Telugu shukraneethisara prasaramu - anilvaranasi/indianlanguages GitHub Wiki
నా [. టు న్ న సంపాదకుడు న. పుల్లెల శ్రీరామచంద్రుడు నన గి .. త సహాజ కవి మల్లెమాల డౌ॥ / న మ 4 [ మనసుపకడ్తి మక్కువతో నేకర్రించ్య్యి / క. , ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం |. శ. సుందరయ్య విజ్ఞాన కేంద్రానిక్రి ఖై న. ఆనందంత్రో బహూకరిస్తున్నాం, / | - మల్లెమాల కుటుంబం న. వ ఖో (క్ర ప సమితి సంస్కృతభాషా ప్రచార శ. లీ ం' "హైదరాబాదు శ ్య ॥| డూ స క స. తష క్ష గ్ / వి. ఆలం ౭46 గో
రజతోత్సవగ్రంథమాల - చతుర్ధకుసుమం శుక్రనీతిసార ప్రసరము సంపాదకుడు దా॥ పుల్లెల శ్రీరామచంద్రుడు రచన దాః కండ్లకుంట అళహసింగరాచార్యులు ఎం.ఏ. పిహెచ్డి. కా శ్రి సంస్కృతభాషా ప్రచార సమితి హైదరాబాదు 2004
2 పస 24 శుక్రనీతిసార ప్రసరము యే చీ ల్ శ్రీల 'ప్రథమముద్రణ : 2004 వెల ; రూ. 25/- ప్రకాశకులు : సంస్కృతభాషా ప్రచార సమితి 5-4-749, | (0 నాంపల్లి స్టేషన్ రోడ్, అవిద్స్, | | హైదరాబాద్ - 500 001. (6/7 అక్షరాల కూర్చు ; యూ (టాలర్వు వా సమంత గ్రాఫిక్స్ గగ న. సస “చీ, హైదరాబాద్-500 016. సులు హైదరాబాద్ ముద్రణ : శ్రీకళాంజలి గ్రాఫిక్స్ విఠల్వాడి, హైదరాబాదు - 500 029.
వ్ శ్రీః తొలిపలుకు
వివిధవిద్యాసంస్థలను నెలకొల్పి నిర్వహిస్తూన్న జి. పుల్లారెడ్డి చారిటీస్ ట్రస్టుకు అనుబంధసంస్థగా సంస్కృతభాషాప్రచారసమితి హైదరాబాదు నగరంలో, 1978లో స్థాపించబడింది. నాటి నుండి ఈ సమితి ఆంధ్రప్రదేశంలో సంస్కృత భాషాప్రచారకార్యం అవిచ్చిన్నంగా సాగిస్తూన్నది. సమితి చేపట్టిన ప్రధాన కార్యక్రమం క్రమబద్ధరీతిలో రూపొందించిన ఏడు సంస్కృతపరీక్షలు నిర్వహించి తద్ద్వారా పాఠశాలా -కళాశాలా విద్యార్థులకు, ఇతర సంస్కృతప్రియులకు సంస్కృతభాషను అభ్యసించడానికి తగిన అవకాశాన్ని కల్పించడం. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశం లోని వివిధవిద్యాస్థానాల్లో ఉన్న దాదాపు 250 కేంద్రాల ద్వారా నిర్వహింప బడుచున్నది.
సమితి పరీక్షానిర్వహణకార్యక్రమానికి అనుబంధంగా గ్రంథప్రచురణ కార్యక్రమం కూడా చేపట్టి నిర్వహిస్తూన్నది. సంస్కృతభాషాసాహిత్యాలకు సంబంధించిన [గ్రంథాలను తెలుగుభాషద్వారా తెలుగువారికి అందించడం దీని ప్రధానలక్ష్యం. ఈ కార్యక్రమానికి సంస్కృతభాషాశ్రద్ధాలువులనుండి ప్రోత్సాహం లభించడం సమితికి ఆనందజనకం.
ఈ సంవత్సరంలో (2003-2004) రజతోత్సవం జరుపుకొంటూన్న సమితి సుప్రసిద్ధులైన సంస్కృతవిద్వద్విదుషీమణులచేత సంస్కృతసాహిత్యానికి సంబంధించిన, ఆ యా కవులను, వారి కావ్యాలను పరిచయం చేసే ఇరవైయైదు లఘు[గ్రంథాలను వ్రాయించి ప్రచురిస్తూన్నది. ఈ సాహిత్యయజ్ఞంలో ఆర్త్విజ్యం వహించినవా రందరికీ మా కృతజ్ఞతలు.
ఈ రజతోత్సవగ్రంథమాలాచతుర్ధకుసుమంగా శుక్రాచార్య విరచిత శుక్రనీతిసార ప్రసరమును రచించి ఇచ్చిన శ్రీ కండ్లకుంట అళహసింగరాచార్యులు గారికి మా కృతజ్ఞతలు. దీనిని సంస్కృతాభి మానులందరు ఆదరించగల రని విశ్వసిస్తున్నాము. సంస్కృతభాషాప్రచారసమితి, పుల్లెల శ్రీరామచంద్రుడు హైదరాబాద్. కులపతి
| సంస్కృతభాషా ప్రచారసమితి హైదరాబాదు కార్యనిర్వాహకసంఘసభ్యులు
1 త్రీ జి. పుల్లారెడ్డిగారు, అధ్యక్షుడు 2 మహామహోపాధ్యాయ
డా. పుల్లెల శ్రీరామచంద్రుడుగారు, కులపతి త డా. కే. రాజన్నశాస్రిగారు, ఉపకులపతి 4& శ్రీ చలమచర్ల వేంకటశేషాచార్యులుగారు, కార్యదర్శి 5... శ్రీపి. రామకృష్ణగారు, సభ్యుడు 6. శ్రీ ఆర్.రామానుజాచారిగారు, సభ్యుడు ౧ శ్రీపి.వేంకటేశ్వర్లుగారు, సభ్యుడు 8. శ్రీ వియన్.రెడ్డిగారు, సభ్యుడు 9. శ్రీ ఆకెళ్ల సత్యనారాయణమూర్తిగారు, సభ్యుడు 10. శ్రీ ఆర్.వి. శేషాచార్యులుగారు, సభ్యుడు 11 శ్రీవై. నాగభూషణరెడ్డిగారు, సభ్యుడు 12 శ్రీ పి. సుబ్బారెడ్డిగారు, సభ్యుడు
శ్రీః ఉపోద్దాతము వ;
సంస్కృతవాజ్బయం పేరు చెప్పగానే వేదాలు, పురాణాలు, వేదాంత[గ్రంథాలు, కావ్యనాటకాదులు మాత్రమే ముందుగా స్ఫురిస్తాయి. మనుష్యుల సామాజికాభ్యున్నతికి తోడ్పడే లౌకిక, సాంకేతిక శాస్త్రగ్రంథాలు లేవని ఒక అపోహ జనులలో ఉన్నది. విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో పాఠ్యాంశాలుగా కావ్యనాటకాలు, వ్యాకరణాది శాస్త్రాలు మాత్రం నిర్ణయించటం దానికి ముఖ్యకారణమని చెప్పవచ్చు. భాస్కర, లీలావతీ గణితాలు, ఖగోళశాస్త్రగ్రంథాలు, ఆయుర్వేదం, శిల్పకళ, విమానశాస్త్రం, రత్నపరీక్ష్మ అశ్వ, గజశా'స్తాలు, వాస్తు, లోహశాస్తాలు వంటి సాంకేతిక విద్యలకు సంబంధించిన (గ్రంథాలు జనసామాన్యానికి దూరంగా మరుగునపడి ఉన్నాయి. రాజనీతి ప్రతిపాదక గ్రంథాలు కూడ అటువంటి కోవకు చెందినవే.
ఇప్పుడు లభ్యమౌతున్న రాజనీతిగ్రంథాలలో చాణక్యాపరనామధేయుడైన కౌటిల్యుని “అర్థశాస్త్రము అత్యంత ప్రాచీనమైనది. చాణక్యుడు నందవంశము నిర్మూలించి, మౌర్యచంద్రగుప్తుని సామ్రాజ్యస్థాపన చేయించిన రాజనీతి ధురంధరుదని, ఆయన చంద్రగుప్తుని సమకాలికుదని (క్రీ.పూ. 325-275) శామశాప్రి ప్రభృతి పండితులు నిర్ణయించినారు.
అర్ధశాస్త్రగ్రంథంలో మొట్టమొదట - “ఓం నమః శుక్రబ్బహస్పతిభ్యామ్” అనే వాక్యంతో ప్రారంభం జరిగింది.
. ఈ శాస్త్రవిషయంలో తనకంటె ప్రాచీనులైన శుక్రాచార్య, బృహస్పతులకు నమస్కరించి గ్రంథారంభం చేసినాడు చాణక్యుడు. అసురుగురువైన శుక్రాచార్యుడు రచించిన రాజనీతి 'బెశనసం' అని, బృహస్పతి రచించిన గ్రంథం బార్దస్పత్యమని వ్యవహరింపబడుతుంది. అందువలన శుక్రనీతి అనేది చాణక్యుని కంటె కూడ పూర్వమే ప్రసిద్ధమైనదని స్పష్టమవుతుంది.
భారతీయ రాజనీతివాజయంలో శుక్రాచార్యునికి ప్రముఖస్థాన మున్నది. మహాభారతం శాంతిపర్వంలో “అమితప్రజ్ఞః, మహాయశాః వంటి విశేషణాలతో శుక్రుని ప్రస్తుతి కనిపిస్తుంది. కాళిదాసు, అశ్వఘోషుడు, దండి మొద॥ కవులు శుక్రనీతిని ప్రస్తావించినారు. శుక్రనీతిలో కేవలం రాజనీతివిషయాలే కాక, రాజ్యానికి, ప్రజా జీవనానికి సంబంధించిన అనేక విషయాలు ్రతిపాదించబడ్డాయి.
6 శుక్రనీతిసార ప్రసరము
“నృపస్య పరమో ధర్మః ప్రజానాం పరిపాలనమ్
దుష్టనిగ్రహణం నిత్యం న నీత్యా తే వినా హ్యుభే” (శుక్రనీతి 1-14)
అని దుష్టనిగ్రహపూర్వకంగా ప్రజలను కాపాడటమే రాజుయొక్క ముఖ్యధర్మమని శుక్రాచార్యుడే చెప్పినాడు.
శుక్రనీతి గ్రంథకర్త
పరంపరాగతమైన విశ్వాసం ప్రకారం శుక్రాచార్యులే శుక్రనీతి రచయితగా భావింపబడుతున్నది. మహాభారతంలో చెప్పిన ప్రకారం, మొదట బ్రహ్మదేవుడు లోకహితంకొరకు తన బుద్ధిజన్యమైన నీతిశాస్తాన్ని లక్ష అధ్యాయాలతో ధర్మార్ధ కామ ప్రతిపాదకమైనదిగా రచించినాడు. తరువాత, మానవులు అల్పాయుష్ములని దయతో దానిని సంక్షిప్త్రపరచినాడు. తరువాత ఇంద్రుడు దానిని గ్రహించినాడు. అప్పుడు పదివేల అధ్యాయా లుండగా ఇంద్రుడు దానిని సంగ్రహపరచినాడు. అది అయిదువేల అధ్యాయాలతో బాహుదంతకమని పిలువబడింది. తరువాత బృహస్పతి దానిని ౩వేల అధ్యాయాలకు, చివరగా శుక్రాచార్యుడు వేయి అధ్యాయాల [గ్రంథంగా సంక్షేపము చేయటం జరిగింది.
జనమేజయుని “నీతిప్రకాశికొలో బ్రహ్మ, శివుడు, స్కందుడు, ప్రాచేతసుడు, బృహస్పతి, శుక్రుడు, భారద్వాజుడు, వేదవ్యాసుడు, గౌరశిరుడు - నీతిశాస్త్రప్రణేతలని చెప్పి, బ్రహ్మ మొదట లక్ష అధ్యాయాల గ్రంథాన్ని రచించినట్లు చెప్పబడింది. బ్రహ్మ లక్షాధ్యాయ (గ్రంథరచన విషయంలో ఈ రెండు ఏకాభిప్రాయం కలిగి ఉన్నాయి. కాని -
“శతలక్షశ్లోకమితం నీతిశాస్త్ర మథోక్తవాన్
స్వయంభూ ర్భగవా న్లోకహితార్థం సంగ్రహేణ వై” (శుక్ర 1-2) అని శుక్రనీతిలో బ్రహ్మకృతి శతలక్షశ్లోకమితం' అని చెప్పబడింది. అనగా కోటిశ్లోకాల రచన అని అర్ధము. కోటిశ్లోకరచన అసంభావ్యము కనుక, శతశబ్దము అనేకార్ధములో ప్రయోగంపబడుతున్నందున అనేకలక్షల శ్లోకములనే అర్ధం (శతలక్ష్ర గ్రహించటం మంచిదని పండితవిమర్శకు లభి(ప్రాయ పడినారు.
ఏది యేమైనా మన కిప్పుడు లభించే శుక్రనీతి, లేదా శుక్రనీతిసారము స్వయంగా శుక్రాచార్య విరచితము కాదని చెప్పవలసి ఉన్నది. ఎందుకనగా, ఈ గ్రంథంలో
శుక్రనీతిసార ప్రసరము 7 ఇప్పుడు 2500 శ్లోకాలు మాత్ర (ప్రక్షిప్తాలతో సహా) మున్నాయి. శుక్రుడు వేయి అధ్యాయాలలో సంగ్రహించిన మూలశుక్రనీతిలో 2500 శ్లోకాలుండటం సంభావ్యం కాదు. అంతేకాక చాణక్యుని అర్థశాస్త్రంలో ఏడుచోట్ల శుక్రసంప్రదాయా న్ననుసరించే బెశనసుల అభిప్రాయాలను పేర్కొన్నారు. ఆ విషయా లేవీ ప్రస్తుత లభ్యమాన (గ్రంథంలో లేవు.
అందువలన తరువాతి కాలంలో శుక్రనీతిలోని విషయా లాధారంగా సంగ్రహంగా రచింపబడినదే యీ గ్రంథమని తలపవలసిఉన్నది.
“'మన్వాద్యెరాద్భృతో యో౭ఒ_ర్ధ స్తదర్జో భార్గవేణ వై
ద్వావింశతిశతం శ్లోకా నీతిసారే ప్రకీర్తితాకి (ఉ-7-428) అని కవి స్వయంగా చెప్పిన ప్రకారం 2200 శ్లోకాలతో ఈ గ్రంథం రచింపబడినది. కాని తరువాత కొన్ని ప్రక్షిస్తశ్లోకాలు అక్కడక్కడ చేర్చబడి ప్రస్తుతముద్రితగ్రంథంలో 2500 శ్లోకాలకు కొంచెం అధికంగా ఉన్నాయి. అందువలన ఇది ప్రాచీనతమ శుక్రాచార్యరచన కాదని, అందులోని విషయా లాధారంగా (గ్రహించి తరువాత రచింపబడినదని స్పష్టము.
రచనాకాలము
ప్రస్తుత శుక్రనీతి రచన ఏ కాలంలో జరిగినదనే విషయం కూడ, గ్రంథకర్త విషయంవలె నిశ్చితంగా చెప్పలేము. రచయిత తన పేరు కాని, కాలం కాని పేర్కొనలేదు.
ఆధునిక చారిత్రక దృష్టితో డా॥ అలేకర్ దీని రచన క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దంలో జరిగిందని అభిప్రాయపడ్డాడు. మరికొందరు దీనిని 16వ శతాబ్దంలో రచింపబడిందని భావిస్తున్నారు. దీనిలో తుపాకుల, తుపాకీమందుల వర్ణన కన్పిస్తుంది కనుక, యూరోపీయులు దాన్ని కనిపెట్టినారు కనుక, 15వ శతాబ్దంలో పోర్చుగీసువారు మొదటిసారిగా తోపులను వాడినారు కనుక ఆ తరువాత వ్రాయబడిందని వారి భావము. కాని పై అభిప్రాయం తప్పని క్రింది పాశ్చాత్యవిద్వాంసుల మాటలవలన తెలుస్తుంది.
- నెపోలియన్ బోనపార్దే "416 ౧6౧౧౦౧/10 ౧౧112౧/ 5ట6౧౦65* అనే పుస్తకంలో
ఇలా వ్రాశాడు.
4౧౧౦౪66౯౪9 గాం౪/ 10 [౧0122౧6 0౧102, 2౧౮ ౪29 6866 10౧16
౧670౦56 01౪/2! ౧4౧౫ ౦6౧1/63 060/8 0౧గ91౧ 68.
8 శుక్రనీతిసార ప్రసరము
- _ మదరాస్ ప్రెసిడెన్సీ కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ 'గష్టావ్ ఆఫర్డో తన “//620009 ఇ&గ౧)/ 0/84019260% 2౧౮ గం[॥1041 ౧౧౬1౧౫౩ ౦01 116 4౧016౧1 [11౧06069 అనే గ్రంథంలో ఇలా వ్రాసినాడు. (ఈయన ఆంగ్లేయుడు).
“౬(01051/6 ౧౦౪౮6౯10? 61500250100 ౧/0)601165 ౪/29 గ౧౦౪/౧ 1౧ 1౧౮1
₹0గ) 116 62గ651 6416".
4౧ ౧౦౪౫౦౭౯౧౬9 066౧ నంళ 1౧ 0[1౧4 19 ౪/61 3 1౧ ౧౧౮౮912010
06)%/016 4 ౧6గ౦6 01 1౧౪6910210".
అందువలన ఇది 16వ శతాబ్దపు రచన కాదని, అంతకు చాలపూర్వమే బహుశః గుప్తరాజుల తరువాత కొద్ది కాలానికి రచింపబడి ఉంటుందని నిష్పాక్షిక పండితుల అభిప్రాయము.
అక్కడక్కడ కొన్ని శ్లోకాలు ఆధునికవిషయాలు ప్రతిపాదించే 300 శ్లోకాలకు పైగా ప్రక్షిప్తాలున్నాయని కూడా విద్వాంసు లంగీకరించినారు.
నీతి శబ్బార్థము ,
“ణీణఖ్ ప్రాపణే అను ధాతువునుండి “స్రియాం కిన్” అను సూత్రమువలన చేరిన క్తిన్ అను కృత్ ప్రత్యయముద్వారా నిష్పన్నమైనది సీతిశబ్బము.
“నీయతే వ్యవస్థాష్యతే స్వేషు స్వేషు సదాచారేషు లోకః యయా సా నీతిః అని నిర్వచనము చెప్పబడినది. దేనిచేత లోకము తమ తమ ఆచారములయందు (ధర్మములందు) నియమించబడునో, అది నీతి అని పై నిర్వచనమున కర్ధము. ప్రజలు చెడుమార్గమున ్రవర్తింపకుండ నిరోధించి మంచి మార్గములో ప్రవర్తింపజేయున దని భావము.
“నయనాన్నీతిరుచ్యతే” అని స్వయముగా శుక్రాచార్యుడే చెప్పినాడు. ప్రజలను ధర్మమార్గము వైపు తీసుకొని వెళ్లునది కనుక నీతి అని చెప్పబడునని అర్థము.
కౌటిల్యుని అర్ధశాస్త్రములో “ఆన్వీక్షకీ, త్రయీ, వార్తా, దండనీతిశ్చ” అని నాలుగు విద్యలు పేర్కొనబడినవి.
అష్టాదశవిద్యలను పేర్కొంటూ విష్ణుపురాణములో -
“అంగాని వేదా శృత్వారో మీమాంసా న్యాయవిస్తరః
పురాణం ధర్శశాస్త్రం చ విద్యాహ్యేతా శ్చతుర్దశ.
శుక్రనీతిసార ప్రసరము 9
ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వశ్సైవ తే త్రయః
అర్ధశాస్త్రం చతుర్ధం తు విద్యాహ్యష్టాదశైవ తావో.
(విష్ణుపురాణం 3-6-28,29)
అని అర్థశాస్త్రము వానిలో ఒకటిగా చెప్పబడింది. కౌటిల్యుని “అర్థశాస్త్ర (గ్రంథములో కూడ దండనీతియే ప్రతిపాద్యాంశము. కౌటిల్యుడు అర్ధశబ్దానికి ధనమని కాక “మనుష్యాణాం వృత్తిః అర్ధ మనుష్యవతీ భూమిళొ అని చెప్పినాడు.
నీతి అనేకవిషయాలకు సంబంధించి విభిన్నరూపాలలో ఉన్నప్పటికీ, అష్టాదశ విద్యలలో పేర్కొనబడినది దండనీతియే. అది రాజ్యములో పాలకులకు అతి ముఖ్యమైనది.
మహాభారతశాంతిపర్వములో
చాతుర్వర్ద్వస్య ధర్మాశ్చ రక్షితవ్యా మహ్క్షితా
ధర్మసంకరరక్షా చ రాజ్ఞాం ధర్మః సనాతనః. (శాంతి 57-15)
“రాజు నాలుగు వర్ణముల ధర్మాలను కాపాడవలెను. ధర్మసంకరము నుండి ప్రజలను రక్షించుటకూడ రాజుల కర్తవ్యము”
మనువు కూడ దందనీతి ప్రాముఖ్యాన్ని యీ విధంగా ప్రతిపాదించినాడు.
“సర్వో దండజితో లోకో దుర్లభో హి శుచిర్నరః
దండస్య హి భయా త్సర్వం జగద్భోగాయ కల్పతే”. (మనుస్మృతి 7-22)
ప్రపంచ మంతయు దందనీతికి వశమై ఉంటుంది. స్వభావసిద్ధముగా పరిశుద్ధుడైన జనుడు లోకంలో దుర్లభుడు. రాజునకు, ప్రజలకు కూడా తమ తమ ధనభోగాదుల ననుభవించుటకు దందభయమే సహకారి అవుతుంది. రాజ్యంలో జారులు, చోరులు, కూటసాక్షులు, వంచకులు మొదలగు వారి నుండి సాధారణ జనులను కాపాడుటకు దండనీతి ముఖ్యసాధనము.
దండనీతి అనగానే నేరములు, శిక్షలు మాత్రమే దీనిలో ప్రతిపాదించబడ్డాయని భావించకూడదు. రాజుకు, మంత్రి మొదలగువారికి, ప్రజలకు, సైన్యానికి సంబంధిం చిన అనేకవిషయాలు దీనిలో వివరింపబడుతాయి. మున్ముందు ప్రకరణవశాన ఆ యా విషయాలను వివరిస్తాను.
రామాయణంలో, మహాభారతంలో, మరికొన్ని పురాతనగ్రంథాలలో కూడ
10 శుక్రనీతిసార ప్రసరము రాజనీతిప్రశంస అనేక్సస్థలాలలో మనకు కన్పిస్తుంది. అవి సందర్భవశమున చెప్పబడినవి. ప్రధానంగా రాజనీతిని ప్రతిపాదించే గ్రంథాలు సంస్కృతవాజ్బ్యయంలో అధికంగానే ఉన్నాయి.
- కామందక 'నీతిసారము 2. వైశంపాయనుని 'నీతిప్రకాశిక
- _క్షేమేంద్రుని నీతికల్పతరువు _ 4 భోజుని 'యుక్తికల్పతరువు
- _సోమదేవుని '“నీతివాక్యామృతము” 6. కౌటిల్యుని '“అర్ధశాస్త్రము"
- శుక్రనీతి సారము 8. చాణక్యసూత్రాలు 9.. బార్జస్పత్యసూత్రాలు 10. జనమేజయుని 'నీతిప్రకాశిక' ఇంకా మరికొన్ని పుస్తకాలు లభిస్తున్నాయి. విదేశీయపాలకులు వచ్చేవరకు మనవారికి పరిపాలన సంబంధి విశేష జ్ఞానం లేదని ఆధునికులలో కొందరి అపోహ. చాణక్యుని అర్థశాస్త్రంలో, శుక్రనీతిలో పరిపాలనకు సంబంధించిన ముఖ్యవిషయా లెన్నో మనకు లభిస్తాయి. ఇంత గొప్ప [గ్రంథానికి మూలంతో సహా తెలుగు అనువాదాన్ని ఇటీవలే నా రచనతో ప్రచురించటం జరిగింది. తెలుగువారికి మన ప్రాచీనుల రాజనీతి పరిజ్ఞానం కలిగించటానికి, భారతీయుల ప్రాచీన నాగరికతలో విశిష్టత ఏమీ లేదని భావించే కుహనామేధావులకు కనువిప్పు కలిగించటానికి ఇటువంటి శాస్త్రగ్రంథాలు వెలువడటం చాలా అవసరము, ప్రస్తుతము హైదరాబాద్ సంస్కృతభాషా ప్రచారసమితి వారు తమసంస్థ రజతోత్సవాల సందర్భంగా 25 [గ్రంథాల పరిచాయక పుస్తకాలను ప్రచురింపదలచి, ఆ సందర్భంగా నన్ను శుక్రనీతిని గూర్చి సంగ్రహపరిచయముతో పుస్తకరచన చేయమని 'కోరినారు. ఇటువంటి గ్రంథప్రచురణకు పూనుకొన్నందుకు, నాకీ రచనా కార్యక్రమంలో అవకాశమిచ్చినందుకు ఆ సంస్థకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. స్వామి జగదీశ్వరానంద సరస్వతి వారి హిందీవ్యాఖ్యానంతో బుషిదేవీ రూపలాల్ కపూర్ ట్రస్ట్‌వారు ముద్రించిన శుక్రనీతిసారగ్రంథ సహాయముతో నా యీ రచన కొనసాగింది. సహృదయపాఠకులు దీన్ని సమాదరించగలరని ఆశిస్తున్నాను. దొ కంద్రకుంట అళహసింగరాచార్యులు
శుక్రనీతిసార ప్రసరము
ఈ గ్రంథంలో మొత్తం అయిదు అధ్యాయాలున్నాయి. చతుర్ధాధ్యాయంలో మాత్రం ప్రకరణ విభాగం చేయబడి ఏడు ట్రలన్న వగళ షియాల్లో టక భాగంతోనే ఉన్నవని. చతుర్థాధ్యాయం అన్నిటికంటె పరిమాణంలో పెద్దది.
ప్రథమాభ్యాయం
దీనిలో 888 శ్లోకాలున్నాయి. మంగళాచరణంతో ప్రారంభించి, నీతిశాస్త ప్రయోజనము, రాజుల భేదాలు, ఏడు రాజ్యాంగాలు, రాజు ప్రజారంజకత్వధర్శ్మము, జూదము మొద॥ వ్యసనముల నిర్దేశము, ఆన్వీక్షకి మొద॥ చతుర్దశ విద్యల స్వరూపము, రాజధర్మాలు, సామంతాదిఖేద వివరణ, రాజధాని నిర్మాణ విధానము, దుర్గనిర్మాణము, రాజసభస్వరూపము, రాజు దినకృత్యనిర్దేశము, ఆహారాది పరీక్ష విధానము, గూఢచారుల ద్వారా సమాచారసేకరణ, రాజ్యపరిషత్ నిర్మాణ వ్యవస్థ, రాజు కర్తవ్యాలు, అధికారుల నిరీక్షణ అనే విషయాలు, వాటికి సంబంధించిన ఇతరాంశాలు కొన్ని ప్రతిపాదించబడినాయి.
నీతిశాస్త్రము అన్నిటికీ పరిపోషకమని, ధర్మార్ధకామమోక్షాలనే నాలుగు పురుషార్థాలకు సాధనమని రాజు తప్పక నీతిశానస్తా న్నృధ్యయనం చేయాలనీ, దానివలన శత్రువిజయము, ప్రజారంజనము చేయగలుజితారని గ్రంథాదిలో చెప్పబడింది.
