Telugu sandi yugam - anilvaranasi/indianlanguages GitHub Wiki

  1. మము. “గి... . ర్న స, 11 సహజకవి మల్లెమాల స | సుర్‌ ఖ్‌ మనసుపడి మక్కువతో సేకరించిన గ. " గు గక ( ఈపుస్తకాన్నిసాహిత్యాభిమానుల కోసం య. య , కం, క సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి న సను అట్ట న్‌ా క. త్తు లు! ఆనందంతో బహూకరిస్తున్నాం. టు... . ల్‌ సీ - మల్లెమాల కుటుంబం . గ. | | శీ చం! (్హాాానణు ము. (. క కాలా (| క ॥ లో స భ్‌ ల నల. ॥ 1] ఇష చసన నంు క లా వ ౨ నాం

సంధియుగం (వ్యాస సంపుటి) వి.ఎస్‌.ఆర్‌. కృష్ణ (ప్రచురణ రచన, మదరాసు

“ద్ర గన 70౮64] & 01644081 0 501006 శుగుం16 0 ౩.5. రు

పు.

| చలి తొడగంగా = వ్ర గ్త్‌ న్స ౨. 3420ల జ్య 20 (42880 ౨౯ 5. 6౦92123004 ౪6 ర్‌ం

56 2616011 : శశజ0ం, 195 గ

€ స్రావ తిలితలూ 2 | ళో గానో యయిటి. 344లికి5్‌ హో దం. ల

న షం గగ అ 3౫. ౨.5.2. కరుర0& క 7 యో 9, 01౯ [018 ల్నబొలి. క్ల మశ్‌120006, కశంయయడు - 600 004

వెగం6 : కిం 70-00 వ్‌ం/ లిటంని40గా 7? శక. ₹ఈ3212206002 క00138108 10430, 4-1-435, వ20! ఏరంంట 0202 902720, క్వురం20264 - 500 001 3212206402 900% 0856 వరల2086 ఖు! టంం6 581020 922480, డట 2%262, గంజరటంర200, 640040 జయ0262, 2000020064, ఉంట కాండ. ఆం+జాపసంంలి :; ౨ 3204 60+జవిబపైం : 5ఢ 506011 *7ంలడణ్య త45టా గాంబాంణ/గరి 46 = ఏ8 పజల సజల 10600, 174, ఇటంన 2046, 0980060120, 26 - 600 014.

వ్యాసాల వరస వసం శీర్షిక పుట

  1. సంపాదకసమయం +
  2. అరుదైన వ్యక్తి ౪||
  3. _ నాగరికత ఫునాదులు శ
  4. నరజాతి వయసు 3
  5. భారత భావవికాసం 6
  6. ప్రపంచపంచాయతి 9
  7. _ ప్రజాస్వామ్యం విలువలు 111
  8. కలర్‌-కులమ్‌ 14
  9. జాత్యహంకార జూడ్యం 16
  10. మౌనసిక బానీసత్వం 19
  11. _తోరో-గాంధీ-కింగ్‌ 21
  12. _ క్రాంతదర్శిగాంధీ 23
  13. _అస్పృళ్ళతా నిర్మూలనోద్యమం 25
  14. _స్వాతం(త్ర్య నిర్మాతల ప్వష్నాలు 2౭7
  15. _ క్విట్‌ ఇండియా జ్ఞాహూలు 30
  16. జాతికిమాయని మచ్చ 33
  17. మతం- మానవత్వం 35
  18. చిత్రమైన సంధియుగం ఏ7
  19. జాతీయసేతువు 39
  20. మరలవనం న!
  21. కాలుష్యాలకాటు తత
  22. ఆప్యాయతల కరువు శం
  23. మారాల్సిన చదువులు 49
  24. సూపర్‌ కంప్యూటర్‌ళకం 52
  25. చంద్రలోకయా(త్ర ర్‌4ీ
  26. చెన్నపురి ఆంధ్ర మహాసభ 57
  27. మారినామారని మదరాసు నగరం ర్‌ం
  28. మద్రాసులో నైజాం విమాచన ఉద్యమం 62
  29. అమరజీవి స్పృతి సంస 65
  30. అనువాద శిల్పులు 67
  31. గిడుగు అనుశాసనం 71
  32. _ వావిళ్ళవారి మహాసంస్ట 74 (1

వసం శీర్షిక పుట 33. తాలి ఆంధ్ర సర్వస్వం 77 34. “హరిజన నాయకుడు” 80 35. మద్రాసు మక్కా - విజయనగరం ఆక్స్‌ఫర్డ్‌ 83 36. ఆంధ్రనాట్య ''నటరాజు'” 86 37. _ తెలుగు జర్నలిజం 88 38. _మహామనీషి- ముట్నూరి 93 39. తలవంచని చింతామణి 96 40. _జమీన్‌రైతు రామానాయుడు 99 41. _ ఒరవడి దిద్దిన (త్రిమూర్తులు 101 42. ధూళిపూడి ఆంజనేయులు 104 43. కవిరాజు 106 44. సి.ఆర్‌.రెడ్డి 109 45. మహోపాధ్యాయులు మామిడిపూడివారు 112 46. _సాహితీవల్లభుడు గోపాలరెడ్డి 114 47. _ విజ్ఞాన సర్వస్వం మోటూరి 117 48. _సౌజన్యమూర్తి బాలసుందరరావు 119 49, (ప్రజ్ఞానిధి నాయుడమ్మ 121 50. మహా పండితుడు దొరసామిళర్మ 123 51. _ తెలుగుతల్లి మల్లెపూదండ 125 52. _ రచనాశిల్పి పద్మరాజు 127 క్‌3, బాలవిద్యాబ్రహ్మ డాక్షర్‌' శర్మ 130 54. _ సొంతదారి బాటసారి ఆరుద్ర 133 55. _ సమగ్రసమన్వయవాది సంజీవదేవ్‌ 136 56. లండన్‌లో తెలుగుమూరర్తి 139 57... బులుసు సాంబమూర్తి 142 58. ఆంధ్ర పితామహుడు 145 వీఠ. సంస్కర్త గద్దె రరగయ్యనాయుడు 147 60. 4పఫజల మనిషి డాక్టర్‌ స్వామి 150 61. జవహర్‌లాల్‌నెహూ 152 ళ2ె, ఆచార్య రంగా 155 63. ఆత్మీయుడు దరువూరి 158 64. యువరైతునేత 160 65. రామారావు రాజకీయ శకం 162 66. రచయితమొత్తం వ్యాసాల జాబితా (అనుబంధం) 166 /

సంపాదక సమయం

వచనం రుగ్వేదమంత పురాతనం. “గద్యం కవీనాం నికషం వదన్తి"” అని ఆర్యోక్తి. నిజమైన వచనం రాయడం ఎంత కష్టమో వచన రచయితలందరికీ అనుభివైకవేద్యం.

19వ శతాబ్దంలో ఆధునిక తెలుగు వచనం కొత్తగొంతు విప్పింది. 20వ శతాబ్దంలో గొప్ప విస్తృతి పొందింది. ముఖ్యంగా ఈ శతాబ్ది ద్వితీయార్ధ భాగంలో ఎన్నెన్ని _సింగారింపులో చేసుకుంది. ఎన్నిక్రైలుల్లోనో కదనుతొక్కింది. విశ్వరహస్యాలను వెలుగుకు తెస్తున్న జ్ఞానశాఖలన్నిటికీ ప్రాణమైంది. సామాజిక జీవన సమాచారానికి అక్షరరూపమైంది.

ఇవాళ మూడుకోట్టకు మించిన తెలుగు చదువరులను అలరిస్తున్నది పత్రికారచన. వివిధరంగాలకు చెందిన క్లిష్టమైన గంభీరమైన సమస్యలను సూటిగా సరళంగా సుబోధకంగా జీవభాషలో సామాన్యులకు సైతం విశదీకరిస్తున్నాయి పత్రికావ్యాసాలు. ఈ శతాబ్ది నాలుగోపాదంలో ఈ రచనా ్రక్రియ మరింత పరిణతిని పొందింది. చెయ్యి తిరిగిన అనుభవజ్ఞులైన రచయితలు నిర్వహించే శీర్షికలు ఈఫ్రక్రియను. సుసంపన్నం చేశాయి. అలాటి శీర్షికల్లో ఒకటి “ఆం(ధ్రజ్యోతి' దినపత్రిక (ప్రచురించిన 'ఇంచొా-బయటా' ఈ శీర్షిక కింద 1983నుంచి 1987 వరకు దాదాపు అయిదేళ్ళకాలంలో 200 పైగా వ్యాసాలను (శ్రీ, బి.ఎస్‌, ఆర్‌.కృష్ణ, రచించారు. వాటిలోనుంచీ భిన్న సందర్భాలలో ఆంధ్రప్రభ దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక, వారపత్రిక ఇంకా ఇతర విశేష సంచికలలో ప్రచురితమైన ఆయన ఇతర రచనల నుంచి 63 వ్యాసాలు ఎంపికచేసి ఈ చిన్న పుస్తకంలో అందిస్తున్నాం.

జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలమీదా సామాజిక జీవన, సాంస్కృతిక తదితర రంగాలలో భిన్న విషయూలమీదా రచయిత అభి'ప్రాయాలను సంపుటీకరించే సూత్రంపై వ్యాసాల ఎంపిక చేశాము. అందువల్ల ఈ పుస్తకంలో వ్యాసక్రమణిక కాల ప్రాతిపదికగాకాక ఇతివృత్త ప్రాతిపదికగా కూర్చాము.

రచయితకి బలమైన స్వతంత్ర అభిప్రాయాలున్నాయి. స్వకీయ దార్శనికత ఉన్నది. భావదాస్యం లేదు. కాలంతోపాటు అనుభవ పారిణత్వం వల్ల కొన్ని అభిప్రాయాలు మౌలికంగా మార్చుకోవడమూ ద్యోతకమవుతుంది. ఆయన అభిప్రాయాలలో కొన్నిటిని నాతో సహా అనేకులు అంగీకరించలేకపోవచ్చు.

౪

అయినా ఆయన సత్యాన్వేషణా దృష్టిని గౌరవించకుండా వుండలేము. ఇంకొక మాట. 'మి(త్రప్రీతి ఈయన 'బలహీనతల్లో' ఒకటి అనిపిస్తుంది. ఆప్తమి(త్రుల మీద రాసిన 'అక్షరచిత్రాల్లో' ప్రశంసలు అతిశయోక్తులా అనిపించేలా ఉంచాయి. ఆయన అభిమానం అలాంటిది.

జీవితం విధించిన పరిమితుల దృష్టా ఈ సంపుటిలో పుటలను తగ్గించేందుకు కొన్ని వ్యాసాలను కుదించాల్చి వచ్చింది. సాధారణంగా దినప్రికల్టో ఇలాటే వ్యాసాలకు శీర్షికలు ద్వీర్ణంగా ఉంచాయి. వాటిని పాట్టి చేయాల్సి వచ్చింది. (అనుబంధంలో రచనా కాల (ప్రాతిపదికగా ఇచ్చిన రచయిత “వ్యాససూచిక' జాబితాలో పత్రికల్లో ఆయా వ్యాసాలకిచ్చిన శీర్షికలే పొందుపర్చాము).

ఈ సంపుటిని కూర్చాలని ప్రోత్సహించిన మిత్రులు శ్రీ, పి. వి. రమణయ్య రాజాగారికి, డొః పప్పు వేణుగోపాలరావుగారికి వ్యాసాల ఎంపికలో తోడ్పడిన సహసంపాదకులు డా.పి.ఎస్‌.గోపాల కృష్ణగ్రారికి, వ్యాసాల శీర్షికల క్టుప్తీకరణలో తోడ్పడిన మిత్రులు పి.నర్సిమ్‌గారికి, ము(ద్రాపకులకు, ముఖ్యంగా ఈవ్యాసాలు అక్షరరూపం దాల్చడానికి “ఇంట' హస్తం (శ్రీ, బి.ఎస్‌. ఆర్‌.కృష్ణగారి 'రాసేచేయి" (రైట్‌హేండ్‌) శ్రీమతి బి.ఎస్‌. ఆర్‌. కృష్ణగారికి 'బయటి' ప్రోత్సాహక హస్తం ఆంధ్రజ్యోతి అనాటి సంపాదకులు (శ్రీ నండూరి రామ్మోహనరావుగారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. మార్చి15, 1995 - మల్లిక్‌

౪1

అరుదైన వ్యక్తి బలమైన ము[ద

తెల్లని మల్లెపువ్వులాంటి నాజూకైన ఖద్దరు లాల్చీ, వెడల్పాటి ఎర్రంచు తెల్లని ఖద్దరు పంచె, ముఖాన చెరగని చిరునవ్వు, మాటలో మార్దవం, మనసులో మంచితనం, సంభాషణలో ఎవరి గురించీ పరుషవాక్కు రానివ్వని గొప్ప హృదయ సంస్కారం, రచనలో బహు విషయ పరిజ్ఞానం, ఏళ్లు పైబడుతున్నా, ఏళ్ల వెనకబడుతున్నట్టుండే యౌవనోత్సాహం, సమకాలిక సాంఘిక రాజకీయ, తదితర సమస్యలపై తరగని ఆసక్తి, ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ వుండాలన్న తపన, సోమరితనాన్ని దరిజేరనివ్వని నిరంతర కార్యదీక్ష...

ఈ ముక్కలు ఇలా రాస్తూపోతుంటే ఎవరూ బి ఎస్సార్‌ గురించేనా మీరు అంటున్నది అని, ఆతన్ని దగ్గరనుంచిగాని, దూరంనుంచిగాని ఎరిగిన ఎవరైనా అనేస్తారు. ఆదీ ఆయన ఇమేజ్‌.

ఆయనకిప్పుడు జరుగుతున్నది సప్తతి మహోత్సవం అంటే నమ్మలేము. ఆయన చురుకుతనం, చలాకీతనం, జా గ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న ఆరోగ్యం అలాంటివి. డభ్బయ్యేళ్ళ వయస్సులోకూడా నిత్యోత్సాహంగా ఎలా వుండవచ్చునో తెలుసుకోవాలంటే బి.ఎస్‌.ఆర్‌: (బి ఎస్సార్‌) కృష్ణగారినే చూడాలి. మద్రాసులో ఉద్యోగరీత్యా స్టేరపడి, ఆనగరంలో '“ఆకులందున అణగిమణగీ", కనిపించీ కనిపించని తెలుగుతనంలో విలీనమైపోయిన తెలుగు ప్రముఖులలో ఆయన ఒకరు. చెన్నపట్నపు తెలుగు సాంస్కృతిక రంగంలో ఆయన్ని ఎరగనివారు లేరు. ఆయన కడచిన 30 ఏళ్లకుపైగా నిర్వహించిన తెలుగు సభలు, సమావేశాలు, కార్యక్రమాలు లెక్కకు మిక్కుటం. ప్రతి మంచిపనికి ముందుండే చొరవ ఆయనది.

ఇప్పుడు మీ చేతిలో వున్న ఈ సంపుటం కృష్ణగారు ఆంధ్రజ్యోతిలో ధారావాహికంగాను, మరికొన్ని పత్రికలలో అప్పుడప్పుడూ వ్రాస్తూ వచ్చిన వ్యాసాల సంకలనం. మరీ సమకాలికత్వపు మండుటెండలో మరిగి కరిగిపోయిన విషయా లపై వ్యాసాలను మినహాయించి, కాలపరీక్షకు తట్టుకుని నిలబడి, పదికాలాలపాటు చదివించే రచనలనే సంపాదకులు ఎంపిక చేసి ఈ సంపుటంలో చేర్చారు. ఆంధ్రజ్యోతికి నేను సంపాదకునిగా వున్న రోజులలో ఆయన్ని ప్రోత్సహించి 'వ్రాయించగా వ్రాసిన వ్యాసాలు బహుళ పొాఠకాదరణ పొందడం, పాఠకులు ఆయన రచనకోసం వారం వారం ఎదురు చూసేటట్టు చేయడం నాకు బాగా జ్ఞాపకం.

|

ఆయన బహువిషయ పరిజ్ఞానం అచ్చెరువు గొలుపుతుంది. సమకాలిక రాజకీయాలపై చురకలతోకూడిన వ్యాఖ్యలేకాక్క సార్వకాలికతగల ఎన్నో సాంస్కృతిక సామాజిక విషయాలపై కూడా సాధికారంగా ఆయన వ్రాస్తూ వుండేవారు.

ఈపేజీలు తిరగేస్తుంటే, చరిత్ర పుటలనుంచి తవ్వి తీసిన ప్రాచీన మానవ నాగరికతల _శిథిలావశేషాల గురించిన వివరాలనుంచి, ఈనాడు దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కులమత విభేదాలపై పరివేదనాపూరిత వ్యాఖ్యలవరకు ఎన్నో విషయాలపై వ్యాసాలు మీకు తటస్టపడతాయి. మరుగున పడుతున్న మహాత్ముని ప్రభావం, జాత్యహంకార జాడ్యం, తెలుగునాట క్విట్‌ ఇండియా ఉద్యమంనుండి, పర్యావరణ పరిరక్షణ, ఓజోన్‌పార విధ్యంసమవుతున్న తీరు మొదలుకుని, తెలుగు వెలుగులైన ముట్నూరి కృష్ణారావు, (త్రిపురనేని రామస్వామి చౌదరి, మామిడిపూడి వెంకటరంగయ్య, నెల్లూరి వెంకద్రామానాయుడు, గద్దె రంగయ్య నాయుడు వంటి వారి పెన్‌ పోర్‌[బ్రైయిట్స్‌, ఇంకా వావిళ్ల ప్రచురణ సంస, చెన్నపురి ఆంధ్ర మహాసభ పొట్టి (శ్రీరాములు స్మారక సంస్టవంటి వాటిని గురించిన ఆసక్తికరమైన విశేషాలతో సహా ఎన్నెన్నో వ్యాసాలు పాఠకులను ఉన్నత భావాలతోకూడిన ఆలోచనా ్రపంచంలోకి తీసుకుపోతాయి. వీటన్నిటిలోను అంతర్లీనంగా, అనుస్యూతంగా బిఎస్సార్‌ అరుదైన వ్యక్తిత్వపు బలమైన ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

ఏ తెలుగు దినపత్రికలోను పనిచేయకపోయినా, మన మంచి జర్నలిస్టులలో, మంచి కాలమిస్టులలో ఒకరుగా బి.ఎస్‌. ఆర్‌.కృష్ణ గుర్తింపు పొందడానికి వివిధ సందర్భాలలో, వివిధ పత్రికలలో, వివిధ విషయాలపై ఆయన (వ్రాసిన ఈ వ్యాసాలే కారణం. ఇప్పటికీ ఆయనలో రచనోత్సాహం తగ్గలేదు. సమకాలిక పరిణామాలకు స్పందిస్తూ అడపాదడపా న్రాస్తూనే ఉన్నారు. ఎంతమంచి తెలుగు (్రాస్తారో, అంతమంచి ఇంగ్రీషు కూడా వ్రాయగలరనడానికి ఆయన వారం వారం “హిందూ'లో న్రాస్తున్న తెలుగు పుస్తకాల సమీత్షలే నిదర్శనం. ఆయన రచనా వ్యాసంగం అవిచ్చిన్నంగా కొనసాగాలని, ఆయన కార్యనిర్వహణా వ్యాసంగం మద్రాసు తెలుగువారికి ఇంకా ఇంకా ఉపయుక్తం అవుతూనే వుండాలని కోరుతున్నాను. విజయవాడ నండూరి రావమవోహనరావు 15-3-1995

౪

యంత ప్రభుల

జనుల జీవన సరళి ఆయా ప్రదేశాల నైసర్గిక పరిస్థితులను బట్టి, శీతోస్ణప్టితిని బట్టి వుంటుందని సాధారణంగా అనుకుంటుంచాము. అంటే అక్కడ ప్రకృతి పరిస్థితుల (ప్రభావం మనుషుల జీవన పద్దతులను అనుశాసిస్తుంటుందని భావించడం కద్దు. మనిషితెలివి తేటలూ, శక్తి యుక్తులూ ప్రకృతి స్వభావాన్ని మార్చివేయడం కూడా కద్దు. చరిత్ర కందని కాలంనాటి నుంచీ ప్రకృతికీ, మనిషికీ మధ్య సంబంధం పరస్పరమైనదిగా వుంటున్నదని పరిశోధకులు తేల్చారు. వేలాది సంవత్సరాల చరిత్రలో మానవుడు నేలను త్రవ్వి దానిలో నిక్షిప్తమై వున్న ఖనిజ సంపదలను ఖర్చుచేస్తూ వస్తున్నాడు. అంతే కాదు, అంతకు ముందునుంచీ నేలను దున్ని పంటలు పండించుకొనడంలో భూమి సారాన్ని పిండివేస్తూ వచ్చాడు. ఒక వైపున పెరుగుతున్న జనాభా, మరోవైపున దిగిపోతున్న భూసారమూ ఖనిజ సంపదలూ మానవులను ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. ఇలా ప్రకృతి సంపదలలో వచ్చిన ఈ మౌర్పులు మనిషీ జీవన దృక్పధాన్ని మార్చివేస్తున్నాయి.

మానవ నాగరికతకు మొదటి పునాది వ్యవసాయం. ఆకు అలాన్నీ, జంతు జూలాన్నీ కొట్టుకు తింటూ వస్తున్న మానవుడు, ఏదో ఒక శుభ ముహూర్తాన నేలను దున్ని తనకు కావలసిన ఆహారాన్ని పండించుకోగలనన్న రహస్యాన్ని తెలుసుకొన్నాడు. అయితే భూగోళం అంతా ఒక వదునైన మైదానంగా వుండదు. ఎత్తు పల్గాలు, కొండలు కోనలూ, నదులు, సముద్రాలూ ఇలా విభిన్న రూపాలలో వుంటుంది కనుక, ఈ పంటలు పండించుకునే పని భూలోకమంతటా ఒకేలాగ వుండదు.

ఈ నైసర్గిక ఫ్రితిని బట్టే నాగరికత ఒక్కొాక్క ప్రదేశంలో ఒక్కొక్క లాగ వృద్ది చెందుతూ, క్షీణిస్తూ వచ్చింది. ఈ నాగరికతల వృద్ది క్షయ చరిత్ర అంతా నేల పాఠరలలో నిక్షిప్తమై వున్నది.

మనిషీ నేల స్వభావాన్ని మార్చివేస్తాడు. ఇది ఎదురు తిరిగి ఆ మనిషి జీవన సరళిని మార్చివేస్తుంటుంది. ఇలా ఈ పరస్పర (ప్రభావాలే చరిత్ర గతిని మార్చివేస్తూ వచ్చాయి. ఇదే ఆయా ప్రజల నాగరికత వృద్ది కీణతలకు కారణమయింది. గత ఏడు వేల పైచిలుకు సంవత్సరాలలో మానవ నాగరికత ఆసియా సమీప ప్రాచ్య దేశాల నుంచి పళ్చిమ ఖండాలలో పసిఫిక్‌ తీరానికి తరలిపోవడానికి దారి తీసిన కథ ఇదే. ఎప్పుడో మనిషి మస్తిష్కంలో మెరిసిన ఒక ఆలోచన వ్యవసాయ నాగరికతకు దారి తీసింది. ఈ ఆలోచన జోర్జాన్‌ నదీతీరంలో నివసిస్తున్న వారిలో మొదట మెదిలినట్టు చరి త్ర చెబుతున్నది. అలా ఆరంభమయిననాగరికత, సంస్కృతి. ఇటు తూర్పున వైనా వైపుకూ, అటు పడమర ఐరోపా ద్వారా అట్జాంటిక్‌ మహాసము ద్రాన్ని దాటి అమెరికా ఖండం వరకూ విస్తరిల్లింది.

మూడునేల సంవత్సరాలకు పూర్వం * పాలుతేనె పారుతున్న భూమి” అని మోసెస్‌ ఇట్రేల్‌ వారికి నోరూరేలా వర్ణించిన జోర్జాన్‌ నదీలోయ [ప్రాంతం ఈనాడు మరు భూమిగా మారిపోయింది. ఇక్కడి భూముల సారం వానలకూ, వరదలకూ పూర్తిగా కొట్టుకుపోయి పర్ర నేలలు మిగిలాయి! కొట్టుకుపోయిన భూసారంతో పాటు నాటి నాగరికత కూడా మేట వేసింది. (ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకంటె ముందు మూడు పూలు ఆరు కాయలుగా వికసించి, సంధియుగం 1

విలసిల్లిన అక్కడి నాగరికత, నాటి శిధిలాలలో మాత్రమే వేడు కనపడుతుంది. అలాంటిదే లెబనాన్‌ అటవీ సంపద చరిత్ర. 4500 సంవత్సరాలకు పూర్వం ఎడారి ప్రాంతాల నుంచి వచ్చి మధ్యధరా సము(ద్ర తూర్పు కోస్తా (ప్రాంతాన్ని ఆక్రమించిన (ప్రజలు రెండు ఓడరేవులను నిర్మించి, ఆ రెండు రేవులను ఆనుకొని రెండు నగరాలను నిర్మించారట. వాటిలో ఒకదాని పేరు 'తైర్‌' మరొకటి “సిడానో. ఆ (ప్రాచీన కాలంలోనే ఆ ప్రాంతంలో ఏర్పడిన మరొక రేవు పట్టుణం బేరూట్‌. అప్పుడు అక్కడికి వలస వచ్చిన వారు 'ఫినిషియన్‌' జాతి (ప్రజలు, తాము ఆక్రమించుకొన్న భూమి కొండల, గుట్టుల మయమైనదనీ, సన్నని తీరమైదాన (ప్రాంతం మాత్రమే చదునుగా వున్నదనీ వారు త్వరలోనే గమనించారు. అయినా వారు (శ్రమించి సేద్యపు నీటి సాగు ఒనరులను నిర్మించుకొని వ్యవసాయాన్ని వృద్ది చేశారు. ఆ విధంగా మెసపాటేమియా, ఈజిప్టు నాగరికతలు పాదుకొని పెంపొందాయి. కొంత కాలం ఈ ప్రజలు పొడి పంటలతో సుభిక్షంగా కాలక్షేపం చేస్తూ వచ్చారు.

కాని రాను రాను జనాభా పెరుగుతూ వచ్చింది. దానితో వారికి సమస్యలు మొదలయినాయి. వున్న నేల కొంచమూ, అవసరం ఎక్కువా అయినాయి. అప్పుడు వారికి మూడు మార్గాంతరాలు కనిపించాయి. ఒకటి ఇతర ప్రాంతాలకు కొందరు తరలి వెళ్ళి నెలవులు ఏర్పరచుకొని కొత్తనేలలు సాగు చేసుకోవడం. మరొకటి వస్తువులు తయారు చేసి వాణిజ్యాన్ని పెంపొందించుకొనడం. ఆ రెండూ చేయనొల్లని వారు కొండ సానువులను సాగుచేసి పండిన మేరకు పంటలు పండించారు. లెబనాన్‌ అడవులు (శ్రేష్టమైన దేవదారు వృవ్షాలకు ప్రతీతి. ఈ దేవదారు వృవ్షాలను నరికి కలపను, కలప వస్తువులను కొందరు ఎగుమతి చేస్తుంటే, ఆ అడవులు నరికిన ప్రదేశాలలో కొందరు వ్యవసాయం చేసేవారు. ఇవి ఏటవాలు నేలలయినందున వర్షాలు ఎక్కువ అయినప్పుడు వరదలు వచ్చి నేలలు కొట్టుకుపోతుండేవి. ఇలా వేలలు బీడు పడిపోకుండా కాపాడుకోవడానికి అడ్డుకట్టులు వేయడం రైతులు అనాడే నేర్చుకున్నారు. ఇలా ఆనాడు రైతులు ప్రకృతితో నిత్య సమరం సాగిస్తుండేవారు. ఈ (ప్రాచీన ఫినీషియా పర్వతాల మీద ప్రపంచ ప్రసిద్దమైన లెబనాన్‌ దేవదారు వృత్షాలు విస్తారంగా 'పెరుగుతుండేవి. క్రీస్తుకు మూడువేల సంవత్సరాలకు పూర్వమే లెబనాన్‌ నుంచి 40 ఓడలలో మేలు రకం దేవదారు కలప ఈజిప్టుకు చేరినట్టు ఆనాటి ఒక శిలా శాసనాన్ని బట్టి తెలుస్తున్నది.

జెరూసలెంలో దేవాలయం నిర్మించడానికి90 వేల మంది కార్మికులు కలపకొట్టుగా, మరి ?0 వేల మంది ఆ కలప దుంగలను సముద్రానికి చేరవేసినట్టు దాఖలాలు వున్నాయి. ఆనాడు రెండు నేల చదరపు మైళ్ళ విస్తీర్ణం గల దేవదారు అడవులు అక్కడ వుండేవట. ఆ అడవులు ఈనాడు ఏమైనాయో తెలియదు. లెబనాన్‌ పరిసరాలలో నాలుగు చిన్న తోపులు మాత్రమే నాటి అడవులకు జాడలుగా మిగిలి వున్నాయి.

జోర్జాన్క మెసపొటేమియా, ఈజిస్టులలో ఆనాడు అలా (ప్రారంభమయిన ఆ ప్రాచీన నాగరికత ఇటు చైనాకు విస్తరిల్లి ఐరోపా కంటె ముందే ఎంతో వృద్ది చెందింది. కాని రాను రాను రాజకీయ, ఆర్థిక హతావరణ కారణాల వల్ల చైనాలో కూడా క్షీణించింది. కాగా పశ్చిమ దేశాలలో (ప్రస్తుళానికిది పారిశ్రామిక, సాంకేతిక ప్రగతి రూపంలో పరిఢవిల్లుతున్నది. చరిత్ర దాని చుట్టూ అది తిరుగుతుందంటారు. నాగరికత కూడా అంతే. ఓడలు బండూ, బండ్లు ఓడలుగా మౌరుతుంచాయి. ముందు ముందు మార్పు వుంటుందని చెప్పగలముకాని, ఆ మార్పుఎలా వుండేదీ చెప్పజాలం. దానిని కాలమే న్నిర్థయించాలి. (23.5.87) 2 సంధియుగం

దనరజేత్రి వయదు “నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం”'

శ్రీ శ్రీ అన్న ఈ మాట గతానికి, వర్తమానానికి మాత్రమే కాదు, ముందుకాలానికి 'సైతం వర్తించే మాట ఇది. మనిషి వయసు అనగా నరజాతి వయసు పాతిక వేల సంవత్సరాలని చెబుతారు. ఆటవిక యుగం, రాతియుగం, లోహయుగం, పారిశ్రామిక యుగం ఇలా నాలుగు దళలలో తాలి కోతి రూపం నుంచి ఈ నాటి మనిషి రూపాన్ని నరజాతి సంతరించుకున్నది. శారీరక రూపురేఖ విలాసాల లోనే కాదు, మానసిక వికాసంలో సైతం ఈ పాతిక వేల సంవత్సరాలలో, ముఖ్యంగా, గత అయిదు వేల సంవత్సరాల కాలంలో గొప్ప పరిణామం వచ్చింది. ఈ పరిణామ (క్రమంలో, అటవిక యుగంలోనూ, రాతి యుగంలోనూ మనిషి నిశ్చింతగా జీవించాడు. ఎందువల్ల నంచే, భూమి మీద మనుష్యుల సంఖ్య అప్పటికి చాలా చాలా తక్కువ. (క్రమేణా భౌతిక రూప పరిణామం, మనో వికాసాలతో పాటు జనుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అలానే కోరికలు, అవసరాలు. వీటితోపాటే మనిషిలో స్వార్ధ గుణం పెంపొందుతూ వచ్చింది.

దానితో పాటుఎదుటి వాడి మీద తనది పైచేయి కావాలన్న కాంక్ష ఇతరుల కంటేతాను పై మెట్టు మీద వుండాలన్న తపన అతడిలో జనించాయి. ఇదుగో, ఈ దళలోనే '*దోపిడి తత్వం” మనిషికి అలవడింది. ఈ దోపిడీ తత్వం వడివడిగా, మనిషి బుద్ది కంటే వేగంగా పెరుగుతూ వచ్చింది. జన సంఖ్య పెరుగుతూ, ప్రపంచం ఇరుకు గదిగా మారుతున్న కొద్దీ ఈ దోపిడీ తత్వం ముదురుతున్నది. కనుకనే (శ్రీ, (శ్రీ, చెప్పిన మాట గతానికీ, వర్తమానానికీ మాత్రమే కాక భవిష్యత్తుకి సైతం వర్తిస్తుందేమో.

నిజానికి, మనిషిలో తెలివి పెరుగుతూ వచ్చిన కొద్దీ, మొదట అతడు దోచుకో మొదలు బెట్టింది మరో మనిషిని కాదు. భూమి మీద ఉన్న సహజ సంపదలను దోచుకొనడం ప్రారంభమైంది. ఈ దోపిడి క్రమాన్ని ప్రారంభించిన వారు ఆర్యులు. నరజాతులన్నిటిలోకి ముందుగా తెలివి తేటలను పెంపొందుచుకొన్న వాళ్ళూ, సాహసికులైన వాళ్ళు ఈ ఆర్యులే.

మధ్య ఆసియా ప్రాంతం నుంచి ఆర్యుల ప్రపంచ దండయాత్ర ప్రారంభమైంది. కొందరు అటు పాశ్చాత్య ఖండాలకు మరి కొందరు ఇటు ప్రాచ్య ఖండాలకు బయలు వెడలి ఈ యీ ఖండాలను ఆక్రమించుకొంటూ వచ్చారు. అయితే ఫ్టల మహాత్యమో, భూ, నైసర్గిక పరిస్టితుల ప్రభావమో చెప్పలేము గాని, అటు పళ్చిమ ఖండాలకు తరలిపోయిన ఆర్యులు ఇటు తూర్పు ఖండాలకు వచ్చిన వారి కంటే సాహసికులు గానూ, నిర్జాక్షిణ్య పరులుగానూ రూపాొందారు. అందువల్లనే, మొన్న మొన్నటి వరకు వారూ, వారి వారసులే ప్రపంచం మీద తమ (ప్రాబల్యాన్ని నెలకొల్పుకొని లోకాలను (దేశాలను) ఏలుబడి చేస్తూ వచ్చారు.

కాగా, ఇటు భారత దేశానికి వచ్చిన ఆర్యులలో ఎప్పుడో, ఎక్కడో ఏదో ఒక దళలో సంధియుగం ప

ఆధ్యాత్మిక చింతన తత్వం 'ప్రకోపించింది. జీవితాన్ని అంతర్ముఖంగా పరిశీలించే అలవాటు వారిలో ప్రవేశించింది. “ఏది నిజం', 'ఏదికాదు' అన్న మీ మాంస వారిలో చెలరేగింది.

ఈ తాత్విక చింతన ప్రాబల్యం వల్ల ఈ ్రాగార్యులు (అనగా ప్రాచ్య ఖండాలకు వచ్చిన ఆర్యులు) వెనుకబడి పోయారు. మిగతా ఆసియా ఖండాల దేశాలకు వచ్చిన వారు కూడా ఈ రకమైన ఆలోచనా సరళిలో పడిపోయినందున వారూ వెనుక బడిపోయారు. ఈ విధంగా ఆర్యులను ఆర్యులేదోచుకునే ప్రయత్నం ప్రారంభమైంది. ('క్రమేపీఇది ఇతర ప్రాంతాలకు, ఇతర జాతులకూ వ్యాపించింది.

అటు పిమ్మట, పాశ్చాత్య ఆర్యులు (ఇక నుంచి వీరిని తెల్లవారు అని సౌలభ్యం కోసం అందాము) ఆసియా ఖండంలో పొంగి పొరలుతున్న సీరులను కొల్ల గొట్టుడానికి ఉద్యమించారు. పదిహేనవ ళతాబ్దిలో పాశ్చాత్య వర్తకులను మధ్యధరా మార్గాన ప్రాచ్య దేశాలకు రాకుండా తురుష్కులు అటకొయించినప్పుడు పాశ్చాత్యులు వేరు మార్గాన ఆసియా ఖండానికి చేరుకునే ప్రయత్నాలు చేశారు. ఆసియాలో అపారమైన సిరులు ఉన్నట్టు వారికి తెలుసు. ఇక్కడి ప్రజలు (ఆర్యులే అయినా) ఆధ్యాత్మిక చింతన వల్ల నిర్వీర్యులైనారని కూడా వారికి తెలుసు. అందుకే 15వ శతాబ్ది చివరిపాదంలో పాశ్చాత్యుల సాహస యాత్రలు ప్రారంభమైనాయి. సంపదల వేట మొదలయింది.

ఆ కాలంలో వైనా, జపాను, ఇండియా, తదితర దూర ప్రాచ్యదేశాలను తెల్లవారు “ఇండీస్‌ అని వ్యవహరించేవారు. ఈ దేశాలను, ఇక్కడి ప్రజలను చుట్టు దారిని చేరుకొనడానికి మొదట (ప్రయత్నించిన సాహసి క్రిస్టోఫర్‌ కొలంబస్‌. ఇతడు సాగరాల మీద తిరిగి తిరిగి దారిలో కొన్ని దీవులను చూచి అదే “ఇండియా” అనుకున్నాడు. నిజానికి అతను ఆనాడు అడుగు పెట్టింది ఇప్పుడు మనం 'వెస్టిండీస్‌' అని అంటున్న దీవులు, అతడు అక్కడి ఆటవికులను చూచి వారే “ఇండియనులు' అని (భ్రమించాడు. ఈ దీవులను స్పెయిన్‌ పేరిట ఆతడు అ'(క్రమించుకున్నాడు. కాని, అది ఇండియా కాదు. వాళ్ళు ఆశించిన సంపదలు అక్కడ కనుపించలేదు. కనుకనే స్వదేశానికి తిరిగి వెళ్ళి అవమానాలకు గురి అయినాడు కొలంబస్‌.

ఆ తరువాత నురొక ఇటాలియన్‌ సాహసి బయలుదేరాడు. అతడు కూడా తిరిగి తిరిగి ఒక పెద్ద ఖండాన్ని కనుగొన్నాడు. కాని అది కూడా “ఇండియా' కాదు. అయితే, అతను కనుగొన్నది చాలా విశాలమైన ఖండమూ సంపన్నమైన ఖండం కూడా. అదే ఈనాటి అమెరికా ఖండం.

దానినే ఇతడు "ఇండియా! అనుకున్నాడు. అక్కడి ఆదిమ వాసులను 'ఇండియనులు' అనుకున్నాడు. అందుకే వారికి “* అమెరికన్‌ ఇండియన్లు” అన్న పేరు స్ర్టిరపడింది. ప్రాచ్యానికి వచ్చిన ఆర్యులలో ఉన్న కారుణ్య దృష్టిగాని, ఆధ్యాత్మిక దృష్టిగాని పాశ్చాత్య ఖండాలకు వెళ్ళిన ఆర్యులలో లేకపోయింది. కనుకనే తాము వెళ్ళిన ్రతివోచా, అప్పుడక్కడ ఉన్న ఆదిమ వాసుఠను పళువులను వేటాడినట్టు వేచాడి చంపటమో, లేదా ఆదిమ వాసులలో వేరు వేరు తెగల వారి మధ్య తంపులు పెట్టి వాళ్ళలో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకునేలా చేయటమో జరిగింది. మన రోజులు బాగుండి, కొలంబస్‌లూ, అమెరిగో వెస్టుచ్చీలు అప్పట్జో భారత దేశం వరకు చేరుకోలేదు. ఆ తరువాత వచ్చి రెండు శతాబ్దాల పాటు మనలను ఏలుబడి తీ సంధియుగం

చేశారనుకోండి. ఇలొ వీరు ఈ దేశాన్ని ఆక్రమించుకున్న ఫలితంగానే పాశ్చాత్య నాగరికతా ప్రభావం మన ప్రాంగణంలోకి తొంగి చూచింది. ఇందువల్ల ఒక విధంగా మనకు మేలు జరిగింది. వారి నాగరికతా ప్రభావం వల్లనే మనలో స్వాతం శ్ర్యేచ్చ జనించింది. మనలో అంటే ఒక భారతీయులలోనే కాదు ఆసియాలోనే కాదు, ఆఫ్రికాకు కూడా ఇది వ్యాపించింది. పర్యవసానంగా ఈ శతాబ్దిలో దాదాపు ఆసియా, ఆఫ్రికా దేశాలన్నీ స్వాతంత్ర్యాన్ని, స్వపరిపాలనను సంపాదించుకున్నాయి. ఇలా వుండగా, ఈ శతాబ్దిలో మరో కొత్త నాగరికత ప్రాబల్యంలోకి వచ్చింది. ఇది మార్క్చ్సియన్‌ నాగరికత. నిజానికి ఈనాడు పాశ్చాత్య, మార్చ్సియన్‌ నాగరికతల మధ్యనే పోటీ ఎక్కువగా జరుగుతున్నది. అర్హ భారతీయ సంస్కృతి లేదా ప్రాగార్య సంస్కృతి అనేది బాగా వెనుకబడి పోయింది. మరి ఈనాటి ఈ'త్రికోణపు పోటీలో (ఆర్ష సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి, మార్క్సిస్టు సంస్కృతి) ఏది నెగ్గుతుందో కాలమే నిర్ణయించాలి. (29.11.86) స్లాస్గాగ్గ నగరాలు “మన నగరాలు అంతస్తౌందర్భం ఎప్పుడో కోల్రోయాయి. ఇప్పుడు అసలు అంతరాత్మనే కోల్పోతున్నాయి... నగర జనాభాలు పెరుగుతుండటం మాత్రమే ఇందుకు కారణం కాదు. స్వాతంత్రం వచ్చి ఇన్లి దశాబ్దాలు గడచినా ఇప్పుటికీ ఒక జాతిగా మనం లరూపొందలేదనే చెప్పాలి జాతీయళీలం నిర్మాణానికి ఫునాదివంటి (క్రమళిక్షణను మనం వీసమంతకూడా ఆఅఅవరచుకోలేదు. ఆలా అలవరముకోవాలన్టు తలంపఫుకూడా ఒక జాతిగా మనకు వున్హుట్టు కనపడదు. ఈనాడు మన దేశాన్ని మన సమాజూన్లి పట్టి వీడిన్తున్ను అన్హి రుగ్గుతలకు మూలకారణం ఈ (క్రమశిక్షణా రాహిత్యమే. కొన్నినందల సంవత్సరాలుగా పరాయివారి పాలనకింద వుండి పోయినందున ము దేశాన్ని మనం “ఇది నాదేశం అని చెప్పుకొనే అవకాళం లేకుండా పోయింది. (పత్వకంగొను. పరోక్షంగాను. వీలికలను ఈసడీంచడం ద్వేషించడం (ప్రతిఘటించడం మనకు అలవాటుగా మారింది. అందువ్యనే (వభుత్వంలో అధికారం వెలాయిస్తున్నవారు తప్పు మిగతొవారంతా ప్రభుత్వాన్ని వ్యతిరేక భావంతో (ప్రతికూల దృష్రితోచూడడం మనలోనేటికీ కనపడుతుంది... ఇంటాబయటా4-4-86 సంధియుగం ర్‌

ధరతభవంష౦

వోనవ నాగరికతా పరిణామాన్ని నాలుగు దశలుగా పరిశోధకులు విభజించారు అతి పురాతన నాగరికత, (ప్రాచీన నాగరికత, మధ్య యుగాల నాగరికత, ఆధునిక నాగరికత అని ఈ నాలుగు దళలకు పేర్టు పెట్టారు. క్రీస్తుపూర్వం 3500 మొదలు క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల మధ్య కాలంలో తాలి నాగరికతలు వికసించి నశించాయి. టై(గ్రిస్‌-యూప్రేట్స్‌ నదుల మధ్య మైదానంలో, నైలు నదీ తీరాన, సింధు నదీ తీరాన, పసుపునది (వైనాలోని యెల్లో రివర్‌) తీరాన ఈ ఆది నాగరికతలు పెంపొంది ఆధునిక మానవ సంస్కృతికి పునాదులు వేశాయి. సుమేరు మైదానంలో ఫినీషియన్‌ ప్రజలు ఓం ప్రథమంగా నాగరికతా బీజాలు వెదజల్టారు. ఈ నాటి నాగరికత, సంస్కృతి సాంకేతిక పురోభివృద్దికి ఆధార భూతమైన అనేకానేక సామాజిక, సాంకేతిక సుతారాలను ఆనాడే వారు కనుగొన్నారు.

ఈ సుమేరియన్‌ నాగరికత అనంతరం సుమారు వేయి సంవత్సరాలకు సింధునదీ తీరాన మరో నాగరికత వెలసి వేయేళ్ళు వర్ధిల్లి అంతర్జాన మయింది. క్రీస్తుపూర్వం 2500 ప్రాంతంలో ఉచ్చదళలో వున్న ఈ సింధు నాగరికత క్రీస్తు పూర్వం 1500 (ప్రాంతంలో పతనమైపోయింది.

ఇండో-యూరోపీయన్‌ జాతుల దండయాత్రల ఫలితంగా ఈ నాగరికత నాళనమై వుండవచ్చునని పరిశోధకుల భావన. తాలి మూడు నాగరికతలలో ఒకటి ఆనదగు ఈ సింధు నాగరికత అలా నళించి, భూస్టాపితమై కాలగర్భంలో కలిసి, కనుమరుగై పోయింది. ఆధునిక పురావస్తుళా,స్త్రం బాగా అభివృద్ది చెందిన తరువాత, ఈ శతాబ్ది తొలిపాదంలో మాత్రమే మొహంజో-దారో వద్ద సమాధిపడివున్న ఈ మహానాగరికత వెలుగులోకి వచ్చింది. ('మొహంజో-దారో* అంటే శవ వాటిక అని అర్హమట).

తాలి నాగరికతలకు వ్యవసాయం ప్రాతిపదిక. అంటే మన సంస్కృతికి ఆద్యులు రైతులు. ఈ వ్యవసాయ కళ తొలుదొల్త సుమేరు, ఈజిస్టు ప్రాంతాలలో రూపొందినదనీ, దీనిపై వృద్ది చెందిన నాగరికత ఫలితంగా మానవుడు గృహాలనూ, గ్రామాలనూ, నగరాలనూ, రాజ్యాలనూ నిర్మించుకానడం నేర్చుకొన్నాడనీ, అలా ఏర్పడిన రాజ్యాలలో సుమేరు, ఈజిప్టు మొదటివనీ పరిశోధకుల అంచనా.

అయితే కొంచెం ఇంచుమించుగా అదే కాలంలో మరోగొప్ప నాగరికత దాదాపు వాటికి సమానాంతరంగా పెంపొందింది. మరో గొప్ప సామ్రాజ్యం నిర్మాణమయింది. సింధు నాగరికత మూడు పూలు, ఆరు కాయలుగా విలసిల్లిన సంగతిని లోకం చాల ఆలస్యంగా తెలుసుకోగలిగింది. ఈ సింధు సామ్రాజ్యం సుమేరు, ఈజిప్టు రాజ్యాల కంటే పరిమాణంలోను, ్రమాణంలోను, పరిణామ క్రమంలో సైతం గొప్పది. ఇక్కడి పరిపాలనా వ్యవస్థ ఆ రెండు రాజ్యాలలో నెలకొన్నదానికంటె మరింత (క్రమబద్రమైనదీ, కట్టుదిట్టుమైనదీ కూడా.

రమారమి ఒకే కాలంలో ఆవిర్భవించి, పరిఢవిల్లి అంతరించిన ఈ మూడు (సుమేరు, ఈజిప్టు, సింధు) నాగరికతలు ఆసియా ఖండంలోనే కావడం గమన్నార్టం. ఈ నాగరికతల వృద్దికి 6 సంధియుగం

కారణభూతమైన సాంకేతిక సుతారాల సృష్టి, వినియోగం దాదాపు ఒకే పద్దతిలో జరుగుతూ వచ్చింది.

ఈ మూడు ప్రాంతాలవారు వ్రాయడం, చదవడం నేర్చారు. కంచు, రాగి, బంగారం వంటి లోహాలతో నగ్జీ వస్తువులు, పనిముట్టు, ఆభరణాలు వంటివి తయారు చేయడం వారికి తెలుసు. మట్టి మిద్దైలు మొదలు మహా (ప్రాసాదాల వరకు గృహ నిర్మాణ వాస్తు నైపుణ్యం ఈ మూడు నాగరిక రాజ్యాలలో సమానాంతరంగా పెంపొందుతూ వచ్చింది. రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. వాణిజ్యం చేయడం నేర్చుకున్నారు. కుటుంబ వ్యవప్ట నుంచి కేంద్రపాలిత సామాజిక, రాజకీయ వ్యవస్థలను రూపొందించుకున్నారు. సాముదాయక జీవనం సజావుగా సాగడానికి అవసరమైన కట్టుబాట్టును కల్పించుకున్నారు. మానవుని భావనా శక్తి ఇక్కడ మహోన్నతంగా వికసించింది.

స్టూలంగా ఈ మూడు నాగరికతలలోనూ ఈ నైపుణ్యాలూ, కళలూ ఒకేలా వృద్ది పొందినప్పటికీ, వారివారి మేధాసంపత్తిలో సామాజిక వ్యవస్థల రూప కల్పనలో ఒక్కాక్కదాని రీతి ఒక్కొక్క లాగ, ఒకదానికొకటి కొంత భిన్నంగా వుండేవి. ఆయా సమాజాలలో మేధావులు సృష్టించిన సాహిత్యంలో వ్యక్తమయ్యే చింతనారీతులు భిన్నంగా కనపడతాయి. ముఖ్యంగా సీంధు తీర నాగరికతలో రూపొందిన (ప్రజా జీవన సరళి మిగతా రెండు నాగరికతలకు భిన్నంగా, శ్రేష్ట్రతరంగా కనపడుతుంది. ఇక్కడి ప్రజలలో వ్యక్తమయిన వ్యక్తిత్వం అసాధారణమైనది. ఆ తరువాత కాలంలో పాదుకున్న హిందూ సంస్కృతి ప్రాతిపదిక లక్షణాలు సింధు నాగరికతలో రూపొందించినవే. వాటిలో ఈ విశిష్ట వ్యక్తిత్వం ఒక లక్షణం.

సింధూ నదీ తీరస్ట్ర నాగరికతకు ఏమని పేరు పెట్టాలో పరిశోధకులకు పాలుపోలేదు. అక్కడ వున్న “హరప్పా' అనే ఒక గ్రామం పేరిట దీనిని “హరప్పా నాగరికతా అని వ్యవహరిస్తున్నారు.

ఈ హరప్పా నాగరికతను మలచి, పెంచి పోషించినవారు ఆది భారతీయులు. 4500 సంవత్సరాలకు పూర్వమే వారు గ్రామాలను నిర్మించుకున్నారు. నగరాలమూ, మహానగరాలనూ తీర్చిదిద్దుకున్నారు. లోహయుగం వీరితో ప్రారంభమయింది. హస్తకళా నైపుణ్యం ఉట్టిపడే అభరణాలను, కాంస్య ప్రతిమలను వారు తయారు చేసుకునేవారు.

అప్పటివరకు తన కుటుంబమే తన లోకంగా ఎంచుకుంటున్న మానవునిలో ఆనాడు సాముదాయక, శాంతి సంజేమాల దృష్టీ నెలకొన్నది. కుటుంబ పెద్ద, గ్రామ పెద్ద పద్దతి నుంచి “జాతి అధిపత్యం' దశకు ఈ నాగరికత పరిణతి చెందింది. సకలజనుల యోగక్షేమాలను వహించడం, అందరికీ న్యాయం జరగేలా చూడడం ఈ “అధిపతి విద్యుక్తధర్మంగా నిర్థయించుకున్నారు. తొలుత ఈ అధిపతిని అందరూ కలిసి ఎన్నుకునేవారు. తరువాత, తరువాత ఈ “ఎన్నిక పద్దతి" అంతరించి, వారసత్వ పద్దతి వేరూనుకున్నది.

అదే ఆ తరువాత రాచరికం” అయింది. సింధుతీర సామ్రాజ్యం సుమేరు రాజ్యం కంటె ఏడురెట్టు పెద్దదట. ఈ సామ్రాజ్యంలో రెండు “మహా నగరాలు” , దాదాపు 70 దాకా బస్తీలూ, గ్రామాలూ, వ్యాపార కేంద్రాలు వ్చైరా వుండేవట. '"మహానగరం' జనాభా 20 వేలదాకా వుండేదనీ, మొత్తం సామ్రాజ్యం జనాభా లక్షమందిదాకా వుండి వుండవచ్చునని అంచనా. బంగారు ఆభరణాలలో రత్నాలు కూడా పొదిగించేవారు. బట్టల నేత, కశుండలచేత వంటి సంధియుగం 7

విద్యలు వారి£ తెలుసు. చక్రాల బండ్లను తయారుచేసుకుని ప్రయాణ సాధనాల గా ఉపయోగించేవారు.

నాటి సాటి నాగరికతలవారు పచ్చి ఇటుకలతో గోడలు కట్టుకుంటున్న రోజులలోనే, హరస్పా నాగరికతలో ఇటుకలను బట్టీలలో ఎ(ర్రగా కాల్చి నిర్మాణాలకు వినియోగిస్తుండేవారు. అన్నిటి కంచె ముఖ్యమైన విషయం, వారిలో విద్యావ్యాప్తి విరివిగావుండేది. తరువాత వచ్చిన హిందూ నాగరికతలోలాగ పక్షపాతం లేకుండా సకల జనులకూ చదువు సంధ్యలు నేర్పేవారు.

తాలి భారత నాగరికత అనదగు ఈ సింధు సంస్కృతిలో పరిపాలనా వ్యవఫ్ర కట్టుదిట్టుంగా వుండేది. నగరాలకు స్టానిక స్వపరిపాలన ఏర్పాట్టు వుండేవి. కాగా, మొత్తం రాజ్యానికి బలమైన కేంద్ర ప్రభుత్వ వ్యవస్త వుండేది. నిర్దిష్ట రాజ్యాంగ ప్రణాళికల ప్రాతిపదికగా పరిపాలన జర్‌గేది. తూనికలు, కాలమానాలను కూడా (క్రమబద్దంచేసి, అమాయక (ప్రజలను వ్యాపారులు వంచించకుండా (ప్రభుత్వం చూచేది. నాటి పాలకుల అధికారానికి ఆధారం సైనిక బలం కాదు, వైతిక శక్తి దానికి మూలాధారం. మతాధిపతులుగా వున్నవారే తరువాత రాజ్యూధిపతులు అయ్యేవారు. ప్రజలందరి ఆచార వ్యవహారాలూ, ఆరాధనా పద్దతులూ ఒకే రకమైనవి అయినందువల్ల వారిలో ఐకమత్యమూ, శాంతియుత సహజీవనమూ నిరంతరాయంగా సాగుతుండేవి. వేయి సంవత్సరాలపాటు నిరాఘాటంగా, నిరుపమానంగా పాగిన ఆ నాగరికతలో, ఆ సంస్కృతిలో అన్నేళ్ళలోనూ ఎటువంటి మార్పులూ, చేర్పులూ, రాకపోవడం గమనించదగ్గ విశేషం. రాజులుమారినా, రాజవంశాలుమారినా నాగరికత వీసమంత మారలేదు.

అయితే, మార్పుకు అతీతంగా అంతకాలం స్టీరంగా నిలువగలిగిన ఆ నాగరికత తాలూకు ఆ అవశేష లక్షణమే దాని ఆకస్మిక పతనానికి దారితీసిందనవచ్చు. సర్వదా శాంతియుత సహజీవనానికి అలవాటుపడిన ఆ ఆదిమ భారత జాతి ప్రజలు అనుకోకుండా తమపై జరిగిన అన్యజాతుల దండయా త్రలను ఎదిరించి నిలువలేకపోయారు.

(క్రీస్తుపూర్వం 2000 ప్రాంతంలో ఆసియా పడమటి అంచుల నుంచి చొచ్చుకు వచ్చిన ఇండో యూరోపియన్‌ జాతులవారు సింధు నాగరీకులను సునాయాసంగా జయించగలిగారు. ఆ తరువాత సంస్కృత భాషను వృద్దిపరిచింది ఈ కొత్త జాతులవారే. తొలి భారతీయ నాగరికతను అంతమొందించి, హిందూ సంస్కృతిని నిర్మించినవారూ వీరే. ఈనాటి మనలో ఎవరు “సంస్కృత సంస్కృతికి వారసులో, మరెవరు హరప్పానాగరికతకు వారసులో, ఇంకెవరు ఈ ఉభయుల మిశ్రమమో పరిశోధకులు తేల్చాలి. ఏమైనా, హరప్పా నాగరికత సృష్టి వృద్ది, క్షయాల చరి(త్ర నేటి మనకు, ముఖ్యంగా మన పాలకులకు ఒక గొప్ప పాఠం నేర్పుతున్నది. నేర్చుకొనడం, నేర్చుకొనకపోవడం మనవంతు.

(30.5.87) 8 సంధియుగం

ఈ శళాద్ది మొదటి అర్ధభాగంలో ప్రపంచం వరుసగా రెండు మహా యుద్దాలకు గురి అయింది. ఒక్కొక్క యుద్దం ముగిసినంతనే దాని ప్రభావం (ప్రపంచ దేశాల మీద ఒక్కొక్క విధంగా పనిచేసింది. మొదటి ప్రపంచ యుద్దం ముగిసినంతనే ప్రపంచ దేశాలు ముఖ్యంగా “మోతుబరి దేశాలు యుద్దం అనర్ధదాయకమని భావించి మరోసారి అటువంటిది రాకుండా చూడాలన్న సదుద్దేశ్యంతో “నానాజాతి సమితి" (లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌) అనే అంతర్జాతీయ సంస్థ నొకదానిని ఏర్పాటుచేసుకున్నాయి. కాని, యుద్దపు గాయాలు మానుతున్నకొద్దీ, దాని బాధ, భయం తగ్గగా వాటిస్టానే అధికార పిపాస పెత్తందారీ దేశాలలో పెరుగుతూ వచ్చింది. ఈ దాహం మరీతాందరగా ముదిరినందువల్ల ఆ ఆంతర్జాతీయ సాముదాయికవేదిక మఖలో పుట్టి పుబ్బలో అస్తమించింది. అందువల్లనే మొదటి (ప్రపంచ యుద్దం ముగిసి ఇరవై ఏళ్ళయినా కాకముందే మరో [ప్రపంచ యుద్ధం దాపురించింది. ఈ మధ్యకాలంలో పెద్ద దేశాలు పెంపొందించుకున్న సాయుధ బలగాలు, సంతరించుకున్న సరికొత్త మారణాయుధాలు, వాటితోపాటు కొన్నిదేశాల నాయకులలో విచ్చలవిడిగా పెచ్చరిల్లిన రాజ్య విస్తరణ కాంక్ష వీటన్నిటి ఫలితంగా (ప్రపంచం మరొకసారి మరింత దారుణమైన మారణకాండకు గురికావలసి వచ్చింది. ఐరోపాఖండంలో జర్మనీ జాత్యహంభావమూ, ఆసియాలో జపాన్‌వారి తలబిరుసుతనమూ ఈ యుద్దాగ్నికి ఆజ్యం పోశాయి. కొన్నిదేశాల అవకాశవాదం హిట్టుర్‌ అధికార దాహానికి ప్రత్యక్ష పరోక్ష ప్రోత్సాహం కలిగించగా, మరికొన్ని దేశాల వ్యాపారదృష్టి యుద్దాన్ని పొడిగించింది.

వీటన్నిటి సామూహిక దుష్ఫలితాలను మొత్తం ప్రపంచం సాముదాయకంగా అనుభవించింది. మొదటి యుద్దం కంటే, రెండవ ప్రపంచ యుద్దం మరింత లోక కంటకంగా జరిగింది. ఈ యుద్దపు దీర్షకాలిక దుష్పులితాలలో నాటికీ నేటికీ లోకాన్ని వెంటాడుతున్న అణ్వాయుధాల బెడద ప్రధానమైనది. అంతేకాదు, ఈ యుద్దంవల్ల కొన్ని దేశాలు ఆర్టికంగా పూర్తిగా చితికిపోయాయి. కాగా, మరికొన్ని దేశాలు తమ రాజకీయ సర్వం సాహాధికారాన్ని కోల్పోయాయి. మరికొన్ని దేశాలేమో ఇతర దేశాల మీద కొత్తరకం పెత్తందారీతనాన్ని నెలకొల్పుకొన్నాయి. అయితే ఇన్ని అవాంఛనీయ పరిణామాలలోనూ ఒకే మంచి పరిణామం ఈ యుద్ద ఫలితంగా జరిగింది. పాత వలస పాలనాధికారం అంతరించిపోయింది.

ఈ అనుభవాలు, యుద్దం ముగిసినంతనే అన్ని దేశాలనూ ఒక చోటకు తెచ్చాయి. మొదటి (ప్రపంచ యుద్దంకంటే మరింత దారుణమైన ఈ యుద్దపు మారణానుభవాలనూ, ఆనాటి నానాజాతి సమితి వైఫల్యాన్నీ పరిగణనలోకి తీసుకొని అంతకంటే కట్టుదిట్టమైన పద్దతిలో ఒకకొత్త ప్రపంచ సంఫ్టను 1945లో ఆనాటికి స్వతంత్రంగా ఉన్న 51 దేశాలవారు కలిసి ఏర్పాటుచేసుకున్నారు. 'పేరుకుఇన్ని దేశాలు పాల్గాన్నా, వాస్తవంలో పెత్తనమంతా ఐదు *' అగ్రరాజ్యాల' వారి చేతులలో వుండేది. అమెరికా, సోవియెట్‌ యూనియన్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా ఈ ఐదు పెత్తందారీ దేశాలు ఈ సంప్ట మీద ఒకరకమైన గుత్తాధికారాన్ని తమ గుప్పిట్టో పెట్టుకున్నాయి. ఈ ఐదు 'మోతుబరి' రాజ్యాలు తమను 'శాళ్యత సభ్యులుగా న్మిర్ణయించుకొని, మిగతా 46 దేశాలకు లేని ప్రత్యేక అర్హతలనూ అధికారాలనూ తమకు మాత్రం

సంధియుగం రి 2

కలిగించుకొన్నాయి. వీటిలో కెల్లా ముఖ్యమైనది *వీచో' అధికారం. అంటే 50 దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించిన తీర్మానమైనా సరే, ఈ ఐదు “శాశ్వత సభ్య' దేశాలలోని ఏ ఒక్క దేశం ““కాదు"” అని అన్నా ఆ తీర్మానం రద్దు అయిపోతుంది.

ప్రపంచంలో అతి పురాతనమైన ప్రజాస్వామిక దేశాలు, ఆధునికమైన కమ్యూనిష్టు దేశాలు కలిసి రూపొందించి మొత్తం ప్రపంచంమీద రుద్దిన సరికొత్త 'లోక ప్రజాస్వామ్య' పద్రతి సుమా! ఎవరి నినాదాలు ఏవి అయినా, ఎవరి దారులు ఏవైనా బలగం గలవారి అందరి లక్ష్యం ఒకటేననడానికి ఈ (ప్రపంచ పంచాయితీ వ్యవస్థ రాజ్యాంగం (ప్రబల నిదర్శనం. వీలైననన్ని ఎక్కువ దేశాల మీద తమ పెత్తనాన్ని చలాయించుకోవాలన్నదే ఈ లక్ష్యం. కాకపోతే పైెపూతలు మౌత్రం వేరు. బలవంతులైన ఈ ఐదు పెద్దదేశాల మధ్య ఏర్పడిన ఐకమత్యం కలకాలం నిలిచి వుంటే బాగుండేదని అనుకునేవారూ, అలా వుండనందుకు బాధ పడేవారూ వున్నారు. కాని, నిజానికి ఈ ఐకమత్య రాహిత్యం బహుదేశాల పాలిటి వరమే అనాలి. ఆలా కాకపోతే “దొంగలు ఊళ్ళు పంచుకున్నారు' అన్నట్టు ఈ అయిదు “అగ్రరాజ్యాలు” ప్రపంచాన్ని అయిదు అధికార మండలాలుగా పంచుకొని శాళ్యతంగా పరిపాలించి వుండును. అలా జరగకపోవడం లోకధర్మం.

“వసుధైక రాజ్య నినాదం, విశ్వమానవ కుటుంబ నినాదం, " (ప్రపంచమంతా ఒక గ్రామం అన్న నినాదాలు వినడానికి ఇంపుగానే వుంచాయి, కవితలలో వినిపించడానికి సాంపుగానే వుంచాయి. కాని వాస్తవంలో అవి నియంతృత్వ వ్యవప్టలే అయి తీరుతాయి. 'మనిషిని దోచుకుంటాడు మనిషి ఇది మానవ నైజం. ఈ నైజమే నియంతృత్వాలకు దారితీస్తుంది. అయితే తిరుగుబాటు కూడా మానవనైజం' మనిషిలోని ఈ రెండు నైజాలు ఒకదానికి ఒకటి విరుగుడు. ఒకవైపు పెత్తందారీతనం. పెరుగుతుంటే, మరోవైపు తిరుగుబాటుతనం 'హెచ్చుతుంటుంది. తన కుటుంబంలో తన గ్రామంలో, తన రాష్ట్రంలో తన దేళంలో లాగానే తన ప్రపంచంలో కూడా మానవుని ఈ తిరుగుబాటు గుణం అతని పురోభివృద్దికి తోడ్ప్చడుతుంటుంది.

(ప్రపంచ పంచాయితీ (ఐక్యరాజ్య సమితి)లో 40 ఏళ్ళలో చేరిన స్వతం(త్ర దేశాల సంఖ్య 51 మంచి 159 వరకు పెరగిందంటే ఎన్ని దేశాలు, ఎన్ని కోట్లు ప్రజలు బానిసతనం నుంచి విముక్తులైనారో తెలుస్తున్నది. ఈ పరిణామం వల్ల ఆనాటి ఆగ్రరాజ్యాలలో రెండు రాజ్యాలు చిన్న రాజ్యాలై పోయాయి. మరొక అగ్రరాజ్యంలో అధికారం చేతులు మారింది. సమితిలో వచ్చిన ఈ మార్పులవల్ల బలాబలాల పరిస్టితి తారుమారయింది. ఒకనాడు సంపన్న దేశాల కనుసన్నలలో మెలుగుతుండిన ఈ (ప్రపంచ పంచాయితీలో ఈనాడు ఆ రాజ్యాల మాట చెల్లుబడి కావడం లేదు. (ప్రజాస్వామ్యంలో సంఖ్యా బలానికే ప్రాబల్యం. కనుక అధిక సంఖ్యలో వున్న చిన్న రాజ్యాలు ఈ సంస్త వ్యవహారాలను శాసించగల ఫ్టితి ఏర్పడింది.

ఇందువల్ల ఒక విచిత్ర పరిస్థితిని ఈ (ప్రపంచ సంస్థ ఎదుర్కొంటున్నది. 'ప్రజాస్వామ్యూనికి ఆర్ధిక ప్రాబల్యానికి పొత్తు కుదరని ఒక కొత్త పరిఫ్టితి వల్ల ఈ సంప్ర ఇబ్బందులలో పడుతున్నది. ఇలా ఎంతకాలం నడుస్తుందో చెప్పడం కష్టమే. కొంచం వెనకా ముందుగా నానాజాతి సమితికి పట్టిన గతే దీనికీ పడుతుందా? లేక నిత్యం వెంచాడుతున్న మహామారణ అణ్వాయుధ భయం ఈ సంస్ట మనుగడను పొడిగించగలదా? ఈ సంస్ట స్వరూష్క స్వభావ, ప్రభావాలలో వచ్చిన మార్పుల పర్యవసానం ఏమి కానున్నది? కాలమే న్మిర్ణయించాలి. (25.10.85) 10 సంధియుగం

రాయల

ఆటవిక యుగం నుంచి రాచరికపు యుగం వరకు "“నా విష్ణు ప్పధివీ పతిః యుగం నుంచి “ప్రజల కోసం ప్రజల నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం” యుగంవరకు మానవజాతి చాలాదూరం పయనించింది. ఈసుదీర్ష సాంఘిక చైతన్య (స్రవంతిలో ఈ రాజకీయ పురోగమన పథంలో ఎన్నెన్నో కొత్త పరిణామాలు వచ్చాయి. అవరోధాలూ ఎదురైనాయి. అయినా మానవుడు తన మనోవికాసం, బుద్దిసూక్ష్మంవల్ల ఆయా అవరోధాలను అధిగమించి పురోగమిస్తూనే వున్నాడు.

వైనా తత్త్వవేత్త మెన్‌షియస్‌ క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దిలోనే ' ప్రజలు ముఖ్యం, పాలకుడు ఆ తరువాతనే'” అని అంటూ ప్రజాస్వామ్య భావాన్ని వ్యక్తపరిచాడు. అదే కాలంలో (గ్రీక్‌ స్టాయిల్‌ తత్త్వవేత్తలు కూడా ప్రజాస్వామ్య సిద్దాంత విస్తరణకు దోహదం చేశారు. సమాజంలో (ప్రజలందరూ సమాన సభ్యులు గనుగ అందరి (్రేయస్సుకోసం పరస్పర సహకారంతో కృషి చేసుకోవడం (ప్రజల ధర్మం అని ఈ తాత్త్వికులు (ప్రబోధించారు.

పాళశ్ళాత్య ప్రజాస్వామ్య పురోభివృద్రి చరిత్రలో కీలక భూమికను నిర్వహించిన రోమన్‌ న్యాయశా,స్త్రం వీరి ఈ ్రభోధాల నుంచే *“ప్రకృతి ధర్మం? అనే ప్రాథమిక సూత్రాన్ని స్వీకరించింది. క్రీస్తుళకం ఆరో శతాబ్దంలో (గ్రీసులో డేరియస్‌, ఒరేనస్‌ల మధ్య జరిగిన చర్చ ప్రజస్వామ్య భావానికి బలం చేకూర్చింది. ప్రజాస్వామిక ప్రభుత్వ వ్యవస్థలో ప్రజలే తమ పాలకులను ఎన్నుకుంటారు. ఈ పాలకుడు తాను చేసే పసనులన్నిటికీ (ప్రజలకు జవాబుదారి వహించాలి. అతడు తాను చేయదలచిన పనులను ్రజాసభముందు పెట్టాలి అని ఒరేనస్‌ వాదించాడు. ఈనాడు ప్రజాస్వామ్యాన్ని గురించి మనం చెప్పుకుంటున్న మూలసూత్రాలు దీనిలో ఇమిడి వున్నాయి.

ప్రజస్వామ్యాన్ని గురించి ఇలా అప్పుడప్పుడు వ్యక్తమవుతూ వచ్చిన భావాలకు 12, 13 శతాబ్దాలలో జర్మనీ వంటి కొన్నిదేశాలలో బ్రస్సెల్స్‌, స్ర్రాస్‌బర్గ్‌, న్యూరెంబర్గ్‌, లక్సెంబర్గ్‌ వంటి నగరాలలో కొంతవరకు నిర్రిష్ట రూపకల్పన జరిగింది.

కాగా అమెరికన్‌, ఫ్రెంచ్‌ విఫ్టవాలతో ప్రజాస్వామ్యానికి మహోన్నత దళ ప్రారంభమయింది. ఈ విప్లవాలు ఆధునిక ప్రజాస్వామ్య సిద్దాంతానికీ, పద్దతులకూ ఒక రూపం కల్పించాయి. 17వ శతాబ్దిలో ఇంగ్ధండులోను, 18వ శతాబ్దిలో అమెరికాలోను, కొన్ని ఐరోపా దేశాలలోను ప్రజాస్వామ్యానికి సిద్దాంతబద్రమైన సమర్ధన లభించింది. అదొక్కటే ఉత్తమ రాజకీయపద్రతిగా లోకామోదం పొందింది. 19వ శతాబ్దం ఉత్తరాన్రంలోను, ఈ శతాబ్దం తాలి పాదంలోను ప్రజాస్వామ్య సిద్దాంత ప్రభావం ప్రపంచ (ప్రజల మనోభావాలను గట్టిగా ఆకట్టుకొన్నది.

కాగా, ఇరవయ్యో శతాబ్ది ఆరంభంలో కారల్‌ మార్క్స్‌ సిద్దాంతాల ప్రభావ ఫలితంగా ప్రజాస్వామ్యం ఒక సరికొత్త పోటీని ఎదుర్కొన్నది. శ్రమ జీవులకు మూ్రమే పాలనాధికారం సంధియుగం 11

వుండాలని *దోపిడీదారులకు, సోమరులకు' అందులో స్టానం ఉండకూడదని మార్కిస్టు సిద్దాంతసారం. అనగా శ్రామిక వర్గ నియంతృత్వం అని అర్ధం. దీనికే కమ్యూనిష్టులు “పీపుల్స్‌ డెమోక్రసీ అని పేరు పెట్టారు.

ఈ శతాబ్దంలోనే సోషల్‌ డెమో|క్రసీ, లిబరల్‌ డెమోక్రసీ, క్రిస్టియన్‌ డెమోక్రసీ, గైడెడ్‌ డెమోక్రసీ వంటి మరికొన్ని కొత్తపేర్గు వినవచ్చాయి. (ప్రపంచ (ప్రజల ఆలోచనా సరళిలో, కాలమాన పరిస్టితులలో, విలువలలో వస్తున్న మార్పులకు ఇవి చిహ్నాలు. ఇన్ని ప్రభావాల మధ్య 1947లో స్వాతంత్ర్యం సంపాదించుకున్న మనదేశం కల్తీలేని ప్రజాస్వామ్యాన్నే వరించింది. 1949లో మన రాజ్యాంగ రచనాసభ మనది సర్వసత్తాక ప్రజాస్వామిక ప్రజారాజ్యం (సావరిన్‌ డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌) అని ప్రకటించింది. 1950లో అమలులోకి వచ్చిన మన ప్రజాస్వామ్యం పాశ్చాత్య ప్రజాస్వామ్యంలో ఉటంకితమైన సూత్రాలనూ సంప్రదాయాలనూ తనలో ఇముడ్చుకొన్నది. మన రాజ్యాంగం '' పౌరులందరికీ ( శ్రామికులకు మాత్రమేకాదు) సాంఘిక, ఆర్దిక రాజకీయ న్యాయాన్ని పదిల పరచుకొనడానికి, భావ, వాక్స్‌ విశ్వాస, మత, ఆరాధనా స్వాతం(త్రాలను, పౌరులందరికీ సమాన అవకాశాలనూ, గౌరవ ప్రతిపత్తిని పదిల పరచుకొనటానికి, ప్రజలందరి మధ్య భ్రాతృ భావాన్ని పెంపొందించుకోనడానికి వ్యక్తి ఆత్మగౌరవాన్ని దేశ ఐకమత్యాన్ని పదిలపరచుకొనడానికి ఉద్దిష్పమైనది. ఇది అరమరికలూ, ఇతర అర్జాలులేని సిసలైన ప్రజస్వామ్యం.

నూరు సంవత్సరాలనాడు అబ్రహాంలింకన్‌ 'ప్రజల కోసం (ప్రజలనుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం" అన్న నిర్వచనం చెప్పేన నాటినుంచి అదే నికరమైన నిర్వచనంగా చెల్లుతూ వచ్చింది. లింకన్‌కు ముందూ, ఆ తరువాత కూడా పలువురు పెద్దలు ప్రజాస్వామ్యానికి పలురకాల నిర్వచనాలు చెబుతూ వచ్చారు. ఈ నిర్వచనాలలో ఆయా దేశకాల పరిస్టీతులు (ప్రతిబింబిస్తూ వచ్చాయి.

  • ప్రజాస్వామ్యంలో స్వేచ్చ అనేది రాజ్యానికి భూషణం కనుక (ప్రజాస్వామ్యంలో మాత్రమే పౌరులందరూ స్వేచ్చగా జీవించగలుగుతారు'" అని శ్లుటో చెప్పాడు. "“నేనెవగికీ బానిసగా వుండడానికి ఇష్టపడను. అలాగే నోకెవరూ బానిసలుగా వుండాలని కోరుకోను. ఈ సూత్రానికి భిన్నమైనదేదీ అలా భిన్నమైనంతమేరకు (ప్రజాస్వామ్యం కాజాలదు” అన్నాడు లింకన్‌. గాంధీజీ నిర్వచనం (ప్రకారం, ** ప్రజస్వామ్యమంటే (ప్రజలు గొ(రైదాటుగా వ్యవహరించే వ్యవస్థకొదు, (ప్రజాస్వామ్యంలో పౌరులు తమ భావస్వేచ్చనూ, క్రియా స్వాతంత్ర్యాన్ని అ్రమత్తంగా కాపాడుకొంటారు”. జవహర్‌లాల్‌ నెహ్రూ దృష్టిలో '' ప్రజస్వామ్యమంటే సహనం. సహనమంటే మనతో ఏకీభవించేవారిపట్ట చూపే సహనంకాదు. మనతో అంగీకరించనివారిపట్లు చూపవలసిన సహనం”. డక్టర్‌ రాధాకృష్ణన్‌ నిర్వచనం ప్రకారం “ ప్రజాస్వామ్యంలో భావ, వాక్స్వాతం (త్రాలు ముఖ్యమైనవి. అధిక సంఖ్యాకులు అల్పసంఖ్యాక వర్గంవారి అభిప్రాయాలను గౌరవించాలి. నిజమైన ప్రజాస్వామ్యంలో పాలకపక్షంతోపాటు (ప్రతిపక్షమూ వుండి తీరుతుంది. ప్రతిపశ్షానికి సంఖ్యాబలం లేనంతమాత్రాన వారికి రాజకీయ విజ్ఞత లేవట్టుకాదు”'.

(ప్రపంచంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులను బట్టి విలువలూ మారిపోతున్నాయి. ఒకనాడు సంస్కొారానికీ చిహ్నాలుగా విలసిల్లిన జీవిత విలువలను ఇప్పుడు బూర్జువా విలువలని నేటి కాలానికి అవి పనికిరావని భావించే వారున్నారు. ఒకనాడు సిద్దాంతాల

12 సంధియుగం

వాదోపవాదాలు చాలా తీవ్రంగా వుండేవి. అయితే ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మార్క్స్‌ సాంఘిక ఆర్ధిక సిద్దాంతాల ప్రభావం ఈనాడు అన్నిదేశాల ప్రజల ఆలోచనలపైన పనిచేస్తున్నది. మార్క్స్‌ రాజకీయ సిద్దాంతాలను సుతరామూ అంగీకరించని వారుకూడా మార్క్సిస్టు ఆర్చి, సాంఘిక సూత్రాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంగీకరిస్తున్నారు. సిద్దాంత పిడివాదాలు తగ్గిపోతున్నాయి. మొత్తంమీద గత రెండు దశాబ్దాల కాలంలో (క్రమేణా సిద్దాంత విశ్వాసాలు తగ్గిపోతూ వచ్చాయి. ప్రజాస్వామ్యమా, మార్క్సిజమా అన్న మీమాంస కాక ఉభయ వాదాలలో ఉపయోగమైన వాటిని ప్రజలు స్వీకరిస్తున్నారు. అసలు మానవస్వభావంలోనే మార్పు వచ్చింది. పరచింతన తగ్గిపోయి స్వార్ధచింతన 'హెచ్చుతున్నది. ఇందువల్ల కూడా సిద్దాంత విలువలు శ్షీణించి పోతున్నాయి. స్వార్ధచింతన మితిమీరి, మళ్ళీ మానవునిలో ఆదిమ ఆటవికతత్వం ప్రబలుతున్నది. లోకమంతచా ఈనాడు సాక్షాత్కరిస్తున్న వికృత పరిణామమిది. వీటి అన్నిటివళ్ల ప్రజాస్వామ్యమూ, మార్కిజమూకూడా అంతరించి మరేదో కొత్త రాక్షస వాదం లోకాన్ని ఆవరించే ప్రమాదం పొంచివున్నట్టు కనపడుతున్నది. రానున్న ఈ లోక కంటక పరిణామాన్ని అరికట్టుగల మరో వీరవసంతరాయలు అవతరించేదెన్నడో? (12.11.83) స్లాన్గాన్గు వంశస్వామ్యం (ప్రజాస్వామ్యంలో వంళస్వామ్య ప్రాబల్యం మనకు కొత్తకాదు. ఆమాటకొస్తే ఇది ఒక్క మనదేళం ఆనవాయితీ మాత్రమే కాదని పలు ఇలర ఆసీయాదేశాలలోను. ఇంకా ఇతర(ాను ఈరాజకీయ ఆనవాయితీ వేరూనుకొన్నాదని చెప్పువచ్చు. అలానే అధికారంలో వున్నవారి బంధువుల అనధికార రాజకీయ పెళత్తనమూను. అర్టికళాన్త,ంలో ఒక సూ్రం వున్హుది. పాతసుంకం సుంకం కాదు అని దాని అరం. ప్రజలు అలవాటుగా చెల్లించే షన్ఫులు వారికి భారంగా కనిపీంచవు. నిజూనికి తాము అవి వెల్టిన్తున్నామున్లు నుహకూడా వుండదు. ప్రజాస్వామ్యంలో చొరబడిన వంళస్వామ్యుంకూడా ఈనాడు అటువంటిదే... చరి(త్రలో ఎన్హాన్నో అనావారాలు ఆనవాయితీగా మారి మూఢనమ్మకాలుగా వేరూనుకొన్న నంగతి మనకు తెలును. వాటి నిర్మూలనకు మవో ఫురుషులు అవతరించవలసీ వస్తూంటుంది. ఇంటాబయటా 25-7-86 సంధియుగం 13

  • కులమ్‌” ముందా "కలర్‌ ముందా? కలర్‌ నుంచి కులమ్‌ పుట్టిందా? కులమ్‌ నుంచి కలర్‌ పుట్టిందా? ఈ ప్రళ్నలు వినడానికి వింతగా తోచవచ్చు. విడ్డూరంగా అనిపించవచ్చు. కాని ఈ రెండింటికీ మధ్య అవినాభావ సంబంధం ఉన్నది. కులాలు అనేవి ఒక్క మనదేళంలో మాత్రం వున్నాయని, హిందూమతంలో మాత్రమే కులభేదాలు కనపడతాయని సాధారణంగా అందరూ అనుకొనడం కద్దు. నిజమే, కులాల వ్యవస్ట్ర అనేది మనదేళంలో ఉన్నంత విస్తారంగా హిందూమతంలో ఉన్నంత కట్టుదిల్టుంగా మరేదేళంలోను, మరేమతంలోను లేనిమాట యదార్హమే. అయితే, హిందూమతంలో ఈ కులవ్యవప్టకు ప్రాతిపదికలుగా ఉన్న సూత్రాలు, కారణాలు మాత్రం (ప్రపంచంలో ఇతరత్రా పలుదేశాలలో కూడా కనపడతాయి.

సంస్కృత భాషలో “కులమ్‌! అనే పదానికి ఇంగ్రీషు భాషలోని 'కలర్‌' అనే పదం చాలా దగ్గరగా వుంటుంది. ఇవి రెండూ సమానార్హకాలు. క్యాక్ట్‌ (కో) అనే ఇంగ్రీషు పదానికి 'జూతి* అని అర్ధం వున్నది. అయితే, హీందూ మతంలోకాని, హిందూ శాసనాలలోకాని 'జాతి, “జాతిధర్మం' అనే మాటలు కనపడవు, వాటికి బదులు “వర్థమ్‌*, ' వర్ణధర్మమ్‌' అనే మాటలు కనబడతాయి. వ్యర్ధం అంటే కులం అని, రంగు అని నానార్జాలు వున్నాయి. ఈ రెండింటికీ ఇంగ్రీషులో “కలర్‌' అనే మాట వాడతారు.

ఈ దృష్టితో చూచినప్పుడు అమెరికాలో సైతం కులాలు, కులభేదాలు వున్నట్టు కనపడుతుంది. అమెరికన్‌ రచయితలు తరచు తమ రచనలలో ' వర్ణ వారసత్వం' * వరద్వేషం? అనే మాటలు వాడుతుంటారు. వారి రచనలలో కులం (క్యాష్ట్ర) అనేమాట కూడా తరచు కనపడుతుంది. నిజానికి, ప్రాచీన సంస్కృత రచనలలో కంచే కూడా వీరి రచనలలోనే ఈపదం ఎక్కువగా కనపడుతుంది. వీటిని బట్టి ఇక్కడ మనదేళంలోకాని, అక్కడ అమెరికాలోకాని, ఆఫ్రికాలోకాని కులభేదాలకు లేదా వర్ణ ద్వేషాలకు వెనుకగల కారణాలు ఒకే రకమైనవి అయి వుండవచ్చు అనిపిస్తుంది.

ఒక శ్వేత అమెరికన్‌ రచయిత ఒకచోట ఇలా (వ్రాస్తాడు : '“ఏ కోణం నుంచి చూచినా వారసత్వం తాలూకు సమస్య అన్నిటిలోకి క్లిష్టమైన సమస్య*' ఆ రచయిత పేరు హావర్త్‌. “అమెరికా-ఇన్‌- ఫెర్మంట్‌' అనే తన గ్రంధంలో ఆయన ఈమాట అంటాడు. కాగా 19వ శతాబ్దపు గొప్పు నీగ్రో రచయిత డాక్టర్‌ దుబాయిస్‌ 'ది పోల్స్‌ ఆఫ్‌ బ్ఞాక్‌ ఫోర్‌ అనే తన సుప్రసిద్ద గ్రంథంళో అమెరికాలో వ్యర్థ విచక్షణను గురించి అద్భుతంగా వర్ణించాడు. అమెరికన్‌ సాహిత్యంలో అనన్య సామాన్యమైన అద్భుత రచనలలో ఒకటిగా అది (ప్రసిద్ది గాంచింది. ఈ వాస్తవాల్ని అమెరికన్‌ శ్వేత రచయితలంతా ముక్తకంరంతో అంగీకరిస్తారు. అయినా, ఆరోజులలో అమెరికాలో వ్యర్థ విద్వేషాలు ఎంత బలంగా వున్నాయంటే, అటువంటి మహా రచయితను కూడా శ్వేత జాతీయుల సరసన హోటళ్ళికు, థియేటర్లకు సైతం రానిచ్చేవారు కాదు.

14 సంధియుగం

ఒకసారి ఆమెరికాలో ఒక సాంఘిక శాస్త్రవేత్తల మహాసభ జరిగింది. దుబాయిస్‌ కూడా ఆ సభలో పాల్గొన్నాడు. సమావేశంలో చర్చలు ముగిసిన తరువాత, తామంతా ఏదైనా ఒక హోటల్‌కు వెళ్ళి కూర్చొని మరికొంతసేపు ఇష్టాగోస్టి చర్చలు కొనసాగిస్తే బాగుంటుందని హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ (శ్వేతజాతీయుడు) ఒకాయన సూచించాడు. అంతట డాక్టర్‌ దుబాయిస్‌ కల్పించుకొని ““ఒక్క రైల్వేస్టేషన్‌ రెస్టారంట్‌లోకి తప్ప మరే హోటల్‌లోకీ నన్ను రానివ్వరే * అని అన్నారట. * “అయితే, అందరం అక్కడికే వెళ్ళితేసరి * అనిఆ హార్వర్డ్‌ (ప్రొఫెసర్‌ సమస్యను సుళువుగా పరిష్కరించాననన్న సంతృష్తితో అన్నారట. అలాగే అందరూ రైల్వేస్టేషన్‌ రెస్టారెంట్‌కే వెళ్ళారు. అంతేకాని అంతమంది శ్వేత మేధావులలో ఒక్కరయినా డాక్టర్‌ దుబాయిస్‌ కూడా హోటళ్ళకు వస్తే తప్పేమిటి, అని అనడానికి సాహసించలేకపోయారు.

ఈ ఉదంతం విన్నప్పుడు ఒకనాడు మనదేళంలో - ఆం(ధ్రదేశంలో మన పండితులు వేమన సాహిత్యాన్ని బయటకు పొక్కనీయకుండా మరుగు పరచడానికి చేసిన మర్మ (ప్రయత్నాలు, మన హరిజనులను మన “సవర్గులు' అంటరానివారుగా ఊరికిదూరంగా వుంచిన దురాచారాలు మనకు జ్ఞాపకం వస్తాయి. దేళం ఏదయినా ద్వేష్పాలన్నీ ఒక్కలాగే వుంటాయి. మనుషులంతా ఒక్కటే. ఆఫ్రికా ఇండాన్ని తెల్లవారు నిన్నమొన్నటివరకు “చీకటి ఖండం" అని చులకన భావంతో చూచేవారు. అక్కడనుంచి నీగ్రోలను అమెరికాకు పట్టుకువచ్చి పశువులను అమ్మినట్టు వెల తీసుకుని బానిసలుగా విక్రయించేవారు.

కాలం మారింది. నీగ్రోలు-కాదు- నల్లజాతివారు మేలుకొన్నారు. వారిలో చైతన్యం రగులుకొన్నది. ఒకదానివెంట ఒకటే నల్ల ఆఫ్రికా దేశాలు స్వాతం (త్ర్యాన్ని సంపాదించుకుంటూ వచ్చాయి. బ్రిటీష్‌వారి నుంచి భారతదేశం స్వతంత్రమైన తరువాతనే, దాని ఒరవడిలో ఈ జాగ్బతీపరంపర ప్రారంభమయింది. నిజానికి మనదేశానికి స్వాతంత్రం రాకముందే మన జాతీయ మహా నాయకులు మన (ప్రజల జాగృతికే కాకుండా, ఆఫ్రికానల్ల ప్రజలను జాగరితం చేయడానికి కూడా అహరహం కృషి చేశారు. ఈనాటికీ మనదేశం, మన నాయకత్వం ఆఫ్రికా తదితర ప్రాంతాలనల్ల జాతి ప్రజల అభివృద్ది కోసం తన మార్గదర్శక కృషిని కొనసాగిస్తున్నది. కనుకనే, నల్లజాతివారంటే మనకు ఒక ప్రత్యేకమైన అభిమానం, అనుబంధం ఏర్పడ్డాయి. ఇందుకు జాతి విచక్షణ దృష్టి కారణం కాదు. శతాబ్దాలుగా అణగారివున్న జాతుల ప్రజలంతా కలిసి పైకి రావడానికి కలిసికట్టుగా ప్రయత్నించడమే ఇందుకు కారణం.

1986లో మద్రాసులో ఒక జూనియర్‌ కళాశాలవారు ఆఫ్రికన్‌ నీగ్రోల జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని, ఆ నల్ల'ప్రజల సామాజిక జీవితాన్ని సంగ్రహంగానేనయినా సమగ్రంగా చిత్రించే ఒక చక్కని ఎగ్రిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఎన్నెన్నో ఆఫ్రికన్‌ కళాఖండాలను, వస్తు సంచయాన్ని ఎక్కడెక్కడి నుంచో ఎంతో శ్రమకోర్చి సేకరించి తీసుకొచ్చారు. "మద్రాసులో మినీ ఆఫ్రీకొ అని అంతా దానిని వర్ణించారు.

కళాశాల ప్రీన్సిపాల్‌ డా. జయా వేణుగోపాలరావు నాయకత్వం వహించి తన తోడి

అధ్యాపకులు విద్యార్థినులతో కలిసి ఇంత జయప్రదంగా ఇంతటి బృహత్కొర్యాన్ని తలపెట్టి నిర్వహించారు. వారి కృషి ఎంతయినా ప్రళంసనీయమైనది.

(22.11.86)

సంధియుగం 15

అప్పటికీ ఈ ప్రపంచంలో కొన్ని జాతుల వారిలో ఇతరులకన్న తాము అధికులమన్న తప్పు భావం ప్రబలంగా కనబడుతుంటుంది. కొన్ని సందర్భాలలో పరోక్షంగానూ, మరికొన్ని సందర్భాలలో ప్రత్యక్షంగానూ ఈ అహంకారం వ్యక్తమవుతుంటుంది. ముఖ్యంగా తెల్లవారిలో, అందునా దక్షిణా ఫీకా తెల్లవాళ్లలో ఈ దురహంకారం నేటికీ చావకుండా వున్నది.

దక్షిణాఫ్రికాలో 2 కోట్టు20 లక్షలమంది నల్లవారున్నారు. కాగా 50 లక్షలమంది మాత్రమే తెల్లవాళ్ళున్నారు. అధిక సంఖ్యలో వున్న నల్లవారిని బలవంతాన ఎన్నికలకు దూరంగా వుంచి, వారి జనసంఖ్యలో అయిదోవంతుకూడా లేని తెల్లవాళ్ళను మాత్రమే ఎన్నికలలో ఓటు చేయనిచ్చారు. జాత్యహంకారానికి, జాతి దురహంకారానికి, ఇది పరాకాష్ట ఈ ఆధునిక ప్రజాస్వామిక యుగంలో వాళ్ళ ఈ ఆటలు ఇక అట్టే కాలం సాగవని వాళ్ళకూ తెలుసు. అయినా వీలైనన్నివాళ్ళు చూరు పట్టుకొని వేళ్ళాడాలన్న దుశ్చింతతో దక్షిణాఫ్రికా శ్వేత అల్పసంఖ్యాక వర్గంవారు సినిమాలలో విలన్షలాగా వ్యవహరిస్తున్నారు. ఆరిసోయేముందు దీపం గప్పుమన్నట్టు వీరు విజృంభిస్తున్నారు.

తమ "శ్వేతజాతి మాత్రమే “గొప్ప జాతి, పరిపాలించే ల్వర్హత, పామర్ద్యాలు తమకే వున్నాయి. నల్లవాళ్ళు తక్కువవాళ్ళు, వాళ్ళ రాజ్యాలను వాళ్ళు సంబాళించుకోవడం వాళ్ళకు తెలియదు”! అన్న తలతిక్కతనం తెల్లవారి జాత్యహంకారానికి కొారణమవుతున్నది. ఇటువంటి ఆలోచన జాత్యహంకార జాడ్యం తప్ప మరేమీ కాదు. ప్రపంచంలో భూగోళ పరిఫ్టితులను బట్టీ, శీతోస్త స్థితులను బట్టీ, భాషను బట్టీ, రంగును బట్టీ పలు జాతులుగా జనులను వర్గీకరించడం జరిగింది. అంతకు మించి ఈ జాతులలో కొన్ని గొప్పవీ, కొన్ని తక్కువవీ అన్నవాదానికి చరిత్రలో ఎన్నడూ, ఎక్కడా, ఏ విధమైన ఆధారాలూ లేవు.

ఆటవిక యుగం నుంచి, రాతియుగం ద్వారా లోహయుగానికీ, అటునుంచి పారిశ్రామిక యుగానికీ, అటు తరువాత ఇటీవలనే వ్యోమయాన యుగానికీ పురోగమించిన మానవ జాతి చరిత్ర గతిని కొంచెం లోతుగా పరి శీలించినట్టయితే వేరు వేరు కాలాలలో వివిధ జాతుల వికాస పతనాలు మనకు కనపడతాయి. తెలివి ఏ ఒక్క జాతి గుత్త సొమ్ముకాదు.

ఈ వాస్తవాన్ని పరిశోధకులందరూ అంగీకరించారు. జాతుల ఆధిక్యత, న్యూనతల వాదానికి ఎన్నడూ తావులేదు. కొన్ని కాలాలలో కొన్ని జాతులు సాంస్కృతికంగా ఉచ్చ దళను చేరుకొని వుండవచ్చు. మరికొన్ని వెనుకబడి వుండవచ్చు. ఈ ఉచ్చ నీచ దళలకు రాజకీయ, అర్టిక, నైసర్గికాది భౌతిక సౌకర్యాలు లేదా అసౌొకర్యాలే కారణం తప్పు జాతి ఆధిక్యత, న్యూనతలు మాత్రం కారణం కాదు. నిజమే, ఈనాటి ప్రపంచంలో కొందరు చంద్ర మండలానికి సోపానాలు నిర్మిస్తుంటే, మరికొందరు వెంపల చెట్టుకు కూడా నిచ్చెనలు వేయలేకపోతున్నారు. ఇందుకు అవకాశాల లోపమే కారణం కాని, జాతి స్వభావం కాదు.

“జాతి ఆధిక్యత” వాదాన్ని, వాదం కోసమైనా, ఒక్క క్షణమైనా అమోదిస్తే శ్వేత జాతీయులకంటచి, భారతీయులూ, చైనీయులూ, అరబ్బులు ఎంతో అధికులని 16 సంధియుగం

అంగీకరించవలసివుంటుంది. క్రీస్తుళకం 1 0 వ శతాబ్దిలో స్పెయిన్‌ దేశంలో నివసించిన ఒకానొక అరబ్‌ తాత్త్వికుడు ' ఉత్తరాది అటవికులను' గురించి ఇలా వర్ణించాడు :

“వీళ్ళు వట్టి మందమతులు. వీళ్ళ పరిహాసాలు మొరటుగా వుంటాయి. వీరికి తలనీలాలు మాత్రమే పాడవుగా వుంచాయి. మనుషులు పాలిపోయినట్టు వుంచారు. తెలివితేటలు సున్నా. అజ్ఞానం, సోమరితనం వీరిలో గూడుకట్టుకుని వున్నట్టు కనపడతాయి. వీరు సంస్కారహీనులు. మంచిచెడ్డల విచక్షణా గుణం వీళ్ళలో బొత్తిగా కనపడదు". ఇది ఆనాటి తెల్లజాతివారిని గురించి ఒక అరబ్‌ పండితుడు తెలిపిన సమాచారం. దీనిని బట్టి ఆ కాలంలో తెల్లవారు ఎంత హీన దళలో వున్నారో తెలుస్తుంది. అరబ్‌ల ప్రగతిని కూడా ఇది సూచిస్తున్నది.

అంతకంటే400 సంవత్సరాలకు పూర్వమే అనగా క్రీస్తళకం ఆరవ శతాబ్దంలో చైనావారు కాగితాన్ని కూడా తయారు చేయగలిగారు. కాగా, అప్పటికి ఐరోపా తెల్లవారిలో అక్షరజ్ఞానం వున్న వాళ్ళ సంఖ్యను వేళ్ళమీద లెక్కించవచ్చు. అంతేకాదు, ఐరోపా వారికంటే 400 సంవత్సరాలు ముందుగానే చైనావారు ముద్రణ కళను సృష్టించారు. ఈనాడు శాస్త్ర, సాంకేతిక (ప్రగతిని చూచి 'తెల్లవాడి మహిమ అంటూ విస్తుపోతుండే వారికి ఈ చారిత్రక దృష్టాంతాలు కనువిప్పు కలిగించాలి. అయితే, ఒకటి మాత్రం నిజం. అన్య జాతుల వారితో, ఇతర సంస్కృతులతో పరస్పర పరిచయాలూ, ఆదాన, (ప్రదానాలూ లేకుండా వికాసం పొందిన సమాజం అంటూ సాధారణంగా కనపడదు.

ఈజిప్టు, మెసపాటేమియా, (గ్రీసు, చైనా నాగరికతలలో ఏదీ కూడా మడికట్టుకొని, దడికట్టుకొని పెంపాందినట్టిది కాదు. ఈ సంస్కృతుల అన్నిటి వికాసానికీ ఇరుగు పొరుగువారితో పరిచయాలు బహుదా దోహదం చేశాయి. కాలక్రమేణా యుద్దాలలో విజయాలూ, వ్యాపార లావాదేవీలూ వంటివి జాత్తుల మధ్య సంబంధ బాంధవ్యాలను ప్రభావితం చేస్తూ వచ్చాయి.

ఈ రాజకీయ, వ్యాపార సంబంధాలు స్పర్ధలుగా మారి, కొన్ని (ప్రాచీన నాగరికతల పతనానికి కారణభూతమైనాయి. ఈస్ట్‌ ఇండియా కంపెనీ వాళ్ళకు వ్యాపారానికి అనుమతి ఇచ్చిన పాపానికీ, అంతకు ముందు ముస్టిం ఆగంతకులకు అతిథి మర్యాదలు చేసిన దోషానికీ భారతీయ సంస్కృతి ఎటువంటి దుష్పరిణామాలకు లోనై ఎలా శ్షీణించిందో మనకు అనుభివైకవేద్యమే కాబట్టి, ఆయా జాతుల నాగరికతల ఉచ్చ, క్షీణ దళలకు జాతి న్యూనత ఎంత మాత్రం కారణం కాదు.

రాజకీయ, అర్ధిక కారణాలకు (ప్రకృతి విపర్యాయాలు కూడా తోడైనందువల్ల ఆఫ్రికన్‌ నల్లజాతులవారు ఈ (ప్రాచీన నాగరికతలకు దూరంగా వుండిపోయారు. కాకులు దూరని కారడవులు, సహారా వంటి ఎడారులు, అలవికాని సాగరతీరాలు వారిని ఆసియా, అరబ్‌, చైనా వగైరా నాగరికతల నుంచి చిరకాలం ఎడంగా వుంచాయి. అలానే మధ్య యుగాలనాడు ఆ్రికావాసులు సాధించిన ఉన్నత నాగరికతా సంస్కృతులతో ఆసియా, ఐరోపా ఖండాలవారికి పరిచయం లేకుండా వుండి పోయాయి. పళ్చిమాఫ్రికాలో ఘనా సామ్రాజ్యంలో సంస్కృతి మూడు పూలు ఆరు కాయలుగా విలసిల్లిన నాటి సంగతులు చాలాకాలందాకా బయటి (ప్రపంచానికి తెలియవు. సంధియుగం 17

అలానే నైజర్‌ నదీ తీరాన బెనిన్‌ అనే రాజ్యంలో 14వ శతాబ్రినాటికి నగిషీ కాంస్య (ప్రతిమలను శయారుచేసిన ఆఫ్రికన్‌ హస్తకళా నైపుణ్యంకూడా. వీరి పనితనం అదేకాలంలో ఐరోపావారి పనితనానికి ఏమాత్రం తీసిపోలేదు. అయినా బయటి ప్రపంచానికి చాలాకాలం వరకు ఈ సంగతి ఒలియదు. ఇలా ఎన్ని ఉదాహరణలయినా చెప్పవచ్చు. మన మొహంజొదారో, హరప్పా, సింఛూ, తుంగభద్ర నాగరికతల సంగతి సరేసరి.

ఈ వాస్తవాలు తెల్లవారికి తెలియనివి కావు. ఏనాడో చేజిక్కించుకున్న అధికారాన్ని చేజేతులా వదులుకొనడం ఇష్టంలేకనే వాళ్ళిలా ప్రవర్తిస్తున్నారు. ఇది వారి జాత్యహంకార జాడ్యం తప్ప మరొకటి కాదు. నేడు కాకున్న, రేపయినా దక్షిణాఫ్రికాలో సైతం జనాభిప్రాయం నెగ్గక మానదు. అక్కడ ఇటీవల జరిగిన ఎన్నికలను బట్టి తెల్లవారిలో సైతం కొందరు కాలగతిని గుర్తిస్తున్నారని, జాతి విచక్షణను వారు వ్యతిరేకులని పరోక్షంగానయినా స్పష్టమయింది. కనుక, అక్కడి శ్వేత పాలకులు కాలధర్మాన్ని గుర్తించ నిరాకరిస్తే కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చగలరు.

(16.5.87) స్లుగ్గున్ల సైనికులు - పోలీసులు

“రమారమి 200 సంవళల్సురాలు పై చిలుకు కాలంలోనూ అటు సైనికులు ఇటు పోలీసులుకూడా ప్రధానంగా (ప్రజూ వ్యతిరేకులుగానే వుండీ పోయారు. అందుకు వారిని నిందించి ప్రయోజనం లేదు. పరదేళవురాజుల పాలనలో పాలకులు తమ రాజ్యాధికారాన్లి పదిలపరచుకోవడానికి చూస్తారుకాని (పజూహితం వారికి ముఖ్యం కొదన్హుది ఒకవాస్తవిక సత్యం, పరరాజులను వారి పాలనను ద్వేషించి వ్యతిరేకించే (ప్రజలు అటువంటి ్రభుత్వవు రాజ్యాధికారాన్ని కాపాడటానికి సర్వదా ఆ పరాయి పాలకుల కనుసన్హులలో మెలుగుతూ, వారి అభిమానంకోసం పనిచేసే సైన్ఫాన్లి పోలీను బలగాన్ని (ప్రేమించజూలరు. సైన్యం ఎంత సామ్మర్ష్యం కలది అయితే ప్రజలకు అంత కంటక(పప్రాయమైనది కావడం కూడా సహజమే. దాదావు వంద సంవళత్సురాల పాటు మన (ప్రజలు, మన నాయకులు సాగించిన జాతీయ స్వాతంత్ర సమరంలో వారిని (ప్రత్యక్షంగా హింసించినదీ, దూషంచినదీ (ప్రజల ప్రాణమానధనాలను ఆయా సందర్భాలలో కొల్పిగొట్టినదీ విక్టోరియా రాణి కాదు. జారి రాజు కాడు. ఎలిజటెల్‌ రాణి కాదు. వారి పేరిట ఈ దారుణాలన్నీ చేసినది మన సైన్యము మన పోలీను బలగమే. అందువలనే (ప్రజలు వారిని తమకు (ప్రత్యక్ష శత్రువులుగా పరిగణించారు. ద్వేష్మించారు ఇలా ఇంతకాలంగా మనలో వేరూనిన ఈ అయిష్టాన్లి ద్వేషాన్లి మరచిపోవడం అంత తేలికకాదు.

ఇంటాబయటా 21! -3- 86

18 సంధియుగం

షో క బూనళ్వం

వున దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది. అంతకుముందు తెల్లవాళ్ల "పెత్తనాన్నీ, మనమీద వాళ్లు చలాయిస్తూ వచ్చిన జులుమును నిరసిస్తూ, ద్వేషిస్తూ వచ్చాము. కడకు వాళ్ల పరిపాలనను దేళంనుంచి బహిష్కరించుకున్నాము. అయినా మనలోని మానసిక బానిసతనం మనలనింకా పూర్తిగా వీడలేదు. నిజమే. నాలుగువందల ఏళ్లుగా మనలో జీర్ణించుకుపోయిన “జ, హుకుం '"సర్క్‌ యస్సార్‌” తత్వాన్ని అంత తొందరగా విడనాడలేకున్నాము.

అందువల్లనే, ఈనాటికీ తెల్లవాళ్తను చూడగానే మనలో, వాళ్ళపట్లు ఒకరకమైన ఆధిక్యభావం వెల్లడి అవుతుంది. చదువుసంధ్యలు లేని మామూలు సాదాసీదా జనులలో కంటే విద్యాధికులైన, నాయకులైన ఉన్నత ఉద్యోగాలలోనూ పెద్ద పదవుల్టోనూ వున్నవాళ్ళలోనే ఈ మానసికమైన చిన్నతనం మరింత కొట్టవచ్చినట్టు కనపడుతుంటుంది. తెల్లవాళ్ళను చూడగానే కడకువాళ్ళు హిప్పీగాత్హైనాసరే మనకంటికి వాళ్ళు ““దారలు”గా కనపడతారు. పదిమంది ప్రఖ్యాతులైన భారతీయుల మధ్య ఒక మామూలు తెల్లవ్యక్తి వుంటేమనం ఆ “దొర"నే ముందుగా గుర్తించి గౌరవిస్తాము. ఆతరువాతనే, ఎంత పెద్దవారైనా మనవారిని (వాళ్ళకంటే తక్కువగా) చూడడం మన కలవాటయింది.

