Telugu science rajakiyalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

సెన్స్‌- రాజకీయా ఫవ 5౨ లం యో స చ శరస [ల న 1 | సజ్ప/ నష య. క్షే న. న. , ననీ నం తట అ పల్టీ . | గు ఈ గ న 1 -*+ క్షే). న. బబ (4 | మం న! మ... “అతా | వ స. ల ళీ శత త ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ వే సగ న

వైన్సు -రాజకీయాలు అమిత్‌సేన్‌ గుప్తా ప్రజాత్త బుకకౌన్‌ ఎమ్‌పాచ్‌ భవన్‌ వ్లాట్‌నెం 27/1. అజామాబాద్‌ ఆర్‌టీసీ కళ్ళాణమందపం దగ్గర వొదరాబాద్‌-20. ఫోన్‌: 040 - 27660073

2451 భజన ఓలి 1111111111 ఏ3క686 క్‌. క (౬ ప్రదురణ సంఖ్య : 1238 ప్రథమ ముద్రణ :జనవరి, 2012 వెల: ₹.20 ప్రతులకు ప్రజాశక్తి బుక్‌హౌస్‌ 1-1-187/1/2, చిక్కడపల్లి, హైదరాబాద్‌-20. ఫోన్‌ : 27608107 బ్రాంచీలు హన్మకొండ, నర్గండ, గుంటూరు, జంగోలు శయ్య గ్రంధాలయ నా ముద్ర ళ్‌ నై ప్రజాశక్తి డైలీ ప్రంటింగ్‌ ప్రెస్‌, హైదరాబా సంజన కః

విషయసూచిక

  1. ప్రజారోగ్యంపై ప్రైవేటుకు తాకట్టు ంంయాలలల 65
  2. _ బిటి వంకాలపై ప్రజల పక్షమా?

బహుళజాతి సంస్థల పక్షమా? 44444౦ 10 3. _ పేటెంట్‌ పద్ధతి ఎవరికీ లాభం? ..................444౦444040లఆ4లలఆ గేల్‌ గ. సవాళ్ల వలయంలో భారతీయ పేటెంట్‌ చట్టం..........................- 19 5. సహస్రాబ్ది లక్ష్యాల సాధనలో వెనుకంబి...........ఆ౮ఆలఆంం 22 6. జౌషధ రంగంలో అపవిత్ర పొత్తులు..........4444244424024000000=0004 26 7 ఆలిండియా పీపుల్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ లౌకికత్వం,

ప్రజాస్వామ్యం, అభివృద్ధే లక్ష్యం .............౮౮౮౦ ౦౦౭౯ 29 8 శిశుహంత నెస్లే చోరబాటు .......4౮౦4౦౦౮4440000000000000000000000000000400000 బైల 9. అందరికీ అందుబాటులో ఆరోగ్య భద్రతే ............040404044040444444 పర్‌ 10. పేటెంట్‌ పేరుతో నిలువు దోసిడి ...............444444400404004404000044 శీల

ముందుమాట

విజ్ఞాన రంగం అనగానే ప్రయోగాలు, పరిశోధనలకు సంబంధించిన అంశాలుగా పరిగణిస్తుంటారు. నిజానికి చరిత్ర పొడుగునా విజ్ఞానశాస్తాభివృద్ధి వినియోగం నాటి పాలక వర్థాల విధానాలతో ముడిపడి వుంది. విజ్ఞానశాస్త్రం ఇంత అభివృద్ధి చెందినా అశేష ప్రజలకు ఆహారం ఆరోగ్యం అందించలేకపోవడం కళ్లముందు చూస్తున్నాం. బహుళ జాతి సంస్థలు, గుత్త పెట్టుబడిదారీ వర్షాలు విజ్ఞాన రంగంలో అనునరించే వివరీత పోకడలను విశదీకరిన్తూ (వ్రజాసైన్సు ఉద్యమ నాయకులు అమితొసేన్‌ గుప్తా రాసిన వ్యాసాలు కూర్పు ఇది. విజ్ఞాన రంగ విధానాలకు రాజక్రీయ ఆర్థికాంశాలకు వున్న సంబంధాన్ని పర్యవసానాలను ఈ రచనలు సులభంగా ఎరుక పరుస్తాయి.

ప్రజారోగ్యంపై పైవేటుకు తాకట్టు = ఆ లు రాజస్థాన్‌లోని జాతీయ గ్రామీణ ఆరోగ్య సంస్థకు చెందిన ఒక అధికారిక పత్రమొకటి ఇప్పటికీ వెబ్‌సైట్‌లో దర్శనమిస్తుంది. సత్యం కంప్యూటర్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సంస్థాపక అధ్యక్షుడు రామలింగ రాజును దానిలో ఆకాశానికి ఎత్తడం జరిగింది. “భారతదేశంలోని అతిపెద్ద ఐటి కంపెనీలలో సత్యం కంప్యూటర్స్‌ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 800 బహుళజాతి సంస్థలకు దీనితో సంబంధాలు ఉన్నాయి. ఇందులో 100 సంస్థలు ఫార్టూన్‌ జాబితాలోకెక్కిన 500 సంస్థలలో చోటు సంపాదించుకున్నాయి. సమాజంపట్ల ఆయనకున్న అంకితభావాన్ని ఇఎంఆర్‌ఐ, సత్యం పౌండేషన్‌, బైర్రాజు పౌందేషన్‌లు రుజువు చేస్తున్నాయి. రామలింగ రాజు గురించి ఆ పత్రంలో ఇలాంటి వివరాలనే మరికొన్నిటిని ఇస్తున్నది. ఎమర్దన్సీ మేనేజమెంట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఇఎంఆర్‌ఐ) "పేరుతో ఆయన నెలకొల్పిన ధార్మిక సంస్థ భారతీయ ఆరోగ్య రంగంలో కొత్తపుంతలు తొక్కిందనటంలో సందేహం లేదు. అయితే, 'ప్రభుత్వ (ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) ఈ కొత్త మార్గాలను సుగమం చేసిందనటం స్పష్టం. బలహీనపడి, క్షీణించిపోయిన (ప్రజారోగ్య మౌలిక సదుపాయ రంగాన్ని గొప్పగా చూపేటందుకుగాను ప్రభుత్వం మేలిముసుగులను తొడిగింది. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ పైవేటు రంగ భాగస్వామ్యం శద్ధతప్పని చెప్పటానికి ఇఎంఆర్‌ఐ మంచి ఉదాహరణగా పనికి వస్తుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనినొక ఘన విజయంగా చెప్పుకుంటున్నప్పటికీ దీని పనితీరును కాస్త సన్నిహితంగా పరిశీలించి నట్లయితే దీనిలోని డొల్లతనం బయటపడగలదు. రామలింగ రాజు నడిపే నాలుగు స్వచ్చంద సంస్థలలో ఇఎంఆర్‌ఐ ఒకటి. లాభాపేక్ష లేకుండా పనిచేసే సంస్థలివి! అయితే తుఫాను ప్రారంభం కాగానే సత్యం కంప్యూటర్స్‌ చైర్మన్‌కు సంబంధించిన అన్ని సైన్సు-రాజకీయాలు ననన 6

ప్రస్తావనలను తన వెబ్‌సైట్‌ నుంచి తుడిచి వేయటం ద్వారా తన తప్పులను మరుగుపరచాలని ప్రభుత్వం అనుకున్నది. కాని రూ.7000 కోట్ల కుంభకోణాన్ని మాత్రం అది దాయలేక పోయింది. అమెరికాలో వైద్య సేవలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే 911 తరహాలో ఇక్కడ కూడా అత్యవసర అంబులెన్స్‌ సర్వీసులను ప్రవేశపెట్టారు. 2005 ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్‌లో 50 పట్టణాల పరిధిలో 30 అంబులెన్స్‌లను ప్రవేశపెట్టటంతో ఇఎంఆర్‌ఐ కథ ప్రారంభమైంది. ఈనాడు ఇఎంఆర్‌ఐ కింద మొత్తం 1500 అంబులెన్స్‌లు 12,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ పథకానికిగాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 95 శాతం ఖర్చును భరిస్తున్నది. మరో విధంగా చెప్పాలంటే ఒక్కొక్క అంబులెన్స్‌కు నెలకు 112,000లు ఖర్చు చేస్తున్నది. ఇఎంఆర్‌ఐ కేవలం 5 శాతం ఖర్చు మాత్రమే భరిస్తున్నది. ఇఎంఆర్‌ఐ విస్తరిస్తున్న కొలది గతంలో కన్నా ఖర్చు ఎక్కువైంది. ప్రభుత్వ ఖజానాపై భారం పెరగసాగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక అంబులెన్స్‌ ఖర్చు నెలకు రూ.14,000 నుంచి రూ.1,12,000 వరకు అవుతుంది. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం కింద ప్రపంచ బ్యాంకు నిధులతో తమిళనాడులో నడిచే అంబులెన్స్‌కు నెలకు రూ.10,000ల ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దీనిని కాదనుకుని నెలకు లక్ష రూపాయలకు పైగా ఖర్చు అయ్యే ఇఎంఆర్‌ఐ పథకాన్ని చేపట్టింది! ఈ పథకం మొత్తం ఎనిమిది రాష్ట్రాలలో అంటే, అస్సాం, గుజరాత్‌, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ తమిళనాడు, గోవా, మహారాష్ట్ర ఒరిస్సాలలో నడుస్తున్నది. సత్యం కుంభకోణం వెలుగులోకి రావటానికి కొన్ని మాసాల ముందు, అంటే, 2008లో రెండు స్వచ్చంద సంస్థలు ఇఎంఆర్‌ఐకి కాంట్రాక్టు ఇవ్వడంపై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. సరైన పద్ధతిలో టెండర్లను పిలవకుండా ఇఎంఆర్‌ఐకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్టులు ఇచ్చాయని దరఖాస్తుదారులు ఆరోపించారు. 2005లో నమోదైన ఇఎంఆర్‌ఐకు ఎలాంటి గతానుభవం లేనప్పటికీ అంబులెన్స్‌ సేవలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించినట్లు కోర్టుకు చెప్పారు. రాజస్థాన్‌ ప్రభుత్వం టెండర్లను పిలిచింది. అయితే, ఐదు కోట్ల రూపాయల వరకు లావాదేవీలు కలిగి 200 అంబులెన్స్‌ వాహనాలు కలిగి, భారతదేశంలోని ఒకే రాష్ట్రం నుంచి కాంట్రాక్టు కోలేవారే టెండర్లను వేయటానికి అర్హులని చెప్పటం జరిగింది. అంటే, టెండర్లు వేయటానికి ఇఎంఆర్‌ఐ మాత్రమే అర్హత కలిగి ఉంటుందన్న మాట. ఆ తరువాత తమిళనాడు కూడా ఇదే పద్ధతిలో నడిచింది. రూ. 25 కోట్ల టర్నోవర్‌ కలిగి రెండు రాష్ర్రాలలో ఉనికిని కలిగివున్న సంస్థలకు మాత్రమే టెండరు వేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి కూడా ళా యాలాల అమిశ్‌సేన్‌ గుప్తా

ఇఎంఆర్‌ఐకే అలాంటి అర్జత ఉన్నది. పిటీషనర్ల తరపు న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ తన వాదనలను వినిపిస్తూ సత్యం సంస్థ, ప్రభుత్వ నిధుల నుంచి రూ.3,800 కోట్లను విడుదల చేయించుకోవటానికి ఏర్పాట్లు పూర్తి చేసిందని, రాష్రాల రాజధానుల్లో దాదాపు రూ.1800 కోట్ల విలువ చేసే 500 ఎకరాలను ఆక్రమించిందని కోర్టుకు తెలిపారు. దీనిపై తన తుది నిర్ణయాన్ని 2010 ఫిబ్రవరిలో వెల్లడిస్తానని సుప్రీం కోర్టు తెలిపింది. ఇఎంఆర్‌ఐకి సంబంధించి వివరణ ఇవ్వవలసిందిగా కేంద్రాన్నీ 12 రాష్ట్రాలను, ఇఎంఆర్‌ఐనీ ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలక్ఫిష్టన్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఆదేశించింది. సొమ్ము ప్రజలది సోకు ప్రైవేటుది

ఇదిలా ఉండగా ప్రభుత్వ-(మైవేటు భాగస్వామ్యంలో ఇఎంఆర్‌ఐని ఫలప్రదమైన గాథగా వర్ణించటం జరుగుతోంది. ఇఎంఆర్‌ఐ పథకంలో అసలు ప్రభుత్వ వాటా ఎంత, ప్రైవేటు వాటా ఎంత అన్న విషయాన్ని చూద్దాము. ఈ పథకానికి 95 శాతం నిధులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి. ఇఎంఆర్‌ఐ కేవలం 5 శాతం మాత్రమే భరిస్తుంది. లాభాలు ఆశించని పథకం అని చెప్పటమేకాని కొంతమంది దీనిద్వారా కోట్ల రూపాయలు ఆర్డిస్తున్నారు. ఇఎంఆర్‌ఐకి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను సత్యం సంస్థ రూపొందించింది. దీనిని రూ.10 కోట్లకు ఇతర రాష్ట్రాలకు అమ్ముతున్నది. (పైవేటు నిర్వహణ కోసం ప్రజాధనాన్ని ఉపయోగిస్తున్నట్లు దీనివల్ల స్పష్టమవుతున్నది. ఇదీ, ప్రభుత్వ-(థైవేటు భాగస్వామ్యంలోని లోగుట్టు. కాగా, ఇలాంటి భాగస్వామ్యాలు ఉభయులకూ శ్రేయస్కరమని చెప్తున్నారు. ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకటి, ఇలాంటి భాగస్వామ్యాన్ని పెట్టుకోవటానికి ముందు, దీర్ధకాలిక పొదుపు పథకం ఏమైనా ఉన్నదా? రెండు, ఈ పథకాన్ని ప్రభుత్వమే నడిపేటందుకు తగినన్ని వనరులు లేకుండా పోయాయా? ఇఎంఆర్‌ఐ పథకం కోసం అత్యధిక మొత్తం ప్రభుత్వ ఖజానా నుంచే వస్తున్నట్లు మనం ఇంతకుముందే చూశాము. నిధులను సమకూర్చే ప్రభుత్వం నిర్వహణ కార్యాన్ని ఎందుకు చేపట్టటం లేదు? ఆరోగ్యానికి సంబంధించి దశాబ్దాలుగా దేశంలో సరైన సౌకర్యాలు లేవు. ఇలాంటి పరిస్థితిలో ఇఎంఆర్‌ఐ వలన సేవలు అలందుతున్నాయని చెప్తన్నారు. ఈ పథకం కారణంగా వైద్య సదుపాయాలు మెరుగుపడిన మాట వాస్తవం. అయితే ఇక్కడొక ప్రశ్న ఎదురవుతుంది. ఈ ప్రభుత్వ నిధులనే ఆరోగ్య రంగంలో ఖర్చు చేస్తే వైద్యసేవలు ఈ తరహాలోనే అందేవి కావా? అధికారంలో ఉన్నవారికి ప్రభుత్వ వ్యవస్థలపై సైన్సు=ళాజకియాలు నానన

నమ్మకం పోయింది. కనుకనే ఇలాంటి వాటిని నమ్ముతున్నారు. నీరు, విద్యుత్‌, విద్య తదితర రంగాలలో ఇలాంటి ధోరణే కొట్టవచ్చినట్లు కనపడుతున్నది. ఆరోగ్య రంగంలో ప్రాథమిక సదుపాయాలను కల్పించే ప్రభుత్వ సామర్థ్యం గురించి కూడా ఆలోచిద్దాం. సదుపాయాలంటే కేవలం అంబులెన్సులే కాక ఆసుపత్రుల సౌకర్యాలు, అందుబాటులో వైద్య సేవలు వంటివి కూడా వస్తాయి. ఈనాడు ఎక్కువ భాగం వైద్య సౌకర్యాలు (పైవేటు రంగంలోనే ఉన్నందున ఎక్కువ మంది (పైవేటు రంగం నుంచే వైద్య సేవలు పొందుతున్నారని పలువురు వాదిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వ రంగ సేవలు అవసరం లేదన్నది వీరి ఉద్దేశం. రాజీవ్‌ గాంధీ స్వాస్థ్య బీమా యోజన అన్న పథకం ఇలాంటి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినదే. అంతేకాక తమ వాదనలకు వత్తాసుగా ట్రీటన్‌, (జిల్‌, జర్మనీ వంటి దేశాల ఉదాహరణలను చూపుతున్నారు. మరొక విషయమేమంటే, ఒకవైపున ప్రభుత్వ ఆసుపత్రులను కూలగొడుతూ, ఇంకొకవైపున కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద వైద్య చికిత్సలకు డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించు కోవలసిందిగా ఈ పథకం ద్వారా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేటు రంగాన్ని దృఢతరం చేసే నయా ఉదారవాద విధానాల ఫలితంగానే ఇవన్నీ సంభవిస్తున్నాయి. శ్రీలంక, మలేసియా, థాయిలాండ్‌ వంటి దేశాలలో నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అమలవుతున్నప్పటికీ అక్కడ ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు అందుబాటులోనే ఉన్నాయి. క్యూబా, ఇరాన్‌, చిలీ, కోస్టారికా వంటి చోట్ల ప్రభుత్వ ఆసుపత్రులే ఎక్కువగా ఉన్నాయి. దీర్ధదృష్టితో చూస్తే భారతదేశంవంటి చోట్ల ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రత్యామ్నాయం ఉండబోదు. లాభార్జనే ద్యేయంగా ఉండే కార్పొరేట్‌ ఆసుపత్రులు (ప్రజల ఆరోగ్యాన్ని రక్షించలేవు. ట్ర నాన నానా సూ. “అమిత్‌నేన్‌ గుప్తా

జి ను బిటి వంకాలపై ప్రజల పక్షమా? బహుళజాతి సంస్థల పక్షమా? జన్యుపరమైన మార్పులతో కూడిన ఆహార పదార్థాల గురించి భారతదేశంలో తీవ్రమైన వివాదాలు సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తత్సంబంధిత చర్చలే నడుస్తున్నాయి. జన్యుపరంగా మార్పులు చేసిన వంకాయ (దీనినే విటి వంకాయ అంటున్నారు) రకాన్ని ప్రవేశపెట్టేందుకు అవసరమైన అనుమతి ఇచ్చేవిషయమై భారతదేశంలో చర్చ సాగుతున్నది. ఐరోపాలో కూడా ఇలాంటి చర్చే సాగుతున్నది. అక్కడ జన్యుపరమైన మార్పులతో కూడిన బియ్యం రకాన్ని ప్రవేశపెట్టాలని బేయర్‌ సంస్థ కోరుతున్నది. జన్యుపరమైన ఆహార పదార్థాల విషయమై సాగుతున్న చర్చలో అనేక అంశాలు ఉన్నాయి. ఈరకమైన అహార పదార్థాల వినియోగంవల్ల కలిగే సమస్యలు, సాగుకు సంబంధించిన అంశాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అదుపు వగైరాల గురించి ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి.

