Telugu samarpana - anilvaranasi/indianlanguages GitHub Wiki
సమర్పణ . తణార్యీ కోనల సుప్రసన్నానార్య
సమర్పణం సాహిత్య తాత్విక వ్యాసాలు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య (ప్రచురణ సృజనలోకం కాకాజీకాలనీ, హనుమకొంద వరంగల్లు
బిసీ రో సాం రా క ళ్ డ్డ ఫే 5గిగిగి9ిష1% న శీగఉం/(0ర9/ ర ముర్చిర 0౧ 044/2 ఫీ చ! 540056౧770 య40/6 శర లొరాంవ్యా - గ ఈ న 1 వహ! స్నా గా రంగ, 2004 [10 గండి. మిర్టల్స అ గం! ఖగ. ళన రం 5, 100/7 నం పోదం డస గ 7 50760716 న్వు -0ఏ ళం? : 9-1-190, 67%066
- *4గ4464[ - 506 002 502 0870-24379909 యే ఏగల318 ఓ0[20 గం ము. 600% [2031260163 (7 గీ 8364109 800% 5666 తిగోగఓ౭గ ల గీ5[ం%8 కగంగగ॥ 0గం6 9/05 రిట166 గి260111 6106 ౪|5ఉ%6%1 - 506 002 010౧6; 2427404
ధ్వన్యనుకరణ సమ్రాట్ పద్మశ్రీ శ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారికి చిరమైత్రీ చిహ్నంగా- గొంతులో వేయి స్వరములు కుదురుకొన్న ఒక మహాశ్చర్య రేఖ రూపొందె నిచట, ఆ యశస్సు సమస్త లోకాతిశాయి నీ వలన ఓరుగంటికి నెలకొనియెను ఎందయిన మైత్రి తావుల నింపుకొనుచు జీవితము నుత్సవమ్ముగ జేసికొంటి, వందరకు ప్రీతి పొంగింతు వాత్మలందు - ధన్యతముడవు వేణుమాధవ మనస్వి ధ్వన్యనుకరుణమ్మున నీ విన్యాసము సాటిలేదు, వేరెవ్వడు నీ తెన్నుల నిలువం జాలును? మాన్యగుణ ప్రవణ, సాధుమతి, సుకృతఖనీ సమదృష్టి మనకు సాహి త్యమునను జీవితమునందు, తాద్భశమగు శాం త్యమృతము నింపుత - ఇదినీ కొమరు మిగులు కొత్త సౌరు, కొను మంకితమున్ 15-10-2004 కోవెల సుప్రసన్నాచార్య
ఆధునిక్ మహర్షి ఆచార్య సుప్రసన్న
సృష్టిలీల బహు చిత్రంగా ఉంటుంది. కాలరథం రహదారి పక్కన శాఖోప శాఖలుగా విస్తరించి, దారిన పోతున్న అనేక మంది బాటసారుల బడలిక తీరుస్తూ తనదంటూ ప్రత్యేకత నిలుపుకున్న ఆ మహావృక్షపు శాఖాగ్రచ్భాయల దరిదాపుల్లో అప్పుడే మొలకెత్తిన ఓ చిన్ని మొక్క తలెత్తి ఆ మహావృక్షపు ఎత్తును అంచనా వేయడానికి సంకల్పించింది.
పసిబిడ్డను ఎత్తుకోవాల్సిన ధర్మం పెద్దలది. వాళ్ల హృదయాలకు హత్తుకునే హక్కు పిల్లలది. ఎవరిది ఏ ఎత్తు అయినా ఇద్దరూ (ప్రకృతి ఒడిలో పసిపిల్లలే ! ఆ యిద్దరూ ఇంకో చెట్టువేపు చూస్తున్నారు. ఎందుకంటే ఆ వృక్షం చిత్రాతిచిత్రంగా ఉంది.
ఊర్జ్యమూల మధః శాఖ మశ్వళ్డం ప్రాహము రవ్యయమ్
ఛన్దాంని యస్య పర్దాని య స్తం వేద న వేదవిత్
ఆ వృక్షం యొక్క స్వరూపాన్ని శోధిస్తూ హృద్గీత, ఆనందలహరి, తేజశ్చక్రము, అధునా, బుతంభర, పాండిచ్చేరి గీతాలు పన్నెండు, శ్రీ పాంచాలరాయ శతకం, శతాంకుర, స్తుతి ప్రబంధము, కన్నీటికొలను, కృష్ణరళ్ళి, శ్రీ నిరుక్తి, శ్రీ నృసింహ ప్రపత్తి, సొాంపరాయం, మజణిసేతువు, ప్రీతి పుష్కరిణి, శేఫాలిక వంటి అద్భుత జ్ఞాన కావ్య కుసుమాలను, సాహిత్య వివేచన, నహృదయచక్రము విశ్వనాథమార్గము, భావుకసీమ, పోతన చరిత్రము, అధ్యయనం, చందన శాఖి వంటి విమర్శనా మధుర ఫలాల్నందించిన జ్ఞాన వృక్షము తానైతే, ఈ సాహిత్య ప్రకృతిని, ఆ అశ్వష్ట వృక్షాన్ని లీలా మాత్రంగా అవలోకించి అచ్చెరువందుతున్న చిన్ని మొక్కకు ఓ ప్రాతఃదినాన మణీసేతు సందర్శనభాగ్యం, లభించింది. అచ్చోట పూచిన పారిజాత పరిమళాలివి.
వెన్నెల లావరించుటయు వేడుక వానల (కుమ్మరింతలున్
కన్నుల న్వవ్న లోకములు కానగ వచ్చుట, లింటివెన్మ సం
వన్నిధి గుప్తతల్ విడిచి పైవయి కెక్కుట, లెన్నియైన లో
నున్న అమేయ శాంతికి అణూపమ కేనియు పోలి రావెటుల్
111
అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టోత్తర శత దివ్యక్షేత్రాలు, భిన్న ప్రకృతులూ ఉన్న మణి ద్వీపమే భారతదేశము. తన మాతృభూమిని జగన్మాతగా దర్శిస్తూ, . . అఖిల జగముల కాటన్నప్టిన నిన్ను అఖిల జగముల నేది కాదైన నిన్ను ఎటుల కొల్పుట యెద నిల్దుటెిటుల నర్వ వియదనంత నమావేశ వృక్షమూర్తి అఖిలమున కాది మూలమైనట్టి నీవు అంతమున వరిజతి నవాస్రారమగుచు ఆ మణిద్వీవమున రాజ్హివౌచు నిలుతు గుండెలో నూక్ష్మ షట్పద గువప్తమూర్తి వీజంలో జడంగా ని(ద్రిస్తున్న చైతన్యమూర్తి, అంకురమై, మొలకై, చెటె, వృక్షమై విశ్వంగా పరిణామం పొందింది. నేను జీవాన్ని వృక్షాన్ని ఫలాన్ని రసాన్ని నేను ఆవర్తాన్ని బుద్భుదోన్ని, తరంగాన్ని తథాగతమ్ము, తథాద్భుష్టము, తథాభానితము నితృభావం. కనిన న్వవ్నము, అర్ధరాత్రి గర్భంలో వగలు ఆ తామసీ గర్భంలోనుంచి ఉషళ్ళిశువు జన్మనెత్తింది. గింజ మట్టిని చీల్చేవేళ ఊవిరినంతా బిగగట్టి పైకి పొద్దుకువవ్చి ఒకసారి తన్నుతాను (్రకటించుకునే క్షణం చివురు విచ్చుకునే వేళ మొగ్గ కనబదే వేళ వినబడని మట్టి మూలుగు - ఆ లిప్త విశ్వచైతన్వు సంవేదన, . . ఆవృ్ఫక్త బీజంలోనుంబి నిర్ధమించిన అళ్వత్డ వృక్షం జీవ కినలయితమై ఆకాశాన్ని కప్పివేసింది నర్గపు తొలి మొలక తాను న్ధుంధంలో ఎన్ని ఎన్ని (ప్రాణరవాన్య కోటరాలు కాని ఇప్పుడు వర్తమానం అత్మబలి చేస్తున్నది. ఈ నాగరికతా, అణ్వాయుధాలు, మౌధ్య కాననాల సమిధలతో దగ్గమైన అనేక మన్వంతరాల వేదనల చితాభస్మాన్ని వెలుగుల శ
సముద్రంలో కదిలే వెన్నెల పడవలో భావిదాకా మోస్తూ సాగే అనంతేతిహాస ప్రయాణమే సొంపరాయమైనపుడు ఫలితం దుఃఖము తొలగి, మృత్యువు తొలగి, తొలగి అహంత, తోరణం సృష్టి కవుతుంది.
సృష్టి విద్యా ప్రాగల్బ్యమంతా నేర్వక నేర్చిన మర్య్యజగత్తు సద్వస్తుచ్చాయయై మృత్యువును [గ్రసించి చిదగ్నియై, ఆనందలేశ ప్రతిబింబమై దుఃఖావలిత మవుతున్నది. ఈ (బ్రహ్మాండంలో - ఎప్పుడో ఒక పూవులోనో, పసిపాప బోసి నవ్వులోనో, వెన్నెల వెండి జరీ అంచు మబ్బు తెరలోనో, అమేయమైన “భి చక్ర సాక్షాత్కారంలోనో, భీకరమైన ఉప్పెనలోనో, బారులుకట్టి ఆకాశంతో కదిలిపోయే కొంగల సమూహంలోనో ఒక అర్థం కాని, అన్వయం కాని, అవాచ్యమైన అనుభవాల సంకలనం స్ఫురించటం కద్దు.
అప్పుడే ఒక చిన్న పూవు పిలిచింది. 'ఓ అనంత సాగర తరంగమై కదిలి వస్తున్న ఏథికుడా, అన్వేషణకు అంతే ఎరుగని బాటసారీ, నీ కోసం ఇక్కడ రూపొందుతున్నాను” అని నేనడెగాను - 'నీవెవరివని - నన్నెరుగుదువా అని. ఆ పూవన్నది - 'నేను శేఫాలికను - నీవు నాలోని ప్రాణశాభివని: ఆ శేఫాలికా ప్రాణశాఖికి మరో ప్రాణసఖి. ఆ ప్రాజసఖి సుమ శాఖాక్ళృతియై సరిన్నిభమునై, శుభ్రాంశు సందోహమై విమలాంభోజ దళాంచలంబునయి,
(బ్రతుకున కొక దేవివయి వచ్చిన నీయెద, నాత్సలోక నం
గత రసపారవశ్చములు కల్ల నిదంతయు నీకె కూర్చితిన్
అతిశయ నంగమార్థములు అచ్చవు పాల్ఫడలిం బలెన్ ఆనుప్ర
తతుల జ్రీతి వువరిణి పాలనసేయవె ఆదిలక్ష్మి వై- అది కోరిక. కులపొలికా ప్రణయ సంయోగభావ చిత్రీకరణ వేదిక.
ఈ లీలాలయ మర జన్మమిది వాంభింవంగ రాదేమి దృ
గ్హాలంబుల్ చిరుకత్తులై యెదద చీల్చన్‌రాదొ నంసేనన
న్థాలిత్వంబుల మాన్సు మీ బ్రతుకు నీ కళ్యాణ ఖభూమిన్ కవా
టాలోలంబగు మువ్వజేసెదను దేవా. . ..
స్తబ్బుంద్రె దివి వృక్షమై నిలుచు నాదైవంబ, పై మూలమై
అఖ్టుల్ కొండలు కాననంబులును భూమ్వాకాశముల్ శాఖలైన
ఓ నారసింవా వ్రభూ....
ఖా
అంతా, అంతటా ఆ అశ్వత్థ వృక్షస్వరూపమే. అక్కడే బోధివృక్షం నీడలను పరచుకొంటున్నది. ఈ ఉనికి అయిదు కొమ్మల వృక్షం. రూపం, వేదన, సంజ్ఞ సంస్కారము, విజ్ఞానము కలబోసిన ఈ వృక్షము మన కందిస్తున్న ముప్పదియొక్క మధుర ఫలాల సంపుటి ఈ సమర్పణ. జాతీయతాభావం, దేశీయత, మానవీయ సంస్కృతి మూలాలుగా విశ్వనా థారవిందుల విశ్వవిజ్ఞానము నారమై, భౌతిక మానసిక అధ్యాత్మిక జీవన జ్ఞానం నాదమై, జాగ్రత్ స్వప్న సుషష్తావస్థలు తురీయవేదమై, జగన్మాత సౌందర్యస్వరూపమే అద్భుత వాదమై, ప్రాక్సశ్చిమ నాగరికతల, ప్రాచీన ఆధునిక కవితల మేళవింపు కమనీయమై శాఖోపశాఖలుగా విస్తరించి సాహితీవనాన్ని సుసంపన్నం చేస్తున్నది.
సాహిత్య విమర్శలో నవ్య సంప్రదాయ వాదమును, ప్రాగ్రూప వివేచనను (ఆర్కిటైపు), సమకాలీన సార్వకాలీన దృక్పథమును, విశ్వలయను మొట్టమొదట ప్రస్తావించిన భారతీయ పునరుజ్జీవనోద్యమ చైతన్య దర్శనము కలిగిన మానవతావాది, ఆధునిక మహర్షి అయిన కోవెల సుఫప్రసన్నాచార్యులవారి యీ (గ్రంథాన్ని 'సృజనలోకం” ద్వారా వెలువరించడం మహాద్భాగ్యంగా భావిస్తున్నాము.
యాంత్రిక ప్రపంచం సృష్టించిన త్రిశంకుస్వర్గాలపై యుద్దాన్ని ప్రకటిస్తూ జీవన సౌందర్యలహరిని (పేమ మార్గం ద్వారా చేరుకునేందుకు సుప్రసన్నాచార్యుల వారిచ్చిన పిలుపు మరల మరల వినిపిస్తుంది. ప్రతి యుగంలో, ప్రతిభావసంతంలో, ప్రతి శతాబ్దంలో కొత్త దుస్తులు తొడుగుతుంది. అది విస్తరిస్తుంది.
శుభం భూయాత్ ! 14-10-2004 16-10-1294 ప్రశాంతి వాస్సిటల్ దాః లంకా శివరామ ప్రసాద్ శివనగర్, వరంగల్ - 606 002 సృజనలోకం ప!
ఆంతర్యం
(ప్రతి “సమర్చణ”కు ఒక “ఆంతర్యం” ఉంటుంది. అందులో జీవన సంస్కారం కుదురుకొని ఉంటుంది.
సుప్రసన్నగారి జీవన సంస్కారంలో ఒక తాత్త్వికగాఢత, సారస్వత ్రౌఢిత పెనగొని వున్నాయి.
తాత్త్విక స్రవంతిని అరవింద వివేకానంద చింతనలు, ప్లావితం చేయగా- సారస్వతస్రవంతిని రసిత మొనర్చినవారు రాయప్రోలు సుబ్బారావుగారు, విశ్వనాథ సత్యనారాయణగారు, ఫలితంగా- సుప్రసన్న ప్రతి రచనా ప్రయత్నంలోనూ అంతర్గతంగా జాతీయాఖినివేశం, మనో విశ్లేషణ (ప్రధానమైన తాత్త్వికత, పెనగొనివుంటాయి.
ఆధునిక తెలుగు సాహిత్య పరిశోధన, విమర్శన మార్గాలలో రెండు వర్ణాల శిబిరాలు ముఖాముఖి నిలిచివున్నాయి.
దేశీయ సాంస్కృతిక జీవన భూమిక ఒకరిదైతే-
అంతర్జాతీయ దృక్పధం గల సాంస్కృతిక భూమిక మరొకరిది-
ఈ శిబిరాలలో తొలి వర్గానికి రాయప్రోలు, విశ్వనాథ, అప్రకటిత నాయకులు కాగా- రెండవ శిబిరానికి శ్రీశ్రీ, అభ్యుదయ రచయితల ఉద్యమం, ప్రకటిత నాయకులయ్యారు.
ఈ రెందు శిబిరాలలో చేరకుండా 'అలీన విధానం) అవలంబించిన తెలుగు రచయితలు, విమర్శకులు, లేకపోలేదు వారికథ విషయాంతరం-
సుప్రసన్న స్పష్టంగా తొలి శిబిరానికి చెందిన కవి - పరిశోధక విమర్శకులు.
చేతనావర్తమనే ఒక తాత్త్విక జిజ్ఞాస నుంచి, ఆధునిక తెలుగు సాహిశ్యాన్ని గాఢ వివేచన చేస్తూ- ఒక జుతీయ సాంస్కృతిక - వారసత్వం గల - కవి పరంపరను గుర్తించి - ఎంచి - నిలిపే ప్రయత్నం చేశారు. వీరు రాయప్రోలు, విశ్వనాథ, దాశరథి- శ్రీశ్రీ వంటి ప్రతిభావంతునికి ప్రత్యాన్నూయంగా- శేషేంద్రశర్మ - అనే కవి పరంపరను ఆధునిక తెలుగు సాహిత్యంలో పథ నిర్దేశకులుగా ప్రతిష్టించారు. తాత్త్వికంగా, తార్మికంగా వారి వారి రచనా తత్త్వాలకొక అంతస్సూత్ర సంబంధమైన ఏకసూటత్రత సాధించే కృషి చేశారు.
స!
కవిగా పద్యవిద్య మీద గాఢానురాగంవున్నా ఆధునిక కవిత్వ చేతనను ఆవిష్కరించడంలో వచన పద్యానికి గల అంతశ్శక్తిని అంగీకరించి - సమర్ధించిన వ్యక్తి శ్రీ సుప్రసన్న, స్తిమిత చిత్తంతో, మూడు తరాల భిన్న భావసరళులకు చెందిన రచయితల కృషిని అంచనావేయడంలో ఆయన విలువైన సంయమనం పాటించగల వ్యక్తి. ఇందుకుగాను స్థిరపడిన సూత్రీకరణల మీద కంటె, మనోధర్మం మీదనే ఎక్కువ ఆధారపడ్డారని తోస్తుంది.
స్వభావతః సాత్త్వికులైన శ్రీ సుప్రసన్నలో యోగ విషయాఖభిరతి, కేవలం స్వీయసాధనాత్మీయాంశంగా మిగిలిపోలేదు; సాహిత్య, జీవన విషయాలను విశ్లేషించే సాధనంగా పరిణమించింది-
ఈ సాత్త్విక పరిక్రమం, శ్రీ సుప్రసన్నను మిగిలిన తెలుగు సాహిత్య విమర్శక పరిశోధకులకంటె భిన్నునిగా నిలపింది.
ఈ 'సమర్ప్చణు సంపుటి - అరసం నుంచి ఆధునికోత్తరకాలం వరకు నవతరం ఆలోచనలను విశ్లేషించడం ఒక వైపు రాయప్రోలు, గురజాడ, విశ్వనాథ, కృష్ణశాస్త్రి వ్యక్తిత్వాల, రచనల తాత్త్వికాంశాల పరిశీలన నెపంతో - జాతీయత, కవిత్వలక్ష్యాల అనుశీలనం మరొకవైపు; నిర్దిష్టంగా చేసింది-
ఇందులో వ్యక్తుల సారస్వతవ్యక్తిత్వాలను నిర్దేశించడం వుంది. కథానిక, కాల్చనిక కవిత్వం, వచనకవిత్వం వంటి ప్రక్రియాంశాలను వివరించడం వుంది. కొన్ని పుస్తకాలను సమీక్షించడంతో పాటు మిత్రప్రశంస వుంది- అ సంపుటిలో వ్యాసాలన్నీ వేరు వేరు సందర్భాల కోసం వ్రాసినవి, పత్రికలలో ప్రకటించినవి, అందువల్ల ఆధునిక కవిత్వంలో ముక్తక లక్షణం వున్నట్టే, ఇటువంటి వ్యాసాలలో కూడా ముక్తకలక్షణం వుంటుందని చదువరులు మరువకూడదు. కాలికమైన, వస్తుసంబంధమైన ఆయా పరిమితులు విస్మరించి, వ్యాసపరంపరనంతనీ ఒకే మనోభూమిక మీద మొలిచిన “పకగ్రంథం'”గా భావించి విశ్లేషణలకు దిగడం తగదని చెప్పడమే ఇక్కడ నా తాత్పర్యం.
తెలుగు ఆధునిక సొహిత్యంలో “ఆధునికత” పేరు చెప్పి సామ్యవాద
సాహిత్యవిమర్భాధోరణి జడలువిచ్చి, సుడులు హెచ్చి వేదిక నాక్రమించిన మాట వాస్తవం.
సామాన్య పాఠకుడంటూ పాఠకుణ్ణి- సామాన్య మానవుడంటూ మానవుడి జీవన
వైవిధ్యాన్నీ - కేవలం కొన్ని పరిభాషలలోకి, పరిమితులలోకి నెట్టివేయడమనే దుర్మార్గం
సుమారు నలభై ఏళ్ల పాటు జరిగిపోయింది. ఈ దుర్మార్గం వచన రచనల మీద కంటె
కవిత్వం మీద ఎక్కువ జరిగింది. అసలే అనాదినుంచే గతానుగతికత్వానికి అను ౪111
కరణత్వానికీ తెలుగు కవిత్వం పెట్టింది పేరు. నానాటికీ తీసికట్టుగా కవిత్వంలో స్వతంటత్రాలోచన, వస్తు వైవిధ్యం కొరవడి - కవిత్వమన్నా కవులన్నా్నా వెటకారంగా తయారైంది- ఉద్యమాల కేలూని నడిచిన కవిత్వమనోధర్మంలో ఉద్యమత్వం, వట్టి భావప్రకటన లౌల్యం, తప్ప - కవితాత్వం, భాషాసంబంధమైన ్రవాహశీలత, మనోధర్మానికి సంబంధించిన ఊహశాలిత, బాగా కౌరవద్దాయి. ఇతివృత్తమే కవిత్వ పర్యాయంగా చెలామణి అయిపోయింది. 1960ల ద్వితీయార్థం నాటికే యీ దురవస్థను- తటస్థంగా నిలబడి -పసికట్టిన తెలుగు విమర్శకుల్లో శ్రీ సుప్రసన్న ఒకరు. రసం, అలంకారం, శిల్పం, వంటిమాటలు వింటే చాలు గంగ వెర్రులెత్తే కవిబ్బవుల మధ్య - సాొత్త్వికమైన, మృదువైన, ఆయన కంఠం వినబడవలసినంతగా వినఐడలేదు- కవిత్వంలో నవత్వం కోసం సుమారుగా 1910నుంచి పలువురు మేధావంతులు చేసిన నిజాయితీగల ప్రయత్నాలను స్తిమితంగా పునఃపరిశీలించి- ఉత్తమ కవిత్వాన్ని అనంతరకాలపు యువజనానికి పరిచయం చెయ్యవలసిన అవసరం వుంది. ఈ సత్ ప్రయత్నాన్ని సమర్పణ సంపుటంలోని ప్రధాన వ్యాసాలు సమర్థంగా చేస్తున్నాయి. ప్రధాన వ్యాసాలంటే: కాల్చనిక కవిత్వం, వచన కవిత్వం, గురజాద చైతన్యం, రాయప్రోలు వారితో ప్రత్యక్షభాషణ, విశ్వనాథ కవిత్వ, వ్యక్తిత్వాలకు సంబంధించిన వ్యాసాలు, కృష్ణశాస్త్రి గురించిన వ్యాసాలు, దాశరథి కవితా వైభవం గురించీ, స్వేచ్భాకవిత్వం గురించీ తెలియచెప్పే వ్యాసాలూను- శ్రీ సుప్రసన్న సాహిత్య వ్యాసాలలో ఆకర్షించే తొలిగుణం ఆత్మీయత. ఈ సంపుటం చదువుతూ ముందుకు వెడుతూంటే, మనల నీ 'ప్రకటనలూ నిలిచి ఆలోచించేలాగ చేస్తాయి. 1 కులవ్యవస్థల సాంద్రీకరణం ఫలం దళిత వాదంకాగా, కుటుంబ వ్యవస్థ శిధిలం కావడం స్త్రీ వాదానికి కారణమైంది. (ఢు. 29) 2. భారతీయ నాయకత్వం సమగ్ర జీవన దృక్పథం నుంచి కాకుండా, భౌతిక జీవన కోణం నుంచి భవిష్యత్తును నిర్మించే ప్రయత్నం చేసింది. (పే. 29) 3. ఖండకావ్య ప్రక్రియ, పలుచదనం పొందని సాంద్రకవితామధువును దగ్గరకు తెచ్చింది. (పే. 38) 4 ప్రధానంగా ఆధునిక కవిత్వమంతా బుద్ధి ప్రధానమైందే- (పే. 43) 1%
- దేశీయ మతస్వరూపాన్ని కూడా క్రైస్త్ర్రమతము మాదిరిలో రూపొందించే ప్రయత్నం జరిగింది. (పే. 53)
- (గురజాడ) జాతీయోద్యమానికి అనుకూలుడు కాదు. (పే. 59)
- రాయప్రోలు వల్ల ఆయనను అనుసరించిన కవి పరంపర ఒక విధంగా రౌచికులైనారు. (పే. 71) & ఇంత సాహిత్యంలోనూ విశ్వనాథ ప్రతిపాదించినది - 'సర్వవస్తుగత (ప్రాణ సమారాధనము'. (పే, 89)
- కృష్ణశాప్రి వివాహవ్యవస్థకన్నా, స్రీ పురుషుల మధ్య స్వేచ్చనూ, ప్రణయాన్నీ లక్ష్యంగా (ప్రతిపాదించినాడు. (పే. 102)
- మన రచయితల్లో ఎక్కువ మంది, కవులు కావటం వల్ల సృజనాత్మక రచనకూ, విశ్లేషణాత్మక రచనకూ, నడుమ సరిహద్దులు చెరిగిపోయాయి. (పే. 138)
- (ఆధునికకవితలో) ఆధునికతా, ప్రాచీనతా భేదాలు పద్యరూపం వల్ల కాదనీ, అభివ్యక్తి ముఖ్యమనీ, తెలియవస్తుంది. (పే. 157)
- భాష కాదు, వస్తువు కవిత్వాన్ని సరళం చేసేదీ, కఠినం చేసేదీ. సంవిధానం మరీ ముఖ్యం. (పే. 157) ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా, ఇవి శ్రీ సుప్రసన్న స్వబుద్ధిగత తార్మిక (ప్రజ్ఞతో వెల్లడించిన అభిప్రాయాలు. ఇటువంటివి ఈ సంపుటంలో మిక్కిలిగానే ఉన్నాయి. స్వతంత్ర వ్యక్తిత్వంతో తన తాత్త్విక చింతనను, సాహిత్య విశ్వాసాలను ఏర్పరచుకొన్న వ్యక్తి శ్రీ సుప్రసన్న- “ఆధునికత అంటే చాలు అసహనంగా ఉలికిపడే పండితులు పంథాలోని వారు కారు సుప్రసన్న - ఆధునికత అనేది కాలికం కాదనీ, తాత్త్వికమైనదనీ నా విశ్వాసం. సువిశాల జీవన భూమికమీద నిలిచి, ఆగతానాగతాల సాహిత్య వివేచన చేయగల ధీర చిత్తులంటే నా కిష్టం. అందువల్ల సుప్రసన్న ఎంచుకున్న వివేచనామార్గం ఆదరణీయమని నమ్ముతున్నాను. ఈ సంపుటం ద్వారా పాఠకులకు ఆ మార్దాన్ని దర్శింప జేస్తున్నందుకు ఆయనకు నా ఆత్మీయాభినందన- 06-10-2004 102 శుభోదయ అపార్ట్మెంట్స్, ఆఫీసర్స్ కాలనీ, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సికింద్రాబాద్ - 500 056 గ
ధన్యవాదాలు
_తాలుదొల్తగా - ఈ జీవన ప్రసారాన్ని అంతర్చహిర్దిశలలో పరిపాలిస్తున్న సద్గురువులు శ్రీ కందుకూరి శివానందమూర్తి గారికి ప్రణామాలు.
అప్పుడప్పుడు వ్రాసికొన్న, ప్రసంగించిన, ప్రసంగింపజేసిన వ్యాసాలు - చాలా వరకు ్రకటితాలు - ఒక సంపుటీకరించే ప్రయత్నంలో ఇది మూడవ సంపుటం. ఒకటి 'దర్పణం' - జీవనానికీ, సాహిత్య తత్త్వానికీ సంబంధించిన వ్యాసాలు; రెండవది 'సమర్చని మహాగ్రంథాలను గురించీ, ప్రాచీన సాహిత్యాంశాల గురించిన వ్యాసాల నంకలనం; మూడవది 'సమర్పణం'* ఇది. ప్రధానంగా ఆధునిక సొహిత్యానికి సంబంధించిన వ్యాసాల సందోహం. ఇవన్నింటికీ ఏక వాక్యత లేకపోయినా ఒకటిగా గుదిగుట్చే అంతస్సూత్రం ఉన్నది. అందుకే అన్నింటినీ సాహిత్య తాత్త్విక వ్యాసాలని పేర్కొనటం జరిగింది. మూడు సంపుటాల్లోనూ ఇంచుమించు డెబ్బై వ్యాసాలు సమకూర్చబడ్డాయి.
“ఆంతర్యం” పేరుతో ముందుమాట వ్రాసి దీన్ని 'లోనారసిని వారు ఆత్మీయ మిత్రులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ.
నాకు ఉన్నత పాఠశాల చదివేకాలం నుంచీ ఆత్మీయంగా పరిచితుడు, విశ్వ విఖ్యాతుడు, వినయశీలి, స్వరవంచన కళావిధాత శ్రీ నేరెళ్ల వేణుమాధవ్‌కు అంకితం చేయటం ఓరుగంటి విజయపతాకాన్ని అత్యున్నతంగా, నింగిలో నిలిపినందుకు. జీవన సాధనలో సత్త్వమార్గం తప్పనందుకు.
ఈ సంపుటాన్ని వరంగల్లులో ఇటీవల స్థాపింపబడిన “సృజన లోకం” ప్రకటిస్తున్నది. సృజన లోకం కవులకు, కళాకారులకు, సంగీతజ్జులకు, భావుకులకు అందరికీ ఒక సమష్టి వేదిక. ఈ వేదిక నిలబెట్టడంలో పేర్వారం జగన్నాథం, నవీన్, రామాచంద్రమౌళి, పొట్లపల్లి శ్రీనివానరావు, వి.ఆర్. విద్యార్థి, జితేందర్‌రావు, డా. రవీందర్ ప్రభృతి మిత్రుల సమష్టి కృషి ఉన్నది. అందరు సృజనశీలుర సమాకలనం ఇది. అదే సర్వులనూ కట్టి పడుతున్న ఏకాత్మసూత్రం. ఆ సూత్రం పట్టుకున్న వ్యక్తి దా. లంకా శివరామప్రసాద్. ఆయన నిత్యవసంతం - బురదలేని వర్షానదీ ప్రవాహం. దానిలో ఒకసారి చేరితే అందరూ రససాగరం దాకా కొట్టుకుపోవలిసిందే.
ఓపికతో దీన్ని ఇంత చక్కగా ముద్రించినవారు అశోకకృష్ణ ఆఫ్సెట్ ప్రింటర్స్ యజమాని నాగుల యుగంధర్.
అందరికీ ధన్యవాదాలు. వరంగల్ - 506 002 ఫోన్ 0870 - 2437999 కోవెల సుప్రసన్నాచార్య క!
విషయసూచిక
- ఈనాటి కవిత్వ సంభావనం - మహాకావ్య శిఖరాలదాకా లం క్షే
- _ కధానిక పరిమితి - విస్తృతి ంు 20
- కాల్పనిక కవిత్వం ంంం ౩92 4 వచన కవిత్వం లం క్రి
- తిరుమల వేంకటకవుల బుద్ధ చరిత్రము ంంం శీర్
- నిజమైన గురజాడ చైతన్యం ంం 539
- రాయప్రోలు వారితో ప్రత్యక్ష భాషణ ంు 60
- _ప్రణవాన్నీ ప్రణయాన్నీ సమన్వయం చేసిన రాయప్రోలు సుబ్బారావు ఎం 70
- విరాట్టురుషుడు . గక
- సమగ్ర మానవ చైతన్య నిర్మాణ శిల్పి విశ్వనాథ సత్యనారాయణ ల 87 11 ఒక్క పిలుపులే దయోధ్య నుండి ఎం 91 12 కృష్ణశాస్త్రి కావ్య సౌందర్యము ల 97 18 కృష్ణశాస్త్రి సంగీత రూపకాలు ఎఎం... 108 1ఓ మధునాపంతుల వారి కవితా తేజస్సు ఎం 110
- అరిశిరస్సుల నుత్తరించిన అలుగు నేనే, తెలుగు నేనే ! లల కేళి
- దాశరథి కవితా వైభవం ఎల. 120
- ఎప్పుడూ ఎదిగిపోయే చేరా ఎఎ... 125
- విమర్శ పరిధులను విసృతపరిచిన చేరా ఎఎం... 228
- స్వేచ్చా కవిత్వం ఎం... 187
- అంతర్జగ ద్యాత్రికుడు ఎం. 145
- అంత్వర్వీక్షణ సార్వభౌమము లం... 151
- “బుతు (భ్రమణం గురించి . 159
- రామా చంద్రమౌళి కవిత వసంత పునరాగమనం ఎఎ... 164 24 నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల వారితో ప్రత్యక్ష భాషణం ... 71
- శ్రీ ప్రసాదరాయ కులపతి - సిద్ధకావ్య వ్యక్తిత్వము ల. 278
- అంతర్భుఖుడు శ్రీ నవీన్ లల... 189
- గురుపూజ ఎఎ 187
- ఉషశ్రీ సుసంధితమైన చాపం నుండి విముక్తమైన భాణం లం. 191
- స్వయం వ్యక్తుడు - స్నేహశీలి ఎ... క94
- శ్రీ చందన చంద్రిక ఎ... 1908
- ఈతరం వారి భాగ్యం ఎం... 201
ఈనాటి ఠవిత్స సంభావనం - మహవోకావ్య శిఖరాలదాకా ఈనాటి చాలామంది తెలుగు కవిత్వ విమర్శకులకు, పరిశీలకులకు కవిత్వాన్ని ఒకే ప్రవాహంగా - ధోరణిగా చూడటం అలవాటు. మిగతా ధోరణులు, కావ్యరచనా సంప్రదాయాలు ఎంతటి బలమైనవైనా వాటిని ఉపేక్షించి, _పాధాన్యం తగ్గించి, అవి అసలే కవిత్వంకాదన్న ముద్రవేయటం, ఈ ధోరణిలో ఒక ముఖ్యమైన అంశం, స్వాకంత్ర్యం వచ్చేనాటికి అవిచ్చిన్నంగా ఎప్పటికప్పుడు నూత్నవచైతన్యాన్ని తనలో సంగమింప చేసుకుంటూ జాతీయభావం - దేశీయత - మానవీయ సంస్కృతి మూలాంశాలుగా నవ్య సంప్రదాయ ధోరణి కానవస్తున్నది. అప్పటికి ప్రబలంగా ఉన్న ప్రగతివాదం రాజకీయోత్సాన పతనాల కారణంగా 1955 నాటికి కుప్పకూలింది. శిష్ట్లా మొదలైన కవుల పరంపర (ప్రయోగవాద ధోరణి ప్రగతివాదంలోని కొన్ని అంశాలను సంగమింపజేసుకుంటూ యూరోపీయ అస్తిత్వవాద ధోరణులను సమాశ్లేషిస్తూ, (ఫెంచికవుల సింబలిస్టు ధోరణులను ఆహ్వానిస్తూ ఒక నవ్య కవితా ధోరణికి స్వాగతం చెప్పుతున్నది అబ్బూరి ఛాయాదేవి సంపాదకత్వంలో ఈ ఉద్యమం నిశ్శబ్దంగానే 'కవిత' పత్రిక ద్వారా బయటపడుతున్నది అజంతా, వరద, రాజశేఖర్ మొదలైన కవులు ఈ పదతిని నడిపించేతీరు కనబడుతున్నది. అనుకోకుండా ఇంకా ప్రగతివాద పరివేషం ణి పూరిగా వదలని కుందుర్తి వీరిలోనే ఉన్నారు. శ్రీశ్రీ ఆరుద్రలు ఈ ఆశ్రమంలోనికి చేరుకున్నారు. 'సాహిత్యోపనిషత్తులో తమ పరివర్తనను స్పష్టంగా చాటుకున్నారు. అవ్వుడే ఆధునిక ధోరణిలో మేల్కొన్న తెలంగాణం. ప్రగతివాదంనుంచి నడచివచ్చి తన త్రోవను వెదుక్కొంటున్నది. దాశరధి “'మహాంధ్రోదయంిలో తెలుగు సమాజాన్ని దాని మహోజ్వల వైభవాన్ని పద్యరచనా వైదగ్యాన్ని స్వాయత్తంచేసుకొని విజ్బృంభిస్తున్నాడు. తెలగాణమ్ము తమః కవాటముల బందీయైన నిశ్శబ్దరా త్రులలో మేల్మొని, కోటి తమ్ములను మేల్కొల్పన్ మహోల్కాసము (|
సుత్రునన్న ఆల
జుం దగ్షిప్రభలీను గీతముల నభ్రమ్మంటగా పాది తె
ల్లులలో వెల్లులు నాటినట్టి కవితా లోక ప్రభా నీరధీ
(జలపాతం - సి. నారాయణరెడ్డి
అతని ఉద్విగ్నజాతీయ చైతన్యంలో పారశీక కవితా మాధుర్యమూ కాళిదాసాదుల కావ్యలావణ్యమూ, విశ్వనాధ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల కవిత్వ చైతన్యమూ సంగమించి నూతన వ్యక్తిత్వాన్ని ఆనిష్మరింపచేశాయి. ఈ జలపాతంలో తడుస్తూ వచ్చిన కవి నారాయణరెడ్డి దాశరథి మార్గంలోనే జాతీయ చైతన్యం మూలవైతన్యంగా ప్రజాస్వామ్య సంస్కృతి నేపధ్యంగా నాగార్జున సాగరం, కర్చూర వసంతరాయలు వంటి కావ్యాలు రచిస్తున్నాడు.
క్రమంగా 'దాశరథి సంవ్రదాయం' - కవిత్వంలో రూపాన్ని పట్టించుకోలేదు. పద్యమూ, గేయమూ, వచన పద్యమూ మూడూ ఈ ధోరణిలోని కవులు వాడుకున్నారు. అయితే ఈ స్వేచ్చ శిల్ప విషయంలో విశ్చంఖలతకు అవకాశమీయదు.
ఆరుద్ర ప్రధానంగా ప్రయోగవాది 'త్వమేవాహం'లో తెలంగాణా ఉద్యమ స్ఫూర్తి ఉందని ఆయనే వ్యాఖ్యానించుకోవలసివచ్చింది చెరిషించు, పెరిషించు మొదలైన ప్రయోగాలు దానిలోనే నిద్రపోయాయి. 'త్వమేవాహం' తరువాత ఆరుద్ర ఏ భావబిందువు దగ్గరా నిలువలేదు. ప్రయోగాలుగానే సాగింది - అతని కవితాయాత్ర.
అబ్బూరి ఛాయాదేవి “కవిత ప్రచురణ రెండు సంచికలతో ఆగింది. తీత ఆరుద్ర, వరదలు “మేమే రాసినప్పుడు ఒక ఉన్మత్త ధోరణి తొంగిచూచింది. ఆశ్రయం కోల్పోయిన కుందుర్తి క్రమంగా వచనకవిత్వ ఉద్యమం పేరున రూపవాదాన్ని ఆశ్రేయించ వలనివచ్చింది. అజంతా బింబనంయోజనలు చేనుకుంటూ ఏకాంతంలోకి వెళ్ళిపోయాడు.
వచన చృందస్సులో జాతీయ ప్రజాస్వామ్యతత్త్వం ఆధారంగా నిరంతర రచన కొనసాగిస్తూ సాగిపోతున్నాడు మాదిరాజు రంగారావు. సుప్రసన్న పద్యము, గేయము, వచనపద్యమూ సాధన చేస్తూనే కవితారంగంలో సామాజిక ధోరణులతో బాటు ఆధ్యాత్మిక అనుభవాలను చెప్పటం మొదలుపెట్టాడు. శ్రీ అరవిందుల తత్త్వచింతన ఆధారంగా ఈ భూమినే దుఖరహితంగా పునారచించవలసిన ఆదర్శాన్ని కవిత్వంలో కేంద్రంగొ చేసుకొని తన అన్వేషణ ప్రారంభమయింది. ప్రజాస్వామ్యం జాతీయ చైతన్యము, వ్యక్తి
2
ఆ సకుద్పీబ సర్వతోముఖ వికాసము, దివ్యజీవన సాక్షాత్కారము ఇవన్నీ చేతనావర్హానికి కారణము లయ్యాయి. ఉద్యమాల హోరుగాలి ఒత్తిడిలో దీని వ్యక్తిత్వాన్ని - ప్రధాన ధర్మాన్ని మరచిపోయిన తెలుగు విమర్శ ప్రపంచం ఈ సమగ్ర సమన్విత దృక్పథాన్ని అర్ధం చేసుకోవటంలో వెనుక ముందాడింది దేశీయతత్త్వం మూలాలను వెదకిపట్టుకొన్న ఈ ధోరణి నెమ్మది నెమ్మదిగా “సాహిత్య భూమి'లో వ్రేళ్లూనుకోవటం జరుగుతూ వచ్చింది సాహిత్య సౌందర్య దర్శనం - భారతీయ జీవన మూల్యాలతో మళ్లీ ముడి వేసుకున్నది. ప్రగతివాదం వస్తుసంవరణంలో చేసిన నియంత్రణ క్రమంగా అదృశ్యమయింది. విద్వాన్ విశ్వం 1955 ప్రాంతాలలో రాయలసీమ దారుణమైన కరువుదృశ్యాన్ని జీవనాన్ని "పెన్నేటి పాటిలో పద్యంగా గేయంగా చిత్రించి దాశరథి మార్దాన్ని తేజస్వంతం చేశాడు. (ఈ (గ్రంధాన్ని మొదట తెలంగాణా రచయితల సంఘం (ప్రచురించింది).
అరవైల నాటికి సాహిత్యరంగంలో ప్రబలంగా ఉన్న ధోరణులు మూడు:
-
నవ్యసంప్రదాయము
-
కుందుర్తి నిర్వహిస్తున్న వచన కవిత్వవాదమనే రూపవాదము
౩ దాశరధి కవితాసంప్రదాయము
- ఇక్కడ దాశరధి కవితా సంప్రదాయమంటే 1) ప్రగతివాదం విధించిన వస్తు పరిమితులకు లొంగకుండా వుండేది. 2) జాతీయ సంస్కృతిలోని మేలి సంప్రదాయాలను స్వాయత్తం చేసుకునేది 8) విశ్వజనీన దృక్పధం కలది. 4) అభివ్యక్తి విషయంలో రూపవిషయంలో ఏ పరిమితులకూ లొంగనిది 5) మానవుణ్ణి భౌతిక, సాంస్కృతిక అధ్యాత్మిక త్రిపుటిగా భావించేది 6) (ప్రజాస్వామ్య దృక్సధం మీద అచంచల విశ్వాసంకలది 7) పీడితులు, తాడితులు లేని సర్వశ్రేయస్సమాజంకోసం భావించేది
ఒక విధంగా తెలంగాణాలో స్వాతంత్రానంతరం తెలుగుకవితా ధోరణి ఈ (ప్రభావ పరిధిలోనే ప్రవహించింది. నారాయణరెడ్డి మాదిరాజు రంగారావు, బాపురెడ్డి, సంపత్ముమార, పేర్వారం జగన్నాధం, నరసింహారెడ్డి, కవిరాజమూర్తి యీ వ్యాసకర్తా మొదలైన వాళ్లందరూ ఇంచుమించుగా ఈ విస్తృత కవితా భూమికకు చెందినవారే. ఇంకా వీరికి (యేరణ యిచ్చిన వాళ్లల్లో కాళోజీ, వానమామలై వరదాచార్యులు, పల్లా దుర్గయ్య, పి.వి. నరసింహరావులను ప్రత్యేకంగా పేర్కొనాలి.
పాములపర్తి సదాశివరావు తెలంగాణాలో మార్చీయ చింతనకు ఆధారమైన వ్యక్తి. తత్త్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు, జ్ఞాన సిద్ధాంతం, చరిత్ర-సంస్కృతి-కళా మొదలైన
ఏ
సుత్రసన్ను ఆఅ (గ్రంధాలు రచించి కమ్యూనిస్టు పార్టీవారి సందేశం పత్రికకు సంపాదకులుగా ఉన్నవాడు ఆయన 1957లో అభ్యుదయ గేయాలు అనే కవితా సంకలనం (ప్రచురించారు. దానిలో “భూమాతి అన్నగేయం కమ్యూనిష్టుల ఆలోచనల్లో క్రమంగా ఎంతమార్చు వచ్చిందో తెలియజేస్తుంది. ఈ గేయాలు 'స్వభావరీత్యా మార్కిస్టు పునాదికల్లి వివిధ సమస్యల నావరించి యున్నాయి” (రచయిత పీఠిక) అని రచయిత పేర్కొంటున్నాడు. నీవు నేనూ కలసి, నేను నీవూ కలసి భూమిదేవికి పూలువేద్దాము పుడమితల్లికి పూజచేద్దాము వీరాధివీరులౌ శ్రీరామచం[ద్రులను కారుణిక మూర్తులౌ శాక్యగౌతములను జ్ఞాన ప్రదీపులౌ వ్యాస వాల్మీకులను కన్నతల్లికి హారతిద్దాము కన్నీట కడిగి పూజిద్దాము నీవు పుట్టిన నేల, నేను పుట్టిననేల .... పాలునీరుగ మనము కలసి పోయిననేల కలసి పోయిన మనము కరగిపోయిననేల జంట నాగళ్లతో వీళ్లు దున్నిన నేల నీళ్లు గొట్టిన నేల కాపుగాచిన నేల రామరాజ్యపు చల్వపందిరెత్తిన నేల గాంధిపుట్టిన భూమి, తిలకు పుట్టిన భూమి శాంతి ఆయుధముతో స్వాతంత్ర్యపథములో సామ్రాజ్యరాక్షసిని సంహరించిన భూమి ఇంటింట జాతీయ జెండ లెగసిన భూమి కోటొక్క ప్రజలకు తిండి బెట్టేనేల చల్లచల్లని శాంతి నీడ నిచ్చే నేల మెల్లమెల్లగ మనలపెంచి సాకేనేల నిండ నూరేండ్లయి కంద్లుమూసేటపుడు పట్టుపాన్సులాంటి గుండెపై జోకొటి జా టబ జోలపాడే నేల, నిద్రబుచ్చేనేల (పే 42,43) జీ
తమ ఉద్యమం రోజుల్లో “దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గేయాన్ని 'వందేమాతరం' గేయానికి ప్రతిద్వంద్విగా, వలస వాదులకు అనుకూలంగా కమ్యూనిన్దులు వాడుకున్నారు. ఈ గేయం సంన్మరణోద్యమాన్ని బలపరచేది స్వాతంత్రోద్యమానికి అననుకూలమైంది. స్వాతంత్రోద్యమంలో భారతదేశం చరిత్ర సంస్కృతి సాధించిన బెన్నత్యాలు 'ప్రేరకాలు దేశం ఒకవిధంగా జగన్మాత్ళ రూపమైంది. గురజాడ అంగిలేయుల ధర్మరాజ్యాన్ని ప్రశంసించినవాడు. గతమును చూచేప్పుడు వాళ్ల దృష్టితోనే చూచి, 'మంచిగతమున కొంచెమేనోయ్” అన్నవాడు పాములపర్తి సదాశివరావు రచన కమ్యూనిస్థులలో రావలసిన భావపరిణామాన్ని దేశీయతా దృక్పధాన్ని ఎత్తిచూపింది గురజాడ వంటివారి దేశాన్నిగురించిన ఆలోచనలోని రిక్తతను, శూన్యత్వాన్ని బట్టబయలు చేసింది.
ఈ నదుమ దిగంబరకవులు హరాత్తుగా ఒక నాలుగైదు సంవత్సరాలు చెలరేగటం జరిగింది. అరాచకత్వం, మొరటుతనం, ప్రజాస్వామ్య వ్యవస్థల వైఫల్యం వల్ల కలిగిన నిస్పృహ, ఎక్కడో బలంగా స్టైక్ చేయాలనే ధోరణి, బూతు పదాల ప్రయోగం ఇవన్నీ వీరి ఆయుధాలు. గిన్స్బర్గ్ మొదలైన అమెరికన్ కవుల ధోరణులు వీరికి బలాన్ని యిచ్చాయి అయితే క్రమంగా ఈ ఉద్యమం విరసంలో కలసిపోయింది. పలుచ పలుచగా అటూ ఇటూ చెదరిపోయింది.
లై
1970 వచ్చేప్పటికి అరసం ప్రగతివాద కవిత్వం మార్చిస్ట తత్త్వానికి కట్టుబడవలసిన అవసరంలేదని నొక్కి చెప్పింది. మరొకవైపు తీవ్ర వామపక్ష భావ సంచలనంలో ఊగిపోతున్న సి విజయలక్ష్మి - విషాదభారతం, 'తిరుగబడు కవులు” దీనితో విభేదించారు.
ఇన్నేళ్లుగా సాగుతున్న వస్తుపరచర్చాధోరణి వల్ల కవిత్వాంశానికి ప్రాధాన్యం తగ్గుతున్నదేమో నన్న సంశయం చాలామందికి కలిగింది. కవితారచనకు కవిత్వ స్పృహ వుండటం అత్యవసరం అనేది ఒక తీవ్రభావమై కవిత్వజగత్తు అట్టడుగుభాగాన్ని స్పందింపజేయటం మొదలైంది 1971లో అఖిలభారత తెలుగు రచయితల ఐదవ మహాసభలో కవి సమ్మేళనం అధ్యక్ష వీఠంనుంచి బోయిభీమన్న ఈ ఆవేదనకు అక్షర రూపం కల్పించాడు. “నీవు నిజంగా కవివే అయితే/నిజంగా కవిత్వం వ్రాయి/నినాదాలు మానెయ్యి (26) భూమినుంచి పుట్టేది కవిత్వం/ార్భ్థానాల నుంచి పుట్టేది పాండిత్యం /
వ్
సువ్రుసన్న ఆల ప్లాస్టిక్ పువ్వుల్ని చూచి భ్రమసిపోకు/ఎంత చిన్నదైనా నీ తోటపని మానకు (339) సాహిత్యానికి దేశకాలాలు లేవు/సరస్వతి నిత్యయౌవని సనాతని/ఆనాడు కంచి పట్టు చీరలు కట్టింది/ఈనాడు నైలాన్ సిల్కువోణీలు వేస్తున్నది (48) సమాజానికి రసభావ సౌందర్యదాతవు/సమైక్యానికి సాక్షాత్ పరమేశ్వరుడవు (48) జీవితాన్ని నలుముఖాలుగా అనుభవించు/అనుభవం నుంచి ఆనందమధువును చెలయించు (53). బోయి భీమన్న ఆలోచనలు అలంకార శాన్త సంప్రదాయాన్ని పునః స్థాపించాయి. మమ్మటుడు చెప్పిన, 'నియతికృత నియమ రహితాం హ్హ్లాదెకమయిీం . అనన్య పరతంత్రాం నవరసరుచిరాం,” అన్న వాక్యాలకు స్థూలమైన వ్యాఖ్యానాలు. తన నాటికి కవిత్వంలోనికి ప్రవేశించిన బింబసంయోజనంలోని సంక్లిష్టతను, ప్రతీకల గందరగోళాన్నీ విమర్శిస్తూ - “'వాల్నీకిశ్లోకం నీ పద్యంకంటే సరళం / కాళిదాసు డెందం నీ కందం కంటే సరసం' అని నూతనాఖివ్యక్తి పేరున ఎంతటి అభివ్యక్తుల కీకారణ్యంలోనికి (ప్రవేశిస్తున్నామో వివరిస్తున్నారు. విరసం ఏర్పడటానికి ముందే కవితారంగంలో ప్రకాశించిన బైరాగి, తిలక్లను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. “తిలక్ అటు భావకవి ఇటు అభ్యుదయ కవి కాడు. అందుకే ఆ రెండు సంప్రదాయాలలోని కొన్ని లక్షణాలను తనలో సంగమింప చేసుకొని తానొక తీర్థప్రాయుడయ్యాడు (కె.వి.ఆర్. “ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర పే. 221) నూతిలో గొంతుకల్లో బైరాగి ఆధునిక నాగరికతా వైఫల్యాలను, అది ఆత్యంతికంగా కలిగించిన వైళ్లబ్యాన్ని చిత్రించాడు. దాశరథికీ తిలక్‌కూ కొన్ని పోలికలు ఉన్నయ్. విస్తృతమైన సమాజమూ, కవితా భూమిక ఇద్దరికీ సమానం. దాశరథి ప్రగతివాదం నుంచి బయటకు వచ్చి కొనసాగినట్లే, తిలక్ ప్రగతివాదపు దారినుంచి నిష్క్రమించి వచ్చాడు. “అమృతం కురిసిన రాత్రిలో తిలక్ ఎంత ఎత్తు ఎదిగినా 'పునర్నవం'లో దాశరథి అందుకున్న శిఖరాలకు చేరువ కూడా కాలేకపోయాడు. 1970లలో అటు విరనం రూపుదిద్దుకుంటున్న తరుణంలోనే సరికొత్త కవిత్వానికి పునాదులు పడ్డట్లు మనం గ్రహించవచ్చు. మే 1969లో సంకలితమైన 'చితి-చింత?, మార్చి1972లో వచ్చిన “చెట్టు నా ఆదర్శం? 1974లో వెలువడిన శేషేంద్ర 'మండే సూర్యుడు” అజంతా వెలువరిస్తున్న కవితలు ఈ కొత్త కవిత్వానికి రూపురేఖలు దిద్దినట్లు మనం అర్ధం చేసుకోవచ్చు * (కవిత్వం ఒక ఆత్మఘోష, సుమనత్రీ పే. 44. 6
ఆఅ నకుప్పబ అటు విరసం మార్గం సాగుతూ వుండగానే బలంగా మరొక మార్గం - కవిత్వానుభవం ప్రధానంగా సాగిన అంశాన్ని మనం గుర్తించుకోవచ్చు.
ఈ అంతర్ముఖ స్రవంతికి దోవాదంగా వరంగల్లుకు సమీపంలో తాటికాయలలో నిశ్శబ్దంగా తన ఊహలకు రూపమిస్తూ వస్తున్నాడు పొట్లపల్లి రామారావు. “చుక్కలు” 60లలో తొలిసారి అచ్చయినా విస్తృత ముద్రణం 1974లో వచ్చింది. రామారావు జీవితాన్ని అన్ని స్తరాలనుంచి పరిశీలించి చేసిన కవితామయమైన రచనా విశేషమిది. వచనకవిత్వం తాత్త్వికంగా రూపుదిద్దుకోబోతున్న భవిష్యత్తును ఈ రచన సూచించినట్లు సువ్యక్తమయింది.