తెల్లవారి పాలనలో మనం అనుభవించని కష్టాలులేవు. అవమానాలు లేవు. అసలు మనలను వాళ్లు మనుషులుగా చూడలేదు. మనం 400 ఏళ్లు పైచిలుకు పరాయి దేశాల పాలకులను సహీంచినందువల్లి, మనమంటే వాళ్లుకు చులకన భావం ఏర్పడింది. తూస్త్రీభావం వాళ్ళలో మరింత గట్టిగా నాటుకొనటానికి మరొక ముఖ్యకారణం వున్నది. పరరాజులు దండెత్తి వచ్చినపుడు, చెప్పన్న దేశాలుగా మనదేశాన్ని చీల్చుకొని, చిన్నచిన్న రాజ్యాలు ఏర్పాటు చేసుకొని పాలిస్తున్న ఆనాటి మనరాజులు తమలో తాము కలహించుకొంటూ ““ఎదుటి వాడిని కొట్టడానికి ఏరాయి అయినా మంచిదే"? 'నన్న ఈర్చాద్వేషాలతో ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ఆ పరరాజులతో చేతులు కలిపిన తీరు మన జాతిని విదేశాలవారిదృష్టిలో ముఖ్యంగా తెల్లవారి దృష్టిలో మరింత చులకన చేసింది.

ఈ కారణాలవల్ల తెల్లవాళ్లలో తాము జన్మతః అధికులమన్న భావం బాగా నాటుకొన్నది. ఆసియా మధ్యప్రాచ్యం. ఆఫ్రికా దేశాల ప్రజలకు తమనుతాము పాలించుకొనడం కూడా చేతగాదని. అటువంటే అక్హత జన్మతః వాళ్ళకు లేదని తెల్లవాళ్ల నమ్మకం. కొంతవరకు మన స్వయంకృతాపరాధం ఇందుకు దోహదం చేసింది. కాగా, వారి అధికార మదాంధత క్రమేణ వారిలో ఈ దృష్టిని ప్టిరపరచింది. బ్రిటీష్‌ వారితో ప్రారంభమైన ఈ తత్త్వం హిట్లర్‌ నాటికి మరింత వె(ర్రితలలు వేసింది. నల్లవారేకాదు. తెల్లవారిలో సైతం జర్మనులు (ఆర్యులు) తప్పు మరెవరికీ పరిపాలించే లర్హత లేదనుకొనేదాకా హిట్లర్‌ ఆలోచనలు వక్రీకరించాయి. అయితే హిట్టర్‌ తాను అనుకున్నది బాహాటంగా చెప్పి, తన ఆర్యాధిక్యత సిద్దాంతాన్ని ఆచరణలో పెట్టాలన్న దుస్పాహసానికి ఒడిగట్టి, ఫలితాన్ని అనుభవించాడు. సంధియుగం 19

నిజానికి ఇంత పచ్చిగా కాకపోయినా అతనిలాగా పైకి చెప్పుకోకపోయినా కొంచం కుడి ఎడంగా నల్లవారిపట్టు తెల్లవారందరి ఆలోచనలు అలాగే వుంచాయి. మరి మనమేమో ఐదువేల సంవత్సరాల అతి ప్రాచీన నాగరికత గలవారమని గర్వపడుతుంచాము. మనది అంత పురాతనమైన సంస్కృతి అన్నమాట యదార్హమే. అయినప్పటికీ తెల్లవారి దృష్టిలో మనం “ అర్థనాగరీకులం'” “* అనాగరీకులం”'.

(ప్రపంచ పరిస్థితులు అనుకూలించినందువల్లనూ, గాంధీజీ అనుసరించిన అహింసాసత్యా[గ్రహ పద్రతులవల్లనూ మనకు రాజకీయ స్వాతం త్యం మనం అట్టే కష్టపడకుండా సునాయాసంగా లభించింది. నాలుగు శతాబ్దాల పరాయిపాలనలో నిర్వీర్యమైపోయిన జాతి తన పరాక్రమౌన్ని ప్రదర్శించవలసిన అవసరం లేకుండా, అలా సుళువుగా స్వరాజ్యం లభించినందువళ్హ మనకొకరకమైన అపకారం జరిగిందని కూడా అనాలి. అమెరికన్తవలె లేదా రష్యన్హవలె పోరాడి స్వాతంత్ర్యం సంపాదించుకున్నట్టుయితే ధీళక్తి, దేశభక్తి, క్రమశిక్షణ ఇప్పటికన్న ఎక్కువగా మనలో పెంపొంది వుండేవి. స్వాతంత్ర్యం విలువ ఇంకింత బాగా తెలిసి వచ్చేది. పాత మానసిక బానిసతనం మనలను వీడిపోయేది.

అలా జరగని లోపాన్ని మన జాతి ఇప్పుడు పూరించుకోవాలి. క్రమశిక్షణను సెంచుకోవాలి. స్వతం(త్ర్య మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి. తెల్లవాళ్లను ద్వేషించాలని కాదుగాని, వాళ్లు ''దొరలు* మనం ““తక్కువవాళ్ళం*' అన్న భావం నుంచి మనం విముక్తి పొందాలి. ఇంగ్రీషు భాషాభ్యాసం ఇందుకు మనకు తోడ్పడి ఉండవలసింది. నిజానికి, నాటి మన నాయకుల అక్స్‌ఫర్డ్‌ చదువులే మనలో స్వాతంత్ర్య దీక్షను పెంపొందించాయి. కానీ మరో 'ప్రక్క “మకాలే చదువులు" మనలో ప్టిరమైన మానసిక బానిసతనాన్ని పాదుకొల్పాయి. ఇదొక విచిత్రమైన విరుద్ర పరిఫ్టితి. నగరాలలో మన మాజీ రాజకీయ బానిసత్వానికి కొండ గుర్తులుగొ అక్కడక్కడా ఇప్పటికీ మనం నిలిచి ఉండనిచ్చిన తెల్లపాలకుల విగ్రహాలు కనపడగానే వంగి నమస్కరించేవారు ఇప్పటికీ లేకపోలేదు. అలా నమస్కరించినా, నమస్కరించక పోయినా వాటినలా ఉండనీయడమే మితి మీఠిన మన అతిసహనవానికిగుర్తు. కనీసం ఈ కొండ గుర్తులనైనా చెరిపివేసుకోలేమా? .. వాటిస్టానే మన స్వాతంత్ర్య వీరుల, జాతిపితల ప్రతిమలను (ప్రతిస్టించుకోలేమా? శరీరపురంగును బట్టికాక, బౌద్దిక (ప్రతిభనుబట్టి గౌరవించుకొనడం నేర్చుకొనలేమా? కొన్నిట వారు మనకన్న అధికులైతే, మరి కొన్నిట వారికంటే మనం ఎంతో అధికులమన్న ఆత్మవిశ్వాసం మనలో పెంచుకోవలదా?

మనసులో ఆటువంటి అత్మ విశ్వాసాన్ని, జాతీయ గౌరవాన్ని, అందరి ఎడల సమదృష్టిని పెంపొందించే. కొత్త విద్యావిధానం మనకు కావాలి. వ్యక్తికి అహంభావం ఎంత (ప్రమాదకరమైనదో, జాతికి నీరసభావం, మానసిక బానిసతనం అంత అనర్హదాయకమైనవి. జాతీయత అంతర్జాతీయతకు పునాది. ఈనాడు ఏ కాపిటల్మ్ట్‌ దేశ చరిత్ర చూసినా, ఏ కమ్యూనిష్టు దేళశచరిత్ర చూసినా ఇదే స్పష్టమౌతుంది.

(23.68.85) 20 సంధియుగం

భౌరతీయ సంస్కృతి అతి పురాతనమైనది. అమెరికన్‌ సంస్కృతి అధునాతనమైనది. అమెరికన్‌ ప్రజాస్వామ్యం అతి పురాతనమైనది. కాగా, మన (ప్రజాస్వామ్యం నాలుగు దశాబ్బాలలోపు (ప్రాయపుది. దేశ సమైక్యతా పరిరక్షణ కోసం యుద్దానికి దిగిన నాయకుడు, వాళ్ల లింకన్‌, హింసా విముఖత వల్లదేళ విభజనకు అంగీకరించిన నాయకుడు మన గాంధీజీ . ఇవన్నీ ఈ రెండు దేశాల మధ్య భిన్నత్వానికి దాఖలాలు కాగా ఈ భిన్నత్వంలో ఉభయ దేశాల మధ్య గల ఏకత్వాన్ని నిరూపించే అంశాలూ వున్నాయి. ఉభయ దేశాలూ ఒకనాడు (బ్రిటిష్‌ వలనపాలన (క్రింద మగ్గిన దేశాలే. రెండు దేశాలూ ఆ వలసపాలనను భిన్న మార్గాలలో ఓడించి జాతీయ స్వాతంత్ర్యాన్ని సాధించుకొన్నాయి. రెండు దేశాలూ “'ప్రజలు, ప్రజలుకోసం, (ప్రజలచేత (ప్రభుత్వాలను ఎన్నుకొనే'” సాంప్రదాయిక ప్రజాస్వామ్యాన్ని తమజాతి జీవన విధాలుగా ఎన్నుకొన్నాయి. ఇలా ఈ రెండు దేశాల మధ్య భిన్నత్వంలో ఏకత్వం కనబడుతుంది. రాజకీయ అర్టిక సంబంధాలు ఈ దేశాల మధ్య నిన్న మొన్నటివే కాని, సాంస్కృతిక సంబంధాలు మాత్రం చిరకాలంగా (ప్రళంసాత్మకమైన ఆదానప్రదానాలతో పరస్పరం ఒకదానినొకటి ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. అమెరికాకు జాతీయ స్వాతంత్ర్యం లభించిన అనంతరం భారతీయ విజ్ఞాన (ప్రభావం అమెరికామీద, అమెరికన్‌ మేధావులమీద (ప్రత్యక్ష (ప్రభావం చూపడం ప్రారంభమైంది. హెగ్రీ డేవిడ్‌తోరో, రాల్ఫ్‌ వాలో, ఎమర్సన్‌ వంటి అమెరికన్‌ తాత్వికులు భగవద్గీత ప్రభావానికి బాగా లోనైనారు. అంతకుముందు ఛార్లెస్‌ విల్‌కెన్స్‌ అనే ఆయన భగవర్గీతను ఇంగ్రీగులోకి ఆనువదించాడు. అది చదివిన తోరో, ఎమర్సన్‌ రచనలమీద దాని ప్రభావం బాగా ప్రసరించింది. తోరో సర్వసౌఖ్యాలను త్యజించి, మన మహర్షుల వలె వానప్రస్త జీవితాన్ని వరించడానికి భగవద్గీత, తదితర భారతీయ ధర్మశాస్త్రాలు ఆయనను ్రేరేపించాయి. విరాగిగా మారి వాళ్లైన్‌ సరోవర తీరంలో ఒక షర్ణకుటీరం నిర్మించుకొని, అన్ని బంధాలను వదిలించుకొని అక్కడ స్వేచ్చాజీవన ప్రయోగం చేశాడు తోరో. అలా భారతీయతత్వ (ప్రభావితుడైన తోరో రచనలు గాంధీజీని ఎంతో ప్రభావితం చేశాయి. 19వ శతాబ్ది పూర్వార్దంలో తోరో (వ్రాసిన “సివిల్‌ డిస్‌ఒబీడియన్స్‌'* అన్న వ్యాసం గాంధీజీని ఎంతగానో ఆకర్షించింది. తన సత్యాగ్రహ సిద్దాంతానికి ఈ తోరో రచన (్రేరకమైనట్టు గాంధీజీ ఒక సందర్భంలో చెప్పుకున్నారు. తోరో 1849 లో పాశ్చాత్యులకు ఒక సలహా ఇచ్చాడు. “+ (క్రైస్తవ మత గ్రంథాలు చదివే వారంతా కృష్ణద్వైపాయన వ్యాసమహర్షి నాలుగువేల సంవత్సరాలకు పూర్వం వ్రాసి పెట్టిన భగవర్గీత చదవడం మంచిదని సలహా ఇస్తున్నాను. అమెరికన్తందరూ భక్తిప్రపత్తులతో పారాయణం చేయదగిన పవిదత్ర గ్రంథం ఇది...” ఇది అమెరికన్లకు ఆయన చేసిన ప్రబోధం. దీనిని బట్టి హిందూ గ్రంథాలు ఆయన మేధను ఎంతగా ఆకట్టుకున్నాయో అర్ధమౌతుంది. సంధియుగం 21

భారతీయ తత్త్వం వళ్ల ఇంతగా (ప్రభావితుడైన ఈ అమెరికన్‌ మేధావి తాలూకు ఆలోచనల ప్రభావం తిరిగి గాంధీజీద్వారా భారతావనికి చేరింది. గాంధీజీ భారత స్వాతంత్ర్య సమరంలో తన అహింసా సత్యాగ్రహ సిద్దాంతాన్ని ఆచరణలో నిరూపించిన తీరు పాశ్చాత్య మతగురువులను, మేధావులను ఆశ్చర్యచకితులను చేసింది. వాళ్ళనే ఏమిటి, మొత్తం ప్రపంచాన్నే “గాంధీ మార్గం'* సం(భ్రమొశళ్చర్యాలలో ముంచెత్తింది. భారత స్వాతం(త్రా నంతరం, మనమైతే ఆయన సిద్దాంతాలను విస్మరించాముగాని, అన్యదేశాల వారిని మాత్రం అవి బాగా ఆకట్టుకొన్నాయి. ముఖ్యంగా సాంఘిక సమానత్వంకోసం. పౌరహక్కులకోసం పోరాడుతున్న అమెరికన్‌ నీ గ్రోలకు గాంధీజీ సిద్దాంతాలు శిరోధార్యాలైనాయి. గాంధీజీ తరువాత ఈ శతాబ్దంలో అహింసా సిద్దాంతాన్ని ఆచరణలో పెట్టిన నాయకులలో అతి ముఖ్యమైన నాయకుడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌: 1956లో మొదటిసారి నీగ్రో ఉద్యమంలో అహింసా సత్యాగ్రహ పద్దతులను అనుసరించిన నీగ్రో నాయకుడీయన. గాంధీజీ ఈ మార్గంలో భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టుగలిగాడు. కాగా, మార్చిన్‌ లూథర్‌కింగ్‌ ఈ గాంధేయ మార్గంలో అమెరికన్‌ నీగ్రోల పౌరహక్కుల ఉద్యమాన్ని చాలా ముందుకు తీసుకువెళ్ళి గలిగాడు. విచిత్రమేమిటంటే, గాంధీజీవలెనే మార్చిన్‌ లూధర్‌కింగ్‌ కూడా ఒక హంతకునిచేత నిహతుడైనాడు. అమెరికన్‌ జూతి జీవనంలో గాంధేయ మార్గాన్ని ఒక భాగంగా చేయగలిగినవాడు రెవరెండ్‌ మార్టిన్‌ లూథర్‌కింగ్‌. (22.6.85) స్గాగ్గాగ్గా కసాయి గుండెలు మనదేశంలో జూలిగుండెలు కలవారు చాలామందే వున్నారు. ఎదుటివారి ఇక్కట్లు చూచి ఎదలు కరిగిపోయే సంప్రదాయం ఈనాటిది కాదు. అయితే ఇటీవలి కాలంలో కసాయి గుండెలు కలవారి సంఖ్య కూడా కోకొబ్బలుగా వున్నట్టు కనిపిస్తున్నది. పూర్చుకాలంలో దుష్టులు లేరనికాదు. కాని ఈకాలంలో వారి సంఖ్య విరివిగా పెరిగింది. కాలమాన పరిస్తితులలో వచ్చిన మార్పులుకూడ అందుకు కొంత కారణం కావచ్చు. ఈమార్చులలో కనపడే ఒఓఒకలక్షణం మానప్రాణాలపట్లు విలువ తగ్గిపోవడం. ఏం ఇంటాబయటా [5-1 [- 86 22 సంధియుగం

(ఆొంతదర్హు గం నళ

ఈ 6 ర్ర్యాన్ని క్వూవ్రాను; చర్చిల్ని చూచాను; రూజ్బ్వాళ్డ్‌ని చూచాను; స్ట్రాలిన్ని చూచాను; ఐన్‌స్టయిన్ని చూచాను ... ఇంకా ఎందరెందరో ప్రముఖ నాయకులను కలిశాను. కాని, గాంధీ వంటి విశిష్టమైన వ్యక్తిని మరెవరినీ నేను చూడలేదు” ప్రఖ్యాత రచయిత లూయిీఫిషర్‌ గాంధీజీని గురించి చెప్పిన మాటలివి.

ఇలా ఎందరో (ప్రపంచ మేధావులు గాంధీజీ సిద్దాంతాలవల్ల ఆయన విశిష్టమైన వ్యక్తిత్వంవల్ల (ప్రభావితులైనారు. 1921లో జాన్‌ హెచ్‌. హోమ్స్‌ న్యూయార్క్‌లో ఒకానొక సభలో ** ప్రపంచంలో మహోత్తమ వ్యక్తి ఎవరు?** అనే అంశంపై ప్రసంగిస్తూ '“మోహనుదాస్‌ కరంచంద్‌ గాంధీ ఈ (ప్రశ్నకు సరైన జవాబు”” అని వక్కాణించాడు. గాంధీజీ ఆత్మకథను మొదటి సారిగా అమెరికాలో ప్రచురించిన "యూనిటీ" అనే పత్రికకు ఆ కాలంలో రెహెండ్‌ హోమ్స్‌ సంపాదకుడు. ఆయనే మరొక సందర్భంలో "'గాంధీజీతో నికరంగా పోల్చదగిన మరొక మహాత్ముడు ఒక్క జీసస్‌ మాత్రమేనని భక్తి ప్రపత్తులతో చెప్పవచ్చు' "నని అన్నాడు.

గాంధీ సిద్దాంతాల (ప్రభావం విశ్వజనీనమైనది. ఈ ప్రభావం అన్నికాలాలలో అన్నిదేశాల మానవులందరిని ఆకట్టుకోగలది. ఆఫ్రికన్‌ నీగ్రోల మానవ హక్కుల ఉద్యమాలపై గాంధీజీ అహింసా సిద్దాంత ప్రభావం బాగా ప్రసరించింది. అమెరికాల్లో స్వర్గీయ డాక్టర్‌ మార్షన్‌ లూథర్‌ కింగ్‌ నాయకత్వాన నల్లజాతి ప్రజలు తమ ఉద్యమాన్ని గాంధేయ పథంలో మలచుకొన్నారు. *““ఆహీంస మనకు అత్యంత శక్తి వంతమైన ఆయుధం'' అని రెవరెండ్‌ కింగ్‌ తన మరణానికి పది రోజులు ముందుగా న్యూయార్క్‌లో ఒక సభలో ప్రకటించాడు. ఆయన గాంధీజీ చూపిన సత్యాగ్రహమార్గాన్ని అమెరికన్‌ నీగ్రోల సమానహక్కుల సాధన ఉధ్యమంలో ఫల (ప్రదంగా వినియోగించాడు. విదేశాలలో గాంధీజీ సిద్దాంతాలకు లభించిన నిజమైన వారసులలో ఆయన ఒకరు. క్రాంతిదర్శి అయిన గాంధీజీ 1936లో చెప్పిన జోస్యం ఇలా నిజమైంది ఆనాడు తనను చూడవచ్చిన కొందరు అమెరికన్‌ నీగ్రో ప్రముఖలతో గాంధీజీ '' అసలైన అహింసా సందేశం ప్రపంచానికి బహుశా నీగ్రోల ద్వారానే వినిపించబడవచ్చు"”' నని అన్నారు. సత్యాగ్రహ ఆయుధాన్ని గాంధీజీనుంచి అరువుతెచ్చుకున్నామని డాక్టర్‌ కింగ్‌ పదేపదే చెబుతుండేవారు.

(ప్రపంచ చరిత్రలో గాంధీతత్త్వం ఒక సరికొత్త ప్రయోగం. సత్యం, అహింస అనే వాటిని ఆయన కొత్తగా కనుగిొన్నారని కాదు. ఈ చిరకాల పరమధర్మాలను (ప్రజలు తము దైనందిన జీవితంలో అనుష్టించేటట్టు చేయడానికి ఒక సులభసాధ్యమైన మార్గాన్ని కనుగొనడానికి తాను ప్రయత్నించానని గాంధీజీ ఒక సందర్భంలో చెప్పుకున్నారు. ఆయన కంటె ఎంతో ముందు గౌతమ బుద్దుడు, ఏసుక్రీస్తు వంటి మహాపురుషులు ఈ ధర్మాలను ప్రబోధించారు. గాంధీజీ దీనినొకజీవిత విధానంగా రూపొందించి తన జీవితంలో తు.చ. తప్పకుండా అనుసరించడమే కాకుండా సకల మానవకోటి జీవిత విధానంగా మలచడానికి ఉద్యమించారు. బహుశా మానవ చరిత్రలో ఇలాంటి సత్యశోధన చేసినవారు ఆయన ఒక్కరేనేమో! సంధియుగం 23

మహామారణాయుధాలు సకల (ప్రపంచాన్ని కణాలలో శ్శశానవాటికగా మార్చగల (ప్రళయ ప్రమాదం (ప్రపంచాన్ని పొంచి వున్న నేటి కాలంలో మానవకోటి నశించిపోకుండా కాపాడగలమార్గం గాంధీ మార్గమొక్కటేనేమో?

ఆధునిక పారిశ్రామిక అతి విస్తరణవల్ల నేటి ప్రపంచాన్ని కావురు కప్పిన భూమాలిన్యాల బెడదను పసిగట్టిన పాశ్చాత్య మేధావులు పలువురు గాంధీజీ ప్రవచించిన ఆర్టిక వికేంద్రీకరణ విధానమే శరణ్యం కావచ్చునన్న గుర్తింపుకు ఇప్పుడిప్పుడే వస్తున్న సూచనలు కానవస్తున్నవి. ఈనాడు పలువురు ప్రపంచ మేధావులు (ప్రపంచ పారిసరిక మాలిన్య ప్రమాదాలను గురించి చేస్తున్న హెచ్చరికలు, సూచనలు గాంధీజీ ముందుచూపునకు నిదర్శనాలు ఆర్ధ ళతాబ్రికి ముందే ఆయన రానున్న ఈ (ప్రపంచ సంక్షోభాన్ని పసికట్టారు. కనుకనే ఆయన మానవకోటికి మార్గదర్శి అయినారు.

గాంధీజీ పేదలను ప్రేమించారు. అయినా, సంపన్నులను ద్వేషించలేదు. తమ మతంలోని గొప్ప సంప్రదాయాలను ఆరాధించారు. అయినా, అన్యమతాలను ద్వేషించలేదు. ఆయన తన దేళ స్వాతంత్ర్యాన్ని కాంక్షించారు సాధించారు. అయినా బ్రిటీష్‌వారిని ద్వేషించలేదు అందుకే ఆయన మహాత్ముడైనాడు.

వ్యష్టి, వ్యవహారంలోనైనా, సమష్టి వ్యవహారాలలో నైనా, జాతీయ వ్యవహారాలలోనైనా, అంతర్జాతీయ వ్యవహారాలలోవైనా అన్నిటా సామమార్ల మొక్కటే నాగరిక పద్రతి అని గాంధీజీ వక్కాణించారు. దాన భేద దండోపాయాలను లోకం పూర్తిగా విసర్రించాలని ఆయన ప్రబోధించారు. దౌస్ట్యాన్ని ధైర్యంగా అహింసా మార్గాన ఎదుర్కోవాలన్నది ఆయన సిద్దాంత సారం. కోపతాపాలూ, భయసంకోచాలూ, హింసాద్వేష ప్రవృత్తి నానాటికీ పెచ్చరిల్లుతున్న నేటి (ప్రపంచంలో గాంధీతత్వమే రక్ష ఆయన వంటి నాయకత్వం లేని లోపం నేడు మనకు కొట్టువచ్చినట్టు కనబడుతున్నది.

మహాశాస్త్రవేత్త ఐన్బోన్‌ '“గాంధీజీ'*ని తనకాలపు రాజకీయరంగంలో మహోన్నత మానవ సంబంధాల కోసం ప్టిరంగా నిలబడిన వ్రైక రాజనీతికోవిదుడు అని శ్ఞాఘించాడు. గాంధీజీ మహోదాత్త భావాల ప్రబోధకుడు మాత్రమే కాదు. గొప్ప కార్యశూరుడు కూడా. ఈరెండు లక్షణాలు కలిసినందునే ఆయన ఒక మహత్తర శక్తిగా రూపొందారు.

గాంధీజీ స్వాతం త్ర్య సమర సారధ్యం వహించి, ఆ ఉద్యమంలో తలమునకలై వున్నప్పటికీ మహిళల సమాన హక్కులను మగవారు గుర్తించి అంగీకరించేటట్టు చేయడానికి తనకు లభించిన ప్రతి ఆవకాశాన్ని వినియోగించుకున్నారు.

““మహిళల హక్కుల విషయంలో ఏ విధమైన రాజీకి నేను అంగీకరించను. పురుషులకు వర్తించని న్యాయ శాసనాలేవీ (స్త్రీలకు వర్తించకూడదని నా అభిప్రాయం, కొడుకు, కూతురు ఇద్దరికి సరిసమానమైన హక్కులుండాలి. మహిళను అబల అనడం ఒక పెద్ద అపచారం. ఇది "స్రీలకు పురుషులు తలపెట్టిన అన్యాయం. బలానికి అర్ధం (క్రూరత్వమే అయితే స్త్రీలు పురుషులంత (క్రూరులుకాని మాట నిజమే. అలాకాక బలమంటే నైతిక బలమనే అర్ధమైతే ఈ బలంలో పురుషునీ కంటే (స్త్రీకి ఎంతో ఆధిక్యత వున్నది. సహనం, త్యాగం, ధైర్యం, సాహసం వంటి శక్తులు (స్త్రీలో పురుషుని కంటె ఎంతో ఎక్కువ పాళ్ళలో వున్నాయి. అహింస మన విధానమైతే భవిష్యత్తు మహిళలపైనే ఆధారపడి ఉంటుంది.” ఇది (స్తీ గురించి గాంధీజీ నిశ్చితాభిప్రాయం. (110.83) 24 సంధియుగం

(రట్ర్రుశ్చం దిర్హాలుళ్చనుం చంశ్రలోమొట్ట మొదటిసారిగా 1947 ఆగష్టు 15 వ తేదీన మనమీద రాచరికపు పాలన అంతమయింది. అంతవరకూ ఆయా చక్రవర్తుల తాలూకు ఆస్తిపాస్తులలో ఒక భాగంగా మా(త్రమేవుంటూ వచ్చిన మన దేళ ప్రజలకు ఆనాడు స్వేచ్చ, స్వతంత్ర పౌరసత్వం, పౌరులుగా (ప్రాథమిక హక్కులూ లభించాయి. ఈ స్వేచ్చా పౌరసత్వాలను అన్నిటినీ మన రాజ్యాంగ చట్టుంలో ్రోడీకరించుకున్నాం. అయితే, మన పాత మత సం ప్రదాయాలవల్ల మన సమాజం చిరకాలంగా అంచెలంచెలుగా విభజించబడి ఉన్నది. రాజకీయ స్వాతం త్యం వచ్చిందేకాని, మన సమాజంలోని ఈ నిమ్నోన్నతాలు మాత్రం తొలగిపోలేదు. అంటే రాజకీయ స్వాతం త్రానికి పరిప్యూర్ధతను ఈయగల సామాజిక సమతా దృష్టీ, ఆర్హిక సమానత్వమూ మనకు ఇంకా పూర్తిగా చేకూరలేదు. ఈ రెండు హంగులూలేని రాజకీయ స్వాతంత్ర్యానికి నిండుతనం వుండజాలదని ముందు చూఫపుగల మన జాతీయ నాయకులు తొలుతనే గుర్తించారు. ముఖ్యంగా. భారత జాతీయ కాంగ్రస్‌ ఆధ్వర్యాన సాగిన ఉద్యమానికి గాంధీజీ నాయకత్వం అభించిన తరువాత ఈ గుర్తింపు మన నాయకులలో మరింత స్పష్టంగా గోచరించింది. కనుకనే జాతీయ స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక అంతర్భాగంగా కుల, మత, సాంఘిక అసమానతలను తొలగించే ఉద్యమం కూడా దేశంలో సాగుతూ వచ్చింది. గాంధీజీ దాదాపు రెండు దశాబ్దాలపాటు దక్షిణాఫ్రికాలో వుండి శ్వేత జాతీయులు అక్కడ నల్లవారిని (భారతీయులను) పెడుతున్న హింసలను తొలగించడానికి ఆ దేశంలో ప్రజా ఉద్యమాలునడిపించారు. అలా చేస్తున్నపుడే, ఇక్కడ మన దేళంలో తెల్లవారి పరిపాలనను అంతమొందించనిదే.ఇందా, బయచా భారతీయులకు వ్యక్తిత్వంగాని, పరుపు ప్రతిష్టలుగాని వుండజాలవని గాంధీజీ గుర్తించారు. ఆ గుర్తింపు వల్లనే ఆయన 1915లో స్వదేశానికి తిరిగి వచ్చి, జాతీయ స్వాతంత్ర్య ఉద్యమ నాయకత్వాన్ని చేపట్టారు. ఈ జాతీయ ఉద్యమానికి జన బాహుళ్యం నంచి సహకారం లభించాలంటే మనలో మనలను వేరు చేస్తున్న కుల, మత పరమైన పాత విచక్షణలను తొలగించుకొనడం అవసరమని బాపూజీ గుర్తించారు. అలా (ప్రారంభమయింది అస్పృళ్యతా నిర్మూలన ఉద్యమం. అయినా ఈనాటికీ అంటరానితనం పూర్తిగా మాసిపోయిందని అనుకోజాలని శోచనీయ స్థితిని చూస్తున్నాం. నిజమే, పలు శతాబ్దాలుగా నునలో జీర్దించిపోయి వున్న ఈ తారతమ్య దృష్టిని తొలగించడం అంత తేలికగా సాధ్యంకాదు. అలాగని మన బాధ్యతల నుంచి మనం తప్పించుకొనజాలం, కనుకనే దేశంలో దురాచార నిర్మూలన కృషి సాగుతూనే ఉన్నది. ప్రజానీకం వైఖరిలో పూర్వం కంటే ఎంతో మార్పు వచ్చిన మాట నిజమే. గాంధీజీ ప్రారంభించిన ఈ అస్పృళ్యతా నిర్మూలన ఉద్యమం దేశంలో మిగతా (ప్రాంతాల కంటే తెలుగునాట ఒకింత ఎక్కువ ్రభావాన్ని ప్రసరించిందేమోననిపిస్తుంది. దాదాపు అదే కాలంలో రష్యాలో జయ ప్రదమైన మార్క్సిస్టు ఉద్యమ ప్రభావం కూడా గాంధీజీ తలపెట్టిన ఈ ఉద్యమ వ్యాస్తికి బాగా దోహదం చేసిందనటానికి నిదర్శనాలున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి ఈ మాట బాగా వర్తిస్తుంది. నిజానికి గాంధీజీ రంగంలోకి రాకముందు సైతం సంధియుగం 25 త్రి

ఆం(ధ్రలో అంటరానితనానికి వ్యతిరేకంగా కొంత (ప్రచారం జరుగుతూ ఉండేది. ఈ కారణాలవల్ల హరిజనోద్రరణ ఉద్యమం తెలుగునాట బాగా సాగింది.

ఉన్నవ లక్ష్మీనారాయణ గారు 1925లో వ్రాసిన మాలపల్లి నవల, ఆచార్య రంగాగారు 1935లో వ్రాసిన “హరిజన నాయకుడు' నవల, ఆ తరువాత కొన్నాళ్ళకు గూడవల్లి రామ బ్రహ్మంగారు నిర్మించిన ' మాలపిల్ల సినిమా, ఎందరెందరో ఆం(ధ్ర జాతీయ కవులు ఆ రోజులలో అంటరానితనాన్ని నిరసిస్తూ, హరిజనోద్రరణను (ప్రభోదిస్తూ (వ్రాసిన పద్యాలూ, పాటలూ, గేయాలూ తెలుగునాట గాంధీజీ ఉద్యమ (ప్రభావ (ప్రాబల్యానికి దృష్టాంతాలుగా చెప్పుకోవచ్చు. బాపుజీ 1929 ఏప్రిల్‌, మే మాసాలలో తెలుగు నాట విస్తారంగా పర్యటించి, హరిజనోద్దరణ ఉద్యమాన్ని విసృతంగా ప్రచారం చేశారు.

ఆ ఏప్రిల్‌ 6వ తేదీన గాంధీజీ హైదరాబాద్‌లో ప్రసంగిస్తూ ఇలా అన్నారు. “ఆది హీందువులను అంటరాని వారుగా చూడడం, హిందూ మతానికి ఒక గొప్ప కళంకం. నేను సనాతన ధర్మావలంబకుళ్లి. ఈ అస్పృశ్యతా దురాచారానికి హిందూమతంలో ఎక్కడా స్టానం లేదని ఘంటాపథంగా చెప్పగలను. మీరు ఆది హిందూ జనులను ఉద్దరించి, మీ కళంకాన్ని తొలగించుకోవాలి. ఇది హిందూ ధర్మానికి నిజమైన శుద్ది అవుతుంది. ??

గాంధీజీ 1929 ఏ్రిల్‌.మే నెలలలో ఆంధ్రలో పర్యటించి హరిజనోద్రరణ (ప్రచారం సాగించినప్పటి అనుభవాలను కొన్నింటిని ఆయన 'యంగ్‌ ఇండియా' పత్రిక (మే 16, 1929, సంచిక)లో (నవ్రాసిపెట్టారు.

అందులో ఇలా వుంది. “ అస్బృళ్యతా విష సర్పం చివికిపోయిందిగాని పూర్తిగా చావలేదు, దాని విషఫలితాలు వుంచాయని అనుకొనని చోట్లు కూడా అవి కనిపిస్తూనే వున్నాయి. ఏట్రిల్‌ 22వతేదీన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మహిళల మహాసభజరిగింది. ఆ సభకు మూడు నాలుగు వందలమంది మహిళలు వచ్చారు. ఆ సభలో నా ప్రక్కన కూర్చున్న ఒకయువతిని చూచి పంచమ బాలిక అని సభికులు గుసగుసలాడుకోవడం కనిపించింది. సభ ముగిసిన వెంటనే వారందరు అప్పటి వరకూ ఒకరినొకరు తాకుతూ కూర్చున్న పాప పరిహారం కోసం అక్కడ నుంచి తిన్నగా కాలువకు వెళ్ళి నీళ్లలో మునిగివచ్చారు.

“నిజానికి ఆ రోజునవా ప్రక్కన కూర్చున్న యువతి సుప్రసిద్ర నాయకుడు (వ్రజకిష్తోర్‌ కుమార్తె ప్రభావతీదేవి. ఆమెనా ఆ(శ్రమవాసి. ఆమెనా కుమార్తె అనికొందరూ, నా కోడలు అని కొందరూ అనుకుంటారు. తణుకు మహిళలు మాత్రం ఆమెను అంతిమ జాతి బాలిక లవ్మీ అనుకున్నారు. ఈ విషాదపూరిత హాస్య నాటకం మనకొక పాఠాన్ని నేర్చుతున్నది”*”.

రాజమండ్రి సమీపాన ఒక గ్రామంలో జరిగిన సభాఉదంతాన్ని గురించి గాంధీజీ అదే పత్రికలో ఇలా తెలిపారు. “చక్కని ఏర్పాట్లు చేసిన ఆ సభలో స్పృళ్యులకూ, అస్పృుళ్యులకూ,

స్త్రీలకూ విడివిడిగా కూర్చునే ఏర్పాట్టు చేశారు. (ప్రేక్షకులనుద్దేశించి పంచములతో కలిసి కూర్చోవడానికి మీకేమైనా అభ్యంతరమా? అని ఆడిగాను. “లేదు, లేదు అంటూ ఆంతా చేతులెత్తారు. ఆ తరువాత అందరూ కలిసి మెలిసి కూర్చొని నా ఉపన్యాసం విన్నారు. ఆవేళనా ఉపన్యాసమంతా అస్పృళ్యత మీదనే నడిచింది. అలా ఆ సభ జరిగిన తరువాత కూడా ఎవరైనా పుణ్యస్నానాలు చేసి వుంచే అందుకు కారణాలు తెలుసుకోగలవారు మానసిక శాస్త్రజ్ఞులు మౌత్రమే. ఆ సభలో అలా కలిసి కూర్చున్న వారిలో మహిళలు కూడా ఉన్నారని చెప్పి ఈ కథ ఇంతటితో ముగిస్తున్నాను?! అనిగాంధీజీ వ్రాశారు. (25.87) 26 సంధియుగం

౧క్రతంక్యు నర్చెకల న్వన్నుల

ఆఅనేకళళాబ్టాల సుదీర్హచరిత్ర, సంస్కృతి గల ఒక దేశచరిత్రలో కొన్ని దశాబ్దాలు చాలా స్వల్పకాలమే అయినా, పరాయి పాలననుంచి స్వాతంత్ర్యం సంపాదించుకొని, ఆధునిక ప్రజాస్వామిక జీవనం కొత్తగా ప్రారంభించుకొన్న మన దేశం ఏ దిళగా సాగిపోతున్నదో తెలుసుకోవడానికి, మంచి చెడులను బేరీజు వేసుకొనడానికి ఈకాలం గణనీయమైదే.

తొలితరం స్వాతం త్రోద్యమ నాయకులు ఎన్నెన్నో త్యాగాలు చేసి తమ శక్తియుక్తులను యుక్తియుక్తంగా వినియోగించి, మానవ చరిత్రలోనే అపూర్వమైన, అసాధారణమైన అహింసా పద్దతిలో మనదేశాన్ని పరాధీనతనుంచి తప్పించి మన కప్పగించారు. దేళ భవిష్యత్తును గురించి వారు కన్నకలలను నిజం చేయడానికి, స్వతంత్ర భారతావనిని జవం, జీవంగల నవసమాజంగా తీర్చిదిద్దుకొని ప్రపంచదేశాల మధ్య సముచిత గౌరవస్ట్రానం పొందడానికి మనం చేయవలసినదంతా చేసుకొంటున్నామా? లేక దేళశపితల ఆశలను ఆడియాసలు కావిస్తున్నామా?

“ఈవేళ లభించిన ఈ స్వాతంట్ర్యాన్ని ఇంచాా బయటా ఎదురుకాగల అన్ని రకాల (ప్రమాదాల నుంచి అప్రమత్తంగా కాపాడుకోవాలి. సమాజంలో నిమ్నోన్నతాలను పాటించకుండా, ఆందరికీ సమాన గౌరవ్వార్తతలు ఉండాలి, కష్టజీవుల (శ్రమకు తగిన ఫలితం లభించాలి. గ్రామసీమలలో చమటోడ్చి పంటలు పండించే రైతుకు న్యాయం జరగాలి. ఇకముందు ఇది మన సొంత బాధ్యతః' అని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 1947 ఆగస్టు 15 నాడు తాలి స్వాతం శ్రోత్సవ సందేశంలో హెచ్చరించారు.

““ఉన్నత స్థానాలలో అవినీతిని నిర్మూలించి, బంధుస్రీతిని, అధికార వ్యామోహాన్ని, మితిమీరిన లాభాపేక్షను, చీకటి వ్యాపారాన్ని కూకటివేళ్ళతో పెకలించి వేయకపోతే మన వ్యవహారాలను మనం సామర్యంతో నిర్వహించుకొనజాలం'' అని డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఆరోజున దేశానికి హితోపదేశం చేశారు.

“ఈ శుభసమయంలో దేశసేవకు, దేళ (ప్రజల (శ్రేయస్సుకు మాత్రమే కాక సర్వమానవ 'శ్రేయస్సుకోసం మనలను మనం అంకితం చేసుకొంటున్నామని ప్రతిన బూనడం సముచితంగా, సమయోచితంగా ఉంటుంది. ఈవేళ లభించిన ఈస్వాతంత్రాన్ని, ఈమహత్తర అవకాశాన్ని వినియోగించుకోగల, భవిష్యత్తులో ఎదురుకాగల సవాళ్ళను అవగాహన చేసుకోగల వివేకం మనకు వున్నదా? అలా ఎదురయ్యే. సమస్యలను పరిష్కరించుకోగల ధైర్య సాహసాలు మనకున్నాయా? ఈ విషయం భవిష్యత్తే నిరూపించాలి. భవిష్యత్తు పూలపాొన్సు కాదు. దేశసేవ అంటే కోట్లాది పీడిత ప్రజానీకపు సేవ అని అర్ధం. ఈ అవగాహనతో, ఈ దీక్షతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళగల శక్తి సామర్థ్యాలు మనకున్నాయా?”' అని జవాహర్‌లాల్‌నెహ్రూ ఆవేళ తనను తాను ప్రల్నించుకున్నారు. అది భావితరాలకు ఆయన వేసిన యక ప్రళ్ళ. సంధియుగం 27

“నామతంపట్టు నాకు అచంచలమైన విశ్వాసమున్నది. అది మానవులందరి మతం, అన్ని మతాలసారం అందులో వున్నది. అన్యమతాలన్నిటిని సమంగా గౌరవించే మతం నాది, నా మతం ఏ ఒకవర్గపు ప్రయోజనం మాత్రమే కోరేది కాదు, నా మతం ఏ మతానికీ ళత్రువు కాదు, అన్య మతస్టులెవరూ నాకు శత్రువులు కారు. మానవులందరినీ (ప్రేమించే మతం నాది. ఈనాటి మతొఅకన్నిటికీ అతీతమైనది నా మతం. సర్వమత సామరస్యమే నా మతం” అని గాంధీజీ ప్రబోధించారు.

ఈ మహా నాయకులంతా ఈనాడు మళ్ళీ తిరిగి రాగలిగిత్మే మనల్ని చూచి ఏమనుకుంటారు? సమాజంలో నిమ్నోన్నతాలను తాలగించుకోగలిగామా? సోమరులు (శమజీవులను దోచుకొనడాన్ని అరికట్ట గలిగామా? అని ప్రశ్నించుకొంటే '' ఇంతవరకు లేదు? అన్న జవాబే వస్తుంది. అవినీతి, బంధుప్రీతి, పదవీ కాంక్ష దొంగ వ్యాపారం. వీటిని నిర్మూలించగలిగామా? నిర్మూలించుకోలేదు సరిగదా ఈనాడీ దుర్గుణాలు విచ్చలవిడిగా పెచ్చు "పెరిగిపోయాయి. బంధుప్రీతి, పదవీకాంక్ష రాజకీయ నాయకులను వళపరచుకొనగా, అధికారులను అవినీతి ఆవరించింది. చీకటి వ్యాపారం సంప్రదాయంగా మారిపోయింది. ఈ దుర్గుణాలన్నీ నేటి సమాజున్ని కావురు కప్పివేశాయి.

స్వాతం శ్రోద్యమం నాటి సేవాతత్పరత కార్యదీక్ష ఇప్పుడు కరవైపోయాయి. చేజిక్కిన అధికారాన్ని వీలైనంత ఎక్కువ సాంతలాభానికి వాడుకోవడం వతనగా మారిపోయింది. అనాటి నాయకుల ఆదర్శం నాటి యువకులలో సేవాధర్మాన్ని, త్యాగనిరతిని, పురోగామి దృక్పధాన్ని (ేరేపించింది. నేటి యువకులలో అటువంటి ఆదర్శ్భాలూ లేవు. పరాన్న భుక్కుతత్వం, సోమరితనం, ఆకతాయితనం, ఇవి నేటి యువకులలో సాధారణంగా కనిపించే గుణాలు నేటి నాయకులలో యువకులను సత్కార్యాలకు ్రేరేపేంచగల ఆదర్శాలు మచ్చుకైనా కానరావు,

దేశసేవ, జాతి సంజేమంతో పాటు సర్వమానవ సౌభ్రాతృత్వంకోసం మనలను మనం అంకితం చేసుకోవాలన్న జవహర్‌లాల్‌ని హూ ఆళ అడియాస అయింది. పదవి చేపట్టిన (ప్రతివారూ తమకోసం, తము ఆత్మబంధువుల కోసం మాత్రమే ఆ అధికారాన్ని దఖలు పరచుకొనటం ఈనాటి రాజకీయ దుస్సంప్రదాయం. ప్రధాని బిడ్డడే ప్రధాని కావాలి. ముఖ్యమంత్రి బిడ్డడే ముఖ్యమంత్రి కావాలి అన్న అభిలాష ఈనాటి రాజకీయ నాయకులందరిలోనూ ఒకేలా కనపడుతున్నది. ““నావిష్టు పృ్పధివీ పతిః అన్న రాచరిక కాలపునాటి నానుడి “*నా విష్ణు పదవీ పతిః” అన్న కొత్త నానుడిగా మారిపోయింది. ఢిల్లీలో, శ్రీనగర్‌లో, హైదరాబాద్‌లో దేశంలో మరెక్కడా చూచినా "“పదవీపతుల'' నినాదమిదే, అత్యమిదే.

స్వాతంత్ర్యానంతర కాలంలో మనదేళం ఏమీ సాధించలేదనడం అసత్యమే అవుతుంది చ్యవసాయు, పారిశ్రామిక ఉత్పత్తుల విషయంలో దేళం ఎంతో అనివృద్రి సాధించిన మాట నిజం.

అయితే, ఉత్పత్తుల అభివృద్దిని మింగివేసే విధంగా జనాభా పెరుగుతున్నందున దేశంలో దారిద్ర్యం తగ్గలేదు. వ్యాపారులలో మితిమీరిన స్వార్ధంవల్ల సాధించిన అభివృద్ది ఫలితాలు

సేదప్రజల కందడంలేదు. నాయకులు అధికారుల, వ్యాపారుల స్వప్రయోజనాలకే దేశసంపద హెచ్చుగా దుర్వినియోగమౌతున్నది. వారు వీరనిలేదు. అందరిలోనూ ఇదే కనపడుతున్నది. ఈ పరిస్థితిని మార్చడం (ప్రభుత్వంవల్ల మాత్రమే అయ్యే పనికాదు. ప్రజలలో కొత్త వైతన్యంరావాలి, వారి ఆలోచనా దృక్పథంలో మార్పురావాలి, నాయకులూ, అధికారులూ 28 సంధియుగం

కూడా (ప్రజలలో నుంచి వచ్చినవారే. (ప్రజల మౌలిక ఆలోచనలలో మార్పురానంతవరకు ఈ అవాంఛనీయ పరిస్టితి మారదు. పాత విలువలు ' అంతరించిపోతున్నాయ' ని వృద్రతరం వారు బాధపడుతున్నారు. కాదు, “విలువలు మారిపోతున్నాయి' అని యువతరం అంటున్నది. సమాజ శ్రేయస్సుకు పాత విలువల పునరుద్దరణ. పరిరక్షణ అవసరమని పెద్దలంటున్నారు, పాత విలువలు బూర్జువా విలువలన్సీ అవి ధనికుల ధన, మాన (ప్రాణాలను పరిరక్షించడానికి మాత్రమే పరిమితమైనాయనీ, సామాన్యులకు వాటివల్ల (ప్రయోజనం లేదనీ, కనుకనే అవి మారిపోతున్నాయనీ నేటితరం యువత అంటున్నది. ఇది ఈనాటి తళాల మధ్య తారతమ్యం. మార్పు అవసరమన్న మాట నిజమే, కాని, మనిషి ప్రాణానికి విలువ నివ్వని విలువలు మానవ విలువలు కాజాలవు. ఆలానే కొద్దిమంది కలవారి, పై అంతస్టుల వారి ప్రయోజనాలను మాత్రమే కాపాడే విలువలు కూడా నేటి కాలానికి పనికిరావు. మతం పేరిట మనుషులను చంపుకునే మతమౌఢ్యం ఎంత ప్రమాదకరమైనదో మార్పుపేరిట మనుష్యులను మనుషులు చంపుకునే నూతన సామాజిక మౌఢ్యంకూడా అంత అవాంఛనీయమైనదే. పిన్నల మనోభావాలను పెద్దలు అవగాహన చేసుకోవాలి. అలానే పెద్దల అనుభవసారాన్ని యువకులు ఆకళింపు చేసుకోవాలి. పెద్దల అనుభవం, పీన్నల ఉత్కం ఠలను మేళవించినప్పుడు మంచి సామాజిక వ్యవస్థ రూపొందుతుంది. యువకులు నవసమొజ నిర్మాణంలో నూతన సామాజిక నీతులనూ, ధర్మాలనూ సృష్టించగల మేధాళక్తిని పెంపొందించుకోవాలి. బూజుపట్టిన మూఢాచారాలనూ, అనర్ధకమైన కొత్త దుస్సాహసాలను సమంగా ఎదిరించి సరికొత్త సమ సమాజ నిర్మాణంలో నాయకత్వం వహించగల నేతలు నేడు కావాలి. (10.484) ఉదారమైన కాంగ్రెస్‌ భారత జూతీయ కాంగ్రైస్‌కీ హిందూమతానికి చాలా పోలికలు కరపడతాయి. మలొలలో హిందూమతం ఎంత ఉదారమైనదో రాజకీయ పక్షాలలో కాంగ్రెస్‌ పతయూ అంత ఉదారమైనది. హిందూమతంలో ఎందరు దేవుళ్ళూ ఎన్లిరకాల భక్తులూ వున్నారో, కాంగ్రెస్‌లో ఆందరు నాయకులూ అన్నిరకాల భక్తులూ శ్రన్హారు. దానిలో వచ్చినట్టే దీనిలోరూ ఎన్హిసాడ్లో తిరుగుబాట్లు చీలికలూ వచ్చాయి.... వాటీ ఫలితంగా హీిందూమతంనుంచి ఎన్జిలకాల మతాలూ మతతెగలూ అవిథ్ధువించాయో. కాంగ్రెస్‌నుంచి అన్ని కొత్త కొత్త పార్టీలు వుట్టుకొచ్చాయి. కొత్తమతాలవలెనే ఈ కొత్తప్పార్ధీలలో కొన్ని మఖలో వుట్టీ పుబ్బలో అంతరించాయి. హిందూమతంలాగానే కాంగ్రెస్‌ పార్రీకూడా ఇన్లి తిరుగుబాట్లను ఇని చీలికలరూ జ్వీర్థించుకుంటూ చిరకాలంగా మనగలుగుతున్నది...... ఇంటా బయటా 18-7-86 సంధియుగం + 29

వ్య£ఇంణేయీ శాయ్‌ా ఖభౌొరత జాతీయ కాంగ్రెస్‌ సర్వ ప్రతినిధి సభ (ఏ.ఐ.సి.సి) బొంబాయిలో 1942

ఆగస్టు 8వ తేదీన సమావేశమై '' ఇండియాను విడిచి వెళ్ళిపోండి”” (క్విట్‌ ఇండియా) అని బ్రిటిష్‌ పాలకులకు (శ్రీ ముఖం ఇచ్చింది. అప్పటికి 57 సంవత్సరాలుగా (ప్రజా ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా నడుపుతున్న కాంగ్రస్‌ అంతకు ముందెన్నడూ ఇంతటి తీవ్రమైన హెచ్చరిక చేసి ఎరుగదు. రెండవ (ప్రపంచ యుద్దంలో దెబ్బ మీద దెబ్బ తింటున్న సమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఇది మింగజాలని మరొక పెద్ద ఎదురు దెబ్బ అయింది. 1941లో రాయబారం వచ్చిన స్రీఫర్డ్‌ క్రిప్స్‌ మన నాయకులకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయాడు. అతను బ్రిటిష్‌ (ప్రభుత్వం తరపున చేసిన వాగ్దానాలను (బ్రిటిష్‌ మంత్రి మండలి తిరస్కరించింది. అది క్రిప్స్‌కి మ్రింగజాలని విషగుళిక అయింది. అందుచేత అతడు ఆడిన మాట తప్పాడు. మన జాతీయ నాయకుల మీద అసత్యపు ఆరోపణలు చేశాడు. అభాండాలు వేశాడు. దానితో భారత జాతీయ నాయకులకు బ్రిటిష్‌ పాలకుల చిత్తశుద్ది మీడ నమ్మకం పూర్తిగా నశించింది.

అంతేకాదు, మరొక వైపున సీమ పాలకులు మన దేశంలో ముస్లిం లీగ్‌ను (ప్రోత్సహిస్తూ “విభజించి పాలించే' దుష్ట చింతనతో వ్యవహరిస్తూ వచ్చారు. ఇండియాను విడిచి వెళ్లి పోవలసి వస్తే అలా వెళ్ళిపోయే ముందు ఈ దేశాన్ని ముక్కలు చెక్కలుగా చీల్చి వెళ్ళాలన్న కుటిల సంకల్పంతో వాళ్ళు అలా చేస్తున్నారు. ఇంకొక వైపున దేశంలోని స్వదేశీ సంస్టానాధీశులను నాళ్ల రాజ్యాలను వాళ్లు విడివిడిగా ఉంచుకొనేలాగా ప్రోత్సహిస్తున్నారు. బ్రిటిష్‌, పాలకుల ఈ ఎత్తుగడలను గమనించిన మన నాయకులు వారి సంకుచిత విధానాల పట్ల మన (ప్రజల అసంతృప్తినే కాక్క, ఆగ్రహాన్ని సైతం స్పష్టంగా వెల్లడించాలనుకున్నారు. పర్యవసానమే "క్విట్‌ ఇండియా” తీర్మానమూ, “ఇండియాను విడిచి వెళ్ళి పొండి" అన్న నినాదమూను.

ఈ తీర్మానం చూచి బ్రిటిష్‌ ప్రభుత్వం బెదిరి పోయింది, కాంగ్‌ ఆ తీర్మానానికి అనుగుణంగా ఉద్యమాన్ని ప్రారంభించే వరకు కూడా పాలకులు ఆగదలచుకోలేదు. ఆగస్టు 8వ ఏ.ఐ.సి.పి. తీర్మానాన్ని ఆమోదించిన మరుక్షణంలోనే ఆ రాత్రికి రాత్రే గాంధీజీని అరెస్టు చేశారు. అలానే కాంగ్రేస్‌ కార్యవర్గ సభ్యులందరినీ నిర్బంధించి జైళ్ళలో పెట్టారు. ఆయితే మన జాతీయ నాయకులు ముందు చూపుతో, తాము బయట వున్నా, చెరసాలలో ఉన్నా ఉద్యమం కొనసాగడానికి కావలసిన పథకాన్ని రూపొందించి వుంచారు.

నాయకులను అరెస్టు చేసిన మరునాడే దేళంలోని అనేక ప్రాంతాలలోని కాంగ్రెస్‌ కార్యాలయాలకు ఈ పథకం ప్రతులు ఠహస్యంగా చేరాయి. డీనిని రూపొందించిన వారు ఆలధ్ర నాయకులు డాక్టర్‌ భోగరాజు పట్టాధి సీతారామయ్య గారు అని ప్రతీతి. ఏమైవా, పాలకులు ఎదురు చూడనంత ఊపుతో ఒక్కసాశిగా ఉవ్వెత్తున ఉప్పెనలా ఈ ఉద్యమం దేశాన్ని కావురు 30 సంధియుగం

కప్పే వేసింది. ఆ తరువాత అయిదేళ్ళు తిరగక ముందే తెల్లవారు మన దేశాన్ని విడి వెళ్ళిపోక తప్పని పరిస్టితులను ఆ 1942 ఆగస్టు నాటి క్విట్‌ ఇండియా తీర్మానం కల్పించింది. ఆ ఉద్యమ కాలంలో ఆం(ధ్రప్రదేళంలో, ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటనలలో నాకు (ప్రత్యక్షంగా తెలిసినవి కొన్ని ఇక్కడ వివరిస్తాను.

అప్పట్లో సత్తెనపల్లిలో “శ్రీ, నాగేశ్వరస్వామి భక్త వెలుగూరి శరభయ్య గుప్త హిందూ హైస్కూలులో స్కూల్‌ ఫైనల్‌ క్లాసు చదువుతున్న విద్యార్థిని. ఆ రోజుల్టోనే నాకు (శ్రీ దరువూరి వీరయ్య గారితో పరిచయం ఏర్పడింది. నన్ను రాజకీయల వైపు మళ్ళించింది ఆయనే. ఆతరువాత, (శ్రీ, వావిలాల గోపాల కృష్ణయ్య, శ్రీ, బత్తుల రామదాసు, (శ్రీ, దామంచర్ల వీర రాఘవయ్య వంటి శుద్ద గాంధేయులతో పాటు, అప్పుడప్పుడే కాంగ్రెసు నుంచి బయటికి వచ్చి (ప్రత్యేక పార్టీగా కుదురుకుంటున్న కమ్యూనిష్టు పార్టీ యువ కార్యకర్తలు, సత్తెనపల్లి తాలూకాలో ఆ పార్టీకి మూలస్తంభాలు వంటే వారుగా ఉన్న చతుర్వేదుల సీతారామ శాస్త్రి (జండుశ్యాస్త్రి), నాళం నరసింహారావు, మాదల వీరభద్రరావు, వావిలాల వీరభద్రరావు, కృష్ణమూర్తి వంటి వారితో కూడా పరిచయం ఏర్పడింది.

బొంబాయిలో కాంగ్రెసు నాయకులను అరెస్టు చేయడంతో క్విట్‌ ఇండియా ఉద్యమం గప్పు మన్నది. అయితే ఆ ఉద్యమంలో ఒక్క కాం(గ్రస్‌ వారే కాదు, జయ్రకాళ్‌ నారాయణ్‌ ఆధ్వర్యాన ఉన్న కాంగ్రెసు సోషలిస్టులు, నేతాజీ నాయకత్వాన ఉన్న ఫార్వర్డ్‌ బ్లాక్‌ వంటి అతివాద పార్టీల వారు కూడా ఉద్యమంలో ఒక్కుమ్మడిగా పాల్గొన్నారు. కమ్యూనిష్టు కార్యకర్తలు కూడా పాల్గొనే సన్నాహాలలో ఉన్నారు. కాని రెండవ ప్రపంచ యుద్దగతిలో వచ్చిన ఒక ఆకస్మిక పరిణామం వారి వైఖరిని మార్చి వేసింది. ఉన్నట్టుండి హిట్టర్‌ సోవియెట్‌ యూనియన్‌ మీద దాడి జరపడంతో, తెల్లవారేసరికి కమ్యూనిష్టు పార్టీ యుద్దానికి అనుకూలంగా, అంచే బ్రిటిష్‌ ప్రభుత్వానికి అనుకూలంగా మారి, ' ప్రజా యుద్దం' అనే నినాదాన్ని ఇచ్చింది.

ఒక వైపున జాతీయ కాంగ్రప్‌ ఇచ్చిన "క్విట్‌ ఇండియా నినాదం, మరొక వైపున కమ్యూనిష్టు పార్టీ ఆకస్మికంగా చేపట్టిన "ప్రజా యుద్దం” నినాదం నాటి యువకులను కొంత తికమక పెట్టిన మాట నిజం. అయితే జాతీయ స్వాతంత్ర్యం అన్నిటి కంటే ముఖ్య మైనది గనుక, కమ్యూనిష్టుల నినాడం ప్రజా బాహుళ్యానికి రుచించలేదు.

జాతీయనాయకుల అరెస్టుకు నిరసనగా ఆగస్టు 12వ తేదీన తెనాలిలోనూ, చీరాలలోనూ విష్ణవ సంఘటనలు జరిగాయి. తెనాలిలో రైలు ప్టేషన్‌ని పూర్తిగా విష్ణవకారులు ధ్వంసం చేయగా, చీరాలలో మేజి'స్టేటు కోళ్టును కొంత వరకు భ్వంసం చేశారు. ఆ మరునాడు ఈ సంఘటనలు గుంటూరులో ప్రతిబింబించాయి. యువకులు, విద్యార్థులు, వృద్దులు సైతం వేల సంఖ్యలో ఊరేగింపుగా గాంధి పార్కు వద్ద చేరగా (ప్రభుత్వం బెదిరి పోయి కాల్పులు జరిపించింది. ఇద్దరు యువకులు (ఒకరు విద్యార్థి) మరణించగా, చాలా మంది గాయపడ్డారు. ఇది విన్న ఆంధ్రదేశం అట్టుడికినట్టు ఉడికి పోయింది. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో విప్ణవ సంఘటనలు జరిగాయి.

ఆ మరునాడు పెద్ద ఊరేగింపుగా వెళ్ళి మృత వీరుల అంత్యక్రియలు జరిపారు. గుంటూరులో ప్రజారంజకుడైన డాక్టర్‌గా పేరున్న ఆమంచళ్ల గోపాలరావు, (శ్రీ, దరువూరి వీరయ్య (ప్రభృతులు ఆ మృతవీరుల అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొన్న తరువాత, ఆ వీరావేశంతో, కాలినడకన బయలుదేరి జిల్లా అంతా తిరిగి ఉద్యమ ప్రబోధం గావించారు. వీరు ముఖ్యంగా సత్తెనపల్లి తాలూకా అంతటా విశేషంగా రహస్య పర్యటనలు చేసి ఎందరో సంధియుగం 31

యువకులలో ఉత్తేజం కల్లించారు. శ్రీ, దరువూరి (వ్రాసుకొన్న ఆత్మకథలో, ఆయన వివరించిన ఒక ఉదంతం 1942 ఉద్యమ స్వభావాన్ని చక్కగా చిత్రిస్తున్నది.

“ఆవేళ అచట సమావేశమైన యువకులు నిచ్చెనలూ, గొడ్డళ్ళూ, మేము అదివరకే సంగ్రహించి తెచ్చిన రైల్వే సామానుల (పనిముట్టు)తో, గుచ్చుకునే ముల్గు, కరిచే పామును సరకు చేయక కన్ను పొడుచుకున్నా కనపడని చీకట్లో పొలాలకు అడ్డంగా పడి కంకణాల పల్లి గ్రామానికి ఆనుకునే వున్న (మాచర్ల-గుంటూరు) రైళ్లే లైను వద్దకు చేరుకొని నాలుగు ఫర్ధాంగుల పర్యంతం టెలిగ్రాఫ్‌ తీగలు తెంచి స్తంభాలను తుత్తునియలు చేశాము”.

అలా వీరి నాయకత్వాన కొందరు యువకులు అక్కడ విష్తవం సాగిస్తుంటే అదే సమయంలో సత్తెనపల్లిలో మేము ( విద్యార్థులు) అద్దెకున్న బ్లాక్సులో ఒగ గదిలో వావిలాలవారి ఆధ్వర్యాన మరికొందరు యువకులు సన్నద్ధులై వెళ్ళి రాత్రికి రాత్రి పట్టాలు తప్పించి వచ్చారు. మొదటిజట్టులో పాల్గాన్నవారిలో ప్రభల రాధాకృష్ణమూర్తి, కొప్పురావూరి దూర్వాసులు, కందికట్టు నరసింహారావు, భీమవరపు నరసింహారావు వంటి యువకులు అరెస్టుకాగా రెండవజట్టువారిలో కొలొసెట్టి వెంకటరత్నం, కొప్పురావూరి వెంకటరామయ్య, నడింపల్లి సాంబశివరావు, గుండెపూడి అప్పయ్యవంటి యువకులు అరెస్టు అయినారు. వీరిలో శ్రీ/ అప్పయ్యకు అప్పుడే వివాహమైంది. ఆయన పసుపుబట్టులతోనే జైలుకు వెళ్ళాడు. అలాగే ఇశ్రీ/ కొలసెట్టి వెంకటరత్నం కూడా కొత్త పెళ్ళికొడుకే. ఆయన ఒక చిన్న సైకిలుషాపు యజమాని. ఆవేళ ఆయన జైలుకి వెళ్ళకుండా వుంటే కొత్తవధువు కొత్తగా కాపురానికి రావలసి వున్నది.

సత్తెనపల్లిలో ఆరోజులలో త్యాగమూర్తులైన దంపతులు వుండేవారు. ఆ సతీపతులు కలసిపాల్గొనని ఉద్యమం లేదు. వీరు కొన్నిసార్లు జైలుకు వెళ్ళారు, వారు ఎవరో కాదు. శ్రీ, వావిలాల గోపాలకృష్ణయ్యగారి అన్నగారు. వావిలాల రామశర్మ ఆయన సతీమణి

మాణిక్యాంబగార్జు.

ఈ అందరి త్యాగాలు దేశమంతటా ఇలా ఇంకా ఎందరెందరో చేసిన అమూల్యమైన అపురూపమైన త్యాగాల ఫలితంగానే ఈనాడు మనం ఒక స్వతం(త్రజాతిగా స్వేచ్చావాయువులు పీల్చుకుంటున్నాము. ముఖ్యంగా పసుపుబట్టలతో జైలుకు వెళ్ళిన ఆనాటీ త్యాగమూర్తుల ఉదంతం నా మనసులో ఎప్పుడూ మెదులుతూ వుంటుంది. ఆ యువకులూ వారి నవవధువులూ ఆ శిక్షాకాలంలో ఎటువంటి మానసిక శ్షోభని అనుభవించి వుంటారో ఊహించుకోవలసిందే. అటువంటి జీవిత మధురిమలను సైతం త్యాగం చేసి దేశంకోసం చెరసాలవాసాన్ని వరించారంటే వారి దేశభక్తి ఎంత గొప్పదోకదా! ఇందరి త్యాగాలను (ప్రత్యక్షంగా చూస్తూ ఎన్నో వింటూ వుంటే నాటినా లేతమనసులో ఉప్పాంగిన భావాలను ఆరోజులలో ఒక చిన్న పద్యంలో పాదిగిపెట్టాను. ఆ తరువాత 1946లో ఆచార్య రంగాగారి రైతు భజనావళిలో అదిచోటు చేసుకున్నది. ఆ తేటగీతి ఇది

““గడచినన్ని నాళ్ళింకము గడువబోదు కాకమౌానదు స్వాతంత్ర్య కదనమింక రాకమానదు మనకు స్వరాజ్యలక్ష్మి పోకమానరు తమదారినింక దొరలు” (8.8.86) 3౩2 సంధియుగం

“4 డీత్తరమ్‌ యత్‌సముద్రస్య/హిమా గ్రేశ్చాన దక్షిణమ్‌ వర్షమ్‌ తత్‌ భారతమ్‌నామ/ భారతీ యత్ర సంతతిః* మహాసాగరానికి ఉత్తరంగానూ, హిమనగానికి దక్షిణంగానూ ఉన్న దేశం భరత వర్షం; అక్కడ నివసిస్తున్నవారు భారతీయులు అని ఈ ళ్లోకానికి అర్ధం. అతి ప్రాచీన కాలం నుంచీ ఈ దేశ ప్రజలలో అనుస్యూతంగా వుంటున్న సమైక్యతా భావానికి విష్ణు పురాణంలో వున్న ఈ శ్లోకం ఒక నిదర్శనం. మన దేళనైసర్లిక స్వరూపం, దేళ ప్రజల ఆచార ఆహార వ్యవహారాదికాలు, వారు వారు అవలంబించే మతాలు - ఇవన్నీ చూచినట్టయితే ఎంతో వైవిధ్యం కనపడుతుంది. అయితే ఆతి పురాతన కాలం నుంచీ ఈ వైవిధ్యంలో ఒక నిసర్గమైైన ఏకత్వం పరిఢవిల్దుతూ వచ్చింది. అంతర్వాహినిలాగా వస్తున్న ఈ ఐక్యతను నాయకులూ, కవులూ గుర్తిస్తూనే వచ్చారు. ఈనాటి వలె కడుపులో నీళ్ళు కదలకుండా ఎంత దూరమైనా ఇట్టే వెళ్ళి అట్టే వ్రాలగల ప్రయాణ సౌకర్యాలు అనాడు లేకపోయినా, చీమలు దూరని చిట్టుడవులు, కాకులుదూరని కారడవులు, నదీనదాలు, కొండలుకోనలు ఎన్ని అడ్డువున్నా ఆ కాలంలో సైతం ఎందరెందరో యాత్రికులు, ముత (ప్రచారకులు, దేళ మెల్లెడెలా సంచరించేవారు. కాశీకి వెళ్ళి వచ్చినవారు రామేళ్వరం వెళ్ళి రాకుండా వుండకూడదన్న ఒక విశ్వాసం ఆ రోజుల్లో ప్రబలంగా వుండేది. అలా ఆ రెండు తీర్రయాత్రలూ సేవించినవారు దేశం ఈ కొసనుంచి ఆ కొసకు చూడడం జర్‌గేది. అందుకే ఆ నమ్మకం ఏర్పడిందేమో! క్రీస్తుకు పూర్వం మూడు వందల సంవత్సరాల నాడే అశోకుడు తన రాజ్యమంతచా సామాన్య (ప్రజానీకానికి అర్ధమయ్యే తేలిక భాషలో, ప్రజలలో సహన సామరస్యాల ఆవశ్యకతను (ప్రచారం చేయించాడు. దీనిని బట్టి రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. ఈ భూమి మీద జన సంచారం మొదలయినప్పటి నుంచీ భరత వర్షం అనే భూభాగమంతా ఏకదేళంగా చెల్లతూ వచ్చింది. రాజకీయ అధికార కేంద్రాలు బలహీనపడినప్పుడు, దేశంలో అచ్చటచ్చట అడపా దడపా విచ్చిన్నకర శక్తులు చెలరేగుతూ వచ్చినప్పటికీ, చరిత్రలో హెచ్చుకాలం ఈ దేశమంతా ఒకే రాజకీయాధికార చృత్రం క్రింద వుండక పోయినప్పటికీ సాంస్కృతికంగా మాత్రం కలకాలంగా ఒకేదేళంగా వుంటూ వచ్చింది. ఎక్కడెక్కడ నుంచో ఎప్పుడెప్పుడో వచ్చిన ఎన్నెన్నో తెగల, మతాల, జాతుల జనులంతా ఏకజాతిగా సమ్మి[మై, సమైక్యమై, సంవర్షిల్దుతూ వచ్చారు. దేళ ప్రజల మధ్య స్పద్టలు జనించడం, అప్పుడప్పుడు కొన్ని విచ్చేదక ళక్తులు చెలరేగి సహన, సామరస్య, సమైక్యతలకు భంగం కలిగించడమూ జరుగుతూ వచ్చింది. అశోక్సుని కాలంలోనే సహన, సొమరస్యాల ప్రచారం ఆవసరమైనదంటే దీని అర్ధం అదే. ఈ దేశ సంస్కృతి ఎంత ఫురాతనమైనదో అంత వైవిధ్యం గలది. ఎంత వైవిధ్యం కలదో అంత ఏకత్వం కలది. కనుకనే ఎడనెడ ఎదురైన విచ్చేదక శక్తులను అన్య ప్రాబల్యాలను తట్టుకుని నిలిచి నిగ్గుతేలుతూ వచ్చింది. తమలో తమకు భాష్క నుతం, కులం వంటి రకరకాల భిన్నాభి ప్రాయాలున్నప్పటికీ సంధియుగం 33

దేశసమగ్రతనూ, సంస్కృతినీ కాపాడుకొనడంలో మన ప్రజలు ఎల్లప్పుడూ సమైక్యంగానే కృషి చేస్తూ వచ్చారు. ఇక ఆధునిక చరిత్రలో సాంఘిక సంస్కరణోద్యమాలూ రాజకీయస్వాతం(త్ర్య ఉద్యమమూ, ఈ ఏకచ్చత్ర భావాన్ని మున్నెన్నడూ ఎరుగనంత విస్తృతంగా ప్రబలంగా వ్యాపింప జేశాయి. ఈ ఉద్యమాల నాయకులు ప్రజానీకంలో సమతా సమైక్యతా భావాన్ని (ప్రేరేపించి 'పెంపాందించుకుంటూ వచ్చారు. అప్పటివరకూ సాంస్కృతికంగా మాత్రమే ఏక దేళంగా వుంటూ వచ్చిన భాఠత ఉపఖండం జాతీయోద్యమ ఫలితంగా రాజకీయంగా కూడా సమైక్య స్వతంత్ర దేశంగా రూపొందింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు సకల భారత జాతికి సీద్దించిన స్వాతం త్ర్యంగానే దేళ ప్రజలందరూ భావించి హర్షాతిశయం ప్రకటించారు. దేశంలోని ఐదు వందల పై చిలుకు సంస్టానాలన్నీ కేంద్ర ప్రభుత్వపాలన క్రిందకు వచ్చినప్పుడు భారత ఉపఖండం యావత్తూ ఏకమైందని అంతా సంతోషించారు. జాతీయ ఉద్యమం ప్రారంభమయిన నాటి నుంచి భారతదేశం, భారత జాతి అన్న మాటలు అందరి నోచా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ అప్పుడప్పుడు జాతి సమైక్యతకు భంగం వాటిల్లే దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. మతస్పర్దలు, కులవైషమ్యాలు జాతీయ సమైక్యతా భావాన్ని దెబ్బతీస్తున్నాయి. దశాబ్దాల రాజకీయ స్వతంత్ర జాతీయ సమైక్య జీవితానంతరం నేటికీ జాతి సమైక్యతకు భ్యూం కలిగించే దౌస్ట్యాలు మతం పేరిట, రాజకీయ స్పర్టల పేరిట జరగడం జాతికి తలవంపులు కలిగించే విషయం. దేశ భవిష్యత్తుకు ప్రమాదం కలిగించగల దుర్రటనలివి. ఆర్టికాభివృద్దికి తద్వారా ప్రజలందరి జీవన (ప్రమాణాల వృద్దికి కృషి చేస్తున్న మనవంటి వర్థమాన దేశానికి ఈ రకమైన విచ్చేదక సంఘటనలు ఎంతో నష్టదాయకం. ఈ (భ్రాతృ స్పర్దలు వర్ధమాన సమాజంలో పెరిగే పెరగే లేత మొక్క రెమ్మలను నరికి వేసే గొడ్డలి వంటివి. కనుక విజ్ఞులయిన దేశభక్తులందరూ ఇటువంటి స్పర్టలను నిరసించి నిర్చించాలి. దేళం ఆ కొన నుంచి ఈ కొన వరకు ఆంతా అందరిదీ అన్న భావాన్ని అందరిలోనూ పెంపొందించాలి. అనాదిగా మనది భిన్నత్సంలో ఏకత్వంగల సంస్కృతి. కట్టులో, బొట్టులో, తిండిలో, అలవాట్లులో, మాటలలో పైతం మన దేశంలో ఎంతో వైవిధ్యం కనపడుతుంది. అందుకే భారతదేశాన్ని ఉపఖండం అన్నారు. ఇన్ని వైవిధ్యాల మధ్య పూసలలో దారం వంటి ఏకత్వం మొదటి నుంచీ మనకున్నది. విశిష్టమైన ఈ ఐక్యతా భావాన్ని కంటి రెప్పలా కాపాడుకోవాలి. దేళంలో చెలరేగే మత కలహాలు మన జాతి కీర్తి (ప్రతిష్టలకు మాయని మచ్చ తెచ్చేవి. అందుకు కారణాలు ఏవైనప్పటికీ సద్భావంతో, సుహృద్భావంతో వైషమ్యాలను తొలగించుకొని జాతీయ సమైక్యతాభావాన్ని బలపరచుకోడానికి అందరూ శాయశళిక్తులా కృషిచేయాలి. ఐకమత్యమే జాతికి బలం. జాతీయ సమైక్యతా సాధనకు ఒక విధానమంటూ ఏదీ వుండదు. వీవేవో శాసనాలు చేయడంద్వారా నేమి, రాజకీయ బలవంతాల వళ్లినేమి, సమైక్యత చేకూరదు. ఆయా మతాల, వర్గాల, ప్రాంతాల (ప్రజలు పరస్పరం అవగాహన చేసుకొని, సద్భావం పెంపొందించుకొని సమరస దృష్టిని అలవరచుకొని అనుకూల వాతావరణాన్ని స్పష్టించుకొన్నప్పుడే ఇది సాధ్యరీ. మన నైతిక స్థాయిని బట్టే జాతీయ సమైక్యత వృద్ది యాలు వుంటుంటాయి. అటువంటి ఉన్నత నైతిక ప్రమాణాలను పెంపొందించుకొనడం మనందరి కర్తవ్యం. (9.2.93) మ సంధియుగం

'పశ్రకలలో రాజకీయాలు ప్రవేశించినా, రాజకీయాలలో మతం ప్రవేశించినా సామాజిక భద్రతకు ముప్పు వాటిల్టుతుంది. ప్రభుత్వ యంత్రాంగం పెట్టెలో పెట్టి తాళం వేసుకొని వెళ్ళే ప్రైవేటు అస్తికాదు. మితిమీరిన మత మౌఢ్యం జాతి భద్రతకే ముప్పుతెస్తుంది, మత కలహాలను ఎవరూ స్వప్రయోజనానికి ఉపయో గించుకోరాదు. పలుచోట్టు చెలరేగిన మతకలహాల నుంచి దేశం యావళ్తూ నేర్చుకో వలసిన గుణపాఠాలు చాలా వున్నాయి.

మన దేళ స్వాతం(త్ర్యమే మత కలహాలతో మైలపడింది. ఆ తరువాత కూడొ ఈ అవాంఛనీయ పరిణామాలను అరికట్టడానికి చేసుకోవలసిన కట్టుదిట్చాలను మనం చేసుకోలేదు. దేశాన్ని ఒకసారి ముక్కలు చేసిన మతమౌఢ్యం అంతటితో ఆగలేదు, మైనారిటీ మతాలపట్టు ప్రభుత్వం చూపుతూ వచ్చిన గారాబు విధానం నయాన ఐకమత్యం సాధ్యమని భావించి, అనుసరించిన మన విధానాలు మత మౌఢ్యాన్ని మరింత పెంచి పోషించాయి. తాజకీయ (ప్రయోజనాలకోసం దేశంలో దాదాపు అన్ని రాజకీయ పక్షాలవారు ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వారు బుజ్జగింపు విధానాన్ని అనుసరించారు, ఆ విధానాల విష ఫలితాన్ని దేశం ఇప్పుడు అనుభవిస్తున్నది.

మతంపేరిట నాడు దేశవిభజనకు అంగీకరించకుండా ఉండివుంటే, ఆ తరువాత పంజాబీ ''సుబా”వంటి మతపరమైన నినాదాలకు లొంగకుండా వుండివుంటే ఈనాడు దేశ పరిస్టితి మరోవిధంగా వుండి వుండేది.

ఆదిమ మానవుడు తన సొంత క్రేయస్సును మాత్రమే చూచుకున్నాడు. ఎదుటి మనిషి మంచివెడులను పట్టించుకోలేదు. రోగపీడితులు, జరాబాధితులు దిక్కులేని చావు చచ్చేవాఠు. ఆ తరువాత మనిషిలో కొంత మార్పు వచ్చింది. “తాను మాత్రమే? అనుకొనే దళనుంచి త్రాను, తన కుటుంబం మాదత్రమే" అనుకొనేదళకు పురోగమించాడు. తన కుటుంబ (శ్రేయస్సును మాత్రమే చూచుకొనే మానవుడు ఆ తరువాత తన చుట్టుపట్ల వున్నవారి యోగక్షేమాలను గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏనాడైతే *నలుగురి బాగూ నాబాగు' అని అనుకున్నాడో ఆనాటి నుంచి మానవుడు సంఘజీవి అయినాడు. ఈ సంఘ జీవనాన్ని క్రమబద్దం చేసుకోడానికి ఆతడు ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లు క్రమంగా మతాలుగా మౌరాయి.

అదే నాగరికతకు నాంది. కాని, క్రమేణ జనసంఖ్య పెరుగుతూ వచ్చినకొలది జనులలో సంఘ దృష్టి తగ్గుతూ, వర్గ దృష్టి, స్వార్ద దృష్టి ప్రబలమౌతూ వచ్చాయి. జనులందరి యోగక్షేమాలను పరిరక్షించడానికి పుట్టిన మతాలు వర్గ ప్రయోజనాలకు వర్గ ద్వేషాలకు ఆలవాలమైపోయాయి. ఆదిమకొలం నుంచి (క్రమేపీ వికసిస్తూ వచ్చిన మానవుని సంఘదృష్టి ఎక్కడో ఒకచోట, ఏదో ఒక దళలో తిరుగుముఖం పట్టింది, సంకుచిత స్వారదృష్టి మానవులను ఆకట్టుకొన్నది. కడకీనాడు మతంపేరిటు మనిషిని మనిషి చంపుకునే అనాగరిక, ఆటవిక దళకు

తిఠోగమించాము. ఒకనాడు మానవ సంఘ సంక్షేమానికి ఆవితృవించిన మతం ఈనాడు అతని వినాశానికి సంథియుగం 35

కారణమౌతున్నది. భక్తివేరు, మతం వేరు. భక్తి మనసుకు సంబంధించినది. దానినెవరు అదుపు చేయజాలరు. చేయవలసిన పనిలేదు. అది వ్యక్తిగతమైనది. కాని, మతం సామూహికమైనది. సాముదాయక సంక్షేమానికి ఉపకరించవలసిన మతం సామూహిక వినాశానికి సాధనమైపోతే ఆది సమాజానికి పనికిరాదు.

ఈనాడు తరచు దేశంలో చెలరేగుతున్న మతకలహాలు ఇదే చెబుతున్నాయి. మతం రాజకీయాలలో ప్రవేశించిననాడే దాని పవిత్రత మరుగునపడింది. చరిత్రలో రాజకీయాలపై వివిధ మతాల ప్రాబల్యంవళ్ల కలిగిన దుష్పలితాలు చాలా ఉన్నాయి. వాటిలో తాజా పరిణామం మతకలహాలు. దేశానికి, జాతికి విపత్తు తెచ్చిపెట్టుగల మత కలహాలను, మతమౌఢ్యాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేయడంలో జాతియావత్తు ఒక్కమాటగా, ఒక్కబాటలో నడవ వలసిందిపోయి, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకు అందరూ, ముఖ్యంగా, అన్ని రాజకీయ పక్షాలవారూ ఈ మతమౌఢ్యాన్ని సహించడమో, ప్రోత్సహించడమో జరుగుతున్నది.

దేళ ప్రయోజనాల ముందు ఏ మత (ప్రయోజనాలూ నిలువజాలవు. దేళంలోని యావన్మందీ ఒకే సమాజం. అది భారతీయ సమాజం. అందరిదీ ఒకే మతం. అది భారతీయత అన్న గుర్తింపు మనలో రానంతవరకు మతమౌఢ్యం మనలను చీలుస్తూనే ఉంటుంది. అలాంటిదే భాషామౌఢ్యం కూడా. జాతీయత ఒక్కటే, ఉప జాతీయతలు ఉండరాదు. ఈ గుర్తింపు రానంతవరకు “నా మతం, నా భాష్క' నినాదాల ముందు “నా దేశం! నినాదం తెల్లబోతుంటుంది. భక్తిని వ్యక్తిగతమైనదిగా గుర్తించి, సామాజిక జీవనానికి మతమౌఢ్యం భంగం కలిగించకుండా తీవ్రమైన కట్టుదిట్టాలు చేసుకోవలసిన సమయం ఆసన్నమైనది, నిజానికి ఇప్పటికే ఆలస్యమైంది. మత కలహాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపట్టడం సబబుకాదు. ఇది ఆయా రాష్ట్ర (ప్రభుత్వాలుకాని, ' ఆమాటకొస్తే కేంద్రప్రభుత్వంకాని మాత్రమే నివారించగలిగిన జాడ్యం కాదు. ప్రధానంగా ప్రజల వైఖరిలో మార్చు రావాలి. అయితే ప్రభుత్వాలు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఏమైనా అందరం రాజ్యాంగం (ప్రకారం నడుచుకోవాలి.

మత కలహాలు తరచు భిన్నమతాలవారి పండుగ ఊరేగింపుల సందర్భంగా చెలరేగడం చూస్తున్నాము. ఇటువంటి ఊరేగింపులు శాశ్వతంగా నిషేధించడం రాష్ట్ర దేళ ప్రయోజనాల దృష్ట్యా ఆత్యంత ఆవళ్యకం, ఎవరి దేవుళ్ళను వాళ్ళు పూజించుకోవచ్చు. కాని, మతం పేరిట మనుషులను చంప్కి సమాజంలో కల్లోలం సృష్టించే హక్కు ఎవరికీ లేదు. సమాజ శాంతిభద్రతలకు, దేళ ప్రయోజనాలకు భంగం కలిగించే వారి అక్రమ, ఆరాచక కార్యకలాపాలను అరికట్టడానికి ఎంత కఠినచర్యలు అమలుజరిపీనా తప్పులేదు. ఇటువంటి కలహాలు జరుగుతున్నపుడు అన్ని పక్షాలవారు ముక్తకంఠంతో వాటిని ఖండించి నిరుత్భాహపరచాలి, అధికార పశ్షాలమీద (ప్రతిపజ్షాలు రాళ్ళు రువ్వుకోడానికి మతకలహాలను ఎవరూ వాడుకోరాదు.

తాత్కాలిక నివారణ చర్యలతోపాటు, ద్వీర్ణకాలిక చర్యలు కూడా అవసరం. సమాజ ('ప్రయోజనాలముందు మత ప్రయోజనాలకు ఎటువంటి (ప్రాముఖ్యం వుండకూడదు. ఆధునిక (ప్రజాస్వామ్యంలో సర్వుల శ్రేయస్సు ఒక్కటే పరమధర్మం. అదే దాని మతం. అందుకు భంగం కలిగించే మరే మతానికి ప్రభుత్వ మన్నన కూడదు. అటువంటి గుర్తింపు అందరిలో వచ్చినప్పుడే దేశం పురోగమిస్తుంది. ముఖ్యంగా మన నాయకులందరిలో ఈగుర్తింపు రావాలి, అదే ప్రజాస్వామిక సంస్కృతి. (3.8.84) 36 సంధియుగం

-న్శకభ్రున సంథధియుగం

అడపాదడపా దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలో భిన్న విభిన్న వర్గాల వారి మధ్య కలహాలు చెలరేగుతున్నాయి. కక్షలు, కార్సణ్యాలు "పెరుగుతున్నాయి. అయితే పలువురు వీటి మూల కారణాలను చూడలేకనో, కావాలని వదిలి వేయడం వల్లనో ఈ కలహాలకు వేరు వేరు కారణాలను ఆపాదించి, వారి, వారి దృక్కోణాల నుంచి అర్జాలు అపార్జాలు తీసుకుంటున్నారు.

వాస్తవికమైన, అనాసక్తమైన దృష్టితో పరిశీలించే వారికి ఈ కలహాల పరంపరకు ఒకే ఒక మూల కారణం కనపడుతుంది. స్థూలంగా చెప్పాలంటే ఇది కలిమికీ లేమికీ మధ్య చెలరేగుతున్న వర్గ సంఘర్షణ, మార్కి్యిస్ట్‌ చైతన్యం దీనికి ప్రేరణ. కాని, ప్రతి ఒక్క ఘటనకు ప్రతిఘటన ఉండి తీరుతుంది. ఒకవైపున లేనివారిలో తమ ఆర్టిక, సామాజిక హక్కులను గురించిన కొత్త వైతన్యం (క్రమేణ పెరుగుతున్నది. తరతరాలుగా తాము గురి అయిన అణచివేతకు (ప్రతిఘటన దృష్టివారిలో చెలరేగుతున్నది. కాగా, కలకాలంగా కొన్ని ప్రత్యేక అర్హతలను తమకు ఆపాదించు కొని అనుభవిస్తున్న కలవారు, తమ ఈ అర్హతలను ఇప్పుడు అన్యులు తొలగించకుండా చూచుకోవాలన్న పట్టుదలతో లేనివారి చైతన్యాన్ని ప్రతిఘటించ ప్రయత్నిస్తున్నారు.

ఇలా చైతన్యం, ప్రతిఘటన పరస్పరం మోహరించడంతో ఒక విచిత్రమైన సంధి యుగంలో మన సమాజం ఇప్పుడు నలుగుతున్నది. *కలవారు' అని అనడంలో నా ఉద్దేశం కోటీశ్వరులు అని కాదు. అక్షతలు ఆస్తులు కలవారు అని ఇక్కడ అర్ధం చెప్పుకోవాలి. లేనివారు అంటే ఆస్తులే కాక్క సామాజిక హక్కులు సైతం లేనివారు అని అర్ధం. ఇది నిజంగా మన సమాజానికి సంధియుగమే. ఎందుకంటే పీడిత దళిత వర్గాలలో మార్క్సిస్టు చైతన్యం అంకురించింది కాని, ఆది ఇంకా వారిలో వికసించవలసినంతగా వికసించలేదు. అలానే ఇప్పుడిప్పుడే ప్రపంచ సమాజాన్ని ఆవరిస్తున్న ఈ మార్క్సిస్టు విజ్ఞాన వికాసం ఇంకా పక్వ్పదశకు రాలేదు. అందువల్ల పీడిత వర్గాలలో చైతన్యం మిడి మిడి దళలోనే ఉండిపోయి, వారిని, తమ లక్ష్యసాధన మార్గంలో ఈ మిడిమిడి జ్ఞానం తప్పుదారి పట్టిస్తున్నది.

వ్యక్తుల వైతన్య స్థాయి, సమాజపు చైతన్య స్పాయిని సూచిస్తుంది. మన రాజకీయ పక్షాలు కూడా వ్యక్తులవలెనే ఈ అపరిపక్వ దళలో మార్క్సిస్టు వైతన్యాన్ని పీడితుల ఉద్దరణ కోసం కంటే షార్టీ ప్రయోజనాలకే ఎక్కువగా వాడుకొనడం జరుగుతున్నది. అందుకే దీనిని సంధి యుగం అనవలసి వస్తున్నది. ఈ సంధియుగంలో ఆయా పార్టీలు కొంతమేరకు మార్క్సిస్టు చైతన్యాన్ని (ప్రేరేపించి వదలి పెడుతున్నందువల్ల పీడిత వర్గాలకు ఈ అపరిపక్వ చైతన్యం వల్ల మేలుకంటే కీడే ఎక్కువగా జరుగుతున్నది. నిజానికి ఈ మాట ఈనాడు వాను పక్ష సిద్దాంతాలను అనుసరిస్తున్నామని చెప్పుకొనే వారందరికీ వర్తిస్తుంది. మార్క్సిస్టు చైతన్యాన్ని బహుజనులలో పూర్తిగా వికసింప చేయగలిగిననాడు (ప్రపంచ సమాజానికి నిజంగా మేలు జరుగుతుంది. కాని (ప్రతి దేశంలో ప్రతి సమాజంలో రాజకీయ పక్షాలు అధికారాన్ని పట్టుకోడానికి మూత్రమే ఈనినాదాన్ని, ఈ ప్రబోధాన్ని వినియోగించుకోవడం, ఆ పైన ఆ ప్రజలకే వ్యతిరేకంగా దాన్ని దుర్వినియోగం చేయడం కూడా జరుగుతున్నది. అందువల్లనే మార్క్సిస్టు సిద్దాంత ప్రభావ సంధియుగం 37

విస్తరణ (ప్రారంభమై ఒక శతాబ్రి దాటినా, నికరమైన మార్క్సిస్టు సమాజం ఏ ఒక్క దేశంలోనూ ఇంతవరకు నెలకొనలేదు.

కాకపోతే కొన్ని దేశాలకంటే, మరికొన్నిదేశాలలో ఈ వైతన్యం ఒకటి రెండడుగులు ముందుకు వెళ్లింది. కాగా, మనదేశంలో ఈ చైతన్యం మరీ శైశవావస్టలోనే వుండిపోయింది. ఇందుకొక ప్రబలచారిత్రక కారణం వున్నది. ప్రపంచంలో మరే సమాజంలోనూ లేని ఒక విచిత్ర వ్యవప్ర కుల వ్యవస్థ మన సమాజంలో శతాబ్దాల తరబడి వేరూనుకొని వున్నది. ఇందువల్ల ఎంత ఆధునిక సిద్దాంతాన్ని కూడా మనం ఈరంగుల అద్దాలనుంచి మాత్రమే చూడగలుగు తున్నాము. ఇందువల్లనే మార్క్సొస్టు చైతన్య (ప్రేరణ వల్ల సంభవిస్తున్న వర్గ సంఘర్షణలకు మన, కులాల రంగుపులిమి ఆ రంగులలో నుంచి చూస్తూ యధార్జానికి ఆపార్జాలు కల్పించు కొంటున్నాము. మన రాజకీయ పక్షాలు, మన పత్రికలు సైతం ఈ బలహీనతల నుంచి బయట పడలేకున్నాయి. అలా బయట పడగలిగితే ఈ కలహాలనూ వాటి కారణాలనూ వాస్తవిక దృష్టితో చూడగలుగుతాము.

దేశంలో ఎప్పుడు ఎక్కడ వర్గ కలహం సంభవించినా మనం దానిని మార్క్సిస్టు దృష్టితో

కాకుండా కుల, మత దృష్టితో చూడడం వల్లి ఏ చైతన్యం వల్ల, ఏ పీడిత వర్గాలకు మేలు జరగవలసి వుండెనో, ఆ వైతన్యం వల్ల ఆ వర్గాలకు అపకారమే జరుగుతున్నది. ఈ సంఘర్షణలను '' దళితులకు ఆ గ్రవర్ధాల వారికి మధ్య సంఘర్షణ' లుగా వర్షించి మన రాజకీయ నాయకత్వాలు, మన పత్రికలు పీడిత (ప్రజలకు మరింత అపకారం చేస్తున్నాయి. ఇలా కులాల రంగు వేయడం వల్ల మన రక్తంలో జీర్ణించి వున్న కులతత్వం వర్గ వైషమ్యాన్ని కులవైరంగా మార్చి పీడితులను ఏకాకులను చేస్తున్నది. పీడిత జనులు సైతం వాస్తవ పరిస్టితులను విస్మరించి, ఏవేవో (భ్రమలు పెంచుకొని తమ నడవడిక వళ్ల, ఉపకారం పాందవలసిన చోట అపకారానికిగురి అవుతున్నారు. నిజూనికి, మనదేళంలో సోషలిస్టులలో రకరకాల వారున్నారు. పలువురి సోషలిజానిక్షి మార్క్సిస్టు సమతావాదం కంటే కులవైషమ్యూలే ఆధారంగా వుంటున్నాయి. మనం తరచు స్వకులానికి నష్టం వుండని, ఎదుటి కులానికి మాత్రమే నష్టం కలిగించేలాగ సోషలిస్టు నినాదాలను. సృష్టించుకొంటుంటాము. అంతో ఇంతో మనలో ప్రతివారు ఈపాపంలో భాగస్వాములే. కనుక మన దేళంలో సోషలిజూనికి, నిజమైన సోషలిజానికి తాలి మెట్టు కుల నిర్మూలన కావాలి. కాని ఇది మనం కోరుకున్నంత సుళువుగా జరిగే పని కాదు. మన రక్తంలో కులం అనేది అంతగా జీర్లించి వున్నది. కనుక మొదట ఈరక్తమార్చిడి జరగాలి. ఇప్పుడు సోషలిజాన్ని ఆకట్టుకొంటున్న మన కులాలు ఒకప్పుడు మతాలను కూడా ఆకట్టుకున్నాయి. ఈ రెండు మెట్టు దొటగలొో! దాకా సోషలిస్టు నినాదాలు నేతి బీరకాయ చందమే.

ఈ మార్పు కలవారి నుంచి ఆశించలేము. కనుక బహుజనులైన లేనివారిలో ఈ సంస్కారం మొదట రావాలి. అలా వచ్చినప్పుడే మార్క్సిస్టు చైతన్యానికి సార్ధక్యం, సాఫల్యం చేకోరుతాయి. అంతవరకు ఈనాటి కలిమి లేముల కలహానలానికి కుల మత సమిధలు తోడై 'పేదలపాట్లు పెరుగుతాయే కాని తరగవు. మనసా, వాచా, కర్మణా మార్క్సిస్టు, సోషలిస్టు, హ్యూమనిస్టు సిద్దాంతాలను నమ్మేవారు మొదట తమలోని ఈ అంతళ్ళుత్రువును జయించాలి. ఇందుకు గొప్ప మానసిక విప్లవం కావాలి, రావాలి. అందుకు మేధావులు తోడ్చడాలి.

(17.11.85) 38 సంధియుగం

'దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కొత్త రాజ్యాంగ చట్టాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ రచనా సభలో ఆనాటి మన నాయకులు తము ఊహకు అందిన అన్ని సమస్యలను కూలంకషంగా చర్చించడం జరిగింది. ఆ సభఆ రోజుల్లో స్వతంత్ర భారతావనికి సొంత అధికార భాష ఒకటి అనవసరమని భావించింది. మన రాజ్యాంగ నిర్మాణ సభ 1947-49 మధ్య కాలంలో చర్చలు, పరిశీలనలూ జరిపి మనకొక సర్వసత్తాక స్వతంత్ర రాజ్యాంగ చట్టాన్ని రూపొందించింది. 1950 జనవరి 26వ ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ చట్టంలోని 17వ అధ్యాయంలో “అధికార భాషుకు సంబంధించిన నిబంధనలను పొందుపరచారు. 343వ అధికరణం మొదలు 351వ అధికరణం వరకు పలు అధికరణాలు, ఉప అధికరణాలు అధికార భాష విషయాన్ని రాజ్యాంగ రీత్యా శాసనబద్దం చేస్తున్నాయి.

జాతీయ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ నాయకత్వాన దేశ విమోచన ఉద్యమం సాగుతున్న రోజులలో ఖద్దరు కట్టడం, గాంధీ టోపీ పెట్టుడం, హిందీ నేర్వడం ఈ మూడూ దేశ భక్తికి చిహ్నాలుగా వుంటూ వుండేవి. స్వాతంత్ర్యానికి పూర్వం దాదాపు మూడు దశాజ్బాల పాటు మన జాతీయ నాయకులు దేళ ప్రజలలో చైతన్యం కలిగించడానికి సాగించిన ప్రచార, ప్రబోధాల ఫలితంగా ఈ చిహ్నాల ప్రాబల్యం పెరిగింది.

అందుచేత అవి (క్రమేణా ప్రజలలో ఒక అలవాటుగా, ఒక ఆచారంగా, ఒక సంప్రదాయంగా రూపొందాయి. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ వెనువెంటనే ఏర్పాటయిన రాజ్యాంగ రచనా సభలో ఎన్ని వాదోపవాదాలు, వాగ్యుద్దాలూ జరిగినా హిందీ భాషకు వ్యతిరేకంగా ఎవరూ ఆ సభలో వాదించలేదు. ఈ మాట ఆ నాటి తమిళనాయకులకు కూడా వర్తిస్తుంది.

అయితే ఆ రోజుల్లో హిందీ విషయంలో మరో రకమైన వివాదం వుండేది. గాంధీజీ, నెహ్రూవంటి ముందు చూపుగల నాయకులు ' హిందూస్తానీ" అనే ఒక భాషను రూపాందించి, పెంపొందించి మొత్తం దేశానికి 'అధికార భాషుగా "సేతువు భాషుగా, 'ఉపకరణ భాషుగా వినియోగించుకోదగునని ఆశించారు.

కాని, తీరా రాజ్యాంగ రచన సందర్భంలో అధికార భాషవ్యవహారం చర్చకు వచ్చినప్పుడు గాంధీ, నెహ్రూల 'హిందుస్తానీ" వాదాన్ని హిందీ మాతృ భాషగా గల ఉత్తరాది రా(ష్ట్రైల వారు వ్యతిరేకించారు. నెహ్రూ వంటి వారు ఎంత చెప్పి చూచినా వారి మనసులు మారలేదు. చివరకు ఓటింగు ద్వారా ఈ విషయం తేల్చి వేయాలనుకున్నారు. ఒకే ఒక ఓటు తేడాతో “హిందీ వాదం నెగ్గింది. 'హిందుస్తానీ' వాదం వీగిపోయింది. ఇలా 'హీందీ' నెగ్గడానికి దక్షిణాది సభ్యుల ఓట్టు కూడా తోడ్పడ్డాయన్న విషయం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి.

అప్పుడప్పుడే స్వాతంత్ర్యం సంపాదించుకొని, కుదురుకొనడానికి కృషి చేస్తున్న దేశం, ఇటువంటి సమస్యల వల్ల వర్గాలుగా చీలి, నిత్యం సంఘర్షణ పడుతూ వుండడం (శ్రేయస్కరం కాదని గుర్తించిన నెహ్రూ ప్రభృత నాయకులు ఒక రాజీ మార్గాన్ని సూచించారు. అధికార భాష సంధియుగం 39

విషయమై ఆ నాడు రాజ్యాంగ సభలో జరిగిన చర్చల సరళిని, సారాంశాన్ని నాయకులు రూపొందించి: రాజీ మార్గాన్ని 17వ అధ్యాయంలోని 351వ అధికరణం 'ప్రతిబింబిస్తున్నది. రాజ్యాంగంలోని ఈ అధికరణం ఇలా నిద్దేశిస్తున్నది. '“హిందీ భాష, వ్యాప్తిని పెంపొందించ డము; దేశపు ఉమ్మడి సంస్కృతి మౌలిక లక్షణాలను వ్యక్తపరచగల మాధ్యమికంగా ఉపయోగపడ గలిగే విధంగా ఈ భాషను అభివృద్ది పరచడము; ఈ భాష సహజ వ్యుత్చత్తికి భంగంలేని విధంగా హిందూస్తానీ లోను, మిగతా భారతీయ భాషలలోను గల శైలినీ, వాక్య నిర్మాణ రీతులను మేళవించి హిందీ భాషను సుసంపన్నం చేయడము; అవసరమైన, వాంఛనీయమైన సందర్భాలలో (ప్రధానంగా సంస్కృతం నుంచి తదితర భారతీయ భాషల నుంచి పదజాలాన్ని స్వీకరించి, ఈ భాష పుష్కలంగా వృద్ది చెందడానికి కృషి చేయడమూ యూనియన్‌ (కేంద్ర ప్రభుత్వం) బాధ్యతగా వుంటుంది.” ఇదే రాజ్యాంగం సూచించిన రాజీ మౌర్ష్గం.

ఈ సందర్భంలో రాజ్యాంగ చట్టుంలో పొందుపరచిన “8వ షెడ్యూలు" ను గురించి జ్ఞాపకం చేసుకోవడం అవసరం. దేశంలో వివిధ ప్రాంతాల ప్రజల మాతృభాషలుగా వున్న 15 పెద్ద భాషలను ' జాతీయ భాషలుగా' గుర్తించి, ఈ షెడ్యూలులో పొందుపరచడం జరిగింది. ఈ విధంగా జాతీయ భాషలుగా రాజ్యాంగం గుర్తించిన ' ప్రాంతీయ భాషలిలో హిందీ కూడా ఒకటి. ఇలా జాతీయ భాషలలో ఒకటిగా, ప్రాంతీయ భాషలలో ఒకటిగా గుర్తించబడిన హిందీ భాష్మ తదితర 14 (ప్రాంతీయ భాషల వలెనే తన సాహిత్య సంపదను తాను సృష్టించి, పెంచి, పోషించుకుంటూనే వుండాలని, (ప్రాంతీయ భాషగా, ప్రాంత ప్రజల మాతృ భాషగా దాని భూమికను నిర్వహిస్తూనే వుండాలని నాయకులు భావించారు. అయితే దేశంలో విడివిడిగా చూచినప్పుడు హిందీ మాట్లాడే వారి సంఖ్య హెచ్చు గనుకనూ, అప్పటికి మూడు దశాబ్బాలుగా దేశమంతటా హిందీ వ్యాప్తికి స్వచ్చంద కృషి జరుగుతూ వచ్చినందుననూ అన్ని జాతీయ భాషల మధ్య ఒక “సేతువు భాషుగా హిందీని వినియోగించాలన్న ఆలోచన నాయకులకు కలిగింది. వారు భావించిన ఈ సేతువు భాష సాహిత్య భాషకాదు. అది ఒక “ఉపకరణ భాషు మాగ్రమే.

అన్ని జూతీయ భాషల సమి(శ్రణంగా ఈ “ఉపకరణ భాష రూపొందాలని, అలా రూపొందిన ఉపకరణ భాష ' అధికార భాష కావాలని నాయకులు భావించారు. ఈ ఆలోచ ఆనాడు అన్ని ప్రాంతాల నాయకుల ఆమోదం పొందింది.

అయితే, అటువంటి ఉపకరణ భాషగా హిందీ రూపొందడానికి కొంతకాలం పడుతుంది కనుక్క అలా అది పరిణతి చెందే వరకూ ఇంగ్రీషు అధికార భాషగా కొనసాగడం మంచిదని అనుకొన్నారు. కొత్త రాజ్యాంగ చట్టుం అమలులోకి వచ్చిన నాటి నుంచి 15 సంవత్సరాల వరకు అలా ఇంగ్లీషు కొనసాగవచ్చునని రాజ్యాంగంలోని 343 (2) అధికరణం ద్వారా నిర్దేశించడం జరిగింది. ఆ15 సంవత్సరాలగడువు ముగిసిన రోజుననే హిందీ ప్రతికూల, అనుకూల వివాదం

మొదలయింది. ఆ నాటి 'హిందీ-హిందూస్తానీ' వివాదం ఈ నాడు “హిందీ-ఇంగ్రీషు వివాదంగా పరిణమించింది.

ఈ సమస్యను పరిశీలించినట్టుయితే అటు హిందీ అనుకూలురు ఇటు హిందీవ్యతిరేకులు కూడా అసలు విషయాన్ని విడచి పెట్టి రాజకీయ సాముగరిడీలు చేస్తున్నారనిపిస్తోంది.

