పాట్లు చేస వస్తానమ్మా! లని వడివడిగా వచ్చా శంకరం చండిక దగ్గరక్తు, “నిన్న నేను ఇచ్చిన డబ్బేద్సి 1 భార్యని అడిగాడు. “అది... అది చీర” భర్త గొంభీర్యం చూసి నస్పిగంద్ష “కళలో చేయి జాపాడు. స్ట అనలేక్ష రెండొందలు భర్త చేతిలో పెట్టింది చండిక ఆయిష్టంగానే, శంకరం రవిని చెల్లెలింట్రిక్తి పంపాడు వాళ్ళని రమ్మని పిలుచుకురమ్మనటానిక తల్లిని భార్యని వంట ఏర్పాట్లు చేయమన్నాడు, బజారు వెళ్ళి కూరగాయలు, కావలసీ సరుకులు, తెచ్చి పడేసి (బ్రహ్మలక్సి చెప్పెవచ్చాడ్రు, ఎంతో [శ్రద్దగా త్రద్దినం పెట్టిన శంకరం తల్లి సంతోషాన్ని చూసి బ్రహ్మలు కడుపునిండ్రా భోజనం చేస్తుంటే తన తండ్రి తింటున్నంత తృప్తిని అనుభవించాడు. క్ర (పల్లకి సచిత్రవారపత్రి 996
సోమంచి ఉషారాణి 17 మ్‌నా మీనా ఉవ్ట్ప దుట కల్యాణ తిలకం దిద్ది, కంటికి కాటుక, ముక్కుకి ముక్కెర పెట్టారు.
ఎడమ బుగ్గమీద సాదుతో చుక్క, బారుగా ఉన్న కేశాలను ఏ సవరం అవసరం లేకుండానే పెద్ద జడగా అల్లి, మొగలిపూలు కుట్టి చివర కుచ్చులు పెట్టారు. పాపిట్టో పాపిడి బిళ్ళ, చెవులకు ఎజ్జరాళ్ళ దుద్దులు, మెడలో ఎజ్జరాళ్ళ నెక్షిసుతో సన్నని ఒంటిపేట గొలుసూ వున్నాయి. ఎజ్జ పట్టుచీర, అదే రంగు పట్టు జాకెట్టు వేసుకుంది. కాళ్ళకి పసుపురాసి పసుపు, సున్నము కలిపి పారాణి, చేతులకు వంకీలు, నడుముకి గజ్జెల వడ్డాణం, కాళ్ళకి గజ్జెలు పెట్టారు. ఇన్ని చేసినా మీనాలో పెళ్ళికళు ఉత్సాహం రాలేదు కళ్ళలో ఆ కాంతి లేదు. మనసులో అటువంటి భావన లేదు.
అయితే మీనాకి ఇన్నాళ్ళూ పెళ్ళికాకపోవటానికి అటువంటి భావం మదిలో మెదలడానికి కారణాలున్నాయి. ఒకటి, మీనా నల్లగా ఉండడమేకాక అందం, ఆకర్షణ లేదు. రెండు, ఎక్కువ చదువుకోలేదు. ఆ పల్లెటూళ్లో పెద్దమనిషైన తర్వాత ఎనిమిదో తరగతితోనే పదమూడేళ్ళకే చదువు మానిపించేశారు. మీనా విషయంలో ఆసలు కట్నం ప్రసక్తే రాలేదు. ఎందుకంటే మీనాని చూసిన వెంటనే పెదవి విరిచేవారందరూ, కట్నం ఇంతకంటే ఇవ్వలేమనీ, మా పిల్ల ఇంతకంటే చదువుకోలేదనీ చెప్పగలరు కానీ 'మా పిల్ల. బాగుండదు' అని చెప్పలేరుకదా! అందుకని మీనాకి చాలా 'పెళ్ళిచూపులే జరిగాయి. కట్నం దాకా రాకుండానే అన్నీ తిరిగిపోయాయి. వింత ఏమిటంటే మీనాకంటే నల్లగా ఉన్నవాళ్ళు. ఎత్తుపళ్ళవాళ్ళు, మెల్లకన్నువాళ్ళు కూడా మీనా నచ్చలేదన్నారు. ఒకవేళ ఏ లక్ష రెండు లక్షలో, కనీసం ఏభైవేలు కట్నమిస్తే ఎవరైనా ముందుకు వచ్చేవారేమో గాని మీనా తండ్రికి అంత తాహతు లేదు. ఆయనకి మీనా పెద్దకూతురు. మీనాకి ఇద్దరు చెల్లెళ్ళు. ఆఖరున నేనే వంశోద్దారకుడనంటూ ఒక చిట్టి తమ్ముడు పుట్టాడు. వాళ్ళకున్నది ఆ పల్లెటూళ్లో చిన్న పెంకుటిల్లు కౌలుకు తీసుకున్న రెండెకరాల పొలం. కౌలుకుపోగా మిగిలేది ఎక్కువేం ఉండదు. కటాకటిగా వాళ్ళ కుటుంబానికి సరిపోతుంది ఏకాలానికి సంబంధించిన పంట ఆ కాలంలో వేసి ఎల్లవేళలా కష్టపడేవారు మీనా తండ్రి. ఇంటి ముందు, వెనుక ఉన్న ఖాళీస్టలంలో అన్ని రకాల కూరగాయల మొక్కలు, పాదులు వేసేది మీనా తల్లి, ఉన్నదాంట్లో గుట్టుగా కాలక్షేపం చేస్తూ పైసా, పైసా కూడదీసి, మీనాకి పాతికేళ్ళు వచ్చేటప్పటికి పదివేలు చేశారు. ఆ డబ్బుతో మీనా పెళ్ళి చేయాలని ఆయన సంకల్పం.
మీనాకి తల్లిదం(డ్రులు చెప్పినపుడు యధావిధిగా తయారై పెళ్ళివారిముందు కూర్చోవడం వాళ్ళు కాదన్నప్పుడు బాధపడకపోవడం, తనకంటే చిన్నవాళ్ళు, చక్కని వాళ్ళు అయిన చెల్లెళ్ళు వేళాకోళం చేసినప్పుడు చిన్నగా నవ్వడం, శనేశ్చరమనీ, దరిద్రదేవత అనీ
సోమంచి ఉషారాణి 18 మీనా తల్లిదం[డ్రులు తిట్టినపుడు “అవును కామోసు” అని అనుకోవడం, ఊరి వాళ్ళందరూ 'నల్ల తుమ్మమొద్దు, కొరివి దెయ్యం” అన్నప్పుడు “అవికూడా తనలాగే ఉంటాయి కాబోలు పాపం!" అని జాలిపడడం, ఎవరైనా సాయం చేయమన్నప్పుడు ఒళ్ళువంచి, శ్రమ తెలియకుండా చేతనైనంత ఉపకారం చేయడం, అలా సహాయం చేస్తున్నప్పుడు ఎవరైనా పని సరిగాచేయలేదని కసురుకుంటే, “అయ్యో! పారషటైపోయింది” అని చిన్నబోవడం ఇవి మీనా అలవాట్లు. ఇంకా చెప్పాలంటే వంటచేయడం, మొక్కలకి నీళ్ళుపోయడం ఖాలీగా ఉన్నప్తుడు గచ్చకాయలు, చింతపిక్కలు ఆడుకోవడం కొంచెం పెద్దయ్యాక తనకి తెలియని ఏదో లోకం గురించి ఆలోచించడం ఈ లోకంతో సంబంధం లేనట్టు ఉండిపోయేది. ఎవరైనా పిలిచినా త్వరగా పలికేది కాదు. ఫలితంగా విసుగు, చివాట్టు తినడం అలవాటయ్యాయి.. అసలు మీనాకి పెళ్ళీ కాదన్న స్టిరనిశ్చయానికి ఇంట్లో వాళ్ళే కాక్క ఊళ్ళోవాళ్ళు కూడా వచ్చాక, ఫలితంగా చెల్దాయిలు తమ పెళ్ళికి అక్క ఆటంకంగా ఉందని విసుక్కుంటున్న సమయంలో, మీనాని వదిలేసి తర్వాత వాళ్ళకి పెళ్ళి చేయాలని ఆమె తలి దండ్రులు నిర్ణయించుకున్న తరుణంలో ఎవరో దూరప్పు చుట్టం మీనాకి ఒక సంబంధం తెచ్చాడు. ఇన్ని జరిగిన తరువాత ఆ వచ్చిన సంబంధం కూడా అనుకున్న దానికి భిన్నంగా అంతస్తుకి మించినదైనపుడు మీనాలో పెళ్ళి కళకంటే ఒక విధమైన జంకు, నిరాశాభావం గోచరించాయి. గౌరీపూజ చేస్తోంది కానీ మనసు దేనిమీదా లగమవటం లేదు. అసలు తానేం స్త / పరిహాసాలూ, చమత్తారాలూ కో చీల్చుకుని నవ్వు పెదవులపై విరియటం లద క లేదు గుండెను కాంతులు కురవటం లేదు. క టం లెదు. కళ్ళ పూజ ముగించి, కొబ రిబొండం చేతిలో పటు వెంటరాగా ముందుకు నడిచిద్సి ఇద్దరి మధ్యా నైనం కనులు ఆకారాలు ఒకరికి స్పష్టంగా కనబడటం లేదు. అసలు పెళ్ళికొడుకు ఎలా ఉంటడో న్ ఉత్సుకతలేదు మీనాతో. “తనకంటే అందంగా ఉంటాడన్న అతను త్రననై దు చేసికొంటున్నట్టు?” అని ఆత్మ విమర్శ చేసుకోవటం లేదు, “అంత అఆస్తీపరుడు ర సా కట్నం లేకుండా ఎవరికీ అజ్ఞర్లేదన్న తనను ఎలా చేసుకుంటా*డన్లి సందేహపడటం లేద్ద. _ముహూర్త సమయం ఆసన్నమైంది. జీలకజ్దు, బెల్లం వధూవరులిద్దరూ ఒక్షగ్రినెతిన ఒకరు పెట్టుకున్నారు. ఒక్కనిముషం అక్షింతల వర్షం కురిసింది ఇద్దరి మధ్యా వున సనని అడ్డుతెర తొలగిపోయింది. ఇంత వరకూ ఒకరినోక్తరు చూసుక్షోక్షన, ] నున్న సన్న న 'ఏశకపోయినా ఇప్పుడు కూడా ఆదుర్దాగా, ఆర్రిగా కనీసం ఓరగా కూడా ఒకరినొకరు చూస్తుక్ర్వ్యం లేదు. పురోహితులు చెప్పినట్లు యంధత్రంలా చేస్తున్నారు... మంగళ సూత్రాన్ని అక్షింతలలో ఉంచి అందరికీ
నోమంచి ఉషారాణి 19 మ్‌నా అక్షింతలు పంచుతున్నాడో పురోహితుడు.
పెళ్ళికొడుకుని చూసిన ఆడపెళ్ళివారందరూ మరోసారి బుగ్గలు నొకుకున్నారు.
మీనాకి అసలు పెళ్ళేకాదనీ, ఒకవేళ అయినా, ఏ ఏభైఏళ్ళవాడో, లేకపోతే పిల్లలున్న ెండో పెళ్ళివాడో జాలిపడి, అదీ కట్నం గుంజి చేసుకుంటాడనీ ఒకప్పుడు ఊరంతా కధలు, కధలుగా చెప్పుకునేవారు. అటువంటిది ఇలా జరగడంతో తాము విన్నది నిజము అవునా కాదా అని మీనా వాళ్ళింటికి వెళ్ళి తెలుసుకుని మరీ బుగ్గలు నొక్కుకున్నారు మరి కొందరు.
మాంగల్యధారణ జరిగిపోయింది. మరోసారి అక్షింతల వర్షం కురిసింది. అందరికీ ఉత్సుకత కలిగించే తలంబ్రాల ఘట్టం చాలా మామూలుగా జరిగిపోయింది. పూలదండలు వేసుకున్నారు. కట్నాల చదివింపుల ఘట్టం వచ్చింది. ఉబుసుపోక పెళ్ళికి వచ్చినవాళ్ళూ, ఈ పెళ్ళి సవ్యంగా జరుగుతుందా లేదా అని వింత చూడడానికి వచ్చినవాళ్ళూ, భోజనాలుచేసి చక్కాపోతున్నారు. పెళ్ళికొడుకు కానుకలముందు. పెళ్ళికూతురు కానుకలు సూర్యుడు ముందు దివిటీలా, ట్యూబ్‌లైట్‌ముందు బెడ్‌లైట్‌లా, పెట్రోమాక్స్‌లైటుముందు. చిన్న కిరసనాయిల్ బుడ్డిలా చిన్నబోతున్నాయి. ఎవరిలోనూ పెళ్ళి ఉత్సాహం, సంతోషం లేకుండా మీనా పెళ్ళి అయిపోయింది. మిగిలిన తతంగంకూడా చాలా మామూలుగా జరిగిపోయింది.
కట్నం ఇవ్వలేదని, ఎదుటివాళ్ళు గొప్పవాళ్ళవడం చేత పెళ్ళి ఘనంగానే చేశాడు మీనా తండ్రి,
'ఆ! పెళ్ళయిన్నా తిన్నగా కాపురానికి తీసుకువెళతాడంటే నే నమ్మలేను అనుకున్న వాళ్ళంతా మీనాని వెంటనే కాపురానికి పంపమని పెళ్ళికొడుకు తొందరచేశాడని విన్నప్పుడు మరోసారి విస్తుపోయారు. ఇన్ని జరుగుతున్నా మీనా పెదవులపై నవ్వులేదు. తనని కానట్టుగా, ఏమీ పట్టనట్టుగా ఉండిపోయింది.
వధూవరులు ఎంతో ఆశతో ఆనందంతో ఎదురుచూసే మధురఘట్టం తొలిరేయి వచ్చింది. అప్పుడు కూడా ఎవరి వేళాకోళాలకూ, పరిహాసాలకూ పెదవి విప్పలేదు మీనా.
“విక్తేమీ విన్నించడం లేదేమిటీ ? చెవుడొచ్చిందా ?” అని ఒకావిడ అంటే, “మీ ఆయన పలకరించినా ఇలా ముంగిలా కూర్చుంటావేమిటి ? మూగదానివనుకుంటాడు సుమా” అని నవ్వింది మరో ఆవిడ.
షా 2
“చ్చిన!”
“మీనా! నిన్నే”
“ఊఊ
“అలా ఉన్నావేం ? సిగ్గా”
సోమంచి ఉషారాణి 20 మీనా “ఊహూ!”
“మరి మాట్టాడవేం? నీకీ పెళ్ళి ఇష్టం లేదా ? ఒక్కసారైనా నవ్వడం చూడలేదు అసలు నన్ను చూశావా?”
చూడలేదన్నట్టు తల_ అడ్డంగా ఊపింది తల వంచుకునే.
“చూడవా ? నాతో మాట్టాడవా ? ఇలా ఉన్నావేం ?” మీనా భుజం మీద చెయ్యి వేసి, మునివేలితో గడ్డం పైకెత్తుతూ అడిగాడు.
మీనా అప్పుడు కళ్ళు పైకెత్తి చూసింది. బేలలా అమాయకంగా చూసే మీనా కళ్ళని ముగ్దుడై చూసి, ముద్దాడొాతను.
మీనా చేతుల్టో ముఖాన్ని దాచుకొని వెక్కివెక్కి ఏడ్చింది. అంతవరకూ ఆపుకున్న దు,ఖం, ఇన్నాళ్ళూ ఎవరేమన్నా కంటనీళ్ళు పెట్టని మీనా అతని పాదాల దగ్గర జారిపోయి కుమిలికుమిలి ఏడ్చింది.
“ఏమిటిది మీనా ? ఏమైంది ?” ఆదుర్దాగా అడిగాడు.
“ెప్పు మీనా ! నాకు చెప్పవూ ?” లాలించాడు.
మీనా దుఃఖం మరింత ఉధృతమైంది. కానీ తగ్గలేదు. మీనా భర్త ఆమెనలా వదిలేసి మంచంమీద పడుకున్నాడు. చాలా సేపటికి మీనాకి ఉపశమనం కలిగింది. కళ్ళు తుడుచుకుని, సూటిగా భర్తకేసి చూసి అడిగింది.
“మీరు నన్నెందుకు పెళ్ళి చేసుకున్నారు?”
“భలేదానివి మీనా | ఎవరైనా ఎందుకు పెళ్ళి చేసుకుంటారు? మనసులో ఆశ్ళ్చర్యపోయినా, సైకి నవ్వుతూ అన్నాడతను,
“నిజం చెప్పండి. మీరు నన్నే ఎందుకు చేసుకున్నారు? మీకేం తక్కువ ? కోరుకుంటే...” మీనా మాటలను మధ్యలోనే అందుకుని, “నీకి తక్కువ మీనా?” ఎదురు 'ప్రశ్నించాడతను. మీనా అమాయక్షురాలేకాన్సీ, తెలివితక్కువదికాదు అనుకున్నాడు
(5! (
ఏమి తక్కువ అని కాదు _ఎమి ఎక్కువ అని అడగండి” చిన్న బుచ్చుకున్నా విసురుగానే అంది మీనా,
“అంటే అందరిలా నువ్వూ బాహ్య సౌందర్యం గురించి ఆలోచిస్తున్నావన్నమాట ! అయినా మాటలు రావనుకున్నాను భలే గడుసుదానివేనే” మూట మార్చాలని చూశాడు.
నా ప్రష్టలకి సమాధానం చెప్పండి” స్థిరంగా అడిగింది మీనా,
దగ్గరకు రా, చెబుతాను” నవ్వాడు,
“ఉహు ముందు చెప్పండి” అదే స్టిరత్వం మీనా గొంతులో.
సోమంచి ఉషారాణి 21 మీనా
“ప్పలేకపోతే,” కవ్వించాడతను.
మీనా సూటిగా చూసిందికానీ సమాధానం చెప్పలేదు. ఆలోచిస్తూ ఉండి పోయింది. సమాధానం దొరకని ప్రశ్న ; ఎప్పటికైనా దొరుకుతుందా? అసలు సమాధానంఉందా? ఉంటే ఏమై ఉంటుంది? అది తను నమ్మగలదా? ఒక్కసారిగా ఇన్ని (ప్రశ్చలు వస్తున్నాయేమిటి తనకి?
“కమాన్‌మీనా! ఇంత అందమైనరాత్రిని అందులో తొలిరేయిని ఈ పరిమళాల తాపంలో, సువాసనలమధ్య నిన్నైదురుగా పెట్టుకుని నేను భరించలేను రావూ?” మంచంమీదనుంచి లేవకుండానే చేతులు జాపాడు.
ఒక్కక్షణం ఆ చేతులలో వాలిపోదామనిపించింది మీనాకి, కానీ “నిజమెలా తెలుస్తుంది? అసలు చెప్పరేం? ఏమిటాయన ఉద్దేశ్యం?” తనని తాను ని(గ్రహించుకుంది. “తన (ప్రవర్తనకి ఆయనకు కోపం వస్తుందేమో ! బాధపడతారేమో! ఇప్పుడెలా?” ఎటూ ఆలోచించలేక అలాగే నిలబడిపోయింది మీనా.
“అయినా ఈ ధర్మసందేహం నీకప్పుడు కలిగింది? అందుకేనా ఎవరితోనూ మాట్లాడకుండా అంత ముభావంగా ఉన్నావ్?”
“కాదు. నాకీ ధర్మ సందేహం ఇప్పుడే కలిగింది. ఇప్పటిదాకా నాకే అనుమానం లేదు. కాకతాళీయంగా ఏదో కారణముండే ఈ పెళ్ళి చేసుకున్నారనీ, అందుకే కనీసం నన్ను చూడకుండా పెళ్ళికి ఒప్పుకున్నారని, మీరు నన్ను (ప్రేమించరనీ, సరిగా చూడరనీ....”
ఫక్కున నవ్విన భర్తను చూసి సీరియస్‌గా చెబుతున్న మీనా ఆగిపోయింది. అతనింకా గలగలా పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూనే ఉన్నాడు. మధ్య మధ్యలో “మీనా! మీనా! భలే మీనా! అంటూ పొట్టపట్టుకుని, కళ్ళలో నీళ్ళు తిరిగేలా అంత గట్టిగా అంతసేపు నవ్వుతుంటే తన మాటలో పొరపొటేమిటో అర్ధంకాక తెలబోయి చూసింది మీనా.
“నేనే మన్నానని అంతలా నవ్వుతున్నారు?” మీనా మొట్టమొదటిసారిగా భర్తమీదే విసుక్కుంది.
అతను నవ్వాపాడే కానీ, పెదవులమీద చిరునవ్వు చెదిరిపోలేదు. “ఇట్రా మీనా! ఇలా వచ్చి కూర్చో, చెబుతాను” అన్నాడు.
మీనా మెల్లగావచ్చి అతని ప్రక్కన కూర్చుంది.
“ఏదో కారణం ఉంటేనేగానీ నిన్ను పెళ్లి చేసుకోనని, ఒకవేళ చేసుకున్నా 'ప్రేమించననీ ఎందుకనుకున్నావ్?” వచ్చే నవ్వును అపుకుంటూ అడిగాడు మీనా భర్త
“ఏీమ్లో నా కలా అనిపించింది.”
“అందం, చదువు, అంతస్టు, హోదా, అస్ట్రి, మంచి ఉద్యోగం ఇన్లి వున్న నేను ఏమీ లేని నిన్ను ప్రేమించలేనని అనుకున్నావు కదూ! నువ్వేకాదు, అందరూ అలాగే
సోమంచి ఉషారాణి 22 మ్‌నా అనుకుంటున్నారుకదూ! నేను నీ కొక కధ చెప్పనా ? అదే నీ ప్రశ్నకు సమాధానం” మీనాని ప్రక్కనే పడుకోబెట్టుకుని ఆమె నడుంచుట్టూ చెయ్యివేసి, దగ్గరకు తీసుకుని చెప్పడం ప్రారంభించడతను.
“ఒక ఊళ్ళో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వాళ్ళు గొప్పవాళ్ళు కాకపోయినా బాగానే డబ్బుంది. తను అందంగా ఉంటాననీ, చదువుకున్నాననీ బోల్డంత గర్వం ఆ అమ్మాయికి, కానీ పైకి నవ్వుతూ బాగానే మాట్టాడేది.
ఆ అమ్మాయికి ఓ అనాకారి బావ ఉన్నాడు. చామన చాయగా ఉంటాడుగానీ సన్నగా, షాట్టిగా ఏ మాత్రం అందంగా ఉండడు. అదీకాక అతనికి చిన్నప్పుడు పోలియో రావడంతో కాలు -ఈడుస్తూ నడిచేవాడు. కానీ వాళ్ళకి చాలా అస్టి ఉంది. అతనికి మంచి ఉద్యోగం ఉంది. అన్నిటినీ మించి తన అందమైన మరదలంటే అతనికి కావలసినంత (ప్రేముంది. (ప్రేమ గుడ్డిదంటారు. అసలు (ప్రేమ అనేది ఎప్పుడు, ఎవరిమీద, ఎందుకు కలుగుతుందో ఎవరు చెప్పగలరు ? చిన్నప్పటి నుంచీ కలిసి తిరగడంవల్ల నైతేనేమి, ఆ అమ్మాయి అందంమీద మోజు పెరగడం వల్లనైతేనేమీ తన మరదలిని ప్రేమించి పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాడా పూర్ ఫెలో ! కానీ ఆ అమ్మాయికి తన బావంటే (ప్రేమలేదు. కనీసం జాలి, సానుభూతి అయినా లేవు. అవి లేకపోయినా ఎవరికీ అవసరం లేదనుకో | ఏదో వంకన ఎప్పుడూ అతన్ని ఆడిస్తూ మనస్సులోనే సంచోపపడేది,
అతను తల దువ్వుకుంటుంటే మధ్యలో వెళ్ళి 'క్రొత్తరకంగా' అని చెప్పి పిచ్చిగా దువ్వి, అబ్బ! బావా పుడు ఎంత బా 89 టికి నిజమనుకుని య న వని వో తెలుసా?” అని వేళాకోళమాడేటప్ప “బావా నువ్వు బెల్‌బాటమ్ వేసుకుంటే అచ్చు హీరోలాగుంటావు” అనగానే. తనక్షి బావుండకపోయినా నిజంగానే బెల్ బాటమ్‌లు కుట్టించుకుని వేసుకునేవాడు. . “బావా! బజారులో ఇవాళ మంచి బాంబేడైయింగ్ శారీ చూశాను. నాక్తు కొనిపెట్లవూ' ' అన్నప్పుడు ఉప్పాంగిపోయి వెంటనే కొనిచ్చేవాడు. అదేకాదు ఏ వస్తువైనా సే ల ఖరీదైనా సరే! వ్ “బావా ఇవహళ మా కాలేజికి సెలవు. నువ్వుకూడా సెలవు కొడుతోంది. కాసేపు ఏ చెస్పో ఆడుకుని వ్యాళ మ కృేట్ము పప ల బోర్ పార్క్‌కెళ్ళి ఇంచక్కా కబుర్భు చెప్పుకుందాం.” అంతే | వెంటనే అవల వరే అలా ఒకటేమిటి ఆమె నోటి నుంచి ఏదివచ్చినా కాదని ఎరగడు, అదంతా ఆమెకి తనమీద 7 అనుకునేవాడు కానీ తన పిచ్చి ప్రేమను ఆమె తన అవసరాలకూ, సా ప్రేమే ఉపయోగించుకుంటోందని ఊహించలేకపోయాడు. అంతవరకు బాగానే ఉంది కవీ సర్టానికీ తన ప్రియుళ్లే కలుసుకుందుకు కారులో వెళ్ళేందుకు, వాళ్ళిద్దరూ వెళ్ళీ సినిమాలకు వ్
సోమంచి ఉషారాణి 23 మ్‌నా టిక్కెట్టు కొనమనీ అతన్ని పురమాయించేది.
“నువ్వతనితో అలా తిరగడం బాగుండదని బావ అంటే -
“ఎవరికి బావుండదు?” అని కోపంగా అడగాలనిపించినా అతనితో వున్న అవసరాన్ని గమనించి, ఏదో (ఢ్రెండ్‌నని నా వెంటబడుతున్నాడు. పూరొఫిలో ! ఏదో ఈ నాలుగు రోజులేగా! తరువాత వాడే మెల్లగా జారుకుంటాడు” అని నవ్వేసేది. ఆమె బాన నిజమని నమే వాడు. కానీ అతనిగురించి తనతో ఇలా చెబుతోందికదా, తన గురించికూడా అతనితో ఇలాగే చెబుతోందేమో నన్న అనుమానం రాకపోలేదు. గట్టిగా కోప్పుడితే “నిన్నసలు ప్రేమించటంలేదం”టుందేమోనని భయంతో మనస్సులోనే బాధపడేవాడు. “సోషల్‌గా ఉంటుంది. తప్పేముంది? మంచిదేగా” అని సమర్హించుకునేవాడు.
రానురాను బావతో చనువు తగ్గించేసిందా అమ్మాయి. ఇప్పుడు అతనితో అవసరం కూడా తీరిపోయింది. అతని గుండెలు బ్రద్ధలుచేసి, ఆరని అగ్బిగుండాలు సృష్టించి, (ప్రేమకు క్రొత్త అర్జాన్ని నిర్వచించి, పెద్దవాళ్ళను ఒప్పించి, తను (ప్రేమించినవాణ్ణి రూమ్మని పెళ్ళిచేసుకుంది. ఇన్నాళ్లూ బావతో తిరిగి అతనిలో ఆళలు రేపిందని ఆమెకీ తెలుసు ఇంట్లో అందరికీ తెలుసు. కానీ ఎవరూ ఎందుకిలా చేశానని?” అడగలేదు-తనకి నచ్చినవాణ్ణి చేసుకుంది తన అందానికి బావ సరిపోడనే అహంభావం!”
“పాపం అతనేమయ్యాడు?” ఉండబట్టలేక అడిగేసింది మీనా. మీనా అతృతకి చిన్నగా నవ్వుకున్నాడు మీనా భర్త,
“పూర్తిగా విను, ఒకసారి అంటే పెళ్ళికాకముందు ఆమె బావ ఇలాగే అడిగాడు. ఎలాగ?”
“ఏమో!” నాకేం తెలుసునన్నట్టు ఆశ్చర్యంగా చూసింది.
“అంటే నీలాగొ! నాకేం ఉందని నన్ను ్రేమిస్తున్నావు? ఈ అంద విహీనుడిపై నీకెందుకింత (ప్రేమా? అని”
“ప్రేమకి అందమేమిటి? అందంలేపోతేనేం? ఆస్టుండి, ఉద్యోగముండి మంచివాడని తెలిసి ప్రేమించవచ్చుకదా? అని సమాధానం చెప్పేది, ఏ ప్రేమకథలు చదివే అమ్మాయినో ఆ టప్రశ్షవేస్తే 1 కానీ మీనాకు అలాంటి (ప్రేమకథలు తెలియవు. అందుకని “అప్పుడా అమ్మాయి ఏమంది?” అంది అమాయకంగా, ఉత్సుకతతో.
“ఏమంటుంది? ఊహించు” ఎదురుప్రళ్నించాడు,
“మీలాగే నవ్వి ఉంటుంది” టక్కున అనేసింది మీనా.
“అమ్మో! గడుసుదానివే! ఆ అమ్మాయి నవ్వింది కానీ, నాలాగాకాదు. చిన్నగా నవ్వి ఊరుకుంది. "నేను నిన్ను ప్రేమిస్తున్నాననుకుంటున్నావా పిచ్చిబావా!” అన్నట్టు వ్యంగ్యంగా నవ్వింది. కానీ అతడు అర్ధం చేసుకోలేదు. పచ్చకామెర్లవాడికి లోకమంతా. పచ్చగా
సోమంచి ఉషారాణి త మీనా కనబడినట్టు (ప్రేమలో పడ్డ వాడికి ఎవరేం మాట్టాడినా అలాగే ఉంటుంది. (ప్రపంచమంతా (ప్రేమమయంగానే కనబుడుతందట!”
“ఇంతకూ అతని సంగతి చెప్పనేలేదు!” ఆదుర్దా, నిష్టూరం ధ్వనించాయి. మీనా గొంతులో.
“అతనప్పుడు ఏం చేయాలి ? ఏమౌతాడని నీ ఉద్దేశ్యం?”
“ఇదుగో ఇలా ఎదురుప్రశ్నలు వేస్తే నేను విననంతే” చటుక్కున లేస్తూ అంది మీనా బెదిరిస్తున్నట్టుగా. 'నా ్రశ్ళకీ అతను చెప్పేదానికీ సంబంధమేమిటబ్బా?' అని కూడా అనుకోకపోలేదు మనసులో,
“వినకపోతే మానెయ్. నాకే? అతనే మయ్యాడోనని బాధపడి, బెంగపడి రాత్రంతా నీకే నిద్రపట్టదు” కళ్ళు మూసుకుని పడుకుంటున్నట్టు నటించాడతను.
మీనా దొహంవేసి మంచినీళ్ళు త్రాగడానికి లేచింది. మీనా నిజంగానే వెళ్ళిపోతుందే మోనని జడపట్టుకులాగాడు (క్రీగంట ఆమెను గమనిస్తున్న భర్త, మీనావచ్చి అతని గుండెల మీద పడడం, ఆమెను రెండు చేతులతోనూ చుట్టేసి, గాఢంగా హృదయానికి హత్తుకుని, అధరామృతాన్ని (గ్రోలడం అన్నీ ఒక్క క్షణంలో మీనా “పరిస్థితి ఊహించే లోపల జరిగిపోయాయి.
“నాకు దాహం వేస్తోంది. మంచి నీళ్ళు తాగాలి” ఎలాగో అతన్ని తప్పించుకుని సన్నగా గొణిగింది మీనా,
“నాకూ వేస్తోంది దాహం.”
“ఉండండి. ఆయితే మీకూ ఇస్తాను.
“ఉహు ! నాకు వేసేది ఆ దాహం కాదు" కొంటెగా నవ్వాడు.
“మరి?” మరో దాహం ఏమిటో అర్థం కాలేదు అమాయకురాలు, చదువురాని పల్లెటూరి మీనాకి. నిజానికి అతను చెప్పినవి కొన్ని అర్ధం కాలేదు.
“ఇది” అన్నాడు అమెని చేతులతో గాఢంగా, మరింతగా హృదయానికి హత్తుకుని, ఆర్తిగా ఒళ్ళంతా ముద్దులతో ముంచెత్తుతూ. -
ఎన్నడూ ఎరగని తీయని అనుభూతికీ తాను ఊహించని మరో లోక్షాికి వై పోయింది మీనా. తన దాహంమాటే మర్చిపోయింది. చి
నన్ను చూస్తే మీకు అసహ్యం వేయడంలేదు? ఈ దురదృష్టవంతురాలి మీద మీకెందుకింత ప్రేమ? కాదు నేను నిజంగా ఎంత అదృష్ట...” తను పొందలేదనుకున్న ఆనందాన్ని పొందినపుడు ఆ మనిషి పాండే సం శః
“బ్బా! ఇప్పుడవన్నీ ఎందుకు అలన సస మురసపోళూ అంటుంటే, భర్త అతని హృదయం తృప్తిత్రో నిండిపోతే మీనా మనసు కుందాంలే” అన్నాడు మీనా
న ను ఆనందంతో పొంగిపోయింది.
సోమంచి ఉషారాణి ౨ సొ ఎవరదృష్టవంతుడు? ఒకరు అనుకున్నది సాధిస్తే మరొకరు నాధించలేననుకున్నది పొందారు.
మర్నాడే (ప్రయాణమయ్యారు. మీనా దంపతులు. మీనా ఎప్పటిలాలేదు. చాలా ఉత్సాహంగా తిరుగుతుంటే, అందరితోనూ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా మాట్లాడుతుంటే, మరోసారి, బహుశా అదే ఆఖరు సారి అందరూ ముక్కుమీద వేలేసుకున్నారు. ఆఖరికి మీనా తల్లిదండ్రులూ, చెల్లెళ్ళూ కూడా మీనాని చూసి ఆశ్చర్యపోయారు.
“ఏమండీ!” అంటూ అతని వెంటే తిరుగుతూ, అన్నీ సర్దుతూ మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్టు అతన్ని సలహా అడగడం. అతను కవ్విస్తే ఉడుక్కోవటం, వెనకాల చేరి అల్లరి చేస్తుంటే ముద్దుగా విసుక్కుంటూ ఏయ్ అని కసురుకోవటం 'హన్నా! మీనా ఒక్కరోజులో ఎంత మారిపోయిందీ!” అనుకునేలా ప్రవర్తించింది. మీనాతో ఎవ్వరూ బయలుదేరలేదు. ఆమెకి పెట్టనలసిన చీరా, సారెతో కాపురానికి పంపేసి చేతులు దులిపేసుకున్నారు.
“ఏమండీ! నిన్నటి కధ పూర్తి చేయలేదు.” ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంటులో ఇద్దరే ఉన్నారు. హనీమూన్‌కని బయలుదేరారు మీనా దంపతులు. తన ఒడిలో తలపెట్టుకుని పడుకున్న భర్తని అడగకుండా ఉండలేకపోయింది.
అతని కళ్ళలో తడి కనిపించింది. “అతనెవరో కాదు మీనా! నేను చెప్పింది కధ కాదు. నిజంగానే జరిగింది. వాడు... మా అన్నయ్య చచ్చిపోయాడు.” తన ఒడిలో తల పెట్టు కుని బోర్జాపడుకుని ఏడుస్తున్న భర్తని ఎలా ఓదార్చాలో అర్హంకాలేదు మీనాకి, ఆమె కంటి నుంచి కూడా అప్రయత్నంగా కన్నీళ్ళు జారి, అతనికి ఓదార్పులా అతని శిరస్సుమీద పడ్డాయి. ఆ బావ తన బావగారేనంటే నమ్మలేకపోయింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం అబద్ధంకాదు. అబద్ధం నిజంకాలేదు.
దుఃఖం తగ్గినా చాలాసేపు అలాగే ఉండిపోయాడు మీనా భర్త. నవ్వుతూ నవ్వించిన భ్తేనా? మనసులో ఎంతో బాధ ఉన్న వాళ్ళే పైకి తేలిగ్గా హాయిగా నవ్వగలరన్నది ఎంత నిజం?” అనుకుంది మీనా.
అతను బాత్రూమ్‌కి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చాడు. మీనా పైటతో ముఖం తుడుచుకుని, మామూలు మనిపైసోయాడు, ప్లాస్కులోంచి మీనా అందించిన కాఫీ త్రాగి, చెప్పటం మొదలుపెట్టాడు.
“నిన్ను బాధపెట్టానుకదూ! మొదటి రాత్రి ఎవరికైనా జీవితంలో కలకాలం నిలిచిపోయే మధురమైన రాత్రి, అటువంటి రాత్రిని రసాభాసం చేయడం ఇష్టంలేక ఆ సమయంలో మా అన్నయ్యను గుర్తుతెచ్చుకుని బాధపడడమేకాక, నిన్ను కూడా బాధపెట్టడం ఇష్టంలేక అంతటితో చెప్పడం ఆపేశాను. అంతేకానీ నిన్ను సస్పెన్సులో పెట్టాలని కాదు.