ఈ మొత్తం వ్యవహారం గురించి సమగ్రమైన అవగాహనకు రావాలంటే, జన్యుపరంగా మార్చుచేసిన మొక్కల ఉత్పత్తి తదితర అంశాల గురించి ముందుగా తెలుసుకోవాలి. ఈ భూతలమంతటిలోనూ మానవులు ప్రత్యేకమైన లక్షణాలను కలిగిన వారు. వివిధ ప్రాణుల ఉత్పత్తిలోనూ, వాటి అభివృద్ధిలోనూ ప్రకృతి నిర్వహించే పాత్రను మెరుగుపరచటానికిగానీ, మార్పు చేయటానికిగానీ సమర్ధత గలిగినట్టిది మానవజాతి ఒక్కటే. అస్తిత్వంలోవున్న ప్రాణులలో మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతో మార్పులు చేయగలిగింది కూడా మానవ జాతేనని చెప్పవచ్చు. ప్రకృతిలో మార్పు తీసుకు రావాలన్న మానవుని అభిలాష -ఈనాటిది కాదు. మొక్కల నుంచీ, జంతువుల నుంచీ మనకు లభ్యమయ్యే ఆహారం అనేక మార్చులకూ చేర్పులకూ గురైనదే. ఆదిమ మానవులు సాగుచేసిన

సైన్సు-రాజకీయాలు నా నా నా

'అడవి' మొక్కజొన్న గోధుమ, బియ్యం వంటివి అనేక మార్పులకు గురయ్యాయి. ఈ మార్పుల కారణంగా దిగుబడులు, నాణ్యత, సువాసన, రుచి వగైరా పెరిగాయి. ప్రపంచం మొత్తంమీద అత్యధిక ప్రాధాన్యతగల ఆహారంగావున్న వరిని ఉదాహరణగా తీసుకుందాము. సుమారు 12,000-11,000 సంవత్సరాల క్రితం యాంగ్దీ నదీ లోయలో వరిని సాగుచేసే వారని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. అడవుల్లో పెరిగే వరిధాన్యాన్ని సేకరించటం నుంచి వరిని సాగుచేసే విధానం వచ్చింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం మధ్య చైనాలో రెండు రకాలైన వరిని (వీటిని ఈనాడు ఇండికా, జపోనికా అని పిలుస్తున్నాము) సాగు చేస్తుండేవారు. సుమారుగా ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ సాగు పద్ధతి మధ్య చైనా నుండి ఆగ్నేయాసియా, దక్షిణాసియాలకు వ్యాపించింది. జపాన్‌లో వినియోగించే ముతక ధాన్యం నుండి బాస్మతి వరకు రకరకాల వరి భారత్‌, పాకిస్థాన్‌లలో సాగవుతున్నది. ఈ రకాలన్నీ ఒకప్పుడు అడవి గడ్డి నుంచి వచ్చినవే. పెంపుడు జంతువులలో కూడా ఎంపిక చేసిన రకాలకు విలువ పెరిగింది. మనచుట్టూ గుర్రమూ, కుక్క తదితరాలు కనపడటానికి కారణం ఇదే. కాలక్రమంలో సంకర జాతులు ఉద్భవించాయి. రెండు రకాలైన జాతులను కలిపి ఒక జాతిని తయారు చేయటాన్ని ఇందులో మనం చూస్తాము. విభిన్నమైన జన్యుమారిడి విధానం సజీవ ప్రాణుల కణ నిర్మాణం రీత్యా వాటిని సంకరం చేయటం సాధ్యమవుతున్నది. సమస్త ప్రాణులలోనూ కణాలు, జన్యువులు ఉంటాయి. ఇవే విభిన్నమైన లక్షణాలకు కారణమవుతాయి. ఒకేరకమైన జాతిలో సైతం ఏ రెండూ అచ్చు గుద్దినట్లుండవు. ఒకే జాతివారైనప్పటికీ ఇరువురు మానవులను మనం గమనించినట్లయితే వారిరువురి మధ్యా తేడాలు కనిపిస్తాయి. మొక్కలలోనూ, జంతువులలోనూ సైతం ఇదే పద్ధతి కనపడుతుంది. జన్యు కణాలలోని తేడాయే ఇందుకు కారణం. ఒకే జాతికి చెందిన రెండింటిలో జన్యుకణాలు ఒకేరకంగా కనిపించినప్పటికీ ఒకదానికొకటి ప్రతిరూపంగా ఉండవు. వరిని తీసుకున్నట్లయితే కొన్ని మొక్కలు ఎత్తుగా పెరుగుతాయి. అంటే వీటిలో పొడవును పెంచే జన్యుకణాలు ఉన్నాయన్నమాట. రైతుగాని వీటి విత్తనాలను జాగ్రత్త చేసి మరుసటి ఏడాది విత్తినట్లయితే ఎక్కువ భాగం ఎత్తయిన మొక్కలే వస్తాయి. కొంతకాలం తరువాత చూసినట్లయితే గతంలో కన్నా ఎత్తు ఎక్కువ పెరిగే పైరుకు సంబంధించిన విత్తనాలు తన వద్ద ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇకపోతే సంకరం విషయానికి వస్తే తాను జూగత్త చేయదలచుకున్న రెండు లక్షణాలను కలపటం అన్నమాట. ఉదాహరణకు వర్షాభ్రావాన్ని తట్టుకునే రకాన్నీ, క్షే అమిత్‌సేన్‌ గుప్తా

ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాన్నీ కలిపినట్లయితే ఈ రెండు గుణాలున్న రకం ఉనికిలోకి వస్తుంది.

వేల సంవత్సరాలుగా మానవుడు తయారు చేస్తూ వస్తున్న వాటితో జన్యు మార్పిడి రకాలు ఎలా వేరు పడతాయో చూద్దాము. పైన పేర్కొన్న విధానాలన్నీ ప్రకృతిపై ఆధారపడినవి. ఈ పద్ధతిలో కోరుకోని లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. పైగా ఈ పద్ధతిలో సంతృప్తికరమైన ఫలితాలను పొందాలంటే చాలా ఏళ్ళు వేచి చూడాలి. జన్యు మార్పిడి పద్ధతిలో చాలా తక్కువ కాలంలోనే ఫలితాలు సాధించవచ్చు. జన్యు మార్చిడి అంటే కణాలను కలిపివేయటం. పప్రయోగశాలలోనే వీటిని కలుపుతారు. ఒక ప్రాణ కణంలోకి జన్యువును చొప్పించటం లేదా తీసివేయటాన్నే జన్యుమార్చిడి అంటారు. ఈ మార్చిడి ఒకే జాతిలో జరిగితే అంతర్‌ జన్యుమార్చిడి అని, వేర్వేరు జాతుల జన్యువుల మధ్య మార్పిడి జరిగినట్లయితే బాహ్య జన్యుమార్చిడి అని అంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మాత్రమే ఈ మార్పిడి సాధ్యం కాగలదు. ఒక జాతి జన్యుకణాలను మరో జాతి జన్యుకణాలతో అనుసంధానం చేయటం ప్రకృతిలో ఎన్నడూ జరగదు లేదా అరుదుగా మాత్రమే జరుగుతుంది.

బిటి వంకాయ విషయానికొస్తే ఈ సాంకేతిక విజ్ఞానం ఎలా ఉపయోగపడుతున్నదీ మనం అర్థం చేసుకోవచ్చు. మట్టిపొరలలో లభించే ఒక బాక్టీరియాను (బాసిల్లస్‌ తురింజిన్‌సిస్‌, ఈ రెండు పదాల మొదటి అక్షరాలను కలిపి బిటి అంటున్నాము) వంకాయలో ప్రవేశపెడతారు. ఇలా ప్రవేశపెట్టినందున సాధారణంగా వంగ మొక్కను ఆశించే పురుగులకు హాని కలిగించే ఒక విషపదార్థం మొక్కలో తయారవుతుంది. దీనివల్ల వంగ కాపు పెరగటమేకాక, పురుగు మందుల వాడకం తగ్గుతుందని చెపుతున్నారు. దీనిని బహుళజాతి సంస్థ మోన్‌శాంటో తయారు చేసింది. భారత్‌లో వీటి ట్రయల్స్‌ను మహికో (మహారాష్ట్ర హైబ్రిడ్‌ సీడ్స్‌ కం పెన్సీతో కలిసి చేపట్టింది. మహికో-మోన్‌శాంటో కలిసి బిటి వంగ విత్తనాలను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఆందోళన కలిగించే అనేక విషయాలు

జన్యుమార్చిడి రకాల ్రవేశంవల్ల ప్రకృతిలోని ఇతర రకాలపై ప్రభావం పడగలదన్న ఆందోళన పెరుగుతున్నది. ఒకసారిగాని జన్యుమార్చిడి పంటలను సాగుచేసినట్లయితే కాలక్రమంలో అవి తమ జన్యుకణాలను ఇతర భూముల్లో సాగవుతున్న పంటలకు నంక్రమింవచేస్తాయి. అంటే కాలక్రమంలో జన్యుమార్చిడి జాతులు (ప్రకృతిలో పెరుగుతాయన్నమాట. కనుక మున్ముందు హాని జరగదన్న హామీ ఏమీ లేదు. సైద్ధాంతికంగా చూసినట్లయితే కృత్రిమంగా ఒక జన్యువును ప్రవేశపెట్టినట్టయితే పంటకు లేదా పర్యావరణానికి సైన్సు-రాజకీయాలు 2

నష్టం జరిగే అవకాశం ఉన్నది. కనుక ప్రయోగ సమయంలోనే కచ్చితమైన పరీక్షలను నిర్వహించాలని చెపుతున్నారు. జన్యుకణాల మార్పిడి కారణంగా ప్రకృతికి నష్టం జరగరాదన్నదే పలువురి ఆకాంక్ష జన్యుమార్చిడి సాంకేతిక పరిజ్ఞానం జీవ వైవిధ్యాన్ని నాశనం చేసి ఏకీకృత పద్ధతిని ప్రవేశపెట్టే ప్రమాదం ఉన్నది. జన్యు మార్పిడి రకాలు పెరిగినట్టయితే అవే ఎక్కువ భూభాగాన్ని ఆక్రమిస్తాయి. ఈ రకాలు విఫలమైతే ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. కనుక జీవ వైవిధ్యాన్ని కాపాడు కోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. రెండవ విషయమేమంటే మానవుల వినియోగార్ధం జన్యుమార్చిడి రకాలను ప్రవేశపెడుతున్నారు. ఆహార పంటల్లో జన్యుమార్పిడి వలన మానవులకు ఎలాంటి హానీ జరగదన్న హామీ ఉండాలి. ఏ మొక్క ఉపయోగమో ఏది హానికరమో అన్న విషయాన్ని వేల సంవత్సరాల అనుభవంలో మానవుడు గ్రహించాడు. కాని ప్రస్తుతం కొద్టి సంవత్సరాల అనుభవాన్ని మాత్రవే మనం పరిగణనలోకి తీసుకుంటున్నాము. కనుకనే జన్యుమార్చిడి పంటలను ప్రవేశపెట్టేటపుడు మానవులకు హాని జరగదన్న పూర్తి హామీ ఉండాలి. ఇదియిలా ఉండగా జన్యుమార్పిడి ఆహార పదార్థాల విషయంలో వివిధ దేశాలు విభిన్న నిబంధనలను పాటిస్తున్నాయి. జన్యుమార్పిడి ఆహారం అన్న లేబుల్‌ను ప్రదర్శించాల్సిన అవసరం లేదని అమెరికా, కెనడా చట్టాలు చెపుతున్నాయి. కాగా ఐరోపా యూనియన్‌ దేశాలు, జపాన్‌, మలేసియా, ఆ(స్టేలియాలలో ఇలాంటి లేబుల్‌ను తప్పనిసరిగా వేయాలి. అలా చేసినపుడు వినియోగదారుడు తన ఇష్టాన్నిబట్టి కొనటమో లేక మానటమో చేస్తాడు. లేబుల్‌ను వేయటమేకాక జన్యుమార్చిడి ఉత్పత్తులను ఇతర ఉత్పత్తులకు వేరుగా ఉంచాలి. విరోపా యూనియన్‌లోని మొత్తం సాగుభూమిలో జన్యుమార్పిడి పంటలను కేవలం 0.05 శాతంలో మాత్రమే సాగు చేస్తుండగా అమెరికాలో 18 శాతం భూమిలో సాగుచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే జన్యుమార్చిడి వంటనూనెలో 96 శాతం ఒక్క అమెరికాలోనే ఉత్పత్తి అవుతున్నది. అలానే అహార పదార్థాల విషయంలో కూడా అమెరికాయే ముందున్నది. ఏదియేమైనా పర్యావరణం పైనా, ఆరోగ్యం పైనా వీటి ప్రభావాన్ని తప్పని సరిగా పరిశీలించాలి. వీటి వాడకంపై ప్రపంచ దేశాలలో ఏకాభిప్రాయం లేదు. భారతీయులమైన మనం ఈ అంశాన్ని ప్రజలలో చర్చకు పెట్టటం ద్వారా ఒక నిర్ణయానికి రావాలి. ఆ విధంగానే మన స్వంత మార్గదర్శక సూత్రాలను రూపొందించుకోవాలి. జన్యుమార్చిడి సాంకేతిక పరిజ్ఞానంపై అదుపు ఎవరికుంటుందన్నదే అత్యంత శత నాలా లమికనేన్‌ గుప్తా

ప్రధానమైన మూడవ విషయం. ఈనాడు జీవ సాంకేతిక పరిజ్ఞానం బడా కంపెనీల సొత్తుగా మారింది. జన్యుమార్చిడి సాంకేతిక విజ్ఞానం విషయంలో కూడా ఇదే వాస్తవం. ఈ విజ్ఞానం (ప్రత్యేకించి భారత్‌వంటి వర్థమాన దేశాల వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తుంది. సంప్రదాయకంగా మన దేశ రైతులు తదుపరి పంటకు ఇప్పటి పంటలో నుంచి విత్తనాలను జాగ్రత్త చేసుకుంటారు. సంకర జాతి రకాల ప్రవేశంతో ఈ పద్ధతిలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం రైతులు విత్తనాల కంపెనీల వద్ద సంకరజాతి రకాలను కొనుగోలు చేస్తున్నారు. లేదా ప్రభుత్వ సరఫరాలపై ఆధారపడుతున్నారు. జన్యుమార్చిడి రకాలు వస్తే రైతులు మరింతగా కంపెనీలపై ఆధారపడవలసి వస్తుంది. భారత్‌లో పరిశోధనల ఫలితాలు ఎక్కువగా (ప్రైవేటు కంపెనీలకే చెందుతున్నాయి. వీటిల్లో ఎక్కువ భాగం విదేశీ కంపెనీలు. ఆహారము తదితరాల కోసం బహుళజాతి సంస్థలపై ఆధారవడితే అది దేశానికే 'ప్రమాదమవుతుంది. ప్రభుత్వం ఎవరి పక్షాన ఉన్నది?

