Telugu siri sunitha - anilvaranasi/indianlanguages GitHub Wiki

" పై. ల నో ం ట4 అలి సునత . సహజకవి మల్లెమాల . | ళ్‌ ర. మనసుపడి మక్కునతో సేకరించిన స ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం

  • సు (| సుందరయ్య విజ్ఞాన కేంఠ్రాగికీ | (|. . ఆనందంతో బహూకరిస్తున్నాం- | జూ! - చల్లెమూల కుటుంబం | , వ్‌ 6 గుత్తి (1 సమర్వణ ర ౬ శి) చంద్రశేఖర రెడ్డి ల ఉం | హైదరాబాద్‌ డే వ ఖ్‌ 2009

649 అగి సిరి సునీత (20-9-1957 - 28-12-2008) గ్‌) సమర్చణ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖర రెడ్డి హైదరాబాద్‌ 2009

/ ఇళ ఎలి ॥. ఆయయేకం నంట 7” [గ 6 పా. ॥ యం ॥ భష లా కూ. ల రంక క "

నా |

అంకిత విన్సపం. చెప్పనెయ్యదో తలచి నే చెప్పలేక గొంతుకెదొయడ్డు పడిన విభ్రాంతి జెంది పొరలు విప్పిన శూన్యంపు పొట్టమువలె నెవియు చెప్పగలేనైతి నిల సునీత. చాల రసవత్తరమ్ముగా సాగుచున్న నాటకాన హఠాత్తుగా నాయికమణి నట్ట నడుమనె మాయమైనట్టి రీతి అలుకబూనితె తొలిగితే సిరి సునీత. న

/ గి

నేను సామాన్యుడను గల్లు నెనరుబెదురు .. తప్పులొప్పులు బలహీనతలును, గలవు | లేదు స్థిరమైన యుల్లమ్ము లేశమైన ల .. నీదు చేయూత నేమంటినేసునీత. ౧. అంకితమ్మును మాట అధికబరువు ! ఒప్పగించితి మేల్కీళ్ళ నోర్చినీవు | అందుకోగదే ప్రియురాల అమలశీల . ౫, ౫ . చెలువు సింగారముల మాల సిరి సునీత. ల | శ్రీ హరి చరణాంబు జముల చేరుకొంటె? . న ॥ మరలపుట్టువు లేనట్టి మహితమైన ( [౧౨౨ ధన్య సాయుజ్యతను గాంచి మాన్యతగ్గని . .. చెలగి దీవింపవే ప్రియసిరి సునీ. ౨౧.

అంజలి సౌభాగ్యవతి సునీత నాకు తోబుట్టువులు లేని లోటు తీర్చింది. ఇంతలోనే ఆమెకు నూరేండ్లు నిండినాయి. ఆధునిక జీవనయానంలో యాభైరెండేళ్ళు పెద్ద వయస్సు కాదు. గుండె లోపల గుండెగా కుదురు కొనుచు మనసులోపల మనసుగా మసలు కొనుచు నింత కాలము ధవుని సేవించినావు హృదయమున నిల్చి వేడ్క పూజించినావు! పచ్చగా పదికాలాలు బ్రతికి - నీదు సంతతిని జూచి మిక్కిలి సంతసింప కనికరములేని దుర్విధి కన్నుగుట్టి యింతలోననే నిన్ను రప్పించుకొనెను! మాయదైవమా యెంత కసాయి వీవు మా 'సునీతమ్మ' లేదన్న మాట విన్న తొప భరమున గుండెలు తల్లడిల్లు శోక తీవ్రత దేహమ్ము సోలిపోవు! ఇకపైన “చెల్లెలా!” అని నేనెవరిని పిలవాలి? నా అదృష్టం యింతే అని సరిపెట్టుకోవాలి. ఆమె సౌజన్యశీలి. ఆమె ముఖంలో క్రోధచ్భ్చాయలు చూసిన గుర్తు నాకులేదు. వదనంలో నిత్య దరహాస చంద్రికలు వెల్లి విరుస్తుండగా అతిథులను మనసార ఆదరించడం ఆమె నిత్యకృత్యం - సహజలక్షణం. శారీరకంగా బడలినా మానసికంగా ధీరోదాత్త! నా ఆత్మీయసోదరుడు చంద్రశేఖరరెడ్డిగారికి అన్నివిధాలా తగిన యిల్లాలామె. మగని యిష్ట్రానిష్టాలు నేర్పుతో గమనించి తదనుగుణంగా నడచుకొనే ఉత్తమ గృహిణి సునీతమ్మ తల్లి. ఆమె గురించి ఇలా ఎంతో చెప్పుకోవాలనుంది. కానీ అశక్తుణ్ణీ - లోపలిమాటలు బయటికి రాకుండా వ్యథాభరిత హృదయం అడ్డుకుంటుంది. సునీతమ్మ ఆత్మ శాంతించుగాక! ప్రొద్దుటూరు, సోదరుడు 1-5-2009 కోడూరు ప్రభాకరరెడ్డి

సిరి సునీత' సిరి సునీత

[1 “పాలికి' వారింట విరిసిన పూలమొగ్గ గుత్తి లోగిలి వెలిగిన కూర్మి బుగ్గ పుట్టినిలు మెట్టినిలు కీర్తి గట్టిపరచి హరి పదమ్ములు చేరితే సిరి సునీత.

