Telugu sangeetha kaarula jeevithalu - anilvaranasi/indianlanguages GitHub Wiki
1 న ఆ. య్. .! నా ర. - [వై . ఆం వ. కానాల న యా కాలా || ర్ గి. ఆ లీ శ్రపభ్థదిశ్భాత్యు లో - గ ల ణి 5 సేరదతకారుల యుగం టు "అణ. ష్ట్ర, ళల స ” న మా. డె తా, సుష (| గ్ మ్రనసుపడి మక్కునతో సేక్రల్రంచ్ష్యి /టె సులు ుసొపాత్యాభమానులకోసం. ీె -మళ్లెమాలక్షుట్టంబం నీయ! -
ప్రసిద్ధ పాశ్చాత్య సుంగేతకారుల జీవితాలు సౌభాగ్య
ప్రసిద్ధ పాశ్చాత్య అలో సంగీతకారుల జీవితాలు జరం 12 ణా. మొదటి ముద్రణ : అక్టోబర్ 2007 వెల : 200/- ప్రతులకు : సౌభాగ్య ఎఫ్.3, బి.4, రామధాజునగర్ మేద్చెల్ రోడ్, హైదరాబాద్ - 55 మొబైల్ : 9848157909 మరియు న నా స్స (ప్రజాశక్తి ర నవయుగ " (€/ నవోదయ ు ల ళభరిరాలయ్ నర బ్రచురణ : గ రక006_ ఎ) * అనుపమ ప్రింటర్స్ టి స౦ంయంయ టా 126 శాంతినగర్ ణి గో "హైదరాబాద్ - 28. లహ ఫోన్ : 28891864
ప్రియమైన తిలక్క్ పాతికేళ్ళ క్రితం మనం యూనివర్సిటీలో చదువ్రకున్నాం. అకుడ ఆగిపోయిన మనసు నిత్య యవ్వనంతో మనతో బాట్లు వస్తోంది తిలక్! నువ్వు వువ్వలాంటి వాడివి. నిలువెత్తు న్నేవోనివి. పదేళ్ళ తరువాత కలసుకున్నా పది నిముషాల క్రితమే కలిసినట్లు పలకరిస్తావు ఆనందంగ్మా ఆవ్లోదంగా పసివాదిలా నవ్వతాను. నువ్వ తాత్వికుడివి. కాని నిరంతర ఉత్సాహంతో ఉరకలెక్తేవాదివి. నాకు ఎంతో పాణవ్రదమయిన ఈ వుస్తకాన్ని నీకు అంకితమివ్వదం నాకెంతో సంతోషం..
నీ సౌభాగ్య
ముందుమాట మనకు నచ్చిన పని చేయడంలో 'మివానందముంది. గొథే, -ప్రాపర్టియస్, కీట్స్, ప్రపంచ కవులు, వుర్ణూ కవులు వీళ్ళందరి మీదా పుస్తకాలు రాశాను. వ్యాసాలు రాశాను.
ఓ సందర్భంలో బిథోవిన్ జీవితం గురించి చదివి ఆశ్చర్యపోయాను. పసితనంలో ఆయన బాధలు, ముప్పయ్యేళ్ళకే ఆయన వినికిడి జ్ఞానం కోల్పోవడం ఆ మహా సంగీతకారుడి సృష్టి వెనక వున్న అనంత దుఖుం నన్ను ఆకట్టుకుంది.
ఆ క్రమంలో పాశ్చాత్య సంగీతకారుల జీవితాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. ఎన్నో వుస్తకాలు: సేకరించాను: ఎన్సైక్లో పీడియాలు పరిశీలించాను. సున్నితమయిన, సుకుమారమయిన సంగీతం వెనక వూహకందని బాధలు చూసి కన్నీళ్ళ పర్యంతమయ్యాను. అసాధారణ జీవితాలే నన్ను ఆకర్షించాయి. ఆ జీవితాల్ని ఆవిష్కరించే ప్రయత్నమిది.
నా ఆనందాన్ని పంచుకొవాలనుకున్నాను. ఫలితం ఈ పుస్తకం,
- సౌభాగ్య,
విషయసూచిక
జోహాన్ సెబాప్టియన్ బాచ్ 02 బేలా బర్జోక్ 07 లుడ్విగ్ వాన్ బిథోవిన్ క్ష అల్బన్ బెర్గ్ 22 హెక్టర్ బెర్లియోజ్ ౭ అలగ్జాండర్ బొరోడిన్ /?7 జోహాన్స్ బ్రామ్స్ త్త అన్టోన్ (బ్రూక్నర్ శ6 (ఢ్రుదరిక్ ఛోపిన్ రం క్లాడి డిబుస్సి 61 (ఢ్రెదరిక్ డేలియస్ 68 ఆంటోనిన్ ద్వోరాక్ 75 సర్ ఎడ్వర్డ్ ఎల్లార్ 8 సీజర్ ఫ్రాంక్ 856 ఛార్లెస్ గౌనాద్ 9౭ ఎద్వర్డ్ (గీగ్ రగ జార్జి ఫెదరిక్ హాందెల్ 103 జోసెఫ్ హైడన్ 118 ఫ్రాంజ్ లిస్జ్డ్ 123 గుస్టావ్ మహ్లర్ 131 ఫెలిక్స్ మెండెల్షాన్ 137 రాబర్ట్ షూమాన్ 146
అలగ్జాండర్ స్కియాబిన్ 155 జీన్ సిబీలియస్ 103 టబెడిచ్ 'స్మెతానా 170 పీటర్ ఇలిట్ట్ చైకోవ్స్కీ 175 రిచర్ట్ వాగ్నర్ 185 పుల్ఫేగాంగ్ అమాడియస్ మొజార్డ్ 198 మోదెస్ట్ ముసార్గ్స్క 212 సెర్జి ప్రాకోఫియేవ్ 220 సెర్టీ రాచ్మానినోఫ్ ౭27 ాంజ్షూలర్ట జు
జోహాన్ సెబాఫ్టియన్ బాట్ అశ౦[2౧౧ 56029%2౧ 540 21-3-1685 -- 28-7-1750
బాచ్ ఒక అసాధారణ సందర్భంలో తన సంగీత పరిశ్రమ గురించి చెబుతూ “నేను అవిశ్రాంతంగా కష్టపడ్డాను అని చెప్పుకున్నాడు. ఏ సంగీతకారుడూ అంత (శ్రమించి వుండడు. అతని సంగీకానికి సంబంధించిన 'సంపుటాలు” చూస్తే మనం ఆశ్చర్యపోతాం. అతని సంగీత రచనల్ని క్రమబద్ధంగా సేకరించి పెట్టడానికి నలభై ఆరేళ్ళు పట్టింది... వాటిని అచ్చులోకి తెచ్చేసరికి అవి అరవై బృహత్ సంపుటాలయ్యాయి.
బాచ్ చేసిన సంగీత రచనల్ని ఈ కాలంలోని వ్యక్తి ఎవరయినా కూచుని ఎత్తి రాయాలంటే, అంటే కాపీ చెయ్యాలన్నా కనీసం దెబ్బయి సంవత్సరాలు పడతాయి.
బాచ్ బతుకంతా రోజువారీ జీవితం కోసం (శ్రమించాడు. చిన్నప్పుడు అంతగా సంగీత శిక్షణ పొందలేదు. అతను చేసిందల్లా సంగీతం వినడం, కాపీ చెయ్యడం, అనుకరించడం, వాటిని ప్రయోగాత్మకంగా నిర్వహించడం. మొత్తానికి అనుభవాల్ని ప్రయోగాత్మకంగా నిర్వహించడమే అతను మౌలికంగా చేసిన పని.
నిత్య నిరంతర సంగీత దాహం అతన్ది. ఆ దాహంతో అతను ఎక్కడెక్కడికో ఎన్నెన్ని స్థలాలనో ఎంతో శ్రమించి ప్రయాణించాడు. సుప్రసిద్ధులయిన సమకాలీన సంగీతకారుల్ని కలవడానికి, వాళ్ళ సంగీతాన్ని, స్వరాల్ని రాసిపెట్టుకుని వాటిని అనుకరిస్తూ, విభిన్న సంగీత వాద్యాలపై పప్రయోగాలకి లోను చేసేవాడు. ఆ స్వరాల సమ్మేళనాలకి చెందిన టెక్సిక్ని
సంగితం పట్ల అతని ఆసక్తికి సంబంధించి రెండు కథలున్నాయి. మొదటిది తన బాల్యంలోనిది. రెండోది అతని-వృద్ధాప్య దశలోనిది.
తొమ్మిదేళ్ళ వయసున్నప్పుడు బాచ్ వాద్య సంగీతానికి చెందిన రచనలున్న ఒక లైబ్రరీలోని పుస్తకాలన్నిట్నీ ఎత్తి రాసుకున్నాడు. ఆ పని చేయ్యడాన్ని అతని సోదరుడు వ్యతిరేకించడం వల్ల (ఆ కారణాలు ఏవో బాచ్ చెప్పలేదు) అతని సోదరుడు నిద్రపోయిన తరువాత రాత్రంతా మేలుకొనీ ఆ పని చేసేవాడు. అప్పుడు ఆ రాత్రిళ్ళల్లో అతను వెన్నెలలో మాత్రమే ఆ రచనల్ని చదివి ఎత్తిరాసుకునేవాడు. అతనికి సహకరించిన ఏకైక దీపం చంద్రుడు మాత్రమే. ఫలితంగా అతని కంటి చూపు బాగా దెబ్బ తినింది.
క్!
అతని జీవితంలోని చివరి సంవత్సరంలో అతని చివరి రచన 7౧౪ &101 4086ల వెలువడింది. అది ఒక బృహద్ధంథం. చాలా సంక్షిషుయింది. ఒక సంగీత మార్గాన్ని గురించి వివరించేది. ఆ (గ్రంథం అచ్చయ్యాకా బాచ్ ఏ సంగిత వాద్యం గురించి ఆ రచన చేశాడో ఎవరికీ అంతు పట్టలేదు. చివరికి.అది (ప్రయోగాన్ని! వుద్దేశించి రాయలేదని తెలిసింది.
'నేను చాలా శ్రమపద్డాను' అని ఆయన చెప్పుకోవడంలో ఆయన గురించి ఆయన అంచనా వేసుకోవడం కనిపిస్తుంది.
బాచ్ ఏడు తరాల వాళ్ళు సంగీతకారులుగా వంశపారంపర్యంగా వున్నారు. పద్దెనిమిదో శతాబ్దంలో ముప్పయి మంది “బాచ్ వంశస్థులు ఆర్గాన్ వాద్యంలో వృత్తి విద్యా నిపుణులుగా వున్నట్లు తెలుస్తుంది. “ఎర్ ఫర్ట్ అన్న పట్టణంలో ఎవరైనా గొప్ప సంగీతకారుడుగా గుర్తింపబడితే వెంటనే అతన్ని “బాచ్” అనేవాళ్ళట.
జోహాన్ సెబాస్టియన్ తండ్రి గొప్ప వయోలిన్ వాద్య నిపుణుడు. ఐసెనాచ్ పట్టణంలో అతన్ని గొప్పగా గౌరవించేవాళ్ళు. బాచ్ తొమ్మిదేళ్ళ వయసులోనే తల్లీ తండ్రీ మరణించారు. అప్పుడు బ్లాచ్ అతని అన్న దగ్గరికి వెళ్ళాడు. అతని అన్న పేరు జోవోన్ క్రెస్టోప్. అతను చర్చిలో ఆర్గానిస్టు. అతని వయసు ఇరవైనాలుగేళ్లు. అతను బాచ్కు *హార్స్ సికోర్ట్ (౧4౧౩0%010) వాద్యంలో కొంత శిక్షణ ఇచ్చాడు. ఆ శిక్షణ అంతా .'కక్షగా అని బాచ్ అన్నాడు. తను యింకో, వ్యక్తిని పోష్షించాల్సి రావడంలో క్రిస్టోప్ నిర్దయగా, సానుభూతి కూడా. ప్రదర్శించకుండా బాచ్‌ని తీవమయిన క్రమశిక్షణకి లోను చేశాడు.
ఐదేళ్ళ అనంతరం లూనేబర్గ్లో ఒక వాద్యబ్బందంలో ఒకడుగా వుద్యోగం సంపాదించడంతో అన్న హింస నుండి, నిర్బంధం నుండి బయటపడ్డాడు. అతని పరిసరాలు అతని సంగీత అభ్యాస్తానికి ఎంతో అనుకూలించాయి. అతను తీవ్ర అధ్యయనంలో మునిగాడు, రాక్షసంగా అధ్యయనం చేశాడు. ఆర్గాన్, క్లావికోర్డ్, (0124101016) వయోలిన్ వాద్యాలని అభ్యసించాడ్డు. చర్చి ల్రైబరీలో తనని తను 'సమాధి' చేసుకుని అక్కడవున్న ప్రతి సంగీత సమాచారాన్ని తన జ్ఞాపక భాండారంలో భద్రపరచుకున్నాదు.
సంగీతం పట్ల అతని వ్యామోహం అంతులేనిది. హాంబర్గ్ నుండి ముప్పయి మైళ్ళ దూరంలో ఆనాటి సుప్రసిద్ధ ఆర్జానిస్టు జాన్ ఆడమ్స్ రీన్కెన్ సంగీత ప్రదర్శన వినడానికి కాలినడకన వెళ్ళాడు. అంతేకాదు..సెల్లె అన్న వూళ్ళో (ఫ్రెంచి సంగీత సమ్మేళనం వినడానికి అరవై మైళ్ళు నడిచివెళ్ళాడు. ఆ రకమయిన సంగీతం అతను వినడం మొదటిసారి.
పందొమ్మిదేళ్ళ వయస్సులో ఆర్న్స్ట్రాడ్ అన్నచోట ఆరానిస్టగా నియమితుడయ్యాడు. లూబెక్ అన్న ప్రాంతంలో ఆనాటి గొప్ప సంగీత దర్శకుడు డీట్రీచ్ బుక్స్ టెహ్లూడ్ (01610 ద16[గ66) ఆర్గాన్ ప్రదర్శనల కోసం బాచ్ నెలరోజులు సెలవు పెట్టి వెళ్ళాడు. అక్కడికి 2
వెళ్ళి అక్కడి సంగీత సమ్మేళనాల్లో పరవశంగాలీనమై వుండిపోయాడు. నెల. రోజులు కాస్తా మూడు నెలలయిపోయయి. ఆర్న్ స్టాడ్ అధికారులు బాచ్. స్థానంలో యింకొకర్ని నియమించుకున్నారు.
బాచ్ బంధువుల అమ్మాయి మేరియాబార్చరాని పెళ్ళాడాడు. సంవత్సరం తర్వాత వీమార్లోని డుకాల్ ఛాపెల్‌లో ఆర్గానిస్టుగా చేరాడు. అతనికి దొరికిన మొదటి ఉన్నత స్థాయి వుద్యోగం అది. అక్కడ తొమ్మిదేళ్ళ పాటు వున్నాడు. అక్కడ ఆర్గాన్ కోసం సంగీత స్వరాల్ని సమకూర్చడంలో లీనమై పోయాడు. ఆర్గాన్ వాద్యానికి ఎవడూ చెయ్యనంత సేవ చేశాడు. ఆర్గాన్ వాద్యానికి అంత సాహిత్యాన్ని సమకూర్చిన వారు సంగీత చరిత్రలోనే లేరు. ప్రదర్శనల్లోనూ తన అద్భుత (ప్రతిభను ప్రదర్శించాడు. 1714లో అతని ప్రదర్శన చూసిన యువరాజు హెస్సి (146556) పరవశించి తన వజ్రాల వుంగరం తీసి బాచ్కు బహుమతిగా ఇచ్చాడు. 1717 నాటికి ఆనాటి గొప్ప ఆర్గానిస్టుల్లో ఒకడుగా బాచ్ గుర్తింపు పొందాడు.
ఫ్రాన్స్‌కు చెందిన ఆనాటి సుప్రసిద్ధ ఆర్గానిస్సు లూయీస్ మార్చాండ్- అవ్పట్లో డ్రెస్దెన్కు వచ్చాడు. ఒకే సమయంలో యిద్దరి సంగీత ప్రదర్శన ఏర్పాటయింది. యిద్దరూ వాళ్ళ వాళ్ళ ప్రతిభని ప్రదర్శించారు. న్యాయ నిర్జేతలు ఎవరు గొప్పవాళ్ళో నిర్ణయించే సందిగ్ధంలో పడ్డారు. అప్పటిదాకా వేరు వేరుగా ప్రదర్శనలిచ్చిన వాళ్ళ మధ్య పోటీ ఏర్పాటయింది. చివరి నిముషంలో లూయీస్ మార్చాండ్ తన (ప్రదర్శన యివ్వకుండా వెళ్ళిపోయాడు.
వీమార్లో వున్నన్ని నాళ్ళూ నిరాడంబరంగా నిర్మలంగా అందరితో మంచిగా మెలిగాడు. ఆర్గాన్ని వదిలి తరువాత '5010 1౧51౧౧౪౧ కు సంబంధించి లెక్కలేనన్ని ప్రయోగాలు చెయ్యడంలో మునిగాడు.
“బాచ్కు పది మంది పిల్లలు. వాళ్ళలో నలుగురు మిగిలారు. అతని భార్య 1720లో చనిపోయింది. సంవత్సరం తరువాత మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. రెండో భార్య పేరు అన్నా డిమాగ్ధలీనా. ఇరవై ఒక్క సంవత్సరాలు వయసు. పట్టణంలోని ఒక వాద్య కారుడి కూతురు, బాచ్ ద్వారా ఆమెకు పదమూడు మంది పిల్లలు కలిగారు. ఆమెకు సంగీతం పట్ల స్వతంత్రమయిన అభిరుచి వుంది. ఆమె సంగీత రచన "116 11116 614౪/16౯దం0॥ 0140౧2 [12062169౧4 880%' పేర అచ్చయింది.
. 1728లో బాచ్ లీప్టిగ్లో చివరి వుద్యోగంలో చేరాడు. తరువాత అతను జీవించిన యిరవై ఏడు సంవత్సరాలు ఆ వుద్యోగం చేశాడు. - త
బాచ్ సంగీత (ప్రేమలో ఎంతో వైవిధ్యం వుంది. ఆర్గాన్ వాయించాడు. పిల్లలకు లాటిన్, సంగీతం నేర్చాడు. సంగీత బృందాలకు తర్ఫీదు యిచ్చాడు. వాటి ద్వారా సంవత్సరానికి 2500 డాలర్లు సంషాదించేవాడు. అంతేకాక పెళ్ళిళ్ళ, శవయాంత్రలు మొదలయిన వాటి ద్వారా పుష్కలంగా సంపాదించేవాడు. కానీ అపరిశుభ్రమయిన పరిసరాల్లో, చీకటి నిండిన యిళ్ళలో నివసించేవాడు. (డైనేజ్ అనుకూలం లేని ఇళ్ళలో నివసించాడు. ఫలితంగా అతని పిల్లల్లో చాలా మంది చిన్న వయసులోనే చనిపోయారు. లీష్టిగ్లో పుట్టిన మొదటి ఎనిమిది మందిలో ఆరు మంది చనిపోయారు. కేవలం అనారోగ్య అపరిశుభ్ర పరిసరాలే అందుకు కారణం. బతికిన వాళ్ళంతా తిరుగుబోతులయ్యారు. క్రమశిక్షణ లేకుండా అల్లరి చిల్లరగా తయారయ్యారు. అతని దగ్గర శిష్యులుగా చేరిన వాళ్ళు కూడా నిర్వీర్యంగా తయారయ్యారు.
బాచ్ స్థానిక చర్చి పూజురితో ఆ జన్మ వైరం వుండేది. ఈ అననుకూలాల మధ్య శత్రుత్వాల మధ్య, వ్యక్తిగతమయిన విషాదాల నడుమ కూదా అతని సంగీత పరిశ్రమ నిరంతరం నిరంతరాయంగా కొనసాగింది.
బాచ్ దైవాన్ని ఆరాధించడానికి, సంగీతాన్ని సృష్టించడానికి జీవించాడు. అతను జీవితమంతా పరిమితమైన పరిసరాల్లో, పరిమిత “సంస్కృతి” మధ్య నివసించాడు. అతనికి యిరత కళలకు సంబంధించిన జ్ఞానం దాదాపు శూన్యం. అతని భాషా సంగీత రచన భాషాదోషాలతో నిండి వుండేది.
1747లో బాచ్ పోస్ట్‌డామ్ వెళ్ళాడు. అక్కడ అతని కొడుకు కార్ల్ ఫిలిప్ ఇమ్మాన్యుయేల్ పనిచేసేవాడు. ఫ్రెడరిక్ ద (గ్రేట్ కింద వుద్యోగిగా వుండేవాడు. బాచ్ అక్కడికి వచ్చిన సంగతి ఫ్రెడరిక్ ద గ్రేట్‌కు తెలిసింది. ఫ్రెడరిక్, బాచ్ నిర్వహించే ఆర్కెస్టాలో తను ఫ్లూట్ వాయించాలని కాంక్షించాడు. ఆ సంగతి తెలిసిన బాచ్ “గౌరవ నీయులయిన (ఫెడరిక్గారూ! ఈ ముసలి బాచ్ సిద్ధంగా వున్నాడు అని చెప్పాడు. కనీసం బట్టలు మార్చుకోదానిక్కూడా బాచ్కు అనుమతి దొరకలేదు. వెంటనే సిద్ధం కమ్మని పిలుపందింది. అన్నీ హడావుడిగా సిద్ధం చేశాడు. ఆర్మెస్త్రా మొదలయింది. ఆ సంగీత సమ్మేళనం పతాక స్థాయిలో ఫ్రెడరిక్ బాచ్ ప్రావీజ్యానికి, నిర్వహణకు అద్భుతంగా, ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యాడు. లీష్టిన్ తిరిగి వెళ్ళాకా రాజు పట్ల కృతజ్ఞతగా మరికొన్ని స్వరాల్ని సమకూర్చాడు బాచ్.
చూపు మందగించడం వల్ల బాచ్ కంటికి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ ఆహేషన్ జాన్ టేలర్ అన్న వైద్యుడు చేశాడు. ఆ ఆపరేషన్ వల్ల ఫలితం కలగలేదు. ఫలితంగా త్త
బాచ్కు అంధత్వం ప్రాప్తించింది. ఇంకా బాచ్కు పక్షవాతం కూడా ప్రాప్తించింది. అతను చనిపోయే ముందు ముందు అతనికి కొద్దిగా చూపు వచ్చింది. వెంటనే తీవ్రంగా మిస్తూ తన చివరి సంగీత రచన 7౧6 2101106 2046' లో మునిగిపోయాడు.
బాచ్ 28 జూలై 1750న మరణించాడు. సెంట్ జాన్ చర్చిలో అతన్ని ఖననం చేశారు. అతని సమాధిపై అతని పేరు గుర్తింపు లేదీ పెట్టలేదు. 1894లో అతని సమాధిని గుర్తించి దానికి మెరుగులు దిద్దారు.
బాచ్ వంశస్థులు సంగీతకారులు. అతనికి మారియాబార్చరా ద్వారా కలిగిన రెండో కొడుకు కార్ల్ ఫిలిప్ ఇమ్మాన్యుయేట్ బాచ్కు (1714-88) సంగీత దర్శకుడుగా, స్పరకర్తగా సంగీత చరిత్రలో స్థానముంది. 'సొనటా” (900212) రూపానికి రూపు రేఖలు యిచ్చిన వాళ్ళలో అతనొకడు. హైదన్, మొజార్ట్ వంటి ప్రసిద్ధులు కార్ల్ ఫిలిప్ ఇమ్మాన్యుయేల్ 'పియానోపొనటా'ల పట్ల తమ కృతజ్ఞతలు వ్యక్త పరిచారు.
హైడన్ 'నాకు తెలిసిన దేదయితే వుందో దానికి సంబంధించి కార్ల్ ఫిలిప్ ఇమ్మాన్యుయేల్ బాచ్కు నేను కృతజ్ఞడయివుంటాను' అని చెప్పుకున్నాడు. 'మొజార్ట్' అతను తండ్రి, మేము పిల్లలం” అని చెప్పాడు.
బాచ్ చిన్న కొడుకయిన జోహాన్ క్రిస్టియన్ బాచ్ (1785-82) బాచ్ రెండో భార్య అన్నా మాగ్ధలీనా యిద్దరూ మధురమయిన సింఫనీలు, ౧0గ౧౦౭గ, సొనటాలు సృష్టించారు. జోవాన్ క్రిస్టియన్ బాచ్ చాలా కాలం ఇంగ్లాండులో వుండడం వల్ల, రాణి ఛార్లెట్టా కి సంగీత ఉపాధ్యాయుడుగా పని చెయ్యడం వల్ల 'ఇంగ్లీష్ బాచ్' అని పేరు పొందాడు.
ర్
బేలాబర్దోక్ 5612 82గ0 25-3-1881 -- 26-9-1945
హంగెరీలో నివసిస్తున్న రోజుల్లోనే ఒక ఇంటర్వ్యూలో బర్జోక్ 'తఈను ఒక సారి కాదు, రెండుసార్లు జన్మించినట్లు, చెప్పుకున్నాడు.
19065 ప్రాంతంలో అసాధారణ పరిసరాల్లో అతని 'రెండో జన్మ జరిగింది. ఒక పనమ్మాయి అతని అపార్ట్‌మెంట్‌ని శుభ్రం చేస్తూ వుంది. పనిచేసుకుంటూ ఒక పాట పాడుతూ వుంది. ఆమె పాదే పాట అతను ఎప్పుడూ విని వుండలేదు, అది కొత్తగా, గమ్మత్తుగా వుంది. వూహకందనంత మాధుర్యం ఆ పాటలో అతనికి కనిపించింది. బర్జోక్ ఆ పాటతో తీవ్రంగా ఆకర్షింపబడ్డాడు. అతను అప్పటి దాకా అట్లాంటి రాగం వినలేదు. ఆ పాట గురించి బర్జోక్ ఆ అమ్మాయిని అడిగాడు. ఆ రాగమేమిటో, ఆ పాట ఎవ(ర్రాశారో ఆ అమ్మాయి చెప్పలేకపోయింది. ఆమె చెప్పిందల్లా వాళ్ళమ్మ పాడుతూ వుంటే ఆ పాట నేర్చుకున్నానని, తను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ప్రాంతంలో ఆ పాట సుప్రసిద్ధమయిందని, యిట్లాంటి ఎన్నో పాటల్ని ఆ ప్రాంతంలో జనం పాడుకుంటారని చెప్పింది.
సంగీకాన్వేషణలో తీరని దాహంతో తపించే బర్జోక్ తనకు కొత్త సంగీత లోకాల పరిమళం అనుభవానికి వచ్చిందని ఆనంద పడిపోయాడు. ఆ పనమ్మాయి పుట్టి పెరిగిన 'ప్రాంకానికి వెళ్ళి అక్కడి పాటల్ని సేకరించాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు, నగరాలకు దూరంగా వున్న హంగేరియన్ గ్రామ సీమల్ని పర్యటించి స్థానికంగా వున్న సంగీత, నృత్యరీతుల్ని అధ్యయనం చెయ్యాలని సంకల్పించాడు
అతని మొదటి పర్యటన ఒక విశాల ఖండాన్ని చుట్టి వచ్చిన అనుభూతిని మిగిల్చింది. తగిన ఆర్థిక పరిస్థితి లేని కారణంగా ఆ పర్యటన తాత్కాలికంగా నిలిచిపోయింది. అతని అన్వేషణ ఫలితంగా వైవిధ్యభరితమయిన సంగీత జ్ఞాన భాండాగారాన్ని అతను 'ప్రపంచాని కందించాడు. అజ్ఞాతమయిన సంగీతలోకాల్ని ఆవిష్కరించాడు. “ప్రసిద్ధలయిన, అత్యాధునికులయిన హంగేరియన్ సంగీతకారులక్మూడా పరిచయం లేని జానపద సంగీతాన్ని అతను ప్రదర్శించాడు. ఎనిమిదేళ్ళ పాటు అహోరాత్రులు శ్రమించి హంగెరీ అంతా తిరిగాడు. హంగెరీ ఒక్కటే కాదు. రుమేనియా, స్లోవేకియాలూ తిరిగాడు. తన తోటి సంగీతకారుదయిన 'జోల్టన్ కొడాలితో కలిసి కొన్నిసార్లు పర్యటించాడు. తను విన్న పాటల్ని పేపరు మీద రాసుకుని, రికార్డు చేసి భద్రపరిచాడు. కనీసం ఆరు వేలపై చిలుకు పాటల్ని సేకరించాడు. 6
వాటిని క్రమ బద్ధంగా సిద్ధంచేసి అచ్చులోకి తేవడానికి సంకల్పించాడు. హంగేరియన్ జానపద సంగీతానికి సంబంధించి పెద్ద లైబ్రరీ సిద్ధం చేశాడు. ఆ హంగేరియన్ సంగీతం విభిన్న రాగాలతో నిండింది. హంగేరియన్ సరిహద్దుల్ని దాటింది. ఇతర ప్రపంచానికి పరిచయం లేనిది. బర్జోక్ ఆవిష్కరణ తరువాతే బావ్యా ప్రపంచానికి సెంటిమెంట్‌తో నిండిన, అలంకార మాధుర్యం అలముకున్న తీగలా వంపులు తిరిగే, జిప్సీ వైతన్యం నిండిన, సాధికారిక హంగేరియన్ ప్రజల సంగీతం పరిచయమయింది. బర్జోక్ సేకరించిన జానపద సంగీతంలో ఆదిమ గాధత, మమకారం, బలం, భమలు లేని తనం కనిపిస్తుంది.
బర్జోక్ మౌలిక మయిన జానపద సంగీతం గ్రామ సీమల్లోనిది. కానీ బయటి ప్రపంచానికి తెలియనిది. దాని ఆవిష్కారంతో హంగేరియన్ కళకు, సంగీతానికి స్వర కల్పన చెయ్యడంతో ఆయన సంతృప్తి పడలేదు “హంగేరియన్ సంగీతం” గురించి రాయడం ప్రారంభించాడు.
1905 నించీ అతనిలో మార్చు మొదలయింది. అంతకు పూర్వం కూడా అతను సంగీతకారుడే. స్వరకర్తే. కానీ 1905 నించీ అందుకు పూర్తిగా వేరుగా అతని పద్ధతి మొదలయింది. అందుకనే అతను తను రెందుసార్లు జన్మించానని చెప్పుకున్నాడు.
బర్జోక్ 1881లో ట్రావ్యల్వేనియా ప్రాంతంలో చిన్ని పట్టణంలో జన్మించాడు. ఆ ప్రాంతం హంగెరీ, రుమేనియా, స్లావిక్ సంస్కృతులు కలగలిసిన ప్రాంతం. అతని తండ్రి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ డైరెక్టర్. బెత్సాహిక సంగీతకారుడు. బర్జోక్ ఎనిమిదేళ్ళప్పుడు తండ్రి చనిపోయాడు. కుటుంబ బాధ్యతల్ని తల్లి తలకెత్తుకుంది. పిల్లల్ని పెంచడమే కాకుండా వాళ్ళ చదువుల పట్ల కూడా ఆమె (శ్రద్ధ కనబరచింది. బర్జోక్ మొదటి పియానో టీచర్ ఆమె. అతని ప్రతిభను మొదట గుర్తించింది అతని తల్లే. బర్జోక్ తొమ్మిదేళ్ళ వయసులో మొదటసారిగా పియానోపై సొంత స్వరాన్ని సమకూర్చాడు. పదో ఏట ప్రదర్శన ఇచ్చాడు. 1898లో కొడుకు సంగీతంలో మరింత అధ్యయనం చెయ్యాల్సిన అవసరాన్ని గుర్తించిన తల్లి తమ చిన్ని పట్టణం విడిచి పెట్టింది. (ప్రెస్ బర్గ్ అన్న పెద్ద పట్టణానికి కుటుంబాన్ని మార్చింది. అక్కడ ఉపాధ్యాయ వృత్తిలో చేరింది. అక్కడ బర్జోక్కు లాస్జ్లో ఎర్కెల్ అన్న సంగీతకారుడు పియానో పారాలు నేర్పించి సృజనాత్మక విధానాల్ని బోధించాడు. 1899 నుండి 1908 దాకా బర్జోక్ బుడాపెస్ట్‌లో థోమెన్, కోస్టర్ అన్న గురువుల దగ్గర లిస్ట్ట్ అకాడమీలో సంగీతాన్ని అధ్యయనం చేశాడు. ఎన్నో రాగాలకు స్వరకల్పన చేశాడు. 1903లో మాంచెస్టర్‌లో హాన్స్ రిచ్టర్ ఆధ్వర్యంలో, వాలే ఆర్మెస్ట్రాలో జరిగిన బర్జోక్ సంగీత ప్రదర్భన ఎంతో ఉద్దేశభరితమైంది. తన జుతీయ సంగీతంలో తన లక్ష్యాన్ని బర్జోక్ సందర్భించాడు. 1905 మొదలు 1918 దాకా అతని నిత్య నిరంతర అన్వేషణలో అది సాధించాడు.
౮
మధ్యకాలంలో 1903లో అకాడమీని వదిలాకా జీవిక కోసం పియానో వాద్య ప్రదర్శనలిస్తూ సంగీత పాఠాలు చెబుతూ, సంగీత యాత్రలు చేస్తూ గడిపాడు. 1907లో లిస్ట్ట్ అకాడమీలో పియానో ప్రొఫెసర్‌గా నియమితుడయ్యాడు. సంగీత స్వరక్తగా అతని ఆవిష్కరణలు ప్రథమ స్థానం వహిస్తాయి. అతని హంగేరియన్ జానపద సంగీత సేకరణ రెండో న్థానంలోనిది. హంగేరియన్ సంగీతం నించీ అతను ఎంతో స్వీకరించి ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఫలితంగా అతని సంగీత రచన సంక్షిష్టంగా, “వ్యక్తిగతి పరిమితులకులోనై “జనామోదానికి' దూరమైంది. సంగితాభిమానులు ఎప్పుడూ అతన్ని గౌరవించడానికి, అభినందించడానికి, అతని సాంకేతిక నైపుణ్యానికి, పాండిత్యానికి తలవంచడానికి ఎప్పుడూ నిస్సందేహంగా సిద్ధపడి వుండేవాళ్ళు. కానీ సామాన్య జనం, సాధారణ (ప్రజానీకం అతని సంగీతాన్ని లక్ష్య పెట్టేవాళ్ళు కాదు. 1927లో బర్జోక్ మొదటిసారి అమెరికా సందర్శించాడు. ఆ పర్యటనకు బాల్డో పియానో కంపెనీ ఆర్థిక సాయం చేసింది. పది వారాల పాటు బర్జోక్ తన ముఖ్యమయిన సంగీత స్వరాల్ని ప్రదర్శించాడు. అతను ఎక్కడికి వెళ్ళినా గొప్ప గౌరవాన్ని అభినందనల్ని అందుకున్నాడు. కానీ వాటికి “పరిమితులున్నాయి. పదమూడు సంవత్సరాల అనంతరం మళ్ళీ బర్జోక్ అమెరికా సందర్శించినప్పటి పరిస్థితులు వేరుగా వున్నాయి. వాంగేరియన్ స్వర కర్తల్లో, సంగీత కారుల్లో బర్జోక్ని సాటిలేని మేటిగా సంగీత విమర్శకులు ఆకాశానికెళ్తారు. సంగీతకారులు, సంగిత సిద్ధాంతకారులు జానపద సంగీతానికి అతని సేవ నిరుపమానమని కోనియాడారు. ఆ తరంలోని మౌలిక సంగీత కారుల్లో ఒకడిగా అతని అభిమానులు ఆకాశానికెళ్తారు. కానీ ఎప్పట్లాగే “సాధారణ” జనం అంతగా స్పందించలేదు. ఎప్పుడో గానీ బర్జోక్ సంగీత ప్రదర్శనలు జరిగేవి కావు. బర్జోక్ తన జీవితంలోని చివరి సంవత్సరాలు న్యూయార్క్ నగరంలో గడిపాడు. దరిద్రంతో భయపడ్డాడు, బాధలు పడ్డాడు. ఎవరో కొద్ది మంది గొప్ప సంగీతకారులు మాత్రమే అతని పట్ల శ్రద్ధా సక్తులు చూపించే వాళ్ళు. వాళ్ళకి మినహాయింపుగా ఒక్క వ్యక్తి వున్నాడు. అతని పేరు సెర్టోకో సవిట్బీ, బర్జోక్ అనారోగ్యంతో హాస్పిటల్లో పడకపై వుంటే అతను వచ్చేవాడు. కోసవిట్స్ ఫౌండేషన్ కోసం బర్జోక్ దగ్గర సంగీత రచన చేయించేవాడు. ఈ కాలంలో బర్జోక్ దాదాపు నిరంతరం అనారోగ్యంతో అల్లాడేవాడు. దాదాపు మూదేళ్ళపొటు జ్వరంతో బాధపడ్డాడు. రక్తహీనత వల్ల క్షీణించాడు. ఒంటరితనంతో, ఎవరితోనూ సంబంధం లేకపోవడంతో చిత్రహింస అనుభవించాడు. అవిశ్రాంతంగా శ్రమించిన వ్యక్తి సమకాలీన సంగీత ప్రపంచానికి దూరమైనట్లు ఫీలయి విలవిల్లాడి పోయాడు. తి
అట్లాంటి దుర్భర పరిస్థితుల్లోనూ అతని గొప్ప సంగీత సృష్టుల్లో ఒకటయిన '00౧- 06గ0' ౧10.3 రచన చేశాడు. అది పియానోకు వుద్దేశించి చేసిన రచన. ఈ స్వర కల్పనలో అతని హృదయం, మేధ రెంటి సమ్మేళనం వుంది.
క్రమ క్రమంగా బర్జోక్ శరీరం శిథిలమైంది. అతని గొంతు మూగబోయింది. తీవ్రమయిన నొప్పిలో బాధపడేవాడు. యింకా అతను మరి రెండు ముఖ్యమయిన 'స్వర సమ్మేళనాలు సృష్టించాల్సి వుంది. కాలం సమీపిస్తోందని అతనికి తెలుసు. అంత అనారోగ్యంలోనూ అవిశ్రాంతంగా తన సంగిత స్వరాల కోసం పరిశ్రమించాడు. అతని పడక పక్కనే అతని కొడుకు పీటర్ కూచుని అవసరమయిన సాంకేతిక వివరాలు రాసి పెట్టేవాడు. బర్టోక్ నిరంతర (శ్రమతో తన జీవితంలోని చివరి సంగీత ఆవిష్కారాల్ని పూర్తి చేశాడు.
బర్జోక్ సంగీతం జనామోదం పొందే దాకా ఆయన జీవించలేదు. 1945లో అతని ముఖ్యమయిన సంగీత రచనలు ఆధారంగా నలఖై ఎనిమిది ప్రదర్భనలు జరిగాయి. బర్జోక్ మరణానంతరం ఐదేళ్ళ తరువాత అతని ముఖ్యమయిన సంగీత రచనలన్నీ అందుబాటులోకి వచ్చాయి.
త్రి
లుడ్విగ్ వాన్ బిథోవిన్ 146/0 ౪2౧ 5661000౪60 16-12-1770 -- 2326-3-18227 రైన్.నదీ తీరంలోని బాన్ నగరం బిథోవిన్ జన్మస్థలం. ఆయన నివసించిన 20 బాన్గాస్, ఇల్లు ప్రపంచవ్యాప్తంగా వున్న సంగీత (పేమికులకు తీర్ధయాత్రా స్థలం. ఆ ఇల్లు మ్యూజియంగా మార్చబడింది. బిథోవిన్ జీవితకాలంలో ఉపయోగించిన ఎన్నో వస్తువుల్ని అక్కడ భద్రపరిచారు. వాటిల్లో ఆయన వుపయోగించిన పియానో కూడా వుంది. ఐతే ఎవరూ దాన్ని తాకు కుందా చూద్దానికి మాత్రమే అనుమతిస్తున్నారు. కారణం ఆ మవాో సంగీతకారుడు తన స్వరాల్ని సృష్టించిన ఆ పియానో మెట్లని తాకడానికి సహజంగానే ఎవరయినా వుద్రేకపడతారు. దానికి సంబందించి ఒక సంవుటన చెబుతారు. సందర్శ్భకురాలిగా వచ్చిన ఒక స్తీ హడావుడిగా హఠాత్తుగా వెళ్ళి.ఆ పియానోపై ప్రపంచ సిద్ధమయిన 'ఫిప్త్ సింఫనీ” (విథోవిన్) వాయించదానికి ప్రయత్నించి దారుణమయిన స్వరాల్ని సృష్టించింది. ఎవరూ తాకకుండా కాపలా వున్న అతను అరుస్తూ ఆమెను వారించాడు. అప్పుడామె భయపడుతూ 'బిధోవిన్ వాయించిన పియానో పై వాయించాలని ఎవరయినా అనుకుంటారు కదా. అంది. దానికి దాని సంరక్షకుదు *అందరూ కాదు. గత వారం ఒక సందర్శకుడు వచ్చాడు. అతను కనీసం ఆ పియానోను తాకడానికి కూడా సందేహించాడు. ఎందుకు తాకరని ప్రశ్చిస్తే నాకంత అర్హత లేదు.” అన్నాడు. అతని పేరు పెట్రోవిస్కీ “(సుప్రసిద్ధ సంగీత కారుడు) అని చెప్పాడు. బిధోవిన్ను ఎవరి పద్ధతిలో వాళ్ళు గౌరవించేవాళ్ళు. మెజారిటీ జనం పెట్రోవ్స్కీ లాగే వినమ్రత (ప్రకటించేవాళ్ళు. వాగ్నర్ బిధోవిన్ ని “టైటాన్ అన్నాడు. చెకోవ్స్కీ 'దేవుడు” అన్నాడు. బిథోవిన్ సంగీతమే కాక అతని వ్యక్తిత్వం కూడా అసాధారణమైంది. అతని దార్భనికత, గంభీర వ్యక్తిత్వం, “అపాం, ఆదర్శం, సాటిలేని నాయకత్వ లక్షణం అసాధారణమైనవి. మానవ జాతిలో మహోన్నత సంగీతాన్ని సృష్టించిన ఉన్నతుడాయన విధితో జీవన్మరణ సమరం చేసిన వాడు. ఆ సమరంలో విజయాన్ని వరించినవాదు. బిధోవిన్ బాల్యంలో ఆనందం లేదు. అతని బాల్యం బాధల మయం. ఆయన తండ్రి పేరు జోహాన్. బాన్‌లోని 'ఎలక్షోరల్ ఛాపెలొలో గాయకుడు. తాగుబోతు. తాగుబోతుల అవలక్షణాలతో ఇల్లు గుల్ల చేసేవాడు. చిన్ని తనంలో బిథోవిన్ సంగీతంలో తన ప్రతిభను ప్రదర్శించగానే తండ్రి మనసులో దురాశ రేకెత్తింది. *చిన్ని వయసులోనే మొజార్ట్ తన [0
ప్రతిభతో బాగా డబ్బు సంపాదించాడు. బిథోవిన్ ఎందుకు సంపొదించకూడదు?” అదీ తండ్రి ఆలోచన. ఆలోచన వచ్చాకా ఇక అతను వూరుకోలేదు. తన స్నేహితుడయిన టోబియాస్ ఫీఫర్ దగ్గర బిథోవిన్కు పియానో పాఠాలు నేర్పించాడు. నిరంకుశంగా కొడుకును నిర్బంధిస్తూ గంటల కొద్దీ పియానో వాయించమనేవాదు. జోహాన్ అతని స్నేహితుడు ఫీఫర్ పీకలదాకా తాగి అర్ధరాత్రి యిల్లు చేరేవాళ్ళు. వెచ్చగా, హాయిగా గాఢంగా నిద్రపోతున్న బిధోవిన్ని నిద్రలేపి బలవంతంగా పియానో ముందు కూచో బెట్టి తెల్లవారే దాకా పియానో వాయించమనేవాళ్ళు. నిద్రమత్తులో బిధోవిన్ ఏవైనా పొరపాట్లు చేస్తే పిడిగుద్దులు పడేవి.
బిధోవిన్ది విషాదకరమయిన బాల్యం. తాగుబోతు తండ్రి, ఇల్లంతా నిండిన దరిద్రం. పియానో ముందు బానిసలా కూచుని చేతులు నొప్పి పెట్టే దాకా వాయిస్తూ అలసి సొలసి సొమ్మ సిల్లేవాడు. దెబ్బలు తింటున్నా తప్పులు రాకుండా వాయించలేకపోయేవాదు. దానికి తోడు బిధోవిన్ దురదృష్టమేమిటంటే అతనికి స్నేహితులు లేరు. కనీసం పలకరించే వాళ్ళు కూడా కరువే. బిధోవిన్ అందవికారంగా వుందేవాడు. బట్టలు మురికిగా వుండేవి. విధోవిన్ సిగ్గుపడుతూ బిడియ పదుతూ ముడుచుకుని వుండేవాడు. మహా సున్నితమయినవాడు. అతని వయసు వాళ్ళు అతన్ని దూరంగా వుంచేవాళ్ళు. అతనూ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు కాడు. చిన్నితనంలోని ఆటలంటే, ఆనందమంటే అతనికి ఏమిటో తెలీదు. చిన్నతనంలో ఆనందం ఏదయినా వుందంటే అది అతనికి తల్లి నించీ అందిన మమకారమే. తండ్రి క్రూరత్వం నించీ కొంతక్కొంత అతనికి ఓదార్పు నిచ్చింది తల్లి అనురాగమే. ఆమె ఎప్పుడూ అనారోగ్యంగా వుండేది. కానీ అర్ధం చేసుకునే మనసు కలిగింది. శ్రేమ కలిగింది. కానీ ఆమె నవ్వడం ఎప్పుడూ ఎవరూ చూసి ఎరగరు. దురదృష్టవశాత్తు ఆమె చాలా కాలం జీవించలేదు.
బిథోవిన్ తన ఎనిమిదవ ఏట సంగీత ప్రదర్శన ఇచ్చాడు. అప్పుడు తన కొడుక్కి కేవలం ఆరేళ్ళే అని తండ్రి ప్రచారం చేశాడు. ఆ ప్రదర్శనలో బిథోవిన్ తన ప్రతిభను ప్రదర్శించాడు. కానీ శ్రోతల్ని ఉద్రేకపరిచేంత ప్రతిభ అప్పటికి అతనికి లేదు. తండ్రి జోవోన్ వ్యూహం పద్ధతి ప్రకారం జరగలేదు. కానీ బిధోవిన్ సంగీతాభ్యాసం కొనసాగింది.
బిధోవిన్ ముఖ్యమయిన సంగీతోపాధ్యాయుడు క్రిస్టియన్ గోట్లాబ్ నీఫే. అతను అస్థాన ఆర్గానిస్టు. అతను బిధోవిన్ను అర్ధం చేసుకున్నాడు. అభినందించాడు. బిథోవిన్లో మొగ్గతొదుగుతున్న ప్రతిభను ఎట్లా ఫ్రోత్సహించాలో అతనికి తెలుసు. పద్నాలుగేళ్ళ వయసులో బిథోవిన్ నీఫేకు అసిస్టెంట్ ఆర్గానిస్టుగా నియమితుడయ్యాడు. అసిస్టెంట్‌గా సమర్ధవంతంగా పని చేశాడు. తన గురువు స్థానంలో కూడా నియమింపబడతాడని అందరూ అనుకున్నారు. అదే సమయంలో నాటక రంగంలోనూ పని చేస్తూ ఒపేరా నృత్య ప్రదర్శనలకు సహకరించాడు.
[2
అతనిలో వికసిస్తున్న ప్రతిభను చూసి ముగ్ధడయిన నీఫే 1783లో “తను యిట్లాగే ఎదుగుతూ పోతే తప్పకుండా యితను రెండో మొజార్ట్ అవుతాడు” అని రాశాడు.
సంగీతకారుల్ని ఎంపిక చేసే ఒక అధికారి బిథోవిన్ ప్రతిభను గుర్తించి అతనికి వియన్నాకు వెళ్ళదానికి తగిన ఆర్ధిక సహకారం చేశాడు. విధోవిన్కు అది మంచి అవకాశం. బిథోవిన్ కూడా వియన్నా సందర్శించాలని వువ్విళ్ళూరు తున్నాడు. కారణం అది “సంగిత కేంద్రం! అక్కడ మొజార్ట్ నివసిస్తున్నాడు. మొజార్ట్ అంటే బిథోవిన్కు అంతులేని గౌరవం. మొజార్ట్ దగ్గర తన సంగీతాన్ని ప్రదర్శించి ఆయన అభిప్రాయాన్ని అందుకోవడం పట్ల బిథోవిన్కు అంతులేని ఉత్సాహం.
బిథోవిన్ వియన్నా వెళ్ళాడు. మొజార్ట్ ముందు తన సంగీతం వినిపించాడు. మొజార్ట్ మర్యాదా పూర్వకంగా విన్నాడు. కానీ పెద్దగా ప్రభావితుడు కాలేదు “ఇప్పుడు నా సహజ సంగీతాన్ని ప్రదర్శిస్తాను' అన్నాడు బిధోవిన్. ఆ ప్రదర్శనలో బిథోవిన్ వూహ, మౌలికత ప్రదర్శించాడు. కానీ మెజార్ట్ మౌనంగా వున్నాడు. బిధోవిన్ మొజార్ట్ పెట్టిన కష్టా సాధ్యమయిన పరీక్షలు నెగ్గిన తరువాత కానీ మొజార్ట్ తన అభిప్రాయం చెప్పలేదు. ఇచ్చిన వస్తువుపై అప్పటికప్పుడు స్వరకల్పన చేసి మొజార్ట్‌ని మెప్పించాడు. అప్పుడు మొజార్ట్ “ నువ్వు ఒక రోజు తప్పకుండా నీ సంగీత సముద్రంలో ఈ ప్రపంచాన్ని ముంచుతావు” అని అభినందనలో
రెండు నెలల పాటు వియన్నాలో వుల్లాసంగా గడిపాడు. క్షయవ్యాధితో తల్లి చనిపోయే పరిస్థితిలో వుందని వార్త అందడంతో అతను వియన్నాను వదిలి పెట్టాదు. బాన్ చేరాడు. అతను తల్లి పక్కన వుండగానే ఆమె కన్ను ముసింది. తల్లి మరణం బిధోవిన్కు అశనిపాతం లాంటిది. తనకి అత్యంత సన్నిహితురాలయిన ఒకే ఒక వ్యక్తిని అతను కోల్పోయాడు. అతనికి (ప్రేమను, అనురాగాన్ని పంచిన ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోయింది.
ఆమె మరణంతో ఆ యింట్లో అతని జీవితం మరింత దుర్భరంగా మారిపోయింది. తండ్రి తాగుడు మరీ ఎక్కువయిపోయింది. ఒకసారి పోలీసుల బారినించీ అతన్ని రక్షించాడు. అతని తాగుడువల్ల చర్చిలో గాయకుడుగా చేస్తున్న వుద్యోగం వుండిపోయింది. దాంతో కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత బిధోవిన్ నెత్తిన పడింది.
కుటుంబాన్ని పోషించడానికి నాటకరంగంలో ఆర్మెస్త్రాలో వాద్యగాడుగా పనిచేశాడు. సంపన్న కుటుంబస్థుల పిల్లలకు సంగీతపారాలు నేర్పాడు. పియానో ప్రదర్శన లిచ్చాడు. కొన్ని పియానో సంగీత స్వరాల్ని సమకూర్చాడు.
మొత్తానికి బాన్ నగరవాసులు మెల్లమెల్లగా అతని (వ్రతిభను గుర్తించి అభినందించడం మొదలు పెట్టారు. ఉన్నత కుటుంబాలకు చెందిన మంచి వాళ్ళయిన శం
పలుకుబడి వున్న కొందరు మిత్రులు అతనికి ఏర్పడ్డారు. వాళ్ళలో (బ్రూనింగ్స్, కౌంట్ వాల్ట్ స్టెయిన్ ముఖ్యులు. రెండో అతను భవిష్యత్తులో బిథోవిన్ సంరక్షకుడు (పోషకుడు) అయ్యాడు. ఎప్పుడు బిధోవిన్ యిబ్బందుల్లో వున్నా అతను ఆదుకునే వాడు. అవసరమయినప్పుడల్లా ధన సాయం చేసేవాడు.
1790లో ఒక సుప్రసిద్ధ సంగీతకారుడు లండన్ వెళుతూ బాన్ నగరం మీదుగా వెళ్ళాడు. అతని పేరు జోసఫ్ హైదెన్. అతని నివాసం వియన్నా అతని సమకాలికుల్లో అతను గొప్ప స్వరకర్తగా క్తీర్తింపబడ్డాడు. అతను బాన్ కెథెడ్రిల్ సందర్శించి యువకుడయి బిధోవిన్ సంగీతం విన్నాడు. పరవశించాదు. “గొప్ప ప్రతిభ వున్న అసాధారణ సంగీతకారుడు అని బిధోవిన్ని అభినందించాడు. హైడన్ తనపై బిథోవిన్ ప్రభావాన్ని అంత సులభంగా మరచిపోయే వ్యక్తి కాడు. అతను లండన్ నించీ వియన్నా తిరిగి వెళుతూ మళ్ళీ బాన్‌లో ఆగి బిధోవిన్ని వ్యక్తిగతంగా కలిశాడు. “నీలో గొప్ప ప్రతిభ వుంది. నువ్వు వియన్నా వచ్చి నా దగ్గర సంగీతం నేర్చుకో అని చెప్పాడు. ఈ సంగతి కౌంట్ వాల్డ్ స్టెయిన్‌కు తెలిసింది. అతను బిధోవిన్కు అన్ని సౌకర్యాలూ సమకూర్చి బిధోవిన్ సెలవులో వున్నా బిథోవిన్ పనిచేస్తున్న దగ్గర అతనికి నెలవారీ జీతం కొనసాగే ఏర్పాటు చేసి వియన్నాకు పంపాడు. సంతోషంగా తన సందేశాన్ని బిథోవిన్కు అందజేశాడు.
“నీ మనసులో దాగి వున్న నీ కోరికలు ఫలించడానికి నీకు అవకాశం వచ్చింది. మొజార్ట్‌ను సంరక్షించే దేవదూత అతని స్థానాన్ని ఎవరూ పూరించలేదే అని కన్నీళ్ళు పెట్టుకొంటోంది. హైడన్ సహకారాన్ని ఆమె కోరింది. హైదన్ ద్వారా రాబోయే వ్యక్తి కోసం ఎదురు చూస్తోంది. హైడన్ ద్వారా అతని శ్రద్ధా సక్తుల ద్వారా నువ్వు మొజార్ట్ చైతన్యాన్ని స్వాయత్తం చేసుకో”,
1792 నవంబరు నెలలో రెండోసారి బిథోవిన్ వియన్నా వచ్చాడు. ఈ సారి వియన్నా రావడం అతని మంచికే జరిగింది. పెద్ద నగరంలో నివసించడానికి కొన్ని పద్ధతులు, నాగరికత వాటి అవసరాన్ని బిధోవిన్ గుర్తించాడు. తను పరిచయ లేఖలు అందించబోయే ఉన్నత కుటుంబీకుల ఆమోదం కోసం తన వస్త్రధారణలో మార్పులు చేశాడు. జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒక విగ్గుకొన్నాడు. సిల్కు అంగీ, ఫాషన్బుల్గా వున్న సూట్లు, అందంగా వున్న కోటు వంటివి ఖరీదు చేశాడు. తను మొరటుగా నిర్లక్ష్యంగా వుందేవాదు. అతని చిన్ని పట్టణంలో సరిపోయింది కానీ వియన్నాలో ఇట్లా వుంటే ఎప్పుడో వెనక్కి తిరిగి పోవాల్సి వచ్చేది. ఇరవై రెందేళ్ళ వయసులో యింకా చాలా పెద్ద వాడిలా అనిపించేవాడు. బిథోవిన్ పొట్టివాడు. గుమ్మటంలా వుండేవాడు. అతని తల సింహం తల లాంటిది. అతన్లో బలం కొట్టొచ్చినట్లు కనిపించేది. అతన్లో అస్తవ్యస్తత కనిపించేది. స్ఫోటకపు మచ్చలు. కానీ అందులో
క్ష
ఒక ఆకర్షణ. అతనో మౌలికంగా శక్తి కనిపించేది. ఎవరి అధికారానికీ తలవంచని ఒక శక్తి ఒక స్వేచ్చ కనిపించేది. మనతో మాట్లాడేది. కొంతమంది మాత్రమే అది ఒక నవ్యతకు స్థానమని, ఫ్రెంచి విప్లవ చైతన్యం అతన్లో ప్రతిఫలిస్తుందని గుర్తించారు. బిధోవిన్ ఫ్రెంచి విప్లవంతో తీవ్రంగా ప్రభావితుడయ్యాడు. ఆ చైతన్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకున్నాడు. రూసోని గాఢమయిన అభిమానంతో చదువుకున్నాడు. అంతరాంతరాలతో అతను 'ప్రజాస్వామ్యవాది. సంగీతకారుడుగా తన బలమైన ము(ద్రను (వ్రదర్శించాలని బిధోవిన్ నిశ్చయించుకున్నాడు. సంగీత అధ్యయనంలో మునిగిపోయాడు. అతని పళ్ళ బిగువు, నిశ్చలత్వం, కంటి మెరుపు అతని విజయ యాత్ర పట్ల అతని పట్టుదలని ప్రదర్శించాయి. బిధోవిన్ హైడెన్ శిష్యరికంలో చేరాడు. ఆశ్చర్యమేమిటంటే అతని శిష్యరికంలో అతను రాణించలేదు. ఆనాటి సుప్రసిద్ధ సంగీతకారుడయిన హైడన్ నిర్మలంగా, నిశ్చలంగా నిర్చంధాలకు, నియమాలకు, శిక్షణకు లొంగని యువకుడయిన బిధోవిన్ని మౌనంగా పరిశీలిస్తూ వుండిపోయాడు. అతని ప్రతిభను గుర్తించినవాడు హైడనే. నియమాలకు తతవంచని బిధోవిన్ ప్రతిభను అతను అర్థం చేసుకోలేకపోయాడు. అతని అసహనాన్ని అంతులేని స్వేచ్ళని హైడెన్ జీర్చించుకోలేక విసుగు ప్రదర్శించాడు. అప్పుడు బిథోవిన్ తన వుషాధ్యాయుడి పట్ల మరింత “ఉత్సాహం” చూపించాడు. అతని తేలిక పాటి, అకడమిక్ మార్తాన్ని సంప్రదాయంలో కురుకుపోయిన అతని పునాదుల్ని చూశాడు. వాళ్ళ మార్గాలు వేరువేరని గ్రహించాడు. బిథోవిన్ కొత్త గురువుల అన్వేషణలో పడ్డాడు. అల్బర్ట్ బెరగ్ధర్, కాపెల్ మీస్టర్ అన్న సంగీతకారుల దగ్గర కొంతకాలం అభ్యసించాడు. ఆకాశమంత శిష్యుణ్ణి వాళ్ళు భరించలేకపోయారు. వాళ్ళ దగ్గర అతను నేర్చుకున్నది అత్యల్పం ఆల్బర్ట్ బెరగ్గర్ “అతను ఏమీ నేర్చుకోలేదు, సక్రమమైన శైలిలో అతను ప్రదర్శించింది శూన్యం” అని అన్నాడు కొంత మంది మాత్రమే అతని ప్రతిభను భవిష్యత్తును దర్శించారు. కౌంట్ వాల్డ్స్టెయిన్ పరిచయ వుత్తరాలు వియన్నా రాజద్వారాల్ని బిధోవిన్ కోసం తెఠిపించాయి. రాజకుమారులు లిచ్నోవ్స్కీ లోబ్కోవిట్ట్, యింకా మారోన్ వాన్ స్వీడెన్ తతన్ని ఆహ్వానించారు. వాళ్ళలో రాజకుమారుడు లిచ్నోవ్స్కీ బిథోవిన్ ప్రతిభాసామర్థ్యాల్ని గుర్తించి తన బాధ్యతగా తన భవనంలో బస చెయ్యమనికోరాడు. వియన్నాలోని ఉన్నత వర్ణాల సమావేశాల్లో బిథోవిన్ తన సంగీతాన్ని ప్రదర్శించాడు. పియానో నేర్పించాడు. తన స్వర పరచిన గీతాల్ని పియానో వాద్యంపై ప్రదర్శించాడు. అతనికి పూలవాన లాగా అభినందనల వర్షం కురిసింది. ఉన్నత వర్గాల సంగీతాభిరుచి అతని బెన్నత్యాన్ని గుర్తించింది. కడ
మొజార్ట్, హైడన్ మార్గాల్లో స్వరకల్పన చేసినా అతని మధుర స్వర ఆవిష్కరణలో స్వాతంత్ర్యం, వ్యక్తిత్వం, స్వేచ్చ పల్లవించాయి. .
తన శక్తి పట్ల బిధోవిన్కు అంతులేని విశ్వాసం. 'సంస్కారా వంతంగా ప్రవర్తించడం అతనికి తెలీదు. తనకు చిన్ని అవమానం జరిగినా వెంటనే ఎదుర్కొనేంత సౌకుమార్యం, సున్నిత గుణం అతన్ది. వెంటనే ప్రతిస్పందించేవాడు. ఎంత గొప్ప వాళ్ళయినసా. లక్ష్యపెట్టే వాడు కాడు. ఓసారి లిచ్నోవ్స్కీ సంగీతమందిరంలో ఓసారి అక్కడి అతిధుల్ని అతను అవమానించాడు. కారణం అతను సంగీతాన్ని ప్రదర్శిస్తోంటే వాళ్ళు మాటల్లో పద్దారు. అతను ఆ అతిథుల కోసమే సంగీత ప్రదర్శన చేస్తున్నాడు. వాళ్ళంతా ఉన్నత వర్గాల వాళ్ళు, ఆదృ్భశ్యం చూసిన బిధోవిన్ ఆగ్రహంతో పియానోని చేతుల్లో గుద్ది 'ఇట్లాంటి పందుల ముందు నేను సంగీతాన్ని ప్రదర్శించను' అని అరిచాడు. కానీ ఆ గౌరవకుటుంబాల.వ్యక్తులు అతని చర్యలకు కోపించలేదు. అతని సంగీత బెన్నత్యాన్ని వాళ్ళు గొప్పగా అభిమానించిన వాళ్ళు, అతని ఆగ్రహాన్ని అర్ధం చేసుకున్నారు. అతని సున్నితమయిన స్వభావం, క్షణికోద్రేకం వాళ్ళకు తెలుసు.
1795 మార్చిలో మొదటిసారి బిథోవిన్ వియన్నాలో తన బహిరంగ సంగీత ప్రదర్శన యిచ్చాడు. అది ఒక ధార్మిక సంస్థ తరపున జరిగిన ప్రదర్శన. తను కొత్తగా కల్పించిన స్వరకల్పనతో ఆ ప్రదర్శన యిచ్చాడు. శ్రోతలు ముగ్జులయిపోయారు. యిం(ధ్రజాలంలో తేలిపోయారు. అప్పటికే ఉన్నత కుటుంబాల వారికి అతను ఆరాధనీయుడు. యిప్పుడు వియన్నా నగర సంగీతాభిమానులకూ ప్రియుడయిపోయాడు: ఒక అజ్ఞాత రచయిత 'పియ్లానో వాద్యకారుల్లో విశ్వరూపం దాల్చినవాడు' అని రాశాడు.
సంగీతకారుడిగానే కాక సంగీత రచయితగా కూడా బిథోవిన్ ప్రసిద్ధుడు. పద్దెనిమిదో శతాబ్దం చివరికి అతను కొన్ని 7౧|౦5 (త్రికాలు), చాలా పియానో సొనటాలు, తన సుప్రసిద్ధమయిన పాట గ౦60166 ని అచ్చులోకి తెచ్చాడు. వాటినించీ ఆదాయాన్ని పొందాడు. వాటి గురించి చెబుతూ 'నా రచనలకు మించిన ఆర్డర్లు నాకు వస్తున్నాయి. నా ఒక్కోరచనకు ఆరు నించీ ఏడుగురు పల్లిషర్లు వున్నారు. నేను కోరికే మరింత మంది వస్తారు. బేర సారాల ప్రసక్తి లేదు. నేను ఇంత అని చెబుతాను, వాళ్ళిస్తారు” అన్నాడు.
1800 సంవత్సరం ఏప్రిల్ 2న వియన్నాలో బిధోవిన్ ఉపయోగం కోసమే అతని సంగీత ప్రదర్శన నిర్వహించారు. అక్కడ అతని రెండు కొత్త రచనలు ప్రదర్శింపబడ్డాయి. ఒకటి 58061 రెందోది అతని “515 9/00000౫.
వియన్నా అంతా అమితోత్సాహంగా ఆ మహా ప్రదర్శన కోసం వువ్విళ్ళూరింది. సంగీత చరిత్రలోనే ఆ ప్రదర్శన మరుపురానిదిగా సువర్జాక్షరాలతో లిఖించబడింది. ఆ సింఫనీ,
జర్
(ప్రీమియర్‌తో బిధోవిన్ సాటి లేని సింఫనిస్టుగా పేరుపొందాడు. అతని ప్రదర్శన సముద్ర గంభీరమంతటిది. ఆ సంగీతం ఆర్మెస్ట్రాకు వాదగలేనంత ఉన్నతమయింది ఆటంకాల్ని బద్దలు కొట్టేంత శక్తివంతమైంది.
విమర్శకులు అతని ప్రదర్శనని అర్ధం చేసుకోలేకపోయారు. జీటింగ్ “పత్రికకు చెందిన విమర్శకుడు వింద్' ఇన్'స్టుమెంట్ని విపరీతంగా వాడడం వల్ల ఆ సంగిత రచన మిలటరీబ్యాండ్ కోసం రాసినట్లుంది. కానీ ఆర్మెస్ట్రాని వుద్దేశించినట్లు లేదు” అని రాశాదు. లీష్టిగ్కు చెందిన ఒక విమర్శకుడు మరీ దారుణంగా, మొరటుగా విమర్శించాడు. “ముందుగా సిద్ధంచేసి పెట్టుకున్న బరితెగించిన తనంతో ఒక యువ సంగీతకారుడు చేసిన అయోమయం నిఠడిన చెవులు బద్దలు చేసే పేలుళ్ళు” అన్నాడు.
1801వ సంవత్సరం [ప్రారంభంలోనే బిధోవిన్ తనకు చెవుడు వస్తున్నట్లు గుర్తించాడు. ఎంతో కాలం తను సంగీతం వినలేనని, తను కాగితంపై చేసిన స్వర రచన వాద్యంపై ధ్వనిగా రూపొందడాన్ని తను వినలేదని తెలియడమన్నది సంగీతకారుడికి అశనిపాతం లాంటిది. అంతటి పరిస్థితి బాధాకరమైంది.
“ఇది విషాదకరమయిన విరమణ. ఇక్కడ నేనాక కాందిశీకుణ్సి.” తనని ఆక్రమించుకుంటున్న చెవిటితనం గురించి దయనీయంగా ఆ సున్నిత వ్యక్తి తనకు తాను ఓదార్పు చెప్పుకున్నాడు. బహిరంగంగా పియానో ప్రదర్శనలు మానుకున్నాడు. సమాజం నీంచీ ఒంటరిగా, ఏకాంతంగా వుండిపోయాడు. సన్నిహిత మిత్రుల్ని తప్ప ఎవర్నీ కలిసేవాడు కాడు.
చెవిటితనం అతనికి ఒక నిరాశని, విషాదాన్ని కలిగించింది. తన నిరాశని అతను అసాధరణంగా 1802లో '161॥06౧౩126(7652గ6౧౯ పేరు ఒక డాక్యుమెంట్‌ని రికార్డు చేశాడు.
“మ్రనుషులారా! ఎవరయితే నన్ను గురించి పగ, ద్వేషం నిండిన వాడని, మొండి వాడని, మానవ ద్వేషి అని అనుకుంటారో, అంటారో నేనట్లా ఎందుకుంటానో దాని వెనక్ర వున్న రహస్యం వాళ్ళకు తెలీదు. నాకునా తోటివాళ్ళతో, నాకు సంబంధించిన వాళ్ళతో ఎట్లాంటి ప్రేమానురాగాలూ లేవు, ఎట్లాంటి భావ వినిమయమూ లేదు, మనసిచ్చి పుచ్చుకోవదాలూ లేవు. ఆలోచనల్ని పంచుకోవడాలూ లేవు, తప్పని సరయిన అవసరముండే తప్ప నేను 'లోకం'లోకి రాను. అవును, నేను తప్పనిసరిగా కాందిశీకుడిగా, ప్రవాసిగా జీవించాలి. ఓ నివేకమా! నాకు కేవలం ఒక్కరోజు, ఒక్కటంటే ఒక్కరోజు సంపూర్ణమయిన ఆనందంతో గడిపే అవకాశమివ్వ. ఎప్పుడో ఎంతో కాలంగా ఆ ఆనందం నా హృదయ 16
ద్వారాల్ని తడుతోంది. ఎప్పుడు? ఎప్పుడు? స్వర్గంలోని సంతోషమా! ప్రకృతి ఆలయంలొ మనిషితోదుగా నేను మళ్ళీ ఆనందించనా? కాదు! లేదు! అది మరీ కష్టం, కఠినం”.
అట్లా తన ఆవేదనకి ఆయన అక్షర రూపమిచ్చాడు. చెవిటితనం ఆయన్లో ఒక ఉద్రేకాన్ని ఆవేశాన్ని అపూర్వ చైతన్యాన్ని తెచ్చి మవాను రాగంతోసంగీత స్వరాల్ని రూపొందించేలా చేసింది. సమాజానికి దూరంగా చైతన్యంతో సాహచర్యం చేస్తూ జీవించాడు. సంగీత స్వరాల్ని వినలేని అశక్తతలో తన అంతరాత్మ నించీ అతను ఉద్వేగభరితమయిన, సముద్ర గంభీరమయిన స్పరాల్ని విన్నాడు. క్రమక్రమంగా సాటిలేని స్వరాల్ని కల్పించాడు. సంగీత ప్రపంచంలో ఈనాటికీ అవి “మాస్టర్ పీసొలు. '|/816451810, *౧౧౭౩510౧౭12, 1000 190 50[౧412' లు పియానోకు వుద్దేశించినవి. 50162 5౧౧౧౦౧౫ 176426! 500412 లు వయోలిన్, పియానోల్ని వుద్దేశించినవి.
అతని మరణానంతరం అతను భద్రపరచిన ఒక డాక్యుమెంట్ దొరికింది. అది ఎంతో అద్భుతమైంది. అది “అనురాగ దేవతను” వుద్దేశించిన వుత్తరం. బిథోవిన్ తరచుగా తన “ప్రేమ వ్యవవోరాలి వట్ల “ప్రేమలో పదేవాడు. సాధారణంగా సౌందర్య రాశులైన, యవన్వనవతులయిన, ఉన్నత కుటుంబాలకు చెందిన యువతుల పట్ల 1పేమిలో పడేవాడు. సాధారణంగా వాళ్ళందరూ అతనికి “అందని వాళ్ళే! వాళ్ళు ఎవరెవరో తరువాతి రోజుల్లో గుర్తించారు. వాళ్ళలో ఒకరు 'గులియెటాలు గుస్తియార్టి. ఆమెకు తన ' [400% 10౧.50౧264' ను అంకితమిచ్చాడు. యింకొక స్రీ అతని 00651౧. థెరెసీవాన్ బ్రన్స్విక్. ఆమె అతని గ?౧౬510౧౭(2 సొనటాకు (ప్రేరణ. మూడో వ్యక్తి పదిహేనేళ్ళ థెరెసీ మల్ఫట్టి. నాలుగో యువతి కవయిత్రి బెట్టినా బ్రైెంటానో. ఆమె గొధే స్నేహితురాలు. వీళ్ళు బిధోవిన్ “అమర స్రీలు, అనురాగమూర్తులు! ఈ వుత్తరం ఎప్పుడు రాశాడో ఏ సంవత్సరమో, ఏ తేదీనో తెలియలేదు, అది రహస్యంగానే మిగిలిపోయింది. ఈ వుత్తరం ఒక స్ట్రీని వుద్దేశించి కాక స్రీజాతినే వుద్దేశించి వుంది! లేదా అతని వూహల్ని కదిలించిన స్త్రీని వుద్దేశించి కూడా కావచ్చు! అతని స్వప్న సుందరికావచ్చు! అతని గాఢమయిన భావోద్వేగంలో, నిరాశలో రాసుకున్న అతని వుత్తరాలు అట్లాంటివి కొన్ని దొరికాయి.
“కన్నీళ్ళలో నీ కోసం విషాదంగా ఎదురు చూస్తున్నా నా జీవితమా! నువ్వు నాకు సమస్తమూ నువ్వే! వీడ్కోలు! నన్ను (ప్రేమించు. నిరంతరం (ప్రేమించు, నీకు విశ్వాసంగా మెలిగే ఈ హృదయాన్ని ఈ ్రేమికుడి మనసు పట్ల చులకన దృష్టి వద్దు. ఎప్పటికీ నీ వాణ్ణి, ఎప్పటికీ నాదానివి. మనం ఒకరికొకం....
ఆ వుత్తరాలు ఇట్లా సాగాయి.
శై/
చెవిటి తనం ఎక్కువయ్యే కొద్దీ అతన్లో అసహనం, చిరాకు, కోపం, తీవ్రంగా స్పందించే గుణం ఎక్కువయ్యాయి. బిథోవిన్ స్నేహితుడు ఫెర్డినాండ్ రీస్ ఒక సంఘటనని రికార్డు చేశాడు. ఒక వోటల్లో మధ్యాహ్న భోజనం ఆర్డర్ చేసి మిత్రుబ్దిరూ కూచున్నారు. వాళ్ళు ఆర్జరిచ్చింది కాక పొరపాటున వెయిటర్ మాంసం పులుసు తీసుకొచ్చాడు. అది చూస్తూనే బిధోవిన్ ఆగ్రహంతో ఆ మాంసం పులుసును వెయిటర్‌పై పోశేశాడు! అట్లాంటి చిరాకు వల్ల, విసుగు వల్ల ఎందరో సన్నిహితమిథత్రుల్ని బిథోవిన్ కోల్పోయాడు. రాను రానూ ఎట్లాంటి ప్రశ్నలూ వెయ్యని, అతని చర్యల్ని విశ్వాసంగా భరించే వ్యక్తులే అతనికి అవసరమయ్యారు. ఓ సందర్భంలో బిథోవిన్ రాజకుమారుడయిన లాబ్కో విట్ట్తో “నా పట్ల విశ్వాస పాత్రంగా మెలగని మనుషుల్లో నేను కలిసి మెలిసి వుండలేను” అన్నాడు. బిథోవిన్ అట్లాంటి మనుషుల్ని కనిపెట్టాడు. వాళ్ళు అతన్ని వదిలిపెట్టకుండా వున్నారు. అతన్ని భరించారు. అతనికి కష్టమొచ్చినప్పుడల్లా వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చి అతన్ని ఆదుకునేవాళ్ళు. నిస్వార్ధ స్నేహభావంతో అతనికి ఓదార్పునిచ్చేవాళ్ళు. వాళ్ళలో ఒకడు ఆర్చ్ ద్యూక్ రుడాల్స్. అతను బిథోవిన్ 'ప్రజాస్వామ్య' భావాల్ని కూడా భరించేవాడు. వాళ్ళందరూ బిథోవిన్ని ప్రేమించారు. నిస్సహాయుడయిన పసివాదడిలా అతన్ని మమకారంతో ఆదరించారు. అతని పట్ల ఉదారంగా ప్రవర్తించారు. 1809లో వాళ్ళందరూ కలిసి అతనికి తగినంతగా ఆదాయం వచ్చేలా సాంవత్సరిక జీవన భృతిని సమకూర్చారు.
మానవ సమాజం నించీ మరింత మరింతగా వుపసంవారించుకునే కొద్దీ బిథోవిన్ స్వర రచనలో, (ప్రకృతిలో ఓదార్పుని, ప్రశాంతతని పొందాడు. సంగీతంపై తీవ్రంగా (శ్రమించాడు. రాగాలు రాస్తూ, రచనలు చేస్తూ వాటిని సవరిస్తూ, తిరిగిరాస్తూ గడిపేవాడు. ఎప్పుడూ వాటిని మళ్ళీ మళ్ళీ తిరిగిరాస్తూ సవరిస్తూనే గడిపాడు. అతని లక్ష్యాలు వున్నతోన్నతమయినవి. పర్వత సదృశ్యమయినవి. ఇతరులెవరూ అందుకోలేనివి. అతని గొప్పతనం అతనికి తెలుసు.
- నా శక్తి సామరాల్ని అంచనా వెయ్యడానికి నేను యింకెవరికో ఎందుకు భయపడాలి?” అని ఓ సందర్భంలో గర్వంగా ఎదురు ప్రశ్న వేశాడు. గ|గ౧ 5/%0౧౦గ౧/ క006గ0 వంటి సంగీత రచనల్లో సంగీత ప్రపంచంలో తనొక కొత్త దిగంత రేఖల్ని ఆవిష్కరించానని గుర్తించాడు. నెపోలియన్ యుద్ధాల అనంతరం రాచరికానికి సంబంధించిన గౌరవ మర్యాదలు, బెన్నత్యం, యధాస్థితికి తేవడానికి వియన్నాలో చక్రవర్తి ప్రయత్నించాడు. అప్పుడు బిథోవిన్ వాటన్నిటికి కేంద్రమయ్యాడు. అభినందనలు అందుకున్నాడు. గౌరవాఖిమానాలు పొందాడు. ఉన్నత వర్గాలవారు ఒకరి తరువాత ఒకరుగా వచ్చి అతన్ని అనందపరిచేవాళ్ళు.
18
1812లో బిథోవిన్ ప్రతిభ ఐదేళ్ళ ప్రశాంథంగా, నిర్మలంగా వికసించింది. ఆకాలంలో అతను అతికొద్దిగా సంగీత రచన చేశాడు. 1818లో ఆ ప్రతిభాశాలి "120౧౭౧ గ2/16/ సొనటా మొదలు పెట్టి తన ఉద్విగ్న చైతన్యంతో జ్వలించాడు. అతని జీవితంలో చివరి సృజనాత్మక అంకం ఆరంభమైంది. ఒక కోణం నించీ ఈ దశ అతని అత్యున్నత ఆవిష్కారాల దశ. అతని సంగీతంలో ఆధ్యాత్మిక కాంతి పుంజాల కదలిక కనిపించే దశ.-[/1౧) 5/౧౫- వ౧0౧౫, 4153534 5016211015 వంటి రచనల కాలం.
ఈ మధ్యలో బిధోవిన్ పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. తన మేనల్లుడి సంరక్షక బాధ్యతకు సంబంధించి కోర్టు కెక్కాడు.. అతని మేనల్లుడి పేరు కార్ల్. మొత్తానికి బిథోవిన్ 1820లో ఆ కేసు నెగ్గాడు. కానీ ఆ ప్రయత్నమంతా నిష్టలమైంది.-కారణం అతని మేనల్లుడు సోమరిపోతు, తిరుగుబోతు. లెక్కలేనన్ని అప్పులు చేసి బిథోవిన్పై భారం వేశాడు. కార్ల్ ఓ సారి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు. చివరికి కార్ల్ ఆర్మీలో వుద్యోగంలో చేరడంతో బిథోవిన్ వూపిరి పీల్చుకున్నాడు.
1824వ సంవత్సరం మే నెల ?వ తేదీన బిథోవిన్ చివరిసారిగా బహిరంగ సంగిత 'ప్రదర్శనయిచ్చాడు. అదీ వియన్నాలోనే జరిగింది. తన [11౧4 5/గ౧౧౦౧౪ ప్రీమియర్ ప్రదర్శన అది. అతను పూర్తిగా చెవిటి వాడయినా తనే ఆ ప్రదర్శన ఆ సాంతం నిర్వహిస్తానన్నాడు. శోతలందరూ మహోత్సాహంగా ప్రదర్శనను చూశారు. ఆ ప్రదర్శన మరీ సమర్ధవంతంగా నిర్వహించకపోయినా శ్రోతలు ఆనందించారు.
బిథోవిన్ స్నేహితుడు, జీవిత చిత్రకారుడు (రచయిత) సిండ్లర్ “అట్లాంటి సంగీతం నా జీవితంలో వినలేదు... అభినందనల పరంపర కొనసాగింది. మళ్ళీ మళ్ళీ తిరిగి వాయించమని జనం డిమాండ్ చేశారు” అని రాశారు.
అ సింఫనీ చివరి దశకు చేరే సరికి ఎందరో జలజలా కన్నీళ్ళు కార్చారు. సింఫనీ ముగిసింది. ఐనా ఏమీ వినపడని బిథోవిన్ అఖినందల ఆటంకం ముండు తన ప్రదర్శన కొనసాగించాడు. పర్యవేక్షకుడయిన కరోలిన్ ఉంగర్ స్టేజిపైకి వెళ్ళి గౌరవనీయంగా, వినయంగా ఆ మవాకళాకారుణ్ణి సముద్రతరంగాల్లో -లేచి పడుతున్న (ప్రేక్షకుల వైపు మళ్ళించాడు. ఆ దృశ్యాన్ని వర్జిస్తూ జార్జిగ్రోవ్, అన్న అతను 'బిథోవిన్ ఒక్కసారిగా ఉద్వేగంగా వున్న జనాన్ని చూశాడు. తన విశ్వాసాన్ని అందరిపై ప్రసరించాడు. ఎగిసిపడుతున్న శబ్ద సందోహం అతనికి వినపడదు. దృశ్యమొక్కటే అతనికి కనిపిస్తోంది. కానీ అందరిపై అతని ఆత్మనించీ సాగిన విద్యుత్తరంగం తాకింది. సింఫనీ ఒక అగ్ని పర్వతం బద్దలయినట్లు జనాల్ని ఆక్రమించింది. అభినందనలు అంతులేని తరంగాల్లా కొనసాగాయి. ఆ దృశ్యానికి అంతం లేదనిపించింది” అని రాశాడు.
2£9
1826లో తన తమ్ముణ్ణి చూడ్డానికి వెళ్ళినప్పుడు బిథోవిన్కు జలుబు చేసింది. అది కాస్తా న్యుమోనియంగా మారింది. జాండీస్ వచ్చింది. ఒంట్లో నీరెక్కింది. చివరి దశకు చేరుకున్నాడని తెలియగానే యూరప్ ఖండం అంతటి నించీ బహుమతులు ప్రవాహంగా వచ్చి పడ్డాయి. అతనికి సంపూర్ణ రచనల ఎడిషన్ బహుమతిగా ఐదువందల డాలర్లు, ఒక కేసు వైన్ వచ్చాయి. బలహీన పడ్డాడు. కానీ అన్నీ తెలుస్తూనే వున్నాయి. చివరికి 1827 మార్చి 28న తన విల్లు సిద్ధం చేశాడు. రెండ్రోజుల తరువాత స్పృహ కోల్పోయి మార్చి 26న కన్నుమూశాడు. వియన్నా నగరం విషాదంలో మునిగిపోయింది. జనంతో అతను నివసించే ప్రాంతం నిందిపోయింది. వియన్నా నగరంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆ రోజు జనం తమ పనులన్నీ మానుకున్నారు. మార్చి 29న అతని శవపేటిక వెంట వేలాది మంది జనం స్మశానానికి తరలి వెళ్ళారు. అతని అంతిమయాత్రలో షూబర్ట్ కూడా వున్నాడు. అతని అంతిమయాత్ర చూసి అందరూ కన్నీళ్ళు పెట్టారు. ఒక్కోయుగం దాని అవసరాన్ని బట్టి (ప్రతిభకు జన్మనిస్తుందంటారు. ఆ విషయం బిథోవిన్కు సంబంధించినంత వరకు యధార్థం. గతంతో సంబంధం తెంచుకుని ఒక నవ్యతకు, స్వతంత్ర స్వరానికి జీవం పోసినవాడు బిథోవిన్. (ఫ్రెంచి విప్లవ కెరటాలు యూరోస్ ఖందమంతా వ్యాపించి రాచరికాల పునాదుల్ని కదలించిన కాలమది. స్వేచ్భా స్వాతంత్ర్య పవనాలు రూసో, వోల్టేర్ రచనల ద్వారా వ్యాపించిన యుగమది. సాంప్రదాయిక సంగీతానికి బిథోవిన్ చరమగీతం పలికాడు. కాల్బనిక స్వేచ్భా తరంగాల్ని తన సంగీతంలో పలికించాడు. ప్రజాస్వామ్యభావాల్ని, విప్లవాన్ని తన సంగీతంలో పలికించాడు. మానవులంతా సమానమని మనసారా నమ్మాడు. మానవజాతి బాధల్లో మమైకం చెందాడు. 'నేనూ రాజునే!, అన్నది అతని ఆత్మ విశ్వాసం. ఒక రోజు బిథోవిన్, జర్మన్ మహాకవి గొథే యిద్దరూ కలిసి వియన్నాలో ఒక్ష వీధిలో మాట్లాడుకుంటూ వెళుతున్నారు. వెళుతూ వుంటే ఎదురుగా ఆఫ్టియారాజి తన పరివారంతో ఎదురు రావడం జరిగింది. గొథే తలవంచి రాణి పరివారం వెళ్ళడానికి పక్కకు జరిగాడు. గొథే పక్కకు జరుగుతూవుంటే బిథోవిన్ “ఆగు. నువ్వు ఎక్కుడున్నావో అక్కడే ఆగు. వాళ్ళు మనకు దారి యివ్వాలి. మనం వాళ్ళ కివ్వడమేమిటి?” అన్నాడు. 20
అల్సన్ బెర్ల్ బీ|020౧ 56/0 0-2-1885 -- 24-12-1935
తన కాలం కన్నా ముందున్న సంగీతకారుడు తప్పనిసరిగా నష్టపోతాడు. కష్టాల పాలవుతాడు. అతనికి అతిమెల్లగా గుర్తింపు వస్తుంది. అల్బన్ బెర్గ్ అలా నష్టపోయాడు కష్టాలు పడ్డాడు. అతని జీవితమంతా, మరణ పర్యంతం అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. తీవ్రంగా విమర్శించారు. సంగీత ప్రపంచం అతన్ని పరిహసించింది.
ఐనా అలన్ బెర్గ్‌కు అతన్ని గురించి అతని కెప్పుడూ సందేహం లేదు. అతని సంగీత సృష్టికి సంబంధించి సందేహం లేదు. చివరికి తప్పని సరిగా సంగీత ప్రియులు తన సంగీతాన్ని అంగీకరిస్తారన్న విషయానికి సంబంధించి అతనికి బలమైన విశ్వాసం!
ఇప్పుడు ఎందరో అతని సంగీతాన్ని ప్రాణప్రదంగా (ప్రేమిస్తారు. అతని సంగీతమంటే నచ్చనివాళ్ళు కూడా ఆధునిక సంగీత పరిణామంలో అతని సంగీతం తప్పని సరి స్థానం కలిగి వుందన్న విషయాన్ని నిర్వంద్వంగా అంగీకరిస్తారు. ఇరవయ్యో శతాబ్దంలో అతని సంగీతానికున్న స్థానం ఎవరూ విస్మరించలేనిది.
అబ్బన్ బెర్గ్ ఒక మధ్య తరగతి వ్యాపారస్థుని కొడుకు. అతను చదువుకునే రోజుల్లో అతనికి యిష్టమయినవి పుస్తకాలు. జర్మన్ క్లాసిక్స్, కాల్చనిక సాహిత్యం, ఇబ్సిన్ నాటకాలు ఆస్కార్ వైల్డ్ కవిత్వం, వచన రచనలు అతని ఇష్టాలు. బాల్యం దాటిన తరువాతే అతనికి సంగీతం పట్ల అభిమానం ఏర్పడింది. చాలా కాలం సంగీతానికి సంబంధించి ఎట్లాంటి శిక్షణను అతను పొందలేదు. అతని పదిహేనో ఏట కూడా అతను సంగీతానికి సంబంధించి స్వరకల్పన చెయ్యడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.
పద్దెనిమిదో ఏట అతని ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టింది. దాంతో అతనికి నరాల జబ్బు సంక్రమించింది. ఎన్నో సార్లు తీవ్ర అనారోగ్యానికి లోనయ్యేవాడు. యివన్నీ దాదాపు అతని జీవితాంతం వెన్నాదాయి.
అల్బన్ బెర్గ్ తన పందొమ్మిదో ఏట ఆర్నాల్డ్ షోయెన్ బెర్గ్‌ను కలిశాడు. ఆర్నాల్డ్ సంగీత ప్రపంచాన్ని అల్బన్కు పరిచయం చేశాడు.
ఇరవయ్యో ఏట అల్బన్ గవర్నమెంటు వుద్యోగంలో చేరాడు. తన తీరుబడి సమయాన్నంతా గాఢంగా సంగీత అధ్యయనానికే కేటాయించాడు. సంగీతాన్ని వినడం, సైద్ధాంతిక సాంకేతిక రచనలు చెయ్యడం, స్వరకల్పనలో ప్రయోగాలు చెయ్యడంతో గడిపాడు.
22
అన్నిటి కన్నా' అతనికి వుత్తేజాన్నిచ్చినవి అర్నాల్డ్తో జరిపిన సంభాషణలే; చర్చలే. తన సంగీత సంబంధమయిన ఆలోచనల్ని, సిద్ధాంతాల్ని అతను అల్బన్తో చర్చించేవాడు. అల్బన్ బెర్గ్ తన వుద్యోగాన్ని వదులుకుని సంగీతానికే తన సమయమంతా వినియోగించే ముందు ఆర్నాల్డ్ దగ్గర ప్రాథమిక మయిన సంగీత విషయాల్ని అభ్యసించాడు. సంగీత రహస్యాల్ని తెలుసుకున్నాడు. అల్బన్కు వున్న ఏకైక గురువు ఆర్నాల్డ్ ఒక్కడే. అల్బన్ తన సంగీత రచన ప్రారంభించినపుడు తన గురువు ఆర్నాల్డ్ లాగే వాన్నర్ను అనుకరిస్తూ సాగించాడు. అతను పియానోపై వాయించడానికి వుద్దేశించిన సొనటా, వాగ్నర్ వర్ణ సమ్మేళనంతో, ఉత్తేజజరమయిన మాధుర్యంతో మిళితమై వుంది. అట్లా కొనసాగి అల్బన్ క్రమంగా తన గురువు ఆర్నాల్డ్ లాగే వాగ్నర్ శైలికి, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తయారైయాడు. అతని సంగీతంలో క్రమంగా సంక్షిప్త ధోరణి, గమన గతిలో క్రమాభివృద్ధి, స్వరకల్పనలో స్వేచ్చ యివన్నీ వాగ్నర్ సంగీత మార్గానికి విభిన్న రీతిని ప్రదర్శించాయి. మొదటిగా వచ్చిన అతని రెచ్చగొట్టే “సంగీత రచనలు ౧1/8 ౦0గ0౧౭౩1/2 ౩90౧05 వీటిలో రెండు 31 మార్చి 1918న వియన్నాలో ప్రదర్శింపబడ్డాయి. ఆ సంగీత ప్రదర్శన ఆర్నాల్డ్ సోహెన్ బెర్గ్ అతని శిష్యులకు సంబంధించింది. ఈ పాటలు ఆర్నాల్డ్ సంగీత ధోరణిని అనుసరించి రాయబడ్డాయి. ఈ ప్రదర్శన వియన్నాలో “చరిత్ర సృష్టించింది. ఏ ('ప్రదర్శనలోనూ శ్రోతలు అంత హంగామా సృష్టించలేదు. చెప్పలేనంత అల్లరి, అల్లకల్లోలం. వియన్నాలో సంగీత ప్రదర్శన ఇచ్చే హాలులో అది మరపురాని అనుభవంగా మిగిలిపోయింది. మొదట జనం నవ్వడం మొదలపెట్టారు. తరువాత పిల్లి కూతలు మొదలయ్యాయి. ఆ తరువాత అరుపుల్తు, పెడబొబ్బలు మొదలయ్యాయి. గొడవ ఎంతగా జరిగిందంటే పోలీసులు రంగ ప్రవేశం చెయ్యల్సి వచ్చింది! సంగీత విమర్శకులు "శ్రోతల్ని మించిపోయాడు. ఒక విమర్శకుడు “మానవ మేధస్సు కల్పించగలిగిన అపశ్చతులు, వాటి పర్యవసానాలు మాకు తెలుసుననుకున్నాం. కానీ యిక్కడ మేధావుల్ని మించిన మేధావులు కూడా తెలుసుకోదగిన విషయాలున్నాయి. ఇక్కడి విపరీతమయిన పిల్లికూతలు, నిట్టూర్పులు... వీటి ద్వారా వాళ్ళ కొత్త 'కళకి, తలనొప్పి తెచ్చే కొత్త కళకి జన్మనిచ్చారని తెలుస్తుంది. ఈ జంతు సంబంధమయిన అభివ్యక్తులు చూస్తే వేలాడే చెవులు, బలహీనంగా కదిలే తోకలు వున్న జంతువులు ప్రకృతి తమకు సరైన “స్వరం ఇవ్వలేదని నిరసనలు తెలిపే జంతు ప్రదర్శన శాలలా వుందిది. సంగీత కారుల్నించీ వీళ్ళను వేరు చేసి కొత్త కేటగిరిలో వీళ్ళను మొదట చేర్చాలి. లేకుంటే వీళ్ళకు “విలువ వుండదు.” అని రాశాడు. 22
ఈ పాశవికమయిన ప్రతిస్పందన, తన తొలిసంగీత ప్రదర్శనకు దక్కిన 'ప్రతిఫలం' చూసి అల్బన్ బెర్డ్ వెనక్కి తగ్గలేదు. మరిన్ని సంప్రదాయేతర, ఆదర్శ విఘాత సంగీత రచనలు చెయ్యడానికి కృతనిశ్చయుడయ్యూడు.
పూర్తి సంప్రదాయ వ్యతిరేకమయిన 'ఒపేరా” నిర్మాణంలో మునిగాడు; “భయంకలిగించే' అభివ్యక్తి వున్న జార్జి బుచ్నర్ రచన "022608 ని ఎంపిక' చేశాడు కూడా. దాన్ని తనకు అనుగుణంగా స్వరీకరించే పనిలో మునిగాడు. యింతలో మొదటి (ప్రపంచ యుద్ధం మొదలు కావడంతో అతని పనులకు అంతరాయం కలిగింది. అతను అనారోగ్యంగా వున్నా బలహీనమయిన వాడయినా అక్కడి చట్టాల్ని బట్టి సైన్యంలో చేరాల్సి వచ్చింది. యుద్ధం జరిగినన్ని నాళ్ళూ అతను చేసిందేమీ లేదు గానీ యూనిఫాం వేసుకుని వుండాల్సి వచ్చింది. యుద్ధం ముగిశాకా మధ్యలో ఆగిపోయిన తన పనిలో మునిగాడు. 1920 నాటికి తన ఒపేరా సిద్ధం చేశాడు.
",౧/022601 ఒపేరాలో కొన్ని భాగాలు ప్రాంక్ ఫర్ట్ మ్యూజిక్ ఫెస్టివల్లో “విన్నారు” చాలా వాదోపవాదాలు, చర్చల అనంతరం 'ఇెర్లిన్ స్టేట్ ఒపేరా దాని ప్రదర్శనకు అనుగుణంగా ఎన్నో మార్పులు చేర్పులు చేర్చి 187 సార్లు రీహార్సల్స్ చేశారు. చివరికి 14వ తేదీ డిసెంబర్ 1925న ్రదర్శింపబడింది. ఆ (ప్రదర్శన అనూవ్యారీతిలో విజయ వంతమైంది. గొప్ప సంచలనం కలిగించింది. ప్రేక్షకులు రెచ్చిపోయి ద్వేషంతో అరస్తూ “ప్రదర్శన లిచ్చారు. విమర్శకుల సంగతి చెప్పాల్సిన పన్లేదు. పాల్ జోరిచ్ అన్న విమర్శకుడు “ఇక్కడ యింత మంది జన సందోహం మధ్య గొప్ప సంచలనం కేకెత్తిందని నేను భావించడం లేదు. పిచ్చాసుషత్రిలో సంచలనం కలిగిందనుకుంటున్నాను"* అని రాశాడు. అక్కడ వున్న ప్రేక్షకుల్లో మెజారిటీ అభిప్రాయాలకు అతను ప్రతినిధి. అది మొదలు సంవత్సరం పాటు "4/022601 ఒపేరా ఎక్కడ ప్రదర్శింపబడినా జనాలు వ్యతిరేకిస్తూ వచ్చారు. తరచుగా అల్లర్లు జరిగేవి. అది ఎక్కడిదాకా వెళ్ళిందంటే 1926 నవంబరు 29వ తేదీన ప్రాగ్‌లోని నేషనల్ ధియేటర్లో ఆ ఒపేరా ప్రదర్శింపబడినపుడు జనాల వ్యతిరేకత అదుపు తప్పడంతో మునిసిపల్ అధికారులు రంగంలోకి దిగి 'సామాజిక ప్రశాంతి కోసం ఆ ఒపేరా ప్రదర్శనని నిషేధించారు. జనాల్ని రె చ్చగొట్టడంలో జనాలకు షాక్ ఇవ్వడంలో తన సంక్షిషుయిన సంగీత సమ్మేళనం వల్ల ఆ ఒపేరా ఆ విధంగా బాక్సాఫీస్‌ను బద్దలు చేసింది. క్రమంగా యూరోపు అంతా ప్రదర్శనలు జరిగాయి. ఇరవై ఎనిమిది యూరోపు నగరాల్లో 150 ప్రదర్శనలు జరిగాయి.
ఆల్బన్ బెర్జ్ నిరంతరం 'స్పరకల్చని చేసేవాడు కాడు. "//02266%6 తరువాత కేవలం ఒకే ఒక ఒపేరా రాశాడు. అదయినా అసంపూర్తిగా వదిలేశాడు. దానిపేరు ".౮౬౮' ఫ్రాంక్ వెడ్ క్రెంట్ రాసిన రెండు విషాదాం తాల ఆధారంగా చేసుకున్న రచన అది. ఆ
23
ఒపేరా మినహాయిస్తే కొన్ని పాటల్ని స్వరపరిచాడు. వయోలిన్పైన వాయించడానికి వుద్దేశించి కొన్ని ఆర్మెన్తా కోసం కొన్ని రాశాడు. మొదటిసారిగా అతని "౬౮౬౮' ఒపేరా వయోలిన్, ఆర్మెస్ట్రాల్ని దృష్టిలో పెట్టుకుని చేసిన సంగీత రచనలు ప్రదర్శింపబడినప్పుడు అవి జనామోదం పొందాయి. విమర్శకుల అభినందనలు అందుకున్నాయి. ఆ (స్రదర్శనలు గొవ్ప విజయవంతమయ్యాయి. '౬01౮ ఒపేరా ప్రదర్శనలో కొత్త స్వర కల్పనలో ఉత్తేజితులై జనం కేరింతలు కొట్టారు.
అతని సంగీత విజయాన్ని సమ(గ్రంగా చూసి ఆనందించడానికి అల్బన్ ఎంతో కాలం జీవించిలేదు. అల్బన్ విపరీతమయిన పంటి నొప్పితో బాధపడేవాడు. పంటి డాక్టర్ని కలవడానికి అవసరమయిన డబ్బు అతని దగ్గర వుండేది కాదు. వియన్నా హాస్పిటల్లో చనిపోయాడు. అతన్ని పరీక్షించిన దాక్టర్లు రక్తం విషపూరితం కావడం వల్ల మరణించాడని అన్నారు. యింకొందరు వైద్యులు నోటి పుండు ఏదో పురుగు కరవడం వల్ల వచ్చిందని ఆ విధంగా రక్తం విషపూరితమై చనిపోయాడని అన్నారు. ఏమైతే ఏం! అతని నిరంతర శ్రమ, సున్నితమయిన అతని శరీరత్వం వల్ల అతను శారీరక రుగ్నతల్ని ఎంతో కాలం భరించలేకపోయాడు. చనిపోయే ముందు కూడా "౬౮౬౮ రివిల్స్ల్కు వాజరయ్యాదు. ఆరెస్ట్రా కోసం సిద్ధం చేసిన సంగీత రచనల రిహార్సల్స్ విన్నాడు. 1935 క్రిస్టమస్ సాయంత్రం కన్నుమూశాడు. అతని శిష్యుల్లో ఒకడయిన లియోనార్డ్ మార్కర్ “అది విపరీత మయిన చలికి వణికింపజేసే డిసెంబర్ నెలలో క్రైస్టమస్ రోజు వర్షం పడుతోంది. అతని మిత్ర బృంధం, అభిమానులు తేలికగా వున్న అతని శవపేటిక మొసుకుంటూ బయద్దేరారు. అతని వెచ్చని స్వరం మళ్ళీ వినలేమని ఎవరూ కలలో కూడా అనుకోలేదు” అని రాశాడు.
అల్బన్ తన వెంట్రుకను రెండుగా చీలుస్తున్నా ఆస్కార్ వైల్డ్‌గా ఆశ్చర్యంగానే చూసేవాడు. తరచుగా అతను అనారోగ్యం పాలవుతున్నా బాధల్లో మునిగి తేలుతున్నా అతన్లో ఆకర్షణ తళతళ లాడుతూ వుండేది. చమత్మారాలు విసిరేవాడు. నవ్వించేవాడు. సున్నితంగా స్పందించేవాడు. నగర జీవితం పట్ల నిర్లక్ష్యంగా వుండేవాడు. తన పాత కారును (డైవ్ చేసుకుంటూ వెసులు బాటు కోసం గ్రామసీమల్లో తిరిగేవాడు. సంగీతాన్ని మినహాయిస్తే అతనికి సంతోషాన్ని కలిగించే విషయం ఒకటుంది. కొరింధియం జిల్లాలోని ఆస్ట్రియన్ సరోవరాన్ని సందర్శించడం. (ప్రతి సంవత్సరం కొన్ని నెలలపాటు అక్కడ గడిపేవాడు. సాకర్ గేమ్స్‌కు వెళ్ళడం, సినిమాలు చూడ్డం అతని హాబీలు. ఒక మతాన్నియింకోమతంతో పోల్చి చూడ్డం అతనికి ఇష్టం. అంకెల సాంకేతికతని అతను విశ్వసించేవాడు.
అల్బన్ను గురించి చెబుతూ లియోనార్డ్ మార్మర్ “అతను పని చేసేటప్పుడు అతని పరిసరాలు సహజంగా, స్వాభావికంగా వుండేవి. ఆటంకాల్ని అతను భరించలేకపోయేవాడు. డై
తనని తను చీకటి గదిలో బంధించుకుని, కిటికీలు కూడా మూసేసి అదీ వేడి వేసవికాలంలో (వ్రవంచంలోని (వతి ఆటంకానికీ ఆమడ దూరంలో వుండేవాడు. ఏదీ అతన్ని కదలించలేకపోయేది... మరీ అతని చివరి రోజుల్లో అతను పని చేసుకునే గది ప్రతి మూలా, ప్రతి కోణంలో అతని స్వర కల్పనలు గాల్లోకి లేచి వేలాడుతూ వుండేవి. అవసరం మేరకు వాటిలో ఎంపిక చేసేవాడు. పర్యవసానంగానే ౬0౬౮ ఒపేరా తయారైంది” అని రాశాడు. అల్బన్ బెర్గ్ సంగీత రీతి ఫోయెన్ బెర్గ్ పద్ధతికి చెందింది. అల్బన్ బెర్గ్ ముఖ్యమయిన సంగీత రచనలన్నీ సంప్రదాయానికి భిన్నమైనవి. అతని సంగీత విధానంలో మాధుర్యం, సమతౌల్యం అన్నవి స్వేచ్చని పునాదిగా కలిగినవి. ఎట్లాంటి నిబంధనలకూ వాదగకుందా, ఎట్లాంటి కేంద్ర బిందువూ లేకుండా యిష్టమొచ్చిన మార్గంలో సంచరించేవి. ఈ పద్ధతి వల్ల వైపరీత్యాలకు అవకాశముంటుంది. అరాచకానికీ వీలుంటుంది. 28
హెక్టర్ బెర్షియోజ్ 116010! 59211102 11-12-1803 -- 8-3-1869
ధియోపైల్ గాటియర్ దృష్టిలో రొమాంటిక్ వుద్యమమన్నది ముగ్గురు వ్యక్తుల మధ్య కేంద్రీకృతమైంది వాళ్ళలో ఒకరు కవి, రెండో వ్యక్తి చిత్రకారుడు, మూడోవ్యక్తి సంగీతకారుడు. వాళ్ళు విక్టర్ వ్యాగో, యూజిని డెలక్రాయిక్స్, హెక్టర్ బెర్లియోజ్.
బెర్లియోజ్ నిజమైన రొమాంటిస్టు. అతని సంగీతంలోనే కాదు, అతని జీవితంలో కూడా. అతను అతని మాటల్లోనే చెప్పాలంటే గాఢంగా, వ్యక్తి స్వాతంత్ర్యం నిలుపుకుని, గొడవలు పడుతూ, విచ్చలవిడిగా కర్చు పెడుతూ జీవించాడు అతని జీవిత కధను రాసిన ఒకతని ద్వారా బెర్లియోజ్ కాల్బనిక భావావేశానికి సంబంధించిన చిన్నితనంలోని ఒక సంఘటన తెలుస్తుంది పన్నెండేళ్ళ వయసులో తనకన్నా ఆరేళ్ళు పెద్దదైన అమ్మాయిని పేమించాడు. ఇరుగుపొరుగు జనాలు ముక్కు మీద వేలు వేసుకునేటట్లు ఆ అమ్మాయిని వేంటేసుకుని తిరిగాడు. త్వరలోనే ఆ ప్రేమ ముగిసింది తరువాత యాభై ఏళ్ళలో ఆమెను ఒక్కసారే చూశాడు అదీ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాకా, ఆ కలహాల కాపురాలతో జీవితం చివరిదశలో ఆమెని కలిశాడు చివరికి వెంట్రుకలు తెల్లబడిన అరవై ఐదేళ్ళవయసున్న, నలుగు పెద్దవాళ్ళయిన పిల్లలున్న ఆమెను కలిశాడు. అతని జీవితంలోని ఏకైక ప్రియురాలు అమే!
పందొమ్మిదో శతాబ్దంలోని కాల్చనిక లక్షణాలన్నీ బెల్లియోజ్లో మూర్తీభవించాయి భావావేశంతో విస్ఫోటనం చెందడం, పరవశం నించీ ఉన్మత్తదశదాకా సంచలనాలు, సెంటిమెంట్‌తో కదిలిపోవడం, దురదృష్టానికి వ్యతిరేకంగా ఘర్షించడం (ఎక్కువ భాగం వూవాతృకాలే) తన అహంలో దైవత్వాన్ని దర్శించడం, విపరీతమయిన దృక్సధాలుండడం, యీ లక్షణాలన్నీ బెర్లియోజ్లో వున్నాయి
బెర్లియోజ్ తండ్రి చిన్ని పట్టణంలో వైద్యుడు, కొడుకు సంగీతాభిరుచి పట్ల మరీ అంతగా సానుభూతిలేదు. నిర్ద్వంద్వంగా బెర్లియోజ్ సంగీత ప్రతిభను నిర్లక్ష్యంచేసి కొకును దాక్టర్ని చెయ్యాలనుకున్నాడు కొడుకు చదువుపట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని అతనికి బోధించాడు కానీ హెక్టర్ సహజంగా సంగీతం పట్ల మొగ్గ చూపేవాడు హెక్టర్ మొదటి సంగీత అనుభవం చర్చిలో దైవ ప్రార్ధనలు వినడం నించీ మొదలయింది (ప్రేమతో, అనురాగంతో నిండిన కొత్త ప్రపంచం తనకు తలుపు తెరచిందని చెప్పుకున్నాడు. ఇది జరిగిన కొన్నాళ్ళకు అతనికి 26
వాళ్ళయింట్లో ఒక పాత పిల్లంగోవి కనిపించింది. సంగీత స్వరాల్ని ఆవిష్కరించడానికి అది ఉపకరించింది. అతను గురువుల దగ్గర పియానో, గిటార్ వాద్యాలపై పారాలు నేర్చుకోవడానికి చాలా కాలం ముందు ఇది జరిగింది, వోర్మోనికి సంబంధించి పుస్తకాల ద్వారా తెలుసుకున్నాడు అర్ధరాత్రి దాకా ఆ పుస్తకాల్ని (శ్రద్ధగా చదివేవాడు. సంగీతాన్ని సృజించడానికి సంబంధించి అతనికి క్రమంగా విశ్వాసం ఏర్పడింది. 1819లో తను చేసిన కొన్ని సంగీత రచనల్ని ఒక పల్లిషర్కు అచ్చువేయమని ఇచ్చాడు. ఆ ప్రచురణ కర్త వాటిని అచ్చువెయ్యదానికి తిరస్కరిస్తే హెక్టర్ కోపంగా రాత'ప్రతిని చింపేశాడు హెక్టర్ బెర్లియోజ్ని డాక్టర్ చెయ్యాలన్న తండ్రి సంకల్పంలో అణువంత కూడా వెసులుబాటు రాలేదు 1821లో అతని తండ్రి హెక్టర్‌ని వైద్య విద్య అభ్యసించడానికి పారిస్ పంపాడు. మొదటిసారిగా ఒక జంతువుని “డిసెక్ట్ చెయ్యడం చూసిన హెక్టర్ భయపడి క్లాసు నుండి పారిపోయి తన గదికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. ఈ అనుభవం మినహాయించి తక్కిందంతా సజావుగానే గడిచింది 'ధైర్యంగా' తండ్రి కోరికను తీర్చాడు 1824లో డిగ్రీ సంపాదించాడు.
కానీ సంగీతాన్ని ఎప్పుడూ అతను విస్మరించలేదు. పారిస్ ఒపేరా కేంద్రాన్ని క్రమం తప్పకుండా సందర్శిస్తూ అక్కడి సంగీత ప్రదర్శనలు చూసేవాడు. 'కంజర్వేటరీ లైబ్రరీకి వెళ్ళి సంగీత రచనల్ని గంటల కొద్దీ అధ్యయనం చేసేవాడు. గ్లూకొకు నంబంధించిన "11 196౧16 6౧ 116౧66 ఒపేరా చూసి కదిలిపోయాడు. మొదటి సారి బిధోవిన్ సింఫనీ విన్నాడు. దాంతో అతని మనః ప్రపంచం ముందు కొత్త లోకాలు ఆవిష్కార మయ్యాయి. తన అపురూప కళకి సంబంధించిన మర్ష్ని రహస్యాల్ని తెలుసుకోవాలన్న ఆతృత మొదలయింది అతను “అెస్మూయర్' అన్న సంగీతకారుడి దగ్గర చదువుకోడానికి చేరాడు ఆ గురువు శిక్షణలో హెక్టర్ '౬5166 61 [1200౧౧' అన్న ఒపేరా రచన చేశాడు అతని గురువు శిష్యుణ్జి అభినందిస్తూ. “నువ్వెప్పటికీ డాక్టర్వి, (ద్రగ్గిస్ట్వి కాలేవు. కానీ గొప్ప స్పరక్తవవుతావు సంగీతకారుడవుతావు నీలో ఆ (ప్రతిభ వుంది అన్నాడు
కానీ యితరుల నించీ అతనికి రావలసినంత ప్రోత్సాహం రాలేదు. 1828 డిసెంబర్ 28న వెంట్రాక్ చర్చిలో ఒక ప్రార్ధనా గీతాన్ని నిర్వహించాడు. ఆ ప్రదర్శన గొప్ప “వైఫల్యాన్ని! పొందింది సంగీత గ్రంధాలయంలో ఇచ్చిన అతని ప్రదర్శన కూడా విజయవంతం కాలేదు. వాటితో బెర్లియోజ్ నిరాశపడలేదు 1824లో అతను తన యింటికి వెళ్ళి తను శాశ్వతంగా వైద్యాన్ని వదిలేస్తున్నానని, కేవలం సంగీతం పైనే తన దృష్టినంతా కేంద్రీకరించాలనుకున్నానని తన నిర్ణయాన్ని తండ్రితో చెప్పాడు. తండ్రి ఆగ్రహించాడు. పెద్దగొడవ జరిగింది. బెర్లియోజ్ తన పట్టువదల్లేదు. చివరికి బెర్లియోజ్ పట్టుదలే నెగ్గింది నెలనెలా పంపే దబ్బులు యధావిధిగా
2/7
పంపడానికి తండ్రి అంగీకరించారు ఐతే నియమితకాలంలో బెర్లియోజ్ తన ప్రయోజకత్వాన్ని నిరూపించుకోవాలని తంద్రి షరతు పెట్టాడు. బెర్లియోజ్ తిరిగి పారిస్ చేరాడు. తరువాత రెండేళ్ళు లెస్యూయెర్, రీచాల దగ్గర శిష్యరికం చేశాడు తన సామర్దాన్ని నిరూపించుకోడానికి 1825 జూలై 10న తన రెండో ప్రదర్శన ఇచ్చాడు దానికి తగిన ఆర్ధిక వనరుల్ని స్నేహితులు సమకూర్చారు ఆ ప్రదర్శన సాధారణంగా విజయవంతమయింది ప్రత్యేకించి అతని స్నేహితుల అభినందనల్ని అందుకొంది కానీ 'తగినంత' అప్పుల్ని మిగిల్చింది వాటిని తీర్చాల్సిన బాధ్యత అతని తండ్రి పైన పడడంతో అతని కోపం కట్టలు తెంచుకుంది అతని కొడుకు సంగీత వ్యాసంగంపై తండ్రికి అసహనం ఎక్కువైంది. సంగీతకారుడిగా రోంలో రెండుసార్లు వుద్యోగం కోసం ప్రయత్నించి విఫలం చెందిన సంగతీ తండ్రికి తెలిసింది తన కొడుకు పనికి మాలినవాదని, తెలివితేటల్లేనివాడని, అసమర్భుడని నిర్ణయించుకుని నెలనెలా పంపుతున్న డబ్బుల్ని పంపడం మానేశాడు. బెర్లియోజ్ తన తిప్పలు తను పడడానికి తీర్మానించుకున్నాడు. ప్రవేటుగా సంగీత షారాలు చెబుతూ, చర్చిలో పాటలు పాడుతూ 'తిండీ బట్టలకు సరిపడా సంపాదించేవాదు. ఈ కాలంలోనే అతని జీవితంలోనే సాటిలేని ఉద్విగ్నమయిన, ఉప్పెనలాంటి ప్రేమ వ్యవహారం జరిగింది. 1827లో పారిస్‌లోని ఓడియన్ ధియేటర్లో నాటకాలు ప్రదర్శించడానికి ఒక ఇంగ్లీషు షేక్సియరియన్ కంపెనీ వచ్చింది. షేక్స్పియర్ నాటకం వామ్లెట్లో ఒఫీలియా' పాత్రని హెన్రియెట్టా స్మిత్సన్ అన్న నటి పోషించింది బెర్లియోజ్ ఆ నాటకం చూద్దానికి వచ్చాడు. స్టేజి మీద ఆ నటిని చూశాడు అంతే! ఆ ధియేటర్లో సీట్లో నించే గాఢంగా ఆమెను (ప్రేమించేశాడు. నాటకం పూర్తయ్యకా అనంత వేదనతో బయట పద్దాడు తన 'ప్రేమ ఫలిస్తే కానీ తనకు శాంతి లేదని నిర్ణయించుకున్నాడు. ఆమెను కలవదానికి తీవ్రమయిన ప్రయత్నాలు చేశాడు అతనికి యింగ్లీషు రాకపోయినా, ఆమెకు (ఫ్రెంచిరాక పోయినా (ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు ఆమెకు ప్రేమ లేఖలు రాశాడు వాటిని చూసి ఆమె మెదట వులిక్కిపడింది. తరువాత ఆందోళనకు గురైంది. ఆ వుత్తరాలకు ఆమె నుండీ ఎలాంటి బదులూ రాలేదు. ఎన్ష్నీ రకాలుగా ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేశాడు చివరికి సంగీతంలో తన ప్రావీణ్యం ద్వారా ఆమెను ఆకట్టుకోదానికి ప్రయత్నించాడు సంగీతశాలలో 1826 మార్చి 26న తన సంగీత ప్రదర్శన యిచ్చాడు ఆ సంగీత ప్రదర్శన జరిగినట్లు కూడా ఆమెక్సు తెల్రీద్రు, చివరికి ఆమె గది పక్కనే వున్న మరో గదిని అద్దెకు తీసుకున్నాడు. తెలిసిందేమిటంరే ఆమె పారిస్ వదిలి వెళుతున్నట్లు సమాచారం అందింది. అతని ప్రయత్నాలన్నీ బూడ్తిదల్రో ప్రోస్సిన పన్నీరయ్యాయి. అనంత విషాదానికి లోనయ్యాడు 28
జలజలా కన్నీరు కార్బాడు. ఆ దుఖం నించీ ఉపశమనం పొందడానికి పియానో వాద్యకారిణి కెమెల్లిమోక్'ను (ప్రేమించాడు. ఆమెతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కానీ అతనికి శాంతి దొరకలేదు, ఉపశమనం అందలేదు. బెర్రియోజ్ తన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి ముఖ్యమయిన తన మొదటి సంగీత రచనల్ని మొదలు పెట్టాడు. వాటిల్లో మొదటిది 0గ౧1' అన్న 02౧1412 అది సంగీత రూపకం, జర్మన్ మహాకవి గొధే ఫొస్టు నాటకంలోని ఎనిమిది రంగాల్ని ఆధారంగా చేసుకున్నది. తరువాతి కాలంలో 116 0౭౧1౧4110౧ 0 ౯4౮6" గా ఆ సంగీత రూపకం సుప్రసిద్ధమైంది. రెండోది 31466 ౧౭5510 అన్న రచన. 59౧౧|౧౦౧16 2౧25406416 గా ప్రసిద్ధం 1830 డిసెంబరు 5న పారిస్‌లో దాని “ప్రీమియర్' ప్రదర్శన ఏర్పాటు చేశాడు. తన ప్రియురాలు దృష్టికి రావడానికి, బహుశా ఆమె అభినందనలు పొందడానికి ఆ ప్రదర్శన ఏర్పాటు చేశాడు. “తన విజయ పరంపరల తుఫానులో మునిగిన, మత్తెక్కిన మిస్ స్మిక్సన్ ని నా సంగీత తరంగాలు, విజయాలు తాకుతాయా?” అని ప్రశ్నించాడు అతని సంగీత ప్రదర్శన గొప్ప విజయాన్ని పొందింది. ప్రశంసల జల్లు కురిపించింది ఫాంజ్ లిస్జ్జ్ (ప్రసిద్ధ సంగీతకారుడు) ప్రేక్షకుల్లో కూచున్నాడు. బెర్లియోజ్ ప్రదర్శనతో గాఢంగా ప్రభావితుడయ్యాడు. ఆనాటి నుంచీ బెర్లియోజ్కు అభిమానిగా, ఆత్మీయుడుగా మారాదు. కాని బెర్లియోజ్ వేదన వేరు “దేవుడా! ఆమె తన ప్రతిభావంతమయిన వృత్తిలో లీనమై ఎప్పుడూ నా 'పేరయినా వినలేదు, నా కష్టాలు, కన్నీళ్ళు, నా సంగీతం, నా విజయాలూ ఏవీ ఆమెకు తెలీవు అని అలమటించిపోయాడు అతని అవిశ్రాంత నేత్రాలు ఆడిటోరియంలో ప్రతి మూలా ఆమెకోసం వెతికాయి, అన్వేషించాయి. ఎక్కడా హెనియెట్టా స్మిక్సన్ కనిపించలేదు తన ప్రదర్శన ఘోరంగా విఫలమైందని వాపోయాడు. కారణం ఆమె వినలేదు కాబటి! చివరికి చాలా రోజుల తరువాత అతని ప్రయత్నం ఫలించి రోం 'నించీ అతనికి పిలుపు వచ్చింది 1830 అక్టోబర్‌లో అతని 0201412 ప్రదర్శన జరిగింది.కానీ విజయవంతం కాలేదు రోంలోని "౪/18 116610 లో మూడేళ్ళపొటు సంగీతకారుడుగా పని చేశాడు కానీ అక్కడ అతను సంతోషంగా లేడు అక్కడి సంకుచితమయిన నిబంధనలు, యువ సంగీతకారులపై పరిమితులు అతను భరించలేకపోయాడు ఇటాలియన్ భోజనం అతనికి రుచించలేదు. ఇటాలియన్ సంగీతాన్ని అతను యిష్టపడలేదు అతనికి ఎంగేజ్మెంట్ ఐన అమ్మాయి కామిల్లిమోక్ గురించిన అపవాదాలు అతన్ని కలతపెట్టాయి రోం వదిలి వెంటనే పారిస్ వెళ్ళి ఆమెను ఆమె ప్రియుణ్ణి చంపేసెయ్యాలన్నంత కోపం వచ్చింది. తన ఆ(గ్రవాన్ని సంగీత రచనలు చెయ్యడంలో మునిగిపోవడంతో కొంత తగ్గించుకున్నాడ్డు. కొన్ని ఆర్మెస్ట్రా రచనలు చేశాడు 29
1832లో పారిస్ తిరిగి వచ్చాడు. అతను పారిస్‌కు వస్తూనే హెన్రియెట్టా స్మిత్సన్ పారిస్‌కు వచ్చినట్లు తెలిసిందీ అంతే! మళ్ళీ ఆమె పట్ల మనసులో దాగిన (ప్రేమ చెలరేగింది మళ్ళీ బెర్లియోజ్ 5/00%0116 12౧5150%046' ప్రదర్శన ఏర్పాటు చేశాడు బహుశా ఆమె వస్తుందని వింటుదని అతని ఆశ! ఆమె వచ్చింది. ఆమె తన సోదరితో బాటు ఆ (ప్రదర్శనకు వచ్చింది. తను కూర్చున్న చోటు నించి బెర్లియోజ్ ఆమెను గుర్తుపట్టాడు అతని తనువంతా పులకరించింది తన జ్ఞాపకాలలో “ఆమె రాక సమస్త వాతావరణాన్ని స్తంభింప జేసింది. విశ్వరూపమై అమె అన్నిట్నీ ఆక్రమించింది. నా సమస్తం ఆమె పైనే కేంద్రీకరించాను హెబెనెక్ సంగీతాన్ని నిర్వహిస్తున్నాడు. నేను అతని వెనక ఉద్రిక్తంగా కూచున్నాను. అప్పటిదాకా ఈ సంగీత ప్రదర్శన నీర్వాహకుడు తను అనుకున్న వ్తేనా లేక తను పారపడివచ్చానా? అని సందేహపడుతున్నదల్లా నన్ను చూపింది గుర్తు పట్టింది “అవును అతనే పాపం కుర్రాడు సందేహం లేదు, నన్నెప్పుడో మరచిపోయాడు మరచిపోయాడనే భావిస్తున్నాను, అని ఆమె అనుకుంది ఆ సింఫనీ మొదలయింది జనాలపై విపరీత ప్రభావాన్ని ప్రదర్శించింది. సంచలనం కలిగించింది జనాల్ని వూపేసింది వున్మత్తుల్ని చేసింది. కానీ కానీ ఆమెను "ఏమీ కదిలించినట్లునిపించలేదు” అని రాసుకున్నాడు. బెర్లియోజ్ పట్ల ఆమెలో హరాత్తుగా సానుభూతి మొదలయింది. సానుకూల ధోరణి శలచూపింది ఆ సింఫనీ అఖండ విజయం దానికి కారణం కాదు నటిగా అప్పుడప్పుడే ఆమె ప్రసిద్ధి తగ్గ ముఖం పడుతోంది. పైగా ఆమె ఆర్థిక యిబ్బందుల్లో వుంది. అట్లాంటి స్థితిలో తన ప్రాణానికి ప్రాణజమయిన ఆమె ముందు నిలబడి తన సమస్తాన్ని ఆమె ముందు ధారబోయడానికి బెర్లియోజ్ సంసిద్ధడైవున్నాడు ఒక (పరిస్థితిలో) సందర్భంలో ఆమె పట్ల తన గాఢమయిన ప్రేమానురాగాల్ని వ్యక్తపరిచి అత్మహత్య చేసుకోడానిక్కూడా సిద్ధపడ్డాడు. తనని పెళ్ళిచేస్తుకోమ్సని ప్రాధేయపడ్డాడు చివిరకి 1888వ సంవత్సరం అక్టోబర్ 3న వాళ్ళ పెళ్ళి జరిగింది. బ్రిటిష్ రాయబార కార్యాలయంలో జరిగింది | వాళ్ళ వివాహం జరిగాకా వాళ్ళ దాంపత్యం ఆనందంగా కొనసాగలేదు ఇద్దరూ క్షణికోద్రేక స్వభావం వున్నవాళ్ళు. చపల చిత్తులు దాంతో సంసారంలో శాంతి లేకుండా పోయింది దానికి తోడు యిద్దరూ పేదవాళ్ళు. దానికి అదనంగా హెనియెట్టా అతనికి వచ్చిన పేరు (ప్రఖ్యాతులు చూపి భరించలేకపోయింది చిన్నిదానికీ గిల్లికజ్ఞాలు పెట్టుకునే తత్వం గయ్యాళితనం ఆమెలో మొదలయ్యాయి. అతనంటే ఆమెలో ఈర్య మొదలయింది అంతులేని ఉద్వేగాల ఉప్పెనలో ఉద్రిక్తంగా వాళ్ళు జీవించారు. చివరికి వేరువేరుగా జీవిచదానికి అంగీకారానికి వచ్చారు. బెర్లియోజ్ తన కొత్త ప్రియురాలు మేరీ రీసియో “ప్రేమతో కొంత ఉపశమనం పొందాడు కానీ హెన్రియెట్టా పట్ల తన గాఢమయిన 'తొలి 3౩౮
ప్రేమను మరచిపోలేకపోయాడు. ఆమె జీవితం చివరి దశలోనూ 'ఆమె అనామకురాలిగా వున్నా ఆమె పట్ల అనురాగంతో, మమకారంతో ఆమెను చేరేవాడు.. ఆ దశలోనూ ఆమె అసభ్యంగా ప్రవర్తిస్తూ, చిరు బుర్రులాడుతూ -వుండేది. ఆమె పట్ల ప్రేమగా" మెలిగాడు. 1858వ సంవత్సరం మార్చి 8న హెన్రియెట్టా కన్నుమూసింది. సంవత్సరం గడిచిన తరువాత బెల్లియోజ్ మేరీ రీసియోని పెళ్ళాడాడు. మొదటి పెళ్ళి కన్నారెండో పెళ్ళి.కొంత మెరుగ్గా సాగింది. హెనైియెట్టాని బెర్లియోజ్కు దగ్గర చేసిన '9౪/0౧1౧6 12౧5511046వల్ల అతను మరో ముఖ్యమయిన ప్రయోజనం పొందాడు. ఆ రోజు (ప్రేక్షకుల్లో కూచున్న ఒక సుప్రసిద్ధవ్యక్తి వచ్చి బెర్లియోజ్ని అభినందించాడు. ఆ వ్యక్తి నికోలో పగానిని. ఆనాటి సుప్రసిద్ధ వయోలిన్ విద్వాంసుడు. అతను బెర్లియోజ్ను కేవలం అభినందించడానికి మాత్రమే రాలేదు. ఒక కొత్త సంగీత రూపకాన్ని తన కోసం రాయమని కోరాడు. బెర్లియోజ్ “4121016 1౧112 అన్న రచనను పూర్తి కవితాత్మకంగా రూపొందించాడు. కానీ అది నికోలో పగానిని ఉద్దేశాలకు పూర్తిగా భిన్నంగా వుంది. ఆ రచనకు సంబంధించిన 'స్కెదొలను చూసి పగానిని పెదవి విరిచాడు. ఆ రచన 28 నవంబరు 1884న నికోలో పగానిని సహకారంతో సంబంధం లేకుండా పారిస్‌లో పప్రదర్శింపబడింది. 16 డిసెంబరు 1888 దాకా నికోలో పగానిని ఆ సంగీత రచనని విననే లేదు. విన్న తరువాత మహవానందంతో బెర్లియోజ్కు తన సందేశం పంపాడు “బిధోవిన్ చనిపోయాడు. ఆ స్టానాన్ని పూరించగలిగిన వాడు బెర్లియోజ్ ఒక్కదే” అన్నది ఆ సందేశం. ఆ సందేశంతో పాటు బహుమతిగా ఇరవై వేల ప్రాంకులు పంపాడు.