అంతర్ముఖ బహిర్ముఖాలుగా రెండు ధోరణులూ వేరువేరుగా సాగుతూవున్నా నడుమ ఒక నిళ్శబ్దమైన ధోరణి సాగివస్తున్నది. దాని కేతనం దాశరధి పునర్నవంలో ఎత్తాడు. యుగసంకేతంలో (1969) మాదిరాజు రంగారావు “మతాల విచ్చుకత్తుల మెరుపులలో బ్రతుకును వెలిగించలేను. ఇజాల చిక్కుటుచ్చుల తలపులతో బ్రతుకును
బంధించలేను' (52) 'నిన్నటి పరివర్తనాలు నేటి దృష్టిలో సంప్రదాయం, రేపటి పరివర్తనం నేటి దృష్టిలో అభ్యుదయం (15) ముక్తకాలు (1970లో అని వాఖ్యానిస్తున్నారు. విమర్శకుల దృష్టి అంతగా పడలేదు కాని 1971లోనే అనాదినుంచి నేటివరకు మానవుని జీవితంలోని ఉత్ళాన పతనాలను చిత్రించిన మహాకావ్యం 'మానవీయం'” రచించాడు. అత్యంతమైన ప్రతిభాశక్తితో కవిత్వంలో శబ్దాలను శిల్పాలుగా తీర్చిన ఒక తనదైన “దర్శనం” గల కవి అరిపిరాల విశ్వం. 'రేపటి స్వర్గం, 'కాలంగీస్తున్న గీతలు” “హళేబీడు మొదలైన సంకలనాలలో ఈయన ఎంతో శక్తిశాలిగా కనిపిస్తాడు. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే 'విశ్వం' సృష్టించే కావ్యభాష శేషేంద్ర సృష్టించిన కావ్యభాషతో బుజాలు ఒరిపిడి పెడుతూ వుంటుంది. 'అంతర్జోళాలు' - 'చిరంతని రచనలతో ఒక విలక్షణమైన కవితాముద్ర వేసికొన్న కవి దుర్గానంద్. గోపాలచక్రవర్తి, శీలా వీర్రాజు. మిరియాల రామకృష్ణ, పరిగి రాధాకృష్ణ, పణతుల రామచంద్రయ్య మొదలైన కవులు ఈ సంధి కాలంలోని వాళ్లే. 1955నుంచి 1970 వరకు కొత్త కవిత్వం ఏదో వెతుక్కున్నట్లు కొనసాగింది. ఒక స్పష్టమైన లక్షణం జాతీయ ప్రజాస్వామ్యంపైన అచంచలమైన విశ్వాసం. వదులుగానైనా కొందరు సామ్యవాదాన్ని ఆశ్రయిస్తే, మరికొందరు ఏకాంత రహస్య గువాసీమల్లోని వెలుగులకోసం రహస్యవాదాన్ని ఆశ్రయించినవాళ్లు “నగరంలో వాని, 7
నుప్రుసన్న ఆక “అముద్రిత కావ్యం” రచనల దగ్గరకొచ్చేప్పటికి కుందుర్తి కూడా సదసత్సంశయంలో పడి సత్తువైపు ప్రయాణిస్తున్నాడు. 1976లో ఆర్.ఎస్. సుదర్శనం రచించిన 'నిశాంతం' వెలువడింది. 'నిశాంతం” మార్మిక కవితా ధోరణికి స్పష్టమైన అభివ్యక్తినిచ్చింది. ఎన్ని జన్మలు పూవులో నెన్నిరేకు లెన్ని మధురవాసనలు నా హృదయమందె యుగయుగమ్ముల కాలమ్ము నొదిగి యొదిగి పుచ్చమును [మింగబోవు పామువలె నుండు సృష్టి అనుస్యూతిని జన్మపరంపరల అనంత చక్రాకారాన్ని సూచిస్తున్నదీ పద్యం. తోకను (మింగే పాము అనడంలో జన్మమృత్యువులనే బిందువులు ఒకేచోట సంగమించటం అనే జీవన రహస్యం ఇక్కడ వ్యక్తమవుతున్నది. “ఈనాటి సమాజంలో ఉన్న పరిస్థితులకు ప్రతిరూపంగా కవిత్వమూ వివిధ భావధోరణులతో కనిపిస్తున్నది. రామాయణ కల్పవృక్షం పూర్తిఐంది. మహాసర్గ అవతరించింది. మహాప్రస్థానం, ఖడ్గసృష్టి ప్రభవించాయి. వందేమాతరం వినిపించింది. విశ్వంభర ఉదయించింది. దిగంబరం-చేతనావర్తం-విప్లవం ఇట్లా అనేకం భావావేశం లక్ష్యశుద్దితో తెలుగులో కవిత్వం స్వేచ్చా వాయువుల్ని పీలుస్తున్నది. జాతీయభావన, సంస్కరణం, పరివర్తనం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, విప్లవం, సంప్రదాయ పరంపరా పార్వాలతో గోచరిస్తుంది. వీరిలో ఒక్కొక్క రచయిత వ్యక్తిత్వంలో ఒక్కొక్కటి ఆధిక్యం వపొస్తూ లేదా కొన్నింటి కలయికచేత విళిష్టరూపాన్ని పొందుతూ పరిశీలనలో గోచరిస్తాయి.” (ఆధునిక కవిత్వం - సమాలోచన. మాదిరాజు రంగారావు పే, 45) ఈ ఫరిణతికి ఆధారభూతంగా ఒక సంస్కృతి అవిచ్చిన్నంగా సాగివస్తున్నదని పేర్కొంటు న్నాడు విమర్శకుడు. “ఏ దేశమైనా ఏ సాహిత్యమైనా పరంపరగా వచ్చే సంస్కృతీ భావన ఒకటి వుంది. ఈనాటి జీవనవ్యవస్థలో నిరసనకు గురైన దురాచారాలు చెల్లని నియమాలు అహేతుకమైన ధోరణులు తీసివేస్తే సారభూతమైందీ సంస్కృతీ ప్రస్థానంలో శిఖరంగా నిలిచే సంప్రదాయ పరంపర ఉంది. ఇది ప్రతి భాషా సాహిత్యానికి వర్తిస్తుంది. (ఇదే పే.44) ఈ మాదిరాజు రంగారావు అభిప్రాయంలో ఒక సంతులనం ఉన్నది. 8
ఆకు సకు్పీణు 8
ఈ పరిస్థితిలో తెలుగు కవిత్వంలో ఉదయించిన నూతన ప్రభాతం “మండే సూర్యుడు” ఆవిర్భవించడంతో సంభవించింది. “విరసం” ధోరణులు క్రమంగా సాహిత్యరంగానికి దూరమై రాజకీయోద్యమంతో తాదాత్యాన్ని పొందటం ఒకవైవు జరిగింది. రాజకీయ స్పృహ ప్రధానాంశమైంది. నియంత్రణ పెరిగి వస్తురూపముల విషయంలో కవి రాజకీయపక్షపు ఆదేశాలకు లొంగిపోతున్నాడు. సాహిత్య రంగంలో నాయకత్వం పరాయివాళ్లు బలవంతంగా ఆక్రమిస్తున్నారు.
ఈ సందర్భంలో శేషేంద్ర ఆవిష్కారం 'మండేసూర్యుడి" కాంతిలో కవిత్వ జగత్తును జేగీయమానంగా ్రకాళశించేటట్లు చేసింది.
శేషేంద్ర ఆంధ్ర కవితా జగత్తును (ప్రకాశింపజేసిన ప్రధానాంశాలు ఇవి.
-
రాజకీయపక్షాల ప్రాబల్యం నుంచి కవితాజగత్తును విముక్తం చేయటం - సాహిత్య జగత్తుకు కవియే నాయకుడని స్పష్టంగా ప్రకటించటం.
-
_ శుషమైన, నినాదప్రాయమైన అకవితా సందోహం భస్మీకరించి-అచ్చమైన కవిత్వ స్పృహను పెంచి కవితా సాధనను ఒక స్పష్టమైన అభినివేశంగా తీర్చిదిద్దటం.
8 కవిత్వాన్ని వ్యాఖ్యానించేప్పుడు తన చేతనను నిర్భయంగా ప్రకటించుకోవటం.
శీ _ ప్రాచ్య పొశ్చాత్య వాబ్బయాలలోని ఇతిహాసాల ప్రక్రియలను అధ్యయనం చేసి ఆధునిక (ప్రక్రియలుగా తన రచనలను ప్రవేశపెట్టటం.
- ప్రతీకలను, బింబసంయోజనను ్రెంచి కవుల నుంచి స్వీకరిస్తూనే వాల్ళీకి, కాళిదాస భవభూతులు మొదలైన భారతీయ కవుల ప్రతీకలను, బింబములను ప్రయోగించటాన్ని వివరించి వారి విశ్వజనీనతను ్రవ్యక్తం చేయటం.
6 ఉదాత్తములైన భారతీయ సంస్కృతిలోని అంశాలను స్వీకరించుతూ, నిర్జీవములైన ప్రాచీనాంశాలను తిరస్మరించటం
- నన్నయ్య అనంతరం-రాయప్రోలు అనంతరం తెలుగు కావ్యభాషను ఆమూలాగ్రం పరివర్తన చేసి కవిత్వానికి కొత్త రక్తమాంసాలను సమకూర్చటం
8 మార్చిజాన్ని జీవన తత్తంగా అంగీకరిస్తూనే - దాని నుండి విశ్వజనీన చైతన్యం దాకా ప్రస్థానం చేయటం.
రి
సుప్రసన్న ఆల
-
_ ప్రగతివాద కవిత్వోద్యమం, విప్లవకవితోద్యమం తీసుకురాలేని వేగాన్ని అవేశాన్ని వచనంలోకి ప్రతిఫలించేట్లు చేయటం.
-
కవిత్వంలో నూతన భాషను సృష్టించుకొన్న-ప్రతీకలను, బింబాలను విరివిగా ఉపయోగిస్తూ వచ్చినా కావ్యం పారకులలో ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఆస్వాదయోగ్యం చేయటం. ఎక్కడా సంక్షిష్టతకానీ, అస్పష్టత కానీ ఉండకుండా 'ప్రతీకల బింబాల అశ్వ హృదయం తెలిసిన దార్భనికుడైన కవి కావటం.
11 ఈనాటి జీవనానికి అనుగుణంగా ఉపనిషత్రత్హ్వాన్ని వ్యాఖ్యానించటమేకాదు. ఆ భాషలోని ముడులను విప్పి తాత్త్విక రహస్యాలను వెల్లడించటం.
- తన ప్రతి పరిశీలనను, అనుభవాన్ని తన జాతిజనుల అనుభవ సంపుటులను కవిత్వంగా మార్చగల స్పర్శవేదిగా తాను రూపొందటం.
ఈ పన్నెండు అంశాలను చూస్తే కవి తెచ్చిన పరిణామం ఎంత బృహత్తరమో అంచనా వేయటానికి కొంత కాలం వేచి చూడవలసి ఉందనిపిస్తుంది. శేషేంద్ర రచనలన్నీ సంకలితాలై ఆధునిక మహాభారతంగా నంకలితమైనాయి. దీనిలో పన్నెండు పర్వాలున్నాయి. దీనికి అనుబంధకావ్యంగా జనవంశం అనే రచనా వచ్చింది. తన కవితా సర్వస్వాన్ని మహాభారతంతో ఏకీభావాన్ని భావించుకోవటంవల్ల శేషేంద్ర దేశీయ జీవన మూలాల్లోకి ప్రవేశించాడు. ప్రగతివాద కవులూ, ప్రయోగవాద కవులూ, విప్లవ వాదులు అందరూ ఈ విషయంలో విఫలమే అయ్యారు. దీని మూలాలు దాశరధిలో ఉన్నా శేషేంద్రలో ఆవిషృతమైనంత శక్తిమంతంగా అవి వెలువడలేదు. శ్రీశ్రీ మహాప్రస్థానం శీర్షిక మహాభారత స్ఫురణ కలిగివున్నా తాత్త్వికంగా భారతంలోని పరమార్థ స్ఫురణ- అంటే ఆత్మబలి - లేదు.
తన మహాభారతానికి కర్షకుడే నాయకుడు. “ఈ దేశానికి నాగలి ప్రతీక. ఈ దేశపు ఆకృతి నాగలి. ఆకృతి ఒకదాన్ని ఒకటి పోలివుంటుంది... అతడే ఈ దేశపు జీవన దానప్రభువు' అంటాడు కవి. దేశపు ఆకృతి నాగలి పోలివుండటం అన్న
ఒక్క అంశం చాలు శేషేంద్రను జాతీయ మనోకవిగా గుర్తించేందుకు.
శేషేంద్ర కవిత్వ ధర్మాన్ని గురించి శ్రీకాంతశర్మ ఇలా అంటున్నాడు. శేషేంద్ర
శర్మలో లాలిత్యం, అలాగే శబ్దగతమైన కర్కశత్వం ఏకకాలంలో ఒకే కవితలో కలగలిసి,
చిత్రమైన బొమ్మలు గీయడానికి ప్రతీకల ద్వారా దోహదం చేస్తాయి. (ప్రతి భావాఖీవ్యక్తి
లోనూ ఒక సామూహికత ఉంటుంది. ఏక రూపమైన విశేషభావం, పక్షులుగా, 10
ఆ నముర్పీణ నక్షత్రాలుగా, వల్లికలుగా, వనాలుగా అనేకతను సంతరించుకొంటుంది. బాహ్య ప్రపంచాన్ని తనలోకి లాక్కోవాలనే తపన; లోపల క్రిక్కిరిసిపోయిన శబ్ద ప్రపంచాన్ని విసిరివేయ్యాలనే ఆరాటం; ప్రతిబింబిస్తాయి ఆయన ప్రతీకలు. నీరైపారిపోయినా, సూర్యుదై మండినా తన ప్రతీకలో తనే మునిగిపోయే కవి ఆయన. (ఆలోచన - పే. 44 ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 1981).
రామాయణం అశ్వమేధంతో ఆరంభమయింది. భారతం సర్పయాగంతో (ప్రారంభమయింది అందుకే ఇతిహాస రచన ఒక యజ్ఞం. 'ఇతిహాన నిర్మాణానికి బాధాపూర్వక బలి కావాలి. నేనే ఆ బలి. నా ప్రతిభ, నా పాండిత్యము, నా అనుభవము ఈ అన్నింటినీ జోడించుకొన్న నా ఆయుస్సు సర్వమూ పిండి మాటల గొంతుల్లో పోసిన ప్రక్రియ ఈ ఇతిహాసం, ప్రపంచ మానవ్వల్ని వాళ్ల చరిత్రలని, వాళ్ల జయాప జయాల్ని వాళ్ల భూత భవిష్యద్వర్తమానాల్ని నా ఇంద్రియ వాద మార్గ అర్జిత జ్ఞాన నేత్రంతో అవలోకనచేసి విశ్వదృశ్యం నుంచి ఈ తాత్పర్యాన్ని క్రోడీకరించాను. దూర దూరాల కొండల్లో కూర్చొని వకాంత గురుత్వాన్ని ఆశ్రయించి ఈ ఆధునిక మహాభారతాన్ని పొందాను" తన రచనా రహస్యాన్ని తపోవ్యగ్రతను ఇంతస్పష్టంగా ప్రకటించిన కవులు చాలా అరుదు. దూరదూరాల కొండలు, ఏకాంత గురుత్వమూ కవి తన చేతస్సీమలను దాటి ప్రచేతస్సీమలను చేరుకోవటం స్పష్టంగా నిరూపిస్తున్నది. ఈ ప్రచేతస్సీమలను గురించిన ఎరుక శ్రీ అరవిందుల తత్త్వదర్భ్శనంలో కావ్యతత్ర్త్వ చింతనలో స్పష్టంగా కానవస్తున్నది.
సూర్యుడు ఈ శుభ దినాన్ని
మోసంచెయ్యనియ్యను
ఈ దేశపు ప్రాచీరేఖ మీద
సూర్యు డుదయించకపోతే
మండే నా గుండె చీల్చి దానిమీద పెడతా (సూర్యపర్వము 61 పే.)
ఎదురుచూచిన నూతన యుగోన్మేషం జరుగటం లేదు. ఈ సారి కవి తన చైతన్యాన్నే నూతన యుగ భూమికగా అమరుస్తానంటున్నాడు. ఆ గుండె-భవిష్యద్దర్భనం- జీవకోటి అనంతస్వప్నాల సంకలనం. తప్పక దాన్ని వాస్తవం చేస్తానంటున్నాడు కవి. నాగలిని గురించిన వర్ణన ఇలా ఉంది. 'నీవొక కర్రముకృవే కావచ్చు / కానీ అనాది సృష్టిలో తలయెత్తిన(మూనవ మహాకృషి ఏకైక చిహ్నానివి .. . నీ స్పర్శ మట్టిలో
1
సుర్రునన్న ఆస
నిద్రిస్తున్నుకలల పరిమాణాల్ని మేల్మొల్పి/దిశల్లో విదిలించింది. శ్రమ జీవుల లోకానికి ఒక/ నూతన సూర్యుణ్జి వాగ్దానం చేశాను' (ఆ.మహా. పే.92) ఎంత కొత్త పలుకుబడి. నాగలి నూతన యుగ నిర్మాణ హేతుభూతమైన ఒక మహాశక్తికి ప్రతీక అయింది.
“గింజ దిగగానే చినుకు పడగానే వారు (శ్రేమించిన గింజల గర్భంలో ప్రవేశిస్తారు మనుష్యుల జన్మలకు మళ్లీ బీజాలవుతారు.” (ఆ.మహాశ47) ఈ వాక్యాల్లో సృష్టి పరిణామ రహన్యం ఉన్నది. ఉపనిషత్తులలో చెప్పిన పంచాగ్ని విద్య ఉన్నది దీన్నే'నా దేశం నా ప్రజలు ఆరంభంలో 'నేను ఛాన్యంలోనుంచి పుట్టాను. ధాన్యంకోసమే 'బ్రశుకుతాను. మరణించి ధాన్యంలోకే వెళ్లిపోజాను' (ఆం మహా 12పే) అని అంటాడు
శేషేంద్ర కవితలోని ఏ పంక్తి ఎత్తుకున్నా సజీవంగా ఉరకలేస్తూ ఉంటుంది.
ఆకాశం కనిపించటం మానేసింది
(ద్రవ్యరాక్షసి కడుతున్న బహుఅంతస్తుల భవనాలుచూచి (165)
అతనితోపాటు అతని స్వష్నాలుకూడా
కాలుతున్న పరిమళం
అతడు ఒక శతాబ్దం మీద నిలుచున్న వీరుడు. (168)
అడవిలో నాకోసం మరణించిన ఆ వీరునికి
ఎవడు కట్టగలడు ఎత్తయిన సమాధి
నా గుండె వాడి మీద లేచిన గోపురం
నా ఆశ్రువులే వాడిమీద రాలుతున్నప్తూలు (159)
జీవితం ఒక మహాసముద్రం కావచ్చు
కానీ ఆశ అనే నావలో దాన్ని దాటి వేయవచ్చు (188)
మనుషులందరూ నడిచే సముద్రాలు
చివరకు కాలపు కెరటాల్లాంటి పునః
పునరావృత్త ప్రాచీన పంక్తుల్లో అర్ధశ్రక్తి
ఆవిషారం జరిగింది నాలో కల్లోలం
స్వస్వరూప దర్శనమిచ్చింది (275) 12
ఆల సకుచ్పల మరొకచోట అంటాడుకవి “భూమిని ఫలాలుగా పంటలుగా మార్చే ప్రవీణత ఉన్నవాడు ధైర్యం కోల్పోనక్కరలేదు - మట్టిలో ఉన్న కస్తూరి తీసే మనిషికి జీవన పరిమళాల కొరతలేదు* (323) అని శేషేంద్ర కవిత్వం నిండా ఒక ప్రబలమైన ఆశ. పునర్నిర్మాణ దీక్ష శేషేంద్ర కవిత్వమంతా అధునిక మానవుని సుదీర్హ సుందరస్వప్నం. త్తే శేషేంద్ర ఆధునిక కావ్యభాషను సృష్టించటం ఒక అంశం అయితే అంతకన్నా ప్రబలమైన అంశం- ఆధునిక వచన కావ్య రీతిలో మహాకావ్య నిర్మాణం చేయటం. ప్రాచిన మహాకావ్యాలకు కధాంశం మూలసూత్రం, మానుష కధ ఆధారంగా చేసిన నిర్మాణం కావటంవలన విభావాదులకు బలం సమకూడి జీవన వేదనల సమీకరణం ద్వారా ఒక విశిష్టమైన అనుభవ విశేషం దానికి చేరువయ్యింది. ప్రాచీన కాలంనుంచీ భారతీయ సాహిత్యం ఈ సమీకరణం ఆధారంగా రససిద్ధాంతాన్ని నిర్మించుకొన్నది. ఆధునికకవి వలె ప్రాచీనకవి అంతగా అంతర్ముఖుడు కాడు. తన సంవేదనలను కావ్యపాత్రల ముఖంలో వ్యక్తంచేయగల నిడివీ పొడవూగల వస్తు జగత్తుగలవాడు. కధా (ప్రధానంగా కావ్యనిర్మాణం చేయవలెననే ఆలోచన అరవైల తొలిరోజులల్లోనే కుందుర్తి ప్రభృతులు చేయటం (ఈ వ్యాసకర్తకూడా ఆ భావాన్నే అప్పుడు బలపరచటం జరిగింది). దాన్ని తిలక్ ప్రభృతులు_వ్యతిరేకించటమూ జరిగింది. ప్రాచీనకావ్యం సమష్టి ప్రక్రియ దానిలోనే కధ ఉంది. వర్ణన ఉంది. ఉపదేశం ఉంది. చమత్కారం ఉంది. నాటకీయ రీతి ఉంది ఆధునిక కాలంలో నాటకం స్వతంత్రించి ముందుకు రావటం
- కధనంకోసం ప్రత్యేకంగా నవల, కధ ప్రక్రియలు పుట్టుకు రావటం జరిగింది వర్ణనలు ఖండకావ్యాలలోకి జారిపోయాయి. ఈనాడు కావ్యం మిగిలితే ఖండ కావ్యంగానే ఉండిపోయింది. ఈ సంకుల సన్నివేశంలో కవులు ఈనాటి కావ్యం పద్దెనిమిది పుటలే/ పంక్తులే అనే దశకు చేరుకున్నారు విసృతమైన సామాజిక సంవేదనను, విశ్వసంవేదను వెల్లడించేందుకు కవిత్వం సాధనం కాలేక పోయింది. వచనంలో మాలపల్లి, వేయిపడగలు ఆధునిక ఇతిహాసాలై ఏకవీర, చివరకు మిగిలేది వంటివి ఆధునిక కావ్యాలైనై హిందీలో కామాయని ఒక త్రోవచూపింది. సుమిత్రానందన్‌పంత్ లోకాయత్ ఇంకా విసృత భూమికలో మహాకావ్య నిర్మాణానికి ప్రయత్నం చేసింది. నారాయణరెడ్డి కర్పూర వసంతరాయలు వంటి కావ్యాలు 13
సుత్రసన్న ఆ (ప్రాచీన కధా కఇావ్యాల నేటి పద్ధతి కొనసాగింపై నవ్య సంప్రదాయ మార్గంలోకి చేరిపోయినయ్ సుమనశ్రీ 'నేత్రం నా సంకేతరి పీరికలో నిఖిలేశ్వర్ 'పదిదృశ్వాల కవితా సంపుటిని నేను కావ్యంగా ఆమోదించలేక పోతున్నాను అంటాడు కావ్యం ఖండకావ్యం కన్నా విశిష్టమైన ఏకాత్మభావం కలిగిన రచనా విశేషమన్న భావం అందరిలోనూ ఉన్నది. పెన్నా శివరామకృష్ణ రచించిన “జీవనది పీరికలో సంపత్కునూరాచార్య ఇలా అంటున్నాడు. “ఏ కావ్య నిర్మాణమైనా - కథ ఉన్నా లేకపోయినా సరే కావ్యపరమార్థ దృష్ట్యా సాగుతుంది భారతీయాలంకారికుడయిన దండి “కావ్యం కవే రభిప్రాయళ (కావ్యమంటే కవి యొక్క అభిప్రాయం) అన్నాడు. కావ్యం ద్వారా కవి పారకుడికి వ్యక్తం చేయదలచుకొన్న అభిప్రాయం అర్థంయొక్క వివర్త రూపమే కావ్యం. శేషేంద్ర 'మండే సూర్యుడు వెనువెంటనే వచ్చిన మహాకావ్యం” “నా దేశం నా ప్రజలు. ఒక రామాయణంవలె మహాభారతంవలె అతి దీరమైన కావ్య శరీరం ఆద్యంతం అనుభవించి తన చైతన్యంలో సంలీనం చేసుకునే వ్యవధి తక్కువ కావటంనల్ల ఈనాటి కావ్యాలు సంక్షిప్తర్తూపంలో ఉండటం లక్షణం అన్నది ఒక విదమైన సమర్థన మాత్రమే అవుతుంది పొశ్చాత్య దేశాలలోను మనదేశంలోనూ నవలలు వేయిపేజీలను మించిన పరిణామంలో వెలువడటం వాటిని ప్రజలు అంగీకరించటం మనకు తెలియని అంశమేమీకాదు. అయితే ప్రాచీన కావ్యంలోని కథాంశం తొలగిపోయిన ఆధునిక కావ్యం/ఇతిహోసం లఘురూపాన్ని పొందటం విస్మయపరచే అంశమేమీకాదు. ఇందుకు ప్రధానకారణం ఇతీవృత్తరాహిత్యం, అందువల్ల ఆధునిక మహాకావ్యాలకు నాయకుడు నామరూపములు కలిగి ఒకానొక దేశకాలాలకో బద్ధుడైనవాడు కాదు. తననుతాను విశ్వీకరించుకొన్న కవియే ఈ కావ్యాలలో వక్త. తానే నాయకుడు. కావ్యంలోని ప్రతీ అంశంతో శొదాత్యం చెందగలవాడు. “నా దేశం నా ప్రజలు ఆవిధంగా భారత కర్షక నాయకమైన దేశీయ బైతన్యం రూవుకట్టిన కావ్యం. ఇది ఎనిమిది సర్గల కావ్యం. “నిజానికి ఒకటో సర్గలోని పధకమే రకరకాలుగా వునరావృతమై విస్తృతమౌతుంది మిగతాసర్గల్లో ఇది కావ్యంలో లయ” అన్నారు ఆర్.ఎస్. సుదర్శనం (యుగకవి శేషేంద్ర 1976 పే 9) 'నా దేశం నా ప్రజలు' తెలుగు కవిత్వరంగంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. నారాయణరెడ్డి 'విశ్వంభర' ఈ మధనంలోనుంచి వెలువడిన మరొక ఇతిహాస కావ్యం. 14
ఆహ సకుప్పల
భూమితోనే [ప్రారంభమయిన తన జిజ్ఞాస వేయిరేకుల పద్మమై విచ్చుకొన్నది - ఈ కావ్యంలో. ఈ కావ్యం అంతా మానవుడు తన సుదీర్హ చరిత్రలో చేసిన మహాప్రస్థానం చిత్రించింది. శేషేంద్ర కావ్యంలో మానవుని జీవన సంవేదన మూలం కాగా విశ్వంభరలో మానవుని జిజ్ఞాస మూలమైంది. “నా దేశం నా ప్రజలుకు ఇలియట్ 'ది వేస్టులాండ్.” (ప్రేరణయిస్తే విశ్వంభరకు జయశంకర్‌ప్రసాద్ 'కామాయని' దారిచూపింది.
పెన్నా శివరామకృష్ణ '“జీవనది' మవాకావ్య నిర్మాణంలో మరొక సవల (ప్రయత్నం. ఈ కావ్యం 'ద్వాసుపర్జా అన్న శ్రుతిని ప్రతీకగా చేసుకొని ప్రారంభమయింది. భారతీయ జీవన పురుషార్ధ సాధక దృష్టి ప్రధానంగా ఈ కావ్యం కొనసాగి ఈ దేశ సంస్కృతి కేంద్రంగా చేసుకొని విశ్వజనీనంగా ఎదిగింది. ఈ కావ్యంలో వర్తమానంలోని “కుహనా లౌకికవాదం” ఎంత నష్టం కలుగచేసిందో వివరిస్తున్నాడు కవి-
మా సహనమే మమ్మల్ని కాటేసింది
మా సౌభ్రాత్భత్వమే దేశాన్ని అవమానాలపాలు చేసింది
మా శత్రువు లెవరెవరిని ఎంతగా (ప్రేమిస్తున్నా వన్నదే కాదు
మా శత్రువుల విజయాని కెంత సంబర పడుతున్నావన్నదీ
నీ దేశభక్తికి కొాలమానమే
మరొకచోట కవి కవిలక్షణాన్ని వివరిస్తూ “అనుభవాన్ని (ప్రేమించని వాడికి/ అథశ్రువు విలువ తెలీదు/ప్రపంచాన్ని ప్రేమించనివాడు కవి కాలేడు” అంటున్నాడు. ఈ ప్రేమ ఆధారమైన కవి హృదయం ఈ కావ్యాన్ని విశ్వజనీనం చేసింది
నాదేశం నా ప్రజలు నుంచీ వెలువడుతున్న ఆధునిక మహాకావ్యాలను నిర్వచించే ప్రయత్నం చేరా చేశారు 'ఒక ప్రధాన వస్తువుతో, ఒక తాత్త్విక చింతనతో, సందేశంతో, అనేక భావాలతో, గం౦6ంతో, కధ లేకుందా, అర్బేనిటీ అనే లక్షణం కలిగివుండి, తగినంత విస్తారంగా ఉన్న దీర్హ కవితను ఆధునిక మహాకావ్యం అంటున్నాను (కాొయ్యగుగర్రం-పీరిక) కథా రాహిత్యమును ఒక స్పష్టమైన లక్షణంగా పేర్మాని చేరా ఆధునిక మహాకావ్య స్వరూపాన్ని నిర్ణయించటం జరిగింది. మిగతా లక్షణాలు ఏ మహాకావ్యానికైనా అన్వయించేవే
వచన కవిత్వరూపం క్రమంగా వికసిస్తూ మహాకావ్యంగా, ఇతిహాసంగా వృద్ధిపొందటం మనం గమనించదగిన ప్రధానాంశం. క్రమంగా రూపం మీద 'శ్రద్ధకన్నా అభివ్యక్తి వస్తువిన్యాసము ఈ క్రమంలో ప్రాధమ్యం వహించాయి
15
నుప్రుసన్న అల
1987లో సుప్రసన్న ఒక ఆధునిక మహాకావ్యాన్ని 'శతాంకురి రూపంలో ప్రకటించడం జరిగింది. కావ్యంలో ఏ కవిత కా కవిత ప్రత్యేకంగా ఆత్మాశయ దోరణిలో వచన చృందస్సులో ఖండ కావ్యరూపంగా వ్యక్తీకరించబడింది. కాని ప్రదానాంశం జగజ్జీవన చిత్రణ, కాలస్వరూప విశ్లేషణ, అనంతత్వోపాసన, సృష్టిమూలగవేషణ, త్రివిధ భూమికలలోని దైవాసుర సంఘర్షణ మొదలైన ఐతిహాసిక కావ్య లక్షణాలు, సృజన భూమికల అన్వేషణ, సౌందర్యంతో మమేకత్వం, (పేమ దుఃఖంవంటి సుకుమార లలిత భావ వ్యక్తీకరణ మొదలైన కాల్చనిక కావ్య లక్షణాలన్నీ శతాంకురలో గాడమైన అనుభవ లోకాలను ఆవిష్కరిస్తాయి “(కె వియన్ రాఘవన్, అభినవ భారతి పే.3800) ఏకసూత్రంలో గ్రధితమైన మణిహారం వంటి ఈ కావ్యం తాత్త్విక కావ్య ధోరణి వికాసానికి
బాటవేసింది.
సుప్రసన్న ఇటీవల వెలువరించిన మరొక ముఖ్యమైన మహాకావ్యం సాంపరాయం (2002) ఈ అనంతేతిహాసం (600 018 6౯6౧ 10 ప్రస్తావనలో రచయిత వ్రానుకొన్న మాటలివి- *'సాంపరాయంలో సృష్ట్యారంభంనుంచీ భావి దుఃఖరహిత జగన్నిర్మాణం దాకా గతాగతాలు వర్తమానంలోనికి వచ్చి ముడి వేసుకొన్నాయి. సర్గవిస్తరణలోనికి ప్రసవవేదన భౌతిక ప్రాణిక చైత్యస్తరాలలోని సంక్లిష్టత అంతరంగ చైతన్యం ద్యుఖ విముక్తికోసం చేసే తపస్సు ధీనిలో ఇతివృత్తాలైనవి.
“వస్తు విన్యాసంలో ఏ సరిహద్దులూ లేవు నాలోనుంచి అమూర్త్షమైన జీవన పరంపర “పికాసో చిత్ర సంపుటిగా అభివ్యక్తమై తన ఆంతర్యాన్ని వ్యాఖ్యానించింది. బిందువునుండి మండలం దాకా పరిణామం చెందే క్రమంలో విశ్వవికాసంలోని అన్ని ఘట్టాలనూ, సభ్యతల విస్ఫోటనాన్న్మి జీవనంలోని పరిమితులను స్వపష్నసంకలనాలలోని సామరస్యాన్ని విశదం చేసింది.
'ఆనంత్యం' రూపుగట్టుకొని వచ్చి-మృత్యుకవాటాన్ని వివృతంచేసే ప్రయత్నంలో ఈ కావ్యప్రపంచం ఇతిహానమై అవ్యక్త శిలాగర్భంలోనుంచి ఆవిషృతమైనది. వేదోపనిషత్తులూ, జొనపదపురాగాధలూ ఆదిమ ్రాగూపాలూ తామై కావ్యద్రవ్య సముద్రంలోనికి ప్రవహించాయి. ఈ మెటామార్భసిన్లో ముడిసరుకుగా ఉన్న సంస్కారాల్తూ భావనలూ, బీంబాలూ, కల్చనలూ, అన్నీ అనుభవజగత్తులోనిక్రి ఒకానొక
అపూర్వ పరిమళాలను మోసుకు వచ్చాయి”, (ప్రస్తావన) 16
పన్నెండాశ్వాసాల ఈ ఇతివాసం చివరి మూడుసర్గలలో ఉపనిషత్మధలూ, బౌద్ధగాధలూ సంలీనమయినాయి. కధా రాహిత్యమన్న లక్షణానికి ఇది కొంతవరకు అపవాదం వంటి సన్నివేశం. సాహిత్య విమర్శ ధోరణిలో మహాకావ్యం, ఇతిహాసం ఈ రెండు శబ్దాలు పైన పేర్కొన్న కావ్యాల సందర్భంలో అనిశ్చితంగానే వాడబడుతున్నాయి 'నగ్నముని' కొయ్యగుర్రాన్ని మహాకావ్యమన్న చేరా నిశ్చయమూ వివాదరహితం కాలేదు.
త్
మొత్తంమీద తెలుగు కవిత్వం ఇంచుమించుగా ఈ మూడు దశాబ్దాలలో విహంగ వీక్షణం చేస్తే కానవచ్చే ప్రధాన దృశ్యాలు ఇవి.
సెవెన్‌స్టార్ సిండికేట్‌వారి అభ్యుదయ సాహిత్య సదస్సు (1970) నాటికి “అరసం” ప్రగతివాద కవిత్వానికి మార్చిజం తప్పనిసరి కానక్కరలేదని స్పష్టంగా ప్రకటించింది. సాయుధ విప్లవమే నూతన సమాజ నిర్మాణానికి అవసరమని భావించిన నక్సల్బరీ పోరాటం సమర్థించే సాహిత్యకారులు శ్రీశ్రీని కలుపుకొని విరసం ఏర్పరచటం జరిగింది. విరసం క్రమంగా వచనకవిత్వంలోంచి పాటలోకి సాగిపోయి ఒకే ఇతివృత్తం, పరిమితమైన అభివ్యక్తి మార్గం, నియతమైన ఛందస్సులను పరిమితమైన పునః పునరావర్తనం చేత ఒక మొనాటనీని తప్పించుకోలేక పోయింది. పాడటం లేకుండా రక్తికట్టే పరిస్థితి లేకపోవటం వల్ల అది విప్లవకారుల వారి అనుయాయుల సభలకు పరిమితమై పోయింది. గద్దర్, శివసాగర్ వంగపండు ప్రసాద్ వంటి కవుల రచనలకు ప్రాచుర్యం కలిగింది.
అయితే తమ కవిత్వ సాధనలో అర్చేనిటీపోకుండా మధ్యతరగతి వర్ణంలో తాదాత్మ్యం చెదరకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారు శివారెడ్డి. నగ్నముని, వరవరరావు ప్రభృతులు. శివారెడ్డి ప్రతిభ చేత వస్తువు రత్న గర్భమై ప్రకాశించింది అతని కావ్యాలలో.
దళితవాదం గొంతువిప్పినప్పుడు చాలా బలంగానే విన్పించినా క్రమంగా సమగ్రసమాజం యెడల సవానుఖూతిలేని కారణంగా విశ్చ్వజనీనతను సంతరించుకోవటం కష్టమవుతున్నది. అయినా ఈ మార్గంలో ఉత్తమ్రేణిలో యెండ్లూరి సుధాకర్, శిఖామణి, సతీష్‌చందర్, బన్న ఐలయ్యలు నిలుస్తున్నారు. స్త్రీవాదమూ పరిమిత వస్తువిన్యాసంతో క్రమంగా వెనుకంజవేస్తున్నది. కొండేపూడి నిర్మల, సావిత్రి, జయప్రభ, రజని మొదలైన వారి కవితలు స్త్రీ జీవనంలోని సంవేదనలను స్పష్టంగా ప్రకటించాయి.
[7
ఇదంతా వదోవిధమైన నిరసన, సంఘర్షణ, పోరాటాలను ఆశ్రయించిన పార్య్వం. అయితే రెండవ పార్వం-అధివాస్తవికత, అస్తిత్వవాదం, సంశయ వాదం, అంతర్జగత్తులోని కల్లోలం ఇవన్నీ వ్యక్తంచేసే కవిత్వ భూమి. ఇక్కడ అక్కడక్కడా రహస్యవాదం నీడలు, అనిర్జిష్టమైన అన్వేషణ దృగ్గోచరమవుతాయి. సామాజిక సంవేదన కూడా ఇక్కడ “'స్వప్పలిపిగా మారిపోతుంది. ప్రతీకలు, వింబాలు, నూతన సంయోజనలు ఈ మార్గంలో ఎక్కువ అజంతా, మోహన్'ప్రసాద్, సుమనశ్రీ (ప్రభృతులు ఈ మార్గంలో సాగిపోయినవారు. ఇక్కడ కవిత్వం - వస్తు ఛందస్సులను దాటి అభివ్యక్తి నిష్టమై పోతున్నది అందువల్ల అవగాహనలో సౌలభ్యం తక్కువ, అయితే మరికొంతమంది కవులు భావకవిత్వంవలెనే ఆత్మాశ్రయ లక్షణంతో కాల్పనిక రహస్యవాద మార్గంలో కవిత్వ నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ అస్పష్టతలేదు. అరిపీరాల విశ్వం, ఇస్మాయిల్, గ్రీకాంతశర్మ, సత్య శ్రీమన్నారాయణ ఇలా కవులు ఒక భావనిష్టమైన అనుభూతి రహోలోకాలను నిర్మిస్తున్నారు. ఆర్.ఎస్.సుదర్శనం, సంపత్కుమార, అనుమాండ్ల భూమయ్యలు న్రాసేది పద్యమైనా ఒక ఆత్మానుభవ ప్రకటనకు ప్రాధాన్యం యిస్తున్నారు. చిన వీరభద్రుడు, విన్నకోట రవిశంకర్, రాజు, సిద్ధార్ధ, సౌభాగ్య, మునిపల్లె రాజు, రామ్‌నారాయణ్-ఈ కవులంతా తమ నూతన వింబాల సృష్టితో ప్రతీకల ప్రయోగంతో కవిత్వ జగత్తును నునంవన్నం చేస్తున్నారు. రామగిరి శివకుమారశర్మ 'నింగిడి” తెలంగాణా రైతుజీవితంలోని భావనలను అనుభవాలను అత్యంతసుందరంగా అభివ్యక్తం చేసింది. దర్భశయనం రచనల్లో ప్రతీకలు, బింబ సామాగ్రి దేశీయతా, గ్రామీణతా పరిమితుల లోంచి పెల్లుబుకుతున్నది. అభినవత్వం దీనిలో విశిష్టత. కొందరు ఇటీవలికవులు ఆధునికోత్తరకాలంపేర విచిత్ర ప్రకటనా వ్యూహాలలో విలక్షణమైన శబ్బజాలంతో రచనా ప్రపంచంలో పురోగమిస్తున్నారు. వీరిలో అవ్సర్, సీతారాం, ప్రసేన్స్ వంశీకృష్ణలు (ప్రముఖులు. అయికే అనేకమంది కవులు ప్రధాన ప్రవంతియైన జాతీయ ప్రజాస్వామ్య చైతన్యంలో దేశీయతాభూమికలో రచనాప్రపంచాన్ని దేదీప్యమానం చేస్తున్నారు. ఈ కవులు తమ శిల్చ నైపుణ్యంతో వస్తు విన్యాసంలో అపరిమితమైన కవిత్వపు సీమల్లోక్తి 'ప్రవేశింపజేస్తున్నారు.. వీరిలో బోయి భీమన్న శేషేంద్ర, నారాయణరెడ్డి మాదిరాజు రంగారావు, పేర్వారం జగన్నాధం, సుప్రసన్న పెన్నా శివరామకృష్ణ, గోపి, భాపురెడ్డి మొదట పేర్మొనదగినవారు. 18
ఆక సకుద్పలబ
ఇంద్రధనూరమ్యమైన ఈ దృశ్యపరంపరకు వెనుకగా ఈ కాలంలో నవ్య
సంప్రదాయం మూడు గొప్ప మహాకావ్యాలను ఆవిష్కరించింది. ఒకటి వానమామలై
వరదాచార్యుల పోతన చరిత్రము - రెండు ముదిగొండ వీరభద్రమూర్తి వందేమాతరం), మూడు - నాయని సుబ్బారావు 'జన్మభూమి”.
ఈతరం కవులు వచన కవిత్వంలో మహాకావ్య నిర్మాణం చేయటం ఒక విలక్షణమైన ఉపలన్ధి విశేషం. విస్తారమైన మన ఆధునిక సాహిత్యోపలబ్బులను తమకు, తమకు చెందిన వారికి మాత్రమే పరిమితం చేసుకునే ఒక సంకుచిత బుద్ధితో కొందరు విమర్శకులు నేటి సాహిత్యంలో గిరిగీతలు గీస్తున్నారు. “ఆసలు సాహిత్యరంగంలోనైతే శాశ్వత విప్లవాన్ని ఎప్పుడూ సంప్రదాయవాదులే తీసుకురాగలరని హెరాల్డ్ రోజెన్ బర్గ్ చెబుతున్నాడు. ఈ మాటల్ని ప్రత్యక్షర సత్యం చేసినవారు - ఇలియట్, అదెన్, అరవిందుడు, టాగోరు, విశ్వనాథ, శ్రీశ్రీ లాంటి మహాకవులు. వీళ్లందరిదీ సంప్రదాయం వల్ల పరిపుష్టమైన ఆధునికత. వేదంలోంచీ, మహాభారతంలోంచీ గ్రహించిన “సావిత్రి! వృత్తాంతంపై ఇంగ్లీషులో రాసిన మహాకావ్యం 'సావిత్రిలో కనిపించేదంతా అరవిందుని ఆధునికత్వమే అలాగే శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో “ఏ దనుజున్ వధించినను ఇంత విషాదమునొందు ఆత్మ మర్యాదుడుస్వామి' అంటూ శ్రీరామచంద్రుడి హృదయంలో ఒక అస్తిత్వవేదన (అ౧౩[8౧[4| 2౧౬౩0 లాంటిది సృష్టించిన విశ్వనాథ సంప్రదాయం లోంచీ ఆధునికతను ఆవిష్కరిస్తున్నాడని గమనించాలి”. (ఆచార్య పణతుల రామచంద్రయ్య -_ పే. 290 సాహిత్యంలో ఆధునికత అభినవ భారతి 1996)
ఈ సమన్విత దృష్టి - విశ్వజనీనమైంది ఉంటేనే మనకు మన సాహిత్యచిత్రం సమగ్రంగా దర్శనమిస్తుంది. ఏది ఏమైనా కవిత్వ సాధనకు లక్ష్యం పరిపూర్ణతా సిద్ధి, మన కళాత్మక శిల్పాత్మక సాధనలు - ఉపకరణాలు అన్నీ ఈ లక్ష్యం వైపుగానే ప్రయాణించాలి. భాష ఛందస్సు, అలంకారము, ప్రతీక మరింకేదైనా ఉంటే అది-అన్నీ మానవ జీవనంలోని అన్ని స్తరాలలోని సంఘర్షణలను చిత్రిస్తూ-అనంత జీవనాన్ని గురించిన అతని ఆర్తిని అభివ్యక్తీకరించాలి. 20వ శతాబ్దం నూతనమైన ఆధిభౌతిక తత్త్వ చింతనలోని పార్య్వాలను ఆవిష్కరించింది. మనశ్శాస్తం ఆధ్యాత్మిక అనుభవాల సీమలను తాకుతూ వచ్చింది. ఖండదృష్టీ, పార్వదృష్టీ తప్పుడు అనుభావనలకు కారణాలవుతవి.
తెలుగులో దేశీయ కవితా ప్రస్థానం (వ్యాస సంపుటి) 2003 19
కథానిక పరిమితి - విస్శితి కధానికగానీ, నవలగానీ పాశ్చాత్యదేశాల పారిశ్రామిక విప్లవం ఫలితంగా ఉద్గమం పొందిన కథన ప్రక్రియలు ప్రపంచ సాహిత్యంలో అన్ని దేశాలలోనూ కధన ప్రక్రియలు అతి ప్రాచీన కాలం నుంచీ 'ప్రహతంగా వస్తూనే వున్నవి. వీరగాధలు, ఇతిహాసాలు, పురాణాలు, దైవగాధలు, ఆచార కాండలు వివరించే గాధలు, నీతి కధలు, శృంగార కథలు, అధిక్షేప గాధలు, (ప్రతీకాత్మక బింబాత్మక గాధలు - ఇలా ఎన్ని ఎన్నని చెప్పేది. ప్రపంచ సాహిత్యమంతా ఈ గాధా ప్రపంచం యొక్క ప్రతిఫలనమే. కొంత మౌఖికం - మరికొంత కాలానికి లిఖితమూ. అయితే ప్రాచీన గాధా సాహిత్యమంతా కథన రీతిలో ఒక సహజక్రమము కలిగి ఉంటుంది. కాలక్రమమూ, ఘటనాక్రమూ సుసంగతమై ఉండటం దీని లక్షణం అయితే ఈనాటి కథ - కథానిక ఈ లక్షణం నుంచి భేదిస్తుంది. (ప్రాచీన గాధల్లో కధకుడు పాత్ర అయిన సందర్భంలోనూ ఆ పాత్ర ప్రధమప్త్పరుషలో దానిలో (ప్రవేశిస్తుంది. రామాయణ మహాభారతంలో వాల్మీకి వ్యాసులు ఇలాగే కధాచక్రంలో భాగమయ్యారు. కాని నేటీ కధ ఈ విషయంలో కూడా ప్రాచీన ధోరణికి భిన్నమైన మార్గంలో ప్రయాణం చేస్తుంది. నేటి కధలో తాను కల్పించే పాత్రను కూడా దాచేసి ఆత్మాశ్రయ రీతిలో ఉత్తమపురుషలో కథనం చేయటం మరొక విశిష్టమైన అంశం. పారిశ్రామిక విప్లవం వల్ల మానవుడు తన మూలాల నుంచి పెరికివేయబడటం వలన తన అస్మిత కోల్పోయి బ్రతుకులో ఒక నిర్దిష్టమైన క్రమం తొలగిపోయింది. జీవనం సాగిపోవటంలో ఒక హేతుక్రమమూ ఉండటం లేదు. భవిష్యత్తుకు భూతమునకూ ఒక లంకె ఉన్నట్లు తోచటం లేదు. ఏదైనా హరాత్స్చంభవము కావచ్చును తన 'అస్మితి సంకోచంలో పడటం వలన ఏ వ్యక్తిత్వంలోనో తాను ప్రతిఫలించవచ్చుననే భావం కలుగుతున్నది. ఆశ కలుగుతున్నది. ఒక పాత్ర చైతన్యాన్ని స్వాయత్తీకరించుకొని కధాకథనం చేసే లక్షణం చేత జీవన వైవిధ్యంలో ఏదో కోణంలోనో కోల్పోయిన తన్ను వెదుక్కోవచ్చునన్న ఆశ రచయితలో కానవస్తుంది. 20
ఆఅ సమిల్పిలు ప్రాచీన కధారూపాలైన అఖ్యాయిక, కథ, ఖందడకధ, పరికధ, కథానికలకూ ఈనాడు ప్రచురంగా వ్యాప్తిలో ఉన్న చిన్నకధ - కధానికలకు మౌలిక జీవలక్షణంలోనే (ప్రధానంగా భేదం కనిపిస్తుంది అసంక్షిష్టమైన సమాజంలో నిర్మితమైంది ప్రాచీన కధ సంక్లిష్టమైన క్షుబ్బ సమాజంలో నిర్మితమవుతున్నది ఈనాటి కధ మన కథ సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ ఆత్మీయమైంది. చిన్నప్పుడే ఒక ఊహా ప్రపంచం కల్పించుకొని దానినుంచి ప్రపంచాన్ని అవగాహాన చేసుకునే పాఠశాల వంటిది అది. ప్రాచీన నాగరక సమాజంలో పల్లెల్లో కధాకథనం ప్రతి ఇంట్లో వృద్ధుల సామ్రాజ్యం. పిల్లలకు లోకస్వరూపం కళ్ళకు కట్టించే విశేషాంశం అది. ఆధునిక కథా ప్రక్రియ నగరంలో పుట్టింది సమాజంలోని అన్ని వర్గాలకు పరచుకొని ఉండిన ఈ ప్రక్రియ ఇప్పుడు నగరాలలో “చదువుకొన్న పరిమిత సంఖ్యకు మాత్రమే భోగ్య వస్తువైంది. తన సాంస్కృతిక జీవన మూల్యాలలోనికి లోతుగా చొచ్చుకొనిపోయే ప్రాచీన కధారూపం, తనను తాను మూలసమాజం నుండి విడదీసికొని అసంతులనం వైపు, అపనమ్మకం వైపు నడిపించటం ఈ కథా స్వరూపంలో వచ్చిపడ్డ ఒక 'భయంకర వాస్తవం. మరొక విధంగా చెప్పాలంటే ఆధునిక సాహిత్య ప్రక్రియలు అన్నీ మౌఖిక సంప్రదాయం మూలాన్ని పెకలించి పారకుల సమూహానికి పరిమితమైపోయాయి. పూర్వం ఇతిహాస పురాణాలు, యక్షగానాలు, హరికథలు, బుర్రకథలు, కీర్తనలు మొదలైన వన్నీ మౌఖిక సంప్రదాయం ద్వారా 'ప్రజాబాహుళ్యాన్ని చైతన్యవంతం చేయగా, ఆధునిక సాహిత్యం పాశ్చాత్య రాజ్య ప్రభావాన ప్రజలలో ఆతి పరిమిత సంఖ్యకు ఉపభోగ్య వస్తువైంది. వైయక్తిక ఉపభోగ్య వస్తువైన ఆధునిక సాహిత్యం ప్రాచీన సాహిత్యంవలె సార్వజనీనములైన మూల్యాలను పట్టించుకోవటం సాధ్యం కాదు. అప్పుడు కథాంశంలో విసృత జీవనం ప్రాధాన్యం వహించి రచయిత మరుగునపడిపోయేవాడు. అతడు సూతుడో, వ్యాసుడో, మరొకరో ఎవరైనా కావచ్చు ఈనాటి కథ అట్లా కాదు. కధాంశం మీద తన శైలివల్ల, శిల్బంవల్ల, ప్రజ్ఞవల్ల భాషా ప్రయోగ వైశిష్ట్రం వల్ల రచయిత పైకి తేలుతున్నాడు. వస్తు విషయంలో ఏర్పడ్డ కట్టుబాట్లవల్ల భావ ధోరణులు పైకి తేలి విశ్వజనీనమైన అనుభవం మరుదుమూుడుతున్నది. 21
సుపుసన్న ఆక రకరకాల అభివ్యక్తి నైపుణ్యాల ప్రయోగశాలగా రచనను మలచుకునే రచయిత మద్య తరగతి పొఠకుల్లోనూ మరీ పరిమితంగా తన (ప్రత్యేక శిల్చనైపుజి - చైతన్యస్రవంతి, (ప్రతీకాత్మకత, మాజిక్ రియలిజం వంటి అనేక ధోరణులను (గ్రహించగలిగేవాళ్లకే మిగిలిపోతున్నాడు. క్ష “వరద వెల్సవ వల్ల దేశానికెంత అపకారం జరిగినా, దాని పుణ్యమా అని పొలాల్లో ఒండ్రుమట్టి పేరుకుపోతుంది. నేల సారవంతమవుశుంది. ఇచ్చ ఓపిక ఒకదానికొకటి తోడైతే పుష్కలంగా కొత్తరకం పంటలు సైతం పండించవచ్చు. “బ్రిటిషు పరిపాలన వరదవెల్లువలా దేశాన్ని ముంచెత్తింది. ఆ కీడులోనుందీ మన సాహిత్య (ప్రపంచానికి ఒనగూడిన మేళ్లు నాళ్లెదింటిలోనూ చాలా ముఖ్యమైంది కథానిక” (మధురాంతకం రాజురాం - మహతి 127) (1972. సుమారు వంద సంవత్సరాలవుతున్నది - తెలుగులో ఆధునిక కథ పుట్టి, 18వ శతాబ్దం అంతా మన (ప్రాచీన కథా సాహిత్య పరంపరను బేఖన రూపంలోక్తి తేవటమూ, అచ్చువేయటమూ సరిపోయింది. ఈ సాహిత్యం అంతా ప్రాచీన [గ్రంధా లయాల్లో దాక్కొని ఉంది. గురజుడ అప్పారావు 1910లో రచించిన 'దిద్దుబాటు' ఆధునిక కధానికా సాహిత్యంలో తొలి ఆవిష్కారంగా అందరూ అంగీకరిన్తున్న విషయం దిద్దుబాటులో కమలిని అనే గృహిణి, గోపాలరావు అనే కుహనా సంభసంస్మర్తవల్ల ఎల్లా వంచింపబడుతున్నదీ - ఆమె అతన్ని ఎలా లొంగదీసుకున్నదీ వివరించే ఇతివృత్తం, మరొక గురజాడ కథ సంస్కర్త హృదయంలో రంగనాధ అయ్యర్ వేశ్యావృత్తిని ద్వేషించే వ్యక్తి చివరకు ఒక వేశ్యను మోహించటం దీనిలో 'ప్రధానేతివృత్తం. గురజాడను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే నాడు ఉద్యమంగా ఉన్నత వర్గాలలో వ్యాపించి ఉన్న సంఘ సంస్మరణము ఆయన హృదయపూర్వకంగా ఆమోదించలేదనేది స్పష్టం. బలవంతంగా సంస్కరణను సమాజంలో ప్రవేశపెట్టడం అనాటి పాలకుల, వారి అనుయాములైన దేశీయ సంస్మర్తల ఆశయమైతే కావచ్చు కాని గురజాడ సమాజంలో క్రమానుగతిలో పరిణామం రావలసిందేనని విశ్వసించినట్లుగా గోచరిస్తుంది. దిద్దుబాటు కథలో గోప్రాలగ్రావక్తు అంతశ్ళుద్ధి లేదు. సంస్మరణ అతనికి ఒక ముసుగు మాత్రమే. రంగనాథ అయ్యరు బౌద్ధికంగా జీవించే వ్యక్తియే కాని హృదయమర్శ్మం 22
ఆ సకుర్పేణ ఎరిగినవాడు కాదు ఈ రెండూ పాత్రలూ కన్యాశుల్కంలోని గిరీశం, సౌజన్యారావుల వివర్త రూపాలుగా భావించటానికి ఎక్కువ అవకాశం కనిపిస్తున్నది.