  1. ఇంటి వెనుకటి మేడలో ఇంపుమీర చంటి పాపవై, యున్నట్టి సమయమందె నిన్ను ఎత్తి యాడించిన నన్ను విడిచి హరి పదమ్ములు చేరితే సిరి సునీత.

-3, పాలబుగ్గల చిన్నారి ప్రాయమందె చదువు సంధ్యల నీపెంపు ముదము నిడగ మెచ్చి తలయూచి నట్టి నా ఇచ్చ మరచి హరి పదమ్ముల చేరితే సిరి సునీత.

శ నిన్ను మీ యమ్మ నాకీయ నిశ్చయింప నదియు మాయమ్మ నాచెవి కందజేయ పొంగి పోయితి నెంతొ నాపున్నె మెంచి హరి పదమ్ములు చేరితే సిరి సునీత,

గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి

'సిరి సునీత'

ర్‌. బంధుగుల యింట యొకనాటి పర్వమందు కజ్జి కాయల ముడులను క్రమము చెడక వేయు నినుజూచి నామోము వెలిగిపోయె మరువ గలనెయా క్షణమును సిరి సునీత.

  1. నేను వచ్చిన సడిని నీ వీనుల విని ఎత్తి ఎత్తక నీవు మోమెత్తి నన్ను చూచి చూడక చూచిన చూపుతాకి పరవశించితి నానాడె సిరి సునీత.

7, ఐదు రోజుల మనపెళ్ళి యార్భటమ్ము నేటికిని చెప్పు చుందురీ వీటియందు ఊరు ఊరంత సంబరమూని చెలగె మరచి పోతివె నవియెల్ల సిరి సునీత.

  1. పేమ పెద్దమ్మ తమయింట విందు బెట్టె మరియు 'కెంగల్లు' వారలు మురిసి రటులె ఇంక మనయింటి మురిపెమ్ము లెంత ఘనమొ చెరిగి పోనివా దినములు సిరి సునీత.

లాయ దాభా

'సిరి సునీత'

  1. తాలుత “పండంటి కాపుర' మలర గాంచి పిదప “నీతి నిజాయితీ' పిక్చరుగని ముదము గని నార మానాడు! బ్రదుకు లటులె జరిగి పోయెను కద దేవి సిరి సునీత.

  2. మూడు నెలలందు జరిగిన ముచ్చటలను అణువు నణువున నిండిన అమల సుఖము నుడుల నిడలేను ఎడదల గుడుల నిలిచె గురుతు మరచితే మహరాణి సిరి సునీత.

11, భాగ్య నగరము చేరి సౌభాగ్య గరిమ బంధు బసిరెడ్డి గారింటి ప్రాంతమందు కాపురము మొదలిడితిమి కౌతుకమున సరస మాధుర్య భావన సిరి సునీత.

  1. వెంట వచ్చిన మాయమ్మ ప్రేమ మీర నీకు గరపిన సంసార నీతు లెల్ల నేర్చు కొంటివి క్షుజ్బత నిండుభక్తి స్థిరత నడచితివా రీతి సిరి సునీత.

గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి

'సిరి సునీత' నాననా యయా.

  1. క్రొత్త కాపుర మూనిన క్రొత్తలోనె చెల్లెలును తమ్ముడును నిల్లు జేరుకొనగ భార మనబోక చదువుల దారిజూపి 'సేమ మరసితి వతిప్రీతి సిరి సునీత.

14, క్రొత్త కొలువు కుదిరి సంస్ట గూర్చ వసతి చేరితి “మలిండు” అది చిన్ని కేరళమ్ము తెలుగు వారలు కొందరే వెలసియుండ్రి చెలువమున నక్కడుంటిమి సిరి సునీత.

15, తెలుగు, సుంత కన్నడ భాష తెలియుగాని ఆంగ్ల మలయాళ హిందీలు అసలురావు అయిన గెల్చితి వెల్లరి నచటి వారి చిరునగవుల మౌనమ్మున సిరి సునీత.