(410.86) 40 సంధియుగం

మరలవనం వునకు తెలియని నీతిలేదు, మనం పాటించే నీతి లేదు. మన దేశ హీన దళలకు ఈ కపట వర్తనమే కారణం. జీవితంలోని మిగతా అన్ని రంగాలకు వలెనే (ప్రకృతి మనకు ప్రపాదించిన సంపదల పరిరక్షణ విషయంలో కూడా ఈ మాట మనకు వర్తిస్తుంది. సుదీర్హమైన చరిత్ర, సంస్కృతి గల (ప్రాంతాలలో మన దేశం ఒకటి. అనేక నాగరికతా లక్షణాలు చాలా దేశాలకంటే ముందే మన దేశంలో ఏర్పడి వృద్ది చెందాయి. ప్రకృతి రహస్యాలను పలు నాగరికతల వారికంటే ముందు మనం తెలుసుకున్నాము. అయినా ఆచరణలో పాక్షిక దృష్టి వర్గదృష్టి, స్వార్ధ దృష్టి మొదటినుంచీ మనలను ఆవరించి వుంటున్నాయి. అతి పురాతన కాలంలోనే ప్రకృతి సంపదలను పదిలపరచుకోవలసిన అవసరాన్ని మన మేధావులు గుర్తించారు. అందుకే జంతుపూజ, వృక్ష పూజ వంటి కొన్ని ఆచారాలను కల్పించారు. అనాడు ప్రకృతి సంపదలను పరిరక్షించడానికి అది ఉత్తమ మార్గమనుకొన్నారు. అంతేకాదు, నాటి రచనలలో మత (గ్రంథాలయినా, నీతి గ్రంథాలయినా, వాటిలో ప్రకృతితో మానవుని సహజీవన ఆవశ్యకతమ ్రబోధిస్తూ వచ్చారు. మేధావులేకాదు, పాలకులు, (ప్రభుత్వాలు సైతం పరిసరాల పరిరక్షణను తమ విద్యుక్త ధర్మంగా పరిగణించిన సందర్భాలు మన దేశచరిత్రలో కనపడతాయి. అటువంటి వాటిలో మనకు చప్పున స్ఫురించేది ఆశోక చ(క్రవర్తి 'పేరు. దేశంలో వృష సంపదను, జంతుసంపదను పరిరక్షించడం రాజ్యపాలన ధర్మాలలో ఒక ముఖ్య విధిగా గుర్తించి అందుకు అవసరమైన శాసనాలను ఆయన చేశాడు. ఆహారం కోసమూ, మృగయా వినోదం కోసమూ కొన్ని జాతుల జంతువులను, వృక్షాలను నిర్మూలించ రాదని ఆయన నిషేధించారు. అలాగే బుద్ధ, జైన మత గ్రంథాలు ప్రకృతిని పదిలపరచడానికి కొన్ని విధి నిషేధాలను నిర్ణయించాయి. దీనిని బట్టి అప్పటికే మానవుడు తన అవసరాలకోసం తన పరిసరాలను శిథిలపరచడం జరుగుతున్నదని, (ప్రభుత్వాలనూ, మేధావులనూ ఆ పరిణామం కలవరపరిచిందనీ అనుకోవచ్చు. ఆటవిక దళనుండి మానవుడు రాతి యుగంలోకి, దానినుంచి లోహయుగంలోకి తెలివి మీరుతూ వచ్చిన కొలదీ, కొత్త కొత్త పౌఖ్యాల రుచి మరగిన కొలదీ అతడి అవసరాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ అవసరాలను తీర్చుకొనే ప్రయత్నంలో ఆతడు ప్రకృతిని శిథిలం చేయడం (ప్రారంభమయింది. రాను రాను జనాభా ఇంతలింతలుగా పెరగడంతో ఈ ఆవసరాలు మరింత పెరుగుతూ వస్తున్నాయి. ప్రకృతికీ, మనిషికీ మధ్య ఒక రకమైన పోరాటమే జరుగుతూ వస్తున్నదనవచ్చు. ఒకనాడు తన ఆహార, విహారాలకోసం చెట్టు చేమలనూ, జంతు జాలాన్నీ చంపడానికి ఆలవాటుపడిన మానవుడు, ఆధునిక పారిశ్రామిక యుగం వచ్చేటప్పటికి అటు అడవులను, ఇటు పొలాలను కూడా పారిశ్రామిక వాడలుగా మార్చివేస్తున్నాడు. సంధియుగం జ శ

ప్రకృతి మీద మానవుని ఈ దండయాత్ర ఇలాగే సగుతూపోత్త, ఒకూటి వారలు దూరని కారడవులూ, చీమలు దూరని చిట్టడవులు పూర్తిగా అంతరించి యి,. ం ఆకు అలమూ లేని ' మరల వనం'గా మారిపోయి మనిషి బల్చుకొనడానికి పొగ తప్పగాలి వుండ మరుభూమిగా మారిపోవచ్చు. తిండిని పండించుకోడానికి గోమ్చిదమంత భూ వసతి కూడా మనిషికి మిగలకపోవచ్చు. అటువంటి పరిణామం రాకూడదు. వచ్చిందంటే మనిషికి మనుగడ లేదు. యుగాంతమే అవుతుంది. అయితే, అలొగని పరిశ్రమలు ఉండకూడదని ఎవరూ అనజాలరు. వాటిని ఆపజాలరు. ఆధునిక యుగంలో అవి లేనిదే ఏదీ జరగదు. కాకపోతే ఈ పరిశ్రమలను నెలకొల్చేవారూ, (ప్రభుత్వాలూ ముందు జాగ్రత్తగా వాటిని ఏ ప్రదేశాలలో ఎలా ఏర్పాటు చేస్తే మనం పేల్చేగాలి మనం త్రాగే నీరూ, తినే తిండీ, ఉండే ఇళ్ళు మలినమై పోకుండా ఉంచాయో ముందుచూపుతో యోచించి నిర్ణయించుకోవాలి. పరిశ్రమల విస్తరణ ఒక్కటేకాదు. ఒకపద్దతి ఆంటూ లేకుండా ఈనాడు సాగుతున్న నగరాల విస్తరణ కూడా మనిషి జీవితాన్ని దుర్భరం చేస్తున్నది. ఈ పరిశ్రమలలో నుంచి, నగర నివాసాలలో నుంచి నిరంతరం నీటిలో వచ్చి కలుస్తున్న కాలుష్యం ముందు ముందు మనం త్రాగడానికి మంచి నీరు అనేదే లేకుండా చేస్తుంది. అడవులను నిర్మూలిస్తున్నందువల్ల గాలి మలినమై పోవటమే కాక; భూములు నిస్సారమై పోతున్నాయి. దేశంలో దారిద్ర్యాన్ని తొందరగా తొలగించి, జనుల అవసరాలను వీలైనంత ఎక్కువగా తీర్చాలన్న ఆతురతలో ప్రభుత్వాలు వాతావరణ కాలుష్యాన్ని గురించి పట్టించుకోలేదు. నిజానికి మన రాజ్యాంగ నిర్మాతలు మాత్రం ముందు చూపుతో, పురాతన అనుభవాల

  • తెలివితో వాతావరణ పరిరక్షణ అవసరాన్ని గుర్తించి, అందుకు సంబంధించిన కాన్ని నిబంధనలను రాజ్యాంగంలో పొందుపరచారు. మన రాజ్యాంగ చట్టుంలోని నిజ్దేళక సూత్రాలలో ప్రత్యేకంగా ఒక సూత్రాన్ని ఇందుకోసం చేర్చారు. 48-ఎ నిబంధన-పరిసరాల పరిరక్షణ, అభివృద్ది, అడవుల, వన్య మృగాల పరిరక్షణ అన్న ఈ నిబంధనలో ఇలా ఉన్నది - ** (ప్రకృతి పరిసరాల పరిరక్షణ, సంరక్షణలకూ, అడవులనూ వన్యమృగాలనూ కాపాడటానికి ప్రభుత్వం కృషిచేయదగును'). అయినా మన (ప్రభుత్వాలేమి, మన మేధావులేమి ఈ విషయాన్ని పట్టించుకోలేదు. 1972 తరువాత కొంత కదలిక ప్రారంభమయింది, (ప్రభుత్వమూ, స్టానింగ్‌ కమిషన్‌ కొత్త పరిశ్రమల ఏర్పాటు విషయంలోనూ, అడవులను అడ్డం చూపి నరికి వేసేవారి విషయంలోనూ, తదితర పారిసరిక కాలుష్య ప్రమాదాల విషయంలోనూ కొన్ని నిబంధనలను రూపొందించి, ప్రత్యేక కమిషన్‌లను ఈ విషయాల పరిశీలనకు ఏర్పాటు చేశాయి. అయినా, (ప్రభుత్వాధికారులు, పాలకులూ సైతం పారిశ్రామికుల ఒత్తిడులకు లొంగిపోతున్నందు వల్లనూ, మరొకవైపున పారిగ్రామికులు తమ తాత్కాలిక స్వల్ప ప్రయోజనాలనే ముఖ్యమ్టైనవిగా ఎంచుకుంటున్నందు వల్లనూ రాజ్యాంగ నిర్దేశిక సూత్రాలు గానీ, ప్రభుత్వ ఆదేశాలు గానీ పనిచేయడం లేదు. ఇందువల్ల, ఈ కాలుష్య ('్రమాడం రోజు రోజుకూ తీవ్రతరం అవుతున్నది. ప్రొఫెసర్‌ 'త్రిపిరనేని శివాజీరావు వంటి కొంతమంది శాస్త్రవేత్తలు, మితిమీరిపోతున్న ఈ ప్రమాదాన్ని పసికట్టి, పదే పదే హెచ్చరికలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వ నిస్సహాయ ఫ్టితివల్ల వీరి హెచ్చరికలు చెవిటి వాని ముందుక శంఖు ఊచినట్టు అవుతున్నాయి. శం సంధియుగం

అందువల్లనే, ఈ ప్రమాద నివారణకు (ప్రజలు ముఖ్యంగా మేధావులూ, పత్రికలూ పూనుకోవలసిన ఆవశ్యకత ఈనాడు ఏర్పడింది. ఆనాటి “తాపసులొవలె ఈనాటి శాస్త్ర పరిశోధకులు తదితర ఆలోచనాపరులు పూనిక వహించి, రానున్న ఈ మహాసంక్షోభాన్ని గురించి ప్రజలకు తె లియచెప్పాలి. పారిసరిక పరిరక్షణకు ఇప్పుడొక ప్రజా ఉద్యమం రావాలి. మేధావులు, పత్రికలు ఇందుకు కృషి చేయాలి. ఇంకింత సమాచారం సేకరించి సమాజున్ని ఆవరిస్తున్న ఈ విపత్తులను గురించి జనబాహుళ్యానికి విచివిగాతె లిపి వారిని ఈ ఉద్యమోన్ముఖులను చేయాలి. భావితరాల సంక్షేమం దృష్ట్యా ఇది మనందరి కర్తవ్యం. (14.287) గ్గాన్గాగ్గు అవ్యవస్థ “మన జాతీయ జీవన వ్యవ్టలో తీవ్రమైన అవ్వువ్టు అలముకొన్నది. ఈ రుగ్గుత చాల తీవ్రమైనది. ఒక జాతిగా మన మనుగడను అన్తవ్యస్తం చేసివేన్తున్నుది.. దేశ భవిష్యత్తును జూతీయ ప్రతిష్ట గురించి ముందుచూపుతో ఆలోబించేవారిని ఈ పరిణామం ఎంతగానో ఆందోళన పరుస్తున్నుది. కొని మన విధిని శాసిన్తునువారుగాని, మన భవిష్యత్తును పదిల పరచవలసీనవారు గాని ఈ పరిస్టితి తీవ్రతను అంతగా పట్టించుకుర్చుట్టు కనపడదు. అధికారంలోవున్ను నాయకులు, ఉద్యోగాలలో | ఉన్న అధికాలులూ చివరకు సుతం బ్రవ్ఫత్తులలో వున్లు విద్యాసంవన్నులలో సైతం దానిని గురించి ఆలోవిన్తున్తువారు. ఆట్టేమంది వున్నట్టు కనపడదు. అకడొకరు ఇక్కడొకరు. వున్నా అటువంటి వారిమాట వినవడదు. ౨ినిపించుకునేవారు. కనపడరు. మరొక జాతీయ వునర్వికాన ఉద్యమంవంటిదేదోవచ్చి మన మనసులను (ప్రక్షాళనం చేయవలసీన అవసరం ఈనాడు కనపడుతున్సుటి... దేశంలో పెనుంచి కింద వరకు దాడాపు అందరిలోనూ మితిమీరిన స్వాబ్ధం అలముకన్నుది. పాలకుల నిజాయితీ, డువావద్దనం ప్రజలను (ప్రభావితం చేయగలవు. పాలకులలో నచ్చీలము సన్మార్గము లుప్తమైనపుడు సామాన్య ప్ర నీకంలోఈ దర్గుణాలబ్భుష్ర ప్రటొవం మలింత హెచ్చుగా వుంటుంది. ఇంటా బయటా 28-3-86 సంధియుగం 4

పౌంశ్రామిక శకం ప్రారంభమయిన తరువాత ప్రపంచ స్వరూప్క స్వభావాలు (క్రమక్రమంగా మారిపోతున్నాయి. భూమిని ఆవరించి వున్న పరిసర వాతావరణంలో మౌర్పులు కనపడుతున్నాయి. కొత్త కొత్త పరిశ్రమల వల్ల ఆధునిక సాధనాలు, వాటివల్ల ఆధునాతనమైన సౌకర్యాలు ఎన్నెన్నో మనకు లభిస్తున్నాయి. ఇందువల్ల మనిషి జీవితం మరింత సుఖ'ప్రదం అవుతున్నది. నిజమే, కాని, గులాబి పూవును వెంటనంటి వుండే ముళ్లలాగ ఈ పౌకర్యాల, సౌలభ్యాలతోపాటు, చాప క్రింద నీరులాగ మెల్లగా (ప్రాకివస్తూ మన జీవితాలను కాటువేయనున్న కాలుష్యాలను గురించి ముందుచూపుగల కొందరు శాస్త్రవేత్తలు ఇటీవల కాలంలో గట్టిగానే హెచ్చరికలు చేస్తున్నారు.

ప్రస్తుత శతాబ్దంలో ఒకవైపున సాగరాల నీటి మట్దాలు పెరుగుతూ వస్తున్నాయి. మరొక

వైపున భూమిపై వేడిమి హెచ్చుతున్నది. ఈ రెండిటికీ గల సంబంధం ఏమిటి? మనచుట్టూ వున్న వాతావరణంలో, మనం అనుక్షణం పీలుస్తూ వుండే గాలిలో ప్రాణవాయువు, బొగ్గుపులుసు వాయువూ వగైరా రకరకాల వాయువులు వుంచాయి. వాటిలో ఈ రెండూ ముఖ్యమైనవి. ప్రకృతి వాతావరణంలో ఈ వాయువులు. (క్రమ పాళ్ళలో వున్నంత వరకే మన పని హాయిగా వుంటుంది. వీటి నిష్పత్తి మారితే, అలా మారిన మేరకు, మారుతున్న కొలదీ మన మనుగడ దుర్భరమవుతుంది. పరిశ్రమలలో బొగ్గు, నూనె వంటి ఖనిజాలను కాలుస్తున్నందు వళ్ల వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు ఎక్కువ అవుతుంది. ఇందువల్ల వేడిమి హెచ్చుతూంటుంది. వేడిమి ఎక్కువ అయినందువల్ల ధృవ (ప్రాంతాలలో గడ్డకట్టి వుండే మంచు కరుగుతుంది. మంచు కరిగి నందువల్ల సముద్రాలలో నీటిమట్టుం పెరుగుతుంటుంది. ఇరవయ్యోశతాబ్టిలో నిదానంగా జరుగుతూ వచ్చిన ఈ గొలసు కట్టువంటి మార్పులు ఇరవై ఒకటవ శతాబ్దిలో ఇంకింత వడివడిగా జరుగ వచ్చునని శా(స్త్రవేత్తలు భయపడుతున్నారు. మౌనవుని అ శ్రద్ద, అలక్ష్యం, హద్దులెరుగని స్వలాభాపేక్ష ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి.

ఇలా గాలిలో బొగ్గు పులుసు వాయువుపాళ్ళు పెరిగినందువల్ల భూమి చుట్టూ ఒక కొత్త

పాగ పారఅలముకోంటుంది. మామూలుగా భూమి మీద జనించే మహోష్టం ఆకాళంలోకి ఎగిరిపోతుంటుంది. కాని ఈ బొగ్గు పులుసు పాఠ ఏర్పడినప్పుడు, ఆ ఉష్ణాన్ని అలా పైకి పోనివ్వకుండా ఈ పొర అడ్డుకుంటుంది. అలా పైకి వెళ్ళిపోజూలని ఈ ఉష్ణం భూమి పరిసరాలలోనే బందీగా వుండిపోతుంది. ఈ కారణంగా భూమి రోజు రోజుకూ వేడెక్కుతుంటుంది.

““భూమి అంతా ఒకే మట్టుంలో వుండదు. నేల మిట్టుపల్లాలుగా వుంటుంది. పైన చెప్పిన పరిణామాలవల్ల పల్లపు ప్రాంతాలలో కంటె ఎత్తు (ప్రదేశాలలో ఈ వేడిమి మరింత ఎక్కువగా పెరుగుతుంది. భూమి చుట్టూ ఆవరించి వుండే వాతావరణంలో మామూలుగా వుండవలసిన దానికంటె బొగ్గుపులుసు వాయువు పాలు రెట్టింపు అయినట్లయితే, భూమి మీద ఉష్ణం 4 మొదలు॥8 డి(గ్రీల (ఫారన్‌ హీట్‌) దాకా హెచ్చుతుంది. అదే సమయంలో ధృవ 'ప్రాలతాలలో ఈ | సంధియుగం

ఉష్ణం 12 మొదలు 16 డి(గ్రీల దాకా హెచ్చుతుంది. రానున్న 60-70 సంవత్సరాల కాలంలో భూమి వేడిమి ఈ మేరకు పెరగీ అవకాళం వున్నది” అని శాస్త్ర పరిశోధకులు అంచనాలు వేస్తున్నారు. భూమి మట్టుం నుంచి పైకి పోను పోను వేడిమి హెచ్చుదల ఎక్కువగా వుంటుందను కున్నాము కదా! అందువల్ల ధృవ శిఖరాల మీద వున్న మంచు కరిగి నీరై సాగరాలలోకి పారుతుంది. అంతేకాదు. భూతల ఉష్ణం పెరిగినందువల్ల సాగరాలలో వున్న నీరు వేడెక్కి దాని పరిమాణం విస్తరిస్తుంటుంది. కడలి నీటి వేడిమి రెండు డి(గ్రీలు పెరిగితే, ఆ నీటి మట్టుం రెండు అడుగులు పెరుగుతుందట. ప్రపంచం ఆంతటా ఘనీభవించి వున్న మంచు అంతా కరిగి నీరుగా మారితే, అన్ని సముద్రాల నీటిమట్టుం 230 అడుగుల మేరకు పెరగగలదు. ఇది ఆద్యతన భవిష్యత్తులో జర్‌గే పని కాదనుకోండి.

  • ప్రపంచంలో వున్న మంచుగడ్డ ఆంతా కాక పోయినా, దానిలో కొంతైనా కరిగి, సాగరాల నీటి మట్టం మరో 50 అడుగులు పెరిగితే చాలు, (ప్రపంచంలో చాలా భాగాన్ని జలప్రళయం ముంచెత్తుతుంది. ఈ (ప్రమాదం ఉత్తర ధృవ ప్రాంతంలో కంటె దక్షిణ ధృవ (ప్రాంతంలో హెచ్చు. ఎందుకంటె దక్షిణ ధృవపు మంచుగడ్డలో హెచ్చుభాగం సాగర గర్భస్త పర్వత శిఖరాలపైన ఘనీభవించి వున్నది. ఉత్తర ధృవం విషయంలో అలాకాదు. అక్కడి మంచుగడ్డ సముద్రపు ఆడుగునేల మీద నిలిచి వుంటుంది.

కనుక్క ముందు ముందు భూమి వేడిమి పెరిగినప్పుడు దక్షిణ ధృవం మంచే జలప్రళయం మొదట వస్తుంది. అలా జరగరాదనే ఆశించాలి. జరిగితే మాత్రం (మన దేశంలో) గంగా డెల్టా (ప్రదేళం, అమెరికా తూర్పు కోస్తా ప్రాంతం, సోవియట్‌ యూనియన్‌లో కాస్పియన్‌ సముద్ర తీర ప్రాంతం, (బ్రెజిల్‌లో అమెజాన్‌, నియత్నామ్‌లో మికాంగ్‌ నదీ డెల్టా ప్రాంతాలు : డెన్మార్కు, నెదర్ణాండ్స్‌, ఆఫ్రికాలో గాంబియా, సెనెగల్‌ నదుల మధ్య ప్రాంతాలూ, న్యూజిలాండ్‌లో ఉత్తర ఐలెండ్‌ ప్రాంతం, ఆఫ్టేలియాలో ఎడలైడ్‌నైరుతీ ప్రాంతం, బయ్టాదేశ్‌, వైనా కోస్తా ప్రాంతాలూ - ఇలా ప్రపంచంలో 40 లక్షల చదరపు మైళ్ళు మేరకు భూ ప్రదేశాలు మునిగి పోయే (ప్రమాదం వుంది. ఈ ఒడిదుడుకుల ఫలితంగా ఉప్పెనలు, తుఫానులు, వరదలు, జల్రళభయాలు వంటి ఉపద్రవాలు సంభవించి అసలే పరిమితంగా వున్న భూష్రదేశాన్ని మరింత తగ్గించే ప్రమాదం వున్నది. మొత్తం భూగోళంలో రెండు వంతులు జలమయం కాగా, మూడోవంతు మాత్రమే భూ భాగం. భావి జలప్రళయాల వల్ల ఆందులో కూడా మరికొంత భూభాగాన్ని కోల్పోతే, మితి మీరి పెరుగుతున్న జనాభాకు కాలుపెట్టే సందులేకుండా పోవచ్చు. పంటలు పండించుకోవటానికి చాలినన్ని పొలాలు మిగలకపోవచ్చు.

ఈనాడు కోట్టాది ధనం వెచ్చించి నెలకొల్పు కుంటున్న పరి'శ్రమలనేకం ముని గిపోవచ్చు. జనసాంద్రత ఎక్కువగా వున్న దేశాలలో ప్రాణ నష్టం విపరీతంగా జరగవచ్చు. ఆ మధ్య కొన్నేళ్ళ క్రిందట అష్ట గ్రహకూటమి వల్ల జల ప్రళయం వస్తుందని పలువురు భయవిహ్వలులయారు. అదే రేపు “నాన్నా పులి” కథగా పరిణమించ వచ్చునేమో! మరి, ఇంతటి జల(ప్రళయాన్ని తెచ్చిపెట్టి, ప్రపంచ విలయానికి దారి తీయగల ఈ బొగ్గు పులుసు వాయువు ఇంకా ఇంకా "పెరగకుండా ఇకనయినా జా గ్రత్తపడడం ఈ నాటి మన కర్తవ్యం. ఆలా చేయకపోతే మన ఆలక్ష్యం వల్ల మనమంతా ఆ పులుసులో కలిసి పోవచ్చు. ముంచుకు వస్తున్న ఈ ముప్పును గురించి శాస్త్రజ్ఞులు పదే పదే చేస్తున్న ఈ హెచ్చరికలను (ప్రపంచం పట్టించుకోకపోతే కాగల కార్యాన్ని కాలుష్యమే తీరుస్తుంది. (311.87) సంధియుగం తక్‌

ఆనాటి అనుబంధాలు ఈనాడు కనపడవు. అప్పటి కలిసికట్టుతనం ఇప్పుడు కలికానికైనా కానరాదు. నాటి సాముదాయక సరదాలూ, సహకార ధోరణీ నేడు అపురూపమైపోయాలయి. ఆ ఆప్యాయతలూ కరువైపోయాయి. మన జనపదాలు మరీ మారిపోయాయి. గ్రామీణ జీవితం పూర్తిగా యాంత్రికం అయిపోయింది. ఇందుకు ముఖ్యంగా మూడు కారణాలు మనకు కనపడతాయి.

(ప్రాచీన భారతీయ అర్దిక వ్యవస్థకి గ్రామం ప్రాతిపదిక. ఏ ఊరికి ఆ ఊరు ఒక సంపన్న కుటుంబం వంటిది. దాని ఆర్దిక జీవనం స్వయం సమృద్దమైనది. ఊరివారంతా ఎంతో ఐకమత్యంగా కలిసిమెలిసి జీవనం సాగించేవారు. అది నిజమైన వికేంద్రీకృత ఆర్రిక వ్యవష్ట. మరి కాలమౌన పరిఫ్టితులు ఎప్పుడూ ఒకేలాగా వుండవు. అవి మారుతుంటాయి. కనుక వ్యవస్టలు కూడా మార్పులకు లోనుకాకతప్పదు. మితిమీరి పెరుగుతున్న జనసంఖ్యా, ఆధునిక రాజకీయ వ్యవస్థా, అధునాతన విజ్ఞాన సాంకేతికశా స్తాలవల్ల లభించిన నూతన సౌకర్యాలూ, సౌలభ్యాలూ, దేశీయ జీవన సరళిని మార్చివేస్తున్నాయి. ఈ మూడు కారణాలవల్హ మన జీవన వ్యవస్థలో రకరకాల మార్పులు వచ్చాయి. వస్తున్నాయి. వీటిలో కొన్ని కోరుకోతగ్గవీ, మరిక్షాన్ని అవాంఛనీయమైనవీను.

ఒకనాడు మన ఊళ్ళల్లో, ఊరివారంతా ఎంతో అనుబందికగా, ఆప్యాయంగా “అందరి కోసం ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కరికోసం అందరూ” అన్న సూత్రం ఆధారంగా జీవించేవారు. ఆనాటి జనసంఖ్య నేటి దానితోపోలిస్తే స్వల్పాతి స్వల్పంగా ఉండేది. అందువల్ల, పనుల పంపిణీ, విధుల విభజన అవసరమైంది. నాటి ఈ ఆర్టిక ఆవళ్యకత కాలక్రమేణ సాంఘిక అసమానతక్సృ దారితీసింది మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది* అన్న సామెత ఇక్కడ పరిస్థితిని అర్ధం చేసుకోవటానికి తోడ్పడుతుంది.

దేశంలో జనాభా విచ్చలవిడిగా పెరుగుతూ వచ్చింది. కాని, వనరులు పెరగలేదు, ఉన్న వనరులను సైతం మరింత ఫలదాయకంగా వినియోగించుకోగల సరికొత్త సుతారాలు నిన్న మొన్నటిదాక మనకు తెలియవు. అందువల్ల ఉన్న పరిమిత వనరులను పెరుగుతున్న జనాభాకు పంపీణీ జరపడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇది మనలో స్వార్ధపరత్వానికి దారితీసింది. “బలం ఉన్నవాడిదే రాజ్యం” అన్న సూత్రం మన సామాజిక జీవనంలో చోటుచేసుకొన్నది. ఈ పరిణామం మొదట పాలకుల (రాజుల)తో ప్రారంభమై [క్రమేణా జనసామాన్యంలోకి వ్యాఫించింది. చివరికది సమాజధోరణినే మార్చివేసింది. ఇలా ఒకనాటి ఆర్రిక పరమైన ఏర్పాటు ఈనాటి సాంఘిక రుగ్మతగా పరిణమించింది.

ఊరిలో ఎవరింట ఏ శుభం జరిగినా అభం జరిగినా ఊళ్ళోవాళ్ళు అందరూ పూనుకొని అది తమ అందరిపని అనుకొని చేయి కలిపి చేసేవారు. ఊరిలో (ప్రతికార్యానికి అందరికీ విందులుండేవి. ఈ విందులకు అవసరమైన సంబారాలు, పెరుగు, పాలు, నెయ్యి, గ్‌ సంధియుగం

కూరగాయలు వంటివి ఆరోజున అందరి ఇళ్ళనుంచీ ఆ ఇంటికి చేరేవి. ఇందువల్ల రెండు ప్రయోజనాలు ఉండేవి. గ్రామీణ సాముదాయిక జీవన అనుబంధాన్ని ఇది బలపరిచేది. కాగా, ఈ వ్యయభారాన్ని అలా పదిమందీ పంచుకొన్నందువల్ల ఎవరికీ మితిమీరిన భారంగా అనిపించేదికాదు.

ఈనాడు పరిస్టితి పూర్తిగా మారిపోయింది. ఆ ఇచ్చి పుచ్చుకునే అలవాట్లు తప్పిపోయాయి. కలవారిలో డంబాచారాలు పెరిగాయి. “ఎవరికివారే యమునాతీరే'* అన్న చందంగా మారిపోయాయి మన గ్రామాలు. కలవారికీ, లేనివారికీ నడుమ ఆర్టిక అంతస్తులతో పాటు మానసిక అరమరికలు కూడా ఏర్పడ్డాయి. ఈ విధంగా గ్రామీణ జీవనంలో ఒక అవ్యవప్ర ఏర్పడింది. ఇది సాంఘిక సంఘర్షణలకు దారి తీస్తున్నది. ఒకనాడు మనలో చదువు సంధ్యలు తక్కువైనా, సామాజిక స్పృహ హెచ్చుగా ఉండేది. ఈనాడు తెలివితేటలతో పాటు స్వార్ధచింతన పెచ్చు పెరిగింది.

బ్రిటీషువారు మనలను ఏలుబడి చేస్తున్న రోజులలో మనలో మనకు తంపులు పెట్టి చీలికలు కల్పించి వాళ్ళ పబ్బం గడుపుకునేవాళ్ళు. తెల్లవాళ్ళ '“ విభజించి పాలించే? జిత్తులమారి విధానాలను మనం పదే పదే అదేపనిగా తెగనాడుతూ వుండేవాళ్ళం. కాన, వాళ్ళు వెళ్ళిపోయి దశాబ్దాలు కావస్తున్నా వాళ్ళు సృష్టించిపోయిన ఈ అనర్ధదాయక హరసత్వం మాత్రం మనలను వదలిపోలేదు సరికదా, మన రాజకీయ జీవితంలో అదొక అంతర్భాగమైంది. రాజకీయకక్షలు (ప్రతి గ్రామాన్ని మురాలుగా చీల్ళివేశాయి. నాయకుల వోట్టకోసం ఊళ్ళను చీలదీసి ఆ చీలికలు మాసిపోకుండా చూచుకోవాలన్న సంకుచిత, స్వార్ద రాజకీయ దృష్టి మనలో జీర్ణించిన సీమ పాలకుల వారసత్వ పర్యవసానమే.

కలవారికీ, లేనివారికి నడుమ చీలికల్నూ కులాల మధ్య స్పర్ధలూ, మన నాయకుల చలవవల్ల సాంఘిక అగాధాలను సృష్టిస్తున్నాయి. అయితే, ఇక్కడ ఒక మాట చెప్పాలి. పేదజనులలో ఒకనాడు ఎరుగని రాజకీయ, సాంఘిక చైతన్యం ఈనాడు ఏర్పడింది. ఇది రాదగిన ఆధునిక పరిణామమే కాని, దీనికితోడుగా రావలసిన విశాల సమతాదృక్చుథం లేనందున, ఈ వైతన్యంవల్ల జరుగవలసిన మంచి జరుగకపోగా, వారికి కీడే జరుగుతున్నది.

ఆధునిక శాస్త్రసాంకేతిక ప్రగతి వల్ల మనకు లభించిన ఆధునాతన ప్రయాణ, (ప్రసార, సమాచార సౌకర్యాలవల్దా, బస్తీల నాగరికతా సంపర్కం వల్లా మనలో ఆళలూ, కోలికలూ, తెలివితేటలూ పెరుగుతున్నాయి. కాని, అపేక్షలు మాత్రం తగ్గిపోతున్నాయి. ఈ ఆధునిక సౌకర్యాలూ, సౌలభ్యాలూ మానవుని కాయకష్టైన్ని తగ్గించి, బుద్దివికాసాన్ని 'పెంపాంది స్తున్నాయి. పరిమిత వనరులను మరింత ఫలప్రదంగా వినియోగించుకోగల మహత్తర అవకాశం 'సైన్సువల్ల మనకు లభించింది. నిజానికి, ఆ అధునాతన పరిణామాలు మన మనసులను, దృక్పధాలను ఇంకింత విశాలంచేసి ఉండవలసింది. కాని, అలా జరగలేదు. ఎందువల్ల? పాతకాలానికి, ఈ విజ్ఞాన శా(స్త్రశకానికి మధ్య సంధికాలంలో మనలో (ప్రబలిపోయిన కుటిల స్వార్ధచింతన మనలను వదలనందువల్ల, ఈ (ప్రగతి మనిషిని మనిషీ సలికొత్త పద్దతులలో దోచుకొనడానికి వీలుకల్పించిందే కాని, మనలో సంస్కారాన్ని పెంచలేదు. ఊరిలో నోరులేని నిరుపేద మొదలు, రోదసిలోని అనంత నికిప్తశక్తి సంపదల వరకు అన్నీ ఈనాడు దోపిడీకి గురికావడం మనిషిలో తెలివితేటలతోపాటు మంచితనం పెరగకపోవడం వల్లనే.

కంకిపండిన చోట అయిదు కంకులను పండించగల _ శక్తియుక్తులను సంధియుగం పీ

సంతరించుకొన్నాము. నేల చాలకపోతే నింగిలోకి లోగిళ్ళు కట్టుకొనటం నేర్చుకొన్నాము. ఈ విశాల (ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడ, ఏమి జరిగినా, అప్పటికప్పుడు క్షణాలమీద మనకంటి ఎదుట సాఇాత్కరింపజేసుకోగల సులు సూత్రాలను తెలుసుకొన్నాము. అనుకుంటే లోకాన్ని భస్మీపటలం చేయగల మారణా,స్త్ర సంపదనూ సమకూర్చుకొంటున్నాము. మనకు చేతకానిదల్టా మన మనసుల్లో పేరుకొని కరుడు గట్టిన మాలిన్యాన్ని కడి గివేసుకోలేక పోవడమే. నిజానికి ఈమాట పల్లీయులకంటె బస్తీలవార్‌కే ఎక్కువగా వర్తిస్తుంది, అయినా ఈ మానసిక కాలుష్యం నుంచి, ఈ నైతిక పతనం నుంచి గ్రామ జీవనాన్ని (ప్రక్షాళనం చేసుకోగలిగితే దేశాన్ని శుద్ది చేసుకోగలుగుతాము. కనుక, ఈనాడు కావలసింది అందరిలోనూ నైతిక పునరుజ్జీవనం. ఇదినేటి ప్రధాన సాంఘిక ఆవళ్యకత. ఇందుకు కృషిజరగాలి. మన మనసుల్లోని మాలిన్యాన్ని కడి గివేసుకోవాలి. (17.8.85) గ్గాన్గున్లు మెదడులో మిడిసిపాటు మైకం “నాగరికత పెరుగుతున్న కొలది పారిశ్రామిక విస్తరణ జరుగుతున్లు కొలది మనిషీ తన తెలివితేటలను గురించి తాను మురిసీపోతున్నాడు. బీవితాన్లి నానాటికీ ఇంకింత సుఖమయం చేసుకొనడానికి ప్రళ్ఫతిలో నిజీప్రమైయున్లు అనేకానేక నిగూఢ రహస్యాలను రోజురోజుకు వెలికి తీసి వినియోగించుకొనడంలో ఉపకరిస్తున్న తన (ప్రతిభావ్యుత్చుత్తులను చూచి తానే గర్పపడుతున్నాడు. ఈ మురిపెము ఈ మిడిసీపాటు మనిషీ మేధస్సులో ఒకరమైన మైకాని కలిగిస్తున్నాయి. మరోవైఫు అలనిలో పెరుగుతున్హు స్వార్ధచింతన మితిమీరిపోతున్ను స్వలాభద్చష్తి పదుగురి (శ్రేయస్సును గురించి ఆలోవించగల అతని శక్తిని లుప్తం చేస్తున్నాయి. ఈ స్పాలాభద్నష్త ఈ (పలోభతత్వం ముందు ముందు మానవకోటి మనుగడకే ముష్ణు తెచి పెట్టనున్నాయన్లు గుర్ధింపు అతనిలో లేకుండా చేస్తున్నాయి”. ఇంటాబయటా 24-8-87 4 సంధియుగం

కొలమాన పరిస్థితులకు అనుగుణంగా విధానాలను, _ పద్రతులను మలఅచుకోగలిగినప్పుడే ఏ దేశమైనా తన సమాజాన్ని ముందుకు తీసుకుపోగలుగుతుంది. సమాజ (ప్రగతికి అన్నిటికంటె ముఖ్యమైనది విద్య కనుక, దేశ అవసరాలకు, మానవ మనోవికాసానికి ఆనుకూలమైన విద్యా విధానాన్ని ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకుంటూ వుండడం అవసరం. ప్రపంచ చరిత్రలో కాలానుకూలఅంగా విద్యా విధానాలను రూపొందించుకోగలిగిన దేశాలే ముందుకు పోగలిగాయి. ఆలా చేయలేకపోయిన దేశాల పరిస్టితి మాత్రం '* ఎక్కడ వేసిన గొంగళి అక్కడే'* అన్న చందంగా వుండిపోయింది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క. (ప్రధాన రాజకీయ పరిణామం ఆనంతరం అక్కడి విద్యావిధానంలో ముఖ్యమైన మార్పులు వచ్చినట్టు చరిత్ర చెబుతున్నది. అమెరికా, సోవియెట్‌ యూనియన్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఇలా ఏ దేశ చరిత్ర చూసినా ఈ విషయం స్పష్టమవుతుంది. మనదేశంలో కూడా మన విద్యావిధానాన్ని మారుతున్న పరిస్టితులకు అనుగుణంగా మలచు కోవడం తవసరమన్న గుర్తింపు స్వాతంత్రానంతరం మనలోనూ వచ్చింది. మన విద్యా విధానాన్ని నేటి పరిస్రితులకు అనువుగా రూపొందించుకొనడంలో ఇతరదేశాల అనుభవాలు కొంతవరకు తోడ్పడగలవు. ఆందరి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మనకు తగిన, మనదైన ఆధునిక విద్యావిధానాన్ని మనం రూపొందించుకోవాలి. ఈనాడు అనేక ఇతర విషయాలలో వలెనే చదువుల విషయంలో కూడా జాతీయ ఎల్లలు చెరిగిపోతున్నాయి. అపారంగా మానవుని చేతికి ఆందివస్తున్న శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఇందుకొక ముఖ్యకారణం. ఈనాడు మన విద్యార్థులు ఎందరెందరో ఇతర దేశాలకు పై చదువులకోసం వెడుతున్నారు. ఇందువల్ల కళాశాల విద్యావ్యవస్టల మధ్య ఒక విధమైన అనుబంధం ఏర్పడుతున్నది. కనుక, ఇతర దేశాల అనుభవాలను కూడా పరిగణనకు తీసుకొనడం అవసరం, అమెరికా తనకు స్వాతం త్ర్యం వచ్చిన తరువాత మొదటి నూరు సంవత్సరాలలో బ్రిటీష్‌ విద్యాబోధన పద్రతులనే అనుసరిస్తూ వచ్చింది. అయితే 19వ శతాబ్ది మధ్యకాలంలో అమెరికా దేశాన్ని ముంచెత్తిన ఆంతర్యుద్దం అమెరికన్‌ నాయకుల ఆలోచన ధోరణిలో మార్చు తెచ్చింది. అందువల్లనే 1960-70 మధ్యకాలంలో అమెరికాలో విద్యారంగంలో ముఖ్యమైన మార్పులు చాలా వచ్చాయి. అంతర్యుద్ధ ఆనుభవం ఒకవైపున, దేశంలో నానాటికి పెరుగుతూ వచ్చిన రా్థ్రాల సంఖ్య మరొకవైపున ఈ మార్పుల ఆవళ్యకతను పెంచాయి. కొత్తగా నీగ్రోలకు బానిసతనం నుంచి విముక్తి అభించడంవల్లను, అప్పుడప్పుడే పుంజుకొంటున్న పారిశ్రామికాభివృద్రి అవసరాలవల్ల కూడా పాత విద్యా విధానంలో మార్పుల ఆవశ్యకత హెచ్చింది. అలానే రష్యాలో సోషలిస్టు విష్లవానంతరం జార్‌ చక్రవర్తి విద్యా విధానం పనికిరాదని సోవియట్‌ నాయకులు గుర్తించారు. 1917 నుంచి ఆదేళంలో విద్యారంగంలో (ప్రయోగాలు ఇందుకు నిదర్శనం. సంధియుగం ఉం

చదువులలో (ప్రాజెక్టు పద్రతిని ప్రవేశపెట్టారు. తరువాత పదేళ్లలో పాత ప్రతిని, (ప్రాజెక్టు పద్దతిని రద్దు పరిచారు. 1920లో పాత విశ్వవిద్యాలయాలను మూసివేసి పదేళ్ళ తరువాత వాటిని మళ్ళీ తెరిచారు. ఇలా రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ వచ్చి, చివరి కీనాటికి తన ఆధునిక విద్యా ఎధానాన్ని సోవియెట్‌ యూనియన్‌ రూపొందించుకొన్నది. ఇలా (ప్రతి దేశానికి దేని అనుభవం దానికున్నది. అతిపురాతన కాలం నుంచి మన విద్యారంగం ఒక విచిత్రమైన పరిఫ్టితిని ఎదుర్కొంటూ వచ్చింది. (ప్రాచీన భారతీయ సంస్కృతి ఎంత ప్రబలమైనదో దానిని అనుసరిస్తూ వచ్చిన మన విద్యావిధానం అంతటి అరమరికలతో కూడుకున్నది. సమాజంలో కొద్దిమందికి మాత్రమే చదువుకునే అవకాశం వుండి, మిగతా వారందరికి అటువంటి అవకాశం అసలే లేని సందర్భం ఒక్క మన దేశంలోనే కనపడుతుంది. దీనితో కొంతవరకు మాత్రమే పోల్చదగిన పరిస్టితి మొన్న మొన్నటివరకు అమెరికా దక్షిణాది రాష్ట్రిలలో వుండేది. అయితే, అక్కడి తెల్లవారు నళ్లవారిని చదువుకొనకూడదు- అని అనలేదు గాని తమ విద్యాలయాలలో తమతో (ప్రక్క ప్రక్కనే కూర్చుని చదువుకొనడానికి వీలులేదని, కావాలంటే వేరే విద్యాలయాలు పెట్టుకొని చదువుకోవచ్చునని అన్నారు. కాల క్రమేణ ఈ ఆరమరికల పద్దతులన్నీ అంతరించి పోయాయి. మనదేశాన్ని మహ్మదీయులు పాలిస్తున్న కాలంలో విద్యావిధానం ఎలా వుండేదో తెలియదుగాని, ఆ తరువాత వచ్చిన ్రిటీష్‌వారి పాలనలో మన విద్యారంగం ఒక కొత్త దారి తొప్పింది. వారు ఏ దురాలోచనతో, ఏ దూరాలోచనలతో 'ప్రవేళపెట్టినప్పటికి వారు తెచ్చిన మౌర్పులు ఒకవిధంగా మనకు మేలు చేశాయి. తమ మత ప్రచారం కోసమని వచ్చిన తెల్లవారు విద్యాగంధంలేని మన దళితజాతుల వారిలో చదువుల వ్యాప్తికి తోడ్పడ్డారు. అలానే, బ్రిటీష్‌ (ప్రభుత్వం మనలను బుజ్జగించడానికి, మన దేశంలో తమ పరిపాలనను కొనసాగించడానికి కావలసిన ఉద్యోగులను తయారు చేసుకొనేందుకని ప్రవేళపెట్టిన ఇంగ్లీషు విద్యావ్యాప్తి మన జాతిని జాగృతంచేస్తి స్వాతంత్ర్యంకోసం పోరాడటానికి సిద్ద్రపరచింది. మకాలే వంటివారు ఎంతో దూరదృష్టితో చేసిన దురాలోచనలు కూడా మనకు మేలే చేశాయి. కాలవాహినికి గల ప్రక్షాళన శక్తి చాలా బలమైనది సుమా! మనకు స్వరాజ్యం వచ్చి, మన స్వతంత్ర సర్వసత్తాక రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటినుంచి మన విద్యారంగాన్ని సంస్కరించుకొనడానికి మనము. చాలా చాలా (ప్రయోగాలు చేశాము. కాని ఇంతవరకు సంతృప్తికరమైన విద్యావ్యవస్థ రూపొందలేదు. గుమౌస్తాలను మాత్రమే తయారుచేసే మకాలే విద్యావ్యవస్థ నుంచి మనం ఇంకా పూర్తిగా బయటపడలేదు. దేశం రాజకీయంగా జాగృతమైంది. పారిశ్రామికంగా పురోగమిస్తున్నది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రూమి దేశాలలో ఒకటిగా ముందుకు సాగుతున్నది. అయినా ఆధునిక కాలానికి తగిన విద్యావిధానం ఇంకా రూపొందలేదు. యువకులలో కాయక్ట సహిష్టుతను పెంపాందించగల విద్యావిధానం ఈనాడు మనకు కావాలి. ఒక్క సైన్స్‌ రంగంలో తప్ప మన విద్యాలయాలు ఇస్తున్న డిగ్రీలకు వీసమంత విలువ లేకుండా వున్నది. సందర్భశుద్దిలేని చదువులు నేర్పడం వల్లి ఇటివంటి పరిస్టితి ఏర్పడుతున్నది. మన దేశానికి జీవనాడి వంటిదనదగు మన వ్యవసాయ రంగాన్ని ఆధునిక శాస్త్రీయ పద్ధతులలో నిర్వహించుకొనడానికి, క్రమేణా విస్తరిల్లుతున్న పారిశ్రామికావసరాలకు కావలసిన మెలకువలను నేర్చడానికి, త్వరిత గతిని పుర్తోగమిస్తున్న శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని సమర్దంగా 50 సంధియుగం

వినియోగించుకొనడానికి అవసరమైన నిపుణులను, (శ్రామికులను తయారు చేసుకొనడానికి ఉపయోగపడగల చదువులు నేడు మనకు కావాలి. మనదేశంలో చదువుకొన్నవారిలో అర్ధరహితమైన, అనర్ధదాయకమైన అపోహలు కొన్ని వేరూనుకొని వున్నాయి. చదువుకొన్నవారు కాయకష్టం చేయడం నామోషీ అన్నది వాటిలో ముఖ్యమైన ఒక (భ్రమ. దీనివల్లి మన జాతికి జరిగిపోయిన, జరుగుతున్న అపకారం అంతా ఇంతా కాదు. ఈ మూఢనమ్మకంవల్లనే మన యువజనులలో చదువులతోపాటు సోమరితనం పెరుగుతున్నది. దీనిని సోమరితనం అనడంకంటేె చేతగానితనం అనడం వాస్తవానికి మరింత దగ్గరగా వుండవచ్చు. ఒకానొకప్పుడు 'స్రీలను “'అబలలు”, “ అసూర్యంపళ్యలు*' అని వర్ణిస్తుండేవారు. ఈనాడు మన దేశంలో చదువుకొన్న యువతీయువకులకు, ముఖ్యంగా యువకులకు ఈరెండు మాటలు వర్తిస్తాయి. యువజనులలో ఈ అబలతను, అసూర్యంపళ్యతను తొలగించగల చదువులు కావాలి. చదువులతోపాటు కాయకష్టం చేయగల దేహ దారుఢ్యాన్ని యువజనులలో పెంపాందించగల కొత్త విద్యా విధానాన్ని మనం నిరాలస్యంగా రూపొం దించుకొనవలసి వున్నది. చదువులను ప్రాజెక్టులతో ముడిపెట్టి, యువతీ యువకులచేత వారి వారి చదువులకు సంబంధించిన (ప్రాజెక్టులలో కొంతకాలం విధిగా పనిచేయించే ఏర్పాటు వున్నట్టుయితే రెండు ప్రయోజనాలు చేకూరవచ్చు. ఒకటి, బుద్ర్దిబలంతోపాటు దేహబలం వృద్ది చెందుతుంది. రెండు, చదువుకున్న వారంతా మేజాబల్ల ఉద్యోగాలకోసమే ఎగబడే పరిస్టితి మారి, నిరుద్యోగ సమస్య తగ్గుతుంది ఇప్పటి పరీక్షల విధానాన్ని కూడా ఈ కొత్త పద్రతికనుగుణంగా మార్పు చేసుకోవాలి. ఇటువంటి విద్యావిధానాన్ని రూపొందించగలిగితే అది జాతి జాగ్ఫితికి దేళ ప్రగతికి తోడ్పడుతుంది. (24.5.85) స్గాగ్గాగ్గా అధికారమే పరమావధి అయితే “నేటి రాజకీయాలలో ఆళయాలకు విధానాలకు బొత్తిగా స్తానం లేకుండా పోతున్లుది. అధికార పదవులే రాజకీయాలకు పరమావధి అయిపోయింది. అందువలనే (ప్రజలకు నాయకులంటే తేలికభావం వర్చుడింది. ఎన్నికలు జరుగుతున్హుమూట నిజమే కొందరు గెలుస్తున్ను మొటౌ నిజమే. కానిఎవరు వీప్పార్టీనీడనగెలిచి మరేపార్టీ వాండాఎపుడు పట్టుకొంటారో చెప్పులేనిపరిస్రితి వర్చుడింది. ఇంటాబయటా 1 7-£2-83 తన న. భయతరయ్య (ంరాలదన్న్న్న సంధియుగం నొ చా 51 ([్ర గన స్‌ (గ స్ట్‌ లి మాయో

(యూసర్‌ శంప్రహుర్‌ళక0

విశ్వం ఆతివిశాలమైనది. ఈ వైశాల్యం అనంతమైనది. దానిలో దాగివున్న ప్రకృతి రహస్యాలు అన్నీ ఇన్నీ కావు. అవి ఎన్నీ ఇంకా ఎవరికీ తెలియదు. తెలుసుకోవాలన్న తపన, తపస్సుల ఫలితంగా మానవుడు ఆటవిక యుగం నుంచి రాతి యుగానికీ, రాతి యుగం నుంచి లోహయుగానికీ, లోహ యుగం నుంచి పారిశ్రామిక యుగానికీ, దాని నుంచి ఆధునిక యుగానికీ, అటుపైన ఈనాటి అధునాతన శకానికి క్రమేణ పురోగమిస్తూ వచ్చాడు.

విశ్వానికీ, మనిషిమెదడుకీ పోలికలు వున్నాయి. మామూలు కంటికీ ఇంత విశ్వమంతా కూడా మనచుట్టూ ఆవరించి వున్న ఒకగుం(డ్రని గుడారంలా కనిపిస్తుంది. మనిషిపు(రై కూడా సైజులో చిన్నదైనా దాదాపు ఆదే ఆకారంలో వుంటుంది. ఈ చిన్న పురైలో ఇమిడి వున్న మనిషి మెదడు (ఆలోచనా శక్తి) అపారమైనది. విశ్వం ఎంత ఆనంతమో ఇది అంత అపరిమితం. శతాబ్దాలుగా ఎప్పటికప్పుడు తన మెదడుకి పదును పెట్టుకుంటూ విశ్వంలో నిక్షిప్తమైన నిగూఢ రహస్యాలను, అద్భుతళక్తులను వెతికి పట్టి వెలికి తీయడానికి నిరంతరం, నిర్విరామంగా దానిని వెంచొడుతున్నాడు మానవుడు.

ఈ వేటలో వేసట ఎరుగని వేటగాడు మానవుడు. అన్వేషణ, తపస్సు, పరిశోధన ఇవన్నీ పర్యాయపదాలు. ఇవే ఈ వేటగాని చేతి విల్లూ, విల్లనంబులు. వీటితోనే ఈనాటి మనిషి తన తెలివినీ, విశ్వరహస్యాలను గురించిన తన తెలివిడిని ఇంతకింతగా పెంపొందించుకొంటూ వచ్చాడు. ఈ అభ్యుదయ యాత్రలో పారిశ్రామిక యుగాన్ని దాటి గ్రహీంతరయానం చేసే ద్రాక్షా వచ్చాడు. ఈ గవేషణ, ఈ కుతూహలం, ఈ ఉద్యమం మనిషిని ఇంకెంత ముందుక్తు తీసుకపోతాయో! ఇంకా ఎన్నెన్ని ప్రకృతి రహస్యాలను వశపరచుకొని వాటిపై ఎలా ఎలా, ఎటు ఎటు స్వారీ చేసుకుంటూ ఎంతెంత దూరం ముందు ముందుకు, పైపైకి పోతాడో, మానవుడు పోగలడో కాలమే చెప్పాలి.

ప్రకృతిని గురించిన పరిప్యూర్థ పరిజ్ఞానం కోసం అర్రులు చాచి పరుగులిడుతున్న మానవ మేథస్సు ఇప్పటికి అనేక ఆవిష్కరణలు చేసింది. ఆవిరియంత్రం, పత్తిమర పంటల కోత యంత్రం, ముద్రణయం(త్రం, విద్యుచ్చక్తి, ఆణుళక్తి, రేడియో, టెలివిజన్‌, ఇలా ఎన్నెన్నో కొత్త కొత్త సాధనాలను, సరికొత్త సౌకర్యాలను సంతరించుకున్నాడు మానవుడు. వీటిలో అతి తాజా సాధనం కంప్యూటర్‌. ఇది మనిషి సృష్టించిన “మరోమనిషి. బహుశా ఒక్క సంతానోత్పత్తి మినహా మానవులు చేయగల షనులన్నీ చేయగల +క్తినీ, ధీశక్తినీ, తెలివితేటలను గుచ్చి కూర్చి

పెట్టి మనిషిఈ మర మనిషిని సృష్టించాడనవచ్చు.

త్వరలోనే *“నుహాకంప్యూటర్‌ (సూపర్‌ కంప్యూటర్‌) అంటూ మరో కొత్తరకం కంప్యూటర్‌ రానున్నదట. ఇప్పటి వరకు మనం విడ్డూరంగా భావిస్తూ వింతగా చూస్తున్న తొలితరం, మలితరం మరమనుషులను తలదన్నే '“మహామరమనిషి' ఈ కొత్త కంప్యూటర్‌.

తొలితరం మరమనుషులు స్థూలకాయులు. రెండోతరం మరమనుషులు సుందరాంగులు 52 సంధియుగం

కాగా, రాబోయే మహామరమనిషి (సూపర్‌ కంప్యూటర్‌) తన ముందు తరాల మరమనుషుల కంటే మరింత చాకచక్యంగా, మరిన్ని పనులు ఏకకాలంలో చేయగలడట. “పిట్ట కొంచెం, కూత ఘనం' అన్నది పాత సామెత. 'పిల్ట కొంచమైన కొలది కూత ఘనమౌతుంది.'* అనే కొత్త సామెత ఈ కంప్యూటర్లకు వర్తిస్తుంది.

సూక్ష్మీకరణ ఆధునికీకరణకు పర్యాయపదమైంది. కనుకనే మొదటి కంప్యూటర్‌ పెద్దమేడలోని పెద్ద గది సైజులో వుండగా, ఇప్పటి కంప్యూటర్లు టైష్‌రైటర్‌ సైజుకి కుదించబడ్డాయి. రానున్న సూపర్‌ కంప్యూటర్‌ అరచేతి ప్రమాణంలో ఇమడవచ్చునట.

మెదడు పదును బారుతున్న కొలది ఇలా కొత్త కొత్త శక్తియుక్తులూ, సాధన సౌకర్యాలూ ఇంకా ఎన్నెన్నో లభించవచ్చు. అయితే, మానవ సమాజ పురోగతిలో ఇంతవరకు, ఈ కొత్త ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు అందినంతనే అందిన మేరకు వినియోగించుకొనగలిగిన వారేమో ముందుకు పోయారు. పాత నమ్మకాల భయం వల్లనో, కొత్తపట్హు సంశయం, సందేహాల వల్లనో వెనకడుగు వేసిన వారేమో వెనుకనే వుండిపోయారు. నేటి (ప్రపంచ సమాజంలో హెచ్చుతగ్గులకు, నిమ్నోన్నతాలకు ఈ జంకు గొంకులే కారణం. ఎదుటి వాడికంటె తనది పై చేయిగా వుండాలన్న మనిషి స్వార్ధచింతన కూడా దీనికి తోడై సమాజాన్ని కలిమి, లేముల మధ్య చీల్చివేసింది. ఫలితంగా వర్గ, వర్ణ తారతమ్యాలు ఏర్పడ్డాయి. క్రమేణ మనిషిని మనిషి దోచుకునే ఒక 'అనాచారానికి' లోకం గురైంది. ఇవి చరిత్ర తెలుపుతున్న వాస్తవాలు.

ఈ చరిత్ర పాఠాలను గ్రహాంచి, ఆధునిక వాస్తవికతలను అర్ధం చేసుకుని, నూతన విజ్ఞాన సాధన సౌకర్యాలను వినియోగించు కొనడంలో కాలంతోపాటు పరుగిడగలిగిన వారే పాత తారతమ్యాలను, అసమానతలను తాలగించుకొని వసుధైక సమసమాజంలో సమాన భాగస్వాములు కాగలుతారు. ఈ తరం యువకులు అ(ప్రమత్తులై కాలంతోపాటు ముందుకు పోగలిగితే తమకూ, తమ దేశానికి, సమాజ భవిష్యత్‌కు మేలు చేసుకున్నవారు అవుతారు.

లోకాన్ని సేవించడానికో లేదా శాసించడానికో ఆయత్తమౌతున్న మర మనుషుల దండయాత్ర ప్రారంభమైంది. మహామరమనుషులు ఇంకా మనదాకా రాలేదు. కాని కంప్యూటర్ల శకంలో మన దేళం అడుగు పెట్టిందని మాత్రం నిస్సంకోచంగా చెప్పవచ్చు.

మన యువతీ యువకులు ఈ కొత్త ఆవకాశాలను వినియోగించుకొని తమ భవిష్యత్‌కు ఆధునిక పునాదులను నిర్మించుకొని, మన దేశాన్నీ, సమాజాన్నీ, ఆధునాతన పథంలో నడిపించగల శక్తి సామర్థ్యాలను సంతరించుకోవాలి. అలా చేయకపోతే మనకు సేవ చేయవలసిన కొత్త శాస్త సాధనాలు ఇతరుల అధీనంలో వుండి మన మీద జులుం చెలాయించగల ప్రమాదం వుండవచ్చు! చరిత్రలో అటువంటి పారపాటు (గ్రహపాటు మరొకసారి జరుగకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత నేటి యువనాయకుల మీద, రేపటి పౌరులు కానున్న విద్యార్డుల మీద వున్నది.

(209.85) సంధియుగం ర్‌3

క969 జాలై 20 తేదీన మానవుడు మొట్టమొదటిసారి భూలోకం నుంచి వెళ్ళి చంద్రలోకంలో దిగాడు. ఒకరుకారు, నిజానికి ఆ రోజున ఇద్దరు మానవులు చం ద్రగోళంమీద “* ప్రశాంతసాగరం'' అనే ప్రదేశంలో దిగి, మానవ విజ్ఞాన పురోగమన సుదీర్ర చరిత్రలో మతో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. చందమామమీద దిగిన మొదటి నరుడు నీల్‌ ఆమ్‌'స్ర్రాంగ్‌, అక్కడ దిగిన ఆ అమృత ఘడియలలో అతను సాలోచనగా అన్నట్టు, '“ఒక బడుగు మనిషివేసిన ఈ చిన్న అడుగు, మానవజాతికొక పెద్ద ముందడుగు”. ఆకాళంలో చుక్కలను, చందమామను చూస్తూ, దాదాపు నాలుగువేల సంవత్సఠాల పైచిలుకు కాలంనుంచి మానవుడు కంటున్న కలలు ఆ రోజున నిజమయ్యాయి. మనిషి కొత్త ెక్కలు విచ్చుకొని భువినుంచి డివి “సీమలకు?', అన్య లోకాలకు ఎగిరిపోగలగాలన్న కోరికతో ఎంతోకాలం నుంచి, ముఖ్యంగా అప్పటికి పదిహేనేళ్ళుగా నరజాతి ధృఢసంకల్పంతో సాగించిన కృషి అంచలంచలుగా ఫలిస్తూ వచ్చి ఈ అద్భుత విజయానికి దారిచేసింది. ఈ విజయానికి అమెరికన్‌ వ్యోమగాములు నిమిత్తమా(త్రులైనా, ఇది సకల మానవకుటుంబానికి మహావిజయం, ఆమ్‌స్ర్రాంగ్‌, అతడితోడి వ్యోమగామి ఎడ్విన్‌: ఆ్లీన్‌ చంద్రలోకంలో దిగినవాత్త ఆగమేఘాలమీద భూలోకానికి అందగానే సకల మానవకోటి ముక్తకంఠంతో వెల్లడించిన ఆనందోత్సాహాలే అందుకు నిదర్శనం. దశాబ్దాల కాలంనుంచి రకరకాల రొకెట్ట (ప్రయోగాలు పలు దేశాలలో జరుగుతూ వచ్చాయి. ఆమెరికా 1949 మే నుంచి 1957 మే మధ్యకాలంలో 14 రకాల రాకెట్టును అంతరిక్షంలోకి ప్రయోగించి పరిశోభనలూ, పరిశీలనలూ జరుపుతూ వచ్చింది. అదేకాలంలో సోవియట్‌ యూనియన్‌, ఆస్టేలియా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, కెనడా, జపాన్‌ వైరా పలు దేశాలు కూడా రాకెట్ల ప్రయోగాలు జరుపుతూ వచ్చాయి. కాగా, 1957 జనవరి నుంచి 1958 జూన్‌ వరకు ఆ పద్దెనిమిది నెలల కాలాన్ని ““అంతర్జాతీయభూభౌతిక విజ్ఞానపరిశోధనల సంవత్సరం (అంతర్జాతీయ అంతరిక్ష వర్షం)గా నిర్ణయించారు. ఈ కాలంలో అమెరికా, రష్యాదేశాలు చొలా ముమ్మురంగా పలు రకాల రోొకెట్లను ప్రయోగించాయి. ఆ శాస్త్ర; పరిశోధనల పందెంలో సోవియట్‌ యూనియన్‌గెలిచింది. 1957 అక్టోబర్‌ 4న మాస్కో తన మొట్టమొదటి కృ(త్రిమ ఉపగ్రహాన్ని (స్పుత్నిక్‌) జయప్రదంగా ప్రయోగించి భూమిచుట్టూ ప్రదక్షిణలు చేయించగలిగింది. లి ఈ సోవియట్‌ రష్యా విజయం అమెరికా అహాన్ని దెబ్బకొట్టింది. వాస్తవానికి వారే అప్పటి అంతరిక్ష పరిశోధనలలో సోవియట్‌ రష్యా కంటే చాలా ముందున్నారు. అయినా, మొదటి ఉపగ్రహాన్ని జయప్రదంగా ప్రయోగించగలిగిన ఘనకీర్తి మాస్కోకు దక్కింథి. అలాగే అంతరిక్షంలోకి మానవుని (గూరిన్‌) పంపగలిగిన ఘనత కూడా వారిదే ఆయింది. ఈ ఓటమి అమెరికాకు ఒక రకంగా మేలు చేసిందనే చెప్పాలి. అప్పటినుండి ఇంకింత పట్టుదలతో పరిశోధనలు సాగించి ఆమెరికా మలో (గ్రహానికి మనుషులను పంపిన మొట్టుమొదటి దేశమన్న చాలిత్రక ఖ్యాతిని సంపాదించింది. 54 సంధియుగం

ఈ విజయానికి వెనుక ఎందరెందరో శాస్త్రజ్ఞులు. ఎందరెందరో వ్యోమగాములు ఎన్నెన్నో ప్రయోగాల ద్వారా సాధించిన అనేక సాఫల్యాల వైఫల్యాల బలం, అనుభవం ఉన్నాయి. 1961లో ప్రెసిడెంట్‌ జాన్‌ ఎఫ్‌. కెనెడీ అమెరికా ““కృతనిళ్ళ్చయాన్ని”” ప్రకటించారు. "ఈ దశాబ్దం ముగిసేలోగా ఈ దేళం ( అమెరికా) చం ద్ర లోకానికి మనిషిని పంపి, తిరిగి సురక్షితంగా భూమికి తీసుకువచ్చే లమ్యాన్ని సాధించడానికి పట్టుదలతో పనిచేయాలి అని ఆయన ఆ వేళ ప్రకటించారు. నాటి ఆ అమెరికన్‌ దీక్ష ఆపోలో-11 చంద్రలోక యాత్రతో సిద్రించింది. పెసిడెంట్‌కెనెడీ జోస్యం ప్రెసిడెంట్‌ నిక్సన్‌ కాలంలో ఫలించింది. ఆంతకుముందు అమెరికా ఆరు అపోలో వ్యోమనౌకలను ప్రయోగించి రకరకాల పరీక్షలు జరిపింది. వాటిలో కొన్ని అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగిరాగా, మరికొన్ని చంద్రునిచుట్టు తిరిగి అక్కడ దిగకుండా భూమికి తిరిగివచ్చాయి.

ఈ అపోలో ప్రయోగాలకుముందు అమెరికన్‌ మెర్క్యురీ, జొమినీ వ్యోమ నౌకలూ, రష్యన్‌ వోస్తాక్‌ వోమ్మిడ్‌ రోదసీ నౌకలు పలువురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకు వెళ్ళి, భూమి చుట్టూ ప్రదక్షిణలు చేసి తిరిగి వచ్చాయి.

తాలిమానవుని చంద్రలోక యాత్ర జూలై 16వ ఫ్లారిడాలో కేప్‌ కెనడీ వ్యోమ కేంద్రం నుంచి, నీల్‌ ఆమ్‌స్ట్రాంగ్‌, ఎడ్విన్‌ ఆ్రిన్‌, మైకెల్‌ కాలిన్స్‌ అనే ముగ్గురు రోదసీ వీరులతో ప్రారంభమైంది, జూలై 19 నాటికి వీరి వ్యోమ నౌకచం(ద్ర మండలం సమీపానికి చేరింది. అప్పటివరకూ అనుకున్నది అనుకున్నట్టు యాత్ర సాగింది. మధ్యలో ఎక్కడా ఏవిధమైన

మార్పులు చేర్పులూ అవసరంరాలేదు. చంద్రునికి 44 వేల మైళ్ల చేరువగా వచ్చినంతనే అపోలో

  • 11 వ్యోమ నౌక చంద్రగ్రహ ఆకర్షణ శక్తికి లోబడి పయనించవలసి ఉంది.

చంద్రునికి 70 మైళ్ల సమీపానికి వచ్చిన తరువాత చంద్రుని చుట్టూ అపోలో - 11 వ్యోమనౌక ప్రదక్షిణలు చేయడం (ప్రారంభించింది. ఇక్కడ మాతృనౌకను వదలి, దానిలో ఉన్న మరో చిన్న నౌకలో ఆమ్‌స్ట్రాంగ్‌, ఆభ్లిన్‌ చం(ద్రగ్రహం మీద దిగటానికి బయలుదేరారు. మూడవ వ్యోమగామి కాలిన్స్‌ చంద్రుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మాతృనౌకలోనే ఉండి, అక్కడి పనులు చూస్తున్నాడు. చిన్ననౌక (చంద్రుని మీద దిగేనౌక) లో బయలుదేరిన ఆమ్‌ స్టాంగ్‌, ఆ(ల్లిన్‌ చంద్రునిమీద తాము దిగచానికి అనువైన (ప్రదేశాన్ని అన్వేషిస్తున్నారు. ఆ నేలమీద ఎక్కడ దిగితే కాలు కూరుకుపోకుండా ఉంటుందో, తన చిన్న నౌక మళ్ళీ ఎగరచానికి ఎక్కడైతే అనువుగా ఉంటుందో చూచుకొని మరీకాలు పెట్టాలి. * ప్రశాంత సాగరం** అనే ప్రదేశం తాము దిగటానికి అనువైనదిగా న్మిర్ణయించారు. ఇక దిగటమే తరువాయి.

అమెరికాలోని హ్యూస్టన్‌ భూతల కేంద్రంలో పనిచేసే వారిలోనూ, చంద్రుని చుట్టూ తిరుగుతున్న మాతృ నౌక కొలంబియాలోనూ దిగబోతున్న చం ద్రనౌక 'ఈగిల్‌ లోనూ వున్న వ్యోమగాములలో ఈ సాహసకృత్యాన్ని భూలోకంలో టెలివిజన్‌ సెట్లలో చూస్తూ, రేడియోలలో వింటున్న కోచ్చాది ప్రపంచ (ప్రజానీకంలోనూ ఉత్సాహం, ఉద్వేగం పెల్ళబుకుతున్నాయి. ప్రపంచం యావత్తూ కుతూహలంతో ఆ చారిత్రక విజయకీసం ఊపిరి బిగిబట్టి ఎదురు చూస్తున్నది.

(ప్రపంచంలో అనేక దేశాలలో వున్న అమెరికన్‌ సమాచార కేంద్రాలలో. (ప్రజలకు ఎప్పటికప్పుడు ఈ యాత్రను గురించిన సమాచారం అందించడానికి ప్రత్యేక టెలిఫోన్లు ఏర్పాటు చేశారు. మదరాసులో నేనూ, మరిద్దరు నా సహ ఉద్యోగులూ ప్రత్యేక టెలిఫోన్సలో సంధియుగం క్‌5్‌

అడిగిన వారికి, క్షణ క్షణం సమాచారం తెలెపేపనికి నియుక్తులమైనాము. *'వాయిస్‌ ఆఫ్‌ అమెరికా రేడియో ఏ నిమిషానికి ఆ నిమిషం మాకు సమాచారం అందించేది. ఆ ఒక్క రోజులో వామట్టుకు నేను ఒక్కళణ్లే 1200 టెలిఫోన్‌కాల్స్‌కి జవాబు చెప్పాను. అలాగే నా సహచరులిద్దరూను.

ఆనాడు ఆం(ధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రా'స్ర్రాలలో ఎక్కడెక్కడినుంచో ఎన్నెన్నో ట్రంక్‌ కాల్స్‌ వచ్చాయి. వారడిగిన ప్రశ్నలూ, చూపిన ఆసక్తీ వారిలో వ్యక్తమైన ఉద్వేగం, ఉత్సాహం గమనించినపుడు నరజాతి సమస్తం ఒక్కటే. జాతులూ, దేశాలూ, మతాలూ, రంగులూ, కులాలు వీటన్నింటికీ అతీతమైన ఒక మహత్తర ఏకాత్మతాభావం, మమతాబంధం సమస్త మానవాళిలో పూలలో సూత్రంలా ఉన్నదన్న భావం ఎవర్‌కైనా కలుగుతుంది. మదరాసులో వయసు మళ్ళిన ఒక వృద్దమాత ఆమ్‌'స్ట్రాంగ్‌, ఆ్లీన్ల మేము సమాచారాలను గురించి ఆదుర్దాతో అడిగినప్పుడు ఆమె కంఠంలో వ్యక్తమైన ఆ(ర్రపూరిత మాతృభావాన్ని గమనించినపుడు ఈ సత్యం ఇంకింత రూఢి అయింది. ఆ రోజున ఫోనులో ఎక్కడెక్కడినుంచో, ఎందరెందరినుంచో ఎన్నెన్ని కుళల ప్రశ్నలో! ఎన్నెన్ని కుతూహల ప్రకటనలో!

ఆ ముహూర్తం రానే వచ్చింది. జూలై 20వ తేదీ. అప్పుడు అమెరికాలో సాయంత్రం 4 గంటల 1? నిమిషాల 40 సెకండ్లు, అనుకున్న దానికంటె 1 నిమిషం 20 సెకండ్డు ముందుగానే ఆమ్‌ స్ట్రాంగ్‌ కంఠం రేడియోలో వినిపించింది. ““ఇది (ప్రశాంత సాగర ప్రదేశం, మా ఈగిల్‌ నౌక

ఇక్కడ దిగింది”. అన్న శుభవార్త ఆనందంతో ఉద్విగ్గమైన ఆమ్‌స్ర్రాంగ్‌ కంఠం నుంచి వెలువడింది. చంద్రనౌక ఈగిల్‌లోని రేడియో (ప్రసార సాధనాల ద్వారా వచ్చిన ఆ మాటలను అప్పటికప్పుడే భూలోకపు రేడియో, టి.వి.లలో (ప్రసారమయ్యే ఏర్పాట్టు ముందే జరిగాయి. ఆనాటికింకా మన దేళంలో టెలివిజన్‌ లేదు. ఆమ్‌'స్ర్రైంగ్‌, ఆభ్లిన్‌ చంద్ర లోకపు గడ్డపై కాలూనిన తొలి మానవజంట అయినారు. వారక్కడికి అలా క్షేమంగా చేరారన్న వార్త కణాలమీద ప్రపంచమంతటా వ్యాపించింది. టెలిఫోనులో నేనీ సంగతి అడిగినవారికి చెబుతున్నపుడు అదివిన్న ఆ (స్త్రీ పురుషుల కంఠాలలో (ప్రతిధ్వనించిన ఆనందోత్సాహాలు అవధు లెరుగనివి. (ప్రాచ్య, ఆ్రాచ్య భావభేద మెరుగనివీ, విశ్వ జనీనమైనవీను. కొందరైతే, ఆనందం పట్టులేక నావద్దకు పరూత్తికొచ్చి కరచాలనం చేసి, ఆలింగనం చేసుకున్నవారున్నారు. ఆవార్త మొదటగా వారికి చెప్పింది నేను కావడమే అందుకు కారణం.

ఆ వేళ ఈ విజయవార్త విన్నప్పుడు వెల్లివిరిసిన ఆనందోత్సాహాలూ, అలాగే ఆపోలో 13 వ్యోమనౌక అంతరిక్షంలో చాలాబాగం తగుల బడిపోయి, దానిలో చంద్రలోకానికి బయలు దేరిన వ్యోమగాములకు (ప్రాణాపాయం ఆసన్నమైన దనుకొన్నప్పుడు లోకమెల్లడలా వ్యక్తమైన సానుభూతి, విచార భావం, మళ్ళీ ఆ గండం గడచి ఆ వ్యోమగాములు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారన్న వార్త విన్నప్పుడు. ' అమ్మయ్య అని లోకం యావత్తు నిట్టూర్భినప్పుడు ఇవన్నీ స్యయంగా గమనిస్తున్న నాలో కలిగిన అనుభూతి నాటికి నేటికీ మరెన్నటికీ మరపురానిది. మానవ హృదయానికీ, మనుషుల మధ్య మమతా బంధాలకూ ఎల్లలు లేవన్న సత్యం ఆ నాడు నాలో ఓచెరగని ముద్రవేసింది.. ఈ మహత్తర చారిత్రక యాత్రల్లో (అంటే ఆ తరువాత జరిగిన అపోలోయాత్రలన్నిటిలో) నేను నిర్వహించిన ఈ చిరుపాత్రవల్ల నేను నేర్చుకున్నది ఎంతో ఉన్నది. నా మట్టుకు నాకు ఈ అనుభూతివల్ల కలిగిన ప్రయోజనం ఆమూల్యమైనది.

(20.7484) ర5్‌6 సంధియుగం

-నుద్స్నప్రురి ఉంద్రామహోదర చెన్నపురి ఆంధ్ర మహాసభనుగురించి అనుకోగానే ఆనాడు చెన్న నగరంలో ప్రసిద్దులుగా వున్న ఎందరెందరో తెలుగు అతిరథులు, మహారథులు స్పురణకు వస్తారు. మదరాసు నగరం ఏఒక్క. భాషాప్రాంతానికోకాక్క మొత్తం దశవ్న్షిణ భారతానికి రాజకీయ, ఆర్టిక, సాంఘిక్క సాంస్కృతిక రాజధానిగా వెలుగొందుతున్న రోజులవి. ఈ మహానగర నిర్మాణ, అభివృద్ది చరిత్రలో తెలుగువారి పాత్ర మిగతా అన్ని భాషలకన్న మిన్న అయినదన్నదొక చారిత్రక సత్యం. మదరాసు కార్పొరేషన్‌ కార్యాలయం వున్న రిప్పన్‌ భవనానికి, మదరాసు సెంట్రల్‌ రైల్వే ప్టేషన్‌కు మధ్యవున్న ఇటుకరంగు భవనం విక్టోరియా పబ్లిక్‌ హాల్‌ ఇందుకొక సజీవ నిదర్శనం.

సర్‌ పిట్టి త్యాగరాయచెట్టి అధ్యక్షతన 1916లో జరిగిన ఒక సమావేశంలో మునగాల రాజానాయని వెంకట రంగారావు, వారణాశి సూర్యారావు, రంగావర్సుల శ్రీ,రామశ్యాస్త్రి, కాతాసూర్యనారాయణ, గొడిచర్ల హరిసర్వోత్తమరావు, ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు, పింజాల సుబ్రహ్మణ్యరెడ్తీ, కొప్పా పద్మనాభయ్య, ఎళ్లేపెద్ది వెంక(ట్రామళర్మ, జమ్మలమడుగు వెంకటరత్నం, నాళం వెంకటరత్నం, కొల్లివర సీతారామయ్య, అల్టాడి సీతారామశ్యాస్తి, వెదురుముడి శేషగిరిరావు, గద్దే రంగయ్య నాయుడు, కాళ్లకూరి గోపాలరావు, కె. వెంకట్రంగం నాయుడు ప్రభృతి పలువురు తెలుగు (ప్రముఖులు సమావేశమై “చెన్నపురి ఆం(ధ్రసభా"ను ఏర్పాటు చేశారు.

సర్‌ త్యాగరాయచెట్టి అధ్యక్షులుగాను, రావుబహదూర్‌ కలవల కన్నయ్యచెట్టి, రావు బహదూర్‌ బి.ఎన్‌. ళర్మ, పండిత డి. గోపాలాచార్యులు, రావు బహదూర్‌ టి. వరదరాజులు నాయుడు ఉపాధ్యక్షులుగాను, దివాన్‌ బహదూర్‌ వారణాసి సుబ్రమణ్యం ' పంతులు, రావుసాహెబ్‌ కలవల రామానుజంచెట్టి, పొత్తూరి అన్నయ్యచెట్టి ధర్మకర్తలుగాను, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, నరసింహారావు నాయుడు కార్యదర్భులుగాను ఏక([గ్రీవంగా మొదటి కార్యవర్గానికి ఎన్ఫిక్షైనారు. కాగా దేశోద్దారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, కె. సూర్యనారాయణరావు పంతులు, కె.సీ.పార్టసారధినాయుడు, తాటికొండ రామచంద్రరావు, ఎన్‌.గురుస్వామిరెడ్డి కార్యవర్గ సభ్యులు.

తెలుగు సాహిత్య, లలితకళల వికాసానికి చెన్నపురిలో ఈసభ నాటినుంచి చేస్తూవచ్చిన సేవ చిరస్మరణీయమైనది. వేదం వెంకట్రాయశా, స్త్రి ఈసభ సాహిత్య విభాగానికి అధిపతిగా వుండేవారు. ముఖ్యంగా తెలుగు నాటక కళకు ఈ సభచేసిన సేవ చరిత్రాత్మకమైనది. బళ్ళారి రాఘవాచార్య, బలిజేపల్లి లవ్మీకాంతం, హరిప్రసాదరావు, నెల్లూరు నగరాజారావు, కె. శ్రీ/నివాసాచార్యవంటి తెలుగు నాటక పితామహులు ఈ సభలో అనేక తెలుగు ఉత్తమ నాటకాలను ప్రదర్శించి, ఈ సభకు, తమకు, తెలుగు నాటక కళకు చిరకీర్తి నార్హించారు.

ఈ సభ ఏర్పడిన ఐదేళ్ళకే బాలారిష్టాలకులోనైంది. సభను స్ట్రాఫించిన ప్రముఖులలో పలువురు గాంధీజీ పిలుపునందుకుని సహాయ నిరాకరణోద్యమంలో పూర్తిగా నిమగ్నులై పోయినందున సభా కార్యకలాపాలకు అంతరాయమేర్పడింది. 1923 నాటికి మూతపడేదాకా సంధియుగం 57

క్‌

పోయింది. ఈసభ చరిత్రను పరిశీలించినప్పుడు ఇలా సభ కష్టాలకులోనైనపుడెల్లా ఎవరో ఒక తెలుగు. (ప్రముఖుడు ముందుకు వచ్చి దాని పునరుద్దరణకు కంకణం కట్టుక్‌నడం కనబడుతుంది. 1924లో అప్పటి ఎం.ఎస్‌.ఎం. రైల్వే కంపెనీలో ప్రముఖ అధికారిగావున్న మాదిరెడ్డి కాంతారావునాయుడు పూనిక వహించి, విరాళాలు సేకరించి సభను ఫునరుద్రరించారు. మొదటి అయిదేళ్ళు బ్రాడ్వేలో ఒక ఇంటిలో పనిచేసిన ఈ సభ ఈసారి ఫ్రాన్సిస్‌ జోసెఫ్‌ వీధిలోని జి. ఎ.నటేశన్‌ గృహంలో తిరిగి పనిచేయడం ప్రారంభించింది. బళ్ళారి రాఘవ, పర్వతం రామచంద్రారెడ్డి, యడవల్లి సూర్యనారాయణ, ఉప్పులూరి సంజీవరావు, అద్దంకి (శ్రీ;రామమూర్తి, జొన్నవిత్తుల శేషగిరిరావు, కొచ్చర్లకోట రంగారావు వంటి అగ్రశ్రేణి తెలుగు నటులు తమ నాటక (ప్రదర్శనల ద్వారా ఈ సభకు అజరామరమైన యశస్సునేగాక, ఆన్చికపుష్టిని కూడా చేకూర్చిపెట్టారు. మళ్ళీ ఐదేళ్ళు గడిచేటప్పటికి తిరిగి కష్టాలు. [ప్రారంభమయినాయి. ఈసారి దీని పునరుద్దరణ కృషి సర్‌ముత్తా వెంకట సుబ్బారావుగారి వంతు అయింది. 1922లో ఏర్పడిన ఆంధ్రనాటక సభను, ఈసభనూ కలిపి 1929లో “చెన్నపురి ఆంధ్ర మహాసభి'గా రూపొందించారు. త్యాగరాయచెట్టి మరణా నంతరం సర్‌ బి.ఎన్‌. ళర్మ ఆ తరువాత పొనగల్టు రాజా, ఆయన తరువాత సర్‌ ముత్తా వెంకట సుబ్బారావు ఈ మహాసభకు అధ్యక్షులుగా పనిచేశారు. ఈదళలో బులుసు సాంబమూర్తి మహాసభ వ్యవహారాలలో శ్రద్ద చూపడం మొదలైంది. 1932లో ఆయన గాంధీబీని చెన్నపురి ఆంధ్రమహాసభకు తీసుకువచ్చి, ఆయనచేత దేశోద్దారక నాగేశ్వరరావు పంతులు చిత్రపచాన్ని ఆవిష్కరింపజేశారు. సాంబమూర్తి కృషి ఫలితంగా మహాసభ కార్యాలయం విక్టోరియా పబ్లికిహాల్‌కు మార్చబడింది. అప్పటినుంచి 1945 వరకు మహర్షి సాంబమూర్తి ఆధ్వర్యాన సభ పనిచేసింది. (శ్రీ, సాంబమూర్తి 1945లో ఆరోగ్య కారణాలవళ్ల విరమించుకొనగా, డ్యాక్టర్‌ పి.వి.రాజమన్నారు 1945 నుంచి 50 వరకు అధ్యక్షులుగా వున్నారు. 1951 నుంచి 55 వరకు సాంబమూర్తి తిరిగి అధ్యక్షులుగా వున్నారు. ఆ తరువాత (శ్రీ, కొత్త రఘురామయ్య ఒక సంవత్సరం మహాసభ అధ్యక్షులుగా పనిచేశారు. 1958 నుంచి శ్రీ, జె.వి.సోమయాజులు పాతికేళ్ళు పైగా ఈ మహాసభను సజీవంగా నడిపించు కొచ్చారు. శ్రీ పీ. వెంకటస్వామి, శ్రీ/యతి కమలా చంద్రబాబు, డాక్టర్‌ గద్దె రామచం(ద్రమూర్తి, (శ్రీ, బి.దేవరాజులు నాయుడు, శ్రీ/ పి.వి. రమణయ్యరాజా, శ్రీ బి.వి.యస్‌.యస్‌,.మణి వంటి పలువురు ప్రముఖుల సహకారం ఆయనకు అభించింది. అయినా, సాధారణ సభ్యులలో ఉత్సాహం తగ్గినందున సభ ఆర్థికంగా దెబ్బతిన్నది. విక్టోరియా పబ్లిక్‌ హాల్‌ నుంచి తమిళులు మహాసభను బయటకు పంపివేశారు. ఈ దశలో ఆ ఆవరణ ప్రక్కనే కొంత ఫ్టలం సంపాదించి, విరాళాలు సేకరించి మొదట ఒక కార్యాలయ భవనాన్ని నిర్మించారు. ఆంధ్ర ప్రభుత్వ సహకారంతోను, 'శ్రీ/ బి.వి.ఎస్‌.ఎస్‌. మణి తదితరుల ఉదార విరాళాలతోను, “కౌతా సూర్యనారాయణరొవు ఆడిచోరియం'' నిర్మించుకోగలిగారు. అయితే, సభ దైనందిన అర్దిక పరిస్టితి దైన్య ఫ్రీతిలో పడింది. అలాటిస్టితిలో శ్రీ నోరి రామక్నష్ణయ్యగారు పూనుకుని అక్ష రూపాయలు నిధులు సేకరించి భవనం అభివృద్దికి చేసిన కృషి శ్లాఘనీయం. మళ్ళీ ఆంధ్ర మహాసభ ఉచ్చదళలోకి రావాలని కాంక్షించేవారికి ఆనందదాయకం. (610.84) ర్‌8ి సంధియుగం

వూరవామాదవి మదర్వారువగరం

వుదరాసు నగరం ఎంతగానో ఎదిగింది. ఎన్నెన్నో మార్పులు వచ్చేశాయి. అయితే, ఎంత ఎదిగినా తన మౌలిక లక్షణాలను కొన్నిటిని నాటికీ, నేటికీ నిలబెట్టుకున్న మహానగరం ఇండియాలో బహుశా, మదరాసు ఒకటేనేమో! అదినుంచి ఈ నగర నిర్మాణంలోనూ, దీని అభివృద్ది విషయంలోనూ తెలుగువారి కృషి చారిత్రకమైనది. నాడేకాదు, ఈనాడు సైతం ఈ నగర ఆర్టిక, సాంస్కృతిక ప్రగతికి తెలుగులకృషీ గణనీయంగా కొనసాగుతూనే వున్నది. నిజానికి ఈ నగరపు తొలి చరిత్ర అంతా తెలుగువారి చరిత్రే. అలాగని ఇప్పుడు దీనిని మన నగరమని చెప్పుకోజాలము. అలా చెప్పుకొనడం వాస్తవిక పరిఫ్టితిని విస్మరించడమే అవుతుంది. ఏమైనా చెన్నపురి చరిత్ర తెలిసిన తెలుగు వారికి దానిని చూస్తున్నప్పుడు ఒక విధమైన గర్వం కలుగుతుంటుంది.

1935లో ఏప్రిల్‌ తాలి వారంలో మొదటిసారి మదరాసు వచ్చాను. ఇంట్లో పెద్దవాళ్ళు తిడితేనో, కొడితేనో అలిగి పారిపోయికాదు. సినిమాలలో వేషాలు వేద్దామనీకాదు. పై చదువుల కోసం అంతకంటేకాదు. అప్పటికి నావయసు పదేళ్ళు. ఆ రోజుల్గోనే కాదు. ఈ నాడు కూడా తిరుపతి వెళ్ళిన తెలుగుయాత్రికులు సాధారణంగా మదరాసు చూడకుండా తిరిగివెళ్ళరు. అయితే, అప్పటికీ, ఇప్పటికీ ఆంధ్రుల మదరాసు ప్రయాణాలలో ఎంతో తేడా వుంది. నాతాలి మదరాసు ప్రయాణంకూడా తిరుపతి యాత్రలో భాగమే. నా పదో ఏట మా పెద్దవాళ్ళు నన్ను తీసుకొని తిరుపతి వెళ్ళారు. అక్కడ నుంచి మదరాసు వచ్చాము.

ఆరోజుల్లో మదరాసు వచ్చే యాత్రికులకు ముఖ్యమైన ఆకర్షణలు - మూర్‌ మార్కెట్‌, దానివెనుక వున్న “బతికిన కాలేజి” (జూ). ఆపక్కనేవున్న వి.పి.హాల్‌ (విక్టోరియా పబ్లిక్‌ హాలు), దానినామకుని వున్న రిప్పన్‌ భవనం, ఎగ్మూరులోని *' చచ్చిన కాలేజీ” (మ్యూజియం), హైకోర్టు, దాని మధ్యలోనే వున్న పాత లైట్‌ హౌస్‌, ఇటు అడయారు మర్రిచెట్టు. మూర్‌ మార్కెట్‌కెదురుగా రాజా రామస్వామి ముదలియార్‌ ధర్మసత్రం వున్నది. మేము వచ్చి ఈ సత్రంలో దిగాము. ఆనాటి నగర జనాభాకు, ఈ నాటి దానికీ హస్తి మళకాంతరం ఉన్నది, నాటి జనాభా చాలా తక్కువ కనుక వీధులలో రద్దీ తక్కువగా ఉండేది. కనుక మా వంటి సామాన్య యాత్రికులు తాపీగా వీధులలో నడుచుకొంటూ అన్నీ చూడడానికి వీలుగా ఉండేది.

ఆ రోజుల్లో నగర ముఖ్య వీధులన్నిచా ్రామ్‌కారులు నడుస్తుండేవి. ఇవి రైలు పట్టాల వంటి చిన్న పట్టాల మీద ఇప్పటి ఎలక్టిక్‌ రైళ్ళవలె నడిచే వీథి వాహనాలు, ఒక్కొక్కదానిలో 70 మంది దాకా ఎక్కడానికి జాగా ఉండేది, మనిషికి ఒక అణా (ఇప్పటి ఆరు పైసలు) ఇస్తే, ఆటు హైకోర్టు నుంచి ఇటు మైలాపూర్‌ లజ్‌ దాకా ప్రయాణం చేయవచ్చు. ఈ (బ్రామ్‌కారులను 1957లో త్రీసివేశారు. అప్పటినుంచి సిటీ బస్సుల శకం ప్రారంభమైంది. మొదట్లో ఈ సిటీ బస్సులు (ప్రైవేటు యాజమాన్యాల క్రింద నడిచేవి. తరువాత కొన్నాళ్లకు (ప్రభుత్వ యాజమాన్యాన వీటిని నడపడం మొదలైంది. సంధియుగం క్‌ి

నాటి ముఖ్య యాథ్రాకర్షణలలో కొన్ని ఈనాడు కనుమరుగై పోయాయి. మూర్‌ మార్కెట్‌, '“బతికిన కాలేజి” పేరిట ఆబాల గోపాలాన్ని ఆకర్షిస్తూ వచ్చిన *'జూ”” ఇప్పుడు అక్కడలేవు. సెంట్రల్‌ స్టేషన్‌ విస్తరణకోసమని రైల్వేవారు ఈ రెండు ప్రదేశాలను ఆక్రమించుకొన్నారు.

మూర్‌మార్కెట్‌ పక్కనే వున్న వి.పి. హాలు ఈనాడు శిథిలావస్థలో వున్నది. ఒకనాడు

విజయనగరం రాజా ఇచ్చిన భూరి విరాళంతో నిర్మించిన ఈ సుందర అరుణభవనంలో చెన్నపురి ఆంధ్రమహాసభ కార్యాలయం వుంటుండేది కాలక్రమేణ అరవలు దీనినాక్రమించు కొని ఆంధ్రమహాసభకార్యాలయాన్ని అక్కడ నుంచిగెంటివేసి భరణంలాగ, అదికూడానెలసరి అద్దెమీద ఒక మూలన గోమ్చాదమంత స్టలం ఇచ్చారు. ఈ స్టలంలోనే (ప్రస్తుత చెన్నపురి ఆంధ్ర మహాసభ కార్యాలయం, దొని ఆడిటోరియం వున్నాయి. ఎప్పుడైనా వారి దయతప్పితే అక్కడినుంచి కూడా పంపివేసినా ఆళ్చ్ళర్యం లేదు.

కాన్నివందల సంవత్సరాల పూర్వం తెలుగు వారు ఈ నగర నిర్మాణానికి, దీని అభివృద్దికి చారిత్రకమైన కృషిచేశారు. అలా కృషిచేయడంలో ఆంధ్రులు దేళంలో మొదటిసారిగా జాతీయ సమైక్యతకు, దేశ సమ గ్రతకు పునాదులు వేశారు.

ఆ రోజులలో పలువురు తెలుగురాజులు, జమీందారులు ఈ నగరా భివృద్రికి కృషిచేయగా, ఈనాడు ఎందరెందరో తెలుగు ప్రముఖులు ఆర్దిక, సాంస్కృతిక, సేవారంగాలలో ఎనలేని కృషి చేస్తున్నారు. రాజకీయంగా ఆంధ్రదేశం చెన్నపురి నుంచి విడిపోయిన అనంతరం కూడా ఇంకితంగా జరుగుతున్న తెలుగువారి ఈ కృషి ఆం(ధ్రుల విశాల జాతీయ దృక్బధానికి సజీవ నిదర్శనం. ఎన్నో పెద్ద పెద్ద పరిశ్రమలను తెలుగువారు ఈ నగరంలో నెలకొల్పి, నగరాభివృద్దికే కాక్క తమిళనాడు పారి'శ్రామికాభివృద్దికి ఎంతో దోహదం చేస్తున్నారు. ..తెలుగు సినిమా పరిశ్రమవల్ల మదరాసుకు చేకూరుతున్న ఆర్దిక ప్రయోజనాలను గురించి వేరుగా చెప్పనవసరం లేదు. ఇక సేవారంగంలో గుమ్మిడిదల దుర్గాబాయమ్మ స్ట్రాపించి, పెంచి పెద్దచేసి ఈ రా(ష్రైనికి అప్పగించిపోయిన ఆం(ధ్ర మహిళాసభ ఆస్పత్రి, (శ్రీమతి చెన్న ఘంటమ్మ కృష్ణారావు 30 ఏళ్ళుగా నిర్మించి, నడుపుతున్న వివిధ దీనజన సేవా సంస్టలు, కేసరి కుటీరం వంటి సంస్టలు తెలుగువారి సేవానిరతికి (ప్రతీకలుగా నిలచి వున్నాయి.

కళారంజని, కళాభారతి, కళాసాగర్‌, కళావాహిని మదరాసు తెలుగు అకాడమి వంటి సంస్థలు నగర సంస్కృతీ వికాసానికి తెలుగు తమిళ తేడాలు లేకుండా సమైక్య దృష్టితో చేస్తున్న కృషి తమిళుల నుంచి కూడా ప్రశంసలను చూరగొంటున్నది. అలాగే కూచిపూడి ఆర్ట్‌ అకాడమి వారి కృషి ఫలితంగా తెలుగువారిదైన కూచిపూడి నృత్యం దక్షిణ భారతీయ స్వభావాన్నేకాక యావద్భారత స్వరూపాన్ని సంతరించుకొంటున్నది. శ్రీ, రాజాలక్ష్మీ ఫౌండేషన్‌ నగరంలో మరో ముఖ్యమైన తెలుగు సంస్ట. అలాగే యార్లగడ్డ కళాపీరం.

ఆనాడు తెల్లవారికి మాత్రమే పరిమితమైన ఒకటి, రెండు పెద్ద హోటళ్లు మాత్రమే ఉండేవి. ఈనాడు నగరంలో ఎన్నెన్నో 5-స్టార్‌, ౩-స్టార్‌ హోటళ్లు వెలిశాయి. వీటిల్లో కూడా అన్నిటిలోకి ఎత్తయిన పది అంతస్తుల మొదటి పెద్ద ఆధునిక హోటల్‌ను నిర్మించినవారు తెలుగువారే కావడం గమనించదగ్గ విశేషం. అలాగే నగరంలోని అతి ఆధునికమైన సినిమా

థియేటర్లలో కొన్ని తెలుగువారు నిర్మించి నడుపుతున్నట్టివే. 60 సంధియుగం

ఆనాటి పాతలైట్‌ హౌస్‌ ఇప్పుడు లేదు. దానికి బదులుమైలాపూర్‌ ప్రాంతంలో ఎత్తయిన కొత్త లైట్‌హొస్‌ నిర్మించారు. దేశమంతటిలో వలెనే ఈ నగరం లోను జన జీవనసరళి ఎంతగానో మారిపోయింది. అయినా మారని కొన్ని మౌలిక లక్షణాలు నాటికీ, నేటికీ ఈ నగర స్వభావానికి చిహ్నాలుగా నిలిచి ఉన్నాయి. దారినపోతూ ఆకులు వేసుకుంటూ చేతికయిన సున్నాన్ని కనిపేంచిన స్తంభానికో, గోడకో పూసి పోతుండే అరవవారి అలవాటు నాటికీ నేటికీ మారలేదు, సంపన్నులకు కావలసిన సర్వ సౌకర్యాలు ఉన్నట్టే పేదలకూ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కనుక్క కాలానుకూలంగా మారుతూనే తనదైన ఒక వ్యక్తిత్వాన్ని నిలబెట్టు కొంటున్న మహానగరం మదరాసు. రాష్ట్రాలు వేరుపడినా, భాషలు వేరైనా, నాటికీ నేటికి దక్షిణ భారత సాంస్కృతిక రాజధానిగా తన ప్రతిపత్తిని నిలుపుకొంటున్న మహానగరం చెన్న నగరం. (5.4.85) స్లాన్గాగ్గా భాషలు దేళంలోని దాదావు ప్రతిభొాషా ఒకచోట (ప్రధానవళ్లపు బాషగాను మరాకవోట మైనారిటీ వల్లంగాను ఉంటుంది. అందుచేత ఈ “మెజూరిటీ' “మైనారిటీ” అనే మాటలు రెండూ అన్లి భాషలవారికీ వర్తిస్తాయి. ఈ నిజూన్లి గుర్తుంచుకొంటే ఈనాటి ఒంటెత్తు వైఖరిని అందరూ వదులుకొని భిన్నత్వంలో వకత్వాన్ని వీకత్వంలో భిన్నత్వాన్నీ సాధించవచ్చు. ఈ ఎరుకే జూతీయ సమైక్సతకు తోద్పుడుతుంది. దేశాన్ని [956లో భాషా ప్రాతిపదికవైన వునర్విభజించినది అన్ని భాషల సాహిత్యాల సంస్కృతుల వికాసానికి తోద్దుడాలనీ తద్వారా బహుభాష్తాభరితమైన ఓక కొత్త భారతీయ సంస్కృతినీ, ప్రజలకు చేరువగా ఉండే భాషాప్రయుక్త ప్రజాస్వామ్యూన్లి నిర్మించుకొనడానికగూని ఎన్నాన్నా త్యాగాలుచేసీ మనం సాధించుకున్న జాతీయ సమైకృతనూ దేళసమ గ్రతనూ నిర్మూలించుకోడానికి కాదు. ఈ వాస్తవాన్లి ఈధర్యాన్ని అన్నిరా(ష్టాలలోగల మెజారిటీ మైనారిటీ వర్గాల వారందరూ గుర్తించి వ్యవహరించేలా క్ఫుషీ చేయడం మనందరి ధ్వేయంకొవాలి. (ఆంధజ్యోతి దినప(త్రికు 13-9-86 సంధియుగం 61

వ్యూవ్రెనులోవైవాం వహానదళ్రద్వదుం ఘమ

కళళ వ్‌

మండీ, కర్లపాలెం అప్పారావు గారు అంటే ఎవరో మీకు తెలుసా?*'

“తెలుసునండీ, ఎందుకట?”

“తెలుసా! ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారండీ! **

“మద్రాసులోనే ఉన్నారు. వారితో మీకేం పని వచ్చిందట?"

“*వీలైతే సరోజని గారూ నేనూ వారిని ఒకసారి చూడాలని ఉందండీ”?

ఒకనాడు సరోజనీ- (ప్రేమచంద్‌ దంపతులతో జరిగిన పై సంభాషణ ఈ వ్యాసం (వ్రాయడానికి ప్రేరణ, కారణం అయింది. మద్రాసులో 1950లో *“శుభోదయ పల్లికేషన్స్‌' అధ్వర్యాన “ఇండియన్‌ రిపబ్లిక్‌ అనే ఇంగ్రీషు దినపత్రిక కొన్నాళ్ళు నడిచింది. ఆ సంప్ర నిర్మాణ, నిరర్వహణలలో ప్రముఖ పాత్ర వహించిన వారు కర్లపాలెం అప్పారావుగారు. అప్పట్లోనే మద్రాసులో 'విజయప్రభా అనే తెలుగు దినపత్రిక కూడా మరొకటి వచ్చింది. అద్రి మొదట కొన్నాళ్ళు “శుభోదయ' వారి కార్యాలయంలోనే (ఇప్పటి పాత కె.సి.పి. భవనం) ఉండేది. ఆ తరువాత (ట్రిప్లికేన్‌ హైరోడ్డులో ఉన్న ఒక భవనంలోకి తరలి వెళ్ళింది. ఆ దినపత్రికలో నేనూ పనిచేశాను. అందువల్ల అప్పచ్జో అప్పారావు గారితో పరిచయమయింది.

ఆ తరువాత వారిని చూడలేదు గాని, వారి కుమారులు రామారావు, లక్ష్మణరావు నాకు సుపరిచితులు. కనుక అప్పారావుగారిని చూడాలంటే ఇబ్బంది ఏమీ ఉండదు ఈ మాటే ఆ దంపతులకుచెప్పి, '' అసలు వారిని ఎందుకు చూడాలనుకుంటున్నారు?'' అని వీరిని అడిగాను. ఈ దంపతులను గురించి తె లియని పాఠకులకువీరిని గురించి ముందు ముందు చెబుతాను.

సరోజిని గారి తండ్రిగారి 1948నాటి డైరీలో అప్పారావు గారి ప్రస్తావన పదే పదే కనిపించిందట. అదీ ఈ దంపతుల కుతూహలానికి కారణం. సరోజిని గారి నాన్నగారికీ, అప్పిరావు గారికీ గల సంబంధం గురించి మొదట చెప్పాలి. ఇదుగో, ఇక్కడే ఈ కథ మొదలవుతుంది.

మన దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. స్వతంత్ర భారత దేశపు తొలి ఆంతరంగిక శాఖా మంత్రీ, *బీస్మర్క్‌' వంటి మహానాయకుడూ సర్దార్‌ పటేల్‌ స్వదేశీ సంస్ట్రానాలన్నిటినీ సామమార్గాన స్వదేశంలో విలీనం చేయించే మహాయాగానికి పూనుకొన్నారు.

అయితే, అటు తిరువాన్కూర్‌, ఇటు హైదరాబాద్‌ వంటి రెండు మూడు సంస్ట్రానాల పాలకులు చూద్రం ఎదురంకె వేశారు. నయాన, భయాన అటువంటి వారిని ఒప్పించటానికి సర్దార్‌ పటేల్‌ కృషి ముమ్మురమయిన కొద్దీ, నిజాం పాలకుల మొండితనం మరింత కరకుబారుతూ వచ్చింది.

అందువల్ల 1947-48 మధ్యకాలంలో హైదరాబాద్‌ సంస్టానంలో ప్రజానీకం పైన పాలకుల, వారి తాటేదారుల దమనకాండ తీవ్రతరమయింది. స్టేట్‌ కాంగ్రస్‌ను నిజాం రాజు నిషేధించగా, తెలంగాణా (ప్రజానాయకులు విజయవాడ నుంచి విమోచన ఉద్యమం సాగిస్తూ

62 సంధియుగం

వచ్చారు. ప్లేట్‌ కాంగ్రమ్‌కి సంబంధించినవంత వరకు స్వామీ రామానంద తీర్చ అధివేతగా ఉండేవారు. ఆయన ఆదేశం ప్రకారం, తెలంగాణా నాయకులు కొందరు అరెస్టు కాకుండా, సంస్టానం వెలుపల ఉండి ఉద్యమాన్ని నిర్వహించాలి. అలా వారి ఆదేశానుసారం ఆంధ్ర (ప్రాంతానికి వచ్చిన వారిలో మాడపాటి రామచంద్ర రావుగారు ఒకరు. ఉద్యమ కాలంలోనూ ఉద్యమ విజయానంతరం ఆయన చూపిన ధైర్య సాహసాలూ, చేసిన త్యాగమూ గణనీయమైనవి. అయినా, ఎందువళ్లనో తెలంగాణా విమోచన ఉద్యమంలో ఆయన భూమిక గురించి ఎవరూ సవిస్తారంగా ప్రస్తావించలేదు.

బహుశా అయనలో కొట్టు వచ్చినట్టు కనపడే స్వతం(త్ర ప్రవృత్తి, ఎవరి ముందూ తల వంచి *జోహుకుం అనజాలని ఆత్మవిశ్వాసం ఇందుకు కారణం కావచ్చు. అంతేకాదు, తెలంగాణా కాంగ్రస నాయకులలో అతివాద భావాలు కల్లి, భయమెరుగని బహుకొద్ది మందిలో ఆయన ఒకరు. ఆయన సోషలిస్టు విశ్వాసాలు అచంచలమైనవి. ఇందువల్లనే కావచ్చు. మిగతా నాయకులు ఆయనను సుళువుగా అంగీకరించలేక పోయారు.

రామచండద్రరావుగారు మొదట విజయవాడ నుంచి మద్రాసు వచ్చి, పల్గావరంలో కర్లపాలెం అప్పారావు గారి మేడను అద్దెకు తీసుకొని కమిటీ కార్యాలయాన్ని అందులో ఏర్పాటు చేశారు. అప్పట్లో మ(ద్రాసు ప్రభుత్వ సమాచార శాఖ డైరెక్టరుగా వున్న కపిల కాశీపతిగారు, (ప్రభుత్వ కార్యదర్శిగా వున్న ఎం.టి. రాజుగారు ఈ కమిటీ వారికి బహుదా సహాయ సహకారాలందించారు. 1948 నాటి మాడపాటి రామచంద్రరావు గారి డైరీలో ఈ విషయాలన్నీ ఉన్నాయి.

ఆ డైరీలో మరొక ఆసక్తికరమైన అంళం కూడా ఉన్నది. 1948 మే 21వ తేతీన జరిగిన కార్యాచరణ కమిటీ సమావేళంలో డాక్షర్‌ బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డి, కాశీనాధ్‌రావ్‌ వైద్యగార్లనూ, మరొకరినీ (వీరి పేరు స్పష్టంగాలేదు) “సస్పెండ్‌ చేసినట్టు రామచంద్ర రావుగారు వ్రాసుకున్నారు. నాటి సమావేశంలో కమిటీ అమోదించిన ఆరు తీర్మానాలలో ఈ ' సస్పెన్టన్ల' నిర్ణయం ఒకటి. “715 ౧౬|-1/ 90169 119 గ$!| ౧౯౦016గ" అని (వ్రాసిఉంది డైరీలో. ఈ '3.ఎం.ఐ. సమస్య" ఏమిచో, ఈ సస్పెన్షన్గు ఎందుకు జరిగాయో, ఆ తరువాత అవి ఎప్పుడు రద్దు అయినాయో, అనాటి సంగతి సందర్భాలు తెలిసిన పెద్దలు చెప్పాలి.