బిటి వంకాయ గురించి ప్రస్తుతం మన దేశంలో సాగుతున్న చర్చలో పైన మేము తెలిపిన అంశాలు ప్రస్తావనకు రావలసిన అవసరం ఉన్నది. బిటి వంకాయ గురించి చేసిన తమ ప్రయోగాలను భారత్‌లోని మహికోగానీ, బహుళజాతి సంస్థ అయిన మోన్‌శాంటోగానీ స్పష్టంగా తెలియచేయటం లేదు. పారదర్శకంగా లేకపోవటం వారి వ్యాపారతత్వాన్నే తెలియచేస్తున్నది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా అనుమానాస్పదంగా ఉన్నది. సాంకేతిక పరిజ్ఞానంపై ఎవరి అదుపు ఉంటుంది? (ప్రభుత్వం ఎవరి పక్షాన, అంటే ప్రజల పక్షానా లేక మోన్‌శాంటోవంటి బహుళజాతి సంస్థల పక్షాన నిలుస్తుందా? అన్నదే ఈనాడు ప్రధానంగా చర్చించవలసివుంది. సైన్సు-ళాజకీయాలు క

పేటెంట్‌ పద్ధతి ఎవరికి లాభం?

(ప్రభుత్వ నిధులందుకునే పరిశోధన -అభివృద్ధి రంగాలలో పేటెంటు రక్షణను కల్పించే ఒక బిల్లును రూపొందించే పనిలో కేంద్ర ప్రభుత్వం తలమునకలుగా ఉన్నది. శాస్త్రవేత్తలు, సంఘ శ్రేయోభిలాషులూ ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం మౌనవ్రతాన్నే పాటిస్తున్నది. వైద్య సంరక్షణలో పేటెంటు పద్ధతి ప్రవేశించటంపట్ల పలువురు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కాస్త వివరంగో చూడాలి. పేటెంట్‌ విధానం ఉన్నందునే వైద్య రంగంలో సాంకేతిక విజ్ఞానం పెరిగిందని పేటెంట్లను బలపరుస్తున్నవారు వాదిస్తున్నారు. పెటెంటు విధానం లేనట్లయితే పరిశోధన -అభివృద్ధి (ఆర్‌౭డి) రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు (పైవేటు కంపెనీలు ముందుకు రావన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆరోగ్య రక్షణకు పేటెంటు విధానం ఉపయోగ పడుతుందా లేదా అన్న విషయమై ప్రస్తుతం చర్చ సాగుతున్నది. కాని సరికొత్తయైన, ఉపయోగకరమైన వైద్య సాంకేతిక పరిజ్ఞానానికి పేటెంటు విధానం ఆటంకమని మనకు అర్థమవుతున్నది. అలానే అవసరమైనవారికి ఇది అందకుండా పోతున్నదన్న భావనకూడా ఉన్నది.

ముందుగా పేటెంటు విధానానికి దారితీసిన పరిస్థితిని చూద్దాము. పేటెంటు

అనేది అన్వేషకుడికీ, సమాజానికీ (సాధారణంగా సమాజానికి ప్రభుత్వాలు ప్రాతినిధ్యం వహిస్తాయి) మధ్య కుదిరే ఒకరకమైన ఒప్పందం. ఏ ఒప్పందంలోనైనా హక్కులతోపాటు బాధ్యతలు కూడా ఉంటాయి. పేటెంటు విషయంలో అన్వేషకునికి తాను కనిపెట్టిన దానిపై గుత్త హక్కులు సంక్రమిస్తాయి. అంటే, అన్వేషణ ఫలితమైన ఉత్పత్తిని ఎవరైనా అమ్ముకోవాలన్నా, నకలును తయారు చేయాలన్నా పేటుంటుదారుని అనుమతి తప్పనిసరి అవుతుంది. అన్వేషణా ఫలితాన్ని ఇతరులెవరూ ఏ రకంగానూ వినియోగించకుండా పేటెంటు నిరోధిస్తున్నందున దీనిని గుత్తహక్కని అనవలసి వస్తుంది. ఈ హక్కుకున్న కాలపరిమితిని కేర్‌ అమిత్‌సేన్‌ గుప్తా

20 సంవత్సరాలుగా ట్రిప్స్‌ ఒప్పందం నిర్ధారించింది. దీనికి బదులుగా అన్వేషకుడు తన విజ్ఞానాన్ని అందుబాటులో ఉంచగలిగితే అప్పుడు ఆ అన్వేషణ ఫలితంగా సమాజం లాభిస్తుంది. భావితరాలకు కూడా ఈ అన్వేషణ ఉపయోగ పడుతుంది. పేటెంటు విధానం వచ్చిన తరువాత నూతన అన్వేషణలు తగ్గాయి. మరీముఖ్యంగా ట్రిప్స్‌ ఒప్పందం అనంతరం 1995 నుంచి ఈ పరిస్థితి మనకు కనపడుతున్నది. ఏదియేమైనప్పటికీ పేటెంటు విధానాన్ని పటిష్టం చేయడం వలన అన్వేషణలు పెరుగుతాయన్న మాట వాస్తవం కాదు. పెరుగుతున్న అసమానతలు

దీనికి మరో కోణం కూడా ఉన్నది. సంపన్న దేశాలకు, వర్ధమాన దేశాలకు మధ్యా పేదలకూ ధనికులకూ మధ్యా ఈ పేటెంటు విధానం అసమానతలను సృష్టిస్తున్నది. ఇది మార్కెట్‌ స్వభావంగలది. డబ్బుగలవానికి తత్సంబంధిత ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. డబ్బులేని వానికి అవి గగన కుసుమాలే అవుతాయి. అంతేకాక, (ప్రజల ప్రయోజనాలు, మానవావసరాలు వంటివి మార్కెట్‌కు పట్టవు. కనుక పేటెంటు పద్ధతి సహజంగానే ఎక్కువ డబ్బులు వచ్చే వైపుకే పరిశోధనను లాగుతుంది. లాభాలను ఎక్కువగా తెచ్చే పరిశోధనల వైపుకే శాస్త్రవేత్తలు మొగ్గు చూపవలసి వస్తుందంటే అందులో ఆశ్చర్యం లేదు. ఎక్కువ భాగం పరిశోధనలు ఆరోగ్యావసరాల కోసమే జరుగుతాయని అనుకోనవసరం లేదు. నేటి ప్రపంచంలో ప్రజలను పట్టి పీడిస్తున్న వ్యాధులలో మలేరియా, న్యుమోనియా, అతిసార, క్షయ 21 శాతంగా ఉన్నాయి. కాని అరోగ్య సంరక్షణ పరిశోధనల్లో వీటికి వ్యయం అవుతున్న నిధులు కేవలం 0.91 శాతం మాత్రమే. దాదాపు 100 కోట్లమంది ప్రజలు (వీరిలో ఎక్కువ భాగం భారత్‌వంటి వర్ధమాన దేశాలకు చెందినవారు) 'సాధారణ వ్యాధులతో బాధపడుతున్నారు. అంటే మలేరియా, కాలాజార్‌వంటి వ్యాధులన్నమాట. ఇవి కొద్దిపాటి చికిత్సతో నయమవుతాయి. కాని పేదతనంవల్ల చాలామంది వీటిని నయం చేయించుకోలేక పోతున్నారు. ప్రపంచ జనాభాలో 90 శాతం మందిని పీడించే వ్యాధుల కోసం 10 శాతం నిధులను (పరిశోధన కోసం కేటాయించిన వాటిలో) ఖర్చు చేస్తున్నారు. మొత్తంమీద పేటెంటు విధానం అనేది సంపన్నులైన కొనుగోలుదారులు వాడే ఉత్పత్తుల తయారీకే మొగ్గు చూపుతుంది. 1975-2004 మధ్య మార్కెట్‌లోకి ప్రవేశించిన 1,556 నూతన జెషధాలలో కేవలం 20 మాత్రమే ఉష్ణమండల దేశాలలో వచ్చే జబ్బులకూ, క్షయవ్యాధికి ఉపయోగపడేవి ఉన్నాయి. ప్రపంచంలోని ఒక భాగానికి మాత్రమే ఉపయోగపడి మరో భాగానికి ఉపయోగపడకపోతే అది పేటెంటు విధాన ఉద్దేశంగా ఉండజాలదని ఇంగ్లండుకు చెందిన రాయల్‌ సొసైటీ అభిప్రాయపడింది. సైన్సు-రాబకీయాలు నావ 6

పరిశోధనలు ఎవరికోసం? ఇక్కడితో ఈ కథ ముగియలేదు. ఉపయోగకరమైన బౌషధాలను కనిపెట్టినపుడు సంబంధిత కంపెనీలు వాటి ధరలను హెచ్చుగా పెడతాయి. భారత్‌వంటి దేశాలలో నివసించే సాధారణ ప్రజలకు ఇవి అందుబాటులో లేకుండా పోతాయి. ధరలను నిర్ణయించేటప్పుడు జౌషధ కంపెనీలు వివిధ దేశాల పరిస్థితిని కాక సంపన్న దేశాల మార్కెట్‌ను దృష్టిలో _ ఉంచుకుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ వినియోగించే మందులు కేవలం 2 శాతం కాగా, అమెరికాలో వాడకం 25 శాతంపైగా ఉన్నది. దీనినే మరో రకంగా చూద్దాము. ఉదాహరణకు కొవ్వును కరిగించేటందుకు వినియోగించే ఫైజర్‌ కంపెనీ ఉత్పత్తి చేసే లిపిటర్‌ను తీసుకుందాము. ప్రపంచమంతటిలోనూ 14380 కోట్ల డాలర్ల మేరకు ఈ మందు అమ్ముడవుతున్నది. అంటే, భారత్‌లో అమ్మకమయ్యే మొత్తం మందుల విలువలో 25 శాతం పైగా ఉంటుంది. ఇలాంటి కంపెనీలకు భారత్‌లో మందులు అమ్మాలన్న ఆసక్తి ఎందుకు ఉంటుంది? లుకేమియా (బ్లడ్‌ కేన్సర్‌) వ్యాధికి వాడే మందు చాలా ఖరీదైనది. ఈ వ్యాధి సోకిన వారు జీవితాంతం దీనిని వాడుకోవాలి. నెలకు దీని ఖరీదు రూ.1,20,000లు అవుతుంది! దీనిని తయారు చేసే నోవర్తిస్‌ కంపెనీకి భారత్‌లో ఈ మందును తయారు చేయాలన్న ఆసక్తి ఎందుకుంటుంది? ప్రపంచంలో 380 కోట్లమంది ప్రజలు (ప్రపంచ జనాభాలో 60 శాతం) రోజుకు రెండు డాలర్లకన్నా తక్కువ ఆదాయంతో జీవిస్తున్నట్లు ఇటీవలి సమాచారంవల్ల తెలుస్తున్నది. పేటెంటు వ్యవస్థలో ఇలాంటి వారికి బౌషధాలు అందుబాటులో ఉంటాయని ఊహించలేము. ట్రిప్స్‌ ఒప్పందానికి ముందు భారతదేశంలో ఉత్పత్తి అయ్యే బెషధాలు ప్రపంచ పేదలకు అందుబాటులో ఉండేవి. భారతదేశంలో అమలులోవున్న 1970 నాటి పేటెంటు చట్టం ఉత్పత్తి పేటెంటును అంగీకరించేది కాదు. దీనివల్ల బహుళజాతి సంస్థలు వసూలు చేసే ధరలతో పోలిస్తే భారతీయ కంపెనీలు వసూలు చేసే ధరలు అత్యల్పంగా ఉండేవి. ఎయిడ్స్‌ వ్యాధిని నయం చేయటానికి బహుళజాతి సంస్థల మందులను వాడితే ఏడాదికి 15,000 డాలర్లు ఖర్చు అవుతుంది. అదే భారతదేశంలోని సిష్లా కంపెనీ మందులు 100 డాలర్లు అవుతాయి. పరిశోధనలకు ఆటంకం పరిశోధనా రంగానికి కూడా పేటెంటు విధానం ఆటంకాలను కలిగిస్తుంది. నిర్ధిష్ట రంగాలలో కొంతమంది పేటెంట్లను తీసుకున్నారు. వాటిల్లోకి ఇతరులు ప్రవేశించే అవకాశం నా

లేదు. ఈ పరిస్థితి పరిశోధనను దెబ్బతీస్తుంది. అభివృద్ధి చేసిన ఉత్పత్తికాక, పరిశోధనలో ఉన్న ఉత్పత్తికి పేటెంటును ఇస్తుండటంతో ఈ దుస్థితి ఎదురవుతున్నది. అత్యధిక సంఖ్యాకులకు పరిశోధనా ఫలితాలను దూరం చేసే ఇలాంటి విధానం ఎలా ఉనికిలోకి వచ్చిందన్న ప్రశ్న సహజంగానే కలగవచ్చు. దీనికి జవాబును సులభంగానే చెప్పవచ్చు. నిజానికి ప్రస్తుతం ఉన్న పేటెంటు విధానం కాలం చెల్లినది. వైయక్తిక అన్వేషకులను ప్రోత్సహించేటందుకై 16 శతాబ్టిలో ఇది పుట్టుకు వచ్చింది. వారి పరిశోధనలకు ఇది రక్షణగా ఉండేది. ఐదు శతాబ్దాలు దాటినప్పటికీ ఈ విధానమే ఇప్పటికీ అమలవుతున్నది. గతంలోవలె ఈనాడు 'ేటెంట్లు వ్యక్తులకుకాక కార్పొరేట్‌ సంస్థలకు ఉపయోగపడుతున్నాయి. ఎక్కువ భాగం పేటెంట్లు వాటి స్వాధీనంలోనే ఉన్నాయి. పరిశోధనలను ప్రోత్సహించే విధానం మనకిప్పుడు కావాలి. దీనిపై

భారత్‌లోనూ ఇతర దేశాలలోనూ చర్చలు సాగుళున్నాయి. లాభాల నుంచీ, మార్కెట్‌ నుంచీ

పరిశోధనలను వేరు చెయ్యాలి. ప్రభుత్వ విధానాలతో ముడిపడిన వాతావరణంలోనే

అన్వేషణలు సాగాలి. భావి అవసరాలను తీర్చేలా ఉండాలి. సైన్సు-రాజకీయాలు లం

సవాళ్ల వలయంలో పేటెంట్‌ చట్టం

జెషధాల పేటెంట్‌ కోసం ఐదేళ్ళ క్రితం భారతీయ పేటెంటు చట్టాన్ని సవరించారు. ఇందుకుగాను వామపక్షాలకు కృతజ్ఞత చెప్పాలి. వాటి ప్రయత్నంతోనే ఈ సవరణ వచ్చింది. ఇతర పార్టీలు కూడా దీనికి మద్దతు ఇచ్చాయి. బౌషధాలను ప్రజలకు అందుబాటులోకి తేవడమే దీనంతటి ఉద్దేశం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే అనేక రక్షణ చర్యలను దీనిలో చేర్చడం జరిగింది. భారతీయ చట్టాన్ని మహాద్భుతమైనదిగా చెప్పలేనప్పటికీ జషధ రంగంలో గుత్తాధిపత్యాన్ని నిరోధించే శక్తి దీనికి ఉన్నది. కనుకనే ఈ చట్టం బహుళజాతి సంస్థలకు కంటగింపుగా తయారయింది. దీనిని నీరుగార్చటానికి అవి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో భారతీయ పేటెంటు చట్టంలో వున్న అవకాశాలను ఉపయోగించుకుని కొన్ని బృందాలు రకరకాలైన హక్కులను నిలబెట్టేందుకు ప్రయత్నించాయి. ప్రస్తుతం పేటెంటు చట్టానికి సంబంధించి న్యాయ పోరాటాలు సాగుతున్నాయి. అత్యవసర జౌషధాలను భారతీయ కంపెనీలు తయారు చేయటం కేవలం దేశీయ అవసరాల కోసమేకాదు. తృతీయ ప్రపంచ దేశాలకు ప్రాణాధార బొషధాలను సరఫరా చేయడంలో భారతదేశం ముందుపీఠిన ఉన్నది. వర్ధమాన దేశాలలోని హెచ్‌ఐవి రోగులలో దాదాపు 92 శాతంమంది భారతదేశం తయారు చేసే మందులనే వాడుతున్నారు. భారత్‌ నుంచి ఎగుమతి అయ్యే బౌెషధాలలో 67 శాతం వర్థమాన దేశాలకే వెళుతున్నాయి. అంతేకాక వర్ధమాన దేశాలలో యునిసెఫ్‌ పంపిణీ చేసే మందులలో దాదాపు 50 శాతం భారతదేశంలో తయారయినవే.