  1. చిరుత ప్రాయంబునందె నాచేయి బట్టి సరస సంసార శృంగార సరసి దేల్చి భవ్య దాంపత్య సౌభాగ్య వరము లొసగి చెలువు నలరితి నా సతీ సిరి సునీత.

“సిరి సునీత 17. అచట నాయున్మి తొలినాళ్ళ నలవికాని ఒడిదుడుకుల గతుకులతో నిడుములువడి చేరెనొక గట్టు నందాక చెరిగిపోని చిరునగవుల నన్‌ బ్రోచితి సిరి సునీత. 18. రక రకమ్ముల పచ్చళ్లు రసనలూర జొన్నరొట్టెలు హోళిగల్‌ చెన్నుమీర ఎల్లవారికి మన రుచు లెరుకపరచి చిందు లేయించి నావుగా సిరి సునీత. 19. సంతు లేదని మనవారు చింత పడగ రాఘ వేంద్ర యతీంద్రుని రమణగొల్చి సర్వసిద్ది యంత్రము దాల్చి సంతసమున చేసినారము పూజలు సిరి సునీత. 20. ఏమి కొర నోము నోచినా మేమొగాని “సెరబరలుపాల్సి'* తోబుట్టె చిన్ని కన్న వాని మూడేళ్ళు పెంచిన పాట్లు తలప చెదరి కూలవె గుండియల్‌ సిరి సునీత. “086021 ని్షక్ర/ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి

'సిరి సునీత'

  1. సత్యనారాయణాఖ్యతో, సాటిలేని ఇంత సొగసుల నెటుబుట్టె నేలపుట్టె తిరిగి మరలుట కేమొ శ్రీహరియ వచ్చి దరిశెనమ్మిడి తొలగెనే సిరి సునీత.

  2. మిసిమి మీగడవన్నియ మెరయు కళ్ళు ఉంగరాల కురుల నుదయమంది మెడలు నిలుపలేదు నుడులు నేర్వనెలేదు చేరుకొనియె హరిని సిరి సునీత.

  3. ఎంత యోపిక నీకు తానెల్లవేళ రోదనలు సేయు బాలుని సేదదీర్చి నిదుర బుచ్చెడు నీనేర్చె నేర్చు సుమ్ము దరిని జేర్చవు విసువింత సిరి సునీత,

  4. బొంబయి కలకత్తాలకే బోయినపుడు అంచెలంచెల వార్తనే నందుకొంటి మురిపెముల బాలుడటు జనె హరిసదనము చిన్న్వయడుగుల నడచుచు సిరి సునీత.

సిరి సునీత"

  1. తమ్ముడు దయింప తానెంతొ సమ్ముదాన తన కవిశ్రాంత శుశ్రూష పెనగుచున్న తల్లికిక శాంతి చేకూరు తరణ మరసి చిన్ని నాయన మమువీడె సిరి సునీత.

  2. పుట్టి నప్పుడె సంజీవుడుట్టి చిలిపి బాల్య క్రీడావిలాసాల వంతలార్చి 'సేదదీర్చెిను ఎదలకు మోదమిచ్చి మరచి పోయితె? గురుతున్నె? సిరి సునీత,

  3. ఎంత చిత్రము ఎవరెవ్వ రెంత యడుగ అమ్మయనక నాన్నా నాన్న యనుచు నవ్వు పదినెలల ప్రాయమందున బెదురులేక మరతుమా సంజుయాటల సిరి సునీత.

  4. పది నెలల బాలుడై యస్టై పలికినాడు పదునెనిమిది నెలల వేళ పరుగుతీసి మైలు దూరము నడిచి ప్రాల్‌ మాలకుండ చిన్ని సంజీవుడలరించె సిరి సునీత.

“సిరి సునీత"

  1. ధిమిత ధిమిధిమిధిమి యని దివ్యగతుల తకిట తకకిట తకతకిట, కమనీయ ఫణితి నర్తన మాడినే బాలశివుడు? చేతనత్వాన సంజుతా చెలి సునీత.

  2. వాని యాటల పాటల పరుగులందు నాని, మీయమ్మ తనతండ్రి నామమిడగ గోర, వల్లెయంటిని ఆమె కూర్మినెంచి పరవశించె గద! బసమ్మసిరి సునీత.

  3. (పేమ ప్రాణమెత్తుగ పెంచి పెద్దజేసి నాదు ప్రగతికి బాటల పాదు కొలిపి నట్టి పెద్దమ్మ వెంకమ్మ పెట్టి నట్టి చిరు పరీక్షల గెల్బితే సిరి సునీత.

