Telugu shabdha shikaralu - anilvaranasi/indianlanguages GitHub Wiki
లా. |. ఆకామూఖీ ఉుమాడి కనినమేళన కవితట ౦1.82౫ 18 వం -- శబ్బ.. “ఆ || క్రదీంగర్రి. స్త ॥ నల్ల స సుం పట ను బం! స తస టన రన్ నరుని! గన ౯ వం ళు సం కం నున ॥ స; వ ల? | స శ వ ॥ . భా నన విప మా ఉం ను స యు . ఎం రోం ళో వన నన చం. . టై, రానే న న ను ॥ | | [| న్య న! గ్ వే ను య న , స |. న్నా . నటట శ ల మ వు టు .
ఈ 2౫2600 ఆకాశవాణి స్థ ప్రమాది కవిసమ్మేళన కవితలు. (నో. "ర స క 1 నల జ్ఞానపీఠ అవార్డు గ్రహిత సవ ఒనె థి జా! సి. నారాయణ లెడ్డి గారి. 7 క బహూకరణ ఖై నా. రు. ౮ ర్చ ఆకాశవాణి హైదరాభాద్, వరంగల్ కేంద్రాల స సంయుక్త నిర్వహణ అక్ష కే న్ ప్రసార భారతి ఆకాశవాణి వరంగల్ కేంద్ర ప్రచురణ
శబ్ద శిఖరాలు 5గరిలెష్ 3[66%గగి4[0 1999 అకాశపణ్రి ప్రమాది కవి సమ్మేళన కవితలు ర. ఇన. దోర దటి ఆకాశవాణి జొ -- మిస్హ హైదరాబాద్, వరంగల్ కేంద్రాల సంయుక్త నిర్వహణ ప్రచురణ; ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ భి ు ళ్ ముఖ చిత్రం: శజన్వా " ఆ క గ వీ క బాహా (డు 6600 స నే ఒఇధ క శ సమ్వు బే-గ్ర00 గతీ ముద్రణ : అశోకకృష్ణ ఆఫ్‌సేట్ ప్రింటర్స్ వరంగల్
నేవథ్యం సంగీత సాహిత్వాది లలిత కళా సంస్కృతీ సంపదకు నిలయమైన వరంగల్ కాకతీయుల కాలం నుండి, ఉజ్వలమైన కళాప్రాభవాన్ని సంతరించుకొని, తెలుగు పరిఢవిల్లుతున్నది. వేదాలకు భాష్యం వ్రాసిన శ్రీవిద్యారణ్యులు, నృత్త రత్నావళిని విరచించిన జాయపసేనాని, జానుతెనుగులో కవనగంగ నుష్పొంగించిన పాల్ఫురికి సోమన, ఆంధ్రమహాభాగవత కర్త బమ్మెర పోతన వంటి మహనీయులు ప్రభవించిన తపోభూమి ఏకళిలానగరి. జానపదానికి, జ్ఞానపధానికి వారధియైన వరంగల్ నానారసాభ్యుదయోల్లాస భావాలకు ఎన్నో ఉద్యమాలకు సారథియై సాంస్కృతిక నగరంగా రూపుదిద్దుకొన్నది. పాబీనకాలం నుండి అర్వాచిన కాలం వరకు వివిధ కళలకు పుట్టిలైన వరంగల్, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో, వివిధ సాహిత్య సాంస్కృతిక సభాకార్యక్రమాలు నిర్వహించడానికి చక్కని కళావితర్దిక. విద్యా వికాస వినోదాది జనహిత కార్యక్రమాలను రూపొందించే ఆతకాశవాణికి తగిన మౌలిక వనరులున్న వరంగల్ గత పది సంవత్సరాలుగా, వైవిధ్య భరితమైన కార్యక్రమాలను సమర్చిస్తున్నది. రాష్ట్రంలోని ఇతర కేంద్రాలకు ప్రాతి నిధ్యం వహించే, కళామూర్తులు ఒకేచోట చేరి అలరింపజేసే సందర్భాలు తక్కువ.
ఈ దృక్పథంతో, 1998 నవంబర్ నెలలో విజయవాడలో జరిగిన ఆకాశవాణి కేంద్రాల సమన్వయ సమావేశంలో, హైదరాబాద్‌లో రాష్ట్రంలోని అన్ని కేంద్రాలకు చెందిన సాహితీమూర్తులు పాల్గొనే ప్రమాది ఉగాది కవి సమ్మేళనానికి ఆర్ధిక వనరులను అందిస్తూ, వరంగల్‌ను వేదిక చేయవలసిందిగా నేను కోరటం వెంటనే ఆ సమావేశం ముక్తకంరంతో ఆమోదించడం జరిగింది. ఆనాటి సమావేశ
నిర్ణయానుసారం, ఆకాశవాణి హైదరాబాద్, వరంగల్ కేంద్రాల సంయుక్త నిర్వహణలో 1999 మార్చి 15వ తేదీన వరంగల్‌లో ఆవ్వానితుల సమక్షంలో “ప్రమాది ఉగాది కవి సమ్మేళనం” ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఆకాశవాణి హైదరబాద్, వరంగల్ కేంద్రాల సంయుక్త నిర్వహణలో జరిగిన ఈ కవి సమ్మేళన కార్యక్రమానికి కేంద్ర సమాచార ప్రసారశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ కె.యస్. శర్మ, 125 గారు, ఆకాశవాణి డిప్యూటి డైరెక్టర్ జనరల్ శ్రీ యస్. కృష్ణన్ గారు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం స్టేషన్ డైరెక్టర్ శ్రీ ఆర్. అనం “ పద్మనాభ రావు గారు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం స్టేషన్ డైరెక్టర్ శ్రీ కఒ అహమ్మద్ గారు, ఆకాశవాణి మద్రాసు వాణిజ్య ప్రసారవిభాగం డైరెక్టర్ శ్రీమతి దుర్గా భాస్కర్ గారు మా కేంద్రానికి అందించిన ఆశీఃపూర్వక సందేశాలు మరింత బలాన్నిచ్చ్భాయి. కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజాకవి పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు గారి ఆశీర్భాషణం మా కార్యక్రమానికి నిండుదనాన్నిచ్చింది.
హన్మకొండ పుష్పాంజలి ఆడిటోరియంలో పండుగ సంబరంలా జరిగిన ఈ కవి సమ్మేళనం అందరికీ అందమైన అనుభూతిని మిగిల్చింది. అయితే ఈ కార్య![క్రమాన్ని కేవలం వాయుప్రసారంతో సరిపుచ్చకుండా కవి సమ్మేళన కవిత లన్నిటినీ అక్షరరూపంలో నిక్షిప్తం చేయాలన్న ఆకాంక్షను ఆనాటి సభలో నిర్ణయించి, ప్రకటించడం జరిగింది.
కవి సమ్మేళన కవితల్లో వస్తు, రూప వైవిధ్యమున్నది. ప్రమాది ఆగమనం శుభసందర్భాన్ని పురస్కరించుకొని, పద్య, గేయ, వచన, రూపాల్లో సమకాలీన సామాజికాంశాలను విభిన్న కోణాలలో దర్భ్శింపజేశారు ఆనాటి సాహితీమూర్తులు!
ఆకాశగుణాత్మకమైన శబ్దాన్ని వాయుప్రసారం ద్వారా వినిపించేది ఆకాశవాణి. ,.
శిఖరం - బెన్న్య సూచకం ....
క్రాంతా దర్శియైన కవి శబ్ద శిఖరాలను అధిరోహించి వ్యక్తం చేసిన శబ్ద సముచ్చయాన్ని సాక్షరాకృతిగా మలచి “శబ్దశిఖరాలు”గా మీ కరకమలాల్లో ఉంచుతున్నాం,
'హైదరాబాద్-వరంగల్ ఆకాశవాణి కేంద్రాల ఈ సంయుక్త కవి సమ్మేళన కార్యక్రమానికి-హైదరాబాద్ కేంద్రం ప్రతినిధిగా పాల్గొన్న డిప్యూటి డైరెక్టర్ శ్రీ కె. మల్లికార్జున శర్మ గారికి, సాంకేతిక సిబ్బందికి - ప్రతి విషయంలోనూ చక్కని సమన్వయాన్ని అందించిన శ్రీమతి యల్లంరాజు సరోజా నిర్మల గారికి కృతజ్ఞతలు.
కవి సమ్మేళన సభా నిర్వహణ నుండి కవితా సంపుటి ప్రచురణ వరకూ అంకిత భావంతో శ్రమించిన వరంగల్ కేంద్రం వ్యాఖ్యాతలు (ఎనౌన్సర్స్) మడిపల్లి దక్షిణామూర్తి, వొద్దిరాజు వెంకట రామారావులకూ, తమ ఇంటి వేడుకగా భావించి, ఈ కార్యక్రమానికి సమధికోత్సాహంతో సహకరించిన మా కేంద్రం వివిధ విభాగాల సిబ్బంది అందరికీ శుభాభినందనలు.
మంగళగిరి ఆదిత్య ప్రసాద్ ప్రమాది నామ సం స్టేషన్ డైరెక్టర్ చైత్ర శుద్ధ పాడ్యమి ఆకాశవాణి, వరంగల్
అనుక్రమణిక
- ప్రమాది ప్రమోద సందేశం
డా, తిరుమల శ్రీనివాసొచార్య ం న! 2. _ వినూత్న శతాబ్ది
వ నూర్వపకాళ్ ఎం ర్ 39 రంగుల వల
ఘంటసాల నిర్థుల | 4 పాట కోసమే
నరాల రామారెట్టి లం క్షేశ్త 5. పూలపల్లకి
దా. రామడుగు వెంకటేశ్వర శర్శ లం 17 6. ఆవేదన
ఉప్పుల అప్పలరాజు లం ట్ర ణ్గ్గా బుద్ధిలో భూకంపాలు పుట్టాలి
దా. కలువగుంట రామమూర్తి . 27 8. 'ని వేదన
మదివల్లి ఖభ్యదయ్య ం త్ర్షే ఓ, ప్రమాథి ఉగాది!
దా. వమిడికాల్వ చెంచు సుబ్బయ్య ఎం ర! 10. ఎక్కడో కోయిల పాట
దా. ఎన్. శరత్‌జ్యోత్నారాణి ఎం తి? 11. ప్రమాది ఉగాదీ !
అవుతావా శాంతికి ప్రోది ఇ డా. ఎన్. జవాద్ ముస్సేన్ ం శ్త౦0
క2. చూడాలని ఉంది
యస్. సూర్యనారాయణమూర్రి న. య! 13. వసంత గానం
దేవులపల్లి విశ్వనాథం ఎఎ. శ్తీకి 14. కొత్త పాట పాడవే కోకిలమ్మ
మోకా రత్నరాజు ఎం. ర8ి 15. ఓ ప్రమాదీ !
