Telugu samkliptha mahabaratham - anilvaranasi/indianlanguages GitHub Wiki

అం ' 1 ఆల వగ / అతంవాంతి తత్వళాచ్వనుుంఅఆతంతతష.ు. .... తే (1 యా నన వనమా నుం రు లో శా కో భా ,11111000111604611110 మ గాజా... కరం సం! సన స కో కా నంత. 1 సర ంయన స. తోట సఖ స (కే రం. / చరయ 2 ఆ||... || వావ రడీ! /41162/ /1 ల ను స ర్న | గా! ॥| - ౮ న | | (త! ్మ సహజ కవి మల్లెమాల షీ | స్త మె మ ణ్‌. మనసుపడి మక్కునతో సేకరించిన న న. న్హ 01 “ళా స ఈ పుస్తకాన్నిసాహిత్యాభిమానుల కోసం హా! న్‌ ॥ అకా గ సె ॥ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి శ్రీ స ( | న జి గ 07 [న “ఆనందంతో బహూకరిస్తున్నాం. క్‌ షై మస న్‌ | - మల్లెమాల కుటుంబం న్‌ 140/1, శ! ఓ గ ౮ | కా | వ న్న తయ టల... 6! త అకక ఏ టకం చ | ” కనా మనన చ || 4 కే ణీ . శ₹ాత్రాత్తాత్తాకళత్రం త్రాతా న్‌ ఏ వాహ డు మం ఆ ౨2హరయర్య్య ఇ అ (త్‌ నా శ భై త పా స్ట

సంక్షిప్త మహాభారతము ఆటవెలది పద్యకావ్యము ఆది పంచకము మల్లెల రామయ్య ప్రణీతము చెన్నై 2005

సంక్షిప్త మహాభారతము (ఆటవెలది పద్యకావ్యము) ఆది పంచకము వఏ్‌జుు1మంై+ 2200222620 జం తడి గింం4లి0 (౭ గాల సం 22౧4) డ్రి స్వా ప్రధమ ముద్రణ : మే, 2005 గ్రామం కహ అం రుర6 : వశం 2005 ప్రతులు : 1000 600155 * 1000 యయ గ్రంధాలూ వెల : రూ. 100/- యా! లైంిధాలద్వు మై కగం6 : [5.100/ గా శై 06 : 5 ల గ౦౫ంంమ న్‌ న. రి మల్లెల రామయ్య నలి వాయ అ 1120014 2టబుజ|20 ౮ శా 1 లు ధ్రచురణ : మళ్లెల (గ్రంథమాల 2, జయంతి ట్రీట్‌, సీతాపతి నగర్‌, వేలచేరి, చెన్నె - 600 042 ఫోన్‌ : 044 - 22430140 బెజీటాగండ ల ఎ గకణకేంయ2 ౫041200212 2, 2/22021 రరం60 5660120261 228 ₹76120[అర, 6౮ల౫2| - 600 042, 9% : 044-22430140 ముద్రణ ; అనుపమ ప్రింటర్స్‌ గ్రీన్‌ వ్యూ, 126, శాంతినగర్‌, హైదరాబాద్‌ - 500 028 ఫోన్‌ : 04ఉ0-23891864 రగ్గాండ 4 ఉులైణు2 లు 6౪౫ *ంసా 126, 5020002292 క్వౌరయి0464 - 500 028, 20 : 040-23391364

విషయసూచిక వుట

  1. ఆదిపర్వము క్షే

గంగాశంతనుల సమయం - సత్యవతీ శంతనుల పరిణయం -

ధృతరాష్త్ర పాండురాజ విదురుల జననం - ధృతరాష్ట్ర గాంధారీ వివాహం -

కుంతీ చరిత్రం - పాండురాజు వివాహం - పాండవుల కౌరవుల జననం -

పాండురాజు మరణం - పాండవుల హస్తినాపుర ప్రవేశం - దుర్యోధనుని

పాండవ ద్వేషం - అస్త్రగురువుగా ద్రోణుని నియామకం - రాజపుత్రుల

అస్త్ర విద్యా ప్రదర్శనం + కర్గుని ప్రవేశం - గురుదక్షిణ - దృష్టద్యుమ్న

(ద్రౌపదీ జననం - పొండవుల వారణావత గమనం - లాక్షాగ్బవహా దహనం -

ఘటోత్కచుని జననం - బకాసుర వధ - (ద్రౌపదీ స్వయంవరం - ద్రౌపదీ.

పాండవుల వివాహం - ఇంద్రప్రస్థపుర నిర్మాణం - అర్జునుని తీర్థయాత్ర -

సుభద్రార్జునుల వివాహం - ఖాండవ వన దహనం 2. సభాపర్వము కరి

మయసభానిర్మాణం - నారదాగమనం - జరాసంధవధ - రాజసూయ యాగం -

శిశుపాలవధ - దుర్యోధనుమాత్సర్యం - జూదమునకు ఆహ్వానం - ధర్మజ

పరాజయం - ద్రౌపదీ పరాభవం - భీమ ప్రతిజ్ఞ - రెండవమాలు జూదం 8. అరణ్యవాసపర్వము 77

అరణ్యవాసారంభం - అక్షయపాత్ర ప్రదానం - మైత్రేయ ముని శాపం - బంధు

జనాగమనం - కిరాతార్జున యుద్ధం - పాశుపతాస్త్ర ప్రదానం - అర్జునుని స్వర్గలోక

గమనం - ఊర్వశి శాపం - నలోపాఖ్యానం - పాండవుల తీర్ధాటనం -

హనుమత్సాక్షాత్కారం - అజగరోపాఖ్యానం - వాసుదేవాగమనం - సత్యాదౌపదీ

సంవాదం - ఘోషయాత్ర - దుర్యోధన పరాజయం - ఐంధవిముక్తి - సైంధవ

దుర్న్మయం - పరాభవం - కవచకుండల సంగ్రహణం - శక్తి ప్రదానం -

బ్రాహ్మణుని అరణి - నకులాదుల మూర్చ - ధర్మజ ధర్మ నిరతి - వర ప్రసాదం

ఖా 4&. అజ్ఞాతవాసపర్వము 125 పరిజనులకు వీడ్కోలు - వేషధారణ నిర్ణయం - ఆయుధ నిక్షేపం - నగర ప్రవేశం - సైరంధ్రి - కీచక ప్రవేశం - ప్రణయ ్రార్ధనం - సుధేస్ట హితోపదేశం - కీచక గృహ (పేషణం - ద్రాపదీభీమ మంద్రాలోచనం - నాట్యశాలా ప్రవేశం - కీచక వధ - ఉపకీచక వధ - సమయభంగయత్నం - దక్షిణ గోగ్రహణం - ఉత్తర గోగ్రహణం - బృహన్నల సారధ్యం - అర్జును నిజరూపస్రాప్తి - కారవవీర పరిచయం - కౌరవార్జున యుద్ధం - సమ్మోహనాస్త్ర ప్రయోగం - కౌరవ తిరోగమనం - ఉత్తరు పురాగమనం - పాండవ పరిచయం - ఉత్తరాభిమన్యుల వివాహం 5. ఉద్యోగపర్వము 179 కార్యాలోచనం - కృష్ణసాహాయ్యాభ్యర్థనం - శల్యసాహాయ్యం - ద్రుపద పురోహితుని చూత్యం - సంజయ రాయబారం - విదుర హితోక్తులు - భీష్ముని హితబోధనం - దుర్యోధన దంభాలాపం - కర్ణ అస్త్ర సన్యాసం - యుధిష్టిర అభిమతం - భీముని అభిప్రాయం - అర్జున సందేశం - నకుల సందేశం - సహదేవ సందేశం - (ద్రౌపది మనోవేదనం - కృష్ణుని ఆశ్వాసనం - కృష్ణుని హస్తినాపుర ప్రయాణం - హస్తినగర ప్రవేశం = కుంతీ గృహ గమనం - విదుర సత్మారం - కురుసభా (ప్రవేశం - కృష్ణ రాయబారం - దుర్యోధన తిరస్కారం - దుర్యోధను దుష్పుతములు - సభా నిష్రమణం - కృష్ణ విశ్వరూప ప్రదర్శనం - కుంతి సందేశం - కర్ణ జన్మ రహస్యం - కురుక్షేత గమనం - భీష్మసేనాధిపత్యం - బలరామ తీర్ణయాత్రా గమనం - శిఖండి వృత్తాంతం

౪

జోషి

ప్రస్తావన భరత వంశవరుల చరితమ్ము దెల్పెడు పరమ పుణ్యకధను వ్యాసమౌని వ్రాసె సంస్కృతమున భారతమ్మను పేర భావి జనుల పరమ భాగ్యమనగ ధర్మమున్న చోట దైవ ముండెడు నంచు ధర్మమునకు జయము తప్పదనుచు ధరణి జనులకిచ్చె పరమ సందేశమ్ము వ్యాసమునివరుండు భారతమున ధర్మ రక్షకులను ధర్మమ్ము రక్షించు ఆర్తి మిగులు కుటిల వర్తనులకు అనెడు నిత్య సత్యమును చాటు జగతికి వేద తుల్యమో పవిత్రగాధ సకల నీతి శాస్తసార పయోరాశి ధర్మపధము జూపు దర్చణమ్ము పరమగతుల దెలుపు పంచమ వీదమ్ము అని ప్రసిద్ధి కెక్కె నవనిలోన మున్ను భారతమును నన్నయ్య తిక్కన్న ఎట్జన కవివర్యు లింపుమార అతి మనోహరముగ నాంధ్రీకరించిరి తెలుగువారి నోము ఫలమనంగ వన్నెదజుగనట్టి భారతమణిమాల కంరసీమ దాల్చి ఘనత జెందె అమిత మధుర వాణి ఆంధ్రభాషా యోష భాసురముగ దేశ భాషలందు

ఇ సంక్షిప్త మహాభారతము ఆంధ్ర భారతమ్ము నాధారముగ జేసి తిరిగి వ్రాసినాడ తెలుగు నందు ఉల్లమలరు రీతి నెల్లరు చదువంగ సులభళైలి నాట వెలదులందు ఈ పవిత్ర గ్రంథ మితిహాసరాజమ్ము నంకితమ్ము జేతు నమిత భక్తి పవనసుతుడు మొక్కు అవనిజా శ్రీరామ పరమ దివ్య పాద పద్మములకు ఒప్పులను గ్రహించి తప్పులు మన్నించి దీని బుధులు చదివిరేని నాదు కృషి ఫలించెననుచు పహృదయమందలరారి ప్రణతి శతము లిడుదు పరమభక్తి నెలవు కళల కెల్ల నెల్లూరు నగరమ్ము పూర్వమలర సింహపుర మనంగ వెలయు రంగనాధ విభు దివ్యధామమై పేరు గాంచి పెన్న తీరమందు భారతమ్ము నందు పదునైదు పర్వంబు లనువదించి తిక్కనార్యు డచట ఆంధ్రభాష కొక్క ఆణిముత్యము నిచ్చె తెలుగు వాణి ప్రభలు దిశలనిండ ఆ పవిత్ర సీమ యందుదృవించితి యశము గన్న మల్లెలాన్నయమున తల్లి సుబ్బమాంబ తండ్రి సంజీవయ్య దైవక్ళపను జన్మదాతలైరి

న. జన్మమిచ్చి నాకు చదువులు నేర్పించి (ప్రేమ మిర బెంచి పెద్ద జేసి కన్నవారలందు మిన్నలై వెలసిన వారి దలచి భక్తి ప్రణతులిడుదు పరమ పూజ్యులైన గురువర్యు లెందతో జ్ఞాన భిక్ష నిడిరి కరుణ నాకు అనుదినమ్ము వారి మనసార స్మరియించి వందనమ్ము లిడుదు పరమభక్తి మంచి చెడుల ఫలము లంచితంబుగ దెల్పు భరత వంశవరుల చరిత వ్రాసి మానవులకు ధర్మ మార్గమ్ము జూపిన యతివరేణ్యు వేద వ్యాసుదలతు

ధర్మపరుల పొండు తనయుల దరిజేర్చి వారి గాచి ఖలుల బారి నుండి

కడకు ధర్మమునకె కల్గును జయమంచు చూపినట్టి నంద సుతుని దలతు అనవరతము నన్ను కనురెప్పవలె గాచి కష్టములను బాపి కరుణ జూపి జ్ఞానమొసగి నాకు సన్మార్గమును జూపు జానకీశు గొలుతు క్షణము విదక

గిరిజ ముద్దుబిడ్డ కరిరాజవదనుండు విఘ్నములను బాపు వేల్పు మిన్న భక్తకోటి చేయు ప్రార్ధన లాలించి కరుణ జూపి వారి గాచు గాక.

ట్‌ ఆది పర్వము గంగాశంతనుల సమయం హస్తినగర రాజ మమరాపగాతీర మందు వెలయు భువన మండితముగ రాజ్యమేలిరచట రాజావతంసులు భరత వంశవరులు భవ్యగుణులు క్షే వారిలోన ఘనుడు వీరాశగ్రగణ్యుండు శక్ర సన్నిభుందు శంతనుండు నగరి చెంత వనిని మృగయావినోదియై తిరుగుచున్న యట్టి తరుణమందు 2 కనియె నాక్కచోట ననుపమ సౌందర్య రాశి సన్నుతాంగి రాజవదన దిశల వెలుగజేయు తేజో విరాజిత తననె జూచుచున్న వనితనొకతె తె చూచి రొకరి నొకరు సురుచిరంబుగవారు చూపు లిక్షుచాపు తూపులాయె తరుణి జెప్పెనంత ధరణీశ నను నీవు వలచి పెండ్లియాడ దలచి తేని శీ ఏను జేసినట్టి దెల్లను సైరింప వలయు నీవు మారు బలుక కుండ మాజుబల్కి నన్ను వారింప జూచిన క క్షణమె నిన్ను వీడి చనెడుదాన విభుడు సమ్మతించె వెలది యాతని జేరి కనియె సుతుని యనతి కాలమందె కన్నబిడ్డ నామె గంగలో విడువంగ మాలు బల్క వెజిచె మనుజ విభుడు ల్‌

2 సంక్షిప్త మహాభారతము ఇటుల నామె చంప నేడ్వురు కొడుకుల వచనబద్ద్ధుడైన వల్లభుండు కుమిలి యేద్చెగాని కొడుకుల జంపిన అతివ దురితకృత్య మాపడాయె 7 అంత కొన్నినాళ్ల కష్టమ పుత్రుండు కలుగ జనవిభుండు కలికితోడ వీని నీటవిడువ నేనోపనన కాంత పలికెనిట్లు సమయభంగమనుచు ॥ నేను చనెడుదాన నినువీడి రాజేంద్ర! మనకు కల్లినట్టి తనయులెల్ల ముని వసిష్టు శాపమున ధాత్రి బుట్టిన యట్టీ యష్టవసువు లమరవరులు రి జననమిచ్చి త్వరగ శాపముక్తుల జేయు మనుచు నన్ను వేదుకొనగ వారు, మనుజ రూపమూని నిను భర్తగా బొంది వారి సుతులగాగ బడిసినాను. 16 గంగ నేను నాదు కార్యంబు నెరవేరె చనెద నిన్ను వీడి జనవరేణ్య శాపముక్తి గలిగి చనిరి యేడ్వురువారు అష్టముండు నిలుచు నవనిలోన 11 వీని దేవవ్రతుని పెంచి విద్యలు నేర్పి అప్పగింతు నీకు అవనినాధ అనుచు గంగ సుతుని కొనిపోయె తనతోడ వగచి శంతనుండు నగరి నుండె [9

ఆది పర్వము 3 అరిగె కొన్ని యేండ్లు అవనీశు డొకనాడు కనియె నాక్క వంత కనుల ముందు గంగ పాజుచుండె కడు నల్చ్బతటినియై జలము నిలుపబడియె శరము లేసి 18 బాణమేయుచున్న బాలుని తిలకించి అబ్బురంబు జెందె నవని విభుడు అంతలోన గంగ అరుదెంచి విభునితో అనఘ వీడు నీదు తనయుడనియె కశ అభ్యసించె నీత దన్ని శాస్త్రంబుల ముని వశిష్టుడాది ఘనుల యొద్ద పరశురాము కృపకు పొత్రుడై (గ్రహియించె అస్రశస్త విద్య లసద్భశముగ 15 అనుచు నప్పగించి చనియె దివ్యాపగ శంతనుందు కరము సంతసించి యౌవరాజ్య పీరి దేవవ్రతుని నిల్పి రాజ్య మేలుచుండె రాజవరుడు 16 సత్యవతీ శంతనుల పరిణయం అంత నొక్కనాడు యమునా నదీ తీర మందు వేటలాడు మనుజవిభుడు (ఘ్రాణ పర్వమైన గంధ మా(ఘ్రాజించి దాని జాడ నరసి దరికి చేరి | కనియె నొక్క చోట కనుల విందొనరించు సురవనితల మించు సుందరాంగి నావ నడిపి జనుల నదిని దాటించెడి చక్కనైన నొక్క చంద్రముఖిని 18

టీ సంక్షిప్త మహాభారతము అరసి, మదన బాణహతి కోర్వగాలేక దాని నడిగె నెవరి దానవనుచు రమణి జెప్పె దాశరాజపుత్రిని నేను పరగుదాన సత్యవతి యనంగ 19 ధరణి నాధుడంత దాశరాజును జేరి తనకు కన్య నీయమనుచు గోర నతడు చెప్పె సత్యవతికి బుట్టినవాడు నీ తదుపరి ధరణి నేలవలయు 20 వసుధ నేల దేవవ్రతుడు యోగ్యుడు గాన నింతి తండ్రి కోర్కె కియ్యకొనక అవని విభుడు నగరి కరుదెంచి కన్యకై వగచు చుండె మిగుల పగలు తేయి లై త౦డ్రి స్థితిని దలచి తనయుందు చింతించి జరిగినట్టి దెజిగి సచివు వలన, తానె దాశరాజు దరికేగి వచియించె వసుధనేలు సత్యవతి సుతుండు 22 విన్న దాశరాజు వినయమ్ముతో జెప్పె గంగ తనయ నమ్మగలను నిన్ను కాని ముందు నీకు కలిగెడు పుత్రులు చేయువారె నీవు చెప్పినటుల? 23 అపుడు దాశరాజు కాశ్వాసమొనరింప శాంతనవుడు బ్రహ్మచర్య దీక్ష బూనె సురలు పూలవానలు గురిపించి వాని భీష్ము డనుచు ప్రస్తుతింప లత

ఆది పర్వము న్‌ తండ్రి సుఖము కొజకు తన సుఖమ్మును వీడి దేవవ్రతుడు కరిన దీక్షబూని సత్యవతిని దెచ్చి అత్యాదరంబున వగచుచుండు తండ్రి వద్ద జేర్చె 25 వత్స! కలుగు నీకు స్వచ్చంద మరణమ్ము అనుచు వరము నిచ్చి తనయు బొగడి సత్యవతిని గూడి అత్యంత ముదమంది గడిపె జీవితమ్ము పుడమిజేడు 26 పుత్రద్వయము బడసి చిత్రాంగద విచిత్ర వీర్యులనెడు వారి వీరవరుల వారి బాల్యమందె పరలోకగతుడాయె భారమేసి దేవవ్రతుని పైన 27 సింహపీరిపైన చిత్రాంగదుని నిల్పె సత్యనిరతుడైన శాంతనవుడు కాని వాడు మడిసె గంధర్వనిహకతుడై ఆలమందు నచిర కాలమందె 28 సింహపీరమున విచిత్రవీర్యుని నిల్చి ఆపగాసుతుందడు అండ నిలువ రాజ్యమేలెనతడు ప్రజలు మెచ్చెడురీతి సమ్మదంబు జెందె సత్యవతియు 29 వాడు కొంతవడికి ప్రాప్తయౌవనుడొట శాంతనవుడు పెండ్లి జరుపదలచి కాశివిభుని పుత్రికలకు స్వయంవర మ్మనుచు తెలిసి తానె యచటి కరిగి 80

6 సంక్షిప్త మహాభారతము కూడియున్న పుడమిజేడుల నిర్దించి బలిమి తోడ కన్యకలను బట్టి రధముపైన నుంచి రాజులందతి జూచి వారు వినెడునటుల పలికెనిటుల 231 వినుడు వీరులార వీరి వివాహమ్ము నా యనుజుడు హస్తినగర విభుడు అగు విచిత్రవీర్యుడను వానితో జేతు ననుచు జెప్పి కదలె నరదమెక్కి 32 పెండ్లి జేయనున్న భీష్ముని తిలకించి జ్యేష్ట కన్య అంబ చెప్పె నిటుల తండ్రిచేత పూర్వదత్త నైతిని నేను సాల్వ భూవరునకు శాంతనవుడ! 38 అపుడు భీష్ము డామె నత్యాదరంబుగ సత్మరించి బంపి సాల్వు కడకు సంబరమున జరిపె నంబికాంబాలిక లకు విచిత్రవీర్యునకును పెండ్లి తెక్ష సతుల పొందుగలిగి అతిశయంబుగ కామ కేళి దగిలి యెల్ల వేళలందు భరత వంశవరుడు వసివాడి కృశియించి చనియె చిన్ననాడె చరమగతికి 85 సుత వియోగ జనిత శోక సంతప్ర్తయై రాజమాత దాశరాజపుత్రి కురుకులంబు నిలుపు కోర్మెతో భీష్ముని పిలిచి పలికె నిటుల ప్రీతి తోడ 86

ఆది పర్వము 77 వత్స! నీవు రాజ్యభారమ్ము వహియించి పెండ్లియాడి వంశవృద్ధి సలిపి కౌరవాన్వ్నయమ్ము కాపాడదవలయును నాదు కోర్కె యిదియె నయ విచార! 87 విన్న శాంతనవుడు విన్నవించెను, తల్లి చెప్పవద్దు ఇటుల చేయుమనుచు రాజ్యత్యాగదీక్ష (బ్రహ్మచర్య వ్రతము భంగపరచ నాకు వలను గాదు తరి కలదు మార్గమొకటి కులవృద్ధి గావింప సద్విజులను గూడి క్షత్రసతులు గర్భధారణమ్ము గావించు కొనవచ్చు అట్టి విప్రవరుని అరయుమమ్మ! 89 అంతనామె చెప్పె శాంతనవుని తోడ నాకు పరిణయమ్ము కాకముందు యతిపరాశరుండు యమునా నదీ ద్వీప మందు నన్ను గూడె నచట నాకు 4౦ పరమపావనుండు వ్యాసుండు జన్మించి తలచినపుడు వత్తుననుచు జెప్పి అనునయించి నన్ను చనె తపోవనులకు పిలువుమంటివేని తలతునతని శ శాంతనవుడు తనకు సమ్మతమ్మని చెప్ప పరమబుిషిని సత్యవతి దలంచె వ్యాసుడామె యెదుట ప్రత్యక్షమై నిల్చి పిలువ కారణమ్ము తెలుపుమనగ శై

8 సంక్షిప్తమహాభారతము ధృతరాష్ట్ర పాండురాజ విదురుల జననం జరిగినట్టిదెల్ల యెజిగించి యతనితో కౌరవాన్వయంబు గాచు కొజకు అనుజుపత్నులైన అంబికాంబాలిక లందు సుతుల బదయుమనుచు జెప్పె త్తం ఆతడియ్యకొనగ, యంబిక కడకేగి వ్యాసు డరుగుదెంచు నతని గూడి పుత్రు బడయు మివు క్షేత్రజునని చెప్పి యతివరేణ్యు బంపె నామె కడకు ద్తేడ్తే అతని కవిలగడ్డ మతని రూపము జూచి ముదిత జడిసి కనులు మూసుకొనియి తపసి వరుడు పుత్రదానంబు గావించి అంధు డుద్భవించు ననుచు దెలిపె తీర్‌ అంత రాజమాత అంబాలికకు జెప్పె సుతుని బడయుమనుచు యతిని గూడి అతని జూచి వెజచి అతివ వెల్లగనాయె సతిని గూడి తపసి సంగమించె త్తే దీని యందు పాండుదేహుండు జనియించు జనని యనుచు జెప్పి చనియెనతదడు అంతకొన్ని నాళ్ల కంబికాంబాలికా సతులు వంశవరుల సుతుల గనిరి ల్తే అతిబలాన్వితుందు ధృతరాష్తుడుదయించె కనులు లేక యంబికాసుతుండు అవతరించె నతివ యంబాలికాకుక్షి పొండువర్డుడైన పాండురాజు త్తి

ఆది పర్వము ం్ర శాంతనవుడు వారి జాతకర్మలు జేసి 'పెంచుచుండె వారి (ప్రేమ మి కనులు లేని అంబికాసూను తిలకించి వంతజెంది సత్యవతి కరమ్ము త్తం వ్యాసునాత్మ దలచి యంబికాసతియందు అవగుణములు లేని యట్టి సుతుని బదయుమనుచు గోరి పడతి చెంతకుబంప తరుణి భీతి జెంది దాసి నంపె ర0 దానికతడు పుత్రదానంబు గావింప దాసి బఐడసె విదురు ధర్మ నిరతు మనుజ యోనిబుట్ట మాండవ్యముని శాప (గ్రస్తుదైన మహిషగమను యముని ల్‌ 1 అంబికా తనయుని హస్తినాపుర రాజ్య పతిగ జేసి దేవవ్రతుడు తానె భారమంత మోసి పాలనమ్మొనరింప వెల్లివిరిసె శాంతి యెల్లయెడల 52 భూమియంత సస్యశ్యామలంబై వెల్గె గాధలాయె కరువుకాటకములు ప్రజలు ధర్మమార్గవర్తులై చరియింప భయము లేక జనులు (బ్రతికిరచట 58 ధృతరాష్ట్ర గాంధారీ వివాహం భీష్ముడాంబికేయు పెండ్లి చేయగనెంచి తగిన కన్య గూర్చి తలచుచుండి విప్రవరులు చెప్ప వినియెను గాంధార ధరణిపతి తనూజ తగినదనుచు ర్‌డీ

10 సంక్షిప్త మహాభారతము

వియ్యమందగోరి విప్రోత్తముల ఐంప సమ్మతించె విభుడు సంతసించి భరత వంశవరుని భర్తగా బదయుట తన కుమార్తె భాగ్య మనుచు దలచి ర్‌ర్‌ విభుడు అంధుడౌట వినినంత గాంధారి పతికి లేని చూపు పడతి కేల ననుచు గంత గట్టి కనుచూపు త్యజియించి వెడలె (భ్రాత శకుని వెంటరాగ 56 అమిత వైభవముగ నాంబికేయుని పెండ్లి జరిపె హస్తినగరి శాంతనవుడు

కనులు లేని పతికి గాంధారి కడు భక్తి

సేవజేసె యతని చిత్తమలర 57 అస్త్రశస్త్ర విద్యలన్నిట నిపుణుడై

కౌశలంబు సకల కళల బడసి

యౌవనంపు శోభనలరారు పాందుని

పెండ్లి చేయదలచి భీష్ముడుండె 58

కుంతీ చరిత్రం

కుంతి భోజవిభుడు కూర్మితో బెంచిన

దత్తపుత్రిక పృథ తరళనయన

అమిత భక్తితోడ నతిధియౌ దుర్వాస

సంయమింద్రు సేవ సలుప నతడు 59

దివ్యమంధత్ర మిచ్చి దీనిని జపియింప

కోరినట్టి వేల్పు కొడుకు నిచ్చు

ననుచు చెప్పి చనియె నంత కొన్నాళ్లకు

దాని మహిమ నెజుగ దలచి యామె 60

ఆది పర్వము 11 చండకిరణు దలచి జపియించె మంత్రమ్ము వచ్చి నిలిచె నతడు వనిత చెంత బాల పలికెనపుడు భయకంపితాంగియై సలిపితిటుల మంత్రశక్తి నెలుగ 61 కన్యనైన నేను గర్భంబు ధరియింప నగరె యెల్ల వారు నన్ను జూచి విడువుమయ్య నన్ను వేడుకొందును నిన్ను అనెడు బాల నినుడు కనికరించి 62 సుదతికిచ్చి యొక్క సుతుని సద్యో గర్భ మందు చనియె నాతడచట నుంది కవచకుండలములు కల్దిన సుతుజూచి మోద శోకములను ముదిత బొౌందె 63 తనయు వీడలేక జననింద బడలేక కుందుచుండ నొక్క మందసమ్ము కదలి వచ్చుచుండె గంగా స్రవంతిలో సూర్య (పేరితమ్ము సుదతివైపు 64 పెట్టెలోన సుకుని బెట్టి నీటను (ద్రోసి కుంతి వీటికేగె కుమిలి కుమిలి సూతుడొకడు దాని జూచి పెన్నిధివోలె సతికి రాధ కిచ్చె సంబరమున 65 పాండురాజు వివాహం అంత కొన్నినాళ్ల కాంబాలికేయుండు వీరవరుడు పృధను పెండ్లియాడె మ(ద్రరాజ తనయ మాద్రిని చేపట్టె భీష్ను దనుమతింప (స్రేమతోడ 66

12 సంక్షిప్ర మహాభారతము

దిగ్విజయము జేసి దేశదేశంబుల

పతుల ని(గ్రహించి పాందురాజు

భరత వంశ వైభవము కీర్తి వెలయించె

వెనుక నిల్చి భీష్మవిదురులుండ 67 తాను దెచ్చినట్టి ధనరత్నరాసుల

ద్విజుల యాచకులను తృప్తి పజచె

దేవ ప్రీతి కొజకు ధృతరాస్త్రుడొనరించె

అశ్వమేధమాది యజ్ఞములను 68 క్షతి యోచితములు జనరంజకములైన

పనులు చాల చేసి పాండురాజు

పర్వతముల చెంత వనభూములందున

వేటలాడి కొంత విశ్రమింప 69 తలపు గలిగి యరిగి దారాసమేతుదై

హిమనగంబు దక్షిణమున వేట

లాడుచుండి యొక్క లేడి జంటను గూల్చె

మరునికేళినున్న తరుణమందు 70 మృతినిబొందుచున్న మృగము పాండునిజూచి

పలికెనిటుల మనుజ భాషణముల

నేను కిందముండ మౌనిని మృగరూప

మందు సతిని గూడి మదనకేళి 7 దగిలియున్న మమ్ము దయమాలి చంపిన

క్రూరచిత్త! దీని కారణమున

చత్తు వీవు నీదు సతిని గూడిన యంత అనుచు విగతజీవు దాయె మౌని 7

ఆది పర్వము 13 విన్న పాండురాజు విహ్వలత్వము జెంది (బ్రతుకు మిద రోసి సతుల జూచి వని వసింతు నేను మునివృత్తి, మరలు నగరి కేగు డనగ మగని జూచి 73 న్వామి నిన్ను గొల్చి మేము తపోవృత్తి వనము నందె యుందుమనుచు జెప్ప సమ్మతించి యతడు శతశ్చంగమున కేగి సతులు గొలువ తపము సలుపుచుందె. 7డ్త పాండవుల కౌరవుల జననం సుతులు లేనివారు గతిహీనులను సూక్తి దలచి పాండు రాజు కలత జెంద మునులు యోగద్భష్టి గని దెల్పిరతనితో భవ్యులైన సుతుల బదయుదనుచు 75 సతుల వలన తనకు సంతానయోగంబు మౌని శాపవశత లేని నిజము నెజిగి పాండురాజు నిజదారలనుగోరె క్షేతజులను కలుగజేయుడనుచు 76 అంత కుంతి దెలిపె నలనాడు దుర్వాస మౌని యిచ్చినట్టి మంత్రమహిమ విన్న పాండురాజు విపుల హర్షము జెంది ధర్మమూర్తి యముని దలచుమనియె 77 తరుణి యటులసేయ ధర్ముండు పొడసూపి పుత్రదానమిచ్చె పొలతి కపుడు సతికి బుట్టె నొక్క సంవత్సరంబున దేవ సన్నిభుడు యుధిస్టిరుండు 78

కే సంక్షిప్ర మహాభారతము కరిపురంబు నందు గాంధారి గర్భంబు తోడ నుండ నొక్క యేడు గడచె అంతలోన వచ్చె కుంతీ ప్రసవవార్త పుత్రలాలసయయి, పొలతి కుమిలఠె గం తాళలేక నుదర తాడనంబొనరించె గర్భపాతమాయె గరితకపుడు వ్యాసుడరుగుదెంచి యా మాంస పిండమ్ము సలిపె నూటయొక్క శకలములుగ 80 వాటి నుంచి నేతిభాండంబులందున చెప్పె మునివరుండు శీతజలము చల్లు చుండిరేని జనియింతురిందున నూరుమంది సుతులు నొక్క సుతయు 81 అతివ కుంతి తోడ శతశ్చ్ళంగమందున పాండు రాజు చెప్పె సుదతి నీవు కనుము వాయుదేవు కరుణచే నొక్కని అరివిరాము ధీరు నమిత బలుని 82 కలికియటులొనర్చి గర్భంబు ధరియించి అతి బలాధ్యుడైన సుతుని గనియె భీమసేను దనెడు వీరావతంసుని సతులు పాండురాజు సంతసిల్ల 83 భీమసేను డుదృవించిన దినమందె రాజునింట కరిపురమ్ము నందు దుష్టబుద్ధిలైన దుర్యోధనుడు పుట్టె ఘూకవాయసములు కూయుచుండ వ!

ఆది పర్వము 15 దినదినమున కొకరు అనుజులు వానికి ప్రభవమందిరపుడు వరుసగాను అన్నవోలె దుష్టుడైన దుశ్యాసను దాది సుతులు కౌరవాన్వయమున 8ర్‌ కౌరవులకు నెల్ల కడగొట్టు చెల్లెలై కలిగె దుస్సలయను కన్య యొకతె పుత్రశతము నొక్క పుత్రిక గని హస్తి నగర విభుడు ముదము నందె మిగుల 86 భీష్మ డొక్కనాడు విదురాది బఐంధుల విప్రవరుల గూడి విభుని జూచి దుష్టశకునములను దుర్యోధనుని జన్మ కాలమందు గనుట జ్ఞప్రి చేసి 87 జరుగు వీని వలన జనసంక్షయము వంశ నాశమనుచు నాదు జ్ఞాననిధులు పలికి యుంట వీని వదలి వేయుట మేలు అనగ (త్రోసి పుచ్చె జనవిభుండు 88 సుతులు నూరుమంది ధృతరాష్త్రునకు గల్గి రని యెజింగి పాండురాజు తనకు భువనత్రయము గెల్పు పుత్రునీయవెయంచు తపము జెసె వృత్రదమను దలచి 89 వాసవుండు కరుణ వరమిాయ పాండుండు కుంతి తోడ జెప్పె నింతి నీవు దివ్య మంత్ర మహిమ దివిజేంద్రు వరమున గనుము విశ్వవిజయు తనయుననియె 90

16 సంక్షిప్త మహాభారతము ఉవిదకటుల బుట్టై నుత్తర ఫల్లునీ ప్రధమ పాదమందు భాసురముగ వంశవర్థ్ధనుండు వాసవతుల్యుందడు అసమ వర్ణ దేహు డర్టునుండు 91 ముగురు సుతుల బడిసి ముల్లోకముల దాను బడసి నటుల మురిసె పాండురాజు తనకు నొక్కడైన తనయుడు లేడంచు కుందుచుండె మాద్రి దెందమందు 92 తరుణి యొక్కనాడు తన మనోవాంఛను పతికి తెలుప నతడు పడతి కుంతి తోడ నీకు తపసి దుర్వాసు డిచ్చిన మంత్ర రాజమిమ్ము మాద్రి కనియె 9ం మాద్రి పొందెనంత మంటత్రోపదేశంబు కుంతి సమ్మతింప కూర్మి తోడ తలచి యాశ్వినులను తనయులగనుమంచు చెప్ప విభుడు పడతి చేసెనటుల 94 వనిత గాంచెనంత వారి యంశములందు దివిజ కాంతులీను కవల సుతుల చారు ముఖుల నకుల సహదేవులను వార లిద్దరమ్మలకును ముద్దు సేయ 95 సతుల సుతుల తోడ శతశ్చంగ మందున నుండె తపసివోలె పాండురాజు మౌని శాపభీతి మాద్రినెప్పుడు కుంతి కంటి రెప్పవోలె గాచుచుండె 96

ఆది పర్వము 17

పాండు రాజు మరణం

అంతనొక్కపరి వసంతకాలము నందు

కుంతి పనులదగిలి చెంత లేని

తరుణమందు నొంటిదాని మాద్రిని జూచి

మనసు వశము దప్పి మదను ధాటి 97

వలదు నాధ యనుచు వారించు మాద్రిని

సరకు సేయకుండ కురువరుండు

మదనకేళి సల్చి మరణించె క్షణమందె

సతుల ముంచి దుఖసాగరమున 98

పతి శవంబు తోడ చితిపైన కూర్చుండి

ప్రాణములను విడిచె పదతి మాద్రి

అంతట శతశృ్ళంగ మందు తాపసులెల్ల

పడతి కుంతి పుత్ర పంచకమును 99

పాండవుల హస్తినాపుర ప్రవేశం

కరిపురంబు జేర్చ గాంగేయ విదురాది

సకల బంధుజనులు సత్యవతియు

సుత శతంబుతోద సతితోడ ధృతరాష్ట్ర

దాదరించి వారి ననునయించె 100

వ్యాసుడరుగు దెంచి వారికి దుఃఖోప

శమన మొనరజేసి సత్యవతిని

ఏకతమున జూచి యెజిగించె నామెకు

జరుగనున్నయట్టి సంఘటనల 101

దుష్టచిత్తులైన దుర్యోధనాదుల

కారణమున జరుగు దారుణముల

కాంచి యోపలేవు గాన తపోవన

మునకు జనుట మేలు జనని యనియె 102

18 సంక్షిప్త మహాఖారతము

వనికినేగ సత్యవతి నిశ్చయము జేసె సమ్మతించ విదుర శాంతనవులు

అరిగిరామె వెంట నిరువురు కోడండ్రు

పొంద తపము జేసి పుణ్యగతుల 103 తన సుతులను పాండు తనయుల కురురాజు

పెంచె నేకరీతి ప్రీతి తోడ

పెద్ద తండ్రి సుతుల భేదభావము లేక

పాండుసుతులు చూచుచుండి రపుడు 104

దుర్యోధనుని పాండవ ద్వేషం

బాలక్రీడలందు వాయుతనూజుని

ధాటి కోర్వలేక నోటు వడుచు

దుష్టబుద్ధులైన దుర్యోధనాదులు

ఛలము జేసి వాని జంపనెంచి 105 మామ శకుని తోడ మంతనంబులు సల్సి

ఆటలాడి యాడి అలసి సొలసి

సుప్తి నున్న పవనసూనుని బంధించి

విడిచి రతని గంగ మడువు నందు 106 నిద్ర లేచి వాడు నీల బంధములన్ని

తైళ్లి నిముసమందు తృణములటుల

బంధనముల బాసి వాయుతనూజుండు

నీటి బారి బడక నిర్ణమించె 107 ఉరగతతుల చేత కరిపించె నొకనాడు

అనిలసుతుని కౌరవా([గ్రజుండు

అతడు నిద్రలేచి అహిరాజముల జంపి

ప్రాణవాని లేక బయటబడియె 108

ఆది పర్వము 19 పెట్టె నొక్కనాడు విషమన్నమున గల్పి గాడ్పు పట్టి జంప కారవుండు విషము జీర్ణమాయె, భీము జంపగ సల్పి నట్టి యత్నమంత వ్యర్ధమాయె 109 అనిలసుతుని జంపు యత్నంబులన్నియు భంగమౌట జూచి పరితపించి కౌరవాగ్రజుండు వారైదుగురికిని హాని జేయు మార్గమరయుచుండె 110 రాజసుతుల కెల్ల రాజోచితములైన అస్త శస్త్ర విద్యలన్ని నేర్చ అవనిసురుని శాంతనవుడు నియోగించె గౌతమముని సుతుని ఘనుని కృపుని శ్ష్ష్ష అస్త్రగురువుగా ద్రోణుని నియామకం అతని వద్ద విద్యలన్నియు (గ్రహియించి చతురులైన రాజసుతులు గూడి బాలక్రీడలందు తేలియాదుచునుండ కందుకంబు నూతి యందు బడియి శ12 దాని వెలికిదీయ తమ చేతగాకున్న కలత జెందు బాలకులను జూచి ద్రోణుడనెడు ద్విజుడు బాణచాపధరుడు బంతిపైన నొక్క బాణమేసి 118 దాని పుంఖమందు బాణమొక్కటి వేసి మరియు దాని పుంఖమందు నొకటి వరుస నొకటి యొకటి శర పరంపర జేసి బంతి పైకిలాగె బాలులలర మమత

20 సంక్షిప్త మహాభారతము వింత జెంది వారు భీష్ముని కెజిగింప శాంతనవుడు వాని సత్కరించి ఎవరు నీవనంగ యొజిగించె నాతండు తనదు చరిత చిన్నతనము నుండి 115 అగ్నివేశ మౌని యాశ్రమంబున మేము కలసి చదువుకొనెడి కాలమందు నేను ద్రుపదవిభుడు స్నేహాతిశయమున నుండ నాకు కరుణ నుడివె నతడు 116 నేను విభుడనైతి నేని నా సిరులన్ని అనుభవించు నీవెయని తలంచి దాని జ్ఞప్తి జేసి వాని గోరితి నేను ఆల నిమ్ము శిశువు పాలకనుచు 1217 వాడు నన్నెటుగని వానియట్టుల బల్కె (ప్రభుడ నేను పేదవాడవీవు అగునె సఖ్యమెన్న డసమానులకు మధ్య ననుచు పరిభవించె నతడు నన్ను 118 విన్న శాంతనవుడు విరివిగా సిరులిచ్చి నేను వింటినయ్య నిన్ను గూర్చి విప్రవర్య! అస్త్రవిద్యలో జమదగ్ని తనయు బోలువాడవనుచు చెప్పి 119 అతని కప్పగించె ధృతరాష్ట్రసూనుల పాండురాజ పుత్ర పంచకమును స్వీకరించి నీదు శిష్యులుగా వీరి విద్య గజపుమయ్య వీరి కనుచు 120

ఆది పర్వము 21 అమర విభుని పుత్రుదత్యంత కుశలుదై యొప్పి గురువరేణ్యు మెప్పుబడసె ఇలను నీ సమాను లెవ్వరు లేనట్టి అస్త్ర కుశలు జేతు ననియె నతడు 121 అంత నేకలవ్యు డనెడు నిషాదుందు తనకు విద్య నేర్పు మనుచు వేడ ద్రోజు డియ్యకొనక త్రోసి పుచ్చగవాడు వనము నందు గురువు ప్రతిమ నుంచి 122 పరమ భక్తి తోడ గురుపూజ యొనరించి పట్టు విడవకుండ (ప్రతి దినమ్ము సదమల మతి తోడ సంతతాభ్యాసియె అస్త్ర విద్యలన్ని యభ్యసించె 128 నగరి బయట వనిని మృగయా వినోదులై యున్న రాజపుత్రు లొక్కచోట వక్రమందు నేడు బాణంబు లొక్కట గ్రుచ్చుకొనిన నొక్క కుక్క గాంచి 124 దరియ వచ్చునొక్క శరచాపధరు జూచి విస్మయంబు జెంది వివరమడుగ చెప్పె వాడు ద్రోణ శిష్యుండ నేనౌదు ఏకలవ్యు దనెడు ఎలుక ననుచు. 125 అంత ద్రోణు జూచి నర్జునుం డొకనాడు అడిగె నస్త విద్యలందు నన్ను అవని వీరులందు నత్యుత్తముని జేతు ననుచు జెప్పి యిప్పు డన్యు నొకని 126

22 సంక్షిప్త మహాభారతము నన్ను నిన్ను మించినట్టి ధనుర్ధరు జేసినాడ వాకని శిక్ష గజపి విన్న ద్రోణుడంత విస్మయం బేపార వాని జూడ జనియె వనములోన 127 అచట నేకలవ్యు డాచార్యునకు మొక్కి జెప్పె నేను నీదు శిష్యుడౌదు నేర్చినాడ విద్య నిన్ను నారాధించి యనగ కాన్మ నీయమనియె గురుడు 128 ఏదియైన గోరు మిచ్చెదనని చెప్ప నడిగెను కుడిచేతి యంగుటంబు కోసి యిచ్చి దాన గోల్పోయె శరమేయు లాఘవమ్ము నేకలవ్యు డంత 129 ఇలను సాటిలేని విలుకాని నిను జేతు ననుచు నరున కిచ్చి నట్టి మాట సఫలమాయె ననుచు సంతోష స్వాంతుడై యుండి గురువు ద్రోణుడొక్కనాడు 180 పక్షి రూపమొకటి వృక్షశాఖను బెట్టి శిష్యగణము నెల్ల చేరబిలిచి వారి తోడ జెప్పె బాణమ్ము సంధించి పక్షి శిరము గొట్టవలయు మోరు 181 గురుడు వారి నంత గుటి బెట్టుడని జెప్పి అదుగ నేమి కాన ఐడియె ననుచు చెప్పిరెల్లవారు చెట్టును పక్షియు పరిసరములు కానబడియె ననచు 132

ఆది పర్వము జ అర్జునుండు మాత్రమనియె నాతని తోడ అరయుచుంటి పక్షిశిరము నొకటె శరము విడిచెనతడు గురువు చెప్పినయంత దాని శిరము విరిగి ధరణి ఐడియె 183 గురుడు శిష్యగణము సురనదీ జలముల స్నానమాడుచుండ నక్ర మొకటి అస్త్ర గురుని ఐట్టె నతి లాఘవంబున 134 రాచబిడ్డ లెల్ల జూచుచుండ ఏమి చేయలేక యిటునటు జూచుచు నుండ రాజసుతులు బెండువదుచు మొసలినోట బాణముల నాటి విడిపించే 135 అర్జునుండు (ద్రోణు నక్కజముగ రాజపుత్రుల అస్త విద్యా ప్రదర్శనం (ర్రోణుడొక్కనాడు దుర్యోధనాదుల పాండుసుతుల శక్తి పాటవములు అస్త్ర శస్త్ర విద్యలందు నైపుణ్యమ్మా 136 భ్‌ష్మ వ్యాస శల్య విదుర శకుని జీ ప్రముఖ బంధుజనుల సముఖమందున జూం దలతునంచు జెప్పె ధరణి పతికి _ విభుడు సమ్మతింప విదురుండు రల 187 రమ్యమైన యొక్క ప్రాంగణమ్ము అంధనృపతి తోడ నరుదెంచె గాంధారి వారి చెంత నుండె పొందుపల్నీ దరి తోడ ర బంధుజనులు నగర ప్రముఖులం 18 (ప్రాంగణమ్ము నేత పర్వమాయె