అప్పటి దాకా అస్థిరంగా, ఎగుడు దిగుళ్ళతో వుండిన బెర్లియోజ్ ఆర్థిక పరిస్థితి బహుమతిగా వచ్చిన డబ్బు వల్ల తాత్కాలికంగా ఉపశాంతి పొందింది. సంగీత విమర్శ రచనలపై అతను దృష్టి పెట్టడానికి అనుకూలించింది. అప్పుడే అతని సుప్రసిద్ధ సంగీత రచనల్లో ఒకటయిన గొంగ180 2౧6 ౮౮1161 అన్న నాటకీయ సింఫనీ సృష్టించాడు. ఆ సింఫనీలో తను మొదట ఓడియన్ ధియేటర్లో మొదటిసారి హెన్రియెట్టాని చూడ్డం, ఆ రాత్రంతా పిచ్చివాడిలా పారిస్ వీధుల్లో తిరగడం ఆనాటి భావోద్వేగాన్నంతా పొందుపరిచాడు. 1889లో సంగితశాలలో అ సింఫనీ ప్రదర్శన జరగింది. గొప్ప విజయాన్ని పొందింది. ఆ ప్రదర్శన చూసి (ప్రేక్షకుల్లో వున్న ఒక యువకుడు కదిలిపోయాడు. కంపించిపోయాడు. అప్పటికి సంగీతకారుడుగా అతను ఎవరికీ తెలీదు. అతనే “రిచర్డ్ వాగ్బర్. భవిష్యత్తులో మహా సంగీత కారుడయ్యాడు. “ఆ సింఫనీలోని నిర్లక్ష్యం నిండిన సాహసం, ఉద్వేగ గమనం నన్ను ఉప్పెనలా ముంచెత్తాయి. మంటల్లా నా మనసును అల్లుకున్నాయి. సంగీతం పట్ల కవిత్వం పట్ల నా మమకారాన్ని వెయ్యి రెట్లు పెంచాయి అన్నాడు.
తె
1842లో తన సంగీత ప్రదర్శన లివ్వదానికి బ్రస్సెల్ వెళ్ళాడు. అప్పటినించీ జర్మనీ, ఆస్ట్రియా, ఇంగ్లాండ్ రష్యాలు పర్యటించి తన (ప్రదర్శనలు ఇచ్చాడు. ఆ పర్యటనల్లోనే పదిహేడు సంవత్సరాల క్రితం అసంపూర్తిగా ఉన్న నాటకీయ గాధ 7౧6 642౧౧10200 01 ₹6॥ ' పూర్తి చేశాడు. ఆ రచన 6 డిసెంబరు 1846లో మొదటిసారిగా పారిస్‌లో ప్రదర్శింపబడింది. దానికి చాలా తక్కువమంది పేక్షకులు వచ్చారు. అదేమింత విజయవంతం కాలేదు. పైగా పదివేల ప్రాంకుల అప్ప మిగిలింది. బెర్లియోజ్ జీవితంలోని చివరి రోజులు అశాంతిగా గడిచాయి. తన సృజనాత్మక జీవితం ముగిసిందని అతనికి తెలుసు. తన సంగీత జ్ఞానానికి సంబంధించి ఒక అసహనం అతన్లో చోటు చేసుకుంది. రెండో పెళ్ళి కూడా మొదటి పెళ్ళి .లాగే దురదృష్టంగా ముగిసింది. అతని ఆరోగ్యం చెడిపోయింది. అతని ఒక్కగానొక్క కొదుకు ఎల్లో ఫీవర్‌తో అతను బతికుండగానే చనిపోయాడు. అది అతనికి పెద్ద దెబ్బ, చివరికి 8 మార్చి 1869లో బెర్లియోజ్ కన్నుమూశాడు. అనాటి సుప్రసిద్ధ సంగీతకారులయిన గౌనోడ్, అంబ్రోయిస్ ధామస్, మొదలయిన వాళ్ళు అతని శవపేటిక మోశారు. అతని శవయాత్ర అతని '5౪గ౧[౧0౧16 1౧60786 1గ౧౧౧౧౭16' గానంతో సాగింది.
బెర్లియోజ్ జన్మించినప్పటికి బిధోవిన్, హైడెన్ సజీవులే. బెర్లియోజ్ తన మౌలిక సంగీత రచనలు 1830 నాటికే చేశాడు. అతను సంగీత రంగంలో తొలి రొమాంటిస్ట్. రూపంలో, శైలిలో క్లాసికల్ సంప్రదాయాన్ని సంపూర్ణంగా కాదని కాల్బనిక సంగీత ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. సంగీత ప్రపంచంలో అతని ఆవిష్కారాలు అనన్య సామాన్యమైనవి. న్
అలగ్జాండర్ బొరోడిన్ గీిఇగ4౭౧౮66! 500061 11-11-1833 -- 27-2-1887
కెమిస్ట్ ప్రొఫెసర్ జినిన్ ఒకసారి బొరోడిన్తో “అన్ని దారులూ నీకు ఆవ్వోనం పల్పుకుతున్నాయి. కానీ నువ్వు పాటలు రాయడానికి తక్కువ సమయాన్ని కేటాయించు. నువ్వు నన్ను అధిగమిస్తావని నా ఆశ. కానీ నువ్వు సంగీతం మినవాయిస్తే దేన్ని గురించీ ఆలోచించడం లేదు. నువ్వు తప్పచేస్తున్నావు. రెండు కుందేళ్ళను ఒకేసారి వేటాడాలను కుంటున్నావు” అన్నాడు.
బొరోడిన్ జీవితమంతా సైన్సు అతన్ని వదిలిపెట్టలేదు. సైన్సులో అతని ఆవిష్కారాలకు అతను ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని పొందాడు. అతను సైన్సులో (గ్రాడ్యుయేట్ డాక్టర్. కెమిష్ట్రీ ప్రొఫెసర్‌గా పని చేశాడు.
బొరోడిన్ సంగీతానికి సంబంధించి బెత్సాహిక సంగీతకారుడికన్నా కేవలం ఒక మెట్టు మాత్రమే ఎత్తులో వున్నానని చెప్పుకున్నాడు “నేనొక ఆదివారం సంగీతకారుణ్ణి. ఆ ఆదివారం సంగీతకారుడు అజ్ఞాతంగా వుండిపోవదానికే ప్రయత్నిస్తూ వుంటాడు' అన్నాడు కానీ సైన్సులో అతని ఆవిష్కారాలకన్నా సంగీతంలో అతను సాధించిన విజయాలు తక్కువయినవేమీ కాదు. రష్యన్ జాతీయ సంగీత లక్షణాన్ని బావ్యూ ప్రపంచానికి మొదట పరిచయం చేసిన సంగీత కారుడు అతనే. గుర్తింపు తెచ్చినవాడు అతనే.
'ప్రిన్స్టాక్ గెడియనిష్విల్లికి అతను “అక్రమ సంతానం. వివాహేతర సంబంధం వల్ల పుట్టిన సంతానం కాబట్టి అప్పటి ఆచారం ప్రకారం ఒక 'పనివాడి' సంతానంగా అతని పేరు నమోదు (రిజిస్టర్) చేయబడింది. పోర్ఫిరి బారోడిన్గా నమోదు చేయబడింది. అతని తండ్రి చనిపోయినపుడు అతనికి ఏడేళ్ళు. సంస్కారవతి, సున్నితమనస్స్కురాలు, (పేమగలది ఐన తల్లి మమకారంలో పెరిగాడు. బౌరోడిన్ బలహీనంగా వుండేవాడు. ఓ సందర్భంలో అతనికి క్షయ వ్యాధి వుందని కూడా సందేహించారు. ఈ కారణంగా అతను స్ఫూలుకు వెళ్ళి చదువుకోలేదు. యింటికే వచ్చి ఉపాధ్యాయులు, ట్యూటర్లు పారాలు చెప్పారు. అట్లా అతని ప్రాథమిక విద్య గడిచింది. అతను పూర్తిగా "స్త్రీల ప్రభావంలో పెరిగాడు. అతని ఏకైక స్నేహితురాలు అతని దాయాది మారియా. కొన్నిసార్లు తను కూడా ఆడపిల్లనే అని అతను చెప్పుకున్నాడు.
తెడె
బొరోడిన్ చిన్నప్పటి నించే చాలా తెలివైనవాడు. సునిశితమయిన బుద్ధి, గొప్ప జ్ఞాపకశక్తి, అసాధారణంగా అతనికి భాషల పట్ల, ప్రకృతి విజ్ఞానం పట్ల, సంగీతం పట్ల అతనికి అభిరుచి. సంగీతం పట్ల" అతనికి యిష్టం కలగడానికి ఒక రోజు అతను తన యింట్లోంచీ కిటికీ గుండా ఒక బ్యాండ్ మ్యూజిక్ వినడం ద్వారా కలిగింది. బౌరోడిన్ తొమ్మిదేళ్ళ వయసున్నప్పుడు *పోల్యా అన్న తన సంగీత రచన చేశాడు. -తన కన్నా పెద్దయిన ఒకమ్మాయిని బొరోడిన్ (ప్రేమించాడు. ఆ (్రేమ ప్రేరణతో ఆ రచన చేశాడు. సంగీతంలో తన ప్రతిభను ఇష్టమొచ్చిన రీతిలో వ్యర్థం చేసే స్టిగ్లేవ్ అన్న మిత్రుడి సాహచర్యం దొరికడంతో బారోడిన్ సంగీత పరిధులు విస్తరించాయి. వాళ్ళిద్దరూ కలిసి “నాలుగు చేతులా' పియానోపై క్లాసికల్ సంగీతాన్ని పండించారు. పావ్లోవ్స్క్ ప్రాంతంలో జరిగే సంగీత సభలకు హాజరయ్యారు. ఇతర్ల సహాయంతో అవసరం లేకుండా తంత్రీ వాద్యాలపై సంగీతాన్ని అభ్యసించారు. ఛాంబర్ మ్యూజిక్ ప్రదర్శనలకు హాజరయ్యారు. వాతావరణం అనుకూలించకపోయినా ఎక్కడయినా సంగీత ప్రదర్శనలు జరుగుతున్నాయంటే మైళ్ళ కొద్దీ నడిచి వెళ్ళేవాళ్ళు. అట్లాంటి ఒక ప్రదర్శనలో ఇరవై నాలుగంటల పాటు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలతో సమాంతరంగా స్వరకల్పనలోనూ మునిగేవాళ్ళు. బొరోడిన్ పద్నాలుగేళ్ళ వయసులో ఫ్లూటు, పియానో, వయోలిన్ తదితరాలపై ప్రయోగించడానికి "అనుకూలంగా మేయర్ బీర్ రచన 'రాబర్ట్లి డయబుల్ అన్న దాన్ని స్వరపరిచారు. సంగీతం పట్ల ఆత్మ సమర్పణ భావంతో వున్నా అతను సైన్సును విస్మరించలేదు. తన గదిలో ఒక లేబొరెటరీని సిద్ధం చేసుకున్నాడు. అక్కడ కెమిష్టీలో ప్రయోగాలు చేశాడు. బొరోడిన్ తన పదిహేడో ఏట “అకాడమీ ఆఫ్ మెడిసన్ అంద్ సర్దరిలో తన పేరు నమోదు చేసుకున్నాడు. బాటనీ, కెమిస్టీలని తన ప్రత్యేకరంగాలుగా ఎన్నుకున్నాడు. అక్కడే అతను ప్రొఫెసర్ జినిన్ దృష్టిలో పడ్డారు. బొరోడిన్ సైన్సు అభిరుచిపట్ల జినిన్ ఆసక్తి చూపించాడు. అప్పటి నించీ అతన్ని తన పర్యవేక్షణ కిందికి తెచ్చుకున్నాడు. బొరోడిన్ చురుకయినవాడు, మేధావి. క్రమంగా ఒక గౌరవం తరువాత యింకో గౌరవాన్ని పొందుతూ వచ్చాడు. 1856లో 'ఫెధాలజీ మరియు థెరాపుటిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితుడయ్యాడు. రెండేళ్ళ అనంతరం మెడికల్ డిగ్రీ పొందాడు. మెడిసన్ ప్రాక్టీసుకన్నా పరిశోధనపై కేంద్రీకరించమని జినిన్ చెప్పాడు. 1859లో కెమిస్ట్రీలో అదనపు అభ్యాసం కోసం బౌరోదిన్ హీదెల్ బెర్గ్ వెళ్ళాడు. హీదెల్ బర్గ్‌లో బసచెయ్యడం వల్ల అతనికి విజ్ఞాన శాస్త్రంలో అభివృద్ధి చెందడానికి వీలయింది. అదే సమయంలో సంగీతంలో అభివృద్ధి చెందడానికీ అవకాశమేర్పడింది. అక్కడ యవ్వనంలో వున్న ఆకర్షణీయంగా వున్న కాధరిన్ ప్రొటొపొపోవా అన్న పియానో వాద్య తెళ్త
కారిణిని కలిశాడు. ఆమె (ప్రేమలో పడ్డాదు. ఆమె ఛోపిన్, ఘామాన్ల-పియానో సంగీతాన్ని అతనికి పరిచయం చేసింది. ఇద్దరు కలిసి ఎన్నో సంగీత ప్రదర్శనలకు 'హోజరయ్యారు. ఇద్దరూ కలిసి వాగ్నర్ ఒపేరాల్ని వినడానికి మాన్హీమ్ వెళ్ళారు. బొరోడిన్ తన సైన్సు పరిశోధనల్లో మునిగి వున్నప్పుడు కూడా సంగీతం పట్ల అతని అభిరుచిని సజీవంగా వుండేలా చేసేది.
స్వస్థలానికి తిరిగి వచ్చాకా బొరోడిన్ కాథరిన్ని పెళ్ళాడి సెంట్ పీటర్స్‌బర్గ్‌లో సెటిలయ్యాడు. అకాడమీ ఆఫ్ మెడిసన్‌కు సంబంధించిన ఒక అపార్ట్మెంట్లో స్థిరపడ్డాడు. అది అతని జీవితకాల కేంద్రమయింది. సైన్సులో, సంగీతంలో సమాంతరంగా (శ్రమిస్తూ వెళ్ళాడు. కొంతకాలం మాత్రం సైన్సు అతని సంగీత పరిశ్రమను అధిగమించింది. కెమిప్టీకి సంబంధించి ముఖ్యమయిన పత్రాల్ని సమర్పించాల్సి రావడం, అవసరమయిన కొన్ని ప్రయోగాల్ని చెయ్యాల్సి రావడంతో సంగీతానికి దూరంగా వుండాల్సి వచ్చింది. బొరోడిన్ పీటర్స్బర్గ్ అకాడమీ ఆఫ్ ఫారెస్టీలో లెక్సెరర్ అయ్యాడు. తరువాత అకాడమీ ఆఫ్ మెడిసన్‌లో ప్రొాఫెసరయ్యాడు, సంగీతమన్నది అతని ప్రత్యేక అభిరుచి. కానీ మౌలికమైంది. సైన్సు నుండీ 'తప్పించుకుని' గంటల కొద్దీ పియానో వాయిస్తూ, స్వరాల్ని కూరుస్తూ గడిపేవాడు.
1862లో బెక్సాహిక సంగీతకారుదికి, వృత్తి సంగీతకారుదికి మధ్య వున్న సరిహద్దులు బొరోడిన్ అధిగమించాడు. ఆ సంవత్సరం బలాకిరెవ్ అన్న సంగీతకారుణ్ణి కలిసి అతని శిష్యుడిగా చేరాడు. స్వరాల్ని కల్పించడం ప్రారంభించాడు. అతని జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. బలాకిరెవ్ “సంగీత స్వరకల్పనలో అతను మునిగే దాకా దాని ప్రాధాన్యం అతనికి తెలీదు. అతని వృత్తి, వ్యాపారం కేవలం స్వరకల్పన మాత్రమే అన్ననా విశ్వాసాన్ని అతనికి చెప్పాను. అట్లా అతనికి చెప్పిన మొదటి వ్యక్తిని నేనే.” అన్నాడు.
బలాకిరెవ్ ఆధ్వర్యంలో, సహకారంలో బొరోడిన్ తన మొదటి సింఫనీపై (శ్రమించడం ప్రారంభించాడు. అతని సంగీత రచన నెమ్మదిగా సాగింది. కానీ లక్ష్య శుద్ధి ఏర్పడింది. రిమ్స్కీ కార్సకోవ్ అన్న సంగీతకారుడు బొరోడిన్ సింఫనీ గురించి చెబుతూ “అతని రూపకంలో కొన్ని భాగాల్ని అతను పియానోపై ్రదర్శిస్తూవుంటే విన్నాను. అవి నన్ను వుల్లాసపరిచాయి. ఆశ్చర్య పరిచాయి. సంగీతం సాగుతున్నప్పుడు మధ్యలో అతను హఠాత్తుగా ఆకాశంలోకి తన స్వరాన్ని తీసుకెళతాడు. స్వరం వెనక్కి తిరుగుళుంది. మండుతుంది. అంతా అద్భుతంలా వుంటుంది. సంగీతంతో గాలి బరువెక్కింది, తేలికపడింది. అనూహ్య సన్నివేశాల కల్పనతో అతనలా సాగిపోయాడు” అని రాశాడు.
సంగీతకారులయిన ముస్మ్ఫోర్ట్ల్కో కూయీ, రిమ్స్కీ కోర్సకోవ్ తదితర సంగీతకారుల సహకారంతో తన సింఫనీకి సాంకేతిక సహకారం పొందాడు. కళాసంబంధమయిన సలవాలనీ
తక్
“పొందాడు. వీళ్ళు బలాకిరెవ్తో కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. జాతీయ సంబంధమయిన వాస్తవ సంగీతాన్ని సృష్టించడం వాళ్ళ ఆశయం. ఆ ఆదర్భంతో బొౌరోడిన్ వాళ్ళతో కలిశాడు. వాళ్ళని “రష్యన్ ఫైవ్ అంటారు. జాతీయ లక్షణాలతో 1867 నాటికి అతని మొదటి సింఫనీ సిద్ధమైంది. బలాకిరెవ్ ఆధ్వర్యంలో 1869 జనవరి 16న రష్యన్ మ్యూజికల్ సొసైటీ తరపున ఆ సింఫనీ ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శన గురించి చెబుతూ బాలకిరెవ్ “అది ప్రారంభమయిన మొదట్లో అందరూ నిశ్శబ్దంగా విన్నారు. క్రమంగా జనం ఉత్తేజితులయ్యారు. వన్స్‌మోర్ అన్నారు. చివరి దశకు వచ్చేసరికి వాతావరణం వుల్లాసంతో నిండిపోయింది. కోలాహలం చెలరేగింది. చివరికి జనం మళ్ళీ మళ్ళీ ప్రదర్శన కోసం ప్రవాహంలా ఎగిసిపద్దారు అన్నాడు. మొదటి సింఫనీ విజయంతో బొరోడిన్లో ఉత్సాహం కలిగింది. రెండో సింఫనీ సిద్ధం చెయ్యదానికి ఉద్యుక్తుడయ్యాడు. కానీ తొమ్మిదేళ్ళకి కానీ అది పూర్తి చెయ్యలేకపోయాడు. మధ్యకాలంలో కొన్ని పాటలు రాశాడు. 7౧6 8004075 అన్న ఒపేరా రాశాడు. అందులో రష్యన్ పురాణాల్లోని నాయకుడు ప్రధానపాత్ర. 1866లో తిరుగులేని విజయంతో ఈ ఒపేరా ప్రదర్శింపబడింది. ఈ ఒపేరాని 1986లో కొందరు ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే సోవియట్ ప్రభుత్వం అజణిచేసింది.
_. వైన్సు పరిశోధనలు నిర్బంధంగా మారి సంగీత సృజనకు అతనికి సావకాశమే చిక్కేడికాదు. ప్రీలకు సంబంధించి వైద్యవిద్య అవకాశలపై అతని శక్తిని కొంతకాలం కేంద్రీకరించాడు. సైన్సు విద్యార్థులకు అతని లేబొరేటరీ తీరయాత్రలా వుండేది. తన అకాడమీలో లేబొరెటరీలని ఆధునికరించే నిమిత్తం 1877లో అతను జర్మనీ పర్యటించాడు 'నేను సంగీతం పై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాని వాపోయేవాడు. “వేసవి సెలవుల్లోనో, నాకు ఆరోగ్యం బాగలేకపోతేనో తప్ప సంగీతంపైకి దృష్టి తిప్పలేకపోతున్నాను” అన్నాడు.
తన రెండో సింఫనీ 1877లో పూర్తి చేశాడు. కానీ దాని ప్రదర్శన అంతగా రాణించలేదు. 1870లో 7[6 11/1 50100 ౧62గ61 1880 0౧ 118 5180౧06౯౦1 606౧2] తీ512. వంటి మౌలిక సంగీత రచనలు చేశాడు ఈ మధ్యలో రష్యన్ జానపద సంగీతంపై కొంత కాలం (శ్రమించాడు.
అతని చివరి సంవత్సరాల్లో ౧/౧౦ 160 అన్న విషాదాంతాల రచన అతన్ని గాధంగా ఆకట్టుకుంది. అతని భార్య అనారోగ్యం పాలయింది. 1884లో అతను తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఒక రకమయిన కలరా జబ్బు అని తేలింది. నిజానికి అతనా జబ్బు నుండీ కోలుకోలేదు. అతనికి ఆత్మీయురాలయిన అతని అత్తగారు కన్నుమూసింది. 36
మధ్య మధ్యలో మానసిక జబ్బుల్తో, నిరాశతో బాధలు పడ్డాడు. ఐనా సంగీతంలో శమిస్తూ తన మూడో సింఫనీకి స్కెచ్‌లు సిద్ధం: చేశాడు.
బొరోడిన్ సైన్సులో, సంగీతంలో మునిగి తేలుతున్నా అతనికి మనుషులంటే మమకారం. అతని యిల్లు సంతలా వుండేది. విద్యార్థులు, బంధువులు, స్నేహితులు, సహాధ్యాయులు, పరిచితులు, అపరిచితులు వీళ్ళందరితో సత్రంలా వుందేది. కొంత మంది భోజనానికి వచ్చేవాళ్ళు, మరికొంతమంది కాలక్షేపానికి వచ్చేవాళ్ళు. కొంత మంది సహాయం కోరి వచ్చేవాళ్ళు. ఎంత మంది వచ్చినా ఏమీ అనుకునేవాడు కాదు. _పైగా వాళ్ళు మళ్ళీ రావడానికి ప్రోత్ససించేవాడు | తన *పని' నుండి తప్పించుకుని తన అతిధుల్లో కబుర్లు చెబుతూ లెక్కలేనన్ని సార్లు టీలు తాగడానికి తహతహలాడేవాడు.
విక్టర్ ఐ. సెరోఫ్ తన '1418౧0/ ౧౪6 అన్న రచనలో బొరోడిన్ గురించి రాస్తూ “అతని ఇంటికి వచ్చిన అతిథులెవరూ అతను తన రచనలో, పరిశోధనల్లో బిజీగా వున్నాడా లేదా? అని పట్టించుకునే వాళ్ళు కాదు. సైన్సుకు సంబంధించిన రచనలు చేసుకుంటూ వాటిని 'ప్రచురణలకు సిద్ధం చేసుకుంటున్నాదేమో, లేదా ఏవైనా ప్రయోగాలు చేస్తున్నాడేమో, అతనికి ఆటంకం కలగకుండా ఆ గదితలపులు వేద్దాం అన్న ధ్యాసకూడా ఎవరికీ వుందేదికాదు. అతని టేబుల్‌పై అతని సైన్సు, సంగీత రచనల పేపర్లుందేవి. వాటిపై వచ్చిన అతిధుల స్వెటర్లు, చేతి తొడుగులు, టోపీలు, వాళ్ళు తెచ్చిన మేగజైన్లు పేరుకుని వుండేవి. వంటింట్లో పేరుకుని పోయిన పాత్రల గురించి అతనికి పట్టింపు వుందేది కాదు. అతని భార్య ఆస్మాతో బాధపడేది. నిద్రలో నడిచే జబ్బు వుండేది. రాత్రిళ్ళు ఆమె లేచి ఇల్లంతా తిరిగేది. కుర్చీలు టేబుళ్ళు తగులుతూ శబ్దం చేసేవి. వచ్చిన అతిధులు సోఫా, టేబల్ అని లేకుండా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ పడుకుని వుండే వాళ్ళు. వాళ్ళని తన్నుకుంటూ తూలేది. కారిడార్‌లో మెట్లమీద కూడా జనం పడుకుని వుండేవాళ్ళు. కానీ ఆమె అంటే బొరోడిన్కు అనురాగం. ఆమెకు ఏ మాత్రం బాధకలగకుండా నదుచుకునేవాడు. వచ్చిన వాళ్ళు తిన్నారా లేదా? అన్న సంగతే అతనికి తెలిసేది కాదు. వాళ్ళు వున్నారో వెళ్ళారో కూడా తెలిసేది కాదు. వస్తూ వుందేవాళ్ళు, వెళుతూవుండేవాళ్ళు. ఒక్కోసారి రాత్రిళ్ళు రెండుసార్లు భోంచేసే వాడు. ఒక్కోసారి రాత్రిళ్ళు వుడకేసిన మూడు గుడ్లు తినేవాడు”
సెరోఫ్ మరికొన్ని వ్యక్తిమయిన విషయాల్ని వివరించాడు. “కేధరిన్ పొద్దున పొద్దున్నే నగ్నంగా భర్త స్నానం చెయ్యడాన్ని యిష్టపడేది కాదు. బట్టల్లేకుందా బాత్రూం వెళ్ళడం, లేదా టవల్ చుట్టుకుని వెళ్ళడం చెయ్యొద్దనేది. గోళ్ళు కత్తిరించుకోమనేది, ఒక గదిలోంచీ యింకో గదిలోకి వెళ్ళేప్పుడు పాటలు పాడడం, విజల్ వెయ్యడం చెయ్యొద్దనేది. తినేటప్పుడు పెద్ద మోతాదులో (బెడ్ కొరకడం, టీలో మరీ ఎక్కువగా నిమ్మరసం పిండదం,
త్ర
స్పూన్ని సమ్మకాయపై బలంగా ఒత్తడం చెయ్యొద్దనేది. బొరోడిన్ మరీ కాంతిని అంతగా తట్టుకునే వాడు కాదు. అందుకని చీకటిగా వున్న గదిలో పడుకునే వాడు, నల్లగావున్న బట్ట ముఖంపై వేసుకుని పడుకునేవాడు.”
1887వ సంవత్సరం 'కార్నివాలో పండుగ సంబరాలు జరుగుతున్నాయి. మెడికల్ అకాడమీలో జరుగుతున్న నాట్య ప్రదర్శనలకు బొరోడిన్ హాజరయ్యాడు. జాతీయ వస్తాల్ని అలంకరించుకున్నాడు. ఆనందంతో వురకలేస్తున్నాడు. డాన్స్‌లో భాగస్వామ్యం వహించాడు. ఇతర్లసి వుల్లాస పరుస్తూ, వుత్సాహంగా తిరిగాడు. హరాత్తుగా కిందకు ఒరిగిపోయాడు. అందర్నీ తమాషా పట్టించడానికి అట్లా చేశాడేమో అని మిత్రులు నవ్వుతూ కదిలించారు. అతను కదల్లేదు. రక్తనాళాల్లో రక్త ప్రసరణ గడ్డ కట్టడంతో బారోడిన్ క్షణాల్లో కన్నుమూశాడు.
38
జోహాన్స్ బ్రామ్స్ ఆ౦[2౧౧65 820005 7-5-1633 -- 3-4-1697
సింఫనీ సంగీతంలో బిధోవిన్ తరువాత ఆ స్థానాన్ని పూరించిన వాడుగా జోవాన్స్ 'బ్రామ్స్ని చెప్పుకుంటారు. అంతేకాదు, వాళ్ళిద్దరిదీ బాధకరమయిన బాల్యమే. బాల్యంలో ఆనందం వాళ్ళకు తెలీదు. హాంబర్గ్‌లో నది వొద్దున మురికివాడలో ఇరుగ్గావున్న ఒక అద్దెకొంపలో వాళ్ళ కుటుంబం నివసించేది. బ్రామ్స్ తండ్రి ఒక మామూలు సంగీతకారుడు. నిరుపేద, తల్లికొంత కురూపి. కుట్టు పని చేసేది. వాళ్ళ సంపాదన వాళ్ళు, పిల్లలు తినడానికి, బట్టలకు బొటాబొటిగా సరిపొయ్యేది. బ్రామ్స్ తరచూ ఆకలితో అల్లాదేవాడు. దానికి తోడు తల్లిదండ్రుల మధ్య జరిగే “అసహ్య” సన్నివేశాలతో అతను మరింత యిబ్బంది పడేవాడు. అతని తల్లిదండ్రుల పరిస్థితీ దయనీయమైందే. వాళ్ళిద్దరూ ఏకాంతంగా కలుసుకోడానికి అవకాశం, స్టలం రెండూ చిక్కేనికావు. అతని తల్లికి పది హేదేళ్ళ వయసులో పెళ్ళయింది.
స్కూల్లో కూడా జోవాన్స్కు శాంతి అంతంత మాత్రమే. అతనికి ఆ చదువులంటే, (ప్రత్యేకించి (ఫెంచి భాష అంటే యిష్టముండేది కాదు. టీచర్లంటే ద్వేషం. అతన్ని ఎప్పుడూ హింసిస్తూ, గేళిచేస్తూ వుండేవాళ్ళు. ప్రపంచంపసిద్ధుడు కాబోయే ఆ-మహా సంగీత కారుడికి ప్రసన్న బాల్యం కరువైంది.
కానీ తన సంగీత ప్రతిభను గుర్తించడానికి అతనికి ఎంతో కాలం పట్టలేదు. చిన్నతనంలోనే కొన్ని స్వరాల్ని సృష్టించాడు. ఆ చిన్నతనంలో అతనికి సంగీతం గురించిన ప్రాథమిక జ్ఞానం కూడా లేదు. కానీ కొన్ని సంగీత గతుల్ని స్వరాల్ని సృష్టించాడు. కానీ వాటిని పేపర్ మీద రాసి పెట్టదానికి అతను అశక్తుడు. తండ్రి కొడుక్కి సంగీతం పట్ల వున్న అభిరుచిని గుర్తించాడు. అతనికి సంగీతం నేర్పడానికి పూనుకున్నాడు. స్థానికి పియానిస్టయిన ఒట్టోకోస్సెల్ని ఫీజిచ్చి తన కొడుక్కి పాఠాలు చెప్పమని కోరాడు. జోవాన్స్ అయస్కాంతంలాగా టీచర్ చెప్పిన పారాలన్నీ త్వరత్వరగా నేర్చుకున్నాడు. కుటుంబం దుర్భర స్థితిలో వుంది. ఎంతో కొంత సాయం చేసినా చేసినట్లే సారాయి కొంపవ్లో పియానో వాయించి ఎంతో కొంత డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు.
జోవోన్స్ వదేళ్ళ వయసున్నప్పుడు ఆనాటి హాంబర్గ్‌లో సుప్రసిద్ధ సంగీత ఉపాధ్యాయుడయిన ఎద్వర్ట్ మార్క్ సేన్ ఆతనికి పియానో పాఠాలు నేర్చించాడు. అప్పట్నించీ
త్ర
జోహాన్స్లో త్వరిత గతిన అభివృద్ధి కనిపించింది. తన సొంత బాణీలో పియానో ప్రదర్శన యిచ్చే శక్తి సామర్ధ్యం అతనికి పద్నాలుగో ఏటికే వచ్చింది.
తన జీవితాన్ని సంపూర్తిగా సంగీతానికే అంకితం చెయ్యాలన్నది జోహన్స్ గాఢమయిన కోరిక. కాని అతని అంతులేని దరిద్రం అందుకు అవకాశమివ్వలేదు. ఆ పరిస్థితిలో అది అసాధ్యం. చిన్ని చిన్ని పాటలు రాసి వాటిని పాడుతూ వాటిని ప్రచురణకర్తకు అమ్మి చిల్లర డబ్బులు సంపాదించేవాడ్డు జి.ఎమ్ మార్క్. కార్ల్ వూర్త్ అన్న మారుపేర్లతో 150 పాటల దాకా ప్రచారంలోకి వచ్చాయి. అవన్నీ జోహాన్స్వే.
పియానో పారాలు చెప్పాడు. పసితనంలోని ఈ (శ్రమ వల్ల అతని ఆరోగ్యం చెడిపోయింది. దగ్గరి బంధువు వొకరు అతన్ని తన (గ్రామానికి విశ్రాంతి కోసం తీసుకెళ్ళకపోతే అతని పరిస్థితి మరింత దుర్భరంగా తయారయ్యేది. అట్లాంటి పరిస్థితిలోనూ అతను స్వరకల్పన చెయ్యడం మానలేదు. పియానోపై వాయించడానికి అనుకూలమైన కొన్ని పాటలు రాశాడు. 1851లో ప్రైవేటుగా వాటిని ప్రదర్శించాడు.
1858 జోహాన్స్ హంగెరీ వయోలిస్ట్ ఎద్వర్డ్ రెమేన్యీని కలిశాడు. జోవిన్స్ జీవితంలో ఇది ముఖ్యమయిన సంఘటన. జోహాన్స్ ప్రతిభను గుర్తించిన ఎద్వర్ తనకు సహగాయకుడిగా తన పర్యటనలో "తనతో బాటు రమ్మన్నాడు. ఆ పర్యటనలో జర్మనీకి చెందిన సుప్రసిద్ధ “సంగీతకారుల్లో జోహ్రాన్స్కు పరిచయమేర్చడింది. వాళ్ళకు సన్నిహితుడయ్యాడు. అతనికి కౌండంత్త బల మేర్చడింది. వుదాహరణకు హానోవర్ అన్న చోట అనాటి ప్రముఖ వయోలిస్టయిన జోసఫ్ జోకిమ్ని కలిశాడు. అప్పటికే అతను జోవాన్స్ పాటలు విన్నాడు. అతని ముందే వెంట వెంటనే తన రాగాల్ని పాటల్ని పేపర్ మీద అవ్యవధానంగా రాసి చూపించడంతో జోసఫ్‌కు జోహాన్స్ పట్ల ఆసక్తి ఎక్కువైంది. బ్రామ్స్ పియానోపై తన సొనటాను 0౪656౧6 అన్న పాటలు పాడి వినిపించడంతో ఆ యువ సంగీత కారుడి పట్ల జోసఫ్‌కు అభిమానం ఏర్పడింది. అది మొదలు చివరి దాకా జోనథ్ జోవోన్స్గాఢంగొ అభిమానించేవాడుగా, సన్నిహితమి(త్రుడిగా మారాడు. వీమార్లో బ్రామ్స్ సుప్రసిద్ధ సంగీతకారుడు ఫ్రాంజ్ లిస్జ్టని కలిశాడు. ఫ్రాంజ్ లిస్జ్ట్ సుప్రసిద్ధ పియానో వాద్య నిపుణుడు. అందుకని అతను కోరినా అతని ముందు పియానో వాయించడానికి జోహాన్స్ వెనుకంజ వేశాడు. ప్రాంజ్లిస్జ్డ్ తను స్వరపరిచిన కొన్ని రాగాల్ని ప్రదర్శించినా అతని ముందు పియానో వాయించడానికి జోహాన్స్ సాహసించలేకపోయాడు. జోవోన్స్ తను స్వరపరిచిన కొన్ని గీతాల్ని ప్రాంజ్కు చూపించాడు. ఫ్రాంజ్ వాటిని పియానోపై వాయించాడు. అభినందించాడు. జోహాన్స్ వీమార్ వదిలి వెళుతున్నప్పుడు ఫ్రాంజ్ ఒక సిగరెట్ కేస్‌ని బహుమతికా ఇచ్చాడు. తగ
జోవాోన్స్ అక్కడి నుండి దుసెల్దార్భ్ పట్టణం వెళ్ళాడు. అక్కడ రాబర్ట్ షూమాన్ వున్నాడు, ఆయన ప్రసిద్ధ సంగీతకారుడు. ఆయనంటే జోహాన్స్కు గౌరవం. మొదట షూమాన్ తనని చూడ్డానికి వచ్చిన ఆగంతుకుని పట్ల కొంత అసహనం ప్రదర్శించాడు. కానీ వెంటనే మెత్తబడి సానుభూతిగా జోహాన్స్ సంగీతాన్ని విన్నాడు. జోహాన్స్ తన '500212 1౧ ౮ [420/ లో ఒక పెద్ద భాగాన్ని వినిపించాడు. వంటింట్లోంచీ రాబర్ట్ భార్య క్లారా * ఏమిటా తిట్లు?” అంది. రాబర్ట్షూమాన్ "క్లారా! యిట్లారా! ఈ సంగీతం ఇట్లాంటి సంగీతం నీ జీవితంలో వినివుండవు' అన్నాడు. ఆ అనుభవం బ్రామ్స్కు అద్వితీయమైంది. ధార్మికంగా ఒకరకంగా రాబర్ట్ బ్రామ్స్ని 'దత్తత' తీసుకున్నాడు. బ్రామ్స్ మూడు నెలలపాటు రాబర్ట్కో పాటువున్నాడు. రాబర్ట్ తన సంగీత అనుభవాన్ని, జ్ఞానాన్ని, వివేకాన్ని బ్రామ్స్కు బోధించాడు.
(బ్రామ్స్ ప్రతిభా సామర్భాల్ని మొదట గుర్తించినవాదు రాబర్ట్ షూమాన్. సెష్టంబరు నెల 30వ తేదీ 1858లో షూమాన్ బ్రామ్స్ తన యింటికి వచ్చిన విషయం రాస్తూ అతను “అసాధారణ ప్రతిభావంతుడు అని రాసుకున్నాడు. నెలరోజులు గడవకముందే అక్టోబరు 28వ తేదీన [16౪6 261300గ5% [౧ గాంం॥4 అన్న పత్రికలో అప్పటికి దాదావు అనామకుడయిన బ్రామ్స్ గురించి రాస్తూ ఉన్నతమయిన, ఆదర్శపూరితమయిన అఖభివ్యక్తుల్ని ఈ కాలం అభిప్రాయాలకు, పద్ధతులకు అందించిన అసాధారణ ప్రతిభావంతుడు అన్నాడు. బ్రామ్స్ తొలి పియానో రచనలు ఒక సబ్లిషర్ అచ్చు వెయ్యడానికి, ఆసక్తి ప్రదర్శించడానికి షూమాన్ కారణం. లీప్టిగ్లో పియానిస్టుగా రంగంలోని రావడానికి (బ్రామ్స్కు ఆహ్వానం అందడం వెనక షూమాన్ ప్రయత్నముంది.
'ఖ్రామ్స్, షూమాన్ల మధ్య వున్నది కేవలం పరస్పర గౌరవం మాత్రమే కాదు. వాళ్ళకు ఒకరంటే ఒకరికి అనురాగం. (బ్రామ్ వాంబర్ల్ చేరేసరికి బాధాకరమయిన వార్త విన్నాడు. మనస్థిమితం తప్పి షూమాన్ పిచ్చాసు పత్రిలో చేరాడని తెలిసింది. వెంటనే వెనకా ముందూ ఆలోచించకుండా బయల్దేరి దుస్సెల్ డార్స్ చేరి క్లారాతో బాటు కష్టకాలంలో షూమాన్ని కనిపెట్టుకుని వున్నాడు. షూమాన్ నివాసం పైనే ఒక అపార్ట్మెంట్ రెంటుకు తీసుకుని రెండేళ్ళపాటు షూమాన్కు సేవలు చేశాడు. క్లారాతో బాటువుంటూ ఆమెని ఆదుకుంటూ, వాళ్ళ పిల్లల్ని చూసుకున్నాడు. మధ్యమధ్యలో పిచ్చాసుపత్రి వెళ్ళి రాబర్ట్‌తో గడిపేవాడు. 1856 జులై 29న షూమాన్ చనిపోయాడు. క్లారా పట్ల వున్న దయ, జాలి (ప్రేమగా పరివర్తన చెందింది. ఆ శ్రేమ నలఖై సంవత్సరాల పాటు కొనసాగింది. అతను ఆమెకు రాసిన వుత్తరాలు గాఢంగా, మృదువుగా సెంటిమెంటుతో నిండి వుందేవి. జీవితాంతం వాళ్ళ పరిచయం కొనసాగింది. ఆమె మరణ సమయంలోనూ ఆమె దగ్గర వుండి సేవలు చేశాడు. సంగీతం పట్ల ఆమె అభిరుచి పట్ల, నిర్ణయాలపట్ల అతనికి గౌరవం. ఒకరంటే
శై
ఒకరికి అంత అనురాగం, ఆకర్షణ వుండి కూడా వాళ్ళెందుకు పెళ్ళి చేసుకోలేదని ఆలోచిస్తే స్రీలకు సంబంధించి 'కట్టుబడి వుందే తత్వం బ్రామ్స్లో లేదని తెలుస్తుంది. బ్రామ్స్ స్త్రీలని ప్రేమించేవాడు, సరసాలాదేవాడు. వాళ్ళ (ప్రేమలో మునిగిపోయేవాడు. వాళ్ళు అతని ప్రేమలో మునిగేవాళ్ళు కానీ “నిర్ణయానికి వచ్చే సమయానికి అతనికి లెక్కలేనన్ని సందేహాలు మనసులో కలిగేవి. వాటి వల్ల అతను మానసికంగా చిత్రహింసపడేవాడు. అతనికి సన్నిహితులయిన ప్రీ క్లారా ఒక్కటే కాదు. క్లారా మరణం తరువాత బ్రామ్స్ గొట్టింగెన్‌లో పనిచేసే ఒక ప్రొఫెసర్ కూతురు అగాధే వాన్ సీబోల్డ్ని ప్రేమించాడు. కానీ “పెళ్ళి అనివార్య మన్న సంగతి తెలివాకా అక్కడి నించీ మకాం ఎత్తేశాడు. పెళ్ళి అంటే “ప్లేగ'లా భయపడేవాడు. “నేను సంకెళ్ళు వేసుకోలేను' అనేవాడు. అట్లాంటి సందర్భాల్లో శృంగార సంగీతాన్ని స్వర పరస్తూ 'ప్రేమ' నించీ విముక్తి పొందేవాడు!
అతను ప్రేమించిన స్రీలు యింకా వున్నారు. వాళ్ళలో గాయని లూసీదస్ట్మాన్ ఒకటి. ఎలిజబెత్ వాన్ స్టాక్హాసెన్ మరాక స్రీ. ఐనా అతని పద్ధతి ఎప్పట్లాంటిదే.
అతను వాళ్ళ నించీ తప్పించుకుని పారిపోయినప్పుడు ఒక సందర్భంలో ఓ సారి అతని మీద అభియోగం కూడా వచ్చింది. ఆ విషయానికి సంబంధించి “నేను నా ఒంటరిగదిలోకి అడుగు పెట్టిన వెంటనే నా “వైఫల్యాలు” నన్ను బాధ పెట్టేవి కావు. అక్కడ ఒక భార్య వుండి కళ్ళతో నన్ను ప్రశ్నిస్తూ, నిలదీస్తూ ఆమె ముందు తలవంచాల్సి వచ్చే పరిస్థితిని నేను తెచ్చుకోలేను. అందుకే ఆ ప్రయత్నం చెయ్యలేదు” అన్నాడు. తన వాదాన్ని హేతుబద్ధంగా ఆవిష్కరించడం బ్రామ్స్ విషయంలో తప్పని సరి. అతను తిరుగులేని సమాధానం చెబుతాడు. కొంధరతన్ని 'నంపుంసకూుదన్నారు. శాశ్వతమయిన అనుబంధానికి సంబంధించి అతని మనసులో భయాలున్నాయన్నారు. ఎవరేమన్నా (ప్రేమ, కాంక్షలు అతని సంగీతంలో తరంగాల్లా తేలుతాయి.
(బ్రామ్స్ 1857లో తాత్కాలికంగా లిష్టిదెట్ మోల్డ్ రాజకుమారుడికి సంగీతోపాధ్యాయుడుగా పని చేశాడు. ఆ సందర్భంలోనే ఆర్మెస్ట్రాను వుద్దేశించిన తన మొదట రచన చేశాడు. ఇంకా రెండు "56/82665' లు 60౧0610 110. 1 లు రాశాడు. ఇవి పియానో, ఆర్మెస్ట్రాలని వుద్దేశించి చేసినవి. 22 జనవరి 1869లో వానోవర్లో అతని 00౧060 'ప్రదర్శింపబడింది. అందులో బ్రామ్స్ సోలోపార్ట్ని నిర్వహించాడు. జోసఫ్ జోకిమ్ ఆర్మెస్ట్రా నిర్వహించాడు. ఆ తరువాత అదే లీప్టిగ్లోనూ ప్రదర్శించారు. కానీ రెండుసార్లు ఆ ప్రదర్శన విఫలమైంది. కానీ 'నిరాశు పడడానికి బ్రామ్స్ ఒప్పుకోలేదు. “ఇప్పుడు జరిగిన అనుభవమన్నది చాలా అవసరమైంది. జరగాల్సిందే జరిగింది. మన ఆలోచనల్ని మరింతగా కేంద్రీకరించాల్సిన త్తం
అవసరాన్ని ఈ అనుభవం తెలిపింది. మనం మరింత ఉత్సాహంగా పని చెయ్యాలని దీని ద్వారా తెలిసింది” అన్నాడు.
వాంబర్గ్ తిరిగి వచ్చాకా తను ౧౧॥౧౦4గ౧౦౧|౦ సొసైటీకి సంగీత దర్శకుడు అవుతానని ఆశించాడు. కానీ మరెవర్నో నియమించడంతో జర్మనీ వదిలి శాశ్వతంగా వియన్నాలో స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు. అక్కడ కనీసం విజయానికి సంబంధించి అనుభూతులు అతనికున్నాయి. అక్కడికి వెళ్ళిపోయాడు. పియానో పాఠాలు చెబుతూ జీవించాడు. కొన్నేళ్ళు గడిచాకా 1872లో సుప్రసిద్ధమయిన 6656|190[02566౯ 10914 - ₹/8౮౧౮౮౯ కు డైరెక్టర్‌గా నియమాలకు డయ్యాడు. ఈ మధ్యలో తన తల్లి చనిపోయినప్పుడు ఆమెకు సంబంధించిన అనుభూతులలో '% 661020 ౧6౧౮16౧) రాశాడు. అతని మౌలిక విజయాల్లో ఈ రచన ఒకటి. కొన్నేళ్ళ తరువాత రాసిన "/&/౭60౧9 0॥ 2 106౧) 0) 1[12/66౧' ఒకటి. ఆ రచన 1878 నవంబర్ 2న వియన్నాలో ప్రదర్శింపబడింది. (ప్రేక్షకులు ఆనందోత్సావోలతో వుర్రూత లూగిపోయారు. సంగీత విమర్శకులు కూడా ఎంతో ప్రశంసించాడు. “నీకు తెలీదు, నువ్వు లీనమై సంగీతం ప్రదర్శిస్తూ వుంటే ఒక బిథోవిన్ మమ్మల్ని కదిలిస్తున్నట్లుంది” అన్నారు.
ఇప్పటికి బ్రామ్స్ ఒక అద్వితీయుడయిన సంగీతకారుడుగా గుర్తింపు పొందాడు, అతని చుట్టూ అభిమానులు, శిష్యులు గుమిగూడి వుండేవాళ్ళు. చలికాలంలో ఒకటి రెండు నెలలు ప్రయాజాల్లో వుండేవాడు. సంగీత నిర్వాహకుడిగా, పియానో వాయిస్తూ అతిథిగా దర్శనమిచ్చేవాడు. వేసవిలో స్వరకల్పనలో మునిగివుండేవాడు. ఆ సందర్భంలో వియన్నా నగరం దాటి కొండలు, అరణ్యాలు వున్న ప్రదేశంలో నివసించేవాడు. ఆ ప్రదేశ మండే అతనికి ఇష్టం. తక్కిన సమయంలో చక్కగా అలంకరించిన తన మూడు గదుల వియన్నా అపార్ట్మెంట్లో వుండేవాడు. దాదాపు పాతికేళ్ళు ఆ యింట్లో వున్నాడు.
బ్రామ్స్ నిరాడంబరంగా వుండేవాడు. తన కాఫీ తనే కాచుకుని తాగేవాడు. మాములు హోటళ్ళలో తినేవాడు. రైల్లో మూడో తరగతిలోనే ప్రయాణించేవాడు. అతని అభిరుచులన్నీ సామాన్యమైనవి, సాధారణమైనవి. వియన్నాలో ఏకాంతంగా ఒంటరిగా నడవడం, మిత్రులతో కేఫేల్లో కూరుని ముచ్చటించడం, తన గదిలో సన్నిహితుల ముందు పియానో వాయించడం అతనికి ఇష్టం. బ్రామ్స్ తత్వం చిత్రమైంది. ఒక సారి దయార్ధంగా మనులంటే కరిగి కంపించిపోయేవాడు. ఒకోసారి చాలా మొరటుగా, కఠినంగా (ప్రవర్తించేవాడు. వదులుగా, సంప్రదాయ వ్యతిరేకమయిన వస్త్రధారణ చేసేవాడు. ఎన్నో ఏళ్ళ పాటు చవక బారుగా వున్న బట్టల్ని వేసుకునేవాడు. కానీ మేధా సంబంధమయిన, కళా సంబంధమయిన విషయాల్లో అసాధారణ క్రమశిక్షణ ప్రదర్శించేవాడు. పనిచెయ్యడంలో, చదవడంలో, రాయడంలో చాలా
త్తే
పద్ధతిగా వుండేవాడు. దబ్బువిషయంలో, పిసినారిగా వుందేవాడు. మరో వేపు డబ్బును ఎట్లా వుపయోగించాలో కూడా అతనికి తెలిసేది కాదు, కట్టలు కట్టలు నిర్లక్షంగా అతని గదిలో ఎక్కడపడితే అక్కడ పడేసేవాడు. కష్టపడి పనిచేసేవాడు. మేథో ఆవిష్కారాలలో నిమగ్నమయ్యేవాడు. అతని ప్రతిభను వియన్నాలో మాత్రమే కాదు, యూరోప్ అంతా గుర్తించింది. అతని సంగీత రచనల ప్రచురణ వల్ల అతనికి లెక్కలేనంత డబ్బు వచ్చేది. అతను చనిపోయినపుడు అతని ఎస్టేట్ విలువ లక్ష డాలర్లు. 1879లో బ్రెస్లా యూనివర్సిటీ అతనికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. 1890లో ఆష్టియా. చక్రవర్తి అతనికి 'ఆర్జర్ ఆఫ్ లియోపాల్డ్ సత్మారం చేశాడు. 189లో క్లారా శవయాత్రలో అతను పాల్గొన్నప్పుడు' బ్రామ్స్కు 'శీతలం' చేసింది. అప్పుడు వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల అతను అనారోగ్యం పాలయ్యాడు. దాంతో అతను దాదాపు జీవితాంతం కోలుకోలేదు. లివర్ కేన్సర్ వచ్చింది. హరాత్తుగా 'వృద్ధాప్యం' అతని మీద పడింది. చాలా రోజులు బతకడని సన్నిహితులు కూడా భావించారు. (బ్రామ్స్ నాలుగో సింఫనీ ప్రదర్శన 7వ తేదీ మార్చి నెల 1897లో జరిగింది. 'బ్రామ్స్ పాల్గొన్న చివరి సంగీత ప్రదర్శన అది. ఆ ప్రదర్శనకు వాన్స్ రిచ్టర్ దర్శకత్వం వహించాడు. అది బ్రామ్స్ చివరి సంగీత ప్రదర్శన కావచ్చని ప్రేక్షకులు కూడా అభిప్రాయపడ్డారు. స్టేజి పైన వున్న కళాకారులు, స్టేజి ముందున్న (ప్రేక్షకులు (బ్రామ్స్ కనిపించగానే. అభినందనల కరతాళ ధ్వనుల్లో హాలుని ప్రతిధ్వనింపజేశారు. ఫ్లోరెన్స మే రాసిన బ్రామ్స్ జీవిత చరిత్రలో అదృశ్యం గురించి “ప్రేక్షకుల అభినందనలు నదీ తరంగాల్లా లేచాయి. బ్రామ్స్ ముందుకు వచ్చి ్రేక్షకులందరికి కనిపించేట్లు నిల్చునే దాకా ఆ కరతాళ ధ్వనులు ఆగలేదు. క్రమంగ సంగీత ప్రదర్శన మొదలయింది. ఉత్కంఠంగా సాగింది. అతని ప్రదర్శనని తన్మయంగా ఆనందించారు. అతను అది ముగించి వెళ్ళడదమన్నది ఎవరికీ ఇష్టం లేదు. బ్రామ్ చెక్కిళ్ళ మీద కన్నీళ్ళు జారాయి. (ప్రేక్షకులు గంభీరంగా నిశ్శబ్దంగా వుండిపోయారు. అతనికి వీడ్కోలు చెప్పడం ఎవరికీ ఇష్టం లేదు ఆ ప్రదర్శనతో బ్రామ్స్ వియన్నాకు శాశ్వతంగా దూరమయ్యాడు" అని ఆ రచన దృశ్యాన్ని కళ్ళకు కట్టింది.
నెల తరువాత ఏప్రిల్ మూడవ తేదీ బ్రామ్స్ కన్ను మూశాడు,
“సమస్త వియన్నా సంగీత ప్రపంచం అతని శవయాత్ర వెంట నడిచింది.” అంటూ పేపర్లు రాశాయి ఇంకా' కళాకారులందరూ సమావేశమయ్యారు. శవయాత్ర వెంట సాగారు. ఎంతో దూరం నించీ ఎందరో స్త్రీ పురుషులు చివరిసారి బ్రామ్స్ని దర్శించుకోడానికి తలివచ్చారు. అతని పట్ల తమ గౌరవాన్ని ప్రదర్శించారు అని రాశాయి. త్త
అన్టోన్ బూక్నర్ గీ౧10౧ 5౧40106 4-9-1824 -- 1-10-1896 (బూక్నర్కు దారి చూపిన ఒకే ఒక నక్షత్రం వాగ్నర్. వాగ్నర్ పట్ల అతని అంతులేని ఆరాధనకు, గౌరవానికి ఏదో అజ్ఞాత కారణముంది. వాగ్నర్ని అతను కలవడానికి ముందు గంటల తరబడి నిల్చుని నివ్వెరపోయి వాగ్నర్ని చూసేవాడు. ఆరాధించేవాడు. నిశ్శబ్దంగా వుండి పోయేవాడు. వాగ్నర్ని సమీపించదానికి, మాట్లాడ్డానికి సాహసించేవాడు కాడు. మొట్ట మొదటిసారి వాగ్నర్ని కలిసినపడు వాగ్నర్‌తో మాట్లాడుతున్నంతసేపూ నిటారుగా నిల్చునే వున్నాడు. సుదీర్హంగా సంభాషణలు సాగినంత సేపూ నిల్చునే వున్నాడు. తన దైవం ముందు, మహోన్నతుడి ముందు కూచోడమన్నది అతను కలలో కూడా వూహించలేనిది. వాగ్నర్ రచన ౯౬12! విన్న క్షణంలో బ్రూక్నర్ వాగ్నర్ కాళ్ళమీదపడి “గురువు గారూ! మిమ్మల్ని పూజిస్తున్నాను' అన్నాడు. వాగ్నర్ మరణానంతరం వాగ్నర్ సమాధిని సందర్శించి కన్నీళ్ళు జలజలా రాల్చి, ప్రార్ధించి కానీ వాగ్నర్ నివసించిన 'బేరూతొ అన్న వూళ్ళోకి అడుగు పెట్టేవాడు కాడు.
బూక్నర్ సృజనాత్మక శక్తికి ఆధారం వాగ్నరే. అతని ప్రేరణ వాగ్నరే. అతని జీవితానికి, అతని (ప్రయత్నాలకు పునాది వాగ్నర్. బూక్నర్ బెన్నత్యానికి కారణం వాగ్నర్ ఐనట్లే అతని అంతులేని కష్టాలకు పరోక్షంగా వాగ్నరే కారణం. వాగ్నర్ పేరుతో తరచుగా అనాగరికంగా, బాధ్యతా రహితంగా జరిగే “'యుద్దాల్లో అమాయకుడయిన బూక్నర్ బలి పశువుగా మారేవాడు. కారణం నూటికి నూరుశాతం వాగ్నర్ సంగీతాన్ని బహిరంగంగా అభిమానిస్తూ బూక్నర్ తిరిగేవాడు. వాగ్నర్ని, వాగ్నేరియనిజం'ని నాశనం చెయ్యాలని కొన్ని బలమైన శక్తులు ఆటవికంగా దాడి చెయ్యడానికి వియన్నాలో ఎప్పుడూ సిద్ధంగా వుండేవి.
(బ్రూక్నర్ గౌరవనీయమయిన ఉపాధ్యాయ కుటుంబం నించీ వచ్చాడు. బ్రూక్నర్ చిన్నితనం నించే సంగీతమంటే ప్రాణమిచ్చేవాదు. సంగీతం తప్ప యితరమయిన దేన్నయినా ఒప్పుకునేవాడు కాడు. ఐనా కుటుంబ సంప్రదాయాన్ననుసరించి ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన శిక్షణ కూడా పొందాడు. బ్రూక్నర్ పదమూడో ఏట అతని తండ్రి చనిపోయాడు. ఆ సంవత్సరమే (బ్రూక్నర్ సెంట్ఫ్లోరియన్ సంగీత పాఠశాలలో కోరస్ గాయకుడిగా చేరాడు. అక్కడ నాలుగేళ్ళ పాటు సంగీతంలో గాఢమైన శిక్షణ పొందాదు.
తర్
అతన్ని టీచర్ని చెయ్యాలన్న యింటి వాళ్ళ ఆలోచనేమీ వెనక్కి పోలేదు. లింజ్లో ప్రిపరేటరీ స్ఫూల్లో పది నెలలు టైనింగ్ పూర్తి చేశాడు.
విండ్హాగ్ ప్రాంతంలో ఒక పర్వత ప్రాంత గ్రామంలో ఉపాధ్యాయుడిగా చేరాడు. అతని జీతం నెలకు ఒక డాలరు. తీరిక సమయంలో పొలం పనుల్లో సాయం చెయ్యడం అతని వృత్తిలో భాగం.
(బ్రూక్నర్ “మంచి వుపాధ్యాయుడు” కాడు. ఉపాధ్యాయ వృత్తికి తగిన న్యాయం కలిగించే “శక్తి అతనికి లేదు. అట్లాగే పొలాలకు” సంబంధించిన అతని బాధ్యతను అతను చలకనగా తీసుకున్నాడు. ఫలితంగా దగ్గర్గోవున్న కార్చ్స్ డార్భ అన్న చోట చిన్న స్కూలుకు అతన్ని బదిలీ చేశారు.
సంగీతానికి సంబంధించి అన్ని రకాలు పరీక్షల్లో వుత్తీర్ణుయిన బ్రూక్నర్ని 1845లో సెంట్ స్లోరియన్లోని సంగీత పాఠశాలకు ఉపాధ్యాయుడుగా ఆహ్వానించారు. అతని వుద్యోగ సంబంధమయిన బాధ్యతలు అతని సంగిత అభిరుచికి ఆటంకం కాలేదు. ఆర్గాన్పై సాధన చేసేవాడు. అతనికి సంగీతంపై వున్న అధికారం చూసి సుప్రసిద్ధ యూరోపియన్ సంగీతకారులు ఈర్యపదేవాళ్ళు. అప్పుడే అతను ఎప్పట్నించే కాంక్షిస్తున్న తన మౌలిక రచనల్లో
వొకటయిన 'గం౦41901 11 ౧౧1౧౦౯ సృష్టించాడు.
1858నాటికి సంగీతం కోసం తన వుపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టాడు. వియన్నాలో 'సెటిలయ్యాడు. సైమన్ సెచ్టర్ దగ్గర (శ్రద్ధగా సంగీతం అభ్యసించాడు. (బ్రూక్నర్ది ఎంత గాధమయిన అధ్యయనమంటే ఒక్క “పాఠానికి డజన్ల కొద్దీ నోట్‌బుక్స్ ఎక్సర్‌సైజుల్లో నిండి వుండేవి. సైమన్. నీ అంత (ద్ధ కలిగిన విద్యార్థిని యిష్పటిదాకా చూడలేదు" అన్నాడు (బ్రూక్నర్ కూడా హార్మనీ మొదలయిన వాద్యాలపై ఎంతో (ద్ధగా అభ్యాసం చేశాడు. వియన్నా సంగీతకారులు పెట్టబోయే సంగీత పరీక్షకు సిద్ధమయ్యాడు. చివరకు సుప్రసిద్దలయిన ఐదుమంది సంగీతకారుల పర్యవేక్షణలో పరీక్ష జరిగింది. వాళ్ళు బ్రూక్నర్కు ఇచ్చిన వస్తువును ఆధారం చేసుకుని ఆ వస్తువును అభివృద్ధి చేసి దానిపై కొత్త కొత్త ఆవిష్కారాలు చేసి తన సంగీత ప్రదర్శన చేశాడు. అక్కడ వున్న సుప్రసిద్ధ సంగీతకారులయిన న్యాయ నిర్దేతల్లో ఒకడయిన జోవాన్ హెర్బెక్ అతని ప్రతిభకు ముగ్భడై తనతో బాటు కూచున్న న్యాయ నిర్ణేతలందర్నీ పరికించి చూసి “మనందరికీ కలిసి ఎంత తెలుసునో దాని కన్నా అతనికి ఎక్కువ తెలుసు” అన్నాడు!
1856లో లింజ్ కెథిడ్రిల్లో బ్రూక్నర్ ఆర్జానిస్టు అయ్యాడు. పన్నెందేళ్ళ పాటు ఆ వుద్యోగం చేశాడు. లింజ్లో వుంటూనే తరచూ వియన్నా సందర్శిస్తూ అక్కడ సంగీత జ్
కారుల్లో సంబంధాల్ని కొనసాగించాడు. 1860లో వియన్నా కోరల్ సొసైటీ సంగీత దర్శకుడిగా నియమితుడయ్యాడు. అతని సంగీత ప్రతిభకు వియన్నా తలవంచింది. 1868వ సంవత్సరం అతని జీవితంలో నిర్ణయాత్మకమైంది. మొట్ట మొదటిసారిగా వాగ్నర్ ఒపేరా 72౧౧౧4౪564 ప్రదర్శన చూశాడు. దాంతో తన సంగీతం పట్ల అతనికి తీవ్ర అసంతృప్తి కలిగింది. వాగ్నర్లోని నాటకీయత “నూతన అభివ్యక్తి అతన్ని తీవ్రంగా ఆకర్షించాయి. చర్చి సంగీత రచనను అతను మానలేదు. కాని అతని సంగీతానికి స్వేచ్చని, కాల్చనికతని, వాగ్నర్ సంగీతంలోని సంస్కారాన్ని తెచ్చాడు. అట్లాంటి మొదట్ రచన '[253 1౧ 0 14ఖం/' ఆ రచన ప్రదర్శన లింజ్ పెథెడ్రిల్లో 1864 నవంబరు 20న జరిగింది. 1865లో మ్యూనిచ్‌లో వాగ్నర్ 1114౧ 2౧6] 190166 వరల్డ్ ప్రీమియర్ జరిగింది. మ్యూనిచ్ వెళ్ళిన ఒకానొక బృందానికి బ్రూక్నర్ నాయకుడు. ఆ అనుభవంతో వాగ్నర్ పట్ల అతని ఆరాధన సమగ్రమైంది. వాగ్నర్ని వ్యక్తగతంగా కలిశాడు. తన గురువును మొదటిసారి కలిసినపుడు. ముఖాముఖి కలుసుకున్నప్పుడు అతని మానసిక కల్లోలం ఎలా వుంటుందో మనం వూహించగలం. జంకుతూ తన సంగీత రచనను అతను వాగ్నర్‌కు (ప్రదర్శించాడు. వాగ్నర్ తన గాధాభిమాని ప్రదర్శించిన సింఫనీకి, అతని ఆరాధనకు సానుభూతిగా స్పందించాడు, అభిమానించాడు. బ్రూక్నర్ పట్ల అనురాగంతో, ప్రేమతో స్పందించాడు. తన గురువు ప్రతిస్పందనతో పరవశించిన (బ్రూక్నర్ కదిలిపోయి కన్నీళ్ళు కార్చ కూడా వుండలేకపోయాడు. 1868లో వియన్నా కన్సర్వేటరీలో ప్రొఫెసర్‌గా నియుక్తుడయ్యాడు. ఆష్టియా రాజధాని వియన్నాని తన శాశ్వత నివాసంగా చేసుకున్నాడు. జీవితాంతం మూడు గదుల అపార్ట్మెంట్లో వున్నాడు. కాడి అన్న విశ్వాయ్ పాత్రురాలయిన పని మనిషి అతన్ని జాగ్రత్తగా కనిపెట్టి అతని అవసరాల్ని చూసేది. అతని అనుమతితో నిమిత్తం లేకుండానే అతను సీరియన్‌గా సంగీత రచన చేసుకుంటున్నప్పుడు అతిథుల్ని అతని దగ్గరకు చేరనిచ్చేది కాదు. అతని ఆరోగ్యం పట్ల (శ్రద్ధతో అతను పగటి పూట మాత్రమే పని చేసుకునేట్లు, రాత్రిళ్ళు నిద్రపోయేట్లు అతన్ని 'అదుపు' చేసేది. మొదట కొన్ని ఏళ్ళు వియన్నాలో అతను యిబ్బందిగా ఫీలయ్యాడు. అతని 1255 1౧ ౯ [1౧౦౫ ప్రదర్శన విఫలమైంది. అది 'గానయోగ్యం' కాదన్నారు. కానీ అతని 5౫౧౫- స[0౧౫ 10. 1 ప్రదర్శన 1968లో జరిగి విజయవంతమైంది. అందరి ఆమోదం పొందింది. కానీ ఎవరూ పట్టించుకోని తన 1855 1౧ ౬ [8౧0/ప్రదర్శన కోసం, తన రెండో సింఫనీ ప్రదర్శన కోసం వియన్నా సంగీత ప్రదర్శనశాలని అద్దెకు తీసుకుని దాదాపు తన రెండేళ్ళ జీతాన్ని దానికోసం వెచ్చించాడు. ఇంత శ్రమపడినా జనాల నించీ 'అంతగా' స్పందన త్తే
రాలేదు “నేను ఆకలితో చావకుండా వుండడానికి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చెయ్యాల్సి వచ్చింది” అని ఒక వుత్తరంలో అన్నాడు. బ్రూక్నర్ తన మూడో సింఫనీని వాగ్నర్ని అంకితమిచ్చాడు. వియన్నా వాసుల వ్యతిరేకత, శత్రుత్వం బ్రూక్నర్కు అనుభవానికి రావడం మొదలైంది. వాగ్నర్ వ్యతిరేక శక్తులు అతనిపై దాడిని వుదృతం చేశాయి. వాటిల్లో దారుణమైన దాడి వియన్నాకు చెందిన ప్రముఖ సంగిత విమర్శకుడు. 'ఎడ్వర్ట్హన్స్లిక్ చేసిన విమర్శ. అందులో (బ్రూక్నర్ రెండో సింఫనీ ఎవర్నీ ఏమాత్రం ఒప్పించలేకపోయిందని దాడి చేశాడు. కన్సర్వేటరీకి చెందిన ఒక ఆఫీసర్ నీ సింఫనీలన్నిట్నీ చెత్త బుట్టలో పడెయ్యి' అని సలహా ఇచ్చాడు. మూడ సింఫనీకి ఆర్మెస్ట్రాలోని వాళ్ళందరూ ప్రదర్శనకు వ్యతిరేకించారు. మళ్ళీ 1877 డిసెంబరు 16వ తేదీన ఎవరూ సహకరించుకున్నా తనొకృడే మూడో సింఫనీని ప్రదర్శించాడు. కన్సర్వేటరీ డైరెక్టర్ అది చూసి పగలబడి నవ్వాడు. (క్రేక్షకులు అరుపుల్లో తమ వ్యతిరేకత ప్రదర్శించారు. (బూక్నర్ మౌనంగా తన ప్రదర్శన కొనసాగిస్తూ వుంటే మెల్లగా జనం లేచి వెళ్ళిపోయారు. చివరికి వేళ్ళ మీద లెక్కించగదగినంతమంది మాత్రమే మిగిలారు. పూర్తయ్యాకా బుక్నర్ తల పైకెత్తి చూస్తే అంత పెద్ద ఆడిటోరియంలో కేవలం పాతిక మంది జనం కనిపించారు. వాళ్ళలో ఏడు మంది ఆ ఆడిటోరియరికు సంబంధించిన జనం. ఆ దృశ్యం- చూసి బాధతో (బ్రూక్నర్ చెక్కిళ్ళు తడిశాయి. అతను అక్కడుండగానే అక్కడన్న సంగీతకారులు స్టేజిదిగి వెళ్ళిపోయారు. కానీ కొంత మంది యువకులు పరిగెట్టుకుంటూ స్టేజిపైకి వెళ్ళి తమ అభిమానాన్ని ప్రదర్శించి అతని అభినందించారు. వాళ్ళలో “గుస్టావ్ మవ్లారొ ఒకడు. కానీ తన స్థానంలో స్థాణువుగా (బ్రూక్నర్ నిల్చుండిపోయాడు. తనని చుట్టు ముట్టిన తన కొద్ది మంది అభిమానుల్ని చూసి బిగ్గరగా “దయ చేసి నన్ను వెళ్ళ నివ్వండి. జనం నానించీ ఏమీ తెలుసుకోవాలని కోరడం లేదు” అని అరిచాడు. బ్రూక్నర్ సంగీతం వల్ల, అతనికి వాగ్నర్ పట్ల వున్న ఆరాధన వల్ల మాత్రమే కాదు, అతన్ని శారీరక స్థితి వల్ల కూడా గేలి చేస్తూ హింసించేవాళ్ళు. అతని శరీరం కన్నా అతని తల పెద్దదిగా కనిపించేది. తన శరీరాన్ని మించి వేలాడే బట్టలు వేసుకునేవాడు. అతను వియన్నా వీధుల్లో వెళుతూవుంటే అతన్ని జనం అటపట్టించేవాళ్ళు. మహానగరంలో అనొక గగ్రామీజరైతులా వుండేవాడు. “గుర్తింపు కోసం అతన్లో ఆరాటం వుండేదికాదు. తన గ్రామీణ వస్త్రధారణని అతను వదిలి పెట్టేవాడు కాడు. అతని “అనాగరిక” ప్రవర్తన, పసిపిల్లవాడు లాంటి సహజత్వం చూసి తిరుగు బోతు జనాలు ఆటపట్టించే వాళ్ళు, అతని “బలహీనమైని వినయం, తనని తను తక్కువ చేసుకునే తత్వం వల్ల మరిన్ని యిబ్బందులు శ్రి
పడేవాడు. ఇతర్లని మరీ ఎక్కువగా గౌరవించే తత్వం వల్ల కష్టాల పాలయ్యేవాడు. తన కన్ని తక్కువ వాళ్ళ ముందు కూడా అతను తలవంచి నమత ప్రకటించేవాడు. ఎదుటివాళ్ళ నించీ ప్రేమగా ఒక మాట వచ్చినా, ఎవరయినా చిన్ని వని చేసి పెట్టినా అతను కదిలిపోయేవాడు. కన్నీళ్ళ పర్యంత మయ్యేవాడు. ఎదుటివాళ్ళు అతని ప్రతి స్పందన కి బేజారెత్తేవాళ్ళు. దాంతో అతని 'సహజత్వం'లో అసహజత్వం కనిపించి అతను 'వాస్యాస్పదు” దడయ్యేవాడు. గెహ్రింగ్' అన్న విమర్శకుడు బ్రూక్నర్ గురించి 'కెలివి తక్కువవాడు, సగం మనిషి అన్నాడు. అతని దయా గుణాన్ని తెలిసిన రుడాల్ఫ్ లూయీస్ “సంస్మానవంతమయిన అనుభూతులున్న వ్యక్తి బ్రూక్నర్ ఆకారాన్ని చూసి నవ్వుతాడు. కానీ బ్రూక్నర్ మాత్రం తనని తను చూసుకుని నవ్వడు అన్నాదు.
వ్యతిరేకత, అగౌరవం (బ్రూక్నర్ని చుట్ట ముట్టాయి. దురదృష్ట వశాత్తు బ్రామ్స్ సింఫనీలని అతను విమర్శించడంవల్ల బ్రామ్స్ని అభిమానించే చిన్ని గ్రుంపు అతనిపై దాడికి దిగింది. వియన్నా 'సంగీత సంస్థా ఒక దాని తర్వాత ఒకటిగా అతను (ప్రదర్శన కోసం వాళ్ళకు సమర్పించిన అతని సంగీత రచనల్ని తిరస్కరించింది. అతని దృష్టి సంక్షిష్టమైంది దయనీయమైన అతని శరీరం మరింత వంగి బలహీన పడింది. కేవలం దేవుడు, వాగ్నర్ అతని సొంత సంగీతం మాత్రమే అతన్ని ఐతికించాయి. తన ఆత్మ విశ్వాసాన్ని అతనెప్పుడూ కోల్పోలేదు. వైఫల్యాలు నిరంతరాయంగా మీద పడుతున్నా తన సృజనాత్మకత పట్ల బలమైన విశ్వాసంతో రచన కొనసాగించాడు. “దేవుడు నన్ను తన దగ్గరికి పిల్చి నేను నీ కిచ్చిన ప్రతిభ ఏది? అనడిగితే నేను నా 7౭ 664గ' వ్రాత ప్రతిని ఆయనకిస్తాను. నాకు తెలుసు. ఆయన దయాద్ధహృదయుడయిన న్యాయనిర్దేళు. అన్నాడు. తన సింఫనీల గురించి కూడా ఆయన అఖభిప్రాయమదే.
ఈ దశలోనే, అతని సంగీతం నిర్దయగా తిరస్మరింపబడిన దశలోనే భావనాత్మకంగా అతను మరిన్ని వైఫల్యాల్ని ఎదుర్కొన్నాడు. అతని ప్రేమ వ్యవహారాలన్నీ బెడిసి కొట్టాయి. అతని జీవితాంతం అతను అప్పుడే యవ్వనం మొగ్గతొడుగుతున్న అమ్మాయిల్నే ఇష్టపడేవాడు. అతనికి నలబై మూడేళ్ళ వయస్నుప్పుడు పదిహేడెళ్ళ వయస్ను జోసఫిన్లాంగ్ అన్న అమ్మాయిని ప్రేమించాడు. ఆమె తల్లితం[డ్రులు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోకపోవడం అతనికి అశనిపాతం లాంటి దెబ్బ. పదమూదేళ్ళ తర్వాత అతను మళ్ళీ (ప్రేమలో పడ్డాడు. ఓ సందర్భంలో ఒబెరామెర్లూ అన్న ప్రాంతం సందర్శించినపుడు మేరీ బర్జల్ అన్న పదిహేడు సంవత్సరాల అమ్మాయిని (ప్రేమించాడు. విచిత్రంగా ఈ సారి ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఆశీర్వాదం లభించింది. ఆమోదం దొరికింది. కానీ ఆ అమ్మాయి ఈ ముసలాడితో, తిక్కమనిషితో త్వరలో విసిగిపోయి అతని (ప్రేమ పూరిత వుత్తరాలకు కూడా బదుల్విలేదు.
త్తి
వృద్ధాప్యంలో తన గతంలోని ప్రియురాళ్ళను మళ్ళీ అన్వేషించాడు. జోసఫిన్లాంగ్ను కనిపెట్టాడు. ఆమె పద్నాలుగేళ్ళ కూతురికి తల్లి అని తెలుసుకున్నాడు. ఆ పద్నాలుగేళ్ళ కూతుర్ని 'ఫేమించాడు. తన డ్రేమ వ్యవవిరం వల్ల ఎట్లాంటి ప్రమాదాలకూ ఆస్కారం లేదని అనుకున్నాడు. అతని దెబ్బయ్యేళ్ళ వయసులో తనను కనిపెట్టుకుని వుండే పనమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆమె “తిరస్కరించడంతో అతని మనసు గాయపడింది. తన జీవన భాగస్వామి కోసం అతని జీవిత కాల ప్రయత్నం నిష్ఫలమైంది. ఈ వైఫల్యాలలోనూ సంగీతమే అతనికి ఓదార్చు. అదృష్టవశాత్తు 1881లో హాన్స్ రిచ్టర్ అతని నాలుగో సింఫనీకి దర్శకత్వం వహించాడు. అది అసాధారణ విజయాన్ని పొందింది. జనం ఉత్సాహ ఉల్లాస తరంగాల్లో తేలియాదారు. మొదటిసారి అతని సింవనీని జనం ఆమోదించారు. స్వీకరించారు. దశాబ్దాలుగా ఎదురు చూసిన అతని “విజయం” నిజం కావడంతో అతను గాఢంగా సంచలించిపోయాడు. కన్నీళ్ళు కార్చాడు. ప్రదర్శన పూర్తయ్యాకా నిర్వహకుడికి కృతజ్ఞతలు చెప్పడానికి నమతగా అతన్ని సమీపించాడు. ఒక వియన్నా నాణేన్ని -పతనికి యిచ్చి, నా ఆరోగ్యం కోసం బీరు తాగు అన్నాడు. తరువాతి రోజుల్లో ఆ విషయం చెబుతూ వాన్స్ రిచ్టర్ని తన వాచ్ చెయిన్‌లో అలంకరించుకున్నానని ఆ రోజు తన కళ్ళలో నీళ్ళు వచ్చాయని చెప్పుకున్నాడు. అతని ఏడవ సింఫనీ 1884లో లీష్టిగ్లో ఆర్ధర్ నికిన్స్ ఆధ్వర్యంలో ప్రదర్శింపబడింది. అతని నాలుగో సింఫనీ విజయోత్సవాన్ని అది మించిపోయింది. ఒక అజ్ఞాత విమర్శకుడు ఆ ప్రదర్శన పొందిన విజయంపై బ్రూక్నర్ ప్రతిస్పందన గురించి “వణుకుతున్న అతని పెదాల్ని చూడాలి. అతని నేత్రాలపై కదుల్తున్న చెమట బిందువుల్ని చూడాలి. అతని వుద్రేకాన్ని ఆ గౌరవనీయుడయిన పెద్ద మనిషి అణచి పెట్టుకోవడం ఎంత కష్టమో అతన్ని చూస్తే తెలుస్తుంది. అతని వదనంలో ఒక నిజయితీ కొణికిసలాడుతోంది. అతని మనసులోని ప్రేమానురాగాలు అతని ముఖంలో కనిపిస్తున్నాయి. ఒక సహృదయుడయిన వ్యక్తికి మాత్రమే అది వీలవుతుంది. కష్టాల మధ్య, నిర్ణయ మధ్య కూడా నీరుగారి పోని వ్యక్తికి మాత్రమే వీలయిన సంగతి అది. ఈ ప్రదర్శన చూస్తే ఆ వ్యక్తిని చూస్తే ఆశ్చర్యంతో మనకు మనమే యింత కాలం నించీ ఈ వ్యక్తి మనకు తెలీకపోవడం ఎంత అన్యాయం అనుకుంటాం” అని అన్నాడు. క్రమ క్రమంగా ఇతర ్రదర్శనలన్నీ విజయపరంపరలతో కొనసాగాయి. ఎన్నో యూరోప్ దేశాల్లో ఘన విజయాలు సంభవించాయి. హెర్మన్లివి, మ్యూనిచ్‌లో, ఫెలిక్స్ మోటల్ “కర్ల్సూక్లో కార్ల్మ్యూక్” గ్రాజ్లో ప్రదర్శించారు. హెర్మన్ లివి యిచ్చిన ప్రదర్శన లాంటిది 1827 మొదలు యూరోప్‌లో సంభవించలేదు. ల్
ఈ మధ్యలో 1883లో వాన్నర్ మరణం బ్రూక్నర్ విషాదాలన్నింటిలో బలమైంది. వాగ్నర్ మరణానంతరం '&6ఇ810' అన్న విషాద సంగీత రచన చేశాడని (బ్రూక్నర్ జీవిత కారులన్నారు కానీ బ్రూక్నర్ ఓసారి వాగ్నర్ని కలిసి వచ్చాకా గురువుగారు యిక ఎంతో కాలం జీవించరన్న విషాదానికి లోనై రాశాడు. ఆ సంగతి (బ్రూక్నర్ చెప్పుకున్నాడు. బ్రూక్నర్కు గౌరవం తరువాత గౌరవం దక్కింది. ఆ విజయ పరంపర, సన్మానపరంపర కొనసాగింది. వియన్నా యూనివర్సిటీ 1891లో గౌరవదాక్టరేట్ ఇచ్చింది.
చక్రవర్తి ఫ్రాంజిజోసఫ్ ప్రభుత్వ గుర్తింపు ఇచ్చి సత్కరించాడు. చక్రవర్తి (బూక్నర్కు ఇల్లు పెన్షన్ యివ్వడానికి సుముఖం చూపాడు. దాని బదులు తన సంగీతాన్ని తక్కువ చేస్తూ తనని కించపరుస్తూ రివ్యూ చేసే వాన్స్లిక్ని అదుపులో పెట్టమని చక్రవర్తిని కోరుదామనుకున్నాదు. కానీ అది వీలు పడలేదు. 18వ తేదీ డిసెంబరు 1892న బ్రూక్నర్ ఎనిమిదవ సింఫనీ ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనకు వాన్స్లిక్ వచ్చాడు. కాగల కార్యం గంధర్వులు చేశారన్నట్లు (ప్రేక్షకులే హాన్స్లిక్ిను అవమాన పరిచి అడిటోరియం నుండి బయటకు పంపేశారు. రెండేళ్ళ తరువాత బ్రూక్నర్ డెబ్బయ్యో జన్మదినం వచ్చింది. ఆయన డెబ్బయ్యో ఏడు సందర్భంగా ఆఫ్టియా అంతటా ఉత్సవాలు జరిగాయి. యాఖై ఏళ్ళ పాటు అపజయాలతో, బాధలతో అల్లాడిపోయిన (బ్రూక్నర్ అంతిమ విజయం సాధించాడు. ఆ విజయాల్ని ఆయన ఎంతో కాలం ఆనందించే అవకాశం లేకపోయింది.
1896 జనవరి 12వ తేదీ తన '78 666గ' ప్రదర్శశకు ఆయన హాజరయ్యాడు. తన సంగీత ప్రదర్శనలకు అతను జనం ముందుకు రావడం అదే చివరి సారి. ఆ వేసవిలో అనారోగ్యం పాలయ్యాడు. ఆరోగ్యం బాగుపడుతున్నల్లే, కోలుకుంటున్నట్లే అనిపించాడు. తన తొమ్మిదో సింఫనీ రచనలో మునిగాడు. ఓ సందర్భంలో చలి పెడుతుందని అన్నాడు. టీ యిచ్చారు. కొన్ని నిముషాల తరువాత కన్నుమూశాడు.
ఈల్ |. టీ శ | ర్త టా రణ ర్శే
ఫ్రెడరిక్ ఛోపిన్ 7666110 0౧౦౧1౧ 22-2-1610 -- 17-10-1849 ఛోపిన్ పోలాండ్‌ని వదిలి వెళుతున్నప్పుడు జోసఫ్ ఎల్స్నర్ అతనికి ఒక వెండితో చేసిన పూలకుందీ యిచ్చి దాన్ని చూసినప్పుడల్లా జన్మభూమి ఐన పోలాందడ్ని గుర్తు తెచ్చుకోమన్నాడు. అతనెప్పుడూ కోలాంద్ను విస్మరించలేదు. పోలాండ్ అతనిలో ఒక అనివార్య భాగం. అతని జీవిత చరిత్ర రాసిన కొందరు అతను తన మాతృభూమిని, తన ప్రజల్ని కోల్పోయానన్న దిగులు మనసు పొరల్లో దాగి వుందేదని అన్నారు. ఛోపిన్ ఒక సందర్భంలో “నేను నా పదడకమీద పడుకుని కిటికీ గుండా కనిపించే ఆకాశాన్ని చూస్తాను, అనంత దూరాల్ని అనుశిలిస్తాను. కిటికీ కవతల (ఫ్రాన్సుదేశం విశాలంగా విస్తరించి వుంటుంది. దూరదూరంగా పోలాండ్ దేశం వుంటుంది. అక్కడ నేను మా అమ్మ కళ్ళను చూస్తాన్స, కట్టలు తెంచుకుని నా కన్నీళ్ళు ప్రవహిస్తాయి. అప్పుడు మా అమ్మ గొంతు విప్పుతుంది. “ఫ్రెడరిక్! నువ్వు గొప్ప సంగీతకారుడివి కావాలి. అప్పుడు నిన్ను చూసి పోలాండ్ గర్వ పడాలి” అనేది, అని రాసుకున్నాడు. అతనిలో అనంత కాల్బనికత వుంది. మాతృదేశం పట్ల మమకారం వుంది. జార్జెస్ జీన్ ఆదీ” పోలాండ్! పోలాండ్! అతని గుండె మాతృదేశాన్ని స్పందించేది. పారిస్‌లో సాయంత్రాలు, రాత్రులు సముద్ర తరంగాల్లా అతని మనసును తాకినపుడు, సున్నితంగా సుకుమారంగా ప్రీలతో అతను సంభాషిస్తున్నప్పుడు అతని ఆలోచనల్లో పోలాండ్ కదిలేది” అని రాశాడు. ఛోపిన్ జాతీయాభిమానం అతని ఆవేశాలలో ఒక భాగం మాత్రమే కాదు, అతని
కళలోనూ అది అనివార్య పార్వం. పసివాడుగా వున్నప్పుడు పొలాలలో పోలాండ్ రైతుల పాటల పట్ల, ఆటల పట్ల అతను ఆకర్షింపబడ్డాడు. జానపద సంగీతం పట్ల అతనికి (ప్రత్యేక ఆసక్తి. తరువాతి రోజుల్లో ఉద్దేశపూర్వకంగా జాతీయ సంగీతానికి నిబద్ధుడయ్యాడు. పాశ్చాత్య సంగీతంలో స్లావిక్ అభివ్యక్తితో సంగీతానికి కొత్త కాంతులిచ్చిన మొదటి సంగీతకారుదాయన., పోలాండ్ అంటే ఛోపిన్. ఛోపిన్ సంగీతమంటే పోలాండ్. ఇతర దేశాల సంగీతకారుల్లో జాతీయత లేదని కాదు. పందొమ్మిదో శతాబ్దంలో పోలాండ్ రష్యా ఆక్రమణలో వుండేది. జార్ నిరంకుశ పాలనలో వుండేది. పోలాండ్ జాతీయవాదులకు ఛోపిన్ సంగీతం ఉత్తేజకరంగా వుందేది. స్వేచ్భా స్వాతంత్ర్యాల్ని రేకేత్తించేది. ర్2
పెడరేవ్స్కీ్ తన ఆత్మకధలో “మేము అన్నీ మరచిపోయాం. మా తండ్రుల విశ్వాసాలని, మా జుతీయ వస్త్రధారణని, మాపాటల్ని మా కవుల్ని అందర్నీ మరచిపోయాం. ఒక్క ధోపిన్ని మాత్రమే మరచిపోలేదు. విస్మరించిన, అణచివేసిన అన్నిటి శ్వాసని ఛోపిన్లో దర్శిస్తాం. ఛోపిన్ అవన్నీ మాకు తిరిగి ఇచ్చాడు. పగిలిన హృదయాల పరివేదనల్ని, తిరుగబడిన ఆత్మఘోషల్ని బానిసత్వంలోని బాధల్ని కోల్పోయిన స్వాతంత్ర్యానికి సంబంధించిన వేదనని నిర్భంధాల్సి, విజయగీతాల్ని ఛోపిన్ వినిపించాడు” అన్నాడు. 1939లో నాజీలు పోలాంద్ని ఆక్రమించినపుడు ఛోపిన్ సంగీతం మళ్ళీ జాతీయ గతంగా మారు మోగింది. ఈ సారి అది తిరుగుబాటు స్వరమయింది. పోరాట పాట ఐంది. వార్సా రేడియో రాత్రింబవళ్ళు '2ఆ/01040040/ మొదలయిన ఛోపిన్ రచనల్ని నిరంతరాయం ప్రసరించేది. నిరంతరాయంగా కురుస్తున్న నాజీ.బాంబుదాడుల్లో ఆ గీతాలు జ్వలించేవి. పోలిష్ సంగీతకారుల్లో అద్వితీయుడయిన ఛోపిన్ తండ్రి [ఫ్రెంచి వ్యక్తి స్కూల్ టీచరు. పోలాండ్‌లో స్థిరపడ్డాడు. ప్రభువంశీకురాలయిక స్మార్బెక్కు (ఫెంచి ట్యూటర్‌గా పనిచేసేవాడు. అక్కడే ఆ వున్నత కుటుంబానికి చెందిన జస్టినా క్రజిజనోవస్మాను (పేమించాడు. ఆమె పోలిష్ జాతీయురాలు. ఆమెనే పెళ్ళాడాడు. ఛోపిన్ వాళ్ళ రెండో సంతానం. మొదట అమ్మాయి, తరువాత ఛోపిన్. ఛోపిన్ పుట్టిన కొంత కాలానికి వాళ్ళ కుటుంబం వార్సా తరలి వెళ్ళింది. అక్కడ ఛోపిన్ తండ్రి ఫ్రెంచి ప్రొఫెసర్‌గా పనిచేశాడు. తరువాత సొంతంగా ఒక బోర్డింగ్ స్కూలు (ప్రారంభించాడు. ఛోపిన్ కుటుంబంలో శాంతి సామరస్యం, నాగరికత వుందేవి. ఛోపిన్ బాల్యం సానుకూల వాతావరణంలో హాయిగా సాగింది. ఛోపిన్ సుకుమారుడు, ఊపహిశీలి. ఆనందంలో ఓలలాడే బాలుడు. సున్నిత హాస్యం. సంగీతంలో లాగే అల్లరి పనుల్లో మిమిక్రీలోనూ అరి తేరి వుండేవాడు. తన బాల్యం తొలినాళ్ళలో వాటిలో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు. నిరంతరాయంగా పియానో వాయిస్తూ, దానిపై మధురమధుర స్వరాల్ని మంద్ర గీతాల్ని ఆలపించేవాడు. లలితల లితంగా సంగీతం (ప్రదరిస్తూ ఆమాధుర్యానికి కన్పీళ్ళు కార్చేవాడు. ఛోపిన్కు ఆరేళ్ళ వయసున్నప్పుడు అడాల్బర్ట్ జ్విని, అన్న ఫిడేల్ వాద్యకారుడు పియానో పాఠాలు చెప్పాడు. తన తొలి సంగీతానికి సంబంధించిన ఆలోచనల్ని అభిప్రాయాల్ని పేపరు మీద పెట్టడానికి సహకరించాడు. అప్పటి నించీ భోపిన్ ప్రగతి అప్రతిహతంగా కొనసాగింది. తొమ్మిదవ ఏట ఒక ధర్మ కరృృత్వ సంగీత సమ్మేళంలో తొలి ప్రదర్శన యిచ్చాడు. అది అసాధారణ విజయాన్ని సంపాదించి పెట్టింది. అది మొదలు ర్ం
వార్సా సమాజానికి అతను యిష్ట్రడయ్యాడు. ఉన్నత వర్ణాల కుటుంబాలకు, ఎస్టేట్లకు తరచూ రాక పోకలు ప్రారంభించాడు. తన పడ్డిహేనో ఏట ఛోపిన్ తన తండ్ర్ స్కూల్లో అకడమిక్ విద్యాభ్యాసం కోసం చేరాడు. జోసఫ్ ఎల్త్నర్ దగ్గర పియానో విద్యార్థిగా చేరాడు. ఎల్స్నర్ వార్సా కన్సర్వేటరీకి డైరెక్టర్. అతను ఛోపిన్ “చివరి” గురువు. ఎల్స్నర్ ఉత్తమ ఉపాధ్యాయుడు. దయగలవాడు. విద్యార్థుల వ్యక్తిత్వాన్ని గౌరవించి వాళ్ళని ప్రోత్సహించేవాడు. ఎల్స్నర్కు ఛోపిన్ సున్నితత్వం తెలుసు. సుకుమారమయిన అతని మనస్తత్వానికి అనుగుణంగా (ప్రవర్తించేవాడు. నియమాలతో, నిబంధనలతో ఛోపిన్ని శ్రమపెట్టకుండా అతని కళాతత్వం ఎటు వేపు అతన్ని తీసుకెళితే అటువేపుగా అతను వెళ్ళడాన్ని అనుమతించేవాడు. అతని కాల్బనిక స్వేచ్చలో అతను సాగదాన్ని ఆమోదించాడు. ఎల్స్నర్ ఇచ్చిన స్వేచ్చవల్ల, అనురాగం వల్ల ధ్రోప్లిన్ దాదాపు తన తొలినాళ్ళ నుండే తన వ్యక్తి గత శైలిలో తన సృజనాత్మక వృత్తిని కొనసాగించాడు. అతని “చదువు పూర్తయ్యాకా అతని తండ్రి మిత్రుడొకడు 1828లో బెర్లిన్ నగరానికి అతన్ని ఆహ్వానించాడు. ఛోపిన్ తండ్రి స్నేహితుడి సంగీత జీవితం చూసి ఛోపిన్ ప్రేరణ పొందాడు. అంతేకాదు ప్రయాణాల పట్ల అతని కాంక్ష కూడా పల్లవించింది. యూరోపు సంగీత కేంద్రమయిన వియన్నాను దర్శించాలన్న కోరిక చెలరేగింది. ఆ చిన్ని వయసులో అతను 'కాన్స్టాంట్టియా గ్లాద్కోవ్స్కా' అన్న సంగీత విద్యార్థినిని ప్రేమించాదు. ఆ ప్రేమను తెలుసుకోవడానికి, వ్యక్తీకరించడానికి అతను అసమర్థుడు. ఆ [్రేమ 'అండి దశలోనే వుండిపోయింది. దృశ్యం మారడంతో కొంత వూరట కలిగింది. వియన్నాకు వెళ్ళడానికి ఛోపిన్ తండ్రి డబ్బు తదితర ఏర్పాట్లన్నీ చేశాడు. 1829 వేసవిలో వియన్నా వెళ్ళాడు. అక్కడ బ్రహ్మాండ విజయాన్ని పొందిన రెండు సంగీత ప్రదర్శన లిచ్చాడు. పియానో, ఆర్మెస్ట్రాల్ని వుద్దేశించిన ఒక రచనను ప్రచురణ కర్తకు అందజేశాడు. విజయానికి సంబంధించిన తాత్కాలిక అనుభవం, వికయన్నాలో ఆనందకరమయిన జీవితం విదేశాల ముఖ్య నగరాలలో వుంటూ, జీవిస్తూ, పనిచేస్తూ వుండాలన్న నిర్ణయానికి వచ్చాడు. వార్సా తిరిగి వెళ్ళాడు. ఆ నగరంలో విసుగు పుట్టింది. *ప్రతి స్పందన' లేని పాత (పేమ వ్యవవోరం మళ్ళీ బాధపెట్టింది. చివరికి వార్సాను వదిలి పెట్టడానికి నిశ్చయించుకున్నాడు. 1880 నవంబరు 1న వార్చాను వదిలిపెట్టాడు. అతని వీడ్కోలు సందర్భంగా అతని గురువు ఎల్త్నర్ అతని పట్ల గౌరవంగా సంగీత ప్రదర్శన నిర్వహించాడు. అప్పుడే వెండి పూల కుండీయిచ్చి, “నువ్వెక్కడికి వెళ్ళినా నీ జన్మభూమిని మరచిపోవద్దు. దాని పట్ల విశ్వాసాన్ని హృదయంలో పదిలపరచుకో” అన్నాడు. ఛోపిన్ చలించిపోయాడు. ఛోపిన్ వియన్నా చేరాడు. కొంత కాలానికి పోలెండ్ రష్యన్ నిరంకుశపాలనకు వ్యతిరేకంగా ర్త్ల
తిరుగుబాటు చేసిందన్న వార్త తెలిసింది. తన దేశ విముక్తి కోసం విప్లవ సైన్యంలో చేరి పోరాటం చెయ్యాలన్న ఆవేశం కలిగింది. అతనితో బాటు వియన్నా వచ్చిన అతని ఆత్మీయ మిత్రుడు వాయిసిచోవ్స్కీ అదే పని చేశాడు కూడా. ఆవేశంలో ఒక బండి మాట్లాడుకుని వార్సా సేపు బయల్దేరాడు. మధ్యలో అతని 'వివేకం' పని చేసి బండిని వెనక్కి మళ్ళించమన్నాదు. తల్లికూదా అతను సైనికుడు కావడానికి తగిన శారీరక బలం లేని వాడని అన్నది. తన ఐలహీనతను అప్పుడతను అంగీకరించాడు. తరువాత ఆరు నెలల పాటు వియన్నాలో వున్నాడు ఆతరువాత జర్మనీ వెళ్ళాడు. 1888 జూలై నెలలో రష్యన్ సైన్యం వార్సాని ఆక్రమించిందన్న వార్త తెలిసింది. వెళ్ళి యుద్ధం చెయ్యలేకపోయినా తన దేశాన్ని మళ్ళీ రష్యా ఆక్రమించడం తెలిసి కదిలిపోయాడు. తన పరిమితుల్లో ఆ పరిస్థితికి స్పందించడమంటే తన కళను వ్యక్తపరచడమే. అప్పుడే తన సుప్రసిద్ధ 'ఇ6/010000౧40/ అన్న రచన చేశాడు. ఛోపిన్ జర్మనీ నించీ పారిస్ వెళ్ళాడు. అక్కడ తాత్కాలికంగా కొంత కాలం వుండి తరువాత లండన్ వెళ్ళాలన్నది అతని వుద్దేశం. కానీ జీవితాంతం పారిస్‌లోనే వుండిపోయాడు. లూగీ చెరూజినీ అన్ని ఒపేరా సంగీతకారుడి సహకారం వల్ల ఛోపిన్ పారిస్‌నే తన నివాసం చేసుకున్నాడు. యితరుల ద్వారా తెచ్చిన పరిచయవుత్తరాల్ని అతనికి అందజేశాడు. అతను ఛోపిన్ను పారిస్‌లో (ప్రసిద్ధలయిన సంగీతకారులను పరిచయం చేశాడు. పారిస్ సంగీతకారులు ఛోపిన్ అంటే ఆసక్తి ప్రదర్శింఛారు. 1832 జనవరి 25వ తేదీన పారిస్‌లో మొదటిసారి ఛోపిన్ సంగీత (ప్రదర్శన ఏర్పాటయింది. ఆ ప్రదర్శన విజయవంతం కాలేదు. ఛోపిన్ పియానో శైలి పారిస్ వాసులకు బాగ్గా పరిచితమయిన రీతిలో వుంది. వాళ్ళ అభిరుచికి అది కొత్తగా అనిపించలేదు. పైగా వాళ్ళు ఛోపిన్ సంగీతాన్ని అంతగా ఇష్టపడలేదు కూడా. శక్తివంతుడయిన ప్రసిద్ధ సంగీత విమర్శకుడు ఫేటిస్ “అతని శైలిలో అలవి మీరిన సుఖం వుంది. సందర్భాలలో సమన్వయం లేక అస్తవ్యస్తత కనిపించింది"అన్నాడు. కానీ ఫెలిక్స్, ఫ్రాంజ్ లిస్జ్ట్, ఫెర్టినాండ్ హిల్లర్ మొదలయిన సంగీతకారులు తామొక ఉన్నత గంభీర సంగీతాన్ని అనుభవిస్తున్నామని భావించారు. కానీ ఆ ప్రదర్శన వల్ల వచ్చిన ప్రతిస్పందనకు ఛోపిన్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. జీవితంలో సంగీత (ప్రదర్శనలు యివ్వకూడదనుకున్నాడు. అంతే కాదు ్రాన్సును వదిలి అమెరికా వెళ్ళిపోదామని కూదా నిర్ణయించుకున్నాడు. కానీ రాజకుమారుడు రగడ్డివిలొని కలిసే అవకాశం రావడంతో ఛోపిన్ 'రాతి మారిపోయింది. రాజ కుమారుడి ద్వారా ఛోపిన్ బరోల్ జాస్విస్ నిర్వహించే. '5410॥' కు పరిచయమయ్యాడు. అక్కడ సుప్రసిద్ధులు సమావేశమయ్యేవాళ్ళు. ఛోపిన్ అక్కడ తన సంగీత ప్రదర్శన చేశాడు. విజయాన్ని పొందాడు. ఠ్ర్
అప్పటి మొదలు (ఫ్రెంచి సెలూన్‌కు ఛోపిన్ ప్రేమ పాత్రుడయ్యాడు. సంగీతోపాధ్యాయుడుగా, 'ప్రదర్శకుడిగా, సామాజిక సమావేశాల్లో అందరికీ సన్నిహితుడిగా ఛోపిన్ సంతృప్తి కరమయిన ఆదాయాన్ని పొందాడు. ఆకర్షణీయమైన సెలూన్ జీవితం ఛోపిన్ని ఆనందంలో ముంచింది. అతను అక్కడ యింట్లో వున్నంత వాయిగానూ ఫీలయ్యాడు. కళాకారుడిగానే కాదు, “మనిషిగానూ వూపిరి పీల్చుకున్నాడు. సాధారణంగా ఛోపిన్ గంభీరంగా వుండేవాడు. సెల్ఫ్ సెంటర్డ్, మూడీ మనిషి కానీ సెలూన్ జీవితం ద్వారా అతని వ్యక్తిత్వంలో మార్పు వచ్చింది. ఉన్నత కుటుంబీకుల్తో, సంపన్నులతో కలిసి మెలసి వుండడానికి యిష్టపడ్డాడు. సౌందర్యవంతులయిన స్ట్రీలతో సాహచర్యం అతనికి పరవశాన్ని కలిగించింది. అతను అధికార స్థాయిలో వాళ్ళతో, ప్రసిద్ధ వ్యక్తుల్లో పరిచయాలు కలిగి వుండేవాడు. సెమిటిక్ జాతుల్ని వ్యతిరేకించే వాడయినా యూదుల్లో ప్రసిద్ధ యూదుల్లో సంబంధాలు కొనసాగించాడు. సుఖ సంపదల్లో తేలియాడాలన్నది అతని కోరిక. అతను దారిద్ర్యానికి వ్యతిరేకంగా పోరాదాడు. అన్నిట్లో విలువైన వాటిని ఎంపిక చేసుకునే అతని తత్వం, సున్నితమయిన అతని గుణం అవన్నీ అతని అభిరుచుల్లో ప్రతిబింబించేవి. అతని వస్త్రధారణ ఉన్నత స్థాయిలో వుండేది. ఆకర్షణీయంగా వుండేది. కళాత్మకంగా అతని ఇల్లు చక్కగా అమర్చబడి వుందేది. పూలన్నాా పరిమళద్రవ్యాలన్నా అతనికి ఎంతో ఇష్టం. అన్ని వేళలా సౌందర్యం తనని చుట్టు ముట్టి వుండడానికి అతను ఇష్టపడేవాడు. జార్జిశాండ్ "కష్టాలు, కడగళ్ళ దాటి, మార్పులేని సాధారణ, సాదాసీదా జీవితం దాటి ఛోపిన్ రాజవంశీకుల పంచ చేరాడు. గతాన్ని గాలికి వదిలి ఉన్నత జీవన ద్వారాల గుండా సాగాడు. ఆకర్షణీయమైన జీవితం గడిపాడు. అది నిజం. ప్రతిరోజూ లెక్కలేని సెలూన్లని సందర్శించేవాడు. కనీసం ప్రతి సాయంత్రం విభిన్నమయిన పరిసరాల్ని ఎంచుకునేవాడు. ఆ రకంగా ఇరవై నించీ ముపష్పయిదాకా సెలూన్లని సందర్శించేవాడు. తన వునికితో అక్కడి అతిథుల్ని తన్మయంలో ముంచేవాదు. ఆకర్షించేవాదు. మత్తులో మాధుర్యంలో తేల్చేవాడు” అంది. క్రమంగా అతను (వ్రదర్శకుడిగానే కాక సంగీత న్వరకర్తగా కూడా గౌరవాన్నందుకున్నాడు. అతని సౌందర్యభరితమయిన పియానోసంగీత రచనలు సెలూన్ సభ్యుల్ని ఆనందపరిచాయి., వాటి మాధుర్యానికి, మంద్రగతికి, కాల్చ్బనికతకు, సెంటిమెంటుకు వాళ్ళు ముగ్ధులయ్యేవాళ్ళు. ఆ రచనల ద్వారా ఒక కొత్త ప్రపంచం ఆవిష్కారమైంది. ఆ త్6
సత్యం భవిష్యత్తులో బలంగా ఆవిష్మారమైంది. ఈ మధ్యకాలంలో అతని కీర్తి ప్రతిష్టలు పెరిగి వాటి ద్వారా ఛోపిన్ ఆనందించాడు. అతని తాజా రచనల్ని ప్రచురించడానికి ప్రచురణ కర్తలు పోటీలు పడేవాళ్ళు.
అతని జీవితంలో మరో కోణం అంత విజయవంతమైంది కాదు. అతని రెండో (ప్రేమ 'మారియా వోడ్దిన్స్మాకు సంబంధించింది. ఆమె ఒక ఉన్నత వంశస్టురాలు. గౌరవనీయ కుటుంబానికి చెందింది. పందొమ్మిదేళ్ళ వయసు. ఛోపిన్ ఆ అమ్మాయి వెంటబడ్డాడు. ఆ అమ్మాయి కూడా ప్రోత్సహించింది. కానీ ఆమె కుటుంబం వ్యతిరేకించింది. వాళ్ళ పెళ్ళి జరిగేపని కాదని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఛోపిన్ చెయ్యదగింది ఏమీ లేకపోయింది. ఆ రెండో ప్రేమకు ప్రతిఫలంగా, ఆ చిత్రహింసకు గుర్తుగా వాడిన పూలు, బోలెడు వుత్తరాలు భద్ర పరచుకున్నాడు. ఆ వుత్తరాలకు “నా విషాదం' అని పేరు పెట్టుకున్నాడు. కానీ అతని 'గొప్ప ప్రేమ, అసాధారణ అనురాగ సన్నివేశం అతని జీవితంలోకి యింకా రావాల్సి వుంది.
1887లో లిస్జ్డ్ భార్య ఏర్పాటు చేసే సమావేశాల్లో సుప్రసిద్ధ (ఫ్రెంచి నవలా రచయిత్రి ఆమె తనకు తను పెట్టుకున్న పేరు జార్జి శాంద్ను కలిశాడు. ఆమె గురించి చెబుతూ ఛోపిన్ అంచనా వెయ్యడానికి వీలు పడనంత అసాధారణ స్తీ అసలు ఆమె నిజంగా స్రీయేనా? నాకైతే సందేహమే" అన్నాడు. అతని నాజూకు తత్వం శారీరక బలానికి సంబంధించిన ఆమె అలవాట్లను, దృష్టిని చూసి వెనక్కి తగ్గింది. జంకింది. ఆమె మగవాడి పేరు పెట్టుకోవడమే కాదు. మగాడిలా బట్టలు వేసుకునేది, సిగరెట్లు కాల్చేది. ఆమెకు వున్న “అక్రమ సంబంధాల గురించి సమాజంలో “గొప్ప ప్రచారం జరిగేది. గొప్ప వాళ్ళతో ఆమె సంబంధాల గురించి గుసగుసలు పోయేవాళ్ళ. అవన్నీ సున్నితమయిన ఛోపిన్ మనసును సులభంగా గాయపరిచేవి. పైగా అతని పక్కన ఆవిడ ఆనాకర్షణీయంగా వుండేది. ఛోపిన్ మాత్రం సుందరంగా వుంటూ స్త్రీలను ఆకర్షించేవాడు.
మొదట ఛోపిన్ జార్జిశాంద్ను లెక్కబెట్టకున్నా మెల్లగా అమె వైపు ఆకర్షితుడయ్యాడు. ఫలితంగా ఆమె అతన్ని ఆరాధించింది. ఆమె నిస్సందేహంగా ఆమె తరంలో మేధావిని. రచయి(త్రిగా గౌరవింపబడింది. అభినందనలు అందుకొంది. ఆ నాటి సుప్రసిద్ధ సాహిత్యకారులు ఆమెను గౌరవించేవాళ్ళు. వీటన్నిటి వల్ల ఛోపిన్ ఆమె పట్ల ఆసక్తి ప్రదర్శించాడు. దీన్ని మించి ఆమె శక్తివంతమయిన మెలితిరిగిన కండరాలు అతనిలోని 'ప్రీత్వానికి' సౌకుమార్యానికి సరైన సమాధానలుగా అనిపించాయి. ఆమె అతనికన్నా పెద్దది. ఛోపిన్కు తల్లి అంటే ప్రాణం. ఆమె కళ్ళలో అతను తన తల్లిని చూశాడు.
ఠ్7
వాళ్ళు ఒకర్నొకరు కలవక ముందు పరిచితులే. మాట్లాడుకోకున్నా చాలా సందర్భాల్లో ఒకర్నొకరు చూసుకున్నారు.
1838లో తన నివాస స్థలమయిన నోహాంట్లో వేసవిదినాల్ని గడపడానికి ఆమె ఛోపిన్కు ఆవ్వానించింది. ఛోపిన్ అప్పుడు అనారోగ్యంగా వున్నాడు. వాతావరణం మారినట్లు వుంటుందనీ అనుకున్నాడు. ఆమె నించీ దయను, మమకారాన్నీ పొందవచ్చనీ భావించి ఆమె అహ్వానాన్ని అంగీకరించాడు. ఆమె పట్ల తనకు (్రేమ వుందని ఎప్పుడూ అతను అనుకోలేదు. వాళ్ళది చిత్రమయిన జంట. వారిద్దరి తత్వాలూ ఒకదానికొకటి వ్యతిరేకమైనవి. వారి వ్యక్తిత్వాలు, దృక్బథాలు భిన్నమైనవి. కానీ వాళ్ళిద్దరి మధ్య (పేమ గాఢమైంది, ఉద్వేగ భరితమైంది, ఉద్రిక్తపూరితమైంది.