వైద్యం వేంకటేశ్వరాచార్యులు . ర్5్ 16. సహనావవతు సహనౌభునక్తు
డా పేర్వారం జగన్నాథం ఎం 59
ప్రమాది ప్రమోద సందేశం దా. తిరుమల శ్రీనివాసాచార్య
సమయమును నేను నాలోని సకల శక్తి యుక్తులను జీవరక్షకై ఉజ్జ్వల ప్ర గతి పథమ్మున సాగగా ('క్రమవిధాన ములను సృజియించినాను ప్రమోద మలర ప్రభవనై విభవనై ప్రకృతి సౌందర్యమ్ము
రాశిపోసితిని ప్రశాంతినొసగ శ్రీముఖగా సర్వజీవ సంరక్షణో
పాయముల్ మీ ముందు పరచినాను దుర్ముఖగా పుట్టి దుష్ట సర్పమ్ముల
విషదంష్టలను తీసివేసినాను సర్వధారిగ వచ్చి సర్వజిత్తుగ నిల్చి
చీకట్ల గుండెలు చీల్చినాను 'కోధనను నేను; శత్రువిరోధి నేను దుర్మతిని నేను; మృత్యుందుందుఖిని నేను జయ విజయ యుగాదులుగ నేజననమంది అఖిల శుభముల నిడిన సిద్దార్ధి నేను.
||
వాసంతశోభా విలాసముల్ వెలియించి చివురించు పాఠాలు చెప్పినాను విరిసినవ్వెడు పూల పరిమళాలను చూపి మంచి త్యాగాలు బోధించినాను గున్నమామిడిపైని కోయిలమ్మను చూపి నేర్పుతో రాగాలు నేర్చినాను గన్నేరు మల్లెలు గరికపువ్వుల చూపి ఏకత్వమును ప్రకటి ంచినాను వేపపువ్వులు మామిడి పిందియలును బెల్లమును జేర్చి రుచులు వర్ధిల్లజేసి తీపి చేదుల కలయిక చూపి జీవ నమ్మునిట్టిదయని చేసినాను బోధ శాంతినై వాసంతకాంతినై కుసుమించి ప్రగతి గీతాలెన్నా పాడినాను గ్రష్మమ్మునై క్రోధభీష్మాగ్నినై నర హృదయాల జ్వాలలై రేగినాను వర్షమ్మునై నరహర్షమ్మునై ఉద్య మావేశధారగా ఆరిచినాను జ్యోతినై నవశరత్ జ్యోత్సనై (ప్రేమసం దేశచందికల నందించినాను. లై
వింతగా నేను హేమంత వేషధారి నగుచు రాగైక హృదయాల నతికినాను నేనె శిశిరమై ఆకుల నేల రాల్చి (మోడులుగ జేసితిని పూలమేడ సలుప. ఎండ కాలాన భగభగ మండు సూర్య కిరణముల వేడి కొలిచెద; తరుణ చంద్రి కల ఎడదలోన నెలకొన్న చలువలెల్ల అరయ నేర్తును నేను యుగాదిని కద ! నేనె ప్రమాదిని నరరూ పాన చెలగు దానవులకు ప్రాణాంతకుడన్ నేనె ప్రమోదిని జన రూ పాన చెలగు దేవతలకు బల సంధాతన్ చేతులన్ని అక్షరాల జ్యోతులతో నింపేస్తా గగనాంతర తారలను కళ్ళల్లో నింపేస్తా ఎండిన డొక్కలకింకా ఏకాదశి రావద్దు ప్రజలార! ఎదఎదలో మధురసుధలు నింపేస్తా. తూటాలను మార్చేస్తా పువ్వుల్లాగా తుపాకులను మలిచేస్తా దివ్వెల్లాగా ఊరుకోను మార్చేస్తా బాంబులనన్నీ ప్రగతి నృత్యమూర్తి కాలిమువ్వల్లాగా. వె
గునపాలను గులాబీలుగా చేస్తా గొడ్డళ్లను గోగుపూలుగా చేస్తా నేటినుండి గొలుసులనూ బాకులనూ మల్లెపూలరేకులుగా మార్చేస్తా. ప్రతి వనమూ నందనమే ప్రతి తరుపూ చందనమే నేనే చల్లగ చూస్తే ప్రతి కణమూ కుందనమే. నింగికి నేలకు లేదు ఏ ఖేదం రవికీ శశికీ లేదు ఏ భేదం పురుషులు మహిళల ఇద్దరు సమానం హక్కులలో ఉండరాదు ఏ భేదం. = = * ఆకాశవాణి, హైదరాబాద్ త
వినూత్న చతౌబ్ది వ సూర్వ్నపకాళ్
కొత్త సంవత్సరాన్ని సరికొత్త కళ్ళ జతతో చూస్తూ చరిత్ర పాదముద్రలను వితర్మించుకుంటూ (ప్రపంచమంతా వినూత్న సహస్రాబ్దికి తలుపులు తెరవడానికి సర్వసన్నద్ధమై సంసిద్ధంగా వేచివున్న వేళ ఈ నవ యుగోదయ శుభవేళ పెద్దగా ఆలోచిద్దాం చిన్నగా ప్రారంభిద్దాం నిర్విరామంగా పరిశమిద్దాం పాతపాటనే పట్టుకు వేలాడడం ఈ ప్రమాది ఉగాది నైజం ఎంతమాత్రం కానేకాదు.
ప్
నేడు కావలసినది ఫ్యాషన్ పురుషుడు కాదు తనమీద తనకు నమ్మకంగల పరిపూర్ణ పురుషుడు నేడు కావలసినది ఫ్యాషన్ స్త్రీ కాదు ఆత్మవిశ్వాసం తొణికిసలాడే పరిపూర్ణ స్రీ అపరిపక్వ మిడిమిడి జ్ఞానంతో మిడిసిపదే మిడిమేలపు దొరలు దొరసానులు కాదు నేడు కావలసినది మార్పుకు స్వాగతం పలికే ముందుయుగం అధినేతలు ! ఎలాగోలా రోజులు నెట్టుకొచ్చే చచ్చుపీనుగలు కాదు నేడు కావలసింది కాలంతో పోటీపడే చిచ్చరపిడుగులు ఉక్కుపిండాలు 6
తమకుతాముగా ఉన్నత ఉన్నతోన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని శిఖరారోహణ చేసి మనోజ్ఞమైన విజయం చేజిక్కించుకునే వారు ప్రతిభా పాటవాలతో తమదైన ప్రత్యేక విలక్షణతను. నిలబెట్టుకునే వారు ఆశావహ వాతావరణంలో భవితకు ఆశాకిరణంగా భాసించేవారు పాతతరం భుజాలమీద ఎక్కి వారికంటే ఎంతో ముందుకు చూసే చురుకైన కొత్తతరం ఇంటా బయటా గెలిచే ఏక వ్యక్తి సైన్యం యాజమాన్యపు మెలకువలు కరతలా మలకం చేసుకున్న యున గురువులు కావాలి ! ఒకటీ అరా విజయాలకే ' తెగ సంబరపడిపోయి
7
చేతులు ముడుచుకొని
గతరకీర్తి వడ్డీమీద
బతికే వాళ్ళు కాదు
నేడు కావలసినది
అనుక్షణం కొత్త సవాళ్ళను
ఎదుర్శొని
నిత్యవిజయం సాధిస్తూ
కీర్తి బావుటాలను ఎగరేసుకుంటూ
మున్ముందుకు ఉరికే
చురుకుగా స్పందించే
కొత్త తరం రావాలి
కొత్త రక్తం కావాలి.
తమకు ఎదురేలేదని విర్రవీగుతూ
తమ గొప్పతనాన్ని తామే
టముకు వేసుకుంటూ
ఎకసెక్కెపు నవ్వులు ఒలకపోసే
మొదటి ప్రపంచ రాజ్యాల దాష్టీకానికి
కుతకుత ఉడికిపోయి
ప్రజ్ఞను నిపుణతను
పుక్కిటబట్టి
తమను తాము
విశ్వమంత విస్తరించుకునే
మూడో ప్రపంచ వీరులు కావాలి ! 8
“రోడ్లు ఊడ్చడమే మీ పని అయితే ప్రపంచంలో మీ అంత పరిశుభ్రంగా ఊద్బగలవారు మరెవరూ లేరన్నట్లుగా ఊడ్చాలి 1” ఒక కోయిల కూయడంతోటే వసంతం రాదు చెడ్డ గొప్పగా చెప్పాలంటే స్వావలంబనతో స్వయంశక్తితో అంకితభావంతో జాతి జాతంతా ఒక్కతాటి మీద నిలవాలి ! అతి మృదువుగా మాట్లాడుతూనే ఎప్పుడూ ఒక దుద్దుకర్ర చేత ఉంచుకోవాలి ! వెనకబాటుతనం మన శాశ్వత చిరునామా కాకూడదు గోళ్లు గిల్లుకుంటూ కూర్చోక విల్లు ఎక్కు పెట్టాలి ఊగిసలాట ధోరణిని విదనాడి కృతనిశ్చయంతో సర్వశక్తులూ ఒడ్డి ఏ క్రీడలోనైనా ఏ నిర్వహణలోనైనా
రి
అందరినీ అధిగమించి స్వర పతకాల హారంతో స్వర్ణ భారతి కంఠసీమ నలంకరించాలి మన దేశాన్ని కొత్త అంచెకు తీసుకెళ్ళాలి | ప్రపంచమంతటా మన మాట చెల్లుబాటు కావాలి ! ప్రపంచం నమ్మినా నమ్మకపోయినా రేపు మనదే నూతన శతాబ్దిలో అన్నిటికన్నా ఎత్తుగా ఎగిరే జెండా మనదే ! = = *, ఆకాశవాణి, నిజామాబాద్ 10
రంగుల వల ఘంటసాల నిర్థల చిన్నారులు మూదు నెలల వరకూ చూపు నిలపరట మా బామ్మ అనేది పుట్టిన మూడో రోజు నుంచే చానెళ్ళ టీవీ మీంచి చూపు తిప్పరని మనం చూస్తున్నది ! అవునుమరి ఇవాళ పురిటి పాపాయి పక్కన మనం పెట్టుకునేవి పొత్తిగుడ్డలు కాదు - పోర్టబుల్ టీవీలు ! తెల్ల వారి లేస్తే మా వాకిలి ఒక వాణిజ్య ప్రకటన ! మా వీధివీధీ ఒక రంగుల అమ్మకాల సముద్రం బుల్లితెర బల్లి వాతెర అయినప్పడు మధ్యతరగతి మనసంతా మనమంతా జిగట వీడిరాలేని ఈగలమే - రోగులమే ! ఏ బ్రాండు దువ్వెన వాడితే ఎన్ని బంగారు పతకాలో మామూలు ఉప్పు ఉపయోగిస్తే మాటపడిపోవడం వంటిదేదో ఎలా ఖాయమో స్నానం చెయ్యడం కంటే ఏదో కంపెనీ గంధాలపూత ఎంతలా నయమో ఉద్దాటించే ఉపద్రవాలు-వస్తువినియోగ ప్రచారం ఇవాళ మనకు పెద్ద సవాలు! మోహన్ ప్రమోషన్ చేయిజారడం అతగాడి రాధ రుద్దిన బట్టలసబ్బు వల్లనే స్నానాలగదిని ఒక తల్లి తెల్లగా.... మరింత తెల్లగా వీళ్ళ పొడరుతో కడిగితే ఆవిడ బుజ్ఞాయి అనతికాలంలో పైలట్ అయిపోతాడు ! 11
జరగని పెళ్ళిళ్ళన్నీ నల్లని అమ్మాయిలవేననీ మేనిచాయ పెంచుకుంటే చాలు మ్యాజిక్ చెయ్యవచ్చనీ పీటల మీద ఆగిపోయిన పెళ్ళి ఫలానా టీసెగలతో అలవోకగా జరిగిందనీ అబ్బబ్బా ఒకటా రెండా ఎన్నని అసంబద్ధ అతర్మ కుతర్మ ప్రకటనలు || బుజ్జిగాడి చెడ్డీ పండుతల్లి మిడ్డీలూ ఆవిడగారి తుంటినొప్పీ మామగారి తలనొప్పీ పరీక్షల్లో జ్ఞాపకశక్తీ పరాయివంటల అనురక్తీ అన్నిటికీ మసి పూసి మారేడు సమస్యల్ని చేసి మళ్ళీ వాటన్నిటికీ తమ ఉత్పత్తుల విబూది పూసి చిటికెలో మాయం చేసి వీక్షకుల వికారాల మీదా అమాయకుల ఆకాశ విహారాల మీదా కలల పెట్టుబడి కాసుల రాలుబడి ! తెల్లవారి లేస్తే నిరవధిక నాటక అంకాలు |! ఇంకా కావాలంటే తెల్లవారడమూ పక్కమీంచి లేవడమూ కూడా అనవసరం - “ఆఫ్‌టైమరూ' “ఆన్ టైమరూ ఉండగా పగలూ రాత్రీ కవ్వించే జోకొట్టే తారావిభాగాల వీక్షణలు ఉండగా ! అనాది మానవుడి గుప్త వాంఛలన్నీ ఛానెలీకరించి కలల్నీ ప్రలోభాళ్నీ సరికొత్త మోసాల్నీ అతిపాత మోహాల్నీ (కోడీకరించి వాణిజ్య ప్రకటనలుగా రంగరించి గుచ్చే ఈ ఖండాంతర బేహారులు 12
మనల్ని ఏ పాతాళంలో పాతరవేస్తున్నారు ? ఆధారమే లేని ఏ ఆశల ఆకాశంలో ఆటబంతిని చేస్తున్నారు ?? పొద్దస్తమానూ దృశ్యాల కఠోర కొక్కేనికి వెరికళ్ళనెలా వేలాడదీయిస్తున్నారు ??? సభ్యతా మానవత్వమూ ఇంకా మత్తిల్లని కొద్ది జనాభాకు ఒకే ఒక్క సందేహం ఉపగ్రహం పుణ్యమా అని ప్రపంచమంతా మన చుట్టే కానీ చుట్టూ ఉన్న ప్రపంచం మనకింత దూరమూ అని !