24 సంక్షిప్తమహాభారతము గురుని యనుమతమున నరపాలసుతులెల్ల రాయుధములు బూని ప్రాంగణమున నిలిచి యతని యొద్ద నేర్చిన విద్యలు సంబరముగ చూపసాగిరపుడు 199 సాయుధులగు వారి సాహసకృృత్యాలు ప్రేక్షకులకు కనుల విందు గొలుప విదురుడండ నుండి వివరంబుగా దెల్స్పె అంధ భూపతికిని అతని సతికి 140 వాయుసుతుడు కౌరవాగ్రజుండును గదా యుద్ధమందు శక్తి యుక్తి జూప పోరు చుండ పూర్వవైరమ్ము తలయొత్తి వారి క్రీడ క్రోధ భరితమాయె కశ] వారి (ద్రోణసుతుడు వారించి విడదీసె కుదుటబడియె (ప్రేక్షకుల మనమ్ము అర్జునుండు చూపు నతని కౌశలమంచు వారి యుల్లమలర పలికె గురుడు 142 సవ్యసాచి నరుడు సర్వాస్తకుశలుండు అస్త్రక్రీడ సలిపె నద్భుతముగ అదియెగాక నతడు అసిగదాద్యాయుధ ముల ప్రయోగమందు బలిమి జూపె 143 కర్టుని ప్రవేశం అర్జునుండు జూపు అస్తవిద్యా పొఢి జూచి ప్రజలు మెచ్చుచుండనపుడు భానుసుతుడు రంగ ద్వార మందున నిబ్చి పలికె భుజము తట్టి పార్థు తోడ 1త్తడ్త

ఆది పర్వము 25 నేను చూపగలను నీవు చూపినదెల్ల తలపవద్దు నీవె దక్షుడనుచు, అంత గురుడు వల్లైయన చూపె నవలీల నర్జునుండు చూపినట్టిదెల్ల 145 సూర్యసుతుని ప్రతిభ చూచి దుర్యోధనుం దమిత హర్షమంది అనియెనిట్లు సలుపుమోవు ద్వంద్వ సమర మర్దునునితో ననగ నియ్యకొనియె నర్మసుతుడు 146 అంత కృపుడు చెప్పె కౌంతేయుడీతండు పాందుసుతుడు భరత వంశవరుడు నీవు చెప్పుమిపుడు నీ వంశ వివరమ్ము తల్లి యెవరా నీకు తండ్రి యెవరొ 147 శిరము వాల్చి నిలిచె సిగ్గుతో కర్టుండు బాధ జెంది బదులు పలుకలేక కౌరవాగ్రజుండు క్షణములో నతనిని రాజు జేసె నంగ రాజ్యమిచ్చి 14రి కర్ణుడనియె నపుడు కౌరవాగ్రజు తోడ నీదు మేలు మరువ నెన్నటికిని కౌరవుండు జెప్పె కలకాలమును నాకు చేయు హితము నీవు చెంత నుండి 149 కవచకుండలములు రవికేజమును జూచి కుంతి యెజిగె కన్నకొమరుడనుచు సూతుడటకు వచ్చి సుతుని కౌగిట జేర్చ తలచిరంత సూత తనయుడనుచు 150

26 సంక్షిప్త మహాభారతము అపర సంధ్యవేళ నస్త క్రీడను నిల్పి చనిరి యెల్లవారు సదనములకు కౌరవుండు తలచె కర్ట్ణుడుండగ నేను వెజివనేల నింక విజయు జూచి 151 గురుదక్షిణ కుంభసంభవుండు గురుదక్షిణను గోరె శిష్యగణము నెల్ల చెంతజేర్చి వలతు రేమి యనగ పాంచాలనృపు బట్టి అప్పగించవలయు ననియె గురుడు 152 ధార్తరాష్టులంత దండెత్తి వానిపై పరిభవమ్ము జెంది తిరిగి రాగ వెడలె నర్జునుండు భీముండు కవలలు తోడు రాగ నపుడు ద్రుపదు బట్ట 158 సరకుగొనక వాని సైన్యమ్ములన్నింటి శరములందు ముంచి శక్రసుతుడు ద్రుపదు బట్టి తెచ్చి ద్రోణున కర్పించె హర్ష పులకితాంగుడాయె గురుడు 154 పాశబద్భడైన పాంచాల విభు జూచి పలికెనతడు వ్యంగ్య భాషణముల (ద్రుపద భూవరుండు కృపణుడై యీ రీతి కట్టుబడుట కేమి కారణమ్ము 155 నేటికైన తొలగెనే రాజ్యగర్వమ్ము ఇంకనైన నన్ను నెఖుగ గలరె పలుకులిటుల బలికి బంధముక్తుని జేయ అరిగె నృపుడు క్రోధ భరితుడౌచు 156

ఆది పర్వము 27 ధృష్టద్యుమ్న ద్రౌపదీ జననము పడయగోరి ద్రోణు బరిమార్చగల పుత్రు నరుని పెండ్రియాడు నట్టి సుతను భూమిధవుడు పుత్రకామేష్టి జేయింప తృప్తుదైన యగ్నిదేవు కరుణ 157 జ్బలన కుందమందు జనియించె శరచాప ధారియైన పరమవీరుడొకడు అంత నుద్భవించె ననుపమ సొందర్య రాశి కాంతులీను రాజవదన 158 తనదు కోర్కె తీరు తరుణమ్ము దరిజేరె ననుచు హర్షమంది అవని విభుడు వారి బెంచసాగె కారణజన్ముల ధృష్టద్యుమ్ను డనగ కృష్ణయనగ 159 హస్తినగరమందు ఆంబికేయుడు ధర్మ తనయు సద్దుణముల జనులు పొగడ ధరణి భారవహన దక్షుందని విదుర శాంతనవులు చెప్ప సమ్మతించి 160 యౌవరాజ్య పదవి నభిషేకమొనరించె పాండుజ్యేష్టసుతుని భవ్య గుణుని అతడు తం్రివోలె ధృతరాష్తు మన్నించి పాలనమ్ము జేసె ప్రజలు మెచ్చ 161 అర్జునుండు భీము డళ్వినీ పుత్రులు తనకు తోడుగాగ ధర్మసుళుడు అవని పతుల దర్చ మడచి వారిచ్చెడు కప్పములను కానుకలను గొనుచు 162

ాాానిక్తపమహాభారతము భరతవంశ వైభవము కీర్తి సంపద పెనుపు జేసె సకల జనులు పొగడ అర్జునునకు ద్రోణు దతిప్రీతితో నిచ్చె పరమ దివ్యశరము (బ్రహ్మశిరము 1638 పాండుసుతుల పేరు ప్రఖ్యాతులను జూచి కౌరవాగ్రజుండు కలతజెంది దుష్టులైన శకుని దుశ్ళాసనులతోడ సఖుడు కర్టు తోడ సంప్రతించి 164 ధర్మసుతుడు వాని తమ్ములు హస్తినా పురిని వీడి దూర మరిగిరేని ప్రజలు వారి మరువ, వారి ఢ్రేమను తాము బడయ వచ్చుననెడు భ్రాంతి తోడ 165 కౌరవుండు తండ్రి కదకేగి తన మనో వాంభితమును జెప్పి పాండుసుతుల నే విధముననైన నిభపురంబున నుండి బంపు మనియె దూరప్రాంతములకు 166 అటుల వారి బంపు టనుచితింబని తండ్రి చెప్పు మాటను పెడచెవిని బెట్టి పట్టుబట్ట సుతుడు ఎట్టకేలకు నియ్య కొనియె రాజు వాని కోర్కె తీర్చ 167 పాందవుల వారణావత గమనం అంతనొక్కనాడు కుంతీసుతుల తోడ పలికె ప్రభువు మంజు భాషణముల మిరు కొన్నినాళ్లు వారణావతమందు దానధర్మ్శ్మములను ధరణి సురుల 168

ఆదిపర్వము ౨౨౨౨౨౨2 తృప్తి పరచి వారి దీవెనలను బొంది తిరిగి రండు హస్తిపురికి ననియె పితృసమానుదైన ధృతరాష్షుడిటు చెప్ప పాండురాజ సుతులు వల్లెయనిరి 169 కౌరవాగ్రజుండు కపటి పురోచను భవనశిల్సి బిలిచి పలికెనిట్లు నీవు త్వరగ వారణావతమునకేగి పాండు సుతుల కొణకు భవన మొకటి 170 నిర్మితమ్ము సలుపు నీ నేర్చు జూపించి వైభవముగ నేత్రపర్వముగను జ్వలన శీలమైన వస్తువులను వాడి దగ్ధ్గమయెడు నటుల త్వరితగతిని 171 పాండుసుతుల నందు వసియింప జేయించి ఆదమజచియున్న యవసరమున అగ్గి బెట్టి వారి యముని సన్నిధి జేర్చి పారితోషికమ్ము బడయుమనియె 172 వాదు చేసెనటుల వారణావతమందు తల్లితోడ పాండు తనయులిచట నతులొనర్చి శాంతనవ ద్రోణ కృపులకు వెడదలుచుండ జూచి విదురు డనియె 178 ఇటుల మిమ్ము బంపి ఇభపురనాథుండు ఎగ్గు 'సేయునేమొ యెజుగరాదు అగ్ని విషము వలన వానిని తలపోసి మసల వలయు నప్రమత్తులగుచు న

30 సంక్షిప్త మహాభారతము వారణావతమున పాండుపుత్రులు కుంతి (ప్రజల (ఢ్రేమ ఆదరముల బడసి రమ్యమైన రాజప్రాసాదమున నుండ గని పురోచనుండు వినతి జేసి 175 ధరణి విభుని యాజ్ఞ తాను నిర్మించిన భవన రాజమందు వారి నుండ కోర సమ్మతించి కుంతీసమేతులై చనిరి పాండుసుతులు సమ్మదమున 176 ఆ గృహంబు చూడ నాగ్నేయమైయున్న దనుచు సంశయించి ధర్మసుతుడు పవన సుతుదు తాను పగలు టేయియు పురో చనుని గతుల నరయ సాగిరపుడు క్షే/ దుష్టబుద్ధియైన దుర్యోధనుని కుట్ర విదురు డెజిగి చిత్త వికలుడౌచు ఖనకునొకని ధర్మతనయు నొద్దకు బంపె వెలికి చనగ నొక్క బిలము (ద్రవ్వ 178 వాడు తెలియజేసె వచ్చు చతుర్దశి నిశి పురోచనుండు నిప్పు బెట్టి మా గృహంబు గాల్బి మిము జంపనున్నాడు అని విదురుడు తెలుపుమనియె మాకు 179 వాడు బిలము ద్రవ్వ వాయుసూనుడు దాని పరికరించి చూచి జరుపదగిన కార్య నిర్ణయమ్ము కావించి యదనుకై ఎదురు చూచె నేమి యెబుగనట్లు 180

ఆదిపర్వము ౨౨ లాక్షాగ్భహ దహనం ఆ చతుర్దశి నిశి వేచిచూచెడి పురో చనుని కన్న ముందు అనిల సుతుడు జనని నన్నదమ్ములను బిలమ్మున జేర్చి వహ్ని ప్రజల్వింప భస్మమ్ముగా మారె లక్కగ్భృహము కపట రచన ఫలము చనె పురోచనుండు అనల సందగ్గడై బ్రతికి బయటబడిరి పాండుసుతులు 182 దాసివోలె కుంతి దరినుండి పొందవ కృత్యములను తనకు నెలుక పరచ మని పురోచనుండు పనిచిన వనితయు పుత్ర పంచకమును పొలిసిరందు 188 కాలి నల్లనైన కాయంబులను జూచి మడిసిరనుచు పాండు మహిషి సుతులు వారణావతంబు వగజెంది దూషించె ధార్తరాష్ట్ర దుష్ట వర్తనముల 184 వంత జెందెచాల వార్త వినిన రాజు (ప్రేత కర్మ లాచరించె నంత భీష్ముడాది వంశ వృద్ధులు గురువులు న కుమిలి కుమిలి నేల గూలిరపుడు 18 విదురు డందరి వలె విలపించి నటులుండె ఎథటీగి యుండి నిజము నెజుగ నటుల కౌరవాగ్రజుండు కరము సంతసమందె తనకు రాజ్యలక్ష్మి దక్కెననుచు 186

22 సంక్షిప్త మహాభారతము

బిలము నుండి వెడలి భీముండు జననిని

అగ్రజానుజులను అడవిలోన

మోసి బామువులను మూపున నిశియంత

చేర్చె నొక్క మళ్ళి చెట్టు క్రింద 187 నీరు క్రాగి వారు నేలపై నిదురించి

యుండ జూచి భీము డుమ్మలించి

వారి గాచి యుండె వనమధ్యమందున

ధార్తరాష్ట్ర దుష్కుతముల దలచి 188 అట హొడింబుదనెడు అసురుదొక్నడు వారి

నరసి భోజనమ్ము దొరకెననుచు

చెప్పె సంబరమున చెలియలితో వారి

బట్టి వండి తనకు బెట్టమనుచు 189 వల్లెయని హిడింబి వారి చెంతకు వచ్చి

సింహబలుని భీమసేను జూచి

మదనబాణ ధాటి మది విహ్వలము జెంది

మనుజవనిత రూపమును ధరించి 190 దరికి జేరవచ్చి తానెవ్వరో తెల్పి

అడిగె తనను పెండ్లియాడు మనుచు

ఇది హిడింబు వనము ఇందులో కాలూని

ప్రాణసంకటమున బడిరి మిరు 191 నన్ను బొందితేని నిన్ను నీ వారల

కాచియుందు వాని కలుగకుండ

అనుచు బల్ముచున్న అసురకాంతను జూచి భీముడనియె నిటుల భామతోడ 192

ఆదిపర్వము 3కి కామ సుఖము గోరి కన్నతల్లిని సహో దరుల విడువ నాకు తరము గాదు అసుర భయము లేదు అతివ నాకిసుమంత వ్రచ్చువాడ వాడు వచ్చెనేని 198 పాందవుడు హిడింబి భాషించుచుండంగ కాలయాపనమ్ము తాళలేక కర్చురుండు వచ్చి కనుల నిప్పులురాల భీమసేను దాకె భీకరముగ 194 కలయవబడిరి వారు గజసింహముల మాడి ద్వంద్వ యుద్ధమాయె చారుణముగ భీము డసురవరుడు భీషణంబుగ బోర శక్తి గోలుపడె నిశాచరుండు 195 వాని ముక్కునుండి వక్రంబు నందుండి రక్తధార లొలుక రక్మసుండు అవని పైన గూలి అసువుల విదనాడె అనిల సుతుని ధాటి కాగలేక 196 అంత నసుర వనిత కుంతితో నిటు బల్కె వినుము జనని నాదు విన్నపమ్ము భీమసేను జూచి కాము బారిని జిక్కి వదలినాను అయిన వారినెల్ల 197 వచ్చియున్న నన్ను వలదన్న నసువుల విడుచు దాన క్షణము తడయకుండ విన్న కుంతి దాని స్వీకరింపుము పుత్ర! అనగ నియ్యకొనియె ననిల సుతుడు 198

34 సంక్షిప్ర మహాభారతము పొలతి తోడ నొక్క పుత్రుండు జన్మించి నంత వజకె నుందు ననియె నతడు అసురి సమ్మతించె నామెతో నివసించి కోర్మెలన్ని తీర్చె కుంతి సుతుడు 199 ఘటోత్కచుని జననం కొంత వడికి బుట్టె కాంత గర్భము నందు భీమబలుడు రూప భీకరుండు నగు ఘటోత్కచుండు నక్తంచరా(గ్రణి తల్లి దండ్రి సంతసిల్లి చూడ 200 ఆ క్షణంబు నందె యౌవనాకారుదై నతులొనర్చి పాండు నందనునకు తలచినపుడు వత్తుననుచు నాశ్వాసించి చనియె ధనదు దిశకు జనని తోడ 201 అంత పాండుసుళులు కుంళితో వనులందు తిరిగి ఏకచక్రపురము జేరి ఒక్క విప్రనింట నుండి భిక్షుకవృత్తి కాలమొక్కరీతి గడుపుచుండ 202 ఒక్కనాడు భీముడొక్కండు తల్లియు వీటనున్న యపుడు వినిరి వారు గుండె లవియజేయు ఘోరార్తనాదమ్ము కారణమ్ము నెజుగ కోరి యడగి 203 కుంతి వినియె నొక్క వింతగొల్బెడు గాధ కలడు ఐబకుడు ఖలుడు కర్చురుండు వాని భుక్తి కొజకు ప్రతి దినమ్ము నగరి నుండి బంప వలయు బండి నిండ 204

ఆదిపర్వము మ్‌ భోజనమ్ము వాదు భుజియించు దానిని బండి నడుపువాని పసులతోడి అటుల జేయకున్న నసురుందు నగరిపై కెత్తి వచ్చి మమ్ము హింస బెట్టు 205 ఊరి వార రెల్ల రొక్కొక్కరాకనాడు వరుస దప్పకుండ బంపవలయు వచ్చె మా గృహంబు వంతు ఈ దినమున ననుచు గృహిణి జెప్పె నామెతోడ 206 అంత కుంతి జెప్పె వంత మానుడు మోరు పోగలండు నాదు ్రుతుడొకడు మాకొకందె సుతుడు నాకునైదుగురుండ వారలందు నొకని బంపగలను 207 అపుడు విప్రదనియె నతిధుల మిము బంప పొయునమ్ము యిహము పరము మాకు తల్లి నీదు సుతుని దనుజువాతను బెట్ట నియ్య కొనను నేను నిశ్చయముగ 208 కుంతి జెప్పెనపుడు చింతింపకుడు నాదు తనయు జంప నసురుతరము గాదు వినిన భూసురుండు తన సమ్మతము దెల్బ్ప దనుజు జేర జనియె ననిలజుండు 209 బకాసుర వధ దరికి జేరకుండ దవ్వులందున నిల్చి ఆరగించసాగె ననిలసుతుడు దనుజు డాగ్రహించి కనుల నిప్పులు రాల తాకె నతని పర్వతాగ్రమటుల 210

36 సంక్షిప్ర మహాభారతము

పోరు ఘోరమాయె వారిరువురి మధ్య భగ్నమాయె పాదపములు శిలలు మరల కొంతవడికి మల్లయుద్ధంబాయె అసురు ఉొమ్ముబొడిచె ననిలసుకుడు 2111 దాని కోర్వలేక ధరగూలె నొడలెల్ల

రక్తధార లొలుక రక్కసుండు

వాని శవము పురము వాకిట బడవేసె

వాయుసుతుడు జనులు ప్రస్తుతింప 212

ద్రౌపదీ సయంవరం

లక్మయింట పొండురాజసూనులు కుంతి

ప్రాణములను బాసిరనెడు వార్త

విన్న ద్రుపద విభుడు విలపించె నరునికై

కృష్ణ నెటుల నొరుల కిత్తు ననుచు 218 విని పురోహితుండు విభుని యాశ్వాసించె

పాండుసుతులు బ్రతికి యుండిరనుచు

చూచుచున్నవాడ శుభనిమిత్తము లేను

రాగలరు స్వయంవరమ్ము చాట బ[ే4 అటుల జేయ నిశ్చయము చేసి ద్రుపదుండు

వార్త నంపి యవని పతులకెల్ల

మంటపమ్ము నందు మత్స్యయంత్రం బొండు

పెట్టె పైన తిరుగునట్టి దాని 215 ద్రౌపదీ స్వయంవరము నందు తమ నేర్పు

చూపదలచు రాజసుతుల తోడ

కనుల విందు గొలిపె కాంపిల్య నగరమ్ము

రమ్యమైన ద్రుపద రాజనగరి 216

అవని సురుల వలన నా స్వయంవర వార్త

వినిన వారు తల్లి యనుమతింప

సంబరమున నేకచక్రపురము వీడి

చనిరి పాండుసుతులు జనని తోడ 217 శుభముహూర్తమందు సభ మండితంబాయె

నతులితముగ రాజ సుతుల తోడ

అవని సురుల మధ్య నాసీనులై చూచు

చుండి రుత్సుకమున పాండు సుతులు 218 వేడ్క చూడ నటకు విచ్చేసి యున్నట్టి

ద్వారాకానిలయుడు పాండుసుతుల

ఆనవాలు పట్టి అర్జునుం డీనాదు

గెలుచు కన్యననుచు తలచె మదిని 219 రంగ మధ్యమందు మంగళవాద్యాలు

విప్రవరులు సలుపు వేదఘోష

వోయి గొలుపుచుండ రాయంచ నడలతో

కేల మాల దాల్చి కృష్ణ వచ్చె 220 ద్రుపద సుతుడు ధృష్టద్యుమ్నుండు వేదిపై

నున్న ధనువు జూపి నుడివెనిట్లు

దీని నెక్కు పెట్టి పైనున్న యంత్రమ్ము

నేయు వాడు పొందు నిందుముఖిని 221 ఇందురేఖ బోలు సుందరాంగిని జూచి

మదను బారి బడిన మనుజపతులు

కాంత నెటులనైన గ్రహియింప వలెనంచు

కార్ముకమ్ము నెత్త గడగిరపుడు ల2ల్పి2ి

38 సంక్షిప్త మహాభారతము విల్లు వంపలేక విన్నదనము జెంది చనిరి కొంతమంది సభను వీడి ధనువు నెత్తి లక్ష్యమును నేయనోపక పలువురరిగి రచట నిలువలేక 228 కౌరవాగ్రజుండు కర్ణ శల్యాదులు విఫలురైరి యంత్రభేదనమున అపుడు విప్రసంఘ మందుండి యరుదెంచె అర్జునుండు ధర్మజానుమతిని బెండ కుంతియనుగు సుతుడు గురు వందనము చేసి మొక్కి ధనువునెత్తి యెక్కుపెట్టి శరము లాఘవముగ సంధించి విడువంగ యంత్రమవని బడియె నక్కజముగ 225 ధరణి సురుడొ వీడు సురలోకవాసుడో యనుచు జనులు విస్మయంబు జెంద ద్రుపదరాజ తనయ తోయజానన పుష్ప దామ మతని కంరసీమ వైచె 226 దాని జూచి యోర్వలేని కౌరవులాది నృపతులెల్ల కలసి ద్రుపదు దాక వారి నిగ్రహించె వాసవసూనుండు అనిలసూను దడతని యందనుండ 227 వాసుదేవు డపుడు బలరామునకు దెల్చ్బె (బతికియున్నవారు పాండుసుతులు అర్జునుండు మత్స్వ్యయం(త్రమ్ము దెగవేసె అండనున్న వాడె అనిలసుతుడు 228

అదిపర్వము కీ పాండుపుత్రు లగ్ని పాలు కాలేదని తెలిసి సంతసిళ్లె హలధరుండు ద్రుపద రాజసుతను తోడ్కొని తమ తల్లి కడకు జనిరి కుంతి కొడుకులంత 229 జనని తోడ భిక్ష కొనివచ్చితిమి యన పంచుకొనుడు మిరలంచు జెప్పి తిరిగి చూచె నెదుట (త్రిభువన సామ్రాజ్య రమను బోలు నొక్క రాజముఖిని 280 కని యధర్మ భీతి కలిగిన మతితోడ కుంతిభోజు తనయ వంత జెంది పలికె నా వచనము వమ్ముగాదెన్నడు ధర్మ సంకటమున తగులుకొంటి లైవ్షే తల్లి నూజడించి ధర్మసూనుడు జెప్పె పొలతి నర్జునుండె పొందవలయు అ(గ్రజుండు నీవె యతివను [గ్రహియింప దగుదు వనుచు నింద్ర తనయుడనియె 232 నిర్ణయంబు జేయనేరక వారుండ ధర్మసూనుడనియె తమ్ములార! మాత చెప్పినటుల మనమైదుగురు నీమె బెండ్లి యాడవలయు ప్రీతి తోడ 233 వారి కడకు వచ్చి బలరామ కృష్ణులు అగ్గి యింటనుండి యెగ్గుబడక వెలికి వచ్చి నేడు విజయమ్ము సాధించి నట్టి వీరవరుల నభినుతించి ర!

తిరిగి చనిన పిదప ధృష్టద్యుమ్నుడు వచ్చి

వారలున్న విడిది తీరు దెలుప

అవని విభుడు వారి నామంత్రణము జేసి

మోర లెవరు వీరులార యనగ 2తెర్‌ ధర్మసుతుడు పాండుతనయుల మని చెప్ప

హర్ష పులకితాంగుడాయె విభుడు

పాండురాజ సతికి వందనమ్మెనరించి

సాదరముగ వారి సత్మరించి 236 దురితచిత్తులైన దుర్యోధనాదుల

యుక్తులందు బడియు ముక్తి బొంది

సుఖమునున్న మిమ్ము చూడ సంతసమయ్యి

ననుచు వారి మిగుల నభినుతించె 2?

ద్రౌపదీ పాందవుల వివాహం

(ద్రుపదు డొక్కనాడు దుహిత పెండలిజేయ

వలతు ననుచు చెప్ప ధర్మసుతుడు

తల్లి మాట మేర తామేవు రామెను

పొందదలతు మనగ పుడమిటేదు 288 విససయమున బల్కె వినలేదు కనలేదు

ఒక్క సతికి పతులు 'పెక్కురుంట

ధర్మవిదుడ నీకు ధర్మవిరుద్ధంబు

లైన యట్టీ మాటలాడదగునె 2౨౩9 అట్టీ తరుణమందు నరుదెంచె నచటికి

పరమజ్ఞాని వేదవ్యాస మౌని

కృష్ణ పూర్వ జన్మ వృత్తాంత మెఠిగించి

పడతి కోరె పంచపతుల ననియె 240

వ్యాసమౌని ్రోక్తమైన గాధను విని

విధి విహితము కాదు విఫలమనుచు

ద్రుపద విభుడు చేసె దుహిత కళ్యాణమ్ము

పాండు సుతులతోడ వైభవముగ 2శ్త]1 మామ (ద్రుపదు వీట మాతాసతుల తోడ

నుండి రశ్రమమున పాండు సుతులు

దుష్ట కౌరవేయ దుశ్చేష్టితము లన్ని

వ్యర్ధమాయె నీతిపరుల ముందు 242 పాందుసుతులు కుంతి (బ్రతికియుండుట గుప్త

చరుల వలన నెటిగి పరితపించి

దురితచిత్తుడైన దుర్యోధనుడు దుస్స

సేను శకుని కర్టు చేరబిలిచి జ! మన పురోచనుండు మడిసె, పాండవులేమొ

బ్రతికి యుండి శుభము బడసి రకట

వారి ద్రుపదు నుండి వేరు చేసెడు మార్గ

మరయ వలయు నెటులనైన ననియె బైత్తశ్త పాండుసుతుల పెండ్లి పాంచాల సుతతోడ

జరిగె ననుచు విదురు దెరిగి యంత

అతిశయముగ నలరి ధృతరాషునకు జెప్ప

పలికె సంతసంబు కలిగెననుచు 24ీర్‌ కౌరవుండు తండ్రి కడకేగి పాంచాల

పతికి పాండవులకు వైర భావ

మేర్చడంగ జేసి యెటులైన వారిని

వేరుచేయు మనుచు వేడుకొనియె 246

తై సంక్షిప్త మహాభారతము కర్టు దపుడు వారు కలహింతురనుమాట తలపవద్దు మరు కలను నైన యుద్ధమందు వారి నోడించి పాండవ భంజనమ్ము సలువవలయు ననియె గ అతని మాట వినిన ధృతరాష్ట్ర భూపతి అదియె మంచి మార్గమనుచు బలికి అయిన పెద్దవారి యభిమతం బెలటుగంగ దలతు ననుచు వారి విలువ బఐంపె బ4శ8 శాంతనవుడు చెప్పె సాంతమ్ముగా విని యియ్యకొనను నేను కయ్యమునకు నాకు మిరు వార లేక రూపము, వారి కర్ధరాజ్య మోయ న్యాయమగును ఐశ9 ఆదరమున వారి నామంత్రణము జేసి పొసగ రాజ్య భాగ మొసగి చెలిమి చేయు టిరువురికిని శ్రేయంబు కల్గించు లేనీ యెడల మోకు వాని కలుగు 2560 అస్త్రగురుడు జెప్పె నాపగేయుని పల్కు లాలకించ మోకు మేలు గలుగు ధర్మపరులు పాండు తనయుల భాగంబు వారి కీయకుంట పాడిగాడు 251 కర్చు డనియెనంత కానివారల తోడ కలసియుంద నేమి ఫలము గలుగు వృద్ధులైన మీర లీరీతి బల్కుట కౌరవేయ హితము కోరికాదు 252

ఆది పర్వము 43 వాదులాదడు వారి వారించి విదురుండు తన మతమ్ము జెప్పె ధరణిపతికి కురుపితామహుండు గురువు (ద్రోణుల కన్న వంశహితము గోరువారు లేరు 258 ద్వారకాధిపతులు పాంచాలు రాదిగా పరిమితమ్ము కాని బంధుబలము భీము బాహుబలము విజయాస్త్రకుశలంబు కలుగ వారి ననిని గెలువనగునె 2లైడ్న అరయ పాండు సుతులు పెరవారలే నీకు నిన్ను గొలుచువారు నెయ్యమార నీతిపరులు వారి నేల దూరము జేతు వాదరించి రాజ్య భాగమిమ్ము 255 దుష్టబుద్ధులైన దుర్యోధనాదుల వలన వంశక్షయము కలుగకుండ చేయుమనుచు ముందె చెప్పియుంటిని గాదె కావుమెల్ల వారి కరిపురేశ 256 వంశహితము గోరు వారి మాటలు విని అనియె నృపుడు మాన్యులార వినుడు అర్ధరాజ్య మిత్తు ననుజన్ముసుతులకు విదురు డరిగి వారి బిలుచుగాక 257 వస్తు వాహనములు స్వర్ణభూషణములు నవ వధూవరులకు నవని పతికి నతని బంధువులకు ధృతరాష్తుడంపగా విదురుడరిగె ద్రుపదు సదనమునకు 258

ఉత త పంక్షీప మహాభారతము బంధుసహితుడైన పొంచాల విభుగాంచి కుంతిసుతుల గాంచి సంతసించి వారి వద్ద నున్న వాసుదేవుని గాంచి 259 వారి క్షేమ మడిగి పలికెనిట్లు పాండు సుతులు కుంతి బాసినప్పటి నుండి తల్లడంబు జెంది ధరణి పకియు భీష్ముడాది వంశ వృద్ధులు గురువులు రం ఇపుడె వారి సేమమెరుగ నన్ను 2 అనిపినారు వారి నామంశ్రణము జేయ పరమ ప్రీతి తోడ కరినగరిక్తి అందువలన వారి ననుమతించుడు మిరు నన్ను గూడి హాస్తినగరి కరుగ 261 విన్న ద్రుపద విభుడు విపులహర్నము జెందె వెతలు తీరె పొండుసుతుల కనుచు సాగనంపె వారి సాదరంబుగ కుంతి వధువు కృష్ణ చనగ వారి వెంట 262 కరినగరము నందు పురజను అందఖు స్వాగతమ్ము జెప్ప పాండుసుతులు పరమ భక్తిత్రోడ కురువృద్ధులకు (మెక్కి పదములిడిరి రాజ్రసదనవ్షుంద్రు 263 ఇంద్రప్రస్థ పుర నిర్మాణం ఆపషేజనుల ప్రజల అన్సురాగ్సృన్స బొంది యున్న కుంతిసుత్చ కొక్మనాద్స (ప్రభువు జెప్పె నింద్రప్రస్థమ్ము మో కిత్తు దాని నేలుకొనుడ్ర తనయృల్రాగ్ర 264

ఆది పర్వము త్న్‌ యయ భీష్ముదాది వంశవృద్ధుల దీవెన లంది పాండుపుత్రులరుగ నటకు వారి తోడునీడ ద్వారకానిలయుండు చనియి వారి వెంట సాయపడగ 265 వెన్నుడింద్రు గోరె విశ్వకర్మను బంప నతడు వచ్చి చేసె నగర రచన ఇంద్రప్రస్థ నగర మింద్రుపురము బోలి తేజరిల్లె భవ్య దీప్త లలర 266 అనుజు లనవరతము ననురక్తులై రాజ్య పాలనమున పాలు పంచుకొనగ ధర్మనందనుండు ధర్మంబు దప్పక రాజ్యమేలి లోక పూజ్యుడాయె 267 కొన్ని దినములుండి గోవిందు డరుగంగ నారదుండు వచ్చి వారి జూడ సతియు తాము మౌనిసత్తమునకు మొక్క యతివరుండు వారి నభినుతించె 268 నాకమౌని వారి నేకాంతమున జూచి కలుగ కూడ దెట్టి కలత లనుచు సుదతి కొజకు పోరి సుందోపసుందులు పొలిసినట్టి గాధ దెలిపియనియి 269 భర్త లేవు రొక్క పడతితో నుండుట కాదు లోకరీతి కనుక మిరు వనిత కారణమున వైర మేర్చడకుండ తుక

వి సంక్షిప్త మహాభారతము తపసివరుని మాట తమ మంచికని యెంచి సోదరులకు ధర్మసుతుడు చెప్పె ఒక్క భర్తతోడ నొక్కొక్క యేడాది కాంత సలుపవలయు కాపురమ్ము 271 ఎవ్వరింట నుండు నింతి యా యింటికి ఒరులు అరుగకుండ నుండవలయు సమయభంగకారి సంవత్సరము పాటు అరుగవలయు తీర్థయాత్ర సలుప లై2 అనుజులెల్ల వారి యనుమతమ్మును దెల్బ చనియె బుషివరుండు సంతసిల్లి పాండుసుతులు సమయభఖంగంబు గాకుండ కలతలేని బ్రతుకు గడుపుచుండ ౨273 ఒక్కనాడు విప్రడొక్కండు తనధేను వులను గొనిన తస్మరులను గొట్టి తిరిగి గోగణమ్ము దెచ్చి యియ్యవెయంచు విజయు తోడ జెప్ప విని యతండు 274 దరిని నున్న ధర్మతనయు వీటను జొచ్చి ఆయుధముల బూని యా క్షణంబె తస్మరులను జంపి ధరణి దేవుని ధేను వులను తెచ్చి యిచ్చి కలత బాపె లై75 విప్రనార్తి బాపి విజయుండు ధర్మజు పాలికేగి సమయ భంగమాయె నీరజాక్షి కృష్ణ నీ యింట వసియించు నపుడు నిటకు వచ్చినాడననియె ౨276

ఆది పర్వము శ (బ్రాహ్మణార్తి బాప వచ్చినాడవు గాన వలదు సమయభంగ భయము నీకు అనగ నర్జునుండు అన్నరో అపవాదు కలుగు ననుచు భయము గలదు నాకు 277 అర్జునుని తీర్థయాత్ర అనుచు నగ్రజన్ము ననుమతింపగ జేసి పరిజనముల గూడి పార్టుడరిగి తీర్ధరాజములను తిలకించి తరియింప స్నానమాడ పుణ్యనదుల యందు 278 అటుల కొన్నినాళ్ల కరిగె గంగా ద్వార మందు దివ్య తటిని యందు మునిగి స్నానమాడు నతని నాగకన్య ఉలూచి కొనుచు నాగలోకమునకు చనియె 279 ప్రణయ ప్రార్ధనంబు పడతి సేయగ పార్టు డామె కోర్కె దీర్చ నాక్షణంబె రమణి గనియె సుతు నిరావంతుడను వాని నరుడు తీర్థయాత్ర కరిగె మరల 280 పార్థు డరిగి యరిగి ప్రాగ్దేశమును జేరి పుణ్య నదుల మునిగి పూజసల్పి చేరి మణిపురంబు చిత్రాంగదను పెండ్లి యాడి సుతుని బడసె నామెయందు 281 తనయు బభ్రువాహనుని తాత కోర్మెపై అతని చెంత వదలి అర్జునుండు పశ్చిమాబ్భి దరిని ద్వారకా నగరంబు నందు కృష్ణు జూడ నరిగెనంత 282

తి సంక్షిప్త మహాభారతము సుభద్రార్దునుల వివాహం అచట వాసుదేవు ననుగు చెల్లి సుభద్ర సద్దుణాంబురాశి సన్నుతాంగి నొరు లెరుంగకుండ నరయంగ యతిరూప మూని నగరి బయట నొక్క వనిని 283 నుండ కృష్ణుడెరిగి పాండవ మధ్యముం డున్న కదకుజని ప్రసన్న దృష్టి గాంచి కుశలమరసి కన్య సుభద్రపై మరులు గలిగి యుంట యెరిగి మురిసి 284 నీ మనోరధమ్ము నెరవేర్తు ననిచెప్పి తపసి నుంచి రైవతకము చెంత పర్వతోత్సవంబు ప్రకటించ ద్వారకా పురము వారలెల్ల రరిగి రటకు 285 హలధరుండు నరుని యతియంచు భావించి ప్రణతి జేసి పరమభక్తి తోడ సేవలంద జేసి దీవెన లందగా ననిపె చెలి సుభద్ర నతని కడకు 286 సంయమింద్రుడనుచు సత్మారములు చేసి ఉవిద యడిగె నతని యొక్కనాడు దేశదేశములను తిరుగుచుండెడి మారు ఇంద్రప్రస్థపురికి నేగినారె 287 కుంతిభోజు పుత్రి కుశలమేమాయత్త భద్రమేన బావ ఫల్గుణునకు అంత నరుడు చెప్పె నర్జునుండను నేను నిన్ను గోరి వచ్చియున్నవాడ 288

ఆది పర్వము తం కలికి నీవు నేను గాంధర్వ విధి పెండ్లి చేసుకొందుమనిన సిగ్గు జెంది పెండ్లిజేయ మనకు పెద్దలున్నారని అనుచు కన్య చనియె నంతిపురికి 289 వారి ప్రణయవాంఛ వసుదేవసూనుండు జ్ఞానదృష్టి నెజిగి సంతసిల్లి బంధువర్గమందు బలదేవు పరివార మెఖుగకుండ పెండ్లి జరిపె నచట 290 కన్యతోడ నరుడు కాంచన రధమెక్కి ఇంద్రప్రస్థ నగరి కేగుచుండ వాని నెదిరి భంగపడి పురరక్షకు లా వివరము జెప్ప హలధరుండు 291 క్రోధ మానసుండు మాధవు నడుగంగ జిష్టుదతని శాంతచిత్తు జేసె వనిత తోడ నింద్రప్రస్థంబు దరిజేరి అర్జునుండు బలికె నతివ నీవు 292 గోపికలను గూడి కోమలి కృష్ణను కాంచుమనుచు జెప్ప కాంత వెడలె (ద్రౌపది ప్రియమార తరుణిని దీవించె కమ్ము వీరమాత కలికి యనుచు 298 అంత చని సుభద్ర కుంతి దీవెనలందె అర్జునుండు నగరి యందు జొచ్చె తీర్థయాత్ర సలిపి పార్భుడింటికి రాగ సంతసిల్లి రాప్త జనులు ప్రజలు 294

50 సంక్షిప్ర మహాభారతము ఇంద్రసుతుడు చెలియలింద్ర ప్రస్థమునందు నున్న వారి జూడనుత్సుకమున హలధరుండు కృష్ణు డరుదెంచి రచటికి కానుకలను గొనుచు ఘనముగాను 295 కుంతి సుతుల చెంత కొన్నాళ్లు వసియించి హలధరుండు వీటి కరిగనంత వాసుదేవు డింద్రప్రస్థంబు నందుండె కుంతిసుతులు గోర కూర్మి మాజి 296 అంత కొన్నినాళ్ల కభిమన్యుడుదయించె వంశవర్ధనుడు సుభద్రయందు తండ్రి అర్జునుండు ధర్మరాజాదులు కుంతి ద్రుపద పుత్రి సంతసిల్ల 297 మామ వాసుదేవు (ప్రేమానురాగాలు ద్విజుల గురుజనముల దీవెనలను బొంది సవ్యసాచి పుత్రుండు వర్ధిల్లె 'ప్రధమపక్ష శీతభానుడటుల 298 పాందుసుతులు బడసి పాంచాల సుతయందు కొమరులైదుగురిని విమలమతుల (ప్రజలు మెచ్చ రాజ్యపాలనంబొనరించు చుండి సుఖమునున్న నొక్కనాడు 299 ఖాండన నన దహనము కమలనాభు తోడ ఖాండవ వని చెంత విజయుడున్న వేళ విప్రడొకడు ఆకలిగొని,.యుంటి నన్నదానము చేయు -డనగ వోనీనేమి తినెడువనగ 800

అది పర్వము 5్‌1 వహ్ని నేను ఖాండవ వని భక్షణ సేయ నుద్యమింప నింద్రు డుగ్రుదొచు కుంభవృష్టిధార కురిపింప నాయత్న మెల్ల విఫలమాయె నేమి జేతు 301 ఇచట నున్న పన్నగేంద్రు తక్షకు గావ సలుపు నిటుల పాకశాసనుండు అస్త్రబలము చేత నరికట్టవలె మిరు అనుచు వారి వేడుకొనియె నగ్ని 202 విధి రచించినట్టి విల్లు గాండీవమ్ము తూపులెపుడు నుండు తూణియొకటి వహ్ని గోరనిచ్చె వరుణుండు నరునకు గదయు చక్రమిచ్చె యదువరునకు 308 | కాల్పదొడగె నగ్ని ఖాండవ వనమంత వృషుని యాజ్ఞ కుంభవృష్టి గురిసె వాసవాత్మజుండు బాణపరంపర నీరు గురియకుండ నింగినింపె 804 వృషుడె వచ్చె ననికి కృష్ణార్జునుల తోడ పోరు ఘోరమాయె వారి నడుమ వీరవరులు నరుడు నారాయణుందడని గగనవాణి దెలుప కదనమాపి 805 దివిజపతి నరునకు దివ్యాస్తములనిచ్చి వాసుదేవు బొగడి పాందవునకు పొతము జేయుచుండు మెల్లవేళలయందు ననుచు గోరి చనియె నాకమునకు 306 ళ్‌ గ్రందాగ్న్యు ఖ్య (క (గ రయ చట సీ స్య నం నిలవడం 0

కం సంక్షిప్ర మహాభారతము మంటలందు జిక్కి మయుడను దనుజుండు శరణు గోర నరుడు కరుణగాచె తక్షకుండు వనము దగ్ధమౌటకు మున్నె కదలి ప్రాణములను గాచుకొనియి 307 అంత కృష్ణ సహితుడై యింద్రతనయుండు నగరి కేగి జరిగినట్టిదెల్ల నగ్రజునకు దెల్బ నానందమును జెంది రింద్రప్రస్థమందు నెల్లవారు 8086 జాలా లవానమమెళ్ట--జయషమైొట్రైన్యప్రపమిలా----1 నానా.

లావై సభా పర్వము మయసభా నిర్భాణం ప్రాణ రక్షకునకు ప్రత్యుపకారమ్ము చేయనెంచి నరుని చెంతకేగి తెల్చె మయుడు దనుజ శిల్పిని నేగట్ట గలను చిత్రమైన కట్టడముల ్షే ఏది ప్రియము మోకు ఎజిగించుడని వేడ సవ్యసాచి యడిగె చక్రధరుని అతడు చెప్పె జగతి ననుపమమపురూప మైన సభను గట్టుమయ్య యనుచు జె మయుడు తరలి వెళ్లె మైనాకగిరి జేర వాసుదేవుడరిగె ద్వారవతికి భవన రచన కార్యభారమ్ము చేపట్టె తడవు సేయకుండ దనుజశిల్సి తె రత్సఖచిత చైత్య (ప్రాకారములు మణి మయములైన కుట్టిమములు గల్లి స్వర్ణమయములైన స్తంభకుద్యంబులు బహువిశాలములగు ప్రాంగణములు శ కలిగినట్టి సభను కనుల విందగురీతి దనుజ శిల్పి నిర్మితమ్ము జేసె పదియు నాల్ధునెలలు బట్ట రచన సేయ, అనుపమముగ కృష్ణుడడిగి నట్లు ర్‌ పలుగురాల కుద్యముల కాంతులందున జలములున్న చోట స్థలములనుచు భ్రాంతి గలుగజేయు ప్రాంగణమ్ముల నందు అమరజేసె శిల్పి అద్భుతముగ గ

వత సంక్షిప్ర మహాభారతము

నేర్పు మొజ దాని నిర్మాణమొనరించి

దితిజ గణము మోసి తెచ్చిపెట్ట

భువిని సాటిలేని భవన రాజమ్మును

పాదుకొలిపె నింద్రప్రస్థమందు (7 దివ్యశంఖమైన దేవదత్తము నిచ్చె

అసుర విశ్వకర్మ అర్జునునకు

పవన సుతునకిచ్చె ప్రతివీర హృదయాల

కలచి వైచునట్టి యలఘుగదను 8 అమిత ప్రీతురైన యమతనూజుని చేత

సత్కృతుల (గ్రహించి చనియె మయుడు

ధర్మసుతుడు సకల దైవ ప్రార్ధన జేసి

శుభముహూర్తమందు సభను జేరె ర్తి భూమి సురులకెల్ల భూరి దక్షిణలిచ్చి

పేదవారి కిచ్చి విరివిగాను

బంధుమిత్ర జనుల పరమప్రీతిగ జూచి

యమతనూభవుందు యశము గాంచె 10 ధరణి నాల్గుదిశల నరపాలులెల్లరు

స్వర్ణ రత్న వస్తు వాహనముల

మహితకాంతు లలర మయసభాస్థితుడైన

యమతనయున కిచ్చి రాదరమున £ క! సుబల మందపాల శునక మార్మండేయ

వ్యాస శుక సుమంత యాజ్ఞవల్క్య

రైభ్యకాదిమునులు రమ్య సౌధము జూడ

వచ్చి రెల్ల రింద్రప్రస్టమునకు 12

సభా పర్వము 55

యమసుతుండు వారి నతి భక్తి పూజించి

కడు ముదమ్ము తోద గౌరవింప

మునులు పాందుసుతుల ఘనముగా దీవించి

చనిరి వారి పుణ్య సదనములకు 18 నారదాగమునం

పారిజాత సుముఖ పర్వత రైవత

మునుల తోడ దేవమునివరుండు

నారదుండు పొందడు నందనులను జూడ

వచ్చి యొక్కనాడు ప్రణతులంది కక!