1888 శీతాకాలంలో జార్దిశాండ్ కొడుకు అనారోగ్యం వల్ల ఆమె మజోర్మాద్తీవిక్రి వెళ్ళింది. భోపిన్ ఆమెను అనుసరించాడు. వాళ్ళ జీవితం అక్కడ ప్రశాంతంగా, ఆదర్శవంతంగా “మధ్యధరా సముద్ర స్వర్గం” లా వుంటుందని భావించాడు. కానీ నిరంతర పీదకలల్లో గడచింది. అక్కడి పట్టణ ప్రజలు వాళ్ళ పట్ల శతృత్వం (ప్రదర్శించారు. కారణం వాళ్ళు చర్చికి హాజరు కాకపోవడం. వాతావరణం తడిగా, చల్లగా ఎడతెరిపి లేకుండా వుండేది. ఛోపిన్ బ్రాంకటీస్త్రో బాధపడ్డాడు. ఛోపిన్కు క్షయ వ్యాధి సోకిందని ద్వీపమంతా పుకార్లు రేగాయి. పట్టణ ప్రజలు వెంటనే తమ పట్టణాన్ని వదిలి వెళ్ళకుంటే చంపేస్తామని బెదిరించారు. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చెయ్యమన్నాడు. వాళ్ళకు పదిహేనో శతాబ్దానికి చెందిన ఒక మరం దొరికింది. అది చీకటిగా, మురికిగా వుండేది. అందులో గదులు శవపేటికల్లా వుండేవి. అక్కడదొరికే తిండి మానవ మాక్రులు తినదగిందిగా వుండేది కాదు. అట్లాంటి పరిసరాల్లో ఛోపిన్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినింది. 'హేమరేజ్లతో, శూన్యంతో, భ్రాంతుల్తో, పీడకలల్లో ఛోపిన్ బాధలు పడ్డాడు. ఒక రోజు అతను పియానో ముందు కూచున్నప్పుడు అతని గురించి జార్జిశాండ్ 'అతని పియానో ముందు కూచుని వున్నాడు. పిచ్చి చూపులు చూస్తున్నాడు, అతని జుత్తు నిక్కబొడుచుకుని వుంది. అతను నన్ను గుర్తు పట్టకముందు అతని పరిస్థితి నిస్సహాయంగా తయారు కావడంతో '్రాన్సుకు తిరుగు ముఖం పట్టాడు. ప్రయాణం మధ్యలో బార్సిలోనా” లో యింకో హేమరేజ్ తాకిడి తగిలింది. అప్పుడు అతనికి విపరీతంగా రక్షస్రావమైంది. అతను దాదాపు చనిపోయాడని అనుకున్నారు. అతన్ని అతని నివాసం నో హాంట్కు చేర్చారు.
అక్కడ కొద్దిగా కోలుకున్నాడు. తన సుప్రసిద్ధ సంగీత రచనల స్కెచ్‌లు అక్కడే తయారు చేశాడు. ల్తి
అదృష్ట వశాత్తు నోవాంట్స్ పారిస్‌ల వాతావరణం వల్ల అతను మెల్లగా కోలుకుని మామూలు మనిషయ్యాడు. అప్పుడు అతని కీర్తి ఉన్నత శిఖరాల్ని అందుకుంది. అనురాగాలు, గౌరవాలు, గారాబాల మధ్య అతని కాంక్షలు నిండిన కళావిష్కారాలు చేశాడు. రెండు సంవత్సరాలు నిరంతర (శ్రమతో అతని ప్రసిద్ధ 50081 1౧ 8- 84. ౧౫100/ రెండు బేలెడ్స్, సుప్రసిద్ధ 54౧12516 1౧ 5 ౧౧౧౦౧ [- క8గా ౧౭౦౧1౧౧౧౧౧ ౦6౯మొదలయిన రచనలు చేశాడు. ఈ రాక్షస శ్రమ అతన్ని పీల్చి పిప్పి చేసింది. 1841 తరువాత అతని ఆరోగ్యం క్షీణించింది. కొన్నేళ్ళు నిశ్శబ్దంగా గడిచాయి. 1648 ఫిబ్రవరి 16న చివరిసారిగా అతను పారిస్‌లో తన సంగీత ప్రదర్శన యిచ్చాడు. అది అసాధారణ విజయాన్ని పొందింది.
జార్జిశాండ్, ఛోపిన్ మధ్య గొడవలు క్రమంగా ఎక్కువయ్యాయి. జార్జిశాంద్ ఛోపిన్తో విసిగిపోయింది. వాళ్ళ సంబంధం తెగిపోయింది. వాళ్ళు విడిసోవదానికి ముందు జరిగిన గొడవ చిన్నది. కుటుంబంలో గొడవ జరిగితే ఛోపిన్ జార్జిశాండ్ కూతురి పక్షం వహించాడు. వాళ్ళు విడిపోయాకా జార్జిశాంద్ యధావిధిగా తన వ్యాసంగంలో మునిగిపోయింది. ఆ ఎడబాటు వల్ల ఆమె మరీ వుద్రేకపడలేదు. కానీ ఛోపిన్ మనసు గాయపడింది. సుదీర్ధమైన అనుబంధం తెగిపోవడంతో అతను కుంగిపోయాదు.
అనారోగ్యంగా వున్నా అతని అభిమాని, మిత్రుడు ఐన జేన్ స్టిర్లింగ్ ప్రోత్సాహంతో ఛోపిన్ ఇంగ్లాండు, స్కాట్లాంద్లు పర్యటించాడు. 1849లో ఇది జరిగింది. దీని వల్ల అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. అట్లాగే పారిస్ తిరిగి వచ్చాడు. ధనవంతులయిన స్నేహితులు ఆర్థికంగా అతన్ని ఆదుకున్నారు. ఎందుకంటే ఆరోగ్య రీత్యా అతనమేమీ సంపాదించే స్థితిలో లేడు. ఉన్నత కుటుంబీకులు తరచూ అతన్ని ఆహ్వానించేవాళ్ళు. పోలెండ్ నించీ అతని సోదరి, బావ మరిది అతన్ని కనిపెట్టుకోడానికి వచ్చారు. అతని జీవితం చివరిదశకు చేరుకుంది. అతను తన సోదరితో అచ్చు కాని తన రచనల్ని తగలబెట్టమని కోరాడు. కేవలంతన రచనల్లో విలువైనవి మాత్రమే మిగిలాలని అతని కోరిక.
మరణానికి ముందు నరాల జబ్బుతో తను బతుకుందగానే పాతి పెడతారని భయపడ్డాడు. తను చనిపోయాకా తన శరీరాన్ని 'కోసి' చూడమని అభ్యర్థించాడు.
1849 అక్టోబర్ 17న ఛోపిన్ కన్నుమూశాడు.గంటల కొద్దీ శరీరాన్ని తైలంతో తడిపిన అనంతరం కన్నుమూశాడు. మాడలీన్ చర్చిలో అతని ఖననం జరిగింది. అది అతని కోరిక ప్రకార జరిగింది. ఆ సందర్భంలో సుప్రసిద్ధ సంగీతకారులు మొజార్ట్ రాసిన “6౧౮416౧ (మరణ గీతం) ఆలపించారు.
ఠ్కి
క్లాడి డెబుస్సి 14౮64౮66 06౦౪55 22-8-1862 -- 25-3-1916 1882లో ఒకరోజు పారిస్ కన్సర్వేటరీలో (ప్రొఫెసర్ లియోడెలిబెస్ లేడ. క్లాసు టీచర్ లేకుండా వుంది. అప్పుడు క్లాసులో వున్న డిబస్సి హార్మనీ వాద్యం గురించి ఎట్లా బోధించాలో విద్యార్థులకు వివరించాడు. తరువాత పియానో దగ్గరకు వెళ్ళి అసాధారణమయిన రీతిలో పియానో వాయించి అనుహ్యారీతిలో శబ్దాల్ని ఆవిష్కరించాడు. ఆ శబ్దాలు కన్సర్వేటర్రీ డైరెక్టర్‌ను ఆకర్షించాయి. పరిగెట్టుకుంటూ క్లాస్ రూంకు వచ్చి “దొంగను పట్టుకున్నాడు, డిబస్సికి “కొత్తు సంగీతాన్ని ఆవిష్కరించాలని కోరిక. అది ఎట్లాంటి దంటే అది సంగిత పారశాలల్లో బోధించనిది. అంతేకాదు మహా మహా సంగీతకారుల సంగీతంలోనూ దొరకనిది. అట్లాంటి సంగీతం కోసం అతని ఆరాటం. అట్లాంటి సంగీతం పట్ల అతని బలమ్లైన కాంక్ష దానికి సంబంధించి నంగీత కళా తత్వ సూత్రాల్ని అతను ఆవిష్కరించకముందే డిబస్సి అట్లాంటి సంగీతాన్ని సృష్టించాడు. డిబుస్సి మళ్ళీ మళ్ళీ క్లాస్‌రూంలో వుపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని నివ్వెపోయెలా చేసేవాడు. సంగీతానికి సంబంధించి తన సాహసాల్ని విలక్షణ రీతిని ప్రదర్శించేవాడు. తన సహజ ప్రతిభతో దిగ్రాంతికి గురి చేసేవాడు. పాఠ్య (గ్రంధాల్ని నియమాల్ని నిబంధనల్ని నిర్లక్ష్యం చేసేవాడు. అతనితో పాట్టు సంగీత పాఠశాలలో చదువుకున్న గేబ్రియల్ పియర్ని “మంత్ర ముగ్గుల్ని చేసే తన అద్భుత శబ్దాలతో మమ్మల్ని ఆశ్చర్యపరిచేవాడు” అన్నాడు. క్లాసులో డిబుస్సి ఎన్నోసార్లు పియానో వాయిస్తూ వుంటే ప్రొఫెసర్ డ్యూరాండ్ అద్దుపడి ఆపమని చెప్పి డిబుస్సి సృష్టిస్తున్న స్వరాలన్నిటికి వ్యతిరేకంగా తలవుపుతూ “ఇవన్నీ సంప్రదాయానికి తీవ్ర వ్యతిరేకమైనవి” అనేవాడు. సంగీత పాఠశాల నించీ బయటపద్డాకా కూడా సంప్రదాయాల పట్ల, అకడమీషియన్ల పట్ల నిర్లక్ష్యంగా, తిరుగుబాటు ధోరణితోనే వుందేవాడు. నిగ౫ 66 గ౧0౧౧౪' లో సంగీత ప్రదర్శనలో విజయం సాధించాకా “నేను కేవలం నా సొంత సంగీతం మాత్రమే సృష్టిస్తాను” అన్నాడు. ఆత్మవిశ్వాసంతో డిబుస్సి ఇక సంగీత స్వరాల్ని సమకూర్చడం (ప్రారంభించాడు. వాటివల్ల కన్సర్వేటరీలోని తెల్లగడ్డాలు భయంతో కంపించాయి. వాళ్ళని షాక్ తినిపించాడు. బాల్యంలో, యవ్వనంలో అతని సహజత్వం (ప్రేరణతో అతను సంప్రదాయ వ్యతిరేక సంగీతం సృష్టించాడు. అది అణచివేతలకు లొంగనంతటి శక్తివంతమైంది. 60
డిబుస్సి తండ్రి మర్యాదస్థడయిన మధ్యతరగతి వ్యాపారస్థుడు. చిన్ని చైనా షాపు వుండేది. డిబుస్సికి మూడేళ్ళ వయసున్నప్పుడు అతని తండ్రి వ్యాపారంలో దివాలా తీశాడు. వాళ్ళ కుటుంబం క్లిచి అన్న ప్రాంతానికి వలస వెళ్ళింది. అతని తండ్రి అక్కడ రకరకాల వుద్యోగాలు చేశాడు. కుటుంబం దరిద్రంతో తల మునకలయి వుండేది. ఆర్ధిక పరిస్థితి వల్ల డిబుస్సిని అతని మేనత్త వరస ఐన ఆవిడ దగ్గరకు పంపారు. ఆమె పరిస్థితి వీళ్ళకన్నా మెరుగ్గా వుండేది. ఈ మార్పు అతని అదృష్టవశాత్తు జరిగిందనే చెప్పుకోవాలి. అతని మేనత్త కళాభిరుచి కలిగింది. ఆమె డిబుస్సికి సుప్రసిద్ధముయిన చిత్రకారుల గురించి సంగీత కారుల గురించి పరిచయం చేసింది. ఆమె దగ్గర ఆ కళాకారుల చిత్రాలు, రచనలు వుండేవి. డిబుస్సి తండ్రి అతన్ని నావికుణ్ణి చెయ్యాలని తలపోశాడు. కాని మేనత్త వుద్దేశాలు వేరుగా వుండేవి. పసివాడుగా వున్న డిబుస్సి లగ్దంబర్ల్ టులేరీస్ ఉద్యానవనాల్లో జరిగిన ఓపన్ ఎయిర్ కన్సర్ట్స్ వినడం వల్ల అతని మనసులో మహదానందం కెరటాలుగా లేచింది. అతని' మేనత్త అతనికి అవకాశాలు కలిగించింది: పియానో పారాలు నేర్పించింది. ఫలితంగా అతని అధ్యయనం గాఢంగా సొగటమే కాక కొత్త కొత్త శబ్దాల ఆవిష్కారాల పట్ల ఉత్సాహం ప్రదర్శించాడు. అతని ప్రతిభను గుర్తించిన అతని మేనత్త ఒకప్పటి ఛోపిన్ శిష్యులయిన మేడం మాటిడి హ్లార్విల్లాని అతనికి ఉప్యాధ్యాయునిగా నియమించింది. ఆమె విద్యార్థిని ప్రోత్సహించే తత్వం కలిగింది. ఉపాధ్యాయుని పారాల్ని ఆసక్తిగా వినే విద్యార్థి డిబుస్సి. పన్నెందేళ్ళ వయసు వచ్చేసరికి డిబుస్సి పారిస్ కన్సర్వేటరీలో ప్రవేశార్దతని పొందాడు. పారిస్ కన్సర్వేటరీలో డిబుస్సి పదకొండేళ్ళ పాటు వున్నాడు. అక్కడ వున్నన్ని నాళ్ళు అక్కడున్న ఆంటోనీ మార్ మొందెల్స్ ఎమిటీ డురాండ్ వంటి అకమీషియన్లను చూసి వవగించుకున్నాడు. అసహనం ప్రదర్శించాడు. నియమ నిబంధనల పట్ల అతని అయిష్టం చూసివాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. పాఠ్య (గ్రంథాల్ని తిరస్కార దృష్టితో చూసేవాడు. అతని వుద్దేశమేమిటో, అతను ఏమి కోరుకుంటున్నాడో వాళ్ళకి అంతు పట్టేది కాదు. కాని అతని స్వాతంత్రానికి, అసాధారణ ప్రతిభకు గుర్తింపు పొందాడు. కొంతమంది సృజనాత్మకతని గుర్తించే ఉత్తమ ఉపాధ్యాయులు కూడా అక్కడ వున్నారు. అతని పట్ల సానుభూతి కలిగిన ప్రగతి దృక్పధం వున్న ఆల్బర్ట్ లావిగ్బాక్, ఎర్నెస్ట్ గురాట్డ్ వంటి టీచర్లు అతన్ని ప్రోత్సహించే వాళ్ళు. దిబుస్సి కొన్ని పైజలు కూడా సంపాదించాడు. డిబుస్సి విష్లవాత్మకమయిన, తిరుగుబాటు ధోరణిని యిష్టపడని మూర్మెంటల్ వంటి టీచర్ కూడా డిబుస్సి సామర్థ్యాన్ని గుర్తించాడు. ఒక రష్యన్ ఉన్నత వంశస్థుడు, కన్సర్వ్టరీలో తమ యింట్లో పియానో పాఠాలు చెప్పడానికి ఒక ౮1
వ్యక్తి అవసరమై వాకబు చేశాడు. వేసవి సెలవుల్లో పియానో పాఠాలు చెప్పగలిగిన వ్యక్తి శావాలి. దిబుస్సి వీప్లవ భావాల్ని యిష్టపదకున్నా మూర్మెంటల్ అతన్ని రెకమండ్ చెయ్యడానికి వెనుకాడలేదు.
'డిబుస్సి నాడెజ్డా ఫిలరెటోవ్నా వాన్మెక్కు పియానో ఉపాధ్యాయుడుగా చేరాడు. ఆమె చయ్కోవ్స్కీ జీవితంలో రహస్య 'ప్రేమికురాలిగా సహాయకురాలిగా పని చేసింది. ఆమె డిబుస్సిని ప్రాన్సులోని లాయిర్ జిల్లాలో వున్న తమ ఎస్టేట్‌కు తీసుకెళ్ళింది. అక్కడ తన బాధ్యతలు నిర్వరిస్తూ ఆమె కూతుళ్ళకు పియానో పారాలు నేర్చించాడు. కుటుంబ సంగీతోపాధ్యాయాల్లో ఒకడయ్యాడు. 1880 వేసవిలో అతను నాడెజ్ఞా కుటుంబంతో కలిసి ఫ్రాన్సు, ఇటలీ, ఆఫ్టియాలు పర్యటించాడు. తిరిగి 1881, 82ల్లో వేసవికాలాల్లో మళ్ళీ అదే వుద్యోగంలో కొనసాగాడు. ఆ రెండేళ్ళు ఈ సారి వాళ్ళ రష్యాలోని ఎస్టేట్‌లో గడిపాడు.
వాన్మెక్ కూతుళ్ళలో ఒకమ్మాయిని డిబుస్సి గాఢంగా ప్రేమించాడు. అతని 'జేవితంలో మధురమయిన బలమైన ప్రేమల్లో అది తొలిప్రేమ. మేడమ్ వాస్నియర్ అతని పియానో స్టూడెంట్లలో-ఒకటి. ఆమె అతని కన్నా పెద్దది. పెళ్ళయింది. ఆ రెంటినీ అతను లక్ష్యపెట్టలేదు. ఆమె, అతని భర్తా యిద్దరూ అతన్ని తమ యింటికి ఆహ్వానించారు. డిబుస్సికి ఆమె' పట్ల ఆరాధన అతిశయించింది. అట్లా కనీసం వారానికి ఒక రోజు వాళ్ళింటికి వెళ్ళాడు. ఆ విధంగా ఐదేళ్ళపాటు వెళ్ళాడు! అక్కడ సంగీత అధ్యయనం చేసేవాడు. స్వరకల్పన చేసేవాడు. పియానో వాయించి వాళ్ళని వుల్లాసపరిచేవాడు. లేదా చిలిపి పనులతో వుడికించేవాదు. వాళ్ళతో కలిసి పేకాట ఆడేవాడు. కానీ అన్ని వేళలా మేడమ్ వాస్నియర్ని ఆరాధించేవాడు. తన తొలి అపూర్వ మధుర గీతాల్ని ఆమెకు అంకితమిచ్చాడు. అవి "౬౯ 50046106, గొ౧౦౦|౧6, 6141 66 14౧౪ మొదలైనవి. డిబుస్సి పిచ్చి ప్రేమకు ఆమె ప్రతిస్పందించడం అసొధ్యం.
నిగ 66 గంగాం సంగీత పరిషత్తులో విజయం కోసం డిబుస్సి రెండుసార్లు ప్రయత్నించాడు. రెండుసార్ల విఫలం చెందాడు. మనసు గాయపడింది. 1884లో మూడోసారి ప్రయత్నించాడు. ఆ సంవత్సరం జూన్ 27న అతజణ్జి విజయం వరించింది. చివరికి తన చిరకాల వాంఛ నెరవేరింది కానీ మేడమ్ వాస్నియర్ని వదిలి వెళ్ళడం దుస్సహమనిపించింది. ౧4 66 గ0౧౧6 విజేత మూడేళ్ళపాటు రోంలోని ౪1 ౧౧661౦1 లో వుండాలి. తప్పని సరై రోం వెళ్ళాడు. రోం అతనికి నచ్చలేదు. అక్కడ అంతా అస్తవ్యస్తంగా అనిపించింది. అక్కడి వాతావరణం, జనం, ఆహారం, సంగీతం అక్కడ తను వుంటున్న ప్రదేశంలో తనపై విధించిన 62
నియమ నిబంధనలూ వాటన్నిట్నీ అతను భరించలేకపోయాడు. ఈ 'నరకం' నించీ తప్పించుకోడానికి అతను వాగ్నర్ సంగీత రూపకాల్ని అధ్యయనం చెయ్యడంలో మునిగాడు. వాటితో గొప్ప ఆనందాన్ని పొందాడు. వాగ్నర్ పట్ల అతనికి అంతులేని అభిమానం కలిగింది. కానీ 'పారిస్‌కు పారిపోవడానికి అదొక్కటే చాలదు కదా! అతని వుద్దేశమల్లా మళ్ళీ 'రోం'కు తిరిగి రాకూడదని. వాస్నియర్ కుటుంబం అతన్ని ఒప్పించి తిరిగి మూడేళ్ళ అతనికి అనుకూలాలు సమకూర్చేలా చేసింది.
కొద్ది కొద్ది విరామాలతో అతను కన్సర్వేటరీకి తిరిగి వెళుతూ వచ్చాడు. కొత్త సంగీత ఆవిష్కారాలతో అభివృద్ధి చెందాడు. పారిస్‌లోని సంగీతకారులు, అకడమీషియన్లు అతని రచనలు ప్రదర్శించడానికి అసాధ్యాలని, అసందర్భాలని ఎట్టి పరిస్థితుల్లోనూ వీలుపడనివని వ్యతిరేకించారు. అతనిపై అలా అంతులేని విమర్శలు కొనసాగాయి.
1887 వసంతకాలంలో 'రోమన్ జైలు” నించి శాశ్వతంగా పారిపోవడానికి నిర్ణయించుకున్నాడు. అప్పటికింకా అతని మూదేళ్ళ గడవు పూర్తి కాలేదు. ఐనా అతను తన ప్రియమైన పారిస్ చేరాడు. తన సంగీత రచన '7౧8 0165566 04౧౧౦26]! ని సంగీత నిష్టాతులకు సమర్పించాడు. న్యాయ నిర్దేతలు అతని 'నిస్సార మయిన రచనను తిరస్కరించి, అది ఆశించిన స్థాయిలో లేదని తీర్మానించారు.
డిబుస్సి మళ్ళీ వాగ్నియర్ కుటుంబంలో స్థిరపడడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడ ఆశాకిరణం కనిపించలేదు. ఆలోటును పూరించడానికి గేబ్రియల్ ద్యూపాంట్ కు దగ్గరయ్యాడు. ఆమెను ఆకుపచ్చ అందగెత్త అనేవాడు. రూడి లాండర్స్ ప్రాంతంలో ఇల్లు తీసుకుని ఆమెతో కలిసి జీవించాడు. పదేళ్ళపాటు ఆమె అతని యింటిని చక్కబెట్టింది. అతని అవసరాలు చూసింది. అతని పట్ల దయా(ద్రంగా మెలిగింది. అతను తన సంగీత సృష్టిలో వున్నప్పుడు అతనికి ఎట్లాంటి యిబ్బందీ కలగ కుండా చూసింది. అతనికి అన్ని అనుకూలాల్చ్సి ఆనందాల్ని కలిగించింది.
డిబుస్సి కెఫెల్లో అభివృద్ధి దృష్టి వున్న అభ్యుదయ దృక్పథమున్న ఎందరో కళాకారులతో సమావేశమయ్యేవాడు. (ఫెంచి కవిత్వంలో, కళల్లో వస్తున్న పరిణామాల గురించి, సమకాలీన విషయాల గురంచి వాళ్ళతో చర్చించేవాడు. అట్లాంటి వాళ్ళలో సింబలిస్టు కవయిన ప్టీఫెన్మల్లార్మే ఇంప్రెషనిస్టు చిత్రకారులయిన మానెట్స్ రినాయిర్ మొదలయిన వాళ్ళుండేవాళ్ళు. ప్రతి మంగళవారం సాయంత్రం వీళ్ళు, వీళ్ళ అనుయాయులు కలసుకుని సమకాలీన, సాహిత్య, కళా ఉద్యమాల గురించి కొత్త కొత్త సొందర్య విషయాల గురించి
63
చర్చించుకునేవాళ్ళు. చాలా కాలం డిబుస్సి వాళ్ళలో ఒకడుగా వున్నాడు. అక్కడ కలిసి వాళ్ళ అభిప్రాయాలతో డిబుస్స్పి, ప్రభావితుడయ్యాడు. (ప్రత్యేకించి 60061౧1106 (ఫెంచి సంగితకారుడయిన ఎరిక్ సాటి తోడి చర్చల పర్యవసానంగా తన ఆలోచనల్లో మెరుపులు మెరిపించి సంగీతంలో స్వచ్భతని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. తన స్వకీయమైన శైలిని వదిలిపెట్టకుండానే సింబలిస్టులు, ఇండ్రైషనిస్టులు కవిత్వంలో చేస్తున్న ప్రయోగాల లాంటిదే తన సంగితంలో చేశాడు. అప్పటి నించీ తన సంగీత రచనలో ఉన్నతోన్నత రచనలు చేశాడు. ౧48గ61 1౧ ఆ 111౧0/అన్న డిబుస్సి రచన పారిస్‌లో (ప్రదర్శింపబడింది?. పరిచయం చేయబడింది. ఆ రచన భాష విలక్షణమైంది, కొత్తది - చాలా మంది విమర్శకులు దాని గొప్పతనాన్ని గుర్తించలేకపోయారు. ఒక విమర్శకుడు” “ఆధునికతలో ఆటవికత' అని అభివర్ణించాడు. తక్కినవాళ్ళు అందులోని సంప్రదాయ వ్యతిరేకత పట్ల నిరసన (ప్రకటించారు. కానీ డిబుస్సి వీటిలో సంబంధం లేకుండా తన సంగీత రచన కొనసాగంచాడు. ఆతని అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగింది. 1893 నించి 1899 దాకా డిబుస్సి ఎంతో వైవిధ్యమున్న ఎన్నో సంగీత రచనలు చేశాడు. అతని వ్యక్తి గత జీవితంలో మార్పులు కలగసాగాయి. ఆకుపచ్చ అందగత్తె స్థానాన్ని రోసళీ టెక్సియర్ ఆక్రమించింది. ఆమె బట్టలు కుట్టేది. ఉన్నత వర్ణాల అభిరుచులు కలిగింది. సంగీతానికి సంబంధించి ఆమెకు జ్ఞానం శూన్యం. ఎర్రటి జుత్తు, ముచ్చటయిన నోరు, ఆకర్షణీయమైన వర్చస్సు. డిబుస్సి ఆమె (ప్రేమలో పడ్డాడు. 1899 అక్టోబరు 19న వాళ్ళ పెళ్ళి జరిగింది. అమెను ముద్దు పేరుతో 'లిల్లీలిలో అని పిలిచేవాడు. ఆమె అభిరుచులు వేరు. అతని అభిరుచులు వేరు. ఆ కాలంలో రాసిన 'గ8|625 61 /1611540606' అన్న రచన 1902 ఏప్రిల్ 80న పారిస్‌లో ప్రదర్శింపబడింది. శత్రుత్వంతో, అపనిందనల్తో, తప్పుడుగా అర్థం చేసుకోవదాల్లో ఆ రచనపై విమర్శకులు విరుచుక పడ్డారు. అంత వ్యతిరేకతను అప్పటి వరకూ ఏ ప్రదర్శనా ఎదుర్మోలేదు. డిబుస్సి ఫ్రాన్సుకు చెందిన సుప్రసిద్ధుడయిన 'రెచ్చగ్గొట్టే సంగీతకారుడు. ఇప్పటికీ ఆయన ఒక 'కల్టొకు నాయకుడు. హద్దుల్ని బద్దలు చేసే ఆయన సాహసానికి యిప్పటికీ అళనికి ఆరాథకులున్నాడు. తన వ్యతిరేకతల పట్ల నిర్లక్ష్యంతో తన సంగీత యాత్రను కొనసాగించిన వాడు డిబుస్సి. రడ
1904 నాటికి తన భార్య 'లిల్లీలిలో' యథార్థ స్వరూపాన్ని డిబుస్సి చూడ్డం మొదలు పెట్టాడు. తన పట్ల అనురాగం చూపే వ్యక్తి కోసం, తనను అర్ధం చేసుకుని ఆదరించే వ్యక్తికోసం, మళ్ళీ అన్వేషణలో పద్డాదు. ఎమ్ముబర్జాక్ అన్న సంపన్నుడయిన బ్యాంకర్ భార్యను పేమించాదడు. ఆ సంగతి తెలిసి 'లిల్లీలిలో' తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమె ఆత్మహత్యకు డిబుస్సి కారణమని అందరూ అతనిపై నిందమోపారు. అతని స్నేహితుల్లో కొంత మంది మళ్ళీ అతన్తో ఎప్పుడూ మాట్లాడలేదు. 'లాలోయ్' అన్న విశ్వాసపాత్రుడయిన మిత్రుడికి వుత్తరం రాస్తూ డిబుస్సి “నా చుట్టూ లెక్కలేనన్ని ఎదారులున్నాయి” అన్నాడు. ఇంకా “అన్నిటితో విసిగిపోయిన వాణ్ణి. అది అసహ్యకరం, విషాదం, నిజమే నేను లెక్కలేనని కష్టాలు పద్దాను. నైతికంగా తలకిందులయ్యాను” అని రాశాడు. ఎమ్మా డిబుస్సి యిద్దరూ తమ భర్తతో, భార్యతో విదాకులు తీసుకుని పెళ్ళి చేసుకున్నారు. మిగిలిన జీవితమంతా డిబుస్సి ఎమ్మా పట్ల అనురాగంతో గడిపాడు. 1905లో వాళ్ళకు అమ్మాయి కలిగింది. అమ్మాయిని డిబుస్సి 'ఛూఛూ' అని ముద్దు పేరుతో పిలిచేవాడు.
డిబుస్సి జీవితంలోని చివరి దశాబ్బమంతా భౌతిక, మానసిక బాధల్లో గడిచింది. కేన్సర్‌తో బాధడ్డాడు. బాధాకరమయిన రెండు ఆపరేషన్లతో నరకయాతన పడ్డాడు. వాటి పర్యవసానంగా బలహీన పడ్డాడు. తనని తను 'నడిచేశవం” అని అభివర్ణించుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలు కావడంతో పరిస్థితులు మరింత విషమించాయి. ఆర్థికంగా తీవ్ర యిబ్బందులకు లోనయ్యాడు. పెట్రోలుకు, తిండికి కూడా డబ్బుల్లేక యిబ్బందులు పద్డాదు. అతని ప్రదర్శనల వల్ల ఫలితం లేకపోయింది. కానీ నిరంతరం అధ్యయనంలో మునిగి వుండేవాడు. ఒకప్పటి ప్రతిభావంతుడి సృజన శక్తులు.బఐలహీన పడజొచ్చాయి.
1918 మార్చి 17న అకాడమీ ్రాన్సులో ఖాళీ అయిన సీటు కోసం అప్లే చేశాడు. కానీ ఆ నియామకాన్ని అందుకోదానికి ఆయనకు వీలుపడలేదు. కారణం ఎనిమిది రోజుల తర్వాత ఆయన చనిపోయాదు. పేపర్లన్నీ ఎక్కడో మారుమూల ఆయన మరణ వార్తను ప్రచురించాయి. ఫ్రాన్సు దేశం అప్పుడు యుద్ధంలో తలమునకలై వుంది. అతని శవయాత్రలో కొద్ది మంది మిత్రులు, బంధువులు పాల్గొన్నారు. ఆయన మరణించిన కొన్నాళ్ళకు 'హరాత్తు'గా ఫ్రాన్సుకు చెందిన *'మహా సంగీత కారుడు మరణించాడన్న విషయాన్ని ప్రపంచం గుర్తించింది.
అతను ఉచ్చదశలో వున్నప్పుడు డిబుస్సి సుప్రసిద్ధుడు. పారిస్ వీధుల్లో కెఫేల్లో అందరూ ఆయన్ని గుర్తు పట్టేవాళ్ళు. వక్కకి వారిగిన టోపీ, పెద్ద నుదురు, నల్లని గడ్డం, అతని వొంకుల జుత్తు నుదురు మీద పడుతూ వుందేది. అతని నల్లని కళ్ళు ఆకర్షణీయంగా
65
వుండేవి. అతని బొద్దుగా వున్న రూపం మొద్దు మనిషి అనిపించినా అతని నిర్మలమయిన కదలిక దయని వర్షించేది అతని ఆత్మకధ రాసిన ఆస్కార్ ధాంప్సన్ొ అతనిలో అణవణువు దయ వర్షించేది అని రాశాడు. అతనికి సంగీతాన్ని మినహాయిస్తే పిల్లులంటే ప్రాణం. అతని.యింట్లో వస్తువుల్లోనూ పిల్లి బొమ్మలున్న చైనా పింగాణీ పాత్రలు తప్పని సరిగా వుండేవి.
డిబుస్సి బలహీనతల్లా కళాకారుల్తో, రచయితల్లో కెఫెల్లో తెల్లవార్లూ మేలుకుని చర్చిస్తూ వుండడం, అతనికి ఇష్టమయిన కఫెలు '0%41 ౧01, 0౧62 ౪/6061! 6౧156౧8 ౧4౪5561 సర్మస్ అన్నా అతనికి ఇష్టం. పుస్తకాలి "సేకరించడం అతని హాబీ. 656
ఫ్రెడరిక్ డేలియస్ 76661104 061145 29-1౮862 -- 10-6-1934 దేలియస్ తన జీవితంలో మొదటి సగభాగం ప్రపంచం చూశాడు. విపరీతంగా తిరిగాడు. విస్తృతంగా పర్యటించాడు నిర్లక్ష్యంగా బతికాడు. తక్కిన సగం జీవితంలో ప్రపంచంనించి వుపసంహరించుకుని ఒక చిన్ని (ఫ్రెంచి టౌన్లో ఏకాంతంగా, ఒంటరిగా గడిపాడు డేలియస్కి చిన్నప్పటి నించే సంగీతమంటే యిష్టం ఎట్లాంటి ప్రయత్నం లేకుండానే చిన్నప్పటి నించీ పియానో, వయోలిన్ వాయించేవాడు. యితరుల్నించీ నేర్చుకోలేదు. అతని తండ్రి సంపన్నుడయిన ఉన్ని వర్తకుడు జర్మనీకి చెందినవాడు తన కొదుకు సంగీతాఖి రుచి పట్ల ఆయనకేమంత ఆసక్తి లేదు. తన వ్యాపారాన్ని తన కొడుకు కొనసాగించాలన్నది ఆయన అభిమతం అందుకుని వ్యాపార సంబంధమయిన విద్యలో అతను శిక్షణ పొందాలని అభిప్రాయపడ్డాడు. అందుకని డేలియస్ని జర్మనీ పంపాడు. అక్కడ వున్ని వ్యాపారం గురించి అధ్యయనం చేయమన్నాడు అయిష్టంగానే డేలియస్ అర్ధమనస్కంగా ఆ పని చేశాడు. అక్కడ వాగ్నర్ '016 1615161086" సంగీత ప్రదర్శన చూసి పరవశించి, సంగీతమంటే యిది కదా అని ఆనందించాడు. ఇంగ్లాందుకు తిరిగి వచ్చి తండ్రి వ్యాపారంలోకి ప్రవేశించాడు. అక్కడ రెండేళ్ళపాటు వున్నాడు. ఎంత సేపూ కుర్చీలో కూచుని ఎక్కడికీ కదల్లేని పరిస్టితి వల్ల అతనికి విసుగు కలిగింది ఎక్కడికో ఎగిరిపోవాలని ఎక్కడెక్కడో తిరగాలని కలలు కంటూ వుండేవాడు. ఒకరోజు ష్టారిడా గురించి చదివాడు అక్కడి సమశీతల వాతావరణం, ప్రశాంత పరిసరాలు, ఆదిమ జాతుల తెగలు, అన్నీ అతని ఆలోచనల్ని కమ్ముకున్నాయి. అక్కడికి వెళ్ళాలన్న కోరిక కలిగింది. తనని అక్కడికి పంపమని తండ్రిని అభ్యర్థించాడు. అతను తన కొడుకుని పరిశీలిస్తూ వస్తున్నాడు తన కొడుకు వ్యాపారానికి పనికి రాడని నిర్ణయానికి వచ్చాడు. తన కిష్టం లేకున్నా కొడుకు కోరికని కాదనలేక సరే అని అనుమతించాడు. అంతేకాదు. కొడుకు అనుకూలం కోసం తగిన సహాయం, ఏర్పాట్లు చేశాడు. ఫ్లోరిడాలోని సాలోనో (ప్రాంతంలో బత్తాయి చెట్ల పెంపకానికి ఏర్పాట్లు చేసి వాటిని పర్యవేక్షిస్తూ జీవించమని కొడుక్కి చెప్పాడు. 6/7
పొలోనో ఒక మారుమూల ప్రాంతం. సెంట్జాన్ నదీ తీరంలోనిది. 1884లో దేలియస్ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే అక్కడి ఆటవిక వాతావరణానికి, ఆదిమ సౌందర్యానికి ఆకర్షింప బడ్డాడు అక్కడి సమశీతల వాతావరణం అతనికి ఆహ్హాదాన్ని కలిగించింది. ఆరంజి చెట్లని నాటి దారిన వాటిని వొదిలేశాడు. చదువుకోవడంలో, వుల్లాసంగా గడపంలో నీగ్రోలతో ముచ్చట్లాడుతూ, వాళ్ళ పాటలు వింటూ, వాళ్ళ డాన్సులు చూస్తూ కాలం గడిపాడు. మొసలి పిల్లల్ని వేటాడ్డంలో గడిపాడు. బాహ్య ప్రపంచంలో సంబంధం లేకుండా అక్కడ గడిపాడు నీగ్రోల మధ్య జీవించే తెల్లవాడిగా ఉల్లాసంగా జీవించాడు జేలియస్ తనతో బాటు తెచ్చుకున్న వయోలిన్‌పై సంగీతాన్ని ఆవిష్కరించేవాడు. పియానోపై కూడా. జాక్ సన్విల్లికి మూడు రోజుల పాటు ప్రయాణించాడు. అక్కడ రకరకాలయిన సంగీత సాధనాల అన్వేషణలో వుంటే ఒక ఆగంతకుడు పరిచయమయ్యాడు అతని పేరు ధామస్ ఎఫ్. వార్డ్. న్యూయార్క్‌లోని (బ్రూక్లిన్ నించీ వచ్చిన అర్గానిస్టు ఆరోగ్య దృష్ట్యా దక్షిణ ప్రాంతానికి వచ్చాడు డేలియస్ రకరకాలయిన పియానోలపై విచిత్రంగా వింత వింత శబ్దాల సమ్మేళనంతో రాగాలు ఆవిష్కరించడం చూసి అతను ఆకర్షింపబద్దాడు, అతను దేలియస్తో సంగీతం గురించి సంభాషించడం మొదలు పెట్టాడు. ఆ సంభాషణ రాత్రి భోజనాల దాకా కొనసాగింది. డేలియస్ తనతో బాటు పోలానో రమ్మని వార్డ్‌ని కోరాడు. యిద్దరూ 'సోలాగో' చేరారు. అక్కడ వార్డ్ ఆరు నెలల పాటు డేలియస్కు సంగీతాన్ని స్వర సమ్మేళనాన్ని బోధించాడు. సంగీతానికి సంబంధించిన సాంకేతిక జ్ఞానాన్ని పరిచయం చేశాడు. అదృష్టవశాత్తు అతను మంచి ఉపాధ్యాయుడు దేలియస్ తరువాతి రోజుల్లో లీష్టిగ్లో చదువుకునే రోజుల్లో వార్డ్ చెప్పిన దాన్ని మించి అక్కడేమీ నేర్చుకోలేదని అన్నాడు. “వార్డ్ చెప్పిన సాంకేతిక విషయాల నించి నేనెంతో ప్రయోజనాన్ని పొందాను” అని చెప్పుకున్నాడు యింకా “అతని దగ్గర నా అధ్యయనం పూర్తి అయ్యేసరికి సాంప్రదాయిక మయిన సాంకేతిక జ్ఞానం ఏమేరకు ఉపయోగపడుతుందో తెలుసుకునే అంతరద్భష్టిని నాకు అతనిచ్చాడు” అన్నాడు. వార్డ్ దగ్గర అభ్యసించిన ఆరునెలల్లో అతను తన వృత్తి 'సంగీత స్వరాల్ని నిర్మించడమే” అని నిర్ణయించుకున్నాడు. అట్లాంటి ఏకాంతంలో, ఒంటరితనంలో వుంటే తన సృజనాత్మకతను అభివృద్ధి పరచుకులేనని నిశ్చయించి ఎంతో కాలంగా దూరమయిన ప్రపంచంలోకి అడుగుపెట్టాలని తీర్మానించుకున్నాడు. 1885లో సెంట్ జూన్ నది గుండా ప్రయాణించి జాక్సన్ విల్లిలో 'సెటిలయ్యాడు తాత్కాలికంగా అక్కడున్న యూదుల సినగాగ్ (ప్రార్ధన స్తలం)లో వాద్య సంగీతాన్ని ఆలపించాడు. అక్కడ వున్న రబ్బీ (యూదుమత గురువు) రెకమందేషన్ లెటర్ ౮65
తీసుకుని వర్జీనియాలోని డాన్విల్లీ చేరి అక్కడ ఓల్డ్ రోనోక్ ఫిమేల్ స్కూల్లో సంగీత అధ్యాపకుడిగా చేరాడు అతను సంగీతం అందించే తీరుకు అక్కడి వాళ్ళు ఎంతో ఆనందించేవాళ్ళు. మాండెల్సాన్ సంగీత ప్రదర్శనలో అతని నైవుణ్యానికి ఎంతో 'ప్రభావితులయిన జనం అతన్ని అభినందించారు. స్థానికంగా అతను పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు సంపన్నులయిన అక్కడి తోటల యజమానులు తమ కూతుళ్ళను సంగీతం నేర్చుకోడానికి అతని దగ్గరకు పంపేవాళ్ళు. సంవత్సరం రోజుల్లో కావలసినంత సంపాదించి అవసరమైనంత వెనకేశాడు వార్డ్ తనలో రేకెత్తించిన కోరికకు కార్యరూపమిచ్చాడు. లీప్టిక్ కన్పర్వేటరీకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. 1886లో వేసవిలో లీష్టిగ్ వెళ్ళి కన్సర్వేటరీలో చేరి సిట్స్ జదాసాన్, రీనెక్ల దగ్గర సంగీతాభ్యాసం చేశాడు సంగీత ప్రదర్శనశాలల్ని అన్వేషించాడు. సెలవుల్లో నార్వే పర్యటించాడు. ఆ దేశమంటే అతనికి ప్రేమ
1887లో ఎద్వర్డ్గ్రిగ్ లీప్టిగ్ వచ్చాడు. అతనికి దేలియస్ని పరిచయం చేశారు. అతను డేలియస్తో ప్రభావితుడయ్యాదు. డేలియస్ ఆర్మెస్ట్రాలో ఒకటి విన్నాకా ఎడ్వర్డ్‌కు అతని మీద గాధమయిన అభిమానం ఏర్చడింది.దేలియస్ తం(డ్రి ఆ సందర్భంలో అక్కదున్నాడు. డేలియస్కు ప్రతి ఏడూ జీవన భృతి వచ్చేట్లుగా ఆయన ఎద్వర్డ్ను ఒప్పించగలిగాడు. దేలియస్ పారిస్ వచ్చి లాటిన్ క్వార్టర్స్‌లో సెటిలయ్యాడు. తరువాత ఎనిమిదేళ్ళ పాటు పారిస్‌ని తన నివాసంగా చేసుకున్నాడు. 1892లో తన మొదటి సంగీత రచనని అచ్చేసాడు. దాని పేరు 'లెజెండ్' అది వయోలిన్‌ని, ఆర్మెస్ట్రాని వుద్దేశించింది. 1890 నుండి 1897 దాకా 1౧౧6110, 706 142010 గం౧121౧, గ౭౧0&' అన్న మూడు ఒపేరాలు పూర్తి చేశాడు. పాటలు, ఛాంమర్ మ్యూజిక్ రచనలు చేశాడు. సమగ్రమయిన సంగీత ప్రదర్శనకు సరిపడా రచనలు చేశాడు. 1899 మార్చి 30న లండన్‌లో అతని సంగీత ప్రదర్శన జరిగింది ఒక అజ్ఞాత సంగీత విమర్శకుడు “ఇంగ్లాండ్ అదృష్టవశాత్తు అసాధారణ ప్రతిభావంతుడయిన సంగీతకారుడు తనవాడు అని చెప్పుకోగలిగిన అవకాశం కలిగింది” అని రాశాడు. అతని సంగీత (ప్రదర్శన పట్ల రెందు రకాలయిన అభిప్రాయాలు వచ్చాయి. ఒక తెలివైన యువకుడి ఇంద్రజాలం” అని కొందరంటే 'మొరటుగా, అనాకర్షణీయంగా వున్న సంగీత మని మరికొందరన్నారు. తమాషా ఏమిటంటే తరువాత ఎనిమిదేళ్ళ పాటు అతని సంగీత ప్రదర్శన లండన్‌లో జరగలేదు.
ఈ మధ్యకాలంలో అతను జల్మా రోసేన్ను కలిశాడు. ఆమెను పెళ్ళాడాడు. ఈ సంఘటన అతని జీవితంలో గొప్ప మలుపు. ఆమె సంస్కారం కలిగింది. వాళ్ళిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి (మ్రేమ కలగడానికి ముఖ్య కారణం యిద్దరికీ నీషే అంటే అభిమానం. ఆమె
69
(ప్రతిభావంతురాలు ఆమె మంచి చిత్రకారిణి. ఆమె పదిహేడో ఏట నుండే ఆమె చిత్రాలు ప్రదర్శింపబడేవి. బాగా ఆస్రిపాస్తులున్నది. ఆమె డేలియస్కు రక్షణ నిచ్చింది. మానసికంగా, ఆర్ధికంగా స్థిరత్వాన్నిచ్చింది అతని అంతరాంతరాలలో వున్న అవసరమైన సానుభూతి సహకారాల్నందించింది గైజ్ - సర్ - లోయింగ్ అన్న చిన్ని (ఫ్రెంచి పట్టణంలో మంచి యిల్లు, తోట సంపాదించారు. బాహ్య ప్రపంచం నించీ అతను ఉపసంహారించుకోడానికి అతనికి ఈ అనుకూలాలు కారణం. ఆ పరిసరాల్లో అతనొక భాగమైపోయాడు. అతను నిర్లక్ష్యంగా తయారయ్యాడు. దాదాపు సంగీతానికి గుడ్‌బై పెట్టేశాడు! ప్రపంచం నించీ దూరం కావడమన్నది అతనిలోని ఒక మానసిక అశాంతికి చిహ్నం. చాలా తక్కువ మంది జనాల్ని మాత్రమే కలిసేవాడు పక్కింటి వాళ్ళని కూదా పట్టించుకునే వాడు కాడు. కనీసం అభివాదం చెయ్యడం కూడా చేసేవాడు కాడు వాళ్లని చూసి చిరునవ్వుకూడా నవ్వేవాడు కాడు. ఆ వీధిలో నడిచిపోతూ ఆ వీధిలో వాళ్ళు ఎవర పలకరించినా బదులు కూడా యిచ్చేవాడు కాదు ఆయన్ని చూడ్డానికి ఎవరయినా అతిధి వచ్చినా ముడుచుకుని కూర్చునేవాడు. నిశ్శబ్దంలో మునిగి వుండేవాడు. ఎవరయినా సుప్రసిద్ధ సంగీతకారులు ఆయన సంగీత రచనల్ని ప్రదర్శించడానికి అనుమతి కోరడానికి వచ్చినా ఏమీ పట్టనట్లు వుండేవాడు. ఎవరయినా అతిధి వచ్చినా ఎంతో సేపు అతన్ని తనతో బాట్స వుందనిచ్చేవాడు కాడు అతన్ని పంపేసేవాడు. లేదా తను అక్కడినించీ నిషృమించేవాదు., ఏకాంతంలో, 'ప్రశాంతంలో, పరవశంలో అతను ఒక కొత్త సృజనాత్మక శక్తిని సమీకరించుకున్నాడు. అప్పటి దాకా అతను విశ్వసింపదగిన సంగీతకారుడుగా వుండేవాడు. 1900 తర్వాత (గెజ్ సుర్ లోయింగ్ ప్రాంతంలో ఏకాంతంలో వుండిపోయాకా అతను చాలా గొప్ప సంగీతకారుడుగా పరివర్తన చెందాడు. పునర్జన్మ ఎత్తాడు 1901లో ౫ ౪1106 గింగా6౦ &౧6 ౮4|161 ఒపేరా రాశాడు. 1908-07 మధ్య ముఖ్యమయిన 0౦16 *ంగిం మూడు సిద్ధం చేశాడు. 562 0%, గ ౧౧౩౩5 01 19, 50౧05 0 58056[లు రాశాడు. 1907 మొదట్లో 8౧9 12/రచనతో మొదలు పెట్టి సుకుమారమయిన, సున్నితమయిన రచనలు ఆర్మెస్ట్రాను వుద్దేశించి రాశాడు యిప్పటికీ వాటిని బట్టే అతనికి గుర్తింపు వుంది. 10 &580[౧౧౧౧6౯౦౭||6౧, 0౧ ౧6౭౧౧9 116 1౧51 ౧౮౮400 || 50౧౧0, 56గాగాం! ౧1౦౧0౧ 116 ౧౪౪మొదలయిన రచనలు చేశాడు దేలియస్కు గుర్తింపు వచ్చింది కానీ మెల్లగా వచ్చింది. సంగీత ప్రపంచం నించీ, సమకాలీన సంగీత ప్రపంచం నించీ అతను ఉపసంహరించుకోవడం వల్ల అతనికి గుర్తింపు 70
రావడానికి ఆలస్యమయింది. యింకా అతని సంగీత స్వచ్భత, సౌకుమార్యాలు కూడా మరో కారణం. ప్రేక్షకుల్ని వురూతలూగించి గంగవెగ్రు లెత్తించి ఆకర్షించే సంగీతం కాదతన్ధి, దేలియస్ ఎప్పటికప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా గొప్ప సంగీత రచనల్ని అన్మిరిస్తూ పోయినా అతను అజ్ఞాత సంగీత కర్తగానే వుండిపోయారు. డేలియస్ జర్మనీలో కొన్ని విజయవంతమయిన ప్రదర్శనలు ఇచ్చాడు. ఇంగ్లాండులో అతన్ని ఆరాధించే కొంత మంది యింగ్లాండులో అతనికి ప్రచారం తేవడానికి ప్రయత్నించారు. 1909లో అతని అభిమానులు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. సర్ ధామస్ బీఛామ్ తెలివయిన సంగీతకారుడు . దేలియస్ అభిమాని. అతను దేలియస్ రచనల్ని ప్రదర్శించి ప్రచారమిచ్చాడు 1910, 11 నాటికల్లా
ఇంగ్లాండులో అతని సంగీత రచనలన్నీ ప్రదర్శింపబడ్డాయి. అతను ఇంగ్లాండులో సుప్రసిద్ధ
సంగీతకారుడుగా గుర్రింపు పొందాడు
మొదటి ప్రపంచ యుద్ధం డేలియస్ ఏకాంతానికి భంగం కలిగించింది జర్మన్ సైన్యం గుళ్ళ వర్షం కురిపించడంతో (గైెజ్ - సుర్ - లోయింగ్ వదిలి దేలియస్ కుటుంబం ఇంగ్లాండు చేరింది. వాళ్ళు స్వస్థలం వదిలి లండన్ చేరారు. యుద్ధ భయం వల్ల అన్నీ వదిలి వచ్చారు. వాళ్ళు తెచ్చుకున్నది ఒకే ఒకటి. అది పాల్ గుగిన్ వేసిన ఒక చిత్రం.
లందన్లో వున్నప్పుడు అతను చేసిన మౌలిక రచన ఒకటే. యుద్ధంలో అసువులు బాసిన ఒక యువ కధాకారుణ్ణి వుద్దేశించి ఒక స్మృతి రచన, నివాళి గీతం ఆది యుద్ధం ముగిసింది. డేలియాస్ తిరిగి తన 'స్వర్గం” చేరాడు కొన్నేళ్ళకు అతను శారీరకంగా, మానసికంగా బలహీన పడిపోయాడు. అతని చైతన్యాన్ని నిర్వీర్యం చేసి, శారీరకంగా అతను కదలలేని వింత జబ్బు అతన్ని ఆవహించింది. మరింత దుస్థితికి ఇవి సంకేతాలు. పూర్తిగా గుడ్డి తనం వచ్చేనింది. వక్షవాతం వచ్చింది. వ్రవంచం నించీ అతను ఉపసంహరించుకోవడమన్నది"' పూర్తయింది.
ఈ దురద్భృష్టకరమయిన విషాదాన్ని అతను ఆత్మ విశ్వాసంతో, ప్రశాంతంగా భరించాడు. ప్రతిరోజు మధ్యాహ్నం తోటలో కూచుని భార్య చదువుతూ వుంటే వినేవాడు ఒకరిద్దరు సన్నిహిత మిత్రుల్లో ముచ్చటించేవాడు. కొత్త ఆవిష్కారాల కోసం ప్రణాళికలు వేసేవాడు. చిన్ని చిన్ని పనుల్లో ఆనందాన్ని పొందేవాడు తన ముఖం మీద వడే సూర్య కిరణాలతో వుల్లాసం పొందేవాడు. టేబుల్ దగ్గర సంభాషణల్లో ఉత్సాహం పొందేవాడు. అదృష్టవశాత్తు వాటిని భావన చెయ్యగలిగే శక్తి అతని కుందేది. తన సంగీతాన్ని వినడం, తన సంగీత రికార్డుల్ని వినడం చేసేవాడు. “చూడలేకపోవడం వల్ల నా కెట్లాంటి బాధలేదు” అన్నాడు * నా వూహలు నాకున్నాయి. నేను ప్రపంచంలోని అద్భుతాలన్నీ చూశాను.
౮
అర్థవంతమయిన వన్నీ సాధించాను. సంతృప్తి పడ్డాను. అద్భుతమయిన జీవితాన్ని ఆనందించాను అన్నాడు.
అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన సంగతి యిప్పటికీ అతను సృజనకారుడుగా వుండడమే. యాంక్పైర్ యువ సంగీతకారుడు ఎరిక్ఫెన్బి వచ్చి డేలియస్ కుటుంబంతో బాటు వుంటూ అతనికి సహకరించేవాడు. దేలియస్ కళ్ళు, చేతులు అతనే అయ్యాడు. ఎంతో శ్రమపడి డేలీయస్ చెబుతున్న అతని చివరి సంగీత రచనలోని సూక్ష్మవిషయాల్ని (గ్రహించి పద్ధతిగా వాటిని రాసిపెట్టాడు.
1929 అక్టోబర్‌లో సర్ధామస్ బీఛామ్ డేలియస్ సంగీతవారాన్ని సంగీతోత్సవాన్ని లండన్‌లో నిర్వహించాడు అక్టోబర్ 12 నుండి నవంబరు 1 దాకా ఆరు సంగీత ప్రదర్శనలు జరిగాయి. సర్ధామస్ వీఛామ్ ఎంతో ప్రయత్నించి డేలియస్ని ఆ సందర్భంగా ఇంగ్లాండ్ రప్పించాడు.
డేలియస్ సోదరి అప్పటి అతని పరిస్థితి గురించి రాస్తూ “కుషన్ దిండ్ల మధ్య కుర్చీలో కూచున్న అతన్ని మోసుకుంటూ అంబులెన్సు కేసి తీసికెళ్ళాం (ప్రెస్ వాళ్ళందరూ నెరిసిన వెంట్రుకలపై బూడిద రంగు టోపీ, బరువైన వోవర్కోట్, చూపులేని కళ్ళకు పెట్టుకున్న
గ్లాసులున్నమా సోదరుణ్ణి, బలహీనంగా కృశించిన అతని ముఖాన్ని చూశారు అని రాసింది.
కదలలేని స్థితిలో తన చేతుల కుర్చీలో కూచుని తన జీవితంలో అఖండ విజయాన్ని అతను అనుభవానికి తెచ్చుకున్నాడు. దేలియస్ జీవిత కధను రాసిన ఆర్థర్ హచ్చింగ్స్ ఆ సందర్భం గురించి రాస్తూ “ప్రతి సంగీత ప్రదర్శన ముగిసిన అనంతరం కరతాళధ్వనులో హాలు దద్దరిల్లేది అది మరపురాని మవానుభవం ఆ సంగీత సమారోహాలకు హాజరయిన జనం అంత స్వచ్చమయిన సున్నితమయిన అమృత జల్లులు అత్మపై వర్షించినట్లుండే సంగీతం అప్పటి దాకా విని ఎరుగరు.
ప్రతిరాత్రీ ఒక పర్వదినం, ఒక ఉత్సవం, ఒక ఉద్వేగం; కరతాళ ధ్వనుల అనంతరం ఒక గంభీరమయిన నిశ్శబ్దం పరిసరాల్ని అవహించేది సంగీత సమారోహకులందరూ మౌనంగా వుండేవాళ్ళు. మళ్ళీ హరాత్తుగా సందడి. అభినందనలు, కరతాళాలు మారుమోగేవి పుట్ బాల్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా అట్లాంటి వాతావరణాన్ని చూడం. తరువాత జనమంతా చుట్టూ పూలు అమర్చి పెట్టి కుర్చీలో కూచోబెట్టిన డేలియస్ వైపు మళ్ళే వాళ్ళు, మొదటి, చివరిసారిగా అక్కడి జనం ఆయన స్వరాన్ని విన్నారు. ఆ సంగీత నిర్వాహకులకు, ప్రేక్షకులకు తన కృతజ్ఞతలు తెలుపుతూ “నా జీవితంలో ఇది మరపురాని పండుగా అన్నాడు. 72
ఆ సంగీతవారోత్సవాల్లోనే డేలియస్కు మరికొన్ని గౌరవాలు దక్కాయి. ఇంగ్లాండు రాజు 00[౧౬౧10౧ 0౧0౧01 తో సత్కరించాడు బ్రాద్ఫోర్ట్ నగరం /8660గ 0116 01%/ గా గౌరవించింది. పేపర్లన్నీ విసృతంగా అతని గురించి రాశాయి. ఒక సంస్థ అతని రచనల్ని సంకలించింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ యిచ్చింది. అదే అతను జనం ముందు చివరి సారి కనిపించడం. అతని ఆరోగ్యం బాగా దిగజారింది 1984వ సంవత్సరం మొదట్లో అతను విపరీతమైన ఒళ్ళు నొప్పుల్తో బాధపడ్డాడు. క్రమం తప్పకుండా [40౧౧11౧9 (మత్తుమందు) వాడడం వల్ల అది జరిగింది
1934 జూన్ 10న దేలియస్ కన్నుమూశాడు (గైజ్ స్మశాన వాటికలో ఎట్లాంటి మతకర్శకాండతో నిమిత్తం లేకుండా అతన్ని ఖననం చేశారు. అతని కోరిక ప్రకారం సంవత్సరం తరువాత అతని శవపేటికను ఫ్రాన్సు నుండి యింగ్లాండుకు తరలించారు చిన్ని పట్టణమైన లిమ్మఫీల్డ్లోని స్మశానవాటికలో “రెండోసారి ఖననం చేశారు.
౮/3
ఆంటోనిన్ డ్వోరాక్ తీ౧(0౧10 0౪౦0౧21 8-9-1841 -- 1-5-1904
బొహీమియా ప్రాంతం గురించి ఒక సంప్రదాయం వుందని అంటారు బిడ్డ పుడితే ఇన్న్మప్రాసనప్పుడో మరో సందర్భంలోనో ఆ పసివిడ్డముందు వెండి స్ఫూను, వయోలిన్ పట్టేవాళ్ళట వాటిల్లో ఆ పసి బిడ్డ దేన్ని తీసుకుంటే దాన్ని బట్టి అతని భవిష్యత్తు గురించి విప్పేవాళ్ళు. బిడ్డ సంపన్నుడయిన వ్యాపారవేత్తో, గొప్ప సంగీతకారుడో అవుతాడని అతను సీసుకున్న వస్తువును బట్టి చెప్పేవాళ్ళు
డ్వోరాక్ పుట్టినపుడు ఈ సంప్రదాయాన్ని పాటించారో లేదో మనకు తెలీదు క్షాన్సి అతని చిన్నతనంలో ఈ రెండూ అతనికి ముఖ్య విషయాలుగా ముందు నిల్చున్నార్చు అతని తండ్రి ఒక హోటల్ యజమాని, మాంస విక్రేత నెమ్మదస్టుడు తంద్రేమో కొడుకు “వెండిస్ప్ఫూన్' అందుకోవాలనుకున్నాడు కానీ కొడుకేమో 'వయోలిన్ అందుకున్నాడు,
అదృష్టవశాత్తు బాహీమియా ప్రజల జీవితంలో సంగీతం ఒక భాగం తరువాత్ర రోజుల్లో డ్వోరాక్ బొహీమియా' ప్రజల గురించి చెబుతూ “ప్రతి పసివాడూ సంగీతం నేర్చుకోవాలి. చర్చిలో వీఐ -ఎతే పాటలు పాడాలి తరువాత సంగీతంలో, నృత్యంలో లీనమై కొన్ని సార్లు తెల్లవారు జాము దాకా తేలియాడాలి'అన్నది వాళ్ళ తత్వం” అన్నాడు డ్వోరాక్ తండ్రి వయోలిన్, గిటార్ వాయించేవాడు. పాటలు పాదేవాడు. గ్రామీణ సంగీత బృందంతో కలిసి సంగీత ప్రదర్శనలో భాగం పంచుకునేవాడు ఫలితంగా తన కొడుకు సంగీతం పట్ర అభిరుచి ప్రదర్శిస్తే అతనెప్పుడూ కాదనలేదు తన తండ్రి కస్టమర్ల ముందు డ్యోరాక్ వయోలిన్ వాయిస్తూ, ఉల్లాస నృత్యాలు చేస్తూ, గ్రామీణ విషాద గీతాలు పాడుతూ వాళ్ళని సంతోష పెట్టెవాడు. గ్రామీణ ఉత్సవాలు నిర్పహించి పాటలు పాదేవాడు చర్చి సంగీతంలో పాల్గొనేవాడు అతను సంగీతాన్ని ప్రదర్శించనప్పుడు సంగీతాన్ని వినడంలో అతనికి అలసట ఎప్పుడూ లేదు. స్థానిక స్కూలు టీచర్ జోసఫ్ ప్టిట్ట్ సంగీతానికి సంబంధించి అతనికి కొన్ని ప్రాధమిక సూత్రాల్ని వివరించాడు. అప్పటి నించీ డ్యోరాక్ తన ప్రజల సంగీతాన్ని వినేవాడు, పాడేవాడు.
డ్వోరాక్ సంగీతంలో మునిగిపోవడం బాగానే వుంది కానీ సమస్యల్లా అతను “వ్యాపారం” గురించి తెలుసుకోవడానికి సంబంధించిందే. అతని తండ్రి పూటకుళ్ళ ఇళ్లు (హోటల్) నిర్వహిస్తాడని కూడా ఆశించాడు. డ్వోరాక్ని అతని తండ్రి దగ్గరి పట్టణంలో /డ్త
నివసిస్తున్న అతని మేవనమామ దగ్గరికి పంపాడు. ఆ పట్టణం పేరు జ్లోనీన్. అప్పుడు డ్వోరాక్ వయసు పద్నాలుగేళ్ళు. కారణం ద్వోరాక్ జర్మన్ భాష నేర్చుకుంటాడు. మంచి హోటల్ యజమాని అప్పట్లో తప్పని సరిగా ఆ భాష నేర్చుకోవాలి. అక్కడ డ్వోరాక్ తనంటే సానుభూతి ప్రదర్శించే ఆంటోనిన్ లీహ్మాన్ అన్న సంగీత ఉపాధ్యాయుణ్ణి కలుసుకున్నాడు. డ్వోరాక్ ప్రతిభా సామర్భ్యాల్ని మొదట గుర్తించిన వ్యక్తి ఆతనే లేహ్మాన్ డ్వోరాక్కు వయోలా, పియానో, ఆర్గాన్ నేర్పించాడు అతని ఆధ్వర్యంలో డ్వోరాక్ సంగీత రహస్యాల్ని (గ్రహించాడు. లీమాన్ గురుత్వంలో అతను సంగీతంలో ప్రావీణ్యం సంపాదించాడు. చిన్నితనంలో తనకు విద్య నేర్పిన గురువు పట్ల డ్వోరాక్ జీవితాంతం కృతజ్ఞడయివున్నాడు. 1880లో లీమాన్ మరణించిన సంవత్సరం తర్వాత జ్లోనీస్లో ఒక సంగీత ప్రదర్శన నిర్వహించి లీమాన్ సమాధిని చక్కగా నిర్మించడానికి ఫండ్స్ సేకరించాడు. తరువాతి రోజుల్లో 7౧8 ౮౭౦౦1౧ అన్న ఒపేరా రాశాడు. అందులో లీమాన్ని ముఖ్యప్రాతగా మలిచాడు ఆంటోనిన్ లీమాన్ తనకు తెలిసిందంతా డ్వోరాక్కు చెప్పాలని ఆశించాడు కానీ
పెద్ద పెద్ద నగరాల్లో, ప్రాగ్లాంటి నగరాల్లో తప్ప దొరకని సంగీత పరికరాలు తన దగ్గర లేవన్న ఆలోచన అతనికి రాలేదు. నిజానికి డ్వోరాక్కు నిష్టాతులయిన సంగీతకారుల గురుత్వం అవసరం కానీ డ్వోరాక్ని ప్రాగ్ వెళ్ళడానికి లీమాన్ ప్రోత్సహించాడు. అంతేకాదు దోరాక్ తండ్రి దగ్గరికి వెళ్ళి అతన్ని ప్రాగ్ పంపమని అభ్యర్థించాడు. కానీ అక్కడ పరిస్థితులు వేరుగా వున్నాయి కుదరదని తండ్రి మొండికేశాడు. కారణం ఆతని హోటల్ దివాలా తీసే స్థితిలో వుంది దాన్ని తప్పని సరిగా మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది మూనెయ్యడమే కాక నేలా వోజవిస్లో ఒకటి, జ్లోనీస్లో మరొకటి వోటళ్ళు పెట్టే ఆలోచనలో ఆతనికున్నాయి. ఆ పరిస్థితుల్లో తప్పనిసరిగా అతనికి కొడుకు సాయం అవసరం కూడా
ఇది పక్కన పెట్టిన తన కొడుకు సంగీతాన్ని వృత్తిగా స్వీకరించడం తండ్రికి ఏ మాత్రం యిష్టం లేదు. సంగీతం కాలక్షేపానికే కానీ జీవిక కాదని అతని అభిప్రాయం.
కొడుకుని “అనారోగ్యకరమయిను ప్రసావాల్నించీ తప్పించడానికి తండ్రి డ్వోరాక్ని జ్లోనీస్ నించీ బోమిస్స్ - కామ్నిట్ట్ పంపాడు అక్కడ కూడా ఎప్పట్లాగే సానుభూతి ప్రదర్శించే, (ప్రోత్సహించే సంగీతకారుల్ని కలుసుకున్నాడు. లీమాన్ అతని మనసులో నాటిన బీజాలు చిగురిస్తూనే వున్నాయి సంవత్సరం తర్వాత డ్వోరాక్ జ్లోనీస్ తిరిగి చేరి తండ్రి వోటల్ పనిలో సాయపడ్డాడు కానీ సంగీతం అతని మౌలిక అభిరుచిగానే వుండిపోయింది. వయోలిన్, పియానో వాయిస్తూనే వున్నాడు మెల్లగా టాన్ ఆర్మెస్ట్రాకు చిన్ని చిన్ని సంగీతరచనలు చేశాడు. ఆంటోనిన్లీమాన్ దగ్గర సంగీతం అభ్యసిస్తూనే వచ్చాడు. అప్పటికీ ౮/5
లీమాన్ డ్వోరాక్ని ప్రాగ్‌కు పంపే (ప్రయత్నాల్ని మానలేదు. డ్వోరాక్ తండ్రి ఎప్పట్లాగే వ్యతిరేకిస్తూ వచ్చాడు కానీ డ్వోరాక్ మేనమామ అందుకు అంగీకరించాడు. అంగీకరించడమే కాక అందుకు తగిన ఆర్థిక సాయం చెయ్యడానికి కూడా సిద్ధపడ్డాడు.
"పదహారేళ్ళ వయసులో డ్వోరాక్ ్రాగ్లోని ప్రసిద్ధ్యమయిన ఆర్గాన్ స్కూల్లో చేరాడు. అక్కడి ఉపాధ్యాయులు కూడా ధ్వోరాక్ అంటే అభిమానం (ప్రదర్శించారు. శ్రమపడే అతని తత్వాన్ని యిష్టపడ్డారు. సైద్ధాంతిక అధ్యయనం కన్నా సృజనాత్మకమయిన అతని సంగీత ప్రదర్శనను అభినందించారు. డ్వోరాక్ ప్రేమతో, యిష్టంతో సంగీతం నేర్చుకున్నాడు కాన్ని స్పరకల్పనలు చేశాడు.
జ్లోనీస్ నించీ వస్తున్న ఆర్థిక సాయం హరాత్తుగా ఆగిపోయింది డ్వోరాక్ పరిస్థిత్తి యిబ్బందుల్లో పడింది. వెనక్కి వెళ్ళిపోయి తన తండ్రి నడుపుతున్న హోటల్లో సాయపడాలి. లేదా ప్రాగ్‌లోనే వుంటూ తన బాధలేవో తను పదాలి. రెండోది చేయడానిక్తే డ్వోరాక్ట్ నిర్ణయించుకున్నాడు. ్రాగ్లోనే వుండడానికి నిశ్చయించుకున్నాకా జీవిక కోసం 'ప్రయత్నాల్లి పడ్డాడ్డు కెఫెనించీ కెఫెకు తిరుగుతూ చిన్ని చిన్ని సంగీత ప్రదర్శనలిస్తూ జీవించే సంగిత్ర బృందంలో సభ్యుడుగా చేరాడు. చిన్ని చిన్న ఆర్మెస్టాల్లో కూడా వుద్యోగాలు చేస్తూ జీవించాడు అతను (శ్రమించి సంపాదించింది అతని తిండికి, బట్టకు సరిపోయేది. తరచూ చలిత్తో, ఆకలితో బాధపదేవాదు. కానీ ఆర్గాన్ స్కూల్లో తన చదువుకు కొనసాగించాడు. ఒపేరా ల్లో, సంగీత ప్రదర్శనల్లో అవకాశాలు వచ్చినప్పుడల్లా ఆనందంతో పరవశించేవాడ్డు, గ ఆర్గాన్ స్కూల్లో విద్యాభ్యాసం ముగిశాకా నేషనల్ ఒపేరా ఆర్మెన్హ్రాలో పన్నెందేళ్ళషాట్స పనిచేశాడు. 1862లో ఆ వుద్యోగంలో చేరాడు అప్పటికీ అతను దరిద్రంనించీ బయట పడలేదు. చాలా కాలం పాటు పియానోని బాడుక్కి కూడా తీసుకునే స్థితి లేకపోయింది. ఆ పరిస్థితుల గురించి కష్టపడి చదవడం, ఎప్పుడో గానీ సంగీత రచన చెయ్యడం, తిరిగిరాయడం, అంతులేని ఆలోచనల్లో కొట్టు మిట్టాడడం, చాలా తక్కువ తినడం” అన్నాడు తను అప్పట్లో చదువుకున్న “ఉపాధ్యాయుల గురించి చెబుతూ” నేను 'దేవుడతో కలిసి చదువుకున్నాను. పక్షులతో కలసి చదువుకున్నాను, చెట్లతో కలిసి చదువుకున్నాను అంతే కాదు నాతో కలిసి నేనే చదువుకున్నాను అన్నాడు. ఆ సమయంలో డ్వోరాక్పై ముఖ్యమయిన ప్రభావం చూపిన వ్యక్తి బొహీమియా కంపోజర్ బెద్రిక్ స్మెటానా, స్మెటానా జాతీయ ఒపేరా కంపోజర్. 1878లో డ్వోరాక్ తన ఆర్మెస్ట్రా వుద్యోగానికి రాజీనామా ఇచ్చి సెంట్ అదాల్బర్ట్ చర్చిలో ఆర్గానిస్టుగా చేరాడు. దాన్తరువాత తన విద్యార్థిని అన్నా సెర్మకోడాని పెళ్ళాడాడు. 76
అప్పట్లో “తక్కువ తింటూ ఎక్కువ పారాలు చెప్పాను” అన్నాదు. కానీ ఆ సందర్భంలోనే అపూర్వంగా అతని రచనల్లో శక్తి, సృజనాత్మకత కనిపించాయి. చాలా కాలం స్మటానా సాహచర్యం వల్ల తన తొలి రచనల పట్ల అతన్లో అసంతృప్తి కలిగింది. ఛాంబర్ మ్యూజిక్, కొన్ని సింఫనీలు, 4166 అన్న ఒపేరాను అతను నాశనం చేశాడు. వీటిల్లో అనుకరణలు ఎక్కువగా వున్నాయని అతని వుద్దేశం. (ప్రత్యేకించి వాగ్నర్ ప్రభావం ఎక్కువగా వుందని అతను భావించాడు ఫలితంగా తను వైఫల్యం చెందానని భావించాడు. జర్మన్ మోడల్స్‌ని నిషేధించుకున్నాడు వాగ్నర్ని వాదిలించుకున్నాడు. తనకు తను స్వేచ్చని కలిగించుకుని “బొహీమియన్ సంగీత రచనలో మునిగాడు. పెళ్ళికి ముందు దేశభక్తి రచన " 7౧6 ౧41901 (16౪416 1406౧12 చేశాడు మార్చి 1878న ఆ రచన ప్రదర్శింపబడి విజయవంతమైంది. ఈ విజయం అతన్లోని సృజనాత్మక శక్తిని వృింభించేలా చేసింది. అతని సింఫనీ '59/౧- ౧౧0౧౫1౧ కా-5్14[1420/౯' 1874లో ఆఫ్టియన్ స్టేట్ 'ప్రైజ్‌ని సంపాదించి పెట్టింది. 116 0060 2౧6 ౧6 0101%66 అన కామిక్ ఒపేరా విఫలమయింది. కానీ దాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి పూనుకున్నాడు పునర్నిర్మించిన ఆ రచన విజయవంతమైంది. ఎన్నో పాటలు, ఒపేరాలు రాశాడు. యివన్నీ బొహీమియన్ జానపద సంగీతం ఆధారంగా వున్నవే.
తన బొహీమియన్ రచనల్లో ఒకటైన '41 ౯0౧1 [40/24' ను ఆస్ట్రియన్ కమీషన్‌కు సమర్పించాడు. ఆ రచన ఆ కమిటీని తీవ్రంగా ప్రభావితం చేసింది. దాని ప్రభావం ఏ న్థాయిలో వుదంటే ఆ కమిటీ అతనికి సంవత్సరానికి 250 డాలర్లు జీవనభ్బతి ఏర్పాటు చేసింది. వీటిని మించి 419 10౧ 11014414 వల్ల సుప్రసిద్ధ సంగీతకారుడయిన జోహాన్స్ (బ్రామ్స్తో జీవికాల స్నేహం లభించింది. కమిటీ ద్వారా డ్వోరాక్కు బహుమతి రావడానిక్కూడా బ్రామ్స్ కారణం. ఆ నాటి వియన్నాకారుల్లో బ్రామ్స్ శక్తి సామర్థ్యాలు కలిగినవాడు. గౌరవింపబడినవాడు. అప్పటికి అజ్ఞాతంగా వున్న డ్వోరాక్కు ఒక స్థాయి కల్పించడానికి బ్రామ్స్ తన పలుకుబడిని వుపయోగించాడు సిమ్కాక్ అన్న ప్రచురణ కర్తని డ్వోరాక్ రచనల్ని అచ్చెయ్యడానికి పురమాయించాడు. సంగీతకారుల్ని సంగీత నిర్వాహకుల్ని డ్వోరాక్ రచనల్ని ప్రదర్శించమని ప్రోత్సహించాడు. డ్వోరాక్కు ఆర్ధిక వనరుల్ని సమకూర్చాడు. డ్వోరాక్ రచనల్ని సరిచూశాడు డ్వోరాక్ అభిమానంగా బ్రామ్స్కు రాస్తూ “గౌరవనీయులయిన గురువుగారూ! మీ గురించి ఏది చెప్పినా ఆ మాటలు నా హృదయపు లోతుల నించీ వస్తాయి. నేను నా జీవితమంతా మీకు రుణపడి వుంటాను. మీరు నాకు చేసిన సహాయానికి కృతజ్ఞదయివుంటాడు మీరు ఉన్నతోన్నత కళాకారుడుగా, ఉత్తమోత్తను మానవుడిగా చెప్పదానికి అర్హలు” అన్నాడు
70
(ప్రచురణ కర్త సిమ్రాక్ బ్రామ్స్ హంగేరియన్ నృత్యాల రీతిలో స్లావోనిక్ నృత్య రచన చెయ్యమని డ్వోరాక్ని ప్రోత్సహించాడు. డ్వోరాక్ చేశాడు. అవి విజయవంతమయ్యాయి అసాధారణ రీతిలో జైత్ర యాత్ర చేశాయి. వాటి వల్ల డ్వోరాక్ యూరోప్ ఖందమంతా పేరు ప్రతిష్టలు ఆర్జించాడు. అతని సంగీత రచనల్ని ప్రసిద్ధ సంగీతకారులయిన హాన్స్ వాన్బ్యూలో, జోసఫ్ జోయాఛిమ్, హాన్స్ రిచ్టర్, (ఫ్రాంజ్ లిస్జ్డ్ మొదలయిన వాళ్ళు యూరప్ అంతటా (ప్రదర్శించారు. జర్మనీ ఆష్టియాల నుండి డ్వోరాక్కు ఆహ్వానాలందాయి
1884లో అతని మూడు సంగీత రచనల ప్రదర్శన కోసం లండన్ నించి ఆహ్వానమందింది. ఆ ప్రదర్శనలు గురించి డ్వోరాక్ రాస్తూ “నేను స్టేజి మీదకు రాగానే పన్నెండు వేల మంది (ప్రేక్షకులు హర్షాతికాల్తో నాకు ఆహ్వనం పలికారు” అన్నాడు, త్మ ప్రదర్శన వల్ల పేరేకాదు, ఆర్థికంగా కూడా లాభాం కలిగింది అతని (ప్రదర్శనలకు తగ్వ పారితోషికాలు రావడం మొదలైంది. అతని కొత్త 0|౦|౯| ౪0గ6కు 06 5060165 5%66 కు నోవెల్లో పబ్లిషర్స్ నించీ రెండు వేల పౌండ్లు అందుకున్నాడు. ఆ రచన 1885లో బర్మింగ్ హామ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది.
తన జీవిత కాల స్వష్నాల్ని సాకారం చేసే స్థాయికి అతను చేరుకున్నాడు వ్యసోక్రా అడవుల్లో వున్న ఒక వేసవి విడిదిని కొన్నాడు. సంవత్సరంలో కొన్ని నెలలు అక్కడ విశ్రాంతిగా గడిపేవాడు. తనకు 'సంబంధించిని నేలపై 'మాతృభూమి”పై సేద తీరేవాడు తన రైతు” జీవిత పూర్వ రంగాన్ని తన గతాన్ని అతనెప్పుడూ విస్మరించలేదు. అతని చివరి రోజుల్లో ఆయన బిడియంగా, ఇబ్బందిగా, వాటిలో గొప్పవాళ్ళు అనుకున్నవాళ్ళ దగ్గర ఆ రీతిలో వుండేవాడు. తన సామాజిక ప్రవర్తన పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించేవాడు. పెద్ద పెద్ద నగరాల్లో ఎవ్వుడూ 'వెసులుబాటుగా' 'వుందేవాడు కాదు అక్కడివాళ్ళు అతన్నించీ కోరిన డిమాండ్ల పట్ల అసహనంగా వుండేవాడు. సిటీలో రోడ్లు దాటాలంటే ఆయనకు భయం ఎవరో స్నేహితుడు తోడు లేనిది ఆయన రోడ్డు దాటేవాడు కాదు. ఆయన 'మన భూమిక్తి దగ్గరగా వున్నప్పుడు ఉల్లాసంతో వురకలెత్తేవాడు. సంతోషంతో పొంగిపోయేవాడు పావురాల్ని ఎగరేసేవాడు, బొహీమియా అడవుల్లో ప్రశాంతంగా ఒంటరిగా చాలా దూరం వాకింగ్ వెళ్ళేవాడు. నిజానికి ఆయన్లో “నిర్లక్ష్యం” లేదు. సన్నిహితులయిన స్నేహితులో వున్నప్పుడు 'కొన్ని' బీర్లు పూర్తయ్యాకా నవ్వుతూ, నవ్విస్తూ, విపరీతంగా కర్చుపెడుతూ వాతావరణాన్ని వెలిగించేవాడు,
అతను ఎక్కడ తిరిగినా ఎన్ని టూర్లు చేసినా, ఎక్కడవున్నా తన బాల్యాన్ని తన చిన్నప్పటి పరిసరాల్ని మరచిపోలేదు. నీటిలో పడవల్ని పసివాడిలా చూసేవాడు. ట్రెయిన్ని /లో
చూడ్డానికి అది వెళ్ళడం చూడ్డానికి ఒంటరిగా దూరంగా వెళ్ళి దాన్ని గమనించేవాడు. సము(ద్రంలో తీరాన్ని తాకిన అలన్ని అతి వుపసంహరించడాల్ని ఆసక్తికగా గమనించేవాడు. చిన్ని పిల్లల ఆటలన్నా అతనికి ఇష్టం. పేకాటలో ఎప్పుడూ ఓడిపోయేవాడు. ఆట పూర్తయ్యాకా పేకముక్కల్ని గదంతా చల్లేవాడు.
డ్వోరాక్ మేధో ప్రపంచమంతా సంగీతానికి సంబంధించింది. అది లేకుంటే అతను లేడు ఆ ప్రపంచంలో అతనికి ఒకే ఒక దేవుడు. ఆ దేవుడు బిధోవిన్. ఓసారి ప్రాగ్లో అతని విద్యార్థులు బిధోవిన్ గొప్పరచనల్ని “విశ్లేషించడానికి, దేనికదిగా విడదీసి చూడదానికి ప్రయత్నిస్తూ వుందే “మీరందరూ ఎందుకు మోకాళ్ళ మీద నిల్పోరు?' అన్నాడు ఒక సందర్భంలో పట్టణంలోని జనం “ప్రపంచంలోని గొప్ప సంగీత కారుడికి అని పూలతో అలంకరించిన ఒక బహుమతిని డ్వోరాక్కు ఇచ్చారు. ఆ పూలమాలను, అలంకారాన్ని ఆయన బిధోవిన్ బస్ట్కు అలంకరించాడు
డ్వోరాక్ కీర్తి ప్రతిష్టలు అట్లాంటిక్ సముద్రాన్ని దాటాయి. జీనెట్టె ధర్చర్ 1885లో న్యూయార్క్‌లో నేషనల్ కన్సర్వేటరీ ఆఫ్ మ్యూజిక్ సంస్థను ఏర్పాటు చేశాడు. డ్వోరాక్ని ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఆహ్వానించాడు. సంవత్సరానికి 15000 డాలర్లు జీతం ప్రాగ్లో ద్వోరాక్ సంపాదించే దానికన్నా దాదాపు ఇరవై రెట్లు అధిక మొత్తం. ఫారిస్ వెళ్ళడం ఆయనకు ఇష్టం లేదు. అక్కడ ఆయన యిబ్బందిగా ఫీలవుతాడు. అది లాభసాటి వ్యాపారమయినా అంతగా వుత్సాహం చూపలేదు. చివరికి 1892లో అమెరికా వచ్చాడు. కన్సర్వేటరీ దగ్గరే యిల్లు తీసుకుని బాధ్యతలు స్వీకరించాడు.
డ్వోరాక్కు తనవూరిపై ధ్యాసమళ్ళింది యింటి దిగులు పట్టింది. కానీ అక్కడికి దగ్గర్లో వున్న చిన్న పట్టణమయిన స్పిల్విల్లలో వేసవిలో గడిపేవాడు. కారణం అక్కడ “జొహీమియా' జనం ఎక్కువగా నివసించేవాళ్ళు. అక్కడ చర్చిలోనూ, పరిసరాల్లో బొహీమియా సంగీతంలోని ఓదార్పు పొందేవాడు అక్కడి గ్రామస్థులు డ్వోరాక్ యాఖై రెండో జన్మదినాన్ని బొహీమియా సంప్రదాయాల్లో ఘనంగా జరిపారు. ఆయన దాదాపు తన జన్మస్థలంలో వున్నంత ఆనందం పొందాడు.
స్పిల్విల్లిలో ఆయన సంతోషంగా గడుపుతూ తన గొప్ప సంగీత రచనల్లో కొన్ని అక్కడ రాశాడు నీగ్రోపాటల్తో ప్రేరణ పొంది '2౧0౧ 16 ౧ఆ౪౪/0గ6' రాశాడు 15 డిసెంబర్ 1893లో న్యూయార్క్‌లో అది ప్రదర్శింపబడింది. విజయవంతమయింది ఆ సింఫనీ విజయం గురించి చెబుతూ ఆ సింఫనీ అసాధారయ విజయం పొందింది. పేపర్లు యిప్పటిదాకా ఈ
౮/9
స్వరకర్త విజయాల్లో యిది సాటి లేనిది అని రాశాయి. జనం ఎంతగా వురూత లూగారంటే నేను పియానో ముందు కూచున్న రాజులా ఫీలయ్యాను” అన్నాడు డ్వోరాక్ ఆ సింఫనీ అదే చోట రెండుసార్లు ప్రదర్శింపబడింది. బోస్టన్‌లో కూడా ఆ సింఫనీ విజయ ఢంకా మోగించింది. అమెరికాలో ఒక పక్క గౌరవాలు వస్తున్నా, కీర్తి పెరుగుతున్నా డ్వోరాక్ అలసిపోయాడు. తన 'దేశం' తను వెళ్ళిపోదానికి తహతహలాడాడు. “నా కాంట్రాక్ట్ వాళ్ళు పొడిగించినా, పొడిగించకున్నా నేను బొహీమియా చూడాలనుకుంటున్నాను అని ఒక మిత్రునికి రాశాడు. కన్సర్వేటరీ అతని కాంట్రాక్ట పొడిగించింది కానీ డ్వోరాక్ 1895లో అమెరికా వదిలి ప్రాగ్ వెళ్ళిపోయాడు. ప్రాగ్ తిరిగి వస్తూనే ఆయన సుప్రసిద్ధ పియానో రచన "114020185066 రాశాడు అమెరికాలో వున్నన్ని నాళ్ళూ ఆనందకరమయిన, చమత్మార భరితమయిన ఎన్నో వివరాల్ని "సేకరించి రాసిపెట్టుకున్నాడు. వాటిని ఆధారంగా ప్రాగ్ వచ్చిన ఏడు రోజుల్లో ఎనిమిది రచనలు చేశాడు. వాటిని అచ్చేశాడు. 1901లో ద్వోరాక్ ప్రాగ్ కన్సర్వేటరీ డైరెక్టర్ అయ్యాడు జీవితాంతం అందులో కొనసాగాడు. చివరి దశలో అతనికి గొప్ప నిరాశ ఎదురైంది 1904లో నేషన్ ధియేటక ఆతని &౧౫|6౭ అన్న ఒపేరాని ప్రదర్శించింది. అది ఎంత అపజయాన్ని పొందిందంఠే డ్వోరాక్ కుంగిపోయాడు. అది జరిగిన కొన్నాళ్ళకి టేబుల్ దగ్గర కూచుని హరాత్తుగా చనిపోయాడు. గుండెపోటుతో కన్ను మూశాడు 5 మే, 1904న అతని శవయాత్ర జరిగింది. అది జాతీయ విషాద దినంగా భావింపబడింది. తి
సర్ ఎడ్వర్ట్స్ ఎల్లార్ 51 ౬604/816 ౬102! 2-6-1857 -- 23-2-1934 హెద్రీ పుల్సెల్ 1695లో చనిపోయాకా ఇంగ్లీషు సంగీత వికాసం దాదాపు ఆగిపోయింది రెండు వందల ఏళ్ళపాటు ఇంగ్లాండు కంపోజర్లని సృష్టించింది. వాళ్ళు సాంకేతిక నిపుణులే కానీ మౌలిక సృజన కారులు కారు. ఫలితంగా వాళ్ళు విస్మృతిలో పడిపోయారు పందొమ్మిదో శతాబ్దం చివరి దాకా చెప్పుకో దగ్గ సంగీతకారులు రాలేదు. అప్పుడు ఎద్వర్డ్ ఎల్లార్ రంగంలోకి వచ్చాడు అతన్తో సమానులెన్వరూ లేరు. అతని ౬0100౧2, 16 088/0 360౧645 రచనలు రెండూ పందొమ్మిదో శతాబ్దం చివర్లో వచ్చాయి. అవి ఇంగ్రీషు సంగీతంలో పునర్జీవం తెచ్చాయి. ఇంగ్లీషు సంగీతానికి పునరుజ్జీవన మనదగిన రచనలవి ఎల్లార్ తండ్రి మ్యూజిక్ స్టోర్ యజమాని. అద్భుత సంగీతకారుడు. ప్రధాన చర్చిలో వయోలిన్ వాయించేవాడు. ఎల్లార్ తొలినాళ్ళ సంగీత ప్రేమ అంతా తండ్రి నించీ వచ్చిందే. అదే సమయంలో ఎల్లార్ ఇతర కళారూపాల పట్ల కూడా ఆసక్తి ప్రదర్శించాడు. ఎల్లార్ గంటల కొద్దీ తండ్రి సంగీత సాధనని పరిశీలించేవాడు బాబ్ “ఆర్గాన్ రచనల్ని తండ్రి (ప్రదర్శిస్తూ వుంటే శ్రద్ధగా వినేవాడు. వాళ్ళ యింట్లో ఎన్నో సంగీత (గగ్రంధాలుండేవి అవన్నీ (శద్ధగా చదివాడు. సింఫనీ రచనలు, ఒపేరా రచనలు ఆసక్తిగా చదివి వాటిని తన జ్ఞాపక భాండంలో భద్రపరచుకున్నాడు. పుస్తకాల్నే మార్గదర్శకంగా శృతి, లయల్ని, సంగీత సిద్ధాంతాల్ని అధ్యయనం చేశాడు. కానీ అతని తండ్రి ఎల్లార్ లాయర్ కావాలని కోరుకున్నాడు. ఎల్లార్ పదహారేళ్ళ వయసప్పుడు మూడేళ్ళపాటు లాయర్ చదువుకోసం లండన్ వెళ్ళాడు. కానీ ఇంటి పట్ల బెంగతో, సంగీతం పట్ల ప్రేమతో అతను మధ్యలోనే యింటికి వచ్చేవాడు. లా చదవడం మానేయడం అతని మంచికే జరిగింది. తనకు ఇష్టమయిన సంగీతానికే (ప్రేమతో అంకితమయ్యాడు. స్థానిక ఆర్మెస్ట్రాల్లో వయోలిన్ వాయించాడు. ఐదు మంది వుండే సంగీత బృందంలో చేరాడు. కొన్ని సార్లు చర్చికోసం సంగీతం వాయించేవాడు. స్థానిక వయోలిన్ సంగీత ప్రదర్శనల్లో పాల్గొనేవాడు. వ!
సంగీతకారుడుగా తను ఏ దిశలో వెళుతున్నాడో ఎల్లార్కు తెలీదు. కాసేపు తను వయోలిస్టు కావాలని తలపోసేవాడు ఆ ఆలోచన వచ్చాకా అడాల్ఫ్ పులిట్టర్ శిష్యరికంలో అధ్యయనం చెయ్యడానికి లండన్ చేరుకున్నాడు. అతని శిష్యరికంలో ఐదు పారాలు చదువుకున్నాకా తన మనసు, తన నైపుణ్యం కేవలం *“వయోలిన్'కు మాత్రమే పరిమితమయినవి కావని తెలుసుకున్నాడు. మళ్ళీ తిరిగి తన సొంతవూరు చేరాడు ఎన్నో గొప్ప గొప్ప సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నాడు స్వర రచనలో మునిగాడు విసృతంగా సంగీత రచనలు చేశాడు. ప్రత్యేకించి ప్రచారం పొందిన ఎన్నో పాటలు రాశాడు
1889 దాకా లక్ష్యం లేకుండా తన యాత్ర సాగించాడు. 1889లో కెరోలిన్ అట్రెప్ రాబర్ట్‌ని పెళ్ళాడాడు. ఆమె అసాధారణమయిన స్త్రీ చైతన్యం కలిగింది. దర్శన శక్తి కలిగింది. తన భర్త సంగీతంలో ఉన్నత స్థాయి లక్ష్యాలని అందుకోగలడని ఆమె విశ్వాసం కానీ అతన్లో 'సీరియస్' నెస్ కన్నా కాలక్షేప దృష్టే ఎక్కువుందని భావించింది అతన్ని తక్షి చిల్లర పనులన్నీ మానెయ్యమని చెప్పింది. అంతేకాదు (ప్రతిభావంతులయిన సంగీతకార్సుల్సు, సానుకూలమయిన వాతావరణం వున్న లండన్‌లో ఎల్లార్ వుడడం అవసరమని నిశ్చయించి
కుటుంబాన్ని లండన్‌కు మార్చింది. ఆమె భర్తని ప్రోత్సహించింది. “ఒత్తిడి చేసింది. అతన్ని సంగీత రచనల వైపు దృష్టి మళ్ళించేలా చేసింది
ఆమె ఎట్లాంటి సంగీత శిక్షణ కలిగింది కాదు. కానీ జీవితాంతం తన భర్త సంగీత సృష్టికి సంబంధించి ఆమె నిర్ణయాత్మకమయిన విమర్శలు చేసేది విశ్లేషణలు చేసేది. సలహాలిచ్చేది. హెచ్చరించేది. ఎల్లార్ ఆమెపై ఆధారపడ్డాడు ఆమె అభిప్రాయాలకు విలువ ఇచ్చాడు. ఆమె తెలివైన సలహాల్ని అనుసరించాడు తరువాతి రోజుల్లో తను ఆమెకు రృల్వప్రడ్రి వున్నానని చెప్పుకున్నాడు.
"నేను రచనల్ని రాగాల్ని ఆమె కోసం రాశాను. కారణం నేను ఎప్పుడు ఎట్లాంటి అభివృద్ధి పధంలో వున్నానో ఆమె ఆసక్తిగా ఎప్పుడూ గమనిస్తూ వుండేది కొన్ని రాత్రులకు ముందు... ఆ రోజు నేను రాసిన రచనను ప్రదర్శించాను అభినందన పూర్వకంగా ఆమె తలకదిలించింది. ఒక్క సందర్భంలో తప్ప. ఆ పేరా దగ్గర ఆగమంది. అక్కడి స్వరాన్ని గురించి మార్చాలని పట్టు పట్టింది ఎక్కడున్నది అక్కడే యధాతధంగా వదిలిపెట్టి నేను పదుకోడానికి వెళ్ళాను. మధ్యలో మెలకువ వచ్చి పక్క గదిలోకి వెళ్ళాను అక్కడ నేను రాసిన పేపరు చూశాను అది యధాతధంగానే వుంది కానీ ఎక్కడ మార్చు అవసరమో ఆ మార్పులు చేసిన పేపరొకటి దానికి జత చేసి వుందడం చూశాను. దానిపైన ఇదంతా చాలా రై
బాగుంది కానీ ఈ చివర్లో ఈ మార్పు చేస్తే బాగుంటుదనుకుంటాను. 'డీయర్ ఎద్వర్ ఈ చివర్లో ఈ మార్పు వుంటే ఎలా వుంటుంది? ఆలోచించు? అని రాసుంది. ఆ చివర్న నేను ఆ మార్పులు చేశాను దాన్ని గురించి మళ్ళీ ఆవిడ నోరు విప్పి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నేను ఉన్నంతా మళ్ళీ తిరగరాశాను. మౌనంగానే ఆ మార్పుకు ఆమె ఆమోదం తెలిసింది” అన్నాడు
మహానగరం ప్రాణవంతమయిన సృజనాత్మక ప్రయత్నాలకు నిర్భంధకరమని, అటంకమని ఎల్లార్ భావించాడు. మల్వర్న్ అన్న చిన్ని వూరికి మకాం మార్చారు అక్కడ ఎల్లార్ నాలుగు 0%0)4లు, కొన్ని 0౧౦౪| రచనలు చేశాడు. వాటిల్లో కొన్ని ఇంగ్లీషు పండుగల సందర్భంగా ప్రదర్శింపబడ్డాయి,
1899లో విజయం అతన్ని వరించింది. రెండు విఖిన్నమయిన సంగీత రచనల ద్వారా అతనికి గుర్తింపు వచ్చింది. వాటిల్లో ఒకటి ౪౭గ4&[0౧9 0౧ &॥ 0గ01౧21 16006 అన్నది. దాని బెన్నత్వాన్ని సుప్రసిద్ధ సంగీత నిర్వాహకుడు వాన్స్రిచ్టర్ గుర్తించాడు 19, జూన్ 1899న లందన్లో అది ప్రదర్శింపబడింది ఇంగ్లీషు ఆర్మెస్ట్రా సంగీతంలో అంత (ప్రచారం పొందిన రచన మరోటి లేదు.
ఆ విజయం గొప్పదే. కానీ దాన్ని మించి అతని రెండో రచన మరింత విజయవంతమైంది. అది 16 6164౧) & 6670౧448 మొదట అది గొప్ప విజయాన్ని వరించలేదు ౩, అక్టోబర్ 1900 బర్మింగ్వాోమ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది. కొంతమంది సంగీతకారులు మాత్రమే దాన్ని మెచ్చుకున్నారు. వాళ్ళతో బాటు అది విన్న బెర్నాద్షా కూడా అభినందించాడు అదే సంవత్సరం లోయర్ రైన్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడినప్పుడు జనం ఉత్సాహంతో పొంగిపోయారు ఇంగ్లాండులో ఆ రచనకు “మాస్టర్ వర్శ్గా గుర్తింపు వచ్చింది
ఇరవయ్యో శతాబ్దం ఆరంభానికి ఎల్లార్ ఇంగ్లీషు సంగీతకారుల్లో సుస్థిర స్థానం సంపాదించాడు. ఎడ్వర్డ్ ౪1! చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవానికి సంగీత రచన చెయ్యమని ప్రభుత్వం ఎల్లార్ని కోరింది మూడేళ్ళ అనంతరం సంగీతంలో అతను సాధించిన విజయాలకి ప్రభుత్వమతన్ని సత్కరించింది 1924లో 1425160106 నగర: [164510 పదవి వరించింది. 1984లో ఉన్నత సంగీత కారుడుగా గుర్తింపు లభించింది.
మొదటి ప్రపంచ యుద్ధంలో ఎల్లార్ తనకు చేతనయినంతలో తన దేశానికి సేవ చేశాడు. వాలంటీర్ సర్వీసు చేశాడు. మార్షల్ మ్యూజిక్ రాశాడు.
రిం
1920 నాటికి అతను ఉన్నతమయిన సంగీత సృష్టి చేశాడు రెండు సింఫనీలు, కొన్ని ఆర్మెస్త్రా రచనలు, ఛాంబర్ మ్యూజిక్స్ రచనలు చేశాడు. అతను గొప్ప ప్రజాదరణళతో, పేరు ప్రఖ్యాతులతో వున్న దశలో అతను హరాత్తుగా సంగీత రచనలు మానేశాడు. ప్రాణానికి (ప్రాణమైన అతని భార్య 1920లో చనిపోవడంతో అతని సృజనాత్మక కార్యకలాపం స్తంభించిపోయింది.
ఒక దశాబ్దం పాటు నిశ్శబ్దంగా వుండిపోయాడు. 1934లో జార్జి ౪ ఆరోగ్యం బాగుపడాలని ఒక కీర్తన రాయడంతో అన్నేళ్ళ నిశ్శబ్దం నించీ బయటపడ్డాడు. మళ్ళీ తను సంగీత రచనలు మొదలు పెడతానని మిత్రులతో అన్నాడు మూడో సింఫనీ రచన మొదలు పెట్టాడు. అది పూర్తి చేసే దాకా అతను జీవించి లేడు తొంటి నొప్పితో, తొడల నొప్పిత్రో
అతను ఆపరేషన్ చేయించుకున్నాడు కానీ పూర్తిగా కోలుకోలేకపోయాడు కొన్నాళ్ళకే 23 ఫిబ్రవరి 1994న కన్నుమూశాడు. ప!
సీజర్ ప్రాంక్ ౮౭50! [౧/2౧ 10-12-1822 -- 6-1-1890
1885 ఆగస్టులో సీజర్ ఫ్రాంక్ 06౪4160116 16310 గౌరవాన్ని పొందాడు. ఆర్గాన్ ప్రొఫెసర్‌గా ఆయన చేసిన సేవకు గుర్తింపు లభించింది. అరవై రెందు సంవత్సరాల వయసున్న సంగీతకారుడికి ఆ వయసులో 'గౌరవం' రావడం చిత్రమయిన సంగతే. సీజర్ ఫ్రాంక్ పియానో, ఆర్గాన్ రచనలు, ఒక సింఫనీ కవిత, మరెన్నో మంచి రచనలు చేశాడు. ఐనా ఈ మర్యాదలు అతని అవిష్కారాల కన్నా ఉత్తమ సంగీత ఉపాధ్యాయుడుగా లభించాయి
'ఫ్రాంక్లాంగే సుప్రసిద్ధ సంగీతకారులందరూ సమకాలికుల్తో బాధలు పడిన వాళ్ళే. (ఫ్రాంక్ సంగీత ప్రదర్శన విజయవంతమంటూ కావడం అతని అరవయ్యెనిమిదవ ఏట జరిగింది. అది అతని జీవితంలో చివరి సంవత్సరం ఆ ప్రదర్శనను జనం అమితోత్సాహంతో అభినందించారు. అంతకుముందు దాకా పారిస్ జనం అతన్ని అంటరానివాడుగా చూశారు. తోటి సంగీతకారులు ఎప్పుడూ వ్యతిరేకతనే ప్రదర్శించారు.
1880లో ఫ్రాంక్ సింఫనీ కవితని రీవార్సల్ చేస్తున్న సంగీత దర్శకుడు కొలోన్ “మధ్యలో ఆర్మెస్ట్రాని ఆగమని చెప్పి ప్రాంక్ వైపు తిరిగి 'ఈ రచన చేసింది మీరేనా?” అన్నాడు “అవునండీ ఆ రచన నాకు చాలా యిష్టమైంది" అన్నాడు ప్రాంక్. కోలోన్ ఆర్కెస్ట్రా వైపు తిరిగి “మిత్రులారా! ఈ సంగీతం భయాన్ని కలిగిస్తోంది. ఏమైతేనేం కానీ మొదలుపెట్టింది" అన్నాడు.
(ఫ్రాంక్ 165 8621146465 అన్న రచన పదేళ్ళు శ్రమించి చేశాడు. పారిస్‌లోని సుప్రసిద్ధ సంగీతకారుల ముందు ఆ రచనని ప్రదర్శించడానికి సంకల్పించాడు. 1879లో ఆనాదు పారిస్‌లో వున్న సుప్రసిద్ధ సంగీతకారులందర్నీ తనయింటికి ఆహ్వానించాడు. చివరి నిముషం దాకా అతిథులందరూ 'మర్యాదాపూర్వకంగా ఏవో పనులున్నాయని చెప్పి పంపి తప్పించుకున్నారు. రాలేకపోవడానికి ప్రతి ఒక్కరూ ఏవో కారణాల్ని కల్పించారు. అతని సంగీత ప్రదర్శనకు కేవలం యిద్దరంటే యిద్దరు మాత్రమే వచ్చారు.
తెలిసిన వాళ్ళందరూ ్రాంక్ని నెమ్మదస్థుడనేవాళ్ళు. మరీ పొడవైన ఓవర్‌కోట్ వేసుకుంటాడని, మరీ ్రొట్టి ట్రౌజర్ వేసుకునేవాడనీ అంటారు. ఒక చోటు నించీ యింకో చోటికి హదావుడిగా తిరుగుతూ వుండేవాడట సెయింట్ క్లాటిల్డ్ చర్చిలో ఆర్గాన్ పాఠాలు
రి్ర్
చెప్పేవాడు. ఎందరో ఇళ్ళకు వెళ్ళి శిష్యులకు సంగీత పారాలు చెప్పేవాడు ఒకచోటి నించీ యింకో చోటుకి పరుగెడుతూ హడావుడి పదుతూ వుండేవాడు. ఫ్రాంక్ ఎప్పుడూ అయోమయంలో వుండేవాడు. గొప్ప మతిమరుపు కానీ ఆర్గాన్ అంటే ఆయనకు ప్రాణం. ఆర్గాన్‌కు సంబంధించి ఎంతో సీరియస్‌గా సంగీత రచనలు చేసేవాడు. కానీ ఎవరూ వాటిని పట్టించుకునేవాళ్ళు కారు. ఫ్రాంక్ నిరాడంబరుడు. నమ్రతగా దైవాన్ని సంగీతాన్ని ఆరాధించాడు దైవ సేవలో, సంగీతారాధనలో ఆయన సంతోషంగా వుండేవాడు అతను ఏమీ ఆశించలేదు. కోరుకోలేదు ఆ దైవ సేవ, సంగీతారాధన కొనసాగితే చాలని అనుకున్నాడు ఫ్రాంక్ నిర్మలమయిన మనిషి ప్రపంచంతోను, తనతోనూ శాంతియుతంగా జీవించిన మనిషి ఫ్రాంక్ ప్రతిరోజు కొన్ని గంటల పాటు నిశ్శబ్దంగా ధ్యానంలో గడిపేవాడు అతని చైతన్యంలోని మధురపార్వం వల్ల కష్టాలు, కారిన్యాలు, బాధ, (మ ఏవీ అత్రన్ని తాకలేకపోయేవి. ఫ్రాంక్ వంచన అంటే ఏమో తెలీని మనిషి కాడి డిబుస్సి అతని గురించి చెబుతూ “ఒక మధుర స్వరాన్ని అతను వింటే చాలు ఆ రోజంతా ఆనందంగా వుల్లాసంగా గడిపేస్తాడు. ఈ మనిషి దురదృష్టవశాత్తు గుర్తింపు లేనివాడు, పసిపిల్లవాడి ఆత్మ అతన్లి తమాషా ఎక్కడండే తనకు పూర్తి వ్యతిరేకమయిన పరిసరాల్లోనూ, యితరుల వంచనలోన్తూ అతను అణుమాత్రం కూడా బాధపదడు” అన్నాడు. 1890లో అతని రచన మౌలిక విజయం పొందినపుడు జనం ఆనందంతో కేరింతలు కొట్టినప్పుడు ఆయన ప్రతిస్పందన * ఈ విజయానికి కారణం ఈ రచనను ప్రదర్శించిన సంగీతకారుల (ప్రతిభ ఈ ఆనందం వాళ్ళకే చెందుతుంది” అన్నాడు, దానికి కారణం తన రచన అన్న స్పృహ కూడా ఆయనకు లేదు చివరికి జనం తండోపతండాలుగా వచ్చి తన్ను చుట్టు ముట్టి గౌరవిస్తూ వుంటే ఆయన “మొత్తానికి చివరికి జనం నన్ను అర్ధం చేసుకోవడం మొదలు పెట్టినట్లున్నారు” అన్నాడు. అవును. ఆయనకు అరవై తొమ్మిదేళ్ళ వయసొచ్చే దాకా జనం ఆయన్ని అర్ధం చేసుకోలేదు. అవును ఆయన ఆనందపు నీడను కూడా జనం అర్థం చేసుకోలేదు. ఫ్రాంక్ తండ్రి ఒక జర్మన్ సంస్థలో వుద్యోగి. తన కొడుకు సంగీతకారుడు కావాలని ఆయన కోరిక, పియానో నిపుణుడిగా తన కొడుకు విజయపరంపరల్లో విహారయాత్ర చేసినట్లు కలలు కనేవాడు. లీగ్ కన్సర్వేటరీలో ఫ్రాంక్ తొలిసారిగా పియానో పాఠాలు నేర్చుకున్నాడు. త్వరత్వరగా సంగీత పారాలు నేర్చుకున్నాడు అతన్లో ఎంత అభివృద్ధి కనిపించిందంటే తిం
పదకొండో ఏట బెల్జియంకు సంగీత ప్రదర్శన యివ్వడానికి వెళ్ళాడు. పదమూడో ఏట సంగీత కళాశాలలో తన పియానో నైపుణ్యానికి ప్రధమ బహుమతి పొందాడు. సంగీతంలో మరిన్ని విజయాల కోసం అతను పారిస్‌లో ఆధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఏర్పడింది 1885 ప్రాంతంలో ప్రాంక్ కుటుంబం పారిస్ వచ్చింది అన్టోన్ రీఛా దగ్గర ప్రాంక్ కొంత కాలం సంగీతం అధ్యయనం చేశాడు ఫ్రాంక్ ఎంత తెలివైన విద్యార్ధి అంటే కాలేజీలోని దాదాపు అన్ని మైజులూ అతనికే దక్కేవి. టీచర్లు ఆశ్చర్యపోయేవాళ్ళు ప్రాంక్ మొదటి సంవత్సరం పరీక్షలకు హ్యూమెన్ రచనని అధ్యయనం చెయ్యాల్సి వచ్చింది ఆ సందర్భంగా ఆ రచనని ఫ్రాంక్ ప్రదర్శిస్తున్న సందర్భంలో తన స్వకీయమయిన రాగాన్ని అందులో మేళవించాదు. దాంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు అతనికి మొదటి (ఫైజు కాకుండా రెండో ఫైజు ఇచ్చాడు నాలుగో సంవత్సరం ఫైనల్ పరీక్షలో రెండు ఇతివృత్తాలు తీసుకున్నాడు. ఒక దాంతో స్వేచ్భారాగాల్ని సమ్మిళితం చేశాడు. రెండోది సొనటా. మళ్ళీ రెండో ప్రైజ్ వచ్చింది. ఆర్గాన్ ప్రదర్శనలో ఆ ఏడు కొన్ని బహుమతులు సంపాదించాడు. '౧౧౫ 68 గంగకు 1842 పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ తన కొడుకులో వస్తున్న 'అభివృద్ధి తండ్రికి రుచించలేదు సంగీత కళాశాలలో ప్రాంక్ అర్ధానిస్ట్రో, లేదా సంగీత స్వరకర్వో అవుతాడని అనుకున్నాడు. (ఫ్రాంక్ స్వరకర్త కావడానికే యిష్టపడ్డాడు. తనకు తనే పరిచయం చేసుకుని పదిహేనో ఏట పారిస్‌లో పియానో ప్రదర్శన చేశాడు సంవత్సరం తరువాత రెందు సంగీత రచనలు చేసి ప్రదర్శించాడు. తండ్రి సంగీత రంగస్థలంలో తన కొడుకు పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు సాధించాలని కాంక్షించాడు. తన కొడుకుని సంగీత కళాశాల నించీ తీసేసి బెల్టియం తీసుకెళ్ళాడు. అక్కడ కొడుకు చేత సంగీత ప్రదర్శన లిప్పించాడు వాటిలో ఒకటి బెల్జియం రాజు కోసం ఏర్పాటు చేశాడు. కానీ యివన్నీ ఫ్రాంక్ సంగీత వృత్తిలో అతి తక్కువ “అభివృద్ధి మాత్రమే సాధించాయి. వాళ్ళు మళ్ళీ 1844లో పారిస్ తిరిగివచ్చారు. రులాబ్రుయేరె అన్నచోట ఒక మ్యూజిక్ సెలూన్ పెట్టారు. దానివల్ల ప్రాంక్ అక్కడికి వచ్చిన అతిధుల ముందు తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం కలిగింది ఈ ప్రదర్శనల కోసం ్రాంక్ ఎన్నో సంగీత రచనలు చేశాడు సందర్భాల ప్రదర్శన కోసం సంగీత రచనలు చేయడమన్నది మొదటిసారిగా, చివరిసారిగా అతని జీవితంలో అప్పుడే చేశాడు. గాఢంగా అతన్లోని మత విశ్వాసం సంగీత సృజన వేపు మళ్ళింది. దీర్మమయిన మత సంబంధ రచనలు చేశాడు. బైవిల్కు సంబంధించి అతను చేసిన 'రూత్” రచన 4 జనవరి 1846లో సంగీత కళాశాలలో ప్రదర్శింపబడింది. త
సభికుల్లో లిస్జ్ట్, మేయర్ బోర్ మొదలయి ప్రముఖ సంగీతకారులు కూదా వున్నారు కొంత మందికి ఆ ప్రదర్శన నచ్చింది. ఫ్రాంక్ 1848లో మేడమోయ్ సిల్లి డెస్మాసీక్స్ అన్న నటిని పెళ్ళాడాడు. ఆ సంవత్సరం జరిగిన విప్లవంతో షారిస్ అల్లకల్లోలమైంది. చర్చికి చేరడానికి ఆ నవ దంపతులు బారికేడ్లని దాటాల్సి వచ్చింది తండ్రి కొడుకుల మధ్య రగులుతున్న చిచ్చు కారణంగా వాళ్ళ దాంపత్యం కూడా పటాపంచలయింది. తండద్రేమో స్టేజీల మీద అద్భుత ప్రదర్శనలిచ్చి గొప్ప ఖ్యాతి సంపాదించాలని కొడుకు గురించి కలగిన్నాడు (ఫ్రాంక్ ఏమో తను స్వరకర్తగా మిస్తూ, చర్చిలో ఆర్గానిస్టుగా వుంటూ కాలక్షేసం చేయాలని నిర్ణయించుకున్నాడు అతని తండ్రి, అతని భార్య ఆతన్ని తమకనుకూలంగా మార్చలేమని నిర్ణయించి దూరమయ్యారు, ఇప్పుడు సంగీతకారుడుగా (ఫ్రాంక్ తన బహుముఖమయిన కార్యకలాపాల్లః నిమగ్నుడయ్యాడు. ఎన్నో ఆర్గాన్ పోస్టుల్ని నిర్వహించాడు 1858లో సెయింటీ క్లాటిబ్టిత్రో ఆరానిస్టగా నియమితుడయి జీవితాంతం పని చేశాడు అతని శిష్యడయిన విన్సెంట్ “అశ్రన్స జీవితంలో ముఖ్యమయిన భాగమంతా అక్కడే గడిపాడు ముపష్పయ్యేళ్ళ పాటు ప్రత్రి ఆదివారం, ప్రతి పండుగరోజు ప్రతి శుక్రవారం పొద్దున్న తన ప్రతిభను ప్రదర్శించాడు" అన్నాడు అతని శిష్యుల్లో చాలా మంది అతను ఆర్గాన్ ప్రదర్శిస్తూ వుండే దగ్గర కూచుని అతని స్వతంత్ర సంగీత స్వరాభినయాన్ని పరిళీలించేవాళ్ళు వాళ్ళ వూహల్ని సౌందర్యవంతం చేసుకునేవాళ్ళు. ౩, ఏప్రిల్ 1866న ఫ్రాంజ్ లిస్జ్డ్ అట్లాంటి (ప్రదర్శనకు వచ్చి ఆ సాంతం విని లేచి” బాబ్ మళ్ళీ పునర్జన్మ ఎత్తి వచ్చాడు” అంటూ వెళ్ళాడు. పియానో, యితర వాద్యాలకు చెందిన పారాల్ని ప్రవేటుగా చెప్పేవాడు 18702 తరువాత పారిస్ కన్సర్వేటరీలో ఆర్గాన్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు పాఠాలు చెబుతూ రొటీన్‌గా వున్న విషయాలు పక్కన పెట్టి బాచ్, లేదా గ్లూక్ తదితర సుప్రసిద్ధ సంగీతకారుల గురించి, వారి సంగీత బెన్నత్వం గురించి చెప్పేవాడు చాలా మంది విద్యార్థులు అతన్ని విచిత్ర వ్యక్తిగా చూసేవాళ్ళు కొద్ది మంది అతని ప్రతిభను గుర్తించి అతన్ని నిజమైన మనిషిగా గౌరవించి (ప్రేమించేవాళ్ళు. డిబుస్సి, ఛాసన్, డిండి, ద్యూపార్క్ మొదలయిన సంగీతకారులు ఆయన్నించీ (ప్రేరణ పొందాడు. ప్రాంక్ జీవితం 'బిజీగా వుండేది ఫ్రాంక్ స్నేహితుడు, ఆర్గానిస్టులు ఐన టోర్న్మైర్ అన్న అతను “పెళ్ళయిన అతని మొదటి సంవత్సరాలు “ముగిసిపోయాయి ” ఐనా మనిషి బతకాలి కదా! పొద్దునే తెల్లవారు జామున నాలుగన్నరకు లేచి ఆ అరున్నర దాకా స్వర రచన చేసేవాడు ఎనిమిది గంటలకు లేచి పారిస్ వీధుల్లో తతి
పడేవాడు. శిష్యుల యిళ్ళకు వెళ్ళి సంగీత పారాలు చెప్పేవాడు. ఒక పండు అంత వెన్న తిని కడుపునింపుకునేవాడు. అక్కణ్ణించి అట్లూయిల్ వెళ్ళేవాడు అక్కడ నవ యవ్వన వతులయిన ప్రీల సమాజానికి వెళ్ళి అసాధారణమయిన నవ్య రీతుల్ని వాళ్ళకు బోధించేవాడు తన చర్యల్ని ఎప్పుడూ తన అదుపులో వుంచుకునేవాడు ఎప్పుడయినా తన సంగీతం గురించి చెబుతున్నప్పుడు కూడా హరాత్తుగా ఆగి పక్కగదిలోని వెళ్ళి చెప్పవలసిన విషయాల్ని, వివరాల్ని చూసుకొని వచ్చి చెప్పేవాడు. ఒకదాని తరువాత ఒకటిగా తన కిష్టమయిన సంగీత రచనలు చేస్తూ పోయాడు.
కానీ ఒకటి వెంట ఒకటిగా నిరాశలు వెంటాడుతూ వచ్చాయి. అతనెంతో శ్రమించి కూర్చి
న [6౪216166 16గ౫6 రచనా సందర్భంలో అతనికి నరాల జబ్బు సంక్రమించింది. అది
అసలు ప్రదర్భ్శనకే నోచుకోలేదు. అది అచ్చుకూడా కాలేదు 80, జనవరి 1887న అతనికి
గుర్తింపు తేవడానికి మిత్రులు, శిష్యులు అతని సంగీత ప్రదర్శన ఏర్పాటు చేశారు. అది
'పేలవంగా ముగిసింది 17 ఫిబ్రవరి 1889న అతని 5౧౭౧౦౧౫ 1౧ 4 ౧౫1౫౦౯
ప్రదర్శింపబడింది. పారిస్ కన్సర్వేటరీ సభ్యులు దాని ప్రదర్శన జరిగి తీరాలని పట్టుబట్టడంతో
అది వీలయింది. శ్రోతల్లో అనాటి సుప్రసిద్ధ సంగీతకారులు, అధికారులు ఎందరో వున్నారు. ప్రదర్శన జరిగింది. ఒక కన్సర్వేటరీ ప్రొఫెసర్ “అది సింఫనీయా? ఎద్దుకొమ్మ బూర వూదినట్లుంది” అన్నాడు.
ఛార్లెస్ గౌనాడ్ అన్న సంగీతకారుడు ఆడిటోరియం నించీ బయటికి వచ్చి తన చుట్టూ వున్న అభిమానులయిన అమ్మాయిల్లో “మొందిగా పట్టుదలగా రాగాన్ని సాగదీయడంలో అతనికెవరూ సాటిరారు” అన్నాడు వీటన్నిటికి మించి ఒక సంగీత ప్రేమికుడు ఫ్రాంక్ శిష్యుడితో “ఈ సింఫనీ ఎందుకిక్కడ ప్రదర్శించారు? ప్రొఫెసర్ ఫ్రాంక్ అంటే ఎవరు? బహుశా ఆర్గాన్ ప్రాఫెసరనుకుంటాను అన్నాడు.