వాడుకలో ఉన్న మందుల్లో స్వల్బమైన మార్చులు చేసి దాని పేటెంటు గడువును (ట్రివ్సు ఒప్పందంలో నిర్ధేశించిన 20 ఏళ్ళకు పైబడి పెంచుకుని గుత్తాధిపత్యాన్ని చెలాయించాలనుకునే బహుళజాతి సంస్థల పేరాశలను భారత పేటెంటు చట్టం వమ్ము చేస్తున్నది. వాడుకలోని మందులకు కొద్దిపాటి మార్పులు చేసినంతమాత్రాన అది పేటెంటు శ్ర నాలా నానా నాలాల... “అమికనేన్‌ గుప్తా

పరిధిలోకి రాదని భారతీయ చట్టం చెపుతున్నది. మందులకు సంబంధించి కొన్ని ఉదాహరణలను చూద్దాము. ఎయిడ్స్‌ రోగులకు వాడే జిదోవుదైన్‌ మందును కేన్సర్‌ వ్యాధి నివారణకుగాను 19860లలోనే కనుగొన్నారు. దీనినే తరువాత అభివృద్ధి చేసి ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు వినియోగిస్తున్నారు. దీనిని పేటెంటు చేయడానికి అనేక దేశాలు ఒప్పుకున్నప్పటికీ భారతదేశ చట్టాలు మాత్రం అంగీకరించలేదు. తరువాత ఎయిడ్స్‌ వ్యాధికిసంబంధించిన మరో మందుకు 1994లో పేటెంటు దక్కినప్పటికీ భారతదేశం దీనిని కూడా అంగీకరించలేదు. అలానే, సిరపగా వాడే మందును 2001లో పేటెంటు చేసినప్పటికీ దానిని కూడా భారత దేశం ఒప్పుకోలేదు. సర్వసాధారణంగా ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు లమివుదైన్‌, జిదోవుదైన్‌ రకాలను సంయుక్తంగా వాడతారు. ఈ రెండు మందులను 1995కు ముందే పేటెంటు చేశారు. ఈ రెండింటి కలయికకు 1997లో పేటెంటు వచ్చింది. కాని భారతదేశం మాత్రం వీటిని గుర్తించలేదు. భారతీయ చట్టాల్లోవున్న ఈ అవకాశాలను ఉపయోగించుకున్న కొన్ని పౌర సంస్థలు అనేక సందర్భాలలో పేటెంటును ఇవ్వకముందే తవ వ్యతిరేకతను తెలియచేయగలుగుతున్నాయి. అయితే ఇదేమంత సులభం కాదు. దీనికి ఆర్థికృమేధోవనరులు అవసరం అవుతాయి. విశేషమేమంటే, పౌరసంస్థలే ఈ పని చేస్తున్నాయిగాని ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. వైద్య రంగంలో పేటెంటు దరఖాస్తులు 10,000 వరకు రాగా వీటిలో పదిహేనింటిని పౌరసంస్థలు వ్యతిరేకించాయి. భారతీయ చట్టానికి సంబంధించి పలురకాలైన న్యాయపోరాటాలు జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు ఇన్ని సవాళ్ళు ఎదురవుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లున్నది. వాస్తవానికి భారతీయ చట్టాన్ని రక్షించడంలో పౌరసంస్థలే ముందున్నాయి. ఈ సందర్భంగా రెండు ఉదంతాలను పేర్కొనాలి. సోరాఫెనిబ్‌ టోసిలేట్‌ (నిక్సవార్‌ పేరుతో ఇది మార్కెట్‌లో ఉన్నది) జౌషధానికి

జర్మన్‌ బహుళజాతి సంస్థయైన బేయర్‌కు కొంతకాలం క్రితం పేటెంట్‌ దక్కింది. మూత్రపిండాలకు వచ్చే ఒకరకమైన కేన్సర్‌ను నయం చేయడానికి దీనిని వాడతారు. కాలేయ కేన్సర్‌ ప్రారంభదశలో ఉన్నపుడు కూడా దీనిని ఉపయోగిస్తారు. కాగా భారతదేశానికి చెందిన సిష్లా కంపెనీ కూడా ఈ తరహా మందు తయారీ కోసం దరఖాస్తు చేసింది. దీనిపై బేయర్‌ కంపెనీ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. సిష్లాకు అనుమతి ఇచ్చేటట్లయితే తన పేటెంట్‌ హక్కులకు భంగం కలుగుతుందని వాదించింది. హైకోర్టు దీనిని తిరస్కరించింది. కాని బేయర్‌ కంపెనీ డివిజన్‌ కంపెనీకి అప్పీలు చేసింది. ఇది కూడా తిరస్కరణకు గురైంది. న.

బేయర్‌ కంపెనీ వేసిన కేసులో చాలా చిక్కులు ఉన్నాయి. పేటెంటు హక్కును మార్కెటింగ్‌తో ముడి పెట్టాలన్నది దాని వాదన. కాని ఇది విడ్డూరమైన విషయమేనని చెప్పాలి. ఎందుకంటే పేటెంటును ఇచ్చేటందుకు ప్రత్యేకమైన సంస్థ ఉంటుంది. దానికి మార్కెట్‌తో సంబంధం లేదు. కనుకనే రెండింటిని ముడివేయబూనటం విడ్డూరమే అవుతుంది. అంతేకాక పేటెంటు అనేది (పైవేటు వ్యవహారం. ప్రభుత్వాన్ని పేటెంటు పోలీసుగా వ్యవహరించమనటం సబబుకాదు. మార్కెట్‌కు ఆమోదం దొరికినంతమాత్రాన దాన్ని వెనువెంటనే ఆచరించటానికి వీలులేదు. ట్రిప్స్‌ ఒప్పందం ్రకారమైనా, భారతీయ చట్టాల (ప్రకారమైనా మార్కెట్‌ చేయదలచుకున్న బౌషధాన్నీ ముందుగా సంబంధిత సంస్థల వద్ద నమోదు చేసుకోవాలి. ఆ జాషధానికి పేటెంటు ఉన్నప్పటికీ ఈ విధంగా చేయాల్సిందే. 2005లో పరిన్ఫితిలో వచ్చిన మార్చు కారణంగా భారతీయ చట్టాన్ని వ్యాఖ్యానించటంలో భారత పేటెంటు కార్యాలయం ప్రధానమైన పాత్రను నిర్వహించింది. కార్యాలయం బాధ్యతలు పెరగటంతో దానికి తగినట్లుగానే చర్యలను చేపట్టారు. పేటెంటు కార్యాలయాలను (ప్రస్తుతం ఢిల్లీ, ముంబయ్‌, కోల్‌కతా, చెన్నయ్‌లలో ఉన్నాయి) ఆధునికీకరించటం, ఆన్‌లైన్‌లో పేటెంటు జర్నల్స్‌ అందుబాటు, దరఖాస్తులు-మంజూరు తదితరాలకు సంబంధించిన సమాచారం, పరిశీలకులకు తగిన శిక్షణ వగైరా చేపట్టారు. పేటెంటు మాన్యువల్‌ అనేది దాదాపు మూడేళ్ళుగా ముసాయిదా రూపంలోనే ఉండిపోయింది. దీనిపై అభిప్రాయాలను తెలపవలసిందిగా పేటెంటు కార్యాలయాలు కోరినప్పటికీ ఎవరూ చొరవ చూపలేదు. పేటెంటు మాన్యువల్‌ను చక్కగా తయారు చేసినట్లయితే పేటెంట్లపై తీర్చు ఇవ్వటం సులభమవుతుంది. దీనిలో ఎక్కువ భాగం అమెరికా, ఐరోపాల ఉదంతాలను ఉదహరించడం జరిగింది. కాని భారతీయ చట్టంతో ఈ రెండు విభేదిస్తాయి. కనుక భారత్‌కు సంబంధించిన ఉదాహరణలనే రూపకర్తలు ఇవ్వవలసి ఉంటుంది. బౌషధరంగంలోని బహుళజాతి సంస్థలు భారతీయ పేటెంటు చట్టాన్ని సవాలు చేస్తున్నాయనటం వాస్తవం. చట్టపరమైన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. కాని కేంద్ర ప్రభుత్వంలో మాత్రం కదలిక లేదు. 2005లో వామషక్షాలపై ఆధారపడి ఉండటంతో పేటెంటు చట్టంపై కదిలింది. ఇప్పుడు ఆ అవసరం తీరిపోయింది. కనుక పేటెంటు చట్టాన్ని కాపాడు కోవటానికిగాను ప్రజలే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాల్సిన అవసరమేర్పడింది. లై యానా అమిత్‌సేన్‌ గుప్తా

జ సహస్రాబ్ది లక్ష్యాల సాధనలో వెనుకంజ సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను భారతదేశం ఏమేరకు సాధించిందీ తెలిపే ఒక నివేదికను గత నెలలో మన ప్రభుత్వం విడుదల చేసింది. ఎనిమిది వేర్వేరు రంగాలలో నిర్ధిష్టమైన లక్ష్యాలను నిర్ధేశిస్తూ 2001లో ఐరాస ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. 2015 నాటికి ఈ లక్ష్యాలను సాధించాలన్న గడువును కూడా విధించింది. ఎయిడ్స్‌, మలేరియా, తదితర వ్యాధుల నిర్మూలన వీటిల్లో ఒక లక్ష్యంగా ఉన్నది. సహస్రాబ్ది లక్ష్యాల సాధనకు సంబంధించి భారతదేశం విడుదల చేసిన నివేదిక ఎయిడ్స్‌ వ్యాధి గురించి సవివరంగా చర్చించింది. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గినట్లుగా ఈ నివేదిక పేర్కొన్నది. 2002లో 20.73 లక్షలమంది వ్యాధిగ్రస్తులు ఉండగా 2007 నాటికి వీరి సంఖ్య 20.31లక్షలకు తగ్గినట్లు నివేదిక తెలిపింది. జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణా సంస్థ వెల్లడించిన సమాచారాన్ని బట్టి ఈ అంచనాకు రావటం జరిగింది. 2007లో వేసిన అంచనాల ప్రకారం ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు 57 లక్షల నుంచి 30 లక్షలకు తగ్గింది. " (ప్రజారోగ్యం మెరుగుపడటాన ఈ తగ్గుదల సంభవించలేదు. తప్పుడు సమాచారాన్ని ఆధారం చేసుకుని వేసిన అంచనాల కారణంగానే ఈ తగ్గుదల కన్పించింది. వాస్తవానికి ఎయిడ్స్‌ గురించి మన దేశంలో సరైన అంచనాలు లేకుండా పోయాయి. కనుక వీటిపై పూర్తిగొ ఆధారపడలేక పోతున్నాము. ఇతర దేశాలతో పోలిస్తే ఎయిడ్స్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రాలు మన దేశంలో తక్కువగా ఉన్నాయి. కాంబోడియావంటి చిన్న దేశంలో ప్రతి ౩1వేల మందికి ఒక వ్యాధి నిర్ధారణ కేంద్రం ఉండగా భారత్‌లో ప్రతి లక్షా 30 వేల మందికి ఒకటి ఉన్నది. ఎయిడ్స్‌ వ్యాధికి చికిత్స సౌకర్యం పెరుగుతున్నప్పటికీ అవసరానికి తగినంతగా మాత్రం లేదు. చికిత్సను చేయించుకుంటున్న వారిలో దాదాపు 88 శాతంమంది చనిపోవటమో లేదా చికిత్సను విరమించు కోవటమో జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితిలో ఎయిడ్స్‌ వ్యాధిని అదుపు చేసే చర్యల విషయంలో ఏమాత్రం ఉదాసీనత తగదు. గత దశాబ్దంలో ఎయిడ్స్‌ సైన్సు-రాజకీయాలు ననన 22

వ్యాధి నిర్మూలనలో మంచి అభివృద్ధి కనిపించినప్పటికీ తదనంతర కాలంలో ఈ ప్రయత్నాలు నెమ్మదించాయి. తగ్గి పెరిగిన మలేరియా ఇటీవలి కాలంలో మలేరియా వ్యాధిగ్రస్తులు తగ్గినప్పటికీ మలేరియా కారణంగా సంభవించే మరణాల సంఖ్యలో మాత్రం తగ్గుదల లేదని నివేదిక వెల్లడించింది. నిపుణుల అభిప్రాయం కూడా దీనినే బలపరుస్తున్నది. 1958లో జాతీయ నిర్మూలనా కార్యక్రమాన్ని చేపట్టారు. అప్పటిలో 7.50 కోట్లమందికి మలేరియా సోకగా, 8 లక్షలమంది చనిపోయినట్లు నమోదయింది. అనాడు దేశజనాభా 86 కోట్లుగా ఉన్నది. మలేరియా నిర్మూలనా కార్యక్రమాన్ని ఉదృతంగా చేపట్టటంతో చాలావరకు వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గింది. 1965-66 నాటికి మలేరియా రోగుల సంఖ్య లక్షకు తగ్గిపోగా, మరణాలు అసలు నమోదు కాలేదు. ఈ క్రమంలో మలేరియా వ్యాధి జాడ లేకుండా పోవలసింది. కానీ, అది మరలా విజృంభించింది. దీనితో ఏడాదికి 20 నుంచి 80 లక్షలమంది మలేరియా బారిన పడసాగారు. ఏడాదికి 200 నుంచి 1000 వరకు మరణాలు సంభవించ సాగాయి. సహస్రాచ్టి నివేదిక ఈ సంఖ్యలను వేరుగా ఇచ్చింది. దీని ప్రకారం 2005 నుంచి 2008 వరకు కోటీ 60 లక్షల నుంచి కోటీ 80 లక్షలమంది మలేరియా బారిన పడ్డారు. 10,000 నుంచి 17,000 వరకు మరణాలు సంభవించాయి. మరోవిధంగా చెప్పాలంటే గత దశాబ్దితో పోల్చుకుంటే, ఈ దశాబ్టిలో మలేరియా వ్యాధిగ్రస్తులుగానీ, ఈ వ్యాధి కారణంగా మరణించిన వారుగానీ పది రెట్లు పెరిగినట్లు అధికారిక సమాచారాన్ని బట్టీ ఊహించవచ్చును. అయితే, సర్వసాధారణంగా అధికారిక సమాచారం తక్కువగా ఉంటుందన్న విషయం మనకు తెలుసు. కనుక, మలేరియా వ్యాధిగ్రస్తులు ఏడాదికి 5 కోట్ల నుంచి 10 కోట్ట-వరకు, మలేరియా కారణంగా సంభవించే మరణాలు 50,000 నుంచి 1,00,000 వరకు ఉంటాయని ఊహించవచ్చు. దీనంతటినీ బట్టి చూస్తే సహస్రాబ్ది లక్ష్యాలలో ఒకబైన వ్యాధుల నిర్మూలనలో మనం వెనుకబడి ఉన్నట్లు అర్థం కాగలదు. మలేరియాను అదుపు చేయటంలో మనం విఫలమయ్యామనే చెప్పాలి. ఒరిస్సా, జార్థండ్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గర్‌ రాష్ట్రాలలోని అటవీ ప్రాంతాలలో నివసించే ఆదివాసులలో పరాన్నభుక్కుల ద్వారా సంక్రమించే మలేరియా కనపడుతున్నది. ఇది (ప్రాణాంతకమైనది. దీనికి సంప్రదాయ వైద్య చికిత్స ఏమాత్రం పనికిరాదు. కొత్తగా వస్తున్న మందులను దీనికి వాడాలి. కాని ఇవి ఖర్చుతో కూడుకున్నవి. తతృలితంగా మలేరియాకు చికిత్స చేయటం క్లిష్టంగా ఉంటున్నది. 2 ఎ అమిత్‌సేన్‌ గప్ప్తా