మా మామయ్యా వాళ్ళు, మేమూ ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళం. అందుకని మూ మామయ్య కూతురు, అన్నయ్య అంతగా కలసి తిరగడానికి అవకాశం దొరికింది. మా అన్నయ్యక, నాకూ
నొమంచిఉషాంతి సౌ అయిదేళ్ళు-జేడా ఉంది. అన్నయ్య ఉద్యోగంలో చేరినప్పుడే నేనూ కాలేజిలో అడుగు పెట్టాను. అన్నయ్య ఏ అర్థరాత్రికో, అపరాత్రికో వచ్చి నన్ను తలుపు తీయమనేవాడు. మరి మామయ్య కూతురు సెకండ్‌షోకి వెళ్చామంటే వెళ్ళాల్సిందేగా 1 నేనేది కావాలన్నా ఇచ్చి, నేనంటే ప్రాణంపెట్టే అన్నయ్య కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధపడే వాణ్ణి.
“బంగారంలాంటి కోడలు వస్తుంద”ని మనసులో సంతోషంగా ఉన్నా, పైకి “పెళ్ళి కాకుండా ఆ తిరుగుళ్ళేమిటీరా?” అని అన్నయ్యను మందలళించేవారు అమ్మా నాన్న, అందుకని రహస్యంగా చేసినవన్నీ నాతో చెప్పి మురిసిపోయేవాడు అన్నయ్య. నాకేమీ అక్షం కాకపోయినా అన్నయ్య కోసం అన్నీ విని నేనూ సంతోషించేవాణి ఒకరాత్రి నన్ను దగ్గరికి పిలిచి చాలా విషయాలు చెప్పాడు.
“ఒకేయ్ తమ్ముడూ! ఈ అనాకారి వాణి స్వంత మామయ్య కూతురే (ప్రేమించలేక మోసంచేస్తే ఇంకెవరు (ప్రేమించగలరు? ఈ బాధని నేను భరించలేనురా. నేను ఏమైపోయినా నాకు బెంగలేదు. కానీ తమ్ముడూ! నీ అన్నయ్యగా ఒక్కటి మాత్రం నిన్ను కోరుతున్నానురా!
నీ కిష్టం లేకపోతే పాటించకు, కాని నన్ను అర్థం చేసుకుని నా మీద నమ్మకముంటేనే ఒప్పుకో. జీవితంలో ఏ సుఖానికీ, ఆదరణకూ ఒక్క (ప్రేమపూరితమైన పలుకుకూ నోచుకోని ఓ అభాగ్యురాలిని పెళ్లిచేసుకోరా! అప్పుడా అమ్మాయి పొందే ఆనందాన్ని కళ్ళారా చూడగలవు. మెల్లిగా మెట్లెక్కి రాగలవాడికి ఏ చేయూతా లేకపోయినా పైకి ఎక్కగలడు. కానీ, ఒక్క మెట్టుకూడా ఎక్కలేని వాడికి చేయూతనిచ్చి పైకి ఎక్కించడంలోనే నిజమైన ఆనందం ఉంది.
ఈ తుచ్చమైన (బ్రతుకుకోసం జీవితకాలాన్ని వృధాచేసుకొని అనవసరమైన వాటి గురించి
ఆలోచించకు, అందం, ఐళ్చర్యం ఉన్న అమ్మాయిని ఎవరైనా పెళ్ళి చేసుకుంటారు. అదే
నువ్వూ చేస్తే అందులో ఉన్న ఆనందం నీకేమీ కనిపించదు. అనాకారితనంతో జీవితంలో
అందరిచేత వెలివేయబడ్డ అమ్మాయిని కట్నం ఇచ్చుకోలేని అభాగ్యురాలిని పెళ్ళి చేసుకుంటే
అందులో ఉండే అనందం అనుభవించినప్పుడే తెలుస్తుంది. తను సుఖపడడంలో కొక
తమవలన ఇతరులు సుఖపడడంలో ఎంత ఆనందం వుందో అనుభవమౌతుంది నీక్సు, అలా ఇతరులు సుఖపడడంలోనే మన సుఖాన్ని వెదుక్కోవాలి. అదే అసలైన ఆనందం. నిజమైన బ్రతుకు ! నా అనుభవం మీద చెబుతున్నాను. నువ్వు నా (ప్రాణానివి, నీకూ నేనంటే ఎంత ప్రేమో తెలుసు. అందుకే కోరుతున్నాను. ఆమె అందవికారాన్ని నీకు అందంగా బంధంగా మార్చుకో, అందులోని హాయి నీ కర్ణమౌతుంది.
అసలీ (ప్రపంచంలో అందవిహీనమైనదీ, నిరుపయోగమైనదీ ఏదీ లేదు, మనం దానిని సద్వినియోగ పరచుకోకపోతే తప్ప. ఆ అమ్మాయి నిన్ను ప్రాణప్రదంగా 'ప్రేమించగలదు, జీవితమంతా నీకు బుణపడి ఉన్నానని కృతజ్ఞత చూపగలదు. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానో నీకిప్పుడు అర్ధంకాదు. కానీ అర్ధం చేసుకుందుకు ప్రయత్నించు. నీ అర్జాంగి హృదయంలో ప్రత్యేకమైన స్థానాన్ని ఎవరూ ఆక్రమించలేని స్థానాన్ని ఆక్రమిస్తావు. అందంగా
సోమంచిఉషారాడిి 27 సరా లేనంతమాత్రాన వాళ్ళకి హృదయమే వుండదనీ, వున్నా అదికూడా అందంగా ఉండదనీ కలలో కూడా భావించకు. నిజానికి అందవిహీనుల కున్నంత ఆత్మ సౌందర్యం మరెవ్వరికీ ఉండదు. తమ అనుభవం ద్వారా అందరినీ అర్ధంచేసుకుని ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు. అందంగా ఉండని వాళ్ళందరూ అలాగే ఉంటారని కాదు. జీవితంలో నువ్వయినా సుఖపడాలనీ, నాకు దక్కని ఆనందం నీకైనా దక్కాలనీ, మీ నవ్వులజల్టులే నా ఆత గైశాంతనీ భావిస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను తమ్ముడూ!”
ఇవన్నీ అన్నయ్య నాకెందుకు చెబుతున్నాడో నిజంగా అర్హంకాలేదు నాకారాత్రి. కానీ మర్నాడు అన్నయ్య నిద్రలేవలేదు. అప్పుడర్హమైంది అన్నయ్య మాటలలోని ఆంతర్యం! అన్నయ్య ఇంతపనిచేస్తాడని నేను కలలోకూడా ఊహించలేదు. అన్నయ్య మాటలు మాత్రం నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. “నిద్రమాత్రలు మింగానని నాతో ఒక్కమాట చెప్పలేదేం అన్నయ్యా” అని అనుక్షణం నన్ను నేనే ప్రళ్నించుకుని, కుమిలిపోయేవాళ్ణి, సమాధానంలేని ప్రశ్న ! కాని అన్నయ్య తన అనాకారి తనానికి ఎంత కుమిలిపోయాడో తలచుకుంటే ఇప్పటికీ...” అతని కళ్ళనిండా నీరు నిండింది. “నీ ప్రశ్నకు సమాధానం దొరికిందనుకుంటాను” నవ్వాడు.
“అబ్బ! రామునికోసం త్యాగం చేసే లక్ష్మణకుమారులన్నమాట. కానీ అన్ని రోజులు నిద్రపొమ్మంటే నేను నిద్రపోను సుమా. అదీ మీరు ప్రక్కనలేకుండా” భర్త కన్నీరొత్తి అతన్ని నవ్వించాలని చిలిపిగా అంది మీనా. పైకలా అంది కానీ మనస్సులో తన బావగారు ఎదురుగుండా ఉంటే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది. తన జీవితం బంగారుబాట కావటానికి మార్గదర్శకులు ఆయనకాదూ - అనుకోవటమేమిటి? చేతులు జోడించి, ఆకాశానికేసి చూసింది మీనా.
“ఇంతకూ అసలు కధ పూర్తవలేదు. అప్పుడు మీ చుట్టం ఒకాయన నన్ను కలిసి నీ గురించి చెప్పినపుడు నేనే...”
“ఆ కథ నాకు తెలుసులెండి” గర్వంగా అంది మీనా.
(ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రిక) అఅలఅి
నోమంచి ఉషారాణి 28 ఈ ప్రశ్షకు బదులేది? డల పకేకు బదులేది ఈ ప దులెది ? ర్రుశ్న్వకు బదులది * ఆొఫసులో పనెక్కువగా వుంది. మూడు బస్సులు మారి ఈసురోమంటూ ఇల్టు చేరింది అవని. ఇంటికి వస్తే ఇన్ని టీనీళ్ళు పోసేవారే లేరు. పిల్లలు ట్యూషన్స్‌కి వెడతారు. భర్త అచ్యుత్ మొదట్లో ఎంతో ప్రేమగా చూసేవాడు. తన కూడా వుండి ఎంతో సాయం చేసేవాడు అందుకే ఇద్దరు పిల్లలు పుట్టినా, ఉద్యోగం చేస్తున్నా అంత బాధనిపించలేదు. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ దిక్కులేని తమ దూరపు బంధువు ఒకావిడని సాయంగా వుంచాడు. హాయిగా చీకూచింతా లేకుండా సంసారం సాగిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఖర్చులు పెరిగాయి. అందుకే డిపార్ట్‌మెంట్ వాళ్ళికి పరీక్షలు కట్టి, కష్టపడి చదివి ప్రమోషన్లతో ఆఫీసర్‌స్టాయికి ఎదిగింది అవని. అచ్చుత్ ఆఫీసులో అటువంటి అవకాశం లేదు. ('ప్రమోషన్గూ అంత తొందరగా రావు. పెళ్ళినాటికి ఎల్.డి.సీగా వున్న అచ్యుత్ ఇప్పుడు యు.డి.సీ అయ్యాడు. అంతే | తన కన్నా భార్య ఉన్నతన్థానంలో వుండడం, ఎక్కువ సంపాదించడం బహుశా ఈ విశ్చంలో ఏ భర్తా భరించలేడేమో | అప్పటినుంచే ఆచ్యుత్‌లో మార్చు వచ్చింది. దూరపు బంధువుని మరెవరో సాయం చేయమంటే వెళ్ళిపోయింది. అచ్యుత్ అవనికి పనిలో సాయం చేయకపోగా ఇల్లు సరిగా వుంచడంలేదనీ, వంట బాలేదన్సీ, పిల్లలు సరిగా చదవడంలేదనీ, తనని పట్టించుకోవడం లేదనీ ప్రతీదానికీ విసుక్కోవడం మొదలుపెట్టాడు. తన ఉద్యోగం, క్లబ్బు తప్ప ఇంటి విషయాలు పట్టించుకోవడం మానేశాడు. ఇంటా బయటా చేసుకోలేక అవని చాలా అవస్ట్రపడేది. అయినా అవని పేరు సార్ధకం చేసుకుంటూ భూదేవంత ఓర్చుతో మెలిగేది. భర్తకు ఎదుతుసమాధానం చెప్పేదికాదు. పిల్లలు కూడా తల్లి బాధ అర్థం చేసుకుని తమకు చేతనైన సాయం చేసేవారు. బుద్దిగా చెప్పినమాటవిని, శ్రద్ధగా చదువుకునేవారు. అళ్ళని, అశోక్‌లకి తల్లంటే గౌరవమూ, తండ్రంటే భయమూను! బస్సుల్లో రౌడీమూక చేష్టలతో విసిగిపోయిన అవని ఒక రోజు “ఏమండీ! నేను సన్నీ" కొనుక్కుందామనుకొంటున్నాను. ఈ బస్సుల తోటీ, బస్సులో రౌడీల చేష్టలతో బాధపడలేను, రేపు వెడదామా?” అని అచ్చుత్‌ని అడిగింది. “నువ్వు నిర్ణయించుకున్నాక నన్ను అడగడమెందుకు? అన్నీ నన్ను అడిగే చేస్తు న్నావా?" " అచ్యుత్ నిర్లిప్తంగా అన్నాడు. భర్తతో వాదించడం ఇష్టంలేని అవని, “రేపు సాయంత్రం మా ఆఫీసుకి రండి. ఇద్దరం కలసి షోరూమ్‌కెడదాం” అంది లైటార్పి పడుకుంటూ, “నాకు కుదరదు. నువ్వెళ్ళి కొనుక్కో” అచ్యుత్ నిక్కచ్చిగా చెబుతుంటే అవనిని
నోమంచి ఉషారాణి 29 ఈ ప్రశ్షకు బదులేధి? నిస్సత్తువ ఆవరించింది.
“అయినా ఇప్పుడంత అవసరమా? మనం రెండు బండ్లు మెయిన్‌టెయిన్ చేసే స్థితిలో వున్నామా? అసలే పెట్రోలు ధర పెరిగింది. పిల్లల ఫీజులూ, ట్యూషన్లకీ వేలకివేలు అవుతున్నాయి. ఇంకోసారి ఆలోచిస్తే మంచిది" ఏ. గోడకో చెబుతున్నట్టు చెప్పేసి పడుకున్నాడు అచ్యుత్.
భర్త మాటల్లోనూ నిజం లేకపోలేదు. పోనీ అతడు బండి మీద దింపుతాడేమో అంటే ఇద్దరి ఆఫీసులూ చెరోదారి. భర్త ఆఫీసు ఎక్కువ దూరం లేదు. అదీకాక డైరెక్టు బస్సు వుందతనికి. 'పోనీ మీరు బస్సులో వెళ్ళండి. నేను బండి మీద వెడతాను అనే సాహసం లేదామెకి.
ఆమాట భర్త అంటాడేమో అంటే బహుశా ఏ పురుషాధిక్యతో, మగవాడినన్న అహమో, భార్య తనకన్నా పెద్ద ఉద్యోగంలో వుందన్న ఇన్‌ఫీరియారిటీ కాంస్లెక్సో అతన్నామాట అననివ్వదు. ఆఫీసు దూరం కనుక పెట్రోలు ఖర్చు చాలా అవుతుందని అవని బండి కొనుక్కునే ఉద్దేశం మానుకున్నది. అంతటితో ఆమె సమస్య తీరలేదు. అంతకన్నా. పెద్ద సమస్య వచ్చింది. అమెకి వేరే ఊరు (ట్రాన్స్‌ఫర్ అయింది. అదంత పల్లెటూరూ కాదు, పట్నమూ కాదు. భర్త ఉద్యోగం, పిల్లల చదువూ ఇక్కడ 1 తాను ఒక్కతీ అక్కడ వుండాలి. క్వార్టర్సూ. సర్వెంట్‌ని ఇస్తారు. ఉద్యోగాన్ని నమ్ముకున్నాక ఎక్కడికైనా తప్పదుకదా! గ
“ఆ ఉద్యోగానికి రాజీనామా చేసెయ్. ఇక్కడే మరో ఉద్యోగానికి ప్రయత్నిద్దాం” అన్నాడు అచ్యుత్.
భర్త అలా అంటాడనీ, తననీ, తన ఉద్యోగాన్నీ అంత తేలికగా తీసిపారేస్తాడనీ ఊహించని అవని హతాశురాలైంది. అప్పటికీ ట్రాన్స్‌ఫర్ ఆపుకుందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 'కొత్తగా (బ్రాంచ్ స్టార్ట్ చేసినచోట ఎఫిషియంట్ పర్సన్ కావాలనీ, ఆమె ఎఫీషియన్సీ మీద నమ్మకంతోనే ఆమెను అక్కడకు పంపుతున్నామనీ ఎం.డి. అనడంతో అమె ఏమీ అనలేకపోయింది. ఒకోసారి మన సామర్థ్యమే మనల్ని ఆవేదనకు గురిచేస్తుందేమో!
ఆ విషయమే తన భర్తతో చెబితే అభినందించవలసిందిపోయి, అతనన్న మాటలు ఆమె మనసుని గాయపరిచాయి. ఏనాడూ భర్తని ఎదిరించడం అలవాటులేని అవని తన వర్క్ ఎఫీషియన్సీని మెచ్చి ఇచ్చిన పోస్ట్‌ని చిన్నచూపు చూసేసరికి ఆమెలో వ్యక్తిత్వమూ,
ఆత శవిశ్వాసమూ తలెత్తాయి.
ఈ _స్పష్టిలో అదినుండీ మగవాడికీ, ఆడదానికీ తేడా చూపుతూనే వున్నారు. సంప్రదాయమంటూ, హైందవస్త్రీకి సంకెళ్ళు వేస్తూనే వున్నారు. భార్య భర్తకన్నా మంచి పొజిషన్‌లో వున్నా ఎక్కువ సరిపాదిస్తున్నా కూడ భర్త తిట్టినా, కొట్టినా పడుండాల్సిందే ననడమే మన సంప్రదాయమా? అటువంటి పరిస్థితిలో 'మీరే ఉద్యోగం వదిలేయండి. నా సంపాదన చాలు" అని భార్య అంటే? అసలా రోజులు వస్తాయా ? ఆ మాటంటే ఎంత సంపాదించినా ఆడది అడదే 1 మొగుడు మొగుడే! అంత అహంభావం పనికి రాదంటారు, మొగుడంటే గౌరవం లేదంటారు. భర్త మీద తిరిగి చెయ్యెత్తితే? ఆ మగాడు ఏమౌతాడు? ఆ
సోమంచి ఉషారాణి 30 ఈ ప్రశ్చకు బదులేది? ఆడదాని గతి ఏమిటి? హత్యలో ? ఆత్మహత్యలో ? విడాకులో ?
మధ్యలో పిల్లలు నలిగిపోతారు. అందుకే కడుపుతీపికొద్దీ ఆడది అణగిమణగి అన్నీ భరిస్తోంది. సంపారాన్ని వదులుకోలేక, పాశ్చాత్య నాగరికతను అనుసరించలేక అభిమానాన్ని చంపుకుని నరనరాన జీర్ణించిన హైందవ నాగరికతను వదులుకోలేకపోతోంది. దాన్ని అవకాశంగా తీసుకుని మగవాడు మితిమీరి ప్రవర్తిస్తున్నాడు.
అయితే భర్తలను పీడించి, సాధించే భార్యలుండవచ్చు. గౌరవమనేది ఇచ్చి పుచ్చుకునేది ఒకరినొకరు గౌరవించుకుని, కలసి సంప్రదించుకొని ఏ పనిచేసినా ఆ సంసారం పదికాలాలపాటు సుఖంగా సాగిపోతుంది. లేకుంటే సమ్'సారంగానే మిగిలిపోతుంది.
బట్టలు సర్జుకొంటున్న భార్యని, “అయితే వెళ్ళడానికే నిశ్చయించుకున్నావన్నమాట!” అని అడిగాడు అచ్యుత్ సీరియస్‌గా,
“నాకు ఒక్క మాటకి సమాధానం చెప్పండి. అదే మీకు ట్రాన్స్‌ఫర్ అయితే ఏం చేస్తారు?” చాలా మామూలుగా అడిగింది అవని
“ఉద్యోగం పురుష. లక్షణం” అన్నారు. మా కంటే తప్పుదు” తన పురుషాధిక్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించాడు అచ్యుత్.
"అప్పుడైనా ఈ పరిస్టితి తప్పదు కదా!” నవ్వుతూనే అంది.
“అంతగా అయితే నువ్వీ ఉద్యోగం వదిలేసి నేను వెళ్ళేచోటే మరో ఉద్యోగం కోసం పప్రయత్నిస్తావు” చాలా తేలిగ్గా అనాలనిపించినా ఆ మాట తనకే నచ్చకతడబడ్డాడు అచ్యుత్.
“ఆ మాటేనేనూ అంటే? బాధో, అవేశమో అణచుకుంటూ అంది అవని. ఆమె ముక్కుపుటాలు అదురుతున్నాయి.
“అవనీ 1” ఆమె అలా అంటుందని ఊహించని అచ్యుత్ కోపంగా అరిచినా, తన తప్పు తెలుసుకుని “సారీ!” అని సర్దుకున్నాడు.
(వనితాజ్యోతి మాసపత్రిక అ అలి
సోమంచి ఉషారాణి 31 మనను మూగథి అ మనసు మూగరది కక (ఆల వన్నావేం సరూ?” కాఫీ కలుపుకు వచ్చిన సరోజని అడిగాడు శ్రీధర్. “రాజీ మళ్ళీ ఉత్తరం వ్రాసింది” - దీర్హంగా నిట్టూర్చింది సరోజ శ్రీధర్ ముఖంలో రంగులు మారాయి. కొంతసేపటికి గుండెదిటవు చేసుకుని ఉత్తరాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. “మహాలక్ష్మీ సమానురాలైన వదినకు - రాజీ నమస్కరించి వ్రాయునది. నేను ఇక్కడి పరిస్టితి గురించి అంత వివరముగా వ్రాసినా మీ దగ్గరనుంచి నేను ఆశించిన సమాధానం రాలేదు. మీరింకా ఆలోచిస్తూనే వున్నారనుకుంటాను. ఇన్నేళ్ళనుంచి ఎంతో సహనం వహించిన నాలో ఇక జీవితాంతం భరించే ఓపిక నశించింది. వీళ్ళు నా ప్రాణాలు తీసినా లేక వీళ్ళ బాధలు భరించలేక నేనే ఆత్మహత్య చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు ఇప్పటికైనా నా పరిస్థితి మీ కర్టమై ఉంటుంది అన్నీ తెలిసిన మీకు ఇంతకంటే నేనేం [వ్రాయలేను. నాకు మీరుతప్ప ఇంకెవరున్నారు? అన్నయ్యకి నమస్కారములు చెప్పు. ఉంటాను మరి! రాజీ” ఉత్తరం చదివిన శ్రీధర్‌కి కన్నీటి పారలో గతం కళ్ళముందు మెదిలింది. షష 1 రాజేశ్చరి పుట్టగానే తల్లిని కోల్పోయింది. కొందరికి దురదృష్టాలు మధ్యలోవస్తే - కొందరికి పుట్టుకతోనే వస్తాయేమో! రాజేశ్చరి రెండోకోవకి వస్తుంది. రాజేశ్సరి నల్లటి నలుపేకాక ముఖంలో ఏవిధమైన కళాకాంతులు లేవు. చిన్నప్పటినుంచీ అందరి నుంచీ అవహేళనలే ఎదుర్కొంది. ఆడపిల్ల తండ్రిపోలిక, మగపిల్లాడు తల్లిపోలిక అయితే అదృష్టమన్నే మాటల్లో వీసమెత్తు నమ్మకంలేదు శ్రీధర్‌కి. అందుకు తాను, తన చెల్లెలు నిదర్శనమని అతని ఊహ. రాజేశ్చరి తండ్రి పోలికైతే, శ్రీధర్ తల్లి పోలిక, కాంచెం అందగాడనే చెప్పవచ్చు అయితే అతనికి చదువబ్బలేదు. ఎలాగో స్కూల్‌ఫయినల్ పూర్తిచేసి, ఏదో కంపెనీలో అటెండర్‌గా చేరాడు. రాజేశ్వరిమీద అతనికి జాలి తప్ప పెద్దగా (ప్రేమాభిమానాలేంలేవు. రాజేశ్వరి నిండుకుండ. గంభీరంగా వుంటుంది. తన మనసులోని మాట ఇది అనిగానీ, తనకు ఫలానాది కావాలనిగొనీ చిన్నప్పటినుంచీ ఎవరినీ అడిగిన పాపాన పోలేదు. అలాగని అమె అమాయకురాలూ, తెలివితక్కువదీ కాదు. చదువులో ఆమె కున్న తెలివితేటలకు ఎంతెనా చదివేది కానీ అంత చదివించే స్తోమతు ఆమె తండ్రికి లేకపోయింది. “డబ్బు, అందం రెండూలేని ఆడపిల్లలకి త్వరగా పెళ్ళి కానట్టే రాజీకి కూడా చాలా రోజులు పెళ్ళి కుదరలేదు. అసలామె పెళ్ళి జరిగితే ఏ మూడో ప్రపంచ యుద్దమో
సోమంచి ఉషారాణి ఏ2 మనసు మూగటది సంభవిస్తుందనీ, కళ్లున్నవాడెవడూ ఆమెను చేసుకోడనీ ఆమెను ఎరిగున్న వాళ్ళందరూ నిర్దారణ కొచ్చారు. అయితే మధ్యవర్తి ఒకరు ఏ "పెళ్ళి చూపులూ లేకుండా పెళ్ళికుదిరారు.
అందుకు కారణమూ ఉంది. పెళ్ళి కొడుకు (గ్రుడ్డివాడు. అతగాడు పెళ్ళికూతుర్ని చూసే 'ప్రసక్తిలేదు సరే | ఇక రాజేశ్వరికి తామిచ్చే కట్నంతో ఆమె అందానికి అంతకన్నా మంచి సంబధం తేలేరు కనుక ఆమె పెళ్ళికొడుకును చూడవలసిన అవసరం(?) లేదు.
తన చెల్లెలు ఎంత అనాకారి అయినా ఒక (గ్రుడ్డివాడు తన బావగారంటే మనసొప్పలేదు శ్రీధర్‌కి. “ఏ నలకూబరుడో వచ్చి వరిస్తాడన్న ఆశ కాకపోయినా “గంతకుతగ్గ బొంత ఎవరో దొరక్కపోతారా? బొత్తిగా గుడ్డివాడితో ఎలా కాపరం చేస్తుంది?” అనుకున్నాడు మనసులో ఆమాటే చెల్లెలితో అన్నాడుకూడా.
“హు! నువ్వెంత పిచ్చివాడివన్నయ్యా, అందం అనేది మన మనసుల్లో వుంటుంది గానీ కేవలం బాహ్యరూపంలో వుంటుందని నేననుకోను. నేను అందంగా లేనని ఈ మాట అనటం లేదు. కానీ ఇది నిజం. పైకి దబ్బపండులా అందంగా వుంటాడు లోపల అనుమానం. అసూయ ఉంటే ఇక ఆ జీవితం నరకషప్రాయమేకదా 1 కళ్ళుండి (గ్రుడ్డిగా ప్రవర్తించే వారికంటే
కళ్ళులేక పోయినా నన్ను ఒక మనిషిగా, తన జీవిత భాగస్వామిగా పిసరంత అభిమానం చూపించినా నా కన్నా అదృష్టవంతురాలు లేదనుకుంటాను,” అంది చిరునవ్వుతో.
“అంత అవసరం ఏముంది? అంతకంటే పెళ్ళి చేసుకోకుండా వుండడమే సుఖమేమో!' " వ్యంగ్యంగా అన్నాడు.
“కావచ్చు. జీవితాంతం నన్ను భరించే శక్తి నీకుందా? నీకున్నా-నీకొచ్చే భార్యకూ వుంటుందన్న నమ్మకముందా?” అదే చిరునవ్వు.
శయ 2
“ఏమిటండీ వచ్చిన దగ్గరనుంచీ అలాగే కూర్చున్నారు? కాళ్ళూచేతులు కడుక్కుని భోజనానికి లేవండి.” సరోజు పిలుపుతో శ్రీధర్ ఆలోచనలకు అంతరాయం కలిగింది ఆకలి లేకపోయినా ఏదో తిన్నాననిపించి లేచాడు. సరోజ వంటింటి పని ముగించుకుని వచ్చింది. శ్రీధర్ మాత్రం తన దీర్చాలోచనలోంచి ఇంకా బయటపడలేదు.
“ఇంతకూ ఏమాలోచించారు” భర్త ప్రక్కన కూర్చుంటూ అడిగింది సరోజ,
“ఏమిటో ప్రతిక్షణం గతం గుర్తుకువస్తోంది మన జీవితానికి పెద్ద ఆశలూ, ఆశయాలు లేకపోయినా కొద్దిపాటి సుఖానికి కూడా నోచుకోని ఈ (బ్రతుకులెందుకు? పెళ్ళయిన క్షణంనుంచీ ఏం సుఖపడింది రాజీ? దాని సమస్యకి పరిష్కారమేమిటి? అంతంతమాత్రంగా జీవిస్తున్న మనం యింకొక సంసారాన్ని భరించగలమా?' ఆవేదనగా అన్నాడు.
“సంసారం భరించడం సంగతి అలా వుంచండి. జీవిత సాఫల్యానికి హత్యలు, ఆత్మహత్యలు, విడాకులు పరిష్కారం కావుకదా! వాళ్ళిద్దరినీ కలపడానికి మన (ప్రయత్నం
మన౦ చేయాలి. ముందు మీరు వెళ్ళి పరిస్థితి ఏమిటో చూసిరండి, వీలుకాని పక్షంలో రాజీని ఇక్కడకు తీసుకువచ్చేయండి” అని అన్నది. కానీ మధ్యవయస్సులోనే రాజీ అన్ని సుఖాలనూ వదులుకొని, భర్త వుండగానే పరాయి వంచన, తండ్రి లేని పిల్లల్సి పెంచుతూ. (బతకాలంటే
సోమంచి ఉషారాణి 33 మనసు మూగది ఊహిస్తేనే భరింపశక్యం కాకుండా వుంది,
“నేను రేపు ఉదయం వెళ్ళి అటో, ఇటో తేల్చి వస్తాను.” నిశ్చలంగా అన్నా అందులో అవేశం, కోపం లేకపోలేదు.
రాజీ పెళ్ళై అత్తవారింటికి వెళుతూ, అక్కడ ఏ విధమైన ఘన స్వాగతాలు ఆశించలేదు కాని, తన భర్త తనను అర్హం చేసుకుని అనురాగం చూపిస్తే చాలనీ భగవంతుణ్ణి ప్రార్టించింది.
“నువ్వు చాలా అందంగా వుంటావట కదా ! మరి నన్నెందుకు చేసుకున్నావు?" పెళ్ళి నాటినుంచి తన మనసులో అడగనా వడ్డా అనుకున్న ్రళ్నను అడగకుండా వుండలేకపోయాడు రాము. అనుకోని ్రశ్నకు బిత్తరపోయింది రాజీ.
“ఏం మాట్టాడవేం ? నన్ను చేసుకోవాల్సి వచ్చినందుకు బాధపడుతున్నావు కదూ!”
“ఛఛ! నేనలా అనుకునే దాన్హైతే మిమ్మల్ని ఎందుకు చేసుకుంటాను? నాకలాంటి షరతులేం లేవు. నాకెవరూ బలవంతంగా పెళ్ళి చేయలేదు. నేను మనస్పూర్తిగా ఇష్టపడే ఈ పెళ్ళి చేసుకున్నాను. ఇక నా అందమంటారా . అది శాళ్చతం కాదుకదా ! మనసు కల్మషమైనపుడు ఆ మనిషి ఎంత అందంగా వుండి మాత్రం ఏం లాభం ? మనిషికి ఉండవలసింది ఆత్మ సౌందర్యమే. అయితే అది నాకుందనే నేను అనుకుంటున్నాను. కాదు బాహ్యరూపమే అసలైన అందమని భావించేవారికి నేనాక అనాకారిని సరేనా?” నవ్వుతూ అంది రాజీ.
“ఏమిటో నువు చెప్పింది నాకు ఒకటీ అర్ధం కాలేదు. నేను నీ ఆంత చదువుకోలేదుగా! అయినా నా పిచ్చిగానీ నీ అందం గురించి నిన్నడిగితే నువ్వేం చెబుతావులే?”' ఆ విషయం తేలిగ్గా వదిలేశాడురామూరావు. వికలాంగుల సౌకర్యార్థం ఏర్పరచిన ఒక ఫ్యాక్టరీలో వర్కర్‌గా పనిచేస్తున్నాడతను.
ఏదో అప్పుడప్పుడు చుట్టుప్రక్కలవాళ్ళ అవహేళనట్టూ, ఇంట్లో అత్తగారి సాధింపులూ తప్ప - రాజీ, రామారావు కొంతకాలం అన్యోన్యంగానే వున్నారు. అయితే లీల ప్రక్కింటి అమ్మాయి. వితంతవు. ఆమెకు పెళ్ళయినా కొత్తలోనే భర్త యాక్సిడెంట్‌లో చచ్చిపోతే ఏ ముద్దూ ముచ్చటా లేకుండానే, అత్తవారింటికి వెళ్ళవలసిన అవసరం రాకుండానే అమె (బ్రతుకు తెల్టారిపోయింది. ఆమె తనిలా (మైడులా (బ్రతకడం సహించలేకపోతోంది. ఆడదానికి రెండో పెళ్ళి చేయడం తన ఇంటావంటా లేదన్నాడు తండ్రి. అయితే (గ్రుడ్డివాడైన రామూని లోబరుచుకుని తన కోరికలు తీర్చుకోవాలనే వుద్దేశం ఆమె మనసులో వుంది.
లీల ఇంకా అలా భావిస్తున్న సమయం లోనే రామారావు పెళ్ళి హరాత్తుగా జరిగిపోయింది. లీలకు ఒంటిమీద తేళ్ళు, జెర్రులు ప్రాకుతున్నట్టుండేది. తనకంటే ఏమాత్రం అందంగాలేని రాజీ తన నుంచి రామూని దూరం చేయడం సంగతి అటుంచి ఆ రాజీ అందగత్తెని మురిసిపోయి. రామూ ఆమెను అభిమానించడం. రాజీ ఎంతో సంతోషంగా అతనికి సపర్యలు చేస్తూ అతని అనురాగాన్ని పొందటం. వారి అన్యోన్య ఫలంగా రాజీకి నెలతప్పడం ఇవన్నీ లీల సహించలేకపోయింది.
సోమంచి ఉషారాణి ప మనను మూగది అందంతోనే తాను ఒక ఆట ఆడించాలి” అనుకుంది లీల. టి ఆమె పధకం ఫలించడానికన్నట్టు రాజీ తండ్రికి ఒంట్లో బావుండలేదనీ, సీరియస్‌గా ఉందనీ టెలిగ్రాం రావడంతో రాజీ పుట్టింటికి వెళ్ళింది. ఎవరూ లేనపుడు లీల రామారావు దగ్గరికి వచ్చింది. రామారావు అప్పుడు ఆరుబయట మంచంమీద పడుకుని కూనిరాగాలు తీస్తున్నాడు. ఏమిటో అలికిడి విని ఆశ్చర్యంగా “ఎవరూ?” అన్నాడు. లీల పొడిగా నవ్వి, “నేనే లీలని ఏమి మంచి హుషారుగా వున్నావే?” అంది నాందిగా. లీల మర్యాద లేకుండా మాట్లాడడం రామారావుకి చిరాకు తెప్పించింది. “ఇంతకూ ఆమె ఎందుకు వచ్చినట్టు? ఇంట్లో ఎవరూ లేరు కూడా,” అనుకున్నాడు. ఆమాటే అడిగాడు.
లీల వ్యంగ్యంగా నవ్వి “నేను వచ్చింది నీ కోసమే” అంది.
“ఎందుకు?” ఆశ్చర్యంగా నుదురు చిట్లించాడు.
“సి కళ్ళేకాదు నీ మనసుకూడా (గ్రుడ్డిదని చెప్పడానికి.”
“లీలా[
“ఊరికే అరవకు. నలుగురూ వింటారు. అసలు అంత అందగత్తె నిన్నే ఎందుకు పెళ్ళి చేసుకుందో నువ్వెప్పుడన్నా ఆలోచించావా ? అవునులే గుడ్డివాళ్ళని మోసం చేయడం తేలిక కదా!”
వెటకారంగా అంది లీల.
“లీలా ! నీ నోటికొచ్చినట్టు మాట్టాడే అధికారం నీకెవరిచ్చారు? రాజీ అందంగా వున్నా, లేకపోయినా నాకు ఒకటే | నాకు కావలసింది ఆమె మంచి మనసు, రాజీ మనస్ఫూర్తిగా ఇష్టపడే ఈ పెళ్ళి చేసుకుందని యిన్నాళ్ళలో నేను (గ్రహించాను. ఇందులో మోసానికి తావులేదు. ఒకవేళ (గ్రుడ్డివాడని నామీద జాలిపడి చేసుకున్నా నాకేమీ బాధలేదు.”
“పిచ్చి రామూ | నీ అమాయకత్వమే నిన్ను మోసగిస్తోందని ఒక స్నేహితురాలిగా నీ మీద జాలివేస్తోంది. ఏదో నాకు తెలిసిన నీజం చెప్పి, ఇకనుంచైనా నీ భార్యను నువు అదుపులో పెట్టుకుంటావని ఆళించాను. పోనీలే?
“ఏమిటో ఆ నిజం” నమ్మకం అనే పైమెట్టుమీద నుంచి అనుమానం అనే క్రింద మెట్టుమీదకు జారడం చాలా సులభం.
“నీ భార్య పెళ్ళికాని (క్రితమే ఎవడినో ప్రేమించింది. వాడెవడో మోసంచేసి పారిపోతే కనీసం పెళ్ళి చూపులన్నా ఏర్పాటుచేయకుండా, హడావిడిగా కళ్చులేని వ్లీక్స కట్టబెట్టారు లేకపోతే అంత అందగత్తె”
'లీలా[ మధ్యలోనే గట్టిగా అరిచాడు రాము. “ఇంకెప్పుడూ ఇలాంటి లేకిమూటలు చెప్పడానికి రాకు, నేను (గ్రుడ్డివాడ్నే కానీ, పిచ్చివాణ్డీ, తెలివితక్కువవాణ్ణీకాదు. జాగ్రత్త”
హెచ్చరించాడు.