మరొక ప్రత్యేకంగా గమనించవలసిన విషయం గురజాడ వ్రాసిన 'పెద్ద మసీదు' అన్న కథ. శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వరుని దేవాలయం కళింగగాంగుల కాలం నాటిది. 1571లో కులీకుతుబ్‌షా గజపతులను జయించి శ్రీకాకుళాన్ని లోబరుచుకొన్నాడు. అక్కడి పాలకుడు షేర్ మహమ్మద్ ఖాన్ ఆ ఆలయాన్ని పడగొట్టి మసీదును నిర్మించాడు. (రాచపాళెం చంద్రశేఖరరెడ్డి - తొలితరం తెలుగు కధలు - 67(1985) మధ్యయుగాల్లో క్రూరమైన మతం పేర - పరమతాల పట్ల అసహనం చూపిన పరిపాలకుల మీద అసహ్యం ఈ కథలో వ్యజ్యమానమవుతుంది.
అయితే గురజాడ కధానికా నిర్మాణానికి పూనుకోవటం ప్రధానంగా ఆయనకు వంగదేశంతో, రవీంద్రునితోగల అనుబంధమూ కారణం. భారతీయ సాహిత్యంలోనే రవీంద్రుని కధలు కాబూలీవాలా, పోస్ట్ ఆఫీసు మొదలైనవి ఆయన మహా ప్రతిభకు అద్దం పట్టేవి. ప్రధానంగా కవిత్వ ప్రవృత్తిగల రవీంద్రుడు కథల్లోనూ గొప్ప కవిత్వాంశాన్ని సమకూర్చటం గుర్తించవలసిన అంశం. తరువాత ఉర్జూలో ప్రేమ్‌చంద్, బెంగాలీలో శరత్చంద్ర ఛటర్జీ కధా సంపుటాలు వెలువడ్డాయి.
గురజాడ అప్పారావు కథల వెనువెంటనే తెలుగులో కధా రచనకు పందిరి వేసింది. తెలంగాణా నుంచి వచ్చిన కధాసంపుటం మాడపాటి హనుమంతరావు 'మల్లికాగుచ్చము.? మాడపాొటివారి వల్ల తెలుగు సాహిత్య పరిణామంలో ఉర్దూ మరారీ భాషల ప్రభావం ప్రస్ఫుటమైంది. గురజాడ అప్పారావు కథలు ప్రచురితమైన “ఆంధ్రభారతి” పత్రికలోనే కొన్ని నెలల తేడాతో కథలు (ప్రచురించిన మాడపాటి హనుమంతరావు కథలను సాపొత్య చరిత్రకారుడు కవిత్వవేది నారాయణరావు 'ఒప్పులకుప్పులని ప్రశంసించినా తరువాతి కాలంలో వాటికి పెద్దగా గుర్తింపు లేకపోవటమే కాదు, వాటి పరిశీలన కూడా జరగలేదు. (కె. శ్రీనివాస్ 'విస్కృత అస్రిత్వాల వికసన విప్లవం (2002) ఇండియాటుడే సాహిత్య సంచిక). ఇందుకు కారణాల్లో ఈ కథలు (ప్రామాణిక భాష అనబడే కృష్ణా-గుంటూరు జిల్లాల శిష్టభాషలో రచింపబడకపోవటం ఒకటి కావచ్చును
సాహితీ సమితి ఉద్యమం తెచ్చిన గొప్ప కథా రచయిత చింతా దీక్షితులు. 'చాసరిపాటిలో గిరిజన జీవనాన్ని ప్రస్ఫుటంగా చిత్రించి కొత్త దారి వేశారు దీక్షితులు. సాహితీ సమితి నాటికి వ్యావహారిక భాష పదునుదేరింది కధకులు దాదా పందరూ
23
సుత్రసన్న ఆ ఈ ధోరణిలోనే కధారచన చేస్తున్నారు అయితే తెలంగాణా ప్రాంతంలో ఈ శిష్ట భాషా ఉద్యమం ప్రభావం చూపటం లేదు
గురజాడ అప్పారావు తరువాత సాహితీ సమితి కవులు నడుమ వెలికివచ్చిన “కథావల్లరి (1917) పానుగంటి లక్ష్మీనరసింహరావుది. వెదురుమూడి శేషగిరిరావు 'మదరాసుకధలు కధారచయిత్రులలో మొదట పేర్కానవలసినది కాంచనపల్లి కనకాంబ “చక్కని కధలు ఈ మధ్య కాలానికి చెందినవే.
సాహితీ సమితి వెలుగులో తెలుగు కథ, నవల, శిఖరాల నందుకొన్నది. చలం, బాపిరాజు, విశ్వనాధ సత్యనారాయణ ముగ్గురూ ఈ రంగాలను ఆవరించిన మహాపురుషుల. చలం కధలు ఉప్పెనవలె సమాజాన్ని - ప్రీ చుట్టూ అల్లుకొని ఉన్న కట్టుబాట్ల బంధనాలను ప్రశ్నించాయి. ఉద్వేగమూ, కవితాత్మకత రెండూ రెండు ఒద్లుగా చలం కధా ప్రవాహం సాగిపోయింది బాపిరాజు కధలు చక్కగా చెక్కిన శిల్పాలు. సౌందర్య ప్రపంచంలోకి మనను ప్రయాణింపజేసే అపూర్వ మంత్రాశ్వాలు. విశ్వనాథ కధలు కొన్ని ప్రతీకాత్శ్మకాలు. కొన్ని ఇతిహాసమంత లోతైనవి. “యోర్చిషిఖెయ్” కథలో ఆఫ్రికా ఖండపు స్వాతంత్రోద్యమం (ప్రధాన వస్తువు కాంగో నది బిడ్డల పోరాటం ఇందులో చిత్రితేతివృత్తం. ఈ కధలో తొలిసారిగా విశ్వనాథ జానపదశైలిలో గీతాలను ప్రవేశపెట్టి కధాకధనంలో దేశీయ పద్ధతిని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
కొడవటిగంటి వెంకటసుబ్బయ్య, మునిమాణిక్యం, నోరి, మొక్కపాటి
నరసింహశాస్త్రి, కవికొండల వెంకటరావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మల్లాది రామకృష్ణ శాస్త్రి ఈ కాల్బనిక సాహిత్య యుగంలోని ప్రముఖ కధా రచయితలు. ఈ యుగం యొక్క కధోపలబ్థులలో ముఖ్యమైంది చలం “ఓ పువ్వు పూసింది" ఇది చరాచర ప్రకృతిలో చైతన్యంలోని ఏకతను, ఏకాంతాన్ని శృంగారాన్నీ సృష్టితత్తా వన్ని అఖండతనూ అద్భుతంగా వ్యాఖ్యానించిన కళాఖండం - కావ్యశిల్పం, మల్లాది రామకృష్ణశాస్త్రి కధలు ఒక ప్రత్యేక భాషా ప్రపంచాన్ని సృష్టించుకొన్నవి. గడచిపోయిన కాలంలోని శృంగార మాధుర్యాలను ఆయన కథలు సజీవం చేశాయి.
బుర్రా వెంకటసుబ్రహ్మణ్యం రచనలు కొద్దే అయినా అవిస్మరణీయమైనవి. 'జేబురుమాలు' 'పారిసో రెండు కధలూ మానవ (ప్రవృత్తిలోని అంతర్గత రహస్యాలను తెలియజెప్పటంలో సాఫల్యం పొందినవి. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కధకుల్లో అజాను
2త
ఆకు నకుద్పణ బాహువు ఆయన భాష గోదావరీ జల సౌభాగ్యాన్ని తలంవుకు తెస్తుంది వడ్లగింజలు గొప్ప కధ వేలూరి శివరామశాస్త్రి కథలు శైలికీ వ్యక్తిత్వానికీ ఉదాహరణలుగా కరగి పోతున్న సమాజ చిత్రాలకు నిధులుగా రూపొందాయి. తరువాత తరాల కధల్లో రెండు ప్రబలమైన ధోరణులు స్పష్టంగా కానవస్తాయి ఒకటి యూరోపీయ కళోద్యమాలలో 'ప్రచురంగా సాగివస్తున్న అనేకోద్యమాల ప్రతి ఫలనము, రెండు సామ్యవాదోద్యమాన్ని బలపరచే, అనుసరించే ఉద్యమాల ్రాబల్యమూ.
ఈ కాలంలో ప్రముఖంగా ప్రకాశించే రచయితలు - గోపీచంద్, మా, గోఖలే, బుచ్చిబాబు, కరుణకుమార, పాలగుమ్మి పద్మరాజు, కొడవంటిగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథశాస్త్రి. వీళ్లల్లో ఒక్కొక్కళ్లు దిగ్గజాలవంటివాళ్లు. కథారచనలో శిల్పప్రాఢిమ, వస్తువైవిధ్యం, మనోలోక రహస్య ప్రకాశనం, సమాజంలోని తాడిత పీడిత వర్గాల తిరుగుబాటు. జీవుని హృదయంలో నిహితమైన కారుణ్యం ఇవన్నీ ప్రధానాంశాలు గానే ప్రకటమయ్యాయి.
ఇదే కాలంలో సమాంతరంగా తెలంగాణాలో సురవరం (ప్రతాపరెడ్డి కధలు వ్రాస్తున్నాడు. ఆయన కథ నిరీక్షణ” దేశీయ జీవన మూలాల ్రాగ్రూపాలను బలంగా చిత్రించిన కధ. శంకరన్ కుమారిల ప్రణయ గాధ సముద్రతీరంలోని మత్స్య కార్మికుల జీవన నేపధ్యంలో చిత్రించిందే అయినా అంతర్గంతంగా దాని మూలంలో దేవీ కన్యాకుమారి ఆవిర్భాన వృత్తాంతం - భౌమమై జానపద కథయైై పరిణమించిన అంశాన్ని విశదీకరిస్తున్నది. మిగిలిన ప్రతాపరెడ్డి కథలలో నాటి హైదరాబాదు రాష్ట్రం సమాజంలోని హిందూ ముస్లిం కుటుంబాల నడుమ ఉండే విలక్షణమైన ప్రేమ-విరోధం అన్న ద్వంద్వ (ప్రవృత్తి తలియపరచబడింది
ఈ కాలంలో సమాంతరంగా తెలంగాణాలో సాధన సమితి - హైదరాబాదు ప్రచురించిన కథా సంపుటాలు పాలవెల్లి, మా ఇంట్లో, రంగవల్లి ఈనాడు ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసినవే. బూర్గుల రామకృష్ణారావు కధల సంపుటి 'వాహ్యాళి, కాళోజీ నారాయణరావు కాళోజీకథలు), పొట్లపల్లి రామారావు కథలు, ఆళ్వారుస్వామి కథలు, నందగిరి ఇందిరాదేవి మొదలైనవారి కధా రచనలు కొనసాగుతూనే ఉన్నాయి. 1983 ప్రాంతాలలో వరంగల్లు కాలేజీ పక్షాన ప్రచురితమైన ఒక సాహిత్య పత్రిక(?) 'వ్యాసకళోలో నాటి విద్యార్థులు టి. హయగ్రీవాచారి, భండారు చంద్రమౌళిశ్వరరావు కధలు కనిపిస్తున్నాయి. తరువాత ఐదారేండ్లకు పి వి. నరసింహారావు కధకుడుగా బయటకు రావటం జరిగింది. (ఈ 'వ్యాసకళ' ఇప్పుడు మృగ్యమే).
25
సుత్రసన్న ఆల
తెలంగాణా నుంచి మరికొంతమంది కథా రచయితలను చెప్పవలసివస్తే ధరణికోట శ్రీనివాసులు, భాస్కరభట్ల కృష్ణారావు, బూర్జుల రంగనాధరావు, జి. సురమౌళి, జి. రాములు పేర్లను చెప్పుకోవాలి. యాఖభైలలో తెలంగాణా భాషలో కధారచన చేసిన పాకాల యశోదా తిరుమలరెడ్డి ప్రత్యేకంగా పేర్య్మొనవలసిన వ్యక్తి.
మధ్యకాలంలోని గోపీచంద్, బుచ్చిబాబు, కుటంబరావు కథకళత్రయం యుగంలో తెలుగు కథ వెయ్యి పోకడలు పోయింది. విస్త్సృతినీ; గాఢతనూ కల్పించు కున్నదీ వీరి కాలంలోనే. ఈ యుగంలో తెలుగు కథకు ప్రఖ్యాతి తెచ్చిన పాలగుమ్మి పద్మరాజును పేర్కొనకపోనటం దోషమే అవుతుంది. వీరిలో బుచ్చిబాబు, పద్మరాజుల కథలు కొన్ని మన సమాజ జీవన భూమికలో నుంచి పుట్టినవి కావు. అదొక కల్పిత జగత్తు. సంవేదనల సాలిగూడు, అవ్యస్థిత ప్రపంచ 'ప్రతిఫలనం. దేశీయ జీవనంలోని పరిణామాన్ని వ్యవస్థలోని కుదింపులను జమదగ్నిశర్మ తన కథల్లో తెలుగు పలుకుబడితో రూపు కట్టించారు.
తరువాత వారప(్రికలు పెరగటం, ప్రచురణావకాశాలు మెరుగవటంతో కథానికల రచయితల దినదినాభివృద్ధి పొందారు. కారుణ్యపు లోతుల్ని త్రవ్విచూపే మంజుత్రీ, హృదయ విదారకంగా వాస్తవాన్ని ఆవిష్కరించే బలివాడ కాంతారావు, తెలుగు జీవనంలోని అన్ని పార్య్వాలను స్పృశించే ఇల్లిందల సరస్వతీదేవి, హితశ్రీ, పల్లె జీవనంలోని అమాయకతను మానవునికీ ప్రకృతికీ నడుమ ఉన్న సామరస్యం తాలగిపోగా దుఃఖితమవుతున్న స్థితినీ కలిగించిన మధురాంతకం రాజారాం, వాకాటి పాండురంగా రావు, తాత్త్విక గాంభీర్యాన్ని కథల్లో ఆత్మగా ప్రకటించే ఆర్.ఎస్. సుదర్శనం, ఆర్ వసుంధరాదేవి, శ్రీవిరించి తెలుగు కథా ప్రపంచలో అతిరధ మహారథులు. చలం తరువాత కవిత్వానికి నన్నిహితమైన శైలినీ, వస్తువిధానంలో అట్టడుగు ప్రపంచాన్నీ జీవనంలోని అసంతులనాన్నీ ఏకకాలంలో ప్రకటించే కధలు రాచకొండ విశ్చనాధశాస్త్రివి.
అరవైలలో వారపత్రికలలో స్త్రీలు ఎక్కువగా నవలలు రాయటం, రాచకొండ విశ్వనాథశాస్త్రి రచనలు ప్రచురితం కావటం కథా (ప్రపంచంలో నూతన స్పందనలకు హైతువైంది. చాగంటి సోమయాజులు, కాళీపట్నం రామారావులు కథారచనలో తమ ముద్ర కొద్ది కథలతోనే వేసుకున్నారు. అవసరాల రామకృష్ణారావు, భమిడిపాటి రామగోపాలం ఇంకా ఎందరో కథకులు మానవీయ నేపథ్యాన్ని ప్రధానంగా రచనా ప్రపంచాన్ని నడిపించారు.
26
ఆ సకుద్పజ సంస్కరణోద్యమం, సాహిత్యంలో నాగరీకరణం సమాంతర దశలో సాగిపోగా- గాంధీ ఉద్యమం మళ్లీ జాతీయ భూమిక మీద గ్రామీణ చైతన్యాన్ని రచించే ప్రయత్నం చేసింది. స్వాతంత్ర్య సముపార్టనకున్న ప్రధాన లక్ష్యత నగరంలోని మధ్య తరగతి నాయకత్వం మీద ఆధారపడి వుండటంతో (గ్రామ పునరుజ్జీవనం ప్రాధాన్యాన్ని కోల్పోయింది. సామ్యవాదోద్యమం కేవలం కార్మికవర్గాల బలంమీద ఆధారపడింది. భూమి పంపకం వంటి ఉద్యమాలు తెలంగాణాలో ప్రస్ఫుటమైన ప్రధాన లక్ష్యం ఐనా కమ్యూనిస్టు రాజ్యస్థాపనకు కేంద్రితం కావటం వలన జాతీయోద్యమంలో మమైక్యమైన నిజాం ప్రజల చైతన్యం దాని కనుకూలింపక పోవటం వలన స్టూలంగా పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల విధానాన్ని ప్రజలు అంగీకరించటంతో తెలంగాణా పోరాటం విఫలమయింది.
ఎన్నికల ప్రజాస్వామ్యమూ మేడిపండుగా వరిణమించటం, భాషా రాష్ట నిర్మాణం కూడా ప్రభుత్వాన్ని ప్రజలకు సన్నిహితంగా చేయలేకపోవటం, విచ్చిన్నమై విశ్లథమైన సమాజం దిక్కుతోచని స్థితిలో సామ్యవాద పక్షం నక్సలైట్ ఉద్యమంగా రూపొందింది. ఈ ఉద్యమం సాహిత్య ప్రక్రియలకు దేశీయ న్వభావాన్ని సమకూర్చే పనిని చేపట్టి మాండలిక భాషలో కథలను నవలలను రచింవజేసింది.
ఈ సందర్భంలో విప్లవోద్యమాలకు చెందినా - నేరుగా (ప్రధానస్రవంతిలో రచనలు కొనసాగించినా కధకులు అందరూ హృదయాన్ని కరగించే కథా రచన సాగించారు. అందరిలోనూ సామాజిక సంక్షోభం ప్రధాన వస్తువైంది. ఈ కధాశైలిలో కూడా ప్రాంతీయ మాండలిక భాషా ప్రయోగాలు చోటు చేసుకుంటాయి. కొందరు రచయితలు ఎమర్జెన్సీలో 19 నెలల పాటు దీర్చ కారాగారంలో (మగ్గినవారు. అనాటి రాజకీయ నిరంకుశత్వాన్ని చిత్రించే ప్రయత్నం అక్కడక్కడా కనిపిస్తుంది.
ఈ రచయితల్లో నవీన్, ఇనాక్, దేవరాజు మహారాజు, శీలా వీర్రాజు, అల్లం రాజయ్య, బోయ జంగయ్య, బి.యస్. రాములు, త్రిపుర, చెరబండరాజు, కేతు విశ్వనాథ రెడ్డి, నగ్నముని, మునిపల్లె రాజు ఇలా ఎందరో ప్రముఖులున్నారు. తరువాత కాలంలో కసిరెడ్డి, సుభా, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, కాలువ మల్లయ్య, పాపినేని శివశంకర్, ఫణికుమార్, జూకంటి జగన్నాథం, ఐతా చంద్రయ్య, చినవీర భద్రుడు, వరిగొండ కాంతారావు, ముదిగంటి సుజాతారెడ్డి, చంద్రలత, పైడి తేరేశ్బాబు, కుప్పిలి పద్మ, పి. సత్యవతి, వోల్గా ఇలా ఎందరికైనా పేర్కొనవచ్చు
27
నుత్రునన్న ఆజ
దాదాపు వందయేళ్ల తెలుగు కధా చరిత్రలో అందరు మంచి కధకుల పేర్లు చెప్పటం కూడా ఇలా కష్టమైన పనే. ఐతే విశ్వనాధ ఆధునిక కధలో (యొర్పిషి ఖెయ్) ప్రాచీన మౌఖిక దేశీయ కధన పద్ధతి ప్రవేశపెట్టిన విధంగానే, ఇటీవల ఇండియా టుడే వార్షిక సాహిత్య సంచికలో గోపిని కరుణాకర్ 'కొల్లేటివంక' అనే కధ వ్రాశారు. దీనిలో గేయాలూ కథనమూ దేశీయ మార్తానికి అనుగుణంగా ఉన్నాయి.
పూడిపెద్ది వెంకట రమణయ్య 'పూలగుత్తి కేవలం కధలు కోసం నడిపిన పత్రిక, ఏలూరు నుంచి ఎన్ ఆర్. చండూరు ప్రభృతులు నడిపిన “కధావీధి” కూడా ఈ విధమైన పత్రికయే నలఖైలలో చాలా పత్రికలు కేవలం కధా రచనను ప్రధానంగా ప్రోత్సహించాయి. ఇటీవల విపుల, చతుర పత్రికలు కథను ముందుకు తీసుకు
పాలకులైన (బీటిషువారి వ్యూవోలను అనుగుణంగా సమాజాన్ని అనేక విధాలుగా విశ్లేథితం చేసే ప్రయత్నం 1857 నుంచే ప్రారంభమయింది. దేశాన్ని ఆర్యులు ఎక్కడనించో వచ్చి ఆక్రమించారన్న కట్టుకధకు చరిత్రలో స్థానం కల్పించటంతో కుట్రకు అంకురార్పణ జరిగింది. హిందూ ముస్లిమ్ విభేదాలు సృష్టించటం, దానివల్ల జాతీయోద్యమాన్ని బలహీనపరచటం రెండవ దశ మూడవ దశలో దక్షిశోత్తర భారతాలు, ఆర్య ద్రావిడ భేదాలు. వీటివల్ల ఈ శతాబ్దం మొదట్లో జస్టిస్ పార్టీ పుట్టింది... దాని మూలాల్లోంచే సామ్యవాదోద్యమం. ఈ క్రమం అంతా ప్రాచీన భారతీయ సంస్కృతీ మూలాల నుంచి మనను విడగొట్టి దూరంగా విసరి పారవేయటం అన్న ధోరణికి చెందినది. దీనికి తోడు నాగరీకరణం పల్లెలను వృత్తులను నాశనం చేసింది. ఆధునిక విద్యా విధానంవల్ల ప్రజల్లో విద్యావ్యాప్తి కుంటుపడ్డది బ్రిటిషువారు రాకముందే చదువుకున్నవాళ్ల సంఖ్య ఎంత ప్రచురంగా ఉండేదో అది వారి నూతన విద్యావిధానంవల్ల ఎలా కుంచించుకుపోయిందో “చదువుల చెట్టి - ఖండపల్లి సత్యదేవప్రసాద్, 'మన చదువులు - ఎం వి ఆర్. శాస్త్రి పుస్తకాలు ఇటీవల నిరూ పించాయి. సామ్యవాదోద్యమం వర్గదృష్టితో సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసింది. అది సాధ్యం కాలేదు
స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత కులవ్యవస్థ రాజకీయాధికార (ప్రాబల్యం కోసం మళ్లీ సాంధద్రతరమవుతూ వచ్చింది నాగరీకరణం, స్త్రీల ఉద్యోగాల వివాహ వ్యవస్థ మీదనే సందేహ బీజాలను నాటిన “చలం” మొదలైనవారి రచనలూ ఒక నూతన
28
సామాజికోపరితలాన్ని సృష్టించాయి. కులవ్యవస్థల సాంద్రీకరణం ఫలం దళితవాదం కాగా, కుటుంబ వ్యవస్థ శిధిలం కావటం స్త్రీవాదానికి కారణం అయింది.
ఈ రెండు ఉద్యమాలకు స్పందించిన రచనలు ఒక్కో దశాబ్దంపాటు వ్యూహాత్మకంగా సాహిత్యంలోని ప్రధాన ్రవంతులుగా ముందుకు తీసుకురాబడ్డాయి. జస్టిస్ పార్టీ నాటినుంచీ ఈ ఉద్యమాల నాయకత్వం ప్రచార సాధనాలను తనకు అనుకూలంగా మలచుకుంటూ అంతా తానేనన్న దృష్టిని ముందుకు తెచ్చింది.
ఇందుకు ప్రధాన కారణం ప్రజాస్వామ్య వ్యవస్థ ఇక్కడ సమాజంలో అనుకూల (ప్రభావాన్ని వృద్ధి చేయలేకపోవటం,. అవినీతి, (ప్రభుత్వాల అసమర్థత, భారతీయ సమాజం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి కోసం భౌతిక, సాంస్కృతిక రంగాలలో పురోగతి కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయలేకపోవటం, అడుగడుగునా ఆర్థిక ఫలాలు కొద్దిమందికే హస్తగతం కావటం, 'నాయకస్వామ్యం' అన్నివిధాలుగా బలపడటం ప్రధాన కారణాలు. మొత్తంమీద ప్రజాస్వామ్య వ్యవస్థ'క్రమక్రమంగా శిధిలమవుతూ వున్నది.
వివేకానందుని కాలం నుంచి గాంధీజీ దాకా పునరుజ్జీవనోద్యమం వల్ల దళితులను (ప్రధాన జనజీవన(స్రవంతిలోనికి తెచ్చే ప్రయత్నం కొనసాగింది. స్వాతంత్రోద్యమం స్త్రీలకు పురుషులతో సమానంగా నాయకత్వం కల్పించింది. స్వాతంత్రానంతరం గాంధీజీతో పాటు ఈ తాత్త్వికదృష్టి మరుగైంది భారతీయ నాయ కత్వం సమగ్ర జీవన దృక్చధం నుంచి కాకుండా భౌతిక జీవన కోణం నుంచి భవిష్యత్తును నిర్మించే ప్రయత్నం చేసింది. ఈ సమన్వయం లోపించటం చేత దేశ పురోగతి అన్ని కోణాలలోనూ మొక్కవోయింది. వైరుధ్యాలు సంఘర్షణలు పెరిగాయి. మతం కూడా అధికార సోపానంపైన తూనికరాయిగా మారిపోయింది.
ఈ అవ్యవస్థ అంతా ఈ దళిత ప్రీవాదోద్యమాల సాహిత్యంలో కథలలో ప్రతిబింబిస్తున్నది. అవమానాలను తిరస్కరించటం, ధిక్కారం, ఆత్మాభిమానం ఇవన్నీ ఉద్యమాల అభివ్యక్తి ముఖాలు అయితే ఈ కల్లోలం సమన్వయ సూత్రం అందే దాకానే. ఆధ్యాత్మిక సాంస్కృతిక నాయకత్వం ప్రస్ఫుటమయ్యేదాకానే.
సంపన్నదేశాలు - మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు ముందుకు వస్తున్న విముక్త దేశాలను తమ అనేక విచిత్ర వ్యూహాలతో దెబ్బతీస్తూనే వుంటాయి. దేశాన్ని కల్లోలపరచే
29
నుప్రుసన్న ఆ
వేర్పాటు ఉద్యమాల వెనుక ఈ (ప్రేరణలు ఉన్నట్లే, ఈ సాహిత్యంలోని వేర్పాటు ఉద్యమాలలోనూ గాయపడ్డ సమాజ శరీరానికి ఉపచారం చేసే బదులు మరింతగా గాయపరచే లక్షణం కనిపిస్తుంది.
ఈ ఉద్యమాలను (ప్రోత్సహించే క్రమంలో మరొక ధోరణి స్పష్టంగా పైకి వస్తున్నది. అది “భారత జాతీయతను 'దేశభక్తినీ అవమానించే లక్షణం. “గర్జించు రష్యా గాండ్రించు రష్యా” అన్న శ్రీశ్రీ రష్యాప్రజల దేశభక్తిని ప్రశంసించినా, ఆ మార్గంలోని వాళ్లు భారతదేశ సమైక్యభావాన్నీ సరిహద్దుల రక్షణకు జరిగే పోరాటాలనూ పరిహసిస్తున్నారు. దేశభక్తి భావనను అధిక్షేపించే 'సౌదా' కథ నల్లగుర్రపు నాడా ఈ సందర్భంలో గమనింపవలసింది. దీనిలో కల్పన అవాస్తవికమైంది. బంగ్లాదేశ్ యుద్ధం తరువాత 90 వేల మంది యుద్ధఖైదీలను పాకిస్తాన్‌కు క్షేమంగా అప్పజెప్పింది భారతదేశం. “క్క కథలోని ఐరనీ, జాతిద్వేషంతో అమానవీయతతో నింపబడి ప్రచారం చేయబడుతున్న దేశభ్రక్తి అసలు స్వభావాన్ని నోరెత్తి ఒకమాట మాట్లాడటానికి కూడా వీల్లేని పరిస్థితులను, మాట్లాడేవాడు దేశద్రోహిగా ఏరివేతకు గురి అయ్యే పరిస్థితిని అధికార రాజకీయాలు ఎలా నృష్టించాయో ఈ సందర్భం వ్యక్తం చేసింది”, “వీరపుత్రులను కన్న తల్లిదండ్రులు తమను తాము ఒక ఉద్వేగపూరిత దేశభక్తి పర్యావరణంలోకి నెట్టుకొని, మనిషికన్న (బ్రశుకుకన్నా సరిహద్దుల రక్షణకు మరణానికి అధికతర ప్రాధాన్యమిచ్చే 'మాయిలో పరిభ్రమించేవాళ్ళుగా మారటంలోని అమానవీయతను కూడా ఈ కధ స్పృశించింది. “మూర్చులూ చుండగులూ అయిన ప్రజల భయమే దేశభక్తికి స్థానం” అని నిర్వచించిన ఈ కథ దేశమంటే మనుషులన్న మాటను పూర్తిగా విస్మరించి దేశమంటే, సరిహద్దురేఖలు అన్న భావనమీద నిర్మింపబడిన “దేశభక్తిలోని డొల్లతనాన్ని పదునుగా విమర్శకు పెట్టింది (కాత్యాయని విద్మహే-ఈ దశాబ్ది తెలుగు కథ - కధ 2000. పే. 178). ఈ ధోరణి ఆలోచన ఎంత ప్రమాదకరమైందో మనం గ్రహించాలి. వర్గశత్రు నిర్మూలన పేర ఎంతోమంది అమాయకులను చంపినప్పుడు గుర్తుకురాని బ్రతుకు, మనిషి విలువలు, దేశరక్షణ కోసం ప్రాణత్యాగం చేస్తున్న యుద్ధ వేళల్లో గుర్తుకురావటం ఎంతటి ప్రగతిశీలమైన ఆలోచనో విచారించాలి. ఈ దేశహితబుద్ధిలేమి క్షమించటానికి వీలులేనిది.
మరొక అంశం, ఏ వ్యవస్థలోనైనా కాలక్రమంలో దోషాలు, మోసాలు, దంభ (ప్రదర్శనలు, దురాచారాలు చోటుచేసుకోవటం వాస్తవమైన అంశమే. అయితే మన కథకలకు 'ప్రగతిశీల' సాహిత్యకులకు పొందూ వ్యవస్థలోని దోషాలు, ఇతర మతవ్యవస్థల
30
ఆఅ నకువ్పబ లోని గుణాలే కనిపిస్తాయి. ఈ చూపును సరిదిద్దుకోవలసిన అవసరం ఉన్నది మన కథకులు ముందు నిర్మించుకోవలసిన మార్గం ఏమిటి?
-
కథాకధనంలో ప్రజా సమూహానికి సన్నిహితంగా పోగల మౌఖిక కధన సంప్రదాయాలను తమ రచనలో ప్రవేశపెట్టాలి. పరంపరాయాతంగా సాగివస్తున్న కధన ధోరణులను అధ్యయనం చేసి ఈనాటికి అనుగుణంగా వాటిని కొత్త ఉపకరణాలుగా మార్చుకోవాలి.
-
మన జీవనంలోంచి స్పందించని, మన కధనాన్ని నిర్దిష్ట పాఠకశీశోతృ సమూహానికి చేర్చేందుకు అంతగా ఉపయోగపడని శిల్చసంవిధానాలను అవలంబించటం అవసరం కాదు.
-
సమాజ పునర్నిర్మాణంలో బాధ్యతగల వ్యక్తులుగా - సమాజంలోని దోషాలకు మూలాలను వెదకి సమాజం మొత్తం యెడల ఆత్మీయతతో భావించిన సమన్విత నూతన సమాజ రూపావిష్కరణకు తోడ్చదే భావ సందోవాోన్ని అనుభవ గాధత్వాన్ని సృజనాత్మక రచనలో భాగం చేయాలి.
-
_జాతీయభావాన్ని దేశముయొక్క అఖండతను, సమాజం ఆత్మలోని ఏకత్వాన్ని భంజింపజేసే రచనా ప్రపంచాన్ని తిరస్కరించి ఖండించి దూరం చేయాలి.
-
రచన ఓ తపస్సు. ధ్యానధారణ. మనోలోకంలో నూతన తేజస్సుల సమా విర్భావం. తాను క్రమంగా సమగ్ర సమాజంగా రూపుదిద్దుకునే క్రమం. సంకుచిత సిద్ధాంతాలు, సంపన్నదేశాల కుట్రలు, సర్వమందు ఏకాత్మ భావాన్ని నిలుపుకోలేని స్థితీ ఆవలి తీరాన్ని చేర్చలేవు.
కథానికే కాదు. సాహిత్యం యొక్క తత్త్వాన్ని ప్రయోజనాన్ని అద్భుతంగా చెప్పిన బుచ్చిబాబు మాటలతో ఈ ప్రసంగాన్ని సమాప్తం చేస్తాను.
“వఏవయ్యా, నువ్వేదో కొండల్లోకి వెళ్లి ఒక్కడవూ తవస్సు చేస్తే ప్రపంచానికి ఏమిటి ప్రయోజనం” అని రామకృష్ణ పరమహంనని అడిగారుట. “నాలో ఒక భావతరంగం లేచి ప్రపంచం అంతటా వ్యాపించింది” అన్నారుట. కథకుని వంద కథలలో, వొక్క కథ అలాంటి అనుభూతి తరంగమై విశ్వమంతా వ్యాప్తి చెందుతుందని నా విశ్వాసం- ఎవరో అన్నట్లు సాహిత్యం ఆత్మని రక్షించలేదు. రక్షించతగిందిగా చేస్తుంది.” (బుచ్చిబాబు, సాహిత్య వ్యాసాలు (1977) పే. 22) కీలకోపన్యాసం (9 మార్చి 2002) సమాలోచన- కథారచయితల సమ్మేళనం విజయవాడ
౩31
కాల్పనిక కవిత్సం కాల్చనిక కవిత్వమూలాలు - పాశ్చాత్య సాహిత్యం నుంచే మన దాకా వచ్చినా దానిలోని సార్వజనీనాంశాల వల్ల ఈ దేశపు మట్టిలో ఎదిగి ఈ అనుభూతుల పూలను పూచి, ఈ సంవేదనల సాక్షాత్మారానికి దర్చణూలయినాయి. నాగరీకరణం, మానవ సంబంధాల యాంత్రికీకరణం, ప్రకృతిలోని సంబంధం దూరం కావటం, కుటుంబ సంబంధాలు శిధిలం కావడం, జీవనం (క్రమంగా శుస్మమై పరివ్యాప్తమౌతున్న (ప్రేమరాహిత్యం - కాల్చనిక కవిత్వోద్యమానికి ప్రధానాధారాలు. వ్యక్తి ఒక్కడ్రైిపోవటం, చుట్టూ వున్న సమాజంతో, తనలోని తనతో, ప్రకృతితో సామరస్యం లోషించటం వల్ల దిక్కు తోచనీయని భయం కభిగించే ఏకాంతం - ఒక అభూతపూర్వమైన వ్యథకు మానవుణ్ణి గురిచేసింది. గాఢమైన పారతంత్ర్యంలోనూ ఒక్క కుదుపుతో మేల్మొని ఆంగ్లకాల్పనిక కవుల వేదనలు తనలో సంవదించుకొని, క్రార్య కౌటిల్య కల్పిత కరినదాస్య శృంఖలములలో- నిబద్భుడైన తొను - పసరపాలనలోని అణచివేతవల్ల, (త్రాక్కిడివల్లా- నా జాతి పూర్వప్రథా జీవరహితమై శక్తి నాడుల యందు చచ్చిపోయి నా మాతృభాష నానాదుష్ట భాషల బిద్ధత్యమును తల నవధరించి- అని రోషంతో తోకత్రాక్కిన పాములాగా బుసకొట్టుళూ- జాతీయోద్యమంతో తాదాత్యాన్ని పొందుతూ వుండగా- 'వచ్చినిదె బంగారు కాలము, వాంఛ లెల్లను తీరు నుజనుల కాంగిలేయుల ధర్మరాజ్యము జ్ఞానమును స్వాతంటత్ర్యమిచ్చుచు సంతతము వర్ధిల్లు గావుతి అని పర పరిపాలకులకు అనుకూలంగా (్రవర్తించేవారూ ఉన్నారు. అయినా దేశంలో జాతీయ శక్తులు ప్రబలటం తప్పని సరైంది. దేశం “క్రూరమైన ఒక [గ్రద్ద దం(్టలకు కట్టుబడిందనీ, ధూళిలో సాష్టాంగ పదుతున్నదనీ” దేశమాత దైన్యాన్ని ప్రకటించటమూ జరుగుతున్నది. శ్రీ రామకృష్ణులు, దయానందులూ, వివేకానందులూ జాతినిద్రాణమైన ఆత్మను జాగృతం చేసి ఆత్మ విశ్వాసాన్ని (ప్రోది చేశారు. స్వాతంత్రోద్యమంగా వరిణమించిన ఆ జాతీయ చేతన న్వరాజ్యం నా జన్మహక్మని (ప్రకటించేటట్లు చేసింది. 32
ఆ సమర్పణ జాతి జీవన పరిణామంలో సంక్రమించిన దుష్టమైన ఆచార వరంపరను తిరన్మరించటం - సంఘసంన్మరణమై నూతన సమాజనిర్మాణానికి దారితీయటం ఒక పార్ట్వం కాగా - ప్రాచీన జీవన సంస్కృతి తన పద్ధతులలో, సంప్రదాయాలలో నిగూఢమై వున్న తాత్త్విక రహస్యాలను పునః వ్యాఖ్యానం చేసి నూతనరూపం వాటికి సంతరింప జేయటం మరొక ప్రధానాంశమైంది. ఈ సామాజిక మధనంలో ఒక సమన్వయం - ఒక నూతన వైతన్య పార్యం సనాతన జీవన విధానానికి అవిచ్చిన్నమైన అనుస్యూతి సాధ్యమయింది. వాణి (ద్రాయింప మోగిన వీణ మోద పారసీక గీతంబులు పలుక మనెనె ? బుషులు నీవారములను పండించినట్టి పొలమునందు గులాబీలు పూయమనెన? అన్న ఆలోచన నూతన సూర్యోదయానికి స్వాగతం నెరపింది. వెండిగొలుసులు లంకె వేసి ప్రచండనుగు నీ నీలితెరలను తూర్చువాకిలి తలుపు రెక్కల తొలగ లాగెద రెవ్వరో” అని నవ్యోదయాన్ని కలిపిస్తున్న కవి తాను సృష్టించిన ప్రభాతాన్ని చూచి ఆశ్చర్య చకితు డవుతున్నాడు. ఇక్కడ జీవన దృక్పథంలోనే ప్రాచీన కవికీ, ఆధునిక కవికీ భేదం ఏర్పడ్డది. కానఐడ కనుమాన (ప్రమాణమునకె అందియందని పరతత్త్వ మవల నుంచి పంచభూత దృశ్యంబైన ప్రకృతి కళనె సన్నిపాత లక్ష్యమనియ వచస్వి నేడు జగదతీతమైన పరతత్త్వభావన స్థానంలో - జగదభిన్నమైన ప్రత్యక్షమైన, నిత్య సన్నిపొతమైన (ప్రకృతియే లక్ష్యంగా మారిపోయింది. అతవూర్వం నశ్వరమూ, అశాశ్వతము అని భావించి - తాత్త్విక దృష్టిలో తీరన్మరింపబడుతూ వచ్చిన ప్రకృతి ఉపాస్య స్థానాన్ని పొందింది. ఆధునిక భారతీయ చింతనలో ఈ జగత్తు కూడా ఈశ్వర విభూతిగా, అభివ్యక్తిగా భావింపబడింది. అందువల్ల కవి ప్రకృతిలో తాదాత్మ్యం పొందటం ద్వారా తాత్త్విక పారమ్యదర్భనం చేయబూనుకున్నాడు. రాయప్రోలు నుబ్భారావు- రవీంద్రులు, శ్రీ అరవిందులు, రాధాకృష్ణుల వలె తాత్త్విక భావనలో జగత్తును బ్రహ్మ మయంగా భావన చేశారు. నీరసమైన అద్వైతం నాకొద్దు. పంచేంద్రియ తర్చణమైన ఆనందం నాక్కావాలి. పంచేంద్రియాల ద్వారా ఆస్వాదించే రనస్ఫురణ నాకు కావాలి అన్నారు 283
సుప్రసన్న అల అందదు నిర్వికారము నిరంజన మౌ పరతత్త్వరేఖ, ఆ నందమె నిర్గుణాన సగుణానను ప్రావృమయౌట, మాత్ళ మూ ర్తిం దరిసింతు నీ ప్రకృతి దివ్య శుభావరణాన ఈ దర్శనంలో వంగదేశం నుంచి కదలివచ్చిన చైతన్య మహాప్రభువుల వైష్ణవాది దర్శనాల ప్రభావమే కాక, తాంట్రిక శాస్త్ర భూమిక కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. తంత్ర శాస్త్రంలో దేవి - ఆద్యాప్రకృతి. అదితి ఆమెయే. రాజరాజేశ్వరి. లలితాదేవి. “బుతువున కొక్క రూపంలో అభినయిస్తున్న సృష్టి స్థితి లయయోగిని'. ప్రకృతిని ఉపాస్యంగా చూచిన నవ్యకవికి అదంతా అత్యంత వినూతనంగా దర్శనమిచ్చింది. ఆత్మీయ[గ్రంధి వేసుకొని తానే అదీ, అదే థానూ అవుతున్నాడు. కవి ఉక్తి లక్షణాశక్తిని ఆశ్రయించింది. ఇసుపు పూసింది తరులెల్ల విసరుచుండి “చూపులకు పాలవెన్నెల జున్నుకేరుో “మొగ్గనవ్వి టెక్కలు విచ్చు, పొట్టపగుల నవ్వి శుక్తి ముత్యమ్ములన్ రువ్వు, చెట్లు నవ్వి లేతకెంపుల వాయనంబు లెత్తు శబ్దములు నవ్వి అర్థకోశములు తెరచు” “కలువలు పరచిన కంచుకంచముల 'పెరుగన్నము తినె ప్రియచకోరములు” “పడుచు కరియావులను పిండిన పాలు పోయుచు కలువ కడవల పంచదారను పంచవచ్చెను, చందమామ జగంబునన్ ఈ నూతనాఖివ్యక్తి కవిత్వమంతా పరచుకొని రూపాంతరీకరణం పొందింది వంపువాకిలి, మబ్బుల ముసుగు, సెలయేటి పాట, కన్నెచిగుళ్లు పసుష్పకుంకుము పూలు బండ్లపై తెచ్చితిమి, బంతిపూలరుగు, చేమంతి పూవుల పీట, స్నేహదీపము ఇలా నూతన పదబంధాలు కావ్యాఖివ్యక్తి వేదికను సౌందర్య దేవతా లాస్యవేదికగా కవి ప్రకృతిలోనికి తానై ప్రవహించే సంగమించే ధోరణిని ప్రకటిస్తున్నాడు. తాను తన తనాన్ని త్యాగం చేసి, చివరకు దానిలో సంలీనమై పోయే పరిస్థితి. వ్యష్టి వక
ఆఅ సకుప్పణ వైతన్యం నుంచి సమష్టి చైతన్యం దాకా చేసే ప్రయాణం ఇది. ప్రాచీన కావ్యాలలో వలె అది వర్య వస్తువేమో కాదు తాదాత్య సింధువు. ఆకులో అకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై ఈ అడవిదాగిపోనా గలగలని వీచు చిరుగాలిలో కెరటమై జలజలని పారు సెలపాటలో తేటనై పగడాల చిగురాకు తెరబాటు తేటినై పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గున్తై ఈ తాదాత్య భావన వైయక్తిక పరిమితుల నుండి తన్ను విముక్తం చేస్తున్నది. 'ఆకలా దాకమా చిందలా వంతలా. . . ఏకతమ తిరుగాడి తాను సులభంగా జనసంకుల కల్లోలం నుంచి శాంతమైన ఏకాంతస్థితిని అనుభవంలోనికి తెచ్చుకుంటున్నాడు. ప్రాచీన కావ్య సందోహంలో ఇదంతా ఉద్దీపన విభాగ సామగ్రి. ఇక్కడ ఆలంబన విభావంలో ప్రకృతి ప్రతిఫలించటమూ, తాను పర్యుత్సుకత్వం పొందటమూ జరుగు తున్నది. ప్రకృతి సంబంధంలో పొందిన ఆత్మరమణ భావం - బహిర్ముఖమైనప్పుడు తనలోని ప్రేమలక్షణానికి - అలౌకికమైన ఆలంబనాన్ని వెదుక్కుంటున్నది ఈ ఆలంబనం ప్రేయసిగా భావకవిత్వంలో సాక్షాత్కరించింది. సృష్టిలో పరిణామం వెనుక్క నియతి వెనుక, పురోగతి వెనుక ఒక అంతస్సూత్రం ఉన్నదనీ అది (ప్రేమ అని కాల్పనిక కవులు భావించారు సౌరభములేల చిమ్ము పుష్ప వ్రజంబు చంద్రికల నేల విరజిమ్ము చందమామ ఏల సలిలంబు పారు, గొడ్పేల విసరు ఏల నా హృదయంబు (ప్రేమించు నిన్ను ఈ అన్వేషణలో కవికి ప్రేమయే పురోగామక (ప్రేరణ శక్తిగా సాక్షాత్కరించింది. ఆ ప్రేయసి- 'ఆమె నవనీత హృదయ, నా అంతరంగ శాంతి దేవత అశాపధాంతరాళ పారిజాతము (కేమ జీవన విభాత క్రెశికీగీతి నా తపఃకల్పవల్లి' “ఆమె కన్నులలో అనంతాంబరంబు నీలి నీడలు కలవు * ఆమె గంధర్వలోక నివాసి. సర్వసొందర్య మూర్తి, కారుణ్య దేవత. ఆమె కళ్లు విప్పితే చాలు కనకాఖిషేకాలు సూర్యచంద్ర లోకాల నడిమి శీరాలలో ఆమె యెక్కడో నివసీంచే శశికళ వనములను దాటి వెన్నెల బయలు దాటి తోగులను దాటి దుర్గమాద్రులను దాటి 35
నుత్రుసన్న ఆల పులుల అడుగుల నడుగులు కలుపుకొనుచు రాళ్లవాగు దాటి పథాంతరములు దాటి అచట కిన్నెరసాని, నా యాత్మయందు ఇప్పటికి దాని సంగీతమే నదించు ఆమె సంగీతం తన ఆత్మలో నిరంతరం [మోగుతూ వున్నది. 'ఆమె పదసన్నిధాన దివ్యస్థలాన భక్తినమ్రుడనై నిలంబడిన యపుడు' - కవికి - తన పేదతనము తలపునకు వస్తున్నది. ఈ ప్రణయభావం అనురాగము నుండి సమర్పణం దాకా - సమర్చణం నుంచి ఆరాధన దాకా సోపానక్రమంలో ఎదిగి పోయింది. 'సరస సాంగత్యసుఖ వికాసముల కన్న దుస్సహ వియోగ భరమె మధురము సఖియ' అని వియోగ మాధుర్యాన్ని తలపోస్తున్నాడు కాల్చనిక కవి. అయితే ఈ ప్రణయం కేవలం ప్రాతిభాసిక సత్యమైతే సమాజానికి ఉపయోగ్యత కోలుపోతుంది. వ్యావహారిక సత్యత్వాన్ని పొందటం తప్పని. సరి. అందుకోసం ఈ ప్రణయ కవితామార్గం దాంపత్యధర్మంగా పరిణమించినప్పుడు జీవితంలో స్త్రీ పురుషుల నడును ఒక సౌందర్య ముధురమైన సామరస్యం ఏర్పడుతుంది. ఆ సామరస్యం రెండు విధాలు. ఒకటి కామభావ న్పర్భలేని మధురభావ విస్తారం. స్త్రీ జననిగా, భగినిగా, కుమార్తెగా అనేక భూమికలలో ఉండవచ్చును. సహచరిగా ఉండటం ఒక పార్యం మాత్రమే. సురత సంస్పర్భలేని ఈ శుచిమదమల భావం రాయప్రోలు వారి చేతిలో అమలిన శృంగారమైంది. ఛృణకంకణము, స్వప్నకుమారం లాంటి కావ్యాలు ఈ భావానికి వ్యాఖ్య చేశాయి. కులశుభాంగీ వయోధీర కుసుమయందు మోహమధువె గవేషించె మున్ను నుకని సాత్త్విక ప్రేమకోశ పేశలములయిన వత్సలామృత రుచులనె వలచు నేడు మనసుచే వాక్కు చేత కర్మంబు చేత కలుషితములు కాదగని వీ వలపు లవని తపసుచే తాల్మిచే ధ్యానధార చేత లీనమై యైక్య మాయ జాలినది [్రేమ ఈ అనుభవపరిధిలో ప్రీతి కూడా యోగమే అవుతున్నది. 36
ఆ నదుద్పల సమవయస్ములైన యువతీ యువకుల మధ్య ఈ (ప్రేమ కామభావదూషితం కాకుండా ఉండగలదా అన్నది ప్రశ్న ఎక్కడో తప్ప - మనస్సు చాంచల్యాన్ని మోహ లక్షణాన్ని వదలుకోలేదు. అందువల్ల ఈ భావన ఆచరణలో సఫలం అయ్యే సన్నివేశం అరుదు. స్త్రీ పురుషుల నడమ (ప్రేమ కామభావ న్సర్శపొందినప్పుడు అది వివాహంగా పరిణమించటం, వివాహితలయి (ప్రేమభావం సంపూర్ణంగా వికసిల్లడం రెండూ సమాజ సుస్థితికి హేతువులైన అంశాలే. ఈ దృష్ట్యా ప్రణయాన్ని అమలిన దశనుంచి స్త్రీ పుంసయోగదశ దాకా శిఖరాలకెక్కించి కులపాలికా ప్రణయ సిద్ధాంతాన్ని తన రచనల ద్వారా ప్రపంచించింది విశ్వనాథ. విశ్వనాధ గిరికుమారుని ప్రేమ గీతాలలో ఈ ప్రణయాన్ని పరమోన్నత శిఖరాల పైకి చేర్చారు. ఆయన ప్రతిపాదించిన స్త్రీ పుంసయోగము - గ్రీదమై, శాంతమై, సమాచీన పదంబు దాకా తీసుకువెళ్ళుతుంది. ఈ ప్రేమ యోగము “చేతో మోహకుల్యానదీ మర్యాదా కృతి తీర్చుయోగుమిది. “అమ్లానైక రోధస్కతన్ నిర్యత్ ప్రాణము వేళ జీవుడు చనన్ నిశ్చేయసాధ్వంబునన్ అని ఆ మార్గము. భవభూతి ఈ దాంపత్య ధర్మమును ఉదాత్తీకరించగా, దాని పరమార్థాన్ని ఆధునిక కవిత్వంలోకి కౌస్తుభమణిగా అలం కరించింది విశ్వనాథ. ఈ యోగము మతాతీతమైంది. కర్మకలాపాలకు ఆచారాలకు దూరమైంది. నీవు నాగుండె కదిలించినావు దేవి దేవి, తత్రత్యులగు సర్వదేవతలును అనభిహుతములు హవ్య కవ్యములు పొంది నా అకర్మిస్టిత క్షమించినారు దేవి ఈ సాధననే రాయప్రోలు ఇలా వ్యాఖ్యానిన్తున్నారు. “శుచిమంతమైన మిధునాంతర్మధనంలో చిత్సుభోదయం అవుతుంది. స్మృతిలో అనుజ్వల దీపనంగా భాసిస్తుంది. ఆ భావములు నిలుపుకునే వారు వఏతత్పునరావృత్తిని పర్యుషితంగా పరిత్య జిస్తారు. కాగా జీవిత ఖేలనం తనూత్సంగమును విడిచి భావాంబరంలో విస్తరిస్తుంది.” ఈ ప్రణయ కవితా ప్రవాహం చివరకు ప్రేమ సంగమంలో లయిస్తుంది. “స్నేహ సురత వాత్సల్యముల్ జీవితమున (ప్రేమ కంగంబులగు అంగి (ప్రేమ యొకడె. (పేమశిఖ రావరోవా ణాఖిజ్ఞులైన మృదుసహృదయుల కివి యెల్ల మెట్టులగును'. 37
నువ్రుసనన్న ఆల
ప్రకృతి తాదాత్యభావన ఒకవైపు ప్రణయంగా పర్యసించితే - మరొక వైపు పృథ్వీ ప్రశంసయై - దేశ భక్తి భావనకు క్రోవతీసింది. పృధివియే ప్రత్యక్ష దైవము ఆధునిక కవులకు. ఈ భావనకు మూలం - బుగ్వేదంలోని పృధ్వీసూక్తము. పృథ్విని వేదం తల్లిగా భావించింది. జాతీయోద్యమంలో దేశభక్తి బహుశాఖలయింది. జాతి గౌరవ ప్రశంసగ్గా, ప్రాచీన గాథా స్మరణగా, చరిత్ర మూలాల అన్వేషణగా రూపొందింది. ఒక విషాదరేఖ ఈ కవిత్వం అట్టడుగున ఉన్నా వీరోచితంగా ఉద్యమానికి శ్రేరణ శక్తియై ఉత్సాహస్థాయిలో విక్రమించింది.
