Telugu seema paalegaarlu - anilvaranasi/indianlanguages GitHub Wiki
(౨ ల. (గ ాాజోలెపాళెం మంగమ్మ నా 22 న వ్ . క ర్మ డా న్ని ళా కకక న్ . | , ర్వ తెజగ మ్ క్ | శ నత నానే తెలగుమహాసభలప్రచురణ | సే ॥ ముంగక్యూ- సము + న్నా ను. ,
మివ ఖు 13/౯౯ ( ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం య 0 లీ శ) రాష్ట్ర సాంస్కృతికశాఖ, సస్సృరక మండలి ం. | |
తెలుగు అకాడమి ప్రచురణ లఘు గ్రంథం (మోనోగ్రాఫ్) నీనుసాలీ వీనుసాలెగార్లు న. (బ్రిటీష్ కంపెనీని ఎదిరించిన వీరులు) రచయిత జోలెపాళెం మంగమ్మ ప్రముఖ రచయిత్రి 4న ప్రపంచ తెలుగు మహాసభలు 2728929 డిశంబరు, 2012 వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ను ర, రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మందలి స స్టార్ల తెలుగు అకాడమి, హైదరాబాదు నాల్
రాజగ్గాడలడ6406బ్రి42//4 ౭ 240448104206 6డీ ౮4 లం 6000160654 62 46 4046 రంటిం్రల 644640 న శా న్నా ౦16921యి స జు8ిడయిం2 రో ఒం ఇట్టి జా ఉలి = || 15 న! ామయయంం:2012 బం స స! 22 ఆ : వం. గ చా 112 + 1/ రా ర స్ట్ ఈ న గౌంటై మరలు గంరం2016 ల డ్రా ళీ ఘీ ర ఖీ ౮
0001౪ : 5000 సు శ గే
106 : 3. 30/-
వె015006 9” 0.0౮౮ శకటం కనిన, వెతల 5864- 500 029
(యుయుణ 9264య1) ఇంరేలు 116 ౮6011” ఏరై00308604 వంపలంం 01 కంఠేజంరం[05 కేంం1దు జురే సలజరు6 స మెంళ్రైంగ41 ఓ20్ర్ర02క్రల3
20 16 న. 16761 0౯016 ఆం+అం611 0 116412 10 616
సెటప్ 0ం? 01 డక గటంల!06 0ఈ6102000616 67 ౨011.
శ/ గటా ఫగందాంలాడా ౯ భట్ రింం6్ 272 ౯2040 ౯462 4/4 ౧౦
బాం/డంగ ర6724/ లం ళ్తాణుడంండ ర 40 ౧0౦ట్బార/ 49774006
+బలింజర తల అరం? బదాయూనంగ ర్ల తం 00్ర్రా్రినిరి ౮26౮ విజీటితంట ౫4౪4 4 లిహిలాలీ4ణడే ర్స్ భం
గలజళై ఉయరేలు! లి
కడేల2స24ే / ర్
కైతనాల 20సగరర68 ౮౯
సంకా ఉంరయి, కరజడ026ే
వొాలాండ గ 4/0
వరం 2 4/5. 42ి2[210001 ౮149001069, గరేలడ9026
యన్. కిరణ్ కుమార్ రెడ్డి ([ హైదరాబాదు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సందేశం
(వవంచవ్యావ్నంగా ఉన్న తెలుగువారిని ఒక్క వేదికపైకి తీసుకువచ్చేందుకు, తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిశంబరు 27 నుంచి 29 వరకు ఏడుకొండలవాడి అవాసమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో అత్యున్నత స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న తెలుగువారందరూ పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, తెలుగువారు తమ గత చరిత్రను సంన్మరించుకొంటూ, ఉత్కష్టమైన భవివ్యత్తును నిర్మించుకోవడానికీ ఈ
మహాసభలు ఎంతోగానో దోహదం చేస్తాయని మేము విశ్వసిస్తున్నాం. తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 87 సంవత్సరాలు గడిచాయి. అయితే ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ప్రపంచ సభలను నిర్వహించడానికి చారవ చూపలేదు. మా (ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రజాజీవితాల్ని ఎలా మెరుగుపరచాలీ తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలి అనే దృష్టితో పనులు చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్థ్యాన్ని ఇటీవల జరిగిన జీవవైవిధ్యసదస్సులో కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలో
(ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడానికి సమాయత్తమైంది. ఇటీవలి కాలంలో పప్రపంచవాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన మన భారతదేశంలో తెలుగు భాష్క సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన
విషయాల్లో జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం చర్చించవలసింది ఎంతో ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష ఉనికిని కోల్పోకుండా పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని పలుదిశలా చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, తెలుగు జాతి దేశవిదేశాల్లో తలెత్తుకు తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా ప్రభుత్వం, తెలుగు తేజం కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు సమాయత్తమైంది. ఈ సభలలో సదస్సులు, తెలుగువారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల ప్రదర్శనలు, లలితకళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల సమావేశాలు మొదలైన ఎన్నో అంశాలతో పాటు, పుస్తక (ప్రచురణ కూడ పెద్ద ఎత్తున చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘుగ్రంథాల ప్రచురణ జరుగుతున్నది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల సందర్భంగా ప్రచురించే లఘుగ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాము. శంల్ 7డ్డ (యన్. కిరణ్ కుమార్ రెడ్డి)
సి. దామోదర రాజనరసింహ గ | ఉపముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అభినందన ఏ దేశమేగినా, ఎందుకాలిడినా పొగదరా నీతల్లి భూమి భారతిని నిలపరా నీజాతి నిండు గౌరవము అన్న మహాకవి రాయహ్రోలు వాక్కులు (ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు నిత్యం స్మరించుకోతగినవి. దేశంలోని అన్ని రాష్రాలలోనూ, ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ తెలుగు ప్రజలు తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటూ ప్రశంసలు పొందుతున్న ఈ సమయంలో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఇది తెలుగు భాషాభిమానులకూ, కళా సాంస్కృతిక రంగాలలో కృషి చేస్తున్నవారికీ ఒక పండగ. ప్రపంచీకరణ నేవధ్యంలో మాతృభాషలను, మాతృసంస్కృతిని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఈ సందర్భంలో తెలుగు భాష్క జూతి వికాసం కోసం నిరంతరంగా కృషిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు భాషా సంస్థ అయిన తెలుగు అకాడమికి 150 లఘుగ్రంథాలను(మోనోగ్రాఫ్‌లను) రాయించి పుస్తకాలుగా తెచ్చే అవకాశం కల్పించాం. తెలుగు భాష సంస్కృతి, చరిత్ర, నం(ప్రదాయాలు, తెలుగుభాషోద్యమాలు, సాపాత్యకారులు, సంఘసంస్కర్తలు, కధ, నవల, వ్యాసం, కవిత్వం లాంటి వివిధ సాహిత్య ప్రక్రియలు, ఛందస్సు, ప్రకృతివైద్యం, ప్రాచిన ఆధునిక సాహిత్య సాంస్కృతిక విషయా లన్నింటిపై, సాహిత్యచరిత్రలపై పుస్తకాలు రాయించి ముద్రిస్తున్న తెలుగు అకాడమిని అభినందిస్తున్నాను. కొద్ది సమయంలో పుస్తకాలు రాయించి ముద్రించడం అనేది ఓయజ్ఞంగా భావించి చేస్తేనే తప్ప ఈ పని పూర్తి కాదు, ఆ పనిని తెలుగు అకాడమి విజయవంతంగా నిర్వహిస్తున్నది.
ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ సందర్భంగా ప్రచురిస్తున్న పుస్తకాలు మన భాషను, జాతిని, సంస్కృతిని, చరిత్రను సమున్నతంగా నిలబెట్టే యజ్ఞంలో, తెలుగు భాషా పరిరక్షణలో ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. తెలుగు భాష పరిరక్షణకోసం, బెన్నత్యం కోసం (ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జరుగుతున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలను ఆహ్వానిస్తూ ఇన్ని పుస్తకాలు ముద్రిస్తున్న తెలుగు అకాడమి సంచాలకులకు, రచయితలకు మరియు అకాడమి సిబ్బందికి అభినందనలు తెలుపుతూ ప్రపంచంలో ఉన్న 18 కోట్ల మంది తెలుగు ప్రజల అభ్యున్నతి కోరుతూ.. మరోసారి అందరికీ నాహృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. “తల్లి నుడికంపె పరమామృతంబుకలది” (సి-దామదర రాజనరసింహ)
ఛి క4గగా 00 814క 3564బ).31 54 ళా కరానం. నా! సిశ1015060 ౯00000 &ఉ ౦11%, [1] కృళంణం86 - 500 022 సాన రు & కంగు, 100. న శ కిషంలల: 400కి ఆం+లంణ౫ం౧ఈ00తగ60౧ లి26ేజ? ు040.23450899 ప్రస్తావన
తెలుగువారు తెలుగు నేలపై 37 ఏళ్ళ విరామం తరవాత చేసుకుంటున్న పండుగ (ప్రపంచ తెలుగు మహాసభలు, మన సంన్కుతిని నలుదిశలా వ్యాపింవజేస్తున్న తెలుగు వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని పంచుకునేందుకు, తెలుగు పరిమళాలు వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు వారి సంస్కృతి బహుముభీయమైంది. అందులో భాష, సాహిత్యం, చరిత్ర, లలితకళలు, జానపద, గిరిజన విజ్ఞానం వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి విశ్లేషించుకొని, వాటిని పరిరక్షించడం, పోషించడం, పరిన్యాప్తి చేయడం ప్రభుత్వం తన విద్యుక్త ధర్మంగా భావిస్తున్నది.
ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే *1ప్రపంచ తెలుగు మహాసభలో నిర్వహణకు ప్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ వ్యవధిలో అత్యంత సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ విదేశాల నుంచి తెలుగువారు స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో ఈ సభల్లో పొల్గొంటున్నారు.
తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ చేసేందుకు ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘు[గ్రంథాల ప్రచురణ, ప్రత్యేక సంచికల పునశ్చరణ, వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది.
తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి, అయితే కాలంతో పాటు అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటికప్పుడు తమ సంస్కృతిలోకి కొత్త నీరును ఆహ్వానించడం సహజం, ఈ “*పాతకొత్తల మేలు కలయికే”ఒక జాతిని నిత్యవైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. అందరం కలిసి, తెలుగుదనాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం ఆసన్నమైంది.
వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి పౌరజీవనం తదితర అంశాలపై లఘుగ్రంధాలను నిష్టాతుల చేత రచింపజేసి ప్రచురించే గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు కలకాలం ఉపయోగించుకునే విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, పండితులు ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను.
లః నో నలి ఆతం కుతాకే వట్టి వసంతకుమార్
భూమిక
1968లో (ప్రభుత్వం అప్పటి విద్యాశాఖమంత్రి మాన్యశ్రీ పి.వి. నరసింహారావు గారు తొలి అధ్యక్షులుగా స్థాపించిన తెలుగు అకాదమి తెలుగు భాషా వీకాసం కోసం చేస్తున్న కృషి అపరిమితం. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు, మోనో(గగ్రాఫ్‌లు, నిఘంటువులు, మాండలిక పదకోశాలతో పాటు ఖాష్క సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన అనేక పుస్తకాలు ప్రచురిస్తూ తెలుగుభాషకోసం అకాడమి చేస్తున్న సేవలు అద్వితీయం. తెలుగు భాష్క జాతి, సంస్కృతి (ప్రేమికుడయిన మాన్యశ్రీ సి. దామోదర రాజనరసింహ గారు అధ్యక్షులుగా తెలుగు అకాడమి తన పరిధిని మరింత విస్తరించుకొని తెలుగు భాషలో శాశ్వతంగా మిగిలిపోగల అనేక పుస్తకాలను తీసుకువస్తున్నది. మహాకవి గు(ర్రం జాషువా పరిశోధన కేంద్రం నెలకొల్పి తద్వారా (వతి ఏటా సాహిత్యరంగంలో విశిష్టసేవ చేసిన ముగ్గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వడం సాహిత్యవేత్తలకు, తెలుగు భాషకు చేస్తున్న సేవకు నిదర్శనం. తెలుగు వారి చరిత్రలోనే ఇది ప్రథమం. అకాడమి ప్రచురించే పుస్తకాలతో పాటు ఇటీవలి కాలంలో గురజాడ సాహిత్యసర్వస్వం, జాషువా పరిశోధన కేంద్రం తరపున పుస్తకాలు ప్రచురించింది. తన 45 సంవత్సరాల చరిత్రలో దాదాపు 8500 శీర్షికలతో వివిధ గ్రంధాలను (ప్రచురించి భారతదేశంలోని అకాడమిలన్నింటిలో తెలుగు అకాడమి అ(గ్రస్థానంలో నిలబడటం తెలుగు వారి కృషికి గర్వకారణం. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సభలు, చర్చాగోష్టులు నిర్వహిం “డంతో పాటు ఇటీవల జాషువా జయంతి సందర్భంగా “శతకవితావసంతం” నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా కవితాచైతన్యానికి, కవులకు ప్రోత్సాహాన్నిచ్చింది తెలుగు అకాడమి.
2012 డిశంబర్ 27,28,29 తేదీల్లో తిరుపతిలో జరగనున్న నాలుగవ (ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం అకాడమి పై ఉన్న నమ్మకంతో 150లఘు (గ్రంధాలను (మోనోగ్రాఫ్‌లను)రాయించి (ప్రచురించే బాధ్యతను అప్పగించింది. తెలుగు భాష సాహిత్యం, చరిత్ర, సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు, జాతి, సంస్కృతి ఒక్కటేమిటి తెలుగుకు సంబంధించిన వివిధ అంశాలను తీసుకొని పుస్తకాలు రాయించడం జరిగింది. తెలుగు భాషా, సాహిత్యాలలో లబ్ధి ప్రతిష్ణలైనవారితో పాటు ఆయారంగాల్లో నిపుణులైన వాళ్ళతో పుస్తకాలు తయారు
చేయించి 'ప్రచురిస్తున్నాం. తెలుగు భాషను, సాహిత్య సంస్కృతులను, సమస్త విషయాలను సమున్నతంగా నిలబెట్టగలమన్న నమ్మకంతోనే ఈ కృషి చేస్తున్నాం. తెలుగు సాహిత్యంలో అనర్హరత్నాలనదగిన, జాతి సంపదనదగిన పుస్తకాలను ప్రచురించే ఈ సువర్ణ అవకాశం మాకు కల్చించడమేగాక ఆర్ధిక వనరులను అందించి ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి, సాంస్కృతిక శాఖ, సాంస్కతికమండలివారికి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రా మాన్యత్రీ యన్. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖా మంత్రి తెలుగు అకాడమి అధ్యక్షులు మాన్యశ్రీ దామోదర రాజనరసింహ గారికి; సాంన్భృతిక శాఖామాత్యులు మాన్యశ్రీ వట్సి వనంతకుమార్ గారికి కృతజ్ఞతాభివందనాలు. 4వ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకుగాను (ప్రభుత్వం
నియమించిన ఉన్నతస్థాయి సంఘం సభ్యులు :
శ్రీ ఆర్. వ. రమణమూర్తి, అధ్యక్షులు, సాంస్కడిక మండలి
శ్రీ మందలి బుద్ధప్రసాద్, రాష్ట అధికారభాషా సంఘం అధ్యక్షులు
దా. జె. బాపురెడ్డి, ఐ.ఎ.ఎస్.,(6)
శ్రీ కె.వి. రమణాచారి, ఐ.ఎ.ఎస్.,(6) సాంస్కృతిక శాఖ, సలహాదారులు
శ్రీ వి. భాస్కర్, ఐ.ఎ.ఎన్ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ, ఆంధ్ధ్య
(
శ్రీ ఎల్, వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఎ.ఎస్. కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం
శ్రీమతి చిత్రా రామచంద్రన్, ఐ.ఎ.ఎస్., ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ (దేవదాయ)
ఆచార్వ ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
శ్రీ జి. ఇలరామయ్య, ఐ.ఎ.ఎస్. ప్రభుత్వ కార్యదర్శి, సాంస్కృతిక శాఖ
శ్రీ జి. ఎన్. రావు, ఐ.ఎ.ఎస్.(6) (ప్రత్యేకాధికారి, శిల్చారామం
ఆచార్య కె. యాదగిరి, సంచాలకులు, తెలుగు అకాడమి
దా, రాళ్లబండి కవితా ప్రసాద్, సంచాలకులు, సాంస్కృతిక శాఖ
(ప్రపంచ తెలుగు మహాసభల రూపకల్పనతో పాటు లఘుగ్రంథాల తయారీలో తమ సహాయ సహకారాలు అందించినందుకు ఈ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురిస్తున్న ఈ మోనోగ్రాఫ్‌లను అత్యంత స్వల్ప వ్యవధిలో తయారుచేయించడం జరిగింది. ఈ (గ్రంధాల్లో ఏవైనా దోషాలు, పొరపాట్లు దొర్లినట్లు పాఠకులు గమనిస్తే సహృదయంతో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే మలి ముద్రణలో సవరించగలమని తెలియజేస్తున్నాం.
ధర్మనునుడు, తత్వమనుడు, యోగమనుడు ప్రాణిసాధింపగల సకలపరమార్ధములకు తల్లిభాషప్రధాన సూత్రంబయగుట భాషకంటె నవ్వులకు తపస్సులేదు
తెలుగు అకాడమి సమన్వయ సంఘం ఆచార్య కె. యాదగిరి సంచాలకులు డా॥ ఎం. మాణిక్యలక్ష్మి ఉపసంచాలకులు దాః ఎన్. యోగిబాబు డాః। టి. అరవింద శ్రీ టి. రాజేందర్ కుమార్ శ్రీ ఎం. వెంకటేశం శ్రీమతి సి. శ్రీవిద్య శ్రీ ఎస్. భూపాల్‌రెడ్డి శ్రీమతి కె. గీతాంజలి డా॥ ఎం. శైలజ శ్రీమతి ఎస్.ఎ.టి. రాజ్యలక్ష్మి శ్రీమతి వి. అరుంధతి శ్రీ ఎస్. వేదవ్యాస్ ఖు ఈ గ్రంథంలో భదురితమైన విషయాలకు వినరాలక్కు అభిభ్రాయాలకు ఆయా రభయితల్తురవయి(లో బాధ్యులు.
(ప్రవేశిక
14వ శతాబ్దం నుండి 19వ శతాబ్ది ప్రారంభం వరకు అయిదు శతాబ్ధాల కాలం ఆంధ్రదేశం వివిధ రాజవంశాల పాలనలో ఉంది. విజయనగర రాజులు అత్యున్నత స్థాయిలో ఉన్నారు. మహమ్మదీయ రాజులను ఎదిరించి దక్షిణాదిన వారి సామ్రాజ్యాలు విస్తరించకుండా విజయనగర రాజులు నిలుపుచేయగలిగారు. ఐరోపాలో మోస్తరుగానే దక్షిణ భారతంలో కూడా భూస్వామ్యం నెలకొంది. విజయనగర సామ్రాజ్య సరిహద్దుల్లో భూస్వామ్యం ప్రస్ఫుటంగా కనబడింది. భూస్వాములుగా పాలేగార్గు కొన్ని (గ్రామాలకు ఆధిపత్యం వహిస్తూ దాదాపు రెండు శతాబ్దాలకాలం కొండప్రాంతాలలో చిన్నచిన్న రాతికోటల్లో నివసించారు. గ్రామాల నుండి చేసిన వసూళ్ళతో కొంత సిబ్బందిని పోషిస్తూ, రాజరీవితో పాలన చేశారు,
విజయనగర రాజుల తర్వాత, కర్ణాటక నవాబులు, హైదర్, టిప్పు, హైదరాబాదు నైజాం కూడా పాలేగార్లమీద అధికారం చలాయించారు. పాలేగార్లకింద చాలామంది కట్టుబఐడులు, భూములను ఇనాముగా పొంది, వంశపారంపర్యంగా వారసులకు భూముల సదుపాయం కలిగించేవారు. తమ పాలేగార్లు ఇతరులతో పోరాడవలసివస్తే కట్టుబడులు తాము స్వతహాగా ఆయుధాలు సమకూర్చుకుని పాలేగారుకు అండగా నిలిచారు. దోపిడీదార్లు, దొంగలు (గ్రామాలమీద పడి దోచుకోకుండా (గ్రామాలకు పాలేగారు రక్షణ కల్పించేవాడు.
పాలేగార్లు చాలా బలం కలిగిన ధైర్యశాలురు. అయినా వారిలో ఐక్యత లోపించింది.
1799లో శ్రీరంగపట్టణ ముట్టడిలో టిప్పు మరణించడంతో, తమకు సాయపడిన (బైటీష్ ఈస్టిండియా కంపెనీకి యుద్ధపు ఖర్చులకు గాను నైజాం నాలుగు జిల్లాలు దత్తం చేశాడు. అదే దత్తమండలం, లేదా రాయలసీమ ప్రాంతమయింది. దత్తమండలంలో కడప, కడ్నాలు, బళ్ళారి, అనంతపురం జిల్లాలుండేవి. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత చిత్తూరు జిల్లా ఏర్పడింది. అంతవరకు కడప జిల్లాలోని మదనపల్లి, పుంగనూరు తాలూకాలు, ఉత్తర ఆర్కాటులోని కొన్ని ప్రాంతాలను కలిపి చిత్తూరు జిల్లా ఏర్పాటు చేశారు. కాళహస్తి, కార్వేటినగరం లేదా బొమ్మరాజుపాళెం, వెంకటగిరి, పాకాలపాళెములను పడమటి పాళెములన్నారు. ఆ పాళెములలోని వనరులు గుర్తించి నివేదించవలసిందిగా (స్ట్రాటమ్‌ను కలెక్టరుగా నియమించారు.
కడప జిల్లాకు కలెక్టరైన థామస్ మన్రో దత్తమండలంలో శాంతి నెలకొనాలంటే ఆ మండలంలో బలంగల పాలేగార్లను అణచివేయడమొక్కటే మార్గమని తలపెట్టాడు. ఎక్కువ బలంగల 80 మంది పాలేగార్లతో పోరాడి, ఒక్కొక్కరినే పట్టుకుని వారిని అనంతపురం జిల్లాలోని గుత్తికోటలో బంధించాడు.
రాయలసీమలో పన్ను రాబట్టేందుకు మన్రో రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. పాలేగార్లకు నామమాత్రంగా ఫింఛనులు, సనదులు ఇచ్చాడు. ఆ విధంగా పింఛను అందుకున్న వంశాల్లో మజ్జేరి వంశంలో పుట్టిన ఉయ్యాలవాడ పాలేగారు నరసింహారెడ్డి బ్రిటీష్ వారిని ఎదిరించాడు. తన పింఛనుకోసం స్వయంగా వెళ్ళనందున రెడ్డిని నిర్బంధంగా తీనుకురావలసిందని వారంటు వంపిన తహాసిల్దారు తనను అవమానించాడని మండిపద్దాడు. వారసులు లేరన్న మిషతో ప్రభుత్వం తమ భూములను తీసివేసుకోగా అసంతృప్తి చెందిన కట్టుబడిదార్లు అప్పటికే కోపంగా ఉన్న మజ్టేం నరసింహారెడ్డిని ఆశ్రయించి అతని సహాయం కోరారు.
ఈ కారణాలతో 1846లో పప్రభుత్వంమీద తిరుగుబాటు జరిపి, నలువైపుల నుండి, సుదూర ప్రాంతాల నుండి పిలిపించిన (బ్రిటీష్ సైన్యాన్ని ఎజ్బమలై, నల్లమతై కొండల్లో ముప్పుతిప్పలు పెట్టి రుద్రవరం, మిట్టపల్లి, ముండ్లపాడు ప్రాంతాలో పోరాటాలు జరిపిన ఖ్యాతి నరసింహారెడ్దిదే. క్ట
గృహనిర్భంధంలోని భార్యాపిల్లలను విడిపించేందుకు కడపకు వెడుతున్న రెడ్డిన్సి పరశుమలై కొండమీద జగన్నాథ ఆలయంలో పట్టుకుని కోయిలకుంట్ల సమీపం లో 1847 ఫిబ్రవరి 22వ తేదీనాడు ఉదయం ఏడుగంటలకు ఉరితీశారు. నిశ్శబ్దం అవరించిన సమయంలో ఈ సంఘటనను రెండువేలమంది తిలకిస్తూ మౌనంగా రోదించారు.
1857లో ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగినట్టు చరిత్రకారులు చాటుతున్నా అంతకు పదేండ్లు ముందే 1847లోనే నరసింహారెడ్డి మరణంతో ముగిసిన పాలేగార్ర ఆఖరిఘట్టం పోరాటం దక్షిణాన జరిగిన ప్రథమ స్వాతంత్ర్య సమరమనాలి. న
ఈ (గ్రంథరచనకు ఆధారాలు విస్తారంగా లేవు. పాలేగార్ల శిలాశాసనాలుగాన్సీ,
"వారు ముద్రించిన నాణేలుగానీ లేవు. వారు కూడా అప్పటి పాలకులు చలామణి చేసిన వరహాలు మాత్రమే వాడేవారు. వారు నిర్మించిన పెద్ద కట్టడాలుగానీ, కోటలుగానీ అరుదు. ఆ కాలపు సొహిత్యంలో వీరిని గురించిన ప్రస్తావన లేదు. అక్కడక్కడా “వీర శిలలూ అనే హీరోస్టోన్స్ ఉన్నా ఆ వీరులెవరో తెలియదు. పెద్దపెద్ద కొండరాళ్ళను
పలుచగా చీలదీసి వాటిమీద వేటాడే మనిషిని చెక్కారు. వారి చేతుల్లో ఈటెలు, విల్లంబులున్నాయి. అ శిల్పాలు జంతువులను వేటాడే ఆటవికులవో, పోరాటాలు సలిపిన పాలేగార్లవో, ఈ శిల్పాలను ఎవరు మలిచారో తెలియదు. ఆ శిల్పాలు షాలేగార్లవని అనటానికి కూడా నిర్ధారణ లేదు. వాటిమీద ఏ భాషలోగానీ రాతలు లేవు, అక్కడక్కడా కొండలమీద, గుట్టలమీద రాతికోటల శిధిలాలున్నాయి. ఈ శిథిలాలలో ఏమైనా రుజువులు దొరకవచ్చునా అన్నది పురావస్తు శాఖ పరిశోధనలో తేలాలి.
రాయలసీమ ప్రాంతాల పాలకుల రికార్డులు, శిలాశాసనాలు పాలేగార్ల చరిత్రకు ఆధారాలయ్యాయి. ఇప్పటికీ కొందరి ఇండ్లలో ఆ కాలపు పెద్దపెద్ద కత్తులు, చురకత్తులు తుప్పుపట్టి ఉన్నాయి. ఆ కుటుంబాలు, ఆ వంశాలు వివాహ సమయాల్లో దేవరకొలువుకు ఆ కత్తులను ఇప్పుడు కూడా పూజిస్తున్నారు. పురుషులు, అంటే వరులు వివాహ సమయంలో పదహారురోజులు కాలికి బంగారుమెట్టెలు ధరిస్తున్నారు. కాలికి బంగారం తాకించే ఆభరణాలు రాజరీవికి చిహ్నం.
బాగా అందుబాటులో ఉన్నవి (బిటీష్ అధికారపత్రాల సంకలనలు, జానపదగీతాలు, బు(రకథలవంటివి. పోరాడి, టబ్రిటీష్‌వారిని గట్టిగా, పట్టుదలతో ఎదిరించిన ఆఖరు పాలేగారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. రెడ్డిని 1847లో ఉరితీయడంవరకు విప్లవవీరుని గాథను కోయిలకుంట్ల ప్రాంతంలో ఇప్పుడు కూడా పిచ్చిగుంట్లవారు, భిక్షగొళ్ళు పాడుకుంటూ ఉంటారు. అప్పటి పాలేగార్లకు ప్రభుత్వం ఇచ్చిన రాగిరేకులు (తొమ్రపత్రాలు) ఏ కొద్దిమంది ఇళ్ళలో ఉన్నా అవి పనికిరాని 'రేకులుగా భావించి మూల పడేసినవే. వాటిని పరిశోధకులు గమనించి పరిశీలించాలి.
పెద్ద జమీందార్లుగా దాదాపు ఒకటిన్నర శతాబ్దాలు అధికార హోదాను అనుభవించినవారివడ్గ వారి కుటుంబ వత్రాలుంటాయి గానీ, వాటిని పరిశోధకులకిచ్చినట్లయితే తమ ఆస్తులకు, భూములకు ముప్పు ఏర్పడవచ్చునన్న అనుమానంతో, వారు వాటిని బయటికి చూపటంలేదు. అటువంటి పత్రాలు సమగ పరిశోధనకు, పాలేగార్ల గురించిన సత్యాలను వెలుగులోకి తేవడానికి తోద్చడుతాయి. ఈ పుస్తకం పాలేగార్ల చరిత్ర రచించే వారికి ప్రోత్సాహకం మాత్రమే.
- జోలెపాళెం మంగమ్మ
- పాలేగార్లు - భూస్వామ్యం న. క్ష
- కంపెనీ పాలనలో రెవిన్యూ సెటిల్‌మెంట్ వ...
- దత్తమండలం - కావలి పద్ధతిలో మనో తీసుకున్న చర్యలు ..... 17 4 మైసూరు సుల్తానులు - బ్రిటీష్ కంపెనీ ఎం 221
- చిత్తూరు పాలేగార్లు ఎం తిక 6., ,అనంతపురం పాలేగార్లు (ఉయ్యాలవాడ నరసింహారెడ్డి) 44. జేర
- కడపజిల్లా పాలెగార్లు ం క50
- అనుబంధాలు - 1 ౨ 0 1 అం. ప్రతి
- ఉపయుక్త గ్రంథాలు, రికోర్డులు అం 111
పాలేగార్లు - భూస్వామ్యం
మధ్యయుగంలో యూరప్‌లో మోస్తరుగానే భారతదేశంలో భూస్వామ్యం నెలకొంది. ఆవనులు 1811లో భారతదేశంలో (వ్రవేశించడంతో దక్షిణభారతంలో విజయనగర రాజులకు, ముస్లిం పాలకులకు మధ్య పోరాటం (ప్రారంభమయింది.
దక్షిణ భారత చరిత్రను ఏదో ఒక రాజు చరిత్రగానో, రాజవంశపు చరిత్రగానో చిత్రించినా, కొన్ని సంఘటనలు చరిత్ర అనే సాంస్కృతిక వాహినిలో గుర్తింపు పొందలేదు. అనేక ప్రాంతాల్లోని చిన్నచిన్న నాయకులను గుర్తించినట్టు లేదు. దక్షిణ భారతదేశంలో అలక్ష్యానికి గురైనవారిలో పాలేగార్లు ముఖ్యులు.
అనాది నుండి రాజ్యాధిపతిదే భూమి హక్కు రైతుకు భూమిని సాగుచేసే హక్కు మాత్రమే ఉండేది. అదయినా వారసత్వం కాదు.
బహమనీ సుల్తానులను అడ్డగిస్తూ విజయనగర రాజులు పాలేగార్లను నియమించారు. వారిని నియమించినట్టు తాఖీదేమీ లేదు. పాలేగార్లు తమ అధీనంలోని భూములమీద పన్ను వసూలు చేసి రాజ్యాధిపతికి కప్పం చెల్లించేవారు. 1565 జనవరి 28ిన జరిగిన తళ్ళికోట (రాక్షస తంగడి) యుద్ధంలో విజయనగరరాజులు ఓడిపోయారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో పాలేగార్లు స్వయం నియమిత పాలకులయ్యారు. ఎవరికి వారు స్వాతంత్ర్యం (ప్రకటించుకుని మకుటంలేని మహారాజులయ్యారు. వారికి రాజులకున్నట్టు
లై సీమపాలేగార్లు సామ్రాజ్య విస్తరణ కాంక్ష లేదు. తమ అధీనంలోని భూములను నిలబెట్టుకునేందుకు పొరుగు (గ్రామాధికార్లతో పోరాడేవారు. పాలకులకు చెల్లించవలసిన కప్పం గురించిగాను, వారు కోరినప్పుడు ఎంత సిబ్బందిని సమకూర్చాలనిగానీ నిర్దేశించే తామ్రపత్రాలుగానీ, శిలాశాసనాలుగానీ లేవు. తళ్ళికోట యుద్ధానంతరం బహమనీ సుల్తానులు తమ రాజ్యాల సమీపంలోని పాలేగార్లమీద విడివిడిగా దాడులు జరిపి వారిని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అయినా 17, 18 శతాబ్దాలలో దక్షిణాదిన పాలేగార్ల అధికారం (ప్రబలింది.
పాలేగార్లకు భూములున్నాయి. వారి అధీనంలోని ప్రాంతాలు పాలనా నిర్వహణ పాలేగార్ల చేతిలోనే ఉంది. భూస్వామ్యంలో వలెనే మంచి భూమిని వారు స్వయంగా సాగుచేసేవారు. అడవులు శుభ్రపరచి, గ్రామాలు ఏర్పాటు చేసి చెరువులు తవ్వించి, వ్యవసాయం అభివృద్ధి చేశారు. బ్రాహ్మణులకు అ(గ్రవోరాలు నిర్మించారు. ఆలయాల్లో వండుగలు, ఉత్సవాలు జరిపించటంతోపాటు ప్రజావినోదంలోనూ గుజ్దపుపందాలు, ఎరద్గపందాలు కూడా నిర్వహించారు. ప్రజల అవసరాలను గుర్తించి పాలన జరిపారు.
పాలేగారన్నది వృత్తినిబట్టి వచ్చిన పదం. పాలేగారు ఒక కులం కాదు. అది ఒక ఉద్యోగమనాలి. వారికి సైనికాధికారాలు, రెవిన్యూ అధికారాలు రెండూ ఉండేవి. తెలుగుపాలేగార్లలో రెడు, రాజులు, కమ్మవారు, వెలమలు, (బ్రాహ్మణులు, ముస్లిములు కూడా ఉన్నారు. ఉదాహరణకు చంద్రగిరి పాలేగారు యాదవరాజు, కోయిలకుంట్ల పాలేగారు రెడ్డి, పుంగనూరు పాలేగారు గౌనివారు. కార్వేటినగరంపాలేగారు క్షత్రియులు, వెంకటగిరి పాలేగారు వెలమ, బంగారుపాళెం పాలేగారు ఏకీలి. ప్రతి పాలేగారు ఎత్తయిన ప్రాంతంలో రాతికోట నిర్మించుకునేవాడు. ప్రమాదంలో కోట రక్షణ కల్పించేది. ఆయుధాలు విచ్చలవిడిగా వాడేవారు. పాలేగార్ల వడ్డ వనిచేసేవారు ఎంతటి అవసరానికయినా వెంటనే, సమావేశమయ్యేవారు. -ఏ ఉత్తర్వులకయినా విధేయులుగా ఉండేవారు. భూ తగాదాలు, ఆస్తి తగాదాలు, సరిహద్దు తగాదాలు,
పాలేగార్లు - భూస్వామ్యం తి ఏమి ఏర్చడినా పాలేగారు న్యాయనిర్దేతగా వ్యవహరించేవాడు. ఆయన తీర్పుకు తిరుగు ఉండేది కాదు. పాలేగారు ఎంత శిస్తు చెల్లించాలో పాలకులు నిర్ణయించేవారు. శిస్తు వసూలు వరకు మాత్రమే పాలేగారు అధికారం పరిమితమయి ఉండేది. పాలేగారు సాలుసరి ఆదాయం కొన్ని వందల వరహాలకు మించేది కాదు.
పాలేగారు సర్వాభరణాలతో, రాజరీవితో ప్రజలకు దర్శనమిచ్చేవాడు. ముత్యాలసరాలు [వేలాడే సరిగలాయ తలపాగా, భుజాలకు బంగారు ఆభరణాలు, మెడకు బంగారు గొలుసులు, చేతులకు బంగారు కడియాలతో, నడుంచుట్టూ బంగారు గజ్జెలతో, చేతికర్రతో, జెండాలు, గొడుగులతో వెడుతూ ఉండగా, కాగడా మనుషులు ముందు నడిచేవారు. ఏనుగుమీద, లేదా గుజ్జంమీద రాజరీవితో దర్బారుకు (మహాసభకు) వెళ్ళేవాడు. వెంట వెళ్ళిన సిబ్బంది ఈ ఊరేగింపుకు శోభ సమకూర్చేది. పాలేగార్ల సిబ్బంది
పాలకులకు సైన్యాన్ని సమకూర్చడం పాలేగార్ల విధుల్లో ఒకటి. కాబట్టి సైనిక సిబ్బందిని పోషించేవారు. సైనిక సిబ్బంది సంఖ్యనుబట్టి వారి హుందాతనం ప్రదర్శితమయ్యేది. తమ ఆదాయాన్ని చాలావరకు సిబ్బంది పోషణకు వినియోగించేవారు. పాలేగారు సిబ్బంది మూడు తరగతులు - అమరం సిబ్బంది, కట్టుబడి సిబ్బంది, కిరాయి సైనికులు. అమరం సిబ్బంది సదా పాలేగారుతోనే ఉండేవారు. అమరం సిబ్బందీలో సర్జారుకింద ఇరవై, ముప్పైమంది వంతున సిబ్బంది ఉండేవారు. పాలకులకు వీలైనంత సేవ చేస్తామని అమరం సిబ్బంది ప్రతిజ్ఞ చేసేవారు. తమ గ్రామాలలో దొంగతనం జరగకుండా చూచే బాధ్యత అమరం సిబ్బందిదే. విధులు సరిగా నిర్వర్తించని అమరం సిబ్బంది ఉద్యోగం, భూమి - రెండూ పోగొట్టుకునేవారు.
కట్టుబడి సిబ్బందికి భూమిమీద వారసత్వపు హక్కు లేదు. నిజానికి వారు రైతులు, సైనిక సిబ్బందికి తోద్చడేందుకు ఈటెలు, నాటు తుపాకులు వారే సమకూర్చుకునేవారు. తమ పర్యవేక్షణలోని గ్రామాలలో దోపిడీలు జరిగితే
శ నీమపాలేగార్లు పోయిన వస్తువులు సమకూర్చడం వారి బాధ్యతే. అత్యవసర పరిస్థితిలో మాత్రమే కిరాయి సైనికులను పిలిపించేవారు. పనిలో ఉండగా వారికి దబ్బు, ధాన్యం రూపంలో బత్తా లభించేది. ఆయుధాలను ఉపయోగించడంలో సిబ్బందికి పాలేగారు శిక్షణ ఇచ్చేవాడు. పాలేగారు మాట వారికి చట్టంతో సమానం. పాలేగారు పనుపున సిబ్బంది హత్య చేసినా, దానికి బాధ్యత పాలేగారు వహించేవాడు. హత్య చేయడం కూడా సిబ్బంది తమ విధుల్లో భాగంగా యుద్ధ సమయం
పాలేగారు సిబ్బంది వాడే ఆయుధాలు వారు చేసే యుద్ధాలకు తగినట్టుండేవి. ఫిరంగులు, నాటుతుపాకులు, కత్తులు, డాలు, ఈటెలు, బాణాలు వారి ఆయుధాలు. బంకమట్టితో కోడిగుడ్డు సొన కలిపి తుపాకీ గుండ్లు చేసుకునేవారు. గట్టికొయ్యతోనో, ఇనుముతోనో చేసిన “బూమరాంగ్ అనే ఆయుధం వాడేవారు. అది శత్రువుతో తలపడి వెనకకు రాగల ఆయుధం. వారి ఆయుధాలన్నీ దగ్గర నుండి పోరాటానికి పనికివచ్చేవే. కోటల చుట్టూ ఉన్న కలప కంచెలు శత్రు కాల్పులకు నిలిచేవి కావు.
యుద్ధకాలంలో సామాన్లు తరలించేందుకు ఎద్దులు అవసరమయ్యేవి, గూధచారులు మారువేషంలో పనిచేసేవారు. మం(త్రశక్తిని కూడా ఒక ఆయుధంగా ఉపయోగించేవారు. పొంచి ఉండి దెబ్బతీయటం వారికి పరిపాటి. కోట గోడలమీద నుంచి కాల్పులు జరిపి కొండలు ఎక్కేవారిని అడ్డుకునేవారు,
అత్యవసర పరిస్థితిలో పిలిపించిన కిరాయి సైనికులకు డబ్బురూపంలో, ధాన్యం రూసంలో బత్తా లభించేది. పాలకులు కోరినప్పుడు పాలేగార్లు తమ సిబ్బందిని పంపి తోడ్బడేవారు. సిబ్బంది పోషణకు మొదట్లో కొంత సొమ్ము లభించినా ఆ తర్వాత అందుకోసం వాలేగార్లకు కొన్ని గ్రామాలమీద అధికారం లభించింది. తమకోసం, తమ సిబ్బందికోసం, తమ పాలకులకోసం కూడా పాలేగార్లు ప్రజల నుండి శిస్తు వసూలు చేసేవారు. వసూలు“ వెళ్ళినవారు (గ్రామ ప్రాంతాల్లో విచ్చలవిడిగా సొమ్ము వసూలు చేసినా పాలెగారుగానీ, ఆ
పాలేగార్లు - భూస్వామ్యం క్ పై అధికారిగానీ ఏమాత్రం పట్టించుకోలేదు. శిస్తు చెల్లింపు భారాన్ని ప్రజలు మౌనంగా వహించారు. పోరాట సిబ్బంది శిస్తు వసూలు పని కూడా చూసుకునేవారు. శిస్తు వసూళ్ళు
విజయనగర రాజుల కాలంలో హిందూ పద్ధతులమీద భూమి ఏ ఒకరి ఆస్తి అని గానీ, ప్రభుత్వానిది అనిగానీ నిర్వచనం లేదు. ప్రతి వ్యక్తి ఎంత చెల్లించాలో, (గ్రామం మొత్తంమీద ఎంత శిస్తు చెల్లించాలో రైతులే నిర్ణయించేవారు. ఈ (గ్రామాలను 'వీసపాడి' (గ్రామాలనేవారు.'ో రైతులు సాగుచేసే భూమి ప్రతి సంవత్సరం మారటంతో భూమిని సారవంతం చేయాలనుకునేవారు కాదు. సంప్రదాయం ్రకారం సగం పంట ప్రభుత్వానికే వెళ్ళేది. సగం పంట విలువను పన్నుగా నిర్ణయించేవారు. తరీ (మాగాణి), కుష్కీ (మెట్ట) పంటలు రెండింటికీ వర్తించేది. లెక్కలలోని దానికన్నా ఎక్కువ భూమిలో సాగును రెవిన్యూ అధికార్లు అనుమతించేవారు. సర్వే అధికార్లు ఇందులో కొంత సొమ్ము చేజిక్కించుకునేవారు. జెరంగజేబు పాలనలో అదివరకటి నిర్ణయం ప్రకారమే పన్ను వసూళ్ళు జరిగేవి. గోల్కొండ నవాబుల అధికారం తగ్గటాన్ని ఆసరాగా తీసుకుని పాలేగార్లు తప్పుడు లెక్కలు చూపుతూ ప్రభుత్వానికి చెల్లింపులు తగ్గించివేశారు. బీజాపూరు సుల్తానుల పతనంతో పొలేగార్లు ఇతర గ్రామాలను దోచుకోసాగారు.