- . , ఆకాళవాణి, విజయవాద 13
పాట కోసమె నరాల రామారెడ్డి పాట కోసమే పుడుతుంది కోయిల పాట కోసమే బతుకుతుంది కోయిల స్వరం - అది పుట్టుకతో తెచ్చుకొన్నవరం అది మధుమాసం అడుగుపెడితే ప్రజ్వలించే భాస్వరం కోయిల గొంతు విప్పుతుంది కొమ్మల ఊయల్లో రెమ్మల పొత్తిళ్ళలో పవ్వళించిన పూల పాపలకు జోల పాడుతుంది పులకించిన పూల మనసులు నవ గంధాలై ప్రసరిస్తాయి మధురించిన పూల తనువులు మకరందాలై ప్రవహిస్తాయి. ఎవరికోసం పాడుతుంది కోయిల ఎందుకోసం పాడుతుంది కోయిల గళం విప్పకపోతే కాలం గడవదా ? గానం చెయ్యకపోతే కాలం ఊపిరాడదా ? గాలివీచేది ఎవరికోసం ? పూలు పూచేది ఎవరికోసం ? వెన్నెల కాసేది ఎవరికోసం ? కోకిల కూసేది ఎవరికోసం? 14
ఏం లాభం ఆశించి కోకిల మధుమాసం కోసం తపస్సు చేస్తుంది ళ్గి ఏ ఫలితం ఊహించి కోయిల పంచమ స్వరాన్ని జ్వలింపచేస్తుంది ? అవార్డుల కోసం అడ్డదారులు తొక్కదు కోయిల డాక్టరేట్ల కోసం పైరవీలు చేయదు కోయిల అది ఒక రాగతపస్వి అది ఒక నాద మహర్షి పిడికెడు చిగుళ్ళను తిని పుట్టెడు రాగాలను పండించే కోకిలకన్నా ఉత్తమ గాయకుడెవ్వరు ? మన తనువుల్ని పరవశింపజేసి అనుభూతి డోలికల్లో ఊగించే కోయిలకన్నా ఉన్నత కళాకారుదెవ్వరు ? దాని కంఠానికి కనకాభిషేకం చెయ్యండి. దాని పాదానికి గండపెండేరం తొడగండి. ఏ పాట వింటే - కర్మశత్వాన్ని కక్కే కొండల గుండెలు కలకండలుగా కరిగిపోతాయో ఏ పాట కోసం 195
శ్వామల శాద్వలాలలో వనాల యౌవనాలు పూచి విరిదండలుగా పరిమళిస్తాయో ఏ స్వరమధురిమ కోసం - పరవళ్ళు తొక్కే సెలయేళ్ళు నురుగుల నవ్వుల్ని వెదజల్లుతాయో ఏ రసానుభూతి కోసం - కొమ్మలలో దాగిన గువ్వలు వెన్నెల మువ్వలా ప్రతిధ్వనిస్తాయో ఆ కోకిల గాయకునికి మామిడి కొమ్మల కోవెల కట్టండి గుండెలను కర్పూర ఖందాలుగా చేసి హారతి పట్టండి కొమ్మకూ కోకిలకూ ఉన్న పవిత్రబంధం కోటి జన్మల కళానుబంధం కొమ్మ లేకుంటే కోకిలకు స్థానమెక్కడిది ? కోకిల లేకుంటే కొమ్మకు గానమెక్కడిది ? అందుకే ! ఓ మానవులారా ! గొడ్డళ్ళను పట్టుకొన్న దానవులారా ! హరిత స్వప్నాలను పూయించే అరణ్యాలను ధ్వంసం చెయ్యకండి మధుర స్వర్ధాలను చిత్రించే వసంతాలను దగ్ధం చెయ్యకండి. = = , ఆకాశవాణి, కదవ 16
పూలపల్లకి దా. రామడుగు వెంకటేశ్వర శర్భు ముత్రైదునలెయైన (మోడులా అవి? కావు వీరేశలింగమ్ము సౌరుగాని కమ్మని కోకిల గళరవమ్మటె? కాదు బాలమురళీకృష్ణవాణిగాని శెప్ప విప్పిన పూలరేకటే అది? కాదు బాపుగీసిన బొమ్మ రూపుగాని భాన మాధుర్యంపుపరిమళమ్మటె? కాదు అలకృష్ణశాస్రి కావ్యమ్ముగాని అనగనొప్పారె వాసంతహాసరేఖ వేదమై శుకశారికా నాదమలర తెలుగు భారతి కల్యాణ లలితవేది అనగ నామని యొప్పె నుగాదివేళ “క్సృద్రరెన్ బుద్ధి వయోజనాజ్ఞులము; మాకున్ మాధవా ! విద్య అ భ్యుదయంబందె; ప్రవాళ పత్ర విభవంపుంజీరలందీయ” నం చుదితామోదము చాటు గోసికలయట్లొప్పారు భూజమ్ముల ల్లదిగో ! కోకిల పంచమశ్రుతుల నాలాపించె వైత్రమ్మునన్ 17
పలురకమ్ముల రుచుల్ ప్రసరించుబడ్జెట్టు చవులూరుగాది పచ్చడియెకాగ వీస్పృతాశల నొప్పు విజనుట్వొంటీ ట్వొంటి భవ్యవాసంత వైభవముకాగ సరసమౌ రైతు బజార్ రేట్ల కేకలే నూతన పైకంపు గీతి కాగ జన్మభూమి ఫలాల సత్పరీమళ వాయు వలె చైత్ర చైతన్య కళలు కాగ క్షీను-గ్రీనుల (శమదాన లీలమెరయ ప్రజల నలరించి స్వర్దాంధ్రవరమొసంగ సార కవి కుమారాళినిన్ స్వాగతింప వచ్చుచుంటివె ? నూతన వత్సరమ్మ ! చేదు చిగుళ్లు మేసి గళసీమ వినిర్గత గాన మాధురిన్ మోదమొసంగు నావలె నమోఘపు బాధల క్రుంగి సౌఖ్య సం పాదనందోడి వారల కవారిగ మీరలు కూర్చుడన్ గతిన్ స్వాదు కుహూకృతిన్ బికము భాసిలె నామని మావితోపులన్ త్యాగ గంధాల గేహము దీర్చు సతివోలె నీ లోన ఆమని నివ్వటిల్ల గడగడ లాడించు ఉడుకు రక్తపు కుజ్జ మాడ్కి నీలోన గ్రీష్మమ్ముదనర 18
ఫలమెట్టులున్నను పాఠమాపని ఒజ్జ సరణి నీలోన వర్పర్తువొప్ప సౌఖ్యదుఃఖాల ప్రసన్న మానసుదైన ప్రభువోలె నీలో శరత్తువరల పైకిమెత్తగ నుండి వణకించు నరువోలె నీలోన హేమంత హేలగ్రాల గుండె కుంపట్లు తొలగించుకొను గృహస్థు రంగువోలె నీలో శిశిరమ్ము వెలయ కాలపుచిటారుకొమ్మపై తేలుపూవ ! రమ్యరసలీల పూసి చేరంగరమ్మ! మీటను నొక్కగా ప్రజనమేయ గతిన్ దరిసింప జేసి, కం ప్యూటరు కందకుండగ మహోన్నతి “ఇంటరు నెట్టు” వౌదు పో! దీటుగ ఓ ఉగాది ! ప్రకృతిన్, మరి నీదగు ఛానెలందునేన్ చోటు నొసంగుమామనికి సొంపుగ మామనముల్ విభాసిలన్ కష్టాల కడలిలో కరగెడి ప్రజపరా మర్శించు ఒక పెద్ద మనిషి వోలె రంగ స్థల స్తబ్ధ భంగినే మార్చ ఉ న్నటులే ప్రవేశించు నటుని వోలె సరస సతృ్మవి హృదంతరమున తరగలై పరుగెత్తు చిక్కని పాటవోలె 19
శిశిరమ్ము గట్టెక్క స్థిర జయశ్రీని గ మ్యము చేరు నూతన మహిళ వోలె సంఘమనెడి పద్మవ్యూహ సరణి చీల్చి విజయుడై వెల్లు విక్రమ వీరునివలె వచ్చుచుంటివె ! నూతన వత్సరమ్మ ! రెండు పేరుల ప్రకృతితో రేగకుంద బాలుని చేత కొట్టబడు బంతివలెన్ గనరాని శక్తిచే కాలము దొర్హు చుండెను యుగాలుగ్య షష్టి గతించియున్ ప్రమా దీ ! లలితంపు విక్రమ గతిందలపించుచు నీవు “ఏప్రియల్ ఫూలొ నరింపయబోక మము పూవుల పల్లకిలోన తేల్చుమా |!