ధర్మజునకు రాజధర్మంబులను దెల్సి

సభను జూచి కరము సంతసించి

వాసవ యమ (బ్రహ్మ వరుణ కుబేరుల

సభలు రావు దీని సాటి యనియె 15

దేవ సభల నెల్ల తిలకించి యున్నట్టి

దేవ మౌని వాటి తీరులెల్ల

వర్ణనమ్ము జేసి వాటియన్నటి కంటె

మయుని సభయె మహిత మనుచు జెప్పి 16

అనఘ మి జనకుడు యమసభ యందుండి

ఇం[ద్రసభకు జనగ నిచ్చగించి

చేయుమనియె రాజసూయ యాగము నిన్ను

చేయుమయ్య తండ్రి చెప్పినటుల 17

జనతు డింద్రలోకమున కేగుటయె గాక

నీకు కీర్తి గల్గు నిహము నందు

అని వచిచి చనియె నమర మునీంద్రుండు

అంత పాందుసుతుడు సంతసమున 18

తన పురోహితుండు ధౌమ్యునితో బంధు

సచివ గణము తోడ సంప్రతించి

నిశ్చయించె యాగ నిర్వహణము జేయ

అండనుండు కృష్ణుడని తలంచి 19

ధర్మసుతుడు పిలువ ద్వారకావాసుండు

వచ్చి చేరె నింద్రప్రస్థ పురికి

రాజసూయ యాగ రాజమ్ము సలుపంగ

సమ్మతమ్ము తెలిపి సంతసమున లం జరాసంధ వధ

కవలు దిగ్విజయము కావింపగలవారు

లేశమైన శంక లేదు కాని

మగధ విభుని దర్పమడచగల్లిన వాడు

సింహబలుడు భీమసేనుడొకడె లై

కంస వధను దలచి కసిబూని యున్నాడు

మరువ డెపుడు నన్ను మగధ విభుడు

వాని ధాటికోడి వైరమ్ము తగదని

తరలి వెళ్లినాము ద్వారవతికి లం

పలువు రవని పతుల బంధించి నిత్యమ్ము

బలి యొనర్చుచుండు ఖైరవునికి

వాని జంపవలయు వసుధలో సొమ్రాజ్య

వైభవమ్ము బడయ వలయునన్న ర.

మారణాయుధముల మరణంబు లేకుండ

వరము బదసినాడు హరుని వలన

మల్ల యుద్ధమందు మహిమాన్వికుండైన

అనిల సుతుడె వాని నణచగలడు ల

చనెడు వాడ నేను అనిలజార్జునులతో

జయము గల్గు మనకు శంక లేదు

అనుచు దెలుప ధర్మ తనయు దనుమతించ

చనిరి వారు గిరివ్రజంబు జేర లర్‌ ఊరిలోన క్రొత్తవారు ప్రవేశింప

ముని యనుగ్రహమున (మోగునట్టి

భేరికాత్రయంబు భేదించి పరమందు

జొచ్చి రాగ్రహమున శూరవరులు 26 విప్రవేషములను విచ్చేయు వారల

గాంచి మగధవిభుడు కరము భక్తి

చేయనున్న పూజ స్వీకరింపకయున్న

కారణమ్ము దెలుపగోరె విభుడు 27

కృష్ణు దపుడు జెప్పె నృపతుల బంధించి

బలి యొనర్చునట్టి పొపి నిన్ను

వధము జేసి వారి బంధముక్తుల జేయ

దలచియున్న భూపతులము మేము 28

వీరు పాండుసుతులు భీముడర్జునుడును

మగధరాజ! నేను మాధవుడను

వెన్ను దటుల దెల్ప విని జరాసంధుండు

పరమ క్రుద్ధుడగుచు పలికెనిటుల 29

రణము నందు గెల్చి రాజుల బంధించి

బలి యొనర్చు టెటుల పాపమగును

మిరు కోరిరేని పోర సిద్ధము నేను

తెలుపు డెవరు తాకగలరు నన్ను 30

58 సంక్షిప్త మహాభారతము మాధవుండు పలికె మాలోని ఐలశాలి గోరుకొనుము నీవె ధారుణీశ అతడు మల్లయుద్ధమందు నిను జయించు నీదు గర్వమడగు నిక్కువముగ 81 విన్న మగధ విభుడు వీర్యదర్పముమిణ పెనగ గోరె పవన తనయుతోడ మల్లయుద్ధ రంగమాయితం బొనరింప తాకిరొకరి నొకరు భీకరముగ 82 గరుడపన్నగముల గజసింహముల మాడి శక్రవృత్రు లటుల విక్రమించి మల్ల యుద్ధమందు బల్లిదులిర్వురు పోర నేల నింగి మారుమోగె 88 పోరు సాగెనిటుల నీరేడు దినములు వీరవరుడు మగధవిభుడు బడలె సమయ మిదియె వాని జంపగా నని చెప్పె శ్రీధరుండు భీమసేను తోడ 84 అనిలతనయు దపుడు తన తండ్రి మదినెంచి తత్షసాద లబ్ధి త్రాణుడగుచు మగధ విభుని నూరుమాజులు తాడించి ధరణి గూల్చె రక్తధార లొలుక కెర్‌ వెరగుజెందు మగధ పురజనులకు కృష్ణు డభయ మిచ్చి మగధ విభుడు చెజను బెట్టినట్టి నృపుల విడిపించి మాగధు తనయు రాజు జేసె జనులు మెచ్చ 86

సభాపర్వము వీ అమిత క్రూరుదైన యవనీశు జంపించి భీము డర్జునుండు వెంట రాగ వాసుదేవు డింద్రప్రస్థంబునకు వచ్చె యమతనూభవుండు హర్ష మంద ౩7 పద్మనాభు డంత ద్వారకాపురి కేగ యమసుతుండు విజయయాత్ర కొజకు నాల్గుదిశల కంపె నల్వురు తమ్ముల తరలి చనిరి వారు దండు తోడ 88 వారి నాదరించి తోరంపు సిరులిచ్చి స్వస్తి బలుక రాజ్య పాలు రెల్ల విజయలక్ష్మి గొనుచు విచ్చేయు తమ్ముల నరసి సంతసిళల్లై యమసుతుండు 89 వైభవమున మించి వరుణ ధనేశుల ధర్మ విజితమైన ధనము తోడ రాజ్య పీరిపైన రవితేజమున వెల్లె పాండు తనయు డింద్రప్రస్థ మందు త౦ ఆస్తు లెల్ల పాండవా[గ్రజా! యాగమ్ము చేయవలయు ననుచు చెప్పుచుండ ఆ సమయము నందె అచ్యుతుం దరుదెంచె కుంతిసుతులు కరము సంతసిల్ల శ్షే రాజసూయ యాగం యాగ నిర్వహణము నందన్ని విధముల సొయపడుదుననియె చక్రధరుడు శౌరి అండనుండ జయము నిశ్చయమంచు యజ్ఞ దీక్ష బూనె యమసుతుండు త్తం

60 సంక్షిప్త మహాభారతము అవని పతులనెల్ల నామంత్రణము చేసి వారి విడిది కొరకు వసతులెల్ల సజ్జితమ్ముజేయ సహదేవు నియమించె రాజచంద్రు డింద్రప్రస్థ విభుడు శ్రి యమసుతుండు సల్పు యాగమ్ము తిలకింప తరలి వచ్చిరెల్ల ధరణి పతులు వేదవేద్యులైన విప్రవరేణ్యులు వైశ్య శూద్రు లింద్రప్రస్థమునకు డడ కరిపురమ్ము నుండి కౌరవేశ్వర భీష్మ విదుర ద్రోణ కౌరవేయ కర్ణ ప్రముఖ హిళులు సఖులు బంధుజనమ్ములు అరుగు దెంచి రటకు యాగమరయ జర్‌ ఉచితరీతి వారి కుపచర్య లొనరించి పరమ ప్రీతి తోడ పాండుసుతులు ఆదరించి వారి యాశీస్సులను గోర తృప్తులైరి కరము ఆప్పులెల్ల 46 విదుర ధార్తరాష్ట్ర భీష్మ ద్రోజాదుల పలు విధముల విధుల సలుప వేడి యమతనూభవుందడు యజ్ఞదీక్షను బూని తేజరిల్లె పరమ ద్‌ప్తి తోద తా వ్యాస యాజ్ఞవల్క్య పైల ధామ్యాదులు సకల యాగక్రియలు సలుపుచుండ రాజసూయ మొప్పె రమణీయముగ నార దాది మునులు శౌరి యంద నుండ శీత

సభా పర్వము 61 భూసురోత్తములకు భూరి దక్షిణలిచ్చి దానభోజనముల తనిపి జనుల సకల దేవతలను సంట్రీతులను జేసి యజ్ఞమాచరించె యమసుతుండు త్త యజ్ఞ పరిసమాప్తి యగుచుండ భీష్ముండు యమతనయుని తోడ ననియెనిట్లు సభను వెలసియున్న సర్వోత్తముని నీవు సత్కరించి పూజ సలుపవలయు ర్‌0 పుణ్యచరితు దట్టి పూజార్హుడెవ్వడో తెలుపవే యనంగ దేవవ్రతుడు మనుజరూప మూని మన మధ్య నున్నట్టి హరి యొకండె పూజకర్చుడనియె ర శిశుపాల వధ అంత ధర్మసుతుడు హరికి యర్హ్యంబిచ్చి శాస్త్ర విధిని పూజ సలుప జూచి, చేది రాజ్యవిభుడు శిశుపాలు డోర్వక జరిపెదేల పూజ జడునకనియె ర్‌2 వ్యాస ప్రముఖ మౌనివర్యు లెందతొ యుండ పరమయోగ్యులైన ప్రభువులుండ కల్లకపటమాడు గొల్లవానికి పూజ సలిపి వారి కెగ్గు సలిపినావు 58 ముసలితనము వలన మూధాత్ముడైనట్టి శాంతనవుడు చెప్ప సుంతయైన మంచి చెడుల మాట నెంచక యీ రీతి సలుపుచుంటి వనుచు చైద్యుడనియె రడ

60 సంక్షిప్ర మహాభారతము పరమ పురుషుదైన హరిని నిందించుట పాడిగాదిది శిశుపాల యనుచు హితవు చెప్పు ధర్మసుతుని లెక్కింపక దూజుచుండె హరిని దుష్టబుద్ధి ర్‌5్‌ అపుడు భీష్ముడనియె హరియె పూజార్హుండు సద్దుణములరాళశి జ్ఞాన జలధి విన్న చేదివిభుడు భీష్ముని బోనాడి కమలనాభు బిలిచె కయ్యమునకు 56 వాసుదేవుడంత వాని దర్వయముల నెల్లనుడివి సభికు లెల్ల వినగ శతము దాటెవీని మితి లేని దోషాలు సమయమాయె వీని సంహరింప ర్‌ అనుచు బల్ముచున్న హరి జూచి చైద్యుండు అనియె నాకు నిచ్చినట్టి కన్య నపహరించి నేడు న్యాయంబు బలుకంగ ఎగ్గు లేదె నీకు సిగ్గు లేదె 58 అటుల దూషణంబు లాదెడు శిశుపాలు సంహరింప తగిన సమయ మనుచు నక్రశిరము ద్రుంచి నట్టి చక్రము బంపె మురహరుండు వాని శిరము దద్రుంప 59 అగ్ని జ్వాల లెగయు నా చక్రధాటికి వాని శిరము శక్రైళ్లి పడియె భువిని దివ్యజ్యోతి వాని దేహంబు వెలువడి అబ్బనాభు దేహమందు జొచ్చె 60

సభాపర్యమ టె యమతనూభవుండు యజ్ఞపరిసమాప్తి సలిపి వెలిగె నంత శక్రుడటుల రాజలోక మతని ప్రస్తుతించగ కౌర వులకు మది నసూయ మొలకలెత్తె 61 విశ్వకర్మ చేత విరచితంబైనట్టి భవనమందు కౌరవాగ్రజుండు శిల్పి రచితమైన చిత్రంబు లెబుగక పలువిధముల భంగపాటు పడియె 62 కుడ్య ద్వారములను గుర్తింపగా లేక కుద్యమునకు తలను గొట్టుకొనియె జలములున్న చోట స్థలమంచు భ్రమియించి ముందు కేగి జలము నందు బడియె 63 కట్టు పుట్టము తడిగా వచ్చు వానిని చూచి నగిరి పాండదుసుతులు సతియు పాండవాగ్రజుండు వస్తభూషణముల భీము చేత బంపె ప్రీతి తోడ 64 దుర్యోధను మాత్సర్యం గజపురమున కేగి గాంధారి తనయుండు తాను పడిన పాటు తలచి, తలచి పాండుసుతుల వైభవంబును తలపోసి మసలిపోయె లజ్జమత్సరముల 65 అన్నపానములను త్యజియించి వగజెందు కౌరవాగ్రజన్ము గాంచి శకుని చింత దీర్చ రాజు చెంతకు గొనిపోయె ధార్తరాష్ట్ర డనియె తండ్రి తోడ 66

పాండుసుతులు వైభవంబున దివిజేంద్రు మించియున్న వారలెంచి చూడ ధరణి నాల్గుదిశల నరపాలులెల్లరు వారి మిక్రులైరి వసుమతీశ! 67 వారి భాగ్య మేను వర్ణింపగాజాల చూచినాద రాజసూయమందు వారి కలిమి బలిమి వైభవంబుల జూచి రగులు గుందెతోడ బ్రతుకజాల 68 శకుని జెప్పెనంత సకల పాండవ శ్రీని మో వశంబు జేతు మేదినీశ మాయజూదమందు మహిమాన్వితుడ నేను ద్యూతమన్న ధర్మసూతికి కడు ప్రీతి కపట మెఖుగ డతడు కౌరవేశ అందువలన వాని వ్యాజంబులో గెల్చి వారి సిరుల నీదు వశము జేతు 70 ధార్తరాఘ్లు డంత తండ్రి పొదములంటి శకుని జెప్పినటుల సలుపు మనియె విభుడు జెప్పె నీతివిదుడైన విదురుండు సమ్మతించె నేని సలుపుడనుచు 71 విదురుదెపుడు పాండవేయ పక్షమె పల్కు ఎట్టి కైతవమున కియ్యకొనడు సలుపనీయ వేని శకుని చెప్పిన రీతి ప్రాణములను విడుతు వహ్ని జూచ్చి 79

సభా పర్వము 65 అనుచు బల్కు సుతుని ఆవాసమున కంపి విదురు నేకతమున విభుడు చూచి అగ్రసుతుని శకుని యభిమతమ్మును దెల్బ తగదు జూదమనియె ధర్మమూర్తి 78 జూదమాడ కల్లు సుతులలో కలహంబు వంశనాశనమ్ము వసుమతీశ! దుష్టబుద్ధి శకుని దుర్మంత్రణము నీవు త్రోసి పుచ్చవలయు దురితమనుచు ౯7త్తీ విభుడు చెప్పెనపుడు విదుర! భీతిల నేల నీవు శాంతనవుడు నేను గలుగ దుర్న్మయంబు లెటుల దొరకొను జూదంబు జరుగు గాదె స్నేహభరిత రీతి 75 జూదమునకు ఆహ్వానం ఇంద్రప్రస్థ నగరికేగి పాండవులను పిలిచి రమ్ము నేను పిలిచినటుల విన్న విదురు డంత భీష్మున కెటిగించి తరలి వెళ్లై ధర్మశనయు బిలువ 76 యమసుతుండు విదురు నాదరంబున జూచి కారణంబు దెలిసి కలత జెంది జూద మాడు నపుడు భేద మేర్చ్పడు, కాని వెడలవలయు తండ్రి పిలువనంప 77 అనుచు కరిపురేశు నామంత్రణము మేర కదలె ధర్మసుతుడు విదురు వెంట తరలి రతని తోడ తమ్ములు నల్వురు (ద్రుపద పుత్రియును పురోహితుండు 78

656 సంక్షిప్త మహాభారతము కౌరవేశ్వరునకు గాంధారికిని మొక్కి భీష్మద్రోణులాది వృద్ధజనుల పదములంటి తక్కు బంధుమిత్రుల నెల్ల నాదరించె మిగుల యమసుతుండు 79 పరమచకితలైరి పాంచాలసుత జూచి కౌరవేంద్రసుతుల కాంతలెల్ల గడచె తొలిదినంబు జ్ఞాతి వైరము పొడ సూప కుండ రాజసుతుల నడుమ 80 మరుసటి దినమందు కురు సభాంగణమున యమతనూజు కౌరవా(గ్రజుండు పిలిచె జూదమాడ ప్రియము లొల్మెడు రితి తగదు ఆడననియె ధర్మసుతుదు 81 నీతివర్జితములు నికృతియు జూదంబు పాపకారకములు పార్థివులకు, వాని వలన భేదభావంబు గల్గును కనుక నాడ కూడ దనియె నతడు 82 శకుని యనియె నంత సమరంబు జూదంబు ఒక్క రూపుగాదె యుర్విలోన అపజయమ్ము గల్లు నని శంక గల్గెనే ఆడజంకుచుంటి వవనినాధ! 88 ములుకు లటుల నాటు పలుకుల మదిరోసి ఆదనియ్యకొనియె యమసుతుండు ధార్తరాష్టుడనియె తనకు మారుగ జూద మాడు తనదు మేనమామ శకుని 8డీ

సభా పర్వము 67 దాని కియ్యకొనియె ధర్మతనూజుండు వారలాడిరంత పణము లొడ్డి సాగు ద్యూతక్రీడ సౌవార్దమగు రీతి ననుచు చూడ వచ్చి రాప్త జనులు 85 భీష్మ ద్రోణ కౌరవేశ్వర కృప ముఖ్యు లధివసింప నున్నతాసనముల (క్రీడ వివరములను ధృతరాష్షుడెబుగంగ చెప్పె విదురుడతని చెంత నుండి 86 ధర్మజ పరాజయం కపటమూని శకుని గాంధారి సుతునికై పణములన్ని గెలువ వరుసగాను ధర్మపుత్రు డోడె ధనరత్నరాసుల వారువముల కరుల వాహనముల 87 జరుగుచున్న దెల్ల పరికించి విదురుండు విహ్వలించి చెప్పె విభుని తోడ ఖలుడు నీ సుతుండు కపటి సౌబలు గూడి పాండవులకు సలుపుచుండె హాని 88 ఇపుడె జూదమాపి యిరువంశముల గావు మనుచు విన్నవింప, జనవరుండు వినియు నూరకుండె తనయునిపై (పేమ కారణమున మంచి గాన లేక 89 ద్యూత మాపుమనుచు దుర్యోధనుని గోర దుష్టబుద్ధి విదురు తూలనాడె మాగృ్భహంబునందు మనుచు పాండవ పక్ష ముననె మాటలాడ జనునె యనియె 90

న సంక్షిప్ర మహాభారతము ఏమి చేయ శక్తి లేమి యూరకనుండె వికలచిత్తుడైన విదురుడపుడు ధనము లెల్లనోడి ధర్మసూనుడు రాజ్య మొడ్డి దాని కూడ నోటువడియె 9 అంత నోడె నాత డనుజుల సహదేవు నకులు నింద్రతనయు ననిలసుతుని తననె యొడ్డి యోడె ధర్మతనయుడంత నతని జూచి శకుని యనియె నపుడు 92 ఊరకుంటివేల ఉర్వీశ (ద్రౌపది ధర్మపుత్ర నీదు ధనము గాదె విన్న ధర్మసుతుడు విగత వివేకుడై ఒడ్డి యాజ్ఞసేని నోటుబడియె 98 శకుని పన్నినట్టి జాలమ్ములో జిక్కి శక్తులెల్ల బాసె చక్రవర్తి విన్నదనము జెంది విధి వంచితులమంచు భగ్నహృదయులైరి పాండుసుతులు 94 భీష్మద్రోణకృపులు విహ్వాలత్వముజెంద విదురుడమిత వ్యధిత హృదయుడాయె సభికులెల్ల పరమ సంతప్త హృదయులై అశ్రుభరిత నయను లైరి యపుడు 95 హర్షప్రులకితాంగులైరి దుశ్శాసన కర్ణ సైంధవాది కపటులెల్ల దాసులైరి పాండు తనయులు తనకంచు కౌరవాగ్రజుండు కావరమున 96

సభా పర్వము ౮ ద్రౌపదీ పరాభవం విదురు జూచి పలికె వేగమె కొని రమ్ము దాసియైన (ద్రుపద తనయ నిటకు అంత విదురు డనియె నాగ్రహావేశుడై పాపకూపమందు బడెదవేల 97 అవని నెల్ల నేల నర్దత గలయట్టి పాండుసుతుల సతిని పరిభవించి వంశనాశపధము బట్టుచుంటివి నీవు మాయబన్ని శకుని నాయపడగ 98 విదురు డటుల బలుక విని ధార్తరాష్తుండు ప్రాతికామి బిలిచి పలికెనిట్లు అంతపురికి నేగి అతివను గొని రమ్ము ద్యూతవిజితదాసి ద్రుపదసుతను 99 వాడు పాండుసుతుల పత్ని యొద్దకు నేగి జరిగినట్ట్‌ దెల్ల నెలుక పజచి కౌరవాగ్రజుందు కాంతరో నిను సభా భవనమునకు పిలువ బంచెననగ 100 మొదట నన్ను నోడి పిదప తన్నోదెనో మొదట తానె ఓడి పిదప నన్ను పణము జేసి ఓటువడియెనో యెటిగింపు తెలియ దలకు ననుచు కలికి జెప్పె 101 (ప్రాతికామి సభకు వచ్చి ధర్మసుతుని అడుగ బదులు చెప్పడాయె నతడు ధార్తరాష్ట్ర డనియె ద్రౌపదియే వచ్చి అడుగదలచినట్టి దడుగుమనుము 102

70 సంక్షిప్త మహాభారతము ప్రాతికామి దెల్ప పాంచాలి వెజిగంది వచ్చి సభకు నేక వస్రయయ్యు శిరము వంచి నిలిచె కురుపితామహు చెంత పాండుసుతులు తలలు వాల్చి యుండ 103 దుస్ససేనుడంత దుర్యోధనుని యాజ్ఞ దరికి రాగ పదతి పరుగులిడుచు కంపితాంగి యౌచు గాంధారి దరికేగె కలికి వెంట నరిగె కౌరవుండు 104 ఏక వస్త్ర నన్ను తాకుట తగదంచు పరుగులిడెడు సతిని సరకు గొనక కులవధూటి కృష్ణ కుంతలంబులబట్టి ఎల్లవారి మధ్య కీద్చి తెచ్చె 105 ధర్మమార్గచరుల ధర్మపత్సిని నన్ను భరత వంశవరులు గురువులున్న కొలువులోని కీద్చె కులపాంసనుడు నేడు వీరలెల్ల కనియు నూరకున్న 106 అనచు తలచి వగచి అసహాయ పాంచాలి కలత జెంది సభను నిలచియున్న అనిలసుతుడు ధర్మతనయుని దూష్వించె ఇంత ముప్పుదెచ్చి తీవెయనుచు 107 కనలుచున్న పవన తనయుని తిలకించి వాని శాంతుబేయ పార్థుడనియె జూదమాడ బిలువ కాదనగలదెట్లు అపజయంబు గలుగుటతని తప్పె! 108

సభా పర్వము 71 ద్రుపదసుతను జూచి ధుర్యోధనుని తమ్ము దగు వికర్ణు దనియె నార్యులార! ఐదుగురికి భార్య యైన వనిత నొడ్డి తప్పిదంబు జేసె ధర్మసుతుడు 109 అదియెగాక మున్నె యత నోటుబడియుండి ఉవిద నెటుల పణము నొడ్డగలడు ధర్మవిజిత గాని తరుణి నిచ్చోటకు తెచ్చు టనుచితమని తెలియలేరె! 110 కర్టుడనియె నంత కాంత కొక్కడె భర్త యుండ వలయు పలువు రున్న దీని కులటయని తలంచి వలువ లొల్బియునైన సభకు నీద్వ ధర్మ సమ్మతమ్మె |! దుస్పసేను జూచి దుర్యోధనుండంత ఒలుచు మివు దీని వలువ లనియె వాడు లాగుచుండ వనిత జఘన సీమ బాయకుండ వలువ వచ్చుచుందె 112 వలువ పర్వతమ్ము వలె వచ్చిపడుచుండ దుస్ససేను డలసి తూలిపడియె అనిలసూను డంత ఆ(గ్రహావేశుడై ప్రతిన జేసె నిటుల వాని జంప 113 భీమ ప్రతిజ్ఞ సభికులెల్ల చూడ సతిని ద్రోవదినిట్లు చేసినట్టి దుస్ససేను జంపి విపుల వక్షసీమ విదళించి లోనున్న రక్తరురుల బీల్చి త్రాగువాడ 114

72 సంక్షిప్త మహాభారతము అరిభయంకరమ్ము నతిమానుషమునైన అనిల సుతుని శపధ మాలకించి చిత్తవిభ్రమంబు జెంది చూచెడు సభా సదుల జూచి బుధుడు విదురుడనియె 115 కౌరవానుజుడు వికర్ణుండు (ద్రౌపది యడిగినట్టి ప్రశ్న కర్థమెంచి తెలియజెప్పరేని కలుగు నన్ఫతదోష ఫలము గాన మాకు తెలుపనగును 116 ఒకరైన పలుకకున్న వేదన జెందు తరుణి జూచి కురుపితామహుండు అనియె నీదు ప్రశ్నమున కుత్తరము జెప్ప ధర్మసుతు డొకండె తగును తల్లి 117 కర్టు డనియె నంత కలికి! యేవురు భర్త లుండ దగదు సతికి నుర్విలోన ఆలి నోటు పడని యట్టివానిని నీవు బదయు మింక నీకు భర్తగాగ 118 ములుకు లటుల నాటు పలుకుల మదిరోసి హరిణ మటుల వదకు నతివ జూచి రమ్ము కల్కి నాదు రంభోరుతల మెక్కు మనుచు బిలిచె కౌరవాగ్రజుండు 119 కావరమున కన్నుగానక యీ రీతి సతిని పరిభవించు శరుని జూచి తాళలేక వాయుతనయుండు క్రుద్దుదై కొలువు దద్దరిల్ల పలికనిటుల 120

సభా పర్వము భి తామసమ్ము మిజణ తనయూరు తలమున పాండవేయ పత్ని నుండబిల్భ్చు పరమపాపి వీని భగ్న్నోరుజేయుదు ఘన గదాభిహతిని కదనతలిని 121 తోచ సాగెనపుడు దుర్నితమిత్తము లెన్నా ఘూక కాక తతులు కూయసాగె ఆరి పోదొడంగె నగ్నిహోత్రంబులు స్త్రీ జనములు తప్త చిత్తలైరి 122 కలత జెంది యంత గాంధారి ధృతరాష్త్ర చెంత కేగి వివరమంత దెలుప ద్రుపదసుతను బిలిచి దుఃఖమ్ము వారించి కూర్మి వరము లిచ్చి కోరుమనియె 123 ధర్మమూర్తి ధర్మతనయుడు దాస్యంబు బాయవలయు ననియె పంకజాక్షి మరొక వరము వేడుమనగ (ద్రౌపది గోరె దాస్యముక్తి యతని తమ్ములకును 1124 ఈ వరమ్ము లిచ్చి యింక గోరుమనగ క్షత సతికి రెండు చాలుననియి అతివ ధర్మనిరతి కధిపుండు ముదమంది తిరిగి యిచ్చె వారి సిరులనెల్ల 125 సతికి నృపు డొసంగ సంప్రాప్తమైనట్టి సిరుల గొనుట మనకు సిగ్గు గాదె రణము నందు గెల్పి రాజోచితంబుగా అవని గెల్తుమనియె ననిలసుతుండు 126

74 సంక్షిప్త మహాభారతము ధర్మసూనుడతని తగదంచు వారించి కౌరవేశు నెడల గారవమున నిజపురమున కేగి నెలత తమ్ముల గూడి రాజ్యమేలు చుండె ప్రజలు మెచ్చ 127 కౌరవాగ్రజుండు కరిపురంబున కర్ణ శకుని దుస్ససేన సైంధవులను కూడి మాటలాడి కురురాజు దరికేగి పలికె నిటుల మర్మ్శ్మభాషణముల 128 రాజ్య మిచ్చి పాండురాజ పుత్రుల కీవు మేలు జేసినావు మిక్కుటముగ కాని జరిగినట్టి దాని మరచివారు మిత్రభావ మూని మెలగగలరె 129 గాండివంబు దాల్చి పాండవ మధ్యముం డలఘుగదను బూని యనిలసుతుడు నిలువ వారి నెదిరి గెలువజారిన వారు లేరు జగతిలోన కౌరవేంద్ర 180 రెండన మాలు జూదం అట్టి శత్రువులను నెట్టులైనను హీన బలుల జేయవలయు ఛలము జేసి కనుక మరల జూదమునకు వారల బిల్చి వారి రాజ్యరమను బదయవలయు 181 సుతుడు వేడనటుల ధృతరాష్తుడొడబడి 'ప్రాతికామి ననుప పొండుసుతులు తండ్రి పనుపుసేయ తమ ధర్మమని యెంచి వెడలి రతని వెంట పడతి తోడ 1382

సభాప్వమ దే ద్యూతనియమములను దుష్టబుద్ధి శకుని జెప్ప ధర్మసూను డొప్పుకొనియె అపజయంబు గలుగ విపిన వాసముజేయ వలయు పదియు రెండు వత్సరములు 1388 అంతనొక్క వర్ష మజ్ఞాతవాసమ్ము జరుప వలయు నెవ్వ రెరుగ కుండ బయలు వడిన తిరిగి వనము నజ్ఞాతమ్ము సలుపవలయు ముందు సలిపినటుల 134 మాయ జూదమందు మరల ధర్మజు డోడె వనిని నుండ జనిరి పాండు సుతులు వారి వెంట జనిరి పాంచాలి ధౌమ్యుండు అపశకునము లొదవె హస్తిపురిని 135 అమరమౌని బల్మె నంబరంబున నుండి విన్న పౌరులెల్ల విహ్వలింప కదన మావహిల్లు పదునాలుగవ యేడు పాండుసుతులు జయము బదయగలరు 186 గహనవాసమందు కష్టములకు కుంతి తాళ జాల దంచు తన గృహంబు నందు నుండ విదురు డామంత్రణము జేయ పాండురాజ మహిషి యుండె నచట 187 పాండుసుతుల తోడి వైరమ్ము కొని తెచ్చు కొనీన సుతుని గూర్చి కుందుచున్న విభుని జూచి చెప్పె విదురుండు రాజేంద్ర! వంచనమ్ము జేయ మంచి యౌనె 186

76 సంక్షిప్త మహాభారతము ధర్మసుతుని అతని తమ్ముల బిలిపించి వారిదైన రాజ్యభాగమిచ్చి మనుట మేలనంగ వినియు నూరకయుందె విభుడు పాందుసుతుల బిలువకుండ 139 ాణాాానముధిళనా-లాాాా

ను అరణ్యవాస పర్వము అరణ్యవాసారంభం విపిన వాసమునకు వెడలు కౌంతేయుల బాసి బ్రతుక తమకు భారమనుచు చనిరి వారి వెంట వనముల వసియింప నగరి వీడి హస్తి నగర జనులు క్‌! దుష్టబుద్ధలైన దుర్యోధనాదులు కపట వృత్తి రాజమపహరింప పెద్దలైన భీష్మ విదుర ద్రోణాదులు ఊరకుండి రేమి కారణమ్ము ఖై దురితచిత్తుడైన దుర్యోధనుని రాజ్య మందు నుండ మాకు మనసు రాదు అనుచు బల్కి వారి ననుగమించెడి పొర జనుల జూచి ధర్మతనయు దనియె తె మీరు జూపు కరుణ గౌరవాదరముల నలరె మా మనమ్ము లార్యులార కాని కష్టతరము కానన వాసమ్ము మీరు సలుపలేరు మిత్రులార త్త వారి నటుల నిలిపి పాండవజ్యేష్టుండు కదలి ముందు కేగి గంగదరిని విడిసి యుండజూచి విప్రులు కొందజు శిష్య గణము తోడ చేరవచ్చి క్‌ పాపి ధార్తరాష్త్ర పరిపాలితంబైన భూమి నుండ లేము స్వామి మేము పూతచరితులైన మీ తోడ కాలమ్ము గడప దలతుమయ్య కాననమున 6

78 సంక్షిప్త మహాభారతము అనెడు బ్రాహ్మణులకు యమతనూజుడు చెప్పె బ్రతుకు దుష్మరమ్ము వనములందు క్రూర మృగము లుండు ఘోరాటవుల యందు భయము పొంచియుండు పగలు టేయి ౮ అదియెగాక సిరుల నన్నియు గోల్పోయి ఏమి లేని వార మిపుడు మేము పుణ్యులైన మిమ్ము పోషింప గలమెట్లు అనిన బలికి రిట్లు అవని సురులు 8 మానుడయ్య చింత మా పోషణము గూర్చి వనిని కందమూల ఫలము లుండ ధార్త రాష్ట్ర పాలితంబైన రాజ్యమం దుండ జులమయ్య పాండుతనయ! ం్ర మరల మరల వేడు ధరణి దేవుల పోష ణంబు నెటుల చేతు ననుచు వగచు ధర్మసుతుని తోడ ధౌమ్యు దాదిత్యుని తలచుమయ్య ఫలము గలుగుననియె 10 ఆత డటుల చేయ జ్యోతి స్వరూపుండు సంతసిల్లి వచ్చి చెంత నిలచి అక్షయముగ నెప్పు డశనమ్ము సమకూర్చు న్థాలినొకటి యిచ్చె సదయుడగుచు 11 పరమ హర్షమంది పాండవ జ్యేష్టుండు పుడమిసురుల నిష్ట భోజనముల తృప్తి పరచి కొన్ని దినము లచ్చట నుండి కామ్యక వనమునకు కదలి వెళ్లె 19

అరణ్యవాస పర్వము 79 ఆ వనమ్ము నందు అసుర కిమ్మిరుండు అమిత బలుడు బకుని యనుజుడాకడు అగ్రజాంతకుదగు ననిలసూనుని జూచి తాకె వాని జంప భీకరముగ 18 పోరు ఘోరమాయె వీరులిద్దరి మధ్య భగ్నమాయె పాదపములు శిలలు పటుతరముగ దనుజు కటి కంరముల బట్టీ వాని హత మొనర్చి వాయుసుతుడు కేడీ కరిపురంబునందు కురురాజు భయమంది విదురు నడిగె పొండవేయు లిపుడు ఏమి సేయగలరా యెతిగింపుమాయని విదురు డతని కిటుల బదులు చెప్పె 15 గాడు పట్టి క్రీడి గదయు గాండీవమ్ము బూనిరేని ధరణిలోన వారి నెవ్వరైన గెల్వ నేరరు వారితో కోరి తగవు తెచ్చుకొనుట మేలె 16 దుష్టచరితుదైన దుర్యోధనుడు కర్ణ శకుని దుస్ససేన సహితుదడగుచు చిన్ననాటి నుండి చేయని నేరమ్ము కలదె వారితోడ తలచి చూడ క్షే? కాలయాపనమ్ము కాకుండ నికనైన వారి బిలిచి రాజ్యభాగమచ్చి వంశనాశనమ్ము వారింప వలెనంచు విదురు డనగ విభుడు మదిని రోసి 185

80 సంక్షిప్త మహాభారతము మా హితమ్ము నీవు మదిగోర వెన్నడు పాండవేయ పక్షప్రాతి వైతి కన్న సుతుని విడువ నెన్నటికిని నేను నీ సహాయ మొల్ల నేను విదుర! 19 అనుచు తూలనాడి మనుజేంద్రు డతనిని ఇష్టమైన చోట కేగుమనగ వదలి వెళ్లెనతడు కామ్యకవని నున్న పాండుసుతుల ధర్మపరుల కడకు 20 అతని జూచి వార లత్యాదరంబున ఉంచుకొనగ నాతదుందె వనిని ధర్మరహితులైన ధార్తరాస్తుల వీడి సుజనులైన పాందుసుతుల యొద్ద. ల విమలబుద్ధిశాలి విదురుడు లేకుండ మనుట కష్టమనుచు మదిని దోప సత్వరముగ బిలువ సంజయు బంపించె కౌరవేశ్వరుండు గహనమునకు 22 విదురు డరిగెనతని వెనువెంట నగరికి అతి ప్రసన్నుడాయి నంధనృపతి. వారలిర్వురింక పాండుపుక్రుల బిల్చి రాజ్యభాగమిత్తురనుచు దలచి 28 కౌరవాగ్రజుండు కర్ణదుశ్శాసన సొబలులను గూడి సంప్రతించి అడవిలోన నిస్సహాయులైయున్నట్టి పాండుసుకులపైకి దండు వెడలి ర!

అరణ్యవాస పర్వము 81 సలుప వలయునిపుడె శత్రు సంహారమ్ము అనుచు సమరమునకు నాయితమ్ము చేయుచున్న వారి చెయిదములను దివ్య దృష్టి నెజిగి వ్యాసబుషివరుండు 2ర్‌ కరినగరికి వచ్చి కౌరవాగ్రజు దూటి అనుచితమ్ము యుద్ధమనుచు జెప్పి పుడమి అేని జూచి కొడుకు దుర్ష్ణయముల నాపుమనుచు జెప్ప నాత డనియె 26 దురితచిత్తుడయ్యు దుర్యోధనుడు నాకు కొడుకు గాన వాని విడువజాల నీవె బుద్ధిగజపి నీతి మార్గము దప్ప కుండ జేయు మయ్య కూర్మితోడ 27 మైత్రేయ ముని శాపం మౌని దెల్చెనంత మై(క్రేయుడను నొక్క బుషివరుండు వచ్చునిటకు వేగ అతడు జెప్పు నీతి నాచరించిన మేలు కలుగు నెల్లరకును కౌరవేంద్ర 28 మౌని దెల్పినటుల మై(శ్రేయు డరుదెంచి పాదపూజలంది పలికెనిటుల వచ్చినాడ నిటకు పాండవేయుల జూచి మహితబలుల ధర్మ మార్గచరుల 29 వనములందు నున్నవారల రావించి కలసియున్న మాకు కలుగు మేలు అని వచించుచున్న మునిక్రేష్టు తిలకించి కౌరవాగ్రజుండు కావరమున 80

82 సంక్షిప్రమహాభారతము మునిని ధిక్కరించి ముంజేత తొడగొట్ట తాపసుండు కినిసి శాపమిచ్చె వాయుసుతుడు చేయు నీ యూరుభంగమ్ము అలఘు గదను బూని యాహవమున త్ర విహ్వలించి కౌరవేంద్రుండు శాపమ్ము ఉదుపుమనగ మునివరుడు వచించె శరుడు వీని కెపుడు సమబుద్ధి గల్గునో కలుగునపుడు శాపఫలవిముక్తి. తబ బంధు జనాగమనం పాండుపుత్రు లడవి పాొలైతిరని విన్న బంధుజనులు కరమువంత జెంది వారి జూడ జనిరి పాంచాల యాదవ వృష్టి భోజ వంశ వీరవరులు 98 పాండు రాజసుతుల పాంచాల సుతనిట్లు పరిభవించి యడవి పాలుజేసి దుష్టకర్ములైన దుర్యోధనాదుల మరణ కాల మింక దరియ వచ్చె త4 వారి రక్తరురుల పానమ్ము సేయంగ నాతురముగ నుండె నవని యనుచు వాసుదేవు డాది బంధుజనము లెల్ల పాండు సుతుల తోడ పలికిరపుడు తర్‌ ద్రుపద రాజపుత్రి రుక్కిణీధవుజూచి పొందడు సుతుల ముందు నిందు సభను దుస్ససేన కర్ణ దుర్యోధనాదుల వలన తాను పడిన పరిభవములు 86

అరణ్యవాస పర్వము 83 చిన్ననాడు భీమసేనుని జంపంగ పన్నినట్టి కుట్రలన్ని దెలిపి వారణావతమున పాండవులను లక్క యింట గాల్బబూను టెబుక పరచి త ఇంత చేసినట్టి ధృతరాష్ట్ర సుతులపై బలము జూపరేల పాందుసుతులు అనుచు నీరుగారు కనుల నొత్తు కొనుచు పలుకు పాండవేయ పత్ని తోడ 88 వాసుదేవుడనియె వంతమానుము నీవు అర్జునుండు భీము డాహవమున హతమొనర్చువారు ధృతరాష్తు బలముల నిక్కువముగ జరుగు నిటుల తల్లి 89 ధృష్టద్యుమ్ను డనియె ధృతరాష్తు బలముల నర్జునుండు నేను ననిలసుతుడు దురము నందు జంపి దుఃఖభోపశమనమ్ము చేతుమమ్మ నిజము చెల్లి నీకు 40 వాసుదేవు డనియె పదిమాసములు నేను సాల్వుతోడ రణము సలుపుచుండి దూరమైతి మోకు దుర్వ్యసనము సాగె జరుగదిటుల నేను సరస నున్న శ వారి వీడి హరి సుభద్రాఖిమన్యుల గొనుచు ద్వారవతికి చనియెనపుడు (ద్రౌపదీ తనయుల తన వెంట గొనిపోయె విపిన భూమి నుండి ద్రుపదసుతుడు శ2

తే సంక్షిప్త మహాభారతము

పాండవేయులంత ద్వైతవనమ్మున

కరిగి కొన్నినాళ్లు గడువుచుండ

వారి జూడనటకు వచ్చె మార్కండేయ

మౌని సత్తముండు మహితయశుడు 43 కౌరవేంద్రు సుతులు కపట ద్యూతమునందు

పుడమి నపహరించి అడవి కనుప

శక్తివంతులయ్యు సమయంబు పాటించు

పాందుసుతుల ధర్మపరత జూచి శ్తేడ్తే తండ్రి మాట నిలుప తన రాజ్యమును వీడి

నాడు రాముడుందె నదవులందు

అట్టివాడ వైతి యమసుతా నీవంచు

నతని ప్రస్తుతించె యతివరుండు శీర్‌ వనములందు నుండు మునిసత్తములు వచ్చి

పాండు సుతుల ధర్మపరత జూచి

సంతసించి పుణ్యచరితమ్ములను జెప్పు

చుండ జీవితమ్ము సుకరమాయె. 46 ద్రుపదతనయ తమకు దుర్యోధనాదులు

సలిపినట్టి దురితములను తలచి

వార లతులమైన భాగ్యరాసుల యందు

తేలియాడి రాజ్యమేలుచుండ త్త ధర్మ నిరతులైన తామంతయును బాసి

వనుల క్షేశములను బదుచునుంట కేమి కారణమ్ము ఈ రీతి మనకెగ్గు సేయ విధికి నటుల న్యాయమౌను 48

అరణ్యవాస పర్వము 85 కరి సహస్రబలుడు అరిభయంకరుదడయ్యు నేమి సేయలేక భీముడుండె అస్తక్రీడయందు అసమాన కుశలుండు అర్జునుండు తిరిగె ననదవోలె త్తం వీరవరులు కవలు విక్రమోపేతులు తిరుగుచుండి రిచట దీనులటుల అవసరమ్ము కలిగినపుడు జూపని శక్తి కలుగ రాజులందు ఫలితమేమి. 50 దీను లటుల వారు తిరుగాడుచుండుట క్రీవె కారణమ్ము కావె చూడ ఎంత కాలమిటుల వంతలపాలొచు ఉపశమమ్ము దాల్చి యుండవలయు ర్‌ అనెడు ద్రుపదసుతకు యమతనూజుడు చెప్పె తగదు ధర్మపధము తప్పిచనుట దైవదూషణమ్ము ధర్మాధిక్షేపమ్ము సలుప దోషమగును జనుల కిలను 52 అపుడు భీమసేను డనియె ధర్మజు తోడ తాల్మి యెంతవరకు ధర్మపుత్ర సమయఖభంగ భీతి కమదమంబులు జూప పగఖు మనల నల్పబలుర మనరె 53 దురితచిత్తులైన దుర్యోధనాదుల పైన జూపు కరుణ వ్యర్థమగును శక్తి జూపి శత్రు సంహారమొనరించి రాజ్య మేలుమయ్య ప్రజలు మెచ్చ రశ

86 సంక్షిప్త మహాభారతము కదన రంగమందు గాండీవమును దాల్చి అర్జునుండు నిలచి యరుల దునుమ నేను గదను బూని నిలువంగ మనకెట్లు జయము గలుగకుండు జనవరేణ్య! ర్‌5 రాజ్య పీరమెక్కి ప్రజలను కాపాడి దేవబ్రాహ్మణులను తృప్తి పజచి క్షతియోచితముగ ధాత్రిపాలన జేసి అంచితముగ యశము గాంచుమయ్య 56 వినిన ధర్మపుత్రు దనిల సూతికి జెప్పె నలతిగాదు కౌరవుల బలమ్ము భీష్ము డస్త్రగురుడు గ్రీష్మ కాలాదిత్య సములు అనిని వారి సములు లేరు ర్‌7 నిరుపమానబలుడు నిర్భీద్యకవచుండు కదన భీకరుండు కర్ణుడుండె భూరి(శవుని బోలు భూపాొలు రెల్లరో వీరవరులు గలరు వారి వైపు 58 అటుల వారు మూటలాడుచుండగ వచ్చె వ్యాస మునివరుండు వారి కడకు అనియె నతడు ధర్మతనయుతో మాఖీతి నపనయింప వచ్చి నాడనిటకు ర్‌ం శాంతనవుడు కుంభసంభవ కర్టులు పరమ వీరులౌట వారి గెలువ దేవతలను గొలిచి దివ్యాస్తముల బొంద బంపు విజయు, నతడుపడయు సిద్ధి 60