క్షయ రోగులలో ప్రథమ స్థానం

పేదరికం, పరిసర కాలుష్యం కారణంగా క్షయ వ్యాధి వ్యాసిస్తుంటుంది. అభివృద్ధి చెందిన దేశాలు 1920లలోనే ఈ వ్యాధిని నిర్మూలించాయి. క్షయవ్యాధికి తొలి మందు కనిపెట్టటానికి 15 సంవత్సరాల ముందే ఆ దేశాలు ఈ విజయాన్ని సాధించాయి. కాగా భారతదేశంలో ప్రతి ఏటా దాదాపు రెండున్నర లక్షలమంది క్షయవ్యాధి కారణంగా మరణిస్తున్నారు. ప్రపంచంలో భారతదేశం క్షయవ్యాధికి రాజధానిగా తయారైంది. ప్రపంచంలో క్షయవ్యాధితో బాధపడుతున్న ప్రతి ఐదుగురులోనూ ఒకరు భారతీయుడు. అయితే గత పదిహేనేళ్ళుగా భారతదేశంలో ఈ వ్యాధిని అదుపు చేసేటందుకు మంచి కృషి జరుగుతున్నది. తత్కారణంగా క్షయవ్యాధి కారణంగా సంభవించే మరణాలు తగ్గుతున్నాయి. ఇటీవలి కాలంలో ప్రపంచ దేశాలలో క్షయవ్యాధిని తగ్గించే పలు రకాలైన మందులు, సాంకేతిక విజ్ఞానమూ అందుబాటులోకి వచ్చాయి. గతంలో 18 మాసాలు పట్టే చికిత్స ప్రస్తుతం 6 మాసాలకు తగ్గింది. క్షయవ్యాధి నిర్మూలనలో ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ ఈ వ్యాధి కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య ఎక్కువగానే ఉన్నది. ఇదియిలా ఉండగా ఒక కొత్త బెడద వచ్చిపడింది. క్షయవ్యాధిని నయం చేయటానికి ఇప్పుడు కొత్తరకం మందులు వచ్చాయి. మళ్టీ డ్రగ్‌ రెసిస్టిన్స్‌ టిబి అని వీటిని పిలుస్తున్నారు. ఈ మందుల వాడకంతో నయం అవుతున్న కేసులు కేనలం 60 శాతం మాత్రమే ఉంటున్నాయి. పైగా వీటివల్ల ఖర్చు కూడా పెరుగుతున్నది. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో భారతదేశం ప్రపంచంలోనే వెనుకపడి ఉన్నది. భారతదేశంలో వైద్యవ్యవస్థ ఎక్కువ భాగం (ఫైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నది. ప్రపంచంలోని మరే దేశంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు. అలానే ప్రపంచం మొత్తంమీద చూసినప్పుడు వైద్య రంగంలో భారత ప్రభుత్వం చేస్తున్న ఖర్చు చాలా తక్కువగా ఉన్నది. సహస్రాబ్టి లక్ష్యాల సాధనలో భారతదేశం వెనుకపడి ఉండటానికి ఇలాంటి అంశాలన్నీ కారణమవుతున్నాయి. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసినపుడే ఈ పరిస్థితిలో మార్పు రాగలదు. అప్పటి వరకు ప్రభుత్వం చెప్పే విజయాలన్నీ ఎక్కువ భాగం కల్పితాలుగానే ఉంటాయి. సైన్సు-రాజకీయాలు 24

ఆలి బెషధ రంగంలో అపవిత్ర పొత్తులు

1960లలో ఐరోపా అంతటాగల వైద్యులు అంతకు మునుపెన్నడూ లేని రీతిలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. కాళ్ళు, చేతులు లేకుండా పుడుతున్న పసికూనల గురించి వార్తలు వెల్లువెత్తాయి. అనేకమంది పిల్లలకు అవయవాలు సక్రమంగా లేకుండా ఎగుడుదిగుడుగా ఉన్నాయి. కొంతమందికి జననేంద్రియాలు లేకుండా పోయాయి. ఇంకొంతమందిలో మూత్రపిండాల అమరిక సరిగా లేదు. అవయవాల పొందిక సక్రమంగా లేని ఈ బిడ్డల విషయంలో ఒకానొక అంశం కొట్టొచ్చినట్లు కనిపించింది. అదేమంటే, ఇలాంటి వికృత శిశవులకు జన్మనిచ్చిన తల్లులందరూ థలిడోమైడ్‌ అనే మందును వాడారు. మానసిక ఉపశమనం కోసం లేదా నిద్ర కోసం దీనిని 19560లలోనూ, 1960ల ప్రారంభంలోనూ చాలామంది వినియోగించారు. దీనితో ఆ మందును ఉపసంహరించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8,000 మందికి పైగా వికృత శిశువులు జన్మించారు. ఈనాటికీ జెషధ సంస్థలు చేస్తున్న దగాలను థలిడోమైడ్‌ విషాదం బహిర్గతం చేసింది. ఈ మందును గురించి సరైన పరిశోధనలు చేయకుండానే జర్మనీకి చెందిన జెన్నీ గ్రున్నెతాల్‌తోపాటు మరికొన్ని సంస్థలు దీనిని తయారు చేసి మార్కెట్‌లో విడుదల చేశాయి. ఇది ఎక్కువగా మత్తునిస్తుందన్న విషయాన్ని పట్టించు కోకుండా అప్పటిలో మార్కెట్‌ చేయటం జరిగింది. ఈనాడు జరుగుతున్నదేమంటే, మత్తును కల్లిస్తాయన్న నివేదికలను మందుల కంపెనీలు కొట్టివేస్తూ

వీటిని వాడేలా వైద్యులను ప్రభావితం చేస్తున్నాయి.

ఈ మందును మార్కెట్‌ చేయడానికి ముండే గ్రున్నెతాల్‌ సంస్థ స్వయంగా దీని గురించి అధ్యయనం చేసింది. ఇది మత్తును కలిగించే మందు అని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయినప్పటికీ ఇది సురక్షితమైన బొషధమని కంపెనీ ప్రచారం చేసింది. పిల్లల కోసం కూడా దీనిని అమ్మకానికి పెట్టింది. చూలింతలు, బాలింతలు దీనిని వాడవచ్చునని, 26 అమిత్‌సేన్‌ గుప్తా

దీనివల్ల అటు తల్లికిగాని, ఇటు బిడ్డకుగాని ఎలాంటి హాని ఉండదని పలు పత్రికలలో ఈ సంస్థ ప్రకటనలిచ్చింది. కాని 1961 నాటికి ఈ మందు దుష్ప్రభావాన్ని కాదనలేని స్థితిలో ఈ నంన్భలు పడ్డాయి. ఆ ఏడాది చివరినాటికి ఈ మందును మార్కెట్‌నుంచి ఉపసంహరించుకున్నాయి. అయితే అప్పటికే అనేకమంది పిల్లలు అవయవ పొందిక లేకుండా జన్మించారు. దాదాపు 46 దేశాల్లో 8,000 మంది వికృత శిశువులు జన్మించారు. మృత శిశు వులను కూడా లెక్కిస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రజలకన్నా లాభాలే మిన్న

బాధితుల కుటుంబాలకు నష్టపరిహారంగా కోట్లాది రూపాయలను చెల్లించటంతో థలిడోమైడ్‌ ఉదంతం ముగిసింది. కాని మందుల కంపెనీల వైఖరిలో మార్పు రాలేదు. ఇదంతా జరిగి యాఖభైయేళ్ళు గడచినప్పటికీ ఇప్పటికీ ప్రజలకన్నా లాభాలే మిన్న అన్న ధోరణితోనే కంపెనీలు నడుస్తున్నాయి. మందు ఖరీదులో మూడింట ఒక వంతు దాని ఉత్పత్తి వ్యయం కాగా మిగిలినది ఆ మందును మార్కెట్‌ చేసేటందుకు అవుతున్న ఖర్చుగా అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని పరిశ్రమలన్నిటిలోకి బెషధ పరిశ్రమ లాభదాయకంగా నడుస్తున్నది. ఈ లాభాలను నిలబెట్టుకోవటం కోసం పరిశ్రమదారులు రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టే మందులు ఉనికిలో ఉన్నవాటికన్నా గొప్పవేమ్‌ కాదు. కనుకనే అవి అనేక రకాల పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఇటీవలి దశాబ్దాలలో ప్రవేశపెట్టిన వాటిలో కేవలం 3 శాతం మాత్రమే మెరుగైన చికిత్సకు అనుకూలంగా ఉన్నాయని తేలింది. నిరుపయోగమైన మందులు ఎక్కువగా ఉన్నందున వాటిని అమ్ముకోవటం సంస్థలకు ఒక సవాలుగా తయారైంది. ఇలాంటి పరిస్థితిలో తమ మందుల మార్కెట్‌ కోసం వైద్యులను, అమ్మకందారులను, కొనుగోలుదారులను ప్రభావితం చేయటానికి మందుల తయారీ సంస్థలు మోసపూరితమైన వాటితో సహా ఎన్నోరకాల పద్ధతులను అమలు చేస్తున్నాయి. మందుల అమ్మకంలో ఉత్పత్తి సంస్థలు అనుసరించే మోసపూరిత పద్ధతులను అరికట్టటానికి రకరకాల చర్యలను తీసుకుంటున్నప్పటికీ ఉపయోగం తక్కువగా ఉంటున్నది. అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన సంస్థలు తమ పలుకుబడిని ఉపయోగించి నిరుపయోగ మందులను సైతం వ్యాప్తిలోకి తీసుకొస్తున్నాయి.

మందుల కొనుగోలు నిమిత్తం భారతీయులు యేటా రూ.50,000 కోట్లు వినియోగిస్తున్నారు. అంటే దేశంలోని ప్రతి కుటుంబం ఏడాదికి సగటున రూ.2,000 సెన్సు -రాజకీయాలు. 26

ఖర్చు చేస్తున్నది. ఈ వ్యయంలో సుమారుగా సగభాగం అనవసర మందులపై ఖర్చు చేస్తున్నట్లు అంచనా. అంటే, ఏడాదికి దాదాపుగా రూ.25,000 మేరకు వృథా వ్యయం అవుతున్నదన్నమాట. ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో 80,000 రకాల బ్రాండ్ల మందులు లభిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కేవలం 800 బ్రాండ్లను మాత్రమే సిఫార్సు చేసింది. పైన పేర్కొన్న 80 వేల రకాల మందులలో ఎక్కువ భాగం ప్రమాదమైనవి లేదా నిరుపయోగమైనవి. ఈ రకమైన పరిస్టితి తలెత్తటానికి ప్రధానంగా జౌషధ సంస్థలనూ, ప్రభుత్వాన్ని నిందించవలసి ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్నవారి తోడ్పాటు లేకుండా ఈ పరిస్థితి నెలకొన్నదని అనుకోలేము. జౌషధాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండక పోవటం కూడా ఇందుకొక కారణంగా చెప్పవచ్చు. చికిత్స విధానంలో అనేక మార్చులు వస్తున్నందున వైద్యులు కూడా తమ విజ్ఞానానికి పదును పెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే ఇందుకు అవసరమైన సమాచారం వైద్యులకు అందుబాటులో ఉండటం లేదు. ముఖ్యంగా, వైద్య రంగంలో వస్తున్న మార్పులకు సంబంధించిన పుస్తకాలు, పత్రికలు అందుబాటులో ఉండాలి. కాని ఈ సౌకర్యం మన దేశలోని వైద్యులకు అందుబాటులో లేదు. ఇలాంటి పరిస్థితిలో మందుల కంపెనీ చెప్పిందే వేదంగా మారుతున్నది. ఇవి అందించే సమాచారం పాక్షికంగానూ పక్షపాతంతో కూడుకున్నదిగానూ ఉంటున్నది. అమ్మకాలను పెంచుకునే లక్ష్యంతోనే ఈ సమాచారాన్ని అవి రూపొందిస్తాయి. భారతదేశంలోని కౌషధ పరిశ్రమ తన వార్షిక అమ్మకాలలో 20 శాతాన్ని మందుల వినియోగాన్ని పెంచుకోవటానికే ఉపయోగిన్తున్నాయి. మందుల వాడకాన్ని పెంచటానికిగాను అర్ధసత్యాలతో కూడిన సమాచారాన్ని ప్రచారంలో పెడుతున్నాయి. ఇవి ప్రచురించే కరపత్రాలలో నిజాలకన్నా అసత్యాలే ఎక్కువగా ఉంటాయి. మందుల కంపెనీల రిప్రజెంటేటివ్‌లు తమ మందులు డాక్టర్‌కు గుర్తుండేటందుకుగాను వారికి ఏవేవో బహుమతులు ఇస్తుంటారు. గతంలో మందులు రాసేటందుకు వీలైన కాగితాలు, వైద్య పరికరాలు వగైరాలు ఇచ్చేవారు. కాని ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఆభరణాలు, ఎయిర్‌ కండిషనర్లు, కెమెరాలు, టెలివిజన్‌లు వగైరాలు ఇస్తున్నారు. రోగులకు తమ మందులను రాసే డాక్టర్లకు రకరకాల బహుమతులను ఇవ్వటానికి వారెప్పుడూ తయారుగా ఉంటారు. కొన్ని సంస్థలైజే డాక్టర్లకు లక్ష్యాన్ని నిర్దేశించి వాటిని సాధించిన వారికి వివిధ రకాల ప్రోత్సాహకాలను ఇస్తున్నాయి. ఉదాహరణకు, 1000 మందు బిళ్ళలను రాస్తే ఒక సెల్‌ఫోన్‌, 5,000 బిళ్ళలు రాస్తే ఒక ఎయిర్‌ కూలర్‌, 10,000 బిళ్ళలు రాస్తే ఒక మోటార్‌ 27 అమిత్‌సేన్‌ గప్తా

సైకిలు ప్రోత్సాహకాలుగా ఇవ్వటం జరుగుతున్నది. ఇంతటితోనే ఈ కథ ముగియటం లేదు. కొన్ని కంపెనీలు ఎంపిక చేసిన డాక్టర్లను విదేశీ పర్యటనలకు పంపుతున్నాయి. శాస్త్ర సమ్మేళనాల ముసుగులో ఇలాంటి పర్యటనలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇలాంటి పర్యటనలకు వైద్యులనేకాక వైద్యవృత్తితో సంబంధమున్న ముఖ్యులను కూడా తీసుకు వెళ్తున్నారు. ఐదు నక్షత్రాల హోటళ్లలో వీరికి బస ఏర్పాటు చేస్తారు. ఇందుకయ్యే ఖర్చులన్నిటినీ జొషధ సంస్థలే భరిస్తాయి.