-
- = అఆకాళవాణి, విజయవాద ౨20
ఆవేదన దీవుల అప్పులదాజూ ఇక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదని నేననుకోను ఎందుకింత మౌనంగా చూస్తున్నారా అన్నదే నా సందేహం 1? వాడికాలికింది చెప్పుకోసం నీ తలని వేరొకడికి అమ్మేస్తుంటే . . . చూస్తూ వూరుకుంటావేం నేస్తం . . .? పరాయీకరణకి ప్రతీకగా మిగిలిపోతావా? మనిషినీ - పశువునీ వేరుచేసి చూపిన ఆలోచన మనిషినీ - మనిషినీ కూడా వేరు చేస్తుంది సుమా ! అర్ధరాత్రి తీతువ అరిస్తే అకాలమరణం ఎవరికోనని ఆలోచిస్తావునువ్వు దానికెంత ఆకలేసి కేక లేసిందో అనుకుంటాను నేను చిప్పలో రూపాయి కాసు పడేసి దాన కర్టుడై పోవాలనుకుంటాడొకడు అణా విలువలేని రూపాయికి అంత చప్పుడెందుకని అసహనంగా చూస్తుంది అవ్వ ! రలోఫీ గంధాలద్యు గ్గంక మ / ల ధో ల] శో ప లో స సై లో సు
- మైదా బాత ర0
అయినా ఇవన్నీ మీకు తెలియదని కాదు స్థితివేరయ్యింది
పరిస్థితి మారిపోయింది
పశువులు గడ్డితిని పాలివ్వ గలుగుతున్నాయి
మనుషులు గడ్డితిని పాలించగలుగుతున్నారు
బాంబులు పేలినచోట భవనాలు కూలుతున్నాయి
ధరలు పేలినచోట ప్రభుత్వాలే కూలిపోతున్నాయి
ఉప్పు ఎంత గొప్పదో మహాత్ముడికొక్కడికే తెలిసిందప్పుడు ఆ మధ్య అనుభవంలోకొచ్చి మానవులందరికీ తెలిసిందిప్పుడు అయినా ఇవన్నీ మీకు తెలియదని కాదు
అవసరాలు మారుతున్నాయి
పరిసరాలు మారుతున్నాయి
అనుభవాల నాగేటిచాళ్ళు
నుదుటిమీద ప్రస్ఫుటిస్తున్న రైతులు
అరచేతుల్లో అద్భృష్టరేఖల్ని వెతుక్కుంటున్నారు
ఎర్రగా వర్రగ్గా పండిన మిరపకాయల్ని చూసి
కళ్ళల్లో కారం పోసుకున్న దళారులు
బైబై
రింగులు కట్టి రంగులు మార్చేస్తుంటె. . . .
బెంగగా చూస్తున్నారు.
బస్తాలతో పత్తిని బజార్లో పెట్టి
కళ్ళు పత్తికాయల్లా విచ్చుకు చూస్తున్నా
పత్తా దొరకదు మద్దతు ధర
అప్పడు విత్తనాలూ వాడే ఇచ్చి
ఇప్పడు పత్తీ వాడే ఇస్తే
రైతు చిత్తయిపోక ఏం చేస్తాడు?!
అయినా ఇదంతా మీకు తెలియదని కాదు హద్దులు మారుతున్నాయి
సరిహద్దులు చెరిగి పోతున్నాయి
రుద్రాక్షను దారానికి గుచ్చి మెడలో వేసుకున్నట్టు భూగోళాన్ని వ్యాపారానికి గుచ్చి మెడలో వేసుకుని గోబలైజేషన్ అంటున్నాడు ప్రపంచ బిజినెస్ మేన్ ! నైబర్‌ని చూసి - సైబర్ వాతలు పెట్టుకుంటే ధనుర్వాతం రావచ్చు గానీ - సిరిపూర్ సింగపూర్ కావచ్చంటావా? ఇవన్నీ ఇక్కడ తెలియని వారున్నారని కాదు ఆలోచిస్తున్నారా అసలు విషయం అని?!
22నే
హక్కులు మారి పోతున్నాయి ఆశల రెక్కలు విరిగి పోతున్నాయి కాలం సాక్షిగా కాకిగూటిలో కళ్ళు తెరిచినందువల్ల కోకిలపాట మీద పేటెంటు హక్కు కాకిదేనట ! ఉగాది పచ్చడిలో వేపపువ్వు వాడేరో పసీబెంట్ ఉల్లంఘనలో మీరూ నేరస్తులే ! మీసం ఎన్నిమిల్లీ మీటర్ల పొడవుండాలో మూతిగలవాడిది కాదు నిర్ణయం క్షత్తైెరగలవాడిదే పెత్తనమంతా ..! అయినా ఇదంతా ఎవ్వరికీ తెలియదని కాదు పరిశీలిస్తున్నారా ప్రపంచాన్ని? పట్టించుకుంటున్నారా ప్రపంచాన్ని? లెక్కలు తారుమారయి పోతున్నాయి హక్కులు హద్దులు మీరుతున్నాయి సైన్సు ఛమక్కులు సృష్టికి చరమ ఘడియలు లెక్కపెడుతున్నాయి టెక్నాలజీ - టెక్నిక్కులతో ప్రపంచాన్ని పరిపాలించాలని చూస్తుంది తేడ
నీకు గుడ్డు కావాలా?
అసలు నీకోడి గుద్దు పెట్టదు - అది బ్రాయిలర్ | నీకు పిల్లకావాలా ?
సీ గుడ్డు పిల్లవదు - ఆది లేయర్ ఎగ్ గుడ్డుకయినా - పిల్లకయినా నీకు వాడేగతి ! కాలచక్రాన్ని కబళించిన సైన్సు
కసాయి వ్యాపారం చేతిలో పేటెంటు పొందుతోంది ! అయినా ఇదంతా మీకు తెలియదని కాదు
నా ఆవేదనని ఆవిష్కరించుకుంటున్నానంతే. ం రేపు - ఒక వేళ -
టెర్మినేటర్ టెక్నాలజీతో
ప్రపంచం మీదికి ప్రళయాన్ని తేబోతున్న మృత్యువీజాలు. ఎం
మానవునిలోని జీవశక్తినీ మాయం చేస్తే. . . . సోదరా. ...
సందేహం లేదు
జీవితానికి కూడు పెడుతుందనుకున్న సైన్సు జీవశక్తికి పిండాకూడు పెడుతోందివాళ !
ఓ... జీసస్... యా...అల్లా.. హే... రామ్ ప్రకృతిని పిడికిట్లో బిగించి
లైక్
ప్రపంచాన్ని శాసించాలని చూస్తున్న సాతానుపుత్రుల్ని సర్వనాశనం చెయ్యండి మాతరం, మరోతరం - ఇంకోతరం తరంతరం నిరంతరం వికసించేట్టు చెయ్యండి ! వందేమాతరం |! వందేమాతరం |! వందేమాతరం 111 = = _ అకాళవాణి, విశాఖవట్నం న్
బుద్దిలో భూకంపాలు పుట్టాలి దా. కటువగుంట రామమూర్తి బుద్భుడో సిద్ధుడో జ్ఞానవృద్ధుడో పుట్టాల్సివుంది ! మన బుద్ధిలో భూకంపాల్ని పుట్టించాల్సి వుంది! ఈ యాంత్రిక మాంత్రిక మహానగరాల్లో మానవతా విలువలు వలువల్లా వీడిపోతున్నాయి క్రియాశీలత వక్రించిన కురుక్షేత్రంలో మన ఊరివాడి ఊరుభంగాన్నే మనం కాంక్షిస్తున్నాం ఎదల మీద పడుతున్న దురాశల గదాఘాతాలకు సుధారస భాండాలు చిట్లి వసుధ వ్యథావిలాపం చేస్తూంది | దుశ్చాసన భీషణ హస్తాల్నుంచి ఆదుకునే కన్నయ్యలు అన్నయ్యలు కరువౌతున్నారు అందుకే. . . బుద్ధుదో సిద్ధుడో జ్ఞానవృద్ధుడో పుట్టాల్సివుంది మన బుద్ధిలో భూకంపాల్ని పుట్టించాల్సి వుంది | = మనుష్యుల మధ్య అనుబంధాల ముడులు సడలిపోతున్నాయి ఆప్యాయతల అంతస్సూత్రాల్ని క్రిములు నమిలివేస్తున్నాయి మనిషి మనసును పరిమళింపచేసే సుగంధం ఏ గంధర్వలోకాల్లో దొరుకుతుందో చెప్పండి ! మానవత్వం కట్టలు తెంచుకోవదానికి మనలోని ఏ గర్వగంథుల్ని పగులగొట్టాలో ఆ రహస్యం విప్పండి ! లగ
మాటకు లోతును పెంచడానికి
ఏ డైనమేట్‌ను పేల్చాలి ?
చేతకు నీతిని అద్దడానికి
ఏ కలంకారీని నేర్వాలి ?
నవ్వులో పువ్వులు రాలడానికి
ఏ తాయెతును కడదాం ?
చూపులో కారుణ్యం ఒలకదానికి
ఏ కనుకట్టును కనిపెడదాం ?
చెప్పరే?... ఈ రహస్యం విప్పరేం ?
అందుకే... బుద్ధుడో సిద్భుడో జ్ఞానవృద్ధుడో పుట్టాల్సివుంది
మన బుద్ధిలో భూకంపాల్ని పుట్టించాల్సి వుంది
మనిషి పుట్టింది సహజాతులతో సహజీవనం చేయడానికే 1
దేవుడు మనసు పెట్టింది సాటి మనిషిని (ప్రేమించడానికే 1
మరి ఎందుకు ?
నవవధువు వేస్తున్న ఏడడుగుల్లో ఏడుపు ధ్వనిస్తోంది ?
అగ్నిసాక్షిగా పెళ్ళాడిన అబల ఆ అగ్నికే ఎందుకు ఆహుతి అవుతోంది?
మన జనారణ్యానికి అంటుకున్న
ఈ దౌర్భాగ్యపు దావానలాన్ని ఆర్బే
కారుణ్యపు కారుమబ్బులు ఉబికివచ్చే బుతువెప్పడొస్తుంది ?
మేఘాడంబరం లేని అంబరం ఎప్పడు సంబరాల వరాల్ని వర్షిస్తుంది?
మనిషిని తిట్టాలని వాడిని
ద్విపాద పశువని, మానవ మృగమని
నరరూప రాక్షసుడని, నడిచే విషసర్పమనీ ఉపమించకండి ! 28
ఎందుకంటే పాపం అది వాటినే తిట్టినట్టవుతుంది !
అవి మనిషంత క్రూరంగా జీవించడం లేదన్న సత్యాన్ని విస్మరించినట్టవుతుంది!
మనిషికింత మనసును సృష్టించే
పరుసవేది కావాలిప్పుడు ! ఆ రసవాది రావాలిప్పుడు !
అందుకే బుద్ధుడో సిద్ధుడో జ్ఞాన వృద్ధుడో పుట్టాల్సి వుంది !
మన బుద్ధిలో భూకంపాల్ని పుట్టించాల్సి వుంది !
పొగచూరిన కొమ్మల మీద కోకిలమ్మలు
సంతాపగీతాల నాలపిస్తున్నాయి !
వేర్లు పీల్చుకున్న రసాయన కషాయాల
చివుర్లు తిన్న చిలుకమ్మలు కొమ్మల మీద సోలిపోతున్నాయి !
భవిష్యత్తరాలకు మనం
వేపకొమ్మల్ని కోకిలమ్మల్ని
బొమ్మల్లో చూపించాల్సి వస్తుందేమో !
చీరకట్టును కుంకుమ బొట్టును
చేతిగాజును కాలిమట్టెను - ఆడపిల్లలు
పురావస్తు ప్రదర్శన శాలల్లో చూడవలసిందేనేమో !
ఈ గ్లోబలైజేషన్ సివిలిజేషన్ విస్తరణలో
మన ఆర్ష సంస్కృతి, మన తెలుగు సంప్రదాయాలు
అడుగంటి పోయాక మన అడ్రస్సును మనం కోల్పోక తప్పదేమో !