ఆ ప్రదర్శన వైఫల్యం ్రాంక్ని తాకలేదు. “జనాల చలనం లేని తనం అతన్ని కదిలించలేదు. తన రచన (ప్రదర్శింపబడింది, అన్న ఉత్సాహం అతన్లో కనిపించింది కొత్త సంగీత రచనలకు అతను ప్రణాళికలు వేశాడు” అన్నాడొక శిష్యుడు.
ఒక సంక్షిప్తమయిన సంగీత విజయం అతని జీవితంలో 19, ఏప్రిల్ 1890న జరిగింది జనం ఆనందోత్సావోలతో అభినందించారు. ఆ నెలలోనే మళ్ళీ అది ప్రదర్శింప బడింది. ఈ మధ్యకాలంలో ఎప్పటానే పారిస్ వీధుల్లో హడావుడిగా పరుగులు పెడుతూ
ల్ో
శిష్యుల ఇళ్ళకు సంగీత పారాలు చెప్పడానికి వెళుతూ మధ్యలో సంగీత రచనలూ చేశాడు. ఒక శిష్యుని అపార్ట్మెంటుకు వెళుతూ స్పృహ తప్పిపడిపోయాడు కోలుకున్నాక్రా మళ్ళీ యధావిధిగా పనుల్లో మునిగాడు కానీ మళ్ళీ అతను పూర్వ స్థితికి రాలేదు. ఊపిరి తిత్తుల వ్యాధితో పడక చేరాడు. అంత అనారోగ్యంలోనూ ఒక రోజు తన పదక మీది నించీ లేచి తన ప్రియమైన ఆర్గాన్ దగ్గరికి వెళ్ళి వాయించాడు. తను చివరగా రాసిన 7/66 6[011165ో వాయించాడు. అతను కన్నుమూసినపుడు అతని పడకమీద అఆ రచనకు సంబంధించిన పేపర్లు కనిపించాయి. 90
ఛాలెన్ గౌనాడ్ 0౮౧౭68 ౦4౧౦౮ 17-6-1818 -- 18-10-1893
గౌనాడ్ చాలా చిన్ని వయసులో వున్నప్పుడే సంగీతకారుడు కావాలనుకున్నాడు. అతని తండ్రి లిధియోగ్రాఫర్ చిత్రకారుడు ఛార్లెస్ ఐదేళ్ళ వయసున్నప్పుడు తండ్రి చనిపోయాడు అతని తల్లి ఛార్లెస్‌ని బోర్డింగ్ స్కూల్లో చేర్చింది. ఛాళ్లెసకు సంగీతం పీరియడ్ అంటే ప్రాణం అతని పదమూడో ఏట అతని తల్లి మొదటిసారి అతన్ని ఒపేరా ప్రదర్శనకు తీసుకెళ్ళింది దాన్ని గురించి చెబుతూ ఛార్లెస్ “నేను ఒక ఆలయంలోకి 'ప్రవేశించానను కున్నాను మెల్లగా నామనసంతా పరిమళ భరితమయింది నా చుట్టూ స్వర్గం విస్తరించింది. ఆ రా(త్రి' ఎంత అద్భుతమయిన రాత్రి! ఎంత ఆనందం! ఎంత పరవశం!” అన్నాడు.
ఈ అనుభవం తర్వాత అతని జ్ఞాపకాల్లో అది మెదుల్తానే వుంది అతను మెల్లగా తన తల్లి దగ్గరకు వెళ్ళి ' అమ్మా! నేను సంగీత కారుడు కావాలనుకుంటున్నాను.” అన్నాడు. సెంట్ లూయీస్ న్మూల్లో తను చదువుకుంటున్న అకడమిక్ చదువులకు స్వస్తి చెప్పాలనుకున్నాడు కేవలం సంగీత అధ్యయనానికి మాత్రమే పూర్తి కాలాన్ని వినియోగించాలని సంకల్పించాడు. అతని తల్లి కూడా సంగీతాభిమాని మంచి పియానో వాద్య నిపుణురాలు. కొడుకు కోరిక పట్ల సానుభూతితో స్పందించింది ఆమె అన్ని విషయాలలో పద్ధతయిన మనిషి. భర్త పోయాకా యింటి పనులు చూసుకుంటూనే భర్త చేసే లిధియోగగ్రఫీ వ్యాపారం కూడా విజయవంతంగా కొనసాగించింది ఆమె వుద్దేశంలో మంచి సంగీతకారుడు కావాలన్నా దానికి తోడు సక్రమమయిన అకడమిక్ విద్య కూడా వుండాలి. సంగీతానికి ఛార్లెస్ తన కాలాన్నంతా వినియోగించే ముందు అతను విద్యాభ్యాసం ముగించాలని అమె ఉద్దేశం. వీటిని నిర్వహించడానికి ఆమె స్కూలు ప్రిన్సిపాల్‌ని కలిసి విషయం వివరించింది. ప్రిన్సిపాల్ ఛాలెన్ని తన గదికి పిలిచి (వశ్నించాడు “ఎందుకు నువ్వు సంగీతకారుడు కావాలనుకుంటున్నావు? ఛార్లెస్ “ఎందుకంటే సంగీతమంటే నాకిష్టం” అన్నాడు. ఆ సమాధానంలో దృఢత్వముంది. 'సంగీతకారుడి జీవితం కష్టాలతో నిండి వుంటుంది” అని ప్రిన్సిపాల్ అంటే *ఐతే ఏమిటి? అన్నాడు ఛార్లెసో నీకు అంత పట్టుదల వుంటే నాకు దృష్టాంతం కావాలి” అన్నాడు ప్రిన్సిపాల్ ఒక కవిత అతనికిచ్చి దీనికి సంగీతం సమకూర్చు
91
అన్నాడు ప్రిన్సిపాల్. ఛార్లెస్ పియానో ముందు కూచుని సహజంగా ఆ కవితను సంగీత బద్ధం చేసి వినిపించాడు. ప్రిన్సిపాల్ అతని సహజ ప్రతిభకు ముగ్గ్భుడై 'నువ్వు చెప్పింది కరెక్ట్. నువ్వు తప్పకుండా సంగితకారుడవుతావు అన్నాడు. తల్లి కోరిక ప్రకారం ఛార్లెస్ తన స్కూలు విద్యాభాస్యం పూర్తి చేశాడు. అతని పద్దెనిమిదవ ఏట పారిస్ సంగీత కళాశాలలో చేరాడు. అక్కడ శ్రద్ధగా సంగీత అధ్యయనం చేశాడు. అతను మంచి విద్యార్థి. శద్దా సక్తులు గలవాడు. 1839లో తన ౯6౧౧౬౧౮ రచన వల్ల గ౫66 గంగాల'లో (ప్రవేశార్టత సంపాదించాడు. రోంలో మూడేళ్ళున్నాడు. ఇటాలియన్ చర్చి సంగీతంతో పరిచయం ఏర్చరచ్చుకున్నాడు. ఛార్లెస్ గాధమయిన మత విశ్వాసం కలిగినవాడయినా ఆ చర్చి సంగీతం అతనికి భిన్నంగా తోచింది. సిస్టెయిన్ భాపెల్లో కోరల్ సర్వీసులకు హాజరయ్యాడు, పదప్తాగ్రః శతాబ్ది ఫంగీతకారుడయిన గియొవానీ సంగీత రచనల్ని అధ్యయనం చేశాడు. వాటివల్ల చర్చికోసం తన సొంత సంగీత రీతిలో రచన చెయ్యడానికి పూనుకున్నాడు. వాటిలో మొదటి రచన 1841లో రోంలో ప్రదర్శింపబడింది. రెండో తరువాతి సంవత్సరం వియన్నాలో 'ప్రదర్శింపబడింది. ఛార్లెస్ పారిస్ తిరిగి వచ్చాకా ఒక చిన్ని చర్చిలో ఆర్గానిస్టుగా చేరాడు అత్రని గాధమయిన మత దృష్టి, చర్చితో అతని అనుబంధం వల్ల అతను ప్రీస్టుగా మారాలని భావించాడు. మత సంబంధ (గ్రంథాల్ని అధ్యయనం చేశాడు. ప్రీస్టులాగా వస్త్రధారణ చేశాడు. కానీ త్వరలోనే తను సంగీతాన్ని వదిలిజీవించలేనని తెలుసుకున్నాడు. ప్రీస్టు కావా లన్న కోరిక. పక్కన పెట్టాడు. సంగీతంలో మత సంబంధమయిన రచనలు చేయడానికి నిర్ణయించుకున్నాడు. సాధారణంగా అతను చర్చి సంగీతం పైనే ఏకాగ్రత నిలిపినా సింఫనీ రంగంపైన కూడా ఆసక్తి ప్రదర్శించాడు. యాదృచ్చికంగా ఆనాటి సుప్రసిద్ధగాయని పాలైన్ వయార్ దాట్ని కలిశాడు. ఆ కలయిక అతనిపై గాడ ప్రభావాన్ని చూపింది. అతని జీవితంలో ఆ విషయం అతను మరచిపోలేదు. ఆమె ఛాక్లిస్ని తన కోసం ఒక ఒపేరా రాయమని కోరింది. మేడం వయార్డాట్ పలుకుబడి వల్లల 16 ఏప్రిల్ 1851న ఆ ఒపేరా 'ప్రదర్శింపబడింది. టెటిల్ రోల్ ఆమే వేసింది. ఆ ప్రదర్శన మరీ అంత విజయవంతం కాలేదు కానీ ఆరు ప్రదర్శనలు జరిగాయి. ఒక సంగీత విమర్శకుడు “పవిత్రమయిన ఉద్దేశాలతో ఒక యువకుడు 92"
ఉన్నత స్థాయిలో ప్రయత్నించాడు. సంగీతాఖిరుచి వెనకడుగు వేస్తున్న ప్రతిసారీ యువకుల నవ్యధోరణికి ప్రోత్సాహమివ్వాలి” అన్నాడు.
ఛాల్లెస్ ధియేటర్ కోసం రచనలు చెయ్యడం ప్రారంభించాడు. పోసార్ట రచన
యులిస్సీ ఆధారంగా రాసిన రచన 1852లో ప్రదర్శింపబడి విఫలమైంది. ఓ2౧0౧6 5200142౧16 అన్న ఐదంకాల ఒపేరా 1854 రాశాడు. అది వదకొండు సార్లు ప్రదర్శింపబడింది. మోలియర్ నాటకం ఆధారంగా 1858లో ఒక ఒపేరా రాశాదు.. అది సాధారణ విజయాన్ని పొందింది.
ఛార్లెస్ గొప్ప రచన 1859లో వచ్చింది. ఆ ఒపేరా పేరు 'ఫొస్ట్. ఎన్నో కష్టనష్టాల కోర్చి, ఆటంకాల్ని ఎదురొడ్డి ఫొస్ట్ ఒపేరా రీహార్సల్స్ పూర్తి చేసుకుని సిద్ధమయింది. ఇప్పుడు దానికి సంబంధించి. సెన్సార్షిప్ సమస్య వచ్చి పడింది. ఫౌస్ట్ ఒపేరాలో కెథెడ్రిల్ దృశ్యం కేధలిక్ చర్చికి వ్యతిరేకంగా వుందని దాన్ని తొలగించాలని వాళ్ళు కోరారు. ఆరంగంలో నివ్చాతులకు ఆ ఒపేరా దర్శకుడు ప్రదర్శించి ఆ రంగం రోం ను కించపరిచేట్లుగా వుందా? అని అడిగాడు. అదేం లేదని తేలింది. ఆ విధంగా సెన్సార్ బాధ తప్పింది.
1859 మార్చి 19న ఫౌస్ట్ ఒపేరా “ప్రీమియర్ ప్రదర్శన జరిగింది. అది మరీ అంత పెద్ద విజయాన్నేమీ పొందలేదు. కొంతమంది గొథే నాటకం ఫొస్టుకు న్యాయం జరగలేదన్నారు. మరి కొంత మంది చర్చి సీనులో ప్రేమ సంగీతం అసందర్భమన్నారు. అన్నిటికన్నా విమర్శనాత్మకమయిన ప్రతిస్పందన ఏమంటే ఆ ఒపేరా ఒక ప్రయోగం ఐతే అది అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయింది, అన్నది. మొదట ఆ ఒపేరా అచ్చువేయడానికి ఎవరూ ముందుకు రాలేదు కానీ చౌదెన్స్ * అన్న అతను సాహసించి అచ్చేశాడు. ఆ ప్రచురణతో అతను ప్రచురణకర్తగా నిలదాక్కుకున్నాడు.
ఫాస్ట్ మొదట రాసినపుడు ఆ ఒపేరా ఘనవిజయాల్నేమీ సాధించలేదు కానీ యాఖై ఏడుసార్లు ప్రదర్శింపబడింది. మార్పులు చేసి తిరిగి రాసిన ఫొస్ట్ 1869 మార్చి మూడున పారిస్‌లో ప్రదర్శింపబడింది. గొప్ప విజయాన్ని పొందింది. శాశ్వతంగా ్రదర్శింపబడే ఒపేరాల్లో స్థానం సంపాదించింది. కేవలం ఒక పారిస్‌లోనే యాభై ఏళ్ళలో రెండువేలకు పైగా పొస్టు ప్రదర్శలు జరిగాయి. 1870 నాటికి గొప్ప జనాదరణ పొందిన ఒపేరాల్లో సాటిలేనిది లందన్లో ప్రసిద్ధి పొందింది. విక్టోరియా రాణి తన మరణానికి ముందు అందులోని భాగాల్ని తన కోసం పాడించుకుని వింది. అమెరికాలో కొత్తగా కట్టిన న్యూయార్క్
93
మెట్రోపాలిటన్ ఒపేరా కంపెనీ ప్రారంభం కోసం ఫొస్ట్ ప్రదర్శన 1883 అక్టోబరు 22న జరిగింది.
- 1852 కొంతకాలం 0౧0121 0౧౦6౧ కు నిర్వాహకుడుగా పనిచేశాడు. ఛార్తెస్ చర్చికోసం ఒక వాల్యూముకు సరిపడా-రచనలు చేశాడు. ం 1870లో (ఫ్రాంకో - ప్రష్యన్ యుద్ధం మొదలయ్యాకా ఛార్లెస్ పారిస్ వదిలి ఇంగ్లాండు వెళ్ళి కొన్నేళ్ళున్నాడు. అక్కడ క్రమక్రమంగా మత సంబంధమయిన మార్మికత వైపు ఆకర్షితుడయ్యాడు. 1881 తర్వాత ఐతే అన్ని వదిలి కేవలం మత సంగీతానికే అంకితమయ్యాడు. పియానో పై సంగీత సాధన చేస్తూ పియానోపై స్పృహ తప్పిపడిపోయాడ్డు, మ్హూడు రోజుల తరువాత కన్నుమూశాడు. 9డ
ఎడ్వర్డ్ గ్రీగ్ 606౪216 ౮౧166 15-6-1843 -- 4-9-1907
గ్రీగ్ నార్వే జాతీయ హీరో. ఆయన గొప్ప సంగీతకారుడు కావడం వల్ల మాత్రమే కాదు. అ జాతికి, ఆ ప్రజల సంగీతానికి ఆయన ప్రతినిధి కావడం వల్ల ఆయన హీరో. జాతీయ ప్రేరణలో ప్రజల గురించి, జాతి గురించి, దేశం గురించి పాటలు పొడిన సంగీత కారులుంటారు. ఆ విషయంలో గ్రీగ్ తన ప్రజలతో, దేశంతో అవిభాజ్యమయిన సంబంధం కలవాడు. ఆయన సంగీతం వింటే నార్వే ప్రజలు, దేశం, ఆచారాలు మన కళ్ళ ముందు కదుల్తాయి. జలపాతాలు, జానపద నృత్యాలు, గ్రామీణ జీవితం కళ్ళకు కట్టిస్తాడు.
గ్రీగ్ పసివాడుగా వున్నప్పుడు నార్వేకు చెందిన సుప్రసిద్ధ వయోల్సిస్టు, సంగీతకారుఢు ఓలే బల్, అతన్లో “నువ్వు ఇక్కడి లోయలు, అడవులు, సరోవరాలు, (ప్రవావాలు చూశావా? మనపైన వున్న నీలాకాశాన్ని చూశావా? అవి నా సంగీతాన్ని చేశాయి - నేను కాదు_ నేను వయోలిన్ వాయిస్తున్నప్పుడు యాత్రింకమయిన కదలికల్ని మాత్రమే నిర్వహిస్తున్నట్లు ఒక నిశ్శబ్ద (శోతగా మాత్రమే నేనున్నట్లు నార్వే ఆత్మ నా ఆత్మతో కలిసి పాడుతున్నట్లు తెలుసుకున్నాను అన్నాడు. అదే విషయాన్ని కొన్నేళ్ళ తరువాత గ్రీగ్ కూడా చెప్పాడు. గ్రీగ్ కేవలం ఒక ఉపకరణం మాత్రమే అతనూ నిశ్శబ్ద (శ్రోత మాత్రమే. 'నార్వే ఆత్మ అతని ఆత్మతో కలిసిపాడుతుంది.
గ్రీగ్ యువకుడుగా వున్నప్పుడు తను సంగీతకారుడవుతానని అనుకోలేదు. తను సంగీతకారుదయ్యాకా తన జన్మభూమితో తనకు విడదీయరాని అనుబంధమేర్పడిందనీ అతనికి తెలీదు. చిన్నప్పుడు కలలు కనేవాడు, సోమరి. చెప్పడానికి వీలుకాని ఎదురు చూపులు, ఎక్కడెక్కడికో ఎగిరిపోవదాలు, అంతులేని వూహలు అతన్ని సంప్రదాయ వ్యతిరేకమయిన ఉద్వేగాల వేపు మళ్ళించాయి. ఓ సందర్భంలో మత గురువవుదామనుకున్నాడు. మత ప్రవక్త అవుదామని స్వప్నించాడు. కవి అవుదామనుకున్నాడు.
తన స్వష్నాలకు సాకారమివ్వాలనుకున్నాడు. బెగ్జిన్ స్కూల్లో చదువుతున్నప్పుడు సోమరి, ముర్భధు అనిపించుకున్నాడు. స్కూలుకు వెళ్ళినపుడు, వచ్చేటప్పుడు చదువుతున్నప్పుడు హీనుదని పించుకున్నాడు. అతనికి చదువులంటే అసహ్యం. తరువాతి రోజుల్లో “నా వుద్దేశ్యం నాగరికత లేని చెత్త స్కూలంటే. అక్కడ చెప్పేవన్నీ విద్యార్థి అభివృద్ధికి ఎట్లా దోహదపడతాయో
95
నాకు అర్ధం కాలేదు. ఇప్పటికీ నాలోని చెడు పార్య్వాన్ని ఆ చదువు స్పర్శించిందని మంచి పార్యాన్ని ముట్టనే లేదని భావిస్తాను” అన్నాడు. సంగీతానికి సంబంధించి అతని పరిస్టితి వేరు. అతనికి ఆరేళ్ళ వయసప్పుడు వాళ్ళమ్మ ఇంట్లో పియానో ముందు అతని కోసం పెద్ద స్టూలు వేయించింది. అక్కడి కీబోర్డును నొక్కుళూ సంగీత స్వరాల్ని పలికించేవాడు. కొన్ని వరుసల్లో నొక్కితే సమశ్ళతిలో రాగాలు వస్తాయని తెలుసుకున్నప్పటి అతని ఆనందం ఎప్పటికీ మరుపురాకుండా మిగిలిపోయింది. సంవత్సరం తరువాత వాళ్ళమ్మను సంగీత పారాలు చెప్పమని కోరాడు. తరువాతి రోజులో ప్రాక్టీసు ఎంత ముఖ్యమో (గ్రహించాడు. కానీ ప్రాక్టీసు చెయ్యడమంటే అతనికి విసుగు. అదృష్టవశాత్తు అతనికి అతని సహజజ్ఞానం వల్ల, ఆసక్తి వల్ల కొన్ని సాంకేతిక పరమయిన సరిహద్దుల్ని అధిగమించాడు. వాటిని కూడా కొద్దిపాటి ప్రయత్నాలతో సాధించాడు. పన్నెండేళ్ళ వయసుకే చక్కగా పియానో వాయించాడు. పన్నెండేళ్ళ వయస్సుక్తే అతని మొదటి సంగీత రచన "౪/8గ2(10౧5 0% 2 66౧౫౭౧ 16౧6 అన్నదాన్ని చేశాద్స. స్కూల్లో విద్యార్భల ముందు తన సంగీత ప్రదర్శన చేశాడు కానీ అదంతా కట్టిపెట్టమన్సి టీచర్ హేచ్చరించాడు. ల్ గ్రీగ్కు ప్రోత్సావోనికి ఏమీ లోటు లేదు. అతని తల్లిదండ్రులు సంగీతకార్రుల్సు (ప్రత్యేకించి అతని తల్లి పియానిస్టు. వాళ్ళకు సంగీతమంటే యిష్టమొక్కటే కాదు, వ్రాళ్ళు తమ కొడుకుని ప్రోత్సహించారు. ఓల్ బల్గ్రీగ్ మొదటి రచన విని ఇది ప్రతిభావంతునీ రచన అని అభినందించాడు. గ్రీగ్ తల్లిదండ్రుల్తో సంగీతంలో మరింత నేర్చుకోవడ్లానిక్తి అతన్ని లీస్టిగ్లోని కన్సర్వేటరీకి పంపమని చెప్పాడు. గ్రీగ్ లీప్టిగ్ వెళ్ళేష్పటికి అతనికి పదిహేనేళ్ళు. బోర్డింగ్ హౌస్‌లో గద తీసుకుని సంగీతకళాశాలకు వెళ్ళేవాడు. అక్కడ కూడా స్కూల్లో లాగే సోమరిగా వుంట్రూ చదవడం బదులు కలలు కంటూ వుండేవాడు. పుస్తకాలకు సంబంధించినవి చదవడానికి, మార్పులేని సిద్ధాంతాలకు, అధ్యయానికి వ్యతిరేకంగా తిరిగబదేవాడు. ఇగ్నాజ్ మోషేలెస్ అన్న ప్రసిద్ధ పియానో టీచర్ ఛోపిన్ సంగీతం గురించి అవహేళన చేస్తే ఛోపిన్ అభిమాని ఐన (గ్రీగ్ ఆగ్రహంతో రెచ్చిపోయాడు. వెంజెల్స్ రీనెక్ష అన్న ఇతర ఉపాధ్యాయులు గ్రీగ్ పట్ల సానుభూతితో ('ప్రవర్తించేవాళ్ళు. కొంతమంది అతని పట్ల అయిష్టంగా వుండేవాళ్ళు, కొంతమంది బాగా శ్రమించే విద్యార్థులు గ్రీగ్ స్నేహితుల్లో వుండేవాళ్ళు. ఆర్థర్ అన్న ఇంగ్లీషు విద్యార్థి అట్లాంటి వాళ్ళలో ఒకడు. తరువాతి రోజుల్లో అతనో కలిసి ఒక 896
కామిక్ ఒపేరా రాశాడు. ఆ ఒపేరా, రాసినాకా గ్రీగ్కు థ్రమించడంలోని ఆనందం తెలిసింది తన చదువులో శ్రద్ధ చూపాడు. నిరంతరం శ్రమించాడు. రాత్రింబగళ్ళు కష్టపడి ఆరోగ్యం నాశనం చేసుకున్నాడు. ఆరోగ్యం బాగలేనప్పుడు అతనికి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు వచ్చింది. దాంతో అతని ఎడమవైపున వూపిరితిత్తి దెబ్బతింది. దాంతో జీవితాంతం అనారోగ్యంతో అల్లాడాడు.
ఆరోగ్యం కొంత బాగుపడ్డాకా తిరిగి లీస్టీగ్ చేరి 1862 దాకా కన్సర్వేటరీలో వున్నాడు. చివరికి ఉత్తమ విద్యార్థిగా గౌరవ సత్మారాలందుకున్నాడు. బహిరంగ ప్రదర్శన లిచ్చి స్వరకర్తగా, పియానిస్టుగా ప్రశంసలందుకున్నాడు. అప్పుడు రాసిన తన రచనలేవీ అతనికి ఇష్టం లేదు. కారణం అవి జర్మన్ రొమాంటిక్ కంపోజర్ల అనుకరణలని అతనికి తెలుసు. కంపోజర్‌గా గుర్తింపు రావాలంటే తన సొంత శైలిలో, తనదయిన సంగీతాన్ని సృష్టించడం అవసరమని గుర్తించాడు. కానీ ఆ సొంత శైలి ఎలాంటిదో, ఎలా వుండాలో అతనికి అంతుబట్టలేదు.
తన సొంత స్థలం బెర్గెన్ తిరిగి వచ్చాకా 1868 వసంతకాలంలో తన రచనలు సంగీత ప్రదర్శన చేశాడు. ఆ ప్రదర్శన గొప్ప విజయవంతం కావడమే కాకుందా ఆర్థికంగా కూడా లాభదాయకమయింది. కానీ దాని వల్ల సంగీతం పట్ల అతనికి కేవలం కొద్దిగా నమ్మక మేర్చడింది. అతన్లో ఏదో ఆరాటం, అన్వేషణ. ఏదో అతనికి స్పష్టంగా తెలీదు. బెగ్గెన్ వదిలి కోపెన్వాగెన్లో నివసించడానికి వెళ్ళాడు. అప్పట్లో అది స్కాండినేవియా సంగీతానికి కేంద్రం. స్కాండినేవియన్ సంగీత కేంద్రానికి డీన్ ఐన నీల్స్గీడ్ ని గ్రీగ్ కలిశాడు. అతను గ్రీగ్ని ప్రోత్సహించాడు. చాలా విలువయిన' సలహాలు, విమర్శలు చేశాడు. .లీష్టిగ్ సంగీత కళాశాలలో సంవత్సరాల పాటు వుండి తెలుసుకున్న దానికన్నా నీల్స్ గీడ్ నించీ ఎక్కువ నేర్చుకున్నానని గ్రీగ్ ఒక సందర్భంలో అన్నాడు. నీల్స్గీడ్ ఒక సింఫనీ రాయమని గ్రీగ్ని కోరాడు. (గ్రీగ్ రాశాడు. నీల్స్గీద్ నించీ అభినందనలందుకున్నాడు. కానీ గ్రీక్ ఆ సింఫనీ వెనకటి రచనలకన్నా భిన్నమైంది కాదు. యిప్పటికీ అతను ఇతరుల శైలినే అనుకరిస్తున్నాడు.
కోపెన్‌హాగెన్‌లో వున్నప్పుడు (గ్రీగ్ యువకుడయిన నార్వే సంగీతకారుడయిన రికార్డ్ నోర్ద్రాక్ని కలిశాడు. నోర్డ్రాక్ నార్వే జాతీయ గీతాన్ని స్వరపరిచిన సంగీతకారుడు. నోర్గ్రాక్ తన దగ్గరున్న లైబ్రరీ గ్రీగ్కు పరిచయం చేశాడు. అందులో నార్వే జానపద గీతాలు, నృత్య విశేషాలు వున్నాయి. అన్నిటికీ మించి నార్వే జాతీయ సంగీతాన్ని సముజ్వలంగా సృష్టించాలని
97
నోర్డ్రాక్ గ్రీగ్ని ఉత్తేజపరిచాదు. జానపద గీతాల ఆధారంగా నార్వేజియన్ సంగీతాన్ని రూపొందించాలని మిత్రులకు దృఢ స్పంకల్పం కలిగింది. “అప్పుడు మొదటిసారిగా మేము జానపద సంగీత రహస్యాల్ని అనుశీలించాం. నా అసలు తత్వం, నా మౌలిక తత్వం, నా పునాదుల్ని నేను స్పర్శించాను” అన్నాడు గ్రీగ్,
బెగ్గెన్ తిరిగి చేరాకా గ్రీగ్ తన నూతనాభిప్రాయాల్ని ఆవిష్కరించడం ప్రారంభించాడు. నోర్డ్రాక్ సహకారంతో 'నార్దిక్ మ్యూజిక్ సొసైటీ* స్థాపనకు గ్రీగ్ తోద్బద్దాదు. నార్వే సంగీతం రాయడం (ప్రారంభించాడు. ఈ ప్రయత్నంలో రాసిన [6౧౦1650663 అన్న పియానో రచన నోరోడ్రాక్కు అంకితం చేశాడు. నోర్డ్రాక్ ఇరవై నాలుగేళ్ళకే చనిపోయాదు.
గ్రీగ్ మరదలు నీనా హేగ్రప్తో ఎంగేజ్మెంట్ ఐంది. ఆమె ప్రతిభావంతురాలయిన గాయని. వాళ్ళ పెళ్ళికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు “అతనేమీ కాడు, ఏమీ కాబోదు, ఎవ్వరూ వినని సంగీతాన్ని సృష్టిస్తూ వుంటాడు, అన్నారు. అతని స్థాయిని మెదట తెలుసుకోవాలి తరువాతే పెళ్ళి అంది, ఆమె తల్లి. ఈ మధ్యలో తన (ప్రేమని అతను సంగీత్రంల్రః నింపాడు. 1864లో అతని సుప్రసిద్ధ గీతం "| ౬0౪6 ౪/౦౮' రాశాడు.
- 1865 శీతాకాలంలో గ్రీగ్ ఇటలీ సందర్శించాడు. అక్కడ సుప్రసిద్ధుడయ్విన తమ దేశస్థుడయిన నాటక కర్త హెనిక్ ఇబ్సన్ని కలిశాడు. అప్పటికే గ్రీగ్ తన మ్సెద్రట్రి ఆర్మెస్టా కోసం రాసిన “1 464/౧” పూర్తి చేశాడు. తన రాతవ్రతిని పెద్ద మనిషయిన నీల్స్ గేదక్రి చూపాడు. ఆయన అది చూసి 'గ్రీగ! యిదంతా చెత్త ఏదైనా మంచిదిరాయి? అన్నాడు. ఐనా గ్రీగ్ తన రచనని స్టాక్ వోమ్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్కు సమర్పించాడు. చానిక్తి మొదటి బహుమతి వచ్చింది. తమాషా ఏమిటంటే న్యాయ నిర్దేతల్లో నీల్స్ గేడ్ష ఒకడు! ఆయన పూర్వం తను ఆ రచన మీద చేసిన తీవ్ర విమర్శని విస్మంచాడు!
'రోంనగరంలో వున్నప్పుడు తన ఆత్మీయుదయిన నోర్డ్రాక్ పారిస్‌లో చనిపోయాడన్న వార్త అందింది. మానసికంగా, శారీరకంగా వుద్వేగానికిలోనై గ్రీగ్ స్పృహతప్పాడు. కొంతకాలం పాటు అతని పరిస్థితి విషముంగా తయారైంది. మెల్లగా కోలుకున్నాకా జాతీయ నార్జిక్ సంగీత కళకు సంబంధించి, దాని ఆవిష్కరణకు సంబంధించి అతని అభిప్రాయాలు మరింత బలపడ్డాయి. తన స్నేహితుడి స్పృత్యద్ధం తన సమస్త శక్తుల్ని జాతీయ సంగీతంపై కేంద్రీకరించాడు.
స్మాండినేవియా తిరిగి చేరాడు. మొదటిసారిగా నార్వేజియన్ సంగీత ప్రదర్శన నిర్వహించాడు. అట్లాంటిది జరగడం అదే మొదటిసారి. అందులో అతని రెండు రచనల్ని 98
కూడా ప్రదర్శించాడు. మొదటిది ఒక పియానో సొనటా. రెండోది వయోథిన్, పియానోలపై ప్రదర్శించే మరో సొనటా. నోర్డ్రాక్ తదితరుల పాటలూ ప్రదర్శించాడు. ఆ ప్రదర్భ్శనలోని నవ్యత వల్ల ఆ ప్రదర్శన ఘన విజయం పొందింది. గ్రీగ్ భవిష్యత్ జీవితానికి సంబంధించి ఈ ప్రదర్శన ప్రభావం వుంది. ఫిల్ హార్మోనిక్ సొసైటీ వాళ్ళు తమ నిర్వాహకుదుగా రమ్మని ఆహ్వానించారు. అక్కడ ఎన్నో 00014 మరియు ఆర్మెస్ట్రా సంగీత ప్రదర్శనలు నిర్వహించాడు. అతని చుట్టూ శిష్యులు గుంపులుగా చేరారు. అతని పియానో ప్రదర్శనలకు జనం ఎగబడేవారు. ఇప్పుడు తన భార్యని పోషించగలనని అతనికి నమ్మకం ఏర్పడింది. తన ప్రియమయిన మరదలిని తన తల్లికి ఇష్టం లేకున్నా 1867లో పెళ్ళాడాడు.
నార్వేజియన్ సంగీతానికి సంబంధించిన లక్ష్యాన్ని యింకా సాధించాల్సివుంది. తన కొత్త దనాన్ని పక్కన పెట్టి అతను అవిశ్రాంత శ్రమకు గుర్తింపు కోసం నార్వేకు చెందిన సంగీతకారుల్ని కలిశాడు మొదట్లో అతన్లో కలిసిపోయినట్లున్నా తరువాత అందరూ అతన్ని వ్యతిరేకించారు. దూరదృష్టిగల యిద్దరు ఆదర్శ వ్యక్తులు మాత్రం అతనికి సన్నిహితులయ్యారు. వాళ్ళలో వోల్స్దాన్ అన్న అతను దురదృష్టవశాత్తు చనిపోయాడు. మరొకతను బ్బోర్సన్ అన్న కవి తరచూ పర్యటనల్లో వుండేవాడు. కాబట్టి గ్రీగ్ ఒంటరిగా సంఘర్షించాల్సి వచ్చింది. ఆ ఘర్షణ కాలక్రమంగా మరింత ఎక్కువయింది. అతను స్థాపించిన సంస్థ దాటరాని ఆటంకాలతో, స్కాందినేవియా సంగీత (ప్రేమికుల వ్యతికేత వల్ల నిష్ఫలంగా మారి అతనికి నిరాశ మిగిల్చింది. దానికి తోడు కుటుంబ విషాదాలు కలిసి వచ్చాయి. 1869లో పదమూడేళ్ళ అతని కూతురు, వకైక సంతానం చనిపోయింది. కానీ సంగితకారుడిగా, స్వరకర్తగా అతను ఎప్పుడూ వెనుకంజ వేయలేదు.
ఈ అంతులేని కష్పాలు హరాత్తుగా అంతమయ్యాయి. రోం నగరం నించీ వచ్చిన ఒక వుత్తరం ఆనందాన్ని ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని యిచ్చింది. అది ఫ్రాంజ్ లిస్జ్ట్ స్వయంగా రాసిన వుత్తరం. ప్రాంజ్ లిస్జ్టే వయోలిన్, పియానోలపై ప్రదర్శించడానికి గ్రీగ్ రాసిన 500214 గ [120/వినడం తటస్థించింది. దాంతో ఆయన గాఢంగా ్రభావితుడయ్యాదు.
ఆ రచన శక్తివంతమైంది, హేతుబద్ధమయిన సృజనశీలత కలిగింది. మేధస్సు పరిమళించేది. నిర్మాణాత్మ ప్రతిభతో నిగారింపు కలిగింది. దాని స్థాయిని అందుకోడానికి దాని సహజ గమనాన్ని అనుసరించడం మినహా ఎవరూ ఏమీ చేయదగింది లేదు. “నువ్వు నీ దేశం నీ విజయాల్ని ప్రోత్సహించడానికి, అభినందించడానికి అర్హడవు ఎందుకంటే ఎక్కడా నీలో అపశ్ళతి లేదు. అన్నాడు లిస్జ్జ్
99
లిస్జ్జ్ గ్రీగ్ను తనకి కలుసుకోమని చెప్పాడు.
కొద్దిగా ప్రభుత్వసాయంతో కష్టపడి ఇటలీ వెళ్ళాడు. అక్కడ లిస్జ్స్ ముందు తన రచన ప్రదర్శించాధు. ఆదే రచనని లిస్జ్ల్ తను వాయించాడు. “నేను తెలివి లేనివాడిలా నవ్వాను” అని-గ్రీగ్ తన తల్లికి లిస్జ్జ్ ప్రదర్శన గురించి రాశాడు. “సరే! అంతకుమించి నువ్వునా నించీ వమాశించావు? అప్పటకప్పుడు చదువుతూ నాలాంటి పెద్దవాడు అంతకుమించి వాయించగలడా?” అన్నాడు లిస్జ్ట్.
లిస్జ్ట్ శిష్యులిద్దరు గ్రీగ్ వయోలిన్ సొనటాను బహిరంగంగా ప్రదర్శన యిచ్చారు. సభికుల్లో లిస్జ్ట్ వున్నాడు. ఆ ప్రదర్శన మనోహరంగా, వుల్లాసంగా సాగటానికి ఆయన సహకరించాడు. కొన్ని రోజుల తర్వాత గ్రీగ్ కొత్త రచనని లిస్జ్ట్కు చూపించాడు. అది ఆ రోజుల్లో ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తించిన రచన. అది 601060 1 2 [41౧0 అది పియానో, ఆర్మెస్ట్రాల్ని వుద్దేశించింది. లిస్జ్ట్ దాంతో గాఢంగా 'ప్రభావితుడయ్యాడు.
1874 దాకా గ్రీగ్ తన సమయాన్ని రెండుగా విభజించుకున్నాడు. కొంత్ర తను భార్య క్రిస్టియానియా” కోసం, మరికొంత కో పెన్వాగస్ కోసం (ప్రదర్శన, పాఠాలు, స్వరరచన) మెల్లగా అతనికి స్వదేశంలో, బయటా పేరు రావడం మొదలయింది. లిస్జ్ట్ గ్రీగ్ రచనల (ప్రచురణ కర్త పీటర్ యూరప్ అంతటా గ్రీగ్ పేరు ప్రఖ్యాతులు పెరగడానికి దోహదపడ్దాద్రు.
తన దేశ సంగీత *ప్రవక్త ప్రసిద్ధి స్వదేశంలో విస్తరించింది. అతనిక్తి ప్రభుత్వం
సంవత్సరానికి ఐదు వందల డాలర్ల జీవన భృతిని ఏర్పాటు చేసింది.
హెనిక్ ఇబ్సన్ ౧66౯ ౮/౧! రచనకు అతను సమకూర్చిన ఇన్సిడెంటల్ మ్యూజిక్ష్ క్రమక్రమంగా పెరుగుతున్న అతని కీర్తిని మరింత విస్తరించింది. 1876 ఫిబ్రవరి 24న క్రిస్టియానియా ఆ ప్రదర్శన చూసి పరవశించి పోయింది. ఆ నాటకం యూరప్ అంతటా 'ప్రదర్శింపబడింది. ఎడ్వర్డ్ హాన్సలిక్ అన్న విమర్శకుడు కేవలం గ్రీగ్ సంగీతం వల్లే ఇబ్సన్ “టకం నిలుస్తుంది” అన్నాడు. ఈ నాటికీ ఆనాటకమంటే గ్రీగ్మాత్రమే క్రానీ ఇబ్సన్ కాడు ఆంటారు.
1885 నాటికి గ్రీగ్ జీవితకాలంగా వున్న కోరిక నెరవేరింది. బెర్గెన్‌కు ఆరుమైళ్ళ దూరంలో పర్వత ప్రాంతంలో మంచి యిల్లు కట్టుకున్నాడు. పర్వతాలకి అరణ్యానికి నదుమ ఆ ఇల్లు వుంది. తక్కిన జీవితమంతా అక్కడే గడిపాడు. ప్రపంచంలోని సంగీత ప్రియులకు ఆ ఇల్లు మక్కా ఐంది. జనాల తాకిడి ఎంత ఎక్కువైందంటే ఆయన ఇంటి గేటు ముందు మధ్యాహ్నం నాలుగు గంటల కన్నా ముందు వచ్చే సందర్భ్శకుల్ని కలుసుకోడానికి గ్రీగ్
యిష్టపడరు” అన్న బోర్డు వుండేది. . 200
అభినందనలే కాదు, అంతు లేని గౌరవాలూ వచ్చి పడ్డాయి. 1872లో స్వీడిష్ అకాడమీలో నియమితుడయ్యాడు. సంవత్సరం తరువాత లేడెన్ అకాడమీలో నిమింపబద్దాడు. 1890లో (ఫ్రెంచి అకాడమీ ఆఫ్ ఆర్ట్స్‌కు ఎన్నుకోబద్దాడు. 1898లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ, 1906లో అక్సిఫర్ట్ యూనివర్సిటీ గౌరవడాక్టరేట్లతో సత్కరించాయి. 1908లో అతని అరవయ్యవ జన్మదినం దాదాపు జాతీయ సెలవు దినంగా ఘనంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రదర్శనలు జరిగాయి. అన్నిటికన్నా గ్రీగ్ను ఆనందపెట్టిన సంగతి ఒకటుంది. లీస్టిగ్ సంగీతశాల ముందు అతని బస్ట్ పెట్టడం అతనికి మహదానందాన్ని కలిగించింది.
గ్రీగ్ లెక్కలేనన్ని సన్మానాలు అందుకున్నాడు. అందుకున్నంత సేపే వాటిని గుర్తు పెట్టుకునేవాదు. తరువాత విస్మరించేవాడు. (గ్రీగ్ నిరాడంబరుడు. జనాల తాకిడికి జడిసి యింటి పట్టునే వుండేవాడు. గ్రీగ్ తత్వం ఏకాంతాన్ని ఇష్టపడేది. అన్నిటికీ దూరంగా ఆశ్రమ జీవనంలా గడుపుతూ కిటికీ గుండా తన దేశ పర్వతాల్ని వనాల్ని చూస్తూ, అవిశ్రాంత నగర జీవితానికి అందనంత దూరంగా గడిపేవాదు. అత్యధునాతన నగర జీవితం అతనికి ఇష్టముండేది కాదు. ఆయన (ప్రజాస్వామ్యవాది.
1906లో లందన్లో రెండు సంగీత ప్రదర్శనలిచ్చాడు. రెండోసారి సంగీత ప్రదర్శనకు బయళల్లేకుతూ వుంటే గుండెపోటు వచ్చింది. వోస్పిటల్కు తీసుకెళ్ళారు. నిర్మలంగా అతను భార్యను చూసి “ఇవే చివరి క్షణాలు అనుకుంటాను” అన్నాడు. తన అంత్యక్రియలన్నీ నిరాడంబరంగా జరగాలని కోరాడు. కొన్నాళ్ళ తర్వాత నిద్రలోనే కన్నుమూశాడు.
ఆయన కోరినట్లు ఆయన అంత్యక్రియలు నిరాడంబరంగా జరగలేదు. ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఆయన శరీరాన్ని స్టేట్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ € ఇన్గఫ్ట్రీ దగ్గర పెట్టారు. వేలాది మంది జనం వచ్చి తమ (శ్రద్ధాంజలి ఘటించారు. యాఖై ఏడు దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, సంగీత సంస్థలు పుష్పగుచ్చ్భాలు సమర్పించారు. ఆయన శవయాత్ర వెంట నాలుగు వందల వేల నార్వేజనం తరలి ఆయన శరీరాన్ని ఆయన కిష్టమయిన బెర్లెన్ వీధులగుండా నడిచారు.
102
జార్జి ఫ్రెడరిక్ హాండెల్ ౭౦89 ౧666గ౦ 112౧66! 23-2-1685 -- 14-4-1759
“ఈ భూమిపై అట్లాంటి సంగీతకారుడు పుట్టలేదు. ఆయన ముందు నేను తలవంచుతాను” అని వాండెల్ గురించి బిధోవిన్ అన్నాడు. సంగీతంలో ఆయన స్తానం ఆసాధారణమైంది. ఆయన ప్రతిసారీ పూర్వం కన్నా తన స్థానాన్ని మరింత బలంగా నిర్మిస్తూ, నిలదొక్కుకుంటూ వచ్చాడు. రెండు సార్లు విజయం నించీ వినాశనంలోకి, విస్కృతిలోకి జారుకున్నాడు. ఉదాహరణకు 1715 నాటికి సజీవులయిన సంగీతకారుల్లో ఆయన సాటిలేనివాదు. సుప్రసిద్దుడు. పదిహేనేళ్ళ తరువాత ఆయన పాపులారిటీ పడిప్రోర్పంద్ర అప్పులపాలయ్యాడు. ఎవరూ పట్టించుకోలేదు. జైలుకు వెళ్ళే పరిస్థితు లేర్చద్దాయి. అట్లాం్యి దుర్భర పరిస్థితుల్ని బయటపడి, దూసుకొచ్చి విజయయాత్ర చేశాడు. కీర్తి శిఖరాల్ని అందుకున్నాడు.
ఆయన యాభై ఏళ్ళ వయసులో ఎన్నో ఏళ్ళుగా విజయయాత్రకు కారణం తను అద్భుతంగా ఒపేరా రచనలు చెయ్యడం అని గుర్తించాడు. హరాత్తుగా వాటి నుండ్డి పక్కకు జరిగి 'ఆరటోరియా' ల రచనల వేపు మళ్ళి వెనకటి కన్నాఘన విజయాల్ని అందుకున్నాడు
అన్నిటికన్నా ఆయనకు తగిలిన గొప్ప ఆఘాతం ఆయనకు గుడ్డితనం రావడం కానీ ఆఘాతాల్తు కానీ ఆనందాలు కానీ ఆయన సృజనాత్మకతకు ఎప్పుడూ ఆటంకాలు కాలేదు. నలభై ఆరు ఒపేరాలు, ముప్పయిరెండు ఆరటోరియాలు వందకు మించి ఓకల్ రచనలు, లెక్కలేని నాటకీయ ఖండికలు, వివిధ వాద్య, ఆర్మెస్ట్రా రచనలు అసంఖ్యాకంగా చేశాడు. ఇతర కళాకారుల కన్నా లెక్కలేని బాధలు పడినా తన ఆధ్యాత్మిక వునికిని అతను కోల్పోలేదు. అతని తల్లితో అతనికి గాధమయిన అనుబంధం. ఆమె చనిపోతే “షైంబ్రోం అన్న ఉల్లాసకరమయిన ఒపేరా రాశాడు. 1787లో విషాదం తప్ప అతనికి ఎవరూ తోడు లేని సమయంలో అతని సంగీత జీవితంలోనే సాటిలేని ఆనంద గీతాలు రాశాడు. కొన్ని హాస్యరచనలు చేశాడు. నిర్మయగా యితరులు తన మీద దాది చేసినపుడు, కుట్రలు పన్నినపుడు, దురభిషప్రాయాల దుమారం చెలరేగినపుడు 'వోస్యరచనలు' చేశాడు. తనకి వ్యతిరేకులయిన గుంపు అతన్ని హీనపరచడానికి, అతని నాశనానికి పూనుకున్నప్పుడు ఆయన చాలా ఫలవంతి మయిన కృషిలో మునిగేవాడు. ఓ సందర్భంలో ఒక్క సంవత్సరంలో మూడు ఒపేరాలతో బాటు లెక్కలేనన్ని యితర రచనలు చేశాడు. 102
అంతులేని కష్టాలు అల్లుకున్నప్పుడు ఒక నిర్మలమయిన సంగీతాన్ని తోడు తీసుకుని నిరాటంకంగా నిశ్చలమయిన (ప్రేరణతో ముందుకు సాగడం, సృజనాత్మకలోకంలో మునగడమన్నది హాందెల్ జీవితంలో కనిపిస్తుంది. వోొందెల్ తన టేబుల్ ముందు కూచోగానే ఆ నిర్మలత్వం వగిలి ముక్కలయిపోయినవ్చుడు అక్కడినించీ అద్భుతమయిన, అసాధారణమయిన ఉత్సాహం వస్తుంది. సాహసం పుడుతుంది. సృజన అన్నది అక్కడ మొదలవుతుంది. హాండెల్కు ఆ ఆత్మశక్తి వుంది. అది యిచ్చిన నైతిక బలంతో విండెల్ దశాబ్దాల తరబడి తనపైన పడుతున్న విపత్తుల్ని వినాశనాల్ని ఎదుర్కొని నిలబడగలిగే ధైర్యాన్ని పొందాడు. వోందెల్ అంత శక్తివంతుడు. కానీ కాలాన్ని బట్టి నలభై ఏళ్ళ తర్వాత అతని శత్రువులు అతనిపై విజయం సాధించారు. కానీ మళ్ళీ అతను పునర్దన్మించాడు. విజృంభించాడు. ఇప్పుడు ఒక కొత్త ఒపేరాతో, కొత్త చైతన్యంతో మళ్ళీ తన స్థానాన్ని పదిల పరచుకున్నాడు.
సంగీత రంగంలో మొదటి స్థానంలో వుండడానికి సాహసం అవసరం. హాందెల్కు ఆ సాహసముంది. హోందెల్ తండ్రి 'క్షురక - వైదుడు, ఆయన కొడుకు సంగీత ప్రేమను వ్యతిరేకించడమే కాదు, అతనికి సంగీతమంటే అసహ్యం. సంగీతాన్ని యిష్టపడడం అన్నది ఒక బలహీనత'గా భావించేవాడు. యిన్ని నిర్బంధాలు, ఆటంకాలు వున్నా హాండెల్ ఆర్షాన్ని, స్పినెట్ని వాయించడం నేర్చుకున్నాడు. స్పినెట్ వాద్యాన్ని రహస్యంగా పైగదిలో వుండే కొడుక్కి సానుభూతి గల అతని తల్లి అందిచ్చినట్లు ఒక కథనం. దాన్ని (ప్రేమగా దాచుకుని తండ్రి కంటబదకుందా రాత్రిళ్ళు హాండెల్ వాయించేవాడు.
హాందెల్కు ఏడేళ్ళ వయసున్నప్పుడు అతని తండ్రి కోటలో వైద్యుడుగా పని చేసే వృద్ధుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ సందర్భంలో ప్రభువు దగ్గర వోండెల్ ఆర్గాన్ వాయించి ప్రదర్శించాడు. దాంతో ప్రభువు ఎంతో ఆనందించి కుర్రాడి జోబుల్ని బంగారు నాణేలతో నింపి అతన్ని సంగీతం నేర్చుకోనిమ్మని తండ్రితో అన్నాడు. ఇష్టం లేకున్నా తండ్రి కొడుక్కి అనుమతి ఇచ్చాడు. కారణం అతనికి మార్గాంతరం లేదు. ప్రభువు మాటను కాదనలేడు కదా!
వోండెల్ లూధరన్ చర్చిలో ఆర్గానిస్టుగా వున్న జాఛోవ్ దగ్గర శిష్యుడిగా చేరాడు. అతను త్వరలోనే ఒక ప్రతిభావంతుడు తన దగ్గర శిష్యుడుగా చేరాడన్న సంగతి గుర్తించాడు. ఆయన శాయశక్తులా శ్రమించి తన సంగీత జ్ఞానాన్నంతా ఆ కుర్రాడికి ధారబోశాడు. శిక్షణ నిచ్చాడు. తన దగ్గర వున్న పెద్ద సంగీత లైబ్రరీ అతని సొంతం చేశాడు. హాండెల్ మూడేళ్ళపాటు
103
జాఛోవ్ దగ్గర చదివాడు. అతని శిక్షణలో అద్భుత వాద్య నిపుణుడిగా పేరొందాడు. మత సంబంధ సంగీత రచన ప్రారంభించాడు. ఇక తన శిష్యుడికి తనేమీ చెప్పాల్సింది లేదని జాఛోవ్ నిర్ణయించుకున్నాడు.
తన పన్నెండవ ఏట హాండెల్ బెర్లిన్ సందర్శించాడు. ఎందుకెళ్ళాడో, ఎవర్ని కలవడానికెళ్ళాడో, ఒంటరిగా ఎందుకెళ్ళాడో తెలీదు. కానీ అక్కడ కోటలో తన నైపుణ్యంతో 0612౪10600%6, ఆర్గాన్ వాద్యాల్ని వాయించి కోటలో కాంతి నింపాడు. బ్రాండెన్ బర్గ్ ప్రభువు అతను ఉన్నత సంగిత విద్య ఇటలీలో కొనసాగించడానికి ఆర్థిక సాయం చేస్తానని చెప్పాడు. కానీ కొడుకుని తంద్రేమో యింటికి తిరిగి రమ్మన్నాడు. ఈ సంగీత “చెత్త కొడుకుని ఎక్కడెక్కడ తిప్పుతుందో అని ఆయన బాధ. కొడుకు యింటికి చేరే సరికి తండ్రి అప్పుడే చనిపోయాడు. సమయానికి కొడుకు ఇల్లు చేరాడు.
ఇప్పుడు ఎట్లాంటి ఆటంకాలూ లేకుండా సంగీతం అభ్యసించడానికి హాండెల్క్షు అవకాశం దొరికింది. కానీ అతనిలోని సెంటిమెంటు, బాధ్యతపట్ల అతని బలమైన దృష్టి తన తండ్రి ఏవైతే కోరాడో ఆ అకడమిక్ చదువుల్ని కొనసాగించాలని నిశ్చయించాడు. అతను హాలె యూనివర్సిటీలో చేరి లా' కు సంబంధించిన ప్రాధమిక విద్య అభ్యసిస్తున్నప్పుడ్తు మోరిట్ట్ బర్గ్ కధెడ్రిల్లో ఆర్షానిస్టు వుద్యోగం ఖాలీ ఐంది. వోండెల్ సుప్రసిద్ధ పూర్వరంగం, ప్రాచుర్యం వల్ల అతన్ని ఆ వుద్యోగానికి ఆవ్వానించారు. అప్పటికి హాండెల్కు పద్దెనిమిదేళ్ళు. దానికి తోడు అతను లూధరన్. చర్చేమో కాల్వనిస్టుబ్టి. సంవత్సరం పాటు ప్రతిభావంతంగా ఆ వుద్యోగం చేశాడు. అప్పటికే అక్కడ కొంత మంది అతన్ని “సుప్రసిద్ధ వాండెలొ అనేవాళ్ళు.
హాండెల్ విధికి తలవంచేశాడు. లాకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పాడు. అతని శక్తుల్ని బట్ట, అతని చైతన్యాన్ని బట్టి తనున్న వాలే పరిసరాల కన్నా మరింత విసృత పరిధి గల, విశాల ప్రపంచం తనకు అవసరమని తహతహ లాదాడు. 1703లో ఆర్గానిస్టు వుద్యోగానిక్షి రాజీనామా చేసి హాంబర్ల్ వెళ్ళాడు.
ఆ రోజుల్లో హాంబర్గ్ జర్మన్ ఒపేరా కేంద్రం. సుప్రసిద్ధ స్వరకర్త రీన్హార్ట్ కైజర్ వాటి నిర్వాహకుడు. హాందెల్ అక్కడ ఒపేరా హౌస్ ఆర్మెస్ట్రాలో రెండో వయోలిస్టుగా వుద్యోగం సంపాదించాడు. త్వరలోనే ఆ వుద్యోగం అతనికి తగింది కాదని తేలింది. ఒకరోజు ౧4౧౧516000 వాయించే వ్యక్తి రాకుంటే హాండెల్ ఆ వాద్యాన్ని అసాధారణ రీతిలో వాయించి ఆశ్చర్య పరిచాడు. సుప్రసిద్ధమయిన మత సంబంధ రచనలు చేశాడు.
204
ఒక సందర్భంలో వాంబర్గ్లోని ఒపేరా నిర్వాహకుడయిన కైజర్ యితర పనుల్లో బిజీగా వుండడం వల్ల తను పూర్తి చేయలేని ఒపేరా గ|౧౫|॥&ను వాండెల్ కిచ్చాడు. వోండెల్ ఆ ఒపేరాను శక్తివంతంగా నిర్మించాడు. 1705 జనవరి 8న అది (ప్రదర్శింపబడి గొప్ప విజయాన్ని పొందింది. తన దగ్గరేవున్న తన ప్రత్యర్థిని కైజర్ చూశాడు. హాండెల్ కైజర్‌కు బద్ధశత్రువయిపోయాదు. వాండెల్ “నీరో అన్న రెండో ఒపేరా రాయడం ప్రారంభించాకా ఆ సంగతి తెలిసి కైజర్ తను కూడా “నీరో అన్న ఒపేరా రాశాడు. రెండూ ప్రదర్శనలో నీరుగారిపోయాయి. కానీ కైజర్ వాండెల్ పట్ల తీవ్ర శతృత్వం పెంచుకుని అతణ్జి ఎట్లాగయినా అణగదొక్కాలని, అణిచేయాలని ప్రయత్నించాడు. ఆ విషయంలో అతను నెగ్గాడు. ఎందుకంటే హాండెల్ తరువాత వోంబర్ల్ ఒపేరా కోసం ఏమీ రాయలేదు. తన విద్యార్థులకు సంగీత పారాలు చెబుతూ, సంగీత పారాలు రాస్తూ గడిపాడు. తరువాత కొన్నాళ్ళకి శాశ్వతంగా హాంబర్గ్ని వదిలి వెళ్ళాడు. హాంబర్గ్‌లో వున్నప్పుడు వోండెల్కి యింకో సుప్రసిద్ధ సంగీతకారుడు “శత్రు వయ్యాడు. ఒపేరా గాయకుడుగా, [గ౧910౧౦౯గా వున్న జోహాన్ మాట్హేసన్ మొదట్లో రెండో వయోలిస్టుగా వున్నంత వరకూ స్నేహంగా వున్నాడు. అంతేకాదు హాండెల్కు ఎన్నో విధాల సాయపడదానికి ప్రయత్నించాడు. ల్యూబెక్లో సంగీతకారుడుగా వున్న బక్సెటెహ్యూఢద్ తనవారసుడుగా యింకాకర్షి నియమించడానికి చూస్తున్నాడని తెలిసి హెందెల్ని ఆ పదవికి ప్రయత్నించమని మాట్హీసన్ చెప్పాడు. ఐతే తన కూతుర్ని పెళ్ళి చేసుకున్నవాళ్ళకే ఆ వుద్యోగం యిస్తానని ఆయన షరతు విధించడంతో వాండెల్ వెనక్కి తగ్గాడు. సంవత్సరం ముందు జాన్ సబాస్టియన్ బాచ్ కూడా ఆ కారణంగానే వెనక్కి తగ్గినట్లు చెబుతారు. క్రమక్రమంగా వాండెల్ కీర్తి ప్రతిష్టలు పెరగడంతో మాట్ హేసన్లో ఈర్ష్య మొదలయింది. క్రమంగా ఎక్కువైంది. 1704లో మాట్హేసన్ రచన క్లియోపాత్రా ఒపేరాని వోందెల్ దర్శకత్వం వహించాడు. అందులో మాట్వోసన్ ఆంటోని పాత్ర ధరించి పాడాడు. ఆంటోని చనిపోయాకా మాట్హేసన్ వెళ్ళి ఆర్మెస్త్రాకు దర్శకత్వం వహించాలనుకున్నాడు. కానీ ఆర్మెస్ట్రా దర్శకత్వం వహిస్తున్న వాందెల్ అది వదిలి వెళ్ళదానికి అంగీకరించలేదు. వోందెల్పట్ల తీవ్ర ద్వేషం పెంచుకున్న మాట్హీసన్ వాండెల్ని ద్వంద్వ యుద్దానికి పిలిచాడు. ద్వంద్వ యుద్ధంలో మాట్హాసన్ కత్తి హాండెల్ కోటు బటన్‌కి తగిలి రెండు ముక్కలయిందఇ కొంతలోపలికి పోయి వుంటే వాోండెల్ జీవితం ముగిసిపోయి వుండేది. హాందెల్ హాంబర్ల్ జీవితంలో విసిగిపోయాడు. అక్కడి ఈర అసూయా, ద్వేషాలతో అలసిపోయి దానిని వదిలిపెట్టాడు. 1706లో దాన్ని వదిలి ఇటలీ వెళ్ళాడు. ఆయన మొదటి 105
ఇటాలియన్ ఒపేరా గ0619౦ ఫ్లోరెన్స్‌లో ప్రదర్శింపబడింది. పెద్ద ప్రతి స్పందన జనాల్నించి లేదు. 1708లో మత సంగీతం రాశాడు. చక్రవర్తి రస్పోలీ ముందు (ప్రదర్శించాడు. అది ఘన విజయం పొందింది. వోాండెట్ రచన "౧6 5౫0% గురించి రోం సంగిత కారులందరూ చర్చించుకున్నారు. వెనీస్‌లో ప్రదర్శించిన అగ్రిష్పా' రచన అఖండ విజయం పొందింది. జనమంతా జేజేలు పలికారు. ఓ000 11/6 116 6౮684! 52%0గ' అని హోరెత్తారు. ఇటలీ సంగీతకారులంతా ఆయన్ని గౌరవించారు. హాందెల్ ఇటలీలోని ప్రసిద్ధ సంగీతకారుడు అగోస్టినో స్పెఫానీని కలిసేవాడు. స్టెఫానీ 1710లో ఆ వుద్యోగంలో చేరాడు. తనకు అవసరమయినన్ని సెలవులిస్తేనే ఆ వుద్యోగంలో వుంటానన్న షరతు మీద చేరాడు. 1710లో తన కొత్త ఒపేరా “౧1౧2160 తో ఇంగ్లాండు చేరాడు. 1711 ఫిబ్రవరి 24న అది ప్రదర్శింపబడి ఇంగ్లాండులో యిటాలియన్ ఒపేరాకు కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. హాందెల్కి ఇంగ్లాండులో పేరు ప్రతిష్టలు సమకూరాయి. పదిహేను ప్రదర్శనలు జరిగాయి. వోందెల్ ఒపేరా పబ్లిషర్ ఎంతగా లాభపడ్ద్డాడంటే ఆ విషయం గురించి చెబుతూ హాండెల్ “ఈ సారి అతన్ని ఒపేరా రాయమని నేను పబ్లిషర్‌గా వుంటాను” అన్నాడు. ఈ అసాధారణ విజయంతో వోందెల్ శక్తివంతులయిన సన్నిహితుల్ని స్నేహితుల్ని అట్లాగే శత్రువుల్ని సంపాదించుకున్నాడు. సుప్రసిద్ధ వ్యాసరచయితలయిన అడిసన్, స్టీలీ అతని శత్రువర్గంలోని వారు. స్పెక్టేటర్ పత్రికలో అతనిపై తీవ్రంగా దాడిచేశారు. కారణం అడిసన్ ఒక ఒపేరా కోసం రచన చేశాడు. దాన్నెవరూ పట్టించుకో లేదు. అట్లాగే స్టీలీ రాసిన ఒక ఒపేరా ఘోరంగా విఫలమయింది. ఆ కసిని యిట్లా తీర్చుకోవాలనుకున్నారు. కానీ హాందెల్ సన్నిహితులు శత్రువుల కన్నా శక్తివంతమయిన వాళ్ళు, వాళ్ళు హాండెల్ని ఆదుకున్నారు. అతన్ని ఆరాధించారు. అతన్ని గురించి ప్రచారం చేశారు. అతని వెంట తిరిగేవారు. అతను శాశ్వతంగా లందన్లో వుందాలనుకున్నాడు. కానీ మరీ అప్పటికే ఎక్కువరోజులు అక్కడున్నాడు. తప్పనిసరిగా హానోవర్ తిరిగి వెళ్ళి డ్యూటీలో చేరాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళి డ్యూటీలో చేరి డైరెక్టర్‌గా, టీచర్‌గా, స్వరకర్తగా తన బాధ్యతలు నిర్వర్తించాడు. కానీ లందన్లో కీర్తి ప్రతిష్టల్ని రుచి చూపిన హాండెల్ని హానోవర్ జీవితం తృప్తి పరచలేదు. మళ్ళీ అధికారి దగ్గరకు వెళ్ళి సెలవు అడిగాడు. ఆయన వీలయినంత తక్కువ సమయంలో తిరిగి వచ్చే షరతు మీద సెలవు మంజూరు చేశాడు. 1712లో హాందెల్ మళ్ళీ లండన్ " చేరాడు. ఈ సారి తన సెలవుల్ని నలభై ఏడేళ్ళ పాటు పొడిగించాడు. తన జీవితకాలమంతా లండన్‌లో గడిపాడు. ఆ దేశ పొరుడయ్యాడు. హాందెల్ తరంలో ఏ సంగీతకారుడూ అంత 106
'ప్రఖ్యాతిని ఆర్జించలేదు. లండన్ వెళ్ళిన కొన్నాళ్ళకే రెండు ఒపేరాలు ప్రదర్శించాడు. కొన్నాళ్ళు లండన్‌లో లేకున్నా అతని పేరు ప్రఖ్యాతులు తగ్గలేదు. రాణి అన్నే 'పుట్టిన రోజులు పండుక్కి సంగీత ప్రదర్శనకు ఆయన్ని ఆహ్వానించారు. ఆ విధంగా ఆస్థాన సంగీత కారుడిగా ఆయనకు గుర్తింపు వచ్చింది. రాణి ద్వారా సంవత్సరానికి రెండు వందల పౌండ్లు జీవన భృతి కల్పింపబడదింది. 1714లో రాణి 'అన్నే' కన్నుముసింది. వోండెల్కు వుద్యోగమిచ్చిన హానోవర్ ప్రతినిధి ఆమె స్థానంలోకి వచ్చాడు. వాండెల్ ప్రతిభను బట్టి కొత్త ప్రతినిధి హాండెల్ను ఆదరించాడు. రాజ కుటుంబానికి సంగీతోపాధ్యాయుణ్ణి చేసి జీవన భృతిని రెండింతలు చేశాడు. 1717లో ఇంగ్లాండులో కొంత కాలం పాటు 'ఒపేరా' పరిస్థితి సానుకూలంగా లేదు. అందుకని హాందెల్ కేంథోన్ ప్రభువు ఆహ్వానం మేరకు అతనికి సంగీతోపాధ్యాయుడుగా వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. కేంధోన్ ప్రభువు లండన్ సమీపంలో అతి ఖరీదయిన, అద్భుతమయిన ఎస్టేట్ కట్టాడు. (ప్రభువు దగ్గర మూడేళ్ళపాటు హాండెల్ పని చేశాడు. ఆ సందర్భంలో ఎన్నో రచనలు చేశాడు. విద్యార్థుల కోసం ఎన్నో సంగీత పారాలు రాశాడు. ఆయన సుప్రసిద్ధ రచన 7౧6 గ2గా౧౦గా1౦౮5 810% 50౫% కూడా ఆ సందర్భంలోనే రాశాడు. లండన్‌లో మళ్ళీ ఒపేరా పరిస్థితులు మెరగయ్యాయి. హాందెల్ లండన్ నగరానికి తిరిగి చేరాడు. అతని క్రీర్తి అత్యున్నత శిఖరాల్ని అందుకున్న దశ అది. రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్‌లో ఒపేరా (ప్రేమికులయిన ఒక శక్రివంతమయిన వర్గం వారు ఇటాలియన్ ఒపేరా ప్రదర్శన కోసం ప్రయత్నాలు చేశారు. దానికి వాందెల్ కళా దర్శకుడు. వోందెల్ జర్మనీ అంతా వాకబు చేసి ప్రముఖ గాయకుల్ని ఎంపిక చేశాడు. కొత్త ఒపేరాలు రాశాడు. గ464౧౧|5(0 ఒపేరా ప్రీమియర్ 1720 ఏప్రిల్ 27న జరిగింది. అదొక జాతీయ సందర్భంగా జరిగింది. రాజు, రాజ కుటుంబం దానికి హాజరయ్యారు. ఆ ఒపేరా ప్రదర్శన ఘనవిజయాన్ని సాధించింది. హాండెల్ని రాజవంశీకులు, సాధారణ ప్రజలు గాఢంగా అభిమానించారు. ఆయన కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. సాటి లేని సంగీతకారుదుగా గుర్తింపు పొందాడు. అదే సమయంలో అతన్ని వ్యతిరేకించే శక్తులు ఒకటై ఆయన్ని కిందకు తోసే ప్రయత్నాలు ప్రారంభించాయి. జీవితంలో చిత్రమేమిటంటే మిత్రుల్ని వాళ్ళ ఆదరాభిమానాల్ని, ప్రేమానురాగాల్ని ఎవరయితే పొందుతారో అట్లాంటి వాళ్ళకు శత్రువులు తయారవుతారు. అదొక కఠిన సత్యం. వోండెల్ పట్ల వ్యతిరేతకి కొన్ని కారణాలున్నాయి. అవి అతను తమ దేశస్థుడు కాకపోవడం 10/7
కావచ్చు, అతను విజయం పొందడం కారణం కావచ్చు. అతన్ని ఆదరించిన వాళ్ళపై అక్కసుకావచ్చు, అతని కింద పనిచేసే వాళ్ళపై అతని అధికారం కావచ్చు. అతని పట్ల శతృత్వానికి వీటిలో ఏదైనా కారణం కావచ్చు. అతని ఆకారమే నవ్వు పుట్టించేది. అతన్ది పెద్ద ఆకారం (అతన్ని పెద్ద ఎలుగ్గొడ్దు 'అనిపించేవాళ్ళు) నీటికుండ కదుల్తున్నట్లుందేవాడు. అతని ముఖం “గుర్రం ముఖంలా, ఎద్దు ముఖంలా వుంటుదనేవాళ్ళు. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ లండన్ నగర వీధుల్లో వెళుతూ వుంటే ఎవరూ సానుభూతి ప్రదర్శించే వాళ్ళు కారు. తనలో తనే ఏదో గొణుక్కుంటూ వెళుతూ వుండేవాడు. వ్యక్తిగతంగా చూస్తే అతస్టి అధికార తత్వం, లో గొంతు. కుండబద్దలు కొట్టినట్లు, నిదయ స్వరం, ఉద్రిక్త స్వభావం. అతినాగరికంగా, మర్యాద నిండినట్లు వుండేవాడు కాడు. అతని తిండి అలవాట్లయితే మరీ విపరీతం, శక్రువర్గమంతా బర్లింగ్టన్ ప్రభువు చుట్టూ చేరి ఇటలీ ఒపేరాకు సంబంధించిన 'స్వచ్చతను పునరుద్ధరించాలని సంకల్పించారు. దీనికై సుప్రసిద్ధ ఇటలీ కంపోజర్ గియొవానీ మాటిస్టా బొనాన్ సినీని రప్పించారు. వోండదెల్కు బొనాక్ సినీకి మధ్య వైతన్యవంతమయిన వైర ముండేది కానీ దాంట్లో సహృదయత వుండేది కాదు. వాళ్ళని ఆశ్రయించిన శిష్యులు ఎప్పటికప్పుడు ఇద్దర్నీ రెచ్చగొట్టేవాళ్ళు. మొదట బొనాన్ సినీ విజయం సాధిస్తున్నట్లనిపించాదు. అతన్దే పై చేయి అవుతున్నట్టనిపించింది. అతను 251210 అన్న ఒపేరా ప్రదర్శించాడు. అది గొప్పగా విజయవంతమయింది. వాందెల్ ౧1౦62౧18 అన్న ఒపేరా ప్రదర్శించాడు. దాన్ని జనం సాధారణంగా స్వీకరించాడు. దానికి బదులుగా బానాన్ సినీ ఏక విగిన మూడు ఒపేరాలు ప్రదర్శించాడు. జనం ఆనందంగా ఆ మూడింటినీ స్వాగతించారు. జేజేలు పలికారు. తరువాత మెల్లగా వాండెల్ వంతు మొదలయింది. వోండెల్ది పైచేయి అయింది. వొందెల్ రచన '0గ0౧6' అసాధారణ గాయకుడయిన ్రొన్సెస్కా సుజ్జోని పాడి లండన్‌ని వూపేశాడు. తరువాత బొనాన్ సినీ పేరు గాలికి కొట్టుకుపోయింది. ఈ చారిత్రాత్మ్సకమయిన పోటీ నుండి ఒక జాతీయం ఏర్పడింది. దాన్ని ]//66616660) 2౧6 (4౪66616 ౧6౧౫ అంటారు. ఈ సందర్భంగా జాన్ బైర్ రాసిన కవితలోనివి ఈ మాటలు. హాండెల్ ఘన విజయం సాధించాడు. కానీ అకాడమీకి కష్టకాలం వచ్చింది. పెద్ద మొత్తంలో జీతాలు ఇవ్వడాల వల్ల, ఇంగ్లీషు వాళ్ళకు ఒపేరాతో మొహం మొత్తడం వల్ల మొత్తానికి అకాడమీ దివాలా తీసింది. కానీ ఈ "పెద్ద ఎలుగ్గొడ్డు ఒక పట్టాన అపజయాన్ని అంగీకరించే రకం కాదు. హెద్దెర్తో భాగస్వామ్యం వహించి ఒక ధియేటర్ బాడుక్కి తీసుకుని సొంత కంపెనీ పెట్టాడు. 208
అకాడమీ ఆపిన దగ్గర్నించీ కార్యక్రమాలు కొనసాగించాడు. ఒక దాన్తరవాత ఒకటిగా ఒపేరాలు రాస్తూపోయాడు.
కానీ ఇటలీ 'ఒపేరా' (ప్రేక్షకుల ఆదరణ కోల్పోయింది. ఈ కారణంగా హాండెల్ తీవ్రంగా నష్టపోయాడు. దీనికి తోడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ సహకారంతో అతని శత్రువులు ఒక కంపెనీ పెట్టి హాండెల్ దగ్గరున్న మంచిగాయకుల్ని అతని ఆశ్రితులయిన కొద్దిమందిని ఆకర్షించడానికి ప్రయత్నించారు. వాోందెల్ తాత్మాలికంగా తన కంపెనీ మూసేశాడు.
హాందెల్ మళ్ళీ తన (ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి, సమీకరించడానికి రెండుసార్లు (ప్రయత్నించాడు. రెండు ప్రదర్శనలిచ్చాడు. కానీ ఫలితం లేకుందా పోయింది. వొండెల్ దివాలా తీశాడు. అప్పులు కట్టలేక జైలుకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితులేర్పద్దాయి. దానికి తోడు అతని ఆరోగ్యం దెబ్బతింది. మొదట మోకాళ్ళ నొప్పుల్తో బాధడ్దాడు. తరువాత పక్షవాతం బారిన పడ్డాడు. (క్రమంగా మతిభ్రమణం కలిగింది.
తమాషా ఏమిటంటే చిత్రంగా వాక్స్వాల్స్ గార్డెన్లో అతని విగ్రహాన్ని ప్రతిష్టించారు. బహుశా అతని గత వైభవ కారణంగా కావచ్చు అక్కడ దాదాపు ప్రతి రాత్రీ అతను సంగీతాన్ని 'ప్రదర్శించేవాడు. ఆ విగ్రహంలోని హాండెల్కీ యిప్పటి వాండెల్కీ ఎంతో భేదముంది. యిప్పటి వాండెల్ శక్తిహీనుడై, అనారోగ్యం పాలై, ఆర్థికంగా కుంగిపోయి బాధలు పడుతున్నాడు.
ఆశ్చర్యమేమిటంటే అతని ఆరోగ్యం (క్రమంగా కుదుట పడింది. మాములు మనిషయ్యాదు. కోలుకున్నాడు. అతని పూర్వపు శక్తులన్నీ పునర్జన్మించాయి. లందన్ తిరిగి వచ్చి ఆత్మవిశ్వాసంతో తలెత్తుకున్నాడు. ఒకటి రెండు కొత్త ఒపేరాలు, ఒకటి రెండు పాతవి ప్రదర్శించాడు కానీ వెనకటి కీర్తిని అందుకోలేక పోయాడు.
అవును ఆ పరిస్థితిని అతను ఎదుర్కోక తప్పుదు. ఎందుకంటే ఒపేరా కంపోజర్‌గా అతని వృత్తి చివరిదశకు చేరుకుంది. కారణం అతను తన ప్రేక్షకుల్ని కోల్పోవడ మొక్కడే కాదు, ఆ రూపానికి సంబంధించి అతను చెప్పాల్సిందేదీ మిగలక పోవడం కూడా. అతని సృజనా విషాదానికి అతను కొత్త మధ్యమాల్ని ఎన్నుకోవలసిన అవసరమేర్చడింది. అతను 1741లో తన చివరి ఒపేరా రాశాడు. అది మొదలు ఇంగ్లీషులో 010/0 లు రాయడం ప్రారంభించాడు. నిజానికి 1708లో తన మొదటి ఆరటోరియో రాశాడు. 1741 నాటికి వాటి పునరుద్ధరణ అవశ్యకత గుర్తించాడు.
1741లో ద్యూక్ ఆఫ్ దెవోన్షైర్ వోండెల్ని దల్లిన్ ఆహ్వానించాడు. ఆయన్హో బాటు మూడు ధార్మిక సంస్థలు అతని సహాయార్థం అతని సంగీత (ప్రదర్శన ఏర్పాటు చేశాయి. ఆ సందర్భంలో హాందెల్ కొత్త ఆరటోరియో రాశాడు. దానిపేరు 1655110 ఇరవై
209
ఐదు రోజులు జ్వరంలో రాశాడు. దల్లిన్ నగరం సహృదయంతో అతనో సహకరించడానికి సిద్ధపడింది. నైపుణ్యం కలిగిన ఆర్మెస్టా సిద్ధం చేయబడింది. ఐర్లాండ్ సుప్రసిద్ధ గాయకుడు డ్యూబర్గ్ ఆధ్వర్యంలో సిద్ధమైంది. సంగీతకారులు సమాయత్తమయ్యారు. ఆనాటి సుప్రసిద్ధ గాయకుల్ని సిద్ధం చేశారు.
ఐర్లాండ్‌లో అతని కీర్తికి లోపం లేదు. అతని గౌరవ సూచకంగా జనం జేజేలు పలికారు. అసంఖ్యాకంగా అతన్ని సందర్శించారు. జనం రద్దీ ఎక్కువై ఆయన యింటి ముందు తోసుకుంటూ కిటికీ సందుల గుండా ఆయన్ని చూడ్డానికి తొక్సినిలో తొందరపడద్దారు. డబ్లిన్ పేపర్లు ప్రదర్శనకు వచ్చే స్రీలకు విచ్చినట్లు వుండే వస్త్రాలను ధరించి రావద్దని, దానివల్ల ధియేటర్లో అందరికీ యిబ్బందని, సాధారణ దుస్తుల్లో వస్తే మరింత మంది ఎక్కువ సావకాశంగా చూసే వీలుంటుందని రాశాయి.
ఫిష్మేబుల్ వీధిలోని మ్యూజిక్ హాలులో 1742 ఏప్రిల్ 18న సంగీత ప్రదర్శన జరిగింది.-ఏడు వందల మంది జనం హాజరయ్యారు. బయట కొన్ని వందల మంది జనం. ఏదో ఒక సందర్భంలో ఎంతో కొంత సంగీతం వినిపించక పోతుందా? అని నిలబడ్డారు.
ఫాక్నర్ జర్నల్ “అక్కడ గుంపుగా చేరిన జనం తమ ఆనందాన్ని వ్యక్తపరచడానిక్తి వాళ్ళ దగ్గర మాటల్లేవు. ఉత్సాహాన్ని వ్యక్తీక్తరించడానికి హావభావాలు సరిపోలేదు” అన్సి రాసింది. “ఆ సంగీత తరంగాల్లో చెవులు, మనసు తెలిపోయాయి' అని రాసింది. ఈ సంగీతం వినడం వల్ల మనుషుల పాపాలన్నీ హరించుకుపోయాయి' అని ఒకరన్నారు. ఈ ప్రదర్శన వల్ల 1800 డాలర్లు వచ్చాయి. వాటిని మూడు ధార్మిక సంస్థలకు సమంగా పంచారు.
1743 మార్చి 23న ౧౧౪55120 లండన్‌లో ప్రదర్శింపబడింది. ఆ సందర్భంలో జార్జి 2 చక్రవర్తి కూడా వాజరయ్యాడు. ఆ ఆరిటోరియా లోని హల్లెలూయ కోరాస్ సందర్భంగా కదిలిపోయిన జార్జి చక్రవర్తి లేచి నిలబడి అది పూర్తయ్యే దాకా కూర్చోలేదు. (పేక్షకులు రాజు గారిని చూసి వాళ్ళందరూ కూడా లేచి నిల్చుని ఆయన కూర్చునే దాకా నిలబడే వున్నారు. హఠాత్తుగా, యాదృచ్ళకంగా జరిగిన ఈ సన్నివేశం క్రమంగా సంప్రదాయంగా పరివర్తన చెందింది. “హల్లెలూయా” పాదేప్పుడల్లా జనం నిలబడడం ఆనవాయితీగా మారింది.
1749లో వాందెల్ ఫౌల్డింగ్ హాస్పిటల్ కోసం ఒక ఆర్గాన్‌ను ప్రజెంట్ చేశాడు. అది మొదలు తొమ్మిదేళ్ళపాటు ఆ వాస్పిటల్కోసం ప్రతి సంవత్సరం ప్రదర్శనలిచ్చాడు. ౧౧౦55212 ఆరటోరియాను తొమ్మిదిసార్లు ప్రదర్శించాడు. దాంతో ఆయన్ను గ్రేట్ వోందెల్ క!
అని ప్రస్తుతించారు. 1751 దాకా ఎన్నో సంగీత రచనల్ని చేశాడు. ఆరటోరియో చరిత్రలోనే యిది అసాధారణమని ఎందరో ప్రస్తుతించారు. ఇది వోండెల్ సృజన రంగంలో పతాక స్థాయి.
1749లో వాక్స్ హాల్ గార్డెన్స్‌లో '౯1/6౪/0గ(5 గొ౮51౮' ప్రదర్శింపబడింది. పన్నెండు వేల మంది జనం వచ్చారు. ఆ గార్జెన్‌లో ప్రతి మూలా జనం క్రిక్కిరిసిపోయారు. టిక్కెట్లు దొరక్క యిబ్బంది పడ్డారు. గంటల కొద్దీ ట్రాఫిక్ జామయింది.
ఆ మవి సంగీతకారుడికి మరో ఆఘాతం ఎదురైంది. ఈ సారి అది శత్రువుల వల్ల కాదు. ౮60002 అన్న ఆరటోరియో రచనలో వుండగా మధ్యలో ఆయనకు చూపు పోయింది. ధియాట్రికల్ రికార్డు “బాధాకరంగా వాండెల్ చూపు కోల్పోయాడు” అని రాసింది. చాలా సార్లు ఆపరేషన్లు జరిగాయి. బాచ్కు ఆపరేషన్ చేసిన డాక్టర్ హాండెల్ కూడా చేశాడు. ఫలితం లేకపోయింది.
అంధత్వం ఆవరించినా తన జీవితానికి ముగింవు వచ్చిందని వోందెల్ భావించలేదు. ఆర్గాన్ సంగీత ప్రదర్శనలు వదిలి చివరి రోజుల దాకా ఆరటోరియోల ప్రదర్శన లిచ్చాడు. 1759 ఏప్రిల్ 6న లండన్‌లో జరిగిన [445512 ప్రదర్శనకు దర్శకత్వం వహించాడు. ఆ ప్రదర్శన యిస్తూ కిందపడిపోయాడు. స్పృహ తప్పాడు. ఇంటికి చేర్చారు. వడక మీద పడుకోబెట్టారు. మళ్ళీ అతను కోలుకోలేదు. “నేను గుడ్ ఫైదేరోజు చనిపోవాలనుకుంటున్నాను' అన్నాడు. దాని తరువాత కాన్ని గంటలకు గుడీ పాటర్ తెల్లవారి జామున కన్ను మూశాడు. వెస్ట్ మినిస్టర్ అబ్బేలో అతన్ని ఖననం చేశారు. ఆయన సమాధిపై టేబుల్‌పై కూచుని సంగీత రచన చేస్తున్న హాండెల్ చిత్రం. దాని ముందు 1165512 లోని | (౧0౪1121 ౧౧౫ ౧6౦66౧౧6? 1౪6” అన్న మాటలు వున్నాయి.
జైన
జోసెఫ్ హైడన్ ఆ౦56౪౧౧ [2/6౧ 31-3-1732 -- 31-5-1809
హైడన్ 1740లో వియన్నావచ్చాదు. జీవితాంతం వియన్నా దగ్గర్లో గడిపాడు. ఆ కాలంలో సంగీతమన్నది 'సంపన్నలకు' సంబంధించింది. సంగీత కారుల ఉనికి అన్నది సంపన్నుల ఆదరాభిమానాలపై ఆధారపడి వుండేది. సంగీతకారుల ఉనికి, అభివృద్ధి వాళ్ళ ప్రోత్సాహాన్ని బట్టే వుండేవి. ప్రజల కోసం సంగీత ప్రదర్శనలంటూ వుండేవి కావు. 179 దాకా అటువంటివి జరగలేదు. మొజార్ట్తో గార్డెన్ కన్సర్ట్ అన్నది 1782లో మొదలయింది. అంతవరకు ఆకర్షణీయమయిన అంతఃపురాల్లోనే సంగీత సభలు జరిగేవి. మామూలు జనం చర్చిల్లో, వీధుల్లో కొంత సంగీతం వినేవాళ్ళు. మంచి సంగీతం రాజాశ్రితమయివుందేది.
వియన్నా సంగీత కేంద్రం. సంపన్నకుటుంబాలకు ఎవరికి వారికి సొంత ఒపేరా కంపెనీలుండేవి. సంపన్నులకు సంగీత పరిచయం కూడా వుండేది. గొప్ప సంగీతాన్ని (ప్రేమించడమన్నది అప్పటి స్టెయిల్. గొప్ప ఉత్సవం, కుటుంబంలో శుభకార్యం వుంటే సంగీతం తప్పని సరి,
వివిధ సందర్భాలకు అనుగుణంగా సంగీత రచన చేయబడేది. సృజనలో స్వేచ్చకన్నా సంప్రదాయ ప్రభావం ఎక్కువగా వుండేది. అట్లాంటి సమాజంలో సంగీత కారుడు కళాకారుడిగా కన్నా “వుద్యోగి'గా వుందేవాదు. అధికారుల ఆజ్ఞలకు తలవొగ్గి వుండేవాడు.
హైదన్ ఉన్నత వర్షానికి చెందిన సంగీతాధికారిగా నియమితుడయినప్పుడు “క్రమశిక్షణ పాటించాలి. అతని లోడి సంగీతకారుల్లో అతి చనువు పనికిరాదు. కానీ దయగా మెలగాలీ. ముక్కుకు సూటిగా వుండాలి. వస్త్రధారణలో శుభ్రత పాటించాలి. సంస్కారవంతంగా ప్రవర్తించాలి. భోజనాదికాల్లో తినడంలో, తాగడంలో, సంభాషణల్లో నాగరికత వుందాలి" వగైరా నియమాలు చెప్పారు. అప్పటికే హైదన్ ఆఫ్టియాలో సుప్రసిద్ధ సంగీతకారుడు.
సంరక్షకత్వంలో పరిమితులు, ఆదేశాలు అనివార్యం. కానీ దాని వల్ల లాభాలు కూడా వున్నాయి. మంచి సంగీత కారుడికి జీవనాధారం దొరుకుతుంది, ఇల్గుంటుంది. (ోతలుంటారు. హైడన్లాంటి పప్రతిభావంతునికి ప్రయోగాలు చేసే వీలుంటుంది. పారితోషికాలూ వుంటాయి. సంప్రదాయ పద్ధతులే వున్నా అభివృద్ధికీ అవకాశముంటుంది. తై
వియన్నాకు రాకముందే హైడన్ తన సహజ ప్రతిభను ప్రదర్శించాడు. హైడన్ తల్లిదండ్రులు అతనికి సంగీతం పట్ల వున్న ఆసక్తిని ప్రోత్సహించారు. వాళ్ళ గ్రామం పేరు రో'హ్రూ. వాళ్ళ యిల్లు సంగీత కేంద్రం. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వాళ్ళ ఎప్పుడూ సంగీత కార్యకలాపాల్లో కలిసి పని చేసేవాళ్ళు. పసివాడుగా వున్నప్పుడే హైదన్ వాటితో (ప్రేరణ పొందాడు. తను విన్న రాగాల్ని పాదేవాడు. కుటుంబ సంగీత సంరంభాల్లో పసివాదుగా వున్న హైదన్ రెండు చిన్ని కర్రలు తీసుకుని వయోలిన్ వాయించినట్లు అభినయించేవాడు. పెద్దవాదయ్యాకా కొడుకుని చర్చికి పంపుదామనుకున్నాడు కానీ అప్పటికి అతని సంగీతాభిరుచికి తగిన అవకాశాలు కల్పించడం గురించి తండ్రి ఆలోచించలేదు.
మొదట వాళ్ళ గ్రామంలోని స్కూల్లు టీచర్ హైడన్‌కు సంగీతంలో మొదటి పాఠం చెప్పాడు. తరువాత బంధువు, వృత్తి సంగీతకారుడు ఐన జోవోన్ మాధియాస్ (ఫ్రాంక్ శిష్యరికంలో చేరాడు. ఫ్రాంక్ హైడన్ ప్రతిభను గుర్తించాడు. హైడన్ ఆరేళ్ళ వయసుప్పుడు ప్రాంక్‌తో బాటు వాళ్ళ వూరయిన హైన్బర్ల్ వెళ్ళాడు. అక్కడ రెందేళ్ళు వున్నాడు. చిత్రహింసలు అనుభవించాడు. ఫ్రాంక్ ఎంత క్రమశిక్షణ పాటించేవాదంటే దాన్ని తట్టుకోవడం కష్టం. అతను కొట్టడానికి 'కర్ర వుపయోగించేవాడు కాడు. బలమైన 'చేతులే' ఆ- పని చేసేవి. ఫ్రాంక్ దెబ్బల్లో హైడన్ మానసికంగా, శారీరకంగా నరకయాతన పద్డడు. వయోలిన్, హార్మొనీ తదితర వాద్యాల్ని నిరంతరం ప్రాక్టీసు చేయాల్సి వచ్చేది. దాంతో పసివాడైన హైడన్ అలసిపోయేవాడు. ఫ్రాంక్ భార్య కూడా హైడన్ పట్ల జాలి చూపేది కాదు. ఒప్పందం ప్రకారం యింకా నెలరోజులు భోజనం పెట్టాలి. కాని అతని పట్ల నిర్లక్ష్యం వహించి అతని అవసరాల్ని పట్టించుకోనేలేదు. దానికితోడు హైడన్‌కు మిత్రులెవరూలేరు. దాంతో పరిస్థితి మరింత దుర్భరమయింది. పసివాడు, నిస్సహాయుడు, బక్కపల్సిని శరీరం. తిట్లతో, దెబ్బల్తో అతన్ని హింసించారు. ప్రతి దానికీ అతన్ని కారణం చేశారు. ఆత్మ రక్షణ లేకపోవడం వల్ల పసివాళ్ళకు కూడా అతను దూరంగా వుండేవాడు.
పసితనంలో నిర్లక్ష్యానికి గురయిన హైడన్ పరిణితదశలో గౌరవాభిమానాలు పొందాడు. ఇన్నివున్నా ప్రాంక్ ప్రతిభావంతుడయిన ఉపాధ్యాయుడు. ఆ రకంగా హైదన్కు మంచి శిక్షణ యిచ్చాడనే చెప్పాలి. 1740లో వియన్నాలోని సెంట్ స్టీఫెన్ చర్చి సంగీతకారుడు హైడన్ సంగీత ప్రతిభను దర్శించాడు. అక్కడి నించీ హైడన్ నివాసం వియన్నా ఐంది, తిండి, బట్ట దొరికేది. ఎనిమిదేళ్ళ వయసు కుర్రాడు ఫ్రాంక్ దగ్గర్నించీ అక్కడికి వెళ్ళడమంటే అక్కడ అనుకూలంగా వుంటుందనే వూహించాడు, కానీ అతనూహించిన దయ, జాలి,
శం
అనురాగం అతనికి దొరకలేదు. అక్కడికి అతను వెళ్ళింది ౦౧౦1గు౦0౪ గా. అక్కడ అతనికి బోలెడు పని. అతను 114గ5100016, వయోలిన్ వాయించాలి. పాడాలి, కీర్తనలు చదవాలి, లాటిన్ చదవాలి. కెథెడ్రిల్ సర్వీసుల్లో పాల్గొనాలి. పవిత్ర వూరేగింపుల్లో, శవయాథ్రల్లో, కొన్ని సందర్భాల్లో రాజ సభల్లోనూ పాల్గొనాలి. ఈ అంతులేని శ్రమకానీ, అలవి మీరిన అధ్యయనం కానీ హైదన్ సంగీతాభిమానాన్ని తగ్గించలేదు. కానీ అనుదిన జీవితం కష్టభూయిసష్టంగా వుండేది. (ప్రభుత్వం చర్చిలో 601౯ 00౪5 కోసం మంజూరు చేసిన అతి తక్కువ మొత్తంతో హైడన్‌కు వుండడానికి ఇంటికి, తినడానికి తిండికీ కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. వాళ్ళిచ్చిన గదులు బాగా చల్లగా వుండేవి. వాళ్ళు పెట్టేకొద్దిపాటి తిండి చాలక పిల్లలు ఆకలితో అలమటించేవాళ్ళు. ఫలితంగా హైడన్ వీధుల్లో పాటలు పాడుతూ తిరిగేవాడు. దానివల్ల వచ్చిన కొంత డబ్బుతో (బెడ్డు లేదా సూపు కొని కడుపునింపుకునేవాడు. గొప్పవాళ్ళు యిళ్ళ దగ్గర పాడితే వాళ్ళు కడుపు నిండుగా భోజనం పెట్టేవాళ్ళు.
నిజానికి సంగీత అధ్యయనమంతా సజావుగా వుంటే హైడన్ వీటి గురించి పట్టించుకునేవాడు కాడు. చర్చిలో సంగీతాధికారి పిల్లల పట్ల నిర్దయగా నిర్లక్ష్యంగా ప్రవర్తించేవాడు. సందేహదృ్భష్టితో కించపరిచేవాడు. అవకాశమొచ్చినప్పుడ్దా అధికారం చెలాయించేవాడు. ప్రత్యేకించి హైడన్ పట్ల ఆగ్రహంతో వుండేవాడు. ఎందుకంటే హైదన్ సందేహంతో ఎన్నో ప్రశ్చలు వేసి విసిగించేవాడు. మరో వేపు అదుపు చెయ్యలేని అల్లరి పనులు చేసేవాడు. అందువల్ల అతను హైడన్ విద్య పట్ల నిర్లక్ష్యం వహించాడు. కానీ 'హైడన్ తన జ్ఞాపకశక్తితో, అధ్యయనంతో, చర్చి సంగిత రచనతో తన సంగీత జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకున్నాడు. స్వతంత్రంగా పన్నెండు భాగాలు సంగీత రచన 521౪6 గ౭౦|౧& రాసి ఉపాధ్యాయుడికి చూపిస్తే అతను అసహనంతో దాన్ని పరీక్షించుకుందానే “ఇట్లా కాలం వ్యర్థం చేసే బదులు చెప్పిన పని చెయ్యి” అని కసురుకున్నాడు.
హైడన్ ప్రమాదాల్ని కొని తెచ్చుకునేవాడు. రాజ ప్రాసాదం పరిసరాల్లో చాలా ఎత్తయిన ప్రదేశంలో నేరస్థుల వధ్యస్థలం వుండేది. హైడన్ మిత్రుల్తో కలిసి ఎంతో శ్రమపడి అక్కడకి ఎక్కాడు. రాణి తన అంతఃపురం నించీ చూసి సంగీతోపాధ్యాయుడి ద్వారా వాళ్ళని శిక్షించింది. యింకో సందర్భంలో హైదన్ కత్తెరతో క్లాసులోనే యింకో విద్యార్థి జుత్తు కత్తిరిస్తూ దొరికిపోయాడు.
పదిహేడో ఏట సెంట్ స్టీఫెన్స్ చర్చి నించీ బయటపడ్డాడు. ఒంటరివాడు, డబ్బులేదు, స్నేహితులు లేరు, హైడన్ ఎడతెరిపిలేని, అంతులేని కష్టాల కడలిని ఈదాల్చి వచ్చేది. 124
అదృష్టవశాత్తు అతన్లాగే చర్చి సంగీతం నేర్చుకుని బయటపడ్డ మరో విద్యార్ధి స్పాంగ్లర్ పరిచయమతర్యూడు. అతనుహైడన్ పట్ల దయ దలిచాడు. అతనూ పేదవాడే కానీ అతను 'హైడన్‌కు అన్నం పెట్టి తన పాడు పడిన యింట్లో వుండనిచ్చాడు. మెల్లగా కొంతమందికి వయోలిన్ పారాలు చెబుతూ తిండికి సరిపడా సంపాదించడం మొదలు పెట్టాడు.
1750 ప్రాంతల వసంతకాలంలో హైడన్ ఒక వ్యాపారస్థుడి దగ్గర అప్పుచేసి ఒక యిల్లు కొన్నాడు. ఆ ఇల్లు పగుళ్ళు వారింది. చల్లగా వుండేది. చీకలిగా వుండేది. వర్షాక్రాలంలో నీళ్ళు ధారగా సీలింగ్ నించీ కురిసేవి, ఐనా అది అతని సొంత ఇల్లు, చాలా ఆనందించాడు.
“నేను నా పాత [1205100014 ముందు కూచుని వాయిస్తూ వుంటే ఏ రాజుకూ నాకు పట్టిన అదృష్టం పట్టలేదు, అనిపించేది” అన్నాడు.
ప్రదర్శనద్వారా, పాఠాల ద్వారా సంపాదించాదు. సంగీత రచనలు చేసేవాడు. అధ్యయనం చేసేవాడు. క్రమంగా తన సొంత బాణీలు రాయడం ప్రారంభించాడు. హైదన్ సంగీతాభిమాని ఒకరు వియన్నాలో సుప్రసిద్ధ నటుడు నటించే ఒక వాస్య నాటకం కోసం సంగీతం సమకూర్చమన్నాడు. 1752లో ఆ హస్య 'ఒపేరా' ప్రదర్శింపబడింది. జనం ఆదరించారు. దురదృష్టవశాత్తు ఆ ఒపేరా ఒక గౌరవ నీయుడయిన వియన్నాకు చెందిన వ్యక్తిని వుద్దేశించింది కావడం వల్ల రెండుప్రదర్శనల అనంతరం అది తెరమరుగైంది. ఆ
పెద్ద మనిషి పలుకుబడివల్ల అలా జరిగింది కానీ తరువాతి సంవత్సరాల్లో యూరప్‌లో
ప్రదర్శింపబడి జనాదరణ పొందింది. హైడన్ నివాసానికి దగ్గర్లో ఆన్భానకవి ఐన పియట్రో మెటాస్టా సియోలిన్ వుందేవాడు. ఆకాలంలోని ఇటలీ ఒపేరా సంగీతకారులందరూ అతని ఒపేరాల్ని ప్రదర్శించేవాళ్ళు. మెటాస్టాసియో హైదన్ గురించి విన్నాడు. అతని సంగీతం విన్నాడు. అతన్ని అభినందించాడు. అతని శ్రమని పొగిడాడు. స్నేహితులయ్యారు. కలిసి పని చేద్దామని నిర్ణయించుకున్నారు. అతను హైదన్కు సహకరించాలని భావించాడు. మొదటి సారిగా హైడన్‌కు పర్మనెంట్ వుద్యోగం దొరికేలా చేశాడు. సుప్రసిద్ధడయిన కంపోజర్, ఉపాధ్యాయుడు, ఒపేరా నిర్వాహకుడు అయిన నీకోలో పోల్పోరా'కు హైడన్ సహాయకుడిగా నియమితుడయ్యాడు. నికోలో హైడన్ కు సంగీత పారాలు చెప్పి ఓకల్మ్యూజిక్ రాయడం నేర్పించాడు. కృతజ్ఞతాపూర్వకంగా గురువుకు హైడన్ అన్ని రకాల సేవలు చేశాడు. ఇటాలియన్ స్వర రచన గూర్చి నికోలో నించీ హైడన్ చాలా నేర్చుకున్నాడు. నికోలా ద్వారా సుప్రసిద్ధ వియన్నా సంగీతకారుల్ని హైదన్ కలుసుకున్నాడు. కొంత మంది ఆశ్రయమిచ్చే పెద్ద కుటుంబీకుల్ని పర్
కూదా కలిశాడు. వాళ్ళలో సంపన్నుడయిన సంగీత (ప్రేమికుడు కార్ల్జోసఫ్ వాన్ ప్యూరెన్బర్ల్ వున్నాడు. ఆయన తన భవనంలో ఉత్సాహభరితమయిన, ఆకర్షణీయమయిన, తరచూ జరిగే సంగీత కార్యక్రమాలకు దర్శకత్వం వహించమని హైడన్‌ను కోరాడు. ప్యూరెన్బర్గ్ కోసం హైదన్ పద్దెనిమిది ఆర్మెన్ట్రా రచనలు చేశాడు. 1755 మొదటి రచన చేశాడు. ఫెర్టినాంద్ అన్న ఉన్నత వంశస్థుడు పిల్సెన్ అన్న చోట సంగీతోపాధ్యాయుడి అవసరం వుండి హైడన్ని ఆహ్వానించాడు. హైడన్ రెండేళ్ళ పాటు, అక్కడ పని చేశాడు, అక్కడ తన మొదటి సింఫనీ 1759లో రాశాడు. హైడన్ 1760 నవంబరు 26న “విగ్గులు తయారు చేసే అతని కూతురయిన అన్నా మారియా కెల్లర్‌ను పెళ్ళాడాడు. హైడన్ నిజానికి అన్నాను పెళ్ళి చేసుకున్నప్పుడు హైదన్కు ఆమె అంటే 'ప్రేమలేదు. వాళ్ళ వైవాహిక జీవితంలో ఆనందం లేదు. ఆమెది సంకుచిత స్వభావం. భర్తని అర్ధం చేసుకోవడం కానీ, అభినందించడానికి కానీ ఆమె అసమర్భురాలు. వాళ్ళు తరచు పోట్లాడుకునేవాళ్ళు. ప్రత్యేకించి అతను సంగీత రచనలు చేసిన పేపర్లని ఆమె వుండలు చుట్టి బంతుల్లాగా చేసినపుడు బాగా గొడవ పదేవాళ్ళు. 'కొన్నేళ్ళ అశాంతి సంసారం తర్వాత విడిపోయారు. వేరుగా జీవించారు. 'హైడన్ దయాంతరంగుదు. వాళ్ళు విడిపోయినా ఆమెకు జీవితాంతం అవసరమయిన ఆర్థిక సాయం చేస్తూ వచ్చాడు. అంతేకాదు ఆమె గురించి ఎప్పుడూ నిర్దయగా మాట్లాడి ఎరుగడు. ఫెర్డినాండ్ ఆర్థిక యిబ్బందు వల్ల 1761లో తన ఆర్మెన్టాని వువ సంహరించుకున్నాడు. అప్పటికే సుప్రసిద్ధడయిన హైడన్ యింకో వుద్యోగం కోసం (ప్రయత్నించలేదు. వుద్యోగమే అతనికోసం ఎదురు చూసింది. వియన్నాలోని సంగీతకారుల సంరక్షకులైన ప్రిన్స్‌పాల్ ఆన్టోన్ ఈస్టర్ హేజీ రాజకుమారుడు హైడన్ గురించి విని అతను తన కోసం పని చేస్తే బావుండునని భావించాడు. హైడన్ ఖాళీగా వుండడం వల్ల రాజకుమారుడి ఆవ్వోనాన్ని అంగీకరించాడు. తన రాజ భవనంలో రెండో సంగీతాధికారిగా 'హైడన్ని రాజకుమారుడు నియమించాడు. తన జీవితకాలంలో ముప్పయ్యేళ్ళపాటు సైడన్ ఆ వుద్యోగం చేశాడు. తన జీవితంలోని ముఖ్యమయిన సంవత్సరాలు అక్కడ గడిపాడు అక్కడ చేరిన కొన్నాళ్ళకి రాజకుమారుడు ఒక అద్భుతమయిన భవనం నిర్మించాడు. మకాం అక్కడికి మారింది. హైదన్ మొదటి సంగితాధికారిగా నియమితుడయ్యాడు. కావలసినంత పని. రాజకుమారుడు సంగీత నిర్వహణలో ఎంతో ఆసక్తి ప్రదర్శించేవాడు. హైడన్ రీహార్సల్స్కు, సంగీత ప్రదర్శనలకు ఇన్చార్జ్గా వుండేవాడు. ప్రత్యేక సందర్భాలకు కర
రచనలు చేసేవాడు. అక్కడ జరిగే సంగీత ప్రదర్శనలకు రచనలు చేసేవాడు. ఆర్మెస్ట్రాకు దర్శకత్వం వహించేవాడు. ప్రత్యేకించి ఉన్నత రాజవంశీకులు వచ్చినపుడు, వివాహ సందర్భాల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక సంగీతం అవసరం, ఉత్సాహపూరిత రచనలు అవసరం. వీటికి తోడు తన కింద పనిచేసే సంగీతకారుల జీవితం, వ్యక్తిత్వం, వాళ్ళ అభినివేశం వీటన్నిటి పట్ల బాధ్యత కలిగి వుండడం కూడా హైదన్ వంతు.
ఆ వుద్యోగం పద్ధతయింది. బిజీ ఐంది. ఉత్పాదకమయింది. నగర జీవితంలోని కోలాహలంతో సంబంధం లేకుండా హైడన్ సింఫనీలు, క్వార్టెట్లు, ట్రియోలు, సొనటాలు ఒపేరా తదితరాలు ఎన్నెన్నో రాశాడు. అదే సమయంలో రూపంలో, శైలిలో మౌలికత (ప్రదర్శించాడు. దాన్ని గురించి చెబుతూ నేను ప్రపంచం నించీ వుపసహరించుకుని ఏకాంతంగా వుంటే ఎవరూ నన్ను యిబ్బంది పెట్టలేరు, బాధపెట్టలేరు, ఫలితంగా తప్పనిసరిగా నేను నేనుగా వుంటాను. నాలో మౌలికతగా నేనుంటాను అన్నాడు. ఆ విధంగా ఆ సంవత్సరాలు నిర్మలంగా, వశాంతంగా సాగిపోయాయి. దానివల్ల అదృన్చవంతుడయిన, (ప్రతిభావంతుడయిన సంగీతకారుడు సాటిలేని స్థాయికి ఎదిగాడు. తన కాలం నాటి సంగీతకారులందరిలో కెల్లా సుప్రసిద్ధుడయ్యాడు.
మొదట ఆస్ట్రియా అంతటా అతని పేరు వ్యాపించింది. తరువాత యూరప్ ఖండంలో విస్తరించింది. 1764లో అతని సింఫనీలు కొన్ని పారిస్‌లో ప్రచురింపబడ్డాయి. సంవత్సరం తరువాత కొన్ని రచనలు ఆమ్‌స్టర్‌డామ్‌లో అచ్చయ్యాయి. 1765లో ౪16౧6౯ 0126౧౫ పత్రిక “మన జాతి (ప్రేమించేవ్యక్తి” అని రాసింది. దూరంగా వున్న మాడ్రిడ్ సిటీలో అతని గౌరవ సూచకంగా ఒక పాటను ప్రదర్శించారు. ఎన్నో విభిన్న ప్రాంతాలనించీ అతనికి అభినందనలు అందేవి. చక్రవర్తిని మారియా తెరెసా అతన్ని గౌరవించేది,
హైదన్ అధికారం, న్థాయి, ఎదుగుతున్న అతని సృజనాత్మక శక్తులు వీటివల్ల అతనేమీ మారలేదు. నిరాడంబరంగా, నిజాయితీగా, నమతగా, అవినీతికి దూరంగా బతికాడు. వంచనతెలీకుండా, తన గొప్పతనం తనకు తెలీకుండా సాధారణంగా జీవించాడు. హైడన్ తనపునాదుల్ని ఎప్పుడూ విస్మరించలేదు. వినయ సంపన్నమయిన తన వారసత్వాన్ని మరచిపోలేదు. ఏమీ లేని తనం 'నించీ ఏదో ఒకటయినందుకు నమతగా కృతజ్ఞతా పూరితంగా మెలిగాడు. తరువాతి రోజుల్లో చెబుతూ “నేను రాజులతో, గొప్ప వాళ్ళతో కలిసి తిరిగాను. వాళ్ళ నించీ ఎన్నో గౌరవ మర్యాదలందుకున్నాను. కానీ వాళ్ళతో శషై/
సన్నిహితంగా వుంటూ, వాళ్ళ 'న్థాయి'లో బతకాలని కలలో కూడా భావించలేదు. నా న్థాయి జనంతోనే కలిసి వుండాలని ఆశించాను” అని చెప్పుకున్నాడు.
ఆయన మాటలు ఆయన వ్యక్తిత్వానికి దర్పణాలు “మంచిగా ప్రవర్తించు, మించు, నిరంతరం భగవంతుడికి సేవ చెయ్యి” హైడన్ మంచి మనిషి నైతిక విధుల్లో, ధార్మిక చింతనలో ఉత్తముడు, సహృదయుడు, ఆరహృదయుడు, మర్యాదస్తుడు. తపుల్ని క్షమించేవాడు. అతని దగ్గరున్న ధనం ఎల్లవేళలా యితరులకు సాయపడడానికి సిద్ధపడి వుండేది. యాభై ఏళ్ళకు ముందుగానే తన వీలునామాంలో ధార్మిక విషయాలకు తన ధనం వెచ్చించాలని రాశాడు. తను యిల్లు కొనుక్కోడానికి అప్పిచ్చిన వ్యక్తి కూతురి పెళ్ళికి సాయం చేశాడు. ఆయనకు చాల తక్కువ మంది శత్రువులు, ఎక్కువ మంది స్నేహితులు.
హైడన్ శ్రమ జీవి. రోజుకు పదహారు గంటలు శ్రమించేవాడు. కొద్ది సేపే నిద్రపోయేవాడు. తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ, తన సంగీత సృష్టి కూడా చేసేవాడు.
వీటన్నిటికీ మించి దైవభక్తి పరుడు. వినయ సంపన్నుడు. తనని అభినందించిన వాళ్ళకు ఎప్పుడూ కృతజ్ఞడయివుండేవాడు ఆయన ప్రతి పనీ దైవస్మరణతో మొదలయ్యేది.
హైడన్ 'సంతోష జీవి కాడు. అతని సమకాలికులు కొందరు ఆయన నవ్వగొ చూడలేదన్నారు. చమత్మారాలు విసరడం వినలేదన్నారు. ఆయన కళ్ళు దిగుల్లో నిండి వుండే వన్నారు. ఆయన దారుణఖమయిన ఒంటరి జీవి ఆయన కోల్పోయిందల్లా భార్య నించీ (ప్రేమానురాగాలు. తన వుదో శగంలో కూరుకుపోయి ప్రపంచానికి దూరంగా వుంటో జీవించాడు. ఒక సందర్భంలో “ఇక్కడ నా ఎడారిలో ఒంటరిగా కూచుని అందరికీ దూరమై అనాధగా, మానవ సాహచర్యంలేని దుర్భర స్థితిలో వుంటూ ఎప్పటివో అందమయిన సాయంత్రాల్ని గుర్తు తెచ్చుకుంటూ గడుపుతున్నాను” అని రాసుకున్నాడు.
ఈ ఒంటరి తనంలో అతనికున్న ఏకైక మిత్రుడు మొ జార్ట్. వాళ్ళు 1781లో అభినందించడమే కాదు ఒకరి పట్ల లయ్యారు. ఒకరి ప్రతిభను యింకొకరు నో ఒక ఉపాధ్యాయుడిలా ప్రతిభావంకుడ ఇ సాన అర్ధతలో స్పందించారు ప చూపించాడు, ప్రతిఫలంగా మొజాక న విద్యార్థి పట్ల ప్రదర్శించే ప్రేమను మొన (ప్రయత్నించి, నేర్చుకుని ఎప్పుడూ క్తత్త ను “స అనురాగంతో అర్ధం చేసుకో డన్
సృతజ్ఞతా పూర్వకంగా మెలిగాడు. చిత్రమేమిటంటే హై 1128
తన యువ మిత్రుడినించీ చాలా నేర్చుకున్నాడు. మొజార్ట్‌లోని మౌలికత, సాహసం, ప్రతిభ హైడన్ని ఆకర్షించాయి. ఆకట్టుకున్నాయి.
ఆ నాటికి సజీవులయిన సంగీతకారుల్లో హైడన్ సాటిలేని క్తీర్తి పొందిన వ్యక్తి ఐనా అతను మొజార్ట్లా రాయడానికి ప్రయత్నించి మొజార్ట్‌కు ఎనలేని కీర్తిని సాధికారికతను తెచ్చిపెట్టాడు.
హైడన్ ఎప్పుడోగానీ వియన్నాకు వచ్చేవాడు కాడు. వస్తే తప్పని సరిగా మొజార్ట్ యింటికి వెళ్ళేవాడు. 1785లో అట్లాంటి ఒక సందర్భంలో మొజార్ట్ అతని సహచరులు హైడన్‌కు గౌరవ సూచకంగా మొజార్డ్ రాసిన రచనను గానం చేశారు. అప్పుడు అక్కడ మొజార్ట్ తండ్రి కూడా వున్నాడు. హైడన్ మొజార్ట్ తండ్రితో “నేను యింతకుముందే దేవుడి మీద ప్రమాణం చేసి నిజాయితీగా చెప్పాను. నాకు తెలిసిన వాళ్ళందరిలో నీ కొడుకు గొప్ప స్వరకర్త నాకు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళలో, పేరు విన్నవాళ్ళందరిలోనూ అతను సాటిలేని సంగీత్రక్రార్రుడ్రు” అన్నాడు.
1790లో హైడన్ వుద్యోగం ముగిసింది. వున్న స్థలాల్ని వదలడానికి హైడన్‌కు ఇష్టం లేదు. వియన్నా చేరాడు. అతని పట్ల గౌరవాభిమానాలున్న స్నేహితుల్లో, సహచరుల్హో అభిమానుల్లో ఆనందించాడు. కానీ అక్కడ స్థిరపడ్డం ఆయన అభిమతం కాదు. అంతలో
ఇంగ్లాండుకు చెందిన సాంస్కృతి కార్యక్రమ నిర్వాహకుడు జోవాన్ పీటర్ సాల్మన్ వియన్నా వచ్చి హైడన్ని కలిసి లండన్‌లో ఆర్మెస్త్రా నిర్వహించమని, కొత్త సింఫనీలు రాయమని పన్నెండు వంద్రల పొండ్లు ఇచ్చాడు. కన్నీళ్ళతో మొజార్ట్ వీడ్కోలు పలికాడు. 'మళ్ళీ మనం కలసుకోంి అన్నాదు.
నిజ్వంగానే సంవత్సరం తరువాత మొజార్ట్ కన్నుమూశాడు. 1790 డిసెంబరు 15న హైడన్ బియల్టేరార్స, ప్రయాణ మధ్యలో బాన్‌లో ఆగాడు. అక్కడ 'చిధోవినో అన్నయువ సంగీతకారుడ్డి కలిశార్స బిభ్రోవిన్ గురించి చెబుతూ 'అతను ప్రతిభావంతుడయిన సంగీతకారుడు' అన్నాడు. సముద్రం దాటి 1791 జనవరి ఒకటిన లండన్ చేరాడు. క లండన్ నగరం హైడన్‌కు జేజేలు పలికింది. గౌరవనీయులు విడిది చేసి గోర్డన్ స్ట్వేర్ల్రి విడిది చేశాడు. లండన్ నగరంలోని సుప్రసిద్ధులందరూ ల క్ స దర్శించారు. వాళ్ళ ఇళ్ళకు ఆయన్ని ఆన్వానించారు. వారంలోని ఏదు రజా అ ర్ ఆయ త ళకు పిలిచి ఆతిథ్యమిచ్చారు. బాగా పొద్దుపోయాకా ఆయ ని న్ని న కు సామాజిక సమావేశాలకు, ఉన్నత వర్గీయుల
న కాలమానం ప్రకారం ఆయన
విందులకు, వినోదాలకు వాజరయ్యేవాడు. ఈ ఎడతెరిపిలేని హడావుడిలోనే ఆయన సమయం కేటాయించుకుని తన ఆర్మెస్ట్రాకు రీహార్సల్స్ నిర్వహించేవాడు, అట్లాగే కొత్త సింఫనీలు సిద్ధం చేశాడు. “నా మనసు చాలా బలహీనయింది. దేవుడి దయవల్ల ఎప్పటికప్పుడు నాకు నిర్దేశించిన పనులు చక్కబెట్టెవాణ్జి, రోజు ఆయన్ని ్రార్థిస్తాను, ఆయన సహకారం లేనిదే ఏమీ చెయ్యలేను” అన్నాడు.
లండన్‌లో హానోవర్ స్వ్వయిర్లో 1791 మార్చి 11న ఉన్నత వర్గీయుల, మేధావుల మధ్యన ఆయన మొటి సంగీత ప్రదర్శన జరిగింది. అది అసాధారణ అపురూప విజయాన్ని పొందింది. ఆయన కొత్త 'సింఫనీ' 54గ09 ప్రదర్శితమైంది. రెండో ప్రదర్శన ప్రిన్స్ వేల్స్‌ని ఆకర్షించింది.
ఈ మధ్యకాలంలో ఆయన నృత్య ప్రదర్శనల్లో పిక్ళిక్లలో, నదీ విహారాల్లో అతిధిగా వున్నాడు. లండన్ మేయర్ గౌరవ పురస్కారంగా బాంక్వెట్ యిచ్చినప్పుడు వెయ్యి మంది పైగా హాజరయ్యారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఈ ఆనంద కోలాహలంలో 1791 డిసెంబర్ రన మొజార్ట్ మరణ వార్త తెలిసింది.
హైడన్ 1784లో రెండోసారి లండన్ సందర్శించాడు. ఈ మధ్యకాలంలో వియన్నాలో యువకుడయిన బిథోవిన్కు పాఠాలు చెప్పాడు. లండన్ వచ్చి మళ్ళీ సంగీత ప్రదర్శనలిచ్చాడు. మళ్ళీ సింఫనీలు రాశాడు. యధావిధిగా పూర్వం లాగే గౌరవమర్యాదలు,
, సన్నానసత్మారాలు అందుకున్నాడు.
లండన్ పర్యటన తరువాత వియన్నా సరిహద్దుల్లోని గుంఫెన్ డ్రాఫ్ ప్రాంతంలో తన శేష జీవితాన్ని గడిపాడు. సంపన్నుడూ, ప్రపంచం గౌరవించిన వాడుగా జీవించాడు. అప్పుడు కూడా ఆయన సృజనశక్తులు లోపించలేదు. ఆయన సుప్రసిద్ధ సంగీతరచనలు ౧6 084100, 716 5645005 అన్న రచనలు అప్పుడే చేశాడు. ఆఫ్టియా ఆంతరంగిక మంత్రి కోరిక మేరకు ఆష్టియా జాతీయగీతం రాశాడు. ఆ గీతాన్ని 1797 పిభ్రవరి 12న చక్రవర్తి పుట్టిన రోజున అధికారికంగా ఆలపించారు. “ప్రతి ఆష్టియన్ హృదయం, విశ్వాస పాత్రమయిన ప్రతి ఆస్టియన్ హృదయంలో ఏదయితే వుందో దాన్ని నువ్వు వ్యక్త పరిచావు. సీ గాన మాధుర్యం ద్వారా ఎప్పుడూ ఆస్ట్రియా గౌరవింపబడుతూనే వుంటుందొఅన్నాడు చక్రవర్తి.