వ్యాకరణజ్ఞానం లేకున్నా శబ్బార్థముల జ్ఞానం కలిగి ఉండవచ్చును. తర్మశాస్త్ర జ్ఞానం లేకున్నా ద్రవ్యాదిపదార్థాల స్వరూపము తెలుస్తుంది. మీమాంస చదువకున్నా వైదికకర్శ్మకాండల పరిజ్ఞానం కలుగవచ్చును. వేదాంతశాస్త్రము చదువకున్నా శరీరాదులు అనిత్యములని తెలుస్తుంది. ఆ శాస్త్రాలన్నీ పండితుల బుద్ధికౌశలాన్ని తెలుపుతాయి. లోకవ్యవహారరంగంలో వాటి ఉపయోగ మేమీ లేదు. కాని, నీతిశాస్తపరిజ్ఞానము లేనట్లయితే లోకవ్యవహారస్థితి తెలియదు. అందువలన లోక వ్యవహార పరిరక్షకుడైన పాలకుడు తప్పక నీతిశాస్తాన్ని అధ్యయనము చేయవలసి ఉంటుంది.
ప్రథమాధ్యాయములో తెలుపబడిన ఇతర ముఖ్యాంశా లీవిధంగా ఉన్నవి.
అపథ్యాహారము భుజించేవానికి రోగములవలె, నీతిహీనులకు శత్రువులు వెంటనే కాని కాలక్రమంలో కాని కలుగుతారు. నీతిమార్గము వదలి స్వతంత్రముగా ప్రవర్తించు రాజు దుఃఖభాగి అవుతాడు. అటువంటి రాజును సేవించుట అసిధారా వ్రతము వంటిది.
12 శుక్రనీతిసార ప్రసరము రాజదండన భయంవలన ప్రజలు తమ తమ ధర్మాలను పాలింతురు. సాత్త్వికము, రాజసము, తామసము అని తవస్సు మూడు విధాలు. రాజు ఏ గుణముతో రాజ్యపరిపాలనమనే తపస్సు నాచరిస్తాడో, అటువంటి వాడవుతాడు. స్వధర్శములో శ్రద్ధ కలిగి ప్రజలను రక్షిస్తూ, యజ్ఞములు చేస్తూ, శత్రువులను జయించి, దానగుణము, శౌర్యము, సహనము కలవాడై, విషయాసక్తుడు కాకుండ విరక్తుడై ఉండేవాడు సాత్త్వికరా జనబడతాడు. దానికి విరుద్ధంగా ప్రవర్తించువాడు తామసరాజు, దయలేక, గర్వితుడై, హింసాస్వభావియై, సత్యమును విడచి, దంభము గలవాదై, లోభి, విషయాసక్తుడు, మోసగాడు, శతుడు అయినవాడు రాజసరాజు అని పిలువబడుతాడు.
పుట్టుకతోనే ఎవడూ (బ్రాహ్మణుడు కాని క్షత్రియుడు కాని, వైశ్య, శూద్ర జాతీయుడు కాని కాజాలడు. గుణకర్మల ద్వారా బ్రాహ్మణాదిభేదాన్ని, మ్లేచ్భతాన్ని పొందుతాడు.
“న జాత్యా బ్రాహ్మణశ్చాత్ర క్షత్రియో వైశ్య ఏవ న |
న శూద్రో న చవై మ్లేచ్చో భేదితా గుణకర్మభిః॥” (శుక్ర 1-38-1)
జ్ఞాన, కర్మ ఉపాసనలతో, దేవతారాధన, శాంతి, దాంతి, దయ అనే గుణాలతో
(బ్రాహ్మణుడుగాను, రాజ్యపాలనచేస్తూ, శూరత్వము, ఇంద్రియని[గ్రహము, దుష్టనిగ్రహ
శీలము కలవాడు క్ష్మత్రియుడుగాను, క్రయవిక్రయసమర్థుడు, వాణిజ్యముతో
జీవించేవాడు, పశుపాలన, వ్యవసాయవృత్తి కలవాడు వైశ్యుడని, పై మూడు వర్దాల వారికి ఉపచారము చేస్తూ, శాంతస్వభావము, ఇంద్రియజయము, శౌర్యము, నాగలి, కొయ్యలు, తృణాదులను సంపాదించువాడు శూద్రుడని తెలియవలెను. తమ ధర్మాన్ని విడిచి, దయలేనివారై, ఇతరులను బాధిస్తూ, క్రూరత్వముత్రో ప్రవర్తించేవారు మ్లేచ్చు లనబడుతారు. దైవబలము కంటే పౌరుషము ప్రబలము. పూర్వజన్మకృత పుణ్యపాప రూపము దైవబలము. ఈ జన్మలో చేసినది పౌరుషము. ఈ రెండింటి ఆధారంగానే ప్రపంచ వ్యవహారాలు నడుస్తాయి. దైవ మనుకూలంగా ఉంటే చిన్న ప్రయత్నానికి ఫల మధికంగా ఉంటుంది. ప్రతికూలమైతే పెద్ద ప్రయత్నానికి కూడ అల్పఫలం లభిస్తుంది. రాజు, అమాత్యుడు, మిత్రుడు, ధనాగారము, రాజ్యము, కోటలు, సైన్యము ఇని సప్తాంగములని, ప్రకృతులని వ్యవహరింపబడుతాయి. వీటిలో రాజు శిరస్సు,
శుక్రనీతిసార ప్రసరము 13 మంత్రి కన్నులు, మిక్రుడు చెవులు, కోశాగారము ముఖము, సైన్యము మనస్సు, కోట చేతులు, రాజ్యము పాదములని (గ్రహించవలెను.
ప్రజలకు రాజు మంచినేత (ధర్మమార్గంలో నడిపించేవాడు) కాకపోతే, నడిపే వాడు లేని నావ సముద్రములో మునిగే విధంగా ప్రజలు సంకటంలో పడిపోతారు. పాలకుడు లేక ప్రజలు తమ ధర్మంలో ప్రవర్తించరు. (ప్రజలు లేనిదే పాలకునికి శోభ లేదు.
తన దుర్గుణాలను విడిచి, నిందలను ఓర్చుకుంటూ, దాన, మాన, సత్యారాలతో ప్రజలను సంతోషపరుస్తూ, ఇంద్రియనిగ్రహము, శౌర్యము కల శస్తాస్తకుశలుడు, శత్రుసంహారకుడు, స్వేచ్భాచారి కాకుండా, బుద్ధిబలము కలిగి, జ్ఞానవిజ్ఞానయుక్తుడై, నీచసంగతి లేక, దూరాలోచన కలిగి, పెద్దలను సేవిస్తూ, చక్కని నీతిమార్గముతో కూడి, గుణవంతులచే సేవింపబడేవాడు. దేవతాంశ గల రాజుగా తెలియవలెను.
దీనికి వ్యతిరేకమైన లక్షణాలు కలవాడు రాక్షసాంశ కలవాడని చెప్పబడినాడు.
నీతికి వినయము మూలము. రాజు మొదట తనను తాను వినయంలో నియమించుకొని, తరువాత కొడుకులను, మంత్రులను, సేవకులను, ప్రజలను క్రమంగా వినయమార్గంలో నడపవలెను. విషయసుఖాభిలాషతో మనస్సు ఇంద్రియా లను ప్రేరేపిస్తుంది. అందువలన మనస్సును నిరోధిస్తే జితేంద్రియుడు అవుతాడు. ఒక్క మనస్సును అణచలేనివాడు విశాలరాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించగలడు?
జూదము, ప్రీసంగము, మద్యపానము అనే మూడు అధికమాత్రలో అయితే అనర్ధాన్ని కలిగిస్తాయి. మితంగా సేవించినప్పుడు ధనము, సంతానము, బుద్ధిబలాన్ని కలిగిస్తాయి.
దుష్టులను అణచివేయటం, దానము, ప్రజలను రక్షించటం, యాగాలు చేయటం, న్యాయమార్గంలో ధనసంపాదన, ఇతరరాజులనుండి కప్పము (గ్రహించటం, శత్రువులను నిర్జించటం, రాజ్యాన్ని పెంచుకోవటం - ఈ ఎనిమిది రాజుల ముఖ్య ప్రవృత్తులు.
యౌవనము, జీవనము, మనస్సు, ఛాయ, సంపద, అధికారము అనే ఆరు చంచలాలు. వాటి స్వరూపం తెలిసికొని ధర్మపరుడుగా ్రవర్తించవలెను. వేట, జూదము, పొనము రాజులకు నింద్యాలు. వాటివలన పాండురాజు, నలుడు, యాదవులు నష్టము పొందినారు.
114 శుక్రనీతిసార ప్రసరము ఆన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అనే నాలుగు విద్యలను రాజు తప్పక నేర్వ వలెను. తర్మము, వేదాంతము మొద! ఆన్వీక్షకిలో చేరిఉండును. త్రయి అనగా బుగ్యజుః సామవేదాలు. వాటిలో ధర్మ, అర్ధ, కామ, మోక్షముల వర్ణ్దన ఉంటుంది. వార్తలో అర్థ సంపాదన, అనర్థనివారణ గురించి చెప్పబడుతుంది. దందనీతిలో నీతి, అనీతి గూర్చిన ప్రస్తావము చేయబడింది. ఈ నాలుగు విద్యల్లో వర్ణ, ఆశ్రమాల ధర్మాలు వివరింప బడినాయి. నాలుగు వేదాలు, శిక్షాది అంగాలు ఆరు, మీమాంస, న్యాయశాన్త్రము, పురాణాలు, ధర్మశాస్త్రము - ఇవన్నీ త్రయి అనే విభాగంలో చేరతాయి. వడ్డీ వ్యాపారము, వ్యవసాయము, క్రయవిక్రయవ్యవహారము (వర్తకము), పశుపాలనము “వార్త అనే విభాగంలో చేరుతాయి. దండశబ్దము లక్షణతో దండకర్త అగు రాజును బోధిస్తుంది. 'దండస్య నీత్తి = దండనీతి? అనివ్యుత్పత్తి. రాజుయొక్క నీతి కనుక దండనీతి అనగా రాజనీతి అన్ని భావము. సత్పురుషుల విషయంలో, శత్రువుల విషయంలో కూడ ఎల్లప్పుడు ప్రియ వాక్కులనే పలకవలెను. విద్వాంసుల మాటలు (శ్రోతలకు ఆహ్లాదము కలిగించినటు హంసల, కోకిలల, నెమళ్ల స్వరముకూడ కలిగించదు. ల సద్భావముతో మిత్రుని మనస్సును, బంధువుల మనస్సును, ప్రేమాదరాలతో స్త్రీ, భృత్యుల మనస్సులను, దాక్షిణ్యభావముతో ఇతర జనుల మనస్సులను వశపరచు కోవలెను. ప్రజలను పీడించకుండా ప్రతి సంవత్సరము లక్షనుండి మూడు లక్షల లోపు వెండి నాణెముల పన్ను లభించే రాజు సామంతుదని పిలువబడుతాడు. అంతకుమించి పదిలక్షల వరకు సంవత్సరాదాయము పొందేవాడు మాండలికుడు అనబడుతాడు. పదిలక్షలకు మించి ఇరువది లక్షల వరకు నాణెములపన్ను ఆదాయం కలవాడు రాజుగా చెప్పబడుతాడు. యాభైలక్షల వార్షికాదాయం కలవాడు స్వరాట్టు అని, తరువాత పదికోట్ల వార్షికాదాయమున్న ప్రభువు సమ్రాట్టు అని పిలువబడుతాడు. ఆపైన యాభై కోట్ల వెండి నాణాల వార్షికాదాయంతో విరాట్టు అని, ఆపైన అధిక మొత్తం పన్నుల ఆదాయముంటే సార్వభౌముడని తెలియవలెను. అతని అధీనంలో భూమి అంతా విధేయమై ఉంటుంది.
శుక్రనీతిసార ప్రసరము 15 నూరు గ్రామాలకు అధికారి అయినవాడు కూడ సామంతు డనబడతాడు. అనేకములైన చెట్లు, తీగెలతో కూడి, పశుపక్షిసమూహము కలిగి, నీరు, ధాన్యం,
గడ్డి, కట్టెలు సమృద్ధిగా కలదై, నదీతీరం కలిగి, దగ్గరలో పర్వతమున్న సమతల
ప్రదేశంలో రాజధాని నగరాన్ని నిర్మించాలి. అర్ధచంద్రాకారంలో లేదా వృత్తాకారంలో, చతురస్రాకారంలో కాని, ప్రాకారాలతో సహ నిర్మించాలి. నాలుగు దిక్కులలో మంచి దారులు, వీథులతో, ధర్మశాలల వంటివాటితో రాజధానిని నిర్మించాలి. రాజధానిలో రాజభవనము, మధ్యలో సభామందిరము, గోశాల, అశ్వశాల, గజశాలలు సమీపంలో ఉండాలి. బావులతో, జలయంత్రాలతో, ఉత్తరదిక్కు పల్లంగా, సాయుధులైన రక్షకభటులతో కూడి ఉండాలి. స్నానం చేయటానికి, బట్ట లుతకటానికి, హోమాదులు చేయటానికి, వంటకు, భోజనానికి తూర్పుదిక్కున ప్రత్యేకశాల లుండాలి. నిద్రించటానికి వినోదానికి, మద్యపానానికి, రోదించటానికి, ధాన్యం నిలువ చేయటానికి, దంచటం, విసరటం వంటి పనులకు, మలమూత్రవిసర్జనకు దక్షిణం వైపు విడిగా నిర్మించాలి. పడమటి దిక్కున పశుశాలలు, ఉత్తరదిక్కున రథాలు, ఆయుధాలు నిల్వచేయటానికి, విద్యాభ్యాసానికి శాలలుండాలి. రాజసభ మూడు, అయిదు లేక ఎడు విశాలమైన గదులతో, తూర్పు పడమరలు పొడవు ఎక్కువగా ఉండి, రెండు లేక మూడంతస్తులతో విశాలంగా నిర్మించాలి. మంత్రులకు, అధికారులకు, లేఖకులకు, సభ్యులకు నివాసభవనాలను రాజమందిరానికి కొంచెం దూరంలో ఏర్పాటు చేయాలి. రాజమందిరానికి ఉత్తరంలో కాని, తూర్పున కాని రెండువందల హస్తాల దూరంలో సైనికుల నివాసగ్భహా లుండాలి. రాజధానిలో బాటసారులకు నీటి సౌకర్యంతో ధర్మశాలను కట్టించాలి. రాజ భవనానికి నాలుగు దిక్కుల విశాలమైన రాజమార్దాలు కల్పించాలి. ముప్ఫెహస్తాల వెడల్పు రాజమార్గము ఉత్తమమని, ఇరవైహస్తాలది మధ్యమమని, పదిహేను హస్తాల మార్గము అధమమని చెప్పబడింది. (హస్తం అనగా మూర అని అర్ధము). రెండు గ్రామాల మధ్య ఒక బాటసారుల విశ్రాంతి గృహం నిర్మించాలి. రాజు దినకృత్యాలు : తెల్లవారు జామున లేచి ఆదాయవ్యయాలు పరిశీలించి, కాల కృత్యాలు తీర్చుకుని, పూజ, పురాణశ్రవణం, దానకర్మలు చేయాలి. సమర్థులైన సేవకులకు పారితోషికా లివ్వటం, వస్త్రాలు, బంగారం మొద వాటిని పరిశీలించటం, సైన్యానికి, రాజ్యానికి సంబంధించి ఆదేశపత్రాలు విడుదల చేయటం, బంధుమిత్రులతో
16 శుక్రనీతిసార ప్రసరము కలిసి భోజనం చేసి రెండు గడియలు విశ్రమించటం, ధర్మాధికారితో వ్యవహారవిచారణ, తీర్పుల పరిశీలన జరపాలి. వేట, వినోదాలతో కొంతసేపు, వ్యూహనిర్మాణాన్ని = అభ్యసించటంలో రెండు గడియలు, సాయంకాల సంధ్యావందనం, గూఢచారుల నుండి రహస్యాల సేకరణ, రాత్రిభోజనం తర్వాత కొంచెం విశ్రమించి నిద్రకు 16 గడియల కాలాన్ని (612గంటలు సుమారు) వినియోగించాలి. రాజధానిలో ఉన్నప్పుడు రాజుదినచర్య యీరీతిగా ఉండాలి. రాత్రులందు కాపలాభటులు నగరసంచారం చేయాలి. కొలతలు, తూకం, నాణాలు, లోహాలు, నెయ్యి, తేనె, పాలు వంటి వాటిలో కల్తీ కాని, మోసంకాని చేయరాదని కఠినశాసనం చేయాలి. అబద్ధపు సాక్ష్యము, మోసపు వ్యవహార పత్రాలు, పరస్టీగమనము, దోపిడీ, ఎక్కువ పన్ను తీసుకోవటం, పప్రభుద్రోహం అనే నేరాలకు కఠినదండన చాటించాలి. గ్రామంనుండి బయటకు వెళ్లేవారిని, గ్రామంలోకి వచ్చేవారిని కాపలా భటులు జాగ్రత్తగా పరీక్షించి పంపాలి. రాత్రి వేళల్లో జాముకు రెండు సార్లు కాప్రలావారు గ్రామంలో తిరిగి దొంగలను, వ్యభిచారులను నిరోధించాలి. క వని లేకుండా జూదము, మద్యపానము, ఆయుధధారణ వంటి పనులు (గ్రామపు ఆదాయంలో 12వ భాగంతో గ్రా నియమించాలి. గా గ్రామరక్షకులను వేతన మిచ్చి రాజు తన ఆహారంలో విషాదిదోషపరీక్షను కోళ్లు, మర్కటాల వ్రంట్రి వాటి ద్వారా జరపాలి. రాజకుటుంబంలో చాలమంది ఉన్నప్పుడు, వారిలో జ్యేష్టుడు రాజు కాదగున్స అతడు చెవిటి, గ్రుడ్డి, మూగ, కుష్టు రోగి, నపుంసకుడు అయితే రాజ్యార్హుడు కాడ అతని తమ్ముడు కాని, కొడుకు గాని రాజు కావచ్చును. రాజబంధువులు, బావ ॥ మరదులు సైన్యాధికారంలో నియమింపబడవచ్చును. రాజు సంవత్సరంలో ఎప్పుడైనా (గ్రొమాలలో, పట్టణాలలో పర్యటించి అధికారుల ప్రవర్తన ఎట్లున్నదో తెలుసుకోవాలి. సేవకపక్షపాతి క్రాక్రుందా, ప్రజాపక్ష పాతిగా వారి సమస్యలను పరిష్కరించాలి. తనకు గొప్ప ప్రమాదం సంభవించినప్పుడు రాజు దుర్గా న్నాశయించి ఆత్మరక్షణ చేసుకోవాలి.
శుక్రనీతిసార ప్రసరము 17 ఇవి, మరికొన్ని ఇతరాంశాలతో ప్రథమాధ్యాయము సమాప్త మవుతుంది. ఈ అధ్యాయానికి రాజకృత్యాధికారమని పేరు. ద్వతీయాధ్యాయం దీనిలో మొత్తం 416 శ్లోకాలున్నాయి. ఇందు ప్రతిపాదింపబడ్డ ముఖ్యాంశా లీ విధంగా ఉన్నాయి. రాజ్యనిర్వహణ క్లిష్టమైనది కనుక ఒక్కనివలన కాజాలదు. విద్యాకుశలుదైనా, మంత్రాంగము తెలిసినవాడైనా మం్రులు లేక స్వయంగా పాలించకూడదు. స్వతంత్ర ప్రవృత్తి అనర్ధాన్ని కలిగిస్తుంది. యువరాజు, అమాత్యవర్గము రాజుకు రెండు భుజాలు, కన్నులు, చెవులు కూడ. తన కొడుకును, తమ్ముణ్ణి, పినతండ్రిని, అన్నకొడుకును, దత్తపుత్రుణ్ణి కాని యువరాజపదవిలో నియమించవలెను. అతనికి రాజముద్రాధికారం తప్ప అన్నీ ఉంటాయి. పై వరుసలో పూర్వం పేర్కొన్నవారు లేనప్పుడే తరువాతి వారి కవకాశ మివ్వాలి. రాజపుత్రులను అమాత్యులు మొదలైవారిచేత నీతిశాస్త్రము, విలువిద్య, ఇతరకళలు చెప్పించి శౌర్యవంతులుగా, వినయవంతులుగా తీర్చిదిద్దాలి. దత్తపుత్రుని కంటె బెరసపుత్రుడు లేదా తన కుటుంబంలోని వంశీయకుమారుడు ద్రేష్టుడు. యువరాజు తండ్రి ఆజ్ఞను పాటిస్తూ, మనోవాక్కాయములతో ఆయనకు సంతోషము కలిగించాలి. రాజుకు విరుద్ధమైన పనిచేయకూడదు. విద్యతో, పనితో, స్వభావముతో ప్రజలను సంతోషపరుస్తూ, త్యాగశీలుదై, సత్యవంతుడుగా అందరినీ వశపరచుకోవాలి. శుక్షపక్షచంద్రునివలె క్రమంగా వృద్ధిపొందాలి. అప్పుడు అమాత్యుల సహాయముతో చిరకాలము రాజ్యాధికారాన్ని అనుభవించగలడు. ఇక అమాత్యుల స్వరూపస్వభావా లీవిధంగా ఉండాలి. రాజోద్యోగుల నియామకంలో శీలము, ఆచరణ, గుణాలు ప్రధానంగా చూడ దగును కాని జాతి కులాలు ముఖ్యం కావు. డ్రేషస్టత్వము జాతితో కాని, కులముతో రాని లభింవదు సజము పలికవాడు, గుణవంతుడు, మంచివంశంలో పుట్టినవాడు, ధనవంతుడు, మంచికులమువాడు, శీలవంతుడు, మంచిపనులు చేసేవాడు, సోమరి కానివాడు,
18 శుక్రనీతిసార ప్రసరము తనపని కంటె స్వామికార్యాన్ని శ్రద్ధగా చేసేవాడు, మనోవాక్కాయములతో ప్రభు కార్యాన్ని శ్రద్ధగా చేసేవాడు, మృదుభాషి వేతనముతో తృప్తిపొందేవాడు, ఇంకా కొన్ని ఇటువంటి మంచి లక్షణా లున్నవాడు ్రేష్టభృత్యుడు. ఇందుకు విరుద్ధమైన లక్షణా లున్న వాడు నీచసేవకుడని చెప్పబడుతాడు. ధూర్హులు, పిరికివారు, దురాశాపరులు, ఇచ్చకాలు పలికేవారు, మద్యపానాదులచే మదించినవారు, వ్యసనపరులు, లంచగొండులు, నాస్తికులు, శత్రుమిత్రులు - ఇత్యాదులు అధమసేవకులని తెలియవలెను. దశప్రకృతులు పురోహితుడు, ప్రతినిధి, ప్రధానుడు, సచివుడు, మంత్రి, ప్రాడ్వివాకుడు, పండితుడు, సుమంటత్రకుడు, అమాత్యుడు, దూత అని యీ పదిమంది రాజుకు ప్రకృతులని చెప్పబడుతారు. వీరిలో చివరినుండి పూర్వపూర్వక్రమంలో పదవ భాగం వేతనం అధికంగా ఉంటుంది. దూతకంటె అమాత్యునికి 10వ భాగం ఎక్కువ, పురోహితునికి సర్వాధికవేతన ముంటుంది. కొందరి మతంలో పురోహితుడు, దూత అనే .వారు లేకుండా ఎనిమిది మంది ప్రకృతులని చెప్పబడింది. ఈ మతంలో అందరికి సమానవేతనా లుంటాయి. మొదటి పక్షంలో అందరికంటె పురోహితుడు (శ్రేష్టుడు. తరువాత క్రమంగా ఆ యా స్థానాలను పొందుతారు. మంత్రానుష్థానపూర్వకముగా కార్యనిర్వాహకుడు, వేదములు చదివినవాడ్రు శ్రద్ధతో పనులు చేసేవాడు, ఇంద్రియాలను, కోపాన్ని గెలిచినవాడు, లోభమోహాల్స లేనివాడు, ఆరు వేదాంగాలు తెలిసినవాడు, ధనుర్విద్యను అంగసహితముగా చదివిన వాడు, ధర్మార్ధవిదుడు, రాజుకూడ ఎవని కోపానికి భయపడి ధర్మనీతిప్రరుడూ ఉంటాడో, అటువంటివాడు పురోహితుడుగా ఉండదగును. ప్రకృతులతో ఆలోచింపకుండా రాజు స్వయంగా నిర్ణయాలు చేసినట్లర్చుత్ర రాజ్యనాశము జరుగుతుంది. ప్రజలు, సైన్యము, ధనాగారము, రాజులో మంచ్రి శీల సంపద, శత్రునాశము ఎవరి మంత్రాలోచన వలన జరగదో, ఆ పకృతులవలన లాభమేమి? ప్రతినిధి అనగా, కర్తవ్య, అకర్తవ్యములను బాగుగా తెలిసినవాడు.
శుక్రనీతిసార ప్రసరము 19
అన్ని రాజ కార్యాలను నిరీక్షించేవాడు ప్రధాను డనబడతాడు.
సైన్యసంబంధి సంచాలన వ్యవహారాలు తెలిసిన వాడు సచివుడని, నీతిశాస్త్రంలో నేర్పరి మంత్రి అని, ధర్మతత్త్వము తెలిసినవాడు పండితుడని, లోకముయొక్క శాస్త్రము యొక్కనీతి తెలిసి, పండితుడైన ధర్మవేత్త ప్రాడ్వివాకుడని చెప్పబడుతారు.
దేశ, కాలాలకు సంబంధించిన విషయాలను చక్కగా తెలిసినవాడు అమాత్యు దని, ఆదాయవ్యయపు లెక్కల వివరాలు బాగుగా తెలిసినవాడు సుమంత్రుడని చెప్పబడు తాడు. ఇంగితము, ఆకారము, చేష్ట అనే వాటి మర్మము తెలిసినవాడు, జ్ఞాపకశక్తి కలిగి, దేశకాలములను గుర్తించేవాడు, సంధి వి[గ్రహాది రాజనీతి షద్దుణములు తెలిసినవాడు, మంత్రరక్షణ తెలిసి చక్కగా, నేర్పుగా మాట్లాడగలవాడు దూత అని వ్యవహరింప బడతాడు.
ఈ పురోహితాది ప్రకృతులు 10 మంది రాజుపొతము కోరి తమ తమ కర్తవ్యాలను పాటించవలెను.
ఈనాడు మనం అమాత్యుడు, మంత్రి, సచివుడు అనే పదాలను సమానార్థ కాలుగా వాడుతున్నాము. కాని దీనిలో ఆ మూడు పదవులు వేరని, వాటి బాధ్యతలు విడివిడిగా చెప్పబడ్డాయి.
ప్రభువు పురోహితాదుల విధినిర్వహణ పద్ధతిని భటులద్వారా, పత్రాలద్వారా, సంభాషణ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకొని, అవసరమైనప్పుడు వారి పదవీ బాధ్యతలను పరస్పరం మార్చుచేయవలెను.
తనకంటె బలవంతులను అధికారులుగా నియమించవద్దు. ఒక్కొక్క అధికార బాధ్యతలో ఒక ముఖ్యుణ్ణి, ఇద్దరు సహాయకులు మొత్తం ముగ్గురుని నియమించాలి. ఏ ఉద్యోగిని కూడ ఒకే అధికారపదవిలో చిరకాల ముంచకూడదు. ఉద్యోగి పుత్రుడు అతని యోగ్యతలు కలవాడైతే అతని స్థానంలో నియమించవచ్చును.
ప్రతి పట్టణము లేదా గ్రామములో దందాధిపతి, (పట్టణ) గ్రామాధ్యక్షుడు, పన్నుల లెక్కలు తయారు చేసేవాడు, లేఖాధికారి (కరణము), వ్యవసాయదారుల పన్ను స్వీకరించేవాడు, ద్వారపాలుడు అనే ఆరుగురిని నియమించాలి.
మునులు, పండితులు, శాస్త్రజ్ఞులు, పౌరాణికులు, వైద్యులు మొదలగువారిని జీవనాధారం కల్పించి రక్షించవలెను.