  4. ఊరివారల, తోటి యుద్యోగుల, మరి బంధువుల నెల్ల పిలిపించి పండుగలకు మించుయోపిక వండి వడ్డించి నావు చెప్పు చుందురు నీ కీర్తి సిరి సునీత.

'సిరి సునీత

  1. వెళ్ళి ఇంగ్లాండు తిరిగొచ్చు వేళ నేను చీరలార్దెచ్చి నీకీయ నేరుకొనక వుంచినా వత్త ముందర పంచు మనుచు సరస హృదయవు నీవు నా సిరి సునీత.

34, వేళతప్పి జనులు వేమరు వచ్చినా వండిపెట్టి నావు నిండు మదిని అన్నపూర్ణ వంచు అనాడె పేరొంది మెరిసి పోతివి గద సిరి సునీత.

  1. కష్ట రాసులెన్ని కదలి పైబడినాను అదరబోవు నన్ను బెదరనీవు కాలమొక్క తీరు గడుచునా యని యోర్మి చెదరనీయవు గద సిరి సునీత.

  2. వంశి ధరుడు వచ్చె హంసలా సంక్రాంతి పర్వదినము నాడు పండుగాయె మురిసినాము మనము మరిమరి జగతిలో గురుతు తెచ్చికొనుము సిరి సునీత.

'సిరి సునీత

  1. వంశియను పేరు రెండవ పట్టికిడగ పులకరించితి ముదమున పాంగిపోతి నాదు మోదమె నీదని వాదులాడి నెగ్గజేసితి నను నీవు నెరి సునీత.

  2. కొలువుమాని సొంత కొలిమి పెట్టుకొనంగ పూనుకొంటి, బ్యాంకు లోనుగొంటి కష్టరాశిదేలి కడకమ్మి అప్పూడ్చి తిరిగి కొలువు జేర్తి సిరి సునీత.

  3. _ గడువులోన పరీక్షకై, కడగివెళ్ళ వైద్యశాలలోన నపుడె ప్రభవ మొందె చిన్ని నాగార్జునుడు చాల చిత్రముగను కష్ట మిడకుండ నీకిల కద! సునీత.

  4. క్రొత్త కొలువులోన కోరి మెచ్చిరినను యాజమాన్య వరులు అర్హతగని పదవి పెంపుగంటి వరుమాన మదిహెచ్చె చెలగినాము సుఖము సిరి సునీత.

గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి

'సిరి సునీతి

4్యే భాగ్యనగరి వదలి పరతెంచి బొంబాయి “గాలిమరిల సంస్థ వాలినాడ పట్టుగా రమేశప్రభుడు రమ్మని పిల్వ చెలగి యొంటి నౌచు సిరి సునీత.

  1. అచటి నుండి 'హాలెండు'న కరిగినాను గాలిమరల విజ్ఞానము గడనసేయ మాస మందుండి ముంబయి మరలివచ్చి చేరుకొంటిని మరికాల్వు సిరి సునీత.

  2. పిల్లవాండ్ల చదువు వెరవట గనలేక ఇచట కట్టుకొన్న ఇంటిలోన బూని నీవు నిలువ బొంబాయి నేనుంటి కలిగిన దెడబాటు చెలి సునీత.

ఉడీ అమ్మ మరణింప మరుగుకా నొత్మళాంతి కనలు చుండిన నాన్నకు కాస్తయైన యూరటగలుగ, జేసెడు యోచనమున తిరిగివస్తి భాగ్యనగరి వర సునీత.

గుత్తి (జోళదరాళి) చంద్రశేఖరరెడ్డి

సిరి సునీత'

తీర్‌, తండ్రి రెండేళ్లు శాంతి పధాన నడచి తుదకు కాన్సరు దాడకి తూలిపోయె నతని వైకుంఠపురి జేర నంపకమిడి పిల్లలను జేర బెంగ్భూరు వెళ్లినాము.

  1. అచట గుండెకు విచికిత్స అవసరమవ చెల్లెలు జయమ్మ, నేనును చిత్రమనగ ఆపరేషన్లతో బాధ లణగిపోవ బ్రతికి పోతిమి సుఖముగా వర సునీత.

తగ జక్కనార్యుడు ప్రాణమ్ము జవము గూర్చ శిల్ప కళకు కాణాచియై చెలగి నట్టి దివ్య బేలూరు హళెబీడు తేజమరసి చేరు కొన్నాము శృంగేరి చెలి సునీత.

  1. అందు కన్నాము సుందర మందిరమున జనని శారద నెలవున్న చక్కదనము మోదమున తుంగ జలముల శీదులాడి పరవశించి నారముగద సిరి సునీత.