ఈ రకమైన అనైతిక ధోరణులు వైద్య పట్టా పుచ్చుకునేటపుడు చేసే ప్రమాణానికి విరుద్ధమేకాక, లక్షలాది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. చాలామంది అనవసరమైన మందులను వాడుతున్నారంటే అందుకు వారికి చికిత్స చేసే వైద్యుడే ప్రధాన కారణం. వైద్యవృత్తిలో ఉన్నవారికి మందుల గురించి సరైన సమాచారాన్ని అందించగలిగితే కొంతమేరకైనా అవినీతిని అరికట్టవచ్చు. ఇటీవలి కాలంలో కౌషధ విభాగం, భారత వైద్య మండలి చేసిన ప్రయత్నాలు గమనించదగినవి. ఏకీకృత మార్కెట్‌ విధానాన్ని చేపట్టవలసిందిగా కౌషధ విభాగం కోరింది. అయితే ఇందుకు బడా కంపెనీలు అడ్డుగా మారాయి, దీంతో గత ఏడాది భారత వైద్యమండలి చట్టాన్ని సవరించారు. దీని ప్రకారం డాక్టర్లు బహుమతులను పుచ్చుకోవటం, విదేశీ పర్మటనలను ఆమోదించటం నేరం. మందుల కంపెనీలకూ, కొంతమంది డాక్టర్లకూ మధ్యవున్న అపవిత్ర పొత్తు చాలా బలంగా ఉన్నది. వైయక్తిక ప్రయోజనాల కారణంగా ఈ పొత్తు నానాటికీ బలపడుతున్నది. వైద్య రంగంలో ఇలాంటి అపవిత్ర ధోరణులను తొలగించేటందుకై ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. సెన్సు-ళాజకీయాలు 25

ఆలిండియా పీపుల్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ లౌకికత్వం, ప్రజాస్వామ్యం, అభివృద్ధే లక్ష్యం "స్‌ గత నెల చివరిలో కేరళలోని త్రిసూర్‌లో 18వ అఖిల భారత పీపుల్స్‌ సైన్స్‌ కాంగ్రెసు జరిగింది. ఆరు వందలమందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. లౌకికత్వం, ప్రజాస్వామ్యం, అభివృద్ధి కోసం శాస్త్రం అన్న అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఈ మహాసభలు జరిగాయి. పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ అధ్యక్షుడు సి.పి. నారాయణన్‌ మహాసభలను (ప్రారంభించాడు. అణు ఇంధన నియంత్రణ బోర్డు మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ ఏ. గోపాలకృష్ణన్‌ ప్రారంభోపన్యాసం చేశారు. 2జి స్పెద్టమ్‌ కుంభకోణంకన్నా భారత్‌-అమెరికా అణు ఒప్పందం మరింత పెద్ద కుంభకోణంగా రుజువు కాగలదని ఆయన అన్నారు. అణు సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన దేశీయ సామర్ధ్యాన్ని ఈ ఒప్పందం ఎలా దెబ్బతీసేది ఆయన వివరించారు. ఈ ఒప్పందం కారణంగా ఏళ్ళ తరబడి భారతీయ శాస్త్రవేత్తలు చేసిన శ్రమ నిష్ఫలంగా మారే ప్రమాదం ఉన్నది. అంతేకాక అణు రియాక్టర్లను దిగుమతి చేసుకోవడం వలన మనం వాటి సరఫరా కోసం విదేశీయుల దయాదాక్షిజ్యాలపై ఆధారపడవలసి వస్తుంది. అమెరికా, ఫ్రెంచ్‌ దేశాలపై ఆధారపడవలసి రావడమేకొక, దేశ ప్రయోజనాలకు ఎలాంటి లాభమూ లేనప్పటికీ జాతి సార్వభౌమత్వానికి ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉన్నదని ఆయన హెచ్చరించారు. పరీక్షించని అణు రియాక్టర్లను భారత్‌కు ఎగుమతి చేసేటందుకుగాను ఈ ఒప్పందం అనుమతిస్తున్నది. పైగా దేశీయమైన వాటితో పోల్చుకుంటే ఇవి అత్యంత వ్యయభరితమైనవి. వీటివల్ల దేశ ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచివున్నది. భారత పొర అణు కార్యక్రమానికి అధికార రహస్య చట్టాన్ని అనువర్తింప చేయటంలో జెచిత్యం ఏమిటని డాక్టర్‌ గోపాలకృష్ణ ప్రశ్నించారు. ప్రస్తుత కార్యక్రమానికి న న న నా

సంబంధించిన అన్ని వివరాలను బహిర్గతం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండు చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. పరీక్షించని అణు రియాక్టర్ల ఏర్పాటు కారణంగా పర్యావరణానికీ, ప్రజారోగ్యానికీ కలిగే ప్రమాదాన్ని గుర్తించేలా ప్రజలను చైతన్యపరచాలని ఆయన కోరారు.

కేరళ భూమి-ప్రజలు అన్న డాక్టర్‌ థామస్‌ ఐజాక్‌ గ్రంథాన్ని ప్రారంభ సమావేశంలోనే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాక్టర్‌ ఐజాక్‌ మాట్లాడుతూ పీపుల్స్‌ కాంగైసుతోనూ, కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్‌తోనూ తనకున్న సుదీర్హ అనుబంధాన్ని వివరించారు. ఈనాడు శాస్త-సాంకేతిక రంగాలలో త్వరితగతిని చోటుచేసుకుంటున్న మార్పులను అవగాహన చేసుకోవలసిన అవసరం శాస్త్ర ఉద్యమానికి ఎంతైనా ఉన్నదని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థనూ, శాస్త్రీయ పరిశోధననూ (పైవేటీకరించే ధోరణిని శాస్త్రీయ ఉద్యమం ప్రశ్నించాలని ఆయన సూచించారు. భారతీయ ఖగోళభౌతిక శాస్త్ర సంస్థకు చెందిన డాక్టర్‌ ప్రజ్వల శాస్రి ప్రసంగిస్తూ, ప్రజలలో శాస్ర్తీయ విజ్ఞానాన్ని (ప్రచారం చేయవలసిన బాధ్యత మహాసభ ప్రతినిధులపై ఉన్నదని చెప్పారు. శాస్త్ర విజ్ఞానంలో 'ప్రజలకు అభివృద్ధిని పెంచటంలో ఖగోళ శాస్త్రం ఏవిధంగా తోద్చదడేదీ ఆమె వివరించారు. పారంభ కార్యక్రమాల అనంతరం బ్రవ్మాండమైన జాతా సాగింది. వీటిల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. సంస్థాగత సమిక్ష

రెండవ రోజున గత 22 ఏళ్ళుగా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ చేపట్టిన కార్యక్రమాల సమీక్ష జరిగింది. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తున్న దాక్టర్‌ అమిత్‌సేన్‌ గుప్తా ఒక నివేదికను ప్రవేశపెట్టారు. 1988లో సంస్థ అవిర్భావానికి దారితీసిన పరిస్థితులను ఆయన వివరించారు. శాస్త్రాన్నీ, విజ్ఞానాన్నీ వ్యాపార సరకుగా మార్చాలని చూసే ప్రస్తుత విధానాలపట్ల ప్రతినిధులు మెలకువగా ఉండాలి. తొలినుంచి ఈ సంస్థ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజల వద్దకు తీసుకు వెళ్ళేందుకే ప్రయత్నిస్తున్నదని నివేదిక పేర్కొన్నది. విద్య, ఆరోగ్యం, అభివృద్ధి, వ్యవసాయం, జీవనాధారాలు, ఎస్‌సి,ఎస్‌టి సంక్షేమం వంటి కార్యకలాపాలను కూడా సంస్థ తన గమనంలో ఉంచుకున్నది. ప్రజల కష్టాలను తొలగించి వారి జీవితాన్ని మెరుగుపరచే శక్తి శాస్తానికున్నది. అంతేకాక, శాస్త్ర విజ్ఞానం వ్యాపారతత్వాన్ని సంతరించుకోకుండా చూసే బాధ్యత కార్యకర్తలపై ఉన్నదని నివేదిక పేర్కొన్నది. కాగా ఈనాడు శాస్త్ర ఉద్యమానికి నూతన సవాళ్ళు ఎదురవుతున్నాయి. సైన్సు-రాజకీయాలు నానా 0

వాటిని సమర్ధవంతంగా ఎదుర్శొనాలి. నివేదికపై జరిగిన చర్చలో పలువురు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

సాంకేతిక విజ్ఞానానికి సంబంధించి ఎనిమిది బృందాలుగా విడివడి చర్చలు జరిపారు. వర్యావరణం, శాస్త విజ్ఞానంలో స్వావలంబన, వ్యవసాయాం, వికేంద్రీకరణ-'ప్రజాస్వామ్య పాలన, విద్య, శాస్త్ర ప్రచారం, ఆరోగ్యం, సామాజిక మినహాయిపులన్న అంశాలపై ఈ చర్చలు సాగాయి. మహాసభ జరిగినన్ని రోజులూ ప్రతిరోజూ సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి. మొత్తం నాలుగు తీర్మానాలను మహాసభ ఆమోదించింది. ఎండోసల్ఫాన్‌ ఆధారిత పురుగు మందులను నిషేధించాలి, మహారాష్ట్రలోని జైతపూర్‌లో అణువిద్యుత్మేంద్ర నిర్మాణాన్ని నిలిపివేయాలి, సామాజిక కార్యకర్త దాక్టర్‌ వినాయకసేన్‌కు విధించిన జీవిత ఖైదు శిక్షను పునస్సమీక్షించాలి, పార్లమెంటులో స్త్రీలకు 88 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలి. చివరగా 21 మందితో కార్యవర్ధాన్ని మహాసభ ఎన్నుకొన్నది. అధ్యక్షునిగా రఘునందన్‌, (ప్రధాన కార్యదర్శిగా గంగాధరన్‌లు ఎన్నికయ్యారు. తదుపరి మహాసభను 2012లో లక్నోలో జరపాలని ప్రతినిధులు నిశ్చయించారు, . త ననన న ఎ“ అమిక్‌సేన్‌ గై

శిశుహంత నెస్లే చొరబాటు

దాదాపు 28 ఏళ్ళకు పైగా అంతర్జాతీయ వెలికి గురైన కంపెనీ అది. బహుశా, ఇంత సుదీర్హ కాలంపాటు బహిష్కరణకు గురైన అంతర్జాతీయ సంస్థ ఇదేనేమో! తల్లిపాలకు (ప్రత్యామ్నాయం అంటూ తన ఉత్పత్తులను అనైతిక రీతిలో అమ్మకానికి పెట్టిన ఈ సంస్థను స్వచ్చంద కార్యకర్తలు “శిశుహంత” అని పిలిచారు. ఈ కంపెనీయే ప్రభుత్వ రంగంలోని నాలుగు విద్యానంస్థలతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. పంజాబ్‌ అగ్రికల్చర్‌ యూనివర్శిటీ (లూథియానా), నేషనల్‌ డైరీ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ (కర్నాల్‌-హర్యానా), యూనివర్శిటీ ఆఫ్‌ మైసూర్‌ (కర్ణాటక), జి.బి.పంత్‌ యూనివర్శిటీ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ (పంత్‌నగర్‌-ఉత్తరాఖండ్‌) సంస్థలతో స్విట్టర్లాండ్‌కు చెందిన నెస్లే ఎస్‌ ఏకు అనుబంధ సంస్థయైన నెస్లే ఇండియా కంపెనీ అవగాహనా ఒప్పందాలను కుదర్చుకున్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గజనవరి 2011) పత్రిక వెల్లడించింది. ఈ ఒప్పందాన్ని అనుసరించి నెస్లే సిబ్బంది పైన పేర్మొన్న విద్యాసంస్థల అధ్యాపకులతో కలసి “పౌష్టికాహార విద్యా” కార్యక్రమాన్ని చేపట్టింది. 2009 ఏప్రిల్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి అగాథ సంగా, నెప్టెల్‌ ఇండియా ఛైర్మన్‌ హేలియో వాజిస్కీలు దీనిని ప్రారంభించారు. అంతా గోప్యమే

ఈ గాథంతా దుర్గంద భూయిష్టమైనది. సమాచార హక్షు చట్టం (ఆర్‌టిఐ) కింద ఈ ఒప్పందాన్ని గురించిన సమాచారాన్ని కోరినప్పటికీ ఇచ్చేటందుకు పంజాబు విశ్వవిద్యాలయం తిరస్కరించింది. ఈ ఒప్పందాన్నిగానీ, దీనిని కుదుర్చుకునేటపుడు జరిపిన చర్చలుగానీ రహస్యమైనవి. మరొకరితో పంచుకునేవి కావని, ఈ ఒప్పందం స్వయంగా చెపుతున్నది. ఆర్టీఐ కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానం ఇచ్చేటందుకు అనుమతించ సైన్సు-ళాజకీయాలు. ననన 2

వలసిందిగా విశ్వవిద్యాలయానికి చెందిన పౌష్టికాహార విభాగం అధిపతి డాక్టర్‌ జె.కె. సంఘా కోరినప్పటికీ నెస్తే సంస్థ తిరస్కరించింది. అవగాహన పత్రంలో పొందుపరచిన అంశాలను శాస్త్రవేత్తలు, నిపుణులు అభివృద్ధి చేసి ఉండటాన వాటిని బహిర్గతం చేయలేమని నెస్లే కంపెనీ సీనియర్‌ మేనేజర్‌ అజయ్‌ పాల్‌ సింగ్‌ గత జూలై 1న సమాధానం ఇచ్చాడు. ఇక్కడ మనకు ఎదురయ్యే ప్రశ్న ఏమంటే, 'పౌొష్టికాహార విద్యకు వెందిన కార్యక్రమాన్ని రహస్యంగా ఉంచవలనిన అవనరం ఏమిటన్నదే? ఈ తరవో కార్యక్రమంయొక్క వ్యాపార, రహస్య స్వభావం ఎలా ఉండనున్నది? ఈ ఒప్పందంలో భాగస్వామిగా ఉన్న సంస్థ నెస్తే అయినందున ఈ ప్రశ్నలు వేయటం తప్పనిసరి అయింది. ఇంగ్లండును స్థావరంగా కలిగిన కార్పొరేట్‌ వాచ్‌ వెబ్‌సైట్‌ ఇలా పేర్కొంటున్నది. “ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం పోషకాలు లోపించిన ఆహారం వల్ల ప్రతియేటా 15 లక్షలమంది శిశువులు చనిపోతున్నారు. స్తన్యానికి అవకాశం ఉన్న సమయంలో సైతం తల్లిపాలకు బదులుగా ఇతరమైన ఆహారాన్ని ఇవ్వటమే ఇందుకు కారణం. ప్రపంచం మొత్తంమీద శిశువులకు పట్టే కృత్రిమ పాలల్లో దాదాపు 40 శాతం ఉత్పత్తి నెస్లే ఆధ్వర్యాన జరుగుతున్నది. కనుక శిశుమరణాలకు ప్రధాన కారణం కూడా నెస్లే సంస్థదే అవుతుంది”. తల్లిపాలకు ప్రత్యామ్నాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో చోటుచేసుకుంటున్న అనైతిక ధోరణుల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన తలెత్తడంతో 1981లో తల్లిపాలకు ప్రత్యామ్నాయాల మార్కెటింగ్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. భారతదేశం కూడా ఇందుకు సంబంధించి 1992లో స్వంతంగా చట్టాలను రూపొందించింది. శిశుపాల ప్రత్యామ్నాయాల చట్టంగా (ఐఎంఎస్‌) పేరుపడిన దీనిని 2003లో మరింత పటిష్టం చేయడం జరిగింది. శిశు ఆహారాన్ని తయారు చేసే నెస్లే వంటి సంస్థలు చేయగూడని పనులను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విధంగా పేర్కొన్నది: ఆ ఆసుపత్రులలోనూ, దుకాణాలలోనూ లేదా సామాన్య ప్రజానీకంలోనూ తమ ఉడ్చత్తులను వ్యాప్తి చేయుటం; ఒ తల్లులకు ఉచితంగా శాంపిల్స్‌ ఇవ్వటం లేదా ఆసుపద్రుల్లోనూ, ప్రసూతి వార్డుల్లోనూ ఉచితంగా లేదా తగ్గింపు ధరకు సరఫరా చేయడం; = ఆరోగ్య కార్యకర్తలకు లేదా తల్లులకు బహుమతులు ఇవ్వటం; త్త లాలా న నూ. అమిక్‌సేన్‌ గువ్తా

లా ఆరోగ్య కార్యకర్తలకు తమ ఉత్పత్తులను ఇవ్వటం, కంపెనీలు ఇచ్చే సమాచారం కేవలం శాస్టీయాంశాలకు పరిమితమైనదిగా ఉండాలి; ఆ పిల్లలకు ఆహార పదార్థాలను లేదా పానీయాలను సరఫరా చేయడం; -ా తప్పుదారి పట్టించే సమాచారాన్ని అందించటం. ఈ నిబంధనావళి ఇంకా ఈ విధంగా చెపుతున్నది: = ప్యాకెట్లపై అంటించే లేబుల్స్‌ను తల్లులకు అర్ధమయ్యే భాషలో ముద్రించాలి. అలానే ఆరోగ్య హెచ్చరిక ఉండాలి. = పిల్లల పాల ఉత్పత్తుల ప్యాకెట్లపై పిల్లల బొమ్మలను ముద్రించరాదు. ఆ ఉత్పత్తులను కీర్తించే రీతిలో లేబుల్స్‌ ఉండరాదు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే, నిబంధనలను ఉల్లంఘించడంలో నెస్లే కంపెనీ ముందుపీఠిన ఉన్నది. 2004లో 69 దేశాలను పరిశీలించగా 2000సార్లు ఉల్లంఘనలు జరిగినట్లు వెల్లడైంది. నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీల జాబితాలో నెస్లే కంపెనీ ప్రథమ స్థానంలో ఉన్నది. రకరకాల ఆవార పదార్థాలను ఈ కంపెనీ తయారు చేస్తున్నది. ప్రపంచమంతటా దీనికి రెండున్నర లక్షలమంది ఉద్యోగులు ఉన్నారు. దాదాపు వంద దేశాలలో 500 ఫ్యాక్టరీలు ఉన్నాయి. మొత్తంమీద 8,000 రకాల ఉత్పత్తులను ఇది తయారు చేస్తున్నది. కోట్లాది ప్రజలు వీటిని వినియోగిస్తున్నారు. భారతదేశానికివస్తే కీలకమైన నాలుగు రకాల ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేస్తున్నది. అవి; పాల ఉత్పత్తులు, శీతల పానీయాలు, తయారిత ఆహార పదార్థాలు, వంటకు పనికివచ్చే సరంజామా, చాక్‌లెట్స్‌ తతతీపి పదార్థాలు. రూ.1,000 కోట్ల నూడిల్స్‌, శిశుఆహార పదార్థాల మార్కెట్‌లో 70 శాతం వాటా నెస్లే కంపెనీదే. నెస్మేప్‌, మాగి, కిట్‌కేట్‌వంటి బహుళ ప్రచారం పొందిన బ్రాండ్లు కూడా నెస్టెల్‌ కంపెనీకి చెందినవే. రకరకాల పద్ధతుల్లో చట్ట ఉల్లంఘన పలు దేశాల్లో సాగుతున్న ప్రతికూల ప్రచారాన్నీ చట్టబద్ధమైన చర్యలనూ ఎదుర్కొంటున్న నెస్తే వంటి కంపెనీలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను, వివిధ దేశాల చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. ఈ కంపెనీలు ప్రతిచోటా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయి. ఒకే రకమైన ఉత్పత్తిని సంపన్న దేశాలలో ఒకరకంగానూ, పేద దేశాలలో సైన్సు - రాజకీయాలు గో