20 శుక్రనీతిసార ప్రసరము
ఏనుగుల, గుట్టాల చిహ్నాలు, సుడులు మొద॥ వాటిని తెలిసినవారినే గజాధ్యక్ష అశ్వాధ్యక్షులుగా నియమించాలి. సేనాధిపతిగా, సైనికులుగా నీతికుశలులు, శస్తాస్త విదులు, మధ్యవయస్కులు, దృఢశరీరులు, ప్రభుభక్తులు, శూద్రులు, క్షత్రియులు, వైశ్యులు, సంకరజాతివారు ఎవరినైనా నియమించవచ్చును.
5 లేక 6 గురు కాల్బలమున కధికారి పత్తిపాలుడని, ముప్పదిమంది సైనికుల అధిపతి గౌల్మికుడని, వందమంది సైనికుల అధికారి శతానీకుడని, అంతకంటె ఎక్కువ మందికి అనుశతికుడని, వేయిసైనికుల అధికారి సాహప్రికుడని, పదివేల సైన్యాధికారి ఆయుతికుడని పిలువబడుతారు. వీరి ఒక్కొక్కరి బాధ్యతలు విడిగా చెప్పబడ్డాయి.
మణులు, బంగారము, వెండి, నాణాలకు అధ్యక్షుణ్ణిగా వాటి రంగు, బరువు, మెరుగు, జాతి, ఆకారములూ బాగా గుర్తించగలవాణ్ణి నియమించాలి.
కోశాధ్యక్షుడుగా ధనవంతుడు, మనోని[గ్రహం కలవాడు, వ్యవహారంలో నేర్పరి, పిసినారి, అయిన వ్యక్తిని నియమించవలెను. ఇట్లే వస్తాధిపతి, పాకాధిపతి, ధాన్యపతి, ఆరామాధిపతి, సంభారాధిపతి మొద॥ పదవులకు వాటివాటి విషయనైపుణ్యం కలవారిని ఏర్పరచాలి.
అంతఃపురపు కాపలా భటులుగా నపుంసకులు, సత్యవాదులు, చక్కని అలంకారము కలవారు, ప్రియభాషణులు, మంచి వంశంలో పుట్టినవారు, అందమైన వారు నియమీంపబడవలెను.
శత్రువుల, సామాన్య'ప్రజల, సేవకుల స్వభావాన్ని ప్రవర్తనను తెలుసు కోవటంలో నేర్చరులను, తాము విన్న యథార్థాలను చక్కగా తెలుపగల వారిని గూఢ్గ చారులుగా నియమించాలి.
అన్ని పాపములకంటె హింస గొప్పపాపము. దానికంటె అసత్యభాషణము ఎక్షువ పాపము. ఆ రెండు దోషాలు కలవారిని భృత్యులుగా స్వీకరించకూడదు.
భృత్యులు చేయవలసినదిన కృత్యాలు వివరంగా దీనిలో చెప్పబడ్డాయి.
సరళమైన వేషధారణ, పిలిచినప్పుడు చేతులు జోడించి, రాజాజ్ఞను శ్రదగ్గా
విని, తన పనులను తెలియజేయటం, దూరంగా వినయంతో కూర్చోవటం, బిగ్గర్ర నవ్వటం, దగ్గు, తుమ్ము, ఆవలింత వంటి పనులను రాజసమీపంలో చేయకుండటం సేవకుని ధర్మాలు. రాజుకు సంకటస్థితి వచ్చినప్పుడు, ఆయన అపమార్గంలో వెళ్లుతున్నప్పుడు, సమయం మించిపోతున్నప్పుడు రాజు మేలుకోరే సేవకుడు,
శుక్రనీతిసార ప్రసరము 21 అడుగకున్నా మంచి మాటను చెప్పవలెను. ఎవరికి అప్పగించిన బాధ్యతను వారు (ఢద్ధతో నిర్వహించవలెను. ఇతరుల కర్తవ్యాలలో జోక్యం చేసుకోరాదు. ప్రభువుయొక్క రహస్యాలను, మంత్రాలోచనను ఇతరుల ముందు వెల్లడించకూడదు. అతనిపై పగను కాని, అతని వినాశాన్ని కాని మనసులో కూడ కోరరాదు.
మంచి ప్రభువు ఆపదలో చిక్కుకున్నప్పుడు వదిలి వెళ్లకూడదు. ఒకసారి అన్నము పెట్టిన వానికే మేలుకోరవలె నన్నప్పుడు, తనను పోషించే యజమాని మేలును కోరవద్దా?
అధికారివర్గము, రాజు ఎక్కడ మంచి వర్తనతో పరస్పరానుకూలంగా ఉంటారో, అక్కడ లక్ష్మి స్థిరంగా నిలిచి ఉంటుంది.
యుద్ధం వంటి గొప్పపనులు వచ్చినప్పుడు భృత్యులు తమ ప్రాణాలను కూడ అర్చించి, ప్రభువిచ్చిన వేతనానికి సార్ధకత కల్పిస్తారు. అట్లు కాకుండా (ప్రభువు, సేవకుడు తమ ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే తమ వినాశానికి తామే కారణ మవుతారు.
అనుచిత దండన కాని, క్రూరదండనను కాని ఎవరికైన విధించినప్పుడు వారించి భృత్యుడు ఏకాంతంలో ప్రభువుతో నచ్చ జెప్పవలెను. అది రాజ్యరక్షణకు ఉపయోగ పడుతుంది.
గుణాలను, నీతిమార్గాన్ని సైన్యాన్ని, ద్వేషించే ప్రభువు మంచి వంశంలో పుట్టిన వాడైనా, రాజ్యనాశకారకుదైన ఆ ప్రభువును భృత్యుడు వదిలి వెళ్లాలి.
పురోహితుడు శ్రేష్టతరుడు. అతని రాకను చూచి రాజు లేచి, ఎదురేగి స్వాగతం చెప్పవలెను. తరువాతి గౌరవము సేనాపతికి, ఆ తరువాత తన మిత్రులకు ఇవ్వవలెను.
ప్రభువు భృత్యులతో పరిహాసభాషణం కాని, ఆటలాడటం కాని చేయకూడదు. దానివలన వారిలో ప్రభువుపై గౌరవం తగ్గి తమ కర్తవ్యాలపై అశ్రద్ధ చూపుతారు.
మనుష్యులకు భమపడటం సహజం కనుక వ్రాతపూర్వకమైన రాజాజ్ఞ ప్రామాణికంగా భావించాలి. లిఖితపత్రం ఇవ్వక ఆజ్ఞాపించు రాజు, లేఖ లేకుండా కార్యాన్ని నిర్వహించిన భటుడు ఇద్దరు కూడ చోరుల వంటివారు.
రాజముద్ర వేయించిన లేఖాపత్రము ఉత్తమోత్తమము, ముద్రలేకుండా రాజు వ్రాయించినది ఉత్తమము, మంత్రి మొద! వారు వ్రాసినది మధ్యమము, పౌరముఖ్యులు వ్రాసినది కనిష్టము. ఇవి అన్నీ కూడ పనులు జరుపటాని కుపయోగించేవే.
22 శుగక్రనీతిసార ప్రసరము రాజపత్రాలు ముఖ్యంగా రెండురకాలు.
- వృత్తపత్రము
- ఆయవ్యయపత్రము వీటిలో ఒక్కొక్క దానిలో వ్యవహారభేదాలను బట్టి అనేకభేదాలు ఏర్పడుతాయి. జయపత్రము, ఆజ్ఞాపత్రము, శాసనపత్రము, విభాగపత్రము, దానపదత్రము ఇత్యాదులు. ఆదాయవ్యయాలకు సంబంధించిన పత్రాలలో భేదాలు చాలా ఉన్నవి. ఈ సందర్భంలో ఆయవ్యయాల లక్షణము, వాటి భేదాలు, సంచితాదాయపు రకాలు, సాహజికాదాయము మొద॥ వివరంగా ప్రతిపాదించబడ్డాయి. పూర్వసంవత్సరాదాయంలో వ్యయము పోగా మిగిలినది (52414009), ఈ సంవత్సరపు సంపాదితాదాయము కలిపి సంచితాదాయమని చెప్పబడింది. తండ్రి, తాతల నుండి తనకు సంక్రమించిన ఆస్తి నుండి ప్రతి సంవత్సరము తనకు లభించేది, వ్యవసాయం మొద॥ వృత్తులద్వారా లభించేది కాని సాహజికాదాయ మని చెప్పబడింది. వడ్డీలరూపంలో కాని, యజ్ఞాదులలో దక్షిణల రూపంలో కాని, బహూమానాల, కానుకల రూపంలో వచ్చినది అగు ఆదాయము అధికము అనబడుతుంది. ఒక వస్తువు తీసుకొని దాని బదులు మరొకటి ఇచ్చినట్లయితే అది ప్రతిదానము, చేసిన సేవకు, పరాక్రమాదులకు మెచ్చి ఇచ్చినది పారితోషికము, నియమిత కాలంలో చేసిన పనికి ప్రతిఫలంగా ఇచ్చినది వేతనము, ధాన్యము, బట్టలు, ఇండ్లు, పశువుల్తు, రథాలు సంపాదించటానికి, రాజ్యాన్ని విద్యను సంపాదించటానికి, వాటి రక్షణకొరక్రు పెట్టే ఖర్చు ఉపభోగ్యము అని చెప్పబడుతాయి. ఆదాయవ్యయాలు ఆవర్తకము, నివర్తకము అని రెండు విధాలుగా ఉంటాయి. వచ్చి మరల వెళ్లేది నివర్తకమని, విశేషాయమని, వ్యయం చేయబడి మరల వచ్చేది ఆవర్తక వ్యయమని విశేషవ్యయమని పిలువబడుతాయి. అంగులము, హస్తము మొద॥ వాటితో కొలువబడేది మానమని, త్రాస్సుత్ర చూపబడేది ఉన్మానమని, శేరు మొద॥ పాత్రలతో కొలిచేది పరిమాణమని, ఒకటి రెండు ఆదిగా లెక్కించేది సంఖ్య అనీ వ్యవహరింపబడుతాయి. రాజపత్రాన్ని రాజు చూచి, ముద్రవేసిన తరువాత విడుదల చేయాలి. అంతకు
శుక్రనీతినార ప్రసరము 23 ముందు దాన్ని మంత్రి, ప్రాడ్వివాకుడు, పండితుడు, దూత చదివి యీ పత్రము నాకు సమ్మతమే అని వ్రాయాలి. సుమంత్రుడు, ప్రధానుడు, ప్రతినిధి యువరాజు, పురోహితుడు వీరందరు తమ ఆమోదాన్ని తెలియజేయవలెను. వీరందరు తమ తమ ముద్రలను వేయవలసి ఉంటుంది.
ఆదాయవ్యయవివరాలు వ్రాయవలసిన పద్ధతులు కూడ ఈ పుస్తకంలో వివరించ బడ్డాయి.
గుంజము, మాషము, కర్షము, పదార్ధము, ప్రస్థము, అని భారమానాలు ఉత్తరోత్తరం పదిరెట్లు అధికంగా ఉంటాయి. 5 ప్రస్థాలు ఒక ఆధకమని, 8 ఆధకాలు అర్మణమని, 20 అర్మణములు ఖారి అని ప్రమాణవాచకశబ్దా లున్నవి. ఇవి ఆయా దేశ భేదాన్ని బట్టి కొంత భఖేదంతో వాడుకలో ఉంటాయి.
అంకెలకు ఎడమవైపు వ్రాసే సంఖ్యలు పూర్వసంఖ్యకంటె పదిరెట్ల ఎక్కువ విలువను బోధిస్తాయి. ఒకటినుండి పరార్ధం వరకుండే సంఖ్యల పేర్లు వరుసగా చెప్పబడ్డాయి. అన్నిటికంటె పెద్ద సంఖ్య పరార్ధము. పరార్ధము విలువ వేయి కోట్లు ౫ కోటి = 100000000000000000 అంకె ప్రక్కన 17 సున్నాలు. బ్రహ్మ ఆయుర్దాయము రెండు పరార్థాలుగా చెప్పబడింది.
చాంద్రము, సౌరము, నావనము అని కాలమానము మూడు విధాలుగా ఉంటుంది.
కార్యమాన, కాలమాన, కార్యకాలమిత అని భృతి (ప్రతిఫలము) మూడు విధాలు. ఈ పనికి ఇంత భృతి ఇవ్వగలను అనేది కార్యమాన. ఇంతకాలం చేసిన పనికి ఇంత భృతి అనేది కాలమాన. ఇంత కాలంలో ఇంత పని చేసినచో ఇంత భృతి అని ఇచ్చినది కార్యకాలభృతి అని తెలియవలెను.
5 సంవత్సరాలు పనిచేసిన భృత్యుడు అస్వస్థుడైతే ౩ నెలలవరకు 3/4 వంతు వేతనాన్ని ఇవ్వవలెను. తరువాత కూడ వ్యాధితో ఉంటే మిగిలిన కాలానికి 4వ భాగం వేతనం ఇవ్వదగును.
నలభై సంవత్సరాలు విధి నిర్వహణ చేసిన భృత్యునికి తరువాత అర్ధవేతనంతో విశ్రాంతి నీయవలెను. సేవలో ఉన్నప్పుడు భృత్యునికి సంవత్సరానికి వేతనంలో ఎనిమిదో భాగం పారితోషికం (80౧69)గా ఇవ్వాలి. సేవాకాలంలో భృత్యుడు మరణిస్తే
24 శుక్రనీతిసార ప్రసరము అతని కుమారుడు యుక్తవయస్సు డయ్యేవరకు తండ్రివేతనాన్ని పూర్తిగా అతని కివ్వ వలెను. ఉపకారాన్ని స్మరించని, మంచిసేవను గుర్తించని, ప్రసంగవశంలో తనను స్మరించని, అనుమానించేవానిని, వ్యర్ధప్రసంగాలు చేయువానిని, కోపముతో తీక్షణముగా మాట్లాడువానిని, తన ప్రభువును సేవకుడు విడిచి వెళ్లవలెను. యువరాజాదుల లక్షణాలు, కర్తవ్యాలు, ఇతర ముఖ్యాంశాలు ఈ విధంగా ద్వితీయాధ్యాయంలో ప్రతిపాదించబడ్డాయి. తృతీయాధ్యాయం దీనిలో మొత్తం 312 శ్లోకాలున్నవి. ధర్మము సుఖహేతువని, అందరు మానవులు సుఖముకొరకే ప్రవర్తిస్తారని, అందువలన జనులు ధర్మపరులు కావాలని ప్రారంభించి అధ్యాయం కొనసాగుతుంది. ధర్మ, అర్ధ, కామాలను పరస్పరవిరోధం కలుగకుండా సేవించవలెను. హింస, దొంగతనము, అధర్మ్శ్మకామము, చాడీలు చెప్పటం, కటువుగా మాట్లాడటం, అసత్య భాషణం, విరుద్ధభాషణం, అవినయము, విషమదృష్టి, నియమఖిన్నప్రవర్తన అను పది పాపకర్శలుగా గుర్తించి, మనోవాక్కాయములతో వాటిని విడిచిపెట్టవలెను. తగిన సమయంలో మితంగా, హితమైనది మాట్లాడవలెను. సమన్వయం కలిగి మృదువైన మాట పలుకవలెను. ముందుగా తానే పలకరించి, దయతో ప్రవర్తించ వలెను. ఒంటరిగా సుఖాన్ని అనుభవించరాదు. ఇంద్రియాలను అతిగా పీడించకూడదు; వాటిని ఎక్కువ లాలన కూడ చేయ కూడదు. శక్తిమంతాలైన ఇంద్రియాలు మనస్సును మథిస్తాయి. కనుక వశంత్రః ఉంచుకోవాలి. క్రూరుడు, నపుంసకుడు, దండించే స్వభావం కలవాడు, ఎక్కువగా దూర ప్రయాణాల్లో గడిపేవాడు, మిక్కిలి పేదవాడు, రోగపీడితుడు, ఇతరప్తీ సంపర్మవ్వు కలవాడు అగు భర్తయందు విరక్తి కలిగి స్త్రీ ఇతరపురుషుణ్ణి ఆశ్రయిస్తుంది. అందువలన పై దుర్గుణాలను తొలగించుకొని తమ స్త్రీలను కాపాడుకొనవలెను. సూర్యాస్తయసమయంలో భోజనం, స్తీసమాగమం, నిద్రించటం, చదవటం, ఆలోచించటం, మద్యాన్ని అమ్మటం, సిద్ధం చేయటం, దానమివ్వటం, తీసుకోవటం అనే పనులు చేయకూడదు.
శుక్రనీతిసార ప్రసరము 25
నిప్పు పెట్టేవాడు, విషం ఆహారంలో పెట్టేవాడు, ఆయుధం ధరించి ఉన్మత్తుడుగా తిరిగేవాడు, ఇతరుల ధనాన్ని పొలాన్ని, భార్యను అపహరించేవాడు - ఈ ఆరుగురు ఆతతాయులని గుర్తించవలెను.
తనవారితో విరోధము పెట్టుకోవద్దు. బలవంతునితో పోటీపడవద్దు. స్రీలతో, పిల్లలతో, వృద్ధులతో, మూర్భులతో వివాదపడవద్దు. "
ఒక్కడు రుచికరపదార్థాలను తినకూడదు. ముఖ్యమైన విషయాలను ఒక్కడే ఆలోచింపకూడదు. దారిలో ఒంటరిగా ప్రయాణించవద్దు. అందరూ ని[ద్రించగా ఒక్కడు మేల్కొని ఉండవద్దు. అతినిద్ర, కునికిపాటు, భయము, కోపము, సోమరితనము, చిన్నపనిని ఎక్కువ సేపు చేయటం అనే ఆరుదోషాలను అఖభివద్ధిని కోరేవాడు విడిచి పెట్టాలి.
భార్యాభర్తల వివాదంలో సాక్ష్యం చెప్పకూడదు. తండ్రి కొడుకుల వివాదంలో కూడ సాక్షి కాకూడదు. తన ఆలోచనలను, పనులను అవి ఫలించేవరకు రహస్యంగా ఉంచుకోవాలి.
సేవకుడు, సోదరుడు, కొడుకు, భార్య కూడ చేయలేని పనిని మిత్రుడు సందేహించ కుండా చేయగలడు.
విద్యతో, పరాక్రమంతో, ధనంతో, గొప్ప వంశముతో, బలముతో మదించి అహంకారి కాకూడదు.
అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు, చెప్పిన సాక్ష్యాన్ని మరల మార్చకూడదు. ఏదైన గొప్ప కార్యాన్ని సాధించేటప్పుడు, ప్రాణసంకటస్థితిలో అబద్ధ మాడవచ్చును.
భార్యాభర్తలకు, తంద్రికొడుకులకు, సోదరులకు, ప్రభుసేవకులకు, అక్మచెల్లెళ్లకు, మిత్రులకు, గురుశిష్యులకు పరస్పరంభేదం కలిగించకూడదు.
నియతసమయంలో హితము, మితము అయిన ఆహార విహారాలను మనుష్యుడు పాటించాలి. యజ్ఞశేషాన్నాన్ని భుజించాలి. దైన్యము చూపకుండా, సుఖనిద్ర కలవాడై, ఎల్లప్పుడు త్రికరణములతో పరిశుద్ధుడుగా ఉండవలెను. రాత్రియందు మొదటి, చివరి జాములను వదిలి మధ్యకాలంలో నిద్రించవలెను. తన భార్యతో విహారము జరుపాలి, వేశ్యలతో కాదు. స్త్రీకి లొంగినవాడు, అప్పులు చేసేవాడు, దరిద్రుడు, యాచించేవాడు, గుణహీనుడు, ప్రయోజనం లేనివాడు అనే ఆరుగురు జీవన్మ్ఫృతు లనబడుతారు.
26 శుక్రనీతిసార ప్రసరము ఆయుస్సు, ధనము, ఇంటిలోని కలతలు, మంత్రము, స్రీసంగమము, బెషధ మర్మము, చేసిన దానము, గౌరవము, అవమానము అనే తొమ్మిదింటిని రహస్యంగా ఉంచదగును. అనేకశాస్తాల అధ్యయనం చేయటం అవసరము. పండితుల సహవాసం చేయటంవలన (ఢుతిస్మృతిపురాణాదుల జ్ఞానము, వివేకబుద్ధి కలుగుతుంది. మూర్చుని ప్రభుత్వంలో పనిచేయుట కంటె మహాత్ములకు దాస్యం చేయటాన్ని కోరుకోవాలి. వేట, జూదము, ప్రీసంగము, మద్యపానము అనేవి నాలుగు వ్యసనాలు. వీటిని అభ్యాసంగా కాక అవసరమైనప్పుడు సందర్భానుసారం మితంగా ఉపయోగించాలి. గురువులముందు, రాజు ఎదుట ఉన్నతాసనంపై కూర్చోవద్దు. కాలుపై కాలు వేసుకొని కూర్చోకూడదు. వారి మాటలను హేతుపూర్వకంగా ఖండించతగదు. పదహారు సంవత్సరాలు దాటిన కొడుకును, పన్నెండు సంవత్సరాలు దాటిన కూతురును కొట్టకూడదు. కోడలు మొద! వారిని పరుషవాక్యాలతో బాధించకూడదు. వయస్సు, విద్య, అందము కల యోగ్యుడైన వ్యక్తి ధనహీనుడైనా కన్యకు భర్తగా స్వీకరించవలెను. కేవలం అందము, ధనము, వయస్సు చూసి స్వీకరించరాదు. కన్య వరుని రూపాన్ని ఆమె తల్లి అతని సంపదను, తండ్రి విద్యను, బంధువులు వంశాన్ని ఇతరజనులు రుచికరమైన వివాహ భోజనాన్ని కోరుకుంటారు. మంచి చదువుతో, మంచిసేవలతో, పరాక్రమముతో, వ్యవసాయముతో, వడ్డీ వ్యాపారముతో, వర్తకముతో, సంగీతాదికళలతో, దానస్వీకారముతో, ఏదో ఒక దాన్సి నవలంబించి ధనవంతుడు కావలెను. ధనవంతుని ద్వారంవద్ద గుణవంత్త్సుల్తు సేవకులవలె పడిఉంటారు. ధనవంతుని దోషాలు కూడ గుణాలుగా, నిర్ధనుని గుజాల్సు దోషాలుగా భావింపబడుతాయి. వ్యవహారం చేసేవారికి వ్రాతపత్రం కంటె మించిన ప్రమాణం లేదు. పండితుడైనవాడు లిఖితపత్రం లేకుండా వ్యవహారం జరుపవద్దు. ఆహారవిషయంలో, వ్యవహారంలో కూడ లజ్జను విడిచినవాడు సుఖపడుతాడు. ఎవరి స్నేహాన్ని మనం కోరుతామో, అతని నుండి ధనసహాయాన్ని కోరకూడదు. పరోక్షంలో అతని అంతఃపురానికి వెళ్లటం, అతని భార్యతో మాట్లాడటం, 'అతని
శుక్రనీతిసార ప్రసరము ౭7 తప్పులను పరిశీలించటం, అతనితో ప్రతివాదం చేయటం, అతని పనులలో సహాయపడక పోవటం, అతనికి హాని నుపేక్షించటం అనేవి చేయకూడదు.
ఎవరితోనైనా ద్వేషాన్ని లేదా స్నేహాన్ని చేసేటప్పుడు బాగా ఆలోచించి చేయవలెను. శత్రువుకు ఉపకారము, మిత్రుని కపకారము చేయకూడదు.
నేను అందరి కంటె గొప్పవాడను, నాజ్ఞానం చాలా గొప్పది అని తెలివికలవాడు భావించకూడదు.
మనిషికి అలంకారాలు కాని, రాజ్యము కాని, పొరుషము కాని, విద్యాధనములు కాన్సి సౌజన్యభూషణముతో సమానంగా శోభను కలిగించవు.
కొండెములు చెప్పటం, తీక్ష్ణస్వభావం, దొంగతనము, అసూయ, మిక్కిలి దురాశ, అబద్ధాలాడటం, ఇతరుల పనులను చెడగొట్టడం, సోమరితనము అనే దోషాలు, గుణవంతునిలో ఇతరగుణాలున్నప్పటికి వాటిని కప్పివేసి అతనిని దోషిగా నిలబెట్టుతాయి.
మూర్చుడైన కుమారుడు లేదా కూతురు, కోపస్వభావురాలైన భార్య, బీదతనము, నీచులను సేవించుట, అప్పుల పాలగుట అనే ఆరు దుఃఖకారకాలని తెలియాలి.
దుష్టులు ఇతరుల కుపదేశించటానికి సాధువులవలె మారుతారు. తమకొరకు మాత్రం వందలకొలది చెడుకార్యాలను చేస్తారు.
తల్లిదండ్రుల ఆజ్ఞను పాలిస్తూ, వారి సేవలో బద్ధకించక, నీడవలె ఎల్లప్పుడు అనుసరించి ఉంటూ, ధనసంపాదనకొరకు ప్రయత్నిస్తూ, అన్నివిద్యలందు నేర్చరిగా ఉండేవాడు. తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగిస్తాడు. దీనికి భిన్నమైన లక్షణాలు కలవాడు దుఃఖదాయకు దవుతాడు.
భర్తయం దెల్లప్పుడు అనురాగము కలదై, ఇంటి పనులయందు నేర్చరియై, మంచి స్వభావము కలిగి, పుత్రసంతానము కలిగిన భార్య భర్తకు ప్రీతిపాత్రురా లవుతుంది.
తెలివి కల కార్యసాధకుడు ఏదైన పని చేసేముందు ఆ పని ఎటువంటిది? దానికి ఉపాయా లేవి? దాని కెంత ఖర్చు అవుతుంది? దాని ఫలిత మెటువంటిది? అనే విషయాలను బాగా ఆలోచించి చేస్తాడు.
తపస్సు, ప్రీ వ్యవసాయము, సేవ, దేనినైనా అనుభవించుట, భోజనము అనే విషయాల్లో తనకు బదులుగా మరొకరిని ప్రతినిధిగా పంపకూడదు.
28 శుక్రనీతిసార ప్రసరము
క్షతియధర్మము తమోగుణ మధికంగా కలది, బ్రాహ్మణత్వము సత్త్వగుణ ప్రాబల్యం కలది, తక్కినవి రజోగుణబాహుళ్యం కలవి. వాటిలో సత్త్వగుణప్రాబల్యము డ్రేస్టమైనది.
రాజసేవ చేయకుండా అధికధనసంపాదన జరుగదు. రాజసేవ చాలా కష్టతర మైనది. అది కత్తి అంచుపైన నడక వంటిది. బుద్ధిమంతులు తప్ప ఇతరు లాపని చేయలేరు.
మొదట పేదవాడుగా ఉండి, తరువాత ధనవంతుడు కావటం మంచిది. మొదట కాలినడక కలవాటుపడి పిమ్మట వాహనసంచారం మంచిది. ఇది సుఖాన్ని కల్పిస్తుంది.
ఏనుగులు, గుజ్టాలు, ఎద్దులు, పిల్లలు, స్రీలు, చిలుకలు తమకు శిక్షణ నిచ్చిన వారి గుణాల ననుసరించి అటువంటివిగా మారుతాయి.
మంచి భార్య, చక్కని సంతానము, మంచి విద్య, ధనము, స్నేహితుడు, మంచి పరిచారకులు, చక్కని శరీరము, మంచి ఇల్లు, మంచి రాజు అనేవి గృహస్థులకు సుఖాన్ని కలిగించేవి అవుతాయి.
దూరప్రయాణం చేసే బాటసారి తోడుగా ఒకరిని వెంట తీసుకొని వెళ్లాలి. నీటి వసతి, మంచి త్రోవ, నిర్భయత్వం కల గ్రామంలో రాత్రి విశ్రమించాలి. కేవలం దారిలో కాని, అడవిలో కాని విశ్రమించకూడదు.