రామూ పైకి అలా అన్నాడేకాని అతని మనస్సులో అనుమానబీజం నాటుకుంది. ఇక అది
నోమంచి ఉషారాణి 35 మనసు మూగటి (వ్రేళ్ళు పాతుకుని మొక్కై మ్రానవడానికి ఎంతసేపు? ఎంత కాదనకున్నా రాజీ(ప్రవర్తనను అనుమానించలేకపోతున్నాడు. “ఆమె మాటలూ, చేతలూ ఎంత అభిమానంగా వుంటాయి! ఇదంతా కేవలం నటనేనా? ఇది సాధ్యమా? ఏమో తను చూడలేడు.”
రాజీకి తండ్రి ఆఖరి చూపుకూడా దక్కలేదు. దుఃఖాన్ని దిగమింగుకుని, అన్నయ్య ఒక్కడే వున్నాడు బాదసడతాడని ఒక నెల్లాళ్ళు ఉండివస్తానని, తనకూ అంతగా ఒంట్లో బావుండలేదనీ అత్తగారికి ఉత్తరం రాసింది. కానీ ఆ ఉత్తరం చేరవలసిన చోటికి చేరలేదు.
రామారావు రాజీ రాకకై ఎదురుచూడసాగాడు. రాజీ కనీసం ఉత్తరం కూడా (వ్రాయకపోవడం అతనికి బాధ కలిగించింది. దానికి తోడు లీల రోజూ మాటలతో అతన్ని మరింత చిత్రవధ చేయసాగింది. అతని దగ్గరకు పనిగట్టుకుని వచ్చి.
“మి ఆవిడ ఇంకా రాలేదేం? ఏం వస్తుందిలే ? అక్కడ ఏం గ్రంధం నడిపిస్తోందో? తండ్రి కూడా పోయాడు. అడిగే వాళ్ళెవరు? ఏకంగా పురుడుపోసుకుని వస్తుందేమో?” అని వ్యంగ్యంగా నవ్వేది. రాముకోపం ఆమెకు సంతోషం.
“రాజీ తండ్రిపోయాడా ? కనీసం ఆ విషయమన్నా ఛ్రాయలేదేం? ఆవునూ;ః ఈ సంగతి తామెవరికీ తెలియకుండా లీలకెలా తెలిసింది!” ఆ మాటే అడిగాడు అనుమానంగా.
"ఆ|| మూ కజిన్‌ది ఆ ఊరే. మొన్న వచ్చాడు యిక్కడికి. మాటల్లో వాడు చెబితేనే తెలిసింది. పాపం నీకు తెలియదేమో” మరొక వాడిబాణం విసిరి అక్కడినుంచి వడివడిగా వెళ్ళిపోయింది.
శర య
నెల తర్వాత రాజీ తిరిగివచ్చింది. నవ్వుతూ అడుగుపెట్టిన రాజీని ఎవరూ పలకరించలేదు భర్త అలకకు కారణం తెలియలేదామెకు.
“అలా వున్నారేం? ఒంట్లో బావుండలేదా?” ఆప్యాయంగా మీద చెయ్యివేసిన రాజీని ఎప్పటిలా దగ్గరకు తీసుకోలేదు. కారణంలేని మౌనం రాజీకి బాధ కలిగించింది.
“అదేమిటే ఒక్క ఉత్తరం ముక్కయినా రాయలేదు? ఇన్నాళ్ళూ. ఏమైపాయ్యావో అనుకున్నాము” అంది రాజీ అత్తగారు సాధింపుగా.
“నేను అన్నయ్యకు సాయంగా నెల్లాళ్ళు వుండివస్తాననీ, ఒంట్లో బావుండలేదనీ మందులు తీసుకుంటున్నాననీ అన్నీ వివరంగా ఉత్తరం రాశానే ! మీకు అందలేదా?” ఒకనేళ భర్త కోపానికి అదే కారణం అయ్యుంటుందని అనుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది రాజీ.
“ఏమో రాశావో, లేదో? మాకు అందలేదు.” చెంపఛెళ్ళుమన్నట్టుగా అని అక్కడి నుంచి వెళ్లిపోయింది అత్తగారు. వాళ్ళు తనని నమ్మడంలేదని రాజీకి కళ్ళలో సీళ్ళు తిరిగాయి.
ష్ ష్ షా
నెలలు నిండుతున్నకొద్దీ ఇంటెడుచాకిరీ, ఇంట్టోవాళ్ళ సాధింపులకన్నా భర్త మౌనమే
రాజీని చిత్రవధ చేయసాగింది. ఫలానా కారణం అని తెలిస్తే సరిదిద్దుకోవచ్చు. ఒక వేళ
సోమంచి ఉషారాణి 36 మనసు మూగది రాజీకి ఈ పరిస్థితేమో అర్థంకాలేదు. ఆమె అన్ని అవమానాలను, అందరి అవహేళనలనూ మౌనంగా భరిస్తూ కాలం గడుపుతోంది. అన్నిటికి తోడు (శ్రమవల్ల అయితేనేమి, మరో కారణం వలన అయితే నేమి లీల ఇంట్లో వాళ్ళతో ఏదో రహస్యంగా మాట్టాడటం గమనించినా ఆ అభాగ్యురాలిని అనుమానించలేకపోయింది. రాజీకి ఏడో నెలలోనే డెలివరీ అయింది. ఇది రామారావు అనుమానాన్ని మరింత పెంచడమేకాక లీల పథకానికి మరో సోపానమైైంది. అమె అదనెరిగి విసిరిన మాటలు విషపుబాణాలై నాటుకున్నాయి. రాజీకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. శ్రీధర్ చూసిపోద్రామని వచ్చాడుకానీ ఆసుపత్రిలో వున్న చెల్లెలికి అతనే దిక్కయ్యాడు. ఆరునెలల తర్వాత శ్రీధర్‌కి పెళ్ళి కుదిరింది. పెళ్ళికి వెడతానంటే భర్త ఏమీ సమాధానం చెప్పకపోవడంతో పసిపిల్లలతో కష్టమని తెలియని భర్త మౌనవ్రతం రోజు రోజుకీ ఆమెని దహించివేయసాగింది. రోజులు గడుస్తున్నాయి. పిల్లల మందులకీ, పాలడబ్బాలకీ డబ్బు చాలటంలేదని భర్త వద్దన్నా చిన్న ఎలిమెంటరీస్కూల్‌లో టీచరుగా చేరింది రాజీ, ఇంటెడు చాకిరీతో, పిల్లల్ని చూసుకుని, ఉద్యోగం చేయాలంటే రాజీ అలసిపోయేది. కానీ ఆమె ఆశించినట్టు ఒక్క ఓదార్చు మాటకూడా రామూనుంచి లభించకపోవడం ఆమెకు మరింత బాధ కలిగించింది. భర్త నిర్లక్ష్యానికితోడు మరింతగా విజృంభించిన అత్తగారి దురుసుతనం ఆమెను కృంగదీస్పోంది. రాజీలో నానాటికీ ఓర్పు నళించసాగింది. ఎవరైనా మౌనాన్ని ఎన్నాళ్ళు భరించగలరు? “ క్ శయ షా “అన్నయ్యా! ఎప్పుడు వచ్చావు?” స్కూల్ నుంచి అలసిపోయి వచ్చిన రాజీని జాలిగా చూశాడు శ్రీధర్ తను వచ్చిన అయిదు నిమిషాల తర్వత మూలుగుతూ వచ్చి” మా అబ్బాయి బయటికెళ్చాడు. కూరో) నా, ఆదెసప న వళ్ల అత్తగారు... = ఏ నాయనా. అదెప్పుడొస్తుందో మరి” అని చెప్పి వెళ్ళింది “ఇప్పుడే 1 బాగున్నావా?” “ఆ ముందు కాస్త కాఫీ తెపానుండ్రు” న్ బయటికి తీసుకెళ్ళి తన మనస విప్పి అ అని లోపల్రిక్షి వెళ్ళి కాఫీ తెచ్చింది. తరువాత “పోనీలే మౌనంగా ఉంటే క్షన్సార్రు ననే షీ భరించాను. కానీ ఈ మధ ౫) న్నా 0. ప్రజ అనటం లేదు కదాని నేనూ ఇన్నాళ్లు రుజువు చేస ల న్ను చేసుకుని నా కళ్ళేకాదు నా మనసుకూడా గ్రుడ్డిదని వు చేసుకున్నాను, నిజంగా నేనంట్రే న చేస్తావా? ఆ రీలలనట దాన్ని ముక గౌరవం ఉన్నదానివైతే నాకిష్టం లేని ఉద్యోగం అంటున్నారు ఇంతకన్నా ఆ చూనమ్వే న్ (కరర విధంగా నోరుమూసుకుని పదం యమనిపిస్తోంది. ఆడది దేన్నయినా భరిస్తుంది కానీ,
సోమంచి ఉషారాణి 37 మనను మూగథి తనముందు పరాయి ఆడదాన్ని పొగిడినా, తన శిలాన్ని శంకించినా భరించలేదు. ఆయన ఆ రెండూ చేస్తున్నారు. ఎన్నాళ్ళని ఓపికపట్టను ? పిల్లల గురించి ఇన్నాళ్ళూ సహించాను. కానీ, ఇక నావల్ల కాదు. ఆయనలో మార్పురావడం దుర్లభమని తెలిసిపోయింది. ఆ లీలనే కట్టుకోనీ! అయినా మొదట్లో అంత అభిమానించిన ఆయన ఎందుకిలా మారిపోయారో అర్ధం కాకుండా వుంది” అంది రాజీ కన్నీళ్ళతో.
మూలకారణం కొంత అర్హమయింది. సాలోచనగానే లీల వివరాలు తెలుసుకుని.
శ్రీధర్ తాను తర్వాత వస్తానని చెల్లెల్ని ఇంటికి వెళ్ళిపొమ్మన్నాడు. ఆ తరువాత మెల్లిగా లీల ఇంటివైపు నడిచాడు శ్రీధర్.
“అ ఇప్పుడే ఇంటికి వెళ్ళడానికి తొందరేముంది? మీ ఆవిడ నీకోసం అక్కడ పడిగాపులు పడ్తోందనా? వాడ్నెవడ్డో ఇంటికి పిలిపించి, కాఫీ యిచ్చి, బజారుకి తీసుకెళ్ళిందట! చిట్టి చూశాడు” వ్యంగ్యంగా అంటూంది లీల.
రాము ముఖం ఆవేశంతో ఎర్రబడింది. అతని కండరాలు బిగుసుకున్నాయి. “ఎన్నాళ్ళి నాటకం? ఈ రోజే దాన్ని చంపేస్తాను...” అని ముందుకు అడుగువేశాడు.
ఇంతలో లీల చెంపలు ఛెళ్ళుమన్నాయి. శ్రీధర్ రుద్రుడిలా ఎదుట నిలిచాడు. “రాజీ నీకేం అన్యాయం చేసింది? ఆమె బాధలన్నిటికీ నువ్వే కారణమని కూడా ఆమె ఊహించ లేకపోయిందే ! ఆమె మీద నీ కెందుకింత పగ? నీ బ్రతుకిలా అయిపోయినందుకు కనీసం సాటి ఆడదాని బ్రతుకైనా చేతనైతే సరిదిద్దాలి కానీ నిప్పులు పోస్తావా? నీకేం ఒరిగింది? మానవమాత్రుడెవడయినా నిన్ను క్షమిస్తాడేమో కానీ, ఆ భగవంతుడు మాత్రం క్షమించడు. చెప్పు. ఇప్పటికైనా నువ్వాడిన నాటకాలు, చెప్పిన అబద్దాలు...”
లీల చెప్పింది వింటూనే రాము స్టాణువై పోయాడు. అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. “గ్రుడ్డివాణ్ణని ఇంత మోసం చేస్తావా? నాలాంటి అంగవైకల్యం కలిగిన వాళ్ళకి తమవల్ల తమకిమాత్రమే నష్టంకానీ నీలాంటి వాళ్ళవలన అందరికీ నష్టమే! ఛీధీ” అంటూ శ్రీధర్ చేయి పుచ్చుకుని, “క్షమించండి బావగారూ! ఇన్నాళ్ళూ రాజీని ఎంతో బాధపెట్లాను. నా పాపానికి నిష్కృతి లేదు. ఇంతకూ ఆమె నాటకం మీకు...” న్
“ఎలా తెలిసిందని ఆశ్చర్యపడకండి. ఏ మాత్రం ఆలోచించినా అదేమంత కష్టం కాదు. నా చెల్లెలు ఎంత అనాకారో నాకు తెలుసు. మీరు (గ్రుడ్డివారు అన్నది ఎంత నిజమో ఆమె కురూపి అన్నది అంతనిజం. మరిదంతా ఎలా సాధ్యం? రాజీ ఇన్నాళ్ళూ నాకేమీ వ్రాయలేదు. ఆమె సంసారంలో కలతలు రేపడం ఇష్టంలేకే నేనూ కల్పించుకోలేదు. ఇప్పుడు అది వ్రాసిన ఉత్తరాన్ని బట్టి...” వడివడిగా ఉత్సాహంగా ఇంటీవైపు నడుస్తున్న రామారావుని చూసి మాటలాపేసి మనసులోనే హాయిగా నవ్వుకున్నాడు శ్రీధర్.
(ఆంధ్రజ్యోతి వీక్ష్రి అఅ€ అ
సోమంచి ఉషారాణి 38 ప్రేమలత నాముంచి చచార లలత ప్రేమలత నో
అప్పుడే సూర్యోదయమౌతోంది. మెల్లమెల్లగా చీకటి తెరలు తొలగిపోయి, వెలుగు వస్తోంది. కష్టాలను చూసి భయపడిపారిపోయిన సుఖాల్దాగా సూర్యుని వేడి వాడీ కిరణాలకు తాళలేనట్టు చంద్రుడు మబ్బులచాటున దాక్కొన్నాడు అది చూసిన సూర్యుడు వికటాట్టహాసం చేస్తూ మరింతగ తన వాడివేడి కిరణాలను ప్రసరింపజేస్తూ తన గొప్పతనం చాటుకుంటున్నాడు. వారు ఆడుకునే దాగుడుమూతలు చూపేందుకు తీరకలేని ప్రజలు ఎవరి పనుల్టో వాళ్ళు నిమ॥మయ్యారు.
పచ్చనిపొలాలూ, తోటలమధ్య నుండి గుజ్జపు బండి వేగంగా పరిగెడుతోంది. (ప్రేమలత అన్నిటినీ వింతగా, ఆనందంగా చూస్తోంది. పుట్టిన దగ్గరనుంచీ బస్తీలోనే ఉన్న లతకి పల్లెటూళ్ళను. గురించీ, వాటి సౌందర్యాలను గురించీ విన్నప్పుడు ఏవిధంగానైనా ఆ ఆహ్ధాదకరమైన వాతావరణంలోని ఆనందాలనీ, అందాలనీ అనుభవించాలని ఆశపడేది. కాని తల్లి ఎక్కడికీ పంపించడానికి ఒప్పుకునేది కాదు. తల్లిదండ్రులకు ఎదురుచెప్పే అలవాటులేని లత తన ఆశల్ని ఎప్పటికప్పుడు ఆణచుకునేది.
ఇంతలో లత పీన్ని కూతురు వాసంతి పెళ్ళి శుభలేఖ వచ్చింది. వాళ్ళది పల్లెటూరు అందుకనే లత పెళ్ళికి వెళ్ళాలని ఉబలాటపడింది. తల్లికి అస్వస్టతగా ఉందని. తండ్రి ఆమెకు తోడుగా ఉండిపోయాడు. కనీసం అతనైనా పంపించకపోతే బావుండదని, లత ఉత్సాహాన్ని కాదనలేక ఆమెను ఒంటరిగాపంపించడం ఇష్టంలేకపోయినా ఒప్పుకున్నారు, ఆమె తల్లి దండ్రులకు లత ఒక్కతే కూతురు. చాలాకాలానికి పుట్టింది. ఆ తరువాత లత తల్లికి అనారోగ్యరీత్యా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయవలసి వచ్చింది ఎప్పుడూ అనారోగ్యంతో ఉండడంవలన ఆమె ఎక్కడికీ వెళ్ళేదికాదు,
(ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఆలోచిస్తున్న లత ఊరిమద్యకి వచ్చినట్లే గమనించలేదు వీధిలో తిరిగే వారందరూ 'ఎవరా?” అని బండిలోకి తొంగిచూసి, అందంగా, పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్న లతను ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిచేసి 'ప్రక్కవాళ్ళకి మోచేత్తోసాడిచి మరీ చూపిస్తున్నారు. బండివచ్చి మేడముందు ఆగింది.
“లతా దిగు ఇల్టువచ్చింది” కేశవ్ నవ్వుతూ అన్నాడు.
ఒకసారి చుట్టూ కలయజాసి, లేడిపిల్లలా చెంగున (క్రిందకు దూకింది లత. వాసంతి, ఆమె తమ్ముడు, చెల్లెలు “అక్కా! అక్కా” అంటూ వీధిలోక్తి పరిగెత్తుకువచ్చారు, నవ్వుతూ కుళల (ప్రశ్ళలు వేసుకుంటూ లోపలికినడిచారు.
లత పిన్ని కామాక్షమ్మ ఆనందంగా అతని కౌగలించుకుని, “వచ్చావా తల్లీ! ఇన్నాళ్ళకి మా ఊరినీ, మా ఇంటినీ చూడాలనిపించిందా? ఎప్పుడూ మేము రాష్వమరా[్ మీరేవరూ రారు, అక్క ఎలా ఉంది? శ్యామలా |! కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళు తీసుకురా” అంది లతను
చిన్న పిల్లలా లాలిస్తూ, "కేశవ్ భార్య శ్యామల నీళ్ళు తీసుకొచ్చి “ఇద్దరి ఆడపడుచులతో వేగలేకుంటే మూడో
సోమంచిఉషారడి ౨ _కేమలత ఆవిడ వచ్చింది నాపాలిటికి” నవ్వుతూ వేళాకోళం చేసింది. ఆమె సరదాగా అన్నా లత ఏమనుకుంటుందోనని మిగిలిన వారు భయపడినా ఆమె అమాయకమైన ముఖం, నిష్కల్మషమైన కళ్ళూ, నిర్మలమైన చిరునవ్వూ చూసి శాంతించారు.
పెళ్ళివారిల్లు కావడంవలన ఇల్లంతా సందడిగా వుంది. పెళ్ళిపనుల్లో సాయపడుతూ,
మారాంచేసే చిన్నపిల్లలను బుజ్జగిస్తూ వాళ్ళకి నీళ్ళుపోసి, అలంకరించి, వాళ్ళతో ఆడుతూ, పాడుతూ, సంధ్యవేళ అందరిని చెరువుగట్టుకు షికారుతీసు౩ళ్ళి, ఆ పసివారి అమాయక సందేహాలకు సమధానాలిస్తూంటే ఎంతో హాయనిపించింది లతకి.
బస్తీలో పుట్టిపెరిగినా ధనవంతుల ఏకైక కుమార్తె అయినా ఆమెలో అణువణువునా
అగుపించే నిరాడంబరత్యాన్ని, నిరహంభావాన్నీ అందరూ మెచ్చుకునేవారు. ఆమెలో అందాన్నీ, చలాకీతనాన్నీ చూసి కొందరు మగువలు ఈర్ష్య పడకపోలేదు. కానీ ఆమె నిర్మలమైన చిరునవ్వు చూశాక ఎవరికీ ఈర్వాచ్వేషాలకు తావుండేది కాదు. పల్లెప్రజల అమాయకత్వాన్నీ, వారిలో నిగూఢమై ఉన్న 'ప్రేమాభిమానాల్నీ చూసి మురిసి పోయేది లత. పెళ్ళి హడావిడంతా ముగిసింది. తల్లి కులాసాగా ఉన్నదని తెలిసి మరో వారం రోజులు ఉండదలచుకుంది. లత. రోజూ సంధ్యవేళ చెణువు గట్టుమీద కూర్చునేది. దూరంగా నీలాకాశం భూమిని తాకాలని ప్రయత్నిస్తూ మధ్యలో. చెట్టు కొండలు, గుట్టలు, మనుష్యులు అన్ని అడ్డువస్తున్నాయని కోపంతో ఎర్రగా కందినట్టనిపించి నవ్వుకునేది.
“ప్పీ ఆలోచనలకూ. ఏకాంతానికీ భంగం కలిగించినట్టున్నాను” ఒక సంధ్యవేళ నవ్వుతూ ప్రత్నిస్తుంటే 'ఎవరా?' అని ఆళ్ళర్యంగా చూసి 'లేదోన్నట్టు నవ్వింది లత.
“నా పేరు రాణి. నాకు ఇలా సాయంత్రం పికొరు రావడం సరదా. మిమ్మల్ని చాలాసార్జు చూశాను. కానీ పలకరిస్తే ఏీమనుకుంటారోనని సంకోచించాను. నాకు పట్నం చదువూ, అక్కడ పద్దతులూ అలవాటేమో సాయంత్రాలు, ఇలా కాసేపైనా షికారు రాకపోతే తోచదు. ఇక్కడి నా స్నేహితురాళ్ళు ఇలా రావడానికి వాళ్ళవాళ్ళు ఒప్పుకోరు. కొంచెం సేపు కూర్చుని ఈ ప్రకృతి సౌందర్యం. తిలకిస్తూ సెలవులు గడిపేస్తాను.. సారీ ఎక్కువగా మౌట్టాడేస్తున్నానమో? అందుకనే నన్నందరూ వాగుడుకాయ అంటారు. ఇంతకూ మీగురించే చెప్పలేదు” నవ్వుతూ గల గలా పా స్నేహభావంతో చూసింది లత. లక
ఇద్దరూ చనువుగా ఎన్నో విషయాలు చర్చించుకూరి. రర నస్టిదం ఆహ్వానించింది. మరునాడ చెరువు దగ్గర కలుసుకుని రాణీ వాళ్ళింటికి వెళ్ళడానికి ఒప్ప చేసుకున్నారు. ( డినందుకు _ అంత అందమైన గొప్పమ్మాయి తనతో మామూలుగా చక్కగౌ ప గా సంతోషంతో గర్వపడింది రాణి. స్వంత చెల్లెలికన్నా సన్నిహితంగా అక్కా ( పిలిచే రాణితో స్నేహం కంలో తప్పులేదనిపించింది లతకు.
న
ఎంబ్రాయిడరీ చేసిన తెల్లని ఫారిన్‌నైలెక్సు చీర, లెక ఫె టా వదులుగా వేసుకున్న పెద్ద బక తెల్లని ఫాలిభాగంపై నృత్యం టి రహవేయడం అన్నిటికన్నా స్వచ్చమైన చిరునవ్వు ప్రేమలతను ఒక దేవతలా ఊహిస్తూ రెబ్బఎలులం
సోమంచి ఉషారాణి 40 ప్రేమలత మర్చిపోయింది. రాణి. ఇద్దరూ- కబుర్హు చెప్పుకుంటూ నడుస్తూ ఒక పెంకుటింట్లో (ప్రవేశించారు. చూడగానే రాణివాళ్ళ ఇల్లు ఎంతో (ప్రశాంతంగా అనిపించింది లతకి.
“ఇదే మాచిన్న కుటీరం. ఈవిడ మా అమ్మగారు” పరిచయం చేసింది రాణి. “నమస్కారమండీ!” అని చేతులెత్తి నమస్కరిస్తున్న (ప్రేమలతలోని అణకువ, వినయ విధేయతలకు మురిసిపోయారు రాణీ అమ్మగారు.
కాఫీ, టిఫిన్ తీసుకున్నాక, ఇద్దరూ తమ ఇంటిముందున్న చిన్నతోటలోకి దారితీశారు, అక్కడ చెట్టునానుకుని చేతులుకట్టుకొని శూన్యంలోకి చూస్తున్న మోహన్ కనిపించాడు, “అతను మా మావయ్య మోహన్, అతని రంగు చూసేనేమో మా అమ మ్మూ, తాతయ్యా తగిన పేరు పెట్టారు” వ్యంగ్యంగా అని ఫక్కున నవ్వింది రాణి. కనీ ఆ మాటలకు (ప్రేమలత, చాలా బాధపడింది.
లతని గమనించిన రాణి నవ్వును ఆపుకుని మోహన్‌కి లతని పరియం చేసింది. ఆమే, మోహన్ పరస్పర నవస్కారాలు చేసుకున్నారు. ఇద్దరి కళ్ళూ ఒక్క క్షణం కలుసుకున్నాయి. మోహన్ చూపులు వెంటనే క్రిందకి వాలిపోయాయి. తల్లి పిలవడంతో లోపలకి వెళ్ళింది రాణి.
'మోహన్‌ని చూడగానే తెలుస్తుంది. ఎంత అందవికారో | చిన్నప్పటినుంచీ కన్న తల్లిదండ్రులతోసహా అందరూ అతన్ని అసహ్యించుకునేవారే కానీ ఆదరించి" అభిమానించిన వారుగానీ, (ప్రేమగా పలకరించినవారుగానీ ' లేరు. అన్ని విమర్శలకూ, వేళాకోళాలకూ అలవాటుపడి, కరడుగట్టిపోయింది అతని హృదయం, దేవుడిచ్చిన రూపానికి అతడేం చేయగలడు ? అతని కళ్ళలోని దీనత్వం, బాధా ఎవరికీ అక్కర్తేదు. తనచుట్టూ ఒక గిరీ గీసుకుని దాన్ని దాటి ఎప్పుడూ వపిందడుగు వేయలేదు." ని ఆశలూ. ఆశయాలూ 'పెంచుకోలేదు. తల్లిదండ్రులు పోయాక్ష అక్కా, బావగారే దిక్కయ్యారు. తన పనే తప్ప ఒకరి జోలికి పోడు. పలకరిస్తేకాని మాట్లాడడు.
“మీరేం చేస్తుంటారు?” మొదటిసారిగా తనని గౌరవంగా, ఆప్యాయంగా పలకరించిన లతకేసి ఉలిక్కిపడి తలెత్తి చూసి, అంతలో విరక్తిగా నవ్వి, “వ్యవసాయం, మరి మీరు...” అన్నాడు మోహన్ నిర్వికారంగా.
“నేను బి.ఎ. పరీక్షలు (వ్రాశాను. ముందు సంగతి ఇంకా ఆలోచించలేదు.” నవ్వుతూ చెప్పింది లత.
వనదేవతలా, పాలరాతి బొమ్మలా, స్వచ్చంగా నవ్వుతూ, తెల్లని దుస్తులలో మెరిసి పోతున్న 'ప్రేమలతని కళ్ళార్చకుండా చూస్తుండిపోయాడు మోహన్: మొదటిసారిగా పరాయి (ప్రీకేసి దైర్యంగా చూడగలిగాడంటే అది లతలోన్సి ఆకర్షణేనేమో | అతని చూపులు తట్టుకోలేనట్టు, అంతవరకూ అతన్ని పరీక్షగా చూస్తూన్న "లత కళ్ళు వాల్చేసింది. తన పలకరింపుతో మోహన్ కళ్ళలో మెరిసిన కాంతినీ, ఆ సంధ్య చీకటోల ఆనోవుళంలోని
వెలుగును స్పష్టంగా చూడగలిగింది, ల
“సారీ అక్కా ! అమ్మ ఏదో పని చెప్పింది. ఆఅస్యమైపోయింది. రా లోపలికి వెడదాం” అని లతను లోపలకు తీసుకెళ్ళి, తండ్రినీ, చెల్లెలినీ తమ్ముడినీ ప్ర చ యం వేసింది. అందరి దగ్గరా సెలవు తీసుకుని, 'వస్తానండీ" అని మోహన్‌కి క్రూడ్తీ బె ౦ ఒలరి-.
క. స, వెళ్ళిపోయింది లత.
(ప్రేమలత! ఎంత అందమైన పేరు పేరుకు తగ అరిదం 'ానికి తగిన వినయ
నోమంచి ఉషారాణి శే ప్రేమలత విధేయతలు ! చదువూ, సంస్కారం 1! తనతో ఎంత బాగా మాట్టాడింది ! తను కలగనలేదు కదా ! ఎంత మధురమూర్తి' మోహన్ ఆలోచనలనిండా ఆమె! 'అమెని గురించి ఆలోచించే హక్కు నీకులేదిని ఆత్మఘోషించినా, మనస్సు అంగీకరించలేదు. 'అందమైన వస్తువుని చూసి ఆనందించని వారెవరుంటారు? కానీ లత తన గురించి ఏమనుకుంటోందో ! అందాన్ని ఆరాధించడమే కానీ అనుభవించే అదృష్టం అందరికీ ఉండదు.” నిట్టూర్చాడు మోహన్,
శ్ చ ల
ఆ సాయంత్రం అత మామూలుగా చెరువు గట్టుకొచ్చింది. కానీ రాణీకి బదులు ఆమె చెల్లెలు వాణి వచ్చింది. “అక్కయ్యగారూ, మరేమో ఇవాళ రాణక్కకి ఒంట్లో బాలేదు. అందుకని రానంది.” అని చెప్పింది. _
లత వాణిని ప్రక్కన కూర్పోపెట్టుకుని మోహన్ గురించి అడిగింది. వాణి మొదట ఆశ్చర్యంగా చూసినా, తరువాత మెల్లగా చెప్పసాగింది.
“మామయ్య చాలా మంచి వాడండీ. కాని అందరూ ఎప్పుడూ కోప్పడుతారు. అక్క కూడా విసుక్కుంటుంది. నాతో ఎంత బాగా మాట్లాడతాడో? నాకు నీలాంటి చెల్లులుంటే ఎంత బావుండేదో! అని నన్ను చెల్లెలులానే చూస్తాడు. పాపం పగలంతా ఎండలో పొలంలో కష్టపడి పనిచేసినా ఏదో తప్పు చేసినట్టు నాన్నగారు తిడతారు. అసలు మామయ్య అంత మంచిగా ఉండడం వలనే అందరికీ అలుసయ్యాడు 'మంచివాళ్ళకి ఎప్పుడూ బాధలేకదండీ?” పన్నెండేళ్ళవాణి అమాయకంగా ఒక్కొక్క మాట చెస్తన్నకొద్దీ లతకి మోహన్‌పై ఏర్పరచుకున్న అనురాగం ఒక్కొాక్కమెట్టు పైకి ఎక్కసాగింది.
కాసేపు వాణితో కబుర్దు చెప్పి ఇంటికి తిరిగి వచ్చింది లత. అందరి ముందూ సిగ్గుపడుతూనే తన నిర్ణయం తెలియజేసింది. వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. వాళ్ళకి మోహన్ బాగానే తెలుసు. అతనిలో ఏం చూసి లత ఇష్టపడుతోందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ వాళ్ళకు తెలియదు. లత మోహన్‌లో ఉన్న ఆత్మసౌందర్యాన్ని ఆరాధిస్తోందనీ, ఎవరెన్ని చెప్పినా, మందలించినా లత ముఖంలోని చిరున్య మాయలేదు, నిర్ణయం మారలేదు.
మరునాడు కేశవ్ చెప్పిన మాట విన్న మోహన్ ఆనందం వర్లించలేనిది ! తను అంత అదృష్టవంతుడా? నింగికీ, నేలకూ సామ్యమా? మోహన్‌లోని సంతోషం ఉవ్వెత్తున లేచి క్రిందపడిన కెరటం లాగా అయింది అంతకంటే ఎక్కువ ఆలోచించలేకపోయాడు. ఎందుకో అతని ముఖంలో విరక్తిభావం తొంగిచూసింది.
లత వెళ్ళిపోతూ ఒకసారి మోహన్ ఇంటిముందు బండి ఆపింది. ఎదురుగుండా కనబడిన మోహన్‌ని చూచి మధురంగా నవ్వి, కళ్ళతోనే పలకరించి, లోపలికి వెళ్ళింది రాణీతల్లి (ప్రేమలత చెప్పిన విషయం విని ఆశ్చర్యంగా చూసింది. ఆవిడ ముఖం నమ్మలేనట్లుగా ఉంది. రాణీ అంతకంటే ఆశ్చర్యపోయింది. అందమైన పువ్వుకి గడ్డి పురుగుకూ సంబంధమా ? కానీ ఏదైనా భగవంతుని సృష్టే? పురుగు అసహ్యంగా ఉంటే ఆ తపు పురుగుది కాదు. దాన్ని సృష్టించిన వాడిది' అని తెలుసుకోలేని రాణి అంతకంటే ఎలా ఆలొచిస్తుంది ? అందరి ఆశ్ళర్యాలకూ సమాధానంగా చిరునవ్వుతో బండెక్కింది ప్రేమలత, లత వెళ్లిపోవడం రాణికి చాలా బాధనిపించినా ఆలోచనలతో ఏం అనలేక పోయింది.
సోమంచి ఉషారాణి శ2 ప్రేమలత న (ప్రేమలతకి బి.ఎలో క్లాసు రావడంతో ఆనందంతో స్నేహితులతో సరదాగా తిరిగి, చీకటిపడుతుండగా ఇంటికి తిరిగివచ్చింది. తన బల్లమీద ఉత్తరం మీద క్రొత్త దస్తూరిని చూసి ఆశ్చర్యంగా కవరు విప్పింది. ప్రియమైన చెల్టాయికి, 'ఆ సంబోధనకి ఎవరాని ఆళ్ళర్యపోయి. సంతకం చూసింది. 'మోహన్' ఆమె గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. భరించలేనట్టు గట్టిగా కళ్ళు మూసు కుంది. అనిర్వచనీయమైన బాధతో ఆమె కళ్ళ నుండి రెండు కన్నీటి చుక్కలు ఉత్తరంమీద పడ్డాయి. గుండె దిటవు చేసుకుని ఉత్తరం చదవటం మొదలుపెటింది. (ప్రియమైన చెల్లాయికి, గ్ నీకు ఆశ్చర్యంగా ఉందికదూ ఇలా సంబోధిస్తున్నందుకు, మీరు అని మన్నించనందుకు! (ప్రేమగా చెల్లాయనిపిలుస్తున్నప్పుడు మన్నించటంలో అర్హంలేదనిపించింది. నన్ను క్షమించగలవనే ఆత్మ స్టయిర్యంతోనే ఈ ఉత్తరం (వ్రాస్తున్నాను. నన్ను నీ అన్నగా అర్జం చేసుకుందుకు 'ప్రయత్నిస్తావు కదూ 1 - నువ్విక్కడున్నప్పుడే చెబుదామనుకున్నాను కానీ అవకాశం రాలేదు. అంతేకాక నీ నిష్కల్మషమైన మెరిసేకళ్ళలో బాధను చూడలేక చెప్పలేదు. నోటితో చెప్పలేని ఎన్నో భావాలను వ్రాసి చూపవచ్చును. మారాణి దగ్గర్నుంచీ “నీ ఎడ్రసు తీసుకున్నాను, నిన్న చెల్లెలుగా తప్పమరేవిధంగానూ భావించే అర్హతలేదనీ, భావించలేననీ. నికు విడమరిచి ఉత్తరం వ్రాస్తాననీ కేశవ్‌గారికి చెప్పాను. కారణమేమిటని అనుకుంటున్నావు కదూ! నేను ఎలా ఉంటానో నీకి తెలుసు. నన్ను పెళ్ళిచేసుకుని నువ్వు అనుక్షణం బాధపడవలసి వస్తుంది. అది నీ తప్పు కాకపోయినా మన చుటూ ఉన్న సంఘం నువ్వు బాధపడేట్టు చేస్తుంది. ప్రతి మనిష సంఘజీవి. ఇది ఎవరు కాటినగలరు ? నీ భయ (ప్రత్యక్షంగానో, పరోక్షంగానో హేళన చేస్తుంటే విని భరించగలవా? లోకులు కాకులు అని సరిపెట్టుకుందుకు ఇది మామూలు విషయం కాదు. జీవితం, నూరేళ్ళపంట, నువ్వు రూపసివి, నేను అందవికారిని. నీకూ, నాకూ నింగికీ నేలకూ ఉన్నంత తేడా ఉంది, నువ్వు నడిస్తే కందిపోతావన్నట్టు గారాబంగా, వైభవంగా ెరిగినదానివి. నేను మధ్య తరగతి కుటుంబంలోపుట్టి కష్టమే తప్ప, సుఖమంటే ఏమిటో తెలియకుండా ముళ్ళలో బురదలో తిరిగినవాడిని, నిజానికి నీ దృష్టిలో ఇవి కారణాలు కాకపోవచ్చు. దేవుడి పాదాలను స్పృశించే స్వచ్చమైన, పవిత్రమైన పువ్వును బురదలో పారేయడం ఇష్టంలేదు. బురదలో ఉన్నవానిని పూజార్హమైన పువ్వుగా చేయడం అంతకంటే ఇష్టం లేదు. అదీకాక నాకు నీలాంటి చెల్లెలుంటే ఎంత బావుండును అనిపించింది. నేన ఏమైనా పారపాటుగా వ్రాసి, నీకు కష్టం కలిగిస్తే నన్ను మన్నించు. మీ నాన్షగారిక్షీ అమ్మగారికీ నా నమస్కారములు చెప్పు, నన్ను క్షమిస్తే నీ దగ్గరనుంచి వెంటనే ఉత్తరం వస్తుంది నువ్వు నా చెల్లెలివని చెప్పడానికి గర్విస్తూ... య. నీ అన్నయ్య 'మాహన్”
నోమంచి ఉషారాణి త ప్రేమలత ఉత్తరం చదివి చాలాసేపు ఆలోచిస్తూండిపోయింది లత. మోహన్ (వ్రాసినదానిలో తప్పు లేదు. ఎంతలోతుగా ఆలోచించగలిగాడు 1! అతను చెల్లాయి" అని పిలిచాక ఇంకేం చెప్పగలదు ? మనసారా ప్రేమించిన మోహన్‌ను చేసుకోలేకపోయాననే బాధ ఒక వైపున్నా, ఆ (ప్రేమ మరోవిధంగా మారి, అతని అభిమానాన్ని చూరగొన్నందుకు ఆనందంగా ఉంది. విధినెదురీద ఎవరితరము ? ఎంత ప్రయత్నించినా 1శ్రమేగానీ ఫలితముండదు. ష్ ర ల సాయంత్రం పొలం నుంచి తిరిగి వచ్చిన మోహన్ తన గదిలో బల్లమీదున్న ఉత్తరాన్ని చూసి దాని మీదున్న ముత్యాల్దాంటి అక్షరాలు ఎవరివో ఊహించడానికి ఎక్కువసేపు పట్టలేదు. సంతోషంతో ఆత్రంగా కవరు విప్పిచదవసాగాడు. 'ప్రేయమైన అన్నయ్యకు. ఉభయ క్షుశలోపరి, నాకు మంచి అన్నయ్య దొరికినందుకు వీకన్నా నేనెక్కువ గర్వపడుతున్నాను. అభిమానంగా 'చెల్లాయ్” అని పిలిస్తే పులకించని మనసు ఉంటుందా ? అందుకే నువ్వు నన్ను పూర్తిగా అర్దంచేసుకోకపోయినా నీ పిలుపు నన్ను మరేమీ ఆలోచించ నీయలేదు. ఇక దాని గురించి చర్చించటం, వాదించటం అనవసరం. నన్ను ఇంతగా అభిమానించే నీ కోరిక మన్నించటం సమంజసమే మరి కానీ నిన్ను మన్నించేంత గొప్పదాన్ని కాదు అంటే పెద్ద దాన్ని కాదు. నీ అభిప్రాయం చెప్పావు. నేనెలా కాదనగలను? ఇతరుల సంతోషం కోసం ఏమైనా చేయగల మనస్తత్వం నాది. నొప్పించక, తానొవ్వక... అన్న సూక్తిని తెలిసిన వారెవరూ సహృదయులైతే వాళ్ళు బాధపడరు. ఇతరులను బాధపెట్టరు. నేను డిగ్రి పాసయ్యాను. మా అమ్మగారికి ఆరోగ్యం బావుండకపోవడం వలన త్వరలోనే బహుశా ఈ నెలలోనే నో వివాహం చేయాలనుకుంటున్నారు బావగారెవరో అనుకుంటున్నావు వూ ప్రసాద్ అని ఇంజనీర్. వాళ్ళూ చాలా గొప్పవాళ్ళే మావాళ్ళు ఈ సంబంధం పాక నా అంగీకారం చెప్పేశాను. శుభలేఖ పంపిస్తాను, మా కేశవ్ అన్నయ్య వాళ్ళ ల్ టు రందరూ క్రూడ్రా తప బీకూడా ఈ విషయం చెప్పు. ఉంటాను. తప్పక రావాలి రాణక్కూ. స్ట శ్రేయస్సు కోరే చెల్లెలు ప్రేమ నిండుగా నవ్వుకున్నాడు మోహన్ ఉత్తరాన్ని పదేపదే చదువకున్నాడు. వే నిట్టూర్డుతో పాటు విరక్తితో కూడిన చిరునవ్వు వెలువడింది పెదవుల నుంచీ! అప్పు లల ముఖా ముసురుకుంటున్నాయి చలగా వచ్చే చంద్రుని ఆగమనానికి సూర్యుడు | 0 స ఎం రొ అడి త్తి కందగడ్డలా చేసుకున్నాడు, మంచితనాన్ని చూసి మండిపడే ద్వేషిలా ! ఆ నంధ్యా వాతావరణానికి వన్నె రుస్తోంది. అఅ9ళి
సోమంచి ఉషారాణి టట్ అరంితరలంి సోమంచి ఉషారాి కా చూశాడు".