అందుకే నేనంటాను ... ఏ బుద్ధుడో సిద్ధుడో జ్ఞానవృద్ధుడో పుట్టాల్సి వుంది
మన బుద్ధిలో భూకంపాల్ని పుట్టించాల్సి వుంది .
స్వచ్ళ హిమగిరి గళితగంగ మన ధాటికి కలుషితమై పోతోంది
శుభ్రాభ హిమకర సరళజ్యోత్న్న మన దాడికి మసకబారుతోంది
విశాల వినీల వినువీధి చెత్తాచెదారంతో విపణి వీధిలా మారిపోతోంది. 29
వృక్షాలు ఒరిగిపోతున్నాయి భూగర్భ జలాలు తరిగి పోతున్నాయి. గాలులు గంధాలు కోల్పోతున్నాయి - నేలలు నిస్సారాలౌతున్నాయి. జనాభా కబంధ హస్తాలకు, ప్రకృతి వికృత రూపం దాల్చుతోంది పాంచభౌతిక శరీరధారి మానవుడు పంచభూతాల్ని పరిరక్షించుకోకపోతే మనిషికొక మనికేమిటి ? ఉనికేమిటి ? తరుదేవో భవ గురుదేవో భవ అన్న వేదవాక్కులు మాతృదేవోభవ పితృదేవోభవ అన్న ఉపనిషత్సూక్తులు సర్వేానా స్పుఖినోభవన్తు అన్న బుషి బుక్కులు రుచించకపోతే సీచులు మారీచులు పెరిగి మానవత్వం మంటకలసిపోతుంది అందాల సంధ్యలు అపురూపాలవుతాయి పండువెన్నెల నిండుపున్నమలు గుండు సున్నాలవుతాయి బుతుచక్రం గతితప్పిపోతుంది పశుపక్షులు అలసి అంతరించే దైన్యంలో ఉగాదులు ఉషస్సులు రాని ఊసరక్షేత్రాల హైన్యంలో మనిషి మేథోపజీవే ! అయినా అతనికి మిగిలేది అంధకార బంధురమైన భావే 1! అందుకే ఈ ప్రమాది ఉగాది శుభోదయాన నేను ఆకాంక్షిస్తున్నాను సంతస శరశ్చంద్రికల్ని మన ముంగీళ్ళోలో దివ్వెలుగా వెలిగించే బుద్భుడో సిద్ధుడో జ్ఞానవృద్ధడో పుట్టాల్సి వుంది మన బుద్ధిలో భూకంపాల్ని పుట్టించాల్సి వుంది ! *, = *, ఆకాళవాణి, తిరుపతి ౩0
పావన మదవల్లి భదయ్య ఆమనొచ్చినపూట - అరుదైన విరిబాట భ్నదయ్య గున్నమావేపూయ - కోయిలమ్మే కూయ వోయిగా అరుదెంచు - అమ్మ” ప్రమాదిపై కవిత చెబుతానంటు - కలము నేబూనగా అరువదేడులనాటి - అలజడిని మది దలచి రెండో ప్రపంచపు యుద్ధ చాయకు వగచి కనుకొలకుల బాప్ప కొలనులే కన్పట్ట గుండె చేతులబట్టి పిండిసట్టులదోచె దేశపు దశదిశలొ - దిసమొలతొ తారాడు చేదు నిజాలనే కధలు - కైతగ జెప్పె. పల్లవి: వినరండు వినరండు వింతలన్నీ - ఎటులపూడ్చుదుమొ ఈ కంతలన్న్వీ ఎటులోర్లు మీవంతలన్నీ - దూరమయ్యేదెట్లు చింతలన్నీ. మెడబడ్డ పాములై - తడబడేట్లుగజేసి సిగపట్లు పట్టించు - సీనిమాకతలోలె వగపునే మిగిలించు - తగినట్టి వార్తలే ఏనాటికానాడు ఎక్కువై మిక్కిలై ఊపిరాడని ఊసులే ఊళ్ళముంచగా 1వినరండు॥ వ]
వృక్షాలు ఒరిగిపోతున్నాయి భూగర్భ జలాలు తరిగి పోతున్నాయి. గాలులు గంధాలు కోల్పోతున్నాయి - నేలలు నిస్సారాలౌతున్నాయి జనాభా తీబంధే హేస్తాలకు, ప్రిక్ఫీకి విక్ళితీ రూపం దాల్చుతోంది పాంచభౌతిక శరీరధారి మానవుడు పంచభూతాల్ని పరిరక్షించుకోకపోతే మనిషికొక మనికేమిటి ? ఉనికేమిటి ? తరుదేవో భవ గురుదేవో భవ అన్న వేదవాక్కులు మాతృదేవోభవ పితృదేవోభవ అన్న ఉపనిషత్సూక్తులు సర్వేజనా స్సుఖినోభవన్తు అన్న బుషి బుక్కులు రుచించకపోతే నీచులు మారీచులు పెరిగి మానవత్వం మంటకలసిపోతుంది అందాల సంధ్యలు అపురూపాలవుతాయి పండువెన్నెల నిండుపున్నమలు గుండు సున్నాలవుతాయి బుతుచక్రం గతితప్పిపోతుంది పశుపక్షులు అలసి అంతరించే దైన్యంలో ఉగాదులు ఉషస్సులు రాని ఊసరక్షేత్రాల హైన్యంలో మనిషి మేథోపజీవే ! అయినా అతనికి మిగిలేది అంధకార బంధురమైన భావే అందుకే ఈ ప్రమాది ఉగాది శుభోదయాన నేను ఆకాంక్షిస్తున్నాను సంతస శరశ్చంద్రికల్ని మన ముంగిళ్ళలో దివ్వెలుగా వెలిగించే బుద్ధుడో సిద్ధుడో జ్ఞానవృద్దుడో పుట్టాల్సి వుంది మన బుద్ధిలో భూకంపాల్ని పుట్టించాల్సి వుంది !
- . = ఆకాళవాణి, తిరుపతి 30
'ని'వేదన మడిపల్లి భ్మదయ్య ఆమనొచ్చినపూట - అరుదైన విరిబాట వెండివలె నిండుగా - మెరిసె 'వే పూదోట గున్నమావేపూయ - కోయిలమ్మే కూయ హాయిగా అరుదెంచు - “అమ్మి 'ప్రమాదిపై కవిత చెబుతానంటు - కలము నేబూనగా అరువదేడులనాటి - అలజడిని మది దలచి రెండో ప్రపంచపు యుద్ధ చాయకు వగచి కనుకొలకుల బాప్ప కొలనులే కన్పట్ట గుండె చేతులబట్టి పిండినట్టులదోచె దేశపు దశదిశలొ - దిసమొలతొ తారాడు చేదు నిజాలనే కథలు - కైతగ జెప్పె. పల్లవి; వినరండు వినరండు వింతలన్నీ - ఎటులపూడ్చుదుమొ ఈ కంతలన్నీ ఎటులోర్లు మీవంతలన్నీ - దూరమయ్యేదెట్లు చింతలన్నీ, మెడబడ్డ పాొములై - తడబడేట్లుగజేసి సిగపట్లు పట్టించు - సీనిమాకతలోలె వగపునే మిగిలించు - తగినట్టి వార్తలే ఏవనాటికానాడు ఎక్కువై మిక్కిలై ఊపిరాడని ఊసులే ఊళ్ళముంచగా ॥వినరందు॥ ప్రే
నాదైన నేదైన పేదోడు పేదోడె పెద్దోడు పెద్దోడె ఎద్దుకష్టము జేసి - గడ్డి గాదము మేసి గంజిగట్మకు లేక - గింజుకుంటున్నాడు పైస పరపతి లేక - పిసుక్కుంటున్నాడు 1॥వినరండు॥। “పట్నాలనీడలో - పల్లెజాడలు మారె నీడలను నమ్ముకొని - ఊడలేతెంచుకొని వస్తుజాలపు మాయగాలమున తాచిక్కి తన తప్పుకాదని - కాలాన్ని నిందించె” 1వినరందడు॥ కలియుగమా ఇది - కలితి యుగమా ఇది ఎటు జూచినను కల్తి - ఏదబోయిన కల్తి మాట కల్తీ - మనసు కల్తీ పనులు కల్తీ - జనుల వనరులే కల్తీ విత్తనాలలొ కల్లి - పెత్తనాలలొ కల్తి పంట కల్తీ - వంట నూనెలే కల్తీ పాలు కల్తీ - ప్రతీ మాలు కల్తీ కల్లు కల్తీ - రెల్లు కల్తీ పైస కల్తీ - పైస బాండులే కల్తీ ॥వినరండు॥ పురుగుమందులు కల్తి - కరగు చక్కెర కల్తి తిరుగుయంత్రము కల్తి - పెరుగు తంత్రము కల్రి వెల
అందాలు కల్తి - ఆనందాలు కల్తి బంధాలు కల్తి - అనుబంధాలు కల్తి ప్యానల్లు కల్తి - ఛానళ్ళునూ కల్తి క్యాసెట్లు కల్తి - కంప్యూటర్లు కల్తి అవార్డులలో కల్తి - రివార్డులలో కల్తి సక్మారమున కల్తి - భీత్మారమున కల్తి కల్తీల కనిపెట్టు - యంత్రాంగమే కల్తి కల్తీని అరికట్టు - మంత్రాంగమే కల్తి చంటి పాపలకిచ్చు - చనుబాలలో తప్ప అమ్మదనమును పంచు - ఆత్మీయతలో తప్ప అడుగడుగు కల్తీలు - కత్తిమొనలైనిల్చి అడిగినోడిని గాల్బె - బడుగు వాడిని గూల్చి కల్తీల కాలమై - వెలితియే మిగులంగ కలియుగమ్మా! ఇది కల్తి యుగమా ! ఓ మనిషీ ! శతాబ్దాంతము నందు ఉండు పండుగనేనె షడ్రుచులు జీవితం పంచు పండుగనేనె తీపి చేదుల గురుతు నెరుక పరతునునేనె ఓపిక జీవితము సాగించు ఓ మనిషి ! చేదులేని తీపినందించు నాకు ఆనాదే కలుగును మంగళము నీకు. . . . అఆకాళవాణి, ఆదిలాబాదు విక
ప్రమాథి - ఉగాది దా. పమిదికాల్వ చెంచు సుబ్బయ్య ఏమని కూయు కోయిల ? మరేమని యీ చిగురాకు కుల్కు ? ఈ యామిని - నా ప్రమాథి నవతాబ్దము శబ్దము విన్న్మయంతనే ఏమి 'పప్రమాదముల్ గలిగి యెంతయు నిచ్చలు దుఃఖ భారముల్ 'ప్రామునా యంచు మానసము ప్రాకుచు నున్నది సౌఖ్యలబ్ధికై మానసహీనమౌ ప్రకృతి మాయయు మర్శ్మమెరుంగకుంద, శో భా నవతోత్సవం బెసగ వచ్చె నుగాది వసంత వేళ్ళ *ఓ మానవ ! నా వలెను మనసు మాయము చేసిన సౌఖ్యమబ్బు, దీ నానన మేలనీ ?” కనుచు హాస విలాస కళా నివాసమై అరువది వత్సరంబు లయినంతట వత్తువుగా ప్రమాథి ! నీ పరువు ప్రతిష్టలున్ కడు నపాయములే ! తవనామధేయమే బరువయి తోచు పాలకుల భావములందు, ప్రమాద మిత్తువో ! నిరుపమ ధైర్య సంపద మనీషులు మెచ్చ ప్రమోద మిత్తువో |! ఆసల మేడ గట్టుకొని, అందు వసించి సుఖింప నెంచి, నీ దాసులు నీదు రాకను సదా మనసారగ స్వాగతించుచున్ వేసము మార్చి, బాసలు గణింపగ జాలని రీతి పల్కుచున్ మాసరి మేమె యంచు బహు మానము లిత్రు ప్రమాథి ! రాగదే ! 34