ప్రాచీన న్మృతి వంటిదే వ్యక్తిస్టృతి అయినప్పుడు కావ్యం స్మృతి కావ్యంగా రూపొందింది. ఈ స్కృతి కావ్యం - మరణ దుఃఖంతో పూర్తి కాకుండా అపవర్గసాధనగా పరిణమించింది- విశ్వనాథ వరలక్ష్మీత్రిశతిలో, నాయని విషాదమోహనంలో,
కాల్పనిక కవీత్వం - తెలుగు సాహిత్యచరిత్రలో ఒక స్వర్ణకిరణ పరివ్యాప్తమైన దీప్తయుగం. ప్రాచీన కాలంలో పరోక్ష సాధనల "కన్న యోగం కన్న తపస్సు కన్నా, ఆరాధనల కన్నా - ప్రత్యక్షమైన ప్రకృతి, మాతృభూమి, (ప్రేయసి, ప్రత్యక్ష ప్రతీక లయినాయి. ఆత్మాశ్రయ కవిత్వం ఒక ఆత్మీతయను సన్నిహితం చేసింది. ఖండకావ్య (పక్రియ పలుచదనం పొందని సాంద్రకవితా మధువును దగ్గరకు తెచ్చింది. 'తారలన్నను, మణులన్న తనయులన్న వులుగులన్న గీతములన్న వూవులన్న అన్నియును పూవులేయగు”- ఈ విధమైన విలక్షణమైన అంతర్జష్టి కలిగింది.
19వ శతాబ్దపు చివరి దశాబ్దంలో తెలుగు నాటకు గంధర్యులు దిగి వచ్చినారని చలం ఎప్పుడో అన్నారు. కాల్పనికోద్యమ కవిత్వ నిర్మాతలు రాయప్రోలు నుంచి నోరినరసింహశాస్త్రి దాకా ఎంతోమంది గొప్ప కవులు ఈ దశాబ్దంలో జన్మించిన ఒక ఆశ్చర్యం కలిగించే సన్నివేశం.
కాల్చనిక కవిత్వం కలిగించిన తాదాత్మ్యం ఎలాంటిదంటే - తాను కూడా రసభావనలో సంలీనమవుతున్నాడు. కవిత్వము - కవి - సహృదయుడు అనే త్రిపుటి అద్వైతభావాన్ని పొందుతూవున్నది.
ఆకాశవాణి, వరంగల్ ఫిబ్రవరి 8, 2008 38
వచన కవిత్సం
తెలుగుభాషకు సంబంధించినంతవరకు వచనంగా కవిత్వం అవతరించడం ప్రయోగవాదులు చేసిన ప్రయత్నాలకు ఫలం. ఈ ప్రయోగవాదులతో సమాంతరంగా ఉద్యమరూపంలో కవితారచన సాగించిన ప్రగతివాదకవులేమో ప్రజలు పాడుకునే పాటల బాణుల్లో కవిత్వంకూడా ఉండాలనీ అది కర్షకులకు, శ్రామికులకు దగ్గరగా పోవాలనీ ప్రయత్నం చేశారు. కాని ఈ ్రగతివాద కవుల్లో చాలామంది మధ్యతరగతివర్షానికి చెందినవారు కావడం, సామాన్య ప్రజలకు యోజనాలదూరంలో విలసిల్లే ఆంధ్రకవితా సంప్రదాయ కావ్యభాషకు చెందినవారు కావడంవలన, ఇంకా సైద్ధాంతికంగానే కాని హార్టికమైన అనుబంధం ్రగతివాదం ప్రపంచించే శ్రామికవర్గంతో లేకపోవడం కారణంగా ఈ ప్రయత్నం కేవలం సిద్ధాంతరూపం దాటి దూరం రాలేదు.
భావుకవుల కాలంలో బహువిధాల ప్రయోగం పొంది పరిణతరూపాన్ని పొందిన గేయం), స్వాతంత్రోదయవేళ కొత్త కవులకు “ఫాషన్. కాని, భావ కవిత్వం మీద సాగిన తిరుగుబాటులో ప్రయోగవాదులు బాహిరరూపాన్ని మార్చడంలో అనేక ప్రయత్నాలు సాగించారు. శిష్ట్లా ప్రయోగాలు ఈ ఉద్యమపు ప్రారంభ సంకేతాలు. ఈ మార్గంలో శ్రీశ్రీ- నారాయణబాబు - రుక్కిణీనాథ శాస్ర్తి - పఠాభి ఈ నల్గురూ దీనికి ఆధార స్తంభాలుగా ఈ ఉద్యమం కొనసాగింది. మరికొందరు ఈ ప్రయోగాలను కొనసాగించిన వారు కూడా ఉన్నారు.
నలభైలలో వచనకవిత్వం విరళంగానైనా రచన సాగుతూనే వచ్చింది. “జ్వాలిలో ముద్దుకృష్ణ కూడా ఈ (ప్రయోగాలకు స్వాగతం చెప్పాడు. పూర్వతరానికి చెందిన రచయితలు కూడా ఈ మార్గంలో కలాన్ని కదలించారు. చలం “విన్నపాలు ఈ కాలపురచనలే. విశ్వనాథ విప్లవం” అనే పేర ఒకవచన పద్యం 'జ్వాలిలో ప్రకటించాడు.
కొందరు కవులు - చాలామంది ప్రముఖులు - ప్రయోగవాద '్రగతివాద శిబిరాల్లోనూ ఉండటంవలన ప్రగతివాదంలోనికి సహజంగా ఈ వచన పద్యం చొచ్చుకు వచ్చింది శ్రీశ్రీ ఆధివాస్తవికి రచనల్లోనే కాక మహాప్రస్థాన రచనల్లోనూ ఈ వచన
239
సుప్రసన్న ఆల పద్యం చోటుచేసుకున్నది. తరువాత 'నయాగరా” కవులు ఈ మార్గాన్ని ఎన్నుకున్నారు. కొందరు చెదురుమదురుగా రచన చేస్తూనే ఉన్నారు. స్వాతం[త్ర్యం వచ్చిన తరువాత రంగంమీద నిల్చిన కొత్తకవులు దాశరధీ, ఆరుద్రాను. దాశరధి వృత్తాలు, ేయము, వచనము తనపద్యాలకు ఉపయోగిస్తూనే ఉన్నాడు. ఆరుద్ర “త్వమేవాహం”? ఈ మార్గంలో వచ్చిన ప్రయోగశీలకావ్యం. దీనిలో గేయవృత్తాదులు క్వాచిత్మంగా లేకపోలేదు. తెలుగు కవిత్వం ఆధునికతా ము(ఢ్ర సంతరించుకున్నది. - ఇంచుమించుగా ఆరుద్ర 'త్వమేవాహం'లోననే చెప్పాలి. శబ్దం దగ్గర నుంచి కావ్యనమగ్రస్వరూపం దాకా ఏదో కొత్తపద్ధతిని సంతరించే (ప్రయత్నం ఆరుద్ర ఇందులో చేశారు. అయితే ఈ పద్ధతిగా ఆయన చేసిన ప్రయత్నం వెంటనే ఎక్కునమంది పాఠకుల ఆమోదాన్ని పొందలేదు. కాని ప్రయోగాలుగా మాత్రం ఆరుద్ర ప్రయత్నాలన్నీ ఇతర కవులకు కొత్తమార్గాలు పోయేందుకు 'పేరణ నిచ్చినవి. ఇందులో ఆరుద్ర ప్రయోగాలు ఇంకా పెరిగి ఖందెకలుగా కూడా ఎన్నో రకాలు సాగినవి. వచనపద్యం ఒక సుస్వరూపాన్ని సంతరించుకొన్నది. తత్పూర్వం వచన కవిత్వాన్ని గేయగుణం, దానికి సంబంధించిన వాక్య నిర్మాణాదికాలు వదలిపెట్ట లేదు. ఇంతలో దాశరథి రంగంమీదకు విజృంభించాడు. కొత్త ప్రయోగాలు అభివ్యక్తిలో చేసేందుకు ఎక్కున వెనులుబాటు ఉంటుందని ఆయన ఈ రూపాన్ని వాడటం (ప్రారంభించాడు. 'మస్ర్తిష్కంలో లేబరేటరీ” అనే ఒక దీర్ధరచన ఈ మార్గంలో కూడా ఆయన గొప్ప రచనలు చేయగలడని చూపింది. ఈ పద్ధతిలోనే 'పునర్నవం' అన్న పేర ఒక వచన పద్యాల కవితాసంకలనం వెలువరించాడు. ఈ విధంగా యాఖైలో సగం దాటేప్పటికి వచనపద్యం ఒక రూపం సంతరించు కున్నదనే చెప్పాలి. అబ్బూరి ఛాయాదేవి సంపాదకత్వాన “కవిత అనే సంకలనం “వచనపద్యరి బహుళంగా ప్రచురించే రెండు సంచికలు వెలువడ్డవి. ఈ పత్రికకు మొత్తం మీద ప్రయోగవాదులతోడి అనుబంధమే ఎక్కువ. శ్రీశ్రీ- ఆరుద్రలు, అజంతా- బైరాగులు, కుందుర్తి- ఎల్చూరి, వీళ్లేకాక కవిరాజమూర్తి, వరద, తిలక్, రాజశేఖర్ మొదలైన కవులు ఈ పత్రికలో రచనలు చేశారు. నలభైలలో విరివిగా రచనలు చేసిన తిలక్ మధ్యలో ఆగి మళ్ళా యాభైల నడుమ విజృంభించాడు. ఈ కొత్త రచనల్లో ఆయన ఎక్కువ వచనవద్య రచనలు చేశాడు. దాదాపు పదిపన్నెండేళ్లు ఆయన మరణించేదాక సాగించిన ఈ రచనలు వచనకవిత్వానికి ఒక ఆకర్షణ తెచ్చిపెట్టాయి. త0
ఆత సకుప్పీణ సుకుమార పదబంధము, సుందరమైన రూపలకాల పరంపర, వైదర్శ్భీశైలి- ఇవి తిలక్ రచనలు. భావకవుల నాటి కృష్ణశాస్త్రి రచనల్లా ఎక్కువమందిని ఆకర్షించేట్లు చేశాయి. ఈ కాలంలో అజంతా చేసినవి కొద్ది రచనలే అయినా నూతనాభివ్యక్తి లక్షణంచేత చప్పున ఆకర్షించాయి. ఆయన బింబకల్పనవిధానం (ఇమేజరీ) అత్యంత నవీనంగా ఉండింది. బైరాగి 'నూతిలో గొంతుకలు” అనే రచనలో ఈ కాలంలో అంతర్ముఖీనంగా మానవుని వేదనను వ్యక్తం చేసే ప్రయత్నం చేశాడు.
ఇంత రచన జరుగుతున్నా యాఖభైలలో కొత్తకవులు పద్యరచన గేయరచన పుష్మలంగానే చేస్తూవున్నారు. నారాయణరెడ్డి గేయాలలో కథాకావ్య రచన ప్రారంభించాడు. పద్యరూపంలో ఎన్నో ఖండకావ్యాలు ఆధునికమానవుని అంతర్వేదనను వెల్లడించేవిగా వెలువడుతూ వున్నవి. ఎక్కువమంది ఈ రచయితలు మనోమయలోకం నుంచి ఆధ్యాత్మమార్గంలోకి చొరబడే ప్రయత్నం చేస్తూన్నారు.
'నయాగరా'లో వచనకవిత్వం రాసిన నాటినుంచీ ఎన్నో రచనలు చేస్తూవున్న కుందుర్తి రాబోయే కవితారూపం వచనపద్యం అని నిశ్చయించుకున్నాడు. 'తెలంగాణా ఈ కాలంలో చేసిన రచనయే. 'తెలంగాణా' రచనలో వచనకవిత్వానికి ఒకస్థితి కలిగింది. అది ఒక కావ్యస్వరూపాన్ని సంతరించుకొన్నది. ఆ కావ్యం కూడా ఆధునిక అభివ్యక్తితో కధాకథన ప్రధానమైంది కాక, కొత్తరూపకాలతో సన్నివేశాలను, సమస్యలను స్ఫురింప జేస్తూ ఒక రాజకీయోద్యమాన్ని, అంతకంటే బలంగా దానివెనుక ఉన్న సాంఘిక సిద్ధాంతాల బలాన్ని వ్యాఖ్యానిస్తూ ఒక సమగ(గ్రదీప్తితో వెలువడింది. ఇంత కాలంగా సాగిన ప్రయోగాలన్నీ ఒక సార్ధకత సంతరించుకున్నట్లయింది.
కుందుర్తి ఈ రచనలో ఆరుద్ర చేసిన విధంగా ఆంగ్లభాషా గంధబంధురం చేయలేదు. పరంపరగా రూపకాలు వాడుతూ వచ్చినా అవి తెలుగుపాఠకుడికి అతని నిత్యజీవితానికి దూరమైనవి కావు. అంతకుపూర్వం రచనల్లో ఉన్న బౌద్ధిక వ్యాయామం కుందుర్తి చేయలేదు. తెలంగాణాలో తెలుగు జీవితం, నేటి తెలుగు చరిత్ర ఒక విధంగా రూపొందింది. ఈ సఫల ప్రయత్నం చేయడం కారణంగా కుందుర్తి తరువాతి దశాబ్దంలో రూపొందిన వచన కవిత్వోద్యమానికి సారధిగా, ప్రేరకుడుగా నిలబడ్డాడు.
యాఖైలలో రచన ఆరంభించి వచనకవిత్వమే ఆధునిక కవితావాహికగా పనికివస్తుందనే విశ్వాసంతో రచన చేస్తున్న వాళ్లు మాదిరాజు రంగారావు, గోపాలచక్రవర్తి డే
నువుసన్న ఆఅ ఈ ఇద్దరిలో రంగారావు బహుళంగానూ, గోపాలచక్రవర్తి విరళంగానూ రచన చేస్తూ వున్నారు. రంగారావు రచన దాదాపు పదిహేను సంవత్సరాలుగా సాగివస్తున్నది. ఆయన మార్గంలో చేసిన రచన రాశిలోనూ, గుణంలోనూ విశిష్టమైందే. కిర్మీరం దగ్గరనుంచి ఇటీవల వెలువడ్డ 'ముక్తధాత్రి దాకా ఒక్కొక్క రచనలోనూ ఒక్కో విధమైన వైలక్షణ్యాన్ని చూపే లక్షణం ఉన్నది. ఈయన రచనలు ప్రధానంగా భావనా ప్రధానమైనవి. ప్రత్యక్షంగా లోకజీవనం కన్పించదు కాని తనవైన ప్రతీకలద్వారా, లోకలక్షణాన్ని లోతుగా సున్నితంగా వ్యాఖ్యానం చేస్తాడు. ఈయనలో ప్రధానమైన ప్రతీకలు ప్రకృతిలోనివీ, కాలాన్ని చెప్పేవీ ఈ సంకేతాలు అనేక విధాలుగా ఉపయోగించి వందలాది భావాలను అభివ్యక్తం చేస్తాడు. ఈ సంకేతభాషయొక్క పరిజ్ఞానం ఉంటే ఈయనకవిత్వం ఆలోచనామృతంగా పాఠకుడికి దీప్తమైన అనుభూతిని కలిగింపజేస్తుంది మాదిరాజు రంగారావు కవిత్వంలో వస్తువు మానవుడు. ఈ మానవుడు దిక్మాలముల కతీతుడైనవాడు. వాడిలో దేవతలు, రాక్షసులు ఉంటారు. ఈ మానవీయ జీవనం యొక్క వివిధ దశలు మనోలోకంనుంచి కొత్తకొత్త దృశ్యాలుగా చిత్రీకరిస్తూ వుంటాడు కవి. ముక్తకాలనే కొత్త ప్రక్రియను సఫలంగా ప్రవేశపెట్టి వచన కవిత్వంలో నూతనమార్గాన్ని వేశాడు. కుందుర్తి 'తెలంగాణా” వస్తువుగా కావ్యం రాస్తే బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమం వస్తువుగా ఒక చిన్న కావ్యాన్ని రచన చేశాడు. ఇది కూడా ఆయనకు సహజమైన ఆలోచనా (ప్రధానమైన రచనాపద్ధతివల్ల 'తెలంగాణా' లాగా త్వరగా బొమ్మ కట్టడంలేదు. ఆలోచనా లోకంలో రూపొందించుకోవలసిందే. గోపాలచక్రవర్తి ప్రధానంగా చమత్కృతి ప్రధానమైంది. శబ్దాల మీద శ్లేషలు చేస్తూనే ఎక్కడనించో పొంచి ఒక జీవనతత్తాన్ని వ్యాఖ్యానం చేస్తాడు ఇది ఇలా ఈ శతాబ్దపు ఆరోదశాబ్దిం ప్రవేశించింది. కవిత్వానికి వచనమే ప్రధానరూపం అయింది. కొత్తకవులు ఈ మార్గాన్నే స్వీకరించారు. యాఖైలలో రచన ప్రారంభించిన కవులు పద్యాలు గేయాలు రాస్తూ వున్నవారు కూడా క్రమంగా ఈ మార్గంలోకి వచ్చి చేరారు ఈ+ దశాబ్దంలో కవులను స్థూలంగా రెండుమార్జాలలోనివారుగా పేర్కొన వచ్చును ఒకమార్గం అంతరమైన చైతన్యాన్ని, దానిలో వచ్చే సంఘర్షణలను వెల్లడించేదీ; రెండోది బాహిరమైన లోకవృత్తాన్ని వెల్లడించేదీ. లౌకికమైన సుఖదుఃఖాలు ప్రత్యక్షంగా వెల్లడించడం ఈ మార్గంలో ఉన్న లక్షణం. త2
ఆల సకుర్పజ చైతన్యపు లోతులను వ్యాఖ్యానించే కవులు ప్రధానంగా ఆధునిక ఆంగ్లేయ అమెరికన్ కవితా (ప్రభావంతో ముందుకు వచ్చినవారు వర్తమాన కల్లోలనుంచి విముక్తి కోసం మానవుడు చేసే మహాన్వేషణ ఈ కవితాయాత్ర. అందువల్ల ప్రధానంగా ఆధునిక కవిత్వం అంతా బుద్ధిప్రధానమైందే. ఆలోచనలో లోతులలోకి వెళ్ళి దాన్ని సుసూక్ష్మ భేదాలను అందుకుని వ్యాఖ్యానించే ప్రయత్నం జరుగుతున్నది ఇలియట్ నించి ఈనాటి వరకు చాలామంది కవులు ఈ త్రోవలో నూతనావిషారాలు చేసినవారే. కవిత్వంలోనికి ఈ వీధంగా ఆలోచనాశీలమైన ప్రవృత్తి ప్రవేశించింది. మానవుడి భౌతిక, మానసిక, అతిమానస దశల్లో పురోగమనాన్ని ఏకకాలంలో కాంక్షించే వారు కావడంవల్ల లౌకికమైన సుఖదుఃఖాలు పరిధులను దాటని కవుల కన్నా వీరు విలక్షణంగా కానవచ్చారు. అనంతవైవిధ్యం గల అనుభూతులను వివరించే ప్రయత్నంలో వీళ్లు తమ కావ్యభాషను కొత్తగా నిర్మించుకోవలసి వచ్చింది. ఆధునిక శాస్త్రీయ, తాత్త్విక విచారణలో గాఢమైన అనుబంధం ఉండటం వలన ఈ కవులు ఆయోమయంగా భాసించడంలో కొత్తవింతేమీ లేదు. ఈ త్రోవలో రంగారావు మాత్రమే కాక వేగుంట మోహన్ ప్రసాద్, అరిపిరాల విశ్వం, రాధాకృష్ణ, దుర్గానంద్ మొదలైన కవులు మరికొంతమంది రచన చేస్తూ వున్నారు ఈ కాలంలోనే రాస్తూ ఉన్న మిగతా కవులంతా ఇంచుమించు రెండోమార్గానికి చెందినవారుగా పేర్కొనవచ్చును. సి. విజయలక్ష్మి శీలా వీర్రాజు, సి.వి. కృష్ణారావు. దిగంబర కవులు, పేర్వారం జగన్నాధం, నరసింహారెడ్డి, సంపత్ముమార, వరవరరావు, శివారెడ్డి, ముదిగొండ శివప్రసాద్, అద్దేపల్లి రామమోహనరావు- ఇంకా పేర్మొనవలసిన పేర్లు ఎన్నో ఉన్నాయి- మొదలైనవాళ్లు అనేకమంది రచన సాగిస్తూనే ఉన్నారు. అందరినీ ఒక వర్గంగా స్థూలంగా పేర్కొన్నా మళ్ళీ సుసూక్ష్మభేదాలు ఉండనే ఉన్నవి. ఇటీవలకాలంలో బహధా చర్చితమైన ఒక సమష్టి కవివర్గం దిగంబర కవులది వాళ్లు (ప్రధానంగా మొదట్లో, కసితో, ద్వేషంతో, జుగుష్సావహాలైన ప్రతీకలు వాడటంతో ఒక గుర్తింపు పొంది, క్రమంగా మార్చీయ అవగాహనను అంగీకరించి విప్లవకవిత్వమనే కొత్త ఉద్యమం రావడానికి కారణమైనారు. ఈ వర్గం క్రమంగా పాత అభ్యుదయ కవులను త్రోసిరాజని మార్క్సీయ అవగాహన ప్రధానంగా రాసే కవులకు ప్రాతినిధ్యం వహించే సంస్థగా రూపొందుతున్నది ఈ మార్గంలో అంతర్భవించిన కవులు వరవరరావు, విజయలక్ష్మి మొదలైనవాళ్ళు త
నుత్రునన్న ఆఅ అంత గందరగోళం చేయకపోయినా సాహిత్యరంగంలో అందరినీ ఆకర్షించిన సమప్టి కవి కృషి మరొకటి చేతనావర్త సంపుటాలది, మానవుని సర్వతోముఖ పురోభివృద్ధి, (ప్రజాస్వామ్యము, జాతీయ దృక్పథము, ఆధునిక భావచైతన్యం ప్రధాన లక్షణాలుగా ఈ సంపుటాలు ఆధునిక కవిత్వంలో తమ వ్యక్తిత్వాన్ని ప్రధానంగా నిరూపించుకున్నవి. ఇందులో కవుల కంరాలన్నీ ఎవరికీ ప్రతిధ్వనులుకావు తమలో తమకు కూడా. ఇలా ఈ పాతికేళ్ళలో వచన కవిత్వం సాగి సాధించినదేమిటి? అన్న ప్రశ్న ఆలోచించవలసింది. ఇందుకు సమాధానం అంత త్వరలో చెప్పలేం. అయినా స్థూలంగా ఇలా సమీక్షించుకోవచ్చును. తెలుగు కావ్యభాష వెయ్యేళ్ళ తరువాత సంపూర్ణంగా పరివర్తన చెందింది. ప్రజలు మాట్లాడుకునే భాష స్వయంగా కావ్యంలోకి ప్రవేశించింది అభ్యుదయ కవిత్వంనాటికంటే సామాన్య మానవుడి జీవనానికీ, అతని సమస్యలకు విస్తృతమైన వాస్తవమైన ప్రవేశం లభించింది. ఈ శతాబ్దపు తొలి యాఖై యేళ్ళలో కొత్త ప్రతీకలు, రూపకాలు, కొత్త వాక్యనిర్మాణం, నూతనపదబంధాలు- వీటిన్నింటికంటే ఎన్నోరెట్లు అధికంగా ఈ ఇరవయ్యేళ్ళ కవిత్వంలో ప్రవేశించి కవి యొక్క అభివ్యక్తి పరిధుల్ని ఊహించినదానికంటె మిక్కిలి విసృతం చేసినవి. వస్తువు ధార్మిక జాతీయ పరిధులుదాటి అంతర్జాతీయమైంది. ఒకవైపున ఉద్యమతీవ్రతలో నినాదాలు, దూషణలు కవిత్వంగా ప్రకటించడం జరుగుతూ వున్నా మొత్తంమీద అనుభూతి, ఆలోచన ఇవి ప్రధానంగా వాటి తత్త్వాన్ని వ్యాఖ్యానించడం జరిగి కవిత్వానికి బుద్ధిప్రాధాన్యం లభించింది. వచనమే రూపం కావడంతో దాన్ని వచనత్వం నివారించేందుకు కవులు చేసే నానాప్రయత్నాలవల్ల వాక్యనిర్మాణంలో మార్పులు, ఆద్యంత(ప్రాసలు, కొత్త యమకాలు, భాషలోని కాకువు ఇవన్నీ చోటుచేసుకుంటున్నవి. భీమన్న, నారాయణరెడ్డి వంటి పూర్వపుతరం కవులు వచనపద్యమూ సాధన చేస్తున్నారు. వచన కనిత్వం ఖందకావ్యరచనకే కాకుండా కధానిర్మాణయోగ్యమైన కావ్య రూపంగా పరిణతి చెందాలనే ప్రయత్నాలు కూడా సాగినవి. భావన ప్రధానంగా కొందరుకవులు కొన్ని కావ్యాలు నిర్మించారు. శీలా వీర్రాజు కొన్ని కధలను వచనకవితగా సమకూర్చాడు వచనకవిత్వానికి ఒక లక్షణనిర్మాణం చేసే ప్రయత్నము జరిగింది. రమణారెడ్డి, సంపత్కుమార, కుందుర్తి, అరిపిరాల విశ్వం, చేకూరిరామారావు ప్రభృతులు ఈ విషయంలో విస్తృతమైన చర్చలు చేశారు మహతి (భారత స్వాతంత్ర్య రజతోత్సవ ప్రచురణ) యువభారతి 1972 శశీ
తిరుపతి వంఠటకవుల బుద్ధ చరిత్రము శ్రీ తిరుపతి వేంకటకవులు ఆధునికాంధ్ర సాహిత్యచరిత్రలో గణనీయమైన
స్థానాన్ని పొందినవారు. పింగళి కాటూరి కవులు వారిని గూర్చి “అద్యతనాంధ్ర కవిప్రపంచ నిర్మాతలు” అనే పేర్కొన్నారు. “చెళ్ళపిళ్ళ వేంకన గురు వంచు చెప్పికొనగా, అది గొప్ప తెలుంగు నాడునన్' అని విశ్వనాథ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆధునిక సాహిత్యంలోని తొలితరం తెలుగు కవులందరూ ఈ కవి ద్వయం యొక్క ప్రభావాన్ని అంతో ఇంతో పొందిన వారే. కాగా ప్రబంధకాలంలోని పద్యం చిక్కదనంతో ఆలంకారిక మైనది. ఉగ్రేక్షాబహుళమై సామాన్య వ్యవహారభాషకి కాకువుకి దూరమై చిత్రబంధాది కవిత్వంగా మారిపోయినప్పుడు దానిని తమ అవధానాలతో, ఆశుకవితా ప్రదర్శనలతో మళ్ళీ సామాన్య ('ప్రజావ్యవహారానికి అతి సన్నిహితంగా చేసిన ఘనత తిరుపతి వేంకఠకటకవులది.
ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మొక్కగ నిక్కినాము, స
మ్మానము లందినాము, బహుమానములన్ గ్రహించినార, మె
వ్వానిని లెక్క పెట్ట కనివారణ దిగ్విజయంబొనర్చి ప్ర
జ్ఞా నిధులంచు పేరు గొనినారము నీవలనన్ సరస్వతీ !
(నానారాజ సందర్శనము) అని ఘంటాపధంగా తమ విజయాలను పేర్కొంటూ ఉన్న ఈ పద్యం ఎంత వ్యవహార సన్నిహితంగా ఉందో మనం పరిశీలించుకోవచ్చు.
'కవనార్థం బుదయించితిన్ సుకవితాకార్యంబె నా వృత్తి అని స్పష్టంగా పేర్మొని తనమ జీవితమంతా తెలుగు కవిత్వపు వెన్నెల పందిరిగా చేసుకొన్న తిరుపతి వేంకటకవుల కవిత్వం ఈ నాటికీ ప్రాతః స్మరణీయం. 'జెండాపై కపిరాజు “బావా ఎప్పుడు వచ్చితీవు" మొదలైన ఉద్యోగ విజయాలలోని పద్యాలు సర్వజనుల నాలుకల మోద నర్తించుటకు వారి పద్యాలలోని సౌలభ్యమే కారణం, ఈ కవుల జీవితం అవధానాలు, రాజసభా సందర్భనాలు, కవితా వివాదాలు, ప్రతిజ్ఞలు ఎన్నో కలసి ఒక కురుక్షేత్రంగా భాసిస్తుంది. ఈ వాదవివాదాల కతీతంగా శతాధికంగా గద్యపద్యరచనలు, సంస్కృత రచనలు ప్రముఖ
నో
నువ్రునన్న ఆ
స్థానాన్ని ఆక్రమిస్తాయి దేవీ భాగవతాన్ని అత్యంత సరళంగా వారు ఆంధ్రీకరించారు.
భారతాన్ని సంపూర్ణంగా అయిదు నాటకాలుగా రచించడమే గాక, మృచ్చ్ళకటిక, మద్రారాక్షసాలను, సంస్కృతం నుంచి అనువదించినారు. వారు రచించిన ప్రబంధాలలో ఛవజానంద 'ప్రాణిగ్రహీతలు ఆ రోజులలో విపులంగా ప్రచారం పొందినవి. కధలూ, గాధలూ అనే పేర వారు రచించిన వందలాది వ్యాసాలు అచ్చమైన తెలుగు వ్యావహారికంలో గడచిపోయిన విద్యా సాంస్కృతిక జగత్తులను ప్రత్యక్షీకరించే సామాజిక దర్నణాలు.
శ్రీ తిరుపతి వేంకటకవుల రచనలలో విలక్షణమైన రచన “బుద్ధ చరిత్రము” అన్న కావ్యము. ఈ కావ్యాన్ని కొచ్చర్ల కోట వేంకటకృష్ణారావు పేరణతో రచించినారు. దీనికి అశ్వఘోష కృతమైన బుద్ధచరిత్రము, ఎడ్విన్ అర్నాల్లు రచించిన “లైట్ ఆఫ్ ది ఏసియా” అనే ఆంగ్ల కావ్యమూ ఆధారములని తెలుస్తున్నది. ఈ కావ్యము ఆరు ఆశ్వాసాలతో బుద్ధుని యొక్క సంపూర్ణ జీవితాన్ని ఆయన ఉపదేశాలను ఇంచుమించు వేయి పద్యాలలో ప్రకటన చేసే రచన
బుద్ధచరిత్రములో ప్రాచీన ప్రబంధ వాసనలు ఎంతగా పరిమళిస్తున్నా వస్తువు అపూర్వమైనందున ఆధునిక లక్షణాలు కూడా అక్కడక్కడా తొంగిచూస్తూనే ఉన్నాయి. ఆధునిక సాహిత్య విమర్శకులు పేర్కొన్న 'నవ్య సంప్రదాయ'కావ్యంగా దీనిని మనం పేర్ళొనలేకపోయినా వస్తువు దీనిని ప్రత్యేకంగా విచారింప చేసేట్టు చేస్తున్నది. నవ్య సంప్రదాయ సాహిత్యంలో క్షీణ ప్రబంధ నిర్జీవ లక్షణాలను పరిత్యజించి కాల్బనిక కవిత్వం తెచ్చిన నూతన అభివ్యక్తీ ఆధునిక కాలచైతన్యమూ అంశాలైతే, దీనిలో అవి మృగ్యాలే అవుతున్నవి. ఈ భేదాన్ని గమనించాలంటే బుద్ధచరిత్రనూ, సౌందరనందాన్ని గురుశిష్యుల రచనలే అయినా పోల్చి చూసుకుంటే తెలియవస్తుంది.
'బుద్ధ చరిత్ర ప్రథమాశ్వాసంలో కపిలవస్తు నగర వర్జనంతో కావ్యం ప్రారంభం అవుతుంది. సిద్దార్థని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దినపుడు కవులు అతనిలో ఆజన్మ సంస్మ్కారంగా వైరాగ్యం జగత్తత్త జిజ్ఞాస ఆంతర్యమైన విచారణలక్షణం ఉన్నట్టుగా సూచిస్తూ వచ్చారు. గౌతముని తల్లి మాయాదేవిని “నిజముగ కటిక చీకటి నియతికలుగు, కలికి కొలములకే దేవి వెలుగుతెచ్చు మణి” (1-63) అని వర్ణించారు. ఏ వంశంలో గాఢాంధకారం అలమి ఉన్నదో ఆమె అక్కడ రత్నం వంటి స్తీ ఈ ఉపమానం వల్ల మాయాదేవి ఈ సర్వప్రకృతికి ప్రతీక అనుకుంటే, ఆమె జన్మ నీయబోయే మవిోపురుష్తుడు సర్వలోకాల్లోను దుఃఖాలను తొలగించగల జ్ఞాన జ్యోతిని వెలిగించగల మహాపురుషుడని వ్యక్తం అవుతుంది.
కట
ఇటు వికున్పిణు
మాయాదేవికి బుద్ధుడు గర్భంలో ప్రవేశించిన సూచనగా గళగిన కలను కవులు ఇలా వర్ణిస్తారు
షట్మిరణయుక్తమైన నక్షత్ర మొకడు
పాటల ప్రభ దిక్కుల దీటుకొనగ
నాకసమునుండి కుడిప్రక్క దాకి తనదు
గర్భమున జొచ్చినట్టు లక్కల తెఅంగు (౧-65)
నక్షత్రము ఆరు కిరణాలతో కూడు కొనినది అని వర్ణన. అతిరహస్యమైన ఆదిగురుతత్త్వాన్ని ఈ వర్ణన ప్రకటిస్తున్నది. ఆది గురువు సనత్కుమారుడనీ, అంటే స్కందుడనీ సుషుమ్నకు అభిన్నుదనీ రహస్య మార్గాలు వివరిస్తున్నవి.
బౌద్ధకథల్లో శ్వేత వర్ణమైన ఒక యేనుగు మాయాదేవి గర్భంలో ప్రవేశించినట్లు ఆమె కలగాంచినట్లు వర్ణింపబడింది. కాని దానిని ఈ కవులెందుకు పరిహరించినారో తెలియరాదు మాయాదేవి ప్రసవమునకు తన తల్లిగారింటికి బయలుదేరి త్రోవలో లుంబినీ వనంలో బుద్దుని ప్రసవిస్తుంది. ఆ సందర్భంలో ఒక పలాశ వృక్షశాఖను చేతులం బట్టికొని ప్రసవ వేదనా పరవశమై ఉండుపట్టున ఆ పలాశ వృక్షంబు
తన కొమ్మ ల్చిగవంచి యెొల్లెడల చిత్రవ్యాప్తి గావించి సూ
ర్య నిరోధం బొనరించె గొడ్డు గతి నారా! వింత, యా సాధ్విని
ల్చినచోట నృ్మయనీయమట్లు మొలచె న్లే జొంపముల్ పూలు మో
దను నేళొక్కటి వచ్చెదాపునకు నేత్రప్రీతి సంధించుచున్ (1-78)
పరమ(బ్రహ్మణ్యుడయిన బుద్ధదేవుని జన్మవేళలో సర్వ చరాచర జగత్తు ఆ సన్ని వేశానికి ఎలా ఉన్ముఖమయి ఉన్నదో సూచిస్తున్నదీ పద్యము.
సృష్టి పరిణామములో ప్రకృతి అవతార పురుషుని రాకకు సంసిద్ధమై ఉన్న లక్షణమును, ఆయనను ప్రభువుగా అంగీకరించే లక్షణమును ఇది స్పష్టముగా సూచిస్తుంది. అతనిని దిక్పాలకులు బంగారపు పల్లకీలో మోసుకొని కపిలవస్తు నగరమునకు తీసుకొని పోయినాడట, అప్పుడు ఆ నగరములో దేవతలు, మనుష్యులు అనే భేదం తొలగి పోయింది. “అసితుడు” అనే బుషి జన్మించిన సిద్ధార్భుని దర్శనానికి వచ్చి, అతనికి నమస్కరించి నీవు బుద్ధుడవై లోకానికి జ్ఞానాన్ని ఇస్తావు. నేను అతి వృద్ధుడను కావడం చేత నేను ఆ జ్ఞాన సంపదను పొందలేను అని విచారాన్ని వెల్లడిస్తాడు.
త్
నుత్రునన్న ఆ సిద్ధార్థుడు బాల్యంలో వేటకు వెళ్ళిన వృత్తాంతం అతి ప్రసిద్ధమైనది. అతనితో దేవదత్తుడు అనే మరొక రాజకుమారుడు కూడా ఉంటాడు దేవదత్తుడు ఒక హంసను బాణంతో కొట్టగా అది క్రిందపడింది అప్పుడు బుద్ధుడు తన శరీరంలో బాణం గుచ్చుకున్నపుడు ఎంత బాధ గలుగుతుందో, అంతటి బాధను అనుభవానికి తెచ్చుకొని తాను సహజ ప్రాణి హింసాదూరుడగుట చేత దానికి ఉపచరించి, దాని బాధను కొంత ఉపశమింప జేస్తాడు. అరటి మొవ్వు వంటి యయ్యంచ జెక్కల నేర్పుకొలది గేలనిమురుచును వ నౌషధీరసముల నద్దాని క్షతి కొంత యుపశమింప జేసె నృపసుతుండు (11-153) హంస రెక్కలను అరటి మొవ్వుతో పోల్చి మిక్కిలి సహజమైన ఉపమానముతో సొగసును సమకూర్చారు ఈ కవులు. సిద్ధార్థుడు సంపూర్ణయౌవనుడై కూడా సంసార దూర విచారంబున ప్రవర్తించు చున్నప్పుడు వసంతవర్ణన చేస్తా రీ కవులు. వసంతం అతనిలో వైరాగ్య స్థానంలో శృంగార భావాన్ని కలిగించాలి. అయితేనే యశోధరా వివావిీనికి కారణం అవుతుంది. ఆగామి కధానుగుణంగా వాతావరణాన్ని కల్పించడం, వర్ణనలు నిర్వహించడం మహాకవి సంప్రదాయం. ఈ వసంత వర్దన దానికి ప్రబలమైన ఉదాహరణముగా తీసుకొనవచ్చును. లతలన్నియును బుష్పవతులై నగంబుల నంచితంబుగ గౌగిలించుకొనియె మందంబులై మంచి గంధంపు దావితో జెలరేగి నును గాడ్పు లలము కొనియె దోర మగ్గిన పంద్లు త్రోట్ చే గొలుకుచు గొదమ చిల్మల దండు కూయదొడంగె బండుటాకుల మిద బడిన పూవులజాలు పండు వెన్నెల కంటె బండు వయ్యి నాలుమగలెల్ల తెల్లని పూలం జాల లీల లొదవగ జేయు నీరాలలోన జీ8
ఆల నకుప్పబ నించు విల్మాని చెయ్యు లగ్గించుకొనుచు సంతసింపగ సాగెడు సమయమందు (11-177) మరొక పద్యములో అశోక శాఖలు చేతులుగా, మోదుగులు పాదములుగా, నల్లకలువలు కళ్ళుగా, పద్మం వదనముగా, జపాకుసుమములు అధరములుగా, ఇత్యాదిగా కుసుమవన శోభతో వసంత లక్ష్మిని పరమమోహినిగా రూపుకట్టించారు ఈ కవులు. సిద్ధార్థునికి యశోధరకు కలిగిన ప్రధమ సమాగమాన్ని వర్ణించేప్పుడు ధ్యాన నిశ్చలుడైన అతని ఎదుటకు వచ్చిన, ఆ యశోధరయందు అతడు బద్ద్ధానురాగుడైనాడు అంతవరకూ రాజకన్యకలకూ ఏవేవో కానుకలిస్తున్న సిద్ధార్థుడు ఆమెతో “వనజాతేక్షణ కానుకల్ ముగిసె, ఈ వామాక్షులం దేరి కీయని దీ కానుకయంచు” తన మెడలోని పచ్చల హారాన్ని ఆమెకు కానుక చేస్తాడు. ఇక్కడ కవి అత్యంత వైరాగ్య వృద్ధి కలిగిన సిద్దార్ధుడు ఆమె యందు అనురాగాన్ని పొందడానికి పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియ జేస్తాడు. యశోధరా, సిద్ధార్థుల వైవాహిక జీవితము నిర్విశంకంగా కొనసాగలేదు వైరాగ్యభావము ఎప్పటికప్పుడు తన ఆధిక్యాన్ని చూపిస్తూనే వచ్చినది. అప్పుడప్పుడు దేవతలు, రాత్రులలో, కలలలో ఆత్మజ్ఞానాన్ని గూర్చి ప్రబోధింపగా అతడు ఆ మాటలని కలవరించడం, యశోధర జలికి పడిలేచి ఇదియేమి అని అడగడం, అతడు ఏమి లేదని మరిపిసూ ఉండడం జరిగింది. ఇలాంటి సమయంలో దేవతలు తదేక గోచరులయి ఎల్లవేళలా ఇలా ప్రబోధించేవాదు. ఎందులకుం జనించితి, మజేమి యొనర్చుచు నుంటి, జ బందు నహింన యెల్లెడల వ్యాప్తమొనర్పుము, రాయాలి వే బందును నిట్టి సొఖ్యముల యందును మున్లక వ్యద్ధమై లోకులకుం బొనర్సువమా (2-115) డృం దిగద్రావి వైళ ముపకారము లోకి వచ్చిన ప్రతి అవతార దేవతలు ఇలా ప్రబోధించడం వాళ్ళ క జన్మించిన పురుషుని విషయంలో జరిగే విషయము గప వారు వ్యత్రావ్యక్ష్థతిలో నీ (౯| జాన్ మహానుభావుడు సహజబోర్థయై ఉంటారు. ర గృషవో, దేవతా ప్రసారమో, ఊగులాడు తుండగా ఒక విలక్షణమైన సన్ని త్రి
నుత్రుసన్న ఆల వాళ్ళను కప్పిన మాయ పౌరనుండి వేరు చేసి ఆత్మ మార్గంలో ప్రయాణింపజేస్తుంది. శుద్డోదనునికి ఒకానొక రాత్రి ఏడు కలలు కలుగుతవి. ఆ కలలకు పర్యవసితార్థముగా సిద్ధార్థుడు సన్యసించడం తప్పదని తెలుసుకుంటాడు. ఒకచోట మలయ మారుతాన్ని కవులు ఈ విధంగా వర్డించారు.
తంజాపురీ నీలకంజాత నయనల రెండు చెక్కులు పుల్కరింపజేసి
కాంచీపురీ దేశ ఘనసారగంధుల పొలయల్క పెక్కుసారులు హరించి
కర్దాట కామినీ ఘన శిరోరుహములం దసమాన నైగనిగ్యంబుందెచ్చి కుంతల ప్రాంత కర్ణాంతాయతాక్షుల చెలువల కూర్మి హెచ్చింపజేసి యమిత తృష్టార్దిత భుజంగ సముదయ '్ర మద విధానార్హ కుశల సంపదల బొదలి మలయ నిలయ సపటీర్షదుమలయ నిలయ మారుతంబులు చెలరేగి మాసరముగ (3-24) ఈ పద్యంలో శృంగారభావము కడు రమణీయంగా చిత్రిస్తూనే “అమిత తృషార్షిత భుజంగ సముదయము” వంటి పదబంధము వైరాగ్య గర్భత్వమును వెల్లడించింది. ఆ రాత్రి బుద్ధదేవుని మహాప్రస్థాన దినము. ఇక్కడ రాత్రి వర్ణన సుందర కాండలోని రావణ భవనంలోనికి ఆంజనేయుడు ప్రవేశించిన సన్నివేశాన్ని గుర్తుకు తెన్తుంది, అతడు ఆ రాత్రి అందరు నిద్రిస్తుండగా బయలుదేరిన సన్నివేశంలో. అతని మానసిక స్థితిని ఈ కవులెంతో సహజంగా వర్ణించారు.
ఒక కొంతేగును, సంశయించును, సముద్యుక్తత్వముం జెందు వే
టొకకొంతేగు, యథాస్థితిం గను; నిరుద్యోగమ్ము వాటించు; వె
న్మకు దోతెంచుట కిచ్చగించు నట ! సన్యాసార్థియే యౌను గా
కకటా ! యెవ్వని కేని శక్యమగునా? యర్ధాంగి వర్షించుటల్ _ (3-99)
సిద్ధార్థుని ప్రయాణంలో దేవతలు “ఖురధ్వానంబున కస్ఫుటత్వంబు సంధింప అవలీల ప్రాకారములు దాటి శీఘ్రగమనమ్ము నొక మహారణ్యము చొచ్చినాడు.”
- ఇక్కడ గౌతమ బుద్ధునికి చెన్నునికి జరిగిన వివాదము, వారి పరస్పర అనురాగాన్ని చెన్నుని రాజభక్తిని, సిద్ధార్థుని యెడల గల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. చెన్నుడు కంటకాశ్వాన్ని తీసుకొని తిరిగి వచ్చినపుడు ప్రజలందరు రాజపుత్రుడు ఏమైనాడు
ర్0
అని అడుగుతూ సారధి వెంటపడ్డారు. ఇది రాముని అడవికి పంపించి, నుమంత్రుడు రధాన్ని తిరిగి తీసుకొని వచ్చినపుడు అయోధ్యాపురజనుల్లాగా దృశ్యములో పోలికగా కవులు తీర్చిదిద్దినారు.
కంటకాశ్వాన్ని చూచిన యశోధర దుఃఖము ఎవరినైనా కరిగించే విధముగా ఉన్నట్లుగా ఉన్నది.
ఒడలెఅుంగని నిద్రలో నున్నవేళ
జనియె నా ప్రాణనాథుండు నను మొఅంగి
యీవు జెన్నుండు వచ్చితి, రేల రాడు
నా ప్రియుడు చెప్పుమమ్మ? కంటకముకాన !
నడినిశ బాన్పుమోద గరుణామయుడై నిదురించు వాని దా
బుడుతను బుద్ధిలే కడవి మోకల -పాలొనరించి వచ్చియుం
బుడిబుడి యేడ్పు లేడ్చుచును బొంపిరివోవు విచారమున్న త
త్తడి వలె నిత్తటీం బ్రతిపదంబును బొత్తున మోసపుత్తురే (3౩-150, 151)
నాలుగవ ఆశ్వాసంనుంచి కథ సిద్ధార్థుని సాధన వెంట సాగుతుంది. ఒక అనాథ తన కుమారుడు పాముకాటు చేత మరణించినప్పుడు బుద్దుని దగ్గరకు అతనిని కెచ్చి తిరిగి జీవింపజేయుమని అడగడానికి వస్తుంది. ఆమె వస్తున్న సన్నివేశంలో ఈ కవుల చేతిలో కవిరాజ విరాజితం వంటి విశేష వృత్తము కూడా 'కరుణ రసి అభివ్యక్తికి ఆశ్చర్యకరంగా ఒదిగిపోయింది.
భుజము పయి నృత పుత్రకళేబరముం దగ బర్వున మోయుచు మే
నజగజలాడగ గన్నుల బాపష్పపుగాల్వలు భోరున గాజగ న
కృజ మెదనించు వికారమునం “గొడుకా ! కొడుకా ! కొడుకా !” యనుచుం
గుజముల నీడలకుం జనుచుంజనె గూరిన వంత దిగుల్వడుచున్ (4-15)
ఇక్కడ అనేక సన్నివేశాలు బుద్ధదేవుని కారుణ్య దృష్టిని వ్యక్తం చేస్తాయి. యజ్ఞాలలోని జంతుబలిని నిరోధించడం, తన దయచేత సమాజంలోని దుఃఖకారణాలను వెల్లడించి వాటిని తొలగింపజేయడం కార్యంగా కొనసాగిస్తాడు. ఒక గోప బాలకుని పాలు ఇమ్మని అడుగగా, “ఆ పాలు నే దాకితి, నీవు కొనదగద్దుకఅన్తడాసీశరీరమునందు
క5్1
నుత్రునన్ను ఆల
నెత్తురు, నా శరీరమునందు మంచి దుగ్ధములగలవె అని వర్ణభేద విరూపాొన్ని సూచించి బోధించినాడు. ఇది తిరుపతి వెంకటకవుల కాలంలో దేశీయ చింతనలో వచ్చిన ప్రబలమైన మార్పును సూచిస్తుంది.
సుజాత అనే ఒక అమాయకురాలు, ఆమె తాను పూజించే వనదేవతగా
భావించి బుద్ధదేవునకు పాయసాన్ని అందించినప్పుడు
క్రమముగానైన జంతుసారంబు కతన
నీ పదార్థంబు రుచ్యమై యెసగినట్లు
నైకజన్మంబు లెత్తి యనంతరంబ
జీవుడును ముక్తి యను ఘనస్థితికి వచ్చు (4-189)
జీవుడి పరిపాకం ముక్తి హేతువు కావడం ఎంతో అందంగా ఈ పద్యంలో
చెప్పబడింది. బుద్ధుని “మార విజయం” ఆయన జీవనంలోని ఒక ప్రముఖఘట్టము. ఈ ఘట్టాన్ని కవులు యుద్దాన్ని వర్ణించినంత అందంగా గొప్పగా వర్ణించారు. అప్పుడు అతనికి జ్ఞానోదయం కలగడం, దివ్యదృష్టి ఉదయించడం జరిగినది. ఆ దివ్యదృష్టి వలన అయిదువందల పూర్వజన్మల వృత్తాంతం తేలియవచ్చింది. నిర్వాణమార్గము స్పష్టమయినది. వాంఛలే జన్మలకు కారణమని తెలిసి మాయాతీతుడై శరీర సృంధములకు వేరై బంధములకు పట్టుపడక కాలచక్రవర్తనంతో తిరుగుడుబడక సుప్తుడు మేల్మొన్నట్లు, అనిర్వాచ్యమైన నిర్వాణ పదవిని అతడు పొందినాడు.
ఈ విధంగా బుద్ధదేవుని చరిత్రను తొలిసారిగా మధురమైన తెలుగులో ('ప్రబంధంగా మలిచి ఇచ్చిన గౌరవం తిరుపతి వేంకట కవులకు దక్కింది. తాత్త్వికమైన గాంభీర్యంతోను, కథానుకూలమైన వర్దనానిర్వహణతోనూ సరళమైన తెలుగు నుడికారంతోనూ కూడిన వద్యరచనతో కవులు తమ అసాధారణమైన ప్రతిభను ప్రదర్శించారు.
“బుద్ధ చరిత్ర” ఆధునిక యుగంలో తొలి చారిత్రకకావ్యము. దీని తర్వాత ఈ అడుగు జాడలలో ఎన్నో చారిత్రక కావ్యాలు వెలువడినాయి. తెలుగుదేశాన్ని తమ కవిత్వ గంగా ప్రవాహంతో ముంచెత్తిన తిరుపతి వేంకట కవుల బుద్ద చరిత్ర ఈనాటికీ మనం జాగ్రత్తగా అధ్యయనం చేయవలసి ఉన్న అరుదైన మహాకావ్యం.