మరోరకంగా (ప్రచారం చేస్తున్నాయి. మాగీ నూడిల్స్‌ కండరాలకు, ఎముకలకు బలా ఇస్తాయంటూ 2008లో అది ప్రచారంలో పెట్టిన ఒక వాణిజ్య ప్రకటన వివాదాస్పదమైంది. ఇది మోసపూరితమైన ప్రకటన అని, తమ దేశ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నదంటూ ఇంగ్లండు (ప్రభుత్వం ఈ ప్రకటనపై నిషేధాన్ని విధించింది. బంగ్లాదేశ్‌కు వెళ్ళవలసిన తమ ఉత్పత్తులు పొరపాటున బ్రిటన్‌కు వెళ్ళినట్లు నెస్లే కంపెనీ చెప్పుకున్నది. వృత్తి సంస్థలను అడ్డుపెట్టుకుని వ్యాపారాన్ని సాగించటం నెస్లేకు అలవాటే. దీని అనుబంధ కంపెనీ నెస్లే న్యూట్రిషన్‌ సంస్థ ద్వారా అది భారతదేశంలో వ్యాపారాన్ని సాగిస్తున్నది. గత ఏడాది ఈ సంస్థ కోల్‌కతా, చెన్నయ్‌లలో జరిగిన వైద్య సదస్సులను స్పాన్సర్‌ చేసింది. ఇలాంటి వ్యవహారాలు శిశుపాల ప్రత్యామ్నాయ ఉత్పత్తుల చట్టానికి వ్యతిరేకమైనవి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. గత ఏదాదిలో చండీగఢ్‌కు చెందిన వైద్యవిద్య-పరిశోధన సంస్థ కార్యక్రమాన్ని కూడా స్పాన్సర్‌ చేసింది. అయితే, తల్లిపాల ప్రచారక కమిటీ గొడవ చేయటంతో చివరకు దీనిని మానివేసింది. చివరికీ విషయం ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్ళింది. ఆరోగ్య, మహిళా, శిశుమంత్రిత్వ శాఖల కార్యదర్భులు ఇలాంటి కార్యక్రమాలపై నిషేధాన్ని విధించాలని లేఖ రాశారు. అలానే, వైద్య కళాశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు, పిల్లల వైద్యుల వద్దకు వెళ్ళి వాళ్ళకు బహుమతులను ఇవ్వటం, శిశువుల ఆహారానికి సంబంధించి లఘు పుస్తకాలను పంపిణీ చేయటం వంటి కార్యక్రమాలను కూడా నిషేధించాలని ఈ లేఖలో కోరారు. నెస్లే కంపెనీ తన ఉత్పత్తుల అమ్మకానికి అనైతిక దారులు తొక్కుతోంది. 'భారత్‌ను ఆరోగ్యంగా మలచండి అని చెప్తూ ఒక వృద్ధుడు బర్గర్‌ను నములుతూ చెప్పే టివీ ప్రకటన వంటివి ప్రజలను తప్పుదోవ పట్టించేవే. చివరకు వీటిని అది ఉపసంహరించుకున్నది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించినట్లయితే కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలకు అమితమైన ప్రాధాన్యతను ఇస్తున్నట్లు అర్ధం కాగలదు. అసంఖ్యాక శిశువులు మరణించినప్పటికీ ఈ సంస్థల కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు ఉండటం లేదు. ప్రభుత్వాల వద్ద వాటి పలుకుబడి అలాంటిది. తత డా లమిశ్‌సేన్‌ గుప్తా

అందరికీ అందుబాటులో ఆరోగ్య భద్రత

చికిత్స చేయించుకున్న వెనువెంటనే బిల్లు కట్టే పద్ధతి వల్ల పేదలకు సరైన వైద్య సహాయం అందడం లేదు. ఆరోగ్య సంరక్షణకు ఇది ప్రధాన ప్రతిబంధకంగా పరిణమించింది. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు జేబులో నుండి చెల్లించే విధానం (ఒఒపి) వల్ల ఖర్చులను భరించలేని వారికి వైద్య సహాయం అందుబాటులో ఉండబోదు. అనేక సందర్భాల్లో వైద్య ఖర్చులు తడిసి మోపిడవుతూ పేదలపై పెనుభారం మోపుతున్నాయి. దీంతో వారు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. దీర్ణకాల అవసరాలకు అనుగుణంగా పటిష్టమైన ఆరోగ్య విధానాలను రూపొందించే వ్యవస్థలో భాగంగా ఆరోగ్య బీమా వ్యవస్థను ప్రవేశపెట్టారు. భరించశక్యం కాని, అనూహ్యమైన వైద్య ఖర్చుల నుండి రక్షణ కల్పించేందుకు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ జోక్యంతో సాగే వ్యవస్థలు

ఆరోగ్య సంరక్షణకు అయ్యే వనరులను సమకూర్చుకునేందుకు సాధారణంగా రెండు పద్ధతులను పాటిస్తారు. పన్నులు విధించడం లేదా ఆరోగ్య బీమా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం. వైద్య ఖర్చులకు అవసరమైన నిధులు సమకూర్చుకునే ప్రక్రియలో అత్యంత ప్రాచీనమైంది జర్మనీలో 19వ శతాబ్దంలో ప్రవేశపెట్టిన బిస్మార్క్‌ విధానం. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ప్రతి ఒక్కరూ ఇందులో తప్పనిసరిగా భాగస్వాములు కావాల్సి ఉంది. ప్రభుత్వ నియంత్రణలో ఈ పథకం అమలు జరుగుతుంది. ఈ పద్ధతి యూరప్‌, జపాన్‌, లాటిన్‌ అమెరికా దేశాల్లో విసృతంగా అమలులో ఉంది. బేవరిడ్‌ విధానంలో ప్రభుత్వ నియంత్రణ మరింత ఎక్కువగా ఉంటుంది. రెండవ (ప్రపంచ యుద్ధం తరువాత గ్రేట్‌ బ్రిటన్‌లో దీనిని ప్రవేశపెట్టారు. పన్నుల ద్వారా లభించే పైన్సు-రాజకీయాలు నం

ఆదాయాన్ని ఈ పథకంలో ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుంది. ప్రజలకు కూడా భాగస్వామ్యం కల్పించారు. సామాజిక ఆరోగ్య బీమా (ఎస్‌హెచ్‌ఐ) విధానం మూడవది. ఈ పథకాన్ని ప్రభుత్వమే స్వయంగా నిర్వహిస్తుంది. వినియోగదారులు, యజమానులు, ప్రభుత్వం ఈ పథకానికి నిధులు సమకూరుస్తాయి. ప్రీమియం చెల్లింపుతో బీమా దారుల బాధ్యత తీరిపోతుంది. కెనడా, దక్షిణ కొరియాలో ఈ పథకం బాగా వ్యాప్తిలో ఉంది. తక్కువ ఆదాయం గల దేశాల్లో అనేకం ఈ పథకాల్లో ఏదో ఒకదానిని అమలు చేస్తున్నాయి. అయితే అనేక మంది ఈ పథకాల పరిధిలోకి రాకపోవడం, లేదా (ప్రయివేటు సంస్థల చేతిలో మోసపోవడం జరుగుతోంది. ఆరోగ్య వ్యవస్థల్లో ప్రభుత్వ భాగస్వామ్యానికి మంచి నీటి సరఫరా, విద్యుచ్చక్తి రంగాల్లో భాగస్వామ్యానికి మధ్య తేడా ఉందనే విషయం గమనించాలి, నయా ఉ దారవాద ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టడానికి పూర్వం నీటి సరఫరా, విద్యుచ్చక్తి రంగాలకు (ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసి వాటిని స్వయంగా నిర్వహించేది. ఆరోగ్య రంగం విషయంలో మాత్రం (ప్రభుత్వం పూర్తి న్థాయిలో భాగస్వామ్యం వహించబోదు. ప్రయివేటు రంగంతో కలిసి భాగస్వామ్యం వహించ డమో, లేదా మొత్తం ప్రయివేటు రంగం పూర్తిగా భాగస్వామ్యం వహించడమో జరుగుతుంది. ప్రస్తుత వ్యూహాలు కొత్తగా ఆవిర్భవించిన ఆఫ్రికా, కొంతమేరకు లాటిన్‌ అమెరికా దేశాల్లో

చోటుచేసుకున్న పరిణామాలు పటిష్టమైన ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. 20వ శతాబ్ది మధ్యవరకు పెట్టుబడిదారీ దేశాల్లో సరుకుల సరఫరా వ్యవహారాన్ని ప్రభుత్వమే చేపట్టింది. ఆరోగ్య రంగంలో (ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు కూడా ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరించగల కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెట్టడం జరిగేది. కొత్తగా న్వాతం(త్ర్యం సంపాదించుకున్న దేశాల్లో ఉపయుక్తమైన అనేక మందులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటి ధరలు మరీ అధికంగా ఉండటంతో పేద ప్రజలకు అందుబాటులో ఉండేవి కావు. వీటిని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకు రాగల స్థాయిలో ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడం సమస్యగా పరిణమించింది. 1978లో ఆల్మాఅటాలో జరిగిన సమావేశం ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ పథకాన్ని రూపొందించింది. కొత్తగా ఆవిర్భవించిన దేశాలు, పేద దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లకు త్ర నానా న... అమిళసేన్‌ గుప్తా

ఈ పథకం పరిష్కారంగా భావించారు. ఆరోగ్య సంరక్షణ పథకానికి ప్రభుత్వం నేరుగా నిధులు మంజూరు చేయకపోయినప్పటికీ నిధుల సేకరణలో, ఈ పథక నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తుంది. శ్రీలంక, కోస్టారికా, క్యూబా వంటి వర్ధమాన దేశాలు ఈ విధానాన్నే అనుసరిస్తున్నాయి.

అత్యధిక, మధ్యతరహా ఆదాయాలు గల దేశాల్లో వృద్ధుల జనాభా పెరుగుతుండటం మరో సమస్యకు దారితీసింది. వారిని దృష్టిలో ఉంచుకుని కొత్త బీమా విధానాలను రూపొందించారు. ఇందులో రిస్క్‌పూల్‌ను ఏర్పాటు చేశారు. ఈ పూల్‌ నుండి ప్రతి ఒక్కరూ సమాన మొత్తంలో ప్రయోజనం పొందగలరనేది ఈ పథక రూపకర్తల ఆలోచనగా ఉంది. అయితే ఆరోగ్య రంగం విషయంలో ఈ ఊహాగానం సరైంది కాదు. ప్రజలందరి ఆరోగ్య పరిస్థితి ఒకే విధంగా ఉండదు. ఆర్థిక, సామాజిక విషయాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అన్నిటినీ మించి వయసు ప్రభావం కూదా ఎక్కువగా ఉంటుంది. ఈ పథకం కింద ఎక్కువ ప్రీమియం చెల్లించగల స్థితిలో వృద్ధులు ఉండబోరు. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులు వారికి ఉండవు. పైపెచ్చు వృద్దాప్యం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. ఈ బీమాను ప్రయివేటు రంగానికి అప్పగిస్తే వృద్ధులకు అన్యాయం జరుగుతుంది. ఎక్కువ రిస్క్‌ గలవారిని ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయివేటు సంస్థలు ఆసక్తి చూపబోవు. అంతేకాకుండా కొన్ని రకాల వ్యాధులను బీమా పరిధిలోకి కూడా అవి తీసుకోవు. అందువల్ల వృద్ధులకు సమగ్ర బీమా సదుపాయం ఎండమావే అవుతుంది. తక్కువ ఆదాయం గల దేశాల్లో సామాజిక ఆరోగ్య బీమా కార్యక్రమం వల్ల ఆశించిన ప్రయోజనం కలగబోదు.

' యజమానులు ఈ పథకం కోసం ఖర్చు పెట్టేందుకు ఆసక్తి చూపబోరు. అలాగే ప్రభుత్వం

కూడా తనకున్న పరిమితమైన ఆర్థిక వనరులతో ఈ పథకానికి నిధులు కేటాయించగల స్థితిలో ఉండదు. ప్రయివేటు రంగం వైపు మొగ్గు

పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల నిర్వహణలో ప్రభుత్వ ప్రమేయం చాలా కీలకమైన అంశం. (ప్రయివేటు సంస్థలు నిధులు కేటాయిం చినప్పటికీ ప్రభుత్వం కూడా నిధులు కేటాయిస్తే ఆ పథకాలను ప్రభుత్వ పథకాలుగానే పరిగణించడం జరుగుతోంది. అటు ప్రభుత్వం, ఇటు ప్రయివేటు రంగం సమిష్టి బాధ్యతలు నిర్వహించే సమీకృత ఆరోగ్య రక్షణ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సమీకృత ఆరోగ్య సేవా వ్యవస్థ సైన్సు - రాజకీయాలు 38

వైపు క్రమంగా అన్ని దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ఒక్క ప్రభుత్వ రంగం మాత్రమే ఈ బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించే పరిస్థితి లేదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు, ఆరోగ్య ఫైనాన్సింగ్‌ సంస్థల మధ్య సమన్వయానికి గల అవకాశాలను సద్వినియోగం చేసుకుని పటిష్టమైన ఆరోగ్య బీమా పధకాలసై దృష్టి సారించాలని అవి చెబుతున్నాయి. ఆరోగ్య భద్రత వ్యయంలో ప్రభుత్వ ఫైనాన్సింగ్‌పై దేశంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. భారత దేశంలో అనేక దశాబ్దాలపాటు ఆరోగ్య వ్యవస్థ (ప్రయివేటు రంగంలోనే ఉంది. ఆరోగ్యంపై ప్రభుత్వ కేటాయింపులను జిడిపిలో కనీసం రెండు నుండి మూడు శాతానికి పెంచాలని గత పంచవర్ష ప్రణాళిక ముసాయిదా పత్రం యుపిఎ-1 ప్రభుత్వానికి సూచించింది. కనీసం ఐదు శాతం కేటాయించాలని ప్రభుత్వ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. అయితే ఇవన్నీ చెవిటివాని ముందు శంఖం ఊదిన చందంగా మారుతున్నాయి. యుపిఎ ప్రభుత్వం జిడిపిలో ఒక శాతం మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంటోంది. గత రెండు దశాబ్దాలుగా ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఇందువల్ల ప్రజలు తమ ఆరోగ్య రక్షణ వ్యయంలో 70 శాతం మొత్తాన్ని ఒఒపి ద్వారానే వెచ్చించాల్సి ఉంటుది. ప్రతి సంవత్సరం 8.9 కోట్ల మంది మితిమీరిన ఆరోగ్య వ్యయాన్ని భరించలేక నిరుపేదలుగా మారుతున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకాన్ని అమలు