ఎక్కువగా సంచారము, ఉపవాసా లెక్కువ చేయటం, అధిక స్తీ సంగమము, అతిగా పరిశ్రమ చేయటం ఇవి నాలుగు తొందరగా ముసలితనం రావటానికి కారణాలు.
పొగడ్తవలన దేవతలే స్వాధీన మవుతా రనగా, మనుష్యుల సంగతి చెప్పవలసిన దేమి? తనలోని చెడుగుణాలను తానే విమర్శించుకోవలెను.
సత్పురుషుడు, తనకు పరులు చేసిన కొంచెం ఉపకారాన్ని గూడ గొప్పదిగా భావిస్తాడు. దుర్దనుడు, ఎంత ఉపకారం ఒకరు చేసినా ఆవగింజకంటె తక్కువగా తలుస్తాడు.
వాది ప్రతివాదుల అభిప్రాయము యథార్థముగా తనకు తెలిసినప్పటికి, రాజు కాని, న్యాయాధికారి కాని అడుగనిదే చెప్పరాదు. చెప్పినందువలన ఓడినవానికి శత్రువు అవుతాడు.
శుక్రనీతిసార ప్రసరము 29
పరాధీనతకు మించిన దుఃఖము కాని, స్వాతంత్ర్యాన్ని మించిన సుఖం కాని లేవు. ప్రవాసం చేయకుండా తన ఇంట్లో స్వతంత్రంగా జీవించేవాడు సుఖజీవనం
వ్యవహారాలలో కాలక్రమంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అవన్నీ చెప్పటం సాధ్యం కాదు. వ్యవహారవేత్తల ఉపదేశాన్ని బట్టి వాటిని తెలుసుకోవలసి ఉంటుంది.
తృతీయాధ్యాయంలో రాజుకు, రాజ్యానికి సంబంధించి చెప్పబడిన ముఖ్యాంశాలు పేర్కొనబడ్డాయి.
చతుర్ధాధ్యాయం
(గ్రంథంలో ఈ అధ్యాయం పరిమాణంలో చాలా పెద్దది. తక్కిన నాలుగధ్యాయాల శ్లోకసంఖ్య మొత్తానికి ఇంచుమించు సమానంగా దీనిలో ఉన్నాయి. దీనిని ఏడు ప్రకరణాలుగా విభజించటం జరిగింది.
మొదటి ప్రకరణములో తెల్పిన ముఖ్యాంశా లీ విధంగా ఉన్నాయి. (దీనిని మిశ్ర ప్రకరణమని గ్రంథకర్త పేర్కొన్నాడు).
లోకంలో ఉపకారం వలన మిత్రులు, అపకారం వలన శత్రువులు ఏర్పడుతారు. వీరిద్దరు కూడ నాల్గు భేదాలు కలిగి ఉంటారు. 1. కర్త 2. కారయిత 8. అంగీకరించిన వాడు 4. సహాయము చేసేవాడు అని ఆ నలుగురి పేర్లు.
తన మిత్రుని దుఃఖముతో మనసు ద్రవించేవాడు, అతడు కోరకుండానే అతని కిష్టమైన పనిలో సాయం చేసేవాడు, గౌరవంగా చూచేవాడు, అతని భార్యకు, ధనానికి, రహస్యాలకు అవసరమైనప్పుడు రక్షణ చేసేవాడు ఉత్తమమిత్రు డనబడుతాడు.
ఒక వస్తువు మీద తమ తమ అధికారాన్ని స్థాపించుకోవాలని కోరేవారికి, ఇతరుల కిష్టమైనదాన్ని నష్టపరచే స్వభావం కలవారికి వైర మేర్చడుతుంది. అది కలిగిన వారే శత్రువులని చెప్పబడుతారు.
రాజులకు సహజమిత్రు లెవ్వరూ ఉండరు. కార్యవశాన శత్రువులు, మిత్రులు ఏర్పడుతుంటారు. అట్టి వారిని కృత్రిమమిత్రులు, కృషప్రిమశత్రువులు అంటారు.
లోకంలో సామాన్యజనులకు విద్య, పరాక్రమము, సమర్థత, శరీరబలము, ధైర్యము అనే అయిదు సహజమిత్రులు. క్రూరుడు, అప్పులు చేసిన తండ్రి, వ్యభిచారిణి
30 శుక్రనీతిసార ప్రసరము అయిన తల్లి, తన తండ్రి సోదరులు, వారి భార్యాపుత్రులు, అత్తకోడంద్లు, సవతులు, ఆడపడుచులు, తోడికోడళ్లు శత్రువు లవుతారు. పాములకు పాలు త్రాగించటం విషాన్ని పెంచటాని కైనట్లు, మూర్చులకు మంచిని బోధించటం కోపానికే కారణ మవుతుంది. రాజుకు, తనకు నలువైపుల ప్రక్క రాజ్యపురాజు శత్రువు, అతని తరువాతిరాజు ఉదాసీనుడు, ఆతరువాతిరాజు మిత్రు డనబడుతాడు. తన మిత్రుడు, ఉదాసీనుడు, శత్రువు అయిన రాజు తనకంటె బలవంతుడు కాకుండా, అన్ని ఉపాయాలతో రాజు ప్రయత్నించవలెను. మొదట సామోపాయాల్ని, తరువాత దానాన్ని ఆ పిమ్మట భేదోపాయాన్ని ఎదుటి పక్షం వారిపై ప్రయోగించాలి. అవన్నీ విఫలమైనప్పుడు ప్రాణసంకటస్థితిలో దండో పాయాన్ని ప్రయోగించాలి. రాజువలన దండనభయంతో (ప్రజలు ధర్మం తప్పకుండా ప్రవర్తిస్తారు. గురువు కూడ గర్వితుడై, కార్యాకార్యవివేకము లేక అధర్మమార్గంలో సంచరించి నట్లయితే అతనిని కూడ దండించటం రాజు కర్తవ్యము. దుష్టులను శిక్షించటం కూడ అహింసే అవుతుంది. దండింపవలనిన వాణ్సి దండించకపోవడం, దండనకు తగని వారిని దండించటం, అధిక దండన అనే వాటి వలన రాజు పాతకిగా గుణవంతులచే విడువబడుతాడు. రాజు ధర్మప్రవర్తన కలవాడైతే ప్రజలు కూడ ఆవిధంగా ఉంటారు. అధర్మపరుడైతే ప్రజలు కూడ అటువంటివారే కాగలరు. కాయికము, మానసికము, వాచికము, సంసర్గజము అని అపరాధాలు నాలుగు విధాలు. వీటిలో ఒక్కొక్కటి బుద్ధిక్సతము, అబుద్ధిక్సృతము అని మరల రెండేసి రకాలు. అపరాధులను వారి గుణాలు, ధనము, కులము అనే వాటి ఆధారంగా ఉత్తమ, మధ్యమ, అధమ్రేణులుగా విభజించి, దానికి తగినట్లు దండనవిధానం చెప్పబడింది. ఎంత ఘోరపాపం చేసినా, యావజ్జీవశిక్షనైనా విధించవచ్చుకాని, మరణశిక్ష ఎవరికి కూడ వేయరాదు. మద్యపాయి, దొంగ, జారుడు, వర్జాశ్రమాచారపరిత్యాగి, లంచాలు తీసుకునేవాడు, మోసపు వైద్యుడు, కులట మొదలగు చాలమందిని పేర్మొని, అటువంటివారిని ప్రభువు రాజ్యంనుండి వెళ్లగొట్టవలెను అని చెప్పబడింది.
శుక్రనీతిసార ప్రసరము 31
తల్లిదండ్రులను, భార్యను వదలి స్వేచ్చగా తిరిగేవాణ్ణి సంకెళ్ళతో బంధించి, దారులను బాగుచేసే పనిలో నియమించాలి. పనికి సగం ప్రతిఫలం మాత్రం ఇవ్వదగును. ఒక వేయి నాణెముల దండన ఉత్తమ సాహస దండము అనబడుతుంది. రాజుచిహ్నంతో ముద్రితమైన పదిమాషాల బరువుగల రాగిపైస పణ మనబడుతుంది. దానినే కార్నాపణమని కూడ అంటారు.
రెండవ ప్రకరణము
ఒక వర్షానికి చెందిన వస్తువుల సమూహాన్ని కోశమని అంటారు. అది అనేక విధాలుగా ఉంటుంది.
సైన్యాన్ని ప్రజలను కాపాడటానికి రాజుకు కోశము అవసరము. యజ్ఞముల కొరకు గూడ ధన మవసరము. ఆ కోశము ఇహపరలోకములలో సుఖాన్నిస్తుంది.
నీతిమార్గాన్ని విడిచి, ప్రజలను పీడించి ధనసంపాదన చేసినట్లయితే ఆ రాజ్యము, ధనముతో కూడ శత్రువశ మవుతుంది. సంకటసమయాల్లో తప్ప ప్రజలపైన పన్నుల భారాన్ని వేయవద్దు.
ఇరవై సంవత్సరాల వరకు రాజ్యపాలనవ్యవహారాలకు సరిపడేటంత ధనాన్ని కోశాగారంలోఎప్పటికీ నిల్వచేయాలి. సైన్యము, రాజ్యము, ధనాగారాము ఈ మూడు పరస్పరాధారంతో రక్షింపబడుతాయి.
తోటమాలి పనికిరాని మొక్కలను తొలగించి, అవసరమైన వాటిని పెంచుతాడు. అట్లే రాజు శత్రువులను జయించి, వారి నుండి కప్పం గ్రహించి తన కోశాన్ని పెంచుకోవాలి. మూడు సంవత్సరాలకు సరిపడే ధాన్యపు నిల్వలను సేకరించి, అవసర సమయాల్లో ప్రజలకు, తనకు ఉపయోగించుకోవాలి.
ఓషధులు, ధాతువులు, తృణకావ్థాదులు, యంత్రతంత్రములు, ఆయుధాలు, (ప్రేలుడు మందు చూర్ణము మొద॥ అవసరములైన వన్నీ సేకరించి నిలువ చేయవలెను.
ధనం సంపాదించటం మాత్రం తెలిసి, దానిని కాపాడుకోవటం తెలియనివాడు పరమమూర్భుడు. అతని సంపాదన, శ్రమ నిరర్ధకము.
ఒక బాధ్యతకు ఇద్దరిని అధికారులుగా నియమించటం, జీవించి ఉన్న ఇద్దరు భార్యలు కలిగి ఉండటం, ఇతరులను అతిగా నమ్మటం, అధికధనాశ, వ్రీలచే జయింపబడటం, చోరజారాదుల విషయంలో సాక్ష్యం చెప్పు మని అడగటం మూర్ధ లక్షణాలు.
92 శుక్రనీతిసార ప్రసరము వజ్రము, ముత్యము, పగడము, గోమేదికము, ఇంద్రనీలము, వైడూర్యము, పుష్యరాగము, మరకతము, మాణిక్యము అని తొమ్మిది మహారత్నాల పేర్లు. మాణిక్యం ఎరుపుతో, ముత్యాలు పసుపు, తెలుపు, ఎరుపు, నలుపు రంగులతో, పగడము పసుపు-ఎరుపు రంగులతో, మరకతము నెమలి పురిరంగుతో, పుష్యరాగము బంగారుకాంతితో, వజము తెల్లని కాంతితో, ఇంద్రనీలము నలుపురంగుతో, గోమేదికము లేత పసుపు-ఎరుపు రంగుతో, వైడూర్యము పిల్లి కన్నులవంటి రంగుతోను ఉంటాయి. అన్ని రత్నములలో వజ్రము థ్రేష్టమైనది. రత్నముల లక్షణాలు, రత్నప్రరీక్షా విధానము కూడ వివరింపబడింది ఈ ప్రకరణములో. ఆ యా రత్నాలకు వెలకట్టే విధానం వివరించబడింది. రత్నాలలో సహజదోషా లుంటాయి కనుక, ధాతువులలో కృత్రిమా లున్నందున వాటిని బాగుగా పరీక్షించి స్వీకరించవలెను. బంగారము, వెండి, రాగి, తగరము, సీసము, సత్తు, ఇనుము అనే ఏడు లోహాలు. ఇతరములన్నీ సంకరాలు. బంగారము అన్ని లోహాలలో శ్రేష్టము. తగరం
- రాగి మేలనం వల్ల కంచు, రాగి - సత్తుల మేలనంతో ఇత్తడి యేర్చడుతుంది. మంచికొమ్ములు, రంగు కలది, సులభంగా పాలిచ్చేది, ఎక్కువ పాల నిచ్చేది, చక్కని దూడకలది, పడుచుది అయిన ఆవుకు ఎక్కువ వెల లభిస్తుంది. ఒక పగటి ప్రయాణంలో నూరు యోజనాల దూరం ప్రయాణం చేయగల గుజ్జము శ్రేష్టము. ఆ యా పశువుల, వస్తువుల వెలలు దేశకాలాలను బట్టి, నాణ్యతను బట్టి మారుతుంటాయి. లోకవ్యవహారాన్ని బట్టి గ్రహించాలి. అన్ని వస్తువులపైన ఒక్కసారి మాత్రమే పన్ను విధించాలి. వస్తువు ధరలో ఇరవయ్యవ భాగం కాని, ముప్ఫై రెందో భాగం కాని సందర్భాన్ని బట్టి పన్ను (గ్రహించాలి. చెరువులు, బావుల కాలువల ద్వారా పండించే వ్యవసాయ ఫలంమీద మూడవ భాగము, వర్షాధారంగా పండే పంటలకు నాలుగవ భాగము, నదీ జలంతో పండించే పంటలకు సగభాగము రాజు శుల్మంగా [గ్రహించవచ్చును.
శుక్రనీతిసార ప్రసరము కం!
ఇంటి అవసరాలకు వాడుకునే పాలమీద పన్ను వేయకూడదు.
వర్తకుల, వడ్డీవ్యాపారులనుండి వారి లాభంలో 32వ భాగాన్ని పన్నుగా స్వీకరించాలి.
తృతీయప్రకరణము
దీన్ని రాష్ట్రప్రకరణ మని పేర్మొన్నారు.
రాష్ట్రశబ్దానికి అర్ధంగా స్థావరాలైన వృక్షాలు, పర్వతాలు, భూమి; జంగమాలైన మనుష్యులు, జంతువులు (గ్రహింపబడుతాయి.
రాజు ఆచరణను బట్టి ప్రజలు నడచుకుంటారు. అందువలన ప్రజల పాప పుణ్యాలఫలాన్ని రాజు కూడ అనుభవిస్తాడు. ప్రభువు స్వయంగా ధర్మపరుడై, ప్రజలను ఆ మార్గంలో నడిపించవలెను.
పూర్వము బ్రహ్మ కర్మభఖేదాన్ని బట్టి నాలుగు వర్థాలు వర్చరచినాడు. ఆ జాతుల అనులోమ, విలోమ సంకరత్వాలనుబట్టి అనంతజాతిశాఖ లేర్చడ్డాయి.
జరాయుజము, అండజము, స్వేదజము, ఉద్భిజ్జ్ఞము అని ప్రాణులు నాలుగు రకాలు. మనుష్యులు, పశువులు జరాయుజాలు. పక్షులు, బల్లులు మొద॥ అండజాలు. పేలు, క్రిములు, స్వేదజాలు. చెట్లు, తీగలు ఉద్భిజ్ఞాలని గ్రహించాలి. యజ్ఞాలు, అధ్యయనము, దానము, యాగాలు చేయించటం, విద్య బోధించటం, దానస్వీకారం బ్రాహ్మణధర్మాలు.
దుష్టనిగ్రహము, సాధురక్షణ, పన్నులు స్వీకరించటం క్షత్రియధర్మాలు. వ్యవసాయం, పశుపాలన, వర్తకము వైశ్యధర్మాలు. దానం చేయటం, ఉద్యోగము శూద్రధర్మాలు.
విద్యలు, కళలు అనంతాలు. వాటిని లెక్కించటం సాధ్యం కాదు. అయినా ముఖ్యంగా 82 విద్యలని, 64 కళలని పండితులు పేర్కొన్నారు.
వాక్కుద్వారా నెరవేర్చటానికి వీలయ్యేది విద్య అని, నోటితో సంబంధం లేకుండా మూగవాడు కూడ చేయగలిగేది కళ అని సామాన్యలక్షణము.
బుగ్యజుస్సామాధర్వణాలనే' నాలుగు వేదాలు, ఆయుర్వేదము-ధనుర్వేదము
- గాంధర్వవేదము-తంటత్రవిద్య అనే నాలుగు ఉపవేదాలు, శిక్ష-వ్యాకరణము-కల్పము -నిరుక్తము-జ్యోతిషము-ఛందస్సు అనే ఆరు వేదాంగాలు మొత్తం కలిపి పదునాలుగు విద్యలని చెప్పబడ్డాయి.
34 శుక్రనీతిసార ప్రసరము మీమాంస, తర్మము, సాంఖ్యము, వేదాంతము, యోగము, ఇతిహాసాలు, పురాణాలు, స్మృతులు, నాస్తికమతము, అర్థశాస్త్రము, కామశాస్త్రము, శిల్పవిద్య, అలంకారశాస్త్రము, కావ్యములు, దేశభాషలు, అవసరోచితవచనము, యవనమతము, దేశప్రచలితధర్మము అనేవి కలిపి మొత్తం ముప్పది రెండు విద్యలు అనే పేరు కలవి. ఈ విద్యలయొక్క స్వరూపము, లక్షణము సంగ్రహంగా కొన్ని శ్లోకాలలో వివరించబడింది. కళలకు వేరువేరుగా పేర్లు, లక్షణాలు స్పష్టంగా చెప్పటం సాధ్యం కాదు. వాటి యొక్క పనులను బట్టి ఆ యా కళలకు పేర్లు భేదాలు వర్చడుతాయి. గాంధర్వవేదంలో ఏడు కళలు పేర్కొనబడ్డాయి.
- నృత్యకళ 2. వాద్యకళ 8. వస్తాలంకార సంధానము 4. రూపప్రకాశనము
- శయ్యాలంకరణ, పుష్పమాలాగ్రథనము 6. ద్యూతాదిమనోరంజనము 7. వివిధ రతి భంగిమల పరిజ్ఞానము. ఆయుర్వేదంలో పేర్కొనబడిన పది కళలు :-
- మద్యాది సంధానము 2. శల్యనిష్కాసన, వ్రణశస్రచికిత్స 3. పాకకళ
- వృక్షములు నాటటం, అంటు పెట్టటం, వాటిరక్షణ 5. శిలలు, ధాతువులను భస్మం చేయటం 6. చెరకుతో బెల్లం, పంచదార సిద్ధం చేయటం 7. లోహాల, మూలికల సమ్మేళనక్రియ 8. లోహసాంకర్యాన్నుండి వేరుచేయటం. 9. ధాతువుల అపూర్వ సమ్మిశ్రణం 10. ఓషధుల, వనస్పతులనుండి క్షారాన్ని తొలగించటం. ధనుర్వేదంలో ప్రతిపాదించబడ్ద అయిదు కళలు :-
- పాదవిన్యాసభేదాలతో లక్ష్యాన్ని భేదించటం 2. మల్లయుద్ధనైపుణ్యము త. గురిని చూచి అస్త్రాలను ప్రయోగించటం 4. వాద్యసంకేతాలద్వారా వ్యూహరచన
- గజ, అశ్వ, రథ, గమనాన్ని బట్టి యుద్ధం చేయగల నేర్పు. ఇప్పటికి 22 కళలను పేర్కొనటం జరిగింది. ఇంకా ఆసనాలు, ముద్రలు ప్రదర్శించటం, సారథ్యము, గజాదులకు గతిఖేదాలు నేర్పటం మొద॥ తక్కిన కళలను గూర్చి మొత్తం అరువది నాల్గు కళలు తెలుపబడ్డాయి. వాటిలో చిత్రలేఖనం, ప్రతిమా నిర్మాణం, గృహనిర్మాణం, బట్టల నేత, రంగులు వేయటం, లిపిజ్ఞానం వంటివి చేరి ఉన్నాయి. ఏ కళయందు అభిరుచి కలవారు దానినే బాగుగా అభ్యాసము చేసి నైపుణ్యాన్ని సంపాదించవచ్చును.
శుక్రనీతిసార ప్రసరము 35 చతుర్ధప్రకరణము
దీనికి లోకధర్మనిరూపణ మని సంజ్ఞ చెప్పబడింది.
(బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్నాసి అనే నాలుగు ఆశ్రమఖేదాలు బ్రాహ్మణునికి నిత్యంగా వర్తిస్తాయి. క్షత్రియ, వైశ్య, శూద్రులకు సంన్యాసము తప్ప మిగిలిన మూడు ఆచరింపదగినవి.
విద్యార్థి బ్రహ్మచారిగాను, గృహస్థుడు తక్కిన ఆశ్రమాల వారికి పోషకుడుగాను, వానప్రస్థుడు ఇంద్రియనిగ్రహంతో, సన్వ్వాసి మోక్షసాధకుడు గాను ప్రవర్తించాలి. శూద్రులకు జప, తపః, తీర్ధయాత్రా సన్యాసాలకు అధికారము లేదు. స్త్రీలు భర్తతో కలిసి ధర్మాచరణమే కాని స్వతంత్రంగా చేయరాదు.
తరువాత గృహిణి దినచర్య వర్ణించబడింది. సంగీతముతో, మంచి మాటలతో, 'స్నేహపూర్వకసరస సంభాషణలతో భర్తను వశపరచుకోవలెను.
భర్త మరణించినచో సహగమనము కాని, విధవావ్రతపాలన కాని చేయవలెను. అలంకారాలు వదలి, దేవతాపూజ చేస్తూ కాలం గడపాలి.
శూద్రులు వేదమంత్రాలు, స్వాహాకారాదులు లేకుండా ధర్మకార్యాలు చేయ వచ్చును.
సంకరజాతులలో కూడ 'బ్రాహ్మణాదివర్జాలు ఒక వైపు, యవనజాతికి చెందినవారు మరొకవైపు చేరుతారు. భారతదేశపు వాయవ్యభాగాన నివసించేవారు యవనులు అని చెప్పబడుతారు.
విశ్వామిత్రుడు, వసిష్టుడు, మతంగుడు, నారదాదులు తమ తపోవిశేషంచేత (ఢ్రేష్టత్వాన్ని పొందినారు కాని పుట్టుకతో కాదు.
స్వర్ణకారులు దొంగలకు సహాయకులుగా ఉంటారు. అందువలన వారిని గ్రామం బయట ఉంచి పర్యవేక్షించాలి. మద్యశాలను గ్రామానికి వెలుపల ఉంచి, పగలు. ఎవరు కూడ మద్యపానం చేయకుండా చూడాలి.
గ్రామంలో వృక్షాలను పెంచవలెను.
బావులు, చెరువులు మొద॥ జలాశయాలను ప్రజలకు సౌకర్యంగా ఏర్పాటు చేయాలి. నదులకు వంతెనలు, దేవమందిరాలు, విద్యాలయాలు నిర్మించవలెను.
(గ్రామం మధ్యలోకాని, నాలుగుదారుల కూడలిలో కాని విష్ణు, శివాది దేవాలయాలను కట్టించాలి.
36 శుక్రనీతిసార ప్రసరము ఇక్కడ మేరు, మందరాది మందిరభేదాలు పదహారిటి పేర్లు, వాటి లక్షణాలు ప్రతిపాదింపబడినాయి. తరువాత ప్రతిమయొక్క ప్రాముఖ్యం చెప్పి, సైకతి, పెష్టి లేఖ్య, లేష్య, మృణ్మయి, వార్ని శిలాధాతునిర్మిత భేదాలతో ఎనిమిది ప్రతిమలు వర్ణించబడ్డాయి. తరువాత వి[గ్రహాల నిర్మాణపు కొలతలు వివరించబడ్డాయి. సాత్త్వికి, రాజసి, తామసి అని ప్రతిమలు మూడు విధాలుగా ఉంటాయి. విష్ణువు ప్రతిమ సాత్తికరూపంలోను, బ్రహ్మ, ఇంద్రాదులవి రాజసంగాను, శివప్రతిమ తామస రూపంగాను ఉంటుంది. ప్రతిమల శిరస్సుమొదలుకొని పాదాలపర్యంతము అవ యవాల పరిమాణాలు వివరంగా చెప్పబడినవి. దేవాలయపు వైశాల్యాన్ని కొలతలను బట్టి అందులో ప్రతిష్టించే విగ్రహాల పరిమాణం ఉండటం అవసరము. లోహప్రతిమ అన్ని విగ్రహాలలో శ్రేషఘ్రమము. దేవప్రతిమకు ఎదురుగా మండపంలో వాహనాలను ఉంచాలి. గరుడవాహనము రెండు చేతులు కలిగి, మంచి ముక్కు కన్నులు రెక్కలు కలిగి, కిరీటము కవచాంగదములు కలిగి ఉండవలెను. అట్లే సింహ, నంది వాహనాదులు వాటి స్వరూపానికి తగినట్లుగా, అలంకృతాలై స్థాపింపబడవలెను. వినాయకప్రతిమను మనిషి ఆకారంలో, ఏనుగు ముఖంతో, పెద్దపొట్టతో, తొండముతో, కొలతల ప్రకారం నిర్మించాలి. మెడ, చేతులు, చెవులు, పాదాలు మొద॥ అవయవాల పరిమాణం ఎంత ఉండదగునో విపులంగా ప్రతిపాదించబడింది. తరువాత స్తీ మూర్తుల ప్రతిమలయొక్క అవయవ పరిమాణాలు చెప్పబడ్డాయి. (స్త్రీమూర్తి ప్రతిమ. మొత్తము ఏడుతాలముల పరిమాణంతో నిర్మించాలి. పిడికిలి పరిమాణంలో నాలుగోవంతు అంగుళమని, 12 అంగుళాల పరిమాణాన్ని తాలమని (గ్రహించాలి. బాల, తరుణ రూపంలో మాత్రమే ప్రతిమలను నిర్మించదగును కాని వృద్ధ రూప ప్రతిమలను నిర్మించకూడదు. రాజు తన రాజ్యంలో పైన పేర్కొన్న దేవతావిగ్రహాలను మందిరాల్లో ప్రతిష్టించి, ప్రతిసంవత్సరం ఉత్సవాలను నిర్వహించవలెను. సరియైన పరిమాణం లేని, విరిగిపోయిన విగ్రహాలను ఆలయాల్లో ఉంచకూడదు. శిథిల మందిరాలను, ప్రతిమలను పునరుద్ధరించాలి. ప్రజలు పరంపరాగతంగా ఆచరిస్తున్న దేవతల ఉత్సవాలను ప్రభువు
శుక్రనీతిసార ప్రసరము 37 ఆచరించి, వారి సంతోషంతో తాను ఆనందాన్ని పొందవలెను. వారి దుఃఖము తన దుఃఖముగా భావించాలి. పంచమ ప్రకరణము
దీనిలో రాజధర్మాలు నిరూపించబడ్డాయి.
వ్యవహారాలను పరిశీలించి, దుష్టులను నిగ్రహించటం రాజు ముఖ్యకర్తవ్యము. దానివలన ప్రజలు తన వశంలో ఉంటారు. జనులను పాపాచరణనుండి తొలగించ టమే దుష్టనిగ్రహ మనబడుతుంది.
ప్రభువు ధర్మశాస్తా న్ననుసరించి, కోపాన్ని లోభాన్ని విడిచిపెట్టి, మంత్రి పురోహితులతో, ధర్మాధికారితో, సావధానబుద్ధితో వ్యవహారాలను పరిశీలించవలెను.
వాది ప్రతివాదుల వ్యవహారాన్ని ఒంటరిగా విచారించరాదు. సభ్యులు, ధర్మాధికారి కూడ ఆ విధంగా చేయదగదు.
పక్షపాతప్రవృత్తికి అయిదు కారణాలుంటాయి.
- రాగము 2. లోభము 3. భయము 4. ద్వేషము, 5. వాది ప్రతివాదుల మాటను ఏకాంతంలో వినటం.