ఆకాశవాణి, వరంగల్ 19 జనవరి, 1991 క్2
నిజమైన గురదాడ బైతన్యం ఒక రచయిత చైతన్యం ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
- వ్యక్తి సంస్కారము - వాతావరణము 2. సమకాలీన చైతన్యము 3. ఆ వ్యక్తి సమష్టి చైతన్యాన్ని అందుకోవడం, తన వ్యక్తిత్వంలో అన్వయించుకోవడం ఈ అంశాలలో మొదటి రెండు సాధారణంగా స్సురించేవేకాని, మూడో అంశం సమష్టి అవచేతనలో వ్యక్తమయ్యే స్వరూపాన్ని అవగాహన చేసుకోవడం జరిగితేనే అది నిజమైన రూపంలో సాక్షాత్మరిస్తుంది. సమష్టి అవచేతనలోని సంస్కారం రచయిత వైయక్తిక జాగ్రత్రయత్నం లేకుండానే రచనలో నిరూపితమవుతుంది. గురజాడ ప్రధానంగా 19వ శతాబ్దం ఉత్తరార్థంలో జీవించినాదు. అవి భారత దేశంలో పునరుజ్జీవనోద్యమం ముమ్మరంగా కొనసాగుతున్న రోజులు. దానికి రెండు ముఖాలు. ఒకటి 1857 ఉద్యమం యొక్క కొనసాగింపులో దేశ స్వాతంత్ర్యానికి సమగ్ర జాతీయ శక్తుల సాక్షాత్కారానికి జరిగిన మహాప్రయత్నం. రెండోది ఆంగ్లపాలనా సంస్కారాలవల్ల ఆత్మన్యూనతా భావంతో ప్రారంభమై ఆంగ్ల విద్యాప్రాబల్యాన్ని కోరడం, బ్రహ్మసమాజ ఉద్యమం, సంఘసంస్కారోద్యమము మొదలైన రూపాలలో వ్యక్తమైంది. మొదటి మార్గంలో శ్రీ రామకృష్ణుల, దయానందుల, వివేకానందుల ఆధ్యాత్మికోద్యమాలు సంగమించి భారతీయాత్మను పునఃదర్శించే ప్రయత్నం జరిగింది. బంకించంద్రుని రచనలు ఈ ప్రేరణలోనుంచి ఉద్దమించినవే. మొత్తం జాతిని స్వాతంత్ర్య సమరానికి సమాయత్తం చేసిన “వందేమాతరం” ఈ రోజుల్లో ఆవిర్భవించింది. రెండో మార్గంలో ఉద్యమం జాతి పతనస్థితి నుండి ఉద్గతిని పొందేందుకు పాశ్చాత్య విజ్ఞానము, సంస్మారమూ అవసరమని భావించడం జరిగింది. దేశీయ మత స్వరూపాన్ని కూడా క్రైస్తవ మతము మాదిరిలో రూపొందించే ప్రయత్చంం జరిగింది. 'బ్రహ్మసమాజ స్వరూపం ఈ రూపమైందే. మైఖేల్ మధుసూదన్ దత్ వంటి కవులు ఈ చైతన్యంతో పరిస్పందించినవారే. ఈ రెండు మార్గాలు ఇలా ఉండగా గురజాడ మనస్సు రూపొందే రోజులలో ఆయన ఒక జమీందారీలో జీవించాడు. విజయనగరం సంస్థానంలో ఆయన ఉద్యోగి. కప
సువ్రసన్న ఆల ఆ జమీందారీ ప్రభావం ఆయన మీద ఉండటం సహజం ఆనందగజపతి రాజుగారి ప్రోత్సాహంతో ఆయన బ్రహ్మ సమాజంలోనూ, ధియోసాఫికల్ సొసైటీలోనూ సభ్యుడుగా చేరినట్లు చరిత్ర చెప్పుతున్నది తన చైతన్యమూ, తన పరిసరాలు ఆయనకు జమీందారు మీద ప్రత్యయాన్ని కలిగించినవి ఆయన కన్యాశుల్మం రాయడం ఆనంద గజపతి ప్రోత్సాహం తోనే. అట్లాగే ఆయనకు ఆ కుటుంబం మీద ఉన్న భక్తివిశ్వాసాలు నీలగిరి పాటల్లోనే స్పష్టంగా వ్యక్తమవుతవి. ఆ వాతావరణం, ఆంగ్లేయ ప్రభుత్వానికీ, తన జమీందారుకీ ఉన్న సంబంధం ఆ ప్రభుత్వం మీద అమితమైన విశ్వాసం 'ప్రకటించేటట్లు చేసింది. “కన్నుగానని వస్తుతత్వము కాంచనేర్చరు లింగిరీజులు, కల్లనొల్లరు వారి విద్యల కరచి సత్యము గరపితిన్”- “ఆంగిలేయుల ధర్మరాజ్యము జ్ఞానమును స్వాతంత్ర్యమిచ్చుచు సంతతము వర్ధిల్లు గావుత” ఆనాటి ఆంగ్ల విద్యావంతులు సంస్కారోద్యమపరులు అందరూ ఇలాగే ఆలోచించేవారు. వీరేశలింగంగారు కూడా రాజకీయంగా ఇలాంటి అభిప్రాయం గలవాడే. 1915 దాకా గురజాడ, 1919 దాకా వీరేశలింగం జీవించిఉన్నా ఉవ్వెత్తున లేచిన జాతీయోద్యమాన్ని వాళ్లు ఏ విధంగానూ బలపరచలేదు. అందువల్లనే గురజాడ అప్పారావు దేశభక్తి గీతం కూడా దేశ స్వాతంత్ర్యాన్ని కోరే గీతం కాదు. ఆంగ్లేయులు దేశంలోకి తెచ్చిన “నాగరీకరణ” యుగానికి స్వాగతం చెప్పడమే దీనిలోని ప్రధానాంశం. “అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్ దేశి సరుకుల నమ్మవలెనోయ్ డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సంపద లబ్బవోయ్” ఈ గీతం ఆంగ్లేయులు వ్యాపారం ద్వారా దేశాలను ఎట్టా కబళిస్తూ వచ్చారో అలాగే వస్తువుల ఉత్పత్తి ద్వారా, ఎగుమతిద్వారా దేశాన్ని సంపన్నం చేయవలెనని ఆయన భావించడం జరిగింది. అయినా ఆంగ్లేయ రాజ్యం దేశీయ ఉత్పత్తులను ఎగుమతులను ప్రధానంగా దెబ్బతీసిన చారిత్రక సత్యం గురజాడ దృష్టికి రాలేదు ఇక్కడ దేశి సరుకులు పెంచవలె ననడంలో గాంధీజీ నడిపిన స్వదేశీ ఉద్యమచ్చ్భాయ ఏ మాత్రమూ లేదు ఇటు ఉగ్రవాదోద్యమాల యెడగానీ, అటు కాంగ్రెసు వారి ఉద్యమంమీదగానీ ఆయనకు సానుభూతి లేదు. ఒక కాంగ్రెసు సభకు వెళ్లి వచ్చి దాన్ని వెక్కిరిస్తూ గేయం రాసిన సంగతి కూడ మన గుర్తుంచుకోవాలి దేశభక్తి గీతం ప్రధానంగా వ్యక్తిగతమైన సంస్కారాన్ని మాత్రమే కాంక్షిస్తుంది. అది ఆంగ్ల సామ్రాజ్యానికి ఏ హానీ చేయదు కనుక క్
ఆక సకుద్సీఐ దేశం అంటే కేవలం ఒక భౌగోళిక పరిమితి మాత్రమే కాదనీ, ఒక జన సమూహం మాత్రమే కాదనీ కొన్ని వేల సంవత్సరాలుగా పెంపొందించుతూ వచ్చిన సంస్కృతి చైతన్యానికి ప్రాతినిధ్యం వహించే స్థల వ్యక్తి కాలాల సంగమమనేభావం గురజాడకు అంగీకార్యం కాదు ఒకవిధంగా “దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్” అన్నమాట ఈ అంశాన్ని స్పష్టంగా చెప్పుతుంది. సర్వచైతన్య భావపరమేశ్వరిగా దేశాన్ని దర్శించిన వందేమాతరం గీతాన్ని వెక్కిరించడం కూడా ఈ గీత రచనలో గూఢమైన ఉద్దేశ్యం. అందువల్లనే దేశభక్తి గీతం సంకుచితమైన సమకాలీన మానవులను మాత్రమే దేశమని నిర్దేశిస్తుంది “దేశాభిమానం నాకు కలదని . .* ఇత్యాదిగా చెప్పిన అంశం జాతీయోద్యమం యెడల ఆయనకు సానుభూతిలేని లక్షణం స్పష్టం చేస్తుంది. ఈ గీతంలో ఎక్కడా విదేశీపాలన ఎడల నిరాసం లేదు. ఇతర స్థలాలలో ఆంగ్లేయ ప్రభుత్వం చిరకాలం నిలువవలెనని కోరడం, ఈ గీతంలో వదేశీ పరిపాలన పప్రసక్తిలేక పోవడమూ- ఈ రెంటిని సరిగ్గా అంచనా వేస్తే ఈ గీతం ఒక విధంగా ప్రభుత్వ విధేయంగా ఉంటూ వారి పాలనను ప్రోత్సహించుతూ వారి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడమే దేశభక్తిగా కవి ప్రతిపాదించినట్లు గోచరిస్తుంది. అయినా సంస్కారం విషయంలో కూడా గురజాడది పరిమితమైన దృక్చధం మాత్రమే. వీరేశలింగం ప్రధానంగా సంఘ సంస్కారి. ఆయన తన ఈ దృక్పధంతో ఎప్పుడూ రాజీపడలేదు. గురజాడ కన్యాశుల్మంలో అన్ని పాత్రలలోనూ మానవులలోని వెలుగు చీకట్లు ప్రదర్శించాడే తప్ప సంఘ సంస్మ్కారాంశాన్ని ప్రతిపాద్యాంశంగా చూపలేదు. ఇంకా పరిశీలిస్తే గిరీశం పాత్ర ద్వారా సంఘ సంస్మారోద్యమం ఎట్లా విఫలమైందీ నిరూపించడం- ఆయన ఈ విషయంలో నిశ్చయ భావానికి వచ్చాడని చెప్పే అవకావం ఇవ్వడం లేదు. కన్యాశుల్కంలో బాల్యవివాహాన్నీ కన్యాశుల్మాన్ని నిరసించడం కనిపిస్తుంది. విధవా వివాహ విషయంలో ధైర్యంగా పరిష్కారం చూపించలేదనే చెప్పాలి నాటకం చివర గిరీశం టక్కరితనం నిరూపించడం, బుచ్చమ్మ వివాహం విషయంలో అను కూలమైన సూచన ఏమీ చేయకపోవడం ఇక్కడ మనం గమనించాలి. అయితే గురజాడ ప్రధానంగా ఆశించిన సంస్కారం వర్ణభేదములన్నీ మాసి పోవలెననీ, లోకమంతా ఒక యిల్లు కావలెననే అంశం వర్ణభేదనిరాసం మధ్య ర్5్
సుత్రుసన్న ఆస
యుగాలనుంచీ భక్తి ఉద్యమాలలో ప్రసరిస్తూ ఉన్న భావ(స్రోతస్సే అయితే ఆధునిక జీవన పరిస్థితులు ఆ భావాన్ని ఆచరణలో సాధ్యం చేసినవి. ఈ అంశంలో ఆంగిలేయులు, ఆంగ్లేయ విద్యావంతులూ సమభావం కలిగిఉన్నారు. అయితే స్వయంసంపూర్ణమైన (గ్రామీణ వ్యవస్థ ఛిన్నాఖిన్నం కావడం, నూతనమైన భూస్వామ్య వ్యవస్థ ఏర్పడటమూ, తత్ఫలితంగా నాగరీకరణమూ, నూతన వృత్తులూ వర్ణభేద వికాసాన్ని అత్యంతావసరం చేశాయి.
అప్పటికే వర్ణ వ్యవస్థ తన ప్రాధమిక భావాన్ని కోల్పోయి స్వరూప మాత్రంగా నిలచివున్నది. ఈ వర్ణవ్యవస్థలోని ప్రాధమికమైన భావంతో ఆయనకు పేచీలేదు. “విద్య నేర్చినవాడె విప్రుడు, వీర్య ముండినవాడు క్షత్రియుడు అని వర్ణవ్యవస్థ యొక్క భావరూపాన్ని వ్యాఖ్యానించుతారు. ఈ భావచ్యుతి పొందిన వ్యవస్థ తొలగిపోవలెననే అంశం పునరుజ్జీవనోద్యమంలోని రెండు ముఖాలూ (ప్రబలంగా కోరినవే. అప్పటికీ శ్రీరామకృష్ణ, దయానంద, వివేకానందులు వర్ణభేదనిరాసమునూ, అస్పృశ్యతా రాహిత్యాన్ని ప్రపంచించదమే కాకుండా తమ తమ పరిధులలో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. వసుధైక కుటుంబమన్న భావం కూడా వివేకానందులు ఆమెరికాలో చేసిన ఉపన్యాసాలలో స్పష్టంగా ప్రతిపాదించిన అంశమే ఈ సన్నివేశంవల్ల గురజాదలో ముత్యాలసరాలు రాసేనాటికి ఈ రెండు భావాలూ గాఢంగా వ్యక్తం కావడానికి అవకాశం కలిగించినట్లు భావించవచ్చు.
“'ముత్యాలనరా'లన్న ఖండికలోని “జీవితేశ్వరి' ద్వారా గురజాడనాటి సంస్మారోద్యమానికి ప్రతిపక్షాన్ని కూడ మృదువుగా సమకూర్చినట్లు తోస్తుంది. “కలసి మెసలిన యంత మాత్రనె కలగబోదీ డైకమత్యము” ఇది ఆమె మాట, కేవలం పంక్తి భోజనాలు చేయడం ద్వారా ఈ మార్చు రాదు. సామాజిక పరిస్థితులలో సంస్కారంలో మార్పులు రావాలి ఈనాటికీ మన ప్రవృత్తిని 'ప్రళ్ళిస్తున్న ప్రశ్న యిది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కలసి మెలగుతూ వున్నా దేవాలయ ప్రవేశం కలిగించినా ముపష్పయ్యా రేండ్ల తరువాత కూడా ఈ కులపు (వేళ్లు ఇంకా బలపడుతూ వండటం మనం చూస్తూనే వున్నాము ఈ ప్రయత్నాలలో ప్రధానమైంది మానసిక సంస్కారం. అది కలిగించే ప్రయత్నం భక్తి ఉద్యమాలు చేశాయి. వర్గాలలో ఉన్న న్యూనతాధిక్య భావాలమీద దెబ్బతీశాయి. సమైక్యానికి పునాది వేశాయి. సంస్మారోద్యమాలు రాజకీయాల నీడలు పడినాక వాటికి ప్రచారమూల్యం పెరిగింది. భావ పరివర్తన వెనుకబడింది.
క్6
ఆ నకుద్పు ఈ నాగరిక వల్ల వచ్చిన మరో మార్పు సమష్టి కుటుంబ విచ్చేదం. ఈ అంశం కూడా ఈ గీతంలోనే “జీవితేశ్వరి" ప్రశ్నించింది అయితే గురజాడ రచనల్లో కాల్పనికోద్యమ ప్రభావం కూడా బలంగా కనిపిస్తుంది. ఆయన రచనల్లో (ప్రేమ ప్రాధాన్యం స్పష్టంగా పేర్కొనబడింది. “దేశమనియెడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్” అన్నచోట “ప్రేమ కలుగక (బ్రతుకు చీకటి- మరులు (ప్రేమని మది తలంచకు” అంటాడు. “కాసులు” అన్న గీతంలో వివాహవ్యవస్థలో ప్రేమ ప్రాధాన్యం తగ్గిపోవడాన్ని సృష్టీకరిస్తాడు. “మగడు వేల్చ్పన పాతమాటది - ప్రాణ మిత్రుడ నీకు” అని స్రీ పురుషవ్యవస్థలో ఆ యిరువురి సమ ప్రాధాన్యాన్ని వివరిస్తాడు. సతుల సౌరను కమలవనమునకు పతుల (ప్రేమయే వే వెలుగు” అంటాడు. ఈ వాక్యంలోని రూపకం ప్రీ పురుషుల సంబంధాలలోని సామరస్యాన్ని ప్రాధాన్య క్రమాన్నీ సూచిస్తుంది. ఈ గీతంలో “అమలిన శృంగార” భావబీజాలు నిక్షిప్తాలై ఉన్నాయి. | గురజాడ ముందు పేర్కొన్నట్లుగా (బ్రహ్మ సమాజంలోను, దివ్యజ్ఞాన సమాజం లోనూ సభ్యుడుగా ఉన్నవాడే. ఆయన మతవిషయాలలో ఆధునికోద్యమాల ప్రభావం ఉన్నవాడు. కాని నాస్తికుడు కాదు. “మనిషి” అన్న గేయంలో విగ్రహారాధనకు అంటే బాహ్యాచార ఆడంబరాలకు ప్రాధాన్యం యిచ్చి మాధవసేవకు ప్రాధాన్యం యివ్వని మౌధ్యాన్ని తిరస్కరిస్తాడు. మధ్య యుగాలలోని భక్తి ఉద్యమాలలోని ఈ భావం ఆధునిక యుగంలో శ్రీ రామకృష్ణాదుల ముఖాన ప్రస్ఫుటమైంది ఈశ్వరుడు సర్వసంస్థుడు. ఆయన ఉనికిని రాయి రప్పలకూ, కొండ కోనలకూ పరిమితం చేయటం తప్పు. భక్తులకు ఈశ్వరుడు కన్ను దెరచిన కానబడుతాడు. ఈ కన్ను దివ్యచక్షుస్సు. ఎరిగి కోరిన ముక్తిని యిస్తాడు. ఇక్కడి ఎరుక జ్ఞానము, కోరిన భక్తితో చేసే సమర్పణము. అనంత కరుణామయుడైన ఆ ప్రభువు కరిగి- భక్తవశుడై ముక్తినిస్తాడు. ఈశ్వరభక్తి సంబంధించిన సంప్రదాయ రూపకాలు నీలగిరి పాటల్లో స్పష్టంగా గోచరిస్తవి. ఉమాపతి యర్చన అన్న గీతంలో ఉదకమండలం ఉమాపతి అర్చన యెట్లా కోటి గుణితమైన పుణ్యఫల మిన్తుందో సూచిస్తాడు తెలమబ్బులలో ఉదక మండలమే హిమాలయముగా గోచరిస్తుంది. అక్కడి ప్రకృతి అంతా ఈశ్వరార్చనకు సామగ్రి అయింది. ఆ(శ్రితవరదుడైన అంబికారమణుడు రాణిని రక్షించవలెనని ఈ గీతం తాత్పర్యం “చిత్తరువుని చూడ అన్న గీతంలో విష్ణుప్రసక్తి కూడా వస్తుంది. గురజాడ రచనల్లో “కన్యక” “పూర్ణమ్మ” రెండూ గొప్ప గీతాలు. వీటిలోనూ, కన్యా శుల్మంలోనూ అసలు వివాహం ప్రధానమైన అంశం. ఆ విషయం కవిని క్షోభ ర్/
నువ్రుసన్న ఆ పెట్టినట్లుగా గోచరిస్తుంది. ఈ రెండు గీతాలలో దక్షయజ్ఞంలో సతీదేవి దేహత్యాగం 'ప్రాగ్రూపం (ఆర్కిటైప్) పని చేసినట్లుగా గోచరిస్తుంది. కన్యకలో రాజు దక్షుని స్థానంలో ధర్మస్వరూపాొన్ని మరచి అహంకరించి మైమరచిన స్థితిలో గోచరిస్తాడు. అందుకే దక్షయజ్ఞంలో దక్షుని వలె రాజు నశిస్తాడు. పట్నమేలే రాజు పోయెను, మట్ళి కలసెను కోట పేటలు పదం పద్యం పట్సి నిలిపెను కీర్తు లపకీర్తుల్” అని పూర్తి చేస్తాడు. అతని కోట కూలి నక్కల కాటపట్టయింది. అందుకే కన్యక రాజు ఎదురు పడ్డప్పుడు “ఇంటిదైవం వీరభద్రుని దేవళానికి పోయి యిష్టుడె పళ్ళిరం సాగించి వత్తునూ” అంటుంది. వీరభద్రుని పళ్ళెరం అనేది శైవుల యిళ్ళలో శుభాశుభ కార్యాలలో జరిపే ఒక కర్మకాండ. ఈ కర్మలో వీరభద్రుడు విజృంభించి దక్షునియజ్ఞాన్ని విధ్వంసం చేసిన వృత్తాంతం గీత నృత్యాలలో ఖద్గఖేలనంతో స్మరింపబడుతుంది. ఈ లక్షణం వల్ల కన్యకకు సతీదేవితో సామ్యం లభించింది. పూర్ణమ్మ కూడ ఇలాంటి ఇతివృత్తమే ఈ కధలో పూర్ణమ్మ బాల్యం నుంచీ దుర్గ భక్తురాలు. కన్యక కధలోనూ దీనిలోనూ దుర్గాదేవి ప్రసక్తి కనిపిస్తుంది. గురజాడకూ “దుర్గా”దేవికీ ఉన్న సంబంధం ఇంకా లోతుగా పరిశీలించదగింది. ఈ గీతంలో కవికి దుర్గోపాసన విషయంలో ఆసక్తి ఉన్న విషయం స్పష్టంగా గోచరిస్తుంది. గుడి పరిసరాల వర్ణన ఆమె దుర్గమత్వాన్ని (కొండల, కోనల, కొలనుల ప్రసక్తి వలన) సూచిస్తున్నది. ఆమె బంగరు దుర్గ. శ్రీ సూక్తంలో చెప్పబడిన “హిరణ్యవర్దాం హరిణీం సువర్ణ రజత '్రజాం చంద్రాం హిరణ్మయీం” అన్న వర్ణన యొక్క సారమంతా ఈ బంగరు దుర్గ అన్నమాట వ్యక్తం చేస్తుంది. దుర్గ యెట్లా హిరణ్మయో పూర్ణమ్మ కూడా పుత్తడిబొమ్మ. ఈ వర్ణన భక్తునికి భగవంతుడికి కలిగే అభేదాన్ని వ్యక్తం చేస్తున్నది. దీన్నే కంరోక్తిగా పూర్ణమ్మ మరణించి నప్పుడు “కన్నుల కాంతులు కలువల చేరెను, మేలిమి చేరెను మేనిపసల్ హంసల చేరెను నడకలబెడగులు దుర్గను చేరెను పూర్ణమ్మా” అని వర్ణించాడు. పంచభూతాలలో తత్తదంశలు విలీనం కాగా చివరకు ఆమె ఆత్మ ఆమె ఆరాధ్యయైన దుర్గలో ఐక్యాన్ని పొందింది. ఉపాసనా మార్గం విషయంలో కూడా దీనిలో కొన్ని అంశాలు కనిపిస్తుంది. ఏ ఏ వేళల పూచే పూవులు - ఆయా బుతువుల పండే ఫలాలు అన్నీ దుర్గకు ఆమె అర్చించేది ప్రకృతి, కాలము రెంటి సంయోజనంవల్ల కలిగే చైతన్యస్పందం అంతా 58
ఆల నకుర్పణ ఈశ్వరార్చితం కావలసిందేనని తాత్పర్యం. చివరకు దుర్గకు తన్నుతాను సమర్పణ చేసుకొన్న విధానికి ప్రతీకగా ఆమె మెడలో హారములమరెను” అంటాడు కవి ఈ కావ్యంలో అభివ్యక్తమయ్యే పూర్ణమ్మ దివ్యప్రకృతికి సూచనగా ఆమె మృతిని వాచ్యం చేయలేదు. ఒక విధంగా అమె పేరులో ఉన్న పూర్ణశబ్దం కూడా ఆద్యాదేవికి ప్రాగూపంగా గూఢార్థ స్ఫోరకమేమో విచారించవలసి ఉన్నది
ఈ విధంగా విచారణ చేసినప్పుడు గురజాడ చైతన్యంలో ఈ క్రింది అంశాలు
ప్రధానంగా కానవస్తవి.
1 గురజాడ ప్రధానంగా సంస్కారోద్యమంలో 'ప్రభావితుడైనవాడు అయినా ఆ ఉద్యమాలలోని పరిమితులను గ్రహించినవాడు. ఈ రంగంలో మానసిక సంస్కారానికి (ప్రాధాన్యం యిచ్చేవాడు.
-
రాజకీయంగా ఆంగ్లేయ రాజ్యాన్ని అభిమానించేవాదు, ఆంగ్లేయుల సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని (కల్చరర్ ఇంపీరియలిజం) ఆహ్వానించే వాడు. ఆ సామ్రాజ్యం వల్ల దేశీయ (గ్రామవ్యవస్థ ఛిన్నభిన్నమై వృత్తులు కోల్పోయిన ప్రజలు ఎట్లా క్షోభించిందీ గ్రహించినవాడు కాదు. జాతీయోద్యమానికి అనుకూలుడు కాదు.
-
ఆస్తికుడు. మత విషయాలలో నూతనోద్యమాలలోని సమన్వయ దృక్పథాన్ని అనుసరించినవాడు.
4 దేవీ ఉపాసనామార్గంతో తాదాత్యం కలిగినవాడు.
లాలా దప ంయుటల కానన 1984 మార్చిలో గుంటూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఓరియంటల్ కాన్ఫరెన్సు చదివిన వ్యాసం - సాధన, నవంబరు 19 క్క్
రాయప్రోలు వారితో ప్రత్యక్ష భాషణ ఆధునికాంధ్ర కవితా యుగకర్త శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారు సృ నాత్మకంగా తెలుగు కవిత్వంలో నూతన వసంతం తెచ్చినవారు ఆయన భావుకత నవ్యాంధ్ర కవిత్వాన్ని తీర్చిదిద్దింది కవి మాత్రమే కాక ఆయన సారస్వతానుభవం గూర్చి నూతన సమాలోచనం చేసి రమ్యాలోకం - మాధురీ దర్శనం నిర్మించారు. నేను ఆయనతో 1977లో రెండు పర్యాయాలు జరిపిన ప్రత్యక్ష సంభాషణ సం[గ్రహకధనం.
12-2-1977 శనివారం మధ్యాహ్నం రెండు గంటల వేళకు మారేడుపల్లి సికిందరాబాదులో శ్రీ రాయప్రోలు వారిని కలుసుకునేందుకు వెళ్లాను. ఇంట్లో ఒక పడకకుర్చీలో కూర్చుని తమలోతాము ఏదో భావించుకుంటూవున్నారు. ప్రక్కగా ఒక బల్లమీద శీః10100021 112342౧౦ సంచికలూ, కొన్ని సంపుటాలూ, అక్కడక్కడా పద్యాలు గిలుక్కున్న కాగితాలు చెదరి ఉన్నాయి.
అంతర్ముఖులై ఉన్న 85 సంవత్సరాల ఆధునికాంధ్రకవితాయుగకర్తకు నమస్కరించాను. నేను ఆయన్నుచూచి చాలా యేండ్లయింది. అంతకుపూర్వం విరివిగా కలుసుకునేవాణ్డి ఈ నాలుగైదు సంవత్సరాలలో ఆయన దర్శనం చేసుకోలేదు. ఇప్పుడు ఆయనకు చూపు సరిగా ఆనడం లేదు. వినడంలో కూడా యిబ్బందిగానే ఉన్నది. అయినా చూడగానే గుర్తుపట్టారు. లేచారు అభినందనం చేయబోగా పైకెత్తి 'సతాం సద్భిస్సంగః కథమపిహి పుణ్యేన భవతి అంటూ 'శతంజీవి అంటూ ఆశీర్వదించారు.
నేను వచ్చే విషయం నాల్గురోజుల క్రితమే ఉత్తరం రాశాను. ఆయన రమ్మని రాశారు.
ఇటీవల మా స్నాతకోత్సవ కేంద్రం (ఇప్పటి కాకతీయ విశ్వవిద్యాలయం) వెలువరించిన పరిశోధన పత్రిక 'విమర్శినిలో' నా వ్యాసంలో రాయస్రోలువారి అమలిన శృంగార సిద్ధాంతం గూర్చి వ్రాసినది బాగుందని ఆయనకు శ్రీ కొత్తపల్లి వీరభద్రరావుగారు చెప్పారట. ప్రామాణికంగా ఉపనిషద్వాక్యాలు కూడా ఉదాహరింప బడినవనీ ఆయన
చెప్పారట. ఆ విషయం ఆయనకు పరమానందం కలిగించింది. ఎప్పటికైనా సమాన 60
ఆఅ సకుచ్పణ ధర్ముడు కల్గుతాడని తన భావనా లక్షణాన్ని పట్టుకుంటాడనే ఆయన విశ్వాసం నిజమైనట్లు భావించారట. అందుకోసం ఈ వయస్సులో తాను భావించిన అనేకాంశాలను వివరించేందుకు రమ్మన్నానని ఆయన చెప్పారు “మీది పండిత వంశమా? ఇదీ ఆయన మొదటి ప్రశ్న. 'అవు'నన్నట్లు తల ఊపాను. 'అదే అనుకున్నాను. లేకపోతే ఈ విధంగా శాస్తాంశాలను సమన్వయించడం సాధ్యం కాదు” అన్నారు.
శ్రీ సుబ్బారావు గారు తరువాత సమాధానాలుగ్గా చెప్పిన అంశాలన్నీ వరుసగా వ్రాస్తున్నాను “నా తృణకంకణాన్ని అబ్బూరి రామకృష్ణరావు, కట్టమంచి రామలింగారెడ్దికి యిచ్చానన్నాడు అది చదివి ఆయన చాలా మెచ్చుకున్నాడు. నేను మదరాసు వెళ్లినప్పుడు కొమ్మర్రాజువారిని దర్శించాను. ఆయన ఇంగ్లీషు చదువుకున్నా కవితా హృదయం పట్టగలిగిన చతురుడు నా పేరు చెప్పగానే పద్యము చదవమన్నాడు. “అడుగులు బొబ్బలెత్తు మొదటి పద్యం చదవగానే అపమని- 'పమయ్యా ఇందులో అప్పుడే అభిసారికను ప్రవేశపెట్టావ్' అన్నారు. కాదండీ అభిసారిక భర్తను కనుమరిగి ప్రియుని కలుసు కునేందుకు పోతుంది. ఇక్కడ ఈమె ఒకనాటి స్నేహితుని మనస్సులో మాలిన్యాన్ని కడిగివేసేందుకు పోతున్నది అన్నాను. అలాగా గడుసువాడివేనే అన్నారు ఆయన.”
“నాకు చిన్ననాటి నుంచీ ఒక విచారం ఉందేది. ఇదేమిట్రా ఇంట్లో కూడా తరుణులైన స్రీ పురుషులు స్వేచ్చగా నవ్వుతూ మాట్లాడుకునే వీలులేదు. ఎక్కడా ఈ కామసంపర్మం భావించవలసిందేనా అని. నా మనస్సులో “'యధాపస్టీణాం తధావాచాం సాధుత్వే దుర్దనోజనఃి అన్న భవభూతి మాట నిలచి ఉంది.”
“అందుకే ఈ అమలిన శృంగార సిద్ధాంతం పుట్టింది. శాంతినికేతన్ వెళ్ళే టవ్పటికే ఈ భావాలన్నీ నాలో రూపుదిద్దుకొన్నవి. నేను మద్రాసులో 1912 జనవరి నుంచి 1914 డిసెంబరు దాకా వున్నాను లలితలో ప్రేమ మైత్రి వీటి స్వరూపాన్ని చిత్రించాను. తృణకంకణంలో ఈ అమలినశ్చంగార సిద్ధాంతం చెప్పాను. కష్టకమలలో కన్న ప్రేమ కంటే కన్నునగన్న (ప్రేమ గొప్పదనే అంశం సూచించాను. ఈ విషయం మా పిన్ని ఎప్పుడూ అంటూ వుండేది. నాకు తెలుగు దేశమన్నాా ఈ తోటలూ, చెట్లూ పూలు ప్రకృతి అన్నా ఎంతో అభిమానం ఆ అభిమానాన్నంతా తెలుగు తోటలో గుప్పించాను. స్వపష్పకుమారంలో భావ ప్రణయం చిత్రించాను. ఒక కాముకుడు ఉంటాడు అలాగే ఉండాలా- అతన్ని సంస్కరించే వీలు లేదా అంటే వీలు ఉందని ఈ కావ్యం చూపింది.”
61
నుత్రునన్న అల
“ఈ కావ్యాలన్నీ (లలిత 1908లోది) శాంతినికేతన్‌కు నేను వెళ్లడానికి ముందే రాయబడ్డవి. ఆ వూరికి వెళ్లాక ఈ భావాలన్నీ ధృవపడ్డవి అక్కడ వాత్స్యాయన్ అనే ఒక బౌద్ధకాస్త విద్వాంసుడు ఉండేవాడు. అతడు అనేవాడు - బౌద్ధతంత్రంలో సంభోగాన్ని శవాసన స్థలనయోగం అంటారని - ఇది ఒక విధంగా యోగ భంగమే అన్నమాట.”
“తృణకంకణం రాసే రోజుల్లో కురుగంటి సీతారామయ్య, వింజమూరి రంగా చార్యులు, బసవరాజు అప్పారావు రోజూ వస్తూవుండేవాళ్లు. ఆ పద్యాలు చదివి విని ఆనందించే వాళ్లు. సీతారామయ్య మీరు ప్రతీదీ కొత్తగా రాస్తారు. అలాగే ఉండనీండి మార్చవద్దు అనేవాడు బసవరాజు అప్పారావు పద్యము చదువుతూ వెర్రిగా గంతులు వేసేవాడు. రంగాచార్యులు గొప్ప సహృదయుడు.”
“శృంగార వర్ణనకు మనశ్ళుద్ది చాలా అవసరం. అది లేకుంటే అది స్వచ్చంగా ఉండదు. ఎవరినో మనసులో పెట్టుకొని భావ కవిత్వం రాస్తే అది ఉన్నత స్థాయిలో ఉండదు. సి.ఆర్. రెడ్డి అనేవాడు. 104110౪8 2 ౪ంగాం౧ ఆమెను మనస్సులో పెట్టుకొని రాస్తే "04౪1 992 1115 ౧౦01119 506౧10 ౧౦౪69౧ 115 ఇ ₹/20/2%06 ఇ౧౮ 2015 ౧౦౪[)/
“అభినవాంధ్ర పండిత సభ సమావేశాల్లో చర్చలు జరిగిన తరువాత అందరూ ఏదో వ్రాయండి అన్నారు. అప్పుడు రాసింది రమ్యాలోకం. నాటికి నాకు స్రీపుంసయోగ దృష్టి లేదు. అది తరువాత కలిగింది. మాధురీదర్భ్శనంలో దాన్ని గూర్చి రాశాను. కాటూరీ వేంకటేశ్వరరావు నవ్యసాహిత్య పరిషత్ తరపున వేంకటశాస్త్రిగారికి సన్మానం చేస్తున్నామని కవితలు పంపమనీ రాశాడు. పద్యాలు కూడా రాయమన్నాడు. ఆ సందర్భంలో మాధురీ దర్శనం రాయడం అంకితం చేయడం జరిగింది. దాన్లో ఆ పద్యం ఒకటి ఉన్నది.”
“ఈ సంయోగం గూర్చి ఇంకా విచారణ చేయగా దాని విశ్వరూపం చూపే ప్రయత్నం రూపనవనీతంలో చేశాను ఇది అంతా నాటకంగా కనిపిస్తుంది కాని మనో భావాల వర్ణనే ప్రధానం-కథ లేదు వస్తువు లేదు.!
'ఆ మధ్య ఒక అమెరికన్ లేడీ వచ్చింది రెండు రోజులు ఏదో చర్చచేసింది మీరు గంలో ఏవ మార్పులు చేశారు చెప్పమన్నది. మీ 1/6లో నేనేం మార్పు
[1 129 గ౧66 10 ౧6/6 ౧6 10౪61 1/0 ౧0౧) 16 3అ 62
అీల నకుప్పణ 0౪810౧6995 10 ౧6 9౪0 1౧6 80009 0% ౧౮౧655 16 [04500 ౧౮ 16 ౧౪౧౪ |0/ 01116 6౪1౧6 9౧806 ౧ 1౧6 ౧౧౧౬౧ ౧6౬గ౮
“అంగజ-అనంగ శబ్దాలకు ఇక్కడే భేదం (గ్రహించాలి. ఇంకా ఈ శ్లోకం భగవద్గీతలోధి నాకు పూర్తిగా అర్ధం కాలేదు. చిక్కు విడిపోలేదు మీరు విచారించండి.
శోత్రాదీ నింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వాతి
శబ్దాదీ న్విషయానన్యే యింద్రియాగ్నిషు జుహ్వతి-
లే ల జ
ఇక్కడ వారు కొంచెం ఆగి- ఒక రహస్యాన్ని చెప్పారు-
“సాధారణంగా నేను జపం నుంచి బయటపడితే కొన్ని కొన్ని సందేహాలు వాటంతట అవే విడిపోయేవి.' 'శాంతినికేతనం నుంచి వచ్చేప్పుడు కాశిలో నాల్గునెలలు ఉన్నాను అక్కడే పంచాగ్నుల వారితో సహవాసం,”
“వాల్మీకి భూతమయుడు, బుషి వ్యాసుడు [౧౫౪/౧ ౧16! 60[ అవుతాడు కాని అంతటి వాడు కాదు. దేశ దేశాల 10 1106 ని సంపుటీకరించి అనేక పురాణాలు సమకూర్చాడు. వాల్ళీకి భూాతమయత్వం వల్లనే ఆదికావ్యం పుట్టింది. భారతం ఇతిహాసమే కాని ఆదికావ్యం కాదు. రస్సెల్ ఎవరిదో కోట్ చేశాడు. & 018 0001: '5 2 06/36. మొదట జయం అనేపేర యుద్ధం ప్రధానంగా రాశాడు. తరువాత వివిధ వంశావళులు చేరాయి (గ్రంథప్రాచుర్యం యింకా పెరిగింది. ఈ కారణం చేత నాటి విజ్ఞాన సర్వస్వమూ యిందులో చేర్చే ప్రయత్నం జరిగి మహాభారతంగా తయారైంది.”
రామాయణం ఒక భర్తకు ఒక భార్య అనీ, ఒక భార్యకు ఒక భర్త అనీ నిరూపించింది. స్ర్రీపుంసయోగ లక్షణం స్థాపించింది. భారతంలో అనిష్టమైన ఐహు భర్శృత్వం కూడా ఉన్నది.”
“ప్రపంచంలో ఏది ఏమైనా ఎన్ని మార్పులు వచ్చినా స్త్రీ పుసయోగ వ్యవస్థ నిలవాలి. సంతానం లేని స్త్రీ జీవితం పరిపూర్ణం కాదు పురుషుని జీవితమైనా అంతే భవభూతి 'అపత్య సంస్మరణేవ ఉచ్చ్వసిత ప్రస్నుతస్తనీ, క్షణమాత్ర సంసారిణీ సంవృతాసి అని సీతాదేవి చేత అనిపిస్తాడు- ఉత్తరరామచరిత్రలో, సంస్కృత కవుల్లో భవభూతి ఫక్కీ కంరమూ వేరు 'ప్రియప్రాయావృత్తిః అన్న శ్లోకంలో అది పర్యాసిత రసం అన్నాడు అలాంటిమాట ఆయనే రాస్తాడు.”
63
నుత్రునన్న ఆల నాకు సాహిత్య స్థాపక బిరుదం యిచ్చిన సందర్భంలో తాతా సుబ్బారాయుడు శాస్త్రిగారు అధ్యక్షులు. మధ్యాహ్నం విశ్రాంతి వేళలో దంటు సుబ్భావధానిగారు అమలిన శృంగారం మీద కొంతచర్చచేశారు. “వ్యభిచారాదులలో శృంగారం మలినంకాదా? “అవుతుంది అన్నాను నేను. చర్చ విన్న రాయుడు శాస్త్రిగారు సాయంకాలం సభలో నిశ్చయంగా అది ఒక కొత్త మార్గం. శాస్త్రంలో ఏదైనా నూతనాంశం నిషేధమార్గంలో నిరూపితం కాకపోతే తోసెయ్యడానికి వీలులేదు అన్నారు.
నాకు అనుభవం కావాలి. ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడనీ ఇదంతా శూన్యమనీ నే ననుకోలేను. ఈశ్వరుడు సృష్టిబేసి సృష్టిలోనే లయమయ్యాదు. అందుకే నన్నయ్య విశ్వశేయః కావ్యం అన్నాడు. శ్రేయస్సు ఐహికాముషికాలను చెప్పేది. పూర్ణమదః
పూర్ణమిదం అని ఉపనిషత్తు రెంటినీ పూర్ణరూపంగానే చెప్పుతున్నది.”
“కాళిదాసు శాకుంతలంలో శృంగార వైరాగ్యాల కలయిక గొప్పగా ఉంటుంది. బాణుని కాదంబరిలోనూ శృంగారం ప్రక్క ప్రక్కగా మున్యాశ్రమ వాతావరణం ఇ651%1600 ఇగ 2506110 హాతావరణాలు కలిసి ఉంటవి.”
“శృంగారః శుచి రుష్టైలః అన్నారు. శుచి అంటే సూర్యుడనీ, అగ్ని అనీ అర్థం. లక్ష్మీనారాయణుల యందు శృంగారమునూ, వాణీ విధాతలయందు శుచినీ, పార్వతీ పరమేశ్వరుల యందు ఉజ్జ్వలత్వాన్ని లక్షిస్తున్నాను.”
“శాంతినికేతనంలో విధుశేఖర భట్టాచార్యులు, కాళీ మోహన ఘోష్ క్షితి మాహాన్సేన్, నందలాల్ బోస్ మొదలైన వాళ్ల సన్నిధానంలో ఈ రస స్వరూపాన్ని గూర్చి చర్చించి కొంత తెలుసుకొన్నాను. భట్టాచార్య అనేవారు. రసము సంగీతమునకు సంబంధించిందే అని అక్కడి వాతావరణంలో తన్మయులై అక్కడి వాళ్లు పాదుతూవుంటే నాకూ తెలిసింది- శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఘణిః అంటే అర్థం ఏమిటో.”
“'భగ్నావరణం అంటే పొదుగు నుంది రావడం నా ఉద్దేశంలో. భగ్నావరణారత్యా వచ్చిన్నా చిదేవరసః అన్నమ్హుడు రసోవైసః అన్నప్పుడు చిత్, శబ్దాలు'తత్త్వమసిలోని తత్పర్యాయాలే. తత్శబ్దం సః శబ్దమే కాదా అంటే సశబ్దం పులింగశబ్దం కదా అన్నాడు సునీతిబాబు. యోవళ్ళివతమో రసః- ఆపోజ్యోతీ రసోమృతం (బ్రహ్మ అన్న చోట రసశబ్దిము విచారించ వలసినదే అసలు రస స్వరూపంలో శివేతరం అమాంగల్వం లేదు. స్వప్న వాసవదత్తంలో ఇద్దరూ పకశయ్యాతులై కూడా వికారం పొందలేదు.
64
ఆఅ సదముద్పంణ అది అంత 5౮6063 గా చిత్రించ బడ్డది. 0.6 4౧6౫౧౭4౪ అన్నాడు మీ “ఉ654%ఆగయా కు మతమూ గ౧|౦50౧|/ అండగా ఉన్నాయి మాకు లేవు అని, ఇక్కడే మనవాళ్లు (ఆ 1618౧15 0% 2695106౪05 చేరుకున్నారు. ౪/6518గ) ఇ65(1605 లో గఇ౪౩|6 నూ సౌందర్యాన్నీ కలిపారు. నాట్యం నేపథ్య వాద్య గీత అభినయాదులతో రసానుఖవం కలిగిస్తోంది. కావ్యం కేవలం శబ్దం వల్లనే కలిగించాలి.”
“తృణకంకణంలో లీలాదాన దళపుటంబు అన్నచోట లీలాశబ్దం వివరణ ఉజ్వల నీలమణిలో ఉన్నది- 'ఆ ప్రాప్త్రవల్లభ సమాగమ నాయికాయాః సఖ్యాపురో౭త్ర నిజచిత వినోదబుద్యా ఆలాప వేషగతి హాస విలోకనాద్యైః ప్రాణేశ్వరానుకృతి మాకలయంతి లీలా? ప్రాణేశ్వరానుకృతి అన్నమాట లీల అంటే ఆలాపము, మాటా, రాగమూ.'
'నందలాల్ బోస్ మేము వస్త్రం ధరించి స్నానం చేసే స్తీని 1౧౧౮1౧౪ చేస్తాం అన్నాడు.” '“పచ్చనికొమ్మకు కోకిలకు నల్లని కలువకు చల్లని రాజుకు భావ విధాతలకు వాగద్ధములకు”' ఈ భావం ఆధారంగా ఒక నాటకం రాస్తాను. పంపిస్తాను.”
“సి.ఆర్. రెడ్డి అనేవాడు ఏం అలంకారాలయ్యా పెట్టెలో పెట్టుకుని దాచేవి అని. కవిత్వతత్త్వవిచారం కొమర్రాజువారి వద్ద అచ్చు అయేదీ. నేను హ్రప్స్ చూచేవాణ్ణి, కామ(ర్రాజువారు ఎంతో గడుసువారు. ఆ పుస్తకాన్ని ఆయన విజ్ఞానచంద్రికా గ్రంథ మండలి తరుపున అచ్చు వేయలేదు.”
“నేను సంప్రదాయాన్ని బేక్ చేశాను. ఎవరినీ అనుసరించలేదు. నా పాత్రలు అన్నీ కేవలం మనుష్యులు. ఈ శతాబ్దం వాళ్ళు. మంచివాళ్లు. క్రొత్త రూపకం, ఉపమానం వేస్తే అప్రయుక్తం అన్నారు పండితులు. సమాసాలకు అన్వయం లేదన్నారు. నైషధంలో ఇలాంటివి ఎన్నీ ఉన్నాయి. కాంతాసాహచర్యం కేవలం భోగానికే అనే భానమూ ఆభాసయే. సాహిత్యాన్ని నేను అమ్మవారి స్తన్యముగా భావిస్తాను. “తవ స్తన్యం మన్నే నేను ఆదిశంకరుల శ్లోకాల్లో అనువదించిన తొలి శ్లోకం యిదే. తృణకంకణం నేను రాసినప్పుడు దీనిలో ఈ పెద్ద పెద్ద విషయాలు ఉన్నవనే విషయం నాకు తెలియదు. శాంతినికేతన్ వెళ్లాక చదువగా చదువగా ఇవన్నీ నాకు స్పష్టం అయినవి.”
“చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా చిన్న మామయ్య - అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దేవీ మహిమ్నసోత్రం చదువమని యిచ్చాడు. ఇది ప్రథమ దేశిక దూర్వాసో మహర్షి రచితం. దీనిలో మొదటి శ్లోకంలో 'త్రిలోకీ మహాసొందర్యార్షవ మంధనోజ్వుల
65
సుప్రసన్న ఆల
సుధాప్రాచుర్య వర్జోజ్వలం స్వాంతే మేస్ఫురతు త్రిలోక నిలయం జ్యోతిర్మయం వాజ్బ్యయం ఈ వర్ణశబ్దమూ, జ్యోతిర్మయం వాజ్మయం అనడమూ యింకా విచారించాలి. (వ్రీపుంసయోగం అన్న శబ్దం నన్నయ తరువాత మళ్ళీ యెక్కడా కనిపించలేదు. వెతగ్గా సప్తశతి చివరకూడా ఉంది. విచారించాలి. ఇప్పుడు పండితు లందరూ వెళ్లిపోయారు. ఈ తరంలో లోతు తక్కువ. వేదాల తిరువేంగళాచార్యులు గారు గొప్పవాడు. భావుకుడు. అంతటివాడు పోవడం దురదృష్టమే దేశానికి.
నేను యింగ్లీషు విమర్శకులను 10 6౪/కాలేదు. 6956106 01 [0౪6 వాళ్లది వేరు. మనది వేరు. శాంతినికేతనంలో 4/11 పియర్చన్ అన్నాడు సెక్సుయల్ వేరు సెన్సుయల్ వేరు అని”. .
-
- ఇలా ఈ రోజు గోష్టి సాయంత్రం ఐదున్నర గంటలదాకా జరిగింది.
ఖు ఖః క జ
మళ్లీ తెల్లవారి 18-2-77న మధ్యాహ్నం రమ్మన్నారు. ఆ రోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు వెళ్ళాను. ఈ రోజూ అంతే ఉత్సాహంగా ఉన్నారు. కొన్ని ప్రశ్నలు వేశాను ఆయన ఇలా చెప్పారు.
“మళ్లీ ఆంధ్రకవులను 6ఇ591/ చేయాలి. తెలుగు కవిత్వంలో యతి్రాసలు చాలా 6/6. కవి వాటికోసం బాధ పడాలిసిందే. ఇంకే భాషలోనూ ఈ అవస్థలేదు. నాకు వీటిని తగ్గించాలనిపించింది ఆ పద్ధతిలో 'దూత మేఘము” రాశాను తిరుపతిలో పది పద్యాలు రాశాక ఒక పండితుడు వచ్చాడు- ముట్నూరి సంగమేశంగారు. ఆయా పద్యాలు చదివాడు మీకేమన్నా లోపం కనిపించిందా అన్నాను లేదన్నాడు. మళ్ళీ చదవమన్నాను. మళ్ళీ అంటే, అప్పుడనిపించింది. యతిప్రాసలు తెలుగు పద్యానికి లేకున్నా ఏదీ లోపించదు అని. ఛందస్సులో నేను చేసిన ప్రయోగాలు కొద్ది మాత్రమే ప్రాసయతి వాదాను యతిస్థానంలో ఆటవెలదిని సమపాదిని చేశాను. రూపకానువాదాల లో సంస్కృత శ్లోకాలను యథాతథంగా అట్లాగే వాడుక చేశాను- ఏ దేశమేగినా ఎందు కాలిడినా మొదలైన చోట్ల ద్విపదలో ప్రయోగాలు చేశాను. ఈ ద్విపదను చదుప్పదిగా ఒక గౌరవం కలిపించాలని-కాని కొన్ని పాదాలు వరుసగా చదివేసరిక్తి రిడండెన్సు వస్తోంది శివకవులు దీనిలో యిక్కడే దెబ్బ తిన్నారు.
“శృంగార కరుణములే నేను రసాలుగా పేర్కొన్నాను. వీరము అంటే వైరము యొక్కభావము అది రసముకాదు అట్లాగే హాస్యమూ వికార చేష్టాదికము వల్ల వచ్చేది.
66
ఆఅనకుర్పీబ ఇవేవీ ఉదాత్తీకరించలేవు. శాంతము అంటే రసానుభవము తరువాత కలిగే శాంతస్థితి, పరిణతి- అంటే చెరువుల్లో, బావిలో నీరు ఉంటుంది. అది స్థాయిగా ఉండటమే పరిణతి.”
నాకు పెద్ద గ్రంధాలలో నమ్మకం లేదు. ఒక్కో భావం ఒక్కో కావ్యంగా మలిచాను పెద్ద గ్రంధంలో వస్తువు-రసము 661456 అవుతాయని నా భయం. అన్ని రసాలు చి(త్రించాలనే భావం నాకు లేదు. అది నా 8516. 'అనుభవ విషయంలో పుణ్య పాపములకు పార్థక్యమే భావించారు. మన పూర్వులు.” 'సి. ఆర్. రెడ్డి అంటూ వుండేవాడు. ౫/౦౪ గ౧౮51 ౧2౪/6 2 రం10416 ౧6౬/1 |! గగ౧౦%/ | 366 )/04? 1208.”
'మేఘ సందేశంలో ఆరంభంలో ఉన్న జనకతనయా స్నాన వుణ్యోదకేషు అన్నది. యక్షుడు శృంగార విషయంలో సంయమం తప్పాడు. ఆయనకు సంయమం నేర్చేందుకే ఈ వర్ష తపస్య విధించబడ్డది. ఈ విషయం (గ్రహించాలి.”
'ేశాఖిమాన కవిత్వం రాసేందుకు ఈ 'దేశం-నైసర్గిక రూపం, ప్రకృతి పశుపక్షులు-సంస్కారం, సంగీత సాహిత్యాలు, ప్రజలు ఇవన్నీ నాకు ఇష్టం, ఈ భావమే ౧21౯౦0 ౧౦౪1౧/ రాసేట్టుగా చేసింది. దీనిలో ఈర్ష్యకు ద్వేషానికీ స్థానం లేదు. ఈ ప్రయత్నం చేశాను. 'తన గతి అరవజాతిని పాటకులుగా దిద్ది తీర్చించిన తెలుగు జాతి' ఈ పద్యాన్ని గూర్చి ఎ. నీలకంఠ శాస్త్రిగారు- ఆయన తెలుగువారే రాధాకృష్ణన్గారితో చెప్పాడట. ఆయన ఆ విషయం చూడమన్నారు.”
“జీశాఖిమాన కవిత్వం ఎక్కువగా శాంతినికేతనం నుంచి రాశాను “వందే మాతరం' గీతాన్ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేశాను. కాని అది సాధ్యం కాలేదు. సంస్కృతంలో కూడా (ప్రయత్నం చేశాను. ఆత్మనైపద పరస్మైపదలు విపరీతంగా పడేవి తరువాత దాన్ని వదిలేశాను.
౧931606[0/ 00] 886లో చదివే రోజుల్లో ఫిలాసఫీ ప్రొఫెసర్ నరసింహంగారు 0౧౫౫ సుఖం౭గా- గ౮రఖగ! ఇచ్చారు చదువమని ఒక పద్యాన్ని మూలం అనువాదం చేశాను. అది వ్యాప్తిపొంది €.గ. గండీయ/ దాకా వెళ్ళింది. ఆయన నన్ను పూర్తిగా అనువాదం చేయమన్నారు. ఆ పద్యం “ఈ సుమశాఖ చెంగట సఖీ అన్నది. కాశీనాధుని నాగేశ్వరరావుగారు కూడా ఈ అనువాదం పూర్తి చేయమన్నవారే. “రూపనవనీతం మూడు విధాలైన శృంగార స్వరూపం చెప్పటం కోసం రాయబడ్డది. అది మిధునాను రాగంలోనే సంభోగ శృంగొర క్షయాలు కలవనే నా దృష్టిలో నిల్చివున్న ఊహ '
67
నుత్రునన్న ఆల
“శాంతినికేతన్ వెళ్లాక చాలా మారిపోయాను. అక్కడ చెట్లు ఊర్ధ్వ ముఖంగా ధ్యానం చేస్తూ వున్న బుషుల్లాగా కనిపించేవి. పక్షుల కిలకిలారావాలు రవీంద్ర సంగీతం పాడుతన్నట్లు తోచేది. గీతాంజలి అనువాదం చేద్దామనుకున్నాను సాధ్యం కాలేదు. తరువాత దూత మత్తేభం తరువాత శకుంతల, ఉత్తరరామ చరిత్రమూ అనువాదం చేశాను.”
శాంతినికేతనంలో నా ఊహలు అక్కడి వాళ్ళకూ అభినవంగానే కనిపించాయి. విధుశేఖర భట్టాచార్యులు మొదట నాకు రమ్యాణివీక్ష్య పద్యం అః౫1౬1౧ చేశారు. ఈ శ్లోకంలో సౌహృదాని అన్నది ॥9/4/06 అనీ కావ్యశాస్త్ర సర్వస్వం దీనిలో ఉన్నదనీ ఆయన చెప్పారు. సొహృదశబ్దం ఉండటం వల్ల వికారానికి అక్కడస్థానం లేదు భట్టాచార్యులు వదిలేవారు కాదు. ఏమడిగినా నూతనంగా అందంగా చెప్పేవారు. గురుదేవులు కూడా అక్కడికి వచ్చేవారు. అప్పుడప్పుడు. గీ631॥18103 కు [౦౪09 32315 కాదని గురుదేవులు చెప్పేవారు. సురతం కార్యం. దానికి రససంబంధం లేదు. సామగానం మనోహరంగా ఉంటుంది. నేను మా బంధువులు చదువగా వినేవాణ్ణి.'
“ఆంధ్ర యూనివర్సిటీ సిల్వర్ జూబిలీ అప్పూదే నా షష్టిపూర్తి జరిగింది. నేను సన్మానాల్లో డబ్బు తీసుకోను. వాళ్ళేదో వసూలు చేసి మీ పుస్తకం అచ్చేస్తామన్నారు. అప్పుడు పుస్తకం రూపనవనీతం ఉంది. పంపాను. ఆచంట జానకిరాం అధ్వర్యంలో అచ్చు అయింది.” “నిర్గుణోపాసన నుంచి సుగుజోపాననకు 5[%4అయ్యారు మేధావులు. రతి మానుష దివ్య వృత్తాలలో రెండు రకాలు. భోగరతి, యోగరతి, శోకం కేవలం మానుషం. అందువల్లనే దివ్య శృంగారం గల భాగవతాదుల్లో శోకం లేదు. మానుషమైన రామాయణంలో శోకం ప్రధానం."
“మనుచరిత్ర పూర్వ మీమాంసకూ వైష్టవానికీ ఉన్న భేదం తెలిపే కావ్యం. దేవతలకు కామనం తీరాలంటే మానుష సంపర్శం అవసరమేమో? రామాయణంలో మేనకా విశ్వామి(త్రులు. కాళిదాసు ఊర్వశిని భూమి మీదికి తెచ్చాడు. వరూధిని గీర301160/ 4౧ &గ3ఓ ప్రవరుడు కేవలం కర్మిష్టి. అంగభవ శబ్దానికి దైహిక కామమని అర్ధం. దానజపాన్ని పద్యంలోనూ, నభోమణి దాల్చె కషాయ దీధితిన్ అన్న పద్యంలోనూ
అగ్నీ సవిత, ఇద్దరూ వైదిక దైవాలే. వారికే నచ్చలేదు. 'ఆ భూదేవ కుమారుడేగిన' పద్యంలో ఆకాశ దివ్యాకృతిన్ భావంబున నిల్పి అన్నచోట అది భౌతిక శరీరం కాదు. గ౧0౧౧౭౧||౦గ) కలిపాడు- ఒక స్వప్న ప్రాయస్థితి.” (గా నే నో 68
ఆకు నకుచ్చీణ
ఆయనకు సమకాలికులైన కవులను గూర్చి అభిప్రాయం అడుగగా కొందరిని గూర్చి ఇలా చెప్పారు. వేదుల కవిత్వం నాకు చాలా నచ్చుతుంది. అతని కవిత్వం వేషమూ, భాషా రెండూ నాకు నచ్చుతవి. శుచీ రుచీ ఉన్నాయి అతని కవిత్వంలో. వినీతంగా ఉంటుంది రూపుకట్టించడంలో ఘనుడు. ఒకసారి సభలో చెప్పాడు. తృణ కంకణం విన్నాక ఇంటికి వెళ్లి అంతకుముందు రాసిన రెండు మూడు వేల పద్యాలు చించేశానని.