1808 డిసెంబరు 26న 16 56౪60 1891 ౪0౧౦9 అన్న సంగీత ప్రదర్శనకు సహైడన్ దర్శకత్వం వపాంచాడు. దాని తరువాత ఆయన (ప్రవంచం నించీ 220
వుపసంహరించుకున్నాడు. శారీరకంగా ఆయన ఆరోగ్యం దెబ్బ తిన్నది. సరిగా వినిపించేది కాదు. మనసు మొద్దు బారింది. నాలుక మందమయింది. సందర్శకులు వచ్చి ఆయనకు ఇబ్బంది కలిగించకుండా చూసి వెళ్ళేవాళ్ళు. తరువాత హైదన్ రాసిన కార్డులు అచ్చేసినవి అతని పని మనిషి సందర్శకులకు అందజేసేవాడు. అందులో “నా శక్తి శాశ్వతంగా నన్ను వదిలి వెళ్ళింది. నేను బలహీనుణ్ణి, వృద్ధుజ్జి అయ్యాను” అన్న మాటలుండేవి. దాంతో బాటు "706 గ02౧/ 016 ౧2౧ అన్న ఆయన రచన నించీ కొటేషన్ వుండేది. చివరి దశలో తలనొప్పితో, మతి మరుపుతో బాధ పద్దాడు. మసు బాగున్నప్పుడు తనకు వచ్చిన బహుమతుల్ని పరిశీలించేవాదు.
1808 మార్చి 2న హైదన్ దెబ్బయి ఆరవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు రోజులపాటు ఉత్సవాలు జరిగాయి. రాజకుమారుడు ఈస్టర్ హేజి తన సొంతవాహనాన్ని పంపాడు. హైడన్ వృద్ధుడయిపోయినా, అనారోగ్యంగా వున్నా చివరిసారిగా జనం ముందుకు వచ్చాడు. తన కోసం వచ్చిన జన సందోహ సంరంభాన్ని చూసి హైదన్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆయన్ని కుర్చీలో తీసుకుని విల్లోకి వస్తే జనమంతా గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు.
(ఫెంచి సైన్యం వియన్నాను ఆక్రమించుకుని నగరంలోకి రావడంతో ఆయన జీవితకాలంలో చివరి నెలలు ఎంతో విషాదానికి లోనయ్యాడు. అతని సేవకుడు అతన్ని పియానో దగ్గరకు తీసుకెళితే చాలా సార్లు తన జాతీయ గీతం వాయించాడు.
ఒకరోజు ఒక (ఫెంచి ఆఫీసర్ విజేతలా కాకుండా హైదన్ అభిమానిలా ఆయన్ని చూడ్డానికి వచ్చాడు. మొదట హైదన్ అతన్ని చూడ్డానికి ఇష్టపడలేదు. కానీ ఆ ఆఫీసర్ నేరుగా పియానో దగ్గరికి వెళ్ళి హైదన్ రచన 76 019410 నించీ 11 ౧౭4౪6 ౪0/1 అన్న భాగాన్ని వాయించాడు. హైడన్ ఆ ఆఫీసర్ని పిలిచి కౌగిలించుకున్ని 'బాబూ! దేవుడు నిన్ను చల్లగా చూదాలి. ఈ రోజు నన్ను చాలా సంతోషపెట్టావు" అన్నాదు.
తను ఎంతోకాలం బతకనని హైదన్కు తెలుసు. మే 26న తన వీలునామారాశాడు. ఎవ్వర్నీ మరిచిపోకుండా అందరికీ, సృష్టికర్తకు కృతజ్ఞతల చెప్పుకున్నాడు. తన వాళ్ళందర్నీ పిలిచి చివరి వీడ్మోలు చెప్పి వాళ్ళ కోసం జాతీయ గీతం వాయించాడు. ఆ నెల చివర్లో చివరి రోజు కన్ను మూశాడు. అన్ని చర్చిల్లో ప్రార్ధనలు జరిగాయి. అందరూ (శ్రద్ధాంజలి ఘటించారు. ఫ్రెంచి వాళ్ళుకూడా. నెపోలియన్ హైడన్ ఇంటి దగ్గర అన్నీ ప్రభుత్వ లాంఛనాలు, గౌరవ మర్యాదలు నిర్వహించి ఉన్నతోద్యోగులు శవయాత్ర నిర్వహించాలని ఆదేశించాడు.
21
ప్రాంజ్ లిస్జ్జ్ [౧2౧2 ౬13201 22-10-1611 --31-7-1866
'ప్రాంజ్ లిస్జ్ట్ అనేక వ్యక్తులు కలిసిన ఏక వ్యక్తి. దైవభక్తి పరుడు. అదే సమయంలో ప్రాపంచికుడు. ఆదర్శవాది. కానీ నిజాయితీ లేకుండా ప్రవర్తించేవాడు. అహంకారి. కానీ వినయసంపన్నుడు. ఉన్నత స్థాయిలో సంగీతాన్ని ఆవిష్కరించిన గొప్ప సంగీతకారుల్లో ఆయనొకడు. ఆయన వీమారొలో సంగీతాధికారిగా పని చేశాడు. ఆయనలా ఆ పదవిని కొందరు మాత్రమే నిస్వాద్ధంగా, దయాగుణంతో, ఓర్పుతో, జెదార్యంతో, ఉత్సాహంతో నిర్వహించారు. పియానో దగ్గర చేరితే చైతన్యం వికసించే సంగీతాన్ని ప్రసరించేవాడు. రంగస్థలం గురించి, సిద్ధాంత విషయాలు వివరించేవాడు. తన సొంత సాంకేతిక నైపుణ్యాన్ని వివరించేటప్పుడు నీరసమయిన సంగీతం వినిపించేవాడు. ఇతర సంగీతకారుల్నించీ గౌరవ మర్యాదల్ని వినయవిధేయతల్ని కోరేవారు. తన మీద తను పుస్తకాలు రాయడానికి వెనుకంజ వేసేవాడు కాడు.
సంగీతంలో ఎట్లాగో జీవితంలోనూ ఆయన వైరుధ్యాల కూడలి. గాఢమయిన మతాఖినివేశం ప్రదర్శిస్తూనే అతినిర్లక్ష్యంగానూ వుండేవాడు. అదే సమయంలో తనక్తు సన్నిహితులయిన ఉన్నత కుటుంబాల వారితో 'సెలూన్ొ లలో చేరి అంతులేని ఆనందాల్లో, వుల్లాసంలో తలమునకలయ్యేవాడు.
గొప్పవాళ్ళ దగ్గర నమత్రగా వుందేవాదు. అతని సంగీతం గురించి ఆ గొప్పవాళ్ళు ఏ సందర్భంలోనైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే వాళ్ళు ఎంత వాళ్ళయినా ఎదురు తిరిగేవాడు. అతని నోటికి అడ్డూ ఆపూ వుందేది కాదు. అతని వస్త్రధారణ సందర్భానుసారంగా మారేది, చర్చి పద్ధతుల్ని పాటిస్తూనే భౌతికా నందాన్ని అందుకునేవాదు. రోం నగరంలో వున్నప్పుడు చర్చికి వెళ్ళి (శాంటామారియా చర్చి) ప్రార్ధనలు చేసి, గాధమయిన భక్తి ప్రపత్తులతో దైవాన్ని పూజించి అదే సాయంత్రం వమాత్రం పశ్చాత్తాపానికి అవకాశం లేకుండా యితర స్థలాల్లో 'సుఖాన్వేషణ' చేశాడు. సందర్భానుసారంగా అతను “అధ్యాత్మికత” ప్రదర్శించివుండవచ్చు కాని శారీరక సుఖాల్ని ఎప్పుడూ అతను కాదనలేదు. ఐశ్వర్యం నిండిన వాతావరణంలో నిర్లక్ష్యంగా వుండేవాడు. కాడు, విచ్చలవిడిగా దుబారా చెయ్యడమంటే, కర్చుపెట్టడమంటే అతనికి ఇష్టం. అతని జీవిత చరిత్ర రాసిన ఒక జర్మన్ రచయిత అతని ఇరఏ ఆరు 222
ముఖ్యమయిన 'డ్రేమ వ్యవహారాల” గురించి రాశాడు. వాటిల్లో కాన్ని వ్యవహారాలు “అనాధల” తోడివి. రైతుకుటుంబాల ప్రీలతో, గౌరవనీయులయిన స్త్రీలతో, అతని సంబంధాల గురించి అసహ్యకరమయిన అపవాదులున్నాయి.
మత విశ్వాసాలకు సంబంధించి ఆయన మచ్చలేనివాడు. ఆయన తరంలో అసాధారణ సంగీతకారుడు.
చిన్నప్పుడు ప్రత్యేక లక్షణాలు అలవరచుకునే పద్ధతిలో పెంచబడ్డాడు. అడిగినవాళ్ళకు లేదనకుండా పెట్టాలి అని .చిన్నతనం నించీ చెప్పిన మాటలు అతనిపై పని చేశాయి. ఎదుటి వాళ్ళతో ఎప్పుడూ చిరునవ్వుతో వుండడం దాన్నించీ నేర్చుకున్నాడు. అతని తండ్రి ఆడల్లిస్జ్ట్ కొడుకు ప్రతిభను పసికట్టాడు. ఆడల్రాజయిన ఈస్టర్హేజీకి రైడింగ్ ప్రాంతంలో వున్న ఎస్టేట్‌లో విశ్వాసపాత్రుడయిన సేవకుడు. ఆడమ్ తెలివయిన బెక్సాహిక సంగీతకారుడు. తన కొడుక్కి కూడా చిన్నప్పుడే పియానో నేర్చించాడు. తొమ్మిదేళ్ళ వయసులోనే ఫ్రాంజ్ జనాల ముందు ప్రదర్శన ఇచ్చాడు. బహుమళులు పొందాడు. వాటిని ఆడల్ తన మిత్రులకు చూపి వాళ్ళ బలవంతం వల్ల ఫ్రాంజ్ ప్రదర్శన ఎస్టేట్‌లో ఏర్పాటు చేశాడు. అతని మిత్రులంతా సంతోషించి ఫ్రాంజ్ సంగిత విద్యకోసం ఆరేళ్ళకు సరిపడా ఆర్థిక సాయం చేశారు.
ఫ్రాంజ్ ఇప్పుడు వియన్నాలో స్థిరపడ్డాడు. కార్ల్జర్నీ దగ్గర పియానో, సలీరీ దగ్గర కాంపోజిషన్ నేర్చుకున్నాడు. ఫ్రాంజ్ సంగీత (ప్రదర్శన కూడా ఇచ్చాడు. 1828లో ఇచ్చాడు. దానికి బిథోవిన్ వోజరయ్యాడు. కుగ్రవాడిగా వున్న ఫ్రాంజ్‌ను ఎత్తుకుని బిథోవిన్ ముద్దాడాడు. ఫ్రాంజ్ కంపోజర్‌గా కూడా ప్రతిభను ప్రదర్శించాడు. వివిధ సంగీతకారుల రచనల సంకలనం కోసం ఫ్రాంజ్‌ని కూడా ఒక రచన అడిగారు. ఆ (గ్రంధం అచ్చయింది.
పన్నెండేళ్ళ వయసులో అద్భుతమయిన శిక్షణ పొందిన వాడుగా అభినందనలు పొంది ఫ్రాంజ్ వియన్నా వొదిలి సంగీత కళాశాలలో చేరడానికి పారిస్ వెళ్ళాడు. త్వరలోనే విదేశీయులకు అందులో్రవేశం లేదని తెలిసింది. ప్రవేటుగా రీచా, పాయేర్ అన్న ఉపాధ్యాయుల దగ్గర చదువుకున్నాడు. చదువుకుంటూనే 1824 మార్చి 8న బహిరంగంగా తన ఒపేరా ప్రదర్శన ఇచ్చాడు. దానికి సంబంధించి ఒక కధనం వుంది. అతను తన సంగీతం ప్రదర్శిస్తూ వుండే ఆర్మెస్టాలోని యితర కళాకారులు తమ వాద్యాల్ని వాయించడం మానేసి ఆశ్చర్యంగా అతని గానాన్నే చూశారట! దాని తరువాత కుర్రాడయిన ఫ్రాంజ్ ఒక దాని తరువాత ఒకటిగా ప్రదర్శన లిచ్చాడు. నగరంలోని గొప్ప వాళ్ళయిన స్త్రీలందరూ అతని సంగీతానికి ఆకర్పితులయ్యారు. అని వార్యంగా నగరంలోని ఫాషనబుల్ సెలూన్లన్నీ
1223
అతన్ని ఆహ్వానించాయి. అతను వచ్చాడు. ప్రదర్శించాడు, జయించాడు! అంతులేని అభినందనలు అందుకున్నాడు. పారిస్ నమాజంలో గారాబంతో *చెడిపోయిన
ఆ వేసవిలో లండన్ వెళ్ళి జార్జి 4 కోసం ఏర్పాటుచేసిన సంగీత ప్రదర్శనలో పాల్గొని సంచలనాత్మక, నిర్ణయాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. లండన్ పేపర్లు “యూరప్‌లోని సుప్రసిద్ధ పియానిస్టుల్లో ఒకడుగా” అభివర్డించాయి.
పారిస్ తిరిగి వచ్చి సంగీత (ప్రదర్శనలు కొనసాగించడమే కాక 00/ 52౧6౧6 అన్న ఒపేరా రాశాడు. 1825 అక్టోబర్ 17న ఆ ఒపేరా ్రదర్శింపబడింది. అది అందర్నీ అకర్షించిందఇ. ఆ ఆకర్షించడం వెనక పద్నాలుగేళ్ళ కుర్రాడి రచన అన్న ఆసక్తి కూడా వుంది. కానీ అ ఒపేరా విజయవంతం కాలేదు. రెందుసార్లు ప్రదర్శింపబడి తెరమరుగైంది. యాఖై ఏళ్ళ తరువాత లైబ్రరీ తగలబడడంతో అక్కడున్న ఆ రచన కూడా మాయమైంది. ఫ్రాంజ్ మళ్ళీ ఒపేరా రాయడానికి ప్రయత్నించలేదు. కానీ ఎక్కడో ఆ రచన కాపీ 1908లో కనిపించింది కానీ పప్రదర్శింపబడలేదు. కానీ ఫ్రాంజ్ పాపులారిటీకి లోపం కలగలేదు. తరువాత రెండేళ్ళ పాటు ఫ్రాన్సు, ఇంగ్లాండ్‌లలో జైత్రయాత్ర సాగించాడు. 1827లో ఫ్రాంజ్ తండ్రి మరణశయ్యపై వుండి ప్రపంచంలో తన కొడుకు పలుకుబడి తెలుసుకున్నాడు. యూరప్ అంతటా ఫ్రాంజ్ సుప్రసిద్ధడన్న విషయం తెలుసుకుని ఆత్మానందాన్ని పొందాడు.
ఫ్రాంజ్ జన్మతః ప్రతిభావంతుడు. అతని నిరంతర విజయపరంపరని అద్దుకునేది ఏదీ లేకపోయింది. ఒక్క స్తీ తప్ప. ఫ్రాంజ్ అందగాడు. స్రీలు అతన్ని ఆకర్షించినట్లుగానే అతనూ ప్రీలను ఆకర్షించాడు.
తండ్రి మరణంతో ఫ్రాంజ్ కొన్ని మతపరమయిన నిర్ణయాలకు వచ్చాడు. తల్లి పట్ల తన శ్రద్దను మరల్చాడు. సంగీత పాఠాలు చెప్పడం ద్వారా జీవించడం సాగించాడు. “గారాబంతో చెడిపోయిన తనం నించీ అర్థవంతమయిన కార్యకలాపాలవైపు మరలాడు.
“సంగీతకారుడుగా వినోదపెదడుతూ, ఆదరింవబడుతూ, ఆర్థికసాయం అందుకుంటూ గారడీ వాడుగా, తెలివయిన కుక్కలా బతికాను” అని చెప్పుకున్నాడు. తరువాత కొన్నేళ్ళపాటు ఎప్పుడోగానీ సంగీత ప్రదర్శన యివ్వలేదు. చివరిగా అతను స్త్రీలను దూరంగా వుంచాడు. చివర తీసుకున్న నిర్ణయం మొదట్లోనే తుంగలో తొక్కాడు.
అతని మొదటి గొప్ప ప్రేమ అతని శిష్యురాలి తోదిది. ఆ అమ్మాయి పేరు కరోలిన్. వయసు పదహారేళ్ళు. ఉన్నత కుటుంబీకురాలు. వాళ్ళు పెళ్ళి కూడా చేసుకుందామనుకున్నారు. ఇంతలో ఆమె తండ్రి రంగంలోకి వచ్చి వాళ్ళ సంబంధాన్ని 'విడిగొట్టాడు. ఫ్రాంజ్ తీవ్ర 124
నిరాశకులోనయిన కాల్చ్పనిక విషాదంలో మునక లేశాడు. కొన్నాళ్ళు నరాల జబ్బుతో బాధవడ్డాడు వెనక్కి మళ్ళి'మతంలో” ఓదార్చు పొందాడు. చర్చి జీవితంలో మునిగిపోదామనుకున్నాడు కాని వీలుపడక విపరీతంగా మత([గ్రంధాలు చదివాడు. “వాటి వల్ల నేను సన్యాసి జీవితం గడపడానికి అనుకూలం దొరుకుతుంది. లేదా నా నమ్మకాలతో నేను కన్నుమూస్తాను” అని చెప్పుకున్నాడు కానీ మత మొక్కటే అతనికి సంతృప్తి కలిగించలేదు. హరాత్తుగా అతను రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 1830లోని విప్లవం రోజుల్లో బారికేడ్ల దగ్గర నిల్చుని యుద్ధం చేద్దామనుకున్నాడు కానీ తల్లి అతన్ని అడ్డుకుంది. దాన్నించీ మళ్ళీ కవిత్వం, ఫిలాసఫీ, “ప్రీలు రాసిన వుత్తరాలు చదువుకున్నాడు ఒక మిక్రుణ్జి “దయచేసి నాకు ఫ్రెంచి సాహిత్యమంతా బోధించు” అని వేడుకున్నాడు అతని స్నేహితుడు “యువకుడయిన ఇతని మనసులో అంతా గందరగోళం నిండి వుంది” అన్నాడు
1880లో ్రాంజ్ ముగ్గురు సంగీతకారుల్ని కలిశాడు వాళ్ళు అతన్ని రాజకీయం, మతం, సాహిత్యం నించీ లాగి మళ్ళీ సంగీతంలో నిలిపారు ఛోపిన్, బెర్లియోజ్ అప్పటికి యువకులు, అజ్ఞాత సంగీతకారులే. వాళ్ళు కొత్తరకమయిన, సున్నితమయిన, కవితాత్మకమయిన సంగీతాన్ని పరిచయం చేశారు. వాళ్ళిద్దరూ ఎవరికివాళ్ళు కాల్బనిక శక్తి కలిగిన సంగీతకారులు. ఫ్రాంజ్ సహజంగానే ప్రభావితుడయ్యాడు. మూడో వ్యక్తి వయోలిన్ నిపుణుడు పగానిని అతన్ని గురించి ఆశ్చర్యం ప్రకటిస్తూ ఒక మిక్రునికి రాసిన వుత్తరంలో (ఫ్రాంజ్ 'ఏం మనిషి! ఏం వయోలిన్! ఎంత గొప్ప కళాకారుడు!ఆ నాలుగు తీగల్లో ఎంత బాధ! ఎంత నరకం! ఎంత మెలికలు తిప్పే చిత్రహింసగొ అన్నాడు.
ఫ్రాంజ్ సాహసోపేతమయిన, నిర్శాహమాటమయిన, తాజు ఐన సంగిత రచనకు వుపక్రమిస్తే ఛోపిన్స, బెర్లియోజ్ వ్యతిరేకించారు. అది తరువాతి రోజుల్లో జరిగింది. తరువాతి రెండేళ్ళు ఫ్రాంజ్ పియానో అధ్యయనంలో సాంకేతిక నైపుణ్యం సాధించడంలో గడిపాడు. ఆయన రాక్షసమయిన పట్టుదలతో (శ్రమించాడు. అవిశ్రాంతంగా కష్టపడ్డాడు. పియానో వాయించడం అపి లేచాడంటే అది విశ్రాంతి కోసం కాదు. అవిశ్రాంత అధ్యయనం కోసం మాత్రమే ఆయన కాలాన్ని “అవిశ్రాంతంగా రెండు శక్తుల్లా థమించాను” అన్నాదు. ఇంకా “హోమర్, బైబిల్, ప్లాటో, లాకే, బైరన్, హ్యూగో, లామర్ టైన్, ఛాటీ బ్రియాండ్, బిధోవిన్, బాచ్, హమ్మల్, మొజార్ట్, వెబర్ అందరూనా చుట్టూ తిరిగారు” అన్నాడు. ఆ సందర్భంలో “నేను వాళ్ళని చదివాను. వాళ్ళని ధ్యానం చేశాను, ఆరాటంతో వాళ్ళని తాగేశాను, దానికి తోడు రోజుకు ఆరునించీ ఏడుసార్లు పియానో ప్రాక్టీసు చేశాను. నేను పిచ్చివాణ్ణయిపోలేదు, నాలో మీరొక కళాకారుణ్ణి చూడగలరు. మీరు కోరుకున్న కళాకారుణ్ణి, ఈ నాటికి అవసరమయిన కళాకారుణ్ణి మీరు చూడగలరు” అన్నాడు
125
1838లో అతని జీవితంలో రెండు ముఖ్యమయిన సంగతులు జరిగాయి తన సంగీత రంగస్థలానికి, జనానికి తిరిగి వచ్చాడు. వాళ్ళతన్ని విజేతలా ఆవ్వానించారు ఆయన గొప్ప అనురాగంలో మునిగాడు. ఉన్నత కుటుంబానికి చెందిన డి అగోల్డ్స్లో ఫ్రాంజ్ అన్వేషిస్తున్న స్త్రీమూర్తి లక్షణాలన్నీ కనిపించాయి. నిలకడ, తెలివి, అందం, స్వాప్నిక సంచలనం, అన్నిటికీ మించి అతన్ని ఆరాధించేతత్వం ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు వున్నారు కానీ ఫ్రాంజ్ అవన్నీ పట్టించుకోలేదు. ఆ (ప్రేమ వ్యవవారం దాని హద్దుల్ని బద్దలు చేసింది. ఆమె కుటుంబాన్ని వదిలి అతన్హో బాటు జెనీవా వెళ్ళిపోయింది. వాళ్ళకి అక్కడొక బిద్దకూడా కలిగింది. ఆ ప్రశాంత అనుబంధంలో మరిద్దరు పిల్లలు కూడా కలిగారు. వాళ్ళలో ఒకరయిన 'కాసిమా' వాగ్నర్ జీవితంలో ముఖ్యమయిన పాత్ర వహించింది ఈ “అవాంతరం వల్ల అతను పారిస్ సంగీత రంగానికి రెండేళ్ళు దూరంగా వున్నాడు తిరిగి ఆయన పారిస్ వచ్చాకా అప్పుడు అక్కడ వెలుగులో వున్న ఒక పియానిస్టుని చూశాడు అతని పేరు సిజిస్మాండ్ థాల్స్బెర్ల్ ఫ్రాంజ్ పట్టుదల అద్వితీయమైంది. అప్పటికీ తన సాటిలేని పియానిస్టని పారిస్ జనాలకి రుజువు పరచాలని నిశ్చయించాడు ఎప్పుడు ధాల్బెర్ట్ ప్రదర్శన ఇస్తే అప్పుడే (ఫ్రాంజ్ కూడా ప్రదర్శన ఇచ్చేవాడు అతను అసాధారణ ప్రతిభతో, సాంకేతిక నైపుణ్యంతో జనాన్ని ఆకట్టుకునేవాడు. ఆ ఇద్దరు పియానిస్టులకు ఎవరి ఆరాధకులు వాళ్ళకు వున్నారు. అభిమానులు వున్నారు. కొంతకాలం పాటు వాళ్ళిద్దర్లో ఎవరు గొప్ప పియానిస్టో నిర్ణయించడానికి వీలులేని సందిగ్ధం నెలకొంది. రాజకుమార్తె క్రిస్టినా బెల్గోజోసో తన “సెలూనొలో ఆ సంగీతకారుల్టిరికీ ఒకే వేదిక ఏర్పాటు చేసి యిద్దరి మధ్య “ద్వంద్వ సంగీతయుద్దానికి రంగం సిద్ధం చేసింది. ధాల్ బెర్గ్ తన రాగయుక్తమయిన అద్భుతం [40565ని ప్రదర్శించాడు. అది 'రోసిని రచన. ఫ్రాంజ్ మెరుపులు మెరిపిస్తూ మధురమధుర తరంగాలతో తరంగితమయిన ఒక అజ్ఞాతవ్యక్తి రచన ఆలపించాడు. ఆ సంగీతకారుల మధ్య జరిగిన సంగ్రామంలో ఫ్రాంజ్ విజేతగా నిలిచాడు.
ఆ తరువాత దశాబ్దకాలం ఫ్రాంజ్ యూరప్ అంతటా పర్యటించాడు. అతను అద్వితీయ జైత్రయాత్ర చేశాడు. ఒక్కగానొక్క శత్రువుకు కూడా అతన్ని ఎదిరించే దమ్ములు లేకపోయాయి. ఏ సంగీతకారుడూ అంతమంది ఆరాధకులతో, అభిమానుల్లో ఎప్పుడూ ఎక్కడా కనిపించలేదు. అతను సాటిలేని హీరోగా వెలిగాదు.
ఆయన సంగీత ప్రదర్శనలో శబ్దాదంబరంతో అద్భుతాలు సృష్టించడం కన్నా దాన్ని మించిన గాంభీర్యం, గాఢత కలిగిన అసదృశశైలి కనిపించేది “అంత అసాధారణ కంర
అపురూపమయిన నిర్మాణాత్మక నైవుణ్యం నేను కలలో కూడా వూహించలేనిది” అని భవిష్యత్తులో గొప్ప సంగీతకారుడు కాబోయే ఛార్లెస్ వోమీ అన్నాడు.
“పొడవయిన తన జుత్తుని మాటిమాటికి వెనక్కి దువ్వుకుంటూ, కొద్దిగా కదిలే పెదాల్తో, చిరునవ్వు నవ్వుతూ, తియ్యటి తన చూపుల్తో ఆడిటోరియాన్నంతా ఆకట్టుకుంటాడు” 'ీగువే అన్న నాటక కర్త మాటలివి.
ఒక అజ్ఞాత రచయిత “ప్రదర్శన పతాక స్థాయిలో వున్నప్పుడు ఆయన ముఖ కవళికల్లోని శమ, దానిలో కలిసిన ఆనందం మేళవించిన చిరునవ్వు, తీక్షణమయిన కాంతి నేను మానవుల్లోని ఎవరి ముఖంలోనూ చూడలేదు. కేవలం మవా కళాకారులు చిత్రించిన జీసెస్వదనంలో మాత్రమే చూశాను” అని రాశాడు. ఇంకా “తన కోసం పేజీలు తిప్పే స్నేహితుడి చేతుల్లో అతను స్పృహ తప్పి పడిపోయాడు. అతనలా వాలిపోయినా మేము అతని సంగీత తరంగాల్లో భాగంగానే దాన్ని చూశాం. మెల్లగా జనం అతన్ని ఆత్భతగా చూశారు. వూపిరి బిగబట్టిన భయమావరించింది. కాసేపటికి ఒక వ్యక్తి రంగం మీదకు వచ్చి ప్రాంజ్కు స్పృవావచ్చింది మళ్ళీ ఉత్సాహంగా, వుల్లాసంగా వున్నాడు అన్నాకా జనం వూపిరి పీల్చుకున్నారు అని రాశాడు.
ఆధునిక పియానో నిపుణుడు ఫ్రాంజ్‌తో బాటే జన్మించాడు. పియానో పట్ల అకర్షణ కలగడానికి అతను ఆద్యుడు. సంపూర్ణ సంగీత ప్రదర్శన అంతా ఏ ఇతర వాద్య పరికరాల సహకారం లేకుందా, ఇతర కళాకారుల సహాయం లేకుందా పూర్తిగా తనొక్కడే పియానోతో ప్రదర్శన చేసే సాహసం చేసిన మొదటి వ్యక్తి ఫ్రాంజ్ ౧0/16 ౦9/౦౧ లో పియానో నిర్వహణని జనం ముందు చేసే సంప్రదాయానికి అయనే ఆద్యుడు.
ఫ్రాంజ్ విజయపరంపరలో సాగిపోతూ వుంటే ఏ అగూల్డ్తో అతని సంబంధంలో మార్పులు చోటు చేసుకున్నాయి. సుదీర్హ కాలాలు అతను పర్యటనల్లో వుంటూ దూరం కావడంతో వాళ్ళ మధ్య అవగాహన లోపించింది. ఆమె అతనో భిన్న వ్యకిని చూసింది. అతనిపై అంతులేని గౌరవాలు వర్షించాయి. అంతులేని క్తీర్తి వచ్చింది. గొప్ప గొప్ప వ్యక్తుల్లో పరిచయాలేర్పడ్డాయి. అతన్లో ఆమె ఆహంకారిని చూసింది. యితరుల్లో అతని సంబంధాలు ఆమెకు నచ్చలేదు. 1840 నాటికి వాళ్ళ మధ్య ప్రేమ వ్యవహారానికి పరిసమాప్తి జరిగిందని వాళ్ళు గుర్తించారు. ఆమె పిల్లల్ని తీసుకు వెళ్ళిపోయింది. అతను తన కీర్తి వెంట సాగిపోయాడు. 1844లో శాశ్వతంగా విడిపోవడానికి వాళ్ళ మధ్య అంగీకారం కుదిరింది.
ఈ “ఖాళీ పూరించడానికి అతనికి మరొకరు దొరికారు. 1847లో కీవ్‌లో ఆయన తన సంగీత ప్రదర్శన యిచ్చాడు ఎప్పట్లాగే అతని వ్యక్తిత్వం అవధుల్లేకుండా, నిరాటంకంగా
12/7
అందర్నీ ఆకర్షించింది. ప్రత్యేకించి రాజకుమారి కరోలిన్ వాన్ - సేన్ విట్టింగ్ స్టెయిన్ అతనో తీవ్రంగా ఆకర్షింపబడింది. ఆమె అతన్ని తన విశాలమయిన ఎస్టేట్‌కు ఆవ్వానించింది. ఫ్రాంజ్ వచ్చాడు, అక్కడ విడిది చేశాడు. ఆమె చాలా తెలివైంది. ఆమె వైవాహిక జీవితంలో ఆనందం లేదు. ఆమె క్రమంగా అతని పట్ల తీవ్రంగా అకర్షింపబడింది. అతని ప్రతిభకన్నా అతన్లోని 'బైరానిక్ తత్వాన్ని ఆమె యిష్టపడింది. ఇద్దరూ కలిసి గొప్ప సాహిత్యాన్ని చదివారు. ఫ్రాంజ్ డాంటేను చదివి చాలా ఉత్తేజాన్ని పొంది ఒక సింఫనీ రాయలనుకున్నాడు ఆమె మతానికి సంబంధించి, మార్మికతకు సంబంధించి తన అభిప్రాయాలతో (ప్రాంజ్ అభిప్రాయాలు కలిసిపోవడం చూసి ఎంతో ఉల్లాసాన్ని పొందింది. ఆధ్యాత్మిక జీవితంలో శాంతిని అన్వేషిస్తూ వాళ్ళు నిరంతరాయంగా సంభాషించుకున్నారు రాజకుమారి అవ్యవధానంగా తన 'బ్లాక్ సిగార్ తాగుతూ పొగవదుల్తున్నా ఆమె పట్ల వ్యామోహితుడయిన ఫ్రాంజ్ సిగరెట్లు విపరీతంగా తాగుతున్నా వాళ్ళ భావ వినిమయానికి, సాహిత్య చర్చలకూ అంతుపొంతూలేదు. వాళ్ళ కున్న పిచ్చి అలవాట్లలో 'సిగరెట్లు కేవలం ఒక చిన్న భాగం మాత్రమే ఆమె చిత్రమైంది ఆమెకు తాజాగావున్ను స్వచ్చమయిన గాలి అంటే భయం దాని వల్ల తన “ఆరోగ్యం దెబ్బతింటుందని ఆమె భావించేది ఆమె తన గదులన్నీ గాలి తగలకుండా తలుపులూ కిటికీలు బంధించి వుంచేది దానివల్ల గదులు ముగ్గు వాసన వేసేవి. ఆమెను చూడ్డానికి, కలవడానికి వచ్చిన వాళ్ళు వెయింటింగ్ రూంలో పదిహేను నిముషాలు తప్పనిసరిగా కూచోవాలి. ఆ గది కూడా గాలి తగలకుండా బంధింపబడి వుండేది. వాళ్ళు కూడా తాజాగాలి నించీ తన వాతావరణానికి అనుకూలంగా తయారైన తరువాతే వాళ్ళని కలిసేది. ఎప్పుడూ అపురూపమయిన, అసాధారణమయిన, అద్భుతమయిన, ఆకర్షణీయమయిన వస్త్రధారణలో వుండేది రాత్రంతా అంకిత భావంతో పనిచేస్తూ ఇరవై నాలుగు వాల్యూముల ఒపేరా” 706 [0౧6 086565 01 (16 0616 ౪6౧653 0116 0[4/౧౦[” రచనలో మునిగి వుందేది.
1848లో ్రాంజ్ను విమార్కు చెందిన (గ్రాండ్ డ్యూక్ సంగీతాచార్యుడుగా నియమించాడు. సింఫనీ, ఒపేరాల దర్శక బాధ్యత ్రాంజ్కి ఒప్పగించబడింది తన “ప్రియురాలితో కలిసి ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని పదేళ్ళపాటు అక్కడున్నాడు ఆ పదేళ్ళు అజ్ఞాత స్వరకర్తల్ని వెలుగులోకి తేవడానికి శ్రమించాడు. అతని ద్వారా వీమార్ జర్మనీలోని గొప్ప సంగీత కేంద్రంగా పేరుపొందింది
వాగ్నర్, ప్రాంజ్లు పరస్పరం తటస్థపద్దారు. ఫ్రాంజ్ మొదటిసారి 1940లో పారిస్‌లో వాగ్నర్ని కలిశాడు. అతని శ్తక్తియుక్తుల్ని గ్రహించాడు వాగ్నర్ 1849లో కొంతకాలం వీమార్ వచ్చి ్రాంజ్తో బాటు వున్నాడు సంగీత ప్రదర్శనల కోసం రాజుగారితో ఫ్రాంజ్ 228
వాదనలకు కూడా దిగేవాదు. అట్లాంటి ఒక సందర్భం వల్లే ఫ్రాంజ్ తన పదవిని వదులుకోవాల్సి వచ్చిందని అంటారు వీమార్లో ఎన్నో స్వతంత్ర రచనల్ని చేశాడు.
1859లో సంగీతాచార్య వదవి వదిలినా 1861 తర్వాత మతం వట్ల ఆకర్షితుడయ్యాడు “మతాధికారి గా మారుదామనుకున్నాడు కానీ అతని గతం, వర్తమానం అందుకు అనుమతించలేదు.
తరువాత అతను తన సంవత్సరాన్ని రోంలో మత సంబంధ విషయాలకు సగం, పెస్త్ వీమార్లలో సంగీత పారాలకు సగంగా విభజించుకున్నాడు. ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు పియానో పారాలు నేర్చుకోడానికి ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు పారాలు కోరిన ఎవరికయినా దయార్ధంగా తన కాలాన్ని వెచ్చించేవాడు. తన శక్తియుక్తుల్ని వాళ్ళకు నేర్చేవాడు ఎప్పుడూ ఎవర్నించీ 'ఫీజు' అడిగి ఎరగడు. ఆయన శిష్యులు ఆయనంటే ఎంతో ప్రేమను, గౌరవాభిమానాల్ని ప్రదర్శించేవాళ్ళు.
వాగ్నర్ ఫ్రాంజ్ కూతురు కాసిమా' పెళ్ళి చెడగొట్టి అమెతో చట్ట వ్యతిరేకంగా కలిసి జీవించడం మొదలు పెట్టినప్పటి నించీ ఫ్రాంజ్ వాగ్నర్ని క్షమించలేకపోయాడు. వాగ్నర్‌తో వ్యక్తిగతమయిన సంబంధాలు తెంపుకున్నాడు వాగ్నర్ సంగీతాన్ని అభిమానించడం పట్ల అతనికి ఎట్లాంటి దురభిప్రాయాలూ అడ్డంకిగా వచ్చేవి కావు. 1883 ఫిబ్రవరి 18న వాగ్నర్ చనిపోయాడు. అతని మరణంతో ఫ్రాంజ్ కుంగిపోయాడు దానికి తోడు అతని కూతురు తండ్రిని క్షమించలేదు. వాళ్ళ (ప్రేమని ఆయన కాదనడమే దానికి కారణం. దానివల్ల వాగ్నర్ అంతిమ సంస్కారానికి కూడా ఆమె దూరంగా వుండాల్సి వచ్చింది. తరువాత మూడేళ్ళ పొటు ఆమె తండ్రి ముఖం చూడడానికి కూడా ఒప్పుకోలేదు.
ఫ్రాంజ్ పెద్ద వాడయ్యాడు. శక్తి యుక్తులు తగ్గాయి. కానీ ఆయనకు 1886లో ఒక ఓదార్చు లభించింది. ఇంగ్లాండు వెళ్ళాడు. బహిరంగ సంగీత ప్రదర్శన యిచ్చాడు క్వీన్ విక్టోరియా కోసం (ప్రవేటు ప్రదర్శన ఒకటి యిచ్చాడు జనం నీరాజనమిచ్చారు వారం రోజులు అక్కడ వుండి ఒవేరియాలో సంగీతశాలకు వెళ్ళాడు. బెరియూత్ ప్రాంతంలో అనారోగ్యం పాలయ్యాడు ఊపిరి తిత్తులకు న్యూమొనియా సోకింది. ఆయన చివరి కోరిక బ్రాంతా దీగాలని. డాక్టర్ ఒప్పుకోలేదు.
129
గుస్తావ్ మహ్లార్ ౮512౪ [4120161 7-7-1860 -- 18-5-1911 తన జీవితంలోని రెండు హాస్య సంఘటనల్ని చెప్పడం మహ్లార్కు ఇష్టం ఒకటి అతని నాన్నమ్ముకు సంబంధించింది. రెందోది వాళ్ళ అమ్మకు సంబంధించింది. అతని నాన్నమ్మ పద్దనిమిదేళ్ళ వయసు నుండి యిల్లిల్లూ తిరిగి సరకులమ్మి జీవించేది అమెకు ఎనభై ఏళ్ళప్పుడు కొత్తగా వచ్చిన చట్టాన్ని అనుసరించి ఆమె నిషేధ వస్తువుల్ని వికయిస్తోందన్న ఆరోపణపై ఆమెకు జరిమానా విధించారు అది కట్టదం ఆమె తలకు మించిన భారమయింది. పైగా అది అవమానంగా భావించింది. నిష్కారణంగా తనపై దోషారోపణ చేశారంది ఆ వృద్ధాప్యంలో ఆమె వియన్నా వెళ్ళి చక్రవర్తి ఫ్రాంజ్ జోసఫ్ సభాముఖానికి వెళ్ళి ఆయనో మొరపెట్టుకుని ఆయన ద్వారా క్షమాభిక్ష పొంది తిరిగియిల్లు చేరి యధావిధిగా తన వ్యాపారం కొనసాగించింది. మహ్లార్ తల్లికి సంబంధించిన సంగతి మహ్లార్ వియన్నా సంగీత కళాశాలలో అధ్యయనం చేసేటప్పటిది. ఒక రోజు మహ్లార్ కళాశాలలో సంగీత పోటీ జరిగితే తనకు (ప్రధమ బహుమతి వచ్చిందని గర్వంగా తల్లితో చెప్పాడు. తల్లి “మరి హాన్స్రాట్ సంగీతేమిటి? అని అడిగింది. సంగీత కళాశాలలో విద్యార్థులందర్లో కెల్లా వాన్స్రాట్ తెలివైనవాడుగా గుర్తింపు పొందిన విద్యార్థి. ఆ విషయం మల్పర్ ఎప్పుడూ తల్లికి చెప్పేవాడు. ఆ పోటీలో వాన్స్రాట్కు ఎటువంటి బహుమతీ రాలేదు. మవ్లార్ తల్లి కళ్ళ నీళ్ళు పెట్టుకుని “రాట్ నీకన్నా ప్రతిభావంతుడు. పైజు అతనికి రావాల్సింది” అందట! తన మార్గానికి అడ్డంకిగా వచ్చిన ప్రతి ఆటంకాన్నీ ఎదిరించే, తిరస్కరించే అతని నాన్నమ్మ తత్వం, భయాన్ని కలిగించే అతని తల్లి 'అలవిమాలిన' నిజాయితీ మహ్లర్ వ్యక్తిత్వాన్ని రూపొందించాయి. మహ్లర్ గర్వంగా, నిజాయితీగా, రాజీపడని శక్తియుక్తుల్తో దృధ సంకల్పంతో ఎట్లాంటి ఆటంకాలకయినా తలవొగ్గని సాహసంతో వుండేవాడు. అతను “యుద్ధకళలో కూడా ఆరితేరినవాడు. ఈ లక్షణాల వల్ల అతన్ని కొంత మంది ఆరాధించేవాళ్ళు, కొంతమంది ఆసహ్యించుకునేవాళ్ళు. కొంత మంది అతను 'యూదు మళతస్థుడు కావడం వల్ల అతన్ని అసహ్యించుకునేవాళ్ళు. మొండివాడయినా, ఎదిరించడానికి వీలు పడనివాడయినా, నోటికి తాళం లేనివాడయినా అతన్ని దెబ్బ తీయడానికి వ్యతిరేకులు (ప్రయత్నించేవాళ్ళు. అతను 230
అహంకారి కూడా. పెద్దపెద్ద సింఫనీలు రాసి ప్రపంచంలోని తత్వశాస్త్రాల్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించాడు. తన శక్తి యుక్తుల పట్ల అపారమయిన విశ్వాసంతో, తన గొప్పతనం పట్ల గాధమయిన నమ్మకంతో స్వరకల్పన చేసే సంగీతకారుడాయన.
అతనో పని చేసిన కొందరు ప్రపంచంలోని గొప్ప స్వరకర్తల్లో ఆయన ఒకడని అంటారు. మరికొందరు తన ఆదర్శాలకు అనుగుణంగా సంగీత రచన చేయించడానికి తమను “శారీరక, మానసిక హింసలకు గురి చేశాడని అంటారు. వాళ్ళు అతని గురించి తక్కువగా మాట్లాడేవాళ్ళు. అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్ళు. చివరికి అతన్ని 'నాశనం” చెయ్యడంతో విజయం సాధించారు. అతని యధార్ధ తత్వాన్ని గుర్తించిన వాళ్ళు అతన్ని రాజీపడని కళాకారుడుగా గుర్తించారు. ఉన్నత ఆదర్శాలున్న వ్యక్తిగా గ్రహించారు. చాలా సంవత్సరాలు అతని అసిస్టెంట్‌గా పనిచేసిన బ్రూనో వాల్టర్, అతనితో శేరణపొందిన సంగీతకారుడు ఆర్నాల్డ్ ఫోయెన్బర్గ్ అతన్ని “రుషి అన్నారు వియన్నా ఒపేరా గాయకుడు థియోడర్ రీఛమాన్ అతన్ని దూషిస్తూ. “యూయాదుకోతి” అన్నాడు. చివర్లో ఆ వ్యక్తే “'మహ్లూర్ దేవుడు” అన్నాడు
మమ్లార్ అంకితభావంలో మతతత్వం వుంది.
మవ్లీర్ చిన్ని బొహీమియన్ పట్టణంలో జన్మించాడు. అతని జీవితమంతా కొనసాగిన “ఉద్రిక్త స్వభావానికి బాల్యంలోనే పునాదులు పడ్డాయి. అతని యింట్లో లెక్కలేనన్ని విషాదాలు జరిగాయి. ఐదు మంది మహ్లర్ తోబుట్టువులు, సోదరులు చిన్నతనంలో డిప్తీరియాతో మరణించారు. ఇంకో సోదరుడితో మహ్లార్కు అనుబంధం వుండేది. అతను దీర్హమయిన అనారోగ్యంతో బాధవడి చివరకు తన పన్నెండవ ఏట 'హైడ్రోకార్డియా' జబ్బుతో కన్నుమూశాడు అతని చివరిదశలో చివరి నెలలు అతని పడక పక్కనే మహర్ వుండి అతన్లో బాటు బాధపడ్డాడు. అతని సోదరి ఒకావిడ పెళ్ళయిన కొంత కాలానికి సంసారంలో అశాంతితో, బ్రెయిన్ ట్యూమర్ వచ్చి చనిపోయింది. యింకో సోదరి తను చనిపోతున్నానని చెబుతూ భ్రాంతులకు లోనయ్యేది. తన పడక చుట్టూ మాటి మాటికీ కేండిల్స్ వెలిగించి చలనం లేకుండా పడుకుని చనిపోయినట్లు పడి వుందేది.
ఒక సోదరుడు సంగీతకారుడు. మామూలు సంగీతకారుడుగా మిగిలిపోవడం ఇన్టం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. వీటన్నిటికి తోదు మవ్హార్ తల్లితండ్రుల వైవాహికజీవితంలో సుఖశాంతులు లేవు. వాళ్ళ కుటుంబం అశాంతి నిలయం. మహ్లార్కి తండ్రి అంటే జాలి. అతని తల్లి ఆమె భర్తని కించపరిచేది, దూషించేది. ఆమెతో అతనెప్పుడూ
231
బాధలు పదేవాడు చిన్న తనం నించీ మహర్ అవన్నీ చూశాడు అందుకని తండ్రంటే అతనికి అభిమానం మహ్లార్ ఆరేళ్ళ వయసులో నాన్నమ్మ యింట్లో పైగదిలో ఒక పాత పియానో చూశాడు. అది అతని కోసం ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది రాక్షసమయిన పట్టుదలతో రాత్రింబవళ్ళు ఆ పియానో ముందు కూచుని తెల్ల మెట్ల, నల్లమెట్ల రహస్యాల్ని చేదించాడు. మహ్స్హార్ తండ్రి అతన్ని గౌరవనీయుడయిన షాపు యజమానిని చెయ్యాలని వుద్దేశించాడు కానీ మహ్లార్ ప్రతిభ చూసి అతని మార్గంలో అతన్ని పెట్టడమే మేలని నిర్ణయానికి వచ్చాడు ఒక రోజు మహ్హార్ని వియన్నా తీసుకెళ్ళి సంగీత కళాశాలలో పని చేసే ప్రొఫెసర్ జూలియన్ ఎప్‌స్టెయిన్‌కు పరిచయం చేశాడు. ఎప్‌స్టెయిన్ నిర్ణయం మీద మహ్లార్ భవిష్యత్తు ఆధారపడింది మహ్లర్ తను రాసిన కొన్ని గీతాల్ని పియానోపై ప్రదర్శించాడు. ఎప్‌స్టెయిన్ ఎంతో ఆనందించి మమహ్హార్ తండ్రిని చూసి “ఇతను జన్మతః సంగీతకారుడు” అన్నాడు పదిహేనో ఏట మహ్లార్ సంగీత కళాశాలలో చేరాడు. సంగీత కళాశాలలో చేరిన మూడు సంవత్సరాలు రాత్రింబవళ్ళు శ్రమించాడు. ' స్వరచనకు, పియానో నైపుణ్యానికి అవార్డులు పొందాదు. ఎప్స్టీన్ సలహామేరకు మహ్లార్ వియన్నా మ్యూజిక్ హాల్లో నిర్వహణాధికారిగా వుద్యోగంలో చేరాడు ఆ పని యువకుడయిన మహ్హార్ సున్నితత్వానికి, అభిప్రాయాలకు వ్యతిరేకమయింది. దానివల్ల ఎంతో యిబ్బంది పద్దాడు. సంతోషం లేక, సంతృపిత లేక ఆ వుద్యోగం వదులుకున్నాడు 1885లో, కొంతమంది దాతలు లీస్టిగ్ సంగీతోత్సవాల్లో మెందెల్షాన్ రచన “సెంట్పాలొను మన్గర్ ప్రదర్శించే ఏర్పాట్లు సమకూర్చాడు. మహ్లార్ ప్రదర్శన శ్రోతల్లో భావో(దేకాన్ని కలిగించింది. ఆయన సాంకేతిక నైవుణ్యం అసాధారణ రీతిలో (ప్రదర్శితమయింది. జనం వుద్వేగంతో వూగిపోయారు ఆ జనంలో సాంస్కృతిక నిర్వాహకుడయిన ఆంజిలో న్యూమాన్ వున్నాడు. ఆయన మహ్లార్కు 'ప్రాగ్‌లోని తన ఒపేరాహౌస్లో వుద్యోగానికి ఆహ్వానించాడు. సంగీత నిర్వాహకుడిగా మహ్లార్ ఎదిగిపోయాడు. ప్రాగ్నించీ పెస్ట్కు వెళ్ళి యిచ్చిన ప్రదర్శనలో వియన్నాకు చెందిన సుప్రసిద్ధ సంగీతకారులు అతన్ని అభినందనల్లో ముంచి తేల్చారు. వాళ్ళలో బ్రామ్స్ కూడా వున్నాడు తరువాత బుడాపెస్ట్, హాంబర్గ్లలో కూడా ప్రదర్భ్శలిచ్చాడు. అభినందన పరంపరలు, గౌరవాభిమానాలు అందుకున్నాడు. వాటితో బాటు 232
వ్యతిరేకత కూడా వచ్చింది నైపుణ్యం లేని కళాకారులకు నగరాలలో అతని అజేయ ప్రదర్శనలు అశనిపాతంలా పనిచేయడంతో వాళ్ళు ఆయన పట్ల శతృత్వం పెంచుకున్నాడు.
1897లో బ్రామ్స్, గైడో ఆడ్లర్ వంటి సంగీతకారుల (ప్రతిపాదనల వల్ల, సహకారం వల్ల మహ్లర్ వియన్నా కోర్ట్ ఒపేరా మ్యూజిగ్ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. దానివల్ల సంగీత నిర్వాహకుడుగా మహ్లర్కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ఆయన వియన్నా ఒపేరా మ్యూజిక్ డైరెక్టర్‌గా వున్న పదేళ్ళలో ప్రపంచంలోని సంగీత సంస్థల్లో అది సాటిలేనిదిగా తీర్చి గుర్తింపు తెచ్చాడు ఆ సంస్థని తీర్చి దిద్దదంలో ఆయన ఎవర్నీ లక్ష్యపెట్టలేదు. చివరికి తన వ్యక్తిగత యిష్టాయిష్టాల్ని కూడా పక్కన పెట్టాడు. అంకిత భావంతో పని చేశాడు. ఒపేరా కంపెనీని పూర్తిగా పునర్మించాడు అలసిపోయిన, పాత వాళ్ళయిన వృద్ధగాయకుల్ని తొలగించి కొత్త వాళ్ళని, వ్యక్తిత్వమున్నవాళ్ళని నియమించాడు. సంగీత (గగ్రంధాలయాన్ని పునర్మించాడు. కొత్త కొత్త విధానాలు, నవ్యరీతులు అంతకు మందు పరిచయం లేని వాటిని అనుసంధించాడు క్రమశిక్షణ నెలకొల్పాడు. సంగీత ప్రదర్శనకు ఏ ప్రేక్షకుడు కానీ ఆలస్యంగా రాకూడదని చట్టం చేశాడు సంగీత రంగస్థలం రూపు రేఖల్ని మార్చేశాడు
ఇన్ని చేసినా ఆయన్ని ద్వేషించే వాళ్ళు కారణం అతను యూదు. అతను ఎదుటి వారి నించీ నమతని ఆశించేవాడు. అతను అసాధారణ ప్రతిభాశాలి. కోర్టు ఒపేరా డైరెక్టర్లు అతను విపరీతంగా కర్చుపెడుతున్నాడని అభియోగం చేశారు. అతని కింద పనిచేసే గాయకులు, సంగీతకారులు అతని నోటి దురుసుకు, కోపానికి, అధికారానికి బాధలు పడ్డారు అతని చుట్టూ కుట్రలు జరిగేవి. వాటిని వేటినీ పట్టించుకోకుండా అతను తన పనిలో తను మునిగివుందేవాడు. ఇతర్ల సంగీతాలకు కొత్త వూపిర్లు పోస్తూనే తన సొంత రచనలు కూడా చేశాడు. సింఫనీకి కొత్త కోణాన్ని వైవిధ్యాన్ని యిచ్చే రచనలు చేశాడు. ఇక్కడా అతనికి వ్యతిరేకత ఎదురైంది.
706 9/౧౫౧౧00౫/ 10 1 మొదట 1889 నవంబర్ 22న బుడాపెస్ట్‌లో తన సొంత దర్శకత్వంలో ప్రదర్శించాడు. అది విఫలమైంది. అతనంటే యిష్టం లేని సంగీతకారులు, వ్యతిరేకులు ఆ సంగీత ప్రదర్శనను వీలయినంత దెబ్బతీయడానికి ప్రయత్నించారు. జనాలు కూదా అదే స్థాయిలో వ్యతిరేకించారు. విమర్శకులు మధ్య రకంగా స్పందించారు.
1895 డిసెంబర్లో సింఫనీ నెం.2 బెర్లిన్‌లో ప్రదర్శితమయింది. ఆ ప్రదర్శనను జనం ఆదరించారు కానీ విమర్శకులు విరుచుకపద్దారు “ప్రతిదాని పట్లా వ్యతిరేకత ప్రదర్శించే అవివేక, దుర్మార్గ .... సంగీతాన్ని అందించేవాడు” అన్నారు. కానీ మహర్ ఒక సింఫనీ తరువాత ఒకటి రాస్తూ పోయాడు కానీ ఆయన పట్ల దురఖిప్రాయాలూ కొనసాగాయి.
233
మవ్లార్ తన శ్రోతలకు, విమర్శకులకు విపరీత ధోరణిలో ఒకే మాట చెప్పేవాడు. అది “నా టైం వస్తుంది ఆ మాటలో ఎంతో దృఢత్వం ధ్వనించేది దూషణలు, దురభిప్రాయాలు ఆయన్ని చుట్టు ముట్టడమే కాదు. ఆయన జీవితంలో వ్యక్తిగత విషాదాలు కూడా వున్నాయి 1906లో అతని చిన్ని కూతురు జ్వరంతో కన్నుమూసింది దాంతో ఆయన గొప్ప విషాదానికి లోనయ్యాడు దాదాపు పిచ్చి పట్టినంత పనైంది. అప్పటి నించీ తన బిడ్డ చావుకు తనే కారణమున్న అపరాధభావనతో అల్లాడేవాడు. 1903లో చనిపోయిన పిల్లల స్మృతిలో కొన్ని గీతాలు రాశాడు. దానికి సంబంధించి పశ్చాత్తాపపదేవాడు. అతని కూతురు చనిపోయిన తరువాత అతని జీవితం యాంత్రికంగా మారింది. తన బాధ్యతల్ని యాంత్రిక రీతిలో నిర్వహించేవాడు. దాంతో అతనికి గుండె జబ్బులు వచ్చాయి. అప్పట్నించీ అతను తన ఉద్రిక్త స్వభావాన్ని తగ్గించుకుని నెమ్మదిగా జీవించాల్సి వచ్చింది దాంతో అన్ని విషయాల్లో అతను నియమబద్ధ జీవితాన్ని గడపాల్సి వచ్చింది. తినడం, తాగడం, పొగతాగడం అన్నిటికీ పరిమితులు హద్దులు ఏర్పడ్డాయి భౌతిక అవసరాలకు ఎప్పుడూ అతను బానిసకాడుకూదా. కానీ తన 'పని' కి సంబంధించి అతను మరింత (శ్రమించడం ప్రారంభించాడు. 1907 అక్టోబర్ 15న వియన్నా ఒపేరా హాల్లో తన చివరి ప్రదర్శన ఇచ్చాడు. | అది బిధోవిన్ మనోహర రచన 14610 ను మహ్లార్ ప్రదర్శించాడు వుద్వేగంగా కొనసాగింది. కానీఅతని శారీరక, మానసిక పరిస్థితులు నిజానికి అనుకూలించలేదు. శత్ర వర్గాలు కూడా సహృదయంతో అతని ప్రదర్శన తిలకించడానికి వచ్చాయి. ప్రదర్శన విజయవంతమైంది. అధికారిక బాధ్యతల నించీ ఆయన తప్పుకోవాలనుకున్నాడు. కాదన్న వాళ్ళు కూడా ఆయన ప్రతిభను అప్పటికి గుర్తించారు. పదవిలో కొనసాగమన్నా ఆయన ఒప్పుకోలేదు” “నేను ఉన్నత స్థాయిలోవుండాలనుకుంటాను. ఎట్లాంటి అవరోధాలూ నన్ను కిందకు లాగలేవు. చాలు. ఇప్పటి దాకా నేను నిర్వహించింది చాలు” అన్నాడు. కోర్ట్ ఒపేరాలో అతని సహచరులు గంభీరంగా అతనికి వీడ్కోలు పలికారు. మనసుని తాకే మాటలు చెప్పాడు మహ్లర్ “నా స్వష్నాల్ని సాకారం చెయ్యకపోయినా వాటి గుర్తుల్ని వదిలివెళుతున్నా. నా వుద్దేశాలు నిజాయితీ నిండినవి, కాని ఉన్నత లక్ష్యాలు; నా సమస్త శక్తుల్ని ఎప్పుడూ లక్ష్యం పైన కేంద్రీకరించాను. నాఆత్మని పనిపై నిలిపాను. నా వ్యక్తిగత యిష్టాయిష్టాల్ని పక్కన పెట్టాను. ఈ సందర్భంలో పరస్పర ఘర్షణలు, గాయాలు అనివార్యం. దురభిప్రాయాలు సహజం. కానీ మనం పూనిన కార్యం సఫలమైతే సమస్య విడిపోయినల్లే, అప్పుడు మనం కష్టాల్ని యిబ్బందుల్ని మరచిపోతాం సాధించిన దానికి సంతృప్తి పొందుతాం” అన్నాడు. 234
ఆయన మార్పును ఆశించాడు. 1907లో అమెరికా వెళ్ళాడు. న్యూయార్క్‌లో 1908 జనవరి 1న మెట్రోపాలిటన్ ఒపేరా వౌస్లో ప్రదర్శన ఇచ్చాడు న్యూయార్మ్ ఫిల్హార్మోనిక్ ఆర్మెస్ట్రా కండెక్టర్‌గా నియమితుడయ్యాడు. వియన్నాలో లాగే క్రమశిక్షణతో తన బాధ్యతలు నిర్వహించాడు 1910 సెప్టెంబర్ 12న మ్యూనిచ్ తిరిగి వచ్చి తన 8వ సింఫనీ ప్రదర్శించాడు. ఆ వేసవిలో తిరిగి అమెరికా చేరాడు. అరవై ఐదు సంగీత ప్రదర్శనలు ఇచ్చాడు.
అవిశ్రాంతంగా, నిర్విరామంగా ప్రదర్శనలిస్తూ, సామాజిక సమావేశాల్లో పాల్గొంటూ, తన సంగీత కారులకు శిక్షణ, సలహాల్లో గడిపాడు 1911 ఫిబ్రవరి 21న న్యూయార్క్‌లో హరాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు. తీవ్రంగా బలహీన పది కదలలేకపోయాడు ట్రీట్మెంట్ కోసం పారిస్ తీసుకొచ్చారు. కానీ ఫలితం లేకపోయింది తనను వియన్నా తీసుకెళ్ళమని కోరాడు నర్సింగ్ హోమ్ చేర్చారు. క్రమంగా నీరసించాడు. 1911 మే 18న కన్నుమూశాడు. అతని నోటి వెంట వచ్చిన చివరిమాట “మొజార్ట్ ”
135
ఫెలిక్స్ మెండెల్షాన్ 61% [/6౧616199000 3-2-1809 -- 4-11-1847
అతని పేరుకు తగిన వ్యక్తి అతను 'ఫెలిక్స్' అంటే లాటిన్లో 'ఆనంద జీవి అని అర్ధం సాధారణంగా సంగీతకారుల జీవితాల్ని నిరాశ, దిక్కుతోచనితనం, అననుకూల పరిస్థితులు చుట్టు ముట్టివుంటాయి. కానీ ఫెలిక్స్ జీవితం వాళ్ళకు భిన్నమైంది అతను అప్పుడే ఉదయించిన సూర్యుడిలా వుల్లాసంగా, తాజాగా జీవించాడు. పుట్టుకతోనే అతను సంపన్నుడు, న్థాయివున్నవాడు చిన్నప్పటి నించీ అతని ప్రతిభను అభివృద్ధి చేసుకునే అవకాశాలు అతనికి కల్పించబడ్డాయి. ఎట్లాంటి కష్టంతో పని లేకుండా చిన్నితనంలోనే విజయం అతన్ని వరించింది. అది అతని అంతిమ శ్వాసదాకా అతన్ని వెన్నంటి వుంది.
ఫెలిక్స్కి రెండు వుద్దేశాలుందేవి ఒకటి జాన్ సబాస్టియన్ బాచ్ విస్తృత సంగీతాన్ని పునరుద్ధరించడం. రెండోది గొప్ప సంగీత కళాశాలని స్థాపించడం ఆ రెంటినీ అతను సాధించాడు. అతను ప్రేమించిన ఒకే ఒక స్త్రీ అతన్ని ప్రేమించింది ముప్పయి ఎనిమిదేళ్ళ చిన్ని వయసులో కన్నుమూశాడు. నిజానికి యింకా ఎక్కువ ఏళ్ళు బతికి వుంటే అతను (ప్రశాంతతను కోల్పోయేవాడు
ఫెలిక్స్ కుటుంబం నిలకడ కలిగింది, సంపన్నమైంది, దాంతో బాటు సంస్కారం కలిగింది. సంస్కృతీ వారసత్వం కలిగింది ఫెలిక్స్ మెండల్ షాన్ తాత మోసెస్ మెండల్షాన్, ఆయన బెషధాల విక్రేత ఆయన పద్దెనిమిదో శతాబ్దంలో జర్మనీలోని మేధావుల్లో ఒకదు. ఆత్మ శాశ్వతత్వాన్ని గూర్చిన ఆయన రచన పన్నెండు భాషల్లోకి అనువాదమైంది. ఆయన్ని “ఆధునిక ప్లాటో అనేవాళ్ళు. ఆయన అధిభౌతిక, సౌందర్యరంగాల్లో కూడా (శ్రమించాడు. అతన్ని కాంట్స్ హెర్టర్, మిరాబూ వంటి ప్రసిద్ధులు అభినందించారు. లెస్సింగ్ రాసిన 114020 (౧6 ౪156 అన్న నాటకం ఆయన్ని వుద్దేశించిందే అంటారు
ఫెలిక్స్ తల్లి లీహ్ చాలా తెలివైంది భాషాశాస్తంలో గొప్ప అభినివేశం కలిగింది. గ్రీకు సాహిత్యాన్ని మూలంలోనే చదివింది. గొప్ప పియానిస్టు డ్రాయింగ్‌లో కూడా అభినివేశం కలది. ఆమె భర్త అబ్రహాం ప్రతిభ యితర రంగాల్లో వుంది. వోంబర్గ్ బ్యాంక్ నించీ మంచి రాబడి వచ్చే ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవాడు తన ఆర్థిక వ్యవహారాలతో ఆయన సంతృప్తి పడేవాడు ఆదాయాన్ని తన కుటుంబ గౌరవమర్యాదల్ని కాపాడ్డానికి వినియోగించేవాడు. 236
కుటుంబ సాంస్కృతిక వారసత్వాన్ని నిలపడానికి శ్రమించేవాడు అందుకని మొదట తండ్రికి, తరువాత భార్యకు, ఆ తరువాత కొదుక్కి ప్రాధాన్యమిచ్చేవాడు ఆయన తరచుగా మొదట నేను నా తండ్రికి కొడుకుని, యిప్పుడు నా కొడుక్కి తండ్రిని యింకో పద్ధతిలో నేను మోసెస్‌కు ఫెలిక్స్‌కు మధ్య వారధిని అని చెప్పేవాడు
మెండెల్షాన్ కుటుంబంలో అబ్రహాం, లీహ్ యిద్దరూ తమ వారసత్వాన్ని జాగ్రత్తగా కొనసాగించేవాళ్ళు సంస్కారం, నాగరికత అన్నవి వాళ్ళయింట్లో ప్రధమ స్టానంలో వుండేవి. ఫెలిక్స్ రెండో సంతానం. మొదట ఫానీ అన్న అమ్మాయి చిన్నప్పటి నించేవాళ్ళకు పుస్తకాల్ని, కళల్ని పరిచయం చేసి వాళ్ళ మానసిక వికాసానికి తోద్చడేవాళ్ళు. వాళ్ళ అనుదిన జీవితంలో ఆహారం ఎంత ముఖ్యమో కళ కూడా అనివార్యభాగమైంది.
(ఫెంచి సైన్యం వోంబర్గ్ని ఆధ్రమించుకున్నప్పుడు ఫెలిక్స్ కుటుంబం బెర్లిన్ తరలి వెళ్ళింది. అక్కడ అతని నాన్నమ్మ విశాలమయిన భవనంలో నివసించారు. అప్పుడు ఫెలిక్స్‌కు మూదేళ్ళు ప్రతిరోజు అతని తల్లి, అక్కకు అతనికి పియానో పారాలు చెప్పింది ఇద్దరూ (థద్దాసక్తుల్తో నేర్చుకుని నైపుణ్యం సంపాదించారు. వ్యాపార నిమిత్తం అబ్రహాం పారిస్ వెళుతూ కుటుంబాన్ని వెంట తీసుకెళ్ళాడు. ఫెలిక్స్ తల్లి అక్కడ తన పిల్లలిద్దరికీ పియానో ట్యూటర్ని ఏర్పాటు చేసింది. వాళ్ళు అక్కడి నించీ బెర్లిన్ తిరిగి వచ్చాకా పిల్లల అకడమిక్ విద్యల పట్ల కుటుంబం (శ్రద్ధ కనబరచింది ఫెలిక్స్ లుడ్విర్ బెర్గర్ గురుత్వంలో పియానో అభ్యసించాడు. కార్ల్ (ఫెడరిక్ జెట్టర్ శిష్యరికంలో వయోలిన్, భాషలు, డ్రాయింగ్ నేర్చుకున్నాడు. అంత సంపన్న కుటుంబంలో పుట్టినా వాళ్ళు పిల్లల్ని గారాబం చెయ్యలేదు ఫెలిక్స్ తెల్లవారక ముందే లేచి రోజంతా తన అభ్యాసంలో మునిగివుందేవాదు అదే సమయంలో కుటుంబ పెద్దలు పిల్లల జీవితాల్ని సమతూకంలో వుండేలా చూసేవాళ్ళు. పిల్లలు ఆహ్లాదంగా, విరామంగా ఇష్టంగా తను పనులు చేసుకునే సావకాశం కల్పించారు.
ఫెలిక్స్‌కు తన *'శమి ఆటలా వుందేది అతని సున్నితమయిన (శ్రవణ శక్తి అద్భుతమయిన జ్ఞాపక శక్తి, సంగీతాసక్తి అతనికి చెప్పిన వాటన్నిట్నీ అనాయాసంగా (గ్రహించే సామర్భ్యాల్ని యిచ్చాయి జెట్లర్ ఫెలిక్స్‌కు అధ్యాపకుడుగా నియమితుడయి ఆయన చేసిన పని ఏమిటంటే “చేపని నీళ్ళలో వొదిలి అది స్వేచ్చగా ఈత కొట్టేలా చెయ్యడం'. తొమ్మిదేళ్ళకే ఫెలిక్స్ బహిరంగంగా ప్రదర్శన ఇవ్వగలిగే నైపుణ్యాన్ని పియానాలో సాధించాడు. సంవత్సరం తరువాత 'సింగకాడమీ'లో సభ్యుడయ్యాడు. జెట్లర్ దాని డైరెక్టర్ ఆ సమయంలోనే ఫెలిక్స్ స్వరరచనలో మునిగాడు. రకరకాలయిన వైవిధ్య పూరితమయిన రచనల్ని చేశాడు. 1821లో సంవత్సరంలో ఎన్నో సింఫనీలు, రెండు ఒపేరాలు, ఎన్నో చిన్ని రచనలు చేశాడు.
శ37
తన కొడుకు జీవితాశయం సంగీతంలో వుందని అబ్రహాం గుర్తించాకా ఎప్పట్నించో అతని మనసులో వున్న యిష్టం లేని పని చెయ్యడానికి సంకల్పించాడు. అది క్రైస్తవ మతాన్ని స్వీకరించడం. అతని భార్య తరపున బంధువులందరూ ఎప్పట్నించో అట్లాంటి అడుగు వెయ్యమని అతనికి చెబుతూనే వున్నారు. వాటినెప్పుడూ అతను లక్ష్యపెట్టలేదు. ఒక రోజు ఫెలిక్స్ సింగకాడమీ నించీ కన్నీళ్ళతో యింటికి వచ్చాడు కారణమేమిటంటే బాచ్ రచన 025510౧ 20001010 (0 1 ౧౭4౧ఆ౪/ ప్రదర్శితమవుతూ వుంటే ఫెలిక్స్ కోరసలో పాల్గొన్నాడు. అప్పుడు పక్కనున్న యింకో వ్యక్తి “ఒక యూదు కుర్రాడు క్రీస్తును కీర్తిస్తున్నాడు” అన్నాడు. అక్కడే వున్న జెట్లర్ కూడా నవ్వాపుకోలేకపోయాదు ఇది చిన్ని సంఘటనే కానీ దీంతో అబ్రహంకు వున్న సందేవాలు, వ్యతిరేకతలు అన్నీ పటాపంచలయిపోయాయి. మరసటి రోజు తన కూతుర్ని కొడుకును తీసుకెళ్ళి ప్రొాటస్టెంట్ చర్చిలో మతం మార్చించాడు తను, తన భార్యా అదే పని చేశారు. తన యింటిపేరును మెండెల్షాన్” నించీ బర్ట్ హోల్డ్‌గా మార్చించాడు. కారణం 'మెందెల్షాన్ యింటి పేరున్న తదితరులు యింకా యూదులుగానే వున్నారు.
మెండెల్షాన్ కుటుంబం ఎప్పుడూ మంచి సంగీతంలో మునిగితేలేది. ఆదివారాల మధ్యాహ్నలు వాళ్ళ ఇంట్లో సంగీత సంబరాలు జరిగేవి సంగీత వృత్తి నిపుణులు పిల్లలతో కలిసి సంగీతాన్ని ప్రదర్శించేవాళ్ళు. ఆ సంగీత సమారోహాలు ఏ స్థాయిలో వుందేవంటే గొప్ప సంగీతకారులు, ఉన్నత కుటుంబీకులు ఆకర్షితులయి వచ్చేవాళ్ళు వుదాహరణకి కార్ల్ మారియా వాన్ వెబర్ 1821లో బెర్లిన్‌లో ఒక సంగీత ప్రదర్శనకు వచ్చి మెందెల్షాన్ ఇంటి గురించి విని వాళ్ళని సందర్శించాడు. ఈ సంగీత సమారోహాల్లో ఫెలిక్స్ పియానో వాయించేవాడు. తన చిన్నప్పటి స్వీయరచనల్ని ప్రదర్శించేవాడు. చిన్ని అర్మెస్ట్రాల్ని కూడా నిర్వహించేవాడు అతని గురించి విన్నవాళ్ళంతా నిస్సందేహంగా అతను 'రెండో మొజార్ట్ అవుతాదని అనేవాళ్ళు
నిజానికి గొప్పవడయిన గొధే కూడా అదే అనుకున్నాడు. గొధే పసివాడయిన మొజార్ట్ ప్రదర్శన చూశాడు. 1621లో జెల్టర్ ఫెలిక్స్ని వీమార్కు తీసుకొచ్చి గాధేకు పరిచయం చేశాడు. ఫెలిక్స్ గొధే ముందు బిధోవిన్, బాచ్ రచనల్ని ప్రదర్శించాడు ఓ సందర్భంలో సంగీత ప్రదర్శనలో దాని కొనసాగింపుకు సంబంధించిన విషయాన్ని ఒక రచనాభాగాన్ని విస్మరించినా నిర్భయంగా దాన్ని యిబ్బంది కలగకుండా నిర్వహించాడు. గొధే అతని ప్రదర్శనకు ముగ్భుడయ్యాడు. పసివాడయిన ఫెలిక్స్ “ప్రతిరోజూ ఉదయం నేను ఫెస్ట్, వెర్తర్ రచయిత నించీ ముద్దును అందుకుంటాను.” అని తల్లిదండ్రులకు వుత్తరంలో రాశాడు. 238
గొధే ఫెలిక్స్ సన్నిహిత మిత్రులయ్యారు. దెబ్బయి రెండేళ్ళ మహా మేధావి, పన్నెండేళ్ళ (ప్రతిభావంతుడు ఆత్మీయ స్నేహితులయిపోయారు. 1832లో గొధే మరణ వర్యంతం వాళ్ళిద్దరూ సన్నిహితమిత్రులుగా వున్నారు. ఎన్నో సందర్భాల్లో కలుసుకున్నారు. ఒక సందర్భంలో గొధే ఫెలిక్స్‌కు రాస్తూ “నేను సాల్ని, నువ్వు డేవిడ్వి. నా దగ్గరికి రా. నేను దిగులుగా, నిరాశగా వున్నప్పుడు నా దగ్గరికొచ్చి నీ మధుర స్వరాలతో నా మనసుకు నెమ్మది నివ్వు” అని రాశాడు ఫెలిక్స్‌కు సంబంధించిన వైవిధ్య పూరితమయిన విషయాలు సుప్రసిద్ధ ఇంగ్లీషు సంగీతకారుడు జూలియస్ బెనిడిక్ట్ ద్వారా మనకు తెలుస్తాయి. ఆయన “నేను నా గురువు, స్నేహితుడు మారియా వాన్ వెబర్‌తో కలిసి బెర్లిన్ వీధుల్లో వెళుతూ వుంటే ఆయననా దృష్టిని ఒక కుర్రాడిపై మరల్చాడు. ఆ కుర్రాడికి పదకొండు, పన్నెందేళ్ళుంటాయి. ఆ కుర్రాడు పరిగెట్టుకుంటూ వెబర్ దగ్గరికి వచ్చాడు. వెబర్ “ఇతను ఫెలిక్స్ మెందల్షాన్” అని నాకు పరిచయం చేశాడు. ఆ 'ప్రతిభావంతుడయిన కుర్రాడి పేరు వినగానే ఆతని నైపుణ్యం గురించి (్రైస్డెన్లో నేను విన్న సంగతి గుర్తొచ్చింది. ఆ అందమయిన కుర్రాడి ఆకారాన్ని నేను మరచిపోలేదు. భుజాలు తాకుతున్న ఎర్రని రింగులు తిరిగిన శిరోజాలు, తెలివిని ప్రదర్శంచే చురుకయిన కళ్ళు, అమాయకం నిండిన చిరునవ్వు ఎర్రని పెదాలు ఎప్పటికీ మరచిపోలేను. అతన్తో బాటు అతని యింటికి వెళ్ళాం అతను నన్ను అతని యింట్లోకి డ్రాయింగ్ రూంలోకి తీసుకెళ్ళాడు. అక్కడ వాళ్ళమ్మ వుంది. “అమ్మా! యిదిగో! వెబర్ శిష్యుడు ఒకాయన వచ్చారు. సంగీతంతో, ఒపేరాతో ఈయనకు గాధమయిన పరిచయం, ప్రావీణ్యం వున్నాయి ఈయన కోసం (ప్రార్ధించు. మన కోసం సంగీత ప్రదర్శన చేయమని ఈయన్ని అడుగు” అన్నాడా కుర్రాడు. నా నిమిత్తం లేకుండా నన్ను పియానో దగ్గరికి తీసుకెళ్ళాడు. నా జ్ఞాపకాలు ఆగిపోయేదాకా, నేను అలసిపోయేదాకా పియానో వాయించాను. అప్పుడు నేను అతని కొన్ని రచనల్ని వినిపించమని కోరాను. తన సొంత రచనల్ని వినిపించడానికి వ్యతిరేకించాడు కానీ తన జ్ఞాపకాల నించీ కొన్ని బాచ్ రచనల్ని వినిపించాడు” అన్నాడు. ఫెలిక్స్ తనని కలిసిన వాళ్ళందర్నీ ఆకర్షించేవాడు, ఆశ్చర్యపరిచేవాడు. 1822లో వాళ్ళ కుటుంబం పర్యటనకు బయల్టేరింది. ఫెలిక్స్ కాసెల్ అన్న ప్రాంతంలో సుప్రసిద్ధ వయోలినిస్టు, సంగీత నిర్వాహకుడు ఐన లుద్విగ్ స్టోర్ దగ్గర తన సంగీతాన్ని ప్రదర్శించాడు. స్టోర్ విని ఆనందంతో తలవూపాడు. ఫ్రాంక్ ఫర్ట్లో సీసిలియా వెరీన్ అతిధులుగా వున్నాడు. అక్కడ ఫెలిక్స్ కొన్ని బాచ్ రచనల్ని వినిపించాడు. ప్రదర్శించాడు. అది మెరుపుల్ని సృష్టించింది. 139
అక్కడున్న సంగీత దర్శకుడు జోవోన్ స్కీల్బెల్ “ ఈ కుర్రాడు దేవుడికి సన్నిహితులైన వాళ్ళలో ఒకడు” అన్నాడు మూదేళ్ళ తరువాత పారిస్‌లో పారిస్ సంగీత కళాశాల డైరెక్టరయిన గొప్ప కంపోజర్ ఐన లూగీ చేరుబినీ ఫెలిక్స్ సంగీతం విని ముగ్భుడయ్యాదు
ఫెలిక్స్ పదిహేనో ఏట అతని పుట్టిన రోజు నాడు అతని ఇంట్లో అద్భుతమయిన అతని సంగీత ప్రదర్శన జరిగింది అక్కడే వున్న జెట్లరొ” బాబూ! యిప్పుడు నువ్వు ఒకరి శిష్యుడు కావు స్వయం వ్యక్తిత్వమున్న, స్వతంత్రుడయిన సంగీతకారుడివి సుప్రసిద్ధలయిన మొజార్ట్, హైదేన్, బాచ్ల సరిసమానుడివి” అన్నాడు. అతనికి విద్యనేర్చుతున్న గురువులందరూ 'ఇక అతను నేర్చుకోవాల్సిందేమీ లేదు” అన్న నిర్ణయానికి వచ్చారు
1825 ఫెలిక్స్ కుటుంబం 'లీప్టి గెర్ స్ట్రాసీ' అన్ని చోట వున్న ఏడెర్రాల ఎస్టేట్‌కు మారింది అక్కడున్న అద్భుతమయిన గార్డెక్హౌస్ వారం వారం జరిగే ఫెలిక్స్ సంగీత (ప్రదర్శనల"కేంద్రమయింది అక్కడ ఫెలిక్స్ గుర్రపు స్వారి, ఈత, శరీర వ్యాయామాలు “చేసేవాడు ఆ సుందరమయిన భవనంలో అన్ని అనుకూలాలు సమకూర్చబడ్డాయి. డాన్సింగ్హాల్, బిలియర్డ్ గేమ్స్ ఆడుకునే అనుకులాలు కల్పించబడ్డాయి. అతనేం చేసినా అన్నీ పద్ధతిగా చేసేవాడు. నృత్యం చేసినా మనోహరంగా చేసేవాడు పెయింటింగ్, డ్రాయింగ్ ఏవి చేసినా చెయ్యి తిరిగిన కళాకారుడిలా చేసేవాడు వీటన్నిటినీ మించి అతను అసాధారణ అందగాడు. సామాజిక సమావేశ సందర్భాల్లో కేంద్రబిందువుగా వుండేవాడు అతనేమీ నీతిమంతుడు కాడు. కానీ తలవంచే పనులేవీ, తలవంపు తెచ్చే పనులేవీ చెయ్యలేదు. తన సంగితాన్ని మచ్చలేని తిరీలో సాగించాడు అతని పదిహేనో ఏటికే అతని అసాధారణ రచన తీ ౧16086౧౧౧౧4 [419010 0184౧ ను పూర్తి చేశాడు గార్జన్ హౌస్‌లో అతని పదిహేడో పుట్టిన రోజునాడు ఆయన, ఆయన సోదరి ఆ రచనను ప్రదర్శించారు
ఆయనకు సంగీతకారుడిగా అన్నీ నల్లేరుపై బండినడకలా సాగాయని చెప్పడానిక్కూడా లేదు. గొధే ఆ కుర్రాడి గురించి “అదృష్టం అలముకున్న రోజున పుట్టావు” అన్నాదు. ఫెలిక్స్ “డొన్క్విక్వోట్ ఆధారంగా ఒపేరా రాశాడు బెర్లిన్ ఒపేరా డైరెక్టర్ స్పాంటినీకి దాన్ని సమర్చించాదు. ఆయన వెంటనే దాన్ని స్వీకరించాడు. కానీ సంవత్సరం కన్నా ప్రదర్శించడానికి ఒప్పుకోలేదు తమాషా ఏమిటంటే ఆ ఒపేరా చాలా తక్కువ స్థాయిలోనిది. ఫెలిక్స్‌కు ఆ సంగతి తెలుసు. ఒక (ప్రదర్శన తర్వాత అది విసృతమైంది.
1829లో ఫెభిక్స్ తన జీవితాశయాలో ఒకటయిన సెబాస్టియాన్ బాచ్ సంగీత పునరుద్ధరణ గురించి ఆలోచించాడు బాచ్ మరణం తరువాత ఎన్నో సందర్భాల్లో బాచ్ ఓ40
సంగీతాన్ని ఫెలిక్స్ జనం మూడు ప్రదర్శించాడు. జనానికి ఆసక్తి రేకెత్తించాడు. చిన్నతనం నించీ ఫెలిక్స్ బాచ్ సంగీతంతో గాఢ _పరిచయమున్నవాడు. దీనికి అతని తల్లి, జెట్లర్ యిద్దరూ కారణం. జెట్లర్ దగ్గర ఫెలిక్స్ తండ్రి యిచ్చిన బాచ్ రాతప్రతులు కొన్ని వుండేవి.
విస్సృతమయిన బాచ్ సంగీతానికి ప్రచారం తేవడానికి ఫెలిక్స్ పూనుకున్నాడు. పదహారు మంది గాయకులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఎడ్వర్డ్ కేవరియంట్ అన్న ప్రసిద్ధ గాయకుడు కూడా అందులో వుండేవాడు. '2295510గ' అన్న బాచ్ రచనను ఎన్నోసార్లు రిహార్సల్స్ చేశారు. దాన్ని జనం ముందు ్రదర్శించాలన్న కోరికను జెట్లర్తో చెప్పారు. ఆయన ఒప్పుకున్నాడు.
1829 మార్చి 11న బెర్లిన్‌లో ఆ ప్రదర్శన ఫేలిక్స్ దర్వకత్వంలో జరిగింది. అతని సంగీత చరిత్రలో సువర్దాక్షరాలతో లిఖింపదగిన రోజయింది. గాయకుడయిన ఎద్వర్డ్ దేవ్రెంట్ తన స్మృతుల్లో “నేనా పాటని నా ప్రాణాల్లో పాడాను. అర్థవంతమయిన ఆ పాట భావాన్ని ఆరాధనతో ఆలపించాను. జనమంతా నిశ్శబ్దంగా విన్నారు. తన్మయులయ్యారు. ఆ రోజు సాయంత్రం మరపురానిది. అంత పరవశంతో తన్మయులయిన జనసందోవాన్ని ఎప్పుడూ నేను చూడలేదు” అని రాశాడు.
ఫెలిక్స్ సోదరి ఒక వుత్తరంలో “ప్రతి వాళ్ళూ పవిత్ర భావంతో తన్మయులయ్యారు. పాడిన వాళ్ళ ప్రాణపులోతుల్లోంచీ ఆ పాట పెల్లుబికింది, అని రాసింది. ఆ ప్రదర్శన రెండోసారి కూడా జరిగి జనామోదం పొందింది. బాచ్గానాన్ని పునరుద్ధరించడం ద్వారా ఫెలిక్స్‌కు సంగీత ప్రపంచంలో గుర్తింపు, గౌరవాదరాలు దొరికాయి.
అది జరిగిన కొన్నాళ్ళకి ఫెలిక్స్ విదేశీ పర్యటనలు చేయడానికి నిశ్చయించాడు. మొదట ఇంగ్లాండు వెళ్ళాడు. ఆయన చేసిన పది ఇంగ్లాండు పర్యటనల్లో అది మొదటిది. హాండెల్ తర్వాత ఏ విదేశ సంగీత కారుణ్ణీ అంత ఆత్మీయంగా యింగ్లీషు సంగితాభిమానులు ఆదరించలేదు. “ లందన్! 'పొగగూడు" నాకు యిష్టమయిన ఆవాస స్థలం. నేను అనుకొని," ఆశించని ఆదరణ అక్కడ నాకు దొరికింది” అన్నాడు. ఫెలిక్స్ ఆయన సందర్శించిన ప్రతిసారీ ఆదరాభిమానాల్ని అందుకున్నాడు. తరువాత స్కాట్లాండ్ సందర్శించాడు. ఆ (ప్రేరణతో “90010 9/౫౧౧౦౧)/ ప్రారంభించాడు. పారిస్‌లో 'ఛోపిన్' లిస్జ్డ్'మేయర్ బీర్ మొదయిలన సుప్రసిద్ధుల పరిచయం కలిగింది. తిరిగి లండన్ వచ్చాడు.
1888లో డస్సెల్డార్భ్లో మ్యూజిక్ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. వృత్తి సంగీతానికి బాధ్యుడుగా వుండాల్సి రావడం అతని మొదటి అనుభవం. ఆ వుద్యోగంతో అతను సంతోషంగా లేడు. ఎందుకంటే అతని లక్ష్యాలు ఉన్నతమైనవి. ఆ వుద్యోగంలో ఓ శై!
ఆర్నెల్లు వున్నాడు. సంవత్సరం తరువాత అంతకన్నా వున్నతమయిన పదవి కోసం అతనికి ఆహ్వానం-అందింది. అది లీస్టిగ్లో జవాన్డాయస్ ఆర్మెస్ట్రాకు మ్యూజిక్ డైరెక్టర్ పదవి. అదె సుప్రసిద్ధమైంది. 1885లో బాధ్యతలు స్వీకరించాడు. తన సమస్త శక్తి యుక్తుల్ని కేంద్రీకరించి అద్బ్భుతంగా- ఆ పదవి నిర్వహించాడు. ప్రపంచంలోని ఆర్మెస్టా బృందాల్లో సాటిలేనిదిగా దానికి వన్నెతెచ్చాడు. తన అధునాతన ధోరణులన్నిట్నీ దానికి అన్వయించి అభివృద్ధి పరిచాడు. 1885లో అతని తండ్రి మరణం అతనికి అశనిపాతం. కానీ నెమ్మదిగా కోలుకున్నాడు. ఇప్పుడు చెయ్యాల్సింది ఒక్క పని మాత్రమే మిగిలింది. ఎవరి బాధ్యతల్ని వారు నిర్వర్తించడం” అన్నాడు తాత్వికంగా. ఆయన మొదటి బాధ్యత ఆర్మెస్తా నిర్వహణ. రెడోది ఆయన సంగీత రచన. సెంట్‌పాల్ అన్న ఆయన ఆరటోరియో లోయర్ రైన్ ఫెస్టెవల్లో -ప్రదర్శింపబడి ఘనవిజయాన్ని సాధించింది. 1886 మే 22న ఆ ప్రదర్శన జరిగింది. ఫెస్టివల్ నించీ తిరిగివచ్చి తాత్కాలికంగా ఫ్రాంక్ ఫర్ట్లో ఆగాడు. అక్కడ 'జీన్రనాడొ అన్న పేరుగల కుటుంబంతో పరిచయం ఏర్పడింది. అతను తరచుగా వాళ్ళయింటికి రాకపోకలు జరపడంతో గుసగుసలు మొదలయ్యాయి. జనం లీష్టిగ్ నించీ వచ్చిన తెలివైన సంగీతకారుడికి ఆ యింట్లో వున్న అందమైన “వితంతువు కు మధ్య సంబంధమేర్చడిందని చెప్పుకోవడం మొదలు పెట్టారు. నిజానికి ఫెలిక్స్ దృష్టి ఆ వితంతువు మీద లేదు. ఆమె పదిహేడేళ్ళ కూత్తురు' సిసిలీ మీద వుంది. తనకు తను కావాలని సిసిలీ కి దూరమైనప్పుడు తన జీవితంలో మొదటిసారి (ప్రేమలో పడ్డట్టు అతను తెలుసుకున్నాడు. వెంటనే ఫ్రాంక్ ఫర్ట్ వచ్చాడు. ఆమెను పెళ్ళి చేసుకోడానికి ప్రతిపాదన చేశాడు. వాళ్ళు ఒప్పుకున్నారు. 1837 మార్చి 28న వాళ్ళ పెళ్ళి జరిగింది. ఆ విధంగా వాళ్ళ (ప్రేమ నిర్మలంగా సాగి ఆనందంగా పెళ్ళిగా పర్యవసించింది. ఖలిక్స్ అంత ఆనందంగా ఎప్పుడూ లేడు. ప్రపంచ వ్యాప్తంగా అతని కీర్తి ప్రతిష్టలు అత్యున్నత స్థానాన్ని అందుకున్న స్థితి అది. సంగీత దర్శకుడుగా అతని చర్యలు అతనికి నిరంతర ఉత్తేజాన్ని యిచ్చాయి. లీప్టిగలో అతను ఫెర్దినాండ్ దేవిడ్, క్లారావీక్, రాబర్ట్ స్కూమాన్ తదితరులో అతని సాన్నిహిత్యం అతనికి మరింత ఉత్తేజాన్ని సమ(గ్రతను ఇచ్చింది. దానికి తోడు అతని ఉల్లాసకరమైన వివాహం మరింత సంతోషం కారణమైంది. ప్రష్యారాజు 1940లో ఫెలిక్స్ని బెర్లిన్‌లోని అకాడమీ ఆఫ్ ఆర్ట్స్‌లో సంగీత శాఖాధ్యక్షుదిగా నియమించాడు. ఫిలిక్స్‌కు లీప్టిగ్ని వదలడం ఇష్టం లేదు. కానీ రాజు ఆదేశాన్ని కాదనడం మర్యాదకాదు. అయిష్టంగానే 1941లో ఫెలిక్స్ బాధ్యతలు స్వీకరించాడు. అక్కడ పరిస్థితులు కూడా అతని కనుకూలించలేదు. లీప్టిగలో ఆయన 500101 సింఫనీ ప్రీమియర్ వుండడం వల్ల తాత్కాలికంగా బెర్లిన్ వదిలే అవకాశం ఆయనకు కలిగింది. ఆ ప్రదర్శన 1842 మార్చి ౩న జరిగింది. తరువాత శై42
యింగ్లాండు వెళ్ళి బకింగ్ హామ్ ప్యాలెస్‌లో విక్టోరియా రాణి ముందు రెండు ప్రదర్శనలిచ్చాడు. తిరిగి బెర్లిన్ చేరాకా అకాడమీ ప్రాజెక్ట్ మూతపడిందని తెలిసింది. ఫెలిక్స్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించాడు. కానీ అతనికి రాజుగారికే “సంగీత ఉపాధ్యాయుడు'గా గౌరవనీయమయిన పదవిని స్వీకరించమని ఆహ్వానమందింది. ఆ పదవి వల్ల కొన్ని కొన్ని సందర్భాలలో వాటికి అనుగుణమయిన సంగీత రచన చేయాల్సి వుంటుంది..కానీ బెర్లిన్లోనే వుండాలన్న నియమమేమీ లేదు. సందర్భానుగుణమయిన ఎన్నో సంగీతరచనలు చేశాడు.
తిరిగి తన కిష్టమయిన లిష్టిగ్ చేరి హాయిగా సంగీత దర్శకత్వం చేస్తూ జీవితానికి కొత్త స్వష్నాల్ని అందించాడు. ఫెలిక్స్‌కు ఎప్పట్నించో సాటిలేని సంగీత కళాశాలను స్టాపించాలన్న కోరిక. దాన్ని లీస్టిగ్లో నెలకొల్పాలన్న వాంఛ. అందుకని శాక్సనీరాజును కోరాడు. రాజు అందుకు అనుమతించి దానిపునాదులు నిర్మించడానికి ఆదేశాలు జూరీచేశాడు. ఫెలిక్స్, రాబర్ట్ స్కూమాన్తో కలిసి పియానో, సంగీత పారాల తరగతులు నిర్వహించెవాదు. ఫెర్టినాండ్ డేవిడ్ వయోలిన్ తరగతులు నిర్వహించేవాడు. అన్నీ సక్రమంగా; ప్రణాధికాబద్ధంగా జరిగాయి. సంగీత కళాశాల ఫెలిక్స్ ఆధ్వర్యంలో అధికారికంగా 1848 ఏప్రిల్ 8న మొదలయింది.
ఫిలిక్స్ అవిశ్రాంతంగా (శ్రమించాడు. బోధనలో, పర్యవేక్షణలో మునిగిపోయాడు. మధ్య మధ్యలో సంగీత ప్రదర్శనలూ ఇచ్చేవాడు. ఆ కాలంలోనే తన సుప్రసిద్ధ ఆరటోరియో “ఎలిజా రాశాడు. ఇతర సంగీత రచన ఎన్నో చేశాడు. విసృతంగా యూరోపు పర్యటించి ప్రదర్శనలిచ్చాడు.
అవిశ్రాంతమయిన పనుల వల్ల, 'ప్రయాణాలవల్ల అలసిపోయి అతని ఆరోగ్యం దెబ్బతింది. అప్పుడప్పుడూ తల నొప్పి మొదలయింది. ఈ బాధలున్నా అట్లాగే ఎలిజా వరల్డ్ ప్రీమియర్ ఇంగ్లాండులో నిర్వహించాడు. 1846 ఆగస్టు 26న నిర్వహించిన ఆ ప్రదర్శన అతని జీవితంలో మరపురాని మరవలేని అఖండ విజయాన్ని పొందింది. “నేనిచ్చిన ప్రదర్శన ఏదీ అంత అసాధారణ విజయాల్ని పొందలేదు. అంత అభినందనలు అందుకోలేదు, అంత ఉత్సాహంగా జనందేన్నీ స్వీకరించలేదు” అని చెప్పుకున్నాడు.
ఈ విజయం తరువాత లీప్టిగ్ తిరిగి వచ్చాడు. యింకా అలసిపోయాడు. అట్లాగే మళ్ళీ సంగీత రచనలో మునిగిపోయాడు. 1847లో మళ్ళీ యింగ్లాండు వెళ్ళి వివిధ సందర్భాల్లో సమావేశాల్లో పాల్గొని నిరంతర ్రదర్భనలిచ్చాడు. విక్టోరియా రాణి ముందు ప్రదర్శన యిచ్చాడు.
243
- 1847 మే 14న అతని జీవితకాల ఆత్మీయురాలు, అన్నివేళలా అతని తోడునీడగా! వున్నసోదరి ఫానీ హఠాత్తుగా బెర్లిన్‌లో కన్నుమూసిన వార్త అందింది. అతను కుంగిపోయాడు. స్మృతి తప్పి పడిపోయాడు. మెదడులో రక్త స్రావమైంది. మెల్లగా కోలుకున్నాడు. కానీ తిరిగి ఎప్పుడూ అతను మాములు మనిషి కాలేదు. హరాత్తుగా వయసు మీద పడినట్లు అయిపోయాడు. అతని శక్తి, చైతన్యం అదృశ్యమయ్యాయి. క్రమక్రమంగా నిరాశ, నిస్సృవాలకు లోనయ్యేవాడు. బాధతో మెలికలు తిరిగేవాడు. బలహీనపడ్డాడు. ఒక రోజంత స్పృహ కోల్పోయి 1847 నవంబరు 4న కన్నుమూశాడు.
ఎడ్వర్ దేవ్రియంట్ “మధ్యాహ్నం శవయాత్ర మొదలయింది. యింటి చుట్టూ జనం నిండిపోయారు. శవపేటిక ఖరీదుగా వెండి అంచులున్న వెల్వెట్‌తో అలంకరించారు. వీధుల నిండా జనం నిండిపోయారు. స్వరకారుల సంరంభంతో శవయాత్ర సాగింది.” అని రాశాడు.
లండన్, మాంచెస్టర్, బర్మింగ్ హామ్, పారిస్, జర్మనీలోని ముఖ్యనగరాలన్నింట్లో మెమోరియల్ సర్వీసులయ్యాయి. ఆ సుప్రసిద్ధ సంగీతకారుడికి చివరి వీడ్కోలు జరిగాయి. కేడ్షీడ్ల
రాబర్ట్ షూమాన్ ౧006గ1 50060౧౧2౧౧. 8-6-1810 -- 29-7-1856
షూమాన్ జీవితంలో ఆందోళన, సంఘర్షణ, బాధ తప్ప యింకేమీ లేవు. విధి అతని పట్ల నిర్ణయ ప్రదర్శించింది. అతని ముఖ్యమయిన లక్ష్యం, మొదటి లక్ష్యం సంగీతం. కానీ ఇరవై ఏళ్ళ పాటు వచనానికీ, కవిత్వానికీ మధ్య, న్యాయ విద్యకు సంగీతానిక మధ్య “యుద్ధం” చేశాడు. చివరికి సంగీతాన్ని చేరుకున్నాడు. అతని తల్లి మొండిగా అతను తప్పనిసరిగా లాయర్ కావాలని ఆదేశించింది. ఫలితంగా కొన్ని ఏళ్ళపాటు అతను లా పుస్తకాలు చదివాడు. మనసుమాత్రం మరో చోట వుంది.
మొదట అతనికి సాహిత్యమంటే యిష్టం. అతని తండ్రి రచయిత, (ప్రచురణ కర్త, పుస్తక (్రేుమికుడు. కుర్రాడుగా వున్నప్పుడు షూమాన్ నాటక సంబంధమయిన న్మచ్లు రాశాడు. పద్నాలుగేళ్ళ వయసులో గ్రీకు క్లాసిక్స్‌ని, తొలి కాల్బనిక కవుల్ని చదువు కున్నాడు. సంవత్సరం తర్వాత చిన్ని “సమాజాన్ని స్థాపించి మిత్రులతో సాహిత్య చర్చలు, అధ్యయనం చేశాడు. కవికావాలనుకున్నాడు: “నాకు వూహాశక్తి వుంది, కానీ నేను గొప్ప ఆలోచనా పరుణ్ణీ కాను” అని చెప్పుకున్నాడు. పదిహేడో ఏట నేను కవినో కాదో భవిష్యత్తరం నిర్ణయిస్తుంది" అన్నాడు. యింకా ఆశ్చర్యమేమిటంటే నా అభిప్రాయాలు బలంగా నన్ను కవిని కాకుండా వెనక్కి లాగుతున్నాయి. అట్లాంటి సందర్భాల్లో నేను ఎట్లాంటి నిశ్చయానికీ రాలేకపోతున్నాను” అన్నాదు.
షూమాన్ ఆరేళ్ళ వయసులో పియానో నేర్చుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే సంగీత రచన కూడా ప్రారంభించాడు. ఇగ్నాజ్ మోశ్చల్స్ అన్న అతని సంగీత ప్రదర్శన షూమాన్పై ఎంతో ప్రభావాన్ని చూపింది. సంగీతంపై మరింత ఏకాగ్రతగా మనసు నిలిపి, వివిధమయిన సంగీత కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేలా చేసింది. ఎనిమిది మంది సంగీత మిత్రుల్ని సమకూర్చుకుని చిన్ని ఆర్మెస్ట్రా బృందమేర్చరచి దానికి 'డైరెక్టరయ్యాడు. పక్కింటి వ్యక్తితో కలిసి పియానో యవ్వన దశలో అతన్ని ఆకట్టుకున్నది. తన్మయ పరచింది. షూబర్ట్ సంగీతం విన్నాడు. అంత ఎంతో వ్యామోహంతో దానికి లొంగిపోయాడు. సంగీతం పట్ల అతని జీవితాన్ని అంకితం చేసుకోవడానికి షూబర్డ్ సంగీతమే కారణం.
కేశర్
షూమాన్ తండ్రి కొడుకు ఉత్సాహాన్ని తెలివి తేటల్ని పట్టించుకోలేదు. కాని ఒక సందర్భంలో కార్ల్ మారియా వాన్ వెబర్‌ని కలిసి తన కొడుక్కి సంగీతానికి సంబంధించి సలహాలు, సూచనలు యివ్వమని అడగడానికి ప్రయత్నం చేశాడు. ఆ రకంగా కొడుకు యిష్టాల్ని కొంత మేరకు ఆయన గుర్తించాదనుకోవాలి. దురదృష్టమేమిటంటే అప్పట్లోనే ఆయన కన్నుమూశాడు. షూమాన్ దురదృష్టాలకు అది నాంది.
షూమాన్ తల్లి సంరక్షణ కిందకు వచ్చాడు. ఆమె మొండి పట్టుదల కలది. గొప్ప ఆత్మవిశ్వాసం కలది. ఆమెలో కలలో కూడా 'కల్పనల' జోలికి వెళ్ళనిది. కొదుకు తప్పని సరిగా లాయరు కావాలని ఆమె నిర్ణయం. అతని సాహిత్య, సంగీత యిష్టాల్ని నిషేధించింది. షూమాన్ తన హైస్కూలు విద్యాభ్యాసం పూర్తి చేశాకా అతని పద్దెనిమిదవ ఏట అతను లా చదవడానికి లీష్టిగ్ యూనివర్సిటీలో చేర్చింది. అతను ఆ విద్య తనకు అసహ్యమయినా చదివాడు. మధ్యలో విరామం కోసం, వెసులుబాటు కోసం స్థానికంగా జరిగే సంగీత కార్యక్రమాలకు వోజరయ్యేవాడు. సంగీత (ప్రేమికుల్ని స్నేహితులుగా చేసుకున్నాడు. (ఫ్రైదరిక్ వీక్ అన్న ప్రతిభావంతుడయిన లీష్టిగ్లోని ఉపాధ్యాయుడి వద్ద పియానో అభ్యసించేవాడు. మనసొక చోట, చెయ్యాల్సిన పని మరొకటి కావడం వల్ల అతన్లో మానసికమయి దిగులు, విషాదం అలముకున్నాయి. అతని మెదడు అలసిపోయింది. నరాలు దెబ్బ తిన్నాయి.
పరిస్థితుల, పరిసరాల మార్చును కోరి హీడెల్బర్గ్కు మారి తన న్యాయ విద్యను కొనసాగించాడు. వెనకటి కన్నా సంగీతానికి ఎక్కువ సమయాన్ని కేటాయించి న్యాయ విద్య పట్ల నిర్లక్ష్యం వహించాడు. చివరికి మౌలికమయిన నిర్ణయానికి రావడానికి దృఢంగా సంకల్పించాడు.
1829 నవంబరు 11న తన తల్లికి “నేను ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలిగితే అది ఒక్క సంగీతంలోనే సాధించగల్ను దాని కోసం నన్ను నేను సమగ్రంగా, సంపూర్ణంగా సమర్పించుకోవాలి. అప్పుడే సృజనకు అవకాశం వుంటుంది” అని రాశాడు. తరువాత ఎనిమిది నెలలకు అతని ఆలోచనలు మరింత స్పష్టరూపం ధరించాయి. “అమ్మా! నేనొక నిర్ణయానికి వచ్చాను. నేను చెయ్యాల్సిన పనికి ఓర్పు, మంచి గురువు, వుంటే ఆరు సంవత్సరాల్లో ఎంతటి పియానో వాద్య నిపుణున్నయినా నేను ఛాలెంజ్ చెయ్యగలను. దీనికి సమాంతరంగా నాకు వూహాశక్తి వుంది. దాహముంది, తపన వుంది, స్వతంత్ర సృజనాత్మక ఆవిష్కారం పట్ల ఆరాటముంది” అని రాశాడు.
లీస్టిగ్ నించీ ఫ్రెడరిక్ వీక్ కూడా అతని తల్లికి షూమాన్ సంగీత ప్రతిభ గురించి రాసిన వుత్తరం వల్ల షూమాన్లో మరింత ఆత్మ విశ్వాసం పెరిగింది. మూడేళ్ళలో అతన్ని 146
సాటిలేని పియానో వాద్య నిపుణున్ని చేస్తానని అతను ఆ వుత్తరంలో హామీ యిచ్చాడు. దాంతో తప్పనిసరిగా అతని తల్లి ఒప్పుకోవాల్సి వచ్చింది. షూమాన్ లీస్టిగ్ వెళ్ళి తన సంగీత అధ్యయనంలో లీనమయ్యాడు. మొదటి అతను సంగీత రచన చెయ్యాల్సి వచ్చింది. సంగీత రచన కన్నా అతనికి పియానో వాయించడమే యిష్టం. ఆ సంగతే (ఫెడరిక్ వీక్‌తో చెప్పాడు. వీక్ ఆమోదం తెలిపాడు. షూమాన్ వీక్ యింటికి దగ్గర్లోనే ఒక యిల్లు అద్దెకు తీసుకున్నాడు. పెయానోపై అసాధారణ రీతిలో నిరంతర అధ్యయనం కొనసాగించాడు. గాఢమయిన పరిశ్రమ ఒకటే చాలదు. కొత్త పద్ధతుల్లో నూతన సాంకేతిక విధానంలో అధ్యయనం కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తించాడు. ఆ మార్గంలో చేతి నాలుగో వేలును నిలకడగా పెట్టి తక్కిన వేళ్ళు పియానో మెట్లని వాయించడం మొదలు పెట్టాడు. అట్లా చేస్తూ మళ్ళీ ఆ వేలును సాధారణ స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే వీలు పడలేదు. పైగా ఆ వేలుకు పక్షవాతం వచ్చింది. ఆ పరిస్థితి నించీ బయట పడడానికి డాక్టర్లు కూడా ఏమీ చెయ్యలేకపోయారు. దాంతో షూమాన్ తీవ్ర ఆఘాతానికి లోనయ్యాడు. తను ప్రారంభించిన ఉద్దేశించిన ఆశయం ముగిసిపోయిందన్న నిజాన్ని తెలుసుకున్నాడు. తన కల కల్లగా మారిందన్న సత్యాన్ని గుర్తించాడు.
ఐనా షూమాన్ నిరాశపడలేదు. తను గొప్ప పియానిస్టు కాలేకపోయినా యిప్పటికీ తను సంగీత రచన చెయ్యడానికి సమర్భుడే అని భావించాడు. హెనిక్ దార్న్ అన్న సంగీత సిద్ధాంతకారుడి దగ్గర శిష్యరికం చేశాడు. సింఫనీ రచనలో మునిగాడు. దాంట్లో మూడు చలనాల్ని ముగించాడు. దాంట్లో మొదటి చలనాన్ని 1882 నవంబరు 18న జ్వికావూలో ప్రదర్శించాడు. తరువాత పియానో కంపోజర్‌గా మారాడు. మూడేళ్ళలో కొన్ని రచనలు చేశాడు. పియానిస్టు నించీ స్వరకర్తగా పరివర్తన చెందడంలో ఎన్నో సందేహాలు, సంక్షోభాలు అతని ఆంతరిక ప్రపంచంలో రేగినా అతని సంగీత రచనలన్నీ సమగ్రంగా, చక్కగా రూపొందాయి.
మధ్య మధ్య షూమాన్కు ఫిట్స్ వచ్చేవి, స్పృహ తప్పి పడిపోయేవాడు. మాములుగా వున్న సమయంలో గొప్ప దిగులు, నిరాశ అతన్ని కమ్ముకునేవి. తన మనసు తన అదుపు తప్పిపోతోందని అతను కుంగిపోయాడు. 1888 అక్టోబర్ 17న కిటికీలోంచీ దూకి ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు. కానీ అది ఫలించలేదు.
అతని అవిశ్రాంత (శ్రమనించీ అతనికి కొంత విరామం, విశ్రాంతి దొరికాయి. 1838లో షూమాన్ ఒక సంగీత సంస్థని నెలకొల్పాడు. ఆ సంస్థ వుద్దేశం గురించి చెబుతూ
శత?
“మనం సోమరిపోతులుగా వుండకుండా పరిస్థితుల్ని మరింత సానుకూలంగా పరివర్తిద్దాం దాని వల్ల కళలోని కవితాత్మక శక్తి దాని గౌరవ స్థానంలో వుండేలా చేద్దాం” అన్నాదు: దానికోసం షూమాన్ ఒక పత్రిక ప్రారంభించి ప్రచారం మొదలు పెట్టాడు అది పదేళ్ళపాటు షూమాన్ సంపాదకత్వంలో నడిచింది. ప్రపంచంలోనే ఆ రకమయిన పత్రికల్లో అది అసాధారణమైంది. జర్మన్ సంగీతం మీద ఆ పత్రిక ప్రభావం అపారం. 11666 261158606% గ౯౧౧౮9|॥ అన్న పేరు గల ఆ పత్రిక 1884 ఏప్రిల్ 4న ప్రారంభింపబడింది. సంగితం పట్ల గొప్ప (శ్రద్ధతో, ఉత్తమ సంగీతం కోసం తపిస్తూ అప్పటికి అనామకులుగా వున్న ఛోపిన్, బ్రామ్స్ తదితరులు కూడా అందులో రచనలు చేసేవాళ్ళు.
పని షూమాన్ ఉద్వేగ స్థితిని నిలకడగా వుంచింది. క్రమంగా అతనికి ఆత్మ విశ్వాసం సమకూరింది. 1884-85 మధ్య అతని సృజన తీగలు సాగింది. పియానో కోసం ౬166065 5/౧0౧౦౧|౧౮65 అన్నరచన, 04౧౫4౪౭1 అన్న రచన చేశాడు. తన అంతరిక సంక్షోభాల వల్ల ఒక స్థలం నించీ యింకో స్థలానికి తన మకాం మారుస్తూ వచ్చాడు. అట్లా మారుస్తూ 1886 నాటికి తనకు తగిన, అనుకూలమయిన ఒక యింటిని పట్టాడు. గదిలో ఒకింత ఎత్తులోని కిటికీ, కిటికీ కింద పియానో. కిటికీ గుండా సుదూర దృశ్యాలు, సుందరాకాశం, ప్రకృతి గాధంగా దర్శనమిచ్చేవి. అతని వివాహ పర్యంతం అది అతని ఇల్లుగా వుంది.
కొత్త సంక్షోభం అతని కోసం ఎదురు చూస్తోంది. అతని జీవితంలోనే అది దుర్భరమయింది. వృత్తి సంగీతకారుడుగా నిలదొక్కుకోడానికి అతను “ఇరవై ఏళ్ళపాటు' యుద్ధం చెయ్యాల్సివచ్చింది. రెందో విషయం అతను (ప్రేమించిన స్త్రీ. ఆమె వీక్ కూతురు. అతని (ప్రేమ వ్యవహారం సంగీతకారులందర్లో కెల్లా మధురమనోహరమయింది. అంతేకాదు ఎంతో బాధాకరమయింది కూడా. షూమాన్ మొదట క్లారాను కలిసినపుడు ఆమె నయసు తొమ్మిదేళ్ళు. అతని వయసు పద్దెనిమిది. సిగ్గు పడుతూ, అంతర్ముఖీనంగా వున్న ఆ చిన్నమ్మాయి మొదట ఆతని మీద పెద్ద (ప్రభావాన్ని చూపలేదు. క్రమక్రమంగా అతనామెన గుర్తించి ఆమె పియానోనైపుణ్యాన్ని ప్రశంసించాడు. ప్రదర్శనలిచ్చే స్థాయిలో తండ్రి ఆమెను 'ప్రవీణురాలిని చేశాడు. షూమాన్ రాసిన ని&0॥1009 మొదలయిన అతని రచనల్ని ఆమె పియానోపై వాయించి అతన్ని ముగ్భణ్డి చేసింది. క్రమంగా ఆమె వ్యక్తిత్వం వట్ల ఆకర్షింపబద్దాడు. ఆమెతో కలిసి చిన్న పిల్లల ఆటలు ఆదేవాడు, ఆమె కోసం కథలు చదివి వినిపించేవాదు. తన చర్యలతో ఆమెను ఆనంద పెట్టేవాడు. క్లారా తన సముఖంలో లేనప్పుడు శూన్యంలో మునిగిపోతున్నట్లు ఫీలయ్యేవాదు. క్లారా వైపు నించీ చూస్తే ఆమె పన్నెండవ శేశ్తతి
ఏట నించీ షూమాన్ను ఆరాధించింది. గంభీరంగా, బయటికి చెప్పకుండా. కానీ సంపూర్ణంగా అతన్ని ప్రేమించింది.
_అతనికి పాతికేళ్ళు, ఆమెకు పదహారేళ్ళు వచ్చే సరికి వాళ్ళు పరస్పరం (ప్రేమించుకుంటున్నారన్న సంగతి తెలిసి వచ్చింది. క్లారా తండ్రితో కలిసి ఒక సంగీత పర్యటనకి వెళ్ళాల్సి వచ్చింది. షూమాన్ వీడ్కోలు చెప్పడానికి వచ్చాడు. మేడమెట్లు దిగి ఆమె అతన్ని సాగనంపడానికి వచ్చింది. దిగుతూ షూమాన్ వెనక్కి తిరిగి ఆమె నించీ అనుమతి తీసుకోడానికి ఆమెను చూశాడు. ఆమె అనురాగం తొణికిసలాడే కళ్ళు చూసి పరశంగా ఆమెను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. “నేను స్పృహ తప్పి పదిపోయాననుకున్నాను. నాకళ్ళు బైర్లు కమ్మాయి” అని తరువాతి రోజుల్లో క్లారా చెప్పుకుంది.
కానీ ఫ్రెడరిక్ వీక్కి తన శిష్యుడికి కూతురికి మధ్య జరుగుతున్న ప్రేమను ప్రోత్సహించే వుద్దేశం ఏమాత్రం లేదు. పైగా తన అధికారాన్ని వినియోగించి వీలయినంత మేర దాన్ని చెడగొట్టడానికి ఆయన ప్రయత్నించాడు. ఆయన వుద్దేశంలో క్లారా సంగీత వృత్తి మార్గంలో ఎవరూ అడ్డంగా రాకూడదు. కారణం అప్పటికే ఆమె అనేకసార్లు ప్రతిభను (ప్రదర్శించింది. (ఫ్రెడరిక్ వీక్ ఒక వేళ పెళ్ళికి ఒప్పుకున్నా పేదవాడయిన, నరాల జబ్బున్న షూమాన్ లాంటివాణ్ణి అల్లుణ్ణిగా చేసుకోడానికి ససేమిరా అంగీకరించడు.
ఎట్టి పరిస్థితుల్లోనూ షూమాన్ని కలసుకోకూడదని, అతనో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరాదని వీక్ కూతుర్ని హెచ్చరించాడు. ఆమెను ద్రెస్దెన్ పంపాడు. షూమాన్ ఆమెను అనుసరించాడు. క్లారా అక్కడ షూమాన్ని కలసుకుంది. వీక్‌కు ఆ సంగతి తెలిసి షూమాన్ని చంపేస్తానని బెదిరించాడు. తరువాత పదిహేను నెలల పాటు క్లారా, షూమాన్ విడిగా వున్నారు. వాళ్ళు కలసుకోడానికి వీలే లేకపోయిది. కానీ వాళ్ళ మధ్య ఏమాత్రం ప్రేమ "తగ్గలేదు. పెళ్ళి చేసుకోడానికి నిశ్చయించుకున్నారు. పైగా ఆమెకు తండ్రిని ఎదిరించే వయసు కూడా వచ్చింది.
కానీ అప్పటి నించీ వీక్ ఎత్తుగడలు మారాయి. అతను షూమాన్ గురించి అబద్దాలు, అపవాదాలు కూతుర్తో చెప్పడం ప్రారంభించాడు. అతని పట్ల ఆమెకు అయిష్టం కలిగేలా చెయ్యదానికి ప్రయత్నించాడు. కానీ ఆమె మనసు మార్చలేకపోయాడు. వాళ్ళని విడదీయడానికి అతను క్రూరంగా, హింసాత్మక ధోరణిలో ప్రయత్నించాడు. అది (ప్రేమికులకు ఎంతో బాధాకరంగా పరిణమించింది. ఎంతో కాలం ఈ ఎడబాటును భరించడం కష్టమన్న నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. ఎంతో (శ్రమ కోర్చి వాళ్ళిద్దరూ క్షణ కాలంకలసుకుని, కొన్ని
శతం
మాటలు యిచ్చి పుచ్చుకుని వెంటనే భయంతో, జంకుతో విడిపోయేవాళ్ళు. ఏదో తప్పు చేస్తున్నామన్న సందేవోనికి లోనయ్యేవాళ్ళు. కొన్నిసార్లు రహస్యంగా ఉత్తరాలు యిచ్చి పుచ్చుకునేవాళ్ళు.
ఈ కష్టాలు నిండిన (ప్రేమ వ్యవహారం నాలుగేళ్ళపాటు కొనసాగింది. క్లారా ఓసారి సంగీత పర్యటనకు వెళ్ళింది. షూమాన్ తన కిష్టమయిన సంగీతకారుడయిన షూబర్ట్ రాత (ప్రతుల కోసం వియన్నా వెళ్ళాడు. అప్పుడు క్లారాకు రాసిన వుత్తరంలో “నేను నిన్నెంతగా (ప్రేమిస్తున్నానో నా మనసువిప్పే అవకాశం వస్తుంది. నిన్ను కలలో కూడా మరచిపోలేను” అని రాశాడు. దానికి బదులుగా క్లారా “నేను మళ్ళీ చెబుతున్నాను. నా ప్రేమకు వాద్దులు లేవు. నీకు నా ప్రాణం కావాలంటే ఈ క్షణంలోనే యిస్తాను” అని రాసింది.
ఇప్పుడు వాళ్ళకున్న ఒకే ఒక మార్గం చట్టం, న్యాయస్థానం. చివరికి మూమాన్ న్యాయబద్ధంగా వీక్ కూతుర్ని పెళ్ళాడడానికి అనుమతించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. వీక్‌పై కోర్టులో దావా వేశాడు. నెలల తరబడి ఆ కేసు అసహ్యంగా కొనసాగి చివరికి షూమాన్ ఆ కేసు నెగ్దాడు. 1840 సెప్టెంబరు 12న లీష్టిగ్ సమీపంలోని స్మాన్ఫీల్డ్లో షూమాన్, కారాల పెళ్ళి జరిగింది. క్లారా తన డైరీలో “మొదట బృందగానం. తరువాత సంక్షిప్తంగా వీల్డెన్సాన్ సంక్షిప్త్రవచనం జరిగింది. అతను షూమాన్ చిన్నప్పటి స్నేహితుడు. అతని మాటలు నిరాడంబరంగా, హృదయాన్ని హత్తుకునేలా వున్నాయి. ఈ కష్టాలను, కడగందడ్లను దాటుకుని మేము క్షేమంగా యిక్కడ చేరేలా చేసిన ఆ భగవంతుని పట్ల నేను హృదయపూర్వకంగా కృతజ్ఞురాలిని. ఎన్నో ఎన్నెన్నో ఏళ్ళుగా నా రాబర్ట్‌ని నా కోసం అట్టి పెట్టిన ఆయన్ని నేను కన్నీళ్ళతో ప్రార్ధించాను. స్తుతించాను. రాబర్ట్‌ని నేను కోల్పోతాను. అన్న ఒక్క ఆలోచన చాలు. నేను పిచ్చిదాన్ని కావడానికి. దైవం ఆ దురవస్థ నించీ తప్పించింది. ఎందుకంటే దాన్ని నేను తట్టకోలేను. తరువాత నెమ్మదిగా నృత్యం కొనసాగింది. హద్దులలో తొణికే ఆనందం కదిలింది. అందరి ముఖాల్లో సంతోషం, సంతృప్తి. వాతావరణం కూడా ఆహ్లాదంగా వుంది. చివరికి ఎన్నో రోజుల నించీ కనిపించకుండా దాక్కుని వున్న సూర్యుడు కూడా కనిపించి తన కిరణాల ద్వారా మాకు చర్చికి వెళ్ళే దారి చూపించాడు. మా కలయిక పట్ల ఆయన వూపిరి పీల్చుకున్నట్లున్నాడు. ఇది ఆటంకాలన్నీ కొలగిపోయిన రోజు. నా జీవితంలోని మరపురాని రోజు, ఉల్లాసకరమయిన ఈ సంఘటన ఉత్సాహంగా నా పుస్తకంలో చోటు చేసుకుంది” అని రాసింది.