గుత్తి (జోళదరాళి) చంద్రశేఖరరెడ్డి

“సిరి సునీత"

  1. వంశి, సంజీవులిర్వురు భాగ్యనగరి తగిన యుద్యోగముల్‌ పొంది తరలిసాగ నాగనకు కూడ పూనెలో రాగ కొలువు పయన మైతిమి ఇటురాగ వర సునీత.

  2. సుతుల పెళ్ళిళ్ల గొడవలు శాంతిమాన్న మదిని యొత్తిళ్లు గుండెలో మరగసేయ దేహమున నెలకొనె మధుమేహ వ్యాధి వ్యాధులకు నెల్ల మూలమ్ము వర సునీత.

  3. బంధులఅందున నామాట పరువు నిలువ శివను పెండ్లాడ నొప్పె సంజీవ సుతుడు చింతలన్నియు దీరంగ సంతసమున పెండి జేసి నారముగదా ప్రియ సునీత.

  4. నాడు సెప్టెంబరిరువది, నాకు నీకు తెలియ నీయక సంజీవుడలర గూర్చి ఏబదొకటవ పుట్టిన శోభ విందు అద్భుతంబగు తీరున నట సునీత.

గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి

సిరి సునీతి

  1. కొత్త చీరను కాన్కగా కూర్చినాడు కొత్త గడియారములను తాకూర్మి నిచ్చె బంధులందరి కొకవిందు బహుమతిచ్చె మురిసిపోతిమి మరి మరి సిరి సునీత.

54... నాడు నీకళ్ళ తళుకులు నటనమాడ మోము నిండుగ చిరునవ్వు మోసులెత్త పట్టరానంత మోదమ్ము పరిఢవిల్ల మురిపెముగ నవ్వులాలికితి సిరి సునీత.

  1. ఇట్టి నిను జూచి విధికి కన్కుట్టెనేమొ మగడు సుతులును కోడలిమ్మహిని నీకు ముదముగూర్చెడి తమకాన ముందురాగ జీవదీప్తిని విధి యార్పె చెలి సునీత.

  2. మూడు నెలలందె ముగిసె మా ముచ్చటలవి ఎగసిపోతివె గగనాని కింతలోనె సహజరీతిని సాగిన ఇహపరములు చెల్లిపోయెనా నీకిల చెలి సునీత.

'సిరి సునీత"

  1. మూడు పెండ్డిండ్ల పిలుపులు ముచ్చటింప పాలుగొని రమ్మటంచు నిన్‌ బంప మేము జోళ్లరాశిని చేరితి సుగుణశీల కష్టమైన సరేనని గద సునీత.

  2. పగలు రాతిరి దోమలు మిగుల గుట్టి నిదుర లేమి ననారోగ్య మొదవ నీకు ఎంతొ తాపము జెంది రవంత బీపి. ెరిగిపోయెను నీ ఎద సిరి సునీత.

  3. శారదమ్మ పెండి సంబరాలకు నయి “'సిరులకుప్పే యూరు జేరినాము సిరులగుప్పలోన శ్రీదేవి వారింట విడిసినాము మనము ప్రియ సునీత.

  4. మరలి వచ్చియు మనయూర తిరిగి బీ.పి. హెచ్చి నిద్రలేమికి చాల పెచ్చుమీర' బెషధమువాడి వ్యాధి తా నోసరిలగ విశ్రమించితి విసుమంత ప్రియ సునీత.

  • సిరుగుప్ప గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి

'సిరి సునీత'

  1. హైదరాబాదు మరలెడి యవసరమున వెళ్లుదము కసాపురస్వామి చల్లనైన దీవెనలు గొందమంచీవు తేటపరుప స్వామి దర్శించి వస్తిమి సఖి సునీత.

  2. నిదుర చాలని గతికిల నిక్కువముగ ఎన్ని బాధల కెరయైతి వేమొగాని అంతయు సహించి లోలోన నణచుకొనగ పెరిగి దుర్భర మాయెనా? ప్రియ సునీత.

  3. పుణ్య తుంగభద్రానదీ పుష్కరములు చేరువకువచ్చె పోయివచ్చిన శుభమ్ము మరల బ్రతుకున మనకిది దొరకబోదు అనగ సిద్ధమైతిమి మేము గన సునీత.

  4. పుష్కరస్నాన మొనరింప పూని మనము తుంగభద్ర నాలంపుర ప్రాంగణమున స్నాన మొనరించి బ్రహ్మేశస్వామి గొలిచి తిరెగివస్తిమి మోదాన వర సునీత.

(19) గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి

'సిరి సునీత"

  1. పూని నాగన్న యాద్గిరి పుణ్యమూర్తి నారసింహుని దర్శింప కోరుకొనగ సుతులు కోడలు వెంటరా సుగతి గొల్చి తిరిగి వచ్చితి సుఖముగా వర సునీత.