నీలి వసంత శోభ లిట నెక్కొను చున్నవి దేశమందు, నీ లీల పసందు గూర్చును భళీ ! తెలు గింట ప్రమాథి ! విజ్ఞవై అలము గూర్చబోకుము, సమంచిత ధర్మము నిల్పుమమ్మ ! మా కాలము నీదయా ఫలము, కన్గానవే మము నోట్ల చోట్లలో హింసయె నీదు రూపమని యెంతురు పేరునుబట్టి, నీ విటన్ కంసునివోలె వర్తిలకు, కాలము గాలము సేయబోకు, మీ మాంసకు తావునీయకు, ప్రమాణము సేయుము “సత్యధర్శ్మముల్ శంసిత రాజమార్గమున లాలన చేయుదు” నంచు వర్షమా | గురుడు ప్రభుండు, మంత్రి బుధ కోవిదు, డర్హదళాధిపత్యముల్ పరగె కుజగ్రహంబునకు, భవ్య రసాధిపుడయ్యె చంద్రుడే, సురగురు డయ్యె ధాన్యపతి, శుక్రుడు నీరసపాలుడౌ, శనై శృరుడట సస్యపాలకుడు శాస్త్రము జెప్పు పురోహితుండు, భా స్మరుడు గణాంకకారి, పశుశాలకు కృష్ణుడు నాయకుండు, ని బృరముగ నుండు మందువ ! సువర్ణము హర్షము నింపుసొౌంపులన్ వరలగనో ప్రమాథి ! నుజనంబులు మెచ్చగ రమ్ము రమ్మిటన్ ఊహల గేహమందు మన సూయల లూగెడి మానవాళికిన్ దాహము, గేహదేహ, పరితాపము మాన్సి, ప్రశాంతచిత్తమున్ స్నేహము గూర్చి, దివ్య సమజీవన భాగ్యము నిచ్చి, తల్లి ! వా రాహి ! మహేశి ! నిచ్చేలును రాజిలజేయు ప్రమాథి దేవతా !! వక్
స్వర్ణ భారత దర్శన భాగ్య గరిమ సంతసింపగ వచ్చితి వెంతా ప్రీతి, ఈ యసమ్మతి పొగసెగ నెంతసేపు నిల్తువో ప్రమాథి ! (ప్రమాద నిశల యందు ఎన్ని వసంతముల్ చనెనొ ఈ భువి నీగతి రాకపోకలన్ మన్నన సేయసాగినవి, నవ్యత గూర్చి, ప్రమోదకారివై క్రన్నన నీవు వచ్చితివి కాంచగ నేటి సువర్జ భారతా భ్యున్నతి నో ప్రమాథి ! ధన యోగము భోగము గూర్చవేయికన్ క్రూరాత్ముల్ పచరించుచేంతలను దా క్రోధించి, సస్ర్రేమ పొం గారం బెంచియు సాధుకృత్యముల, నిత్యారోగ్య విద్యాయ శః పారమ్యంబును గూర్చి, పేర్వినగ జెప్పంగల్లు సంత్రాసమున్ పాన్ జేసి ప్రసన్నతా గరిమ నీ నవ్యాబ్ద మొష్పారుతన్ కాలమనంతవాహిని సఖా ! సుఖదుఖపు టొడ్గు రాయుచున్ లీలగ సుళ్లు ద్రిప్పి పయనింపగ జేయుట తత్స్వభావ, మీ వేల విచారముల్ సలుప నెంతువు ? భావము మంచిదైనచో కాలము మంచిదై మన “ఉగాది” యుగాదిగ మోదమిచ్చెడున్ జీవన నందనమ్ము వికసించిన భావసుమమ్ములన్ ప్రమో దావహమై యెసంగి, బహుళాభ్యుదయంబుల కాటపట్టుగా నీవె ఘటింపగా వలయు నిచ్చేలు సుస్థిర రాజయోగ సం సేవిత భోగభాగ్య ఘనశీల సుశాంతి ప్రమాథి వర్షమా |! = = = అకాశవాణి, అనంతపురం 36
ఎక్కడో కోయిలపాట డా, ఎన్, శరత్‌జ్పోత్తారాణి కవిత రాద్దామంటే కదలాడే దృశ్యాలు కన్నీటి చిత్రాలవుతున్నాయి మనస్సు మరోసారి మౌనరాగాలను మీటుతుంది అంతటా వసంతం విరిసిన ఆమని కోకిల పాట కరువైనా కవి కోకిల కంఠాలు నేడు కదం తొక్కుతున్నాయి ఆంధ్రదేశాన్ని చుట్టి వచ్చావుకాబోలు అలసిన నీవు ఆదమరచి ఉంటావు అయినా... వసంతం నీకు స్వాగతం పల్ముతుంది మాకోసం ఓసారి గొంతెత్తి పాడవమ్మా బతుకు పర్వంలో చితికిన బడుగు వర్ణాల గుండెల్లో రాగ సుధలను నింపవమ్మా పుడమిపై నడకలు నేర్చినమనిషి నరుకుతున్న ప్రతి చెట్టూ నరాలు తెగి విలపిస్తున్నయ్ పచ్చదనం నశిస్తుందని ఆక్రోసిస్తున్నయ్ వై
అదిమి పెట్టినా అవకాశవాదుల ఆగడాలు మరో అడుగు ముందుకు వేస్తే శాంతి కోసం నాల్గడుగులు వేసిన నీకు నడి రోడ్డులోని హత్య బాకై గుచ్చుకుందా | ఏదమ్మా ఆ కోయిల పాట కుసంస్మారపు బాటలో మతోన్మాద వేటలో మనిషి మరో మృగమై మారణ.కాండ సల్పితే సిగ్గు పడి దాగున్నావా ఎక్కడమ్మా ఆ కోయిల పాట అధిక ధరల బరువుతో అదిరిపడే గుండెలతో అనుక్షణం అలమటించే సామాన్యుని వేదన అరణ్యరోదనని ! స్త్రీల కోసం ఎన్నో చట్టాలు అయిన స్త్రీల పైనే అత్యాచారాలు అడిగితె ఆకాశంలో సగం అంటారు బస్సులో సీట్లు మీకే చట్ట సభల్లో సీళైందుకంటారు.
౩8
అవమానాల అగ్ని గుండంలో బూడిదైన అతివల ఆర్తనాదాలకు వగచవా ! ఎక్కడమ్మా ఆ కోకిల పాట ఓ కోయిలా... పగిలిన నీ హృదయాన్ని పదిలపర్పుకో (ప్రమాది ఉగాదిలో ప్రమోదాన్ని కల్గించేలా పగలున్నా పది మంది కోసం పాట పాడు నీ పాట నా కవితకు పల్లవి నీ రాక మాకో సందడి గతించిన పునాదులపై ఆశాసౌధాన్ని నిర్మిద్దాం ! మరుగుపడ్డ మమతల మాగాణిలో మరుమళల్లెలను పూయిద్దాం ప్రపంచ శాంతి పల్లవించేలా వసంత గానం వినిపించవమ్మా. . . . ఆకాళవాణి, హైదారాబాద్ వ
ప్రమాది ఉగాదీ! అవుతావా శాంతికి ప్రోది? దా, ఎన్, జవాద్ ముస్సేన్
ఓ నవ వసంత యామినీ ! ఎక్కడున్నది అసలైన ఆమని ? శబ్ద - వాయు - జల - స్థల కాలుష్యాల వికసనంలోనా ? కుల - మత - ప్రాంతీయ కల్మషాల కశ్మ్శలాల పృాదయాల సంకుచితత్వంలోనా ? ఎక్కడున్నది అసలైన ఆమని ? స్వాగతించును నిన్ను ఏమని ? ఆనందపు గాదెలవుతాయని ఎన్ని ఉగాదులను నా ఆశల తడియారా ఆహ్వానించాను ఆశగా గుండెలకు హత్తుకొన్నాను ఆబగా తలపైకి ఎత్తుకొన్నాను ఇన్నేళ్లూ నువ్వు గుపిళ్లతో సంతోష వసంత మకరందాలను పంచుతావనీ మానవ హృదయాలను క్రమ్మిన నల్లని మబ్బుల భయాలను బాపుతావనీ ఆశగా ఎదురు చూశాను
త
తెగిన ఆశల వీజా తండ్రులు సరిచేసి
(శ్రుతి చేస్తావని నమ్ముకొన్నాను
నా నమ్మకం వన్ముయి పోయింది
నా నిరీక్షణ దుమ్మయి పోయింది
నా కిప్పుడు నిరాశ మాత్రమే మిగిలింది
నా జాతి కన్నుల్లో దుఃఖాల పొర పగిలింది
నీవు ప్రతి యేదూ వస్తూనే ఉన్నావు
వచ్చి వెడుతూనే ఉన్నావు
కత్తుల వంతెనల్ని కూల్చి
మసిబారిన మనసులకు కొత్తరంగులద్ది
మానవతా పరిమళాలను లోకమంతా చల్లి
నూత్నలోకపు దారులు తెరవాలని నీ ఆరాటం
మోడు బారిన (బ్రతుకుల వనంలో
వెన్నెల పూలు పూయించాలని నీ పోరాటం
అయినా ఓ వసంతలక్ష్మీ |
దేశంలో శాంతి వనాలు వికసించటం లేదు
అశాంతి పవనాలు వీచటం తప్ప
ఆమని పూవుల తావులు గుబాళించలేదు
ఆకలి చావుల ప్రోవులు తప్ప
చైతన్య కాంతి ప్రవాహాలు లేవు
స్వార్ధ ప్రభంజన ఘోషల హాహాలు తప్ప ఖీ]
ఇన్న్ అసంతృప్త మేపు పింకారాల మర్యు సీకు కుదురునా సయోధ్య 1 హక్కుల ఉక్కుపిడికిళ్ల గదా ఘాతాల భూతాలమధ్య నీకు వినిపించునా నా అహ్వాన గీతాలు ! ఏటికేదాది నీ వంటి ఉగాదులు ఎన్ని వచ్చినా వసంతోదయ కళాసౌరభాలు ఎన్ని మోసుకొచ్చినా నాదేశం ఇంకా - ఇంకా చీకటి పంకంలో స్నానం చేస్తూనే ఉంది సమాజంలో దురాచారాల, అత్యాచారాల హింసా భీభత్సాల విలయతాండవం సాగుతూనే ఉంది నా దేశం ఎండల తలపాగాలతో ఏదుపుల దండలు మోస్తూనే ఉంది ! ఈ దయనీయ దారుణ దారిద్ర్య దృశ్యం నా కన్నుల నిండా పరచుకొన్నప్పుడు ఓ ప్రమాది ఉగాదీ ! నీకెలా స్వాగతం పలకను నీ ముంగిటిలో కవిత్వపు రంగుకుంచెతో ఎలా అలకను ? పేరులోనే ప్రమాదాన్ని నిక్షిప్తం చేసికొన్నావు నీ తీరంలో ఏ ప్రమాదాలు ఊరేగుతాయోకదా ? టై