1756లో మహారాషులు కడప నవాబును ఓడించి సగం రాజ్యాన్ని బలవంతాన వశపరచుకున్నారు. హైదరాలీ, టిప్పు సుల్తాన్ అధికారం పొందని వారి ఇనాములు లాగివేసుకుని, తప్పుడు లెక్కలను వెంటనే పట్టివేస్తూ పాలేగార్లను కొంతవరకు అదుపులో ఉంచారు. వసూలైన శిస్తు 5 నుంచి 10 శాతం మాత్రమే పెరిగింది. 1780లో కర్టాటక (ఇప్పటి ఆర్కాటు జిల్లాలు) యుద్ధాలలో నిమగ్బుడైన హైదరాలీ లెక్కలమీద దృష్టి సారించలేకపోయాడు.
- _ తమిళ్‌నాడు ఆర్మైవ్స్ - లాండ్ రెవిన్యూ వాల్యుమ్ 23
6 సీమపాలేగార్లు నైజాం పాలనలో 1788 నుండి పదేండ్ల కాలంలో రాబడి 20 లక్షల నుండి 15 లక్షల వరహాలకు పడిపోయింది. 1792లో మూడవ మైసూరు యుద్ధానంతరం నైజాంకిచ్చిన జిల్లాలలో తగ్గినంతగా టిప్పు సుల్లాను అధీనంలోని జిల్లాలలో రాబడి తగ్గలేదు. ప్రభుత్వ బలహీనతవలన, భూముల మీద యాజమాన్యం తరచు మారటం వలన కప్పం చెల్లించే పద్ధతిమీద పాలేగార్లకు మరికొన్ని గ్రామాలు అదనంగా లభించాయి. పన్నులు పెరగటమే గాక జరిమానాలతోపాటు వసూలును కట్టుదిట్టం చేశారు. తక్కువ జీతం పొందుతున్న ఆశ్వికులను జీతాలు వసూలు చేసేందుకు గ్రామాలమీదకు పంపితే వారు గ్రామస్థులను గ్రామాల నుండి వెళ్ళగొట్టి వసూలు చేయవలసినదానికంటే ఎక్కువే వసూలు చేసేవారు. పన్ను వసూలుకు ఒక సూత్రమంటూ లేదు. ఎంతమొత్తం వసూలు చేశారన్నది గాక ఏ రీతిని వసూలు చేశారన్నది ప్రజలను బాధించింది. నాలుగవ వంతు భూములు పాలేగార్ల అధీనంలో ఉన్నందున "వారు తరచు పోరాడుకునేవారు. ప్రభుత్వం వారివద్ద అపరాధరుసుం వసూలు చేసింది. పాలేగార్ల సిబ్బందినిబట్టి వారు చెల్లించవలసిన శిస్తు నిర్ణయించారు. ప్రజాసైన్యం అంటే కట్టుబడి సిబ్బందికోసం మొత్తం శిస్తులో 20 నుండి 50 శాతం ఖర్చు పెట్టడాన్ని అనుమతించారు. ఎంతమేరకు వసూలవుతుందన్న నమ్మకాన్నిబట్టి శిస్తు నిర్ణయించారు. భూమితోపాటు ప్రజలను కూడా పాలేగార్లు తమ అదుపులో ఉంచుకోగలిగారు. సిబ్బందిని కేటాయించిన భూమిని ప్రభుత్వం వశపరచుకుని తమ తరఫున వారికి తిరిగి ఇచ్చారు. సిబ్బంది పాలేగారుకు విధేయులుగా ఉండే బదులు, ఉత్తర్వులు అమలుపరచిన అమల్ దారుకు విధేయులయ్యారు. పాలేగారు అధికారాలు తగ్గిపోయాయి. *) దాదాపు రెండు శతాబ్దాలు నిరాటంకంగా అధికారం చలాయించిన పాలేగార్లు వివిధ ప్రభుత్వాలకు కప్పం చెల్లించారు. విజయనగర రాజులు, 11) మన్రో - మనోస్ ఎర్లీ రిపోర్ట్స్ - తమిళనాడు ఆర్మైన్స్, ముద్రణ బళ్ళారి 1892
పాలేగార్లు - భూస్వామ్యం 7 మొగలాయీలు, హైదరాబాదు నిజాం, మరారా నాయకులు, హైదర్, టిప్పుల పాలనలో కప్పం చెల్లిస్తూ కొనసాగినా బ్రిటీష్ కంపెనీ పాలనలో పాలేగార్లు కొనసాగలేకపోయారు. అంతవరకు పాలకులెవ్వరూ ఈ కొండలరాయళ్ళను కదలింపలేకపోయారు.
పాలేగారు పద్ధతిలో కేంద్రంలోని ప్రభుత్వానికి బయటి ప్రమాదాలు ఎదురైనప్పుడు స్థానిక (ప్రముఖులకు ఇంకా ఎక్కువ అధికారాలు, బాధ్యతలు లభించాయి. స్టానిక ప్రముఖులు సైనిక సహాయం చేయవలసిరావటంతో సైనికబలగం గల భూస్వామ్యం అమల్లోకి వచ్చింది. (గ్రామనాయకులకు పాలేగారు ఒక బిరుదుగా మారింది. కడప నవాబులు గానీ, మరారి అధిపతులుగానీ పాలేగార్లను అణచలేకపోయారు. హైదరాలీ పాలేగార్లను కోటల నుండి వెడలగొట్టగలిగాడు. అలాంటి పాలేగార్లకు రక్షణ కల్పించివారిమీద చర్య తీసుకున్నాడు. పాలనా దక్షుడైన హైదరాలీ తలారులవంటి సిబ్బంది జోలికి పోలేదు. హైదరుకు కప్పం చెల్లించటంతో హైదరు ఆధిపత్యాన్ని పాలేగార్లు గుర్తించినట్టయింది. అవసరమైనప్పుడు తనకు సహాయపడే పోరాట సిబ్బంది హైదరాలీకి సమకూరింది. పాలేగారు అనుభవించే భూమి విలువమీద వారు అందించే సైనిక సహాయం ఆధారపడింది.
18వ శతాబ్దం ఆఖరుకు పాలేగార్ల విషయంలో టిప్పు అవలంబించిన విధానంలో కొంత మార్పు కనబడింది. టిప్పు అమల్‌దారు కొన్ని భూములను వ్యక్తిగతంగా పాలేగార్లకు కౌలుకిచ్చాడు. బినామీ పేర్లతో అదే ప్రాలేగార్లకు మరికొన్ని భూములిచ్చాడు. బ్రిటీష్ పోరాటంలో తలమునకలవుతున్న టిప్పు పాలేగారు సమస్యను అంతగా పట్టించుకోలేదు. 1799లో టిప్పు మరణంతో (బైటీష్ కంపెనీ తమతో కుదుర్చుతున్న ఒప్పందాన్ననుసరించి నైజాం, కడప, కర్నూలు, బళ్ళారి జిల్లాలను కంపెనీకి బదలాయించాడు. ఆ జిల్లాలలోని పాలేగార్లు అయాచితంగానే బ్రిటీష్ కంపెనీ కిందకు వచ్చారు. కంపెనీ ఆ జిల్లాలను వశపరచుకోవడమంటే ఆ ప్రాంతంలోని పాలేగార్లను అణచివేయడమే అయింది.
8 సీమపాలేగార్లు
ఏదైనా పాలేగారు మరణించినా, వారసునికి గుర్తింపు లభించినా వారివద్ద ఎక్కువ 'రుసుం, శుల్కం వసూలు చేసేందుకు నవాబు ప్రయత్నించేవాడు. నవాబుకిందగల జాగీర్జార్లు నిరంకుశంగా పాలించినా పాలేగార్లమీద తమకున్నది పరిమిత అధికారాలు మాత్రమేనని వారికి తెలుసు. కంపెనీ సేవకులకు కలకత్తా నుంచి ఫోర్ట్ విలియం ఈ విషయం స్పష్టం చేసింది..
మ య బ్రిటీష్ కంపెనీ పాలనలో రెవిన్యూ సెటిల్‌మెంట్
1799లో టిప్పు మరణానంతరం నైజాం తన వాటా యుద్ధ ఖర్చులకు గాను దత్తమండల జిల్లాలను (బిటీష్ కంపెనీ వశం చేశాడ్డు. మనో దత్తమండలానికి కలెక్టరయ్యాడు. రెవిన్యూ సెటిల్‌మెంట్ మన్రో మొదటి ఆలోచన. 1800-01 గ్రామప్రాంతాల సెటిల్‌మెంట్
(గ్రామమంతటికీ కలిపి శిస్తు నిర్ణయించాలని తలపెట్టాడు. దీనినే “'మోజావర్” అన్నారు. 20 లక్షల వరహాలకు మించిన శిస్తు వసూలవుతుందని అంచనా వేశారు! అయితే 11 లక్షలకు మించి వసూలు కాలేదు. 1801-1802 రైత్వారీ సెటిల్‌మెంట్
(గ్రామమంతటికీ కలిపి 'మోజావర్” శిస్తు విధానం అనుకున్నంత విజయవంతం కాకపోవడంతో, మనో రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. (ప్రభుత్వం నుండి పట్టా పొందిన రైతు తాను వ్యక్తిగతంగా అనుభవించే భూమికి ఎంత శిస్తు చెల్లించాలో తెలుసుకున్నాడు. రైతువారీ పద్ధతి ప్రవేశపెట్టడంతో ఆ క్రితం సంవత్సరంకన్నా నాలుగు రెట్లు ఎక్కువ శిస్తు వసూలైంది. విజయనగర కాలం నుండి కూడా భూమిని ఎల్లప్పుడూ (ప్రభుత్వ అస్తిగానే పరిగణించారు. భూమి ఏ ఒక్కరి ఆస్తి అనిగానీ, ప్రభుత్వానిదనిగానీ నిర్వచనం ఎక్కడా లేదు,
10 సీమపాలేగార్లు సంప్రదాయం ్రకారమయితే సగం పంట ప్రభుత్వానికే వెళ్లేది. సగం పంట విలువను ప్రభుత్వానికి చెల్లించి రైతు నష్టపోయేవాడు. మూదేంద్ల గుత్త ప్రతిపాదన
(ప్రతి గ్రామాన్ని సంవత్సరానికి ఇంత చొప్పున మూడేండ్ల కాలానికి గుత్తకిచ్చారు. గ్రామాన్ని తీసుకున్న జమీందారుగానీ, మరో వ్యక్తిగానీ నిర్ణీత శిస్తు చెల్లింపుకు బాధ్యుడు. జమీందార్లు లేని దత్తమండలంలో మామూలు (గ్రామపెద్దలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని కలెక్టరుగా మన్రో సూచించాడు. (ప్రభుత్వాధికారికి, రైతుకు మధ్య మరొక వ్యక్తి రావడంతో రైతు మీద భారం పెరిగి వారి పరిస్థితి మరింత దిగజారుతుంది. రైతులతోనే పరిష్కారం కాబట్టి రైత్వారీ కొనసాగాలని మన్రో భావించాడు. పంటను బట్టి పన్ను చెల్లిస్తారు కాబట్టి పెద్ద ఎస్టేట్లకన్నా చిన్న కమతాలమీదే ఎక్కువ వసూలవుతుంది. జమీందారీ దమన విధానాన్ని ప్రజలు హర్షించబోరని మన్రో అభిప్రాయం. రైత్వారీ రేట్లు తగ్గించాలన్న (ప్రతిపాదన
ప్రభుత్వ రాబడి పెంచాలన్నద్నే మన్రో ఆలోచన. రైతుకు భూమిమీద శాశ్వత హక్కు లభిస్తే ప్రభుత్వ రాబడి పెరుగుతుంది. భూమిని బాగుపరచ్చి పంట దిగుబడిని పెంచుతారు. మొత్తం ఆదాయంలో 45 శాతం (ప్రభుత్వానికే చెందుతుంది.
దత్తమండలమంతటికీ వేజర్ మ్యనోను (వధాన కలెక్టరుగా నియమించారు. నలుగురు అసిస్టెంట్ కలెక్టర్లకు హర్చనహళ్ళి, ఆదోని, కడప, కంభం ప్రధాన కార్యాలయాలయ్యాయి. దత్తమండల ప్రాంతంలో భూమి శిసు వసూలుకు సరికొత్త పద్ధతిని రూపొందిస్తూ అక్కడి పాలేగార్లను అణచివేయడమే ప్రధాన కర్తవ్యంగా మనో భావించాడు.
1802 జూన్‌లో దత్తమండలంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలలో భూముల సర్వే ప్రారంభమైంది. సర్వే పుస్తకంలో (ప్రతి పొలానికొక పేరు, ఒక నంబరు ఇచ్చారు. పాలేగార్ల అధీనంలోని ప్రాంతాలలో సైనిక వ్యవస్థను నిర్మూలించాలనీ,
బ్రిటీష్ కంపెనీ పాలనలో రెవిన్యూ సెటిల్‌మెంట్ కేకే లేదా ఆ వ్యవస్థను ప్రభుత్వాధికారి అయిన అమల్‌దారుకు బదలాయించాలనీ మన్రో అభిలషించాడు. సిబ్బందికయ్యే ఖర్చును కలుపుకుని పాలేగార్లు చెల్లించవలసిన పన్ను మొత్తాన్ని చాలా ఎక్కువగా నిర్ణయించడంతో పాలేగార్లు తప్పనిసరిగా తమ అనుయాయూలను వదులుకోవలసి వచ్చింది. కొత్తగా ఏర్పడిన జిల్లాలను యూరోపియన్ పర్యవేక్షణలో ఉంచారు. నీటి సదుపాయం లేని భూములను గ్రామంలో పెద్ద రైతుల వశం చేశారు. వీటిమీద పన్నులో (గ్రామానికీ, గ్రామానికీ తేడా ఉంది. నీటిపారుదల గల పుంజభూములు పాలేగార్ల చేతుల్లో ఉన్నాయి. ఆ భూములమీద శిస్తు నగదు రూపంలోగానీ, వస్తురూపంలోగానీ స్వీకరించారు. సర్వే లేనిచోట్ల గ్రామలెక్కలు ఆధారంగా చెల్లించవలసిన శిస్తును సర్జుబాటు చేశారు. పాలేగార్ల అధికారం శిస్తు వసూలుకు మాత్రమే పరిమితమయింది. వసూలైన మొత్తంలో కొంతభాగం తనకోసం నిలుపుకుని మిగిలినది ప్రభుత్వానికి సమర్పించేవారు. ధామస్ మనో పాలేగార్లతో చాలా నేర్పుతో వ్యవహరించాడు. శిస్తును ఎన్నో రెట్లు పెంచి పాలేగార్లు సకాలంలో ఆ మొత్తాన్ని చెల్లించే అవకాశం లేకుందా చేశాడు. వారు సాయుధులను నియమించుకునే అవకాశం లేకుండా చేశాడు. శిస్తు చెల్లించని పాలేగార్ల భూములను వశపరచుకుంటూ వచ్చారు. అదనప్పు వసూళ్ళు జరిపే వీలు లేకుండా పోయింది. భూములు పోగొట్టుకున్న పాలేగార్లు సామాన్య రైతుజీవనం గడపవలసి వచ్చింది. భూముల వలన ఎంత రాబడి ఉందేదో కలెక్టర్లకు నిర్దిష్టంగా తెలియదు. అడిగిన శిస్తు చెల్లించలేని పాలేగార్లు ఊర్లు వదలి పారిపోగా, వ్యవసాయ భూములు సాగులేకుండా నిలిచిపోయాయి. భూమికి అమ్మకం విలువ పెరగాలంటే పంటలో మూడవవంతుకు పన్ను మించకూడదనీ, అన్ని భూములమీద 25 శాతం పన్ను తగ్గించాలనీ, సేద్యపు బావులు, చెరువుల మరమ్మత్తుకు రైతులు అంగీకరిస్తే వాటికింద జరిపే సాగుకు మరో 8 శాతం అదనపు పన్ను చెల్లించాలనీ మనో ప్రతిపాదించాడు. ఇందువలన సాగుభూమి వైశాల్యం పెరగడమేకాక ఇంకా ఎక్కువ పన్ను వసూలవుతుంది.
12 సీమపాలేగార్లు
డైరెక్టర్ల కోర్టు నిర్ణయించినట్టు ఒక స్పెషల్ కమిషన్ నియమించారు. జమీందార్లకు సనదులు ఇవ్వాలనీ, ఈ సనదులు చెంగల్పట్టు జిల్లాలో మొదట ఇవ్వాలనీ నిర్ణయించారు. 1803 నాటికి పడమటి పాళెములయిన వెంకటగిరి, కాళహస్తి, బొమ్మరాజుపాళెం, సైదాపూర్‌లలో శాశ్వత పన్ను పరిష్కారం జరగాలని తలపెట్టారు. సెప్టేంబరులో కమీషన్ రద్దు చేసి ఆ విధులను రెవిన్యూ బోర్జుకు అప్పగించారు.) జమీందార్లకు బంజరు భూములు, వ్యవసాయ భూములు కూడా లభించాయి. జమీందార్లు లేనిచోట జమీందార్లను సృష్టించారు. ప్రతి జమీందారు స్థిరంగా ఎంత చెల్లించాలో నిర్ణయించారు. జమీందార్లు తమ రాబడిలో మూడింట రెండువంకతులు ప్రభుత్వానికి చెల్లించాలి. వారు ఒక పద్ధతికి లోబడి రైతులవద్ద వసూలు చేయాలి. ప్రతి రైతు ఎంత చెల్లించాలో నిర్ణయిస్తూ జమీందారులే రైతుకు పట్టా ఇవ్వాలి. పట్టా పొందిన రైతులు తమకు అన్యాయం జరిగితే జిల్లాలో ఏర్పడిన కోర్టులను ఆ(శయింపవచ్చు.
మొదట సర్వే జరగాలనీ, దాంతో స్థిరమైన రాబడి ఎంతో తెలుస్తుందనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు అభిప్రాయపడి, ఆంతరంగిక అల్లర్లు అణిగితేగానీ శాశ్వేత పరిష్కారం కుదర్గదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రాబడిలో భూమి శిస్తు చాలా ప్రధానం. 1802వ సంవత్సరం 30వ రెగ్యులేషన్ ప్రకారం రైతులను జమీందార్లు, భయపెట్టకుందా చూసే బాధ్యత కలెక్టరుదే. జమీందార్లు కలెక్టరు ఆదేశాలను అనుసరించాలి.
దత్తమండలంలో మన్రో ప్రవేశపెట్టిన రైత్వారీ పద్ధతిని కోర్టు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించారు. రైత్వారీ పద్ధతిలో ప్రభుత్వానికి ఎంత రాబడి లభించేది తెలుస్తుంది. బంజరు భూములు కూడా సాగులోకి వస్తాయి. ఈ అదనపు రాబడితో రైతులు చెల్లించవలసిన శిస్తు తగ్గించవచ్చు. జమాబంది సమయంలో రైతుల హక్కులు, ప్రభుత్వ వాక్కులు నిర్వచించారు. సర్వే తర్వాత (1) కెం0000 0050160109 [0 8081206, 66 2316 కశ10001 1804.
బ్రిటీష్ కంపెనీ పాలనలో రెవిన్యూ సెటిల్‌మెంట్ 18 దత్తమండలంలో నిర్ణయించిన పన్ను గురించి రెవిన్యూ బోర్జు 1807లో నివేదించింది.
ఫోర్ట్ సెయింట్ జారి ప్రధాన కార్యదర్శి జి. బుకన్ 1804 డిసెంబరు 6వ తేదీ మన్రోకు ఇలా రాశాడు -
“లిత్తూరు పాలేగార్ల తిరుగుబాటు జరిగినందున వారిని అణచివేసేందుకు సైనిక దళాన్ని పంపించవలసి వచ్చింది. 78వ రెజిమెంట్‌లోని లెప్టినెంట్ కల్నల్ మనిపెన్ని సైనికదళం వెంట వెళ్ళాడు. పాలేగార్లు ఒకరితో ఒకరు కలవకుండా చూడాలంటే వారు మనిపెన్నితో నవాకరించాలి. అవసరమనుకుంటే స్థానికంగా సిబ్బందిని సమకూర్చుకోవచ్చు.”
1805 మార్చి 26వ'తేదీన మన్రోకు రాసిన ఉత్తరంలో గట్టుపాలేగారు ప్రతిఘటిస్తున్నట్టు, గట్టు పాలేగారును వశపరచుకోవటానికి 19వ నేటివ్ రెజిమెంట్‌లో 2వ పటాలాన్ని చిత్తూరు నుండి గుల్దిం కొండకు తరలించినట్టు రాశారు. గట్టు పాలేగారు లొంగిపోతే పాళెం నుండి దూరంగా వసతి కల్పించాలని తలపెట్టారు. ఇప్పటి ఆదాయానికి సమానంగా మొత్తం ఆయనకు ఇప్పించాలని సూచించారు. పుంగనూరు పాలేగారు కంపెనీ అధీనంలోకి రావటానికి డైరెక్టర్లు అడ్డు చెప్పలేదు.
సర్వే జరగని చోట్లలో ప్రతి రైతు ఏ భూమిని దున్నుకోవాలో గ్రామ కరణం నిర్ణయించేవాడు. పంటలో నష్టపోయిన రైతులు కొంత భూమిని వదులుకోవలసి వచ్చేది. ఆ వదులుకున్న భూములను అవి కావాలనుకున్న ఇతరులకు ఇచ్చేవారు. పంటను బట్టి వారు చెల్లించవలసిన శిస్తును కలెక్టరు నిర్ణయించేవాడు. విత్తనాలకు, నాగలి, ఎడ్లు కొనేందుకు పేద రైతులకు తహసిల్లారు అడ్వాన్సులిచ్చేవాడు. ఎవరి స్వాధీనంలో భూములున్నదీ, ఎవరి స్వాధీనంలో లేని భూములేవైనా తహసిల్దారు గుర్తించేవాడు. పంట చేతికి వచ్చేటప్పుడు పొలాలు చూసి, కలెక్టరు తహసిల్టారును, కరణాలను సంప్రదించి మిగులు భూములకు ఎంత శిస్తు చెల్లించాలో నిర్ణయించేవాడు. బంజరు
కేశ సీమపాలేగార్లు భూములు రెండ్డు నుంచి ఏడేండ్లు సాగయ్యాక వాటిమీద పన్ను నిర్ణయించేవారు. రైత్వారీ పద్ధతిలో సర్వే తర్వాత రైతుకిచ్చిన పట్టాలోనే చెల్లించవలసిన శిస్తు గుర్తించేవారు.
జిల్లా సర్వే పూర్తయిన ప్రతి పొలానికి సంవత్సరకాలానికి శిస్తు నిర్ణయించేవారు. (ప్రకృతి అవాంతరాలలో దానిని తగ్గించే వీలుంది కానీ, నిర్ణయానికి మించి శిస్తు వసూలు చేసే వీలు లేదు.']
1802కు పూర్వం కంపెనీ భూములను యూరోపియన్లకు 99 సంవత్సరాల కౌలుకు ఇచ్చేవారు. = 1802 తర్వాత ౫1౫ రెగ్యులేషన్ ప్రకారం యూరోపియన్లైవరు గానీ మద్రాసు పట్టణం వెలుపల అంటే సుప్రీంకోర్టు పరిధిని మించి ప్రభుత్వ అనుమతి లేకుండా భూములు కొనకూడదు. ఆక్రమించకూడదు. భూములు కౌలుకు ఇవ్వకూడదు.” మద్రాసు కలెక్టరు వారికి అనుమతి పత్రాలు మంజూరు చేసేవాడు. 99 సంవత్సరాల కౌలు 1828 వరకు అమల్లో ఉందేది.
దత్తమండలాల సర్వే 1802-1806 వరకు కొనసాగింది. సర్వే బృందంలో మొదట్లో 6మంది ఉంటే, ఆ తర్వాత 10 మంది ఉన్నారు. * కొండలు, గుట్టలు మినహాయిస్తూ చదును భూమినంతటినీ కొలిచారు. కొలతకు 388 అడుగుల గొలుసును వాడి నలఖై చదరపు గొలుసులను ఒక ఎకరాగా పరిగణించారు. ప్రధాన సర్వేయర్లు తమ కింది సర్వేయర్ల కొలతలు సరయినవా, లేదా అని పరీక్షించారు. * సర్వేయర్ల బృందం కొలతలు తీసిన భూమి మీద (0) ెం000600 0౧౪౧౦ 0001. 17908. "0110. 50. (9 7014006 0౧02812100 | 802.
- _ మెకంజీ బృందంలో సర్వేయక్లేగాక లిఖిత ప్రతులు సేకరించే పండితుల బృందం
కూడా ఉందేది. (4 ససంం:0 సంగం ౮4166 260 81/ 1807
కెంంగబ0 పెంషగ6 ౮౧౧౮121100 సం. 21-22, రష6064 2410 ఉంటం! 1807
బ్రిటీష్ కంపెనీ పాలనలో రెవిన్యూ సెటిల్‌మెంట్ 15 ఎంత వసూలు చేయాలో అంచనా వేసేందుకు ఇద్దరిని నియమించారు. గ్రామ పెద్దను, కరణాన్ని, రైతులను వెంటబెట్టుకుని అంచనాదార్లు సర్వే చేసిన భూమిని
- పర్యవేక్షించి నేల రకాన్నిబట్టి భూమిని మాగాణి, మెట్టగా వర్గీకరించారు. కలెక్టరు కచేరిలో తుది నిర్ణయం తీసుకున్నారు. కచేరీలో నిర్ణయించిన మొత్తం అంచనాదార్ల మొత్తంకంటే 5 నుంచి 15 శాతం వరకు తక్కువగానే ఉండేది. కలెక్టరు జిల్లా మొత్తం ఎంత శిస్తు వసూలు కావాలో నిర్ణయించేవాడు. ఈ పద్ధతిని 1814లో ప్రవేశపెట్టి మరో నాలుగేండ్లకు ఇందులో కొన్ని మార్పులు చేశారు. జమాబందీ సమయంలో రైతులు కొత్తగా మరికొన్ని భూములు సాగుచేసేందుకు స్వీకరించవచ్చు లేదా తమ భూమిలో కొంత వదులుకోవచ్చు. సర్వే సెటిల్‌మెంట్‌కు కొత్త పద్ధతి అవలంబించి 1855లో మద్రాసు రాష్టంలో అప్పటి పద్ధతిని మార్పు చేశారు. 1807లో మనో సెలవు మీద వెళ్ళాడు. 1808లో జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వు మేరకు గ్రామాధికార్లకు, పెద్ద రైతులకు గ్రామాలను అప్పగించాలి. పంటలు సరిగా పండినా, పండకపోయినా రైతులు చెల్లించవలసిన పన్ను తగ్గించకూడదని నిర్ణయించారు. మూడేండ్ల కౌలు విఫలం కావడంతో 1812-18లో ఇరవై ఏండ్ల కౌలు పద్ధతి ప్రవేశపెట్టారు. గడచిన ఏడేండ్ల వసూలు ఆధారంగా శిస్తు నిర్ణయించినా ఫలితం లేకపోయింది. భూముల మీద ఆధిపత్యం పొందిన పెద్ద రైతులు సన్నకారు రైతులను పీడించడమే గాక, వసూలు చేసిన సొమ్ముతో పారిపోయారు లేదా సొమ్ము చెల్లించకుండా బకాయిలు పడ్డారు. వసూలు చేసేవారిని రైతులు ప్రతిఘటించలేకపోయారు. వారి (గ్రామాలను ప్రభుత్వం వశపరచుకుంది. మళ్రోతో ఇంగ్లండులో నంథవదించిన డైరెక్టర్సు రైత్వారీనే అనునరించాలని మరోసారి ఉత్తర్వు చేశారు. పదేండ్ల తర్వాత 1816లో ఇంగ్లండు నుండి మద్రాసు గవర్నరుగా తిరిగి వచ్చిన మన్రో తాను ఇదివరకే ప్రతిపాదించినట్టు 25 నుంచి 38 శాతం దాకా శిస్తు తగ్గించాలని సలహా ఇస్తూ 1820లో తానే స్వయంగా ఉత్తర్వులు జారీ చేశాడు. దాదాపు 1855 దాకా ఈ పద్ధతే అమల్లో ఉంది.
16 సీమపాలేగార్లు 1870-71లో (బ్రిటీష్ ప్రభుత్వం ఇనాందార్లకు పట్టాలు పంచిపెట్టాలని నిర్ణయించింది. అప్పటికి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, కాళహస్తి, ఉండి, ఉదయగిరి, గూడలూరు, ఒంగోలు, సైదాపురం పాలేగార్లంతా కావలిగార్లుగానే ఉన్నారు.
టు దత్తమండలాలు - కావలి పద్ధతి - మన్రో
తీసుకున్న చర్యలు దత్తమండలంలో దొంగతనాలు జరిగితే పోయిన వస్తువులను కావలిదారు సమకూర్చేవారు కావలిదార్లు. ఇంకొకచోట దోచుకుంటే గాకపోయిన వస్తువులు సమకూర్చలేరు కదా! వారసత్వంతో లఖించే ఆదాయంకన్నా దోపిడీలతో ఆదాయం పెంచుకునే అవకాశం కావలిగార్లకు లభించింది. గ్రామంలోని ధనికులను గుర్తించుకునే కావలిగారు పద్ధతి కొనసాగింది. ఆ పోయిన వస్తువులకోసం ఊర్లోని వారిచ్చే సొమ్ము ఆ వస్తువు విలువను మించేది. కావలిగార్ల అధీనంలోని గ్రామాల్లోను పరిసర గగ్రామాల్లోను ఎన్నో దోపిడీలు
జరిపే వ్యవస్థతో కావలిగార్లకు నిధిని సమకూర్చినట్టే. మో చేతికి అధికారం రాగానే కావలిగార్ల భూములను స్వాధీనం చేసుకున్నాడు. వారి సహాయం అవసరం లేదంటూ కావలిగార్ల అలవెన్సులు నిలిపివేశాడు. దీనివలన దోపిడీలు కొంతవరకయినా తగ్గుతాయని మన్రో అభిప్రాయం. కావలికాయటమన్నది గ్రామ తలారీలు, అమల్‌దార్లు చేయగలిగిన పని. దోపిడీదాల్లేవరని కావలిగార్లలో గుర్తించటం ఇబ్బందికరం. వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినవారు దోపిడీకి, హత్యకు గురవుతారు. తమ (గ్రామ పరిధుల్లోని ప్రతి మనిషిని గురించి పటేల్, కరణం, ఇతర ప్రభుత్వోద్యోగులకు తెలుసు. ఎవరైనా కొత్తగా ఆ గ్రామం ప్రవేశిస్తే వారికి వెంటనే తెలిసిపోతుంది.
18 సీమపాలేగార్లు
తవుంతట తాము రూపొందిన కావలిగార్హు పాలకులచేత నియమింపబడిన వారు కారు. తరచూ మారే ప్రభుత్వాలు స్థిరమైనవి కాదు. కావలిగార్లను అణచేందుకు సైన్యం కావాలి. సైనికాధికార్లు కూడా ఎప్పుడు తమ ఉద్యోగం షోతుందోననే భయంతో ఉండేవారు. కావలిగార్లు చాలా నష్టం కలిగించేవారయితే వారిని ఎప్పుడో అణచివేసి ఉండేవారు. పాలేగార్ల అధీనంలోని భూములు తమ వశమయి వారి ్రతిఘటనను క్రమేపీ నిర్మూలించగలుగుతామనే అభిప్రాయంతో మన్రో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాడు.
పాలేగార్లను అణచడమంటే వారితో పోరాటానికి దిగినట్టేనని గవర్నరు అభిప్రాయం, (ప్రశాంతతతోనే తమ పథకాన్ని సాధించుకోవాలని మనోకు గవర్నరు సలహా ఇచ్చాడు. వ్యాపారం మీద దృష్టితో పాలేగార్ల అదుపాజ్ఞలోని నేత పనివారికి రక్షణ కల్పించి తమ పలుకుబడి క్రమేపీ పెంచుకోవాలని కూడా మన్రోకు సలహా అందింది. పాలేగార్ల భూస్వామ్య ధోరణిని తగ్గిస్తూ వారి దౌర్జన్యపూరిత అలవాట్లను మాపుచేస్తూ కరినంగా వ్యవహరించాలని డైరెక్టర్లు 1804లో మన్రోకు రాశారు. మన్రో కూడా పాలేగార్లు చేసేవన్నీ నేరాలేనని దృఢంగా నమ్మాడు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో చెరువులు తవ్వించటంవంటి ప్రజోపయోగ కార్యక్రమాలమీద పాలేగార్ల దృష్టి సన్నగిల్లింది. 19వ శతాబ్దారంభంలో రంగప్రవేశం చేసిన మ(నో పాలేగార్లను, వారి శుల్కం, వారి కప్పం, వారి సిబ్బందిని కూడా తుడిచిపెట్టాడు. మనో అధికారం కింద పాలేగార్ల చేతి ఈటెలు పట్టుదప్పాయి. పాలేగార్ల అణచివేతకు మన్రో అవలంబించిన విధానం
మనో కలెక్టరు పదవి చేపట్టగానే ప్రభుత్వాదాయాన్ని ఎలా పెంచాలనే ఆలోచనతో పాలేగారు చెల్లించవలసిన రుసుంను ఎన్నో రెట్లు పెంచాడు. అంత రుసుం చెల్లించలేదని కలెక్టరు తన సిబ్బంది బలగంతో (గ్రామం ముందర శిబిరం ఏర్పాటు చేసి పాలేగారును పిలువబంపేవాడు. శిబిరానికి వెళ్ళేందుకు
దక్తమండలాలు - కావలి పద్ధతి - మనో తీసుకున్న చర్యలు 19 మనసొప్పని పాలేగారు పాళెం వదలి వెళ్ళిపోయేవాడు. ఎంతో కొంత చెల్లించిన పాలేగారుకు రక్షణ దొరికేది. బ్రిటీష్ సైనికులు పారిపోయిన పాలేగారును వెంటాడటంతో చివరకు పట్టుబడేవాడు. పాలేగారును గుత్తికోటలో బంధించి వారి భూములను ప్రభుత్వం వశపరచుకుని పన్ను వసూలుకు అమల్‌దారును నియమించేది. సిబ్బంది ఎవరికి వారు భూములు సాగుచేసుకునేవారు. పారిపోయిన పాలేగార్లను బంధించి, గుత్తికోటకు ఖైదీలుగా పంపవలసిందని హైదరాబాదు వంటి దూరప్రాంతాలకు కూడా మనో సందేశాలు పంపాడు. ప్రతిసారీ ఒక పాలేగారుతో వ్యవహరించిన మన్రో కలెక్టరుగా పాలేగారు వ్యవస్థను చిన్నాభిన్నం చేయగలిగాడు. (బ్రిటీష్‌వారిని ఎదిరించటంలో పాలేగార్లు ఎందుకు విఫలమయ్యారు?
ప్రభుత్వం ఒక సూత్రమంటూ లేకుండా తనకు తోచినట్టుగా పాలేగారు చెల్లించవలసిన మొత్తం నిర్ణయించింది. తమ పొరుగువారితో, లేదా పొరుగు సిబ్బందితో, వారి పై అధికారితో పోరాడటమే పాలేగారుకు సరిపోయింది కానీ పాలేగారు వ్యవస్థకే ఉమ్మడి శత్రువైన బ్రిటీష్‌వారిని ఎదిరించి పోరాడేందుకు పాలేగార్లలో ఐకమత్యం లేదు. పొరుగున ఉన్న పాలేగారు గతి తమకు రావచ్చునని వారు ఊహించలేదు. బ్రిటీష్ అధికారులు పాలేగార్లు చెల్లించవలసిన రుసుం కొందరికి పెంచారు. కొందరి సిబ్బందిని తగ్గించారు. మరికొందరి భూములను స్వాధీనపరచుకుని ఇతరులకు అప్పగించారు. అదనంగా కొంత డబ్బు ముట్టజెప్పిన వారిని జమీందార్లుగా గుర్తించారు. వారసత్వం
కట్టుబడి భూములు వారసులకు లభించేవి. పాలేగారు కోరినప్పుడు మాబ్‌లాకులు (వెలుగులు) వారే సమకూర్చుకోవాలి. తమకు ఇచ్చిన ప్రాంతంలో కావలి విధులు నిర్వర్తించాలి. దొంగతనమయిన వస్తువులు విలువ వారు కట్టివ్వాలి. బయటి ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తే అమరం సిబ్బందికి లభించిన విధంగానే వారికీ బత్తా లభిస్తుంది.
న! సీమపాలేగార్లు మేర రుసుం పంట కోసినప్పుడు, ధాన్యం కొలిచినప్పుడు పాలకులకు పంటలో వంతు చిల్లించడమే మేర. పుంజి, నంజి భూములలోని మొత్తం ఉత్పత్తిలో (గ్రామాలు 10 నుండి 15 శాతం వరకు మేర చెల్లించవలసి ఉండేది. పొలేగార్ ప్యూన్‌లకు లాభాలు అతి పెద్ద కమతంలోని ప్యూన్‌లకు సాలుకు చెల్లించవలసిన వేతనం మినహాయించగా 8 వరహాల పైచిలుకు లభించేది. అతి చిన్నకమతం గలవారికి 3 వరహాల పైచిలుకు లభించేది. వెంకటగిరి జమీందారీలో ప్యూన్‌కు 7 వరహాలు లభిస్తే, కాళహస్తి జమీంద' రీలో దాదాపు 6 వరహాలు లఖించేది. పాలేగారి రుసుం (గ్రామాల్లో పోలీసు సేవలందించినందుకు కొందరు పాలేగార్లకు (గ్రామాలు లభించేవి. కొన్ని శ్రోత్రియ గ్రామాల్లోను, ప్రభుత్వ గ్రామాల్లోను కూడా పాలేగార్లు కొంత సొమ్ము వసూలు చేసేవారు. వసూలైన పన్ను పాలేగారు కప్పంకింద (ప్రభుత్వం జమకట్టుకునేది. ఇనాం నిబంధనల కింద పన్ను నిర్ణయించేవారు. (శ్రోత్రియం పొందినవారుగా కొన్ని మత సంస్థలకోసం పాలేగార్లు ఈ రుసుం వసూలు చేసేవారు. ఆ వసూలైన మొత్తంలోనే కావలిగార్లకు, పోలీసు పనిచేసేవారికి ఖర్చుపెట్టేవారు.
బ్రిటీష్ కంపెనీతో మైసూరు
సుల్తానుల పోరాటం 1780 సంవత్సరం రెండవ మైసూరు యుద్ధంలో బ్రిటీష్ వారితో కర్టాటక (ప్రాంతంలో (ఆర్కాటు (ప్రాంతం) తలపడిన హైదరాలీ ఆర్కాట్ ప్రాంతాన్ని ముట్టడించాడు. పాలేగార్ల తిరుగుబాట్లు ఎక్కువయ్యాయి. పాలేగార్లు (ప్రభుత్వ (గ్రామాలను ఆక్రమించుకున్నారు. పాలేగార్ల అలజడులు తమకు మైసూరుతో జరుగుతున్న యుద్దాన్ని మరింత కష్టతరం చేశాయని కంపెనీ ప్రభుత్వం భావించింది. పాలేగార్లు తమకు లొంగిపోవాలనీ, తమకు విధేయులుగా ఉ
ండాలనీ బ్రిటీష్ కంపెనీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. 1790లో మూడవ ఫి ూరు యుద్ధం ప్రారంభమైనప్పుడు కర్ణాటక పాలకులు, అంటే వాలాజ నవా. దగ్గర ఏమీ అంగీకారం పాొందకుండానే ఆ ప్రాంతపు రెవిన్యూ విషయాలను బ్రిటీష్ కంపెనీ చేపట్టింది. మూడవ మైసూరు యుద్ధానంతరం ఉత్తర ఆర్కాటు జిల్లాలోని మెరక ప్రాంతం బ్రిటీష్ కంపెనీకి లభించింది. కర్ణాటక నవాబు కుమారుడు పాళెములను కంపెనీకి స్వాధీనపరచటానికి ఒప్పుకోలేదు. దక్షిణాది పాలేగార్లు అప్పటికే తిరుగుబాటు ధోరణిలో ఉన్నారు. పోలీసులకు సంబంధించిన రుసుంగానీ, జమీందార్ల భూములను గురించిగానీ ఒప్పందంలో లేనందున (గగ్రామాధికార్లను నియమించే హక్కు, అధికారం తమదేనని జమీందార్లు వాదించారు. కంపెనీ ఆ హక్కును
22 సీమపాలేగార్లు జమీందార్లకు ఇవ్వటానికి అంగీకరింపలేదు. మూడవ మైసూరు యుద్ధం తర్వాత 1792లో కర్టాటక సంధి కుదిరింది. అందులోని అయిదవ షరతు ప్రకారం పాలేగార్లు కంపెనీకే కప్పం చెల్లించాలి. ఈ ఒక్క విషయం గాక, మిగతా విషయాలన్నిటిలో పాలేగార్లు నిజాంకు లోబడి ఉండాలి. పాలేగార్ల మీద ద్వంద్వ ప్రభుత్వం ఏర్పడింది.