కోర్టు చుట్టూ తిరగడాలతో షూమాన్ ఎంతో చిత్రవధను అనుభవించాడు. మానసికంగా నలిగిపోయాడు. ఎంతో నష్టపోయాడు. కానీ క్లారాను పెళ్ళాడిన తరువాత 5 250
1౧561 52556 లోని తన యింట్లో ఎంతో ఆనందంగా, సానుకూలంగా, అద్భుతంగా, వోయిగా, ఉల్లాసంగా కొన్నేళ్ళపాటు వాళ్ళు జీవించారు. అతని సృజనాత్మక శక్తులు పువ్వుల్లా విచ్చుకున్నాయి. క్లారా, రాబర్ట్‌ల అనుబంధం విడదీయలేనంత గాఢంగా పెనవేసుకుపోయింది. వాళ్ళ (పేమ సాటిలేనిది.
క్లారా కూడా తన తరంలోని పియానిస్టు లయిన ప్రీలలో సాటిలేనిది. అంతేకాదు గొప్ప రొమాంటిక్ కంపోజర్ కూదా. వాళ్ళ పెళ్ళయింది మొదలు షూమాన్ తన సృజనాత్మక శక్తులకు గొప్ప జవం, జీవం వచ్చినట్లు భావించాడు. కేవలం పియానోకి సంగీత రచనలు చెయ్యడంతో అతను సంతృప్తి పడలేదు. 1840లో వోకల్ మ్యూజిక్ వైపు మళ్ళాడు. సంగీత సాహిత్యంలో మరపురాని, మరవలేని ఆణిముత్యాల్లాంటి పాటలు రాశాడు. తరువాత ఆర్మెస్త్రా సంగీతం వైపు మళ్ళాడు. అక్కడి నించీ ఛాంబర్ సంగీతం వైపు వెళ్ళాడు. మూడేళ్ళలో ముప్పయి మౌలిక రచనలు చేశాడు. అవన్నీ కూడా సంగీత ప్రపంచంలో ప్రథమ స్ట్థాయిలోనివే.
షూమాన్ని ఎరిగిన వాళ్ళ పొడవుగా నెమ్మదిగా వుందేవాడని, మృదు స్వభావుడని, పెద్దతల, గుండ్రని ముఖం, అతని శరీరమంతా మెత్తదనంతో నిండి వుండేదని అంటారు. (ఫ్రెడరిక్ నిక్స్ “ఇప్పటికీ అతని రూపం కళ్ళల్లో మెదుల్తోంది. దగ్గరగా వున్న పెదాలు, (ప్రతిదాన్నీ సొంతం చేసుకుంటూ ఎక్కడో చూస్తున్న చూపులు మరచిపోలేను.” అన్నాడు. దానికి అదనంగా హెచ్. ట్రహ్న్ “అతని కళ్ళు అందమయిన నీలి రంగుని నింపుకుని వుంటాయి. మరీ పెద్దవీ కావు, చిన్నవీకావు. అతను ప్రతిదాన్నీ ఆత్మతో గాఢంగా స్వీకరిస్తున్నట్లు అవి తెలుపుతాయి. చూడ్డానికి ముడుచుకున్నట్లుంటాడు కానీ నడిస్తే నెమ్మదిగా, నిర్మలంగా నదుస్తాదు.” అన్నాడు. |
షామాన్ సెల్ఫ్ సెంటర్డ్ మాన్. సాధారణంగా గొఢమయిన ఆలోచనలో మునిగివుండేవాడు. పదిమంది మిత్రుల మధ్య వున్నా వకాంతంగా వున్నట్లుండేవాడు. గుంపులోనూ ఒక మూల కూచుని వుండేవాడు. తన చుట్టూ జరుగుతున్న దాని పట్ల అంత పట్టింపు వుండేది కాదు. ఏదయినా కెఫెకు ఒకడే వెళితే టేబుల్ని దగ్గరి గోడ దగ్గరకు జరిపి గదికి తన వీపు మళ్ళించి గోదను చూస్తూ విజిల్ వేసుకుంటూ వుండేవాడు, లేదా తనలో తనే ఏదో మాట్లాడుకునేవాడు. కెఫెకు వెళ్ళడం అతని కిష్టం. అక్కద కూచుని వైన్ తాగడం, పేపర్లు చదవడం ఇష్టం. సంగీత రచనలోని సంక్షిష్ముయిన సమస్యల్ని అక్కడి వాతావరణంలో సానుకూలంగా పరిష్కరించవచ్చని అతని నమ్మకం. ఒకే కెఫె'కు తరచూ వెళ్ళేవాడు కాడు. అలవిమీరిన శబ్దాలు. వెయిటర్ల రాకపోకలు, విపరీతమయిన సిగరెట్ పొగలు అతనికి
1852
చిరాకు. అందువల్ల అక్కడనించీ యింకో కెఫెకు మకాం మార్చేవాడు. అక్కడా అట్లాంటి పరిస్థితు లేర్చడితే మళ్ళీ మార్చు.
ఎప్పుడూ ఏదో లోకంలో వుండేవాడు. ఒక్కసారి బిల్లు చెల్లించకుండా బిధోవిన్లా. వెళ్ళిపోయేవాడు. ఒకోసారి ఏమీ తీసుకోకున్నా బిల్లు చెల్లించడానికి సిద్ధపదేవాడు. అతని తత్వం తెలిసిన వెయిటర్లు అతను బిల్లు చెల్లించుకుండా వెళ్ళిపోయినప్పుడు ఆ విల్లుల్ని క్లారాకు పంపేవాళ్ళు. అతను చెల్లించకుండా ఏదో ఆలోచించుకుంటూ వెళుతున్నా అతన్ని పిలిచి యిబ్బంది పెట్టేవాళ్ళు కారు. కొన్ని హోటళ్ళ వాళ్ళు నిజాయితీ నిండిన అతని ముఖం చూసి యింకోసారి వచ్చినపుడు బిల్లు చెల్లిస్తాడులే అనుకునేవాళ్ళు.
కంపోజర్‌గా, పత్రికా సంపాదకుడుగా వున్నప్పుడు మహాచురుకుగా వుండేవాడు. కొత్తగా లీష్టిగ్లో పెట్టిన సంగీతకళాశాలలో పియానో టీచర్‌గా, నిర్వాహకుడుగా చేరాడు. కానీ అతని ఆరోగ్యం దెబ్బ తినింది. మళ్ళీ నరాల జబ్బుతో, మానసిక విషాదంతో బాధపడ్డాడు. ధాంతో సంగీతం మీద ఏకాగ్రత నిలపడం అతనికి కష్టమయింది. 1844లో రష్యా పర్యటించి వచ్చాకా తన కార్యక్రమాలన్నిటికీ స్వస్తి చెప్పాడు. కేవలం స్వర రచన ఒక్కటి మాత్రమే చేసేవాడు. అంతకు పూర్వముండిన పరిస్థితుల్ని సంవూర్ణ్జంగా మార్చుకున్నాడు. (డైస్ దెన్కు మకాం మార్చి ఐదేళ్ళు అక్కడ ప్రశాంతంగా వుండి కొన్ని మౌలిక రచనలు చేశాడు. అతని ఆరోగ్యం కుదుటపడింది. కానీ సంపూర్ణ ఆరోగ్యం సమకూరలేదు. కానీ 18560 నాటికి దడుస్సెల్దార్భ్ నగర సంగీత నిర్వాహక పదవిని ఒప్పుకునే స్థాయిలో అతనికి ఆరోగ్యం సమకూరింది. కానీ నిజానికి ఆయన చెప్పుకో దగ్గ నిర్వాహకుడు కాడు. కానీ ఆ ఆఫీసులో ముఖ్యమయిన పని అదే. దానికి తోడు ఆయన నరాల జబ్బు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, మొదలయిన వాటివల్ల 1853లో ఆ పదవి వదులుకున్నాడు. ఆయన కేవలం సంగీతరచనకే పరిమితం కావడం మేలని అందరూ అన్నారు కూడా.
జోకిమ్ అన్న అతనికి రాసిన వుత్తరంలో షూమాన్ “చీకటి పడడం మొదలయింది" అని రాశాడు. కానీ అతని దిగుళ్ళని పోగొట్టడానికి క్లారా అనుక్షణం ప్రయత్నించింది. అతనికి వినిపించే శబ్దాలతో, సంగీత స్వరాలతో అతను అవిశ్రాంతంగా బాధపడేవాడు. అతని దిగులు మరింత మరింత గాధమయింది. చనిపోయిన గొప్ప సంగీతకారులు తన దగ్గరికి వచ్చి మధుర స్వరాల్ని తనకు బోధిస్తున్నారనేవాడు. కుర్రవాడయిన బ్రామ్స్ నించీ అతనికి కొంత ఓదార్చు దొరికింది. టామ్స్ ప్రతిభను షూమాన్ మొదట్లోనే గుర్తించాడు.
షూమాన్ '*నా సంగీతం నిశ్శబ్దంలో మునిగిపోయింది” అని రాసుకున్నాడు. 152
చలికాలంలో ఒక వర్షం పడుతున్న రోజు వీధుల్లో కార్నివాల్ సంబరాలు జరుగుతునప్పుడు రైన్ నదిలోని దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చూసిన వాళ్ళు అతన్ని రక్షించి యింటికి తీసుకెళ్ళారు. వారం తరువాత అతన్ని బాన్ దగ్గరున్న పిచ్చాసుపత్రిలో చేర్చారు. అక్కడ రెందేళ్ళున్నాడు. ఎప్పుడూ శబ్దాలు వినిపిస్తున్నాట్లు, అద్భుతాలు జరుగుతున్నట్లు భయభ్రాంతుడయ్యేవాడు. 1856 జూలై 28 రోజంతా క్లారా అతన్లో బాటు పిచ్చాసుపత్రిలో వుంది. తన డైరీలో” చిన్ని కిటికీ గుండా గదిలో వున్న అతన్ని తరచూచూసేదాన్ని అతను నరక యాతన పడ్డాడు. అతని అవయవాలన్నీ వాణుకుతున్నాయి. వదో సీరియస్‌గా మాట్లాడుకుంటున్నాడు. అయ్యో! అతన్ని విడుదల చెయ్యమని దేవుణ్ణి ప్రార్ధిస్తాను! అంతకుమించి ఏం చెయ్యగలను? ఎందుకంటే అతన్ని నా ప్రాణం కన్నా మిన్నగా 'పేమిస్తున్నాను” అని రాసుకుంది.
ఆ రోజు మధ్యాహ్నం నాలుగ్గంటలకు అతనికి “విముక్తి కలిగే సమయం వచ్చింది. నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశాడు. అది జరిగినప్పుడు అతని పక్కన ఎవ్వరూ లేరు. ముప్పయి ఒకటో తారీఖున అతన్ని ఖననం చేశారు. '(బ్రామ్స్, హిల్లర్, జోకిమ్ తదితరులు హాజరయ్యారు. అంతకు మించి అతనికి సన్నిహితులు లేరు. క్లారా తన డైరీలో “చాలా మంది జనం రావడం కూడా నాకు ఇష్టం లేదు. వచ్చిన అతని సన్నిహిత మిత్రులు ముందు వరసలో వున్నారు. నేను వెనక నిల్బున్నాా అదే మంచిది. అతనికీ అదే యిష్టమేమో! అట్లా అతన్ని సాగనంపాం. అంతే! సంతోషానికి అక్కడితో సమాప్తి” అని రాసుకుంది.
253
అలగ్జాండర్ స్కియాజన్ గీ|6%20616!/ 50/01 6-1-1872 -- 27-4-1915
అతని జీవితంలోని చివరి పదినంవత్సరాలు (స్కియాబిన్ “దర్శనిపై కేంద్రీకరించాడు. మంచి సంగీత సృష్టి గురించి పట్టించుకోలేదు. గతంలో తను సృష్టించి అద్భుత సంగీతాన్ని పక్కనే పెట్టి జీవితానికి ఉన్నత 'ప్రమాణాలున్న “తత్వాన్ని? అందివ్వడానికి ఉద్యమించాడు. "కొత్త సత్యాన్ని ఆవిష్కరించడానికి 'ప్రయత్నిస్తున్నానన్నాడు. తన దర్శనాన్ని “రహస్యం అన్నాడు. మార్శికం అన్నాడు. అది మానవజాతి ఆరంభం నించీ మానవజాతి వినాశనం దాకా వున్న మనిషి చరిత్రకు సంబంధించిన సంక్షిప్త వ్యక్తీకరణ అన్నాదు. విసృతమయిపోబోతున్న నాగరికతకు సంబంధించిన గాఢమయిన వ్యక్తీకరణే తన తత్వమన్నాడు. దాని వ్యక్తీకరణకు ఒక కొత్త భాషను తనిస్తున్నట్లు చెప్పాడు. ఆ భాషలో కవిత్వం, నాటకీయత, నృత్యం, రంగులు, పరిమళాలు యివన్నీ కలగలసి వుంటాయన్నాడు.
అతను ప్రణాలికలు వేసే కొద్దీ, స్వస్నించే కొద్దీ అది మరింత విస్తృతమయింది. తన “మార్మిక ప్రదర్భనల్ని ఇండియాలో ఒక సరస్సు ఒద్దున ఒక “విశ్వ ఆలయంలో యివ్వాలని వుద్దేశించాదు. (పేక్షకులు ఆరాధకులయి వుండాలని వాళ్ళు అంతిమ ఆనందాన్నందుకోవాలని ఆశించాడు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలుకాగానే అతను మహదానంద పడిపోయాడు. ఆ యుద్ధం వల్ల ప్రపంచ ప్రక్షాళన జరిగి ప్రపంచం తన మార్మిక బోధనలకు సిద్ధమవుతుందన్నాడు. ఈ శిధిలాల నించీ కొత్త వ్రవంచం ఆవిర్భవిస్తుందన్నాడు. దానిని తాను 'ప్రవక్త' నన్నాడు. సమస్త శక్తుల్ని సమీకరిస్తానన్నాడు.
దాన్ని గురించి చెబుతూ, ప్రణాళికలు వేస్తూ పదేళ్ళు పరిశ్రమించాడు. తూర్పుదేశాల్లో నివసించాల్సిన ఆవశ్యకత గురించి చెప్పాడు. ఒక ట్రావెల్ ఏజెన్సీ స్థాపించి యిండియాకు సంబంధించి విడిది చేయడానికి సమాచారం అందించాడు. అతని బృహత్ ప్రణాళిక అతని మరణంతో మాయమయింది.
ఇరవయ్యో శతాబ్దం మొదలు కావడంతో అతన్లో మార్మిక ఆలోచనలు మొగ్గతొడిగాయి. 'ఫిలసాఫికల్ సొసైటీ" అన్న సంస్థని స్థాపించి దానికి సిద్ధాంత పూర్వరంగాన్ని ఏర్చరచాదు. గాఢంగా నీషేను అధ్యయనం చేశాడు. 'సూపర్ మానొలో తనని తను చూసుకున్నాడు. ఫిలాసఫీ నించీ ధియోసఫీకి, అక్కడి నించీ పాంఫీయిజంకి, అక్కడి నించీ రడ
సోలిప్పిజంకి మారుతూ సృజనాత్మక అహానికి 'విశ్వజనీనత' కోసం ప్రయత్నించాడు. “నేను సృష్టి ప్రతినిధిని. నేను లక్ష్యాలకే లక్ష్యాన్ని అంతాలకు అంకాన్ని” అని చెప్పుకున్నాడు. “నిజమైన” ప్రపంచ రాజ్యం వచ్చేదాకా జీవితం నిరంతర పరివర్తనకు లోనుకావాలన్నాడు. తన లక్ష్యాలను వ్యక్తీకరించదానికే తన సంగీతం కూడా ఉపకరణం కావాలని ఆశించాడు. ఆ విషయంలో అతను విజయవంతం కాలేదు. రిమ్స్కీ అతన్ని 'సగం పిచ్చివాడు అన్నాదు. కానీ అతని తత్వం దాన్ని స్కియాబినిజం' అనేవాళ్ళు అతని సంగీతం ఇరవయ్యో శతాబ్దం మొదటి భాగంలో రష్యాని వూపేసింది. అతన్ని నమ్మిన వాళ్ళు అతన్ని ప్రవక్త అని ఆరాధించారు. అతని సంగీతాన్ని విప్లవ సంగీతమన్నారు. బోరిన్ అన్న సంగీత విమర్శకుడు” అతని సంగీతం సృజనశక్తి సారాంశం” 'అన్నాడు.
స్కియాబిన్ ది విపరీత (ప్రవృత్తి. టోపీ లేకుండా (హేట్ పెట్టుకోకుందా) తిరిగేవాడు. పారిస్‌లో అలా వెళుతూ వుంటే పిల్లలు వెంబడించి పనీపాటాలేనివాడని గేలి చేశారు. అతను తనకేదో జబ్బు వుందని ఎప్పుడూ భయపడుతూ వుండేవాడు. డాక్టరు ఇచ్చిన మోతాదుకు మించి మందులు తీసుకునేవాడు. ఎప్పుడూ చేతులకు గ్లౌజులు తొడుక్కునేవాడు. సూక్ష్మక్రిముల బారినించీ తప్పింకోడానికి అనేవాడు. ఒంటరిగా వుండాలంటే మానసికంగా భయపడేవాడు. సంగీత రచన చేసేప్పుడుకూడా ఒంటరిగా వుండేవాడు కాడు. అదే సమయంలో అందరికీ దూరంగా వుండేవాడు. “తనకీ తన చుట్టూ వున్న వాళ్ళకీ “లక్షల మైళ్ళు” దూరంలో వుందేవాడని ఒక విమర్శకుఉన్నాడు.
అలవిమీరిన ఆత్మ విశ్వాసం, తనని తాను గొప్ప చేసుకోవటం, తనని తాను “ఆరాధించడం' తన సృజనాత్మక కార్యకలాపాల ద్వారా తీవ్రంగా (ప్రభావితం కావడం అతన్లో కనిపిస్తుంది. సబనియేన్ అతను తన సొంత సంగీతాన్ని వినేప్పుడు ఎట్లా వుండేవాడో వర్ణించాడు “అతని ముఖం వికసించి వుండేది. కళ్ళు మూసుకుని వుండేవాడు. సమస్త శరీరంతో పరవశంగా అనందిస్తున్నట్లుందేవాడు. మెల్లగా కళ్ళు తెరిచి ఆకాశంలోకి ఎగిరిపోవాలన్నట్లు పైకి చూసేవాడు. ఉద్రిక్త క్షణాల్లో గాఢంగా నిట్టూర్చి చేతుల్తో కుర్చీని బలంగా పట్టుకునేవాదు.
స్క్రియాబిన్ గాధమయిన అనుభూతులుగలవాడు. విపరీతమయిన ఉద్వేగం నిండిన 'ప్రదర్శనలిచ్చేవాడు. అతని జీవితమంతా ఆ పద్ధతి కొనసాగింది.
చిన్నప్పుడు పియానోను (ప్రేమగా ముద్దు పెట్టుకునేవాడు. అది రిపేరుకు వెళితే అనారోగ్యం పాలయిన సన్నిహిత ప్రాణి కోసం అల్లాడినట్లు చలించిపోయేవాడు. కొన్నాళ్ళ తరువాత అతనికి ఛోపిన్ సంగీతమంటే మమకారం ఏర్చడింది. ఆయన సంగీతాన్ని నిరంతరం
క్షే55్
వాయించేవాడు. ఛోపిన్ని కలుసుకున్నాడు. అంతేకాదు ఛోపిన్ సంగీత రచనల్ని దిండు కింద పెట్టుకుని పడుకునేవాడు.
ప్కియాబిన్ తండ్రిపేరు నికోలస్. నికోలస్ లా స్టూడెంట్‌గా వున్నప్పుడు ఇరవయొక్క ఏళ్ళ వయసులో యవ్వనంలో వున్న ల్యాలోవ్ అన్న పియానిస్టుని (ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళ పెళ్ళయినప్పటి నించీ వాళ్ళ పరిస్థితులు ప్రతికూలంగా పరిణమించాయి. మొదట నికోలస్ తన లా చదువు మానేసి తన భార్యకు సహకరించడం మొదలు పెట్టాడు. ఆమె గర్భవతి కాగానే సహాయం కోసం తండ్రిని అర్ధించాడు. ఆమె స్క్రియాబిన్కు జన్మనిచ్చాకా పరిస్థితులు మరింత వికటించాయి. మళ్ళీ సంగీత ప్రదర్శనలు యిద్దామని ఆమె భావించేంతలో ఆమె ఆరోగ్యం క్షీణించి చికిత్స కోసం దక్షిణ టిరోల్‌కు వెళ్ళింది. అక్కడ కొన్ని నెలలుంది. క్షయ వ్యాధితో కన్నుమూసింది.
పస్కియావీన్ నాన్నమ్మ, అత్తల సంరక్షణలో పెరిగాడు. అతని తండ్రి కౌన్సలర్ సర్వీసులో చేరి కొద్దిపాటి ఆదాయాన్ని పొందేవాడు. స్కియావబిన్ని నాన్నమ్మ, అత్త ప్రేమగా పెంచారు. గారాబింగా పెంచి “చెడి పేశారు. ప్రమాదాల నుండి, అనారోగ్యాల నించీ అతన్ని రక్షించడానికి “రక్షణ వలయం'లా నిల్బారు. ఇతర పిల్లలతో అతన్ని ఆడుకోడానికి పంపేవాళ్ళు కారు. దాంతో అతను 'సమ(గ్రం'గా వాళ్ళమీద ఆధారపడ్డం అలవాటు చేసుకున్నాడు. అతన్లో బాటు ఎప్పుడూ ఎవరో ఒకరు నాన్నమ్మో, అత్తో అతని వెంట వుండేవాళ్ళు. అతను పద్నాలుగేళ్ళ వయసు వచ్చేదాకా ఒక్కడే ఒంటరిగా వీధిలోకి కూడా వెళ్ళలేదు. అందువల్లే అతను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తోడు'గా ఎవరో వుండాలి. ఎప్పుడూ ఏదో అనారోగ్యం తనని వెంటాడుతుందన్న భావానికి కూడా అతన్ని నాన్నమ్మ, అత్తలు “పునాది వేశారు.
ఐదేళ్ళ వయసులో అతన్ని ఒపేరాకు తీసుకెళ్ళారు. ఆ ఒపేరా అతనిపైన ఎంత ప్రభావాన్ని చూపిందంటే తన 'సొంతి థియేటర్ స్థాపించి డ్రామాలు ప్రదర్శించేవాడు. అతను ఎంతో గొప్ప సంగీత 'స్పృహ' కలిగినవాడు. అతని అత్త పియానోపై అతనికి కొన్ని పాఠాలు నేర్పింది. వాటిని ఎంత (శ్రద్ధగా గ్రహించాడంటే తను విన్న ఒక మిలటరీ బ్యాండ్‌ని ఓ సారి యథాతధంగా వాయించి చూపించాడు. గిటార్, వయోలిన్లు కూడా నేర్చుకుని వాయించాడు. కానీ పియానో అంటే అతనికి ఎంతో ఇష్టం. ఎప్పుడూ సంగీతాన్ని స్వేచ్చగా సాధన చేసేవాడు. సహజ సిద్ధమైన ప్రావీణ్యాన్ని సంపాదించాడు. అతను ఏదయినా సంగీత ప్రయోగాన్ని చెయ్యడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరయినా ఏదయినా సలహాయివ్వదానికి (ప్రయత్నిస్తే తీవ్రంగా వ్యతిరేకించేవాడు. అతని తొలి నాళ్ళ సంగీత విద్య, అకడమిక్ విద్య జేర్6
రెండూ లక్ష్యరహితంగా, క్రమ శిక్షణా రహితంగా కొనసాగాయి. చాలా కాలం అతను సంగీతాన్ని కూడా అభ్యసించలేకపోయాదు. పదేళ్ళవయసులో అతను పియానో వాయిస్తుంటే రూబిన్ స్టీన్ విని “ప్రతిదీ సమయాన్ని బట్టి సమకూరుతుంది. మొదట ఈ కుర్రాడు స్వేచ్చగా అభ్యసించనీ” అన్నాడు.
ప్కియాబిన్ తన ఇష్టానుసారంగానే 1882లో మిలటరీ స్కూల్లో చేరాడు. సైనికరంగంలో వుండాలన్న వుత్సాహం కొద్దీ చేరాడు. అతను బహుముఖ ప్రజ్ఞావంతుడయిన విద్యార్ధి.ప్రతిభావంళుడు. క్లాసులో అందరికన్నా ముందుండేవాడు. అంతేకాదు అతను క్లాసులో “ప్రసిదృడు' కూడా. పియానో వాయించి అందర్నీ ఆనందపెట్టేవాడు.
తరువాతి రోజుల్లో జి.ఇ. కోనస్ దగ్గర క్రమశిక్షణతో పియానో అభ్యసించాడు. అతన్ని గురించి చెబుతూ కీనస్ “బలహీనంగా, పేలవంగా, పొట్టిగా వుందేవాడు. వయసుకన్నా చిన్నవాడిగా కనిపించేవాడు. అతను రాసుకున్న రచనల సారాంశం అతనికి తెలుసు. అతని బలహీనమైన వేళ్ళతో శుభ్రంగా, సక్రమంగా పియానో మెట్లు కదిలించేవాడు. చెప్పేవి చాలా త్వరగా ఒంట బట్టించుకునేవాడు. అతని శారీరక బలహీనత వల్ల అతని సంగీత ప్రదర్శన తేలిగ్గా, వినిపించేదిగా వుందేది” అన్నాడు.
తరువాతి రోజుల్లో స్కియాబిన్ సంగీత స్వర రచనను తనియే దగ్గర, పియానో జ్వరేవ్ దగ్గర అభ్యసించాడు. స్కియాబిన్ జ్యరేవ్ యిష్టమయిన విద్యార్థి. తన యింట్లో తన స్నేపాతుల ముందు ఆదివారం సాయంత్రాలు ప్రియాబిన్ చేత సంగీత (ప్రదర్శన యిప్పించేవాదు.
ప్కియావిన్ 1885 నాటికి మిలటరీ స్కూలు నించీ బయటి కొచ్చాడు. 1886 నాటికి ఆర్మీకి సంబంధించిన ఆలోచనల్ని వాదిలేశాడు. తరువాత మాస్మోలోని సంగీత కళాశాలలో చేరి సంగీకాన్ని వృత్తిగా స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. సఫనోవ్, తనియేవ్, ఆరెన్స్క తదితరులు అక్కడ అతని వుపాధ్యాయులు. పియానో తరగతిలో ప్కియాబిన్ని సఫనోవ్ ఇతర విద్యార్థులకు ఆదర్శంగా వుండేలా తీర్చి దిద్దాడు. కానీ 'స్వర సమ్మేళని సందర్భాల్లో, సిద్ధాంత అధ్యయనాల్లో ప్క్మియావిన్ అసంతృప్తిగా వుండేవాడు. అన్నీ సులభంగా, తేలిగ్గా తీసుకునే తనియేవ్ చనువు వల్ల స్కియాబిన్ హోంవర్కులు, ఒక్కోసారి క్లాసులు ఎగ్గొట్టేవాడు. ఎవరేం చెప్పినా అన్నీ తన యిష్ట ప్రకారమే చేసేవాడు.
గొప్ప పియానిస్టు కావాలన్న తీవ్ర కాంక్షతో తను అసహ్యంచుకునే 'సాంకేతికత' పై థమించి సాధికారికత కోసం అవిశ్రాంత కృషి చేశాడు. పర్యవసానంగా అతని కుడిచేయి,
కేర్?
దాంట్లో కొన్ని కండరాలు పక్షవాతానికి లోనయ్యాయి. పరీక్షించిన వైద్యుడు అతను ఆ పక్షవాతం నించీ కోలుకోవడం అసంభవమని అతను ఎప్పటికీ సంగీత వృత్తిని చేపట్టలేడని ఖరాఖండిగా తేల్చి చెప్పేశాడు. కానీ ప్కియాబిన్ పట్టుదలగా వేళ్ళకు సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్లు చేస్తూ వచ్చాడు. దాని వల్ల అతని వేళ్ళ వెనకటి స్థితికి వచ్చి వెసులు బాటు కలిగింది. ఫలితంగా సంగీత కళాశాలలో బంగారు పతకం కోసం పోటీకి సిద్ధపడ్డాడు. అప్పటికీ అతని కుడి చెయ్యి పూర్తిగా కోలుకోక పోవడం వల్ల అతనికి బహుమతి రాలేకపోయింది. అతని సహావిద్యార్ధి ఐన రాచ్మానినోఫ్కు అతను ఎన్నో విధాల సహకరించాడు. స్నేహితుడు కూడా అతని పట్ల సానుభూతిగా వ్యవహరించకపోవడంతో సంగీత పోటీలో స్వరరచన పరీక్షకు కూడా హాజరుకాకుండా కళాశాల వదిలి వెళ్ళిపోయాడు. అతని చెయ్యి కూడా కోలుకోకున్నా సంగీత ప్రదర్శన యివ్వడానికి ప్రారంభించాడు. ఆ సంగతి గురించి ఒకరు “అతను జనం ముందు ప్రదర్శన యిస్తూ ఆరోగ్యం బాగా లేని తన ఏడి చేతి సహకారాన్ని కూడా కోరాడు” అన్నారు. ఆతను అద్భుతంగా (ప్రదర్శన చేశాడు. జనం ఆనందించి అతనికి ఆవ్వానం పలికారు. పీటర్స్‌బర్గ్‌లో జరిగిన అతని ప్రదర్శనకు హాజరయిన వాళ్ళలో సుప్రసిద్ధ ప్రచురణ కర్త బలాయియేవ్” వున్నాడు. స్కియాబిన్ రచనలతో వుత్తేజితుడయిన ఆ ప్రచురణకర్త అతనికి సంరక్షణ యివ్వాలని అనుకున్నాడు. స్కియావిన్ వచనలన్నిట్నీ ప్రచురించడానికి, అతని ప్రదర్శనల నిర్వహణకు అతను ముందుకొచ్చాడు. బలాయియేవ్ ఆధ్వర్యంలో స్క్రియాబిన్ 1895-96 మధ్య రష్యా, బెర్లిన్, పారిస్, బ్రస్సెల్స్, ఇమ్స్టర్డాం, హేగ్‌లలో జైత్రయాత్ర చేశాడు. ఘన విజయాలు సొంతం చేసుకున్నాడు. సేయానిస్టుగా, కంపోజర్‌గా కీర్తి గడించాడు. అతని విజయపరంపరల్లో ఆనందించిన బిలాయియేవ్ కొన్నేళ్ళ పాటు బహుమతి రూపకంగా సంవత్సరానికి 5600 నించి 1500 వాకా రూబుల్స్‌ని అతనికి రహస్యంగా అందే ఏర్పాటు చేశాడు. బలాయియేవ్ మరణ పర్యంతం అది కొనసాగింది, 1897లో సియాబిన్ వేరాఇసకోవిచ్ని పెళ్ళాడాడు. ఆమె సంగీత కళాశాలలో వదువుకుంది. ప్రతిభావంతురాలు. పియానో వాద్య నిపుణురాలు. వివాహానంతరం భర్తతో కలిసి సంగీత ప్రదర్శనల్లో పాల్గొనేది. అతనికి సహకరించేది. తరువాత మెల్లగా తన సంగీత వృత్తినించీ వుపసంహరించుకుని భర్త, పిల్లల అవసరాలు చూడ్డంలో మునిగిపోయింది. భార్యా నిద్దల్ని పోషించడం అంటే కష్టపడక తప్పదు. స్కియాబిన్ సంగీత కళాశాలలో వుద్యోగంలో వేరాడు. అక్కడ ఐదేళ్ళపాటు పని చేశాడు. అతనికి ఉపాధ్యాయవృత్తి అంటే యిష్టం లేదు. తారణం అతను సంగీత రచనకు కేటాయించే సమయాన్ని అది ఆక్రమిస్తుంది. 258
క్రమంగా అతనికి సంగీతం పట్ల ప్రేమ ఎక్కువ కాసాగింది. ఛోపిన్ రచనల నుండి చిన్ని చిన్న ఖండికలు తయారు చేశాడు. ఒక సింఫనీ పూర్తిచేశాడు. ఆ సింఫనీ 'ప్రదర్శించాకా మిత్రుడితో “నేనింకా ఏదో చెప్పాల్సి వుంది. నా అరోగ్యం అనుమతిస్తే నేనేం చెయ్యగలనో చేసి చూపిస్తాను” అన్నాడు.
సాహసోపేతమయిన, బృహత్తరమయిన ఆలోచనలు అతన్ని ఆక్రమించాయి. అల్లకల్లోలానికి లోను చేశాయి. అతను మార్మిక వాద ప్రభావానికి లోనయ్యాడు. రాజకుమారుడు ఎస్.ఎన్. ట్రుబేట్ స్కాయ్తో స్నేహం చేశాడు. ప్రేమ, దైవం రెండూ ఒకటే అన్న విశ్వాసానికి జీవితాంతం ఆ రాజకుమారుడు కట్టుబడిన వ్యక్తి. అయన (ప్రభావంతో సంపూర్ణ పరివర్తనకు లోనై స్క్రియావిన్ మార్మిక వాదానికి మారాడు. తన సంగీతం తన నమ్మకాల్ని ప్రతిధ్వనించాలని నిశ్చయించాడు. 1904లో "01/16 ౧0౦౧) అన్న సింఫనీ రాశాడు. అందులో ఆయన మార్మిక సిద్దాంతాలున్నాయి. అదే సంవత్సరం మే 29న ఆ సింఫనీ పారిస్‌లో ప్రదర్శింపబడి జనాల్ని తీవ్రంగా ఆకర్షించింది. రాచ్మానినోఫ్, రిమ్స్కీ గ్లాజునోవ్ తదితర సంగీతకారులు ఆ సింఫనీలో కొన్ని భాగాలు విని ఆశ్చర్యానికి, గందరగోళానికి లోనయ్యారు. 1908 డిసెంబర్ 10న న్యూయార్క్ నగరంలో వరల్డ్ ప్రీమియర్ (ప్రదర్శన జరిగింది. 1909లో రష్యాలో జరిగింది. కొంత మంది అతని మార్మిక మతంలో చేరారు. కొంత మంది సందేహించారు. బలాయియేవ్ పబ్లిషింగ్ వొస్ అతనికి గ్లింకా (మ్రైజ్ ఇచ్చింది.
స్క్రియాబిన్ వ్యక్తిగత జీవితం విప్లవాత్మక మయిన మార్పులకు లోనయింది. 1902 ప్రాంతంలో యవ్వనవతి ఐన తాతియానా అన్న పియానిస్టు ప్రేమలో పద్దాడు. దాంతో అతనికి రెండు విషయాలు తెలిసి వచ్చాయి. తనకు ముఖ్యంగా కావలసినవి యవ్వనంలో వున్న వ్యక్తులు, ఆరాధన అని. తాతియానా తన పద్దెనిమిదవ ఏట స్కియాబిన్ రచన ఒకటి వింది. “అది నా జీవితం మీద బలమైన ప్రభావం చూపింది. ఆ తరువాత నేను కేవలం స్క్రియాబిన్ రచనల్ని మాత్రమే పియానో పై వాయించాలన్న నిర్ణయానికి వచ్చాను. అంతేకాదు ఎట్లాగయినా ఆ కంపోజర్‌ని కలసుకోవాలని తపించాను” అంది. ఆమె అతన్ని కలుసుకుంది. కొంతకాలం అతన్తోపాటు సంగీత అధ్యయనం చేసింది. తరువాత సంగీతంలో తను సొంతంగా ఏదో చెయ్యాలన్న ఆలోచన వదులుకుంది. కారణం 'అతని సంగీత రచనలే మెరుగ్గా వుంటాయి' అని చెప్పింది. అతను చేసిన ప్రతి సంగీత రచనను గాఢంగా అభిమానించింది. బదులుగా కృతజ్ఞతా పూర్వకంగా అతను ఆమెపై ఆధారపడ్డాడు.
159
1904లో బలాయియేవ్ మరణంలో సంరక్షకుణ్ణి, ప్రచురణకర్తను అతను కోల్పోయాడు. నికరాదాయం లేకుండా పోయింది. తాత్కాలికంగా ఒక స్నేహితుడు వచ్చి ఆర్థికంగా తగిన వనరులు సమకూర్చి ఆదుకున్నాడు. స్కియాబిన్ రష్యా వదిలి కుటుంబంతో బాటు స్విట్టర్లాండు తరలి వెళ్ళాడు. తాతియానా కూడా తరలి వెళ్ళింది. వాళ్ళకు దగ్గరకగా నివాసమేర్చరచుకుంది. విషయాలు క్రమంగా వికటించాయి. ఒక రోజు స్కియాబిన్ భార్యతో “ఆమె మంచి కోసం ఆమెని వదిలి వెళుతున్నట్లు చెప్పాడు. *నా కళ కోసం నేను త్యాగం చెయ్యాలనుకుంటున్నాను' అన్నాడు. ఈ మధ్యకాలంలో చాలా కాలం తను తాతియానాతో కూడా కలిసి వుండలేనని తెలుసుకున్నాడు. అతని భార్య వేరా తన 'విధికి తలవొగ్గింది కానీ అతనికి విదాకులివ్వలేదు. వాళ్ళు విడిపోయాకా కూడా వాళ్ళ మధ్య మృదువుగా, మర్యాదా పూర్వకంగా వుత్తర ప్రత్యుత్తరాలు కొనసాగాయి. తరువాతి రోజుల్లో వేరా అతని పవిత్ర సిద్ధాంతాల్ని సంగీతాన్ని యూరోప్ అంతటా ప్రచారం చేసింది.
1906 శీతాకాలంలో స్కియాబిన్ అమెరికా పర్యటించాడు. డిసెంబర్ 20న న్యూయార్క్‌లో జరిగిన రష్యన్ సింఫనీ ఆర్మెస్ట్రాలో సోలోయిస్టుగా మొదటి ప్రదర్శన ఇచ్చాడు. అలా అమెరికా పర్యటన కొనసాగింది. తాతియానా వచ్చి కలిసింది. చిన్ని అపవాదు రేకెత్తింది. ఫలితఠిగా ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా వెళ్ళడానికి ఇష్టం లేక, 'నైతికి విలువలకు తలవొగ్గి పర్యటన పూర్తి కాకుండానే వాళ్ళు అమెరికా వదిలి వెళ్ళారు.
1908లో స్కియాబిన్కు శక్తివంతుడయిన సంరక్షకుడు దొరికాడు. అతను యువకుడు. మేధావి. సంగీత నిర్వాహకుడయిన సెర్జీ కౌసెవిట్జీ. అతను రష్యన్ సంగీతకారుల కోసం పబ్లిషింగ్ హౌస్ స్థాపించాడు. అతను సంగీతకారుడు, (ప్రచురణకర్త. అతనికి అతని మార్గాల్ని ప్రచారం చెయ్యడానికి ఒక సంగీతకారుడు కావాలి. స్క్రియాబిన్ వున్నాడు. వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులయ్యారు. అంగీకారం కుదిరింది. అతని సహాయం వల్ల నిలకదయిన సంవత్సరాదాయం పొందుతూ స్కియాబిన్ తన “మార్మిక వాదంలో కృషి చేశాడు.
1910లో కౌ సెవిట్జ్కీతో కలిసి వోల్లా దిగువ ప్రాంతం పర్యటించి పియానో ('ప్రదర్శనలిచ్చాడు. వాళ్ళిద్దరూ కొంతకాలం గడిచాక్సాఎవరిదారంట వాళ్ళు విడిపోయారు. కారణం యిద్దరూ “తలబిరుసు' మనుషులే. ఉద్రేక స్వభావంలో, వ్యక్తిత్వంలో ఎవరికి వాళ్ళే, వాళ్ళ (ప్రతిభపట్ల, వాళ్ళ (ప్రాముఖ్యం పట్ల వాళ్ళకు అంతులేని విశ్వాసం. కాబట్టి విడిపోవడం అనివార్యం. కానీ కౌసెవిట్జ్మీ రష్యాలో, పాశ్చాత్య ప్రపంచంలో ప్కియాబిన్ సంగీతాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు. 1911 మార్చి 5న కౌసెవిట్జ్కీ స్కియాబిన్ గొప్ప మౌలిక 160
సంగీత రచన ఐన ప్రామోథియస్ “ప్రీమియర్‌కు దర్శకత్వం వహించాడు. అది స్క్మియాబిన్ మార్మిక సిద్ధాంతానికి ప్రాథమిక అధ్యయనం లాంటిది. అప్పటి నించీ వర్ధాలు, కాంతులు సంగీతంలో కలసిపోవదం మొదలయింది. కౌసెవిట్జీ ప్రీమియర్ ప్రదర్శనలో వర్జాలు ప్రదర్శింపబడ్డాయి. మెజారిటీ (ధ్రేక్షకులు ఆనందానికి, ఆశ్చరానికి లోనయ్యారు. కొంత మందికి విపరీతమునిపించింది. మరి కొంత మంది గుసగుసలు పోయారు. పత్రికలు, మరికొంత మంది స్కియాబిన్పై తీవ్రంగా దాడి చేశాడు.
స్కియాబిన్ లండన్‌లో ప్రదర్శన యిస్తున్న సందర్భంలో పైపెదవిలో విపరీతంగా నొప్పి మొదలయింది. కానీ వైద్యంతో నిమిత్తం లేకుండానే అది తగ్గిపోయింది. మాస్మోకు తిరిగి వచ్చిన కొద్ది కాలానికి అతనిపై పెదవిపై వాపు మొదలై కండ పెరగడం మొదలయింది. జ్వరం తోదయింది. క్రమంగా ఆ వాపు ముఖమంతా వ్యాపించింది. మరణానికి ముందు ప్క్రియాబిన్ “బాధ అన్నది అనివార్యం. ఇదీ మంచిదే, బాధలోనూ నేను నిర్మలంగా అనుభూతి చెందుతున్నాను” అన్నాడు.
1915 ఏప్రిల్ 26న అతని పరిస్థితి వికటించింది. చైతన్యం కోల్పోయాడు. ఏప్రిల్27న ప్రొద్దున్న కన్నుమూశాడు. అతనికి తాతియానా ద్వారా ముగ్గురు పిల్లలు. అతని అనంతరం న్యాయస్థానం ద్వారా వాళ్ళు అతని సంతానంగా నిర్ధారింపబడ్డ్దారు.
161
జీన్ సిబలియస్ ౮౪౬౧ 51061145 ౬8-12-1865 -- 20-10-1957
సిబీలియస్ జన్మించిన దేశం ఫిన్లాండ్. అతను నిన్నా నేడూ జాతీయ హీరో. ఆయన జీవితకాలంలోనే ఫిన్లాండ్ ప్రభుత్వం ఆయన బొమ్మతో తపాలా బిళ్ళ విడుదల చేసింది. జీవించి వున్న అతన్ని ఘనంగా గౌరవించింది. అతని 75వ ఏట అతని వజ్రోత్సవాన్న్ ఘనంగా నిర్వహించడానికి దేశంలో అన్ని సన్నాహాలూ మొదలయ్యాయి. ఆయన బృహత్ శిలా విగ్రహ ప్రతిష్టాపన కోసం ప్రయత్నాలు సాగాయి. పత్రికా ముఖంగా ఆయన వ్యతిరేకత వల్ల తాత్కాలికంగా ఆ ప్రయత్నాలు ఆగాయి. ఆయన మరణానంతరం ఇరవై ఎనిమిది టన్నుల బరువున్న ఇరవై ఆరడగులు వెడల్పు, ముష్పయ్యారడుగుల పొడవయిన నైరూప్య శిల్పం అతని స్మృత్యర్థం నిర్మించబడింది. ఈలా హిట్టనిన్ అన్న శిల్పి దాన్ని నిర్మించాడు. 1967 సెప్టెంబరు 7వ అది ఆవిష్కరింపబడింది. ఫిన్లాండ్ యాభయ్యవ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆవిష్మరింపబడింది.
సివీలియస్ ఫిన్లాండ్కు సంకేతం. ఫిన్లాండ్ స్వర ప్రతినిధి, ఫిన్లాంద్ని సందర్శించిన వాళ్ళకు ఆ దేశంలో అతను ఏ స్థాయిలో వున్నాదో తెలిసి వస్తుంది. పిల్లలు వీధుల్లో అతని మెలొడీలు గానం చేస్తారు. పిల్లబక్కూడా అతని పేరు సుపరిచితం. మామూలుగా దేశే మహా నాయకుల కుండాల్సిన గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు అతని కున్నాయి. వృద్ధతరం అతని పట్ల అంతులేని గౌరవాన్ని ప్రదర్శిస్తారు,
సిబీలియస్ ఫిన్లాండులో సంగీతం. సంగీతంలో ఫిన్తాండ్. అతని సంగీతంలో అతని దేశ సంస్కృతి, నాగరికత, జనం, ప్రకృతి ప్రతిఫలిస్తాయి, ప్రతిధ్వనిస్తాయి.
జర్మనీ, అష్టియాల్లో సంగీత అధ్యయనం ముగించి అతను తన జన్మభూమికి తిరిగి వచ్చాడు. అప్పటికి ఫిన్లాండ్ రష్యా నిరంకుశపాలనలో నలిగిపోతోంది. నీకోలీ రెండు పరిపాలనలో ఫిన్లాండ్ స్వేచ్చ, స్వాతంత్రం (క్రూరంగా అణచివేయబడ్డాలూ: దేశభక్తులందర్నీ జైళ్ళలో కుక్కాడు. షతికల్ని నిషేధించారు. అణచే కొద్దీ స్వేద్భాభిలాష పొంగోో వారింది. రహస్య బృందాలు ఏర్పడి స్వేద్భి స్వాకంత్ర్యాల కోసం జనాల్లో రహస్య కార్యకలాపాలు మొదలు పెట్టాయి. జాతి గర్వాన్ని గౌరవాన్ని జనాలకు నూరిపోశాయి. తనకాలం పరిస్థితులో సగరియన్పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. తన దేశ చారిత్రక సంప్రదాయాల్ని గౌరవో
సంస్కృతిని తన సంగీతం ప్రతిఫలించాలని ఆయన భావించాడు. సుప్రసిద్ధమయిన తన దేశ పురాణం 'కలివాలా'నను విసృతంగా అధ్యయనం చేశాడు.
“బంగారు బహుమతుల్ని నేను ఆశించను, వెండి నాణాల్ని కోరాను. ఒక్కటే కోరతాను, నన్ను నా దేశానికి తీసుకెళ్ళు” అని ఆ కావ్యం మొదలవుతుంది. ఆ 'కలివాలాను ఆధారం చేసుకుని ఐదు సందర్భాలు మేళవించిన 'కుల్లేర్వో' అన్న సింఫనీ కవిత రాశాడు. హెల్సింగ్ఫోర్స్లో 1892 ఏప్రిల్ 29న ఆ సింఫనీ ప్రదర్శింపబడింది. అది అసాధారణ విజయాన్నందుకుంది. ఫిన్లాండు ప్రజలు మాటల్లో వ్యక్తీకరించలేని స్వేచ్చను సిబీలియస్ సంగీతం ద్వారా వ్యక్తీకరించాడు. కంపోజర్‌గా తన జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయానికి వచ్చాడు. .
సిబీలియన్ తండ్రి మిలటరీ దాక్టర్. చిన్ని ఫిన్నిష్ పట్టణం తవస్టీహస్లో సిబిలియస్ జన్మించాడు. సిబిలియస్ సున్నితమయిన వాడు. అన్నిట్లో సౌందర్యాన్ని సందర్భించేవాడు. కళలు, పుస్తకాలు, సంగీతం, ప్రకృతి అన్నిటితో పరవశించేవాడు. ఐదొావ యేట పియానోలో వినిపించే మధురధ్వనుల్లో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. తరువాత నాలుగేళ్ళకు పియానో ప్రాథమిక పాఠాలు అభ్యసించాడు. తరువాత కొంతకాలానికి పియానో వదిలిపెట్టి వయోలిన్‌పై ఆసక్తి చూపించాడు. మొదటి నించీ సృజనాత్మక అభివృద్ధిపైనే అతనిదృష్టి, పదేళ్ళ వయసులో స్వతంత్ర సంగీత రచన చేశాడు. వయోలిన్‌పై వాయించడానికి వుద్దేశించిన యుగళగీతం '50/005 01 ౪౭18 రాశాడు. నీటి బిందువులు పదే శబ్దాన్ని ఆధారంగా రాసిన
గీతమది. ఫిన్నిష్ మోడల్ స్కూల్లో పదకొండో ఏట చేరాడు. స్కూల్లో అతని సిగ్గు పడేతత్వాన్ని గూర్చి ఒక తోటి విద్యార్థి “పాఠాలు చెప్పేటప్పుడు వినడానికి జీన్‌కు ఆసక్తి వుండేది కాదు, కూచుని ఆలోచనల్లో మునిగి ఉండేవాడు. ఎక్కడో ఏ లోకంలోనో వుండేవాడు. ప్రశ్నిస్తే పులిక్కి పడి లోకంలోకి వచ్చేవాడు. అట్లాంటి సందర్భాల్లో మా ప్రియమైన హెడ్మాస్టర్ అతన్ని చూసి గాఢంగా నిట్టూర్చి” అయ్యో! సివిలియస్ మళ్ళీ యింకో లోకంలో వున్నాడు అనేవాడు. పదిహేనో ఏట సిబిలియస్ కొత్త వయోలిన్ టీచర్ గుస్టావ్ లావెండర్ దగ్గర చేరాడు. అప్పటి నించీ మృదువుగా, వుంటూ శ్రద్ధ కలిగిన విద్యార్థిగా మారి సంగీతంలో ప్రావీణ్యం సంపాదించాలన్న పట్టుదల పెరిగింది. దాంతోనే ఆగక లైబ్రరీలో సంగీత గ్రంథాల్ని శ్రద్ధగా అధ్యయనం చేశాడు. తను సంపాదించిన జ్ఞానం ఆధారంగా సిద్ధాంత, రూపాల అవగాహనతో కొంత ఛాంబర్ మ్యూజిక్, ఒక ట్రియో, ఒక పియానో క్యార్టెక్ రాశాడు. 263.
హైస్కూలు విద్యాభ్యాసం ముగించి హెల్సింగ్ ఫోర్స్ యూనివర్సిటీలో లా 'చదవడానికి చేరాడు. సంగీత కార్యకలాపాలతో, వ్యాపకాలతో లా చదువుని అశ్రద్ధ చేశాడు. సంవత్సరం గడిచాకా తల్లిదండ్రుల 'దయ' వల్ల ఆ చదువు వదిలిపెట్టి తన పూర్తికాలాన్ని సంగీతానికి అంకితం చేశాడు. అతని పట్ల సానుభూతి కలిగిన ఫెర్రూసియో బుసోనీ, మార్చిన్ ఏజీలియస్ తదితర సంగీతోపాధ్యాయుల ఆధ్వర్యంలో అతను అభివృద్ధి సాధించాడు. ప్రతిభావంతులయిన యువ సంగీతకారులు ఆర్మాస్, రాబర్ట్‌లతో స్నేహం కుదిరింది. కొన్ని సంగీత రచనలు చేశాడు. ఆడాల్ఫ్పాల్ సిబిలియస్ సహాధ్యాయి. భవిష్యత్తులో నవలా, నాటక రచయిత అయ్యాడు. తన మిక్రుడయిన సిబిలియస్ గురించి చిత్రణ ఇచ్చాడు “అతను ఎప్పుడూ ఎక్కడో ఆలోచిస్తున్నట్లుండేవాడు. భూమ్మీద వుందేవాడుకాడు. అతన్ది సుకుమార ప్రవత్తి. అతన్ని చూస్తే యిష్టపడతాం. చిన్ని (ప్రేరణకు కూడా అసాధారణంగా స్పందించి దాన్ని తన సంగీతంలో ప్రదర్శించేవాదు. అతని ఆలోచనలు బలమైనవి. అతని మనసు వూహల్తో నిండి వుండేది. అతని మౌొలికమయిన ఆలోచనలు మిత్రుల్ని ఆశ్చర్యపరచేవి. అందరం తాగినప్పుడెట్లా మత్తులో వుంటామో అతను మామూలుగానే అట్లావుంటాడు” అన్నాడు. ప్రభుత్వ సహకారంతో 1889లో బెర్లిన్ వెళ్ళి ఆల్బర్ట్ బెకెర్ దగ్గర చదువుకున్నాడు. అక్కడ ఒక పియానో ౧॥1౧161రాశాడు. సంవత్సరం తరువాత తాత్మలికంగా తన దేశానికి తిరిగివచ్చాడు. తన మిత్రుడి కూతురు అయినో జార్నిఫెల్స్తో ఎంగేజ్మెంటయిది. అక్కడి నించి వియన్నా వెళ్ళి కార్ల్ గోల్డ్మార్క, రాబర్ట్ ఫచ్ల దగ్గర సంగీతం అధ్యయనం చేశాడు. ఆనాడు జర్శనీ, ఆఫ్టియా దేశాల్లో ప్రసిద్ధంగా వున్న కాల్చ్బనికానంతర వుద్యమంతో 'ప్రభావితుడయ్యాడు. ఆ ప్రభావంతో కాన్ని ఆర్మెస్ట్రా రచనలు చేశాడు. వాటిని ఫిన్లాండులో ప్రదర్శించాడు. తన (ప్రాథమిక సంగీత అధ్యయనం ముగించుకుని 1891లో ఫిన్లాండు తిరిగి వచ్చాడు. కొంత మంది యువ ఫిన్లాండ్ ఆదర్భ్శవాదులో కలిసి ఒక బృందాన్ని నెలకొల్పాడు. దాని వాళ్ళని “00౧0 ౯1౧౧5 అనేవాళ్ళు. వాల్బ బలమైన దేశభక్తులు. రష్యా నిరంకుశత్వం నుండి స్వేచ్చ కోసం తపించేవాళ్ళు. అట్లాంటి ఉద్రిక్త భావాల్లో 1892లో తమ జాతీయ కావ్యమయిన గ&16౪/212 ప్రేరణతో !4116గ౧/0 అన్న రచన చేశాడు. 1892 జూన్ 10న సిబిలియస్ అయినోని పెళ్ళి చేసుకున్నాడు. హనీమూన్ ముగించుకుని హెల్సింగ్ ఫోర్స్‌లో స్థిరపడ్డాడు. సంగీత సిద్ధాంతం, స్వరకల్పన, వయోలిన్ 164
పాఠాలు చెబుతూ, సంగీత సంస్థల్లో పని చేస్తూ జీవించాడు. ఫిన్నిష్ జాతీయ తత్వాన్ని నింపుకున్న గీతాలు రాశాడు 1898 ఫిబ్రవరి 16న జరిగిన అతని ౬౧ 5202' సంగీత రచన ప్రదర్శన విఫలమయింది. కానీ దాన్ని తిరగరాసి తరువాతి రోజుల్లో ప్రదర్శించాడు. ఆ రచన అతని గొప్ప రచనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
క్రమంగా అతని కీర్తి వ్యాపించింది. శాసన సభ అతనికి వార్షిక ఆదాయాన్ని మంజూరు చేసింది. అప్పటి నించీ యితర పనులు వదిలి స్కాండినేవియా, జర్మనీ, వాలెండ్, ప్రాన్స్ తదితర దేశాలు పర్యటించి ఫిన్లాండ్ సంగీతాన్ని తన స్వీయ రచనల్ని ప్రదర్శించాడు.
సివిలియన్ 1899లో తన మొదటి సింఫనీ పూర్తి చేశాడు. 1899 ఏప్రిల్ 26న హెల్సింగ్ఫోర్స్లో అది రాబర్ట్ కాజనస్ దర్శకత్వంలో ప్రదర్శితమయింది. 1901లో ఇటలీలో ఉందగా రెండో సింఫనీ పూర్తి చేశాడు. తరువాత పాతికేళ్ళలో ఎనిమిది సింఫనీలు రాశాడు.
1901 నుండి 1905 మధ్య తీవ్రమయిన చెవి జబ్బుతో బాధపడ్డాడు. దాదాపుగా అతను వినికిడి జ్ఞానం కోల్పోయాడు. ఆ రోజుల్లోనే అతని సుప్రసిద్ధమయిన, జనాదరణ పొందిన 8156 11516 రచన చేశాడు. క్రమంగా ఆరోగ్యం కుదుట పడి వినికిడి జ్ఞానం తిరిగి వచ్చింది. 1908లో తిరిగి మరో ప్రమాదానికి లోనయ్యాడు. ఈ సారి గొంతులో గడ్డ విపరీతంగా పెరగడం మొదలయింది. దాన్ని కేన్సర్‌గా గుర్తించారు. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగి కోలుకున్నాడు. అప్పటిదాకా అతను ఆల్మాహాల్ సిగరెట్లువిపరీతంగా తాగేవాడు. కేన్సర్ వచ్చాకా వాటిని పూర్తి వదిలేవాడు. అతని అరవైలలో తనకు పూర్తిగా కేన్సర్ నించీ విముక్తి కలిగిందని తెలుసుకున్నాకా మళ్ళీ ఆల్మాహాల్, సిగరెట్లు మొదలు పెట్టాడు.
ఆ కాలం నాటి అతని సంగీత సృష్టి అతని శారీరక, మానసిక పరిస్థితులపై ప్రభావాన్ని చూపింది. తన ఆనంద, విషాద సందర్భాల్లో వాటికి అనుగుణమైన సంగీత రచనలు చేశాడు.
1914లో అమెరికా సందర్శించాడు. నార్క్ఫోక్ ఫెస్టివల్లో ప్రదర్శన యిచ్చాడు. అతని ప్రదర్శనలు విజయవంతమయ్యాయి. అమెరికా వదిలేముందు యేల్ యూనివర్సిటీ అనికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. యూనివర్సిటీ అధ్యక్షుడు “వాగ్నర్ ట్యూటానిక్ గాధకు ఎట్లాంటి రూపకల్పన చేశాడో అట్లా తన దేశమయిన ఫిన్లాండుకు చెందిన జాతీయ గాధను అంతర్జాతీయ భాష ఐన సంగీతంలోకి అనువదించాడు. అందులో ఉదాత్తత, నిరాడంబరత అగాథ కవిత్వ వ్యక్తిత్వం అసాధారణమైనవి” అన్నాడు. ”
క్షేంర్
మొదటి ప్రపంచ యుద్ధం, రష్యన్ విప్లవం వీటి ప్రభావంతో ఫిన్లాండ్లో తీవ్ర సంక్షోభం మొదలయింది. అది సిబిలియస్కు సంక్షోభం మొదలయింది. అది సిబిలియస్కు కూడా ఉద్వేగ పరిస్థితి. అతని ప్రచురణ కర్తలు జర్మనీ దేశస్థులు. యుద్ధం వల్ల అతని రాయల్టీలు ఆగిపోయాయి. ద్రవ్యోల్బణం మూలంగా ప్రభుత్వం అతనికిస్తున్న సాంవత్సరిక భృతి రాలేదు. కాపీరైట్ లాంటిదేమీ లేకపోవడంతో ప్రపంచంలో ఇతర దేశాల్లో యితర్లు ప్రదర్శించిన అతని రచనల వల్ల అతనికి రాబడి రాలేదు. సివిలియస్ తీవ్రమయిన దరిద్రంతో అల్లాదాదు. అక్కడక్కడా సంగీత పాఠాలు చెబుతూ జీవించాడు. నిజానికి సిబిలియస్కి దరిద్రమన్నది ముఖ్యమయిన సమస్యకాదు. అప్పుడే ఫిన్లాండ్ రష్యా ఆధిపత్యం నించీ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. రెడ్గార్ట్లకు, వైట్గార్ట్లకు మధ్య అంతర్యుద్ధం మొదలయింది. హత్యలు, దౌర్జన్యాలు, అదుపులేని అరాచకాలు ఫిన్లాలందడంతటా మొదలయ్యాయి. ఆ గొడవల్లో సిబిలియస్ సోదరుడయిన డాక్టర్ వృత్తిలో వున్న తను చనిపోయాడు. అధికారులు అతని యిల్లు విడిచి వెళ్ళొద్దని సిబిలియస్ని హెచ్చరించారు. కానీ నిజానికి అక్కడ కూడా భద్రత ఏమీ లేని పరిస్థితి. రెండు సందర్భాల్లో రెడ్ ఆర్మీ దళాలు అతని యింట్లో తనిఖీలు నిర్వహించి కుటుంబ సభ్యుల్ని దుర్భాషలాడాయి. సిబిలియస్ దగ్గర ఒక రివాల్వర్ వుండేది. అదృష్టవశాత్తు అది వాళ్ళ కంట పడలేదు. పడివుంటే అతని జీవితం ప్రమాదంలో పడి వుందేది. యుద్ధం ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొన్నాకా సిబిలియస్ యూరప్ దేశాలన్నీ పర్యటించి సంగీత ప్రదర్శన లిచ్చాడు. నార్వే, స్వీడన్, ఇటలీల్లో తన రచనల్ని ప్రదర్శించాడు. ఇప్పుడు అతను తన దేశానికి చెందిన జాతీయ సంగీతకారుదే కాదు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంగీతకారుడయ్యాడు. సిబిలియస్ సంగీత ప్రదర్శనలతో, పర్యటనలతో అలసిపోయాడు, విసిగిపోయాడు. 1924 నాటికి దాదొపు తన 'వృత్తి' నించీ విరమించుకుని తనకు ఇష్టమయిన 'అయినోలా' అన్న పేరున్న యింటికి చేరాడు. సంగీత రంగానికి దూరమయ్యాడు. జర్వెన్పొ అన్న చిన్ని పట్టణంలో వుండేవాడు. ప్రశాంత నిర్మల జీవితం గడుపుతూ చుట్టు పట్ల వున్న అరణ్యాలలో వాకింగ్ చేస్తూ గడిపేవాడు. బాల్కనీలో సంతృప్తిగా కూచుని సుదూర తీరాల్ని చూస్తూ గడిపేవాడు, తన యింటి దగ్గరున్న కొలను దగ్గర కూచుని ఏకాంతాన్ని ఆనందించేవాడు. తన యింటికి వచ్చే సందర్శకులతో సంతోషంగా కాలక్షేపం చేసేవాడు. ప్రపంచం నలుమూలల్నించీ ఆతని 166
అభిమానులు అతని పట్ల గౌరవంతో, ప్రేమతో అతన్ని చూడ్డానికి వచ్చేవాళ్ళు. అతన్ని చూడ్డానికి వచ్చే అభిమానుల కోరిక మేరకు రైలు అతని యింటి ముందు అగేది. సివిలియస్ కొన్ని సాయంత్రాలు పట్టణంలోని 'పబొకు వెళ్ళి యిరుగు పొరుగు వాళ్ళతో కలిసి ముచ్చట్లాడుతూ ఘటూగా వున్న మద్యాన్ని కొద్దిగా 'సేవించేవాడు. కానీ 1980 దాకా కేన్సర్ భయం పోయే దాకా సిగరెట్లు ముట్టలేదు. అప్పుడయినా ఖరీదయిన సిగరెట్లే తాగేవాదు. ఎప్పుడో కాని తన నివాసాన్ని వదిలి వెళ్ళేవాడు కాడు. అదయినా “హెల్సింగ్
- ఫోర్స్‌కు వెళ్ళడానికి మాత్రమే. అతని పట్టణానికి ఆ నగరం ఇరవై మైళ్ళ దూరంలో వుందేది. తన రచనల ప్రదర్శనలకు వెళ్ళేవాడు. వాటికన్నా ఎక్కువగా తన టైలర్‌ను కలవడానికి వెళ్ళేవాడు. ఎప్పుడూ విలువయిన, అకర్షణీయమైన, శుభ్రమయిన దుస్తులు వేసుకునేవాడు. వస్త్రధారణపై ఎంతో (శ్రద్ధ ప్రదర్శించేవాడు. చాలా జాగ్రతగా బట్టలు ఎంపిక చేసి తన కాలం నాటి ఫాషన్కు అనుకూలంగా వుందేలా చూసేవాడు. చాలా సంవత్సరాల పాటు అతను ధరించే బూట్లు బెర్లిన్ నించీ వచ్చేవి. అతని గర్వానికి, గంభీరానికి అతని బట్టతల వుదాహరణ. అతని నలభై ఏళ్ళ వయసులో అతని వెంట్రుకలు తెల్లబద్దం మొదలయింది. దాంతో తను పెద్ద వాదవుతున్నాదన్న స్పృహ అతనికి కలిగింది. ఆ కారణంగా అతను గుండుకొట్టించుకున్నాడు. జీవితాంతం అలా తల మీద ఒక్క వెంట్రుక ఛాయ కూడా పదకుండా గుండు తోనే వున్నాడు. వృద్దాప్యం మీద పదే కొద్దీ తనలో వుత్సాహం, యవ్వనం తగ్గలేదని సాధికారికంగా చెప్పేవాడు. వృద్ధాప్యంలోనూ అతను ఆరోగ్యంగా, బలంగా వుండేవాడు. తన కండర సంపద. ప్రదర్శించేవాడు. ఆనందంగా, వుల్లాసంగా వుండేవాడు. అతని బుగ్గలు ఆ వయసులోనూ ఎర్రగా వుండేవి. నల్లకళ్ళు నిగ నిగ లాడేవి. హెన్రీ అస్మోలీ అన్న వ్యక్తి అతన్ని వర్దిస్తూ “ప్రాచీన రోమన్ నాయకుడు, ఆధునిక ఇంగ్లీష్ జంటిల్మెన్ యిద్దరి కలయిక ఆయన. మానసికమయిన బెన్నత్యం, బలమైన వ్యక్తిత్వం ఆయన సొత్తు” అన్నాడు. రెండో ప్రపంచ యుద్ధంలో అతని ప్రశాంతతకు భంగం ఏర్పడింది. సోవియట్లు ఫిన్లాండును ఆక్రమించుకున్నారు. సిబిలియస్ ఆకలితో అల్లాడుతూ బాధలు పడుతున్నాదని వదంతులు వ్యాపించాయి కానీ మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు అప్పుడు లేవు. ప్రభుత్వ సహకారం, పెన్షన్ అతని అవసరాలకు, కుటుంబానికి తగినంతగా సరిపోయేది. 216/7
అతని అభిమానులయిన కొందరు ఇంగ్లాండు దేశస్థులు అతనికోసం ప్రదర్శనలు నిర్వహించి అతనికి ఆర్ధిక వనరులు సమకూరుస్తామని, భద్రంగా అతన్ని ఫిన్లాండు నుండి బయటికి తీసుకొస్తామని అంటే అతను ఆగ్రహించి వాళ్ళ ప్రతిపాదనల్ని తిరస్కరించాడు. అతను తన దేశంలోనే, తన ప్రజలతోనే వుండాలని దృఢంగా నిశ్చయించుకుని యితర్ల సానుభూతిని, సహకారాన్ని నిర్వంద్వంగా కాదన్నాడు. సోవియట్ ఆక్రమణలో యితర ఫిన్లాండు వాసుల్లాగే బాధలు పడ్డాడు. అతని యింటి మీదుగా సోవియట్ విమానాలు దూసుకెళ్ళినప్పుడల్లా బయటికి వచ్చి పైకి చూసి పిడికిలి బిగించేవాడు. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఎక్కువ సమయం కుటుంబతోనే గడిపేవాడు. చూద్దానికి వచ్చే సందర్శకులు “నిరాశకు లోనయ్యేవాళ్ళు. ప్రభుత్వ గుర్తింపులకు, ప్రజల అభినందనలకు దూరంగా (ప్రశాంత, ఏకాంత జీవితం గడిపాడు. 1951లో మాత్రం ఫిన్లాండు ప్రభుత్వం అతని సంగీతోత్సవాలు జరపడానికి కోరిపుడు ఆమోదం తెలిపాడు. ఆయన తొంభయ్యవ ఏట దేశ వ్యాప్తంగా ఆయన సంగీత ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సివిలియస్ 1957 సెప్టెంబరు 20న తన స్వగృహంలో కన్నుమూశాడు. దేశమంతా ఆయనకు నివాళులర్పించింది. సెంట్ నికొలస్ చర్చిలో సందర్శకుల దర్శనార్థం అతని శరీరాన్ని వుంచారు. వేల మంది (శ్రద్ధాంజలి ఘటిస్తూ సందర్శించారు. తరువాత అతన్ని అతని నివాసానికి తరలించారు. ఆ చిన్ని పట్టణంలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి. 168
బ్రెడిచ్ స్కెతానా 666100 5౧161102 2-3-106224 -- 12-5-1884
బొహీమియా సాంస్కృతిక జీవితంలో స్మెతానా వల్ల సంగీతం అనివార్య పార్వమయింది. బొహీమియా జాతీయ సంగీత పితగా ఆయన పిలవబద్దాద్ము అంతేకాక ఇప్పుడు మనం బొహీమియా సంగీతమని దేన్ని పిలున్తామో దాని సృష్టికర్త ఆయన. బొహీమియా సంగీతకారులకు, సంగీత సంప్రదాయాలకు పునాదులు నిర్మించిన వాడాయన.
స్మెతానా తండ్రి మాంస విక్రేత. కానీ ఆయన 'బెత్సాహిక సంగీతకారుడు. ఏడు మంది సంతానంలో స్మెతానా ఒక్కడే అబ్బాయి. చిన్నతనంలో తండ్రి కొద్దిగా కొడుక్కి సంగీతం నేర్పాడు. ఐదో వట స్మెతానా తండ్రితో, మరింకొంత మంది యితర సంగీత కారుల్లో-కలిసి హైదెన్ క్వారటెట్ ప్రదర్శనలో పాల్గొన్నాడు. ఐదో ఏట పియానో ప్రదర్శన యిచ్చాడు. ఎట్లాంటి శిక్షణా లేకుండానే ఎనిమిదో వట సంగీత రచనకు పూనుకున్నాడు.
అకడమిక్ విద్య పట్ల కూడా స్మెతానా నిర్లక్ష్యం చూపించలేదు. ఏడో ఏట నుండి పదిహేనో ఏట మధ్య జర్మన్ స్కూల్సులో విద్యాభ్యాసం చేశాడు. ఆ రోజుల్లో అది సంప్రదాయం. తరువాత ప్రాగ్ స్కూల్లో చదివాడు. ఎప్పుడూ అతను సంగీత కార్యకలాపాల్లో నిమగ్నుడయి వుండేవాడు. దాని మూలంగా అకడమిక్ విద్య వెనకపదేది. ఉన్నత కుటుంబాలకు చెందిన సంగిత ప్రియుల ఇళ్ళలో పియానో వాయించేవాడు. బొహీమియా నృత్యాలను దృష్టిలో పెట్టుకుని సంగీత రచన చేసేవాడు. “దేవుడి దయ వల్ల నేను సంగీత రచనలో మొజార్ట్‌ను, సాంకేతికతలో లిస్జ్జ్ను అవుతాను” అని చెప్పుకున్నాడు. ఆ విషయాల్ని 1848 జనవరి 23న తన డైరీలో రాసుకున్నాడు. అతని జీవిత లక్ష్యం తనని తాను సంగీతానికి సమర్చించుకోవడమే. అతనికి ఆ ఆలోచన వచ్చినప్పటికి అతనికి పందొమ్మిదేళ్ళు.
తన చిన్నతనంలోని స్నేహితురాలు, తనతో బాటు పియానో పై డ్యూయెట్లు పాడిన వ్యక్తి ఐన కాథరీనాను ప్రేమించాడు. ఆమె కూడా సంగీతం పట్ల గాఢమయిన తద్దాసక్తులు కలిగింది. ప్రాగ్లో ఆనాటి సుప్రసిద్ధుడయిన జోసఫ్ ఫోక్స్ దగ్గర పియానో అభ్యసించింది. సంగీతం మీద ఏకాగ్రత నిలపమని ఆమె స్మెతానాకు చెప్పేది. ఆమె తల్లి కూడా జోసఫ్ పోక్స్ను స్మెతానా సంగీతోపాధ్యాయుడుగా నియమించింది.
169
1848లో చేతిలో పైసా లేకుండా స్మెతానా ప్రాగ్ వచ్చాడు. సంగీత శిక్షణ పొందాడు. సాంకేతిక విషయా లభ్యసించాడు. పియానో కోసం కొన్ని రచనలు చేశాడు. 1844లో ప్రభువంశీకులయిన లియొపాల్ట్డన్ కుటుంబానికి సంగీతోపాధ్యాయుడుగా నియమితుడు కావడంతో అతను ఆర్థిక సమస్యల నుండి బయట వడ్డాదు. ఆ కుటుంబానికి సంగీతోపాధ్యాయుడుగా నాలుగేళ్ళపాటు పని చేశాడు.
ప్రాగ్లో పరిస్థితులు చూసి యువబొహీమియన్ సంగీతకారులకు శిక్షణ ఇవ్వడానికి ఒక సంగీత పాఠశాల వుండే బావుటుందని భావించాడు. దానికోసం విరాళాలు సేకరించడం ప్రారంభించాడు. అందుకోసం ఎన్నో సంగీత ప్రదర్భనలిచ్చాడు. కానీ వాటిన్నిటి ద్వారా అతను సేకరించగలిగింది అత్యల్పం మాత్రమే. దాంతో కొంత నిరాశకు గురయ్యాడు. ఆ సందర్భంలో ఫ్రాంజ్ లిస్జ్ల్ సహకారం దొరికింది. ఎన్నో ప్రయత్నాల అనంతరం 1848లో ప్రభుత్వం నించీ కూడా పాఠశాల నిర్మాణానికి అనుమతి దొరికింది. అతనికి అవసరమయిన నిధుల కోసం లిస్జ్ట్ కూడా ఎంతో సహకరించాడు. ఆ విధంగా స్మెతానా బృహత్ర్రయత్నం వల్ల ప్రాగ్లో ముఖ్యమయిన సంగీత పారశాల నెలకొల్పబడింది.
1848వ సంవత్సరం ఇతరకారణాల వల్ల కూడా స్మెతానాకు ముఖ్యమయిన సంవత్సరం. సంగీతంలో ఎన్నో ముఖ్యమయిన, విప్లవాత్మకమయిన రచనలు చేశాడు. జాతీయ రాజకీయ పరిస్థితులపై కూడా దృష్టి నిలిపాడు.
1849 ఆగస్టు 27న తన 'జీవితకాలి (ప్రేయసిని కేధరీనాను పెళ్ళాడాడు. సంవత్సరం తరువాత మాజీ ఆఫ్టియా చక్రనర్తి ఫెర్డినాండ్ - 1 దగ్గర పియానిస్టుగా ఆధికారికంగా నియమితుడయ్యాదు. అది సంతృప్తి కరమైన ఉద్యోగం. లాభదాయకమైంది. ఉత్తమమయిన ఎన్నో రచనల్ని 1850 నుండి 55 మధ్య రాశాడు. వాటిలో 1854లో ఫ్రాన్సిస్ జోసఫ్ చక్రవర్తి వివాహోత్సవాల కోసం రాసిన ఆగ్రైస్టాను వుద్దేశించిన రచన ఒకటి. దాన్ని ఆఫ్టియా జాతీయ గీతమని కూడా అంటారు. రెండోది ఒక ఎలిజీ గీతం. 1855 అతని నాలుగేళ్ళ కూతురు చనిపోయింది. ఆ విషాదాన్ని వ్యక్తీకరించే రచన అది.
1856లో స్మెతానా బొహీమియాను వదిలి స్వీడన్‌లోని గోధెన్బర్గ్లో ఐదేళ్ళ పాటు నివసించడానికి తరలి వెళ్ళాడు. తన కూతురి మరణం కుంగదీయడం వల్ల పరిసరాల మార్పు కోసం అలా చేశాడు. అక్కడ ఎందరో సుప్రసిద్ధులు అతనికి సన్నిహితులయ్యారు. ఎన్నో సంగీత ప్రదర్శన లిచ్చాడు.
1859లో మళ్ళీ తిరిగి ప్రాగ్ వచ్చాడు. కారణం ఉత్తర ప్రాంత వాతావరణం అతని భార్యకు పడలేదు. ఆమె ఆరోగ్య దృష్ట్యా ప్రాగ్ వచ్చాడు. కానీ అనారోగ్యంతో ఆమె 270
1860లో కన్ను మూసింది. అదే సంవత్సరం జులై 10న బార్చారా ఫెర్దినాండిని అన్న ఆమెను పెళ్ళాడు. స్మెతానా అంకిత భావంతో తన జాతీయ సంగీతాన్ని సంగీత సంస్కృతిని అభివృద్ధి చెయ్యదానికి శ్రమించాడు. 'కోరల్ సొసైటీకి డైర్టరయ్యాడు. కొత్త సంగీత పారశాల నిర్వహణ బాధ్యతల్ని స్వీకరించాడు. సంగీత విమర్శకుడయ్యాడు. బొహీమియన్ సంగీత బెన్నత్యాన్ని వివరించాడు. కళాకారుల సంస్థని స్థాపించడానికి సహకరించాడు. స్థానిక రంగస్థల కార్యకలాపాల్ని ప్రోత్సహించాడు. నాటక రంగస్థలాన్ని నెలకొల్పాడు. ఎన్నో వైవిధ్య పూరితమయిన కళా కార్యక్రమాలకు పూనుకున్నాడు. ఆ కారణంగానే తన దేశ సంగీతకారుల్లో అసాధారణ కీర్తి ప్రతిష్టలార్జించాడు ప్రాగ్‌లోని కెఫేలను తరచూ సందర్శించేవాడు. అతని ఆకారం, అభిరుచులు సుప్రసిద్ధమయిన ప్రాగ్ కెఫె వాసులకు బాగా పరిచితం. మధ్యాహ్నలు న్యూస్ పేపర్లు చదివేవాడు. కప్పు కాఫీనో, లేదా కొద్దిగా బ్రాందీనో తాగుతూ పేపర్లు చదివేవాడు. ఆయన చదువుకునేటప్పుడు, లేదా భోంచేసేటప్పుడు ఎవరూ ఆయన్ని డిస్ట్రబ్ చెయ్యకూడదు. ఆ సంగతి తెలిసిన స్నేహితులు, సన్నిహితులు ఆయనకు ఆ సమయంలో ఇబ్బంది కలిగించేవాళ్ళు కాదు. తినడం, పేపరు చదవడం ముగించాకా ఆయన టేబుల్ దగ్గరికి మిత్రుల్ని యితరుల్ని ఆహ్వానించేవాదు. వాళ్ళతో రాజకీయాలు, సాహిత్యం, సంగీత సందర్భాలు, చర్చలు వాదాలు చేస్తూ ఉల్లాసంగా కాలక్షేపం చేసేవాడు. చర్చల సందర్భంలో, భోజనానంతరం తృప్తిగా పొగపీలుస్తూ చర్చల్లో మునిగేవాడు. చర్చించుకునే సందర్భంలో మహాసంతోషంగా వుండేవాదు. కానీ ఎప్పుడో చీకటి పద్దాకా, ఏదైనా సంగీత ప్రదర్శన ముగిశాకా కెఫె'కు వస్తే దిగులుగ్మా ఒంటరిగా ఏదో లోకం వున్నట్లు వుండేవాడు. ఒటాకర్ వోస్టిన్స్కీ అతన్ని గురించి “నియమబద్ధంగా నిర్మలంగా, తొందర పడకుండా అతను మాట్లాడేవాడు చమత్మారం నిండిన సంభాషణల్లో చురకలు వేసేవాడు. ఏదైనా జోకును అర్ధం చేసుకోడానికి ప్రయత్నించేవాదు. ్రతివాళ్ళనీ గౌరవనీయమయిన “దూరం'లో వుంచేవాడు. కారణం తను వాళ్ళని తన “ప్రభావానికిలోను చెయ్యడం లేదని గుర్తు చెయ్యడానికే అలా చేసేవాడు మంచి మూడ్‌లో వున్నప్పుడు హృదయపూర్వకంగా నవ్వేవాడు. కొన్నిసార్లు బిగ్గరగా మాట్లాడేవాడు. కానీ ఉన్నత సంగీతకారుల గురించి, వాళ్ళ సృజన గురించి చెబుతున్నప్పుడు లీనమై మెల్లగా మాట్లాడేవాడు. వెలిగే అతని కళ్ళని పెద్దవి చేస్తూ అతని కనుబొమలు పైకి లేచేవి. అతని సమస్త ఆకారం ఉత్సాహాన్ని బలాన్ని నిర్ణయ శై/ై
దృఢత్వాన్ని నిలువెత్తున ప్రదర్శించేవి. బిధోవిన్ గురించి లేదా వాగ్నర్ లేదా బాచ్ లేదా లిస్జ్జ్ గురించి ఎవరి గురించి మాట్లాడినా అతన్లో ఆనందం వురకలెత్తేది” అన్నాదు.
బొహీయామి సంగీతాన్ని అతనెంతో అభివృద్ధి పరిచాడు ప్రత్యేకించి జాతీయ సంగీత రచనల్లో సుసంపన్నం చేశాడు 1863లో మొదటి జాతీయ బొహీమియా ఒపేరా పూర్తి చేశాడు. 1866 జనవరి 5న స్వీయదర్శకత్వంలో అది ప్రదర్శించాడు (ప్రజలలో ఉత్సాహం కలిగింది. రచన, సంగీతం జాతీయాభిమానాన్ని రేకెత్తించాయి. బొహీమియాను ట్యూటాన్లు వదిలివెళ్ళిన చారిత్రక ఘటన ఆధారంగా చేసిన రచన అది. విమర్శకులు ఆ రచనను తీవ్రంగా విమర్శించారు. వాగ్ననిర్ అనుకరించాదని వాళ్ళ ప్రధాన ఆరోపణ
విమర్శ స్మెతానాకు మనస్తాపం కలిగించింది. ఎట్లాంటి యితర ప్రభావాలకూలోను కాకుండా .సాధికారికమయిన బాహీమియా ఒపేరా నిర్మాణానికి పూనుకున్నాడు అదొక వాస్య ఒపేరా దాని పేరు [6 6416194 8౧46 అందులో జాతీయ నృత్య, జానపద స్వరాల సమ్మేళనం. వుంది.
1866 మే 30నన అది ప్రదర్శింపబడి విజయవంతమైంది 1866లో నేషనల్ ఉపేరాకు కండెక్టరయ్యాడు. 1876దాకా ఎన్నెన్నో రచనలు చేసి ప్రదర్శనలిచ్చాడు
1874లో అప్పుడప్పుడూ విపరీతంగా వచ్చే తలనొప్పుల్లో బాధపడ్డాడు. వాటి పరవసానంగా అతనికి చెవుడు ప్రాప్తించింది. మొదట చెవుల్లో ఎవరో గీ పెడుతున్నట్లు శబ్దాల్లు వచ్చేవి. ఆ అనుభవానంతరం “మొదట ఎవరో నా చెవి దగ్గర అరుస్తున్నట్లు వినిపించేది. ఏదో జలపాతం కింద తలపెట్టినట్లుండేది. చివరికి అంతా శూన్యం. నా గొంతే నాకు వినిపించడం ఆగిపోయింది. ఏకాగ్రత అన్నది నాకు అసాధ్యమయిపోయింది. నా పియానో వాదన పట్ల నాకు కేవలం 'అభిమానం' తప్ప నిజానికి దాని ధ్వనులు నాకు వినీపించేవి కావు. ఎవరేది వాయించినా వినపడేది కాదు. నా పరిస్థితుల్లో మార్పు వస్తుందన్న ఆశ నాలో లేదు; నాకు ఎట్లాంటి చెవి పోటూ లేదు. ఎట్లాంటీ జబ్బు లేదని డాక్టరు చెప్పాడు. ఎక్కడో నరాల పక్షవాతం వచ్చిందన్నాడు. కాబట్టి నా దురదృష్టాన్ని నేను జీవించినంత కాలం ఓపిగ్గా భరించక తప్పదన్న నిర్ణయానికి వచ్చాను” అని చెప్పుకున్నాడు.
తయివాత జవించినంత కాలం చెవిటితనంతో వున్నాడు. కానీ ఈ విషాదం అతని సంగీత వ్యాపకాన్ని అడ్డుకోలేదు. తనకు చెవుడు ప్రాప్తించిన మొదటి రోజే తన గొప్ప రచన ఒక జాతిని కీర్తించే రచన చేశాడు. ఆ రచన ఐదారేళ్ళ ఫలితం, అది అసాధరణ ప్రజాదరం పొందింది. 272
దాంతో బాటు తన ముఖ్యమయిన భాంబర్ మ్యూజిక్, ఆత్మకధాత్మకమయిన మరో రచన, దానికి '౯0౧ ౧౪ 118 అని శీర్షిక కూడా పెట్టాడు. వీటన్నిట్నీ రాసి ప్రదర్శించి గొప్ప జనాదరణ పొందాడు.
అతని చివరి ఒపేరా అతనికి అంతులేని నిరాశని మిగిల్చింది దాని పేరు. 16 రిఆ/1॥5 ౪2|| 1882లో మొదట అది ప్రదర్శింపబడింది. విఫలమైంది. దాంతో అతను గొప్ప విషాదానికి లోనయ్యాడు. ఆ రచన మూడో ప్రదర్శన ఆయనకు ఆర్థిక సహకారం చెయ్యడానికి యితరులు నిర్వహించారు. కానీజనం పల్చగా వచ్చారు. అంత తక్కువ జనాన్ని చూసి ఆయన ఎంతో కుమిలిపోయి “నేనింక రాయడం మానేస్తే మంచింది. బహుశా ఎవరూ నా సంగీకాన్ని వినడానికి ఇష్టపడుతున్నట్లు లేదు” అని వాపోయాడు.
ఆ సంవత్సరమే అతని నరాలు దెబ్బతిన్నాయి. మానసిక సంక్షోభాలకో, దిగుళ్ళతో కుంగిపోయాడు అవిశ్రాంతంగా రెండో స్ట్రింగ్ క్వార్టెట్ రచన చేస్తూ అందులో ఒక సందర్భంలో “దాదాపు అస్తవ్యస్త మానసిక స్థితిలో అది రాశాను అని చెప్పుకున్నాడు.
1888లో అతని మానసిక పరిస్థితి విషమించి ప్రాగ్‌లోని పిచ్చాసుపత్రిలో చేర్చారు. 1884 మే 12న అక్కడే కన్నుమూశాడు.
క్ష
పీటర్ ఇలిట్స్ చైకోవ్స్కీ ౧౭16 11100 10౧[2410౪91/ 7-5-1840 -- 6-1-1893 సువ్రసిద్ధ రష్యన్ సంగీతకారుల్లో ఎక్కువ మంది జీవితాలు విషాదంతో నిందినవే. చైకోవ్స్కీ ఒక సందర్భంలో “నేను సంతోషంగా వుండడానికి ముఖ్యమయిన కారణం నేను ఎప్పటి కప్పుడు 'అసంతృప్తిగా వుండడం మాత్రమే. లోలోపల ఒక విష కీటకం నా హృదయాన్ని రహస్యంగా అనుక్షణంకాటేస్తూనే వుంటుంది. నేను చిత్రహింసలు అనుభవించాను. వాటిని మాటల్లో పెట్టలేను.” అన్నాదు. అతని జీవితాంతం తప్పించుకోడానికి వీలుపడని భయాలు అతన్ని వెంటాడాయి కొంత కోపగించినా అతను కన్నీళ్ళ పర్యంతమయ్యేవాడు. అతనెప్పుడూ “పార” పోతూ వుండేవాడు ఎందుకో అతనికే తెలీదు కొత్త పరిసరాల్లో ప్రశాంతత కోసం ప్రయత్నించేవాడు జనం అతన్ని బాధ పెట్టేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు. అతని ప్రతి కొత్త అనుభవం, కొత్త వ్యక్తితో తాజాగా జరిగిన ప్రతి పరిచయం "కొత్త నైతిక బాధకి కారణమవుతోంది” అన్నాడు. ఐనా ఏకాంతం కూడా అతన్ని బాధపెట్టేది. వింత వింత భయాలు అతన్ని భ్రమించదేసేవి. అతని జీవితమంతా కళ్ళు చెదరగొట్టే మెరుపులకు కళవళ పదిపోయేవాడు. వాటికి భయపడి పసివాడిలా దాక్కునేవాడు. అతని 'స్వాప్నిక జీవితం' విశ్వాసపాత్రంగా డైరీల్లో రికార్డు చేశొడు' జారుడు బండలా సాగిపోయే సంఘటనలన్నాడు. తొలిరోజుల్లో ఆర్మెస్ట్రా నిర్వహించేటప్పుడు తన భుజాల నించీ జారి తన తల కిందపడి పోతుందని భయపడిపోయేవాడు. నిర్వహణ సందర్భంలో తన చుబుకాన్ని తీన ఎడంచేత్తో సట్టుకుని వుండేవాడు. ఏదో ఒక రోజు తన తల్లిలాగే తను కూదా కల జబ్బుతో కన్ను మూస్తానని అనుకునేవాడు. అట్లాగే చనిపోయాడు కూడా. వైకోవ్స్కీ బాధలన్నిటికీ పునాది అతని 'అతి సున్నిత గుణం. అది అతని “నరాల జబ్బుతో ముడిపడింది అదివారస్వతంగా వచ్చింది. అతని తాతకు ఖట్స్' వచ్చేవి. చైకోవ్సీకీ కొన్ని నరాలు దెబ్బతిన్నాయి. ఒకటైండు మార్లు తనకు పిచ్చిపడుతుందేమో అని కూడా భయపడ్డాడు. ఓ సందర్భంలో ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు. వీటన్నింటికీ మించి అతని హోమో సెక్సువల్ లక్షణం' అతన్ని విపరీతంగొ భయపెట్టి ఆ లక్షణాన్ని ఎవరయినా పసికడతారన్న భయంతో దాచి పెట్టేవాడు
మానసికంగా అతన్ని సిగ్గుపడేలా ఆ లక్షణం చేసింది ఎప్పుడూ దిగులు పడుతూవుందేలా చేసింది జనాలకి దూరంగా వుండేలా చేసింది. ఆ కారణంగా ఒక తెలివి తక్కువ పెళ్ళి చేసుకుని మొదట్లోనే భంగపడ్డాడు. ఎగుడు దిగుడుగా సాగిన అనుభవాలు, కలత పెట్టే ఉద్వేగాలు, బాధలు, దిక్కు తోచని తనం, ఆఘాతాలు వీటన్నిటి వల్ల విపరీతమయిన సంగీత సృష్టి చేశాడు. గొప్ప సంగీతాన్ని ఆవిష్కరించాడు. ఇది అద్భుతాల్లో అద్భుతం, ఆశ్చర్యాల్లో ఆశ్చర్యం ఐనా అతని జీవితాన్ని పరిశీలిస్తే అతను సంగీతాన్ని సృష్టించడం, దానికి కట్టుబడదడం ఆలస్యంగానే జరిగినట్లు తెలుస్తుంది ఇరవై రెందేళ్ళ వయసు వచ్చేదాకా అతను సంగీతానికి సర్వాత్మనా కట్టుబడలేదు అప్పటిదాకా అతను బెత్సహిక సంగీతకారుడుగా వుంటూ లా చదువుతూ వుండేవాడు మూడేళ్ళపాటు న్యాయశాఖలో వుద్యోగం కూడా చేశాడు చైకోవ్స్కీ తండ్రి పేరు ఇల్యా పెట్రోవిచ్ చైకోవ్స్కీ ఆయన లస్టినెంట్ కల్నల్‌గా వుండేవాడు ప్రభుత్వ గనుల శాఖలో సుప్రసిద్ధ ఇంజనీరుగా పని చేశాడు తల్లి పేరు అలగ్గ్జాంద్రు ఆడ్రియేవ్నా వాళ్ళకు ఏడు మంది సంతానం వైకోవ్స్కీ మూడో సంశానం మూడేళ్ళ వయసులో మొజార్ట్ గీతం విన్నాడు తరువాత దాన్ని పియానో పై వాయించడానికి (ప్రయత్నించాడు. ఐదేళ్ళ వయసులో పియానో పారాలు నేర్చుకుని సంగీత ప్రదర్శనలకు హాజరయ్యేవాడు. సంగీత అతన్ని ఉద్రేకపరిచేది సంగీత ప్రదర్శన అనంతరం పదుకోదానికి వెళ్ళే ముందు ఏదుస్తూ కనిపించాడు “సంగీతం నా మనసును వదిపెట్టదు. నన్ను ప్రశాంతంగా నిద్రపోనీదు” అన్నాడు ఈ సంఘటన అతని అసాధారణ సౌకుమార్య గుణాన్ని తెలుపుతుంది అతని ఆలనా పాలనా చూసే ఫ్రెంచి ఆయా అతని సున్నితత్వాన్ని వర్ణించింది “అతి సాధారణ విషయం కూడా అతన్ని గాయపరుస్తుంది. అతను చాలా “పల్చటి (పెళుసు) కుర్రాడు అతన్ని శిక్షించడం అసాధ్యం. కనీసం “విమర్శించి డానిక్కూడా వీలుపడదు ఏదైనా చిన్న పొరపాటు చూపిస్తే పిల్లలు సాధారణంగా ఆ విషయాన్ని మరచిపోతారు కానీ అలా చూపిస్తే అతను తీవ్రంగా గాయపడి నిరాశకు లోనవుతాడు తనంతకు త్రను వుపసంహరించుకుని పియానో వాయించడంలోనో కవిత్వం చదువుతూనో, రాస్తూనో గడుపుతాడు” అని చెప్పింది. అతని వృత్తిగా సంగీతాన్ని కాదు, లాను స్వీకరించాడు. 1850లో అతని తల్లి అతన్ని సెంట్‌పీటర్స్ బర్ల్ తీసుకెళ్ళి న్యాయ పాఠశాలలో చేర్చించింది మొదటిసారి అతను తల్లికి దూరమయ్యాడు అతనికి తల్లి అంటే ఆరాధన అప్పుడు అతని మనసుకు తగిలిన శై/ర్
గాయం నించీ అతను జీవితాంతం కోలుకోలేదు. వాళ్ళమ్మ అతన్ని అక్కడ వదిలి వెళ్ళి బండి ఎక్కి పోబోయేంతలో అతను పరిగెట్టుకుంటూ వెళ్ళి బండి చక్రాల్ని పట్టుకుని విపరీతంగా ఏడుస్తూ నానా హంగామా చేశాడు. రెండేళ్ళ తరువాత అతని కుటుంబం సెంట్ పీటర్స్ బర్గ్ వచ్చే దాకా రోజూ అతని తల్లిని అతను చూసే దాకా అతను అశాంతిగానే గడిపాడు 1854లో అతని తల్లి కలరాతో మరణించింది. అతని అశాంతి, దుఖం అతని “అంటువ్యాధిగా మారిపోయింది న్యాయ విద్య ముగించి ప్రభుత్వ న్యాయశాఖలో తన పందొమ్మిదో ఏట వుద్యోగంలో చేరాడు. మూడేళ్ళపాటు చేశాడు. అతను తన పనిపట్ల ఎంత అశ్రద్ధగా వుందేవాడంటే కొన్నేళ్ళకి తను ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నాడో కూడా అతనికి గుర్తుండేదికాదు నిర్లక్ష శంగొ వుండేవాడు లక్ష్యం లేకుండా, ఎట్లాంటి “కాంక్షలు లేకుండా వుండేవాడు. 'మంచి సమయం చిక్కితే చాలనుకునేవాడు. మార్పులేని, చలనం లేని అతని జీవితంలో చైతన్యం తెచ్చిన ఒకే ఒక సంగతి 'సంగితం' అతను తరచుగా ఒపేరాలకు వెళ్ళేవాడు మొజార్ట్ '00౧ 910౪౧౧1 గింకా 2 8 10౯116 022/ అతన్ని కదిలించాయి. ఆకర్షించాయి. పియానోను సిద్ధాంత రీత్యా అతని లా చివరి సంవత్సరంలో అభ్యసించాడు దాని అభివృద్ధికి కృషి చేశాడు సంగీత రచన ప్రారంభించాడు. 1860లో ఒక ఇటాలియన్ సాంగ్ పూర్తి చేశాడు. అది ప్రచురణ కూడా ఐంది 1861లో సంగీతం గురించి ఎప్పటికన్నా గాఢంగా ఆలోచించడం మొదలు పెట్టాడు. ఆ సంవత్సరం అతని సోదరికి రాసిన వుత్తరంలో “నేను మంద్ర స్థాయిలో సంగీత సాధన చేస్తూ దాంట్లో చెప్పుకోదగిన అభివృద్ధి సాధించాను ఏమో! ఎవరికి తెలుసు? మూడేళ్ళలో నువ్వు నా ఒపేరాలు వినవచ్చు. అందులోని పాటని పాడే అవకాశం వుండొచ్చు. నా “గౌరవనీయ మయి ప్రతిభ తో (బహుశా దీన్ని నా సొంత దబ్బాగా నువ్వు అనుకోవని ఆశిస్తున్నాను) సంగీతంలో నా భవిష్యత్తును, అదృష్టాన్ని అన్వేషించకుంటే నేనేంచేసినా వ్యర్థం” అన్నాడు. రెండోసారి రాసిన వుత్తరంలో “నాకు “వ్యక్తిత్వం” లేపోవడమన్నదే నా ఐలవైన లోపం. చివర్లో తప్పని సరిగా నా సోమరితనాన్ని 'జయించగలను అట్లా చెయ్యలేని పక్షంలో ఏదో వచ్చి నన్ను ఆదుకుంటుంది. అదృష్టవశాత్తు నాకింకా సమయముంది" అన్నాడు. నికోలస్ జరెంబా అతని టీచర్. తన టీచర్ ప్రేరణతో చైకోవ్స్కీ తన సహజమైన సోమరి తనాన్ని వదిలి ఎంతో శ్రమించాడు. కష్టపడ్డాడు 1862లో ప్రభుత్వ వుద్యోగం మానేసి కొత్తగా పెట్టిన సంగీత కళాశాలలో చేరి అక్కడ పనిచేసే జరెంబా, అన్టోన్ రూబిన్ శే
ప్టీన్ల దగ్గర సంగీత అధ్యయనం చేశాడు. అప్పుడు తను సంగీతకారుడయి తీరాలన్న సంగతి అతనికి తెలిసి వచ్చింది. “గొప్ప కళాకారుడు కావడం అన్న సంగతి తప్పు ప్రతి క్షణం యింకో ఆలోచన లేదు. నేను గొప్ప స్వరకర్తగా లేక మామూలు సంగీత కారుణ్జవుతానా! అన్నదాంతో నాకు నిమిత్తం లేదు. అన్ని సంఘటనలు, సందర్భాలూ నావే. నాకున్న సమస్తంలో దేని గురించీ తక్కువగా అంచనా వేసే స్థితే లేదు” అన్నాడు.
నిరంతర సంగీత రచనలో మునిగాదు. కొన్ని. ప్రదర్శించాడు. 0[4౧౫౮16గ960 02౧065 అన్న రచనను ఆర్మెస్ట్రా కోసం రాశాడు: 1865లో పావ్లోవ్స్కీలో ప్రదర్శితమయింది 046 16 )0) అన్న షిల్లర్ రచన ఆధారంగా చేసిన 62౧1124 (దాన్నే బిథోవిన్"కూడా ఉపయోగించాడు.) చైకోవ్స్కీకి వెండి పతకాన్ని తెచ్చి పెట్టింది. అతని స్నేహితుడు, తరువాతి రోజుల్లో ప్రసిద్ధ విమర్శకుడు ఐన హెర్మన్ లారోభీ “నువ్వు సమకాలీన రష్యన్ సంగీతకారుల్లో అసాధారణ ్రతిభాశాలివి. ఐలాకిరేవ్ కన్నా శక్తివంతుడివి, మౌలిక ప్రతిభగలవాడివి. సెరోవ్కన్నా గొప్ప సృజనశీలివి. రిమ్స్కీ కన్నా గొప్ప సంస్కారివి. నేను నీలో ఉన్నతోన్నమయిన ఆశన్మి సంగీత భవిష్యత్తును చూస్తున్నాను” అన్నాడు.
1865లో గగ్రాద్యుయేషన్ పూర్తయ్యాకా బతకడం కోసం ఏదయినా పని చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్టోన్ రూబిన్ స్టీన్ సోదరుడు నికోలస్ రూబిన్ స్టీన్ దానికి “సమాధానరంి ఇచ్చాడు. అతను అప్పుడప్పుడే మాస్కో సంగీశ కళాశాల స్థాపించాడు. దానికి సంగీతోపాధ్యాయుల అవసరం ఏర్పడింది. తన. పరిమిత వనరుల్ని అర్థం చేసుకునే సంగీతోపాధ్యాయుల అవసరం అతని కుండి హార్మన్సీ ప్రొఫెసర్ వుద్యోగానికి చైకోవ్స్కీని ఆహ్వానించాడు. నెలకు 'యాఖై' రూబుళ్ళ అత్యల్ప జీతమయినా చైకోవ్స్కీ అంగీకరించాడు: నికోలస్ రూబిన్ స్టీన్ అపార్ట్‌మెంట్‌కు చైక్వస్కీ తన నివాసాన్ని మార్చాడు. కొన్ని నెలల పాటు అతన్హో కలిసి వున్నాడు. క్రమంగా సంగీతోపాధ్యాయుడుగా తన బాధ్యతల్లో మునిగాడు. 1866 ఫిబ్రవరి 19న తన సోదరికి రాసిన వుత్తరంలో “నాకు నాకే ఆశ్చర్యంగా వుంది. నా పని విజయవంతంగా వుంది. నా జంకు, భయం అన్నీ మటుమాయ మయ్యాయి. క్రమంగా వృత్తి పరమయిన నా బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తున్నాను. నా “మానసిక విషాదం మటుమాయమైంది. .నా “మాస్కో నగరం యింకా నాకు పరాయిది లాగే వుంది. యిక్కడ వుండడానికి నిర్భయంగా ఆలోచించగలిగే సమయం యింకా రావాలి” అని రాశాడు,
వింటర్ డ్రీమ్స్ అన్న మొదటి సింఫనీ రచన మొదలు పెట్టాదు. భయం, తన శక్తి పట్ల నమ్మకం లేకపోవడం౦ అతను. రాసిన' దాని పట్ల అసంతృప్తి వీటన్నిటి వల్ల అతను తలనొప్పితో, నిద్రలేమిలో బాధపడ్డాడు. తన 'సింఫసీ' పూర్తి కాకముందే తను తప్పనిసరిగా
శా
మరణిస్తానని దృఢంగా నమ్మాడు. ఆ కారణంగా రాత్రింబవళ్ళు విపరితంగా శమించి “మరణాన్ని జయించే ప్రయత్నంలో “పరుగు” తీశాడు. ఫలితంగా నరాలు దెబ్బతిన్నాయి. వేసవి సెలవుల్లో సెంట్‌పీటర్స్ బర్గ్ దగ్గరున్న ఒక గ్రామంలో గడపడంతో అతనికి విరామం, విశ్రాంతి దొరికాయి. దాంతో అతని సింఫనీని విజయవంతంగా ముగించే అవకాశం అతనికి దొరికింది. నికొలస్ రూబిన్ప్టీన్ ఆ రచన చూసి ఇష్టపడి 1868 ఫిబ్రవరి 15న మాస్కోలో ఆ రచన ప్రీమియర్ ప్రదర్శన నిర్వహించాడు. అది ఘన విజయాన్ని సాధించింది. కాష్కిన్ అన్న అతను దాన్ని గురించి రాస్తూ అన్ని అంచనాలనూ అది తలకిందులు చేసింది, చివరికి చైకోవ్స్కీ స్నేహితుల అంచనాల్ని కూడా తలకిందులు చేసి గొప్ప విజయవంతమైంది” అని రాశాడు.
చైకోవ్స్కీ మరో ముఖ్య రచన 716 ౪01౪066 అన్న ఒపేరా 1869 ఫిబ్రవరి 11న మాస్కోలో ప్రదర్శింపబడింది. అందర్నీ అలరించి ఐదు సార్లు ప్రదర్శింపబడింది. ఇది జరిగిన పదహారు రోజుల అనంతరం చైకోవ్స్కీ ఫాంటసీ ౯14౧౧ అన్న దాన్ని నికోలస్ నిర్వహించాడు కానీ తన ఒపేరా, ఫాంటసీ లకు వచ్చిన ప్రేరణతో సంతృప్రిపదని చైకోవ్స్కీ ఆ రెండిట్నీ “నాశనం' చేశాడు. (తరువాతి రోజుల్లో అవి పునర్నిర్మింపబడ్డాయి)
తన మౌలికమయిన, గొప్ప రచనను 1870లో పూర్తి చేశాడు. అది ఆర్మెస్ట్రాల్ ఫాంటసీ 'గింగ60 2౧6 ౮460 అది బూకిరేట్ సలవి, ప్రోత్సాహాలతో నిర్మించాడు. దాన్ని నికోలస్ 1870 మార్చి 16న మాస్కోల్ నిర్వహించాడు. దాన్ని ఎవరూ “పట్టించుకోలేదు'. చైకోవ్స్కీ * నా ప్రదర్శన విఫలమైంది. ఎవరూ దాన్ని పట్టించుకోలేదు ఆ రోజు సాయంత్రమంతా ఎవరూ దాన్ని గురించి ఒక్కమాటయినా నాతో అనలేదు” అని రాశాడు. దాన్ని మళ్ళీ తిరగరాశాడు. 1879లో మళ్ళీ దాన్ని వునర్నిర్మించాడు. అది అతని అద్భుత రచనల్లో ఒకటిగా మిగిలింది.
1868లో చైకోవ్స్కీ దేసిరీ అర్జాట్ అన్న ఒపేరా గాయని ప్రేమలో పద్దాడు. లారీఛీ మాటల్లో “ఆమె అందం అసాధారణమైంది ఆమె తన ఆకర్షణతో గొప్ప గొప్ప సొందర్యాలని కూదా లొంగదీసుకుంటుంది!”
వైకోవ్స్క్ “మేము మృదువయిన అనురాగంలో గాఢంగా మునిగిపోయాం. ఒకరి హృదయాన్ని ఒకరికి యిచ్చుకున్నాం. మా అభిప్రాయాల్ని యిచ్చి పుచ్చుకున్నాం. సహజంగా “పెళ్ళి” అన్న విషయం ఎలాగూ ముందుకొస్తుంది కదా! మా యిద్దరిలోనూ అదే ఆలోచన వెఎగ్గ తొడిగింది. ఎట్లాంటి అవరోధాలూ లేకుంటే ఈ వేసవిలో మేము పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం” అని తండ్రికి రాశాడు. శతి
ఇంతలో గొప్ప మార్చు!
దెసిరీ, హరాత్తుగా మేరియానో పాడిల్లా అన్న స్పానిష్ గాయకుణ్ణి పెళ్ళి చేసుకుంది. ఆ విషయం చైకోవ్స్కీకి పెద్ద 'ఆఘాతం కలిగించినట్లు లేదు. ఆ విషయం గురించి తన సోదరుడికి రాసిన వుత్తరంలో అదంతా తమాషాగా, వోస్యాస్పదంగా వుందని రాశాడు!
అతని జీవితంలో మరి కొంత మంది స్రీలున్నారు. వాళ్ళలో ఆంటోనినా మిలియుకోవా తీవ్ర స్పందన, భావావేశంలో నిలకడలేనిది ఐన యువ సంగీత విద్యార్థిని ఆమె. ఆమె అతని ఇంటర్వ్యూ కోసం అభ్యర్థిస్తూ వుత్తరం రాసింది. ఆ సందర్భంలో ఆమె మోకాళ్ళపై కూచుని కన్నీళ్ళ పర్యంతమై జీవితాంతం అతని సేవలో తరిస్తానని అది తనకు అదృష్టంగా భావిస్తానని కోరింది చైకోవ్స్కీ “ఒక మార్మిక శక్తి నన్ను ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుణ్ణి చేసింది. ఒక రోజు సాయంత్రం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నిర్మోహమాటంగా నేనామెను (ప్రేమించలేనని, కానీ విశ్వాసపాత్రుడయిన స్నేహితుడుగా వుంటానని చెప్పాను. నా వ్యక్తిత్వం, నా అసహనం నా తత్వంలోని అనిశ్చితత్వం, అసహజత్వం, నా “ఆర్థిక స్థితిగతుల అస్తవ్యస్థ స్థితి వివరించాను అప్పుడు నన్ను పెళ్ళి చేసుకోమని కోరాను. సమాధానం సరే అని వచ్చింది, అన్నాడు.
హరాత్తుగా అతను 'పెళ్ళి' దాకా ఎందుకొచ్చాడో ఆంటోనినా పరిచయం కాకముందే తన సోదరుడికి రాసిన వుత్తరంలో 1876 సెప్టెంబర్ 22న “ఈ రోజు నించీ ఎట్లాంటి స్త్రీ ఐనా సరే నేను పెళ్ళి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను. నా అభిప్రాయాలు నా తత్వానికి వేరయినవికావు.” అని రాశాడు. మూడు వారాల తరువాత రాసిన మరో వుత్తరంలో నాకు నన్నిపాతులయిన వాళ్ళు కూడా నన్ను అవమానానికి గురి చేస్తున్నారు. వీళ్ళ నోరుమాయించాలంటే నేను పెళ్ళి చేసుకోవాలి. నా 'ప్రేమ' వీళ్ళ 'బాధికు కారణమవుతోంది” అన్నాడు
1877 జూలై 18న ఆంటోనినా'ను పెళ్ళి చేసుకున్నాడు. తొలిరోజే అది 'పీదకలగా పరిణమించింది. మొదటిసారి వాళ్ళు విడిగా వున్నప్పుడు “బిగ్గరగా” రోదించడానికి అతను సిద్ధపడ్డానని చెప్పుకున్నాడు తరువాత కొన్ని వారాలు చెప్పుకోలేని *చిత్రహింని అనుభవించాడు రాత్రిళ్ళు గంటల కొద్దీ మాస్మోవీధుల్లో తిరుగుతూ యింటికి రావడానికి “సాహసం' ప్రదర్శించలేకపోయేవాడు. అట్లాంటి ఒక రాత్రి గడ్డ కట్టిన మాస్మ్కోనదిపై నిల్చుని ఆత్మహత్యకు విఫల యత్నం చేశాడు. ఫలితంగా న్యుమోనియా వచ్చింది. చివరికి అతని సోదరుడి యింటికి వెళ్ళి సొమ్మసిల్లి పడిపోయాడు. కొద్దిగా కోలుకున్నాకా సంవత్సరం
11/79
పాటు యూరోపు పర్యటించాడు తన దారణమైన “అనుభవాలు' స్మృతుల నుండి పారిపోతూ గడిపాడు. తరువాత అతను ఆంటోనినాను చూడనే లేదు. కానీ ఆమె నించీ తప్పించుకోలేకపోయాడు. చాలా ఏళ్ళపాటు అతని బంధువుల్ని స్నేహితుల్ని అతనికి వ్యతిరేకంగా రెచ్చగొడుతూ, డబ్బుకోసం డిమాండ్ చేసేది. అతని వుత్తరాల్ని పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసేది. 1896లో ఆమెను పిచ్చాసుపత్రిలో చేర్చారు అక్కడ చివరి ఇరవై ఏళ్ళపాటు వుంది
..... ఒక వైపు చైకోవ్స్కీ ఈ 'పెళ్ళి' వ్యవహారంలో వుంటూనే అతని జీవితంలో అతి ముఖ్యమయిన (ప్రాముఖ్యం వసించిన ఒక స్త్రీ పట్ల ఆకర్షింపబడ్డాడు. ఆమె పేరు నాదెజ్దా ఫిలరెటోన్నా వాన్మెక్. అతి సంవన్నురాలయిన వితంతువు. చాలా తెలివైంది ఉల్లాసవంతురాలు. సంగీతమంటే ఆమెకు ప్రాణం. ఆమె నికోలస్ ద్వారా చైకోవ్స్కీ గురించి విని అతని సంగీతం పట్ల ఉత్సాహం (ప్రకటించింది అతని సంగీతం పట్ల గాధమయిన అనురాగాన్ని ప్రదర్శిస్తూ అతనికి వుత్తరం రాసింది. కృతజ్ఞత ప్రకటిస్తూ అతను బదులిచ్చాడు. వాళ్ళిద్దరి మధ్యా వుత్తర (ప్రత్యుత్తరాలకు అది నాంది. పదమూడేళ్ళ పాటు వాళ్ళు వుత్తరాలు రాసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యా దాదాపు రోజూ వుత్తరాలు నడిచేవి. ఆమె అభినందనల్తో అతని కృతజ్ఞతలతో అనురాగ పూరితంగా, నిత్య నవ్యంగా సాగే ప్రేమతో ఆ వుత్తరాలు నిండి వుండేవి.
ఆ పదమూదేళ్ళలో వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలసుకోలేదు! నాదెజ్డా వాళ్ళ స్నేహం కొనసాగడానికి ఎప్పుడూ వాళ్ళు వ్యక్తిగతంగా కలుసుకోకుందా వుండాలన్న షరతు పెట్టింది! దాని కోసం ప్రయత్నాలు చెయ్యొద్దని చైకోవ్స్కీని కోరింది! కలసుకుంటే కలిగే పరిణామాలు ఆమెకు తెలుసు. తన పిల్లల పట్ల వున్న బాధ్యత వల్ల ఆమె తప్పని సరిగా చైకోవ్స్మీని తిరస్కరించి వుండేది. ప్రతి సందర్భంలోనూ అతన్ని దూరంగా వుంచేది. అతని తత్వాన్ని బట్టి చైకోవ్స్కీకి ఈ “షరతులు” నచ్చాయి. అతని భావోద్వేగ జీవితానికి యిది చాలా అనుకూలంగా అనిపించింది. వాళ్ళిద్దరూ ఏదో సంగీత సమావేశంలోనో, మాస్మో వీధుల్లోనో కొద్ది సేపు కొన్ని సార్లు కాసేపు ఒకర్నొకరు చూసుకునేవాళ్ళు
ఓ సారి ఫ్లోరెన్స్‌లో ఆమె నివసించే యింటి కిటికీ కిందుగా అతన్ని నడిచి వెళ్ళమనికోరింది. అట్లా చేస్తే అతన్ని చూసే అవకాశం వుంటుందని ఆమె అభిప్రాయం. చైకోవ్స్కీ ఆమె యింటికి దగ్గర్నే యింకో యింట్లో విడిది చేసి వుండేవాడు. చివరికి ఆమె 'హద్దుల్చి చెరిపేసి అతన్ని వచ్చి తనని కలసుకోమని కోరింది. కోనీ చైకోవ్స్కీ వినయంగా “సంరక్షించే దేవతను ముఖాముఖి కలసు కూడదని" బదులిచ్చాడు.
180
పదమూడేళ్ళపాటు విలువ కట్టలేని ఆ స్నేహితురాలితో, ఆత్మీయురాలితో తన ఆశలు, కష్ట సుఖాలు అన్నీ ఆమెతో చెప్పుకున్నాడు. ఆమె అనురాగ పూరితంగా ఆతని బాధల్ని అర్ధం చేసుకుని అర్ధవంతమయిన సలహాలిచ్చేది. అతని ప్రతిభను ప్రోత్సహించేది, అభినందించేది. అతని గొప్ప సంగీత రచనలకు ప్రోత్సాహమిచ్చేది. ఆర్థికంగా ఆదుకునేది. బాధల్నించీ బయటపడేసేది. అతను హరాత్తుగా ఆంటోనినాను పెళ్ళి చేసుకోవడం ఆమెకు ఆశ్చర్యం కలిగించినా తుదిదాకా ఆ వ్యవహారంలో అతనికి సలహాలిచ్చింది. పెళ్ళి మధ్యాంతరంగా ముగిశాకా ఆ వ్యవహారంలో అతనికి సలవాలిచ్చింది. అతన్ని ఓదారుస్తూ అతనికి ప్రతి ఏటా చేసే ఆర్ధిక సాయం పెంచింది. దానివల్ల అతను స్వతంత్రాన్ని వ్యక్తిత్వాన్ని నిలుపుకునేందుకు తోద్బడింది. అతని భార్య అతన్నించీ డబ్బును డిమాండ్ చేసినపుడు దాంట్లో అధిక భాగం నాదెజ్ఞా యిచ్చింది
చైకోవ్స్కీ ఆర్థికంగా ఎంత 'స్వతంత్రు'డయినా తన సృజనాత్మక కార్యకలాపాన్ని వదల్లేదు సంగీత రచనలో మునిగాడు. యూరప్ అంతటా స్వేచ్భగా పర్యటించాడు. ఆ రోజుల్లో తన సుప్ర సిద్ధమయిన ఎన్నో సంగీత రచనలు చేశాడు.
అతని అనుదిన కార్యక్రమం గురించి అతని సోదరుని భార్య “అతను శ్రమించే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తన రోజు వారీ కార్యక్రమాన్ని క్రమబద్ధం చేసుకుంటాడు ఎనిమిది గంటలకు లేస్తాడు. తొమ్మిది గంటలకు టిఫిన్ ముగించి రష్యా పేపర్లు, ఫారిన్ పేపర్లు చదివి తరువాత వుత్తరాలు రాస్తాడు. అతను లెక్కలేనన్ని వుత్తరాలు రాసేవాడు ప్రతి వుత్తరానికీ బదులివ్వాలన్న నియమం పెట్టుకునేవాడు. కొత్తగా వచ్చిన పుస్తకాలు, వాటి సమీక్షలు చదివేవాడు. పియానో వాయించేవాడు. పగలంతా యిలా గడిచేది. ఒంటి గంటకు మధ్యాహ్న భోజనం చెట్లలో, పొలాల్లో చాలా దూరం నడిచేవాడు. అలా నడుస్తూ తన దగ్గరున్న చిన్ని నోట్‌బుక్‌లో తన స్వరకల్పనల గురించి ఆలోచించుకుంటూ నోట్ చేసుకునేవాడు. నోలుగున్నరికి టీకి వచ్చేవాడు మధ్యాహ్నం తన ఆలోచనల్లో రూపొందిన సంగీత రచనకు రూపకల్పన ఇవ్వడానికి ఐదు గంటలకు తన గదిలోకి వెళ్ళేవాడు.
రాత్రి భోజనానంతరం విశ్రాంతిగా నడిచేవాడు. అన్ని విషయాల గురించి 'ప్రాణవంతంగా సంభాషించేవాడు. చిన్నప్పటి సంగతులంటే అతనికిష్టం. అప్పట్లో తన కిష్టముయిన వాళ్ళ గురించి, తనకు ఇష్టం లేనివాళ్ళ గురించి చెప్పేవాడు తల్లి గురించి అతనికి ఎంత (ప్రేమంటే అదొక వ్యామోహం లాంటిది. యిప్పటికీ కళ్ళలో నీరు కార్చకుండా ఆమె గురించి చెప్పలేదు ఆమె సాంవత్సరీకం రోజున చర్చికి వెళ్ళేవాడు. ప్రార్ధనలు చేసేవాడు.
181
పట్టణంలో వున్నా గ్రామంలో వున్నా సాయంత్రాలు ఉల్లాసంగా గడిపేవాడు. పుట్టగొడుగుల సేకరణలో సాయంత్రాలు, అదీ ఆదివారం సాయంత్రాలు గడిపేవాడు.
బట్టలకోసం విపరీతంగా కర్చు పెట్టేవాడు పారిస్ నించీ తెప్పించేవాడు. ఖరీదయిన సుగంధ ద్రవ్యాలంటే అతనికి ఇష్టం.