విశ్వనాథ చాలా రాశాడు. ఆ రోజుల్లో ఆంధ్రప్రశస్తి చదివాను. దేశం పులకించింది, నేను వేయిపడగలను వారం వారమూ చదివాను. కిన్నెరసాని విని ఒళ్ళు పిచ్చెక్కి పోయింది. ఏకవీర చాలా గొప్ప దనుకుంటాను. ఆయన రామాయణాన్ని కల్పవృక్షంగా చూచాడు. నాకేమో పాలిచ్చే కామధేనువుగా గోచరిస్తుంది. విడిగా విపులంగా రాస్తాను.
గేయమంటే నండూరి సుబ్బారావుదే. తరువాత ఐసవరాజు. నండూరి ఎంత 8౪96118! అనుభవమో అంత ౪౧ 8అ(౪౬|.
దువ్వూరి - నిజమైన ౧0౪1. 807) 258 & ౧౦౪1, 04110/2166 ౧౦61౧4 తరువాత కీర్తకోసమో ఏమో పండితుడుగా లోకానికి కనబడాలని ప్రయత్నం చేశాడు.
సాధన (మూసపటలైిక) 1981-82 (1984) 69
ప్రణవాన్నీ ప్రణయాన్నీ సమన్నయం చేసిన రాయప్రోలు సుబ్బారావు తెలుగుకవితా రంగంలో ఆధునికతకు జాతీయతకు 'ప్రారంభస్థానం రాయప్రోలు సుబ్బారావు. వెయ్యేళ్ళు బానిసతనంలో నుంచి ఉద్గతమైన దేశాఖిమానం వంగదేశంలో “వందేమాతరం' గీతంగా రూపుకట్ణి వంగదేశం విముక్తి పోరాటానికి ఆలంబనగా రూపొందగ్యా, తెలుగుదేశంలో ఆ ఉద్యమపుబిడ్డగా “ఏ దేశమేగినా ఎందు కాలిడినా అన్న గీత రూపంలో రాయప్రోలు సుబ్బారావు ముఖాన దేశభక్తి కవిత్వం సమగ్ర రూపాన్ని ఆవిష్కరించుకొన్నది. ఆంగ్రేయుల పరిపాలనాన్ని పొగడుతూ. వారి నుస్థిర పరిపాలననూ (ప్రశం సించుతూ “కన్నుకానని వస్తు తత్త్వము కాంచ నేర్చరు లింగీరీజులు అవీ 'ఆంగిలేయుల ధర్మరాజ్యము' చిరకాలం నిలువ వలెననీ - ఆంగిలేయుల సామంతరాజులూ వారి అన్ఫానకవులూ ప్రశంసిస్తూ ఉండగా ఆత్మవిశ్వాసాన్ని దేశప్రజలలో కలిగిస్తూ “లేదురా ఇటువంటి భూదేవి యెందు, లేరురా ఇటువంటి థీరులింకెందు' అనుమానమేలరా అవమానమేలరా భరత పుత్రుడ నంచు భక్తితో పలుక అని ఆకాశమంత యెత్తున పలికిన వైతాళికుడు రాయహ్రోలు సుబ్బారావు, తెలుగు కవిత్వానికి కొత్త ఊపిరిపోసి కొత్త జిలుగునూ వెలుగునూ సంపాదించి పెట్టిన వ్యక్తి ఆయన. గతానుగతికమైన మార్గాన్ని నిరసించి అభినవ కవితా లోకానికి నూతన కవాటాలను తెరచిన మహాపురుషుడు. తొలిరోజులలోనే వేగాతివేగోక్తి దుర్వ్యసనాన్ని నిరసించి రమ్యాక్షర క్షోణికి తెలుగు కవితా స్యందనాన్ని మరలించినాడు రాయప్రోలు సుబ్బారావు. గోదావరిలో స్నానం చేస్తూ నన్నయ భట్టును తనపై ఆవహింపచేసుకుని నవ్య కావ్య ధోరణిని నిర్మించుకున్నానన్నాడు. ఈ పద్ధతిలో ప్రావీన కావ్యస్వరూపానికీ ఆధునిక కావ్యస్వరూపానికీ మధ్య ఎంతో మార్చు వచ్చింది. తొలి కావ్యమైన లలిత (1908)లో కొంత ప్రాచీన వాసనలు ఉన్నా తృణకంకణం (1913) నాటికి ఆధునిక కావ్యస్వరూపం సుసృష్టంగా రూపుకట్టింది. అనసవరమైన వర్ణనాదికము తొలిగిపోయి 70
కాళిదాసుని మేఘసందేశంలాగా వస్తు నిర్దేశంలో కావ్యారంభం జరిగింది. ప్రాచీన కావ్యాలు కొన్నింటిలోని కృత్రిమత తొలగిపోయింది. మూసపోసిన విధంగా ఉండే అంగాంగ వర్ణనలూ క్రీడా పర్వతాదికాలు లేవు కావ్యభాష రాయప్రోలు సుబ్బారావు చేతిలో నూత్నత్వాన్ని సంతరించుకున్నది. ప్రబంధకాలంలో క్లిష్ణతనూ జాటిల్యాన్ని పొందిన తెలుగు కావ్యభాష తిరుపతి వేంకట కవుల అవధానాలలో సామాన్య జనుల సంభాషణల స్థాయిలో వ్యావహారిక భాషలోని సొగసులను, జాతీయాలనూ, కాకువునూ సంపాదించుకొనగా, రాయస్రోలువారి కావ్య సమారంభంలో దానిలోకి రమ్యతా లక్షణం ప్రవేశించింది. (శ్రవణ దారుణములు శిరీష ప్రసన్న భావ బాధకములు రస భంజకములునైన విషమ శబ్ద స్నేహ మనుఘటిల్ల దమృతమయమైన సుకవిసూక్తమున కెపుడు” అని ఆయన రమ్యాలోకంలో 'ప్రకటించినారు. అందువల్ల తెలుగుకావ్య ప్రపంచంలోకి నూతన రూపకాలు శబ్ద సమ్మేళనంలో నూతనత ఆవరించింది. కవిత్వంలో వస్తు వివృతిలో ఏర్పడిన నూతన సన్నివేశాన్ని అందుకొనేందుకు శబ్దం అనంత వైవిధ్యాన్ని పొందింది. 'వాగర్ధశోభన వివృతి వలన శబ్ద్బనాద మనంతమై శాఖ సాగె.” రాయప్రోలు వల్ల ఆయనను అనుసరించిన కవి పరంపర ఒక విధంగా రౌచికులయినారు. వాళ్ల రచన అంతా “రుచిర ప్రసన్న పద మృదూపగూహన శయ్య'గా రూపొందింది. దేశంలో అత్యంతోజ్వులంగా కొనసాగుతూ వున్న స్వాతంత్రోద్యమం ఈ కవికి “మహితాభఖిమాన దివ్యదీక్షా సుఖ స్ఫూర్తి”నిచ్చింది. “ఏపూర్వ పుణ్యమో ఏ యోగబలమొ జనియించినాడ వీ స్వర్గఖండముని అనీ, శ్రీలుపొంగిన జీవగడ్డ అనీ చరిత్రలోని వైభవ నన్నివేశాలను సాక్షాత్కరించుకొని ఒక వినూత్న కాల్చనికావేశాన్ని పొందినారు రాయప్రోలు సుబ్బారావు. దేశచరిత్ర మహాపురుషుల వ్యక్తిత్వము ఇలాంటి అంశాలు ఆయనకు కవితా వస్తువులైనాయి. “చావలేదు చావలే దాంధ్రుల మహోజ్వల చరిత్ర అని వర్తమానమును చరిత్రతో అనుసంధించి ప్రశంసించి (ప్రేరణ కల్గించే ధోరణిని ప్రారంభించినారు ఆయన. కాల్పనికోద్యమాన్ని అభినవ కవితగా రూపవుకట్టించిన రాయప్రోలు - స్వాతంత్రోద్యమము, స్త్రీ పుంసయోగము ఈ రెండూ కవిత్వంలో ప్రధానాంశాలుగా చేసుకున్నారు. 'కానబడక అనుమాన ప్రమాణమునకె అంది అందని పరతత్త్వమవల క!
నుత్రునన్న ఆల
నుంచి పంచభూత భాసితమైన ప్రకృతి కళనె సన్నిహిత లక్ష్యమని నిర్దేశించుకున్నారు. ప్పధ్విని ఉపాసించడం ఈ జగత్తును ఈశ్వరుని విభూతి విశేషంగా భావించడంవల్ల ఆయనకు సిద్ధించింది. అట్లాగే ఆయనకు మాతృభాషకూడా తపోభూమి అయింది. 'భాషకంటె నవ్యులకు తపస్సులేదు.” అయితే రాయప్రోలు తాత్త్వితకు ఇంకా బలమైన భూమిక ఆయన భావించిన ప్రణయ స్వరూపము, ప్రాచీన సాహిత్యంలో శృంగారం క్రమక్రమముగా పతనమైన దైహికమైన అనుభవ పార్యంతికంగా పరిణమింపగా, దాన్ని మళ్లీ అమలినంగా రూపొందించిన స్థితి ఆయనదే.
స్రీ పురుషులనడిమి సంబంధం కేవలం కాముకమైందే కాదనీ, అది సర్వతో ముఖమనీ సమవయస్కుల నడుమ స్నేహం అమలినంగా దేహసంబంధ దూషితం కాకుండా ఉండవచ్చుననీ ఆయన ప్రతిపాదించారు అనురాగము మనకావ్యములలో వలె సంభోగ పరిణామము పొందనక్కరలేదు. “విషయేంద్రియ భోగముకాక భావాత్మక మయిన స్నేహయోగంగా పరిణతమౌతుంది. దీనిని అమలిన శృంగారమని సంకే తించితిన అంటారు ఆయన మనస్సు చేత వాక్కుచేత కర్మము చేత ఈ వలపు కలుషితం కాకూడదు. 'తపసుచే తాల్మిచే ధ్యానధారచేత లీనమై ఐక్య మీయజాలినది - (పేమ - అని ఆయన ప్రేమను నిర్వచించారు.
ఈ ప్రేమ సమవయస్కులయందు స్నేహంగా, పెద్దబయందు పిన్నలయందు వాత్సల్యరూపంగా, దాంపత్యమందు సురతంగా దర్శనిమిస్తుంది. ఈశ్వరుని యందు ఇది భక్తి అవుతుంది. ఆధునిక భావకవులు తమ (ప్రేయసులను వర్ణించినా కులపాలికలను వర్ణించినా వారి అలౌకిక సౌందర్యాన్ని వర్ణించారేకాని దైహికమైన మోహాన్ని రెచ్చగొట్టే వర్దనలు చేయలేదు. ఈ మనోహర సుకుమార ధోరణి రాయప్రోలు వల్లనే సాధ్యమయింది. ఆధునిక కవిత్వంలో స్తీ “జననీ, భగినీ, సహచరీ, కుమారీ, క్రమముని దర్శనం యిచ్చింది తల్లిగా, ధాత్రిగా, దేవతామతల్లిగా రూపొందింది ఆధునిక సాహిత్యంలో రాయప్రోలు సాగించిన ఈ స్త్రీ పుంసయోగ వైలక్షణ్యం తరువాత సాహిత్యంలో సమాజ మూలమైన స్రీ పురుష సంబంధాలను విస్పష్టంగా సమస్థాయిలో చర్చించటానికి దోహదం చేసింది.
తెలుగు కవితా రంగంలోకి ప్రవేశించిన పాశ్చాత్య కావ్య తాత్త్విక వస్తు
సంబంధి, రూప సంబంధి ధోరణులను భారతీయ జీవన భూమికకు సమన్వయించిన
వైదుష్యం రాయప్రోలు వారీది ఆయన గొప్ప కవిగానేకాక కావ్యతత్వ వివేచకుడుగా
ఆధునికాంధ్ర సాహిత్యంలో ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తి. ఆధునిక కవితా స్వరూపాన్ని 72
ఆహ నకువ్పీణ సరిగా అంచనా వేసుకోవడానికి ఆయన “రమ్యాలోకం' రచించారు. “పూర్వ లక్షణముల దిద్దుబుద్ధిలేదు అతినవీనముల్ శాసించు సహముకాదు” అని 'మామిడి కొమ్మపైన కలమంత్రపరాయణుడైన కోకిలస్వామికి మొక్కి ఈ అభినవ స్వర కల్పన కుద్యమించితిన్'
- అని తన దృక్పథాన్ని స్పష్టం చేశారు. తరువాత 'మాధురీ దర్శనంలో దీనికి పరిణతి, సమగ్రతా ఏర్పడ్డాయి సామాన్య మధ్యకుటుంబంలో 1892లో 13 మార్చిన పుట్టి, మేనమామగారైన పిశుపాటి చిదంబర శాస్త్రిగారి సాహచర్యంలో పాండిత్యాన్ని సంపాదించుకొని, ఒక విలక్షణమైన తాత్త్విక జిజ్ఞాసతో ఆధునికాంధ్రకవిత్వానికి సంపూర్ణంగా వినూతన రూపావతారాన్ని కలిగించారు ఆయన. రవీంద్రుని సాన్నిహిత్యంలో ఆయన దార్శనిక పరిధులు విస్తరించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్ర భాషా సాహిత్యాల శాఖను ప్రారంభించారు. నైజాం కొలువులో పరాధీనస్థితిలో ఆయన గొంతులో కావ్యధోరణలు సంకుచితాలైనా, కావ్య దర్శనంలో ఏ మాలిన్యమూ ్రవేశించలేదనే అనిపిస్తుంది.
అనేక ఖండకావ్యాలు - లలిత, తృణకంకణం, స్నేహలత, కష్టకమల, స్వప్న కుమారము, ఆంధ్రావళి, జడకుచ్చులు మొదలైనవి - రమ్యాలోకము, మాధురీ దర్శనం వంటి కావ్యతత్వ దర్శన (గ్రంధాలూ - అనేక గ్రంధాలకు అరుదైన పీరికలూ ఆయన రచించారు. శాకుంతలాన్ని ఉత్తర రామచరిత్రనూ తెలుగుచేశారు. క్రమంగా రాయప్రోలు వారు ప్రతిపాదించిన ప్రేమ సిద్ధాంతం ఆయనలో భక్తి భావంగా రూపొందింది. చైతన్యుని సంప్రదాయంలోకి ఆయన ఆకృష్ణులైనారు. “రాస పంచాధ్యాయిని' తెలుగు చేశారు. వాల్మీకి మీద ఉన్న భక్తి కారణంగా సుందర కాండనూ తెలిగించారు. క్రమంగా అంతర్ముఖత్వాన్ని పెంచుకున్నారు. అంతరమైన లలితోపాసననూ, కృష్ణమయమైన రాసలీలా విశ్వ ప్రదర్శననూ ఆయన తన సాధనలోని సోపాన పంక్తికి ఇరువైపులా ఆలంబ(్రేణిగా నిలుపుకున్నారు.
'వణవమూ, ప్రణయమూ యోగుల సాధనలోనివే. శారీరకంగా సంయ మనములో అనుతప్రమైన యింద్రియ చాలనం ప్రణయ రూపమును పొందింది. ఇంద్రియాతపములో ఉన్నుక్తమైన విషయ సహస్రారస్పందం ప్రణవరుచిగా భాసించింది. ఒకటి అంగజాతము, ఒకటి భావభూతము' (రూప నవనీతము) ఈ విధంగా రాయప్రోలు తన జీవితంలోనే భావభౌతిక లోకాలకు ఒక వంతెన నిర్మించుకున్నారు.
మధుకోశం - శ్రీ జి. పుల్లారెడ్డి అమృతోత్సవ సంచిక 1995 73
వరాట్టురుషుడు జీవితం ఒక సుదీర్ధయాత్ర, నిరంతర అన్వేషణ. ఒక అభ్యాసం. అపరిపూర్ణత నుంచి పరిపూర్ణత వైపుగా చేసే ప్రయాణం. ఈ పరిమిత జీవితానికి అపరిమితమైన శక్తిని కలిగించేదీ. వెలుగును విస్తరింపజేసేదీ విలువను కలిగించేదీ మహాపురుష సందర్శనం, ఈ మహాపురుషుడు గురువు కావచ్చు, ప్రాణదాత కావచ్చు, జీవన పరమార్ధాన్ని విప్పిచెప్పే వ్యాఖ్యాత కావచ్చు. ఒక ఆశ్చర్యం కలిగించే ప్రభావ పరిదిలో నీ చైతన్యాన్ని పరిపాలించే ప్రభువు కావచ్చు. తాత్త్వికుడు కావచ్చు. సాత్త్వికుడు కావచ్చు కవియో, కళా కారుడో, శిల్పియో, గాయకుడో కావచ్చు. యోగి కావచ్చు ఎవరైనా ఒక విలక్షణమైన శక్తి స్పందంచేత సన్నిహితుడైన వాని పాత్రతను బట్టి ఊర్థ్యముఖంగా, దివ్యముఖంగా పరిణమింపజేసే వాడై అతని జీవనరథానికి సారధి అవుతాడు. మహాపురుషుల పరిచయం, సాన్నిహిత్యం, అత్యంతం ఆశ్యర్యాన్ని కలిగించే వారి వ్యక్తిత్వం పార్శ్వాలను దర్శించగలుగటం ఒక విశేషం వారి (బ్రతుకులో, అన్ని విబ్చియార్లకూ, భావలోకంలో ఇంద్రధనూవర్ణశబలతకూ నడుమను వైరుధ్యాలు అసంపూర్ణతలు కూడా ఎంతో విలువైనవి. ఆ మవిప్పరుషని నిర్యాణం తరువాత పాతికేంద్లు గడచిన తరువాత కూడా ఆ వ్యక్తిత్వంలోని మణిభంగదీస్తులు ఇంకా ప్రకాశిస్తూనే ఉండటం ఎంత అద్భుతమైన అంశమో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ మహాపురుషుని ముద్ర జీవితంతో విడదీయరానిడై ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ వుండటం మన ట్రతుక్కు ఒక విలువను సంపాదించటం, స్మరించుకోవటం మనకు ముఖ్యమైన అంశమే. నా జీవితంలోనూ ముగ్గురు మహాపురుషుల సంసర్గం లభించింది. ఒకరి పరిచయం కేవలం పరోక్షమైంది. భావరూపమూ, వాజ్ఞయరూపమైంది. ఇరువురైతే భౌతికంగా నా జీవిత పధంలో నడిచిపోయారు, పోతున్నారు. అలా నా జీవన పరిధిలో సాగిపోయిన మవోనీయులు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు ఆ సాగిపోయిన సన్నివేశాలు, అవిస్మరణీయుములైన ముద్రలూ చెప్పుకోవటం ప్రారంభించితే అది ఒక (గ్రంధమే అవుతుంది. 74
ఆ సధుచ్పీణ ఆజానుబాహుడై చూపులతో వాక్కులతో ఎవరికైనా ఆకర్షించగల ఆ మవాత్ముణ్ణి 1951లో తొలిసారి వరంగల్లుశాఖ ఆంధ్రసారస్వత పరిషత్తు వార్నికోత్సవాలకు వచ్చినప్పుడు చూడటమే అప్పటికి ఆయన సాహిత్యాన్ని గురించి కొంచెం కొంచెం తెలుసు ఆరాధన కానంత అభిమానం చిట్టిగూడూరులో ప్రాచ్యకళాశాలలో 1949 నుంచీ చుదువుతున్న మా చిన్నాయన శ్రీ సంపత్ముమారాచార్యుల గారి వల్లనే ఈ పరిచయం అప్పుడు మూడో, నాలుగో ఉపన్యాసాలు వినటం జరిగింది. ఆయన భౌతిక వ్యక్తిత్వమూ, సారస్వత వ్యక్తిత్వమూ జమిలిగా అవిభాజ్యంగా తోచి రసప్రపంచంలోకి సాగిపోయే అవకాశము లభించింది. - అమృతసమమైన ఆ రసప్రపంచంతో నన్నయ తిక్కనలూ, శ్రీనాధ పోతనలూ, రాయలు పెద్దనలూ సంగమించిన విలక్షణత దర్భ్శనమిచ్చేది. అయినా ఇన్నింటినీ మించిన, మనకు వ్యక్తావ్యక్తంగా అతీతమైన చైతన్య శిఖరం కనిపించేది. ఒక రవీంద్రుని, ఒక వాల్మీకినీ చూడలేదన్న కొరత ఎప్పుడూ జీవితంలో అనిపించలేదు. నా ప్రపంచంలో ఆయన ఒక మిన్నుల వాన, తేనెలమబ్బు, తట్టుకోలేని తుఫాను
వ్యక్తిగతంగా ఆయనలో పసిపిల్లవాడికుందడే అమాయికత, అమృతమయమైన హృదయం, తొందరలో కటువుగా మాట్లాడినా ఎవరినీ ద్వేషించలేని హృదయం, ధనాన్నీ కీర్తిని వద్దనకపోయినా అంతస్సులో నెలకొని ఉన్న నిజమైన వైరాగ్యం, అలిప్తత, 'సమానానాం ఉత్తమ శ్లోకత్వం” - ఇవన్నీ ఆయనలోని మరొకపార్వం.
ఈ రెండు వ్యక్తిత్వ పార్గ్యాల మధ్య అత్యంతికమైన వైరుధ్యం ఏమీలేదు. మానవ సహజములైన కొన్ని బలహీనతలు ఉండటం వాస్తవమే అయినా జీవితానికి మకుట ప్రాయాలైన బెదార్యము, క్షమ, దాక్షిణ్యము ఆయనను నడిపించిన ప్రధాన లక్షణాలు. మొత్తమ్మీద ఆయనలో ్రతిఫలించేది రజోముఖమైన సత్త్వము. సత్త్వము జీవుని చింతనలోని గాఢతకు వేదనకు కారణం కాగా రజస్సు అనితర దృశ్యమానమైన సృజన శీలానికి హేతువుగా రూపొందింది.
ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలలో శ్రీ సత్యనారాయణ గారి ఉపన్యాసాలు మూడూ వినటం నాకు అరుదైన సన్నివేశం. మనస్సులోని సంస్కార సంపుటి కుదురునకు వచ్చే ప్రాయం మాతృభాషాభిమానం, ఆంధ్రసారస్వతం మీద అభిరుచి కవితాస్వాదవైఖరి ఈ మూడు నాలో బీజభూతంగా కుదురుకున్నాయి. రెండు ఉపన్యాసాలు చమన్ దగ్గరలోని, మాధ్యమిక పాఠశాలలోనూ, ఒకటి వేయిస్తంభాల గుడిలోనూ జరిగాయి.
75
నుత్రురన్న ఆ
వేయిస్తంభాల గుడికి మేం నడిచిపోతున్నాం. సత్యనారాయణగారూ, ఆయన సోదరూలూ (వేంక టేశ్వరులుగారు) టాంగాలో పోతూవుండగా చూచాము- వారు ఇంద్రావరుణుల్లాగా కనిపించారు.
మర్నాడు మేం చదువుకునే పాఠశాల - ఆంధ్రవిద్యాభివర్థనీ పారశాలకు
సోదరులిద్దరూ వచ్చారు. శ్రీ వేంకటేశ్వరులు గారు అదే పాఠశాలలో తెలుగు పండితులుగా అప్పుడే కుదురుకున్నారు. శ్రీ సత్యనారాయణగారు పాఠశాల విద్యార్థుల నుద్దేశించి అతిసరళంగా ప్రసంగించారు. ఎంత సరళంగా ఉందో ఆ ప్రరోచకమైన ప్రసంగం “ఊరెయ్యది చీపురుపలి, పేరో సూరకవి” అన్న అడిదం సూరకవి పద్యమూ, చెళ్లపిళ్లవారి “అభినవరామలింగ బిరుదాంకుడ”, “కలనన్ తావక ఖడ్గ ఖండిత”, “శరసంధాన బలక్షమాది” అన్న పద్యాలూ వారి ప్రసంగంలో వచ్చినట్లు జ్ఞప్తి. పద్యవిద్యా సౌలభ్య పార్వం యిక్కడ అవిష్కృతం చేశారు వారు.
శ్రీ వేంకటేశ్వరులుగారి నీడలో నేను పద్యవిద్యాభ్యాసం చేశాను అప్పటికి నేను వ్రాసిన పద్యాలన్నీ చూచి “ఏది ఏమైనా లోకంలోని వ్యక్తిని పొగిడే పద్యాలు వ్రాయవద్దు' అన్నారు. ఆ మాట నాకు ఇప్పటికీ మార్గదర్శకంగా రూపొందింది. ఆయన గొప్ప అధ్యాపకులు. వ్రాసే పద్యంలో ప్రొఢిమ, జిగి ఉండేది. శ్రీ సత్యనారాయణగారి వాజ్బయంతోనూ పరిచయం పెరుగుతూ వచ్చింది. కావ్యమును చూడటంలోని గాధత్వం, ఆస్వాదలక్షణం, వస్తువులో ప్రత్యక్షంగా గూఢంగా ఉన్న శాస్తాంశాలను గమనించే నేర్పు అప్పుడే అలవడుతున్నది. శ్రీ సంపత్కుమారగారు నేనూ కలసి రచించిన తొలి పద్యరచన 'హృద్గీతకు వేంకటేశ్వరులు గారే 'ముందు మాటి సత్యనారాయణ గారితో వ్రాయించారు.
1951 ప్రాంతాలలో ఆంధ్రపత్రికలో సీరియల్‌గా ప్రచురితమైన “స్వర్గానికి నిచ్చెనలు అప్పుడు చదివిన గురైతే లేదుకాని 1954-55లలో ప్రచురితమైన తెరచిరాజు (వారానికి రెండు సార్లు వచ్చేది) చదవటం గుర్తే ఆ రోజుల్లోనే విశ్వనాధవారు కరీంనగరం జగిత్యాలలో సాహిత్యయాత్ర చేశారు. శ్రీ జువ్వాడి గౌతమరావుగారి ప్రేరణతో. వరంగల్లులో వారి విడిది శ్రీ వేంకటేశ్వరులు గారింట్లోనే అప్పుడు వారిని కలుసుకోవటం ఆయన చేసే ప్రసంగాలకు శ్రోతలుగా ఉండటం గొప్ప. తొలిసారి విమాన ప్రయాణం చేసినంత విస్మయకరభావన
76
ఆ నకుద్పబ
1955 ఫిబ్రవరిలో కాలేజీలో ఇంటర్ చదువుతున్న మిత్రులం శ్రీ పేర్వారం
జగన్నాధం 'ప్రభృతులం- సాహితీ బంధు బృందం అనే సంస్థను స్థాపించుకున్నాం.
దాని ప్రారంభోత్సవానికి విశ్వనాధ వారు వచ్చి సరస్వతీ తత్త్వాన్ని గురించి చక్కని
ఉపన్యాసమిచ్చారు. స్థాపకాధ్యక్షుణ్ణి కావటం వలన నేను వేదిక మీదనే ఉన్నాను. ఆ
నాటి వారి ఆశీస్సు గాఢత, బలమూ, నాటి నుంచీ సాహిత్య స్ఫూర్తి రూపంలో నా జీవితాన్ని పాలిస్తూవున్నది
ఆ రోజుల్లోనే వరంగల్లులో శ్రీ మగదల రామచంద్రరావు అనే మిజ్రుడు
ఉండేవారు ఆయనా ఐనాల హరీంద్రబాబు, నేనూ మా సంపత్కుమార గారూ అందరం కలిసి విశ్వనాధను, కాటూరి వారిని చూచేందుకు విజయవాడ వెళ్లాము. రామచంద్ర రావుకు కాటూరి విజయసారధి ఆత్మీయ మిత్రుడు. అప్పుడు శ్రీ సత్యనారాయణ గారితో రెండు మూడు సార్లు ప్రసంగించే అవకాశం లభించింది. ఇరవయ్యేళ్ళు కూడా నిండని నాతో వారు ఆత్మీయంగా ప్రసంగించటం, సాహిత్య జీవితాన్ని గురించి తెలియజేయటం ఈనాడు తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వారి సౌలభ్యమూ, సౌహార్ధమూ అప్పుడే తెలిసివచ్చాయి. ఆ యాత్ర మాకు ఒక అరుణాచల శిఖరాన్ని మీనాక్షి దేవాలయాన్ని చూచి వచ్చినంత గొప్ప అనుభవం.
1956 ప్రాంతాలలో వరంగల్లులో శ్రీ, చిలుకమళ్లి రామానుజాచార్యులు అనే గొప్పకవి ఉండేవారు. ఆయన పరమ మధురంగా పద్యం చెప్పేవారు. ఆ రోజుల్లో ఆంధ్రవిద్యాభివర్ధనీ పాఠశాలలో పోతన జయంతి సందర్భంలో కవి సమ్మేళనం జరిగింది. శ్రీ సత్యనారాయణగారు అధ్యక్షులు. నేనూ రామప్ప గుడి' అని కొన్ని పద్యాలు చదివాను, మెప్పుగా చూచారు. అయితే శ్రీరామానుజాచార్యులుగారు 'దశావతార వర్ణన మాలిక చదివారు. విశ్వనాధవారు అదివిని పులకించిపోయారు. అతనిని ప్రశంసిస్తూ ఆయన కవిత్వాన్ని పెద్దన కవితతో పోల్చినారు. తెల్లవారి తమ విడిది దగ్గరకు రమ్మని వారి కావ్యం 'కల్యాణంరాఘవంిలో పద్యాలు విని, కల్పవృక్షం నుంచి సీతాకల్యాణ ఘట్టం చదివి వినిపించారు. తరువాత కల్యాణరాఘవం (ప్రచురిస్తానని ఉత్సాహపడద్డారు. (అది తరువాత అలాగే వారి కావ్యం విని పులకరించిన కాటూరి వారి ప్రేరణతో ్రివేణి పబ్లిషర్స్ (మచిలీపట్నం) అచ్చువేయించారు.)
ఈ సన్నివేశం శ్రీసత్యనారాయణగారి భావుకతకు, సదఃస్పందనకు సాక్ష్యం ఇచ్చేది 1940 ప్రాంతాలలో విశ్వనాధవారు కాళోజీ సోదరులకు అతిధిగా ఒక పర్యాయం 77
నుతప్రసన్న ఆఅ ఉన్నారు శ్రీ వానమామలై వరదాచార్యులు గారూ, శ్రీ గార్లపాటి రాఘవరెడ్డి గారూ తమ పద్యాలు వినిపించటానికి వచ్చారు భోజనానంతరం మంచంమీద పడుకుని విశ్రాంతి తీసుకుంటున్న విశ్వనాధగారు అలాగే ఉండి వారి ప్రక్క కుర్చీలో కూర్చొని వినిపించమన్నారు. శ్రీరాఘవరెడ్డి గారు పద్యాలు చదువుతున్నారు. రెండు మూడు పద్యాలు చదివేసరికి లేచి కూర్చున్నారట. మరికొన్ని పద్యాలు చదివేసరికి మంచం మీదనుంచి దిగి నేలమీద ఉన్నారట. ఇది వారి యందున్న కావ్యానుభవ పారమ్యాన్ని తెలియజేసే సన్నివేశం. దీన్ని శ్రీకాళోజీ పదేపదే గాద్గద్యంతో వివరించేవారు. శ్రీ సత్యనారాయణగారు శ్రీవేంకటేశ్వర్లుగారి అమ్మాయి వివాహానికి వరంగల్లు వస్తూన్నారని తెలిసింది. నాకూ మాచిన్నాయనగారికీ ఒక సాహితీ సమర్భన చేయాలని అనిపించింది. అంతకు పూర్వమే 'శబరిని గూర్చిన కొన్ని పద్యాలు ఉండనే ఉన్నవి. అదనంగా కొన్ని అటూ ఇటూ చేర్చి 'అనందలహరి' అనే పేర అచ్చువేసి వారికి అంకితం చేశాము. అత్మీయతలతో చిన్ని సమావేశం. ఆయన ఎంత సంతోషించారో చెప్పలేము. నా రచనా శిల్చ్పం ఈ పద్యరచనలో ఉన్నదనీ, వీరు నా కవితా సంతానమనీ ఆదరంతో సంభావించారు. "కవిత చెప్పి ఉభయకవిమిత్రు మెప్పింప నరిది అన్న కేతన మాటకు అర్ధం అప్పుడు తెలిసి వచ్చింది. ఈ సంఘటనకు కొంచెం ముందే కరీంనగరంలో 1955 మార్చి 31, ఏప్రియల్ 1 తేదీలలో విశ్వనాధ షష్టిపూర్తి జరిగింది అత్యంతవైభవంగా. వారిని గురించి నేను వ్రాసిన పద్యాలను విడిదిలో మా మాస్టారు శ్రీ వేంకటేశ్వరులు గారికి నేను వినిపిస్తున్నాను. ప్రక్కగదిలో మేల్కొని ఉన్నారేమో విశ్వనాథవారు వాటిని వింటున్నారు. ఒక పద్యంలో తార్తీయమూర్తి అనే ప్రయోగం ఉన్నది. ఆ ఫ్రొఢ ప్రయోగానికి మెప్పుగా అక్కడినుంచే ఊ అని దీర్ధంగా పలికారు. తరువాత ఆ పద్యంలో ఒకటో రెండో ఆనందలహరి అంకితంలో చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఏర్పడ్డది. దానిలో శ్రీసత్యనారాయణ గారిని సభ్యులుగా ప్రభుత్వం నామినేట్ చేసింది. ఇంతలోకి కరీంనగరంలో (ప్రారంభమైన కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యారు రెంటిలోనూ కాలేజి ప్రిన్సిపల్ పదివిని ఎన్నుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వచ్చింది, దానికి ఉపాధ్యక్షులయ్యారు, కరీంనగరం కాలేజి ప్రిన్సిపాల్‌గా, సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగా విశ్వనాధ వారు తరచుగా హైదరాబాదు వస్తుందేవారు. అంతలో జయంతి పత్రిక శ్రీ జువ్వాడి 78
ఆ సకుద్సబ గౌతమరావుగారి అధ్వర్యంలో ప్రారంభమయింది ఆ రోజులలో ఖమ్మంలో, హైదరా బాదులో, వరంగల్‌లో, రాజమహేంద్రవరంలో రామాయణకల్పవృక్ష పరనోత్సవాలు రెండు మూడు రోజుల పాటు నిర్వపొస్తువుందేవారు.
సృజనాత్మకరీతిలోను, సాహితీతత్త్వ ప్రచారంలోను శ్రీ సత్యనారాయణగారు అధికంగా క్రియాశీలంగా ఉన్నకాలం యిది. మైయుతుమ్మెద, సముద్రపుదిబ్బ, పురాణ వైరగ్రంధమాల ఇంకా ఎన్నో నవలలు, కల్పవృక్షంలో సుందర యుద్ధకాండలు, కాళి దాసాదుల రచనలపై విమర్శలు ఇలా ఎన్నో రచనలు వెలుగులోనికి వచ్చిన కాలం ఇది. విశ్వనాథ మధ్యాక్కరలు ఈ కాలపురచనయే. ఒకసారి ఖమ్మంలో కల్పవృక్షోత్సవాలు జరుగుతున్నవి. ఉదయం విడిదిలో విశ్వనాథ వారు ఆనాడే ప్రారంభం చేసిన కులస్వామి మధ్యాక్కరలు వినిపించారు. శ్రీ సత్యనారాయణ గారికి ఒక అలవాటు మొదటినుంచీ ఉన్నది. ఇంటికి వచ్చిన వారికి తత్కాలంలో వ్రాస్తూవున్న రచన తప్పకుండా వినిపించటం. ఆ విధంగా అతిథిరూపంలో ఉన్న సరస్వతికి సమర్చించటం. అస్వాదశక్తి యొక్క వివిధస్తరాలను అంచనా వేసుకోవటం, తన రచనలలో మార్చు పొందుతూవున్న భాషాపరమైన, అభివ్యక్తి శిల్పరూపమైన అందాలకు సహృదయుల ఒప్పుదలను సంపాదించడం - వ్యాఖ్యాన సహితంగా వినిపించటంతో, పారకులు అత్యంతసన్నిహితులు కావటం ఇది దీనివల్ల కలిగిన ప్రయోజనం. ఆయన రచనా ప్రపంచ పరిణామం గమనించినవారికి సాహిత్య ప్రక్రియా నిర్వహణలో, పద్యరచనలో, తెలుగుపలుకుబడిని పెంపొందించటంలో, భాషాశక్తికి పదును పెట్టడంలో అనంతమైన ప్రయోగలక్షణం, నూతనాంశాల ఆవిష్కారం ప్రత్యేకంగా అధ్యయనం చేయదగిన అంశం. విశ్వనాధ ప్రతిభా స్ఫూర్తికి ఏ ప్రక్రియగూడా దాని పరిమితులలో అది నిలిచివుండలేదు. అన్నీ విస్తరించి నూతనములైన సరిహద్దులను నిర్మించుకొన్నాయి. కరీంనగరం కాలేజీ ప్రిన్సిపాల్‌గా సుమారు రెండు సంవత్సరాలు ఉన్నారను కొంటాను. ఆయన రచన అప్రతిహతంగా సాగుతూనే ఉన్నది పురాణ వైరంలో రెండవదో, మూడవదో రచన సాగుతున్నది. ఆయన చెప్పుతున్నారు, శ్రీ గౌతమరావుగారు వ్రాస్తున్నారు. రచనా వ్యగ్రమైన చిత్తంలో శ్రీ సత్యనారాయణగారు ఉన్నప్పుడు ఆయన నిజంగా బ్రాహ్మమయమూర్తి. అతని చూపుకు మరోలోకంలోని అన్ని తలుపులూ 70
నుత్రుసన్న ఆల తెరువబడి ఉండేవి. విశ్వచైతన్యంతో తాదాత్య్వాన్ని ఆయన సాక్షాత్మరించుకుని ఉండేవారు ఆ సన్నివేశాన్ని చూచే అవకాశం రెండు మూడు సార్లు నాకు లఖించింది. ఒకసారి కరింనగరం నుంచి హైదరాబాదు వచ్చారు. అప్పుడు కల్పవృక్షంలో యుద్ధకాండ సాగుతున్నది. నాగపాశబంధం నుంచి శ్రీరామలక్ష్మణులు విముక్తులయ్యే ఘట్టం. ప్రయాణంలో ఇరవై ముప్ఫై పద్యాలు ధారణచేసి వచ్చారు. శ్రీపిశుపాటి రమణయ్యగారింట్లోచేరి సేదతీరిన తరువాత పద్యాలన్నింట్నీ కాగితం మీద పెట్టారు. మాకు వినిపించారు. అప్పుడనిపించింది - మనం ఏ వేద వ్యాసుణ్లో, భవభూతినో చూడలేదని బెంగపడనక్కరలేదని, మన ఎదుట ఈ సర్వసతీ విభూతి సజీవంగా సంచిరిస్తున్నదని. 1960-61లలో హైదరాబాదు ఆకాశవాణి వారి కోసం ఆంధ్రసాహిత్య చరిత్ర రూపకాలు రచించియిస్తున్నారు. అప్పుడు రెండో మూడో చివరి రూపకాలు హైదరాబాదు లోన- (వ్రాయించారు - మల్లాది శివరాంగారింట్లో. అప్పుడూ నేనూ సాక్షినే. ఆయన విజయవాడలో ఉన్నా కరీంనగరంలో ఉన్నా హైదరాబాదులో ఉన్నా, వరంగల్లులో ఉన్నా సహృదయుల మధ్య, అభిమానుల మధ్య కూర్చున్నప్పుడు అదొక విసృత సహృదయగోస్టి అక్కడ సుకుమారమైన హాస్య ముండవచ్చు, గంభీరమైన శాస్తాంశం ఉండవచ్చు, జీవనానుభవం కావచ్చు, కాల్పనిక ప్రపంచం కావచ్చు. ఆర్తిపొందు కావచ్చు, ఆనందోల్చ్బణం కావచ్చు. అక్కడ ఆయన ప్రసంగం విలక్షణంగా సాగేది. విశిష్టమైన వ్యాఖ్యానం, సమకాలీన కవులగురించి, సొహిత్యోద్యమాల గురించీ, తాము కలుసుకున్న మహాత్ములగురించి, విశిష్టులైన అనామకులు గురించి ఏం చెప్పినా ఒక జీవన రహస్యం విశదం అయ్యేది. విస్ఫుటం అయ్యేది. ఆయన ప్రసంగించేప్పుడు ప్రాణమయ ప్రపంచం - ఉద్వేగాల సంపుటి - సమగ్రంగా మేల్కొని ఉండేది. కోపమైనా, దుఃఖమైనా, ప్రీతియైనా, అత్యాసక్తియైనా వ్యక్తం చేయటంలో ఆయన ధోరణియే వేరు. ప్రత్యేకమైనది. ఈ మిత్రులందరూ ఒక వలయం అయితే ఆయన తరగిపోని ఆకర్షణ శక్తి గల ఒక అయస్కాంతం. 1958లో నేనూ, శ్రీరామకోటి శాస్రిగారూ, శ్రీమాదిరాజురంగారావు గారూ కలసి రసధుని పేర హైదరాబాదులో విశ్వనాథ, శ్రీశ్రీల సాహిత్యంపై రెండు రెండు రోజుల సాహిత్య గోప్టులు నిర్వహించాము. విశ్వనాథ గోష్టీ సందర్భంలో యాదృచ్చికంగా విశ్వనాథ వారు అక్కడికి వచ్చారు. చివరి సమావేశానికి ఆయన వచ్చి పాల్గొన్నారు. 80
అల రకుద్పీణు శ్రీ అనుముల కృష్ణమూర్తిగారు ఆ సమావేశానికి అధ్యక్షులు. ఆయన విశ్వనాథ వస్తూవుంటే భావోద్వేగంతో ఈ క్రింది పద్యం చదివారు- అతిథిగ వచ్చె నేడు బుషియంతటివాడు, హిమాద్రియంత ఉ న్నతమయి శుభ్రమైనదియు, నాకధునీ జలజాతమంత ను న్నితమయి స్వచ్భమైనదియు, నిర్మలమైన యెడందవాదు ఆ కృతి శివుడై మనోజ్ఞత నుపేంద్రుడునై సృజనావిధాతయ్రై తాదాత్యభావంతో ఆ పద్యం చదువుతూ వున్నప్పుడు నెమ్మదిగా విశ్వనాథ సభావేదిక మీదకురావటం మరపురాని సన్నివేశం. ఈ గోష్టీ పత్రాలన్నీ స్రవంతిలో (క్రమంగా ప్రచురితం అయ్యాము. శ్రీ పిశుపాటి రమణయ్య గారింట్లో విశ్వనాథవారు విడిదిచేసినప్పుడు సాయం కాలాల్లో సాహితీగోష్టులు జరిగేవి. తమ రచనల గురించియో, కాళిదాసాదుల రచనల గురించియో ప్రస్తావన ప్రసంగాలు జరిగేవి. ఆ గోష్టులలో రెండు మూడు గంటలు గడిచిపోయేవి. వాటిల్లో శ్రీకురుగంటి సీతారామయ్య ప్రభృతులు పాల్గోనేవారు. 1968లో హైదరాబుదులో “జయంతి మళ్ళీ ప్రారంభం అయింది. విశ్వనాథ, మల్లంపల్లి ప్రభృతులు సంపాదకులుగా ఉన్నా అసలు సంపాదకత్వం శ్రీ గౌతమరావు గారిదే. శ్రీ సత్యనారాయణ గారి సంపాదకీయం, శాకుంతలము యొక్క అభిజ్ఞావత వంటి వ్యాసపరంపర ఉండేవి. మిగతా పత్రిక అంతా శ్రీ గౌతమరావుగారే తీర్చిదిద్దేవారు. ఐదారు సంచికల తరువాత శ్రీగౌాతమరావు గారు 'సాహిత్యధార” పేర సమకాలీన సాహిత్యం- ముఖ్యంగా పత్రికలలోని రచనల గురించి ఘ్యాటైన విమర్శలు ప్రచురించటం ప్రారంభం అయింది 'సమవర్తి అనే పేర. అది విశ్వనాథ విషయంలో కొందరు శత్రుత్వం పెంచుకునేందుకు దోహదం చేసింది. వాస్తవపరిస్థితులను అనుసరించి పోవటంలో ఆయనకు స్పష్టమైన దృష్టి ఉందేది. తాము హైదరాబాదులో స్థలం కొంటున్నామని అన్నారు. నేను చాపల్యంతో రెండు మూడేండ్ల క్రితం కొని ఉంటే బాగుందేది అన్నాను. వెంటనే ఆయన అన్నారు- ఇప్పుడు కొనటం రెండుమూదేండ్ల తరువాత కొనటం కంటే మేలుగదా అని, ఒకసారి (భారతీయ కవిత” సంపుటంలో తెలుగు విభాగానికి వారు సంపాదకులు. నా కవిత ఒకటి దానిలో స్వీకరించారు. అట్టాగే నేషనల్ బుక్ ట్రస్టువారి ఆరంభ తెలుగు కవితా సంకలనంలోనూ నా కవిత ఒకటి చేర్చుకున్నారు. 81
సుప్రసన్న ఆల 1965లో తొలిభారతీయ జ్ఞానపీర్ వారి పురస్కారం విశ్వనాధ వారికి వేయి పడగలకు వస్తుందనే అనుకున్నాము అవార్డు పురస్కార నిర్ణయ సంఘం సమావేశానికి వెళ్లేముందు మా ఆచార్యులు శ్రీఖండవల్లి లక్ష్మీరంజనంగారు నాకొక లేఖ వ్రాశారు. ఈ సారి అవార్డు విశ్వనాధ వారికే వస్తుందనీ తమకు సమావేశంలో ప్రసంగించటానికి వీలుగా శ్రీ సత్యనారాయణగారి బిబ్లియోగ్రఫీ పంపించమని, నేను వరంగల్ నుంచి వారికి పంపించాను. అయితే కొంతమంది తెలుగువాళ్ల 'ప్రయత్నం' వలన అప్పుడు వారి 'వేయి పడగలకు” అవార్డు రాలేదు 1974లో శ్రీభండారు సదాశివరావు, శ్రీ ప్రసాదరాయకులపతి, శ్రీముదిగొండ శివప్రసాద్, శ్రీకొత్తపల్లి ఘనశ్యామలప్రసాద్ (ప్రభృతులం జాతీయ సాహిత్యపరిషత్ను స్థాపించాము. పూర్వరంగం చాలా వరకు విజయవాడలో 2,3 రోజులు విసృత చర్చలలో సిద్ధమైంది. అందరమూ కలసి విశ్వనాధవారింటికి వెళ్లి సంస్థ ఉద్దేశాలు కార్యప్రణాళిక వివరించాము. నిర్వహణలో ఉండే ఇబ్బందులను, పరిమితులను వారు కాస్త కటువుగానే చెప్పారు. అప్పుడు కొంతకటువుగావే తోస్తాయి ఆ మాటలు. ఆ మాటల్లోని వాస్తవాంశాలు తరువాత తరువాత మాకు అనుభవంలో సత్యంగా తోచాయి. వరంగల్ 1960 జూన్‌లో కొందరు మిత్రులం 'కులపతి సమితి అనే సాహిత్య సంస్థను స్థాపించాము. దీని పక్షాన కల్పవృక్షోత్సవాలు రెండు మూడు సంవత్సరాలు విస్తృతంగా జరిగాయి. ఆ సందర్భంలో శాకుంతలము యొక్క అభిజ్ఞానత', “అల్లసాని వాని అల్లిక జిగిబిగి మొదలైన విమర్శ (గ్రంథాలను పుస్తకరూపంలో అచ్చువేసి వారికి సమర్చించటం జరిగింది. ధ్వన్యనుకరణ సమ్రాట్ శ్రీ నేరెళ్ల వేణుమాధవ్‌కు విశ్వనాధవారి గ్రంధం ఒకటి అంకితం పొందాలని కోరికగా ఉందేది. నాతో ఆయన ఆ విషయం ప్రస్తావించేవారు. ఒకసారి నేనూ ఆయన కలిసి విజయవాడ వెళ్లాము. వారితో ఈ విషయం (ప్రస్తావించి - వారి రచనలో తమ రచనలను గురించినవి 'నేను-నా రచని వంటి వ్యాసాలను పుస్తకంగా అచ్చువేసి సమర్పిస్తాము అన్నాము, వారు సరే అన్నారు. అప్పుడు వారు శివాజీ పట్టాభిషేకోత్సవ సంఘం వారి కోరిక మేరకు “శివార్చణం' అనే కావ్యం వ్రాస్తున్నారు. ఆ సాయంకాలం మేం వెళ్లేప్పటికి 'వ్యాససంపుటి ప్రచురణ విషయంలో తొందర ఏమీలేదు వేణుమాధవ్‌కు శివార్పణం అంకితం చేస్తాను అన్నారు 'అది వాళ్లే అచ్చువేయిస్తారనీ నీవు పుస్తకం అచ్చువేయించే డబ్బు సన్మానంగా 82
ఆల సకుప్పణ ఈయవచ్చు'ననీ అన్నారు. శ్రీవేణుమాధువ్తో నీవు చాలా అదృష్టవంతుడవని నేను 'ప్రశంసించాను. తరువాత శివార్చణం' అచ్చువేసేముందు వారి వ్రాత ప్రతితో అచ్చుకు సిద్ధం చేసిన ప్రతిని పోల్చుకుంటూ నేనూ శ్రీ కందర్ప రామచంద్రరావుగారూ కందర్చ వారింట్లో రాత్రంతా మేలుకొనే ఉన్నాము. తెల్లవారి వారితో మాట్లాడి సవరణలు చేసుకున్నాము “శివార్చణం' అంకితోత్సవం విజయవాడలో రోటరీ ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. దానిలో (గ్రంథం మధ్యలో శివాజీ పూజాగ్భహంలో భస్మాయుధాది దేవతల ప్రసక్తి ఉన్న సీసపద్యం ఉన్నది. గ్రంధాంతఘట్టం ఆ విశిష్ట దేవతానమస్మారంతో పూర్తవుతుంది. ఈ రహస్యం గూఢంగా నిక్షేపించారు విశ్వనాధ వారు గ్రంధంలో. నేను నా ప్రసంగంలో ఆ రహస్యాన్ని వెలికి త్రవ్వి వ్యాఖ్యానించగలిగాను. దానిలోని తాత్త్వికతను వివరించాను. దాంతో శ్రీ సత్యనారాయణ గారు చాలా సంతృప్తితో నన్ను అభినందించారు. 1971లో నా “సాహిత్యవివేచన' ఆధునిక కవిత - ముఖ్యంగా వచనకవిత- గురించిన విమర్శగ్రంథం. - దానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి పురస్కారం లభించింది. అప్పుడు విశ్వనాధవారికి ఛందోరహితమైన కవితారచన అంటే అనిష్టంగా వుండేది. వచన కవిత వ్రాయటమే కాకుండా దాన్ని గురించి విమర్శ కూడా వ్రాశానని నన్ను కోప్పడ్డారు. ఆ కోపం ఆయన నాలుక చివరనే కరిగిపోయింది. నేను శ్రీ సంపత్ముమారగారూ 1954 ప్రాంతాల నుంచీ శ్రీసత్యనారాయణ గారి రచనలను, వారి రచనలపై పత్రికలలో వచ్చే వ్యాసాలను, వారి ఉపన్యాసాల రిపోర్టులను (శ్రద్ధతో సమకూర్చుకునేవారం. 1967-69లలో వరంగల్లులో స్నాతకోత్తర కేంద్రం ఏర్పడింది. శ్రీసత్యనారాయణ గారి సాహిత్యాన్ని అమితంగా అభిమానించే శ్రీరామకోటిశాస్రిగారు వస్తు సంపాదనలో వచ్చి చేరారు. విశ్వనాధ సాహిత్య విషయంలో ఒక క్రమపద్ధతిలో పరిశోధన చేయాలనీ మేము భావించాము. శాస్త్రీ నేనూ కలిసి విశ్వనాధ వాజ్మయ జీవిత పరిశోధనా కార్యక్రమం పేర ఒక ప్రాజెక్టు ప్రారంభించాము, క్రమంగా వ్రాతప్రతులూ, డైరీలు, ఉత్తరాలు చేరాయి ప్రశ్నావళితో అనేక వ్యక్తుల నుంచి సమాచారసేకరణ చేశాము. పత్రికలలోనూ విస్తృత ప్రచారం జరిగింది. ఆధికారికంగా ఉండేందుకు శ్రీశాస్తి డైరెక్టరుగా, నేను జాయింట్ డైరెక్టరుగా పేర్మానటం జరిగింది. 83
నుత్రురన్న ఆల
1972లో జ్ఞానపీర పురస్కారం తరువాత శ్రీసత్యనారాయణగారికి వరంగల్లులో సన్నానం జరిగింది. ఆ సందర్భంలో స్నాతకోత్తర కేంద్రానికి వచ్చి వారు ఆ ప్రాజెక్టును లాంఛనంగా (ప్రారంభించారు. ఆ పద్ధతి - సామగ్రీ సేకరణ - పాశ్చాత్యపద్ధతిగా ఉన్నదని వ్యాఖ్యా నించారు. అప్పుడు బిరుదురాజు రామరాజుగారు స్నాతకోత్తర కేంద్రం ప్రిన్సిపాల్‌గా ఆ కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. అందుకు మమ్మల్ని ముగ్గురినీ ఆశీర్వదిస్తూ శ్రీ సత్యనారాయణగారు సభలో ఒక పద్యం చెప్పారు
రామరాజుగారు, రహి సుప్రసన్నయు, రామకోటిశాస్తి ఈ మువురకు
అస్మకీనములను ఆశీర్వచనముల నెన్ని ఈయవలెనొ అన్ని యిత్తు ఈ ఆశీర్వచనం మా జీవితాలను గొప్పగానే ప్రభావితం చేసింది.