అరణ్యవాస పర్వము 87 మౌని నాధుడంత మంత్రోపదేశమ్ము చేసి ధర్మజునకు జెప్పె దీని వలన నరుడు దేవతలను తృప్తుల జేసి వలయు నస్తములను బదడయగలడు. 61 మారు పెద్దకాల మీ చోటనే యుంట ప్రాణికోటి కంతరాయమౌను కనుక చనుడు వేరు వనములో నివసింప ననుచు చెప్పిచనియె ముని వరుండు 62 పాండుసుతులు మౌని వచనమ్ము తలదాల్చి వారలున్న ద్వైతవనము వీడి ధౌమ్య సహితులౌచు కామ్యకవనమందు నుండిరచట పరిజనులను గూడి 68 అచటనొక్కనాడు యమతనూభవు డింద్ర తనయు దరికి బిలిచి మునివరుండు తెలిపినటుల నీవు దివ్యాస్తముల బొంద చనుము తపము సలుప వనుల కనియె 64 మౌని దత్తమైన మంత్రమ్ము గ్రహియించి ధర్మసుతుని యాన తలను దాల్సి హిమనగమును దాటి యింద్రకీలాద్రిని గడచిపోవనున్న గగనవాణి 65 వగవలదు ముందు కీచోటనే యుండు మనుచు బలికె మధురస్వరము తోడ పుష్పవృష్టి గురిసె పుడమియంతయు నిండ అర్జునుండు విస్మయంబు జెంది 66

88 సంక్షిప్తమహాభారతము అరయుచుండ నొక్క తరుమూలమందున కృశతనుండొకండు వృద్ధమౌని యున్న జూచి వాని సన్నిధి కరుదెంచి (ప్రణతు లిడగ నతడు పార్టు జూచి 67 వీతరాగులైన విషఫ్రోత్తములె యుండు వనికి నాయుధుడవు వచ్చినావు విడుము వానిననుచు వి(ప్రడాదేశింప వినియు నూరకుండె వీరవరుడు 68 వాని'ధైర్యమునకు పాకారి ముదమంది అసలు రూపు జూపి అనియెనిటుల ఇష్టమైన వరము లిచ్చువాడను నేను తెలుపుమయ్య యేమి వలతు వనగ 69 సవ్యసాచి గోరె దివ్యాస్తనికరంబు నాకవిభుడు పుణ్యలోకములను వేడు మిత్తుననగ విజయుండు బదులిచ్చె వాని నొల్ల నేను పాకవైరి 70 మాయజూదమందు మహినెల్ల గోల్పోయి పరిభవముల బొంది పడతి తోడ అడవులందు తిరుగు అన్నదమ్ముల వీడి పుణ్యలోకములకు బోవ నొల్ల భౌ విజయుడటుల బలుక ప్రీతుదై యింద్రుండు చెప్పె వత్స నీవు శివుని తలచి తపము జేసితేని దయతోడ నతడిచ్చు అరుల దునుమజాలు అస్త్రములను లాల

అరణ్యవాస పర్వము 89 అటులజెప్పి యింద్రు డంతర్జిళుందైన సవ్యసాచి తపము సలుపనొడగె నెలలు గడిచె శివుడు తలచూపదాయెను పట్టు విడువడాయె పొండుసుతుడు 78 వీఠవరుడు చేయు ఘోర తపము జూచి అచటి మునులు విస్మయంబు జెంది పరమశివుని జేరి వాని తపోజన్య ఉష్ణ ముడిపి కావు ముర్వి ననిరి 74 కిరాతార్డున యుద్ధం అంత నీశ్వరుండు కుంతీసుతుడు గోరు వరము లీయదలచి దరియ వచ్చి బోయవాని వోలె మాయవేషము దాల్చి పందినొకటి వాని పైకి బంపె 75 భీకరముగ వచ్చు సూకరమ్మును జూచి పాందుసుతుడు గాండివమ్ము నెత్తి బాణమేయబోవ వారించె వానిని ఏయకేయకనుచు నెలుకు రాజు 76 వాని మాట వినక పాండుపుత్రుదు వేసె వ్యాధుడేసె బాణ మాక్షణంబె బాణఘాతమైన పంది మాయంబాయె విజయు డరయుచుండ విస్మయమున 77 అతని ముందు నిలచె నతిభీకరంబుగ వ్యాధరూపధారి పరమ శివుడు నీవు వేసితేల నేనేసిన మృగము ననుభవించు ఫలితమనె కిరీటి 78

90 సంక్షిప్ర మహాభారతము నిహతమాయె మృగము నేను బాణము వేయ చెప్పెదేల లేని గొప్ప నీవు చేవయున్న రణము చేయుము నాతోడ ననుచు శివుడు కుంతి తనయు దాకె 79 అర్జునుండు వేయు అస్తమ్ములన్నియు వ్యర్ధమాయె బోయవానిముందు బాణరహిత మాయె తూణీరమప్పుడు వైరి పైకి గాండివమును విసరె 80 నరుడు బోయనంత కరవాలమున గొట్ట నదియు వ్యర్థమాయె నబ్బురముగ అంత ముష్టియుద్ధ మాయె నిర్వురి మధ్య నరుడు మూర్చ్భజెంది ధరణిబడియె 8కే శంకరుండు వాని శౌర్యమ్మునకు మెచ్చి భక్తవత్సలతను వరము లీయ నిలిచె వాని ముందు నిజరూపమును దాల్చి అర్హునుండు తన్మయత్వమంద 82 పార్వకీరమణుడు పన్నగాభరణుండు కామవైరి మూడు కనులవేల్పు ఇందుశేఖరుండు ఎదుట నిల్వగజూచి అర్జునుండు హర్ష మతిశయిల్ల 88 పదములంటి (వ్రాలి ప్రణతు లర్బణ చేసి పరమశివుని తోడ పలికెనిటుల యెజుకువనుచు తలచి యొదిరించితిని నిన్ను దేవ! తప్పు మజచి కావుమయ్య 84

అరణ్యవాస పర్వము 9] కాలకంధరుండు కరుణా సముద్రుుండు తప్పు పైచి తనుచు చెప్పె నిటుల నరుడవౌదు వీవు నారాయబణునిగూడి అవతరించినావు అవని లోన 85 ఇదుగొ గాండివమ్ము యిదిగొ తూణీరమ్ము తిరిగి యిచ్చుచుంటి తీసికొనుము ఇష్టమైన వరము నిత్తు కోరుకొనుము అనగ నర్జునుండు అనియెనిట్లు 86 పాశుపతాస్త్ర ప్రదానం దేవ పొంద దలతు దివ్యాస్తముల నేను పాశుపతము నిమ్ము పార్వతీశ! దాని బలిమి నేను రానున్న సమరాన శత్రువులను దునిమి జయము గాంతు 87 విశ్వనాధు డపుడు విజయుని దీవించి పాశుపతము నిచ్చె పరమప్రీతి అస్త్ర మహిమ దెల్పి అల్బులపై వేయ హాని గలుగు జగతి కని వచించె 8ిరి యమ కుబేర వరుణ అమరేంద్రులైనను తెలియలేరు విజయ దీని మహిమ నీవు దీని నెఠిగి నిఖిల లోకంబుల గెలుతు వనుచు శివుడు తెలిపి వెదలె 89 దేవదేవుగాంచి దివ్యాస్తమును బొంది ధన్యుడైన కుంతి తనయు కడకు దేవగణము తోడ దివిజేంద్రు దరుదెంచె పాండుసుళుని పరమ భాగ్యమనగ 90

92 పంక్షిప్ర మహాభారతము వరుణుడాదిసురలు వారి యస్తములీయ శతమఖుండు జెప్పె సుతునితోడ దేవదేవు కరుణ దివ్యత్వ సిద్ధిని బొందినావు పూర్వ పుణ్య ఫలము ర అర్జునుని స్వర్గలోక గమనం రమ్ము నాకమునకు రధము బంపెద నేను అచట నిత్తు నీకు నస్తములను అని వచించి యింద్రు డమరులతో నేగె నరదమునకు వేచె నర్జునుండు 92 అంత కొంత వడికి నరుదెంచె మాతలి (ప్రభల వెలుగు దివ్యరధముపైన అశ్వమేధశతము లాచరించిన వారి కైన బొందరాని యట్టి రధము 98 నరుడు స్నానమాడి పరిశుద్ధగాత్రుడై రధము నెక్కె భక్తి ప్రణతి జేసి అమర నగరి జీర హరి సఖుందని వాని చూడ వచ్చిరచటి సురలు మునులు ర్త వార లెల్లరకును ప్రణతు లర్బణ జేసి విజయుడరుగ స్వర్గ విభుని జూడ అతని కౌగిలించి అమరేంద్రు దొసగెను అర్ధభాగ మతని యాసనమున 05 ఊర్వశి శాపం స్వర్గలోక వైభవములన్ని చూచుచు కుంతిసుతుడు గడిపె కొన్నినాళ్లు అంత నొక్కనాడు అందాల ఊర్వశి వాని జూచి మదను బారి జిక్కి 96

అరణ్యవాస పర్వము 9 సంగమేచ్చ వాని సన్నిధి జేరంగ ప్రణతిజేసి తల్లి వనుచు బిలువ దివిజ కాంత జెప్పె దేవ వేశ్వలయందు వావి వరుస లేవు పాండుతనయ! 87 స్త్రీలు పురుషు లిచట స్వేచ్చగా రమియింతు రిలను లేని స్వేచ్చ గలదు మాకు దివిని యుంటివిపుడు భువి నీతులను వీడి నన్ను జేర రమ్ము సన్నుతాంగ 98 అనుచు బిలుచు నూర్వళిని చూచి పార్టుండు పలికె నిటుల వినయ భాషణముల పడతిరో పురూరవుడు మాకు కులకర్త నీకు భర్త గాన నీవు నాకు 99 తల్లి వౌదు వమ్మ తనయు డౌదును నేను రతులగోర దగదు సుతుని తోడ విజయుడటుల జెప్ప విఫల మనోరథ యైన దివిజ వనిత వాని జూచి 100 నను తిరస్మరించినాడవు నీవింక షండుడగుమ యనుచు శాపమిచ్చి విజయువలన దాని వినిన యింద్రుడు శాప ఫలము ననుభవింప వలయుననియె 101 విపినవాసమైన పిదప నజ్ఞాతులై వత్సరంబు గడుప వలసినపుడు ఛద్మరూపమందు షండుడవై నృత్య కళల నేర్చు రాజకన్యకలకు 102

ర సంక్షిప్త మహాభారతము అని యనుగ్రహించి యతనికి దివ్యాస్త తతులనెల్ల దివిజ పతి యొసంగె కౌరవేశ్వరుండు కరము వ్యాకులమందె దీని నెతిగి వ్యాసమౌని వలన 103 వనము నందు పాండుతనయులు (ద్రౌపది ఇం(ద్రతనయు రాక కెదురు చూచి ఐదు వత్సరంబులాయెను రాడేల అనుచు వగచుచుండ ననిల సుతుడు 104 అ(గ్రజన్ము తోడ ననియెను దివ్యాస్త సంచయనము చేసి సవ్యసాచి అరుగుదెంచగానె యరులను దునుమాడి నీకు రాజ్యపదవి నిత్తు మనఘ 105 యమసుతుండు జెప్పె సమయంబిు పాటించి అపుడు రాజ్యభాగ మడుగవలయు ఈయరేని వారిపై యుద్దమొనరించి సలుప వచ్చు దుష్ట సంహరణము 106 మహిమలీను వాడు బృహదశ్వుడను మౌని వచ్చెనొక్కనాడు వారి జూడ అతని గౌరవించి అతిధి పూజలు చేసి యమతనూభవుండు అడిగె నిటుల 107 ధరను బంధువులను సిదిసంపదల బాసి అదవులంటి తిరుగునట్టి మమ్ము బోలునట్టి వారు పుడమిలో నున్నారె వినదలంతుమయ్య మునివరేణ్య 108

అరణ్యవాస పర్వము 95 నలోపాఖ్యానం యతివరుందు జెప్పె ననుజులు సతియును ఉన్నవారు ద్విజులు నిన్ను గూడి ఎవరు లేక నలుడు ఏకాకియై కాన లందు తిరుగలేదె అన్ని బాసి 109 అలఘు విక్రముండు నలుడు నిషధరాజు పరమ తేజ మలర ధరణినేలి జూదమందు నోడి సుదతీసమేతుడై అడవులందు తిరుగులాడుచుండె 110 సుందరాంగి పరమ సుకుమారి దమయంతి పదెడు వెతలు జూచి పరితపించి పొలతి యొకటె యున్న పుట్టినింటికి బోయి యచట సుఖము బొందునని తలంచి శ్షేషేక్షే నిదురబోవుచున్న నెలతను విడనాదె కాననమున నంధకార మందు పడతి పడియెనంత పడరాని కష్టాలు ఎట్టకేల కింటి కేగు వరకు 112 విపినమందు నలుడు విషసర్పదప్పుడై వికృత రూపమంది వికలుడాయె కలిప్రభావజనిత కష్టాల కెదురీది కడకుబాందె సతిని పుడమి నతడు 118 నలునివోలె కష్టజలధిని తరియించి అవనిబొందగలవు అనుచు దెలిపి అక్షహృ్ళదయ మంత్రమతనికి బోధించి ఆశ్వసించి చనియె యతివరుండు కేష4

96 సంక్షిప్త మహాభారతము పాండవుల తీర్దాటనం పొండుపుత్రు లంత గాండీవి రాకకై వేచిచూచుచుండ వేల్చుమౌని నారదుండు వచ్చి నరనాథునకు జెప్పె వివిధ పుణ్యక్షేత్ర వివరములను 115 క్షేతదర్శనంబు సీయంగ తలపోయు చుండ మౌని రోమశుండు వచ్చి దేవలోకమందు దివ్యాస్త సముపార్ద నంబు చేసియున్న నరుని యునికి 116 తెలిపి వారితోడ తీర్థాటనము జేయ వత్తుననగ మౌని సత్తమునకు పరమభాగ్యమనుచు ప్రణతు లర్బణ జేసి తరలిరపుడు ధరణి సురుల తోడ కష? వ్యాసనారదాది యతివరు లరుదెంచి పాండు సుతులు చేయవలసినట్టి (వ్రత విశేషములను వారికి బోధించి చనిరి జయము గలుగుననుచు జెప్పి 118 తపసి రోమశుండు ధర్మ్శసూక్ష్మములను క్షేతమహిమలన్ని తెలుపుచుండ సాగె తీర్థయాత్ర సంతోష జనకమై పాండు సుతులు, కృష్ణ, బ్రాహ్మణులకు 119 వనధిగ్రోలినట్టి ముని యగస్తుని యాశ్ర మంబు జూచి యతని మహిమలెటిగి జామదగ్ని సగర చ్యవన విశ్వామిత్ర శిబినరేశ బుష్యశ్చంగ ప్రముఖ 120

అరణ్యవాస పర్వము 07 మునుల చరితములును మనుజేంద్రగాథలు మౌని తెలుపుచుండ మార్గమందు క్షేతదర్శనంబు చేయుచు వారెల్ల గంధమాదనంబు కడకు జనిరి క్ష విలయమారుతంబు దలపించు జడివాన భూరుహముల గూల్చు మారుతమ్ము లందు జిక్కి వారు ముందు బోజాలక ఇటుల నటుల పరుగులిడుచు నుండ 122 కరిన శిలలు పొదలు కంటకావృతమైన అదవి దారులందు నడువ లేక సొమ్మసిల్లై నచట సుకుమారి ద్రౌపది ఆమె నెత్తి మోసె ననిల సుతుడు 128 ముదిత కొంతవడికి మూర్భ దేటినయంత అనిలసుతునకనియె న(గ్రజుండు దుష్కరంబు చనుట (ద్రుపదసుతను గొంచు పాదచారులైన వారికిచట పవక తలచె భీముడపుడు తనయు ఘటోత్కచు వాడు వచ్చి నిలచె బలము తోడ వారు ద్రుపద సుతను పాొండుకుమారుల భూమి సురుల నెత్తి వ్యోమవీధి 125 చనిరి రోమశుండు చనె తపశ్శక్తిచే కనిరి మార్గమందు గంగతటిని ఫలభరితములైన పాదపంబులు గబ్లి మదికి హాయి గొల్పు బదరివనము 126

కం! సంక్షిప్త మహాభారతము

కొంతకాలమట (ప్రశాంతిగా గడుపంగ

దలచి పాండుసుళులు నిలచిరచట

అనతికాలమందె ఆయాసమును బాసి

యుండ జరిగె నచట నొక్క వింత 127

హనుమత్సాక్షాత్యారం

ఉదయ సంధ్యవేళ నొకనాడు ద్రౌపది

అనిలసుతుడు వననమునందు నుండ

సౌరభములు జిమ్ము సౌగంధిక సుమాలు

తేలియాడి వచ్చె గాలిలోన 128 సుమముల జూచి అతివ తన్మయమంది

వాని నింక బొందవలతు ననగ

భామ కోర్కె తీర్చ భీమసేనుడు వెళ్లె

సౌరభములు వచ్చు జాడ నరసి 129 చనెడు మార్గమందు కనిపించె నొకచోట

పరమ వద్దు డొక్క వానరుండు

తోక దారికద్డు తొలగించమని భీమ

సేనుడడుగ వాడు చెప్పెనిటుల 180 ముదుకనైతి నేను కదల లేకున్నాను

నీవె తోక జరిపి పోవుమయ్య

అతిబలుండు భీము డదియెంత పనియని

తోకబట్టి కదప లేకపోయె 1831 కరిసహ(స్రబలుడు కపివృద్ధువాలమ్ము

శక్తి యంత జూపి జరుపలేక

చోద్యమంది వాని జూచి యీతడు దివ్య పురుషుడని తలంచి పరమభక్తి 192

అరణ్యవాస పర్వము ంం పదములంటి (మొక్కి పరమాత్మ యెవరీవు తెలుపు మనగ నతడు తెలిపెనిటుల వినుము పాండుపుత్ర హనుమంతుడను నేను అనిలసుతుడ నీకు నగ్రజుండ 18కి నీవు వచ్చు టెటిగి నిను జూడవచ్చితి అలరె నా మనంబు అనుచు తెలిపి నేత్రపర్వమైన నిజరూపమును జూపి అనియె మరల పాండు తనయు తోడ 184 ఏగుచుంటి నీవు సౌగంధికములకై దొరకు నవ్వి యనతి దూరమందె వైర మూనవర్దు వనపాలకులతోడ ఇయ్యమనుచు వేడ నిచ్చువారు 185 కౌరవులకు మికు కానున్న సమరమ్ము కాంచ మదిని కాంక్ష కలిగె నాకు విజయు స్యందనమ్ము ధ్వజముపై కొలువుండి అరయువాడ జరుగునట్టి దెల్ల 136 ధర్మవర్తనమ్ము దైవబలము గూడి జయము గలుగు మీకు సమరమందు అని వచించి హనుమ అంతర్జితుండాయి పాండు సుతుడు శ్రమము బాసి యలరె 187 కదలి ముందుకేగి కాంచి సౌగంధిక వనము దాసె ననిల వరసుతుండు దాని రక్షసేయు దనుజులు వారించి భీమసేన! యిది కుబేరు వనము తెరి

100 సంక్షిప్త మహాభారతము చనుట యనుచితమ్ము ధనదు యానతి లేక అనగ వాయుసూను డాగ్రహమున నిగ్రహించి వారి నిర్వీర్యులను జేయ యక్షవిభుడు వచ్చి యతని జూచి 189 పాండు పుత్ర గొనుము పాంచాల విభు పుత్రి కోరినట్టి దివ్య కుసుమములను అని సుమంబు లీయ నవిగొంచు భీముండు అచటి నుండి వెడలు నంత లోన 140 మిన్ను నాల్గుదిశలు మేఘావృతంబాయె అవని నంధకార మావరించె చదలు విరిగినట్లు జడివాన గురియంగ కదలలేక పోయె గాడ్పుపట్టి క్షేడ్త1 ధర్మసుతుడు వాయుతనయుని గానక కలత జెంది కృష్ణ నలన నతని జాడ దెలిసి చనియె హైడింబుతో గూడి భీమసేను వెదుక వ్యోమవీధి 142 అరిగిరెల్ల వార లసుర స్మంధములపై యమతనూజు వెంట నంబరమున వంతబాసిరంత వాయుసూనుని జూచి సుదతి కృష్ణ మురిసె సుమములంది 143 అంత పాండుసుతులు హైడింబు బోబంచి వేచియుండ సవ్యసాచి కొజకు ఛద్మ వేషధారి జటనామ దైత్యుని శునిమె ననిలసుతుడు దోర్చలమున కశడ

అరణ్యవాస పర్వము 101 కృష్ణ పాండుసుతులు క్రీడి యాగమనమ్ము కొజకు వేచియుండ కొంత వడికి దిశలు వెలుగ జేయు దివ్య విమానమ్ము వచ్చె దివము నుండి వారి కడకు 145 దిగెను దానినుండి దివ్యాస్తముల బొంది పరమవీరుడైన ఫల్గుణుండు పాండుసుతులు కృష్ణ బ్రాహ్మణోత్తములంత పరవశించిరపుడు నరుని జూచి 146 అంత కొన్నినాళ్ల కమరేంద్రు డరుదెంచి అనియెనిటుల ధర్మతనయు తోడ అర్జునుండు పగల నిర్దించి రణమందు రాజ్యమిచ్చు నీకు రాజ చంద్ర 147 మౌని రోమశుండు మరి కొన్ని నాళ్ళకు వారి వీడి చనియె స్వర్గమునకు పాండు సుతులు శీత పర్వత సీమల నొక్కయేడు గడుప నొక్కనాడు మ4రి అజగరోపాఖ్యానం భీము డడవిలోన వేటాడుచుండగ అతని బట్టె నొక అజగరమ్ము దాని పట్టునుండి తప్పించుకొనలేక అలసి '్రుక్కి కరిసహస్రబలుడు మేశ9ి అరిభయంకరుండు అసమాన బలశాలి పాము చేత భంగపాటు జెంది అబ్బురంబు జెంది యది యసాధారణ మైన సర్పమనుచు మదిని దలచి 150

102 సంక్షిప్త మహాభారతము దానినడిగె ఖీమసేనునే బంధిప జాలినట్టీ శక్తి శాలివీవు ఎవరొ దెలుపుమయ్య వివరించి యన పూర్వ జన్మ స్మృతులు గలిగి సర్ప్వమనియె 151 జనవిభుండ నేను శక్రపదవి బొంది కావరమున కన్ను గాన రాక బుషుల పరిభవించి యీ రూపుబొందితి తెలియరాదు ముక్తి గలుగు టెపుడొ 152 వారలిరువురటుల భాషించు చుండంగ తమనివాసమందు ధర్మసుతుడు అనుజ మధ్యమందు ననిలజు గానక వాని వెదుక వచ్చె కాననమున 158 భీము డచట భుజగవేష్టితదేహుడై శక్తి దొరగి ధరణిశయనుడౌాట అరసి యార్తిజెంది ఉరగరాజును జూచి అడిగె ధర్మసూను డబ్బురమున 154 ఎవరవయ్య నీవు యీ రూపమందున్న దైవసన్నిభుడవా దానవుడవా ఏను ధర్మసుతుడ నితడు నాయనుజుండు క్షుధను తీర్చుకొనగ గోరు దేని 15ర5్‌ ఈవు కోరినంత మృగమాంస మిచ్చెద అనుజు విడువుమయ్య అజగరేశ అనగ నాతదనియె వినవయ్య నా గాథ జనవరేణ్య పూర్వ జన్మమందు 156

అరణ్యవాస పర్వము 103 నహుషుడనెడు దొడ్డ నరనాధుడను నేను పూర్వజుండ మోకు పూర్వజులకు ప్రజల హితమె గోరి రాజ్యపాలన జేసి దేవతలను బుషుల తృప్తి పలుప 157 వారు నన్ను మెచ్చి స్వర్గాధిపుని జేయ గర్వమెక్కి కనులు గాన రాక ఇంద్ర సతిని గోరి బుషుల పరిభవించి సర్పమైతి మౌని శాపమంది 158 మునివరేణ్యు శాపమోచనోపాయమ్ము తెలుపుమనుచు వేడ కలశజుండు తెలిపె నీదు ప్రశ్చ్నములకు సదుత్తర ములనొసంగువాని వలన నీకు 159 శాపముక్తి గలుగు జననాధ యని జెప్పి పూర్వస్మృతుల నిచ్చె పుణ్యమూర్తి ప్రశ్న లడిగెదేను ప్రత్యుత్తరము లిచ్చి అనుజువిడిచి పుచ్చుకొనుము నీవు 160 అనగ నడుగుమయ్య యని ధర్మసూనుండు వ్యాళమడిగినట్ట్‌ ప్రశ్చ్నములకు ఉత్తరంబులీయ నురగమ్ము ముదమంది భీమసేను విడిచి పెట్టెనపుడు 161 శాపముక్తి బొంది సర్పరూపము వీడి అసలు రూపుదాల్చి యలరె నతడు అతని వలన నరసి యధ్యాత్మ జ్ఞానమ్ము అనుజుగూడి యరిగె యమసుతుండు 162

104 సంక్షిప్త మహాభారతము అచట కొంతకాల మావాస మొనరించి కామ్యక వనమునకు ధౌమ్యుడాది (బ్రావ్మాణులను గూడి పాండు తనూజులు తిరిగి వచ్చియున్న తరుణమందు 165 వాసుదేవాగమనం వచ్చె నొక్కనాడు వసుదేవసూనుందు వారి జూడ సత్యభామ తోడ ధరణి సురులు కృష్ణ ధర్మజుండనుజులు అతిధి పూజ సలిపి రమిత భక్తి 164 దేవకీసుతుండు దివ్యాస్తములబౌంది నట్టి సవ్యసాచి నభినుతించి నీ యనుజులశక్తి నీ ధర్మవర్తన అంతలోన వచ్చె నటకు మార్మండేయ యతివరుండు పాందుసుతుల జూడ కృష్ణ సహితులౌచు బుషిపుంగవుని పూజ సలిపి భక్తితోడ కొలిచి యుండ 166 ధర్మసూను డడిగె తాపసోత్తమ మేము నీతి మార్గమందె నిలచియుండి లెక్కలేనియన్ని యిక్కట్ల పాలౌచు తిరుగుచుంటి మిటుల దీనులటుల 167 ధార్తరాస్త్ర లేమొ ధర్మమ్ము విడనాడి వోని సలిపి పరుల కనవరతము సుఖము జెంది బ్రతుకుచున్నవా రదియేమి దీని కారణమ్ము తెలియరాదు 168

అరణ్యవాస పర్వము 105 మునివరుండు జెప్పె మొదటి కల్పమునందు నరులు సత్యధర్మ నిరతులౌచు సకల సద్దుణముల సంపన్నులైయుండి (బ్రతుకుచుండి రిహము పరము దలచి 169 కాలక్రమము నందు కామ క్రోధంబులు మత్సరములు ప్రబలి మనుజ జాతి ఇహమె నిత్యమనుచు నిష్టభోగంబుల దగులుచుండె పరము దలచకుండ 170 ఈశ! అట్టి వార లిహపరంబుల బాసి సమయు వార లనతి సమయమందె సత్యధర్మ మార్గ చరులు శాశ్వతమైన పదవి బొందగలరు పరమునందు మేక అని వచించి మౌని యమతనూజుడు గోర సత్పురుషుల పుణ్య చరితములను తెలిపి యూరడించి దీవింప వారిని పాండుసుతులు కలత బాసిరపుడు 172 సత్యాద్రౌపదీ సంవాదం కృష్ణ నొక్కనాడు ఏకాంతమున జూచి అడిగె సత్యభామ పడతి నీకు ఐదుమంది భర్త లనురక్తులై యుంట చూడ నాకు మిగుల చోద్యమాయె 173 వ్రతము సల్పినావొ వరమంత్ర ఫలితమో మందు బెట్టినావా మగలకీవు అతి ప్రసన్న దృష్టి నరయుచుందురు నిన్ను ఏమి కారణమ్ము ఇంతి చెపుమ కేక

106 పంక్షిప్త మహాభారతము నెలత యీ నిజంబు నీ నుండి గ్రహియించి వశము జేసుకొందు పతిని నేను అనెడు సత్య పట్ల కినిసియు మదిలోన మృదుల భాషణముల కృష్ణ చెప్పె 175 వాసుదేవు పత్చివైయుండి నీవిట్లు పామర సతివోలె పలికెదేల మంత్రతంత్రములను మందుల వతముల పతులు వశముగారు పద్మనయన 176 మంత్రతంత్రములను మగల పై ఐఅపింప ఉన్న వలపు కూడ సన్నగిల్లు అట్టి సతుల పొత్తు నహిపొత్తువలె జూచి మగలు మనకు దూరమౌదురమ్మ క మందు మాకు బెట్ట మగని కారోగ్యమ్ము చెడును రోగ బాధ జెందు నతడు దానివలన పతికి వోని గల్టుటె గాక నింద గలుగునమ్మ నిజము గాను 178 వ్రతము సలిపి పతిని వశవర్తునిగజేయ జూడ వెళ్టితనము సుదతి వినుము అతని భావమెటిగి యనుకూలవతియైన సతిని యనుసరించి పతిమెలంగు 179 ఏను పాండుసుతుల కెల్లవేళలయందు చిత్తమలర సేవజేతు నబల వేరె పత్నితోడ వారు సంగతిసేయ దోసమెంచి వారి దూజనమ్మ 180

అరణ్యవాస పర్వము 107 మగువ పతుల నేను మనసార సేవింతు పగలు జేయి యనక భక్తితోడ దివిజవరుల నైన తృణముగా భావింతు పతులె దైవతములు పడతి నాకు 181 ఆత్త కుంతిదేవి నతి భక్తి సేవింతు ఆమె యవసరముల నన్ని దీర్చి గురుల కతిధిజనుల ధరణిదేవుల పూజ సలుపుచుందు భక్తిశ్రద్ధ లెసగ 182 ఇట్టి వర్తనముల నేప్రొద్దు పతులకు 'సేవచేతు వారి చిత్తమలర మగువ యింతె గాని మంత్ర తంత్రమ్ములు మందు మాకు భెఆఖుగ నిందువదన 188 అనగ సిగ్గుచెంది అనియె సత్యాదేవి నేరనైతి తప్పు నెంచకమ్మ మహిని నీ చరిత్ర మహిమ (్రసిద్ధమ్ము మాననీయమమ్మ మాన్యచరిత 184 పాండవేయ పత్ని పతిభక్తి మహిమమ్ము పతికి ప్రీతిగొలుపు పధము దెలుప సత్యభామ కరము సంతోషబిత్తమై ఆమెనాదరించి యభినుతించె 185 వాసుదేవు డంత పాండుసూనుల వీడి చనియె ద్వారవతికి సత్యతోడ ఆంత కొంత వడికి నరిగె మార్మండేయ మునివరుండు వారి ప్రణతులంది 186

108 సంక్షిప్త మహాభారతము కామ్యకవని వీడి కదలి (బ్రాహ్మణులతో ద్వైతవనికి జనిరి పాండుసుతులు అచటి కరుగుదెంచె హస్తినాపురి నుండి వారి జూడ విప్రవర్యు డొకడు 187 తిరిగి వెళ్లియతడు ధృతరాష్ట్ర విభునితో పాండుసుతులు విపిన వాసమందు తరుల నీడలందు తలదాచుకొనుచును పలువిధంబులైన పాట్లు బఐడుచు 1688 ఉన్నవారలయ్య యుర్వీశయని చెప్ప కౌరవేశ్వరుండు కలత జెంది ఆత్మసుతుల దుర్ష్మయముల మాన్సగలేక నాడు జూద మాపనైతి నేను 189 దుష్టులైన కర్ణదుస్ససేనులబల్మి శకుని కైతవమ్ము జయము గూర్చు ననుచు నా సుతుండు అన్నదమ్ముల రాజ్య మును హరించి వారి వనుల కంపె 190 వాసవాత్మజుందు వాయుతనూజుండు జగమునెల్ల గెలువజాలినట్టి శక్తివంతులయ్యు సత్యనిబద్దులై తిరుగుచున్నవారు దీనులటుల 191 దివిజ నగరికేగి దివ్యాస్తముల బొంది వచ్చినాడు శ్వేతవాహనుండు వాడు ధనువునెత్త వారింపగలవారు కానరారు ముజ్జగముల యందు 192

అరణ్యవాసపర్వము ౦

అట్టి వార లన్న యాజ్ఞకు బద్భులై

వేచియున్నవారు విపినమందు

సమయ పరిసమాప్తి జరిగిన క్షణమందె

కక్ష తీర్చుకొనరె కదలి వచ్చి 198

పాండుసుతుల దలచి పార్ధివుండీరీతి

వంతజెంద, కౌరవాగ్రజుందు

కలతజెంది కలసె కర్ణ సౌబలులతో

కుంతి సుతులపైన కుట్రబన్న 194 ఘోషయాత్ర

పలికె కర్టు డింద్రప్రస్థమ్ము గొని నీవు

వెలుగుచున్నవాడ వింద్రుడటుల

ద్యూతమందు నోడి దుఃఖోపహతులౌచు

వనములంటి తిరుగ పాండుసుతులు 195

సిరి దొజంగి రిపులు చింతావశేషులై

తరుల నీడలె తమ కిరవు గాగ

బరువు బ్రతుకుమోయ వారి జూచుటకంటె

కలదె హాయి మదికి కౌరవేశ 196

అతులితంబులైన ఆనంద భోగాల

ననుభవించు కౌరవాంగనలను

గాంచి యాత్మనింద గావించుకొని పాండ

వాంగన మదిలోన క్రుంగవలదె 197

దుష్టచిత్తుడైన దుర్యోధనుండంత

తెలిపె నేను కూడ తలతు నటుల

ద్వైతవనికి నేగి పాండవులకు జూప

వలయు కౌరవేయ వైభవములు 198

110 సంక్షిప్త మహాభారతము కాని నా జనకుడు పోనీయడెన్నడు పాండు పుక్రులుండ ద్వైతవనికి వారి పక్షముననె వాదించు విదురుందు అన్ని విధములైన అడ్డు జెప్పు 199 అందువలన నిది రహస్యంబుగానుంచి (ప్రభువు సమ్మతమ్ము బడయవలయు పాపు లటుల దలచి గోపాలు నొక్కని (ప్రభువు కడకు బంప వాడు పలికె 200 దేవ! ద్వైతవనిని గోవర్గముకు వాని గలిగె క్రూరజంతుగణము వలన ప్రక్కనున్న శకుని రాధేయులప్పుడు పలికిరిటుల నేమి తెలియనటుల 201 వన్యజంతువులను వధియించి గోరక్ష చేయ బంపుమయ్య జ్యేష్టసుతుని అనిన వారితోడ తన మనంబుననున్న భయము వెల్లడించె వల్లభుండు 202 క్రూరమృగముల వధ గోరక్షణము జేయ క్షత్రియులకు తగిన కార్యమయ్యు ధర్మజాదులున్న దరిదాపులకు బోవ మంచిగాదు మోకు నెంచి చూడ 208 వారితోడ మిరు పోరజూచితిరేని ముందు జేసినట్టి మోస మెంచి క్షణములోన మిమ్ము తునుమాదడుదురు గారె భీముడర్జునుండు వీర వీరులు 204

అరణ్యవాసపర్వమ మ అనగ శకుని చెప్పె నట్టి వీరులతోడ పోరదలప గలమె కౌరవేంద్ర అటుల మేము చేయ యమతనూజుడు లేడె ధర్మపధము జూప ధారుణీశ 205 కీడు గలుగకుండ క్రీడించి గోవుల కాచి వత్తుమయ్య కౌరవేంద్ర అనగ నెట్టకేల కనుమతించెను రాజు మనుడు బుద్ధితోడ ననుచు దెలిపి 206 ఆ క్షణంబె ఘోషయాత్రను చాటించి కదలె ద్వైతవనికి కౌరవుండు హస్తితురగ స్యంద నారూఢులైనట్టి వేనవేలు భటులు వెంటనడువ 207 కదలిరతని వెంట కర్ణగాంధారులు బంధువర్గ మనుజ వ్రాతములును మేదినీశు వెంట మృగయా వినోదులై హస్తినగర వాసు లరిగిరపుడు 208 విహరణమ్ము చేసి విపిన భూములయందు నృత్యగానములను హృదయ మలర ద్వైతవనము జేరి పాండవేయనివాస మునకు ననతి దూరమున వసింప 209 వనసరోవరమ్ము గని ముగ్గుడై దాని తటిని క్రీడలాడ దలచి రాజు భృత్య జనుల జూచి క్రీడాంగణములను కట్టుడనుచు వారి కానతిచ్చె ౭210

112 సంక్షిప్ర మహాభారతము దుర్యోధస పరాజయం (హదము చిత్రసేను డనెడు గంధర్వుని దౌొట యతని యనుమతమ్ము బడయ వలయుననుచు జెప్పు భటులను సుంతైన సరకు సేయడాయె కురువిభుందు 211 విషయ మెటిగి యటకు విచ్చేసె గంధర్వు డుభయ పక్షములకు యుద్ధమాయె కౌరవేశుడోడె గంధర్వుడతనిని పట్టి రధమునందు గట్టివైచె 212 అపుడు కురుబలమ్మునందలి కొందణు త్వరిత గతిని ధర్మతనయు జేరి విషయ మంత జెప్పి విభుని రక్షింపవే యనుచు వేడ ననిలతనయు డనియె 218 మనము చేయదగిన పనిని గంధర్వులే చేసి మనకు మేలు చేసినారు మోసగించి మనల గాసిపెట్టినవాడు తగిన శిక్షబడసె ధాత చేత 214 విషములందు (దోసె విషమును దినిపించె అగ్గి బెట్టె రాజ్య మపహరించె చెలిని సభకు నీడ్చి వలువల నొలిపించె వాడు చేయనట్టి కీడు గలదె 215 వాని దుర్నియముల వలన నీ రీతిని దీనులటుల వనిని దిరుగు మనల పరిభవింప దలచి వచ్చిన ఖలునిపై సుంతయైన కరుణ జూపవలదు 216

అరణ్యవాస పర్వము 113 అనెడు వాయుజునకు యమతనూజుడు చెప్పె ధార్తరాష్తు డిట్టీ ధూర్తుడయ్యు పెద్ద తండ్రి కొడుకు పెరవారి చేజిక్కి యుండ మనకు నూరకుండ దగునె 217 శరణు జొచ్చినట్టి శత్రువులను గూడ కావ ధర్మమౌను క్షత్రియులకు దోసములను మరచి దుర్యోధనుని గావ వెడలురయ్య మోరు వేగిరముగ 218 అ(గ్రజు దటుజెప్ప ననిలతనూజుండు వెడలె క్రీడి కవలు వెంటరాగ కోరె నర్జునుండు కౌరవులకు ముక్తి యమసుతుండు గోరెననుచు దెలిపి 219 ఇయ్యకొనక వారు కయ్యంబునకు రాగ ఘోర యుద్ధమాయె వారి మధ్య భేచరుల బలమ్ము క్రీడి ధాటికి తాళ నలవిగాక నపజయమ్ము బొందె 220 అపుడు చిత్రసేనుడనియె నర్జున మిమ్ము పరమ ధర్మపరుల పరిభవింప వచ్చినట్టి వీని పట్టి తెమ్మని నన్ను వాసవుండు బఐంప వచ్చినాడ 221 బంధ విముక్తి చిత్రసేను డటుల జెప్పగా విని క్రీడి చెప్పె ధర్మసుతుని చెంత జేర్చి ఆత డెటుల జెప్పునటుల చేయుదమన్న ఖేచరుండు దాని కియ్యకొనియె ల2ై2

114 సంక్షిప్ర మహాభారతము అతని గౌరవించి యమతనూజుడు సుయో ధనుని విడిచి పుచ్చు మనుచు వేదె పాపవర్తనుండు బంధముక్తిని గాంచె యమతనూజు డంత హర్షమంది 2283 సలుప కెన్న డిట్టి సాహస కార్యమ్ము చేటు గలుగు ననుచు చెప్పె నతడు పాండు సుతుల కరుణ (ప్రాణావశేషుడై పరమలజ్జ జెందె కురువరుండు 2ైటైడ నగరి లోని కేగ నగుబాటు పొలౌదు నని తలంచి కౌరవా[గ్రజుండు చేయ దొడగె నపుడు ప్రాయోపవేశమ్ము పురము బయట నొక్క తరువు నీడ 225 కర్ణ దుస్ససేన గాంధారులతనిని పలువిధముల నచ్చబలుక నతడు పట్టు విడువకుండ ప్రాయోపవిష్టుడై యుండ కర్చు దతని నూరడించి 226 దైన్యమేల నీకు ధార్తరాష్ట్రాగ్రజా శోక ముడుగుమయ్య శూరవర్య! భయము కలుగనేల ఫల్దుణుందన నీకు వాని నేను జంపువాడ నిజము 227 అనుచు నాయుధమ్ము నంటి ప్రతిన చేయ ధార్తరాష్తు డంత ధైర్య మూని మరణదీక్ష మాని కరిపురంబునకేగె సకల బంధు మిత్ర సహితు దౌచు 228

అరణ్యవాసపర్వము 185 సైంధవ దుర్న్మయం ఒక్కనాడు కృష్ణ ఒంటరిగా పర్ణ శాల యందునున్న సమయమందు అడవి బాటలందు స్యందనారూఢుదై చనెడు సైంధవుందు వనిత జూచి 229 లలన నిరుపమాన లావణ్యమును జూచి మదనుబాణ ధాటి మది చలించి స్యందనమ్ము డిగ్గి అతివ దరికి జేరి పలికె వలపు లొలుకు భాషణముల 220 గరుడ యక్ష సిద్ధ గంధర్వ కాంతవో భువికి వచ్చినట్టి దివిజ సతివొ యెవ్వరమ్మ నీవు ఇందు నిభానన కాన నుండ నేమి కారణమ్ము 231 నే జయద్రథుండ రాజీవలోచన సైంధవుడను పూర్ణచంద్రవదన ఎవరిదాన నీవు ఎవరు నీ (ప్రేమకు పాత్రుడైన పరమ భాగ్యశాలి 282 అనెడు వానితోడ నతివ జెప్పెను నేను వీరవరులు పాండవేయ సతిని వేట కేగినారు విభులు వచ్చిన యంత నందుకొనుడు మిరలతిథి పూజ 233 మగువ నిన్ను జూచి మదన పీడితుడైన నాకు నతిథి పూజనంబు లేల తృష్ణ దీర్చునాకు మృగరాజ మధ్యమ రథము నెక్కి వేగిరముగ రమ్ము 234

116 సంక్షిప్త మహాభారతము అనుచు దరికి జేరు మనుజాధముని జూచి పాండవేయ పత్ని పలికె నిటుల దురిత చిత్త వినుము దుస్సల పతివౌాట వరుస నాకు అన్నవౌదు వీవు 285 కోర దగదు నన్ను ఘోరాపరాధంబు చేయుచుంటి నీవు సింధు విభుడ అనగ వాడు జెప్పె నతివలతో గూడ నరపతులకు వావి వరుస లేవు 286 పాపి యటుల బిల్కి పై పైకి రానుంద ద్రుపద పుత్రి జెప్పె దుర్విచార పాండు సుతులు తిరిగి వచ్చిన క్షణమందె నిన్ను జంపగలరు నిక్కువముగ 237 'సైంధవుండు నవ్వి సతితోడ నిటుచెప్పె బెదరువాడ గాను ముదిత నేను అనుచు బట్టి లాగ యతివ యాక్రోశించె దవుల నుండి వచ్చె ధథౌమ్యు డటకు 238 అంత సైంధవుండు కాంత పయ్యెదబట్టి మగువనెత్తి యరద మందు బెట్ట ధౌమ్యు డద్డు వచ్చి తగదని వారింప వినక నతని మాట, వెడలె ఖలుడు 299 వాని రథము వెంట పరువెత్తె ధౌమ్యుండు చెలిని విడువు దురిత చిత్త యనుచు పొండుసుతులు వేట పరిపూర్తి గావించి ఆ(శమంబు చెంత కరుగుదెంచి 240

అరణ్యవాసపర్వము ౨౨౨౨? రోదనమ్ము సేయు ద్రుపద పుత్రిక సఖి చెప్ప విషయ మెటిగి జేగురించి బుసలు గొట్టి క్రూర భుజగంబులట్టుల చనిరి పత్ని హరణు జాడ నరసి బెడ! త్వరిత గతిని నేగి వాని సమిపించి సేనలన్ని నుగ్గు జేసి వాని వాయుసుతుడు క్రీడి నధియింప దలపంగ యమసుతుండు వారికడ్డువచ్చె 22డ2 పరాభవం ధూర్తుడయ్యు వీడు దుస్సల పతిగాన వీని జంప చెల్లి విధవ యౌను విహ్వలత్వ మొందు పెదతల్లి గాంధారి కనుక వీని జంప జనదు మనకు 2త్త8 అన్న చెప్పు మాట మన్నించి భీముండు పాయ లటుల గొటీగి వాని శిరము నరులు నవ్వునట్లు పరిభవం బొనరించి ప్రాణదాన మిచ్చి వాని విడిచె 224 అచట నుండి వాడు హరిద్వారమున కేగి చేసె తపము పరమ శివుని దలచి పార్వతీధవుండు ప్రత్యక్షమై యేమి వలకు వనగ సింధు వల్లభుండు 245 పంచ పాండవులను భండనంబున గెల్వ వలతు ననగ శైలనిలయుడనియె నీవు గోరు కోర్కె నెవరు తీర్చగలేరు శక్రసుతుని గెల్వ జాల రెవరు 246