“రాకీ! నీకు ఇదివరకే చెప్పాను. నుళ్ళీ చెబుతున్నాను. నీకు పెళ్ళాం కావాలంటే కొట్టినా, తిట్టినా పడుండు. లేదంటే నీబ్రతుకేదో నువ్వు (బ్రతుకు. చదువుంది, ఉద్యోగం వుంది. పెళ్ళయ్యాక మగాడికి మావగారిల్లే గతి! ఇంక ఒక్క రూపాయి కూడా ఇవ్వడం నావల్ల కాదు. రాబేష్‌ని చదివించాలి. పెళ్ళిచేయాలి. వాడికెంత కట్నం అడుగుతారోనని హడలిచస్తున్నాను. ఏమైనా కాస్త వెనకేయవచ్చునని ఎలక్షన్లలో దిగుతున్నాను. ఎలక్షన్టో నెగ్గాలంటే ముందు డబ్బు కావాలి కదా! దానికే నేను నానా అవస్టలూ పడుతున్నాను. ఈ స్థితిలో లక్ష రూపాయలు కాదుకదా లక్ష పైసలు కూడా నావల్ల కాదు” అర్చన నిక్కచ్చిగా చెప్పింది.
“అలా అంటే ఎలాగండీ? వాడికి పెళ్ళాం అంటే ఎంత అభిమానమో తెలిసీ...” రావు సర్ది చెప్పబోయాడు.
“నువ్వు నోరుమూసుకో! నీకు కొడుకు మీద అంత అభిమానమే వుంటే ఆఫీసులో అప్పో, లోనో తీసుకుని ఇచ్చుకో 1 నా వల్లకాదు చూడు రాకేష్! 'మా అమ్మ ఎలక్షన్టో నిలబడుతోంది. గెలిస్తే లక్ష ఏమిటి ? రెండు లక్షలిస్తానంది. అప్పుడు ఇద్దరం ఫారిన్ వెడదామని నచ్చజెప్పు. అప్పటి సంగతి ఆలోచించుకోనచ్చు” అంది అర్భన.
“డబ్బు తీసుకోకుండా నేనక్కడికి వెళ్ళను మమ ముఖం చిన్నబుచ్చుకుంటూ గొణిగాడు రాకేష్ “ఉద్యోగానికి సెలవు పెట్టి నీకు ఎలక్షన్లలో సపోర్టు చేస్తూ ఇక్కడే వుంటాను”
- అన్నాడు ధైర్యం చేసి.
“నామాటకు ఎదురుచెప్పడానికి వీల్లేదు. నువ్విక్కడే వుంటే నేను అందరికీ సంజాయిషీ ఇచ్చుకోవాలి, అదీగాక మీ ఆవిడ మరో పెళ్ళి చేసుకుందంటే నీ సంసారం నాశనం కావడమే కాక నీ తమ్ముడికి పెళ్ళికాదు. ఇక నాకు నిదద్రవస్తోంది. రేపు (ప్రొద్దున్నే బయలుదేరు” ఆజ్ఞాపించి లేచింది అర్భన,
“నాలుగు రోజులుండనీండి. ఒంటిమీద దెబ్బలూఅవీ...” ఇంతలో రాజేష్ పారం తెలుగులో చెప్పమని వచ్చాడు రావు దగ్గరికి.
“వాడిని వెళ్లనీ రావ్ ! మా ఆఫీసులో ఒకావిడ కొడుకుని రెండోసారి కూడా మగపిల్దాడు పుట్టాడని పుట్టింటికి పంపేశారట! అవిడ నిన్న నాతో చెప్పుకుని ఏడ్చింది. ఉన్న డబ్బంతా పెట్టి కొడుకు పెళ్ళిచేస్తే సంసారం ఇలా అయిందని అప్‌సెట్ అయింది. దానితో సన్నగా గుండెనొప్పి కూడా వచ్చింది”,
“స్కానింగ్ చేయించలేదా?” అడిగాడు రావు.
“స్కానింగ్‌లో మగపిల్లాడని తెలిసినా, ఈ మొగుడికి విడాకులిచ్చి మళ్ళీ కట్నంతో పెళ్ళి చేసుకోవచ్చునని కావాలనే మగపిల్హాడిని కన్నదంటారు. నిజానిజాలు ఆ భగవంతుడికే తెలియాలి. పారం చెప్పీ త్వరగా రా” అని రావుతో చెప్పి, బెడ్‌రూంలోకి వెళ్ళిపోయింది అర్భన.
శమ ల నా చెల్టివారుయూమున లేచి రాలకృత్యాలు తీర్చుకుని, తండ్రి ఇచ్చిన కాఫీ తొగి ను డొ 1 మమ్మీకి చెప్పు” అన్నాడు దినంగా.
నువ్వేమీ దిగులు పడకు. ధైర్యంగా వుండు. లేకపోతే మరీ అధికారం చెలాయిస్తారు.
సోమంచి ఉషారతి కరం ఏదో అత్తా బామ్మర్దుల పోరు లేదు. ఒక్కతే కూతురని ఆశపడ్డాము గానీ ఇలా జరుగు తుందనుకోలేదు. మన మగజన్మలింతే. ఏదో సర్దుకుపోవాలి. జాగ్రత్త ! మమ్మీ చెప్పినట్టు చెప్పిచూడు” అని కొడుకుని సాగనంపి, కండువాతో కళ్ళు ఒత్తుకుని తన వంట ప్రయత్నం లో పడ్డాడు రావు.
అర్భన లేచి పేపరు చదవసాగింది. రావు కాఫీ కప్పుతో వచ్చి ప్రక్కనే కూర్చున్నాడు. రాజకీయ వార్తలు చదివాక, పైకి చదివింది అర్భన.
'వధుకట్నం బాధపడలేక ఒక యువకుడి ఆత్మహత్య!"
'వధుకట్నం తక్కువైందని అత్త మామ, బామ్మర్టులు, ఓ యువకుడ్ని హత్య చేయడంతో వారిని అరెస్టు చేశారు."
'వధుకట్నం తక్కువిచ్చారనీ, ఇతర లాంఛనాలు జరపలేదనీ సాధింపు పడలేక మరో నడివయస్కుడు ఇలు వదలి పరారీలో వున్నాడు. ఆచూకీ తెలియజేయవద్దని (ప్రార్దన!
“దేశం మరీ తగలబడి పోతోంది. ఈ మగవాళ్ళకు విముక్తి ఎప్పుడో!” అన్నాడు రావు ఉండబట్టలేక ఆవేదనతో
“ఏదైనా తమదాకా వస్తేకానీ తెలియదన్నారు. ఆ తెలివి ముందే వుండాలి. ఆడపిల్ల అనగానే అబార్డన్ చేయించుకోవడం, లక్షలు, లక్షలు కట్నాలు తీసుకున్న కోడళ్ళను వేధించడం, చంపడం మా ఆడజాతి ఎన్ని బాధలు పడ్డదో!” వ్యంగ్యాన్నీ, బాధనీ కలగలిపి అంది అర్భన.
“నిజమేనండీ! వాళ్లకీ ముందు చూపు వుంటే మన (బ్రతుకుల్లో ఇంత విషాదం ఉండేది కాదు. అడయినా, మగయినా సమానమేననీ, రెండు చేతులూ కలిస్తేనే చప్పుట్టనీ, కష్టసుఖాలు ఇద్దరూ కలిసి పంచుకునేవేననీ అవి ఏ ఒక్కరికో పరిమితం కాదనీ, జీవితంలో మంచితనం, మానవత్వం శాశ్వతం కానీ, డబ్బుకాదనీ ఆ రోజుల్లో వాళ్ళూ, ఈ రోజుల్లో వీళ్ళూ ఎవరూ తెలుసుకోలేకపోవటం వలనే మనుష్యులకు ఇన్ని కష్టాలూ, కన్నీళ్ళూనూ!”
శ షయ
“కూరగాయలు తీసుకురావడానికి ఇంతసేపా? ఇంట్లో పనంతా ఎవడు చేస్తాడనుకున్నావు? వెయ్యి రూపాయిలిస్తే ఇవేనా కూరగాయలు?” సాధింపు మొదలుపెట్టాడు మార్దాండం.
“ఢేనేం చేసేది కూరల ధరలు అలా వుంటే” గొణిగాదు రాకేష్
“త్వరగా వంటపని కానీ! అమ్మాయి లేచిందంటే అరుస్తుంది.” అల్టుడికి ఆజ్ఞాపించి, పేపరు క్రీరగేస్తూ “మీ అమ్మ ఎలక్షన్లో గెలిచేదెప్పుడో డబ్బు ఇచ్చేదెపుడో ! ఎంతైనా చాలా తెలివైంది. అందుకే రాజకీయాల్టోకి వెళ్ళింది” అని సణగసాగాడు మార్తాండం.
రాకేష్ చకచకా టిఫిన్, వంటచేసి, నవ్య స్నానం చేసి వచ్చేసరికి వడ్డించాడు. మావగారికి టిఫిన్‌పెట్టి, వంటంతా ఆయనకిహాట్ కలో పెట్టి ఇద్దరూ మౌనంగా భోజనం చేసి ఆఫీసుకు బయలుదేరారు. స్కూటర్‌మీద భార్య వెనుక కూర్చుని భుజంమీద చెయ్యేశాడు రాకేష్
“నడుం చుట్టూ చెయ్యి వేసి కూర్చోమని ఎన్నిసార్లు చెప్పాలి?" నవ్య విసుక్కుంది. రాక్షేష్‌ని అఫీసు ముందు దింపి, “ఏవిటీ ఆ తరుణతో వెకిలి వేషాలూ, కబుర్లూ? తిన్నగా
నషముంచి ఉషారాణి కవ. అం'తరలంి నీపని చేసుకుని, నేను వచ్చేసరికి సిద్దంగా వుండు. మరోసారి దానితో మాట్లాడటం నేను చూడకూడదు. అండర్‌స్టాండ్” అని స్కూటర్ స్టార్ట్‌చేసుకుని వెళ్ళిపోయింది నవ్య, రాకేష్ బుద్దిగా తలూపి, తన సీట్టో వచ్చి కూర్చున్నాడు. 'ఈ తరుణ ఎక్కడ దొరికిందో నా ప్రాణాలు తీయడానికి! ఏదో ఒకటి అంటూతనని కవ్విస్తూ వుంటుంది. తను పలకకపోయినా, హాయ్ హేండ్‌సమ్”, 'స్వీట్‌డాళింగొ, 'హౌ స్మార్ట్ అంటూ మీదపడి ముద్దులు పెడుతూ ఉంటుంది. తను ఏమన్నా, కోపగించినా లెక్కచేయదు సరికదా, నవ్వుతుంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో । ఆమెకెలా చెప్పాలి" మధనపడసాగాడు. “హలో! హీరో! నిన్న రాలేదేం? మీ పుట్టింటికి వెళ్ళావా ? మళ్ళీ మీ ఆవిడ డబ్బు తెమ్మందా?” గలగలా నవ్వింది తరుణ. రాకేష్ తలవంచుకున్నాడు కానీ సమాధానం చెప్పలేదు. అతనికి గట్టిగా సమాధానం చెప్పాలని ఉంది కానీ ఎలా చెప్పాలో తోచలేదు. _ “మనలో మనమాట ! మీ ఆవిడవిడాకులిస్తానని బెదిరిస్తే నువ్వేం భయపడకు. నా దగ్గరకు వచ్చేయ్ ! నేను నిన్ను ఉంచుకుంటానులే' ఫక్కున నవ్వింది. రాకేష్ ఆవేశంతో తరుణ చెంపమీద కొట్టాడు. తరుణ ఒక్కసారిగా తెల్లబోయింది. “మగాడంటే ఆంత చులకనా? మేము తలచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలము. మేము సహనం వహించేది మీకు భయపడీ కాదు, మీరేదో మాకన్నా గొప్పవాళ్ళనీ కాదు. పూర్వం మా పెద్దలు చేసిన పొరపాట్లను, వారు చూపిన అహంభావాన్ని పునరావృత్తం చేయకూడదనీ, సృష్టిలో ఆడా, మగా సమానమేననీ, ఒకరు ఎక్కువా, ఒకరు తక్కువా అన్న తేడా లేదనీ మా తల్లిదండ్రులు మాకు చిన్నప్పటి నుండి నేర్పించారు. పుట్టేది ఆడపిల్ల అయినా, మగపిల్దాడైనా అబార్షన్ చేయించుకోకుండా ఒకరిదరుతో సరిపెట్టుకుంటే ఏ సమస్యలూ వుండవని నా వుద్దేశ్యం” రాకేష్ ఆవేశంగా చెబుతుంటే అందరూ వింతగా చూస్తుండిపోయారు. వెంటనే సంతోషంతో చప్పట్టు కొట్టారు. అయితే తరుణ నవ్యతో ఏం చెప్పిందో తెలీదు. నవ్య ఆ తర్వాత “ఎప్పుడూ డబ్బు తెమ్మని భర్తని పుట్టింటికి పంపలేదు. మార్తాండం కూడా అల్లుడిని ఏమీ సాధించకపోవడమే కాక వంటకి వంటమనిషిని ఏర్పాటుచేశాడు. న నవ్య నెల తప్పిందన్న శుభవార్త తెలియగానే ఇంట్లో అందరూ చాలా సంతోషించారు. రాకేష్ తల్లిదండ్రులూ, తమ్ముడూ కూడా వచ్చారు. నవ్య స్కానింగ్ చేయించుకొని, ఆడో, మగోతెలుసుకోవాలని ఉందంది. రాకేష్ ఒప్పుకోలేదు. అడ్జైనా, మగైనా ఒకటే అయినప్పుడు స్కానింగ్ అవసరం వీముందని అన్నాడు. ఇంట్లో అందరూ అందుకు ఒప్పుకోవడమే కాక అతని మాటలకి అభినందించారు. నిజమే ప్రతి ఒక్కరూ ఆడా, మగా అని చూడకుండా, ఒకరిద్దరితో సరిపెట్టుకుని, ఇద్దరూ సమానమేనన్న దృక్సధం ఏర్పరచుకుంటే ఇన్ని కట్టాల చావులూ, అత్యాచారాలు, శిశు హత్యలు వుండవుకదా! వేలకొద్దీ ఉపన్యాసాల కన్నాఒక ఆచరణ మంచిదన్న" మహాత్ముని మాటల్లో ఎంత సత్యం వుంది | ఈఅ€లఅ
నోమంచి ఉషారాణి తం బెటర్ వోఫ్ బెటర్ హాఫ్ అఆ ఆయు ఉద్టి ఛీ! ఇంత దుర్మార్గమా? హవ్వ!”
“వేను ఇలాంటిదేదో జరుగుతుందని ఎప్పుడో అనుకున్నాను”
“అవును, ప్రతిరోజూ ఏదో ఓ గొడవ వినబడుతూనే ఉండేది”
“పైకి చూడు నంగనాచుల్లా ఎలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారో[”
“ఇలాంటి వాళ్ళను నిలువునా కాల్చివేయాలి”
“ఏంచేస్తే మాత్రం ఏం లాభమమ్మా? పోయిన మనిషి తిరిగొస్తుందా?"
“పోయిన మనిషి రాకపోయినా మరొకరైనా అలా చేయకుండా ఉంటారని”
నిజానిజాలు తెలియకుండా, కనీసం తెల్ప్సుకోవాలన్న (ప్రయత్నమైనా చేయకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరికి తోచింది వాళ్ళు అంటూన్నారు. మహిళా సంఘాలు తమ కర్తవ్యం గుర్తువచ్చినట్టు ఆవేశంగా చిందులు తొక్కాయి. పత్రికలు రకరకాల కధలల్టాయి. పోలీసులు ఇంట్టో వాళ్ళను అరెస్టు చేయబోయారు.
“సార్!” రవితేజ గుండెనిబ్బరం చేసుకొని ముందుకు వచ్చాడు. “ఈ హత్యకూ, మా ఇంట్టోవాళ్ళకూ ఏ సంబంధమూ లేదు. నిజానికి హత్యకూడా కాదు. పారపాటున జరిగినది అని చెప్పినా ఎవరూ నమ్మే స్థితిలోలేరు. అందుకు పూర్తి బాధ్యత నేను వహిస్తున్నాను. నన్ను అరెస్టు చేయండి. మావాళ్ళకి ఇందులో ఎటువంటి జోక్యమూ లేదు”
అతని మాటలు విన్నవాళ్ళందరూ కల్లబొల్లి కబుర్లని మూతి తిప్పారు ఒక్క జర్నలిస్టు శ్రావణి తప్ప. ఎందుకంటే రవితేజ ఒకప్పటి ఆమె క్లాస్‌మేట్ కనుక. అతనంటే పడిచచ్చేవాళ్ళలో ఆమె ఒకతె కనుక | అతని సంగతీ, స్వభావమూ పూర్తిగా తెలుసు కనుక అతని మాటలు నమ్మింది.
పోలీసులు శవాన్ని పోస్టుమార్టమ్‌కి పంపించారు. గ్యాన్‌స్టవ్‌కి చీర అంటుకుని మరణించినట్టు నిర్దారణ అయింది. ఇంట్లో రోజూ గొడవలు వినబడేవని చుట్టపక్కలవాళ్ళు చెప్పారు. అవి ఎలాంటి గొడవలో, ఎవరివలన జరిగాయో ఎవరికీ అక్కరలేదు. వీటికితోడు మహిళా సంఘాల ఉద్రేకం! అన్నిటినీ మించి తనకిక్కడ సుఖం లేదనీ, ప్రతిక్షణం కట్నం ఎక్కువ ఇవ్వలేదనీ, అవి తేలేదు, ఇవి తేలేదు అని ప్రతిరోజూ కాల్చుకుతింటున్నారనీ తన భర్తకి లేని వ్యసనం లేదనీ, తనకి డబ్బు అవసరం అని కూతురు [వ్రాసిన ఉత్తరాలు ఆమె తల్లిదండ్రులు చూపించారు.
ఈ సాక్ష్యాలకు తోడు ఇంట్లో వాళ్లు నిమ్మకు నీరెత్తినట్టు గమ్మున ఊరుకోవడమే ఆ సాక్ష్యాలని మరింత బలపరిచాయి. రవితేజ కూడా తనని తాను రక్షించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. తాను ఏరికోరి ఇష్టపడి పెళ్ళి చేసుకొన్నందుకు ఇది తగిన శిక్ష
నోమంచి' ఉషారాణి వ్0 బెటర్ వోఫ్ మనిషి ఒరటరిగా - ఉన్నప్పుడు, అతన్ని గతం జ్ఞాపకాలూ, ఆలోచనలు వేధించుకుతినడం సహజమే 1! అలాగే రవితేజ ఆలోచనలు కూడా గతంలోకి జూరుకున్నా, అప్పటికప్పుడు జరుగుతున్నట్టు అన్ని సంఘటనలూ కళ్ళముందు ప్రత్యక్షమైనాయి. (ఏయ్ పావనీ 1 ఇదేమిటే సడన్‌గా ఇంత తేజస్సు ఎక్కడినుండి వస్తోంది?” రవితేజ రావడం చూసి ఏమీ ఎరగనట్టు అంది కావేరి. “ఏమి తేజస్సులే? ఒట్టి దద్దోజనం. చదువుతప్ప ఏమీ అక్కరలేదు. ఓ సినిమాలా? షికారా ? అమ్మాయిలా అల్లరా* సుధ వ్యధ. “మరే. రుష్యశృంగుడు. ఇంతమంది అమ్మాయిలు ఆరాధిస్తున్నా ఏమీ పట్టదు. ఇంతకన్నా ప్రవరాఖ్యుడే నయం” మరో వరూధిని నిట్టూర్పు. “ఏం పావనీ 1 నువ్వేం మాట్టాడవేం?” కావేరీ అంది. “చూస్తూ ఉండండి! ఆ ప్రవరాఖ్యుణ్శి నా కాళ్ళమీద పడేలా చేస్తాను. (ప్రేమా, పెళ్ళీ అంటూ నా వెంటపడేలా చేస్తాను. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాను” పావని దృఢంగా చెప్పింది, పావని ఉద్రేకం చూసి మిగతా అమ్మాయిలు కొంచెం ఆశ్చర్యపోయారు. అదంత సులభం కాదని గేలిచేసి పందెంకూడా కట్టారు. దానితో పావనిలో పట్టుదల పెరిగింది పక్కనే కూర్చుని వాళ్ళ మాటలు విన్న (శ్రావణి పావని మాటలకు భయపడింది. ఆమెకెందుకు అంత ఉద్రేకమో ఊహించలేకపోయింది. పావనితో స్నేహంచేసి అసలు విషయం తెలుసుకోవాలనుకుంది. రవితేజని ఆరాధించే అమ్మాయిల్లో శ్రావణికూడా ఒకతె కావడంవల్ల అతని జీవితం సుఖ సంతోషాలతో వర్చిల్హాలని కోరుకుంద్! పావని చదువులో గొప్పతెలివైనది కాకపోయినా మిగతా విషయాల్లో చాలా అ(్రమత్తంగా ఉంటుంది. అందుకే ఆమె మనసులో ఉద్దేశ్యమేమిటో ఎవరూ తెలుసుకోలేకపోయారు. పావని ఒకరోజు రవితేజ బుల్లెట్‌మిద వస్తుంటే అతనికి అడ్జ్డువెళ్ళింది. ఫలితంగా రోడ్డుమీద పక్కకి పడిపోయింది. దెబ్బలు బాగానే తగిలాయి. రవితేజ దృష్టిలో పడాలన్నా, అతనికి తనమీద అభిమానం ఏర్పడాలన్నా ఆమెకు అంతకంటే మార్గం కనిపించలేదు.
పావని ఊహించినట్టే రవితేజ కంగారుగా బుల్లెట్‌దిగి ఆమెను లేవదీశాడు. ఆమె అందానికిఅచ్చెరువాందడమేకాక ఆమె స్పర్శ అతనిలో స్పందనలు కలుగజేసింది. తనవలన దెబ్బలు తగలడం వలన బుల్లెట్‌మిద కూర్చోబెట్టుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కట్టు కట్టించాడు. ఆ సాన్నిహిత్యం అతనిలో మరింత అలజడిని రేపింది.
ప్రతిరోజూ ఆమెకోసం ఎదురుచూడటం, సరదాగా మాట్టాడటం, ఆమెకోసం, అమె తీయని నవ్వుకోసం. ౯
విశాలమైన కనుదోయిలో తన ప్రతిబింబం కోసం తపించేవాడు. ఇద్దరిదీ ఒక (గ్రూపు కాకపోవడం వలన ఆమె వచ్చేవరకూ నిరీక్షించేవాడు. ఆమె కనిపించని రోజు అతనికి ఏం
హి ఎవిస్టై
నోమంచి ఉషారాణి ర్ (౫ కట %6, ల! ఫ్ తోచేది కాదు. సెలవురోజుల్లో కూడా ఎక్కడో వై బైవపకాతోకన ననాడూ హద్దుమీరి ప్రవర్తించలేదు. నామ టా
తనమాట నిలబెట్టుకున్నందుకు ఫ్రెంజ్స్‌దగ్గర గర్వంగా ఫీలయ్యేది పావని. కానీ రవితేజ (ప్రేమిస్తున్నంత నిష్కల్మషంగా పావని అతన్ని (ప్రేమించటం లేదని శ్రావణి (గ్రహించింది. కారణం తెలియకపోయినా ఆమె మనసులో ఏదో ఉందని మాత్రం ఊహించింది. కానీ ఆ విషయం రవితేజకి ఎలా చెప్పాలో అర్హం కాలేదు ఫలానా కారణం అని తనకు తెలియదు. అసలు చెప్పినా రవితేజ నమ్ముతాడని నమ్మకం లేదు. ఏది ఏమైనా అతను సుఖంగా ఉంటే అంతే చాలు. డిగ్రీ అయ్యాక తన ఆశయం మేరకు జర్నలిస్టుగానే తన (బ్రతుకు గడిచిపోతుంది. తన మనస్సులో వేరొకరికి స్టానం లేదు. నిశ్చయించుకుని తన మూగ (ప్రేమకు మూగగానే కన్నీరు తుడుచుకుని తన చదువులో పడిపోయింది శ్రావణి,
చదువు అవగానే తండ్రి పలుకుబడితో రవితేజకు ఉద్యోగం దొరకడం, అతను కోరుకున్న పావనితో పెళ్ళి జరగడం వరుసగా జరిగిపోయాయి. పెళ్ళి అనేది ఎవరు, ఎందుకు ఎలా చేసుకున్నా అది కొందరి జీవితాల్లో సుఖసంతోషాలని తెచ్చిపెడితే, మరికొందరి జీవితాల్లో విషాదాన్నే మిగిలిస్తుంది. జీవితమన్నాక కష్టసుఖాలు తప్పవు. జీవితంలో పెళ్ళి అనేది ఒక లాటరీ. అదృష్టవంతులకి అది ఒక వరమైతే దురదృష్టవంతులకు అదొక శాపం ! జీవన్మరణ సమస్య.
రవితేజ కట్నం వద్దనీ, తనకేమీ ఇవ్వనసరం లేదనీ మనస్పూర్తిగా పావనిని ఇష్టపడి పెళ్ళిచేసుకున్నాడు. కానీ ఆ విషయం ఒక్క పావనికే తెలుసు. ఆమె తన తల్లిదండ్రులతో రవితేజ కట్నం చాలా అడిగాడనీ, కనీసం లాంఛనాలైనా జరపమన్నాడనీ చెప్పింది. అందుకే ఆమె తల్లిదండ్రులు తమకున్నంతలో లాంఛనాలు ఇచ్చి, పెళ్ళి ఘనంగానే చేశారు. కూతురు అల్టుడికేదో సర్దిచెప్పిందని సంబరపడ్డారు. పెళ్ళయ్యాక కొడుకు దగ్గరకు మరో ఊరు వెళ్లిపోయారు.
ఇవేమీ తెలియని రవితేజ, అతని తల్లిదండ్రులు ఏదో వాళ్ళకున్నది పెట్టుకున్నారులే, మనమేమీ అడగలేదు కదా అని సర్షిచెప్పుకున్నారు. వాళ్ళది మంచీ, మర్యాదా కలిగిన సంస్కారమైన కుటుంబం, అనవసరంగా ఒకరి జోలికి వెళ్ళక, పరాయి. వ్యవహారాల్లో తలదూర్చక తోమేదో, తమ పనేదో అన్నట్టుగా ఉన్నాకూడా ఈ సంఘం సహించలేదు. అటువంటి వారి విషయంలో ఎప్పుడు అవకాశం వస్తుందా, తాొముకూడా ఒక రాయి విసిరి, కసి తీర్చుకుని, కడుపుమంట చల్దార్చుకుందామా అని ఎదురుచూస్తుంటారు కొందరు.
పెళ్ళయిన మొదటిరోజునుండీ పావని ముభావంగా ఉండసాగింది. కొత్తచోటు సిగ్గనుకున్నారు. అంతవరకూ సరదాగా ఉన్న పావని ఎందుకింత మూడీగా మారిపోయిందో రవితేజకి అంతుబట్టలేదు. ఆమెకిష్టంలేకుండా తాకితే ఎక్కడ నొచ్చుకుంటుందోనని బాధపడే సున్నిత మనస్కుడు. అతని ఆ మనస్తత్వం ఆమెకి మంచి అవకాశంగా మారింది.
“ప్రావనీ! కొన్నాళ్ళు హనీమూన్ అలా ఎక్కడికైనా తిరిగొద్దామా?' అలాగైనా ఆమె
నోయంటి ఉత్తారాణ 52 బెటర్ వోఫ్ నన ననన సంతోషపడితే చూడాలని రవితేజు ఆ
“నాకు ఎక్కడికీ రావాలని లేదు. నేను కూడా ఉద్యోగం చేస్తాను” అంది గబగబా!
“ఒకే పావనీ! అప్లికేషను పెట్టు. కానీ పావనీ నువ్వెందుకు అలా దూరంగా... నేనంటే ఇష్టంలేదా? ఈ పెళ్ళి ఇష్టంలేదా?” సూటిగా అడిగేశాడు.
“నాకసలు పెళ్ళన్నా, మగాళ్ళన్నా ఇష్టంలేదు” నిశ్చలంగా చెప్పింది.
“పావనీ”! హతాశుడైనట్టు చూశాడు రవి. “మరి.....”
“మీరే నాకిష్టం లేకపోయినా నా వెంటబడ్డారు. (ప్రేమా, పెళ్ళీ అంటూ నన్ను వేధించుకుతిన్నారు” పావని ఏడుస్తూ చెప్పింది.
రవితేజకి ఇది ఇంకొక షాక్! "సారీ పావనీ! నీ మనసు తెలుసుకోలేకపోయినందుకు ఐయామ్ ఎక్స్‌టట్రీమీలీ సారీ! నీకిష్టం లేకుండా నిన్ను తాకను. ఏం చేసినా ఇదేమని అడగను. యూ లివ్ యాజ్ యు లైక్” సున్నిత మనస్కుడైన రవితేజ హృదయం దెబ్బతింది.
అతను మనసును రాయి చేసుకుని ఒకరోతి మనిషిలా మిగిలిపోయాడు.
పావని కసితీరా నవ్వుకుంది. రవి జీవితంలో చీకటి నింపటంతో ఆమె కసితీరలేదు. ఆ చీకటి ఆ ఇల్లంతా వ్యాపించింది.
“ఛిలి! ఇదేం వంట ? ఇందులో ఉప్పూ లేదు. కారం లేదు, ఈ తిండి గొడ్డుకూడా తినవు” భర్తా మామగారూ ఎదురుగా ఉన్నా అత్తగారి వంటను ఛీత్కరించేది.
“ఈ వస్తువు ఇలా పెట్టావు. అక్కడ తుడవలేదు. ఇక్కడ నీట్‌గా లేదు' అంటూ నౌకరుమీద ఎప్పుడూ అరుస్తూ ఉండేది.
"పోనీ నా వంట నచ్చకపోతే నువ్వుచేసి పెట్టరాదమ్మా! నాకు కొత్త రకాలు తెలియవు” అత్తగారు నవ్వుతూ అడిగేవారు.
“అవునమ్మా! ఈ పాత వంటలు తినితిని విసుగొచ్చింది. నువ్వయినా (క్రొత్త రకాలు చేసి పెడితే తినాలని వుందో మావగారు ఆశగా అన్నారు.
“నేనేం వంట మనిషిననుకున్నారా ? నేనేం గతిలేక ఈ ఇంటికి రాలేదు. మీ అబ్బాయి కాళ్ళావేళ్ళా పడితే సరేనన్నాను” అతిశయంగా అనేది. కొడుకు ముఖం తల్లిదండ్రులూ, తల్లిదండ్రుల ముఖం కొడుకూ చూడలేక తలదించుకునేవారు.
“ఏం ఉన్నమాట అన్నాననిబాధగా ఉందా?” అని కవ్వించేది. వాళ్ళు అన్నం మధ్యలో చేయి కడుక్కుని లేచిపోతే తృప్తిగా నవ్వుకునేది.
“ఏందమ్మా ప్రతి పనికీ వంకలెడతావు. ఇన్నాళ్ళు పనిచేస్తున్నా! ఒక్కనాడూ నన్ను ఎవరూ పల్లెత్తుమూటనలా ! అంతగా అయితే నువ్వే సర్దుకో” అన్నాడు ఒకరోజు విసురుగా నౌకరు. రోజూ అంటుంటే విసుగెత్తడం సహజమే | అందులో ఇంత మంచి మనసుల మధ్యఅలాంటి తిక్కమనిషి ఉండటం తులసి వనంలో గంజాయి మొక్కలా కోపంగా వుంది
ఆ నౌకరుకి,
“నన్నంత మాట అంటావుట్రా ! గెటవుట్!” అని ఆ నౌకరుని ఒక తోపు తోసింది పావని.
సోమంచి ఉషారాణి 53 బెటర్ వోఫ్
“పావనీ! వాడితో నీకెందుకమ్మా? నేను శుభ్రంగా సర్జుతాలే” అంది అత్తగారు. గొడవలు, అరుపులు, కలతలు, కన్నీళ్ళు ఎరుగని మంచి మనసు ఆమెది. సర్దుకుపోయే మనస్తత్వం.
“మావగారూ! చూశారా వాడి తలబిరుసు? వాడిని ముందు బయటికి పంపించండి” సోఫాలో పేపరు చదువుతున్న మావగారి దగ్గరకు వచ్చి దురుసుగా అంది.
“వాడు ఇన్నాళ్ళూ ఈ ఇంటినే నమ్ముకుని పనిచేసే నమ్మకస్తుడమ్మా! నేను మందలిస్తాలే!” మావగారు సర్రిచెప్పబోయారు.
“విల్లేదు! ఈ ఇంట్లో వాడైనా ఉండాలి, నేనైనా వుండాలి. ఏవండీ! మాట్లాడరేం? ఇలా అవమానించడానికేనా నన్ను పెళ్ళి చేసుకుంది” మెట్టమీద నిలబడి చూస్తున్న భర్తని నిలదీసింది.
“అదేమోగానీ నేను అవమానింపబడడానికి చేసుకున్నాను” మనసులోనే అనుకుని, “సారీ పావనీ! వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఈసారికి క్షమించేయి. మరోసారి ఇలా జరగదు” అనేసి బయటకు వెళ్ళిపోయాడు. పావనికి తృప్తి కలగలేదు కానీ అప్పటికి ఊరుకుంది.