ఈ కార్యక్రమ ఫలితంగా పి.జి. సెంటర్ పక్షాన విశ్వనాథ వాజ్ఞయ సూచిక (ప్రచురించాము. తెలుగులో ఏ రచయితలను గురించైనా ఇది తొలి బిల్లియోగ్రఫీ ప్రయత్నం. కాకతీయ విశ్వవిద్యాలయం విమర్శిని, రెండవ సంచిక నాల్లు వందల పేజీలతో విశ్వనాథ వాజ్ఞయ జీవిత విశేష సంచికగా వెలువడింది. అపూర్వమైన పరిశోధన సామగ్రి దీనిలో ప్రచురితమైంది.
కొన్ని వ్యక్తిగత విభేదాల వల్ల సాహిత్య రాజకీయ కారణాల వల్ల ఈ కార్యక్రమం తరువాత ఆగిపోయింది. అయితే అందులోని సామగ్రిలో కొంతభాగం 1994-97లలో విశ్వనాధ అసంకలిత సాహిత్యం పేర ఆరు సంపుటాలుగా ప్రచురించటం జరిగింది. దీనికోసం విశ్వనాథ “భారతి” అనే సంస్థను స్థాపించి అనేకులైన సహృదయుల సహాయం, పొందినాము.
శ్రీజువ్వాడి గౌతమరావు గారికి తమ ఖండకావ్యసంపుటం 'భష్టయోగి' అంకితం చేశారు విశ్వనాధవారు. ఈ ఉత్సవం జగిత్యాల కళాశాలలో దాని ప్రిన్సిపాల్
శ్రీ వి. కొండలరావుగారి ఆధ్వర్యంలో జరగింది ప్రసంగాలు జరిగినాయి. శ్రీ సత్య నారాయణ గారు వ్యక్తులను సత్మరించినారు- నూతన వస్త్రాలతో. సభ నుంచి అందరు శ్రీ కొండలరావు గారింటికి వచ్చాము. అక్కడ విశ్వనాథవారు 'వక్తలకు పెట్టటానికి బట్టలు తెచ్చారు అయితే సంఖ్య పెరగటం వలన నీకు పెట్టలేదు” - అని తమకు కళాశాల వారు పెట్టిన శాలువను తీసి నాకు కప్పారు. 'అప్పుడే కప్పుదామను కున్నాను. అయితే కాలేజీ వాళ్లు తమ శాలువ విలువైనది కాదని మరొకరికి కప్పారను కుంటారు. వారిని నొప్పించవద్దని అక్కడ కప్పలేదు' అన్నారు ఇక్కడ రెండంశాలు. ఎంత చిన్న 84
ఆజ నకువ్పల
వాళ్లైనా సంభావించటం, రెండు ఒకరిని నొప్పించక పోవటం. ఇంత సూక్ష్మంగా (ప్రవర్తించే లలిత మర్యాద సత్యనారాయణ గారిది. శ్రీ కొండలరావు గారు వేరే శాలువ తెచ్చి వారికి కప్పారు.
ఆయనలోని మరాక గుణం మెచ్చితే వనుగు ఎక్కించటం. శ్రీ వీర్నీడి ప్రసన్న అనే కవి రచన అంటే ఎంతో మెచ్చుకున్నారు. ఆయన రచనకు పీఠిక వ్రాశారు. కోరి ఆయనతో 'పృథ్వీ భాగవతమనే” కావ్యాన్ని అంకితం పుచ్చుకున్నారు. హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సమావేశాల సందర్భంలో సమావిష్టులైన అఖిలాంధ్ర సాహితీ వేత్తల సమక్షంలో అంకితం (గ్రహించి అతన్ని ఘనంగా సత్కరించారు.
ఆయనది జాలిగుందె. ఆశ్రయించిన వారి కోరికను కాదనలేక పోయేవారు. కొందరు ఎం.ఏ. విద్యార్థులు మంచి మార్కుల కోసం పరీక్షకులకు చెప్పమని ఉత్తరాలు ('వాయించుకొనే వారు ఆయనతో. ఆ సిఫారసు లేఖలో ఈ తాత్చర్యం ఉండేది. “ఈతడు నాకు చాలా కావలసిన వాడు. నేను నిన్నింత వరకు ఏమీ కోరలేదు. ఈతని పని పూర్తిచేస్తే నాకు ఉపకరించినట్లు' అని. కొన్ని సందర్భాలలో ఇవి చాలా ఇబ్బంది కలిగించేవే.
శ్రీ సత్యనారాయణగారు నిరంతర జపశీలి. ఆయన ఆధ్యాత్మిక సాధన గురించి బయట తెలిసింది చాలా తక్కువ. ఆయన ఎక్కువగా ఆ విషయం చర్చించే వారు కాదు. “స్వప్న సుషుప్తల గూడ రామనామగ్రహణంబె నావయిన మానసజివ్వులు సేయు అన్న స్థితి ఆయనది. కాటూరి వారు 1948లో గుడివాడలో గజారోహణ సందర్భంలో - ఆయనను 'మంత్రమయ వాణీ అని ప్రశంసించారు. (భష్టయోగి అన్నది తమను వర్ణించుకున్నమాట. “అమృతపదార్థమున్ తెలిసినట్టిరు యోగులు" - అన్న అఆనార్మలీలోని నాందీ పద్యం మొదలైన చోట్లల్లో ఆయన సాధన రహస్యాలు గర్భితమయ్యే ఉన్నవి. విశ్వనాథ మథ్యాక్కరలు ఈ సాధన వథాన్ని ఎంతో కొంత రహస్యాలను పట్టియిచ్చే మవహా[గ్రంథం.
శ్రీ విశ్వనాథ వేంకటేశ్వరులు గారి కుమారుడు వేణుకు జబ్బుచేస్తే మాస్టర్ సి.వి.వి యోగ చికిత్స నిమిత్తం వారు తిరుపతిలో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వద్ద ఉన్నారు. ఆ రోజుల్లో ఆ యోగ మార్గాన్ని గురించి వారితో విస్తృతంగా చర్చలు విశ్వనాథ చేశారు. మృత్యుంజయత్వం గురించి ఇరువురి నడుమ ఏకాఖిప్రాయం కుదురలేదు.
85
నుత్తునన్న ఆల
ఆ చర్చలు 1967 ప్రాంతాలలో రచించిన 'రురుచరిత్రలో ప్రతిఫలించాయి. రురువు 'ప్రతిపాదించిందీ సి.వి.వి యోగమే. అయితే విశ్వనాథ వారు చివరిదాకా వేటూరి వారినీ గురువులుగానే సంభావించే వారు.
1956 ప్రాంతాలలో ఒకసారి నాతో అన్నారు. నేను ఇక్కడ పడుకుని పైనుంచి నా శరీరాన్ని చూదగలనని. ఈ సాధన యోగంలో ఒక పురోగతి దశ అని సిద్ధపురుషులు అంటున్నారు. ఒకానొక మహాత్మునితో శ్రీ విశ్వనాధవారు తమ జపసాధన గురించి చెప్పగా = వారు మీరు పలకటం కాదు ఆ జపం లోనించి మీకు వినిపించాలి అని ఆ సాధన చేసి ఆ సిద్ధిని కూడా శ్రీ సత్యనారాయణగారు పొందారని వారు చెప్పారు.
ఈ స్థితి గురించిన సాధన, భావన విశ్వనాధ మధ్యాక్కరలలో ఉన్నది. “సీ మంత్రము మహర్షులకు లోనుండి నిర్గమించినది/స్వామి, నాకో వెలినుండి ఆత్మ లోపలి కెక్షవలయు. . . నను నీ మంత్రమున నిల్చు (భద్రగిరి 99). ఇట్లాగే (భ్రూమధ్యంలో వెలుగై రావటం, కలలో ముక్తి నిస్తానని వాగ్గానం చేయటం వంటివెన్నో ఉన్నాయి కాని లోకంలో కనిపించే విశ్వనాథ వేరు.
లేని కోపంబు వీరికై పూనుచుంటి లేని కామంబు వీరికై పూనుచుంటి
కృతకమయ్యెన యీ బ్రశుకెల్ల వల్లరీ మనోజ్ఞ జటా శశభృచ్చలాటు
అసలు వ్యక్తి అంతస్సులో 'నికామభవత్ పదచింతనానలో జ్వలిత సనాధం'గా లిష్తలను గడిపినవాడు. ఆ లిస్తలు నిరంతరాలుగానే గడిచాయి చివరి రోజులో.
86
సమగ్ర మానవ చైతన్య నిర్మాణ శిల్పి విశ్వనాథ సత్యనారాయణ
ఈ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని విసృత పరిధిలో భారతీయ సాహిత్యాన్నీ తన సర్వతోముఖ (ప్రతిభా తేజస్సుతో ఆవరించిన మహాపురుషుడు విశ్వనాధ సత్య నారాయణ గడచిన నూటాయాఖై సంవత్సరాలలో సామాజిక సాంస్కృతిక రంగాలలో వచ్చిన ఉప్పెనలను సాక్షాత్కరింపజేయడమే కాక, వాటి నుంచి మనం తప్పుకొని శిధిలమైన ఈ జీవనాన్ని ఎలా పునర్నిర్మాణం చేయవలెనో స్పష్టంగా వథనిర్దేశం చేసిన మవహావ్యక్తి విశ్వనాధ సత్యనారాయణ.
సమ(గ్ర మానవ చైతన్య నిర్మాణ శిల్పిడటైైన విశ్వనాథ నృష్టిలోని ఈ సమన్వయాన్ని వ్యక్తంచేయటం కోసం అనేక విధాలుగా తన సాహిత్యాన్ని నిర్మించారు. ఈ సమన్వయ భూమిక మీది మానవుడే ఆయన సాహిత్యానికి నాయకుడు. జీవనంలోని, ప్రకృతిలోని అనేక విధాలైన సంవేదనలను, అనుభవ సంపుటులను ఖ్ధయన కావ్య వస్తువుగా రూపొందించారు. అందుకే ఆయన భాష 'తేనెల్వాటును, మేఘగర్జనలు వీతెంచున్, పికీ కన్యకానూనవ్యాహృతి మాధుపంచమము చిందున్, ద్యోనదాంభఃకణ శ్రీ నృత్యంబులు చూపుతుంది. భాషలో శైలిలో పదబంధ నిర్మాణంలో తెలుగు పలుకు బడుల జడులలో, సంస్కృత సమాస కల్పనలో ఎంతో వైవిధ్యం ఏర్పడుతుంది.
విశ్వనాధ జన్మించేనాటికి భారతదేశంలో గ్రామీణ వ్యవస్థ చెదిరిపోతున్నది. పరిశ్రమలూ, నగరాలు పెరుగుతున్నవి. మానవుడిలోని ధర్మబుద్ధి కుంచించుకుపోయి, మానవత్వపు విలువలైన దయ, శాంతి, తితిక్ష మొదలైనవి క్షయిస్తున్నవి అర్ధకామాలు మొత్తం నమాజాన్ని ఆవరించాయి. (ప్రకృతితో పశుపక్ష్యాదులతో మానవునికి ఉన్న సామరస్య సంబంధాలు క్షీణించాయి. మత విశ్వాసాలు తొలగిపోయినవి. మానవుడు ఒంటరియై దిక్కుతోచక కాలచక్రము క్రింద నలిగిపోతూ హాహాకారాలు చేస్తూవున్నాడు. నా శరీరము దాని క్రిందపడి నలిగిపోయినది, ఆ దారిలో రక్తనదములింకినవి. ఆచటి బహుజన రక్త చిహ్నముల యందు నాది యిదని గుర్తీమి కన్చడును' ఇదీ రచయిత ప్రశ్న వ్యక్తి అభిజ్ఞకు సంబంధించిన సమస్య యిది ఈ వ్యక్తి క్రమంగా తన గుర్తింపును
87
నుత్రునన్న ఆ తనకు తానే అర్ధంకాని ఆ దశలో తనలోని రెండు పార్య్వాలను రచయిత దర్శిస్తున్నాడు. “ఈ కెలన శరత్సూర్ద్హిమావృత శశాంక లలితరోచిర్వితాన, మా కెలన ఘోర, ఘన తరాంధకారచ్చటా సమాక్రాంత భూమి, అందు సగమందు సగముంటి నార నేను” ఇదీ ఇప్పటి పరిస్థితి. ఆ రెండో వైపున ఉన్న అవ్యక్తంతో వ్యక్త జగత్తుకు సేతువును నిర్మించుటయే విశ్వనాధ చేసిన ప్రయత్నం. విశ్వనాథ సాహిత్య పరిణామాన్ని దర్శించితే కవిత్వంలోని అన్ని ప్రక్రియలేకాక, నాటకము, నవల, విమర్శ, సామాజిక చరిత్ర, తాత్త్విక చింతన ఇలా ఎన్ని ప్రక్రియలైనా ఆయన రచన చేస్తూ పోయారు. వేయిపడగలు, శ్రీమద్రామాయణ కల్పవృక్షం వంటి రెండు ఇతిహాసాలు నిర్మించారు. వేయిపడగలు ఆధునిక జీవనంలోని అసామరస్యానికీ అనాత్మీయధోరణులకూ, అమానవీకరణకూ దర్పణం పట్టింది. ఆ ఇతిహాసం ప్రకృతికీ, మానవుడికీ, ఈశ్వరుడికీ నడమి ఖందాఖండ కాలాలలో ఉండే సామరస్యాన్ని అన్వయ వ్యతిరేకముఖాలలో వ్యాఖ్యానించింది. కల్పవృక్షం సృష్టి మూలమైన దైవాసురసంఘర్జణకు కేంద్రస్థానం కల్పించి దైత్య శక్తులు క్రమంగా పలుచబడుతూ ఘర్షణ పడుతూ క్రమంగా దైవీ భావ స్థితికి చేరుకోవటం' ఆవిష్కరించింది. దేవభావాన్ని మనచుట్టు ఉన్న ప్రకృతిలో సాక్షాత్మరించు కోవటం దగ్గర ప్రారంభించి - అత్యంతము దైత్య (ప్రకృతిలోనూ అట్టడుగున దైవగుణం నిద్రాణ దశలో ఉంటుందనీ, దాన్ని మేల్కొలిపి లంకను అయోధ్య చేయ వచ్చుననీ కల్పవృక్షం మానవ సమాజ నిర్మాణానికి మూలసూత్రాన్ని ప్రతిపాదించింది. వర్తమాన స్థితిలో ఈ లోకాన్ని కలవర పరుస్తూ వున్న అర్ధకామాలను, దాని అనుబంధ లక్షణాలైన క్రోధమోహమద మాత్సర్యాదులను ఆ తత్త్వాలను సమర్థించే కొన్ని ఆధునిక సిద్ధాంతాలనూ కల్పవృక్షం పరామర్శించింది. ఆధునిక కాలంలో (ప్రేమపేరుతో (క్రమ్ముకు వచ్చిన స్వేద్భాకామాన్నీ, వివాహ ధర్మ నిర్మూలనాన్నీ తన సాహిత్యం నిండా నిరోధించారు విశ్వనాధ. స్రీ పురుష సంబంధం ఎంత వ్యక్తిగతమో, అంత సామాజికం కూదా. ఈ వ్యక్తిగత సామాజిక సంబంధాల సముచితమైన సమన్వయం నుంచే దాపంత్య ధర్మం ఉన్మీలితమవుతుంది. విధి (ప్రేరణ వల్ల (ప్రేమవివాహాలు వ్యత్యస్తమైనప్పుడు దానిని స్వప్రయత్నంతో సరిదిద్దు కోవటం, దిద్దుకోలేక ఉద్వేగాలకు లోనుకావటం అన్న ద్విధాభూతస్థితిని మానసిక భూమిక (ప్రధానంగా - ఏకవీరలో అనిదంపూర్వంగా విశ్వనాధ చిత్రించారు. అందుకే 88
ఆక సకుద్పణ
“గిరికుమారుని ప్రేమ గీతాలిన్న ఆత్మాశయ (ప్రేమ కావ్యంలో కులపాలికా ప్రణయం విస్పష్ట రూపాన్ని సంతరించుకొన్నది. “అనార్మలి'లో “కిన్నెరసాని పాటలిలో వ్యవస్థవల్ల వ్యక్తిగతమైన (పేమ నష్టం కావటం చిత్రించితే, ఆ రెంటి సమన్వితమైన దశను “పేమగీతాలు” ప్రతిపాదించింది. “చెలియలికట్ట' సమష్టి నుంచి వెలికి వచ్చిన స్త్రీ దిక్కుతోచని స్థితిలో ఎలా ఉండిపోతుందో చెప్పింది:
విశ్వనాథను కల్లోలపరచిన అంశం మన చరిత్రను పాశ్చాత్య చరిత్రకారులు అస్తవ్యస్తం చేశారన్న సంగతి. దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆయన పురాణ వైర గ్రంథమాల రచించారు. ఈ పన్నెండు నవలలూ భారత చరిత్రలో పాశ్చాత్యులు చేసిన కాల వ్యత్యాసాన్ని ఖండించాయి. అయితే కథాంశాలు అన్నీ అపూర్వ కల్పనలు. మానవుల సామాన్య విపరీత 'ప్రవృత్తులకు వ్యాఖ్యానాలు. ఈ నవలలలో విశ్వనాథ దైత్యభావము యొక్క పునపునరుద్గమాన్ని జయద్రధుని పాత్రలో చిత్రించి అద్భుతమైన 'ప్రాగ్రూవ శిల్పాన్ని ప్రవేశపెట్టారు.
విశ్వనాథ తన సాహిత్యం నిండా విస్తృతంగా చిత్రించిన సమాజ స్వరూపం ద్వారా విలక్షణమైన చర్చల ద్వారా వివిధ రంగాలను గూర్చి ఎంతగానో తన ఆలోచనలను వ్యక్తం చేసి, కేవలం రచయితగానేకాక ఒక సామాజిక చింతకునిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన రచనలలో తొలి రచనల నుంచి చివరి రచనల వరకు ఈ చింతనలో ఎంతో పరిణామం కానవస్తుంది.
విశ్వనాథ సాహిత్యాన్ని ఆత్మ ప్రతిభా ప్రకాశకంగానే కాక ఆత్మ సాధకంగా కూడా భావించారు. సాహిత్య రచనకు ప్రేరణగా జీవుడు తనలో నిక్షిప్తమైన బ్రహ్మభావాన్ని సిద్ధింపజేసుకునే ప్రయత్నాన్ని 'జీవుని వేదన'గా పేర్కొన్నారు. ఈ (ప్రయత్నంలో ఒక దశ విశ్వాత్మ భావంతో ఏకం కావటం. కల్పవృక్షానంతరం ఆయన కవిత ఆత్మాశయమైన మధ్యాక్కర శతకాల రూపంలో, కృష్ణభక్తి కావ్యాల రూపంలో సాగింది. శివాజీని గూర్చి కావ్యం నిర్మించినా, ఆయన శివాజీని లలితా మహాదేవి యొక్క ఉపకరణంగా దర్శింపజేస్తారు. రురుచరిత్రలో మృత్యుతత్త్వాన్ని వ్యాఖ్యానిస్తారు.
ఒకచోట విశ్వనాథ చెప్పిన మాటలివి: 'మా మతమున దేవుడున్నాడని కాదు. సర్వమైన నృష్టి యందు ప్రాణము, జీవము, ఆత్మ కలకలలాడుచున్నవని మా పూర్వబుషులు చూచిరి. సర్వవస్తుగత ప్రాణమును సమారాధించిరి. అంతకన్న భూతదయలేదు.” ఇంత సాహిత్యంలోనూ విశ్వనాథ ప్రతిపాదించింది- 'సర్వవస్తుగత
89
నుత్రునన్న ఆకల ప్రాణ సమారాధనము.” ఇది మానవతా సిద్ధాంతమని మనం ఈనాడు (ప్రచారం చేస్తున్న సిద్ధాంతం కంటే సమ(గ్రమైంది. అందువల్లనే విశ్వనాథ సాహిత్యంలో పశువులు, పక్షులు, పాములు, చెట్టు, చేమలు అన్నీ ప్రాణంతో కలకలలాడేవే. వ్యక్తిత్వం గలవే. ఈశావాస్య మిదగ్ం సర్వం - అన్న (శ్రుతి ఆయన సాహిత్య సాధనకు అన్వయిస్తుంది.
విశ్వనాధ సత్యనారాయణ 1895లో సెప్టెంబరు 10వ తేదీన కృష్ణాజిల్లా నందమూరులో జన్మించారు. బందరులో చదువుకోసం చేరి, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి పాదసన్నిధిలో కవిగా రూపు దిద్దుకున్నారు. ఒకవైపు సాహితీ సమితిలో చేరి, వేరొకవైపున తరువాత కాలంలో కుర్తాలం పీఠాధిపులైన శ్రీ విమలానందభారతీస్వామి వద్ద, గుంటూరులోని శ్రీ విరూపాక్ష పేఠాధిపతులైన శ్రీ కల్యాణానందభారతీస్వామి వద్ద వేదాంతాది శాస్త్రాలను అధ్యయనం చేసినారు. అధ్యాపకులుగా ప్రిన్సిపాలుగా పనిచేశారు. శానన మండలి సభ్యులైనారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులైనారు. కేంద్రసాహిత్య అకాడమీ, జ్ఞానపీర్ బహుమతులు అందుకున్నారు. విశ్వ విద్యాలయాల గౌరవ బిరుదాల్ని పొందారు. సాహిత్యంలోనే అనేక ప్రక్రియలలో శతాధిక రచనలు చేశారు. అక్టోబరు 18, 1976న శరీరాన్ని విడిచిపెట్టారు.
విశ్వనాథ సాహిత్య జీవితంలో వివాదాలు చర్చలు ఎప్పుడూ కొనసాగుతూ వస్తూవున్నవి. ఆయన '“ధిషణాహాంకార సంభార దోహల ('బ్రాహ్మమయమూర్తి'గొ అభిమానుల చేత విరోధులచేత సమానంగా గౌరవాన్ని పొందిన అరుదైనవ్యక్తి.
మధుకోశం - శ్రీ జి. పుల్లారెడ్డి అమృతోత్సవ సంచిక 1995
90
ఒర్క్ పిలువులే దయోధ్య నుండి 1971, జులై నెల సాగుతున్నది. అ సంవత్సరానికి భారతీయ జాన పీఠం వారి పురస్కారం ఎట్టకేలకు విశ్వనాథ సత్యనారాయణకు వచ్చింది. వార్త తెలుగు వాళ్లందరినీ ఉత్సాహ తరంగాలలో ఊయల లూపుతున్నది. తమ గురువులను గురించి ఆయన చెప్పుకున్నట్లుగా అప్రదృష్యత్వము, సమభిగమ్యత్వమూ ఆయనలో ఉన్నాయి. పత్రికల వాళ్లూ ఆకాశవాణి వారూ మిగతా ప్రముఖులు మారుతీనగరం (విజయవాద)లో వారింటికి తరలిపోతున్నారు. కొందరెక్కడో మూలమూలల్లో తమతో తాము గొణు క్కుంటున్నారు. నమస్కారాలు, అభినందనలు, ప్రశంసలు, (ప్రణామాలు కవి సషమ్రాట్టును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నవి. టెలిఫోన్ ఎడతెగకుండా (మోగుతూనే ఉన్నది. ఎన్న్నో ఉత్తరాలు, టెలిగ్రాములూ ఆ దారిలో సాగివస్తున్నవి. 20వ శతాబ్దంలో తెలుగు కవులలో విశ్వనాధను పోలిన సాహిత్యవేత్త ఉండడు. ఆయనకు అసంఖ్యాకులైన అభిమానులు ఉన్నారు. అట్లాగే విద్వేషించే శత్రుపరంపర ఉన్నది. సాహిత్యజీవితంలోకి ఆయన చేరుకున్న ఇరవై యేళ్ళ నాటి నుండి ఎప్పుడూ వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. 'అల నన్నయకు లేదు తిక్కనకు లే దా భోగము అస్మాదృ్భశుండు శిష్యుడయినా డన్నట్టిది' అన్న మూర్తిమత్త్వమూ, “నేనెంత, నాబ్రతుకెంత, సృష్టిలో నిజము నావంటి మానవుల్ మూడు కాలముల పుట్టుచు మడియుచున్నారు' అన్న వ్యక్తిత్వములో ఆయనదే. మాట దురుసు చేసినావు, చేసితి మనసు మెత్తనగ బాట తప్పింతివి బతుకు, పుట్టెడు ప్రతిభ నిచ్చితివి కోటి శత్రుల కూర్చినావు, కూర్చుంటి గుండియలోన ఆటగా- ఇదీ చీలియున్న తామర రేకుల వంటి వైవిధ్యం గల ప్రవృత్తి. అందుకే ఒక కవి అన్నాడు “విశ్వనాథకు వేయిఆత్మలు, ఏకవీరుని వేయి పడగలు' అని. ఆయన అంతరంగంలో ఎన్నో భావోద్రేకాలు, స్మృతి సంపుటులు. రావలసిన గౌరవం ఏదైనా ఎవరితోనో పంచుకోవలసి రావటం ఆలస్యంగా రావటం. ఆయనకు 91
నుప్రునన్న ఆల తొలి జ్ఞాన పీఠపురస్కారమే రావలసింది. అయితే రాలేదు చివరిదశలో ఎవరో తెలుగు వాళ్లు ఎంతో ప్రయత్నం చేశారు అది రాకుండా ఆ గాయం తెలుగు సాహిత్యానికి మరో పద్దేనిమిదేళ్లదాకా ఆ బహుమతి రాకపోవటంలో దోహదం చేసింది ఎట్టకేలకు వచ్చిన బహుమతి ఆయనను ఉక్కిరిబిక్కిరి చేయలేడు అంతా గ్రహబలం నల్ల జరిగిందని అనుద్విగ్నంగా శాంతచిత్తంతో (ప్రకటించారు. ఆరేళ్ల క్రింద తన (గ్రహబలం వల్లనే బహుమతి రాలేదనే తాత్పర్యం స్వష్టంగానే వ్యక్తమయింది. మనస్సు నిర్మలంగా ఉన్నది ఇన్ని ప్రశంసలూ మనోబుద్ధులను దాటడం లేదు. ఆయన చిత్తంలోనికి అవి ప్రవేశించటంబలేదు. కొందరు పత్రికా ప్రదినిధులు ఆయనతో స్నాతకోత్సవం వేషం వేయిస్తున్నారు.
ఒక గౌను వలె, ఒక తల మీద టోపీ అంతా కష్పుతున్నది ఆయనను ఈ వేషం. ముందరి వోలు దాటి లోపలికి వెళ్ళితే కేవలం అంగవస్త్రం ధరించిన ఆయన చిత్రం. రెండు చిత్రాలు తనలోని ప్రపంచానికీ, బయటి ప్రపంచానికీ ప్రతీకలుగా ఉన్నాయి. పనిపిల్లవాడిలాగా వాళ్ల వాళ్ల సరదాల కోసం ఆయన ఆయా వేషం కట్టతూ వున్నా లోలోపల ఆయన చిత్తం ఎక్కడో లగ్నమ్రైయున్నది. తనలోని అంతర్చహిర్షగత్తులకు ఏకీభావం కుదరటం లేదు, అర్థశతాబ్దం పైగా ఎన్నివేల పాత్రల నిర్మాణం చేశారో, అవన్నీ రక్తమాంసాలతో కళ్లముందు కడలి పోతున్నారు. చరాచరమైన ఈ జగత్తంతా తనలోక్సీ తాను ఈ చరాచర జగత్తులోనూ సంలీనతను పొందుతున్నారు
వైగ్రై నది ప్రోషిత భర్తృక వలె ప్రవహిస్తున్నది (ఏకవీర) పృషన్నిథి అన్న మేఘం ప్రకృతిలోని అనంతులనం వల్ల గాయపడి కొండకు తలగొట్టుకొని రోదిస్తున్నది. (వేయి పడగలు) ఎదమెత్తనైన తెలుగుపడుచు అత్రమాటలకు ఓర్చుకోలేక కరిగి నీరై వాగై ప్రవహించింది. (కిన్నెరసాన్సి
వనములను దాటి వెన్నెలబయలు దాటి
తోగులను దాటి దురగ్గమాద్రులను దాటి
పులుల అడుగుల అడుగుల కలుపుకొనుచు
రాళ్ల వాగుదాటి పధాంతరములు దాటి
అచట కిన్నెరసాని - నా యాత్మయందు
ఇప్పటికి దాని సంగీతమే నదించు
92
ఆసు రకుద్పీబ ఆ రోదనలో హిందోళరాగం వినబడుతున్నది వసుంధరలో తోడిరాగమై జగనుభవ సముద్రంలో నుంచి వేల దుఖనదులను పైకి పెకలించింది (స్వర్గానికి నిచ్చెనలు) ఈ సంగీతమే మనోబుద్ధులను చిత్తంతో లంకె చేసే గ్రంథిసూత్రం. అషాఢ మేఘంతో కవి తాదాత్యం చెంది - 'మింటికి నీవు మంటికి నేను కవులు మైతిమి హృదయ దుఃఖములు పాడి” అంటున్నాడు (గిరి కుమారుని ప్రేమ గీతాలు) చిత్తపరిధిలో ఏ పొరలూలేని అచ్చమైన జీవుడు తానై విశ్వచైతన్యమూలంలో జగద్వేదనను పొందుతున్నారు. ఆ వేదన అతన్ని విశ్వచైతన్య కేంద్రం వైవు సమాకర్షిస్తున్నది. బయట తాను నిర్మించిన, తనను నిర్మించిన సాహిత్య ప్రపంచం - వైయక్తిక జీవనంలోని సుఖదుఃఖాలు సాఫల్యవైఫల్యాలు, మృత్యువు, అసంతృప్తి - రెండూ తన వ్యక్తిత్వంలో రెండు అంశాలై తన వేల వేల రూపాలుగా ్రతిఫలించగా - రెంటికి అతీతంగా అహంకారం వెనుక ఒంటరి తనంలోనూ 'తాను కప్పబడకుండా మేలుకొని ఉండటం తనలోని వైలక్షణ్యం. అది విస్తరించ నెంచినప్పుడు ఈ ప్రతిఫలన పరిధులు
- పరిమితులు సరిపోవటం లేదు ఎంతటి యిరుకటంబవుచున్నది, యింతైన *'బ్రతుకు సంతాపిమొక్కటి విరుగు'జైనను చాలును నాకు' అహంకారం అనే ఇరుకు బెజ్జంలో నుంచి ఇటు అటూ సాగిపోవటం చాలా యిరుకటమైపోయింది. తనకు ప్రతీ సృజన లిప్త ఇబ్బందే. ప్రతీ పద్యోద్గతీ ప్రసవేదనయే. ఆ ప్రవాహం అసంకల్పితం గానే దిగివస్తూవుంటుంది. రచనకు ఉద్యుక్తు దయినంతనే ఆయన రచనా సందర్భం తెలిసిన వాళ్ళకు ఈ విషయం తెలుసు. నవలను డిక్టేట్ చేయడం మొదలుపెట్టగానే అంతర్జగత్తు కవాటాలు తెరచుకునేవి స్వయంగా. అట్లాగే పద్యం సంకల్పించితే నలుగురితో నడుస్తూవున్నాా ఏదో లోకాఖిరామాయణంలో ఉన్నా పద్యగంగ ఊటగా లోనుంచి పొడుచుకువచ్చేది. మనస్సులో నిలుపుకున్న పద్యాలు ముప్ఫైయో, నలఖైయో ఇంటికి చేరగానే కాగితం మీద పెట్టేవారు. అదొక వివశస్థితి. సామాన్యముగ నే ప్రయాణముం జేయు సమయంబునందు నా ముఖంబున కవితా సరస్వతి నాట్యమాడెడిని స్వామి ! నా తుదియాత్ర నిన్ను పాడుచు సాగనీవే- 93
నుత్రునన్న ఆల నిరంతరం ఆంతర బాహిర లోకాలలోనికి స్వేచ్చగా ప్రయాణం చేయగల స్థితి ఆయనకు ఉందేది. అంతమందిలోనూ, సందడిలోనూ ఏకాంతంలోకి సృజన మూలాల లోనికి వెళ్లలుగటం ఆయన వైలక్షణ్యం. భారతీయ సాహిత్య పరిణామాన్నీ పరిపాకాన్నీ ఎరిగిన వారెవరికైనా సృజన 'ప్రవాహమంతా ఆత్యంతికంగా ఈశ్వర సాన్నిధ్యంలో లయం పొందవలసిందే. అంతర జగత్తులోని అట్టడుగున ఎక్కడో ఆయన కాంతి మిలమలలాడుతూ వుంటుంది. అందువల్ల ఈ రచనా ప్రక్రియ అంతా పునర్జన్మ రాహిత్యమైన ఆత్యంతిక ముక్తికి మార్గం వేయవలసిందే. కవితాసాధన చేస్తూవున్నప్పుడు తన చైతన్య స్రోతస్సు చిత్తాన్ని చేరుకోవటం, అక్కడ ఆ సృజన బిందువు దగ్గర విశ్వ సంవేదనలను బహిర్గతం చేయటం, ఆ వెలువడే అస్మితతో తాను ఒకటై పోవటం - చివరకు తాను దానిలో కలసిపోయి కర్పూరం వలె కరగిపోవటం జరుగుతుంది. తిక్కన పోతనలు తమ సాహిత్యసాధనకు ఫలం పునర్జన్మ రాహిత్యముగా పేర్కొన్నారు. విశ్వనాధ “తుదిజన్మ'గా దీనిని చేయమని కోరినాడు. వఏశ్వనాధ కవితా సాధన ఆరంభదినాలలో భష్టయోగి అనే ఖండిక రచించారు. వాక్కునకు బ్రహ్మమునకు అభేద భావమును తలచటం వలన, ఈ జగత్తత్త్వములో (బ్రహ్మమును భావించటం వలన భష్టయోగినై కవిజన్మమును పొందినట్లు చెప్పారు. యోగప్రవృత్తిలో ఊర్జ్యముఖంగా టబ్రవ్మాఖిముఖంగా కాక లోకాభిముఖంగా సాగటం వలన ఈ 'దిగుబాటు” వచ్చింది. కాబట్టీ ఆ భావం ఆధారంగా సాగినకవి తన కవిత్వాన్ని- కవితారూప తపస్సు చేసెదను- అనటంలో ఆశ్చర్యం లేదు అయితే కవిత్వం అంతా లోకజీవన విస్తారం- 'లోకమ్ము లేక రసమ్ములేదు” అన్నవాడు కావటం వల్ల ఇది ఆ లక్ష్యాన్ని చేర్చగలదో లేదో అన్న అనుమానం ఎలాగూ వున్నది ఈ పద్యమును నీవు, నిట్టి వేషాలు నెందరో వేత్తు రీ పప్పు లుడుకవు, చచ్చినట్లుగా నింద్రియ జయము ప్రాపింపజేసికో, తేరగా వచ్చి పడదనె దీవు నీపట్టు తెలియులే కవిత్వరూపంలో చేసే ప్రయాణం తనను బయలు పరుస్తుందే కాని లోనికి లోలోతులోనికి చొచ్చుకొని పోనీయదనే స్పృహ ఒక వైపు ఉన్నది. అందువల్ల వ్యక్తిలోని రశ
ఆ సరుద్పీల రెందు పార్య్వాలకూ ఘర్షణ తప్పటం లేదు బయటి (బ్రతుకు బరువెంతదంటే అది నిశ్చయమైన కారణాల పాదులోనికి పోనీయదు
బండిని లాగెడి నెద్లు కూడ కన్చడనట్టి గడ్డి
బండి వోలిక నేను సాగుచుంటిని పై బర్వు నెవరి
తిండికో,ో యలవాటుకొలది సాగెడు, తెలియని కోర్కి
నెందుచు
బ్రతుకంతా తన ప్రయోజనం ఎరుగని గడ్డిబండి వలె సాగిపోతున్నది.
అనుభవం ప్రధానంగా మనస్సు మిద ఆధారపడిందే. తత్క్షణము కలిగే సుఖదుఃఖాల పర్వవసానం ఎరిగిన వారికి - అనుభవం తీవ్రత సాంద్రత తగ్గియే ఉంటుంది. పర్యవసానం తెలియనప్పుడు అది అధిక దుఃఖాపాదకమవుతుంది.
కోరి కబేలాకు మందగా లాగికొని వోవుచునుండ
దారి ప్రక్కన యున్న పచ్చిగడ్డి బండిపై తారాడు పసుల
తీరుగా నున్నది జనుల భోగాశ-
మృత్యువు తధ్యమని ఎరిగి ఎరిగీ లౌకికమైన సుఖానుభవం మోది కోరికలు చావకపోవటంలోని వైరుధ్యం యిక్కడ విశదీకరింపబడ్డది.
ఈ ఘర్షణ- ఆంతర బాహిర వృత్తుల నడిమి సంబంధం కవికి ఒకసాది మెరపులా మెరిసింది. ఈ పురస్కారం తనను ఆవరించకుండా జాగ్రత్త పడుతున్నాడు. సాహిత్యం నిండా తాను సాగించిన ఈశ్వరాన్వేషణను, తాను పొందిన ఈశ్వర విరహాన్ని స్మరించుకున్నాడు. అప్పుడుకాని తెలియవచ్చింది తాను ఎంతగా (భ్రాంతి పొందుతున్నాదో ఆ క్షణంలో.
జ్ఞాన వీరం బహుమతి నుంచి జ్ఞానమూలాలలోనికి ప్రవేశించాడు. తనలోనే ఉన్నది ఈ అన్వేషింపదగిన తేజోబిందువు.
హృదయకుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం
అహ మహమితి సాక్షాదాత్మ రూపేణ భాతి
హృది విశ మనసా స్వం చిన్వతా మజ్ఞతావా
పవన చలన రోధాత్ ఆత్మనిష్టో భవ త్వం (రమణ గీత-అధ్యా 2 )
85
సుదుసను.ఆయి తమసా తీరంలో వాల్నీకికి మానిషాద పలికింది. ఈ లోకానికీ ఆ లోకానికీ నడిమిగట్టే తమస. అక్కడ నిలచివున్న కవికి ఈ జన్మ వ్యర్ధ్థమౌతుందన్న శోకం ముంచుకువచ్చింది. శోకం శ్లోకం అయింది. పద్యం గొంతులోంచి బయటపడింది.
“ఎన్ని ఉత్తరములు ఎన్ని తంతులువచ్చె
ఒక్క పిలుపు లే దయోధ్యనుండి'
ఈ అయోధ్య హృదయకేంద్రం. అనాహత చక్రబిందువు. మృత్యు విజయం పొందే సాధన యిక్కడే చేయవలసి ఉన్నది. “అష్టాచక్రా నవద్వారా దేవానాం యోపూ రయోధ్యో ఈ మహర్షోకం నుండి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు కవియోగి.
ఇంత ప్రమోదోన్మాదంలోనూ ఆంతస్సు లోకి మరలగలుగటం ఆ మహాకవి
ర వ పనా స్పెస్టెంబరు 10, 2001 ఆంధ్రభూమి (విశ్వనాథ జయంతి సందర్భంగా) [6
రృష్టశాస్త్రి కావ్య సౌందర్యము
దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరు ఆధునికాంధ్ర సాహిత్యంలో పారిజాతనికుంజం వంటి చోటు. లలిత కోమల కాంత పదావళితో భారతీయ సాహిత్యంలో జయదేవుని న్థాన మెల్లాంటిదో ఆధునికాంధ్ర సాహిత్యంలో శిరీష కుసుమ పేశల సుధామయోక్తులతో కృష్ణశాప్రిదీ అల్లాంటిదే.
ఈ శతాబ్దంలో భావ కాల్పనిక కవితా (ప్రస్థానం (ప్రారంభించిన రాయప్రోలు, గురజాడల మార్గంలో ఒక భావుకతా శిఖరం నిర్మించిన కవి వతంసుడు కృష్ణశాస్త్రి “తలిరాకుజొంపముల సందుల త్రోవల నేలవ్రాలు తుహినకిరణ కోమలరేఖియై తెలుగు సాహిత్యంలో కృష్ణశాప్రి పద్యం వినూత్న అభివ్యక్తి లోకాలకు తలుపులు తెరచింది.
ఆధునిక నాగరతతో వ్యస్తమైన జీవనంలో సహజమైన ప్రకృతితోడి సామరస్యం గల జీవనం నుంచి, దూరంగా తొలగిపోయిన ఈనాటి మానవుడు మళ్ళీ ప్రకృతి తోడి తాదాత్యాన్ని వాంఛిస్తున్నాడు. ఈ తాదాత్యం కోసం ఈ సభ్యతల వలలో చిక్కుకుని పోయిన మిగిలిన వారికంటే తా నొంటరి తనాన్ని పొంది ప్రకృతి యొక్క నిసర్దమైన సాన్నిధ్యంలోకి వెళ్లాలని ప్రయత్నం (ప్రారంభించాడు. “ఆకులో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై, ఈ యడవి దాగిపోనా ఎటులైన ఇచటనే ఆగిపోనా” అని ప్రశ్నించుకున్నాడు ఈ భావ యాత్రలో కవి-
గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
జలజలని పారు సెలపాటలో తేటనై
పగదాల చిగురాకు తెరచాటు తేటినై
పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై
తరులెక్కి అల నిలగిరినెక్కి మెలమెల్ల
చదలెక్కి జలదంపు నీలంవు నిగ్గునై
పరిణమించాలని సంకల్పించాడు. నేల మిద నుంచి నింగిదాకా ప్రాకి అన్ని చైతన్యస్థానాలలో తానే అదై, అన్నీ తానై పోవాలని భావన చేస్తున్నాడు. ఈ భావతాదాత్య
97
నుత్రునన్న ఆల దశలో వ్యష్టియైన తన వ్యక్తిత్వం సమష్టిలో లీనమవుతున్నది. అప్పుడు తనకు మిగిలేది 'సర్వభూతస్థ మాత్మానం, సర్వభూతాని చాత్మని పశ్యతే (యోగయుక్తి) వ్యష్టి బిందువు నుండి సమష్టి సముద్రంలోనికి చేసే మహాప్రయాణం. అందువల్ల జగత్తు తోడి తాదాత్యం సులభంగా సిద్ధిస్తుంది. కాల్పనిక కవితాతత్త్వం ఈ స్థితికి చెందిందే. మనోలోకంలో సమష్టివ్యధలు, బాధలు కల్లోలాలు అన్నీ కవిలో ఆత్మీయతను పొంది, గాఢదశలో అభివ్యక్తమవుతవి, ఈ సర్వత్ర సమదర్శనమన్న స్థితిని పొందటానికి కవి ఎంతో ఒరిపిడిని పొందవలసి ఉన్నది. అది ఒక ఏకాంతస్థిడి - 'ఆకలా దాహమా చింతలా నంతలా ఈ కరణి వెరినై ఏపకతమ తిరుగాడ' భావుకులుకాని అన్నమయ ('ప్రాజమయకోశాలకు నిబద్భులైన వారికి ఈ బాధ, ఘర్షణ, ఉన్నస్థితితో అసంతృప్తి మొదలైన అంశాలు పొందే విలక్షణుడైన కవిని చూచినప్పుడు వెర్రివాడుగానే గోచరిస్తాడు. ఏ మార్గంలోనైనా ఈ స్థితి ఉండనే ఉన్నది. వర్తమానంలో ఉన్న ఈ దుఃఖం వల్ల, కట్టుబడుల వల్ల సంకుచితుడైన మానవుడు స్వేచ్చ కోసం పరితపిస్తున్నాడు. ఈ దాస్యశ్ళంఖలాలు - క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్యశ్చంఖలాలు. ఇవి తమంత తామే చెదరిపోవాలి. జీవితంలోని దుఃఖాన్ని గుర్తించడంలో కాల్పనికవులు బుద్ధదేవుని వలె లోకాన్ని దర్శించారు. దుఃఖం నుండి విముక్తి వాళ్లకు లక్ష్యమైంది. అయితే దుఃఖమూలంలోకి వెళ్లినప్పుడు వాళ్లు ఈ వేదనలన్నీ అనుభవించవలసి వచ్చింది. ఈ గాఢమైన మనస్సులోకి, అగాధంలోకి తమంత తాముగా ప్రవేశించి ఆ గాధాంజన గర్భంలోనుంచి చీల్చుకుంటూ పైకి రావలసి వచ్చింది. అప్పటి స్థితి- తిమిరలత తారకా కునుమములు తాల్చ కర్శశశిలయు నవజీవ కళల దేర (మోడు మోక చివురులెత్తి మురువు సూప నున్న స్థితి తిమిరిలత అన్న స్థితి - అగాధమై - సృష్టిపరిణామం 'ప్రారంభంకాని - సృష్టి దేవాలయంలో చిరుదీపం కూడా వెలుగని సంకల్ప పూర్వదశ కావచ్చు రెండవది సంపూర్ణమైన కరిన శిలాస్థితి మూడవది చైతన్య స్పందం స్ఫురించే (మోడు మోక, 'ప్రొణ వికాసంలో క్రమ దశ ఈ విధంగా వ్యక్తమౌతున్నది 08
ఆ సకువ్పీల
ఇలా మూల ప్రకృతిలోకి, దుఃఖ గర్భంలోకి ప్రవేశించి దాని నుండి సంఘర్షించి
నూత్న జగత్తును స్పష్టించే సంకల్పంతో ఆ పరిమితులను ఛేదిస్తూ పురోగమనం చేయటం
కాల్చ్బనిక కవిత్వానికి పరమలక్ష్యమయింది. ఈ స్థితిలోని పరిణామదశలు ఎన్ని ఉన్నవో అన్నింటినీ స్పష్టరేఖలతో వ్యక్తం చేసిన కవి కృష్ణశాస్త్రి.
“'యుగయుగంబుల నీశ్వర యోధులగుచు” ఈ వ్యక్తులు స్వేచ్చకై తమ ప్రాణ సుమములు ఆర్పిస్తున్నారు. ఇందువల్ల అమల జీవిత ఫలము ధన్యతను పొందుతున్నది. ఇంతటి ఘర్షణ ఫలితం సామాన్యమైందికాదు. జగత్తు తనతో పాటు పరిణామానికి ఉన్నుఖమై తన పరిమితులనుండి ఉన్ముక్తమై వెంట వస్తూ వున్నది. భయము కలిగించు కష్టాతపంబు మరచి కరము కలగించు వంత చీకట్లు మరచి విశ్వమే పరవశమయి వెంటరాగ తాను ఈశ్వర యోధుదై ముందుకు సాగగా తన వెంట పరవశమయిన జగత్తు కదలి వస్తున్నది. జగత్తులోని దుఃఖాన్ని తొలగించటమే ఈశ్వర యోధుని లక్షణం. ఈశ్వరాభిముఖంగా ఈ జగత్తు పొందే పరిణామక్రమాన్ని వేగిరపరచి దానికి ఆనందమయస్థితిని కలిగింప జేసేందుకు మార్గం వేయటమే కవియైన ఈశ్వర యోధుని ప్రవృత్తి.
ఈ ఈశ్వర యోధుని ఉన్ముక్తమైన ఉన్మాదప్రాయమైన దశ 'స్వేచ్భాగానిమన్న రెండవ ఖండికలో వ్యక్షమౌతున్నది. 'పక్షి నయ్వెద చిన్న బుక్షమయ్యెదను, మధుపమయ్యెద చందమామ నయ్యెదను, మేఘ మయ్యెద వింతమెరపు నయ్యెదను అలరు నయ్యెద చివురాకు నయ్యెదను' అంటూ 'మాయ మయ్యెదను నా మధుర గానముని అంటాడు. తనకూ తన గానానికీ అభేదం. ఆ స్థితి పొందిన వారికి మళ్ళీ ప్రకృతి ఆవరణంలోకి వచ్చే అవసరం ఉండదు వాళ్లు జీవన్ముక్తులు, అందుకే అంటారు కవి 'దిగిరాను దిగిరాను దివినుండి భువికి అని అంటే అ చైతన్య పరిమితిలోనికి తిరిగిరానని తాత్పర్యం.
కవి అనేక చిత్తస్థితులను వర్ణిస్తాడు లోకంలో వైరుధ్యం ఉన్నది. సుఖ దుఃఖాలు ఉన్నవి సుఖముగా ఉన్న దశలో అట్టడుగున ఉన్న దుఖూన్ని గుర్తించగలగితే- ఈ దుఃఖ స్పర్శలేని స్థితి కోసం పరితపించే దశ వస్తుంది. వైరుధ్యాల వల్ల సంక్లిష్టమైన దశ ఉంటుంది. ఏది ఏమిటో గుర్తించలేము.