సుఖభోగాల్లో మునిగి పౌరకార్యాలను చేయని రాజు నరకంలో పడతాడు. సభాసదుల లక్షణము :-
వ్యవహారము బాగా తెలిసినవారు, బుద్ధిమంతులు, మంచి శీలము, గుణాలు కలవారు, శత్రుమిత్రలయందు సమభావం కలవారు, నిజం మాట్లాడేవారు, ధర్మజ్ఞులు, సోమరులు కానివారు, కోపాన్ని కామాన్ని జయించిన వారు, ప్రియముగా మాట్లాడే వారు సభాసదులుగా రాజుచేత నియమింపదగినవారు.
మునులు, యోగులు, ఐంద్రజాలికుల వివాదాలను రాజు స్వయంగా విచారింపక, వేదజ్ఞులైన పండితులతో విచారింప జేయాలి.
ధర్మసభలో ఏడుగురు, ఐదుగురు లేదా ముగ్గురు సభ్యులు లోకమును, వేద శాస్త్రాలను తెలిసినవారు క్షూర్చుండగా అది యజ్ఞమువంటి సభామందిర మవుతుంది.
ఒక శాస్త్రాన్ని మాత్రం చదివినవాడు వ్యవహారనిర్ణయం చేయలేడు. అందువలన అనేకశాస్తాలు చదివినవాణ్ణి వ్యవహారనిర్ణయం చేయటానికి నియమించదగును. అతడు చెప్పినది ధర్మముగా స్వీకరించాలి.
38 శుక్రనీతిసార ప్రసరము
రాజు, నియమిత సభ్యులు, ధర్మశాస్త్రము, గణకుడు, లేఖకుడు, బంగారము, అగ్ని నీరు, ధనము, కర్మచారి అనే పది రాజుకు వ్యవహారనిర్ణయంలో ఉపకరణాలని చెప్పబడింది. రాజు ఈ పది ఉపకరణాలతో వ్యవహారాలలో న్యాయనిర్ణయం జరిపినప్పుడు ఆ సభ యజ్ఞసమాన మవుతుంది. పది సాధనాలకు తమ తమ ఉపయోగాలు ప్రత్యేకంగా ఉంటాయి.
పూర్వంనుండి వాడుకలో ఉన్న దేశ, జాతి, కుల ధర్మా లేవైతే ఉన్నాయో వాటిని రాజు అట్లే పాటించవలెను. లేని పక్షంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. దాక్షిణాత్యులు మేనమామ కూతురిని వివాహం చేసుకుంటారు. మధ్యదేశంలో శిల్పులు, కార్మికులు గోమాంసాన్ని భక్షిస్తారు. ఉత్తరదేశంలో అందరూ మత్స్యభక్షకులుగా, స్రీలు వ్యభిచారపరులుగా, మద్యపానం చేసేవారుగా ఉంటారు. రజస్వలాస్త్రీని అస్పృశ్యగా చూడరు. ఇవి ఆ యా దేశ, జాతి ధర్మాలుగా స్వీకరించాలి.
కలియుగంలో పరస్త్రీ, ధనవాంఛకలవారు, మద్యపానపరులు, అల్పజ్ఞానంతో గర్వించేవారు, తంత్రకర్మపరులు, వేదధర్మానికి విముఖులు అయినవారిని ప్రభువు శిక్షించాలి.
రాజు సభలో స్వయంగా న్యాయార్ధిని, అతని విజ్ఞప్తిని గూర్చి ప్రశ్నించాలి. రాజు లేని సమయంలో ్రాడ్వివాకుడు ప్రశ్నించవచ్చును. వాది ప్రతివాదులను విచారించటంవలన ప్రాట్ అని, తరువాత గంభీరంగా ఆలోచించటం వలన వివాకుడని, ప్రాట్+వివాకుడు = ప్రాడ్వివాకుడు అని చెప్పబడినాడు.
రాగ, లోభ, క్రోధాలకు వశులై రాజు కాని, ధర్మాధికారి కాని ఎవరినీ పీడించ కూడదు.
మార్గభంగకారి, జలాశయ మలినకారి, ప్రాకారలంఘకుడు మొదలుగా 50 మంది అపరాధులుగా పేర్మానబడినారు. ఇవి సాధారణదోషాలు. ఇవి కాక పది మహాదోషాలు ఈ విధంగా 'ప్రతిపాదింపబడ్డాయి.
1 రాజాజ్ఞ నుల్లంఘించటం 2. స్త్రీహత్య 3. వర్ణసాంకర్యము 4. పరస్త్రీగమనము 6. కఠినంగా మాట్లాడటం 6. దొంగతనము 7. భర్త లేకుండా గర్భధారణ 8. పలుక కూడని మాట లాడటం 9. కఠినంగా దండించటం 10. గర్భవిచ్చిత్తి.
ఈ అపరాధం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.
శుక్రనీతిసార ప్రసరము 39
ఇవి కాక మరాక 22 విధాల దోషాలను కూడ రాజు గమనించి వాటికి దండన విధించాలని వాటి పేర్లు తెలుపబడినవి.
ఆవేదనపత్రస్వరూపము, దానిలోని భాష, పూర్వపక్షము అనే విషయాలు, దాని ఆధారంగా వ్యవహారవిమర్శ చేయాలని చెప్పబడింది.
ఎవరిపై దోషారోపణ చేయబడిందో, అతనినే న్యాయసభకు పిలిపించాలి.
రోగగ్రస్తులు, పిల్లలు, వృద్ధులు, సంకటంలో ఉన్నవారు, కార్యనిమగ్ను లైనవారు, సమయానికి రాలేనివారు, వ్యసనపరులు, రాజకార్యంలో లేదా ఉత్సవాల్లో నిమగ్నులు, పానమత్తులు, పిచ్చివారు, సావధానంగా లేనివారు, దుఃఖంతో ఉన్నవారు అయిన భృత్యులను, అపరాధులను రప్పించుటకు పంపకూడదు.
అనాథయువతిని, కులీనస్తీని, బాలెంతరాలిని, బ్రాహ్మణకన్యను, యజమాని జాడ తెలియని ప్రీని ధర్మసభకు పిలిపించరాదు. వారివద్దకే వెళ్లి విచారణ జరపాలి.
మరికొంతమంది న్యాయస్నానానికి - రప్పించదగని వారిని కూడ పేర్కొనటం జరిగింది.
వ్యవహారపరిజ్ఞానం లేని, ఇతరకార్యాలలో నిమగ్బుడైన వాది కాని, ప్రతివాది కాని తమబదులు వాదించటానికి ప్రతినిధిని (వకీలు) నియమించుకోవచ్చును. ఆ ప్రతినిధి చేసిన దంతయు వారు చేసినదిగానే భావించవలెను.
వ్యవహారం ప్రారంభించిన తరువాత వాదిప్రతివాదులలో ఎవరైనా మరణిస్తే, వారి పుత్రుడు వ్యవహారాన్ని కొనసాగించవచ్చును.
హత్య, దొంగతనము, పరభార్యాసంపర్మము, అభక్ష్యభక్షణము, కన్యాహరణము, రాజద్రోహము, వంచన, పరుషదండము అనే అపరాధాల్లో ప్రతినిధిని నియమించ రాదు. వాదిప్రతివాదుల వాదనలో ఉండే లోపాలు కొన్ని వివరించబడినవి. పిలిచి నప్పుడు రాకున్నా వచ్చి కూడ సమాధానాలు చెప్పకున్నా ప్రతివాది దండనీయు దడవుతాడు.
పూర్వపక్షము, ఉత్తరపక్షము, క్రియ, నిర్ణయము అని వ్యవహారానికి నాలుగు పాదాలు. వాది పూర్వపక్షము చేయగా, ప్రతివాది ఉత్తరపక్షము చెప్పుతాడు. వాటికి తగిన సాక్ష్యాధారాలు, వాదవివాదాలు క్రియ అనబడుతుంది. ధర్మాధికారి ఇచ్చే తీర్చు నిర్ణయమనే చివరి పాదము.
40 శుక్రనీతిసార ప్రసరము ప్రమాణరూపమైన సాధనం రెండు విధాలు. 1. మానుషము 2. దైవికము. లిఖితపత్రాదులు, స్వాధీనంలో ఉండటం, సాక్ష్యము అనేవి మానుష (ప్రమాణాలు. తులాదండము మొద॥ దైవప్రమాణమని, దీనినే భవ్యమని కూడ అంటారు. వాది ప్రతివాదుల ఎదుటనే ప్రమాణాలను చూపించవలెను. అబద్ధపు సాక్ష్యం చెప్పినవాణ్ణి, సాక్ష్యాన్ని లోపింప జేసేవాణ్సి వ్యవహార ప్రాధాన్యాన్నిబట్టి దండించాలి.
లిఖితపత్రాలలో రాజకీయపత్రమని, లౌకికపత్రమని ముఖ్యంగా రెండు భేదాలు. మళ్లీ వాటిలో అనేక అవాంతరభేదాలున్నాయి. వాటి స్వరూపం ఈ ప్రకరణంలో చెప్పబడింది.
సాక్షి లక్షణము, సాక్షులలో గల భేదాలు కూడ ఇక్కడ ప్రతిపాదింపబడ్డాయి.
పిల్లలు, స్త్రీలు, బంధువులు, కపటవర్తనులు, శత్రువు, అతనిపై ఆధారపడిన సేవకాదులు సాక్ష్యానికి పనికిరారు.
పది సంవత్సరాల కాలము తన సొత్తు ఇతరుల అనుభవంలో ఉండగా, ఎటువంటి అభ్యంతరము చెప్పక, వ్యవహారము నడుపకుండా చూస్తూ ఊరుకున్నట్ల యితే అత డా వస్తువుపై తిరిగి అధికారాన్ని పొందజాలడు. అదే విధంగా తన భూమి ఇరవై సంవత్సరాలు పరుల స్వాధీనంలో ఉంటే సమర్భుడై కూడ ఎటువంటి అభ్యంతరము తెలుపకుండా ఉదాసీనంగా ఉంటే రాజు కూడ అతని కా భూమిని ఇప్పించజాలడు.
పై మూడు మానుషసాధనాలు లభించనప్పుడు మరొక మూడు పద్ధతులు చెప్పబడ్డాయి.
- ప్రేరణా ప్రతికాలము 2. యుక్తిలేశము 3. శపథము మాటిమాటికి (ప్రేరేపించినప్పటికి వాదియొక్క మాటకు ప్రతివాదినుండి వ్యతిరేకంగా ఎటువంటి సమాధానం లభించకపోవటాన్ని ప్రేరణాప్రతికాల మని అంటారు. ఇది మరియు యుక్తులు కూడ పని చేయనప్పుడు మూడవదైన శపథాన్ని ప్రమాణంగా స్వీకరించాలి. దీన్నే దివ్యమని కూడ వ్యవహరిస్తారు.
ఇది అనేకవిధాలుగా ఉంటుంది.
శుక్రనీతిసార ప్రసరము 4
అగ్ని విషము, త్రాసు, నీరు, బియ్యము, ధర్మాధర్మాలు, ఒట్టుపెట్టుట అనే వాటితో దివ్యప్రమాణాలు చెప్పబడ్డాయి. వీటిలో పూర్వపూర్వము 'ప్రబలము. అనగా ఒట్టునుండి అగ్నివరకు ఒకదానికంటె మరొకటి ప్రబలమని భావము. ఇక్కడ దివ్య శపథం చేయించే పద్ధతులు క్రమంగా తెలుపబడ్డాయి.
పరదారగమనంలోను, పొందదగని ప్రీతో సంపర్మము చేసినప్పుడు, బ్రహ్మ హత్యాది మహాపాతకాల విషయంలో మాత్రమే దివ్యశపథాన్ని చేయించదగును. ఇతర వ్యవహారాలలో పనికిరాదు. వాటిలో కూడ మానుషమైన సాధనాలు లభ్యం కానప్పుడు దివ్యాన్ని ప్రయోగించవచ్చును.
వివాహము, ఉత్సవాలు, జూదము అనే వాటిలో వివాదము కలిగినప్పుడు ప్రత్యక్షసాక్షులే అక్కడ సాధనంగా గ్రహించాలి. దివ్యము, లిఖితము అక్కడ పనికి రాదు.
ద్వారాలు, మార్గాలు, స్వాధీనంలో ఉండే అంశాలు, నీటి పారుదల వంటి విషయాలలో స్వాధీనత అనేదే ప్రమాణంగా స్వీకరించవలెను. సాక్షులు, దివ్యము ముఖ్యం కాదు.
నిర్ణయాలు ఆరు విధాలుగా జరుగుతవి.
- ప్రమాణాలతో 2. హేతువులతో 3. ప్రవర్తన తీరుతో 4 శపథముతో 5. రాజాజ్ఞతో 6. వాది అంగీకారముతో.
లిఖితాధారము, సాక్ష్యము, స్వాధీనత, దివ్యశపథము అవకాశము లేనిచోట రాజునిర్ణయమే [ప్రామాణికము.
ప్రభువు అధర్మమార్గంలో ప్రవర్తిస్తున్నప్పుడు సభాసదులు ఉపేక్షించకూడదు.
తప్పుడు వ్యాజ్యము పెట్టిన వారిని కఠినంగా శిక్షించవలెను.
ఇంటి యజమాని తన ఆస్తిని పంచేటప్పుడు, భార్యకు, కొడుకులకు, తనకు సమానభాగాలుగా విభజించవలెను. తన భాగంలో సగం కుమార్తెకు ఇవ్వదగును. యజమాని మరణానంతరమే ఇది వర్తించవలెను.
కొడుకు తమకు లభించిన భాగంలో నాలుగోవంతు తల్లికి, అందులో సగము సోదరికి ఇచ్చి మిగిలినది తాము అనుభవించవలెను.
ఆస్తికి ఉత్తరాధికారుల క్రమం ఈ విధంగా ఉంటుంది. 1. కొడుకు 2. మనుమడు
42 శుక్రనీతిసార ప్రసరము 8. భార్య 4 కూతురు 5. దౌహిద్రుడు 6. తల్లి 7. తండ్రి 8. సోదరుడు 9. అతని కొడుకు.
వీరిలో పూర్వులు లేనప్పుడే తరువాతి వారి కధికారం లభిస్తుంది.
తండ్రి, తాతలనుండి సంక్రమించినది కాక అన్నదమ్ములు తమ కృషితో స్వతంత్రంగా సంపాదించుకున్న దానిపైన ఎవరిదానిపై వారికే హాక్కుంటుంది. అది పంచుకోదగినది కాదు. కృత్రిమవస్తువులను అమ్మిన, వ్యాపారంలో వంచన చేసిన వర్తకుణ్ణి దొంగవలె కఠినంగా శిక్షించవలెను.
షష్టప్రకరణము (దుర్గనిరూపణము)
కందకాలు, ముళ్లతీగెలు, శిలలతో ప్రవేశించటానికి శక్యము కాకుండా ఉండే దుర్గము ఐరిణమని వ్యవహరిస్తారు.
ఏ కోటకు నాలుగువైపుల లోతైన కందక ముంటుందో అది పారిఖదుర్గము. ఇటుకలతో, రాళ్లతో, మట్టితో ఎత్తైన ప్రాకారము చుట్టూ నిర్మింపబడినది పారిఘ దుర్గము. అట్లే వనదుర్గము, ధన్వదుర్గము, జలదుర్గము, గిరిదుర్గము, సైన్యదుర్గము, సహాయదుర్గము అని దుర్గభేదాలు కలవు. అన్ని దుర్దాలలో సైన్యదుర్గము ప్రబల తమమని తెలియవలెను.
దుర్గంలోపల ఉండి సాయుధుదైన ఒక్కడు వందమందితో పోరాడగలడ్ష, వందమంది పదివేల మందితో పోరాడగలరు. అందువలన దుర్గా న్నాశయిం. చటం మంచిది.
ఆహారవస్తుసామగగి, వీరులైన సైనికులు, ఆయుధాలు, ధనాగారపుష్టి స్వళ్వ్య కులయిన బంధుమిత్రులు కలిగిఉన్న దుర్గమే అన్నివిధముల శ్రేష్టమైనది.
మిత్రరాజుల పరస్పరానుకూలత విజయాన్ని కలిగించుతుంది. (ఇది-14 శ్లోకాల చిన్న ప్రకరణము).
సప్తమ ప్రకరణము. (సేనానిరూపణము) శస్త్రములు, అస్త్రములు సహాయముగా గల మనుష్యాదులకు సేన అని పేరు.
స్వగమ, అన్యగమ అని సైన్యం రెండు రకాలు. ఆ రెండింటిలో మరల దైవీ,
ఆసురీ, మానవీ అని మూడేసి విభాగాలున్నాయి. తనంతట తాను నడిచివెళ్లేది స్వగమ అని, వాహనాదుల సహాయంతో వెళ్లేది
శుగక్రనీతిసార ప్రసరము త అన్యగమ అని తెలియదగును. కాల్బలము (పదాతి) స్వగమ అని, రథ, గజ, అశ్వాలతో ప్రయాణించేది అన్యగమ అని చెప్పబడుతాయి.
సైన్యము లేకుంటే రాజ్యము, సంపద, పరాక్రమము స్థిరంగా ఉండవు. బలవంతునికి అందరు వశమవుతారు.
అశ్వబలం కంటె నాలుగురెట్ల సంఖ్యలో పదాతిబలము, అశ్వసైనికులలో అయిదవభాగం ఎద్దులు, ఎనిమిదవ భాగం ఒంటెలు, అశ్వబలంలో నాలుగవ వంతు ఏనుగులు, గజసంఖ్యలో సగం రథాలు, రథసంఖ్యకు రెట్టింపు బృహన్నా లికలు (తోవులు) ఉండవలెను.
భద్రము, మంద్రము, మృగము, మిశ్రము అని ఏనుగులలో నాలుగు జాతి భేదా లున్నాయి.
పెద్ద కనుబొమలు, చెక్కిళ్లు, నొసలు కలిగి, శీఘ్రగమనము గల ఏనుగు అన్నిటిలో శ్రేష్టముయినది.
అశ్వాల కొలతలకు అయిదు యవగింజల పరిమాణం అంగుళంగా లెక్కించ బడుతుంది. నలభై అంగుళాల ముఖపరిమాణం కల అశ్వము ఉత్తమోత్తమము. ముప్పదిఆరు అంగుళాల ముఖపరిమాణం కలది ఉత్తమమని, ముప్పదిరెం డంగుళాల ముఖం కలది మధ్యమమని, ఇరవై ఎనిమిది అంగుళాల ముఖం కల అశ్వము అధమమని తెలియవలెను.
ఇక్కడ అశ్వాల వివిధావయవాల పరిమాణాలు, సుడులు, మచ్చలు మొద॥ కొన్ని లక్షణాలు విపులంగా చెప్పబడ్డాయి.
గుజ్టానికి చెక్కిళ్ల మీద రెండు సుడులు ఉన్నట్లయితే అవి దాని యజమానికి క్తీర్తిన, రాజ్యాభివృద్ధిని పొందిస్తాయి. చెంపమీద ఒక్కసుడి ఉంటే అది అనర్గాన్ని కలిగిస్తుంది. అశ్వం యొక్క మెడమీద ఒక పెద్ద సుడి ఉన్నట్లయితే అది చింతామణి పేరుకలదై కోరిన అర్థాలను, సుఖాలను ఇస్తుంది. ఇంకా ఇటువంటి చాలా విషయాలు తెలుపబడ్డాయి.
మంచి శిక్షకునితో అశ్వాలకు గమనశిక్షణ ఇప్పించవలెను. అశ్వాన్ని ఆ యా స్థానాల్లో అవసరాన్ని బట్టీ కొట్టవలెను.
1 నుండి 16 వరకు అంకెలను లెక్కపెట్టే సమయంలో ఉత్తమాశ్వము 100
ల శుక్రనీతిసార ప్రసరము ధనుస్సుల కొలతదూరం పరుగెత్తుతుంది. బుతువుల భేదాన్నిబట్టి అశ్వగతిశిక్షణ సమయంలో మార్చులు చేయవలసి ఉంటుంది. ఆహారం తినగానే, నీరు త్రాగిన వెంటనే గుట్టాన్ని ప్రయాణం చేయించటం వలన రోగాలకు కారణ మవుతుంది. యవలు, సెనగలు అశ్వాలకు మంచి ఆహారము. మినుములు అడవి పెసలు మధ్యమము. చిరుసెనగలు, పెసలు అధమము. అశ్వపు నడకలు ఆరు విధాలుగా ఉంటాయి.
- ధార 2. ఆస్కందితము 3. రేచితము 4. వ్లతము 5. ధౌరీతకము
- వల్లితము అని. అత్యంతవేగముగా వెళ్లే నడకను ధార అంటారు. ఏడు తాలపరిమాణపు ఎత్తు కల ఎద్దు, అందంగా ఉండి, మందగతి లేకుండా, బరువు మోయగలిగి ఉన్నట్లయితే అది శ్రేష్టమైనది. ఒక రోజు ముప్పది యోజనాల దూరం ప్రయాణం చేయగల, బరువు మోయగల, తొమ్మిది తాలముల ఎత్తు కల, దృఢశరీరము కల ఒంటె డ్రేస్టమైనది. ఏనుగులకు, మనుష్యులకు నూరు సంవత్సరాలు పరమాయుర్దాయము, ఇరవై సంవత్సరాల వరకు బాల్యముగా భావించవలెను. అరవై సంవత్సరాల వరకు మధ్యమ వయస్సని, తరువాత వార్ధ్థకమని లెక్కించవలెను. ఏనుగును అదుపులో ఉంచటానికి వాడిగా, వంగి ఉండే అంకుశాన్ని కృప్రత్ష్రా గించవలెను. ఎద్దులను, గుజ్జాలను నీరుండే చోటికి దగ్గరలో, ఏనుగులను, ఒంటెలను అడవిక్తి దగ్గరగాను, కాల్బలము సైనికులకు సాధారణప్రదేశంలోను వసతులు కల్పించి ఉంచదగును. పరుషమైన మాటలు, కఠినదండన, వేతనం తగ్గించటం, ఎక్కువ భయం కలిగించటం, ఎల్లప్పుడు ప్రయాజాలు చేయించటం, అధికపరిశ్రమ కల్గించటం అనే కారణాలవలన సైనికులలో ప్రభువుపట్ల వ్యతిరేకభావం కలుగుతుంది. అందు వలన తన సైన్యంలో అటువంటి భేదం కలుగకుండా చూచుకుంటూ, శత్రుసైన్యంలో అటువంటి భేదాన్ని కలిగించి తమవక్షంలోకి వారిని ఆకర్షించుకోవలెను. తనకంటె బలవంతుడైన శత్రువును ఉపచారాలతో, నమస్మారంతో వశం
శుక్రనీతిసార ప్రసరము 45 చేసుకోవలెను. కొంచెం అధికుడైన వాణ్ణి మానదానాలతో, తక్కువబలం కలవాణ్ణి యుద్ధంతో వశపరచుకోవలెను. సమానబలుణ్ణి స్నేహంతో జయించదగును.
మంత్రములతో, యంత్రాలతో, నిప్పుతో ప్రయోగింపబడేది అస్తమని, ఖడ్గము, బల్లెము మొదలైనవి శస్త్రములని పిలువబడును.
అ'స్తాలు రెండు విధాలు. మంత్రపూర్వకంగా ప్రయోగించేవి, గొట్టాలతో ప్రయోగించేవి (తుపాకులు మొద!) అని.
తుపాకి మందు సిద్ధం చేసే విధానం ఈ క్రింది విధంగా వివరించబడింది.
సువర్చలవణం అయిదు పలాలు, గంధకము ఒక పలము, జిల్లేడు-జెముడు మొక్కలను కాల్చి సిద్ధం చేసిన బొగ్గు ఒక పలము-అన్నీ కలిపి చూర్ణము చేసి, దానిని మళ్లీ జిల్లేడు, జెముడు, ఉల్లిరసాలతో కలిపి ఎండలో ఆరబెట్టవలెను. ఎండిన తరువాత పొడిగా చేసి నిలువ చేయవలెను. ఇది ఇసుక రేణువులవలె తయారైన తుపాకీ మందుగా పనికి వస్తుంది. అదే విధంగా తోపులలో ఉపయోగించే ఇనుపగుండ్ల నిర్మాణం గురించి కూడ వివరింపబడింది. బాణము, గద, అడ్డకత్తి, నిలువుకత్తి బల్లెము, శూలము, చక్రము, పాశము అనే ఆయుధాల స్వరూపము, వాటి భేదాలు తెలుపబడినవి.
యుద్ధము మూడు విధాలుగా ఉంటుంది.
- దైవికము 2. ఆసురము 8. మానుషము
మంత్రపూర్వకాలైన అస్త్రాలతో చేసే యుద్ధము దైవికమని, తోపులు తుపాకులు వంటి ఆయుధాలతో చేసేది ఆసురమని, కత్తులు మొః! ఆయుధాలతో, చేతులతో జరిపే యుద్ధము మానుషమని తెలియవలెను.
దేశకాలాలను, శత్రుబలాన్ని తనబలాన్నిి సామదానాద్యుపాయాలను, సంధి విగ్రహాది షడ్డుణాలను అన్నిటిని బాగా విచారించి యుద్దానికి పూనుకోవలెను. యుద్దానికి శరత్, హేమంత, శిశిరబుతువుల కాలము ఉత్తమము. వసంతకాలము మధ్యమము. గ్రీష్మబుతువు అధమకాలము. వర్షాకాలంలో యుద్ధం ఎప్పుడూ పనికి రాదని విజ్ఞులు చెప్పినారు.
సంధి, విగ్రహము, యానము, ఆసనము, సమాశ్రయము, ద్వైధీభావము అని మంత్రాంగము యొక్క షద్దుణములని చెప్పుదురు.
4 శుక్రనీతిసార ప్రసరము ఏ పద్ధతుల ద్వారా బలవంతుడైన శత్రువు తనకు మిత్రుడుగా చేయబడుతాడో అది సంధి అనబడుతుంది. ఏ ప్రయత్నముతో శత్రువును పీడించుట లేదా స్వాధీనం చేసుకొనుట జరుగుతుందో అది విగ్రహ మనబడుతుంది. తన అభీష్టం నెరవేరటానికి, శత్రుసంహారంకొరకు దండెత్తి వెళ్లటం యానమని, తనకు రక్షణ, శత్రునాశము జరగాలంటే తాను ఎక్కడ నిలిచి ఉండవలెనో ఆలోచించి అక్కడ ఆగుట ఆసన మని, ఎవరి ఆశయం వల్ల తాను రక్షింపబడుతాడో అటువంటి బలవంతుణ్ణి ఆశ్రయించటం ఆథశయమని, తన సైన్యాన్ని చిన్న చిన్న దళాలుగా విభజించి అక్కడక్కడ నిలుపుట ద్వైధీభావమని చెప్పబడుతుంది. ఈ ఉపాయాలను ఆయా సందర్భాలను, అవసరాలను గమనించి, మంత్రి పురోహితాదులతో ఆలోచించి ప్రయోగించవలెను. బలవంతుడైన రాజు తనపై దండెత్తినప్పుడు, దానిని తప్పించుకోవటానిక్షి ఉపాయము లేనప్పుడు సంధి చేసుకొనుట తప్ప మరొక మార్గం లేదు. క్రాన్సుక అర్చించటం లేకుండా సంధి ఉండదు. తనకు శత్రురాజుకు మధ్యగల తారతమ్యాన్ని బట్టి కానుక ఇవ్వవలసి ఉంటుంది. మిక్కిలి బలవంతునితో సంధి, సమానస్కంధునితో యుద్ధము, బలహీనునిపై దందెత్తుట, మిత్రులతో ఆశ్రయము మరియు ఆసనము అనే వాటిని ప్రయోగిం్వ వలెను. తనకంటె బలవంతునితో యుద్దానికి పూనుకోరాదు. అది నాశానిక్రి క్యా మవుతుంది. యానము (దండయాత్ర) అయిదు విధాలని పండితులు తెలిపినారు. అవ, ౩ విగృహ్యయానము 2. సంధాయయానము 8. సంభూయ యానము 4 ప్రసంగ యానము 5. ఉపేక్షాయానము. వీటి లక్షణాలు కూడ ఈ ప్రకరణంలో తెలుపబడినాయి. సైనికులను వివిధ భంగిమలలో, భిన్నాకారపంక్తులుగా నిలుపటాన్ని వ్యూహ మంటారు. మకరవ్యూహము, శ్యేనవ్యూహము, సూచీవ్యూహము, శకటవ్యూహము, వజ వ్యూహము, సర్వతోభద్రవ్యూహము, చక్రవ్యూహము, వ్యాలవ్యూహము అని వ్యూహ
శుక్రనీతిసార ప్రసరము ళా భేదాలు కలవు. ఆ యా ఆకారాలలో సైనికులను నిలుపటం జరుగుతుంది. కనుక ఆ పేర్లు సార్ధకాలు.