కొడుకు టిఫిన్ అయినా తినకుండా త్వరగా ఆఫీసుకు వెళ్ళడం, రాత్రి పొద్దుపోయి రావడం అతడి జీవితంలో సుఖం లేదని తెలుసుకోవడానికి ఆ తల్లిదండ్రులకి ఎన్నాళ్లో పట్టలేదు. లోలోపలే కుంగిపోయారు.
ప్రతిరోజూ ఏదో వంకన అరిచిగొడవచేసి ఇరుగుపొరుగువారి కడుపుమంటచల్టార్చింది. అటు ఆఫీసు పనిలో మునిగిపోయిన రవిని చూసి కొలీగ్స్ విస్తుపోయేవారు. కొత్తపెళ్ళికొడుకు, రంభలాంటి బెటర్‌హాఫ్‌నుంచుకొని ఇలా ఉన్నావేమిటి?' అని అడిగితే 'బెటర్ హాఫ్! హు' అని విషాదంగా నవ్వుకునేవాడు.
శశ ర
కోర్టులో కేసు జరిగింది. జడ్జి తీర్పు చెప్పబోయేంతలో శ్రావణి 'ఆగండి' అంటూ కోర్టులో ప్రవేశించింది. అందరూ ఉత్కంరగా చూశారు.
శ్రావణి బోను ఎక్కి, ఒక డైరీని జడ్జిగారికిమ్మని ఇచ్చింది. అందులో కొన్ని పేజీలు గుర్తుపెట్టింది. 'మా అత్తయ్యంటే చిన్నప్పటినుండీ నాకెంతో అభిమానం. నన్ను ప్రాణంగా చూసుకునేది. మా అమ్మకన్నా ఎక్కువగా నేను కోరినవన్ని కొనిపెట్టేది. అటువంటి అత్తయ్యని పెళ్ళయ్యాక భర్తా మావగారు, అత్తగారు కట్నం చాలలేదనీ, పుట్టింటినుంచి అవి తెమ్మనీ, ఇవి తెమ్మనీ కొట్టి తిట్టి హింసించేవారు. మా నాన్నకూడా అంత డబ్బున్నవాడు కాదు. వాళ్ళ కోరికలన్నీ తీర్చలేకపోవడంతో మా అత్తయ్యని వాళ్ళు, ఆ నరరూప రాక్షసులు కిరసనాయిలు పోసి తగులబెట్టారు. అందుకే నాకు భర్తలన్నా, అత్తమమలన్నా కసి 1 నేను కూడా పెళ్ళిచేసు కుని నా కసి తీర్చుకుంటాను. రవితేజ! అవును రవితేజ వాళ్ళ బంధువేనట! అందుకే అతన్ని
సోమంచి ఉషారాణి 54 బెటర్ హోఫ్
చేసుకొని... అలాఅలా చాలాచోట్ల ఏదేదో (వ్రాసింది. పావని తల్లిదం[డ్రులకి వాళ్ళు తనను
ఎన్నో కష్టాలు పెడుతున్నట్టు, సాధిస్తున్నట్టు హింసిస్తున్నట్టు పండుగలకి పంపనట్లు
ఉత్తరాలు [వ్రాసేదాన్ననీ, వాళ్ళని రావద్దనీ, ఒకవేళ నేను ఏ కారణంగాకనైనా చచ్చిపోతే
అందుకు భర్తా అత్తా మామగారే కారణమని తల్లిదండ్రులకి వ్రాసినట్టుగా, (ప్రతి విషయం
ఆ డైరీలో (వ్రాసుకుంది. అందులో ఏముందోనని జడ్జిగారికేసి ఆతృతగా చూడసాగారు. “ఈ డైరీ నీకెక్కడ దొరికింది?” శ్రావణిని అడిగారు.
"నేను ఒకరోజు రవితేజ నిర్జోషి అని రుజువుచేసే రుజువు కోసం వాళ్ళింటిఇళ్ళినపుడు”
“అతడు నిర్దోషి అని నువ్వు ఎందుకనుకున్నావు?”
“ఒకానొకప్పుడు అతన్ని ఆరాధించిన దాన్ని కాబట్టీ, అతని మనస్తత్వం నాకు పూర్తిగా తెలుసుకాబట్టి”.
“ఈ డైరీవలన అతన్ని నిర్దోషిగా నిరూపించడానికేముంది?”
“ఒకటి! ఆమె మెంటాలిటీ, అత్తమామలను, భర్తను ఎలా హింసించిందీ తెలుస్తోంది. రెండు ఆమెది ఆత్మహత్యేకాని, హత్య చేయబడలేదనడానికి రుజువు దొరికింది”
“ఏమిటి?” కేసు కొత్తమలుపు తిరిగేసరికి అందరూ ఉత్సాహంగా చూడసాగారు. రవితేజ శ్రావణిని తెల్లబోయి చూస్తున్నాడు.
“ఈ కాసెట్ అందించింది (శ్రావణి.
ఆరోజు ఉదయమే టేప్ రికార్డులో సుప్రభాతం రికార్డు అవుతోంది. అదయ్యాక అత్తగారితో అప్పటికే గొడవపడుతున్న పావని మాటలు ఖాళీగా ఉన్న ఆ కాసెట్‌లో టేప్ అయ్యాయి.
“మ్సికెవ్వరికీ నేనన్నా, నా మాటన్నా లక్ష్యం లేదు. నేను చచ్చాక అప్పుడు వరకట్నం కేసని మిమ్ముల్నందరినీ జైల్లో పెడతారు. తగిన సాక్ష్యాలు మా వాళ్ళదగ్గరున్నాయి” అంతవరకే ఉంది. ఆ తరువాత వంటింటి తలుపేసుకుని గ్యాస్‌నాబ్ ఓపెన్ చేయడం, ఇంట్లోవాళ్ళు అరిచినా తలుపు తీయకపోవడం పావని అత్తగారు చెప్పినవన్నీ చెప్పింది (శ్రావణి కోర్టులో. వాటి సాక్ష్యంతో కేసు కొట్టేశారు. రవితేజ కృతజ్ఞతతో చూస్తే, (శ్రావణి అతన్ని తన గుండెల్లో దాచుకుంది. “బెటర్ హాఫ్” అంటే ఇలా ఉండాలి అనుకున్నాడు రవితేజ. అంతకు ముందు 'వర్స్‌హాఫ్'ని తలుచుకుని.
(ఆంధ్రభూమి వీక్షీ అతల అ
సోమంచి ఉషారాణి 55 ప్రమాణం క్రుమాణం ఆలో కర్ నాజు క ప్రకాష్ సైక్రియాట్రిస్టు.
బోర్డు చదివి మెల్లగా లోపలికి అడుగుపెట్టాడు వాసు. లోపల జనం ఎవరూ లేరు. డాక్టరు ఏదో మేగజైన్ తిరగేస్తున్నాడు.
“యే ఐ కమీన్”
“యస్. కమిన్! సిడౌన్! వాటీజ్ ద మేటర్?” డాక్టర్ కుతూహలంగా అడిగాడు చేతిలోని పుస్తకం పక్కన పడేసి.
వాసు కాసేపు తటపటాయించాడు. చివరకు చెప్పాడు.
“నేను చదువు, ఆటలు తప్ప దేనిమీదా శ్రద్ధ చూసేవాడిని కాదు. ముఖ్యంగా అమ్మాయిలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా చాలా భయపడేవాడిని. మా స్నేహితులు ఎప్పుడూ అమ్మాయిలగురించి మాట్లాడేవారు. వాళ్ళని రకరకాలుగా వర్షించి ఏడ్పించేవారు. 36-26-36, 38-28-40 ఇట్టా ఏవేనో చెప్పుకునేవారు. ఇద్దరు, ముగ్గురైతే అమ్మాయిలతో తమకున్న అనుభవాన్నికూడా చెప్పేవారు.”
వాసు కాసేపు ఆగాడు. డాక్టర్ ఇంటరెస్టింగ్‌గా వింటున్నాడు.
“కొన్నాళ్ళు తరువాత నాకూ ఆ అనుభవం గురించి తెలుసుకోవాలనిపించింది. అందుకు ప్రయత్నం కూడా చేశాను. కానీ నా వలన ఏమీ కాలేదు. ఏదో కంగారు, భయం, ఆ అమ్మాయి గేలి చేసి పంపేసింది. నేను నిజంగానే అందుకు పనికిరానేమో అన్నభయం పట్టుకుంది. 'పెళ్ళయితే స్వంత భార్యే కనుక ఇటువంటి కంగారు ఉండదని మా ఫ్రెండ్స్ అనడంతో పెళ్ళి చేసుకున్నాను. కానీ.. కానీ మా వైవాహిక జీవితం మరో మలుపుతిరిగింది.”
బాధతోనో ఆవేదనతోనో అతని గొంతు పూడుకుపోయింది.
“ఏం జరిగింది? ఫరవాలేదు చెప్పండి” డాక్టరు అడిగాడు.
వాసు ఆనాటి సంఘటనను చెప్పసాగాడు,
ప
తెల్లచీరా, తలనిండా మల్లెపూలు, చేతిలో పాలగ్గాసు, రంగు తక్కువైనా రమ్యంగానే కనిపించింది రమ్య నా కంటికి. అందుకేనేమో 'తావలచింది రంభ" అంటారు. నాకసలే బిడియం, దానికి తోడు రమ్య పాలగ్గాసు టేబులు మీద ఫలహారాలు 'ప్రక్కనపెట్టి, అటు తిరిగి మంచం మీద పడుకుంది. న
సోమంచి ఉషారాణి 56 వ్రమాణం సిగ్గుపడుతోందేమోనని నేనే చొరవ చేసి దగ్గరకు వెళ్ళి, “రమ్యా” అని భుజం మీద చేయి వేశాను.
నా చేయి విసిరికొట్టి “నా కసలు పెళ్ళన్నా, మగాళ్ళన్నా అసహ్య” అంది అసహ్యాన్నంతా తన ముఖంలో చూపిస్తూ
“ఏమిటి రవ్యూ! జోక్ చేస్తున్నావా?” అన్నాను మళ్ళీ చేయివేసి.
“నేను నిజమే చెబుతున్నాను. నన్ను ముట్టుకోవద్దు” అంది చిరాగ్గా.
“ఎందుకని?” సౌొమ్యంగానే అడిగాను.
“కారణం అనవసరం, నాకిష్టం లేదు. అదంతే!” లేచి కూర్చుని విసురుగా అంది రమ్య,
“మరైతే పెళ్ళెందుకు చేసుకున్నావు?” ఆశ్చర్యంగా అడిగాను.
“వద్దన్నా మా వాళ్ళు నా బరువు దింపుకోవడానికి పెళ్ళిచేశారు” రెండు మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని ఏడవసాగింది.
నాకు ఏం చేయాలో తోచలేదు నాలో అసహనాన్ని అణచుకుని, వేదాంతిలా నవ్వుకుని, “పోనీలే బాధపడకు రమ్యా! నీకు ఇష్టం లేకుండా నిన్ను ముట్టుకోనులే” అని ఇటు తిరిగి పడుకున్నాను.
రమ్య దుఃఖాన్ని దిగమింగుకుని, కళ్ళు తుడుచుకుని హాయిగా ని(ద్రపోయింది. నాకు మాత్రం నిద్రరాలేదు.
“ఏమిటిది నాకేనా ఇలాంటి అనుభవం? అందరికీ అంతేనా? పోనీలే క్రొత్త గనుక భయపడుతోందేమో! నాలుగు రోజులైతే తనే దగ్గరకు వస్తుంది” అనుకుని నిద్రకుప'క్రమిం చాను.
నాలుగు రోజులు కాదు నెలరోజులైనా తన వైఖరిలో మార్చు రాలేదు. నాకు కావలసినవి అన్నీ అందిస్తుంది. ఇంట్లో అందరితోనూ మామూలు గానే మాటొడుతుంది. ఎన్నాళ్ళెనా మీద చేయివేస్తే మాత్రం కసిరిగొడుతుంది. నాలోనూ సహనం నశించింది.
ఎంతో సరదాగా సినిమాలూ, షికార్లూ తిరగవలసిన మేము ముభావంగా ఉండడం ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చింది. అమ్మ నన్ను అడగనే అడిగింది. ఉన్న విషయం చెప్పేశాను. అమ్మ ఆశ్చర్యపోయింది. అవేశపడింది. బాధపడింది. మా నాన్నగారితో చెప్పినట్టుంది. ఆయన మీ దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చారు”.
తాను చెప్పదలచుకున్నది చెప్పేసి దీర్జంగా నిట్టూర్యాడు వాసు. “డోంట్ వర్రీ మిష్టర్ వాసూ! కొాంతము వ వ్ 0దికి ఆవిషయంలో అసహ్యం, అపోహ ఏదో కారణం ఉంటుంది, అటువంటి వాళ్ళని విసుక్కునీ, అవేశపడీ వారి అపోహను పెంచక, (ప్రేమతో, ఆప్యాయతతో మాట్లాడుతూ, అమెకు నచ్చేట్టుగా ప్రవర్తిస్తే కొంత వరకు మారవచ్చు. ఎనీహౌ ఆమెను ఒకసారి నా దగ్గరకు తీసుకువస్తే నేను చెప్పవలసింది చెప్పి, నా ప్రయత్నం నేను చేస్తాను. సో బెటర్‌లక్ష్!* నవ్వుతూ షేకొహీండ్ ఇచ్చారు డా. (ప్రకాష్
సోమంచి ఉషారాణి 57 ప్రమాణం వాసు ఆయన ఫీజు చెల్లించి బయటపడ్డాడు. స్వీట్టు పళ్ళు, పూలు కొనుక్కొని ఇంటికి వచ్చాడు. రమ్య హుషారుగా తన బట్టలు సర్దుకుంటోంది. వాసుని చూసి. “మా అన్నయ్య పెళ్ళికి వారం రోజులు ముందే రమ్మని నాన్నగారు ఉత్తరం (వ్రాశారండి. రేపే బయలుదేరుతున్నాను'
- అంది అడగకుండానే. వాసు నవ్వుకున్నాడు. ఈ ఆడవాళ్ళకి పుట్టిల్లంటే ఎంత మమకారమో![” తను తెచ్చినవి అమె చేతిలో పెట్టాడు. వాసు స్నానం చేసి వచ్చాక ఇద్దరూ భోజనం చేశారు. అప్పుడు కూడా ఏవో పుట్టింటి సంగతులు చెబుతూనే ఉంది రమ్య, “నీకు పెళ్ళన్నా, మగవాళ్ళన్నా అసహ్యం కదా. మరి మీ అన్నయ్య పెళ్ళి?” ఉన్నట్టుండి అడిగాడు వాసు, సడన్‌గా అడిగేసరికి తెల్లటోయింది రమ్యం ముందు అర్ధం కాలేదు. తరువాత అర్థం చేసుకొని “నాకు నా పెళ్ళంటే ఇష్టంలేదు అన్నాను కానీ ఇతరుల పెళ్ళిళ్ళు ఇష్టం లేదనేలేదే!' అంది సమర్చించుకుంటూ,. “ఐసీ! అయితే దురదృష్టవంతుణ్ణి నేనే అన్న మాట!” నిట్టూర్చాడు వాసు. రమ్య అదేమీ పట్టనట్టు “ఇదిగో పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి. ఏవంకో పెట్టి మానేశారో... "వాసు చూపు ఎక్కడ ఉందో చూసి పైట గబుక్కున సరిచేసుకుంది. తలనిండా పూలు పెట్టుకుని, హుషారుగా మాట్లాడుతున్న రమ్యని చూస్తే వాసుకి తనని తాను కంట్రోలు చేసుకోవడం కష్టంగా ఉన్నా అన్నమాట ప్రకారం నిగ్రహంగా ఉండిపోయాడు. స్వీటు పాకెట్ ఓపెన్‌చేసి అతని నోట్లో స్వీటు పెట్టింది రమ్యు స్వీటుతోపాటు రమ్యవేలు కూడా కొరికేసరికి బుంగమూతి పెట్టింది. వాసు చిలిపిగా నవ్వి, తనూ ఒక స్వీటు ఆమె నోటికి అందించాడు. తన వేలు కొరికాడన్న కోపమో, తనూ అతని వేలు కొరికింది రమ్య. “అబ్బా! గబుక్కున వేలు లాక్కుని వాసు ఊదుకుంటుంటే గలగలా నవ్వింది రమ్య, ఆమె నవ్వుతుంటే తన బాధ మర్చిపోయి ఆమెని పరవళంగా చూశాడు వాసు. రమ్య స్వీట్ పాకెట్ మూసేసి, లైటార్చి మామూలుగా అటు తిరిగి పడుకుంది. వాసు మాత్రం ఈ రోజు తన అవేశాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. అలాగని తొందరపడితే మాట తప్పడమే కాక, డాక్టరు గారు చెప్పినట్టు ఆమె ఆపోహని మరింత పెంచినవాడౌతా డేమో! అతికష్టం మీద తనని తాను కంట్రోలు చేసుకుని 'నాతిగల (బ్రహ్మచర్యానికి' తన చురదృష్టాన్ని తానే నిందించుకుని నిద్రలోకి జారిపోయాడు వాసు.
నోమంచి ఉషారాణి 58 ప్రమాణం మర్నాడు పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయింది రమ్య. పెళ్ళినాటికి వాసు కూడా వెళ్ళాడు తల్లిదండ్రులతో సహా, పెళ్ళిలో ఆడపడుచుగా అధికారం చలాయిస్తూ బాగానే తిరిగిందిరమ్య. ఆమె ఫ్రెండ్స్ తననీ, భర్తనీ వేళాకోళం చేసినా నవ్వేసింది. పెళ్ళి ఫోటోల్టో వీడియోలో అంతటా తానే అయింది. భర్త భుజం చుట్టూ చేయి వేసి ఫోటో దిగినా కాదనలేదు కానీ కాస్త ఇబ్బందిగా ఫీలయింది రమ్యం
పెళ్ళి హడావిడి అయ్యాక అత్తారింటికి వచ్చిన రమ్య మామూలుగానే ముభావంగా ఉండడంతో ఒకరోజు డాక్టర్ ప్రకాష్ దగ్గరకి తీసుకెళ్ళాడు వాసు.
“నాకేం జబ్బులేదే ! నన్ను డాక్టరు దగ్గరికి ఎందుకు తీసుకువచ్చారు?” వాసు సమాధానం చెప్పలేదు. మౌనంగా లోపలికి వచ్చారు.
డాక్టరు వాసుకి షేక్‌హేండిచ్చి, “కూర్చోమ్మా! నీ పేరేంటి?” అని మొదలుపెట్టి, అమె చదువు, హాబీలు, తల్లిదండ్రులు, అన్నా చెల్లెళ్ళు, స్నేహితులూ అందరి గురించీ వరసగా ప్రశ్నలు వేశాడు.
మొదట బిడియపడినా, తరువాత వాటన్నింటికి చకచకా, హుషారుగా సమాధానాలిచ్చింది రమ్యం
“నీకు పెళ్ళంటే ఇష్టమేనా?”
“లేదు” అంతలోనే అయిష్టంగో ముఖం పెట్టింది.
“ఎందుకని?”
“ఏమో?”
“ఫరవాలేదు చెప్పమ్మా! ఎందుకిష్టం లేదు? ఏదైనా కారణంఉండాలిగా! చదువుకున్న దానినీ పైగా మంచిదానివి, చాలా బుద్దిమంతురాలివి” రమ్యను (ప్రోత్సహిస్తూ అన్నాడు డా, ప్రకాష్
“ఏమో! నాకు భార్యాభర్తల సంబంధం అంటే ఇష్టం ఉండదు. పైగా అసహ్యం మగవాళ్ళంటే!”
“మరి మీ నాన్నగారూ, అన్నయ్యా, మగవాళ్ళేగా!”
“వాళ్ళు కాదు. బయట మగవాళ్ళు ! పరాయివాళ్ళు”.
“నీ భర్త కూడా పరాయివాడనుకుంటున్నానా?”
“నాకు ఆయన కూడా అందరి మగవాళ్ళలాగే కనిపిస్తారు”
“పోనీ మగవాళ్ళంటే ఎందుకు అసహ్యం? నిన్ను ఏమైనా అన్నారా? ఏమైనా చేశారా?
వాళ్ళంటే అసహ్యమేర్చడడానికి ఏదైనా కారణం ఉండాలిగా!” మొదట చెప్పడానికి తటపటాయించినా డా. ప్రకాష్ ప్రోద్చలంతో తన మనసులోని
సోమంచి ఉషారాడి 5 ప్రమాణం మాట బయటపెట్టింది రమ్య, ఒకసారి వాళ్ళక్కా వాళ్ళింటికి వెళ్ళినప్పుడు బావగారు తాగడానికీ, పేకాటకీ అక్కని డబ్బులివ్వమని వేధించడం, తాగివచ్చి ఆమెని కొట్టడం, రమ్యని అనుభవించాలని (ప్రయత్నించడం అన్నీ చెప్పింది. డాక్టరు తల పంకించి, వాసుకేసి నవ్వుతూ చూశాడు. తరువాత రమ్యకి చెప్పవలసిన నాలుగు మూటలు చెప్పి, బెస్టాఫ్‌లక్ చెప్పి ఇద్దరినీ ఇంటికి పంపించారు. రమ్య పులుకడిగిన ముత్యంలా రమ్యంగా తయారై, ఆ రాత్రి భర్త చెంతకు వచ్చింది. వాసు మామూలుగా ఇటు తిరిగి నిద్రపోయాడు. రమ్యకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. వాసుని హత్తుకుని పడుకుని అతని మీద చేయివేసింది. వాసుకి హాయిగా, సంతోషంగా ఉన్నా కదలలేదు. రమ్య అతనిని తనవైపు తిప్పుకుని ముఖంమీద ముద్దులు కురిపించింది. ఇంక వాసు ఆగలేక పోయాడు. అప్పుడు ఇక వాళ్ళకి పాలు, పళ్ళు, పూలు ఏమీ అక్కరలేదు. ఇన్నాళ్ళూ ఇద్దరూ ఎంత ఆనందాన్ని దూరం చేసుకున్నారో తెలుసుకుని, అందుకు తానే కారణమని క్షమాపణ కోరింది రమ్య. అందుకు వాసు విధించిన తీయని శిక్షలన్నీ భరించింది. అంత హడావిడిలోనూ భర్తని త్రాగుడుకీ, జూదానికీ, దేనికీ బానిస కానని మాట తీసుకోవడం మాత్రం మర్చిపోలేదు రమ్య. మొదటి నుండీ సౌమ్యుడూ, బుద్ధిమంతుడూ అయిన వాసుకి ప్రమాణం చేయడం ఏమంత కష్టం కాలేదు. మొదటిసారి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళిన తన అనుభవాన్ని కూడా నవ్వుతూ చెప్పాడు వాసు. రమ్య ఆ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు సరికదా నవ్వుతూ. వాసు ముక్కుపట్టుకుని ఆడిస్తూ చిలిపిగా అంది. మ “మగవాళ్ళందరూ. తాము అందుకు పనికివస్తారేమోనని ఇలా ('ప్రయత్నిస్త శ్రీరామచంద్రులే ఉండరు లోకంలో. అంతేకాదు. ఆడవాళ్ళు కూడా అదే రూట్‌లో వస్తే మీరేమైపోతారో ప్!” నిట్టూర్చింది. “ఏయ్ నాటీ!” వాసు మొట్టికాయ వేస్తుంటే రమ్య కిలకిలా నవ్వింది. (మయూరి వీక్షీ అఅలఅి
సోమంచి ఉషారాణి 60 ఈ తరం స్తీ వరాల లయలో లరం దం ల్డి ఈతరంస్తి టీ ల మండీ! ఈ రోజు బాబుకి పోలియో(డ్రాప్స్ వేయించాలి.”
“వేయించు. ఆ విషయం నాకు చెప్పటం దేనికి?” అద్దంలో క్రాఫ్ సర్దుకుంటూ చిరాగ్గా అన్నాడు వేణు,
సాయంత్రం కొంచెం త్వరగా ఇంటికి రండి”
“నాకు కుదర్జు. నువ్వు వెళ్ళిరా. నాకు హాస్పిటలూ, మందులూ, ఆ వాతావరణమంటే తగని చిరాకు” సెంట్ ప్రే చేసుకుంటూ అన్నాడు వేణు. శ్రైలజకి భర్త్రమీద కోపం వచ్చింది. అయినా తమాయించుకుంది.
“సరే! ఓ యాభై ఇవ్వండి, నేనే వెళ్ళి వస్తాను” ఉక్రోషంగా అంది.
“డబ్బు కావాలని సూటిగా అడగచ్చుగా! ఈ డొంక తిరుగుడు ఎందుకు? ఇప్పుడు నాదగ్గర డబ్బు లేదు. మళ్ళీ వెల వేయిద్దాంలే!' అని ఆమె సమాధానంకోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోయాడతడు.
శైలజ నిస్సహాయంగా నిలబడిపోయింది. అతని మీదే పూర్తిగా ఆధారపడడం అమెకు బాధనిపించింది. తాను (గ్రాడ్యుయేట్ అయినా ఉద్యోగం చేయాలనే ఉత్సాహం, ఉద్దేశ్యం మొదటినుంచీ లేదు. తానొక సాధారణ ఇల్టాలుగానే మిగిలిపోవాలనుకుంది. అయినా లోకంలో చదువుకున్న వాళ్లందరూ ఉద్యోగం చేయాలంటే అంతమందిక్తీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి ? ఇప్పటికే చాలామంది అవసరం లేకపోయినా ఉద్యోగం చేయటంతో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. హు, పోనీ ఏదైనా కళలో (ప్రావీణ్యత వుందా అంటే అదీ లేదు. అయినా ఈ లోకంలో గృహిణులందరూ తనలాగే బాధ,”
బాబు ఏడుపుతో ఈ లోకంలోకి వచ్చింది శైలజ. బాబుకి పాలుపట్టి, పడుకోబెట్టి ఇల్లంతా వెదికింది. ఏవో చిల్లరడబ్బులు తప్ప సదిరూపాయలు కూడా లేవు. బీరువా తాళంచెవులుకూడా తనతో తీసుకుపోతాడు వేణు. శైలజకీ మనసుకి కష్టమనిపించినా, అది అతనికి మొదటినుంచీ అలవాటని సరిపుచ్చుకుంది. ఎక్కడికక్కడ ఎంత సర్జుకుపోతున్నా
వేణుకు తనన్నా, తన మాటన్నా విలువలేదు. తాను అసాధారణ అందగత్తె కాకపోయినా అందవికారంగా వుండదు. అయినా లోకంలో అందరూ అందమైనవాళ్ళే వుండరు కదా! ఏమిటో రకరకాల మనుషులు' నిట్టూర్చింది.
శశ య
సోమంచి ఉషారాణి 61 ఈ తరంస్తే శోభా! పాపని ఈరోజైనా డాక్టర్‌దగ్గరికి తీసుకెళ్ళావా?” మురళి ఇంటికి వస్తూనే అడిగాడు, “నాకు ఆఫీసులో పని ఎక్కువగా వుంది. చాలా టైరై పోతున్నాను. రాగానే ఇంటిపనీ, వంటపనీ - మీరు తీసుకెళ్ళండి” శోభ విసుగ్గా అంది. “పాపని ఎత్తుకోవడం నాకు సరిగా రాదు. సరే! ఇద్దరం వెడదాం పద! స్కూటర్ మీద వెళ్ళివద్దాం” అన్నాడు మురళి, ఇద్దరూ బయలుదేరారు. “శైలజగారూ! బాబుకి (డ్రాస్స్ వేయించారా?” గుమ్మంలో నిలబడి తమకేసి చూస్తున్న శ్రైలజను పలకరించింది శోభ శ్రైలజ ముఖం చిన్నబోయింది. “లేదండీ! తీసుకెళ్ళాలి. ఆయనకోసం చూస్తున్నా!” అబద్ధమాడేసింది. వాళ్ళు స్కూటర్‌మిద వెళ్ళిపోయాక చక్కగా ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. కలసి పనిచేసుకుంటారు. కలసి తిరుగుతారు. అదృష్టవంతులు' నిట్టూర్చి, బాబుని ఆడిస్తూ అటూ ఇటూ తిరుగుతోంది శైలజ. ణు ఇంటికి ఏరోజూ త్వరగా రాడు. పెళ్ళయిన కొత్తలో అప్పుడప్పుడు త్వరగా వచ్చి ఏ సినిమాకో, షికారుకో, (ఫెండింటికో, హోటల్‌కో తీసుకెళ్ళేవాడు. బాబు పుట్టాకే ఇలా మారిపోయాడు. తాను పురిటికి వెళ్ళినప్పుడు మరెవరి వలలోనో పడలేదుకదా!' అనే అనుమానం వచ్చినా అడిగే ధైర్యం లేదు. అసలా అవకాళం కూడా ఇవ్వడతను. ఇంట్లో పనిసాయం మాట అటుంచి, బాబుని అసలు పట్టించుకోడు. బాబు గుక్కపెట్టి ఏడుస్తున్నా తనమీద చిరాకుపడతాడుకానీ ఎత్తుకోడు. ఆడించడు. ఎంతపని హడావిడిలో వున్నా వదిలేసి రాకపోతే అరుస్తాడు. వాడి ఏడుపూ, ఉచ్చగుడ్డలూ చిరాకని ఎక్కడికీ తీసుకెళ్ళడంలేదు. 'పొడ్దు పోయాక రావడం, నిత్యపెళ్ళికొడుకులా తయారై ఆఫీసుకు పోవడం శైలజకి తలచుకున్నకొద్దీ దుఃఖం వస్తోంది. ఇంటిముందు. ఆటో ఆగింది. ఆటోలోనుంచి దిగిన ఆడపడుచుని సాదరంగా అహ్వానించింది శైలజ. కుళల (ప్రశ్చలయ్యాక అడపడుచు శారద అన్నగారి విషయం ఆరా తీసింది. శ్రైలజకి తెలియకుండానే ఆ మాత్రం ఆప్యాయతకే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. భర్త ప్రవర్తన, బాబుకి పోలియోడ్రాప్స్ విషయం చెప్పేసింది. అలా చెప్పాక ఆమె మనసులోంచి 'ెద్దబరువు దిగినట్లనిపించింది. “వదినా! నీకు ఇన్నాళ్ళూ చెప్పలేదని క్రోపగించుకోకు. అన్నయ్యకు పెళ్ళికాని క్రితమే ఒక అమ్మాయితో స్నేహం వుంది. ప్రేమా, పెళ్ళీ అని గొడవచేస్తుంటే కులంకాని పిల్లను చేసుకోవడం ఇష్టంలేని నాన్నగారు హడావిడిగా నీతో పెళ్ళికుదిర్భారు. వాళ్ళు ఇల్టూ వాకిలీ
నోమంచి ఉషారాణి 62 ఈ తరం స్తీ అంటూ ఆ ఊళ్లోనే వుండడం అన్నయ్యకు అదుపూ, ఆజ్ఞా లేకపోయింది. పెళ్ళయ్యాక మర్చిపోతాడేమో అనుకుంటే ఇంకా మారలేదన్నమాట! సరే, వాడికి బుద్దివచ్చేలా చిన్న నాటకం ఆడదాం. ముందు డాక్టర్ దగ్గరికి పద! (డ్రాప్స్ వేయిడ్దాం. డబ్బు నాదగ్గర వుందిలే” శారద నవ్వుతూ మాట తీసేయబోయినా శారద చెప్పిన విషయం విని శైలజ హృదయం (బ్రద్దలైంది.
“అనుమానించడం వేరు, అనుమానం నిజం కావడం వేరు! తెలిసి తెలిసీ తనను బలిపశువును చేశారంటే తట్టుకోలేకపోతోంది. నాటకాలతో (ప్రేమ పుట్టుకొస్తుందా? కోర్టు సిఫారసులతో కాపురాలు నిలబడతాయా? తన జీవితం చివరకు ఏమి కానుందో?”
“పద వదినా! నువ్వేం బెంగపెట్టుకోకు. అన్నయ్యకు తగ్గ గుణపాఠం నేను చెబుతానుగా?” అని బాబుని భుజానవేసుకుంది శారద.
ఇల్లు తాళంపెట్టి ఇద్దరూ దగ్గరలో వున్న డాక్టరు దగ్గరికి నడిచే వెళ్ళివచ్చారు. దారిలో ఏం మాట్టాడుకోలేదు.
రాత్రి పదకొండింటికి వేణు వచ్చాడు. అప్పటికి ప్రయాణ బడలికతో శారద నిద్ర పోయింది. శ్రైలజకి మాత్రం నిద్రరాలేదు.
“సారీ శైలా ! మా ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు. నాకు ఆకలిలేదు. నువ్వు తిన్నావా?” అనడిగాడు వేణు.
“శారద బలవంతం చేస్తే తనతో తిన్నాను” క్లుప్తంగా అంది శైలజ, అతనికేసి చూడాలనీ, మాట్టాడాలనీ అనిపించటంలేదామెకి,
“శారద ఎందుకు వచ్చింది? అమ్మా, నాన్నా కులాసాయేనా?” ఏదో మామూలుగా అడిగేసి డ్రస్ మార్చుకుని పడుకున్నాడు,
శైలజ “ఊ” అనడం విన్నాడో లేదో వెంటనే నిద్రపోయాడు.
తైలజకిది మామూలే అయినా ఈ రోజు భరించలేకపోతోంది.
మర్నాడు శారదా, వేణూ లేచేసరికే శైలజ తన బట్టలు పెట్టిలో సర్దుకుని, బాబు సరంజామా అంతా ఒక బ్యాగులో "పెట్టుకుంది.
శారద ఏదో అడగబోయినా అవకాశం ఇవ్వలేదు. వేణుకి. కాఫీ ఇచ్చి. “నేను వెడుతున్నాను” అంది ముభావంగా,
“ఇంత ప్రొద్దున్నే ఎక్కడికోయ్? మా చెల్లెలు వచ్చిందికదాని పుట్టింటికి బయలుదేరావా?” నవ్వుతూ అన్నాడు వేణు.
శైలజ నవ్వలేదు. “నేను అనాథ మహిళాసదన్‌కి -వెడుతున్నాను. అక్కడ ఏదో ఒకటి నేర్చుకుని, నన్నూ, బాబునీ పోషించుకోగలనన్న నమ్మకం నాకుంది” అంది గంభీరంగా. ఈసారి వేణూ, శారదా తెల్లబోయారు. ఎంతో అమాయకంగా కనిపించే శైలజ అంత
సోమంచి ఉషారాడి ఈ కశొతరంస్తీ త్వరగా అటువంటి నిర్ణయానికి వస్తుందని శారద ఊహించలేక కంగారుపడింది.
“అదేమిటి వదినా! మగవాళ్ళన్నాక ఏవో అలవాట్లు వుంటాయి. అవి మాన్పించి, వాళ్లని మన వైపు తిప్పుకుని, సంసారాన్ని సరిదిద్దుకోవాలికానీ ఇలా అయితే ఎన్ని సంసారాలు నిలబడతాయి?”
“హు! అదే నేను సింగారించుకుని మరో మగాడితో తిరిగితే మీ అన్నయ్య సహిస్తారా? అంతెందుకు నువ్వు ఒప్పుకుంటావా? భర్తకో. నీతీ, భార్యకోనీతా? ఇన్నాళ్ళూ తెలుసుకోలేకపోవటమే నా అవివేకం! మీ అన్నయ్య (ప్రేమించిన ఆ అమ్మాయినే కట్టుకుంటారో, మరో ఆడదాని గొంతే కోస్తారో నాకనవసరం. పుట్టింటి గౌరవం, మెట్టినింటి వైభవం అంటూ అర్ధం లేనిమాటలు చెప్పొద్దు. భర్త ఏంచేసినా భరించే భార్యలు వుండవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. ఎవరేం చెప్పినా నా నిర్ణయం మారదు” శైలజ గంభీరంగా అని, బాబుని భుజూన వేసుకుంది.
“శైలా ! ప్లీజ్! నా మాట విను. ఆ అమ్మాయిని మర్చిపోతాను. సారీ శైలూ, ప్లీజ్ ! ఈ ఒక్కసారి...” భర్త ఏంచేసినా భార్య నోరుమూసుకుని పడివుంటుందన్న నమ్మకాన్ని కాదని, భార్యా ఒక మనిపేననీ ఆమెకీ స్వంత అభిప్రాయాలూ, అభిమానాలూ వుంటాయన్న నిజాన్ని అంత తేలిగ్గా జీర్లించుకోలేకపోతున్నాడు వేణు.