  2. మనసు కల్గెను శ్రీశైల మల్లుజూడ ననగ వెనువెంట తరలి నామందరమును భక్తి భమరాంబికా తల్లి, పశుపతులను చెలువు మీరగ గనినాము చెలి సునీత.

  3. మనము శ్రీశైల మేగెడు మార్గమందు ఎన్ని సరదాలు మజిలీల వెన్నితిండ్లు సుతుల యార్భాట మదియెంతొ చూచినాము ఢథేమలోలోన నగవుల ప్రియ సునీత.

  4. పంచధారల ప్రాంతాన పరవశాన అడవి సోయగ మింపార నరసినాము శిఖర దర్శన భాగ్యమ్ము చేదికొనుచు సంతసించితి మెంతయో సఖి సునీత.

(9) గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి

సిరి సునీత"

  1. భవ్య శ్రీతైలగిరి జేరు పథము నందు పచ్చ చీరను గట్టిన పడతియట్లు సహజ వనసీమ సౌందర్య సరళిగాంచి మురిసిపోతిమి మరిమరి సిరి సునీత.

  2. ఎన్నా నాళ్లుగ నామది నున్న కోర్కె దీరునని త్రిపురాంతక దేవుని గన పయనమైతిమి శ్రీశైల పతికి మొక్కి పులకలెత్తగ తనువెల్ల చెలి సునీత.

71, మన మొటాటి రెడ్డకు మూలమనగ చెల్లు స్వామి త్రిపురాంత కేశ్వరు స్థానమందు తల్లివేరును గని ఎద త్రుళ్లుచుండ చిత్రమని నవ్వుకొంటివి చెలి సునీత.

  1. కొండవీటి రెడ్డట వచ్చి కొమరు మిగుల స్వామి సేవకు శాసన సమితి నిలుప రెడ్డిరాజుల ఘనతకు రిచ్చపడెడు చెలుని ననుజూచి నవ్వితే చెలి సునీత.

గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి

'సిరి సునీత”

  1. చిత్రముగ నున్న త్రిపుర విచ్చిన్న కరుని లింగమును జూచి హృదయాంత రంగమందు తనివి తీరగ కేల్మోడ్చు నను విచిత్ర గతిని గమనించి నవ్వితిగద సునీత.

74, అచటి నుండి బయలుదేరి హాయిమీర కృష్ణవేణీ తరంగాల క్రీడజూపు ఎత్తిపోతల జలపాత మెనయ జూచి మురిసిపోతిమి మనమెల్ల వర సునీత.

75, పరుగుపరుగున నురగల నురకలెత్తి ముప్పదడుగుల "పైనుండి కుప్పళించి కృష్ణవేణమ్మ వింతగు కేళి బరపు చెలువు దనమున కలరితి చెలి సునీత.

  1. కొడుకు లిర్వురు సేవలు గూర్చుచుండ పరమ సౌభాగ్య సామ్రాజ్య పట్టమహిషి వనగ నొప్పుచు లోలోన నతిశయముగ గరువ మందినారము కదా సిరి సునీత.

గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి

'ససిరి సునీత”

77, ముందు సాగుచు కృష్ణమ్మ ముక్కుదాడు యనగ నొప్పు నాగార్జున వననిధి గని భవ్య మనిపింప, నిలుచుండి పలు తెరగుల కొలిచినారము కృష్ణమన్‌ చెలి సునీత.

  1. ఆంధ్ర శాతవాహన రాజ యశవిభూతి సిద్ధ నాగార్జునుని కొండ చెలువు గనగ మర పడవనెక్కి కృష్ణమ్మ తరగలందు పయనమైతిమి మనమంత వర సునీత,

  2. తుంగ భద్రాంబ తనుజేర పొంగిపోయి తెంపునను బారు కృష్ణ నాలంపురమున తొలుత గన్నాము మనజన్మ కలతదీజ జిలుగు వెలుగుల కనులతో చెలి సునీత.

  3. _ మల్లికార్డును గిరివద్ద మలుపు తిరిగి పచ్చగా లక్ష్మి తీరాల నచ్చువడగ కృష్ణవేణమ్మ గంభీర కేళి సాగు చెలువ మారసి గన్నాము చెలి సునీత.

గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి

సిరి సునీత"

  1. అడ్డు తగిలిన దేదైన జిడ్డు మాన్పి సాగివచ్చు త్రుల్లింతల లేగ వోలె ఎత్తిపోతల తల్లిని చిత్తమందు చిత్ర మచ్చొత్తి నామెద చెలి సునీత.