మాడపాటి రామచం(ద్రరావుగారు విజయవాడ, మదరాసులలో వుండి ఉద్యమాన్ని నడిపిస్తున్న రోజుల్లో వారి స్వగ్రామమైన ఎ(ర్రుపాలెంలోనే వుండి పోయిన వారి కుటుంబం, నాటి పాలకుల వల్లా, రజాకారుల వల్దా పడిన ఇడుములు అన్నీ ఇన్నీ కావు. వారి సతీమణి (శ్రీమతి విశాలక్షమ్మ ఒక వీరాంగన. ఆమె పసికందులైన తమ బిడ్డలను వెంట పెట్టుకుని మౌారువేష్ణాలలో, కాలినడకన, ఒక అర్ధరాత్రికి అర్ధరాత్రే రహస్యంగా బయలుదేరి, అప్పటికే స్వతంత్రమైన సర్కారు (ప్రాంతం సరిహద్దులో వున్న పెద్దాపురం గ్రామానికి చేరుకున్నారు. అయితే, అక్కడ వారి సొంత ఊళ్లో వారి ఇంటిని దుండగులు ధ్వంసం చేసి నానా బీభత్సం కలిగించారు.

హైదరాబాద్‌ సంస్థాన విమోచనకై 12-11-21వ బీజాలు పడిన ప్రజా ఉద్యమం ఎట్టకేలకు 18-9-48వ కేంద్ర ప్రభుత్వ పోలీసు చర్యతో ముగిసింది. సంస్పానం స్వదేశంలో విలీనమయింది. నిజాం రాజు ' తరతరాల బూజు' ఆనాటితో వదలి పోయింది. సంధియుగం 63

అలా ఉద్యమం ముగిసినంతనే ఇతర నాయకులతోపాటు రామచంద్రరావుగారు 'హైదరాబాదు చేరుకున్నారు. అక్కడ వీరికి ఘనమైన ప్రజా స్వాగతం లభించింది. అయితే, మాడపాటి రామచం(ద్రరావుగారు మాత్రం అంతటితో తన ధర్మ నిర్వహణ పూర్తయిందని తృప్తిపడి ఊరుకోనూ లేదు, అధికార పదవుల కోసం అగ్రులు చాచనూ లేదు. సమతా సమాజస్ట్రాపన ఆశయంలో అచంచల విశ్వాసం గల ఆయనకు "' స్వాతంత్ర్యం వచ్చింది కనుక, ఇక సోషలిజం వచ్చి తీరుతుంది”? అన్న గట్టి నమ్మకం కుదిరింది. తానాశించిన ఆ సోషలిజం శాసనపరంగా వచ్చే దాకా తాను ఆగదలచుకోలేదు. తను పిత్రార్హితం అగు 100 ఎకరాల అడవి భూములను, ఎంతో ఫలసాయం ఇస్తున్న అంత ఆస్తినీ రామచం(ద్రరావుగారు, అప్పటి వరకూ దానిని కమతం చేస్తున్న రైతులకు ధారాదత్తం చేసివేశారు. అయినా, అటువంటి ఆయన త్యాగాలను గురించి ఈ నాడు ఎంత మందికి తెలుసు? చేసిన, చేయని త్యాగాలకు పలువురు ప్రతిఫలాన్ని ఆశిస్తున్న ఆ తాలి రోజుల్టోనే స్వాతంత్ర్యపు ఫలితాలను నేరుగా శ్రామిక రైతాంగానికి అందించిన (వారి) ఆరుదైన ఆ మహాత్యాగానికి విలువ కట్టిన షరాబు లేరి? మాడపాటి రామచంద్రరావుగారి ఎనిమిది మంది సంతానంలో సరోజినిగారు ఒకరు. కాగా ఆమె భర్త గోవిందరాజు (్రేమ్‌చంద్‌గారు 'ఆంధపితామహి మాడపాటి హనుమంతరావు గారికి స్వయాన దౌహిషత్రుడు ( అనగా కూతురి బిడ్డ) ఈ విధంగా మాడపాటి మహానాయకులిద్దరి వారసత్వ ప్రతినిధులు ఈ దంపతులు. అన్నట్టు, రాజకీయాలలో హనుమంతరావుగారు మితవాది, రామచం(ద్రరావుగారు అతివాది. హనుమంతరావుగారి సొంత అన్న కుమారుడే రామచంద్రరావు గారు. నిస్వార్ధ త్యాగమూర్తి, సమతావాద క్రియాశీలి అగు రామచంద్రరావు గారు తనకు 50 ఏళ్ళు అయినా నిండక ముందే నూరేళ్ళు నింపుకొని (1952)లో వెళ్ళిపోయారు. (27.12.86) గ్గాగ్గాగ్గు వేధావులు “4... మనలో మేధావులవంటివారూ, మేధావులలా కనవపడేవారూ, అలా కనపడాలనుకునేవారూ వున్హుంతగా మౌలిక మేధావులు లేరు. మన మేధావులలో ఆధునిక దృళ్టుళం వున్హువారికంటే అది వున్హుట్టు లోకాన్ని (బమింపచేయాలనుకునేవారేఎక్కువమంది..... ఇంటాబయటా 22- 6- &4 64 సంధియుగం

శవంళీని స్తుతి దంజ్ళ

తము నమ్మిన ప్రజాహిత లక్యసాధనకోసం అనేకానేక త్యాగాలుచేసిన వారెందరెందరో వున్నారు. కాని అందుకోసం ఆత్మబలిదానం చేసినవారు ఈలోకంలో ఎందరో వుండరు. అటువంటి మహనీయులలో మొదట మనకు స్ఫురించే మహోన్నతవ్యక్తి యేసుక్రీస్తు, మనదేళంలో, మన రాష్ట్రంలో, ఆ మహా పురుషుని త్యాగానికి సరిపోగల మహాత్యాగం చేసినవ్యక్తి అమరజీవి పాట్టి (శ్రీ;రాములు, దేశంకోసం, (బ్రిటీష్‌ (ప్రభుత్వం ప్రవర్తనకు నిరసనగా గాంధీజీ పలుమార్జు నిరళనదీక్షలు పూని దేశానికి మార్గదర్శకుడైనాడు. అయితే, ఆయన ఆత్మాహుతి దాకా ఎప్పుడూ పోలేదు. ఆయన అనుంగు శిష్యులలో ఒకరైన (శ్రీ, పొట్టి శ్ర,రాములు తాను నమ్మిన ఒక ప్రజాహిత లక్ష్యంకోసం ఆమరణ నిరళన దీక్ష బూని ఆ దీక్షలో అసువులు బాసిన అనన్య సామాన్య త్యాగమూర్తి.

మదరాసులో 1952 డిసెంబర్‌ 15వ తేదీన ఆ మహా పురుషుడు తనువు చాలించాడు. అనాడు ఆయన ఆ దీక్ష జరిపిన గృహాన్ని ఆంధ్ర ప్రభుత్వం కొనుగోలు చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరంగా రూపొందించింది. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలకు ఇటువంటి స్మారక మందిరాలు ఎన్ని నిర్మించినా ఆయన బుణాన్ని తెలుగుజాతి తీర్చుకొన జాలదు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి, దానిని పాలించే అధికారం కోసం నానాపాట్టుపడుతూ ఈనాడు మనం ప్రత్యేకంగా చూస్తున్న రాజకీయ కొట్లాటల వంటివాటిలో తలమునకలైవున్న తెలుగు నాయకులకు పొట్టి (శ్రీ;రాములు వంటివారి త్యాగాలను జ్ఞాపకం ేట్టుకునే తీరికా లేదు, ఆయన స్కృతికి శాశ్వత చిహ్నాలేవైనా ఏర్పాటు చేయాలన్న ధ్యాసాలేదు.

అధికార రాజకీయాలకు దూరంగా వున్నవాళ్ళయినందుననే కావచ్చు మదరాసు తెలుగువారిలో అమరజీవి పొట్టి (శ్రీరాములు పట్లు ఇంకా (శ్రద్దాసక్తులు మిగిలి వున్నాయి. అయితే ఆం(ధ్రులు ఎక్కడవున్నా ఆం(ధ్రులే కనుక ఆరంభకళూరత్వం వారి పారంపర్య లక్షణం కనుక ఇక్కడివారిలో కూడా అనాటి శ్రద్ద ఈనాటికి కొంత తగ్గింది. ఆయినా ఆం(ధ్రదేళశంలోని తెలుగువారికంటే వీరు కొంత నయమే. ఇప్పటికీ అప్పుడప్పుడు అమరజీవి స్మారక మందిరంలో చిన్నచిన్న సభలు, సమావేశాలు జరుపుకొంటూ వుంటారు. మైలాపూర్‌లో లజ్‌కార్నర్‌ సమీపాన, రాయపేట హైరోడ్‌లో 126వ నంబరు ఇంటిలో ఈస్మారక మందిరం వున్నది. నాటి కాంగ్ర[ు నాయకులలో ఒకరైన బులుసు సాంబమూర్తిగారు ఈ ఇం టిలో అద్దెకు వుండేవారు. ఈ ఇంట్లోనే (శ్రీ,రాములుగారు (ప్రాయోపవేశం ప్రారంభించారు. మదరాసు తెలుగువారి కోర్కెపై నాటి ఆంధ్ర ప్రభుత్వం ఆ ఇంటిని కొని పొట్టి (శ్రీ,రాములు మిషన్‌ అనే సంఫ్ట ఆధ్వర్యాన ఈ స్మారక మందిరాన్ని నిర్వహించే ఏర్పాట్లు చేసింది.

అయితే, ఈ భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ వర్క్స్‌ శాఖవారి ఆధ్వర్యంలో వుంచి మదరాసుకు చేరువగా వున్న ఆంధ్ర ఇంజనీర్లు దీని బాగోగులను చూచే ఏర్పాటు చేశారు. కంచెదుటి విషయాలనే పట్టించుకోని ఉద్యోగులకు ఎక్కడో మదరాసులోవున్న దీని విషయం పడుతుందా? స్టానికులు కోరగాకోరగా ఎప్పుడో సకృత్తుగావచ్చి అరకొరపనులు చేయించి పోతుంచారు. వారు చేస్తున్న నిర్వాకమెల్లా రెండు జతల మంచాలు, పరుపులు (ప్రభుత్వం ఖాతాలోకొని రెండు గదులలో వేసుకొని, వారు మదరాసు వచ్చినప్పుడు తమకు విశ్రాంతి విడిది సంధియుగం 65

గృహంగా వినియోగించుకుంటూండేవారు. అంతకు మించి ఈ స్మారక కేంద్రానికి వారు చేస్తున్నది సున్న.

నగరంలోని పలువురు తెలుగుపెద్దలు పొట్టి (శ్రీరాములు మిషన్‌లో సభ్యులు. కానీ కాల(క్రమేణా వారిలోనూ (శ్రద్ద తగ్గిపోతూ వచ్చింది. ఎవరుకలిసి వచ్చినా రాకపోయినా సడలని పట్టుదలతో అవసరమొచ్చినపుడెల్టా చేతి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఈ స్మారకకేంద్రాన్ని, ఉన్నంతలో సజీవంగా, సభక్తికంగా నడుపుకుంటూ వస్తున్న వ్యక్తి (శ్రీ/ వై. యస్‌. శ్నాస్తి. ఆయన కూడ (శ్రద్ధ చూపకపోయినట్టుయితే ఈపొటికి ఈభవనం ఎవరిపాలయ్యేదో, ఏమయ్యేదో? (శ్రీ/ శాస్త్రి పట్టుదలతో సాగించిన కృషి ఫలితంగా, ఆం(ధ్ర ప్రభుత్వం 30 ఏళ్ళ తరువాత మళ్ళీ అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకకేంద్ర పునరుజ్జీవనానికి ఆయన చేసిన కాన్ని ప్రతిపాదనలను అంగీకరించింది.

పబ్లిక్‌ వర్క్స్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్హీవంగా వుండిపోయిన ఈ స్మారక కేంద్రాన్ని ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్ర, సాంస్కృతిక విషయాల శాఖ ఆధ్వర్యంలోకి మార్చింది. స్మారక మందిరం వ్యవహారాల నిర్వహణలో ఆంధ్ర ప్రభుత్వానికి సలహాఇవ్యడానికి, మద్రాసులో ఈ కేంద్ర ఆధ్వర్యాన వివిధ సాంస్కృతిక, స్మారక ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడానికి నగరంలోని పదిమంది తెలుగు (ప్రముఖులతో ' అమరజీవి పొట్టి, శ్రీ;రాములు స్మారక సొసైటీ' ని ఏర్సరచారు.

స్మారక మందిరంలో పొట్టి శ్రీరాములు మ్యూజియంను రూపొందించాలని ఆయన పుట్టినరోజున, ఆత్మ బలిదానంచేసిన రోజున, గాందిజయంతినాడు, తెలుగు ఉగాదినాడు, ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్వవం నాడు, ఈ కేంద్రం అధ్వర్యాన మదరాసులో ఏటా ఉత్వవ కార్యక్రమాలు జరగాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆంధ్రప్రభుత్వం 30 వేల రూపాయలు మంజూరుచేసింది, ఈ మ్యూజియంలో భద్రపరచడానికి అమరజీవి పొట్టి (శ్రీరాములు ఫోచోలు, ఆయన న్రాసిన లేఖలు, ఆయన గురించి రచనలు ప్రజలవద్ద నుంచి సేకరించాలని ఈ స్మారకసంస్ర నిర్ణయించింది.

ఇప్పుటి తరం యువతీ యువకులకు శ్రీ, పొట్టిశ్రీరాములు గురించి అట్టే తెలియకపోవచ్చు. అందుకు వారిని తప్పుపట్టనవసరంలేదు. ఇటీవల కాలంలో ఆయనను గురించి చెబుతున్నవారు లేరు. (శ్రీ, రాములుగారు 1901 మార్చి 16 వ తేదిన మదరాసులో జన్మించారు. కొన్నాళ్ళు మదరాసులో మరి కొన్నాళ్ళు బొంబాయిలో చదువుకొని శానిటరీ ఇంజనీరుగా ఆ నాట్‌ గ్రేట్‌ ఇండియన్‌ పెనిన్సులా రైల్వే కంపెనీలో చేరారు. గాంధీజీ న్యాయకత్వాన సాగుతున్న స్వాతం(త్రోద్యమంవల్ల ప్రభావితుడైన ఆ యువకుడు 1927లోనే ఆ ఉద్యోగానికి రాజీనామచేసీ సబర్మతీ ఆశ్రమంలో చేరి. 1938 వరకు గాంధిజీ శుశ్రూష చేశారు. “ప్రా ట్టి(శ్రీరాములు వంటి కార్యకర్తలు మరి పదిమంది వుంటే చాలు, సంవత్సరం తిరక్కముందే స్వరాజ్యం సంపాదించకోవచ్చు!” అని గాంధీజీ ఒక సందర్భంలో అన్నారు. (త్రికరణ శుద్దిగా గాందేయపథధాన్ని అనుసరించిన వ్యక్తి శ్రీ; (శ్రీరాములు.

(శ్రీ పొట్టి (శ్రీ/రాములుగారు స్వాతంత్ర్య సమరంలో పాల్గాంటూనే హరిజనోద్రరణకు దీక్షతో కృషి చేశారు. 1948లో అస్పృశ్యతా నివారణోద్యమంలో ఆయన (ప్రాయోపవేశం చేయగా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లా కలక్టరూ వారానికి ఒక రోజైనా హరిజనోద్దరణ కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించింది. తన 52 ఏళ్ళ జీవితంలోనే ఆన్యులెవరూ నూరేళ్ళలో చేయనంత ప్రజాసేవచేసి తరించారు. అంతటి మహాత్యాగమూరర్తి, ధన్యజీవి పొట్టొ శ్రీ/రాములు. (149.84) 66 సంధియుగం

నన్నయ్యను ఆదికవి అని ఎందుకు అన్నారో తెలియదు. వేయి సంవత్సర కాలంలో మధ్య మధ్య రెండు మూడు వందల సంవత్సరాల మినహా, సంస్కృత సాంప్రదాయకులు నన్నయను అదికవి అని ఆరాధిస్తూ వచ్చారు. మరొకవైపు తెలుగు భాష దాదాపు అయిదువేల సంవత్సరాల నాటిది అని ఈ పండితులే మనకు తెలిపారు. తమిళం సహా, (ద్రావిడ భాషలన్నీ కొంచెం ఇంచుమించు ఒకే కాలంలో పుట్టి ఉండాలి. లేదా నాడు ముందు ఉండి ఉండిన ఏదో ఒక ఆదిమ భాషనుండి ఎప్పుడో ఒకప్పుడు పాయలు పాయలుగా చీలి దక్షిణ భాషలు కాల క్రమేణా తమ తమ సొంత వ్యక్తిత్వాలను పెంపొందించుకంటూ వచ్చి వుండాలి. ద్రావిడ భాషల చరిత్రలు చదివితే ఇటువంటి అభిప్రాయం కలుగుతుంది.

ఇలొ అయినప్పుడు, (క్రీస్తు పూర్వం మూడో సహస్రాబ్లి నుంచి పుట్టి పెరుగుతూ వచ్చిన తెలుగు భాషమొదటి నాలుగు వేల సంవత్సరాల కాలంలో ఎటువంటి సాహిత్య సృష్టి లేకుండా, జడ భాషగా ఉండిపోయిందంటే నమ్మకడం కష్టం. నిజంగా అలానే ఉండి వుంటే, ఉన్నట్టుండి ఒక్కసారి పదకొండో శతాబ్దిలో నన్నయ వంటి ఒక పండితుడు అవతరించి అంత గొప్పసాహిత్య సృష్టి చేయగలగడం అసంభవమై. ఉండేది. అయితే నన్నయకు ముందు ఉన్న తెలుగు సాహిత్యాన్ని గురించి ఎందరు (వ్రాసినా, ఎప్పుడు (గ్రాసినా కొన్ని కొండ గుర్తులను మాత్రమే చెపుతూ వచ్చారు కాని లోతుగా పరిశీలన జరగలేదనే అనాలి. ఎనిమిదవ, తొమ్మిదవ శతాబ్దాలకు ముందు తెలుగు సాహిత్య సృష్టి జరిగి వుండవచ్చునని పలువురు ఊహాగానాలు చేశారే తప్పఎవరుగాని వాటి దాఖలాలను గట్టిగా పట్టి చూపలేకపోయారు.

ఇలా దాఖలాలు దొరకకపోవడానికి (ప్రబలమైన ఒక కారణం ఉన్నట్టు అనిపిస్తుంది. ఏ ఆదిమ (ద్రావిడ భాషావాహిని నుంచోఎప్పుడో విడివడిన తెలుగు భాష క్రీస్తు శకారంభం నుంచి ఏదో ఒకమత ప్రభావానికో, ఏదో ఒక ఇతర భాషా ప్రభావానికో గురి ఆవుతూ వచ్చింది. నాటి (ప్రాకృతం మొదలునేటి ఆంగం వరకు, ఈ రెండువేల సంవత్సరాల కాలంలో వివిధ మతాలూ, మత శాఖలుుపలు ఇతర భాషలూ తెలుగు ప్రజలను, తెలుగు భాషను (ప్రభావితం చేస్తూవచ్చాయి. ఇందువల్ల ఒక రకంగా మేలు, మరో విధంగా కీడు మన భాషకు జరిగాయి. ఇన్ని వైపుల నుంచి ఇన్ని మార్పులు తెలుగువీడులోకి వీచినందువల్ల తెలుగు భాష, విస్తారంగా వికసించింది. మన భాష సుసంపన్నమైనది. కాలగమనంలో ఎప్పటికప్పుడు వస్తున్న నూతన పరిణామాలకు, వికాసాలకు సరిపడ, పదకోశాలను తెలుగు భాష సంతరించుకుంది. ఇది మన భాషకు జరిగిన మేలు.

కాగా అయా కాలాలలో ఆయా మతొల ప్రభావం తెలుగువారి మనసులను ఆకట్టుకొనగా, ఒక మత ప్రభావం చేత సృష్టి అయిన సాహిత్య సంపదను, మరో కొత్త మతం వచ్చిన ప్రతి సారి ఈ నూతన మతావలంబకులు కసి కొద్ది తత్పూర్వ మత సాహిత్యాన్ని ఆనవాళ్ళు లేకుండా నిర్మూలించడానికి ప్రయత్నించారనుకోవలసి వస్తుంది. మొన్నమొన్నటి వాడు వేమన, అయన సృష్టించిన విప్లవ (ప్రజాసాహిత్యాన్ని నామ రూపాలు లేకుండా చేయడానికి సంధియుగం 67

మన సనాతన పండితులు ఎంతగా ప్రయత్నించలేదు. సి.సి.బ్రౌన్‌ వంటి వారు పుణ్యం కట్టుకోకపోతే బహుశా, ఈపాటికి వేమన కవి జాడలు మనకు మిగిలి వుండేవి కావేమో।! ఆది నుంచితెలుగు సాహిత్యం ఈ విధమైన “సృష్టి, ఫ్రితి, లయ' క్రియలకు గురి అవుతూ వచ్చింది.

కనుకనే మన పరిశోధకులకు పూర్వ సాహిత్యపు దాఖలాలు దొరకకుండా పోయి ఉండాలి, ఆనాటి బౌద్ద, జైన మతాల దాడుల తాడనాల నుంచి హిందూ మతం తెప్పరిల్లుకొని మళ్ళీ నిలదొక్కుకొనేలాగ చేయడానికి పదకొండో శతాబ్దంలో అప్పటి ఆం(ధ్రరాజుల ప్రోద్బలం, ప్రోత్సాహంతో పండిత ప్రయత్నాలు (ప్రారంభమైనాయి. హిందూ మత సూత్రాలు, బోధనలు అన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. మతాన్ని జన సామాన్యంలోకి తీసుకువెల్లడానికి ఈ సంస్కృత మత గ్రంధాలను తెలుగులోకి తీసుకురావడం అవసరమని హిందూమత పునరుద్దరణ ఉద్యమకారులు భావించారు. ఆనాడు జైన, బౌద్ధ మతాల వారు జనుల భాషలో మత ప్రచారాలు చేస్తూ ఉండడం కూడా వీరి ఆలోచనలను ప్రోత్సహించింది. అప్పటి నుంచే తెలుగులో అనువాద సాహిత్యం మొదలైందనవచ్చు. తెలుగు భాషపై సంస్కృత ప్రభావం కూడా అప్పుడే (ప్రారంభమైంది.

సంస్కృత రచనల తెలుగు అనువాదానికి (శ్రీకారం చుట్టిన వాడు నన్నయ. ఒక బృహత్‌ కావ్యాన్ని ఒక క్రమ పద్దతిలో కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని తెలుగులోకి మొదటిసారిగా అనువదించిన ఘనత నన్నయకు దక్కింది. కనుకనే ఆయన తాలి తెలుగు అనువాద శిల్పి అయినాడు. నన్నయకు ముందు అనువాదాలు లేవు. తెలుగు సాహిత్యం మాత్రం వున్నది. కనుక నన్నయ ఆది కవి కాదు, ఆది అనువాద శిల్పి. ఆయన మహాకవి అన్నమాట నిజమే, ఆయినా ఆయనది అనువాద కవిత్వమే. భారత కావ్య తెలుగు అనువాదం నన్నయతో ప్రారంభమై ఎ(్రనతో ముగియడానికి రెండువందల సంవత్సరాలకు పైగా పట్టింది. నన్నయ మరణాంతరం మరో కొత్త మత విష్ణవం వచ్చింది. వీర్హూవం విజృంభించి దాదాపు రెండువందల ఏళ్ళపాటు స్వైర విహారం చేసింది. అందువల్ల, వైదిక మత (ప్రాధాన్యం గల భారత కావ్య అనువాదాన్ని పూరించడానికి ఆ కాలంలొ ఎవరూ సాహసించి ముందుకు రాలేదు. వీర శైవ ఉగ్రవాదం చల్చారిన తరువాతనే, తిక్కన, ఎ(ర్రనలు ఆ పనికి ఉపక్రమించారు. అందువల్లనే అంత ఆలస్యమయింది.

వీర శైవ కవులు నన్నయ కవితా పద్దతులను అనుసరించలేదు. అంతకు ముందుగల జానపద కవితా రీతులను వారు తమ కవిత్వానికి ఎన్నుకున్నారు. పన్నెండవ శతాబ్దిలో నన్నెచోడుడు వ్రాసిన కుమూరసంభవం తెలుగులో మొదటి స్వీయ పద్యకావ్యం అని పలువురు పండితుల అభీప్రాయం. ఆయన శైవుడు కాకపోతే సంస్కృత సాం(ప్రదాయకులు “ఆదికవి పదవిని నన్నయకు గాక నన్నెచోడునికే ఇచ్చి ఉండేవారేమో! ఏమైనా శ్రైవ కవులు అనుసరించిన కవితా రీతులనుబట్టి నన్నయకు ముందే తెలుగులో దేశీయ కవితా సాహిత్యం పరిపక్వత చెందుతూ వస్తున్నదనిపిస్తుంది.

అయితే తెలుగు భారత కావ్యరచన పూర్తి అయిన నాటి నుంచి వచ్చిన అనువాదొలలోను, 'ప్రబంధాల పేరిట వచ్చిన అనుసరణలలోనూ నన్నయ జఒరవడినే దాదాపు అందరూ అనుసరించడం జరిగింది. ఇలా సంస్కృత పదకోశాగారం నుంచి విస్తారంగా పదాలను, సమౌసాలను, ఛందస్సును (గ్రహిస్తూ, సంగ్రహిస్తూ వచ్చిన తెలుగు భాష మీద కొంత కాలం ఇస్లాం మత, భాషల (ప్రభావం, ఆ తరువాత క్రైస్తవ మతం, ఆంగ్ల భాష ప్రభావమూ 68 సంధియుగం

'ప్రసరించగా,తెలుగు భాష ఈనాటికీ ప్రస్తుత రూపాన్ని సంతరించుకున్నది. సొంత రచనలకన్న అనువాద, అనుసరణ రచనలే పుష్కలంగా గల తెలుగు భాష_ఈ శతాబ్దంలో పాశ్చాత్య ఆలోచనా రీతుల ప్రభావానికి, ఆ పిదప మార్క్సిస్టు సిద్దాంత (ప్రభావానికి లోనై ఎన్నెన్న్నీ రచనా రీతులను కవితా రూపాలను సంతరించుకొంటు చిలవలు పలవలుగా గద్య, పద్య గేయ రూపాలలో శతప(త్రకమలంలా వికసిస్తూ సజీవమైన ఆధునిక భాషల్లో ఒకటిగా పరిణతి చెందుతున్నది. నన్నయ భారతానువాదం సంకల్పించే నాటికి భాషాంతరీకరణంలో మార్గదర్శక సూత్రా లేవి లేవు. మూర్గదర్శకులూ లేరు. కనుక తానే కొన్ని నియమనిబంధనలను ఏర్పరచుకొని ఆయన ఈ అనువాద యజ్ఞానికి పూనుకున్నాడు. అసలు రచనలో, తన కాలానికి పనికిరానివని అనుకున్నవాటిని జాచిత్యం లోపించినవి అనుకున్నవాటిని, నాటి సమాజూనికి తొను అందివ్వదలచుకొన్న సందేళ వాప్తికి తోడ్పడజాలనివి అని అనుకున్నవాటిని నన్నయ వదలి వేశాడు. తన ప్రబోధానికి అవసరమనుకొన్న కొత్త అంశాలను ఆయన తన అనువాదంలో చేర్చాడు. ఈ విధంగా అనువాదకుడు అసలు రచనలో మార్పులూ చేర్పులూ చేయవచ్చునన్న ఒక సంప్రదాయాన్ని ఆయన ఏర్పరచాడు. ఆ తరువాత పండితులు ఈ సంప్రదాయాన్ని అనుసరించి తమ అనువాదాలలో తమ చిత్తం వచ్చినట్టు అసలు రచనల రూపురేఖలను మార్చి వేసిన సందర్భాలు అనేకం వున్నాయి. కాలంమారింది. రాచరికాలు అంతరించాయి. (ప్రజాస్వామ్యాలు వచ్చాయి. మత ప్రధాన సాహిత్యం రాజుల విజయవిలాసాల (ప్రళంసా స్టాయికి దిగజారింది. అదీ పోయి, 'ప్రజాయుగావ తరణతో జాతి హిత సాహిత్య మార్గాలు వచ్చాయి. ఈ రెంటికీ మధ్యకాలంలో ప్రేమారాధనకు 'ప్రాధాన్యమిచ్చిన భావ కవిత్వ కాలం ప్రవర్షిల్లింది. అనంతరం మార్క్స్‌ సిద్దాంత ప్రభావం (ప్రపంచాన్ని ఆవరించగా జాతీయ (శ్రేయస్సు, విశ్వమానవ (శ్రేయస్సు కవితా వస్తువులుగా 'పైకొన్నాయి. ఆధునిక ప్రయాణ, ప్రసార సాధనాలు (ప్రపంచ ప్రజానీకాన్ని చేరువకు తెచ్చాయి. ఈ పరిణామం అనువాద సాహిత్య (ప్రాముఖ్యాన్ని అవశ్యకతను ఇబ్బడి ముబ్బడిగా పెంపాందించింది. ఎన్నెన్నో భాషలు మొట్లాడే ఇన్నిన్ని దేశాలవారు ఒకచోటచేరి విశ్వ శ్రేయస్సు కోసం చేయికలిపి పని చేయవలసిన నేటి కాలంలో పరస్పరావగాహనకు ముఖ్య సాధనం అనువాదం. కనుక అనువాద శిల్ప ప్రాముఖ్యం హెచ్చింది. మరి ఈ నాటి అనువాదకులు నన్నయ సూ(త్రాలను అనుసరించి అసలు దానితో తమకు నచ్చనివి తొలగించి తాము అనుకున్నవానిని చేర్చి అనువదిస్తే ఉండగల ప్రమాదం ఏమిచో చెప్పనవసరంలేదు, కనుక్క నన్నయ అనువాద సూత్రాలు నేటికి పనికిరావు. అంతేకాదు అధునాతన శాస్త్ర, సాంకేతిక పరిణామాల దృష్యా, (ప్రపంచ ప్రగతి దృష్ట్యా అనువాద శిల్పంలో ఎన్నెన్నో కొత్త మెలుకువలు అవసరమవుతున్నాయి. ఒక పద్యానికి చేసే అనువాదం, ఒక నవలకు చేసే అనువాదం, ఒక ప్రభుత్వ విధాన ప్రకటనకు చేసే అనువాదం, ఒక రాజకీయడఉపన్యాసానికి చేసే అనువాదం, ఒక విజ్ఞాన శాస్త్ర విషయానికి చేసే అనువాదం - ఇలా ఒక్కొక్క విషయ అనువాదానికి ఒక్కొక్క. రకమైన భాష్రైలిని, పదజాలాన్ని ఉపయో గించవలసివుంటుంది. అందుచేత ఈనాటి అనువాదకునికి ఒక రచన తాలూకు అసలు భాష మీదను, తన భాష మీదను సమగ్రమైన అధిపత్యం అవసరం. తన భాషను తాను కోరిన భంగిమలలో నృత్యం చేయించగలిగిన ప్రజ్ఞ, అసలు భాషతత్వాన్ని, తాత్పర్యాన్ని గ్రహించగల ప్రతిభ అనువాదకునికి ఉండాలి. నిజానికి సాంత రచన కంటే అనువాద రచన కష్టతరమైనది. సంధియుగం 69

మరి ఈనాటి అనువాదకులలో అటువంటి (ప్రజ్ఞ పాటవాలు గల ఉభయ భాషా ప్రవీణులు, పలు భాషాకోవిదులు ఎందరున్నారు! లేరు కనుకనే అనువాదాలలో హెచ్చుభాగం అధ్వాన్నంగా వుంటున్నాయి. ఈనాడే కాదు, నన్నయ నాటి నుంచి నేటి వరకు ఈ లోపం వుంటూనే వున్నది. అయితే ఆనాటి కంటే ఈనాడు అనువాద శిల్చ్బం ప్రాముఖ్యత, అవళ్యకత ఎంతగానో పెరిగాయి. ఈ దృష్ట్యా అనువాద శిల్పాన్ని విశ్వవిద్యాలయాలలో ఇతర సాహిత్య ప్రక్రియల వలెనే శాస్త్రీయంగా బోధించవలసిన అవసరం ఉన్నది. మన విశ్వకళా పరిషత్తులు ఈ అవశ్యకతను ఇంకా గుర్తించినట్టు లేదు. శుభస్య శీఘ్రం. (1.11.85) స్గాస్గాన్ల సంస్కృతం సంస్కృతం మృతభాషకాదు. నిజానికి బాషలలో మృతబాష సబీవ భాష అంటూ వీదీవుండదు. అయా భాషలను వినియోగించుకొని (పజులసాంఘిక ధార్జిక చైతన్యాలను బట్టి ఆయాభాషలు ఆయాకాలొల్లో అతిప్రాచుర్యానికి అనతిప్రాబల్యానికి లోనవుతూ వుంటాయి. సంస్కృత భాష ఒక సహజమైన భాష్క సంవన్హమైన భాష పలుభారతీయ భాషలకు ఆభరణంగా భాసీల్డుతున్ను భాష ఒక్క సంస్కృతభాష ఒక్క మతాదర్భు (ప్రచారానికి చూత్రమేకాదు. అనేకానేకమైన మానవ సంస్క్యృ్రతీ విజ్ఞాన వికాసాలకు గొప్పు సాధనంగా ఉపయోగపడింది. వేద వేదాంత శా(స్తాలే కాదు మానవజాతి పరిణామ వికాసాలకు తోద్బుడిన న్యాయతర్భ_ వైద్య నాట్టకావ్వ అలంకారాది అన్ని రంగాలలో విజ్ఞాన పరిణామానికీ మనోవికాసానికీ తోద్చుడిన మన గ్రంధాలు ఎన్నెన్నో సంస్కృత భాషలో న్నస్త్రీజరిగాయి. సంస్కృత వాజ్తియంలో వైదిక లౌకీక రంగాలలో మార్గదర్భుకమైన సువిస్తారమైన పరిశోధన పరిశ్రమ జరిపీ మవోగ్రంధాలు రవించి సంస్కృత భాషను సుసంషన్డుం చేసిన వారిలో ఎందరెందరో ఆం(ధులు వున్నారు. (కీన్తుపూర్చుం 300 ఏళ్ళకు ముందే ఆం(ధ్రుల సంస్కృత పాండిత్యం యావద్భారతావని దృష్టిని ఆకట్టుకొన్లుదట. ఆనాడు “కల్పనూ(త రచన చేసిన ఆవస్తంబుడు తెలుగువాడని పరిళోధకులు నిర్ణయించారు. ఇంటాబయటా /8.4. 86 70 సంధియుగం

కజ్రుగు థబాఖుం

66 'స్వంజ్యం కావాలని అంటున్నాము. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము కోసం చిక్కుపడుతున్నాము. ప్రజా స్వామిక పరిపాలనం కోరుతున్నాము. ఇటువంటి పరిఫ్టితులలో మన ప్రజలకు సామాన్యజనులకు ఏ భాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి వుంటుందో, ఏ భాషలో (గ్రంథ రచన సాగించవలసి వుంటుందో ఆలోచించండి. దేళ భాష ద్వారా విద్య బోధిస్తేనే గాని ప్రయోజనం లేదు. వ్యావహారిక భాష లోకంలో సదా వినబడుతూ వుంటుంది. అది జీవంతో కలకలలాడుతూ వుంటుంది. గ్రాంథిక భాష (గ్రంథాలలో కనబడేదే కాని, వినబడేది కాదు. (ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంథిక భాష ప్రయోగిస్తూ తిట్టుకున్నా, సరసాలాడుకొన్నా ఎంత హాస్యాస్పదంగా వుంటుందో చూడండి."

మదరాసులో 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో, ఆ పత్రిక సంపాదకులు గూడవల్లి రామ(బ్రహ్మంగారు ఏర్పాటుచేసిన జర్నలిస్టుల సమావేశంలో గిడుగు రామమూర్తి పంతులుగారు చేసిన (ప్రసంగంలోని మాటలివి. అప్పటికి 30 సంవత్సరాలకు పైగా వాడుక భాష వ్యాప్తి కోసం అహరహం తాము సాగిస్తూ వచ్చిన మహోద్యమ లక్ష్యాలను ఆ 'తుది విన్నపము'లో ఆయన స్పష్టంగా వివరించారు. "'నా ఆరోగ్యం చెడిపోయినది. కాలేయములో గుల్మ పుట్టినది; చికిత్స కోసం చెన్నపట్టణం వచ్చాను. అట్టే కాలం జీవించగలనని తోచదు. జీవించి వున్నా చాలా కృశించి పోయి వున్నాను. కనుక, మునుపటిలాగున మరి ఉపన్యాసాలు చేయలేను. అందుచేత ఇదే నా కట్టుకడపటి విన్నపమంటున్నాను. ఇక జరుగవలసిన పని మీకే అప్పగిస్తున్నాను. మీరే సాగించవలెను?” అని రామమూర్తి పంతులుగారు ఆవేళతమ ఉద్యమాన్ని తెలుగు పత్రికల వారికి అప్పగించారు. ఆ తరువాత సరిగా వారం రోజులకు అంటే జనవరి 22వ తేదీన మదరాసులో ఆయన కన్నుమూశారు.

గ్రాంథిక భాషలో విశేష పాండిత్యం గల మహా పండితులు అశేషంగా వున్న కాలంలో రామమూర్తి పంతులుగారు వ్యావహారిక భాషి ప్రచారోద్యమం సాగించారు. నాటి పండిత లోకం ఆయనను వె(ర్రివాడన్నది. నన్నయనాటి నుంచి అనూచానంగా వస్తున్న గ్రాంథిక భాషకు మహాపచారం చేస్తున్నాడన్నారు. అయినా మొక్కవోని దీక్షతో, అచంచలమైన విశ్వాసంతో, అపారమైన భాషా జ్ఞునంతో ఆయన నాటి ఉద్దండ పండితులను ఎదిరించి వాదించి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. నోరి నరసింహ శ్నాస్త్రిగారు అన్నట్టు '“వారి జీవితము చాలా భాగము ఈ వాదనలతోనే గడిచి పోయింది. వారు వాదించినన్ని పర్యాయములు గాని, అన్ని 'ప్రదేశములందుగాని, అంతమందితోగాని వాదించ వలసిన అవసరము ఇతరులకు సామాన్యముగా కలిగి వుండదు...ఎన్ని వాదపీఠములెక్కినా, వారు తమ సిద్దాంతమును లోకము అంగీకరించేట్టు చేయవలెనని వాదించినారే కాని, తమ కీర్తికోసము గాని, వివాదము కొరకు గాని ఆ పని చేయలేదు. ఆత్మ జయము కోసము చేసే దుర్వాద పద్దతి వారెప్పుడూ అనుసరించలేదు”. సంధియుగం 71

ఆయన వాదాలు ఏదో పైపై చదువులతో, మిడిమిడి జ్ఞానంతో, వాకృమత్కారాలతో చేసిన పిడివాదాలు కావు. ఆయన చదివినన్ని (గ్రంథాలు ఆనాడు మేటి పండితులుగా చలామణి అయినవారిలో బహుశా ఎవరూ చదివి వుండకపోవచ్చు. భారత భాగవతాది ప్రాచీన (గ్రంథాలనే కాక, అచ్చుకూడా పడని అనేక ఆధునిక రచనలు సైతం చదివినవారాయన. కావ్యాలే కాకచరిదత్ర (గ్రంథాలు, ల॥,ణ గ్రంథాలు, నిఘంటువులు, పదకోశాలు, డైరీలు శాసన (గ్రంథాలు, భాషా శాస్త్రం, వివిధ పత్రికలు విరివిగా చదివారు. అంతేకాదు. ప్రాచీన గ్రంథాల పుట్టుపూర్వోత్త రాలను వ్రాత ప్రతులలోనూ ప్రచురణ అయిన ప్రతిసారీ ఆయా (గ్రంథాలు ఎన్నెన్ని మార్పులకు చేర్చులకు లోనైనదీ ఆయన పరిశీలించి ఆకళింపుచేసుకొన్నారు. కనుకనే వారి వాద పటిమకు నాటి పండితులు తట్టుకోలేక పిడివాదాలకూ, కువిమర్శులకూ దిగుతుండేవారు.

వ్యావహారిక భాషకు (ప్రాచుర్యము కలిగించి, దాని గౌరవాన్ని నిలబెట్టుడానికి మూడు దశాబ్దాలకు పైగా సాగించిన ఆ ఉద్యమంలో ఆయనకు మొదట్లో గురజాడ అప్పారావుగారు, మరి ఇద్దరు ముగ్గురు మాత్రమే తోడుగా నిలిచారు. కాగా, నాటి పండితులు యావన్మందీ ఆం(ధ్ర సాహిత్య పరిష్పత్తు ద్వారా వారికి వ్యతిరేకంగా పనిచేశారు. ఆ రోజుల్లో ఆంధ్ర సాహిత్య పరిషత్తు చాలా ప్రబలంగా వుండేది. ఎక్కువమంది పండితులు దాని ప్రభావానికి లోనై వుండేవారు. ఆపాత ప్రవాహంలో పడి కొట్టుకొనిపోతూ రామమూర్తి పంతులుగారి వాదన లోని వాస్తవాన్ని [గ్రహించలేక పోయారు. అయినా పంతులుగారు పట్టువిడువక తమ వాద పటిమతోనూ, ఉద్యమ బలం వల్లనూ (క్రమేపీ పలువురి అభిప్రాయాలలో మార్పు తీసుకు రాగలిగారు.

ఈ శతాబ్ది మొదటి దశాబ్దం చివరలో మొదలైన గిడుగువారి వాడుకభాషా ఉద్యమం 1925-26 ప్రాంతాలనాటికి సతృలితాలనివ్వడం కనిపించింది. 1926లో తణుకులో (పశ్చిమ గోదావరి జిల్లా) ఆంధ్రసాహిత్య పరిషత్తు వార్షికోత్సవం జరి గినప్పుడు దానిలో పాల్గొన్నవారిలో హెచ్చుమంది గిడుగువారి వాదంలోని సామంజస్యాన్ని అంగీకరించారు. పరిషత్తు పెద్దలలో ఇది పెద్ద కలవరపాటు కలిగించింది. ఆ తరువాత తమ సభలకు వాడుక భాషావాదులు రాకుండానూ, పరిషత్తులో సభ్యులుగా చేరకుండానూ నివారించటానికి కట్టుదిట్చాలు చేసుకున్నారు. అయితే తత్చలితంగా ఆం(ధ్ర సాహిత్య పరిషత్తు అనతికాలంలోనే క్షీణించి పోయింది. వ్యావహారిక భాష్లావాదాన్ని ఆమోదించినవారు “నవ్య సాహిత్య పరిషత్తు? ను స్ట్రాపించి, “ప్రతిభ అనే పత్రిక కూడా నడిపారు. ఆ పత్రిక ఈ ఉద్యమానికి సాధనంగా ఉపయోగపడింది. అయితే ఒక్క ఆ పత్రికే కాదు, దాదాపు తెలుగులో వస్తున్న పథత్రికిలన్నీ వాడుక భాషా ప్రయోజనాన్నీ, అవసరాన్నీ గుర్తించి అంగీకరించాయి.

కనుకనే, రామమూర్తి పంతులుగారు తమకు శక్తి ఉడిగినదనుకున్నప్పుడు, తమకు అవసాన కాలం ఆసన్న మైనదని అనుకొన్నప్పుడు పాత్రికేయుల సమావేళంలోనే, “కట్టు కడపటి విన్నపాన్ని" వినిపించారు. ఆ+విధంగా తమ ఉద్యమానికి పత్రికా లోకాన్ని వారసుల్ని చేశారు. అలాగే పత్రికలు గిడుగువారి అనుశాసనాన్ని శిరసావహించి, వ్యావహారిక భాష వ్యాప్తికి అనవరతం అద్భుతమైన కృషి సల్సి, కడకీనాటికి వ్యావారిక భాషదే గ్రాంధిక భాష మీద పైచేయిగా చేయగలిగాయి. ఒకనాడు గ్రాంథిక భాపకే కట్టుబడి ఉన్న పత్రికలు సైతం వాడుక భాషను అంగీకరించాయి. ఒకప్పుడు పత్రికల భాషను అంటే - వ్యవహారిక భాషను, 'అది భాషేకాదు" అని ఈసడించినవారనేకులు తరువాత, తరువాత వాడుక భాషలోనే గద్య, పద్య, గేయ రచనల 72 సంధియుగం

చేసేదాకా మారిపోయారంటే అది మన పత్రికల కృషి ఫలితమే, గిడుగువారి ఉద్యమాన్ని పత్రికలు కొనసాగించిన ఫలితమే. ఒకనాడు ఆంధ్ర సాహిత్యపరిషత్తు పెద్దల ఒత్తిడికి భయపడి వాడుక భాషవైపు కన్నెత్తి చూడ నిరాకరించిన ప్రభుత్వసంస్థలూ, విశ్వవిద్యాలయాలూ, ఈనాడు వ్యావహారిక భాషను అధికారభాషగ్రా, విద్యా భాషగా స్వీకరిస్తున్నాయి. ఆంధ్ర (ప్రభుత్వం నియమించిన అధికార భాషా సంఘంవార్సు, తెలుగు అకాడమీవారు ఈనాడు పత్రికల భాషలోనే లేదా వ్యావహారిక భాషలోనే తమ వ్యవహారాలను నిర్వహించడమే కాకుండా గ్రంథాలను కూడా ప్రచురిస్తున్నారు. గిడుగువారి ఉద్యమం ఎంతగా ఫలించిందో వీటన్నిటినిబట్టీ ఈనాడు మనకు తెలుసు. “ప్రజలలో విద్య వ్యాపిస్తే గాని సంఘం వృద్రిలోకి రాదు. అయితే ప్రజలలో వ్యాపించవలసిన విద్య ఈ కాలానికి పనికిరాని (ప్రాచీన కావ్యాలూ, వ్యాకరణాలూ చదివించడం వల్ల రాదు. పాశ్చాత్య దేశాలలో కేవలం ప్రజల కోసం పెద్ద సారస్వతం పుట్టి వృద్ది పాందుతూ వున్నది. అది అంతా (ప్రజల భాషలోనే వుంటుంది. ఆ విధంగానే మన దేళంలోకూడా ప్రజలలో విద్య వ్యాపించడానికి అనుకూలమైన గ్రంథాలు కావలెను. ప్రజలలో విద్య ఎక్కువగా వ్యాపింపచేయడానికి, నవీన ఆశయాల కనుకూలంగా ఎక్కువగా తోడుపడేవి పత్రికలే. కనుక పత్రికా సంపాదకులకు నా విన్నపము తెలియజేస్తున్నాను” అని అంటూ, గిడుగువారు తమ ఉద్యమాన్ని పథత్రికలవారికి అందించి వెళ్లిపోయారు. పత్రికలు ఆయన ఉద్యమానికి తగిన వారసులుగా నిరూపించుకున్నాయి. ఆనాడే అంత ముందుకు చూడగలిగిన క్రాంతదర్శి గిడుగు రామమూర్తి పంతులుగారు. ఈనాడు మనమంతా (వ్రాస్తూ, చదువుతూ వ్యాపింపచేస్తున్న జనభాష ఆయన పెట్టిన భిక్ష “వారి ఉద్యమ ఫలితంగా కవులకు గొంతుచెర వీడినది. రచయితల చేతుల సంకెలలు ఊడిపోయినవి”', (19.186) స్గాన్గాగ్గ సాహిత్య పరిళోధన “వదిమంది పదేపదే పరిశీలన చేసి చెప్పినవాటిని గురించే మరి మరి పరితోభనలు సలిపి వారూ వీరూ చెప్పున విషయాలనే వెనుకముందులు తిరూవేసి వ్రాసే వ్యాఖ్యలవ్వూ ఉపయోగం వుండదు. ఇతర పరిశీలకులు చెవున్సి చెప్పుజూాలకపోయిన చెప్పుడం విన్థురించిన రచనలను గురించి స్వతంత్రంగా కొత్తకోణాలనుంచి పరిశీలించి చెప్పే తాత్సర్యాలకు, చేసే వ్యాఖ్యలకు స్రిరమైన సాహితీ (ప్రయోజనం సిద్రిస్తుంది. ఇంటాబయటా 6- [2-86 సంధియుగం 73 6

ా్యత్రవారి మనపంగ్క

రళ్ళ్‌ ఇండియా కంపెనీ అధికారులూ, క్రైస్తవ మత (ప్రచారకులూ మన దేశ భాషలను చుణ్ణంగా నేర్చుకొనడానికి ప్రయత్నించారు. ఈ దేశంలో తమ తమ కార్యాలను ఫల(్రదంగా కొనసాగించుకొనడానికి ఇది అవసరమని వారు గుర్తించారు. అలానేర్చ్భుకొనే ప్రయత్నంలో మన భాషల అధ్యయనాన్ని ఒక పద్దతిలో క్రమబద్ధం చేశారు. అంతేకాదు మన భాషలకు ముద్రణ సౌకర్యాలను కూడా వాళ్ళు ప్రవేశ పెట్టారు. తెల్లవారు ఒకందుకని చేసిన ఈ పనులు మనకు మరొకందుకు లాభించాయి. తెలుగు భాషా సాహిత్యాల (ప్రాచుర్యానికి, ముద్రణ సౌకర్యాల అభివృద్దికి సంబంధించినంత వరకు ఈ మాట మరింత నిజం.

మౌనవుడు ముద్రణ కళను ఆవిష్కరించుకొన్న తరువాతనే ప్రపంచ నాగరికత బహుదా వృద్ది చెందింది. పదహారవ శతాబ్ది మధ్యకాలంలో మొదటి ముద్రణా యంధత్రాన్ని కనిపెట్టారు. పందొమ్మిదవ శతాబ్లి మధ్యకాలంనాటికి ఈ కళ బాగా వృద్ది చెందింది. అయితే పద్దెనిమిదవ శతాబ్ది మధ్య ప్రాంతంలోనే ఈ ముద్రణ కళ క్రైస్తవ ప్రచారకుల ద్వారా మన దేశంలో ప్రవేశించినప్పటికీ, పందొమ్మిదవ శతాబ్ది (ప్రారంభం దాకా తెలుగులో అచ్చు అయిన రచనల సంఖ్య అట్టే లేదు. ఆ అచ్చు అయినవి కూడా బైబిల్‌ తాలూకు ప్రచురణలు మాత్రమే.

క్రైస్తవ మత ప్రచారకులు తమ (ప్రచార కృషికి ఉపయోగించుకుంటున్న ఈ కళను, ఈళ్ళ్‌ ఇండియా కంపెనీ అధికారులు మన దేశంపై తమ పెత్తనాన్ని ఫ్రిరపరచుకొనడానికి వినియోగించుకోవాలని సంకల్పించారు. అలా వారు సంకల్పించిన తరువాతనే, అప్పటివరకు తాళ పత్రాలలో చేతివ్రాత ప్రతులుగా మాత్రమే వుండిపోయిన సంస్కృత, ఆంధ్ర తదితర భారతీయ భాషా సాహిత్యాలు అచ్చులో వెలుగుచూచే అవకాళం లభించింది. (బ్రిటిష్‌ వారి ఈ ప్రయత్నాలను, కృషినీ గమనిస్తూ వచ్చిన మన వారిలో ముందు చూపుగల వారు కొందరు ఈ ఆధునిక సౌకర్యాన్ని మన భాష్తా సాహిత్యాల ప్రకటనా ప్రాచుర్యాలకు వినియోగించు కొనడంలోని “విజ్ఞతను” గుర్తించారు. అలాంటి వారిలో, తెలుగుకు సంబంధించినంతవరకు వావిళ్ల వారిని గురించి ముందుగా చెప్పవలసి వుంటుంది.

ము(ద్రణ సౌకర్యాన్ని దేశ భాషా సాహిత్యాల వికాసానికి వినియోగించే విషయంలో తెలుగువారి కంటె తమిళులు చాలా ముందు చూపు కలవారని నిరూపించుకున్నారు. తెలుగు కంటె నూరేళ్ళకు ముందే తమిళంలో పుస్తక ముద్రణ ప్రారంభమయింది. అంతేకాదు, తెలుగులో గ్రంథ (ప్రచురణకు మొదట పూనుకొన్న వారు కూడా తమిళులే. మైసూరులో ధర్మాధికారి చక్రవర్తి అయ్యంగార్‌ అనే ఆయన తెలుగు లిపిలో వివిధ సంస్కృత (గ్రంథాల (ప్రచురణకు పూనుకొన్నారు. ఆయన ఎవరో కాదు. చక్రవర్తి రాజగోపాలచారి (రాజాజీ) గారి తండ్రి.

దాదాపు అదే కాలంలో మదరాసులో వావిళ్ల రామస్వామి శాస్త్రిగారు తెలుగు లిపిలో సంస్కృత గ్రంథాల (ప్రచురణ ప్రారంభించారు. చక్రవర్తి అయ్యంగార్‌ వలెనే వావిళ్ల వారి మాతృ 74 సంధియుగం

భాషకూడా తమిళమే. ఆ కాలంలో భాషా భేదాలు పాటించేవారు కాదు. నిజానికి వావిళ్ళ రామస్వామి శాస్త్రిగారు మొదట తలపెట్టింది కన్నడ (గ్రంధాల ప్రచురణ. మైసూరులో వారు (ప్రారంభించిన ఆ ప్రయత్నానికి ప్రోత్సాహం లభించనందువల్ల, అది విరమించుకొని మైసూరు నుంచి మదరాసు వచ్చి 1854లో తెలుగు పుస్తకాల ప్రచురణ ప్రారంభించారు.

అది మొదలు సంస్కృత, తెలుగు తాళపత్ర గ్రంథాలను దొరికినవి దొరికినట్టు పట్టుకొచ్చి, వాటిలో తమకు నచ్చిన వాటిని తెలుగు లిపిలో ముద్రిస్తూ వుండేవారు. మొదట “వివేక రత్నాకర ము(ద్రాక్షరశాల', ఆ తరువాత "హిందూ భాషా సంజీవనీ ముద్రాకరశాలి, అటు పిమ్మట “సరస్వతీ నిలయ ము(ద్రాక్షరశాల*లను ఒకదాని తరువాత ఒకటి పెడుతూ, నష్టపడుతూ వచ్చి, చివరకు తొండాయార్‌పేటలో వారి సొంత ఇంటిలో ' ఆది సరస్వతీ నిలయ ముద్రాక్షరశాల'ను సొంతంగా ఏర్పాటుచేసుకొని ఎన్నెన్నో గ్రంథాలను తెలుగులో వెలువరించారు. మొదటి ఏడేనిమిదేళ్ళ వ్యవధిలోనే రామాయణం, భారతం వంటి 17 బృహడ్లంధాలను ప్రచురించారు. సి.పి. (బ్రౌన్‌ తన నిఘంటువుకు న్రాసిన ముందు మాటలో అన్నట్టు *“నేతివ్రాత పుస్తకాలు చదువుకొంటూ సతమతమవుతున్న రోజులలో వావిళ్ళ రామస్వామిశ్శాస్త్రిగారు ముద్రణాలయాన్ని నెలకొల్పి చదువరుల ఇబ్బందులను వివర్తింపచేశారు'.

ఇలా తెలుగు పుస్తక ముద్రణలో మార్గదర్శకులైన రామస్వామిశ్శాస్త్రిగారు 1891లో తమ 79వ ఏట మరణించే నాటికి, వారి ఒకే ఒక కొడుకు వేంకటేశ్వరశ్నా స్త్రి, ఆరేళ్ళ పసివాడు.

తండ్రి మరణించే నాటికి వేంకటేశ్వరశా స్త్రిగారు మరీపసికందు అయినందున, ఆయన పెరిగి "పెద్దవాడై చదువుసంధ్యలు నేర్చేవరకు వావిళ్లవారి ప్రచురణ వ్యాసంగం అంతంత మాత్రంగానే వుంటూవచ్చింది. అయితే, ఈయన పచ్చయ్యప్పకళాశాలలో చదువు కుంటూనే, ప్రచురణ సంస్థ కార్యకలాపాలను చూస్తూ వుండేవారు.

"పెత్తనం తన చేతికి రాగానే ఈయన తమ ముద్రణాలయం పేరును ' వావిళ్ళ (థెస్‌ అనీ, (ప్రచురణ సంస్ట పేరును ' వావిళ్ల రామస్వామి శా(స్తులు అండ్‌ సన్స్‌* అనీ మార్చివేశారు. తదాదిగా వావిళ్ల వారి సంస దినదిన (ప్రవర్రమాన మవుతూ వచ్చింది. ఒక్క తెలుగులోనే కాక సంస్కృతం, ఇంగ్లీషు, తమిళ భాషలలో సైతం వీరు అనేక గ్రంథాలు ప్రచురించారు. మొత్తం మీద ఈ సంప్ట పతాకం క్రింద వెలువడిన (గ్రంథాల సంఖ్య వెయ్యికి పైగా వుంటుంది.

వావిళ్ల వారి వాజ్బ్యయ సేన ముమ్మరంగా సాగుతున్న ఆ కాలంలో దేశంలో జాతీయోద్యమం కూడా ముమ్మరంగా సాగుతుండేది. వేంకటేశ్వర శ్నాస్త్రిగారు వ్యాపార దక్షులు మాత్రమే కాదు. గొప్ప జాతీయవాది కూడా. ఆ రోజులలో బంకించంద్ర చటర్జీ రచించిన బెంగాలీ నవల “ఆనందమఠం' దేశంలో పెద్ద సంచలనం కలిగించింది. బ్రిటిష్‌ పాలకుల గుండెలలో దడ పుట్టించింది. ఆ నవలను సాహసించి తెలుగులో (ప్రచురించిన దేశ భక్తుడు వేంకటేశ్వర శాస్త్రిగారు. అంతేకాదు, దాదాపు 40 మంది జాతీయ నాయకుల సంక్షిస్త జీవిత చరిత్రలను తెలుగులో ప్రచురించి స్వాతం త్ర ఉద్యమానికి ఎంతో దోహదం చేసిన వారు వావిళ్లవారు.

తమిళనాట గొప్ప దేళభక్తులలో వి.ఒ. చిదంబరం ఫిళ్లే ఒకరు. ఈయన పేరిట తమిళనాడు ప్రభుత్వం ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది. కాని, ఆ రోజులలో ఆయన *తాల్‌కాప్పియమ్‌' అనే గ్రంథానికి (వ్రాసిన వ్యాఖ్యానాన్ని తమిళ ప్రచురణ కర్తలెవ్వరూ సంధియుగం 75

ప్రకటించడానికి అంగీకరించనప్పుడు వావిళ్ళ సంస్ర్ర ముందుకు వచ్చి దానిని తమిళంలో ప్రచురించింది. అలాగే తమిళ మహాకవి భారతియార్‌ అవసాన దళలో పేదరికంతో బాధ పడుతున్నప్పుడు ఎవరూ పట్టించుకోకపోతే వేంకటేశ్వరశ్యా స్త్రిగారే ఆయనకు అర్హిక సహాయం అంధ్ధించి అదుకొన్నారు.

  • వేంకటేశ్వరశ్యాస్త్రిగారికి నాటి. జాతీయ ్రముఖులెందరితోనో_ సన్నిహిత పరిచయాలుండేవి. శాస్త్రిగారి పప్టిపూర్తి సభకు డ్యాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సాధారణ ('ప్రేక్షకులుగా వచ్చారంటే శాస్త్రిగారి ఎడల దేశంలో పెద్దలకు ఎటువంటి గౌరవ భావమున్నదీ తెలుస్తుంది.

శ్యాస్త్రిగారి కృషి గ్రంథ ప్రచురణకే పరిమితం కాలేదు. ' త్రిలిబ్ల” అనే తెలుగుపత్రికను 1916లో ప్రారంభించి నాలుగు దశాబ్దాలపాటు నడిపి, తద్వారా సాహిత్య సేవ, దేశ సేవ కూడా చేశారు. 1927లో “ఫెడరేటెడ్‌ ఇండియా” అనే ఇంగ్రీషు పత్రికను కూడా పెట్టి నడిపారు. అలాగే, నాలుగు సంపుటాలలో *వావిళ్ల నిఘంటువును ప్రచురించి తెలుగు భాషకు మహోపకారంచేశారు. అంతకు ముందు ఇతరులు రూపొందించిన పన్నెండు నిఘంటువులను కూడా వావిళ్ళవారి సంస్థ ప్రచురించింది. తెలుగు, సంస్కృత, తమిళ సాహిత్యాలకు ఇంత సేవ చేసిన వీరు, పక్షవాత వ్యాధితో 1956లో మరణించారు. వీరికి సంతానం లేదు. వీరి సతీమణి కూడా మరణించిన తరువాత ఈ మహా సంస్త క్షీణించి అంతరించింది. వేంకచేశ్వరశాస్త్రిగారి ఈత జయంతి ఉత్సవాలను జరపడానికి మదరాసులో ఏర్పాటైన సన్నాహక సంఘం శతజయంతి ఉత్సవాలను జరపడమేకాక, వానిళ్ల సంస్థను పునరుద్దరించాలని కూడా సంకల్పించింది. వారి సత్ర్రయత్నం సఫలం కావాలని సాహిత్యాభిమానులంతా ఆశిస్తారు. (25.10.86) స్లాస్గాగ్గా విమర్శలు వధ్యశిలలు కాకూడదు “సాహిత్యంగావచ్చు సంగీతం కావచ్చు. మరే ఇతర ప్రక్రియ అయినా అయి వుండవచ్చు. ఒక రచనా (ప్రక్రియను పరిశీలించేటప్పుడు ఆ పరిశీలకులు స్వీయ విశ్వాసాలరూ మమకారాలను ఒకింత దూరంగా ఉంచడం అవసరం. మన నమ్ముకాలు అవనమ్ముకాలు ఈ అనుళీలనలో అడ్డు రాకూడదు. విమర్థుకులకు సమ్యక్‌ దృష్తి సహృదయత వుండాలి. విమర్భులు వధ్యళిలలు కాకూడదు. ఇటువంటి (ప్రమాదం దధీమతుల విషయంలో సయితం ఎడనెడ కనపడుతుంటుంది. వస్తునిష్టతో నిర్మమకార దృష్టితో జరిపే పరిశీలనలకు సాహిత్య పరిళోధనలకు శాళ్ళత ప్రయోజనం వుంటుంది. ఇంటాబయటా 6- ! 2-86 76 సంధియుగం

₹6౪9 ఆంఛ్రుసర్స£్రం

నొటి సేవానిరతి నేటి వారిలో కానరాదు, ఆనాటి కార్యదీక్ష ఈనాడు కరువైంది, 1942లో మాగంటి బాపివీడుగారు పూనిక వహించి ఒంటిచేతి మీదుగా రూపొందించిన ప్రచురించిన *ఆంధ్ర సర్వస్వము' చూచినపుడు ఈమాటే అనిపిస్తుంది. 1941 సత్యాగ్రహోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన బాపినీడు గారికి జైలులో ఒక రోజున మెరుపులాగా ఒక ఆలోచన వచ్చింది. తెలుగులో ఒక సర్వస్వ గ్రంథాన్ని ప్రచురించాలన్న తలంపు ఆయనకు కలిగింది. జైలులో తనతోపాటున్న మిత్రులను సంప్రతించారు. ఆ విధంగా ఆరోజు రూపొందిన ఆలోచన ఆయన జైలునుంచి విడుదల కాగానే కార్యరూపం దాల్చింది.

పాశ్చాత్య ఆలోచనా ప్రభావం వల్ల లభించిన ఒక్షవిద్యా సమాచార సాధనం '' సర్వస్వము" అనాటికే 24 సంపుచాల ఇంగ్రీషు ఎనొసైక్టోపీడియా 14 సార్దు మళ్ళీ మళ్ళీ ముద్రణ అయింది. ప్రతి పునర్ముద్రణలో అనేక కొత్త విషయాలూ, విజయాలూ, సమాచారాలూ చేర్చుకుంటూ విస్తరిల్దుతుండడం సర్వస్వాల లక్షణం, మనకంటే ముందు కన్నడ భాషలో “బాల (ప్రపంచి అనే సర్వస్వం నాలుగు సంపుటాలలో వెలువడింది.

నిజానికి బాపినీడుగారిది మొదటి ప్రయత్నం కాదు. కొమర్రాజు లక్మణరావుగారు అంతకు ముందు కొంతకాలం క్రిందట ''ఆం(ధ్ర విజ్ఞాన సర్వస్వము*' అనే ఒక ఉద్హంథ (ప్రచురణకు ఉద్యమించి, అకారాది క్రమంలో ప్రచురించ తలపెట్టి, మొదటి సంపుచాన్ని మాత్రమే తీసుకురాగలిగారు. వారి మరణంతో ఆయన సంకల్పించిన ఆ గ్రంథ ప్రచురణ నిలిచిపోయింది. ఆ తరువాత కొంతకాలానికి దేశోద్దారక కాశీనాథుని నాగేశ్వరరావుగారు లక్మణరావుగారి అసంపూర్ణ ప్రయత్నాన్ని పూరించాలన్న సదుద్దేశ్యంతో ఆ మొదటి సంపుటాన్ని సమగ్రంగా సవరించి, సంస్కరించి, విస్త్పృతపరచి ప్రచురించారు. అంతే. మళ్ళీ ఆ (ప్రచురణకు గ్రహణం పట్టింది. దేశోద్దారకుని నిర్యాణంతో ఆ ప్రయత్నం అక్కడే ఆగిపోయింది.

అటువంటి పరిస్టితులలో మాగంటి బాపినీడుగారి ఆలోచనలు అటువైపు మళ్ళాయి. అయితే, లక్ష్మణరావు గారు, నాగేశ్వరరావుగారూ సంకల్పించినంత బృహత్‌ గ్రంథ (ప్రచురణ సాధ్యంకాదేమోనన్న భావంతో ఒకే సంపుటంలో ఆంధ్రులను గురించిన అన్ని విషయాలను సంగ్రహగూపంలో సమకూర్చి '' ఆంధ్ర సర్వస్వము”: పేరిట ప్రచురించ సంకల్పించారాయన. 1942 ఏప్రిల్‌16వ తేదీన దీనికి ప్రారంభోత్సవం జరిపి తన మిత్రులను పత్రికా ప్రతినిధులను, (ప్రముఖ రచయితలను కొందరిని ఆహ్వానించి, తన సంకల్పాన్ని వివరించి వారి సహకారాన్ని అర్టించారాయన. అప్పచ్జో దక్షిణ భారత హిందీ ్రవారసభ (ప్రధాన కార్యదర్శిగా వున్న మోటూరి సత్యనారాయణ గారు ఈ గ్రంథ (ప్రచురణలో బాపినీడుగారికి కుడిభుజంగా పనిచేశారు.

గ్రంథ (ప్రచురణ పని (ప్రారంభించిన నాలుగు నెలలకే - 1942 ఆగస్టు తొమ్మిదవ తేదీన “క్విట్‌ ఇండియా”* ఉద్యమంలో ప్రభుత్వం భాపినీడుగారిని రాజకీయ బందీగా పట్టుకెళ్ళింది. సంధియుగం 77

“అప్పటికి గ్రంథము సగమైననూ పూర్తి కాలేదు. నా కుమారుడు అప్పటికి నెల బాలుడు. నా భార్యను, పిల్లలను. అ బాలుని విడిచి పెట్టుటకంటే ముద్రితమగుతూ వున్న నా ఆం(ధ్ర సర్వస్వమును విడిచి పెట్టిపోవుటు నాకు ఎక్కువ విషాదకరముగా నుండెను” అని ఆరోజున అర్వస్ట్‌ అయి వెళుతూ బాపినీడుగారు అన్న ఈ మాటలు ఆయన కార్యదీక్షకు, సేవానిరతికి నిదర్శనం.

ఆయన నిర్బంధానంతరం వారి సతీమణీ డాక్టర్‌ మాగంటి శకుంతలాదేవి పట్టుదలతో బాధ్యత వహించి ఆయన జైలులో వుండగానే సర్వస్వాన్ని పూర్తిచేయించారు. "ఈ గ్రంధ ము(ద్రణము సగము సాగినవరకు దీనితో నాకు సంబంధము ఏ మాత్రమైనా వుంటుందని నేను అనుకోలేదు... ముద్రణము ప్రారంభించిన నా భర్త బాపినీడుగారు రాజకీయ పరిస్టితులవల్ల ప్రభుత్వము వారి నిర్భంధములో నుండుటకు వెళ్ళవలసివచ్చింది. మరియొక మాసమునకే ఈ ఉద్యమందు వీరికి ప్రధాన సహాయకులుగా వుండిన (శ్రీయుత మోటూరి సత్యనారాయణ గారూ ప్రభుత్వంవారి నిర్బంధంలో నుండుటకే వెడలవలసి వచ్చింది. ఇట్టి పనికి నేను అలవాటు పడినదానను కాను''. అటువంటి పరిస్టితులలో డ్యాక్టర్‌ శకుంతలాదేవి గ్రంధ ప్రచురణ పూర్తి చేయించి భర్త మాటను నిలబెట్టు గలిగిన సాహసికురాలు. ఆనాటి వారి కార్యదీక్షకు ఈమె కృషి మరొక మచ్చుతునక.

డాక్టర్‌ కట్టమంచి రామలింగారెడ్డి గారు ఈ సర్వస్వానికి వ్రాసిన ““ముఖబంధము**లో నుడివినట్టు “ఈ యాం(ధ్ర సర్వస్వము మన భాషలలోని పూర్వమార్గముఅం గూర్చంబడిన య(గ్రగణ్యములైన గ్రంధములలో నొక్కటి. ఇంటింట నుండదగినది. ఎల్లరును జదువ వలసినది. ఆం(ధ్రులభూమి, దాని వర్ధనము, వారి చరిత్రము, వాజ్ఞయము. సంస్కారోద్య మములు అర్టిక స్టితిగతులు, జాతీయతా భావ పరిణామము, రాజకీయ ప్రయత్నములు, చిత్రకళా నైపుణ్యము, విద్యా విధానములు తద్వ్యాప్తి మొదలగు సర్వ విషయములను ఆదినుంచి యాధునికము వరకును వివరించి ప్రాచీన విషయ విజ్ఞానముతోపాటు వర్తమానకర్తవ్యము లను, భవిష్యత్తును భద్రపరచు రీతులను దెలిపి జ్ఞానముతో శీలమునకు నావళ్యకమైన జ్ఞానము, పరస్పర వర్తకములగు నీరెంటినీ మన హృదయములను నాటునట్టుచేసి దేశోపకారము నమోఘముగా సల్పిన వారీ గ్రంధ కర్తకులు. ఇట్టి బృహ(్లంధమిదివరలో రచింపబడి యుండలేదు. ఇక ముందు క్రొత్తగా రచింపనవసరములేదు. ఏలన దీనికే నాల్రైదేండ్రకొక పర్యాయము లోపములు బూరించుచు నూత్నములను సమకూర్చుచూ సవరించి, సంస్కరించి ప్రచురించిన యెడలా నద్దియే నిత్య ప్రమాణ గగ్రంధమగును*'.

అవును. కట్టుమంచి వారన్నట్టు విసృత ఆంధ్ర సర్వస్వ('ప్రచురణకు (ప్రాతిపదిక కాగల అన్ని లక్షణాలు ల్జ్హతలు వున్న (గ్రంధం 'ఆం(ధ్ర సర్వస్వము. దీనిలో మొత్తం 14 భాగాలున్నాయి. వాబేక్రింట మొత్తం 33 శీర్షికలున్నాయి. దీనికి వ్యాసాలు (వ్రాసిన వారిలో దేళభక్త కొండా వెంకటప్పయ్య, డాక్టర్‌ భోగరాజు పట్టాభిసీతారామయ్య, అడవి బాపిరాజు. జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి, ఉన్నవ లక్ష్మీనారాయణ, డ్యక్టర్‌ గిడుగు వెంకట సీతాపతి, శ్రీ, పింగళి లక్ష్మీకాంతం, డాక్టర్‌ ఉమర్‌ అలీషా, రైట్‌ రెవరెండ్‌ పాతకమూరి ధామస్‌, డాక్టర్‌ పుట్టపర్తి శ్రీ/నివాసాచారి వంటి సు ప్రసిద్దులెందరో వున్నారు.

దీని తరువాత తెలుగు భాషా సమితి అధ్వర్యాన 1954లో తెలుగు విజ్ఞాన సర్వస్వం మొదటి సంపుటం వెలువడింది. అప్పటినుంచి 30 ఏళ్ళలో వారు 14 సంపుచాలు 78 సంధియుగం

(ప్రచురించారు. ఇలా కాలహరణం జరిగినందువల్ల వీరి తాలి తుది సంపుచాల మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయి. ఈ సమితివారు మాగంటి బాపినీడుగారి ఆంధ్ర సర్వస్వాన్ని పరిగణలోకి అంతగా తీసుకున్నట్టు కనపడదు. వాస్తవానికి ఆంధ్రులకు సంబంధించిన అన్ని విషయాలన గురించిన సమాచారం ఒకే సంపుటంలో వున్న ' ఆం(ధ్ర సర్వస్వము ఎక్కువ ప్రయోజనకారిగా కనపడుతున్నది. కట్టుమంచివారు సూచించినట్టు ఈ “ఆంధ్ర సర్వస్వము* గ్రంధాన్ని చేపట్టి సవరించి సంస్కరించి తాజా సమాచారం సమకూర్చి ప్రచురించగలిగితే తెలుగు విద్యారులకు- ఒక్క విద్యార్దుల కేమిటి, తెలుగువారందరికి మహోపకారం చేసినవారు అవుతారు. నిజానికి ఆం(ధ్రప్రభుత్వమే దీనిని విరివిగా (ప్రచురించి అందరికీ అందుబాటులో వుండగల ధరకు అందించగలిగితే బాపినీడుగారి కృషి సార్రకమౌతుంది. మనకో మంచి ఆధునిక సంహిత వున్నదన్న సంతృప్తి తెలుగువారికి మిగులుతుంది. (19.10.84) స్గాన్గాన్గా స్రీలకు శత్రువులు 'త్రీ/లకు. మొదటి శత్రువు సినిమా. రెండవ ళత్రువు నవల, ఈరెంజింటిలోను. (శ్రీ/లను. హేయంగా బానిసలకంటె కనాక్టంగా ఆటబొమ్మలుగా చిత్రించడం జరుగుతున్నది. కొని సినిమాలలో యువతులవేత చేయించే అంగాంగ ల్రింగారవిన్యాసాలు సభ మానవతకు తలవంవులు తెచ్చేవిగా వుంటున్నాయి. అలానే పలువురు రాసే నవలల్లో ఆని. వ్యక్తిత్సంలేని. ఆత్మగౌరవం. ఎరుగని ఎందుకూ కొరూని బానిసబొమ్మగా చిత్రించడం జరుగుతున్లుది. దురద్చష్ట్రవశాత్తూ ఈ నవలలలో ముఖ్యంగా తెలుగు నవలలలో చాలావాటేకీ కర్తలు (స్త్రీలే ఇవి చదివినపుడు. (న్తీలకు.. (శ్రీలే. ఇంత అపచారం అన్యాయం చేసుకుంటున్నారేమా అనిపీన్తుంది. ఇది శోచనీయమైన పరిస్టితి, అయితే నవలలకంటో కూడా నేటి సినిమాలు ్రీలకు ఎక్కువ అపచారం చేస్తున్నాయి. కొన్లి దృశ్యాలు కొని డైలాగులు మిక్కిలి జుగువ్ఫుకరంగా సంస్కారమేలేని ఆటవిక మనస్తత్తాన్ని వ్రతిభింబించేవిగా వుంటున్నాయి. ఆ్రీ/లని ఇలా వృక్తిత్సంలేని వినోద సాధనాలుగా చి(తించే దృశ్యాలను పాటలను నిష్కర్షగా నిషేధించే సెన్సార్‌ నిబంధనలు కావాలి. వాటిని ఉల్ధంఘీంచినవారికి కరినళిక్షలు విధించే శాసనాలు కావాలి భావ (ప్రకటనా స్వేచ్చ పేరిట జరుగుతున్లు ఈ అనభ్యకొండను (తుంచివేయాలి. ఇంటాబయటా 24-9-83 సంధియుగం 79

“బరిచనాయకుడు'

క9వ +తాబ్దంలో మన ఊళ్ళెలా వుండేవి? ఆకాలంలో మన గ్రామీణ జీవన సరళిఎలా వుండేది? నదులపై ఆనకట్టులు కట్టి సాగునీటి సౌకర్యాలు (ఇర్‌గేషన్‌) వచ్చిన తరువాత మన పళ్లెపట్టులలో అలవాట్లు ఎలా మారిపోయాయి? ఆనాడు ఆయావర్గాల (గ్రామ ప్రజల మధ్య సంబంధాలు, అనుబంధాలు ఎలా వుండేవి? స్వాతంత్ర్య ఉద్యమంతోపాటు హరిజనోద్దరణకు గాంధీజీ ఇచ్చిన పిలుపు తెలుగునాట (ప్రజల మనోభావాలపై ఎటువంటి (ప్రభావం చూపింది?

1933లో వెలువడి అంతలొనే మరుగున పడిపోయిన ఒక తెలుగు నవలలో అనాటి తెలుగు జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చిత్రించడం జరిగింది. అంటరానితనం, సాంఘిక అసమానతల నిర్మూలనను (ప్రబోధించడం ఈ నవల రచనా ధ్యేయం.

కృష్ణాజిల్లాలో ఏడెనిమిది గ్రామాలు ఈ నవలకు భూమిక. అయితే రచయిత తాను చెప్పదలచుకొన్న లేదా ప్రబోధించదలచుకున్న భావాలను సాత్విక సిద్దాంతాలను విశద పరచడానికి అవసరమైనపుడు పాఠకులను అటు కలకత్తానుంచి ఇటు మదరాసు వరకు పయనం కట్టించారు. మరి సబర్మతీ ఆశ్రమానికి తీసుకెళ్ళారు.

నూరేళ్ళినాడు గ్రామసీమలలో మన రైతులు రైతుకూలీలు మాట్దాడుతుండిన పల్లీయ భాష చక్కని సాధనంగా రచయిత వాడుకొన్నారు. అవసరమైనచోట్లు వారి అలవాట్లును, ఆచారాలను పాత్రలచేత చక్కగా చెప్పించారు. ఈ నవలలో ముఖ్యపాత్ర ఊరి హరిజనులలో వయోవృద్దుడు గంగయ్య, ఈ పాత్రచేత రచయిత చెప్పించిన ఈ క్రింది మాటలు ఇందుకొక ఊదాహరణ '““మేము మీ కమ్మవారి మాదిరిగా రంగులు పింగులు వేసుకొని తిరగేవాళ్ళమా? తిరూలన్న మాకు నాలుగు డబ్బులిచ్చిన వారెవరున్నారు? పెండ్రినాటికి నాకు ముప్పై సంవత్సరాలు. దానికి 16 సంవత్సరాలని చెప్పితిగదా: నాకు అరవైఏళ్ళు వచ్చిందాక సంసారిపక్షముగానే యుండేవాళ్ళము నా డెబ్బైయేట ఆదిదేవుడు సాన్నిధ్యమునకు పోయె. పాపమిప్పుడే లోకములో యున్నదోగాని, మీ ముత్తవ్వ ఎంతటి పనికత్తెయనుకొన్నారు? పగలంతా పాలాన పనిచేసి వచ్చి ఇంటిలో భోజనాదులన్ని సరిపెట్టి, ఇరుగుపారుగు వారికి మర్యాదచేసి వచ్చి, నాకాళ్ళు పిసుకుచు నిద్రకు జోకొట్టేది.?'

మరొకచోట ఆ గంగయ్యే ఇలా చెప్తాడు '' ఏదో ఈ మాయా ప్రపంచములో ఈ వేష్ణాలన్నీ వేయాలిగాని, వాస్తవముగా ఎప్పుడూ పంచములు వీళ్ళు, శూద్రులు వారు, అని పాలాలలో పనిచేసుకొనేటప్పుడు మేము మాత్రము అనుకొనే వాళ్ళమా? పని చేసేవడుపులోగాని , కోత కట్టవేతలోగాని, అరకదోలి, సాళ్ళువేసి జడ్డిగము పెట్టి విత్తనాలు వేయటములోగాని మేమీభేదాలు పట్టింపుగా జూచేవాళ్ళమూ? ఒకే మునుములో అందరము ఒకరి ప్రక్కన మరొకరము పనిజేసీ వాళ్ళమే: అచ్చా పని చేయుచున్నంతకాలము మా కులాలను మరచిపోయేవాళ్ళం.*” కష్టజీవులకు కులాలవంటి అడ్డుగోడలు లేవని పనిపాటలు లేని సోమరులకే ఆ పట్టింపులు వుండేవని చెప్పడం ఇక్కడ రచయిత ఉద్దేశం.

ఈ రచనలో వ్యర్థనలు ఇలా వుంచాయి, '' కొండపల్లిలో ఉపన్యాసముచేసిన పిమ్మట కోట చూచు తలంపున... మన యోధులు కొండ ఎక్కారు. దారివెంట నీడ నొసంగుచున్న తిం సంధియుగం

తరుజొంపముల చూచి ముచ్చటపడుచు, రాళ్ళపై దుముకుతూ, అక్కడక్కడ (ప్రవహించు ఏరులందు పాదములు, ముఖములు కడుగుకొంటూ ఆ చల్లని సలిలముల త్రాగుతూ అత్యుత్సాహముగా అలసట నే మాత్రము పొందకయే, కోట చేరారు. పాడుబడిన ముసల్మానుల మహలును దర్శించి అందున్న పూర్వకాలపు సరస్సును, జలకమాడుకున్న తచాకమును, సహజముగ ఏర్పడిన జలాధార ములనుగాంచి సంతసమొందారు. ఆ తచాకము (ప్రక్కన నిలబడి మైళ్ళ పర్యంతము ఒక వంక బెజవాడ మరొకవంక కృష్ణానది, ఆవలివంక కొల్లేరులగాంచి ఇట్టి హృదయానందకరమగు ఈ భూభాగమందు ఒకప్పుడు గజపతుల సైన్యము, మహమ్మదీయుల సీపాయీలు, విజయనగరపు నాయకులు సంచారమొనర్చిరి గదా యని తలపోసి ఆశ్చర్య మొందారు.'” ఉన్నవవారి నవల “' మాలపల్లి” వెలువడిన పది పన్నెండేళ్ళ తరువాత విశ్వనాధవారి “వేయి పడగలు'' నవల రాయడానికి ఏడెనిమిదేళ్ళ ముందు ఈ నవల వెలువడింది. వారిద్దరి వలెనే ఈ నవలా రచయిత కూడా విద్యాధికుకుడే. అయితే వారిద్దరికీ తెలుగు భాషలో వున్న పాండిత్యం ఈయనకు లేదు. ఈ ముగ్గురిలో విశ్వనాథ వారిది పూర్తిగా అన్నిచా భిన్నమైన నవల. కాగా ఉన్నవవారి వలెనే ఈ నవలా కర్త కూడా గాంధీ సిద్దాంతాల (ప్రభావానికిలోనై దేళ స్వాతంత్ర్యం కోసం సాత్విక మార్గాన సమరం సాగించినవారు... నిజానికి ఉన్నవ వారి రచనా ప్రభావం వీరిమీద వున్నది. అయితే గాంధేయవాదులైనా, వీరిద్దరి రచనలలో కొంత తేడా కనిపిస్తుంది. ఉన్నవవారు పుట్టింది పల్రైలోనైనా, చిన్నప్పటి నుంచి పెరిగింది మధ్య తరగతి బస్తీ ప్రజల వాతావరణంలో కాగా, ఈ రచయిత విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసివచ్చినా, గ్రామీణ వాతావరణంలోనే ఆ జీవన సరళికే అంటిపెట్టుకొని వున్నవారు. వీరిద్దరి రచనలలో ఈ తేడా కనబడుతుంది. మాలపల్లి" లో సాత్వికులకు, దుడుకుతనం కలవారికి మధ్య కొట్టాటలు జరగడం చూస్తాము. ఈ నవలలో మాత్రం భిన్నవర్గాల వారి మధ్య వున్న కుల, వృత్తి వైరాలను సామమౌర్గంలో సంభాషణల ద్వారా ఇచ్చిపుచ్చుకునే పద్దతిలో పరిష్కరించుకొనడం జరుగుతుంది. ఇది ఈ ఇద్దరు రచయితల గాంధేయ దృక్పథంలో వున్న సున్నితమైన తేడా అయినా ఉన్నవవారి రచన ఈ రచయితకు ఈ రచన చేయడంలో ఒకరకమైన ఉద్దీపన కల్షించినట్టు కనబడుతుంది. ఈ నవలలో ఒక హరిజన నాయకుని పుట్టుక నుంచి పూర్తి పరిణతి వరకు అచ్చమైన గాంధేయ పద్దతిలో రూపొందించడం మనకు కనబడుతుంది. ఈ పాత్ర పేరు బసవలింగయ్య,. నిజానికి లింగయ్య అనే ఈ హరిజన యువకుని గుణగణాలను గమనించిన ఉన్నవ లక్ష్మీనారాయణగారే ఇతనికి బసవలింగయ్య' అనే పేరు పెట్టినట్టు రచయిత నవలలో ఒకచోట చెబుతారు. ఈవిధంగా ఉన్నవవారి రచనా ప్రభావం ఈరచనమీద కనబడుతుంది. *' కరువు వచ్చినా, కలరా వచ్చినా, కష్టమొచ్చినా, కాలయముడొచ్చినా, మా పాలేరుల మేలే మాదని"' తలచే రైతులు. “'మేము పంచమజాతివారమైనా అసూయగాని, అసహ్యతగాని బొందకరైతు జాతికి సహజమగు సహనముతో, ధార్మికబుద్దితో, ఉదార స్వభావముతో మాకోరిన కోర్కెనింత నిరభ్యంతరముగా చెల్లించినందులకు మా సంఘీయులెల్లరు మీయందు సుహృదయులై వుండగలరు”' అని తలపోసే హరిజనులు ఈనవలలో మనకు సాక్షాత్కలరిస్తారు. ఇది శుద్ద ఆదర్శవాదం, అయితే ఒక ఆదర్శాన్ని (గాంధేయ ఆదర్శాన్ని) ప్రబోధించి, సంధియుగం 81

(ప్రచారం చేయడానికి ఉద్దేశించిన ఇటువంటి రచనలో ఇలాంటి ఆదర్శ సామాజిక వ్యవఫ్రను చిత్రించడం సహజమే. ఈవిధంగా ఇది ఒక మంచిరచన, ఉత్కృష్టమైన రచన అనిపించు కుంటుంది.

ఈ నవల రచనా కాలాన్ని, ఆనాటి సాంఘిక ఫ్రితిగతులను, అప్పుడప్పుడే గాంధీజీ నాయకత్వాన ఉమ్మరమవుతున్న స్వాతంత్రోద్యమ ప్రభావాన్ని మనసులో పెట్టుకొని చదివినప్పుడే దీని విశిష్టత గోచరిస్తుంది. 'మాలపల్లి' వంటి రచనల కోవకు చెందినది. ఆనాటి సాంఘిక పరిస్టితులను తెలుసుకొనడానికి ఉన్నవ వారి రచనవలెనే ఇదీఎంతో ఉపకరిస్తుంది.

ఈ నవల పేరు '“హరిజన నాయకుడు". 1932లో ఆచార్య రంగా ఈ నవల (వ్రాశారు. కీర్తిశేషులు గోగినేని లత్ష్మీనారాయణగారి సంపాదకత్వాన ఏర్పడిన '“రైతు గ్రంథమండలి" వారి మొదటి ప్రచురణగా 1933 డిసెంబర్‌ నెలలో ఈ రచన అచ్చు అయింది.

(1.6.84) స్లాన్గాగ్గు మతాలు చూస్తే భయమెందుకు?

ఎందువ్య్ఞనో ప్రభుత్వాలు మతాలను చూచి భయపడుతుంటాయి. మతాలను వమీ అనలేక మతాన్నోదాన్లి మాతం మనం విమర్థిస్తూంటాము. ఈ ఉన్నాదానికీ మతలాలమధ్య వైషమ్యూలే కారణమని మరచిపోతుంటాము. అందువ్షూనే ఈవిషయంలో మన (ప్రయత్నాలు ఫలించడం లేదు. మతాలను వ్యక్తులకు పరిమితం చేయవలసిన సమయం వచ్చింది. వ్యక్తులు తమ మతవిశ్వాసాలను తమ ఇళ్ళాకే పరిమితం చేసుకోవలసిన సమయం వచ్చింది. తమ కార్యకలాపాలను ఆలయ ప్రాంగణాలకు. పరిమితం చేసుకోవలసీన సమయం ఆసన్హుమయింది. రాచరికాల కాలంలో మతాలకు వును ప్రాముఖ్యం ప్రజాస్వామ్యంలో ఉండవలసిన అవసరం లేదు. ఈ నియమాలను పరిమితులను నిన్సుంకోచంగా నిష్పుకపాతంగా (ప్రభుత్వం అమలులో పెట్టాలి. అలా జరుగనంతవరకు మనదేళం. ఇప్పుడు ఎదుర్కొంటున్ల్ను మతోన్మాద సమస్యలనుంచి బయటపడజూలదు.

ఇంటాబయటా 1! 5- | £- 86

82 సంధియుగం

వ్యువమమక్కి- విభయదనరం ఆ్క్స్‌ఫర్త్‌ డు వుదరాసు నగరం కరనాడు (కర్నాటక కాదట) సంగీతానికి మక్కావంటిది. కాగా విజయనగరం మన సంగీతానికి ఆక్స్‌ఫర్డ్‌ వంటిది. శంఖంలో పోస్తే కాని తీర్థంకానట్టు మదరాసు సంగీత సభలలో మెప్పు పాందనిదే సంగీత విద్వాంసులకు గుర్తింపురాదు. (ప్రతి సంవత్సరం తుదీ, మొదటి పక్షాలు చెన్నపురిలో సంగీతం సీజను. ఈ మాసాన్ని మదరాసు మ్యూజిక్‌ అకాడమీ, ఇండియన్‌ ఫైన్‌ ఆర్స్‌ సొసైటి, నారదగాన సభ, కృష్ణగాన సభ కళావేత్ర, ట్రిఫ్లికను పార్ధసారధిస్వామి సభ వంటి ప్రసిద్ద సంగీత సభలలో ఈ నెలరోజులు “రాల్లరిగించు గంధర్వగాన' రవళులు, శిశువులను, పశువులను సైతం మైనురపించే గాన సుధావాహినులు నగర శ్రోతలను ముందెత్తుతుంటాయి. దక్షిణ భారతమంతటి నుంచి సంగీత ప్రియులు తీర్ణయాత్రికుల వలె నగరానికి వచ్చి నవరసభరితమైన ఈ సంగీతోత్సవాలను తిలకించి, ఆలకించి తన్మయులై తరించిపోతుంటారు. మొన్నమొన్నటివరకు చెన్నపురి మనకు కూడా రాజధాని నగరమే. అది ఇప్పటికీ దక్షిణ భారత సాంస్కృతిక సంగీత రాజధానిగా తన విశిష్ట స్టానాన్ని నిలబెట్టుకొంటున్నది. సంగీత విద్వాంసులలో ఉద్దండ పండితులలో తమిళులే ఎక్కువమంది వున్నా వారి మూలవిరాట్‌ తెలుగు త్యాగయ్య. అంతేకాదు, తరువాతి కాలంలో కూడా పలువురు తెలుగు విద్వాంసులు మదరాసు సంగీతోత్సవాలకు శోభ చేకూరుస్తూ వచ్చారు. అటువంటి వారిలో ద్వారం 'వెంకటస్వామినాయుడు, పర్వతనేని వీరయ్య చౌదరి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, (శ్రీపాద పినాకపాణి వంటే వారెందరో వున్నారు. వీరిలో వీరయ్య చౌదరి పాండిత్యంగురించి తమిళులకు తెలిసినంతగా తెలుగువారికి తెలియదు. ఆయన సంగీత విద్వత్తునుఎరి గిన మదరాసు మ్యూజిక్‌ అకాడమివారు ఆయన జీవించి వున్నంతకాలం ్రతి సంవత్సరం ఆహ్వానించి వారిచేత ఉపన్యాసాలు చేయిస్తుండేవారు. ఇక బాలమురళీకృష్ణ గురించి వేరుగా చెప్పనవసరం లేదు. ఆబాల గోపాలాన్ని అలరించగల పండితుడు బాలమురళి. మన సంగీత లోతులను తరచి, తరచి చూచి సరికొత్త బాణీలను స్వరాలను సృష్టించిన అపర సంగిత బ్రహ్మ ఆయన. దక్షిణాదిన ఆయన పాండిత్యాన్ని మెచ్చుకునేవారు, ఆయన పాట వినడానికి పడిచచ్చేవారు ఎంతమంది వున్నారో! ఆయన కొత్త పోకడలు నచ్చక విమర్శించేవారూ అందరున్నారు. ఈ అనుకూల, (ప్రతికూల పవనాలను బట్టి బాలమురళి గొప్పతనాన్ని (గ్రహించవచ్చు. ఇంతగా కాకపోయినా మదరాసు సంగీత వాతావరణాన్ని ప్రభావితం చేసిన తెలుగు సంగీత విద్వాంసులు మరెందరో వున్నారు. వీరందరిదీ ఒక ఎత్తు. ద్వారం వెంకటస్వామినాయుడుగారిది ఒక ఎత్తు. మదరాసు సంగీత అకాడమి పండితులను రంజింపచేసి, ఈ అకాడమి సన్నదునందుకున్న మహా విద్వాంసుడాయన. 1941లో ఈ సభ ఆయనకు 'సంగీత కళానిధి" అన్న బిరుదాన్నిచ్చి సమ్మానించింది. ఆ తరువాత మైసూరు మహారాజా ఫిడేలు నాయుడుగారికి ' సంగీత రత్నాకర అన్న సన్నదునిచ్చి 1946లో గౌరవించారు, ఆపీమ్మట ఆంధ్ర విశ్వవిద్యాలయం 1950లో సంధియుగం 83

“కళా ప్రపూర్ణ గౌరవ పట్టుం ఇచ్చింది. జయపూర్‌ మహారాజా విక్రమదేవ్‌ వర్మ నాయుడుగారిని సన్మానించినవారిలో మొదటివారని అంటారు. ఆయన స్వయంగా ఒక బంగారు పతకాన్ని నాయుడుగారి కోటుకు పెట్టి సత్కరించారు. ఆ తరువాత మరెందరో మహరాజులు, సామంతరాజులు ఆయనను సన్మానించారు. అంతేకాదు మైసూరు, తిరువాన్కూరు పాలకులు ఆయనను తమ అఆస్ట్రాన విద్వాంసుడిగా చేసుకోవాలని ప్రయత్నించి, విఫలులైనారట. విజయనగరం సంగీత కళాశాల పట్లు ఆయనకు గల అభిమానం ఇందుకు కారణం.

మదరాసులో 1927లో జాతీయ కాం(్రమ్‌ మహాసభలు జరిగాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అఖిల భారత సంగీత మహాసభను కూడా ఏర్పాటుచేశారు. ఫిడేలునాయుడుగారు ఓం (ప్రథమంగా మదరాసులో కచేరీ చేసేంది ఆ సభలోనే. అది మొదలు ఆయన విద్వత్రభ దక్షిణాది అంతటా వెలుగొందింది. అరియకుడి రామానుజ అయ్యంగార్‌, చెంటై వైద్యనాథ భాగవతార్‌, కాంచీపురం నాయనపిళ్రై, ముసిరి సుబ్రమణ్య అయ్యర్‌, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, పల్గాడం సంజీవరావు వంటి సుప్రసిద్ద గాయకుల కచేరీలకు నాయుడుగారు వయొలిన్‌ వాయించేవారు. ఆరొజుల్లోనే సొంతంగా కచేరీలు కూడా చేస్తుండేవారు. తరువాత, తరువాత ఇతరుల కచేరీలకు వాయించడం మానివేసి సొంత ఫిడేలు కచేరీలు మాత్రమే చేస్తూ వచ్చారు. ఇందుకు రెండు కారణాలు ముఖ్యంగా చెబుతారు.

ఒకానొక తెలుగు పండితుడు ఓర్వలేనితనంతో నాయుడుగారి విద్వత్తు పక్కవాద్యంగా తప్పసాంత కచేరీకి పనికిరాదని కరపత్రాలుచేసి పంచాడట. ఇది ఇలా వుండగా ఒకసారి అనకాపల్లిలో చిత్తూరు సుబ్రమణ్యపిళ్లై గానకచేరీకి నాయుడుగారు ఫిడేలు వాయించడానికి ఒంట్లో బాగా లేకపోయినా అంగీకరించి ఆరోజున మూడు గంటలు దాటకుండా కచేరీ ముగించవలసిందగా పిళ్లైను కోరగా ఆయన సరేనని, తీరా కచేరీలో మునిగిపోయి ఆమాట మరచి అయిదు గంటలసేపు సాగదీశాడట. దీనితో మరి జన్మలో ఎవరి కచేరీకి వాయించ కూడదని నిర్ణయించుకున్నారట. కనుక అనకాపల్లి ఆయనకు అటువంటి చివరి కచేరీ అయింది.

ఫిడేలు నాయుడుగారూ, అంతకుముందు అజ్జాడ ఆదిభట్లు నారాయణదాసుగారు వంటి ఉద్దండ పండితుల ఆధ్వర్యం లభించినందువల్ల విజయనగరం సంగీత కళాశాల ఈ రంగంలో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం వంటిది అయింది. 1919లో విజయనగరం మహారాజా “విజయనగరం గాన పాఠశాల' అనే పేరుతో ఈ విద్యాలయాన్ని నెలకొల్పారు. ఆ తరువాత దీని పేరును “మహరాజా సంగీత కళాశాల అని మార్చారు. ఈ విద్యాలయం ఏర్పాటును గురించి ఒక కథ చెబుతారు. గంగబాబు అనే ఒక గుడ్డి కుర్రవాడు మహారాజుగారి సహాయం కోసం ఆర్టించవచ్చాడట. అతని జీవితానికి ఎలా తోడ్చటమా అని మహారాజా ఆలోచిస్తుండగా అతడికి సంగీతం నేర్పించడం మంచిపని అని దివానుగారు సలహా ఇచ్చారట. వెంటనే ఈ విద్యాలయం ఏర్పాటు చేశారట.

ఇక్కడ మరొక విచిత్ర ఉదంతం జరిగింది, అప్పుడప్పుడే కచేరీలు చేసి పేరులోకాస్తున్న ఫిడేలు నాయుడుగారు ఆ విద్యాలయంలో విద్యార్థిగా చేరి ఒక సర్టిఫకేటు సంపాదించుకుంటే, ఆ తరువాత మ్యూజిక్‌ టీచరుగా చేరవచ్చునని ఆశపడి శ్రీ;రంగం సుందరనారాయణ అనే ప్రముఖ న్యాయవాది సహాయం కోరారు. ఆయన రాజుగారి దర్బారులో నాయుడుగారి కచేరీ ఏర్పాటు చేయించారు. అంటే విద్యార్థిగా చేర్చుకోడానికి ఇంటర్వ్యూలాంటిదన్నమాట. 84 సంధియుగం

ఈ కచేరీకి నారాయణదాసుగారు కూడా వచ్చారు. ఆవేళ అది విన్న మహారాజాగారు, నారాయణదాసుగారు ““విద్యార్థిగా ఎందుకు, మీరు టీచరుగానే వుండండి?” అని ఆర్హరు వేశారట. ఆవిధంగా నాయుడుగారి కాలేజీ ప్రవేశం జరిగింది. నారాయణదాసుగారి తరువాత నాయుడుగారే ప్రిన్సిపాల్‌ అయినారు. ఈ కళాశాల తీర్చిదిద్దిన సంగీత విద్వాంసులలో శ్రీపాద పినాకపాణి, వేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణ, మారెళ్ళ కేశవరావు, పద్రాయని సంగీతరావు, ధర్మపురి రామమూర్తి, కోకా సత్యవతి వంటి 'హేమాహేమీలెందరో వున్నారు సుప్రసిద్ద తమిళ వేణు విద్వాంసుడు టి.ఆర్‌.మహాలింగం రెండేళ్లపాటు విజయనగరంలో వుండి నాయుడుగారి వద్ద సంగీతం నేర్చుకొన్నారట.

ఈపైన పేర్కొన్న వారంతా మదరాసు సంగీత సంప్రదాయానికి గొప్ప దోహదం చేసినవారే. మరి వీరంతా విజయనగరం సంగీత కళాశాల విద్యార్దులు కావటం విజయనగరానికే కాక తెలుగునాడుకే గర్వకారణం. కనుక కరనాటి సంగీత వైభవ ప్రాభవాలల్‌ తెలుగుల భూమిక తమిళుల కేవిధంగానూ తీసిపోదు. కాకపోతే, కలిసి చెప్పుకోడం చేసుకొనడం మనకు చేతకాదు. అంతే.

(10.186) స్గాస్గాగ్గ జాతి సమైక్యత

దేళ స్వాతంత్ర్రంవతనే జూతి సమైక్పతకూడా నిరంతరం అ(వ్రమత్తంతో కాపాడుకోవలసినట్టిది. జాతీయ సమైక్యతా సాధనకు ఒక విధానముంటూ వదీ వుండదు. ఇది శాసనాల వ్యల్హ మాత్రమ జరిగేది కాదు. వివిధ ప్రాంతాల వర్గాల మలాల (ప్రజలు ఒకరినొకరు అమాహన చేసుకుని పరస్పుర సద్భావం పెంపొందించుకోవడం, ఉన్హుత నైతిక ప్రమాణాలను అవలంబించడం, పాలకులు విచక్షణా రహితమైన అభివృద్దీ విధానాలను ఆనునరించడం ఇందుకు అవసరం. రాజకీయ ప్పార్టీలనుబట్టి శాసనాలనుబట్టీకాక్క మన నైతికస్తాయిని బట్టి జూతీయ నమైకృత వృద్దికయాలు వుంటుంటాయి. అటువంటి ఉన్హుత నైతిక ప్రమాణాలను పెంపొందించగల నాయకత్వం మనకు కావాలి. దేళస్వాతం(త్రం జూతీయ సమైక్యత అవిభాజ్యమైైనవి.

ఇంటాబయటా 5-0-83

సంధియుగం 85

ర్రుంధ్రానాట్పు దోాఖు"

ఏదో ఒకానొక సందర్భంలో సుప్రసిద్ద సంస్కృత పండితుడు డాక్టర్‌ వి. రాఘవన్‌ “కూచిపూడి నృత్యం జానపదకళ అని అన్నారట. పలువురు తెలుగు పండితులు ఆమాటకు నొచ్చుకున్నారు. మన కళా సాహిత్యాలన్నీ తొలుత జానపదాలే. మరి ఈమాటను అంగీకరించచానికి ఏ అభిమానం అడ్డువచ్చిందో! బహుశా మనవారి అభ్యంతరం, ఆయన ఒక్క కూచిపూడి నృత్యాన్ని మాత్రమే అలా వర్గీకరించినందుకు అయివుండాలి.

మన దేళం తొలుత జనపదాల సముదాయం. ఈ జనపద సముదాయాలకు ఒకించుక ఎడంగా, అక్కడక్కడా ఆశ్రమ పదాలుఉండేవి (శ్రమజీవులకు జనపదాలు ఆవాసాలు కాగా, బుద్రిజీవులకు ఆ(శ్రమపదాలు ఆకరమైనవి. ఆనాడు మనకు నగరాలు లేవు. ఉన్నవి జనపదాలూ ఆ'శ్రమపదాలూను. ఇవికాక రాజధానులు మాద్రం ఉండేవి. రాజులు, వారి మందీ మార్చలం, వందిమాగధులు మాత్రమే రాజధానులలో ఉండేవారు. కనుక ఆనాడు నాగరికత అనేది లేదు. ఉన్నది “రాజధానీకత' మాత్రమే. అందువల్ల నేటి నాగరికత వంటిది ఆనాడు ఉండే అవకాళం లేదు. జనులు అనగా జనసామాన్యం కష్టసుఖాలలో కోపతాపాలలో, సుఖదుఃఖాలు తమలో చెలరేగిన ఉద్రేకాలను అవేశాలను కేకల్గో కేరింతల్గో గంతుల్లో వెల్లిడించేవారు. పసిపాపల కేరింతలు, ఏడుపులువంటివే అవీను. మనిషీ ఆలో చనాళక్తి పెరుగుతూ వచ్చిన కొలదీ, అతనిలో జిజ్ఞాస, పీపాస హెచ్చుతూ వచ్చిన కొలది, ఈఆట, పాటలకు ఒక అర్జాన్నీ, ఒక పద్రతినీ కల్పించటానికి అతడు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇలా ఆలోచించగలిగిన బుద్దిజీవులనే “తపస్సులు అన్నారు. ఈనాడు అటువంటి వారినే మనం ““పరిశోధకులు'” అంటున్నాము.

ఈ॥క్రమానుగత బుద్ది వికాస ప్రక్రియలో భాగంగానే, సామాన్య జనులలో తొలుత అనాలోచితంగా ప్రారంభమైన జానపద సాహిత్యం, తదితర కళలను “సంస్కృతీకరించే'! (ప్రయత్నం జరుగుతూ వచ్చింది. ఒకవైపున సాహిత్యం, మరొక వైపున ఇతర కళలు ఈ సంస్కృతీకరణ ్రక్రియకులోనై ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ సాహిత్యం మేలురకం సాహిత్యంగానూ, కళలు సునిశిత లలితకళలుగానూ పరిణామం చెందుతూ రాను రాను ఇంకింత ఆధునికతను సంతరించుకొంటూ వచ్చాయి.