(ప్రత్యేక సందర్భాలలో కర్ణాటక నవాబు జరిపించే దర్బారుకు పాలేగార్లు హాజరు కావాలి. (గ్రామాలను కనిపెట్టి ఉండాలి. కప్పం సొమ్ము పెంచడం, తగ్గించడం అధికారం మాత్రమే కంపెనీకి దక్కింది. పాలేగార్లు తమ సైనికాధికారాలుగానీ, స్వాతంత్ర్యంగానీ పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. సైనికాధికారం ఉన్నంతకాలం పాలేగార్లు దౌర్జన్యం కొనసాగిస్తూనే ఉంటారని బ్రిటీషు పాలకుల భావన. 1792లో బ్రిటీష్ వారితో కుదిరిన ఒప్పందం చాలా తాత్మాలికమేనని అమల్‌దార్లు పాలేగార్లను నమ్మించి (బిటీష్ వారిపైన తిరగబడవలసిందిగా వారిని ప్రోత్సహించారు. కంపెనీ పాలకులకు ఇది కంటకమయింది. పాలేగార్ల మీద పూర్తి అధికారం తమకే ఉండాలని బ్రిటీష్ కంపెనీ తలపెట్టినా, పాలేగార్లను అమల్‌దార్ల నుండి కాపాడేందుకు సంసిద్ధత కనబరచలేదు. సృతహాగా పోరాటానికి దిగలేక, కలపెనీ నుండి రక్షణ పొందలేక పాలేగార్లు ఇబ్బందులపాలయ్యారు. 1795లో మద్రాసు గవర్నర్ హ్యూబర్ట్ అప్పటి ఒప్పందాన్ని సవరించాలనీ, కప్పం వసూలుతో సరిపెట్టుకోకుండా పాలేగారీ పద్ధతినే పునర్‌వ్యవస్టీకరించేందుకు కూడా కంపెనీకి అధికారం ఉ ండాలని కోరారు. కంపెనీవారు పాళెములు తరచు సర్వే చేస్తూ పాలేగార్లు చెల్లించవలసిన కప్పం పెంచుతూ పోయారు. ఇటు నవాబు, అటు కంపెనీ చేతుల్లో నలుగుతున్న పాలేగార్లు మైసూరు తమను ఆదుకుంటుందని భావించారు. 1799లో శ్రీరంగపట్టణ ముట్టడి, టిప్పు సుల్తాన్ పతనంతో ఆ ఆశలు కూడా అంతరించి ఇప్పటి చిత్తూరు, కడప జిల్లాల పాలేగార్లు (బిటీష్‌వారితో చేసిన పోరాటం విఫలమయింది.
మొదటి కర్ణాటక యుద్ధం సమయంలోనే ఫోర్ట్ సెయింట్ జార్జి నుండి గవర్నరు మెకార్ట్‌నీ సైనిక సర్వాధికారి లెప్టినెంట్ జనరల్ సర్ అయ్యర్ కూట్‌కు
బ్రిటీష్ కంపెనీతో మైసూరు సుల్తానుల పోరాటం 238 రాస్తూ పాలేగార్లకు రక్షణ కల్పించి, హోదా కల్పించి తమ స్వాధీనంలోకి తెచ్చుకోవలసిందని 1782 ఆగస్టు 8వ తేదీ సూచించాడు. అంగీకరించిన కప్పం చెల్లించేందుకు పాలేగార్లు సుముఖంగా ఉన్నందున వారికి రక్షణ కల్పిస్తూ అర్హతగల వారికి సనదులు మంజూరు చేయవచ్చనీ మెకార్ట్‌నే సర్ అయ్యర్ కూట్‌కు రాశాడు. '* హైదరాలీ గుజ్జంకొండను వశపరచుకున్నప్పుడు కొందరు పాలేగార్లను లోబరచుకుని వారి నుండి వసూళ్ళు చేశాడని తెలిసి ఆ పాలేగార్లకు భూములివ్వవలసిందిగా మెకార్ట్‌నే ప్రతిపాదించాడు.
దేశ తూర్పుతీరంలో ఈస్టిండియా కంపెనీ 1611లో నిర్మించుకున్న మొదటి కేంద్రం మచిలీపట్టణం.” 1626లో ఆర్మగామ్‌లో కేంద్రం నిర్మించుకున్నా 1638లో దానిని వదులుకున్నారు. 1689లో ఫ్రాన్సిస్ డే కంపెనీ తరపున పాలేగారు నాయకుని దగ్ధర మద్రాసు తీరంలో భూమి కొన్నాడు. 1640లో కంపెనీ మద్రాసు తీరంలో ఫోర్ట్ సెయ్యింట్ జార్జి నిర్మించుకున్నారు. సెయింట్ జార్జి కోట ప్రధాన కార్యాలయంగా 1653లో మద్రాసును ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నారు. తూర్పు కోస్తా అయిన కోరమండల్ కోస్తాలో సెయింట్ డేవిడ్ కోట, సెయింట్ జార్జి కోట చుట్టూ అయిదు చదరపు మైళ్ళ ప్రాంతం ఇంగ్లీషు కంపెనీ అధీనంలో ఉన్నాయి.
ఆర్కాటు నవాబు తనకు యుద్దాలలో తోద్బడిన (్రిటీష్‌వారికి 1765 ఆగస్టు 80వ తేదీ జాగీరు ఇచ్చాడు. అక్కడి దేశ్‌ముఖ్‌లు, (ప్రజలంతా కూడా బ్రిటీష్ వారికి లోబడి ఉండాలని కోరుతూ సనదు వెనుక వైపున నవాబు స్వదస్తూరిలో ఇలా రాశారు - (1) 1782- ఫారిన్ - సీకైట్ కన్సల్టేషన్, "26 ఆగస్టు - యఫ్, (2) పై విధంగానే
అందులో తొమ్మిదిమంది నాయక్‌లు, నల్లా వెంకటపతి, చిత్తూరు జమీందారు
కూడా భూములు పొందారు. (3) అట్మిన్సన్ సనద్స్ - వాల్యూమ్ ౫ - మద్రాసు స్టేట్స్
న! సీమవాలేగార్లు
“ఇంగ్లీషు ఈస్టిండియా కంపెనీపై గల మై(త్రీభానం, విశ్వాసంతో జాగీరంతటికీ చేసిన సనద్”. దివాన్ కార్యాలయంలో 1763 అక్టోబరు 29న రిజిస్టరయింది.
ఆర్కాటు నవాబు కంపెనీకి ఇచ్చిన (గ్రాంటును (ధ్రువపరుస్తూ మొగల్ చక్రవర్తి ఇచ్చిన ఫర్మానా (ఉత్తర్వు) 1765.
మద్రాసుకు ఎగువన ఉన్న ప్రాంతాలను బ్రిటీష్ కంపెనీకి నవాబు ఇచ్చిన సనదులతో “ఇంకెవరికీ ఆ భూములసై హక్కుండదు. అందువలన తన కుమారులు, ఒమరాలు, వజీర్లు, గవర్నర్లు, మత్‌సుదీలు ఇప్పటినుంచి మరెప్పటికీ ఇంగ్రీషు కంపెనీకి, వారి వారసులకు లోబడి ఉండాలి. వారిని ఏ విధంగానూ బాధించరాదు” (12 ఆగస్టు 1765)
ఈ సనదు ద్వారా బిటీష్‌వారికి ఆర్మాటు నవాబు సర్వ హక్కులను అప్పగించాడు.
1781లో (బైటీష్ గవర్నర్ జనరల్ తనతో ఒక ఒవ్పందం కుదుర్చుకోవాలని వాలాజా నవాబును కోరాడు. కారణం హైదరాలీ కర్ణాటక మీదకు సైన్యంతో రావడమే. అందుకు నవాబు జవాబిస్తూ తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నా అవసరమయినప్పుడు దానిని సవరించుకునే వీలుండాలని కోరాడు.
ఇంగ్లీషు పార్లమెంటు ఆ ఒప్పందాన్ని మంజూరు చేస్తే అది చిరకాలం కొనసాగుతుంది. వివ్వరూ దానిని అధిగమించే వీలుండదని నవాబు అభిప్రాయం. శిస్తు వసూలుకు గవర్చరు నియమించే అమల్‌దార్లు, భూమిని కౌలుకు తీసుకునేవారిని ధ్రువపరచాలి. బ్రిటీష్ గవర్నరు వసూలు చేసుకున్న మొత్తంలో ఆరవ వంతును నవాబు ఉత్తర్వుల మేరకు ఆయన పేర్కొన్న చోట చెల్లించాలి. మిగిలిన అయిదు వంతుల సొమ్మును నవాబు చెల్లించాల్సిన బకాయిలకు జమకట్టుకోవాలి. ఖాతాలకు జమకట్టిన మొత్తానికి గవర్నరు నవాబుకు రసీదు చూపాలి. గవర్నరుకు తెలువకనే కౌలుదార్లను తొాలగించకూడదు.
బ్రిటీష్ కంపెనీతో మైసూరు సుల్తానుల పోరాటం £ెగ్
నవాబు మహమ్మదాలీతో ఈ ఒప్పందం మద్రాసులో 1781 డిసెంబరు 2వ తేదీన కుదిరింది.
నవాబు చెల్లించవలసిన 9 లక్షల వరహాలలో ఏదాదికి లక్ష వంతున చెల్లించాలి. గడువు ముగిసిన ఒక నెలరోజుల్లోగా నవాబు బకాయిలు చెల్లించకపోయినట్టయితే నవాబు కింద పనిచేస్తున్న అమల్‌దార్ల నుండి కంపెనీ తరపున కౌలుసొమ్మును, శిస్తు, పన్నులు, కప్పం వసూలు చేసేందుకు కంపెనీ పర్యవేక్షకులను (సూపరింటెండెంట్లను) నియమిస్తుంది. ఆ పర్యవేక్షకులు వసూళ్ళకు తగిన చర్యలు తీసుకుని, రసీదులను, లెక్కలను తనిఖీ చేసి, సంవత్సర వసూళ్ళను, నవాబుకిందగల జమీందార్హు, లేదా పాలేగార్ల నుండి వసూలు చేసిన మొత్తం కంపెనీకి అప్పగించాలని 1785 జూన్ 28న తీర్మానం మీద కౌన్సిల్ కార్యదర్శి కాంప్‌బెల్‌తో సహా ఏడుగురు కౌన్సిల్ సభ్యులు సంతకాలు చేశారు.
మూడవ మైసూరు యుద్ధానంతరం 1792 జూలైలో ఆర్కాటు నవాబుతో ఈస్టిండియా కంపెనీ అదివరకు 1787 ఫిబ్రవరి 24న కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేశారు. కొత్త ఒప్పందంలో పాలేగార్లను గురించి కొన్ని ఆర్టికల్స్‌లో ప్రస్తావించి 1792 జూలై 12 నుండి అది అమల్లోకి వచ్చినట్టు పరిగణిస్తూ గవర్నర్ జనరల్ ఛార్లెస్ కార్నవాలిస్, కర్టాటక (ఆర్కాటు) నవాబు వాలాజ సంతకాలు చేశారు. ఆర్టికల్ 5
వాలాజ నవాబు 15,21,105 వరహాలు కంపెనీకి చెల్లించేందుకు అంగీకరించాడు. పాలేగార్ల వద్ద నుండి వసూళ్ళకయ్యే ఖర్చును కంపెనీ భరించాలి. షెడ్యూల్స్‌లో నిర్ణయించిన ప్రకారమే ఆ వసూళ్ళు జరగాలి. అలా వసూలైన సొమ్ములో కొంత నవాబు బకాయి పడిన 9 లక్షలకు జమ కట్టుకోవాలి. 2,64,704 వరవాలు కిస్తుబందుగా తీసుకోవచ్చు. దీనిలో మార్పు చేయరాదు.
26 సీమపాలేగార్లు ఆర్టికల్ 65 పాలేగార్లమీద నవాబుకున్న అధికారానికి భంగం లేకుండా
పాలేగార్లమీద కప్పం వసూలు చేసుకునేందుకు వీలుగా పాలేగార్లు విధేయుకై ఉండేట్టు చూడాలి. పద్ధతి (ప్రకారం ఉత్సవాలు జరపటంలోను, సిబ్బందిని సమకూర్చటంలోను పాలేగార్లు మునుపటిలాగే (శ్రద్ధ చూపాలి. నవాబు రాజ్యంలోని ప్రజల ఆస్తులను కంపెనీ పరిరక్షించాలి. రెవిన్యూ ఖాతాలను నవాబు పేరుతో జమచేయాలి.
ఈ విషయాలన్నీ తెలియజేస్తూ నవాబు సీలు, సంతకంతో ప్రతి పాలేగారుకు ఒక్కొక్క పత్రం పంపాలి. పాలకులతో పాలేగార్ల సంబంధాలు
పాలేగార్లలో స్వతంత్ర భావం, ఆందోళన ధోరణి సర్వసామాన్యం. కోటలు, కొన్ని పాత తుపాకులు, సంప్రదాయ సిద్ధమయిన ఆయుధాలతో సైనిక బలాన్ని పెంచుకుని తాము బలవంతులమనే ఆత్మవిశ్వాసం నిలుపుకున్నారు. తప్పించుకునేందుకు అడవులున్నాయనే ధీమాతో ఉన్నారు.
కర్ణాటక అంటే ఆర్కాటు నవాబు పట్ల పాలేగార్లకు మిత్రవైఖరి లేదు. వీలయినప్పుడల్లా నవాబుకు కప్పం నిలిపివేశారు. నిస్సహాయులయినప్పుడు మాత్రం తమకు తోచిన కప్పం చెల్లించేవారు. సమయం వచ్చినప్పుడు బాకీలు వసూలు చేయవచ్చునని నవాబు భావించడంతో ఇరువైపులా అపనమ్మకాలు తావు చేసుకున్నాయి.
పాలేగార్లు తమకు అనుకూలంగాను, వినయ విధేయలతోను ఉన్నందున గోల్కొండ నుల్తానులు, హైదరాబాదు నిజాం పాలేగారు వద్ధతిని ఆమోదించడమేగాక, పాలేగార్లను ఇంకా ఎక్కువ సంఖ్యలో నియమించారు. ఆర్మాటు నవాబు అధీనంలోని పాలేగొర్లు వారికి చాలా భూములున్నాా లేకపోయినా పాలేగారు హోదాకోనం 'ప్రాకులాడారు. పాలకులు బలహీనమయ్యేకొద్దీ పాలేగార్లు బలం పుంజుకున్నారు.
1799లో టిప్పును ఓడించిన బ్రిటీష్ కంపెనీకి దక్షిణ కన్నడ, కోయంబత్తూరు, నీలగిరి, సేలం జిల్లాలో హోసూరు, ఉత్తర ఆర్కాటులోని
బ్రిటీష్ కంపెనీతో మైసూరు సుల్తానుల పోరాటం 2 పుంగనూరు తాలూకాలో మూడవవంతు, వెంకటగిరి కోట లభించాయి. టిప్పు బంధువులకు, టిప్పు మీద అంతవరకు ఆధారపడి ఉన్నవారికి స్టయిఫండ్ తగ్గించారు. బ్రిటీష్ సైన్యాన్ని మైసూరు రాజ్యంలో నిలిపినందుకయ్యే ఖర్చుకు సబ్సిడీ ఇవ్వాలని మైసూరు రాజుతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
నైజాం సైనిక ఖర్చులకింద దత్తత చేసిన మండలాన్ని కాపాదాలన్నాా అక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉండాలన్నా ఆ ప్రాంతంలో పన్ను వసూలు చేయాలన్నా సైనిక సహాయం అవసరమయింది. రెండు, మూడు యూరోపియన్ రజిమెంట్లు, ఆశ్వికదళం, తాము సమీకరించగలిగిన మేరకు పదాతి దళం సంచారంలో ఉండాలి. దీనివలన దత్తమండలమేగాక, కర్ణాటక, మలబారు, కన్నడ కూడా బ్రిటీషువారు అదుపులో ఉంచగలుగుతారు. ఆదోని, గుత్తి బళ్ళారి, రాయదుర్గం, ఖమ్మం, నంద్యాల, గండికోట, కడప, గుజ్జంకొండ ప్రాంతాల విషయంలో కంపెనీ జాగ్రత్త వహించాల్సి వచ్చింది. ఈ ప్రాంతాలకు అంటే గుత్తి, బళ్ళారి, ఆదోనికి కలిపి రెండు కంపెనీల ఫిరంగిదళం, ఒక రెజిమెంటు యూరోపియన్లు, 8 పటాలాల సిపాయిలను కేటాయించారు. కర్నూలు నవాబుకు పలుకుబడి అధికం కాబట్టి అక్కడ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది. కర్నూలు పరానులకు యుద్ధప్రీతి అధికం. బ్రిటీష్‌వారి భద్రతకోసం అక్కడ ఒక గేరిసన్ సైన్యాన్ని నిలిపారు. గుత్తిలో దేశీయ ఆశ్వికదళం రెజిమెంటు ఒకటి, యూరోపియన్ ఫిరంగిదళం రెజిమెంటు ఒకటి, ఫిరంగి దళం లస్మర్లు 8 రెజిమెంట్లు, యూరోపియన్ పదాతిదళం ఒకటి, దేశీయ పదాతిదళం 2 రెజిమెంట్లు ఏర్పాటు చేయాలని తలపెట్టారు. మిగిలిన ప్రాంతాలకు ఒక్కొక్క పదాతిదళం వంతున 5 దళాలు అవసరమయ్యాయి. నైజాంకు సైనిక సహాయం చేసే దళంలో దేశీయ ఆశ్వికదళం 2 రెజిమెంట్లు, యూరోపియన్ ఫిరంగిదళు ౩ రెజిమెంట్లు, దేశీయ ఫిరంగిదళం 2 రెజిమెంట్లు, దేశీయ పదాతిదళం 8 రెజిమెంట్లు ఉన్నారు.
టిప్పు మరణానంతరం యుద్ధంలో సహాయం చేసిన బ్రిటీప్‌వారికి నైజాం నాలుగు జిల్లాలు దత్తం చేశాడు. ఆ నాలుగు జిల్లాలు కడప, కర్నూలు,
28 సీమపాలేగార్లు అనంతపురం, బళ్ళారి, కడప జిల్లాలో 80 మంది పెద్ద పాలేగార్లున్నారు. . జెకు, నోసం పెద్దపాలేగార్లు.
పరిపాలనా సౌలభ్యంకోసం విజయనగర సామ్రాజ్యాన్ని పాలకులు అనేక చిన్న రాజ్యాలుగా విభజించారు. బలిష్టమైన దుర్గం కేంద్రంగా పరిసర (గ్రామాలతో ఒక రాజ్యం ఏర్పడేది. ఆ రాజ్యాలను సీమలనేవారు. అలా ఏర్పడినవే గండికోట సీమ, సిద్ధవటం సీమ, గుత్తిసీమ. తమ సార్వభౌమత్వాన్ని అంగీకరించి, అవసరమైనప్పుడు సైన్యాన్ని పంపేందుకు సమ్మతించినవారిని సీమాధ్యక్షులుగా చక్రవర్తి నియమించేవాడు. దీనినే అమర నాయకర పద్ధతి అనేవారు. అమరనాయకరులకు భూమి వంశపారంపర్యం కాదు. నిర్ణయించిన కప్పం పాలకులకు చెల్లించాలి. సైన్యాన్ని పంపేందుకు," కప్పం చెల్లించేందుకు అంగీకరింపని వారి స్థానే కొత్తవారిని అమరనాయంక్షరులుగా నియమించే అధికారం చక్రవర్తికి ఉంది. వీరికి వేతనం ఉండదు. మహామండలేశ్వర బిరుదుతో తమ రాజధానిలోనే ఉంటూ వరిపాలనా వ్యవహారాలను నిర్వహించేందుకు కార్యకర్త అని ఒక ప్రతినిధిని నియమించేవారు. రెవిన్యూ అధికారిగాను, కావలిగార్లపై అధిపతిగాను, ఉన్నత న్యాయాధికారిగానూ ఆ కార్శకర్త వ్యవహరించేవాడు. ఈ కార్యకర్తను పారుపత్యగారని కూడా అనేవారు. కృష్టశేవరాయల కాలంలో గండికోట సీమ నాయంకరుదైన అవసరం తిమ్మరుసయ్య తరపున అణజ్జాజీ అయ్యగారు పారుపత్యం చేస్తున్నట్లు క్రీ.శ. 1525నాటి తలమంచి పట్టణ శాసనంబట్టి తెలుస్తోంది.
గండికోట సీమకు చెందిన దువ్వూరి సీమ, కడపసీమ, ఊటుకూరి సీమ, దొరగంటిసీమ, కల్గ్లూరిసీమ, చెన్నూరు, నిట్టూరు, పులివెందల, తాళ్ళషప్రొద్దుటూరుసీమ, రామేశ్వరం 'ప్రొద్దుటూరి సీమ, సకలిసీమ మొదలైన సీమలు విశ్వాసపాత్రులైనవారికి నాయంకరంగా ఇచ్చారు.
కత్తి తిప్పనాయుడు, పాపానాయుడు, ఎజ్జమనాయుడు, రేనాటి నంద్యాలను నాయంకరంగా పొందినట్టు 1521 నాటి దొమ్మర నంద్యాల శాసనంబట్టి తెలుస్తోంది. కొమరగిరి రంగప్ప నాయకుడు కమలాపురం తాలూక
బ్రిటీష్ కంపెనీతో మైసూరు సుల్తానుల పోరాటం 29 పందిళ్ళపల్లెను అమరనాయకుడుగా పాలిస్తున్నట్టు 1528 నాటి పందిళ్ళపలైే శాసనంబట్టి తెలుస్తోంది.
(గ్రామాలను స్టూలంగా మూడు విధాలుగా విభజించారు. బండారువాడ (గ్రామాలు, అమర గ్రామాలు, మాన్యగ్రామాలు. బండారువాడ గ్రామాలు చక్రవర్తి అధీనంలోను, అమర([గ్రామాలు దుర్గనాయకుని అధీనంలోను, మాన్యగ్రామాలు, దేవాలయాలు, మరాలు బ్రాహ్మణుల చేతుల్లోను ఉండేవి. తన అధీనంలోని (గ్రామాల్లో పన్ను వసూలుకు చక్రవర్తి కొంతమందిని నియమించి నిర్తీత మొత్తం వారివద్ద వసూలు చేసేవాడు. అంతకుమించి వసూలైన సొమ్మును వసూలు చేసేవారు, వాడుకునేవారు. మాన్యాలలో, అ(గ్రహారాలలో మొదటి మూడు సంవత్సరాలు ఎలాటి'పన్ను వసూలు చేసేవారు కాదు. పాలేగార్లపై అధికారం
మనో మొత్తం 80 మంది పాలేగార్లను తొలగించాడు. కడప జిల్లాకు చెందినవారు 49 మంది పెద్దపాలేగార్హు మిగిలిన 81 మంది బళ్ళారి, కర్నూలు జిల్లాలకు చెందినవారు.
కడప జిల్లాలోని గుజ్బంకొండ (ప్రాంతంలో 38మంది పొలేగార్లను మనో గుత్తికోటలో బంధించాడు. ఏమాథత్రం ప్రతిమటించకుండా కోటలకు వెడతామన్నవారికి మాత్రమే ఏదో కొంత పింఛను మంజూరయింది. ప్రతి
[గ్రామంలో ఒక కోట ఉండేది. రాతికోట చుట్టూ (ప్రహరి, బురుజులు ఉండేవి. పాలేగారుకు సాయుధులు సహాయంగా ఉండేవారు. మన్రో కలెక్టరుగా వచ్చినప్పటికీ ఆ ప్రాంతమంతా కట్టుబడులతో నిండి ఉండేది.
మదనవల్సె తాలూకాలోని గట్టు పాలేగారు వద్ధ వేయిమండ కట్టుబడులుండేవారు. మల్లెల, కొక్కంటి కలిపి అయిదారువేలమందిని సమకూర్చుకునేవారు. వారిలో కొందరికి మనో భూములు మంజూరు చేశాడు గుజ్బంకొండ, గట్టుపాలేగార్లకు తమ నాణేలు ముద్రించుకునేందుకు స్వంఠ టంకశాలలుండేవి. కడప పాలేగార్లలో ముఖ్యమైనవారు పుంగనూరు, గట్టు
80 సీమపాలేగార్లు కొక్కంటి, మల్లెల. 1858 వరకు పుంగనూరు కడప జిల్లాలోనే ఉంది. 1642 ప్రాంతంలో ఈ జాగీరు షాహజీ వశమయింది. హైదరాబాదు ప్రభుత్వం పాలేగార్లకు ఎస్టేట్లు అంటే విశాల భూభాగాన్ని ఇచ్చేది. 1780-82లో మైసూరు సుల్తాను హైదరాలీ బ్రిటీష్‌వారితో పోరాడినప్పుడు కర్దాటకీ యుద్దాలలో పొలేగార్లు హైదరాలీపక్షాన పోరాడారు. వారి తర్వాత వారి కుమారులను పాలేగార్లుగా (ప్రకటించేవాడు.
దత్తమండలం 1800లో బ్రిటీష్‌వారి వశమైనప్పుడు పాలేగార్ల నుండి శుల్కం వసూలు చేయటం కంపెనీ. బాధ్యత అయింది. కోటలో సిబ్బందిని ఉంచుకుని బలవంతపు వసూళ్ళు చేసే ప్రతి ఒక్కరూ తిరుగుబాటుదారేనని మన్రో భావించాడు. పాలేగారు కచేరీకి వచ్చేందుకు నిరాకరించటం, కరణానికి లెక్కలు చూపకపోవటంతో ఆ పాలేగారును వెంటాడి, పాళెం వశపరచుకుని, పాలేగారును పట్టుకుని గుత్తికోటలో బంధించటం - ఈ పద్ధతి ననుసరించి మన్రో 18 నెలల కాలంలో పాలేగార్లను లొంగదీశాడు.
1800 నవంబరులో దత్తమండలాలను ఆక్రమించేందుకు సైనికాధికారి అయిన కల్పల్ వెలస్లీ అనేక చర్యలు తీసుకున్నాడు. కల్నల్ మైకే హర్పనహళ్ళి ప్రవేశించాడు. కల్నల్ మనిపెన్ని పెద్దసైన్యంతో ఆనగొంది వద్ద తుంగభద్రను దాటి బళ్ళారి, ఆదోని, గుత్తి వశపరచుకునేందుకు వెళ్ళాడు. నంది దుర్గంలోని కల్నల్ కప్పేజి గుజ్జంకొండను ఆక్రమించేందుకు ఒక పటాలాన్ని పంపొడు. నవంబరు 15న మేజర్ జనరల్ కాంప్‌బెల్‌ను దత్తమండలం సైనికాధికారిగా పంపారు. ముఖ్యమైన ప్రాంతాలను పెద్దగా ఇబ్బంది లేకుండానే కంపెనీ సైనికులు వశపరచుకున్నారు.
1801 సెప్టెంబరు నాటికే అల్లరులు అణగినట్టు కాంప్‌బెల్ ప్రకటించాడు. తన సైన్యాన్ని బళ్ళారి, గండికోట, కమలాపురం, రాయచోటి, గుజ్జంకొండ, చిట్వేలు, సిద్ధవటం, కంభం, కొత్తకోట, నోసమ్ 'ప్రాంతాలమధ్య విభజించాడు. ఆదోనికి తూర్పున దాదాపు 15 మైళ్ళలో ఉన్న తనకల్లులో తిరుగుబాటు తలెత్తింది. మేజర్ స్ట్రటమ్ ఆ ప్రాంతంమీద దాడి చేశాడు. 60 మంద్షి సైనికులు
బ్రిటీష్ కంపెనీతో మైసూరు సుల్తానుల పోరాటం 81. గాయపడటమో, మరణించటమో జరిగింది. (బిటీష్ ఆఫీసర్లు ఆరుగురు' గాయపడ్డారు. నల్లమలై - ఎజ్జమలై కొండలలోని కోటలను సర్వే చేసి, ఆ ప్రాంతంలో పాలేగార్ల బలమెంతో అంచనా వేసి, బలగాన్ని తొలగించి, ఇకముందు అటువంటి తిరుగుబాట్లు జరగకుండా చూడాలని బ్రిటీష్ ప్రభుత్వం ఉత్తర్వు చేసింది. కోటలను సర్వేచేసి ఆఫీసర్లు నివేదిక తయారుచేశారు. మద్రాసు గవర్నరు క్లైవు 1800 అక్టోబరు 24వ తేదీ రాష్ట్రంలోని బ్రిటీష్
ఆఫీసర్లందరికీ లేఖలు పంపాడు. కల్నల్ వెల్లస్తీని సైన్యంతో నైజాం దత్తత చేసిన ప్రాంతాలను ఆక్రమించుకోవలసిందిగా కోరాడు. 1800 నవంబరులో కంపెనీ ఆఫీసర్లు దత్తమండలం ప్రవేశించారు. అప్పటికి దత్తమండలం అల్లకల్లోలంగా ఉంది. రెవిన్యూ అధికారులు, కొంత కప్పం చెల్లించిన పాలేగార్లు (గ్రామాలమీద పడి ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు. గ్రామాధికార్లు తమలో తాము పోట్లాడుకుంటున్నారు. నైజాం ఆఫీసర్లు స్వయంగా అవినీతిలో మునిగి, శిస్తు వసూలు పనిని పాలేగార్లకు, జమీందార్లకు పదేండ్ల కాలానికి అప్పగించారు. పేదరికానికి బలైన ప్రజలు [గ్రామాలే వదలి వెళ్ళారు. గ్రామాల్లో సైనిక దళాలు నిండాయి. దత్తమండలం చాలా ప్రాంతాల్లో గ్రామపెద్దలు, కరణాలు (గ్రామాల్లోని కోటలను ఆక్రమించి, సిబ్బందిని కూడగట్టుకుని దోపిడీకి పాల్చదేవారు. హైదరు, టిప్పు కూడా పాలేగారు సిబ్బందిని ప్రజాసైన్యంగా ఉపయోగించుకున్నారు. ఆ (ప్రాంతం బటీష్‌వారి చేతికి రాగానే సిబ్బంది ఉపాధి పోగొట్టుకున్నారు. శాంతి, భద్రతలకు భంగం ఏర్పడింది. ధన రూపేణా ఆదాయం పొందినవారు తక్కువే అయినా, భూములు పొందినవారు లభించిన భూములను కౌలుకిచ్చి ఇనాముల మీద నివసించేవారు. భూమిమీదనే ఆధారపడినవారి సంఖ్య ఎక్కువ. వారు తమ భూమిని పండించుకొంటూ తక్కువ శిస్తు చెల్లించేవారు. పాలేగార్లను అధికారం నుండి తొలగించేందుకు ఎవరు (ప్రయత్నించినా వారిని ఎదిరించేందుకు ఈ సన్నకారు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఆ పాళింలోని భూములు తమవని అంటూ వాటిని తిరిగి పొందేందుకే ప్రయత్నించేవారు.
త్రై సీమపాలేగార్డ్లు ఇటువంటి సిబ్బందిని పూర్తిగా తొలగించాలని బ్రిటీష్ కంపెనీ ప్రభుత్వం తలపెట్టింది. ఆ ప్రాంతంలో సైనిక దళాన్ని నిలపవలసివచ్చింది. అమల్‌దారుకు శిస్తు వసూలు పని అప్పగించాలని తలపెట్టారు. భూములను కంపెనీ తరపున అమలే్‌దారు ఇచ్చినట్టయితే రైతులు కంపెనీకి విధేయులై ఉంటారు. పాలేగార్ల అధికారం అందువలన తగ్గిపోతుందని కలెక్టరుగా మనో రివిన్యూ బోర్డుకు సూచించాడు. మనో కలెక్టరుగా 80 మంది పాలేగార్లను గుర్తించాడు. వీరిని అణచేందుకు నేరుగా సైనిక సహాయం పొందేందుకు రెవిన్యూ బోర్డు మన్రోను అనుమతించింది. 1801 మార్చినాటికల్లా మనో గుల్టంకొండ రెవిన్యూ స్టిరపరిచాడు. ఆ మరుసటి నెలలోగా మొత్తం జిల్లా రెవిన్యూ బోర్జుకు అధీనమయింది. కోట కట్టినవాడు, పాత కోటను మరమ్మత్తు చేసినవాడు, సిబ్బందిని పోషించినవాదు, నిధులు వసూలు చేసినవాడు ఎవరయినా కంపెనీ ఆ వ్యక్తిని తిరుగుబాటుదారుగా పరిగణించింది. మనో పాలేగార్లను ఒకరి తర్వాత మరొకరిని వెంటాడి, వేటాడి, లొంగదీసుకుని గుత్తికోటలో బంధించాడు. మన్రో పాలన మొదటి 18 నెలలు ఇటువంటి సంఘటనలతోనే సరిపోయింది. ప్రతి సంఘటన పాలేగారు తాను చెల్లించవలసిన శిస్తు చెల్లించటానికి నిరాకరించటంతో (ప్రారంభమై పాలేగారు పట్టుబడటంతో ముగిసేది. ఉదాహరణకు మన్రో ఉప్పలూరు పాలేగారు ఐషయం ప్రస్తావించాడు. కడపకు పళ్చిమంలో 80 మైళ్ళలోని ఉప్పలూరు పాలేగారు 1801 ఫిబ్రవరిలో మన్రోను కలుసుకోవటానికి నిరాకరించాడు. నైజాం అమల్‌దారు నుండి కౌలుకు తీసుకున్న రెండు (గ్రామాలను ఇచ్చివేయాలని మన్రో కోరగానే పాలేగారు వమాశ్రం ప్రతిఘటన లేకుండా ఆ రెండు గ్రామాలను తిరిగి ఇచ్చివేసి, వంశపారంపర్యంగా లభించిన ఉప్పలూరు మాత్రం మిగుల్చుకున్నాడు.
బైటీష్ కంపెనీతో మైసూరు సుల్తానుల పోరాటం తి జమాఖర్చులు చూపమంటే పాలేగారు రాకపోవడమేగాక, తన లెక్కలు చూపే కరణాన్ని కూడా పంపలేదు. గుజ్జంకొండ మండలంలోని పొలేగార్లు పిలవగానే హాజరయ్యారు. ఇదే అదనుగా ఉప్పలూరు పాలేగారును వెంటనే బంధించాలని తలపెట్టాడు. పాలేగారు వద్ద సాయుధసిబ్బంది 20మంది మాత్రమే ఉన్నందున ఇంకా చాలామందిని సమీకరిస్తాడనే భావనతో కమలాపురం నుండి సైన్యాన్ని రప్పించి ఏ కష్టం లేకుండానే బంధించాడు. పాలేగార్లు ఈ మాటలు వింటే “పాలేగార్లు జమీందార్లుగా వారి భూములు వారు దున్నుకుంటే మంచిది. అయితే వారు పొరుగువారిని దోపిడీ చేస్తున్నారు. విధ్వంసము, సోమరితనం మరింత వారి అలవాటయితే, ఈటె పట్టినవారంతా, పాలేగారు తలపాగా ధరించినవారంతా ప్రభుత్వానికి శత్రువులే!” ఇది విన్న పాలేగారు ఇలా జవాబిస్తాడు “మేము అడవులు నరికి, కొండల అాళ్ళు ఏరివేసి, మైదానాలు ఏర్పరచకపోయి ఉంటే, భూమిని కాపాడుతూ కప్పం చెల్లించేవారమా? దాడి చేసిన శత్రువు నుండి మైదానాల్లోని పాళెములను కాపాడుతూ తమను కాపాడిన సైనికులకు ఆహారం సమకూర్చుతూ వచ్చిన పాళెములున్నాయి కదా! ప్రభుత్వం పాలేగార్ల నుండి వసూలు చేసేందుకు నియమించిన సాయుధులు ఒక పద్ధతంటూ లేక, పాళెములను ధ్వంసం చేయటంలేదా? న్యాయసమ్మతంగా పరిపాలన సాగించండి. మేం చెల్లించవలసిన కప్పం మా స్తోమతకు తగినట్టు (క్రమబద్ధం చేయండి. మా చేతుల నుండి ఈటెలు జారిపడతాయి. కృతజ్ఞతతో మేము పంటలు పండిస్తాం.” పాలేగార్ల అవిధేయత, లేదా తిరుగుబాటు ఒక మార్పుకోసం విప్లవం కాదు. విదేశీయులు తమ గడ్డమీద కాలూనకుండా వారిని తరిమిగొట్టేందుకు చేసిన ప్రయత్నం. దమనవిధానం పాటించే స్వార్ధప్రభుత్వం పాలేగార్లను సోమరులుగా, దోపిడీదార్లుగా చిత్రించింది. ఈటె ఫట్టిన వారందరినీ, తలపాగా
కిక సీమపాలేగార్లు చుట్టిన వారందరినీ, ప్రభుత్వ వ్యతిరేకులుగా లెక్కకట్టింది. తమ రాబడికి మించిన శిస్తును ప్రభుత్వం విధిస్తోందనీ, దమనవిధానం పాటించే పాలకులను శాంతింపజేసేందుకు కప్పం చెల్లిస్తూ పాలకుల తరపున శిస్తులు వసూలు చేసి వారికి జమకడుతున్నామని పాలేగొర్లు వాపోయారు.
లండన్‌లోని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇండియాలోని కంపెనీ పాలకులను హెచ్చరిన్తూ ఆదేశాలిచ్చారు. దివాన్‌లను, లేదా మం(థతులను నియమించటంలోను, పాలేగార్ల ఆంతరంగిక విషయాల్లోను ఏమాత్రం కూడా జోక్యం కల్పించుకోవడం సమర్థనీయం కాకపోవచ్చు. పాలేగార్లతో యుద్దాలు న్యాయబద్ధం కాదు. లాభసాటి కూడా కాదు. వారిలో వారు పడే తగాదాలను నిలుపుచేసేందుకు, వారు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పూనుకోకుండా చూడాలేగానీ, వారితో నిరంతరం పోరాడలేము. ఈ విషయం కంపెనీ సేవకులకు స్పష్టం కావాలి. బ్రిటీష్ కంపెనీ ఫెంచివారితో, హైదరుతో, టిప్పుతో బాహాటంగా పోరాడినా పాలేగార్లతో పోరాడటం చాలా ఖర్చుతో కూడిన పని. కొండ ప్రాంతాల్లో, విభిన్న పరిస్థితుల్లో శత్రువుతో పోరాడటం సులభం కాదు. పాలేగాళ్ళ వద్ద ఉన్న సాయుధ సిబ్బందిని తొలగించారు. వారి మీద పాలేగారు పెడుతున్న ఖర్చును కూడా పాలేగారు శిస్తుకు కలిపారు. పాలేగార్లవంటి చిన్న చిన్న పాలకులను తొలగిస్తే ఆర్కాటు నవాబువంటివారి చేతులు బలపడతాయని డైరెక్టర్లు భావించారు. (గ్రామప్రాంతాల వసూళ్ళకు అంతరాయం కలగవచ్చు. తమదే విజయం అనే దృఢవిశ్వాసంతోనే కంపెనీ ఎటువంటి నైనిక చర్యనయినా చేపట్టవలసి వచ్చింది.
య చిత్తూరు పాలేగార్లు
మూడవ మైసూరు యుద్ధానంతరం 1792 జూలై 12వ తేదీ బ్రిటీషు కంపెనీకి, కర్ణాటక (ఆర్కాటు ప్రాంతం) నవాబు మహమ్మద్దాలీకి మధ్య కుదిరిన ఒప్పందంలో, జమీందార్లు, పాలేగార్లు కంపెనీ అధికారం కిందకు వచ్చారు. వారి సిబ్బంది కంపెనీ అధికారంకిందకు రావటంతో, పాలకులు కోరినప్పుడు సిబ్బందిని పాలేగార్లు సమకూర్చే బాధ్యత తప్పింది. చిత్తూరు జిల్లాలో 20 ముఖ్యమైన పాళెములున్నాయి. ఆర్కాటులో కొంతప్రాంతం కడప జిల్లాలో, కొంత ప్రాంతం కలిపి చిత్తూరు జిల్లా ఆ తర్వాత ఏర్పాటయినందున ఆ రేండు జిల్లాలు కలిపాక బ్రిటీష్‌వారి వశమయినవే ఈ పాళెములు.'
కడప నవాబులు మదనపల్లె, పుంగనూరు, వాయల్పాడు తాలూకాలను పొలించారు. అక్కడి పాలేగార్లు కడప నవాబు అధీనంలో ఉన్నారు. ఆర్కాటు నవాబు అధీనంలో చాలామంది పాలేగార్లున్నారు. గోల్కొండ పతనానంతరం వీరిలో కొందరు ఆర్మాటు నవాబు పాలనకిందకు వచ్చినవారు. మైసూరు చిత్తూరు జిల్లాలో ముఖ్యమైన పాళెములు
-
మదనపల్లె 2. పుంగనూరు 3. బంగారుపాళెం ఓ కంగుంది కుప్పం
-
అవులపల్లె 6. తుంబ 7. పుల్లూరు 8. పాకాల 9. మొగరాల 10. పులిచెర్ల
-
కల్లూరు 12, ఈదరగుంట 18. నారగల్లు 14 యల్లమంద 156. ఎనుగొండపాళెం
-
చిట్టేచర్ల 17. నగరి 18 గుట్టపాళెం 19. రొంపిచెర్ల 20. గుడిపాటి
కళ సీమపాలేగార్లు పాలకుడుగా హైదరాలీ చేతికింద కొందరు పాలేగార్లున్నారు. మైసూరు యుద్దాలలో సైన్య సహకార పద్ధతి కింద తోడ్బడిన బ్రిటీష్ కంపెనీకి పూర్తి పైకం చెల్లించలేక రాయలసీమ జిల్లాలను వశపరిచాడు. అందులో కొందరు చిత్తూరు జిల్లా పాలేగార్లున్నారు.