అయినా మనిషి ఆశాజీవి ! అందులోను కవి ఆశల పగడాలు మొలిచే దీవి ! అవనీ స్థలికి అందిస్తాడు ఆనంద సందేశాల ఆహ్లాద భావి ! ఓ ప్రమాదీ ! ఒద్దన్నా రాకమానవు నీవు ! చల్లని ఆశల సన్నజాజి పూల పందిళ్ళ చలువలతో సదసద్వివేక మానవతా మహితమైన విలువలతో నీవు ఒక నూతన అధునాతన శకానికి కావాలి పునాది ! కవిగా భాషించే రవిగా - నా అభిమతం ఇదే ప్రమాది ఉగాది ప్రమోదానికి పాది ప్రజాక్షేమానికి ప్రోది ప్రగతిని కాదనే భావక్యాన్సర్‌కు సమాధి ! = = =, అకాళవాణి, కదప టె
చూడాలని ఉంది యన్, సూర్యనారాయణమూర్తి ఎన్నాళ్ళు - ఇంకెన్నాళ్ళు ధ్వని ప్రతిధ్వనించాల్సిన నా మనసులో నిశ్శబ్దపు చీకటి నీడలు ఇంకెన్నాళ్ళు, చైతన్యం తేజరిల్లాల్సిన నాలో నిరాశల స్తబ్బతపు వెల్లువ ఇంకెన్నాళ్ళు అక్షరాలను ్రసవించాల్సిన నా కలం పురుటి నొప్పుల సంధిలో విలవిలలాడుట ఇంకెన్నాళ్ళు కవితలను పలకాల్సిన నా మస్తిష్కం కల్లోలంలో కూలిపోవుట ఇంకెన్నాళ్ళు నూతనత్వం పలకాల్సిన కవులనోట, గతకాలపు కవితా తత్వం ఇంకెన్నాళ్ళు కొత్త భావాలతో సరిక్రొత్త రాగాలను తీసుకురావాల్సిన కోకిలనోట పాత కాలపు కుహుకుహులే ఇంకెన్నాళ్ళు వ్యధా మూర్తుల వేదనలను ఆలకించకుండా ఆలపించకుండా, వసంతం వస్తూ పోవుట ఇంకెన్నాళ్ళు (ప్రతి సంవత్సరము కొత్త బిడ్డను చేతికిస్తూ కుటుంబ నియంత్రణ పాటించని ఉగాది వృద్ధ నారి పురుటి నొప్పులు యింకెన్నాళ్ళు తత
ఆశల గుండెలను
నిరాశను ఛేదించడం
ఇంకెన్నాళ్ళు
అదర్శ్భాల బతుకును
అసమర్ధత చెరచడం
ఇంకెన్నాళ్ళు
నీతినీ, న్యాయాన్ని దహించివేస్తూ, రూపాయి పాపాయి చేసే
కరాళ నృత్యం
యింకెన్నాక్ళు
అర్థరాత్రి స్రీని ఒంటరిగా తిరుగనియ్యక, అబల, అబల అంటూ
కబంధ హస్తాలలో బంధిస్తూ, స్వాతంత్ర్య దేశంలో అస్వాతంత్ర్యాన్నిస్తున్న పురుషాధిక్యం
యింకెన్నాళ్ళు
ఉగాది వేదమంత్రంనాదమై నాలో చేరి అమృత పానం చేయించి,
గొంతును మార్చుకొమ్మన్నది,
క్రొత్త తీర్పు చెప్పమన్నది క్రొత్త మార్పును చూడమంది, అందుకే చూడాలని ఉంది !
శీ
తప్పతాగి, రోడ్ల మీద కుప్పకూలి, క్లబ్‌లో, చీకటి బల్బుల వెలుగుల్లో నగ్నంగా వర్తించే, ప్రవర్తించే జనవరి ఫస్టు విష సంస్కృతి అంతరించిపోతే చూడాలని ఉంది సౌజన్యంతొ, సౌశిల్యంతొ విద్యతో, వినయంతో సంస్కారంతో, నమస్కారాలతో విద్యార్థులు మసఃపూర్వకంగా గురువులను గౌరవించే సమయం వస్తే చూడాలని ఉంది తెలుగంటే వెలుగు, తియ్యగా ఎద కరుగు, అమృత మందించు భాష తెలుగు జగతిని మేల్కొలుపు తెలుగు వెలుగని తెలుగు దేశ ప్రజలంతా ముక్త కంఠంతో ఒక్కటైతే చూడాలని ఉంది అనురాగాన్ని పంచి, ఆప్యాయతను పెంచి, నవ మాసాలు మోసి నవ్య గారాలు నేర్పిన తల్లిని పుట్టి పెరిగిన బిడ్డ నోట “మమ్మీ” కి బదులుగా “అమ్మా” అన్న ప్రణవ నాదం పలికితే చూడాలని ఉంది జీ6
కవుల సమ్మేళనపు కవితా వెల్లువలో రసరమ్య రాజ్యంలో తేలియాడుతూ తలలు ఊపుతూ వహవా, వహవా, అంటూ ఆకాశాన్ని తాకేలా చప్పట్లు కొడితే చూడాలని ఉంది ఆరు కాలాల అష్టకష్టాలలో మునిగి పండించిన పంటకు గిట్టుబాటులేక పంటకాలవల్లో జీవితాన్ని ఒలకబోసుకున్న దేశ వెన్నెముక రైతన్న మోమున చిరునవ్వులు మొలకలెత్తితే చూడాలని ఉంది మతం మతం మన అభిమత మంటూనే మానవత్వాన్ని సమాధి చేస్తూ మారణహోమాలకు ఆజ్యం వోసే దుష్కర ముష్కర మూకలు నశించి భిన్నత్వంలో ఏకత్వమంటూ ఎలుగెత్తి చాటితే చూడాలని ఉంది మన దేశం, మన దేహం మన సంస్కృతి, మన నాగరికత మన వేదాలు, మన నాదాలు, మన గీర్వాణం మనకు ఆభరణం, క్!
మనం మనం భారతీయులం, మనం మనం ఈ దేశీయులం అని ప్రజలంతా అనుకునే రోజును చూడాలని ఉంది పచ్చగా చిగురించిన మామిడి కొమ్మపై నూత్చరాగాలతో కోకిల పరవశత్వంతో కూస్తూ పేదల జీవితాలలో వసంతుడు వసంతం నింపుతూ, యుగానికే ఆదియై ఆశల ఉగాది అడుగిడితే చూడాలని ఉంది ఆశల పల్లకీలో అందంగా అడుగుపెట్టిన ప్రమాధి సకల జన సమ్మోదమై సకల జగత్తుకు ప్రమోదమై నవ్యతకు వైతాళికుదైతే చూడాలని ఉంది, భవ్యతకు మార్గదర్శకుడైతే చూడాలని ఉంది. అప్పుడే శాశ్వతంగా కనుమూయాలని ఉంది. = = =, ఆకాశవాణి, కొత్తగూడెం జి
వసంతగానం దేవులపల్లి విశ్వనాథం
మామిడి కాసె, వేపయును మానక పూసె, మనోహరంబుగా, కోమలమైన భంగిమల కోయిల కూసె, విలాసమేర్చడన్ (ప్రేమగ పూలదండలను వేయుచు, నేడు వసంతలక్ష్మినిన్ నేమము తోడ నీ ప్రకృతి నీరజ, చూడుము స్వాగతించెడిన్.
ఈ వసంత శోభలుగన నింపుగలుగు
(ప్రకృతిధర్మముల్ సవ్యమై ప్రబలుచుండె
మనుజధర్నాలు (క్రమముగా మంటగలియ
కాలమే రీతి బుజువుగా (గ్రాలగలదు.
ప్రతి తరువొకవధువగుచు పాటపాడు
నరులు నరుకుదురను ఖీతినాటుకొనియె
శోక గీతాల వినిపించు వ్యాకులముగ
ప్రకృతి రూపుమాపందలప పాడియగునె ?
పంటపండింపందలప కరెంటు కోత
మండు వేసవి నీటికి గుందెదిగులు
కొరత లేనిది కల్తీకి ధరణియందు
క్రొత్తవత్సరమా ! నీవు కొరతం దీర్చు
లి
ఆమని యేమనె, ఆశల పల్లకి మక్కువ మీరగా నెక్క్ముమనియె కోయిల కబులేమి ? హాయిగా జీవనో ద్యానమున చరించి తనియుమనియె చిగురు కొమ్మలనున్న చిలుకమ్మ పలుకేమి ? మధుర భాషణమది మంచిదనియె పూచిన పొదరిల్లు బోధించు హితమేమి ? పూలమాటున ముళ్ళు గ్రాలుననియె (ప్రకృతినేర్చెడి పారాలవలన మనము ప్రగతి సాధింప నిరతంబు ప్రతిన బూని పట్టుదలను వహింపగ ఫలితమలరు, జాగు చేసిన కలుగదు సత్ఫలంబు. పురుగుమందులకల్లి పుట్టెడు దుఃఖంబు చేకూర్చరైతుకు శోకమయ్యె ఎరువుల ధరలన్ని పెరుగగా హాలికు డెంతయో వగచుచునింపు వీడె అమ్మబోవ అడవి యిమ్ముగా కొనంబోవ కొరివియై హాలికుండు పరితపించు ఇల్లుపిల్లియు గూడగుల్లయె ఆత్మహ త్యల ప్రత్తి రైతులు బలిఅయిరట 50
నడ్డి విరిగి తలకు మించు వడ్డివలన టర్మినేటరు విత్తుల మర్మమేమొ నకిలివిత్తనాలతొ రైతు నాశమయ్యె మా ప్రమాదముల్ దీర్చు ప్రమాదియైన. ఒక చోట చూడగా నుష్పొాంగువరదల కల్లోలమువలన తల్లడంబు వేజొక చోనతివృష్టిచే పంటలు సర్వంబు పాడై విషాదమయ్యె ఒక వంక దౌర్జన్యమొకవంక దోపిడీ లొకవంక హత్యలువికలమయ్యె ఒక పజ్జ కాటకమొక చాయ కక్షలు నొకచోనరాచకముకన పడెను చూడబహుధాన్య వ్యర్థమై గోడునిచ్చె వీడుకోల్ బహుధాన్యకు వీడు కోలు సకలశుభములు ప్రభవిల్లి సౌఖ్యమంద స్వాగతంబు ప్రమాదికి స్వాగతంబు. పసిబిడ్డ బంగారు బ్రతుకును మురుగుకా ల్వలనుంచు కన్నెల వెలితిబ్రతుకు పసలేనిదెప్పుళ్ళు కసితోడి పలుకుల పనిలేక తిరిగెడి పాడు బ్రతుకు గంధాల భర వ. త ( నిగ అజం ే న క్1 ఖ్ లో అ పాం కను యీ