సైనికుల కదలికలకు, బాణాదుల ప్రయోగానికి వాద్యసంకేతాలద్వారా సూచనలు ఇవ్వవలెను.
మంచి ఉపాయాలతో, మంచి ఆలోచనతో, మంచి ప్రయత్నాలతో కార్యసిద్ధి సాధారణజనులకు కూడ కలుగుతుంది. ఇక రాజు విషయంలో చెప్పవలసిన దేమి?
ఉపాయముల మహత్త్వము చెప్పశక్యము కానిది. ఛేదింపరాని ఇనుము కూడ ఉపాయముచేత ద్రవరూపాన్ని పొందింపబడుతుంది.
సామాద్యుపాయాలలో భేదము, సంధి మొదలగు షద్గుణాలలో సమాశ్రయము రాజుకు (శ్రేష్టమైనవి.
ఆపద కలిగినప్పుడు బ్రాహ్మణుడు క్షత్రియధర్మా న్నవలబించటం దోషము కాదు.
తన ప్రభువుకొరకు ఏ శూరుడు యుద్ధరంగంలో పరాక్రమించి పోరాడునో, భయంతో వెనుదిరుగడో, అతనికి అనంతమైన స్వర్గఫలము లభిస్తుంది.
ఆతతాయి స్వభావాన్ని పొందిన (బ్రాహ్మణుడు శూద్రునితో సమానుడు. ఆతతాయిని వధించినట్లయితే హంతకునికి పాపము రాదు.
ఆయుధాలు ధరించి క్షత్రియుని వలె తనమీదికి యుద్దానికి వచ్చిన 'బ్రావ్మణునితో పోరాడి చంపితే బ్రహ్మహత్యాదోషము కలుగదు.
నమ్మకంతో తనను శరణు కోరి వచ్చిన మనిషిని కాపొడక తిప్పి పంపినచో, అతడు పదునలుగురు ఇంద్రుల కాలపర్యంతం ఘోరనరకంలో పడి మగ్గుతాడు.
మంత్రపూర్వకాస్తాలతో చేసిన యుద్ధము ఉత్తమమని, గొట్టముల ద్వారా (తోపులు, తుపాకులు) చేసినది మధ్యమమని, ఖడ్గము, శూలము వంటి ఆయుధాలతో యుద్ధము అధమమని, బాహుయుద్ధము అన్నింటికంటె తక్కువదని, విజ్ఞులు తెలిపినారు.
చాలాదూరం ప్రయాణం చేసి అలసిన, ఆకలిదప్పులతో బాధపడుతున్న, రోగము, కరువు, వడగండ్లతో పీడింపబడిన, దొంగలచే తరుమబడిన, బురదలో, నీటిలో దిగబడిన, చెదిరిపోయిన, భయపడిన, నిద్రించిన, భుజిస్తున్న కొద్దిసంఖ్యలో ఉన్న తిరుగుతున్న అగ్నిజ్వాలలలో చిక్కుకున్న వర్షంతో, గాలితో దెబ్బతిన్న తన సైనికులను ప్రభువు కాపాడవలెను.
వ! శుగక్రనీతిసార ప్రసరము గజంపై ఉన్న సైనికుడు గజస్థునితో, ఆశ్వికసైనికుడు ఆశ్వికునితో, రథికుడు రథికునితో, నేలపై నిలిచిన పదాతిబలము పదాతితోనే యుద్ధం చేయవలెను. ఒక యోధుడు ఒక్కనితో, శస్త్రధారి శస్త్రధారితో, అస్త్రము కలవాడు ఆస్రికునితో పోరాడ వలెను. యుద్ధంలో చంపదగనివారు - 1వాహనం నష్టమై నేలమీద నిలబడి ఉన్నవాడు. 2. నపుంసకుడు 8. చేతులు జోడించి శరణు కోరినవాడు 4. తలవెండ్రుకలు విరియబోసుకున్నవాడు 5. కూర్చున్న వాడు 6. నీవాడను నేను అంటున్నవాడు 7. శయనించినవాడు 8. పోరుకు సిద్ధంగా లేనివాడు 9. దిగంబరముగా ఉన్నవాడు 10. ఆయుధాలు ధరించనివాడు 11. యుద్ధము చేయదలచనివాడు 12. ఇతరుల యుద్దాన్ని చూస్తున్నవాడు 18. నీరు త్రాగుతున్నవాడు 14. ఆహారము తింటున్నవాడు 15. ఇతరకార్యములో నిమగ్నమై ఉన్నవాడు 16. భయపడినవాడు 17. రణభూమి నుండి మరలిపోయేవాడు 18. వృద్ధులు, బాలలు, స్రీలు 19. ఒంటరిగా చిక్కిన రాజు. ఈ నియమాలు ధర్మయుద్దానికి సంబంధించినవి. కపటయుద్ధంలో ఇవి పాటించ బడవు. ప్రబలుడైన శత్రువు విషయంలో కపటయుద్దాన్ని మించినది లేదు. రామకృష్ణులు, ఇంద్రుడు మొద॥ వారు పూర్వము కపటయుద్దా న్నాశయించ్చి నారు. వాలి, కాలయవనుడు, నముచి క్రమంగా పైవారిచేత కూటయుద్ధం లో చంపబడ్డారు. యుద్ధంలో ఏ సైనికుడైనా తన సామర్ధ్యంతో, పరాక్రమంతో, అసాధారణక్రార్యం జరిపినప్పుడు, అతనికి ధనరూపంలో పారితోషికం కాని, పదవిలో ఉన్నతస్థానాన్ని కాని ఇప్పించదగును. దేశ కాల, పాత్రముల ఆది మధ్యాంతాలలో ఎటువంటి ఉపాయాల మ ంత్రా లోచనతో ఎటువంటి ఫలితము కలుగుతుంది? అని విచారించిన మంత్రి ప్రభ తులు ముందుగా యువరాజుకు తెలియజేయవలెను. తరువాత యువరాజు వారితో కలస రాజుకు నివేదించవలెను. రాజు తన నిర్ణయాన్ని యువరాజుకు తెలుపగా, అతడు మంత్రులు మొద॥ వారికి తెలుపుతాడు. పురోహితుడు రాజుకు కార్యాకార్యముల గురించి వివరించవలెను. రాజు సైనికులను గ్రామాలకు దూరంగా వెలుపల ఉంచవలెను.
శుక్రనీతిసార ప్రసరము 49
నగర రక్షక భటులను (కాపలాదారులను) దినప్రమాణాన్ని ఎనిమిది, పది, పంద్రెండు భాగాలలో ఏదో ఒక విభాగం చేసి దానికి తగినట్లు ఏర్పాటు చేయవలెను. వంతుల వారీగా వారు తమ కాపలా బాధ్యతను నిర్వహిస్తారు.
రాజధర్మాలను సంపూర్ణంగా పాలించే రాజు చిన్నవాడైనా ట్రేష్టత్వాన్ని పొందుతాడు. రాజధర్మాలను రక్షించని గొప్పరాజు కూడ నీచత్వాన్ని పొందుతాడు.
పూర్వము మనువు మొదలగు స్మృతులలో ఏ ధర్మాలు ఆదరింపబడ్డాయో, వాటినే శుక్రాచార్యుడు ఇరవైరెండు వందల శ్లోకాలతో నీతిసారములో వివరించినాడు.
శుక్రనీతితో సమానమైనది ముల్లోకాలలో మరొకటి లేదు. ఏ రాజులు పిరికి తనంవల్ల కాని, ధనలోభంవలన కాని యీ నీతిని అనుసరించరో, మందభాగ్యులైన ఆ రాజులు నరకాన్ని పొందుతారు.
పంచమాధ్యాయము
ఇది చాలా చిన్న అధ్యాయము. దీనిలో 86 శ్లోకాలు మాత్ర మున్నాయి. నీతి శేషాధ్యాయమని దీన్ని పేర్ళొన్నాడు కవి.
వేళ్లు నశించిపోవటంవలన చెట్టు ఏ విధంగా కొమ్మలతో గూడ ఎండిపోతుందో, అదే విధంగా రాజు లేకపోతే సేనాపతి మొదలైనవారు వెంటనే కాని, కొంత కాలం తరువాత కాని బలహీను లవుతారు. రాజ్యమనే చెట్టుకు రాజు వేరు వంటివాడు. మంత్రులు స్కంధాలు, సేనాపతులు కొమ్మలు, సైనికులు చిగుళ్లు, ప్రజలు పూలు, భూభాగాలు పండ్పు భూమి విత్తనము అని తెలియదగును.
రాజు సేవకుల, స్త్రీల, పుత్రుల, శత్రువుల విషయంలో క్షణకాలము కూడ అజాగ్రత్తగా ఉండకూడదు. తాను జీవించి ఉండగా తన రాజ్యాధికారాన్ని సమగ్రంగా కుమారునికి అప్పగించకూడదు. తన జీవితకాలపు చరమాంకంలో పుత్రునికి రాజ్యాధి కార మప్పగించవలెను.
కొత్తగా అధికారం స్వీకరించిన రాజకుమారునితో మంత్రులు మొ॥ వారు ధనాశవలన అవినీతిమార్గంలో ప్రవర్తించకూడదు.
ఇతరుల సొత్తును అపహరించటంలో జారులు, చోరులు లోకంలో నిందింప బడుతారు. కాని వారు పరోక్షంలో ఆ పనిచేస్తారు. ధూర్తుడు మాత్రం ప్రత్యక్షంగా పరస్వాన్ని హరిస్తాడు.
50 శుక్రనీతిసార ప్రసరము ఎవరిని వంచింపకుండా, కొద్ది కాలంలో గొప్పసంపద జనులచేత సాధింప బడదు. ఇతరుల సొత్తును హరించక గొప్ప ధనవంతుడు కాజాలడు. దొంగలు, బందిపోట్లు ఇతరుల ధనా న్నపహరించటం పాప మనబడుతుంది. రాజులు పరరాజుల ధనాన్ని హరించటం పాపం కాదు. ఆశయభేదంవలన కొన్ని పొపాలు ధర్మంగా లెక్కింపబడుతాయి. ఎక్కువమందిచేత ఏది పొగడబడుతుందో, అది ధర్మమని, ఏ పని నిందింప బడుతుందో అది అధర్మమని తెలియవలెను. ధర్మతత్త్వము చాలా లోతైనది. ధర్మమార్గంలో ధనసంపాదన చేస్తూ, దేశకాలపరిస్థితులను తెలిసి ప్రవర్తించే మనిషి పూజింపదగినవాడు. శస్తాస్తాలు లేకుండా పరాక్రమము, భార్యలేకుండా గృహస్థజీవితము, ఐకమత్యం లేకుండా యుద్ధము, గ్రహించే వ్యక్తి లేకుండా ప్రదర్శించిన నేర్చు నిరుప యోగా ఇతరులను తక్కువ చేసి చూడవలె ననుకోవటం దర్చమని, నేను అందరికంటె గొప్పవాడనని తలచటం మానమని, ఖర్చుపెట్టటంలో వెనుకంజవేయటం కార్చణ్య మని, తనకు వినాశాన్ని శంకించటం భయమని, మనస్సు నిలకడగా లేకపోవటం ఉద్వేగమని వ్యవహరింపబడుతాయి. పదహారు సంవత్సరాల పాటు వేతనం లేకుండా జీవించే స్థితి కల భృత్యుడు, (ప్రభువుకు ఆపత్కాలంలో ఎనిమిది సంవత్సరాల వరకు వేతనం గ్రహించకుందా సేవ చేయవలెను. ఇతరులు తమ స్థితి ననుసరించి వీలయినంత కాలం ఆ విధంగా చేయవలెను. బీదవారైతే రాజునుండి అన్నవస్తాలు మాత్రం స్వీకరించి పని చేయవలెను, దొంగ లందరు సంఘటితంగా ఉండి, లోకానికి వినాశం కలిగించటానికి సమర్థు లయినప్పుడు, రాజు మరియు భృత్యులు ఏకచిత్తంతో సంఘటితంగా ఉండి శత్రుసంహారము ఎందుకు చేయజాలరు? లోకంలో శ్రీకృష్ణునితో సమానుదైన కూటనీతిజ్ఞుడు మరొకడు లేడు. తన చెల్లెలు సుభద్రను అర్జునునికి భార్యగా కపటమార్గముతో చేసినాడు. కార్యసిద్ధికొరకు అవలంబించే యుక్తులు రెండు విధాలు. 1. సత్యరూపము 2. కపటరూపము. ఎవడు మన విషయంలో కపటంతో టప్రవర్తిస్తాడో, వాని విషయంలో
ల పాన శర్మా
శుక్రనీతిసార ప్రసరము వూ, 51 కపటయుక్తినే అవలంబించవలెను. కాని యెడల గొప్బవా లానికి కూడ మచ్చ ఏర్పడుతుంది.
భృత్యులు ఉత్తమ, మధ్యమ, అధమ భేదంతో మూడు విధాలుగా ఉంటారు.
తన ప్రభువుపైనే గాఢమైన ఆదరం కలవాడు ఉత్తముడని, ఎక్కువ వేతనము ఇచ్చే ప్రభువుపై భక్తిని చూపేవాడు మధ్యముడని, తనరాజు ద్వారా వేతనం పొందుతూ, రహస్యంగా ఇతరరాజుల కనుకూలంగా పనిచేసేవాడు అధముడని చెప్పబడినారు.
ఒకే సమయంలో అనేకకార్యాలను ప్రారంభించటం శ్రేయస్కరము కాదు. ఆరంభించిన పనిని పూర్తి చేయక మరొకదాన్ని ప్రారంభించకూడదు.
ఈర్ష్య, లోభము, మదము, ప్రీతి, క్రోధము, భయము, సాహసము అనే ఏడు, ఏదైనా కార్యంలో ప్రవర్తించటానికి కారణాలు. ఇవే కార్యగతదోషాలని కూడ పండితులు తెల్పినారు.
(గగ్రామాధిపతులు వారి వారి శ్రేణులను బట్టి గ్రామపర్యటన జరుపవలసిన పద్ధతులు క్రమంగా వివరింపబడ్డాయి.
ప్రభువు తన రాజ్యంలోని ప్రజలకు, రాజబంధువులకు (గ్రామాల్లో, నగరాల్లో నివాసగ్భహాలకు అవసరమైన స్థలాల ఏర్పాటు చేయవలెను.
ముప్పదిరెండు హస్తాల పొడవు, పదహారు హస్తాల పరిమాణం కల స్థలము అధమమని, నలభై ఎనిమిది హస్తాల పొడవు, ఇరవైనాలుగు హస్తాల వెడల్పు కలది మధ్యమమని, అరవై నాలుగు హస్తాల పొడవు, ముప్పదిరెండు హస్తాల వెడల్పు గల ఇంటి స్థలము ఉత్తమమని చెప్పబడింది. హస్తపరిమాణ మనగా మూర పొడవు.
సైనికులు రాజధానినుండి బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు వారికయ్యే ఖర్చు సొమ్ముకు అదనంగా మూడవవంతు కలిపి ఇవ్వవలెను.
ధనవంతుడు ఎవరికైనా వడ్డీకి అప్పు ఇచ్చినప్పుడు, అసలు సొమ్ముకు నాలుగు రెట్ల డబ్బు వడ్డీ రూపంలో అతనికి అందినట్లయితే, ఆ అప్పు తీరిపోయినట్లు భావించి, బుణగ్రహీత ఇక మీద ఇవ్వవలసిన అవసరం లేదని రాజు ఆజ్ఞాపించవలెను.
ఈ విధంగా శుక్రనీతిసారములోని అయిదు అధ్యాయాలలో ప్రతిపాదించబడ్డ విషయాలలో ముఖ్యాంశాలు. సంగ్రహంగా వివరించబడినవి.
కేవలం రాజనీతివిషయాటే కాక, కుటుంబానికి, సమాజానికి సంబంధించిన
52 శుక్రనీతిసార ప్రసరము సీతివిషయాలు, కాలమానం, సంఖ్యామానం, మందిరాది నిర్మాణ పద్ధతులు మొదలగు విషయా లనేకం దీనిలో విపులంగా, సుబోధకంగా ప్రతిపాదించబడినాయి. సింహావలోకనము ఈ (గ్రంథములో చెప్పబడిన నీతివిషయాలు ్రాచీనకాలపు రాజరికవ్యవస్థ కనుకూలంగా చెప్పబడ్డాయి. కాలక్రమంలో 'ప్రభుత్వవ్యవస్థలు మారినప్పటికీ ఏ ప్రభుత్వానికైనా కొన్ని నీతిపద్ధతులు తప్పనిసరిగా అవసరమే. 'ప్రజారంజనమే రాజు యొక్క ముఖ్యలక్షణ మని చెప్పినది ప్రజాస్వామికప్రభుత్వాలకు కూడ ఉపయోగిస్తుంది. దీనిలో చెప్పబడిన చాలా విషయాలు కొద్ది మార్పులతో ఈ కాలానికి కూడ పనికివస్తాయి. పాలకునికి రాజనీతిశాస్త్రపరిజ్ఞానం అవసరమని, అతడు వ్యసనాలకు దూరంగా ఉండవలెనని చెప్పినది మనం కాదనలేము కదా! రాజధాని పట్టణము, దుర్గాల నిర్మాణము, రాజసభ, ధర్మశాలలు, రాజ మార్గముల నిర్మాణము సర్వకాలాల్లో అవసరమే, సప్త ప్రకృతులు, సామాది చతురుపాయాలు, సంధివిగ్రహాది షద్దుణాల్సు, దశ ప్రకృతులు, న్యాయసభ, ధర్మపరిషత్, చతురంగసేనాపద్ధతి ఇత్యాదులు ప్రాచీన భారతీయ రాజనీతి స్వరూపాన్ని ఈ కాలపు వారికి తేటపరుస్తాయి. గూఢచారివ్యవస్ట పురాతనకాలమునుండి ఉన్న విషయం మనం దీనిద్వారా గ్రహించగలము. రాజ్యంలోని దుష్టులను అణచివేయటం, బీదవారికి, ఆర్తులకు దానం చేయటం, ప్రజలను ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పరిపాలించటం, రాజసూయము మొదలగు యాగాలు చేయటం, న్యాయమార్గంలో కోశాగారానికి ధనాన్ని సంపా దించటం, ఇతరరాజులనుండి కప్పములు సేకరించటం, శత్రువులను సంహరించటం, తన రాజ్యానికి మరికొంత భూమిని అదనంగా సంపాదించటం అనే ఎనిమిది రాజుల ముఖ్యకర్తవ్యాలని చెప్పటం జరిగింది. వీటిలో యాగాలు చేయటం వైదికమతానికి సంబంధించినది. రాజ్యాన్ని పెంచుకోవా లనుకోవటం పూర్వకాలం అన్నిచోట్ల జరిగినదే. అలెగ్జాండరు ప్రపంచవిజయయాత్ర, బాబరు మొద॥ వారు భారతదేశంలో సామ్రాజ్యం స్థాపించటం, డచ్చి, పోర్చుగీస్, ఫెంచి, బ్రిటిషువారు మనదేశంపై, ఇంకా కొన్నిచోట్ల ఆధిపత్యం సంపాదించటం తెలియనిది కాదు. ఈ కాలంలో కూడ
శుక్రనీతిసార ప్రసరము 53 పైకి చెప్పకున్నా, రాజ్యవిస్తరణకాంక్షతో పొరుగుదేశాల భూభాగాల నాక్రమించటం జరుగుతూనే ఉన్నది. “రాజ్యం వీరభోజ్యమ్” అని అప్పటివారి అభిప్రాయం.
పైవాటిలో దుష్టనిగ్రహము, ప్రజల సంరక్షణ అనేవి ఏ రాజకీయవ్యవస్థకైనా అవసరమే. ఖజానాకు డబ్బును కూడ న్యాయమార్గంలో సంపాదించాలని చెప్పటం వలన, ప్రజలపైన పన్నులభారం మోపవద్దని, వారిని పీడించవద్దని చెప్పినట్లయినది.
రాజధాని నిర్మాణము, జలసమృద్ధి, తృణకాష్టసమృద్ధి కలిగి, సముద్ర ప్రయాణానికి వీలుగా నదీతీరంలో, పర్వతానికి సమీపంలో, వృక్షలతాదులతో కూడిన ప్రదేశంలో చేయాలని, చుట్టూ ఎత్తైన ప్రాకారము, దాని పక్కన లోతైన కందకము, మధ్యలో రాజసభాభవనము కలిగి ఉండవలెనని, విశాలరాజమారాలతో, నాలుగు దిక్కుల సింహద్వారాలతో ప్రజలకు, ప్రభువుకు సౌకర్యాలతో పాటు భద్రతను కూడ దృష్టిలో ఉంచుకొని చెప్పబడింది.
రాజభవనంలో వివిధ విభాగాలకు ఏయే గృహా లుండవలెనో ఈ విధంగా చెప్పటం జరిగింది.
- వస్తమార్దనశాల 2. స్నానశాల 8. యాగశాల 4. భోజనశాల 5. వంటశాల
- నిద్రగది 7. విహారభవనము 8. పానశాల 9. రోదనగ్భృహము 10. ధాన్యగ్భహము
- దంచటం, విసరటం కొరకు గృహం 12. పరిచారకుల వసతి 18. మలమూత్ర విసర్దనశాల 14. గోవుల, ఒంటెల, లేళ్ల, వనుగుల శాలలు 15. రథశాల 16. అశ్వ శాల 17. ఆయుధశాల 18. వ్యాయామగ్భహం 19. వస్త్రశాల 20. ద్రవ్యశాల 21. విద్యాభ్యాసశాల 22. ధర్మసభ కార్యాలయము 23. శిల్చశాల
వీటన్నింటికి వేరు వేరు దిక్కులను కూడ సూచించటం జరిగింది.
రామాయణంలో కైకేయి కోపగ్భహంలో ప్రవేశించినట్లు కనిపిస్తుంది. పారిజాతా పహరణంలో కూడ కృష్ణునిపై కోపగించిన సత్యభామ కోపగ్భహంలో చేరినట్లున్నది. పైన తెలిపిన గృహాలలో కోపగ్భహం ప్రసక్తిలేదు కాని, రోదన గృహమున్నది. కోపానికి, రోదనకు దగ్గర సంబంధమున్నది కనుక రోదనగ్భహాన్నే కోపగ్భహంగా మనం భావించవచ్చును.
మంత్రులు, అధికారులు మొదలగు ముఖ్యులకు కూడ రాజధానిలో రాజ భవనానికి కొద్దిదూరంలో భవనాలు నిర్మింపజేయాలని, వాటి కొలతలు, వివరాలు కూడ ఇవ్వబడ్డాయి.
ర్క శుక్రనీతిసార ప్రసరము (ప్రాచీనవైదిక రాజ్యవ్యవస్థలో పురోహితునిది చాల ముఖ్యస్థానము. రాజుయొక్క దశప్రకృతులలో మొదటివాడు పురోధ (పురోహితుడు). మంత్రానుష్థాన పూర్వకముగా కర్మలను నిర్వహించగలవాడు, బుగ్వేదాది వేదములను చదివినవాడు, కర్మలను శ్రద్ధతో నిర్వహించేవాడు, ఇంద్రియములను, కోపమును జయించినవాడు, లోభమోహాలు లేనివాడు, వేదాంగము లారింటిని తెలిసినవాడు, ధనుర్వేదము చదివినవాడు, ధర్మార్ధముల స్వరూప మెరిగినవాడు, నీతిశాస్త్రము, శస్తాస్తప్రయోగము తెలిసిన వ్యూాహప్రయోగకుశలుడు పురోహిత్తుడుగా ఉండదగినవాడు. రాజుకూడ అతని భయంతో ధర్మాన్ని నీతిని తప్పకుండా ప్రవర్తిసాడు. ఆయనే ఆచార్యుడని చెప్పబడ్డాడు. శపించుటకు, అనుగ్రహించటానికి కూడ సమర్థుడు. రాజకార్యనిర్వహణలో ఆయన అభిప్రాయానికి చాలా విలువ ఇవ్వబడేది. రాజు నిరంకుశంగా, స్వతంత్రంగా అన్ని నిర్ణయాలు తీసుకోకుండా, ప్రకృతులందరి అభిప్రాయం ప్రకారం పరిపాలించవలెనని మన రాజనీతిగ్రంథాలు చెప్పుతున్నాయి. ప్రభువు ఒకవేళ గుణాలను, నీతిని, సైన్యాన్ని ద్వేషించే వాడై, ధర్మమార్గానికి విరుద్ధంగా వ్రపర్తిస్తే, అతణ్ణి రాజ్యాధికారం నుండి పురోహితాది దశప్రకృతులు తొలగించవచ్చునని శుక్రనీతి చెప్పుతుంది. వ్యవహారాలకు లిఖితపత్రం చాలా ముఖ్యమైన ఆధారమని చెప్పుతూ, సమాచాగ్ర పత్రాలు, ఆదాయవ్యయపత్రాలు అని ముఖ్యంగా రెండు భేదాలు చెప్పి, జయపత్రమ్సృ, ఆజ్ఞాపత్రము, ప్రజ్ఞాపనపత్రము, విభాగపత్రము మొదలైన ఇరవైకి పైగా అవాంతర పత్రభేదాలను పేర్కొనటం జరిగింది. ఆదాయవ్యయపు లెక్కలను ఏ విధంగా వ్రాయవలెనో, విపులంగా ప్రదర్శించబడింది. దూరమానము, తులామానము, ధాన్యాదిపరిమాణము, వాటిలోని భేదాలు ఇందులో కన్పిస్తాయి. సంఖ్యామానంలో ఒకటినుండి పరార్ధం వరకు సంఖ్యల పేర్లు శుక్రనీతిలో చూడగలము. ప్రపంచంలో ఏదేశంలో కూడ ఇంత పెద్ద సంఖ్యల వరకు పేర్లు వాడుకలో లేవు. కాలమానము చాంద్ర, సౌర, సావన భేదంతో మూడు రకాలుగా పేర్కొనబడింది. ప్రధానంగా పేర్కొనదగిన మరొక అంశం కర్మచారులకు ఇవ్వవలసిన వేతనము,
శుక్రనీతిసార ప్రసరము 55 సెలవులు మొదలగు విషయాలు ప్రస్తుతకాలపు వ్యవస్థతో చాలవరకు సమానంగా తెలుపబడ్డాయి.
అతని కుటుంబపోషణకు సరిపడేటంత వేతనం భృత్యునికి ఇవ్వాలని, పగలు ఒక జాము (3గంటలు) రాత్రి మూడు జాముల కాలము అతనికి విరామ మివ్వాలని, అయిదు సంవత్సరాలు సేవచేసిన భృత్యునికి జబ్బు చేసినప్పుడు వేతనంలో 3/4 భాగము మూడు నెలల కాలం ఇవ్వవలెనని చెప్పబడింది.