1800 ఆగస్టు 2వ తేదీ వెలువడిన ప్రకటనననుసరించి వెంకటగిరి, కాళహస్తి, బొమ్మరాజుపాళిం లేదా కార్వేటినగరం, పుంగనూరు బ్రిటీష్ కంపెనీ పరిధిలోకి వచ్చాయి. ఈ పాళకెములు పడమటి పాళెములయ్యాయి. “వంశపారంపర్యంగా భూములు పొందిన కామందులు, ప్రభుత్వం తలపెట్టిన పథకాలతో రాజీపడితే ఆ ప్రాంతంలో ప్రశాంతత నెలకొంటుంది” అని కలెక్టరు మన్రోకు గవర్నరు రాశాడు. న
శ్రీరంగపట్టణం పతనమై టిప్పు మరణించాక అక్కడి బ్రిటీష్ సైన్యానికి ఆధిపత్యం వహించిన కల్నల్ వెలస్లీ మేజర్ మోకు ఇలా రాశాడు -
“క్ర (ప్రాంతంలో మన పరిస్థితి మొత్తం మీద వమంత బాగాలేదు. మన' చుట్టూ పాలేగార్హు, నాయర్హు, మోస్తాలు తిరగబడినారు. నేను వీలైనంత సైనిక సహాయం సమకూర్చుతాను. అసంతృప్తి చెందిన లేదా మనకు లోబడకుండా ఒక పాలేగారు మిగిలినా మనం ఈ ప్రాంతాన్ని వదలకూడదు.”
1800 తర్వాత శిస్తు వసూలు జమీందార్లు, పాలేగార్లు, గ్రామాధికార్ల చేతికి వచ్చింది. వారంతా ఒక్కొక్కరు ఒక చిన్న సైన్యం సమకూర్చుకున్నారు. దారి దోపిడీలు ఎక్కువయ్యాయి. ఇరుగు పొరుగు గ్రామాలతో వారు తగాదాలు పడుతూ ఉండేవారు. నైజాం సైనికులేగాక, బ్రిటీష్‌వారికి దత్తం చేసిన ప్రాంతంలోని 80మంది పాలేగార్ల కింద 80 వేలమంది సాయుధసిబ్బంది ఉ ండేవారు. ఇటువంటి అలజడులు నిండిన రాష్టంమీద స్వతహాగా కోరుకుని కలెక్టరుగా వచ్చిన మనోకు నలుగురు అసిస్టెంటు కలెక్టర్లు నియమితులయ్యారు. ఈ నలుగురికి వార్చనవాళ్ళి, ఆదోని, కడవ, కంభం (వధాన కార్యాలయాలయ్యాయి. బళ్ళారి జిల్లాలోని తాలూకాలకు అనంతపురం ప్రధాన కార్యాలయమయింది.
చిత్తూరు పాలేగార్లు త వెంకటగిరి, పొకాల, కాళహస్తి, కార్వేటినగరం, మద్రాసుకు పడమరగా ఉన్నందున వాటిని పడమటి పాళెములుగా గుర్తించి స్ర్రాటమ్‌ను కలెక్టరుగా నియమించారు. (స్తాటమ్ ఆ పాళెముల శిస్తు గురించి 1800 డిసెంబరు 14న రెవిన్యూ బోర్జుకు లేఖ రాశాడు. పాలేగార్లు మూడు విధాలుగా చెల్లింపులు చేసేవారు. దబ్బురూపంలో, ధాన్యం రూపంలో చెల్లించలేని వారు భూమి వదులుకునేవారు. డబ్బు రూపంలో చెల్లింపులు నామమాత్రమే. పాలేగార్లు కంపెనీకి ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నట్టు చూపినా, అన్ని తగ్గింపులు పోగ్గా' నిర్ణయించిన దానిలో సగం, లేదా మూడవవంతు మాత్రమే సిబ్బందికి దక్కేది. ఆ చిన్నమొత్తం వారికి సమ్మతం కానిషక్షంలో ఉద్యోగం వదులుకునే స్వాతంత్ర్యం వారికుందేది. మూడు, నాలుగు నెలల వేతనం బకాయిలో ఉండగా అది వసూలు చేసుకుందామనే ఆశతో వారు పనిలో కొనసాగేవారు. ఎవరైనా దయాదాక్షిణ్యంతో ఇచ్చినది, అప్పులుగా తీసుకున్నదిగాక స్వయంగా బలవంతాన వసూళ్ళు చేసిన దానితో వారు జీవనం సాగించారు. నాలుగైదేంద్లు శిస్తు బాకీని వసూలు చేసే పని కంపెనీ పాలేగార్లకు అప్పగించేవారు. పాలేగార్లు పంపిన సిబ్బంది శిస్తు వసూలయ్యేంతవరకు రైతు ఇంటివద్ద తిష్ట వేసి రోజుకు కొంత డబ్బు, శేరు బియ్యం వంతున బత్తా తీసుకునేవారు. బత్తా చెల్లింపకపోతే ఇల్లు అమ్మకానికి పెట్టి రైతును నిరాశయుని చేసేవారు. వెంకటగిరి, కాళహస్తి, జమీందారీలలో ధాన్యరూపంలో చెల్లింపులు ఎక్కువ లేవు. కరవు, కాటకాలలో పంటలు తగ్గితే సిబ్బందికి రెండు మూడు నెలల వేతనం తగ్గించటం కార్వేటి నగరంలో ఆనవాయితీ. వెంకటగిరి, కాళహస్తి పాలేగార్లు తాము జమకట్టవలసిన ధాన్యం జమకట్టవలసిందిగా కిందివారిని పురమాయించేవారు. పడమటి పొళెములన్నిటిలో రైతులు ఇలాంటి బాధలకు గురవుతూ వచ్చారు. కంపెనీ పడమటి పాళెములు వశపరచుకున్నప్పుడు బలం తగ్గిన పాలకులు తరచు మేనేజర్ల మార్చిడి, చెల్లించిన కప్పం బదులు అదనంగా భూమిని పొందిన పాలేగార్హు, సిబ్బంది ఖర్చును కలుపుతూ పెంచిన పన్ను ఆశ్వికదళం చేసే వసూళ్ళు ఇలాంటి సమస్వలన్నీ ఎదురయ్యాయి.
88 సీమపాలేగార్లు (బ్రిటీషు చట్టపరిధికిందకు వచ్చిన పాలేగార్లకు పాలకులు కోరినప్పుడు సిబ్బందిని సమకూర్చే బాధ్యత తప్పిపోయింది. 1800 ఆగస్టు 2వతేదీ వెలువడిన (ప్రకటన ననుసరించి పడమటి పాళెములయిన వెంకటగిరి, కాళహస్తి, బొమ్మరాజుపాళెం, లేదా కార్వేటినగరం, పుంగనూరు బ్రిటీష్ చట్టపరిధికిందకు వచ్చాయి. సంవత్సరానికి కొంత కప్పం చెల్లిస్తూ, కోరినప్పుడు సైనిక సహాయం చేసేవారు. సైనికసహాయం చేయని పక్షంలో దానిబదులు సొమ్ము చెల్లించేవారు. అలా చెల్లింపని సందర్భంలో వారి ఆస్తిని లేదా జమీందారీని పాలకులు వశపరచుకోవచ్చు. భూములు సాగుచేసే రైతులు నగదు లేదా వస్తురూపంలో శిస్తు చెల్లించేట్టు లిఖితపూర్వకంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. మరో రెండు నెలలకు 1800 అక్టోబరు 12వ తేదీన తాలూకదార్లందరికీ వంవిన ఉత్తర్వులలో కంపెనీ ఇలా పేర్కొంది - “యుద్భంలో సహాయపడినందుకు ఇవ్వవలసిన సబ్సిడీ బదులుగా తుంగభద్ర ఉత్తరభాగంలో, అంటే తుంగభద్రకు పైభాగంలో, కృష్ణానది వరకు ఉన్న భూములన్నింటినీ ఆ ప్రాంతంలోని కోటలతో సహా బ్రిటీష్‌వారికి నైజాం ఇచ్చివేశాడు. అందువలన ఈ ఉత్తరం అందిన వెంటనే ఆ ప్రాంతంలో మీరు వసూళ్ళు నిలిపివేయాలి.” పడమటి పాలేగార్లను నిరాయుధులను చేసి వారిని శత్రుబారి నుండి రక్షిస్తామని (ప్రభుత్వం మాట ఇచ్చింది. పాలేగార్లేగాక, (ప్రజలు కూడా తుపొకులుగానీ, ఇతర ఆయుధాలుగానీ ఉపయోగించే బీలు లేదు. 18092 నాటికి పాలేగారు సైనికులు (సిబ్బంది) 21 వేలమంది ఉన్నారు. వారి ఆయుధాలను కలెక్టరుకు అప్పజెప్పి పరిహారం తీసుకోవలసిందని కోరారు. మస్కెటుకు పదిరూపాయలు, నాటుతుపాకీకి ఐదు రూపాయలు, ఈటెకు రెండు రూపాయలవంతున చెల్లించారు. హోదాకోసం పాలేగారు నిలుపుకునే సిబ్బంది సంఖ్యను కలెక్టరాఫీసులో నమోదు చేయాలి. కాళహస్తి, బొమ్మరాజుపాళెం, వెంకటగిరి, పాకాల జమీందార్లకు 1802 ఆగస్టు 24వ తేదీకే వ్యక్తిగతంగా, విడివిడిగా లేఖలు రాశారు. గవర్నరు క్రైవు పాలేగార్లకీవిధంగా రాశాడు -
చిత్తూరు పాలేగార్లు తి
“మీ జమీందారీలో వ్యవసాయాన్ని, వాణిజ్యాన్ని అభివృద్ధి చేసే ప్రధాన బాధ్యత మామీద ఉంది. ఆ బాధ్యత తీర్చుకోవాలని మిమ్ములను కోరుతున్నాను.”
ఒప్పందం మీద సంతకం చేయవలసిందిగా (ప్రభుత్వం పాలేగార్లను కోరింది. లాంగిపోవాలనుకున్నప్పుడు నెలలోగా వారు తమ సిబ్బందిని వంపివేయాలనీ, పాత కోటలను వడగొట్టాలనీ, కొత్తగా కోటలు నిర్మించకూడదనీ, ఆడవులను ఉపయోగంలోకి తేవటంలోను, రోడ్డు నిర్మించటంలోను తోడ్చడాలనీ, ఐకాయిలను మూడు నెలల్లోగా చెల్లించాలనీ, భూముల సర్వేకు అంగీకరించాలనీ, ప్రభుత్వానికి విధేయులై ఉండాలనీ వారిని కోరారు.
పాకాల, మొగరాల, తుంబ పాలేగార్లు ఒప్పందాలమీద సంతకాలు చేశారుగానీ, మిగిలినవారు ఒప్పందాన్ని తిరస్కరించారు. పాలేగార్లతో రాజీకోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సైనికులను తరలించేందుకు వీలుగా చిత్తూరు మీదుగా నారగంటి నుండి వేలూరుకు, వరదరామి నుండి వెంకటగిరికి ప్రభుత్వం రెండు రోడ్లు నిర్మించింది.
ఒప్పందం మీద సంతకం చేయని పాలేగార్లను శిక్షించేందుకు లెప్టినెంట్ మనిపెన్ని నాయకత్వంలో 8 వేలమందిని చిత్తూరులో కూడగట్టారు. సైనిక శాసనం ప్రకటించారు. తిరగబడిన పాలేగార్లు కడప సరిహద్దులు దాటి వెళ్ళిపోయినా చివరకు కల్నల్ మన్రోకు లొంగిపోయారు. వారిని కృష్ణగిరి కోటలో బంధించారు. పుల్లూరు, ఈదరగుంట పాలేగార్లు కృష్ణగిరి నుండి తప్పింకుపోయారు.
ఈ తిరుగుబాటుదార్లను అణచివేస్తూ నవాబు సైనికులు జోక్యం కల్పించుకున్నట్టయితే సహించబోమని ఆర్కాటు నవాబును కంపెనీ హెచ్చరించింది. పాలేగార్ల తిరుగుబాటును అణచివేసేందుకయ్యే ఖర్చును నవాబు భరించనవసరం లేదు. చిన్న చిన్న కమతాలను నిరంతరం కౌలుకు తీసుకున్న పాలేగార్లు ఆ కమతాలను అడ్దుపెట్టుకుని బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పనిచేశారు. ఆర్మాటు నవాబు అంతకు పదేండ్ల క్రితమే పాలేగార్లను
క్ష సీమపాలేగార్లు అణచివేసేందుకు కంపనీ సహాయం కోరగా ఫోర్ట్ విలియం నుండి డైరెక్టర్లు తమకది ఆమోదయోగ్యం కాదని సైనికులను పంపడానికి నిరాకరించారు. ఇలా నిరాకరించడంతో పాలేగార్లమీద తమ అధికారాన్ని (ిటీష్ కంపెనీ (ధువపరచుకుంది. కనీసం ఇరుగు పొరుగు పాలేగార్ల సిబ్బందినయినా అనుమతించటానికి కూడా కంపెనీ అంగీకరింపలేదు. పదేపదే సైనిక సహాయం కోరుతూ, పాలేగార్లు బ్రిటీష్ అధికారంకిందకు వచ్చినట్టు ఆర్కాటు నవాబు ధ్రువపరిచాడు. పాలేగార్ల సిబ్బందికి, ఈటెగాళ్ళకు (ప్రభుత్వమే జీతభత్యాలు ఇవ్వసాగింది.
అప్పటి రాజకీయ పరిస్థితులలో పాలేగార్లు ప్రతి ఒక్కరు హోదా (ప్రదర్శించారేగానీ, ఏ పాలేగారు కూడా (ప్రత్యేకంగా సామ్రాజ్యాన్ని విస్తరించే (ప్రయత్నం చేయలేదు. వారికి ఉమ్మడి ప్రభుత్వం లేదు. ఐకమత్యానికి వారు ఏ విధంగానూ ప్రయత్నం చేయలేదు. సరయిన నాయకత్వం లేనందున వారి సిబ్బంది కూడా కలసి పనిచేయలేకపోయారు. వారి సిబ్బంది పోషణ ఖర్చును (ప్రభుత్వమే భరించింది. వారి గ్రామాలలో వచ్చిన ఆదాయంలో కొంత సొమ్ము పాలకులకు సమర్పించేవారు. (గగ్రామాలమీద వసూళ్ళకు వెళ్ళినవారు పాలేగార్లకోసం, పాలకులకోసం, తమకోసం కూడా వసూలు చేసేవారు. వసూళ్ళకు వచ్చినవారికి ఎదురు తిరిగేంత సాహసం ప్రజలకు లేదు. తమ ఇబ్బందులను పాలకులకు తెలియజేసే ధైర్యం వారికి లేదు. తెలియజేసినా లాభం లేదని వారి భావం. ఈ సిబ్బంది ('క్రమబద్ధమయిన సైన్యం కాదు. రెవిన్యూ అధికారాలు, న్యాయ నిర్ణయాధికారాలు పూర్తిగా పాలేగారు చేతిలోనే ఉందేవి. స్థానికంగా బలంగల పాలేగార్లను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తేగాక, దక్షిణాదిన (బ్రిటీష్ అధికాలాన్ని నెలకొల్ప్బటంగానీ; దానిని సుస్థిరంగా నిలబెట్టుకోవడంగానీ వీలుపడేది కాదు.
(ప్రభుత్వానికీ, పాలేగార్లకూ మధ్య అసమ్మతికి పన్ను పెంపుదల తాత్మాలికంగా కారణమయింది. అందువలన తమ గ్రామాలనుందేగాక పొరుగు (గ్రామాల నుండి, ప్రభుత్వ గ్రామాల నుండి కూడా పాలేగార్లు వసూళ్ళు ప్రారంభించారు.
చిత్తూరు పాలేగార్లు త్తే విదేశీయుల భయంతోగానీ, వారిమీద గౌరవంతోగానీ పాలేగార్లు లాంగిపోలేదు. కంపెనీ పెంచిన పన్ను చెల్లించడమంటే పాలేగార్లు తమ స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నట్టే. (బ్రిటీష్ ఆధిపత్యాన్ని గుర్తించినట్టే. అందువల్లనే విదేశీయులమీద ద్వేషం పాలేగార్లలో ఏమాత్రం సడలలేదు.
1802 ఆగస్టు 25వ తేదీన ఫోర్ట్ సెయింట్ జార్జి పడమటి పాలేగార్ల గురించి అనేక వివరాలు సేకరించవలసిందిగా జిల్లా కలెక్టరును కోరారు. వెంకటగిరి, కాళహస్తి, బొమ్మరాజుపాళెం, సైదాపూరు పాళెముల ఆదాయం, సైనిక వ్యవస్థల గురించి నివేదికలు కలెక్టరుకు అందాయి. వారి సైనికులు వెంటనే ిటీష్ సైన్యంలో చేరారు. వారి జీతభత్యాలను కంపెనీ ప్రభుత్వం భరించింది. 'సైనికులకోసం ఈ జమీందార్లు ఖర్చుపెడుతున్న పైకం ప్రభుత్వానికి జమ కొవాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి -
వెంకటగిరి 98,827 వరహాలు, కాళహస్తి 49,225 వరహాలు, బొమ్మరాజుపాళెం, లేదా కార్వేటినగరం 27, 414 వరహాలు, సైదాపురం 3,400 వరహాలు. ఈ నలుగురు కలసి సైనిక సేవకులకుగాను 1,78,366 వరహాలు చెల్లించవలసి వచ్చింది. ఉప్పు, రోడ్డు పన్నులు, మద్యాల నుండి వసూలయ్యే మొత్తం (ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. ఇతర మొత్తం 21,502 వరహాలు. అన్నీ కలుపుకుని పాలేగారు చెల్లించవలసినవి - వెంకటగిరి 1,11,058 వరహాలు, కాళహస్తి 54,398 వరవాలు, బొమ్మరాజుపాళెం 53,618 వరహాలు, సైదాపురం 9,424 వరహాలు. మొత్తం 2,28,498 వరహాలు. అప్పటి ఏర్పాటు శాశ్వతమనే అనుమానం పాలేగార్లకు కలగకుండా గవర్నరు సనదులు సృష్టించాడు. సనదులకు సమానమయిన కబూలియత్‌లు పంపించారు. జమీందార్లు వాటిమీద సంతకాలు చేసి తిరిగి పంపాలి. ఉ త్తర్వులను అనుసరించి కిస్తు నిర్ణయించి, కిస్తుబందీలను కబూలియత్‌కు జతపరచాలి. ఈ పత్రానికి మరేమీ జతచేయవద్దని కలెక్టరుకు ఆదేశమిచ్చారు. పాలేగార్లు అడిగిన ప్రశ్నలను ఓపికగా విని, వారు ఈ మార్చుకు అంగీకరించేట్టు కలెక్టర్లు వారిని ఒప్పించాలి. వారు చెల్లించవలసిన మొత్తం పెరగదనీ, పైగా
త్త సీమపాలేగార్లు వారికి కొంత ఆదాయం ఉంటుందనీ, అంతవరకు వారికి అలాంటి ఆదాయం లభించేది కాదనీ, ఇప్పుడు ఆ వచ్చే ఆదాయం వారి జమీందారీల అభివృద్ధికి తోద్చడుతుందనీ కలెక్టరు వారికి నచ్చజెప్పాలి. సైనిక సిబ్బందిని తొలగించినంత మాత్రాన వారి హోదాకు ఏమాత్రం భంగం కలగబోదనీ, ప్రభుత్వం కోరినప్పుడు సిబ్బందిని పంపే బదులు పైకం చెల్లించవచ్చనీ తెలిపారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు, గవర్నర్ జనరల్ సమ్మతి తెలిపిన ఈ ఉత్తర్వును ఫోర్ట్ సెయింట్ జార్జి మార్పు చేసే వీలు లేకపోయింది. పోలారు నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని ఉత్తర ఆర్కాటు అనేవారు. కర్ణాటక, మిగతా ప్రాంతంతోపాటు ఉత్తర ఆర్కాటు కూడా 1801లో కంపెనీ అధీనంలోకి వచ్చింది. ఆర్కాటు జిల్లాలో చాలాసార్లు మార్పులు, కూర్పులు సంభవించాయి. 1801లో కంపెనీకి అప్పగించిన తర్వాత పైదాపూరు, కలగుంది, బడామహల్‌లోని కృష్ణగిరి డివిజను, కాళహస్తి, కార్వేటినగరం, వెంకటగిరి, కనుమల ఎగువనున్న మైసూరు ప్రాంతాన్ని ఆర్కాటులో కలిపారు. 1808లో వెంకటగిరి, సైదాపూరు, కాళహస్తిలో కొంతప్రాంతాన్ని నెల్లూరుకు బదలాయించారు. కలగుంది జమీందారీ మినహా హోసూరు, కృష్ణగిరి విభాగాలు, పలమనేరు తాలూకాను సేలంలో చేర్చారు. పోలారును ఆనుకుని దక్షిణ్‌లో ఉన్న అయిదు తాలూకాలను ఆరణి జాగీరుతో సహా ఉత్తర ఆర్కాటుకు కలిపారు. సత్యవేడు తాలూకాను, పులికాట్ విభాగాన్ని చెంగల్పట్టు నుండె విడదీశారు. ఉత్తర ఆర్కాటనుని అనేక తాలూకాలుగా విభజించారు. చిత్తూరు, తిరుపతి, కడపనత్తం, సాతనూరు, తిరువలం, కావేరిపాల్, షోలింగర్, ఆర్కాట్, వెల్లూరు, తిరువత్తూర్, పోలూర్, వండివాష్‌్ సత్తెవీడు, చిత్తూరు పాళెములు, మామందూర్, కృష్ణాపురం, కరకంబాడి, ఆరణి జాగీర్, ఆవులకొండ, దేసూర్‌గాక, కాళహస్తి, కార్వేటినగరం, కంగుంది జమీందారీలు. 1818లో పులికాట్‌ను కంపెనీవారు డచ్‌వారికి ఇచ్చినా, కొంతకాలానికే మరలా తీసివేసుకుని చెంగల్పట్టుకు కలిపినా 1824లో ఉత్తర ఆర్మాటుకే చేర్చారు. సత్యవేడు తాలూకాలో కొంత కలుపుకొని 1850లో తిరిగి చెంగల్పట్టుకే
చిత్తూరు పాలేగార్లు 43 చేర్చారు. సత్యవీడులో మిగిలిన ప్రాంతాన్ని కూడా 1860లో చెంగల్పట్టుకే చేర్చారు. 1856లో పుంగనూరును కడప. జిల్లా నుండి ఉత్తర ఆర్మటుకు బదలాయించారు. ఆవులకొండ జాగీరును 1848లోను, దేను జాగీరును 1826లోను ప్రభుత్వం వశపరచుకుంది. 1860లో తాలూకాల సంఖ్య 9కి తగ్గించారు. చంద్రగిరి, తిరుపతి కలిపి చంద్రగిరి తాలూకా ఏర్పాటయింది. మిగిలిన తాలూకాలు - వాలాము, గుడియాతం, వేలూరు, పోలూరు, వందివాష్ ఆర్మాటు.
1894 ఏప్రిల్ 1నాడు కాళహస్తి జమీందారీలోని మదర్‌పాల్ విభాగాన్ని చెంగల్పట్టుకు బదలాయించారు.
మొగరాల, పాకాల, పీలేరు పాలేగార్లు చిత్తూరు, చంద్రగిరి జాగీరుదార్లకు లోబడినవారు.
కరాాటక (ప్రాంతం కంపెనీ పాలనకిందకు రాగానే ఆర్కాటు ప్రాంతానికి మొదటి కలెక్టరుగా (స్త్రాటమ్‌ను నియమించారు. పడమటి ప్రాంతం పాలేగార్ల గురించి స్త్రాటమ్ నివేదికను సిద్ధం చేశాడు.
విజయనగర ' కాలంలో పాలేగార్లు ఎలా పైకివచ్చిందీ, విజయనగర పతనానంతరం వారెలా స్వతంత్రులయిందీ వివరించాడు. కంపెనీ అధికారం కిందకు వచ్చిన పాలేగార్లు కావలి రుసుం వసూలు చేసే వీలు లేకపోయింది. పాలేగార్లు బకాయిలుపడి (గ్రామాలను తిరిగి కొల్లగొట్టడం ప్రారంభించారు. బిటీషవారు జాప్యం లేకుండా సైనికబలాన్ని ప్రదర్శించారు. పన్ను చెల్లింపుకు పిలిపించినా పాలేగార్లు స్వయంగా వెళ్ళకుండా తమ ప్రతినిధులను పంపారు.
కర్ణాటక నవాబు స్వయంగా ఇతరులకు లోబడి ఉన్నా పాలేగార్లతో తగాదాలు పడుతూనే ఉన్నాడు. తమలో తాము పోరాడటం మాన్పటంవరకు మాత్రమే పాలేగార్ల విషయంలో పట్టించుకుంటామని కంపెనీ (ప్రభుత్వం తెలిపింది. పాలేగార్ల శిస్తులు, ఆస్తుల విషయాలలో కలెక్టరుగానీ, నవాబుగానీ కల్పించుకోకూడదనీ, ఆ విషయాన్ని గవర్చరే నిర్ణయిస్తాడనీ కలకత్తా నుండి గవర్నరు జనరలున్న కౌన్సిల్ నిర్దేశించింది.
మ! సీమపాలేగార్లు
క్రిమినల్ ఛార్జీలు మోపబడిన చిన్నచిన్న షాలేగార్లను శిక్షించాలని నవాబు ఉద్దేశించినా, ఫోర్ట్ విలియం అందుకు అంగీకరింపలేదు. కంపెనీ సైనికులతో ఒక గారిసన్‌ను చం(దగిరిలో నిలిపేందుకు కంపెనీ అంగీకరించింది. పాలేగార్ల్షను అణచేందుకు తమ సిబ్బందిని పంపడానికి కంపెనీ నిరాకరించింది.
కారన్‌వాలిస్‌తో కుదిరిన ఒప్పందం ్రకారం తమ శిస్తును పాలేగార్లు మద్రాసులోని కంపెనీ అధికార్లకు చెల్లించారు. నవాబు కోరినట్టు సిబ్బందిని పంపితే తమ శిస్తు వసూలుకు అంతరాయం కలుగుతుందని కంపెనీ భావించింది.
వ అనంతపురం పాలేగార్లు
విజయనగర రాజులవద్ద పనిచేసిన దివాన్ చిక్కష్ప వడయార్ క్రీ.శ 1864లో అనంతసాగరమనే పట్టణం నిర్మించాడు. పాండు నదికి దేవరకొండ దగ్గర ఆనకట్ట కట్టించాడు. ఆనకట్టకు పడమరగా ఏర్పాటయిన గ్రామానికి అనంతసాగరం అని తన భార్యపేరు పెట్టాడు. ఆనకట్టకు తూర్పున ఏర్పడిన (గ్రామానికి తన యజమాని బుక్కరాయని పేరుతో బుక్కరాయ సముద్రం అని పేరు పెట్టాదు. 1565లో తళ్ళికోట (రాక్షస తంగడి) యుద్ధం ముగిసి విజయనగర రాజులు ఓడిపోయినప్పుడు అనంతపురం, ఆ పరిసర ప్రాంతాలకు హుండే హనుమప్పనాయుడు పాలేగారయ్యాడు. విజయనగర పాలకుడు రామరాజు మీద యాదవసాక తిమ్మరాజు తిరగబడినప్పుడు తిమ్మరాజును అణచటంలో హనుమప్పనాయుడు రామరాజుకు తోద్చడినాడు. తిమ్మరాజుకు సాయంగా వన్తున్న గోల్కొండ నుల్తానును కూడా ఓడించాడు. హనుమప్పనాయుడు బుక్కరాయసము[ద్రం గ్రామంలో స్థిరపడి 1582లో మరణించాడు. హనుమప్పనాయుని కుమారుడు విమ్మడి హంపనాయుడు పాలేగారయ్యాడు (1588-1595) ఆ తర్వాత హంపనాయుని కుమారుడు మలకప్పనాయుడు పాలేగారయ్యాడు (1595-1619) '
ముస్లిం సుల్తానులతో పోరాటంలో మలకప్పనాయుడు పాల్గొని సుల్తానుకు లొంగిపోయాడు. బుక్కపట్నం వరకు మలకప్పనాయుని పాలనకింద ఉందేది అప్పటికి మలకప్పనాయుడు చెల్లించవలసిన మొత్తం 1,37,316 వరహాలు.
శ్ర సీమపాలేగార్లు మలకప్పనాయుడు అనంతపురం చేరుకుని తన అధీనంలోని విశాలప్రాంతాన్ని తన నలుగురు కుమారులకు పంపిణీ చేశాడు.
దేవప్పనాయుడు - తాడిపత్రి, ప్రొద్దటూరు
చిన్నరామప్పనాయుడు - బళ్ళారి, కరగోడు పరిసరప్రాంతం
లింగప్పనాయుడు - కొండెరిపి (ధర్మవరం తాలూక), కనకల్
(రాయదుర్గం తాలూకా)
హంపనాయుడు - అనంతపురం, బుక్కపట్నం, ధర్మవరం
1757లో మహారాష్ట్రలు అనంతపురం ముట్టడించారు. వారికి రూ. 50,000 ఇచ్చి సమాధానపరిచారు. ఇంత పెద్దమొత్తం సమకూర్చడం చాలా ఇబ్బందయిపోయింది. మంటత్రి బసప్ప దోపిడీలకు పంపి ఈ డబ్బు సమకూర్చుకోవాలని తలపెట్టాడు. తాడిపత్రి, ఎల్లుట్ల, రడ్డమ్, పుట్టపర్తి పాలేగార్ల వశమయ్యాయి.
బళ్ళారి, గుత్తి 1775లో హైదరాలీ వశమయ్యాయి. అనంతపురం నుండి రూ. 40 వేల కప్పం గడువులోగా హైదరాలీకి లభించేది. క్రమేపి కప్పం బకాయిపడింది. హైదరు మనుష్యులు అనంతపురం వెళ్ళి ఆస్తిని జప్తు చేసి పాలేగారును అరెస్టు చేశారు. దాంతో పాలేగారు కుటుంబం మరుగున పడిపోయింది. పాలేగారు పెద్దకుమారులిద్దరూ హైదరు సైన్యంలో చేరారు. మూడవ కుమారుని తమ రాజధాని అయిన శ్రీరంగ వట్టణానికి పంపించివేశారు. 1788లో పాలేగారు మరణించాడు. పాలేగారు కుటుంబంలో మగవారందరినీ ఉరితీశారు. శ్రీరంగపట్టణం నుండి తప్పించుకున్న మూడవ కుమారుడు పారిపోయి కాళహస్తి రాజు శరణు కోరాడు.
1799లో టిప్పు మరణించాక మూడవ కుమారుడు అనంతపురం తిరిగి వెళ్ళి నిజాంకు లొంగిపోయాడు. మూడవ కుమారుడు లింగప్పనాయుడు కొద్దిపాటి కప్పం చెల్లించే షరతుమీద సిద్ధరామపురం పాలేగారయ్యాడు. 1801లో లింగపవ్పనాయుడి మరణంతో మలకప్పనాయుని వంశం
అనంతపురం పాలేగార్లు త్త సమసిపోయింది. 1860 వరకు కూడా కొన్ని కుటుంబాలకు పింఛను లఖిస్తూనే ఉండేది.
కల్నల్ మన్రో 1800లో అనంతపురంలో నివాసం ఏర్పరచుకున్నాడు. అనంతపురం చాలా సంవత్సరాలు దత్తమండలానికి ప్రధాన కార్యాలయంగా కొనసాగింది. 1822లో కాంప్‌బెల్ తన కేంద్రాన్ని బళ్ళారికి మార్చినా రాబర్ట్‌సన్ ఆ మరుసటి సంవత్సరమే తిరిగి ప్రధాన కార్యాలయాన్ని అనంతపురానికే మార్చాడు.
అనంతపురం జిల్లాలో గుత్తి, మడకశిర, పత్తికొండ, కోలుకాండ, అనంతపురం, రాయదుర్గం పాలేగార్లు చాలా ప్రధానమయినవారు. 1801 మార్చి నాటికే గుజ్జంకొండ (ప్రాంతానికి మనో శిస్తు నిర్ణయం చేయగలిగాడు. ఎవరైనా సిబ్బందిని సమకూర్చుకున్నాా విధిగా సొమ్ము వసూలు చేసినా, ఆ వ్యక్తిని తిరుగుబాటుదారుగా పరిగణిస్తామని మన్రో ప్రకటన చేశాడు. దాంతో పాలేగార్లు అదుపులోకి వచ్చారు. ఉన్నపళంగా పాళెములు వశపరచుకోవటాన్ని ప్రజలు ఆమోదింపలేదు. ఈ చర్యను లండన్‌లోని డైరెక్టర్ల బోర్డు సమ్మతింపలేదు. ఎందుకు అలా వశపరచుకోవాలని గట్టిగా కారణాలడిగారు. ఇది కొనసాగితే మ(ోను రెవిన్యూ పని నుండి తొలగించవలసి వస్తుందని కూడా హెచ్చరించారు. అనంతవరం జిల్లాలో పెరువూళ్ నాయుడు, గుజ్జప్పనాయుడువంటి పొలేగార్ల వలన పెద్దగా ప్రతిఘటన లేకపోయినా ఇతరులు వారిని అనుకరిస్తారని ప్రభుత్వం అనుమానించింది. ఇలాంటి పరిస్థితుల్లో గుజ్జప్పనాయుడు గుత్తిలో అయిదువందలమందిని సమీకరించాడు. 8 క్రోసుల దూరంలోని కొనకొండ్లమీద దాడి చేసి కొనకొండ్ల కోటను ఆక్రమించాడు. పాలేగార్ల భూస్వామ్య పద్ధతుల దృష్టా, వారి దమన పద్ధతులను జాప్యం లేకుండా అణచివేస్తేనే మంచి ప్రభుత్వం ఏర్పాటయ్యే వీలుంటుందని 1805 నాటికి డైరెక్టర్లకు మన్రో స్పష్టం చేశాడు.
ఉప్పులూరు పాలేగారు మనో పంవిన సమన్లు తీసుకోవటానికి నిరాకరించాడు. ఎంత తాను బాకీ పడినానని లెక్కలు చూడటానికి కూడా
వ! సీమపాలేగార్లు తిరస్కరించాడు. కాంపెబెల్ ఉప్పులూరు పరిసరంలో శిబిరం వేసి, ఆ “ప్రాంతంలోని ఆక్రమిత (గ్రామాలను, సర్మారు గ్రామాలను వశపరచుకో వలసిందిగా తహసిల్దారును నిర్దేశించాడు. తహసిల్దారు తమకు విధేయుడుగా ఉంటాడని ఉప్పులూరు (గ్రామాన్ని తహసిల్టారుకిచ్చాడు. గుల్టింకొండ పాలేగార్లందరూ తమ లెక్కలు తెచ్చారు. ఉప్పులూరు పాలేగారు వెంట సదా 20 మంది సాయుధ సిబ్బంది ఉన్నారు. ఉప్పులూరు పాలేగారును రాత్రికి రాహ్రి సైన్యాన్ని పంపి అరెస్టు చేసి గుత్తికోటకు పంపారు.
1869లో డివిజన్లు పునర్‌వ్యవస్టీకరించినప్పుడు సబ్‌కలెక్టర్ కార్యాలయం గుత్తికి మారింది. సర్ ధామస్ మన్రో బళ్ళారి రోద్దుమీద ఊరికి అరమైలు దూరంలో తన భవనం నిర్మించుకున్నాడు. రాయదుర్గం
16వ శతాబ్దం ఆఖరులో రాయదుర్గం పాలేగారును తొలగించి విజయనగర సైన్యాధికారి వంశీయుడు పాలకుడయ్యాదు. ఇరుగు పొరుగు పాలేగార్లు తమ పైనున్న పాలకులు కట్ప్నకానుకలపట్ల మాత్రమే (శ్రద్ధ చూపుతూ తమవైపు నిర్లక్ష్యం చూపుతున్నారని గుర్తించారు. 1766లో హైదరుకు తోద్బడినా టిప్పును పాలేగారు వ్యతిరేకించాడు. టిప్పు పాలేగారును ఓడించి, కోట వశపరచుకుని, పాలేగారును శ్రీరంగపట్నం పంపి అతనిని హతమార్చాడు. 1799లో ఆ పాలేగారు బంధువు రాయదుర్గం తిరిగి వచ్చాడు. నైజాం మనుషులు అతనిని ఖైదు చేసి హైదరాబాదు పంపారు. బ్రిటీష్‌వారు అక్కడి నుండి అతనిని గుత్తికోటకు పంపారు. విజయనగరం కింద ఉండిన పాలేగార్లను హైదరు, టిప్పు, నైజాం, (బిటీష్‌వారంతా లొంగదీసే ప్రయత్నం చేసి వారిని శ్రీరంగపట్టణం, హైదరాబాదు, లేదా గుత్తికోటకే పంపించారు. గుత్తి
చాలా బలమ్రైన ఈ గుత్తికోటను కృష్ణదేవరాయలకాలంలో 86 సంవత్సరాలు పాలించిన బుక్కరాజు అనే అధికారి కట్టించాడు. ఆ వంశంలో
అనంతపురం పాలేగార్లు డ్రి ఆఖరివాడయిన తిరుమలదేవరావు 22 సంల్లవత్సరాలు పాలించాడు. తిరుమలదేవుని కాలంలో మీర్‌జుమ్లూ దండయాత్ర చేసపొపన్నెండు సంవత్సరాలు ముట్టడి సాగించి గుత్తికోటను స్వాధీనపరచుకున్నాడు. కడప నవాబులు, ఆదోని నవాబులు కోటను వశపరచుకున్నా, వారికింద గుత్తి చాలాకాలం కొనసాగలేదు. బెరంగజేబు కాలంలో 1670 ప్రాంతంలో సవనూరు పాలకుడు మీర్ అబిద్‌ఖాన్ పాలన కిందకు వచ్చిన గుత్తికోటను మరారీ నాయకుడు మురారీరావు తండ్రి హిందూరావు వశపరచుకుని కోటను గట్టిపరిచాడు. గుత్తికోటను రాజధానిగా చేసుకున్నాడు. హైదరాలీ తొమ్మిది నెలలు ముట్టడి సాగించి 1776లో ఈ కోటను వశపరచుకున్నాడు. మురారీరావును శ్రీరంగపట్టణానికి ఖైదీగా పంపాడు. అక్కడనుంచి గోపాలకోటకు పంపితే అక్కడే మరణించాడు. 1781లో టిప్పు ఆ కుటుంబాన్ని హతమార్చాడు.
(క్రూ స ల్ న కడపజిల్లా పాలేగార్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1799లో టిప్పు పతనానంతరం నాలుగు జిల్లాలు - కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి యుద్ధపు ఖర్చుకింద బిటీష్ కంపెనీకి నైజాం దత్తత చేశాడు. కడప జిల్లాలోని 80 మందిలో బెకు, నోసమ్ పాలేగార్లు ప్రముఖులు. 1807నాటికి పాలేగార్లను అణిచివేసి గుత్తికోటలో మన్రో బంధించాడు. 46 సంవత్సరాల తర్వాత బ్రిటీష్ పాలనకు ఎదురు తిరిగినవాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, నరసింహారెడ్డి ఇంటిపేరు 'మజ్జరివారు. కోయిలకుంట్ల తాలూకాలోని ఉయ్యాలవాడ పాలేగారు నరసింహారెడ్డి. బెకు, నోసమ్ పాలేగార్లు చాలా పలుకుబడికలవారు. వీరి ఆధీనంలో 66 (గ్రామాలుందేవి. నోసమ్, ఉ య్యాలవాడ సంస్థానాలకింద కట్టుబడులుగా వ్యవసాయం సాగిస్తున్న వారు 800 మంది. ఉయ్యాలవాడ కింద 10 (గ్రామాలు, నోసం పాలేగారు కింద 15 (గ్రామాలుందేవి"** వ్యవసాయం ప్రధాన వృత్తి అయిన ఈ (గ్రామాలలో పాలేగార్లు చెరువులు తవ్వించారు. పంట కాలువలు తవ్వించి భూములకు సాగునీటి సదుపాయం కల్పించారు. (గ్రామాలలో చిన్న పాఠశాలలు ఏర్పాటు చేశారు. నాటువైద్యులను పోషించారు. (ప్రజల వినోదం కోసం ఉత్సవాలు, వురాణ కాలక్షేపాలు ఏర్పాటు చేశారు.