  • చేయడంతో పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ మౌలిక వనరుల కల్పన, మాన వనరుల వినియోగంలో భారీ అంతరాలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 68.6 శాతం కేంద్రాలు ఒక (కొన్ని సందర్భాల్లో అసలు లేకుండానే) అర్హత పొందిన డాక్టర్లతో మాత్రమే నడుస్తున్నాయి. 649 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. ప్రభుత్వం తగిన మొత్తంలో నిధులు కేటాయించి తగిన ఆసక్తి ప్రదర్శించకపోవడంతో ప్రయివేటు రంగం ఆరోగ్య రంగంలోకి ప్రవేశించింది. అప్పటి నుండి వైద్యం సామాన్య ప్రజలకు అసలు అందుబాటులో లేకుందా పోయింది. 1998-94, 2004-05 మధ్య ఒజఒపి రెండున్నర రెట్లు పెరిగింది. ప్రయివేటు రంగంలో కూడా కార్పొరేట్‌ రంగం ఎక్కువగా విస్తరిస్తోంది. ప్రభుత్వ సామాజిక ఆరోగ్య బీమా పథకాలు అందరికీ అందుబాటులో ఉండటం లేదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు అమలు చేస్తున్న జాతీయ రాజీవ్‌ గాంధీ స్వాస్థ్య బీమా యోజన పథకం, ఆరోగ్యశ్రీ, కలైంజర్‌ పథకాలు అందరిక్తీ అందుబాటులో లేవు. 9 న స అమిక్‌సేన్‌ గుప్తా

పేటెంట్‌ పేరుతో నిలువు దోపిడి

పెట్టుబడి ఎప్పుడూ లాభాన్నే కోరుకుంటుంది. లాభం లేకపోయినా, లేక తక్కువగా ఉన్నా అది శూన్యంతో సమానం. గణనీయమైన లాభాలున్నాయా అది ఎంతో చైతన్యవంతంగా మారుతుంది. పది శాతం లాభం వస్తే దానిని ఎక్కడైనా ఉ పయోగించవచ్చు. ఆదే 20 శాతం ఉంటే చాలా ఆకర్షణీయంగా మారుతుంది. 50 శాతం ఉంటే దానికి ఎక్కడ లేని చైతన్యం వస్తుంది.నూటికి నూరు శాతం లాభం తెచ్చిపెట్టిందా అన్ని చట్టాలను తన చుట్టాలుగా చేసుకుని తనకెదురులేదన్న రీతిలో వ్యవహరిస్తుంది. కొనుగోలు చేసే శక్తి లేకపోవడంతో నేడు అనేక మందులు ఎవరికి ఎక్కువ అవసరమో వారికి అందుబాటులో ఉండటం లేదు. తక్కువ ధరల్లో ఉత్పత్తి చేయడం సాధ్యం కాకపోవడం ఇందుకు కారణం కాదు. కొన్ని బహుళ జాతి సంస్థలు విజ్ఞానాన్ని తమ ఆస్తిగా పరిగణించుకుంటాయి. అందువల్లనే ఈ మందులను భరించశక్యం కాని ధరలకు విక్రయిస్తాయి. పేటెంట్ల ద్వారా లభించే గుత్తాధిపత్యాన్ని ఇతర కంపెనీలు తమ కంటే తక్కువ ధరలకు ఆ మందులను ఉత్పత్తి చేయకుండా అడ్డుకుంటాయి. ప్రస్తుత పేటెంట్‌ వ్యవస్థ మానవాళిపై నేరం

ప్రస్తుత పేటెంట్‌ వ్యవస్థ మానవాళిపై దుష్ట నేరాలకు పాల్పడుతున్న వ్యవస్థ రూపాన్ని సంతరించుకుంది. సైన్స్‌లో అందించే ప్రయోజనాలు మానవాళిలో అధికులకు అందకుండా అడ్డుకుంటుంది. అనేక దేశాల్లో 15 నుండి 45 ఏళ్లలోపు వయోగ్రూప్‌లో ఉన్న వారిలో మూడింట ఒక వంతుమందికి హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌ సోకింది. మొత్తం తరం ఈ వైరస్‌ సోకి మృతి చెందారు. హెచ్‌ఐవి వైరస్‌ను చికిత్స చేయడం సాధ్యం కాకపోవడం వల్ల కాకుండా, అవసరమైన మందులు తయారుచేయడానికి అవసరమైన పరిజ్ఞానం గల తమ గుత్తాధిపత్య పేటెంట్‌ను ఆఫ్రికా ఖండంలో ఏ ఒక్కరూ భరించలేని సైన్సు-ంరాజతీయాలు నవవ ఉ0

ధరలకు అమ్ముకోవడానికి ఉపయోగించుకోవడమే కారణం. 2001లో హెచ్‌ఐవి లేదా ఎయిడ్స్‌ సోకిన ఒక వ్యక్తికి చికిత్స చేసేందుకు పది వేల డాలర్లు ఖర్చయ్యేది. అవసరమైన వారి కోసం ఈ మందులు కొనుగోలు చేసేందుకు కొన్ని ఆఫ్రికా దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తి(జిడిపి)లో సగానికి పైగా ఖర్చుపెట్టాల్సి వచ్చేది. విచారించాల్సిన విషయం ఏమంటే భారత్‌కు చెందిన సిష్లా కంపెనీ అవే మందులను సంవత్సరానికి 250 డాలర్ల చొప్పున విక్రయించడం ప్రారంభించింది. అంటే, అంతకుముందు ఉన్న ధర కంటే శత౦0వ వంతు ధరకు విక్రయించింది. అవే మందులు సంవత్సరం పాటు సరఫరా చేసేందుకు వంద డాలర్ల కంటే తక్కువ ఖర్చు అవుతోంది.

2005 వరకు మందులపై పేటెంట్లను భారత్‌ ఉపయోగించుకోలేదు. ప్రపంచంలో అత్యంత పటిష్టమైన పేటెంట్‌ హక్కులు భారతదేశంలో అమలులో ఉన్నాయి. భారత్‌ ఈ చట్టాన్ని 1972లో చేసింది. 1994లో డబ్యుటిఒ ఒప్పందంపై సంతకం చేయడంతో పేటెంట్‌ వ్యవస్థకు భారత్‌ కూడా కట్టుబడాల్సి వచ్చింది. భారత్‌ తొలి పేటెంట్‌ వ్యవస్థ చాలా సరళంగా ఉంది. పేటెంట్‌ను మానవాళి మనుగడకు అవసరమైన ఆహారం, ఆరోగ్య రంగాల్లో మినహా అన్ని రంగాల్లో అనుమతిస్తామని చట్టం పేర్కొంది. అందువల్ల వైద్య ఉత్పత్తులపై పేటెంట్లను భారత్‌ అనుమతించలేదు. అనేక భారతీయ కంపెనీలు ఎటువంటి అవరోధం కలగకుండా అనేక రకాల మందులను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం

_ అనుమతించింది. అందువల్లనే సిష్లా కంపెనీ హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ మందులను అంతకుముందున్న ధరల్లో అవలేశం ధరలకు ఉత్పత్తి చేయగలిగింది. 2005లో పేటెంట్‌ చట్టాన్ని సవరించిన దరిమిలా భారత కంపెనీలు ఈ సౌలభ్యాన్ని కోల్పోయాయి. 1994లో డబ్యుటిఒ ఒప్పందంపై సంతకం చేసిన తరువాత పదేళ్ల గ్రేస్‌ పీరియడ్‌ ముగిసిన వెంటనే ఈ సవరణ చేసింది. నోవార్డిస్‌ చరిత్ర: భారత్‌లో పోరాటం

ప్రజలను పణంగా పెట్టి లాభాలు గుంజుకునే వికృత ప్రక్రియ బ్లడ్‌ క్యాన్సర్‌ (లుకేమియా) చికిత్సకు ఉపయోగించే ఇమాటినిబ్‌ మెసీలేట్‌ అనే మందును 2001లో ప్రవేశపెట్టిన తరువాత మొదలైంది. అనతికాలంలోనే ఈ మందు లుకేమియా వ్యాధికి

ముఖ్యమైన మందుగా మారింది. క్రానిక్‌ మేలాయిడ్‌ లుకేమా (సిఎంఎల్సొ్‌కు ఈ మందును

విరివిగా ఉపయోగించేవారు. శే అమిక్‌సేన్‌ గుప్తా

స్విట్టర్లాంద్‌కు చెందిన బహుళ జాతి సంస్థ నోవార్టిస్‌ ఈ మందుకు గ్రైవెక్‌ పేరుతో అనేక దేశాల్లో పేటెంట్‌ పొందింది. భారత్‌లో ఈ మందు పేటెంట్‌కు దాఖలు చేసిన దరఖాస్తును పేటెంట్‌ కార్యాలయం 2006లో తోసిపుచ్చింది. పేటెంట్‌ పొందేందుకు నోవార్టిస్‌ చేయని ప్రయత్నం లేదు. పేటెంట్‌ అప్పిలేట్‌ బోర్డుకు అప్పీలు చేసింది. ఆ దరఖాస్తును బోర్డు మళ్లీ తిరస్మరించడంతో మద్రాస్‌ హైకోర్టులో ఈ నిర్ణయాన్ని సవాలు చేసింది. భారత పేటెంట్‌ చట్టంలోని 3(డి) చట్టం అన్వయింపును సవాలు చేస్తూ నోవార్టిస్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 2005లో పేటెంట్‌ చట్టానికి సవరణ చేసిన సందర్భంగా ప్రభుత్వం విదేశీ బహుళ జాతి సంస్థలు మితిమీరిన లాభాలు పిండుకోకుండా తీసుకోవాల్సిన భద్రతా ప్రమాణాల్లో భాగంగా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది. మాలెక్యూల్స్‌లో చేసే స్వల్బమైన మార్పులు (ఎవర్‌ గ్రీనింగ్‌ అని పిలుస్తారు) తాజాగా పేటెంట్‌ చేసుకోవడానికి ప్రాతిపదిక కాదని ఈ సెక్షన్‌ స్పష్టం చేస్తోంది.

గెవిక్‌కు సంబంధించి తొలి పేటెంట్‌ కోసం నోవార్డిస్‌ కంపెనీ 1993లో దరఖాస్తు చేసింది. ఇమాటినిబ్‌ మెసిలేట్‌ అనే రసాయనం పేటెంట్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేసింది. సహజమైన ఆకారం లేని ఈ లవణం ప్రకృతి సిద్ధంగా వివిధ రూపాల్లో లభిస్తుంది. 1990ళ్లో ఆ కంపెనీ మరోసారి బేటా వేరియంట్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేసింది. ఇంతకుముందు పేటెంట్‌ పొందిన అమార్భస్‌ సాల్ట్‌లో బేటా వేరియంట్‌ అంతర్భాగంగా ఉంది. 19939 పేటెంట్‌ జారీ చేసే ప్రక్రియను భారత్‌లో గుర్తించలేదు. ఆ సమయంలో భారత్‌లో మందులకు పేటెంటింగ్‌ లేదు. 2005లో చట్టంలో మార్పు చేయగా నోవార్టిస్‌ పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసింది. పేటెంట్‌ కార్యాలయం దీనిని తోసిపుచ్చింది. పేటెంట్‌ ఇచ్చేందుకు కొత్తదనం, పరిశోధన ఫలితాలు ఏమీ లేవని అది వ్యాఖ్యానించింది. బేటా సాల్ట్‌ కొత్త పదార్ధమేమీ కాదు. ఆ తరువాత సెక్షన్‌ 3(డి)ని నోవార్టిస్‌ కంపెనీ కోర్టులో సవాలు చేసింది. అది డబ్యుటిఒ ఒప్పందాన్ని ఉల్లంఘించేదిగా ఉందని వాదించింది. ఈ

“ కేసును తమ పరిధిలో లేదని, దబ్యుటిఒలోనే పరిష్కరించుకోవాలని మద్రాస్‌ హైకోర్టు

ఆదేశించింది. అంతటితో ఊరుకోని ఆ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించి తన వాదనలను స్పల్పంగా మార్చింది. సెక్షన్‌ 3(డి)ని సక్రమంగా అమలు చేయడం లేదనే వాదనలు వినిపించింది. అక్కడ కూడా కంపెనీకి చుక్కెదురైంది. నోవార్టిస్‌; ధార్మిక ప్రవృత్తి

ఈ పేటెంట్‌ లభిస్తే నోవార్టిస్‌ కంపెనీకి ఏ మేరకు ప్రయోజనం కలుగుతుంది? గైవిక్‌ బెషథ నెలవారీ ఖర్చు రు. 1.20 లక్షలు. ఈ మందును జీవితాంతం తీసుకుంటూనే సైన్సు-ళజకీయాలు నానా నం

ఉండాలి. 99 శాతం భారతీయులకు ఈ మందు ధర అందుబాటులో లేదు. భారతీయ కంపెనీలు ఈ మందును నెలకు ఎనిమిది వేల రూపాయల చొప్పున సరఫరా చేస్తున్నాయి. అంటే నోవార్టిస్‌ కంపెనీ 1500 శాతం లాభం పొందడం కోసం కోర్టుల్లో పోరాటం చేస్తోంది. ఆ జెషధానికి ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున మార్కెట్‌ ఉంది. దాని మార్కెట్‌ షేర్‌ రు. 20,000 కోట్లు అది 2010-11 సంవశ్సరానికి మన కేంద్ర బడ్జెట్‌తో సమానం. భారతదేశంలో 11 వేల లుకేమియా వ్యాధిగ్రస్తులకు ఈ మందును ఉ చితంగా సరఫరా చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. భారతదేశంలో లక్షమంది మేలాయిడ్‌ లుకేమియాతో బాధపడుతున్నారని అంచనా. వీరికి కొత్తగా ప్రతి సంవత్సరం అనేక మంది చేరుతూ ఉంటారు. యూరప్‌, ఉత్తర అమెరికాల్లో కంటే భారత్‌లో అతి పిన్న వయసులోనే ఈ వ్యాధి సంక్రమిస్తోంది. అర్హులైనవారికి ఉచితంగానే ఈ మందును సరఫరా చేస్తామని నోవార్టిస్‌ చేసే ప్రకటన దురుద్దేశపూరితం. ఎంత ధార్మికత? తాము లాభాలు గడించేందుకు పోరాటం చేయడం లేదని, తాము చేసిన పెట్టుబడులకు ధర్మసమ్మతమైన ప్రతిఫలం కోసం మాత్రమేనని ఆ సంస్థ బుకాయిస్తోంది. అర్జెంటీనాలో ఈ పథకం కింద ఈ కంపెనీ కొంత మంది రోగులకు నెల రోజులకు సరిపడా మందును పంపిణీ చేసింది. బైవిక్‌ సరఫరా చేయని మందుల కంపెనీలపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని కంపెనీ వారిని హెచ్చరించింది. ఆ తరువాత ఆ పథకాన్ని నిలిపివేసి రోగుల మానాన రోగులను వదిలివేసింది. నెల రోజులపాటు మందు వాడిన తరువాత రోగి సహజంగానే ఆ మందును కొనసాగించేందుకు ఇష్టపడతాడు. ఇక్కడే నోవార్టిస్‌ కంపెనీ లాభాలు దండుకునేది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కేసులు అనేక దేశాల్లో ఉంటాయి. పేటెంట్‌ పొందేందుకు నోవార్టిస్‌ చేసే పోరాటం విజయవంతం

కాకూడదని మనం అంతా కోరుకుందాం. చిన్న వరిశోధనలు చేని తమ

ఉత్పత్తుల్లో స్వల్ప మార్పులు చేసి వాటికి కూడా పేటెంట్‌ సంపాదించి పేటెంట్‌ గడువును

నిర్దిష్ట 20 సంవత్సరాలకు పైబడి కొనసాగించే వ్యూహంతోనే నోవార్టిస్‌ వంటి సంస్థలు

ఈ న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఈ న్యాయపోరాటం ఒక బూటకం, నయవంచన.

తక్కువ ధరలకే భారతీయ కంపెనీలు మందులను సరఫరా చేస్తుంటే నోవార్టిస్‌ వంటి

సంస్థలు 1500 శాతం లాభాల కోసం ఆరాటపడుతున్నాయి. కార్పొరేట్‌ గౌరవానికి

కాకుండా కార్పొరేట్‌ దురాశకు నోవార్డిస్‌ ప్రతీకగా నిలుస్తోంది.

న లె శ గటి 6,440.44 త్‌ గః నా ౯ తాడో

॥ వ. మాన /' “ 1 భధ యు ఇ శ ఖనశాసంఇంత అఖివృద్ధిబందనా ౨ అశేష ప్రజతకుతహారభతరోగ్యం తది. వలు లేకపోవడళికళ్లముకదుచ్యోస్తున్నారు భహ్తాళ . జాతి సంస్థలు గుత్త పెట్టుబడిదారీ వర్గాలు... ౨౨ | 'వీజ్ఞాన :ఠఠగళలో' అనుసరించే! పవరీత. ...! . 'పోకదలినుపశదీకరిస్తూ ప్రజాసైన్సు ఉద్యమ: 11 = 'సాయకుల్లా అమిత్‌ సన్‌ సవ్వుఠాసినప్యాసొలు:.. కూర్చు!త్లద్య? 1 .. వ. ప్రజాశక్తి బుక్‌హౌస్‌ .