సంవత్సరానికి 15 రోజుల వేతనం అదనంగా పారితోషికంగా ఇవ్వాలని కూడ సూచింపబడింది. ఇది ఇప్పటి బోనస్ వంటిది. 40 సంవత్సరాల కాలం సేవచేసిన ఉద్యోగికి విశ్రాంతినిచ్చి, తరువాత యావజ్జీవం అర్ధవేతనం (ప్రతినెల అందజేయవలెను.
ప్రభుసేవలో ఎవరైనా మరణానికి గురయితే, అతని వేతనాన్ని కుమారుడు పనిచేయదగిన వయస్సు వచ్చేవరకు సేవచేయకుండానే పూర్తిగా ఇవ్వవలెను. యుక్త వయస్సు వచ్చిన తరువాత తండ్రి ఉద్యోగం కుమారుని కివ్వవలెను.
ఈ విధంగా భృత్యులకు వేతనాది సౌకర్యాలు ఎన్నో దీనిలో చెప్పబడ్డాయి. ఇటువంటి విషయాలన్నీ మొగల్ రాజులు వచ్చిన తరువాతనో, బ్రిటిష్ పరిపాలన వచ్చిన తరువాతనో మనవారికి తెలిసినాయని, అంతకుముందు మనవారి కిటువంటి ఏర్పాట్లు లేవని మనలో చాలామంది అనుకుంటారు.
కొందరు ఆధునికులు భావించినట్లు క్రీ.శ. ఎనిమిదో శతాబ్దంలో లేదా 15వ శతాబ్దం తరువాత ఇది రచింపబడిం దనుకున్నా, అంతకుముందే మనవారి కిటువంటి పద్ధతులు అమల్లో ఉండేవని భావించక తప్పదు. అయితే ప్రజాస్వామికదేశాల్లో ఉన్నంత ఉదారంగా సౌకర్యాలు లేకపోవచ్చు.
సేవకులు తమ కర్తవ్యాన్ని సమర్థంగా, ఇతరులకంటే విశిష్టంగా చేసినప్పుడు, అటువంటి వారికి పారితోషికము, పదోన్నతి కల్పించటంవంటి సత్కారాలు కూడ చెప్పబడ్డాయి.
ప్రీల విషయంలో మాత్రం ఈ (గ్రంథం మన పూర్వికుల అభిప్రాయాలకు తగినట్లుగానే బోధిస్తుంది. ప్రీలకు పూర్తిగా స్వాతంత్ర్యం అనర్ధదాయకమని, గృహకార్య నిర్వహణ తప్ప వారికి ఇతరముల కవకాశ మీయరాదని తెలుపుతుంది. అబద్ధాలాడటం,
సాహసము, మాయలు, మూర్ధత్వము, అత్యాశ, అపవిత్రత, జాలి లేక పోవటం, గర్వము అనే ఎనిమిది స్రీలకు సహజమైన దుర్గుణాలు అని (38-162) ఒక శ్లోకంలో కన్పిస్తుంది.
56 శుక్రనీతిసార ప్రసరము కొని యీ భాపము తరువాతి కాలంలో ఏర్పడిందని, వేదవాబజ్బయంలో స్త్రీలకు గౌరవపూర్ణస్థాన ముండేదని, పై భావము దానికి విరుద్ధంగా ఉన్నదని శుక్రనీతి సారవ్యాఖ్యాత అభిప్రాయపడ్డారు. ప్రీలలో కొందరిలో కన్పించే యీ దుర్గుణాలను స్రీజాతి కంతటికీ ఆపాదించటం సమంజసం కాజాలదు. దండనవిధానం చెప్పినప్పుడు అపరాధానికి తగినట్లు దండించాలని, రాగద్వేషాలకు, పక్షపాతానికి లోనుకాకుండా శిక్షవేయాలని, అతిక్రూరదండనవల్ల ప్రజల్లో విరోధభావ మేర్పడుతుందని, సాధ్యమైనంతవరకు మరణదండనను విధించ వద్దని సూచింపబడింది. నవరత్నాలు, వాటిలో ఉండే రకాలు, రత్బపరీక్షా విధానము, వాటికి వెలకటే విధానము, ఉత్తమ, మధ్యమాది రత్నభేదాలు వివరంగా తెలుపబడ్డాయి. అట్టే బంగారము, వెండి మొదలగు లోహాల, ధాతువుల మూల్యము, వాటిలో మంచి చెడులు కూడ వివరించటం జరిగింది. వ్యవసాయభూములపై వచ్చే పంటలకు విధించవలసిన పన్నులు, నదీమాతృక దేవమాతృక భూముల పన్నులలో భేదాలు, వర్తకులనుండి తీసుకోవలసిన పను " పశువులపై పన్ను శిల్పులు మొద॥ వృత్తికారులకు విధించే పన్ను వీటన్నింటికీ రసీదు'ఇచ్చే పద్ధతి ప్రదర్శింపబడింది. బ్రాహ్మణాది వర్షాలు, నాలుగు ఆశ్రమాలు, ఆయా వర్జాలవారి ధర్మాల్సు వివరించబడ్డాయి. ఆపత్కాలంలో బ్రాహ్మణుడు వ్యవసాయవృత్తితో జీవితం గడపటం తప్పు కాదని తెలుపబడింది. విద్యలకు, కళలకు గల భేదాన్ని వివరించి, ముప్పదిరెండు విద్యలను, అరువద్ది నాలుగు కళలను పేర్శొని, సంగ్రహంగా వాటి స్వరూపం కూడ వివరించటం జరిగింది (గ్రామాలలో, నగరాలలో ప్రజల సౌకర్యంకొరకు వృక్షాలు పెంచటం, చెరువులు బావులు తవ్వించటం, తోటలు పెంచటం, రాజమార్గాలు వేయించటం, దేవమందిరాలు ధర్మశాలలు కట్టించటం రాజుల విధిగా చెప్పబడింది. మందిరాలలో రకాలు, వాటి కొలతలు, మండపాల, స్తంభాల సంఖ్య, వాటి కొలతలు, మందిరంలో ్రతిష్టించే విగ్రహాల పరిమాణాలు, ప్రతిమల భేదాలు, ఆలయద్వారాల పరిమాణం మొదలైన అనేక విషయాలను మనం దీనిలో చూడగలము. వ్యవహారవిచారణ ధర్మపరిషత్ ఏర్పాటు, దానిలో నియమించదగిన సభ్యుల
శుక్రనీతిసార ప్రసరము 57 లక్షణాలు, అపరాధపరిశీలన, విచారణవిధానము, తీవ్రఅపరాధాలు, సాధారణ అపరాధాలు, వాదిప్రతివాదుల వాదనవిధానము సూచింపబడింది. రాజు స్వయంగా తన సమక్షంలో వాదిప్రతివాదుల వాదనలను వినవలెనని, పూర్వపక్షము, ఉత్తర పక్షము మొదలైన అంశాలు చాల విపులంగా ్రస్తావించబడినాయి.
సాక్షుల స్వరూపము, సాక్షులలో భేదాలు తెలుపుతూ స్మరణశక్తి, వినికిడి శక్తి లోపించనివాడు, అనుభవశక్తి కలిగి నిజమే మాట్లాడేవాడు సాక్షిగా తగినవాదని, రెండు పక్షాలకు సమ్మతమైన ఒక్కసాక్షి అయినా వ్యవహారనిర్ణయానికి సరిపోతాడని శుక్రనీతి చెప్పుతుంది.
పిల్లలు, ప్రీలు, వంచకులు, వాదిప్రతివాదుల బంధువులు, వారి శత్రువులు, సేవకులు, డబ్బుకు సంబంధించిన ఆదానప్రదానం కలవారు, విద్యాసంబంధం కలవారు సాక్ష్యం చెప్పటానికి పనికిరారు. అనేకసాక్షులు చెప్పిన సాక్ష్యంలో విరోధ మున్నప్పుడు ఎక్కువమంది సాక్షుల అభిప్రాయాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. సాక్షి తాను సహజంగా చెప్పిన సాక్ష్యానికే విలువ ఉంటుంది. బెదిరించి బలాత్కారంగా చెప్పించిన సాక్ష్యాన్ని (గ్రహించకూడదు.
వ్యవహారాలలో లిఖితపత్రము, సాక్ష్యము, స్వాధీనత అనేవి మూడు ఆధారాలని, వాటిలో లిఖితపత్రము బలవత్తరమని చెప్పబడింది.
అగి, జల, శపథ, విష, తండులాదుల ద్వారా దివ్యప్రమాణాలు చేయించటం కూడ కొన్నిటి విషయంలో సాధనంగా చూపినారు. మండుతున్న నిప్పులపై నడవటం, కాల్చిన ఇనుపగుండును చేతిలో ధరించటం మొద॥ దివ్య ప్రమాణపు పద్ధతులు చాల కఠినంగా ఉంటాయి. ఏ యే దివ్యము ఎటువంటి వ్యవహారాల్లో చేయించవలెననే వ్యవస్థ కూడా తెలుపబడింది.
దాయభాగవిభాగంలో ఆస్తికి వారసులు కాదగిన వారి క్రమం ఈ విధంగా చెప్పినారు.
పుత్రుడు, కొడుకుకొడుకు, భార్య, కూతురు, దౌహిశ్రుడు, తల్లి, తండ్రి, సోదరుడు
- వీరు మృతుని సొత్తుకు ఉత్తరాధికారు లవుతారు. క్రమంగా విలోమక్రమంలో పూర్వపూర్వులు ప్రబలులు. తండ్రి, తన ఆస్తిని తన కుమారులకు, తనకు సమాన భాగాలుగా పంచవలెను. తనభాగంలో సగము కూతురుకు, ఆమె కుమారునికి దానిలో సగభాగము పంచవలెను, తండ్రి మరజానంతరమే పుత్రులు ఆస్తికి అధికారు లవుతారు.
58 శుక్రనీతిసార ప్రసరము
స్త్రీకి వివాహానికి ముందుగాని, తరువాతకాని, తండ్రిచేత లేదా భర్తచేత కానుకగా ఇవ్వబడినది సౌొదాయిక మనబడుతుంది. అటువంటి దాన్ని ఆమె స్వతంత్రంగా అనుభవించవచ్చును, దాన విక్రయాదులు కూడ జరుపుకొనవచ్చును. దానిపైన ఎవరికీ అధికారముండదు.
తండ్రి, తాతల పూర్వార్జితంతో సంబంధం లేకుండా అన్నదమ్ములు తమ ప్రయోజకత్వంవలన స్వంతంగా సంపాదించుకున్న భూమి, ధనము ఎవరిది వారికే చెందుతుంది. అది దాయవిభాగాని కర్ణము కాదు.
స్థల,జల, గిరి, వనదుర్గాల స్వరూపము, వాటి నిర్మాణపద్ధతులు, దుర్గ ప్రాముఖ్యము వివరించి సైన్యస్వరూపము, దానిలోని భేదాలు వర్ణించబడ్డాయి.
కాల్బలము స్వగమ అని, రథ, గజ, తురగాల మీద నడిచే సైన్యము అన్యగమ అని చెప్పబడుతుంది.
సైన్యం లేకుంటే రాజ్య ముండదు, ధన ముండదు, పరాక్రమము పనికిరాదు. లోకంలో బలవంతునికి అందరు స్వాధీను లవుతారు, బలహీనునికిి శత్రువు లేర్పడుతారు. సైన్యానికి శిక్షణ ఇప్పించి, వ్యాహరచనాదులలో నైపుణ్యం కలిగించాలి.
చతురంగబలనిరూపణ సందర్భంలో ఏనుగుల లోని భేదాలు, వాటి ఆకృత్తి లక్షణాలు, అశ్వజాతులు, వాటి శరీరంపై ఉండే సుళ్లు, మచ్చలు, వాటిఎత్తు, గమన వేగం మొదలైన విషయాలు వివరంగా వర్ణించబడినాయి.
ఆయుధాలలో అస్త, శస్త్ర భేదము తెలుపుతూ, మంత్రపూర్వకంగా, యంత్రాలత్రి అగ్నిద్వారా ప్రయోగించబడేది అస్తమని, ఖద్గము, బల్లెము, గద వంటివి శస్త్వ్సన్ల చెప్పబడింది. అస్త్రం మళ్లీ రెండు విధాలని; ఒకటి మంత్రపూర్వకంగా ప్రయోగించేది, రెండవది గొట్టముల ద్వారా ప్రయోగించే తోపులు, తుపాకులు మొద॥నవి,
పూర్వం ఆగ్నేయాస్త్రము, వారుణాస్తము వంటివి పురాణాలలో తెలుసుకున్నాము. అవి ఆ యా దేవతలను మంత్రపూర్వకంగా ఉపాసించి సాధించిన అస్త్రాలనేది ప్రసిద్ధము. శుక్రనీతిలో నాళికాస్తమనే పేరుతో తుపాకుల వంటి వాటిని కూడ అస్త్రాలుగా పేర్కొనటం విశేషము. ఈ కారణంగానే శుక్రనీతి ఇటీవలికాలంలో రచింపబడినదని కొందరు ఆధునిక విమర్శకు లభిప్రాయపడ్డారు. నందరాజ్య నిర్మూలనం చేసిన చాణక్యుని అర్థశాస్త్రంలో నాలికాస్తాల ప్రసక్తి కన్పించదు.
శుక్రనీతిసార ప్రసరము 59
శత్రురాజ్యంపై దండయాత్రకు వెళ్లినప్పుడు, సైనికులకు అధికవేతనం ఇవ్వాలని చెప్పబడింది.
వృద్ధులు, బాలురు, స్రీలు, ఒంటరిగా మిగిలిన రాజు - వీరిని యుద్ధరంగంలో చంపకూడదు. కపటయుద్ధంలో ఈ నియమం వర్తించదు. ప్రబలుడైన శత్రువును జయించటానికి కూటయుద్దాన్ని మించినది లేదు. అత్యవసరమైనప్పుడు కపట యుద్ధంతోనైనా ధర్మపాలనకొరకు శత్రువును జయించాలి.
రాజు వృద్ధాప్యంలో అశక్తుదైన స్థితిలో తన కుమారునికి రాజ్యాధికార మప్పగించాలి.
దేశ, కాల, పాత్రములనుబట్టి అనేకవిధాల యుక్తులను, నీతిని అనుసరించ వలసి ఉంటుంది.
సైనికులను గ్రామానికి, నగరానికి దూరంగా వసతి కల్పించి అక్కడ ఉంచాలి. వారు గ్రామంలో ప్రవేశించి, గ్రామీణులకు ఇబ్బంది కలిగించకూడదు. ధనవంతుల, వడ్డీవ్యాపారుల దోపిడీనుండి సాధారణప్రజలు పీడింపబడకుండా, రాజు వారిని కాపాడాలి.
ఇటువంటి ప్రజాహితానికి సంబంధించిన ఎన్నో అంశాలు శుక్రనీతిలో మనకు కన్పిస్తాయి.
క్రీ.పూ. 8,4 శతాబ్దాల కాలంలో రచింపబడ్డ కౌటిల్యుని అర్థశాస్త్రంలో శుక్రాచార్యప్రశస్తి చాలాచోట్ల కన్పిస్తుంది. ఆయన అభిప్రాయాలు కొన్నిచోట్ల పేర్కొన బడ్డాయి.
చాలా విషయాల్లో శుక్రనీతికి, అర్ధశాస్తానికి పోలిక లున్నప్పటికి భేదాలు కూడ కొన్ని ఉన్నాయి. దండప్రకరణంలో అర్ధశాస్త్రం కొన్ని కఠినదండనలను చెప్పింది.
పవిత్రక్షేత్రాలలో దొంగతనం చేసినవానికి మొదటిసారి బొటనవ్రేలు ఛేదించటం, రెండవసారి ఐదు టవ్రేళ్లను ఛేదించటం, మూడవసారి కుడిచేయి నరకటం శిక్షగా అర్ధశాస్త్రం చెప్పింది. ఇళ్లకు, కళ్లాలకు, వస్తువులకు నిప్పుపెట్టి కాల్చిన వాణ్ణి అగ్నిలో పడవేసి చంపాలి. అని ఇంకా ఇటువంటి కఠినదండనలు చాలా చెప్పబడ్డాయి. ఇవి మనకు కొంత క్రూరంగా అనిపించవచ్చును.
కాని యీనాడు ప్రపంచంలో పలుచోట్ల తీవ్రవాదం, ఉగ్రవాదం, విచ్చలవిడి
అ శుక్రనీతిసార ప్రసరము తనం పెరిగిపోవటం చూస్తుంటే తీక్షణదండన లేకపోవటం వల్లనే నేరాలు బాగా వృద్ధి చెందా యనిపిస్తుంది.
దాయవిభాగంలో కూతురికి సమానభాగం శుక్రనీతి చెప్పగా, అర్ధశాస్త్రం స్త్రీకి దాయభాగంలో హక్కులేదని చెప్పింది. “అదాయాదా భగిన్యః.
“దండనీతిరేకా విద్యేత్యాశనసాఃా దండనీతి ఒక్కటే విద్య అని బెశనసులు - అనగా శుక్రాచార్యుని నీతిశాస్తా న్ననుసరించే వారంటారు అని అర్థశాస్త్రంలో చెప్పారు. సమస్తమైన ఇతరవిద్యలు దానిమీదనే ఆధారపడినవని వారి అభిప్రాయం.
భృత్యులకు పెన్నన్, (గ్రాట్యుటీ, సెలవు సౌకర్యాలవంటి ఆధునికకాలానికి సంబంధించినవిగా తోచే కొన్ని విషయా లిందులో ఉన్నాయి. కౌటిల్యుని అర్థశాస్త్రంలో కూడ కొంచెం ఇంచుమించుగా ఇటువంటి విషయా లున్నాయి. అందువలన ఇవి ప్రాచీనులకు బొత్తిగా తెలియనివని భావించకూడదు.
గ్రామాల్సో, నగరాల్లో మొక్కలను నాటి చెట్లను పెంచాలని, “గ్రామే 'గ్రామ్యాన్వనే వన్యాన్ వృక్షాన్సంరోపయేన్నృపళ అని చెప్పి యెక్కడ యే చెట్లు పెంచాలో పేరత్రో సహ దీనిలో చెప్పబడింది. వాతావరణ సమతుల్యతకై యీనాడు చెప్పే వృక్షాల పెంపకం మన పూర్వు లెప్పుడో గుర్తించారు.
రైతులపై పన్ను వేసేటప్పుడు, ముందుగా పంటభూమిని కొలిచి, పం ట దిగుబడినిబట్టి అధిక, మధ్య, అల్ప్రేణులుగా విభజించి పన్ను నిర్ణయించాలని రైతుకు నష్టం కలుగకుండా చూడాలని తెలుపుం దీ గ్రంథం. +
“యావజ్జీవం తు వా కళ్ళిన్న కశ్చిద్వధమర్దత్రి” అని “మనిషి ఎంత పాపకర్మ చేసినా యావజ్జీవశిక్షనైనా విధించవచ్చును కాని ఎవనికీ మరణదండన విధించరాద్రు* ఈనాడు నాగరికప్రపంచం ముక్తకంఠంతో కోరుతున్న మరణశిక్ష రద్దు సూచనను శుక్రాచార్యుడు చాలాకాలం క్రిందటనే చేసిఉన్నాడు. ఇటువంటి అనేకనూతన భావాలకు స్టానమై, ఈనాటికీ ఉపాదేయాలైన పెక్కు విషయాలతో అందరిక్తీ అవశ్య పఠనీయ మీ గ్రంథము.
ఈ గ్రంథంలోని ఆణిముత్యాల వంటి కొన్ని ముఖ్యమైన శ్లోకాలను తాత్పర్యంతో సహ క్రింద ఉదాహరిస్తున్నాను.
1 న జాత్యా బ్రాహ్మణ శ్చాత్ర క్షత్రియో వైశ్య వవన న శూద్రో నచ వై మ్లేచ్చో భేదితా గుణకర్శభిః॥॥ 1-38
శుక్రనీతిసార ప్రసరము 61
“ఈ ప్రపంచంలో ఎవరు కూడ కేవలం పుట్టుకతోనే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, మ్లేచ్చుడు కాజాలడు. వారి వారి గుణకర్మలను బట్టి బ్రాహ్మణత్వాదులు ఏర్పడుతాయి”.
ఇది చాల సంచలనాత్మకమైన కథనము. భగవద్గీతలో “చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశళ” అని శ్రీకృష్ణుడు చెప్పిన దానికి ఇది సరిపోతుంది. ఆర్య సమాజ వ్యవస్థాపకుడు దయానందసరస్వతి కూడ ఇదే అభిప్రాయాన్ని ప్రచారం చేసి శూద్రాదులకు కూడ ఉపనయనాదిసంస్మారాలు జరిపినాడు.
కాని ఇది ఆచరణలో కష్టసాధ్యమైన విషయము. ప్రస్తుతము ఆచరణలో ఉన్న జన్మగతవర్ణసిద్ధాంతానికి వ్యతిరేకమైంది. 2. _వకస్యైవ హి యో£.శక్తః మనస స్సన్నిబర్దణే
మహీం సాగరపర్యంతాం స కథం హ్యవదేష్యతి. 1-99
“కేవలం తన ఒక్క మనస్సునే స్వాధీనం చేసుకోలేనివాడు సముద్రపర్యంతం వ్యాపించిన భూమిని ఏ విధంగా జయింపగలడు?”
మనోని(గ్రహము అన్నింటికంటె ముఖ్యమనేది భారతీయనంస్కృతిలో ముఖ్యభాగము. కామక్రోధాదులను జయించినప్పుదే సజ్జనుడుగా క్రీర్తింపబడుతాడు. రావణ, శిశుపాల, దుర్యోధనాదులు మనస్సును నిగ్రహించుకోలేకనే వినాశాన్ని పొందినారు. రాజ్యపాలకుడు మనస్సును అదుపులో పెట్టుకుని, రాగద్వేషాల కతీతుడై పాలించవలెను. 3. మదరక్తస్య హంసస్య కోకిలస్య శిఖండినః
హరంతి న తథా వాచో యథా వాచో విపశ్చితామ్॥! 1-169
“మదంతో మైమరచిన హంసయొక్క కోకిలయొక్క నెమలియొక్క కమ్మని కంఠస్వరము కూడ పండితులవాక్కులు వలె మనస్సు కాహ్లాదాన్ని కలిగించలేవు”.
హంసలు మొద॥ వాటి స్వరములు ఆపాతమధురంగా వినగానే మనస్సుకు సంతోషాన్ని కలిగిస్తాయి. అది మంచి ఫలమే, కాని అల్బకాలపర్యంతమే దాని ప్రభావ ముంటుంది. విద్వాంసుల వాక్కులు ఆలోచనామృతాలుగా హితాన్ని శుభాన్ని బోధించేవిగా, శాశ్వతఫలదాయకాలుగా ఉంటాయి కనుక ఇవే శ్రేషస్టములని భావము.
62 శుక్రనీతిసార ప్రసరము 4 న భేదం జనయేయు ర్వై నృనార్యోః స్వామిభృత్యయోః
ఖ్రాత్యూణాం గురుశిష్యాణాం న కుర్యుః పితృపుత్రయోః 1 1-299
“రాజ్యంలోని ప్రజలలో భార్యాభర్తలకు, యజమానికి సేవకునికి, అన్నదమ్ములకు, గురుశిష్యులకు, తండ్రి కొడుకులకు మధ్య భేదాభిప్రాయాలు కలిగించకూడదు”.
రాజు తన ప్రజలకు ఇటువంటి శాసనం చేయవలెనని చెప్పబడింది. ఒకరి మీద మరొకరికి చాడీలు చెప్పి వారిలో విరోధము కల్లించినవారిని శిక్షించవలెనని కూడ దీని భావమై యున్నది. కుటుంబకలహాలే సమాజవైరుధ్యానికి కారణం కాగలదు కనుక, కుటుంబకలహాలు రాకుండా చూడటం ప్రభవుల ధర్మము. 5. _రాజపుత్రా మదోద్ద్ధూతా గజా ఇవ నిరంకుశాః
పితరం చాపి నిఘ్నంతి భ్రాతరం త్వితరం న కిమ్ ॥ 2-2099
రాజకుమారులు అహంకారముతో ఉన్న్మత్తులై, నిరంకుశులై, అధికారంకొరకు తమ తండ్రిని కూడ చంపుతారు. ఇక ఇతరుల విషయం చెప్పవలసిన దేమున్నద్రి?”
అధికారంలో ఉన్నవారి సంతానానికి సహజంగా అహంకార ముండటం మన అనుభవంలో చూస్తున్నదే. మన దేశచరిత్రలో మధ్యయుగంలో రాజ్యాధికారంకొరక్రు సోదరులను చంపిన, తండ్రిని చెరసాలలో బంధించిన రాజులను గూర్చి చరిత్రతో చదువుకున్నాం. అధికారవాంఛ ఎంత క్రూరమైందో చాల పురాతనకాలంలోనే మన కీ గ్రంథంలో తెలుపబడింది. 6 అమంత్ర మక్షరం నాస్తి నాస్తి మూల మనౌషధమ్
అయోగ్యః పురుషో నాస్తి యోజక స్తత్ర దుర్లభః ॥ 2124
“మంత్రము కాని అక్షరము లేదు. మందు కాని మూలిక లేదు. యోగ్యుద్తు కాని పురుషుడు లేడు. వీటన్నిటినీ తగిన విధంగా సమకూర్చగలవాడే దుర్లభుడు”.
అన్ని వర్ణములు మంత్రంలో చేరదగినవే. ప్రతిమూలిక ఏదో ఒక వ్యాధికి మందుగా పనికి వచ్చేదే. అట్లే ప్రతిమనిషిలో ఏదో ఒక యోగ్యత ఉంటుంది. దానిని గుర్తించి అతనికి తగిన కార్యంలో అతణ్జి ఉపయోగిస్తే లోకాని కుపయోగపడుతాడు. అందరూ అన్ని కార్యాలకు యోగ్యులు కాకున్నాా దేని కెవరు తగుదురో, దానిని గుర్తించి ఆ విధంగా వారి నుపయోగించుకోవటం తెలివికలవారి పని.
శుక్రనీతిసార ప్రసరము 6 7. _సుమహద్ద్గుణినం త్వార్తం భృత్యర్థం కల్పయే త్సదా
సేవాం వినా నృపః పక్షం దద్యాద్భృత్యాయ వత్సరే ॥ 2-892
“మిక్కిలి మంచి గుణవంతుడైన భృత్యుడు వ్యాధి[గ్రస్తు డయినప్పుడు ఎంతకాలమైనా సగం వేతన మివ్వవలెను. ప్రతి ఉద్యోగికి సంవత్సరానికి అర్ధమాసం సేవ చేయకుండా వేతన మిప్పించవలెను.
ఆధునికకాలంలో ప్రభుత్వోద్యోగులకు లభిస్తున్న సెలవు నిబంధనల వంటివి రాజరికవ్యవస్థలో కూడ ఇవ్వదగినవిగా శుక్రనీతిలో చెప్పబడింది. బోనస్ వంటి విధానం కూడ దీనిలో మనకు కనిపిస్తుంది. పాశ్చాత్యులు మన పాలకులైన తరువాతనే ఇటువంటి సౌకర్యాలు మన కేర్చడ్డాయని కొందరు భావించటం కేవలం అపోహ మాత్రమే అని తెలుస్తున్నది. 8. ఏకః స్వాదు న భుంజీత వకో౬ర్థా న్న విచింతయేత్
ఏకో న గచ్చే దధ్వానం నైకః సుప్తేషు జాగ్భయాత్ ॥ 3-52
“రుచికరమైన పదార్థాన్ని ఒంటరిగా భుజించకూడదు. ముఖ్యమైన విషయాలను ఒక్కడే ఆలోచించి నిర్ణయించరాదు. దారిలో ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. అందరూ నిద్రించియుండగా ఒక్కడు మేల్కొని ఉండవద్దు”.