కడపజిల్లా పాలేగార్లు ర్1 నోసం పాలేగారు జయరామరెడ్డికి పురుష్మస్‌ంతానం లేదు. కుమార్తె కుమారుడైన నరసింహారెడ్డిని జయరామిరెడ్డి దత్తత స్టేసుకున్నాడు. భూములు (బైటీష్ పాలనకిందకు రావటంతో జయరామరెడ్డికి పింఛను మంజూరయింది. కడప కలెక్టర్ రాస్, పాలేగారు పింఛనుల గురించి 1888లో ఒక నివేదిక సమర్పించాడు. నరసింహనాయుడు కుమారుడు రామప్పనాయుడికి మగ సంతానం లేదు. రామప్పనాయుని దత్తపుత్రుడంటూ తిమ్మనాయుడు అర్జీ పెట్టాడు. అప్పటికి నరసింహనాయుని భార్య, కూతురు బతికే ఉన్నారు. 1801 జూలై ఉయ్యాలవాడ నోసం సంస్థానం (గ్రామాలు కట్టుబడులు గ్రామాలు కట్టుబడులు ఉయ్యాలవాడ 10 నోసం "48 రామాపురం 2 పెద్ద ఎమ్మగనూరు శ్ర ఒంటెద్దుపల్లి - దూళ్ళదుర్తి 43 రెడ్డివారి జంబల్‌దిన్నె కత వార వరం ఆ పడిగెపాదు ఆ ఇంజాదూ 8 సుంగపట్నం 28 మూకాముల్లా - ఉల్లూరు క్షే కిస్టేపాడు 9 కంపమల్ల 17 రూపన గుడి 10 కాకరవాడ శీ పొట్టేపాడు 2 పూచకోయలపల్లి ఆ గుందుమల్ల ఆ మొత్తం 76. తుదుమర్‌దిన్నె - సుద్ధమల్లి క్షే మయలూరు క్ష న అలవకాండ 19 కట్టుబడులు మొత్తం _తం0 రుద్ర 39 మొత్తం నూ (౧ నోసం, ఉయ్యాలవాడ సంస్థానాలలో (గ్రామాలు, కట్టుబడుల సంఖ్య
52 సీమపాలేగార్లు 12వ తేదీనాడు వారికి కంపెనీ ప్రభుత్వం సాలుకు రూ. 291. 10.8 ఇచ్చేట్టు మనో మంజూరు చేశాడు. కొర్లగుంటతోపాటు ఇతర (గగ్రామాలమీద నరనింవానాయుడు అధికారం వదులుకుని ఉన్నాడు. 1821లో నరసింహనాయుడు మరణించగా ఆయన కుమారునికి ఆ పింఛను లభించింది. కుమారుడు నరసింవానాయుడు కూడా 1838లో మరణించాడు. దత్తకుమారుడు తిమ్మనాయుడు పింఛను తనకు రావాలని అర్జీ పెట్టాడు. పింఛనులో సగం రూ. 146 రామప్పనాయుడి భార్యకు చెందాలనీ, ఆమె మరణానంతరం కుమార్తెకు చెందాలనీ ఆ తర్వాత పింఛను నిలుపు చేయాలనీ నిర్ణయించారు.
గుండువల్లి, ఇతర (గ్రామాలను తీసివేనుకుని, పాలేగారు వెంకటప్పనాయునికి 1801 జూలైలో రూ. 1812-4-0 పింఛను మనో మంజూరు. చేశాడు. తండ్రి మరణానంతరం జన్మించిన వెంకటకృష్ణ శేష చలపతినాయునికి పూర్తి పింఛను మంజూరు చేశారు.
గుజ్బంకొండ మండలంలోని గట్టు పరిసరాల్లోని పది గ్రామాలకు బదులుగా 1818లో రంగనాయకులు నాయునికి సాలుసరి పింఛను రూ. 5,888-5-4 ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయన మరణానంతరం పింఛను నాలుగు భాగాలుగా విభజించి, నలుగురు భార్యల బిడ్డలకు పంచారు. మూడవభార్య కుమారుడు వెంకటప్పనాయుడు మరణించాడు. ఆయనకు కుమారులు లేరు. ముగ్గురు భార్యలు, ఒక కుమార్తె, మరణించిన అన్న భార్య, తన తల్లి ఉన్నారు. చనిపోయిన అన్న కుటుంబాన్ని పోషించే షరతుమీద నెలకు రూ. 24 రెవిన్యూ బోర్డు మంజూరు చేసింది.
నరసింారెడ్డి తండ్రి పెద్ద మల్లారెడ్డి, పినతండ్రి చిన్న మల్గారెడ్డి, ఇద్దరూ తమ సంస్థానాన్ని వదలి హైదరాబాదు రాజ్యంలో ఎనిమిదేండ్లు గడిపారు. పాళెం బ్రిటీష్‌వారి వశమయింది. తిరిగి వచ్చిన అన్నదమ్ములు కలెక్టరును కలుసుకుని తమకు పింఛను మంజూరు చేయవలసిందిగా కోరారు. నెలకు 70 రూపాయల పింఛను మంజూరయింది. అన్నదమ్ములకు చెరి 85 రూపాయలు పింఛను లభించింది.
కడపజిల్లా పాలేగార్లు ర్‌కి నరసింహారెడ్డి తిరుగుబాటుకు కారణాలు
తన స్వలాభంకోసం (బ్రిటీష్‌వారిమీద తిరుగుబాటు చేయలేదు. బ్రిటీష్ కంపెనీ పాలన ఏర్చడేవరకు భూమిశిస్తు పంటరూపంలోనే చెల్లించేవారు. పంటలో ఆరవవంతు నుండి పదవవంతు వరకు పాలకులకు చెల్లించేవారు. (బ్రిటీష్ పాలనలో మన్రో రైత్వారీని ప్రవేశపెట్టడంతో శిస్తు నగదు రూపంలో చెల్లించవలసి వచ్చింది. పంట ఏ విధంగా ఉన్నాా ప్రతి రైతు ఎకరాకు ఒక వరహా అంటే మూడున్నర రూపాయలు చెల్లించవలసి వచ్చింది. ఆ ప్రాంతంలో సాధారణ పంట జొన్న. బస్తా జొన్నలు ఒక వరవాి. అది చెల్లించటం రైతులకు భారమనిపించింది. వసూలుకు వచ్చినవారు రైతుల ఆస్తులను వేలం వేస్తూ, చెల్లించనివారిని ఖైదు చేసేవారు. పేదరికంలో మగ్గుతున్న రైతులు ఈ బాధలు పడలేక గ్రామాలే వదలి వెళ్ళేవారు. వారిని కాపాడవలసిన బాధ్యత నరసింహారెడ్డి వహించాల్సి వచ్చింది. దయార్దహృదయంగల నరసింహారెడ్డి రైతులకు ఊరట కల్పించేందుకు నడుం కట్టాడు. ఈ పరాయిపాలనను తొలగించాలని నరసింహారెడ్డి నిర్ణయించాడు.
కుటుంబానికి నెలకు రూ. 85/- పింఛను లభించింది. తమ జాగీరులో వస్తున్న ఆదాయంతో పోల్చితే నెలసరి పింఛను సమతూకంలో లేదు. తాతగారి వైపు నుండి కొంత మొత్తం లభించేది. కొంతకాలానికి ఆవైపు నుండి పింఛను ఆగిపోయింది. తన ఇద్దరు సోదరులతో తమకు వచ్చే పింఛను పంచుకోగా నరసింహారెడ్డి వాటాకు రూ. 11-10-8 లభించింది. ఇది కుటుంబ ఖర్చులకు సరిపోలేదు. తిరగబడి ప్రభుత్వాన్ని నిలదీసి అడగాలంటే అన్నలిద్దరూ కలసి రాలేదు. తమ జాగీరులో ఇనాములు గౌందినవారు చాలామంది బంధువులే అయినందున వారంతా నరసింహారెడ్దిని బలపరిచారు. తమ అండ ఉంటుందనీ, తిరుగుబాటు కొనసాగించవలసిందనీ ప్రోత్సహించారు.
వంశపారంపర్యంగా 8వందలమంది కట్టుబడులలో 240 మంది భూములను కంపనీ వశపరచుకుంది. భూములు పోగొట్టుకున్నవారు అసంతృప్తితో ఉన్నారు. వీరంతా నోసం, ఉయ్యాలవాడలకు చెందినవారు. నరసింహారెడ్డిని నాయకునిగా ఎంచుకున్నారు.
ర్4 సీమపాలేగార్లు
జిల్లాలో కలెక్టర్లు తరచు బదిలీకావటం తిరుగుబాటుకు మరొక ముఖ్య కారణమయింది. తాత్మాలిక ప్రాతిపదికగా నియమితులైన వారు అసంతృప్తితో ఉన్నారు. వారు కడప నుండి ఎప్పుడు బదిలీ అవుతామా అని ఎదురు చూపులలోనే ఉన్నారు. ఇతర జిల్లాలలో ఉన్నట్టు మనోల్లాసానికి వారికి అవకాశం లేదు. పదేంద్లలో పన్నెండుమంది కలెక్టర్లు బదిలీ అయ్యారు. వారికి స్థానిక భాష తెలియదు. జిల్లా చరిత్రనుగానీ, ఆచార వ్యవహారాలనుగానీ వారు పట్టించుకోలేదు. అర్హత ఏమాత్రం లేనివారిని కూడా హెడ్‌పోలీసువంటి కీలక ఉద్యోగాల్లో నియమించారు.
తిరుగుబాటుకు, భూమిశిస్తుకు దగ్గర సంబంధం ఉంది. 1831 రెగ్యులేషన్ ప్రకారంగా దానధర్మంగా ఇచ్చినవే ఇనాము భూములనీ, 1845లో రెవిన్యూ బోర్జు నిర్ణయించింది. ఇనాం భూములను ఇతరులకు బదలాయించకూడదు. వాటిని ఇతరులకు అమ్మకూడదు. ఆ భూములు అనుభవంలో ఉన్న వ్యక్తి మరణిస్తే కలెక్టరుకు సమాచారాన్ని వెంటనే అందజేయాలి. ఇనాందారు మరణించిన వెంటనే ఆ భూములు (ప్రభుత్వపరమవుతూ వచ్చాయి. ఈ ఆదేశాలను కలెక్టర్లు తు.చ. తప్పకుండా అమలు జరుపుతూ వచ్చారు. ఆ మరణించిన ఇనాందారు కుమారులుగాని, వారనులుగాని, బందుువులుగాని నెలలతరబడి నందిగ్గంలో ఉండిపోయేవారు. ఇనాములు కొనసాగించాలని ఒకవేళ ఉత్తర్వులందినా ఆ వారుసునికి ప్రభుత్వం ఒక విషయం స్పష్టం చేసింది. ఆ ఎస్టేటు వారసత్వంగా వారికి లభించలేదనీ, ప్రభుత్వం దయాదాక్షిణ్యాలతో, కారుణ్యభావంతో ఆ భూములను వారికి జీవితకాలానికి మాత్రమే ఇస్తున్నారనీ స్పష్టం చేశారు. సామాన్య ప్రజానీకానికి ఆ ఉత్తర్వులేమిటో తెలిసేవి కాదు. స్థానికోద్యోగులు చెప్పినదానినే వారు నమ్మేవారు. ఏదీ తమకు స్వంతమంటూ లేదని ప్రజలలో ఒక అభిప్రాయం ఏర్పడింది. అదివరకటి పాలనకన్నా కంపెనీ పాలన మంచిదని వారు అనలేకపోయారు. ఎవరినయినా దత్తత తీసుకున్న ఇనాందారు
కడపజిల్లా పాలేగార్లు ర్‌క్ మరణానికి కనీసం ఆరునెలలు ముందయినా దత్తత విషయం ప్రభుత్వానికి తెలియజేయాలి. దత్తతను రిజిస్టరు చేయించీ ఉండాలి. ఇది విడ్డూరం. ఎలాగంటే దత్తత తీసుకున్న ఆరునెలలకు గాని తాము మరణించబోమని ఇనాందారుకు తెలిసే ఆస్కారం లేదు.
ఇనాం భూముల మీద ప్రభుత్వానికి అధికారం ఉండకూడదని సూచిస్తూ లండన్‌లోని కంపెనీ డైరెక్టర్లకు కలెక్టరు ఒక అర్జీ పంపాడు. రెవిన్యూ' పదజాలంలో భటవర్తి ఇనాములను “మతపరంగా లేదా దానంగా ఇచ్చిన (గ్రాంటులు' అని నిర్వచించారు. కలెక్టరు పంపిన అర్జీకి అభ్యంతరం తెలుపుతూ ఈ జిల్లా చాలా అలజడితో ఉందనీ, అత్యున్నత, న్యాయాధికారి దృష్టికి ఈ విషయం తేవాలనీ 1846 జూన్‌లో కడప స్పెషల్ కమీషనర్ సూచించారు.
ఈ కడప జిల్లాలో భటవర్తి ఇనాములు చాలా ఉన్నాయి. భూములన్నీ కూడా సాగులో లేవు. ఆ ప్రాంతం బిటీష్‌వారి వశమైనప్పటి నుండి, అంటే దాదాపు 47 సంవత్సరాలకాలం ఇనాందార్లు తమ ఆస్తులమీద, ఆదాయలమీద ఆధారపడి జీవిస్తూ, ఆ ఎస్టేట్లను అనుభవిస్తూ వచ్చారు. భూమిశిస్తు రైత్వారీ కింద సెటిలయింది. వారికి తమ భూములను అమ్ముకునే హక్కు కూడా ఉ ౦ది. అయితే 1845లో రైతులకు భూములు అమ్ముకునే హక్కు లేదని రెవిన్యూ బోర్డు అనడంతో కలెక్టర్లు దానిని వెంటనే అమలుపరిచారు. మరణించిన ఇనాందార్ల భూములను కంపెనీ ప్రభుత్వం వశపరచుకుంటూ వచ్చింది, మొత్తం జిల్లాలో 1896 మంది కట్టుబడుల భూములను, 8మంది కావలిగార్ల భూములను 1846లోగా ప్రభుత్వం స్వాధినం చేసుకుంది. వీరెవ్వరి. వారసులుగానీ సదరీ అదాలత్‌కు (పైకోర్టుకు) అప్పీలు చేయలేదు.
కట్టుబడులను స్వంతగ్రామం నుండి ఇతర గ్రామాలకు బదిలీ చేసి వారిని చిన్నకామందుల న్థాయి నుండి తలారుల స్థాయికి దింపారు. దీంతో కట్టుబడులు చెదిరిపోవటమేగాక వారి సంఖ్య తగ్గించే ప్రయత్నం జరిగింది. తలారీలుగా కట్టుబడులు, (గ్రామపెద్ద అయిన రెడ్డి, కరణాల చేతులకిందకు వచ్చారు. తలారీల
కం సీమపాలేగార్లు సంఖ్య ఎంత పెరిగితే రెడ్డి, కరణాల బలం అంత పెరిగేది. కోయిలకుంట్ల తాలూకాలో 100 (గ్రామాలకు 526మంది తలారులు, లేదా గ్రామ పోలీసులు ఉండేవారు. ఒక గ్రామంలో తలారిలే లేరు. తలారీలు తమ ఇళ్ళలోనే నివసిస్తూ, వారి డ్యూటీలు వారు చేసేవారు. పట్టాభూములు పండించుకుంటూ తమ తలారి పనులతోపాటు కులవృత్తిని కొనసాగించేవారు. పెద్ద (గ్రామాల తలారులకు కొన్ని బంజరు భూములు కూడా లభించాయి. చిట్వేలు తాలూకాలో 1,128 మంది కట్టుబడులుండగా. పులివెందుల తాలూకాలో పదిమంది మాత్రమే ఉన్నారు. ఆ గ్రామాల్లో దో పిడీలు ఎక్కువగా జరిగేవి. నరయిన వారనులు లేరన్న నెవం కారణంగా భూములు పోగొట్టుకున్నవారిలో అసంతృప్తి ప్రబలింది. 40 రూపాయలు పింఛను లభిస్తున్న వారి పింఛను రు. 28-10-0కు తగ్గించాలనీ, పింఛను 70 రూపాయలకంటే ఎక్కువగల వారి పింఛను రూ.40కన్నా తగ్గించరాదనీ యాక్టింగ్ కలెక్టర్ కొక్రైయిన్ సూచించాడు. సనదులుగా ఇచ్చిన ఇనాములు వారసులకు చెల్లేట్టు అంతవరకు ఎటువంటి నిబంధనలు లేవు. ఇనాంలు పొందినవారు ఆ భూములను వ్యక్తిగత ఆస్తిగా పరిగణించారు. అటువంటి సనదులను అంవే దానపత్రాలను గుర్తించి ఆ భూములను ఇతరులకు బదలాయించే వీలు కల్పించాలని తలపెట్టారు. కనుమలను రాకపోకలకు తెరవాలన్సీ, రోడ్లను బాగుచేయించాలనీ దాంతో జిల్లాలో ఒకచోట .నుండి మరొకచోటకు సులభంగా సమాచారం పంపగలుగుతామనీ (ప్రభుత్వం ఆలోచించింది. (ప్రజా సైన్యాన్ని ఏర్పాటు చేసినట్టయితే ముఠాదాడులు ఆగుతాయనీ, కర్నూలు, బళ్ళారి జిల్లాలలో మోస్తరు కడప జిల్లాలో కూడా ఆశ్విక దళాన్ని నియమించాలనీ, అలా అయితేనే దోపిడీ మురాలు కొండల్లోకి తప్పించుకుని వెళ్ళేలోగా వారిని పట్టుకోవచ్చనీ భావించారు. ఉద్యోగంలో ఉన్న (గ్రామాధికార్లకు, కరణాలకు ప్రోత్సాహకరంగా విరివిగా మాన్యాలు పంచిపెట్టాలని తలపెట్టారు. అయితే ఇనాందారు మరణిస్తే
కడపజిల్లా పాలేగార్లు క్7 సర్వే అసెస్‌మెంట్‌లో మూడవవంతు పైకం ప్రభుత్వానికి చెల్లించాలని షరతు పెట్టారు.
వారసులు లేరని వశపరచుకున్న భూముల్లో కోయిలకుంట్ల తాలూకా గుండ్లదుర్తి నోసమ్ కూడా ఉన్నాయి. రెవిన్యూ బోర్డు కోరినట్టుగా గ్రామ పోలీనుల గురించి యాక్టింగ్ కలెక్టరు 1845 డిసెంబరులో నివేదిక సమర్పించాడు. వారసులు లేకుండా మరణించిన 28మంది కట్టుబడుల భూములను (ప్రభుత్వం వశపరచుకుంది.
కడప జిల్లాను కంపెనీ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు కడప, పరిసర ప్రాంతాలు మాత్రం పాలకుల చేతికింద ఉండగా, మిగతా జిల్లా అంతా పాలేగార్ల చేతుల్లో ఉంది. పాలేగార్ల చేతిలో సాయుధ సిబ్బంది ఉన్నారు. పాలకులకు కప్పం చెల్లించడం, పాలేగార్లు దాదాపు మానివేశారు. నైజాం చేతికింద ఉన్న పదేండ్లలోను ఏమాత్రం రాబడి లేదు. అందువలన పాళిములన్నీ వశపరచుకుని, సాలేగార్లు అదివరకటిలాగే పాలకులకు సిబ్బందిని సమకూర్చి ఇనాములను, తమ (గ్రామాలను అనుభవింపవచ్చునని మన్రో ఉదారత చూపాడు.
1846 జూన్‌లో ఇరవైముగ్గురు కట్టుబడుల భూములను వారి మరణానంతరం వారసులు లేరన్న నెపంతో ప్రభుత్వం వశపరచుకుంది. నిజానికి వారిలో ఇద్దరికి మాత్రమే వారసులు లేరు. 28మంది కట్టుబడుల వారసులు తమ భూములు, ఇనాములు పోగొట్టుకుంటామని భావించి నరసింహారెడ్డిని సలహా అడిగారు. కొన్ని నెలలుగా తిరుగుబాటు గురించి ఆలోచనలో ఉన్న నరసింహారెడ్డికి తిరుగుబాటు ఒకటే మార్గమని తోచింది. 30మంది సాయుధులను వెంటబెట్టుకుని స్వయంగా గ్రామాలను సందర్శిస్తూ నరసింహారెడ్డి కట్టుబడులను కలుసుకుంటున్నాడని 1846 జూలై మొదట్లో తెలిసింది ఆ (గ్రామాలలోని కట్టుబడిదార్లు రెడ్డికి ఎదురేగి గౌరవంగా స్వాగతం పలికి (గ్రామంలోకి తీసుకెళ్ళేవారు.
కో ఘులకుంట్ల తహాసిల్టారు రాఘవాచారి ఎవరినీ లెక్కచేయకుండా కఠినంగా వ్యవహరించేవాడు. తిరుగుబాటు ప్రధాన కారణాల్లో ఇదొకటి.
58 సీమపాలేగార్లు తహసిల్దారు ఆ ప్రాంతంవాడు కాదు. ఏ పనికైనా కట్టుబడులే స్వయంగా రావాలనీ, తమ బదులుగా మరెవరినీ పంపరాదనీ తహసిల్దారు అభ్యంతరం పెట్టేవాడు. తమ ఇంటివద్ద చాకిరీకి వారిని నియమించేవాడు. కట్టుబడి బదులుగ్గా పనికి వచ్చిన వారి వద్ద పైకం వసూలు చేసేవాడు. ఆ తహసిల్టారును అదే ఉద్యోగంలో కొనసాగించకూడదని నరసింహారెడ్డి కోరాడు. ఏదో అలజడి జరుగుతోందనీ, నరసింహారెడ్డి నాయకత్వంలో కట్టుబడులు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారనీ 1846 జూన్‌లోనే తహసిల్దారు పసిగట్టాడు.
నరసింహారెడ్డి తరృమ కర్నూలు, ఆదోని వెళ్ళేవాడు. నైజాం ప్రాంతాలను సందర్శించేవాడు. వనపర్తి జమీందారు అదే కులానికి చెందినవాడయినందున నరసింవారెడ్డికి సన్నిహితుడయి అప్పుడప్పుడు కొంత ధన సహాయం కూడా చేసేవాడు. దాదాపు ఆరు నెలలయినా ఆలోచించిన తర్వాతనే నరసింహారెడ్డి తన అనుచరులను సమావేశపరిచాడు. తిరుగుబాటును ప్రారంభించినవారు గుంద్లదుర్తి, నోసమ్ తిరుగుబాటును ప్రారంభించిన వారు గుండ్లదుర్తి నోసమ్ పాలేగార్లు. జిల్లాలో 1657 మంది పెద్ద కట్టుబడులున్నారు. సరయిన వారసులు లేరని వారి భూములను వశపరచుకున్నారు.
61 తిరుగుబాటులో నరసింహారెడ్డిని (ప్రోత్సహింఛిననారు చాలామంది ఉన్నారు. ఆ ప్రాంతంలో కంపెనీ పెద్దరికాన్ని వారు సమ్మతించలేదు. స్వాతంత్ర్యానికి జరిపే ఈ పోరాటంలో వారంతా పాల్గొన్నట్టే. హైదరాబాదు పరిధిలోని వనపర్తి పాలేగారు, బళ్ళారి జిల్లాలో చాలామంది పాలేగార్హు, కర్నూలులోని పాపాఖాన్, హైదారాబాదులోని పాపాఖాన్ తండ్రి సలామ్‌ఖాన్ నరసింహారెడ్డిని బలపరిచారు. నరసింహారెడ్డి సన్నిహితులలో గోసాయి వెంకయ్య ముఖ్యుడు. రెడ్డి తన ఆసంతృప్తి గురించి గోసాయికి వెళ్ళబోసుకున్నాడు. హక్కులకోసం పోరాడితే పూర్తి విజయం సాధించవచ్చునని రెడ్డిని గోసాయి ప్రోత్సహించాడు. గోసాయి మతి చలించినవాడా, లేక కాషాయ దుస్తులలో
కడపజిల్లా పాలేగార్లు 59 ఉంటూ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తున్న సన్యాసా? అని ప్రభుత్వం అనుమానించింది. రెడ్డికి మంచి రోజులు ముందున్నాయనీ, ప్రత్యర్థులను లొంగదీసేందుకు కొన్ని ముంత్రాలున్నాయనీ, తిరుగుబాటు విజయవంతమవుతుందనీ, (ప్రభుత్వ దృష్టిని ఆకర్షించి తన కోర్కెలను తీర్చుకొనవచ్చుననీ, గోసాయి నచ్చజెప్పి రెడ్డిని ప్రోత్సహించాడు. నరసింవిరెడ్డి తనకు, తనను ఆశయించినవారికి అన్యాయం జరుగుతోందని భావించాడే కానీ, తిరుగుబాటు ఫలితాలెలా ఉంటాయని ఆలోచించలేదు. జయం తనదేనన్న గట్టి నమ్మకం కుదిరింది.
ఇటువంటి సందిగ్ధ పరిస్థితిలో తహసిల్దారు నరసింహారెడ్డి పింఛనును, రెడ్డి పంపిన వ్యక్తి ద్వారా చెల్లించేందుకు నిరాకరించి, రెడ్డిని ్రెజరీకి పిలవనంపాడు. వెళ్ళడానికి నిరాకరిస్తే రెడ్డిని అరెస్టు చేసి తీసుకురమ్మని వారంటు పంపాడు. ఇది తిరుగుబాటును వేగిరపరిచింది. పట్టడానికి వెళ్ళినవారు నరనింవోరెడ్డితో కలనిపోయారు. తిరుగుబాటు విజయవంతమయితే పరాయి అధికారం తొలగుతుందనీ, విజయవంతం కానట్టయితే ఇంతవరకు జరిగిన నష్టాన్ని మించిన నష్టం జరగబోదనీ రెడ్డి భావించాడు. ఆ (ప్రాంతంలోని కట్టుబడులు చాలామంది తాతలనాటినుంచి కూడా తమ కుటుంబం నుంచి భూములు పొంది, ఆ భూముల మీద బతుకుతున్నవారయినందున ముందుతరాలకు అవి గిట్టకుండా పరాయి ప్రభుత్వ పరమవుతాయన్న భయంతో బ్రిటీష్ వారిని ఎదిరిస్తున్న నరసింహారెడ్డికి అండగా నిలిచాడు. నరసింహారెడ్డి దళం కదలికలు
కోయిలకుంట్ల తర్వాత దువ్వూరు, ప్రొద్దటూరు ఖజానాలు కూడా దోపిడీకి గురవుతాయనీ, దారివెంట గ్రామాలను కూడా తిరుగుబాటు దళం దోపిడీ చేస్తారన్న భ్రమతో కర్నూలులోని సైనిక దళాన్ని కడప నుండి బలగాలనూ పిలిపించారు. సైన్యాన్ని జమ్మలమడుగుకు పిలిపించి అక్కడి ఖజానాను కాపాడారు. తిరుగుబాటు దళం కర్నూలు సరిహద్దులోని రుద్రవరం చేరుకుని
60 సీమపాలేగార్లు బ్రిటీష్ సైనికదళం అక్కడికి చేరుకునేలోగా అహోబిలం కోట చేరారు. కనుమలు దాటుకుని కంభంవైపు బయలుదేరారు. బహుశా తిరుగుబాటుదార్లు హైదరాబాదు చేరుకోవచ్చనే అనుమానంతో రెడ్డిని పట్టిచ్చినవారికి ప్రభుత్వం వెయ్యి రూపాయల బహుమానం (ప్రకటించింది.
నరసింహారెడ్డిదళంలో చాలామంది కట్టుబడిదార్లు, తాలూకాలోని తలారులు, ఒడ్డరులు, యానాదులున్నారు. నాటు తుపాకులు, కత్తులు, ఈటెలు వారి ఆయుధాలు బంకమట్టితో కోడిగుడ్డు సొన కలిపి తుపాకీగుంద్లు తయారుచేశారు. బిటీష్ సైనిక దళాన్ని గుత్తి కనుమ దాటనివ్వకుండా కంభం నుండి ముండ్లపాడుకు మళ్ళించారు. సైన్యంతో తలపడటానికి ముండ్లపాడు అనువయినదని నరసింహారెడ్డి కూడా తలపోయడమే ఈ సైనిక కదలికకు కారణమనాలి.
నరసింహారెడ్డి తిరుగుబాటుకు పథకం వేస్తున్నాడని అతని తమ్ముడు కుమార మల్లారెడ్డి తహసిల్టారుకు తెలిపాడు. పైగా వెంటనే చర్య తీసుకొనకపోతే చాలా ప్రమాదమని కూడా హెచ్చరించాడు. నరసింహారెడ్డి తమ (గ్రామం సందర్శించాడనీ, కట్టుబడులను తిరుగుబాటుకు ప్రోత్సాహపరచి చాలామందిని తనవైపు చేర్చుకున్నాడనీ, జంబలదిన్నె గ్రామాధికార్లు ఒక లేఖలో తహసిల్హారుకు తెలిపారు. తిరుగుబాటు ఏదో జరగబోతోందని ప్రభుత్వానికి చూచాయగా తెలుసు. కట్టుబడి, ఇనాందారు మరణిస్తే భూములు స్వాధీనపరచుకునే తమ చర్యకు అటువంటి ప్రతిఘటన ఎదురవుతుందని ప్రభుత్వం ఊహించటం సహజమే.
వ్రభుత్వం భూముల వశీకరణకు సంబంధించిన నిబంధనలు సార్వత్రికంగా అందరికీ వర్తించాయి గానీ కోయిలకుంట్లకు మాత్రమే పరిమితం కాలేదు. మొత్తం ఉయ్యాలవాడ, నోసం సంస్థానాలలోని 8వందల కట్టుబడి ఇనాముల్లో 161 ఇనాములను చట్టప్రకారం వశపరచుకునే వీలు లేదు. వారసులు లేనందున 60 ఇనాములు మాత్రమే ప్రభుత్వ వశమయ్యాయి. కోయిలకుంట్లలోని 19 (గ్రామాలు నరసింహారెడ్డిని బలపరిచాయి.
కడపజిల్లా పాలేగార్లు 61
బెకు పాలేగార్ల సన్నిహితుడొకడు కరణాన్ని హత్య చేశాడు. ఆ విషయమై మాట్లాడేందుకు పాలేగారు నరసింహారెడ్డితోపాటు, ఆయన సన్నిహితులు అశ్వర్థం రామయ్య, నరసయ్య కలిసి బెకు వెళ్ళారు. బ్రిటీష్ వారిని ఎదిరించాలనీ, వారిని ఆ ప్రాంతం నుండి తరిమిగొట్టాలనీ అక్కడి బెక్‌లో నిర్ణయించారు. పెద్దఎత్తున తిరుగుబాటు జరిపేందుకు బెక్ సమావేశంలో పథకం వేశారు. తిరుగుబాటు- కోయిలకుంట్ల ట్రెజరీ కొల్లగొట్టడం
కోయిలకుంట్ల కస్పాలోని తాలూకా (టెజరీని దోచేందుకు నరసింహారెడ్డి తన బలగంతో బయలుదేరాడు. హెడ్ డఫేదారు మేడమీదకు వెళ్ళి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఒక పోలీసు నుండి తుపాకీ లాక్కున్న రెడ్డి డఫేదారుకు గురిపెట్టి కాల్చి చంపొడు. హెద్‌కానిప్టేబుల్‌ను గాయపరిచాడు. ఆయనతోపాటు స్టానిక వ్యాపారవేత్తను కోటలో బంధించాడు. అయిదుగురు పోలీసులు టటెజరీ కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. సిబ్బంది ఆయుధాలను తిరుగుబాటుదార్లు లాక్కున్నారు. తహసిల్టారును బంది చేశారు. ఆయనను విడుదల చేయాలన్నదే నరసింహారెడ్డి ఆలోచన. తహసిల్టారును విడిచిపెట్టినట్టయితే తమ పనికి అడ్డంకి అవుతాడని అనుయాయులు అనటంతో బంధించిన తహసిల్దారును అతని పల్లకిలోనే సగౌరవంగా తీసుకువెళ్ళి బందీగా ఉన్నంతకాలం చాలా జా(గ్రత్తగా చూసుకున్నారు. రెండు వందలమంది తిరుగుబాటుదార్లతో కలిసి కోయిలకుంట్ల తాలూకా ఖజానాను కొల్లగొట్టాడు.
తహసిల్దారు తిరుగుబాటుదార్ల చేతిలో ఉన్నప్పుడు మరొక సిరస్తదారును ఆ పని చూసుకునేందుకు నియమించారు. టైెజరీ మీద దాడి జరిగినప్పుడు తహసిల్దారు పారిపోకుండా కట్టుఐబడులు కూడగట్టుకుని ఎదిరించి ఉన్నట్టయితే తిరుగుబాటు బహుశా అక్కడే ఆగిపోయేదేమ్లో! (1) న్యాయశాఖ - మినిట్స్'ఆఫ్ కన్సల్టేషన్ 1847 మార్చి 2వ తేదీ లేఖకు కొక్రైయిన్
సమాధానం.
62 సీమపాలేగార్లు
పాలేగారు వెంట దాదాపు 9 వేలమంది ఉన్నట్టు అంచనా వేశారు. నరసింహారెడ్డి కదలికలను గమనించి అనుచరులతో ఎటువైపు వెడుతున్నాడో తెలియజేయవలసిందని కడప కమాండింగ్ ఆఫీసర్ కోరాడు. దువ్వూరు, కోయిలకుంట్ల పోలీసులకు సహాయంగా చాలినంతమంది సైనికులను పంపవలసిందని కోరాడు. జమ్మలమడుగు హెడ్ పోలీసు నరసింహారెడ్డిని గురించి యాక్టింగ్ కలెక్టరు కొక్రెయిన్‌కు రాస్తూ కోయిలకుంట్ల ట్రెజరీ కొల్లగొట్టాడనీ, దఫేదారును చంపాడనీ, హెడ్‌పోలీసులు గాయపరిచాడనీ, అయిదుగురు పోలీసులను చంపాడనీ, ప్రదాన వర్తకుడిని కోటలో బంధించాడనీ, తహాసిల్దారును తీసుకెళ్ళాడనీ నివేదించాడు. నరసింహారెడ్డిని, అనుయాయులను పట్టుకోవలసిందిగా పోలీసులకు ఉత్తర్వులందాయి.
1846 జూలై 12న కడప తాత్కాలిక మేజిస్టేటుకు కోయిలకుంట్ల సంఘటన గురించిన సమాచారం అందింది. కొక్రెయిన్ కడప కమాండింగ్ ఆఫీసరును సహాయం కోరాడు. (ప్రభుత్వాన్ని ఎదిరించిన వానిని అలా వదిలితే అవాంఛనీయ వరిణామాలు ఎదురవుతాయనీ, నరనింవోరెడ్డిని బంధించవలసిందని ఉత్తర్వు చేశాడు. పొరుగు తాలూకాల్లోని పోలీసు అధికార్లను ఇందులో తోద్బడవలసిందిగా నిర్దేశించాడు. కర్నూలులోని గవర్నరు ఏజంటును, బళ్ళారి మేజిస్టేటును కూడా కొక్రెయిన్ సంప్రదించాడు.
నరసింహారెడ్డి తన అనుచరులతో కర్నూలు, బళ్ళారి జిల్లాలు ప్రవేశిస్తే అతనిని అదుపులోకి తీసుకోవటంలో సహకరించాలని కోరాడు. కర్నూలు దాటిగాని హైదరాబాదు చేరుకోలేదు. కాబట్టి కర్నూలులోని ఏజెంటును హెచ్చరించాడు. కర్నూలు బ్రిటీష్‌వాఠి అధీనంలోకి వచ్చినప్పుడు చాలామంది కట్టుబడులను పని నుండి తొలగించి ఉన్నందున, అసంతృప్తితో మగ్గుతున్న కట్టుబడులంతా నరసింహారెడ్డితో కలిశారు. కర్నూలు ప్రాంతంలోని పాపజ్ (1) 1846 జూలై 28నాడ్డుఫోర్టే సెయింట్ జార్డ్‌లో న్యాయశాఖ కార్యదర్శికి కొక్రెయిన్
రాసిన ఉత్తరం.
కడపజిల్లా పాలేగార్లు 63 ఖాన్ 400 మంది అరబ్బులతో రెడ్డితో చేరారు. అహోబిలం సమీపంలో మరమ్మతు చేసిన కోట దిశగా తిరుగుబాటుదార్లు వెళ్లారు. 1846 జూలై 10 తేదీ కోయిలకుంట్ల తాలూకా టెజరీ నుండి తిరుగుబాటుదార్లు తీసుకెళ్లిన సర్కారు వసూళ్ళు. (ు శ = 422.5. 6 ఆ అదనపు రెవిన్యూ అబ్బారీ డిపాజిట్ ఫసనీ 1256 | 200.0.0 మొటుర్భా వసూళ్ళు ఫసనీ 1256 | 12.48 పళ్ళతోటల వసూళ్ళు 160.0 స్టాంపుల వసూళ్ళు 0.40 | 228.8.8 650. 142 ఇతర మార్గాల్లో రెవెన్యూ పోస్టేజి వసూళ్ళు 2.3.6 అమానత్ ఇనామ్ శీఉీరి 1846 మే నెలకు పాలేగారు నరసింహారెడ్డికి ఇవ్వకుండా నిలిపిన పింఛను 11. 10.8 లెక్కలలో ఖర్చు చూపినా చెల్లించకుండా తాలూకా (టెజరీలో నిల్వ 18.2. 10 అరావణి ప్యూన్ పనికి చెల్లించవలసిన పైకం 0.143 (1) రెవిన్యూ బోర్జ్డు సెక్రటరీ ఫోర్ట్ సెయింట్ జార్జికి 1847 నవంబరు 25న 69వ నవంబరులో కలెక్టరు పంపిన లేఖలో 48వ పేరా.
64 సీమపాలేగార్లు
ఫోలీసు డఫేదారుకు,
ప్యూన్‌లకు చెల్లించవలసిన జీతం | 19.0.0
తాలూకా కచేరికి వస్తువులు సప్లయ్ | చేసిన వ్యాపారి కివ్వవలసినది 8.5.5
ఖైదీలకు బిత్తా 0.40
పెరియ చెన్నకేశ్వరస్వామి
ఆలయ ధర్మకర్తలకు ఇవ్వవలసినది, 87.8.0
వ్యాసపూజకు ఒక (బ్రాహ్మణునకు
ఇవ్వవలసినది 410.8
రైతుల వద్ద అదనంగా వసూలు చే
వారికి తిరిగి ఇవ్వవలసినది 415.0
(ప్రభుత్వం కొనుగోలు చేసీ డబ్బు
చెల్లించని ఇనుము విలువ 16.0.0 | 136.9.4 154 18.2
మొత్తం 805. 10.4 కోయిలకుంట్ల ట్రెజరీని కొల్లగొట్టడంతో రెడ్డి తన (ప్రతాపంతో దేశాన్ని చేజిక్కించుకున్నాడని జనం భావించారు. (గ్రామపెద్దలు సిబ్బందిని సమకూర్చటంతోపాటు ఆయుధాలు సప్లయి చేశారు. డబ్బుతోవాటు ఆహారపదార్థాలు సమకూర్చారు. సాహసం చేసి ప్రభుత్వాన్ని ఎదిరించినందుకు అనేకులు నరసింహారెడ్డిని అభినందిస్తూ ఉత్తరాలు రాశారు. ఆ సంవత్సరం సుష్టుగా వర్షాలు పడటంతో గ్రామాల చుట్టూ వాగులు పొంగాయి. ఏర్లు పారాయి. సంఘటన స్థలానికి కొక్రెయిన్ 120 మైళ్ళ దూరంలో ఉన్నాడు. సంఘటన
స్థలానికి స్వయంగా వెళ్ళి, ఇంకా ప్రాణనష్టం, అస్తి నష్టం జరగకుండా జా(గ్రత్తపదాలని కొడ్రెయిన్ ప్రయత్నించాడు. అయినా ఇంత. హఠాత్తుగా
కడపజిల్లా పాలేగార్లు 65 తిరుగుబాటు ఇలా ట్రెజరీని కొల్లగొట్టడంతో ప్రారంభమవుతుందని బ్రిటీష్ అధికార్లు ఎదురు చూడలేదు.
నరసింహారెడ్డి భార్యాపిల్లలను మామగారికి అప్పగించి బ్రిటీష్ వారి చేతికి అందకుండా తిరుగుతున్నాడు. కోయిలకుంట్ల నుంచి 2 క్రోసుల దూరంలోని కుందుర్తి గ్రామం చేరుకున్నాడు.
హైదరాబాదు రాజ్యంలోని గద్వాలుకు పయనమయ్యాడు. గుల్జిపు దళం వెంటాడింది. రుద్రవరం పోరాటం
నోసమ్ జమీందార్ల కింద కట్టుబడిగా ఉన్న కసనె ఓబయ్యను బంధించి తీసుకురావలసిందిగా వారంటుతో పంపిన ప్యూన్ తిరిగి వచ్చి ఓబయ్య ఒక కొండమీద మరికొందరితో కలసి దాగి ఉన్నాడని తెలిపాడు. 25 మంది సిబ్బందితో నేటివ్ ఆఫీసర్‌ను పంపి ఓబయ్యను పట్టుకోవలసిందిగా ఆలోచించి 5వ రెజిమెంట్‌లోని లెఫ్టినెంట్ విండ్ హోమ్‌ను కొక్రెయిన్ కోరాడు. ఆ మరుసటిరోజు కడపకు దక్షిణంగా 40 మైళ్ళలో ఉన్న కొక్రెయిన్ బయలుదేరి రుద్రవరంలోని పటాలంతో కలిశాడు. అక్కడ తటస్థపడిన రెడ్డి దళాన్ని చెల్లాచెదరు చేశారు. కరణం అశ్వర్థాన్ని గోసాయి వెంకయ్యను పట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమయింది. వారు తొమ్మిది మందిని చంపివేసి రుద్రవరం దోచుకున్నారు. మిట్టపల్లి పోరాటం
నరసింవారెడ్డి వెంట 9 వేలమంది ఉన్నారని అంచనా వేశారు. పోలీసులేగాక సైన్యాన్ని పంపి రెడ్డిని పట్టుకోవాలని వ్యూహం పన్నారు. సైన్యం వెళ్ళే దారిలోని తహసిల్దారు సైన్యానికి అవసరమైన ఆహార పదార్థాలను సప్లయి చేయాలి, తాము సేకరించిన సమాచారాన్ని సైన్యానికి అందజేయాలని వారికి ఆదేశాలందాయి. నరసింహారెడ్డి తనంటత తాను లొంగకపోయినట్లయితే
66 సీమపాలేగార్లు ఆయుధాలు (ప్రయోగించాలని ఉత్తర్వులిచ్చారు. అలజడిలో పాల్గొన్నవారిని గురించి కమాండింగ్ ఆఫీసర్‌కు తెలియజేయాల్సి ఉంది.