భరతమునితో ప్రారంభమైన ఈ సంస్కృతీకరణ (కావాలనే సంస్కరణ అనే పదాన్ని ఉపయోగించటం లేదు), ఆయన తొలి శిష్యుడగు కోహాలుని కృషివల్ల మరికొంత ముందుకు సాగింది. నృత్త, నృత్య, నాట్య కళల విషయంలో ఇటువంటి పరిశోధన, పరిశీలన, విశ్లేషణ కృషి జరిపిన తెలుగువారిలో నందికేశ్వరుడు మొదటివాడంచారు. ధనంజయుడు. ధనికుడు, శార్‌బ్లదేవుడు. జాయహసేనాని వంటి పలువురు తెలుగు పండితులు ఈరంగంలో ఎంతో కృషి చేశారు. అయితే, ఎవరి ఆలోచనా కోణంనుంచి వారు ఈ పరిశోధన పరిశీలన సాగించారు. ఆయా కాలాలలో విజృంభించి, ప్రాబల్యం వహిస్తూ వచ్చిన వివిధ మత తెగల ప్రభావం కూడా ఈ పరిశోధకుల పరిశీలనల మీద ఉన్నది. ముఖ్యంగా వీరశైవం, వీరవైష్టవం, జైనమతం - ఈ 86 సంధియుగం

మూడు మతాలవారు నృత్త, నృత్య, నాట్య కళలను తమ తమ మత ప్రచారాలకు యుక్తియుక్తంగా విరివిగా వినియోగించుకున్నారు. అయితే, ఆయా కాలాలలో ఏయే పండితులు, ఏయే ముత (ప్రభావానికి లోనై, ఎటువంటి పరిశోధనలు జరిపినప్పటికి ఆ పరిశోధనలో భాగంగా ఎటువంటి కొత్త కొత్త బాణీలను సృష్టించినప్పటికీ మొత్తం మీద అవన్నీ చేరి మన నృత్య కళను సుసంపన్నం చేయడానికి తోడ్పడినాయి. వీరైవ ప్రభావంవల్ల శివతాండవం వంటి నృత్యకళ అభివృద్ది చెందగా, ఆ తరువాత వీరవైస్తన (ప్రాబల్యం వల్ల “రాధా-మాధవం' 'భామా-కలాపం' వంటి నూతన నర్తన కళలు రూపొంది (ప్రళస్తమైనాయి. సంస్కృతంలో ఉన్న గీత గోవిందం, తెలుగులో సిద్రేంద్రముని సృష్టించిన భామా కలాపం క్షేత్రయ్య పదాలు ఆధునిక యుగపు నాట్య కళకు గొప్ప దోహదం చేశాయి. ఇలా ఒకవైపు సంస్కృత పండితులు నృత్త, నృత్య, నాట్య కళలలో తమ తమ సమకాలీన సమాజాలకు అద్దం పట్టి చూపే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కాగా, మరొకవంక ఎందరెందరో మహనీయులు ఈ కళను ఆచరణలో ఎందరెందరో శిష్యులకు నేర్పుతూ దాని ప్రచార ప్రాచుర్యాలను పెంపొందిస్తూ వచ్చారు. ఇలా ఆచరణలో ఈనాడు ఈ కళలను శిష్య, ప్రశిష్యుల ద్వారా విస్తరింప జేస్తునవారిలో నటరాజ రామకృష్ణగారు ఒకరు. ఈయన ఈ రంగంలో తపస్సు వంటి పరిశోధన, పరిశీలనా కృషిని దాదాపు 40 గ్రంధాలలో ప్రచురించారు. వీరొకవైపున తన “నృత్య నికేతన్‌ ద్వారా తాను పరిష్కరించిన రూపంలో ' ఆంధ్ర నాట్యాన్ని'- ఆలయనృత్యాలను దేళ విదేశాల నుంచి వచ్చిన పలువురు శిష్యులకు నేర్పుతూ ఈతెలుగు నర్తన కళ ప్రాబల్య, (ప్రాభవాలను దేళదేశాలకు చాటుతున్నారు. వెంపటి. చినసత్యంగారు కూచిపూడి నృత్యకళను కూచిపూడి నుంచి మదరాసు మీదుగా వాషింగ్రన్‌, ఫ్రాన్సు నగరాల దాకా తీసుకు వెళ్ళుతున్నట్టే, నటరాజ రామకృష్ణగారు హైదరాబాదును కేంద్రంగా పెట్టుకుని, ఆంధ్రుల నాట్యకళా వైభవాన్ని దేశ విదేశాల వారికి రుచి చూపుతున్నారు. ఈవిధంగా ఈ ఇరువురు సమకాలీన ఆం(ధ్ర లలిత కళా ప్రతిభకు ప్రతీకలుగా ఉన్నారు. నటరాజరామకృష్ణ పున సృష్టించిన, లేదా పునరుద్ర్దరించిన నాట్యరీతులలో నవ జనార్దనం ఒకటికాగా 'పేరిణి శివ తాండవం' మరొకటి. జాయహసేనాని (వ్రాసిన “నృత్త రత్నావళి! గ్రంధంలో ఆ స్వతంత్ర పండితుడు చేసిన విశ్లేషణలు ఆధారంగా (శ్రీ, రామకృష్ణ ఈ తాండవాన్ని పునసృష్టించారు. అంతేకాదు చాలాకాలంగా మరుగునపడి ఉన్న '“నవజనార్దన పారిజాతం", “ఆంధ్ర నాట్యం” వంటి పలు నర్తన కళలను ఆయన తిరిగి వెలుగులోకి తీసుకొచ్చారు. సత్యభామ రాజసం మెండుగా గల రాచపుత్రిక ఆత్మవిశ్వాసం హెచ్చుగా గల మహిళ. కానీ, కాలక్రమేణా భామా కలాపంలో సత్యభామను "హాస్యం పేరిట అపహాస్యంపాలు గావించటం జరిగింది". ఇది బుద్రిపూర్వకంగా జరిగినా ఇందువల్ల సత్యభామ పాత్రకే కాక్క మహిళాలోకానికి కొంత అపచారం జరిగింది. నటరాజరామకృష్ణ తన పరిశోధన, పరిశీలనల ఫలితంగా ఈపాత్రకు ఉచితమైన, మహిళల ఆత్మాభిమానానికి (ప్రతీకకాగల '' సత్యభామ'*ను నవజనార్రనంలోపున సృష్టి చేశారు. ఇటువంటి గురు పరంపరవళ్లనే మన లలిత కళలు సజీవంగా, సముచితంగా వర్పిల్దుతూ, మన కళా ప్రాభవ, వైభవాలను ప్రపంచానికి అందించగల్లుతాయి.(ఆం(ధ్ర నాట్యాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారంగా గుర్తిస్తూ 1995 జనవరిలో జి.ఓ. జారీచేసింది.- సం.) (11.786) సంధియుగం 87

'అెంశలవారుతుండగనే తలుపుతట్టి పేపరు వేసి వెళ్తే కుర్రాడు నేటి నాగరిక జీవనంలో మేలుకొలుపు గీతిక ఆలపించే బాల హరిదాసు. అతడు పడేసివెళ్లే దినపత్రిక మడతల్లో ప్రకృత (ప్రపంచం మన ముందు సొవొత్కారిస్తుంటుంది. వార్తలూ, వింతలూ, విడ్డూరాలూ, వినోదాలూ, విషాదాలూ కలిసి ఉండే పంచామృతం వంటిది వార్తాపత్రిక. పత్రికలు చదవడంలో ఎవరి అభిరుచులు, అలవాట్లు వారివి, వ్యక్తుల, కుటుంబాల, అవసరాలను, ఆశయాలనూ బట్టి, వారు, వారు పుట్టి పెరి గిన వాతావరణాన్ని బట్టీ ఈ అభిరుచులు భిన్న విభిన్నంగా ఉంటాయి.

తనకు తెలియని సంగతులు తెలుసుకోవాలన్న తహతహ, అఆళ్ళర్యాతిరేకం, హర్షాతిశయం కల్పించే అద్భుతాలను, ఆధునిక మానవ విజయాలనుగురించి తెలుసుకో వలన్న కుతూహలం, అన్నిటినీ మించి స్వీయ వివేక వికాసాలను అనుదినం పెంపొందించుకోవాలన్న తపన. ఇవన్నీ మనందరి చేత పత్రికలను చదివిస్తాయి. క్రమేణా ఇదొక వ్యసనంగా మనలో గూడు కట్టుకొంటుంది. కాగా, ప్రజాస్వామిక స్వేచ్చా సమాజంలో ఈ భావనకు ఒక (ప్రత్యేక కారణం ఉన్నది. వార్తలను విపులంగా తెలుసుకొని తీరవలసిన ఒక ఆవశ్యకత పౌరులకు ఉన్నది. (ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయాలు (ప్రజల అభిమతం మీద ఆధారపడి ఉంటాయి. కనుక ఈ ప్రజాభిమలాన్ని వివేకపూరితమైనదిగా తీర్చి దిద్దగలిగిన శక్తి వార్తాపత్రికలకు మాత్రమే ఉంటుంది. దేశంలో ప్రభుత్వ పరంగా, సమాజపరంగా నిత్యం ఏమి జరుగుతున్నదీ, ఎలా జరుగుతున్నదీ పౌరులు తెలుసుకొనడానికి పత్రికలే సాధనం, ప్రజాస్వామ్య ప్రియులకు తమ సమాజంలో, తమ ప్రాంతంలో, తమ దేశంలో ఏమి జరుగుతున్నదో మాత్రమే తెలుసుకొంటే చాలదు. కనుక తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో దైనందిన పరిణామాలను గమనించడానికి కూడా పత్రికలు గవాక్షం వంటివి.

“పత్రికలు అని సౌలభ్యం కోసం అంటున్నాము. విస్త్రృతార్రంలో వార్తా ప్రచురణ. ప్రచార సాధనాలన్నీ ఈ నిర్వచనం క్రిందకు రావాలి. ఈనాడు ఈ సాధనాలు రెండు రకాలు. కాగితం మీద అచ్చు వేసి పంచేవాటిని ము(ద్రిత సాధనాలంటారు. దిన పత్రికలు, వార, మాస ప(త్రికలు, పుస్తకాలు వైరా ఈ వర్గంలో చేరతాయి. రెండోవర్గం ప్రసార సాధనాలు, రేడియో, టెలివిజన్‌, కెసెట్‌, విడియో, వేదికలపై మైకులలో ఉపన్యాసాలు వంటివి ఈ వర్గంలో చేరతాయి. వీటిని “ఎలక్ట్రానిక్‌ మీడియా” అని అంటున్నారు. అయితే, వీటన్నిటిలో వార్తాపత్రిక అతి పురాతనమైన, కడువిస్తారంగా ఉపయోగపడుతున్న సమాచార సాధనం. కనుక పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలవంటివి.

ప్రజాస్వామిక సమాజానికి స్వేచ్చగా వార్తలను అందియ్యగల పత్రికలు, అవళ్యసాధనాలన్న సత్యాన్ని (ప్రపంచం ఏనాడో గుర్తించింది. కాగా, గడచిన ఒకటిన్నర శతాబ్బకాలంలో వార్తాప(త్రికలను ప్రభుత్వవ్యవస్టలో “నాలుగో అంగం'గా పరిగణిస్తున్నారు. దీని వెనుక ఒక కథ ఉన్నది. ఆధునిక పార్లమెంటరీ వ్యవస్థలో అతిపురాతన మైనది అనదగిన బ్రిటిష్‌ పార్లమెంటులో మూడు వర్గాలు ఉండేవి. వీటిని “ఎస్టేట్స్‌' అనేవారు. “మతాధికారులు, 88 సంధియుగం

“సంపన్న భూస్వాములు' , *“సామౌాన్య ప్రజా ప్రతినిధులు అనేవి ఈ మూడు ప్రాతినిధ్య వర్గాలు

  • కాగా లార్డ్‌ మకాలే 1928లో ఒక రోజున పార్లమెంటులో (ప్రసంగిస్తూ ఆ సభలో పత్రికలవారు కూర్చున్న స్పానాలవైపు చూపి '' విలేకరులు కూర్చున్న ఆ గ్యాలరీ మన ప్రభుత్వ వ్యవస్థలో ఫోర్త్‌ ఎస్టేట్‌ (నాల్లవ అంగం) అయింది? అని అన్నాడట. ఆ తరువాత కార్లయిల్‌, ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ, ఎడ్మండ్‌ బర్క్‌ మొదట ఈ మాట అన్నట్టు ఉదాహరించాడు. మొత్తంమీద వారిలో ఎవరు ముందు ఈ మాట అని ఉన్నప్పటికీ నాటి నుంచీ పత్రికలకు “షార్ట్‌ ఎస్టేట్‌ అన్న బిరుదం ఫ్టీరపడింది. (క్రమేణా ప్రజాస్వామిక దేశాలన్నిటిలో ఈ మాట వాడుకలోకి వచ్చింది. అయితే అధునిక ప్రజాస్వామిక వ్యవస్థకు అనుగుణంగా, ఈ నిర్వచనంలో ఆ తరువాత కొంత మార్పు జరిగింది. నేటి (ప్రజాస్వామిక ప్రభుత్వ వ్యవప్టలో “పరిపాలనా నిర్వహణ' , “శాసన నిర్మాణం', 'న్యాయ పాలన' అనేవి మూడు ముఖ్యాంగాలు. కాగా వార్తా ప్రచురణ, (ప్రసార, ప్రచార సాధనాలు ' నాలుగో అంగం'గా రూఢి అయినాయి. ఈ ఉదంతం ప్రజాస్వామ్యంలో పత్రికల ప్రాముఖ్యాన్ని స్పష్టపరుస్తున్నది. మహాభారత రచనాకాలం నాటికే మన దేళంలో మన వారు వార్తవిలువను గుర్తించినట్టు దాఖలాలు వున్నాయి. అయితే పత్రికల (ప్రచురణ అనేది మనకు పాశ్చాత్య ప్రపంచం నుంచి సంక్రమించిన ఒక కొత్త సంప్రదాయం. 17వ శతాబ్దంలో అప్పటి పరాయి పాలకులు, తమ అవసరం కొద్దీ '“గవర్నమెంట్‌ గెజిట్‌, "మద్రాసు గెజొటో, 'కూరియర్‌'' వంటి పత్రికలను శాలుదొలుత ప్రచురించారు. ఆ తరువాత మన దేశంలో క్రైస్తవ మత (ప్రచారం చేయడానికి వచ్చిన పాశ్చాత్య మిషనరీలు తమ ప్రచారోద్యమ సాధనాలుగా దేళంలో అక్కడక్కడా తమ సాంత పత్రికలు కొన్ని పెట్టుకొన్నారు. మన దేళంలో పత్రికా ప్రచురణ ఆ విధంగా ప్రారంభమైంది. 1836లో 'స్పెక్షేటర్‌', 1860లో “మెడ్రాస్‌ టైమ్స్‌”, 1867లో “మెయిల్‌ వంటి ఇంగ్రీషు దిన పత్రికలు, మదరాసులో వెలిశాయి. తొలుత కొన్నాళ్ళు, వారానికి మూడుసార్లు వెలువడుతూ వచ్చిన “హిందూ” 1889లో దినపత్రికగా రూపొందింది. మన దేశీయులు మన కోసం (ప్రారంభించిన మొదటి పత్రికలలో ఈ పత్రిక ముఖ్యమైనది. బ్రిటిష్‌ పాలకులూ, క్రైస్తవ మత ప్రచారకులూ ఇలా దారిచూషగా, దేశంలో పలువురు సంఘసంస్కర్తలు కొన్ని వారు మాస పత్రికలను తమ ఉద్యమాలకు సాధనాలుగా (ప్రారంభించారు. అటు పిమ్మట జాతీయోద్యమ వ్యాప్తీతో పలువురు జాతీయ నాయకులు స్వాతంత్ర్య ఉద్యమ విస్తరణ, ప్రచారాలకోసం పత్రికల (ప్రచురణకు పూనుకొన్నారు. దేశంలో ఇలా ప్రారంభమైన పత్రికా ప్రచురణశకంలో ఈ శతాబ్ది ప్రారంభంలో ఒక పెద్ద మలుపు వచ్చింది. దేశం అంతటికీ వర్తించే ఈ మాట తెలుగు జర్నలిజానికి కూడా వర్తిస్తుంది. తెలుగులో వెలువడిన తాలి పత్రిక ఏది, అన్న విషయంపై చాల మీమాంస జరిగింది. విష్ణుభొట్ట సూర్యనారాయణగారి వంటి కొందరు పరిశోధకులేమో బళ్లారి క్రైస్తవ మత ప్రచారకులు ప్రారంభించిన 'సత్యదూత' మొదటి తెలుగు పత్రిక అని అభి[ప్రాయపడ్డారు. కాగా, ఆరుద్రగారి వంటి మరి కొందరు ఇదికాదంటున్నారు. మత ప్రచురణలను వదలివేసి, మనకోసం మన వారు పెట్టిన ప త్రికలనే తీసుకొన్నట్టైతే ఈ వివాద ప్రసక్తి ఉండదు. అటువంటి మన పత్రికలలో 1840లో నుండిగల వెంకట్రామ శాస్త్రిగారి సంపాదకత్వాన వెలువడిన 'వృత్తాంతి, 1842లో పువ్వాడ వెంక బ్రావుగారి సంపాదకత్వాన, సయ్యద్‌ రహ్మతుల్హా సాహెబ్‌ (ప్రచురించిన * వర్తమాన తరంగిణి, తాలి ప్రచురణలనవచ్చు. సంధియుగం 89 7

ఆతరువాత, 1862లో “'హితవాది", 1863లో '(శ్ర,యక్షిణి”, 1864లో 'తత్వబోధిని" వంటి పత్రికలు వెలువడినవి. 1871లో కొక్కొండ వెంకట రత్నం పంతులుగారి ' ఆంధ్రభాషా సంజీవని", 1874లో వీరేశలింగం పంతులుగారి ' వివేక వర్టని వెలువడినవి. వీటిలో ఎక్కువ భాగం ఆట్టే కాలం నడువలేదు. కాని, 1885లో ఆవుల చిన పార్టసారధి నాయుడుగారు (ప్రారంభించిన ' ఆం(ధ్రప్రకాశిక' మాత్రం దాదాపు పాతిక్షేళ్లప్తాటు నిరాఘాటంగా నడిచింది.

ఇలా ప్రారంభమైన తెలుగు పత్రికలళకంలో ఈ శతాబ్బారంభంలో మరో పెద్దమలుపు వచ్చింది. 1902లో ప్రారంభించిన "కృష్ణాపత్రిక వందేమాతరం ఉద్యమానికి గొప్పగా తోడ్పడింది. ఆ తరువాత అయిదు సంవత్సరాలకు అంటే 1907లో “స్వరాజ్‌ పత్రికను గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు నడిపారు. దాదాపు అదే కాలంలో దేశోద్దారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు బొంబాయిలో *"ఆం(ధ్రప(త్రిక'ను వార పత్రికగా ప్రారంభించి, హోమ్‌రూల్‌ ఉద్యమం ఉధృతమయ్యే నాటికి దానిని మదరాసుకు మార్చి 1914లో దినపత్రికగా రూపొందించారు. మొదటి (ప్రపంచ యుద్దం కూడా అప్పట్లోనే (ప్రారంభమైంది. కృష్ణా పత్రిక, ఆం(్రపద్రిక (దిన పత్రిక) అవతరణతో తెలుగు పత్రికా రంగం ఒకరూపినికి వచ్చింది. కాం(గ్రు పార్టీకి గాంధీజీ నాయకత్వం 1915 నుంచి లభించింది. అప్పటి నుంచి స్వాతంత్రోద్యమం ఒక కొత్త ఊపును ఆందుకొన్నది. ఇది పత్రికల వృద్దికి కూడా తోడ్పడింది. కాంగ్రమ్‌లో గాంధీళకం ప్రారంభమైన తరువాత *' బ్రిటిష్‌ ప్రభుత్వపు తీవ్ర దృష్టికి గురి ఆయిన ఎనమండుగురు సంపాదకులను కారాగారానికి సమర్పించిన మద్దూరి అన్నవ్యూర్ణయ్యగారి “కాంగ్‌! పత్రిక ఆంధ్రపత్రికా ప్రపంచంలో చిరకీర్తి గడిచింది”.

తెలుగు జర్నలిజానికి సుద్సీర్హమైన చరిత్ర ఉన్నదని చెప్పుకొనడాన్దైతే 'సత్యదూత' అంతకు ముందు ప్రభుత్వం ప్రచురించినగెజొట్టు వంటి వాటిని చెప్పుకొని తృప్తిపడవచ్చు. 19వ శతాబ్దం చివరి వరకు పుట్టిగిట్టిన రకరకాల పత్రికలు తెలుగు జర్నలిజం చరిత్రకు ఒక రకమైన ఆనవాళ్ళు మాత్రమే. నిజానికి పార్తసారథి నాయుడుగారి ' ఆం(ధ్ర ప్రకాశిక ప్రచురణతో తెలుగు జర్నలిజం ప్రారంభమైనదనవచ్చు. అలానే బొంబాయి నుంచి ఆంధ్రపత్రిక మదరాసుకు మౌరడంతో తెలుగుదిన పత్రికల చరిత్ర మొదలయింది. అప్పటి నుంచే తెలుగు జర్నలిజం రూపు కట్టింది. జాతీయ కాంగ్రక్‌లో గాంధీజీ నాయకత్వపు (ప్రాబల్యం హెచ్చిన తరువాత పత్రికలు నడిపే వారి పని కొంత సుకరమైంది. అందువల్లనే కావచ్చు. 1930ల తరువాత పత్రికల సంఖ్య (క్రమంగా పెరుగుతూ వచ్చింది.

వెంకట రామానాయుడుగారి జమీన్‌ రైతు (1930), ఆచార్య రంగాగారి వాహిని (1935), తాపీ ధర్మారావుగారి జనవాణి (1936), ఆంధ్రప్రభ(1938) వంటి వార్తాపత్రికలు, భారతి, జయంతి, ఉదయిని, అభ్యుదయ వంటి సారస్వత పత్రికలు, గృహలక్ష్మి, ఆంధ్ర మహిళ వంటి స్త్రీల పత్రికలు, రూపవాణి, నాట్యకళ్ళ “సీనిమా” వంటి కళల పత్రికలు - వరుసగా ఆ రోజుల్లో వచ్చాయి. అలాగే, విశాలాంధ్రవాణి, గోల్కాండ పత్రిక ప్రవాసి దక్షిణాంధ్ర పత్రిక సాధన వంటి పత్రికలు కూడా అప్పట్లో ప్రారంభమైనాయి. ఈ పత్రికలు వచ్చే నాటికి పూర్వపు పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. ఈ శతాబ్బారంభంలో స్వాతంత్రోద్యమం తాలి రోజుల్లో తమ అధికారాన్ని దేశీయులు సవాలు చేస్తున్నారన్న భావం (బ్రిటిష్‌ వారిలో భయ, క్రోధాలను (ప్రజ్వరిల్ల జేసింది. అందువల్లనే (ప్రభుత్వానికి వ్యతిరేకంగా పల్లెత్తు మాటన్నా భరించలేని అసహనం వాళ్ళలలో చెలరేగింది. క్రమేపీ ఈ క్రోధం తగ్గుతూ, రవంత సహనం కనుపించింది. 90 సంధియుగం

అమెరికాలో స్వాతం[త్ర్య సమరం జరుగుతున్న కాలంలో పత్రికా స్వాతంత్ర్యం కోసం (బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని వీరోచితంగా ఎదిరించి పోరాడిన పీటర్‌ జంగర్‌ (1733) ఉదంతాన్ని సందర్భం వచ్చినపుడెల్లా అమెరికన్లు సగర్వంగా చెప్పుకుంటుంటారు. విచిత్రమేమిటంటే మనంకూడా మన వ్యాసాలలో, ఉపన్యాసాలలో పీటర్‌ జంగర్‌ ఉదంతాన్నే ఉదాహరిస్తుంచాము. కాని, అంతకు ఏమాత్రం తీసి పోని, ఒక విధంగా అంతకంటే ఎక్కువ ధైర్య సాహసాలు ప్రదర్శించిన తెలుగు జర్నలిస్టు గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారి వీరోచిత పోరాటం గురించి మనలో చాలా మందికి తెలియదు. ఆయనను ఎరిగిన వారిలో కూడా పలువురు 'గ్రంధాలయోద్యమపితామహుడుగానే ఆయనను ఎరుగుదురు. 1907లో ఆయన నడిపిన “స్వరాజ్‌ పత్రికలో నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రంగా (వ్రాసినందుకు (ప్రభుత్వం ఆయనకు మూడేళ్లు కఠిన శిక్ష విధించి, జైలులో చెప్పరాని బాధలు పెట్టింది. పీటర్‌ జంగర్‌ తెల్లవాడు గనుక ఆయన మీద ప్రభుత్వంకేసు పెట్టినా, కోర్టులో ఆయననెగ్గాడు. మరి మన హరి సర్వోత్తమరావు నల్లవాడు గనుక కేసు పెట్టినవారూ, విచారించేవారూ తెల్లవారే గనుక ఆ పాలకుల అహం మీద దెబ్బకొట్టిన హరి సర్వోత్తమరావు గారిని కసిగా శిశంచారు. అలాగే 1920-30 మధ్యకాలంలో మద్దూరి అన్నప్యూర్ణయ్య, మద్దూరి శివరామ కృష్ణయ్య, కాం(డ్రేగుల రామచంద్రరావు, ద్రోణంరాజు చిన కామేశ్వరరావు, క్రొవ్విడి లింగరాజు, రామచం ద్రుని వెంకటప్పగార్ల వంటి నాయకులు “కాంగ్రెస్‌ పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా *“చిచ్చుల పిడుగు”, “వీరబలి' వంటి వ్యాసాలు ఎన్నో ప్రచురించి ఒకరి తరువాత ఒకరు వరుసగా ఏడుగురు ఈ పత్రిక సంపాదకులు సంవత్సరం మొదలు మూడు సంవత్సరాల వరకు కఠిన శిక్షలకు గురైనారు. వీరంతా నేటి మన తెలుగు జర్నలిస్టులకు ఆద్యులు, ఆరాధ్యులు, ఆదర్శ మార్గ దర్శకులు, కాని, ఈ నాడు మనలో ఎంత మందికి వీరిపేర్సు తెలుసు? అసలు వీరు జర్నలిస్టులని మరెందరికి తెలుసు?

తెలుగు జర్నలిజాన్ని మూడు దళలుగా విభజించవచ్చు. అచ్చమైన గ్రాంధిక భాషలో, అంతంత మాత్రాన కొరుకుడు పడని కరిన గద్య పద్య భూయిప్టమైన గ్రాంధిక భాషతో(ప్రారంభమైన పత్రికలు తొలి దళకు చెందినవి. తొలుత పత్రికలు పెట్టినవారు పండితులు, సాంఘికసంస్కరణ, రాజకీయ ఉద్యమాల నాయకులు కావడం ఇందుకు కారణం. కృష్ణా పత్రిక, ఆం(ధ్రపత్రిక, ఇంకా అంతకు ముందు నడిచిన తెలుగుపత్రికలూ ఈ కోవకు చెందుతాయి. కాగా స్వాతంత్రోద్యమం ఒక వైపు ముమ్మరమవుతూ వచ్చింది. మరో వైపు గిడుగురామమూర్తి పంతులుగారి వ్యావహరిక భాషా ఉద్యమం - వీటి (ప్రభావం క్రమేపి పత్రికల మీద ప్రసరించింది. వేమన ఏనాడో సరళమైన జన భాషను తన కవితలో ఉపయోగించినా, (క్రిందటి శతాబ్దిలోనే సి.పి. బ్రౌన్‌ వంటి వారు సుగమమైన తెలుగు భాషకోసం ప్రయత్నించినా, 1936లో తాపీ ధర్మారావు గారి 'జనవాణి'తో గాని వ్యావహారిక భాషను పత్రికలు పనిగట్టుకొని ఉపయోగించడం (ప్రారంభంకాలేదు.

ఆ తరువాత 1938లో ప్రారంభమైన ఆం(ధ్రప్రభకు తొలి సంపాదకుడు ఖాసా సుబ్బారావు గారు ప్రధానంగా ఇంగ్రీషు జర్నలిస్టు. ఆయన తరువాత ఆ పత్రిక సంపాదకత్వం వహించిన న్యాయపతి నారాయణ మూర్తిగారు తన *పాన్‌- సుపారి' కాలంలో సరళవ్యావహారికం (వ్రాఫేవారు. కాని వారి సంపాదకీయాలలో గ్రాంధికమే ఎక్కువగా ఉండేది. ఆ తరువాత ఆ పత్రిక సంపాదకత్వం చేపట్టిన (శ్రీ;నార్ల 1936లో ధర్మారావుగారు ప్రారంభించిన పత్రికల్లో వ్యావహారిక సంధియుగం గ!

భాషా ఉద్యమానికి ఫ్టిరమైన పునాదులు వేసి తనదైన ఒక తెలుగు పత్రికా భాష్టూలిని రూపొందించారు. అప్పటి నుంచి, ఆ తరువాత పుంఖాను పుంఖాలుగా వచ్చిన తెలుగు పత్రికలన్నీ ఆ శ్రైలినే అనుసరించాయి. ఆ తర్వాత 1960లో తన సంపాదకత్వంలో [ప్రారంభమైన ఆం(ధ్రజ్యోతిని కూడా ,శ్రీ/ నార్హ ఇంచుమించుగా అదే ఒరవడిలో కొనసాగించారు. పిమ్మట 1974లో వచ్చిన కొత్త దినపత్రిక ఈనాడు", అప్పటి వరకు అన్ని తెలుగు పత్రికలూ అనుసరిస్తున్న ఆంధ్రప్రభ- ఆంధ్రజ్యోతి సంప్రదాయాన్ని అనుసరించక తన దైన ఒక సరికొత్త శైలిని శీర్షికలలోనూ, వార్తల రచనలోనూ సృష్టించు కొన్నది. దాని తరువాత ఉదయించిన “ఉదయం పత్రిక కూడా *ఈనాడు' శైలినే అనుసరిస్తున్నది. సూలంగా ఈ మూడు సంప్రదాయాలను (1) గ్రాంధిక భాషాళకం. (2) వ్యావహారిక భాషా ళకం. (3) జన భాషా శకం అని వర్గీకరించ వచ్చు. గ్రాంధిక భాషను అన్ని పత్రికలూ వదిలివేశాయి. ఆం(ధ్ర పత్రిక భారతి సైతం ఆ తరువాతి కాలంలో వ్యావహారిక భాష్తా వర్గంలో చేరిపోయాయి. అయినా ఈ వ్యావహారిక భాషా శైలికి నిజమైన ప్రతినిధిగా ఆం(ధ్రజ్యోతిని పేర్కొనవచ్చు. గ్రాంధిక భాషా పత్రికల శకం దాదాపు అంతరించినట్టే. "ఈనాడు''ఉదయం' తప్పు మిగతా పెద్ద చిన్న పత్రికలన్నీ 'ఆం(ధ్రజ్యోతితైలి'నే అనుసరిస్తున్నాయి. ముందు ముందు మరేదైనా కొత్త శైలి వస్తుందా? ఈ రెండు పద్దతులలో ఏదైనా ఒకటిరెండవ దానిని (మంగి వేస్తుందా? ఈ ప్రశ్నలకు కాలమే జవాబులివ్వాలి. (1985 జూలై) న్లాన్గాన్గు దీపంలేని ఇల్లు ““వ(్రికలవారికి వారిలోవారిమధ్య ఎన్లి వైమనస్యాలున్నా, విధాన విభేదాలున్నా, వాటిని పక్కకుపెట్టి పతిక్రా స్వాతంధత్యాన్లి పదిలపరుచుకోవడానికి సమైక్యంగా ఉద్యమించాలి తమ హక్కులను (ప్రజలవాణీని (ప్రతిబింబించగల తమ స్వేచ్చను. పదిలపరచుకొనడానికి సమైక్యతను (ప్రదర్శించాలి. ఇది ప(్రికా యజమానులకు ఎడిట్టుర్టకు వొ(త్రమే. పరిమితమైన సమస్య కాదు. ఈ వృత్తిలోని వారందరికీ (పాణవ్రదమైన సమస్య ఇది. పత్రికా స్వాతంత్ర్రంలేని (ప్రజాస్వామ్యం దీపంలేని ఇల్లు వంటిది. ఇతరులందరి హక్కులు అశ్రతిహతమైనవి ప(త్రికల హక్కులు మా(్రమ (పతిహతమైనవన్హు వాదాన్ని (ప్రబలనీయరాదు. చట్టుసభల హక్కులు ఎంత పవి(తమైనవో వ(్రికల హక్కులూ అంత పవిత్రమైనవే. అందరి హక్కులను న్యాయసానం సమన్సయపరిచేలాగ ఈ వివాదాన్లి పరిష్క రించుకోవాలి. ఇంటాబయటా 4-౮-84 92 సంధియుగం

వువనుక-నుట్లరి ఆయన ఈ +ళాబ్లి తొలి తెలుగు పత్రికా సంపాదకుడు, ఈ శతాబ్దపు తొలితరం తెలుగు జాతీయ మహానాయకులలో ముఖ్యుడాయన. తెలుగు సాహితీ లోకానికి, పాఠకలోకానికి వంగ సాహిత్యాన్ని, లలిత కళలను పరిచయం చేసిన తాలి తెలుగు పండితుడాయన. ఒక్క మాటలో, గోపాలరెడ్డిగారి మాటల్లో "ఈ శతాబ్ది తొలి తెలుగు పెద్ద ముట్నూరి కృష్ణారావు గారు”

ప్రాంతీయ పత్రికగా ఆవిర్భవించి జాతీయపత్రికగా గుర్తింపు, మన్నన పొందిన పత్రిక “కృష్ణా పత్రిక. ' వందేమాతరం” ఉద్యమౌన్ని తెలుగునాట-కాదు- దక్షిణ భారతావని అంతచా విశేషంగా ప్రచారంచేసి ప్రజానీకాన్ని జాతీయ స్వాతంత్ర్య ఉద్యమోన్ముఖులను చేసిన మహానాయకుడాయన. దేశ స్వాతం త్ర్య సమరంలో నిర్భీకంగా పాల్గొని, కారాగారవాస కాలంలో తోటి రాజకీయ బందీలకు తెలుగు, సంస్కృత మహాకావ్యాలను ఆంగ్రంలో అనర్గళంగా బోధించిన అధ్యాపకుడాయన.

ఆయన సంపాదకత్వం తెలుగు జర్నలిజానికి, ఆధునిక జర్నలిజానికి ఒరవడి దిద్రింది. ఆయన రాజకీయ విమర్శ తెలుగు ప్రజలను ఉత్తేజపరిచింది. ఆయన సంపాదకీయ రచనలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ఇలా మూడు గొప్ప లక్షణాలు ముప్పిరిగొని, మూర్తీభవించిన ప్రజ్ఞాశాలి ముట్నూరి కృష్ణారావుగారు.

కృష్ణా పత్రికను ముట్నూరి కృష్ణారావుగారు ప్రారంభించలేదు. పలువురు ఈ తరంవారు అనుకుంటున్నట్టు ఆ పత్రిక 'పేరు కృష్ణారావుగారి పేరునుబట్టి వచ్చినట్టిది కాదు. ఈ శతాబ్టి ఆరంభంనాటికి ఇప్పటి గుంటూరు జిల్లా లేదు. ఈ ప్రాంతం కూడా కృష్ణామండలంలో ఒక భాగంగా వుండేది. అందువల్ల ఈ ప్రాంతం అంతటికీ బందరు ముఖ్యపట్టణం.

ఆ రోజులలో కృష్ణామండల మహాసభ అంటూ ఒక సమాజం వుండేది. ఆ సమాజం తరపున దేళభక్త కొండా వెంకటప్పయ్యగారు, దాసు నారాయణరావుగారు (ఈ ఉభయులు బందరులో న్యాయవాద వృత్తిలో వుండేవారు) కలిసి “కృష్ణాపత్రికును 1902 ఫిబ్రవరిలో (ప్రారంభించారు. కృష్ణామండలం, కృష్ణానది ప్రాముఖ్యాన్ని సూచించేదిగా వుండాలని “కృష్ణాపత్రిక అని దానికి పేరు పెట్టారు.

ఇలా వుండగా, 1903లో దాసు నారాయణరావు గారు మరణించారు. 1904లో కృష్ణా మండలాన్ని విభజించి కృష్ణానదికి అద్దరిని వున్న ప్రాంతాన్ని కృష్ణాజిల్దాగానూ, ఇద్దరిని వున్న (ప్రదేశాన్ని గుంటూరు జిల్లాగాను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా, గుంటూరులో జిల్లా కోర్టులు ఏర్పడినందున కొండా వెంకటప్పయ్యగారు తమ స్వస్థలమైన గుంటూరులో తమ ప్రాంత కొత్త జిల్లాలో న్యాయవాద వృత్తి కొనసాగించాలన్న సంకల్పంతో గుంటూరుకు తరలి వెళ్ళారు.

ఈ పరిణామాల ఫలితంగా కృష్ణా ప త్రిక సారథ్యం అప్పటివరకు ఆ పత్రికలో ఒక సహాయ సంపాదకులుగా వున్న ముట్నూరివారికి దఖలు పడింది. ఈ మార్చు వల్ల ఆ పత్రికకు ఎంతో సంధియుగం 93

లాభించింది. మహాపండితుడు, భయమెరుగని దేశభక్తుడు ఆగు కృష్ణారావుగారి సంపాదకత్వం (ప్రారంభమైంది.

దానితో ఆ పత్రిక ప్రభ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆ రోజులలో అటు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి 'స్వరాజ్‌ పత్రిక, ఇటు ముట్నూరివారి కృష్ణా పత్రిక బ్రిటిష్‌వారి దౌమ్టైలను వారి తొత్తుల దుర్నీతిని నిర్చీకంగా తెగవాడుతూ ఉండేవి.

కృష్ణాపత్రిక కార్యాలయం ఒక జర్నలిజం కొలువు కూటంగా విరాజిల్దుతుండేది. ముట్నూరివారి చుట్టూ నిత్యము పది, పదిహేను మందికి తక్కువ కాకుండా కొలువుదీరి దేళ వ్యవహారాలను, సాహిత్య సమస్యలను చర్చిస్తుండేవారు. ఆయా చర్చల సారాంశాన్ని కృష్ణారావుగారు సంపాదకీయం ద్వారానో, లేదా వారి “కబుర్ల ద్వారానో నిశితంగా విశేషించి (వ్రాస్తూ వుండేవారు. ఆ విధంగా భావి తెలుగు పత్రికా సంపాదకులకు ఆయన ఒరవళ్ళు పెడుతూ మార్గదర్శి అయినారు. పేరుకు చిన్న పత్రికే అయినా, అందలి విమర్శల వేడిమి బందరు నుంచి లండన్‌ దాకా (ప్రసరించి ప్రభుత్వ నిర్వాహకులలో సంచలనం, సంభ్రమాళ్చ్ళర్యాలు కలిగిస్తుండేది.

ముట్నూరివారి మీద బెంగాలి సాహిత్య, లలిత కళల ప్రభావం ఆ తాలి రోజులలో విశేషంగా వుండేది. అందువల్లనే కృష్ణా పత్రిక ఆంధ్ర, వంగ సాహితీ (్రష్టలకు, లలితకళాకారులకు మధ్య సేతువుగా పని చేసింది. బెంగాలీ రచనలను, చిత్రలేఖనాలను తెలుగు వారికి పరిచయం గావించిన తాలి తెలుగు పండితుడు, విమర్శకుడు అన్న ఖ్యాతి ముట్నూరివారికి దక్కింది. ఆయన [క్రమేణా వంగ (ప్రభావం నుంచి పూర్తి తెలుగుతనానికి మౌరుతూ వచ్చారని కొందరు పరిశీలకులంచారు. ఏమైనా తన తెలుగు కుదురును చెరుపుకోకుండా అన్య పాహిత్యాదికళల సొగసులను ఆకళింపు చేసుకొని తన పాండిత్యాన్ని విస్ప్రతపరచుకున్న ఆధునిక పండితుడాయన.

తన పత్రికలో పరాయి ప్రభుత్వ దుశ్చేష్టలను తీ(వ్రంగా ఖండించి వారి దండనలకు గురై కారాగారాలకు వెళ్ళి, అక్కడ సైతం చేతులు ముడుచుకుని కూర్చొనక తోటి రాజకీయ బందీలకు అభిజ్ఞాన శాకుంతలం వంటి కాళిదాసు కృతులు మొదలు తెలుగు కావ్యాలనేకం కరతలా మలకంగా బోధించిన చెరసాల అధ్యాపకులు ముట్నూరివారు. తెలుగు, సంస్కృత భాషలతోపాటు ఆంగ్రంలోను మంచి పండితులైన కృష్ణారావుగారు అక్కడి వారి సౌకర్యం కోసమని ఈ సాహిత్య పాఠాలు ఇంగ్రీషులో చెప్పేవారట.

ముట్నూరివారి సాహిత్య కృషిలో అత్యధిక భాగం వారి సంపాదకీయాల ద్వారానే జరిగింది. వారి కార్యాలయంలో నిత్యం జరగే కొలువుకూటాలలో రాజకీయాలేకాక, సాహిత్యం గురించి కూడా చర్చలు సాగేవి. ఇతరులచేత చదివిస్తూ, వింటూ వాటిపై వ్యాఖ్యలు (వ్రాయడం ఆయనకు అలవాటు.

అయితే, ముట్నూరివారు గ్రంథ పరిచయాల వంటివి ఎప్పుడు ఎన్ని వ్రాశారో తెలియదు. కాని, ఇటీవల అటువంటి దొకటి నా కంటపడింది. రవీంద్రుని “కౌమార దళలో రచించిని' రెండు నాటకాలు “కచ దేవయాని”, * చిత్రాంగద' లను గోపాలరెడ్డిగారు తెలుగులోకి నాలుగు దశాబ్దాలకు పూర్వం అనువదించారు. వారి తొలి సాహిత్య అనువాద కృషి అదే. ఆయన ఈ తెలుగు సేతలను ముట్నూరివారికి పంపగా, వారి ఒకనాటి కొలువులో చదివించి, విని, ఆ రెండు నాటికలకు *““పరిచయ వాక్యములు” వ్రాశారు. అందలి భాష్క భావరురి అద్భుతమైనవి. 94 సంధియుగం

ఆ పరిచయ వాక్యాలలో వారి భాషా పరిజ్ఞానం భారతీయ సంస్కృతీ సంప్యూర్ణ ఆవగాహన అశ్షరక్షరాన ప్రత్యతమవుతుంచాయి. ““ఏ వినీలాకాళ గర్భమునుంచి, ఏ యుగారంభ సంరంభమున, భారత పరిజ్ఞానామృతం అవనికి ది గివచ్చెనో ఎవరు చెప్పగలరు?” అని అంటూ ప్రారంభించి, “భారత విజ్ఞాన మహాతరంగిణి జాహ్నని వలె హిమాలయోత్తుంగ శృంగముల నుండి దుమికి, సాంద్రారణ్యముల విబిడచ్భాయల వి'శ్రమించుచు, మూనవ లోకమునందు ప్రవహించి, మానవుని కల్యాణగుణములను మూర్తీ భవింపచేసుకొనిన అవతారపురుషుల లీలా విలాసములను _ బ్రతిఫలింపచేయ, పురాణేతిహాసములజిత్రించిరి” అని వివరిస్తారు కృష్ణారావుగారు.

ఈ జ్ఞానోద్దారకులలో ముఖ్యంగా మువ్వురు మనీషులు నవ్యభారత భాగ్యోదయమునకు త్రిమూర్తులా యమనట్టుద్భవించిరి. (శ్రీ అరవిందయోగేంద్రుడు, (శ్రీ,కరమ్‌ చంద్‌ మోహన్‌దాస్‌ గాంధి, శ్రీ, రవీంద్ర నాథ కవిచంద్రుడు'” అని అంటూ కృష్ణారావుగారు ఈ ముగ్గురు మహా పురుషులయెడ తమకుగల గురుభావమును ఎంతో కమనీయంగా వర్ణించారు.

“కచదేవయాని*, “చిత్రాంగద నాటికలు "' రవీంద్రుని కౌమార దళలో రచించినవి. వసంతరుతు సమాగమమున, యౌవన విలాస సంపదలొక్కుమ్మడి ఎట్టు విజృంభించి, ఉన్మత్తత కల్లించునో, అట్టి 'కైపేగిరి' ఈ నాటికలు కల్లించును ... అయ్యది భావోన్మాద (క్రీడలో రసావేశావస్ట యందలి చిద్విలాసము భూమిని, స్వర్గసీమను ఐక్యపరచి మానవుని దేవ పీఠమున ఆసీనుని చేయగల సాధనా మహిమ అది" అని వాటి రచనా కాలమున రవికవి మానసిక ఫ్రితిని వర్ణిస్తూ, “రవీంద్రుని రచనామృతమును గ్రోలగల్లిన ఇశ్రీ,మంతులు ఆనందభోగులు కాకుండ నెట్టుండగలరు??' అని చివరలో ఒక చెణుకు విసిరారు, ఎంత చక్కని భాషు పాంతచి చిక్కని భావగరిమ! ముట్నూరి కృష్ణారావుగారి పాండిత్యానికి, మానవతత్వ పరిజ్ఞానానికి, భారతీయ సంస్కృతీ అవగాహనకు ఈ పరిచయ వాక్యాలు మచ్చుతునకలు.

ముట్నూరి వారు ముమ్మూర్తులా ఈ శతాబ్దపు తొలి తెలుగు పెద్ద, దాదాపు నాలుగు దశాబ్దాలపాటు కృష్ణాపత్రిక ద్వారా మన సంస్కృతి, సాహిత్యాలకు మన జాతీయ జీవనపు పునరుజ్జీవనానికి అపారమైన సేవ చేసిన మహామనీషి

(20.6.86) న్గాన్గున్లా సంధియుగం 95

తలనంచద-౨ింతామలో

1886 ఏట్రల్‌ 10నాడు ఉగాది పండగ వచ్చింది. ఆనాడు ఉత్తరాం(ధ్రలో ఒకానొక బాలకుడు జన్మించాడు. ఉత్తరోత్తరా అతడు ఉత్తరాది తరలివెళ్ళి యావత్‌ భారతావనినే ఉత్తేజితం గావించనున్నాడని అతను పుట్టిననాడు ఆ ఊరివారెవరూ ఊహించి ఉండరు. కాని అలా జరిగింది. అదొక రసవత్తరమైన గాధ. ఆం(ధ్రులంతా గర్వించదగిన గాథ.

పూవు పుట్టగానే పరిమళిస్తుంది. విజయనగరంలో ఆ సంవత్సరంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆ బాలకుడు కళాశాల చదువులలో వుండగానే తనలో అంతర్గతమైవున్న ప్రతిభను ప్రదర్శించడం ప్రారంభించాడు. ఆ చిన్నవయసులోనే (ప్రగాఢమైన వ్యవహారాల అవాహనను చేసుకొన్నాడు. నాటి మన ఏలికలగు బబ్రిటీషువారి రాజకీయ వ్యవప్రను అప్పటికే పూర్తిగా అర్ధం చేసుకొని ఆ చిన్నప్రాయంలోనే రాజకీయ వ్యాఖ్యలూ, వ్యాసాలూ నాటి స్టానిక పత్రికలకు పంపుతుండేవాడు. అప్పటికింకా అతని వయసు పట్టుమని పదేహారేళ్ళు నిండలేదు. అప్పటికే మ(ద్రాసునుంచి వచ్చే ఆంగ్ర దినపట్రికలను, ఇతర పత్రికలను బీరుపోకుండా చదువుతుండేవాడు. చదువుకొంటున్నది ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరమే అయినా చక్కని ఇంగ్రీషు భాషలో పత్రికలకు వ్యాసాలు వ్రాస్తుండేవాడు. ఆవిధంగా ఆయనలోని రచయిత అప్పటికే రూపుదిద్దుకొనడం వల్ల ఆయన చదువుకి అంతరాయం కలిగింది.

ఆరోజుల్లో వైజాగ్‌ స్పెక్టేటర్‌, తెలుగు హార్చ్‌ అనే రెండు పత్రికలు విశాఖపట్నం నుంచి వెలువడుతుండేవి. ఆ రెండు పత్రికలకు ఆయన (వ్రాస్తుండేవాడు. ఆయన (వ్రాతలను చూచి మెచ్చుకున్న స్పెక్టేటర్‌ ప్రచురణకర్తలు ఆయువకుని తమ పత్రికకు సంపాదకునిగా నియమించారు. అలా ప్రారంభమైంది చిర్రావూరి యజ్జేశ్వర చింతామణి గారి జర్నలిస్టు జీవితం. కొంతకాలంపాటు 'స్పెక్తేటర్‌' "హెరాళ్లో వంటి రెండు మూడు చిన్న పత్రికలు స్వయంగా నడిపి చేతులు కాల్చుకున్న తరువాత మదరాసు వెళ్ళి మద్రాస్‌ మెయిల్‌ పత్రికలో చేరాడు. కాని కొద్దిరోజులకే తనను (శద్దాసక్తులు లేని చేతగాని సబ్‌ ఎడిటర్‌ అంటూ మదరాసు వారు చిన్నచూపు చూస్తున్నట్టు గ్రహించాడు. అంతే ఆయన మదరాసు నగరాన్నే కాదు దక్షిణ భారతావనినే విడిచి ఉత్తరాదికి తరలి వెళ్ళాడు. ఆనాటి యు.పి. (సంయుక్త పరగణాలు) రా(్టైనికి రాజధానిగావున్న అలహాబాదు నగరానికి చేరుకున్నాడు.

ఆనగరంలో అడుగుపెడుతూనే దానిచేత ఆకర్షితుడైనాడు. అది మొదలు యావజ్జీవితం ఆ నగరాన్నే ఫ్టిరనివాసంగా చేసుకున్నాడు. ఆ రోజుల్లో ఆప్రాంతంలో అ(గ్రనాయకులలో ఒకరు సచ్చిదానంద సిన్హా ప్రారంభించిన ''“ఇండియన్‌ ప్యూచర్‌ అన్న పత్రికకు 1903లో సంపాదకుడైనాడు. ఆ తరువాత ఆ నగరంనుంచి వెలువడే రెండు (ప్రసిద్ద దినపత్రికలలో ఒకటిఅగు “లీడర్‌ పత్రికకు మూడు దశాబ్దాలకు పైగా సంపాదకుడుగా ఉండి, జర్నలిస్టుగానే కాకుండా రాజకీయ నాయకుడుగానూ, సంఘ సంస్కర్తగానూ సచ్చీల సంపన్నుడుగానూ ఒక్క యుపీ రాస్ట్రిన్నేగాక మొత్తం ఉత్తర భారతావనినే (ప్రభావితం చేశాడు. అంతేకాదు. గాంధీజీ 96 సంధియుగం

మొదట అనాటి జాతీయ మహా నాయకులందరితోనూ సన్నిహితుడుగా వుండి అవసరమొచ్చినపుడు దాదాపుఅందరి వద్దా, తన మాటనెగ్గించుకుంటూ వచ్చారు. ఆరోజుల్లో కొందరు పత్రికా సంపాదకులు జాతీయ నాయకులుగా కూడా ప్రసిద్దులైన సందర్భాలు వున్నాయి. అటువంటివారిలో సర్‌ సి.వై. చింతామణిగారొకరు. ఆయన సంపాదకత్వాన నడిచిన “లీడరో పత్రిక ఒకవైపూ '"పయొనీర్‌' అనే మరొక ప్రముఖ పత్రిక ఇంకొకవైపునా అలహాబాదు నగరానికిగొప్ప పేరు ప్రతిష్టలు చేకూర్చాయి. దేశంలో ఒకటి రెండు మేధావికేంద్రాలలో అలహాబాదు ఒకటిగా రాణించిందంటే సచ్చిదానంద సిన్హా, మదన మోహన మాలవీయ, మోతీలాల్‌నెహ్రూ, సి. వై. చింతామణి వంటి మేటి నాయకుల ఉనికి, కృషి ప్రధాన కారణం. చింతామణిగారు పత్రికా సంపాదకుడుగా నాటికీ నేటికీ ఏనాటికీ జర్నలిస్టు అయిన ప్రతిఒక్కరూ అనుసరించదగ్గ ఒక '“ఒరవడి' పెట్టారు. పత్రికా సంపాదకుని స్వేచ్చ పత్రికా స్వేచ్చకు ప్రాణప్రదమని నిరూపించిన మేటి సంపాదకుడాయన. అవసరమనుకున్నప్పుడు రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలేను సైతం ఆయన గట్టిగా విమర్శించిన సందర్భాలు వున్నాయి. అలానే తన పత్రికా నిర్వాహకుల అభిప్రాయాలతో తాను విభేదించినపుడు తన ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడానికైనా సిద్రపడ్డాడు కాని విధానాల విషయంలోనేమి స్వీయాభిప్రాయాల విషయంలోనేమి రాజీమాత్రం పడి ఎరుగని రుజువర్తనుడాయన. తన పత్రిక మేనేజ్‌మెంట్‌ బోర్డు అధ్యక్షులుగా వున్న పండిత మదన్‌మోహన్‌ మాలవీయతో చింతామ౭హోరికి అభిప్రాయభేదాలు రాగా తన సంపాదకత్వానికి చింతామణిగారు రాజీనామా ఇవ్వచూపారు. అప్పుడు పండిత మాలవీయ ““నేను అధ్యక్షుడుగా లేకపోయినా “లీడర్‌ పత్రికకు ఏమీ నష్ట్రంలేదు. కాని చింతామణి సంపాదకత్వం లేకపోతే అది మూడురోజుల్లో మూలపడుతుంది. కినుక నేనే తప్పుకుంచాను' అని చెప్పి మాలవీయ తన అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చారట. చింతామణిగారి వంటి స్వేచ్చ్భాళువులైన సంపొదకులే కాదు, మాలవీయగారి వంటి ఉదాత్త మనస్కులైన ప(త్రికాధిపతులు కూడా ఆకాలంలో ఉండేవారు. కనుకనే ధన సంపన్నులు కాకపోయినా వాటి సంపాదకులూ నాయకులూ మౌనధనులుగా చరితార్హులయినారు. చింతామణి గారికి శారీరక ఆరోగ్యం ఎప్పుడూ అంత బాగా వుండేదికాదు. అయినా ఆయన రాత్రింబవళ్లు తన పత్రికకోసం ఎంతో శ్రమించి పని చేసేవారు. ఒకసారి మోతీలాల్‌ నెహ్రూ, తన తనయుడు జవహర్‌లాల్‌కు గ్రాసిన ఒక లేఖలో ఇలా వ్రాశారు '... లీడర్‌ పత్రిక విషయంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. దాని సంపాదకులలో ఒకరు శ్రీ, చింతామణి చాలా తీవ్రంగా జబ్బుపడ్డారు. ఆయన లేకుండా తేజ్‌ బహదూర్‌, ఈశ్వర్‌ శరణ్‌ వంటి యువకులు ఎంతో కష్టంమీద లాక్కొస్తున్నారు. చింతామణి ఎంతో (శ్రమపడి పనిచేస్తాడు. అందుకని ఆయన జీతాన్ని 30 రూపాయల నుంచి 50 రూపాయలకు పెంచారు. ఇది చూసి ఆయన సహ సంపాదకుడు నాగేంద్రనాథ్‌ గుప్తా అలిగి రాజీనామా చేసాడు. ఇది చాలా సంకుచిత బుద్దితో చేసినపని. చింతామణి రా(త్రింబవళ్ళు పనిచేస్తుంటే గుప్తా ఏనాడూ ఒక్క అరగంటకూడా అదనంగా పనిచేసి ఎరుగడు. అతనిని వెళ్ళనివుడమే మంచిదనుకున్నాము'' జర్నలిస్టుగా చింతామణగారికి తన సమకాలికులైన ప త్రికాధిపతులకు మధ్య ఎటువంటి సద్భావం వుండేదో ఈలేఖ తెలుపుతున్నది. సంధియుగం 97

పత్రికా సంపాదకులుగానే కాక రాజకీయ నాయకుడుగా చింతామణీగారు యు.షి. రాజకీయాలలోనేగాక జాతీయ రాజకీయాలలో గొప్ప భూమిక నిర్వహించాడు. 1919లో కాం(గ్ర[ునుంచి కొంతమంది చీలిపోయి లిబరల్‌ పార్టీ పెట్టినపుడు చింతామణిగారు కూడా ఆపార్టీలో చేరి రెండుసార్లు లిబరల్‌ పార్టీ అధ్యక్షులైనారు. అప్పటి ఎన్నికలలో లిబరల్‌ పాన్టీ పాల్గొన్నది. ఆరోజులలో ప్రతిరాష్ట్రంలో విధానమండలి (కౌన్సిల్స్‌ మాత్రమే వుండేది. ఆ ఎన్నికలలో చింతామణిగారు యు.పి.విధానమండలికి ఎన్నికై విద్యామంత్రిగా నియమితులైనారు. ఆవిధంగా ఉత్తర భారతావనిలో ఒక పెద్ద రాష్ట్రమంత్రి మండలిలో సభ్యుడైన తాలి ఆంధ్రుడు చింతామణీగారు. ఇది ఈ శతాబ్ది తొలిపాదంలో జరిగిన సంగతి. తెలుగువారు గర్వించదగిన ఉదంతం. జర్నలిస్టుగా ఎంత స్వతంత్ర దృష్టితో వ్యవహరించారో యు.పి. మంత్రిగా కూడా అంతటి ఆత్మగౌరవంతో వ్యవహరించారాయన. ఏదో ఒక విధానంలో అప్పటి. బ్రిటీష్‌ గవర్నర్‌తో అభిప్రాయ భేదం వచ్చింది. దానిపై 1923లో మంత్రి పదవికి... రాజినామా ఇచ్చివేసి, మళ్ళీ జర్నలిస్టుగా ప్రజాసేవ ప్రారంభించారు.

అనేక సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం సాగించారు. ఒక సందర్భంలో ఆయన ప్రచారానికి ఆగ్రహించిన కొందరు ఆయనను తిట్టారు, కొట్టారు. ఇంకా అనేక విధాల హింసించారు. ఆయన సంస్కరణాభిలాష ప్రచారానికి మాత్రమే పరిమితమైనది కాదు. 1920లలోనే ఆయన విధవా వివాహం చేసుకొని, మార్గదర్శుకుడైనాడు. నాటి కాంగ్‌ ఆందోళనా పద్దతులను తానువ్యతిరేకించినప్పుడు గాంధీజీని సైతం ఆయన గట్టిగా విమర్శించాడు. అయినా ఒకానొక సందర్భంలో గాంధీజీని రెండవ రౌండ్‌ చేబుల్‌ సమావేశానికి వెళ్ళమని ఒప్పించడానికి పలువురు జాతీయ నాయకులు చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పుడు చింతామణిగారు గాంధీజీని ఒప్పించగలిగారు. సప్రూ, జయకర్‌, శ్రీ;నివాసశ్శాస్త్రి, బోపాల్‌ నవాబు వంటి పెద్దలంతా చేయలేని పనిని ఆవేళ చింతామణి గారు చేయగలిగారు. ఆ విధంగా ఆయన గాంధీ-ఇర్విన్‌ సంధికి మూలకారకుడైనాడు.

జర్నలిస్టుగా, రాజకీయ నాయకుడుగా తన కాలపు అగ్రనాయకులను ఇంతగా మెప్పించి ప్రభావితం చేసిన వారు బహుకొద్దిమంది వుంచారు. 1941 జూలై 1వ తేదీన చింతామణిగారు అస్తమించినపుడు “మన దేశంలో జర్నలిజానికి ఆయన మరణంవల్ల అపారమైన నష్టం కలిగింది” అని గాంధీజీ వాపోయారు. "'నిజమైన జాతీయవాది, మనసా వాచా కర్మణా నిస్ప్వార్ధంగా మాతృభూమికి అంకితమైన ఆకళంక దేశభక్తుడు” అని పండిత మదనమోహన మాలవీయ విచారం వ్యక్తం చేశారు. అలాగే బాబూ పురుషోత్తమదాస్‌ టాండన్‌, డాక్టర్‌ సంపూర్ణానంద్‌, ఛాత్తారీ నవాబ్‌, సర్‌ తేజ్‌బహదూర్‌ సప్రూ వంటి మేటి నాయకులు (గాఢ సంతాపం ప్రకటించారు. సర్‌. సి.పి. రామస్వామి అయ్యర్‌ మాటలలో ఆయన *' అత్యంత నిష్కుపటి, నిజాయతీపరుడు””, ఆయనతెలుగువాడు. అది మనకు గర్వకారణం.

(10.4.86) స్లాన్గున్లా

98 సంధియుగం

'ఇవ్వాశవైతూగెన్లూ కరత జాతీయ స్వాతం త్ర పోరాటం 1920 తరువాత మంచి ఊపునందుకొన్నది. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగివచ్చి, జాతీయ ఉద్యమానికి సారథ్యం వహించిన ఫలితంగా ఒకకొత్త ఉత్సాహమూ, ఉద్వేగమూ దేశ ప్రజలలో ముఖ్యంగా జాతీయ కాంగ్రేస్‌ కార్యకర్తలలో, నాయకులలో పెల్టుబికినాయి. మొదటిసారిగా దేశమంతచా ఈ ఉద్యమం ఒక నాయకుని వెనుక, ఏకత్రాటిపై నడవడం మొదలయింది. ఆంచేకాం్రువారిలో అభిప్రాయ బేధాలు లేవని కాదు. ఉన్న విబేధాలు ఉద్యమంలో అనుసరించవలసిన పద్దతులను గురించే కాని, దేశానికి స్వాతంత్ర్యం కావాలన్న అత్యం మాదత్రం అందరిదీ ఒక్కటే. అయితే జాతీయ స్వాతం త్య ఉద్యమకారులలో అప్పట్లో ఒకకొత్తవర్గం అవతరించింది. దేశానికి పరాయి పాలన పీడ విరగడ కావాలనడంలో అందరిదీ జికేమాట అయిన్నా కొందరేమో ఈ బ్రిటిష్‌వారి పరిపాలనతో పాటు, దేళంలో రైతులను జలగల్టా పట్టి పీల్చి పిప్పి చేస్తున్న జమీందార్డు పోవాలనీ, జమీందారీలు రద్దు కావాలనీ వాదించడం 1925 ప్రాంతంలో మొదలైంది. అలా ఆనాడు (ప్రారంభమయింది జమీందారీ రద్దు ఉద్యమం. ఈ ఉద్యమం తొలుదొల్త వెంకటగిరి (నెల్లూరు జిల్లా)లో (ప్రారంభమయిందనవచ్చు. ఈ ఉద్యమానికి ఆద్యుడు స్వర్గీయ వెల్లూరు వెంకట రామానాయుడు. రామానాయుడుగారు 1920నుంచి జాతీయోద్యమంలో చాలా చురుకుగాపాల్గుంటుండేవారు. ఆ విధంగా ఆయన జిల్టా ప్రజలకు సన్నిహితులయినారు. వెంకట రామానాయుడుగారు, మొదట ఒక గ్రామోద్యోగి. ఆది వదిలివేసి కాంగ్రెస్‌ ఉద్యమంలో చేరారు. ఆయన మంచి కవి, గాయకుడు కూడా. ఎన్నో దేశభక్తి గేయాలు వ్రాసి, వాటికి బాణీలు కట్టి సింహనాదం వంటి కంఠంతో గర్రించినట్టు ఆ పాటలు పాడుతూ, ఆ (ప్రాంత (ప్రజలను ఉత్తేజపరుస్తూ, స్వాతంత్ర్య సమారాంగణంలోకి ఎందరెందరినో ఉరికించిన దేశభక్తుడాయన. అలా స్వాతంత్ర్య సమరంలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్న రామానాయుడుగారి దృష్టి ఆ రోజుల్లో జమీందారీ రైతులు అనుభివిస్తున్న నికృష్ట పరిస్టితుల మీదకు ప్రసరించింది. అయితే ఈ విషయంలో కాంగ్రేస్‌ నాయకుల మధ్యతేడాలు వుండేవి. బ్రిటిష్‌వారిని వెళ్లగొట్టేదాకా మరొక సమస్య లేవనెత్తకూడదనీ, అందరూ జాతీయ స్వాతంత్ర్యం అనే వైక లక్ష్యం కోసమే పోరాడాలనీ కొందరు నాయకులు భావించారు. కాగా, మరికొందరు నాయకులు, కార్యకర్తలు *అటు బ్రిటిష్‌ పెత్తనం, ఇటు జమీందారీ పెత్తనం ఒకేసారి పోవాలి, లేకుంటే స్వరాజ్యం వచ్చిన తరువాత జమీందారులు కాంగ్‌ వారిని కొనివేస్తారు. అప్పుడింకా జమీందారీ లైతుల కష్టాలు పెచ్చుపెరుగుతాయి. “కనుక ఈరెండు పీడలనూ ఒకేసారి విరగడ చేసుకోవాలి! అని భావించారు. జమీందారీ ప్రాంత రైతులు, వారి నాయకులు ఇలా భయపడడానికి కారణాలున్నాయి. ఆ రోజులలో బ్రిటిష్‌వారు జమీందారులను దువ్వుతుండేవారు. అందువల్ల సంధియుగం 99

(ప్రభుత్వంలో వారి మాట బాగా సాగుతుండేది. బ్రిటిష్‌ (ప్రభుత్వపు అండ చూచుకొని జమీందారులు తమ క్రింద వున్న రైతులను హీనాతిహీనంగా చూస్తూ నానాబాధలూ 'పెడుతుండేవారు. జమీందారీ రైతుల దీనాతి దీనమైన పరిఫ్టితులతో పోలిస్తే ఆనాటి రైత్వారీ రైతుల పరిస్టితి ఎంతో మెరుగ్గా వుండేది. జమీందారుల జింకలూ, లేళ్ళూ పంటలు పాడుచేస్తున్నా వాటిని రైతులు ఏమీ అనకూడదు. “ఏ రైతో వడిసెలతోనో, బరిసెలతోనో అదిలెస్తే మోయలేనంత జరిమానాలు. అందమైన ఆడపడుచు ఉద్యోగి కంటపడ్తదా ఆ ఊరికి ముప్పే. రోషమున్న రైతు ఉన్నాడా, వాని పైరుకు నిప్పే, జమీందారులు వేటకు వస్తే రైతులు తప్పెట్టు, డబ్బాలూ, ఈటెలూ, వడిసెలూ అందించాలి'” ఒక్కొక్కసారి ఏరైతో వేట మృగమై ప్రాణాలు విడిచినా చెప్పుకునే దిక్కు లేదు.

ఈ పరిస్థితులు కళ్ళారా చూచిన రామానాయుడుగారు జమీందారీ రైతు రక్షణ ఉద్యమం ప్రారంభించారు. ఆయన సంపన్నుడు కాదు. ఆజన్మ బ్రహ్మచారి. చింకిచాప, తలక్రింద పాతబట్టుల మూట ఇవే ఆయన ఆస్తిపాస్తులు. అయినా మొక్కవోని గుండె ధైర్యం, కమ్మగా పాడే కంఠం, ఉత్తేజపరచే దేశభక్తి, రైతుభక్తి కవిత్వం- అనే విల్ణునంబులతోనే ఆయన అటు బ్రిటిష్‌ పాలన మీద, ఇటు జమీందారీ దౌమ్ట్యాల మీదా ఒకే కాలంలో పోరాటం జరుపుతూ వుండేవారు. ఆయితే ఆనాటి జాతీయ పత్రికలు జమీందారీ వ్యతిరేక వార్తలను వేసేవి కావు. అందుకే ఆయన సొంతంగా 1930లో “జమీందారీ రైతు' అనే వారప త్రికను ప్రారంభించారు. ఆతాలిరైతు పత్రిక డబ్బు లేక ఒకసారీ, రాజకీయ అవరోధాల వల్ల మరొకసారీ తాత్కాలికంగా నిలిచిపోయింది. అయినా నాయుడుగారు పట్టుదలతో దానిని మళ్ళీ ' జమీన్‌రైతు* అనే పేరుతో (ప్రారంభించారు. ఆతరువాత మరి వెనుక చూపు లేదు. ప్రాంతీయ చిన్న పత్రికలకు ఒరవడి దిద్దిన ఈ వారపత్రిక ఆ రోజుల్లో జమీందారుల మీద ఆగ్నేయా,స్త్క,ంగా పనిచేసింది.

ఈ ఉద్యమ నిర్వహణ సందర్భంలోనే రామానాయుడుగారు మదరాసు వెళ్ళి అప్పట్లో పచ్చయ్యప్పు కళాశాలలో పనిచేస్తున్న *“ప్రాఫెసర్‌ రంగా**ను ఒప్పించి, రప్పించి ప్రత్యక్ష రాజకీయాలలో దించి ఆంధధ్రులకొక “ఆచార్య రంగాను, దేశానికొక “రైతు రంగాను అందించారు. రంగాగారి అండదండలతో వారు ప్రారంభించిన ఆ ఉద్యమం నాయుడుగారి జీవిత కాలంలోనే ఫలించింది. స్వాతంత్రానంతరం చెన్న రాష్ట్ర ప్రభుత్వం జమీందారీ రద్దు శాసనం చేయటానికి అంగీకరించింది. అప్పటి రెవిన్యూ మంశత్రి కళావెంకట్రావుగారు ఆ బిల్టును రూపాొందించిడంలో ఆయనకు రామానాయుడుగారు చేదోడువాదోడుగా వున్నారు. బిల్దును నిర్దుష్టంగా తీర్చిదిద్దారు. ఆ బిల్హును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేసే వరకు నాయుడుగారు మదరాసులోనే మకాం పెట్టి తన దీక్షను నెరవేర్చుకున్నారు.

జమీందారీ రైతు ఉద్యమానికి ఆద్యుడైన వెంకటు రామానాయుడుగారు నాటి జమీందారీ రైతులకు ఆరాధ్యలైనారు. 1891 జూన్‌ 3న జన్మించిన నాయుడుగారు 1959లో అస్తమించారు. దేశానికీ, రాష్ట్రానికి ఇంత చేసిన నాయుడుగారు స్వాతం త్రానంతరం ఎన్నడూ తనకు ఏ పదవినీ ఆశించలేదు. అందుకే ఆంధ్ర రాజకీయాలలో ఆయన నిజమైన మహర్షి.

(30.5.86) 100 సంధియుగం

'తెబు పత్రికా రంగంలో ఆద్యులు అనదగినవారు ముగ్గురున్నారు. మొదటి తెలుగు దినపత్రికను నెలకొల్పిన దేశోద్దారక కాశీనాధుని నోగేశ్వరరావు, తెలుగు ముద్రణ అచ్చులను ఆధునికపరచడంలో అనన్యమైన కృషి పలిపిన ఎన్‌.జి. ఆచార్య. తెలుగు దిన పత్రికకు ఆధునిక కాలానికి అనుగుణమైన రూపురేఖలు తీర్చిదిద్ది, తనదైన ఒక ఒరవడి పెట్టిన నార్ల వెంకటేశ్వరరావు - ఈ ముగ్గురికీ పై మాట వర్తిస్తుంది.

పత్రికా రచనలో '*వడగండ్హ'” వానలు కురిపించిన ముట్నూరి కృష్ణారావు, పత్రికా రచనను విష్ణ్లవ ఆయుధంగా వినియోగించిన నెల్లూరి వెంకట్రామానాయుడు. నైజాం (ప్రజలకు “గోలకొండ! వంటి పత్రికను ఇచ్చిన సురవరం ప్రతాహరెడ్డిగార్హను విస్మరించి పై మాట అనడం లేదు. ఈ ముగ్గురివలెనే తెలుగు పత్రికా రచనకు ఎంతెంతో దోహదం చేసినవారు మరెందరో కూడా లేకపోలేదు. అయితే వీరందరి కృషి ఒక ఎత్తుకాగా, మొదటి ముగ్గురి కృషి మరొక ఎత్తు. కాశీనాధునివారు, ఆచార్యగారు, నార్లవారు చేసినది మార్గదర్శకమైన కృషి వీరు మువ్వురు మరణించడంతో తెలుగు జర్నలిజంలో ఒకశకం అంతమయింది.

1915కి ముందు ఆంధ్రదేశం ఎలా ఉండేదో; తెలుగువారు ఎలా ఉండేవారో; అప్పటికి ఇంగ్లీషులో మాత్రం రెండు దినపత్రికలు మదరాసునుంచి వచ్చేవి. అనాడు ఇంగ్లీషు చదువుకున్న తెలుగువారి సంఖ్య చాల తక్కువ. తెలుగులో దినపత్రికంటూ ఏదీలేదు. దేశంలో రాష్ట్రంలో ఏమూల, ఏమి జరుగుతున్నదో తెలుసుకునే అవకాశం ఇంగ్రీషురానివారికి అనాటి వరకూ లేదు. కనుకనేనేమో బ్రిటిష్‌ (ప్రభుత్వం సునాయాసంగా అంతకాలం మనలను ఏలగలిగింది. అటువంటి సమయంలో ఆ అంధకార బంధురమైన పాత (ప్రపంచంలో ఒక వెలుగు రేఖ మెరసింది. కాశీనాధుని నాగేశ్వరరావు గారు పెట్టిన మొట్టమొదటి తెలుగు దినపత్రికను చూచిన తెలుగువారికి, 1969లో మొట్టమొదటి సారిగా నూనవుడు చంద్ర మండలం మీద దిగినప్పుడు లోకం అంతచా వెల్లి విరిసిన సం భ్రమాళ్ళర్యాలవంటిని అనాడు కలిగి ఉండాలి. కనుకనే తెలుగు పత్రికారంగంలో ఆయన మొదటి మౌర్గదర్శి అయినారు.

అయితే అప్పటికి తెలుగుముద్రణ టైైపులు వికారంగా ఎగుడు దిగుడుగా ఉండేవి. ఇప్పుడున్నన్ని రకాల రూపాల తెలుగు అక్షరాల అచ్చులు అప్పుడులేవు. దినపత్రిక అందంగా పాఠకుల కంటిని ఆకర్షించేలా నడపడానికి ఎన్నెన్ని రకాల టైపులు కావాలో ఈనాడు మనకు తెలుసు ఇప్పుడిన్నిరకాలు ఉన్నాయి. కనుక చూడగానే ఫలనా పత్రిక బాగున్నదనో, బాగులేదనో మన కనిపిస్తుంది. నిజానికి నేడు ముద్రణ పద్దతులలోనే ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. మరి ఆనాడు ఉన్నటైపులే తక్కువ. ఆవీ అందంగా ఉండేవికావు. తెలుగు దిన పత్రిక ముద్రణకు సంబంధించి ఈ లోటును గుర్తించి, దానిని సరిదిద్దడానికి ప్రయత్నించిన మొదటి తెలుగు జర్నలిస్టు ఎస్‌.జి. ఆచార్యగారు.

తొలితరం తెలుగు జర్నలిస్టులలో ఎస్‌.జి. ఆచార్యగారికి విశిష్టమైన స్థానం ఉన్నది. గురువులకు గురువు అనదగినవాడాయన. ఆరోజుల్లో ఆయన సహాయ సహకారాలు లభించని సంధియుగం 101

తెలుగు జర్నలిస్టులు అరుదు. ఉన్నంతలో ప(త్రికల రూపురేఖలను అందంగా తీర్చిదిద్దడంలో అందెవేసిన చేయి ఆయన, కనుకనే తెలుగు టైపులలో కొరత మొదటగా కొట్టు వచ్చినట్టు కనిపించించాయనకు. తాను నడిపిన వారు మాస, పక్షపత్రికల ద్వారా (ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎందరెందరో ఆనాటి యువ జర్నలిస్టులకు ఆచార్యగారి ఆచార్యత్వం లభించింది. ఆటువంటి వారిలో నేనూ ఒకళ్లి. జర్నలిస్టుగా ఆయన కృషి ఒక ఎత్తుకాగా, తెలుగు పత్రికల ఆకర్షణను పెంచడానికి అవసరమైన కొత్త కొత్త రకాల ట్రైపులను రూపొందించడంలో ఆయన జరిపిన పరిశోధన, చేసిన కృషి అనన్యమైనవి.

తెలుగు పత్రికలకు నాటి ఆయన కృషి అమూల్య ఆభరణమైనది. ఆ తరువాత పలువురు పలురకాల పరిశోధనలు జరిపి తెలుగు అచ్చు అక్షరాల కూర్పులో ఎన్నెన్నో సాగసులూ, సౌలభ్యాలూ సాధించారు. ఈ విషయంలో (శ్రీ, మద్దాలి రాఘవరామచం (ద్రరావు కృషిని ఇక్కడ "పేర్కొనడం సముచితంగా ఉంటుంది. ఈయన ఒకప్పుడు నాతో పని చేసినవారు.

తొలి తెలుగు దినపట్ర్‌కే కాదు, ఆ రోజుల్లో వారు మాస, పత్రికలు కూడ గ్రాంధిక భాషలో ఉండేవి. అందువలన పండితులకు తప్ప మామూలు చదువులు చదువుకున్న వారికి నాటి పత్రికల భాష ఒక పట్టాన కొరకుడు పడేదికాదు. అటువంటి పరిస్టితులలో నార్హవారు జర్నలిజం రంగంలో సరికొత్త తారలా ఉదయించారు, అయితే అప్పటికే తాపీ ధర్మారావుగారు భాషను పాండిత్య (ప్రాసాదం నుంచి, పామర జనావాసాలకు తీసుకురావడానికి ప్రయత్నిస్తు న్నారు, 1938లో ప్రారంభమైన ఆంధధ్రప్రభకు 1942లో నార్లవారి సారధ్యం లభించింది. ఆయన సంపాదకత్వాన ఆ దినపత్రిక, తాపీవారు చూపిన మార్గంలో ఇంకింత నవీన పంథాలో ఆధునిక కాలమాన పరిస్టితులకు తగిన కొత్త రూపు రేఖలు దిద్దుకొనడం (ప్రారంభించింది. పండితులకు మాత్రమే పరిమితమైన గ్రాంధిక భాష దినప(త్రిక అవసరాలకు పనికిరాదని (గ్రహించిన నార్హవారు వ్యావహారిక భాషను పత్రికా భాషగా పరిణమింపజేశారు.

ఇందువల్ల రెండు ప్రయోజనాలు చేకూరాయి. ఆధునిక రాజకీయ సాంఘిక, ఆర్టిక వార్తలన్తూ, విశేషాలనూ మామూలు ప్రజలకు సుళువుగా అర్హ్రమయ్యే సాధారణ జనభాషలో ప్రజానీకానికి తెలియ జాప్పీ సాధనంగా తెలుగు దినప(త్రికల ప్రయోజనం విస్పృతమైనది. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం గావించడంలో నార్హవారి '“ప(్రికాభాషు? చేసిన దోహదం అంతింత కాదు. దాదాపు ఆదేకాలంలో (శ్రీ/శ్రీ, ఆరుద్ర మరి పలువురు నడుపుతున్న అభ్యుదయ సాహిత్య ఉద్యమమూ, నార్లవారి ““పత్రికాభాషు' ఉద్యమమూ తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని ప్రజల పరంచేశాయి అనవచ్చు.

తెలుగు సాహిత్య ప్రగతికి నార్లవారు వేసిన దోహదం ''ప(త్రికాభాషు* ద్వారా మాత్రమే కాదు. వ్యాస రచనలో, నాటక రచనలో, ఆటవెలదులు అల్లడంలో ఆయనది అందె వేసిన చేయి. అంతేకాదు, ఇంగ్లీషు రచనలలో కూడా ఆయన చేయి తిరిగినదిట్టు. నలుగురు నడిచే మామూలుదారిని పోవడం కాక, విష్ణవదృష్టితో విషయ పరిశీలన చేయగల కొద్దిమంది అగ్రశ్రేణి తెలుగు పరిశోధకులలో ఆయన ఒకరు. పత్రికా సంపాదకుడుగా, నాటక రచయితగా, కవిగా విష్టవవాదిగా, విమర్శకుడుగా, పరిశోధకుడుగా తెలుగు సాహిత్యానికి, సాంఘీక పరివర్తనకుగొప్పు "సేవ చేసిన నవమేధావి నార్ల. తెలుగువారిలో నార్ధవారితో పోల్చదగిన వారు చాల కొద్దిమందే ఉంటారు. ఆవేశానికి ఆయన సుళువుగా వశుడై పోయేవారు. ఇదే ఆయన బలమూ, బలహీనత కూడాను. 102 సంధియుగం

ఆవేళం లేనివాడు - భావావేశంలేని వాడు జర్నలిస్టు కాజాలడు, మంచిని చూచి ఎంతగా ఉప్పాంగి పోతాడో, చెడుని చూచి అంతగా రెచ్చిపోగలిగినవాడే జర్నలిస్టుగా రాణించ గలుగుతాడు. కనుకనే నార్ల గొప్పు జర్నలిస్టు కాగలిగాడు. ఇది ఆయన బలం. ఇదే ఆయనలో మితిమీరిన బలహీనతగా పరిణమించిన సందర్భాలు ఆయన జీవితంలో మనకు కనపడతాయి. రాజకీయ, సాంఘిక, ఆర్హకాది సామూహిక సమస్యల పరిశీలనలో ఈ భావావేశం జర్నలిస్టుగా ఆయన కెంత బలమిచ్చిందో, వ్యక్తిగత కోపతాపాలకు లోనైనప్పుడు ఈ ఆవేశం అంత పెద్ద బలహీనతగా పలుమారు వెర్రితలలు వేసింది. ఆయా సందర్భాలలో వివిధ ఆంధ్ర రాజకీయ నాయకుల మీద వ్యక్తిగతమైన కక్షతో ఆయన వ్రాసిన వ్రాతలు ఆయన ప్రతిష్టను కొంత దెబ్బ తీసిన మాట నిజం. ఆయన జీవితంలో ఇదే పెద్ద బలహీనత. ఆయనంత ఎత్తుకి ఎదిగిన వ్యక్తి ఈ ఒక్క విషయంలో ఇంత బలహీనుడు కావడం (ప్రకృతి వైపరీత్యమే మరి. ఏమైనా ఆంధ్రచరి'త్రలో, తెలుగు సాహిత్యక్షేత్రంలో, తెలుగు పత్రికా (ప్రపంచంలో ఆయనస్ట్రానం విశిష్టమైనదీ, చిరస్రాయిగా నిలచి ఉండగలది. (స్రవంతి--23.11.85) న్గాస్తాన్ల ఇట్‌ అజ్ఞానమూ - 'న్వచ్చా తెలివిమీరినవారిలో మితిమీరిన స్వార్టచింతన (ప్రజూస్వామ్యూనికి ఎంత చెరువు చేయగలదో, అమాయక జనబాహుళ్ళవు మూఢభిక్షే అంత న్మ్హం కలిగించగలదు. ఈపరిస్టితులనుంచి, ఈ అన్టకాల నుంచి ప్రజస్వామ్యూన్ని తప్పుంచగలిగినప్పుడే ఈ వ్యవస్థకు స్వార్టక్యం. స్వేచ్చా (ప్రజాన్యామ్యాలు పదిలంగా వుండాలంటో (ప్రజలలో విద్యావికాసాలు విషయ వివేచనాళక్తే పెంపాందాలి. ఆజ్ఞానము- స్వేచ్చు ఒకే ఒరలో ఇమిడేవికావు. జ్ఞానహీనులు తమ ప్రజాస్వామిక హక్కులను తెలునుకోచూలేదు, వాటీని కాపాడుకోనూ లేదు. కనుక మన విద్యాలయాలు మన ప(తికలు, పౌరులను ప్రజాస్వామిక పౌరులుగా తీర్చి దిద్దడంలో చేయవలసినదెంతో వుంది. ముఖ్యంగా పత్రికలు చేయవలసినది చాలావుంది. అందుకు మొదట పత్రికలు తమ స్వేచ్చను కాపాడుకోవాలి. ధర్మునిరతిని పెంపొందించుకోవాలి. ఇంటాబయటా 27-4-84 సంధియుగం 103

ధూళిప్రోాణీ ఉఅంజ్రోయుల

అల్యెషు జర్నలిజంలో బాగా రాణించి పేరు తెచ్చుకున్న తెలుగువారు పలువురున్నారు. సి.వై. చింతామణి, కోటంరాజు రామారావు, కోటంరాజు పున్నయ్య, చలపతిరావు, కె. ఈశ్వరదత్తు, ఖాసా సుబ్బారావు, జి.వి.కృపానిధి, సి.వి.హెచ్‌.రావు, జి.3.రెడ్డి, ఎ.ఎస్‌.రామన్‌ వీరంతా ఈ రంగంలో నిస్టాతులే. అయితే, ఒక చిన్న తేడా వున్నది. ఒక్క ఖాసా సుబ్బారావు తప్ప, ఇక్కడ పేర్కొన్న వారంతా ఉత్తరాదిన రాణించినవారే. నిజానికి వీరిలో కొందరిని మదరాసు ఇంగ్రీషు పత్రికలవారు “పనికిరాని వారు'గా చిన్నబుచ్చిన సందర్భాలు లేకపోలేదు.

కాగా, ఖాసా సుబ్బారావు '“స్వరాజ్య'', '' ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌” వంటి పత్రికలలో తమ (ప్రతిభను ప్రదర్శించి, ఆ తరువాత స్వతంత్రంగా "స్వతంత్ర అనే ఆంగ వార పత్రికను (ప్రారంభించి, ఆధునిక ఆంగ జర్నలిజానికి ఒక ఒరవడి దిద్దిన వారయినారు. అంగేకాదు. అనాటి దక్షిణాది రాజకీయ నాయకులనూ, విధానాలనూ ప్రభావితం చేసిన ప్రజ్ఞాశాలి ఖాసా. ఆ రోజులలో ఉత్తరాది వారి ఇంగ్రీషు పాండిత్యం దక్షిణాది వారి పాండిత్యం ముందు వెలవెల పోతుండేది. అందువల్లనే కావచ్చు, దక్షిణాది జర్నలిస్టులకు పేరు (ప్రతిష్టలు అధికంగా వుంటుండేవి. కనుకనే ఇంగ్రీషు భాషా జర్నలిస్టుగా రాణించడం ఉత్తరాదిన కంటె దక్షిణాదిన కష్ట సాధ్యంగా వుండేది. ఈనాటికీ ఈమాట కొంతవరకు నిజమే.

దక్షిణ భారతంలో చదువుకొని, ఈ రంగంలో శిక్షణ పొంది, అ(గ్రశ్రేణి ఇంగ్రీషు భాషా జర్నలిస్టుగా రాణిస్తున్న మరొక తెలుగు ప్రముఖుడు క్రీ, ధూళిపూడి ఆంజనేయులు. ఖాసావారి తరువాత ఇటువంటి గౌరవస్త్రానాన్ని పొందిన ఘనత వీరకే దక్కుతుంది. “ధూళిపూడి ఆంజనేయులు అంటే కొద్దిమందికే తెలుసు. '“డి.ఆంజనేయులు' అంటే చాలామందికి తెలుసును. కాగా, డి.ఎ. అని అంటే మదరాసు నగరంలో అందరికీ తెలుసును. మదరాసునుండి వెలువడే రెండు అగ్రశ్రేణి ఆంగ దినపత్రికలలో పనిచేసి, అనుభవం గడించిన ఆంజనేయులు గారు జర్నలిస్టు మాత్రమే కాదు, చేయి తిరిగిన రచయిత కూడా.

మదరాసులో సుప్రసిద్ద రచయితల సంఘం (యునైటెడ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌) “డిస్టింగ్విస్ట్‌ జర్నలిస్ట్‌ అవార్డును డాక్టర్‌ డి. ఆంజనేయులుగారికి ఇచ్చి సన్మానించింది.

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా ఎలవ(ర్రులో 1924 జనవరి 10వ తేదీన జన్మించిన ఆంజనేయులు గారు మదరాసు క్రిస్టియన్‌ కాలేజిలో చదివి ఎం.ఎ. పట్టుం పుచ్చుకుని, ఆ తరువాత న్యాయశాస్త్రంలో పట్టుభద్రులైనారు. అయితే, న్యాయవాద వృత్తిలో ఆయనకు ధ్యాస కదురలేదు. విద్యార్ది దళనుంచి ఇంగ్రీషు భాషా సాహిత్యం పట్ట మితిమీరిన మోజు పెంచుకున్న ఈయన రచయితగా, విమర్శకుడుగా, జర్నలిస్టుగా క్రమేణా తనను తాను రూపుదిద్దుకుంటూ వచ్చారు.

మొదట “ఇండియన్‌ ఎక్స్‌(పైసొ' సంపాదకవర్గంలో 1948లో చేరి, అయిదేళ్ల పాటు పనిచేసిన అనంతరం, 1953లో 'హిందూ* పత్రిక సంపాదకవర్గంలో చేరి అక్కడ మరొక 104 సంధియుగం

అయిదేళ్ళు అనుభవం సంపాదించిన పిదప, 1959లో ఆకాళవాణి వారి 'వాణి' పత్రిక సంపాదక బాధ్యతలు స్వీకరించారు. 1971 నుంచి 1975 వరకు హైదరాబాదులో కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖ (సి.ఐ.బి)లో ఇన్ఫర్‌మేషన్‌ ఆఫీసరుగా పనిచేశారు. మధ్య మధ్య మరికొన్ని ప్రభుత్వ బాధ్యతలు ఢిల్లీలో నిర్వహించిన ఆనంతరం 1977 నుంచి రెండేళ్లు ఆకాశవాణి వార్తా విభాగంలోనూ, ఆ తరువాత మరి రెండు సంవత్సరాలు దూరదర్శన్‌ కేంద్రంలో న్యూస్‌ ఎడిటర్‌గానూ పనిచేసి, 1981లో ప్రభుత్వ ఉద్యోగం నుంచి విరమించుకొన్నారు.

జర్నలిస్టుగా ఆంజనేయులుగారి అనుభవాలన్నీ ఒక ఎత్తు. రచయితగా, విమర్శుకుడుగా, గగ్రంథకర్తగా ఆయన కృషిఅంతా మరొక ఎత్తు. ఎన్నెన్నో పత్రికలకు లెక్కలేనన్ని వ్యాసాలు ఆయన (వ్రాశారు. బహుశా ఆయన రచన అచ్చుపడని ఆంగ్రప(త్రిక ఏదీ మనదేశంలో వుండదనడం మరీ అతిశయోక్తి కాకపోవచ్చు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి కోరికపై డ్యాక్టర్‌ సి. ఆర్‌.రెడ్డి జీవిత చరిత్రను, భారత ప్రభుత్వ పబ్లికేషన్స్‌ డివిజన్‌వారి 'నవభారత నిర్మాతలు" పరంపరలో కందుకూరి వీరేళలింగంగారి జీవిత చరిత్రను ఆయన (వ్రాశారు. సోవియెట్‌ యూనియన్‌, కొన్ని ఐరోపా దేశాలూ పర్యటించిన పీదప 'విండో టు ది వెస్ట్‌ అన్న యాత్రా (గ్రంథాన్ని ప్రచురించారు. ఈ మూడూ కూడా ముచ్చటయిన రచనలు.

తెలుగు సాహిత్యాన్నీ, తెలుగు కవి పండితులనూ, ఆం(ధ్రేతరులకు పరిచయం గౌవించడంలో విశిష్టమైన కృషివేసిన బహు కొద్దిమందిలో ఆంజనేయులుగార్‌ొకరు. కృష్ణశాస్త్రి, (శ్రీ/్రీ/ వంటి పలువురి తెలుగు కవితలను ఆంగ్లంలోకి ఆనువదించారు. విశ్వనాథ సత్యనారాయణగారి వంటి మరెందరి రచనలనో ఆయన ఆం (ద్రేతరులకు పరిచయం చేశారు. ఏటేటా తెలుగు సాహిత్యం మీద సాంవత్సరిక సమీక్ష వ్యాసాలు ఇంగ్లీషులో (వ్రాస్తుంచారు. ద్వివేదుల విశాలాకిగ్రారి “గ్రహణం విడిచింది” *'అమరజీవి పొట్టి (శ్రీరాములు జీవిత చరిత్ర: వంటి కొన్ని తెలుగు (గ్రంథాలను ఇంగ్రీషులోకి అనువదించారు.

ఆంజనేయులు గారిది స్వతంత్ర దృక్బథం. ఆయన అభిమానించే భారతీయ, ఆంధ్ర, అమెరికన్‌ రచయితలు పలువురున్నారు. మకాలే, లిటన్‌శ్ర్రానీ, ఆర్నాళ్త్‌చాయన్ని, సిపి.స్నో వంటి ఆంగ రచయితలూ, ఎడ్మండ్‌ విల్సన్‌, ఆర్టర్‌'ఫెసింజర్‌, ఐజక్‌ బి. సింగర్‌ వంటి అమెరికన్‌ రచయితలంటే ఆయనకు ఇష్టం. జవాహర్‌లాల్‌నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణగార్హ రచనాశ్రైలులు ఆయనను ఆకట్టుకుంటాయి.

అయితే, ఎవరి బాణీకీ ఆయన దాసుడు కాదు. తన బాణీ తనదే. అలా ఆయన తన సొంత బాణీనొకదానిని రూపొందించుకొన్నారు. ప్రతి సోమవారం “హిందూ”? ప(్రికలో పదేళ్లపాటు ఆయన న్రాసిన “బిట్వీన్‌ యు అండ్‌ మి' శీర్షిక వ్యాసాలలో ఆ బాణీ ఏమిచో మనకు స్పష్టంగా కనపడుతుంది. దానిని “డి.ఎ. బాణీ అని అనవచ్చు.

అన్నట్టు, ఆయన సొంత (గ్రంథాలయం, మనదేశంలో అతి పెద్దవైన వ్యక్తిగత గ్రంథాలయాలలో ఒకటి. ఆంగ్హ, ఆంధ్ర సాహిత్యాలమీద వెలువడిన గ్రంథాలు దాదాపు అన్నీ ఆయన గ్రంథాలయంలో వున్నాయి అనవచ్చు. మద్రాసులో అనేక ప్రజాహిత సంఘాలతో ఆయనకు సన్నిహిత సంబంధం వున్నది. మూడేళ్లపాటు మదరాసు ప్రెస్‌ క్షబ్‌ అధ్యక్షులుగా వున్నారు. అన్నిటినీ మించి ఆయన నిష్కపటి, స్నేహశీలి, మొగమాట మెరుగని విమర్శకుడు, నిత్యాధ్యాయి. తెలుగువారు గర్వించదగిన ఇంగ్రీషు జర్నలిస్టు, ఆంగ్ర సాహిత్యపు లోతులు తరచి చూసిన రచయిత, (10.7.90) సంధియుగం 105

8

“సంజ నీరెండ పుష్పమంజరులెల్ల బొల్పుమీటెడి మంకెన పూలొనర్చె బర సంతతులను బల్లవములజేసె వేమిచెప్పుదు నా వనసీవు గోము”

"కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారి కవితాధారలోని సారళ్యాన్ని ఎత్తి చూపడానికి ఆచార్య దివాకర్ల వెంకటావధానిగారు ఒకానొక సందర్భంలో పై పద్యాన్ని ఉదాహరించారు. సాహిత్యాన్ని (కవిత్వం, నాటకం) తన తర్భ ప్రచారానికి (ప్రధాన సాధనంగా ఎంచుకొన్నారు త్రిపురనేనివారు. అందుకే ఆయన ముందుగా సాంప్రదాయక సాహిత్యాన్ని సాకల్యంగా చదివి క్షుల్లుంగా అవగాహన చేసుకున్నారు. నిరంతర సాధన చేసి నిరుపమ పాండిత్యాన్ని సాధించుకొన్నారు, సంపాదించుకొన్నారు. సాహిత్యాన్ని, ముఖ్యంగా కవిత్వాన్ని చిరకాలంగా పలువురు మేధావులు మత (ప్రచారానికీ, తత్వ (ప్రచారానిక్సీ మతతత్వ (ప్రచారానిక్షీ సాధనంగా వినియోగించుకొంటూ వచ్చారు. అయితే ఆధునికకాలంలో తర్క ప్రచారానికి, సంఘ సంస్కరణోద్యమానిక్కి రాజకీయ సిద్దాంత ప్రచారానికి సాహిత్యాన్ని సాధనంగా, సమర్హంగా వినియోగించుకున్న మేధావులు కొందరు మనకు కనపడతారు. కందుకూరి వీరేళలింగంగారు, గురజాడ అప్పారావుగారు, (త్రిపురనేనివారు, ,శ్రీగశ్రీగారు అటువంటి వారిలో ముఖ్యులు.

కవిత్వానికి భాష్క భావం, వస్తువు, రసం, వరన పంచ ప్రాణాలవంటివని సాంప్ర దాయకుల నమ్మకం. అయితే కొందరు ముందు చూపుగల పెద్దలు దేళ కాల పరిఫ్టితులకు అనుగుణంగా తమ రచనలలో స్వతంత్ర్య మార్గాన్ని అనుసరించారు. అలా కొత్తదారి తొక్కిన “ ఆధునిక ఆం(ధ్రకవి చంద్రులలో పై అయిదింటి విషయమున స్వాతం త్రము వహించిన వారు పలువురు వున్నారు. వారిలో భాష స్వాతంత్ర్యము (ప్రకటించిన వారి సంఖ్య అధికము. భావ స్వాతంత్ర్యము వహించిన వారల్ప సంఖ్యాకులు కలరు. వారిలో అగ్రేసరుఠఅని చెప్పదగిన వారు కవిరాజు రామస్వామి చౌదరిగారు*' అని అవధానిగారు విశ్లేషించి చెప్పారు. ''కావ్యమునందలి కొన్ని భావములతో నేకీభవింపజాలక పోయినన్తూ, వ్యక్తీకరణ సౌందర్యమును గ్రహించి యానందించుట రసజ్జతకు లక్షణము. కవిరాజుగారి భావములతో సంప్రదాయానుసారులు పలువురు ఏకీభవించలేక పోవచ్చును. కాని రసజ్ఞులైనవో వారి పద ప్రయోగ జౌచిత్యము, ధారాశుద్ది,, భావ ప్రకటునమూ, వరన _నైపుణ్యమూ మున్నగువానిని మెచ్చుకొనకుండజాలరు”'.

ఒక్క. ఆవధానిగారే కాదు. (శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, మాధవపెద్ది బుచ్చిసుందర రామశ్యాస్త్రి, ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు, పింగళి లక్ష్మీకాంతం వంటి పండితులు పలువురు కూడా (త్రిపురనేని వారి పాండిత్యాన్ని మెచ్చుకున్నారు. ఇలా, సొంప్రదాయకుల, ఆధునికుల మెప్పును పొందిన పాండిత్యాన్ని, సాహిత్యాన్ని విల్హునమ్ములుగా ధరించి “కవిరాజు 106 సంధియుగం

త్రిపురనేని భారతీయ సమాజంలో చిరకాలంగా వేరూనుకొన్న 'నిమ్నోన్నతాలను, “పక్షసాతాలను, 'అధర్మాలను", అన్యాయాలను” ఎత్తిచూపి వాటిని ఎదిరించి, సంఘాన్ని సంస్కరించి, మనుషుఅందరికీ సమాన వ్యక్తి గౌరవం, సమధర్మం, సమన్యాయం వుండే సమసమాజాన్ని నెలకోల్చే నవ మానవ వాద ఉద్యమాన్ని 1927 నాటికే ప్రారంభించారు. తరతరాలుగా, శతాబ్దాల తరబడి మన నరనరాన జల్లించి వున్న నమ్మకాలను, అలవాటును మార్చడమంటే మాటలుకాదు. అది ఏటికి ఎదురీత మాత్రమేకాదు. మహానదులకే ఎదురీత వంటిది. అటువంటి. ఉద్యమానికి ఉద్యమించటానికి ఎంతో గుండెదిటవు కావాలి. నిర్మాహమాట వైఖరి వుండాలి. ఆత్మబలం కావాలి, వాదనాపటిమ కావాలి. ఈ గుణాలన్నీ త్రిపురనేనివారిలో పుష్కలంగా వున్నాయి. ఈ ఉద్యమ (ప్రకటన, ప్రచారాలకు అనువైన సాధనంగా సాహిత్యాన్ని ఆయన మలచుకొన్నారు. ఇలా దృఢమైన పునాదులపైన ఆయన తన ఉద్యమాన్ని నిర్మించసాగారు. విదేశాలలో పైచదువులు ముగించుకొని, స్వదేశానికి తిరిగి వచ్చి, పాశ్చాత్య తర్క శక్తివల్ల (ప్రభావితుడైన త్రిపురనేని రామస్వామి చౌదరి తన చుట్టూ వున్న సమాజాన్ని, “సామాజిక రుగ్మతలను" చూచి స్పందించారు. బారిష్టర్‌ పట్టం పొందివచ్చిన ఈయన తన న్యాయశాఖస్తు ప్రతిభకు అమాయక ప్రజల అజ్ఞానాన్ని వినియోగించుకొని రెండు చేతులా ధన సంపాదనకు పాల్పడి వుంటే కోటీళ్వరుడై వుండేవాడు. కాని ఆయన అలా చేయదలచలేదు. జనులలోని అజ్ఞానాన్ని తొలగించి వివేక వికాసాలు కలిగించి వారిని జాగృతం చేయడానికి ధర్మా ధర్మ విచక్షణా శక్తిని కలిగించడానికి తన న్యాయశాస్త్ర) వైదుష్యాన్ని, భాషా పాండిత్యాన్ని వినియోగించారాయన, మూడు దశాబ్దాలపాటు తన రచనలద్వారా, ఉపన్యాసాల ద్వారా సమాజంలోని ఎత్తుపల్లాలను చదును చేయడానికి ఆయన అకుంఠిత దీక్షతో, నిర్చీకంగా హేతువాద ఉద్యమం సాగించారు. కారెంపూడి కదనం, కొండవీటి పతనం, రాణాప్రతాప్‌, కురుక్షేత్ర సంగ్రామం, శంబుకవధ, ఖూనీవంటి నాటకాలు, సూతపురాణం, భగవద్గీత వంటి కావ్యాలూ, కుప్పుస్వామి శతకం, ధూర్తమానవ ళతకం, గోపాలరాయ శతకం వంటి శతకాలు, సూతా(శ్రమ గీతాలు వంటి పలు తిరుగుబాటు రచనలు ఆయన కలం నుంఛి వెలువడ్డాయి. ఈ రచనలన్నిటిద్వారా సమాజంలో మతపరంగా, కులపరంగా సాగుతున్న అన్యాయాలను, అధర్మాలను ఎదిరించి పోరాడిన వారాయన. దాళరధిగారన్నట్టు '“జడుపు గిడుపులేక... జడ జీవుల మనసులలో బడబాగ్ని రగల్బ* గలిగిన “కోటి కోటిభానుబింబపాటవమున్న విష్ణవ కవిరాజు త్రిపురనేని “కవిరాజు. కనుకనే "' ఇరవయ్యో శతాబ్దపు ఆం(ధ్ర సాహితీ చరిత్రలో “కవిరాజు ది తిరుగులేని స్థానం” అని పింగళివారు ప్రళంసించగా, “' వీరేళలింగంగారి తరువాత ఆయనంతటివాడు రామస్వామి చౌదరిగారే. కవిరాజు మమతా రహితమైన విమర్శకులు. వైద్యునివలె సమాజంలోని దుస్థాంగాలను సంహరించడానికి శస్త్రచికిత్స చేసిన నేర్పరి” అని డాక్టర్‌ కొత్తపల్లి వీరభద్రరావుగారు త్రిపురనేనికి నీరాజనాలర్పించారు. కాగా '' అపరవ్యాసుడు రామస్వామి” అని శ్రీపాద కృష్ణమూర్తి శ్యాస్త్రిగారంటే, *“ఆం(ధ్రభాష ఇతని కలమునకు వలె మరొకరికి స్వాధీనపడలేదని నా నమ్మకము, జాతీయమైన శుద్దాంధ్రమును వ్రాయగల వాడు తిక్కన తరువాత ఇతడే. కవిరాజు అంతటి శుద్రవర్తనుడు మరియొకడు లేడు” అని ఉన్నవ వారు అన్నారు. సంధియుగం 107

తిపురనేని రామస్వామి చౌదరిగారు తన యావజ్జీవితాన్ని జనంలో భావ విప్లవం తీసుకురావడానికి ధారపోశారు. మూఢ నమ్మకాలపై ఏకాకిగా పోరాడారు. హేతువాదాన్ని పెంపొందించడానికి కృషిచేశారు. సంప్రదాయాన్ని వ్యతిరేకించిన వీరులందరివలెనే వీరు అనేక కష్టాలకు లోనుకావలసి వచ్చింది. అయినా వెనుకంజవేయక చివరిదాకా సత్యాన్ని అన్వేషిస్తూనే వున్నారు. ఆయన ''“స్వతం(త్రుడు, మితభాషి నిష్కపటి, పరోపకారి, నిగర్వి, కార్యశూరుడు, భల్లూకప్పట్టువాడు, విమర్శకుడు, తార్కికుడు, పరిశోధకుడు, కర్తవ్యదీశ్షాపరుడు, ఆయనది అంతులేని పాండిత్యం, అహంకారం లేని విజ్ఞానం, విసుగులేని పరిశ్రమ, విసృతి లేని పటిమ, కరుడుకట్టిన ఆంధ్రత్వం, కల్తీలేని అభిమానం” అని పండిత గొర్రెపాటి వెంకటసుబ్బయ్యగారు కవిరాజు గుణగణాలను చక్కగా చిత్రించారు.

ఆయన దేశ స్వాతంత్ర్యాన్ని కోరిన దేశభక్తుడు. తెలుగుతేజాన్ని ఘనంగా కీర్తించిన తెలుగుబిడ్డ. మనిషిలో విచక్షణా గుణాన్ని, హేతు దృష్టిని వికసింప చేయడానికి వారు, నీరుపోసి నవమానవతా వాద ఉద్యమాన్ని పెంచి పోషించిన తార్కికుడు.

““శాస్త్రమెల్ల జదివి విజ్ఞానమెరిగి

సంశయింపక సర్వదా చర్చజేసి

నిజమెరుంగ వలయు నిదినేర్వకున్న

మూఢ విశ్వాసమున జేటు మూడుచుండు””

త్రిపురనేనివారి ఉద్యమ సారమంతా ఈ పద్యంలో ఇమిడివున్నది. ఈ విచక్షణా దృష్టిని, ఈ పరిశీలనా దృష్టిని అందరిలో పెంపొందించాలన్నదే ఆయన ఆశయం. ఆయన జీవించి వున్నంతకాలం ఈ ఆశయం కోసమే అహరహం కృషి చేశారు. చరిత్రను, పురాణాలను విమర్శనాదృష్టితో తార్కిక దృష్టితో నిశితంగా పరిశీలించి సత్యాన్ని వెల్లడిస్తూ వచ్చారాయన. మూడు దశాబ్దాలపాటు ఆయన సాగించి, విడిచిపోయిన కృషి ఆయన గతించిన తరువాత స్తబ్దుగా వుండిపోయింది. అంతేకాదు, అతి ఉత్సాహభరితులు, ఆలోచనారహితులు అయిన “వారి అనుయాయులు కొందరు తమ సొంత అభిప్రాయాలను ఆయనకు అంటగట్టి వారి ప్రత్యర్థులకంటే “కవిరాజు'కు ఎక్కువ అపకారం చేశారని" నాగండ్త గురు ప్రసాదరావు గారు అంటున్న మాటలో కొంత నిజం లేకపోలేదు, కవిరాజు రామస్వామి చౌదరి ఉద్యమం భారతదేశమంతటికీ, భారతీయులందరికీ వర్తించే ఉద్యమం. రామమోహనరాయ్‌, ఎం.ఎన్‌.రాయ్‌, వేమన, వీరేశలింగం వంటి వారి కోవకు చెందిన వారాయన.

ఆయనను అలాగేచూడాలి. ఆయన ఉద్యమాన్ని అలాగే పరిగణించాలి. అటు ప్రత్యర్థుల సం(ప్రదాయ బలంవల్ల, ఇటు శిష్యుల విశాల దృష్టిలోపం వల్దా ఆయన తలపెట్టిన ఉద్యమం దెబ్బతినకూడదు. వారి శిష్యులు, ఉద్యమాభిమానులు ముందు చూపుగల వారందరూ కణికో ద్రేకదృష్టితో కాక ఉద్యమ సాఫల్య సాధన దృష్టితో ఉద్యమించి పనిచేయాలి. నట్టికొండ రంగయ్య గారన్నట్లు -

“విష్ణవాత్మక కవిని వెంటనె

వె(ర్రిలోకము గౌరవించున?