  2. మగనికౌగిలి జేండు ముగుదవోలె పండు ముత్తెదువట్టుగా పరచుకొనియు సాగరముజేర బిరబిర సాగుచున్న జనని కృష్ణను గన్నాము సఖి సునీత.

  3. చిరుతప్రాయాన నలరిన చురుకు జూచి ముగ్ధమోహన సౌందర్యమూర్తి గాంచి తల్లి తనమున పండిన ధాత్రి నెంచి సకల మీవైతి నాకుర్వి సఖి సునీత.

84... తూగుటుయ్యాలగా యోడ సాగుచుండ పైన క్రిందను నీలంపువన్నై నెగడ అలర నాగార్జునాద్రి రమ్మనుచు జీర చేరుకొంటిమి కొండను చెలి సునీత.

గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి

'సిరి సునీత

  1. అట పురావస్తు సంగ్రహ ఘటిత కుటిని రాతి శిల్పాల మరి బౌద్ధ జాతక కథ లద్భుతమ్ముల కచ్చెరువంది మురిసి తిరిగినారము మనమెల్ల సిరి సునీత.

  2. భిన్నమైనట్టి శిల్పాల వన్నెలరసి అక్షరముదోప నచ్చోట నాగిపోయి పరవశించెడు నా పిచ్చి వరుస జూచి చాల నవ్వుచుంటివి గదా సఖి సునీత.

  3. నీకు నానంద మునుగూర్చ నీ కొమరులు పూలు జల్లిరి కాలూను నేలపైన అడుగడుగున కోరకమున్నైె అమరజేసి చెన్నుమీరిరి కాదటే చెలి సునీత.

  4. వారి అభిమానమందలి అమల (ప్రేమ కలరి కలిగిన యలసట నవల నెట్టి కొండనెక్కియు దిగితివి కూర్మి మీర చాల బడలితి వాపూట సఖి సునీత.

గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి

'సిరి సునీత

  1. తిరిగి నిలుజేర పయనమై మరలువేళ దారిలో పొట్ట నలజడి పోరువెట్ట రయము నిలుజేరి నారము రాత్రిలోన అలసి యొరిగితి శయ్యపై చెలి సునీత.

  2. వైద్యుడారసి మందుల వాడమనగ వాడి, రుజతగ్గి యలసటే వరలుచుండ తినియు తినకుండ నొకయింత తిండి కొనుచు గడిపినావా దినమ్మును కద సునీత.

91 శుక్రవార శుభోదయ శుభ్రవేళ ఎంతయో [్రేమ తొడపై నొకింత తడవు తలనుబెట్టియు జాలి చూపులను బరుప తెలియ నైతిని నీప్రేమ చెలి సునీత.

  1. సమయ మాసన్నమౌట నీకు మునుముందె తెలిసి తెలియక తెలిసిన తీరుదోచె ఆప్తులకు నీవు చిరుకాన్క లందజేసి వెలసితివి వారి హృదులందు చెలి సునీత.

గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి

సిరి సునీత్త

  1. మరుసటి దినాన బెంగ్భూరు పురముజేర పయనమైతిని పిలువంగ బసవసమితి నీకు వీడ్కోలు జెప్పుచు నేను సాగ శాంతముగ నూకొడితి వీవు సఖి సునీత.

  2. నేను బెంగుళూరును చేరనైన లేదు సుతుని సంజీవు ఫోనొచ్చె బ్రతుకు జార “అమ్మలేదిక నాన్నా యటన్న వార్త చెవులు దూరియు దూరక చెలి సునీత.

  3. ఎందుకో గాని నే నప్పు డేడ్వనైతి జరిగినది యెల్ల సహజమ్ము సహజ మనుచు ఎవరొ పల్కిన తీరున ఎడదదోచి నిలిచిపోయెను యోచనల్‌ చెలి సునీత.

  4. తేరుకొని యంతకుమును నీతీరు తెలియ గోరినట్టి ప్రభాకర కూర్మి సఖుని నీ మహాప్రయాణపు వార్త నిర్మలముగ తెలియజెప్పితి నెటులనో చెలి సునీత.

గుత్తి (జోళదరాళి) చంద్రశేఖరరెడ్డి

'సిరి సునీత”

97, గుండె గొంతుక లోననే కొటుకులాడు టెట్టనెడు గతి, నెరిగితి నిష్పుడేను కనుల నొకచుక్క కన్నీరు కారలేదు జాలి నెరుగని మనిషిని సఖి సునీత.

  1. ఊరు జోళదరాశిని చేరుకొంటి, భాగ్య నగరమ్ము విడి నీవు వచ్చుదారి కెదురు చూచుచు వేచితి నెల్లవారు కలత పడుచుండ నేడ్చుల చెలి సునీత.