రుద్రవరానికి బయలుదేరిన సైన్యం ఆలమూరు చేరింది. నరసింహారెడ్డి దళం అప్పటికే గుత్తి కనుమ దాటారు. గుత్తి కనుమ కొత్తకోట దగ్గర మొదలవుతుంది. కొత్తకోట నగరులో నరసింహారెడ్డి స్థావరం ఏర్చరచుకుంటాడని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ దళం కెప్టెన్ స్కాట్ నాయకత్వంలో రుద్రవరం చేరింది. కంభం తహసిల్దారు నాట్‌కు వీలైనంత సహాయం అందించాడు. కొత్తకోట నుండి ముండ్లపాడుకు మూడు మైళ్ళు. గిద్దలూరు నుండి ముండ్లపాడుకు నాలుగు మైళ్ళు.
రెండు సైనిక దళాలలో నూరుమంది సవరులతో గుత్తి కనుమకిరువైపులా కాపలా ఉంచారు. కంభం నుండి కనుమ చేరిన సైన్యాన్ని కృష్ణం సెట్టిపల్లి వద్ద మిగిలిన సైన్యంతో కలపాలని నాట్ పథకం వేశాడు. గుత్తి కనుమ దగ్గర తిరుగుబాటుదార్లను అటకాయించేందుకు జోతికనుము కాపలాకు మరొక .పైనికబ్బందం సిద్ధమయింది. ప్రతి బృందంలో యాభైమంది వంతున 'సవరులున్నారు. ముండ్లపాడు పోరాటం 18238
కర్నూలు జిల్లాలోని చాగలమళ్చి, సిరువెళ్ళ, చింతకుంట, మిట్టపల్లి, చీటీరణపల్లి, ఓబులంపల్లి రైతులు, తలారులు, తిరుగుబాటుదార్లతో కలిశారు. తిరుగుబాటు దళాన్ని వెంటాడుతున్న సైనిక దళాన్ని కంభం నుండి ముండ్లపాడుకు మళ్ళించారు. సైన్యంతో తలపడటానికి ముండ్లపాడు అనువయినదని నరసింహారెడ్డి తలపోశాడు.
ముంద్లపాదులో ఒక సవరుడు, ఇద్దరు సిపాయిలు గాయపడ్డారు. కంభం తహసిల్దారు మరణించాడు. కట్టుబడులలో నాలుగింట మూడువంతులమంది పాలేగారులే సహాయపడినారు. దట్టమయిన టేకు అడవుల్లో బ్రిటీష్ సైనికులు
కడపజిల్లా పాలేగార్లు 67 పాలేగారుకోసం గాలింపలేకపోయారు. అడవులు దాటి నరసింహారెడ్డి హైదరాబాదు చేరుతాడని భావించారు.
నరసింహారెడ్డి గురించిన వివరాలు, అతని అనుయాయులు నలుగురి పేర్లు కూడా కొక్రెయిన్ హైదారాబాదులోని (బ్రిటీష్ ప్రతినిధికి తెలిపినట్టు ఆగస్టు 16న న్యాయశాఖ కార్యదర్శికి సూచించాడు. ౨
జిల్లా సరిహద్దులో కృష్ణానదిని దాటేందుకు ఏ రేవులో ప్రయత్నించినా తీరుగుబాటుదార్లను అటకాయించేందుకు కర్నూలు కమీషనరు ఏర్పాట్లు చేశారు. హైదరాబాదులోని రెసిడెంటు కూడా అలాంటి ఏర్పాట్లు చేశాడు.
జూలై 24న ముండ్లపాడు పోరాటం తర్వాత సిబ్బంది చెదిరిపోవటంతో, పాలేగారు నరసింహారెడ్డి హైదరాబాదు (ప్రాంతానికి వెళ్ళాడు. తిరుగుబాటు విషయం (బ్రిటీష్ రెసిదెంట్‌కు అప్పటికే తెలిసి ఉన్నందున, హైదరాబాదు నుండి తప్పించుకుని కర్నూలు ప్రాంతంమీదుగా ఎజ్జిమలై ప్రాంతం తిరిగ చేరుకున్నాడు. కొండలమీద తిరుగుతున్న అనుయాయులు తమ గ్రామాలకు తిరిగి వెళ్ళడానికి భయపడి మరలా నరసింహారెడ్డినే కలిశారు. వందమంది సిబ్బందితోపాటు పొరుగు తాలూకాల కట్టుబడులను సమకూర్చుకుని తిరుగుబాటుదార్లను పట్టుకుంటే అనుయాయులు నరసింహారెడ్డిని వదలి వెళ్ళడమేగాక, దోపిడీలు ఆగుతాయనీ, రెడ్డిని పట్టుకోవడం అప్పుడు సులభమవుతుందనీ కొక్రెయిన్ తలపెట్టాడు.
బళ్ళారి, హైదరాబాదుల నుండి రెజిమెంటును పిలిపించారు. ఆత్మకూరు సమీపంలో అల్లరులు చెలరేగాయి. మేజర్ రీడ్ ఎజ్జగుంట్ల, నంద్యాలమీదుగా ఆత్మకూరు బయలుదేరి, నంద్యాల ్రధానకేంద్రంగా వారంరోజులుండి, ఆ ప్రాంతంలో తన అవసరం లేదని గుర్తించి, అర్ధకంపెనీ సిపాయిలను కృష్ణం సెట్టిపల్లి, రుద్రవరం వద్ద ఉంచాడు. కొండలలో జట్లు జట్లుగా ఉన్న (1) బళ్ళారి మేజి(స్టేటు ఆఫీసు నుండి ఆండర్సన్ జూలై 18, 1846 నాడు నం,
650లో కొక్రెయిన్‌కు రాసిన లేఖ.
68 సీమపాలేగార్లు కట్టుబడులు, ప్యూన్‌ల నుండి కొంతయినా సమాచారం రాబట్టాలని (ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ముండ్లపాడు పోరాటంలో రెడ్డి దళం చెల్లా చెదురయింది. రెడ్డికొండల్లో మాయమయ్యాడు. జూలై నుంచి సెప్టెంబరు వరకు రెడ్డి జాడ అంతుబట్టలేదు. కర్నూలులోని యాగంటి నుంచి కమలాపూర్ తాలూకాలోని మొయిళ్ళచెరువు వరకు ఎల్జమలై కౌండలు దాదాపు యాఖైమైళ్ళు వ్యాపించాయి. మధ్యలో ఏమాత్రం దారి లేదు. రెడ్డికోసం రుద్రవరానికి బయలుదేరిన సైన్యం ఆలమూరు చేరేలోగా నరసింహారెడ్డి గుత్తి కనుమ దాటాడు. కంభం నుండి ఒక బెటాలియన్ సైన్యం ముండ్లపాడు బయలుదేరింది. సైన్యం రుద్రవరం చేరుకునేలోగానే రెడ్డిదళం కృష్ణం సెట్టిపాడును, ముండ్లపాడును దోపిడీ చేసినట్టు తెలిసింది. రెడ్డి దళం గిద్దలూరు మీదుగా కంభం వెడుతున్నారని అనుకుని 19వ రెజిమెంట్‌లోని కెప్టెన్ నాట్, కెప్టెన్ రసెల్ నాయకత్వంలో 250మంది సైనికులు, 50మంది సవరులతో నందికనుమ మీదుగా వెళ్ళి కంభం నుండి వచ్చే సైనికదళంతో. కలవాలని నిర్ణయించారు. 6వ రెజిమెంట్‌లోని లెప్టినెంట్ మూర్ 90 మంది పైనికులు, 56మంది సవరులతో రుద్రవరంలోనే ఉండి గుత్తి కనుమ కాపలా కాశాడు. రెడ్డి దళం అదే దారిన వెనుతిరిగితే వారిని అటకాయించటమే అందులోని ఉద్దేశ్యం. ఇంకా దక్షిణాన బంచియపల్లి దగ్గర ఇస్తు కనుమ కాపలా కాసేందుకు కెప్టెన్ కోట్స్, కాక్రైయిన్ కలసి వెళ్ళారు. ఇంకా దక్షిణాన మరో కనుమ దగ్గర కూదా సైనిక కాపలా ఏర్పరిచారు. కొండలలోని కనుమలన్నిటినీ కాసి, రెడ్డిని ఏ విధంగానయినా పట్టుకోవాలనే (ప్రయత్నం చేశారు. కంభం నుండి లెన్టినెంట్ వాట్సన్ బయలుదేరాడని తెలుసుకున్న నరసింహారెడ్డి బలగంతో గిద్దలూరు చేరాడు. జూలై 23 మధ్యాహ్నమే గిద్దలూరు వద్ద వాట్సన్‌ను ఎదిరించాడు. నరసింహారెడ్డి వద్ద 4 వేలమంది ఉన్నారు. వాట్సన్ బెటాలియన్‌లో వందమంది సైనికులు, కంభం తహసిల్దారు, కొంతమంది సిబ్బంది ఉన్నారు. రెడ్డిని ఎదిరించే ధైర్యం చాలని వాట్సన్
కడపజిల్లా పాలేగార్లు 69 దగ్గరలోనే పాడుపడి ఉన్న కోట చేరుకుని ఆరుగంటలసేపు -పోరాడాడు. మందుగుండు సామగ్రి అయిపోయింది. చీకటి పడేవరకు వేచి ఉన్నాడు. ఫలితం ఎలా ఉంటుందో ఎదురు చూడకుండా రాత్రికి రాత్రే పాఠలేగారు మీద విరుచుకుపడ్డాడు. రెడ్డి దళంలో రెండువందలమంది మరణించారు. 4 జజాయీలు దొరికాయి. నరసింహారెడ్డి ముండ్లపాడు చేరాడు. వాట్సన్ దాదాపు అయిదు మైళ్ళలోని కృష్ణం సెట్టిపల్లికి చేరుకున్నాడు. కెప్టెన్ నాట్ కృష్ణసెట్టిపల్లి చేరుకుని, రెడ్డి ముండ్లపాడులో ఉన్నట్లు తెలుసుకుని ముండ్లీపాడు బయలుదేరాడు. రెడ్డిని కొండల్లో వెదికి పట్టుకునేందుకు పంపవలసిందిగా గవర్నరు ఏజెంటు స్కాట్ ఆలమూరు నుండి సూచించాడు. కొండలమీడ అడవి దట్టంగా లేదు. కాలిదోవలు ఎన్నో ఉన్నాయి. అక్కడక్కడా చిన్న పల్లెలు కూడా ఉన్నాయి.
కడపలో గృహనిర్బంధంలోని కుటుంబాన్ని విడిపించేందుకు నరసింవారెడ్డి మెరుపుదాడి జరుపుతాడని అధికార్లు ఎదురుచూశారు. లాల్‌ఖాన్ మహమ్మదు నరసింహారెడ్డికి సాయవపడినందున లాల్‌ఖాన్‌ను బంధించి తనవద్దకు వంపవలసిందిగా హైదరాబాదులోని (బ్రిటీష్ రెసిడెంట్‌ను కోరారు. నరసింవారెడ్డిని పట్టినవారికేగాక గోసాయి వెంకయ్యను పట్టినవారికి కూడా రూ. 100/- ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వనపర్తి, ప్రగతూరు వద్ద గట్టి కాపలా కాశారు. కృష్ణానదిమీద నడిచే పడవలన్నీ తనిఖీ చేశారు. బంగనపల్లి జాగీరులోని బిలం కార్యాలయంగా గల ఫక్రుద్దీన్ రుద్రవరం వద్ద నరసింహారెడ్డితో చేరాడు.
నరసింహారెడ్డి, కరణం అశ్వర్థం, గోసాయి వెంకయ్యతో కలిసి మారువేషంలో కృష్ణానదిని దాటారు. వనపర్తి జమీందారు రాజా రామేశ్వరరావు నరసింహారెడ్డికి రక్షణ కల్పించాడు. శివార్లలో పలుకుబడిగల జమీందారు బుడన్‌ఖాన్ మహామయి తిరుగుబాటుదార్లను పట్టుకోవడంలో సహాయపడతానని తెలియజేశాడు. నరసింవారెడ్డి అనుయాయులు దాదాపు రెండువందలమంది తమతమ గ్రామాలకు వెనుదిరగటానికి సంకోచిస్తూ మురిపుండి వద్ద
70 సీమపాలేగార్లు సమావేశమయ్యారు. అంతా కలిసి ఎజ్జమలై కొండలవైపు వళ్ళారు. వారిని పట్టేందుకు సహాయపడేట్టు తాడిపర్తి యాడికి, పంచపాళెం తాలూకాలలోని హెడ్‌పోలీసులకు ఉత్తుర్వులివ్వవలసిందని కాక్రెయిన్ 1846 ఆగస్టు 26న బళ్ళారి మేజి(షస్టేటుకు కోయిలకుంట్ల నుండి రాశాడు. తిరుగుబాటుదార్లకు సఫప్లయిలు అందకుందా చూడాలని కూడా కోరాడు. పాళెం, బంగనపల్లి తాలూకాల హెడ్‌పోలీసులను కూడా (ప్రభుత్వ సిబ్బందికి తోద్చడవలసిందిగా కోరాడు. పట్టుబడిన అనుయాయులు
రంగపూరులో అధికారి శిబిరం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు పట్టుబడ్డారు. వారిలో నాగప్ప నైజాం రాజ్యంలోని గద్వేలు వాడు, రెండవవాడయిన కంభడు బెక్ సమీపంలోని మిట్టపల్లివాడు. బెక్‌కు చెందిన కోర అప్పయ్యను గవర్నరు ఏజంటు పిలిపించి, నాగప్ప ఎవరో అతనిని నరసింహారెడ్డి పిలిపించాడేమో తెలుసుకోమన్నాడు. కంభానికి ఇనాం బఖూవి ఉంది. జఖళ౮ూవి ఉన్నమాట నిజమో, కాదో, ఇనాం భూమి ఎందుకు వదిలిపెట్టాడో, అంతవరకు ఎక్కడ గడిపాడో, వివాహితుడా, పిల్లలెందరనీ తెలుసుకోవలసిందని కోరాడు.
స్మాట్ శిబిర సమీపంలోని కొత్తపల్లిలో “మాదిగ అనేవానిని పట్టుకున్నారు. నిజానికి అది కులంపేరయినా దానిని మనిషిపేరుగా జమకట్టారు. నరసింహారెడ్డికి పదిరోజులు ఆశ్రయమిచ్చిన బండి వెంకటి అనే వ్యక్తిని పట్టుకున్నార్ము మాదిగ అనే వ్యక్తి కుండ్లదుర్తి గ్రామానికి చెందినవాడు. ఖాదరాబాద్‌లో నివసిస్తున్నాడు. అక్కడ ఉన్నది నాలుగిండ్లు. ఒక ఇంట్లో మాదిగ అన్న బోయ బీబిగాడిని, అదే చెర్వుపల్లికే చెందిన రాముడిని పట్టుకున్నారు. బేతంచర్లవాసి వెంకటకొండను నిర్బంధించారు. స్కాట్ మరో కొందరిని గురించి వాకబు చేశాడు. ఆ అయిదుగురు-
గులామ్ మహమ్మద్ ఖాన్, ఎగ్లోని సుబ్బయ్య, నాగరాజు, పంటిపాడి యాగంటిరెడ్డి, బండి వెంకయ్య, బంగనపల్లి ఖాజూ బేగ్. గుల్‌దురి
కదపజిల్లా పాలేగార్లు ణా వెంకటసుబ్బయ్య ఉప్పలపాడులో, గుల్‌దుర్పి రోసిరెడ్డిని పట్టుకుని అమిల్‌దారుకు అప్పగించగా అమిల్‌దారు రోసిరెడ్డిని స్మాట్ దగ్గరకు పంపాడు. నరసింహారెడ్డి అనుయాయులుగా భావించి పింజేరి బూడగ్గాడిని, బైరామ్‌సాబ్‌ని, ఈర్ల ఓబయ్యను నంద్యాల హెడ్‌పోలీను కోయిలకుంట్ల హెడొపోలీనుకు అప్పగించాడు.
1846 నవంబరు 26 ప్రాంతంలో నందవరానికి చెందిన ఓబుల్‌రెడ్డిని పట్టుకున్నారు. ప్రకటించిన వంద రూపాయల బహుమతిని ఓబుల్‌రెడ్డిని పట్టిచ్చినవారికి పంచిపెట్టారు. ఎగ్లోని సుబ్బయ్య నరసింహారెడ్డికి ఆయుధాలు సమకూర్చాడని ఆరోపిస్తూ అతనిని బంధించారు.
రెడ్డికోనం వెదకుతున్న సిపాయిలు దట్టమయిన అరణ్యాలలో సంచరించలేకపోయారు. శాంతి నెలకొనిందన్న భావంతో సైన్యాన్ని వెనకకు ఆయా న్థావరాలకు పంపించివేసినా, కొండలకిరువైపులా ఒక్కొక్క కంపెనీ సైనికులను ఉంచారు. పొలేగారు మనుష్యులు చెల్లాచెదరయినందున సైన్యం అనవసరమని కొక్రెయిన్ తెలిపాడు. కొక్రెయిన్ కృష్ణంసెట్టిపల్లి, రుద్రవరం ప్రాంతాల్లో కొంతకాలం కొనసాగినా గాజులపల్లిలో కూడా మరధోసగం కంపెనీని యూరోపియన్ అధికార్లకింద ఉంచాడు. అఖరి పోరాటం
ముండ్లపాడు నుండి చెదరిపోయిన రెడ్డిదళం ఎజ్జ్బమలై కొండల్లో చెదరుమదురుగా ఉన్నారు. అనుయాయులు ఒకరొకరే మరలా చేరుతున్నారు. (గ్రామాలను రక్షించేందుకు రెండు కంపెనీల సైన్యాన్ని పంపవలసిందిగా కొక్రెయిన్ కోరాడు. (ప్రభుత్వం ఆమోదిస్తుందనే విశ్వాసంతో స్థానికంగా వందమందిని తాత్మాలికంగా కొక్రెయిన్ సిబ్బందిలో చేర్చుకున్నాడు. ఈ ఏర్పాట్లు చూసిన అనుయాయులు రెడ్డిని వదలిపెడతారని కొక్రెయిన్ భావించాడు. బహుమతి ప్రకటిస్తే ఇతర పాలేగార్లు ముందుకువచ్చి నరసింహారెడ్డిని పట్టుకోవడంలో తమకు తోద్బడతారని కొక్రెయిన్ భావించాడు. గిద్దలూరు,
గ్ర సీమపాలేగార్లు ముండ్లపాడు అనుభవంతో నరసింహారెడ్డి ఇంకొకసారి ప్రభుత్వ దళంతో తలపడబోడనీ, కొండలలోనే దొరికిపోతాడని కొకైయిన్ భావించాడు.
ఆవులకొండ (ప్రాంతంలో నరసింహారెడ్డి ఉన్నట్టు ప్రభుత్వానికి సమాచారం అందింది. మరికొందరు అనుయాయులు నరసింహారెడ్డితో అక్కడ చేరారు. కొథడ్రైెయిన్ కొందరు సిపాయిలను వెంటబెట్టుకుని ఆవులకొందకు బయలుదేరాడు. అయితే కొక్రెయిన్ వచ్చేలోగా రెడ్డి ఆ ప్రాంతం వదలి వెళ్ళాడు. (గ్రామాలు (గ్రామాలే ప్రజలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. (ప్రభుత్వ దళాలు తమను అనేక విధాల పీడింపవచ్చనే భావంతో (గ్రామాలు ' తాత్కాలికంగానైనా ఖాళీ చేసి ఉండవచ్చు.
నరసింహారెడ్డి తన కుటుంబాన్ని విడిపించేందుకు కొండదారులలో రాత్రిపూట ప్రయాణం చేస్తూ కడపకు బయలుదేరాడు. కడపలోని కమాండింగ్ ఆఫీసర్‌ను అప్రమత్తంగా ఉండవలసిందని అధికార్లు హెచ్చరించారు. పాలేగారు తన ప్రాంతం కాని కడప గ్రామాలలో ఉన్నా గ్రామాల ప్రజలకు రెడ్డిమీద ప్రత్యేకాఖిమానం ఉండబోదనీ, రెడ్డిని బంధించటంలో [గ్రామ ప్రజలు ప్రభుత్వంతో సహకరిస్తారనీ (ప్రభుత్వం ఎదురు చూసింది.
కడప జిల్లాలో రెడ్డి మరలా కనపడగానే మూడు కంపెనీల సిబ్బందిని చిన్న చిన్న బృందాలుగా విభజించి గ్రామాలలో కాపలా పెట్టారు. 500 మంది ప్యూన్‌లను, కట్టుబడులను కర్నూలు ప్రాంతంలోకి పంపారు. వారంతా కర్నూలు కమీషనరు పంపిన దళంతో కలిసి పనిచేయవలసి ఉండింది.
జిల్లా సరిహద్దులో కృష్ణానది దాటేందుకు ఏ రేవులో తిరుగుబాటుదార్లు (ప్రయత్నించినా వారిని అటకాయించేందుకు ఏర్పాట్లు చేశారు. కేసుల విచారణకు ఒక ప్రత్యేక కమీషనరును నియమించటం మంచిదని కొక్రెయిన్ భావించాడు. సైనికులు (గ్రామాలకు కాపలా కాస్తే కట్టుబడులు, ఇతర సిబ్బంది పాలేగారును వెంటాడి, అతనిని పట్టి అప్పగిస్తారని కొక్రెయిన్ భావన. *
కడపజిల్లా పాలేగార్లు గతి పాలేగారు నరసింహారెడ్డిని పట్టిచ్చినవారికి ఇంకా పెద్ద బహుమతి లభిస్తుందని ఆశ చూపితే, ఇతర పాలేగార్లు తమ సిబ్బందితో నరసింవారెడ్డిని వెంటాడుతారని కొజ్రెయిన్ భావించాడు. నరసింహారెడ్డికి గిద్దలూరు పోరాటంలో, ముండ్లపాడు పోరాటంలో ఉన్నంత బలగం లేనందున ఇక పోరాటానికి తలపడబోడని ప్రభుత్వ భావన. రెడ్డి స్థావరం - కొత్తకోట గుత్తి కనుమ ద్వారంలోని కొత్తకోటను నరసింహారెడ్డి తన ప్రధాన కార్యాలయంగా ఎంచుకున్నాడు. తన కుటుంబాన్ని తన కార్యకలాపాలకు దగ్గరగా కొత్తకోటలో ఒక ఇంట్లో ఉంచాడు. అయితే కార్యకలాపాలు తీవ్రరూపం దాల్చినప్పుడు కుటుంబాన్ని, అంటే రెడ్డి భార్యా, బిడ్డలను నిర్బంధంలో ఉంచి పింఛనులో రెడ్డి వాటా రూ. 11-10-8 కుటుంబానికి ప్రభుత్వం నెలనెలా చెల్లించింది. అడవి దారులన్నీ తెలిసిన చెంచులతో రెడ్డి కొండల్లోనే ఉన్నాడు. రెడ్డితోపాటు గోసాయి వెంకయ్య, కరణం అశ్వర్ధం, దాసరి రోసిరెడ్డి, జంగం మల్లయ్య ఉన్నారు. కొత్తకోటలోని ఇంట్లో ప్రభుత్వానికి చాలా పత్రాలు దొరికాయి. ముఖ్యమైన లేఖలు, పత్రాలున్నాయి. హైదరాబాదు రాజ్యంలోని ప్రాతకూరు జమీందారు లాభ్‌ఖాన్‌కు, నరసింహారెడ్డికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, సహాయం చేస్తానని లాల్‌ఖాన్ మాట ఇచ్చిన పత్రాలు, కోయిలకుంట్ల తాలూకా ప్రజలు రెడ్డిని అభినందిస్తూ రాసిన జాబులు దొరికాయి. సిబ్బందిని సమకూర్చి తామెంతో సహాయపడినామని చాలామంది గ్రామాధికార్లు రాశారు. సిబ్బందికి బత్తా చెల్లించిన కాగితాలందులో ఉన్నాయి. కంభం తహసిల్దారు జంగంరెడ్డి శ్రీనివాసరావు, బంట్రోతులు వాట్సన్‌కు సహాయంగా వెళ్ళాడు. 19వ రెజిమెంట్‌లో కృష్ణసెట్టిపల్లి నుండి మూడు మైళ్ళలోని ముండ్లపాడు చేరుకోగానే రెడ్డి దళం చెల్లాచెదరయింది. వారిలో 30 మందిదోకా మరణించారు. 85 మంది ఖైదీలుగా సైన్యానికి పట్టుబడ్డారు.
ల! సీమపాలేగార్లు నరసింహారెడ్డిని పట్టుకునే ప్రయత్నం
పంచెపాళెం తాలూకాలో సాలుకు రూ. 1187-8-0 పింఛను తీసుకుంటున్న పందికోన ఎజ్జచెన్నమనాయుడు చాలా ఇనామ్ భూమిని అనుభవిస్తున్నాడు. నల్లమలై కొండలలో దాగిన నరసింహారెడ్డిని తాను పట్టివ్వగలననీ, పదిమంది వడ్డరులను తనవెంట తీసుకువెడతాననీ, తనకు రోజురు రూ.8/- బత్తా ఇవ్వాలనీ ప్రభుత్వానికి రాశాడు. వంశానుగతంగా కట్టుబడులయిన వడ్డరులు నరసింహారెడ్డి కొండల్లో ఎక్కడ ఉన్నదీ కనిపెట్టగలరనీ తెలిపాడు. అవసరమయినా, ప్రభుత్వ అంగీకారమయినా కడప యాక్టింగ్ మేజి(స్టేట్ కొడక్రెయిన్‌ను కలవదానికి తాను సిద్ధంగా ఉన్నాననీ, పంచెపాళెం కట్టుబడులకు చాలా ఇనాం భూములున్నందున వారు విశ్వాసఘాతుకులు కారనీ తెలిపాడు. *) అయితే కొక్రెయిన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించాడు.
నరసింహారెడ్డి సిబ్బంది మూడు ముఠాలుగా చీలారు. ఒక బృందం ముచ్చర్లపేటకు, ఒక బృందం యాబఐగుంటకు, మూడవబ్బందం సంగోబండవైపు వెళ్ళారు. సెప్టెంబరు 24 నాటికి 7వందలమంది అనుయాయులతో నరసింహారెడ్డి మల్కాపురం దరిదాపుల్లో ఉన్నాడు. తమకు కావలసినవన్నీ సమకూర్చుకుని రెడ్డి దళం బెకువైపు వెళ్ళారు. కడప, కర్నూలు, బళ్ళారి - ఈ మూడు జిల్లాల నుండి చుట్టుముట్టి రెడ్డిని పట్టేందుకు పోలీసులు పధకం వేశారు.
(ప్రభుత్వ సైనికులు రెడ్డి కోయిలకుంట్లకు వెళ్ళవచ్చునని భావించారు. నోసంలోని 10మంది సవరలకు తోడుగా మరో 40మందినిచ్చి వారందరినీ కోయిలకుంట్లకు పంపారు. ఒక్కొక్క జట్టులో 25మంది వంతున రెండు కంపెనీల సైన్యాన్ని విభజించి ఒక్కొక్క జట్టుకు 50మంది కట్టుబడులను జతచేసి, 25మంది సిబ్బందిని సమకూర్చి మొత్తం వందమంది గల ఒక్కొక్క బృందాన్ని ఒకవైపుకు పంపారు. ప్రభుత్వం నుండి పింఛను పొందిన పాలేగార్లను కూడా (1) బళ్ళారి మేజిస్టేటు 1846 జూలై 27న కొక్రెయిన్‌కు రాసిన లేఖ (కడప సంద్రోన్)
కడపజిల్లా పాలేగార్లు 75 సైనికదళంలో చేరాలని కోరారు. కట్టుబడులకన్న తాము నియమించిన సిబ్బంది (శ్రద్ధతో పనిచేస్తుందని భావించారు. రెడ్డి జమ్మలమడుగు, చెన్నూరు ప్రాంతంలోకి (ప్రవేశిస్తున్నాడనుకుని అక్కడి సిబ్బంది సంఖ్యను నలఖై, యాభై నుంచి 150కి పెంచారు. రెడ్డి జమ్మలమడుగు కొండల్లో సంచరిస్తున్నాడు. కంపెనీ సైనికులను కూడా రంగంలోకి దింపాలనుకున్నారు.
ముండ్లపాడు పోరాటం తర్వాత ఆరువారాల వరకు నరసింహారెడ్డి నల్లమలై అడవులలోనే ఉన్నాడు. జెకు రాజులు వెంకటరామరాజు, నారాయణరాజు, నరసరాజులతోపాటు బింగనవల్లి నవాబ్ మహమ్మదాలీఖాన్ కూడా తిరుగుబాటులో చేరారు. ౨
కొక్రెయిన్ తన అసిస్టెంట్‌తోపాటు కొంతమంది సిపాయిలతో ఆవులకొండ (ప్రాంతం చేరుకున్నాడు. నరసింహారెడ్డి ఇద్దరు, ముగ్గురితో కలిసి ఆ ప్రాంతం వదలి వెళ్ళాడు. రెడ్ది ఎటు వెళ్ళిందీ (గ్రామస్థులు అధికార్లకు సూచించలేదు. కుటుంబాన్ని విడిపించేందుకు కడపకు వెడుతున్నాదని కొక్రెయిన్ భావించాడు. *
మూడు కంపెనీల సైన్యాన్ని ఎర్రమలై (ప్రాంతంలో గ్రామాలను రక్షించడానికని చిన్న సమూహాలుగా పంపారు. ప్రభుత్వ పింఛను పొందిన పాలేగార్లు కూడా రెడ్డిని కలిసే సూచనలు కనిపించాయి. బంగనపల్లి నవాబు నరసింహారెడ్డికి సహాయంగా ఉన్నాడు. నరసింహారెడ్డి పట్టుబడటం
నరసింహారెడ్డి పెరియసోమల కొండమీద జగన్నాథ దేవాలయంలో తన బలగంతో ఉన్నాడు. 19వ రెజిమెంట్‌లోని కెప్టెన్ నాట్స్ యంగ్ హస్పెండ్, నెల్లిన్ అందరూ పెరియసోమల చేరుకున్నారు. పెరియసోమల కొండ చుట్టుకొలత 6 మైళ్ళు. యాఖైమంది సవరులను ఆ కొండ చుట్టూ కాపలా (1) స్పెషల్ కమిషనర్ ఇంగ్లిస్ నివేదికను సమీక్షించిన కొక్రెయిన్ 15 ఏప్రిల్ 1847 (2) యాక్టింగ్ కలెక్టరు కొక్రైయిన్ 1846 సెప్టెంబరు 7న కోయిలకుంట్ల నుండి
ఫోర్ట్‌సెయింట్ జార్జిలో న్యాయ శాఖకు రాసిన ఉత్తరం.
౯76 సీమపాలేగార్లు పెట్టారు. థార్న్‌హిల్, స్మిత్ ఇరువురూ గుర్రాలమీద వెళ్ళి కాపలా సవరులు అహ్రమత్తంగా ఉన్నారా, లేరా అని పర్యవేక్షిస్తున్నారు. కొండమీద నుండి తప్పించుకునే వీలు లేకుండాపోయింది. తీవ్రమైన పోరాటం జరిగింది.
ఆ పోరాటంలో నరసింహారెడ్డి బలగంలో నలభై, యాఖైమంది దాకా మరణించారు. 90 మందిదాకా గాయపడి, పట్టుబడినారు. నరసింహారెడ్డి కాలికి తుపాకి గుండు తగిలింది. ఇంకో అయిదుగురిని పట్టుకున్నవారికి బహుమానం ప్రకటించారు. నరసింహారెడ్డి 1846 అక్టోబరు 6వ తేదీ సాయంద్రం జగన్నాథ ఆలయంలో పట్టుబడ్డాడు. నరసింహారెడ్డి మీద కేసు - శిక్ష
ప్రభుత్వానికి లభించిన సాక్ష్యాధారంతో తిరుగుబాటు, హత్యలు, దోపిడీ నేరాలకింద నేరం మోపి 1884 రెగ్యులేషన్ 1 లోని సెక్షను 1 లోని నిబంధనలననుసరించి, 1802వ సంవత్సరపు రెగ్యులేషన్ ౪11లో 10వ సెక్షనుకింద నరసింహారెడ్డికి ఉరిశిక్ష విధించడమయినది. ఈ వారంటు అందిన తర్వాత వీలయినంత త్వరలో కోయిలకుంట్ల సమీపంలో జిల్లా అధికార్లు ఎన్నికచేసిన చోట ఉరిశిక్ష అమలు జరిపేందుకు పెద్ద అరుగుమీద ఉరికంభం ఏర్పాటు చేసి నరసింహారెడ్డిని ఉరితీయాలి. కడప మేజి(స్టేటుగానీ, ఆయన అసిస్టెంట్లలో ఒకరుగానీ ఉరిశిక్ష అమలు జరపవలసిన స్థలాన్ని ఎన్నికచేసి, ఉరిశిక్ష అమలు జరిగేప్పుడు అక్కడే ఉండి పర్యవేక్షించాలి. కేసు వివరాలన్నీ న్యాయశాఖకు సమర్పించాలి. ఆ వివరాలు 1841 చట్టం ౪ సెక్షను ప్రకారం, 1884 రెగ్యులేషన్ 1 ప్రకారం, 1802 రెగ్యులేషన్ ౫౫ సెక్షను 5 ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుకోసం పంపాలి అని రిజిస్టార్ జె. హెచ్. డేవిడ్‌సన్ 1847 జనవరి 9న ప్రాసిక్యూటరుకు రాశాడు.
ఫౌజ్‌దారీ అదాలత్ (సైనిక న్యాయస్థానం) ప్రతిపాదనను గవర్నరు ఆమోదించిన రీతిని అమలు జరిపేందుకు ప్రభుత్వ కార్యదర్శి అధికారం మంజూరు చేశాడు. 1847 ఫిబ్రవరి 22వ తేదీన నరసింహారెడ్డిమీద ఉరిశిక్ష అమలు జరపాలని నిర్ణయించారు.
కడపజిల్లా పాలేగార్లు గాగ
ఉరిశిక్ష 22వ తేదీ ఉదయం 7 గంటలకు అమలుజరిపారు. దాదాపు రెండువేలమంది గుమిగూడి నిశ్శబ్దంగా ఉరిశిక్షను చూశారు. కడప నుండి బయలుదేరినప్పటి నుండి ఉరిస్తంభం ఎక్కిన రెడ్డి చాలా గంభీరంగా ఉన్నాడు. తనను తహసిల్దారు అవమానించాడనీ, దానితో ప్రారంభించి, స్థానిక ప్రజల బాధలను గుర్తించి తానే ఈ నేరాలన్నీ చేశానని రెడ్డి అంగీకరించాడు. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. ఆ వేదిక శిథిలావస్థను చేరినప్పుడు, పై అధికార్తకు తెలియజేసినా మరమ్మతు చేయటాని5 వారు అంగీకరింపలేదు. కోటలోని వేదికమీద 1877 వరకు 80 సంవత్సరాలకాలం నరసింహారెడ్డి తల ఉ రికంబానికి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ వేలాడింది. తిరుగుబాటు తర్వాత
కడప - కర్నూలు మధ్య కొండలలో పర్యటించిన మేజర్ హారిస్ నివేదిక సమర్పించాడు. ఎజ్జమల - నల్లమల కొండల్లో పెద్ద కోటలు 12 ఉన్నాయి. వాటిలో ప్రధానమయిన గండికోటలోని మందుగుండు గదిలో పేలుడు సామగ్రి, తుపాకీ గుంద్లున్నాయి.
కడప జిల్లా కొండల్లో నిర్మానుష్యమయిన కోటలకు మార్పులు, చేర్పులు అనుమతింపరాదంటూ ఫోర్ట్ సెయింట్ జార్డ్ రెవిన్యూ బోర్డుకు రాసి, ఈ ఉత్తర్వులను కడప, బళ్ళారి, కర్నూలు జిల్లా కలెక్టర్లకు, కమీషనర్లకు పంపారు.
నరసింహారెడ్డికి రావలసిన రూ. 11-10-8 పింఛను ప్రభుత్వం నిలుపు చేసుకుంది. రూ. 35లో మిగిలిన రూ. 28-5-4ను తిరుగుబాటుసమయంలో తోద్బ్చడిన నరసింహారెడ్డి తమ్ముడు కుమార మల్లారెడ్డికి ఆజీవాంతం ఇవ్వాలని కేంద్రం రాసింది. పోరాటంలో మరణించిన వారి సమీప బంధువులకు నెలకు రూ. 62-12-0 మంజూరు చేశారు. ప్రతి వ్యక్తి మరణించిన తేదీ నుండి ఈ పింఛనులు అమల్లోకి వచ్చాయి. (=
కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు, రెవిన్యూ బోర్జు, మిలిటరీ విభాగం ద్వారా తిరుగుబాటు అణచటంలో పాల్గొన్న ఆఫీసర్లకు, సిబ్బందికి ప్రశంసలు పంపారు.) (1) మిలిటరీ - మినిట్స్ ఆఫ్ కన్సల్టేషన్ నం. 2348, తేది 4 మే 1847. (2) కోర్ట్ ఆఫ్‌దైరక్టర్త జనరల్ లెటర్ నం 14 తేది 22, జూన్ 1847.
గ₹8 సీమపాలేగార్లు ప్రభుత్వోద్యోగంలో ఉంటూ తిరుగుబాటులో ప్రాణాలర్చించినవారు
ఎనిమిదిమంది.
-
శ్రీనివాసరావు - తహసిల్దారు. మరణం 18646 జూలై 23. తహసిల్దారుగా 15 సంవత్సరాలు పనిచేశారు. తన సిబ్బందితో గిద్దలూరు వద్ద వాట్సన్‌తో. తలపడినాడు. తిరుగుబాటుదార్లతో పోరాడటంలో అతనిని తలలో కాల్చి చంపారు.
-
సయ్యదు ఇమాం - పోలీసు. 1846 జూలై 10న నరసింహారెడ్డి కోయిలకుంట్ల ఖజానా కొల్లగొట్టినప్పుడు ఎదిరించి కాల్పులకు గురయ్యాడు.
-
హనుమాన్‌సింగ్ - గ్రామపెద్ద. 1846 జూలై ౩1న నరసింహారెడ్డిని పట్టేందుకు వారంటుతో వెళ్ళాడు. ముళ్ళపాడు పోరాటం తర్వాత తల నరికివేసిన మొండెం నల్లమల కొండల్లో లభించింది.
4 _ రామప్రసాద్ - అట్టావణి దఫేదార్. 1846 ఆగస్టు 3౩వ తేదీ. తహసిల్దారు శ్రీనివాసరావుతో కలసి గిద్దలూరులో నరసింహారెడ్డిని ఎదిరించాడు. పోరాటంలో తొడలో గుండు దూసుకుపోయి మరణించాడు.
ర్, కార్మోన్ గోపాలరావు - మరణం 1846 సెప్టెంబరు 2. నరసింహారెడ్డిని వెదకటానికి వెళ్ళగా భద్రాచలం కొండల్లో అతనిని చంపివేశారు.
- బాలాజి - పోలీసు ప్యూన్. 28 అక్టోబరు 1846న మరణించాడు. 'సైనికులకోసం సఫ్లయిలు సేకరిస్తూ కాల్పులకు గురయ్యాడు.
77 కనగిరి - బెక్ కరణం. 1846 సెప్టెంబరు 2న మరణం, కరణం గోపాలరావుతో కలిసి రెడ్డిని వెదకటానికి వెళ్ళగా అతనితోపాటు చంపివేశారు. కొడుకు బుచ్చయ్యకు కరణీకం ఇచ్చారు.
- అవప్పసామి - బెక్ రెడ్డి. 1846 సెప్టెంబరు 2న మరణం, తిరుగుబాటుదార్లు బెకుమీద దాడి చేసినప్పుడు వారిని ఎదిరించి
కాల్పులలో మరణించాడు.
కడపజిల్లా పాలేగార్లు గా పోరాటంలో మరణించినవారి తాలూకు పింఛనులు పొందినవారు") నెలకు రూ. తహసిల్దారు జంగమరెడ్డి శ్రీనివాసరావు భార్య శేషమ్మ 85-00 దఫేదార్ సయ్యద్ ఇనాం భార్య ఫాతిమా బీబీ 4-00 దఫేదార్ రాంప్రసాద్ భార్య భవానీబాయి 8-00 సర్‌ఛాసమ్ హనుమాన్‌సింగ్ భార్య రాంబాయి 5-00 కార్మోన్ గోపాల్‌రావ్ భార్య జానకీబాయి 6-00 ప్యూన్ బాలాజీ తల్లి జమీనాబాయి 1-12 జెక్ కరణం కనిగిరి భార్య నరసమ్మ త్తా౦00 జెక్ అప్పసామిరెడ్డి భార్య చెంచక్క తా00 పింఛను నెలకు మొత్తం 02-12. గోసాయి వెంకన్న గోసాయి వెంకన్నను పట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. అతనిని పట్టినవారికి రూ. 200/- బహుమతి ప్రకటించారు. * గోసాయి కడప జిల్లా వదలి వెళ్ళిపోయాడని భావించారు. ఈ బహుమతిని ఇంకా పెంచాలని కొక్రైయిన్ సూచించాడు. అయినా రూ. 200/- అదనంగా ఇస్తున్నట్టు 1847 జనవరి 14 అంటే, సరిగ్గా సంక్రాంతినాడు ప్రకటించారు. హైదరాబాదు రేసిడెంటును ఈ విషయం బాగా ప్రచారం చేయవలసిందిగా కోరారు. ముండ్లపాడు నుంచి పారిపోయిన వెంకయ్య జాడ ఎనిమిది నెలలయినా తెలియలేదు. బహుశా మారువేషంలో తిరుగుతున్నాడనీ, అతనిని ఎవరంటే వారు పట్టలేరనీ ప్రభుత్వానికి కూడా తెలుసు. కడప జిల్లా పోలీసు దావూద్ (1) కోర్ట్ ఆప్ డైరెక్టర్ల జనరల్ లెటర్ నం. 14, తేది 22 జూన్ 1847. | (2) కలకత్తాలోని ఫోర్ట్ విలియం నుండి సెక్రటరీ జి.ఎ. బుష్‌బె ఫోర్ట్ సెయింట్ జార్జికి నం. 1425, తేదీ 9 జూలై 1847న రాసిన ఉత్తరం.