118 సంక్షిప్త మహాభారతము యమతనూజ భీమ యమళులనొకనాటి కయ్యమందు గెల్వగల్లు దీవు అని వచించి ఈశు డంతర్జికుండయ్యె స్వపురమునకు నేగె సైంధవుండు లశ? పాండుసుతుల జూడ వచ్చె మార్కండేయ మౌనివరుడు [్రేమ మానసుండు అపుడు ధర్మసుతుడు ద్రుపద పుత్రిని సింధు విభుడు తస్కరింప వెలది కొజకు 248 పడిన శ్రమయు నితర వనవాస క్లేశంబు లన్ని జెప్పి మౌని నడిగె నిటుల సంయమింద్ర మేము శక్తివంతులమయ్యు సతత సత్య ధర్మ రతులమయ్యు 249 కలుగ నేల మాకు కష్టంబులీరీతి వేరె యెవ్వరిట్టి వారు గలరె అపుడు మునివరుండదు యమయసూనునకు జెప్పె రఘుకులాబ్ధి సోము రాము గాధ 250 తండ్రి మాట నిలుప తన రాజ్యమును వీడి వెలదియు ననుజుండు వెంట రాగ అడవులందు దిరిగి యిడదుమల బడినట్టి రవికులావతంసు రాము గాథ 251 మృత్యువాత బడిన సత్యవంతుని (ప్రాణ ములను తిరిగి పొంద గలిగినట్టి సాధ్వి కులవధూటి సావిత్రి జయగాథ పొందవులకు మౌని వరుడు చెప్పి బ్లెర్రలై

అరణ్యవాస పర్వము 119 జనవరేణ్య సీత సొవిత్రియును బోలె పరమ సాధ్వి కృష్ణ భవ్య చరిత మిమ్ము నుద్ధరించు మి కీర్తి వెలయించు ననుచు జెప్పి చనియె మునివరుండు 2638 కవచ కుండల సంగ్రహణం వన నివాస మందు పదియు రెండవ యేడు అంత మొంద నుండ నమర విభుడు కర్టు చెంతనున్న కవచ కుండలముల మాయజేసి పొంద మదిని తలచె 254 అతని తలపు నెటిగి ఆదిత్యు దొకనాడు వృద్ధ విప్రవరుని వేషమూని కర్డు తోడ జెప్పె కవచకుండలముల నడుగ నున్నవాడు అమరవిభుడు 255 కవచ కుండలములు కలుగ నిన్నెవ్వరు గెలువలేరు సమర క్రీడయందు అందువలన వాని నర్జున హితకామి ఇంద్రు దడిగెనేని యియ్యవద్దు 256 ఎవ్వరయ్య మిరలింత దయాళువు లనగ నతడు జెప్పె నినుడ నేను నీకు మేలు జేయ నీరూపమున వచ్చి తనగ కర్ణుడనియె నతని తోడ 257 బ్రాహ్మణుండు గోర ప్రాణంబు లైనను తప్పకుండ నిత్తు తరణి నేను కవచకుండలములె కాదు ప్రాణములైన ఇచ్చువాడ నేను ఇంద్రు డడుగ 258

120 సంక్షిప్త మహాభారతము ఇనుడు చెప్పినంత నిదియె నీ నిర్ణయ మైన నింద్రు నడుగు మతని శక్తి వాసవుండు దాన వధియించె పల్వుర శక్తివంతులైన శాత్రవులను 259 అనుచు జెప్పి సూర్యు డంతర్జితుండాయె అంత కొన్ని నాళ్ల కమర విభుడు కపట విప్రవేషి కర్టుని దరిజేరి కోరె నతని కవచ కుండలములు 260 (బ్రాహ్మణునకు నీకు వానితో పనియేమి స్వర్ణ రత్న రాశి వలదె నీకు విప్రవర్య కోరు వెలలేని సిరులను అనగ నొల్ల ననియె నవనిసురుడు 261 కర్టుడనియె నంత కపట విప్రనితోడ నీవు బ్రాహ్మణుడవు కావు నిజము కవచకుండలముల (గ్రహియించి క్రీడికి హితము సలుప గోరు శతమఖుడవు 262 శక్తి ప్రదానం ఇనుడు నీకు దెల్పెనని యెజుంగుదు నేను తడయ నేల నింక దాననిరత అనగ కర్ట్ణుడనియె నటులైన నాకిమ్ము నీ యమోఘ శక్తి నిర్ణరేంద్ర 268 శక్రుడనియె శక్తి శత్రుల దునుమాడి మరల మరల నాదు దరికిజేరు కొని నీవు వేసితేని యొక్కని జంపి నన్ను వచ్చి చేరు నిన్ను వీడి 264

అరణ్యవాసపర్వము 12

వృత్రదమన పరమశత్రు వాక్కడె నాకు

వాని జంప శక్తి వలతు నేను

అనుచు దానిబొంది యనిమిష పతికిచ్చె

కవచ కుండలముల కర్టుడపుడు ౨65 బ్రాహ్మణుని అరణి

ద్వైతవనము నందు ధర్మజునొద్దకు

ధరణి దేవు డొక్క డరుగుదెంచి

చెప్పె నొక్కమృగము శృంగమందున నాదు

అరణి గొనుచు వనిని పరుగుకెత్తె 266

దాని దేర బనుపు ధర్మజా యని వేడు

నతని కోర్కె తీర్చ యమసుతుండు

తమ్ము లరుగు దేర తనవెంట మృగముకై

అడవులందు వెదకి అలసి సొలసి 267

దాహబాధ తోడ తపియించి నీటికై

కలయజూచి యెందు కాన రాక

నగము నొకటి నెక్కి నకులుండు పరికించె

సలిల భరితమైన సరసి నొకటి 268

దాని దరికి బోయి దాహశాంతిని బొంది

తెత్తు సోదరులకు తీర్థమనుచు

నీరు బ్రాగబోవు వీరుండు వినెనంత

నొక్క మనుజ స్వరము నక్కజముగ 269 నకులాదుల మూర్చ

సరసి నాది నీవు జలము గోరెదవేని

బదులు చెప్పు నాదు ప్రశ్చములకు

సరకు చేయకుండ సలిలంబు సేవించి

పడియె చేతనమ్ము బాసి యతడు ల70

122 సంక్షిప్త మహాభారతము శమను పుత్రుడంత సహదేవునకు జెప్పె నీవు నకులు గాంచి నీరు శ్రావి మాకు దెమ్మనంగ మాద్రేయు డటకేగి మనుజ స్వరము జెప్పు మాట వినక 271 నీరు ద్రాగి యతడు నేలపై (వ్రాలంగ నరుడు వాయుసుతుదడు వరుస గాను వచ్చి దాహ బాధ భరియింపగా లేక నీరు ద్రావి పడిరి నేలపైన 272 ధర్మపుత్రు డపుడు తమ్ముల వెదకుచు వచ్చి వారి జూచి కలత జెంది దాహ బాధ నీరు త్రొగెదనని యెంచి జలమునంట మనుజ స్వరము బలికె 278 ఏను బఐకుడ నయ్య యీ తటాకము నాది బదులు చెప్పు నాదు ప్రశ్నములకు చెప్పకుండ నీరు సేవింప తమ్ములు పొంది నట్టి గతిని బొందు దీవు 274 విన్న యమసుతుండు వినయంబుగా జెప్పె ఆరయ నిన్ను నే మహానుభావ నాకు తోచినంత నయమార జెప్పెద ప్రశ్చలడుగుమయ్య పరమ పురుష 275 అతని యెదుట నిలిచె నపుడొక్క యక్షుండు తాళ వృక్షమంత తనువువాడు వాడు ప్రశ్నలడుగ ప్రత్యుత్తరము లిచ్చె పరమజ్ఞాని వోలె పాండుసుతుడు 276

అతని యుత్తరముల కత్యంత (ప్రీతుడై

యక్షవరుడు జెప్పె యమతనూజ

మృతులలోన నొకని (బ్రతికింతు ననుజుని

తెలుపుమయ్య యెవరు వలయు నీకు ల్రెల్లాల్లా ధర్మజ ధర్మనిరతి

పరమ పురుష నకులు (బతికించుమని గోరు

యమతనూజు జూచి యక్షు డనియె

వీరవరులు (ప్రియులు భీమార్జునుల వీడి

కుంతిపుత్ర నకులు గోరెదేల 278 ధర్మజుండు జెప్పె తల్లు లిద్దరు మాకు

సురవరేణ్య కుంతి సుతుడనేను

మాద్రిసుతు డొకండు మనుట న్యాయముగాదె

నకులు గోరినాడ నందువలన 279 అతని ధర్మనిరతి కమిత హర్షముజెంది

యక్షు డనియె నల్వు రనుజులకును

ప్రాణదాన మిత్తు రాజేంద్ర యన వారు

లేచి రంత నిద్రలేచినటుల 280 ముదము విస్మయంబు ముప్పిరిగొన ధర్మ

తనయు డతని తోడ ననియె నపుడు

అనఘ నమ్మజాల యక్షమాత్రుడవని

తెలుపు మెవరు నీవు దివ్యపురుష 281 అంతనతదు చెప్పె నంతకుండను నేను

వత్స! నిన్ను జూడ వచ్చినాడ

సకల సద్దుణముల సంపన్నుడవు నీవు

వరముగోరు మిత్తు వరకుమార 282

124 సంక్షిప్త మహాభారతము తెచ్చియిమ్ము ధరణిదేవుని యరణిని హరిణ మపహరించి నట్టి దనగ నేనె జేసినాడ నిన్ను పరీక్షింప అని యముండు అరణి నతనికిచ్చి 288 వరప్రసాదం పాండుపుత్రులార ద్వాదశ వర్షంబు లంత మొందు సమయ మరుగుదెంచె అందువలన నింక నజ్ఞాతవాసమ్ము సలుపు మార్వమరయ వలయు నిపుడు 284 పదియు రెండు నెలలు పరులెఖుంగని రీతి మారువేషములను మనుట కొఅకు మిరు పొందగలరు కోరిన రూపమ్ము వలదు సమయభంగ భయము మోకు 285 మారువేషములను మోరుండగా మిమ్ము ఒరులెఖుంగకుండ వరము నిత్తు ఇంకనేమి వలయు నిచ్చెద నని జెప్ప ధర్మపుత్రు డనియె తండ్రితోడ 286 తండ్రి నిన్నుజూచి జన్మ ధన్యంబాయె ఏమి గోరగలను ఇంతకన్న కామ క్రోధములకు నా మనం బెన్నడు దరికి జేరకుండ వరము నిమ్ము లర యముడు వరము నిచ్చి యంతర్జితుండాయె పర్ణశాల కేగి పాండుసుతులు అరణిని గొనిపోయి ధరణి దేవునకీయ నతడు సంతసించె నార్తిబాసి 268 నన వప్రపట్తుక్తనినాా- అనాలా

లాలా వ ఆ అజ్ఞాతవాస పర్వము పరిజనులకు వీడ్కోలు ఇన్నినాళ్లు తమకు సన్నిధినే యుండి కష్టములను మోసి, కానలందు వెంటనంటియున్న విఫ్రోత్తముల జూచి సవినయముగ బలికె శమనసుతుడు 1 పడితిరయ్య మోర లిడుమల మాతోడ కాల మొక్కరీతి గడచిపోయె ఆర్యులార! యింక నజ్ఞాతముగ నుండ వలయు మేము ఒక్క వత్సరమ్ము 2 ఎవ్వ రెటుగకుండ నీవత్సరము మేము గడుపవలయు నెంత కష్టమైన మో యనుగ్రహమ్ము మి దీవెనలు మాకు కలుగజేయు డయ్య కరుణతోడ తి ఒక్కనాడు మేము ఇక్కట్టులను బాసి బంధుజనులు విప్రవరుల తోడ సంతసముగ సాధుసాంగత్యమున నుండు దినము లెపుడు వచ్చు తెలియరాదు డ్తీ అనుచు వంతడజెందు యమతనూజుని జూచి ధౌమ్యుడనియె నీకు దైన్యమేల ఎంతవారలైన నిడుమలబడి వాని నెదిరి నెగ్గలేదె యదను జూచి ర్‌ నృపకులావతంస ధృథఢచిత్తమున నీకు సాటి యెవరు లేరు జగతియనుచు సేరు బొందియుండి యీ రీతి ధ్రైర్యంబు గోలుపోవ నగునె బేలవోలె 6

126 సంక్షిప్తమహాభారతము ధౌమ్యుడటుల బల్మ దైన్యమ్ము విడనాడి ధైర్యమూనె పాండుతనయు డపుడు మోకు దైవ మెపుడు మేలు చేసెడునని విప్రవరులు వారి వీడి చనిరి ళా అపుడు పాండుసుతులు ద్రుపదపుత్రియుగూఢ వృత్తి నుండదగిన వేళదరియ ఎచట నుండ వలయు నే వేషమున నుండ వలయు ననెడి విషయములను తలచి తి మత్స్వచేది సాళ్వ మగధాది జనపద ములు నివాస యోగ్యములని విందు మందు మత్స్య నృపతి అమితబలుడు ధర్మ వర్తియనుచు పేరు బడసినాడు రి మత్స్వదేశమందు మనమందరము వేరు వేరు పనుల యందు విరటు గొలిచి అతని మనము బడసి యందజఅమొక చోట నొకరి కొకరు చెంత నుండవచ్చు 10 వేషధారణ నిర్భయం అటుల నిశ్చయించి యమసుతాదులు కృష్ణ చెప్పిరపుడు వారు చేయదలచి నట్టి పనుల విరటు నాస్థాన మందున అబ్బురమున ధౌమ్యు దాలకింస 11 యమసుతుండు చెప్పె యతివేషమున నేను పుణ్యకధలు చెప్పి పుడమిపతికి ద్యూతక్రీడలందు నాతని మురిపించి మెలగువాడ విరటు కొలువునందు 12

ఎవడవీవు, ఇచటి కెటినుండి వచ్చితి

వనగ జెపుదు ధర్మతనయు సఖుడ

పేరు కంకుభట్టు వెలయంతకు నీ కొల్వు

యమతనూజు కొల్వునటుల నధిప 18 వాయుసుతుడు చెప్పె వంటల వాడనై

పనులు చేతు విరటు బానసమున

రుచికరంబులైన పచనంబులనుజేసి

విభుని మనము బడసి ప్రియము గూర్తు శ! మల్లయుద్ధ మందు బల్లిదులను గెల్చి

ప్రియము గూర్చు వాడ విభుని మదికి

కావరించినట్టి గజరాజులను బట్టీ

చూపలజుల మనమ్ము చూరకొందు 15 వలలు దనెడు పేరు వహియించి చరియింతు

వార లడుగ నెవరి వాడవనుచు

పాండవాగ్రజన్ము బానసంబున నేను

వంటవార్పు చేయుచుంటి నందు 16 అర్జునుండు చెప్పె ఆనాడు ఊర్వశి

కోపగించి నాకు శాపమిచ్చె

మనుము షందడుడటుల వనితామణుల మధ్య

పుంసకత్వ ముడిగి పుడమి ననుచు షే? అమరవిభుడు నన్ను అజ్ఞాతవాసమ్ము

నందు శాపఫలము ననుభవించి

వెనుక శాపముక్తి గనుమని దీవించే

నదియె నాకు ఇప్పు డండ యగును 18

128 సంక్షిప్ర మహాభారతము పేడితనము దాల్చి విరటుని దరిజేరి ఆఅంతిపురము కొలువు నడుగువాడ రాణివాస మందు రాజకన్వకలకు గజిపువాడ నృత్య గాన శిక్ష 19 నకులు డనియె నంత నా కశ్వజాతుల తీరు తెన్ను లన్ని తెలియుగాన అశ్వశిక్షకుండనై మత్స్య విభుగొల్తు నతని యశ్వశాల యందు జేరి 20 దామగ్రంధి యనెదు నామంబు వహియింతు తొల్లి ధర్మసుతుని తురగరక్ష సేయుచుంటి ననుచు చెప్పి విద్యను జూపి నమ్మకమ్ము కలుగు నటుల జేతు బై అంతట సహదేవు డనియె తం్రీపాలు డనెడు పేర బరగి యవని విభుడు అతి ముదంబు జెంద నాలమందల గాచు చుండువాడ పదియు రెండు నెలలు లల పాండుసుతుల చెంత నుండి వారల గోగ ణముల గాచుచుంటి ననుచు చెప్పి నమ్మబలికి నాదు నైపుణ్యమును జూపి ప్రియము గూర్తు మత్స్య విభుని మదికి ల! తమ్ములటుల బలుక ధర్మతనూజుండు వంతబాసె మదిని వారి గూర్చి కాని యతడు తలచి కలతచెందెను చాల పడతి కృష్ణ యెటుల గడుపుననుచు |

అజ్తాతవాస పర్వము 129 సుదతి రాజపుత్రి సుందరి సుకుమారి పాందుసుతుల పత్ని పరుల నెటుల_ గొల్వ నేర్చునంచు కొందల పడుచున్న ధర్మతనయు తోడ తరుణి చెప్పె 25 సాధు చరిత నేను సైరంధ్రి వేషమ్ము నందు మత్స్య విభుని యంతిపురము జేరి రాజివాస స్త్రీల కలంకార మాది పనులు జేసి మనెడుదాన 26 మాలినియను పేర మత్స మహీపాలు సతి సుధేష్ట చెంత సకియ నౌదు పరిచయంబు గోర పాండవేయుల పత్ని చెంతనుంటి ననుచు జెప్పుదాన 27 కార్యనిర్ణయమ్ము గావించి యీ రీతి తోదనున్న వారి వీడు కొలిపి ద్వారకాపురమ్ము పాంచాల దేశమ్ము నందు నుండ బంచె నమితప్రీతి 28 అధిపులైన వారు విధి వైపరీత్యాన వేరు నృపుని గొలువ వెడలనున్న 'సీవగొనుటె గాని సేవించు టెలుగని ధరణి వరుల జూచి ధౌమ్యుడనియె 29 పరమశ్రేస్టమైన కురువంశమున బుట్టి ప్రీతి ప్రజల నేలి ఖ్యాతి గాంచి రాజసూయ మాది క్రతువుల నొనరించి నట్టి మొర లొక్క యవని విభుని 80

30 సంక్షిప్త మహాభారతము

సేవ జేయు నప్పు డావంత యైనను

తప్పు చేసిరేని ముష్పు గలుగు

కాన సేవకులకు కర్తవ్యమైనట్టి

విధుల దెల్పువాడ వివరముగను 21 అని పురోహితుండు పనివారలే రీతి

మెలగవలయు రాజు కొలువునందు

సవివరముగ జెప్పి యవరోధములు లేక

వత్సరమ్ము గడప వలయుననియె తెలి

ఆయుధ నిక్షేపం

అంత పాండు పుత్రులతని దీవెనలంది

విరటు నగరి మార్గమరసి చనుచు

ఆయుధముల నన్ని యనువుగానాక చోట

దాచవలయు ననుచు తలచివారు రత్రి ఊరి బయట గాంచి రొక శమోవృక్షంబు

భూరి తరువు (ప్రేత భూమి చెంత

చాలా పెరిగినట్టి శాభోపశాఖల

మధ్య నంధకార మావరించి 34 భీతి గొల్పుచున్న వృక్షశాఖల మధ్య

దాచియున్న ఆయుధముల జాడ

తెలియ నెవరికైన నలవిగాదని యెంచి

పెట్టి రచట వాని కట్టగట్టి 35 యమసుతుండు వృక్ష మధిరోహణము జేసి

సకల దేవతలను సంస్కరించి తాను నర్జునుండు తప్ప నెవ్వరు వీని చూడనీకు డనుచు వేడుకొనియె 36

అజ్జాతవాసపర్వము 131 యముని మరల వేడె నజ్ఞాతవాసమ్ము నందు జయము గూర్చుమయ్య యనుచు క్షణము నందు గలిగె సన్యాసి రూపమ్ము తనదు రూపు బాసి ధర్మజునకు త? మిగత వారలెల్ల తగిన రూపులు దాల్చి రా క్షణమ్ము నందె యముని కరుణ దైవ యోగ మనుచు తలచిరి వారెల్ల రొకరి నొకరి జూచి యుత్స్ఫుకమున 38 నగర ప్రవేశం ధర్మతనయు డంత తరలి వెళ్లెను ముందు విరటు సభను జేరి విభుని జూడ వచ్చు తపసి జూచి వాని తేజము జూసి అబ్బురంబు జెందె నవని విభుడు 89 ఈ మహానుభావు దెవ్వ రేకతమున నన్ను జూడ వచ్చుచున్నవాడు ఇచ్చువాడ నీత డేమి గోరిననైన వజ కనక వస్తు వాహనముల 40 అని తలంచి విరటు డాతని కెదురేగి ఉన్నతాసనమున నుంచి పలికె ఎవ్వరయ్య మీర లెటునుండి విచ్చేసి నారు రాక కేమి కారణమ్ము న! యతివరుండు జెప్పె నధిప నే ద్విజుడను సుజనప్రియుడు ధర్మసుతుని సఖుడ ప్రభు వినోదకరుడ పరివ్రాజకుడ నేను అవనినాధ! కంకు డనెదు వాడ త్త

132 సంక్షిప్త మహాభారతము ఉత్సుకుడను నేను ద్యూతక్రీడలయందు కపట ద్యూతమందు కానివారు నన్ను మోసగించి నా సొమ్ము కాజీేయ విన్నదనము జెంది యున్నవాడ కు! (వ్రతము సల్బువాడ వత్సర కాలమ్ము అరుల గెల్వ బోదు నపుడు నేను అంత వరకు నీదు చెంత నుండెద నీవు సమ్మతించి తేని జనవరేణ్య శీర్ష అనగ భూమి పాలు డాతనితో జెప్పె నమిత ప్రీతి గలిగె యతివరేణ్య మాకు వలసినన్ని సొకర్యముల బొంది గడపవచ్చు నెంత కాలమైన డీప్‌ అటుల విరటుకొలువు నందాశ్రయముబొంది అచట నిలిచె పొండ వాగ్రజుండు అంత కొంత వడికి నరుదెంచె భీముందు బానసీని వేషమూని యటకు 46 అనిలసుతుడు విభున కభివాదనము జేసి సవినయముగ బల్మె నవనినాధ వలలు డనెడు వాడ వంటలలో మేటి పాండు సుతుల మెప్పు బడసినాడ త్తే పలు విధంబులైన వంటకంబుల జేతు రుచికరంబులైన పచనములను యమతనూజు కొలిచి నటుల కొల్తును, నీదు కొలువు నందు జేర్ప్చుకొనుము నన్ను 4ీరి

అజ్ఞాతవాస పర్వము 133

అదియెగాక నేను మదగజంబులతోడ

పులుల తోడ దొడరి పోరగలను

మల్లయుద్ధ మందు బల్లిదులను గూల్చి

వేడ్క సలుప గలను విభుని మదికి 49 కూడు గుడ్డనిచ్చి కూర్మి జూచినచాలు

లేవు వేరె కోర్కె లేమి నాకు

అనెడి వాయుసుతుని ఆదరించెను రాజు

పాకశాల కాధిపత్య మిచ్చి 50 నరుడు వచ్చెనంత విరటు కొల్వున జేర

శాపజనిత షండ రూసమందు

భాసురముగ వెలిగె వాసవసూనుండు

వేషధారి యైన విష్ణు వటుల రే 'సేడితనము వలన వెలది లక్షణములు

కలిగి రుచిర మంద గమనుడౌచు

పయ్యెదంచు జాఅ నొయ్యార మొలుకంగ

నాట్యరాణి వోలె నడచి వచ్చె 52 వాని వెదదయురము బాహుయుగ్మము జూచి

మదిని దలచె నిటుల మత్స్యవిభుడు

కానరాదు వీనిలో నాడు చందమ్ము

విధికృతమ్ము వీడు పేడియెట ర్‌తి అని తలంచుచున్న యవనీశునకు మొక్కి

పలికె నాత డెల్ల వారు వినగ 'పేడియౌదు నేను పేరు బృహన్నల నృత్యగాన కళల నేర్చుగలదు. ర్క

134 సంక్షిప్త మహాభారతము పురుష జన్మమెత్తి పుంస్త్వంబు గోల్బోతి శాప కారణమున భూపవర్య అందువలన నిటుల నాటపాటలు నేర్పి కన్నియలకు శిక్ష గణపుచుంటి ర్‌5్‌ నమ్మకమ్ము గలుగ నతని మాటలయందు కొలువు నందు నుంచదలచి విభుడు తన కుమార్తె ఉత్తర నటకు రావించి నర్తనమ్ము నేర్చ నప్పగించె 56 విరటు డశ్వశాల తురగంబులను జూచు నట్టి సమయమందు నకులుడటకు వచ్చి మత్స్యవిభుని వారువంబుల పరీ క్షించి చూచుచున్న గాంచి విభుడు ర్‌ వారువముల నీవు పరికించు విధి జూడ నశ్వశిక్షకుండ వనుచు దోచె ఎవరివాడ వీవు యెటనుండి వచ్చితి వనుచు నదుగ నకులు దనియిె నిట్లు 58 పేరు దామగ్రంథి వారువంబుల లక్ష ణమ్ము లన్ని తెలియు నిమ్ముగాను తొల్లి ధర్మసుతుని తురగశిక్షకుడనై కాల మతని చెంత గడుపుచుంటి 59 విమల యశుడతండు విధి వైపరీత్యాన సిరి దొరంగి వనుల తిరుగుచుంట (బ్రతుకుదెరువు కొరకు నతనికీడగు నిన్ను కొలువ వచ్చినాడ కువలయేశ! 60

అజ్ఞాతవాస పర్వము 35

అనుమతించితేని మనసార గొలిచెద

యమతనూజు గొలిచి నటుల నిన్ను

అనెడు నతని మత్స్య జనపతి మన్నించి

చేర్చుకొనియె నశ్వ శిక్షకుడుగ 61 సాధులక్షణుండు సహదేవు డరుదెంచె

విభుని జూడ గోపవేష మందు

నిన్ను గొల్వనిమ్ము నీ గోవులను గాచి

యనుచు వేడుకానియె నవనిజేశు 62 ఆల గాచువాడ వ్యాధులు రాకుండ

ధరణి నాధ పాడి తబుగకుండ

కొల్చినాడ మున్ను కుంతీసుతాగ్రజు

నిన్ను గొల్వదలతు నింకముందు 63 జనవరేణ్య వినుము జనులు తంత్రీపాలు

దనెడు పేర బిలుతురయ్య నన్ను

సమ్మతించితేని జననాధ నిను గొల్లు

కుంతి సుతుని ముందు గొలిచినట్లు 64 సంతసించి రాజు సహదేవు నియమించె

మనుపుమయ్య ఆలమంద లనుచు

అండ దొరికె నిటుల నజ్ఞాతముగ నొక్క

వత్సరంబు గడుప పొండవులకు 65

సైరంధ్రి

అంతయాజ్ఞసేని యరుదెంచె సైరంధ్రి వేషమందు రాణివాసమునకు ఒరుల కెలుకపడక నొక్కయేడు సుధేష్ట జెంత గడుపదలచి యంతిపురిని 66

136 సంక్షిప్రమహాభారతము నగర వీథులందు నడచి వచ్చెడు రూప వతిని జూచి మనుజ వనితలందు నింత దివ్యకేజ మింత సౌందర్యమ్ము చూడగలమె యనిరి సుదతులెల్ల 67 సతి సుధేష్ణ రాజసౌధాగ్ర మందున చెలులతోడ కేళి సలుపుచుండి అరుగుదెంచుచున్న అపురూపలావణ్య రాశి నరసి యబ్బురంబు జెందె 68 చెలు లిరువుర బంపి పిలిపించి యామెను అడిగె వెవ్వరమ్మ పడతి న్‌వు ఏమి కులముదాన, వెందుబోవుచునుంటి వెఖుగ జెప్పవమ్మ యిందువదన! 69 సతి వచించె నాది సైరంధ్రివంశమ్ము మాలిని యను పేర మనెదుదాన కలరు పతులు నాకు గంధర్వు లేవురు నన్ను గాచియుందు రన్నియెడల 70 నీచమతిని నన్ను నెవ్వడైనను జూడ చంపగలరు వారి క్షణము నందె చూడ వెజతురమ్మ సూటిగా నా వైపు వక్రబుద్ధులైన వారలెల్ల య! పంకజాక్షి నాకు పరిచారికా ధర్మ మెల్ల తిలియునమ్మ యిమ్ముగాను నీచమైన పనుల నియమింప వలదమ్మ నన్ను జూదవమ్మ నయము మిజి కట!

అజ్ఞాతవాస పర్వము 137 తొలుత సత్యభామ చెలికత్తె నైయుంటి అంత [ద్రుపద పుత్రి చెంతనుంటి వారి గొల్బ్చినట్లు వనజాక్షి నిను గొల్తు ఒక్క వత్స్పరమ్ము ఉండుదాన 78 ముదము జెంది రాజి ముదితకు నెలవిచ్చె సాధ్వి ద్రుపద పుత్రి సంతసించె ఇటుల పాండుపుత్రు లేవురు కృష్ణయు ఒరుల కెజుకలేక యుండి రచట గతీ ద్యూతమాడు విభునితో ధర్మసూనుండు మాటలాడి యుల్లమలర జేయు విభుని యాదరమ్ము సభికుల మన్నన గాంచి వెలిగె సభను కంకుభట్టు ?₹5 మల్లవరుల తోడ మదగజంబులతోడ పెద్ద పులులతోడ పెనగి గెలిచి ప్రీతుచేయు విభుని క్రీడాంగణము లందు పాకశాల నున్న వల్లవుండు 76 కీచక ప్రవేశం ఇటుల చాల కాల మేచింతయును లేక కుంతి సుతులు విరటు చెంత నుండ సతి సుధేష్ట జూడ చనుదెంచె నచ్చోటి కామె భ్రాత కీచకాగ్రజుండు 77 సింహబలుడు మత్స్య సేనాధినాధుండు కరి సమానబలుడు గర్వితుండు అక్క పాదములకు మొక్క బోవుచుగాంచె (ప్రక్కనున్న ద్రుపదరాజసుతను 78

138 సంక్షిప్త మహాభారతము అంగసౌష్టవమ్ము నామె యందము జూచి చూపు ద్రిప్ప లేక చూచి చూచి ఎందు జూడనట్చీ సౌందర్యమును జూచి మదను బారి జిక్కి మతి చలించి 79 అక్క చెంతకేగి యడిగె నీ లావణ్య రాశి సుందరాంగి రమణి యెవరు ఏమి కులము దీని కెవ్వడు నాథుండు ఏమి జేయుచున్న దింతి యిచట 80 ప్రణయ ప్రార్ధనం అతని తీరు జూచి యతివ కొందలమందె పడెను వీడు కాముబారి యనుచు మాటమార్చజూడ మదన బాణహతుడు తానె యరిగె ద్రుపద తనయ కడకు 81 మగువ నడిగె వాడు మాననీ యెవరీవు నామ మేది నీదు నాధు డెవడు పొలతు లందు నీట్టి చెలువంబు గనరాదు తెలుపు మెవ్వ రీవు జలజ నయన 82 వనిత యూరకున్న వినియు విననియట్లు మదన బాణహతుడు మరల బలికె బదులు జెప్పవేమె పంకజదళనేత్రి నన్ను జూడవేమె సన్నుతాంగి 88 లగ్నమాయె మనసు రమణిరో నీ పైన నిలువజాల నింక నిముసమైన తరుణి యింక కొంత తడవు నాతో నీవు పలుకవేని విదుతు ప్రాణములను 84

అజ్ఞాతవాసపసర్వమ కి దుష్టుడటుల బలుక ద్రుపదరాజతనూజ పలికె నిటుల మృదుల భాషణముల పరమదీనురాల పరవనితసు నన్ను బొందగోర నగునె పురుషవర్య 8ర్‌ భువన మోహనమ్ము పొలతి నీ చెలువమ్ము నిన్ను బొందగోర నేరమౌనె పరసతీగమనము పాపంబెయగు గాక నిన్న బొందకుండ నిలువ లేను 86 వాని మాటలు విని భయపెట్ట మదినెంచి ఆగ్రహించి బల్కె యాజ్ఞసేని దురితచిత్త యిట్టి దుస్సాహసము జేసి కోరి చావు దెచ్చుకొనకు మోవు 87 కలరు నాకు పళులు గంధర్వు లేవరు నిన్ను జంపగలరు నిక్కువముగ విన్న సింహబలుడు నన్ను జంపెడువాడు ముజ్జ్ఞగముల లేడు ముదిత యనియె 8ిరి సైరణ విడనాడి సైరంధ్రి వానిని ధిక్కరించి పలుక అక్క కడకు చేరి పలికె నీవు చేడియ నెటులైన మార్చి దాని నాకు గూర్చవలయు 89 సుధేస్ట హితోపదేశం అంత జెప్పెనామె యతివపై మోహమ్ము మాను మివు నాదు మాట వినుము కోరెదేల నీవు సైరంధ్రితో పొందు నిన్ను రక్తి గొలుచు నెలతలుండ 90

140 సంక్షిప్త మహాభారతము అతివ జెప్పలేదె పతులు గంధర్వులు అరయు వారు దాని ననవరతము చెలియ చెంతకైన చేరనిత్తురె నిన్ను తలచినంత గుండె తటిగిపోవు రై అంతవాడు చెప్పె అక్కరో నాకిట్లు నీతి బోధ జేయ నేమి ఫలము చెలువ పొందు లేక నిలువదు ప్రాణమ్ము దాని గూర్చు మెటుల నైన నాకు 92 వాని మనసు మార్చ వలను గాదని యెంచి సతి సుధేష్ణ చెప్పె నతని తోడ నీదు సదనమునకు నెలతను బంపింతు తనివి తీర్చుకొనుము తరుణి గూడి 9౩ ముదిత హృదయుడౌచు సదనమ్మునకు నేగి వేచి యుండె నచట వెలది కొజకు తరుణి యందములను తలపోసి తలపోసి గడియ యుగమువోలె గదుపుచుండె 94 కీచక గృహ ప్రేషణం భవనమున సుధేష్ణ పాంచాలి రావించి తృష్ణ నభినయించి తెలిపెనిటుల మదిర వలయునాకు మాలినీ! వినుమమ్మ వేగ సింహబలుని వీటి కేగి 9ిర్‌ అతని యింట నున్న ఆసవరాజమ్ము తెచ్చి యిమ్ము కృష్ణ దీర్చుకొనెద విన్న కృష్ణ చెప్పె నన్ను ఐంపకుమమ్మ మదిర దేర వేరె సదనమునకు 96

అజ్జాతవాసపర్వము | చేరినపుడె నీకు చెప్పియుంటిని గాదె హేయమైన పనులు చేయననుచు నెలత జెప్పుమాట నిజమయ్యును సుధేష్ట అనుజు స్థితిని దలచి అనియె నిట్లు 97 ఆసవమ్ము పైని నాశతో తెమ్మని కోర నీకు పోవకుంట తగునె లాతి యిల్లై నీకు నా తమ్ముని గృహము ఇంత సేయలేవె యింతి నాకు 98 అని సుధేష్ణ యనగ చనదీమెతో వాదు అని తలంచి కృష్ణ చనెదు ననియె సంతసించి రాణి స్వర్ణ చషక మీయ దాని గొంచు ద్రుపదతనయ చనియె 99 మనసులోన హరిని స్మరియించి పాంచాలి కదలె సింహబలుని సదనమునకు ఆతతాయి వలన నాపద రాకుండ కావుమనుచు, నుష్ణకరుని వేడి 100 వ్యాఘ్రబిలము జొచ్చు హరిణశాబక మట్లు కీచకుని గృహమ్ము కృష్ణ చాచ్చె తీక్టకరు డనిపె నదృశ్యంబుగా నొక్క అసురవీరు నామె యండనుండ 101 సింహబలుని జూచి చెప్పె పాండవ పత్ని దేవి నన్ను మదిర దేరబంసపె ఇచ్చితేని యామె తృష్ణ తీరెడునన్న వాడు బలికె పువ్వు బోడి జూచి 102

్షే42ై సంక్షిప్రమహాభారతము తీర్చ జూచుచుంటి దేవి తృష్ణను నీవు తీర్చవేల నాదు తృష్ణ ముందు సరసనుండ రావె సన్నుతాంగీ యంచు పైకి వచ్చి సతిని బట్టుకొనగ 108 తనను గాచియున్న దనుజుని భుజశక్తి తనువునందు జేర వనిత యంత వాని ద్రోసిపుచ్చి పరుగెత్తె నట నుండి లేచి వెంటబడియె కీచకుండు 104 తరుణి వాని నుండి తప్పించుకాననెంచి పరుగులెత్తి చేరె విరటు సభకు సింహబలుడు పడతి సిగబట్టి యిలద్రోచె బుసలు గొట్టి క్రూరభుజగమటుల 105 భీమసేను క్రోధం, ధర్మజు మర్మభాషణం అన్నతోడ నప్పుడా స్థానమున నుండి వెలది పాటు సింహబలుని పోటు కాంచి వాయుసుతుడు కనుల నిప్పులు రాల పండ్లు గొటికి ఒడలు వశము దప్పి 106 వాని కీటడంచ బూని చెంగటనున్న వృక్ష మొకటి జూచి పెజుక దలచి అన్న మొగము జూడ నాతడు కనుసన్న చేసియట్టి పనిని చేయవలదు 107 అనియె నెల్లవారు వినగ, నీ వృక్షంబు వలలు దేలచూచె తెలియరాదు పెరిగి వృద్ధి జెంది వరశాఖలను గల్లి ఆ(శ్రితులకు నాత్రయమ్ము నిచ్చి 108

అజ్జాతవాసపర్వము _ కె (ప్రీతి గొలుపునట్టి వృక్షరాజము దీని కొట్టనేల వంట కట్టియలకు అను నిగూఢ భాషలను విన్న భీముండు ఊరకుండె కోప ముసశమింప 109 అన్నదమ్ము లిటుల మిన్నకుండుట జూచి యాజ్ఞసేని పలికె నార్తి తోడ కలరు పతులు నాకు గంధర్వు లేవురు విక్రమాధ్యులైన వీరవరులు " 110 ఖలుని బారి నుండి కొవరా రీవేళ కొలువువార లైన పలుకరైరి అనిన విభుడు కీచకుని జూచి భయమంది సాంత్వనములు బల్మి శాంతు జేసె క్షే వాడు చనియె నిజ నివాసంబునకు నంత సభను వీడి కృష్ణ చనక యుండ ధర్మసుతుడు బల్మె మర్మభాషణముల పతుల దూఅదగునె పడతి నీకు కే12 నీ పరాభవంబు నెజుగరే వారలు తాకు వారు తగిన తరుణ మందు మాటలాడనేల మగువరో చనుమింక సభను వీడి నీదు సదనమునకు 118 దీనవదన యౌచు తిరిగి వచ్చెడు నామె గని సుధేష్ణ యడుగ కారణమ్ము తెలిపె కృష్ణ సింహబలుని దుండగమెల్ల రాణి శిక్ష జేతు వాని ననియె ్షేషేత్య

144 సంక్షిప్త మహాభారతము పడతి జెప్పె నాదు పతులు గంధర్వులు శిక్ష జేయువారు సింహబలుని విని సుధేష్ణ కరము విహ్వలత్వము జెందె శయన గృహము జేర చనియె కృష్ణ 115 ద్రౌపదీ భీమ మంత్రాలోచనం పడతి రాత్రివేళ పాకశాలకు వెళ్లి వాయుసుతుని తోడ పలికెనిటుల నిదుర యెటుల వచ్చె నీకు పవనపుత్ర జరిగినట్టి దెల్ల మరచినావా 116 భీముడనియె నంత భామరో మాయన్న సన్న జేసి యాపకున్న నేను చంపియుందు వాని, సమయంబు భంగమై మరల కానలందు తిరుగవలదె కష? నెలత పదునొకందు నెలలు గడిచె గాదె ఉవిద కొన్నినాళ్లు ఓర్చుకొనుము జయప్రదముగ ముగియు సమయమ్ము మనకంత వంతలన్ని బాయు వనజనేత్రి 118 నీదు కలకదీర్హు నీచుని బరిమార్చి గూఢవృత్తి వాని గూల్బ వలయు వాని పట్ల నీవు వలపును నటియించి నేటి రాత్రి నాట్యనిలయమునకు 119 ఒంటివాని వచ్చి యుండ బిల్వుము వాని ఎవ్వరేని దీని నెబుగకుండ, వాని జంపి నీదు వంతబాపుదు నేను వెడలుమింక నిచట తడయకుండ 120

అజ్జాతవాసపర్వమ మరుసటి దినమందు మదనబాధితుదైన కీచకుడు సుధేష్ట గృహమునందు మాలిని గని బల్మె మగువ జూచితిగాదె కొలువు నందు సింహబలుని శక్తి కేం] నిందు సభను నేను నిను బట్టి తోయంగ కలికి యెవరు నిన్ను గాచినారు కలరు పతులు నాకు గంధర్వులంటివి చెలియ వారలేమి జేసినారు 122 ఇంకనైన నీవు బింకమ్ము విడనాడి నన్ను జేరు మావు సన్నుత్రాంగి అపుడు ఎదుట నిలచి ద్రుపదనందన మెత్త బడినయట్లు చూచి పలికెనిటుల 128 పతుల చాటు దాన బాహాటముగ నెట్లు చేరగలను నిన్ను వీరవర్య తనివిదీర కోర్కె కనురూపమగు రితి అనుభవింపు మతి రహస్యముగను క2తీ అనగ కీచకుండు వనితరో యెచ్చోట నభిమతమ్ము తీర్తువనగ నామె యనె నిశీధి నేడు అరుదెంచు మొంటిగా సద్దు లేక నాట్యశాల యందు 125 సింహబలుడు మనము చిందులాడుచు నేగి వేచియుండె రాత్రివేళ కొలకు పాకశాల కేగి పాంచాలి వివరింప పరమప్రీతి జెందె వాయుసుతుడు 126

146 సంక్షిప్ర మహాభారతము నాట్యశాలా ప్రవేశం సింహబలుడు చేరులోపల వాయు నందనుండు నాట్యమందిరమ్ము సొచ్చి ద్రుపదరాజసుత నొక్క యెడ నుంచి పవ్వళించియుందె పక్కపైన 127 సింహబలుడు వచ్చి సింహేంద్ర మధ్యమ యనుచు దటికి వచ్చి యనిలసుతుని చేయి బట్టి లాగ సింహవిక్రము డంత తాకి వాని దన్నె భీకరముగ 128 అదరిపాటు తోడ మదన తాపము బాసి సింహబలుడు భీమసేను దాకె పోరు ఘోరమాయె వీరోత్తముల మధ్య పెనగి రొకరి నొకరు తునుమబూని 129 కీచకవధ కీచకుండు డస్సె కిమ్మార దమనుండు వాని గొట్టి విగత ప్రాణు జేసె వాని మస్తకమును బాహుపాదయుగము మేనిలోన జొనిపి వాని నొక్క 130 పిండనుటుల జేసి పృథ్విపై బడవేసి చాటునుండి చూచు సతికి జూపె కార్యసిద్ధి గాంచి, కమలాక్షి భీముండు చనిరి వారి వారి సదనములకు 131 నన్ను పరిభవించి నా దివ్యపతులచే సంహరింప బడియె సింహబలుడు అని వచించె ద్రుపద తనయ కానలి వారి బిలిచి ఉదయ సంధ్యవేళయందు 132

అజ్ఞాతవాస పర్వము 147 అన్న మరణవార్త విన్న కీచకవ్రజ మతిశయముగ శోక మావహిల్ల మాంసపిండ మటుల మర్దించబడినట్టి వాని కాయ మరసి దీనికంత 188 కారణమ్ము గాదె సైరంధ్రి దీనిని సింహబలుని తోడ చితిని జేర్చి కాల్బవలయు ననుచు కాంతను బంధింప పతుల దలచి యేద్చె పరమసాధ్వి 184 ఉపకీచకవధ వనిత యార్తనాదమును విని భీముందు పరుగులెత్తి ప్రేత వనము జేరి వృక్షరాజ మొకటి పెకలించి భుజముపై దాల్చి నిలిచె వారి దారిలోన 18ర్‌ కాంత దివ్యభర్త గంధర్వుడని యెంచి పాడె నేల ద్రోసి ప్రాణఖీతి పరుగులెత్తు సింహబలుని తమ్ములబట్టి భీకరముగ జంపె భీము డచట 136 బంధముక్తి గాంచి పాండవేయ మహిషి చనె సుధేష్ట సదనమునకు నంత బానసమున కరిగె వాయుతనూజుండు వేరు మార్గమందు వేగిరముగ 187 కాంత కొజకు దాని గంధర్వ పతులిట్లు సకల కీచకులను సంహరించి రని యెజింగి విరటు డత్యంత భయమంది పలికెనిటుల తనదు పత్ని తోడ 138

143 సంక్షిప్త మహాభారతము మాలిని యిట నుండ మనకు క్షేమము గాదు ఇంతి ననుపవలయు నెటులనైన మనసు నొవ్వకుండ మంచి మాటలతోడ వెడల నడచవలయు వేగిరముగ 189 వల్లెయని సుధేష్ణ వనితతో నిటు పల్మె ప్రజలు నిన్ను జూచి భయము జెంది యున్న వారు గాన యువిద నీ వెటకైన చనుము వీడి మత్స్య జనపదమ్ము 140 పడతి జెప్పె నింక పదమూడు నాళ్లలో వ్రత సమాప్తి జరుగు వనజనేట్రి అంత నాదు పురుషు లింతిరో పొదసూపి వలసినట్టి మేలు సలుపగలరు శశ1 సమ్మతించె రాణి సైరంధ్రి నిలువంగ వ్రత సమాప్తి జరుగు వరకు నచట మరల జెప్పె చూడు మగువరో మాకెట్టి హాని కలుగకుండ నంత వరకు క్షతం సమయభంగ యత్నం పాండవులకు సమయ భంగమ్ము గావించి మరల వనము లందు తిరుగు నటుల చేయ దలచి కౌరవేయుండు బంపిన వేగు వారలెల్ల విఫలు రౌట 148 దిగులు జెందియున్న ధృతరాషస్త్రసుతునకు తెలియవచ్చె సింహబలుని గూర్చి ఇంతి కారణముగ వింతైన మరణమ్ము అనుజ నిహతి యొక్క దినమునందు కేశ శ