వేణు ఈ తరం భర్త
(వనితాజ్యోతి మాసపత్రిక) అత అతి
ఆడపిల్ల నోమంచి ఉషారాణి ర్] ఆడపిల్ల ఆటఆియలల్లి యీ వండీ! రేపొద్దున స్టేషన్‌కి వెళ్లాలి, అమ్మ వస్తోంది” అంది శాంతి భర్తతో. 'ఇప్పుడెందుకొస్తోంది అవిడ?” ఏమీ ఎరగనట్లే అడిగాడు శేఖర్ పేపర్ తిరగేస్తూ, “అదేమిటి! అలాగంటారు ? మన ఒప్పందం మర్చిపోయారా? అమ్మకు ఇద్దరం ఆడపిల్లలమే. నాన్న యాక్సిడెంట్‌లో పోతే కష్టపడి మమ్మల్ని చదివించి, పెళ్లిచేసింది. అవిడకంటూ ఏమీ మిగుల్బుకోలేదు. ఇప్పుడు మేము సంపాదిస్తుండగా కూడా ఆవిడ కష్టపడటం ఇష్టం లేక అక్క దగ్గర కొన్నాళ్ళూ నా దగ్గర కొన్నాళ్ళూ ఉంచుకుంటామని ెళ్లికి ముందే చెప్పాను కదా! శాంతి సీరియస్‌గా అని లోపలిక్తి వెళ్ళిపోయింది. “ఎవరికైనా అత్తారింటినుంచి ఆస్టులూ, వస్తువులూ వస్తే నాకు అత్తగారే వస్తున్నారు. హు ఏంచేస్తాం' అనుకుని భార్యకి కోపం వచ్చిందని బతిమాలుకోవడానికి ఆమె వెనుకే వెళ్ళాడు, “ఇప్పుడు నేనేం అన్నాను శాంతీ! ఏదో మర్చిపోయి.....! "సకి బజారుకెళ్లి సరుకులు తెచ్చుకుందామా?” “తెచ్చుకో! నన్నడగడం దేనికీ?” “అదేమిటీ డబ్బులివ్వందే...,” “నీ జీతం ఉందిగా!” . | “అబ్బా! మీకు మతిమరుపు బాగా ఎక్కువైంది” “నాకేం మతిమరుపు లేదు, నా దగ్గర డబ్బు లేదు” “లేదా!” మీ జీతం అంతా ఏమైంది?” “నా జీతం లెక్కలు నీక్సు చెప్పవలసిన అవసరం లేదు, నుగాళ్లకేవో లక్ష ఖర్చులుంటాయిో “ఆహా! ఆడవాళ్లకు౦డవా ఖర్చులు?” “ఉంటే పెట్టుకో! నీ జీతం నేనడిగానా?” “నీ జీతం... నా జీతం ఏమిటి? మనం ఏమనుకున్నాం? నా జీతం బ్యాంకులో వేద్దాం. రేపు పిల్లలు పుట్టినా, సడన్‌గా ఏ అవసరం వచ్చినా ఎవరినీ అడగక్కరలేదు. మీ జీతంతో ఇల్టు నడుపుడాము అనుకున్నావా?”
నోమంచి ఉషారాణి 65 ఆడపిల్ల
"నేను కాదన్నానా? ఈ నెల ఖర్భయిపోయింది”
“అదే ఎలా ఖర్చయిందీ అని అడుగుతున్నాను.”
శేఖర్ ఏమీ మాట్లాడలేదు.
నిన్నగాక మొన్న పెళ్ళయిన పెళ్ళాం అలా నిలదీయడం అతనికి నచ్చలేదు.
ఆఫీసులో సరదాగా రేసులుకి వెడదామంటే వెళ్ళాడు. రెట్టింపు డబ్బు వస్తోందన్న ఆశతో ేసుల్లో పెట్టాడు. కానీ, నష్టం వచ్చింది
ఆ విషయం చెబితే...
అయినా ఎందుకు చెప్పాలి ? తన కష్టార్దితం ఆ మాత్రం స్వతంత్రంగా ఖర్చు చేసుకునే అధికారం తనకు లేదా?
“మాట్లాడరేం? మీ వాళ్లకి పంపారా?”
శేఖర్ బు(ర్రలో స్తాష్ వెలిగింది.
“అవును అమ్మకి ఒంట్లో బావుండలేదుట! నాన్న ఉత్తరం రాస్తేనూ....”
“ఆ మాట చెప్పడానికి అంత ఆలోచిస్తారేం?
అవసరానికి మనం వాళ్లకిస్తే కాదంటావా? పోనీ లెండి. రేపు బ్యాంకులో డబ్బుతీసి సరుకులు తీసుకువస్తాను. రండి భోజనం చేద్దాము” నవ్వుతూ భర్త చేయి పట్టుకుని డైనింగ్‌టేబుల్ దగ్గర కూర్చుని అన్నం వడ్డించింది. శాంతికి అన్నం సయించలేదు. తిన్నదికూడావాంతి అయిపోయింది.
శేఖర్ కంగారుపడ్డాడు.
శాంతి నవ్వి, “ఫర్వాలేదు, మీరు తినండి. నాకీ మధ్య ఇలాగే ఉంటోంది. రేపు డాక్టరు దగ్గరకు వెళ్ళాలి” అంది
“అంటే?
“అవు'నన్నట్టు నవ్వింది శాంతి.
అయితే సినిమాల్లో చూపించినట్టు ఎగిరి గంతేసి ఆమెను ఎత్తేయలేదు శేఖర్.
“వాట్ నాన్‌సెన్స్! మనం అప్పుడే పిల్లలు వద్దనుకున్నామా?”
పైగా నవ్వుతున్నావా? రేపెళ్లి వెంటనే అబార్డన్ చేయించుకో!”
శేఖర్ కోపంగా కంచంలో చేయి కడిగేసుకున్నాడు.
“అదికాదండీ! మొదటే జా(గ్రత్తపడితే ఒక్కోసారి అసలు పిల్లలు పుట్టే అవకాశమే ఉండదని...”
“అని... ఎవరు చెప్పారు? అసలు మనం ఏం అనుభవించాం? ఏం కూడబెట్టాం? నా కిష్టం లేదు. అంతే!”
సోమంచి ఉషారాణి 66 అడసిల్ల శేఖర్ అంత నిక్కచ్చిగా అంటుంటే శాంతికి ఏడుపు వచ్చింది. “ఎందుకేడుస్తావు ? అప్పుడే కడుపూ, కానుపా! ఛ! మనం సరదాగా తిరగడం, సంతోషంగా ఉండటం నీ కిష్టం లేదా ? పైగా ఉద్యోగస్తురాలివి. పిల్లలని ఎవరు చూస్తారు?” శేఖర్ ఆవేశంగా అన్నాడు. “మా అమ్మ చూస్తుందిలెండి” అంది ఊక్రోషంగా శాంతి. “అయితే మీ అమ్మని ఇక్కడే పర్మినెంట్‌గా సెటిల్ చేద్దామనుకుంటున్నావా? అమ్మ! ఇంత గుండెలు తీసిన బంటువనుకోలేదు.” “కీర్ సెంటర్‌లో పెట్టినా డబ్బుకట్టాలి కదా! ఆ డబ్బు మా అమ్మ మీద ఖర్చుపెడితే మనవాళ్లని దైర్యంగా ఉంటుంది, అందుకని అలా అన్నాను కానీ...” “అబ్బా నంగనాచి! ఏమీ ఎరగనట్టు ఎలా మాట్లాడుతోందో! రేపు వెళ్లి అబార్షన్ చేయించుకో....నో డిస్కషన్!” “అదికాదండీ! ఈ ఒక్కసారికీ నామాట వినండి, ఆ తరువాత నేను మీ మాట వినకపోతే అడగండి” శాంతి సర్దిచెప్పాలని చూసిన కొద్దీ శేఖర్ బెట్టుచేశాడు, శాంతి ఏడుస్తూ పడుకుంది. శేఖర్‌కి ఏం చేయాలో పాలుపోలేదు. ఎంత నచ్చజెప్పుకున్నా అతని మనసు అంగీకరించటం లేదు. కొత్తగా పెళ్లయిన భార్య!ఇంకా పెళ్లయి. ఏడాది కాలేదు. తనతో సమానంగా సంపాదిస్తున్న భార్యను కష్టపెట్టడం అతనికీ బాధగానే ఉంది. ఈ ఆడవాళ్ళు ఎంత చదువుకుని, ఉద్యోగం చేస్తున్నా సెంటిమెంట్ వదులుకోరు. ఏడుపు వాళ్లకి భగవంతుడిచ్చిన మహాయుధం! “సరేలే! అయిందేదో అయింది. ఎలాగూ కనేది ఒకళ్లనే కనుక ముందే చెబుతున్నాను. మగ పిల్దాడయితే సరే! ఆడసీల్లయితే మటుకు అబార్డన్ తప్పదు” అన్నాడు, శాంతి తెల్లబోయింది. అతడీలా స్లేటు ఫిరాయిస్తాడనుకోలేదు. ఎంత చదువుకున్నా ఈ మగాళ్లింతే! వాళ్లని కన్నతల్లి ఆడది! కట్టుకున్ల పెళ్ళాం ఆడది!
నోయంచి ఉషారాణి 67 ఆడపిల్ల
వాళ్ళు మాత్రం ఆడపిల్లల్ని కనరట...కాదు కననివ్వరట!
ఎంత అమానుషం....!
ఇరవై ఒకటో శతాబ్దంలో అడుగిడుతూన్నా వీళ్లు మారరు.
“ఈ రోజుల్లో ఇంకా ఆడా, మగా ఏమిటండీ? ఎవరో ఒకరు....” శాంతి మెల్లగా నచ్చజెప్పబోయింది.
“అదే కుదరదంటున్నాను. నా మాటకు విలువ ఉందా? లేదా?” శేఖర్ అసహనంగా అన్నాడు.
శాంతికి చాలా కోపం, ఊక్రోషం వచ్చాయి. కానీ అది సమయం కాదని ఊరుకుంది. రెట్టించిన కొద్దీ మగవాళ్ళింకా రెచ్చిపోతారు. పురుషాహంకారం వాళ్ల నరనరాల్లోనూ ఇమిడిపోయింది. దాన్ని వదిలించుకోవడం అందరికీ సాధ్యం కాదు
“చూద్దాంలెండి. పడుకోండి” అంది నెమ్మదిగా శాంతి
“చూద్దాంకాదు, చేద్దాం సరే నను” రెట్టించాడు శేఖర్. ఇనుము వేడిమీద ఉన్నప్పుడే వంగదీయాలి. లేకపోతే లొంగుతుందా?
“సరే లెండి” శాంతి అయిష్టంగానే అంది.
మర్నాడు జానకమ్మ రైలు దిగింది.
శేఖర్‌కి అత్తగారిని చూస్తే అత్తగారిలా అనిపించదు. ఇద్దరే ఆడపిల్లలూ, వయసులో ఉండగానే భర్తపోవడం, భర్తపోయినా చేతికి బంగారు గాజులూ, మెళ్లో గొలుసూ, దుద్దులూ, నుదుట చిన్న నల్లబొట్టు ఇంత వయసు వచ్చినా అమె తెల్లగా, నాజూగ్గా అందంగానే ఉందంటే వయసులో ఇంకెంత అందంగా ఉండేదో!
పెద్దకూతురు కాంతికి బహుశా తండడ్రిపోలిక వచ్చిందేమో అంత అందంగా ఉండదు. కానీ శాంతి మళ్ళీ తల్లి పోలిక! వాళ్ళిద్దరినీ చూస్తే అక్కా చెల్లెళ్ళు అనుకుంటారుగానీ తల్లీ కూతుళ్ళలా ఉండరు.
“బావున్నారా బాబూ! అమ్మాయి కులాసానా?”
జానకమ్మ ఆప్యాయంగా అడుగుతుంటే ఈ లోకంలోకి వచ్చాడు చర్.
“క్రులాసాయేనండీ! మీరూ. మీ పెద్దమ్మూయీ వాళ్లూ...”
“అంతా బానే వున్నారు.”
“మీరు స్కూటర్ మీద కూర్చోగలరా? ఆటో పిలవనా?
“నేనేమైనా ముసలిదాన్నా! కూర్చుంటాలెండి” అందావిడ.
“ఈ బుట్ట నా కాళ్ల దగ్గర పెట్టుకుంటాను. సూట్‌కేస్ పట్టుకుని కూర్చోండి” అన్నాడు
పిల్ల నోమంచి ఉషారాణి 68 అదే సల్ల నాని శేఖర్. సూట్‌కేస్ ఇద్దరి మధ్యా పెట్టి కూర్చుందావిడ. కొంత ఇబ్బందిగా ఉన్నా శేఖర్ ఏమీ అనలేకపోయాడు. తల్లిని చూసి సంతోషంగా పరిగెత్తుకొచ్చి కౌగలించుకుంది శాంతి. కుశల ప్రశ్చలథ్యాక జానకమ్మ స్నానానికి వెళ్ళాక “ఏమిటీ! ఇంకా అలాగే ఉన్నావు? ఆఫీసుకు రావడంలేదా?” శేఖర్ మెల్లిగా అడిగాడు. “అమ్మ వచ్చిందికదా! అదీ కాక నాకు ఒంట్టో తేలిగ్గాలేదు అందుకనీ. .” భర్తకేసి ప్లీజింగ్‌గా చూసింది శాంతి. “సరే! నీ ఇష్టం. లీవ్ లెటర్ ఇచ్చి, నాకు వడ్డించు. ఇదిగో చూడు... మీ అమ్మ దగ్గర రాత్రి జరిగినదేదీ చెప్పకూడదు. అర్ధమైందా?” అని వార్చింగిచ్చి మరీ వెళ్ళాడు శేఖర్? “ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏమైనా విశేషమూ?” తల్లి అభిమానంగా అడిగేసరికి శాంతికి దుఃఖం వచ్చేసింది. “ఏంటమ్మా! ఏం జరిగింది? నాతో చెప్పకూడదా?” తల్లి గుండెల్లో తలదాచుకుని ఏడిస్తే శాంతికి కొంత ఉపశమనం కలిగింది. తల్లితో చెబుదామా అనుకుంది కానీ భర్త ఇచ్చిన వార్చింగ్ గుర్తుకువచ్చింది. అదీగాక తము మధ్య అప్పుడే భేదాభిప్రాయాలు తలెత్తాయంటే తల్లి బాధపడుతుంది. రాగానే ఆమెనెందుకు నొప్పించండం? ఏం లేదమ్మా! వేవిళ్లు, అందుకని నిన్ను చూడగానే ఏడుపు వచ్చేసింది” అంది కళ్టు తుడుచుకుని సిగ్గుపడుతూ, “దొంగా! మరి చెప్పవేం? హడలగొట్టేశావు” అంద్రి ఆప్యాయంగా శాంతి నుదుట ముద్దుపెట్టుకుంటూ, రామ్మా! భోజనం చేద్దాం. అక్కయ్య కబుర్లేంటి చెప్పు” అంటూ సరదాగా కబుర్హు చెప్పుకుంటూ భోజనం చేశారు, జన్, ఆక కాసేపు పడుకోమ్మా లేచాక మాట్లాడుకోవచ్చు. నేనివ్వాళ సెలవు పెట్టాను. నాకూ నిద్రవస్తోంది” అని పడుకుంది శాంతి, జానకమ్మ కూతుర్ని చూసి నిట్టూర్చింది. లాం, ఆక అ, పెచ్చిపిల్ల! అప్పుడే ఎంత్ర ఎద్ద ఆరిందలా మారింది! పెళ్లయితే ఆడపిల్లలింతేనేమ్రై! ఐం, టీ ఆ ఫ్ర ఎక షారురు ఏల్లలు పుట్టలేదని బెంగపెట్టుకుందన్న చేదు నిజాన్ని ఈ సంతోష సమయం చిన్న కూతురిక్తి చెప్పలేక ఆ బరువునీ, బాధనీ మోస్తున్న ఆ కన్నతల్లి చిన్నకూతురు మరో విధంగా బాధపడుతోందన్సీ, ఇక్కడ కూడా చేదు అనుభవాలు ఎదుర్కోవలసి వస్తుందనీ ఊహించలేక్ష హాయిగా నిద్రలోకి జారింది.
నోమందిఎషారాి క సిక శం 2 పదిరోజులు సరదాగానే గడిచిపోయాయి. తల్లి కూతురికి వేవిళ్ళని నోటికి రుచికరమైనవి చేసిపెట్టేది. సాయంత్రం ఆఫీసునుంచి వచ్చాక ముగ్గురూ సినిమాలనీ, ఏవైనా ప్రదేశాలకో, గుడికో వెళ్ళేవారు. శేఖర్ అత్తగారిని అభిమానంగానే చూసేవాడు. ఆవిడ మాట గౌరవించేవాడు. జానకమ్మ అతని మంచితనానికి మురిసిపోయింది. కాంతి జీవితం తలుచుకుని బాధపడేది. పెద్దల్హుడు శంకర్ కూడా మొదట బాగానే ఉండేవాడు. కానీ ఈమధ్య పిల్లలు పుట్టలేదని సతాయింపు ఎక్కువైంది. అత్తగారని కూడా చూడకుండా తనకేసి అదోలా చూసేవాడు. ఆ చూపులు నచ్చలేదు. అయినా... కూతురు బాధపడుతుందని అవన్నీ భరించి కూతురికి సాయంగా ఉండిపోయింది. “నీకన్నా మీ అమ్మే బావుంటుంది. ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నానని చేసుకున్నాను హు...” అని నిట్టూరిస్తే కాంతి తనకు వినబడుతుందని “మెల్లిగా మౌట్టాడండి. అయినా తల్లిలాంటి. స్త్రీని పట్టుకుని ఏమిటా మాటలు? అమ్మ వింటే బాధపడుతుంది” అనేది. “నేను ఆవిణ్ణి పట్టుకుని ఎక్కడన్నావే? హు అంత అదృష్టం కూడానా?" అని శంకరం అంటుంటే కాంతి కోపంగా వెళ్ళిపోయేది. శంకర్ పకపకా నవ్వుకునేవాడు. 'పిచ్చితల్లి! నాకు చెప్పుకోలేకా, భర్తకి నచ్చ చెప్పలేకా ఎంతగా నలిగిపోయేదో!' తను కూడా అక్కడ ఉండలేకపోయింది. జ్ చ మ “డాక్టరుకి చూపించుకున్నావా? స్కానింగ్ చేశారా?” అడిగాడు శేఖర్ శాంతిని. శాంతి దీనంగా చూసి తలవంచుకుంది. శేఖర్‌కి అనుమూనం ఎక్కువైంది. 'మాట్టాడవేం? ఆడపిల్లని అన్నారు కదూ!” కోపంతో అతని గొంతు స్థాయి పెంచాడు. “గట్టిగా అరవకండి. చదువుకున్న వాళ్ళంకూడా మూర్జంగా ఆడపిల్లని అబార్డన్....” షటప్! నేను ఆ రోజే చెప్పాను. మళ్లీ మొదటికొచ్చావే? నా మాటంటే అంత లెఖ్ఞలేదా?” గట్టిగా అరిచాడు శేఖర్, “నేను చెప్పేది పూర్తిగా వినండి. ప్లీజ్!” శాంతి బతిమాలుతున్న కొద్దీ శేఖర్ కోపంగా అరిచాడు. “నేను వినను. రేప సెలవు పెడుతున్నాన్. అబార్జన్ చేయించుకుంటున్నావు. దట్టాల్' అని విసురుగా బయటికి వెళ్లిపోయడు. శాంతి ఎంత పిలుస్తున్నా వినిపించుకోలేదు. “ఏమిటమ్మా? ఏం జరిగింది? అంది జానకమ్మ కంగారుగా. శాంతి జరిగింది చెప్పింది.
70 ఆడపిల్ల సోమంచి ఉషారాణి నావా తాని భర్తని ఒప్పించలేకపోయినందుకూ, అబార్డన్ చేయించుకోవలసి వస్తున్నందుకూ రోషంగా ఉంది శాంతికి. హు! ఏం చదువుకున్నా ఎంత సంపాదిస్తున్నా ముదిత, బతుకు చర్చితచరణం! ది ఎ వల్లను పిల్లలు పుట్టలేదని ఆమెని నిందిస్తుంటే, చిన్నల్లుడేమో అస్బిడే పిల్లలు వద్దనీ, పుట్టినా ఆడపిల్ల వద్దనీ! ఎవరికి చెప్పగలదు? చెప్పినా వింటారా?” జానకమ్మ నిట్టూర్భడం తప్ప ఏం చేయగలదు? 'హోనీలే శాంతీ! చిన్న విషయానికి మీ ఇద్దరికీ మనస్పర్థలెందుకు? మీరు సంతోషంగా ఉండటం ముఖ్యం, మరోసారి, “అప్పుడూ ఆడపిల్లయితే? ఇలా ('భూణ హత్యలు చేసుకుంటూ పోవలసిందేనా? దీనికి అంతమెక్కడా ? పురుషాహంకారానిక్తి లొంగిఎన్నాళ్లు జీవించాలి? ఏమైనా సరే...” అయితే నీకూ నాకూ ఇక సరబంధం లేదు. వీ దారి చూసుకోవచ్చు” అప్పుడే వచ్చిన శేఖర్ విసురుగా అన్నాడు, “ఏం! నేను 'బ్రతకలేననుకున్నారా? 1 పురుషడి అవసరం ఎంత్ ఉందో పురుషుడికీ స్త్రీ అవసరం అంతే ఉంటుంది. ఈ రోజు ౧ చోడపిల్లలు క్తూడ్రా మగవాళ్ళత్రో సమ్రానంగ్రా చదువుకుని...” “అందుకే ఆంతపొగరు। ఎంత చదువుకున్నా మొగుడు దగ్గర లొంగిన పురం సజావుగా ప్పుడే ఆ కాపురం సాగుతుంది. నువ్వెంతందే నువ్వెంతా అన్నుక్తుంట్ర. ఎల మన హైందవ సంప్రదాయానికి అరమ లేదు. మీరు పెద్దవారు ఉండి కూడా ఏం మాట్లాడరేం అత్తగారూ!” యి వ్ శేఖర్ జానకమ్మ కేసి క్వోంగ్గా చూస్తూ అడిగాడు. “నేనూ ఒక ఆడదాన్నయి క్రింది ఒక్ర ఆడపిల్లకి అదీ కన్న కూతురికి... “నువ్వు కూతురి కనకమూూ?: ా స్తై స?" అని ఎలా చెప్పముంటావు బాబూ! అమ్మాయి అన్నదాంట్స్ వం తప్పేం ఉంది?” ఆ్రంద్రి జానకమ్మ. “ఎంతైనా మీరూ ఆడవారూ, శాంత్రి $ చల్లి | డం నాదే బుద్లితక్కువ, అంతకన్నా ఏపు, టు న్నా ఎమంటార్త లెండి వ్యంగ్యంగా నవ్వాడు శేఖర్. వారన్న ప్ర్‌గా అక్కడినుంచ్రీ వచ్చెసింది. ఇం ఇల తల్లిదం। డులు వ నవ్వుతూ కుశల్రళ్ళలు వేసుకున్నారు (గ్ర చ్చారు. అందరూ మామూలుగా వ్వు “నాన్సగారికి చూపించుల్లో ందామ్ బావు౦డలేద్సురా! బాగా దగ్గూ ఆయాసం వస్తోంది. ఇక్కడ నాన్షని...! చ్చాము. మంచి డాక్టర్ ఎవరో కనుక్కుని, రెండురోజులు సెలవుపెట్టి తల్లిమాట పూర్తికాక్రుండ్లా విసుగ్గా చూశాడు శీర్. అమ్మా! నాకిప్పుడు సెలవు హారళదు. అయినా ఉత్తరం రాయకుండా ఎందుకు
సోమంచి ఉషారాణి కేపి వచ్చారు?”
“బావుంది నాయనా! అయ్యొచ్చేదాకా అమావాస్య ఆగుతుందా? ఆయన పరిస్థితి చూడలేక, నువ్వు కాదనవని...” "
“ఊ సరేలే! శాంతీ! అన్నం వడ్డించు. నిద్రవస్తోంది” అని కోపంగా అక్కడనుంచి వెళ్లిపోయాడు.
శాంతి మౌనంగా భర్తకి వడ్డించింది. జానకమ్మ వియ్యంకులకి మళ్ళీ అన్నం వండింది. శేఖర్ పడుకున్నాక అందరూ కలిసి భోజనం చేశారు. అత్తమామలు బాధపడుతుంటే శాంతి వారిని ఓదార్చింది. మాటల్లో శేఖర్ డబ్బు పంపలేదని అర్థమైంది.
“నేను సెలవు పెట్టి మావయ్యగారిని చూపిస్తాను. మీరు బాధపడకండి అత్తయ్యగారూ! పడుకోండి” అని వంటిల్టు సర్ది బెమకూమ్‌లోకి వెళ్లేసరికి శేఖర్ హాయిగా నిద్రపోతున్నాడు.
జన 7
“డబ్బేం చేశారు?
మర్నాడు శాంతి అడిగిన ప్రశ్ళకు ఉలిక్కిపడ్డాడు శేఖర్,
“ఏ డబ్బు?” అన్నాడు ఏమీ ఎరగనట్టు,
“అదే. ఈ నెల జీతం,”
“అదీ... చెప్పానుగా! మళ్లీ అడుగుతావేం?”
“ఆ డబ్బు ఏం చేసుకున్నారో అడగను. మళ్లీ నెలనుంచీ మీ జీతం ఇస్తేనే ఇంట్టో సరుక్షులు కొంటాను. లేకపోతే ఇంట్లో అందరూ పస్తే! మావయ్యగారిని మీరు డాక్టరు దగ్గరికి తీసుకెడతారా? నేను తీసుకెళ్లనా?”
'నాకు కుదరదని చెప్పాగా!
నాకు ఆఫీసులో చాలా పనుంది.
నీ అబార్జన్ సంగతి ఏం చేశావు?”
“వాక్తూ కుదరదని చెప్పాగొ! మగపిల్లలు తల్లి దండ్రుల్ని ఎంత బాగా ఆదరిస్తున్నారో చూస్తున్నాంగా!” నిరసనగా అనేసి అక్కడినుంచి వెళ్ళిపోయింది శాంతి.
శుర్ ఆఫీసుకి వెడుతుంటే, “బాబూ! మేం డాక్టరు దగ్గరికి వెళ్ళొస్తాం” అన్నాడు శేఖర్ తండ్రి. "| ,
'మంచిది అని శేఖర్ వెళ్ళిపోతుంటే అతని తల్లిదండ్రులు నిట్టూర్చారు 'ఆడపిల్లని కనలేకపోయామే” అని!
'జానకమ్మా! నువ్వు అద్ధష్టవంతురాలి. మాలాంటి మగపిల్లలు కన్న తల్లిదండ్రుల కోసమే వృద్ధాశ్రమాలు వెలిశాయేమో!”' బాధపడుతూ కోడలు వెంట బయలుదేరారు శేఖర్ తల్లిదండ్రులు.
శాంతికి అతమామలు తనవైపు ఉంటారన్న ధైర్యం కలిగింది.
న (ఆంధ్రజ్యోతి వీక్సీ ప
నిమంచి ఉషారాణి 72 ప్రేమే నేరమౌనా ? నత య మ వయనాన. ప్రేమ నేరమౌనా? ఫ్రే నా 66 వ్ న్ మా! ప్రేమా! ప్రేమా! ఏమిటి ప్రేమంటే? బలవంతంగా ఎదుటి వారిని 'ప్రేమింపచౌసేదేనా? వాళ్ళు చదువును అశ్రద్ద చేయడమే కాక ఎదుటివాళ్ళని కూడా చదువుకో నీయనిదే (ప్రేమైతే ఆ (ప్రేమ నాకక్కరలేదు. ఓ అందమైన అమ్మాయి కనబడగానే కలిగేది 'ప్రేమకాదు. ఆకర్షణ ! నాగురించి నీకేం తెలుసని (ప్రేమిస్తున్నానంటున్నావు? రెండు మనసుల కలయిక 'ప్రేమైతే మనిద్దరి మనసులూ కలవలేదే! నేను నిన్ను ప్రేమించటం లేదే 1
నా దృష్టిలో ప్రేమంటే ఒట్టి ట్రాష్! నాకు చదువే ముఖ్యం. ఎంతో కష్టపడి చదివిస్తున్న నా తండ్రీ ఆశయమే ముఖ్యం. ఇంకెప్పుడూ పేమంటూనా వెంటపడవద్దు”
“దేవీ! నా మాట విను. నీ చదువుకి అడ్డు రాను. నీ బరువు బాధ్యతలు నావిగా భావిస్తాను. నా ప్రేమను కాదనకు ప్లీజ్! ఒక మనిషిని చూడగానే ఎందుకు (శ్రేమ కలుగుతుందంటే నేను చెప్పలేను కానీ ఎదుటి మనిషి కష్టసుఖాలూ, అస్హ్రీ అంతస్పులూ చూసి (ప్రేమిస్తే అది 'ప్రేమకాదు. నన్ను ఏమైనా అను కానీ నా ప్రేమనీ, అసలే ప్రేమే ట్రాష్ అంటే నేను భరించలేను.”
నువ్వ నన్ను ప్రేమించడమే నిజమైతే నా వాళ్ళనీ (్రేమించగలవా ? నన్ను పెళ్ళి చేసుకోగలవా? చేసుకున్నా నీ కాళ్ళమీద నువ్వే నిలబడని వాడివి మమ్మల్నేం సోషిస్తావ్ ? కట్టుం తీసుకోకుండా మీ వాళ్ళని పెళ్ళికి ఒప్పించగలవా? క్షణిక సుఖాలు తప్ప ఈ (ప్రేమవల్ల చాలామంది ఏమి సాధిస్తున్నారో వాళ్యకే తెలియదు. నీతో సినిమాలకీ, పార్కులకీ తిరుగుతూ, నీ గర్డ్‌స్రెండ్‌గా మిగిలిపోయేదే ప్రమయితే ఆ (ప్రేమ నాకవసరం లేదు. నాకంత తీరికా, ఓపికా లేవు, నీక్సు కాలక్షేపం (ప్రేమ కావాలంటే చాలా మందే దొరుకుతారు. ముందు నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో”, తన వెళ్ళిపోతున్న శ్రీదేవి వంక నిస్సహాయంగా చూస్తుండిపోయాడు. సుమన్. ఆాలో యస నటనని చింతించాలో అమె వ్య్తిత్వాన్నీ, అత్మాలిమానాన్నీ అభినందిం
| మళద మ్ వగా న్‌సెట్ అయినట్టున్నావే 1! అదంతేలే! ఫెమినిస్టు ! ప్రేమా, పెళ్ళీ హు!” అని నిట్టూరింది జయ బైతుకుతుందిట! అటువంటి దాన్ని (ప్రేమించి ఏమిలాభం ? “లవ్ ఎట్ సైట్! ౮ సుమన్ వెంటనడుస్తూ, అనురాగం, అంధటే అప నమన చూడగానే నాకు (ప్రేమకు అర్ధం తెలిసింది. నా లేకపోతే నేనూ ఇలాగే మిగిలిపోతాన సమైంటేలా చేసుకోగలనన్న నమ్మకం నాకుంది. తో ఆత్మస్థయిర్యంతో చెబుతున్న సుమన్ కేసి జాలిగానూ, ఆరాధనగానూ, అసూయగానూ చూసిందో జయంతి.
“క్రాందరంతేలే! పక్కనున్న ఒయాసిస్సుల్ని వదిలేసి, ఎండమావులవెంట పరుగుదిస్తారు." మళ్ళీ నిట్టూర్చింది జయంతి.
“జయంతీ! నాకొక సొయం చేస్తావా?” ఆశగా అడిగాడు.
“అంతకన్నా భాగ్యమా?” అనుకొని 'ఏమిటన్నట్టు చూసింది.
"శ్రీదేవి గురించీ, వాళ్ళ తల్లిదండ్రుల గురించీ, వాళ్ళ ఇష్టాలూ, అలవాట్టగురించీ తెలుసుకుని చెప్పగలవా?”
“మా ఇల్లు వాళ్ళింటి దగ్గరే! అదేమంత కష్టంకాదు కానీ నీకో సలహా ఇవ్వదలచు కున్నాను.” సీరియస్‌గా అంది జయంతి,
“సహాయమడిగితే సలహా అంటావేంటి?”
“ఇదీ అలాంటిదే! నువ్వు శ్రీదేవిని మర్చిపోయి ఐమీన్ మర్చిపోయినట్టు నటిస్తూ బాగా కష్టపడి చదువు. చదువులో ఆమెని ఓడించు, అలాగే స్టేట్‌రాంక్ తెచ్చుకో! అసలు మీమధ్య ఏమీ జరగనట్టు, ఆమెని పట్టించుకోనట్టు ఉండు. అప్పుడు అమే నీవెంట పడవచ్చు. నువ్వంటే (ప్రేమ కలగవచ్చు” అంది జయంతి.
“నిజంగానా? అంతేనంటావా” ఎంతో ఆళగా, ఆనందంగా అడుగుతున్న సుమన్ని సంభ్రమాళ్ళర్యాలతో చూస్తుండిపోయింది జయంతి.
శ్ ర య్
జయంతి అంతటితో ఊరుకోలేదు. శ్రీదేవి తల్లిదగ్గరికి వచ్చి చెప్పవలసిందంతా చెప్పింది. శ్రీదేవి చదువుకోవడం ఆమెకల్లికీ, అన్నగ్గారికీ కూడా ఇష్టంలేదు, అడసిల్ల పెళ్ళికి బోళ్ళు కట్నమివ్వాలి. ఇంకా చదువులకి లక్షలు, లక్షలు తగలేయడానికి మనమేం లక్షాధికారులం కాముని వాదించింది. శ్రీదేవి అన్నగారేమో “ఈ ఆడపిల్లలు చదువుకోవడానికా కాలేజీలకి వెళ్ళేది? రకరకాల డ్రస్సులతో హోయలు చూపిస్తూ మగవాళ్ళను రెచ్చగొట్టి, ప్రేమించామంటూ వెంట తిప్పుకుని, వాడినో పిచ్చివెధవని చేసి, చివరకు తమ తల్లిదండ్రులు చూసిన వాడిచేత లక్షల కట్నం ఇచ్చి మరీ తలవంచుకుని తాళి కట్టించుకుంటారు అని గుక్క తిపుకోకుండా ఇష్టం వచ్చినట్టు మౌట్లాడాదు.
నన్ను! నేను దాన్ని “మీకు తలుసు. నామీద నమ్మకముంటే నన్ను చదివిం చండి. నేను వాడికన్నా బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి అప్పుడు వాడికి సమాధానం చెబుతాను. మీరు ఖర్చుపెట్టే వైసాకూడా వృథా పోనివ్వను. కట్నం తీసుకోని వాడినే పెళ్ళిచేసుకుంటాను లేకపోతే ఇలాగే ఉండిపోతాను. ఇటీజ్ మై ఛాలెంజ్! “శ్రీదేవి నిక్కచ్చిగా, నిర్మాహమాటంగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా చెప్పింది.
“సరేనమ్మా! నాకు అన్నయ్యా, నువ్వూ ఇద్దరూ సమానమే! ఏదో కష్టపడో, తలతాకట్టుపెట్టో నిన్ను చదివిస్తాను. నీ ఛాలెంజ్‌ని నువ్వు నిలబెట్బకోవాలి. ఎవరితోనైనా ప్రేమలో పడినా, మార్కులు సరిగా రాకపోయినా చదువు ఆపేయాలి “శ్రీదేవి తండ్రికూడా అంతే ఖవ్చితంగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
సోమంచి ఉషారాణి గ ప్రేమే నేరమౌనా ?
అందుకే శ్రీదేవి సుమన్‌తో అంత కరినంగా మాట్టాడవలసివచ్చింది. ఆ తరువాత ఆమె విషయాన్ని అప్పుడే అక్కడే మర్చిపోయింది. అయితే తనతల్లీ, అన్నయ్య తనకి శత్రువులుగా మారి, తనను చదువుమధ్యలో ఆపేయడానికి కుట్రపన్నుతారనీ, జయంతి ఆ అగ్నిలో ఆజ్యం పోస్తుందని కానీ ఆమె ఊహించలేదు. సుమన్‌కూడా మళ్ళీ తన జోలికి రాకపోవడంతో తృప్తి పడింది,
“సుమన్ ఎవరు?” తండ్రి ఒకరోజు సీరియస్‌గా అడిగేసరికి శ్రీదేవి ఉలిక్కిపడింది. అతనెవరో, తన నెందుకడుగుళున్నారో అర్దం కాలేదు.
“సుమనా ? ఎవరునాన్నా?” ఆశ్చర్యంగా అడిగింది శ్రీదేవి.
“చూశావా నంగనాచిలా నిన్నే ప్రశ్నిస్తోంది నాన్నా!” శ్రీదేవి అన్న శ్రీకర్ తండ్రిని ఎగదోశాడు.
“నిజం నాన్నా! నా సంగతి మీకు తెలుసు. నాకు ఏ అబ్బాయి పేరూ తెలియదు. ఎవరో అబ్బాయి 'ప్రేమించానంటూ వెంటపడితే తగినబుద్ది చెప్పాను. మళ్ళీ నాజోలికి రాలేదు. ఆ అబ్బాయి పేరేమిటో కూడా నాకు తెలియదు” శ్రీదేవి మాటల్లో నిజాయితీ అర్థం చేసుకున్న తండ్రి వెంకట్రావు ఆమెనేమీ అనలేదు.
“అతనెవరో తెలియకుండానే 'ప్రేమిస్తే పెళ్ళి చేసుకుంటావా? కట్నం తీసుకోకుండా మీ వాళ్ళని ఒప్పించగలవా? 'అన్నానా?' తల్లి సావిత్రి నిలదీసింది.