  2. నీవు వచ్చితివి, శీతల మావరించు యంత్రమున తుది నెరుగని యమల నిద్ర నుండి, రోదనల్‌ మిన్నంటె నూరు పాగిలె సాంత్వనమున నోదార్చితి సఖి సునీత.

  3. ఎందరెందరొ వచ్చిరి యింతి నీదు అమలమగు నిర్గమన వార్త నరసి నంత గుత్తివారింట జాతర కుదురు కొనియె చెలియ నీవేమొ పలుకవు చెలి సునీత.

గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి

'సిరి సునీత'

  1. అలర సంజీవ నాగార్జు నాఖ్య సుతులు వెంటవచ్చిరి నీతోడు నంటి ఇటకు అమెరికానున్న వంశి నిన్నందుకొనగ బయలుదెరె నారాత్రి వర సునీత.

  2. నాటి శనివారము దినమ్ము నాడు నీవు నడుమ రేతిరి లేచియు, నాగు, పిలిచి కాఫి గోరగ వాడు పాల్కాచి ఈయ తాగి నిదురించి నావట ధర సునీత.

  3. మరల మేల్కాంచి నాలుగున్నరకు నీవు మోము కడిగియు నొక జామముక్క దినియు నిద్రలేచిన నాగును నిదురపోవ జెప్పి టీ.వి. బెట్టుకొనితి చెలి సునీత,

  4. . పరుపుపై వాలి, టీ.వి. పై బరపి దృష్టి యోర బండితివట నదె యోగనిద్ర పూనిన తెరంగు దోపంగ పుణ్యరాశి ఎంతలో నెంత జరిగిన దిల సునీత.

గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి

'సిరి సునీత'

  1. అలరుపాన్సుపై దుప్పటి నలుగ లేదు చేతనున్న రిమోటట్లె చేత నుండె ప్రాణ పక్షి ఎగిరిపోయె పరముజేర నిలిచిపోయిన వూపిరుల్‌ చెలి సునీత.

  2. బాధపడినట్టి జాడ కన్పట్ట లేదు ఊపిరాగిన ఛాయ లేదొక్కటేని నిశ్చల, నిర్వికార సుదీర్హ నిద్రలోన పవ్వళించితె! ప్రాణమా వర సునీత.

107... నరులు గోరు ననాయాస మరణమబ్బె చాన లిచ్చ ముత్తైదువ చావు కలిగె ఎల్లమేలును నీ కాయెనేమొ గాని ఛిద్రమాయె నా బ్రతుకిట చెలి సునీత,

  1. ఊరి కుత్తర మందున యోగనిద్ర కొరకు పాడెపల్లకి నెక్కి తరలినావు నావధువ! నా సతీ! నాదు భావజలధి పెద్ద ప్రాణమ! నాతల్లి ప్రియ సునీత.

గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి

  1. లౌక్య మెరిగి వర్తించు టశక్యమవగ ముక్కు సూటగు నడతకు చిక్కులొదవ యోర్మితో వంతలన్నియు యోడజేసి కాచు కొంటివి నన్నెప్ట గద సునీత.

  2. “ఎనక జన్మములోన మేమెవరొ' యనెడి ఎంకి పాటను నేపాడ నింక చాలు ముందు జన్మల మాటేల ముగియు నెట్లు వర్తమానమ్మదంటివి వర సునీత.

  3. అప్పుడప్పుడు మనము వాదాడుకొనుట సహజ రీతుల సాగిన జంట బతుకు ఒకరి నాకరము గెల్పించి యూరడించి చెలిమి తనమున నుంటిమి సిరి సునీత.

  4. చావు తథ్యము ప్రాణికి సహజ మదియ అదియ మేలైన యౌషధ మందరికిని

. భాగ్యమింతియ నీతోడి బ్రతుక నాకు

ం వెళ్ళిపో సఖీ మరి రాకు ప్రియ సునీత. గ ర్య... | లం ఉతితిళి* కిడకి లో లో ఇ" లలా.

. . జీ . తా న లలా య శశి. నే... సిరిసునీత %| (| (20-9-1957 - 28-12-2008 1%, శ న. ॥ ఉసి, “అమె నా జీవితమ్మునం దమృత గుళిక _- దివ్యకాంతులు విరజిమ్ము దీప కళిక. +. అడుగకనె కూర్చు కల్పవృక్షంపుమొలక -. కలికి తనమున సరిలేని 'పొలికి''చిలుక” వ. . గుత్తి (జోళదరాశి) చంద్రశేఖర రెడ్డి _ లు "|