తవాస పర్వము 149 గడువు ముగియవచ్చె కనరారు పాండవు లెచట వెదకవలయు నింకయనుచు వంతజెందు కౌరవా[గ్రజునకు గంగ సుతుడు జెప్పె ధర్మసుతుని గూర్చి 145 ఆఅతడున్న దేశమందు సమృద్ధిగా పాడిపంట లుండు ప్రజలు మిగుల సాధులందు భక్తి సత్యమం దనుకక్తి చూపి సంచరించుచుందు రెపుడు 146 విని సుయోధనుండు అనియె నీ శుభలక్ష ణములు కలవు విరటు నగరి యందు అందువలన పాండునంద నాన్వేషణ సలుప వలయు మత్స్య జనపదమున 147 అనిని సింహబలుని హతమార్చ గలవారు మారుతాత్మజుండు మద్రవిభుడు హలధరుండు దక్క నన్యు లింకెవరైన వాని జంపలేరు వసుధలోన 1486 అందువలన వాని హంత యనిలజుండు ఉవిద (ద్రుపదు పుత్రి యుండవచ్చు కనుక తక్షణంబు మనము సేనల తోడ విరటు రాజ్యమునకు వెడల వలయు 149 వారి గోగణముల బట్టగల్లితిమేని అనికి వచ్చు మత్స్వజన విభుండు ఉండిరేని యచట పాండుతనూజులు వాని సాయమునకు వచ్చువారు 150

150 సంక్షిప్త మహాభారతము అపుడు సమయ భంగమగును వారలనంత వనుల నుండ మరల బంపవచ్చు ఇంక పదియురెండు నేళ్లు రాజ్యమ్మును పాలనమ్ము జేయవచ్చు మనము 151 దక్షిణ గోగ్రహణం విని సుశర్మ తనకు విరటునిపై సింహ బలుని నాటి పగను తలచి జెప్పె నే త్రిగర్త సైన్య నివహంబుతో నేగి దక్షిణమున నుండి తాకువాడ 152 విని సుయోధనుండు తన సమ్మతిని దెల్పె భుజము దట్టి జయము బొందుమనుచు పసుల ఐట్టనెంచి బహుళాష్ట్రమి దినాన చనె సుశర్మ సేన లనుగమింప 158 వేగువారి వలన విరటు గోవుల జాడ దెలిసి వానిపైన కలయబడియె ఆప శక్తి బేక గోషాలకులు మత్స్య విభుని సభకు జేరి విన్నవింప 154 కోప విస్మయములు భూపాలకుడు చెంది కదలె సేనతోడ కదనమునకు అపుడు ధర్మసూను డవనీశునకు జెప్పె నేను వచ్చువాడ నిన్ను గూడి 155 పోరనేర్పు గలదు భూమిశ నాకొక్క యతివరుండు నేర్సె నస్త్ర క్రీడ నీవు పోరుకేగ నేనెట్టు లిటనుండు సాయపడుదు నీకు సమరమందు 156

అజ్జాతవాసపర్వము కర కొలువు వారలందు వలల తంత్రీపాల దామ(గంధులకును ధరణి నాధ కదన విద్యలందు కలదు నైపుణ్యమ్ము చూచినాడ ధర్మసుతుని సభను 157 విభుడు సంతసించి పిలిపించె వారల కదలె సేనలెల్ల కదన భువికి చని సుశర్మ సైన్యమును దాక సంకుల సమరమాయె నుభయ సైన్యములకు 158 వెస (త్రిగర్త విభుడు విరటుని బంధించె నంత ధర్శ్మసూను డతిశయముగ అశనిపాత మటుల నిశితశరము లేసి కూలవేసె వాని ఘోటకముల 169 అనిలసుతుడు వాని యరదమ్ముపై దూకి వెస సుశర్మ బట్టి విరట విభుని బంధముక్తు జేసి పసులను గొనిపోవు శత్రుసైన్యములను చిత్రగతుల 160 కవలు తాను తాకి యవలీలగా గెల్చి మరల జేసె నాలమంద లన్ని అరి బలంబు లోడి పరువులెత్త సుశర్మ యత్నమెల్ల విఫల మాయె నటుల 161 బంధముక్తి బొంది పాండవా(గ్రజు తోడ (ప్రభువు జెప్పె కంకుభట్ట నాదు ('ప్రాణమానములను రక్షించినాడవు ఎటుల దీర్తు నీదు బుణము నేను 162

152 సంక్షిప్త మహాభారతము కోరుకొనుము యేమిగోరిన నిత్తును మత్పదంబు గూడ మాన్య చరిత అనెడు విభుని తోడ యమతనూజుడు చెప్పె ఇంత జెప్పనేల నృపవరేణ్య 163 ధర్మమయ్య నాకు ధరణీశ నిను గొల్వ మన్న నదియ నాకు నూనవేంద్ర ప్రభువు చెప్పె నంత వలల తంత్రీపాల దామ(గ్రంథులకును తగిన రీతి 164 కోరినట్టి వెల్ల కూర్చి వారికి నమో వాకములను జెప్పవలయు నిపుడు అనగ పాండుపుత్రు లనిరి భూవర మాకు మోరు చేసినట్టి మేలు చాలు 165 అంత ధర్మపుత్రు డనియె సుశర్మను విడిచి పుచ్చ నాకు ప్రియము గలుగు (ప్రభువు సమ్మతించ బంధముక్తిని బొంది చనియె నతడు తనదు సదనమునకు 166 విరటు విజయవార్త పురమందు చాటంగ కాలరులను త్వరిత గతిని ఐంపి జనవిభుండు గడిపె సైన్య సమేతుడై రాత్రి యొక్క రమ్య క్షేత్రమందు 167 ఉత్తర గోగ్రహణం ఉదయసంధ్య వేళ నుత్తర దిశ నుండి కురు బలములు బట్టె గోగణముల అస్త్రగురుడు భీష్మ డాదిత్యసూనుండు తోడురాగ ప్రబల దోర్చలముగ 168

అజ్ఞాతవాస పర్వము 53

ఉండె నగరిలోన నుత్తరుండొక్కడే

విరటుపుత్రు డట్టి వేళ యందు

గోగ్రహణము వార్త గోపాలకురు దెల్బ

భీరువతడు కరము భీతి జెందె 169

అయిన నంతిపురిని ఆడంబరము జూపి

పలికె చెండగలను పగటి, కాని

మగువలార నాకు తగిన సారధి లేమి

కదన మెటుల సలుపగలను నేను 170

అచటనున్న కృష్ణ హాస్యాస్పదములైన

అతని మాట జెప్ప నర్జునునకు

అతడు గణన జేసి యజ్ఞాతవాసంబు

పూర్తియగుట దెలిపి పొలతి కనియె 171 బృహన్నల సారథ్యం

రమణి తెల్పు మిటుల రథము బృహన్నల

నడుపగలదు రణము నందు నీకు

ఫల్టునుండు ఖాండవము గాల్పు సమయాన

నతడు మెచ్చ రధము నడిపె ననుము 172

కృష్ణ జెప్ప నటుల నృపకుమారుడు నవ్వె

రమణి జెప్పె మరల రాకుమార

అతని గూర్చి నీవు అలతిగా దలచకు

అర్జునుండె మెచ్చె నతని నేర్పు 178

కారణ జనితమ్ము శారీర వైకల్య

మందు వలన నేర్చు అల్బమగునె

అతడు రథము నడుప నపజయమ్మే లేడు

అతని గూడి పోరు కరుగుమయ్య కేశ

154 సంక్షిప్త మహాభారతము ఏమి చేయలేక భూమిశ నందనుం డియ్య కొనియె పోరుకేగ నపుడు అర్జునుండు రథము నాయత్త మొనరింప చిత్త మురియ నెక్కె నుత్తరుండు 175 కొంత దూర మరగి కురుసేనలను జూచి ఉత్తరుందు భీత చిత్తుడగుచు అనియె నరిబలమ్ము ఆభీలమై యొప్పు దాని జూడ గుండె దడలుబుట్టు 176 భీష్ణ ద్రోణ ప్రముఖ వీర నికాయమ్ము కౌరవేయ కర్ణ శూరమయము కనుల భీతిగొలుపు కౌరవానీకమ్ము దరికి జేరనైన తరముగాదు 177 చందడకిరణు డటుల మండు దవ్వులనుండి కాంచినంత మదిని కంపమడరు 'ప్రాణభయము గలిగె రధము మరల్పుము నేను పోరలేను నిక్కువముగ 178 ఆతనీ జూచి నవ్వి అనియె బృహన్నల పసుల వీడి చనుట పాడి గాదు అంతిపురములోన అన్ని మాటలు చెప్పి మరలి పోవ దగునె వరకుమార 179 పగజఖ నెదిరి పోరి పసులను విడిపించి కాంచవలయు నిపుడు కార్యసిద్ధి అటుల చేయమేని యపకీర్తి వాటిల్లు రణము సలుపుమయ్య రాకుమార 180

అజ్జాతవాసపర్వమ య్‌ అనుచు బల్కి పార్టు డరదంబు బోనీయ నుత్తలంబు జెంది యుత్తరుండు శర శరాసనముల నరదంబుపై వీడి భువిని దూకి పాజె పురము వైపు 181 అర్జునుండు రధము నాపి నేలకు దూకి పరుగులెత్తి వాని బట్టి తెచ్చి పోరజాలవేని సారథి వగు నాకు నేను పోరువాడ నీకు మారు 182 అనుచు వాని నొగల నునిచి బృహన్నల చెంతనున్న జమ్మిచెట్టు కడకు అరుగుచుండ ద్రోణుడాతని గుర్తించి సమయభంగ మతడు సలిపెననుచు 188 భీతి జెంది చెప్ప భీష్ముందు గణియించి గడువు వత్సరంబు గడిచెననియె అరయు చుండిరంత కురువీరు లాతని వింతరూపు జూచి విస్మయమున 184 తరు సమోప మందు నరదమ్ము నిలిపించి చెప్పె నర్జునుండు చెట్టుపైన కట్టగట్టి యున్న గాండీవమును తూణి దించు మనగ (ఢేతమంచు దలచి 185 ఎటుల జేయమనెదు వీ నీచ కార్యంబు తగునె చెప్ప శవము తాకుమనుచు అనెడు రాజసుతుని కర్టునుండనె నద్ది శస్తసంచయమ్ము శవము గాదు 186

156 సంక్షిప్త మహాభారతము కట్టవిప్పివాడు కాంతు లీనెడు గాండి వమ్ము తూజి నిచ్చె పాండవునకు వాడెజటుంగ గోర పార్టుండు వివరించె అచట నున్న అన్ని ఆయుధముల 187 అంత నుత్తరుండు అనియె నాయుధముల విడచి యిచట పాండువేయు లెచట కష్టజీవితమ్ము గడుపుచుండిరా యంచు కొందలమ్ము గలిగె దెందమందు 1886 అంత విజయు దనియె వంత జెందకు మోవు సుంతయైన పాండుసుతుల గూర్చి గుప్తరూపములను కుశలురై యున్నారు అతివ తోడ మి గృహమ్ము నందు 189 వత్స! కంకుభట్టు పాండవజ్యేష్టుండు వలలు దనిలదేవు వరసుతుండు అశ్వయూధములను ఆలమందుల గాచు వారు మాద్రిసుతులు వీరవరులు 190 శాపజనిత షండరూపధారిని నేను అమరవిభుని సుతుడ నర్జునుండ సతి సుధేష్ట చెంత సైరంధ్రిగా నున్న పడతి పాండవేయ పట్టమహిషి 191 అమె కొజకు గాదె యనిలజుం డానాదడు సంహరించి ఖలుని సింహబలుని విన్న విరటుసుతుడు వృక్షంబు దిగివచ్చి పదములంటి మొక్కె ఫల్గుణునకు 192

అజ్జాతవాసపర్వము 1౧7

సూతకృత్య మందు నూతనోత్సాహంబు

కలిగె యుత్తరునకు కలత దీటె

వాని కౌగిలించి వాసవసూనుండు

పలికె రధము నడుపు భయము వీడి 198 అర్జును నిజరూప ప్రాప్తి

భక్తి దేవతలకు ప్రణమిల్లె పార్థుండు

షండతనము బాసె క్షణములోన

దివ్యద్యుతుల వెలిగె దివిజేంద్ర సూనుండు

అన్ని లాంఛనమ్ము లతని జేర 194

దేవదత్త మూద దివిజేంద్ర తనయుండు

మారు మోగె దిశలు మరల మరల

వచ్చుచున్నవాడు పాండవమధ్యముం

డని వచించె ద్రోణు డస్త్ర గురుడు 195

విని సుయోధనుండు భీష్మునితో జెప్పె

పాందవులకు సమయభంగ మాయె

గడువు ముగియకుండ పొడసూపె విజయుండు

వనికి మరల వెడల వలయు వారు 196

అనగ తెలియజెప్పె నాపగా తనయుండు

గడువు తీరె నిన్న కౌరవేశ

పొండుసుతులు వెళ్టివారలే సమయమ్ము

భంగపరచి తిరిగి వనుల కరుగ 197

ఫల్గునుండు వచ్చె బవరమ్ము సలుపంగ

అతని నెదిరి గెల్తు మనగరాదు

సలిపినారు గాన సమయానుసారమ్ము

కోరదగును పొందు వారితోడ 198

158 సంక్షిప్ర మహాభారతము విని సుయోధనుండు భీష్మునితో జెప్పె వారితోడ ఫొందు గోర నేను రాజ్య భాగమిోయ, రణరంగమున వారు లావు జూపవచ్చు చేవయున్న 199 అంత నర్జునుండు ఆపగాసుత ద్రోణ కృపుల కాళ్ల దరిని రెండు రెండు బాణములను వేసి వారికి నతులిచ్చి సాగె గోగణముల జాడ నరసి 200 వెడలుచున్న వాని వీక్షించి భీష్ముండు అనియె కౌరవేశు వెనుక వీడు అరుగుచున్నవాడు ఆపంగవలె నంచు వాని వెంట నరిగె సేన తోడ 201 కౌరన వీర పరిచయం వచ్చి నిలచి రటుల వాసవసుతు ముందు కౌరవేయ సమర వీరులెల్ల వారి నుత్తరునకు వేరువేరుగ జూపి అనియె పాండుతనయు డతని తోడ 202 అస్త్రగురుడు ద్రోణు డతనితో సమరమ్ము నేను కోరి సలుప నెప్పుదైన అతడె బాణమేయ నపుడు చూతము గాక అంతవలఅకు చొరకు మతని దరికి 203 ఇతడు కృపుడు గురున కెనయౌను రణక్రీడ గురుసముండు దివ్యశరవిదుండు అతని చెంతనున్న యతడె అశ్వత్థామ సుర సమాన బలుడు గురుసుతుండు 204

అజ్ఞాతవాస పర్వము 159

పరశురామకలిత పరమాస్త్ర కుశలుండు

కౌరవేయ సఖుడు కర్గు డితడు

నన్ను గెల్వజాలి నట్టి వాడని నమ్మి

కౌరవేయు డతని గారవించు 205 ఉరగకేతనుండు కురుపుత్రజ్యేష్టుండు

మాయజూద మందు మమ్ము గెలిచి

సతిని పరిభవించి వెతల పాళ్టేసిన

దుండగీడు కౌరవుం డితండు 206 కురుపితామహముండు సురనదీసూనుండు

వీరపుంగవుండు భీష్ముడితడు

హితముగోరు మాకు ధృతరాష్టసుతులకు

పోరు నచట నుంట వారి జేరి 207 అమిత భక్తి నాకు నాపగాసుకుదన్న

ముందు బాణ మేయ మోహరమున

అని నరేంద్ర సుతుని కరివీరులను జూపి

అర్జునుందు సిద్ధమాయె ననికి 208

కౌరవార్డున యుద్ధం

గురుడు శాంతనవుడు గురుసూతి కృపుడును

అనుజ యుతుడు కౌరవాగ్రజుండు

తాక నొక్కసారి నాకేశుతనయుండు

శకలములుగ జేసె శరములన్ని 209 నరుడు వేయు శరము లరుల సేనలదాక

లక్ష్యసిద్ధి తోడ లాఘవమున వనధిజలములందు 'పెనుమత్స్యమట్టుల కదలె నతని రథము కదన తలిని 210

160 సంక్షిప్త మహాభారతము భగ్న స్యందనములు ధ్వజ చామరమ్ములు ధరణి గూలు కరులు తురగములును నిండియున్న నేల నిబిడాభముల తోడ కప్పబడిన నభము కరణి దోచె ల్మ్న అస్త్రగురుని కృపుని ఆపగాతనయుని (దోణసుతుని కర్టు దుస్ససేను శరములందు ముంచి సారథులను నొంచి విక్రమంబు నెరపె శక్రసుతుడు 212 అర్మసూను డంత నమరేశునందను తాకి శరములేయ భీకరముగ సవ్యసాచి వాని శరపరంపర లేసి శిరము నుండి పదము వరకు గొట్టె బ1ే8 శక్రసుతుని తీవ్ర శస్తాస్త ధాటికి తాళలేక పాజె తరణిసుతుడు అంత నస్త్ర గురుని యరదమ్ము తిలకించి ఇంద్రసుతుడు దానికెదురు వెళ్ల లన్న పరమ భక్తితోడ గురువందనము జేసి నేను మొదట వేయ బాణమనియె (ద్రోణుడంత నిశిత బాణమ్ములను వేయ నడుమ ద్రుంచె వాని నర్జునుండు 215 అనిల శక్ర వరుణ అనల దత్తములైన శరము లేయ గురుడు నరుడు వాని ప్రతిశరంబులేసి భగ్నంబు గావింప నతడు కరము విస్మయంబు జెంది 216

అజ్జాతవాసపర్వమ ర తలచె నితని గెలువతరమె ఈశునికైన సమరక్రీడ వీని సములుగలరె అంతలోన విజయు డతని శరీరమ్ము స్యందనమ్ము గప్పె శరము లేసి లై? తండ్రి పాటు జూచి తనయు దర్జును దాక పోరు ఘోరమాయె వారి నడుమ ఇంద్ర వృత్రు లటుల నిరువురు పోరంగ సేన యబ్బురంబు జెంది చూచె 218 (దౌణి తూణు లంత బాణశూన్యము లౌట కృపుడు వచ్చి పోర క్రీడి తోడ జ్వాలలెగయు నటుల శరపరంపర లేసి శక్రవరసుతుండు విక్రమమున 219 కేతనమ్ము దునిమి కృపుని వక్షము నేసి రథ్యములను జంప, రధముడిగ్గి ఖడద్గమూని రాగ ఖండించె దానిని సవ్యసాచి యొక్క క్షణములోన 220 అంత పాండుపుత్రు డాపగాసుతు డున్న దిశకు నేగజూచి దేవవ్రతుడు శరపరంపరలను నరునిపై రధముపై వేయ పాందుసుతుడు విక్రమించి 221 విడుపు తెజపి కానబఐడకుండ సాయక తతుల నేసి గగనతలము గప్పె శాంతనవుడు నరుని శరముల దునుమంగ నతని విల్లు వితిచె నర్జునుండు 222

162 సంక్షిప్త మహాభారతము భీష్ము డాగ్రహించి వేరొక్క ధనువెత్తి కురిసె నస్తములను నరునిపైన వాని నెల్ల ద్రుంచె వాసవసూనుండు చూచి ప్రస్తుతింప సురగణములు 228 మరల భగ్నపజచి కురువృద్ధుచాపమ్ము నరుడు వేసె నతని యురము దగుల సోలి శాంతనవుదు కూలగా సూతుండు తొలగిపోయె రధముతోడ నపుడు ఐ2డ్మ కుంతి తనయు డిటుల కురువీర వర్గంబు నుక్కడంచ గని సుయోధనుండు వచ్చి తాక నతని వాసవ సూనుండు క్షణము లోన రక్షగాత్రు జేసె 225 అతని యనుజు లంత నర్జును నెదిరించి భంగపడిరి వారి భ్రాతవోలె అంత నతని గెల్వవలను గాదని యెంచి భీష్మద్రోణ ప్రముఖ వీరులంత 226 సమ్మోహనాస్త ప్రయోగం ఒంటివాని పైకి నొక్కుమ్మడిగ వచ్చి చుట్టుముట్టుచున్న చూచియపుడు శక్రసుతుడు వేయ సమ్మోహనాస్తంబు క్షితిని బఐడిరి వారు చేష్టలుడిగి 227 పాండుసుతుడు చెప్పె వత్స! రథము డిగ్గి అరుల తలల పైని యంబరములు తెమ్ము త్వరగ నేగి, దేవవ్రతుడు చేష్ట కలిగియుందు నతని కదకు జనకు 228

అజ్జాతవాసపర్వము ౨౨౨౨63

ఉత్తరుండు బొమ్మ పొత్తికలకు వస్త్ర

సంగ్రహణము జేసి సంభ్రమమున

అరద మెక్కి కదల నాపగా తనయుండు

నరునిపైన నిశిత శరము లేసె 929

అతని సరకుగొనక (్రతిశరంబుల నేసి

విజయస్స్ఫూర్తి తోడ విజయుడేగ

కౌరవాగ్రజుండు కనువిప్పి పరికించి

పురికి బోవుచున్న నరుని జూచి 280 కౌరవ తిరోగమనం

పోవువాని దాకి పోరు సల్పెదమన్న

నగుచు భీష్ము దనియె నతనితోడ

చేతనమ్ము లుడిగి చీరలొల్చుట గూడ

తెలియకుండ కదన తలము నందు 231

పడిన మనల విడిచె ప్రాణముల్‌ గొనకుండ

పరమ కరుణతోడ ఫల్గునుండు

దాని మరచి మరల వాని దాకితిమేని

కొనడె ప్రాణములను క్షణములోన 282

మరలిపోద మింక మనయూీరి కని చెప్ప

కౌరవుండు వేరు దారి గనక

పరిభవాగ్ని తోడ నురియు చిత్తముతోడ

తిరిగివెళ్ల సమ్మతించె నపుడు 238

విజయు డంత జమ్మి వృక్షంబు చెంతకు

నరిగి పదిల పఅచె నాయుధముల

సేడియటుల మరల వేషధారణ జేసి

తొలుత వోలె రథము దోలసాొగె లైర్రిడ్తీ

164 సంక్షిప్త మహాభారతము ఆలబట్టినట్టి యరులను నిర్దించి విజయలక్ష్మి గొనుచు వీరవరుడు ఉత్తరుండు వచ్చుచుందెననుచు చాట పసుల కాపరులను బంపె పురికి 285 దక్షిణమున శత్రు దళముల నోడించి పురికి వచ్చినట్టి విరట విభుడు భీష్మ ద్రోణ ప్రముఖ వీరులతో బోర ఉత్తరుండు వెళ్లియుంట తెలసి 286 పాప డెటుల పోరు నాపగాసుత ద్రోణ కర్ణ ప్రముఖ వీరగణము తోడ సారధియును లేడు షండుడెట్టుల దోలు రథముననియె ఘోర రణము నందు 2వ? విన్న కంకుడనె బృహన్నల తోడుగా నుండ జయము గల్లు నుత్తరునకు ఏగె నొక్క్మరుండె యేమగునో యంచు సుతుని దలచి వగచుచుండె విభుడు 288 అంత వచ్చి చేరి రటకు గోపాలురు కురు బలముల గెల్చి గోగణముల (గ్రమ్మరించి వచ్చు రాకుమారుని వీర విజయవార్త దెలుప విభుని తోడ 239 వార్త విన్న విభుడు పరమ హర్షము జెంది వీట వీట దాని చాట బనిచి అనియె నుత్తరునకు ఘనస్వాగతము జెప్ప సలుపవలయు నగరి సజ్జితమ్ము 240

అజ్జుతవాసపర్వము _ _]6 అంత కంకు జూచి ఆహ్హాదమయ వేళ పాచికలను ఆదతోచె మదికి అనుచు నడ్డసాళకులను వేసి యతనితో నాడ దొడగి మనుజనాధు డపుడు బెశ్తన్షే జనవిభుండు తిరిగి తనయుని బొగడంగ యమతనూజు డనె బృహన్నలుండ జయము నిశ్చయమ్ము జననాధ నే గంటి అతని పాటవమ్ము నాహవమున 242 అంత విరటుడనియె వింతగా బల్మెదు దురము గెల్వ సారధులకు తరమె నాదు సుతుని నేర్పు నలతిగా బల్బుట తగదు నీ కనంగ కంకు డనియె 248 అటుల బల్మెదేని యవనీశ వినుమయ్య సారధియె రణమ్ము సలిపియుండు రధము దోలియుండు రాకుమారుడు నేడు జ అనగ భూమిపాలు డా(గ్రహించి చేత నున్న సారె నాతనిపై వేయ గాయ మాయె నతని కంటిపైన ఓర నిలచియున్న సైరంధ్రి చీరతో 5 గాయ మెత్తి నీట కడిగి తుడిచె ఇటుల తుడవనేల నీతని గాయమ్ము అని విరాటు డడుగ వనిత జెప్పె సాధు భక్తు డితడు సద్వంశజాతుండు 246 వసుమతీశ పుణ్యవర్తనుండు

166 సంక్షిప్త మహాభారతము ఇతని రక్త మిలను ఎన్ని బొట్టులు రాలు అన్ని యేండ్లు వర్ష మవని బడదు అందు వలన దాని నవనిపై బడకుండ పుడమినాథ నేను తుడిచినాను ఏ2శ్త/ ఉత్తరు పురాగమనం అంత విరటు పుత్రు డరుదేర భూనాధు డతని జూచి హర్ష మతిశయిల్ల నడిగె కురుబలముల నడచితి వే రీతి వినదలంతు తెలుపు మనగ నతడు 248 భీష్మ ద్రోణ ప్రముఖ వీరోత్తములు గల్గు సేన గెల్వలేదు నేను తండ్రి మహితశక్తియుతుడు మహనీయు డొక్కడు రణము సల్పె నేను రధము నడుప 249 సరకుగొన డతందడు సురనదీసూనుని కర్ణు నస్త్రగురుని కౌరవేశు వాని యస్త్ర ప్రొఢి వర్ణ నాతీతమ్ము భంగపజచె నెల్ల వారి నతడు 250 ఓడి యెల్లవార లొక్కుమ్మడిగ దాక మోహనాస్త్ర మేసి మూర్చ గొలిపె వారి తలల మిద వస్త్రమ్ములను నేను కత్తిరించి నాడ పాొత్తికలకు 21 అవని నాథుడడిగె యెవరట్టి వీరుండు ఇచట లేడె యెచటి కేగినాడు తనయుడనియె నిచ్చ జనియె నాతడు నిక్కు వముగ నేడొ రేపొ వచ్చువాడు 252

అజ్ఞాతవాస పర్వము 167

పాండవ పరిచయం

మరుసటి దినమందు మత్స్య భూపాలుండు

కంకుభట్టు జూచి గద్దెపైన

ఆగ్రహమున బల్మ నమరేంద్రసూనుండు

అతడు ధర్మతనయు డనుచు దెలిపె 258

అవని విభుడు విససయము సంశయము గల్ల

ననియె నితడు ధర్మతనయు డేని

అనిలసుతుడు పార్టు డళ్వినీసుకులేరి

పాందుసుతుల ధర్మపత్ని యేది 254

పొర్టు దనియె నీదు పాకశాలను జేరి

నేర్చు తోడ వంటవార్చ్పు జేసి

మల్లవరుల తోడ మత్తేభముల తోడ

పెనగి నీదు మదికి వేడ్క సలిపి 2565

నట్టి వలలు డీత డనిల తనూజుండు

బక హిడింబ దైత్యవరుల జంపె

అశ్వయూధములను అలమందల గాచి

నట్టివారు మాద్రి యనుగు సుతులు 256

సతి సుధేష్ణ చెంత సైరంధ్రిగా నుండి

సేవ చేసినట్టి చెలియ కృష్ణ

ఆమె కొకు గాదె భీమసేనుడు నాడు

పార్థివేంద్ర సింహబలుని జంపె 257

అంత భీముడనియె నంతఃపురము నందు

కన్నియలకు నృత్య గానములను

నేర్పుచున్న పేడి నిర్ణరేశ్వరసూను

డస్త్రశస్త్ర నిపుణు దర్జునుండు 258

168 సంక్షిప్త మహాభారతము విస్మయమ్ము జెంది వీక్షించు విభు జూచి అనియె నుత్తరుండు జనక యితడె కురుబలంబు చెండి గోగణంబుల గాచె నేను రధము ద్రోలు నటుల జేసి 259 భీష్మ ద్రోణ ప్రముఖ వీరాధివీరుల సరకు గొనక సలిపె సమర మితడు అస్త్ర క్రీడయందు అసమానకుశలుండు జగతి నితని గెల్వజుల రెవరు 260 విన్న మత్స్యవిభుడు విజయు కౌగిటజేర్చె చేర్చె యెదను భీమసేను, కవల పాండు జ్యేష్టసుతుని పాదంబులకు మొక్కె వినయవినమితముగ తనువు వంచి 261 అంత బిలువ నంపె కుంతీసుతుల జూడ బంధు మిత్ర సచివ వర్గమెల్ల సతిసుధేష్ట కడకు సైరంధ్రి పాందవ పత్ని యనుచు దెలుప బంపె చెలుల 262 అర్జునుండు జెప్పె నజ్ఞాతవాసమ్ము సలిపి నాము మాదు సదనమందు అంత విరటు డనియె నది మాకు భాగ్యమ్ము దైవ కృపయె యనుచు దలతు నేను 268 ఏలుమయ్య నీవె యీ మత్స్యరాజ్యమ్ము ధర్మతనయ నీవె తగుదు వనగ ఛాకుమారు డనియె రాజ్యమ్ము వీరిదే వీరె యనిని గెల్చినారు గాదె 264

జనక వీరికొక్క ఘనమైన కానుక

నిచ్చు టుచిత మనుచు నెంచినాడ

రాకుమారి యుత్తరను బిల్వ బంపుము

అనగ సమ్మతించె నవని విభుడు 265 తంది పిలుపు నంది తరళాక్షి యరుదెంచె

మదమరాళ మటుల మందగతుల

అధిపు డెదురు వెళ్లి యామెను గొనితెచ్చి

పాండవాగ్రసుతుని వద్ద నిలిపి 266 అనియె నాయనుంగు తనయ నీమెను నీవు

సమ్మతింప సవ్యసాచి కీయ

దలతు ననగ నతడు తమ్మునిదెస జూచె

వాసవాత్మజుండు పలికెనిటుల 267 బాలనాకు శిష్యురాలౌట నీమెను

ఆలిగాగ ఐడయు టనుచితమ్ము

హరికి మేనయల్లు డఖిమన్యు డీమెను

సతిగ బడయు మిరు సమ్మతింప 268 విరటు డనియె నంత విజయుతో వియ్యమ్ము

మాకు పరమభాగ్య మనిదలంతు.

ఉచితరీతి బలికె శచిపతీ తనయుండు

అనియె నతనితోడ యమసుతుండు 269 పెండ్లి పత్రికలను విరటుండు వ్రాయించి

బంధుజనుల కెల్ల బఐంపి యపుడు

పరమప్రీతి తోడ పొందుపుత్రుల జూచి

పెండ్లి దినము కొటకు వేచియుండె 270

170 సంక్షిప్త మహాభారతము కౌరవాగ్రజుండు గాంగేయు వచనమ్ము తోసిపుచ్చి కర్ణ దుస్ససేన సౌబలాది దుష్టజనుల దుర్మంత్రమ్ము వలన నెగ్గు సలుప పాండవులకు గ. ఫల్గునుండు సమయ భంగమ్ము గావించె ననుచు వర్తమాన మనిపె నంత యమసుతుండు జెప్పె సమయాబ్దములు నిందె భంగపజచ లేదు ఫల్గునుండు 272 పాండుసుతులు గుప్తవాసమ్ము ముగియించి గ్రహణముక్త లైన గ్రహములటుల తేజరిల్లి విరటు పూజలు గ్రహియించి వాసముండిరి యుపష్లావ్యమందు 278 వారిజూడ నెంచి పరివార సహితులై హలధరుండు కృష్ణు దడరుగు దెంచ సత్కరించి వారి సంభావనల నంది పరమప్రీతులైరి పాండుసుతులు 274 ఉత్తరాభిమన్యుల వివాహం హరికి భాగినేయు డభిమన్యు డరుదెంచె విరటు ననుగు సుతను పెండ్లియాడ వచ్చె ద్రుపద విభుడు పొంచాల బలముతో సుతను జూడ పాండుసుతుల జూడ 275 వచ్చి రిరుతెజిగుల బంధువర్గము లెల్ల పెండ్లి కొకు విరటు పిలుపునంది పూలతోరణముల పురి యలంకృతమాయె నవవధువుగ దోచె నగరమంత 276

అజ్ఞాతవాస పర్వము క! మంత్ర వేదఘోష మంగళవాద్యాలు నిండియున్న పెండ్లిమంటపమున హరియు హలధరుండు కరుణదృక్కుల జూడ ఉత్తరాభిమన్యు లొక్కటైరి బి7? విరట భూవిభుండు విరివిగా సమకూర్చి సంపదలను నూత్న దంపతులకు బంధుజనుల కిచ్చె వస్తభూషణముల అతిధి పూజ జేసి యాదరమున 278 ద్విజులు యాచకులకు విరివిగా సిరులిచ్చె లేనివాడు పురిని లేనియటుల పాండవేయ మాత్స్య వంశంబు లీ రీతి కలసె పొలు నీరు కలిసినటుల 279 నటాషా ననా

172 సంక్షిప్ర మహాభారతము ఉద్యోగ పర్వము విరటు నగరమునకు పెండ్లికై వచ్చిన రాజులెల్ల మత్స్యరాజ సభను కూడియున్నవేళ గోపాల దేవుండు పలికెనిటుల వారి కలయజూచి క్‌! కౌరవాగ్రజుండు కపట ద్యూతమునందు మాయకజేసి రాజ్య మపహరింప శక్తివంతులయ్యు సమయంబిు పాటించి పడిరి కష్టములను పాండు సుతులు ౭ పదియు రెండునేండ్లు వనవాసమున నుండి గూధవృత్తి నాక్కయేడు గడిపి పరిభవింప బడియు వైరమ్ము దలపక తాల్మి దాల్చి యుండె ధర్శ్మజుండు తి ద్యూత నియమములను నీతితో పాటించి 'ప్రకటమైన యట్టి పొండవులకు వారిదైన రాజ్యభాగమ్ము నిచ్చుట సాధుహితము ధర్మసమ్మతమ్ము టీ ధార్తరాష్ష్రు లేమి తలతురో యెజుగంగ వారి కడకు దూత బంపవలయు ననగ హలధరుండు తన సమ్మతము దెల్పె కినుక బూని సాత్యకిటుల బల్మె ర్‌ మాయజేసి రాజ్య మపహరించినవారి దరికిబోయి వేదదగునె మనకు రణము సల్పుటొకటె యనువైన మార్గమ్ము నిలువగలరె మనల నెదిరివారు 6

ఉద్యోగపర్వమ లె ద్రుపదు డనియె నపుడు దుర్యోధనునియందు మంచి యనెది లేశమైన లేదు ధర్మమార్గ మెంచి ధరనీయ నొల్లడు సందియమ్ము లేదు సమరమగును ళా కుమతి యనక వాని గూడియుందురు ద్రోణ శాంతనవులు రణము జరిగెనని అంధ న్ఫపతి పుత్ర వ్యామోహి యమైయుందు తులువ కర్టు డతని తోడ నుండు 8 వారి బలిమి దలచి కౌరవుం డేప్రాొద్దు కాలు ద్రవ్వచుండు కయ్యమునకు సలుప వలయు మనము సమర సన్నాహమ్ము 'సేకరింప వలయు సేన నిపుడు 9 మనకు మిత్రులైన జననాథులను గోర వలయు సైన్యములను బంపుమనుచు కాలయాపనమ్ము కలుగనీయక వారి కడకు బంపవలయు కాలరులను 10 మాన్యచరికు దైన మన పురోహితుదేగి సమయపాలనమ్ము సలిపి వీరు తిరిగి వచ్చి రనుచు కురునాథ గాంగేయ కలశభవుల తోడ తెలియజేయు క్ష్ష ననగ సమ్మతించి హరి దెల్బె నతనితో చేయు టొప్పు మోరు చెప్పి నటుల కౌరవేశ్వరుండు గాంగేయ (ప్రముఖులు గారవమున జూచు వారు మిమ్ము [2

174 సంక్షిప్త మహాభారతము త డన. నుప హస్తినగర మందు నవనిదేవుడు పొందు సలుప గలిగె నేని సంతసమ్ము అటుల గాని యెడల ననికి సన్నద్ధమ్ము చేయవలయు తడవు సేయకుండ 18 పెండ్లి పిలుపు నంది విచ్చేసి యిచ్చోట నిలువ దగదు వెడల వలయు మేము ఆర్య సమ్మతముగ కార్యమ్ము నెరవేర్చి పిలువ బంపవలయు పిదప మమ్ము కేశ అని వచించి కృష్ణు దగ్రజ సహితుడై ద్వారకాపురమ్ము జేర వెడలె ధర్మసుతుడు సమ్మతము దెల్ప ద్రుపదుండు కరి నగరికి విప్రవరుని బంపె 15 కృష్ణ సాహాయ్యాభ్యర్థనం కరిపురమ్ము నందు కౌరవేయుడు సైన్య సంచయమ్ము చేయనెంచి సకల ధరణి పతుల వేడ తగిన దూతల బంపి తానె తరలి వెళ్లె ద్వారవతికి 16 నిదుర బోవుచున్న యదువంశ తిలకుని తలకు దరిని యున్నతాసనమ్ము నధివసించి యుండ నచ్చోటి కరుదెంచి హరి పదముల చెంత నరుడు నిలిచె క కొంత వడికి మేలుకొని ముందు నరుజూచి వెనుక ధార్తరాష్ష్రు గనియె విభుడు పరమప్రీతి తోడ నిరువురి వీక్షించి ఏల వచ్చినార లిటకు ననగ 18

ఉద్యోగ పర్వము 15 వినిన కౌరవేయు డనె పాండుసుతులతో జరుగ బోవనున్న సమరమందు మాకు నీ సహాయ మర్ధింప వచ్చితి వాసుదేవ తోడు పడుము మాకు 19 ముందు వచ్చినాడ నందువలన మాకు సాయపడుట నీకు న్యాయమనగ హరి వచించె నీవె యరుదెంచితివి ముందు కాని విజయు ముందు గంటి నేను 20 ఇరువురకు సమముగ నేర్చరించెద నేను మిరు వలసి నటుల కోరుకొనుడు కదనరంగ బలులు పదివేవు రొకవైపు ఒక్కరుండ నే మరొక్క వైపు 2 పిన్నవాడు గనుక విజయుండు మునుగోర పాడియనగ నతడు వాసుదేవు గోర నాత్మబొంగి కౌరవేయుడు సైన్య ములను గోరుకొనియె ముదము మాటి 22 అట సుయోధనుండు హలధరు కడకేగ తాను ఎవరి పక్షమూన ననియె ఆహవమున కొక్క యక్షాహిజీ సేన బంపగల నని కృతవర్మ దెలిపె 28 వీరవర్యుల పదివేవుర విడనాడి రణము సేయనట్టి నను వరింప నేమి కారణమ్ము యెజిగింపుమని కృష్ణు డడుగ సవ్యసాచి అనియె నిట్లు జట

176 సంక్షిప్త మహాభారతము నేను రణము నందు నీ సాయమొల్లను నీవు పోర పేరు నీకె యగును కృష్ణ నిన్ను నెదిరి గెల్వలే రెవరైన మూల మోవె విజయమునకు నెపుడు ఖద సమరమందు నాకు సారధ్య మొనరించి గారవించు నన్ను కరుణ జూపి యనగ సమ్మతించి హరి బల్కె నీ వాంఛి తమ్ము దీర్చ నాకు ధర్మ మనఘ! 26 అని వచించి కృష్ణు డర్దున సహితుడై ధర్మసుతుని కడకు తరలివెళ్లె అనికి సైన్య సంచయము సల్సు కార్యమ్ము పాండుసుతులు సలుపుచుండి రచట ల శల్యసాహాయ్యం మద్రవిభుని సాయమర్థ్ధింప దూతల యమసుతుందు బంప నలరి యతడు బంధుమిత్ర సైన్య పరివృతుందై సాగి పాండుసుతుల జేర వచ్చుచుండ 28 విని సుయోధనుండు విడుదు లేర్పడ జేసి మద్రవిభుడు చనెడు మార్గమందు చకృనైన సకల సొకర్యముల గూర్చ యమసుతుండు చేసెనని తలంచి 209 పరిజనులను మెచ్చి పారితోషక మంద రమ్మనంగ ధార్తరాష్లు డటకు వచ్చి నిలచి వినయ వచనంబులను బల్మ శల్యుడతని జూచి సంతసమున 80

ఉద్యోగ పర్వము 177 ప్రీతి మొజ మాకు నాతిథ్య మిచ్చిన నీ బుణమ్ము తీరు నెటుల మాకు నీదు కోర్కె దెలుపు నెరవేర్చ గలవాడ ననగ కౌరవుండు హర్ష మంది 81 అనియె సత్యసంధుడౌ నీవు కరుణించి నాయపడుము మాకు సమరమందు మేము పాండుసుతులు మికొక్క రూపౌట నన్ననుగ్రహించు నయవిచార తె2 మాట దప్పనట్టి మద్రేశు డతనికి సాయపడెదననియె సమరమందు పాందుసుతుల జూచి వచ్చిదనని జెప్ప కరిపురమున కేగె కౌరవుండు తతి అపుడు శల్యభూపు డుపప్లావ్యమున కేగి జరిగినట్టి దెలుక పరచి తాను శ్రుపక్షమూని సమరంబు సల్పుట తెలుప ధర్మసుతుడు పలికెనిటుల రెడీ తనకు కృష్ణు డటుల తగిన సారధి లేమి నరునితోడ పోరు నపుడు నిన్ను కోరు సూతసుతుడు సారథ్య మొనరింప దాని కియ్యకొనుము ధరణినాథ కిక్‌ రధము నడుపు నపుడు రాధేయు థైర్యమ్ము మందగించు నటుల మాటలాడి వాని నాత్మ ధైర్యహీనునిగా జేసి నరుని గావ వలయు నరవరేణ్య 86

176 సంక్షిప్త మహాభారతము సమ్మతమ్ము దెల్పి శల్యభూపాలుందు వాని కిటుల జరుగవలయు ననియె దుర్నయుండు వాడు దుర్యోధనుడు వాని బలిమి నెంచి రణము సలుపజూచు 87 నాడు సభను కర్టు దాడిన మాటల ధర్మపుత్ర హృదయ తాప మాయె వారి వలన మోరు పడిన బాధల నెంచ తరమె యెవరికైన ధరణి లోన 88 తొల్లి నహుషు డటుల దుర్యోధనుడు నాశ మొందగలడు లేదు సందియమ్ము భరతవంశ తిలక తిరిగి సామ్రాజ్యమ్ము బొంది నీవు శుభము లొందగలవు 89 అని వచించి మద్రజననాధు డరిగిను త్వరిత గతిని హస్తిపురము జేర అంత వచ్చె నటకు నక్షాహిణీ సేన గూడి సొత్యకి, యదుకులవరుండు త్త౦ చేరి రంతలోన చేది నరేశుండు సేనతోడ మగధ క్షితివరుండు అంత వచ్చి కేకయాధీశు లేవురు చేరి రటకు వారి సేనతోడ శ్షీ్షే అటుల జేరె నేదు అక్షౌహిణుల సేన పాండు రాజ సుతుల వైపు పోర అచట పదునొకండు అక్షౌహిణుల సేన కౌరవా(గ్రజన్ము జేర వచ్చె న

ఉద్యోగ పర్వము 179 ద్రుపద పురోహితుని దూత్యం (ద్రుపద విభు పురోహితుడు హస్తినగరిని కృపుని విదురు వారి గృహములందు గాంచి నతు లొనర్చి కౌరవాగ్రజు జూచి భాషణములు సల్పె వారి తోడ తై పిదప నొక్కనాడు పేరోలగంబున వారి సముఖమందు బలికనిట్లు వపాండుపుక్రు లింద్రప్రస్థ మందున వారి పాలిదైన రాజ్య మేలుచుండ త్తేడ్తే వంచనమ్ము జేసి వారి రాజ్యము గొన్న తెలగు లెల్ల మాకు తెలియు గాదె నిండుకొలువు నందు నెలత చీరలు బట్టి లాగలేదె మోర లరయు చుండ డర్‌ పదియు మూడునేండ్లు పొండుపుత్రులు పడ్డ యిడుము లన్ని మోర లెజుగలేదె బాధ లిన్ని పడియు వైరమ్ము దలపక శాంతి గోరుచుండె కుంతిసుతుడు తేర కౌరవేయు డిచట వైరభావము బూని కాలు (ద్రవ్వు చుండె కదనమునకు సైన్యబఐలము జూచి సాహసించెద రన్న క్రీడి నెదిరి వీరు గెల్వగలరె శ? అరి భయంకరుందడు అనిల తనూజుండు సమరసింహుడైన సాత్యకియును కదన తలిని నిలువ నెదిరించ గలవారు కలరె కౌరవేయ బలము లందు తీరి

180 సంక్షిప్త మహాభారతము ఇదియెగాక కృష్ణు డిందిరారమణుండు వారి ప్రక్క నుండ పాండవులకు జయము గలుగకున్నె సమరాంగణంబున కౌరవేయు లెట్లు పోరగలరు త్రి ఇంత జెప్పనేల కుంతీసుతుల బిల్చి వారిదైన రాజ్యభాగ మిచ్చి రెండు పక్షములకు ప్రియమైన మార్గమ్ము నందు జనుట మేలు అవనినాధ ర్‌0 విన్న భీష్ము డనియె విప్రోత్తమా నీవు పలుక నేల నింత పరుషముగను శక్తివంతులయ్యు సమయమ్ము పాటించి ధర్మపధము నుండి తప్పకుండ ర్‌1 తిరిగి వచ్చినట్టి వరకుమారుల జూచి సంతసింప కున్నె జనవిభుండు ఎవ్వ రెజుగ రిచట కవ్వడి శౌర్యమ్ము జగతి నతని గెలువజాల రెవరు త్‌2ై అంత కర్టు డనియె నందరెజిగినయట్టి మాట జెప్పనేల మరల మరల జూదమాడి ధర్మసుతుడు రాజ్యంబోడి సమయబద్దు డౌచు చనియె వనికి ర్‌కి గుప్తవాస పరిసమాప్తి చేయకముందె ప్రకటమౌట సమయభంగ మాయె అందువలన తిరిగి యడవిలో నివసింప వలెను గాని సమరభాష లేల ల్‌కీ