నిజము నిలకడ మీద తేలిన

నిన్నె పూజించున్‌”

వారంటున్న ఆ నిజాన్ని నేటి యువతరం గుర్తించగలదని, గుర్తించి ఉద్యమానికి ఊపునివ్వగలదని ఆళిద్దాము!

(13.3.87)

108 సంధియుగం

జక్ష5 2. ఈ. -లఆ౧ లు య ఒకనాడు మదరాసునుండి చిత్తూరు వెళుతున్నాం. (డ్రైవరు దారి మరచి మరోదారిన వెళ్లాడు. ఆ దారిన చిత్తూరు సమీపిస్తుండగా “కట్టుమంచి" గ్రామం పేరు కనిపించింది. ఆది కనిపించగానే నూరేళ్లనాటి చరిత్ర స్పురణకు వచ్చింది. ఆచిన్న గ్రామం ఇద్దరు మహామేధావుల్ని మన దేశానికి అందించింది. భారత జాతీయ కాంగ్రస్‌ అధ్యక్ష పదవిని అలంకరించిన తాలి ఆంధ్రుడు పీ. ఆనందాచార్డు ఆ ఊరిబిడ్డ. కట్టమంచి గ్రామం అందించిన మరో దొడ్డబిడ్డ కట్టమంచి రామలింగారెడ్డి. ఆవూరును చూడగానే ఈరెండు చారిత్రక జ్ఞాపకాలు మనసులో మెదిలాయి. రామలింగారెడ్డిగారు ఒక గొప్ప విద్యావేత్త. ఒక గొప్పు రాజకీయ మేధావి. ఒక సుప్రసిద్ద ఆర్థిక శాస్త్రవేత్త. మంచి రచయిత, కవి, సాహితీ విమర్శకులు. ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండటం చాలా సకృత్తుగా కనిపించే విశేషం. అటువంటి అరుదైన మహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్‌ కట్టుమంచి రామలింగారెడ్డి. ఆయన మంచి సరసుడూ, సహృదయుడూ, సుహృదయుడూను. పందొమ్మిదో శతాబ్ది చివరిపాదం, ఇరవయ్యో శతాబ్ది తొ లిదశకం మనదేళచరి(త్రలో ఒక సంధియుగం వంటిది. చారిత్రక సంధ్యాసమయం అని కూడ అనవచ్చు. రాజకీయంగానూ, సాంఘికంగానూ, సాహిత్యపరంగానూ కూడా ఈమాట వర్తిస్తుంది. దేశ ప్రజలలో అప్పుడప్పుడే పెంపొందుతున్న స్వాతంత్ర్య కాంక్ష పాశ్చాత్య విద్యా ప్రభావం, పెరుగుతూ వచ్చిన రాకపోకల సౌకర్యాలు, సమాచార వితరణ సౌకర్యాలు వంటి చారిత్రక పరిణామాలు ఇందుకు కారణాలు అయి వుండవచ్చు. ఆం(ధ్రదేశానికి సంబంధించినంతవరకు కందుకూరి వీరేశలింగం పంతులు, (త్రిపురనేని రామస్వామి చౌదరి, కట్టమంచి రామలింగారెడ్డి తెలుగు సాహిత్య రంగంలో ఈసంధియుగ ప్రభావానికి ప్రతీకలుగా కనపడుతారు. తరువాత, తరువాత వచ్చిన సాహితీరంగ పరిణామాలకు బీజాలు వేసిన మార్గదర్శకులుగా ఈముగ్గురినీ చెప్పవచ్చు. ఈముగ్గురూ ప్రాచీనకాలపు భాషనే తమ రచనలకు సాధనంగా ఎంచుకున్నారు. అయితే ముగ్గురూ కూడా అధునిక హేతు దృష్టితో కొత్త కొత్త ఆలోచనలను తమ రచనలలో ప్రతిపాదించి (ప్రచారం చేశారు. సి.ఆర్‌:రెడ్డీగారు కళాశాల విద్యార్థిగా ఉండగానే, ఇరవయ్యేళ్ల ప్రాయం రాకముందే జిగువు, బిగువుగల కవిత్వం అల్లి, పెద్దల ప్రశంసలను అందుకొన్న యువమేధావి. వారిమొదటి కవిత “ముసలమ్మ మరణం' కవితా రచన పోటీలో బహుమానం అందుకొన్నదిః ఈ రచన శీర్షికను బట్టి ఒక వయోవృద్దురాలయిన “అవ్వ మరణం” గురించి చేసిన రచన కాబోలునని చదువరులు భ్రమపడే అవకాశం ఉంది. నిజానికి ఈ ' ముసలమ్మమరణం' కథానాయకి అయిన “ముసలమ్మ, ముసలమ్మ కాదు, పేరు మాత్రమే ముసలమ్మ. కొత్తగా కాపురానికొచ్చిన జవరాలు ఆవిడ. తన ఊరివారందరి (శ్రేయస్సు కోసం తనను తాను ఆహుతి చేసుకున్న ఒక సంధియుగం 109

మహాత్యాగమూర్తి. ముసలమ్మ అనే పేరుగల ఆ యువతి రవీంద్రనాథ్‌ టాగోర్‌ నాటకంలోని సుభాషిణి, సుహాసిని, సుకేశిని పాత్రలకు పూర్తిగా భిన్నమైన రూపంలో ఈపాదత్ర మనకు కనిపిస్తుంది. లేనివి ఉన్నట్టు (్రమింపచేసేవి చాగోర్‌ పాత్రలు కాగా ఉన్నది లేనట్టు (భ్రమింప చేసే పాత్ర రెడ్డిగారి ముసలమ్మ.

కవిగా రామలింగారెడ్డిగారు (వ్రాసింది చాలా తక్కువ. తెలుగు సాహిత్యంమీద ఆయన చేసిన విమర్శలు కూడా చాలా పరిమితమైనవే. అయినా సాంప్రదాయక కవిత్వంలో ఆధునిక భావాలను పొందుపరచడంలో ఆయన ఒక మార్గదర్శి అయినారు. తెలుగులో ఆధునిక విమర్శనా (ప్రక్రియకు ఒక ఒరవడి దిద్దినవారాయన. వీరేశలింగం పంతులుగారివలె సాంఘిక దురాచారాలను ఎదిరించడానికి ఆయన యత్నించలేదు. రామస్వామి చౌదరిగారివలె మతమౌఢ్యం మీద అక్షరయుద్దాన్ని ఆయన ప్రకటించలేదు. అయితే, వారివలెనే ఈయన ఆధునిక సామాజిక భావాలను తన కవితలో పొదిగి అందించారు. బహుళ సి.ఆర్‌. రెడ్డిగారు తెలుగు కవిత్వం, తెలుగు విమర్శలు వ్రాయడం యవ్వనదళలోనే విరమించినందువల్ల కావచ్చు, ఆయన మిగతా ఇరువురివలె ఏ తిరుగుబాటుకూ నాయకత్వం వహించలేదనుకోవాలి. అయినా (వ్రాసినకొంచెంలోనే తన భావ ధోరణులను గంభీరంగా చూపించారు. ఇతరుల రచనలకు వ్రాసిన పీఠకలలోనేమి, ఉపన్యాసాలలోనేమి ద్రావిడ ఉద్యమాభిమానిగా ఆయన పొగడతారు.

కేంద్ర సాహిత్య అకాడమీ వారి ప్రేరణతో డ్యక్టర్‌ డి. ఆంజనేయులుగారు డాక్టర్‌ సి.ఆర్‌. రెడ్డిగారిని గురించి వ్రాసిన పుస్తకంలో, ఒక యుగకర్తగా రెడ్డిగారి బహుముఖ ప్రతిభను చక్కగా చిత్రించారు.

ఆయన అంటారు కదా! రెడ్డిగారి పద్యకావ్యం ' ముసలమ్మ మరణం తెలుగు కవిత్వంలో సాంప్రదాయక యుగం నుంచి ఆధునిక యుగంలోకి తిరిగిన ఒక మలుపు అనుకుంటే వారి “కవిత్వ తత్త్వ విచారము" అన్న విమర్శనా (గ్రంథం తెలుగు సాహితీ విమర్శనా (ప్రక్రియలో ఒక (ప్రధానమైన మైలురాయి వంటిది అనవచ్చు, ఆంగ్ల సాహిత్య విమర్శకులలో సిడ్నీ, షెల్లీ, వర్త్‌వర్త్‌, కాగల్రిడ్డి వంటివారి సరసన సి. ఆర్‌.రెడ్డిగారికి పీట వేయవచ్చును. నిజానికి కొందరి దృష్టిలో అయితే రెడ్డిగారిమీద అలెగ్జాండర్‌ పోప్‌, మాత్యూ ఆర్నాల్డ్‌ వంటివారి ప్రభావం కనపడుతుంది”'. స్వల్ప రచనలతో తెలుగు సాహిత్యం మీద అనల్పమైన తన ముద్రను వేసిన రెడ్డిగారి విమర్శనాశక్తిని ఆంజనేయులుగారు చక్కగా అంచనావేశారు.

రామలింగారెడ్డిగారి రచనలన్నిటిలోకి పెద్దది వారి భారత అర్టశా(స్తం. మనదేశపు (ప్రాచీన అర్థిక వ్యవస్టను దీనిలో కూలంకషంగా వివరించారు. నిజానికిది అర్రశా,స్త్ర, గ్రంథం మాత్రమే కాడు. దీనిలో దేశ సాంఘిక ఆచారాలను, సం ప్రదాయాలనూ కూడా వివరంగా పరిశీలించారు. ఈబాడు ప్రాంతీయ భాషలలో విద్యాబోధన చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసమని అన్నిశా(స్తాలనూ ఆయా భాషలలో వ్రాసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెడ్డిగారు ముపష్పయ్యేళ్ల లతవయసులోనే రచించిన ఈ తెలుగు అర్ధశా,స్త్ర, గ్రంధం ఇటువంటి కృషికి ఆనాడే దారిచూపింది అనవచ్చు.

సాహిత్యంలో లాగానే, రాజకీయాలలో కూడా రామలింగారెడ్డిగారు తలదూర్చారే తప్పు, కాలు నిలదొక్కుకొని వుండలేదు. ఆనాటి చెన్నరాష్ట్ర శాసనమండలి సభ్యులుగా ఆయన తమ చతురోక్తులతో కూడిన (ప్రసంగాలతో సభారంజకంగా వ్యవహరించేవారు. జస్టీస్‌ పార్టీలో చేరి 110 సంధియుగం

శాసనసభకు వెళ్లిన రెడ్డిగారు, ఆ పార్టీ విధానాలతో తృప్తివెందక మరికొందరితో కలిసి యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ అనే మరో రాజకీయ పవ్నాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత రాజకీయాలు “దలి కొత్తగా ఏర్పడిన ఆం(్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్ష పదవి స్వీకరించారు. అయిదేళ్ల తరువాత ఆ పదవిని వదులుకొని చిత్తూరు జిల్ఫాబోర్డు అధ్యక్ష పదవిని చేపట్టారు. అంత పెద్ద విద్యావేత్త ఆ చిన్నపదవిని వరించడం ఆళ్చిర్యంగానే కనిపిస్తుంది. మళ్లీ అయిదేళ్ల తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా వెళ్ళారు. అంతటితో రాజకీయాలను పూర్తిగా వదలివేసి

విద్యావేత్తగానే జీవితాంతం కృషిచేశారు. డాక్టర్‌ సి. ఆర్‌. రెడ్డిగారు సాహితీవేత్తగా కంటే విద్యావేత్తగానే మరింత ఎత్తుగా కనిపిస్తారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని భావన చేసి దానికి రూపుదిద్దడంలో దాని తాలి వైస్‌ ఛాన్సలర్‌గా రామలింగారెడ్డిగారి భూమికచారిత్రకమైనది. కొందరి దృష్టిలో తెలుగులోకంటే ఆంగ్రంలో వారి పాండిత్యం చాలా గొప్పది. విద్యావేత్తగా రాణించడానికి ఈ పాండిత్యం, ఈ ప్రతిభ ఆయనకు బాగా ఉపకరించాయి. మన రాష్ట్రంలోనేకాక, నాటి మైసూరు సంస్పానంలో విద్యావ్యవస్టల సువ్యవస్టీకరణకు ఆయనఎంతో దోహదం చేశారు. మైసూరులో ఉండగానే ఆర్టికళాస్త్రంమీద తెలుగులో బృహ(్లంధాన్ని రచించి ఆవిధంగా కూడా మార్గదర్శి అయినారు. 1925నుండి 1930 దాకా ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవస్త్రాపక ఉపాధ్యక్షులుగా ఉన్న రెడ్డిగారు, బ్రిటీష్‌ పాలకుల దమననీతికి నిరసనగా ఆపదవికి రాజీనామా చేశారు. ఆ పదవిలో డాక్టర్‌ సర్వేపల్లి రాధాక్నష్ణగారు నియుక్తులయినారు. 1936లో రాధాకృష్ణన్‌ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి వెళ్లిపోగా

మల్టీ రెడ్డిగారు ఆపదవిని స్వీకరించారు. మొత్తంమీద రెడ్డిగారు ఎక్కువకాలం ఉండి ఎక్కువ కృషి సల్పినది విద్యారంగంలో నే. కనుకనే గొప్ప విద్యావేత్తగానే వారు పేరు ప్రతిష్టలు తెచ్చుకొన్నారు. అయితే వ్రాసింది కొంచెమే

అయినా తెలుగు సాహిత్యం మీద వారి ప్రభావం అనల్పమైనదే. (16.6.90) న్గాగ్గాగ్గా

సంధియుగం 1111

మామిణశేహ్రాణువారు

రౌొనురాను మనలో మేధావుల సంఖ్య తగ్గుతున్నది. ఇది ఎవరి మనసునూ నొప్పించచానికి అంటున్నమాట కాదు. దేశం మొత్తంమీద ఈనాడు కనబడుతున్న సర్వసాధారణమైన లోపం ఇది. మేధావులు అంటే చదువుకున్నవారని నా అరంకాదు. కుయుక్తులతో ఎత్తులకు పైఎత్తులు చేయగలవాళ్ళు అనికూడా నా అభి'ప్రాయంకాదు. దేశ వ్యవహారాలను ముందుచూపుతో, జన (శ్రేయస్సు దృష్ట్యా భవిష్యత్తు పరిణామాలను ఊహించ గలిగి, సొంతంగా ఆలోచించి, మంచిచెడులను విశదంగా చెప్పగలవారినే మేధావులంటారు. గతాన్ని, ప్రస్తుతాన్ని సూత్మ్మంగా పరిశీలించి వాటి ఆర్జ్రాలను, ఆంతరార్జాలను (గ్రహించి చెప్పగల ధీమంతులే మేధావు లనిపించుకుంచారు. అటువంటి ప్రతిభావంతుల సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నది. నూతన భావ ప్రియత్వాన్ని నేరంగా పరిగణించేదాకా మనలో అధికార ఆరాధనా (ప్రీతిపెరుగుతున్నది.

ఈ పరిణామాల దృష్ట్యా చూచినపుడు ఒకనాటి మన మేధావివర్గం ఎంతగా కృశించిపోయిందా అనిపిస్తుంది. మహోపాధ్యాయ మామిడిపూడి వెంకట రంగయ్యవంటి వారి రచనలు చదువుతున్నపుడు నేటి తరంవారిలో ఈలోపం కొట్టువచ్చినట్టు కనపడుతుంది. మామిడిపూడివారు రాజనీతి శాస్త్ర, పారంగతులే కాదు, ఆర్టిక శాస్త్రపు లోతుపాతులను కూలంకషంగా ఆకళింపుచేసుకున్నావారాయన. అంతేకాదు, ఆయన గొప్ప చరి[త్రకారుడు. రాజనీతి, అర్ధశాస్త్రం, చరిత్ర రచనలలో ఎవరినీ. ఆనుకరించక, స్వకీయ భాష్యాలు చెప్పినవారాయన.

ఏడువందల సంవత్సరాలపాటు ముస్లింలు, ఆ తరువాత రెండు వందల ఏళ్ళపాటు తెల్లవాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలించారు. ఇందువల్ల మరి రెండు కొత్త మతాలు మన దేశింలో వ్యాపించాయి. ఒకేమతం, ఒకే భాష్క ఒకే గడ్డ (భూభాగం), ఒకే సంస్కృతి కలవారంతా ఒక జాతిగా ఏర్పడతారన్నది ప్రాచీన నిర్వచనం. ఈ పాత నిర్వచనం ప్రకారం అయితే మనది ఒకే జాతీయత కాజాలదు. కాని ఆధునిక రాజకీయ నిర్వచనం ప్రకారం ఒకే దేశంలో నివసిస్తూ ఒకే రకిం ప్రయోజనాలు కలిగిన ప్రజలు భిన్నమతాలు అవలంబించినా, విభిన్న భాషలు మాట్టాడేవారైనా, ఆచారాలు వేరైనా ఒకే పాలన క్రింద వున్నప్పుడు వారిలో జాతీయత ఏర్పడి ఒక జాతిగా మనగలగవచ్చు. అనేకదేశాలలో ఈనాటి వాస్తవాలు దీనిని నిరూపిస్తున్నాయి. ఇటువంటి జాతీయతను ' బహుళ జాతీయత'* అనవచ్చునంటారు మామిడిపూడివారు.

అయితే మన సమాజంనంటి సమాజంలో వేరూనుకొని వున్న కులవ్యవస్త, కొత్తగా పెంపొందుతున్న భాషా దురభిమానం, 'ప్రాంతీయతత్వం, భారతజాతీయతా సిద్దాంతానికి (ప్రమాదకరమైన అంశాలవుతున్నవి. ఒక ప్రాంతంలో వున్న ఒక భాషీయులు, (ప్రపంచంలో ఎక్కడెక్కడున్న ఆ భాషీయులంతా తమవారేనని, వారి ప్రయోజనాల సంరక్షణ తమ బాధ్యత అని భావించుకునే భాషాతత్వం జాతీయతకు ప్రమాదకరమైనదని ఆచార్య వెంకట రంగయ్యగారు భావించారు. అలాగే ఒకదేశంలోని ఆయా ప్రాంతాలవారు, ఇతర (ప్రాంతాలవారిని పరాయివారుగానో, తమకు (ప్రమాదకరమైన విరోధవర్గంగానో భావించుకొనడం జాతీయతకు 112 సంధియుగం

మరొక ప్రమాదమని ఆయన హెచ్చరించారు. పరిపాలించే వారిలో విశాల జాతీయతత్వం లోపించినందువల్ల ఈ (ప్రాంతీయ భాషాభిమానాలు ప్రకోపించి, ప్రజ్వరిల్హుతుంచాయని చెప్పి, ఈ అనర్జాలకు మూలకారణాలను కూడా ఆయన వివరించారు. కౌటిల్యుడు తిరిగివస్తే ఏమి చేస్తాడు అనే విషయం గురించి జ్యోతిషం చెప్పవలసిందిగా ఒకసారి ఆయనను కొందరు కోరారు. తనకు జ్యోతిషం రాకపోయినా, గతజన్మలో కౌటిల్యుడు ఏమిచేశాడో తెలుసుకొని, దానినిబట్టి అతడీ జన్మలో ఏమిచేస్తాడో ఊహించవచ్చునని అంటూ, ఆయన వారి ప్రళ్నకు చెప్పిన జవాబులో తనను కొత్త కౌటిల్యుని స్థానంలో పెట్టుకొని, నేటి రాజకీయ, ఆర్థిక వ్యవప్ట ఎలా వుంటే మంచిదని ఆయన భావిస్తున్నారో వివరించారు. మామిడిపూడివారి అభిప్రాయాలతో అంగీకరించనివారు కూడా చదివితీరవలసిన ఆధునిక రాజకీయ, అర్టిక విశ్లేషణ వారి రచనలలో వున్నది. కాలంలోకి ముందుకు చూడగల ఉపజ, గతాన్ని, ప్రస్తుతాన్ని ఆదారం చేసుకొని భవిష్యత్తుకు రూపకల్పన చేయగల ప్రతిభా వ్యత్పత్తులు ఆయన రచనలలో మనకు కనిపిస్తాయి. కౌటిల్యుని కౌళల్యాన్ని విస్మరించి, కాటిల్యాన్ని మాత్రమే స్వీకరించే ధోరణి (ప్రబులుతున్న నేటికాలంలో ఆలోచనాపరుల ఆలోచనలకు పదునుపెట్టుగల ఆలోచనాపద్దతి మామిడిపూడివారి రచనలలో మనకు కనిపిస్తుంది. ఈనాటి. రాజకీయ, ఆర్దిక, పారిశ్రామిక రంగాలలో నాయకత్వం వహించేవారు (గ్రహించవలసిన అనేక ఆధునిక ధర్మాలను, విధులను, అ'ప్రమత్తతలను ఆయన సూచించారు. ఈనాటి అనేక రుగ్మతలకు సామ్యవాదం ఒక్కటే విరుగుడని కూడా ఆయన ఒకచోట అంటారు. రాజ్యాలకోసం రాజులు చేసిన యుద్దాలు, రాజుల భోగలాలస వృత్తాంతాలు వీటినే మనకు దేశ చరిత్రగా ఇంతవరకు అందించడం జరుగుతున్నది. చరిత్ర అంటే 'సర్వరంగాల సమగ్ర చిత్రణ" అని నిర్వచిస్తూ వెంకటు రంగయ్యగారు అంటారుకదా: “ప్రతి భాషలోను వాబ్మయాన్ని రెండు శాఖలుగా విభాగం చేయవచ్చు. విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే రచనలు మొదటిశాఖలో చేరినవి. శాస్త్ర, గ్రంధాలు ఇలాటివి. చెప్పవలసిన విషయానికంచే, చెప్పేరీతికి ఎక్కువ ప్రాధాన్యం కల్పించే రచనలు రెండోశాఖలో చేరినవి. భావం, రసం, శైలి, మాటల పాందిక- ఈలాటే వాటికి రెండవ శాఖలో చేరిన (గ్రంథాలలో ఎక్కువ ప్రాధాన్యం, సాహిత్య వాజ్బయం అన్ని చెప్పబడే కావ్యాలు, నాటకాలు మొదలైనవి ఈ శాఖలోనివి, చరిత్ర గ్రంథాలలో వివరించవలసిన విషయానికి ఎక్కువ (ప్రాధాన్యం అవసరం కావడంచేత అవి మొదటిశాఖలో చేర్చదగినవి. ఇలా ఆయన సాహిత్య నిర్వచనంచేస్తూ, దాదాపు ఒక ఛతాబ్లిగా వచ్చిన తెలుగు రచనలలో రెండవ శాఖలోనే అభివృద్ది ఎక్కువగా వున్నదని చరిత్ర, శాస్త్ర (గ్రంథాల రచన అంతగా వృద్రిచెందలేదని బాధపడ్డారు. నిజమే. ఈ కాలంలో పద్య, గద్య కావ్యాలు, గేయాలు, నవలలు, కథలు, నాటకాలు, నాటికలు వంటివి పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి. కాని చారిత్రక రచనలు అంతగారాలేదు. కొమ'ర్రాజు లక్మణరావు, చిలుకూరు వీరభద్రరావు చారిత్రక రచనలకు పూనుకున్న వారిలో ప్రధానంగా చెప్పదగినవారు. ఆ తరువాత మారేమండ రామారావు, కొడాలి లక్ష్మీనారాయణ వంటి మరి పదిపన్నెండు మంది మాత్రమే తెలుగులో ఇటువంటి రచనలు చేశారు. ఈ (వ్రాస్తున్న వారిలో కూడా కొందరు పాతపద్రతుల నుంచి పూర్తిగా బయటపడ లేకున్నారు. కనుకనే సమగ్ర ఆధునిక చారిత్రక రచనా పద్దతుల ఆవశ్యకత గురించి వెంకట రంగయ్యగారు పదేపదే చెబుతూ వచ్చారు. ఇది ఈతరం రచయితలు జౌదలదాల్బదగిన ఉపదేశం, (11.10.45) సంధియుగం 113

ట్‌జవాడ గోపాలరెడ్డిగారు భూగోళంవంటివారు. పూర్వార్ధగోళం, పశ్చిమార్హ గోళం అంటూ భూగోళం రెండు అర్హ గోళాలుగా వుంటుంది. ఈ రెండు అర్హగోళాలను కలిపి చూచినప్పుడు సంప్యూర్ణ (ప్రపంచ పటం మనకు కనపడుతుంది. ఆలానే గోపాలరెడ్డిగారిలో రెండు అర్ధభాగాలు మనకు కనపడతాయి. ఒకటి రాజకీయార్టగోళం, రెండవది సాహిత్యార్ధ గోళం. ఆయన జీవిత క్రమంలో ఈ రెండు అర్ధ భాగాలను కలిసి చూచినప్పుడు గోపాలరెడ్డిగారి సమగ్ర వ్యక్తిత్వం మన కంటెదుట సాకాత్కరిస్తుంది.

గోపాలరెడ్డిగారు 1907 ఆగస్టు 5న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించారు. ఆయన అక్కడ (ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన తరువాత బందరు జాతీయ కళాశాలలోనూ, ఆ తరువాత రవీంద్రనాథ్‌ టాగోర్‌ వద్ద శాంతినికేతన్‌లోను చదువుకున్నారు. ఈ చదువులు సాగిన తీరు ఆయన భావి జీవితాన్ని తీర్చిదిద్రింది. ఉగ్గుబాలతో అబ్బిన నెల్లూరు నుడికారం, స్వగ్రామంలో చదివిన (ప్రాథమిక చదువులలో రూఢి అయింది. ఆ తరువాత బందరు జాతీయ కళాశాల చదువులు ఆయనలో దేళభిక్తిని, జాతీయ భావాలను (పేరేపించి, పెంపొందించగా, శాంతినికేతన్‌ చదువులు గోపాలరెడ్డిగారిలో సాహిత్య ఫిపాసను, లలిత కళానురక్తిని విశ్వజనీన దృష్టినీ పెంచి పోషించాయి. ఇలా బాల, యౌవన దళలలోనే ఆయన జీవన గమనం రెండు సమానాంతర రేఖలమీద సాగడం (ప్రారంభమైంది.

రాజకీయాలలో గాంధీజీ, సాహిత్య సంగీతాది లలిత కళలలో రవికవి ఆయనకు మార్గదర్శకులైనారు. జాతీయ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని పలుమారులు కారాగార వాసం చేసి అక్కడనే రాజాజీ రాజకీయ చతురతను, పట్టాభిగారి ఆర్టిక పాండిత్యాన్ని గమనించి, వారిరువురికీ అనుంగు అనుయాయి అయినారు. పట్టుమని మూడు పదుల వయసయినా నిండకముందే నాయకుడై మంత్రి పదవులు చేపట్టిన గోపాలరెడ్డిగారు మదరాసు, కర్నూలు, హైదరాబాదు, ఢిల్లీలలో 186 మాసాలపాటు వివిధ స్థాయిలలో రాష్ట్ర కేంద్ర మం (త్రి పదవులు, ముఖ్యమంత్రి పదవి నిర్వహించి, ఆ తరువాత అయిదేళ్ళ పైచిలుకు కాలం ఉత్తర(ప్రదేళ్‌ గవర్నరుగా ఉద్యోగ పర్వంలో గడిపారు.

రాజకీయాలలో ఆయన వలెగెలుపు, ఓటములను ఒకేలాగ స్వీకరించగలిగిన నాయకులు చాలా అరుదుగా వుంచారు. కర్నూలులో ముఖ్యమంత్రి పదవిని గెలిచినప్పుడు ఎలా హాయిగా చిరునవ్వుతో విజయాన్ని స్వీకరించారో, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి సంజీవనరెడ్డిగారి చేతిలో ఓడినప్పుడు కూడా ఆ ఓటమిని అదే చిరునవ్వుతో చిద్విలాపంగా స్వీకరించి తన ప్రత్యర్థిని మనసారా అభినందించారు. అంతేకాదు, సంజీవరెడ్డిగారు అడిగినంతనే ఆయన మంత్రివర్గంలో చాలా స్పోర్షివ్‌గా చేరారు. రాజకీయ రంగంలో ఈ రకమైన సరసజ్ఞత చాలా అరుదుగా కనిపిస్తుంది. శాంతి నికేతన్‌ అంతేవాసిత్వం ఆయనలో ఈ ధీరోదాత్త లక్షణాన్ని పెంపొందించి వుండాలి.

రాజకీయాలలో ఒకవైపు క్రిందూ, మీదూ అవుతూనే, మరొకవైపు సాహిత్యం, 114 సంధియుగం

సంగీతం, చిత్రలేఖనం వంటి లలిత కళల పట్లు ఆసక్తిని, వ్యామోహాన్ని సమానాంతరంగా పెంచుకుంటూ వచ్చిన ద్వంద్వ వ్యక్తిత్వం అయినది. 1946 నుంచి తెలుగు భాషా సమితి అధ్యక్షులుగా, 1957లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ఏర్పడినప్పటి నుంచి 1982 వరకు దాని అధ్యక్షులుగాను, 1978 నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వాహక సభ్యులుగాను, 1963 నుంచి ఎనిమిదేళ్లపాటు జ్ఞానపీఠం అధ్యక్షులుగాను, భాషా సాహిత్యాలకు ఆయన ఎంతో దోహదంచేశారు. రవీంద్రనాథ్‌ టాగోర్‌లోని విశ్వజనీన దృష్టి గోపాల రెడ్డిగారిని గొప్పగా ఆకర్షించింది. అందుకే రవికవిని ఆయన తన గురువుగా పరిగణించుకొంటారు. ఆ గురుభక్తి వల్లను, రవికని సాహిత్య అనురక్తివల్లను, రవీంద్రుని నాటికలు, కథలు, కల్పికలు, కవిత్వం వగైరా మొత్తం పది రచనలను తెలుగులోకి అనువదించారు. గోపాలరెడ్డిగారు బహు భాషావిదుడు. ఉర్వూ, పర్షియన్‌, బెంగాలీ, మరాతీ వంటి భాషలను పట్టుపట్టి నేర్చుకున్నారు. గాలిబ్‌, ఇక్బాల్‌ వంటి మహాకవుల రచనలను కూడా కొన్నిటిని తెలుగులోకి అనువదించారు. ఈ అనువాద సాహిత్యమంతా ఒక ఎత్తు. తన 70వ ఏట మొదలు పెట్టి పుంఖానుపుంఖాలుగా (వ్రాసివేస్తున్న సొంత కవిత్వం మరొక ఎత్తు. అనువాదాలతో ప్రారంభమై, అనుకరణలగుండా సాగిన గోపాలరెడ్డిగారి సాహితీ వ్యవసాయం 1977లో అంటే ఆయన డెబ్బయో ఏట ఒకకొత్త మలుఫపుతిరిగింది. వారి సాహితీ పర్వంలో ఇది చాలా ముఖ్యమైన మలుపు, అనువాదాలు మానివేసి సొంత కవితా సృష్టికీ పూనుకున్నారు. యాభైయ్యేళ్ల రాజకీయ, సాంఘిక జీవితానుభవం ఆయన కవిత్వానికి మూలనిధి వంటిది. కనుకనే ఆయన రచనలో భాష కంటె భావం బలంగా కనపడుతుంది. 1978 ఫిబ్రవరిలో ఆయన తొలిస్వీయ కవితా సంపుటి '' ఆమె'' వెలువడింది. ఆతరువాతమరి నాలుగు సంపుటాలు - ఆమె జాడలు, ఆమె నీడలు, ఆమె తళకులు, ఆమె చెణుకులు వెలువడ్డాయి. ఆయన సృష్టించిన ఈ “ఆమె” పంచకం తెలుగు సాహిత్య లోకంలో ఒక సంచలనాన్ని సృష్టించింది. మునిమాణిక్యంగారి ''కాంతం””, కృష్ణశాస్త్రిగారి “ ఊర్వశి” వగైరా తెలుగు కవితా నాయికల సోయగాలకు అలవాటుపడిన తెలుగు సాహితీ కుటుంబంలోకి గోపాలరెడ్డిగారు, ఒక పర సం(ప్రదాయంలో నుంచి పట్టుకొచ్చి పెట్టిన ఒక సరికొత్త కోడలు ఈ “ఆమె”. ఈ కొత్త కోడలు వచ్చినప్పటి నుంచీ తెలుగు కవితా కుటుంబీకులలో రకరకాల గుసగుసలు, మళ్లగుల్దాలు సాగుతున్నాయి. ఈ కొత్త '“ఆమె”* మనమెరిగిన తెలుగు *' ప్రేయతమ”' వంటిదికాదు. మనకు తెలిసిన తలుగు “ప్రియురాలు” ఎప్పుడూ ప్రియుడి కోసం విరహ బాధ అనుభవిస్తూ వుంటుంది. కాగా, గోపాలరెడ్డిగారు సృష్టించిన '“ ఆమో” అలవోకగా అందరినీ అలరించే అలివేణి. ఈ ''ఆమె”కు ఏ ఒక్క (ప్రేమికుడి మీదా (ప్రత్యేక అనురాగం వుండదు. “ఆమో” దృష్టిలో ప్రియులంతా ఒకటే. ఒకడిని చూసి మరొకడిని ఏడిపించడం ఆమెకు సరదా. ఆమె” పంచకాన్ని సమీక్షిస్తూ డి. రామలింగంగారన్నట్టు “ ఉర్జూకవిత్వవినూత్న వాతావరణాన్ని తెలుగులో ప్రవేళపెట్టుడానికి (గోపాలరెడ్డిగారు) చేసిన ఒక ప్రయత్నంలో ఆరంభమైన "ఆమె పురాణం", క్రమంగా స్వతంత్ర భావాలతో అలరారి, “ఆమె అనే కొత్త కావ్యనాయిక ఆధునిక తెలుగు కవిత్వంలో అవతరించింది”. ఇది గోపాలరెడ్డిగారు తెలుగు కవితా లోకానికి అందించిన సరికొత్త కానుక ఈ '"ఆమె”” ఎవరు? గోపాలరెడ్డిగారిని గురించి వారి, సంధియుగం 115

వారికిగల భావాలను బట్టి ఈ “ఆమె” ఎవరో ఆరా తీయడానికి పలువురు ప్రయత్నిస్తున్నారు. పలు చర్చలు జరుపుతున్నారు. ఈ ఆరాలు, చర్చలే గోపాలరెడ్డిగారి సాంత కవితల ప్రాముఖ్యాన్ని వెల్లడిస్తున్నాయి. కాని, ఈ (ప్రయత్నాలు వృథా ప్రయాసేనేమో! ఎందుకంటే, ఈ 'ఆమోను ఇదమిత్రంగా నిర్వచించడం సాధ్యం కాక పోవచ్చు. ఆయనలో చిరకాలంగా గూడుకట్టుకొని పున్న అనేకానేక భావాలకు కవితా రూపం 'ఆమె. "ఈ ఆమె ఒక ఆమె కాదు. అనేక ఆమెలు కలిసి రూపొందిన ఆమె... ఆమె అంటే (స్త్రీ కావచ్చు, (ప్రేయసి కావచ్చు, చెలి కావచ్చు, ప్రకృతి కావచ్చు, సర్వాన్ని ఆవరించే మాట ఆమె” అని గోపాలరెడ్డిగారు ఈ '*“ఆమె”ను గురించి చెబుతున్నారు.

“ఆమె*” రూపురేఖలను (గ్రంథకర్త తన భావ విహారాన్ని బట్టి మనకు చూపుతారు. అంతేకాని పిన్‌కోడ్‌తో సహా '*“ఆమె** చిరునామా కావాలని అడిగితే గోపాలరెడ్డిగారు కూడా ఇవ్వలేరు. కాని ఒక పద్యంలో '' ఆమో” (ప్రాముఖ్యాన్ని కవి ఇలా చెబుతారు. **ఆమె స్మరణ స్వరమాలికలే నా మూగ మురళిని పలికించాయి. కొత్త భావాలు అంకురించాయి. కొత్త సాహిత్య మొక్కలు తొడిగింది. కొత్త కవిత్వం వికసించింది. ఆమె లేకనా వాణి లేదు?' ఇంతకన్నా వివరాలు చెప్పమని '' ఆమె” సృష్టికర్తను అడగడం పాడి కాదు. ''ఆమె పంచకం కాక మరో ఏడు కవితా సంపుటాలను ఆయన ఇప్పటికే వెలువరించారు. ఏడేళ్ళ స్వల్ప కాలంలో ఇంత వేగంగా ఇన్ని కవితలల్లినవారు, అందునా డెబ్బయో పడిలో వుండి, ఇంత భావావేశంతో కవన మళల్లినవారు చాలాకొద్దిమందే వుంచారు.

అయితే, ఆయన నాడిన భాషమీద పలువురు పలురకాల అభి(ప్రాయాలను వెల్లడిస్తున్నారు. ““మీ కవిత్వం బాగున్నది, అచ్చువేయించండి, మీరు కవి** అని గోపాలరెడ్డిగారి కవిత్వాన్ని మెచ్చుకొంటూ కృష్ణశాస్త్రి, గారు వ్రాయడం నేను చూచాను. 'ఆయనకు తెలుగు రాదు, అది కవిత్వమూ కాదు* అని మరో ప్రముఖ కవి అనడం కూడా విన్నాను. కాని, ఈనాడు ఎవరి భాషను మరొకరు తప్పుపట్టుడానికి వీలు లేదు. ఒకరి భాషఇంకొకరికి నచ్చకపోతే అది వేరే విషయం. తెలుగు కవులు గ్రాంథిక భాషను వదలి వ్యావహారిక భాషను అటుపైన జన భాషను ఉపయోగించడం ్రారంభమైనస్పుటి నుంచి, (ప్రతి కొత్త భాషారీతి మీద ఇటువంటి విమర్శ తత్పూర్వీకుల నుంచి వినవస్తున్నదే. ఆరుద్రగారు ఒక సందర్భంలో అన్నట్టు ““ఆధునికమన్నమాట ఎప్పుడూ సాపేక్షం. పదమూడో శతాబ్దంలో పాల్కురికి సోమనాధుడు అధునికుడు. అలాగే (క్రీనాథుడూ, దిగంబర కవులూ, విప్లవ కవులు రేపటికి పాతబడిపోతారు*” కనుక గోపాలరెడ్డిగారి నెల్లూరి సుడికారం ఈవేళ నచ్చనివారికి రేపు పాతబడి గొప్పదిగా కనిపించవచ్చు. ఆరుద్రగారి “త్వమేవాహమ్‌”' ఒక మంచి ఉదాహరణ. అది వచ్చిన కొత్తల్గో ఆరుద్రగారికి తెలుగు రాదు, కవిత్వం రాదు అన్నవారే ఇప్పుడు ఆ రచన గొప్పతనాన్ని నేనోళ్ళ మెచ్చుకొంటున్నారు. అలానే గోపాలరెడ్డిగారి కవిత్వం కూడా మరికొంత కాలానికి కాని మనకు జీర్దం కాకపోవచ్చు.

గోపాలరెడ్డిగారి సాహితీ వాల్లభ్యం రెండు అర్జ్రాల రీత్యాను సార్రకమైనదే. పూర్వ కవులు “+ వాల్లభ్యం'' ఆనే మాటను సాహితీ పోషణ అనే అర్ధంలో ఉపయోగించేవారు. శాసించేవాడు, పోషించేవాడు- ఇద్దరినీ వల్లభుడే అంచారు. గోపాలరెడ్డిగారు తన కవిత్వాన్ని ఒక సాంత పంథాలో శాసించుకొంటున్నారు. మరో పక్క విశ్వనాధవంటివారిచేత '' సాహితీ బంధువు”* అన్న ప్రశంస పొందినవారు. కనుక గోపాలరెడ్డిగారి సాహితీ వాల్లభ్యం ఉభయత్రా సార్ధకమైనదే. ఏమైనా, తెలుగు కవితా కుటుంబంలో ఆయన ప్రవేశపెట్టిన ఈ కొత్త 'ఆమె” తన ప్రత్యేకతను బహుకాలం నిలుపుకొంటుందని చెప్పవచ్చు. (13.12.85) 116 సంధియుగం

వుబ్లాద బ్రద్పస్తుంమా[ూరా

జోౌొతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, బహుభాషాకోవిదుడు "పద్మభూషణ్‌

డాక్టర్‌ మోటూరి సత్యనారాయణగారు జాతీయ రాజకీయరంగంలోనూ, సాహిత్య, చరిత్ర, తత్వపరిశోధన రంగాలలోను నిరుపమానమైన కృషి చేశారు. ఆఖరిక్షణం వరకు ఆయన మనదేశ సమైక్యత గురించి, చరిత్ర ప్రాముఖ్యాన్ని గురించి, తెలుగుభాషా సంస్కృతుల ప్రాశస్త్యాన్ని గురించి ఎన్నో ఆలోచనలు చేస్తుండేవారు. డాక్టర్‌ మోటూరి సత్యనారాయణ 1921 నుంచి1942 నాటి “క్విట్‌ఇండియా” పోరాటం వరకు అన్నిజాతీయ స్వాతం త్ర్య ఉద్యమాలలో పాల్గొని పలుమౌర్జు కారాగారవాసం చేశారు. అరోజులలోనే ఆయనకు గాంధీజీ, జవాహర్‌లాల్‌ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్‌, సత్యమూర్తి, రాజాజీవంటి నాటి మేటి నాయకులతో సాన్నిహిత్యం ఏర్పడింది. నిజానికి మేధాళక్తిలోనేమి, ముందుచూపులోనేమి, దేశభక్తిలోనేమి ఈయన వారెవరికీ తీసిపోరు.

ఒకవైపున దేళ స్వాతంత్ర్యం కోసం సత్యాగ్రహ సమరాలుసాగిస్తూనే, బాపు నిర్దేశించిన నిర్మాణ కార్యక్రమంలో భాగంగా సత్యనారాయణగారు దక్షిణ భారతావనిలో హిందీభాషా వ్యాప్తికి అద్వితీయమైన కృషిచేసి బాపూజీ, రాజన్‌ బాబుల మన్ననలు పాందారు. దక్షిణ భారత హిందీ ప్రవారసభ నిర్మాణ, విస్తరణలకోసం మోటూరి వారు చే సినకృషి చిరస్మరణీయమైనది. చెన్నపురిలో త్యాగరాయ నగరులో, ఠీవీగా నిలిచి ఉన్న దక్షిణభారత హిందీ (ప్రచారసభ భవనాల సముదాయం సత్యనారాయణగారి స్పృతికి శాశ్వత చిహ్నాలుగా ఉండిపోతాయి. దేశానికి స్వాతం(త్ర్యం వచ్చిన తరువాత స్వతంత్ర భారత రాజ్యాంగ రచనకు ఏర్పాటయిన రాజ్యాంగ చట్టనిర్మాణసభలో మోటూరివారు ఒక (ప్రముఖ సభ్యులుగా ఉండి అన్ని చర్చలలో చురుకుగా పాల్గోన్నారు. దేళంలో 1650 పై చిలుకుభాషలు మాటాడే ప్రజల ప్రతినిధులు 299 మంది ఈ సభలో మూడు సంవత్సరాలపాటు సుద్వీర్రముయిన, విపులమయిన చర్చలు జరిపీ ఒక ముసాయిదాను రూపొందించారు. డాక్టర్‌ సత్యనారాయణగారు పూనికవహించి, నెహ్రూజీని ఒప్పించి, దేళంలో ప్రధాన ప్రాంతీయ భాషలను చట్టరీత్యా అధికారభాషలుగా గుర్తించి, రాజ్యాంగచట్టుంలో వాటిని పొందుపరిచారు. “ఎనిమిదవ షెడ్యూల్‌ లో 15 భాషలను అనాడు చేర్చారు. ఇందుకు మోటూరివారి కృషి (ప్రధానంగా తోడ్పడింది. భారతదేశ ప్రాంతీయభాషలకు మోటూరివారివల్ల చేకూరిన, శాశ్వతమైన గొప్ప ప్రయోజనమిది. రాజ్యాంగసభముసాయిదా రాజ్యాంగాన్ని ఆమోదించడం, 1951 జనవరి26వతేదీన మనదేశం సర్వసత్తాక స్వతంత్ర ప్రజాతంత్ర రాజ్యాంగంగా అవతరించడం అప్పటిచరి'త్ర,

ఆ తరువాత రెండేళ్లపాటు అమలులో ఉన్న తాలి తాత్కాలిక పార్లమెంటులో మాడా సత్యనారాయణగారు సభ్యులుగా ఉన్నారు. అటుపిమ్మట 1952 నుంచి 54 దొకా అవిభక్త చెన్న రాష్ట్ర విధానపరెత్తు (లెజిస్టేటీవ్‌ కౌన్సిల్‌) సభ్యులుగానూ, 1954 నుంచి 66 దాకా, పన్నెండేంళ్లపాటు రాజ్యసభ సభ్యులుగా ఉండి పలు జాతీయ అంతర్జాతీయ సమస్యలపై అమూల్యమైన సలహాలూ, సూచనలూ చేశారు. రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్‌ చేసిన తొలి సంధియుగం 117

తెలుగుపెద్ద మోటూరి సత్యనారాయణగారు. నిజానికి ఇప్పటివరకూ మళ్ళీ ఈగౌరవం మరే తెలుగువ్యక్తికీ లభించలేదు. తెలుగు రైతులపాలిటి వర(షప్రసాదంవంటి నాగార్జున సాగర్‌ ప్రాజెక్టును సాధించడంలో విశేషమైన కృషి సలిపిన కొద్దిమంది తెలుగు నాయకులలో సత్యనారాయణ ముఖ్యులు. ప్రఖ్యాత ఇంజనీరు డాక్టర్‌ కె.ఎల్‌. రావుతో కలిసి వీరు ఈ పధకం ప్రాముఖ్యాన్ని, దానివల్ల ఆం(ధ్రదేశానికి చేకూరగల ప్రయోజనాలను గురించి దినపత్రికల ద్వారా విసృత (ప్రచారం గావించి, (ప్రజాభిప్రాయాన్ని సమీకరించి, సాగించిన వీరి ఉద్యమం ఫలితంగా 1954లో నాగార్జున సాగర్‌ నిర్మాణానికి శంకుస్థాషన జరిగింది. (ఈ ఉద్యమంలో ముత్యాలరాజా చిరుమామిళ్ల ప్రసాద్‌, ఆచార్య రంగా, వావిలాల గోపాలకృష్ణయ్య, కోనూరి కన్నయ్య. పతకమూరి అంతయ్యవంటి పెద్దల కృషిని కూడా జ్ఞాపకం చేసుకోవడం అవసరం). డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డిగారు అధ్యక్షులుగా, డాక్టర్‌ మౌటూరి సత్యనారాయణగారు గౌరవకార్యదర్శిగా 1946లో మదరాసులో ఏర్పడిన తెలుగు భాష్లాసమితి 16 సంపుటాలు తెలుగు విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించి తెలుగుజాతికి మహోపకారం చేసింది. ఈ సంప్టకు సత్యనారాయణగారు వెన్నెముకలాంటివారు. మల్లంపల్లి సోమశేఖర శర్మ, డాక్టర్‌ గిడుగు సీతాపతివంటి. పండితుల సహకారం ఈ కృషిలో వారికి పుష్కలంగా లభించింది. సత్యనారాయణగారు ఇదేపద్దతిలోహిందీ విజ్ఞాన సర్వస్వం కూడా ప్రారంభించి మూడు నాలుగు సంపుటాలు వెలువరించారు. ఈ కృషిలో యార్లగడ్డ ఆంజనేయులు వీరికి కుడి భుజంలాగా పనిచేశారు. తెలుగు, హిందీ, ఇంగ్రీషు భాషలలో మంచిపాండిత్యం గలమోటూరివారు ఈ మూడు భాషలలో పలువిషయాలపై అనేకానేక రచనలు చేశారు. చరిత్ర పరిశీలన, తాత్విక విశ్లేషణ, భాషా శాస్త్ర, అనుశీలన వారికి అభిమాన విషయాలు. వారి రచనలలో స్వతం(త్ర విశ్లేషణ, సాంతపరిశీలనాభివేశం దండిగా కనపడతాయి. వారు ్రాసీ ప్రచురణకాని “కాంచీపుర మండలం, “భౌతికవిజ్ఞాన సాంకేతికవికాసంవలెనే మనోవిజ్ఞాన వికాసం అవళ్యకత* వంటి వ్యాసాలు వీరి సునిశిత మేధాళక్తికి, చరిత్ర అవగాహనకూ దృస్ట్రెంతాలు, అలాగే తమిళమహా వేదం 'తిరుక్కురళ్‌ గురించి మోటూరివారు (వ్రాసీన త్రిసూత్ర భాష్యం వారి ప్రతిభా వ్యుత్చత్తులకు అద్దంపడుతుంది. ఆయన 'క్విట్‌ఇండియా' ఉద్యమ స్వర్గోత్సవాల సందర్భంలో ఒక ఆంగ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'క్విట్‌సిటీస్‌' (నగరాలు వదలి పల్లెలకు తరలండి) అన్న ఒక సరికొత్త నినాదం ఇచ్చారు. ఇది ఎంతో ముందాలోచనతో చెప్పినమాట. ఈనినాదం నేటితరానికీ, భావితరాలకు 'మోటూరివారు ఇచ్చిన గొప్ప అంతిమ సందేశం అనవచ్చు. మోటూరి సత్యనారాయణ కృష్ణజిల్లా దొండపాడు గ్రామంలో 1902లో జన్మించారు. బందరు జాతీయ కళాశాలలో చదువుకొన్నారు. హిందీభాషలో డి. లిట్‌ (సాహిత్య వాచసృతి) పట్టుం పుచ్చుకున్నారు. భారతప్రభుత్వం 1958లో “పద్మశ్రీ” 1961లో “పద్మభూషణ్‌ 1972లో '“తామ్రపత్రం' ఇచ్చి గౌరవించింది. ఇంకా ఇతరత్రా అనేక సత్కారాలందుకున్నారు. పండిన మనస్సుగల ఈపండితుడు 93 సంవత్సరాల పండువయస్సులో 1995 మార్చి 6వ తేదీన అడయారు (మదరాసు) లో వారి స్వగృహంలో అనాయాసమరణం పొంది మనను విడిచి వెళ్ళిపొయారు. వారి జీవితం ఒక సఫలకావ్యం. (11.3.95) 118 సంధియుగం

వుదరాసులో తెలుగువారికి తలలో నాలుకలా మెదిలేవడాయన. రోగనిర్భయంలో మేటి అని పేరుతెచ్చుకున్న ప్రసిద్దవైద్యుడాయన. వైద్యశాస్త్రాన్ని తెలుగులో పండు ఒలిచి పెట్టినట్టు అందరికీ అర్హమయ్యేలాగ (వ్రాసిపెట్టిన వాడాయన. నాటకరచనలో చేయితిరిగిన వాడాయన. నాటక కళకు వ్యక్తిగతంగా ఆయన చేసినంతసేవ చేసిన వారు తెలుగుదేశంలో బహుకొద్ది మందే ఉంటారు. అన్నిటినిమించి సహృదయుడు, సుహృదయుడు డాక్టర్‌ గాలిబాలసుందరరావు. లోపల ఒకమాట, పైకొక మాట ఎరుగని అరమరికలులేని మనసు ఆయనది. మదరాసులో ఇప్పుడున్న తెలుగువారేమి ఇదివరకు ఉండిన తెలుగువారేమి, దాదాపు ఎవర్‌నైనా అడగండి, ''ఆయన మా కుటుంబానికి ఆప్పుడు, ఆత్మీయుడైన వైద్యుడు” అని చెప్పని వారుండరు. కొన్నాళ్ళు రాయపేట ఆస్పత్రిలో పనిచేసిన తరువాత రాయపేట హైరోడ్డులో ఒక ఇంటిలో ఆయన సాంత వైద్యశాల పెట్టి నడిపారు. అప్పుడు ఆయనకు డాక్టరుగా ఉన్న పేరు (ప్రతిష్టలు అంతాఇంతా కాదు. ప్రతిరోజు రోగులు పెద్ద "క్యూలో ఉండేవారు. ఆయన గొప్పు కారుణ్యదృష్టి గలవారు. అందుకే వైద్యంచేసి ఇచ్చిన వారిదగ్గర పుచ్చుకునేవారు. ఇవ్వలేనివా రికి ఉచితంగానే చేసేవారు అటువంటి మెత్తని మనసుగల వైద్యునికి జనులలో గౌరవ ప్రతిష్టలు పెరుగక ఏమవుతాయి? తన చిన్నవాడు ఆంధ్రదేశంలో ఒక ఊళ్లో ఒక డాక్టరు ఒక 'ఫేదరోగిని పెట్టిన ఇక్కట్టై చూస్కి ఎలోగైనా తాను డ్యాక్టరుచదివి అటువంటి పేదలకు సాయపడాలని కృతనిశ్చయంతో మదరాసువచ్చి వైద్యశా(స్త్రం చదివి, వైద్యం చేపట్టారని వారి బాల్యం ఎరిగిన వారు చెపుతారు. వైద్యంలో ్రావీణ్యంతోపాటు వైద్యశా'స్రాన్ని అమూలాగ్రంగా మధించి, క్షుణ్ణంగా ఆకళింపుచేసుకొన్నారు. సామాన్య జనులకుకూడ వైద్యశా,స్త్ర, పరిచయంకాంతయినా ఉంటే వైద్యంచేయడంలో డాక్టరు పనిసుళువు అవుతుందని నమ్మిన డాక్టర్లలో ఆయన ఒకరు. ఆందుకే ఆయన అంత శ్రమించి, వ్యయప్రయాసలకోర్చి వైద్యశాస్త్రం తెలుగులో వ్రాయడా నికి సంకల్పించి, "మనమూ మనదేహఫ్టేతి” అనే శీర్షిక (క్రింద ఆరేడుపుస్తకాలు ప్రచురించారు. జీవకణ పరిశీలన అనేగ్రంథం అనువదించారు. ఇవిగాక అప్పుడప్పుడు పత్రికలలో వైద్యం గురించి, పరమాణువుగురించి చాల వ్యాసాలు (వ్రాశారు. ఈ విధంగా, ఆయన తెలుగు దేశానికి ఎంతో చేశారు. ఈ పుస్తకాలు ఒక్కొక్కటీ ముద్రణముగిసి బయటకు వచ్చినపుడు మిత్రులనుపిలిచి, వారికి చూపించి, చదివించి, వారివారి అభి[ప్రాయాలు తెలుసుకొన్నప్పుడు ఆయన ఎంతమురిసిపోయేవారంటే ఒకే కూతురు, అనంతర కాలంలో (ప్రముఖ రచయిత్రి అయిన జలంధర చంద్రమోహన్‌ తప్పు పుత్రసంతానం లేని బాలసుందరరావు గారికి ఈ ఒక్కొక్క పుస్తకం ఒక్కాక్కకాడుకు పుట్టినప్పుడు కలిగే పుత్రోత్సాహంవంటి పరమానందం కళ్లల్లో మిలమిల మెరిసేది. ఈ పుస్తకాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమువారో, తెలుగు సంధియుగం 119

విశ్వవిద్యాలయంవారో సేకరించి విరివిగా చౌకప్రతులు ముద్రించి జనులకు అందచేస్తే, తెలుగు ప్రజల ఆరోగ్య సంరక్షణలో గొప్పకృషి చేసిన కీర్తి వారికి దక్కుతుంది.

డాక్టర్‌ గాలిబాలసుందరరావుగారు చేయి తిరిగిన నాటకరచయిత. ' సత్యాగ్రహి మొదలు *“యోగమి'(త్రులు' వరకు పలునాటకాలు ఆయన ్రాశారు. (వ్రాయడమేకాదు, తమ ఇంటి ఆవరణలోనే ఒక మినీధియేటర్‌ నెలకొల్పి జౌత్సాహిక నటినటు లెందరినో చేరిదీసి కట్టుదిట్టమయిన పద్దతిలో నాటక ప్రదర్శనలో శిక్షణ గరిపించి స్వీయరచనలు, ఇతర (ప్రముఖ రచయితల నాటకాలు, ఎన్నెన్నో వేయించారు. ఈ మినీధియేటర్‌ పలువురు మంచినటీనటులను రూపొందించింది. కొందరికి చలన చిత్రాలలో నటించే అవకాశానికి సోపానంగా కూడా తోడ్పడింది. డ్యాక్టరుగారికి చలనచిత్ర నిర్మాణం, రచన విషయాలలోకూడ ఒకప్పుడు చాల ఆసక్తి ఉండేది. ఇదే కొంతవరకు వైద్యవృత్తి నుంచి ఆయన దృష్టిని మళ్ళించిందేమో. ఆయన (వ్రాసిన చివరినాటకం - యోగమిత్రులు. కేన్సర్‌తో జీర్లించిపోతున్న ఆయన జీవితం చరమదళలో, ఆయన ఏకాగ్ర చిత్తంతో నమ్మిన మాష్టర్‌ సి. వి.వి. సిద్దాంతాల నవాటకరూపం ఇది.

వ్యక్తిగతంగా నాకు ఆయన 1960 నుంచి తెలుసు. అప్పటినుంచి నాపట్టు ఆయన ఏదో అనిర్వచనీయమైన ఆదరాభిమానాలు చూపేవారు. ఆయన జబ్బులో ఉండగా చివరిసారి చూడ్డానికి వెళ్లినప్పుడు ఒకమాట అన్నారు. ఈ చివరిమాట, అమూల్యమైన అపూర్వమైన వారి స్నేహశీలతకు, ఆదరాభిమానాలకు, సహృదయానికి నాకు చిరకాలపుగుర్తువంటిది. బహుళః మదరాసులోని తెలుగువారికి చాలమందికి, ఆయనతో ఇటువంటి మధురానుభూతి ఏదో ఒకటి ఉండి ఉంటుంది.

తిరుపతిలో అఖిలభారత తెలుగురచయితల మహాసభలకు అందరం వెళ్ళాం. యూనివర్సిటి హాస్టల్టో వసతి ఏర్పాటుచేశారు. అప్పటికి ఆయన నన్ను ఎరుగరు. డాక్టరుగారు అన్నిగదులలో రచయితలను పరామర్శించుకుంటూ మా గదివద్దకు వచ్చారు. అదేగదిలో విద్వాన్‌ విశ్వంగారిని చూచి ఆయన లోపలకు వచ్చారు. విశ్వంగారు నన్ను పరిచయం చేశారు. ఆ క్షణంనుంచి ఆయన ఎంతో పాతపరిచయమున్నవారిలా వేళాకోళాలు పట్టిస్తూ మాట్లాడారు. ఇన్నాళ్ళూ అదే చనువు, అదే అభిమానం. ఆయన కేన్సరుతో జీవితంలో చరమఘడియలకు చేరుకుంటున్న సమయంలో చూడచానికి వెళ్లాము. మమ్మల్నిచూచి బావురుమన్నారు. మేము నిభాయించుకోలేకపోయాము. కొన్ని నిమిషాలసేపు అంతజబ్బులోను ఆత్మీయంగా కొన్ని మాటలు మాట్లాడి తలదగ్గరే ఉన్న చివరి నాటకం 'యోగమి(త్రులు' ్రతినొకటి ఇచ్చి "వేనుపోయేలోపల నీవంటి మేధావుల సవిమర్శక అభిప్రాయం ఈ రచనగురించి వినాలని ఉంది" అని అంటూ మళ్ళీ కంట తడిపెట్టారు. "అలగి అన్నాను. అంత ఆత్మీయంగా కోరిన వారి చివరికోరిక తీర్చలేక పోయాను. ఆ తరువాత కొద్ది రోజులకే నాకు రెండునెలలపాటు సుస్తీ చేసినందువల్ల ఇది సాధ్యం కాలేదు. ఓపిక చేసుకొని నాటకం చదువుతుండగనే ఆయన పోయారన్న కబురు అళశనిపాతంలా వచ్చింది.

(10.11.24) స్గున్గాన్గ

120 సంధియుగం

౧0|క్హాలుధా దాయుడుమ్ము క జిన్మచేత రైతుని, వృత్తిచేత అస్పృశ్యుణ్లి' అని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుప్రపిద్ర లెదర్‌ టెక్నాలజిస్టు డ్యాక్టర్‌ యలవర్తి నాయుడమ్మ అపుడప్పుడు తన చర్మశా(స్త/ సాంకేతిక పరిశోధన వృత్తిని గురించి చమత్కరిస్తుండేవారు. ఆయన బ్రిటన్‌, అమెరికా దేశాలలో చర్మశుద్ది విద్యలో ఉన్నత శిక్షణపాంది, డాక్టర్‌ పట్టుం పుచ్చుకొనీ ఆ దేశాలలోనే పెద్ద ఉద్యోగమేదో చూసుకొని అక్కడే ఫ్రిరపడిపోవాలని అనుకోకుండా, స్వదేశానికి తిరిగివచ్చిన పిదప, అడపాదడపా కొన్ని చిన్న ఉద్యోగాలు చేసిన అనంతరం మదరాసులో కేంద్ర చర్మశ్యాస్త్ర పరిశోధన సంస్త (సెంట్రల్‌ లెదర్‌ రీసర్చి ఇన్‌ప్టేట్యూట్‌)ను నిర్మించి నిర్వహించే బాధ్యతను స్వీకరించి, ప్రపంచం మొత్తంలో సాటిలేని మేటి పరిశోధనాసంపఫ్టగా దానిని రూపొందించారు. | ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విషయాల శాఖలో కార్యదర్శిగాను, జాతీయ విజ్ఞానశాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సి.ఎస్‌.ఐ.ఆర్‌) డైరక్టర్‌ జనరల్‌గాను ఏకకాలంలో వ్యవహరించారు. అంతవరకు ఒక పరిపాలన నిర్వహణ కార్యాలయంగా మాత్రమే వుంటూ వచ్చిన ఈ జాతీయ విజ్ఞానశాస్త్ర పరిశోధనా మండలి ప్రధాన కార్యాలయాన్ని ఒక ముఖ్య పరిశోధనాగారంగా రూపొందించి, , దాని కొక సరికొత్త (ప్రాముఖ్యతను సంతరింపబేశారు. ఈయుండలి అధీనంలో నలబై ఎనిమిది జాతీయ పరిశోధన శాలలు (నేషనల్‌ లేబరేటరీస్‌) ఉన్నాయి. వీటిలో 80వేల మందికి పైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు పనిచేస్తున్నారు. ఈ డైరక్టర్‌ జనరల్‌ హోదాలో ఆయన ఇతర దేశాలలో ఉన్నతోద్యోగాలలో వున్న భారతీయ శాస్త్రసాంకేతిక నిపుణులను స్వదేశానికి తిరిగి రప్పించి, వారి 'ప్రతిభావ్యుత్చత్తులను మన దేశాభివృద్రి కృషిలో వినియోగపడేటట్టు చేయడానికి విశేషమైన కృషిచేశారు. తరువాత ఈ డైరెక్టర్‌ 'జనరలీ పదవిని ఆయన తనకుతానే వదలి వేశారు. ఇలా ఈ ఉన్నత పదవిని వదలుకున్నవారు ఈయన ఒక్కరే, అనంతరం మదరాసుకు తిరిగి వచ్చి చర్మ పరిశోధన సంప్టలో 'విశిష్ట శాన్త్రచేత్త హోదాలో తమ పరిశోధన కృషిని సాగిస్తుండగా మళ్ళీ ఢిల్లీ ముంచి పీలుపు వచ్చింది. ఈసారి ఢిల్లీలోని అత్యంత ప్రతిష్పాకరమైన జవహర్‌లాల్‌నె హూ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ పదవి ఆయనను వరించింది. కొంత ఆయిష్ట్రంగానేనైనా ఆ పదవిని స్వీకరించి, కొంతకాలం పనిచేసితన పరిశోధన కృషిమీద మమకారాన్ని వదులుకోలేక ఆ వైస్‌ ఛాన్సలర్‌ పదివినే వదిలేసి తిరిగి మద్రాసు వచ్చి సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఆక్టిరేటివ్స్‌కి వైర్మన్‌ హోదాలో ప.ఎల్‌.ఆర్‌.ఐ. లో తమ పరిశోధన కృషిని సాగించారు. మద్రాసు యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ పదవి ఇవ్వ చూపగా దానిని ఆయన నిరాకరించారు. ఇలా ఉన్నత పదవులను తృణప్రాయంగా విడచిపెట్టుగల సత్తాఆయన సాత్తు అయింది. వివిధ హోదాలలో దాదాపు 50 దేశాలలో పలుమార్జు పర్యటించారు. ఈయన పరిశోధనాకృషి ఫలితంగా మనదేళపు చర్మవస్తువులకు విదేశాలల్‌* విశేషమైన ఆదరణ, గిరాకీ లభించాయి. అంతేకాదు, సాంకేతిక విజ్ఞాన వినిమయకృషిలో ఆలీన దేశాలకి, ఇతర దేశాలకు మధ్య సేతువు అయినా రాయన. ఇవన్నీ యావద్భారతావనిలోనే కాక ప్రపంచమంతటా ఆయన పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేశాయి. ఆయన నిశితమేథకు నిదర్శనాలివి. అయితే, సంధియుగం 121 9

ఆయనను గురించి తెలుసుకోదగినవి, ఎక్కువ మందికి తెలియనివి ఎన్నో ఆదర్శప్రాయమైన

ఆయన నిశితమేథాళక్తిని, నిరాడంబరతను గుర్తించిన నొటి ముఖ్యమంత్రి (క్రీ, జలగం వెంగళరావు ఆయనను రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ సలహాదారుగా నియమించి గౌరవించారు. అప్పటి నుంచి ఆ తరువాత వచ్చిన ముఖ్య మందత్రులందరు ఆయనను ఆ గౌరవపదవిలో కొనసాగిస్తూ వారి పరిణత అనుభవాన్ని వినియోగించుకున్నారు. ఆం(్రప్రదేశ్‌కే గాక ఆయన తమిళనాడు ప్రభుత్వానికి కూడా గౌరవసలహాదారుగా వున్నారు. మదరాసు, మరికొన్ని విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ ఆచార్యపదవిని కల్పించి సత్కరించాయి. ఆయనది చాల ఉదారమైన స్వభావం. చదువులు ముగించుకొని, ఉద్యోగాలలో ప్రవేశించిన తరువాత కాస్త మంచి జీతమే వస్తున్నదనుకోగానే సంవత్సరంలో ఒకనెల జీతం పేద విద్యార్దులకుకేచాయిస్తూ వచ్చారాయన. అయితే, ఈ సహాయం తాను చేస్తునట్టు తెలీయనీయకుండా గుప్తంగా అందిస్తూ వచ్చిన ఉదారమనస్కుడు. ఆయన సి.ఎల్‌.ఆర్‌.ఐ డైరక్టురుగా వుండగా ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి, చదువుకున్న ఒక యువకునికి ఆయన ఆ సంస్థలో ఒక చిన్న పని ఇచ్చారు. ఆ యువకుని (ప్రతిభను, విద్యాసక్తిని పసికట్టిన ప్రొఫెసర్‌ నాయుడమ్మ అతనికి కావలసిన ధనసహాయం అందించి (ప్రైవేటుగా పై చదువులు కొనసాగించడానికి తోడ్పడ్డారు. ఆ హరిజన యువకుడు పోస్టుగ్రాడ్యుయేట్‌ పట్టుం సంపాదించి, ఆ సంస్టలోనే ఒక విభాగానికి ముఖ్యాధికారి అయ్యాడు. ఈ ఉదంతం గురించి చెబుతున్నప్పుడు నాయుడమ్మ గారిలో పాంగిపారలుతున్న సంతృప్తి, ఆనందాలను ఆయన దాచుకోలేకపోయారు.

శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాజ్యతంత్ర నిర్వహణ సలహాదారుగా ఇందరి గౌరవాన్ని చూరగొన్న ఆయనలో కనిపించే నిరాడంబడత్వం అచ్చెరువు గొలుపుతుంది. ఆయనతో మాట్లాడుతుంటే ఆ నిరాడంబరత్వం. ఆ పల్లీయ నిజాయితీ, ఆ నిశిత మేథస్సు, విషయ వివేచనానుభవం మనను అట్టే ఆకట్టుకుంటాయి. కమ్మని ఇంగ్రీషులోను, తీయని తెలుగులోను తన లోకానుభవాలను పండు ఒలిచిపెట్టినట్టు ఆయన చెప్పగలరు. ఆయనతో సంభాషణ ఒక ఆహ్లాదకరమైన విజ్ఞానదాయకమైన అనుభూతి. 1969 జనవరిలో ఒకనాటి సాయంత్రం మద్రాసు మైలాపూర్‌ వై.ఎం.ఐ.ఎ. ఆడిటోరియంలో జరుగుతున్న “'“రచని* సమావేశానికి అందరితోపాటు పంపిన ఆహ్వానం అందుకొని వచ్చిన ప్రాఫసర్‌ నాయుడమ్మ *““నాపేరు నాయుడమ్మ అంటారండీ” అని అతి సాధారణంగా తనను తాను నాకు పరిచయం చేసుకొన్నారు. అదే వారితో నా మొదటి పరిచయం. ఆ స్వీయ పరిచయ పద్దతిలో వ్యక్తమైన బౌచిత్యం, సంస్కారం ఆయన పట్టు ఆనాడు ఎనలేని గౌరవభావాన్ని నాలో కుదురుకునేలా చేశాయి. నిర్మలంగా, నిరాడంబరంగా జీవితాన్ని సన్మార్గంలో మలుచుకోవాలనుకునే వారికి ఆయన జీవితం ఒక చక్కని ఒరవడి.

నోబెల్‌బహుమానం మొదలు చిన్న సన్మానాల వరకు ఈ (ప్రపంచంలో అవేకస్టాయిలలో, పలురకాల బహుమానాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే విశిష్టమైనవి. ఈ విశిష్టతకు రాశికంటె వాసి ముఖ్యమైనది, !1979లో హైదరాబాద్‌లో ఆవిర్భవించి మదరాసులో కుదురుకొని ఏచా ఆయా రంగాలలో నిష్లాతులైనవారిని సన్మానిస్తూవస్తున్న (శ్రీ, రాజా-లక్ష్మీ ఫౌండేషన్‌వారు 1983లో ఒక ఉత్తమ శాస్త్రవేత్తను సత్కరించాలనుకొని అందుకు డాక్టర్‌ నాయుడమ్మని ఎంపికచేసుకున్నారు. ఇంతకంటె (శ్రృమైన ఎంపిక వుండజాలదని ఈ అవార్డు ప్రకటన వెలువడినంతనే ఎందరో హర్షించారు. ఈ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు దాని మేనేజింగ్‌ (ట్రప్టీఅయిన (శ్రీ, పి.వి. రమణయ్య రాజూ బహుదా అభినందనీయులు (19.11.83) 122 సంధియుగం

ఆయనను చూచినవారు ఆయన తెలుగువాడని అనుకోరు. మాట్లాడుతుంటే మధ్యమధ్య మదరాసు యాస వినపడినా ఆచ్చగ్రాంధికంలోనే వుంచాయి ఆయన పలుకులు. అసలు పెద్దగా చదువుకున్న వారిలా కూడా కనిపించరు. ఆరవ పంచకట్టు, అరచేతుల లాల్చీ, నెత్తిమీద పూర్తిగా పలుచబడిన జుత్తు- ఎవరో తమిళుడేమో అన్నట్టు వుంచారాయన. అనాటి “* రచని' సమావేశాలకు బీరుపోకుండా వచ్చి కూర్చొని, (శ్రద్రగా ఆందరి ఉపన్యాసాలూ వింటూ వుండే ఆయనను చూచి ఎవరో తెలుగు సాహిత్యమంటే చెవికోసుకునే తెలుగు భాషాభిమాని కాబోలు అనుకుంటుండేవాడిని. కమేణా ఆయనతో పరిచయం పెరగుతూ వచ్చింది. అప్పుడు తెలిసివచ్చింది ఆయనొక మహాపండితుడుడని. అంతేకాదు, ఆయన పండితులకు కూడా పండితుడని అనతికాలంలోనే అర్ధం చేసుకున్నాను. డాక్టర్‌ ఆరుద్ర, ప్రాఫెసర్‌ జి.లలిత, సుప్రసిద్ద నేపథ్య గాయకుడు, బహుభాష్షాకవి డాక్టర్‌ షి.బి.(శ్రీనివాస్‌, ఆచార్య దేవళ్ల. చిన్నిక్నష్ణయ్య వంటి ఎందరో పండితులకు, (ప్రముఖులకు ఆయన గురుపాదులు. ఆరుద్రవంటి సాహితీఖని ఆయనవద్ద ఛందోవ్యాకరణ పాఠాలు నేర్చుకున్నారంటే ఆ పండితుడెంతటి ఘటికుడో గ్రహించగలుగు తాము. ఆ నిరాడంబర వేషధారణ, ఆ అతిసాధారణ రూపురేఖల వెనుక అపారమైన పాండిత్య సంపద దాగివున్నదని తెలిసినప్పుడు సాహిత్యమంటే గౌరవం వున్నవారందరికీ ఆయనపట్ల వల్లమాలిన అభిమానం, గురుభావం ఏర్పడి తీరుతాయి. 1968 నుంచి నాకూ ఆయన ఎడల అటువంటి అభిమానం కుదిరింది. అప్పో ఆయన మదరాసు వైష్ణవ కళాశాలలో ఆం ధ్రోహన్యాసకులు (తెలుగు లెక్ఫరర్‌)గా పనిచేస్తుందేవారు. అంతకుముందు బహుకాలం చెన్నపురిలో హిందూ హైస్కూలులో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేశారు. 1919లో ఘటికాచలంలో రావూరి దొరసామిళర్మగారు జన్మించారు. పసికందుగా వున్నప్పుడే తల్లిపోయింది. తండ్రి ఒక మహా పండితుడు. ఆయనే దొరస్వామిశర్మకు తశ్లీదం'డ్రీ అయి ఉగ్గుపాలలో, జోలపాటలలో, చిన్ననాటి ఆటపాటలలో అన్నిటా సాంప్రదాయిక సాహిత్యాన్ని రంగరించిపోసి ఆ టానిక్కులతోనే కొడుకును పెంచిపెద్దచేశాడు. అందువల్లనేనేమో విద్వాన్‌ రావూరి దొరసామిళర్మగారికి సర్వావస్రలలోనూ సాహిత్య ధ్యాస తప్ప మరొకటి వుండదు. అప్పకవీయ తృతీయాళ్వాస వళిప్రాస పరిచ్చేద వివరణ'తో ఆయన (వ్రాసిన 'అప్పకనీయ భావ ప్రకాశిక అన్న ఒక్క రచనలోనే ' అచ్చతెలుగు రామాయణము, ' అధర్వణకారికావళి',

  • అధర్వణచ్చందము' మొదలుకొని 'హరివంళము' , 'హరిళ్ళం ద్రోపాఖ్యానము" వరకు దాదాపు నూటపాతిక గ్రంథాలను తరచి చూచి, వాటన్నిటిలో నుంచి ఉదాహరణలు ఇచ్చారు. అప్పకవి తన “అప్పకవీయం' వ్రాయడానికి ముందు అప్పటివరకు వున్న ఛందో గ్రంథాలన్నీ సంపాదించి వాటిసారాన్ని తన రచనలో చొప్పించాడట. అందుకేనేమో, ఆయన తన గ్రంథానికి వ్రాసిన పీఠికలో “ఇది చదివిన పిమ్మట పండితులకు మరే గ్రంథమూ చదవవలెనని బుద్ద పొాడమదని”' సంధియుగం "" 123

చెప్పుకొన్నాడు. దొరసామిళర్మగారి కంటే ముందు వేదుల రామశ్శాస్త్రిగారు అప్పకవీయ తృతీయాళ్వాసానికి తాత్పర్యం (వ్రాసి 1950లో ప్రచురించారు. కాగా, శర్మగారు మరికొన్ని కొత్త ఉదాహరణలు, వివరణలు చేర్చి 'అప్పకవీయ భావ (ప్రకాశిక రూపొందించారు. తన ముందువారికంటే మరెన్నో కొత్త ఉదాహరణలను ఈయన తన రచనలో చేర్చారు.

శర్మగారి (ప్రగాఢ పరిశీలన ఫలితంగా మరొక (ప్రామాణిక లక్షణ గ్రంథం తెలుగు

సాహిత్యానికి అభించింది. దివాకర్ల వేంకచావధానిగారు అన్నట్టు ' అప్పుకవీయ భావ (ప్రకాశిక రచనలో శ్రీ, దొరసామి శర్మగారు “చూపిన ప్రతిభయు, పాండిత్యమును, పరిశీలన వైపుణ్యమును, ఓర్పును మిక్కిలి ప్రశంసింపదగియున్నవి. వివరణము (వ్రాయు సందర్భమున పాణినీయ వ్యాకరణ సూత్రములను గూర్చియు, అమరకోళమునందలి శబ్దముల వ్యుత్చత్తులను గూర్చియు నితరలాక్షిణికులు చెప్పిన యతిప్రాస భేదములను గూర్చియు, భాషా శాస్త్ర సీద్దాంతములను గూర్చియు వారు కావించిన వ్యాఖ్యానములు వారి పాండితీ గొంభిర్యమును, బరిశోధన పారంగతత్వమును సూచించుచున్నవి*.

ఇంత పాండిత్య ప్రపూరిత రచన కూడా సులభ్లూలిలో విద్యార్దులు సైతం తమంతకుతామే చదువుకొని అర్ధం చేసుకొనే రీతిలో వుండఢం గొప్ప విశేషం'' అని ప్రొఫెసర్‌ జి. ఎన్‌. రెడ్డిగారు దొరసామిళర్మగారి రచనను మెచ్చుకున్నారు.

దొరసామిళర్మగారు వ్యాకరణ, ఛందశ్శా(స్తాలలో పారంగతులు. “తెలుగు భాషలో ఛందోరీతులు' అన్న వీరి గ్రంథం పలువురు పండితుల (ప్రళంసలందుకున్నది. ఈ చక్కని విమర్శ (గ్రంథంలో “వీరి వ్యాఖ్యానం సరళముగా, బహు విషయ సంభరితముగనున్నది. .. ఆవళ్యకమైన సంస్కృత వ్యాకరణ విశేషములును సుబోధకములుగా తెలుపబడినవి. కొన్ని లక్షణముల యెడ విమర్శ సహితుకముగ సాగినది. అత్య నిరూపణమున పాఠాంతరములెన్నో సం్రతించుట ప్రళశంసార్హమైన విషయము” అని ఆం(ధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్‌ కాకర్ల వెంకటరామ నరసీంహంగారు శ్ఞాఘించారు. దొరసామిళర్మగారి రచనలలో అచ్చు అయినవి బహు స్వల్పమే. అముద్రిత వ్రాతప్రతులు ఎన్నో వెలుగు చూడత్లో వారి ఇంటపడి మూలుగుతున్నవి. వీటిలో ఎంతెంత సాహితీ సంపద నిక్షిప్తమై వున్నదో!

1986 జనవరి 19న మదరాసులో గుండెజబ్బువల్ల ఆకస్మిక, అకాల మరణంపాలైన పాండిత్యశేషులు రావూరి దొరసామిళశర్మగారు తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు విలువ కట్టుజాలనివి.

ఇంతటి మహాసండితుడైన దొరసామిశర్మగారి పేరు ఆంధ్రదేశంలో అట్టేమందికి తెలియకపోవడం విడ్డూరమే! ఆం(ధ్ర సాహిత్య అకాడమివారి కోరికపై ఆయన 25 వేల ఛందో వ్యాకరణ ప్రయోగాలను సేకరించి పెట్టారట. ఆంధ్ర (ప్రభుత్వంవారుగాని, లేదా తెలుగు విశ్శవిద్యాలయంవారు గాని పూనుకొని దొరసామిళర్మగారి అముద్రిత గ్రంథాలన్నిటినీ అచ్చు వేయిస్తే తెలుగు భాష పరిపుష్టికి గొప్ప దోహదం చేసినట్టు అవుతుంది. ఇది వ్యావహారిక భాషా యుగమన్న మాట నిజమే. వ్యావహారిక భాష జిగిబిగువులకు సౌం(ప్రదాయిక సాహిత్యం గట్టి పునాదివంటిది. దానిపట్టు అ(శ్రద్ద, అలక్ష్యం కూడదు. కనుక శర్మగారు జీవిత సర్వస్వాన్ని సాహిత్య సేవకే పణంగాపెట్టి వెలార్చిన వారి అమూల్య అముద్రిత రచనలను చెదపురుగులపాలు కానీయరాదు. ఇది తెలుగు పాలకుల, ప్రజల కనీస ధర్మం.

(311.86) 124 సంధియుగం

టంగుతల్రి మవ్రప్రూనండా నే,

తొం (ప్రపంచ తెలుగు మహాసభలు 1975 ఏ ఫ్రిలనెలలో హైదరాబాద్‌ నగరంలో అతి వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి (శ్రీ జలగం వెంగళరావు, నాటి విద్యామంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు తీసుకొన్న చొరవ, చూసిన విశేష (శ్రద్దాసక్తుల ఫలితంగా ఆ సభలు జయప్రదంగా జరిగాయి. దేళంలోను, విదేశాలలోను తెలుగు (ప్రశస్తిని విస్తరింపజేసిన గొప్పు ప్రయత్నాలలో ఈ సభల నిర్వహణ ఒక ముఖ్య పర్వం. ఆ ఏప్రిల్‌12న (తెలుగు ఉగాదినాడు) మొదలైన ఆ సభలు 18వరకు ఆరురో జులపాటు చాలా కోలాహలంగా జరిగాయి.

ఆ ఉగాది పర్వదినాన వేలకొలది తెలుగు (ప్రేక్షక మహాజనుల సమక్షంలో సుప్రసిద్ద మధురగాయని టంగుటూరి సూర్యకుమారి “మా తెలుగుళల్లికీ మల్లెపూదండ" అన్న (ప్రార్ధనాగీతాన్ని మృదుమధురంగా ఆలపించడంతో జయ జయ ధ్వానాల మధ్య సభలు ప్రారంభమైనాయి. మన స్వాతంత్ర్యానికి పూర్వపు రోజులలో ఈ రాష్ట్రగేయాన్ని అదేతీయని కంరం నుంచి పదే పదే విని పులకితులైన తెలుగువారికి ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ ఆ గేయం అదే కంఠం నుంచి వినిపించి అందరినీ మైమరపించింది. పాట పాడడం ముగియగానే సభలో క్రిక్కిరిసివున్న (ప్రేక్షక సముదాయం ఒక్కపెట్టున లేచి నిలుచుని సుద్సీర్త కరతాళ ధ్వనులతో తన ఆనందాతిశయాన్ని ప్రకటించింది.

కాని, అంతటి సంతోష సమయంలోను ఆ సభ ఆవరణలోకి ప్రవేళం లభించని ఒకానొక వ్యక్తి ఆ ప్రాంగణం వెలుపల ఒకవైపు తన్మయత్వమూ, మరొకవైపు పరాభవచింత, వేరొకవైపు తన దీనప్టితి కలిసి ముప్పిరిగొని ఉక్కిరిబిక్కిరి చేయగా, కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కాకతీయద్వారం వెలుపల కనిపించాడు. అతను ఎవరోకాదు స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు నుంచీ తెలుగువారిని ఉత్తీజపరుస్తూ రాష్ట్రా వతరణానంతరం, ముఖ్యంగా ఈ తెలుగు మహాసభల తరువాత ““రాష్ట్ర గేయం''గా తెలుగుల హృదయాలలో తనదైన ఒక విశిష్ట స్టానాన్ని ఫ్టీరంగా ఏర్పరచుకొన్న “మా తెలుగు తల్లికీ మళల్లెపూదండ'"లు సుందరంగా అల్లి ఆంధ్రులకు అంకితం గావించిన తెలుగుల ““రాష్ట్ర కవి' శంకరంబాడి సుందరాచార్య.

అవును అనాటి ఆ మహోత్సవాలను నిర్వహిస్తున్న నాయకులకుకాని ఆనాడు అక్కడ ఆగేయం విని తన్మయులైన తదితరులెవరికిగాని, దాని కర్తను గురించి జ్ఞాపకం రాలేదు. ఆ సభలకు ఆయనను పఫిలిచినవారులేరు. అయినా, అంత పేదతనంలో చుక్కానిలేని జీవితం గడుపుతున్న ఆ “తెలుగు బంకించం'ద్రుడు' ఎలాగో హైదరాబాదు చేరుకొన్నాడు. మాసిన బట్టలతో రేగిన జుట్టుతో దీనంగావున్న అతనిని చూసి ఎవరో కొరగాని వ్యక్తి అని భావించిన మహాసభ ద్వారపాలకులు సుందరాచార్యను సభ లోపలికి అనుమతించలేదు. అతని గేయానికి లభించిన ఆదరణలో ఆవంతైనా అతనికి లభించలేదు. ఇదీ లోకం తీరు!

దేళ స్వాతంత్రోద్యమం - ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులు. తెలుగునాట ఎక్కడ ఏ సభ జరిగినా, ఏ ఉత్సవం జరిగినా తొలుత ఈపాటల రికార్డు సంధియుగం 125

విధిగా_వినిపిస్తుండేది. ఒకానొక శుభముహూర్తాన ఒక సంగీత విద్వాంసునికి ఈ పాటకు ఈ బాణీ కట్టాలన్న ఆలోచన మనస్సులో మెరిసింది. ఆరోజుల్లో తెలుగువారిని విరివిగా అలరిస్తున్న రెండుమూడు కమనీయ గాత్రాలలో టంగుటూరి సూర్యకుమారిది ఒకటి. ఈట్యూనులో ఈపాటను మొదటిసారి పాడిన గాయని ఆమే. అటు పిమ్మట ఎందరు పాడినా ఎప్పుడు పాడినా అదేపాట అదేబాణి. బంగారానికి తావి అబ్బినట్టు సుందరాచారి కవనానికి సూర్యుకుమారిగానం తోడై “మా తెలుగుతల్లికి మల్లెపూదండ*కు *' రాష్ట్రగేయం'”' స్టాయిని కల్పించాయి.

భారత జాతికి “వందేమాతరం” గీతం వంటిది తెలుగువారికి సుందరాచార్యుని ఈ సుందర గీతం. ఆరోజుల్లో ఆయనకంటే ముందూ, ఆ తరువాతకూడా ఎందరెందరో ఎన్నెన్నో దేశభక్తి గీతాలూ, రాష్ట్ర గాన గేయాలూ (వ్రాశారు. అన్నిటిలోనూ రెండు గేయాలు కలకాలం తెలుగువారిని ఉత్తేజపరిచేవిగా, తెలుగు మనసుల్లో ఫ్టిరపడిపోయాయి. ఒకటి శంకరంబాడి వారి *మా తెలుగుతల్లికి మల్లెపూదండ కాగా మరొకటి, వేములపల్లి (శ్రీ/కృష్ణగారి “చేయెత్తి జైకొట్టు తెలుగోడా'' అన్న గేయం. తెలుగువారికి సుందరాచారి గేయం *' వందేమాతరం! వంటిదైతే (క్రీ/కృష్ణగారి గేయం *““జనగణమనాి'” వంటిది. (ప్రతి తెలుగు సభలోనూ, ప్రతి తెలుగు ఉత్సవాన్నీ “మా తెలుగుతల్లికి మళల్లిపూదండ'"*తో ప్రారంభించి, *““చేయెత్తి జైకొట్టు''తో ముగించుకొనదగును. ఈ రెండు గేయాలు అంత (ప్రశస్తమైనవి, అర్జభరితమైనవి, వాటి బాణీలు అందుకు ఎంతైనా అనువైనవి.

““ఇంటా-బయటా”' వ్యాసాలు విడవకుండా చదువుతుండే ఒక పాఠకురాలు - (శ్రీ,మతి వారణాసి గీతా రామకృష్ణరావు చేసన సూచన మేరకు శంకరంబాడిని గురించిన సమౌచారంకోసం అన్వేషణ ప్రారంభించాను. ఆయన ఈపాట మా(త్రం చాలా ్రచురణలలో కనిపించింది కాని, ఆయనను గురించి సమాచారం ఏదీ ఎక్కడా కనిపించలేదు. తొలి (ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో ప్రచురించిన సొవనీర్‌లో ఈపాటను ప్రత్యేకమైన అలంకరణలతో ముచ్చటగా ముద్రించారు. కాని అన్నివందలపేజీలలోనూ అంతమంది రచనలలోను ఎక్కడా ఎవ్వరూ ఆయన గురించి 'ప్రస్తావించకపోవడం విచారం కలగించింది. మరికొన్ని ఇతర ప్రచురణలు కూడా వెతికాను. ఎక్కడా ఏమీ కనిపించలేదు, కడియాల రామమోహనరాయ్‌గారి *“తెలుగు కవితా వికాసం” లో మాత్రం ఆయన గేయం గురించి క్లుప్తంగా ప్రస్తావించారు.

ఇంత శ్రేష్టమైన '“రాష్ట్రేయం'' రచించి మన కందించిన సుందరాచార్య ఇతర రచనల గురించి, ఆయన జీవిత విశేషాలను గురించి సమగ్ర పరిశీలన జరిపించి ఆయన సాహిత్య చరిత్రను వెలుగులోకి తీసుకురావడం తెలుగువారి కనీస కర్తవ్యం ఆయన తిరుపతి ప్రాంతంవాడు. ఇక్కడ ఒక్కమాట చెప్పాలి. మన తెలుగు సాహిత్య పరిశీలకుల దృష్టి సాధారణంగా నెల్లూరు. దాటి రాయలసీమదాకా ప్రసరించడం లేదేమోననిపిస్తున్నది. మనసాహిత్య చరిత్రకారులు ఎవరైనా పూనికవహించి శంకరంబాడి వారి జీవితచరిత్ర వ్రాయడం సముచితంగా వుంటుంది.

(25.11.84) స్లాన్గాన 126 సంధియుగం

హసద్రాకల్పి పద్నంప్రూ

[కానాక ఆగస్టు 15 సాయంకాలం, దేవులపల్లి కృష్ణశ్నాస్త్రిగారు మాఇంటికి వచ్చారు. ఆసమయానికి ఇంట్లో లేను. ఒకవీటి వ్రాసి యింట్లో యిచ్చివెళ్ళారు. దానిలో ఇలౌ వుంది: '* ప్రియమి(త్రులు శ్రీ కృష్ణా మీకు ఎంత తొందర పని వున్నాసరే, పెళ్ళిషనుల తొందరలో తీరికలేకపాయినా సరే, రేపు సాయంకాలం పది నిముషాలు చాలు. నన్ను కలుసుకొని తీరాలి. చాలా చాలా అర్జంట్‌. - మీ కృష్ణశ్నాస్త్రి 15-8-1978”,

అలానే, ఆ మరునాడు సాయంకాలం వీలుచేసుకొని వారి ఇంటికి వెళ్లాను మా అమ్మాయి పెళ్ళిపనులు ఎంతవరకు వచ్చిందీ వైరా కుళల(ప్రళ్నీలు అడిగారు. ఆ తరువాత, నన్ను ఆవసరంగా ఎందుకు పిలిచిందీ చెప్పడానికి ఆయన వ్రాసిన మాటలివి:

““మనదేళంలో వున్న బహు కొద్దిమంది మేధావులలో పద్మరాజు ఒకరు. ఆయన సాహిత్య కృషిని మనవాళ్సింకా గుర్తించలేదు. ఆయనకు ఘనంగా ఈఊళ్లో సన్మానం జరగాలి. ఈమాట చెప్పడానికి రమ్మన్నాను''. అంతకుముందు నాలుగు నెలల క్రితం కాకినాడలో జరిగిన పద్మరాజుగారి షష్టిపూర్తి సన్మానసభకు శ్యాస్త్రిగారు పంపిన సందేశంలో, **తెలుగునాట నేనెరిగున్న మేధావులో, ప్రతిభావంతులో అయిన అయిదారుగురిలో పద్మరాజు ఒకడు... అతని ప్రక్కనున్నప్పుడు నేను చిన్నవాడనుగా నాకు నేనే కనిపిస్తాను” అని అంటూ ఆయన పద్మరాజుగారి మేధాసంపత్తిని (ప్రళంసించాడు.

1966లో ఒక విదేశీ ప్రచురణ సంస్టకోసం (క్రీ/కె. నత్వర్‌సంగ్‌ స్టోరీస్‌ ఫ్రమ్‌ ఇండియా” (భారతీయ రచయితల కథలు) అన్న సంకలనాన్ని రూపొందించారు. దానికి ఆయన దేశం మొత్తంమీద అత్యంత (ప్రఖ్యాత కథకులుగా పేరెన్నికగన్న పదముగ్గురు రచయితల రచనలను ఎంపీక చేశారు. రవీం(ద్రనాథ్‌ చాగోర్‌, శరచ్చంద్ర చటర్లీ, రాజాజీ, (ప్రేమ్‌చంద్‌, ముల్క్‌రాజ్‌ ఆనంద్‌, ఆర్‌:కె.నారాయణ్‌, రాజారావు, సి.వి.భావే, కృష్ణచందర్‌, తకాళి శివళంకరపిళ్ళ, కుశ్వంత్‌ సింగ్‌, శాంతా రామారావు, పాలగుమ్మి పద్మరాజుగార్ల కథలను ఆయన సంకలనంలో చేర్చారు.

ఆవిధంగా పాలగుమ్మి పద్మరాజుగారు భారతీయ కధా రచయితలలో తెలుగు కథకుల పైక ప్రతినిధిగా ఎంపిక అయినారు. పద్మరాజుగారి *పడవ (ప్రయాణం' అనేకథను ఆయనే స్వయంగా ' ఆన్‌ది బోట్‌ అనే శీర్షికతో ఇంగ్రీషులోకి అనువదించుకొనగా, ఇలస్టేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా పత్రికలో అచ్చయిన దీనిని (శ్రీ, నత్వర్‌సింగ్‌ ఆ సంకలనంలో చేర్చారు. శ్రీ నత్వర్‌సింగ్‌ అప్పట్లో పోలెండ్‌లో మనదేశపు రాయబారిగా వుండేవారు. (శ్రీ, సింగ్‌ ఆ పుస్తకానికి (వ్రాసిన పీఠికలో ఇలా అన్నారు, ''ఈ కథలు చదివినవారికి భారతదేశపు వివిధ (ప్రాంచాలనాగరిక్క జానపద జీవన సరళిని గురించి, భారతీయ సాహిత్యాన్ని గురించి అవగాహన కలుగుతుందని అనుకుంటున్నాను. గత నూరేళ్ళకాలంలో ముఖ్యమైన కథకులుగా పేరుపొందినవారి రచనలను ఇందులో చేర్చాను. గ్రామీణ రైతు జీవనం మొదలు అతి నాజూకైన నాగరిక జీవన సరళిదాకా ప్రతిబింబించే వివిధ ఇతివృత్తాలతో (వ్రాసిన కథలు ఇందులో వున్నాయి”. సంధియుగం 127

కథకుడుగా, నవలా రచయితగా, నాటకకర్తగా, కవిగా, విమర్శకుడుగా - ఏ సాహిత్యరూపం తీసుకొన్నా చేయి తిరిగిన శిల్పిలాగా తన రచనను మలచగల నిపుణులు పద్మరాజుగారు. కధలు, నవలలు, నాటకాలు వ్రాసేవారు చాలామందే వున్నారు. ఈ వ్రాసేవారిలో నిజ జీవితంలో తాము చూచిన ఏవో కొన్ని సంఘటనల వల్ల ఉత్తేజితులైనందువల్లనో భావో'ద్రేకం కలగినందువల్లనో రచనలు చేసేవారే హెచ్చుమంది. అయితే పద్మరాజుగారిలో మిగతావారిలో కనిపించని ఒక విశిష్ట లక్షణం మనకు కనపడుతుంది. పరిస్థితులు మానవుల ప్రవర్తనను శాసిస్తాయి. ఏ ఏ పరిస్టితులలో మనుషుల (ప్రవర్తన ఎలా, ఎలాటి మార్పులకు లోనయ్యేదీ క్షుజ్ణంగా ఆకళింపు చేసుకొన్న శాస్త్రీయ ఆలోచనా సూత్రాలపై పద్మరాజాగారి రచనలు ఆధారపడివుంటాయి. కనుకనే ఆయన రచనలు ఇతరుల వాటికి భిన్నంగా కనిపిస్తాయి. ఈ గుణం వల్లనే ఆయన రచనలకు జాతీయ, అంతర్జాతీయ స్దాయిలో గుర్తింపు లభించింది. నత్వర్‌- సింగ్‌ సంకలనం ఇందుకొక తార్కాణం.

నిజానికి, పద్మరాజుగారి రచనలకు అటువంటి గుర్తింపురావడం నత్వర్‌సింగ్‌ సంకలనంతోనే (ప్రారంభం కాలేదు. అప్పటికి పద్నాలుగేళ్ళకు ముందే- 1952లో న్యూయార్క్‌ హెరాల్డ్‌ (ట్రిబ్యూన్‌ అనే ప్రముఖ అమెరికన్‌ పత్రిక నిర్వహించిన (ప్రపంచ కధానికల పోటీలో పద్మరాజుగారి “గాలివాన కథకు ద్వితీయ బహుమానం లభించింది. ఈపోటీకి వచ్చిన తెలుగు కథలన్నిటిలోను “'గాలివాని” ఉత్తమకధగా ఎంపిక అయినది. “(త్రివేణి పత్రిక ఇన్‌చార్జ్‌ సంపాదకులుగా శ్రీ బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ పాకాల వేంకట రాజమన్నార్‌, డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డిగార్డు జడ్డీలుగా వుండి, ఈ ఎంపిక చేశారు. ఇలా పద్మరాజుగారి కథలలో రెండిటికి జాతీయ, అంతర్జాతీయ స్టాయిలలో గుర్తింపు లభించింది. తెలుగు కధకులలో ఇటువంటి గౌరవం-పాొందినవారు పద్మరాజుగారొక్కరే. ఆవిధంగా ఆయన తెలుగు కథకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి తెప్పించిన హ్రైక తెలుగు ప్రతినిధి అయినారు.

గొప్ప రసాయన శా(స్త్రవేత్త కావలసిన పద్మరాజుగారు అది మానివేసి సినిమా రంగానికి వచ్చారు. మంచి కవిత్వం (వ్రాయడం మొదలుపెట్టిన పద్మరాజుగారు అది వదలివేసి కథానికా రచనపై తమ కలాన్ని కేంద్రీకరించారు. తరువాత సునిశితమైన రాజకీయ నవలలు (వ్రాశారు. సశాస్త్రీయంగా హేతువాద దృష్టితో ప్రతి విషయాన్ని పరిశీలించగలిగిన మేధావి గనుక ఆయన ఏ ఇజానికో కట్టుబడిపోయి నినాద రచనలు చేయలేదు. కాశీలో విద్యార్దిగా వుండగా మార్క్సిజమ్‌ ఆయన్ని ఆకర్షించింది. అందలి మంచిని ఆయన పూర్తిగా ఆకళింపు చేసుకొన్నాడు. అయితే కమ్యూనిజం తరువాత మానవుని స్టితిగతులను సమ్యక్‌ దృక్పథంతో దర్శించగలిగిన మానవేంద్రనాధ్‌రాయ్‌, నవ్యమానవవాద ప్రభావం ఆయనపై ప్రసరించింది. ఇది ఆయనలో స్వతంత్ర అవగాహనా దృక్పథాన్ని పెంపాందించింది కనుకనే ఆయన రచనలలో ఏ ఇజమ్‌ తాలూకు పిడివాదమూ కనిపించదు. విషయ నివేచన చేసి మంచిచెడుల నిర్ణయాన్ని పాఠకులకే వదలివేయడం ఆయన అనుసరించిన పద్రతి.

“అయినా సోషలిస్టు దేశాల సాహిత్యంతోనూ, సాహితీపరులతోనూ సంబంధాలు పెట్టుకొనేవారు. ఒకసారి తూర్చు యూరప్‌ రాజ్యాలలో పర్యటన చేసి వచ్చాక మదరాసు లక్ష్మీపురం యంగ్‌మిన్స్‌ అసోసియేషన్‌ (లైమా) హాలులో చాలా ఉత్తేజకరమైన ఉపన్యాసం ఇచ్చారు. అక్కడి సాహిత్య సంస్థల గురించి బాగా విశదం చేశారు"? అని డక్టర్‌ ఆరుద్రగారు “పాలగుమ్మి పద్మరాజు జ్ఞాపకాలు" అన్న వ్యాసంలో పేర్కొన్నారు. యుగోస్తావియా, రుమేనియా, హరోరీ, బల్గేరియా దేశాలలో పర్యటించి అప్పుడే తిరిగివచ్చిన పద్మరాజుగారు 128 సంధియుగం

1968 డిసెంబరు నెలలో 'రచని ఆధ్వర్యాన జరిగిన సదస్సులో 'తూర్పు యూరప్‌ దేశాలలో రచనా ధోరణులు" (ఆంధ్రజ్యోతి 1968 డిసెంబరు 20) అన్న విషయంపై ప్రసంగించారు. డాక్టర్‌ దాళరధిగారు అధ్యక్షత వహించారు. పద్మరాజుగారు తాము చూచివచ్చిన విషయాలను గురించి చెపుతూ 'ఆ దేశాలలో రచయితల మీద జాతీయవాద ప్రభావం అధికంగా వుంటున్నది. జాతీయోద్యమాలలో పాల్గొన్నవారు గనుక స్వాతంత్ర్యం విలువ వారికి తెలుసు”నని అన్నారు.

ఆ పర్యటనలో పద్మరాజుగారు యుగోస్థావియాలో ఒక నదిమీద జరిగిన కవి సమ్మేళనం గురించి చెప్పారు. కవులు వంతెనపై కూర్చుని కవితాగానం చేస్తూ వుంటే శ్రోతలు నదిలో పడవలలో కూర్చొని విని ఆనందిస్తూంచారని ఆయన చెప్పారు. '“రచయితల పని హాయిగా వున్నది. రచనలు ఎలా వుంటేనేమి?”” అది చాలా భావగర్భితమైన మాట. గంభీరమైన ఎటువంటి విషయాలను కూడా ఇటువంటి సున్నిత హాస్యం రంగరించి చెప్పగల చతురోక్తి ఆయన సొత్తు. రచయితల స్ట్రానాన్ని రచయితల వ్యవప్రే నిర్ణయిస్తుందని అంటూ రచనలలో "స్వేచ్చ లోపించినా, పలువురు రచయితలకు లబ్ది పుష్కలంగా వుంటున్నదని ఆవేళ ఆయన చెప్పకుండానే చెప్పారు.

పద్మరాజుగారు మంచి వక్త, 'ఆయన ఉపన్యాసం వింటుంటే వినే ప్రతివారికీ ఆయన తమతోనే ఊసులాడుతున్నారా అనిపించేటంత హాయిగా మాట్టాడతారు. తాను నవ్వకుండా (శ్రోతలను కడుపుబ్బ నవ్వించగల దిట్టు. ఒకసారి చెన్నపురి ఆంధ్ర మహాసభలో కళాభారతివారు కాంచనమాలకు - ఆమె చరమదళలో ఒక సన్మానం చేశారు. ఆవేళ పద్మరాజుగారు ఒక వక్త. గూడవల్లి రామ బ్రహ్మంగారి “మాలపల్లి సినిమానాటి సంగతులు ముచ్చటిస్తూ, ఆయన ఒక మాట చెప్పారు. ఆసినిమా చూచి ఆనాటి (బ్రాహ్మణ యువకులు కొందరు రామ(బ్రహ్మంగారి మీద కారాలు మిరియాలు నూరేవారట. మాలపిల్లను బ్రాహ్మణ యువకుడు పెళ్ళి చేసుకున్న దృళ్యం వాళ్లకు కస్టం కలిగించింది. ఒకనాడు కొందరు యువకులు దీనిమీద చర్చ జరుపుతుండగా తామ కల్పించుకొని, ““కాంచనమాలంత చక్కని అమ్మాయి మాలపిల్ల అయితే మౌ(త్రం ఏం?” అని అన్నారట. ఆమాట విని అంతా గొల్హుమన్నారట.

ఏమైనా ఇంత గొప్ప రచయితకు ఆయన వుండగా రావలసినంత గుర్తింపురానిమాట నిజం. కనీసం ఇప్పటికయినా కేంద్ర సాహిత్య అకాడమీ ఆయన రచనలకు బహుమతి ఇవ్వడం, వారి అభిమానులకే గాక్క తెలుగు సాహిత్య రంగానికే సంతోష కారణం. అలానే రాజాలక్ష్మీ ఫౌండేషన్‌ వారు పద్మరాజు గారి అముద్రిత (గ్రంధ ప్రచురణకు మంచి విరాళం ఇచ్చి మంచిపని చేశారు. ఇవన్నీ ఆయన ఉండగా జరిగితే ఎంత బాగుండేది!

(28.286) సంధియుగం 129

౯/8ల౨వ్లావ్రష్నా జక్షర్‌ శథ కళళ

రళిమిలేముల తారతమ్యాలు పాటించక, కలవారికి, లేనివారికి ఒకేలాగ మంచి చదువులునేర్పాలన్న ఉత్తమ ఆదర్శంతో అర్హ శతాబ్ది క్రితం చి(ల్లన్స్‌ గార్డెన్‌ స్కూలును నెలకొల్పి, తద్వారా స్వర్గీయ డాక్టర్‌ వి. ఎన్‌. శర్మగారు చేసిన సేవలు గణనీయమైనవి. ఉదాత్తమైన వారి ఈ సేవలను మదరాసు పౌరులు కలకాలం జ్ఞాపకం వుంచుకుంచారు. విద్యాబోధనా శాస్త వైతాళికులలో ఒకరు అనదగిన ఆయన్క పనిపాటలు చేసుకునే తల్చుల పిల్లల కోసం “బాలారామా' లను నిర్వహించడంలో మార్గదర్శుకులైనారు. అంతేకాదు, కొన్ని మన సాహిత్య గ్రంథాలను వారు జర్మన్‌ భాషలోకి చక్కగా అనువదించిపెట్టారు. వారి అస్తమయం వళ్ల నగరపౌరులకు పూరింపజాలఅని నష్టం వాటిల్లినది. వారు నెలకొల్పిన సంస్టలకు, వారి కుటుంబానికి మా హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నాము””.

మదరాసు తెలుగు ప్రముఖులలో ఒకరూ, విద్యాప్రదాత, ప్రముఖ రచయిత డాక్టర్‌ వి.ఎన్‌. శర్మగారి మరణవార్తను విన్నంతనే చెన్ననగర షరీఫ్‌ అధికార హోదాలో చేసిన పై సంతాప (ప్రకటన డాక్టర్‌ శర్మగారి నిస్వార్హ సేవానిరతిని ముక్తసరిగా వెల్లడిస్తున్నది.