80 సీమపాలేగార్లు సర్ చాసమ్ జాఫర్ మహమ్మదును కొందరు ప్యూన్‌లను జతచేసి హైదరాబాదు రాజ్యంలోని గోసాయి వెంకయ్యను పట్టేందుకు పంపారు. జాఫర్ మహమ్మద్ తన బంధువులు ఇద్దరిని వనపర్తి సంస్థానంలోని రామచంద్రపల్లికి పంపాడు. స్థానికులు కాదంటూ వారిద్దరినీ రామచంద్రపల్లి వాసులు బంధించారు. హైదరాబాదు రాజ్యంలోని ముక్త్యాల డివిజన్‌లోని ఆత్‌కూరు వద్ద గోసాయి వెంకయ్యను పట్టుకున్నారు. దాసరి వేషంలో గోసాయి అక్కడ చాలామందికి తెలిసినవాడు. కేసులు “తిరుగుబాటుకు సంబంధించి మొత్తంమీద నిర్బంధించీనది 901మందిని. వారిలో 412మందిని మేజి(స్టేటు వెంటనే విడుదల చేశాడు. 273మంది జామీను మీద విడుదలయ్యారు. తప్పుదారి పట్టించినందువల్లనే వారు నరసింహారెడ్డితో చేరారనీ, వారిని రెడ్డి బెదిరించటంతో, వరపు సంవత్సరంలో తిండికి ఇబ్బందయి, వారంతా తిరుగుబాటులో చేరారనీ నిర్ధారించారు. 12మందికి చట్టరీత్యా శిక్ష విధించారు. 75మంది ఆయుధాలతోనే వట్టబడ్డారు. పెరియసోవుల కొండవీద జగన్నాధ గుడిలో నరసింహారెడ్డితోపాటు ఉన్నప్పుడు ఎర్రమలై - నల్లమలై కొండల్లో తిరుగాడుతూ వీరంతా పట్టుబడ్జారు. వీరిలో కొందరి శిక్షాకాలాన్ని తగ్గించారు. రెంటాల పెద్దకంబడు, పహిల్వాన్ వెంకటిగాదు, కరణం నరసప్ప - ఈ ముగ్గురి శిక్షను 14 నుండి 8& సంవత్సరాలకు తగ్గించారు. మిగిలినవారికి 8 సంవత్సరాల శిక్షను 6 సంవత్సరాలకు, 7 సంవత్సరాల శిక్షను 5 సంవత్సరాలకు, ఐదు సంవత్సరాల శిక్షను మూడు సంవత్సరాల కారాగారవాసానికి తగ్గించారు. ముండ్లపాడు నుండి చెల్లాచెదరయినవారిని నల్లమలై ప్రాంతంలో 98మందిని పట్టుకుని కేసు పెట్టారు. దాదాపు రెండువందలమందిని చంపిఉ ండినా మిగిలినవారిని స్వగ్రామాలకు పంపారు. జిల్లా మొత్తంమీద 153మందిని న్యాయవిచారణకోసం పోలీసు కమీషనర్ వద్దకు పంపారు. విడుదలైనవారు (గ్రామాలలో దోపిడీలకు పూనుకున్నారు. కట్టుబడులు, వారసత్వంగా ఏర్పడిన '
కడపజిల్లా పాలేగార్లు 81 పోలీసులుగాక, ఇతరులను కూడా స్వేచ్చగా తిరుగనివ్వకూడదని, వారిని బంధించడమే మంచిదని భావించారు. తిరుగుబాటు తీవ్రదశలో ఉండ్రగా గిద్దలూరు వద్ద పాలేగారు వెంట ఉన్న నాలుగైదు వేలమంది నేరస్థుల పేర్లను వారు తమ గ్రామాలను తిరిగి చేరుకోవాలన్న ఉద్దేశ్యంతోనే జూబితాలో చేర్చలేదు. చాలామంద్ది తిరుగుబాటులో చేరినట్టు మూడువిధాల రుజువు లభించింది. మొదట్లోనే నరసింహారెడ్డితో చేరినట్టు మేజి'స్టేటు ఎదుట అంగీకరించినవారు, చేరినవారిని గుర్తించి కచ్చితంగా చెప్పగలిగినవారు, (గ్రామాల్లో లేరని తహసిల్దారు గుర్తించి వారు తిరుగుబాటులో చేరినట్టు నిర్దారించారు.
1846 అక్టోబరు 28నాటికి 42మంది ఖైదీలు కడప చేరుకున్నారు. ముండ్లపాడు వద్ద పట్టుబడిన 85మందిగాక మరో ఏడుగురు జాయింట్ మేజి(స్టేట్ విచారణలో ఉన్నారు. వారిమీద పత్రికల వార్తలు తప్ప నేరాలు చేసినట్టు ఆధారాలేవీ లేవు. కమ్మరని నరసీంగరావు నరసింహారెడ్డికి అన్నం వండాడు. కట్టుబడి బైగ్గాడు ఏవో సప్లయిలు తెచ్చి ఇచ్చాడు. చిన్న రంగారెడ్డి నరసింహారెడ్డికి కొంత డబ్బు ఇచ్చాడు. వీరిని విడుదల చేయవలసిందని స్పెషల్ కమీషనర్ ఇంగ్రిస్ ఉత్తర్వులిచ్చాడు.
నవంబరు 8నాటికి 75మంది మీద విచారణ జరిగింది. మరో 87మందిని కడప జైల్లో పెట్టారు. ఇక జైల్లో ఖాళీ లేదని ఇంగ్రిస్ కొకైైయిన్‌కు రాశాడు. జాబితాలో పేర్కొన్న సాక్షుల మొత్తం 17మందిలో రెండవ కేసులో సాక్షులు - అవుల నాగిరెడ్డి, రంగారావు, సావుకారు ఖాజా బేగ్, కరణం వెంకయ్య, ఆక్టింగ్ ప్యూన్ షేక్ హుస్సన్ - మూడవ కేసులో సాక్షులు - రుద్రవరం కరణాలు చెంచురాజు, పెద్ద అప్పయ్య, మిగిలినవారు మాలగురవడు, వెంగటిగాడు, దుడ్డ గురవమ్మ, తాతేచర్ల వీరమ్మ, కొత్తూరు శేషమ్మ, పాలూన్ శరభక్క, కమ్మ ఫకీర్క, సముద్రాల వెంకటస్వామి. నాలుగవ కేసులో సాక్షులు
- ఖమ్మం జిల్లా నర్ఫోజి, లక్ష్మణాసింగ్.
ఎగ్గూరి సుబ్బయ్య నరసింహారెడ్డికి ఆయుధాలు సప్లయిచేసినట్టు సాక్షి యమనూర్ మద్దులేటి.
82 సీమపాలేగార్లు
ఫక్రుద్దీన్ ముఠాలోని నారప్ప, గుడ్డివాడు గోవిందు, నరసింగ, ఓబడు, దూదేకుల బాబుగాడు, అందరూ కొండ గుహల్లో పట్టుబడ్డారు. 1846 మేలో వీరంతా బంగనపల్లి జాగీర్‌లోని బిలం (ప్రధాన కార్యాలయంగా యాడికి ప్రాంతంలో కొన్ని గ్రామాలను కొల్లగొట్టి తప్పించుకుపోయారు. ఫక్రుద్దీన్ పట్టుబడి కేసు కడపలోను, సిద్ధ వటంలోను నమోదయింది. ఫక్రుద్దీన్ గురించి సాక్ష్యం. చెప్పినవారు కరణం బంగారు, కరణం రామయ్య, తలారి వెంకట, నరసాపురం చెంచులు - కడప పోలీసు అమీన్ చేసిన వారంటుతో ఫక్రుద్దీన్‌ను అరెస్టు చేశారు.
కేసు నం. 10 వై. కొండారెడ్డి, నరసింహారెడ్డి అనుయాయూలలో ఒకడయిన సూరపల్లి పాపానాయుడిని పట్టివ్వలేదు. భీమప్పనాయునిచేత దెబ్బలు తిని వీధిలో అరుస్తున్న పాపానాయుడిని పట్టుకోలేదని కొండారెడ్డి మీద కేసు నమోదు చేశారు. రెంటాల కంబడు నరసింహారెడ్డి మురాలో కనబడ్డాడని, సాలెనాగు దోపిడీలో పాల్గొన్నాడని కేసు పెట్టారు. తగిన సాక్ష్యం లేదని వారిని వదిలిపెట్టారు.
18, 14 15 కేసులు కూడా కొట్టివేశారు. 18లోనివారు పుత్త వెంకట, చాగలమళ్టి వీరప్ప, అంబటి సుబ్బడు. 14వ కేసు ఆకుల సుబ్బడు, 15వ కేసులో 14మంది ఉన్నారు.
1846 డిసెంబరు 8నాడు స్పెషల్ కమీషనర్ అరెస్టయిన వారందరి కేసులు విచారణ జరిపారు. జూలై 23, 24 తేదీల్లో ముండ్లపొడు వద్ద పట్టుకున్న 85మందిని తిరుగుబాటు చేశారన్న నేరానికి వారిని తమ ఇండ్ల నుండి, లేదా పనిచేస్తున్నవోట నుండి తెచ్చారనీ, తిరుగుబాటు సంగతి తమకు తెలియదనీ అన్నారు. వారిలో 80మంది ఏ నేరం చేయలేదంటూ వారిని విడుదల చేశారు. అయిదుగురికి శిక్ష విధించినా క్షమాభిక్ష పెట్టి జైలుశిక్ష తగ్గించారు.
ఒకప్పుడు తిరుగుబాటుదార్లకు పట్టుబడి, విడుదలయిన తహసిల్దారు తనకు పింఛను ఇవ్వవలసిందిగా పెట్టుకున్న అర్జీని స్పెషల్ కమీషనర్ తిరస్సరించాదు.
కడపజిల్లా పాలేగార్లు 83
చిట్వేల్ తాలూకాలోని మాలకోయిలపల్లి పాలేగారు ఎం. వెంకట రామరాజుకు నరసింహారెడ్డి తిరుగుబాటుకు ముందు సాలుకు రూ. 156-ర5-%4 పింఛను లభించేది. తిరుగుబాటు, తర్వాత పింఛను నిలుపుచేశారు. అయినా ఆ పింఛను డిపొజిట్‌లో ఉంచారు. సోదరులిద్దరితో సహా వెంకటరామరాజును కోర్టులో హాజరుపరచి, నరసింహారెడ్డితో చేరాడన్న నేరం మోపి ఆజీవాంతం అండమానుకు పంపారు. మిగతా ఇద్దరు చెరి రూ.500/- వంతున చెల్లించి, అవనరమయినవ్వుడు వోజరయ్యే వోమీ మీద విడుదలయ్యారు. వెంకటేశ్వరరాజు తన పింఛను ఇప్పించవలసిందిగా అర్జీ పెట్టుకున్నాడు. నెలకు పింఛను రూ. 18-0-5 ఇప్పించవలసిందిగా కోరినా తిరస్కరించారు.
చాలామంది పట్టుబడినా తిరుగుబాటులో ఏదో ఒక పనిచేశారనే నేరం మోపారు. నేరస్థులు 1, 2 దండోరా కొట్టేవాడు, దివిటీ పట్టేవాడు. మిగిలినవారు బరువులు మోసే కూలీలు. 1 నుండి 4 వరకు తాము నరసింహారెడ్డికి సేవ చేశామని పేర్కొన్నారు. వారికి రోజు కూలి 2 అణాలు. మిగిలినవారు నరసింహారెడ్డి తమచేత బలవంతాన బరువులు మోయించాడనీ, తామై తాముగా వెళ్ళలేదనీ చెప్పారు. తిరుగుబాటుదారు వద్ద కూలి చేయటం నేరం కాదని 1808 రెగ్యులేషన్ ౪11. సెక్షన్ 11 ప్రకారం వారు చేసినది తిరుగుబాటు కాదని ఖాజ్‌దారి అదాలత్ తీర్పు చెప్పారు.
1846 నవంబరు 12 స్పెషల్ కమీషనర్ కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం 153మంది అప్పటికి విచారణకు రాగా 66మంది మీద విచారణ జరిపి నేరస్టులుగా నిర్ణయించారు. వారిలో ఒకడు నరసింహారెడ్డి దర్జీ. అటువంటిది నేరం కాదని స్పెషల్ కమీషనర్ తీర్పు. మరో 686 మందిని పట్టుకునేందుకు వారెంట్లు జారీ అయ్యాయి. నరసింహారెడ్డి తయారు చేసుకున్న జాబితాలో ఈ పేర్లున్నాయి. చాలా తీవ్రంగా పోరాడిన వారిమీద కరిన చర్య తీసుకుని అది మిగిలినవారికి గుణపారం అయ్యేలా చూడాలని ఇంగ్లిస్ అభిప్రాయపడ్డాడు. దానినిబట్టి ట్రైజరీని కొల్లగొట్టటోతున్నారని తహసిల్టారుకు ముందే తెలుసునని స్పష్టమయిందన్నాడు. తవానిల్టారు వట్టుబడినవ్వుడు అందరూ
వ! సీమపాలేగార్లు హర్షించినవారేగానీ విచారించినవారు కాదు. తిరుగుబాటును అణచటంలో కొక్రెయిన్‌తో కలసి పనిచేసిన స్కాట్ రాసిన లేఖలో ఉన్నాయి.
కడపలో జరిగిన తిరుగుబాటు చాలా తీవ్రమయినది. తిరుగుబాటు నాయకుడు నరసింహారెడ్డి, ఆయన అనుయాయులను పట్టివేయడంతోను, రెడ్డిని ఉరితీయటంతోను ప్రమాదం తప్పిందని చాలామంది అనుయాయులను చంపివేశారు. కడప యాక్టింగ్ మేజిస్టేట్ కొక్రెయిన్, సైనిక దళాల కమాండెంట్ కెప్టెన్ నాట్స్ కర్నూలు, ఆశ్వికదళ కమాండెంట్ కెప్టెన్ రసెల్ ఈ పోరాటంలో పాల్గొన్న ఆఫీసర్లు, సిబ్బంది అందరూ తమ పనికి ప్రభుత్వ (ప్రశంసలను పొందారు.
ఈ రీతిని అతి పెద్దయెత్తున (ప్రభుత్వాన్ని కూలదోసేందుకు 1847లోనే (ప్రయత్నం జరిగింది. అయితే ఉత్తరాదిన 1857లో జరిగిన తిరుగుబాటును చరిత్రకారులు ప్రథమ స్వాతంత్ర్య సమరంగా పేర్కొనటం అంత సమంజసమని అనలేం. రెండు సమరాల్లోనూ వైఫల్యం అందరూ ఐక్యంగా పోరాడలేకపోవడం, భిటీష్‌వారికి గల ఆయుధబలం భారతీయ సైన్యానికి లేకపోవడం కూడా కారణం కావచ్చు. ఏక సమయంలో వివ్లవజ్యోతి దేశవ్యాప్తంగా వ్యావించకపోవడం, విదేశీపాలన వలన కలిగే నష్టాన్ని అందరూ గుర్తించకపోవడం వైఫల్యానికి కారణమయినా దేశంలో ఒక జాగరూకత ఏర్పడటానికి ఈ రెండు విప్లవాలూ ఉత్తేజం కల్పించి దోహదం చేశాయనటంలో
"సందేహం లేదు. ముగింపు
తిరుగుబాటు ప్రారంభం కాగానే అదివరకు తలపెట్టిన పోలీసు సంస్కరణలు నిలుపుచేశారు. పోరాటదళమయిన కట్టుబడిదార్లకు వారసులు లేకుంటే వారి భూములను ప్రభుత్వం వశపరచుకుంటుందని రెవిన్యూబోర్జు భావించలేదు. కట్టుబడిదార్ల భూములు మొదటినుంచీ వారసత్వ భూములేనని 1821లో మనో ఉత్తర్వు గురించి ఉత్తర (ప్రత్యుత్తరాల్లో ప్రస్తావించనేలేదు. 1801లో మన్రో ఉత్తర్వు ప్రకారం కట్టుబడులను వీలైనచోట్ల ప్యూన్‌లుగాను,
కడపజిల్లా పాలేగార్లు 805 తలారీలగాను ఉపయోగించాలి. ఇనాంలను వారు అనుభవించుకోవచ్చు దత్తమండల కట్టుబడి ఇనాంలు మొదటినుంచీ వంశపారంపర్యమేనని, ఇనాంల నుండి వారిని తొలగించరాదనీ ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. కట్టుబడి ఇనాంల విషయంలో ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరించే వీలు లేదు. ఎవరి సేవలు" అనవసరమనుకుంటే వారందరి భూములు తీసుకోవటానికి వీలు లేదు, అవకాశం లేదు.
ఇనాంలను అనుభవించే వారిని తప్పనినరిగా తమ సేవలలో ఉపయోగించుకోవాలనే నిబంధన లేదు. ప్రభుత్వం కోరినప్పుడు మాత్రమే ఇనాందార్లు ప్రభుత్వానికి తోద్బడాలి. ఇనాంలమీద బతికేవారు ఎల్లప్పుడూ ప్రభుత్వ సేవలో ఉండాలి. ఇనాంల మీద చాలినంత ఆదాయం రానివారు ప్రభుత్వానికి వంతులవారీ సేవ చేయవలసి ఉంటుంది. మిగిలిన ఇనాందార్ల గురించి ప్రభుత్వం పట్టించుకోనవసరం లేదు. శిస్తు ఏమాత్రం చెల్లించకుండా సాలుకు రూ. 24/-, అంతకు మించిన ఆదాయం కలవారు మొదటి రెండు తరగతులకు చెందినవారు. సాలుకు రూ. 15/- ఆదాయం కలవారు ప్రభుత్వానికి సదా తోడ్చడే స్థాయికి చేరుకుంటారు. ఇనాందార్లను వారి [గ్రామాలు వదలి సహాయం చేయాలని కోరడం సమంజసం కాదని ప్రభుత్వం భావించింది. దత్తమండలంలో ఏ తరహా కట్టుబడులయినా వారసులు లేనివారి భూములు ప్రభుత్వపరం కావాలని నిర్ణయించారు.
ఉరిస్తంభమెక్కిన నరసింహారెడ్డి తహసిల్దారు తనను పట్టుకురావలసిందిగా వారంటు వంవీ ఎంతో వరువుగా, వలుకుబడితో ఉన్న తనను అవమానించాడనీ, ఆ తహసిల్టారును తిరిగి షదవిలో నియమించకూడదనీ, ట్రెజరీని కాపలా కాయకుండా పారిపోయి దాక్కోనటాన్ని మరువకూడదనీ చెప్పాడు. తన స్వంతపైకాన్ని తిరుగుబాటుకు మూడు రోజులు ముందే తహసిల్దారు ట్రెజరీ నుండి తొలగించాడనీ, 11 నవంబరు కేసులో మజ్టేరి నరసింహారెడ్డి తిరుగుబాటు చేశాడనీ, ఇంకా ఇతర నేరాలు చేశాడనీ కోయిలకుంట్ల మున్నీ కృష్ణారావు, బండారు రామయ్య సాక్షులయ్యారు. డిసెంబరు
86 సీమపాలేగార్లు 8నాటికి జమ్మలమడుగునుంచి 93 మందిని బందీలుగా తీసుకువచ్చి కడపలో కొత్వాల్ చావిడి దగ్గర ఒక ఇంట్లో ఉంచారు. అందులో సగంమందికి కూడా ఆ ఇల్లు సరిపోదు. ఒక ఆఫీసరును, 50మందిని ఇంటికి కాపలా ఉంచారు,
కేసు నంబరు 17లో మాలవెంకటగాడు, మాల వందమని గురవడు, తిరుగుబాటు నాయకునితో చేరారు. ఖాదీలందరూ వేర్వేరు చోట్ల నల్లమల అడవుల్లో పడమటివైపు 1846 జూలై 25వ తేదీ పట్టుబడ్డారు. వీరంతా ఆ ముందురోజు ముండ్లపూడి నుండి చెల్లాచెదరయినవారు కావచ్చు. తామంతా నరసింహారెడ్డి వెంట ఉన్నట్లు అంగీకరించారు. వీరందరినీ వడుదల చేశారు.
కేసు నం.1లోని సనబోయన సుబ్బడికి తిరుగుబాటు, హత్య, దోపిడీ నేరాలకింద మరణదండన విధించారు.
కేసు నం. 29లో ఉయ్యాలవాడలోని పాపం కట్టుబడులు మంగడు, దూదేకుల జమాల్ సాక్ష్యమిస్తూ తిరుగుబాటు నాయకుడు నరసింహారెడ్డికోసం గొండ్ల వెంగన్న దగ్గర, కోమటి పాలూరు వెంకటరాముని దగ్గర విరాళం కోఠారని చెప్పారు.
బెకు గ్రామం మీద తిరుగుబాటుదార్లు దాడి జరిపినప్పుడు, అప్పాసామిని హత్యచేసినప్పుడు వెంకటరామరాజుల ఇంటిలోకి నరసింహారెడ్డి దొడ్డిదారిన ప్రవేశించి వారితో మాట్లాడాడని 3వ సాక్షి శేషన్న నాలుగవ సాక్షి అచ్చమ్మ చెప్పారు. స్పెషల్ కమీషనర్ ఎదుటికి ౯ నప్పుడు తమచేత బలవంతంగా ఆ సాక్ష్యం ఇప్పించారని చెప్పారు. వీరిద్దరినీ సబ్ క్రిమినల్ జడ్జి వద్దకు పంపి విడుదల చేశారు. తిరుగుబాటు శర్వాత పింఛనులు
1807 నాటికి ఇక ఎన్నటికీ తలెత్తలేనంత దెబ్బతిన్న పాలేగార్లు పేదరికంలో మగ్గుతూ పెంకుటిళ్ళ నుండి పాకల్లోకి మారారు. కోటలన్నీ దాదాపు బీడుపద్డాయి. మనో ఖైడు చేసిన, లొంగదీసిన 80 పాలేగారు కుటుంబాలకిచ్చిన పింఛను దాదాపు రూ. 25,632/-. అందరికన్నా ఎక్కువ పింఛను సాలుకు
కడపజిల్లా పాలేగార్లు 87 వెంకటప్ప నాయుడికి రూ. 2,625/-. అందరికన్నా తక్కువ పింఛను సాలుకు చెన్నప్ప నాయుడికి రూ. 17.50.
పోరుమామిళ్ళ పాలేగారుకు పింఛను లేదు.
రావూరు పాలేగారు కుటుంబం సమసిపోయింది.
గుజ్జంకొండ చాలాకాలం అలవెన్సు పొందారు.
నర్సపూరు, హనుమత్‌గుండు - నైజాంతో వ్యవహారంలో మహిల పాత్ర అధికం.
తిప్పరెడ్డిపల్లి - ముసల్మాన్ పాలేగారుగా ఎస్టేటు కంపెనీ వశమయింది. నరసనాయుని మరణానంతరం భార్య సాహస పోరాటం.
ఉప్పలూరు - 1748లో ఒకసారి 1761లో ఒకసారి దాడిచేసి
. పాలేగారును హైదరు తరిమిగొట్టాడు.
గట్టు - 1718 నుండి 1771దాకా హైదరాలీ వసూళ్ళు చేశాడు. కారన్‌వాలీస్ పాలేగారుకు సనదులిచ్చాడు. 1791-92లో కచేరికి రాలేదని మన్రో గట్టు పాలేగారును తరిమిగొట్టాడు.
బత్తలాపురం - 1718 వరకు మార్పు లేదు.
సోంపల్లి - (గ్రామాలలో బ్రిటీష్ సిబ్బందిని నిలిపారు.
అనంతపురం ప్రధాన కార్యాలయంగా వ్యవహరిస్తూ బళ్ళారి జిల్లాలోని తాలూకాలను మనో తన స్వాధీనంలో ఉంచుకున్నాడు.
(బిటీష్‌వారికి నైజాం దత్తమండలాలను ఇచ్చిన సందర్భంలో శాంతి భద్రతలను నిలబెట్టే ప్రయత్నంలో ముందుజా(గ్రత్త చర్యగా గుత్తి కోటలోను, బళ్ళారిలోను ప్రభుత్వ నిర్బంధంలోనివారు -
మహబత్‌ఖాన్, కాకిమ్ మియాన్ : తలపుల నవాబులు. 20 ఏప్రిల్ 150౮1 కోటను, తలపుల జిల్లాను కంపెనీకి అప్పగించేందుకు నిరాకరించారు.
రాయదుర్గ రాజా గోపాల్‌నాయుడు : 28 సెప్టెంబరు 1801. రాయదుర్గ జిల్లాను ముట్టడించినందుకు 1799లో నిజాం అధికార్లు బంధించి
88 సీమపాలేగార్లు హైదరాబాదుకు ఖైదీగా తీసుకెళ్ళి రెసెడెంటుకు అప్పగించారు. రాయదుర్గను కంపెనీ వశపరచుకుంది. నరస్‌ంహారెడ్డి: 1801 నవంబరు 25. ప్రభుత్వ (గ్రామాలు రెండింటిని అప్పగించేందుకు, తను చెల్లించవలసిన శిస్తు బకాయిల పరిష్కారం కోసం కచేరికి రావటానికి నిరాకరించినందుకు. కమలాపాడు రంగప్పనాయుడు : 1801 డిసెంబరు 5. గుర్రప్పనాయుడు చెప్పినట్టుగా కమలాపాడు కోటను కాపాడుతూ కంపెనీ వ్రభుత్వాన్ని ఎదిరించినందుకు. రవ్‌రవి గౌరప్ప, రవ్‌రవి నర్ఫోజి : 18 డిసెంబరు 1801. 1801లో కంపెనీ ప్రభుత్వాన్ని ఎదిరించి, రవ్‌రవి కోటను రక్షించే ప్రయత్నం చేసినందుకు సైన్యానికి స్వాధినమయ్యారు. మాదిరెడ్డిపల్లి బాల వెంకటాద్రినాయుడు : 16 వప్రిల్ 18083. 1800/ 1లో మాదిరెడ్డిపల్లెను అప్పగించేందుకు నిరాకరించి, శివార్లలోని (గ్రామాలను దోచుకోవడం. పుల్లలచెరువు దేవప్పనాయుడు, దివాకరనాయుడి ప్రధాన సిబ్బంది : 4 నవంబరు 1804 దివాకరనాయుడును వెంటనున్న సిబ్బందితో కంపెనీ పైనికులను 1801/2లో ఎదిరించినందుకు నిర్భంధం. గట్టు రఘుకులనాయుడు :18 జూలై 1805. తిరుగుబాటు ధోరణి అవలంబించినందుకు జిల్లా నుండి బహిషారం, నిర్బంధం. నాగులదిన్నె ఫకీరినాయుడు : 15 నవంబరు 1806. ఆదోని డివిజన్‌లో సబ్-ఆర్దినేట్ కలెక్టరు జారీచేసిన ఉత్తర్వులను తిధస్మరించినందుకు నిర్బంధం. (సంతకం) పి. బ్రూస్ ప్రభుత్వ వ్యతిరేకంగా నేరాలు చేసినందుకు నిర్బంధంలోకి వచ్చినవారు
- (1804వ సంవత్సరంలో) ఛార్జీ సంగ్రహంగా - నార్‌గౌడ్ అన్‌లు పన్నిన కుట్రలో భాగస్వాములు.
కడపజిల్లా పాలేగార్లు 89 తిమ్మభట్ (17 ఏప్రిల్ మూగోవింద నారప (4 మే) కొంకనూర్ రమణ (16 మే) తిమ్మన్న (16 మే) బాలప్ప (19 మే) చిర్ల గౌడప్ప (28 మే ఖౌొందె రామరావ్ (26 జూన్) మల్లారెడ్డి (17 జూన్) బూమ్లపూర్ అన్నప (2 జూలై) హుడ్డూర్*దచీమ తిమ్మన భట్ 'పెరుమాల్ నాయుడు (19 సెప్టెంబరు) రామ, నాగ (9 సెప్టెంబరు) కొనకొండ్ల దోపిడీలో గురప్పనాయుడిని ప్రోత్సహించి, తోడ్పడి, సాయుధ దళంతో కంపెనీ దళాన్ని ఎదిరించి, నారగౌడ్ పన్నిన కుట్రలో పాల్గొనటం. చిత్తూరు పాలేగాళ్ళు చిత్తూరు పాలేగార్ల తిరుగుబాటును అణచడానికి 78వ రెజిమెంట్‌కు చెందిన లెప్టినెంట్ కర్షల్ మనిపెన్నిని సైనికదళంతో పంపారు. పాలేగార్లు ఇతర పాలేగార్లతో కలవకుండా చూడాలి. మనిపెన్నితో సహకరించాలి, మనిపెన్ని స్థానికంగా అవసరమయిన సంఖ్యలో సిబ్బందిని సమకూర్చుకోవచ్చు. గట్టు పాలేగారు ప్రతిఘటిస్తున్నాడనీ, గట్టుపాళెం వశపరచుకోవటానికి 19వ నేటివ్ రెజిమెంట్‌లో 2వ పటాలాన్ని చిత్తూరు నుంచి గు(ర్రంకొండకు తరలించారు. గట్టు పాలేగారు లొంగిపోతే పాళెం నుండి దూరంగా అతనికి
వ సీమపాలేగార్లు వసతి కల్పించాలి. ఇప్పటి అతని ఆదాయం ఎంత ఉన్నదో అంత మొత్తాన్ని ఆయనకు ఇప్పించాలని ప్రధాన కార్యదర్శి రాశారు. 1)
పుంగనూరు పాలేగారు కంపెనీ అధీనంలోకి రావటాన్ని డైరెక్టర్లు వ్యతిరేకించలేదు.
పుల్లలచెరువు జమీందారు జల్లి దివాకరనాయుడు 1806 నవంబరు 7న గవర్నరుకు పెట్టుకున్న అర్జీలో ఇలా తెలియజేశారు. ఆ జమీందారీ తాతల నుండి వారికి చెందినదే. టిప్పు మీద కారన్‌వాలిస్, మెడోస్ దండయాత్ర జరివినవ్వ్చుడు దివాకరనాయుడి సోదరుని బంధించారు. ఆస్తులను దోచుకున్నారు. తనను బంధించేందుకు వివిధ విధాల ప్రయత్నిస్తున్నారనీ, తాను అన్నివిధాల విధేయుడై ఉంటాననీ విన్నవించుకున్నాడు.
కడప కలెక్టరుకు రెవిన్యూ డిపార్టుమెంటు డెప్యూటీ సెక్రటరీ ఫోర్ట్ నుండి 4 మే, 1808న లేఖ రాస్తూ, కలెక్టరు పంపిన స్టేట్‌మెంట్ ప్రకారం ఖైదు చేయబడినవారు మూడు తరగతులు - సామూహికంగా దోపిడీకి పాల్పడినవారు = కమలాపాడు రంగప్పనాయుడు, మూతరెడ్డి బాలు వెంకటాద్రినాయుడు, పూలచెరువు దేవప్పనాయుడు, గట్టు రఘుమూలనాయుడు, నాగులదిన్నె ఫకీర్‌నాయుడు. వీరిమీద విచారణ జరపాలి. వారిని విడుదల చేసినా మరలా దుండగాలకు పాల్పడబోమని వారిని జామీను మిద విడుదల చేయాలి. మరొక తరగతి ఖైదీలను విడుదల చేయాలనుకున్నారు. కరని గౌడప, నరసోజి. వీరిని గురించి పూర్తి నివేదికను ప్రభుత్వం కోరింది. ఆ తర్వాత వారు దుండగాలకు పాల్పడకపోతే విడుదల వేయవచ్చునేమో ఆలోచించవలసిందిగా కోరింది. బేషరతుగా విడుదల చేసినా దుండగాలకు పాల్పడుతారనే అనుమానం
- కడప సంగ్రీస్ - వాల్యూమ్ 26255 - యాక్టింగ్ మేజిస్ట్రేట్ కాక్రైయిన్
పులివెందల నుండి 89 మార్చి 1847న రాసిన ఉత్తరం. స్పెషల్ కమిషనర్
ఇంగ్లీస్ నివేదిక.
కడపజిల్లా పాలేగార్లు 9్షే ఉన్నవారిని - తలపుల జాగీర్‌దార్లు, మొహబ్బత్‌ఖాన్, హకీమ్ మియాన్, రాయదుర్గ గోపాల్‌నాయుడ్డు, నరసింహారెడ్డి.
వారినప్పట్లో వదలిపెట్టడం ప్రమాదమని రెవిన్యూ బోర్డు భావించింది. లోగడ పాలేగార్ల అధికారం చలామణీ అయిన ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారం ఏర్పాటయింది. కొందరిని హామీమీద వదలిపెట్టవచ్చని రెవిన్యూ బోర్జు ఆలోచించింది. తప్పనిసరి అనుకున్న వారిని నిర్బంధం నుండి వదలకూడదని భావించారు. *)
(1) కడప జిల్లా రికార్డులు - వాల్యూమ్ 635. ఫోర్ట్ సెయింట్ జాద్ది నుండి డెప్యూటీ సెక్రటరీ 4 మే 18086 న రాసిన లేఖ.
అనుబంధం - 1
నల్లమల కొండలు
కడప నుండి ఉత్తరంగా కృష్ణానది వరకు దాదాపు 130 మైళ్ళు. కడప కలెక్టరేటులో ఉన్నా గాజులపల్లి నుండి కృష్ణానది మీద హుసేన్‌నగర్ ఘాట్ వరకు 60 మైళ్ళు మాత్రం కర్నూలు జిల్లాలో ఉంది. ఈ కొండల్లో మూడు కనుమలున్నాయి.
నంద్యాలపేట కనుమ కడప నుండి 19 మైళ్ళ దూరమయినా బద్వేలుకు, కంభంకు దారితీస్తుంది. కడప నుంచి 28 మైళ్ళు ఉత్తరంగా కంభం వెళ్ళే ఏడడుగు కనుమ. ఈ రెండు కనుమల్లో బండి వెళ్ళే వీలుంది. కడపకు 700 మైళ్ళలో ఉత్తరాన నంది కనుమ, బళ్ళారి, గుత్తి, కర్నూలు నుంచి కంభం, ధూపాడుకు నేరుగా రోడ్డు. బరువులతో ఎడ్లు కూడా పోలేవు. 35 నుంచి 40 మైళ్ళు ఏడడుగు కనుమ నుంచే వెళ్ళాలి.
కొండలమీద కాలిబాటలు బాగా వాడుకలో ఉన్నాయి.
గుత్తి కనుమ : కడప జిల్లాలో కోయిలకుంట్ల నుంచి రుద్రారుకు, కంభం నుంచి గిద్దలూరుకు కాలిబాట.
కొత్త కనుమ : కడప జిల్లా కంభం తాలూకాలోని కొత్త చెరువు నుంచి కోయిలకుంట్ల తాలూకాలోని బసవపురానికి కాలిబాట.
మూడవది : కర్నూలు జిల్లా నాగలాపురం నుంచి కడప జిల్లా కంభం తాలూకాలో బెక్ వరకు.
నాలుగవది : కర్నూలు జిల్లా నాగలాపురం నుంచి కంభం తాలూకాలోనే కొత్తూరు వరకు.
ఐదు, ఆరు; కూర్తి కనుమ, మంత్రాల కనుమ - రెండూ కూడా కర్నూలు జిల్లా ఆత్మకూరు నుండి కంభం తాలూకా డోర్నకల్ వరకు.
అనుబంధం --1 త్ర
ఏడవది : కర్నూలు జిల్లా మువ్వచెరువు నుంచి, కంభం తాలూకా గుంటావానిపల్లి వరకు.
ఇంకా ఎన్నో దారులున్నాా అవి చెంచులకు మాత్రమే తెలుసు.
వడడుగు కనుమకు ఉత్తరంగా 16 నుంచి 20 మైళ్ళ వెడల్పున్న కొండలు కడపవైపు చాలా సన్నగిల్లాయి.
నల్లమలై : ఎ(ర్రమలై కొండలలోని కోటలన్నీ సర్వే చేసి ఆ ప్రాంతంలో పాలేగార్ల బలమెంతో అంచనా వేసి, బలగాన్ని తొలగించి ఇకముందు పాలేగార్లు తిరగబడకుండా చూడాలని బ్రిటీష్ ప్రభుత్వం ఉత్తర్వు చేసింది. ఆ బాధ్యత నిర్వహించి నివేదించిన ఆఫీసర్లు - దత్తమండలాల డెప్యూటీ అసిస్టెంట్ క్వార్టర్ మాస్టర్ జనరల్ మేజర్ హెచ్.ఎల్. హారిస్. దత్తమండలాల కమాండింగ్ (బ్రిగేడియర్ జనరల్ జె. ఆందర్సన్.
అనుబంధం - 11 రెవిన్యూ పదజాలం కట్టుబదులు
తాము పొందిన ఇనాంకు బదులుగా నాయకునికి సొమ్ము చెల్లించేవారు. కోరినప్పుడు పాలేగారు సిబ్బందిగా పనిచేసేవారు. ఆదాయం తక్కువగా ఉ న్నందున పటిష్టంగా పని చేయలేకపోయారు. శిస్తు చాలా అధికం కావటంతో మాన్యాలను వదులుకునే స్థాయికి వచ్చారు. మొత్తం 11,756 కట్టుబడులలో 557మంది భూములను మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం తలపెట్టింది.
భటవృత్తి ఇనాంలు : ఈ ఇనాంల మీద శిస్తు చెల్లింపనవసరంలేదు. జాగీర్జార్లు ఈ ఇనాంలు బ్రాహ్మణులకిచ్చారు. మన్రో ధర్మాదాయం పద్దుకింద చూపాడు.
జైరతీలు : ముస్లింలకు జీవనాధారంగా ఇచ్చిన భూములు. మనో వీటిని ధర్మాదాయ పద్దు కింద చూపాడు.
ఈ పై రెండు తరహాలను ఇతరులకు బదలాయించకూడదు. స్టానిక న్యాయస్థానాలు ఇందుకు అంగీకరింపవు. ఈ భూములను ఎంతకాలం అనుభవింపవచ్చుననే నిర్ధారణ లేదు.
కనుంగో : భూమి శిస్తుకు సంబంధించిన వివరాలు రిజిస్టరు చేసే వ్యక్తి.
కరణం: (గ్రామంలో వ్యవసాయం, ఉత్పత్తి, రైతుల శిస్తులు చూసే వ్యక్తి
కచేరి : రెవిన్యూ కార్యాలయం.
ఇనాం : బహుమానం. శిస్తు చెల్లించే అవసరం లేని భూమి బహుమతి. (1) గెగ్ - లైఫ్ ఆఫ్ మన్రో - వాల్యూమ్ 11 పేజీలు 452 - 457.
అనుబంధం - 11 లిక మిరాసాదారు : వంశపారంపర్యంగా భూమి పొందినవాడు. తహసిల్డారు : పన్ను సేకరణకు దేశీయ అధికారి. జమీందారు: మహమ్మదీయ (ప్రభుత్వంలో భూముల పర్యవేక్షకుడు. బ్రిటీష్‌కాలంలో వారిచ్చిన భూములు అనుభవిస్తూ నిర్ణయించిన మొత్తాన్ని (బిటీష్‌వారికి చెల్లించేవాడు.
అనుబంధం - ££.1
కడప జిల్లాలో ప్రధానమైన కోటలు
జిల్లాలో పాలేగార్ల అణచివేత పూర్తికాగానే ఆ జిల్లాలోని పాలేగారి కోటలను సర్వే చేసి నివేదించవలసిందిగా (వ్రభుత్వం అధికార్లను నియమించింది. కడప జిల్లాలో ముఖ్యమైన కోటలు చాలా ఉన్నాయి.
గండికోట: కడప జిల్లాలో జమ్మలమడుగుకు 10 కి.మీ. దూరంలోని గిరిదుర్గం. పెన్నానది 5 కి.మీ. పొదవునా గండికోసి లోతు (ప్రవాహంగా పెట్టని కందకమైనందున కోట 'అభేద్యం. గండిపై నిర్మించినందున గండికోట అయింది. కోటను నిర్ణయించిన పొలిమేర చుట్టూ తిరిగి రావడానికి దాదాపు నాలుగు ఆమడలు అంటే దాదాపు 50 మైళ్ళు. 1128 జనవరి 09వ తేదీకి కోట కట్టడం పూర్తయిందిఃగండికోట పేరు శాసనాలలో మొదటిసారిగా క్రీశ. 1279 నాటి ఉత్తరాల శాసనంలో కనబడుతుంది.