“అందులో తప్పేముంది? ఈనాటి (ప్రేమికుల్లో చాలా మంది ఏదో కాలక్షేపానికి తమ అవసరాలకీ ('ప్రేమించేవారే! నేను ఆంత కరినంగా మాట్లాడకపోతే అతను రోజూ నా వెంట పడేవాడు. అతని చదువును పొడుచేసుకోవడమేకాక నా చదువు పాడు చేసేవాడు.” శ్రీదేవి నిర్భయంగా, నిష్కర్జగా మాట్టాడడంతో ఎవరూ ఏమనలేకపోయారు,
“ఇలాంటి చర్చ ఇంకోసారి జరగడానికి వీల్లేదు” వెంకట్రావు గంభీరంగా అనేసి, తన గదిలోకి వెళ్ళిపోయాడు.
“అమ్మా! కన్నతల్లివై ఉండి కూతురి అభివృద్దిని కాంక్షించవలసిందిపోయి నామీద నీకెందుకమ్మా ఇంత కక్షగొ తల్లికేసి జాలిగా చూస్తూ అడిగింది. సావిత్రి ముఖం తిప్పేసుకొని వెళ్ళిపోయింది,
“ఒశేయ్ అన్నయ్యా 1 నువ్వు ఈ జనరేషన్ వాడివి, అమ్మా, నాన్నతో దెబ్బలాడి నన్ను చదివించవలసిన బాధ్యతా, ఎవరైనా నావెంటపడి వేధిస్తే వారిని మందలించివలసిన హక్కూ ఉన్నవాడివి నువ్వు ఇలా (ప్రవర్తించటం నాకు చాలా బాధగా ఉందన్నయ్యా[”
శ్రీదేవి కన్నీరు అతనినేమీ కరిగించలేదు. ఏమీ జరగనట్టే తనని కాదన్నట్టే శుభ్రంగా ముసుగుతన్ని పడుకున్నాడు. శ్రీదేవి మాత్రం తన ఆత్మస్థయిర్యాన్ని కోల్ళోక చదువుకుంటూ కూర్చుంది.
శశ య
నోమంచి ఉషారాణి 75 ప్రేమ్ నేరమౌనా ? సుమన్ ఇంజనీరింగ్ పూర్తిచేసి మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. శ్రీదేవీ, జయంతీ ఇంకా ఉద్యోగాల వేటలో ఉన్నారు. సుమన్ శ్రీదేవిని ఇప్పుడు ధైర్యంగా అడిగాడు.
“దేవీ! నన్ను పెళ్ళి చేసుకోవడానికి నీకేం అభ్యంతరం లేదనుకుంటాను. నేను నిన్ను ఇంకా (ప్రేమిస్తూనే ఉన్నాను, ఉంటాను”
చూడండీ! మీరు నన్ను 'ప్రేమిస్తున్సంతమాత్రాన నేనూ మిమ్మల్ని ప్రేమించాలని రూలేం లేదుగా! ప్రేమనేది సహజంగా కలగాలికానీ ఒకరిని అడుక్కునేది కాదు” నిక్కచ్చిగా ఆంది శ్రీదేవి.
సుమన్ హతాశుడయ్యాడు" దేవీ!”
“నాపేరు దేవీ కాదు శ్రీదేవి! నాకీ ప్రేమా, పిచ్చీ వాటిమీద నమ్మకం లేదని మీకు ముందే చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నాను. సో ఫర్ గెట్ మి! ఇంకెప్పుడూ నన్ను కలవాలని (ప్రయత్నించవద్దు” అని ఆవేశంగా వెళ్ళిపోయింది.
నిశ్చేష్టుడై నిలబడిన సుమన్‌ని జయంతి తన ఇంటికి తీసుకెళ్ళింది. చల్లటి నీళ్ళిచ్చి సేద తీర్చింది.
“జయంతీ! ఇదంతా నిజమేనా? కలకదూ!” సుమన్ అపనమ్మకంగా అడుగుతుంటే జయంతి జాలిగా చూసింది.
“శ్రీదేవికి నేను నచ్చచెబుతాను. మీరు ఇంటికి వెళ్ళండి. ప్లీజ్! అప్‌సెట్ కావద్దు” అని నచ్చచెప్పి పంపించింది. కానీ సుమన్ అంత తేలిగ్గా మర్చిపోలేకపోయాడు.
“జేవీ! దేవీ!” అంటూ కలవరిస్తూ దాదాపు పిచ్చివాడయ్యాడు. ఉద్యోగానికి సరిగా వెళ్ళక త్రాగుడు అలవాటు చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళు కలవరపడిపోయారు.
జయంతి శ్రీదేవికి ప్రేమగురించీ, సుమన్ గురించీ చెప్పబోతే వినిపించుకోలేదు. అతని గురించి తనదగ్గర చెప్పదలచుకుంటే తన గుమ్మం తొక్కవద్దంది.
జయంతిద్వారా సుమన్ ప్రేమ విషయం తెలుసుకున్న ఇంట్లో వాళ్ళు శ్రీదేవి ఇంటికి వచ్చారు.
“మా అబ్బాయిని పెళ్ళి వేసుకోవడానికి నీకేమిటి అభ్యంతరం?” అని శ్రీదేవిని అడిగారు.
“చూడండీ! నేను ఉద్యోగం చేసి నాకాళ్ళమీద నిలబడాలి. అప్పుడు నా మనసుకి నచ్చినవాడు దొరికితే పెళ్ళి చేసుకుంటాను. లేకపోతే ఇలాగే ఉంటాను. అంతేగానీ మీ అబ్బాయి ప్రేమించినంతమాత్రాన పెళ్ళికి నేనెందుకు ఒప్పుకోవాలి” శ్రీదేవి నిక్కచ్చిగా చెబుతుంటే సుమన్ తల్లిదండ్రులు తెల్లబోయారు.
“ఏమండీ! మీ అమ్మాయికి మీరైనా చెప్పవచ్చు కదా! పోనీ ఉద్యోగం దొరికాకే పెళ్ళి చేసుకోమనండి, అందాకా మా వాడితో స్నేహంగా ఉండవచ్చుకదా!” సుమన్ తండ్రి శ్రీదేవి తండ్రితో చెప్పాడు.
“అవునమ్మా! వాడు నీకోసం ఎన్నాళ్ళైనా సుమన్ తల్లి కన్నీళ్ళతో నచ్చచెప్ప బోయింది.
సోమంచి ఉషారాణి 76 ప్రేమే నేరమౌనా ? ఇలా వరనాానాుగా నాతో ారాలన్నకారరనానానా ననున నాలా నాననా నా గాన మాననాయుోనావనాననాుుాకానాకాలనాయనాఖకాకానారానళగాయాంావాడాయార
“వాట్ నాన్‌సెన్స్! మీ అబ్బాయి (ప్రేమిస్తే నాకేం సంబంధం? నాకసలు పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యమే లేదు” శ్రీదేవి కోపంగా, చిరాగా అంది.
“చూడండీ! దాని 'ప్రాణస్నేహితురాలిని ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని ఒకతను మోసం చేశాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అప్పట్నించీ, అదిలా తయారైంది. మీరు ఈ మొండిదాన్ని మార్చడంకన్నా మీ అబ్బాయికి నచ్చజెప్పుకుంటే మంచిది “శ్రీదేవి తల్లి అసలు విషయం బెప్పింది. సుమన్ తల్లిదండ్రులు చేసేదిలేక నిరాశగా వెనుదిరిగారు.
జ శ 2
ఓ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళింది శ్రీదేవి. అక్కడ ఆమెకి ఉద్యోగం దొరికిందికానీ అందులోనే సుమన్ దగ్గర పని నేర్చుకోవలసిరావడం ఆమెకి నచ్చలేదు. కానీ వచ్చిన ఉద్యోగావకాళాన్ని వదులుకోవడం ఇష్టంలేదు.
సుమన్ కూడా ఆమెవరో తెలియనట్టే పని నేర్పించాడు. అతనికోసం జయంతి వస్తూ ఉండేది. ఇద్దరూ కలిసి సినిమాలకీ, షికార్లకీ హీరోహోండా మీద వెళ్ళిపోయేవారు. శ్రీదేవి వాళ్ళని పట్టించుకునేదికాదు.
ఒకరోజు జయంతి పెళ్ళి శుభలేఖ తీసుకొని శ్రీదేవి దగ్గరికి వచ్చింది. శ్రీదేవి ముభావంగానే చూసింది, పెళ్ళికొడుకు వినయ్! జయంతికేసి ఆశ్చర్యంగా చూసింది.
“అతను ఫారిన్‌లో ఉంటాడు. పెళ్ళిచేసుకుని నేను కూడా ఫారిన్ వెళ్ళిపోతాను” జయంతి ఉత్సాహంగా చెప్పింది.
“మరి! సుమన్‌తో షికార్లు...”
“జస్ట్ ఫ్రెండ్ అంతే! అతన్ని మామూలు మనిషిగా చేయడానికి ఒక స్నేహితురాలిగా నావంతు ప్రయత్నం చేశాను. అంతమాత్రాన అతన్నీ, అతని ప్రేమనీ అనుమానిస్తే అది వాళ్ళ ఖర్మ!” అనేసి వెళ్ళిపోయింది.
శ్రీదేవి పనిలో అతని తెలివితేటల్నీ, అతని గంభీర స్వభావాన్నీ అభిమానించింది, కానీ అతన్ని సెళ్ళిచేసుకుంటాననడానికి ఆమెకి ఆత్మాభిమానం అద్దువచ్చింది.
కొడుకు జీవితం అలా అయిపోయిందని దిగులులో అతని తల్లి మరణించింది, సుమన్ తండ్రి మౌనిలా మిగిలిపోయాడు. దానితో సుమన్‌కి (ప్రేమంటే, పెళ్ళంటే విరక్తి పుట్టినా, (ప్రేమను చంపుకుని మరొకరిని పెళ్ళిచేసుకోవడానికి మనసొప్పలేదు, =. శ్రీదేవి ఇప్పుడు సెళ్ళికి ఒప్పుకున్నా సుమన్ అందుకు సిద్ధంగాలేడు. వాళ్ళ జీవితాలు ఎప్పటికీ కలవని రైలుపట్టాలు ! (ప్రేమేనేరమౌనా ?
అ అ
సోమంచి ఉషారాణి 77 ఏంసెట్ రష ల్నా2ి ట్ర్ ఏంసెట్? “నే ను ఎంసెట్ వ్రాయనూ, వ్రాయనూ, వ్రాయనూ! ఎన్నిసార్జు చెప్పాలి ? జీవితానికి ఎంసెట్టే పరమావధా?” ఆదిత్య విసురుగా అన్నాడు.
“వ్రాయక ఏం చేస్తావురా? డబ్బులేని వాళ్ళు కూడా అప్పో సప్పో చేసి ఎంసెట్‌కి ప్రిపేర్ అవుతుంటే శుభ్రంగా మూడుపూట్టా మేపి, ట్యూషన్ పెట్టించీ, కావలసినవన్నీ కొనిచ్చీ చదువు కోమంటే నీకు పొగరెక్కిందిరా! టీవీ అమ్మి పారేస్తాను. ఆ వీడియో గేమ్ పగలకొట్టేస్తాను. వేలకువేలు తగలేసి కాలేజీలో చేర్పిస్తే, కాలేజీకి సరిగా వెళ్ళక రౌడీవెధవలతో తిరగడం, ఇంట్లో ఉంటే ఆ టీవీ ముందు కూర్చుని వీడియో గేమ్‌లు ఆడడం ఇదే జీవితమనుకున్నావా? చదువుకోకపోతే ముష్టెత్తుకు బ్రతుకుతావా?” చక్రధరంగారు చెట్టంత ఎదిగిన కొడుకును ఎడాపెడా వాయించేశారు. ళ్
సుధ చూస్తూ ఊరకుండిపోయింది కానీ అడ్డువెళ్ళలేదు. తల్లిమనసు కొడుకును కొడుతుంటే తల్లడిల్లినా కొడుకు ఉజ్బ్వల భవిష్యత్తునూ, మంచినీ కోరుకునే అమ్మగా అమెకి కూడా కొడుకు ప్రవర్తనా, ఎదురుసమాధానం చెప్పడం, చదువుమీద (శ్రద్ధ లేకపోవడం చాలా కోపంగా ఉంది. ష్ వ్రాయుము ర బ్రయపడలేదు. “నేనేమీ చదువుకోననడం లేదుగా! ఎంసెట్ ఉక్రోషంగా. ద ఇంట్రెస్ట్ లేదంటున్నాను. డిగ్రీలో చేరతాను” అన్నాడు
“నోర్ముయ్. నువ్వు చదవాల్సిందే, పరీక్ష వ్రాయనలసిందే! నామాటకు తిరుగులేదు. ఈ రోజునుండీ టీపీలూ, తిరుగుళ్ళు బంద్ ! సుధా ! వాణ్ణి కూర్చోబెట్టి చదివించాల్సిన బాధ్యత నీమీదే! నీమాట వినకపోతే చెప్పు. నేనే సెలవుపెట్టి చదివిస్తాను. తెలిసిందా?” ”
భార్యమీద బాధ్యతపెట్టి, ఆఫీసుకు వెళ్ళిపోయాడు చక్రధర్! తండ్రి అలా వెళ్ళగానే టీవీ పెట్టుకొని కూర్చున్నాడు ఆదిత్య, సుధకి ఒళ్ళు మండిపోయింది.
“నాన్నగారు తిట్టినా, కొట్టినా నీకు సిగ్గు లేదేంరా? ముందా టీవీ ఆపి పుస్తకం తీయి” అని అరిచింది కొడుకుమీద.
“నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవెంటమ్మా? నాకా ఇష్టంలేని చదువు చదవమని ఎందుకు "బలవంతం చేస్తారు? నాకిష్టమైన చదువు చదివించవచ్చుగా!. నేనేమీ చదువుకోననడం లేదే! ఆ ఎంసెట్ మీద మీకెందుకంత పట్టుదల? కొన్ని లక్షలమంది వ్రాస్తారు. అందులో మంచి ర్యాంకు రావాలి. లేకపోతే ర్యాంకు రాలేదని అదొక బాధ. వచ్చినా ఫ్రీసీట్ రావాలి. అదీ ఎక్కడిస్తే అక్కడికి వెళ్ళాలి. పేమెంట్ సీటైతే మంచి గ్రూప్ రాకపోతే అదొక దండగ. ఇప్పటికే బోళ్ళునుంది ఇంజనీరు ఖాళీగా ఉన్నారు. వెబితే అర్ధం వేసుకోరేం?"
సోమంచి ఉషారాణి 78 థంసెట్
- ఆవేశంగా, ఆవేదనగా అన్నాడు ఆదిత్య, “ఇంకా చిన్నపిల్చాణ్ణి కొట్టినట్టు కొడతారు. చదివేది నేనా? ఆయనా?” దుఃఖం వచ్చేసింది.
“మీనాన్నగారి సంగతి నీకు తెలియంది ఏముంది? ఎవరైనా ఆయనకి ఎదురు చెప్పటానికి వీల్లేదు. ఇప్పటికీ నేనే చెప్పలేను. మాకు నువ్వు ఒక్కడివే కొడుకువి. నువ్వు పెద్ద ఇంజనీరై గొప్పవాడివవ్వాలని కోరుకోవటంలో తప్పులేదుగా[” సుధ కొడుకుని దగ్గరకు తీసుకుని అనునయిస్తున్నట్లుగా అంది.
“గొప్ప వాళ్ళవ్వాలంటే ఇంజనీరే అవ్వాలా? తెలివితేటలుండాలి, అదృష్టముండాలి కానీ డగ్రీ చదివి, బాంకు పరీక్షలు (వ్రాయచ్చు, ఇంకా ఎన్నో కోర్సులు ఉన్నాయి. నాన్నగారు వినిపించుకోరేం?” ఆదిత్య పట్టువదలకుండా అన్నాడు.
సుధ “తల్లిదండ్రులకి పిల్లలమీద కొన్ని ఆశలు ఉంటాయిగా ! చదివి పరీక్ష (వ్రాయి. తరువాత సంగతి చూద్దాం.” ఒప్పించింది.
న సస
“శారదా! పదిసార్హు నాచేత లేదనిపిస్తావెందుకూ? అన్నయ్య చదువుకైన అప్పే ఇంతవరకూ తీరలేదు. ఇప్పుడు మళ్ళీ నిన్ను ఎంసెట్ కట్టించి, సేటొచ్చిందని డాక్టరు చదివించడం”.
“ప్లీజ్ నాన్నా! ఎంసెట్ అప్లికేషన్‌కె డబ్బు కట్టండి చాలు. నేను కష్టపడి చదివి మంచిరాంకు తెచ్చుకుంటాను. ఫ్రీసీటు వస్తేనే చదివించండి. అంతేకానీ అన్నయ్యకులా డబ్బు ఖర్చుపెట్టి చదివించక్కరలేదు. ప్లీజ్ నాన్నా! కాదనకండి” శారద తండ్రి కాళ్ళా వేళ్ళాపడి
బతిమాలింది.
“మగపిల్దాడితో. నీకు పోలికేమిటే? నిన్ను ఇంతా కష్టపడి చదివిస్తే పెళ్ళయ్యాక నీమొగుడికేగా జీతం డబ్బులు ధారపోసేది. మళ్ళీ పెళ్ళికి లక్ష కట్నం! ఎక్కడనుంచి తేగలననుకుంటున్నావు? మన పరిస్టితి అర్ధం చేసుకోలేనంతటి చిన్నపిల్లవేంకాదుగా! ఏదో సంబంధం చూసి, మూడు ముళ్ళూ వేయించేస్తే.....” తల్లి విసుక్కుంది.
“అమ్మా! ఆడవాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తున్న ఈ రోజుల్లో మూడా ఆడా, మగొ తేడా చూపించడం బాలేదమ్మా! అన్నయ్యని అంత డబ్బు తగలేసి చదివించారు. వాడిప్పుడు మీకేమైనా పంపుతున్నాడా!” శారద ఊశక్రోషంగా అంది.
“అయినా వాడిని చదివించాల్సినన బాధ్యతా, నీకు పెళ్ళి చేయాల్సిన విధి మాకుంది. నోర్మూసుకొని నాన్నగారు చెప్పినట్టు విను”
తల్లి మందలింపుతో శారద నిరాశగా, “అంతేనా నొన్నా ! నేను కష్టపడి చదువుతాను నాన్నా! ఫ్రీ సీటు వస్తేనే...” అంటుంటే.
“ఫ్రీసీటు వస్తే మాత్రం? పుస్తకాలనీ, దారి ఖర్చులనీ, అదనీ, ఇదనీ ఎన్నో ఖర్చులు ఉంటాయి. మనలాంటివాళ్ళు డాక్టరు చదవడమంటే ఆషామాషీకాదు” తండ్రి
సోమంచి ఉషారాణి 79 ఏంసెట్ మందలించాడు.
నేను ట్యూషన్స్ చెప్పి నా ఖర్చులు నేను చూసుకుంటాను. మీరు ఒప్పుకోండి చాలు. ప్లీజ్ నాన్నా!” శారద దీనంగా అడిగింది సరేనని అప్లికేషన్‌కి డబ్బిచ్చాడు శారద తండ్రి, తల్మి మూతి తిప్పింది.
ష్ చ మ
పరీక్ష వ్రాయను మొర్రో అన్న ఆదిత్యను వారం సెలవుపెట్టి, దగ్గరుండి చదివించి, బలవంతాన పరీక్షహాల్గోకి పంపించాడు చక్రధర్. ఉన్న ఒక్కగా నొక్క కొడుకు అంత మొండివాడుగా మారడం ఆయనకి చాలా బాధగా ఉంది. ఇంతమంది ఎంతో ఉత్సాహంగా, కష్టపడి చదివి పరీక్ష (వ్రాస్తుంటే వీడికేమైంది? ఏదో డిగ్రీ చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ ఏముంది?
ఏంసెట్‌లో ర్యాంకంటూ వస్తే పేమెంట్ సీటైనా ఎన్ని లక్షలైనా చదివించగల స్తోమత తనకుంది. వీడు అర్హం చేసుకోడు. డిగ్రీ అయితే ఏదో ఆడుతూ పొడుతూ చదవచ్చు. కాలేజీకి వెళ్ళకపోయినా అడిగేవాళ్ళుండరు అనుకుంటున్నాడేమో! ఈ రోజుల్లో ఆడపిల్లలు చక్కగా చదువుకుని మంచి ర్యాంకులు తెచ్చుకుంటుంటే ఈ మగపిల్లల కేమైందో? ప్రతి వాళ్ళకీ ఆటలూ, టీవీలు, సినిమాలూ, ఆడపిల్లలతో స్నేహాలు, ప్రేమలూ...”
“అంకుల్! మీరు ఆదిత్య ఫాదరా?” ఒక స్కూలు అమ్మాయి అడుగుతోంది.
“యస్!” నువ్వెవరు? అన్నట్టు చూశాడు చక్రధర్.
'నాపేరు సునీత. నేను ఇంటర్ ఫస్టియర్ (వ్రాశాను. ఆదిత్య మా సీనియర్. మేమిద్దరం ఫ్రెండ్స్. మీ గురించి చెబుతూ ఉంటాడు ఆదిత్య, లోపల పరీక్ష వ్రాస్తున్నాడా?” చాలా డేరింగా ఉంది.
“ఏమని చెప్పాడు నాగురించి?” కుతూహలంగా అడిగాడు.
“మీరు మరో హిట్టరనీ, కోపం ఎక్కువనీ, మీకు మీ ఇష్టాఇష్టాలే తప్ప ఎదుటివాళ్ళ ఇష్టాలతో పనిలేదనీ, నిజంగా తనకు ఎంసెట్ వ్రాయాలని లేదనీ ఏదో చెబుతూ ఉంటాడు. నిజమేనా అంకుల్!” అమాయకంగా అడిగినా చాలా తెలివైందని చద్రధర్‌కి అర్జమైంది. దానికన్నా అదిత్యకి ఆడపిల్లలతో స్నేహాలున్నాయన్న విషయాన్ని సహించలేకపోయాడు.
ఇందుకేనన్నమాట వీడు ఎంసెట్ వ్రాయనన్నది! ఆడపిల్లలతో తిరుగుతూ అఆ కాలేజీలోనే డిగ్రీ చదివి, చివరకు (ప్రేమా, పెళ్ళి అంటూ... ఈ యువత ఎటుపోతోంది?
“హాయ్ సునీ! ఎంతసేసైంది వచ్చి?” పరీక్ష (వ్రాసి వచ్చి ప్రక్కన తండ్రి ఉన్నా సునీతను ఇంతముఖం చేసుకొని పలకరించడం చ(క్రధర్‌కి ఒళ్ళు మండిపోయింది.
“ఎలా ద్రాశావు? ఈజీగా ఉందా?” చక్రధర్ అడగబోయిన ప్రశ్న సునీతే అడిగేసింది.
“ఏదో వ్రాశాలే! ఇప్పుడు దానిగురించి ఆలోచించే ఓపిక లేదు. ఏదైనా పిక్చర్‌కో, పార్క్‌కో వెడదామా?” తండ్రి అక్కడ లేనట్లే ఆదిత్య సునీతని అడిగాడు.
సోమంచి ఉషారాణి 80 ఏంసెట్ నముంచిచపురొల ల బందెట్
“ఓ! అందుకేగా నీకోసం వెయిట్ చేస్తున్నాను అంకుల్! ఆదిత్య బాగా టైర్డ్ అయిపోయాడు కదా! కాసేపు పార్క్‌లో కూర్చుని, రిలాక్సయి వస్తాడు. వెళ్ళొస్తాం” చక్రధర్ ఆదిత్య నిర్లక్ష్యాన్నీ, పాగరునీ ఏమీ అనలేక నిస్సహాయంగా వెనుదిరిగాడు.
ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు తనకు అసలు ర్యాంకే రాకపోయినా తనకు ముందే తెలుసన్నట్టు ఆదిత్య బాదపడలేదుకానీ అతని తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. చక్రధర్ మరీ కుంగిపోయాడు. ఆదిత్యని ఏమనాలో, ఏంచేయాలో అర్హంకాక ఆలోచిస్తూండి పోయాడు.
ఆదిత్య తను చదువుతున్న కాలేజీలోనే బి.ఎస్.సి.కి అప్లికేషన్ తెచ్చుకున్నాడు. కానీ చక్రధర్‌కి అ కాలేజీలో చదివించడం ఇష్టంలేదు. ఆదిత్య ఆ కాలేజీలోనే చదువుతానని పట్టుబట్టాడు పోనీలెండి వాడికిష్టమైందే చదువుకోనీండి. ఇంటర్‌లో ఫస్ట్‌క్లాస్ వచ్చిందికదా! అని సుధకూడా అనడంతో ఊరుకున్నాడు.
శశ ల శారదకి ఎంసెట్‌లో ఫస్టుర్యాంకు వచ్చింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు. ఆమెకి ఫోన్ లేకపోవడంతో అమె స్నేహితులూ, తెలిసిన వారూ, బంధువులూ, పత్రికా విలేఖరులూ ఇంటికే వచ్చేశారు. అందరూ అడిగిన (ప్రశ్చలకూ ఓపిగ్గా సమాధానం చెబుతోంది శారద.
తల్లి వచ్చినవాళ్ళందరికీ మంచినీళ్ళూ. కాఫీలు సప్లయ్ చేస్తోంది. తండ్రి స్వీట్టు తెచ్చి అందరికీ తలొకటీ ఇస్తున్నారు. న్ క
పత్రికా విలేఖరులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అందరూ ఆసక్తిగా వింటున్నారు. శారద ఎంతో ఆత్మవిశ్వాసంతో సమాధానాలిస్తోంది.
“మీకు ఫస్టుర్యాంకు వస్తుందని ఊహించారా?”
“మంచి ర్యాంకు రావాలని ఆళించానుకానీ ఇది ఊహించనిది”
“మీ విజయానికి కారకులెవరు?”
“నా తల్లిదండ్రులు” తల్లిదండ్రులకేసి ఓరగా చూస్తూ సమాధానమిచ్చింది శారద. ఇద్దరూ ఉలిక్కిపడి తలెత్తారు వారి కళ్ళలో నీళ్ళు. అవి అనందబాష్పాలనుకున్నారందరూ. అవి కన్నీటి బిందువులని ముగ్గురికే తెలుసు.
“మీ ఆశయం ఏమిటి?”
'ఎం.బిబిఆయన్ అయ్యాక ప్రభుత్వం అనుమతిస్తే అమెరికా వెళ్ళి మంచి న్యూరాలబిస్టుగా పేరు తెచ్చుకోవాలని”
అలా ఏవేవో ప్రళ్షలు వేసి విలేఖరులు వెళ్ళి పోయాక వచ్చినవాళ్ళు అందరూ ఒక్కొక్కరూ వెళ్ళిపోయారు.
తండ్రి ఆమె తల నిమిరి, “నువ్వు అన్నమాట నిలబెట్టుకున్నావమ్మూ। నాకు చాలా గర్వంగా ఉంది. ఎంత డబ్బు ఖర్చయినా నువ్వు నీ లక్ష్యం నెరవేర్చడానికి నా ఆశీర్వాదం
నోమంచి ఉషారాణి 81 ఏంసెట్ ఎప్పుడూ ఉంటుంది” అన్నాడు మనస్సూర్తిగా.
తల్లి 'ఎందరి కళ్ళు పడ్డాయోనని దిష్టితీసింది. శారద నిజంగా ఆ శారద దేవేనని మురిసిపోయింది" అమ్మో! తన దిష్టే తగిలేలా ఉందిని లెంపలు వేసుకుంది
హ్హ స
'(ప్రేమలోపడి, చదువుని అ(శ్రద్ధచేసి, తన భవిష్యత్తును నాశనం చేసుకుంటాడనుకున్న ఆదిత్య బి ఎస్.సి. చదువుతూ కంప్యూటర్‌లోనూ డిస్టమా తీసుకుని డిగ్రీ అయ్యేసరికి ఒక మంచి కంప్యూటర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు.
చక్రధర్ అప్పుడు నిజంగా పొంగిపోయాడు. నిజమే ! పిల్లలకి దేనిమీద శ్రద్ద ఉంటుందో అదే చదివించాలి బలవంతాన మన అభిప్రాయాలూ, ఆశయాలూ, కోరికలూ వారిమీద రుద్దకూడదు. మనము వారికి తగిన ్రోత్సాహాన్నీ, సలహాలనీ ఇవ్వాలి తప్ప వారిని శాసించకూడదు. చక్రధర్‌కి తన ఫ్రెండ్ ప్రసాద్ గుర్తువచ్చాడు.
“ఏమిటండీ అలా ఉన్నార ? ఎనీ ప్రాబ్దమ్?” అడిగింది సుధ.
“ప్రసాద్ గుర్తు వచ్చాడు సుధా! నాలాగే అతనూ వాళ్ళబ్బాయిని బలవంతంగా ఎంసెట్ వ్రాయించాడు. ఎన్నోవేలు ఖర్చుపెట్టి ట్యూషన్లూ చెప్పించాడు. ఎప్పుడూ ఇన్నివేలు తగలేసి చదువు చెప్పిస్తున్నాను, బాగా చదవమని విసుక్కునేవాడు.
ఓటీవీలేదు, ఓ సినిమా లేదు. ఇంట్లో వాళ్ళతో కలసి సరదాగా నవ్వనిచ్చేవాడుకూడా కాదు. ఎంతసేపూ చదువూ, చదువూ తప్ప వేరేమాట వచ్చేదికాదు ఆ భార్యాభత్రల నోట! ఆ అబ్బాయి మన వాడిలా ఎదురుసమాధానం చెప్పేవాడుకాదు కానీ, కష్టపడి చదవడానికి ప్రయత్నించేవాడు. తాను పాస్‌కాకపోతే నాన్న ఏమైపోతారో, అంత డబ్బు వృధా అయిపోతుందేమో. అమ్మ తనను అభిమానించదేమో, అన్న దమ్ములు వెక్కిరిస్తారేమో, స్నేహితుల్లో పరువుపోతుందేమో, తనకు ర్యాంకు రాదేమో అని ఆలోచించి, చివరకు మంటల్‌గా తయారయ్యాడు. అతనికింకా సైక్రియాటిస్టు ట్రీట్‌మెంట్ ఇప్పిస్తూనే ఉన్నారు కానీ పూర్తిగా తగ్గలేదు”.
“అందుకే అంటారు గుర్రాన్ని చెరువుదాకా తీసుకెళ్ళగలరు కానీ బలవంతంగా నీళ్ళు (త్రాగించగలరా? అందులో పిల్లల్ని (ప్రతిక్షణం చదవమని వేధించడం, ముఖ్యంగా డబ్బువిషయం వారి దగ్గర ప్రస్తావించడం మరీ తప్పు. ఈ తల్లిదండ్రులు ఎప్పటికి తెలుసుకుంటారో! ఈ ఎంసెట్ అనేది మరీ వేలంవెర్రిగా, అదే జీవిత పరమావధిగా మారిపోయింది. ప్స్!” నిట్టూర్చింది సుధ
అఅలఅి
సోమంచి ఉషారాణి 82 దావోర్తులు సోమంచి ఉషారాణి 62 __దాహోర్తులు హోరు అారూఆ్యులు
- ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా వృధా చేస్తుంటే వసంతకళ్ళలో కన్నీరు చిందుతుంది. పైకి చెప్పలేని విషాదం 1 చెప్పినా ప్రయోజనంలేని ఆత్మఘోష ! గుక్కెడు నీటికోసం పరితపిస్తూ ఎన్నో మైళ్ళు నడిచివెళ్ళి మోసుకొచ్చే ముసలి వాళ్ళూ, స్త్రీలూ, పిల్లలూ ఎందరో! ఇంకా ఎందరో ఈ రోజుల్లో కూడా సరిపడునీరులేక్ర దాహంతో అలమటిస్తుంటే నీటిని ధారాళంగా ఖర్చుచేయాలంటే మనసులో ఏదో ముల్లు గుచ్చుకున్న బాధ! వాళ్ళకి తానేమీ చేయలేదా? తన మనసును ఇంత దయగా ఎందుకు సృష్టించాడో ఆ భగవంతుడు?
ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ? బిడ్డ దాహంతో బాధపడుతుంటే కన్నతల్లి మనసెంత తల్లడిల్లిపోతుంది! మరి...
“రంగయ్యా! ఈ జాజి తీగకు మరిన్ని నీళ్ళు పట్టు ఈ ఎండలకి మొక్కలు వాడిపోతున్నాయి” అని తోటమాలికి పురమాయించి వసంత (ప్రక్కన కూర్చున్నాడు వినోద్.
ఆమె ఏదో దీర్జాలోచనలో ఉండి అతన్ని గమనించలేదు. ఆమె ఎప్పుడూ దేనిగురించో బాధపడుతున్నట్టుంటుంది. కారణం చెప్పదు. ఒకోసారి ఎంతో అమాయంకగా చూస్తుంది. అలాగని తెలివితక్కువదేం కాదు. అందరి బాధలూ తనవిగా భావించి బాధపడుతుంది. మరీ అంత జాలి పనికిరాదంటే వినదు.
“వసంతాగ” ప్రేమగా పిలిచాడు వినోద్ సాలోచనగా చూసిందతనిక్తేసి. దాహార్తుల దృశ్యం కళ్ళలో మెదుల్తున్న ఆమెకతడు మసగ్గా కనిపించాడు. అమాయకంగా చూస్తున్న ఆమె స్నిగ్భమోహన సౌందర్యాన్ని తన్మయంగా చూశాడు వినోద్
'ఏమిటంత దీర్దాలోచన? సంఘసేవ గురించేనా?” వేళాకోళం.
“మీకు నవ్వులాటగా ఉందా?” వేళాకోళానికి విస్తుపోయింది.
“లేకపోతే ఏమిటి వసంతా! బాధలు లేని మనిషెవడుంటాడు? అలాగని అందరి బాధలూ ఎవరు తీర్చగలరు? సాధ్యంకాని దాని గురించి అలోచించి మాత్రం ప్రయోజనం ఏమిటి? ఊరికే మానసికంగా, శారీరకంగా బలహీనమవడం తప్పు!” వినోద్ వితండవాదాన్ని వింతగా వింటూండిపోయింది వసంత.
“ఎంత తేలిగ్గా చెప్పారండి! ఏ ఒక్కరూ అందర బాధలూ తీర్చలేకపోవచ్చు. కానీ కొందరైనా కలసి కృషిచేసి ఒక్కరి జీవితాన్ని అయినా బాగుచేయవచ్చుకదా! ఎవరికి వారే తమ స్వార్థం చూసుకుంటే అభాగ్యుల జీవితాలు బాగుపడేదెలా?* ఆర్తిగా అంది వసంత,
“డోంట్‌బీే ఏ సెంటిమెంటల్ ఫూల్ అవన్నీ చూడ్డానికే మనం ప్రభుత్వాన్ని ఏర్పరుచుకుంది!” చిరాగ్గా అన్నాడు వినోద్.
“ప్రజలే ప్రభుత్వం! (ప్రభుత్వమే ప్రజలండీ! (ప్రజల అండ దండలూ, సహకారం లేనిదే ఏ ప్రభుత్వమైనా ఏం చేయగలం? ఊం చీకటిపడుతోంది. వంట చేయాలి” అని ఇంక
సోమంచి ఉషాండి ఈ __దావోర్తులు వాదించడం ఇష్టంలేనట్టు లోపలికి వెళ్ళిపోయింది వసంత,
వినోద్ దానిగురించి మరి ఆలోచించలేదు. చెట్ల మీదుగా వస్తున్న చల్లనిగాలిని ఆస్వాదిస్తూండిపోయాడు.
కొందరు తను జీవితాన్ని తమ భార్యా, పిల్లలూ, తనవాళ్ళూ క్షేమంగా ఉంటేచాలు, ఈ లోకం ఏమైపోయినా పట్టించుకోరు. తమచుట్టూ ఒక పరిధి గీసుకుని అందులోనే కుచించుకుపోతారు. మరికొందరు ఈ దేశానికీ ఈ (ప్రజలకూ ఏదో చేయాలనీ, వాళ్ళకు కొంతవరకైనా సాయపడాలనీ ఆళిస్తారుకానీ వారికేం చేయాలో, ఎలా చేయాలో సాధ్యంకాక నిస్సహాయంగా ఉంటే, ఇంకొందరు అనుకున్నదాన్ని ఆచరణలో పెట్టి, ఎన్ని అడ్డంకులెదురైనా తమ లక్ష్యాన్ని సాధిస్తారు.
యశ ౫
ఒకరోజు ఏదో పుస్తకం తిరగేస్తున్న వసంత “నమస్కారమండీ!” అని తన ఎదుట నిలిచిన వ్యక్తులకేసి అయోమయంగా చూసింది. వాళ్ళెవరో తెలియకపోయినా.
“రండి. కూర్చోండి” అని మర్యాద చేసింది. చల్లటి మంచినీళ్ళు అందించి, 'ఏమిట'న్నట్టు చల్లగా చూసింది.
“నిట్రి ఎద్దడితో త్రాగేందుకు చుక్కనీరు లేక అక్కడ ప్రజలగొంతు ఎండిపోతుంటే ఇక్కడ మనం...” విచారంగా అంటూ చేతిలో గ్లాసు క్రిందపెట్టేశాడు ఒకాయన,
“మనం వృధాగా నీళ్ళు నేలపాలు చేస్తుంటే కొన్నిచోట్ల ప్రజలు ఒక్క నీటి బొట్టుకోసం ఎంత అల్ఫాడిపోతున్నారో. ! వాళ్ళూ మనసాటి మనుష్యులే ! దాహం బాధ ఎంత దారుణమైనదో దాన్ని అనుభవించిన నాలాంటి వాళ్ళకే తెలుస్తుంది.” కళ్ళు తుడుచుకుంటూ మరొకాయన కూడా గ్లాసు క్రింద పెట్టేశాడు.