1986 ఫిబ్రవరి మాసంలో జిడ్డు కృష్ణమూర్తిగారు, శ్రీమతి రుక్మిణీ అరండేల్‌ కాలధర్మం చెందారు. వారి కోవకు చెందిన డాక్టర్‌ శర్మగారు ఏ ప్రిల్‌నెల 23 వ తేదీన కొడైకనాల్‌లో మరణించారు. అడయార్‌లో డాక్టర్‌ అనిబిసెంట్‌ నెలకొల్పిన నేషనల్‌ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడే శర్మగారు కొత్త స్వేచ్చా విద్యాబోధనావళ్యకతను గుర్తించారు. టీచర్స్‌ కళాశాలలో ఉపాధ్యాయ శిక్షణ పొందిన శర్మగారు విద్యాబోధనా పద్దతులలో ఆధునిక పద్దతులను పూర్తిగా అవగాహన చేసుకోవాలన్న పట్టుదలతో అమెరికాకు బయలుదేరారు. దారిలో ఇంగండ్‌ చేరుకుని 1930లో అక్కడ ఆరునెలలు వుండి, వారి విద్యాబోధనా పద్రతులను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నారు. అక్కడ వుండగానే ' ఓడెన్‌ వాల్డ్‌ స్కూల్‌ అనే జర్మనీలోని ఒక విద్యాలయం గురించి విన్నారు. అంతట అమెరికా వెళ్ళే ప్రయత్నం విరమించుకుని జర్మనీ వెళ్ళారు. వెళ్ళగానే అక్కడే ఆయనకు ఒక ఉద్యోగం లభించింది.

ఆ ఉద్యోగం చేస్తూనే అక్కడి విద్యాబోధనా పద్దతులను ఒకవైపున పరిశీలిస్తూ, మరొకవైపు భారతీయ సంస్కృతీ సాహిత్యాలను గురించి జర్మన్లకు తెలియచెపుతూ వచ్చారు. ఆవిధంగా ఆయన స్ట్రానిక జర్మన్‌ ప్రజలలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు. జర్మనీలో అత్యంత ప్రతిష్థాకరమైన విశ్వవిద్యాలయాలలో ఒకటైన హైడెల్‌బన్ల్‌ యూనివర్సిటీలో పరిశోధనలు జరిపి, భారతీయ విద్యా, తత్వ శాస్త్రాలను గురించి (వ్రాసిన శర్మగారి సిద్దాంత వ్యాపానికి ఆ యూనివర్సిటీ డాక్టర్‌ డి (గీ ఇచ్చింది. అక్కడే జనా యూనివర్సిటీలో కొంతకాలం అతిథి- అధ్యాపకులుగా పనిచేశారు.

బెర్లిన్‌లో తన డాక్టర్‌ డి(గ్రీకోసం పరిశోధనలు చేస్తున్న సమయంలో ఆయనకు కొన్ని భారతీయ గ్రంథాలు అవసరమైనాయి. అక్కడ ఎవరి వద్దనైనా ఆ గ్రంథాలు దొరుకుతాయా అని ఒక జర్మన్‌ మి(త్రుణ్ణి శర్మగారు అడిగారు. ఆ మిత్రుడు ఒక చిరునామా ఇచ్చి, అక్కడికి వెడితే 130 సంధియుగం

దొరకవచ్చునని చెప్పాడు. ఆయన ఇచ్చిన చిరునామా పుచ్చుకుని శర్మగారు (శ్రీమతి అల్వినా నాన్‌ కెల్లర్స్‌ అనే ఆమె ఇంటికి వెళ్ళారు. వారి ఇంట్లో తనకు కావలసిన గ్రంథాలు లభించాయి. భారతీయ సంస్కృతి పట్లు అభిలాష అభిమానం గల ఆ కుటుంబంవారితో ఆయనకు ఆవిధంగా (ప్రారంభమైన పరిచయం సాన్నిహిత్యంగా పరిణమించింది. ఆయన ద్వారా ఆ కుటుంబంవారు భారతదేళంగురించి, దాని ప్రాచీన సంస్కృతీ సం'ప్రదాయాలగురించి ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నారు.

ఆ ఇంటి ఇల్ఫాలు అల్వినా నాన్‌కెల్లర్స్‌కి ఇద్దరు కూతుళ్ళు. ఆ ఇద్దరిలో చిన్న అమ్మాయి పేరు ఎలెన్‌: శర్మగారి పాండిత్యమూ, నిరాడంబరతా చూచి ఎలెన్‌ ఆయనను (్రేమించింది. వారి (ప్రేమ అనతికాలంలోనే (1931) పరిణయంగా పరిణమించింది. పుస్తకాల కోసమని వెళ్ళి, ఆ ఇంటి అమ్మాయికి పుస్తె కట్టారు శర్మగారు.

శర్మగారి జీవితంలో ఎలెన్‌ ప్రవేశం ఒక అర్హభరితమైన సంఘటన. అది ఇద్దరు యువతీ యువకుల పాణిగ్రహణం మాత్రమే కాదు. ఒకేరకమైన ఆదర్శాలు, ఆశయాలు, భావాలు గల ఇద్దరు వ్యక్తుల సంయోగం. అదొక అపూర్వమైన అంతర్జాతీయ దాంపత్యం. ఎందుకంటే ఎలెన్‌కు కూడా విద్యాశా,స్త్రమన్నా, ఆధునిక విద్యాబోధనా పద్దతులన్నా ఎంతో అభిమానం. వివాహానంతరం అయిదారేళ్ళు జర్మనీలో ఇద్దరూ కావలసినంత అనుభవమూ, అవగాహన విద్యారంగంలో సంపాదించి, ఆ అనుభవ సంపదను మూటకట్టుకుని 1937లో మదరాసు చేరుకున్నారు. మైలాపూర్‌లో బృందావనం కాలనీలో కొత్త కాపురం పెట్టారు. వారిది కారణ దాంపత్యం. ఆశయ సామ్యంకల దాంపత్యం. కనుక మదరాసు వస్తూనే తమ ఆదర్శాలకు కార్యరూపం కలిగించారు.

బృందావనం కాలనీలో ఒక చిన్న ఇంట్లో ఏడుగురు పసిపాపలతో ఒక బాలల బృందావనం అనే విద్యాలయాన్ని ప్రారంభించారు. దానికి ''చిల్లన్స్‌ గార్డెన్‌ స్కూల్‌” అని పేరు పెట్టారు. నాటినుంచి ఈ దంపతుల కృషి ఫలితంగా ఈనాటికి అది రెండువేలమంది విద్యార్దులకు క్రమశిక్షణతో చదువులు నేర్చే ఒక బృహత్‌ ఆదర్శ విద్యాసంస్టగా రూపొందింది. 1978లో శ్రీ/మతి ఎలెన్‌ శర్మ మరణించారు. అప్పటివరకు ఆమె ఆస్కూల్‌ సిబ్బందికి, విద్యార్థులకు అందరికీ 'అమ్మ'లాగ అందరినీ కంటికి రెప్పవలె చూచుకుంటూ వచ్చారు. డాక్టర్‌ శర్మగారు తరచు జర్మనీ వెళ్ళి భారతీయత గురించి విరివిగా ఉపన్యాసాలిచ్చి నిధులు సేకరించి తెచ్చేవారు. ఎలెన్‌ శర్మగారు ఈస్కూలును ఒక విద్యాలయంగా మాత్రమే కాక్క ఒక 'సేవాశ్రమంగా నడుపుతూ ఎందరో అనాధ బాలబాలికలకు, పేదతల్టులకు సహాయపడుతూ వచ్చారు. ఈ దంపతులకు గీత, రుక్మిణి, శకుంతల అనే ముగ్గురు సంతానం. వీరిలో మూడో కుమార్తే శకుంతల తల్లిగారి అనంతరం ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టి, తన తల్లిదం(డ్రులు సృష్టించి, పెంచి, పోషీంచుకుంటూ వచ్చిన ఈ విద్యాసంస్థను ఇంకింత అభివృద్ది పరుస్తూవస్తున్నారు.

డాక్టర్‌ శర్మగారి కృషి ఒక్క ఈ స్కూలు నిర్మాణం, నిర్వహణలకే పరిమితం కాలేదు. విద్యాబోధన శా(స్త్రంతోపాటు, తత్వశాస్త్రం, లలితకళల విమర్శన శాస్త్రంలో కూడా శర్మగారు పాండిత్యం సంపాదించారు. వారి ఈ పాండిత్యం ఇండియా-జర్మనీల మధ్య అంతర్జాతీయ సద్భావ సేతువుగా ఉపయోగపడింది. జర్మనీలో ఉండగా భారతీయ సంస్కృతీ సం ప్రదాయాలనుగురించి ఆయన (వ్రాసిన గ్రంథాలను అక్కడి విశ్వవిద్యాలయాలు ప్రచురించి, వాటిల్లో కొన్నటిని జర్మనీలో పాఠ్య పుస్తకాలుగా కూడా పెట్టాయట, అలాగే డాక్టర్‌ శర్మగారు సంధియుగం 131

అనేక జర్మన్‌ గ్రంధాలను తెలుగులోకి అనువదించారు. వాటిలో గాతె వంటి మహా పండితుల రచనలు మొదలు, జర్మన్‌ బాల సాహిత్యం గ్రంథాల వరకు ఎన్నో వున్నాయి. గొతె రచన ' ఫాస్ట్‌! (ఫో) రెండు భాగాలు, “గెలిలియో”, '“ఖైదీ*, '*కవల పిల్లలు", 'బుడుతడి యాత్ర, “బాల డిట్యైవ్‌, “వె[ర్రి అమ్మాయిలు” వంటివి వీటిలో ఉన్నాయి.

ఇవికాక మన '“భారతం”* వంటి జర్మన్‌ గ్రంథం 'ఎద్దా'ను ఆయన తెలుగులోకి అనువదించారు. వారి రచనలలో మరొకటి శర్మగారి స్వీయచరిత్ర, ఇది తెలుగులో ఇదివరకే రచన పూర్తయింది. దీనిని ఇంగ్రీషులో (వ్రాస్తుండగా వారికి మరణం సంప్రాప్తించింది. జర్మన్‌ భాషలో ఆయన (వ్రాసిన గ్రంథాలలో ' భారతదేశపు ఉత్సవాలు' ' భారతీయ కుటుంబ జీవితం" అనేవి ముఖ్యమైనవి. ఇవి రెండు జర్మనీలో జర్మన్‌ భాషలో ప్రచురణ అయినవి.

డాక్టర్‌ శర్మగారి పూర్తిపేరు ముక్తినూతలపాటి వెంకట నారాయణ శర్మ. (ప్రకాశం జిల్హా, ఒంగోలు తాలూకా కొత్తపట్నంలో 1897 జూన్‌ 14వతేదీన ఆయన జన్మించారు. ఒంగోలులో ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. ఆ తరువాత మదరాసులో డాక్టర్‌ జారి అరండేల్‌ గారి థియసాఫికల్‌ సొసైటీలో చదివారు.

ఎక్కడి కొత్తపట్నం? ఎక్కడి బెర్లిన్‌ ననరం? ఈనాడంటే వాయువేగ, మనోవేగాలతో ఆగమేఘాలమీద విమానాలలో తృటికాలంలో ఎంత దూరమైన వెళ్ళే అవకాశం వున్నందున దూరాభారాలు తెలియవుగాని, 1 920 లలో విదేశాలకు వెళ్ళడమంటే దాదాపు అసాధ్యమైన పనే. సము(ద్రం మీద ప్రయాణం చేయడం మహా పాపమని భారతీయులు భావించే రోజులు. మరి, నౌకాయానమొక్కటే ఆనాడు పరదేశ ప్రయాణానికున్న మార్గం. ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబంలో పుట్టిన శర్మగారు సంప్రదాయాల అడ్డుగోడలనే కాక్క ధనాభావం వంటి అవరోధాలను కూడా అధిగమించి జర్మనీ వరకు వెళ్ళి చదువుకొనడమే కాక, ఒక '* అప్రాచ్యపు"' అమ్మాయిని వివాహమాడటం ఎంతటి అభ్యుదయ దృక్సథమో వెనుకకు వెళ్ళి చూడగలిగినవార్‌కే అర్ధమవుతుంది. ఆయన తెలుగువారే కాదు. యావదాంధ్ర జాతి గర్వించదగిన భారతీయుడు.

(2.5.86) స్లాగ్గాన్గా

132 సంధియుగం

-సాంతవెరి చుప్రారి ఠొర్యువ్రు

ర్రీవిశాకేతనం కేలనెత్తి గగన తలానికెగిరిన మహాకవులు మనకున్నారు. ఏదో ఒకానొక సాహిత్య ప్రక్రియలో పారంగతులైన పండితులూ వున్నారు. సమస్త సాహిత్య సాగరాన్ని అమూలా(గ్రంగా జొపోసన పట్టినవారూ వున్నారు. నాట్యశా(స్త్రం సాకల్యంగా అధ్యయనం చేసినవారూ వున్నారు. ఒకనాటి రాచక్రీడ చదరంగంలో ఆరితేరిన యోధులున్నారు. మాయాజాల విద్యలో ఆరితేరిన ఇం'ద్రజాలికులున్నారు. ఇలా ఒక్కొక్క రంగంలో సూక్ష్మ పరిశీలన, పరిశోధన జరిపి ఒక్కొక్క విషయాన్ని నిగ్గుతేళ్చిన నేర్చరులున్నారు. ఛాయా చిత్రగ్రహణ విద్యాధురీణులున్నారు. చిత్ర లేఖనంలో చేయి తిరిగిన వారెందరో వున్నారు.

అవును. వీనిలో ఒక్కొక్క అంశాన్ని విడివిడిగా చూచినపుడు అందందు పేరన్నికగన్న వారెందరో వున్నారు. కాని ఈ అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి, పరిశోధించి ఇన్ని విద్యలను కరతలామలకం గావించుకొన్న ఒకే ఒక వ్యక్తి వుండడం చాలా, చాలా అరుదైన విషయం. అటువంటి అతి అరుదైన, అపురూపమైన వ్యక్తి ఆరుద్ర. ఇన్ని నివేసాలను ఒకేచాపలో చుట్టి చంకనపెట్టుకుని తిరుగాడుతూ, ఆచాపనే ఓచెట్టు (క్రింద పరుచుకొని బుషిపుంగవునిలా దానిమీద కూర్చుని తపస్సు, చేస్తున్నట్టు అనవరతం అవిరళకృషి సలుపుతున్న బహుముఖ ప్రతిభాశాలి ఆరుద్ర.

ఆయన వాలకం వేరు. తీరువేరు, దారివేరు, వేషధారణ వేరు. ఆయన్ని గురించి సన్నిహితంగా తెలుసుకొన్న కొలదీ, మనిషిలో నిక్షిప్తమై, నివురుగప్పి వుండే అనంతళక్తులను గురించిన ఆలోచన, ఆ తెలివిడివల్ల కలిగే ఆశ్చర్యమూ మనలను ముంచెత్తుతుంచాయి. అతని ఒక్క పొదిలో ఇన్ని అంబులు ఇముడ్చుకొనడం అప్పుడప్పుడూ కొందరికి కొంత సంళయమూ కలిగిస్తుంటుంది. ఇన్ని రంగాలలో ఇన్ని పరి శీలనలూ, ఇన్ని పరిశోధనలూ చేయడానికి ఒకే వ్యక్తి పూనుకొన్నప్పుడు ఇన్నిటిలో వేలుపెట్టిన వ్యక్తి ఏదీ సాకల్యంగా చేయలేడన్న సందేహం, కొందరికి కలుగుతుంటుంది. ఆరుద్ర విషయంలోనూ అలా అనుకునేవారు లేకపోలేదు.

కాని, ఆరుద్ర గత అర్హ శతాబ్ది కాలంలో సాగించిన సాహిత్య వ్యవసాయమూ, చేపట్టిన ప్రతి ప్రక్రియలోనూ సాధించిన విజయాలూ, ఆ పాత నమ్మకాన్ని అపవాదం చేస్తున్నాయి. అసూయా గ్రస్తులు మినహా అందరికీ ఆరుద్ర ప్రతి భావ్యుత్చత్తులు హర్దామోదాలు కలిగిస్తాయి. మనమాట, పాట, ఆట, నటనం - వీటన్నిటి కిటుకులన్నిటిని లోతుగా పరిశీలించి, పరిశోధించి వాటి వాటి వాటమేమిచో నిండుగా తెలుసుకున్న వాడాయన. ఆయన కృషినీ, దీక్షనూ, సావధాన అవధాన మేధనూ గమనించినవారికి, అతని పలు విషయపరిజ్ఞానపు లోతులెరిగిన వారికి అతని యెడల గౌరవభావం కుదిరితీరుతుంది.

సహస్ర తరంగ సాహిత్య తరంగిణిలో ఆయన స్పృశించని అలలేదు. ఆరుద్ర చేపట్టని రచనా ప్రక్రియ లేదు. చేపట్టిన దాని అంతు చూడని సందర్భంలేదు. మనస్సుకు హత్తుకానేలా, గుండెలను పిండేలాగ వచన రచన చేయగలడు. గాయాలను గేయాలుగా, జనగానాలుగా మలచగలడు. సులువైన పద్యాలను అలవోకగా అల్లగలడు. బాణీలకు పాటలు కట్టగలడు. సంధియుగం 133)

వచనాన్ని పద్యమంత సుందరంగా, పద్యాన్ని వచనమంత సులువుగా నర్తింపజేయగలడు. పండితులను ఒప్పించగల, పామరులను మెప్పించగల రచనలు చేయగలడు. తన గీతాలతో నవ్వించగలడు, కవ్వించగలడు, ఏడ్పించగలడు, ఆడ్చించగలడు. అతని కలం అంత బలమైనది.

సిద్దాంత నిబద్దులైనవారు మహాకవులైనాా మహా నాయకులైనా వారి చూపు కాకిచూపు కాకమౌనదు. సిద్దాంతాల అవగాహనకు అదికాదు గుర్తు, మంచితోపాటు చెడును కూడా (గ్రహించినగలిగినవాడే మేధావి. పొగడ్త అవగాహన రాహిత్యానికి గుర్తు. విమర్శు అవగాహనకు సంకేతం. కనుకనే ఆయా కాలాలలో ఆయా సిద్దాంతాలకు బద్దులైనవారు సార్వకా లిక సత్యాలను చూడజాలరు. చూచినా చెప్పనాల్లరు. ఈ ఒరపురాతి మీద గీచి చూచినప్పుడుగాని ఆరు(ద్ర సార్వకాలిక్క సార్వజనీన విశ్వవిశాల దృక్పథం, పరిపక్వత్క పరిప్వూర్ణతగల ఆలోచనా సరళి అర్ధంకాదు. పిన్ననాట ఎవరిని చూచి (ప్రేరణ పొందినా, ప్రభావితుడైనా- వయసునా, మనసునా పరిణతి చెందిన కొలదీ ఆరుద్ర ఆలోచనా పరిధి విస్తరించింది. అందునా, అతడు స్వతంత్ర మనస్తత్వం కలవాడు. కనుకనే, ఎవరిదారి వెంటనో పడిపోక తనదారిని తాను మలచుకొన్నాడు. తన చూపును తాను విసృతపరచుకొన్నాడు.

ఆధునిక సిద్దాంతాలన్నిటినీ అతడు ఆకళింపు చేసుకున్నాడు. మార్క్స్‌ నవలోక సిద్దాంతం అతనికి అంతుబట్టింది. నేటి ప్రపంచ మానవాళిని విశేషంగా - నిజానికి నిశ్శేషంగా అనవచ్చు - (ప్రభావితం చేసిన మార్క్స్‌ సిద్దాంతాలను అభిమానించాడు. అయితే దానికి దాసుడు కాలేదు. యం.యన్‌.రాయ్‌ వంటి ఆలోచనాపరుల భావాలను ఆకళింపు చేసుకొన్నాడు. అందలి సారాన్ని గ్రహించాడు. దానికీ దాసుడైపోలేదు. కనుకనే అతను అతనుగానే ఆరుద్రగానే నిలువగలిగాడు. తన ము(ద్రను తాను రూపొందించుకొన్నాడు. అది నవ్యమౌానవవాద ముద్ర. ఆరు(ద్రది హృదయవాదం. హృదయవాదం మార్క్స్‌ నవలోకవాదం కంటే, మరోమెట్టు పైన వుంటుంది. సిద్దాంతబందీలు దీనిని అంగీకరించరనుకోండి!

అందువల్లనే 'ఆరు(ద్రను అందరూ కొంతమేరకే అంగీకరిస్తారు, ఆదరిస్తారు. ఇది ఆ “అందరి' పాక్షిక దృష్టివల్లనూ, అతని పరిపూర్ణ మానవ వాద (హృదయవాద) దృష్టివల్లనూ ఏర్పడిన పరిస్టితి, అతివాదులు ఆరుద్రను తనవాడనుకున్నారు. మళ్ళీ వాళ్ళే కాదన్నారు. సనాతనులు ఇప్పటికీ ఆరు(ద్రలో సంప్రదాయపు వాసనలు చూస్తారు. అయినా అతనిలో ఆధునాతనతను వాళ్లు నిరసిస్తారు. ఆధునికులు ఆతనిని తిరోగామి అన్నారు. సనాతనులు అతనిని భ్రస్ట్రాచారి అన్నారు. ఉభయులూ అతనిని నిలకడ లేని వాడన్నారు. ఆరుద్ర పరిపూర్ణ వ్యక్తిత్వానికి, పరిపక్వమేధకీ ఇంతకన్నా కితాబులు మరేమికావాలి?

ఆరు(ద్ర, (శ్రీగశ్రీ/ల మధ్య విభేదాలు రావడం కొందరికి కోపం, కొందరిలో నిరసన, మరికొందరిలో విచారం కలిగించాయి. వారివారి ఆలోచనా ధోరణులను బట్టి ఈతరతమ తేడాలు. శ్రీశ్రీ, ఆరుద్ర ఒకప్పుడు దగ్గరివారు, బంధుత్వం వల్లనేకాదు. ఆలోచనల సామీష్యం వల్లకూడా, కలిసి వ్రాసినవారు. కలిసి మెలిసి ఆలోచించినవారే. నిజమే. కానీ, వ్యక్తి వికాసం అందరిలో ఒకేలాగ మూసలో పోసినట్టు జరుగదు. ఊహ తెలిసి, ఊహలు పెరిగిన కొలది సాలోచనాపరుల ఆలోచనలు వివిధ దళలలో, వేరువేరు దిళల విస్తరిస్తుంచాయి.

శ్రీశ్రీ ఒకే సిద్దాంతానికి నిబద్దుడైన కవి. కాగా ఆరుద్ర ఏఒక్క సిద్దాంతమూ పరిప్యూర్ధమైనది కాదన్న నమ్మికతో ప్యూర్ణ మానవతవాది అయ్యాడు. ఈ ఆధునిక కవి పుంగవులిరువురి అభిప్రాయాలు అక్కడ వేరైనాయి. ఇందులో వారిని తప్పుపట్టువలసింది లేదు. 134 సంధియుగం

ముఖ్యంగా ఆరుద్రను తప్పుపట్టువలసింది ఆసలేలేదు. ఈలోకం పుట్టినప్పటినుంచి ఎందరో ప్రవక్తలు అవతరించారు. ఎన్నెన్నో సిద్దాంతాలు ప్రవచించారు. ఎప్పటికప్పుడు కొత్త సిద్దాంతాలు పాతవాటిని మరుగుపరుస్తూ వచ్చాయి. ఏ ఒక్క సిద్దాంతమూ పరిపూర్ణమైనది కానందువల్లనే అలా జరిగింది. కనుకనే సాలోచనాపరుల ఆలొచనాలోచనాలు ఎన్నడూ అర్హ నిమీలితాలుకావు. వారెప్పుడూ ఇంకింత దూరం దృష్టిని సారించి మరింత ముందుకు చూడటానికి (ప్రయత్నిస్తారు. ఈమాట ,శ్రీ/క్రీ॥ి వర్తించదు. ఆరుద్రకు వర్తిస్తుంది. అందుకే వారి దారులు వేరైనాయి. ఇది సిద్దాంత సంబంధమైన, లేదా మార్గ సంబంధమైన ఎడబాటు, విడిపాటు. దీనికి వ్యక్తిగతమైన కారణాలు అంటగట్టుడం సబబుకాదు. ఆస్ట్రాయి ఆలోచనలకు తగినదీ కాదు.

పండితుడుగా, బహువిషయకోవిదుడుగా ఆరు(ద్రను తెలుగువారి కంటే తదితరభాషల వారు ముఖ్యంగా తమిళులు ఎక్కువగా గుర్తించి గౌరవిస్తున్నారేమో! తెలుగువారు గుర్తించలేదని కాదు. అయితే మనకంటే తమిళ విద్వాంసులు, కళాకారులు ఆరు(ద్ర పాండిత్యాన్ని హెచ్చుగా గౌరవించడమే కాదు, వినియోగించుకుంటున్నారు కూడా.

నాట్యశా(స్రాల లోతుపాతులను ఆయనెంత కుణ్లంగా తె లిసినవాడో తమిళులకు తెలుసు. మదరాసు నగరంలో ఈనాటి అగ్రశ్రేణి నర్తకీమణుల, నాచ్యాచార్యుల మన్నన పొందిన నాట్య, సంగీత శాస్త్ర నిపుణుడు ఆరుద్ర. ఒక పద్మా సుబ్రహ్మణ్యం, ఒక చిత్రా విశ్వేశ్వరన్‌, ఒక కళానిధినారాయణన్‌, ఒకచం ద్రలేఖ- ఒకరేమిటే దాదాపు ప్రతిఒక్కరు తరచు తమ సందేహాలు తీర్చుకొనటానికి ఆరు(ద్రను సంప్రతిస్తుంచారు. నృత్య, సంగీత కళలకు పుట్టినిల్లు మదరాసు. ఈ నగరంలో ఏ ప్రఖ్యాత సంగీత, నాట్య సభైనా వెళ్లండి, ఏ (ప్రఖ్యాత నర్తకి నృత్యానైనావెళ్లండి. ఆ సభలో ఆరుద్రకు ఒక అగ్రస్థానం ప్రత్యేకించి ఉంటుంది. ఆయన ఒకవేళ వెళ్లకపోయినా, ఆరు(ద్రకంటూ అక్కడ ఒక కుర్చీ ఖాళీగా ఉంచుతారు. ఆయన వచ్చిననాడైతే కార్యక్రమానికి ముందో, మధ్య విరామ సమయంలోనో, చివరనో నర్తకీమణులు, నాట్యాచార్యులు, సంగీత పండితులు ఆయనను చుట్టుముట్టి రకరకాల సందేహాలు అడిగి తీర్చుకుంటుంచారు. ఈ సందర్భాలు స్వయంగా చూచినవారికి ఆరుద్ర పెద్దరికం బాగా అర్దమవుతుంది. ఇది తెలుగువారికి చాలామందికి తెలియని సంగతి, తెలుసుకున్నప్పుడు తెలుగువారు గర్వంతో పొంగిపోయే సంగతి.

(1.9.85) గ్గున్గున్గా

సంధియుగం 135

దసుస్ర దుమన్వయవావి

కో

అర్ఫ్పొోదయం రసమయం ఆయన చేతలు వైతన్యమయం

ఆయన అనుభూతి ఆనందమయం. ఆయన సమీక్షలు సమత్వమయం. ఆయన శైలి సౌందర్యమయం. ఆయన జీవితం వీటి అన్నిటిమయం. ఆయన వాస్తవంలో కల్పనను చూడగలడు. వ్యష్టిలో సమష్టిని, సమపష్టిలో వ్యష్టి అనుభూతి చెందగలడు. ఆయన రచనలు కాంతి కిరణాలు. ఆయన పథం కాంతిపథం.

ఇవి నా మాటలు కావు. సుప్రసిద్ధ సాహితీపరుడు, సంస్కృతీపరుడు, నిశిత వైజ్ఞానికుడు, నిగూఢ దార్శనికుడు, అద్భుత శిల్చవేత్త, అద్వితీయ లాక్షణికుడు, బహు భాషా కోవిదుడు, భావమాధురీ సంపన్నుడు. ఒకే వ్యక్తిలో ఇన్ని ప్రతిభలు గూడు కట్టుకున్న బహుముఖ మేధావి ఆనంద కుమారస్వామి గురించి ఒక సందర్భంలో సూర్యదేవర సంజీవదేవ్‌గారు (వ్రాసిన మాటలవి.

నిజానికి, సంజీవదేవ్‌గారిని గురించి వర్ణించడానికి కూడా ఇవే మాటలు మక్కికిమక్కిగా సరిపోతాయి. ఆనందకుమారస్వామిలో వలెనే సంజీవదేవ్‌గారిలోనూ ఇన్ని (ప్రతిభలు ఇమిడి వున్నాయి. అందుకే ఆయన మాటలతోనే ఆయనను గురించిన ఈ కలంచిత్రం మొదలు అవుతున్నది.

ఉపదేశప్రాయమైన ఆయన ఉషన్యాసం వింటుంటే, ఆయన విశ్వజనీన, విశాల మానవ దృక్పథంగల ఒక సమగ్ర సమన్వయవాది అన్న భావం కలుగుతుంది. ఈ భావం, వారి ప్రసంగాలు నా మనసుమీద వేసిన ఈ ముద్ర రూఢిగా స్థిరపడడానికి మరికొన్ని అవకాశాలు కావాలి, మరికొంత వ్యవధి కావాలి. ఎందుకంటే, వారి సారవిచారమతిత్వాన్ని సంప్యూర్ధంగా అవగాహన చేసుకొనడం అంత సుళువైన సంగతి కాదు. ఎంతో లోతైన ప్రకృతి తత్వపరిశీలన, మానవస్వభావ పరిశీలన వారి ఆలోచనలలో నిబిడీకృతమై ఉంచాయి. జీవితంలో కళను, కళలో జీవితాన్ని చూడగల, చూషగల సునిశిత రసమయ మేథస్సు వారిది.

సంజీవదేవ్‌గారు కవి, కళా(స్రష్ట, సాహితీ స్రష్ట సమీక్షకుడు, కళా వ్యాఖ్యాత, ఛాయాచిత్ర గ్రహణ విద్యాధురీణుడు - అన్నిటినీ మించి నిరాడంబర సౌజన్యమూర్తి నిత్యానందశీలి. ఆయన “కానివీ' కాన్ని వున్నాయి. ఆయన మార్క్సిస్టు కాదు. నైతిక వాది కాదు. దార్శనికుడు కాదు. నాటకాలు [వ్రాయరు. నవలలు గిలకరు. తాపసికాదు. వనవాసీ కాదు. ఉపదేశాలు చేసేగురువూ కాదు. నిజానికి రచన ఆయనకు వృత్తి కాదు. అదొక వ్యావృత్తి మాత్రమే. అయితే “కాదు, కాదు" అంటున్న ఈ పై లక్షణాలన్నీ ఆయనలో మనకు కనపడకపోవు సుమండీ!

ఆయనే ఒక సందర్భంలో తాను “కవికాని కవిని అని చెప్పుకొన్నారు. తన కవిత 'కవితకాని కవిత' అని వర్ణించుకున్నారు. అలాగే మనమూ ఆయనను గురించి ఉపదేశికాని ఉపదేశి, గురువుకాని గురువు, నైతికవాదికాని నైతికవాది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన రచనలలో, (ప్రసంగాలలో, నడివడికలో ఈ గుణాలన్నీ (లక్షణాలన్నీ) మనకు కనపడతాయి. అయినా, తాను 'ఫలానా* అని తనను గురించి ఆయన ఎప్పుడూ, ఎక్కడా చెప్పుకొనలేదు, నిండు కుండ 136 సంధియుగం

తొణకదు మరి. ఆయన ఒకసారి గోపాలరెడ్డిగారికి వ్రాసిన ఒక జాబులో ““ఎన్నిన్ని అనుభూతులో। ఎన్నని అనుభవించ గలడు మానవుడు” అని ఒక మాట (వ్రాశారట. డాక్టర్‌ గోపాలరెడ్డిగారు ఈ మాట చుట్టూ ఒక పెద్ద కవితనే అల్లారు, ఎందుకంటే, ఈ ఒక్క మాటలో ఎంతో ప్రకృతి పరమార్ధం ఇమిడి వున్నది. ప్రకృతిలో జీవితాన్ని, జీవితంలో ప్రకృతిని చూడగల రసదృష్టిగలవారు మాత్రమే అనగలిగిన మాట ఇది. అలాగని సంజీన్‌దేవ్‌గారు నేల విడచి సాముచేస్తూ, ఊహాలోకాలలో విహరించే వ్యక్తికాదు. తనచుట్టూ (ప్రపంచాన్ని, అందలి మంచి చెడులను, తొడిమానవుల కష్ట సుఖాలను చూచి స్పందన పొందే హృదయంగల సహృదయుడు. నేటి సమాజాన్ని విచ్చలవిడిగా ఆవరిస్తున్న అవినీతిని మానవుడికి మానవుడు చేస్తున్న అన్యాయాలను చూచి బాధపడే మనసుగల మనిష్కి వారి 'రస రేఖలు" (గ్రంథంలో వీటన్నిటికి సాక్యాధారాలు మనకు కనుపడతాయి. ఏ సిద్దాంతానికి నిబద్దుడుకాని ఆయన స్వీయ సిద్దాంతాలకు, సుద్దులకు అద్దం పట్టే గ్రంథం 'రసరేఖలు'.

ఆయన రస స్రష్ట మాత్రమే కాదు. సమగ్ర రసదృష్టి కల సమీక్షకుడు కూడా. కనుకనే సంజీవదేవ్‌గారి సమీక్షలు అన్యుల రచనలలోని ఆంతరంగిక అంద చందాలను మామూలు పాఠకులకు, పండు వలిచి చేతపెట్టినట్టు, ఎత్తి చూపేవిగా వుంచాయి. వారి సమీక్షలు కళాసాహిత్యాలకు వధ్యశిలలు కావు. సమీక్షకునికి వుండవలసిన సహృదయత, సమ్యక్‌దృష్టి, సమగ్రవీక్షణ ఆయనలో నిండుగా ఉండడమే ఇందుకుకారణం. ప్రకృతిలో ప్రతి అణువులోను, ప్రతి మనిషిలోను నిక్లిప్తమైఉండే విశిష్ట నిక్షేపాలను చూడగల ఆలోచనా లోచనాలు ఆయనకున్నాయి. కనుకనే మనకు వైరుధ్యాలుగా కనుపించేవాటిని ఆయన వైశిస్ట్యైలుగా చూడగలుగుతారు, చూషగలుగుతారు. సమీక్షా విద్యకు ఇంతకన్న పరాకాష్ట మరేమి వుంటుంది?

ఇలాతలపు సుందర సీమలను, గగనతలపు రామణీయకతను, నేలకు నింగికి నడుమగల ఆవరణాల అమరికలోని సొగసును తొను చూచ్చి, తన చిత్రలేఖనాల ద్వారా మనకు చూపగల చేయి తిరిగిన చిత్రకారుడు, పేరుమోసిన ప్రకృతి ఆరాధకుడు ఆయన. చిత్రలేఖనం, రూపచిదత్ర రచనలలో స్వారస్యాన్ని గురించి ఆయన చెబుతున్నపుడు వింటున్న మనకు అందలి రసానుభూతిని అందించగల సరళ కళా వ్యాఖ్యాత సంజీవదేవ్‌గారు. సకల లలిత కళల అంతరంగాన్ని బౌపాసన పట్టిన రస సిద్దుడు ఆయన. కనుకనే సంగీత, సాహిత్య, నృత్య, చిత్రలేఖవాది కళలను గురించి ఆలతి ఆలతి పదాలలో, అలవోకగా ఆయన చెబుతుంటే వింటున్నంతసేపు మనం మరో ప్రపంచంలో, రసలోకంలో ఓలలాడిపోతుంచాము. తన (శ్రోతలను తనతోపాటు ఉచ్చస్ట్రాయికి తీసుకుపోగల పరిణత పండితుడాయన.

ఆయన దృష్టి విశ్వమంత విశాలమైనది. రపాతల మంత లోతైనది. ఒక సందర్భంలో ఆయన ఇలా అంటారు, “నేడు మనం ప్రాచ్యమని, పాశ్చాత్యమని అనుకునే (ప్రభేదాలు చాలకాలం క్రిందటి వరకు లేవు. యూరప్‌లో పారి శ్రామిక యుగం (ప్రారంభమయినప్పటి నుంచి వచ్చినదే. ప్రాచ్య, పాశ్చాత్య ప్రభేదం అంతా. కాని, (క్రమేణ నేడు ఈ ఖండ భేదాలు నశించి ఖండాంతర ఐక్యత ఏర్పడుతున్న లక్షణాలు జీవితానికి సంబంధించిన ప్రతి రంగంలోను గోచరం అవుతున్నాయి. ఆదిమానవుల స్వల్ప అవసరాలతో నిండిన జీవితంలో గోచరించే సామ్యం నేటి మానవుని బహుళ అవసరాలతో నిండిన జీవితంలో కూడా గోచరిస్తుంది” ఈ మాటలలో ఆయన విశాల, ఆధునిక దృక్పథం మనకు కనపడుతుంది. సంధియుగం 137

10

పదునారేళ్ళ తరుణ యౌవనంలో, సత్యాన్వేషణకై దేశం ఉత్తరాగ్రాన, హిమాలయ సానువులలో, ఆ (ప్రాంతపు లోయలలో సంచరించి, ఎందరెందరో దేశ విదేశీ మహాను భావులతో పరిచయంగావించుకొని, వారితోడి చెలిమివల్ల (ప్రభావితులైన సంజీవదేవ్‌గారు బహుకొద్ది మంది ప్రబుద్ద భారతీయులలో ఒకరు అనవచ్చు. ఆ అనుభవాలు, ఆ పరిచయాలు ఆయన జీవిత సౌధపు రూపురేఖలను దిద్దిపెట్టుగా, ఆ పునాదులపైన ఆయన తనదైన ఒక రస ప్రాసాదాన్ని నిర్మించుకున్నారు. వారి తుమ్మపూడి జానపద నివాసం తోరో కాసార తీరపు కుటీరాన్ని స్ఫురింపచేస్తుంది. సంజీవదేవ్‌గారిలో ఒక జిడ్డు కృష్ణమూర్తినీ, ఒక ఆనంద కుమారస్వామిని చూడగలుగుతాము. సంజీవదేవ్‌గారి రచనలు తెలుగు సాహిత్యాడికి ఒక కొంగ్రొత్త రస స్టాయిని సంతరించి పెడుతున్నాయి. అలాగే ఆయన ఇంగ్లీషు రచనలు భారతీయ ఆంగ్రసాహిత్యానికి ఆభరణాల వంటివి. ఆయన ఒక ఆధునిక భారవి. ఆయన రచనలు ఆయనతోడి పరిచయాలు మన మనోనయనాలమీద సరికొత్త వెలుగును ప్రసరిస్తుంచాయి. ఆయన ప్రసంగాలు ప్రకృతి సౌందర్యాన్ని మన ముందు ఆవిష్కరిస్తాయి. ఆం(ధ్రదేశం అందించిన మరొక దార్శనికుడు డాక్టర్‌ సంజీవదేవ్‌. సి. నారాయణరెడ్డిగారి మాటలలో ““లోచనానికి ఆలోచన, ఆలోచనకు ఆలాపన, ఆలాపనకు ఆకృతి, ఆకృతికి రుంకృతి అమరించగలిగిన అమృతభావుకుడు సంజీవదేవుడు”. (29.8.86) స్గాన్గాన్గా అంతః కలహాలు ““దేళంలో చెలరేశుతున్లు ప్రాంతీయ కలవోలన్సు భాష పేరిట మతం పేరిట పొడసూఫుతున్ను తగాదాలను ఈ వివాదాల విషయంలొ వివిధ రా(్రాల నాయకులు అనుసరిస్తున్న వైఖరులను చూస్తుంటోేమనం ఒక జూతిగా భారత జూతిగా కలకాలం మనగలమా అన్హు సంళయం మనలను గురించి మనకు కలగకుండా ఎలా వుంటుంది? జూతీయ ప్రయోజనాలు పూర్తిగా విస్థురించే ఈ అంతః కలవోలు చూడగా మనం భాషావాదులుగ తవ్పు (ప్రాంతీయ వాదులుగా ఆలోచించగలళక్తి మనలో నళించి పోయిందేమోననిపిస్తుంది. ఇది దేళభవిష్యుత్తుకు వీమాద్రం మంచిదికాదు. ఇంటాబయటా 27. 6. తీఠ 1386 సంధియుగం

'ఆంనగనగా ఎప్పుడో ఒకానొకప్పుడుకాదు. నిన్న మొన్నటిదాకా ఈ దేళంలో తెలుగు అనే భాష ఒకటి ఉన్నదని, దేళ జనాభాలో చాలామందే ఈ భాష మాట్లాడుతారనీ మన దేశంలోనే వింధ్యపర్వతాల కావలనున్న ఉత్తరాదివారకే తెలియదు. దక్షిణ భారతమంటే మదరాసు, మదరాసీలూ మాత్రమే కాబోలు షనుకునేవారు, తెలుగువారిని “మదరాసీ'ల క్రిందనే జమవేసేవారు. ఈ “'మదరాసీలు” ఏభాష మాట్లాడుతారోకూడా చాలామందికి తెలియదు. తెలిసిన కొద్దిమందికికూడ తమిళం ఒక్కటే దక్షిణాదిభాష అనే (భ్రమ వుండేది. వాస్తవానికి దేళంలో హిందీభాష తరువాత ఎక్కువమంది మాట్లాడేది తెలుగుభాష అయినా నిన్న మొన్నటిదాకా దాని వునికి తెలిసిన వారు బహుకొద్దిమంది.

భారతీయులుగా విదేశాలలో గొప్పు పేరు ప్రతిష్టలు సంపాదించిన తెలుగు (ప్రముఖులు లేకపోలేదు. శాస్త్ర పరిశోధకులుగానో, హిందూ ధర్మ వ్యాఖ్యాతలుగానో, ఇంజినీర్లగానో విదేశాలలో గొప్ప పేరు తెచ్చుకున్న తెలుగువారెవరికి, తెలుగువారిగా ఆ కీర్తి రాలేదు. కాకినాడ నుంచి అమెరికా వెళ్ళి ఆరోమైసిన్‌ వంటి కౌషధాన్ని ప్రసాదించిన యెల్లా (ప్రగడ సుబ్బారావుగానీ, తత్త్వవేత్తగా (ప్రపంచ 'ప్రసిద్దుడైన సర్వేపల్లి రాధాకృష్ణన్‌గానీ, సోవియట్‌ యూనియన్లో స్థిరపడి బహుకాలం అక్కడ పనిచేసి మంచిపేరు తెచ్చుకున్న కొలచెల సీతారామయ్యగానీ, (ప్రముఖ భారతీయులుగానే ప్రఖ్యాతులైనారుతప్ప వారు తెలుగువ్వారన్న సంగతి తెలిసిన వారి సంఖ్య ఆ దేశాలలో బహుశా (వేళ్ళమీద లెక్కించవచ్చు.

అయితే, అంతకుముందునుందే విదేశాలలో తెలుగు పరుపు ప్రతిష్టలను, తెలుగుభాషా ప్రస్తిని ఇతర దేశాలలో నిరాడంబరంగా, వైయక్తిక స్థాయిలో విస్తరింప జేస్తున్న తెలుగు (ప్రముఖులు కొందరున్నారు. ఉత్తరమెరికా తెలుగుసంఘం, ఐరోపా ఆంధ్రసంఘం, మలేసియా ఆంధ్ర సంఘం వంటి కొన్ని సంఘాలుకూడ ఇటీవలి కాలంలో ఆయా దేశాలలో తెలుగు వ్యక్తిత్వాన్ని తెలుగు భాష తీయందనాన్ని వ్యాపింపజేస్తున్నాయి.

తెలుగు భాషా ప్రతిపత్తిని నిర్మాణాత్మక పద్దతిలో ప్రచారాడంబరాలు లేక స్వచ్చందంగా విదేశాలలో పెంపొందిస్తున్న వారిని గురించి అనుకొన్నప్పుడు మొదట స్పురణకు వచ్చే వ్యక్తి శ్రీ, గూచాలకృష్ణమూర్తి. దాదాపు పాతికేళ్ళుగా లండన్‌ నగరంలో ఆంగ సాహిత్యాధ్యాపకులుగా పనిచేస్తున్న డాక్టర్‌ కృష్ణమూర్తి కొందరు (ప్రాచీన ఆంగ కవులను గురించి ఆర్జోయులకే తెలియని అనేక విషయాలు తెలియచెబుత్తూ, ఆరితేరిన ఆంగ్రభాషా సాహిత్య పండితులుగా గొప్ప పేరు తెచ్చుకొన్నారు. ఆ విధంగా పెరిగిన తన ప్రతిష్టను వినియోగించి అక్కడి వారిలో తెలుగు వ్యక్తిత్వాన్నీ, తెలుగు భాషా విశిష్టతను గురించిన అవగాహన ఎంతగానో పెంపొందిస్తున్నారు.

అసలు ఈయన లండన్‌ వెళ్ళిన చరిత్ర ఆసక్తికరంగా ఉంటుంది.

ఆయన పుట్టింది పర్గాకిమిడిలో, పెరిగింది బరంపురంలో. చదువులు ప్రారంభించింది

విజయనగరంలో. కొనసాగించింది విశాఖపట్టణంలో. పూర్తిచేసింది లండన్‌లో. వీరిదొక సామాన్య కుటుంబం. ఐదుగురు సోదరులలో చిన్నవారీయన. మిగతా వారంతా రైల్వేలలో పని చేస్తున్నారు. స్కూల్‌ ఫైనల్‌ కాగానే ఈయననుకూడా ఏదో ఒక రైల్వే ఉద్యోగంలో చేర్చించాలని అన్నల ఆలోచన. అయినా, ఈయన పట్టుదలతో చదువుకొని ఎం. ఏ. పట్టం పుచ్చుకుని 1955 సంధియుగం 139

నుంచి మూడేళ్ళపాటు అమలాపురం కళాశాలలోనూ, ఆ తరువాత సాగర్‌ విశ్వవిద్యాలయం తాలూకు బిలాస్‌పూర్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ కాలేజీలో మరో మూడేళ్ళపాటు ఇంగ్రీషు లెక్చరర్‌గా పనిచేశారు.

అప్పట్లో జరిగిన ఆలిండియా ఇంగ్రీషు టీచర్ల మహాసభకు ఈయన హాజరైనారు. అప్పటికి ఈయన కింకా పట్టుమని ముప్పై ఏళ్ళ వయసుకూడా లేదు. ఆ రోజుల్లో కలకత్తా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ దీనా స్టాక్‌ (మిసెస్‌ ఎ. జి. స్టాక్‌ తో పరిచయమైంది. ఈమె ప్రసంగవశాత్తు (శ్రీ, కృష్ణమూర్తిని 19వ శతాబ్ది చివరిపాదంలో గొప్పు ఆంగ్ర కవులలో ఒకరైన '్రాన్సిన్‌ తామ్సన్‌ను గురించి పి. హెచ్‌. డి. పరిశోధన చేయవలసిందిగా ప్రోత్సహించారు. అంతకు ముందు మరో (గ్రీకు అధ్యాపకురాలు మిసెస్‌ పాల్వాడి కూడా ఆయనకు ఇదే పేరు సూచించడం జరిగింది. ఈ ప్రముఖ మహిళలిద్దరు సూచించిన ఆ ఆంగ కవిపేరు ఆయన అప్పటి వరకు ఎప్పుడూ వినలేదు. అందువల్ల, ఆశ్చర్యంతో ఇదే మాట మిసెస్‌ దీనా స్టాక్‌తో అనగా “' మీరేకాదు, ఈ కాలపు ఇంగ్రీషు వాళ్ళకే ఆ గొప్పకవినిగురించి ఏమీ తెలియదు. అందుకే ఈ పరిశోధన మిమ్మల్ని చేయమంటున్నాను” అని ఆమె ఆయనను ఉత్సాహపరిచింది.

అలా లభించిన ప్రోత్సాహంతో 1961లో ఆయన ఎలానో కష్టపడి లండన్‌ చేరుకున్నారు. 1962లో ఇన్నర్‌ లండన్‌ ఎడ్యుకేషన్‌ ఆధారిటీ వారి కళాశాలలో ఇంగ్రీషు టీచరుగా ఉద్యోగం లభించింది. ఆ ఆధారంతో ఆయనతన పరిశోధన కృషి ప్రారంభించారు. తామ్సన్‌ కవినిగురించి ఎక్కడెక్కడ ఎటువంటి సమాచారం లభించినా, ఎంతో వ్యయప్రయాసలకోర్చి దానినంతా సేకరించారు. ఆయన సేకరించిన సమాచారం ఆర్లేయపండితులకే చాలామందికి చాలాభాగం తెలియదు. తన పరిశోధన కృషిలో భాగంగా (శ్రీ, కృష్ణమూర్తి '' ఫ్రాన్సిస్‌ తామ్సన్‌ సాసైటీ*' అనే సాహితీ సంస్థను లండన్‌లో 1963లో నెలకొల్పారు. దీనిలో పలువురు సమకాలీన ప్రఖ్యాత ఆంగ్ర కవులు, తదితర సాహిత్యాభిమానులూ సభ్యులుగా చేరారు. ఆ ఆంగ్ర కవిని గురించి తాను సేకరించిన సమాచారాన్ని, కవిత్వ వ్రాతప్రతులను, ఆ కవి చిత్ర పటాలను చేర్చి ఒక చక్కని ఎగ్టిబిషన్‌ను కూడా సమకూర్చారాయన. దీనికి అండన్‌ లార్డ్‌ మేయర్‌ ప్రారంభోత్సవం చేశారు.

తన పరిశోధనలకు లండన్‌లో అయితే పుష్కలంగా సమాచారం అభిస్తుందనుకొని అక్కడకు వెళ్ళిన (శ్రీ, కృష్ణమూర్తి ఆర్లేయులకే అంతవరకూ ఆ కవిని గురించి తెలియని పలు విషయాలు తెలియ చెప్పవలసి వచ్చింది. ఇది నిజంగా ఒక విచిత్ర పరిస్టితి. ఉడుము పట్టుతో ఆయన పరిశోధించి సేకరించిన సామ(గ్రి ఆ విధంగా ఆయనకు ఆంగ్ల కవితా ప్రపంచంలో ఒక (ప్రత్యేక గౌరవస్ట్రానాన్ని చేకూర్చి పెట్టింది. అలా ఆయన తన పరిశోధన పూర్తిగావించి డాక్టరేట్‌ పుచ్చుకున్నారు. 1968 నుంచి 72 దాకా అమెరికాలో రెండు యూనివర్సిటీలలో ఇంగ్రీషు (ప్రాఫెసర్‌గా పనిచేసి తన అమూల్య పరిశోధన విజ్ఞానాన్ని అమెరికన్‌ విద్యార్థులకు కూడా పంచిపెట్టారు.

డాక్టరు గూటాల కృష్ణమూర్తి '' ఫ్రాన్సిస్‌ తామ్సన్‌ సొసైటీ'' పేరును ఆ తరువాత 1890 సొసైటీ అని మార్చారు. అప్పటికి ఒక పదేళ్ళుముందూ, పదేళ్ళు వెనుకా మధ్యకాలంలో గొప్ప కవితలల్లి కారణాంతరాల వల్ల మరుగునపడిపోయిన ఆంగ కవులను, వారికవితలను వెలుగులోకి తీసుకరావడం ఈ సొసైటీ లక్ష్యం. ఆయన ““మేకర్స్‌ ఆఫ్‌ నైన్‌టీస్‌'” అనే మకుటం క్రింద ఆ కాలపు ఆంగ కవులను, కళాకారులను, నటులను గురించి గ్రంథాలు ప్రచురించారు. ప్రచురించడమేకాకుండా వారిని గురించిన ఎగ్రిబిషన్‌లను సమకూర్చి బ్రిటన్‌, అమెరికా దేశాలలో విస్తారంగా ప్రదర్శించారు. 140 సంధియుగం

ఇంగ్రీషు సాహిత్య పరిశోధనా బోధనాకృషిలో పాత్‌కేళ్ళపాటు మునిగిపోయిన ఈయన తెలుగు భాషను దాదాపు మరచిపోయివుండవచ్చునని ఎవరైనా అనుకుంటే ఆళ్చర్యంలేదు. కాని ఆయనను తెలిసినవారికి, ఆయననుచూచి ఆయనతో మాట్టాడినవారికి మాత్రం అలా ఒక్కక్షణం కూడ అనిపించదు. నిజానికి ఆం(ధ్రదేశంలో వున్న మన అందరికంటె ఆయన మాట్లాడే తెలుగు, వ్రాసే తెలుగు మరింత సరళంగా, తీయగా వుంటుంది. పాతికల్లో ప్రవాసం ఆయన తెలుగు భాషాభిమావాన్ని ఇంకింత పెంపొందించింది. ఆయన ఒకసారి ఇండియా ఆపీసులై బ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ దిక్కూ మొక్కు లేకుండా ఒక మూలన పడివున్న ఎన్నెన్నో పురాతన తెలుగు గ్రంథాలు చూడగా, ఆయనలో కలిగిన భావావేశం ఆంతా ఇంతా కాదు. అక్కడున్న అధికారిని ఆ పుస్తకాల గురించి ఆయన అడిగినప్పుడు అవే భామిపుస్తకాలో కూడా తనకు తెలియదన్నాడు. ఈ జవాబు ఆయనలో తెలుగు భాషాభిమానాన్ని మరింత (ట్రేరేపించింది. ఆ పుస్తకాలు తెలుగు భాషా రచనలనీ, తాను తెలుగువాడిననీ, వాటన్నిటికీ తాను శ్రేటలాగు తయారుచేసి పెడతాననీ అన్నప్పుడు, ఆ ఉద్యోగికి ఆళ్చర్యం వేసింది. ఎందుకంటే డాక్టర్‌ కృష్ణమూర్తి ఆరితేరిన ఒక ఆంగ సాహిత్య పండితుడని ఎరిగిఉన్న అతనికి ఆయన మాటలు అచ్చెరువు గొలిపాయి. డాక్టర్‌ కృష్ణమూర్తి ఒక పైసా పుచ్చుకోకుండా ఉచితంగా కొన్ని వేల ఆ గ్రంథాలకులై'(బ్రరీ శాస్త, రీత్యాకేటలాగును స్వహస్తంతో (వ్రాసి ఇవ్వగా, ఆ (గ్రంథాలయం వారు ఆ (వ్రాత ప్రతులకే బ్లాకులు చేయించి ముద్రించారు. కృష్ణమూర్తిగారి తెలుగుతనం, తెలుగు భాషాభిమానం అంతా ఇంతా కాదు, తెలుగు గ్రంథాలను కూడా బ్రిటన్‌లో ఆంగ్ల గ్రంథాలతీరులో (ప్రచురించాలన్న పట్టుదలతో ఆయన **విదేశాం[ధ్ర ప్రచురణలు” అనే సంస్థను ప్రారంభించారు. దీని క్రింద ప్రచురించిన మొదటి రచన పురిపండావారి '“పులిపంజా”'. ఇక్కడ తెలుగులో కంపోజ్‌ చేయించి అర్జుపుల్స్‌ పట్టుకెళ్ళి. (బ్రిటన్‌లో ముచ్చటగా ముద్రింపించారు.. వారి రెండవ (ప్రచురణ ీగ8్రీ/

  • మహాహ్రస్థానం,'” దీని విషయంలో ఆయన మరింత సాహసోపేతమైన (ప్రయోగం చేశారు. శీ॥శ్రీని లండన్‌ తీసుకువెళ్ళి తన ఇంట కొన్ని నెలలు వుంచుకొని '*మహా(్రస్టానం' యావత్తూ శ్రీ;శ్రీ దస్తూరిలో (వ్రాయించి అచ్చువేయిండమే కాక్క శ్రీశ్రీ. చేత స్పీయకవితాగొనం చేయించి ఆకేసెట్‌ను కూడా ఆ పుస్తకంలో ఇమిడ్చారు. సాహిత్యపు విలువలు తెలిసిన వార్‌కే ఈ పుస్తకం విలువ తెలుస్తుంది. ఈ విధంగా స్వభాషాభిమానంతో ఆయన చేతులు బాగానే కాల్చుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు, లండన్‌లో కనపడిన ఏ తెలుగు వాడికైనా ఆయన అప్యాయంగా ఇచ్చే ఆతిధ్యం మరొక ఎత్తు. అది స్వీకరించి వచ్చిన వారంతా లండన్‌లో +కృష్ణమూర్తీభవించిన తెలుగు” సత్రంలో వుండి వచ్చాము అని నవ్వుతూ అంటుంటారు. వినయ సంపన్నుడు, పాండిత్య భారంతో కృంగిన యువ వృద్దుడు. అన్నింటినీ మించి స్నహశీలి, కర్మయోగి గూటాల కృష్ణమూర్తి. (12.10.84) గాన్గాగ్గు సంధియుగం 141

నునార్ని - వొంబమూర్తి 44 త్‌ శోకం నుంచి పొంగి పారలిన రక్తాళ్ళవ్రలను ముత్యాలుగా మార్చి వోరాలుగా కూర్చి ఈ సభకు వచ్చిన దేళభక్తుల మెడలలో వేస్తు మేరు ననసమాన ధీరుడు మన సాంబమూర్తి” కాకినాడలో 1923లో జరిగిన జాతీయకాంగ్రస్‌ మహాసభల ముగింపు సమావేశంలో, ఆ సభల స్టానిక నిర్వాహకులకు ఎ.ఐ.సి.సి, పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ భారత కోయిలమ్మ సరోజిని నాయుడు మహర్షి బులుసు సాంబమూర్తిగారిని ఉద్దేశించి చెప్పినవి పై పలుకులు. అఖిల భారత జాతీయ కాం. 38న వార్షిక మహాసభలను ఆంధ్ర దేళంలో జరుపవలసిందన్న అప్పటి ఆంధధ్ర రాష్ట్ర కాంగ్రట్‌ అధ్యక్షులు దేశభక్త కొండా వెంకటప్పయ్య, ప్రధాన కార్యదర్శి మహర్షి బులుసు సాంబమూర్తి ప్రభృతి ఆంధ్ర నాయకుల అభ్యర్థనపై 1923లో మన గడ్డమీద ఆ సభలు జరిగాయి. సాంబమూర్తిగారి పట్టుదలపై కాకినాడలో ఆ సభలు జరపడానికి నిర్ణయించారు. ఆహ్వాన సంఘం (ప్రధాన కార్యదర్శిగా ఆ సభల నిర్వహణ భారాన్ని సాంబమూర్తిగారు తన పైన వేసుకొని, అంతకుముందు ఎన్నడూ జరగనంత బాగా ఏర్పాట్టుచేశారు. సభలు మరికొన్ని రోజులలో ప్రారంభమవుతాయనగా సాంబమూర్తిగారి పీకైక పుత్రుడు ఇరవైయ్యే ప్రాయపు చెట్టుంత బిడ్డ ఆకస్మిక అకాల మరణానికి గురి అయినాడు. అంతటి కడుపు శోకాన్ని లోలోపల దిగ మ్రింగుకొంటూ సభలు పూర్తయ్యేవరకు దీక్షతో పనిచేశారు. ఆయనలో (పేలని అగ్ని పర్వతంలా, లోలోన ఉడుకుతున్న శోకాన్ని ఆయన కనులలో కాంచ గలిగిన సరోజినీదేవి కవితా హృదయం ద్రవించి పై పలుకులలో ప్రవహించింది. ఆ మాటలు విన్ననాటి సభికుల మనసులు చలించిపోయాయి. సాంబమూర్తిగారి ఎడల అందరిలోను ప్రళంసా భావం పాంగులు వారింది. సిల్కు సూటు, దొర చోపీ ధరించి మోటారు సైకిలు మీద హుషారుగా తిరుగుతూ క్రిమినల్‌ కేసులలో అజేయుడైన లాయరన్న పేరు తెచ్చుకుని, రెండు చేతులా పుష్కలంగా సంపాదిస్తూ అడిగినవారికి లేదనకుండా అంతో ఇంతో దానాలుచేస్తూ కులాసాగా, ఖుషీగా సాయం సమయాలను కాకినాడ క్లబ్బులో సరదాగా గడుపుతుండే ఆ యువ న్యాయవాది అన్ని సరదాలు, సౌఖ్యాలు అమాంతం వదిలివేసి గాంధీజీలాగ, కొల్పాయి గట్టి దేశమాత సేవకు అనితర సాధ్యమైన దీక్షా దక్షతలతో పూనుకొంచాడని ఆ తొలి ఆశ్రమంలో ఆయనను చూచినవారెవరైనా ఊహించడం కష్టమే. అయినా, అదే జరిగింది. గాంధీజీ పూర్వ వేషం మార్చి కొల్లాయి కట్టిన రోజుననే సాంబమూర్తిగారుకూడా అటువంటి మానసిక పరిణామానికే లోనైనారు. గాంధేయవాదులలో ఆయన అతివాది. ఆమాటకొస్తే గాంధీజీ కంచె ఎంతో ముందుగా సంప్యూర్ణ స్వాతంత్ర్యం కావాలని ఎలుగెత్తి నినదించిన భయమెరుగని మహా దేశభక్తుడు మహర్షి 142 సంధియుగం

బులుసు సాంబమూర్తి. రాజకీయరంగంలో అసహాయ శూరుడు, సునిశిత మేధావి అన్న మాటలకు సజీవ రూపం సాంబమూర్తిగారు.

“సాంబమూర్తి, నేను గత ముప్పయ్యేళ్ళుగా కలిసి పనిచేస్తూ వచ్చాము. ఇ ౮ వృత్తిచేత లాయర్లము. ఇద్దరము దాదాపు ఒకేసారి మా వృత్తిని కాలదన్ని దేశ స్వాతంత్ర్య సమరంలో దూకినవాళ్ళము. 1921లో జరిగిన మొదటి గోదావరి జిల్లా రాజకీయ మహాసభకు నేను అధ్యక్షత వహించాను. ఆ సభలో సాంబమూర్తి సాహసోపేతంగా ప్రవేశపెట్టిన “సంపూర్ణ స్వాతంధత్ర్యం?* కావాలని కోరే తీర్మానాన్ని ఆనాడు నేను సైతం వ్యతిరేకించాను. ఎందుకంటె గాంధీజీ లాగానే నేను కూడా ఆనాటి పరిస్టితులలో 'సంప్యూర్ణ స్వాతంత్ర్యం అన్న మాటను ఉచ్చరిస్తేనే ఎటువంటి తీవ్ర పరిణామాలు వుంచాయోనని భయపడ్డాను.”

సాంబమూర్తిగారు ఆం(ధ్రకేసరి (ప్రకాళంగారిని తనకు గురుపాదులుగా ఎంచుకొనేవారు. భయమన్న మాటను తన నిఘంటువులో నుంచే చెరిపివేసిన నిర్భీకుడుగా గుండెలు తీసిన బంటుగా ఆం(ధ్రులు ఆరాధించిన ఆంధ్రకేసరి (ప్రకాశంగారు సాంబమూర్తి గారిని గురించి తన స్వీయ చరిత్రలో చెప్పిన పై మాటల కంటె గొప్ప కితాబు మరెవరు ఈయగలరు? ఆ తరువాత ఎనిమిది సంవత్సరాలకుగాని, గాంధీజీవంటి వారు సంప్యూర్ణ స్వాతం త్ర్య నినాదాన్ని ఆమోదించ లేదంటే సాంబమూర్తిగారి సాహసము, మూర్గదర్శకత్వము, ముందుచూపు మనకు అర్ధం అవుతాయి.

గాంధీజీ పీలుపునందుకొని దేశమంతటా ఎందరెందరో న్యాయవాదులు తమ వృత్తిని వదలివేశారు. కాని, వారిలో చాలామంది కొంతకాలమయ్యాక మళ్ళీ తమ లాయరు వృత్తిని చేపట్టారు. అలా వదలివేసిన ఆ వృత్తివైపు తిరిగిచూడని జాతీయ నాయకులు-మోతీలాల్‌ నెహ్రూ, జవాహర్‌లాల్‌ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్‌, రాజాజీ, ప్రకాశంవంటివారు బహుకొద్దిమందే వుంటారు. ఆ కొద్దిమందిలో సాంబమూర్తి గారు ఒకరు. ముఖ్యంగా సాంబమూర్తిగారు తన న్యాయవాద వృత్తితోపాటు ఆ వేష భాషలను సైతం పరిత్యజించి కొల్దాయి గట్టి, నుదుట విభూతిరేఖలు దిద్ది ఈ కొత్త వేషంలో తూర్పు గోదావరి జిల్టాలో ఊరూరుతిరిగి, జాతీయ కాంగగ్ర్‌ నినాదాలను ప్రచారం చేశారు.

“రెండు చేతుల విత్తన్నూర్తించినట్టి వృత్తినాకగడ్జి పోచగా విడిచిపెట్టి

దేళ సేవా మహోద్యమ దీతనడపీ యపబ్బథము చేసినాడు మా సాంబమూర్హి"'

అని మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు ఆయన త్యాగ నిరతిని నాలుగు పాదాలలో చక్కగా ఇమిడ్చారు.

సుప్రసిద్ద జర్నలిస్టు చల్దా శేషగిరిరావుగారు. ఒకానొక సంపాదకీయంలో సొంబమూర్తిగారిని “మహర్షి అని వర్ణించారు. నాటి నుంచి ఆ మాట ఆయనకు చక్కగా అతికిపోయింది.

దేశంలో ఎక్కడ ఏ సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభమైనా అక్కడ ఆయన వుండేవారు.

1932లో గాంధీజీ లండన్‌ రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి తిరిగి రాగానే ప్రభుత్వం ఆయన్ను బొంబాయిలో అరెస్టు చేసింది. అదే రోజున కాకినాడలో సాంబమూర్తిగారు పోలీసు ఉత్తరువులను ధిక్కరించి, పెద్ద సభజరిపి, అక్కడ ఉపన్యసించబోగా పోలీసులు లారీ చార్జి చేసి సంధియుగం 143

ఆ సభను చెదరగొట్టారు. అయినా, సాంబమూర్తిగారు చలించకుండా ఎదురుతిరిగి నిలిచారు. ఆనాడు లాఠీలతో, పోఠీసు బూటుకాళ్ళతో ఆయనను కొట్టిన దెబ్బలు, పెట్టిన హింసా అంతా ఇంతా కాదు. స్పృహ తప్పి పడిపోయిన సాంబమూర్తిగారు మరణించారనుకాని పోలీసులు ఆయన తలమీదుగా బూటుకొళ్ళతో తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. మన జాతీయ మహా వాయకులలో ఇటువంటి చిత్రహింసకు స్వయంగా గురైనవారు మరొకరు లేరేమో,

ఆ తరువాత 1937లో ఆయన మదరాసు శాసనసభ స్పీకర్‌ అయినప్పుడు, ఆనాడు ఆయనను హింసించిన పోలీసు అధికారిని తీవ్రంగా దండించాలని శాసనసభ యావత్తూ కోరింది. అయినా, గాంధీతత్వం నరానరాన జీర్జించిన సాంబమూర్తిగారు స్పీకర్‌స్టానంలో నుంచి మాట్లాడుతూ తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించిన ఆ ఉద్యోగిని క్షమించమని చిరునవ్వుతో సభను కోరారు. దేళభక్తి, నిర్భీకత, త్యాగనిరతి, క్షమాసంపత్తి. ఇన్ని గొప్ప లక్షణాలు మూర్తీభవించిన మహర్షి సాంబమూర్తి స్పీకర్‌గా కొత్తకొత్త సత్సం(ప్రదాయాలను సృష్టించి మనవారి మన్ననలనే కాకుండా, ఆనాటి బ్రిటిష్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ ప్రశంసలను సైతం చూరకాన్న రాజర్షి

అప్పటి కామరాజ్‌ మంత్రి వర్గంలో సభ్యుడు, శాసనసభలో సభానాయకుడుగా వున్న (శ్రీ-ఆర్‌. వెంకట్రామన్‌, 1958 ఫిబ్రవరిలో సాంబమూర్తిగారు అస్తమించినప్పుడు శాసనసభలో ఆయనకు నివాళి అర్చిస్తూ ఇలా అన్నారు : '"'నిరాడంబరతలోను, నిజాయితీలోను, భావో ద్రేకంలోను ఆయన మూర్తీభవించిన ఆం(ధ్రుడు ... ఆయన గొప్పు త్యాగాలు చేశారు. కఠినమైన బాధలు సహించారు. దేళభక్తుడుగా ఆయనతో సరితూగగలవారు కొందరుండవచ్చు. కాని ఆయనను మించగలిగినవారు మాత్రం ఎవరూ లేరు. శాసనసభాద్యక్షులుగా ఆయన ప్రదర్శించిన స్వతం త్రదృక్పథం, అనుసరించిన ప్రజాస్వామిక పద్దతుల వల్ల సభాధ్యక్ష పదవికే ఆయన ఒక గొప్ప ఆభరణం వంటివారైనారు. *'

(14.3.86) న్గాన్గాన్గా 144 సంధియుగం

కంస ౨౪తామముడుఎ

6

రాల మొక్కుత నీ బాంచన్‌ దొర* కట్టు బానిసతనానికి ఊతపదమైన ఈ మాటకు పర్యాయపదంగా ఉండేది ఒకనాడు తెలంగాణా (ప్రాంతం. చిమ్మచీకటిలో తరతరాల నిజామురాజు బూజు వెనుక చిక్కుపడి దారీతెన్ను కానని అయోమయావస్టలో వుండేది అనాటి తెలంగాణా ప్రజానీకం. ఆ కారు చీకటిలో 1885లో ఒక కాంతి రేఖ ఉదయించింది. అక్క ముర వలా ఈ వాంచ భల వలగులు నదజల్యడం మొధైంది. అందరూ కలిసిన, లేదా ఈ అందరి గుణగణా లింగం 2కగురజాద, ఒకగో పాలకృష్ణగోఖలే-ఈ ప్రజలకు లభించాడు. నాటి కారుచీకటిలో ల మరస నకవాయుకుడు. తెలంగాణా కాదు-పలుజ్యోతులు వెలిగించిన దూర్షదర్శి ఆయన, ఆయన అభిరుచి, కృషి కువ. విజక్టు రంగానికో పరిమితంకావు, ఆం(ధ్రజనసయుం, ఆంధ్రమహాసభ, ఆం(ధ్ర భామ వికాసోద్యమం, (గ్రంథాలయోద్యమం, కట్టు బానినతసాం నిదూజ్రలత అప్హుట్టిలా నివారణ, (ఫ్రీవిద్యా వికాసం, వితంతు వివాహాలు, రజస్వలానంతర వివాహాలు, బహుభార్యాత్వనిషిధం, వళ్యాృుత్తి నిర్మూలన, రైతుల, తదితర గ్రామీణ ప్రజల కష్టాల నివారణ, మత సామరస్యం, వివిధ భాషల వారి మధ్య సయోధ్య అదీ ఇదీ అని ఏమిటి దాదాపు అన్ని రంగాలలో ఆయన ఉద్యమించారు. నిద్రాణమై వున్నవాటి తెలంగాణాలో అన్ని ప్రజా ఉద్యమాలకు ఆయన అద్యుడు. అంతేకాదు. ఆయన కవి, విమర్శకుడు, కథకుడు కూడా. శ

ఈ శతాబ్ది ప్రారంభంలో మూడు ఉద్యమాలు సంచలనం కలిగించాయి. సుప్రసిద్ద చరిత్రకారుడు కొమర్రాజు లక్మణరావు హైదరాబాద్‌లో తెలుగు భాషా ప్రచారానికి విజ్ఞాన వికాసానికి అప్పట్లో తమ కృషిని ప్రారంభించారు. కందుకూరి. వీరేళలింగంగారి. సంఘ సంస్కరణోద్యమం అప్పుడప్పుడే ఆంధ్రదేశ మంతటా వ్యాపిస్తూ ఇరుగుపారుగు రాష్ట్రాలపై కూడా తన ప్రభావాన్ని ప్రసరిస్తున్నది. కాగా మూడవది, భారత జా య నగ ప్రారంభించిన దేశ స్వాతంత్ర్య సమరం. భారత జాతీయ కాంగ్రెస్‌ పుట్టిన స ను తచేత అంటే 1885లో ఈ ఆం(ధ్ర మహానాయకుడు జన్మించాడు. వృత్తిచేత లాయర్‌, ప్ర త 'ప్రజాసేవకుడు అయిన ఆ మహానాయకుడే ఆం(ధ్రపలౌమహ మొ డపాటి హనుమం: రావుగారు.

ఆ కాలంలో తెలుగు ప్రజలను వెన్నుతట్టి సేలుకొలుపుతున్న పై మూడు ఉద్యమాల (ప్రభావం ముప్పిరిగొని, హనుమంతరావుగొరి మనసును ఆకట్టుకొన్నవి. ప్రభుత్వ ఉదధ్గూన్ని వదిలేసి లాయరు పరీక్ష చదివి న్యాయవాదిగా స్వతంత్ర జీవనం ప్రారంభించి, నాటి నుంచి ప్రజాసేవకు జీవితాన్ని ఆంకితం చేశారు హనుమంతరావుగొరు. అయనా ణే పెట్టరా కలి ప్రారంభించిన ఉద్యమాలన్నిటికి “తెలంగాణా అని కాక 'అంధ్రి అన్న పదాన్ని ఉపయోగించటంలో మాడపాటి వారు తన సమకాలికులందరికంటే వంద ఏళ్ళి ముందు చూపును. ప్రదర్శించిన మేధావి. అనాటి. నిజొము రాష్ట్రంలో రాజకీయోద్యమాలను సంధియుగం 145

ప్రత్యక్షంగా ప్రారంభించే అస్కారం లేనందున ఆయన యుక్తియుక్తంగా భాష్క [గ్రంథాలయ ఉద్యమాలను ప్రారంభించి అక్కడి ప్రజలలో విద్యాగంథమూ, భాషాభిమానమూ వాటి ద్వారా ప్రచ్చన్నంగా రాజకీయ వైతన్యాన్ని పెంపొందించారు. దేశమంతటా అప్పుడప్పుడే వ్యాపిస్తున్న జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమం కూడా మొదట రాజకీయాల ప్రసక్తి లేకుండానే ప్రారంభమైంది. మాడపాటి వారి ఆంధ్ర మహాసభ ఉద్యమం కూడా అదే ఒరవడిని అనుసరించి, 1946లో హైదరాబాద్‌ సంస్టాన కాంగ్రెస్‌లో లీనమయ్యేనాటేవరకు తెలంగాణా ప్రజల (ప్రచ్చన్న. రాజకీయ పక్షంగా పెరుగుతూ వచ్చింది. తెలంగాణాలో ఆంధధ్రోద్యమానికి మిగతా ఆంధ్ర ప్రాంతంలో నడచిన ఆం(ధ్రోద్యమానికి తేడా వున్నది. ఆంధ్ర ప్రాంతంలో నడిచిన ఉద్యమం ప్రధానంగా ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర నిర్మాణంకోసం జరిగినట్టిదికాగా, తెలంగాణాలో జరిగిన ఉద్యమం నిజాము రాజ్యంలోని ఎనిమిది జిల్లాలలో వున్న తెలుగు ప్రజల మాతృభాషను పునరుజ్జీవింపచేసి, తెలుగు భాషా సాహిత్యాల అభివృద్దిని సాధించడానికి, అక్కడ ప్రజలలో వారి సాంఘిక, అర్దిక, రాజకీయ హక్కులను గురించిన టైతన్యాన్ని పెంపొందించడానికి, వారి సాంస్కృతిక వికాసానికి ఉద్దేశించి బహుముఖంగా సాగిన ఉద్యమం. గాంధీజీ నాయకత్వాన జాతీయ కాంగ్రస్‌ దేశ ప్రజలందరిలో వైతన్యం కలిగించి, అందరిని ఒక త్రాటిమీదకు, ఒకే పతాక క్రిందకు తీసుకురావడానికి భాషా ప్రయుక్త రాష్ట్ర నినాదాన్ని వినియోగించుకున్నట్టే, తెలంగాణా ప్రజానీకాన్నీ ఆం(ధ్రోద్యమంలోకి ఆకర్షించడానికి కుల సంఘాలను వినియోగించుకున్నారు. సూక్ష్మంగా పరిశీలిస్తే దేశంలో కాంగ్రెస్‌ ఉద్యమ ఛాయల్లోనే తెలంగాణాలో ఆంధ్రోద్యమం. సాగుతూ వచ్చినట్టు స్పష్టమవుతుంది. అక్కడ పుట్టి పెరిగిన అన్ని ఉద్యమాలలోను మాడపాటివారి ప్రమేయం వున్నది. అన్నిటి మీదా ఆయన ముద్ర వున్నది. ప్రఖ్యాత కమ్యూనిష్టు నాయకుడు రావి నారాయణరెడ్డిగారి మాటల్లో చెప్పాలంటే ““నాబోటి యువకులెందరో ఆయనవల్ల ప్రభావితులై ఆంధ్ర వాజ్యయంతో పరిచయమేర్చరచుకున్నారు. హైస్కూలులో ఉరూ రెండవ భాషగా చదివిన నేను పంతులుగారి చేత ప్రభావితుడనై కాలేజీకి రాగానే తెలుగు రెండవ భాషగా తీసుకున్నాను. తెలుగు ప్రబంధాలను చదివాను. తెలుగులో ఉపన్యాసాలివ్వడం నేర్చుకున్నాను. నాలాగే ఇంకెందరినో ప్రభావితులను చేసిన పంతులుగారికి 'ఆంధ్రపితామహ' అన్న బిరుదు సారకతను సంతరించుకొన్నది?'. మౌడపాటి వారు సాగించిన ఇతర ఉద్యమాలన్నీ ఒక ఎత్తు. పాత మూఢాచారాలమీద వారు సాగించిన పోరాటం ఒకఎత్తు. ఇతర ఉద్యమాలన్నిటా నిజాము ప్రభుత్వపు కోపతాపాలకు గురి అయిన హనుమంతరావుగారు ఈ సంస్కరణోద్యమంలో హిందూ సనాతనుల ఆ గ్రహానికి గురైనారు. ఇలా రెండువైపుల ప్రతీపళక్తుల (ప్రత్యక్ష పరోక్ష ప్రతిఘటనలను ఎదుర్కొంటూ నెగ్గుకొచ్చిన మేరునగ సమాన ధీరుడాయన. (18.10.85) గానుగ 146 సంధియుగం

ఈయన రోజుకు అర్రరూపాయి జీతంమీద రైల్వే కంపెనీలో గూడ్సు గుమస్తాగా జీవితం ప్రారంభించారు. రెండు దశాబ్దాలపాటు మదరాసు కార్పొరేషన్‌ కౌన్సిలర్‌గా, ఆ తరువాత మదరాసు శాసనసభలో కాంగ్రెస్‌ శాసనసభ్యుడుగా పిదప కేంద్ర శాసన సభా సభ్యుడుగా ఉన్నత పదవులు నిర్వహించారు. సంపన్న కుటుంబంలో పుట్టినందుననో స్వయంగా గొప్పు సంపద లార్షించినందు వల్లనో ఆయనకు ఈ పదవులు లభించలేదు. ఆచంచల దీక్షతో, అకుంఠిత దేశభక్తితో సాటి ప్రజలకు ఆయన చేసిన సేవలే ఈ పదవులు అధిష్టించడానికి సోపానాలైనాయి. నిజానికి ఆయన హైస్కూళ్లలో, కాలేజీలలో పెద్దచదువులు చదివినవాడూ కాదు. ఆయన తండ్రిగారి దేళభక్తి తన ఇంగ్రీషు చదువులకు అడ్డువచ్చింది. పుట్టిన పల్లెటూళ్లో ప్రాథమిక చదువుల తరువాత నాటి మాధ్యమిక పాఠశాలలోచేరి ఇంగ్రీషు చదువుకొంచానంటే *'“ఆ అప్రాచ్యపు చదువులు మన కొద్దు” అని తండ్రి అంగీకరించలేదు. వారిదొక మామూలు రైతు కుటుంబం. తండ్రి వద్దన్నా ఎలాగో కష్టపడి ధర్హుఫారం వరకు ఇంగ్లీషు చదువుకొన్నాడు. కొద్దికాలంపాటు పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసి అది మానివేసి 1890లో ఆనాటి ఎం.ఎస్‌. ఎం. రైల్వే కంపెనీలో తాడేపల్లి రైల్వే ప్టేషన్‌లో గూడ్పు గుమాస్తాగా చేరారు. అప్పుడు ఆయన జీతం నెలకు పదిహేను రూపాయలు, పదేళ్ళు అక్కడ పనిచేసిన తరువాత మదరాసులో నెలకు పదిహడున్నర రూపాయల జీతం మీద అదే పనిలో చేరారు. ఆ విధంగా ఆయన మదరాసులో స్టిరవాసం ఏర్పరచుకున్నారు. పుట్టింది కృష్ణాజిల్లా, తిరువూరు తాలూకా ముష్టికుంట్లు గ్రామంలో. మదరాసులో మరి పదేళ్ళు గూడ్సు గుమాస్తా పనిచేశారు. 1910లో ఆ కంపెనీలో డి స్టిక్స్‌ ట్రాఫిక్‌ సూపరింటెండెంట్‌గా వున్న బ్రిటిష్‌ అధికారితో అభిప్రాయాలు వచ్చి, మాటకు మౌట పెరిగి ఆ అధికారి తన ఆత్మగౌరవానికి భంగకరంగా తూలనాడాడన్న కోపంతో అతని ఆఫీసులోనే అతడిని పట్టుకొని చావచితక గొట్టి, ఆ గుమొస్తా పనికి రాజీనామా ఇచ్చారు. అప్పటి మంచి సొంతంగా నౌకా వ్యాపారులకు రైల్వే గూడ్చు వ్యాపారులకు “'క్షియరింగ్‌ ఏజంటు'' గాను *' రికార్డింగ్‌ కంబ్రాక్టరు''గాను పనిచేయడం ప్రారంభించి ఆ రోజులలో ఈ వ్యాపారం చేసిన ప్రముఖలలో ఒకరైనారు. ఈ స్వతంత్ర వ్యాపారం చేసుకుంటూనే స్ట్రానిక ప్రజలకు తలలో నాలుకలా మెదలుతూ కాంగ్రక్‌ కార్యకర్తగా ప్రజాసేవచేస్తూ వచ్చారు. మొదటిసారిగా 1915లో బిపిన్‌ చంద్రపాల్‌ అధ్యక్షతన జరిగిన జాతీయ కాంగ్రు మహాసభకు ఆయన హాజరైనారు. ఈ సమావేశంలోనే గాంధీజీ కూడా పాల్గాని మొదటిసారిగా తన అహింసా విధానలవైపుకు కాంగ్రేస్‌ వారిని త్రిప్పుకొన్నారు. అప్పటినుంచి మన కధానాయకుడు ప్రతి ఏటా జాతీయకాం గమ్‌ మహా సభకు హాజరు అవుతూ వచ్చారు. 1916లో విదేశీ వస్తు బహిష్కురణోధ్యమంలో పాల్గొని తన తెల్లబట్టులన్నీ తగలబెట్టి ఖద్దరుధారణ సీమవస్తు బహిష్కరణకు కంకణం కట్టుకున్నారు. సంధియుగం 147

ఆయన మొదటిసారి 1924లో మద్రాసు కార్పారేషన్‌ ఎన్నికలలో పాల్గొని పోటీ లేకుండా కాన్సిలరుగా ఎన్నికైనారు. అప్పటి నుంచి 1948 వరకు అంటే రెండు పుష్కరాల కాలం ఈ నగర పాలక సంస్టకు పోటీ లేకుండానే ఎన్నికవుతూ' వచ్చారు. కౌన్సిలర్‌గా తన నియోజకవర్గం ప్రజలకు ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యమైనవి. 1936లో ఒక కార్పొరేషన్‌ ఉన్నత స్థాయి సంఘం నగరంలోని కార్పోరేషన్‌ డివిజన్‌లన్నిటిని పరిశీలించి ఈయన డివిజన్‌ను పారిశుధ్య విషయంలో ఉత్తమమైనదిగా ఎంపిక చేసింది. అప్పుడు ఆయనకు ఆరు సవర బంగారు గొలుసును బహుమతి ఇవ్వగా ఆయన దానిని వెంటనే తన డివిజన్‌లోని పారిశుధ్యపు పనివారికి ఇచ్చివేశారు.

నగరంలో మొదటి కార్పోరేషన్‌ రీడింగ్‌ రూమ్‌, లైబ్రరీ ఈ డివిజన్‌లోనే ఏర్పాటయినవి. తనసాంత గ్రంథాలయంలో వున్న వెయ్యి పై చిలుకు తెలుగు సంస్కృత (గ్రంథాలను ఆయన ఈ కార్పొరేషన్‌ గ్రంథాలయానికి బహుకరించారు. ఈయన మొదట కౌన్సిలర్‌గా ఎన్నికయ్యేనాటికి ఈడివిజన్‌లో ఒకే స్కూలువుండేది. ఈయన పదవీ కాలంలో మరి ఎనిమిది కార్పొరేషన్ల స్కూళ్ళను ఈయన పెట్టించారు. ఆ విధంగా ఆయన తన డివిజన్‌ ప్రజల ఆదరాభిమానాలను ఎంతగానో చూరగొన్నారు.

మదరాసు ఆంధ్ర కాంగ్రమ్‌ కమిటీకి కార్యదర్శిగాను ఆ తరువాత అధ్యక్షుడుగాను చాలాకాలం పని చేశారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ సంఘాన్ని రద్దుచేసే వరకు ఆయన దీనిలో ఏదో ఒక పదవిని నిర్వహిస్తూనే వచ్చారు. 1930నాటి ఉప్పు సత్యాగ్రహోద్యమంలో నగరంలో అర్జ్థయిన మొదటి ముగ్గురు నాయకులలో ఈయన ఒకరు. దేశోద్దారక కాశీనాధుని నోగేశ్వరరావు పంతులు. పి.ఎస్‌. బాష్యంచెట్టి, ఈయనా ఒకే రోజున ఆర్భాయినారు. అప్పుడు వీరికి ఆరునెలలు జైలుశిక్షపడింది. తిరిగి1932లో బ్రిటిష్‌(ప్రభుత్వం ఈయనను ఒక సంవత్సరంపాటు డిటెన్యూగా నిర్బంధంలో ఉంచింది. 1934లో మరొకసారి అరెస్టు చేసింది. కాని ఈసారి ఒకనెలరో జులలోపుగానే విడుదలైనారు.

“ఆంధ్రకేసరి” టంగుటూరి ప్రకాళం పంతులు, దేశోద్దారక నాగేశ్వరరావు పంతులు, రాజాజీ వంటి నాయకులతో చాలా సన్నిహితంగా కలిసి పనిచేశారు. అనేక సంవత్సరాలపాటు ఆంధ్రరాష్ట్ర కాంగ్రేస్‌ కమిటీ సభ్యులుగా వున్నారు. చెన్నపురిలో ఆం(ధ్రుల కార్యకలాపాలలో ఒక కీలక వ్యక్తిగా వుండేవారు. ప్రతి సంవత్సరం ఏ.ఐ.సి.సి. సమావేశాలకు నగర ఆంధ్ర'ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహీస్తుండేవారు.

ఆయన 1937లో కాంగ్రెస్‌పార్టీ తరపున మదరాసు నగర ఉత్తర నియోజకవర్గంనుంచి చెన్న రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనారు. అ ప్రక్కనే వున్న ఉత్తర మద్రాసు మధ్య నియోజకవర్గంనుంచి ప్రకాళశంపంతులుగారు ఎన్నికైనారు. మొదట కాంగ్రేస్‌మంత్రి వర్గంలో రెవిన్యూమంత్రిగా వున్న (ప్రకాశంగారు జమీందారీ పద్దతి రద్దును గురించి సూచనలు చేయడానికి నియమించిన శాసనసభా సంఘంలో ఈయనను ఒక సభ్యునిగా నియమించారు. ఈయన ఆంధధ్రప్రాంతమంతా పర్యటించి అందుకు సంబంధించిన ఎంతో సమాచారాన్ని సేకరించి, ఆ కమిటీ నివేదికతయారీలో (ప్రముఖపాత్ర నిర్వహించారు.

1940లో వ్యక్తి సత్యాగ్రహం ప్రారంభమైనప్పుడు ఆ ఉద్యమంలో చెన్నపురిలో అరెస్టయిన మొదటి వ్యక్తి ఈయనే. అప్పుడు బ్రిటిష్‌ ప్రభుత్వం ఈయనకు ఒక సంవత్సరం శిక్ష విధించింది. రెండవ (ప్రపంచయుద్దకాలంలో (1942)లో మదరాసుమీద బాంబులు 148 సంధియుగం

పడినప్పుడు ఎందరెందరో నగరం వదలి వెళ్ళిపోతుంటే, ఆయన ధైర్యంగా మదరాసులోనే ఉండి, నగరంలోనే వుండిపోయిన (ప్రజలకు అండగా నిలిచి వారకెంతో సేవచేశారు.

1943లో సత్యమూర్తి మరణంవల్ల కేంద్ర శాసనసభా సభ్యత్వానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రమ్‌ పార్టీ ఈయనను నిలబెట్టింది. అప్పుటి నుంచి 1946 వరకు ఆయన కేంద్ర శాసనసభాసభ్యుడుగా ఆసభా కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఆ ఎన్నికలో తన (ప్రత్యర్థి డిపాజిట్టును కూడా పోగొట్టిన ఘనత ఈయనకు దక్కింది, 1947లో దేశానికి స్వాతంత్ర్యం సిద్రించినంతనే “గాంధీజీ నాయకత్వాన మనం కలలుకన్న ఆశయం ఈడేరింది కనుక” తాను రాజకీయాల నుంచి విరమిస్తునట్టు (ప్రకటించారు. 1955లో ఆయన తనువు చాలించారు.

ఆయన గొప్ప సంఘసంస్కర్త. 1920 ప్రాంతాలలో గుంటూరు, కృష్ణా జిల్లాలలో తన ఆధ్వర్యాన చాలా విధవాపునర్వివాహాలు చేయించారు. హరిజన సంక్షేమౌనిక్కి అస్పృళ్యతా నివారణకు ఆయన నిర్మాణాత్మకంగా ఎంతో కృషిచేశారు. వారం వారం నగరంలోని హరిజనవాడలకువెళ్ళి ఆ వీధులను వూడ్చించి, అచట భజనలు జరిపీంచేవారు. పాత మదరాసు నగరంలోని హరిజనులు (దళితులు) ఈ భజనల్లో విరివిగా పాల్గొనేవారు. ఆయన, తమ జ్యేష్టపుత్రుడు రామచంద్రమూర్తి కలిసి ఈ భజనలకు ఆధ్వర్యం వహించి తంబుచెట్టివీధి, లింగిచెట్టివీధి, బ్రాడ్వేవంటి వీధులగుండా నడిపించేవారు. వీరి ఇంటివద్దను, ఆంధ్ర పత్రిక కార్యాలయంవద్దను ఈ భజనలలో పాల్గొనే వారందరికీ గ్లాసులతో పానకం ఇస్తుండేవారు. అప్పుడప్పుడూ దేశోద్దారక నాగేశ్వరరావు పంతులుగారు కూడా ఈ భజన ఊరేగింపులలో పాల్గాంటుండేవారు. 1933లో వారి జ్యేష్టపు త్రుడు డాక్టర్‌ రామచంద్రమూర్తి వివహమప్పుడు. ఆయన హరిజనులకు ఇతరులతోపాటు సహపంక్తి విందుచేశారు. ఆ విందులో సవర హిందువులు, ముస్లింలు, హరిజనులు కలిసి కూర్చున్నారు. ఈ విధంగా ఆయన, ఆయన కుటుంబంవారు అస్పృశ్యాతా నివారణకు, హరిజనోద్దరణకు ఎనలేని కృషిచేశారు.

సర్‌ పిట్టి త్యాగరాయ చెట్టి, సర్‌.బి.ఎన్‌. శర్మ, దేశోద్దారక నాగేశ్వరరావు పంతులు, గాడిచర్ల హరి సర్వోత్తమరావు వంటి ఆ నాటి చెన్నపురి మేటి తెలుగు నాయకులతోపాటు 1916లో చెన్నపురి ఆంధ్ర మహాసభను స్ట్రాపించిన వారిలో ఈయన ఒకరు. ఇదీ క్లుప్తంగా గద్దె రంగయ్య నాయుడుగారి దేశభక్తి, సంఘ సంస్కరణ, హరిజన సేవా చరిత్ర, నేటి యువతరానికి ఆయనగురించి అట్టేతెలియదు. ఆంధ్రులు ముఖ్యంగా చెన్నపురి ఆం(ధ్రులు ఆయనకెంతగానో రుణపడి వున్నారు. మరి-ఈనాడు వారిని గురించి అనుకొనే వారేరీ?

(289.84 గ్గున్గాన్గు

సంధియుగం 149

ప్రఇలమ్యుత జక్హువ్మైమి

(ప్రంలన్వూష డక్షర వక్ర

రొంగ్రిి పార్టీ రాజకీయాలు 1946-51 మధ్య కాలంలో వున్నంత సందడిగా బహూశా అంతకు ముందెప్పుడూ వుండేవి కావేమో? దేళ రాజకీయ స్వాతం త్ర్యం కనుచూపు మేరలో కనపడుతున్న సమయం, స్వాతం త్ర్యం సిద్రించిన సమయం. కనుకనే అప్పట్లో కాంగ్రెస్‌ రాజకీయాలలో కోలాహలం ఎక్కువగా వుండేది, కలహాలు కూడా అప్పుడే ఎక్కువైనాయి.

అప్పటి వరకు రాష్ట్ర కాంగ్‌ అధీనంలో గల డాక్టర్‌ పట్టాభిగారి వర్గంవారు నాటి చెన్న రాష్ట్రమంత్రి మండలిలో ప్రాతినిధ్యం సహజంగానే సంపాదించుకున్నారు. కాగా, ప్రకాళం - రంగావర్గం 1946లో రాష్ట్ర కాం గ్రస్‌ను పట్టుకొన్నది. అప్పటినుంచి రాష్ట్ర రాజకీయాలు చాలా లబ్బుగా వుండేవి. ప్రభుత్వాధికారంలో వున్న వర్గంకంటె రాష్ట్ర కాంగ్రెస్‌ను గెలుచుకున్న ఈ వర్గానికి ప్రజాబలం ఎక్కువగా వుండేది. సోంపేటలో సర్దార్‌ లచ్చన్న, విశాఖపట్నంలో తెన్నేటి విశ్వనాధం, రాజమండ్రిలో డక్టర్‌ ఎ.బి. నాగేశ్వరరావు, ఏలూరులో కొమ్మారెడ్డి సూర్యనారాయణ, విజయవాడలో డ్యాక్టర్‌ టి. వి.ఎస్‌. చలపతిరావు, గుంటూరులో నడింపల్లి సరసింహారావు (ఎన్‌. వి.ఎల్స్‌ కర్నూలులో ఓబులరెడ్డి, చిత్తూరులో తిమ్మారెడ్డి, కడపలో కోటిరెడ్డి, మదరాసులో డాక్టర్‌ కె.వి. స్వామి అప్పటి పి.సి.సి. వర్గానికి మూల స్తంభాలుగా ఉండి, ఈ వర్గానికి అపారమైన ప్రజాబలాన్ని కూడ గడుతుండేవారు.

ఆ రోజుల్లో తమిళ తెలుగు ప్రజలు ఒకే రాష్ట్రంలో ఉన్నందున చెన్నపురి రాజకీయ ప్రాముఖ్యం చాలాహెచ్చుగా ఉండేది. అప్పటికి తెలుగువారి రాజకీయ రాజధానికూడా అదే. చెన్న నగరంకోసం తెలుగువారు తమిళులతో వివాదపడుతున్న కాలమది. అందువల్ల పేరుకు ఆంధ్రరాష్ట్ర కాంగగ్రక్‌ కేంద్ర కార్యాలయం విజయవాడలో వున్నా, ఆంధ్రుల రాజకీయాలకు కూడా మదరాసు నగరమే కేంద్రంగా ఉండేది. (ప్రకాళంగారు మదరాసులోనే నివాసం ఉన్నందువల్ల కూడా నగరంలో ఈ వర్గంవారి ప్రాబల్యం హెచ్చుగా ఉండేది. ఇంత (ప్రాముఖ్యంగల ఆ రోజుల్భొ ఈ నగర రాజకీయాలకు డాక్టర్‌కె. వి. స్వామి మూలశక్తిగా ఉండేవారు.

వస్తుతః డాక్టర్‌ స్వామిగారి కుటుంబం రాజకీయ సేవలకు, త్యాగాలకు పేరుపొందిన కుటుంబం, డాక్టర్‌ కె.వి. స్వామి వైద్యకళాశాలలో విద్యార్థిగా ఉండగానే స్వాతం త్రోద్యమంలో చాలా ఆవేళంతో పాల్గొంటుండేవారు. డ్యాక్టర్‌ స్వామి పిరికితనమెరుగని రాజకీయ సాహసి. ఎంత నిండు విగ్రహమో, అంత నిర్చీకత, ఎంత నిర్భయస్తుడో అంత నిష్కల్మషమైన మనసుగల వ్యక్తి ఆయన. తన దృష్టిలో అన్యాయం జరుగుతున్నదనుకున్నప్పుడు ప్రభుత్వాన్నే కాదు, గాంధీజీని పైతం ్రశ్నించగల ఆత్మ విశ్వాసం ఆయనలో పిన్నతనంనుంచే తొణికిపలాడుతుండేది. దేశమంతా మహాత్ముడికి బ్రహ్మరధం పడుతున్న రోజులు, ఢిల్లీనుంచి మదరాసు వస్తున్న గాంధీజీ రైలు ఆగిన ప్రతి ప్టేషులో లక్షోపలక్షలు ఆయన దర్శనం అయితే చాలునని ఎగబడి చూస్తున్న రోజులు. ఆయన అడిగితేచాలు ఒంటిపై ఆభరణాలన్నీ అక్కడికక్కడి ఒలిచి త్త్రలు ఆయన చేతిలో పెడుతున్న రోజులు.

మదరాసులో దక్షిణ భారత హిందీ ప్రచార సభలో 1945లో ఒకరోజున గాంధీజీ ఉపన్యాసం జరుగుతున్నది. ఆ వేళ ఆ ప్రసంగానికి తమిళ అనువాదం మాద్రమే ఏర్పాటు 150 సంధియుగం

చేశారు. వేలాదిమంది శ్రద్రగా భక్తి ప్రపత్తులతో ఆయన ఉపన్యాసం వింటున్నారు. ఉన్నట్టుండి (పేకకుల మధ్యలో ఆజానుబాహుడైన ఒక యువకుడు లేచి నిలబడి సింహ గర్హనలాటి స్వరంతో *' అయ్యా బాపూజీ, మీరు మా తెలుగు వారికి కూడా న్యాయం చేయాలి. తెలుగు అనువాదంకూడా కావాలి” అని బిగ్గరగా విన్నవించాడు. డాక్టర్‌ స్వామి నిర్భీకత్వానికి అది ఒక ఉదాహరణ మాత్రమే. అనేక సందర్భాలలో, అనేక సభలలో ఆయన వాస్తవం మరుగున పడిందనుకున్నప్పుడో, న్యాయం జరగలేదనుకున్నప్పుడో ఇలా గర్హించడం అనేక సార్గు స్వయంగానేనూ విన్నాను.

పొట్టి ఇశ్రీ/రాములుగారి ఆత్మాహుతి సందర్భంలోను, చెన్నపురి తెలుగువారికి కావాలన్న ప్రకాళంగారి నినాదాన్ని నగరంలో ప్రతిధ్వనింపచేసిన ప్రతి సందర్భంలోను, ఆయన అవేశంతో ఊగిపోతూ చేసిన ప్రసంగాలు, పిరికి వారిలో సైతం లేని తెగువను, ధైర్యాన్ని తెచ్చిపెట్లేవి. అయితే ఆయన మనస్సు వెన్నపూసవంటిది. ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా పోయి ఆదుకునే స్వభావం. నగరంలో ఆయన చేదోడు వాదోడు లభించని తెలుగు సభలు, ఉత్సవాలు, సంఘటనలు సాధారణంగా వుండేవి కావు. డ్యాక్టరుగా '' ప్రజల వైద్యుడనిపించుకున్నారు. కనుకనే ఆయనను పలుమార్జు మదరాసు కార్పొరేషన్‌ కౌన్సిలర్‌గా పెద్ద మెజారి, ప్రజలు ఎన్నుకున్నారు. ఒకసారి డిప్యూటీ మేయర్‌గా కూడా ఎన్నికైనారు.

నగరంలో హరిజన సేవాసమాజాన్నినెలకొల్పిన వారిలో ఆయన ఒకరు. తద్వారా ఆయన చెన్నపురి హరిజనులకు, ముఖ్యంగా వారిలో తెలుగువారికి బహుకాలం సేవ చేశారు. చాలకాలం త్యాగరాయకళాశాల పాలక సంఘానికి అధ్యక్షులుగా వుండి ఆ కళాశాల అభివృద్దికి, తద్వారా నగరంలో తెలుగువారి విద్యాసౌకర్యాల వృద్దికి ఎంతో కృషిచేశారు. ఎ.పి. పి. సి. మెంబరుగా కూడా వున్నారు. అఖిలభారత వైద్యవృత్తిదారుల సంఘం ఉపాధ్యక్షులుగా తన వృత్తిరంగానికి శేవచేశారు. అఖిల భారత వైశ్ళమహాసభ ప్రధాన కార్యదర్శిగాను, దక్షిణ భారత వైళ్యసంఘం ఉపాధ్యక్షులుగాను, ఇలా అనేక ప్రజాహితరంగాలలో చివరివరకు సేవచేస్తూనే వచ్చారు.

స్వామిగారి కుటుంబం చాలా ప్రసిద్దమైనది. వీరి అత్తగారు కొల్లా తాయారమ్మ సుప్రసిద్ర కాం(గ్రమ్‌ సేవకురాలు. వీరి ఏకైక పుత్రిక శ్రీమతి శశికళ కూచిపూడి నృత్యంలో అంతర్జాతీయ (ప్రఖ్యాతి గాంచిన నర్తకి, ధ్వవ్యనుకరణ సామ్రాట్‌ నేరెళ్ళ వేణుమాధవ్‌ వీరి తోడి అల్జుడు, స్వామిగారికి నలుగురు కొడుకులున్నారు.

డాక్టర్‌. వి. స్వామి40 సంవత్సరాలపాటు చెన్నపురి తెలుగు ప్రజల రాజకీయ ప్రతినిధిగా, అందరికీ తలలో నాలుకలా వుంటూ వచ్చారు. ఆయన స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి ఆయన స్నేహ మాధుర్యాన్ని దాదాపు పాతికేళ్ళు చవిచూచిన వారిలో నేనూ ఒకళ్లి. బహుళః నగరంలో ఏ తెలుగువ్యక్తిని కలిసినా ఈ మాటే అంటారు. 1984 మార్చి 22వ తేదీన తన 74వ ఏట డాక్టర్‌ కె.వి. స్వామి గుండెపోటువల్ల కన్ను మూశారు. డి. ఆంజనేయులుగారన్నట్టు ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు ఆయన వుండగానేమి, ఆయన పోయినప్పుడేమి రాలేదన్నబాధ ఆయన నెరిగిన వారందరికీ వుంటుంది. డ్యాక్టర్‌ స్వామి, మొదటినుంచి చివరివరకు కాం'గ్రక్‌ వాదిగానే, వుండిపోయారు. ఆయన తనకు రాజకీయ గురువులుగా, నాయకులుగా ఎంచుకొన్న పెద్దలు కాంగ్రెస్‌ను విడిచి పెట్టినప్పుడు కూడా ఆయన ఆ పార్టీనే అంటి పెట్టుకుని వున్నారు. తనకు శాసనసభ్యత్వం ఇవ్వ నిరాకరించినప్పుడు కూడా ఆయన కాంగ్రమ్‌ను విడువలేదు. ఇదీ ఆయన గాంధేయ విధేయతకు నిదర్శనం, అయినా ఆయన పోయినప్పుడు కనీసం సానుభూతి (ప్రకటించిన కాంగ్రెస్‌వారు కనిపించలేదు. ఇది అధికార పూజాయుగం కదా 11

(30.3.84)

సంధియుగం 151

(1 ఉట

నూరు సంవత్సరాల క్రితం దాదాపు పది, పదిహేనేళ్ల తేడాతో ఎందరో గొప్ప నాయకులు మనదేశంలో జన్మించారు. ఒక జవాహర్‌లాల్‌నెహ్రూ, ఒక వల్లభాయ్‌ పటేల్‌, ఒక రాజేంద్రప్రసాద్‌, ఒక సుభాస్‌చం ద్రబోస్‌, ఒకహరి సర్వోత్తమరావు, ఒక పార్ధసారథి నాయుడు, ఒక ప్రకాశం, ఒక రామస్వామి చౌదరి - ఇలా పలువురు ఉద్దండులు ఉద్భవించిన కాలమది. జాతీయ కాంగ్‌ సంస్థ కూడా దాదాపు అదేకాలంలో ఆవిర్భవించింది. ఆ సంస్థ ఆధ్వర్యాన గాంధీజీ నాయకత్వాన సాగిన స్వాతం త్య ఉద్యమంలో వీరంతా మహా సేనానులవంటివారు. ఈ నాయకులు సాగించిన ప్రజావైతన్య ఉద్యమం పర్యవసానంగా మనదేశానికి శాంతి, అహింసా మార్గాన స్వాతం త్ర్యం సిద్దించింది. కనుకనే ఈ మహానాయకులూ, ఇటువంటివారే ఇంకెందరో జాతీయనాయకులు మనకు చిరస్మరణీయులుగా చరిత్రలో ఉండిపోతారు.

అయితే ఇందరిలోనూ మిగతా నాయకుల అందరిదీ ఒక ఎత్తుకాగా, జవాహర్‌లాలా నెహ్రూది ఒక్కరిదీ ఒక ఎత్తు. స్వతంత్ర్య భారతావనికి ప్రప్రథమ ప్రధాన మంత్రిగా ప్రభుత్వ సారధ్యం వహించి దేశరాజకీయ, ఆర్చిక, సాంఘిక రంగాలలో కొత్త ఒరవళ్ళు దిద్దిన మార్గదర్శిగా ఆయన కృషి అగణితమైనట్టిది - అందుకే ఆయన “నవభారత నిర్మాణ శిల్పి అన్న ప్రఖ్యాతి గడించారు.