దీనిలో రాజనీతికి సంబంధించిన అంశ మెక్కువగా లేదు. ముఖ్యమైన రాజకీయాలను మంత్రులతో కలిసి ఆలోచించవలెనని మాత్రం చెప్పవచ్చు. మిగతా విషయాలు సామాజికనీతిధర్మాలు. మంచి వాటిని నలుగురు తనవారితో కలిసి అనుభవించవలెనని, సమస్యలు వచ్చినపుడు ఆస్తులతో కలిసి విచారించవలెనని. పూర్వకాలం ప్రయాణాలలో దొంగల, క్రూరమృగాల బాధ ఉండేది. కనుక ఒంటరిగా ప్రయాణం చేయవద్దని చెప్పటం జరిగింది. ఒక్కడు మేల్మొని ఉండవద్దనటం మనస్సులో చెడు ఆలోచనలు కలుగకుండా ఉండటానికని భావింపవచ్చును. 9. _ ప్రవిచార్యోత్తరం దేయం సహసా న వదేత్ క్వచిత్
శత్రో రపి గుణా గ్రాహ్యాః గురో స్వాజ్యాస్తు దుర్గణాః ॥1 8-68
“ఎవరైనా ఏదైన విషయం ప్రశ్నించినప్పుడు బాగా ఆలోచించి సమాధానం చెప్పవలెను కాని తొందరపడి ఏదో ఒకటి చెప్పకూడదు. మనకు పగవాడైనా అతనిలో గుణాలుంటే వాటిని స్వీకరించవలెను. అదే విధంగా మన గురువులో ఏవైనా దుర్గుణాలుంటే వాటిని స్వీకరించక విడిచిపెట్టాలి”.
64 శుక్రనీతిసార ప్రసరము ఇది కూడ లోకసామాన్యనీతికి సంబంధించిన శ్లోకమే. భారవి “సహసా విదధీత
న క్రియామ్” అన్నాడు. తొందరపడి ఎవరి ప్రశ్నకు సమాధానం చెప్పవ ద్దనేది పై
దానికి లక్ష్యమే అవుతుంది. ఇక శత్రువు గుణాలను గ్రహించవలెనన్న దానికి
రామాయణంలో శ్రీరామచంద్రుడు తన శత్రువైన రావణునిలోని గుణాలను ప్రశంసించటం సర్వవిదితమే. గాంధీగారు కూడ “పాపాన్ని ద్వేషించు, పాపిని కాదు” అని చెప్పినారు. అదే మన ప్రాచీన నీతికారులు చెప్పినారు.
గురువు మన కారాధ్యుదైనా, ఆయనలోని మంచిగుణాలనే ఆదర్శంగా గ్రహించవలె కాని దుర్గుణాలను కాదు. “అవశ్యం పితురాచారం దురాచారం తు వర్జయేత్” అని పెద్దల వాడుకలో ఉన్న సూక్తి ఇదే భావాన్ని తెలుపుతుంది.
- న బ్రూయా దన్ఫతం సాక్ష్యం కృతం సాక్ష్యం న లోపయేత్ ప్రాణాత్యయే2._నృతం బ్రూయా త్సుమహత్మార్యసాధనే 1 3-97 “అబద్ధపు సాక్ష్యము చెప్పకూడదు. ఒకసారి చెప్పిన సాక్ష్యమును తరువాత
రద్దుచేయరాదు. ప్రాణసంకటము సంభవించినప్పుడు కాని, ఏదైనా గొప్ప లోకహితమైన
కార్యము చేయవలసినప్పుడు కాని అసత్యము చెప్పటం దోషం కాదు”.
అబిద్ధమాడే విషయంలో శుక్రాచార్యులు చాల విషయాలలో అనుమతి నిచ్చినట్లు భాగవతంలో మనకు కన్పిస్తుంది.
“వారిజాక్షులందు వైవాహికములందు
ప్రాణవిత్తమానభంగమందు
చకితగోకులాగ్రజన్మరక్షణమందు
బొంకవచ్చు నఘము పొంద దధిప”.
అనే పోతనగారి పద్యం కూడ ్రసిద్ధంగా ఉన్నది - కాని శుక్రనీతిసారంలో
ఈ ఒక్కవిషయంలో తప్ప మరే సందర్భంలో అసత్యమాడ వచ్చునని చెప్పే శోకము
లభించటం లేదు. దీనిలో చెప్పిన సందర్భాలు సమంజసములే.
- ఆయు ర్విత్తం గృహచ్చిద్రం మంత్రమైథునభేషజమ్ " దానమానాపమానం చ నవైతాని సుగోపయేత్ 38-126 “తన ఆయుర్ధాయ పరిమితి, తన కున్న ధనసంపద, ఇంటిలో జరిగే కుటుంబ
కలహాలు, మంత్రము, స్ర్రీసంగమము, మందు, దానముచేసిన విషయము, తనకు
శుక్రనీతిసార ప్రసరము 65 జరిగిన గౌరవము, అవమానము - ఈ తొమ్మిదింటిని బుద్ధిమంతుడు రహస్యంగా ఉంచవలెను,
తన ధనాన్ని వెల్లడిస్తే ఇతరులకు ఆసూయాదులు, అపహరించాలనే బుద్ధి కలుగవచ్చు. ఇంటికలతలు చెప్పుకోవటం వలన నలుగురిలో చిన్నచూపు ఏర్పడు తుంది. మంత్రాన్ని రహస్యంగా ఉంచినప్పుడే విశ్వాసం కలిగి అది పనిచేస్తుంది. మందుకూడ అంతే. చేసిన దానం చెప్పుకోవటం వలన, గౌరవాన్ని వెల్లడించటంవల్ల అహంకారం కలుగవచ్చు. అవమానాన్ని ఇతరులకు చెప్పితే అగౌరవం కలుగుతుంది. కనుక ఇవి అన్నీ గోప్యంగా ఉంచవలెనని చెప్పబడింది. 12. ఆదౌ కులం పరీక్షేత తతో విద్యాం తతో వయః
శీలం ధనం తతో రూపం దేశం పశ్చా ద్వివాహయేత్!! 3౩-196
“తమ కూతురికి వివాహసంబంధం చూచేటప్పుడు మొదట వరుని కులాన్ని పరీక్షించి తరువాత అతని చదువును, వయస్సును, శీలాన్ని ధనసంపదను క్రమంగా పరిశీలించవలఠెను. ఆపిమ్మట అందాన్ని, నివాసదేశాన్ని ఆలోచించి వివాహనిశ్చయం జరుపవలెను,
కులశబ్దానికి ప్రాచీనసాహిత్యంలో వంశమనే అర్ధమే కనిపిస్తుంది. వరుని వంశమర్యాదను చూడవలెనని అర్థము. రూపానికి చివరి (ప్రాధాన్యం ఇవ్వబడింది. చదువు, నడవడి తరువాత ధనాన్ని చూడవలెనని చెప్పినారు. నేటి కాలంలో ఈ క్రమం పూర్తిగా మారిపోయి రూపము, ధనము అన్నిటి కంటె ముఖ్యస్థానాన్ని ఆ(క్రమించినవి.
“కన్యా వరయతే రూపం మాతా విత్తం” అనే శ్లోకం ఇదే సందర్భంలో ఈ శ్లోకం వెంటనే ఈ [గ్రంథంలో కన్పిస్తుంది. 18. గురో రప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః
ఉత్పథం ్రతిపన్నస్య కార్యం భవతి శాసనమ్ (ఉ-1-50)
మదముతో క్రూరుడై, కర్తవ్యాకర్తవ్య వివేచన లేకుండా, అధర్మ మార్గంలో ప్రవర్తించేవాడు తన గురువైనప్పటికి, రాజు అతణ్జి దండించవలెను”.
ప్రజారంజనము, ధర్మరక్షణమే రాజు ముఖ్యకర్తవ్యాలు కనుక ఆ విధి నిర్వహణలో పక్షపాతం లేకుండా ్రవర్తించవలసి ఉంటుంది. తన కుమారుడైనా,
66 శుక్రనీతిసార ప్రసరము సోదరుడైనా అపరాధిని దండించవలసినదే. మాధవవర్మ అనే రాజు తన కుమారునికే దండన విధించిన కథ ్రసిద్ధమే కదా!
ఇతరులు అటువంటి అపరాధం చేయకుండుట కొరకే దోషికి దండనవిధానం చెప్పబడింది. అయితే గురువుకు విధించే దండన అతని స్థానాన్ని దృష్టిలో ఉంచుకొని కఠినమైనది కాకుండా విధించవలెను. 14 యో౬ధీతవిద్యః సకలః స సర్వేషాం గురు రృవేత్
న చ జాత్యా_నధీతో యో గురు రృవితు మర్షతి ॥ (4-8-21)
“ఎవడు కళలతో గూడ విద్యలను అధ్యయనం చేసినాడో, అతడే అందరికి గురువు కాదగినవాడు. విద్యలు నేర్చుకొనక కేవలం పుట్టిన జాతిచేతనే ఎవడూ గురువు కాజాలడు”.
గురువు స్థానాన్ని పొందాలంటే విద్యలలో, కళల్లో పాండిత్యం సంపాదించటం అవసరమని చెప్పటం సమంజసమే.
“గుశబ్ద స్వంధకారే స్యా ద్రుశబ్ద స్తన్నిరోధకః
అంధకారనిరోధిత్వా ద్గురు రిత్యభిధీయతే”
అనే సూక్తి ప్రకారం అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించటానికి వివిధవిద్యల్లో పాండిత్యం సంపాదించవలెను. తన అజ్ఞానాన్ని తొలగించుకోనివాడు ఇతరులకు జ్ఞానబోధ ఎట్లు చేయగలడు? 15. దేశజాతికులానాంచయే ధర్మాః ప్రాక్ ప్రవర్తితాః
తథైవ తే పాలనీయాః ప్రజా ప్రక్షుభ్యతే£ న్యథా ॥ (4-5-46)
వ్యవహారవిచారణ, న్యాయనిర్ణయసందర్భాలలో, “ఆ యా దేశాలలో, జాతులలో, కులాలలో పరంపరాగతంగా యే ధర్మాలు ఆచరణలో ఉన్నాయో, వాటిని కాపాడుతూ తీర్పులు ఇవ్వవలెను. అట్లు కానిచో ప్రజలలో అలజడి ఏర్పడుతుంది”.
ఆధునికన్యాయవ్యవస్థలోకూడ కొన్ని జాతుల, తెగల, సంప్రదాయాలకు, ఆచారాలకు పరిగణన జరుగుతున్నది. “ధర్మజ్ఞసమయః ప్రమాణం వేదాశ్చ” అనే ప్రాచీనధర్శశాస్త్రంలో వేదంకంటె ధర్మజ్ఞుల ఆచారమే ప్రథమగణ్యమని చెప్పబడింది. అందువలన ప్రధానధర్మానికి హాని కలగకుండా ఆయా వర్గాల ఆచారాలను పాలించటం సముచిత మని భావము.
శుక్రనీతిసార ప్రసరము 67 16. స్వతంత్రః సాధయన్నర్ధా న్రాజాపి స్యా చ్చ కిల్చిషీ
ధర్మశాస్తా౭_. విరోధేన హ్యర్థశాస్త్రం విచారయేత్ ॥ 4-5-260
“రాజు స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నట్లయితే అతడు పాపి అవుతాడు. ధర్మ శాస్త్రానికి విరోధం లేకుండా రాజనీతిశాస్తాన్ని పరిశీలించవలెను.
నేటి కాలపు న్యాయస్థానాలలో సివిల్, పీనల్ కోడ్ల ప్రకారం వ్యవహారాలను విచారించేటప్పుడు ఆ యా మతాల ధర్మగ్రంథాలను పరిశీలనలోకి తీసుకుని చర్చించటం జరుగుతుంది. అదేవిధంగా రాజుల కాలంలో కూడ ధర్మశాస్తానికి భంగం కలుగకుండా దండనీతి నవలంబించి వ్యవహారాలలో తీర్చుచెప్పవలెనని ప్రతిపాదించ బడింది. 17. బ్రాహ్మణస్యాపి చాపత్తౌ క్షత్రధర్మేణ వర్తతః
ప్రశస్తం జీవితం లోకే క్షత్రం హి బ్రహ్మసంభవమ్ ॥ 4-7-289
“జీవనోపాధి దుర్లభమై, కుటుంబపోషణ సంకటంలో పడినప్పుడు బ్రాహ్మణుడు క్షతియవృత్తితో జీవించటం పాపం కాదు. క్షత్రియధర్శ్మము బ్రాహ్మణధర్మము నుండి ఉత్పన్నమైనదే”.
మహాభారతంలో (ద్రోణాచార్యులు విలువిద్య నేర్చటమే కాక కౌరవుల పక్షాన మహాభారతయుద్ధంలో పాల్గొన్నాడు. పరశురాముడు జీవికకొరకు కాకున్నా దుష్ట క్షత్రియ గర్వనిర్మూలనంకొరకు క్షాత్రధర్మా న్నవలంబించినాడు. “ఇదం బ్రాహ్మ మిదం క్షాతం” అని ప్రకటించి వీరత్వాన్ని ప్రదర్శించిన బ్రాహ్మణులు మరి కొందరు పురాణ కథల్లో కనిపిస్తారు. 18. విస్రంభాచ్చరణం ప్రాప్తం యః సంత్యజతి దుర్మతిః
స యాతి నరకే ఘోరే యావదింద్రా శ్చతుర్దశ 4-7-316
“మనపై నమ్మకంతో తనను కాపాడుమని శరణుకోరి వచ్చిన వాణ్ణి రక్షించ కుండా వదలిపెట్టినవాడు, పదునాలుగు మంది ఇంద్రుల పాలనకాలంవరకు ఘోరనరకంలో పడిఉంటాడు”.
శరణాగతరక్షణము భారతీయ సంస్కృతిలోని ముఖ్యధర్మము. శిబిచక్రవర్తి కథ, గయోపాఖ్యానము, గజేంద్రమోక్షము వంటి గాధలు ఈ విషయంలో దృష్టాంతాలుగా ఉన్నాయి.
ఈ శుక్రనీతిసార ప్రసరము
శ్రీమద్రామాయణంలో శరణాగతరక్షణకు గొప్ప ఉదాహరణ.
“సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే
అభయం సర్వభూతేభ్యోదదామ్యేతద్వతం మమ”. అని శ్రీరాముడు ప్రకటించి, ఆ రావణుదే స్వయంగా వచ్చి శరణుకోరితే అతని అపరాధాన్ని మన్నించి విడిచిపెడతానని అంటాడు. శత్రువైనా శరణుకోరితే కాపాడటం భారతీయుల గొప్ప ధర్మం. 19. బహూనా మైకమత్యం హి నృపతే రృలవత్తరమ్
బహుసూత్రకృతో రజ్ఞుః సింహాద్యాకర్షణక్షమ: ॥ శ-7-398
“రాజ్యాంగనిర్ణయాలలో మంత్రి, పురోహితాదుల బహుజనాభిప్రాయమే రాజుకంటె బలవత్తరము. సన్నని, బలహీనమైన అనేక దారములతో పేనిన తాడు సింహాది మృగాలను కూడ కట్టి లాగటానికి సమర్థమవుతుంది కదా”.
ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాస్వామికవ్యవస్థలోనే కాక, రాజు పరిపాలనలో కూడ బహుమతానుసారమే పరిపాలన జరగాలని శుక్రనీతి చెప్పుతున్నది. రాజు అమాత్యాదుల సలహాలు పాటించకుండా నిరంకుశంగా పరిపాలిస్తే ఆ రాజుకు పతనం తప్పదని మరొకచోట చెప్పబడింది. 20. వినా మాయాం మహాద్రవ్యం ద్రాబ్న సంపాద్యతే జనైః
వినా పరస్వహరణా న్న కశ్చిత్స్యాన్మహాధనః ॥ 5-29
“కపటం చేయకుండా, ఇతరుల సొత్తును అపహరించకుండా, ఎవరు కూడా అల్పకాలంలో గొప్ప ధనవంతులు కాలేరు”.
న్యాయమార్గంలో సంపాదించేవానికి ధనం వచ్చినా, దీర్ణకూాలంలో సమకూరు తుంది. దొంగతనంవల్ల, మోసంవల్ల గొప్ప ధనవంతులు కావటం చూడగలము. వ్యాపారంలో న్యాయమైన లాభాన్ని మించి ఎక్కువ లాభానికి వస్తువుల నమ్మినా, అది పరుల సొమ్మును అపహరించటమే అవుతుంది. 21. బహుఖి ర్యః స్తుతో ధర్మః నిందితోల_ ధర్మ ఏవసః
ధర్మతత్త్వం హి గహనం జ్ఞాతుం కేనాపి నోచితమ్ ॥ 5-32
“ఎక్కువ మందిచేత కొనియాడబడే ధర్మమే నిజమైన ధర్మము. అధిక
శుక్రనీతిసార ప్రసరము 6 సంఖ్యాకులచే నిందింపబడినది అధర్మమే అవుతుంది. ధర్మముయొక్క యఖార్ధతత్త్వము చాల గంభీరమైనది. దానిని ఎవరు కూడ తెలుసుకోలేరు”.
ఇక్కడ కూడ బహుజనాఖభిప్రాయానికే ప్రాధాన్య మీయబడింది. “మహాజనో యేన గతః స పంథాః౯ొ అను సూక్తి ప్రసిద్ధంగా ఉన్నదే. “పదుగు రాడుమాట పాడియై ధర చెల్లు” అని తెలుగులో కూడ సూక్తి వ్యవహారంలో ఉన్నది. అందువలన ధర్మశాస్త్రంలో చెప్పినది మాత్రమే కాక, లోకంలో ఎక్కువమందిచేత ఆమోదించబడినదే ధర్మమని భావము. ఆ ఎక్కువమంది సమాజంలో గుర్తింపబడిన శిష్టులై ఉండాలి. అంతేకాని ఎక్కువమంది ఆమోదించినారని మద్యపానము, జూదము వంటివి ధర్మమని చెప్పజాలము. 22. భృత్యః స ఏవ సుళ్లోకో నాపత్తౌ స్వామినం త్యజేత్
స్వామీ స ఏవ విజ్ణేయో భృత్యార్థం జీవితం త్యజేత్ | 5-49
“తన (ప్రభువుకు సంకటపరిస్థితి వచ్చినప్పుడు అతనిని విడిచి వెళ్లకుండా ఉన్నవాదే నిజమైన సేవకుడని చెప్పదగినవాడు. అదే విధంగా అవసరం కలిగినప్పుడు తన భృత్యుణ్ణి రక్షించటంకొరకు తన జీవితాన్ని అర్చించగలవాడే నిజమైన ప్రభువని తెలియవలెను,
యజమాని-సేవకుల సంబంధము సాపేక్షమైనదని దీనిలో చెప్పబడింది. తనకు జీవనభృతిని కల్పించి, పోషిస్తున్న ప్రభువుకు విశ్వాసపాత్రుడుగా ఉండి సేవ చేయటమే కాక, ఆయన కేదైనా ఆపద కల్లినప్పుడు తన స్వార్థం చూచుకొని వెళ్లిపోకుండా విశ్వాసం చూపటం కూడ మంచి సేవకుని విధి.
అదే విధంగా, తనకొరకే తన యావచ్చక్తిని వినియోగించి ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవచేస్తున్న సేవకుణ్ణి రక్షించటానికి అవసరమైతే (ప్రభువుకూడ తన (ప్రాణాల నర్పించానికి సిద్ధంగా ఉండాలి. ఇది ప్రభుసేవకుల ఉత్తమసంబంధము. 28. యశ్శద్మచారీ భవతి తస్మిన్ ఛద్మ సమాచరేత్
అన్యథా శీలనాశాయ మహతా మపి జాయతే ॥ (5-57)
కార్యసాధనకు యుక్తులు రెండు విధాలుగా ఉంటాయి. కపటయుక్తి, సత్యయుక్తి అని. “మన విషయంలో ఎదుటివాడు కపటంగా ్రవర్తించినపుడు, అతని విషయంలో కపటయుక్తినే ప్రయోగించాలి. అట్లుకానిచో గొప్పవారి శీలానికి కూడ కళంక మేర్చడుతుంది”.
70 శుక్రనీతిసార ప్రసరము
మనం న్యాయమార్గంలో ప్రవర్తించా లనుకోవటం మంచిదే, కాని ఎదుటివారి చర్యను బట్టీ మనం మార్చుకోవలెను. ధర్మరాజు ఆ నీతిని ప్రయోగించనందువల్లనే అరణ్యవాసం మొదలైన కష్టాల ననుభవించ వలసి వచ్చింది. శ్రీకృష్ణుడు మాయావుల విషయంలో మాయను ప్రయోగించటం తప్పు కాదని, ఆ విధానంతో పాండవులకు జయం కల్పించినాడు.
మన ప్రభుత్వం కూడ శత్రుదేశం పన్నుతున్న కపటోపాయాలకు తగిన వ్యూహం అవలంబించనందువల్లనే కొన్ని నమస్యలు దీర్చకూలంగా అపరిష్కృతంగా ఉంటున్నాయి. 24 యదా చతుర్లుణా వృద్ధి రహీతా ధనికేన చ
అధమర్హా న్న దాతవ్యం ధనికే తు ధనం తదా ॥ (5-86)
“అప్పు ఇచ్చిన ధనవంతునికి వడ్డీ రూపంలో కొంతకాలానికి అసలు ధనానికి నాలుగురెట్ల ధనం ముట్టినట్లయితే, అప్పు తీసుకున్నవాడు బుణదాతకు ఇంక ఏమీ ఇవ్వవలసిన అవసరము లేదు అని రాజు శాసించవలెను.
వడ్డీ వ్యాపారం చేసేవారు న్యాయమైన వడ్డీ తీసుకుంటే ఎవరికీ బాధాకరం కాదు. కాని కొంతమంది ధనాశతో ఎక్కువ వడ్డీతో అప్పులు ఇస్తారు. అటువంటప్పుడు కొద్దికాలంలో అతడు చెల్లించిన వడ్డీపైకము అసలు అప్పుకు నాలుగురె ట్లవుతుంది. అటువంటి సమయంలో రాజుకు విన్నవించుకుంటే, బుణగ్రహీత ఇంక ఏమీ తీర్చవలసినది లేదని శాసించటం ప్రభువువిధి.
ప్రజలను పీడించకుండా పరిపాలించటంతోపాటు, వడ్డీ వ్యాపారస్తులనుండి, ధనవంతులనుండి వారికి ఎటువంటి బాధలు కలుగకుండా చూడటం కూడ రాజు కర్తవ్యము.
శుక్రనీతిలో ఇటువంటి, ప్రజలకు న్యాయం కలిగించే విషయాలు ఎన్నో ప్రతి పాదించబడ్డాయి.
స్థాలీపులాకన్యాయంగా 2500 శ్లోకాల శుక్రనీతిసారంలోని 24 శ్లోకాలను మాత్రం గ్రహించి వాటిని గురించి వివరించటం జరిగింది. చాణక్యుని అర్థశాస్త్రంలో చెప్పిన చాలా విషయాలకు దీనిలో ఆధారాలు కన్పిస్తాయి.
దీనిలోని “గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతళ” అనే శ్లోకం చివరి పాదంలో పాఠభేదంతో రామాయణంలో కన్పిస్తుంది. “ఏకః స్వాదు న భుంజీత” అనే శ్లోకం
శుక్రనీతిసార ప్రసరము 71 నీతి శాస్త్రం అనే చిరుపుస్తకంలో కన్పిస్తుంది. శుక్రనీతిలోనిదని తెలియకుండానే చాలా మందికి కంఠస్థంగా ఉన్నది. అలాగే “ఆయుర్విత్తం గృహచ్చిద్రం” అనే శ్లోకం కొంత మార్పుతో పంచతంత్ర, హితోపదేశాదుల్లో కనిపిస్తుంది”. “కన్యా వరయతే రూపం” ఇత్యాది శ్లోకం సామాన్యంగా విద్యావంతులందరి ప్రచారంలో ఉన్నది.
“అధమా ధన మిచ్చంతి ధనమానౌ తు మధ్యమాః” అనేది సాధారణ నీతికి సంబంధించిన శ్లోకం విద్వత్పచారంలోనిదే.
“అనృతం సాహసం మాయా మూర్ధత్వమతిలోభతా” అనే శ్లోకం ప్రీల విషయంలో నీచంగా వర్ణించినది, నీతిశ్లోకాలలో ఇతరత్ర కన్పిస్తుంది. ఇది 'ప్రక్షిప్తశ్లోకం కావచ్చునని పరిశీలకుల అభిప్రాయం.
“ఆహారే వ్యవహారే చ త్యక్తలజ్జః సుఖీభవేత్
ఉపదేశో హి మూర్చాణాం క్రోధాయైవ శమాయ న”,
ఇత్యాది శ్లోకాలు కొంచెం పాఠభేదంతో లోకవ్యవహారంలో విన్పిస్తుంటాయి.
“న కవేః సదృళీ నీతిస్రిషు లోకేషు విద్యతే” 4-7-406
శుక్రనీతితో సమానమైనది మూడు లోకాలలో లేదు.
భారతప్రథమప్రధాని, కీ. శే. జవహర్గాల్నెహ్రూ గారు తమ కుమార్తె ఇందిరకు వ్రాసిన లేఖలలో శుక్రనీతిని గూర్చి ప్రశంసాపూర్వకంగా ప్రస్తావించినారు. అందులో కొన్ని అంశాలు మచ్చుకు -
1.ప్రభుత్వోద్యోగులను నియమించేటప్పుడు, అతని కార్యదక్షతను ప్రధానంగా చూదాలి కాని, జాతి, కులాలను కాదు.
2.తన అభిప్రాయం ప్రకారం కాక (్రజాబాహుళ్ళం అభిప్రాయం ప్రకారం పరిపాలించాలి.
- ప్రజలు రాజోద్యోగిపై ఫిర్యాదుచేసినప్పుడు రాజు ప్రజల పక్షపాతం చూపాలి కొని అధికారిపై అభిమానం కాదు.
ఇటువంటి మరికొన్ని చూపి ఆయన అవి ఈనాటికీ ఉపాదేయాలని చెప్పినాడు.
మహాభారతంలో నీతికారుల ప్రసంగంలో శుక్రాచార్యులను గూర్చి “అమిత ప్రజ్ఞ, మహాయశా?” అని ప్రశంసించటం జరిగింది. దండిమహాకవి తన దశకుమార చరిత్రలో నీతిశాస్తకర్తలలో మొదట శుక్రాచార్యులను పేర్శొన్నాడు.
72 శుక్రనీతిసార ప్రసరము ఇంతటి ప్రాముఖ్యం కల యీ (గ్రంథాన్ని మొట్టమొదట “గెప్టావ్ ఆఫర్డ్” అనే ఆంగ్లేయుడు మద్రాస్‌లో ప్రచురించిన ప్రతి ప్రామాణికంగా గుర్తించబడింది. అది ఇప్పుడు అలభ్యము. తరువాత జీవానంద విద్యాసాగర్, కలకత్తాలో సంస్కృతవ్యాఖ్యాన సహితంగా ప్రకటించినారు. స్వామి జగదీశ్వరానందసరస్వతి హిందీవ్యాఖ్యానంతో రూపలాల్ కపూర్ ట్రస్టు వారు ముద్రించిన గ్రంథమాధారంగా రచయిత తెలుగులో ఈ సంగ్రహపుస్తకం రచించటమైనది. పండితులు, నీతిశాస్తాఖిమానులు, సహృదయులైన పాఠకులు ఈ గ్రంథాన్ని చదివి, ఇందలి విశేషాలను అవగతం చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. రచనలో ఏవైనా లోపాలుంటే సహృదయంతో మన్నించగలరని ప్రార్ధనతో విరమిస్తున్నాను. ౮౪౧ రయ్య (గ్రంధాలప్షా ణంద' న్ య ళా [1 0.౫06262) య త్తి బ్రా 17
లో [ శ్రే ; శ (షి న్్ /