సన్నిహితులు కూడా అతన్ని బాధ పెట్టేవాళ్ళు. గొప్పలు చెప్పుకోవడం, “ఆత్మ సంతృప్తి, అతనికిష్టముండేవి కావు. సంగీతం ఒక్కటే కాక అన్ని విషయాల గురించి మాట్లాద్దం అతనికి ఇష్టం” అని చెప్పింది
1881 నుండి 1888 మధ్య చైకోవ్స్కీ సంగీత రచన కన్నా విపరీతమయిన పర్యటనల్లో వుండేవాడు ఆ మధ్యలో రాసిన వేవీ అంత ముఖ్యమైనవి కావు తనేమీ రాయలేదేమో అన్న (భ్రాంతికి కూడాలోనయ్యాడు బలాకిరేవ్కి రాసిన వుత్తరంలో చిన్ని సంగీత సంబంధమయిన అభిప్రాయం కూడా నా మనసులో మొదలదం లేదు అని రోధించాడు. యింకా *నాలోంచీ సంగీత సరస్వతి లేచి దూరంగా, దూరదూరంగా వెళ్ళిపోతోందని భయపడ్డం మొదలు పెట్టాను” అన్నాడు
1818లో సింఫనీ 5 రాశాడు. కానీ అది విజయవంతం కాలేదు. అతని సింఫనీ విజయవంతం కాకున్నా అతని కీర్తి వ్యాపించింది జార్ చక్రవర్తి సెంట్న్లదిమీర్ బిరుద 'ప్రదానం చేశాడు. నాలుగేళ్ళ తరువాత ప్రభుత్వం అతనికి సాంవత్సరిక జీవన భృతి ఏర్పాటు చేసింది. 1818లో అతని రచనల ప్రదర్శన కోసం యూరోపు పర్యటించాడు. ఆ పర్యటన విజయవంతమైంది.
1890లో అతను కాకసస్లో వున్నప్పుడ్డు అతని మనసును దెబ్బ తీసేవార్త అందింది. ఆర్థిక పరిస్థితుల అస్యవ్యస్త స్థితుల కారణంగా అతనికి ప్రతి సంవత్సరం ఇచ్చే జీవనభృతిని రద్దు చేస్తున్నట్లు నాదెజ్ఞా నించీ వుత్తరం అందింది. ఆమె పరిస్థితులకు సానుభూతి ప్రకటిస్తూ తాను ఆర్థికంగా మంచి పరిస్థితిలో వున్నాని ఆమె మీద ఆధారపడక పోయినా యిబ్బంది లేదని బదులిచ్చాడు. ఐనా తమ స్నేహం కొనసాగుతుందన్న ఆశని వ్యక్తపరిచాడు. అతని వుత్తరానికి సమాధానం రాలేదు. ఆమె గురించి యితరులకూ వుత్తరాలు రాశాడు. వాటికీ బదుల్లేదు. అతను మాస్కాకు తిరిగివచ్చాకా నాదెజ్ఞా పరిస్థితుల్లో మార్చులేదని, అతనితో స్నేహానికి పరిసమాప్తి చెప్పడానికి ఆమె వుద్దేశించిందని తెలిసింది అతని వుత్తరాలతో ఆమె విసిగిపోయింది. అతను హోమోసెక్స్వల్ అని తెలిసి “షాక్ తింది. అతనికి దూరం కావడమే మేలని నిశ్చయించిందామె. ఆమె నిర్ణయం అతన్ని కుంగదీసింది. 182
1891లో చెకోవస్కీ మొదటిసారి అమెరికాలోని తూర్పు నగరాలు పర్యటించాడు. మే 5న న్యూయార్క్‌లో ప్రదర్శన యిచ్చాడు. అమెరికా అతనికి వుత్తేజున్నిచ్చింది. అతని సంగీతం అక్కడ చాలా మందికి వరిచితమని తెలిసి, అతనికి ఎంతో మంది అభిమానులుండడం చూసి ఆతని ఆనందానికి అంతులేదు. కానీ అతన్లో దిగులు కదిలేది. ఒక్కోసారి కన్నీళ్ళు కదిలేవి. అతనికి 'యింటిబెంగ' పట్టుకుంది. “అమెరికా సంప్రదాయాలు, కట్టుబాట్లు సాధారణంగా నాకు ఇష్టమైనవే యివన్నీ ఆకలి లేకుండా, గ్యాస్‌తో బాధపడుతూ వున్న మనిషి వ్యవహారంలా తోస్తుంది అమెరికా వదిలి రష్యా వెళ్ళాలన్న ఆలోచనే నాకు ఆకలి తెప్పిస్తుంది" అన్నాడు. రష్యాకు తిరిగి వస్తూనే అతని బాధ మరింత ఎక్కువైంది. తనకు పిచ్చి పడుతుందేమో అని భయపడిపోయాడు. యాఖై ఒక్క సంవత్సరాలకే డెబ్బయి ఏళ్ళు వచ్చినట్లు దిగులు పడ్డాడు.
తన చివరి సింఫనీ రాసినప్పటి అతని పరిస్థితి అది. ఆందులో తన నిరాశని నింపాడు 1893 అక్టోబరు 28న అతని చివరి సింఫనీ ప్రీమియర్ (ప్రదర్శన జరిగింది. అంతగా విజయవంతం కాలేదు. అదే సంవత్సరం నవంబర్ 18న నెప్రావ్నిక్ దర్శకత్వంలో అది (ప్రదర్శింపబడి ఘన విజయాన్ని పొందింది అంతే కాదు అది మొదలు అది ఎక్కడ ప్రదర్శింపబడినా తిరుగు లేని విజయాన్ని పొందింది.
1893 నవంబరు నెలలోనే కాచని నీరు తాగడం వల్ల అతని కడుపు నొప్పి వచ్చి కలరా' లక్షణాలు కనిపించాయి. చైకోవ్స్కీ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని వదంతులు పుట్టాయి. అతనికి ఇన్ఫెక్సనయింది. జ్వరం ఎక్కువైంది. అతను స్పృహలో లేని స్థితిలోనూ నాదెజ్ఞా పేరు కలవరించేవాదు. యింకా ౧0103౫8124 అన్న పదాన్ని పలికే వాడని తరువాతి రోజుల్లో మిత్రులు చెప్పారు. అంటే “తనని వంచించిన వ్యక్తి అని అర్థం.
మోదెస్టీ అతని పరిస్థితి వివరిస్తూ, పీటర్" హరాత్తుగా కళ్ళు తెరిచాడు. అనంత చైతన్యం, అవర్షనీయమయిన అభివ్యక్తి అతని కళ్ళలో కనిపించింది. చూపుల్ని గదంతా తిప్పాడు. తరువాత తనకు దగ్గరగా వున్న ముగ్గురి మీద నిలిపాడు. తరువాత 'స్వర్గం' కేసి చూశాడు. అతని కళ్ళ నించీ సాగిన కాంతి అతని శ్వాసని తీసుకుని అనంత వాయువుల్లో లీనమైంది” అన్నాడు.
అతని అంతిమయాత్ర ఘనంగా జరిగింది. జనం అరమైలు పొడవున బారులు తీరారు. రష్యా నలుమూలల నించీ పూలు, (తద్ధాంజలులు వెల్లువెత్తి వచ్చాయి.
1894 జనవరి 13న నాదెజ్ఞా వాన్ మెక్ జర్మనీలో కన్నుముసింది.
183
రిచర్ట్ వాగ్నర్ ౧1002160 /20౧61 22-5-1813 -- 13-2-1663 వాగ్నర్ ఇరవై రెందేళ్ళ వయసులో పెద్ద నోట్‌బుక్ ఒకటి కొని తన జీవితానికి సంబంధించిన చిన్న వివరాలతో సహా రికార్డు చేసి పెట్టాడు కారణం భవిష్యత్తులో ఆత్మ కధ రాయడానికి అవి ఉపయోగపడతాయని ఆయన వుద్దేశం అప్పటికాయన చిన్ని పట్టణంలోని ఒపేరా వొస్లో నిర్వాహకుడు “ఇంకా రాయని” రెండు ఒపేరాల రచయిత మాత్రమే కానీ తన '“విధి మారుతుందని, తను అసాధారణ వ్యక్తిగా గుర్తింపు పొందుతానని ఆయన నమ్మకం ఆయన ఆత్మకధ రాయడానికి అవసరమయినన్ని నాళ్ళు జీవించాడు ఆ ప్రాధమిక నత్యాన్ని అంగీకరించడానికి, ఆ సత్యం జనామోదం పొంది, అందరూ అంగీకరించడానికి అవసరమయినన్ని నాళ్ళు జీవించాడు ఆయన మవాీ సంగీతకారుడుగా మన్నన లందుకున్నాడు గొప్ప నాటక కర్తగా, గొప్పకవిగా, తన తరంలోని మవామేధావిగా కీర్తి ప్రతిష్ట లార్జించాడు. తరువాతి రోజుల్లో ఆయన “యితర్లని తన స్థాయిలో ఎప్పుడూ పోల్పుకునేవాడు కాడు. ఆయన ప్రతిభాగర్వం 'అద్వితీయమైంది అందరూ ఆయన “ఎదుగుదలకు సోపానాలుగా మారదానికే ఇస్టపర్డాడు నిజానికి అది ఆమోదయోగ్యం కాదు కానీ ఆ విషయంలో ఆయన గొప్పతనాన్ని 'ఫీలయ్యేవాడు అసాధారణ గర్వం, ఆత్మస్తుతి ఆయన సొత్తు. తన స్థాయికి సంబంధించి ఆయనకు 'ందేహం' లేదు భవిష్యత్తులో బహిరంగమయిన అతని లక్షణాలు చిన్నప్పుడే మొగ్గ తొడిగాయి _వత్యేకించి నిర్ణయ, అసాధారణ స్వార్ధం, ఆటంకాల్ని లక్ష శ్రీ పెట్టకుండా ముందుకు దూసుకెళ్ళడం, ఎవర్నీ దేన్నీ లెక్కపెట్టనితనం అతని “ప్రత్యేక లక్షణాలు తరువాతే అతని బృహత్ ప్రతిభ ఆవిష్కారమయింది వాగ్నర్‌కు సంగీత పూర్వరంగమేమీ లేదు అతని తండ్రీ కార్ల ఫెదరిక్ వాగ్నర్లీష్టిగ్లో వోల్రీస్సు ఆఫిసర తల్లి జోహన్నా బ్రెడ్డు తయారు చేసేది. యిద్దరికీ సంగీతం గురించి ఏమీ తెలీదు. వాగ్నర్ పూర్వరంగాన్ని గురించి పరిశోధనలు చేశారు. ఇఠవయ్యో శతాబ్దం మొదట్లో జరిగిన పరిశీలనల్ని బట్టి, ఆధారాల్ని బెట్టి అతని తండ్రి పోలీస్సు అధిక్షారి కాదని, నటుడు లుడ్విగ్ గేయర్ అని నిర్ధారించారు గేయర్ వాళ్ళ కుటుంబానికి స్నేహితుడు ఆ విధంగొ గ!
జోహన్నాకు సన్నిహితుడు. కార్ల్ ఫ్రెడరిక్ 1818 నవంబరు 2న చనిపోయాడు అప్పుడు వాగ్నర్ వయసు ఆరు నెలలు గేయర్ ఆ కుటుంబ బాధ్యతలు స్వీకరించాడు జోహన్నా, వాగ్నర్ అతని సంరక్షణ కిందకు వచ్చారు అదే సంవత్సరం గేయర్ జోహన్నాను పెళ్ళి చేసుకున్నాడు వాళ్ళ కూతురు కాసిలీ పుట్టడానికి ఆరు నెలల ముందు పెళ్ళి చేసుకున్నారు. వాగ్నర్ పట్ల గేయర్ (ప్రేమ అనురాగాల్ని బట్టి గేయర్కు అచ్చు గుద్దినట్లు వాగ్నర్ వుండడాన్ని బట్టి వాగ్నర్ తండ్రి గేయర్ అని నిర్ధారించారు తరువాతి రోజుల్లో వాగ్నర్ యింట్లో గేయర్ ఫోటో వేలాడదీయబడి వుండేది. అది అచ్చం వాగ్నర్లా వుండేది తన సవతి సోదరి కాసిలీకి రాసిన వుత్తరంలో వాగ్నర్ గేయర్‌ని వుద్దేశించి మన “నాన్న అని రాశాడు ఈ ఆధారాల్ని బట్టి వాగ్నర్ తండ్రి గేయర్ అని అందరూ నిర్ణయించారు. వాగ్నర్ తండ్రి గేయర్ అవునా కాదా? అని మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ గేయర్ యూదు అని తెలిసిన తర్వాత అందరూ ఆవిషయం పట్ల 'ఆసక్తి' ప్రదర్శించారు. ఎందుకంటే వాగ్నర్ యూదు మతస్టుడి కొడుకని. ఆ ఆధారాల్ని బట్టి తెలుస్తోంది కాబట్టి యూదులకు వ్యతిరేకంగా ఉద్యమించి 'నాజీలు 'వాగ్నరోని గొప్పగా కీర్తించారు. ఈ వ్యవహారం గొప్ప వైరుధ్యాలకు ఆస్మారమైంది కానీ గేయర్ యూదు అనడానికి కానీ, అతని పూర్వీకుల్లో “యూదు రక్తం ప్రవహించిందని చెప్పడానికి దాఖలాలు లేవు. వాగ్నర్ ప్లీ" గేయర్ ప్రభావం అపారం గేయర్ నటుడే కాదు గొప్ప సాహిత్య (ప్రేమికుడు, రచయిత, చిత్రకారుడు అతని యింటిని సాంస్కృతిక సౌరభాలతో నింపేవాడు. అట్లాంటి ఉత్తేజకరమయిన పరిసరాల్లో వాగ్నర్ తొలినాళ్ళ బాల్యం గడిచింది. వాగ్నర్‌కు ఎనిమిదేళ్ళ వయసున్నప్పుడు గేయర్ మరణించాడు కానీ అప్పటికే అతను వాగ్నర్ హృదయంలో కళాబీజాలు నాటాడు అవి ఫలించడం ప్రారంభించాయి. వాగ్నర్‌కి మొదట సంగీతం కన్నా సాహిత్యమంటే యిష్టం క్రూజ్ స్కూల్ అన్న ఉపాధ్యాయుని శిష్యరికంలో తొమ్మిదేళ్ళ వయసులో గ్రీకు సాహిత్యాన్ని మూలభాషలోనే అభ్యసించాడు. షేక్స్పియర్ పట్ల ఆసక్తితో ఇంగ్రీమ చదవాలన్న కోరిక కలిగింది పౌరాణిక సాహిత్యం పట్ల అతనికి అభిమానం పద్నాలుగేళ్ళ వయసులో 'ఓ660216' అన్న కవితాత్మక నాటకాన్ని రాశాడు గ్రీకు సాహిత్యంతో, షేక్స్పియర్ (పేరణతో ఆ నాటకం రాశాడు. అందులో మొదటి నాలుగు అంకాల్లోనే యాభై రెండు పాత్రలు చనిపోయాయి వాటిలో కొన్ని ఐదో అంకంలో మళ్ళీ కనిపిస్తాయి మొదట్లో గాఢంగా పియానోపై, వయోలిన్‌పై సంగీత పారాలు అభ్యసించాడు. కానీ అకడమిక్ విద్యాభ్యాసం ఆకర్షించినంతగా సంగీతం ఆకట్టుకోలేదు 185
వెబర్ రచన ప్రదర్శనతో వాగ్నర్‌కు సంగీతం పట్ల ప్రేమ మొదలయింది. భీప్టిగ్లో బిధోవిన్ సింఫనీలు విన్న తరువాత సంగీతం అతని 'వ్యామోహం'గా మారిపోయింది. చదువులన్నీ వెనుకబడ్డాయి. చదవడం పట్ల ఆసక్తి సన్నగిల్లింది. బిధోవిన్తో (ప్రేరణ పొంది ఒక సంగీత సిద్ధాంత గ్రంధం చదివి చాలా శ్రమకు లోనయ్యాడు. కొన్ని స్వరరచనలు చేశాడు అతని తల్లి అతని సంగీతాభిమానాన్ని వ్యతిరేకించ లేదు కానీ మొదట అకడమిక్ విద్యపై మనసు పెట్ట మంది ఆరు నెలల పాటు ఓ సందర్భంలో స్కూలు ఎగ్గొట్టాడు కూడా.
లీప్టిగ్ యానిర్సిటీలో చదువుకునేటప్పుడు “రౌడీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. జూదం, గొడవలు పడ్డం, తాగుడు, తిరుగుడు మొదలయిన వాటిల్లో మునిగివుండేవాడు. ఇట్లా “చెడ్డవాడయిన కుర్రాడు సంగీతం దగ్గరికొచ్చేసరికి అన్నీ మరచిపోయి సీరియస్ ఐపోయేవాడు. మరింత గాఢంగా సంగీత పరిచయం కోసం బిధోవిన్ సింవనీలు అభ్యసించాడు. దానికి తోడు రెండు అర్మెస్ట్రా రచనల చేశాడు వాటిల్లో ఒకటి 1830 ప్రాంతంలో ప్రదర్శింపబడింది.
1830 మొదలు 1888 మధ్యలో సంగీతంలో అతని పరిశ్రమ కొనసాగింది. 1888లో వుర్జ్బర్గర్ థియేటర్లో కోరస్ మాస్టర్‌గా నియమింపబడడంతో అతని మొదటి సంగీత “ఉద్యోగం? మొదలయింది. ఆ రోజుల్లోనే తన మొదటి ఒపేరా రాశాడు. చిత్రమేమిటంటే అది వాగ్నర్ మరణానంతరం కానీ 'ప్రదర్శింపబడలేదు
యువకుడయిన స్పరకర్తకు లేనిపోని బాధలు చుట్టుముట్టుకున్నాయి. జూదం కారణంగా లెక్కలేని అప్పులు చుట్టు ముట్టాయి. అప్పుల వాళ్ళు వూపరి సలప నివ్వకుండా వేటకుకృల్లా వెంటపడ్డారు. దానికి తోడు యిబ్బందికరమయిన (ప్రేమ వ్యవహారాల్లోనూ ఇరుక్కున్నాడు. బాధ్యతలేని సొంత కొడుకు అరాచకాలకు అలసిపోయిన అతని తల్లి అతనికి “నీళ్ళు” వాదిలేసింది యిట్లాంటి దిక్కుతోచని పరిస్థితుల నుండి తప్పించుకోడానికి 1834లో చిన్నిపట్టణంలో అనుకులాలు లేని ఒక ధియేటర్లో ఒక ఒపేరా కందెక్టర్గా పనిచెయ్యడానికి వెళ్ళాడు. ఏ అనుకులాలు లేని అక్కడ “మాద్దెబెగ్గ్ అన్న ఆ చిన్ని పట్టణంలో అతను వుండడానికి రెండు కారణాలు. మొదటిది 1౧6 840 01 10౪6 అన్న అతని రెండో ఒపేరా పూర్తి చేయడానికి రెండోది ముచ్చటగా వున్న నటి మిన్నాష్తానర్ ముద్దు మొఖం కోసం
1886 మార్చి 29న 706 84౧ 01 10౪6 ఒపేరా మాగ్చెబర్ల్ ధియేటర్లో ప్రదర్శింపబడింది. అది ఎంత “విఫలి మయిందంటే అది రిపీట్ చేసినప్పటికి థియేటర్లో జనం ఒక్కరు కూడా లేరు దానికి తోడు అన్ని రకాలుగా దివాలా తీసిన ఆ ఒపేరా కంపెనీ 186
ఆఅ దెబ్బతో మూతపడింది. దాంతో వాగ్నర్ అప్పుల పాలు కావడమే కాక జీవనాధారం కోల్పోయిన స్థితికి చేరుకున్నాడు. 1886లో ఈస్ట్ ప్రష్యాలో ఒక ప్రాంతంలో నిర్వాహకుడిగా ఒక థియేటర్లో వుద్యోగం వచ్చింది కానీ వాగ్నర్ ఆ బాధ్యతలు స్వీకరించేలోపుగానే అది 'దివాలా' తీసింది. ఇన్ని ఇబ్బందుల నడుమ చివరికి 1886 నవంబరు 24న నటి మిన్నా ప్లానర్‌ని పెళ్ళాడాడు. రెండేళ్ళ ప్రయత్నం ఫలించింది ఆమె అందగత్తె. కానీ ఆమె అభిరుచులు, మనస్తత్వం బూర్జువా స్టాయివి. ఆమెను అందుకునే దాకా వాగ్నర్ ఆరాటపడ్డాడు. ఆమ సొంత మయ్యాకా ఆమె అంటే ఆతనికి బోరు కొట్టింది. మళ్ళీ యింకో వుద్యోగం అతనికి దొరికింది. ఐతే ఈసారి అది రష్యాలోని రీగా' అన్న ప్రాంతంలో 1837లో అక్కడ చేరి రెండేళ్ళపాటు వున్నాడు, అక్కడి ఒపేరా హౌస్ నిర్వాహకుడితో ఘర్షణ పడ్డడు. అప్పుల వాళ్ళ బాధా అధికమైంది ఒక రోజు అతను ఒపేరాహౌస్కు వెళితే అతన్ని తీసేసి కొత్త వ్యక్తిని ఆ స్థానంలో నియమించినట్లు తెలిసింది. అతని పాస్‌పోర్ట్‌ని అప్పుల వాళ్ళు లాక్కున్నారు. ఫలితంగా రష్యాని దొంగదారిని రహస్యంగా దాటాడు అతనూ, అతని భార్యా ఒక వ్యాపార ఓడలో, బాల్టిక్ హార్చర్లో ఆ ఓడని అందుకన్నారు. అంతిమంగా పారిస్ చేరాలన్నది. వాళ్ళ లక్ష్యం. తనని చిరకాలం చుట్టు ముట్టిన కష్టాలు, దుఃఖాలు ఇక తనని వదిలి వెళతాయని అతని నమ్మకం. నిస్సందేహంగా అతను ప్రతిభావంతుడు. గియెకోమో మేయర్ బీర్ కోసం అతను యితర్ల నించీ తెచ్చిన పరిచయ పత్రాలు అతని భవిష్యత్తును మలుపు తిప్పుతాయని అతను నమ్మాడు. 1881 నుండి 1840 వరకు వాగ్నర్ పారిస్‌లో వున్నాడు. అతను కొండంత ఆశతో వచ్చాడు. కానీ అతని ఆశ నీరుగారి పోయింది. ప్రతి చోటా అతన్ని 'మర్యాదగా ఆహ్వానించారు. అంతే “మర్యాదగా తిరస్కరించారు. యిచ్చిన హామీల నెవరూ నిలుపుకోలేదు 7116 84౧ 0౧ 10౪6 ఒపేరా ప్రదర్శనకు డిలా రినాయ్ జెన్స్ థియేటర్ అంగీకరించింది కానీ ప్రదర్శనకు ముందే ఆ ధియేటర్ అప్పులతో మూతపడింది. అప్పుడు వాగ్నర్ కుటుంబం దరిద్రంతో అల్లాడింది. వెనకటి రోజుల కష్టాలు అప్పుడు పడుతున్న బాధల్లో పోలిస్తే ఐశ్వర్యంలా అనిపించాయి. చాలా సందర్భాలలో ఆకలితో అలమటించారు. అప్పులు చెల్లించలేక వాగ్నర్ రెండుసార్లు జైలుపాలయ్యాడు. ఉదయాన్నే భార్యా భర్తలు పూట కూళ్ళ యిళ్ళకు వెళ్ళేవాళ్ళు. అక్కడికి వచ్చే కష్టమర్ల బూట్లు మిన్నా శుభ్రపరిచేది. వాగ్నర్ 'కూలి' పని చేసేవాడు. ఈ అనుభవాల వల్ల అతను మొండిగా, నిర్దయగా, స్వార్ధపూరితుడుగా తయారై ఇతర్ల పట్ల 'కరుణ' లేని రీతిలో జీవితాంతం వున్నాడు. ఇతర్లని పట్టించుకునేవాడు కాడు. జీవితాంతం అట్లానే వున్నాడు. జం/
వాగ్నర్ మనిషిగా అవమానింపబడ్డాడు. తక్కువగా చూడబడ్డాడు కంపోజర్‌గా తిరస్మరింపబడ్డాడు. కానీ తన సంగీత రచనను నిరంతరాయం కొనసాగించాడు. 1840లో రీంజీ అన్న ఒపేరా పూర్తి చేశాడు 716 ₹0/1౧3 04100 ౧౫4౧ అన్న లిబ్బెట్టోని పూర్తి చేసి పారిస్ ఒపేరా డైరెక్టర్‌కు చూపించాడు. అతన్నించీ ప్రోత్సాహం దొరుకుతుందని ఆశించాడు దాదాపు వాగ్నర్ అతన్నించీ నిర్లక్ష్యం అందుకున్నాడు. చివరికి ఆ దెరెక్టర్ వాగ్నర్ లిబైెట్టోను ఐదువందల ్రాంకులకు తీసుకుని సంగీత జ్ఞానం అంతగా లేని ఒక అయోమయ కంపోజర్ వైట్చ్ అన్న అతనికిచ్చి దాన్ని నిర్వహించమని చెప్పాడు వాగ్నర్ తప్పనిసరయి ఆ లిబైెట్టోను అమ్మాడు. కారణం దానికి సంగీతాన్ని సమకూర్చడానికి అతని దగ్గర పియానో కూడాలేదు. ఎట్లాగయినా అది ్రదర్శింపబడాలని వాగ్నర్ సంకల్పం. తన రచనకు సంగీతం సమకూర్చడంలో వాగ్నర్ నిమగ్నమయ్యాడు. క్రమంగా అతని సందేవాలు మటుమాయమై అతని వైఫల్యం విజయంగా పరిణమించింది తన సృజన శక్తి వేగవంతంగా అభివృద్ధి చెందడం పట్ల అతను నిత్య స్పృహతో వున్నాడు. తన 7[6 10/00 90౪4160 గ౧౧ కు సంగీతం సమకూర్చడం గురించి చెబుతూ “ప్రతిదీ సులభంగా, ప్రవాహశీలంగా సాగింది నిజానికి నేను ఆనందంతో అరిచాను. నా సమస్త అస్తిత్వంతో నేనుయింకా కళాకారుడిగా వున్నానని పరవశించాను” అని రాసుకున్నాడు.
అతని ఆనందం, ఉత్సాహం అతని గ౧:6౧౭| రచనని (ద్రెస్డెన్ ఒపేరా వాళ్ళ స్వీకరించడంతో మరింత ఊపందుకున్నాయి. అప్పుచేసి పారిస్ వొదిలి ఆ రచన ప్రీమియర్ ప్రదర్శన కోసం (డైస్డెన్ వెళ్ళాడు. 1842 అక్టోబర్ 20న ఆ ప్రదర్శన అసాధారణ విజయాన్ని అందుకుంది. ఒపేరా వూర్తి అయ్యేనరికి వాగ్నర్ కూడా అ విజయోత్సవంతో నిరుత్తరుడయ్యాడు. ఆ సంవత్సరం (డ్రైస్దెన్ ఒపేరాల్లో రీంజీ గొప్ప ప్రజాదరణ పొందిన రచనగా గుర్తింవు పొందింది. మొట్ట వెొదటిసారిగా వాగ్నర్ పేరు జర్మనీ అంతామారుమోగింది.
ఆ ఘనవిజయం వల్ల రెండు ముఖ్యమయిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండో ఒపేరా 1848 జనవరి 2 ప్రదర్శింపబడింది. అది కూడా విశేష జనాదరణ పొందింది. రెండోది 1843 ఫిబ్రవరిలో వాగ్నర్ (ద్రెస్డెన్ ఒపేరా సంగీత దర్శకుడుగా మంచి జీతం మీద నియమింపబడ్డాడు.
తరువాత ఆరేళ్ళపాటు నిరాటంకంగా ఆ పదవిలో కొనసాగాడు. ఆ ఒపేరా కంపెనీని వునర్మించి దాన్ని తన అదుపాజ్ఞల్లో వుంచుకుని జర్మన్ ఒపేరాకు జవజీవాలందిచ్చాడు. పారిస్‌లోని దుర్భర పరిస్థితుల తర్వాత గుర్తింపును, ఐశ్వర్యాన్ని 188
అందుకున్నాడు. కానీ వాగ్నర్ సంతోషంగా మాత్రం లేడు. ఆయన నెలకొల్పాలని ఆశించిన ఉన్నత ప్రమాణాలకు గుర్తింపు రాలేదు. విప్లవాత్మక 'మార్చులతో విస్తృత రీతిలో ఆయన ఒపేరాల్ని నిర్వహించిన తీరు విఫలమయింది. దానికి తోడు వేరే బాధలున్నాయి. అతని అప్పుల వాళ్ళు యూరప్‌లోని వివిధ ప్రాంతాల నించీ అతనిపై మిడుతల దండులా వచ్చి పదేవాళ్ళు సాధారణంగా వాటిని ఆయన తీర్చేవాడుకాడు. అంతేకాదు, దానికి తోడు ఎప్పుడో కొత్తకొత్త అప్పులు చేసేవాడు. స్థాయికి మించి జీవించేవాడు.
(డైస్దెన్లో వున్న రోజులో రెండు కొత్త ఒపేరాలు పూర్తి చేశాడు. 20౧౧2౮56 అన్న ఒపేరా 1845 అక్టోబరు 19న ్రదర్శింపబడింది. విఫలమైంది. కొందరు వాగ్నర్ బూళు చిత్రకారుడు అన్నారు. యితరులు అది పాడటానికి ప్రదర్శించడానికి పనికిరాదన్నారు అందులో వీనస్ పాత్రధారి ఐన గాయకుడు ఫ్రోడర్ - డెర్వియంట్ “వ్వీరు జీనియస్. కానీ మీ సంగీతం ఎంత తిక్కగా వుంటుందంటే అది సాధ్యం కావడం అసాధ్యం” అన్నాడు. దాన్ని పునర్మిర్మించి వాగ్నర్ దాన్ని విజయవంతంగా ప్రదర్శించాడు. ఓ006౧8గ౧' అన్న రెండో ఒపేరా 1950లో వీమార్లో ప్రదర్శింపబడింది. ఆ ప్రీమియర్‌కు వాగ్నర్ హాజరు కాలేదు. కారణం అతను అప్పుడు “రాజకీయ ్రవాసం'లో వున్నాడు.
అన్ని కాలాల్లో అసాధారణమైన ఒపేరా ఓ0[6౧9:1% అని వాగ్నర్‌కు తెలుసు. తన అసాధారణ ప్రతిభ పట్ల అంతులేని అత్మ విశ్వాసంతో బాటు ఆ సత్యాన్ని ప్రపంచం గుర్తించలేని స్థాయిలో వున్నందుకు ఆయనకు బాధ కలిగేది విప్లవకారుదుగా తిరగబడ్దం మినవో మార్ధాంతరం లేదని ఆయన తెలుసుకున్నాడు. 1848వ సంవత్సరం యూరప్ అంతా విప్లవంతో ప్రభావితమైంది ప్రభావం 1849 మొదట్లో శాక్సనీ ని తాకింది. వాగ్నర్ ఉత్సాహంతో శాక్సనీలోని విష్లవ వర్గాలతో చేతుల కలిపాడు. తీవ్రవాదులకోసం ఉద్రిక్తమైన 'ప్రచార గీతాలు రాశాడు రాజకీయ ఉపన్యాసాలిచ్చాడు. (్రెస్డెన్లో జరిగిన తిరుగుబాట్లు, అల్లర్ల పట్ల సానుభూతి (ప్రకటించాడు. వివ్లవం ఇంకా మొదలు కాలేదు. వాగ్నర్ వెంట్రుకవాసిలో అరెస్టు తప్పించుకుని మొదట వీమార్కు, అక్కణ్ణించి పారిస్‌కు ప్రవాసం వెళ్ళాడు. ప్రాంజ్ లిస్జ్ట్ అతనికి పాస్‌పోర్టు సమకూర్చాడు.
తరువాత పదమూదేళ్ళపాటు వార్నర్ (స్రవాస జీవితం గడిపాడు. ఆ కాలంలోనే అతని ఒపేరా 100600౧౧ వీమార్లో ప్రదర్శింపబడింది. ఘన విజయం పొందింది. జర్మనీ అంతటా వాగ్నర్ పేరు మారు మోగిపోయింది. జర్మనీ అంతటా వాగ్నర్ రచనలు 'ప్రదర్శితమయ్యాయి. ఓ0[8౧9౧౧ ఎంత ప్రచారం పొందిందంటే ఆ విషయం గురించి దుః ఖిస్తూ వాగ్నర్ *.0[609%౧ ప్రదర్శన చూడని ఏకైక జర్మన్నినేనే” అని చెప్పుకున్నాడు.
189
వాగ్నర్ జ్యూరిచ్‌లో ఇల్లు కట్టుకున్నాడు. ఆ కాలంలోనే ఒపేరాకు సంబంధించిన తన కౌత్త కొత్త ఆలోచనల్ని అభిప్రాయాల్ని రూపొందించుకున్నాడు ఆ అభిప్రాయాలు అతి నవ్యమైనవి. పాత సంప్రదాయ పద్ధతుల్ని సమూలంగా తిరస్మరించేవి తలెత్తుకోకుండా చేసేవి. అన్ని కళల్ని సమీకరించి, సంక్షిప్తీకరించి ఒపేరాలో ఒదిగింపజేసే విప్లవాత్మక ఆలోచనలలో ఒక బృహత్ ప్రణాళికను ఒక ప్రవక్త స్థాయిలో నిర్వహించాలని అతని సంకల్పం ఒపేరాకు సంబంధించిన (ప్రాచీన సాంకేతిక విధానాలపై దాడిచేస్తూ ఎన్నో పత్రికల్లో వ్యాసాలు రాశాడు. పాంప్లెంట్లు వేశాడు. సంగీత నాటకానికి సంబంధించి తన స్వీయ సిద్దాంతాల్ని వివరించాడు. దాని కోసం ఒక ప్రాజెక్టు తల పెట్టాడు. దాని కోసం పాతికేళ్ళు నాలుగు సంగీత నాటకాల్ని తన శక్తి యుక్తుల్ని నిక్షిప్తం చేసి రాశాడు వాటిని ప్రచురించాడు తన బృహత్వణాళికల్లో మునిగి, తన అభిప్రాయాల రూపకల్పనల్లో శ్రమిస్తూ వుంటే “ఇంటి* విషయాల భారం తల మీద పడింది మిన్నాతో అతని వైవాహిక జీవితంలోని అశాంతి బయటపడింది. మొదట్నించీ ఎగుడు దిగుళ్ళతో, సంక్షోభాలతో కూడుకుని వుండేది. ఆమె భర్తలో వస్తున్న ఎదుగుదలని, పెరుగుతున్న అతని ప్రతిభని అర్ధం చేసుకోడానికి పరిమిత మయిన ఆమె తెలివి తేటలు సహకరించలేదు. ఎందుకతను ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనల్లో ఒపేరాలో పరివర్తన తేవాలని రాస్తూ ప్రచారాలు చేస్తూ వున్నాడో ఆమెకు అర్ధం కాలేదు. అదంతా అతని పిచ్చి అని ఆమె అనుకుంది. దానికి తోడు అతనికి ఏవో యితర (పేమ వ్యవహారాలున్నాయని సందేహించింది. ఒక యింగ్లీషు ద్రాక్షసారా వ్యాపారి కూతురు ఇరవై ఒక్క ఏళ్ళ జెస్సీ లాస్సాట్తో అతనికి వున్న సంబంధం ఆమెకు ఆగ్రహం తెప్పించింది. 1850లో వాగ్నర్ పారిస్ దర్శించినపుడు వాగ్నర్ జెస్సీ యింట్లో విడిది చేశాడు. ఆమె పరిచయం (ప్రేమగా పర్యవసించింది.వాగ్నర్ ఆమెని తనతో "లేచి రమ్మన్నాడు కొంత సమయం ఆమె అతని పట్ల సానుభూతిగా ప్రవర్తించింది. ఓ సందర్భంలో భర్తని వదిలి వాగ్నర్‌తో బాటు వెళ్ళిపోదామని కూడా అనుకుంది. మెల్లగా వాగ్నర్ తత్వాన్ని పరిశీలించింది అనారోగ్యంతో బాధపడే తన భర్తను చూసింది చివరికి వాగ్నర్‌తో వెళ్ళడానికి తిరస్కరించింది. వాగ్చర్ “నా జీవితానికి పరిష్కారం అని నేను భావించిన స్త్రీ నిస్సహాయంగా వున్న పసిపిల్లలా మారిపోయింది. నన్ను చూసి ఆమె జాలిపడి వుంటే దైవమా! నన్ను మన్నించు” అని విషాదంతో విహ్వలించాడు. జెస్సీ తరువాత సంపన్నుడయిన సిల్కు వ్యాపారస్థుని భార్య మెటిల్దితో పరిచయం ఏర్పడింది. ఆమె భర్త పిట్టోకు వాగ్నర్ సంగీతమంటే ఇష్టం. 1853లో వాగ్నర్ కోసం జూరిచ్‌లో ఎన్నో సంగీత ప్రదర్శనలకు ఆర్థిక సాయం చేశాడు. నాలుగేళ్ళ అనంతరం తన 190
యింటికి దగ్గరలో ఆకర్షణీయమయిన ఒక భవనాన్ని వాగ్నర్ కోసం కట్టీంచాడు. దానికి 'అనిలొ అని పేరు పెట్టాడు. ఇన్ని అనుకూలాలు ఒట్టో కలిగిస్తూ వుంటే వాటి వట్ల' వాగ్నర్ తన కృతజ్ఞత ప్రదర్శించాడు. వాటన్నిట్నీ స్వీకరిస్తూనే అతని భార్యతో (ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. ఈ వ్యవహారంలో రహస్యం లేదు. ఒట్టోకి, వాగ్నర్ భార్య 'మిన్నాకు ఈ సంగతి తెలుసు. దానికి సంబంధించి మొదట ఎట్లాంటి గొడవలూ జరగలేదు. కానీ మెల్లగా వార్నర్ మెటిల్డాకు దూరంగా జరిగి ఒట్టో ఆర్థిక సాయంతో సంగీత కార్యక్రమాలు కోసం భార్యతో కలిసి పారిస్ వెళ్ళాడు. అర్ధం చేసుకోని తన భార్యతోనే అడ్డస్టయి తన సంసార జీవితంలోనే ఒదిగి వుండడానికి ప్రయత్నించాడు. ట్రిస్టాన్ ఒపేరా రచన మెటిల్లా ప్రేమ
వ్యవహారంలో వున్నప్పుడు రూపొందిందంటారు. అతని వ్యక్తిత్వం ఒక పద్ధతికి వొదిగేది కాదు. అందులో నెమ్మది లేదు. అతని తత్వమిలాంటిదని నిర్ణయించడానికి కుదరదు. ఎవరి పట్లా ఎంతో కాలం అతను విశ్వాసపాత్రంగా మెలిగేవాడు కాడు. దేని పట్లా “శాశ్వతంగా” కట్టు బడ్డం అతని ప్రవృత్తికి విరుద్ధం (తన కళ పట్ల తప్ప) అతను అబద్దాల కోరు, మోసగాడు. దురహంకారి, ఫోజులరాయుదు, నీతి, విలువలు, దయ, గౌరవాల పట్ల అతనికి లక్ష్యమేలేదు. బాధ్యత అంటే అతనికి పట్టింపేలేదు. తిరిగి యివ్వాలన్న వుద్దేశమే లేకుండా యితర్ల దగ్గర డబ్బు తీసుకునేవాడు. ఆ తీసుకున్న డబ్బును విచ్చలవిడిగా కర్చు పెట్టేవాడు. తన స్థాయికి; అవసరాలకు మించి ఆడంబరంగా జీవించేవాడు. అంతా “రాజుల స్థాయిలో” అతని జీవితం వుందేది. గర్వంగా అతను “ప్రపంచం నా అవసరాలకు అప్పుపడి వుందె” అని చెప్పుకున్నాడు. ఎందుకంటే తను సాటిలేని సంగీత కారుణ్జిని అతనికి ఐలమైన విశ్వాసం. సోటిలేని సంగీతకారుదేకాదు, అసాధారణ నాటక రచయితనని, అపూర్వమయిన కవినని, ప్రపంచానికి యిప్పటిదాకా తెలిసిన, వరిచయమయిన మహా మేధావుల్లో తను అద్వితీయుడనని ఆయన
నమ్మకం.
పర్యవసానాల్తో నిమిత్తం, పట్టింపు లేకుందానే ఆయన స్త్రీలతో (ప్రేమ వ్యవహారాలు కొనసాగించేవాడు. వాళ్ళు అతని అవసరాల కోసం, ఆనందాల కోసం మాత్రమే వుండేవాళ్ళు, యితర్ల బాధల గురించి ఏ మాత్రం పట్టింపు లేకుందా సొంత బాధల్లో మునిగివుండేవాదు. ఎప్పుడూ ఆత్మారాధనలో వుంటూ చుట్టూ వున్న వాళ్ళని అందర్నీ అసహ్యించుకునేవాడు. విమర్శ పట్ల, వ్యతిరేకంగా వచ్చిన ఒక్క మాట పట్ల కూడా ఆగ్రహంతో మండి పడేవాడు, అతనికి ఉపయోగవడడానికి జనం ఎవ్పుడూ వుండేవాళ్ళు. వాళ్ళని “నిర్ణయాగా 191
వుపయోగించుకునేవాడు. అతని అభివృద్ధికి సహకరించేవాళ్ళను, అతనికి సేవ చేసేవాళ్ళను "స్నేహితులు'గా ఆమోదించేవాడు. ఇతర్లని శత్రువులుగా చూసేవాడు.
టేలర్ అన్న అతను “రాక్షసుడు” అన్న వ్యాసంలో వాగ్నర్ని వర్టిస్తూ “పొంతన లేని వింత ఆకారం, పొట్టివాడు, శరీరం కన్నా తలపెద్దది. బలహీనంగా, అనారోగ్యంగా కనిపించేవాడు. అతని నరాల పరిస్థితి బావుండేది కాదు. అతనికి *చర్మరోగం' వుందేది. ముతక బట్టలు తప్ప యితరమైన వాటిని ధరించినా అతనికి పడేవి కావు.” యింకా అతని మనస్తత్వాన్ని వర్ణిస్తూ, “ఆరేళ్ళ పసివాడి భావోద్వేగం అతన్ది. అతని మనసు బాగా లేనప్పుడు పిచ్చి పట్టినట్లు కలవరించేవాడు. కాలితో నేలని తన్నేవాడు, ఆత్మహత్య చేసుకుంటాడేమో అనిపించేది. తను తూర్పు దేశాల సేపు వెళ్ళిపోయి బౌద్ధ సన్యాసి ఐపోతానని చెప్పేవాడు. పది నిముషాల తరువాత వదయినా ఒక విషయం అతన్ని ఆనంద పెట్టిందంటే తలపు తీసుకుని ఉద్యానవనంలోకి పరిగెట్టేవాడు. ఉద్యానవనంలో ఉల్లాసంగా తిరిగేవాడు. లేదా సోఫాలో పసిపిల్లవాడిలా ఎగిరి గంతులేసేవాడు. లేదా శీర్షాసనం వేసేవాడు. మచ్చికయిన కుక్క చనిపోతే విషాదంతో దిగులుగా వుండేవాడు. ఒక్కోసారి నిర్ణయంగా కరినంగా వుండి తరువాత వణికేవాడు” అన్నాడు.
వాగ్నర్‌కి మాట్లాద్దమంటే యిష్టం. తరుచుగా విలువయిన సంభాషణలు చేసేవాడు. తన శ్రోతలు తన మాటల పట్ల ఆసక్తి (ప్రదర్శిస్తున్నారా! లేదా! అన్న దాంతో నిమిత్తం లేకుండా మాట్లాడేవాడు. దాన్ని గురించి చెబుతూ టేలర్ *“ఒక సాయం/్రం అతన్తోగడపడమన్నది ఒక సాయంత్రం మనమాటల్ని మనం వింటూ గడపడం లాంటిది" అన్నాడు. సంభాషణలో అతనికిష్టుయిన విషయం 'అతను' మాత్రమే! అతని గురించి మాట్లాడ్డమే!
వాగ్నర్ అన్ని విషయాల్లో వ్యతిరేకించవలసిన వ్యక్తే! ఒక్క విషయంలో తప్ప అది కళ పట్ల అతని దృష్టి కళ అన్నది అతని మతం. అతను ఆరాధించే విషయం. అతను తలవంచే విషయం. ఆతను నిజాయితీగా ప్రవర్తించే సంగతి. విశ్వాసపాత్రంగా బదులిచ్చే ఏకైక సత్యం కళ. స్థాయి పట్ల అతను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపదేవాడు కాడు,
వాగ్నర్ ఒక్క వైఫల్యం తరువాత దాన్ని మించిన వైఫల్యార్ని అందుకున్నాడు. అట్లాగే విజయాల్నీ అందుకున్నాడు. కానీ ఎక్కడా ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ తన పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. తన మార్గాన్ని వదల్లేదు. *సులభమయిన దారుల కోసం అల్ప (ప్రయోజనాల కోసం ప్రయత్నించలేదు. 11512౧ 2౧6 150166 రచన యాఖై ఆరు సార్లు 1292
రీవోర్సల్స్ చేసిన తరువాత 1861లో వియన్నాలో ప్రదర్శనకు అనుమతి నిరాకరింపబడింది. అతనికి ఆటంకాలు, ఆపదలు మిడుతల దండులా వచ్చిపదేవి. అతని ఒపేరాలు ప్రదర్శనకు అర్జ్హమయినవి కావని అన్నారు. *నా జీవితంలో యిట్లాంటి మొండి తనంతో ఆపదలు నా మీద దాటి చెయ్యడం ఎప్పుడూ జరగలేదు” అన్నాడు. తన ఒపేరాకు అనుమతి నిరాకరింపబడడం గురించి చెబుతూ, ప్రతి చోటా జరిగినట్లే ఇక్కడా జరిగింది. వృత్తి పరమైన అసూయ అసాధారణ స్థాయిలో వుంది. కాబట్టి నన్ను నిలవరించడానికి వాళ్ళ శాయ శక్తులా ప్రయత్నిస్తున్నారు అన్నాడు. అతని జీవితంలో నాటకీయమయిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1860లో జర్మనీ ప్రభుత్వం అతన్ని జర్మనీలోకి రావడానికి అనుమతించింది. ఐతే శాక్సనీ ప్రాంకానికి తప్ప ఎక్కడికయినా వెళ్ళొచ్చని “మెలిక పెట్టింది. 1862 నాటికి ఆ నిషేధం కూడా తొలగించారు. సంవత్సరం గడిచాకా బవేరియా యువరాజు లుడ్విగ్ 2 వాగ్నర్ని గొప్పగా అభినందిస్తూ అతని సంరక్షణ, పోషణ బాధ్యతలు స్వీకరించదానికి ముందుకొచ్చాడు. వాగ్నర్ని మ్యూనిచ్కు ఆవ్వోనించాడు. వాగ్నర్ వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య గాఢమయిన స్నేహం ఏర్చడింది. యువరాజు వాగ్నర్‌కు అన్ని అనుకూలాలు కల్పించాడు. అతన అప్పులు శీర్చాడి. అప్పటి దాకా ప్రదర్శింపబదని అతని రచనల ప్రదర్శనకు ఆర్థిక సహకారం అందించాడు. వాగ్నర్‌కు రాజవైభోగాలు కల్పించాడు. ఐశ్వర్యంలో తేలేలా చేశాడు. వాగ్నర్ రచనలన్నీ ప్రదర్శనకు నోచుకున్నాయి. మ్యూనిచ్‌లో వాగ్నర్ శత్రువులు లెక్కలేనంత మంది వున్నారు. వాళ్ళు శక్తిమంతులైనవాళ్ళు. ఒక సంగీత బృందం వాగ్నర్ రచన ఒక దాన్ని తిప్పి పంపుతూ రాజుగారికి నచ్చింది మాత్రమే ప్రదర్శనకు నోచుకుంటుందని షరతుపెట్టారు. దాని వెనక వాగ్నర్ పట్ల అసూయ ప్రదర్శించే ఒక రాజకీయ వర్గ హస్తముంది. కానీ వాగ్నర్ తనకు రాజుతో వున్న సాన్నిహిత్యాన్నీ పురస్మరించుకుని వాటన్నిట్నీ అధిగమించాడు. 1862లో వాగ్నర్, మిన్నా విడిపోయారు. కేవలం వాళ్ళ *'మంచి కోసమే అంగీకారంతో విడిపోయారు. నాలుగేళ్ళ అనంతరం ఆమె చనిపోయింది. వాగ్నర్ జీవితంలో గొప్ప (ప్రేమ వ్యవహారం 'కాసిమా' తోడిది. ఆమె సుప్రసిద్ధ సంగీతకారుడు ఫ్రాంజ్ లిస్జ్డ్ కూతురు. వాగ్నర్ సన్నిహిత మిత్రుడు హాన్స్వాన్ బ్యూలో “భార్య హాన్స్వాన్ పియానిస్టు. అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన సంగీత నిర్వాహకుడు. ఆమె వాగ్నర్ కళ పట్ల అపారమయిన సానుభూతి గలది. ఒక రోజు కాసిమాతో బాటు 193
బెర్లిన్‌లో వెళుతూ “ఒకరి కళ్ళలోకి ఒకరు నిశ్శబ్దంగా చూసుకున్నారు. “మా కళ్ళల్లో నీళ్ళు కదిలాయి. మన మధ్య విడరాని అనుబంధ ముందని, ఎప్పటికీ విడిపోమని కళ్ళలోనే (ప్రమాణం చేసుకున్నాం” అన్నాడు వార్నర్. వాళ్ళు (ప్రేమికులయి పోయారు. వాగ్నర్ మ్యూనిచ్‌లో స్థిరపడ్డాకా హాన్స్వాన్ను పియానిస్టుగా అక్కడే నియమించేట్లు రాజుగారి ద్వారా వాగ్నర్ ప్రయత్నించి నెగ్గాడు. కాసిమా కానీ, వాగ్నర్ కానీ వాళ్ళ సంబంధాన్ని “మరుగు” పరచడానికి ఎట్లాంటి ప్రయత్నము చెయ్యలేదు 1865 ఏప్రిల్‌లో కాసిమా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. నిర్భయంగా యిద్దరూ కలిసి ఆ బిద్దకు “ఇసోబ్టి' అని నామకరణం చేశారు. దిక్కులేని, అశాంతి నిండిన, మెత్తని వాడయిన వోన్స్వాన్ ఆ దుర్భరమయిన పరిస్థితిని ఓపికతో భరించాడు. వీలయినంత వరకు ఏమీ పట్టనట్లు, ఏమీ జరగనట్లు కళ్ళు మూసుకుని గడిపాడు. “ఇసోల్టీని సొంత బిడ్డగా “అంగీకరించాడు. 1866లో వాళ్ళకు రెండో బిడ్డ పుట్టింది. ఈ '“అసహ్య'కరమయిన పరిస్థితిని వాగ్నర్ శత్రువులు అతనికి వ్యతిరేకంగా వుపయోగించుకోడానికి ప్రయత్నించారు. మ్యూనిచ్ నగరం ఈ '(ఢ్రేమికుల్ని! భరించలేకపోయింది. దాంతో వాగ్నర్‌కు మ్యూనిచ్ నగరాన్ని తప్పనిసరిగా వదిలి పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు పిల్లల్ని తీసుకుని మ్యూనిచ్ వదిలిపెట్టి స్విట్టర్లాండ్ వెళ్ళిపోయారు. ట్యూసర్న్ సరోవరం తీరంలో ఒక ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. “ఇది వాగ్నర్ తప్ప మరెవరయినా చేసి వుంటే అతన్ని నేను కాల్చేసి వుండేవాణ్ణి” అని వోన్స్వాన్ ఆగ్రహంతో అరిచాడు. తన పగలిన హృదయాన్ని ఓదార్చుకుంటూ ఆరాధనా పూర్వకంగా వాగ్నర్ సంగీతం పైనే పనిచేస్తూ వచ్చాడు. కాసిమా తండ్రి ఫ్రాంజ్ లిస్ట్ట్ కూడా కోపోద్రిక్తుడయ్యాడు. వాగ్నర్ని వ్యక్తిగతంగా అతనూ ఏదుర్మోలేదు. హాన్స్వాన్ లాగే నిజాయితీగా వాగ్నర్ సంగీతాన్ని ప్రచారం చేశాడు. క్రమంగా వాగ్నర్ జీవిశంలో భావోద్వేగాల సమతూకం ఏర్పడింది. జీవితమంతా అవిశ్రాంతంగా అన్వేషించే, ఆరాటంతో వెతికే ప్రీ అతనికి కాసిమా'లో కనిపించింది. కాసిమా అతని అవసరాల్ని చూస్తూ, అర్ధం చేసుకుంటూ అన్ని అనుకూలాలూ సమకూర్చింది. 1869 జూన్ 6న వాళ్ళ మూడో సంతానం సీగ్ఫైద్ అన్న కొడుకు పుట్టాడు. తరువాత సంవత్సరానికి వాగ్నర్, కాసిమా చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. అతని జీవితంలో ఏనాడూ లేని (ప్రశాంత వాతావరణంలో సంగీత రచనకు ఉపక్రమించాడు. పన్నెందేళ్ళ అనంతరం అతను తన గ1౧౩ రచనపై ఏకాగ్రత నిలిపి 1871లో పూర్తి చేశాడు. 5160166 16/1 అన్న అతని మనోహరమయిన రచనను కాసిమా పుట్టిన రోజుకు అపూర్వమయిన కానుకగా యిచ్చాడు. ఆశ్చర్యకరంగా ఆ రచనను ఆమె పడగ్గది బయట 1870 డిసెంబరు 25న ప్రదర్శించాడు. శంక
అతని చివరి సంగీత నాటకం (116 1419010106 6049 అన్న రచనను 1874లో ఎంతో (శ్రమించి పూర్తి చేశాడు. అతని అసాధారణ విజయాల్లో అదొకటి. అతని రాక్షస శక్తితో అతని స్వప్నాలకు సాకారమిచ్చాడు. అతని అభిప్రాయాల అనుసారంగా అతని రచనల్ని ప్రదర్శించడానికి ఒక ప్రత్యేకమయిన ఫెస్టివల్ థియేటర్ అవసరమని భావించాడు. సాంకేతిక అనుకులాల్తో, నిర్మాణాత్మకంగా ఆ థియేటర్ వుండాలని సంకల్పించాడు. ఆర్మెస్ట్రా (పేక్షకులకు కనిపించకుండా వుండాలని, ఎందుకంటే స్టేజిపై జరగేదాన్ని నిరాటంకంగా (పేక్షకులు చూడాలని వుద్దేశించాడు. దాంతో సానుకూల ఫలితాలు వస్తాయని అతస దృష్టి అట్లాగే (ప్రదర్శన మొదలయ్యాకా ధియేటర్లోకి ఎవర్నీ అనుమతించకూడదని నియమం పెట్టాడు.
కొంత మంది ఆర్థిక సాయం అదించడానికి ముందుకొచ్చారు. మరిన్ని ఆర్థిక వనరుల కోసం అతను కొన్ని సంగీత ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. మరిన్ని ప్రదర్శనలు నిర్వహించడానికి అతను అమెరికాలో, యూరోపులో వాగ్నర్ సొసైటీలు స్థాపించాడు.
అతని నిరంతర ప్రయత్నం వల్ల బేరియత్ అన్న చిన్ని బవేరియా పట్టణంలో అతనికి స్థలం దొరికింది. అక్కడ థియేటర్ నిర్మాణం సానుకూలం కాదని ఎందరన్నా వాగ్నర్ లక్ష్య పెట్టలేదు. చివరికి1872న అతని పుట్టిన రోజున అక్కడ పునాది రాయి పడింది. ఆ సందర్భంగా బీథోవిన్ నైన్త్ సింఫనీ ప్రదర్శించాడు. అప్పటి నించీ భవన నిర్మాణం వూపందుకుంది. ఆ థియేటర్‌కు కొన్ని మైళ్ళ దూరంలోనే వాగ్నర్ ఇల్లు నిర్మించుకున్నాడు. జీవితాంతం అక్కడే వున్నాడు.
1876 ఆగస్టు 18న ఆ థియేటర్ ప్రారంభోత్సవం జరిగింది. రోజుల తరబడి వాగ్నర్ అపూర్వ సంగీత కళాఖండాలు ్రదర్శింపబడ్డాయి. ఆ థియేటర్ ప్రపంచాన్ని ఆకర్షించింది. యూరోపు ఖండంలోని మహా సంగీతకారులందరూ. అక్కడికి వచ్చారు. చైోవ్స్కీ సైంట్ సేన్స్, గౌనాడ్, గ్రీగ్, లిస్జ్డ్ తదితరులు సందర్శించారు. హోటళ్ళు, రెస్టారెంట్లు జనంతో నిండిపోయాయి. ధరలు ఆకాశాన్నంటాయి. ప్రతి ప్రదర్శనకు టిక్కెట్ల ద్వారా లాభాలు వచ్చాయి. ్రసిద్ధమయిన పత్రికలు, కొన్ని న్యూయార్క్‌కు చెందిన వాటినించీ కూడా విలేఖరులు వచ్చారు.
విన్న ప్రతిదీ విశ్వసించే వాళ్ళు వుండడం అరుదు. అక్కడంతా కొత్తగా, ఆశ్చర్యకరంగా కనిపించింది. కానీ అక్కడ జరుగుతున్న వాగ్నేరియన్ ఫెస్టివల్ అద్భుతాలు సృష్టించింది. దాన్ని గురించి వైకోవ్స్కీ
“క్రళ్రక్రు సంబంధించిన మూర్ధవు వట్టువున్న వాళ్ళకి యిది చెంపపెట్టు. నాగరికులయిన జనం ఫలితాల్ని ప్రయోజనాల్ని దృష్టిలో వుంచుకుంటారు. కళాత్మక ఆదర్శాల
శేఫి5
దృష్టితో చూస్తే అసాధారణ చారిత్రకమయిన గుర్తింపును ఈ ధియేటర్ పొందింది. వాగ్నర్ హద్దులకి లోబడ్దాడా లేక వాటిని అతి క్రమించాడా అన్నది పక్కన బెట్టి కళని సౌందర్యపు అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళాడా లేదా అన్నది అతిముఖ్యంగా చూడాల్సిన విషయం. సంగీత అభివృద్ధిని సాఫీగా సాగడానికి దారి ఏర్పరచిన ప్రధముడు వాగ్నర్, బేరియత్లో జరిగిన ఈ విప్లవాత్మక పరిణామం మన మనవళ్ళు, మునిమనవళ్ళు తప్పక గుర్తు పెట్టుకుంటారు” వాగ్నర్ ౧2౧౫2] అన్న మరో సంగీత నాటకాన్ని రాయాల్సి వుంది. 1882 జూలై 26న దాని ప్రీమియర్ ప్రదర్శన జరిగింది. వాగ్నర్ ఆరోగ్యం దెబ్బతింది. అతని గుండె పరిస్థితి కూడా దిగజారింది. ఆ ప్రీమియర్ ప్రదర్శనానంతరం వాగ్నర్ పిల్లల్తో కాసిమాతో పదిహేనో శతాబ్దం నాటి భవనంలో ఉల్లాసంగా గతపదానికి వెనీస్ వెళ్ళాడు. అప్పటికి తన అల్లుడ్జి “క్షమించిన లిస్జ్ట్ కూడా అక్కడే వున్నాడు. కొంతకాలం వాళ్ళతో గడిపాడు. 1882 డిసెంబరు 24న తన భార్య పుట్టిన రోజు సందర్భంగా వాగ్నర్ తన యవ్వనం నాళ్ళలో రాసిన సింఫనీ ప్రదర్శించాడు. ఆరు వారాల అనంతరం గుండెపోటుతో హరాత్తుగా కన్నుమూశాడు. అప్పుడు కాసిమా దగ్గరే వుంది. అతని యింటి దగ్గర వుద్యానవనంలో అతన్ని ఖననం చేశారు. ప్రతి సంవత్సరం కాసిమా జీవించినంత వరకూ ఆమె ఆధ్వర్యంలో సంగీత ఉత్సవాల జరిగాయి. తరువాత అతని సంతానం ఉత్సవాల్ని కొనసాగించింది. తరువాత అతని మనమలు అలా తరాలుగా వాగ్నర్ వుత్సవాలు కొనసాగుతూనే వున్నాయి. 196
వుల్స్గాంగ్ అమాడియస్ మొజార్ట్ 1౧/౦0/0200 4౧౧2066063 [022/1 27-1-1756 -- 5-12-1791
పద్దెనిమిదో శతాబ్దం ఉత్తరార్థం నించి సంగీత ప్రతిభను అంచనా వెయ్యడానికి మొజార్డ్ మూల స్తంభ మయ్యాడు. మహోన్నతమయిన స్టానిక శక్తి యుక్తుల్ని కేంద్రీకరించుకుని అద్భుతాల్ని ఆవిష్కరించిన అసద్భశ సంగీతకారుడాయన. ఆయనకు ఆయనే సాటి. ఆయన్లో ఎవర్నీ పోల్చలేం. అతను బాల్యంలో ఏవైతే సాధించాడో, సంగీతంలో ఏ అద్భుతాలు సృష్టించాడో వాటితో సమానమయినవి, వాటిని అధిగమించినవి ఐన సంగీత సృష్టులు కేవలం అతను మాత్రమే చెయ్యగలిగాడు. ఆయన పసితనపు ఆవిష్కారాలు మెరుపులు సృష్టించి ప్రేక్షకుల్ని మంత్ర ముగ్భల్ని చేశాయి. వూపిరి బిగబట్టేలా చేశాయి. అతని పరిణిత దశలో ఆయన ఆవిష్కారాలు మరింత మహోన్నతమయినవి, అసాధారణమైనవి. సమగ్రంగా, సంపూర్ణంగా వుంటూనే గతులు మార్చే, గమనాన్ని మార్చే అతని అపూర్వ సంగీత రచనలు ఒక దాని తరువాత ఒకటిగా సృష్టింపబడ్డాయి. రకరకాల రూపాల్లో రూపొందాయి. అతని తైలి, నిర్మాణం, అభివ్యక్త సంపూర్ణమైనవి, వేలెత్తి చూపలేనివి. అప్రయత్నంగా అనాయాసంగా ఆయన చేసిన ఆవిష్కారాలు.
అతని బాల్యంలోని అద్భుతాల కథలుగా, గాథలుగా చెబుతారు. అవి వాస్తవాలైనా అద్భుతంగానే వుంటాయి. మొజార్ట్ తండ్రి పేరు లియొపాల్డ్ మొజార్ట్. మొజార్ట్ పుట్టిన సంవత్సరానికి అతని తండ్రి ఫాల్స్బర్గ్ ఆస్థాన ఆర్మెస్ట్రాలో ఒక వాద్యకారుడుగా చేశాడు. అతను వయోలిస్టుగా గౌరవాన్ని పొందాడు. అంతేకాక వయోలిన్ వాద్యానికి సంబంధించి మొట్ట మొదటగా ఒక గ్రంధం రాసిన వాళ్ళలో అతనొకడు. 1756లో పుస్తకం ప్రచురించాడు. స్వరకల్పనలు చేశాడు. అతను ప్రతిభావంతుడు కాడు. ఆ సంగతి అతనికి తెలుసు. చిన్ని తనంలో తన కొడుకులో సంగీత ప్రతిభను దర్శించిన అతను కొడుకును (ప్రతిభావంతుడుగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు.
మొజార్డ్ అక్క పేరు మారియా అన్నా ముద్దు పేరు నన్నారల్. ఆమెకు ఐదేళ్ళప్పుడు మొజార్ట్‌కు మూడేళ్ళు. ఆమె సాధన చేస్తున్న [14గ510%014 వాద్యంపై మొజార్ట్ అసాధారణ ఆసక్తిని ప్రదర్శించాడు. క్రీ బోర్డు మీద ప్రయోగాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒక క్రమబద్ధమయిన, ఆమోదకరమయిన సంగీత అభివృద్ధి కనిపించిన వెంటనే ఆనందించేవాడు.
తే9/
ఇదంతా అతని తండ్రి [14౧0810016 గురించి చెప్పకముందే చేశాడు. అప్పుడతని వయసు నాలుగేళ్ళు. అతని తండ్రి చెప్పేవాటిని గుడ్డిగా వల్లించడం కన్నా సహజంగా నేర్చుకున్నాడు. ఏది సరైంది అని అతనికి చెప్పాల్సిన అవసరం లేకపోయింది. వెంటనే ఏది సరైందో పసికట్టేసేవాడు. అతని శబ్ద జ్ఞానం ఎంత సున్నితమైందంటే వయోలిన్‌కు సంబంధించిన అతి మంద్ర స్థాయి స్వరాల్ని కూడా స్వీకరించేవాడు. సున్నిత స్వరాల సమ్మేళనంలో కర్ణ కరోరమైన శబ్దం వస్తే కంపించిపోయేవాడు. ఒక సందర్భంలో వుల్లాసంగా లేని ]₹%1గ౧౧61 శబ్దం విని స్పృహ కోల్పోయాడు. మొజార్ట్ది ఎప్పటికి చెదిరి పోని జ్ఞాపక శక్తి. పారపాటుకు ఆస్మ్కారమివ్వని సహజ జ్ఞానం. ఒక మధురమయిన స్వరాన్ని వింటే ఏ మాత్రం తప్పులకు ఆస్కారం లేకుండా యధాతధంగా దాన్ని ఆవిష్కరించేవాడు. వ్యక్తి గొంతును, వాద్య స్వరాన్ని చూడకుండానే గుర్తు పెట్టేవాడు. ఏదైనా ఒక వస్తువు నిస్తే పునరుక్తి లేకుందా ఆ వస్తువును అభివృద్ధి పరచి ప్రదర్శించేవాడు. ఒక సంగీత రచనలో ఒక భాగాన్ని చదివి ఇతరులు దాన్ని ఎట్లా ప్రదర్శించేవాళ్ళో అట్లా యథాతథంగా ఆవిష్కరించేవాడు. మరొకరికయితే గంటల తరబడి దాన్ని ప్రాక్టీసు చెయ్యాల్సి వచ్చేది.
ఒక సందర్భంలో మొజార్ట్ తండ్రి ఏర్పాటు చేసిన సంగీత ప్రదర్శనకు కారణాంతరాల వల్ల అందులో పాల్గొనాల్సిన రెండో వయోలిస్టు రాలేదు. మొజార్ట్ అతని న్థానంలో వుండి అనాయాసంగా అతని స్థానాన్ని పూరించాడు. అక్కడ ఎట్లాంటి సంగీతం వాయించాలో కూదా మొజార్జ్కు తెలీదు. కానీ యిబ్బంది కలగకుండా వయోలిన్ వాయించాడు. ఆ చర్యవల్ల మొజర్ట్ తండ్రి ఆశ్చర్యానికి, అనందానికి లోనై “నిజం! నిజంగా రెండో వయోలిస్టు స్థానాన్ని పూరించడానికి దాన్ని తెలుసుకోవలసిన అవసరం కానీ, ప్రాక్టీసుతో కానీ నీకు పనేలేకపోయింది కదూ!” అన్నాడు.
సంగీతాన్ని నేర్చుకోవడం మొదలు పెట్టినప్పటి నుండే మొజార్ట్ సంగీత రచన కూదా చేయడం మొదలు పెట్టాడు. ఐదేళ్ళ వయసున్నప్పుడు 1109100016 కోసం రెండు నిముషాల పరిమితి గల రచన చేశాడు. అది భద్ర పరచబడింది. వెంటనే అతను ఉన్నత స్థాయి లక్ష్యాల్ని అందుకోవాలని వువ్విళ్ళూరాదు. యింకా ఐదేళ్ళ వయసులోనే వున్నప్పుడు సంగీత రచనలో ఎంతో అభివృద్ధి సాధించి సంగీత సమ్మేళనానికి సరిపోయిన అవిష్కారాలు చేశాడు. ఐనా ఏదేళ్ళ వయసు వచ్చే దాకా సమగ్రమయిన సొనటాను అతను పూర్తి చేయ్యలేదు. ఎనిమిదేళ్ళ వయసుకల్లా సింఫనీ సిద్ధం చేశాడు.
లియోపాల్ట్ యింట్లో అద్భుతాలు జరగబోతున్నాయన్న విషయం అతనికి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకపోయింది. ఆ సంగతి అతనికి తెలిసినప్పటి నించీ అతని సొంత 95
సంగీత ప్రయత్నాలన్నీ వెనక్కి మళ్ళాయి. కేవలం తన కొడుకు అభివృద్ధి పైనే అతను తన శక్తి యుక్తులన్నిట్నీ కేంద్రీకరించాడు. మొజార్ట్‌కు ఆరేళ్ళ వయసు వచ్చినపుడు తన కొడుకు ప్రతిభను బాహ్యా ప్రపంచానికి ప్రదర్శించాలని లియోపాల్ట్ నిర్ణయించుకున్నాడు. లియోపాల్డ్ కుటుంబమంతా పర్యాబనకు సిద్ధమై బయల్దేరింది. మొదట మొజార్ట్ బవేరియా పాలకుడి ముందు మ్యూనిచ్‌లో తన సంగీత ప్రదర్శన చేశాడు. అక్కడ మొజార్ట్ ప్రదర్శన అసాధారణంగా విజయవంతమైంది. ఆ విజయవార్త వియన్నా చేరింది. మొజార్ట్ వియన్నా చేరిన వెంటనే అతన్ని చక్రవర్తిని మారియా తెరెసా దగ్గరికి రమ్మని పిలుపు వచ్చింది. సిల్కు పైజామా, దానిపై బిగుతుగా వున్న వెల్వెట్ జాకెట్, ఉబ్బినట్లు చొక్కా రెక్కలు, చక్కగా అణచినట్లు దువ్విన జుత్తు ఇదీ ముచ్చటయిన మొజార్ట్ ఆకారం. మొజార్ట్ ఒద్దిగా [14గ0510%016 ముందు కూచుని జార్జి క్రిస్టఫ్ వాజెన్నీల్ రచనను ప్రదర్శించడం ప్రారంభించాడు. జార్జి క్రిస్టఫ్ అక్కదే వున్నాడు. మొజార్ట్ పసివాడు కావడం వల్ల సంగీతాన్ని అభినయిస్తూ ముందున్న ఆ రచనకు సంబంధించిన పేజీలను తిప్పమని క్రిస్టఫ్ని కోరాడు. జార్జి క్రిస్టఫ్ ఆ పేజీలు తిప్పుతూ అ అపురూప సంగీతకారుణ్ణి చూస్తూ కళ్ళు తడిచేసుకున్నాడు. సాహసంతో మొజార్ట్ సంగీతంలో మెరుపులు సృష్టించి అందర్నీ దిగ్రమకు లోను చేశాడు. ఆ పసివాడి ప్రతిభకు పరవశించిన చక్రవర్తి “నువ్వు చిన్ని ఇంద్రజాలికుడివి అని అభినందించాడు. చక్రవర్తిని ప్రేమగా మొజార్ట్‌ని దగ్గరికి తీసుకుని ముద్దులాడి లాలించింది. చిన్ని మొజార్ట్పై బహుమతుల వర్షం కురిసింది. వియన్నా విజయాలతో లియొపాల్డ్ “దాహం” మరింత పెరిగింది. తరువాత మూదేళ్ళపాటు తన 'పసిమంత్రగాడిని' దేశ దేశాల్లో ప్రదర్శించాడు. 1768లో ఫ్రాంక్ ఫర్ట్లో ప్రదర్శన జరిగింది. వన్‌మాన్ సర్మస్ షోకు జరిగినట్లు మొజార్ట్ ప్రదర్శనకు అద్బర్స్టైజ్మెంట్ కూడా జరిగింది. వయోలిన్‌పై అతను సంగీత ప్రదర్శన చేస్తాడు. [1205101016 పై సింఫనీ నిర్వహిస్తాడు. కీ బోర్డు పై గుడ్డ కప్పి వుంటారు. దూరంగా పెట్టిన రచనను చూస్తూ అతను ప్రదర్శన నిర్వహిస్తాడు. ఒంటి చేతితో రకరకాల వాద్యాలని, గంటల్ని గ్లాసుల్ని గడియారాల్ని మన ముందు ఆవిష్కరిస్తాడు. క్రమక్రమంగా సంగీతాన్ని ఉన్నతోన్నత స్థితికి తీసుకెళతాడు. సంగీతం అతని చేతిలో నృత్యం చేస్తుంది” ఇట్లా అతని సంగీత నిర్వహణ గురించి ప్రచారం సాగింది. జర్మన్ మహాకవి గొథే ఫ్రాంక్ ఫర్ట్లో మొజార్ట్ సంగీత (ప్రదర్శన చూశాడు. తరువాతి రోజుల్లో, చాలా ఏళ్ళతరువాత తన కార్యదర్శి ఎకెర్మెన్తో చెబుతూ “అప్పుడు నా వయసు పద్నాలుగేళ్ళు. ఇంకా నేనా ప్రదర్శన చూస్తున్నట్లే వుంది. ఆ దృశ్యం నా కళ్ళ ముందు జం
కదుల్తోంది. వొంకులు తిరిగిన జుత్తు. తన చిన్ని ఖడ్గం పట్టుకున్న ఆ కుర్రాడు ఆ అన్విరచనీయమైన, వర్ణించ శక్యంకాని ఆ పసివాడు మెజార్ట్” అన్నాడు. తరువాత మొజార్ట్ ముఖ్యమయిన మజిలీ పారిస్. వర్సైల్స్ పారెస్లో మొజార్ట్ ప్రదర్శన అప్రతిహతంగా సాగింది. ఐరోన్ వాన్[గగ్రిమ్ “అతని సంగీత ప్రదర్శన అసాధారణం, అద్వితీయం. ఎవరయినా చెప్పినా నమ్మడం అసాధ్యం. ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత కళ్ళతో చూడాలి. సొంత కళ్ళతో వినాలి. అప్పుడే నమ్మ గలుగుతారు” అన్నాడు. కేవలం మేడం పాంపడూర్ మాత్రమే ఏమీ పట్టనట్లు మౌనంగా వుండిపోయింది. ఆమె ముఖం పక్కకి తిప్పుకుని వుండిపోవడంతో తనని ముద్దు పెట్టుకోకుండా ముఖం చాటేసిన ఆమె గురించి “ఎవరీమె? నన్ను ముద్దు పెట్టుకోకుండా మూతి ముడుచుకున్న ఈమె ఎవరు? చక్రవర్రినే నన్ను ముద్దు పెట్టుకుంది” అన్నాడు మొజార్ట్. మొజార్ట్ తన నాలుగు వయోలిన్ పొనటాలు పారిస్‌లో అచ్చుకిచ్చి ఇంగ్లాండు బయల్దేరాడు. కింగ్ జార్ట్ 8 ఆస్థానానికి వెళ్ళాడు. అక్కడ ఆస్టాన సంగీతకారుడు ((1206|] - 1౧615160 జోహాన్ క్రిస్టియన్ బాచ్. అతను జోహాన్ సబాస్టియన్ కొడుకు. అప్పటికి అతను తండ్రి కన్నా ప్రసిద్ధి చెందిన సంగీతకారుడు. బాచ్ పసివాడయిన మొజార్ట్ (ప్రేమలో పద్దాడు. ఆస్థానమంతా అతనికి లొంగిపోయింది. బాచ్ కుర్రాడయిన మొజార్ట్ శక్తియుక్తుల్ని వరీక్షించడంలో సంగీతానికి సంబంధించిన ఆటలు మొజార్ట్తో కలిసి ఆడడంలో మునిగిపోయాడు. మొజార్ట్ వాక్స్హాల్ గార్డెన్స్‌లో మరికొన్ని విజయవంతమయిన సంగీత ప్రదర్శన నిచ్చాడు. అవన్నీ దాదాపు తన స్వతంత్ర రచనలే అయివుండేవి. అక్కడే మొదటి సారి మొజార్ట్ తన మొదటి సింఫనీ ప్రదర్శించాడు. మొజార్ట్ మూడేళ్ళ సాహసయాత్రల తర్వాత, విజయపరంపరల తర్వాత 1766లో తిరిగి సాల్స్బర్ట్ చేరాడు. మొజార్ట్ ప్రతిభ యూరోపు ఖందమంతా మారు మోగింది. కేవలం సాల్స్బర్గ్ ఆర్చిబిషప్ ఒక్కడే ఆ విషయాన్ని సందేహించిన వ్యక్తి. మొజార్ట్ ప్రతిభను పరీక్షించడానికి అర్చిబిషప్ మొజార్ట్‌ను ఒక గదిలో బంధించి ఒక వస్తువు నిచ్చి దానికి స్వరకల్పన చేయమని కోరాడు. మొజార్ట్ అద్భుతంగా ఆ వస్తువుకు స్పరాన్ని కల్పించాడు. ఆర్చిబిషల్ తన పూర్తి ఆనందాన్ని వ్యక్తపరిచాడు. మొజార్ట్ స్వరపరచిన రచనని అచ్చేశాడు. సంవత్సరం గడిచాకా లియొపాల్డ్ మళ్ళీ తన కొడుకుని రెండో పర్యటన కోసం సమాయత్తం చేసినపుడు ఇర్చిబిషప్ తన అభినందనల్ని ఆశీర్వచనాల్ని అందించాడు. 1768లో మొజార్ట్ తిరిగి వియన్నా వచ్చాడు. ఒకప్పుడు అక్కడ ఇచ్చిన ప్రదర్శనలు విజయవంతమయ్యాయి. ఆ విజయాలు తిరిగి పురావృతమవుతాయన్న ఆశ లియొపాల్డ్ది. 206
రాజకుమారై మారియా జో సెఫా వివాహవేడుకల సందర్భంగా తప్పకుండా తమ ప్రదర్శనకు అవకాశం దొరుకుతుందన్నది లియోపాల్డ్ ఆశ. వాళ్ళు వియన్నా చేరకముందే పెళ్ళి కూతురికి మశూచి సోకింది. అది అంటువ్యాధి కావడం వల్ల ఆ (ప్రాంతమంతా వ్యాపించి వుంది. మొజార్ట్‌కు కూడా అది సోకింది. దాదాపు తొమ్మిది రోజులు “గుడ్డి వాడై. మొజార్ట్ బాధపడ్డాడు. చివరికి వియన్నా చేరడం జరిగింది. రాజకుటుంబమంతా అనారోగ్య పరిస్థితుల వల్ల మౌనంగా వుంది. వీళ్ళను ఆహ్వానించే నాథుడే లేకపోయాడు. అప్పట్లో మొదటిసారి మొజార్ట్ వచ్చినపుడు అతనికి ఐదేళ్ళు. ఇప్పుడు పదకొందేళ్ళు. ఐదేళ్ళ కుర్రాడిలో “అద్భుత్తాలు' చూసినట్లు పదకొందేళ్ళు కుర్రాడిలో జనం చూడరు. మొత్తానికి చక్రవర్తి మొజార్ట్‌ను ఒక ఒపేరా రాసి దానికి సంబంధించిన సంగీత ప్రతినిధుల బృందానికి దాన్ని సమర్చించమన్నాడు. మొజార్ట్ శరవేగంతో [2 ౯౧౧12 356౧101106 అన్న ఒపేరా రాశాదు. ఒపేరా. హౌస్‌కు సంబంధించిన కళాకారులు దాన్ని చూశారు-కానీ అది ప్రదర్శన దాకా వెళ్ళలేదు; మొజార్ట్ యింకో కామిక్ ఒపేరా 805460 4౧6 8894606 అన్నది రాశాడు. అది దా. ్రాంజ్ అన్టోన్ మెస్మర్ అన్న ప్రసిద్ధ హిప్మాటిస్సు యింట ప్రదర్శింపబడింది. ఆ ప్రదర్శన వల్ల మొజార్ట్ సంతృప్తి పడ్డాడు. మొజార్ట్ సంవత్సరం పాటు ఎక్కడికి వెళ్ళకుండా సాల్స్‌బర్గ్‌లో వున్నాడు. ఈసారి లియొపాల్డ్ 'ఇటలీ' ప్రయాణం తలపెట్టాడు. ఇటలీ ప్రయాణం వల్ల వియన్నాలో కలిగిన అసంతృప్తి మాయమయింది. మొజార్ట్ ఇటలీలో వెళ్ళిన ప్రతిచోటా తీవ్రమయిన పరీక్షలకు గురయ్యాడు. వాటన్నిట్నీ విజయవంతంగా అధిగమించాడు. బొలోగ్నా వెళ్ళినపుడు అక్కడ 0001206012! 6౫8015 ఇచ్చారు. ఎంత గొప్ప సంగిత వండితుడికయినా అది నిర్వహించడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. అట్లాంటిది మొజార్ట్ అరగంటలో పూర్తి చేశాడు. అప్పట్లో సుప్రసిద్ధుడయిన, గౌరవనీయుడయిన ఇటలీకి చెందిన గొప్ప సంగీతకారుడు పాడ్రి మార్టిని. మొజార్డ్ను తనతో సమానుడుగా అంగీకరించాడు. నేపుల్స్లో ఐతే మొజార్ట్ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయిన జనం అతను చేతికి పెట్టుకున్న వుంగరం మంత్ర శక్తి కలిగింది కావడం వల్ల అతను సంగీతంలో అంత గొప్ప సాహసాలు చేస్తున్నాడని నమ్మారు. అక్కడ అన్నిటికన్నా మొజార్ట్ గొప్ప విజయం రోం నగరంలో పవిత్ర వారం సందర్భంగా సంభవించింది. రోమన్ క్యాధలిక్ చర్చిలో ప్రతి సంవత్సరం గ్రిగోరియో ఆలిగ్రీ అన్న పదిహేడో శకాబ్దం సంగీతకారుడు రాసిన ౧1156818 అన్న సంగీత రచనని ప్రదర్శిస్తారు. చర్చికి చెందిన సంగీతకారులు అది నిర్వహిస్తారు. ఆ సంగీత రచనని, మరెక్కడా ప్రదర్శించకూడదన్న నిషేధం వుంది. ఆ రచనకు సంబంధించిన ఏకైక ప్రతిని చర్చిలోనే 201
జాగ్రతగా భద్రపరుస్తారు. అదొక్కటి తప్ప మరో ప్రతి ఎక్కడా లేదు. ఆ రచనని ఎక్కడయినా ఎవరయినా ప్రదర్శిస్తే వాళ్ళకు దేశ బహిష్కారమన్న చట్టం కూడా వుంది. చర్చిలో మొజార్ట్ ఆ ప్రదర్శన చూశాడు. తన విడిదికి వచ్చి తన జ్ఞాపకాల నుండి ఆ సంగీత రచననంతా సమగ్రంగా ఎత్తి రాశాడు. ఈ అసాధారణ ప్రతిభ గురించి ఎవరో పోప్‌కు చెప్పారు. పోప్ మొజార్ట్‌ని శిక్షించడానికి బదులు అతన్ని పిలిచి స్వర్ణ పతకంతో సత్కరించాడు.
మొజార్ట్ యింటికి తిరిగి వచ్చాకా బాలోగ్బాకు చెందిన అకాదెమియా ఫిల్బన్ మోనికా సంస్థ సభ్యత్వాన్నిచ్చి గౌరవించింది. ఎప్పట్నించో ఆ సంస్థ ఇరవైకన్నా తక్కువ ఏళ్ళ వయసున్న వాళ్ళకు సభ్యత్వం యివ్వకూడదని పెట్టిన నిషేధాన్ని పక్కన పెట్టి మొజార్ట్‌కు సభ్యత్వమిచ్చింది. మిలాన్ నించీ కొత్త ఒపేరా రాయమని అభ్యర్థన వచ్చింది. కొత్త ఒపేరా రీవార్సల్స్ని పర్యవేక్షించడానికి 1770 శీతాకాలంలో మొజార్ట్ ఇటలీ వచ్చాడు. ఆ ఒపేరా పేరు [/1/64416, గొ౭ 6! ౧4౧౦. ఆ ఒపేరా ప్రదర్శనకు పూర్వం జరిగిన సంగతులు లియొపాట్ట్ భార్యకు వుత్తరం రాస్తూ “మొదటి రిహార్సల్స్‌కు ముందు అక్కడ అది నిర్వహించడానికి చాలినంత మంది జనం వున్నా ఇటలీ భాష రాని ఒక కుర్రాడు ఎట్లా నిర్వహిస్తాడో చూద్దాం అన్న ఉత్కంఠతో వున్నట్లు కనిపించారు. ఆ “కుర్రాణ్జ్ణి వాళ్ళు గొప్ప ప్రతిభావంతుడుగా అది వరకే గుర్తించారు. నిర్విఘ్నంగా మొజార్ట్ మొదటి రీహార్సల్ పూర్తి చేసినప్పుడు ఒక్కరి నోటంటా ఒక్క మాట కూడా పెగల్లేదు” అని రాశాడు.
1770 డిసెంబరు 26న ఆ ఒపేరా ప్రదర్శింపబడింది. ప్రజలు మహోత్సాహంతో (వ్రతిస్సందించారు. ఆ ప్రదర్శన ఎంత విజయవంతమైందంటే అది ఇరవైసార్లు ప్రదర్శింపబడింది. +
అతని యిటాలియన్ జైత్రయాత్ర తరువాతి మొజార్ట్ జీవితం కొన్నేళ్ళపాటు ప్రతికూల ఫలితాల్ని ఇచ్చింది. ఈ సంవత్సరాలన్నీ ఆయన తన సొంత వూళ్ళోనే వున్నాడు. అప్పుడు సాల్డ్బర్గ్కు కొత్త ఆర్చిబిషప్ హీరోనిమస్ వాన్ కొల్లోరిడ్ అన్న అతను వచ్చాడు. అతనికి మొజార్ట్ ప్రతిభ గురించి అంతగా అభిమానం లేదు. నిజానికి అతను మొజార్ట్‌ని కంపోజర్‌గా నియమించాడు కూడా. మొజార్ట్‌ను ఎంత తక్కువ జీతమిచ్చేవాడంటే యితర మామూలు వుద్యోగస్థుల్లాగే చూసేవాడు. ఆ జీవితం మొజార్ట్‌కు నరకంలా అనిపించింది. కారణం అతను బయటి ప్రపంచం నించీ అభినందనల అనందతరంగాల్లో తేలినవాదు. చేస్తున్న పనిలో చలనం లేదు. అంతా నిస్సారం, నీరసం. అతని సృజనాత్మక సంగీత రచనలకు అక్కడ గుర్తింపు లేదు. ఎన్నో స్వరరచనలు, వయోలిన్, పియానోల్ని వుద్దేసించినవి, 202
సింఫనీలు సిద్ధం చేశాడు. ఎప్పుడయినా ఒక సారి జైలు నించీ బయటపడినట్లు ఆ వాతావరణాన్ని తప్పించుకుని వెళ్ళేవాడు: 1773లో అర్చిబిషప్తోబాటు వియన్నా వెళ్ళాడు. 1774 డిసెంబర్లో తన విస్య ఒపేరా 14 ౯1౧14 918౧010016 ని పర్యవేక్షించడానికి మిలాన్ వెళ్ళాడు. మొజార్ట్ మనసు సాల్డ్బర్ల్ నించీ బయట పడాలని తపించింది. తహతహలాడింది. 'ప్రయాణాలలోని ఉల్లాసాన్ని వూహించింది. యూరప్‌లోని సుప్రసిద్ధ సంగీత కేంద్రాలు అతనికి ఇచ్చిన ఆనందాన్ని అభినందనల్ని అతని జ్ఞాపకాలు కదిలించాయి. వాటన్నిటి కన్నా తనిప్పుడు పసివాడు కానని, పరిణిత వయసు వచ్చిన వాడని, మనసు వికసించిన వాడని అతనికి స్పృహ ఏర్పడింది. ఎక్కడో ఒక చోట లాభదాయకమయిన స్థితిని అన్వేషించే ప్రయత్నం అవసరమని భావించాడు. మొజార్ట్ వెళ్ళడానికి ఆర్చి విషప్ అడ్డు చెప్పలేదు. అతని దృష్టిలో మొజార్ట్ ఆస్థాన సంగీతకారుల్లో అతనొకడు. మొజార్ట్‌కు “లీవు మంజారు చేశాడు. మొజార్ట్ జీవితంలో మొదటిసారి తండ్రి వెంట లేకుండా టూర్, మొదలు పెట్టాడు. లియొపాల్డ్ కూడా కొడుకు వ్యక్తిత్వాన్ని మన్నించి కష్టముయినా అతను ఒంటరిగా వెళ్ళడానికి అనుమతించాడు. 1777లో తల్లితో బాటు మొజార్ట్ పారిస్ వైపు కదిలాడు. పారిస్ చేరే ముందు ఆగ్స్బర్ట్లో ఆగి అక్కడ తన [1168 60491 బాన్లీతో సరసా లాడాదు. మాన్హీమ్ అన్న చోట ఆలోసియా వెబర్ అన్న అమ్మాయి (ప్రేమలో పడ్డాడు. క్షణకాలం ఆమెతో కలిసి ఇటలీ పారిపోదామని కూడా అనుకున్నాడు. సాల్డ్బర్గ్ నుండి ఆగ్రహ పూరితమయిన వుత్తరాలు అతని లక్ష్యాల్ని గుర్తు చేస్తూ వచ్చాయి. ఇప్పటికీ మొత్తం మీద మొజార్ట్ తండ్రి అదుపాజ్ఞల్లోనివాదే. అనివార్యమయిన ఎడబాటుతో అలోపియాకు వీడ్కోలు పలికి మార్చి 28, 1778న పారిస్ చేరాడు. పారిస్‌లో మొజార్ట్‌కు తాజా నిరాశలు ఎదురయ్యాయి. ఇపుడక్కడ ఎవరికీ అతని పట్ల అంత వుత్సాహం లేదు. అను పసివాడు కాడు. పరిణిత దశలోని యువకుడు. అతన్ని పసివాడుగా పారిస్ వచ్చినప్పుడు ఆకాశానికెత్తిన వాళ్ళు కూడా 'మరీ అంతులేని ఆత్మవిశ్వాసం ప్రదర్శించే వాడని అన్నారు. అతనికి కొన్ని అవకాశాలే వచ్చాయి. కొంత గౌరవనీయమైన వుద్యోగం వర్సైల్స్‌లో ఆర్భానిస్టుగా వచ్చింది. నిరాశకు తోడు విషాదం ఎదురైంది. 3 జూలై 1778న మొజార్ట్ తల్లి హఠాత్తుగా చనిపోయింది. జీవితంలో మొదటిసారి మొజార్ట్ ఒంటరివాడయ్యాడు. మొజార్ట్ హఠాత్తుగా 203
మాన్హీమ్ వెళ్ళి అలోసియాను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మాన్హీమ్ వెళ్ళాడు. కానీ అలోసియా అతన్ని మొదట గుర్తు పట్టలేదు. గుర్తు పట్టిన తరువాత అతన్తో ఎంతోకాలంగా సంబంధాలు లేకపోవడంతో అతని పట్ల తన ఆరాధన చల్లబడిందని ఆమె అంది. మొజార్ట్ ఏమీ చెయ్యలేకపోయాడు. తండ్రి ఆ దేశానుసారం సాల్ట్బర్ల్ వెళ్ళాడు.
మొజార్ట్ మళ్ళీ 'దారుణమయి' జీతం వచ్చే ఆర్చిబిషప్ ఆస్థానంలో ఆర్జానిస్టుగా, కంపోజర్‌గా మళ్ళీ చేరాడు. మళ్ళీ పాత విసుగు, అమర్యాద మొజార్ట్‌ని అల్లుకున్నాయి. రెండేళ్ళపాటు చిత్రహింస అనుభవిస్తూ తన విధి వైపరీత్యానికి వ్యతిరేకంగా నిశ్శబ్దంగా తిరుగుబాటు చేశాడు మొజార్ట్.
అతని ఒపేరా 5612 14006౧60 మ్యూనిచ్‌లో (ప్రదర్శించడానికి వెళ్ళాడు. 29 జనవరి 1781న అది జరిగింది. అక్కడి జనం దాన్ని ఆహ్వానించారు. మొజార్ట్ ఉల్లాసంగా వూపిరి పీల్చుకున్నాడు. ఆ విజయం అతన్లో కొత్త వుక్సావాన్నిచ్చింది. యింక ఎంతో కాలం తను సాల్స్‌బర్గ్‌లో వుండలేనని అతను నిశ్చయానికి వచ్చాడు. ఆర్చిబిషప్‌తో అతని సంబంధాలకి అంతం పలకాలనుకున్నాడు. ఎందుకంటే ఆర్చిబిషప్ నిశ్శబ్ద క్రూరత్వంతో, భూస్వామ్య తత్వంతో మొజార్ట్‌ని చిత్రహింసకులోను చేశాడు. తక్కువగా చూశాడు. అసహానానికి గురి చేశాడు,
1781లో హరాత్తుగా ఆ మార్పు, మలుపు సంభవించింది. ఆర్చివిషప్ మారియా తెరెసా అంత్యక్రియలకు వెళుతూ మ్యూనిచ్‌లో వున్న మొజార్ట్‌ని, వియన్నా రమ్మని ఆదేశాలు వంపాదు. మొజార్ట్స్ వచ్చాడు. ఆర్బిబిషప్ నిర్లక్ష్యంగా మొజార్ట్డ్ ఎట్లాంటి సొంత వ్రయోజనకరమైన “సంగీత ప్రదర్శనలూ వియన్నాలో యివ్వకూడదని అంక్షలు పెట్టాదు. దాంతో మొజార్ట్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంత దాకా ఓర్పు గురించి, నెమ్మది తనం గురించి సలహా సం్రదింపుల్తో ఎప్పటి కప్పుడు వచ్చే తండ్రి వుత్తరాల్లోని హెచ్చరికలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. మొజార్ట్ ఆవేశంతో బదులిచ్చాడు. ఆర్చివిషప్ అమర్యాదకరంగా కించపరిచాడు. ఈ తతంగమంతా తండ్రికి రాసిన వుత్తరంలో మొజార్ట్ వివరించాడు. ఈ గొడవ పతాక స్థాయికి చేరిన సన్నివేశం మొజార్ట్‌ని సాల్స్బర్గ్ వెళ్ళమని ఎట్లాంటి ముందస్తు వివరణలు లేకుందా చెప్పడంతో జరిగింది.
“వారం రోజుల క్రితం ఒక నౌకరు వూహించకుండా వచ్చి తక్షణమే నువ్వు ఇక్కణ్ణించీ వెళ్ళిపోవాలని అన్నాదు. తక్కిన వాళ్ళకు ఆ సంగతి ముందే చెప్పబడింది. నాకేమో ముందుగా చెప్పకుండా అప్పటికప్పుడు వెళ్ళిపోమన్నాడు, నేను వెంట వెంటనే నా సమాన్లన్నీ పెట్టెలో 204
కూరాను. నేనేమో బుధవారానికి బయట్టేరడానికి బండి మాట్లాడాను. అప్పటికి నాకు రావాల్సిన దబ్బు అందకపోవడంతో నా ప్రయాణాన్ని శనివారానికి వాయిదా వేసుకున్నాను. తెల్లవారాకా సేవదువచ్చి ఆర్చిబిషప్ నాతో బాటు ఒక సంచిని తీసుకెళ్ళమని చెప్పాడు” అన్నాడు. అదేమంత అర్జెంటా?'అన్నాను. అతను “అవును. చాలా ముఖ్యమయినది” అన్నాడు. అప్పుడు నేను, ఐతే నన్ను మన్నించండి. నేను యిక్కణ్ణించి శనివారం దాకా బయళ్దేరను. నేను కుటుంబం మీద ఆధారపడిలేను, నా ఐతుకు నేను బతుకుతున్నాను. నా ప్రయాణానికి సరిపదా డబ్బురావాల్సి వుంది. నన్ను అజమాయిషీ చేసే అధికారం ఎవరికీ లేదు” అని రాశాడు.
యింకా “నేను అతని ముందుకు వచ్చినపుడు అతని మొదటి మాటలు జస్యగ్రే! ఐతే ఎప్పుడు వెళుతున్నావోయ్?” అన్నాడు! ఈ రాత్రికి వెళదామనుకున్నాను కానీ వీలుపడలేదు” అన్నాను. అప్పుడతను వూపిరి కూడా పీల్చుకోకుండా నిల్చున్నాడు. అంత అసహ్యకరమైన మనిషిని నా జీవితంలో చూడలేదు. నాలాగా ఎవడూ వాడికి సేవలు చెయ్యడు. నేను వెంటనే ఈ రోజే బయల్దేరాలి లేకుంటే వాడు వుత్తరం రాసి నా జీతం అందకుండా ఆపేస్తాడు. నా రక్తం వుడికిపోతోంది. ఇంకా మౌనంగా వుండలేక, వుండబట్టలేక మీ దయ నేనంటే అయిష్టం ప్రదర్శిస్తోందనుకుంటాను, అన్నాను. అతను “ఏంటి? నన్ను బెదిరిస్తున్నావా? ఇడియట్! అదిగో! తలుపులు తెరిచేవున్నాయి, గెటౌట్! నీచులతో నేను మాట్లాడను, అన్నాడు “నేనూ అంతే! అన్నాను. నేను వెళుతూ రేపు ఉద్యోగానికి రాజీనామా నా దస్తూరీతో నీకందుతుంది' అన్నాను” అని రాశాడు.
అట్లా చివరికి దుర్మార్డుడయిన ఆర్చిబిషప్ నించీ (అదే సమయంలో అధికారం చెలాయించే తండ్రి నించీ) ఏకకాలంలో మొజార్ట్ 'స్వేచ్భాను పొందాడు.
మొజార్ట్ వియన్నాలో స్థిరపడ్డాడు. తన జీవితంలో మొదటిసారిగ తన కాళ్ళపై తను నిలబడ్డాడు. మొజార్ట్‌కు భవిష్యత్తుకు సంబంధించి భయాలు లేవు. వియన్నా అతనికి పరిచిత నగరమే. రాజాస్థానం నించీ మొజార్ట్‌కు ఆహ్వానం అందింది. ఆనాటి సుప్రసిద్ధ పియానిస్టు మూజియోక్షిమెంటీ తో సంగీత “ద్వంద్వ' యుద్దానికి ఆహ్వానం. క్లిమెంటీ తను రాసిన సొనటాను ప్రదర్శించాడు. మొజార్ట్ అప్పటికప్పుడు ఆశువుగా విఖిన్న రీతులో తన సంగీత ప్రదర్శన చేశాదు. చక్రవర్తి ఆ పోటీని “డ్రాగా నిర్ణయించాడు. కానీ ఆ పోటీ వల్ల వియన్నాలో విపరీతమయిన పేరు సంపాదించాడు. కంపోజర్‌గా గుర్తింపు పొందాడు. చక్రవర్తి కొత్త ఒపేరా రాయమని మొజార్ట్‌ని కోరాడు. మొజార్ట్ 716 40660101 0/౫ 582010 అన్న ఒపేరా రచించాడు. ఆంటోనియో సలీరి అన్న ఆ నాటి పలుకుబడి కలిగిన
2005
సంగీతకారుడు ఆ ఒపేరా ప్రదర్శనకు ఎన్నో ఆటంకాల్ని కలిగించాడు. చివరికి 16 జూలై 1782లో ప్రదర్శింపబడింది. ఆంటోనియో మనుషులు కొందరు అల్లరి చేసి, రసాభాస చెయ్యడానికి ప్రయత్నించారు. కానీ తక్కిన (ప్రేక్షకులంతా ఆ ప్రదర్శనకు అనందించి అభినందించారు.
ఆ ఒపేరా గురించి చెబుతూ మొజార్ట్ “ఆ ఒపేరా పట్ల జనం అమితోత్సాహం ప్రదర్శించారు. వాళ్ళనించీ అభినందనలు వెల్లువెత్తాయి. జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు. రాజవంశీకులు ఆనందించారు. రాజకుమారుడు కూనిట్ట్ 'మొజార్ట్ లాంటి ప్రతిభావంతుడు శతాబ్దానికి ఒక్కడు పుడతాడు" అన్నాడు అని” అన్నాడు.
ఆస్థానంలో గొప్ప ఆదాయం వచ్చే ఉన్నత ఉద్యోగం తనకు త్వరలో రాబోతోందన్న విషయంలో మొజార్ట్‌కు సందేహం అణువంత కూడా లేదు. అతని భవిష్యత్తు పట్ల అతనికి అంతులేని విశ్వాసం ఏర్పడింది. పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆమె అలోసియా సోదరి. ఆమె పేరు కాన్స్టాంట్జి వెబర్. 4 ఆగస్టు 1782న వాళ్ళ పెళ్ళి జరిగింది.
కానీ మొజార్ట్ ఆశించినట్లుగా విషయాలు జరగలేదు. అతను ఆశించిన పదవి దక్కలేదు. ప్రతిసారీ ఆ పదవి తనకు వస్తుందని ఆశించాడు.
ఇప్పుడు ఆ స్థానంలోకి మొజార్ట్ చిరకాల శత్రువు సలేరీ వచ్చాడు. అతన్ని అభిమానించిన చాలా మంది ప్రసిద్ధులు కూడా పోటీకి వచ్చారు. వాళ్ళలో జోసఫ్ హైదెన్ కూదా వున్నాడు. కొద్దిగా ఆదాయం వచ్చే అదీ ఎప్పుడు వస్తుందో తెలీని ఆదాయం వచ్చే సంగీత పారాలు చెబుతూ అలసిపోయాడు. భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ విసిగిపోయాదు.
కానీ అతన్లో నిరాశ ఏకోశానా లేదు. ఆ 'గొప్ప క్షణం కోసం ఎదురు చూస్తూనే అతను పాడాడు, రాశాడు, నృత్యం చేశాడు. ఎప్పుడూ సౌందర్య భరితంగా కొత్త కొత్త ఫాషన్ల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఎప్పటి కప్పుడు ఉన్నత సృజనాత్మక శిఖరాల్ని అందుకుంటూ సాగాదు. అతని పెళ్ళయిన రెండేళ్ళలో ఐదు పియానో సంగీత రచనలు చేశాడు.
మొజ్ఞార్ట్ సుకుమారుడు. పొట్టిగా వుండేవాడు. బలహీన శరీర నిర్మాణం. అతని తల అతని శరీరం కన్నా పెద్దది. అది అందమైన ఒత్తుగా వున్న జుత్తు ఆకర్షణీయమైంది.
అతను అందమైన ఆడ పిల్లలా వుండేవాడు. అతని ముఖంలో సౌకుమార్యం, స్రీత్వం వుండేవి. ఆ ముఖంలో బలమైనవి, శక్తివంతమయినవి అతని కళ్ళు.
మొజార్డ్ జీవితాన్ని (ప్రేమించాడు. ఆ జీవితం కొన్ని సార్లు బాధాకరమయినా (ప్రేమించాడు. ఎర్రకోటు వేసుకుని, హాస్యగాడుగా ముఖానికి మాస్మువేసుకుని నృత్యం 206
చేసేవాడు, బిలియర్స్స్ ఆట ఆదేవాడు. కానీ అన్నిట్లోకల్లా అతనికి ఆనందకరమైన విషయం నాట్యం చేయడం, “సంగీతం చెప్ప నక్క్లేదనుకోండి' అనేది వాళ్ళావిడ.
అడాల్న హెనిక్ పసివాడయిన మొజార్ట్ గురించి కొన్ని ఆసక్తికరమయిన విషయాలు చెప్పాడు. “చిన్నప్పుడు “పద్ధతిగా ఎట్లా ప్రవర్తించాలో అతనికి తెలిసేదికాదు. ఇంటి విషయాల్లో డబ్బును పద్ధతిగా కర్చు పెట్టడం, తనకి అవసరమయిన “ఆనందాల్ని అందుకోవడ-. =తనికి తెలిసేది కాదు. వాటికి సంబంధించి ఎట్లాంటి అభిరుచుల్ని అతను ఏర్పరచుకోలేదు. ఆ క్షణానికి ఆనందించడ మొకటే అతన్లో మౌలికమైన లక్షణంగా వుండేది” అన్నాడు.
అతని సంగీత రచనా విధానం గురించి చెబుతూ
“మాధారణంగా పొద్దున్నే ఆరుగంటల నించీ ఏడు గంటల దాకా సంగీతాన్ని అభ్యసించేవాడు. కానీ సంగీత శ్రమకు సంబంధించి అతనికో కాల నియమం, పద్ధతి, ప్రకారం వుండేది కాదు. అతని మనసులో స్వరకల్పనకు సంబంధించి ఆలోచన వస్తే పియానో ముందు కూచుని చుట్టూ మిత్రబృందం వున్నా సంగీతంపై ఏకాగ్రత నిలిపేవాడు. ఒక్కోసారి రాత్రంతా కూచుని రాస్తూ వుందేవాదు.- మొజార్ట్‌కు మనుషులంటే మమకారం. వాళ్ళ మధ్య సజీవంగా ఆనందంగా, చలంశీలనతో వుండేవాడు. ఎప్పుడయినా కొంత దిగులుగా వుండేవాడు కానీ “అన్యమనస్కంగా వుండేవాడు కాడు. ఆదివారం వుదయం 'అతని యిల్లు అతిధులతో నిండివుండేది.. ఆనందం, వుల్లాసం, చర్చలు, హడావుడి వుండేది. మొజార్ట్ “పెద్ద మొత్తంలో” తాగేవాడు. కానీ అన్ని వేళలా అక్కడ సంగీతం తాండవించేది. అతనయినా, లేదా యితర సంగీతకారులయినా ప్రదర్శించేవాళ్ళు. ఓ సందర్భంలో హైడన్ వస్తే అతని పట్ల గౌరవంగా తన కొత్త కృతిని ఆలపించాడు. అప్పుడు అక్కడ నలుగురు సంగీతకారులు మొదటిసారి ప్రదర్శనకు సిద్ధపడ్డారు. మొదట హైడెన్ వయోలిన్ వాయించాడు. చక్రవర్తికి ఇప్పుడయిన కార్ల్వాన్ దిట్టర్స్ డార్భ్ రెండోవయోలిన్ వాయించాడు. మొజార్ట్ వయోలా వాయించాడు. మొజార్ట్ స్నేహితుడు వాన్హల్ ౪1010౧6610 వాయించాడు. అప్పుడు తన కొడుకుని చూద్దానికి అక్కదికి వచ్చిన లియొపాల్డ్తో హైదెన్ 'నేను దేవుడి ముందు నిలబడి నిజాయితీగా చెబుతాను. నీ కొడుకు నాకు తెలిసి సంగీత కారులందరిలో అసమానుడు. నాకు సన్నిహితుల్లోనూ, నాకు తెలిసిన వాళ్ళందరిలోనూ అన్నాడు.
మొజార్ట్ 1785లో యింపీరియల్ థియేటర్‌కు కొత్తగా నియమితుడయిన కవి అమ్బెడాపోటీ'ని కలిశాడు. అతనో కలిసి బీమర్ఛాయీస్ రచన.[6 [12206 68 [04౧0 ఆధారంగా ఒక ఒపేరా నిర్మించి ప్రదర్శించారు. 'బీమర్ చాయిస్” విప్లవాత్మక భావాల్ని అభిప్రాయాల్ని పక్క పెడితే తక్కినదంతా బావుందని, వాటిని తొలిగించమని చక్రవర్తి చెప్పాడు. చక్రవర్తి చెప్పినట్లు ఆరువారాల్లో దాన్ని సిద్ధం చేశారు.
207
ఎప్పట్లాగే సలీరీ మొజార్ట్ కొత్త ఒపేరా ప్రీమియర్‌కు అడ్డు పడ్డాడు. కుట్రచేసే 'సైంధవుడిగా అడ్డు పద్దాడు. ముందుగా కుట్రపన్ని సంగీతకారుల్ని పాటకుల్ని ప్రభావితం చేశాడు. ఆ ఒపేరా మార్పులకు వీలుపడదని, ఐనా అది ప్రదర్శనకు పనికి రాదని వాళ్ళతో చెప్పాడు. ఆగ్రహించిన మొజార్ట్ ఆ ఒపేరాని ప్రదర్శించనని కూడా ఓ సందర్భంలో నిర్ణయించాడు. మధ్యలో చక్రవర్తి జోక్యం చేసుకున్నాడు. దాంతో పరిస్థితులు మారాయి. గెండో రీహార్సల్ మొదలయ్యే సరికి పాటకులు, సంగీతకారులు ఉత్సాహంతో ముందుకొచ్చారు. మైకేల్ కెల్లి అన్న గాయకుడు “స్టేజిపైన ఆర్మెస్ట్రా విద్యుత్తేజంతో వెలిగిపోయింది. స్టేజి మీది సంగీతకారులంతా ఆనందంతో పరవశులై ప్రతిసారీ ఉత్తేజంతో అరిచారు. “బ్రేవో! లాంగ్‌లివ్ ద గ్రేట్ మొజార్టై” అని అరిచారు" అన్నాడు. మొజార్ట్ నమంగా తలవంచి కృతజ్ఞతలు చెప్పాడు.
1 మే, 1786లో 1౧6 [12౧1206 0 ౯10౭10 బర్గ్ థియేటర్లో ప్రదర్శింపబడింది. మైకేల్ కెల్లీ దాన్ని గురించి రాస్తూ “ధియేటర్ క్రిక్కిరిసి పోయింది. అందులో అంటే ఒపేరాలో ఎన్నో సన్నివేశాలని, మళ్ళీ మళ్ళీ ప్రదర్శించాల్సి వచ్చింది. చక్రవర్తి కూడా ఎంతో అనందించాడు.” అన్నాడు,
ఐతే *'సలేరి మొజార్ట్ విజయాన్ని అంగీకరించలేదు. తన ఆధివత్యాన్ని నిరూపించుకోవదానికి శాయశక్తులా కృషి చేశాడు. బర్గ్ ధియేటర్లో తన ఆకర్షణీయమైన, ముచ్చటయిన చిన్ని “ఒపేరా 4౧2 6052122 ప్రదర్శించాడు. అది విజయవంతమైంది. దాని విజయం కింద మొజార్ట్ ఒపేరా విజయం మరుగున పడింది.
మొజార్ట్ ఒపేరా ప్రదర్శన వల్ల 1450 '“గుల్టెన'లు వచ్చాయి. అవి దానికయిన కర్చులకు, అప్పులకు బొటాబొటిగా సరిపోయాయి. చేతిలో పైనా లేకుండా పోయింది. మధ్య మధ్యలో స్నేహితులకు సాయం చేయాల్సి వచ్చేది. ఆస్థానంలో మంచి ఆదాయం వచ్చే స్థాయి కోసం ప్రయత్నాలు ఫలించలేదు. లేదా ఎవరయినా సంపన్నుల దగ్గర మంచి ఆదాయం వచ్చే అనుకూలమూ కుదర్లేదు. చక్రవర్తి “ప్రోత్సాహం” తప్ప మొజార్ట్‌కు ఏమీ యివ్వలేదు. ఇనా ఇవేవీ మొజార్ట్ సృజనాత్మక కార్యకలాపం మీద ప్రభావం చూపలేదు. ఒపేరాలు, ఇతర రచనలు కొనసాగించాడు. డాపోంటీ సహకారుతో సిద్ధంచేసిన 00 10౪20౧) ఒపేరా 28 అక్టోబర్, 1787లో 'ప్రాగ్లో ప్రదర్శింపబడింది. ఘన విజయం సాధించింది. సమకాలీన పత్రికయిలా రిపోర్టు చేసింది. “సందర్శకులు, కళాకారులు అందరూ యిట్లాంటి ప్రదర్శన యిప్పటిదాకా (ప్రాగ్లో జరగలేదని అన్నారు. మొజర్దే దీన్ని నిర్వహించాడు. ఆర్మెస్ట్రాలో ఆయన కనిపించగానే ఆనందంతో జనం వూగిపోయారు.”
208
ఆ సందర్భం గురించి మొజార్దే “అందరూ ఆనందంతో నన్ను ఆకాశానికెత్తారు. యిక్కడే వుంది. యింకో ఒపేరా సిద్ధం చెయ్యమన్నారు. నేనెంత పరవశించినా ఆ ప్రతిపాదన నేను స్వీకరించలేదు” అన్నాడు.
(ప్రాగ్వాసులు కోరినా అక్కడ వుండకుందా తిరిగి వియన్నా చేరాడు. .వస్తూనే ఆ స్థాన సంగీతకారుడు, 'గ్లూక్' హరాత్తుగా కన్ను మూసినట్లు వార్త అందింది. ఎప్పట్నించో అందరూ మొజార్ట్‌కు ఆ పదవి యివ్వాలని, మొబజార్డ్ ఆర్థిక దుస్థితి కూడా చక్రవర్తికి చెబుతూ వచ్చారు.మొజార్ట్‌కు ఆ పదవి వచ్చింది కానీ అంతకు ముందా పదవిలో వున్న వాళ్ళకి సంవత్సరానికి 2000 గుల్డెన్లు జీవన భృతి వుంటే మొజార్ట్ వంతు వచ్చేసరికి అది 800 గుల్టెన్లకు దిగజార్చారు! ఫలితంగా డబ్బు కోసం మొజార్జ్ స్నేహితుల్నించీ అప్పు చేయాల్సి వచ్చేది. అదీ తగిన 'వడ్డోతో! మొజార్ట్ భార్య ఆరోగ్యం బాగో లేక చికిత్స కోసం బాడెన్ వెళ్ళింది. మొజార్ట్కూ అరోగ్యం సరిలేదు. సహాయం కోసం ఎవర్ని అభ్యర్థించాలో మొజార్ట్‌కు తోచలేదు. తరువాత రెండేళ్ళు అతని పరిస్థితి మరింతగా దిగజారింది.
ఇట్లా అప్పుల్లో, అనారోగ్యంలో, ఒంటరి తనంలో, నిరాశలో మునిగిన చీకటి పరిస్థితుల్లో యిమ్మాన్యుయెల్ స్టికెన్డర్ ఒక జర్మన్ కామిక్ ఒపేరా రాయమని కోరాడు. అది 706 [18010 ౯116. అది రాయడానికి మొజార్ట్ ఉత్సాహంగా 'అంగీకరింఛాడు. ఆ సందర్భంలో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి తనా ప్రదర్శనని నిర్వహిస్తానని కోరాడు. అతను "60౪౧ ౪౧౪౬156099. మొజార్ట్ ఆ విషయం గురించి చెబుతూ
“నేను ఆ అజ్ఞాత వ్యక్తిని కళ్ళార్చృకుందా చూశాను. అతను నన్ను (బ్రతిమిలాడాడు. నన్ను ఆ ఒపేరా నిర్మించమని అభ్యర్థించాడు. నేను అవిశ్రాంతంగా కష్టపడ్డాను. ఇక్కడ నేను భయపడాల్సిందేమీ లేదు. ఈ సమయం చాలా విలువైంది. నేను 'మరణాన్ని సమీపించబోతున్నాను. నా ప్రతిభను నేను 'ఆనందించే' ముందే ఈ పని ముగించాలి. తరువాత నా '౯416/2! $09' పూర్తి చేయాలి. దాన్ని అసంపూర్తిగా వదలకూడదు” అన్నాడు.
స్పికండర్కు సంబంధించిన చిన్ని థియేటర్లో ౧6 112010 ౯116 30, సెప్టెంబర్ 1781లో ప్రదర్శింపబడింది. మొదట వియన్నా జనాలు నిశ్శబ్దంగా దాన్ని స్వీకరించారు. కానీ క్రమంగా వందల కొద్దీ ప్రదర్శనలు జరిగాయి.
మరణం తనకేసి పరిగెట్టు కొస్తోందని మొజార్ట్‌కు తెలుసు. ఆ రోజు సాయంత్రం మిత్రులందర్లో కలిసి తన కిష్టముయిన 716 $42010 [1416 నించీ కొన్ని భాగాల్ని విన్నాడు. తన ఒపేరా అందర్నీ అలరిస్తోందన్న సృహ ఆయనకు ఆనందాన్నిచ్చింది.
209
డిసెంబర్ ఉన పరుపు మీద ఒద్దిగ్గా తనను ఆనుకునేలా కూర్చో బెట్టమని కోరి సన్నిహితులయిన మిత్రుల్ని పిలిచి ౬00౧/౧౧౦52 అన్న రాతప్రతిని యిచ్చి' అందర్నీ కలిసి దాన్ని ఆలపించమన్నాడు. వాళ్ళు ఆలపిస్తూ వుంటే మధ్యలో తట్టుకోలేక జలజలా కన్నీళ్ళు కార్చాడు. ఆ రోజు అర్ధరాత్రి కుటుంబానికి వీడ్కోలు చెప్పాడు. గోడవైపు తిరిగి పడుకున్నాడు. వాళ్ళు అతన్ని తాకి చూస్తే చనిపోయివున్నాడు.
అతని అంతిమ సంస్కారం దయనీయంగా జరిగింది. ఆ రోజు బాగా చల్లగా వుంది. తక్కువ రకం శవపేటిక సిద్ధం చేశారు. చిరకాల శత్రువయిన సలేరీ శవయాత్ర సంగీతాన్ని నిర్వహించాడు. విపరీతమయిన వర్షం వల్ల మిత్రులు కూడా కొద్ది మందే వచ్చారు. మొజార్ట్ భార్య దుఃఖాతిరేకం వల్ల శవయాత్రలో పాల్గోలేదు. ఒక అనాథ శవంలా అతన్ని సమాధి చేశారు. అతని సమాధిపై సమాధిరాళ్ళు కానీ, క్రాస్ గుర్తుకానీ లేవు! కొన్నేళ్ళ తర్వాత అతని భార్య కాన్స్టాంట్జి వచ్చి చూసింది కానీ ఆమె భర్తను ఎక్కడ పాతిపెట్టారో అమె గుర్తించలేకపోయింది! 220
మోడెస్ట్ ముసార్ల్స్కీ 061651 /46550/3951/ 21-3-1839 -- 28-3-1881
సుప్రసిద్ధ రపష్యన్ సంగీతకారుడు బొరోడిన్, మూసార్గ్స్కీని కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు. అప్పుడు ముసార్ల్స్కీ ఆర్మీ ఆఫీసర్‌గా వున్నాడు. యువకుడు.
“ముసార్ల్స్కీ ముచ్చట గొలుపుతాడు. అందగాడు. బిగుతుగా వున్న యూనిఫాంలో ఆకర్షణీయంగా కనిపించే యువకుడయిన ఆఫీసర్. అణచి దుర్వి కొద్దిగా ముందు కొచ్చిన జుత్తు. అందమైన చేతులు తీర్చి దిద్దినట్లున్నాయి. అతని ప్రవర్తనలో హుందాతనం, సంపన్న లక్షణం వున్నాయి. పళ్ళగుండా కొద్దిగా మాట్లాడతాడు. ఫ్రెంఛి వ్యక్తీకరణతో అతని చర్చలు నిండి వుంటాయి. అతన్లో ఆదంబరం కనిపిస్తుంది కానీ మర్యాదగానే ప్రవర్తిస్తాడు. అతని సంస్కారం, నాగరికత అసాధారణంగా వుంటాయి. స్త్రీలు అతన్ని ఇష్టపడతారు. పియానో ముందు కూచుని తన అందమైన వేళ్ళని కదిలిస్తూ మధురమయిన గానాన్ని పంచుతాడు. స్రీలు పరవశంతో చప్పట్లు కొట్టి 'మళ్ళీ మళ్ళీ? అంటారు” అన్నాడు.