ఉద్యోగ పర్వము 181

సురనదీసుతుండు సూర్యపుత్రుడు బల్కు

వ్యర్థమైన పలుకు లాలకించి

ఆ(గ్రహమున బలికె గోగ్రహణము నాడు

సమయపూర్తి వారు సలిపినటుల ర్‌ర్‌ కౌరవాగ్రజుండు కలశజుండును నీవు

వినగ జెప్ప లేదె గణన జేసి

అంత కౌరవేశు డనునయంబుగ బల్మె

ధరణి సురుని తోడ తన మతమ్ము ర్‌6 మంత్రివరుల తోడ మంతనంబులు సల్సి

సంప్రతించి బంధుజనుల తోడ

ఉభయ పక్షములకు నుర్విజనుల కెల్ల

ప్రీతి గలుగునట్టి రీతి నరయ 57 పాండుసుతుల కదకు బంపు వాడను నేను

అచిర కాలమందె సచివునొకని

అని వచించి బంపె నత్యాదరమ్మున

విప్రవరుని కౌరవేశ్వరుండు ర్‌రి తగిన మాటలాడ తమ్ముని సుతులతో

సంజయుండు తగిన సచివుడనుచు

నతని ఐబంపె పాండుసుతుల చెంతకు రాజు

వారి మనసులోని భావమెజుగ 59

సంజయ రాయభారం

అపుడు సంజయుండు ఉపప్లావ్యమున కేగి వాసుదేవు దున్న వసతి యందు నరుని గూడియున్న నారాయణుని తోడ మనసు చూరగొనెడు మాటలాడి 60

182 సంక్షిప్త మహాభారతము మభఖుసటి దినమందు మాధవసహితుడై యున్న ధర్మసుతుని యొద్ద కేగి సంజయుం డతనికి సాష్టాంగముగ మొక్కి పలికె నిటుల మధుర భాషణముల 61 మోదు సేమమెఖిగి మా తండ్రి ధృతరాష్త్ర డంతు లేని రీతి సంతసించి నన్ను బంపె నిటకు నయమార మిరున్న తీరెజింగి తనకు తెలుపుమనుచు 62 ధర్మపుత్రు డనియె ధరణీశు కృపనిట్లు సుఖము నుంటిమయ్య సూతతనయ మది ప్రసన్నమాయె మా 'సేమ మరయంగ నతడు నిన్ను బంపి నందు వలన 63 సుతులు నరవరుండు సుఖముగా నున్నారె గురుడు శాంతనవుడు కుశలురేన భూమిసురవరులకు మేమర్డి నాసగిన వృత్తు లన్ని గౌరవింప బదునె 64 శత్రు భయము లేక సాగునే రాజ్యమ్ము కలిగెనేని విజయు దలచువారె విజయు నస్తబలము భీము గదా శక్తి దలచు వారె భయము గలిగినపుడు 65 మా సుయోధనుండు మన్నించు చుండునే అంగరాజు కర్టు నధికు జేసి విన్న సంజయుండు వినయంబుగా బల్కె నింత చెప్పనేల కుంతిపుత్ర 66

ఉద్యోగ పర్వము 18 కౌరవేశు సభను కల రన్ని విధముల జనులు సత్పురుషులు చెనటి వారు వార లొకరి నొకరు గౌరవింపరు వారి ననిన లాభ మేమి యమతనూజ 67 సుతుని దుర్షయముల ధృతరాష్తు డాపని కారణమున మనకు కలిగె వెతలు పొందు గోరుచుంటి వందటి కది మేలు ఉభయ పక్షములకు శుభము లొదవు 68 నీ యజాతశత్రు నియమంబు జనులెల్ల తలచుచుందు రెపుడు ధర్మ నిలయ శత్రుభయము గలుగ జనులు భఖీమార్దున యముల దలకురయ్య యమతనూజ 69 ఆప్తజనులు కృష్ణు డనుజులు వినుచుండ కురు విభుండు మోకు పరమ ప్రీతి అందజేసినట్టి సందేశమును నేను విన్నవింతు వినయ వినమితముగ 70 మన పవిత్ర వంశ మపవిత్రతను బొందె నా తనయుని కారణమున నేడు కలుషితమ్ము బాప గలుగువాదవు నీవె ధర్మ పుత్ర సతత ధర్మనిరత ళో శాంతి గోరుదేను కౌంతేయ వినుమయ్య పోరు గోరనెపుడు పుణ్యచరిత అని యొనర్చ ప్రాణవాని గల్గుటెగాక యెవరు గెల్బువారొ యెజుగరాదు 72

184 సంక్షిప్త మహాభారతము నీకు తోడుగలరు గోకుల నాథుండు భీము డర్జునుండు విరట ద్రుపదు డాది వీరవర్యు లతిబలాఢ్యులు వారి సురలకైన తేతి చూడనగునె 78 వారి నెదిరి యున్న వారలు గాంగేయ కలశసంభవ కృప కర్ట శల్య బాహ్లికాది వీరవరులు వారిని గెల్వ తరమె శివునికైన ధర్మతనయ 74 ఇంత శక్తి వంతు లిరుపక్షములవారు పోరు తగదు మీకు పొందు వలయు ననుచు కౌరవేశు నభిమతమ్మును దెల్పి సభకు మొక్కి నిలిచె సంజయుండు 75 యమసుతుండు చెప్పె సమరంబు పలుకులు పలికె దేల నేను పలుక లేదె రెండు పక్షములకు ప్రియముగా సఖ్యంబు కలిగి మెలగు టొప్పు గాదె మనకు 76 దుష్టబుద్ధి యైన దుర్యోధనుడు నాడు మాయ చేత సర్వ మపహరింప ఊరకుండినట్టి కౌరవేశుడు నేడు మాకు నేర్చుచుండె మంచి బుద్ధి ౯7 జూదపు సిరినొల్ల రాదని విదురుండు చెప్పు హితమును పెడవచెవిని బెట్టి ప్రభువు కర్టు డాడు పలుకులు వినకున్న జరిగియున్నె యిట్టి దురితమెల్ల 78

ఉద్యోగ పర్వము 185 సూతసుతుడు శక్రసూనుని క3నయౌను అని సుయోధనుండు రణము సలుప నెంచుచుండు నెపుడు, కొంచమైైనను శాంతి భావమునకు మదిని తావునీక 79 ముందు మమ్ము బొగడి యందుమోదట వారి గెలువ జాలమనుచు బలికె దీవు సూత తనయ పక్షప్రొత బుద్ధిని వీడి యిరు బలముల లావు నెంచుమయ్య 80 వాసవాత్మజుండు వరచాపమును బూని గదను చేత దాల్చి గాడ్పుపట్టి కవలు తోడుగాగ కదన భూమిని నిల్వ వారి గెలువ జాలువారు గలరె 81 అది యటుండనిమ్ము అవమానితులమయ్యు జరిగినట్టి దెల్ల సైచి మేము శాంతిగోరు చుంట స్వయముగా వీక్షించి నావు గాదె నేడు నయవిచార 82 ప్రీతి తోడ తండ్రి ధృతరాష్ట్ర భూపతి బిడ్డలార యనుచు పిలిచి మమ్ము ఇంద్రప్రస్థ మిచ్చి యేలుకొమ్మని జెప్ప శాంతి గలుగు గాదె క్షణములోన రితి అంత సంజయుండు అనె సహించితిరయ్య అన్ని కష్టములను యమతనూజ అధిప యట్టి మికు రుధిరాన్నమున కంటె బిచ్చపన్నమైన ప్రియముగాదె 84

186 సంక్షిప్త మహాభారతము బంధుజనుల గురుల వధియించి యస్థిరం బైన సౌఖ్యములను బడయనేల అరుల పాపమనెడు గరళ మాస్వాదించి ఖ్యాతి గనుము నీలకంరు డటుల 85 ధర్మసుతుడు చెప్పె ధర్మ మధర్మమ్ము నెంచి మాటలాడు మిపుడు నీవు మనకు వాదమేల మాధవుండున్నాడు చేయు టుచిత మతడు చెప్పినటుల 86 కృష్ణుడనియె నంత దృతరాష్ట్ర భూపతి నిండు మనము తోడ నిన్ను బంపె పాండు సుతుల క్షేమ భాగ్యమ్ము లరయంగ సూతతనయ! పరమ ప్రీతి గలిగె 87 పాండుసుతుల బిలిచి వారి రాజ్యంబిచ్చి తనయులార యేలుకొనుడి యనక పలుకు తేనె లొలుక ఫలమేమి సంజయా! రిత్త మాట లాడ శ్రేయమగునె 88 కుంతి సుతులు శాంతి గోరు చుండుట నీవె చూచినావు గాదె సూత తనయ! వారి పాలు రాజ్యభాగ మాయక యున్న సమర మగును గాక శాంతి యగునె 89 రణము సల్పు టరయ రాజధర్మ్శ్మము గాదె యెళటుగు దీవు గాదె యీ నిజంబు విభు లొసంగు వారు వేడు వారలు గాదు ఇదియు నీకు తెలియు విదితముగను 80

ఉద్యోగ పర్వము 187 ఎంత తులువలైన నింతిని సభకీద్చి పరిభవింప దగునె పదుగురెదుట కురునరేంద్రు డూరకుండగ వారింప రైరి భీష్మద్రోణ ప్రముఖ బుధులు 1! దుస్ససేను డచట ద్రుపద పుత్రిని చీర బట్టి లాగుచుండ పలుకనట్టి జనవిభుండు నేడు తనయుల క్షేమమ్ము నరయ నిన్ను బంపె నబ్బురముగ 92 సుదతి నిన్ను వీరు జూదంబులో నోడి విడిచినారు గనుక వేరె యొకని పతిని వెదకికొనుము పడతి నీవనె కర్ణ శూలమైన మాట సూతసుతుడు 93 పౌరుషంబు లేని వారలు మారని దుస్ససేను డనియె దుర్మదమున ఇట్టి పరిభవముల నెల్ల నోర్చిరి గాదె పాండుసుతులు సమయ బద్దులగుచు క్క చాల దుష్మరంబు సంధికార్యము చూడ అయిన నేనె యచటి కరుగు దెంచి కౌరవులకు బుద్ధి గజపి వీరికి రాజ్య భాగమియు డనుచు బలుకువాడ 95 క్రోధమయ తరువు సుయోధనుండరయంగ స్కంధ మంగరాజు, శాఖ శకుని దుస్ససేను డేమొ దోరగాయలు పూలు విభుడు మూలశక్తి వృక్షమునకు 96

188 సంక్షిప్త మహాభారతము ధర్మపుత్రు డరయ ధర్మవృక్షము, స్కంధ మర్జునుండు శాఖ అనిలసుతుడు కవలు దాని పూలు కాయలు, మూలంబు వేదములును నేను విప్రవరులు 97 ఈ తరువుల యందు నేది సారయుతమొ యేది సారరహిత మెంచి చూచి న్యాయ నిర్ణయంబు సేయంగవలె గాని ఏక రీతి జూడ నేమి ఫలము 98 నేను వచ్చువాడ నీ విషయము లెల్ల పెద్ద లెదుట కౌరవేయ సభను మంచి చెడ్డ లెల్ల మాటాడి సంధికై సర్వ యత్నములను సలుపువాడ ం్రం అంత ధర్మపుత్రు డనియె సంజయుతోడ విదురు డటుల బుద్ధి వినయములను కలిగియుంట నిట్సి కార్యంబు సలుపంగ తగుదువయ్య సూతతనయ నీవు 100 భీష్మ ద్రోణు లాది పెద్దలందటికిని విప్రవరుల కెల్ల పేరు పేర పరమప్రీతి తోడ ప్రణతు లర్పింపుము నాకు మారుగాను నయవిచార 101 తండ్రి కిడుము నాదు దండప్రణామమ్ము అతని సుతుల సేమ మడిగితనుము కర్ణ సౌబలులను కయ్యమునకు వచ్చి నట్టి వారి సేమ మడుగుమయ్య 102

ఉద్యోగ పర్వము 189 విదురు శల్యు జూచి వినయంబుగా మొక్కి రాజవరుల కెల్ల ప్రణతు లిడుము తరుణి లోకమునకు, తల్లి గాంధారికి జనని కుంతి కిమ్ము ప్రణతిశతము 103 అని వచించి ధర్మతనయుండు గాంగేయ కౌరవేశ్వరులకు పేరు పేర సముచితంబులైన సందేశముల నిచ్చి పలుకుమనియె కురు సభాంగణమున 104 కౌరవాగ్రజునకు వైరంబు విడనాడి న్యాయమార్గ మందు నడువు మనుము రాజ్యభాగ మిచ్చి రణము నివారించి ఖ్రాతృపేమ తోడ బ్రదుకుమనుము 105 అటుల గాని యెడల, ననివార్యమౌ పోరు సర్వ నాశనంబు జరుగు ననుము అయిన వారినెల్ల నాహుతి గావించు ఆశ యనెడు నగ్ని నార్చు మనము 106 నగధరుండు తోడు న్యాయంబు మావైపు వాయుసుతుడు వాసవాత్మజుండు కలుగ మాకు జయము కలుగుట తధ్యంబు అయిన నొల్ల ననుము అని యొనర్ప 107 మాకు రాజ్యమాయ మనసొప్ప కున్నచో అయిదు ఊళ్లు యియ్యమనుము మాకు తృప్తి జెంది వాని నేలుకొందుము మేము ఉర్విలోన శాంతి యుండు ననుము 108

100 సంక్షిప్ర మహాభారతము బాల్యసఖుని తోడ పార్టు డప్పుడు చెప్పె గాడ్పు పట్టి మత్తగజము వోలె ననియొనర్చ సిద్ధమై యుండ నగ్రజుం డంకుశమ్ము వోలె నాపియుంచె 109 అని వచించి సంజయుని సముచితముగ వీడుకొలుప నతడు వేగిరముగ కరిపురమున కేగి కౌరవేశుని గాంచి విన్నవించె కన్న విన్న దెల్ల 110 ధర్మసూను డెపుడు ధర్మంబు దప్పక దైవబలము నమ్మి తాల్మి తోడ బాధలన్ని బడియు క్రోధభావము లేక నిన్ను గారవించు నెమ్మనమున షష పాపి యైన సుతుని వశవర్తివై నీవు అతడు సఖులు చెప్పినటుల జేసి ధర్మ్శ్మనిరతులైన తమ్ముని తనయుల కెగ్గు జేసి నావు అగ్గలమున 112 పాండుసుతుల నిట్లు పలు కష్టముల పాలు సలిపినాడ వనుచు జనులు నిన్ను తిట్టుచుండ నేమి పట్టని యట్లుగా నూరకుండ దగునె కౌరవేశ 118 నిగ్రహంబు వీడి యాగ్రహంబున పాండు సూనులెత్తి వచ్చిరేని నిన్ను నీ కులంబు గావ నెవ్వడి తరమౌను ఎంచి చూడవయ్య యిభపురేశ 114

ఉద్యోగ పర్వము 191 జూదమాడు నాడు చూచి యూరకయుంటి వందు వలన పుట్టె ననల మిపుడు మాన్పకున్న నదియె మారణహోమమై మనల నెల్ల గాల్చు మానవేంద్ర 215 బడలియున్న వాడ బహుదూర పయనాన ఎల్లి సభను, ఆప్పలెల్ల రెదుట వినిన కనిన దెల్ల వివరించి తెల్చెద చేయు డపుడు మంచిచెడుల నెంచి 116 విదుర హితోక్తులు అనుచు సంజయుండు తన గృహంబున కేగ కౌరవేశ్వరుండు కలత జెంది నిదుర బట్టకున్న విదురుని రావింప బుధుడు హితుడు నీతి బోధ జేసె 117 సిరి దొరంగినట్టి దురదృష్టవంతుండు వైరి కన్న నల్చ్బ్ప బలమువాడు దోచి తినెడు వాడు దుర్మోహచిత్తుడు కుందుచుందు రధిప కునుకు రాక 118 ఇట్టి చెడ్డవృత్తు లేమి జేసితి వీవు నిదుర రాక యుందనేల నీకు అనగ భూపుడనియె యమతనూజుండేమి పలికినాడొ యనుచు భయము గలిగె 119 అపుడు విదురుడనియె యమతనూజుడు నీకు బాంధవుండు హితుడు భటుడు గురువు సత్యవ్రతుడు శాంతిసహనశీలి వివేకి కీడు బలుకునట్టి వాడు గాడు 120

192 సంక్షిప్త మహాభారతము నీ సుతుండు నీవు మోసంబుచే వారి రాజ్యభాగ మపహరణము జేయ ధర్మజుండు నిన్ను తండ్రిగా మన్నించి అన్నిటికిని సైచియున్నవాడు 121 విభుడు చెప్పెనంత వికలచిత్తుడనైతి తెలియకున్న దేమి సలుపవలెనొ చిత్తశాంతి కలుగజేయు మాటలు నాకు విదుర! చెప్పవయ్య వినెద ననగ 122 విదురుడు ధృతరాష్ట్ర విభుని దుఃఖము బాపి చిత్త శాంతి కలుగ జేయు కొఅకు చేయదగిన యట్టి చేయకూడని యట్టి మంచిచెడుల జెప్పి యంచితముగ 1283 దుష్టబుద్భులైన దుర్యోధనాదుల పైన మోహమనెడు బంధమందు చిక్కి పాండుసుతుల శ్రేయమెంచక వారి కెగ్గు జేసినాడ వగ్గలముగ 124 తండ్రి లేని వారి దరి జేర్చి యానాడు పెంచి పొండుసుతుల పెద్ద జేసి పుత్ర మోహ వశత పోనాడ జూచుట పాడిగాదు నీకు పార్ధివేంద్ర 126 కుంతి సుతులు శౌర్యవంతులై యుండియు నీతి పధమునందె నిలిచినారు వార లాగ్రహింప వహ్షిజ్వాలలు రేగు వాని నార్చనెవరి వలను గాదు 126

ఉద్యోగ పర్వము 193 పరమ ధర్మ పరుల పాండు పుత్రుల వీడి ఆదరించుచుంట నీదు సుతుల వసుమతీశ వినుము వనరాజమును వీడి పిల్లి నాదరించు విధము దోచె 127 వారిదైన రాజ్యభాగంబు నీయక మ్రింగ జూచు టరయ మేదినీశ ఆమిషంబుపైని యాశతో గాలమ్ము (మంగి మడియు మిను రీతి దోచె 128 కురుపితామహుండు కుంభసంభవ కర్ణ ప్రముఖ వీరవరులు పాండుసుతులు కలిసియున్న వారి కన్నెత్తి చూడంగ తరమె సురలకైన ధరణినాధ 129 విభుడు జెప్పెనంత విదుర నీ మాటలు నీతి బోధకములు నిర్మలములు కాని విదువజాల కన్నబిడ్డను నేను జరుగనున్న దేమొ జరుగనిమ్ము 180 విదురుడనియె నంత విడువరు జ్ఞాతుల గుణవిహీనులైన కువలయేశ ఎటుల విడుతు వీవు ఇంతటి గుణవంతు లైన పాండుసుతుల నమలయశుల [31 నీ హితమ్ము గోరి నే జెప్పుచుంటిని వారి కిమ్ము కొన్ని పల్లెలైన లేని యెడల చాల వాని గల్గును మాకు దాని బాపనెవరి తరము గాదు 182

194 పంక్షిప్త మహాభారతము అనగ కౌరవేశు దనియె నీ పలుకుల కలక దీటె నిజము దెలిసె నాకు చేయువాడ నీవు చెప్పిన రీతిగా నదియె ధర్మమార్గ మని దలంతు 183 మరుసటి దినమందు కురు సభాంగణమున భీష్మ ద్రోణు లాది వృద్ధజనుల కౌరవేయ శకుని కర్థ్ణాది ప్రముఖుల సమ్ముఖమున బిలిక సంజయుండు 134 కీర్తనీయులైన కృష్ణారునులు వారి సతుల తోడ సంతసమున నుండి పిల్వబంచి నన్ను ప్రీతి సంభావించి గారవించి నాకు కాన్మలొసగి 185 ద్వారకేశు డనియె ధర్మజు కోపాగ్ని నార్చలేరు గాన నేర్పుతోడ కార్యసాధనంబు గావింపవలె మిరు పాండుసుతుల గారవమున బిలిచి 136 నిండు సభను నాడు పాండవేయుల పత్ని నిస్సహాయ దిక్కు నీవెయనుచు నన్ను వేడుకొనుట నెన్నటికిని నాకు మరువ వలయునన్న మరపురాదు 137 పార్టు దడనియె రాజ్యభాగ మియక యున్న నదియె మాకు మేలు అని తలంతు ధార్తరాష్ల్రుల దురితములకు తగు శిక్ష వేయ మాకు తగిన వేళ వచ్చె 138

ఉద్యోగ పర్వము 195 ధర్మవర్తనమ్ము తప్పక లోలోన అడచుకొనిన కోప మగ్ని యటుల ప్రజ్వలించి కౌరవానీకమును గాల్బు చుండ జూచి రాజ్యమొసగు వారె 189 ధర్మమార్గచరుల దైవమ్ము కాపాడు మాకు తోడు గలడు మాధవుండు సందియమ్ము లేదు జయము మమ్ము వరించు మిమ్ము గావ లేదు మో బలమ్ము. 140 భీష్ముని హితబోధనం అనుచు సంజయుండు హరియర్జునుల మాట తెలుప శాంతనపుడు కలత జెంది పలికె నిటుల కౌరవా(గ్రజన్ముని తోడ గతము నెటీగి వాని హితము గోరి మేత] ద్వారకాధిపుండు నారాయణుడు శ్వేత వాహనుండు నరుడు పరమ మునులు దుష్టశిక్ష జేసి శిష్టుల రక్షింప అవతరించినార లవని లోన 142 వారలిరువు రొక్క వైపు యుద్ధము సేయ తరముగాదు గెల్వ హరునకైన దుష్టులైన కర్ణ దుశ్శాస నాదులు చెప్పినటుల జేసి చెడకు మావు 143 అంత కర్ణుడనియె శంతనుసుతు తోడ ఏమి జేసినాడ నిటుల బలుక రాజహితము గోరి నే జేయు పనులందు తప్పు లెంచ నీకు ధర్మ మగునె మేశ్తత

196 సంక్షిప్ర మహాభారతము విని పితామహుండు విభునితో నిటుబల్కె రజ్జులాడుచుండు రాధసుతుడు వీని బలిమి నమ్మి యీనీ సుపుత్రుండు పాండు సుతులతోడ వైరమూనె 145 ఆల బట్టినప్పు డర్జునుం డెదురైన పారలేదె వీడు భీరు వటుల వీని సాహసమ్ము వీర్యమ్ము లేమాయె 'ఘోషయాటత్ర నాడు కువలయేశ 146 నీతి బాహ్యుడైన సూతజుం డీరీతి (ఢ్రేలుచుండ సైచెదేల నీవు అనెడు భీష్ము పలుకు లాలించి ద్రోణుండు అవని విభునితోడ ననియె నిటుల 147 కురుపితామహుండు ఇరుపక్షముల మంచి గోరి పలుకుచుండె కౌరవేంద్ర ధర్మసుతుని తోడ తగదు కయ్యము జేయ నరుని గెల్వలేరు ధరణి నెవరు 148 ఇటుల భీష్మగురులు హితబోధ సలుపంగ వినని యట్లు కౌరవేశ్వరుండు తెలియ గోరె పాండవుల బలమ్మును గూర్చి సంజయుండు చెప్పె సవివరముగ 149 విన్న కురువిభుండు విహ్వలచిత్తుడై భీము దలచి కరము భీతి జెంది భండనమున కలుగు వంశనాశము గాన సంధిజేయ మేలు జరుగుననియె 150

ఉద్యోగ పర్వము 107 దుర్యోధను దంభాలాపం విని సుయోధనుండు తన వైపు గురు భీష్మ కర్ణ శల్య కృప వికర్ణ శకుని సోమదత్త ప్రముఖ శూరోత్తములు గల్గి కుంతి పుక్రులనగ నెంతయనియె 151 అదవులందు దిరిగి యిడుముల బడిపడి చేవ జెడిన వారి ప్రోవు జేసి ద్వారకాధిపుండు వారి యందను నిల్వ పొడుచువారె పాండు భూపుసుతులు 152 భీముడనిన నింత భఖీతిజెందెద వేల నా సముందె వాడు నరవరేణ్య గదను బూన నాకు నెదురు నిల్చెడువాడు మూడు లోకములను లేడు నిజము 153 శక్రు డొసగినట్టి శక్తి కర్ణుని చెంత నుండ నెంత యర్జునుం డనంగ, అదియెగాక (ోణు డాపగా తనయుండు లేరె వాని గెల్వ కౌరవేంద్ర 154 అవని నాధ సైన్య మక్షాహిణులు ఏడు వారి కుండ మనకు పదునొకండు కలవు గాన నీకు కలత జెందగనేల జయము మనకె గలుగు జనవరేణ్య కేర్‌ర్‌ అంత కౌరవేశు డనియె వారిని గెల్వ తనయ వినుము నీకు తరము గాదు వ్యర్థమైన మాట లాడుట చాలించి సంధి చేసి శాంతి బొందు మావు 156

198 సంక్షిప్ర మహాభారతము అన సుయోధనుండు తన తండ్రి మాటలు త్రోసిపుచ్చి యనియె దుస్ససేన రాధ తనయ (ప్రముఖ రణధీరు లుండంగ కుంతి సుతు లనంగ నెంత నాకు 157 పలుకబోకు మింక పాండుపుత్రుల తోడ సంధి యనెడు మాట జనవరేణ్య సూది మోపినంత మేదినీ భాగమ్ము వారి కీయబోను వసుమతీశ 158 అనగ వెచ్చ నూర్చి యంబికాతనయుండు వాని తోడ మరల పలికెనిటుల యముడు వాయు వింధద్రు దశ్వినీ దేవత లంద యుండువారు పాందవులకు 159 వారికేమి కీడు వాటిల్ల కుండంగ కాచి యుండు వారు, గనుక వారి పరిభవింపలేరు గురు శాంతనవు లైన సవ్యసాచి దేవ సముడు గాడె 160 ఎన్నదిశల నుండి యెంచి చూచినగాని మైత్రి మార్గ మొకటె మంచి మనకు అన సుయోధనుందు జనకుని పలుకుల నాదరింప కుండ ననియె నిటుల 161 దైవబలము గలదు ధర్మజాదుల కంచు ననెద నీవు, వారలంత శక్తి వంతులైన నటుల పదియుమూడేడులు వంత లొందు వారె వననములందు 162

ఉద్యోగ పర్వము 199 పాందుసుతులు విరట పాంచాల నృపతులు పాండ్య మగధ చైద్య పాలకులును వాసుదేవు డాది ద్వారకావాసులు నన్ను దాకి మడియ నున్నవారు 169 తరణి సుతుడు చెప్పె గురు శాపమున నాకు నస్త్ర స్ఫురణ బాసె నండ్రు జనులు అది నిజమ్ముగాదు యతివరు కరుణచే తిరిగి పొందినాడ స్ఫురణ నేను 164 నాకవాసు లైన నాయస్త ధాటికి తాళలేరు పాండుతనయు లెంత నీకు జయము గూర్తు నిశ్చయమ్ముగ నేను ధార్తరాష్ట్ర యనికి తరలు మయ్య 165 కనలి శాంతనపుడు కర్షునితో జెప్పె పలికి తిటుల మృత్యువాత జిక్కి శక్రు డిడిన శక్తి సర్పముఖాస్రమ్ము భంగమగును కంస వైరి ముందు 166 అని వచించి కౌరవాధిపుతో జెప్పె పాందుసుతుల తోడ వైరముడిగి వారి నాదరించి వారి రాజ్యంబిచ్చి మనుట మేలు మనకు మానవేంద్ర 167 అంత బాహ్లికుండు నదియె యుత్తమమార్గ మనుచు జెప్ప విభుడు తనయు తోడ ననియె బాహ్లికుండు నాపగాతనయుండు చెప్పుచుండ నీదు శ్రేయమెంచి 168

200 సంక్షిప్ర మహాభారతము వినవదేల నీవు విధి వంచితుని వోలె ధర్మసుతుని విడువ దగదు నీకు వారి దైన రాజ్యభాగమ్ము నర్పించి నెమ్మి నేలుకొనుము నీదుపాలు 169 కలుగు జయము నాకు కర్టుడుండగ నంచు పలుకుచుందు వెపుడు ప్రాకటముగ నాడు పసుల బట్టినపుడు కర్ణుడు లేడె (క్రీడి యొకడె మిమ్ము గెల్వ లేదె 170 జరుగుచున్న యట్టి సమరాన కృష్ణుండు నదుపనున్న వాడు నరుని రధము వాయుసుతుడు కవలు వానికి తోడైన వారి మార్మొనంగ వశమె మనకు 171 కర్ణ అస్త సన్యాసం పెద్దలటుల బలుక విని రోసి కర్టుండు ఆపగేయు పైన నాగ్రహించి నను నిరాకరించి నందుకు నీవింక ఫలిత మనుభవింప వలయు ననియె 172 సలుపుచుంటి నస్త్ర సన్యాసమును నేను శరము బట్ట నీవు సమయు వరకు అని వచించి కర్టు డరిగెను సభ వీడి కౌరవాగ్రజుండు కనలి పలికె 179 కౌరవేంద్ర వినుము కర్ణ దుశ్శాసను లుండ గెలువ గలను పాందవులను వారి బిల్చి రాజ్యభాగ మీయను నేను పోర గెల్చి వారి బొందనిమ్ము 1174

ఉద్యోగ పర్వము 201 తనయు దడటుల బల్మ తండ్రి కొందలమంది విదురు నడుగ నతడు బదులు జెప్పె పాండుసుతుల బిల్చి వారి రాజ్యంబిచ్చి సంధి జేసుకొనుటె సముచితమ్ము 1765 అట సుయోధను హితు లాగ్రహమ్మున సభా స్టలిని వీడి చనిరి తామసమున అపుడు సంజయుండు నధిపుండు నటనుండ చనిరి యెల్లవారు సభను వీడి 176 కౌరవేశ్వరుండు గాంధారి రావించి మౌనివరుని వ్యాసు మదిని దలప అపుడు వచ్చె నటకు యతిలోక శ్రేష్టుండు బాదరాయణుందు పరమ మౌని 177 మౌని జెప్పు మనగ మాధవు మహిమంబు తెలిపి సంజయుండు పలి నిటుల న్యాయమున్న చోట నారాయణుండుండు కలుగు జయ మతండు కలుగుచోట 178 శిష్ట రక్షణమ్ము చుష్ట సంహరణమ్ము నతడు చేయుచుండు నవనినాథ నీతి బాహ్యులైన నీ పుత్రగణమును నిగ్రహించు నతడు నిక్కువముగ 179 నృపవరేణ్యు డంత నిజనందనుని తోడ ననియె ద్వారకేశు నాశ్రయించి (బతుకుమనగ నతడు పాండవేయహితుడు చేరి యతని పొందు గోర ననియె 180

202 సంక్షిప్త మహాభారతము తల్లి జెప్పెనంత తనయుండు వినదాయె కాందలంబు జెందె కురువిభుందు హరిని శరణు గోరి తరియింపుడని జెప్పి వారి వీడి తపసివరుడు చనియె 181 యుధిష్టిర అభిమతం సంజయుండు తిరిగి చనిన మిదట ధర్మ సుతుడు బంధుజనుల హితుల గూడి కృష్ణుడున్న యతిధి గృహమున కేతెంచి భక్తి మిఆ విన్నపంబు జేసె 182 ధర్మబాహ్యుడైన ధార్తరాషుని తోడ పోరు గోర నేను పుణ్యచరిత పాలు పంచియిడిన నేలుకొందుము మేము భద్రమగును రెండు పక్షములకు 188 అందువలన నీవు వస్తినాపురి కేగి కౌరవులను గాంచి వారి తోడ తగిన మాటలాడి ధరణి భాగము మాకు చెందునటుల సంధి జేయమయ్య 184 యాదవేంద్ర వారి నైదూళ్ల నైనను అయిదుగురికి నియ్యమంటి గాదె దీనికైన సమ్మతింతురో వారలు, మాకు వలదె యంతమాత్ర మైన 185 బంధుజనుల హితుల వధియించి బ్రతుకుట తగని కార్యమనుచు దలతు నేను కాని యేమి లేక కష్టాలలో మున్లి గదుపవలయు నెంతకాల మిటుల 186

ఉద్యోగ పర్వము 20 అందువలన నీవు హస్తినాపురమందు విదురుడాది బుధులు వినెడు నటుల శాంథిపధము నందు చనుటయే మేలంచు కౌరవులకు పొతము గజబుపవలయు 187 పక్షపాతబుద్ధి వలదు మా దెస నీకు న్యాయమార్గ మందె నదువుమయ్య ఉభయ పక్షములకు శుభము గల్లెడు రితి పలుకవయ్య కురు సభాంగణమున 188 దురితచిత్తుడైన దుర్యోధనుని చెంత కరుగవలదు నీవు యదుకులేశ వలదునాకు దేవపదవియైనను గాని నీకు వాని గలిగె నేని కృష్ణ 189 అంత కృష్ణుడనియె నంత యెబుగుదు నేను వారి దుర్ణయములు పాండుతనయ కపటవృత్తి తోడ గైకొన్న రాజ్యంబు కౌరవేయు లీయబోరు మికు 190 భీష్మ ద్రోణు లుండ భీతి జెందగనేల ననుచు తలచినారు రణము సలుప, పాపులైన వారి వధియించు టుచితమ్ము బంధు హింస యనుచు వగచెదేల 191 కురుపితామహుండు గురుడు చూచుచునుండ నాడు సభను జేసినట్టి దెల్ల తలప రోత గలుగు కులవధూమణి నట్లు చేయువారె యెంత చెనటులైన 192

204 సంక్షిప్ర మహాభారతము వని వసింప మారు చనుచుండ సభవీడి కౌరవేయ శకుని కర్టు లాది ధూర్తులెల్ల మిమ్ము దూషించుచుండంగ వినియు నుండకుండె జనవిభుండు 198 అట్టివారి చెంత కరిగి యా సభయందు అవని విభుడు శాంతనపుడు వినగ నీదు ధర్మనిరతి నీ పుణ్యచరితమ్ము పడిన క్లేశములను నుడువువాడ 194 ఓపినంత వరకు నుభయ పక్షములకు సంధి గలుగజేతు సమ్మతమున దురిత చిత్తుడైన దుర్యోధనుడు దీని కియ్యకొనిన మేలు ఇరువురకును 195 కాని కాంచుచుంటి కయ్యంపు శకునమ్ము లన్ని యెడల నేను యమతనూజ కనుక నీవు యుద్ధమునకు సన్నాహమ్ము సలుపుచుండ వలయు జాగులేక 196 భీముని అభివ్రాయం అపుడు భీము డనియె నంబుజోదరు తోడ వంశనాశనమ్ము వలదు కృష్ణ సంధి జేసి మాకు గాంధారి సుతులకు హితము జేయుమయ్య యిరువురకును 197 పవన పుత్రుదటుల బలుక విసయమంది యదుకులేశు డనియ నతని జూచి వింతమాటలాడె భీమసేనుడు నేడు అగ్గి చల్లబడిన యటుల దోచె 198

ఉద్యోగ పర్వము 205 భీముదనియె నంత భూమి భాగంబీయ నంతె చాలు నన్న యమతనూజు మాట కద్దురాక మాటాడితిని గాని యూరకుందడ గలనె పోరు గలుగ 199 పగఅ జంపి గదకు పండువు గావించి వ్రయ్య జేసి గజ తురంగములను ధార్తరాష్ట్ర ఖలుల దారుణంబుగ జంపి కక్ష దీర్చుకొననె కంసవైరి 200 అర్జున సందేశం క్రీడి చెప్పె నంత కృష్ణునితో నిట్లు అ(గ్రజుండు చెప్పె నన్ని నీకు కాని నాకు నమ్మకము లేదు వారితో సంధి గుదురు నంచు సారసాక్ష 201 కౌరవేశ్వరుండు కడులోభి, మాపాలు పంచి యీయ నిచ్చగించ డతడు వాని దుష్టసుతుడు కానిచ్చునే సంధి 202 పోరు నిశ్చయమ్ము పురుషసింహ కాని నీవు జేయ గడగిన పనినెట్లు తలచగలము సిద్ధి గలుగ దనుచు పురుషయత్నమైన పరమేశు కృపయైన 203 నీరజాక్ష రెండు నీవె గావె దుష్టచిత్తు లపుడు ద్రోవది నటుజేసి మమ్ము కానలందు ద్రిమ్మరిల్ల చేసినట్టి వారి శిక్షించుటకు మారు నెరపుమయ్య సంధి నేర్పుగాను 20%

206 సంక్షిప్ర మహాభారతము వాసుదేవన భూమి భాగమ్ము మాకీయ గౌరవముగ (బ్రతుకు గడుపగలము అనఘ నీకు న్యాయ మని తోచినట్టుల చేయువార మానతీయవయ్య 205 క్రీడ! సంధి సేయ కృషి యొనర్చెద నేను ఫలితమునకు దైవబలము వలయు దుష్టచరితు డైన దుర్యోధనుడు దాని కియ్యకానునా లేదా యెఖుగరాదు 206 నకుల సందేశం నకులు డనియె నందనందనా ధర్మజుం డనిలసుతుడు విజయుడనినయట్లు సంధి గూర్చితేని చాలును మాకింక వలదు క్రౌర్యమింక వారి పట్ల 207 పసుల బట్టునాడు పార్టుని శౌర్యంబు చూచినారు గాదె శూరులెల్ల అంతెగాక మత్స్య యాదవ పాంచాల బలము లిచట నుంట తెలియలేరె 208 గురుడు కృపుడు బాహ్లికుడు నదీసూనుండు విదురు డాది వృద్ధ బుధులు జెప్ప కౌరవాగ్రజుండు కాదనగల డెట్లు తలతు నేను సంధి గలుగు నంచు 209 అదియెగాక నీవె యటకేగి స్వయముగా కౌరవేయ సభను వారి యెదుట హితవు మాటలాడ ధృతరాషు సుతులెట్లు తోసిపుచ్చ గలరు రుక్కిజీశ 210

ఉద్యోగ పర్వము 207 సహదేవ సందేశం

అనుచు నకులుడటుల తన భావమును జెప్ప

నతని యనుగు తమ్ముడనియె నిట్లు

ఆ సుయోధనుందడు నాతని తమ్ములు

వసుధ బంచి యిచ్చువారు గాదు ల

వంచితులము మేము పదియుమూడేడులు

కష్టములను బొంది కానలందు

తిరిగి వచ్చినాము ధరణి భాగము నిమ్ము

సాగవింక నీదు ఛలము లనుము 212

పలుకుమయ్య కృష్ణ స్పష్టమ్ముగా నీవు

రాజ్య మియకున్న రణము జరుగు

సభను నున్నవారు సహదేవు బొగడంగ

సన్నుతించె నతని సాత్యకియును 218 ద్రౌపది మనోవేదనం

యమసుతుండు బల్మి నట్టి మాటలు విని

విహ్వలించి పాండవేయ పత్ని

కనుల నీరుగార గద్గ్దదకంరియై

వాసుదేవు తోడ పలికె నిటుల 2214

అంతజేసి కౌరవాధము లానాడు

నేడు సూతతనయు నిటకు బంప

యమసుతుండు చెప్పె నైదూళ్ల నిచ్చిన

నేలు కొందు మదియె చాలుననుచు 215

వరము వలన బుట్టి భరతవంశము మెట్టి

పాండరాజసుతుల పత్నినైతి

పరమవీరులైన వరపుత్రులను గాంచి

పలువిధముల కీర్తి బడసితేను 216

206 సంక్షిప్ర మహాభారతము అదియెగాక నీవు అనుగు చెల్లెలి కంటె అధిక (ప్రేమ జూతువట్టి నన్ను జుట్టు బట్టి పతులు చూచుచుండగ న్‌ద్చె నీచు డొకడు నాడు నిందు సభకు లై? అబల నేకవస్ర ననియైన తలపక చెనటి నను వివస్త్ర చేయబూన కనికరించి నీవె కాపాడితివి గాదె వరద! తజుగనట్టి వలువలిచ్చి 218 నాడు దాసి జేసె నను కౌరవేశుండు నేడు సలుప వలెనె కోదటికము అనుచు కొప్పు విచ్చి తన వెంట్రుకల బట్టి బుసలు గొట్టి కాలభుజగ మటుల 219 అనియె కృష్ణ కురు సభాంగణమ్మున నీవు సంధి మాట లాడు సమయ మందు దుస్ససేను వేళ్ల దూషితంబైనట్టి యీ శిరోజములను ఎంచుమయ్య 220 జుట్టు బట్టి లాగినట్టి యా నీచుని తనువు గదను క్రెళ్లి తునియ లౌచు ధరణి బడిన గాని తాపోపశమనమ్ము కలుగదయ్య నాకు కమలనాభ బట ఇంత పరిభవమ్ము నిన్ని ఐన్నములను కలుగజేసినట్టి కౌరవేయు శవము జూచువరకు చల్లారబోదయ్య ఎదను మందు మంట యదుకులేశ 222

ఉద్యోగ పర్వము 209 జగతి దుష్టశిక్ష సలుప బుట్టిన నీవు పతులు వీరవరులు పాండుసుతులు అందయుండి యిటుల గుందెమంటల తోడ (బతుకు టెన్నినాళ్లు పరమపురుష! 223 కృష్ణుని ఆశ్వాసనం అనుచు నేడ్చుచున్న యాజ్ఞసేనిని జూచి వాసుదేవు దనియె వగవకమ్మ శత్రు సంక్షయమ్ము సలిపెద త్వరలోనె అర్జ్హునుండు భీము దండనుండ 224 రాజ్యమాయరు ధృతరాష్త్రసూనులు, వారి మరణకాల మిపుడు దరియ వచ్చె సతులు సుతులు వారి శవములపై నేడ్చు టనతి కాలమందె వినెదవమ్మ 225 వినుము తల్లి నీవు విజయలక్ష్మిని గూడి వజల నున్నవారు పాండుసుతులు ఎభిగియుంటి నైన యిరుపక్షముల మేలు గోరి పలుకువాడ వారి తోడ 226 కృష్ణుని హస్తినాపుర ప్రయాణం అనుచు నాశ్వసించి అరుణోదయమ్మున మంచి సమయ మందు మాధవుండు స్యందనమ్ము నెక్కి సాత్యకీసహితుడై కరిపురమ్ము జేర కదలి వెళ్లె 927 కుటిలచిత్తులైన కురుకుమారుల చెంత కేగు చుండె గాన కేశవుండు వారు నమ్మదగిన వారు గొదని యెంచి ఆయుధముల గొనియె స్యందనమున ౨28

210 సంక్షిప్త మహాభారతము పాండవాగ్రజుండు వసుదేవ సుతునితో ననియె జనని కుంతి గనుము నీవు కష్టజీవితమ్ము గడుపు చుండెను తల్లి నాకు దెలిసి చిన్ననాటి నుండి 229 వనికి నేగు మమ్ము గని తల్లి వ్యధ జెంది నిలచియుండె కనుల నీరుగార ఎటుల గడిపెనామె యిన్నేళ్లు మమువీడి తలచుకొనిన గుండె తతిగిపోవు 280 బాధలన్ని తొలగు త్వరితంబుగానంచు జెప్పవయ్య నేను చెప్పినటుల నిన్ను దలచియామె నిబ్బరమ్ముగ నుండు నామె నూజడించుమయ్య కృష్ణ 281 గురుడు భీష్ము దాది కురువృద్ధలకు బంధు జనుల కెల్ల ప్రణతి సలుపుమయ్య మనకు వారలకును మధ్యస్థుడైయుండు హితుడు విదురునకు ప్రణతులనిమ్ము 2వ2 వాసుదేవు డంత వారిని వీడ్మొని హస్తినగరి జేర నరుగుచుండ నారదాది మునులు దారిలో గనిపించి పరమప్రీతి తోడ పలికిరిటుల క! కురు సభాంగణమున నిరుపక్షముల మేలు గోరి నీవు బలుకు తీరు నరయ విదుర భీష్మ దాది విబుధుల పల్ములు వినగ వచ్చినాము వనజనాభ 234

ఉద్యోగ పర్వము 211 దానికియ్యకానియె ద్వారకానాధుండు సభకు వత్తుమనుచు చనిరి మునులు అంత టేయి గడిపె హరి కుశస్థల మందు సంతసిల్ల నచటి జానపదులు 285 కరినగరికి కృష్ణు దరుగు దెంచెడు నన్న వార్త విన్న కౌరవాధిపుందు భీష్మ ద్రోణ శకుని విదుర సంజయ కర్ణ కౌరవాగ్రజులను చేరబిలిచి 236 చెప్పె సుతుని తోడ శ్రీకృష్ణు డిచ్చోటి కరుగుదెంచుచుండె ననుచు వింటి అతిధి గౌరవముల నాదరించు మతని కలుగు శుభము లతని కరుణ గలుగ 23౩7 భీష్మ ద్రోణు లాది వృద్ధులు విదురుండు అంతులేని రీతి సంతసింప కురుసుతాగ్రజుండు పరిచారకుల బిల్చి బంపె పురి నలంకరింపు దనుచు 238 ద్వారకేశు డుండ నా రమ్యసదనమ్ము మరియు దుస్ససేను మందిరమ్ము ఆయితమ్ము జేయు దని బంపె వారిని విభుడు బల్కె నిటుల విదురు తోడ 239 స్వర్ణభూషణములు వస్తువాహనములు కృష్ణు దేమి గోర నీయవలయు మన గృహంబు లందు మది మెచ్చు నెద్దాని నైన నిడుడు నందనందనునకు 240