“ఛఛ! ఒక ప్రక్క దాహం దాహం అని మన తోటి మనుష్యులు 'ప్రాణాపాయస్టితిలో ఉంటే వారికి మనం చేతనైనంత సాయం చేయవలసిందిపోయి కూల్‌డ్రింక్స్ (త్రాగుతూ, షవర్‌బాత్‌లు చేయడంలో అర్హంఏమిటి? అసలు ఈ దేశం, (ప్రజలూ ఎప్పుడు బాగుపడతారు?” మరొకాయన దేశోద్దారకుడిలా ఆవేశపడిపోతూ ఆయాసం తీర్చుకుందుకు ఆ చల్లని నీళ్ళు గడగడా తాగేశాడు.
శన మనసులో మాటలే వారినోటినుండి వెలువడుతుంటే వసంత సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండిపోయింది. తన మొరాలకించి ఆ దేవుడు పంపిన దూతల్చా అగుపించారు వాళ్ళు ముగ్గురూ ఆమె కంటికి.
“ఇంతకూ మీరు...”
“స్తాగ్రీ అండీ! మేము ఎవరమో చెప్పకుండా మాటలతో మిమ్మల్ని బాధపెట్టినట్టున్నాము. చేము ఆ దాహార్తులకోసం ఏవైనా చేయాలని నిర్ణయించుకున్నాము” మొదటి ఆయన అసలు విషయం చెప్పాడు.
సోమంచి ఉషారాణి ర్న దావోర్తులు
“ఏదో మీలాంటి సహృదయుల దగ్గర చందా వసూలుచేసి, అటువంటి చోట్ల ఎంత (శ్రమకైనా ఓర్చి, బావులూ, చెజువులూ (త్రవ్వించి, చంద్రునికో నూలుసోగులా మావంతు కృషి చేయాలని...” రెండో ఆయన అన్నాడు.
“అంతే కాదండీ! రోజూ టాంకర్లలో వారికి నీటిని అందించాలనీ (ప్రభుత్వానికి వినతిపత్రం సమర్చిస్తున్నాము. మీరు కూడా సంతకం పెడితే...” చల్లటి నీళ్ళు త్రాగి చల్లబడిన మూడో ఆయన శాంతంగానే వినతిపదత్రం అందించాడు.
వసంత వాళ్ళ మాటలకీ, ఆలోచనా విధానానికీ పొంగిపోయింది. తన మనసులో కోరికకు రెక్కలు వచ్చినట్టు మురిసిపోయి. వారికి వెంటనే పదివేలకు చెక్కును ఇవ్వడమే. కాక వినతిపత్రం మీద సంతకం పెట్టింది.
వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు కాగల కార్యం గంధర్వులే నెరవేర్చినట్టు సంబర పడిం.ది అప్పుడే వాళ్ళు టాంకర్లలో నీళ్ళు తీసుకెళ్ళినట్లూ, అక్కడ బావులూ, చెరువులూ (త్రవ్విస్తున్నట్టూ కలలు కనసాగింది.
“ఏమిటి వసంతా! పగటికలలు కంటున్నావా? రెండు, సార్టు పిలిచినా పలకలేదు. ఏదైనా మరీ అదేపనిగా ఆలోచించకూడదు డియర్!” నవ్వుతూ అన్నాడు వినోద్.
“ఇదంతా కలా? నిజమైతే ఎంత బావుండును! మనసులో మాట పైకే అనేసింది వసంత, వినోద్ ఫక్కుమని నవ్వాడు,
వసంత మూతి ముడుచుకుని, కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. 'ఆమెని ఒంటరిగా వదిలేస్తే ఇలాగే ఆలోచనలతో పిచ్చిదైపోతుందేమో!' అనిపించింది వినోద్‌కి. అందుకే ఆ సాయంత్రం సినిమాకి వెడదామన్నాడు. వసంత ఒప్పుకోలేదు, సరికదా కలెక్టరు దగ్గరకు వెడదామంది.
“వసంతా! ఏమిటీ పిచ్చి? నిన్ను కలెక్టరు దగ్గరకు కాదు సైక్రియాటిస్టు దగ్గరకు తీసుకెళ్ళాలి” అని కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. అతనికి భార్యంటే అంతులేని అనురాగం. అయినా ఆమె చాదస్తాన్ని భరించలేకపోయాడు. ఆరోజు బాగా అలసిపోయాడు.
భర్త కాఫీ అయినా తాగకుండా అలా వెళ్ళిపోతాడని ఆమె ఊహించలేదు అయితే ఆమె పట్టుదల మాత్రం వదలలేదు. తానే కార్యనిర్వహణకు పూనుకుంది. సంఘసేవే ఆమె ఊపిరి మరి!
బాగా డబ్బున్నవాళ్ళదగ్గర చందాలు వసూలుచేసింది. నీటి కరువు ఉన్న (ప్రాంతాలకు వెళ్ళి తమకు నీటివసతి కల్పించమని పిటిషను తయారుచేసి, ఇంటింటికీ వెళ్ళి సంతకాలూ, వేలిముద్రలూ తీసుకుని దాన్ని ముఖ్యమంత్రికి సమర్పించింది.
ఆమె ఫోటో, పేరూ పేపర్టో చూసి వినోద్ మనసులో సంతోష్షించినా పైకి ముభావంగా ఉండిపోయాడు. నిజమే ! ఏదైనా కార్యరూపంలో చూపించాలి కానీ శుష్కప్రియాలూ, శూన్య హస్తాలూ ఎందుకూ? అయినా వసంతను మెచ్చుకోవడానికీ, మనసారా అమెని అభినందించడానికీ అతనిలోని పురుషాహంకారం అడ్డువచ్చింది. కొలీగ్స్ పాగుడుతున్నా
పట్టనట్టు ఉండిపోయాడు.
సోమంచి ఉషారాణి _ 65 రోకు
నీటికరువు ప్రాంతాల్లో త్రవ్వకాలు మొదలుపెట్టారు. బోరింగులు వేస్తున్నారు. వాళ్ళు అక్కడ పనిచేయాలంటే నీరు కావాలి. వారి దాహం తీరితేనే పని సులువుగా జరిగి, ఇతరుల దాహం తీర్చగలరు. అందుకని టాంకర్లలో వాళ్ళకి నీళ్ళు అందేలా చేసింది వసంత. తాను చేసేదేమీ లేకపోయినా త్రవ్వకాలు జరిగేటప్పుడు దగ్గరే ఉండేది. టాంకర్లలోని నీళ్ళు చూసి ఉప్పాంగుతున్న ఆ దాహార్తుల ఉత్సాహం చూసి మురిసిపోయేది.
ఆ బీద (ప్రజలు ఆమెనొక దేవతలా చూశారు. ఆ ఆనందంలో తప్పు త్రాగారు. ఆటలాడారు. గంతులేశారు. అయితే అనుకోనిది జరగటం, అనుకున్నది కాకపోవడం విధి ఆడే వింత నాటకం !
ఎందరో దాహార్తుల దాహం తీర్చాలని ఆశించిన వసంత కొందరు కామాంధుల దాహానికి బలైపోయింది. పల్లైనుంచి కారులో తిరిగివస్తుంటే కొందరు దుండగులు కారు ఆపుచేసి ఆమె సర్వస్వాన్ని దోచుకున్నారు. చీకటిపడిపోయింది. ఆ దారిలో రాకపోకలు తక్కువ.
నవ వసంతంలాంటి వసంత సౌందర్యం ఆమె పాలిట శత్రువైంది. ఆమె రోదన ఆరణ్యరోదనైంది. కరడుగట్టిన ఆ కామాంధుల పాషాణ హృదయం కరగలేదు సరికదా తమ విషయం ఎక్కడ బయట “పెడుతుందోనని ఆమెని గొంతు నులిమి చంపేసి పారిపోయారు.
ఎంతకూ తనివి తీరనిది ధనదాహమే అయినా చచ్చిన మనిషి మీద కూడా ధనం రాబట్టాలనుకోవడం అమానుషత్వానికి పరాకాష్ట అలాంటి వాడే వీరాస్వామి. (స్రీశవం, కారూ అదీ చూసి అటుగా వెడుతున్న ట్రక్కు (డ్రైవరు వీరాస్వామి ఆమెని కారులో పడుకోబెట్టాడు. అమె బాగులో ఆమె అడ్రసూ, టెలిఫోను నెంబరుకోసం వెదికాడు.
ఒక్కసారిగా లక్షాధికారి అయిపోతే బావుండననే కోరిక చాలామందికి ఉంటుంది. అయితే అందుకు వారు ఎంచుకునే మార్గాలు విభిన్నంగా ఉంటాయి. ఎదుగూబొదుగూ లేని ఆ (డ్రైవరు ఉద్యోగంతో విసుగెత్తిపోయిన వీరాస్వామికి ఓ దురాలోచన కలిగింది. అందుకే వసంతను కారులోనే ఉంచి, ఆమె బ్యాగులో దొరికిన టెలిఫోన్ నెంబరుకి రింగ్‌చేశాడు. బహుశా ఇదంతా సినిమాల ప్రభావమంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదేమో!
'చాలో! ఎవరూ?” అంటుంటే వీరాస్వామికి అలవాటులేని పనికావడం వలన గొంతెండుకుపోయి, వణుకుపుట్టింది. మొదట నోట మాట రాలేదు కానీ తరువాత
“మీరెవరు?” అన్నాడు కర్కశంగా.
“నేను వినోద్! మీరు?” ఆశ్చర్యంగా అన్నాడు వినోద్. రాత్రయిపోయింది. తన భార్య ఇంకా రాలేదని కంగారుపడుతున్నాడు.
“నేనెవరైతేనేంలే? నీ భార్య నా అధీనంలో ఉంది. నీ భార్యని క్షేమంగా అప్పచెప్పాలంటే లక్షరూపాయలు తీసుకుని, సిటీ బోర్డరుకి రా ! ఈ విషయం పోలీసులకిగానీ, మరెవరికైనా చెబితే నీ భార్య ప్రాణాలతో దక్కదు. జాగ్రత్త!” అని ఫోన్ పెట్టేసి గట్టీగా నవ్వాడు.
సోమంచి ఉషారాణి 86 దాహార్డులు చెప్పింది ఎంతవరకూ నమ్మాలి? తన భార్య నిజంగానే అతని వలలో చిక్కుకుందా? ఇప్పుడేం చేయాలి? ఎవరితోనూ చెప్పద్దన్నాడు. కర్కోటకుడిలా ఉన్నాడు. పోలీసులకి చెబితే నిజంగానే ఆమెని చంపేస్తాడేమో! ఇప్పటికిప్పుడు లక్షరూపాయలు ఎలా వస్తాయి? తన అర్జాంగి, తన జీవితం సర్వస్వం అయిన వసంత లేకుండా తనకు నునుగడ ఏముంది? వద్దంటే వినకుండా దాహార్తులంటూ వెళ్ళింది. ఇప్పుడేమైంది? నిస్వార్ధంగా సంఘసేవ చేయాలనుకునేవాళ్ళు ఇంతేనా? ఏమైతే అయిందని తన (ఫ్రెండు ఇన్‌స్పెక్టరు రవికి విషయం చెప్పి, అతని సాయం కోరాడు. రవి మష్టీలో వినోద్ వెంట ఫోన్‌లో చెప్పిన ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అతను కారులోనే ఉండిపోయాడు. వినోద్ బ్రీఫ్‌కేస్‌తో కిందకి దిగి తమ కారున్న చోటికి వచ్చాడు. ప్రక్కనుంచి వీరాస్వామి వచ్చాడు. “నీభార్య ఆ కారులో నిద్రపోతోంది. ఆడబ్బిలా ఇవ్వు” అని లాక్కుని, రవి కారు దిగి వచ్చే లోపల మాయమయ్యాడు, కారులో వసంత అప్పటికే చలనరహితంగా ఉండడం వినోద్ భరించలేక ఘౌల్టుమన్నాడు. రవి ధైర్యం చెప్పి అమెని సిటీలోకి తీసుకువచ్చి, పోస్ట్‌మార్టమ్ చేయించాడు. ఆమెని కొందరు కామాంధులు అనుభవించి, గొంతు నులిమి చంపినట్టుగా తెలుసుకొని వినోద్ మరీ విలవిలలాడిపోయాడు, ఆ అమాయకురాలినీ, సంఘసేవికురాల్ని, సుకుమారినీ చంపడానికి వాళ్ళకి చేతులెలా వచ్చాయో! “వినోద్! ఆ దుర్మార్గుల్ని ఎలాగైనా పట్టుకుంటాను. వారిని ఉరి స్థంభానికి ఎక్కిస్తాను” ఆవేశంగా అన్నాడు రవి. “హు!” విరక్తిగా నవ్వాడు. వినోద్ 'నా భార్యని (బ్రతికించలేవుకదా” అన్నట్టు! ఆమెని ఊరేగింపుగా తీసుకొచ్చి దహనం చేశారు, ఆ వార్త పేపర్టో ప్రముఖంగా వచ్చింది. కొందరంతే! చనిపోయాక కూడా ఇతరులకి సాయపడతారు. తప్పించుకుపోయిన వీరాస్వామి ఎక్కడికో దూరంగా పారిపోయి లక్షాధికారి అయ్యాడు, ఆమె జీవితకధని (వ్రాసి ఓ రచయిత బహుమతి, అవార్డూ పొంది తన కీర్తి దాహాన్ని తీర్చుకున్నాడు. ఇంతమందికి ఇన్ని రకాలుగా దాహం తీర్చిన వసంత దాహార్తుల పాలిట కల్పతరువుగా చరిత్రలో మిగిలిపోయింది కొందరి జీవితాలంతే! పరోపకారార్థం ఇదం శరీరం? అఅలిఠలి
సోమంచి ఉషారాణి 87 శోభ
గలకృచట్టి ఏడుస్తున్న కూతుర్ని సముదాయించలేక సతమతమైపోతున్నాడు కృష్ణకాంత్: పాలు పట్టినా పాలకిత్తిని ఆవలకు నెట్టేసి మరీ లుంగచుట్టుకుని ఏడుస్తోంది పాపాయి.
“అమ్మా లతా! పక్కింటి ఆంటీని ఒకసారి పిలుచుకురామ్మా” మూడేళ్ళ పెద్ద కూతుర్ని పురమాయించాడు.
చెల్లాయి ఏడుస్తుంటే అమాయకంగా చూస్తున్న లత సరేనంటూ తలూపి పక్కింటికి వెళ్ళింది. ఆవిడ పేరు తరళ, కృష్ణకాంత్ భార్య శోభ, తరళ ఎంతో స్నేహంగా ఉండేవారు.
తరళ వెంటనే ఏమైైందోనని పరుగెత్తుకువచ్చింది. కృష్ణకాంత్ చేతిలోని పిల్లని అందుకుని సముదాయిస్తూ అడిగింది. “ఎప్పటినుంచి ఇలా? పొట్ట ఎత్తుగా ఉన్నట్టుంది విరోచనం ఎప్పుడైంది?”
“నిన్న కూడా అయినట్లు లేదు” గుర్తుకు తెచ్చుకుంటూ అన్నాడు కృష్ణకాంత్.
“అయితే కడుపు నొప్పే! కంగారేంలేదు” అంటూ సబ్బు ముక్క తెచ్చి పెట్టింది. వెంటనే విరోచనం అవడం, ఆ పాప ఏడుపు ఆపటం ఒక్కసారే జరిగాయి. వాన వెలిసినట్లు అయ్యేసరికి అందరూ ఒక్కసారే 'హమ్మయ్య!' అన్నట్టు నిట్టూర్చారు.
పాపాయి పాలు (త్రాగి హాయిగా నిద్రపోయింది. నిద్రలోకూడా ఉండి ఉండి వెక్కుతూనే వుంది.
“ఏమ్మా అతా! అన్నం తిన్నావా?”
“లేదన్నట్లు తలూపింది.
“ధాంకృండి. లతా నేను తింటాంలెండి” అన్నాడు కృష్ణ
“వస్తానండీ” అని వెళ్ళిపోయింది తరళ.
“నాన్నా! అమ్మ ఎప్పులొత్తుంది?” తల్లికి బాగా చేరికా అలవాటూ ఉన్న లతకి తల్లిలేని లోటు బాగా తెలుస్తోంది.
“అమ్మకి ఇంకా జ్వరం తగ్గలేదమ్మా! తగ్గాక వస్తుంది. పద భోంచేద్దాం” అని వంటింట్లోకి నడిచాడు కృష్ణకాంత్.
శ రే 3
అది వైజాగ్ మెంటల్ హాస్పిటల్. భార్యను చూడ్డానికి అక్కడికి వెళ్ళాడు కృష్ణకాంత్. అతనికి శోభ అంటీ అంతులేని అనురాగం! రెండోసారి పురిట్టో మెంటే షాక్ వచ్చింది శోభక్తి
ఆడుతూ పాడుతూ 'స్వీట్‌హోమ్'లా హాయిగా సాగిపోయే వారి సంసారం హాట్ హోంగా మారిపోయింది. భార్యని మేంటల్ హోమ్‌లో జాయిన్‌చేసి మధ్యమధ్యలో వెళ్ళి చూసి వస్తున్నాడు కృష్ణూం్ కానీ ఆమెలో మార్చేమీలేదు. "స్నేహితులూ, బంధువులూ అందరూ ఆ
నషమంచి ఉషారాణి 88 శోభ పసివాళ్ళతో ఏం అవస్ట్రపడతావు మళ్ళీ పెళ్ళి చేసుకొమ్మన్నారు. కానీ అతడు శోభని మర్చిపోలేకపోతున్నాడు. "|
తల్లిదండ్రులూ, తోబుట్టువులూ కూడా చెప్పి చెప్పి ఇక లాభం లేదని ఊరుకున్నారు. ఎవరి సంసారం వాళ్ళది! తండ్రి ఇంకా రిటైర్ కాలేదు. అందుకని తల్లి కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయింది. తమ్ముడు దూరంగా ఉంటున్నాడు ఉద్యోగరీత్యా, చెల్లెలు పెళ్ళయిపోయింది
“గుడీవినింగ్ డాక్టర్! శోభ ఎలా వుంది?” ఆశగా అడిగాడు.
“సారీ మిస్టర్ కూంల్ మీరు ప్రతిసారి ఇలా అడగటం నేనిలా చెప్పడం బాధగా వుంది. ఆమె సరిస్థితిల్ మార్పేమీ లేదు. చూస్తారా?” డాక్టర్ అలా అడుగుతుంటే కృష్ణకేదో గొంతుకు అడ్డు పడినట్టే వుంది.
మౌట్టాడలేనట్టు తలూపుతున్న అతని భుజం చుట్టూ చెయ్యివేసి లోపలికి తీసుకెళ్ళాడు. ఎంతో అందంగా చురుకుగా ఉండే శోభని అలా చూడలేకపోయినా చూడకుండూనూ ఉండలేకపోతున్నాడు. బాగా చిక్కిపోయింది. ఏవో పిచ్చి చేష్టలు చేస్తూ నవ్వుకుంటూ కూర్చుంది తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ కోపం తెచ్చుకుంటూ అక్కడ ఉన్నవన్నీ విసిరేసి నవ్వుతోంది.
స్వచ్చంగా, నిర్మలంగా నవ్వుతూ పాలూ, నీళ్ళలా కలిసిపోయి తన సుఖసంతోషాలలో పాలు పంచుకుని ఎన్నో తీపి గుర్తులు మిగిల్చిన తన అర్జాంగిని చూడలేక కన్నీళ్ళు తిరుగుతుంటే వెనుదిరిగాడు కృష్ణకాంత్. డాక్టరు అనుసరించాడు.
“అమ్మా! పిల్లల్ని చూడటం ఇక నావల్ల కాదు. నువ్వె చూసుకోవాలి” అన్నాడు తల్లి అరుంధతితో.
“నాక్రుమాత్రం ఓపిక ఉందిరా నాయనా! అసలే బిపి, ! నా మాటి విని మరో పెళ్ళి చేసుకో!” తల్లి ఎప్పటి పాటే పాడింది.
కానీ ఎప్పటిలా వెంటనే కాదనలేదు కృష్ణకాంత్. ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయాడు.
“పోనీ ఎవరినైనా మంచి ఆయాని చూస్తి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమ్మా. అక్కడ పనిపిల్లని పెడితే పిల్లల బిస్కట్టు పళ్ళు వాళ్ళకి పెట్టకుండా తనే తినేసేది. పైగా పిల్లల్ని కొట్టేదట! లత అన్నీ చెబుతుందని దాన్ని బెదిరించేది” న్
“ఈ తిప్పలన్నీ ఎందుకురా? మళ్లీ పెళ్ళి చేసుకుంటే...”
“ఆ వచ్చే ఆమె పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుందన్న గ్యారంటీ ఉందా?” సీరియస్‌గా అడిగాడు.
“ఎక్కడో మంచివాళ్ళు ఉండకపోరు చూడమన్నావా?” కొడుకు ఆ మాట అన్నందుకే మురిసిపోతూ అడిగింది తల్లి.
నా నమ్మకం నీకుంటే అలాగే కానీయ్ కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, వచ్చే ఆమె నాకు భార్యగా కాదు, పిల్లలకి తల్లి కొవాలి” అని అక్కడినుండి లేల్చి వెళ్ళిపోయాడు.
“నానమ్మా! మా అమ్మకి జ్బారం తగ్గలేదా?” ముద్దుగా అడుగుతున్న మనవరాలిని దగ్గరకు తీసుకుంటూ “లేదమ్మా అది తగ్గదు. కొత్త అమ్మను తెచ్చుకుందామా?” అని అడిగింది.
పాత గౌను చిరిగితే కొత్త గౌను కొన్నట్టే బొమ్మ విరిగితే కొత్త బొమ్మ కొన్నట్టు అమ్మ
సోమంచి ఉషారాణి 89 శోభ లేకపోతే కొత్త అమ్మను కొనుక్కుంటారేమో అన్నంత ఆలోచన మాత్రమే ఉన్న లత ముఖ్యంగా చెల్దాయిని సముదాయించలేక తండ్రి పడుతున్న అవస్థను చూస్తున్న లత స నంటూ నవ్వుతూ తలూపింది. ఇంకేమి ఆలోచించగలదు ఆ చిన్నారి. క
కృష్ణ పెళ్ళి రాధతో గుళ్ళో సింపుల్‌గా జరిగిపోయింది. రాధకి తల్లిదండ్రులు లేరు. మేననూమ దగ్గర ఉంటోంది. చాలా నిదానమైైంది. కష్టసుఖాలు తెలిసినది. అరుంధతమ్మ బాగా ఆలోచించి ఆమెకి నచ్చజెప్పి ఈ పెళ్ళికి ఒప్పించింది. ము లన
కట్నం ఇచ్చి పెళ్ళి చేయని మేనమామ కన్నా పెళ్ళి చేసుకుని పిల్లల్ని చూసుకోవటం ఆనందముంటస్ భావించింది రాధ. పిల్లల్ని ఎంతో అభిమానంగా చూసుకునేది. |
శోభ స్తానంలో వచ్చిన రాధను వెంటనే అభిమానించకపోయినా తన మంచితనం, స్నేహశీలతతో తరళ అభిమానాన్ని త్వరలోనే సంపాదించింది రాధ.
తరళ చాలా తెలివెనది కావడంతో శోభ ప్రసక్తి ఎప్పుడూ తీసుకువచ్చేది కాదు. రాధ కూడా అడిగేది కాదు. ఇద్దరూ ఏవో కుట్టు, అల్లికలూ చేసుకుంటూ త్సరలోనే మంచి స్నేహితులయ్యారు. పిల్లల్నీ, పెద్దల్నీ, అందర్ని ఆకర్షించినంత త్వరగా భర్త అభిమానాన్ని పాందలేకపోయింది లర డినా కోభని అంత
రాధ ఆతనికి వేళకి అన్నీ అందిస్తూ ఎంత ఆప్యాయంగా మాట్టా న భి అంత త్వరగా మర్చిపోలేక పోతున్నాడు కృష్ణ కా ఎల్లల విషయంళ | సైమా ఉండగలుగుతున్నాడు. అటువంటి అమ్మాయిని చూసినందుకు తల్లి క ష డు. రోజులు అలా గ ల ం పోక్ట్యను మన సంప్రదించడం, పండగలకి కొత బట్టలు కొనడం, అపుడస్పుడు భార్యా 'పల్లల్ని సినిమాకు, షికారుకు తీసుకువెళ్లడం వరకూ వచ్చాడు. అంతమాళ్రానికే మురిసేపోయంది. త్యరలోనే అతడు తనవాడు అవుతాడన్న నమ్మకం ఏర్పడింది రాధకి,
న
“సాబ్ మీకు ఫోన్” అటెండరు వచ్చి చెప్పగా సీరియస్‌గా పనిచేసుకుంటున్న కృష్ణకాంత్ ఉలిక్కిపడ్డాడు.
లు ఫోన్ రావడం తక్కువ. ఇంట్లో ఫోన్ సెసిలిటీ లేదు. ఈ ఊళ్ళ బంధువులూ, స్నేహితులూ తక్కువే! ఒకవేళ పిల్లలకి ఎవరికైనా బాగుండకపోతే రాధగానీ పబ్లిక్ టెలిఫోన్ నుంచో, పోస్టాఫీసునుంచో చేయలేదుకదా!" ఆదుర్దాగా ఫోన్ అందుకున్నాడు కృష్ణకాంత్.
“హలో! మిస్టర్ కృష్ట పౌ ఆర్ యూ? నన్ను గుర్తుపట్టావా?
“యస్ డాక్టర్! వాటోహాపెండ్! శోభకెలా నుంది?” కంగారులో ఏం మాట్టాడుతున్నాడో, ఎలా మాట్లాడాలో అరిం కాలేదు. శోభని చూసి చాలా రోజులైందని అతనికి అప్పుడు గుర్తువచ్చింది.
“కంగ్రాట్స్ మిస్టర్ కృష్ణ నౌ శోభా ఈజ్ అల్‌రైట్! నీ బాధ చూసి ఫారిన్ నుంచి ఒక సైకాలజిస్టు నస్తై శోభకి ట్రైట్‌మెంట్ ఇప్పించాను. నీకు తెలియచేద్దామనుకున్నాను. కానీ ఆమెకు నయంకాకపోతే అనవసరంగా ఆళలు కల్పించిన వాడినవుతానేమోనని చెపలేదు. ఆమెకు పూర్తిగా నయమయ్యాక నిన్ను సర్'ప్రయిజ్ చేసి నీ ముఖంలో సంతొషాన్ని
నయంచి ఉషారాణి 90 శోభ చూడాలనుకున్నాను. కానీ నువ్వు వచ్చి చాలా రోజులైంది. ఆసలు ఊళ్ళో ఉన్నావో లేదోనని ఫోన్ చేశాను. కృష్ణా! మాట్టాడవేం? సంతోషంలో మాట రావటం లేదుకదూ! ఐనో! ఒక వారం రోజుల్లో నువ్వు వచ్చి శోభని తీసుకెళ్ళవచ్చు. ఓకే!” కృష్ణ ఆలోచనలతో సంబంధంలేనట్టు తాను చెప్పదలచుకుంది చెప్పేసి ఫోన్ పెట్టేశాడు మెంటల్ హాస్పిటల్ డాక్టర్, కృష్ణకూడా అన్యమనస్కంగా ఫోన్ ్రెడిల్‌చేసి తన సీటులోకి వచ్చాడు కానీ పనిచేయలేకపోయాడు. “తను ఆమె బాగుపడాలని ఎన్నెన్ని కలలు కన్నాడు! ఎంత బాధ అనుభవించాడు. అటువంటిది ఇప్పుడు ఆమెకి నయమైందంటే కలగవలసినంత సంతోషం కలగటం లేదేం? తను మళ్ళీ పెళ్ళిచేసుకుని తొందరపడ్డాడేమో! ఇప్పుడేం చేయాలి? కృష్ణకాంత్ ఇంటికి వచ్చి అన్యమనస్కంగా కూర్చున్నాడు. లత నాన్ని ఇదిగో రిపోర్టు ఇచ్చారు" అంటూ వచ్చింది. చిన్న కూతురు పడుతూ లేస్తూ వచ్చి తండ్రి ఒళ్ళోకి ఎక్కుతోంది. “వెళ్ళండవతలకి! ఇంటికి రాగానే గోలి 'ఎప్పుడూ లేనిది తండ్రి ముఖంలో విసుగుచూసి లత తెల్లటోయింది. బిక్కముఖం వేసిన పిల్లలిద్దరినీ. 'ఆంటీ వాళ్ళింటికి వెళ్ళి ఆడుకోమని పంపించి వేడి వేడి కాఫీ ఇచ్చింది రాధ. కృష్ణ మౌనంగా కాఫీ తాగి కళ్ళు మూసుకుని ఆలోచిస్తుండిపోయాడు. అతన్ని పలకరించడానికి రాధ భయపడినా “ఏమైందండీ? ఎందుకలా ఉన్నారు?” అంది ధైర్యం చేసి. కృష్ణకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కాలేదు. కానీ సమస్య పరిష్కరించడానికి తన సహధర్థురారిణి సహకారం అవసరమనిపించింది. గుండె దిటవు చేసుకుని మెల్లిగా అన్నాడు. “శభ ఆరోగ్యం బాగుపడింది. వచ్చి తీసుకెళ్ళమని డాక్టర్ ఫోన్‌చేశాడు.” రాధ ఉలిక్కిపడింది. కానీ తన తత్తరపాటును చిరునవ్వుతో కప్పి పుచ్చుకుంటూ అంది “చాలా సంతోషకరమైన శుభవార్తను అలా మెల్లిగా చెబుతారేం? ఎప్పుడు తీసుకెళ్ళమన్నారు?" కృష్ణ ఆశ్చర్యంగా చూశాడు రాధకేసి. “ఒక వారం రోజుల్లనే. కానీ...” ఏమనాలో అర్జంకాక సందిగ్ధంగా అన్నాడు. శ
“ఇంకొ కానీ ఏమిటండీ? అక్కయ్యే ఈ ఇంటి యజమానురాలు. మీ అనురాగాన్ని అందుకున్న అర్ధాంగి, పిల్లలు తల్లి. ఇందులో అంతగా ఆలోచించవలసిందీ, మధనపడవల సిందీ ఏముంది? ఇక నా సంగతి అంటారా? ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను. ఏ అనాధ శరణాలయంలోనో పిల్లలకి సేవచేస్తూ శేషజీవితాన్ని గడిపేస్తాను” నిబ్బరంగా అంది.
ఆ రాత్రి ఆ తరువాత నాలుగు రోజులు అన్యమనస్కంగానే గడిచిపోయింది. ఈలోపు తరళ రాధను విషయం అడిగి తెలుసుకుంది. కృష్ణ తల్లిదండ్రులకు వెంటనే రమ్మని టెలిగ్రాం వచ్చాడు. రాత్రి భోజనాలయ్యాక అందరూ హాలులో సమావేశమయ్యారు. ఎవరికీ ఏమనటానికీ ధైర్యం చాలటంలేదు.
“అబ్బాయ్!” రాధను నేను తీసుకువెడతాను. నువ్వు శోభను తీసుకువచ్చేయ్. ఆమె మనఃస్థితిని బట్టి తరువాత సంగతి ఆలోచించుకోవచ్చు” అందరీకీ అదే నచ్చింది ఆరుంధతమ్మ ఎంత తెలివైనదైనా ఆమెకి కూడా అంతకన్నా ఏం చేయటానికీ తోచలేదు.
మర్నాడు అందరూ దిగులుగా కనిపించారు. కృష్ణ తల్లిదండ్రులు రాధను తీసుకుని వెళ్ళిపోయారు. పిల్లల్ని వడిల్ వెళ్ళడానికి రాధ ఎంత బాధపడిందో[క్రన్నతల్లికన్నా, ఎక్కువ
సోమంచిఉషారడి 91 లోల ఆదరించిన తల్లిని వదలడానికి పిల్లలు మరీ మరీ విలవిలలాడిపోయారు.
ఆ మర్నాడు పిల్లల్ని తీసుకుని కృష్ణకాంత్ హాస్పిటల్‌కి వెళ్ళాడు. శోభ నవ్వుతూ డాక్టర్‌తో కబుర్జు చెబుతోంది. భర్రనీ, పిల్లల్నీ చూడగానే అమె సంతోషం పట్టలేక పోయింది.
శోభ పిల్లల్ని ముద్దాడుతుంటే డాక్టరు కృష్ణని పక్కకి తీసుకెళ్ళాడు. “చూడండి “కృష్ణగారూ! ఆమె మనఃస్థితి చాలావరకు నయమైంది. మీరు చాలా అదృష్టవంతులు. ఆ 'సైక్రియాట్రిస్ప ఇక్కడకు రావడం, శోభ బాగుపడటం యు ఆర్ వెరీ వెరీ లక్షీ! అయితే డబ్బు ౯
నో ప్రాబ్లమ్! ఎంతైనా ఇవ్వడానికి సిద్దమే ! థాంక్యూ వెరీమచ్ ఫర్ యువర్ హార్టీ కైండ్ నెస్!” నవ్వడానికి ప్రయత్నించాడు. అయితే అతని ముఖంలో ఆశించినంత ఆనందం కనిపించకపోవడం డాక్టర్ని ఆశ్చర్యపరిచింది. “చూడండి కృష్ణగారూ! అమెని మీ పిల్లలతో సమానంగా ఒక పిల్లలా చూసుకోవాలి. ఆమె మనసుకి ఎటువంటి కష్టం కలిగించకూడదు. ఆమె మనసు నొప్పిస్తే వ్యాధి తిరగబెట్టవచ్చు”.
“ఒ.ె. డాక్టర్! మీ డబ్బు చెక్ పంపిస్తాను వస్తామండి” కృష్ణ శోభనీ, పిల్లల్నీ తీసుకుని ఇంటికి వచ్చాడు. శోభ మళ్ళీ మామూలుగా ఉత్సాహంగా వుంది.
అంతవరకూ ఉత్సాహంగా ఉన్నా చిన్న కూతురు 'అమ్మా!” అని ఏడుపు మొదలుపెట్టింది. శోభ ఎంత సముదాయించినా లాభం లేకపోయింది. కృష్ణకాంత్. కంగారుపడిపోయాడు. లత అమాయకంగా చూస్తోంది.
“నువ్వు దానికి తలియవుకదా! అందుకని...”
“అందుకని?” శోభ ముఖంలో ఏదో అనుమానం తొంగిచూసింది.
“దానిని పెంచడానికి నియమించిన ఆయా...నే అమ్మ అనుకుంటోంది” నవ్చబోయాడు కృష్ణు పాప ఏడుపుమానలేదు. శోభని చూడ్డానికి తరళ వచ్చింది. తరళ ఎత్తుకున్నాక కాస్త బడుపు ఆపింది. ఆమె ఒళ్ళోనే నిద్రపోయింది. లేచాక ఎలాగా అని ఆలోచన పట్టుకుంది తరళకీ, కృష్ణకాంత్‌కే.
“నేను వస్తే మాత్రం ఆయాని ఎందుకు పంపేశారు? నాకు కాస్త అలవాటు అయ్యేదాకా ఆయాని రమ్మనండి” శోభ ఖచ్చితంగా చెప్పింది.
కృష్ణ అలాగేనని తలూపి, వెంటనే టెలిగ్రాం ఇచ్చివచ్చాడు. మర్నాటికి వచ్చింది రాధ. పాప అమ్మా అమ్మా అంటూ రాధ దగ్గరికి పరుగెత్తింది. లత సందిగ్ధంగా అయిపోయింది.
“ర్రా చెల్లెన్మూ! మా వారు నువ్వు వెళ్ళి చేసుకున్న ఫోటో చూశాలే!” ఆప్యాయంగా దగరకు తీసుకుంది శోభ. రాధ కళ్ళు చెమ్మగిల్లాయి.
“1 “రాధా! నేను పిల్లలకి తల్లిని మాత్రమే! కానీ వాళ్ళని తల్లిలా పెంచింది నువ్వే! అదీకాక ఆయనకి భార్యవు కూడా నీవే! నేను గాజు బొమ్మని. సంసార జీవితానికి పనికిరాను. నాకు తరళ అన్నీ చెప్పంది. ఈ రాత్రే మీకు తొలి రాత్రి!” ఇద్దరి చేతులు కలిపింది. రాధ కృష్ణ కళ్ళలోకి చూడలేక తఠివంచుకుంది.
న్న (ఆంధ్రభూమి మాసపత్రిక) ట్రే అలి ప్ జా 225 సత్తి
వ శ్రీమతి సోమంచి ఉషారాణి సాహితీ యువరత్న, బి.కాం,, జననం ఏ 3-6-1956 (విజయవాడ) కృష్ణాజిల్హా తండ్రి ; కీ.శే, వైవి.యన్. చైనులు గారు తల్లి వ. కీశే. వై సీతమ్మగారు భర్త :. శ్రీ యస్.యస్.వి. పురుషోత్తం గారు ఎ.డియమ్., మదర్‌డైరీ, హైదరాబాద్. నివాసం 2 విజయనగర్ కాలనీ, హైదరాబాద్ . 1