తళ్ళికోట యుద్ధం తర్వాత మహమ్మద్ కులి కుతుబ్‌షా మంత్రి అమీర్ ఉల్ ముల్క్ గండికోటను వశపరచుకున్నాడు. 17వ శతాబ్ద మధ్యకాలంలో ఈ కోటను గోల్కొండ సుల్తాను అబ్బుల్ కుతుబ్‌షా సైనికాధికారి మీర్‌జుమ్లూ స్వాధీనపరచుకున్నాడు. కోటలో తెలుగులోనేగాక పారశీకంలో మొత్తం 15 శాసనాలున్నాయి. గోల్కొండ సుల్తానులను ఓడించగా 1687లో బెరంగజేబు వశమయింది. కడప నవాబులు, ఆ తర్వాత ఆంగ్లేయుల చేతికి వచ్చింది. కోటలోపల, వెలుపల మొత్తం 12 దేవాలయాలున్నాయి. వేమన పద్యాలలో గండికోట ప్రస్తావన ఉన్నందున వేమన గండికోటవాడని, తెలుగు సాహిత్యాన్ని ఉద్ధర్షించి భాషా సేవ చేసిన ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ భావించాడు.
గండికోట శత్రు దుర్భేద్యంగా నిర్మించబడినది. పశ్చిమాన చిన్న ద్వారం నుండి పెన్నానది వరకు దిగటానికి మెట్లున్నాయి. కోట చుట్టూ మొత్తం 101 బురుజులున్నాయి. ఫిరంగులనుపయోగించేందుకు కోటగోడలో అక్కడక్కడ
అనుబంధం - 111 97 పెద్ద రం(ధ్రాలున్నాయి. గండికోట కైఖియత్ ప్రకారం మొత్తం 31 ఫిరంగులుండేవని తెలియవస్తుంది. కోట వాకిలి మూసేందుకు గడియ(మాను తలుపుల వెనుకభాగాన అమర్చారు. తలుపులు మూసేందుకు, గడియ లాగేందుకు ఏనుగులను ఉపయోగించేవారు. గండికోటలో మహలు, జమ్మామసీదు, చార్‌మినార్ ఉన్నాయి. ధాన్యాగారాన్ని బ్రిటీష్ అధికార్లు సమర్పించిన నివేదిక ప్రకారం సగం కోటను పేడతో అలికారు. సగం కోటకు సున్నం కొట్టారు. రెండు ద్వారాల్లో ప్రజల రాకపోకలకు భూమివైపు దారినే వాడేవారు. నదివైపు గేటుకు రెండు దారులున్నాయి. ఒకటి బండి బాట అయితే, రెండవది బరువులు మోసే జంతువులకు. కోటకు దారితీసే కాలిబాటలెన్నో ఉన్నాయి. వానాకాలంలో మాత్రమే సదిలో నీరుండేది. 1847 నాటికి కోట మరమ్మత్తులలో ఉంది. కోటగోడ అక్కడక్కడా పడిపోయి, గోపురం, మసీదు గాక భవనాలన్నీ శిధిలావస్థలో ఉన్నాయి. కోటలోని 117 ఇళ్ళలో రవందలమంది ఉన్నారు. కోటకు మూడువందల గజాల్లోని ఊర్లో 47 ఇండ్లున్నాయి. కోటలో ఏడు ఊట చెరువులుండి, వాటిలో ఎల్లప్పుడూ నీరుండేది. ఊరి సమీపంలోని బుగ్గల్లో కూడా నీరు పుష్కలంగా ఉండేది. కోట చుట్టూ భూమి అంత సారవంతమైనది కానందున కోటలోకి కింది నుండి ధాన్యం సరఫరా అయ్యేది. కోటలో పసుపు, కంద, చిలగడం, అరటి, నారింజ పండించి చుట్టుపక్కల పట్టణాలకు పంపేవారు.
దబ్బూడపల్లి : జమ్మలమడుగు తాలూకాలో గండికోటకు వాయవ్యంలో కాండ శివార్లలోని దబ్బూడపల్లి కోట (గ్రామానికి 200 గజాల దూరంలో ఉంది. రాతిగోడకు చుట్టూ మట్టిగోడ, 12 అడుగుల వెడల్పున, 12 అడుగుల లోతున కోట చుట్టూ కందకం ఉంది. దీనికి బురుజులు గానీ, గేట్లుగానీ లేవు. గ్రామంలోని ౩8 ఇండ్లలో దాదాపు 100 మంది నివసించేవారు. గ్రామంలో ఒక కొట్టు ఉండేది. కట్టెలు (వంటచెరకు) గ్రామస్థులకు ఇచ్చి, దానిబదులు ధాన్యం తెచ్చుకునేవారికి వీలుగా కోట పక్కనే దట్టమయిన అడవి ఉంది.
98 సీమపాలేగార్లు ఊరచింతల : బళ్ళారి జిల్లా తాడిపత్రి తాలూకాలో దబ్బూడపల్లికి వాయవ్యంలో ఎనిమిది మైళ్ళ ఉత్తరాన ఊరచింతల చతుర(స్రాకారపు చిన్న రాతికోట. కోటకు నలుమూలల నాలుగు బురుజులుండేవి. అక్కడ జాగీర్జారు కుటుంబం నివసించేది. ఉప్పునీటి బుగ్గకోటలో ఆధారం. గ్రామంలోని 52 ఇండ్లలో 180 మంది ఉండేవారు. ఆరుమైళ్ళలోని తాడిపత్రి సంత నుండి వారు సరుకులు తెచ్చుకునేవారు. తూములపెంట : ఊరచింతలకు రెండుమైళ్ళు వాయవ్యంగా జమ్మలమడుగు తాలూకాలోని చిన్న గ్రామం. తలారి చెరువుకు 8 మైళ్ళు ఉత్తరంగా ఉండేది. రెండువందల ఇండ్లలో 6588 మంది ఉండేవారు. నాలుగు వందల అడుగుల ఎత్తులో కోట ఉండేది. కోటలో 2 నీటి బుగ్గలు, ఒక దుకాణం ఉండేవి. దారి చాలా ఏటవాలుగా ఉందేది. చిన్న గుట్టమీద గ్రామంలో పది ఇండ్లుండేవి. ప్రజలు కావలసిన నీరు కింది నుండి తీసుకువెళ్ళేవారు. (గ్రామానికి వాయవ్యంలో రెండుమైళ్ళలోని కనుమ మీదుగా కడప జిల్లాలోని కోయిలకుంట్ల తాలూకా నుండి బళ్ళారి జిల్లాలోని యాడికికి వెళ్ళే వీలుంది. యాడికి తాలుకాలో కనుమ మధ్యన బాగసముద్రం (గ్రామంలో ఒక పెద్ద చెరువుకింద కొంత వరి పండేది. తలారి చెరువు: ఊరబింతలకు రెండుమైళ్ళు వాయవ్యంగా శిథిలావస్థలో తలారి చెరువు గ్రామంలో 45 ఇండ్లలో 150 మంది ఉండేవారు. నాలుగు నీటిబుగ్గలు, ఒక చిన్న దుకాణం ఉండేవి. సమీపంలో ఒక పెద్ద గుడి ఉందేది. ఊరి చుట్టూ కొండచరియల్లో గుబురు పొదలుండేవి. బూర్గుల : బళ్ళారి జిల్లా పంచపాళెం తాలూకాలోని బూర్జ్లుల (గ్రామం కోట చుట్టూ ఆరు బురుజులుండేవి. ఆందులో నాలుగు పడిపోయాయి. తూర్పు, పడమర గోడలు కూడా పడిపోయాయి. 250 ఇండ్లలో 9వందల మంది ఉండేవారు. ఊర్లో 9 నీటిబుగ్గలు, 2 దుకాణాలుందేవి. వేసవిలో నీరు ఎండిపోయి నీటికోసం పడమరగా రెండు మైళ్ళు వెళ్ళేవారు. పశువులతో సహా వెళ్ళినవారికి “అంతర్‌గంగి అనే బుగ్గనీరు లభించేది. బూర్లులకు దక్షిణంగా
అనుబంధం - 99 కనుమను కోటరాయుడు దేవస్థానం అనేవారు. పైన జొన్నలు పండేవి. ఇతర ధాన్యాలు కింద మైదానం నుండి తెచ్చుకునేవారు.
ఉప్పలపాడు : బూర్జులకు ఈశాన్యంగా ఆరున్నర మైళ్ళలో కడప జిల్లా కోయిలకుంట్ల తాలూక్తాలోని ఉప్పలపాడు పాతకోట 18 బురుజులున్నా శిధిలావస్థలో ఉంది. కోటలోకి చాలా దారులున్నాయి. 207 ఇంట్లలో 1006మంది ఉన్నారు. పది నీటిబుగ్గలు, రెండు దుకాణాలుండేవి.
రాయ్‌చెర్ల : ఉప్పలపాడుకు ఆరు మైళ్లలోని రాయ్‌చెర్ల రాతికోట చుట్టూ 16 గుండ్రటి బురుజులున్నాయి. చుట్టూ లోతు లేని కందకం ఎండిపోయింది. ద్వారం శిధిలమయింది. 250 ఇండ్లలో 1232మంది ఉండేవారు. 5 నీటిబుగ్గలు, 4 చిన్న చెరువులు, ఒక దుకాణం ఉండేవి. చుట్టూ ఉన్న పొలాల్లో సరిపడినంతగా ఆహారధాన్యాలు పండేవి.
మునిమడుగు : బళ్ళారి జిల్లా పంచెపాళెం తాలూకాలోని మునిమడుగు (గ్రామంలో రాయ్‌చెర్ల కోటవంటిదే ఉండేది. ఒకప్పుడు 5 వేల ఇండ్లుండేవి. ఈ సమాచార సేకరణ కాలానికి 206 ఇండ్లలో 777 మంది ఉన్నారు. 50 చిన్న చిన్న నీటిబుగ్గలు, 5 దుకాజాలుందేవి. 1767లో రాయ్‌చెర్ల, మునిమడుగు [గ్రామాల్లోని వ్యాపారులందరినీ ఒక ముస్లిం కమాండరు నైజాం రా్లానికి తరలించుకుపోయినట్లు తెలుస్తోంది.
భద్రాచలం : మునిమడుగుకు ఈశాన్యంగా బళ్ళారి జిల్లా.పంచెపాళెం తాలూకాలో 8 మైళ్ళలో ఉంది. మోటుపల్లి (గ్రామానికి పడమర ఒకటిన్నర మైళ్ళలోను, కడపజిల్లా కోయిలకుంట్ల తాలూకాలోని జెకుకు వాయవ్యంగా శ్రీ మైళ్ళలోని భద్రాచలంలో ఒకప్పుడు కోట ఉందేది. అది (పకృతి వైపరీత్యంలో ధ్వంసమయిపోయింది. సమీపంలో ఒక ఏరుండేది. అయినా ఈ సర్వేనాటికి అక్కడ కోట ఉన్న సూచనలేవీ లేవు.
పసుపులపెంట : భద్రాచలానికి వాయవ్యంగా దాదాపు 8 మైళ్ళలో బంగనపల్లి నవాబు జాగీరులోని పసుపులపెంట "గ్రామంలో గుట్టల మధ్య పొడుపడిన చిన్న కోట. కంభం నుండి బళ్ళారికి వెళ్ళే రహదారిలో ఉంది.
హెచ్.ఎల్.హారిస్, ఎస్. ఆండర్సన్ కోటలను పర్యవేక్షించి నివేదించారు.
100 సీమపాలేగార్లు తేల్‌దుర్ల్ : బంగనపల్లి నుండి ఎనిమిది మైళ్ళలోని తేల్‌దుర్గ్ గ్రామంలో పసుపులపెంట కోటవంటిదే చిన్న కోట ఉండేది.
ఈ కోటలన్నీ ఎర్రమల కొండలలోనివి. వీటిలో పేర్ళొనదగినవి గండికోట. కొండల్లో కాలిబాటలెన్నో ఉన్నందున బ్రిటీష్ (ప్రభుత్వం తరపున సైనికులు వెళ్ళటానికి, సామగ్రి తరలించటానికి పెద్ద ఇబ్బంది అనిపించలేదు.
రంగారెడ్డికోట : పడమట రుద్రారంకు, తూర్పున కొత్తకోటకు మధ్య దూరం 80 మైళ్ళు. ఈ రెండింటికి మధ్యలోనిది రంగారెడ్డి కోట. కోటచుట్టూ ఆరు బురుజులుండేవి. కోట మధ్యలో చెరువు ఎండిపోయింది. చుట్టుపక్కల 8 మైళ్ళలోపు ఎక్కడా నీరు లేదు. కొత్తకోట నుండి ఏటవాలుగా ఏర్పడిన మార్గం ముళ్ళపొదలతో నిండి ఉంది.
పులివెందుల తాలూక పార్లపల్లి : పాడుపడిన పాలేగార్ల కోటలో విజయనగర రాజు '్రొఢ దేవరాయని కాలంనాటి క్రీ.శ. 1476 నాటి శిలాశాసనం ఉంది. అక్కడి ఆశ్రమం కణ్వాళథ్రమం. అందులో రెండు గుడులున్నాయి.
బెక్ (అవుకు) : కోయిలకుంట్లనుంచి 14 మైళ్ళు. బెక్ డెప్యూటీ తహళిల్దారుకు, పోలీస్ ఇన్‌స్పెక్టరుకు కోయిలకుంట్ల ప్రధాన కార్యాలయం. బెకు చెరువు నిర్మించిన తిమ్మరాజు ఈ బెకు కోటను కూడా నిర్మించాడు. 'సెటిల్‌మెంట్‌కు ముందు బెకు వైశాల్యం 8002 ఎకరాలు. సెటిల్‌మెంట్ తర్వాత 8,568 ఎకరాలుగా నిర్ణయించారు. రెండు పోలీసు డివిజన్లలో 9 పోలీసు స్టేషన్లున్నాయి.
కోయిలకుంట్ల డివిజన్ : కోయిలకుంట్ల - దొన్నపాడు, ఉయ్యాలవాడ, నోసమ్, రెవనూర్.
బెక్ డివిజన్ : బెక్ ఆవులకొండ, తిమ్మనాయునిపేట, ఉప్పలపాడు.
వారపుసంతలు : కోయిలకుంట్ల, తిమ్మనాయనిపేట - శుక్రవారం. నోసమ్, బెకు - బుధవారం.
మదనపల్లి తాలూక : గట్టు కోటలో శక్రిమంతమయిన పాలేగార్లున్నారు.
అనుబంధం - 117 అనంతపురం జిల్లా పాలేగారు కోటలు
పత్తికొండ : 1858 వరకు బళ్ళారి జిల్లాలో ఉండగా దీనిని పంచపాళం అనేవారు. అక్కడ అయిదురుగురు పాలేగార్లకు అధికారం ఉండేది. ఈ పంచపాళెంమీద అధికారం చాలా చేతులు మారింది. మహారాఘ్టలు, హైదరు, టిప్పుసుల్తాన్ - అందరూ ఈ ప్రాంతాన్ని పాలించినవారే. ఎడతెగని పోరాటాలు కొనసాగుతూ ఉండి 1799లో టిప్పు మరణంతో (బిటీష్ పాలన ఏర్పడింది. వ్యవసాయ యోగ్యం కాని బీడు భూమి చాలా ఉండేది. రైత్వారీ పద్ధతిని (ప్రవేశపెట్టిన మన్రో మరణించిందిక్కడే.
కోటకొండ : (ప్రభుత్వానికి 5వందలమంది సిబ్బందిని సమకూర్చే ఒప్పందంతో గోనెగుండ్ల తలారి ఆదోని, గద్వాల్ కర్నూలు, ముద్గల, రాయచూరు ఆశ్విక దళాన్ని పొందాడు. శుల్కం చెల్లింపు క్రమబద్ధంగా జరగకపోవడంతో హైదరు ఈ కోటలను వశపరచుకున్నాడు. 1800లో పాలేగార్లకు పింఛను మంజూరు చేశారు.
తాడిమర్రి : అనంతపురానికి తూర్పున తాడిమ(ర్రిలో ఒక బలమైన కోట ఉన్న ఆధారాలున్నాయి. సాకే కొండన్ననాయుడనే పాలేగారుకింద 90 (గ్రామాలున్నాయి. ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన హైదరాలీ కొండన్ననాయుడును తొలగించాదు. తాడిమరర్రిలోని గ్రామాలను 1820 నాటికి అనంతపురం, తాడిపత్రి, పెనుగొండ ప్రాంతాలకు బదలాయించారు. కోట అడుగు ఇప్పటికీ కనబడుతుంది. 16 బురుజులు, వాటిమధ్య ఫిరంగులు నిలిపే గాడి ఉన్నాయి. కందకం వెడల్పుగా, లోతుగా రాతితో నిర్మించారు. కోటలోపల రాతి ఇళ్లు, మట్టి ఇళ్ళు కూదా పాడుబడి ఉన్నాయి.
ధర్మవరం : పాలేగారుది మూడంతస్టుల రాతి మిద్దె. ఆ ప్రాంతంలోనే లేనివిధంగా ఇటుకలు, సున్నం వాడారు. చెరువు గట్టుమీదే పాలేగారు
102 నీమపాలేగార్లు ఎక్కువకాలం గడిపేవాదట. హెచ్.ఎల్ హారిన్, ఎస్. ఆండర్సన్ కోటలను పర్యవేక్షించి నివేదించారు.
గుత్తికోట : 1799లో టిప్పు మరణానంతరం గుత్తికోట బ్రీటీష్‌వారి వశమయింది. కొండమీద పెద్ద కోట. ఎన్నో కట్టడాలు పాడుపడి ఉన్నాయి. తిరుగబడిన పాలేగార్లను బందీలుగా ఉంచేందుకు ఈ కట్టడాలను మనో ఉపయోగించుకున్నాడు. తర్శికోట యుద్ధంవరకు ఈ కోట విజయనగరవాసుల అధీనంలోనే ఉండేది. 1709లో టిప్పు మరణానంతరం గుత్తికోట బిటీష్‌వారి వశమయింది. కొండలను కలుపుతూ గోడలు నిర్మించారు. మిట్టపల్లాలు లేకుండా చదునైన ప్రొండాళ్లో ఇళ్ళు కట్టుకున్నారు. నైరుతిలో ఒక పెద్ద ద్వారం. కోటకు దారితీసే రెండు కాలిబాటలు. కోటకు నీటి సప్లయి నిలిపివేసి హైదరాలీ గుత్తికోటను వశవరచుకున్నాడు. కొండమీద చెరువులు, బావులు జలాశయాలున్నాయి. బైదీలనుంచేందుకు అనేక భవనాలున్నాయి. 300 అడుగుల ఎత్తయిన కొండచరియకు ఎదురుగా' బురుజులో చిన్న భవనాన్ని గచ్చుతో నునుపు చేశారు దానినే మరాఠీభవన్ ఆసనమంటారు. ఈ అసనం నుండి చూస్తే నగరమంతా కనబదేది. చుట్టూ కొండలుండటం వలన గుత్తికోటలో వేడిమి ఎక్కువ. ఇక్కడి యూరోపియన్ స్మశాన వాటికలో జిల్లా మొదటి కలెక్టరయి, ఆ తర్వాత మద్రాసు గవర్న్షరయిన ధామస్ మన్రో మృతదేహాన్ని 1827 జూన్ ఏడవ తేదీనాడు ఖననం చేసినా, ఆ తర్వాత మృతదేహాన్ని వెలికితీసి ఫోర్ట్ సెయింట్ జుర్జిలోని సెయింట్ మేరీ చర్చి ఆవరణలో సమాధి చేశారు.
గంపమల్ల : కొండలలో అతి ఎత్తయిన అడవిప్రాంతం. అనంతపురం, గుత్తి తాలూకాల మధ్య తరిమెల సమీపంలోని పాళెం.
మడకశిర : 1520లో 12 [గ్రామాలను జాగీరుగా పొందిన పాలేగారు కోటను నిర్మించాడు. అవసరమైనప్పుడు వెయ్యిమంది సిబ్బందిని సమకూర్చుతూ వచ్చాడు. 1741లో వహారా్టులు పాలేగారును ఓడించారు. ఆ ప్రాంతం మురారీరావు వశమయింది. 1769లో హైదరాలీ 15,000 రూపాయల కప్పం
అనుబంధం - 103 కోరాడు. కోటను ముట్టడించాడు. పాలేగారును బంధించాడు. ఈ పాలేగారును టిప్పు ఉరితీశాడు. టిప్పు మరణానంతరం 1799లో మడకశిర బిటీష్‌వారి వశమయింది.
అనంతపురం : విజయనగరపాలకుడైన రామరాజుకు సహాయపడినందున అనంతపురం, పరిసర (ప్రాంతాలు 1569లో హుండే కుటుంబానికి లభించాయి. రెండు శతాబ్దాలపాటు హుండే కుటుంబం అనంతపుర (ప్రాంతాన్ని పాలించింది.
కొండపి దుర్గం : కోటను రాయదుర్గం పాలేగారు నిర్మించాడు.
కోనకొండ్ర్ల : 1804లో కోనకొండ్లలో ఒక తిరుగుబాటు జరిగింది. సమీపంలోని కమ్మలపాడు (గ్రామం పాలేగారు గుర్రప్పనాయక్‌ను మనో తరిమిగొట్టాడు. దూదికొండ పాలేగారు పెరుమాళ్‌నాయక్‌తో కలిసి కోనకొండ్ల కోటమీద 2వందల మందితో దాడిచేశారు. కావలిగారితో సవా చాలామందిని చంపారు. కోటలో ఎన్నో కట్టడాలున్నాయి. గుత్తి నుండి సైన్యం వస్తుందని తెలుసుకుని దాడిచేసినవారు పారిపోయారు.
ఉదిరిపికొండ : కొండమీద మధ్యన ఉన్న గుండ్రటి కోటకు అనేక (ప్రాకారాలున్నాయి. కోట చుట్టూ అనేక బురుజులున్నాయి. బురుజులమీదనుంచి చుట్టుపట్ల దారులన్నీ కనబడతాయి. స్థానికంగా ఏ పాలేగార్లు పాలించారో వివరాలు లేకపోయినా, మెకంజీ పాత పత్రాల సేకరణలోని లోకల్ రికార్డులు 001 - ౫00/4 76లో కొన్ని వివరాలున్నాయి. జోగినాయుడు విజయనగర రాజులకాలంలో ఒక పాలేగారు, ఆయన కుమారుడు తిమ్మనాయుడు. 1556లో పెన్నహోబలం ఆలయానికి ఒక గ్రాంటు ఇచ్చినట్టు శాసనంలో ఉంది. ఉ దిరిపి కొండమీద ఎన్నో కట్టడాలు కట్టించాడు. తిమ్మనాయుని కుమారుడు నరసనాయుడు కోట పడమరవైపు ఒక బురు నిర్మించాడు. గ్రామం చుట్టూ మట్టిగోడ కట్టించి దానిమీద మరో బురుజు నిర్మించాడు. ఒక పెద్ద రాతిమీద నగరు కట్టించాడు. కిందున్న గ్రామంలో మరో నగరు (రాజభవనం) కట్టించాడు. నరసనాయుని కాలంలో ఆ కుటుంబం అతి ఉన్నతస్థాయిని అందుకుంది. కడప నవాబులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించాక (౫£ఏపి పాలేగారు కప్పం
104 సీమపాలేగార్లు చెల్లించలేక గ్రామం తర్వాత గ్రామాన్ని పోగొట్టుకున్నాడు. ఉదిరిపి కొండ, మారుట్ల, రామాపురం, కలగండ్ల (గ్రామాలు మిగిలాయి. ఈ నాలుగు గ్రామాలకు రెండువందల వరహాలు చెల్లించాల్సి ఉండేది. 1759లో మురారిరావు కింద మహారాష్ట్రల వశమయింది. 1775లో హైదరాలీ ఈ గ్రామాలపై అధికారం సంపాదించాడు. ఆ పాలేగారు వంశీయులను టిప్పు ఉరి తీయించాడు. కుందుర్సి (కళ్యాణదుర్గ్ తాలూక): 1652లో కోనేటినాయుడు వెనుకొండను అప్పగించి బీజాపూరు రాజు వద్ద నుండి కుందుర్చిని తీసుకున్నాడు. కొండమీద కోట పాడుబడింది. రాయదుర్గంలో ఒక కక్ష కుందుర్చి పాలేగారును ఆవ్వోనించారు. అదికారంలోని పాలేగారును తొలగించాలని ఉద్దేశించారు. కోనేటినాయుడు కుందుర్పితోపాటు రాయదుర్గం కూడా వశపరచుకున్నా, చివరకు బ్రిటీష్ అధికారం అక్కడ స్థిరపడింది. బుక్కపట్నం (పెనుగొండ తాలూక): తళ్ళికోట యుద్ధానంతరం బుక్కపట్నం హుండే పాలేగార్ల అధీనంలో ఉండగా రాయదుర్గం పాలేగార్లు దానిని వశపరచుకునే ప్రయత్నం చేశారు. రెండంతస్థుల కోట పొడుపడింది. మొదటి అంతస్థు రాతి కట్టడం, రెండవ అంతస్థు ఇటుకల గోడలు. పాముదుర్తి (పెనుగొండ తాలూక): పాతకోట. ఒక గ్రామ పెద్ద పాలేగారు వంశీయులకు 1791లో ఇచ్చిన పల్లకి ఉంది. తళ్ళికోట యుద్ధానంతరం విజయనగర రాజులు పాముదుర్తిలో నివసించారు. 1762లో ఈ కోట హైదరు వశమయింది. టిప్పు పతనం వరకు కూడా వారి ఆధీనంలోనే ఉండేది. రత్నగిరి (మడకశిరి తాలూక) ; మైసూరు రాష్ట్రంలోని సిరాపాలకులకు రత్నగిరిని బీజాపూర్ సుల్తాను ఇచ్చారు. మహారాష్ట్రల పన్ను “చౌత్” వసూలు అధికారి లక్షణనాయుదు. 1727లో రత్నప్రాంతం ఆక్రమించాడు. మైసూరు సైన్యం అతనిని వెళ్ళగొట్టారు. పాలేగారు కుటుంబం సైన్యాన్ని తరిమిగొట్టారు. హైదరాలీ రత్నగిరి తిరిగి వశపరచుకున్నాడు. 1799 వరకు రత్నగిరి మైసూరు అధీనంలోనే ఉంది.
అనుబంధం - 1 105
మునిమడదుగు : బళ్ళారి జిల్లా పంచపాళెం తాలూకా మునిమడుగు గ్రామం రాయచర్లకు ఈశాన్యంలో ఉంది..కోట శిధిలావస్థలో ఉంది. రాయ్‌చర్ల నుండి వాలు తక్కువగా ఉన్న కొండల మధ్య మైదాన ప్రాంతంలో మునిమడుగు (గ్రామం ఏర్పడింది. ఒకప్పుడు 5000 గృహాలుండేవి. పాలేగార్లను అణచివేసిననాడు అక్కడ 206 ఇళ్ళలో 777మంది జనం ఉన్నారు. 5 దుకాణాలున్నాయి. కోటలో 50 నీటిబుగ్గలున్నాయి. అంత ఆరోగ్యకరమయిన స్థం కాదు. 80 ఏండ్ల క్రితం ఒక ముసల్మాన్, కమాండరు అక్కడి వర్తక, వ్యాపారులందరినీ నిజాం రాజ్యానికి తరలించుకుపోయాదు. వారిమీద ఆధారపడినవారంతా ఉపాధి వెతుకుతూ వెళ్ళిపోయారు. రాయ్‌చర్లలో కూడా అదే జరిగింది. మునిమడుగు కొన్ని మైళ్ళవరకు కొండలమయం. కొండలపక్క మాత్రం కొద్దిగా పొదలున్నాయి. చరియలన్నీ గుబురు పొదలున్నాయి. నేరస్థులు కొంతకాలం తలదాచుకునే అవకాశం ఉంది.
రాయ్‌చర్ల : ఉప్పలపాడుకు వాయువ్యంలో 6 మైళ్ళలోని ఈ గ్రామం ప్రక్కనే ఒక రాతికోట ఉంది. గోడలు పాడుపడినాయి. 16 వృత్తాకార బురుజులున్నాయి. ఈ కోట ఉత్తర దక్షిణాలు 451 అడుగులు, తూర్పు పడమరలు 360 అడుగులు. కోట చుట్టూ ఎండిపోయిన కందకం. కోట గోడలమీద వృత్తాకారంలో 11 బురుజులు. చతుర(స్రాకారంలో ఒకటి ఉన్నాయి. ఒకటి పూర్తిగా పడిపోయింది. మిగిలినవి పడిపోయే స్థితిలో ఉన్నాయి. తూర్పు గోడ చీలింది. పగిలిన గోడలోంచి లోపలకు ప్రవేశించవచ్చు. ముఖద్వారం పడిపోయింది. తలుపు లేదు. 2 వేల ఇంధ్లున్న చోట 250 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. జనాభా 282మంది. 5 నీటిబుగ్గలు, 4 చిన్న చెరువులు ఒక దుకాణం ఉన్నాయి. రాయచర్ల చుట్టూ పంటలు బాగా పండటంతో జనానికి ఆహార పదార్థాలు సరిపడుతున్నాయి. ఇరుపక్కలా కొండలు, గుబురు పొదలున్నాయి.
భద్రాచలం : బళ్ళారి జిల్లా పంచపాళెం తాలూకాలో మునిమడుగుకు ఈశాన్యంగా 8 మైళ్ళలో భద్రాచలమనే కోట ఉండేది. ఏవో కొన్ని గోడలు
106 సీమపాలేగార్లు తప్ప అక్కడ ఇంకేమీ లేదు. కడప జిల్లా కోయిలకుంట్ల తాలూకాలోని బెక్ వాయవ్యంలో ! మైళ్ళ దూరంలో కుగ్రామం. మిట్టపల్లికి పడమరగా ఒకటిన్నర మైళ్ళలో కాండసానువు తూర్పు అంచు 3౩వందల అడుగుల ఎత్తున ఉంది. సానువు చాలా ఏటవాలుగా ఉన్నందున ఆ రాళ్ళమీద పశువులు ఎక్కే వీలు లేదు. తూర్పువైపున సహజమైన రాతిగోడలు 20 అడుగుల ఎత్తున్నాయి. చూడటానికి పాడుపడిన పెద్ద నగరంలా కనబడుతుంది. సహజంగా ఉన్న రాతి గోడలను కలిపి భవన నిర్మాణానికి ప్రయత్నం జరిగి ఉండవచ్చు. గోడ ఉత్తర దక్షిణాలుగా 500 అడుగులు, తూర్పు పడమరలుగా దాదాపు 750 అడుగులు ఉంది. పడమటివైపు చదరపు బురుజు ఉంది. తూర్పు, దక్షిణం వైపు కూడా అలాంటి బురుజులే ఉన్నాయి. ప్రకృతి అవాంతరాలలో అంతా శిధిలమైనట్టు కనబడుతుంది. ఉత్తరంవైపు లోయలో వర్షాకాలంలో నీరుంటుంది. దగ్గరలోని వాగులో కావలసినంత నీరుంది. కాలువకు దక్షిణంవైపు నుండి రెండు దార్లున్నాయి. ఈ వాగు మునిమడుగు దాకా కూడా ప్రవహిస్తుంది. లోయలో చిట్టడవిలాగా పొదలున్నాయి. ఉత్తర దక్షిణాలంతా మైదానమే. తూర్పున మేటుపల్లి కోన, పడమర కాలువ - తిరుగుబాటుదార్లు కొంతకాలం దాగినా, ప్రభుత్వ సైనికులు వారిని పట్టుకోగలరు.
పేయంటి పసుపుల కోట : కంభం నుండి బళ్ళారి రోడ్డుమీద పేయంటి పసుపుల కోటి ఉంది. బంగనవపల్లి నవాబు జాగీరులో భ(దాచలానికి వాయవ్యంలో 8 మైళ్ళలోని పెయ్యంటి పసుపుల (గ్రామంలో చిన్న కొండల మధ్య ఇది పాడుపడిన కోట. ఎర్రమల కొండల అవతలగల బంగనపల్లికి తూర్పున 14 మైళ్ళలో, కొండల్లోని తెల్‌దుగ్గ గ్రామానికి పదమరగా ఎనిమిది మైళ్ళలో పెయ్యంటి పసుపులవంటి మరొక కోట ఉంది.
రంగారెడ్డి కోట : పడమట రుద్రారుకు, తూర్పున కొత్తకోటకు మధ్య 30 మైళ్ళు. ఈ మధ్యలో రంగారెడ్డి కోట ఉంది. కొత్తకోట నుండి ఈ కోట చేరేందుకు ఆరుగంటల సమయం కావాలి. దారి పొడవునా పెద్దచెట్లు. ఏపుగా పెరిగిన గడ్డి. ఇది ఒకప్పుడు చిన్న కోట. ఆరు వృత్తాకార బురుజులు -
అనుబంధం - 107 మూలకొకటి, ఉత్తర, దక్షిణపు గోడల మధ్యలో ఒక్కొకటి ఉన్నాయి. ఉత్తర దక్షిణాలకు, కోట 254 అడుగులు. తూర్పు పడమరలు 117 అదుగులు. సిమెంటు లేకుండా కట్టిన ఈ రాతి కోట కుప్పకూలింది. ఎండిపోయిన చెరువుంది. మూడు మైళ్ళకివతల నీరు లేదు. అడవి ప్రవేశించాక ఒకచోట చిన్న గుంటలో కొంత నీరుదప్ప వేరెక్కడా నీరు లేదు. కాలిబాటేగాని మంచి రోడ్డు లేదు. కొన్నిచోట్ల ఏటవాలుగా అంతా రాళ్ళ్నమయం. వెదురు పొదలు రోడ్డును కప్పివేశాయి. అందులోంచి గుర్రం వెళ్ళగలిగేది గానీ, రంగారెడ్డి కోట నుంచి రుద్రారుకు కొండలమీద దిగే వీలు లేదు.
హారిస్, ఆండర్సన్ దత్త మండల కోటలను పరిశీలించి, పర్యవేక్షించి నివేదిక సమర్పిస్తూ, తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఎర్రమల కొందల వరుస పోయేకొద్దీ వెడల్పు తగ్గుతుంది. కర్నూలు సమీపంలో కొండలు ఆగిపోతాయి. ఇక్కడ పీఠభూమి అరమైలు వ్యాపించింది. కొండలలో చెట్టూచేమలు లేవు. ఎక్కడో దూరంగా ఒక కుగ్రామంగాక, జన సంచారం లేదు. బళ్ళారి నుండి మద్రాసు వెళ్ళే హైరోడ్‌మీద గండికోట గాక, మరో కోట లేదు. మార్గం చదునుగా లేకున్నా సైన్యం రాకపోకలకు అడ్డంకులు లేవు. కాలిబాటలెన్నో ఉన్నందున సైనిక శిబిరాలకు జంతువులమీద సరుకులు తీసుకెళ్ళటానికి ఆటంకం లేదు. గండికోట నుండి తూములపెంటవద్ద, బంగనపల్లి నుండి పేయంటిపసుపుల మీదుగా తెలిదుర్గ నుండి గుత్తికి బండి బాటలున్నాయి.
అనుబంధం - గ
దొరవారి నరసింహ్వారెడ్డి
(ఆచార్య దోణప్పగారు సేకరించిన ఆంధ్రప్రదేశ్ జానపదగేయాల సంకలనం “త్రివేణి” నుండి - అనంతపురం జిల్లాలోని కోలాటం పాట - తంగిరాలవారి సౌజన్యం)
దొరవారి నరసింవారెడ్డి!
నీ దొరతనము కూలిపోయె రాజూ నరసింవాోరెడ్డి! 7 దొర ॥
రేనాటి నీమలోనా రెద్దోళ్టు కులములోనా
దొరగారి వమిశానా థీరుదే నరసింవ్వోరెడ్డి / దొర ॥
కోయిల్‌కుంట్లా గుట్టవెంటా కుందేరు దొడ్డువెంటా
గుజ్జమెక్సీ నీవు వస్తే కుంపెణీకి గుండె దిగులూ / దొర ॥
కాలిక్తీ నంకెండ్లు వేసీ చేతీకీ బేడీలు వేసీ
పొరాతో పట్టితెచ్చీ బఐందికానులొ పెట్టిరీ / దొర ౫
కంద్లకూ గంతాలు గట్టీ నోటినిండా బిట్లు పెట్టీ
నిలువునా నీ తలా గొట్టీ కోటబురుజుకు గట్టిరీ ౫ దొర 4
తాసిలోనా తల్లికేమో చావు నుద్దీ దెలిసినాదీ
కన్నకడుపే తల్లటించే గంగలోనా గంగ గలిసే 7 దొర ॥
అనుబంధం - 17
వాహువా! నరసింహారెడ్డి! (కోలాటం పాట) భళిరా! నరసించాోరెడ్డి! నీ పేరంటే - రాజు నరసింవారెడ్డి! నారసింవాోరెడ్డి ఎంబడి గోసాయీ ఎంకన్న గోసాయీ ఎంకన్న ఒద్దే ఓబన్నేమొ 4 ఖభళిరా ॥ కోయిలకుంట్లా కొట్టినాడూ గిద్దలూరు దోబినాడూ కుడిమీసా మొడ దిద్దీ రచ్చ కట్టున కాలును దీరే ॥ భఖళిరా ॥ వావువా! నరసింవాోరెడ్డి నీ పేరంటే రాజా నరసించోరెడ్డి కోయిలకుంట్లా తానీల్దారూ శిరనునేమో నరికినాడూ జాందిలోడు నారసింగూ వాని శీరసూ నరికినాడు రండు శిరసులు నరికినాడూ న యనలవ్పలో దాబినాడూ ॥ వొహువా ॥ గోలుకొందది గొడ్డుగోదా బుక్సవట్నం సన్నబియ్యం కాలవాజీ ఉడికెతప్పుదు కల్లిబిల్లీ వేపినాదూ /॥ వొహువా ॥
110 సీమపాలేగార్లు సైరా! నరసింవారెడ్డి నీ పేరంటే - రాజు నరసింవాోరెడ్డి! కోయిలకుంట్లా కరణమయ్యా ఆయన పేరే ఎంకట్రాముడు లక్ష్రరెడ్డి ధాకలాకు. దత్తనాల మూట ఎత్తుకు పారిపోతడు కరణమయ్యా * సైరా 4 పిచ్చగుంట్లవారి పాట భళిరే! నరసింహారెడ్డి! నీ పేరంటే - రాజనరసింహారెడ్డి! జగన్నాథుని కొండమీదా ఆఅదిశక్తీ దేవళంబూ అది శక్తిని తోడుబెట్టుకు అయిదు నూర్లకు నరికినాడూ “4 భలిరే ॥॥ తండ్రి పేరే పెద్దిరెడ్డీ తాత పేరే జయరామిరెడ్డీ ఇంటీిపేరే మద్దెలోళ్ళూ | తానపేరే నరసింవోరెడ్డీ ౯ భలిరే /
ఉపయుక్త గ్రంథాలు, రికార్డులు ఉపయుక్త [గ్రంధ సూచి సమాచార సేకరణ స్థలాలు నేషనల్ ఆర్మైవ్స్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ (జనపధ్) తమిళనాడు అర్మైన్స్, చెన్నై (ఎగ్‌మోర్) ఆంధ్రప్రదేశ్ ఆర్మైన్స్, హైదరాబాద్గు (తార్నాక) తమిళనాడు అర్మైన్స్, నేషనల్ ఆర్పైవ్స్ (1) మద్రాసు రెవిన్యూ బోర్డ్ కన్సల్టేషన్స్, 1801 ఆగస్టు 31 (2) _ దత్తమండలం పాలేగార్ల గురించిన మనో రిపోర్ట్ 1801 - 1802 (39) ధామస్ మనో లేఖ - రెవిన్యూ బోర్డు - 20 మార్చి 1802. (4) దత్తమండలం, మలబార్, కెనరా మీద విలియం ధాకరే నివేదిక 1807 సెప్టెంబరు 8 (5) _ సెలెక్షన్స్ ఫ్రమ్ ది ఓల్డ్ రికార్డ్స్ ఆఫ్ ది బళ్ళారి డిస్ట్రిక్ట్ 1800 - 1801 (6) కోయిలకుంట్ల తాలూకాలో పాలేగారు నరసింహారెడ్డి తిరుగుబాటు గురించిన అధికార నివేదిక 1846-1847 (నాలుగు సంపుటాలు) (7) రెవిన్యూ బోర్డు ప్రాసీడింగ్స్ 1848 ఆగస్టు 10 - (8) రైత్వారీ సెటిల్‌మెంట్‌పై మనో లేఖ 1802, సెప్టెంబర్ 30 (9) రెవిన్యూ బోర్డ్ కన్సల్టేషన్స్ 1807 - జనవరి 5, 1801 ఆగస్టు 31 (10 పబ్లిక్ సండ్రీస్ - కింద కలెక్టర్లకు రైత్వారీ గురించి మనో లేఖ 1800 డిసెంబరు (11) సెలెక్షన్ ఆఫ్ పేపర్స్ (ఈస్టిండియా హవుస్ రికార్డులనుంచి), లండన్ 1820-26. ఆంధ్రప్రదేశ్ ఆర్మైన్స్ కడప జిల్లా రికార్డులు
పం స రీ * | కః క. నఖ. ల పచ వ్యా మ! టి పాతు
టట ర... సక సట సనని న ల
నక్త న ల కు
నీ దొరతనము కూలిపోయె రాజు నరనంతరైక దార్.
దొరగారి వమిశానా థీరుడే నర్రఫరప్ర్టిద్ద దోర! |
గుజ్జమెక్కీనీవు వస్తే కుంపెజీకీ గుండె దిగులూ. దొర ॥ | కాలికీ సంకెండ్లు వేసేచేతీకీ బేడీలు వేసీ , కండ్లకూ గంతాలు గట్టీ నోటినిండా బిట్లు పెట్టీ కాసిలోనా తల్లికేమో చావు సుద్దీ దెలిసినాదీ కన్నకడుపే తల్లటించే గంగలోనా గంగ గలిసే 1 దోర ॥ |
.
| ఇ
|
| |
||
న్ రొస్త్ర సాంస్యృతికళ, సాంస్కృతిక మండలి తం. హిమాయత్ వగరి వై
| న్ పస ల. 2
| జైల ఆ: 100ట్రటో టర ంం00 గ!