212 సంక్షిప్త మహాభారతము అనగ విదురు డనియె నైదూళ్లనైనను యమతనయున కీయ ననిన నీవు ఇట్టి సిరులలెల్ల నీయబూనుట కేమి కారణమ్ము జెపుమ కౌరవేంద్ర 241 హరికి లంచ మిచ్చి యతని ప్రీతుని జేయ దలచుచుంటి వీవు ధరణి నాధ మేరువంత యర్ధ మిచ్చిన నాతండు ప్రాణసముని విజయు బాయదెపుడు 242 అతని గారవించి అతిధి పూజలు చేసి అతడు పూని వచ్చి నట్టి పనిని నిండు మనముతోడ నెరవేర్చితివయేని ప్రీతిజెందు నతడు భూతలేశ 248 భీష్ము డనియె నంత వేరె చింతనమాని చేయవలయు నతడు చెప్పి నటుల ధార్తరాష్తు డనియె ధరణి భాగంబీయ మనిన దాని కియ్యకొనను నేను 244 అదియెగాక వినుడు యదువీరు బంధించు వాడ నిచట నంత పాందుసుతులు పక్షహీన లైన పక్షుల చందాన నా విధేయు లౌచు నదచువారు 24ీర్‌ వారి బంధుహితులు పొాంచాలయాదవ వీరులెల్ల లొంగువారు నాకు నేల నాల్గుదెసల నిష్కంటకముగాగ నేలుకొందు నేను ఎదురులేక 246

ఉద్యోగ పర్వము 213

దురితచిత్తుడైన దుధ్యోధనుం డిట్లు

పలుక కురువిభుందు కలతజెంది

అనియె నిట్టి ద్రోహమునకు పాల్పడవద్దు

కృష్ణు దేమి చేసె కీడు నీకు 2డీ

భీష్ము డంత కౌరవేశ్వరు తిలకించి

నీ తనూజ డిట్టి నీచమైన

పనిని జేయ దాని ఫలిత మనుభవించు

ననుచు సభను వీడి చనియెనపుడు 248

హస్తినగర ప్రవేశం

మరుసటి దినమందు కరినగరము జేర

నందనందనునకు నగరి బయట

భీష్మ ద్రోణ ప్రముఖ వృద్ధులు మిత్రులు

స్వాగతంబు చెప్ప సంతసించి 249

సముచితముగ వారి సంభావనము జేసి

ముందు కేగి రాజమందిరమున

ఆంబికేయు జూచి యభివాదనము జేసి

సత్కరించె విదుర సంజయులను 250

అచట కొంత తడవు యాదవేశ్వరు డుండి

యమతనూజు వందనములు దెలిపి

వెడలి యచటి నుండి విదురు నింటికి నేగి

అతిధి పూజ లందె నాదరమున 251 కుంతీ గృహ గమనం

అచట నుండి యరిగి హరి కుంతి యింటికి

సుతుల (ద్రుపద రాజ సుతను దలచి

ఉవిద యేడ్వ నామె నోదార్చె నాతండు

ధర్మమునకు జగోను తప్ప దనుచు బెర్రి

214 సంక్షిప్త మహాభారతము అపుడు కుంతి యనియె యమతనూజుడు భీము డర్జునుండు కవలు యాజ్ఞసేని వనము లందు దిదిగి పలుకష్టముల బొంది ఎటుల గడిపినార లిన్ని యేండ్లు 2658 కదన రంగమందు గదబూని భీముండు, చాపమెత్తి సవ్యసాచి నిలువ వారి యెదుట నిల్చి పోరగల్లిన వారు కలరె జగతి లోన కంసవైరి 2ర్‌4 అంత వీరవర్యు లైన పొందుసుతులు చేయువారు నీవు చెప్పినటుల కనుక తగిన దీతి కార్యంబు నెరవేర్చి నాదు దిగులు మాన్సు నయవిచార 25ర5్‌ అంత కృష్ణుడనియె వంతమానుము నీవు పరమవీరులైన పాందుసుతులు శత్రువులను దునిమి సామ్రాజ్యపీరమ్ము నెక్క నున్నవారు నిక్కువముగ 2656 అటుల కృష్ణు డనగ నలరి పాండుమహిషి అనియె పొండవులకు యదుకులేశ తండ్రి గురువు మరియు దైవంబు సర్వమ్ము నీవె యౌదు గాదె నిజముగాను 2657 ఎలుగు దీవు వారి కేయది హితమౌను ధర్మ మెటలుగుదయ్య ధర్మమూర్తి పరమపురుష నీవు ఇరుపక్షముల మేలు దలచి యుచితరీతి సలుపుమయ్య 258

ఉద్యోగ పర్వము 215 మాధవుం డపుడు సుయోధను మందిర మునకు నేగి, యచట తనను జూడ వచ్చినట్టి రాజవర్గంబుతో భాష ణంబు సలిపి వారి నతులనందె 259 అంత ధార్తరామ్హ డామంత్రణము జేసె నందసుతుని భోజనమ్ము జేయ కార్య పరిసమాప్తి గాకుండ కుడుచుట తగదు దూత కనియి నగధరుండు 260 విదుర సత్యారం అని వచంచి విదురు నావాసమున కేగ నతడు పరమభక్తి నతు లొనర్చి స్నాన పాన భోజనముల ప్రీతుని జేసె సాత్యకీ సమేతు చక్రధరుని 261 అంత జెప్పె నాత డవినీతిపరుడైన కౌరవుండు నీవు కోరు నటుల పాండవులకు రాజ్యభాగ మిచ్చుట కల్ల వారి కడకు నరుగ వలదు నీవు ౨62 కృష్ణు దనియెనపుడు ధృతరాష్త్రసూనుండు దురితచిత్తుడౌట అరయుదేను అట్టివాని మార్చ యత్నంబు సలుపుట తలతు నేను పరమ ధర్మమనుచు 263 కనుక హితము గఅిపి పినతండ్రిసుతులకు వారి దైన రాజ్యభాగ మిచ్చి న్యాయమార్గ మందు నడచి శాంతిని బొందు మనెద గురులు బంధుజనులు వినగ 264

216 సంక్షిప్త మహాభారతము

అటుల జేయనేని అన్నదమ్ములు పోరు

చుండ జూచి యూరకుంటి ననరె

అందువలన నేను యత్నంబు సలిపెద

సంధి గూర్చి భువిని శాంతి నిలుప 265 కురుసభా ప్రవేశం

వెన్ను డటుల బల్మ విదురుండు ముదమంది

శాంతి యత్నమునకు సమ్మతించె

మాధవుండు వెడలె మఖజునాటి ప్రొద్దున

అంధనృపతి సభకు సంధి గూర్చు 266

ఉన్నతాసనమున ఉపవిష్పుడై యుండి

అంబరమున నారదాది మునులు

తోచ, శాంతనవునితో జెప్పె వారిని

సభకు బిలువు మనుచు సొదరముగ 267

సముచి తాసనముల సంయమోంద్రులనుంచి

అతిధి పూజ సలిపి నతులొనర్చి

సభికులెల్ల వారి స్థానమ్ము లందుండ

అచ్యుతుండు పలికె నధిపుతోడ 268 కృష్ణ రాయబారం

జరుగుచున్న దెల్ల కురుకులేశ్వర నీవు

యెజతిగియుంటి వైన హితుడనౌట

వంశహితము దలచి పలుకుచుంటిని నేను

ఎంచి చూడుమయ్య మంచి చెడుల 269

పాలు నీరు నటుల పాండుసూనులు నీదు

సుతులు కలసియున్న శుభము లొదవు

వేరుకారు నీకు వీరలిర్వురు గాన

కలసి యుండుమనుము కరిపురేశ 270

ఉద్యోగ పర్వము 27 భరత వంశవరులు పాడిదప్పని వార లనుచు నిన్నినాళ్లు యశము గాంచి నీతిపరులు గాని నీ తనయుల వల్ల ధర్మపథము నేడు తప్పనేల 271 కారవాన్వయమున కాధారభూతుండ వాట నెల్ల వారి వర్తనముల ఫలితములకు నీవె బాధ్యు డౌదువు గాన మంచి నెంచి యాచరించుమయ్య 272 పాండురాజ సుతులు భవదీయ పుత్రులు కలసి శాంతితోడ మెలగిరేని అదియె నీకు నాకు నవని జనుల కెల్ల శుభకరమ్ము గాదె ఇభపురేశ 273 వారలటుల గాక పోరుచుండిన నీదు వంశమునకె కాదు వసుధ కెల్ల వాని గలుగు గొన నవనీశ వారికి పొందు గూర్చుమయ్య పోరు మాన్సి 274 పాండుసుతులు నీకు భక్తితో ప్రణమిల్లి చెప్పినట్టి మాట జెప్పుచుంటి పదియుమూదునేళ్లు పలు కష్టములకోర్చి నిర్వహించి ద్యూత నియమములను 275 మరలి వచ్చి యిపుడు మా రాజ్యభాగమ్ము నొంద నిశ్చయించియున్న మమ్ము తప్పులున్న సైచి దయజూపి మాపైన దారి జూపుమయ్య తండ్రి మాకు 276

218 సంక్షిప్త మహాభారతము

కనుక నీవు పాండుతనయుల బిలిపించి

వసుమతీశ వారి భాగమిచ్చి

సుతుల గూడి నీవు సుఖశాంతులను బొంది

మనుట ఎల్లరకును మంచిగాదె లగా రాజసూయ యాగరాజమ్ము గావించి

భరతవంశ గౌరవమ్ము బెంచి

ధరణి నేలు ధర్మ తనయుని జూదమ్ము

నందు గెలిచి రాజ్య మపహరించి 278 ద్రుపదరాజ సుతను, దుర్యోధనాదులు

పదుగు రెదుట కురు సభాంగణమున

పరిభవించు చుండ వారింప నొల్లక

ఊరకుంటి వీవు కౌరవేంద్ర 2709 దాని కంత కోర్చి ధర్మతనూజుందడు

వనికి నేగె నియమబద్దు డౌచు

అట్టి శాంతమూర్తి అంతటి సుజనుండు

కలడె జగతి నెందు కరిపురేశ 280 శాంతశూరులైన కుంతిపుత్రులు నేడు

నిన్ను గొలువ దలచి యున్నవారు

న్యాయ మెంచి వారి నాదరించితివేని

శుభము గలుగు మోకు ఇభపురేశ 281 అటులగాని యెడల ననివార్య మగు పోరు

వంశనాశ మగును వసుమతీశ రెండు తెజగులందు డశ్రేయంబు నీ కేది

నిశ్చయింపుమయ్య నృపవరేణ్య 282

ఉద్యోగ పర్వము 219 కృష్ణుడటుల బల్క బుషులు సంతస మంది కౌరవాగ్రజున్ము కలయ జూచి వాసుదేవుడాడు వచనమ్ము లాలించి కౌరవాన్వయమ్ము గావు మనిరి 283 విని సుయోధనుండు మునులతో నిటుబల్కె జరుగనున్న దేదొ జరిగి తీరు మౌనులార మిరు మాటాడ పని లేదు ఫలిత మేమి వ్యర్థ భాషణముల 284 అధిపు దనియె నంత యతులార నా మాట చెల్ల దిచట నేమి జేయజాల అని ముకుందు తోడ ననియె నీవెటులైన నచ్చ జెప్పుమయ్య నా సుతునకు 285 అపుడు కృష్ణు డనియె నవనీశు సుతుతోడ పాండుసుతులతోడ వైర మేల చెలిమి తోడ మెలగ కులవృద్దు లెల్లరు పరమ హర్ష మందు వారు గారె 286 కర్ణు డింద్రసుతుని కదనమ్ములో గెల్బు ననుచు నమ్మియుంటివయ్య నీవు నాకులైన నరుని దాకి నిల్వగ లేరు మరువ వద్దు దీని కురుకుమార 287 గంధవాహ సుతుడు గద బూని నిల్చిన కలరె వాని గెల్వగలుగువారు కనుక వారి గెల్తునను తలంపును వీడి పొందు గోరుకొనుము పోరుగాదు 288

220 సంక్షిప్త మహాభారతము ఆల బట్టు నాడు అర్జునుండొక్కడే గెలువలేదె మదు బలము నెల్ల అట్టి వీరు డిప్పు దండగా మేముండ ఏమి చేయగలడా యెంచుకొనుము 289 పోరు జరిగెనేని పొాలియువారలు మోరు సఖులు హితులు బంధుజనులు ప్రజలు వంశనాశకరుడ వని దూజుదురు నిన్ను లోకనింద గలుగు రాకుమార 290 గతము మజచి పాండుసుళులు నన్నిట ఐబంపి పొందు గోర త్రోసి పుచ్చు టరయ దరికి వచ్చినట్టి సిరిని బోనాదెడు విధము దోచె కౌరవేంద్ర తనయ లం] అనియె భీష్మ డంత మన భాగ్యవశమున నందనందనుండె పొందు గూర్చ వచ్చియుండె నతని వచనమ్ము లాలించి శాంతిపధము నందు చనుము నీవు 292 గురువు జెప్పెనంత కురుసుతాగ్రజ నీవు తాత తండ్రి నేన్‌ ప్రీతి తోడ పలుకునట్టి హితవు భాషల నాలించి మనుము వత్స! బంధుజనుల గూడి 293 ఆంబికేయు డనియె హరి మాట విని నీవు పుణ్యమూర్తి ధర్మపుత్రు తోడ సంధి జేసితేని సమకూరు శ్రేయమ్ము చేటు గలుగు నటుల చేయవేని 294

ఉద్యోగపర్వము 22

మరల శాంతనపుడు గురుడు సుయోధను

తోడ ననిరి యెంచి చూడుమయ్య

క్రీడి గాండివమ్ము కృష్ణ సారధ్యమ్ము

కలసి రాగ నెదిరి నిలువ గలమె ౨2965

నీవు పాండు సుతుల స్నేహంబు మదిగోరి

కలసి వారి తోడ మెలగికేని

(ప్రజలు బంధుజనులు పరమహర్షము జెంది

నిను నుతింతురయ్య ఘనముగాను 296 దుర్యోధన తిరస్కారం

విని సుయోధనుండు వనజాక్షుతో జెప్పె

దోష మేమి నేను జేసినాడ

జూదమాడి ధర్మసుతు డోడె రాజ్యంబు

వనము లందు గడిపె వత్సరములు 29

సురనదీసుతుండు కురువిభుండానాడు

పాండవులకు రాజ్య భాగమిచ్చి

చిన్ననాడు మాకు చేసి రనన్యాయమ్ము

జరుగనీయ నటుల మరల నేను 298

సూది మోపినంత మేదినీ భాగమ్ము

పంచియియ్య నేను పాండవులకు

పోర మమ్ము గెలిచి పొందవచ్చును వారు

ఇదియె నా మతమ్ము యదుకులేశ 299

దుర్యోధను దుష్పృతములు

వాసుదేవుడనియె దోసమ్ము నీ వల్ల

లేదనెదవు నీవు లేశమైన

నీవు చేయనట్టి నేరమ్ము లున్నవే

సుజనులైన పాండుసుతుల పట్ల 300

222 సంక్షిప్త మహాభారతము తినగ విషము బెట్టి ఫణులతో గజపించి నిదురవోవ గట్టి నీట ద్రోసి లక్క యిల్లు గాల్చి పెక్కు భంగుల వారి జంప బూన లేదె ఛలము జేసి 301 ఇన్ని విధములైన యిక్కట్ల పొాలయ్యు పాండుసుతులు ధర్మపధము విదక రాజ్యరమను బొంది రాజసూయము జేసి ఉర్వి నేలుచుండ నుజ్జలముగ 802 చూచి యోర్వలేక జూదమాడగ బిల్చి కపట మూని రాజ్య మపహరించి అంత తోడ బోక కాంతామణిని బట్టి పరిభవించినావు పదుగు రెదుట 3808 అపుడు నీవు కర్టు డాడిన మాటలు పలుక వలను గాదు కొలువు నందు ఇన్ని తప్పు లుండి యేమెజుంగని యట్లు పలికె దేల నాకు తెలియనటుల 804 తప్పు లన్ని పాండు తనయులపై బెట్టి పెద్దవారి మాట వినక నిటుల (బ్రతుకుచుంట మాని వారితో గలసిన రెండు పక్షములకు శ్రేయమగును 805 సభా నిష్కనుణం అపుడు దుస్ససేను డనియె నగ్రజుతోడ ఇచట నుంటివేని వృద్ద్ధులెల్ల యాదవేంద్రు డడిగినటుల పాండవులకు అవని భాగమియ మందురయ్య 806

ఉద్యోగపర్వము 22 అంత జనియె కౌరవా[గజుండట నుండి సభను పెద్దలుండ సరకు గొనక చనిరి వాని వెంట శకుని కర్టాదులు విభ్రమమున జూడ పెద్దలెల్ల 807 కౌరవేశు డంత గాంధారి బిలిపించె మందలించి సుకుని మనసు మార్చ ఆమె పిలువనంప నరుదెంచె పుత్రుండు విని నిరాకరించి జనని హితవు 3808 కృష్ణ విశ్వరూప ప్రదర్శనం తిరిగి వెలికినేగి యరుదెంచె సఖులతో వాసుదేవు బట్టి బంది జేయ దరికి బోవుచున్న ధార్తరాష్ట్రడు జూచె హరిముఖమ్ము నుండి యద్భుతములు 809 ఫాలదేశ మందు (బ్రహ్మదేవుడు, విరూ పాక్షు డుండె నతని వక్షమందు వదన మందు వహ్ని పార్వ్వంబులం దింద్ర యమ కుబేర వరుణు లాశ్వినులును 310 వెడలె హలధరుండు యెడమ భుజము నుండి నరుడు తోచె దక్షిణమ్ము నుండి వెనుక ధర్మసుతుడు భీమ మాద్రేయులు ఊరు లందు వృష్టి వీరవరులు తష శంఖ చక్ర ఖడ్డ శార్డి గదాదులు ఆయుధములు వెల్లె హస్తములను దిశలు నాల్లు వెలిగె దేదీష్యమానమై వేయి సూర్యు లున్న విధము దోచె 312

224 సంక్షిప్త మహాభారతము ధూమకేతు కోటి భూమి నిండినయట్లు ప్రజ్బలించె నంబరమ్ము ధరణి ప్రభలు చూడలేక బహుఖభీతచిత్తులై కనులు మూసికొనిరి జనులు సభను 818 భీష్మ ద్రోణులకును విదుర సంజయులకు నారదాది మౌని నాధులకును దివ్యదృష్టి నాసగె దేవకీపుత్రుండు వారు పరమహర్ష వార్ధిదేల ౩14 మారు (మోగె దేవభేరీ రవంబులు భువిని గురిసె దివ్య పుష్పవృష్టి కలకలంబు విన్న కౌరవనాధుండు విశ్చ్వరూపు జూపె వెన్ను డనుచు 315 నేత్రహీను నన్ను నీ దివ్యరూపమ్ము జూడనీవె యనుచు వేడుకొనగ కృష్ణు డమిత కరుణ దృష్టి ప్రసాదించె పరవశమున జూచి పలికె విభుడు 816 నిన్ను జూచినట్టి కన్నులతో నింక నొరుల జూదలేను గరుడగమన నాకు మరల జూపు లేకుండ జేయవే యనుచు వేడ కృష్ణు డటుల జేసె తై? అంత విశ్వరూప మంతంబు గావించి యతుల వీడుకొల్పి యాదరమున కేశి సూదనుండు కృతవర్మ సాత్యకి తోడు రాగ సభను వీడి చనియె 318

ఉద్యోగ పర్వము నా వెడలుచున్న కృష్ణు వెనుకను ధృతరాష్తు దాది బంధుజనము లరుగుచుండ నతడు కుంతి సదన మందు ప్రవేశించి యామె చరణయుగళి నంటి (మొక్కె 319 నాడు సభను జరిగి నట్టి దెల్లను దెల్పి సుతుల కడకు బోవుచున్న నాకు ఇయ్యదలచు చుంటి వేమి సందేశమ్ము తెలుపుమనగ నామె పలికనిటుల 820 కుంతి సందేశం ఉత్తమకుల మందు నుద్భవించిన వారు వంశధర్మములను వదలకుండ భీము డర్జునుండు విడనాడి దైన్యంబు చెలగుమనుము వీర సింహులటుల ౩21 కురు సభాంగణమున కులవధూనమణీి బట్టి వారు పజచినట్టి భంగపాటు దలచి యొనరజేసి తగు ప్రతీకారమ్ము అంచితముగ కీర్తి గాంచు మనుము 322 అని వచించు కుంతి కాదరమ్మున మొక్కి కదలి దవుల నున్న కరు జూచి మాధవుండు బిలిచె రాధేయ నా తోడ జనుము కొంత దూర మనుచు ప్రీతి 828 కర్ణ జన్మ రహస్యం ఇందిరేశు డంత నేకాంతమున జెప్పె నతని తోడ కుంతి సుతుడ వీవు మంత్రబలము వలన మార్తాండు వరమున . కన్య కుంతి కీవు కలిగినావు 324

226 సంక్షిప్త మహాభారతము కనుక పొండుసుతుల కగ్రజుండవు నీవు సూతసుతుడ గావు సూర్యపుత్ర వార లెజిగిరేని యీ రహస్యము నీకు పూజ జేతురయ్య రాజు జేసి 825 అదియెగాక కర్ణ యారవభర్రగా పొందు (ద్రుపద రాజపుత్రి నిన్ను సకల బంధుజనులు సంతసింపగ నీవు ఇంద్రు డటుల రాజ్యమేల గలవు 326 విన్న కర్టుడనియె వినియుంటి నిది నేను నన్ను నీట విడిచె కన్నతల్లి నీట దేలుచున్న పేటిలో ననుగాంచి సతికి సూతుడిచ్చె సంతసమున ౩27 తల్లి లేని నాకు తల్లియై మలమూత్ర ములను గడిగి పెంచె నెలత నన్ను అతిరథుండు, రాధ అనురాగమును పంచి నన్ను పెద్ద జేసినారు గాదె 328 అటుల బెంచినట్టి ఆత్మీయులను వీడి సోదరులను రాధసుతుల వీడి రాజవంశమునకు రమ్మని నను బిల్వ న్యాయ మగునె నీకు యదుకులేశ 829 హీనకులుడ నంచు న్యూనమ్ముగా జూడ బడెడు నన్ను కౌరవా[గ్రజుండు రాజు జేసె నంగరాజ్యమ్ము నాకిచ్చి నరుని గెలుతు ననుచు నమ్మియుండదె 23380

ఉద్యోగ పర్వము 227 వమ్ము సేయు టతని నమ్మకమ్మును నేడు రుక్మిణీశ మిత్రద్రోహ మగును అదియె గాక నాకు నపకీర్తి గలుగదే నరుని జూచి వెరచి నాడ ననుచు 8891 తెలుపవలదు పాండవులకు నీ విషయమ్ము వారి కెల్ల జ్యేష్ట (భ్రాత నగుట ఎటిగెనేని రాజ్య మేలంగ నొల్లడు అవని నేలదగిన యమసుతుండు 882 జరుగనున్న యట్టి సమరయజ్ఞము నందు పసుల కురుసుతులను బలియొనర్చి వారితోడ కలసి పోరు నా బోంట్లకు పరమగతుల నిచ్చు పాండుసుతుడు 838 కృష్ణు డనియె పఫ్లవగకేతను గెలువంగ ధరణి లోన నెవరి తరము గాదు అయిన నాదు వచన మాలకింపక నిట్లు చావు గోరు చుంటి వీవు కర్ణ 884 వారమునకు నింకవచ్చు నమావాస్య పుణ్యదినము నాడు పోరనగును కర్దుడనియె నంత కాంచుచుంటిని కృష్ణ సతత మేను దుష్ట శకునములను 835 కౌరవులకు చేటు గల్గుట తధ్యంబు అగును పాండుసుతుల కభ్యుదయము నేను శకుని దుస్ససేనుండు కలనికి మూలమగుట వదలజాలనిపుడు 386

228 సంక్షిప్త మహాభారతము అని వచించి కర్టు డచ్యుతు వీడ్మొని హస్తినగరి కరిగె నచటి నుండి వాసుదేవు దరిగె పాండుపుత్రుల జూడ అంత విదురు దరిగి కుంతి కడకు 387 నాడు సభను జరిగి నట్టి దెల్లను దెల్ప పాండు రాజపల్ని పరితపించి తనకు పుత్ర దనుచు రవి సుతుందెటిగిన రణము సలుప మాను నని తలంచి 888 అతడు గంగ తలము నంద నుష్టానమ్ము చేయ నరుగు టెటిగి చేర నటకు ఆమె నతడు గాంచి అభివాదనము జేసి ఏల వచ్చి తనగ నింతి జెప్పె 3889 సూతసుతుడ గావు సూర్యునంశము నందు కన్య నైన నాకు కలిగినావు ధర్మజాది పాండు తనయులు నీతమ్ము లగుట వారి జేరదగును నీకు 840 తనయ పాండవులకు ధార్తరాస్త్రులకీవు తగిన విభుడ వనుచు తల్లి చెప్ప ఆమె నిజము జెప్పెనని పల్కు వినె కర్టు డపుడు సూర్య బింబ మందు నుండి తశ విన్న కర్గుడ నియె కన్నబిడ్డను నన్ను పుట్టి నపుడె విడిచి పుచ్చితీవు ఇప్పు డిటకు వచ్చి యేను నీ తల్లిని నన్ను జేరు మనుట న్యాయమగునె 842

ఉద్యోగపర్వమ టై

సవిత కరుణ నాదు జన్మరహస్యంబు

బయలుపదక నింద బాసితీవు

ఇపుడు దాని దెల్పి అపవాదు పాలౌట

మనకు మంచి గాదు జనని వినుము తి48 కుంతి సుతుడ ననుచు కురుకుమారుల వీడి

పాండుసుతుల జేర వచ్చితేని

విజయు నెదిరి పోరవెజచి వచ్చితినంచు

నగరె వీరులెల్ల నన్ను జూచి తెడీశ నన్ను దరికి జేర్చి అన్నియు సమకూర్చి

రాజు చేసెను ధృతరాష్త్రసుతుడు

యుద్ధ మనెడు జలధి నుత్తరించెడు నావ

యనుచు నమ్మియుండె నతడు నన్ను 545 అట్టివాని యుద్ధ మారంభమగు వేళ

విడుట ద్రోహమవదె వీరమాత

కనుక పోరువాడ కౌరవేయుల జేరి

అమ్మ యిదియె నిశ్చయమ్ము నాది 346 అయిన నీవు వచ్చి నందుకు నీకొక్క

మాట యిత్తునమ్మ మాన్యచరిత

యమతనూజ భీమ యమళుల నే జంప,

దొరికెనేని విజయు దునుమునాడ ౩47 క్రీడి చేతి చావు కీర్తదాయక మౌను అతడొ నేనా యొకడె బ్రతికియుండు కనుక పుత్ర పంచకము గల్గియుందువు పాండుపత్ని యార్వు రుండరమ్మ తిడీరి

230 సంక్షిప్త మహాభారతము దైవమింతె తనకు దయచేసెనని యెంచి కదలె కుంతి సుతుని కౌగిలించి బరువు గుండెతోడ నరిగె రాధేయుండు అచటి నుండి తలపు లందు మునిగి 849 అపర సంధ్య వేళ నుపపష్లావ్యమును జేరి మరుసటి దినమందు మాధవుండు అనుజ బంధు సహితుడైన ధర్మజు తోడ విషయ మిటుల జెప్పె వివరముగను 350 కురుపీతామహుందు గురుడును విదురుండు బాహ్లికుండు నితర బంధుజనులు మోకు రాజ్యభాగ మిచ్చి స్నేహము తోడ నుండు మన సుయోధనుందు వినడు 351 వాని తండ్రి విభుడు వైచిత్రవీర్యుండు చెప్పు మాటలు పెడచెవిని బెట్టి త్రోసి పుచ్చు చుండె దుర్యోధనుడు చావు మూడియున్నయట్టి మూర్చుడతడు 352 పెద్ద లెల్ల జెప్ప విన నిచ్చగించక సభను వీడి చనియె సఖుల తోడ కౌరవేంద్రు డపుడు గాంధారి గావించి విదురు బంపి వాని బిలువనంపె 858 తల్లి జెప్పిచూచె తగదు వైరంబంచు దుష్టు డామె మాట త్రోసిపుచ్చె నారదాది మునులు నయమార బల్మిన దంత వాని ముందు వ్యర్థమాయె 354

ఉద్యోగ పర్వము 231 రణము నందు గెల్చి రాజ్యభాగమ్మును పొందవచ్చు పాండుపుత్రు లనియె పోరు తప్పనింక వేరు మార్గము లేదు అనియె వాసుదేవు దతని తోడ 855 హరి వచించినట్టి దాచరణీయంబు అనిరి కవలు భీము దర్జునుండు ధర్మసుతుడు సమ్మతము దెల్బ సమరంబు సలుప నిర్ణయమ్ము జరిగెనపుడు 356 శాంతనవుని కెదురు సైన్యమ్ము నడుపంగ తగిన వీరు నెంచు ధర్మజునకు ద్రుపదసుకుడు ధృష్టద్యుమ్ను డర్దుందని అనిరి అర్జునుండు నచ్యుతుండు 357 అగ్నిగుండ మందు నాయుధంబుల తోడ ఉద్భవించినాడు ఉజ్వలముగ పాండవేయ సైన్యబలముల నడుపంగ తగిన వీరు డితదె ధర్మతనయ 358 పరమ వీరులైన పాంచాల నరపతి మత్స్యపతి, శిఖండి, మగధ విభుడు దండి మగలు చేకితానుండు సాత్వకి ధృష్టకేతు చేది దేశ విభుడు 859 వీర సప్తకంబు వీరి నక్షౌహిణీ పతుల జేయుమయ్య పాండుతనయ సరకుగొనరు వీరు కురురాజు బలముల నీకు జయము గలుగు నిశ్చయముగ 860

232 సంక్షిప్ర మహాభారతము దివిజవరులకైన తేటీ జూడగరాదు నీదు తమ్ము లనిని నిలచిరేని కమల నాళములను గజము చెందెదు రీతి కలచి వైతు రరుల కదన మందు 361 యదువిభుండు చెప్పినట్టుల పాంచాల ప్రముఖులను యూధపతుల జేసి ద్రుపదసుతుని ధృష్టద్యుమ్నుని నియమించె సకల పాండవేయ సైన్యపతిగ 362 కురుక్షేత్ర గమనం యాజ్ఞసేని సకియ లక్షతంబులు చల్ల విప్రవరులు సలుప వేదఘోష యమతనూభవుండు హరిని తమ్ముల గూడి కదలె సేనతోడ కదనమునకు 363 సాగరోపమముగ చని కురుక్షేతంబు చెంత విడిది జేసె సేనలెల్ల వాసయోగ్యమైన వసతుల గల్పించి సిద్ధమైరి ఘోర యుద్ధమునకు 364 వేగు వారి వలన విని ధార్తరాష్ట్రుండు శకుని దుస్ససేన సౌబలులను పిలిచి మంతనములు సలిపి వారల తోడ కురు బలంబు లన్ని గూర్చమనియె 865 కలశజుండు కృపుడు కర్డు డశ్వత్భ్థామ శకుని బాహ్లికుండు సైంధవుండు భూరిశ్రవుడు శల్య భోజ కాంభోజులు కౌరవేయ సేన కధిపు లైరి 366

ఉద్యోగ పర్వము 233 భీష్యసేనాధిపత్యం అంత ధార్తరాషు డమరనదీసూను పాలి కేగి యూధపతుల జూపి తాత వీరి కీవు నేతృత్వమును బూని జయము గూర్చవలయు సమర మందు 367 అనఘ నిన్ను మించి నట్టి వీరులు లేరు మన కులంబు నందు మాన్యచరిత స్వీకరించి సర్వ సేనాధిపత్యమ్ము కనికరమున మమ్ము గావుమయ్య త68 అనుచు వేడు కౌరవుని తోడ భీష్ముండు పలికె నాకు మిరు పాందుసుతులు ఒక్క్మరూపె కాని ఉనికి యిచ్చట గాన సరస నుందు మికు సమరమందు 269 పూనువాడ నేను సేనాధిపత్యంబు సలుపువాడ పోరు శక్తి కొలది ఇలను లేరు నన్ను గెలువ గల్గినవారు పాండుపుత్రమధ్యముండు దక్క 870 ఏను చంపగలను ఎవ్వరినైనను చేయి రాదు పొండవేయ వధకు అదియెగాక నేను అని సేయనొల్లను కర్టుడుండెనేని కదనభూమి 871 విన్న కర్టు డనియె మున్నె చెప్పితిగాదె పోర ననుచు నితడు పొలియు వఅకు ధార్తరాష్తుడంత దండనాయకు జేసె సకల సైన్యములకు శాంతనవుని 372

234 సంక్షిప్ర మహాభారతము

తోచె నింగినేల దుర్నిమిత్తము లెన్నా

అపజయంబు గలుగు నటుల దోచె

కారవుండు శాంతికర్మంబు లొనరించి

కదన రంగమునకు కదలి వెళ్లి 373 కురుకుమారవరుడు కురుభూమి దరిజేరి

నిలువ జేసె 'సైన్య నివహములను

వారి వాసమునకు వసతు లేర్చదజేసి

ఎదురు జూచుచుండె కదనమునకు 374 పొందు గూర్చలేక పోయెను కృష్ణుండు

రణము జరుగనున్న దని యొటింగి

పాొండుసుతుల కడకు బలభ(ద్రు దరుదెంచె

నార్తి జెంది మిగుల ననుజు జూడ 875

బలరామ తీర్ధయా త్రాగమనం

సకల బంధుమిత్ర సహితుడై యున్నట్టి

యమతనూజు కొలువు నందు బలికె

ఉభయపక్షములకు శుభము గల్లెడు ర్‌తి

మైత్రి సలుపకుండ మాధవుండు 376 పాండవేయ పక్షపాతియై సఖ్యంబు

కలుగకుండ చర్చ సలిపినాడు

అన్నదమ్ము లెల్లి అని సేయుచుండంగ

చూచి యోర్వలేను సుమ్మి నేను 877 వాయుజునకు కౌరవాగ్రజునకు గదా యుద్ధమేను గజపియున్నవాడ నాకు పరమప్రియులు నా శిష్యులిర్వురు ఒకరి నొకరు తాక నోర్వగలనె 878

ఉద్యోగ పర్వము 235 అందువలన తీర్థయాత్రకు వెడలెద నని వచించి చనియె హలధరుండు అంత కొంతవడికి నరుదెంచె రుక్మిణీ యగ్రజుండు రుక్మి యనెడు వాడు 879 వీరులెల్ల వినగ విజయునితో జెప్పె జరుగనున్న యట్టి సమర మందు పోర వెజచికేని కౌరవేయుల తోడ భయము వలదు నేను జయము గూర్తు 880 విజయు డనియె నపుడు వెజవనేటికి కృష్ణు డండనుండ నాకు కుండినేశ నీ సహాయ మొల్ల నేగు మెచ్చటికైన అనగ రుక్మి మిగుల నాగ్రహించి 381 కౌరవాగ్రజన్ము కడకేగి యతనికి సాయపడుదు ననియె సమర మందు నీ సహాయ మొల్ల ననె ధార్తరాష్తుండు చనియె రుక్మి విన్నదనము జెంది 882 కురు శిబిరము నందు సురనదీసూనుండు ధార్తరాష్తు డదుగ తమ బలమున అతిరధ సమరధ మహారధులను జెప్పి అర్జరథుడు కర్ణ గని భబించె 883 దివిజ విభుడు గొనియె కవచకుండలములు జామదరగ్ని ఘోర శాప మిచ్చె అందువలన నీత డర్జును మార్శొని నిలువజాల డనిని నిజముగాను 8ిరికీ

6 సంక్షిప్ర మహాభారతము అపుడు ద్రోణుడనియె నర్థరథుడె వీడు పాటె ననిని వీడి పందవోలె రాధపుత్రు డపుడు క్రోధ తామ్రాక్షుడై సురనదీ తనూజు జూచి పలికె తెరి5 అర్ధరథుడ వనెదు వాపగాసుత నన్ను ఏమి తక్కువాయె నిటుల బలుక అర్థ్ధరథుడ వీవె యౌదువు నీలావు నని యొనర్చు శక్తి నరసి చూడ 3లిర్‌ అని వచించి కౌరవాగ్రజుతో జెప్పె ఎటుల నోర్చుచుంటి వితని పలుకు విజయు పక్షపాతి నిజముగా నీ మేలు గోరి వాని తోడ పోరువాడె 887 ఇతడు లేకయున్న నేమి నష్టము నీకు మది చలించి నోటి కొదవి నటుల వదరుచున్నయట్టి ముదుసలి మాటలు సరకు చేయనేల కురుకుమార 888 విన్న శాంతనవుడు కన్ను లెజ్జగ జేసి అనియె వినుము సూతతనయ నాదు బలము నీ గురుండు పరశురాముడు, నన్ను దాకినట్టి రాజలోక మెలుగు 389 చేటు కౌరవులకు వాటిల్లె నీ వల్ల కాంచి యూర కుందడగలమె మేము అనుచు కర్ణు తూలనాడు భీష్ముని జూచి కోప ముడుగు మనియె కురుసుతుండు 390

ఉద్యోగపర్వము మ పర్వము జా కలసి పోరవలయు గాదె మిరు అనుచు శాంతనవుని అర్మసూనుని వేడి వారి శొంతపరచె కౌరవుండు 91 ఖీష్ముడపుడు పాండవేయ పక్షము నందు నున్న వీరవరుల నుగ్గడించి యమతనూజ భీమ అభిమన్య సాత్యకి ద్రుపదపుత్ర ధృష్టద్యున్న ప్రముఖ 892 అతిరధ సమరధుల నర్థరధుల దెల్పి అనియె నిటుల నింద్ర తనయు గూర్చి విజయు డరయ మిన్న వీరలందరి కన్న ఇలను లేరు వాని గెలుచువారు 898 గాండివమ్ము బూని పాండవ మధ్యము౦ దనికి వచ్చెనేని హరిని గూడి కీటడంచు నెట్టి మేటి వీరులనైన మట్టు బెట్ట గలడు మన బలముల 894 వాడొకందు దప్ప పొండవ బలమందు లేరు నన్ను గెల్పు వార లెవరు కాని నే శిఖండి పైన బాణము వేయ ననగ కారణమ్ము నడిగెనతడు 895 శిఖండి వృత్తాంతం అట పీతామహుండు అంబ వృత్తాంతమ్ము తెలిపె కౌరవునకు తొలుత నుండి మును విచిత్రవీర్యుడను నాదు తమ్ముని పెండ్లి జేయ బయలు వెడలి నేను 396

238 సంక్షిప్త మహాభారతము కాశి విభుని కన్యకామణుల స్వయం వరమహోత్సవమున కరుగు దెంచి నట్టి భూమిపాలు రదరి చూడగ రాజ సుతల దెచ్చి నాదు సోదరునకు 897 పెండ్లి జేయ నుండ పెద్ద కన్యక అంబ తండ్రి చేత పూర్వదత్త నైతి సాళ్చపతికి యనగ సాదరంబుగ నేను అనిపినాడ కన్య నతని కడకు 898 తిరిగి వచ్చి నట్టి తరుణిని చేపట్ట ననియె సాళ్ళు డంత నామె చెప్పె నీకు దత్త నౌట నెబుగక నను బట్జె తెలియజెప్ప నిటకు తిరిగి బంపె 399 దీన నేమి తప్పు భూనాధ యను నంబ నొల్ల ననగ నామె తల్లడిల్లి శాంతనవుని వలన సాళ్వుని గోల్పోతి ననుచు కక్షబూని యతివ నాకు 400 వాని చేయదలచి యతల సాయంబంది రమణి చనియె పరశురాము కడకు నాదు శిష్యు దతదు నన్ను గాదన డంచు జామదగ్ని వచ్చె భామ తోడ 401 పలికె నన్ను జూచి బలిమితో కన్యను తెచ్చి చెళచినావు దీని పెండ్తి, కనుక దీని మనుము గావించు మిప్పుడు నీ యనుజున కిచ్చి నెమ్మి తోడ 402

ఉద్యోగ పర్వము 239 అనగ గురుని తోడ వినయమ్ముగా నంటి పరుని గోరి యున్న పడతి దీని చేతు నెటుల పెండ్లి నా తమ్మునకు నిచ్చి కోర దగునె యిటుల గురువరేణ్య 403 విన్న భార్గవుండు మిన్నంటు కోపాన పిలిచె నన్ను పోరు సలుపు మనుచు భక్తి తోడ నేను ప్రణమిల్లి గురునితో పోరినాడ వేరె దారి లేక శే04 రెండు పదులు మరియు రెండు దినమ్ములు రణము సాగె భీకరముగ మాకు దివియు భువియు నదరె దివ్వాస్తముల వల్ల నారదుందు వచ్చి నడుమ నిలిచె 405 నాకమౌని జెప్ప నా గురువున కేను పదము లంటి మొక్క భక్తితోడ అమిత హర్షమంది ఆలింగనము జేసి భార్గవుండు నన్ను ప్రస్తుతించె 406 అంత పరశురాము డంబతో నిటు బల్కె చేయ గల్లి నంత జేసినాడ శాంతనవుని గెల్వ జాలనైతి ననగ తరుణి వనుల కేగె తపము సలుప 407 అంత నొక్కనాడు వ్యాస నారద మౌని వరుల గాంచి నట్టి తరుణ మందు అమరమౌని జెప్పె నంబ వృత్తాంతమ్ము జమదగ్ని వీడి చనిన వెనుక 408

240 పంక్షిప్ర మహాభారతము అపర జన్మ మందు నైన భీష్ముని జంపు దాన ననుచు శపధ మూని యంబ కరిన తపము జేయ కరుణించి రుద్రుండు తరుణి యెదుట దోచి వరము నిచ్చె 409 అపుడు ద్రుపద భూపు డనవద్యు డైయుండి చేసె తపము పరమశివుని దలచి పుత్రి బుట్టి పిదప పురుషత్వమును బొందు నని యనుగ్రహించె హరుడు కరుణ త్తే౦ సుత జనింప నృపుడు సుతుదని చాటించి పెంచి బాలు డటుల పెద్ద జేసి అస్త్ర శస్త్ర విద్య లన్నియు నేర్పించి వయసు పెరుగుచున్న వనితకపుడు త్తీష్షే తరుణి బాలు డగుట తథ్యంబు గావున మనుము జరిపె నొక్క మగువతోడ వనిత నిజము దెలిసి తన దాసితో జెప్ప నామె వార్త నృపుని కందజేసె తల కన్యతండ్రి యపుడు కడు నుగ్రుడై వచ్చె సేన తోడ రణము జేయ నంత తనకు మరణ మింక తప్పదని శిఖండి ప్రాణములను బాయ వనికి చనియి 418 అచట యక్షు దొక్క దతివ గాధను విని కరుణ గలిగి తనదు పురుషరూపు కలికి కొసగి తాను కాంతరూసపము దాల్బ్ప అట శిఖండి నగరి కరుగు దెంచె శీ1ేశ

ఉద్యోగపర్వము డ్‌ విషయ మెటిగి ద్రుపద విభుడు సంతస మందె సంకటమ్ము బాసె సఖ్యమాయె శివుని వరబలమ్ముచే శిఖండి పురుషు డయ్యె నని వచించె నమరమౌని 415 పోరు సలుప నేను పూర్వాంగనల తోడ బాణ మేయ నాడు వారిపైన అని పితామహుండు తన నిర్ణయము జెప్పె పోర ననుచు ద్రుపద పుత్రి తోడ 416 ఆపగేయు డిచట నట ధృష్టద్యుమ్నుండు తమ ఐలముల తోడ సమరభువిని చేరి నిలువ నుభయ సేనానికాయమ్ము లవని యంత నిండి నటుల దోచె శే సంక్షిప్త మహాభారతము అఆదిపంచకము సమాప్రము (నానన

కృతజ్ఞతా వాక్యాలు నా వ్రాతప్రతిని చదివి అమూల్యమైన సలహాల నిచ్చిన ఆప్తమిద్రులు, సుప్రసిద్ధ కవి దాక్టర్‌ ఉండేల మాలకొండారెడ్డి గారికి (గ్రంధ ము(ద్రణ కార్యంలో ఎన్నో విధముల సహాయ సహకారాల నందించిన ప్రియమిత్రులు శ్రీ యగ్రమిల్లి సూర్యనారయణ మూర్తిగారికి నా యీ రచనకు పుస్తక రూపం కల్చించిన అనుపమ ప్రింటర్స్‌ వారికి నా కృతజ్ఞతా భివందనములు చెన్నై మల్లెల రామయ్య 10-05-2005 జ్య 6 శ్‌ గ్‌ క లో నా

. వు నా. మల్లెల రామయ్య జననం 20 మార్చి,1981; నెల్లూరు " ( జననీజనకులు మల్లెల సుబ్బమ్మ, సంజీవయ్య . విద్యాభ్యాసం - నెల్లూరు, చిదంబరం, ఖరగ్‌పూర్‌, కొలంబియా (మిస్ఫోరీ-అమెరికా) .... + " విద్య 9.4., 3.1. (0030, 4 260. ౩౬. _ గ వో | పదవులు డైరెక్టర్‌, స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ రిసర్చి సెంటర్‌ (3£20031%),,... సీనియర్‌ హ్యూమన్‌ 'సెటిల్‌మెంట్స్‌ అద్వెజర్‌, " . ౮౫౦౫౪5 (120120, నైరోబీ, కెన్యా ( వ్యవస్థాపక అధ్యక్షులు, ఇండియన్‌ కాంక్రీట్‌ ఇన్‌స్టిట్యూట్‌ రచనలు ఆంగ్లం : 0% ౧68608 206 గటం2101 512100 -త్మీ 5282 01 - - ౧6+0601, 1998 ". తెలుగు : సుందరకాండము, ఆటవెలది పద్యకావ్యము, 1999 సంక్షిప్త రామాయణము, ఆటవెలది పద్యకావ్యము, , 2002 సా