ఇది ముసార్గ్స్కీ యవ్వనంలో వున్నప్పటి వర్ణన. రెండోది రేపిన్ అన్న చిత్రకారుడు ముసార్గ్స్కీ చివరి రోజుల్లో గీసిన చిత్రం. లోతుకు పోయిన కళ్ళు. పాలిపోయిన ముఖం. పల్చటి దవడలు. రంగు వెలిసిన నుదురు. వీటిని బట్టి అనారోగ్యంతో అంతిమ దశకు చేరుకున్న మనిషిని కాదు మనం చూడాల్సింది. ఆ లోతు కళ్ళలోని చైతన్యం, ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఒక పరిణిత దశకు చేరిన ఒక ్రతిభావంతుణ్ణి మనం చూడొచ్చు.
ముప్పయి అయిదేళ్ళు దాటాకా ముసార్గ్స్కీ తాగుడుకు బానిస అయ్యాడు. తనని భయభ్రాంతుజ్జి చేసే ఒంటరితనం, రోగం, దిక్కు తోచని తనం, నిరాశ దరిద్రం, సోమరి తనం వీటి నించీ బయట పడడానికి మత్తు ఒకటే అతనికి మందు!
ముసార్గ్స్కీ ఒక సందర్భంలో “కళ ఒక ఆటకాదు, కాలం విలువైంది" అన్నాదు. నిజమే, ముసార్గ్స్కీ తన జీవితంలో కళ అన్నద్రాన్నెప్పుడూ ఆటగా భావించలేదు. తన జీవితంలోని కష్టకాలంలోనూ, అంతిమ ఘడియలోనూ ఆయన ఎప్పుడూ అలా భావించలేదు, తన సహకళాకారులయిన బొరోదిన్, రిమ్స్కీ కొారసకోవ్, బలాకిరెవ్ల ఆదర్భాలకు కట్టుబడ్డాడు. తన సహ సంగీతకారుల్ని అతను అభినందించాడు. ఆరాధించాడు. కానీ వాళ్ళు అతన్ని తక్కువగా అంచనా వేశారు. వాళ్ళు అతన్ని తడబడే స్కూలు కుర్రాడిగా భావించారు. కానీ
221
తను విశ్వసించే దాని పట్ల ముసార్గ్స్కీ ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు. తను నమ్మినధాన్ని అవిష్కరించదంలో అతను వెనుకంజ వేయలేదు.
అవును. కాలం అతనికి విలువైంది. విధి అతని జీవితమంతా సంగీతానికి ధారబోయడానికి అనుమతించలేదు. మొదటి ఇరవై సంవత్సరాలు మిలిటరీ సర్వీసు చేశాడు. తరువాత సంగీతం కోసం యూనిఫాం వాదిలేశాడు. కానీ ఐదేళ్ళ తరువాత ఆకలినించీ చావకుండా బతకడానికి “బానిస క్లర్కు వుద్యోగంలో చేరి జీవితంలో చివరి సంవత్సరం దాకా చేశాడు. అతని సహసంగీతకారుల కున్న సంగీత పూర్వరంగంకానీ, విద్యకానీ, శిక్షణకానీ అతనికి లేదు. వాళ్ళతో పోలీస్తే సంగీతంలో అతను 'అవిద్యావంతుడి కిందే లెక్క 'స్పరకల్పన' అన్నది అతని రోజువారీ జీవితంలో రెండో స్థాయిదే. సాయంత్రాలు కానీ, వారాంతాలు కానీ బతకడానికి ఏమీ సంపాదించలేని పరిస్థితుల్లో సంగీత రచన చేసేవాడు. వీటికి తోడు అతని అనారోగ్యం. అప్పుడప్పుడూ స్పృహ కోల్పోయేవాడు. నరాలజబ్బు, ఒక్కోసారి 'పిచ్చి” పట్టేది!
ఇట్లాంటి దారుణ పరస్థితుల్లో వుంటూ రష్యన్ సంగీతంలో ఆణిముత్యాల వంటి సంగిత రచనలు చేశాడు. వాటిల్లో అతని సృజన పొంగులు వారుతుంది. రష్యన్ సంగీతకారులందరిలో సహజ సిద్ధమయిన ్రతిభగలవాడు ముసార్ల్ స్కీ సంగీత విద్య ఆధునికత అతనికి అందుబాటులో లేకపోయినా తన జన్మతః వచ్చిన శక్తియుక్తుల్లో వాటిని ఆవిష్కరించాడు,
ముసార్గ్స్కీ దుర్భరమయిన దరిద్రంలో కన్నుమూశాడు. కానీ మహా సంపన్న కటుంబంలో పుట్టాడు. అతని తండ్రి గొప్ప భూస్వామి. నలభై మైళ్ళ విస్తీర్ణమున్న ఎస్టేట్‌కు యజమాని. అక్కడ ముసార్గ్స్కీ హాయిగా, ఆనందకరమయిన బాల్యం గడిపాడు.
అతని బాల్య వివరాలు ఆసక్తికరంగా వుంటాయి.
“అతని ఆయా పర్యవేక్షణలో పెరిగాడు. రష్యన్ కథలు గాథలు ఆమె చెప్పగా వాటితో గాధంగా (ప్రభావితుడయ్యాదు. రష్యన్ ప్రజల జీవన చైతన్యాన్ని ఆ కథల గుండా (గ్రహించి ప్రాథమిక పియానో పారాలతో నిమిత్తం లేకుండానే ఆశువుగా సంగీతాన్ని సృష్టించాడు. పియానో ముందు కూచుని ఎవరో చెప్పినట్లు చెయ్యడమంటే అతనికి చిరాకు. అతనిలో ఎంత అభివృద్ధి కనిపించిందంటే ఏడో ఏట లిస్జ్ట్ సంగీత శకలాల్ని అతను (ప్రదర్శించాడు. తన కుటుంబంలో పెద్ద పార్టీ జరుగుతున్నప్పుడు తన పదకొండో ఏట అతిధుల గుంపు ముందు పీట్డ్ సంగీతాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. అతని తండ్రి సంగీత 222
ప్రియుడు. తన కొడుక్కి సంగీతంలో మంచి విద్య, ప్రావీణ్యం సంపాదించి పెట్టాలని సెంట్ పీటర్స్ బర్గ్ పంపాదు.
తండ్రికి కొడుకుని “వృత్తి సంగీతకారుణ్ణి గా చెయ్యాలన్న వుద్దేశమేమీ లేదు. పీటర్ ద గ్రేట్ కాలం నించీ ముసార్గ్స్కీ వంశీకులు భద్రతాదళంలో వంశపారంపర్యంగా పనిచేసేవాళ్ళు. ముసార్గ్స్కీ ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలి. 1851లో ముసార్గ్స్మీ సెంట్పీటర్స్బర్ల్లోని ఉన్నత వంశస్థుల స్ఫూల్లో చేరాడు. సంవత్సరం గడిచాకా ఆర్మీటెయినింగ్ ఎస్టాబ్లిష్ మెంట్‌కు వెళ్ళాడు. వాళ్ళ గార్డ్స్ కేదెట్ అకాడమీకి ముసార్ట్స్మీని సిద్ధం చేశారు. ముసార్ల్స్మ్ మృదువయిన యువకుడు. క్లాసిక్ లిటరేచర్ చదివేవాడు. జర్మన్ ఫిలాసఫీ చదివాడు. అకాడమీ డైరెక్టర్ ముసార్గ్స్కీ అభిరుచుల్ని చూసి పరిహసించాడు. ఆఫీసర్‌కు పుస్తకాలు చదవాల్సిన అవసరమేమిటి? అని అవహేళన చేశాడు. అంతేకాక ఆ డైరెక్టర్ తన కేడెట్ని మధువు, స్త్రీల వేపు మళ్ళమని ప్రోత్సహించేవాడు.
ముసార్ల్స్కీ జీవితంలో స్త్రీలు. ముఖ్యమయిన విషయాలు కారు. అతని తల్లి తప్ప ఆమె అంటే అతనికి ఆరాధన. '
ఇక మధువు! మొదట దానిజోలికి వెళ్ళేవాడు కాడు. కానీ భవిష్యత్తులో దాన్లో మునిగిపోయాడు.
అకాడమీలో వున్నప్పుడు ముసార్ల్స్కీ సంగీత వ్యాసంగంలో దిగాడు. నాలుగేళ్ళపాటు (ప్రవేటుగా ఆన్టోన్ హెర్క్మి దగ్గర పియానో నేర్చుకున్నాడు. తన క్లాస్మేట్లలో పియానో నిపుణుడుగా, గాయకుడిగా పేరు పొందాడు. దురదృష్టవశాత్తు అతనికి సంగీత లయ, తాళాదుల విషయంలో, సిద్ధాంతపరమయిన శిక్షణ అంటూ ఏమీ లేదు.
ముసార్గ్స్కీ మొదటి సంగీత రచన ౬౧319 అతని సంగీత గురువు హెర్మి 1852లో అచ్చేశాడు. విక్టర్ హ్యూగో రచన "1101 61914౧66" ఆధారంగా ముసార్గ్స్కీ ఒక ఒపేరా రాయడానికి ప్రయత్నించాడు. కానీ అది పూర్తి కాలేదు. దాన్ని గురించి చెబుతూ ముసార్గ్స్కీ “అది పూర్తి కాలేదు, కంపోజర్‌కి పదిహేడు ఏళ్ళు. అతనికి తెలిసింది శూన్యం” అన్నాడు.
1856లో (ట్రెయినింగ్ ముగిశాకా రెజిమెంట్‌లో చేరాడు. ఆఫీసర్ యూనిఫాం ధరించాడు. సంవత్సరం గడిచాకా జాతీయ స్థాయిలో సుప్రసిద్ధ సంగీతకారులయిన అలగ్జాండర్ డర్గోవిజ్స్కీ బలాకిరేవ్లు పరిచయమయ్యారు. 1861 తర్వాత ముసార్గిస్కీ ఉత్సాహంగా బిలాకిరేవ్తో కలిసి పని చేశాడు. అతనో బాటు మరి ముగ్గురు యువకులు కలిశారు. రిమ్స్కీ కొరసకోవ్, సీజర్ కూయీ, అలగ్జాండర్ బొరోడిన్. వీళ్ళే రష్యన్ జాతీయ సంగీత ప్రతినిధులు. ఈ ఐదు మందిని [౧6 ౧౮5514౧ ౪6 అని, [౧6 ౧౦౧0౪ 1/68 అని అంటారు,
23
ఈ మధ్యకాలంలో డర్గోమిజ్స్కీ బలాకిరేవ్ ముసార్ల్స్కీ ప్రతిభను గుర్తించి మొదట రష్యన్ సంగీతం సృష్టించమని ప్రోత్సహించారు. ముసార్ల్స్కీ బలాకిరేవ్ శిష్యాడయ్యాదు. ఆ గురువు తన శిష్యుడికి బిధోవిన్, షూబర్ట్, షూమాన్ తదితర సంగీతకారుల సంగీతాన్ని పరిచయం చేసి సిద్ధాంతం, రూపాలకు (శైలికి) సంబంధించిన సందేహాల్ని నివృత్తి చేశాడు. ఆఫీసర్‌గా పనిచేస్తున్న ముసార్ల్మ్కీ పని వాత్తిడి వల్ల, వృత్తి బాధ్యత వల్ల ఈ సంగీత తరగతులకు సక్రమంగా వాజరు కాలేకపోయేవాడు. 1858 వేసవిలో వచ్చి కొన్నాళ్ళ బలాకిరేవ్తో గడిపాడు. అప్పుడు వాళ్ళు చర్చించుకున్నారు. అభిప్రాయాల్ని యిచ్చి పుచ్చుకున్నారు. బలాకిరేవ్ మంచి వుపాధ్యాయుడు. కానీ ముసార్గ్స్కీ సంగీత అధ్యయనంలోని ఖాళీలని పూరించలేకపోయాడు.
18ళ8లో ముసార్గ్స్కీ హరాత్తుగా మిలటరీ నించీ రాజీనామా చేసి సంగీతానికే తన సమయాన్నంతా కేటాయించాలని తీర్మానించుకున్నాడు. కావలసినంత స్వేచ్చ, సమయం దొరికినా రష్యాని పర్యటించాలని, పరిశీలించాలని నిర్ణయించాడు. మొదట మాసో వెళ్ళాడు. మాస్కో పర్యటన అతనికి మహదానందం కలిగించింది. తను రపష్యన్గా జన్మించినందుకు అతను గర్వపడ్డాడు. “సమస్త రష్యా నాకు ప్రియమైంది, నాకు సన్నిహితమైంది” అని రాసుకున్నాడు.
ముసార్ల్స్కీ సంగీతకారుడుగా రంగ ప్రవేశం చేశాడు. 29, జనవరి 1860న అన్టోన్ రూబిన్ స్టీన్ దర్శకత్వంలో రష్యన్ మ్యూజిక్ సొసెటీ తరపున తన సంగీత (ప్రదర్శన యిచ్చాడు. ఆ (ప్రదర్శన పట్ల జనం సానుకూలంగా స్పందించారు.
కానీ మాస్కో పర్యటన అంతా సానుకూలంగా వుందనీ చెప్పలేం. ముసార్గ్స్కీ నరాల జబ్బుతో బాధపడ్డాడు. శారీరక రుగ్మత వల్ల ఉన్మత్త లక్షణాలూ కనిపించాయి. ఈ విషయాలన్నీ బలాకిరేవ్తో ముసార్గ్స్కీ చెప్పాడు. “యవ్వనంలో వుత్సావానికి హద్దులుండవు. యవ్వనం శక్తివంతమైంది, అన్నీ తెలుసుకోవాలన్న కాంక్ష అతివేలంగా వుంటుంది. అది ఎవరికీ లొంగదు. అంతులేని అంతస్సీమా విహారం వుంటుంది. ఆదర్భం ఏ స్థాయిలో వుంటుందంటే స్వష్నాన్ని ఆధారం చేసుకుని వాస్తవాన్ని అందుకోవాలనుకుంటుంది” అప్పట్లోనే ముసార్గ్స్కీ బైరన్ "1412౧766" చదివాడు. “అది చదివి నాలో విద్యుత్తు జ్వలించింది. ఏదో ఉన్నత శక్తి నాలో విజృంభించి “నేనే [20/66 అని ఆక్రోశించింది. విధి నన్ను కరుణించింది. నా కాంక్షను నిజం చేసింది. నా శక్తి నా శరీరాన్ని చంపింది. దీని విరుగుడు కోసం నేను ప్రతి వనమూలికనీ సహాయం కోరాలి. ఈ విషం నించీ విముక్తి కావాలి” అని చెప్పాడు.
వేసవిలో గ్రామ సీమకు వెళ్ళి మళ్ళీ కంపోజ్ చెయ్యడం మొదలు పెట్టాడు. 8 అక్టోబర్ 1860న మిత్రునికి వుత్తరం రాస్తూ “నాకు పూర్తిగా ఆరోగ్యం కుదుటపడింది. 224
ఇప్పుడు సంగీతంలో నేను చేసిన తప్పులన్నీ ఆర్జర్లో పెడుతున్నా. నా సంగీత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది” అన్నాడు. కొన్ని ఆర్మెన్హ్రా రచనలు, అద్భుతం నిండిన 'గీ ౪40160౧ 0016 గ౧౧౦౪౧1౩1౧' అన్న సింఫనీ రచనలు చేశాడు. ఒక 01021 ౧1606 పీటర్స్ బర్గ్‌లో ప్రదర్శింపబడింది. దానికి అంతగా ప్రతి స్పందన రాలేదు. పైగా అతని “అభివృద్ధికి సంబంధించి హెచ్చరికలు వచ్చాయి. అతని సహచరులు అతన్ని 'విలాసార్ధం సంగీతం సృష్టించే వాడని, అంతకు మించి మరేమీ కాదని, అంచనా వేశారు. పెద్ద పెద్ద సిద్ధాంతాలు చేస్తూ, ప్రణాళికలు వేస్తూ, ఆదర్శాలు వల్లిస్తూ ఆచరణలో శూన్యం మాత్రమే సృష్టిస్తాడని అన్నారు. బలాకిరేవ్ పెదవి విరుస్తూ ముసార్గ్స్కీ తను కళలో అత్యున్నత శిఖరాలు అందుకున్నానని, అదీ రష్యన్ సంగీత కళలో అంచులు చూశాననీ అనుకుంటారు” అన్నాడు, 1861లో బానిసత్వాన్ని నిషేధిస్తున్నట్లు రష్యన్ రాచరికం ప్రకటించింది. ఆ ప్రకటన ముసార్ల్స్క్మీని 'దరిద్రుణ్ణి చేసింది. కానీ అతను సహృదయతతోనే ఆ మార్పును స్వీకరించాడు. అతనికి రైతుల పట్ల జీవిత కాల సానుభూతి వుండిపోయింది. అతని మిత్రులు చేతనయినంత ఆర్థిక సాయం అతనికి చేయడానికి ముందుకొచ్చారు. అతని 'సంగీత సామర్థాన్ని! వాళ్ళు ఒప్పుకోకపోయినా అతని వ్యక్తిత్వాన్ని వాళ్ళు యిష్టపడేవాళ్ళు. కానీ ముసార్గ్స్కీ యితరుల సాయాన్ని అందుకోవడానికి అతని ఆత్మాఖిమానం అద్జొచ్చింది. యితరుల దయాదాక్షిణ్యాల పట్ల అతనికి అంతులేని చిరాకు. అతను వుద్యోగాన్వేషణలో పడ్డాడు. 1863లో మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్‌లో క్లర్క్‌గా చేరాడు. అతను తరువాత బతికిన పద్దెనిమిదేళ్ళలో పదిహేడు సంవత్సరాల పాటు అత్యల్ప జీతానికి ఒంచిన తల ఎత్తకుండా డస్కు దగ్గర పని చేశాడు. కాలం సంగీతాన్ని కావాలంటోంది. తనకు ఎంతో జీవితం లేదని ఆతనికీ తోచినట్లనిపిస్తుంది. అతనికి తెలుసు. తను యింకా ఎంతో తెలుసుకోవాలని, ఎంతో సాధించాలని! కానీ చలనం లేని నిర్జీవమయిన క్లర్క్ పని. ఈ నీచమయిన, నికృష్ణమయిన, కష్టమయిన పని నుండి రిలీఫ్ పొందడానికి అతను ఒక మేధావుల బృందంతో స్నేహం చేశాడు. వాళ్ళలో సంగీతకారులెవ్వరూ లేరు. అతను వాళ్ళతో కలిసి ఒక సహకార సంఘం స్థాపించి వాళ్ళని ఒక కుటుంబంలా తయారు చేశాడు. ఈ (గ్రూపుతో, ఈ స్నేహితుల్లో సాయంత్రాలు చర్చించేవాడు. వాళ్ళనించీ కళా సాహిత్యాలు, రాజకీయాలు, తత్వశాస్త్రం ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. 16 [1౧0/6 లో ముసార్గ్మ్కో అందికన్నా సంస్కారి, విజ్ఞాని, తీక్షమయిన ఆలోచనాశీలి. అతని మేధో పరిధులు విస్తరించే కొద్దీ అతని సంగీత పరిధులు కూడా విశాలమయ్యాయి. ఇప్పుడు ఒక విస్తృతమయిన బహు ముఖీనమయిన ఒపేరా రాయాలని సంకల్పించాడు. దానికి వస్తువుని ఎంపిక చేశాడు. అది ప్లాబర్ట్ ౮414౧౧౧౧00. ఆయన
వుద్దేశించిన ఎన్నో బృహత్పణాళికల్లాగే యిది కూడా మరుగున పడింది. 2265
తరువాత చిన్ని చిన్ని ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలని నిర్ణయానికి వచ్చాడు. అది ప్రత్యేకించి పాటలు. పాట అన్నది పరిమిత సాంకేతికత కలిగింది. జనాలకి సులభంగా చేరేది. 1857లో అతను తన మొదటి పాట రాశాడు. ఐతే అతని ఆణిముత్యం లాంటి పాటలు 1864 నుండి 1865 మధ్య వచ్చాయి. [8304 1౧6 ౧8292౧15 [41120 అన్న పాటల్లో అతని సృజనాత్మశక్తి అంచులు దాటింది.
1865లో అతని తల్లి మరణించింది. అతని జీవితంలో ఆ ఘటన మౌలిక మార్చు తెచ్చింది. ముసార్గ్స్కీ మెల్లగా తన మీద తను అదుపు కోల్పోయాడు. అపుడప్పుడూ తెలివి తప్పి పడిపోయేవాడు. దాంతో శారీరకంగా క్షీణించడం మొదలయింది. మానసికంగా కూడా అదుపు తప్పేవాడు. అంతులేని నిరాశ, అడ్డూ ఆపూ లేని తాగుడూ అలముకున్నాయి. “కో-ఆపరేటివ్ అపార్ట్మెంట్లలో వున్న మిత్రులందరూ అతను అక్కడవుండదాన్ని భరించలేకపోయారు. తన సోదరుడితో కలిసి అతను వేరే చోట వుందడం మేలని చెప్పారు. అతని శారీరక, మానసిక క్షీణత ఒకవైపున జరిగితే మరో వేపు అతని సృజన శక్తులు విజృంభించాయి. అతని సంగీత సంబంధ ఆలోచనల్లో మౌలికత చోటు చేసుకుంది. మరింత సాహసాన్ని సంతరించుకుంది. ఎన్నో మంచి పాటలు రాశాడు. తన మౌలికమైన రచన “౧6 6654110801 0 560౧40%6గ10' చేశాడు.
1868లో గొగోల్ "౧6 [18గ1౮6' ఆధారంగా తన మొట్ట మొదటి ప్రయోగం చేశాడు. ఆ ఒపేరాలో మ్యూజికల్ రియలిజంతో (ప్రయోగాలు చేశాడు. మానవ సంభాషణలో పదాలలో మార్పులు సృష్టించి మాధుర్యం తెచ్చాడు. దానికి సంబంధించి ఒక చాప్టర్ రాశాడు. అంతలో యింకో (ప్రాజక్టు మనసులోకి రావడంతో అది పక్కన పెట్టాడు. ఈ సారి అతను రెండేళ్ళపాటు ఏకాగ్రతగా ఉత్సాహంగా, ఆత్మ సమర్చణ భావంతో పని చేశాడు. 1870 నాటికి అతని మాస్టర్ వర్క్ అనదగిన ఒపేరా పూర్తి చేశాడు. అది 8013 306౧0౪. దాన్ని సెంటిపీటర్స్ బర్గ్ యింపీరియల్ థియేటర్‌కు సబ్మిట్ చేశాడు. దాని చిత్రమయిన రూపానికి, సంప్రదాయ వ్యతిరేక శైలికి వాళ్ళు అసహనంగా ఫీలయిన దాన్ని పక్కన పెట్టారు.
ముసార్ల్కో ఆ ఒపేరాను మళ్ళీ మార్పులు చేశాడు. దాంట్లో సంప్రదాయబద్ధమయిన కౌన్ని అంశాలు చేర్చి (ప్రేమా సన్నివేశాలు పెట్టి, సాధారణ విషయాలు కొన్ని కలిపి తిరిగి రాశాడు. కానీ మొదటి దానిలోని జీవం యిందులో లేదు. రెండో సారి మళ్ళీ సమర్పించాడు. ముసార్ల్స్కీ మిత్రుల ప్రయత్నాల వల్ల 17 ఫిబ్రవరి, 1878న అది యింపీరియల్ ధియేటర్లో ప్రదర్శింపబడింది. అందులోని మూడు సన్నివేశాలు ప్రదర్శింపబడ్డాయి. వాటిని చూసిన థియేటర్ నిర్వాహకులు పూర్తిగా ప్రదర్శనకు అనుమతించారు. 8, ఫిబ్రవరి 1874న 226
ప్రదర్శింపబడింది. ప్రదర్శన చూసిన జనం ఆనందించారు. కానీ సంగీత విమర్శకులు వృత్తి సంగీతకారులు విరుచుకుపడ్డారు. సెంట్‌పీటర్స్ బర్ల్లోని సుప్రసిద్ధ సంగీత విమర్శకుడు హెర్మాన్ లారోచీ మెరటుగానూ, మోటుగానూ, అస్తవ్యస్తంగానూ వుందన్నాడు. [41000/ 1౪6 లోని తన సహసంగీతకారులు కూడా అర్ధం చేసుకోలేకపోయారు. అభినందించలేక పోయారు. అతనెట్లా జనాల్ని ఆనంద పెట్టాడో అర్థం కాలేదు వాళ్ళకు. సీజర్ కూయీ తక్కువ చేస్తూ రివ్యూ రాశాడు. రిమ్స్కీ కోర్ సకోవ్ ఆ ఒపేరా 'మురికితో అజ్ఞానంతో నిండింది" అన్నాదు. బలాకిరేవ్ పబ్లిక్‌గా ఎగతాళిగా మాట్లాడాడు.
అతని జీవితమంతా (శ్రమించి నృష్టించిన అతని రచన నానాటికి దిగజారుతున్న అతని శారీరక, మానసిక పరిస్థితికి ఏ మాత్రం సహకరించలేకపోయింది. 1873లో అతని సన్నిహిత మిత్రుడు, చిత్రకారుడు వికర్ హార్ట్ మాన్ మరణించాడు. ముసార్గ్ప్కీ పై ఆ ప్రభావం కూడా పడింది. 'ఆత్మ గౌరవ' మన్నది ముసార్గ్స్కీ నించీ మాయమయింది. యింట్లోని వర్నీచర్ని తాగుడు కోసం అమ్మేశాడు. బిచ్చగాడిలా బట్టలు వేసుకున్నాడు. అద్దె చెల్లించకపోవడం వల్ల ఎప్పుడో దొంగలా తన యింటికి వచ్చేవాడు. మిత్రులు అతని కోసం వెతికేవాళ్ళు. చింపిరి గుద్దలతో దిక్కులేని వికారంగా తయారయ్యాడు. గొంతు వావయింది. ముక్కు ఎర్రగా పండిన ప్లమ్ పండులా వుంది. మాటలు తడబడుతున్నాయి. మాటలు తడబడుతూ వుంటే వున్నట్లుండి చిరాకు పడి, మొండిగా తయారై జగడాలకు సిద్ధపడేవాడు. పనివాళ్ళతో, సర్వర్లతో పోట్లాడి బండబూతులకు దిగేవాదు. మొదట్లో మిత్రుల్తో కూచుని వున్నపుడు తన బలహీనత బయట పడకుండా జాగ్రత పడేవాడు. వాళ్ళ వైన్ ఆఫర్ చేసినా మొండిగా తిరస్మరించేవాడు. అంతే! కొద్దిసేపట్లో హఠాత్తుగా మాయమయిపోయేవాడు. ఎక్కడో దిక్కులేని వాళ్ళతో తాగిపడి వుంటాడని అందరికీ తెలుసు.
ఐనా ఆశ్వర్యకరమయిన విషయమేమిటంటే అప్పటికీ అతను కంపోజర్‌గా పని చేసేవాడు. అతని సృజనశక్తి కుంటుపడలేదు. అట్లాంటి శారీరక మానసిక రుగ్మతల మధ్య అతను కొన్ని అద్భుతమయిన పాటలు రాశాడు.
1879లో సింగరయిన డేరియా లియెనోవాతో కలిసి సహసంగీతకారుడుగా దక్షిణ రష్యా పర్యటించాడు. ముసార్గ్స్కీకి డబ్బు అవసరం గనక వెళ్ళాడు. ఆ ట్రిప్పవల్ల తనకు మంచి జరుగుకుందని వెళ్ళాడు. తాత్మాలికంగా ఆ పర్యటనవల్ల ఉల్లాసంగా ఫీలయ్యాడు. పీటర్స్బర్గ్ తిరిగి వచ్చాకా పరిస్థితులు మరింత దిగజారాయి. 1880లో తన క్లర్ము వుద్యోగానికి రాజీనామా చేశాడు. సన్నిహితమిత్రుల సాయంతో జీవించాడు. ఓ సందర్భంలో ఒక మిత్రుడితో
22ై/
కన్నీళ్ళు పెట్టుకుని స్నేహితుల సాయం లేకుంటే తొను వీధుల్లో బిచ్చ మెత్తుకోవాల్సి వచ్చేదన్నాడు.
ఒకరోజు సాయంత్రం ఒక మిత్రుడి యింట్లో హఠాత్తుగా ఫిట్స్ వచ్చి పడిపోయాడు హాస్పిటల్‌కు తీసుకెళితే డాక్టర్ పరీక్షించి అది శరీరం వొంకర్లు పోయే రోగం అన్నాదు. చివరికి ముసార్గ్స్కీ సారాయి ఇమ్మని బతిమలాడాడు. తన .నలఖై రెండో పుట్టిన రోజు తరువాత వారం రోజులకు చనిపోయాడు. అతని జీవితంలోని చివరి కొన్ని వారాలు “'మతిభ్రమించి' బాధపడ్డాడు. చాలా సంగీత సంస్థలు ఆయనకు నివాళుర్పించాయి. 1014 [౪6 లోని (తక్కిన నలుగురూ) నిశ్శబ్దంగా కన్నీళ్ళు నింపుకున్నారు. 4లో
సెర్ది ప్రాకోఫియేవ్ 5606 ౧౧౦116౪ 23-4-1891 -- 5-3-1953 సోవియట్ సంగీతంలో ్రోకోఫియేవ్ న్థానం 1917 నించీ 1958లో అతని మరణం దాకా ఎన్నోసార్లు మార్పులకు లోనయింది. 1917 అక్టోబర్ జరిగిన బోల్నినిక్ విప్లవం తరువాత ఆరు నెలలకు అతను జన్మభూమిని వదిలిపెట్టాడు. అప్పటి దాకా అతను అధికారంలోకి వచ్చిన కొత్త వర్గంతో సన్నిహితంగా వున్నాడు. వాళ్ళతో గౌరవాలు అందుకున్నాడు. 1918లో పెట్రోగ్రాడ్‌లో 'ప్రొకోఫియేవ్వారం' అంటూ సంగీతోత్సవాలు కూదా జరిగాయి. అదే సంవత్సరం ్రాకోఫియేవ్ సంగీత ప్రదర్శన కోసం అమెరికా టూరు వెళ్ళడానికి తన ఆకాంక్షని తెలిపాడు. పీపుల్ కమిస్సార్ అందుకు అనుమతినిస్తూ “నువ్వు సంగీతంలో విష్లవకారుడివి. మేము జీవితంలో విస్లవకారులం. మనం కలిసి పని చెయ్యాలి. కానీ నేను నీ మార్దానికి అడ్డురాను అన్నాడు. 'ప్రోకోఫియేవ్ 19186 మే ?వ తేదీన పీటర్స్బర్గ్ వదిలిపెట్టాడు. కొన్నాళ్ళ పర్యటనకే అన్నాదు. కానీ తిరిగి రావడం అతేనికి ఇష్టం లేదు. ప్రోకాఫియేవ్ మళ్ళీ 1927లో సోవియట్ తిరిగి వచ్చాడు. ఈ సారి అసాధారణ రీతిలో విజయాన్ని అందుకున్న అనేక సంగీత ప్రదర్శన లిచ్చాడు. వెళ్ళాడు. మళ్ళీ 1988 చివర్న తన జన్మస్థలానికి వెళ్ళి స్థిరపడిపోవాలని నిశ్చయించుకున్నాడు. కొంతకాలం అతను సోవియట్ సిద్ధాంతం పట్ల సానుకూలంగా స్పందించాడు. అతను సోవియట్ జీవితాన్ని వివరించే "716 106 01 5166! అన్న బేలెట్ కూడా రాశాడు. ప్రపంచ ్రసిద్ధడయిన ్రొకోఫియేవ్ని ఏళ్ళ తరువాత వచ్చినా మాతృభ్తూమి హృదయపూర్వకంగా అవ్వానించింది. మాటలలోను, చేతులలోనూ ఆయన నిజమైన సోవియట్. పాశ్చాత్య సంగీత దృష్టిని ఆయన వ్యతిరేకించాడు. సోవియట్ పద్ధతుల్లో సోవియట్ ఆదర్శాల్ని సోవియట్ చరిత్రని ప్రచారం చెయ్యడానికి తన సంగీతాన్ని వుపయోగించాడు. సోవియట్‌లోని సుప్రసిద్ధ సంగీతకారుడతను. ప్రజల చేత, ప్రభుత్వం చేత లెక్కలేని గౌరవాలందుకున్నాడు. సోవియట్ యూనియన్ బయట సోవియట్ కళకు చెందిన ఉన్నతోన్నత ఆనందానికి అతను ప్రాతినిధ్యం వహించాడు, 219
ప్రొకోఫియేవ్ సృజన శక్తులు ఉన్నతోన్నత క్తీర్తి శిఖరాల్ని అధిరోహించిన దశలో అతన్ని ముందు హెచ్చరికలు లేకుందా, హఠాత్తుగా సోవీయట్ ప్రభుత్వం అతని స్థాయిని దిగజార్చింది. 1948 ఫిబ్రవరి 10న కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ 'నూతన సంగీత విధానాన్ని ప్రకటించింది. కారణం వానోమురా తేలీ' అన్న సంగీతకారుడు రాసిన '6/841 1౧6౧6 5010" అన్న ఒపేరా సంక్షిష్ట శబ్దాలతో నిండి వుండడంతో కమిటీ సోవియట్ కంపోజర్లకు 'నియమావళి వుండాలని డిమాండ్ చేసింది. సంగీతం నించీ 'ఆధునికతత్వం, మేధోతత్వం మొదలయినవాటిని దూరంగా వుంచాలని కోరారు. శైలిని, సాంకేతికతని రష్యాగతం నించీ తీసుకుని 'సులభం'గా సరళంగా వుండేలా సంగీతాన్ని రూపొందించాలని కోరారు. బహిరంగంగా ఫిబ్రవరి 10న సోవియట్ సంగీతకారులు చాలా మందిని “'పదవీచ్యుతుల్ని చేశారు. తక్కువ చేశారు. ప్రాకోపియేవ్ ఒకృజ్ణే కాదు. కట్ఛాటూరియన్, సోస్టకోవిచ్, నికాతాయ్ వయోకోవ్స్కీ విస్సారియన్ షెబాలిన్ వీళ్ళందరూ “అజ్ఞాన సంప్రదాయ వాదులని నిందింవబడ్డారు. అదేవో అధికారుల నించీ వచ్చిన అభిప్రాయమయితే, (పెస్ ఐతే వాళ్ళందరిదీ “డికడెంట్ ఫార్మలిజం' అని నిందించింది. ఈ కంపోజర్లందర్నీ నిందించింది సంప్రదాయ సంగీతానికి చెందిన మౌలిక సూత్రాల్ని కాదని అపస్వరాల్ని అనుసరిస్తూ, సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ, అస్తవ్యస్తరీతులకి ఆహ్వానం పలుకుతూ దాన్నే “అభ్యుదయమని, ఆవిష్కారమని అంటున్నందుకు నిందించింది.'
ప్రొకోఫియేవ్ మీద చేసిన ఆరోపణ ప్రత్యేకమైంది.
“ప్రొాకోఫియేవ్ సృజనాత్మక శైలి అతను “పాశ్చాత్య దేశాల్లో వున్న సంవత్సరాల్లో చెప్పుకోదగిన రీతిలో రూపొందింపబడింది. అతని పద్ధతిలోని బాహిరమయిన నవ్యత సంకుచితమయిన బూర్జువా సౌందర్యవాదుల్ని సంతృప్తి పరచింది. అతను వాళ్ళ కోసమే ఆ సంగీతాన్ని సృష్టించాడు. అతని సంగీత భాష కూడా ఖచ్చితంగా వాళ్ళకి సరిపోయింది. తరువాత అతను సోవియట్ వాస్తవిక సారాంశంలోకి వచ్చినపుడు అతని సంగీత వస్తు సాంకేతిక విషయాల్లో ఒక బ్రేక్ ఏర్పడింది. ఆతని కళలోని వైవిధ్యంలో వికారముంది. అది హాస్యాస్పదమైంది. అతని సంగీతం మన ప్రజల “గొప్పు తనాన్ని ప్రతిఫలించలేదు. మన వాస్తవికతకు అది అలీనమైంది”.
ఇది జరిగిన వారం రోజులకు ప్రొకోఫియేవ్ సోవియట్ సంగీతకారుల సమావేశంలో తన్న పక్కనున్న సోటి సంగీతకారుడితో వాళ్ళు రాజకీయాలలోనే వుండి సంగీతాన్ని సంగీతకారులకు వదిలేస్తే మంచిది” అన్నాడు. కానీ ప్రభుత్వ దృష్టిలో ఈ వ్యతిరేకత అన్నది “సాంస్కృతిక దృక్పథంగా మారింది. ప్రొకోఫియేవ్ సోవియట్ కంపోజర్స్ జనరల్ అసంబ్లీ ఉన్నతాధికారి ఐన తికోన్ క్రెనికోవ్కు ఒక సుదీర్టమైన “క్షమాపణ” వుత్తరం రాశాడు.
220
“పదిహేను సంవత్సరాలు పార్మలిజానికి సంబంధించిన లక్షణాలు నా సంగీతంలో ప్రత్యేకించి ప్రముఖంగా వుండేవి. దానికారణంగా కొన్ని పాశ్చాత్య అభిప్రాయాలతో దానికి సంబంధ మేర్చడినమాట నిజం” అంటూ తన క్షమాపణల్ని కొత్త కోణంలో ముగించాడు. నా కొత్త ఒపేరా 'ఉ1216 02 గ6౭| [44%' లో కొన్ని ఉత్తర రష్యా జానపద గీతాలలో ఆసక్తి కర అంశాల్ని పొందువరిచాను. ఇందులో మాధుర్యం, మనోవారమయిన భాష వుపయోగించాను” అన్నాడు.
ఏమైతేనేం? గ 7216 0౧64! [2౧ పూర్తి చేశాడు కానీ అధికారులకు సంతృప్తి కలగలేదు. క్రైనికోవ్ దాని 'ఆధునిక, మాధుర్య వ్యతిరేకశైలి'కి విమర్శించాడు. రవ్యన్ అధికారుల్ని సంతృప్తి పరచడానికి రష్యన్ “అంతర్జాతీయ శాంతి దృక్పథాన్ని సమర్థిస్తూ, పాశ్చాత్య 'యాదోన్నాదాన్ని “విమర్శిస్తూ 0౧ 0౮౬౫ [0౯06208 అన్న రచన చేశాడు. అట్లాగే వాస్తవిక శైలిలో ౪/1016/80[[౪/6 అన్న మరో రచన చేశాడు.
ఈ రెండు రచనల చేయడం వల్ల 1951లో ప్రొకోఫియేవ్ స్టాలిన్ అవార్డు వచ్చింది. తిరిగి అతన్ని యథాతథంగా వెనకటి “స్థాయి'కి తీసుకొచ్చారు. ఈ కారణంగా ప్రభుత్యం 1951 ఏప్రిల్ 28న ప్రొకోఫియేవ్ జన్మదిన సందర్భంగా రష్యన్ ప్రభ్వుం సంగీతోత్సవం నిర్వహించింది. అది ప్రొకోఫియేవ్ అరవయ్యవ జన్మదినం. అనారోగ్య కారణంగా ్రొకేఫియేవ్ ఆ వుత్సవానికి వాజరు కాలేకపోయాడు. సంవత్సరం తరువాత ఆయన ఏడవ సింఫనీ ప్రదర్శింపబడి జనాల్చిఉత్తేజితుల్ని చేసింది. విమర్శకులూ అభినందించారు.
.. ప్రోకోఫియేవ్ చిన్నతనంలో అతని కోసం తల్లి పియానో వాయించేది. అతను చిన్న తనంలో తన అనుభవాలు తెలుపుతూ “ఒక రోజు నూ అమ్మ హానన్' రచనను. ప్రాక్టీసు చేస్తోంది. నేను నా 'సొంత' సంగీతాన్ని కీబోర్డు మీద వాయిస్తానని మా అమ్మని అడిగాను. ఆశ్చర్యంగా ఆమె ఒప్పుకుంది. నేను అస్తవ్యస్తంగా పియానో వాయించాను. మా అమ్మ ఏమీ అనలేదు. పియానో పట్ల ఆ రకంగా నాకు ఆసక్తి కలిగింది. నేను నా సొంతంగా కీబోర్టు ప్లే చేస్తూ కొన్ని స్వరాల్నిరాప్తి పెట్టమని చెప్పింది.
“నేను కొన్నిట్ని అశ్రద్ధగా రాశాను. ఓసారి లిస్జ్ట్ రచనని వాయించి దాన్నే రాసి చూపిడితే అది లిస్జ్జ్ది. ఆ స్వర రచన అలా కాదు, యిలా రాయాలి అని చూపెట్టింది. ఆమె ద్వారా సంగీత రచన ఎలా చెయ్యాలో నేర్చుకున్నాను. మెల్లగా చిన్ని చిన్ని పాటల్ని కంపోజ్ చేసి రాసి వాయించడం నేర్చుకున్నాను” అని రాశాడు.
పన్నెందేళ్ళ వయసులో రెండు ఒపేరాలు రాశాడు. మూడో ఒపేరాలో కొన్ని భాగాలు ఒక సింఫనీ రాశాడు. .
221
అతని తల్లిదండ్రులకు మిగిలిన సంతానం అతనొక్కడే. తక్కినవాళ్ళు చిన్నతనంలోనే పోయారు. వాళ్ళు సంస్కారవంతులు. తండ్రి ఎస్టేట్స్‌కు మేనేజర్‌గా పనిచేశాడు. సంగీతమంటే వాళ్ళకు యిష్టమేకానీ దాంతో బాటు గణితం, సాహిత్యం అభ్యసించమని ప్రోత్సహించారు. చెస్ మొదలయిన ఆటలు ఆడమని, తోటపని నేర్చుకోమని చెప్పేవాళ్ళు.
(ప్రొకోఫియేవ్ పదమూడేళ్ళ వయసులో సెంట్ పీటర్స్బర్గ్ కన్సర్వేటరీలో సంగీతాభ్యాసం కోసం చేరాడు. పదేళ్ళపాటు అక్కడున్నాడు. రిమ్స్కీ కొరసకోవ్, లియాడోవ్, నికోలస్ చెెస్నిన్, అన్నెట్టి ఎసిపోవ్లనుండి సంగీతం అభ్యసించాడు. ఎన్నో సంగీత రచనలు చేశాడు. తన సంగీత రచనల్ని అచ్చేశాడు. వీటిల్లోని సంప్రదాయ వ్యతిరేక, స్వతంత్ర ధోరణులు సంగీతకారుల్ని ఆకర్షించాయి. అతని ధోరణులు కాలానికన్నా ముందుండేవి. దానివల్ల అభిమానుల్లో మాటు శత్రువులూ తయారయ్యారు.
మొదటిగా 1908 డిసెంబర్ 31న పియానో ప్రదర్శన యిచ్చాడు. ఒక విమర్శకుడు 'పేలవంగా వూదని రాశాడు. 1912 జూలై 25న పియానో కన్సర్టో నెం. 1ని ప్రదర్శించాడు. అనాటి సుప్రసిద్ధ విమర్శకుడు సబనియేవ్ ఆ సంగీతాన్ని విశ్లేషిస్తూ “మోటుగా, మొరటుగా, అపసవ్యమయిన శబ్దాలతో “ఆదిమ సంగీతానికి సరిపోయినట్లుంది” అని రాశాడు.
1909లో ్రొకోఫియేవ్ స్వరకల్పనకు, పియానో ప్రావీణ్యానికి డిప్లామాలు పొందాడు. పియానో అత్యున్నతస్థాయిలో ప్రదర్శించే దశకు వచ్చే దాకా తరువాత ఐదేళ్ళ అనంతరం కానీ సంగీత కళాశాల నుండి డిగ్రీ పొందలేదు. కన్సర్టో నెం.1 కి తన ఉన్నత విద్య సందర్భంలోనే ప్రదర్శించాడు. ప్రోకోఫియేవ్ తన (ప్రదర్శన యిస్తూ వుంటే ఆనాటి ప్రొఫెసర్, కంపోజర్ ఐన అలగ్జాండర్ గ్రజునోవ్ ఆ శబ్దాలు వినలేక చెవులు మూసుకున్నాడు. తరువాత కాసేపటికి లేచి వోలు నుండి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు ్రాకోఫియేవ్ మరీ ఆచారబద్ధంగా మార్పు లేకుండా సంగీత రచన చేస్తున్నాడని విమర్శించిన టనియేవ్ కూడా షాక్ తిన్నాడు. “మీరు చెప్పినట్లే ఆచారాల్ని బద్ధలు కొట్టాను” అన్నాడు ప్రోకోఫియేవ్. అతని స్వేచ్చకి ఆ గురువు ఆశ్చర్యపోయాడు. ఇటువంటి వాళ్ళతో బాటు అతని సంగీతంలోని మౌలికతని, నిజాయితీని గుర్తించిన సంగీతకారులు కూడా సంగీత కళాశాలలో వున్నారు. ఆ కన్సర్టోకు గౌరవనీయమయిన రూబిన్ స్టీన్ (ఫైజు వచ్చింది.
కన్సర్వేటర్ వదిలాకా సెలవుల్లో లండన్ వెళ్ళి బేలెట్ సంగీత వేత్త ఐన దియాగిలెవ్ని కలిశాడు. డియాగిలెవ్ ఈ యువ స్వరక్త వల్ల (ప్రభావితుడయ్యాడు. బాలెట్ కోసం సంగీతం సమకూర్చమని కోరాడు. ఈ మధ్యలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలయింది. 222
వితంతువయిన తల్లికి ఒకడేకొాడుకు కావలడం వల్ల మిలటరీ సర్వీసు నించి-ప్రోకఫియేవ్ని మినహాయించారు. త సంగీత స్వరకల్పనకి అతను అంకితమయ్యాదు.
ప్రొకేఫియేవ్ డియాగిలేవ్ కోసం రాస్తున్న రచన_ప్రాచీన సిడియానో తెగలకు, వాళ్ళ దేవతలకు సంబంధించింది. డియాగిలేవ్కు అ వస్తువు ఇష్టం లేదు. -అది బొలెట్కు తగింది కాదని అతని వుద్దేశం. ఆ కారణంగా దాని చుట్టూ ఆర్మెస్ట్రాగానం వుండేట్లు చేశాడు. 19316 జనవరి 29న సెంట్ పీటర్స్బర్ట్లో ప్రదర్శన జరిగింది. అతని ఆధునిక శైలిని ోతలు, విమర్శకులు అర్ధం చేసుకోలేదు. తీవ్రంగా విమర్శలు వచ్చాయి.
60112౧ 5616 రచన వల్ల ఒక వింత విపరీతం జరిగింది. దానికి కారణం విమర్శకుడయిన లియోనిడ్ సబనియేవ్. ఆ రచన ప్రదర్శన మరాకదానికన్నా ముందు జరగాల్సి వుంది. కానీ ఆర్మెస్ట్రా సిద్ధం కాలేదు. చివరి నిముషంలో ఆ ప్రదర్శన వాయిదా పడింది. విమర్శకుదడయిన సబనియేవ్కు ఆ రచనా (ప్రదర్శన వాయిదా పడినట్లు తెలీదు. పైగా అతనా ప్రదర్శన జరిగే చోటుకూ రాలేదు. ఆశ్చర్యమేమిటంటే ఆ రచనా ప్రదర్శనపై అతను తీవ్రమయిన దాడి చేశాడు. సమీక్షించాడు. మరుసటి రోజు పొద్దున్నే ఆ సమీక్ష పేపర్లో వచ్చింది. ప్రదర్శన జరగకుండానే దానిపై సమీక్ష వచ్చిందన్నమాట! ఈ సంఘటన, దారుణమయిన, క్రూరమయిన ఆ విమర్శ సంగీతకారులందరికీ తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దాని వల్ల ప్రొకోఫియేవ్కు నష్టంకన్నా లాభమే జరిగింది. యువ సంగీతకారుల్లో ఆయన 'పేరు మారియోగిపోయింది.
డియాగిలేవ్కు సిధియన్ల వస్తువు నచ్చక పోవడంతో ్రోకోఫియేవ్ రష్యన్ జానపద సంగీతం ఆధారంగా '0[04 అన్న బాలెట్ రాశాడు. యుద్ధ ' కారణంగా అది ప్రదర్శింపబడలేదు. 1921 మే 17న పారిస్‌లో వ్రదర్శింపబడి అఖండ విజయాన్ని అందుకుంది.
రష్యాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టుల వల్ల “సృజనాత్మక శక్తులకు అవరోధాలు పెరగడం మొదలు కావడంతో క్రమంగా ప్రోకోఫియేవ్ అప్తవూనానికి. లోనయ్యాడు. అతని అమెరికన్ టూరు కోసం పబ్లిషింగ్ వొస్ ద్వారా వనరులు రావడంతో. తప్పించుకు పోవడానికి మంచి అవకాశం చిక్కింది.
19[ునవంబరు*20న అతని కొన్ని రచనల -ప్రదర్శన న్యూయార్మ్నగరంలో జరిగింది. విమర్శకులు అతని ప్రావీణ్యాన్ని ప్రశంశించారు కానీ అతని “ఆధునికత పట్ల అసహనం (ప్రదర్శించారు. అతని సంగీతాన్ని అమెరికన్ విమర్శకులు “కళలో బోల్నినిజం'
2238
అన్నారు. ఇంకా “రష్యన్ సంక్షోభం, అప శబ్దాల ఉన్నత్త తాండవం అన్నారు. ఒక న్యూయార్క్ విమర్శకుడు “ఇదే సంగీతమయితే నా పని వదిలేసి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను” అన్నాడు. మరో విమర్శకుడు “ప్రాచీన ఆసియా పీఠభూముల్లో తెల్ల వనుగుల (114౧౧౧౦1౧9) ఉన్నత్త ఘీంకారాలు' అన్నాడు.
అతన్ని చికాగోలో కొంత సానుకూలంగానే చూశారు. అతనికి చెప్పుకోదగ్గ ఆవ్వానం లభించింది. చికాగో ఒపేరా నిర్వాహకుడు ఇటాలో కంపానిని తమ కంపెనీ కోసం కొత్త ఒపేరా రాయమని ప్రోకోఫియేవ్తో ఒప్పందం కుదుర్భుఉన్నాడు. ప్రోకోఫియేవ్ ఆ ఒపేరా పూర్తి చేసి చూపించేసరికి దాన్ని ప్రదర్శించడం, నిర్వహించడం మరీ ఎక్కువ కర్చుతో కూడుకున్న విషయం అన్నాడు. దాంతో ఆ ప్రదర్శన జరగలేదు. రెండేళ్ళ తరువాత చికాగో ఒపేరా నిర్వహణ బాధ్యతలు మేరీ గార్టెన్ స్వీకరించాకా ఆ సంగతి విని 1921 డిసెంబరు 30న ప్రదర్శన జరిగింది. కానీ అది విఫలమైంది. అమెరికాలో 1949 నవంబరు దాకా మళ్ళీ అ ప్రదర్శన జరగలేదు. అప్పుడు న్యూయార్క్ సిటీ ఒపేరా కంపెనీ విజయవంతంగా ప్రదర్శించింది.
1921లో ప్రోకోఫియేవ్ తన ఒపేరా ప్రీమియర్ కోసం అమెరికా వచ్చాడు. అతను 1922లో యూరప్ తిరిగి వెళ్ళీ ముందు యువ క్యూబిన్ గాయని “లీనా ఇననోవాల్యూబెరాను పెళ్ళాడాడు. 1928 అక్టోబర్‌లో వాళ్ళు పారిస్‌ని తమ శాశ్వత నివాసంగా చేసుకున్నారు. ప్రతి సంవత్సరం ప్రొకఫియేవ్ యూరప్, అమెరికాల పర్యటన కోసం పారిస్ వదిలి వెళ్ళేవాడు. ఈ మథ్యలో తన ముఖ్యమయిన రచనలూ చేస్తూ వచ్చాడు.
చివరికి తన జన్మస్థలం చేరాలన్న నిర్ణయానికి వచ్చాడు. అప్పటినించీ అతని సంగీతం సోవియట్ సిద్ధాంతాలతో ప్రభావితమైంది. సోవియట్ ఆవశ్యకతల చుట్టూ తిరిగింది. పిల్లల కోసం ఎన్నో పాటల రాశాడు. సింఫనీ ఫెరీటీల్, "౧616౯2౧6 (16 ౪01౯ రాశాడు.
1989లో లీనాతో విడాకులు తీసుకున్నాడు. అమె వల్ల అతనికి ఇద్దరు కొడుకులు తరువాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ లిటరేచర్‌లో చదువుతున్న చురుకైన, తెలివైన విద్యార్థిని “మీరా అలగ్గాంద్రోన్నా మెండెల్సన్ని గాధంగా (ప్రేమించాడు. రెండేళ్ళ తర్వాత పెళ్ళి చేసుకున్నాడు.
నాజీలు 1941లో రష్యాపై దండయాత్ర చేసినపుడు ప్రాకోఫియేవ్ మాన్మో సరిహద్దుల్లో నివసిస్తూ “సిండ్రెల్లా బాలెట్ రచనలో వున్నాడు. వెంటనే మిలిటరీ మార్చి సాంగ్స్, ఫాసిస్టు వ్యతిరేక రచనల కోసం అంకిత భావంతో పనిచేశాడు. అట్లాంటి సందర్భాల్లో మరింత విశాల ప్రాతిపదికన కృషి చేయాలి, అన్నాడొక ఇంటర్వ్యూలో. యుద్ధం తన మీద 224
చూపిన ప్రభావాన్ని 7%6 9౧౧౧౦౧1౦ 5016 అన్న తను ఎంతో కష్టపడి చేసిన రచనలో ప్రదర్శించాడు. స్టాలిన్ గ్రాడ్'గా పేరొందిన మరొక అద్భుతమయిన రచన కూడా చేశాడు. మొదటి సారి స్టాలిన్ ప్రైజ్ అందుకున్నాడు. తరువాత. సింఫనీ నెం. 6, రచన రష్యాలో (ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయాన్ని పొందినది రాశాడు. ఈ సందర్భంలోనే అతని చిరకాల వాంఛగా వున్న రచన వార్ అంద్ పీస్ అన్న రచనా కావ్యం వెలువడింది. నిజానికి అందులో ముప్పై రంగాలున్నాయి. తరువాత అది పదకొండు రంగాలకు కుదింపబడింది. దాన్ని రెండ్రోజులు ప్రదర్శించేవాళ్ళు (సాయంత్రాలు) అది టాల్‌స్టాయ్ నవల ఆధారంగా చేసింది. నెపోలియన్ రష్యాపై దండయాత్ర చెయ్యడం అందులో వుంది. అది కొత్తగా రెండో ప్రపంచ యుద్ధ కారణంగా సమకాలీన సంఘర్షణకు సరిగ్గా సరిపోయింది. 1945 జూన్ 7న మాస్మోకన్సర్వేటరీలో ప్రదర్శితమైంది. అప్పటినించీ వివిధ సందర్భాల్లో రష్యా అంతటా విజయవంతంగా వ్రదర్శింవబడింది. 1958లో పాశ్చాత్య ప్రవంచానికి ఆ రచన పరిచితమైంది. ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో సంగీతోత్సవాల్లో ప్రదర్శితమైంది. 1957లో ఇంగ్లీషు అనువాదంతో 180 - 7/ నెట్‌వర్క్‌లో (బ్రాడ్కాస్ట్ ఐంది.
'ప్రోకోఫియేవ్ పొడవుగా వుండేవాడు. బట్టతల ఎవ్పుడూ శుబ్రంగా, తీర్చిదిద్దనట్లుందేవాడు. సాంప్రదాయిక వస్త్రధారణ అంటే యిష్టం. అతను బ్యాంకర్ లాగా, వ్యాపారస్థుడిలా కనిపించడమే కాదు అట్లాగే ప్రవర్తించేవాడు. ఆయన తన 'న్థాయిని మరచిపోయేవాడు కాడు. ప్రాక్టికల్‌గా వుందేవాడు. సమయ నియమాన్ని పాటించేవాడు. ప్రతిభావంతుడు. టైమ్ మ్యాగజైన్ అతని నిర్మాణం గణితంలా వుండేది. భవిష్యత్ రచనలు కోసం ప్లానులు, ప్రణాళికలు చేసి వుంచుకునేవాడు. చైతన్య శీలి. ఆయన నడకను అందుకోవడం కష్టం. ప్రతిరోజు పదిగంటల నుండి మధ్యాహ్నం దాకా తన సంగీత రచనలో (మించేవాడు. సీరియస్‌గా పని చేసుకునే సమయంలో ఇతర్ల సంగీతాన్ని వినేవాడుకాడు” అని రాసింది.
సంగీతం చేయనప్పుడు చెస్ ఆడేవాడు, బడ్డి ఆదేవాడు, తాగుడు, సిగరెట్లు ఆయనకు అలవాటు లేదు. వీటి స్థానంలో 'స్వీట్లంటే ఆయనకు ఇష్టం,
తన జీవితంలోని చివరి సంవత్సరం మాస్కో దగ్గర్లోని కంట్రీవోమ్లో గడిపాడు. అనారోగ్యంగా వున్నా చివరి క్షణం దాకా సంగీత రచనలో వున్నాడు. స్టాలిన్ చనిపోయిన రోజే ప్రోకోఫియేవ్ కూడా చనిపోయాడు.
225
సెర్దీరాచ్మానినోఫ్ 561౧86] ౧2౦౧౧౭౧1౧౦ 1-4-1873 -- 28-3-1943
ఆత్మ విమర్శ చేసుకున్న సందర్భంలో రాచ్మానినోఫ్ ఒక రష్యన్ సామెత చెప్పేవాడు. అది-“నువ్వు ఒక్కసారిగా రెండు కుందేళ్ళను వేటాడాలనుకుంటే కనీసం ఒక్కదాన్నయినా పట్టుకోగల వన్న నమ్మకమేమిటి?” అని.
సెర్టీ. రెండు కుందేళ్ళను కాదు. ఒక్కసారిగా మూడు కుందేళ్ళను వేటాదాడు. ఆయన కంపోజర్; పియానిస్టు, నిర్వాహకుడు. ఒక దాని తరువాత ఒకటిగా అవన్నీ చెయ్యడమన్నది. సంక్ష్లిషుయిన విషయం. ఆ విషయం గురించి ఓ సందర్భంలో ఒక మిత్రునికి చెబుతూ “నేను ప్రదర్శన నిర్వహించేప్పుడు స్వరకల్పన చేయలేను. సంగిత రచన చేసేటప్పుడు దానిపైనే నా ఏకాగ్రత నిలపాలి. అప్పుడు పియానో తాకలేను. నిర్వహణలో నిమగ్నమయినపుడు (సంగీత) స్వరకల్పనా చెయ్యలేను, వాద్యాన్నీ వాయించలేను. ఒక విషయం మీద నా ఏకాగ్రత నిలిపినపుడు ఆ విషయం నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరో వేపు మళ్ళ నీయదు” అన్నాడు.
కానీ ఆయన ఆ మూడు “కుందేళ్ళను పట్టుకున్నాడు. తన కాలంలోని గొప్ప కంపోజర్‌గా గుర్తింపబడినా, ఆయన ఇరవయ్యో శతాబ్దంలోని గొప్ప పియానిస్టుగా కూడా (ప్రఖ్యాతి పొందాడు. సంగీత నిర్వహణలో సాధికారికత, సహజాత గుణం, సంగిత తత్వం కలబోత ఆయన. పసితనంలోనే ఆయన తన ప్రతిభను ప్రదర్శించాడు. పియానో అంటే ఆయనకు చిన్నప్పటి నించీ ఆసక్తి. పసివాడుగా వున్నప్పుడే అతని తల్లి సంగీతానికి సంభంధించిన ప్రాథమిక విషయాల్ని అతనికి బోధించింది. నాలుగేళ్ళ వయసుకే సంగీతంలో అద్భుతంగా ప్రతిభను కనబరచాడు.
సెర్ట్ తండ్రి అతని కొడుకులందరూ సైనిక రంగంలో వుండాలని వుద్దేశించాదు. కానీ 'ఒనేగాలోని వాళ్ళ ఎప్టేట్ దివాలా తియ్యడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. సెర్డీ తన నాన్నమ్మ యిల్లు చేరాడు. మిలటరీలో చేరే సంగతి మరుగున పడింది. దానికి బదులుగా సెర్టీ సంగీత కళాశాలలో చేరాడు. సెర్టీ చాలా తెలివైన వాడు, కానీ సోమరి. చదవడమన్నా ప్రాక్టీసు చెయ్యడమన్నా అతనికి అసహ్యం. వీలు దొరికినప్పుడల్లా ఈత కొట్టడం, బోటింగ్, స్మేటింగ్లలో మునిగేవాడు. తరగతి నించీ పని దొంగలా తప్పించుకు తిరిగేవాడు. 226
సెర్టీ నాన్నమ్మకు మనవడి శక్తి సామర్థ్యాల మీద బలమైన నమ్మకం. పరిసరాలు మారితే అతని ప్రతిభ వికసిస్తుందని ఆమె విశ్వాసం. అందుకని ఆమె మనవణ్ణి మాస్కో పంపి నికొలాయ్ జ్వరేవ్ దగ్గర వుంటూ ఆతని దగ్గర చదువుకోమని చెప్పింది. జ్వరేవ్ లక్ష్య శుద్ధి వున్న వ్యక్తి. సెర్టీ కేవలం సంగీతం మాత్రమే కాక భాషలు, సాహిత్యం, చరిత్ర అన్నీ చదువుకోవాలని భావించాడు. అదే సమయంలో జ్వరేవ్ సానుభూతి గల వ్యక్తి అర్థం చేసుకునే తత్వం, ఎట్లాంటి పరిస్థితినయినా ' తెలివితో నిర్వహించే గుణం గలవాడు. సెర్డీ సంగీతాభిమానాల్ని ఎట్లా వికసింప జెయ్యాలో, దానికి అనుకూల పరిస్థితులు ఎట్లా సమకూర్చాలో జ్వరేవ్‌కు తెలుసు. సెర్టీ రెండేళ్ళపాటు జ్వరేవ్ దగ్గరున్నాడు. అతని శిక్షణలో అద్భుతమయిన అభివృద్ధిని సాధించాడు. 1885లో సెర్టీ మాస్కో సంగీత కళాశాలలో చేరాడు. పియానో క్లాసుని సిలోటీ, కాంపోజిషన్ క్లాసుల్ని ఆంటోన్ అరెన్స్కీ అలగ్జాండర్ తనియేవ్ తీసుకునేవాళ్ళు. సహజంగా సెర్టీ కున్న తప్పించుకునే తత్వం వల్ల అతనికి ఉపాధ్యాయులతో ఘర్షణ ఏర్పడింది. అతని ప్రతిభ పట్ల మాత్రం ఎవరికీ సందేహం లేదు. వాళ్ళళో ఒకరయిన తనియేవ్ మెల్లగా, మర్యాదగా బుజ్జగించి సెర్టీ సంగీత పాఠాలు వినేట్టు, చెప్పిన పనులు చేసేట్లు మచ్చిక చేశాడు. తనియేవ్ తన తరపున ఒక వ్యక్తిని పొద్దుట పూట పాఠాలు చెప్పడానికి సెర్టీయింటికి పంపేవాడు. సెర్టీ హోంవర్ము పూర్తి చేసే దాకా అక్కడే వుండమని ఆ వ్యక్తికి ఆదేశాలు కూడా ఇచ్చాడు. ఆ పంపబడ్డ వ్యక్తి ట్రీ, “తప్పించుకోడానికి ప్రయత్నించాను కానీ రెండుసార్లు పట్టుబడ్డాను. మూడోసారి నేను యింట్లో లేనని తనియేవ్తో అబద్ధమాడమని ఆవిడను ఒప్పించాను” అని సెర్టీ చెప్పాడు. నిలకడ లేనివాడయినా, అనాసక్తి ప్రదర్శించినా సెర్టీ సంగీతకళాశాలలోని తెలివైన విద్యార్థుల్లో ఒకడుగా గుర్తింపు పొందాడు. అభినందనల్ని గౌరవాల్ని నిరంతరం అందుకున్నాడు. ఓ సారి సంగీత పరీక్షలో తన సొంత పాట పాడాడు. న్యాయ నిర్జేతల్లో సుప్రసిద్ధ సంగీతకారుడు చెయ్కోవ్స్కీ వున్నాడు. ఆయన ఎన్ని మార్కులు వీలవుతాయో అన్నీ ఇచ్చాడు. 1892లో సెర్టీ తన పియానో నైపుణ్యానికి బంగారు పతకం పొందాడు. సదస్సుకు సంబంధించిన వాళ్ళందరూ ఏకగ్రీవంగా అతన్ని గౌరవనీయస్థానానికి ఎంపిక చేశారు. గ్రాడ్యుయేషన్ పట్టా కోసం ఒక వన్యాక్ట్ ఒపేరా 416%0 రాశాడు. అది సంగీత కళాశాలలో ప్రదర్శింపబడుతూ వుంటే ఎంతో విజయవంతమయిన దానికి బక ప్రచురణకర్త దొరికాడు. 1893 మే 9న అది బోల్నాయ్ థియేటర్లో ప్రదర్శింపబడింది. అందరూ అద్భుతమని అభినందించారు. అందరికన్నా గొప్పవాడయి ఛకోవ్స్కీ మరింత అభినందించాడు. కార్ల్ 227
గుఢేయిల్ అన్న ప్రచురణ కర్త అతను విద్యార్థి దశలో రాసిన రచనలు మొదలు అన్నీ (ప్రచురించడానికి ముందుకొచ్చాడు. చకచకా ఎన్నో రచనలు చేశాడు. వీటిల్లో '౧॥౪14646%1౧ 6 50౧0 ౧౫1౧౦ అన్న నెంమర్లోని రచన యింటింటా ప్రచారమైంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనాత్మకంగా అమ్ముడుపోయింది. దాన్ని మొత్తానికి మొదటే అమ్మేయడంతో అతనికి వచ్చింది పేరు తప్ప ఆదాయం శూన్యం. అనుకోకుండా వచ్చిన ఈ అసాధారణ విజయం ఆనందపెట్టినా వైఫల్యానికి చెందిన బాధాకరమయిన అనుభవం కూడా అతనికి కలిగింది. సింఫనీ నెం.1 యువకుల ఆత్మవిశ్వాసానికి, ఉత్సావానికి ప్రాతినిథ్యం వహిస్తుందని అతని నమ్మకం. 1897 మార్చి 27న సెంట్ పీటర్స్ బర్గ్‌లోని మిలాయేవ్లో గ్రజనోవ్ దర్శకత్వంలో ప్రదర్శింపబడింది. ఆ (ప్రదర్శన ఎంత విఫలమయిందంటే అందులోని కొన్ని భాగాలు గుర్తు పట్టలేనంతగా తయారయ్యాయి. దాంతో సెర్టి షాక్ తిని ఆడిటోరియం నుండి వెళ్ళిపోయాడు. గంటల కొద్దీ పిచ్చిగా తిరిగాడు. జనాల్లో తిరుగుతూ తనని తను మరచిపోవాలనుకున్నాడు. మిత్రులు హఠాత్తుగా అతన్ని సాయంత్రం ఆహ్వానించి చెప్పా పెట్టకుండా ఎందుకు వెళ్ళావని అడిగారు. నిజాయితీ నిండిన అభినందనలు కూడా ఆయన్ని సంతోషపెట్ట లేకపోయాయి. “అప్పుడు నా ఆత్మని కమ్మిన నిరాశ నన్ను వదలిపెట్టలేదు. నా సంగీత జీవితానికి సంబంధించిన నా స్వష్పాలు గాలికి కొట్టుకుపోయాయి. నా ఆశ నా ఆత్మవిశ్వాసం ముక్కలైపోయాయి.” అని చెప్పుకున్నాడు. దానికి తోడు విమర్శకుల అభిప్రాయాలు తోడయ్యాయి. సీజర్ కూయీ “ఒక వేళ నరకంలో సంగీత పోటీలు జరిగితే రాచ్మానినోఫ్ సింఫనీకి తప్పకుండా ఫస్టు (మైజు వస్తుంది. అంతా దయ్యాల అరుపుల్లా వుంది” అని రాశాడు. రాచ్మానినోఫ్ “విధి విధించే తీవ్ర అనారోగ్యం, అది కొట్టే చావు దెబ్బలు మనిషి వ్యక్తిత్వాన్ని మారుస్తాయి. ఇది నా సింఫనీ నాపై చూపిన ప్రభావం. ఈ ప్రదర్శన వల్ల కలిగిన అనిర్వచనీయ చిత్రహింస నించి మొత్తానికి బయటపడ్డాను. ఇప్పుడు నేను వేరే వ్యక్తిని” అని చెప్పుకున్నాడు. అతని నరాలు పూర్తిగా దెబ్బ తినడానికి ఇది ఆరంభం. అతని నాన్నమ్మ నీవగోరోడ్లో అతనితో బాటు వుండేది. ప్రేమగా అతనికి సపర్యలు చేసి అతన్ని మామూలు మనిషిని చేసింది. అతని ఆరోగ్యం కుదుట పడింది. మాస్మోకు తిరిగి వచ్చాడు. కానీ మాటిమాటికీ అతన్ని చుట్టు ముట్టే నిరాశ అతన్ని కుంగదీసేది. అతను ఒక రకమయిన మానసిక జదళత్వానికి లోనయ్యాడు. సెర్టీ మాస్మోలో సుప్రసిద్ధమానసిక వైద్యుడయిన డా. డాల్స్ దగ్గర సైకోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. “అటోసజెషన్' ద్వారా దా. డాల్ సెర్టీకి ట్రీట్మెంట్ ఇచ్చాడు. సెర్టీ చెదిరిపోయిన 228
ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించాడు. “మళ్ళీ నువ్వు స్వరకల్పన చెయ్యి. నువ్వు పియానోకు రచన చెయ్యగలవు. అన్ని అనుకులాల్లో అద్భుతంగా రచించగలవు “ ఈ మాటల్ని డాక్టర్ తరచూ చెబుతూ వుండేవాడు. ఆయన మాటల ద్వారానో మరో విధంగానో సెర్టీ తననతాను గుర్తించాడు. పియానో కన్సర్ట్ నెం. 2, ముగించాడు. ఈ నాటికీ అది అద్భుతమయిన రచన. దాన్ని దా. డాల్‌కు అంకితమిచ్చాడు. 1901 నవంబరు 9న మాస్మోల్తో ఆ రచన ప్రదర్శించాడు. అది ఘన విజయాన్ని పొందింది.
సెకండ్ పియానో కన్సర్ట్ ద్వారా సెర్టీ సంగీతంలోకి, విజయంలోకి అడుగుపెట్టాడు. దానివల్ల అతని ఉద్వేగాలకు నిలకడ దొరికింది. 1902 ఏప్రిల్ 29న తన మరదలు, ఎన్నాళ్ళ నించో తన ప్రియురాలు ఐన నటాలియా శాటిన్ను పెళ్ళి చేసుకున్నాడు. అతని శక్తులు, ఆత్మవిశ్వాసం తిరిగి స్థిరపడ్డాయి. పర్యటిస్తూ (ప్రదర్శన లివ్వడం ప్రారంభించాడు. అనాటి రష్యన్ పియానిస్టుల్లో సాటిలేని వాడుగా కీర్తి గడించాడు. బోల్సాయ్ థియేటర్లో పర్శనెంట్ నిర్వాహకుడుగా వుండడానికి అంగీకారం కూడా తెలిపాడు. 1904 నుండి 1906 దాకా అక్కడ పనిచేసి అసాధారణ ప్రతిభావంతుడుగా గుర్తింపు కూడా పొందాదు. ఎన్నో రచనలు, పియానో రచనలు, సొనటాలు రాశాడు. త్వరలోనే మాస్కోలో పేరు పొందిన గొప్ప సంగీతకారుల్లో ఒకడుగా గుర్తింపు పొందాదు. అతని అపార్ట్మెంట్ సుప్రసిద్ధ సంగీతకారుల్తో, మేధావి వర్గంతో సందడిగా వుందేది.
ఏళ్ళు గడిచేకొద్దీ (కండెక్టర్) నిర్వాహకుదుగా, పియానిస్టగా, అతని కార్యకలాపాలపై సామాజిక జీవన రంగం ప్రభావం ఎక్కువైంది. అతను కోరుకునే ఏకాంతం, సృజనాత్మకతకు అవసరమయిన ప్రశాంతం అతనికి దూరమయ్యాయి. ఫలితంగా అతను మాస్కో నగరం వదిలిపెడదామనుకున్నాడు. భార్యతో, కూతురితో కలిసి 1907లో ద్రెన్డెన్లో స్థిరపడ్డాడు. అక్కడ రెండు మౌలిక రచనలు చేశాడు. నెం. 2 1౧ ౬ ౧౫110౯అన్న సింఫనీ, 76 151601 (18 686 అన్న వన్టోన్ పోయమ్, ఆ రెండు రచనలు తన సొంత దర్శకత్వంలో ప్రదర్శించాడు. సింఫనీ 1908 ఫిబ్రవరి 8న సెంట్ పీటర్స్ బర్గ్‌లో, టోన్పోయమ్ 1909 మే 1న మాస్మోలో (ప్రదర్శించాడు.
జర్మనీలో వున్నప్పుడు మొదటిసారిగా అమెరికా పర్యటకు ప్రణాళిక వేశాడు. మాస్కో వచ్చి ఏకాగ్రతగా పియానోపై ప్రాక్టీసు చేసి, పియానో కోసం కొత్త రచన చేసి అవన్నీ పర్యటన కోసం సిద్ధం చేశాడు. 1909 నవంబరు 4న అమెరికా చేరాడు. అమెరికాలో వివిధ ప్రదేశాలు పర్యటించి పియానిస్టుగా, కంపోజర్‌గా, నిర్వాహకుడుగా ప్రదర్శనలిచ్చాడు.
సెర్టీ రెండోసారి 1918లో అమెరికా వచ్చాడు. ఈ సారి 'దేశం లేని మనిషిగా” వచ్చాడు. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చినపుడు రష్యన్ సైనికుల కోసం, కాందిశీకుల
229
కోసం ప్రదర్శనలిచ్చి సాయం చెయ్యడానికి సిద్ధపడ్డాడు. ఆ సందర్భాల కోసం చేసిన రచనలు అతన్ని అంతగా సంతృప్తి పరచలేదు. అప్పుడు విప్లవం వచ్చింది. అప్పుడు గాఢంగా తన 12౧0 00౧060 [10. 1, మీద గాఢమయిన ఏకాగ్రత నిలిపి ఎన్నో ఏళ్ళకు ముందు మొదలు పెట్టిన దాన్ని పూర్తి చేశాడు. “రాసుకునే టేబుల్ దగ్గర లేదా పియానో ముందు రోజంతా కూచుని మిషన్ గన్ల, తుపాకి గుళ్ళ శబ్దాలకు ఏ మాత్రం భయపడకుండా రచన చేశాను” అని చెప్పుకున్నాడు. అంతులేని అరాచకం అతను జీర్ణించుకో లేకపోయాడు. రష్యాలో కొత్తగా ఏర్పడిన అధికార వర్ధాన్ని అతను అర్ధం చేసుకోలేకపోయాదు. ప్రతి చోటా అతను మరణాల్నిి నిర్మూలనను, విధ్వంసాన్ని చూశాడు. అంతులేని, అవధి లేని విప్లవ జ్వాలు అతనికి విసుగు పుట్టించాయి. ఇపుడు రష్యా తన రష్యా కాదనిపించింది. తను ఎరిగిన తన దేశం తనది కాకుండా పోయింది. ఇప్పుడొక కొత్త యింటిని వెతుక్కోవాలి అనుకున్నాడు. మార్చి 1917లో రష్యాను వదిలి పెట్టడం మంచిదని భావించాడు. కానీ ఆ సంవత్సరం చివరి దాకా అతని ప్రయత్నాలు ఫలించలేదు. స్కాండినేవియాలో సంగీత పర్యటన నిమిత్తం అతని వేసిన ప్రణాళిక 1917 డిసెంబరులో అతను రష్యా - ఫిన్లాండ్ సరిహద్దు కూడా దాట నివ్వలేదు. అతన్దగ్గర కొన్ని బట్టలు, చిన్ని సూట్ కేసు, కొన్ని వందల రూబుళ్ళు మాత్రమే వున్నాయి. సంవత్సరం పాటు స్కాండినేవియాలో వున్నాడు. ప్రదర్శనల ద్వారా కొంత సంపాదించాడు. అప్పుడు 1918లో రెండోసారి అమెరికా పర్మటకు బయల్దేరాడు. అప్పటి నించీ తరుచూ అమెరికా పర్యటనలు జరిపాడు. 1918 నుండి 1935 వరకు అతని నివాసం స్విట్టర్లాండ్‌లోని లూసర్న్ సరో వరం ఒడ్డున వున్న ఇల్లు, 1935 తర్వాత న్యూయార్క్‌లోని ఒక రివర్ "సైడ్ అపార్ట్మెంట్లో వున్నాడు. ఆ తరువాత కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో ఒక ఆధునికమయిన ఇంట్లో నివసించాడు. తన మరణానికి కొంత ముందు అమెరికా పొరుడయ్యాదు. సెర్టీ ఎక్కడున్నా ఏ దేశంలో స్థిరపడినా అతని మనసులో ఒక మూల రష్యా గురించిన తపన వుండేది. అది నిస్సహాయమైంది. అతను తన భాషను, తన దేశ ఆచారాల్ని సెలవుదినాల్ని క్రమం తప్పకుండా పాటించేవాడు. మాతృభూమి పట్ల అతని మమకారం అలాంటిది. అతని ముఖ్యమయిన భోజనంలో తప్పనిసరిగా రష్యన్ వంటకాలుండేవి. ప్రతిరోజూ రష్యాలో లాగే స్ట్రాంగ్ టీ తప్పని సరిగా తాగేవాడు. స్విట్జర్లాండ్‌లోని అతని ఇల్లు రష్యన్ పద్ధతుల్లో అలంకరించేవాడు. ఎప్పుడూ ఒంటరిగా, విషాదంగా వుండేవాడు, తనకి ఆశ్రయమిచ్చిన దేశం అతన్ని ఆదరించినా అతని విషాదం పోగొట్ట లేక పోయేది. సంవత్సరాలు గడిచే కొద్దీ “యిల్లు కోల్పోయిన బెంగ ఎక్కవయిందే కానీ తగ్గలేదు. అది 230
అతనో అంతులేని విషాదంగా గూడు కట్టుకుని వుండేది. అతని కొంత మంది మిత్రులు తమ పరిచితుల్లో అంత విషాదం నిండిన వాణ్ణి ఎవర్నీ చూడలేదు" అనే వాళ్ళు. అతను నవ్వడం ఎప్పుడూ చూడలేదు 'అనే వాళ్ళు. అతని కళ్ళలో ఒక దిగులు మొదిలేది.
ఇన్ని వున్నా అతను సంగీత రచన మానలేదు. కొన్ని స్విట్టర్లాందులో, మరికొన్ని అమెరికాలో పూర్తి చేశాడు. సంగీత రంగ స్థలంపై అతని అనంత చైతన్య శక్తి పురులు విప్పేది. అతను తన కాలంలోని గొప్ప సంగితకారుల్లో ఒకడు. అతని ముష్పయ్యవ సంగీతోత్సవం 1989లో అమెరికాలో భారీ ఎత్తున జరిగింది. ఫిలడల్సియాలో జరిగిన ఉత్సవాల్లో సెర్టీ పాల్గొన్నాడు.
(క్రమంగా అతని ఆరోగ్యం క్షీణించింది. ఐనా సంగీత ప్రదర్శన లిస్తూ వచ్చాడు. కొంత కాలం మాని బీవర్లీ హిల్స్‌లో చిన్ని యిల్లు తీసుకుని అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. “క్ష భూమిపై ఇది నా చివరి యిల్లు. ఇక్కడే నేను చనిపోతాను” అన్నాడు. తనెంతో కాలం బతకనని అతనికి తెలుసు. కేవలం అమెరికాలోనే ఓసారి పర్యటన చేయాలనుకున్నాడు. అనారోగ్యంగా వున్నా 1948 ఫిబ్రవరిన పర్యటనకు బయల్దేరాడు. ఎంతో దూరం వెళ్ళలేదు. న్యూయార్క్‌లో నీరస పడ్డాడు. కాలిఫోర్నియాకు తీసుకొచ్చారు. చనిపోయే ముందు “ఎక్కడో దగ్గర్లో ఏదో సంగీతం వినిపిస్తోంది.” అన్నాడు. దగ్గరున్న వాళ్ళు “ఇక్కడెవరూ సంగీతం వినిపించడం లేదు” అన్నారు. సెర్డీ “ఐతే అది నా తలలోంచీ వినిపిస్తోంది” అన్నాడు విషాదంగా మార్చి 28న కన్నుమూశాడు.
232
ఫ్రాంజ్ షూబర్ట్ ౧2౧2 50[6406గ1 31-1-1797 -- 19-1-16:286
షూబర్ట్ తండ్రి పేరు థియోడోర్ షూబర్ట్. భక్తి పరుడు. నిరడంబరుడు. మురా వియన్ రైతు కుటుంబం నించీ వచ్చినవాడు. తన స్థాయిని మించి వెళ్ళే వ్యక్తి కాడు. సుఖాల పట్ల అత్యాశలేనివాడు. తన హద్దులు తెలిసినవాడు. ఒక ఫాదర్ ఆధ్వర్యంలో నడిచే గౌరవనీయమయిన పాఠశాలలో ఉపాధ్యాయుడు. తన ఉద్యోగ జీవితంతో సంతృప్తి పడిన వ్యక్తి. 1785లో ఎలిజబెత్ వీట్ట్ అన్న ఒక వంట మనిషిని పెళ్ళాడాడు. వియన్నా నగర సరిహద్దులో కాపురం పెట్టాడు. అతని తరగతిలోని పిల్లలు నెలకు ఒక వెండినాణెం ఇచ్చేవాళ్ళు. తన తక్కువ ఆదాయంలోనే పొదుపు చేసి ఒక ఇల్గుకొన్నాడు. అతనికి పదకొండు మంది సంతానం. వాళ్ళలో ముగ్గురే బతికారు. తన యింటిని స్కూలుగానూ, నివాసంగానూ ఉపయోగించుకున్నాడు. 1797లో షూబర్ట్ అక్కడే జన్మించాడు. ఆ ఇల్లు ఇప్పుడు షూబర్ట్ మ్యూజియంగా మార్చారు.
దురాశలు, అత్యాశలు లేని తండ్రి తనలాగే పిల్లలు వుందాలని ఆశించాడు. వాళ్ళు కూదా గౌరవ మర్యాదలు పొందే స్కూలు టీచర్లు కావాలని కోరుకున్నాడు.
చిన్నప్పుడు పెట్టిన పరీక్షల్లో షూబర్ట్ సంగీతంలో అసాధారణ ్రతిభావంతు డవుతాడన్నది ఆయన వూహకు అందని విషయం. ఐనా ఆకలితో అలమటించే సంగీతకారుడి బతుకృన్నా నిర్మలంగా గడిచే స్కూలు టీచర్ వుద్యోగం మేలని కొడుక్కి హిత బోధ చేశాడు. అట్లా అని కొడుకు అభిరుచిని ఆయన కాదన్లేదు. ఆయనకు సంగీతమంటే ఇష్టమే. తన పిల్లలు ఛాంబర్ మ్యూజిక్ ప్రదర్శనల్లో తను కూడా పాల్గొనేవాడు. సంగీతంతో కొద్దిగా అతనికి పరిచయం కూడా వుంది. ఫలితంగా షూబర్ట్కు తండ్రి కొన్ని సంగీత పాఠాలు నేర్పాడు. వయోలిన్ జ్ఞానం కొద్దిగా కలిగించాడు. షూబర్డ్ సోదరుడు ఇగ్నాజ్ పియానో నేర్సించాడు. కొద్ది రోజుల్లోనే షూబర్ట్ అన్నను అధిగమించి అప్పటి నించీ తన సొంత మార్గంలో ప్రయాణించాడు. తన తమ్ముడికి యిక తను నేర్పేదేమీ లేదని అన్న గుర్తించాడు.
తొమ్మిదేళ్ళ వయసులో చర్చి సంగీతకారుడు మైకేల్ హాల్టర్ దగ్గర సంగీతం నేర్చుకోదానికి షూబర్ట్ చేరాడు. ఆయన ఆర్గాన్ వయోలా, వాద్యాలు, పాటలు పాడడం నేర్పించాడు. అతస్టగ్గర షూబర్ట్ కొద్ది కాలంలో ఆ గురువు నేర్చిన విద్యలన్నీ గ్రహించాడు. 232
ఆ పెద్ద మనిషి “నేను మొదలు పెట్టి వివరించేలోగా ఈ కుర్రాడు వాటిల్లో పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రదర్శించేవాడు” అన్నాడు.
1808లో వియన్నా పేపర్లు వియన్నా ఛాపెల్ చాయిర్ బాయ్స్ ఇద్దరు కావాలని (ప్రకటన యిచ్చాయి. వాటికోసం పరీక్షలు నిర్వహిస్తారనీ చెప్పాయి. అందులో ఎంపికయిన వాళ్ళకు సంగీత బోధన చేస్తారని, ఇంపీరియల్ కోర్ట్ ఛాపెల్‌లో వాళ్ళకు నివాసం, భోజన సదుపాయాలు కూడా కలిగిస్తారని వివరణ వుంది. హాల్దర్ ఉత్సాహంతో షూబర్ట్ని అప్లే చెయ్యమన్నాడు. అట్లాంటి ప్రతిభావంతుడికి అది మంచి అవకాశమన్నాదు. అది కూడా ఉపాధ్యాయ వృత్తి వంటిదే అని షూబర్ట్ తండ్రి కూడా అంగీకరించాడు.
షూబర్ట్ అప్లే చేశాడు. షూబర్ట్ కలవరపడుతూ, పిరికిగా వుండేవాడు. కానీ పరీక్షలో (ప్రతిభావంతంగా పాల్గొన్నాడు. అప్పటి వియన్నా సంగీతకారుల డీన్‌గా వున్న ఆంటోనియో సలీరీ పరీక్షాధికారిగా వచ్చాడు. షూబర్ట్ని పాడమన్నాడు. అతని పాటతో ఎంతో ముగ్దుడయిన ఆంటోనియో షూబర్ట్ని ఎన్నిక చేశాడు.
కానీ ఆ స్కూల్లో జీవితమంత బాగోలేదు. గదులు వెచ్చగా వుండేవి కావు. తరచుగా అవి చల్లగా వుండేవి. చాలీ చాలని తిండి పెట్టేవాళ్ళు. చాలని తిండి వల్ల షూబరక్ట్ తన అన్నకు వుత్తరాలు రాసేవాడు. కొన్ని డబ్బులు పంపమని, వాటితో ట్రెద్దు, ఆపిల్ పళ్ళు కొనుక్కంటానని రాసేవాడు. ఈ ఇబ్బందులున్నా వాటిని మరచిపోయేలా చేసే మరో పార్య్వం కూడా వుంది. తన అననుకూలాల్ని అతను విన్మరించేవాడు. కారణం ఎప్పుడూ ఆ వాతావరణం సంగీతమయంగా వుండేది. స్వరరచనతో బాటు ఆర్మెస్ట్రాలో అతను పాల్గొనడానికి ఎంతో యిష్టపదేవాడు. ప్రతి రోజూ సాయంత్రం గంటన్నర పాటు విద్యార్థులందరికీ హైదన్, మొజార్ట్, బిథోవిన్ రచనల్ని పరిచయం చేసేవాళ్ళు. ఆ మహా సంగీతకారుల సంగీత పరిచయం ఆనందోత్సాహాలలో ముంచి తెల్పేది.
షూబర్ట్ మొజార్ట్ రచన 7౧6 1201206 01 ౬190 గురించి చెబుతూ “ప్రపంచంలో (సౌందర్య భరితమైంది) అది సాటి లేనిది” అన్నాడు. మొజార్ట్ సింఫనీ 6 $110౯గురించి చెబుతూ “దేవ దూతలు పాడడం మీరు వినొచ్చు” అన్నాడు. నిర్మలంగా అలల్లా సాగే హైదన్ సింఫనీలు అతన్ని కదిలించాయి. అన్నిటికన్నా అతన్ని అవనకుణ్ఞ చేసేవి బిథోవిన్ రచనలు.
షూబర్ట్ అప్రయత్నంగా, అనాయాసంగా అతనికి చెప్పినవన్నీ నేర్చుకోవడం అతని వుపాధ్యాయుల్ని ఆశ్చర్యానికి లోను చేసింది. రుజికా, అన్న ఉపాధ్యాయుడు “నేను అతనికే మీ నేర్చలేదు. అతను దేవుడినించీ అన్నీ నేర్చుకున్నాడు” అని చెప్పాడు.
233
సలీరీ * నువ్వు ప్రతిదీ సాధించగలవు, నువ్వు జన్మతః ప్రతిభాశాలివి” అన్నాడు.
షూబర్ట్ స్నేహితుల్ని ఒక పట్టాన సంపాదించుకోలేకపోయేవాడు. ఎందుకంటే అతను దూరదూరంగా, జంకుగా వుండేవాడు. ఐనా కొంత మంది కుర్రాళ్ళు అతని నెమ్మది తనానికి, అతని తెలివి తేటలకు ఇష్టపడి దగ్గరయ్యేవాళ్ళు. అతని పట్ల ఆకర్షితులయిన వాళ్ళు అతన్ని గాఢంగా యిష్టపడేవాళ్ళు. ఆరాధించేవాళ్ళు. అటువంటి వాళ్ళలో జోసఫ్ వాన్ స్పాన్ జీవితాంతం షూబర్ట్ సన్నిహితుడుగా, ఆరాధకుడుగా వున్నాడు. తన స్మృతులలో అతను తను షూబర్ట్తో ఎట్లా ఆకర్షింపబడిందీ వివరించాడు.
“ఆ పొట్టి కుర్రాడు కలుపుగోలుతనంగా వుండేవాడు కాడు. సీరియస్‌గా వుండేవాడు. మరీ అంత స్నేహ భావంతో వుండేవాడు కాడు. వయోలిన్‌ని నైప్రణ్యవంతంగా ప్రదర్శించేవాడు. రెండో వయోలిన్ బృందానికి నేను నాయకుణ్ణి. పొట్టి షూబర్ట్ నా వెనక నించుని ఫిడిల్ పట్టుకుని నా భుజాల గుండా చూసేవాడు. అతను నన్ను అధిగమిస్తున్నట్లు గుర్తించాను. అతనంటే ఆసక్తి కలిగింది. ఒక రోజు ఒక్కజ్జీ సంగీతం వాల్లోకి వచ్చాను. అప్పుడే అక్కడ పియానో ముందు కూచుని తన చిన్ని చేతుల్తో మనోహరంగా షూబర్ట్ పియానో వాయిస్తున్నాడు. మొజార్ట్ రచనని ప్రదర్శిస్తున్నాడు. నా అభ్యర్థన మేరకు అతని సొంత రచనని ప్రదర్శించాడు. సిగ్గుతో అతని బుగ్గలు కందిపోయాయి. నా అభినందన అతన్ని అనంద పెట్టింది. అతను తన ఆలోచనల్ని రహస్యంగా రాసి పెడుతున్నట్లు తెలిసింది. కానీ 'ఫాదరొకు ఆ సంగతి తెలీదు”
స్టాన్ సహకారంతో షూబర్ట్ ఎన్నో సంగీత రచనలు చేశాడు. షూబర్ట్ స్వరం 1818లో దెబ్బ తినింది. స్వరం దెబ్బతింటే చాలా మంది విద్యార్థుల్ని పంపేసేవాళ్ళు. కానీ స్కాలర్షిప్ మీద షూబర్ట్ని వుండ నిచ్చారు. కారణం అతను గణితంలో వెనకబదడం వల్ల, కానీ షూబర్ట్ స్కూలు జీవితంలో విసుగెత్తాడు. తిరిగి తన యింటికి చేరాడు. అక్కడ తండ్రి కోరిక మేరకు వుపాధ్యాయ వృత్తిని స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. దానికి రెండు కారణాలు. ఒకటి ఉపాధ్యాయుడుగా వుంటే అతనికి మిలటరీ సర్వీసు నించీ మినహాయింపు వుంటుంది. రెండోది జీవనాధారం దొరికినట్లూ వుంటుంది. సెంట్ అన్నా నార్మల్ స్కూల్లో ప్రిపరేటరీ కోర్సు పూర్తి చేసి 1814లో తన తండ్రి స్కూల్లో టీచర్‌గా చేరాడు.
స్కూలు గదన్నా పాఠం చెప్పడమన్నా అతనికి అసహ్యమేసింది. అతను పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడంలో అసమర్భుడు. పిల్లలు తమ నోటుబుక్స్లో రాసుకుంటూ వుంటే షూబర్ట్ తన నోట్‌బుక్‌లో సంగీత రచనలో మునిగి వుండేవాడు. దాదాపు అతని సాయంత్రాలు, రాత్రులు స్వరరచనకు అంకితం చేసేవాడు. 1814లో తన మొదటి ఒపేరా పూర్తి చేశాడు. అతని సుప్రసిద్ధ రచనల్లో ఒకటయిన "810060 27 5010౧266" అప్పుదే రాశాడు. 23డ్ల
అక్టోబర్ 16న ఆ రచన చర్చిలో ప్రదర్శింపబడింది. రెండోసారి ప్రదర్శింపబడినప్పుడు సలీరీ హాజరై 'నీ శక్తి యుక్తులు సాటి లేనివి అన్నాడు. ఆ అభినందనల పట్ల అభిమానంతో షూబర్ట్ని అనురాగ దృష్టుల్లో చూసిన వ్యక్తి 'శెరెసెగ్రాబో. ఆ ప్రదర్శనలో అమె పాడింది. ఆమెకు పదహారేళ్ళు. మొఖంపై స్ఫోటకం మచ్చలు, పెద్ద నోరు, గద్ద ముక్కు కానీ అద్భుతంగా పాడగలదు. ఆమెను ప్రేమించడానికి ఆమె ప్రేమలో పడడానికి షూబర్ట్కు ఆమె మధుర కంఠ స్వరమే కారణం. 1821లో తనామెనెంత గాఢంగా (ప్రేమిస్తున్నానో ఒక .మిక్రునికి రాశాడు. ఆమె కూడా అతన్ని (ప్రేమించింది. కానీ మూడేళ్ళు ఎదురు చూసి ఫలితం లేక యింకొకర్ని పెళ్ళాడింది. కారణం షూబర్ట్ ఆమెకు ఎట్లాంటి ప్రతిపాదన చెయ్యలేదు. ఎందుకంటే ఆమెను పోషించే ఆర్థిక స్టోమత అతనికి లేకపోవడమే. ఒక మిత్రునికి రాసిన వుత్తరంలో “యిప్పటికీ ఆమెను (ప్రేమిస్తున్నాను. నేను యిష్టపడిన మరో స్ర్త్రీ యిప్పటికీ నాకు తటస్థించలేదు” అని రాశాడు.
1815 అతని జీవితంలో ఫలనంతమయిన సంవత్సరం. రెండు సింఫనీలు, మూడు మాసెస్, ఒక ఒపేరా, నాలుగు అపరెట్టాస్, నాలుగు సొనటాలు, కొన్ని చిన్ని కోరల్ వర్క్, 146 పాటలు రాశాడు.
అసాధారణ వేగంతో రచనలు చేశాడు. రోజుకి ఐదారు రచనలు చేసిన సందర్భాలూ వున్నాయి. అతని బాల్య మిత్రుడు స్పాన్ అతనెట్లా లీనమై రచన చేస్తాడో ఎన్నోసార్లు వివరించాదు.
మేర్ హాఫర్ సెన్సార్ బ్యూరోలో ఆఫీసర్. స్వతవాగా కవి. షూబర్జ్ స్నేహ బృందంలో సభ్యుడు. అతని రచన "4౧ 566 ని షూబర్ట్ స్వరపరిచాడు. అప్పట్నించీ వాళ్ళు మిత్రులు, షూబర్ట్ సన్నిహితమి(త్రుల్లో ఫ్రాంజ్ వాన్ షోబర్ ఒకడు. అతను బెత్సాహిక సంగీతకారుడు, ఉన్నత కుటుంబీకుడు. ఆ గ్రూపులో 'జోవోన్ వోగలొ అన్న సుప్రసిద్ధ గాయకుడుగా కూడ వుందేవాడు. వీళ్ళందరూ మాబర్ట్ జీవితాంతం సన్నిపాతంగా మెలిగారు. అతన్ని అభినందించారు, ఆనంద పెట్టారు. అందర్నీ అధిగమించే గాయకుడు జోహాన్ వోగల్ కూడా “షూబర్ట్ ప్రతిభ ముందు మేము మోకాళ్ళపై కూచుని తలవంచే వాళ్ళం” అన్నాదు.
1816లో తన కయిష్టమయిన 'హీని మైన వుపాధ్యాయ వృత్తిని వదిలి అనిచ్చితిలోకి దరిద్రంలోకి అడుగు పెట్టడానికే సిద్ధపడ్డాడు. తన స్నేహితుడు షోబర్తో బాటు వుండడానికి నిశ్చయించి తన సంపూర్ణ సమయాన్ని సంగీతానికి వినియోగించాలని భావించాడు. అది
మొదలు ఒక మిత్రుడి నించీ యింకో మిత్రుడి దగ్గరికి మకాం మారుస్తూ వాళ్ళ దయాదాక్షిణ్యాలపై జీవిస్తూ గడిపాడు. 235
ఒక రకంగా షూబర్ట్ జీవితం బిథోవిన్ జీవితం లాంటిది. షూబర్ట్ అతని మిత్రులు ఒక “ఆనంది బృందం లాంటివాళ్ళు. అదృష్టవంతులు. సాయంత్రం పార్టీల్లో ఉల్లాసంగా గడుపుతూ, వోటళ్ళలో చర్చల్లో మునగుతూ, వైన్ తాగుతూ గడిపేవాళ్ళు. ఒకరి దగ్గర డబ్బుంటే చాలు, అందరూ తినేవాళ్ళు, తాగేవాళ్ళు. డబ్బు లేకుంటే అది మరచిపోడానికి నవ్వుతూ, కేరింతలు కౌడుతూ ఆడేవాళ్ళు.
షూబర్ట్ స్నేహితుల యిళ్ళలో ఉల్లాసకరమయిన సాయంత్రాలు ఉత్సవ వాతావరణంలో నిండి వుందేవి. వాటిని "50[608 5౪6౧1095" అనేవాళ్ళు. ఓగల్ పాట పాడేవాడు. షూబర్ట్ పియానో వాయించేవాడు. విందులు, వినోదాలు, నృత్యాలు వుండేవి. విషాదాన్ని పారదోలే పియానో 'పారడిలతో షూబర్ట్ ఉల్లాసాన్ని నింపేవాడు. అట్లాంటి సందర్భాల్లో మిత్రులంతా హోటల్ వెళ్ళి వైన్ తాగుతూ సంగీతం, కళ, సాహిత్య విషయాల్ని చర్చించుకునే వాళ్ళు. ఒక హోటల్ నించీ మరో హోటల్‌కి మారుతూ ఎప్పుడూ అర్ధరాత్రిళ్ళు యిళ్ళు చేరేవాళ్ళు.
షూబర్ట్ అనుదిన జీవితం గురించి మిత్రుల వర్ణనలున్నాయి.
అన్సెల్మ్ హట్టెన్ బ్రెగ్నర్ “షూబర్ట్ పొద్దున్నే ఆరుగంటలకు తన డస్ముదగ్గర కూచుని మధ్యాహ్నం ఒంటి గంట దాకా స్వర రచనలో మునిగి వుండేవాడు. అప్పుడప్పుడూ పైప్ తాగుతూ గడిపేవాడు. నేను పొద్దున పూట అతన్ని చూడడానికి వస్తే అప్పటికే తను స్వర పరిచిన తన రచనను నాకు వినిపించేవాడు. నా అభిప్రాయం కోసం ఎదురు చూసేవాడు. నేనేదన్నా పాటని గొప్పగా వుందని చెబితే అది నచ్చడానికున్న కారణాల్ని విశ్లేషించేవాడు. తరువాత కెఫెకు వెళ్ళేవాళ్ళం. షూబర్ట్ కప్పు కాఫీ తాగేవాడు. డబ్బుంటే వైన్ తాగేవాడు. కాస్త పొగ పీల్చేవాడు. గంటలు గదిచేవి. వైన్కో నరాలు వుడుకెత్తితే అల్లరి చెయ్యకుండా నిశ్శబ్దంగా లేచి ఒక మూలకు వెళ్ళి కూచుని తరువాత వెర్రెత్తిన వాడిలా చేతి కందిన గ్లాసును పగల గొట్టి తన చిన్ని కళ్ళను తిప్పుతూ ముడుచుకు పోయేవాడు”
అతని స్నేహితులు అతన్ని 'ఆకర్షణీయుడు'గా ఎప్పుడూ చెప్పలేదు. పైగా “మొద్దుగా, లావుగా వుండేవాడన్నారు. “హప్టెన్ బైన్నర్ “పొట్టిగా వుండేవాడు. గుండ్రని ముఖం. మెరుపు లీనే కళ్ళు లోపలి అగ్నిని (ప్రదర్శించేవి అన్నాడు. దూరదృష్టి వల్ల ఎప్పుడూ అద్దాలు ధరించేవాడు” అన్నాదు. అద్దాలతో పాటీ పడుకుని అట్లాగే లేచి అవ్యవధానంగా స్వరకల్పనలో మునిగేవాడని షోబర్ అన్నాడు. యింకా” తన బట్టల గురించి అతనికి పట్టింపు వుండేది కాదు, ఉన్నత వర్గాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకోవడం అవసరమన్న దాన్ని అతను వ్యతిరేకించేవాడు. 236
1818లో వేసవిలో హంగెరీకి చెందిన ఈస్టర్ హేజీ అన్న రాణికి చెందిన జెలెస్ట్ ప్రాంత ఎస్టేట్‌లో మ్యూజిక్ ట్యూటర్‌గా షూబర్ట్ నియమితుడయ్యాడు. అది అతనికి మధురమయిన అనుభవాన్ని మిగిల్చింది. (షూబర్డ్ అక్కడ "సేవకుడిగా చూడబడినా) కానీ అతనికి యింటి పట్ల బెంగపట్టుకుంది. వియన్నా స్నేహితులు మనసులో మెదిలారు. మిత్రులందర్నీ ఓ సారి కలిసి ఆనందించాడు. 1818లో తాత్కాలికంగా తండ్రి స్ఫూల్లో కొంత కాలం పనిచేశాడు. 1824 వేసవిలో రెండోసారి జెలెస్టలో ట్యూటర్‌గా వెళ్ళాడు. ఈస్టర్ హేజీ కూతుళ్ళు ఆకర్షణీయంగా, మనోహరంగా, అందరానివాళ్ళుగా అనిపించారు.
1824 తర్వాత అతని సంగీత ప్రదర్శనల ద్వారా 500 డాలర్లపైగా సంపాదించాడు. 1820 నాటికే దాదాపు 500 రకరకాల రచనలు చేశాడు.
14 జూన్ 1820న జరిగిన అతని ప్రదర్శన అతని ఘన విజయాల్లో మొదటింది. అందులో అతని మిత్రుడయిన గాయకుడు వోగల్ రెండు పాటలు పాడాదు. ఆ సందర్భం గురించి చెబుతూ పహట్టెన్ బైన్నర్ 'జనం ఆ ప్రదర్శనను హృదయపూర్వకంగా స్వీకరించడం పట్ల షూబర్ట్ ఎంతో ఆనందించాడు. సోలో సాంగ్స్‌ని వోగల్ పాడిన తీరుకు ఉత్సాహంతో జనం వురకలేశారు. కరతాళధ్వనులు చేశారు. చివర్లో షూబర్ట్ని పిలిచారు. కానీ అతను తెరముందుకు రావడానికి తిరస్కరించాడు. కారణం అతని వోవర్ కోటు మురికిగా వుంది. నేను నాకోటును విప్పి అతని కిచ్చి అతన్ని తెరముందుకు పంపడానికి ప్రయత్నించాను. జనం ముందుకు అతన్ని పంపడం అవసరమని భావించాను. కానీ షూబర్ట్కు విపరీతమయిన సిగ్గు, బిడియం. జనాల అరుపులు ఎక్కువయ్యాయి. అందరూ ఏక కంఠంతో షూబర్ట్ని పిలిచారు. పరిస్థితి చెయ్యి దాటిపోకముందే ఆ సంగీత ప్రదర్శన నిర్వాహకుడు రంగం మీదకు వచ్చి షూబర్ట్ అక్కడ లేడని వెళ్ళిపోయాడని చెప్పాడు” అన్నాడు.
ఆ ప్రదర్శన జనం యిష్టపద్దారు. విమర్శకులకు అది నచ్చలేదు. వియన్నా నించీ వచ్చే ఒక పత్రికా కరస్పాండెంట్ 'దాన్ని గొప్ప సంగీతంగా జనం ఆదరించారు కానీ అది అంత గొప్పది కాదు” అని రాశాడు. ఆ రచన తరువాత ఆరుసార్లు మాత్రమే ప్రదర్శింపబడింది. ఆగస్టు 19న 016 24640912గ6 రచన మొదటిసారి ప్రదర్శితమైంది. షూబర్ట్ దానిపై ఆశలు పెట్టుకున్నాడు. ఆ ప్రదర్శన నిరాశనే మిగిల్చింది. ఎప్పట్లాగే విమర్శకులు విరుచుకపడ్దారు. “ఈ రచన మరీ సుదీర్షమైంది, విసుగెత్తించేద” అని రాశారు.
అతని (ప్రదర్శనల వల్ల కలిగిన నిరాశ నించీ అతని రచనల మొదటి ప్రచురణ ద్వారా అతనికి ఓదార్పు కలిగింది. అతని రచన ౬0119 ని జనం ముందు వోగల్ 1821 మార్చి 7న పాడి జనాన్ని వూపేశాదు. కొంత మంది మిత్రులు షూబర్ట్ రచనల ప్రచురణకి పూనుకున్నారు. వంద మంది చందాదారులు కూడా ముందుకొచ్చారు,
237
కానీ మరి కొన్ని వియన్నాలో యిచ్చిన సంగీత ప్రదర్శనలు విఫలమయ్యాయి.
నిరాశ, తోచని తనం, వరుస వైఫల్యాలు షూబర్ట్ని బాధ పెట్టలేదు. కానీ అంతులేని దరిద్రం, హింసించే లైంగిక వ్యాధి యివే అతన్ని కుంగదీశాయి. జీవితాంతం వాటితో బాధ పడ్డాడు. నిరాశలో, దిగుల్లో కుంగిపోయాడు. ఒక మిత్రునికి రాసిన వుత్తరంలో “ఎవడయితే అనారోగ్యం నించీ కోలుకొని మామూలు మనిషి కాలేడో, అతని దిగులు అతన్ని మరింత కుంగదీస్తుందే కానీ అతన్ని బాధల నించీ బయటపడెయ్యదు. నాకు సంబంధించి నా అపురూపమయిన ఆశలన్నీ శూన్యపు అంచుల్ని తాకాయి. (ప్రేమ, స్నేహాం స్థానంలో కోపం మిగిలింది. అద్భుతమయిన స్వష్పాలన్నీ నిష్ఫలంగా పర్యవసించాయి. యివన్నీ అశాంతి, దుఖం నిండిన మనిషి లక్షణాలు. ప్రతిరోజూ నేను పడుకోబోయేముందు నేను మళ్ళీ నిద్రలేవకూడదని ఆశిస్తాను. మేలు కొన్నప్పుదల్లా నిన్నటి గాయాల్ని విప్పుకుంటాను” అని రాశాడు.
ఈ దిగుల్నించీ అతనికి విశ్రాంతి నిచ్చేది అతని సన్నిహితమిత్రుల్లో కెఫెల్లో కలసుకోవడం, సామాజిక సందర్భాల సమావేశాలు మాత్రమే. యివి ముగిశాకా తన గదికి చేరాకా నిద్రపోతున్నా నిరాశ, దిగులు మళ్ళీ కమ్ముకునేవి.
తన ఆత్మ విషాదం నించీ వుషసంహరించుకోడానికి అతను రాసుకున్న కవితలో “విషాద భారాన్ని మోస్తూ నా దినాలు గడిచాయి” అన్నాడు,
అతని సమకాలికులయిన సంగీతకారులు ప్రచురణలతో, ప్రచారంతో పద్ధతిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు. పదవులు పొందారు. షూబర్జ్ చిన్ని చిన్ని విజయాలతో సంతృప్తి పడిపోయేవాడు. 1823లో ఒక సంగీత సంస్థ అతన్ని గౌరవనీయ సభ్యుడుగా ఎన్నుకొంది. దాని వల్ల అతనికి నిజానికి ధనంగానీ, పేరుగానీ రాలేదు.
ఇది మొదలుగా జీవితాంతం విషాదంలో మునకలేస్తూ, తీవ్రమయిన శారీరక రుగ్భతల్లో బాధలు పడ్డాడు. ఎప్పుడయినా ఆనంద సందర్భాలు వచ్చేవి. 1825 వేసవిలో వోగల్లో ఆఫ్టియా ఉత్తర ప్రాంతంలో తిరిగాడు. మనసు విప్పుకునే మిక్రుల్ని కలిశాడు. తన తాజా రచనలు ప్రదర్శించాడు. అద్భుతమయిన గ్రామ సీమల్లో ఆహ్లాదంగా విహరించాడు. కానీ ఎప్పుడూ దిగులు అతని మనసులో గూడు కట్టుకుని వుండేది.
1827లో బిధోవిన్ మరణం అతనికో పెద్ద విఘాతం. ఎప్పుడూ షూబర్ట్ వ్యక్తిగతంగా తన 'గురువు'ను కలసుకోలేదు. కానీ పసితనం నించే దూరం నించే తన గురువును ఆరాధించాడు. ఆయన సంగీతం విని “ఆయన్ని.అనుసరించే సాహసం యెవరికుంది?” అన్నాడు. బిథోవిన్కు షూబర్ట్ గురించి తెలీదు. విథోవిన్ మరణానికి కొన్నాళ్ళ ముందు 238
కొన్ని షూబర్డ్ రచనల్ని చూశాడు. అవి ఆయన్ని ఆకర్షించాయి. “నిజం షూబర్ట్ రచనల్లో కొన్నిటికి దైవ స్పర్శ వుంది" అన్నాడు.
పర్వత సమానుడయిన ఆ మవా సంగీత కారుడి మరణం షూబర్ట్ను కుంగదీసింది. ఎవరికీ శ్రద్ధాంజలి ఘటించనంత గొప్పగా షూబర్ట్ బిథోవిన్ అంత్యక్రియలు ముగిశాకా శవయాత్రలో పాల్గొన్న వాళ్ళతో కలిసి ఆయన ఆత్మశాంతి కోసం భోజనం చేశాడు. అప్పటి నించీ అతని మనసులో ఒకటే ఆలోచన, బిథోవిన్ తరువాత తను కన్నుమూయాలని.
కానీ అతని నిరాశ, అనారోగ్యం అతని సృజనాత్మక కార్యకలాపానికి అడ్డంకి కాలేదు. సృజనాత్మక జ్వాలలు యింకా పైకెగస్తూనే వున్నాయి. పైగా యింకా విజృంభించాయి. 1827లో అతను ఒక విషాదగీతం "016 ౪1౧1676156" అన్నదాన్ని, రాబోయే మరణాన్ని సూచించేందుకున్నట్లు రాశాడు. అతని చివరి రచనల్లో గుండెలు పగిలే విషాదం, మరణం జంటగా కదుల్తాయి.
అతని జీవితంలోని చివరి సంవత్సరంలో అతను విజయాన్ని రుచి చూశాడు. 1828 మార్చి 26న వియన్నాలో అతని సంగీత ప్రదర్శన జరిగింది. పూర్తిగా అదంతా షూబర్ట్ రచనల ఆధారంగానే జరిగింది. చివరికి వియన్నా అతన్ని గుర్తించింది. ఆ సంగీత ప్రదర్శనకు ఎప్పుడూ ఎవరికీ రానంత మంది జనం వచ్చారు. ఆ సంగీత ప్రదర్శన అతనూ అతని స్నేహితులు కలిసి నిర్వహించారు. జనం ఉత్సాహోద్రేకాలతో సంగీత తరంగాల్లో ఉవ్వెత్తున లేచి పద్దారు.
షూబర్ట్ బలహీన పడ్డాడు. అనారోగ్యంతో సెప్టెంబర్‌లో వియన్నా సరిహద్దుల్లో వున్న తన సోదరుడితో బాటు నివసించడానికి వెళ్ళాడు. ఐనా అప్పటికీ భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసే ఆలోచనల్లో వున్నాడు. ఎన్నో గొప్ప సంగీత రచనలు చేశాదు. మరణ శయ్యపై వున్నప్పుడు కూడా తన రచనని సరి చేయడంలో మునిగాడు. నవంబరు 12న షోబర్కు రాస్తూ “పదకొండు రోజుల్నించీ నేనేమీ తినలేదు, తాగలేదు. కుర్చీలోంచీ పడక్ష మీదకు, పదక మీది నించీ కుర్చీలోకి మారుతున్నాను. ఏదన్నా తిన్నా అది బయటికొచ్చేస్తోంది. ఇట్లాంటి విషాద పరిస్థితిలో నీ సాయంకావాలి. అదేమిటంటే దయచేసి నాకు కొన్ని పుస్తకాలు పంపు. నేను కూపర్స్ రచనలు "718 1851 0116 గా౦౧102[3, 1౧9 90, 6 ౧101 116 010066౯ లు చదివాను. ఈ రచయితవి ఏవైనా యితర రచనలుంటే దయచేసి కెఫెలో బోగ్నర్ భార్య దగ్గర వాటిని యివ్వు” అని రాశాడు.
ఆరు రోజుల తరువాత అతనికి మతి భ్రమించింది. అంతు లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడం ్రారంభింభఛాడు. ఆ మాటల్లో ఎక్కువ భాగం తను బిధోవిన్ పక్కనే పడివున్నట్లు చెప్పినవే. నవంబరు 19 మధ్యాహ్నం కన్ను మూశాడు. అతని అంత్యక్రియలు ఫోబర్
239
కవితాత్మకమయిన వీడ్కోలు గానంతో ముగిశాయి. బిథోవిన్ సమాధి దగ్గరే అతన్ని జననం చేశారు.
షూబర్ట్ మరణానంతరం అతని మిత్రులు ఆ రోజు ఎవరికి వారు ఒంటరిగా వాళ్ళయిళ్ళలో వుండి పోయారు. మేరీహోపర్ తను షూబర్ట్తోపాటు నివసించిన గదిలో వుండిపోయి కవిత రాశాడు. తన డైరీలో 'షూబర్ట్ స్మృతిలో రహస్య జ్ఞాపకం' అని రాసుకున్నాడు. బాయర్ ఫెల్ట్ అన్న మిత్రుడు తన దైరీలో “గొప్ప నిజాయితీ నిండిన ఆత్మ ఉన్నతోన్నత స్నేహితుడు. అతని బదులు నేను చనిపోయి వుంటే ఎంత బావుండేది, అని రాసుకున్నాడు. స్మీవిండ్ అన్న చిత్రకారుడు మ్యూనిచ్ నించీ షోబర్కు రాస్తూ “షూబర్జ్ చనిపోయాడు. దాంతో మన జీవితాల్లోని కాంతి, మన జీవితాల్లోని సౌందర్య పార్వం నశించిపోయింది” అని రాశాడు.
అ రోజు బోగ్గుర్స్ కెఫెలో అసాధారణమయిన నిశ్శబ్దం అలముకుంది. అక్కడ వున్న ఎవరో “ఏమిటీ నిశ్శబ్దానికి కారణం అనడిగితే “మీకీ విషయం తెలీదా? మీరు వినలేదా? పొట్టిగా వుండేవాడే షూబర్ట్ అని, ఆ సంగీతకారుడు ఈ రోజు కన్నుమూశాడు” అన్నారు.
కొన్ని నెలల తరువాత షూబర్ట్ సమాధిపై శిలాఫలకంలో గ్రిల్ పార్టర్ అన్న కవి రాసిన మాటల చెక్కారు “ఇక్కడ గొప్ప సంగీత నిధిని సమాధి చేశారు. ఐనా యింకా ఆశవుంది". ఆయన బతికున్నప్పుడు ఆయన కొన్ని రచనలు అచ్చులో వచ్చాయి. తరువాత వాటిని ఎవరూ పట్టించుకోలేదు. ఆయన రాత ప్రతులు దుమ్ముపట్టి ఎక్కడో షల్ఫ్లలో వుండేవి. ఎన్నో ఏళ్ళ తరువాత వివిధ సంగీతకారులు వాటిని సేకరించారు.
షూబర్ట్ ఉన్నతోన్నకమయిన సంగీత రచన ఆయన కన్నుమూసిన పదేళ్ళకు కనుక్కున్నారు. 1888లో షూబర్ట్ సంగీతాభిమాని ఐన గొప్ప సంగీతకారుడు షూమాన్ వియన్నాకు వచ్చి షూబర్ట్ సోదరుడయిన ఫెర్డినాండ్ని కలిశాడు. పద్ధతి లేకుండా చిందరవందరగా పడివున్నా షూబర్ట్ రాత ప్రతుల్ని అతను షూమాన్కు చూపాడు. వాటిలో ముఖ్యమయిన రచనలు కొన్నింటిని షూమాన్ ప్రచురించాడు. మరికొన్ని రచనల్ని యితర ('ప్రచారణ కర్రలచే ప్రచురింపజేశాడు. ఒక పత్రికలో షూబర్ట్ రచనల గురించి రాస్తూ బిథోవిన్ అనంతరం ఏ సింఫనీ కూడా షూబర్ట్ సింఫనీ అంత గాఢంగా మనల్ని ప్రభావితం చెయ్యలేదు” అన్నాడు. వాటి ప్రచురణకు నిరంతరం (శ్రమించడమే కాకుండా 1889 మార్చి 21న మెండల్షాన్ ద్వారా సింఫనీని ప్రదర్శించాడు.
అట్లా ఎందరో దశబ్దాల తరబడి షూబర్ట్ రచనల్ని వెలికి తీస్తు ప్రదర్శిస్తూ వచ్చారు. 240 ( ధం 80రిశ్రద్ద 1
సన్న ఎ ావసి ల /
. లీ న
- జోహాన్ సెబాస్టియన్ బాచ్ జార్జి (ఫెడరిక్ హాండెల్ బేలా బర్టోక్ జోసెఫ్ హైడన్ లుడ్విగ్ వాన్ బిథోవిన్ ఫ్రాంజ్ లిస్జ్జ్ -. = అల్బన్ బెర్గ్ గుస్తావమ మహ్లార్ | హెక్టర్ బెర్లియోజ్ ఫెలిక్స్ మెండెల్ పాషాన్ . అలగ్జాండర్ బొరోడిన్ రాబర్ట్ షూమాన్ జోహాన్స్ బ్రామ్ అలగ్జాండర్ స్కియాబిన్ అన్టోన్ బ్రూక్సర్ జీన్ సిబీలియస్ " (ఫెడరిక్ ఛోపిన్ బైెడిచ్ స్మెతానా క్లాడి డిబుస్సి పీటర్ ఇలిట్ట్ చైకోవ్స్కీ (ఫెడరిక్ డేలియస్ రిచర్డ్ వాగ్నర్ ఆంటోనిన్ డ్వోరాక్ వుల్ఫ్‌గాంగ్ అమాడియస్ మొజార్ట్ సర్ ఎడ్వర్డ్ ఎల్లార్ మోడెస్ట్ ముసార్ట్స్కీ సీజర్ ఫ్రాంక్ సర్ది ప్రొకోఫియేవ్ ఛార్లెస్ గౌనాడ్ సెర్టీ రాచ్మానినోఫ్
- ఎడ్వర్డ్ గ్రీగ్ ఫ్రాంజ్ షూబర్ట్ య పే | ( " హ్ ॥ '