మన జాతీయ రాజకీయ స్వాతంత్ర్య ఉద్యమాన్ని, దాని భవిష్యత్తును ఆరు దశాబ్దాలకు పూర్వమే విశాలమైన వసుధైక దృష్టితో ముందుకు చూడగలిగిన ప్రజాస్వామిక దృక్పథంగల క్రాంతదర్శి నెహ్రూ. స్వాతంత్ర్యం అంటే రాజకీయ స్వపరిపాలన మాత్రమే కాదు, అర్టిక సాంఘిక, స్వేచ్చా సమానత్వాలు కూడా తరతమ తారతమ్యాలు లేకుండా దేళ పౌరులందరికీ అభించిననాడే చేకూరుతుంది, అని దృఢంగా విశ్వసించిన అభ్యుదయగామి, ప్రజాస్వామ్యవాది జవాహర్‌లాల్‌ నెహ్రూ. ఇంతేకాదు. తరతరాలుగా మన జాతిని పట్టి పీడిస్తున్న మూఢ నమ్మకాలను తొలగించి సామాన్య ప్రజానీకంలో ఆత్మ విశ్వాసాన్నీ, వివేకాన్నీ, హేతుదృష్టినీ, శాస్త విజ్ఞాన, వికాసాలనూ పెంపొందించటం ఎంతయినా అవసరమని నమ్మి, అందుకు కంకణం కట్టుకొని, యావజ్జీవం ఉద్యమించిన ప్రగతిశీలనేత జవాహర్‌లాన్‌నెహ్రూ.

జాతీయ సమస్యలను, అంతర్జాతీయ దృక్చధంనుంచి, అంతర్జాతీయ సమస్యలను జాతీయ దృక్కోణం నుంచీ పరిశీలించి సమన్వయ పరచగలిగిన ఒక మేధావి. ఒక చరిత్రకారుడు. ఒక తాత్వికుడు, ఒక ప్రజాస్వామ్యవాది జవాహర్‌లాల్‌ నెహ్రూలో మనకు కనిపిస్తారు. ఆనాడు పరాయిపాలనలో (మ్రగ్గుతుండిన అనేకానేక ఆసియా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల ప్రజలకు మనదేళం ఒక దీపకళిక వలె దారిచూప గలిగిందంటే నెహ్రూకి గల ఈ విశాల వసుధైక సంక్షేమ దృక్పథమే కారణం.

జాతీయ స్వాతంధ్ర్యాన్ని సంపాదించుకొనడం ఒక ఎత్తు. ఆ సంపాదించుకున్న స్వాతంత్ర్యాన్ని (ప్రజాస్వామ్యపు పునాదులపై సువ్యవస్టీకరించుకొని పదిలపరచడం మరొక ఎత్తు. అలా మన రాజకీయ స్వాతంత్ర్యాన్ని దృఢమైన ప్రజాస్వామిక పునాదులపై సుస్టిర వ్యవస్రగా రూపొందించుకొనడంలో నెహ్రూ నాయకత్వం బహుదా తోడ్పడింది.

స్వతంత్ర నారతదేళం అనుసరించదగు రాజకీయ ఆర్ధిక, సామాజిక విధానాల భావి స్వరూప స్వభావాల గురించి స్వాతంత్ర్యం రాకపూర్వంనుంచే నెహ్రూ కలలు కంటుండేవారు. 152 సంధియుగం

1929లోనే భావి భారత విదేశాంగ విధానానికి ప్రాతిపదిక సూత్రాలను గురించి ఆయన ' ఆలోచనలు చేయసాగారు. నెహ్రూ అభిమతం ప్రకారం, '"*స్వతం(త్ర్య భారత విదేశాంగ విధానానికి అన్ని దేశాలతో స్నేహమూ, ఇరుగు పొరుగు దేశాలతో సాన్నిహిత్యమూ, స్టీరమైన (ప్రపంచ శాంతి అనేవి ముఖ్యమైన మూలసూత్రాలుగా ఉండాలి” సందర్భం వచ్చినపుడెల్లా ఆయన తన ఈ ఆలోచనలను పదే పదే వెలిబుచ్చుతూ వచ్చారు. స్వాతం త్రం వచ్చిన తరువాత ఆ ఆలోచనలకు కార్యరూపమిచ్చి నవభారత విదేశాంగ విధానాన్ని రూపొందించి అమలు జరపటానికి ఆయన అహరహం కృషిచేశారు. కొత్తగా స్వాతంత్ర్యం సంపాదించుకొన్న దేశాలకు ఏ సైనిక కూటమిలోనూ చేరని అలీనవిధానం అత్యుత్తమమైనదని ఆయన భావించారు. అత్యధిక సంఖ్యాక దేశాలవారిచేత తన ఈ ఆలోచననను ఒప్పించి అందరి మెప్పును చూరగొన్న రాజకీయ క్రాంతదర్శి జవాహర్‌లాల్‌ నెహ్రూ, ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలు అనాటి నెహ్రూ ముందుచూపు ఎంత సబబయినదో నిరూపించాయి. బాండుంగ్‌లో 1955లో జరిగిన సమావేశంలో ఆయన చొరవ తీసుకొని ఆయా దేశాలమధ్య పరస్పర సత్సంబంధాలను ప్రాతిపదికగా “పంచశీలు పేరిట అయిదు గొప్ప సూథత్రాలను ప్రతిపాదించారు. ఆవిధంగా (ప్రపంచ రాజకీయ రంగంలో నెహ్రూ ఒక మార్గదర్శిగా సకల దేశాల ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. అనాటి పాకిస్తాన్‌ గవర్నర్‌ జనరల్‌ క్వాజానజీ ముద్దీన్‌ ఒకానొక సందర్భంలో అన్నారు కదా! *“ఇండియా పాకిస్తాన్‌ దేశాలు రెండిటికీ ఒకే రకమైన బలమూ, బలహీనతలూ ఉన్నాయి. అయితే మౌకులేనిదీ, ఇండియాకు అదనంగా ఉన్నదీ ఒక్క జవాహర్‌లాల్‌నె హ్రూ మాత్రమే” ఇంతకంచేగొప్ప కితాబు ఏ నాయకుడికైనా మరేమి ఉంటుంది! నెహ్రూ దృష్టిలో ప్రజాస్వామ్యం అనేది రాజకీయ, ఆర్టిక విషయాలకు మాత్రమే పరిమితమైనదికాదు, అది ప్రజల మానసిక స్థితికి సంబంధించినది, అదొక 'ప్రజాజీవన విధానం. ““ ప్రజాస్వామ్య వ్యవస్టలో పౌరులందరికీ రాజకీయ, ఆరిక, సామాజిక రంగాలలో సమానావకాశాలు ఉండాలి. అది వ్యక్తి వివేక, వికాసాలకు వీలు కలిగించేదికావాలి, మనకు నచ్చినా నచ్చకపోయినా ఎదుటివారి అభిప్రాయాలను శ్రద్దగా ఆలకించి, సహించి గౌరవించగలిగినదే ప్రజాస్వామ్యం?" అని అంటారు జవాహర్‌లాల్‌నెహ్రూ. ఆర్థిక అసమానతలు అంతరించి పోనంతవరకు రాజకీయ సమానత్వానికి అర్ధంలేదనీ, ప్రజాస్వామ్యూనికి సార్టక్యం ఉండదనీ ఆయన నమ్మకం. కనుకనే సంక్షేమరాజ్యం, సమతా ఆర్టిక వ్యవస్త, సామాజిక సమభావంవంటి ప్రజాస్వామిక ఆశయాల సాధనకు తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి ఉద్యమించారు. 1938లోనే ఒక అనధికార జాతీయ ప్రణాళికా సంఘాన్ని ఏర్పరచి ఆయన దానికి అధ్యక్షులుగా ఉన్నారు. దేశ (ప్రజల సమగ్రాభివృద్దికి ఒక ఆర్టిక ప్రణాళికను తద్వారా రూపొందించటానికి ఆయన పూనుకున్నారు. కాని అప్పటినుంచి స్వాతంత్ర్యం వచ్చేవరకు తాను తరచు చెరసాలలలో గడపవలసి వచ్చినందున ఆకోరిక నెరవేరలేదు. ఆయినా స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే తాలి పంచవర్ష ప్రణాళికను రూపొందించి అమలు జరిపించారు. ఆయన (ప్రధానిగా ఉన్నకాలంలో మూడు పంచవర్ష ప్రణాళికలు అమలు జరిగాయి. కొన్నిరంగాలలో గణనీయమైన అభివృద్ది సాధించడానికి ఈ(ప్రణాళికలు తోడ్చడ్డాయి. _సంధియుగం 153 క్షే

(ప్రజల మనోవికాసానికీ, వారిలో శాస్త్రీయ దృక్పథం, హేతుదృష్టీ ముందుచూపు పెంపొందించటానికి విజ్ఞానశ్యాస్త్ర వ్యాప్తి అవసరమని నెహ్రూ గట్టిగా విశ్వసించారు. అందుకోసం దేశంలో శాస్త్ర, పరిశోధన సౌకర్యాలను విస్త్సృతంగా కల్పించారు. మరోవైపు పాతకాలపు మూఢనమ్మకాలను (ప్రజల మనసులనుండి తొలగించడానికి ఆయన ఎంతగానో కృషిచేశారు.

ఇలా సకల జన సంవేమ వికాసాలను సంబంధించిన అన్ని రంగాలలోనూ నెహ్రూ తన ఆధునిక అభ్యుదయగామి నేతృత్వాన్ని అందించారు! కొందరు ఆయనను కమ్యూనిష్టు అని నిందించారు. ఈ నిందారోపణకు అప్పటి సోవియట్‌ ప్రధాని కృళ్చేవ్‌ చెప్పిన జవాబునే ఎప్పటికీ మనం చెప్పుకోవచ్చు. కృళ్చేవ్‌ ఏమన్నారంటే '“ కొందరు నెహ్రూను కమ్యూనిష్టు అంటున్నారు. నెహ్రూ కమ్యూనిష్టు కావాలని నామట్టుకు నేను అనుకోడంలేదు. నెహ్రూ నెహ్రూగానే ఉండిపోవాలని నా అభిమతం”. అవును, నెహ్రూ ఆజన్మాంతం నెహ్రూగానే ఉండిపోయారు. ఆయనది ఏఇజమూ కాదు నెహ్రూఇజమే. దానిని నవ్యమానవవాదం అని అనవచ్చు. వాదమేదైనా ఆయన నికరమైన (ప్రజాస్వామికవాది. ఇది నిజం.

(28.592) స్గాన్గాన్గా (పఫజలు గొ(ంలుకారు

(ప్రజాస్వామ్యం ఒక యంత్రం కాదు. అదొక వ్యవస్థ. అదొక జీవనవిధానం కనుక సంఖ్యా బలం వుండడం ఒక్కటే చాలదు. అందరి అభిప్రాయాలను గౌరవించి పలువురి అభిప్రాయాలను పరిగణలోకి తీనుకుని వ్యవవోరాలను నిర్వహించడం (పజూస్వామ్యు లక్షణం. జూతి ఆత్మ గౌరవంతోబాటు వ్యక్తుల ఆత్ము గౌరవాన్లికూడ గౌరవించడం మన నాయకులు నేర్చుకోవాలి. (ప్రజాస్వామ్యంలో (ప్రజలను గొగ్రెలకాపరి తన మందను చూచినట్టుగా చూడకూడదు...

ఇంటొదయటా 2! -9-84

154 సంధియుగం.

ఖభౌరత జాతీయ కాంగ్ర[్‌ 1885లో అవతరించింది. ఆప్పటివరకు ఏటి కొకరు, కోటి కొకరుగ వుంటూ వచ్చిన దేశభక్తులంతా అనాడు ఒకే జొండా క్రిందకు వచ్చారు. బ్రిటీష్‌ పరిపాలన నుంచి విముక్తి సాధించి, దేశానికి స్వపరిపాలన ఏర్పరచుకొనడం ఆనాడు అందరి ధ్యేయం. అయితే ఈ మాట అంత స్పష్టంగా బయటికి చెప్పడానికి కొందరు దేళభక్తులు జంకుతుండేవారు. అందువల్ల అటువంటివారంతా పరోక్షంగా తమ లఅకవ్యాన్ని ప్రచారం చేస్తూండేవారు. కాగా మరికొందరేమో నిర్భీకంగా, నిస్సంకోచంగా స్వాతంత్ర్య వాంఛను వెల్లడిస్తుండేవారు. ఈ విధంగా మొదటినుంచి కాంగ్రస్‌లో రెండు వర్గాలు వుండేవి. వీరిలో మొదటి వర్గాన్ని మితవాద వర్గమనీ, రెండో వర్గాన్ని అతివాద వర్గమనీ వ్యవహరిస్తుండేవారు. అలాగే, కాంగ్రస్‌ వారిలో మరోవిధంగా కూడా రెండు వర్గాలవారుండేవారు. ఒక వర్గం వారేమో దేశానికి పరాయి పాలన నుంచి విముక్తి కలిగించి, స్వరాజ్యాన్ని సాధించుకానడమే హైక ధ్యేయంగా పోరాటం సాగించదగునని భావించిన వారు. కాగా మరో వర్గంవారు రాజకీయ స్వాతంత్ర్యంతో పాటు దేశంలో ఆర్దిక అసమానతలను, సాంఘిక అన్యాయాలను, దురాచారాలను తొలగించడానికి కూడా స్వరాజ్య సమరంలో భాగంగా కృషి చేయాలన్న పట్టుదల గలవారు. కాంగ్రు పుట్టినవాటి నుంచి స్వాతంత్ర్య సీద్ది నాటివరకు గడచిన 60 సంవత్సరాల కాలంలో జాతీయ ఉద్యమం ఉవ్వెత్తున ఉప్పెనలా దేశాన్ని ముంచెత్తుతూ వచ్చింది. అయితే, అప్పుడుప్పుడు ఈ ఉద్యమకారులలో అభిప్రాయ భేదాలు తీవ్రతరమైనప్పుడు కాంగ్రులో చీలికలు రావడం, కొందరు విడిచిపోవడం జరుగుతూ వచ్చింది. అయినా, జాతీయ ఉద్యమంలో ఊపు, ఉత్సాహం ఎన్నడూ తగ్గలేదు. బయటకు వెళ్ళినవారు వెళ్ళగా కాంగ్రస్‌లోనే వుండిపోయినవారిలో సైతం ఈ మితవాద, అతివాద వర్గాలు అంటూ వుంటూనే వచ్చాయి. ఈ అతివాద వర్గానికి జవాహర్‌లాల్‌ నెహ్రూ మార్గదర్శి వంటివారు అనవచ్చు. ఆ కోవకే చెందిన ఆంధ్ర అగ్రనాయకులలో మొదటగా చెప్పదగినవారు ఆచార్య రంగా. అయితే ఈ ఇరువరి నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు లేవని కాదు. నిజానికి స్వాతంత్రావంతరం నెహ్రూ విధానాలను అవసరమనుకున్నప్పుడల్లా నిర్భీకంగా, నిస్సంకోచంగా ఎదిరించిన బహుకొద్దిమంది జాతీయ అగ్రనాయకులలో రంగాగారు ఒకరు. స్వాతంత్ర్యానికి పూర్వం, ఈ ఇద్దరు నాయకుల ఆలోచనలలో సామ్యం చాలా ఎక్కువగా కనపడేది. ఇద్దరూ సోషలిస్టు భావాలు కలవారే. ఇద్దరూ అఆర్టిక, సాంఘిక అసమానతలను, అన్యాయాలను నిర్మూలించడానికి దీక్ష పూని కృషి చేసినవారే. అంతే కాదు. దేళ రాజకీయ రంగంతో పాటు, అంతర్జాతీయ వ్యవహారాలను క్షుణ్ణంగా అవాహన చేసుకొంటూ, భావిభారత విదేశాంగ విధానం ఎలా వుండాలో భావన చేసుకుంటూ, విశ్వమానవ కళ్యాణాన్ని లఖ్యీంచే విశాల దృక్పథంతో ఆలోచిస్తూ వచ్చినవారే. ఉభయులూ సోవియట్‌ విప్లవ విజయాలను హర్షించి, మార్క్సిష్ట్‌ సాహిత్య ప్రభావానికి లోనైన వారే. అయితే, ఇరువురి మధ్య ఒక ముఖ్యమైన తేడా వుంది. నెహ్రూ నగర వాతావరణంలో పుట్టి పెరిగి, తదనుగుణంగా తన ఆలోచనా రీతిని మలచుకున్న వారు కాగా, రంగాగారు గ్రామీణ రైతు వాతావరణంలో పుట్టి పెరిగి, తదనుగుణమైన ఆలోచనా సరళిని అలవరచుకున్నవారు. ఇది ఈ ఉభయుల మధ్య గల ప్రాతిపదిక తారతమ్యం. నెహ్రూ (ప్రజాస్వామ్యవాదిగా మాత్రమే సంధియుగం 155

సోవియట్‌ కమ్యూనిష్టు విధానాలతో విభేదించగా, రంగాగారు తన నరనరాన జీర్లించి వున్న రైతుతత్వం వల్లకూడా కూడా సోవియెట్‌ మార్క్సిస్టు పంథాకు క్రమేణా దూరమైనారు. సోవియట్‌ యూనియన్‌లో కమ్యూనిష్టు పార్టీ అధికారానికి వచ్చిన కొత్తలో రష్యన్‌ రైతాంగం విషయంలో అనుసరించిన హింసా విధానం రంగాగారిలో కమ్యూనిష్టు వ్యతిరేకతను బాగా పెంచింది. క్విట్‌ ఇండియా ఉద్యమం సందర్భంలో అతివాదిగా కొన్నాళ్ళు అజ్ఞాతవాసం చేసిన అనంతరం జైలుకు వెళ్ళిన రంగాగారు, 1944లో జైలు మంచి బయటకు వచ్చేనాటికి పూర్తిగా గాంధేయవాదిగా మారిపోయారు. ఆ రోజులలో రంగాగారు, అయ్యదేవర కాళేశ్చరరావుగారు కలిసి సాగించిన కమ్యూనిష్టు వ్యతిరేక ప్రచారం అంతా ఇంతా కాదు. నాటి విద్యార్హులలో, యువకులలో వారికి అసంఖ్యాకమైన అనుయాయులు వుండేవారు. ఈ నాయకుల (ప్రచారం వల్లనే ఆనాడు అంతమంది యువతీ యువకులు కమ్యూనిష్టు వ్యతిరేకులుగా రూపొందారు. అయితే క్రియ వున్న చోటనే ప్రతిక్రియ కూడా వుంటుంది. కనుకనే ఆంధ్రలో కమ్యూనిష్టు ప్రభావానికి లోనైన యువతీ యువకుల సంఖ్య కూడా ఆనాడు అసంఖ్యాకంగానే వుండేది. 1940కి పూర్వం కమ్యూనిష్టులతో కలిసి రైతు ఉద్యమాన్ని నిర్మించి, నిర్వహిస్తూ వచ్చిన, రంగాగారిలో రైతు తత్త్వ ప్రభావంవల్ల వచ్చిన, ఆ మార్పు రాకుండా వుండినట్టుయితే ఈనాడు ఆంధ్రప్రదేశ్‌లో వామపక్ష సామ్యవాద ఉద్యమం బెంగాలులో కంచే, కేరళలో కంటేను బలమైన శక్తిగా వుండి వుండేది. ఆం(ధ్రలో 1951నాటి ఎన్నికల ఫలితాలు, 1955 నాటి మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఇందుకు నిదర్శనాలు. రంగాగారు, కమ్యూనిష్టులు కలసి వుండి, ఆంధ్రలో వామపక్ష ప్రభుత్వం . ఆనాడే ఏర్పడి వుంటే, అందువల్ల ఒక్క ఆం(ధ్రలోనే కాకుండా, మొత్తం దేశంలోనే చరిత్ర గతి మరోలా వుండేది. అందుకే వామపక్షాలవారు, దేశంలో వామపక్ష శక్తుల ప్రగతిని నిరోధించిన ప్రతీప శక్తిగా రంగాగారిని నాటికీ నేటికీ నిరసిస్తుండగా, (ప్రజాస్వామ్యం విపత్తులో పడినప్పుడు, స్వీయరాజకీయ ప్రయోజనాలకు భంగమని తెలిసికూడా ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రలో కాపాడిన నాయకుడుగా కమ్యూనిష్టు వ్యతిరేకులు ఆయనను శ్ఞాఘిస్తారు. రంగాగారు 1917లో తన పదిహడవ ఏట (ప్రజా సేవారంగంలో ప్రవేశించి, ఆర్ధిక, సాంఘిక రంగాలలో అనేక అసమానతలను, దురాచాలను నిర్మూలించడానికి పలు ఉద్యమాలు నిర్మించి నిర్వహించారు. ప్రత్యేకించి చిన్న, మధ్య తరగతి రైతుల, వ్యవసాయ కూలీల, చేనేత కార్మికుల ప్రగతి, సంజేమాల కోపం ఆయన చేసిన కృషి ఆ గ్రణ్యమైనది. రాయలసీమలో తరచు వస్తుండే కరువు. కాటకాల ఆపత్కాలంలో రంగాగారు, భారతీదేవిగారు నిర్వహించిన సహాయ కార్యక్రమాలు, జమీన్‌ రైతు వెంక్రామానాయుడు జమీందారీ రద్దు ఉద్యమమూ, రైతులకు ఎప్పుడుఎక్కడ, ఎటువంటి విపత్తు సంభవించినా, అన్యాయం జరిగినా, అప్పుడు అక్కడ తాము వున్నామంటూ రంగా దంపతులు నాయకత్వం వహించి చేసిన రైతు సేవలు చరిత్రాత్మకమైనవి. ఈ నైతిక నేత తన సుదీర్ష రాజకీయ జీవితంలో పారపొట్టు ఎన్నయినా చేసి వుండవచ్చు. కాని, ఎన్నడూ ఒక తప్పు కూడా చేయని, మచ్చలేని మహా నాయకుడాయన. ఆయన పలుమారులు పార్టీలు మారారు. అయితే పదవి కోసమని ఆ పని ఎన్నడూ చేయలేదు. విధానాల విభేదాల వల్లనే, ప్రజల సంక్షేమానికి అవసరమనుకున్నప్పుడే ఆయన పార్టీలు మార్చారు. ఈ సూక్ష్మాన్ని గ్రహించలేని వారు మాత్రమే హ్రస్వదృష్టితో ఆయనను “రంగులు మార్చే రంగా! అని అవహేళన చేస్తుండేవారు. అటువంటివారు కూడా ఈనాడు ఆయన నైతిక శక్తినీ, ప్రజా సేనామరక్తినీ గుర్తించి గౌరవిస్తున్నారు. ఇది ఆయనకు గొప్ప నైతిక విజయం. రంగాగారి రాజకీయ జీవితంలో ఎన్నెన్నో అథ్యాయాలు, ఎన్నెన్నో ఉద్యమాలు; 156 సంధియుగం

ఎందరెందరో యువకార్యకర్తల సమీకరణ, శిక్షణలు, ఎన్నో విజయాలు - మరెన్నో అపజయాలు. ఈ సుద్నీర్ణ రాజకీయ జీవిత సమరంలో రైతు నాయకుడుగా ఆయన నిగ్గు తేలినాడు. రాజకీయ స్వాతం[త్ర్య ఉద్యమానికి గ్రామీణ రైతాంగ యువతను ఆయన సమీకరించినంతగా బహుళ దేళంలో మరే నాయకుడూ చేయలేదేమో! రాజకీయ స్వాతంత్ర్యంతోపాటు రైతులకూ, కూలీలకూ దేళ ఆర్దిక వ్యవస్థల సముచితమైన స్ట్రానాన్ని సాధించి పెట్టడానికి, దళారీల దోపీడీల నుంచి వారికి ఆర్ధిక రాజకీయ విముక్తి కలిగించడానికి ఆయన చేసిన కృషి సాగించిన ఉద్యమం అసామాన్యమైనది. అందుకే రైతునేతగా దేళం ఆయనను గుర్తించింది. స్వాతంత్రానంతరం పార్లమెంటులో ప్రధాని నెహ్రూ ఒకానొక సందర్భంలో ఆయననుద్దేశించి "'మీరీ సభలో వుండగా రైతులను ఎవరైనా విస్మరించడం సాధ్యమా?” అని అన్నారు. అలానే రైతుల కూలీల సంక్షేమానికి ఆయన సాగిస్తున్న కృషిని గాంధీజీ ప్రశంసించి, ఆశీస్సులందించారు.

స్వాతంత్ర్య ఉద్యమానికీ, గ్రామీణ ప్రజల సముద్దరణ ఉద్యమానికీ యువకులను సమీకరించి ఆయన తర్చీదు గావించిన పద్దతి అపూర్వమైనది. ఆయన పుట్టిన నిడుబ్రోలు (గ్రామంలో '' ఇండియన్‌ పెజింట్‌ ఇన్టైట్యూట్‌'” (భారతీయ రైతాంగ విద్యాలయం) అని ఒక అపూర్వమైన ఆదర్శ విద్యాసంస్థను ఆయన నెలకొల్పి గాంధీ మహాత్మునిచేత దానికి (ప్రారంభోత్సవం చేయించారు. గ్రామీణ యువకులలో రాజకీయ, ఆర్టిక విజ్ఞానాన్ని, వివేకాన్ని పెంపొందించడం, వారిని దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గానేలాగ ప్రేరేపించడం. యువకులలో సాంఘిక చైతన్యాన్ని, కులమత సామరస్యాలను పెంపొందించడం, వారిలో గాంధి సిద్దాంతాల అవగాహన కలిగించడం దాని లవ్యాలలో కొన్ని. చదువులు రాని యువకులలో వయోజన విద్యావ్యాప్తికి కూడా ఈ సంస్ట కృషిచేస్తూవచ్చింది.

అందువల్లనే ఈ సంస్త గాంధీజీ దృష్టిని బాగా ఆకర్షించింది. కరాచికాంగ్రప ఆమోదించిన ప్రాథమిక హక్కుల ప్రణాళికను రూపొందించడంలో ఈ సంస్ట పరిశొధ్గనలద్యాగా ఆచార్యరంగా గావించిన దోహదాన్ని గాంధీజీ ఎంతో హర్షించారు. ఈ విద్యాలయంలో రాజకీయ శిక్షణ పొందిననాటి కార్యకర్తలెందరో ఆ తరువాత దాదాపు అన్ని పాన్టీలలోనూ నాయకులై పలురకాల పదవులు నిర్వహించారు, నిర్వహిస్తున్నారు. ఈ ఆచార్యుడు మాత్రం ఏపదవి _ జోలికీపోక (ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేశారు.

నిజానికి ఇక్కడేకాదు మదరాసు పచ్చయప్ప కళాశాలలో ఆర్టికళా,స్త్ర ఆచార్యుడుగా వుండి అన్నాదుర్రైవంటి ఎందరో గొప్ప నాయకులను తీర్చిదిద్దారు. అందుకే ''రంగా ఒక అసాధారణమైన వ్యక్తి, ఆయన తన సొంత లాభం మానుకొని దేశ ప్రజల సౌఖ్యం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు" అని రాజాజీ ఒకానొక సందర్భంలో మెచ్చుకొన్నారు. “రాజకీయవేత్తగా ఆరికశాథస్త్రవేత్తగా, పార్టమెంచేరియన్‌గా, సాంఘిక సంక్షేమ కార్యకర్తగా, (గ్రంథకర్తగా, ఒక విశిష్టమైన వ్యక్తి రంగా. మన దేళ రాజకీయ నాయకులలో ఇన్ని గుణాలు సంతరించుకున్నవారు చాల కొద్దిమంది వుంచారు” అని ఒక ఆంగ్ర దిన పత్రిక సనంర్ళి

ప్రఖ్యాత జ శ్రీ, ఖాసా సుబ్బారావు అన్నట్టు ఆచార్య రంగా గాంధి మార్గా మనసో కంద రన అ తన సతీ జీవితం సాగిస్తున్నారు. బాపూజీ (ప్రభావం రంగా జీవితానికి జొన్నత్యం చేకూర్చింది.

“సోషలిజంలో నామొదటి ఆచార్యుడురంగా”' అని సుప్రసిద్ద సంపాదకుడు ఎం. చలపతిరావు అన్న మాటనే నేనూ అంటున్నాను. నేనే కాదు నాలాంటివారెందరో ఈ మాట అంటారు. (93.84) సంధియుగం 157

మొదాకస్వరాజ్య సమరవీరుని కథ. ఇదొకానొక 'అదబ్రహామ్‌లింకన్‌' జీవిత (క్రమం. ఇదొక విరామ మెరుగని సేవానిరతుని వృత్తాంతం. ఇదొక ' ఆదర్శ శిష్యుని" చరిత్ర. అందువల్లనే ఆయన గురించి వ్రాయడం ఒకింత కష్టమవుతున్నది. అందునా మనకు మరీ తెలిసిన వారిని గురించి వ్రాయడం మరింత కష్టమయినపని. ఎందుకంటే సాంగోపాంగంగా ఒకరిగురించి అన్ని సంగతులూ తెలిసిన వారికి ఎక్కడమొదలు పెట్టాలో, ఎక్కడ ముగించాలో తేల్చుకొనడం కొంత ఇబ్బంది కలిగించే విషయం. అంతేకాదు ఆయన గురించి వ్రాయడమంచే ఒక విధంగా నమ్నగురించినేను వ్రాసుకోడమే అవుతుంది.

మా రాజకీయ "సప్తపది అయిదు దశాబ్దాల నాటిది. ఇక్కడ “సప్తపది గురించి ఒక మౌట చెప్పాలి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఏడడుగులు నడచినా, ఏడుమాటలు మౌట్టాడినా దగ్గరవుతారు అన్నది ఆ నానుడి. దీనినే కాళిదాసు మహాకవి సంస్కృత కుమారసంభవంలో ఒకచోట ““సాప్తపదీనముచ్యతే బంధుత్వమ్‌”” అని అంటాడు. ఇక్కడ బంధుత్వమంచే చుట్టరికమేకానవసరంలేదు. స్నేహంకూడానని అర్ధం చెప్పుకోవచ్చు. మా యిద్దరి విషయంలో మాత్రం ఈ రెండర్దాలూ సార్టకమయినాయి. 1943లో అలా (ప్రారంభమయిన మా చెలిమి, అలా అలా బలపడుతూ వచ్చిన ఆత్మీయత 1981లో బంధుత్వంగా పరిణతిచెందింది.

సత్తెనపల్లిలో చదువుకుంటున్న నన్ను రాజకీయాలవైపు మళ్ళించినవారు ఆయనే. అప్పటికే ఆయనకు రాజకీయాలలో, ఆపీన్న వయసులోనే పెద్ద అనుభవాలు ఎదురయ్యాయి. ఆయన ఎవరో నాకు తెలియదు. నేనెవరో ఆయనకు తెలియదు. అయినా ఒకనాటి ఉదయం ఆయనతో ఏర్పడీన పరిచయం దాదాపు ఈ అర్ధళతాబ్దికాలంలో ఎన్నీ మలుపులు తిరిగింది. అంచా వెంకటేశ్వర్థుగారి గదిలో ఆనాడు వావిలాలగారితో పరిచయం అయిందీ ఆయన వల్లనే. ఆ తరువాత ఆచార్య రంగాగారి రాజకీయ శిబిరంలోకి నన్నునడిపించింది ఆయనే. ఒక్కనన్నే అనేమిటి? నావంటి. విద్యార్దులను యువకులను ఎందరినో సమీకరించి, రంగాగారి నాయకత్వాన, కాంగ్రెస్‌ ఉద్యమానికి అందించారాయన.

స్వరాజ్యసమరంలో నిర్భీకంగా, నిస్వార్ధంగా త్యాగనిరతితో ఉద్యమిస్తూనే రైతుల కడగండ్లను ఏలికల దృష్టికి తీసుకొచ్చి, వాటిపరిష్కారానికి ప్రయత్నించే పట్టుదల ఆయనకు ఆ చిన్న వయసులోనే అబ్బింది. మా రాజకీయ గురువుచూపిన మార్గంలో ' ఆదర్శ శిష్యుడుగా పయనించగల దీక్షాదక్షతా మా అందరిలో ఆయనకే ఎక్కువగా ఉన్నాయని కాలం నిరూపించింది. నామట్టుకునేను 1955లోనే రాజకీయాలు వదిలేసి ఉద్యోగానికి వెళ్ళి పోయాను. నావలెనే, నడుము జారుకున్న వారు చాలామంది ఉన్నారు. కాని, ఆయన మాత్రం ఎన్ని అవరోధాలు, వైఫల్యాలు ఎదురయినా పట్టువిడువకుండా ప్రజా సేవారంగంలో ముఖ్యంగా రైతుల సేవలో పయనిస్తూ ' సప్తతి" ని దాటి ఇంకా మును ముందుకు పోతున్నారు.

స్వరాజ్యం వచ్చేదాకా, కారాగార శ్లేశాలను లెక్కచేయకుండా, ఆ అక్ష సిద్దికోసం ఆయనెంత చిత్తశుద్దితో ఉద్యమించారో, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అంతటి 158 సంధియుగం

పట్టుదలతోనూ రైతుల, గ్రామీణ ప్రజల శ్రేయస్సు కోసం అహరహం కృషి చేస్తున్నారు. కనుకన్నే పత్రికలవారు ఆయనను “గురువుకు గౌరవం తెచ్చిన మేటి శిష్యుడు! అని ప్రశంసించారు. అర్హ శతాబ్ది రాజకీయ జీవిత యాత్రలో, ఆయా సందర్భాలలో, ఆయనను వ్యతిరేకించినవారు, అనుకూలించిన వారుకూడా తరువాత ఆయన సేవానిరతిని కీర్తించారు. నాడు (ప్రజానీకం పాలిట శాపంగా పరిణమించిన రేషనింగు, కంద్రోళ్ళు రద్దుచేయించడానికి జరిగిన ప్రజా ఉద్యమంలో ఎంత పట్టుదలగా పనిచేశారో, ఈనాటి పాగాకు రైతుల కష్టాలనూ నష్టాలమూ తొలగించడానికి అంతటి ఉత్సాహంతోను, దీక్షతోనూ కృషి చేస్తున్నారు. ఆనాటి చెన్న రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్‌ నిర్మాణాన్ని నిరోధించి, కృష్ణాపెన్నార్‌ (ప్రాజెక్టును నిర్మించడానికి పూనుకొన్నప్పుడు ఉప్పెనలా, ఉవ్వెత్తున ఉప్పాంగిన ప్రజా ఉద్యమంలో ఒక ఉత్తుంగ తరంగంవలె ఆయన ఎలా కృషిదేశాడో, ఈ నాటి 'ప్రత్తిరైతుల జీవన్మరణ సమస్యలను పరిష్కరింపచేయటానికి కూడా ఈ వృద్దాప్యంలో అంతటి ఓపికతో పనిచేస్తున్నారు. ఈ కృషిని గురించి ఇంకా వివరంగా చెప్పవలసినపని లేదు. ఇవి తెలుగువారందరికీ తెలిసినవే, కాని చాలమందికి తెలియని ఆయన గుణం మరొకటున్నది. ఆయన సంపన్నుడు కాకపోయినా జాలిగుణం కలవాడయినందున అవసరంలో, ఆపదలో ఉన్నవాళ్ళకు ఉన్నంతలో వెనకాముందూ చూడకుండా చేయూతనివ్వడం ఆయనకు వెన్నతో అబ్బిన అలవాటు. రాజకీయ ఉద్యమాలు, రైతు ఉద్యమాలు ఆయనకు జాతీయ వాదిగా, దేళభక్తుడుగా రైతుసేవకుడుగా చిరకీర్తిని అర్హించి పెట్టాయి. ఇవన్నీ ఒకెత్తు కాగా మూడుదశాబ్దాల క్రిందటనే ఆయన ఒంటిచేతి మీదుగా రూపొందించి, (ప్రచురించిన "గుంటూరు మండలసర్వస్వం* ఒక్కటీ ఒక ఎత్తు, గుంటూరు జిల్లా నైసర్గిక, సాంఘిక, రాజకీయ, విద్యా, వైజ్ఞానిక సాంస్కృతిక రంగాలన్నిటికీ అద్దంపడుతున్న “గుంటూరు మండల సర్వస్వం” ఒక ప్రామాణిక (గ్రంథం. అది వెలువడిన నాటినుంచీ ఆ జిల్లాకు సందింధించి ఎవరికి, ఎప్పుడు, ఏ సమాచారం అవసరమయినా అందించగల కల్పతరువులా అందరి (ప్రళంసలందుకొాన్న ఉత్తమసంకలనం ఈ గ్రంథం ఆయన (ప్రతిభావ్యుత్చత్తులకు, సంకలన శక్తికి ప్రబలనిదర్శనం. వ్యక్తిగా రాజకీయకార్యకర్తగా, రైతాంగ సేవకుడుగా, అనుకంపనగల మానవతావాదిగా, ఆదర్శ శిష్యుడుగా, రచయితగా, సంపాదకుడుగా ఆయనకు సరిరాగలవారు చాలాకొద్రిమంది ఉంటారు. ఆయన చదువుకొన్నది చాలా తక్కువ. కానీ, చదివినది అపారమయినది. నేనాయన కంటే ఎక్కువ చదువుకొన్న మాట నిజమేకాని, నేను చదివినది మాత్రం ఆయన చదివిన దానిలో లవలేళశం కూడా ఉండకపోవచ్చు. అందుకే ఆయన 'చదువుకొనని మేధావి' అయినాడు, ఇంతకూ, ఇంతవరకూ ఆయన ఎవరో చెప్పాను కాదు. ఆయన దరువూరి వీరయ్యగారు. ఈయన తనకు అనుంగు శిష్యుడుకావడం ఆచార్యరంగాగారికి ఎంతటి గర్వం కారణమో, నాకు దరువూరి అనుంగు మిత్రుడు ఆత్మీయుడు కావడం అంతటి గర్వకారణం. రాజకీయ సప్తపదినుంచి వయోసప్తతిని దాటిన మా చెలిమి అజరామరమయినది ఆయన కీ ర్తివలెనే. (17.7.89) న్గాస్గాగ్గ సంధియుగం 159

శఈజాటి రాజకీయ నాయకులలో సర్వసాధారణంగా కనపడే వేషాడంబరాలు ఆయనలో కనపడవు. పార్లమెంటు సభ్యులలో మామూలుగా మనం చూస్తుండే డాబు, దర్పాలు ఆయనలో మచ్చుకైనా కానరావు. తనతరం రాజకీయ నాయకులలో ఆయన తప్పపుట్టిన వాడనవచ్చు.

దేళంలో సామాజిక విలువలు మారిపోయాయి. రాజకీయాలలో సేవాధర్మం నశించింది. వ్యాపారదృష్టి రాజకీయరంగాన్ని ఆకట్టుకున్నది. పాతతరం నాయకులు (క్రమేణా రంగంలో నుంచి కనుమరుగు అవుతున్నారు. ఈ రాజకీయ చిమ్మవీకటిలో కూడా అక్కడక్కడా కొన్ని కాంతి కిరణాలు మనకు కనపడతాయి. అటువంటి వెలుగురేఖలనదగిన చాలా, చాలా కొద్దిమంది యువనాయకులలో ఈయన ఒకరు. రాజకీయాలలో సేవాధర్మానికీ, రుజువర్తనానికీ సచ్చీలానికీ ఇంకా తావు ఉన్నదన్న ఆశపూర్తిగా అంతరించి పోకుండా ఉన్నదంచే ఈయన వంటివారు కొద్దిమంది అయినా ఉండటమే కారణమని చెప్పవచ్చును. శాసన నిర్మాణ సభ హాజరు పట్టికలో చేనవ్రాలు పెట్టి, వెళ్లిపోయి రకరకాల సరదా కాలకేసాలు చేసే ప్రజా ప్రతినిధులు ఎక్కువగా కనిపించే ఈ కాలంలో, ఏ వ్యసనాలనూ తన జోలికి రానీయక, పాతకాలపు పెద్దమనిషివలె సభలోపల, వెలుపల (ప్రజా సమస్యల పరిష్కార ప్రయత్నమే పరమావధిగా పెట్టుకొని ఈయన పనిచేస్తున్నారనచానికి దృష్టాంతంగా ఇటీవల దేశంలోని పత్రికలన్నిటిలోనూ ఒక వార్త వచ్చింది. అంతవరకు రాజ్యసభలో ఏ సభ్యుడూ అడిగి ఎరుగనన్ని ప్రశ్నలు సభలో అడిగి, ఆయన తన ప్రత్యేకతను నిరూపించుకున్నారన్నది ఆ వార్త.

నేషనల్‌ ఫ్రంట్‌ మంత్రివర్గం అధికారంలో ఉండగా కేంద్ర ప్రభుత్వం చిన్న రైతులకు బుణవిముక్తి కలిగించే ఒక మంచి నిర్భయం ప్రకటించింది. పదివేల రూపాయలలోపు బుణాలను తిరిగి చెల్లించవలసిన అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఈవరం ఇచ్చినా బ్యాంకుల్లో పూజారులు అంత తేలికగా అంకెకు రావడంలేదు. అటువంటి పరిస్టితులలో పార్లమెంటు సభ్యుడుగా ఆయన పూనుకొని చిన్న రైతులకు చేసిన సేవ అపారమైనది.

ఒక్క గుంటూరు జిల్లాలోనే నూరుకోట్ట రూపాయల మేరకు రైతుల బుణాలను ఆయన రద్దు చేయించాడు. మన పార్లమెంటు ఉభయసభలలో ఉన్న 750 మంది సభ్యులలో మరే ఒక్కరుగాని ఇంత కృషిచేసి ఉంచారనుకోను. ఆమధ్య ఆంధ్ర ప్రాంతంలో ప్రత్తి పండించే రైతులు అపారమైన నష్టాలకు లోనై, తమకున్న కాస్త బంగారాన్ని బ్యాంకులలో తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారు. ఆ బంగారమంతా బ్యాంకుల పరమయ్యే (ప్రమాదం ఏర్పడిన సమయంలో ఆయన కేంద్ర ప్రభుత్వ ఆర్చిక శాఖను ఒప్పించి బుణాల రద్దుతోపాటు, ఎవరి బంగారం వారికి తిరిగి ఇప్పించే ఏర్పాటు చేయించారు.

ఆం(ధ్రలో ఆచార్య రంగా దంపతులు రైతులకోసం చేసిన సేవలను ఈయన ఇప్పుడు చేస్తున్న కృషి జ్ఞాపకం చేస్తున్నది. ఇంతవరకు నేను (వ్రాస్తున్నది ఎవరి గురించో పేరు చెప్పకపోయినా అర్రమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఈనాడు ఒక్క గుంటూరు జిల్లాలోనే 160 సంధియుగం,

కాదు - ఆం(ధ్రదేశంలోనే కాదు - మొత్తం భారతదేశంలో ప్రజాప్రతినిధిగా రైతు సేవకుడుగా డక్టర్‌ యలమంచిలి శివాజీగారి పేరు సుపరిచితమైనది. చాలా పిన్నవయస్సులోనే రంగాగారి నాయకత్వంలో రైతు సేవానిరతిని అలవరచుకున్న డాక్టర్‌ శివాజీ రంగాజీవంటి రైతు నాయకుడుగా రూసొందుతున్నాడు. స్వతంత్ర పార్టీ రోజులలో మినూ మసానీ వంటి మేధావితో సాన్నిహిత్యం నెరపి సునిశిత రాజకీయ సిద్దాంత పరిశీలనాసక్తిని పెంపాందించుకున్నారు. ఆ తరువాత లోక్‌దళ్‌లో ఉన్నప్పుడు చౌదరీ చరణ్‌ సింగ్‌ వంటి మచ్చలేని మహా నాయకునికి సన్నిహితుడై, తన రైతు సేవాసక్తిని, అనురక్తిని పెంపొందించుకున్నారు. ఈ నాయకులందరి నిరాడంబరత, నిజాయితీ, రుజువర్తనం డాక్టర్‌ శివాజీలో గూడు కట్టుకున్నాయి.

ఆం(ధ్రదేళంలో 1982లో రాజకీయంగా ఒక పెద్ద మలుపు వచ్చింది. దాని (ప్రాముఖ్యాన్ని తాలి రోజులలోనే గుర్తించిన యువ రాజకీయ మేధావులలో డాక్టర్‌ శివాజీ ఒకరు. అయితే ఎన్‌. టి.ఆర్‌.వంటి నాయకుని మెప్పు పొందడం అంత సుళువైన పనికాదు. ఆయన కార్యకర్తలనూ, నాయకులనూ రాజకీయ అగ్నిపరీకవంటి దానికి గురిచేస్తారు. అందులో నెగ్గిన వారికి ఆయన ఇచ్చే గౌరవం అపారమైనది. రాజ్యసభకు ఎంపిక కావడం ద్వారా 1988లో అటువంటి గౌరవం పొందినవారిలో డాక్టర్‌ శివాజీ ఒకరు.

ఆయన ఇంకా వర్ధమాన నాయకుడే. ఎక్కవలసిన రాజకీయ సోపానాలు మరెన్నో ఉన్నాయి. అందుకు కావలసిన ధనసంపదలు ఆయనకు లేనిమాట నిజమే. వంశపారంపర్యత అంతకంటే లేదు. అయినా ప్రజల మనసులలో చెరగని అభిమానాన్ని తన నిస్వార్ధ రాజకీయ కృషి ద్వారా ఆయన పెంపాందించుకుంటున్నారు. ఈ అభిమాన సంపదకు ఏ ధనసంపదా సాటిరాదు. ఏ వంశపారంపర్యతా దీటు కాజాలదు. ముందు ముందు ఏ పదవులైనా రావచ్చూ, రాకపోవచ్చూ, ఏ పదవి ఉన్నా లేకపోయినా ప్రజానాయకుడుగా ఇంతింతై, ఇంకింతై జాతీయ నాయకుల కోవలో చేరి తీరగలడు డ్యాక్టర్‌ యలమంచిలి శివాజీ.

డాక్టర్‌ శివాజీ రాజకీయ కార్యకర్త మాత్రమే కాదు. అర్జిక, సాంఘిక సమస్యలను సూక్ష్మంగా పరిశీలించగల యువ మేధావి. వివిధ దిన, వార పత్రికలలో ఆలోచనా (ప్రేరకమైన ఎన్నో వ్యాసాలు ప్రచురించారు. సమకాలీన సమస్యలలో ఆయన స్పందించని విషయం లేదు. ఆయన బహు (గ్రంథకర్త. “మన (ప్రజలు - మన రాజకీయాలు, 'కర్షక ప్రధాని, “గాంధీ పథంలో, 'ఈ కాంగ్రేస్‌ తెలుగుజాతిని ఉద్దరిస్తుందా!' ' మీరు-మీ ఆరోగ్యం” వంటి గ్రంథాలు ఆయన ్రాశారు. వీటిలో మొదటే గ్రంథం గత పాతికేళ్ల మన జాతీయ జీవనానికి అద్దం పడుతున్నది. ఈ గ్రంథానికి వ్రాసిన ముందుమాటలో 'శ్రీ/ మినూ మసాని అన్నట్టు “ఈ సంపుటిలో పొందుపరచిన డాక్టర్‌ శివాజీ వ్యాసాలు ఆయన విశ్వాసాలనూ, సైద్దాంతిక స్పష్టతనూ 'ప్రతిబింబిస్తున్నాయి” అందులోనే శ్రీ, మసాని అంచారు కదా! '"నేడు రాజకీయ రంగంలో సిద్దాంతాలు అ ప్రధానమైనవని భావించే రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారు. ఏదోవిధంగా అధికారంలోకి రావడం, పదవులద్వారా ప్రయోజనం పొందడం మాత్రమే వారికి (ప్రధానం. డాక్టర్‌ శివాజీ అలాకాదు. ఈయన కొన్ని స్పష్టమైన సిద్దాంతాలుగల రాజకీయవేత్త''. అవును, అందువల్లనే ఆయన జాతీయ నాయకుల కోవలోకి ఎదుగుతున్నారు.

(“డా. యలమంచిలి శివాజీ' పుస్తకం నుంచి (పః, 1993) సంధియుగం 161 శేరి

రెమళప్రురభట్‌ియథయం

ఆయదేళ్‌రాజకీయ రంగంలో 1982 ఒక మలుపు. దాదాపు 35 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఆయా నాయకులు కాంగ్రెస్‌కు బలమైన ప్రతిపక్షాన్ని నిర్మించడానికి చేస్తూ వచ్చిన (ప్రయత్నాలన్నీ విఫలం కాగా చివరకు ,శ్రీ/ఎన్‌. టి. రామారావు నాయకత్వంలో కేవలం తొమ్మిది మాసాల వ్యవధిలో కాం [గ్రస్‌ను పూర్తిగా ఓడించగలిగిన ఒక కొత్త పార్టీ పుట్టి, పెరిగింది. 1983 జనవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 300లకుగాను 202 స్థానాలను అవలీలగా గెలుచుకొన్న “తెలుగుదేళం షార్టీ' విజయంతో రాష్ట్ర రాజకీయరంగంలో రొమారావు శకం ఆరంభమైంది. 'హేమహేమీల వంటి రాజకీయ నాయకులు విఫలమైనచోట ఒక సినీ హీరో విజయుడైనాడు. ఈ విజయగాధను వివరించేముందు స్వాతం త్ర్యసిద్ది అనంతరం గడచిన 37 ఏళ్ళ రాజకీయ వృత్తాంతాన్ని ఒకసారి నెమరువేసుకొనడం అవసరం.

దేశానికి 194? ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. అయితే 1946 జూన్‌ రెండవ తేదీన జవాహర్‌లాల్‌నెహ్రూ నాయకత్వాన మొదటి జాతీయ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది. ఆ ఏడు జరిగిన శాసనసభల ఎన్నికలలో భారత జాతీయ కాం[గ్రమ్‌ ఘనవిజయం సాధించింది. అప్పటికి ఆంధ్ర రాష్ట్రం చెన్నరాజధానిలో ఒక అంతర్భాగంగా వుండేది. ఆ ఎన్నికల అనంతరం చెన్నరాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వానికి * ఆంధ్రకేసరి” (ప్రకాళం పంతులుగారు ప్రీమియర్‌ (అప్పటి ముఖ్యమంత్రి) అయినారు. అయితే జనాభాలో మనకంటె హెచ్చుగా ఉన్నతమిళులకు ఇది మింగుడు పడలేదు. దానికితోడు ఆంధ్ర కాంగ్ర[, నాయకులలో ఒక వర్గం వారు తమకు మంత్రి పదవులు రాలేదన్న కారణాన ్రకాళంగారిని దించివేసే ఓముండూర్‌ రామస్వామిరెడ్డియార్‌ని అందలం ఎక్కించడంలో తమిళులకు తోడ్పడ్డారు.

ఆంధ్ర కాంగ్రులో ప్రబలమైన రెండువర్గాలు ఏర్పడడానికి ఆనాడు నాంది ప్రస్తావన జరిగింది. “ఆం(ధ్రకేసరి'' ప్రకాళం, ఆచార్య రంగాగార్హ ఉమ్మడి నాయకత్వాన పనిచేస్తున్న వర్గం అప్పటివరకు డాక్టర్‌ పట్టాభి, కళావెంకద్రావు ప్రభృతుల నాయకత్వాన ఉన్న వర్గంనుంచి రాష్ట్ర కాంగ్రస్‌ నాయకత్వాన్ని పట్టుకోగలిగింది. 1946లో రంగాగారు పీ.సిసి. అధ్యక్షులుగా ఎన్నికైనారు. 1949లో దాక్టర్‌ పట్టాభిగారు భారత జాతీయకాం్రక్‌ అధ్యక్షులుగా ఎన్నికైనారు. ఇలా సాగుతూ వచ్చిన వర్గకలహాలు 1951నాటికి పరాకాష్ట నందుకొన్నాయి.

అప్పుటి వరకు కాంగ్రస్‌ సంఘాలకు అన్ని స్థాయిలలో ఎన్నికలు నికార్సయిన ప్రజాస్వామిక పద్దతిలో జరుగుతుండేవి. కాగా, డాక్టర్‌ పట్టాభి కాంగ్రైస్‌ అధ్యక్షులు అయిన అవకాశాన్ని పురస్కరించుకొని, ఆంధ్రలోని ఆయన వర్గంవారు రాష్ట్ర కాంగ్రస్‌ సంఘాన్ని ఎలాగైనాసరే పట్టుకోవాలన్న పట్టుదలతో పనిచేశారు. 1951 మేనెలలో పి.సి, సి. అధ్యక్షపదవికి ఎన్నిక జరిగింది. రంగా- ప్రకాశం వర్గానికి ఎక్కువ బలమున్న గుంటూరు జిల్లాలో షి.సి.సి. సభ్యుల ఎన్నిక పూర్తి కాకుండా నిరోధించి, ఆ జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండానే రాష్ట్ర కాంగ్‌ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిపారు. అయిదు వోట్ట తేడాతో ఆచార్య రంగా ఓడిపోవడం, పట్టాభి వర్గం అభ్యర్ది (శ్రీ, నీలం సంజీవరెడ్డి గెలవడం జరిగింది. ఏ.ఐ.సి.సి. తమ చేతిలో ఉన్నందువల్ల 162 సంధియుగం

అక్రమంగా పట్టాభి వర్గంవారు తమను ఓడించారన్న కోపంతో రంగా - ప్రకాశం వర్గం వెంటనే కొంగ్రటనుంచి బయటకు వెళ్ళి ప్రజాపార్టీని నెలకాల్పుకున్నారు.

ఆ విధంగా 1951లోనే ఏళ్ళనాడు కాంగ్రమ్‌కు వ్యతిరేకంగా మరొక నాన్‌ కమ్యూనిస్టు పార్టీని ఆంధ్రలో నిర్మించే ప్రయత్నాలు (ప్రారంభమైనాయి. యాదృచ్చికంగానే కావచ్చు. సరిగా ఆ సమయంలోనే (శ్రీ, ఎన్‌. టి. రామారావు సబ్‌రిజిస్ట్రార్‌ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సినిమా రంగంలో ప్రవేశించారు. అప్పటిలో రంగా - ప్రకాశం వర్గంవారికి ప్రజలలో మంచి (ప్రాబల్యం ఉండేది. ఇందుకు రెండు కారణాలు చెప్పవచ్చు. స్వాతంత్రోద్యమంలో (ప్రకాళంగారు (ప్రదర్శించిన ధైర్యసాహసాలూ, రంగాగారు వారి శిష్యులు నిర్వహించి ఉన్న విష్ణవాత్మకమైన భూమిక వల్ల ఈ నాయకులిద్దరికీ ప్రజల అండదండలు దండిగ ఉండేవి. మరొక కారణం పట్టాభి వర్గంవారు అధికారంలో ఉండి ప్రజల సమస్యలను అట్టే పట్టించుకోలేదన్న అసంతృప్తి జనంలో ఉండేది.

ఆ రోజుల్లో ఆంధ్రలో కమ్యూనిష్టు పార్టీకి మంచి పలుకుబడి ఉండేది. స్వాతంత్రానంతరం కాంగ్రోస్‌వారు పదవుల కుమ్ములాటలో ప్రజల సంగతి మరచిపోయారనీ, కాగా కమ్యూనిష్టు పార్టీ కార్యకర్తలు మాత్రమే ఊరూరు తిరిగి ప్రతి పల్లెలో ప్రజల మధ్య, ముఖ్యంగా హరిజనుల వంటి పేద ప్రజల మధ్య మెలుగుతూ వారి కష్టనస్థాలనూ, సమస్యలనూ గురించి నిస్వార్ధంగా పని చేస్తుండేవారనీ ఆ రోజుల్లో రాష్ట్రరాజకీయాలను గమనిస్తూండిన నిష్పాక్షిక పరిశీలకులు ఎవరైనా అంగీకరిస్తారు. ఫలితంగా పేద ప్రజలను కమ్యూనిష్టు పార్టీ పూర్త ఆకట్టుకున్నది. అటువంటి సమయంలో రాష్ట్రంలో కాంగ్ర[లో అంతో ఇంతో 'ప్రజాబలంగల రంగా- ప్రకాశం వర్గం కాంగ్‌ నుంచి నిష్క్రమించడంతో కుడి ఎడంగా సమానమైన బలంగల మూడు రాజకీయ పక్షాలు రంగంలో ఉన్నాయి.

ఇటువంటి పరిస్టితులలో కొత్త భారత రాజ్యాంగ చట్టం క్రింద మొదటి సాధారణ _ ఎన్నికలు 1952లో జరిగాయి. అయితే ఈ ఎన్నికలు వచ్చే లోపలనే రంగా- ప్రకాశం గార్హ కొత్త షార్టీ రెండుగా చీలిపోయింది. ఆ ఎన్నికలలో కాంగగ్రక్‌ పార్టీకి చాల తక్కువ స్టానాలు వచ్చాయి. మొత్తం 140 స్థానాలలో 40 స్పానాలు కమ్యూనిష్టు పార్టీకి రాగా, మిగతా 100 స్టానాలను కాంగ్రస్‌, ప్రజాపార్ర్రీ, రంగాగారి లోక్‌పార్టీ పంచుకొన్నాయి. ఈ కమ్యూనిష్టు విజయాలను చూచి బెదిరిపోయిన కాం(గ్రక్‌ 1955 మధ్యంతర ఎన్నికల నాటికి (ప్రజాపార్టీ లోక్‌ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఆ ఎన్నికలలో కమ్యూనిష్టుపాన్టీని పూర్తిగా ఓడించింది. అప్పటికే అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

ఆ విధంగాకాం(గ్రముకు ప్రత్యామ్నాయంగా మరొక నాన్‌ కమ్యూనిష్టు పార్టీని నిర్మించడానికి జరిగిన ప్రయత్నం పురిటిలోనే సంధికొట్టిపోయింది. ఆ తరువాత చాలా కాలం వరకు కమ్యూనిష్టుషార్టీ కాంగ్రక్‌కు బలమైన ప్రతి పక్షంగా వుంటూవచ్చింది. కమ్యూనిష్టులు గెలుచుకొన్న స్థానాల సంఖ్య తగ్గిపోయినా, దాదాపు ప్రతి ఎన్నికలోనూ వారికి రమారమి 30 శాతం వోట్లు వస్తూనే వుండేవి. పేదవర్లాల (ప్రజలు ముఖ్యంగా దళితులు తమకు ఇతరులెన్ని ఆశలు చూపీనా ఆ ప్రలోభాలకు లాంగక ప్రతి ఎన్నికలోనూ కమ్యూనిష్టు పార్టీకే వోట్లు ఇస్తూ వచ్చారు.

ఆం(ధ్రలో కమ్యూనిష్టు పార్టీ చీలకుండా ఉన్నట్లయితేనూ, నెహ్రూ అనంతరం కాంగ్‌ పార్టీ చేపట్టిన కొత్త నినాదాల భ్రమలో కమ్యూనిష్టు నాయకులు పడిపోకుండా ఉన్నట్లయితేనూ, సంధియుగం 163

బెంగాలులోలాగా, కేరళలోలాగ కమ్యూనిష్టు షార్టీ ఇక్కడ కూడ అధికారం వైవసం చేసుకొనగలిగి ఉండేది. చరిత్ర గతి కూడ మరోవిధంగా ఉండేది. కాని కమ్యూనిస్టులు పఫ్టీరంగా ఉన్న తమ వోటు బ్యాంకులోని వోట్లను (శ్రీ,మతి ఇండిఠరాగాంధి నాయకత్వాన ఉన్న కాంగ్రెసు పార్టీకి తాకట్టు పెట్టుకున్నారు. ఆ తరువాత తాము కోరినప్పుడు ఆ తాకట్టును విడిపించుకోలేక పోయారు. ఆ విధంగా స్వయంకృతాపరాధం వల్ల ఆం(ధ్రలో ఒక రాజకీయ శక్తిగా కమ్యూనిష్టులు ఈమ ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోయారు.

ఇలా కాంగ్రెస్‌ పార్టీకి ఆం(ధ్రలో 1971 నుంచి ఎదురు లేకుండా పోయింది. వారు ఆడింది ఆట పాడింది పాటగా చెల్లుతూ వచ్చింది. ఎమర్హన్పీ అనంతరం 1977లో జర్తిగిన సాధారణ ఎన్నికలలో దేశమంతటా పూర్తి పరాజయం పాలైన కాం గ్రెస్‌ పార్టీ. ఆంధ్రలో మా(త్రం సంపూర్ణ విజయం సాధించింది. దీనితో కేంద్ర కాంగ్రము నాయకులు ఒకరకమైన రాజకీయ 'నవాబుగిరి ని సాగించడం ప్రారంభించారు. 1978 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ఆంధ్రలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రేస్‌ పార్టీ అయిదేళ్ళ కాలంలో నలుగురు ముఖ్యమం త్రులను నిష్కారణంగా మార్చివేయడం 'ప్రధానికొడుకే అయినా. ఒకపార్లమెంటు సభ్యుడు ఒక ఆం(ధ్ర ముఖ్యమం త్రిని నడివీధిలో పెట్టి తూలనాడడం ఇందుకు ఉదాహరణలు.

రాష్ట్ర రాజకీయాలలో ఈ ధోరణులను (శ్రీ ఎన్‌ టి. రామారావు అంతకుముందు పదీ పదిహేను సంవత్సరాలుగా శ్రద్దతో గమనిస్తూ వస్తున్నారు. పలువురు భావిస్తున్నట్టు ఆయన రాజకీయాలలో ఉన్నట్టుండి, ఆకస్మీకంగా ప్రవేశించలేదు. 1970 నుంచి ఆయనలో లీలగా రాజకీయమైన ఆలోచనలు మెదలడం మొదలయింది. కాంగ్రేస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాల విషయంలో ఆయనకు నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన తీసిన “తాతమ్మ కలి” సినిమాలో మొదటిసారిగా ఈ రాజకీయ అభి(ప్రాయాలు ప్రతిబింబించాయి. ఎం.జి, రామచంద్రన్‌ డి.ఎం.కె. నుంచి విడిపోయి తన సొంత పార్టీ పెట్టుకొన్నప్పుడు ఆ పార్టీ వారు ఒక పెద్ద ఊరేగింపు మదరాసు నగరంలో జరిపారు. ఎం.జి.ఆర్‌ ప్రజా బలాన్ని మొదటిసారి ప్రతిబింబించిన ఊరేగింపు అదే. ఒక సినిమా షూటింగులో వున్న ఎస్‌. టి. ఆర్‌. ఆవేళ ఆవూరేగింపును చూచి ఎంతగానో ఉత్తేజితుడయినాడు. ఇది అప్పటికి ఒక పుష్కరం కాలంనాటి సంగతి “తాతమ్మ కల?” తీస్తున్న రోజులవి 1972లో ఒకనాడు ఆయనా నేనూ ఒకే విమానంలో హైదరాబాదు నుంచి మదరాసు వస్తున్నాము. ఏదో సినిమాకు ట్కీఫ్లు (ద్రాసుకుంటున్నారు. ఆ ప్రయాణంలో కూడా మధ్యలో కొంచంసేపు వ్రాయడం ఆపినప్పుడు ఆ రోజు దినపత్రికలో భూసంస్కరణలకు సంబంధించిన ఒక శీర్షిక ఆయన దృష్టిని ఆకర్షించింది. అప్పుడాయన ఆ విషయం మీద తన నిన్షిష్టమైన అభిప్రాయాలను వెళ్ళబుచ్చారు. ఆ కొంచెం సేపు జరిగిన మా సంభాషణలో ఆయన రాజకీయ భావాలను చాలవరకు గవునించగలిగాను.

అప్పటికి పది పదిహేను సంవత్సరాలుగా ఆయనలో రాజకీయమైన ఆలోచనలు గూడుకట్టుకుంటున్నాయనీ, ఈ ఆలోచనలు కాలానుకూలంగా కొంతమార్చు చెందుతూ వచ్చాయనీ ఆయన తీరు తెన్నులను జాగ్రత్తగా గమనిస్తూ వచ్చిన వారికి తెలుసును. 30 ఏళ్ళుగా తెలుగు సినిమా రంగాన్ని మకుటంలేని రాజుగా ఏలుతూ వచ్చిన ఎన్‌. టి.ఆర్‌. లో క్రమశిక్షణ, నిష్టగరిప్టత స్పష్టంగా కనిపిస్తాయి. జీవితాన్ని సూత్రబద్దంగా నడుపుకొంటూ వచ్చిన వ్యక్తి, కార్యదీక్ష సడలని పట్టుదల, ఆయనకు విద్యార్థి దశనుంచి అలవడిన గుణాలు. గుంటూరు 164 సంధియుగం

ఏ.సి. కాలేజీలో ఆయన, నేను బి.ఏ. చదువుతున్న రోజుల్లోనే ఎన్‌.టి. ఆర్‌. ఇటు చదువుల్లోనూ, అటు సాంస్కృతిక కార్యకలాపాల్గోనూ చాలా చురుకుగా ఉండేవారు. డ్సర్‌ కొంగర జగ్గయ్యగారు కూడా అప్పుడు అదే కాలేజీలో బి. ఏ. చదువుతున్నారు. సినిమా రంగంలో అనుభవ సంపదను పెంచుకుంటూ, రాజకీయాలలో తన భూమికను ప్రారంభించడానికి తగిన సమయం కోసం వేచివున్న వ్యక్తి ఎన్‌. టి. రామారావు. అవును, తగిన సమయంలో, సరైన సమయంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రంగా- ప్రకాశం వంటి నాయకులు ఒక వంక్కా ఆంధ్ర కమ్యూనిష్టు పార్టీ మరో" వంకా విఫలంకాగా, కాంగ్రెస్‌ పార్రీ ఎదురులేకుండా వ్యవహరిస్తుండగా, అసంతృప్పులై ప్రత్యామ్నాయ నాయకత్వంకోసం ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రజానీకానికి తగిన అదనులో ఎన్‌.టి.ఆర్‌ నాయకత్వం లభించింది. కనుకనే ఆయన '"'తెలుగుదేశం పార్టీ” తొమ్మిది నెలలకే 1982 డిసెంబరులో జరిగిన సాధారణ ఎన్నికలలో రాష్ట్రంలో అప్పటివరకూ ఎదురులేకుండా వున్న కాంగ్‌ పార్టీని పూర్తి పరాజయం పాలుచేశారు. “ఒంట, రెంట, ఒనరంగ మూటి' అన్నట్టు రెండేళ్ళ వ్యవధిలో జరిగిన మూడు సాధారణ ఎన్నికలలో వరుసగా, ఒకసారి కంటే మరొకసారి మిన్నగా కాం గ్రక్‌ పార్టీని ఓడించి తన నాయకత్వపు స్టానాన్ని సువ్యవస్టితం చేసుకున్నారాయన. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాల్లో ఇంత *భ్రైమర్‌' సృష్టించుకొన్నవారు అంతవరకు మరెవరూ లేరనవచ్చు. (జూలై 1985) సాన్గుగ్గు తీ బంధు(ుతి ““రాజుకీయవాదులు ఒకరిపై ఒకరు బంధుద్రీతి ఆరోపణలు చేసుకోవడం తరము వింటున్నాం. ప్రజాస్వామ్యంలో (ప్రజల ఓట్లతో ఎన్లికై అధికారాన్ని నిర్వహిస్తున్తువారు పాటించవలసిన నైతికభర్మాలు ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. వాటిలో మరింత ముఖ్యమైనది ప్రజలు తమకిచ్చిన అధికారాన్ని వారు తము బిడ్తలకో లేక ఇతర బంధువర్తానికో వారసత్వంగా సం ్రమింప చేయడానికి ప్రయత్హించడం మవోపావం. అది వీనాయకుడు చేసినా పాపమే. అయితే ఎంతో పెద్దపదవిలో వున్నవారు చేస్తే అది మరీ పెద్ద పాతకమవుతుంది..... ఇంటాబయటా [0-2-84 సంధియుగం 165

అనుబంధం శ్రీ వి.ఎస్‌.ఆర్‌- కృష్ణ రచనల పట్టిక 1 _ | విప్లవం వస్తే రైతులు జమీన్‌రైతు మే 1947 2 | విద్యార్థుల రంగా వాహిని 7-11-52 3 _ | రాజాజీ వేసిన రెండు బాణాలు వాహిని 19-8-60 4 | పాలుపోసిన పెంచిన పాము వాహిని 26-9-60 5 | అర్ధంకాని స్వీయాపరాధం వాహిని 2-9-60 6 ఎ ప్రణాళిక ప్రచారవారోత్సవాలు వాహిని 16-9-60 బి కమ్యూనిస్టు కులంలో ముసలం 7 _ | బలంకాదు వాపుమాత్రమే వాహిని 23-9-60 8 | నియంతృత్వ రేఖలు వాహిని 30-9-60 9 | ఎ అయూబ్‌ఖాన్‌కు తట్టిన ఆలోచన వాహిని 7-10-60 బి నేటి ప్రణాళిక విధాన దుష్పరిణామాలు 10 _ | పాక్‌సైన్యం శిఖండిపాత్ర వాహిని 14-10-60 11 | మామిడిపూడివారు గమనించని విషయం వాహిని 16-12-60 12 | *ఇసౌజన్యమూర్తి డా గాలి బాలసుందరరావు | ఆంధ్రప్రభ(దిన) 10-11-74 13 |ఎ శ్రీలంక సమస్య బి తమిళనాడు రాజకీయాలు సి ఆటవికన్యాయం ఆం[ధ్రజ్యోతి (దిన) | 27-8-83 14 _ | ఎ పాకిస్తాన్‌లో చెలరేగుతున్న (ప్రజాస్వామ్య ఉద్యమం ఆంధ్రజ్యోతి (దిన) | 3౩-9-83 బి మార్గదర్శుకమైన తీర్చు 15 | ఎ అగ్రరాజ్యాల అనుమానాలకు అమాయక ప్రజల బలి ఆంధ్రజ్యోతి (దిన) | 10-9-83 బి మహిళలను గౌరవించడం మంత్రులకు కూడా చేతకాదా? 16 | ఆపదమొక్కుల ఫ్రంట్‌లతో అయ్యేదేమిటి?| ఆంధ్రజ్యోతి (దిన) | 17-9-83 17 | మద్రాసు యూనివర్సిటీ పంచమ రజతోత్సవాలు ఆంధ్రజ్యోతి (దిన) | 20-9-83 18 | ఎ కమ్యూనిష్టు పార్టీలు మూడో ఫ్రంటు పెట్టుకుంచాయా? ఆం(ధ్రజ్యోతి (దిన) | 24-9-83 బి మద్రాసు, ఢిల్లీ మహిళలు శలపెట్టిన మంచి ఉద్యమం ఆంధ్రజ్యోతి (దిన) | 24-9-83 166

19 | * మహాత్ముని సిద్దాంతాల లోకమాన్యత | అంధ్రజ్యోతి (దిన) 1-10-83 20 | దేశ స్వాతంత్ర్యం జాతి సమైక్యత

అవిభాజ్యమైనవి కావా? ఆంధ్రజ్యోతి (దిన) | 15-10-83 21 | తెలుగుదేశం తొమ్మిదినెలల బాలానందం (ఆంధ్రజ్యోతి (దిన) | 22-10-83 22 _ | ఐక్యరాజ్యసమితి మనుగడలో అపళ్ళతులు | ఆంధ్రజ్యోతి (దిన) | 29-10-83 23 | రాజకీయ స్నేహానుబంధాలు నాడు-నేడు [ఆంధ్రజ్యోతి (దిన) 6-11-83 24 | * ప్రపంచంలో ప్రజాస్వామ్యం

పట్టుతప్పుతున్నదా? ఆంధ్రజ్యోతి (దిన) | 12-11-83 డక్‌ * బహుముఖ (ప్రజ్ఞానిధి

డా వై నాయుడమ్మ ఆంధ్రజ్యోతి (దిన) | 19-11-83 26 _ | తెలుగు వికాసానికి మరో విశ్వవిద్యాలయం

అవసరమా? ఆంధ్రజ్యోతి (దిన) | 26-11-83 27 | సమస్యకారాని సమస్య కేంద్రరాష్ట్ర

సంబంధాలు ఆం(ధ్రజ్యోతి (దిన), 3-12-83 28 _ | పత్రాలపైనే మిగిలిపోతున్న మానవస్వత్వాలు| ఆంధ్రజ్యోతి (దిన) | 10-12-83 29 _ | పార్టీల మార్పిడి అప్పటికీ ఇప్పటికీ తేడా | ఆంధ్రజ్యోతి (దిన) | 17-12-83 30 _ | దక్షిణప్రాంత కాంగ్రమ్‌-ఐ సభ వింతలు

విశేషాలు ఆం(ధ్రజ్యోతి (దిన) | 23-12-83 31 _ (పాలస్తీనా ప్రజల లక్ష్యసిద్దికి సత్యాగ్రహం

సరైనమార్గం ఆంధ్రజ్యోతి (దిన) 30-12-83 32 _ | ఐక్యరాజ్యసమితి విచ్చిత్తిలో తొలిఘట్టుం

(ప్రారంభం ఆంధ్రజ్యోతి (దిన) 27-1-84 33 _ | రాష్ట్రిలపై కేంద్రం అధికారం మద్రాసులో

రసవద్గోష్టి ఆంధ్రజ్యోతి (దిన), 13-1-84 34 _ | పత్రికలవలె ప్రైవేటు ప్రసారాలు

'పెట్టుకోవచ్చునా ఆంధ్రజ్యోతి (దిన) 20-1-84 35 _ | మరీ బజారుపాలైన మన రాజకీయపక్షాల

తీరుతెన్నులు ఆంధ్రజ్యోతి (దిన) 28-1-84 36 _ | అన్ని పన్నులలో రా(ఫ్టైలకు సగం వాచా -

సెమినార్‌ సూచన ఆంధ్రజ్యోతి (దిన) 3-2-84 37 _ | రాజకీయాలలో బంధుస్రీతికి ఎప్పుడో పడిన

పునాదులు ఆంధ్రజ్యోతి (దిన) 10-2-84 38 _ | అమెరికన్‌ కాంగ్రేస్‌ పార్లమెంటు కాదా? (ఆంధ్రజ్యోతి (దిన) 17-2-84 39 _ | ప్రాంతీయ పరమార్హంకంటే రాష్ట్ర శ్రేయస్సే

మాన్యం ఆంధ్రజ్యోతి (దిన) 25-2-84

167

40 _ | విజయవాడ మద్రాసు సదస్సులు ఒక పరిశీలన ఆంధ్రజ్యోతి (దిన) | 2-3-84 41 |* సహస్ర చంద్రదర్శి ఆచార్య రంగా రాజకీయ సప్తపది ఆం(ధ్రజ్యోతి (దిన) | 9-3-84 42 _ | ఢిల్లీలో కాంగ్రక్‌, పొచ్నాలో జనతా సభల ధోరణి ఆంధ్రజ్యోతి (దిన) | 16-3-84 43 _ | చినకాకానివద్ద పెద్ద క్యాన్సర్‌ పరిశోధన చికిత్సా కేంద్రం ఆంధ్రజ్యోతి (దిన) | 23-3-84 44 _ | * చెన్నపురి తెలుగుల రాజకీయ ప్రతినిధి డాక్టర్‌ స్వామి ఆంధ్రజ్యోతి (దిన) | 30-3-84 45 _ | భాగ్యనగర్‌నుంచి బైకనూర్‌మీదుగా వ్యోమయానం ఆం(ధ్రజ్యోతి (దిన) | 6-4-84 46 _ | సాహితీభారతికి కేరళ అకాడమీ రజిత కానుక ఆంధ్రజ్యోతి (దిన) | 13-4-84 47 _ | ప్రయోజనకర పుస్తకం ( జానమద్ది హనుమచ్చాస్త్రీ, గారి గ్రంధం కన్నడ “కస్తూరి సమీక్షు ఆంధ్రప్రభ(దిన) | 15-4-84 48 _ | పనిచేసే ప్రభుత్వంలో ఒళ్ళువంచని ఉద్యోగులు ఆంధ్రజ్యోతి (దిన) | 20-4-84 49 _ | ప్రజాస్వామ్యంలో వీర సన్మానమేకాని వీరపూజకూడదు ఆం(ధ్రజ్యోతి (దిన) | 27-4-84 50 _ | ఒడియా సాహిత్య చరిత్ర (పురిపండా పుస్తకంపై సమీక్ష ఆం(ధ్రప్రభ(దిన) | 29-4-84 51 పత్రికా స్వాతంత్ర్యం మాత్రమే ప్రతిహతమైనట్టిదా? ఆంధ్రజ్యోతి (దిన) | 4-5-84 52 _ | ఇరవైఏళ్ళనాటి అక్కినేని తొలి అమెరికా యాత్ర కథ ఆం(ధ్రజ్యోతి (దిన) | 10-5-84 53 | జస్టిస్‌ పార్టీ చివరిముంత్రి సర్‌ ముత్తయ్య చెట్టియార్‌ అంధధ్రజ్యోతి (దిన) | 18-5-84 54 _ | అధ్యక్ష తరహాపాలన వ్యవస్త్రే మనకు అనువైనదా? ఆంధ్రజ్యోతి (దిన) | 25-5-84 55. | ఇ యాభైఏళ్ళుగా మరుగున పడివున్న మరో తెలుగునవల (రంగాగారి “హరిజన నాయకుడు' పై) ఆంధ్రజ్యోతి (దిన) | 1-6-84 56. | తనదైన వ్యక్తిత్వంగల తమిళ కలైజ్ఞర్‌ ఆం(ధ్రజ్యోతి (దిన) | 8-6-84 168

57 _ | అమెరికా అధ్యక్షుని ఎన్నిక ఎలా జరుగుతుంది? ఆం(ధ్రజ్యోతి (దిన) 15-6-84 58 | అన్నిమతాల ఆలయాలపై దేవాదాయశాఖ అజమాయిషీ ఆం(ధ్రజ్యోతి (దిన) 22-6-84 59 _ | రాష్ట్రాభివృద్ది కృషిలో పాన్టీ విభేదాలు అడ్డు రారాదు ఆం(ధ్రజ్యోతి (దిన) 29-6-84 60 _ | ఫరూక్‌ ప్రభుత్వం తొలగింపు పూర్వాపరాలు | ఆంధ్రజ్యోతి (దిన) 6-7-84 61 | రోదసీ రోకెట్లకుమూలం శ్రీరంగపట్నం సిసింద్రీలు ఆంధ్రజ్యోతి (దిన) 13-7-34 62 | * తాలి మానవుడు చందమామపై అడుగిడిన వేళ ఆంధ్రజ్యోతి (దిన), 20-7-84 63 | ఒలింపిక్‌ ఆటల పోటీల పుట్టుపూర్వోత్తరాలు ఆం(ధ్రజ్యోతి (దిన) 28-7-84 64 | * మతమౌఢ్యం మానవతను మట్టుపెట్టునీయరాదు ఆంధ్రజ్యోతి (దిన) 3-8-84 65 | * స్వాతంత్ర్య నిర్మాతల ఆళలు అడియాసలౌతున్నాయా ఆంధ్రజ్యోతి (దిన), 10-8-84 66 | అమెరికాలోకూడ పత్రికా స్వేచ్చకు విపత్తు రానున్నదా? ఆంధ్రజ్యోతి (దిన) 17-8-84 67 _ | దేళ రాజకీయాలపై ఆం(ధ్ర పరిణామాల (ప్రభావం ఆంధ్రజ్యోతి (దిన), 1-9-84 68 | 'గవర్నర్‌, “ముఖ్యమంత్రి ఒకే ఒరలో 'రెండు కత్తులు ఆం(ధ్రజ్యోతి (దిన) 7-9-84 69 | * మద్రాసులో అమరజీవి స్పృతి సంప్ట పునరుజ్జీవనం ఆంధ్రజ్యోతి (దిన) 14-9-64 70 | ఆంధ్ర ప్రహసనం వెల్లడించిన రాజకీయ సత్యాలు ఆంధ్రజ్యోతి (దిన), 21-9-84 71 | * దేశభక్తుడు సంఘసంస్కర్త గద్దె రంగయ్యనాయుడు ఆంధ్రజ్యోతి (దిన), 28-9-84 72 | * గతమెంతో ఘనకీర్తిగల చెన్నపురి ఆం(ధ్ర మహాసభ ఆంధ్రజ్యోతి (దిన), 6-10-84 73 | + లండన్‌లో “కృష్ణ్థమూర్తీభవించిన తెలుగుతనం”? ఆం(ధ్రజ్యోతి (దిన) 12-10-84 74 | * తెలుగులో తొలి సమగ్ర సంహిత *ఆంధ్ర సరస్వము ఆం(ధ్రజ్యోతి (దిన) 19-10-84 169

?5$ _ | పాలకులైనా పనికిరాని

మన (ప్రభుత్వాస్పత్రులు ఆంధ్రజ్యోతి (దిన) |26-10-84 ?6 _ | అమెరికన్‌ (ప్రసిడెంట్‌ ఎన్నికల సంరంభం | ఆం(ధ్రజ్యోతి (దిన) | 3-11-84 77 | ఆటవికత వైపు వడివడిగ తిరిగి వెడుతున్న

మానవత ఆంధ్రజ్యోతి (దిన) | 9-11-84 ?8 | మహానగరాలలో అన్యభాషలవారిపట్లు

అలక్ష్యం ఆం(ధ్రజ్యోతి (దిన) |23-11-84 79 | * మా తెలుగుతల్లికి మల్లెపూదండ

అల్లిన సుందరాచార్య ఆంధ్రజ్యోతి (దిన) |25-11-84 80 | మదరాసులో తమిళేతరుల రాజకీయేతర

సమస్యలు ఆంధ్రజ్యోతి (దిన) 30-11-84 81 | ప్రాంతీయపార్టీల తోకపట్టి ఈదుతున్న

జాతీయపక్షాలు ఆంధ్రజ్యోతి (దిన) | 7-12-84 82 _ | డబ్బు లేనివారందరు ఎన్నికలకు

పనికిరాని వారేన? ఆంధధ్రజ్యోతి (దిన) 14-12-84 83 _ | ఎన్నికలైనాయి ఇక అంతా మన్నికతో

వ్యవహరించాలి ఆం(ధ్రజ్యోతి (దిన) 31-12-84 84 _ కొత్త నాయకత్వం దేశానికి సరికొత్త

ఒరవడి దిద్దాలి ఆంధ్రజ్యోతి (దిన) | 11-1-85 85 | అయ్య వచ్చేవరకు అమావాస

ఆగవలసిందేనా? ఆంధ్రజ్యోతి (దిన) | 18-1-85 86 _ | చెన్నపురిలో చెన్నఘంటమ్మ నిర్మించిన

సేవాసంస్టలు ఆంధ్రజ్యోతి (దిన) | 25-1-85 87 _ | రాజీవ్‌కి సంక్రమించిన దేళ వారసత్వం ఆం(ధ్రజ్యోతి (దిన) | 1-2-85 88 _ | పార్టీలలో ప్రజాస్వామ్యాన్ని నిర్దేశించే

శాసనావళ్యకత ఆంధ్రజ్యోతి (దిన) | 8-2-85 89 _ | అన్నిషార్రీలను కుదిపివేస్తున్న యువజన

విష్ణవం ఆంధ్రజ్యోతి (దిన) | 15-2-85 90 | ఆరోపణలకు ప్రత్యారోపణలు

జవాబు కాజూలవు ఆంధ్రజ్యోతి (దిను! 1-3-85 91 | ఈనాటి కూచిపూడి నృత్య (ప్రాళస్త్య

విస్తరణ ఉద్యమం ఆం(ధ్రజ్యోతి (దిన) | 8-3-85 92 | అరవైఏళ్ళలో మన ఊళ్ళలో వచ్చిన మార్పులు | ఆంధ్రజ్యోతి (దిన) | 15-3-85 93 _ | బడ్జెట్‌లో అతిముఖ్యమైనది పంటల

భీమా ప్రతిపాదన ఆంధ్రజ్యోతి (దిన) | 22-3-85

170

  1. | నలఖభైఏళ్ళుగా లంకలో రగులుతున్న *“రావణకాష్ట్రం' ఆం(ధ్రజ్యోతి (దిన), 29-3-85
  2. | ఏభైఏళ్ళలో ఎంతో ఎదిగిన మదరాసు నగరం ఆంధ్రజ్యోతి (దిన)! 5-4-85
  3. | తెలుగు సాహిత్య పునర్వికాసానికి సి.పి, బ్రౌన్‌ సేవలు ఆంధ్రజ్యోతి (దిన), 12-4-85
  4. | రాష్ట్రపతి సన్నదు నందుకున్న రాయలసీమ సేవాసమితి ఆంధ్రజ్యోతి (దిన)! 19-4-85
  5. | తెలుగు నాటకరంగం ఎందుకు నీరసించింది! ఆంధ్రజ్యోతి (దిన) 26-4-85
  6. | పదేళ్ళనాడు ముగిసిన వియత్నాం యుద్దపాఠాలేవి? ఆంధ్రజ్యోతి (దిన) 4-5-85
  7. | భారతజాతీయ కాంగగ్రక్‌ శతవార్షికోత్సవాలు | ఆంధ్రజ్యోతి (దిన), 10-5-85
  8. | దేశాన్ని కళవెళపెడుతున్న రిజర్వేషన్ల సమస్య | ఆంధ్రజ్యోతి (దిన), 17-5-85
  9. | * కాయకప్ట సహిష్టుతను పెంచగల చదువు అవసరం ఆం(ధ్రజ్యోతి (దిన)! 24-5-85
  10. | ప్రధానిగా రాజీవ్‌ తాలి విదశయాత్రల ప్రాధాన్యం ఆంధ్రజ్యోతి (దిన) 1-6-85
  11. | ఇండియా అమెరికా సంబంధాలలో . ఎత్తుపల్టాలు - 1 ఆంధ్రజ్యోతి (దిన), 7-6-85
  12. | ఇండియా అమెరికా సంబంధాలలో ఎత్తుపల్టాలు - 2 ఆంధ్రజ్యోతి (దిన) 14-6-85
  13. | * గీత-తోరో-గాంధీ-కింగ్‌ ఇండియా - అమెరికా ఆం(ధ్రజ్యోతి (దిన) 22-6-85
  14. | తెలుగు దినప(త్రికల చరిత్రలో రజతయుగం ఆంధ్రజ్యోతి (దిన), 28-6-85
  15. | * ఆం(ధ్రదేశంలో తెలుగుదేశం : రాష్ట్ర రాజకీయ రంగంలో రామారావు శకారంభం| తెలుగుపలుకు | జూలై£్‌
  16. | ఆకాళ అరాజకాన్ని అంతా కలసి అరికట్టాలి ఆంధ్రజ్యోతి (దిన) 6-7-85
  17. | మన సెక్యులరిజం మతాలముందు తలవంచరాదు ఆంధ్రజ్యోతి (దిన), 12-7-85
  18. | తమిళనాడులో కాంగ్రెసు పునరుజ్జీవన యత్నం ఆం(ధ్రజ్యోతి (దిన), 19-7-85
  19. | కేంద్రంపట్లు ఎన్‌. టి. ఆర్‌వైఖరిలో మార్పు | ఆంధ్రజ్యోతి (దిన)! 26-7-85
  20. | చెన్నపురి తెలుగువారికి వన్నె తెచ్చిన ! విశిష్టవ్యక్తి ఆం(ధ్రజ్యోతి (దిన), 2-8-85
  21. | ఇరుకుగదులుగా మారిన మన నగరాలు | ఆంధ్రజ్యోతి (దిన) 10-8-85
  22. | * మరీ యాంత్రికంగా మారిన మన (గ్రామీణ జీవనం ఆంధ్రజ్యోతి (దిన)! 17-8-85 171

116 | * తెల్లవాళ్ళంటే మనవాళ్ళకి ఇప్పటికీ

వల్లమాలిన మోజు ఆం(ధ్రజ్యోతి (దిన) | 23-8-85 117 | * ఇంట గెలిచి రచ్చగెలిచిన

ఆరు(ద్ర పాండిత్యం ఆంధ్రజ్యోతి (దిన) | 1-9-85 118 _ | నానాటికీ శీణించిపోతున్న ఇంగ్రీషు భాషా

ప్రమాణాలు ఆంధ్రజ్యోతి (దివ) | 7-9-85 119 _ | తక్‌ పిచ్చివాడుకాదు, దేశ రాజధానిగా

ఢిల్లీ తగదు ఆంధ్రజ్యోతి (దిన) | 13-9-85 120 | * సూపర్‌ కంప్యూటర్‌ ప్రాంగణంలో

(ప్రపంచం ఆంధ్రజ్యోతి (దిన) | 20-9-85 121 | తమిళులు ఆవిష్కరించిన

తెలుగు జానపద గాన చరిత్ర ఆం(ధ్రజ్యోతి (దిన) | 29-9-85 122 | తన షార్టీ ఓడినా రాజీవ్‌ విధానానికి

నైతిక విజయం ఆంధ్రజ్యోతి (దిన) | 4-10-85 123 | * మహోపాధ్యాయ మామిడిపూడి వారి

“చరిత్ర చెప్పిన పాఠాలు” ఆంధ్రజ్యోతి (దిన) 11-10-85 124 | * తెలంగాణలో అన్ని ఉద్యమాలకు

ఆద్యుడు మౌడపాటి ఆంధ్రజ్యోతి (దిన) 18-10-85 125 | * మారిన ప్రపంచ పంచాయితీ స్వరూపం | ఆంధ్రజ్యోతి (దిన) |25-10-85 126 _ | * నన్నయనుంచి నేటివరకు అనువాదశిల్పం] ఆంధ్రజ్యోతి (దిన) | 1-11-85 127 _ | కదలబారుతున్న ఎం జి ఆర్‌ పార్టీ పునాదులు ఆంధ్రజ్యోతి (దిన)| 8-11-85 128 | మన ప్రజలు - మన రాజకీయాలు

(యలమంచిలి శివాజి పుస్తకంసై) ఆంధ్రజ్యోతి (దిన) | 11-11-85 129 | * కలిమిలేముల కలహాగ్నికి కులమత

సమిధలు ఆంధ్రజ్యోతి (దిన) [17-11-85 130 _ | వానరాకడ తుఫానుపోకడ తెలియతరం కాదా? | ఆంధ్రజ్యోతి (దిన) 22-11-85 131 | * తెలుగు జర్నలిజంలో ఆద్యులు మువ్వురు (స్రవంతి 23-11-85 132 | చెప్పుకోదగ్గ మనుషులు

(దేవులపల్లి ప్రభాకరరావు పుస్తక సమీక్ష | ఆంధ్రజ్యోతి (దిన) |25-11-85 133 _ | జెనీవాలో రీగన్‌, గోర్భచేవ్‌ల

చర్చల ఆంతర్యం ఆం(ధ్రజ్యోతి (దిన) | 29-11-85 134 _ | చాంపరాన్‌ సత్యాగ్రహవీరుడు రాజెన్‌బాబు | ఆంధ్రజ్యోతి (దిన) | 6-12-85 135 _ | ఇ టెజవాడ గోపాలరెడ్డిగారి సాహితీ వాల్లభ్య4 ఆంధ్రజ్యోతి (దిన) 13-12-85 136 _ | లలితకళల కాణాచి రుక్మిణీదేవి కళాత్షేత్ర | ఆంధ్రజ్యోతి (దిన) |20-12-85 137 _ | తెలుగు జర్నలిజం చరిత్ర పరిశీలన

(లక్మణరెడ్డిగారి పుస్తకం పై సమీక్షు ఆం(ధ్రజ్యోతి (వార) [20-12-85

172

138 | తెలుగులో భారత స్వాతంత్ర్య సంగ్రామ

చరిత్ర (కృష్ణాజిల్లా స్వాతంత్ర్య సమర

యోధుల సంఘం పుస్తకంపై సమీక్సు ఆంధ్రజ్యోతి (దిన) 27-12-85 139 | సామాజిక ప్రగతికి వీడియో

సరికొత్త సాధనం ఆం(ధ్రజ్యోతి (దిన) 3-1-86 140 | * సంగీతానికి మద్రాసు మక్కా

విజయనగరం ఆక్స్‌ఫర్డ్‌ ఆంధ్రజ్యోతి (దిన) 10-1-86 141 | * వాడుకభాష వ్యాప్తికి గిడుగువారి

అనుశాసనం ఆంధ్రజ్యోతి (దిన) 19-1-86 142 | తెలుగు కళా సాహిత్యాలకు

చెన్నపురి వెన్నుదన్ను ఆంధ్రజ్యోతి (దిన), 24-1-86 143 * పండితులకు పండితుడు

రావూరి దొరసామిశర్మ ఆంధ్రజ్యోతి (దిన) 31-1-86 144 _ | పోప్‌ భారతయా(్రపై వినిపించిన

విభిన్నస్వరాలు ఆంధ్రజ్యోతి (దిన) 7-2-86 145 | రాజకీయ రవరవలకు దారితీసిన ధరవరలు | ఆంధ్రజ్యోతి (దిన) 14-2-86 146 _ | 'ఫిక్సిఅవార్డు' అందుకుంటున్న శాస్త్రవేత్త

శాంతప్పు ఆం(ధ్రజ్యోతి (దిన) 21-2-86 147? | *తెలుగుకథకు లోకఖ్యాతి తెచ్చిన

పాలగుమ్మి పద్మరాజు ఆంధ్రజ్యోతి (దిన) 28-2-86 148 | తమిళనాడు రాజకీయాలలో

మరొక సరికొత్త మలుపు ఆం(ధ్రజ్యోతి (దిన) 7-3-86 149 | * మహా దేశభక్తుడు మహర్షి

బులుసు సాంబమూర్తి ఆం(గ్రజ్యోతి (దిన) 14-3-86 150 _ | సైనికులను గౌరవించడం మనకు తెలియదా+ ఆంధ్రజ్యోతి (దీన) 21-3-86 151 | జాతీయ వ్యవప్టను అస్తవ్యస్తం చేస్తున్న

అవ్యవస్ట ఆంధ్రజ్యోతి (దిన) 28-3-86 152 _ | క్రమశిక్షణా రాహిత్యం అన్ని రుగ్మతలకు

మూలం ఆంధ్రజ్యోతి (దిన) శ4-4-86 153 | * ఉత్తర భారతావనిని ఉత్తేజపరచిన

సి వై చింతామణి ఆంధ్రజ్యోతి (దిన) 10-4-86 154 | తెలుగువారి సంస్కృత రచనలు

సాహిత్య అకాడమీ ఆంధ్రజ్యోతి (దిన) 18-4-86 155 | అగ్రరాజ్యాల ఆగడాలు ఎందువల్ల

సాగుతున్నాయి? ఆంధ్రజ్యోతి (దిన) 25-4-86

173

156 _ | * బాలవిద్యాదాత ప్రముఖ రచయిత

డా వి ఎన్‌ ళర్మ ఆంధ్రజ్యోతి (దిన) | 2-5-86 157 | తెలుగువారి సంస్కృత పాండిత్యం

త్షీణించిందా? ఆంధ్రజ్యోతి (దిన) | 9-5-86 158 | ఎచట నిజము నిజముగ నిజమొ అచటికి | ఆం(ధ్రజ్యోతి (దిన) | 16-5-86 159 _ | శ ఆమరబీవి స్పృతి మందిరం కేంద్రంగా

రా(ఫ్టేతర తెలుగువారికొక వికాసవేదిక ఆం(ధ్రజ్యోతి (దిన) | 23-5-86 160 |(* వెంకటగిరి వీరుడు

'వెంకటరామానాయుడు ఆంధ్రజ్యోతి (దిన) | 30-5-86 161 _ | జయవర్టనే తర్కానికి బలం చేకూర్చిన బంద్‌ | ఆంధ్రజ్యోతి (దిన) | 6-6-86 162 _ | వాస్తవికతపై కసితో రాస్తున్న

(ప్రసిద్ద అమెరికన్‌ రచయిత్రి ఆం(ధ్రజ్యోతి (దిన) | 13-6-86 163 * ఈశళతాబ్ది తొలి తెలుగు పెద్ద

ముట్నూరి కృష్ణారావు ఆంధ్రజ్యోతి (దిన) | 20-6-86 164 _ | మనం ఒకేజాతిగా కలకాలం మనగలమా? | ఆంధ్రజ్యోతి (దిన) | 27-6-86 165 _ | మరోసారి వెల్లడైన ఎం జి ఆర్‌ పార్టి

బలహీనత ఆంధ్రజ్యోతి (దిన) | 4-7-86 166 (* నటరాజ పరిషత ఆంధ్రనాట్య

సుధాలహరి ఆం(ధ్రజ్యోతి (దిన) | 11-7-86 167 _ | ఎన్ని చీలికలైనా జ్మీర్షించుకోగల కాంగ్రెసిజమ్‌ | ఆం(ధ్రజ్యోతి (దిన) | 18-7-86 168 | ప్రజాస్వామ్యంలో వంశస్వామ్యం

ఆనవాయితీ అయిందేమో ఆంధ్రజ్యోతి (దిన) | 25-7-86 169 | భారత జాతీయ కాంగ్రక్‌ పుట్టుకకు

పట్టుగొమ్మలు ఆంధ్రజ్యోతి (దిన) | 1-8-86 170 + క్విట్‌ఇండియా ఉద్యమం

కొన్ని జ్ఞాపకాలు ఆం(ధ్రజ్యోతి (దిన) | 8-8-86 171 _ | కాలపరీక్షలో నెగ్గిన మన విదేశాంగ విధానం | ఆంధ్రజ్యోతి (దిన) | 15-8-86 172 | మన విమానయాన వ్యవస్థలో

మౌలికలోపాలు ఆం(ధ్రజ్యోతి (దిన) | 22-8-86 173 | * సంజీవదేవ్‌ సమగ్ర సమన్వయవాదం | ఆంధ్రజ్యోతి (దిన) | 29-8-86 174 | జాతీయ సమైక్యత ఎలా సాధ్యం? ఆంధ్రజ్యోతి (దిన) | 13-9-86 175 _ | యోగకేమమ్‌వహామ్యహమ్‌ ఆంధ్రజ్యోతి (దిన) | 20-9-86 176 | * జాతీయభాషల సేతువుభాష ఆంధ్రజ్యోతి (దిన) | 4-10-86 177 _ | ఎవరి 'హిందీ' ప్రయోజనాలు వారివే ఆంధ్రజ్యోతి (దిన) 11-10-86 178 _ | అధికారభాషకు ఒక పరిష్కారం ఆం(ధ్రజ్యోతి (దిన) 18-10-86

174

179 | * తెలుగు పుస్తక ప్రచురణలో వావిళ్ళ. | ఆంధ్రజ్యోతి (దిన) 25-10-86 180 | ముప్పయ్యేళ్ళ మన రాష్ట్ర ముచ్చట్లు ఆం(ధ్రజ్యోతి (దిన) 1-11-86 181 | * ఆదర్శ ప్రజాస్వామ్యవాది ఆచార్య రంగా | ఆంధ్రజ్యోతి (దిన) 8-11-86 182 | మతాలు జాతిని విడదీయకూడదు ఆం(ధ్రజ్యోతి (దిన) 15-11-86 183 | *"కలరొముందా 'కులమ్‌' ముందా? | ఆంధ్రజ్యోతి (దిన), 22-11-86 184 | * నాగరికతా పరిణామ(క్రమం ఆంధ్రజ్యోతి (దిన) 29-11-86 185 _ | భారతీ(య) కళా తరంగిణి ఆంధ్రజ్యోతి (దిన) 6-12-86 186 _ | తెలుగునాట ఓకొత్త పునర్వికాస ఉద్యమం-1| ఆంధ్రజ్యోతి (దిన) 13-12-86 187 | తెలుగునాట కొత్త పునర్వికాస ఉద్యమం-2 | ఆం(ధ్రజ్యోతి (దిన) 20-12-86 188 | *మద్రాసులో నైజాం విమోచన ఉద్యమం | ఆంధ్రజ్యోతి (దిన) 27-12-86 189 | తమిళనాట రాజకీయ దావానలం ఆంధ్రజ్యోతి (దిన) 3-1-87 190 | మన రాజకీయ వ్యవస్థలో మార్పు అవసరమా? | ఆంధ్రజ్యోతి (దిన), 10-1-87 19] ముత్యాలసరాలకు మూలం

అలనాటి అప్పకవీయం ఆం(ధ్రజ్యోతి (దిన), 17-1-87 192 | మురికికూపంగా (ప్రపంచం ఆంధ్రజ్యోతి (దిన) 24-1-87 193 | * సాగరాలు నగరాలను ముంచివేయగల

ముప్పు ఆంధ్రజ్యోతి (దిన), 31-1-87 194 | యువతరంపై కవిరాజు ప్రభావం ఆంధ్రజ్యోతి (దిన) ?-2-87 కే ఫస్‌ * (ప్రకృతి పరిరక్షణకు

'ప్రజాఉద్యమం కావాలి ఆంధ్రజ్యోతి (దిన) 14-2-87 196 _ | కాలుష్యంవల్ల రకరకాల వ్యాధులు ఆంధ్రజ్యోతి (దిన), 21-2-87 197 | భవిష్యత్తులో తెలుగు పరిశోధన ఆంధ్రజ్యోతి (దిన) 28-12-87 198 | భావిపొరుల భావాలు ఆంధ్రజ్యోతి (దిన) 7-3-8? 199 | * సాహిత్యాన్ని మార్పుకు సాధనంగా

ఎంచుకున్న కవిరాజు త్రిపురనేని ఆం(ధ్రజ్యోతి (వార) 13-3-87 200 | తెలుగుగంగ పూర్వాపరాలు-1 ఆం(ధ్రజ్యోతి (దిన) 14-3-87 201 | తెలుగుగంగ పూర్వాపరాలు-2 ఆంధ్రజ్యోతి (దిన) 21-3-87 202 | తెలుగుగంగ పూర్వాపరాలు-3 ఆంధ్రజ్యోతి (దిన) 28-3-87 203 | జాతీయ ప్రతిపక్ష నిర్మాణ ప్రయత్నాలు | ఆంధ్రజ్యోతి (దిన) 4-4-87 204 | కాయ్లేవ్‌కు కామన్‌ కార్యక్రమం ఆంధ్రజ్యోతి (దిన) 11-4-87? 205 | విడివడని మూడు పీటముడులు ఆంధ్రజ్యోతి (దిన), 18-4-87 206 | రాజ్యసభను ్రళ్నలతో హోరెత్తించిన

రైతాంగ నాయకుడు (యలమంచిలి శివాజి) | ఆంధ్రపత్రిక (దిన) 24-4-42 207 | స్వయంకృతాపరాధం ఆంధ్రజ్యోతి (దిన) 25-4-87 208 | * ఆంధ్రలో అస్పృశ్యత నివారణ ఉద్యమం | ఆంధ్రజ్యోతి (దిన) 2-5-87

175

209 | సంగీతం సమైక్య సాధనమ్‌ ఆంధ్రజ్యోతి (దిన) | 9-5-87 210 | * జాత్యహంకార జాడ్యం అంధధ్రజ్యోతి (దిన) | 16-5-87 211 | * పురాతన నాగరికతల జాడలు ఆంధ్రజ్యోతి (దిన) | 23-5-87 212 | * తొలిభారత భావ వికాసదళ ఆంధ్రజ్యోతి (దిన) | 30-5-87 213 | * సప్తపది నుంచి సప్తతి వరకు దరువూరి సప్తతి సంచిక 1989 214 | * డిస్టింగ్విప్ట్‌ జర్నల్‌ డి ఆంజనేయులు |ఆం(ధ్రజ్యోతి (దిన) | 10-7-90 215 (ఇసిఆర్‌ రెడ్డ రేడియో ప్రసంగం | 16-6-90 216 |1 ప్రజాస్వామ్యవాది నెహ్రూ రేడియో ప్రసంగం | 28-5-92

  • జాతికి మాయని మచ్చ తెస్తోన్న మత కలహాలు ఆంధ్రజ్యోతి(ది | 9-2-93 217 | శవయసున, మనసున పండిన పండితుడు మోటూరి ఆంధ్రజ్యోతి (దిన) | 11-3-95 గమనిక _ ఇ గుర్తు వున్న వ్యాసాలు ఈ సంపుటిలో ప్రచురితమైనాయి కళ న ఉయట్యు 'గ్రంఠాలంు నై (1 ఫూ | గ శ్‌ | జ్ర బ్రా టోన్‌ ఫాదరా! నమహ 176

. " "|, “రత గంగ! 06414 . . తీ 00160600 0£3ల6ం0[శు ళం] 0/35 ముండ | /[ వు య . 7464404207 ౪౯4 సా “07/6 తంగడి గ దాకి నాని. కాసగగడ :9.వ్‌ య కరుంనగ4, 2 8001010)0302%0031 206 14ల%10/ ౧66౦, ఏ 116 1601016001

  • 66 “2200 సంటాడజు& 212160 క4ంగ0021000య0జ్టగు శాజరి 01 46) - 986, 21 06 06[001802016101 [3 *6ంలేరు/ 001000 “224-320224” 2 2 | 16118 010820 6410 “444042 ౦౧ అంగం 1983 206 1987211 " ౪01206 6013136 ౫036) జళం163 *గ4ల 0064 11 001000. ॥॥
  • ” 90001 శేశజం 15, 1925, 2౯500410, 64౧౦ ప60 ఉత 1661. . ల" లం క.5...103%02 (0461200064 50/2 24002 ముఖ) [26 ప 0302400 46 ॥ రంఈ060 180 50100112 5240220211] జర ఓం 40602 ౧౧63622 ౧011626 _ 12 ౮౫౧4౯ [6 508166 25 2 ఏ03గా2156 ఇట 113 6641005141 646402 [001 ః జుకటయి 2 ౪766ర్వు)ం0గా2! గంగ 6౮490 (1949). [6 114 ౪05668 0% " 6064100021 52% 0622002004), 2 ౧6826 60 గంగ స2463 (1950). . 6 230 ౪0800664 2 2610106 902ఖ04 [020 2 0%” 00010260 01 - ం60000(60%0%0ఉఅయ21 0009 *42060009010% (195 156 జట ౪1210 [ ఎ” ' _ 26)010064 06 ౧166 512165 0600002600 5అాగం6 1 1956 23 (6 486 06 . | ఉంట గ౧010803 0౫1206 76066 జ 031021 శకస 500య02%10021983. .. వం కురుర02 02 జ 2016102 966661 1106 26 జు 206 1 46 016 స 076206 206760%్రఖ15టాంక్‌గడండిడి, 2 9050 00 ఇ050000 హై నె26ు. " 116 15 206761 701౪766 1 జు 1అ2ం/ జరీ 0410121 0224132605. 01 , ౩ళల213620 ౧613 2106-0096600600006 6౧యుం2046 తర 3420252002 ' 25 2150 0£ (6 సల26023 01020 ండ6ంగం నశ 104 13 2 ౧040664 క౫ట464౪6 క41ల౧06 054064 బటల?! 90641 51021 ంణగంగజ! 50016) ॥
  • 3613 006 0046 420676 0జ02పలం 08 016 70516 01084 ౨660ల2601%. _ ల