పరులపై బురదను చకచకా చల్లగా పరుగులు దీసెడి మురికి (బతుకు లంచాల పంచలో లాస్యంబు సల్పియా నందించుచుండు హీనంపు బ్రతుకు ఎట్ట్ ఫలితంబు సమకూర్చ వెప్పుడైన (బతికి బ్రతికించు, పరులకై పాటు పడుము ధర్మసాధనయే దేహ తత్త్వమరసి జగతి ప్రగతి నిలుపుచును సుగతిగూర్చు సాగిపోవుచుగాదిని స్వాగతించు కంప్యుటర్ వాడుక గాధఢమై మానవ మేధకు పనితగ్గె మేటిగాను పేటెంటు హక్కులవేట విదేశముల్ సేయగా నశియించు సిరులు మనకు పాశ్చాత్య సంస్కృతీ వారసత్వంబున భారతీయతవన్నె బాసిపోయె మతతత్త్వ ధోరణుల్ మానవతకు మచ్చ మత సామరస్యంబు హితముగూర్చు పూలతోటలో విరిసిన పూలవోలె మానవత్వపు పరిమళాల్ మహిని నిలిపి కలసిమెలసి జీవించిన కలిమిగలుగు నవశతాబ్దికి పలుకుము నాంది నీవు. = = = ఆకాళవాణి, నూర్చాపఫపురం ప్‌ై
కొత్తపాట పాడవే కోకిలమ్మ మోకా రత్నరాజు ఆగున్నమావి కొమ్మ మీద కోకిలగానం నాకు విన్పించకనున్నది కడుపార కూడులేక - సరిపడే గుడ్డలేక కళ్ళల్లో కాంతిలేక - బ్రతుకుల్లో శాంతిలేక నీరసించి నిరాశగా నిస్పృహ చెందే నిర్భాగ్యుల ఆర్తనా ఆవేదనలోంచి ఆ గున్నమావి కొమ్మమీది కోకిలగానం నాకు విన్పించకనున్నది. నిరుద్యోగి నిరాశానిట్టూర్సులు చిరుద్యోగి అప్పులతో అగచాట్లు ఒకవైపు పెళ్ళికాని ఈడొచ్చిన ఆడపిల్ల ఒకవైపు దీర రోగ రోదనతో రోదించే భార్య మరొకవైపు ధరల పీఠమెక్కిన ఉద్యోగాన్ని డిగ్రీ పట్టా చేపట్టిన కొడుక్కి కొని పెట్టలేని అయోమయస్థితిలో మధ్య తరగతి కుటుంబ యజమానికి జీవితం అడకత్తెరలో - పోకచెక్కై తుక్షైపోతుంటే ఆ గున్నమావి కొమ్మమీది కోకిలగానం నాకు విన్పించక నున్నది. ఏ్3ె
ఉప్పునిప్పై రాజుకుని మహాత్ముని ఆత్మసహితం ఘోషించి ఉల్లి ఆటంబాంబై కొత్తపాటొకటి పాడి, కొత్త బాట కానవే స్వరమొక వరముగ పొందిన కోకిలమ్మ ! చిగురించిన కొస కొమ్మన అలరించి తీయగా పాట పాడటమేకాదు చెట్టుకు '్రేళ్ళె, నీళ్ళై (బ్రతుకంతా - ఎరువునై మగ్గిపోతూ చెట్టుకు ఊపిరి నేనై నిల్చి ఊపిరాడక - ఉక్కిరి బిక్కిరవుతున్న నన్ను గొప్పగ పొగడికాదు మది పులకింత చెందెడి - ఒక్క ఓదార్పు పలకరింత చాలని నావంతుగ గొంతెత్తి పాడవే కోకిలమ్మ కొత్తపాట పాడవే కోకిలమ్మ (శమపునాదుల్లేని ఊహా సౌధాలకు వెలుగు చిగుళ్ళ ఊపిరి మేమేనని మా ఉచ్చ్వాస నిశ్వాసలే ప్రగతి దీపాలకు చావుపుట్టుకలని నిజమెరిగి పాడవే కోకిలమ్మా జగమంతా చాటవే కోకిలమ్మా
- = = ఆకాశవాణి, విశాఖపట్నం ర్‌ష
ఓ ప్రమాదీ | వైద్యం వేంకటేశ్వరాచాడ్యులు
శ్రీరంజిల్లగ చైత్ర శ్రీ రమణీ ! జగతికీవు శ్రేయమొసంగన్ కూరిమి మీరగ రాగదె ! రా రమ్మిదె ! ఓ ప్రమాధి ! రావె ఉగాదీ !! కిసలయమ్ముల మెసవి కోకిలలు పలికె తమ్మి పువ్వులలో మరందమ్ము లొలికె కవియు గళమెత్తి కమ్మని కైతబలికె స్వాగతమ్మో 'ప్రమాధి ! సుస్వాగతమ్ము !! ఇత్యాదిగా స్వాగతం పలుకుదామనుకుంటుంటే కొత్త సంవత్సరం రానే వచ్చింది మా దేశంలో బస్సులూ - రైళ్ళూ - విమానాలూ అన్నీ లేటుగానే వస్తూవుంటాయి ఓ కాలశకటమా |! నీవు మాత్రం కరెక్టు టయానికే వస్తుంటావు నీకు స్వాగతం పలకటం మా వంతు ఇదంతా ఉగాది తంతు
ప్5
ఓ ప్రమాదీ ! నీవు ప్రమాదివి అని తెలిసి కూడా ఎలా స్వాగతం పలకాలో....! ఏమని స్వాగతం పలకాలో .. .॥ పోయిన బహుధాన్య “బహుధాన్య అయినప్పటికీ వదాన్య కాకపోవటం వల్ల ధరలన్నీ ఆకాశానికి వెళ్ళాయి ఒకానొకప్పుడు ఉల్లిధరకూడా ఆకాశంలో “ఉల్మాపాతాన్ని సృష్టించింది మరి నీవేం చేస్తావో. . !? నీపేరేప్రమాది.....!! ప్రమాది ఉగాది పంచాంగ శ్రవణంలో మన కందాయ ఫలాలిలా వున్నాయి విదేశాలిచ్చే అప్పులవల్లే ఆదాయం స్వదేశీయులు కల్గించే ముప్పుల వల్లే వ్యయం ప్రజలే కదా మన రాజులు ! రాజపూజితం సున్న అవనాలు మాత్రం మిన్న ఓ ప్రమాధీ !
56
ఇలాంటి నీకు ఎలా స్వాగతం పలకాలో ...! ఏమని స్వాగతం పలకాలో . . . ఓ ప్రమాదీ ! నీ పేరుకు దీటుగా మా గడ్డమీద నల్లధనం విషవృక్షానికి గూండాయిజం విరబూసింది బాంబుల సంస్కృతి పరిమళించింది మా సీమలోని ఆమని మంచి ఉనికీ మంచి మనికీ కరువైన ఆమనీ....! ఏమని పలకాలో స్వాగతం ? ఎలా పలకాలో స్వాగతం !? ఆ విషవృక్షాల్ని సమూలంగా పెకలించాలి సమైక్యంగా మానవత్వపు మొకృల్ని నాటాలి. మంచితనం పరిమళించాలి ప్రమాదిని ప్రమోదంగా మలచుకోవాలి అప్పుడే మాకు ఉగాది అదే మాకు ఉగాది 57
ఓ ప్రమాధీ | నీవు ('ప్రమాదాలని కలిగించే ప్రమాధివి కారాదు ప్రమోదాలని చేకూర్చే ప్రమోదివి కావాలి ఓ ఉగాదీ ! చేదు రుచుల్ని చవిచూపిస్తూనే వుంటావు తీపి కలల్ని కూడా పండించటం నీవంతు చిగురించిన ఆశలతో నీకు స్వాగతం పలకటం మావంతు సర్వేజనాః సుఖినో భవంతు. . . . ఆకాళవాణి, కర్నూలు 5ర్ర
దా. పేర్వారం జగన్నాథం
ఏడాదికోమారు తప్పకుండా వచ్చే ముఖ్య అతిథి ఉగాది వద్దన్నా వస్తుందది ఉండమన్నా ససేమిరా క్షణం కూడ ఆగనిమంకుపట్టుదానిది. ఇంటికి వచ్చే కొత్త చుట్టం మాదిరిగా గంపలకొద్దీ సంబరాలను తెస్తుంది గాదెలనిండా సంవత్సరానికి సరిపడే సంతసాల సంచుల్ని నింపుతుంది కష్టాల నెగళ్ళను ఆర్పేసి తలాపిదికెడు శ్రీ చందనం పంచుతుంది. కష్టజీవి కనుబొమ్మలపై వాలి నవ్వుల తోరణాలు కడుతుంది కన్నీటి ధారల్ని కడిగేసి పాల సముద్రాన్ని ఫాలం పై మొలిపిస్తుంది. కసాయివాని గుండెల్లోకి దూరి ఏవేవో గుసగుసలు పలుకుతుంది
క్‌ం్రి
కళేబరాలతో సౌధాలు కట్టబోనని వాడితో వాగ్ధానం చేయిస్తుంది. అదేం కనికట్టోకాని వాడిలో మానవతను కర్పూరంలా వెలిగిస్తుంది. గుట్టలు గుట్టలుగా కూలుతున్న గబ్బిలాలవలె ముసురుకుంటున్న చీకట్ల జూలుబట్టి విద్యుత్తును తాపిస్తుంది అగ్ని కీలల్ని తినిపిస్తుంది తిమిరానికి తెల్లసున్నంతో వెల్లవేయించి కైలాస శిఖరంగా మారుస్తుంది ఇక అమావాస్యకిదే ఆఖరు రోజని చాటిస్తుంది. పీడిత తాడిత జన సందోహం పూరి గుడిసెల్లోకి దూరి (బ్రహ్మశ్రీ దైవాజ్ఞులంతా పొరబడిన (గ్రహచార గుణింతాలను సరిచేసి సరికొత్త పంచాంగం వినిపిస్తుంది లోకానికెల్లప్పుడూ మంగళాశాసనమే పలుకుతుంది. దానికి వసంతం ఒక్కటే తెలుసు పూతపూసిన వేపచెట్టులా మనిషి ఒళ్లంతా నవ్వాలంటుంది. 60
విరగగాసిన మామిడి చెట్టులా మనిషి జీవితం సఫలం కావాలంటుంది చిగురించిన చింతచెట్టును చూపించి మనిషి నిలువెల్లా కొమ్మలువేసి మహావృక్షంలా ఎదగాలంటుంది. పసుపు పారాణి అలదుకొని కొత్తకోడలు అత్తవారిల్లు చేరినట్లు కోకిలలూ గోరువంకలూ మంగళగితాలు పాడుతుండగా మన నట్టింట్లోకే వచ్చింది ఉగాది పిన్న - పెద్ద భేదం లేకుండా అందరం సమంగా సేవిద్దాం ఉగాది పచ్చడిని అందరం కలసికట్టుగా భుజిద్దాం ఉగాది వంటకాల్ని అందరం ఆనందంగా అనుభవిద్దాం ఉగాది పండుగని సహనావవతు సహనౌభునక్తు జ యి పం: భాలథు స్వా సహవీర్యం కరవావహై. ర సస వల క్ [ శం ౮ గీ నా న్ వ న కాయ. గగ 644. , = *, ఆకాశవాణి, వరంగల్ 61
శబ్బకునే జ్యోఇలేకుంటే ఇఐశ్వకుంతా | అంధకారకువుతుందని దంజ అఖిభాషణం. | సమాజంలోని కూర్పులు, ఐలుకలు, సంఘర్షణలకు ప్తాతినిధ్యం కహొంచే కఐ వ్రుకటిత శబ్దాలు , శిఖరాయపూనమైనఐ.
ప్రజలకు, ప్రభుత్వానికి వదధిగా నిల్చి:
ఆకాశ5ాబి త్రీసారం చేనీ శబ్ద తదంగాల్లో
ఒక ఏబికర్వ్యైన ఈ నంకలనాన్న - ఆలోచనాక్కుతం, అనుభవైకవేద్యంగా అందిస్తున్నాం ...