అమల మోహన సంగీత మందు హృదయ దళన దారుణ రోదన ధ్వనులవిందు 99
సువ్రుసన్న ఆ ఈ అనిత్యమైన నిరంతర పరిణామ శిధిలమైన జీవితం నుండి జీవుడు ఈశ్వర చైతన్యంలోకి విశ్రాంతి పొందే ఒక దశను కవి వర్ణిస్తాడు నీలభ్రసరసిలో నిండు జావీిల్లి రాయంచవలె నిహారము సల్పుచుందె కమ్మతెమ్మరలు శాఖా పత్రములనొ కల్లోలినీ తరంగములనో దాగె నాట్యంబు మధుర గానంబును మరచి గాటంపు నిద్దురగాంచె శ్రైవలిని సర్వేశ్వరుని హస్త జలజ యుగ్మమున విశ్వమే హాయిగా విశ్రాంతి జెందె ఈ వర్ణన మాండూక్యములో వర్ణించిన అవస్థాత్రయంలో మూడవ దశను సంబంధించింది. జాగ్రత్సప్న సుషప్రిదశల్లో అనుభవస్థానమైన పురుషుని క్రమంగా విశ్వతైజసప్రాజ్ఞులుగా వ్యవహరిస్తారు. ఇక్కడ భోక్త ప్రాజ్ఞదశలో ఉన్నప్పటి దశ. ఈ ఖండికలో వర్ణితమైంది. సామాన్య దశలో ఉండగా (ప్రేరకమైన భావం ఎక్కడినుంచో అపూర్వమైంది స్ఫురిస్తుంది. అతని పాట అన్న గీతంలో 'మందమలయానిలోర్మికా మాలికలను లలిత సుకుమార మధుర బాలస్వరంబు నెత్తి, పాడితి వేమేమొ హృదయ కమల వికస నోద్చోధకంబగు వింతగీతి అప్పుడు తన అనుభవం ఎలా ఉందో వెంటనే వివరిస్తాడు కవి. 'సందె వేళ పొలముగట్టు; చల్లగాలి చేతిలో చేయి నునులేత చిత్రములును, ఈవు నేను పిట్ట లటుల నేమియనక, సర్వమును జేర నొక్క యపూర్వభావ ముదయమయ్యె కుమార నా హృదయమందు - 'మొగముగంటి కనులగంటి మొగిలుగంటి పాటవిను చుంటి' ఈ విలక్షణమైన దశలో అనుభవిస్తున్న కవీ, పాడుతున్న కుమారుడూ ఇద్దరే ఉన్నారు. 'ఈవునేను పిట్ట లటుల” అంటే జీవేశ్వరులను పక్షులుగా వర్ణించిన శ్రుతి తప్పక స్మరించబడుతుంది. *ద్వాసవర్జ్దా సయుజా సఖాయి అని విశ్వనాథ ఈ కాలంలోనే 'ఈ అనిలాధ్వమందు నినదించెడు మువ్వల (మైత దూరమై పోయిన గోతలఠిన్ పిలుచు పోలిక యేదొ వినిస్వనించెదున్' అన్నిచోట ఈ అవ్యక్త లోకపు ఆహ్వాన గీత స్ఫురణను వర్ణించినాడు. ఈశ్వర భావవేళ దీనుదైన ఈ జీవుని పరిస్థితిని రవీంద్రుడు గీతాంజలిలో వర్ణించినాడు. కృష్ణశాస్త్రి ఒక గీతంలో- ప్రసవ కోమల రమణీయ పధము బట్టి పోవుచుందువు లావణ్యమూర్తి నీవు ఏనా దీనుడ, నే నీడనైన నొదిగి 100
ఆహ సకుచ్సీబు అడుగిడగ లేక నిట్టూర్చువిడువలేక పొరలు కన్నీటి కాల్వలు కురియలేక 'మోడునై రాయినై నిల్పిపోదు నకట ఇక్కడ పరిణామానికి ముందు జీవుడు రాయిగా (మోడుగా నిలిచివున్న దశలను నీడలో నొదిగి ఉండటం, ప్రకృతి పరిమితుల్లో దుఃఖమయజగత్తులో మిగిలి పోవటాన్ని సూచిస్తుంది. బ్రహ్మసమాజ భావన కృష్ణశాస్త్రి కవిత్వానికి ఆధారపీఠం, విశిష్టాద్వైతంలోని సగుణోపాసన స్థానంలో నీరూపమైన ఈశ్వరభావన నిలిపితే బ్రహ్మభావన నిలచి వుంటుంది అందుచేత ఈశ్వర శరణాగతి వల్ల ఎటువంటి జీవునికైనా నిష్పృతి ఉన్నదనే తత్త్వమార్గం బోధిస్తుంది. ఈశ్వరుడు దోషభోగ్యుడు. ఈశ్వరుని ఈ లక్షణమే అతనిని మనకు నిత్యసన్నిహితుజ్హి చేస్తుంది. 'మలినబాప్ప మౌక్తినమ్ము మిలమిల నీ కనుల నిలువ, తళతళమని తారలు నటియించునురా పాపీ !) 'కురియుమురా కన్నీటి మరిమరి విలపింపుమురా సరముగూర్చి పరమేశుడె తాల్చునురా పాపీ శరణాగతి అనన్య గతికత్వము ఈ రెండు లక్షణాలే జీవుణ్ణి ఈశ్వరుని దగ్గరకు చేర్చే అంశాలు. అప్పుడు జీవుని మలినాశ్రుధార పరమపావన జాహ్ననీ ప్రతిభగాంచుతుంది. తావకీన పదసరోజ దళములందు నిలువ నిమ్మొక్క వేడి కన్నీటి చుక్క కడల ప్రసరించు నెత్తావి కమ్మదనము త్రావనిమ్మో ప్రభూ ! దాని తనివితీర ఈ జీవయాత్ర పరిమితిలో కృష్ణశాస్త్రి దుఃఖం సమష్టిజీవ దుఃఖమే కాని లౌకికమైన దుఃఖం కాదు. దానికి పరమమైన గమ్యం ఈశ్వర ప్రాప్తి. అవధరింతువు ప్రతి దివసాంతవేళ నిత్య నూతన తాండవ నృత్యకేళి ళరరద్యూ ట్ దాలై ఓయి నటరాజ తలలైన ఉపలేక హంగ తన. భువనములు దుర్భరానందమున నడంగ | శ్రి ౫ం.జై 286 ఆటలో పాటలో నేర్చినట్లు దేవ ల 1) ఏనుగూడ నీవలె నటియింపనిమ్ము సెనాలను 101 పైలా ద్_ర్టర సనీసళ
నుత్రుసన్న ఆ ఎడతెగని యాత్ర నెట్లా సాగించు వరకు ఎట్లొ నీ దర్శనమ్ము సాధించు వరకు కృష్ణశాస్త్రి చెప్పిన ఈ అనంత యాత్ర సర్వజీవుల యాత్రయే. కాల్చ్పనిక కవిగా కృష్ణశాస్త్రి కవిత్వం విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించింది ఒక పరిమితుల్లో విమర్శకులు దీన్ని భావకవిత్వం అని పిలిచారు. ఆత్మాశయధోరణిలో సాగిన మార్గంలో ఈ కవిత్వంలో (ప్రధానస్థానాన్ని ప్రేమ ఆక్రమించింది. ఈ (ప్రేమ ప్రకృతికీ, స్వేచ్చకూ ఈశ్వరుడికీ పరిమితం కాకుండా స్తీ పురుష సంబంధాన్ని విలక్షణంగా విచారించింది. సమాజంలో స్రీ పురుష సంబంధాలు, ధర్మ స్ఫూర్తి కోల్పోయిన వివాహవ్యవస్థ- కాఠిన్యాన్ని మౌధ్యాన్నీ స్త్రీ పురుషులకు సమాన స్థానం లేక పోవటాన్నీ కల్పించినప్పుడు ప్రీపంసయోగంలో ప్రేమకు పట్టాభిషేకం చేసిన ఘనత భావ కవిత్వానిది. స్రీని కేంద్రంగా
- ఆరాధ్య దేవతగా భావించి ఈశ్వర స్థానం కల్పించే వరకూ ఈ కవిత్వం ప్రవర్తించింది. స్త ప స్వేచ్చనూ ప్రణయాన్నీ లక్ష్యంగా కృష్ణశాస్త్రి వివాహవ్యవస్థ కన్నా స్త్రీ పురుషుల మధ్య స్వేచ్ళనూ (గ్ర క్ష 'ప్రతిపాదించినాడు. ప్రేయసిని “తానే సృష్టించుకొన్నాడట. ఎలాగ? తన మనస్సుకు ఎన్నడో ఎక్కడో సోకిన ప్రతి సౌందర్య ఖండాన్నీ తన హృదయాన్ని ఎన్నడో పలకరించిన ప్రతిప్రేమ శకలాన్నీ ఏరి ఏరి తెచ్చుకుని, అన్నిటినీ కలిపి కలిపీ ఆమెను సృష్టించు కున్నాడటి ఈ మాటలు కవి చెప్పినవే. ఈ (ప్రేయసి నితాంత వియోగిని, నిశీధిని, కరోర ప్రణయశాలిని. అలాంటి ఆమెను గూర్చిన తన అన్వేషణము అనంతమైంది. ఈ భావనుందరిని నిజజీవితంలోకి సాక్షాత్మరించుకునే పని కృష్ణశాస్త్రి కవిత్వం సూచించదు. ఇది ముగియబోని, ఏ యర్ధమెరుగరాని వేసటేలేని వెర్రి యన్వేషణమ్ము ఈ ప్రవాస యాత్రారతి నిటులె నేను కదలిపోవుదు నాశావకాశములకు ఒక్కనిట్టూర్చు వోలిక ఒక్క మౌన బాప్పకణమటు, ఒక గాఢ వాంఛపగిది ఇంత నూతనాభివ్యక్తి సముదాయంతో కృష్ణశాస్త్రి తెలుగుకవిత్వానికి నూతన దిశాభిగమ్యం నేర్పాడు తానే ఈ మార్గంలో కవులందరికీ గురుపీరమైనాడు. క టంలలునాదు ఆకాశవాణి (వరంగల్) 102
త్త 54 టం వ్ కృష్ణశాస్త్రి సంగీత్ రూప్కాలు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆధునిక ఆంధ్ర కవిత్వ నిర్మాతలలో ప్రముఖులు. కాల్చనిక కవిత్వోద్యమం ఆయన వల్ల సౌందర్య శిఖరాలకు చేరుకున్నది. భావకవిత్వం కృష్ణశాస్త్రి రెండూ పరస్పరం పర్యాయపదాలు. 1925లో కృష్ణపక్షం వెలువరించిన నాటి నుంచీ, 1929 ప్రాంతాలలో ప్రవాసము ఊర్వశి వెలువడిన వాటికి 20వ శతాబ్దపు తెలుగు కవిత్వంలో సౌందర్య పక్షానికి కృష్ణశాస్త్రి అధినేతగా కొనసాగినాడు. ఆకాశవాణి ప్రసారాల వల్ల కృష్ణశాస్త్రి అనేక సంగీత రూపకాలు రచించటం జరిగింది. రూపకం దశరూపకాల్లో ఒకటే అయినా, రేడియో రూపకం ఒక వైలక్షణ్యం కలిగివుంటుంది. రేడియో రూపకంలో దృశ్య లక్షణం లోపించటం వల్ల శ్రావ్యమైన భాగమే - దృశ్యానికీ ఆంగిక అభినయానికీ పర్యాయంగా రూపుదిద్దుకోవలసి వుంటుంది. (భ్రవ్య రూపకంలో సంభాషణలు ప్రధానాంశం. దానికి తోడుగా ఆ సంభాషణలు పలికించే కంఠం అనేక భావ సూక్ష్మభేదాలను స్పష్టంగా ప్రకటించే శక్తి కలిగి వుండటం మరొక ముఖ్యమైన అంశం. దీనితో పాటు నడుమ నడుమ ప్రయుక్తమయ్యే సన్నివేశాలను సూచించే ధ్వనులు, సంగీతక్వణనమూ కాల విరామాన్నీ సన్నివేశములలోని రస భావనలను, రూపకంలోని భాష ప్రకటించని అంతర్గత తాత్పర్యాన్నీ వెలువరించవలసి వుంటుంది మరి సంగీత రూపకం లక్షణం ఇంకా లోతుగా విచారించవలసి వుంటుంది. సంగీత రూపకం అంటే సంగీతానికి అధిక ప్రాధాన్యం ఉండదే రచనా విశేషం. పాటలు ఈ ప్రక్రియలో మూలకేంద్రాలు పాత్రల ప్రాణచైతన్య లోకాలలోని భిన్నస్తరాలను విశదంగా ప్రకటించటం ఈ పాటలు చేసే పని ఒక పాట దాని అంతర్గతమైన సాహిత్య లక్షణం చేతనే కాక ప్రకాశితమయ్యే రాగతాళ లయానుగుణరీతి చేత కధా తాత్పర్యానికి అభిముఖంగా రూపకాన్ని నడిపిస్తూ పోతూ వుంటుంది. పాటలోని శబ్దం సంగీతం వల్ల ప్రాణం పోసుకుంటుంది రసభావనల ఇంద్రధనుస్సులను వెలయిస్తుంది. ఈ సంగీత రూపకం కేవలం పాఠర్యంగా అంతగా మదికెక్కదనే చెప్పాలి. 103
నుత్రుసన్ను ఆల న సంగీత రూపకాల కాలం దగ్గరికి వచ్చే సరికి ఆయన క్రమంగా కృష్ణశాప్రి స ౧ షబసూరి దరికి చేరుకుంటున్నారు. తొలినాటి బ్రాహ్మ సామాజికునిగా ఆయన చేతస్సులోని నయన పాటలు రూపొందటం మళ్ళీ మేల్మొన్నది. జై “మహతి” కార్తిక గీత మాధుర్యం కొత్తగా జీవం పోసుకుని పాటలై ప్రవ హించటం ప్రారంభమయింది. (బ్రహ్మ సమాజం నాటి నిరాకారమైన (బ్రహ్మము - సగుణమై, సాకారమై భక్తి పరవశమై కృష్ణశాస్త్రి వాక్కులలో అపూర్వాఖివ్యక్తి లావణ్యాన్ని ప్రకాశింపజేస్తూ వచ్చింది. కృష్ణపక్షంలోని “అన్వేషణ'లోని కవి ఆత్మ గోపికయైన రీతి, మళ్లీ మళ్లీ భక్తి పారవశ్యంతో వివిధ రూపాలలో ఆవిష్ఫృతమవుతూ వచ్చింది. కృష్ణపక్షం చివర- 'అవధరింతువు ప్రతి దివసాంతవేళ నిత్యనూతన తాండవనృత్యకేళి, ఓయి నటూజ! తలలైన ఊపలేక భువనములు నిర్భరానందమున మునుంగు అని చేసిన తాండవ వర్ణనంలోని అనుభూతమైన తాదాత్యస్థితి తరువాత కాలంలోనూ ఆయన మనస్సు నిందా నిండిపోయే ఉంది. కృష్ణశాస్త్రి సంగీత రూపకాలన్నింటికీ ప్రాణం పోసిం దీ అనంతమైన ఈశ్వరా న్వేషణ- జీవుడు పొందిన గోపికాస్థితి, ఎక్కడో కనిపించకుండా వినబడే వేణునాదం. మనకు లభిస్తున్న కృష్ణశాస్రి సంగీత రూపకాలలో ప్రధానమైనవి. ధనుర్జాసు సాయుజ్యము, గుహుడు, శివక్షేతయాత్ర, శ్రీ ఆండాళ్లు, శర్మిష్ట, కృష్ణాష్టమి, యమునా విహారి, ఏడాది పొడుగునా, గౌతమి, వేణుకుంజం. వీటిల్లో రెండు మూడు నాటికల్లో తప్ప అన్నింటా భక్తి భావమే ప్రధానం. శర్మిష్ట భారత గాధ (ప్రధానంగా చేసుకున్నా కథాంశం ముఖ్యం కాకుండా, నిత్య యౌవన భావం ఇతివృత్తంగా (గ్రహించి చర్చించింది. దీనిలో వసంతహేమంతాలు యౌవన వార్థకాలను ప్రతీకలయ్యాయి. ఇక్కడ ఈ భావాలను శర్మిష్త దేవయానులు భావమూర్తులయినాయి. ఒక పరి వేసగివలె క్రోఫ్రిచ్సన్స కి ఒక్కసారి వానకారు మాదిరి ఏద్చించుగానీ ఒకపరి కార్తిక శ్ర్వల్ర హసియించును గానీ ఇక హొామయవనిక్రల దారి నిరసించునుగానీ ఏమైనా తానేనని ఈనాటికి న్సనియని ఇన్నాళ్లకు విన్నాన్సే_ 104
ఆపు సకుద్పలణ
ఇక్కడ అన్ని బుతువులు వసంతానికి వివర్తరూపాలే. వసంతమే నిత్య లక్షణం.
సృష్టిలో నిత్య పరిణామశీలత ఉన్నది. ఈ పరిణామం పురోగమనం వైపు ఊర్థ్వముఖ
మైంది. కనిపించే శైధిల్యం వదైనా ఉంటే అది తాత్కాలికమే. తరువాత రాబోయే వసంతానికి అది పూర్వరూపం మాత్రమే.
ఈ రూపకంలోని కవి చైతన్యానికి ప్రతీకగా కవి పాత్ర ప్రవేశించింది. విశ్వనాథ అనార్మలిలో కవి పాత్ర ఇలాగే నాయకుని పాత్రకు భావదర్శనంగా కానవస్తుంది. ఇక్కడ కవి విశ్వచైతన్యమును తనగొంతులో (మోగిస్తున్నాడు.
నా హృదయమందు విశ్వ వీజాగళమ్ము
భోరుభోరున నీనాడు (మోతవెట్టు
దశదిశా తం(టత్రులొక్క సుధా(శుతిని, పె
నంగి చుక్కల మెట్లపై వంగి వంగి
నిలచి నిలచి నృత్యోత్సవమ్ముల చలించు
విశ్వవీణా గళంలో సుధాథ్రుతి. అది చుక్కల మెట్లపై నిలచి నృత్యోత్సవ నిమన్నమౌతున్నది. ఈ కవి యయాతికి నిత్యయౌవనం సిద్ధించేందుకు చెప్పిన ఉపాయం నిత్యమూ వసంత తాదాత్యుం చెంది జీవించటం. అందుకే కవి అంటాడు 'మోయలేనింక లోకాల తీయదనము ఆలపింతు ఆనందతేజోంబు నిధుల)” లోకమంతా నిరంతరానంద ఖావోన్నత్తంగా కవి దర్భించుతున్నాడు. రూపకం చివర యయాతి అంటాడు. “ఇప్పుడు ఈ లోకంలో ఏ వస్తువునూ (డవేమించకుండా ఉండలేమూ అని అందుకే ఈ వనంతము
నిచ్చిన ఈశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాడు.
ఏచోట దాచితివా ఈ చైత్రజీవమ్ము ఇన్నాళ్లు మా కనుల దేవా !
ఏ నీలిపందిళ్ల ఏ నిదుర పొదిగిళ్ల ఈ తార లలసెనో దేవా!
నీ వసంతమ్ములో నేటి కీర్తనములో పికములై పలికెనో దేవా !
ఇక హిమర్హువువలదు ఇక నిశీధము వలదు నీ సన్నిధియె దేవ దేవా!
ఒక వసంతము పైన ఒక ప్రభాతములబోన వికసింపజేయవా దేవా !
అంతిమమైన ఈ గీతం సంస్కృత రూపకాలలోని భరత వాక్యం వంటిది. అంతస్సులో తేజోమయమైన ్రభాతాన్ని బహిరంగంగా నిత్యసృజన శీలమైన వసంతాన్ని వికసింపచేయాలని యయాతి ప్రార్ధించాడు. జీవనం ఐపొకాముష్మికాలకు ఐక్యాన్ని అనునంధించింది.
105
నువ్రుసన్న అల శర్మిష్ట రూపకం జీవన తాత్పర్యాన్ని వ్యాఖ్యానిస్తే కృష్ణాష్టమి నిత్యమైన ఈశ్వర విరహాన్ని విశదం చేసింది. కృష్ణాష్టమి ప్రారంభంలోనే జన్మించబోతున్న కృష్ణుడు (వ్రేపల్లేకు రావటం నిమిత్తం అంతా సంసిద్ధమవుతున్నది. ఈ సంరంభం అంతా రాధాదేవి ప్రధానంగా నిర్వహిస్తున్నది శ్రీకృష్ణదేవుని రాక కోసం ఉద్ధవుడు, రాయణుడు, నందుడు, యశోద, రోహిణి, రాధ అందరూ ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడటంలో యమున తరంగాలు కూడా కదలటం లేదట. “ఒక తలిరుటాకు తుదయేని ఒక లతాగ్రమేని, తలయూప; దొక సూనమేని వలచి ఉస్సురనక నదే నిరీక్షణ నున్నయదియొ, ఈ విభావరి వేళ బృందా వనమ్ము.' స్వామి అవతరించే ముహూర్తం రాగానే ఉద్ధవుడు అంటున్నాడు 'నీల గగనాంచలము నుండి నేలపైకి శ్రావణ వలాహక స్నిగ్ధ శకలమొండు జారగా” అనగానే రాధ దుర్గాదేవి జన్మను సూచిస్తూ - “తోడ నోరగా జాలువారె చంచలా కాంచనాంచిత కాంచి యొకటి” అంటుంది. శ్రీకృష్ణదేవుడు వ్రేపల్లెలో ప్రవేశించాడు. రాధ ఎదురుగా వచ్చింది చంటిబిడ్డ నెత్తుకుని. కొంచెం కధలో మార్పుచేశారు కృష్ణశాస్త్రి, రాధాకృష్ణుల అనుబంధాన్ని స్వామి జన్మతోనే ప్రారంభం చేశారు. అందుకే స్వామి దర్శనానికి వచ్చిన గోపికలు తలుపు తీయమంటే రాధ అంటుంది. వేయబోవని తలుపు తీయమంటూ పిలువు రాధకెందుకొ నవ్వుగొలుపు నీలోన నాలోన నిదుర పోయేవలపు మేలుకుంటే లేదు తలుపు విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన వీధి వాకిలి యేది చెల్లెలా విశ్వవిభుదే రాధ వెంటనంటీ రాగ పిలుపేది తలుపేది చెల్లెలా మన హృదయంలో నిద్రిస్తున్న ఈశ్వర కామన మేలుకోవాలి. అప్పుడు అతనికీ మనకూ నడుమ ఏ ద్వారబంధాలు లేవు ఈ జగమంతా ఆయన మందిరమే. అప్పుడు అంతస్సు అనీ ఇహిరంగమని వేరే ఏమిలేదు ఈ రచనలో ఒక తపోభావమున్నది. సాధకుని తీవ్రమైన ఆర్తి ఉన్నది సర్వమున ఈశ్వరుని ఉనికి చూడగల జ్ఞాన లక్షణం ఉన్నది. రాధాభావాన్ని ఇంత సుకుమారంగా అపూర్వంగా చిత్రించిన రచన మరెక్కడైనా ఉందేమో వెదికి చూడవలసిందే. 106
ఆకు సకున్సఐ “యమునా విహారి రూపకంలో అంతా అదృశ్యంగా ఉన్న స్వామి కోసం వ్రేపల్లెవారు వెదుకుతూ పోవటం ఇతివృత్తం. ఎక్కడో పిలుపు వినబడుతుంది. వేణురావం (శావ్యమవుతుంది. కాని శ్రీకృష్ణుడు మాత్రం దర్శనం ఈయటం లేదు. గోపికలు ఉద్ధవుని తాదాత్యాన్ని గురించి ప్రశంసిస్తూ అంటారు- 'మురళి (మోగినప్పుదే మనకు మతి పోతుంది. ఉద్ధవుడు అస్త్రమానమూ ఉలికిపడుతూ వుంటాదు” అని అతడంటాడు నందునితో- “అందరమూ ఒక్కటే, ఆడవాళ్లమే. అతడొక్కడే మగవాడు” అని చైతన్య మహా్రభువులు ప్రతిపాదించిన కృష్ణభక్తి సారాంశాన్ని ఉద్ధవుని ప్రవృత్తిలో మనం దర్శించవచ్చు. ఆ వేణువు ఎంతగా మోహపెట్టుతున్నదో బృందావన గోపీ గోపికలకు దరియుకొలది చాలదవ్వాను, దవ్వైనకొలది దరిసి దరిసి పలుకరించు నిముసమేని నీలువనీయదు వేణువు, పిలుపొగాని మేలుకొలుపా గాని కృష్ణశాస్త్రి రూపకాలలో ధనుర్ధాసు, గుహుడు రెండూ భాగవత స్ఫూర్తిని '్రకాశింపజేసే రూపకాలు. ధనుర్ధాసు వృత్తి రీత్యా మల్లుడు. శరీర పరిమిత చైతన్యాన్ని అదుపులో పెట్టుకున్నవాడు. అతడు తన భార్య ప్రియురాలు హేమాంగిని చూడకుండా ఒక్కక్షణమైనా ఉండలేదు. అతడు ఆమె నేత్ర సౌందర్యానికి అనన్యాసక్తుడు. ఇంద్రియ ప్రపంచంలోనూ అతడు సమున్నిద్రస్థితిలో సొందర్యభావనలో మేల్కొని ఉంటాడు. ఈ రెండే అతని ప్రపంచాలు. రెంటిలోనూ రెండవదే అతనికి అత్యంతమూ ముఖ్యమైంది. నీ కనులపైని నాకేలి నీలి గొడుగు నీడ, నీమోదనో సమున్నిద్రజాగ్ర దస్మ దనురాగ సితశీతలాత పత్ర మో సఖీ! ఇటునటు సుంత యోసరిలకు అంటున్నాడు శ్రీరంగనాథుని ఉత్సవానికి వచ్చి అక్కడ కూడా ఆమె నేత్రాలు వాడిపోకుండా ఎండలో గొడుగు పట్టి నడుస్తున్నాడు అది భూలోకవైకుంరం. భూలోక వైకుంఠమునకు రావయ్యా నీలోని రతనాల నిధులెల్ల తీవయ్య నీ కొరకు నా కొరకు లోకులందరి కొరకు వైకుంరమే విడిచి వరదుడిట వేంచేసె అని భక్తులు పాడుకొంటున్న సన్నివేశం భగవద్రామానుజుల దృష్టి ధనుర్ధాసుపై పడింది. 'ఏ తపస్వికొ కాని సాధ్యం కాని అతని ఏకాగ్రత" వారిని ఆశ్చర్యపరచింది. ఒక్క ఆ లక్షణం చాలు అతణ్జి పరమ భాగవతుణ్ణి చేయటానికి పరమ కారుణ్యమూర్తులైన రామానుజులు దనుర్దాసుకు శ్రీరంగదేవాలయానికి రమ్మని కబురుపంపారు. ధనుర్జాసు సులభంగా నమ్మనే లేదు. 1౧7
నుత్రుసన్న ఆ దేవాయలయంలోకి ప్రవేశిస్తూనే హేమాంగిని నిజంగానే- తన వెంట తెచ్చుకున్నాడు. తనలో ఆ దివ్య సన్నిధానం సామిప్యమే మార్చు తెస్తున్నది. ఘంటానాదం, ధూపదీపాల సువాసనలు, మాల్యములు, చందనము, దీపకాంచులు ఒక్కొక్కటీ అతని యింద్రియ పరిమితులను అతిక్రమింప జేస్తున్నాయి. రామానుజులు అతన్ని 'ప్రశ్చించారు. ఇంత ఆలస్యమయిం దెందుకని? వారెన్ని ఎన్ని యుగాలనుంచి ఈ తప్పిపోయిన జీవునికోసం ఎదురుచూస్తున్నారో? వెదుకుతున్నారో? ధనుర్దాసు తన వేదనంతా ఆచార్య పాదాల ముందు వెళ్లబోసుకొన్నాడు. శ్రీరంగనాధుని నేత్రదర్శనమయింది. అతని హృదయం ముగ్ధమైంది. నా తండ్రీ ! చిరదగ్ధజాంగలము ప్రాణమ్మిద్ది యుష్మత్కృపా న్వీత సీత కటాక్ష వీక్షణము, ్రావృణ్మేఘమాలా గళ చ్భీతస్రోతము ఒక్కమారయిన వర్షింపంగదే, ఆరునే మో తృష్టాగ్ని రవంత చల్లబడునేమో జీవమోయీ ప్రభూ ! కనగ కనగ నీదికన్నేది? మిన్నేది? అదుగులేవి కడలి యదుగులేవి? ఎరుగనైనలేను ఏమేనులేని నీ వీ దృగాళి నెట్టు లిమిడినావు అద్భుతమైన ఆశ్చర్యకరమైన రచన యిది. మొదటిపద్యంలో అనంతకాలపు జీవుని వేదనాతీవ్రదహ్ని రెండవపద్యంలో పరతత్త్వ సాక్షాదనుభవమూ వ్యక్తమవుతున్నాయి మరొక నాటిక గుహుడు రామాయణ కథకు సుందర వ్యాఖ్యానం, నిషాదరాజు గుహుడు అమాయక భక్తుడు. శ్రీరామాగమనవార్త తెలిసి త్రోవను సిద్దంచేసే విషయం చెప్పిందే చెపుతూ నిరంతరమైన ఆర్తిని పొందుతూవుంటాడు శ్రీరామచంద్రుడు ఎంత కరుణామయు డంటే ఆయన భక్తుని కోసం తానై వస్తున్నాడు. “నేనెందుకు పరుగెత్తడం. నేనొక్క అడుగు వెయ్యిబోయేసరికి ఆ మవారాజే వెయ్యి అడుగులు ఎదురుగా వస్తుంటే' ఇది గుహుని అనుభవచరమసీమ. ప్రభువు నిర్దేతుక జాయమాన కరుణా లక్షణం, గుహనికి ప్రకృతి అంతా స్వామి స్వాగతానికి సిద్ధమైనట్లు కానవస్తున్నవి, ఇతరులను ఆ అనుభవం పొందటం కోసం 'నాలోపలికి వచ్చిచూడండయ్యా' అంటున్నాడు. ఎంత తొందర పరువుల నేగుదెంచు నన్ను నేలెడు వాని ఘృణాపదమ్ము దలి ప్రాణాలు నామేనువదలి ఎదురు తెరువులై ఎట్లు లహరులై కరిగిపారు 1040
ఆ సకుప్పల గుహుడు స్వామి పాదప్రక్షాకనము కోసము గంగా జలమును పరిచారకుడు తెచ్చేదాకా నన్నా ఆగలేదు కన్నీటితోనే ఆ పాదాలు తడిపేశాడు. భక్తునికి భగవంతునికీ నిత్య సంబంధము. అది అనాది అనంతము. అందువల్లనే అతనంటాడు- “ఎప్పటి నుంచో ఎరుగుదును ఆ మహాప్రభువుని ఆ పాదాలు ఎప్పటినుంచో నడుస్తున్నాయి నాయనా నా మనసులో. నేనిదివరకే చూచానయ్యా వాటిని ఎంత అంటీ అంటక వోయినా ఆ పాదచిహ్నాలు ఇట్లే పోల్చుకోగలను సుమా లక్ష అడుగు జాడలలో. జీవేశ్వరుల నిత్య సంబంధం గురించి ఇంకా గుహుడు ఇలా అంటున్నాడు. “ఇందాకా రావడమేమిటి? అలాగే వస్తూవున్నారు నా ప్రభువులు నా కోసము. ఎప్పుడూ వస్తున్నారు! ఆవా ! ఎప్పటినుంచో వస్తున్నారు. ఎక్కడి నుంచో వస్తున్నారు. నాకోసమే నా కోసమే. నా తండ్రి నా కోసం వస్తున్నారు” ఇలా గుహని పలుకులు విని లక్ష్మణుడు “ఏ పరమ భాగవతుడు అనలేని మాట అంటున్నాడు అన్నాడు. గంగను దాటించేందుకు పడవ నడుపుతూ “సర్వమూ నడిపేవాడిని నడిపే వాడెవరమ్మా' అని - పడవ నడపుము కర్ణధారీ అని పాడుతూ తన తన చైతన్యాన్ని సర్వమూ సమర్పణ చేసినాడు గుహుడు. సీతారామ లక్ష్మణులు చిత్రకూటం చేరినా ఆ పడవ దగ్గరేనిల్పుని వారి తిరిగిరాక కోసం పదానాల్లేళ్లు గుహుడు అలాగే నిల్చుని ఎదురు చూచాడని కృష్ణశాస్త్రి చెప్పారు. ఈశ్వర నిత్యవిరహ భావనకు ఇది సుందర చిత్రణం. కృష్ణశాస్త్రి నాటికలలో ఇంకా ఎన్నో అందమైన నాటికలు ఉన్నాయి. శ్రీ ఆండాళ్లు వాటిల్లో ఉత్తమమైంది ఆండాళ్లు మధురభక్తిని, విష్ణుచిత్తుల వాత్సల్యభక్తిని గొప్పగా చిత్రించారు దీనిలో. స్వామి స్వయంగా ఆండాళ్లును వివాహం చేసుకుంటు న్నట్లుగా కబురుచేయడం, సపరివారంగా శ్రీవిల్లిబుత్తూరు విచ్చేయటం అంతా భక్తి భావ బంధురంగా చిత్రింపబడింది. రచన అంతా ఆముక్తమాల్యద కర్త శ్రీకృష్ణదేవరాయల వారి అడుగు జాడల్లో సాగింది ఇదంతా కృష్ణశాస్త్రి సంగీత రూపకాలలోని వస్తుభావ సౌందర్య వర్ణనమే అయితే రచన అంతా సంగీతమయం కావటంలోనే ఉంది దాని బెదార్యం. సంగీతం వల్ల మనం శబ్దం నుంచి నిశ్శబ్దం దాకా బుద్ధి దశనుంచి అహంకారమును దాటి చిత్తము దాకా ప్రయాణిస్తున్నాం. జీవుని అంతర్గతమైన వేదనకు అధిక ప్రకాశక మవుతున్నది ఆకాశవాణి (వరంగల్ 109
మధునాపంతుల వారి కవితా తేజస్సు ఈ శతాబ్దపు తొలిసగాన్ని ఆక్రమించిన కాల్బనిక కవితా సరస్వతిని కైసేసిన “దిగివచ్చిన గంధర్వుల వంటి కవిశ్రేణి రాయప్రోలు కృష్ణశాస్త్రి విశ్వనాథ 'ప్రభృతికము గత శతాబ్దపు చివరి దశకంలో 'ప్రాదుర్భవించింది. ఆ అడుగు జాడలలో పులకించిన తెలుగు కవిత్వాన్ని ముందుకు సొగించిన వారు అటు నవ్య సంప్రదాయ ఉద్యమానికీ, ఇటు ప్రగతి వాదోద్యమానికీ ఊపిరులూదిన కవి ్రేష్టులు. వీరు సుమారుగా ఈ శతాబ్దపు రెండవ దశకం జన్మించినవారే. వీరిలో ప్రముఖులు- పుట్టపర్తివారు, తీ, రుక్మిణీనాధ్ శాస్త్రి పిలకా గణపతి శాస్త్రి, విద్వాన్ విశ్వం, ఇంద్రగంటి హనుమన్శాస్త్రి, కరుణశ్రీ, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి. ఈ తరం కవులలో 'ప్రయోగశీలిత వైవిధ్యం ఎక్కువ. బహుమార్గగామిత అధికం అయితే వీరందరిలోనూ తాము ఎన్నుకున్న మార్గంలో ముక్కుసూటిగా, చెక్కుచెదర కుండా సాగిపోయి ఆంధ్ర జాతి చరిత్రను ఒక పురాణంగా తీర్చిదిద్దిన ఘనత శ్రీమధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిదే. భారతీయ పునరుజ్జీవనోద్యమం తెలుగు కవిత్వంలో కొత్త దారులకు 'హైతువైంది. ఇకర భారతీయ భాషలలోనూ అదే హేతువు. మధ్య యుగాలలో దీర్హకాలపు అవ్యవస్థలో బానిసతనంలో విలువలు కోల్పోయి పతనావస్థలో ఉన్న భారతీయ సమాజానికి పునరుజ్జీవనోద్యమం వసంతం వచ్చినట్లుగా కొత్త ప్రాణం పోసింది. భారతీయ జీవనం పునఃజాగ్భతమై తన శిధిలాల అడుగున ఉన్న మూలాలను వెతుక్కుంటూ వచ్చింది. సంస్కరణోద్యమం జాతీయోద్యమంగా మారి ఆ భావ '్రవాహాంలో వీరరసం అంతస్సులో సంలీనమై ఒక విలక్షణమైన విజయ యాత్రగా మారిపోయింది. 'క్రార్య కౌటిల్య కల్పిత కరిన దాస్య శృంఖలములు తనంతన చెదరిపోవు? ప్రయోజనం కోసం భారతచైతన్యం సింహవాహిని దుర్గారూపం ధరించింది. పాశ్చాత్య సాహిత్య సంస్కారం, నూతనాదర్శాలు ఈ చైతన్యానికి పదునుపెట్టాయి ఆత్మాశ్రయమై అంతర్వేదనకు ఆవిష్కారరూపమైన కాల్పనిక కవిత్వం మహాకావ్య రూపాన్ని పొందింది. సంప్రదాయం కొత్త చైతన్యంతో అభివ్యక్తితో సమన్వయంతో, నవ్యతను పొంది నవ్య 110
సంప్రదాయమైంది రాయప్రోలు దేశభక్తి గీతాలు, విశ్వనాధ ఆంధ్రప్రశస్తి, కొడాలి హంపీ క్షేత్రాలలో వస్తువును అన్వేషిస్తూ వచ్చి వచ్చి మధునాపంతులవారి ఆంధ్ర పురాణంతో జాతీయ స్ఫూర్తితో 'ఆధునిక రఘువంశ పురాణం'గా సంగమించింది. రాజమహేంద్రవరం నన్నయ నాటినుంచీ ఒక సారస్వత తీర్ధం. ఒక ప్రొధిమతో కూడిన మధురశైలి నన్నయ శ్రీనాధుల నుంచి సాగివచ్చింది. తిరుపతి వేంకట కవుల అవధానప్రవాహం తెలుగు పద్యాన్ని క్షీణ ప్రబంధ యుగ వాసనలనుంచి విముక్తం చేసి నచేతనమైైన ఆధునిక భాషాలక్షణంతో వాక్య విన్యాసంతో (ప్రజలలోకి ప్రవహింపచేసింది. కాల్పనిక కవుల నూతన భావాఖివ్యక్తి ఈ తెలుగు పద్యానికి బంగారానికి తావిఅబ్బిన విధంగా కొత్త జిలుగును సంతరించింది. నవ్యసంప్రదాయోద్యమంలో సౌందరనందం కాల్పనికోద్యమపు సంకుచిత పరిధులను విచ్చేదం చేయగా, శిరభారతము, రాణా (్రతాపసింహ చరిత్రలు జాతీ యోద్యమ లక్షణాన్ని స్వేచ్భా సమర తీవ్రతను సంతరించిపెట్టగా, రామాయణ కల్పవృక్షం ఆధ్యాత్మిక అధిదైవిక ఆధి భౌతిక స్థితులలో మానవుని సర్వతోముఖ విముక్తికి సమగ్రతకు, పరిపూర్ణతకు దోహదం చేస్తూ కొనసాగుతూ వుండగా ఆఅఆంధ్రపురాణ రచన వెలువడింది. తెలుగున వేలయేండ్లుగ గతించిన గాథల పెంపు కొండగు ర్తుల పెనుగుంపు గాని, “యిది రూఢిగనిట్టిది” నాగ తెల్పనె వ్వలన నసాధ్యమైన నొకపాటి చరిత్రము దాన్ని రసమహితమైన కాలనాయకమైైన పురాణంగా మధునాపంతులవారు వెలయించారు. ఎప్పుడో చన్న మహానుభావుల ప్రశంసలు సేతలు జాతికి' అవసరమని ఆయన భావించారు. వారి అనుభవవిశేషమే ఈ నాటిక (పేరణ. ఇది పురాణమే అయినా ప్రాచీన పురాణాల వలె పంచలక్షణ సమన్వితం కాదు. దీనిలో ప్రధానమైన అంశం వంశానుచరితమే అది పంచలక్షణాలలో ఒకటి. ఇది ఇతిహాసం కాకుండా పురాణం కావడం ఒక వైలక్షణ్యం నవ్య సంప్రదాయ కావ్యంలో దీని తరువాత వెలువడిన మరొక పురాణం ముదిగొండ వీరభద్రమూర్తి రచించిన “వందేమాతరం.” ఇదీ కాల నాయకమైన రచనయే. సౌందరనందాదులు కావ్యాలై కల్పవృక్షం ఇతిహాసమై, ఈ రెండూ నవ్యసంప్రదాయంలోని పురాణాలు అయ్యాయి. ఈ అయితే ఈ రెండూ చరిత్ర ఆధారంగా నిర్మితమైన పురాణాలు ఒక కావ్యం 111
సుర్రసన్న ఆల ప్రాచీనాంధ్రచరిత్రను ప్రాణసూత్రంగా నిర్మించితే రూపుకట్టింది రెండవది అతి సమిప భూతకాలంలోకి స్వాతంత్ర్య సమరాన్ని పద్దెనిమిది భాగాలుగా నిర్మించిన పురాణ రచన. ఈ రెండూ ఊర్జితకథో పేతాలు, నానా రసోభ్యుదయోల్లాసాలు. మరొక పురాణ ప్రాయమై మహాకావ్యత్వాన్ని మేళవించుకున్న వానమామలైవారి పోతనచరిత్రము విలక్షణ నిర్మాణ వైఖరిగల వర్ణనా బహుళమైన ప్రబంధం. నాయని వారి “జన్మభూమి” స్థల పురాణపు మూసలో నుంచి పొదుచుకువచ్చిన మరొక శ్రేష్టరచన. ఒక చరిత్రను కావ్యంగా నిర్మించడంలో ఎన్నో చిక్కులు ఉన్నాయి చరిత్రలోని వాస్తవికతకు, సాక్ష్యాలకూ భంగం కలుగకుండా వ్యక్తుల శీలాన్నీ వ్యక్తిత్వాన్సీ సన్నివేశాల కార్యకారణభావాన్నీ కవి నిర్మించవలసి ఉంటుంది. ఈ నిర్మాణంలో ఉన్న పరిమిత స్వేచ్చలోనే రసోత్మర్హను కలిగించ వలసిన బాధ్యత కూడా ఉంటుంది. ఇరులు వారిన కొండ దరుల లోపలి రాల జిలుగు శాసనపు వ్రాతలను నేర్చి చిరుమబ్బు సందుల మెజపులై యొజపు పెం పరు నాణెముల కొలగురుతులూడ్చి వాయుమత్సాదిక ప్రాక్పురాణములలో గలసి పాడిన కధావళు లమర్చి సోమ దేవాదిక సూరివర్యుల కైత కల్పనమ్ముల సోయగమ్ము దేర్చి ఈ చరిత్రలో నవనీతాన్ని గ్రహించి వలసి ఉంటుంది కవి చారిత్రక కావ్యము, చారిత్రక నవల ఈ రెంటికీ ఇది సమానమైన సమస్యయే చాల సన్నివేశంలో 'పేరులే తప్ప బ్రతుకుల పెంపు సొంపు తీరుతీయము పసలు గుర్తింప రాకి ఉంటాయి చరిత్రలోని చాలా ఘట్టాలు ఈ సన్నివేశాల అస్థి పంజరాన్ని రక్తమాంసాలతో నింపడం కవి ప్రతిభ మిద ఆధారపడి ఉంటుంది ఈ కల్పన కావ్యపరమార్థమును, కావ్యంలోని ఏకసూత్రతను వ్యాఖ్యానిస్తుంది. ఈ లక్ష్యంతో ఆద్యంతాలను ఏ హేతువుకూ లొంగని సన్నివేశాలను ఒక మాలగా గ్రుచ్చి ఒక ఆధునిక పురాణాన్ని తెలుగువారికి ఉపదగా చేశారు మధునాపంతులుగారు. మధునాపంతుల వారి సా హిత్యజీవన ఫలం ఆంధ్రపురాణమే మిగతా రచనలన్నీ ఖండకావ్యాలు, విమర్శలు ఈ ఖండకావ్యాలు చాలాభాగం ఆంధ్రపురాణం 112
ఆ నకుర్పీబు అనంతర రచనలే. ఇవి చదువుతూ వుంటే ఆ మహాగ్రంధంలోని ఏదో ఘట్టం చదువుతూ వున్నట్లుగానే తోస్తుంది మనకు
ఆం(ధ్రపురాణం నవపర్వ సమన్వితం శాతవాహన, చాళుక్య, కాకతీయ, పునః ప్రతిష్టా విద్యానగర, శ్రీకృష్ణదేవరాయ విజయ, నాయకరాజ పర్వాలు ఈ తొమ్మిది. ఈ మహాగ్రంధం ఆంధ్ర జాతి ఆవిర్భావ చరిత్రలో ప్రారంభమై, విజయ రాఘవుని రాజ్య వైభవం దాకా కొనసాగుతుంది. కావ్య నిర్మాణంలో వస్తు విన్యాసంలో మధునా పంతుల వారు అవలంబించిన విధానం కావ్యాన్ని ఆద్యంతమూ మధురంగా పరనీయంగా రసోల్లసితంగా చేస్తున్నది. ఒక్కొక్క పర్వం చరిత్ర క్రమాన్ని అనుసరిస్తూ వచ్చినా, కొన్ని కొన్ని సన్నివేశాలను చిత్రించి ఆనాటి మానుష ప్రపంచాన్ని సాక్షాత్కరింప చేస్తారు కవి. కావ్యారంభంలోని శునశ్ళేపునికధ స్వార్ధానికీ, త్యాగానికీ జరిగే ఒరిపిడిగా సన్నివేశాలన్ని తీర్చిదిద్దారు. విశ్వామిక్రుని ఉత్తాలమైన వ్యక్తిత్వం మనకు దీనిలో సాక్షాత్కరిస్తుంది. వేదయుగ సభ్యత మనకు రూపు కడుతుంది. తన (బ్రతుకు కాపాడటం కోనం రోహితుడు అజీగర్త దంపతులను బిడ్డ నిమ్మని ప్రాధేయ పడ్డప్పుడు - శునశ్ళేపుని తల్లి- వత్సా నీవొక తల్లి బిడ్డ్జడవు కావా ! ముద్దు ముచ్చట్లు నం పత్సర్వస్వము నిండ బుజ్జకము నింపం బెంచి పోషించ క వ్వాత్సల్యంబును నుజ్జగించి వెల మోవం కాన్పు బోకార్చు నా పత్సంకల్పము మాతృ మానసపు (ోవం జూపు సారించున్ అని మందలిస్తే 'కుడి యెడ చెంపపెట్టులుగ గొట్టగ దంపతు లాడినట్టి యా నుడులకు రాచపుట్టువు కనుల్ నొసలెత్తిన నీలిమబ్బులై జడి గురిసినాయి. మానుష ప్రవృత్తిలోని వైవిధ్యాన్ని ఎంత గొప్పగా చిత్రించారు కవి. స్వార్ధపరుడైన రాజకుమారుడిలో కూదా ఎంత ఆ(ర్టత ఉన్నది. శాత వాహన పర్వంలోని కావ్యహోమము ఒక విలక్షణమైన ఘట్టము. కవి కృతమైన రచనా నర్వన్వమును రాగద్వేషదూషితమైన నమాజం ఆదరించక తిరస్కరించింది అవమానించినప్పుడు అతనికి కలిగే వేదన సామాన్యమైంది కాదు. ఆ అహంకార దుర్విదగ్భులైన రాజులను గుణాధ్యులు దూషించే సందర్భం ఏనాడైనా అధికారాంధులు రస (ప్రపంచదూరులు అయిన వారిని రూపుకట్టించే సన్నివేశమే 113
సుతుసన్న ఆ శాజఉన్యంబను మేకతోలు మెయి నాచ్భాదించుకొన్నట్టి యీ రాజుల్ రాజులు గారు బెబ్బులులు,” - మోసపు తేనియల్స్ విసపుమెచ్చులు, నచ్చముగాని కౌగిళుల్, మోసపు కానుకల్స్ మొగము ముందరి నవ్వుల నాల్కబోసి వి శ్వాస కృతజ్ఞతా హృదయభావుకతల్ దిగద్రోసి, జీవితో ల్లాసము దీర్చికొన్న నృపులా కవితాకళ నుద్ధరించుటలొ “ఇది యేడేండ్ల తపస్సు పండిన ఫలం బీ నాకృతిన్ జీవసంపద నందించితి' ఈ కావ్యము ప్రతీకాత్మకమైందే, ఒకరాజు, ఒక అధికార ధూర్యహవ్యక్తి సమూహము, ఒక మతాహంకారము. ఒక రాజకీయ సిద్ధాంత ప్రచారోన్మాదము ఏదైనా స్వచ్చమైన కావ్య రసజ్ఞతను శత్రువులైన అంశమే కవికి “వేయి దళాల తమ్మివిరివోని హృదయ మొక్కొక్క రేకుగా ్రిదులుచుండె. ప్రకృతిలో కూడా ఈ భీభత్స పరిణామాన్ని వరిస్తారు కవి. కటకటాయని (ప్రకృతి భగ్నహ్బదయమున మొదలుపెట్టె మహీధర దరులు ('మోగ”. పులుగుల కూనడెందములు పాొక్కె జెమర్చను జంతుపాళి క న్నులు, శిలలుం కరంగినవి, నూల్మోని మోడులునేద్చె, నద్భుతో జ్వల నవకల్పనా మహిత చారుకథాకృతి యిట్లు గాలి నె చ్చెలి వెడయుచ్చులంబడి కృశించి నశించుచునున్న నయ్యెడన్ ఈ సన్నివేశంలో మానవ హృదయానికీ, ప్రకృతికీ ఎంతగాధమైన ఏకాత్మ లక్షణం ఉన్నదో కవి నిర్దేశించి అద్భుతంగా చిత్రించారు. వాళ్ళీకి కాళిదాసు భవభూతుల వంటి మహాకవుల తాత్త్విక రసచైతన్యాన్ని వారసత్వంగా తెచ్చుకున్న కవి కాబట్టే మధునాపంతుల వారు రచనలో సృష్టిలోని ఏకాత్మ లక్షణం ఇంతా గొప్పగా ధ్వనింపజేశారు. ఆంధ్ర పురాణ పరమార్ధమైన నవ్య సంప్రదాయ వాదంలోని సర్వతోముఖ విముక్తిని (ప్రతాపరుద్రుని ముఖాన కవియిట్లు పలకించారు. కుతుకములేని దాస్యమున గుందెడి దేశసవిత్రి యిక్కటుల్ జతనమునం దొలంపుడి ప్రజల్స్ విజయ ధ్వజమున్ పునఃప్రతి స్టీత మొనరింపుడీ, తెలుగు సీమ స్వతంత్రపు జోతి పెంపుడీ, తతభుజశౌర్యుదైన వినతాసుతు వీరకృతుల్ తలంపుడీ 1114
లౌకికంగా దేశస్వాతంత్రాన్ని నాధింపవలసిన ఆవశ్యకతను ఈ పద్యం (ప్రస్ఫుటీకరిస్తున్నది. నర్మదా తీరంలో విషయబంధ విముక్తుం డ వ్వీర భద్రుడు ధ్యానకళా వినీతుడై అపునరావృత్తి మృత్యుంజయానువర్తి సుఖము చూరాడె అని చెప్పినప్పుడు ప్రతాపరుద్రుని విషయంలో రఘువంశరాజుల ఆదర్శం 'యోగేనాంతే తనుజ్యతాం అన్నది ఎలా సార్ధకమైందో తెలియవస్తుంది. శ్రీకృష్ణ దేవరాయపర్వంలో రాయల యెడ చనవుగొనె నిట్లు ప్రాక్తనజన్మకళలు” అని అతని ప్రతిభా విశేషాన్ని వర్ణించినప్పుడు కుమారసంభవం స్ఫురిస్తుంది. పురాణ రూపమైన ఆంధ్రపురాణం మొత్తమూ రచనా మాధుర్యంతో స్వాదుతా సంవలితమై ఒక వడపోతపెట్టిన ఇక్షరసంలాగా సాగిన వైఖరీ విశేషం. మధునాపంతులవారి ఇతర కావ్యాలు శ్రీఖందడము, కేళాకుళి, చైత్రరథము. సదాశివ పంచాశిక రచనావైదగ్య్యాన్ని వెల్లడించే ఖండ కావ్య సంపుటులు. వీటిల్లో సదాశివ పంచాశిక ఒక విధమైన సంగ్రహమైైన సర్వదర్భ్శన సంగ్రహం. వారి పాండిత్వానికి పరిణతికీ ఉదాహరణ (ప్రాయమైన కృతి. మధునాపంతులవారి కవితాతీర్థం ఈ శతాబ్దపు ఆంధ్రకవితా వాపొనిలో ఒక (ప్రధానఘట్టం. మధురోజ్జ్వల ప్రౌఢ కవితా సరస్వతి వారి రచనల్లో ఆవిష్కుతమైన ఆంధ్ర పద్య విద్యకు ఒక నూతనమైన పథాన్ని నిర్దేశించింది. లా ఆకాశవాణి, వరంగల్ కేంద్రం 2, మార్చి 1993 115
అరిశిరస్సుం నుత్తరించిన అలుగు నేన, తెలుగు నన! దాశరధి కవితారంగంలోకి (ప్రవేశించినప్పటికి “తెలగాణమ్ము తమఃకవాటముల బందీ'యైనకాలం. ఆ స్తబ్బతలో నిశ్శబ్దరాత్రిలో జ్వాలాకేతనంతో ప్రవేశించి, ఆసాధారణ (ప్రతిభతో, పాండిత్యంతో నిరంతర సాధనతో “'ప్రాణలొడ్డి ఫోర గహనాటవులన్ పడగొట్టి మంచి మాగాణములన్ సృజించిన రైతుదే తెలంగాణము, ముసలినక్కకు రాచరికమ్ము దక్కునే అని గర్జించిన కవియోధుడు దాశరథి అప్పటికి ఉధృతంగా సాగుతూవున్న ప్రగతివాదోద్యమంలోనికి ప్రవేశించి ఆ ఉద్యమంలోనికి జాతీయవాద దీప్తిని నిలబెట్టి నూతన ప్రాణాన్ని సమకూర్చాడు. ఇంట్లో నేర్చుకున్న సంస్కృత సాహిత్యం. పారశాల వాతావరణంలో అలవడ్డ ఉరూ పారసీక కవితా సౌందర్యం ఆయన తెలుగు పలుకునకు గొప్ప దీప్తిని తెచ్చిపెట్టింది. ఈ స్థితివల్ల అతని కవిత ప్రగతివాదోద్యమ పరిధి కంటె విసృతంగా రూపొందింది. గెలిచినది గడ్డిపోచ, ముక్కలయిపోయి మన్నుకరచెను గొడ్డలి, కన్నులోని వేడి ఆశ్రువు గెలిచెను, వాడి కత్తి ఓడిపోయెను ముస్సి పారాడిపోయె. . . అని హైదరాబాదు సంస్థాన విముక్తిని తాదాత్యంతో వర్ణించాడు దాశరధి. ప్రగతివాద కవుల్లోలేని ఆత్మీయత-కాల్చ్బనికవాద కవుల వారసత్వంగా దాశరధి కవితలోనికి సాగివచ్చింది. జాతీయ చైతన్యం సమగ్రంగా శతపత్రసుందరంగా దాశరధిలో వికసించింది అగ్నిధార ప్రారంభంలోనే జెండా ఒక్కటి మూడు వన్నెలది, దేశంబొక్కటే భారతా ఖందాసేతు హిమాచ లోర్వర, కవీట్కాండమ్ములోనన్ రవీం (ద్రుండొక్కండె కవీంద్రు, డూర్దిత జగద్యుద్ధాలతో శాంతికో దండోద్యద్విజయుండు గాంధి యొకడే, తల్లీ మహాభారతీ 116
ఈ పద్యంలోని వస్తువు ప్రగతివాద కవుల పరిమితులను దాటివచ్చింది. 'గతమొక గంగయై హృదయగహ్వరమునన్ చొరబారింది” వర్తమానం ఆయన కార్య రంగం. భవిష్యత్తు స్వప్న భూమి. మూడుకాలాలనూ తనలో సమన్వయించుకున్న కవి అందువల్ల 'మంచి గతమున కొంచెమేనోయ్' వంటి పాక్షిక ధోరణులతో ఆయన ఎప్పుడూ కుంచించుకపోలేదు అందుకే దాశరధి 'కాలం నా కంఠమాలి అన్నాడు. దాశరధి దృష్టిలో గతం వర్తమానం లోనికి (ప్రేరక శక్తిగా ప్రవహిస్తుంది. 'నా కవితా లతాంతము తృణమ్ములలో నయినన్ సువాసనల్ ్రాకెడి రీతి పూచినది, పాతదనమ్మును శ్రావి తేన్చి నాజూకగు కొత్తవాసనలు చూపిన దీ రసికాంధ్ర సాహితీ లోకమునందు? అని వివరించాడు దాశరధి. దాశరథి కవిత్వంలో ఉద్వేగం ఎక్కువ ఏది కాకతి, ఎవరు రుద్రము, ఎవదు రాయలు, ఎవడు సింగన, అన్ని నేనే అంతనేనే, వెలుగు నేనే తెలుగు నేనే అరిశిరస్సుల నుత్తరించిన అలుగు నేనే, తెలుగు నేనే అఖిల జగముల చుట్టివచ్చిన పులుగు నేనే వెలుగు నేనే, దాశరథి దృష్టిలో కవిత- మాట్లాడని మల్లెమొగ్గ. నిశ్శబ్దం ఎరుగని నిమ్నగ. ఈ రెండూ వైరుధ్యం గల లక్షణాలు. వాచ్య ప్రధానం కాక వ్యంగ్యమును ప్రకటించే కవిత మాట్లాడని మల్లె మొగ్గ నిశ్ళబ్దం ఎరుగని నిమ్నగ అంటే దేశకాలాలకు అతీతంగా అందరి సృదయాలలోనూ నిరంతరంగా నిస్వనించే లక్షణం కలిగింది. ఈ రెండు లక్షణాలు కలిగివుండడం వల్ల కవిత ఆజరామరమౌతుంది. దాశరధి కవితకు సోరాటమే వస్తువు ఈ పోరాటం అంతస్సులోనూ, బాహ్యంగానూ సాగుతున్నది. హిట్లర్ ముసోలిన్సీ, నిజాంరాజులను ఎదరించి గెలిచిన మహావీరులు ఆయనకు సమానంగా అరాధ్యస్థానాల్లో ఉన్నవారే. అందుకే 'నేను దుష్టులతో రాజీపడలేదు వారితో సామరస్యం నా చేతకాదు. సమరసం కన్నా సమరమే నాకు ఇష్టం అంటాడు దాశరధి కవితాచైతన్య స్పందన తెలంగాణా పోరాటంతోనే (ప్రారంభం అయింది. “విషము గుప్పించినాడు, నొప్పించినాడు మా నిజాంరాజు జన్మజన్మాల బూజు' అని ధీరతతో పల్కి యుద్ధంలో పొల్గొన్న కవి అతడు ఈ ధీరప్రకృతి ఆయన కవిత్వం 117
గుప్రునన్న ఆ నిండా వ్యాపించి ఉన్నది. జీవితంలోనూ సాహిత్యంలోనూ దేనితోనూ రాజీపడని వ్యక్తిత్వం దాశరధిది. చైనాతో, పాకిస్తాన్‌తో భారతదేశం జరిపిన యుద్దాలలోనూ దాశరధి తన గొంతును శక్తిమంతంగానే వినిపించాడు తెలంగాణ తోడి ఆత్మీయతయే అతనిని గొప్పకవిగా తీర్చిదిద్దింది. 'నా తెలంగాణా కోటి రత్నాల వీణ” అన్న మాట తెలంగాణా ప్రజల వ్యక్తిత్వ చైతన్యానికి ప్రతీక వంటి వ్యక్తీకరణ నినాదమయింది. తెలంగాణంలోని ప్రతి అంశమూ ఆ కవితా యాత్రలో ఆయన గళంలోనుంచి కవితయై పాటయై వెలువడింది. నిజామాబాదు దగ్గర ఉన్న “మంజీర ఆయనకు కావ్యవస్తువైంది. 'ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర- ఎవరి కజ్జల బాప్పధారవే మంజీర అన్న పంక్తులలో ఆనందమూ, దుఖమూ జంటగా కనిపిస్తాయి జీవితంలోని వైవిధ్యం ప్రకృతిలో నిష్పన్నమై స్ఫురిస్తున్నది. దాశరధి కాళిదాసు వలె, రవీంద్రుని వలె ప్రకృతితో తాదాత్యము చెంద గలవాడు. పూలలో జ్వాలలు, మస్తిష్కంలో లేబరేటరీ వంటి రచనల్లో ఎన్నో (ప్రయోగాలు చేశాడు. ఆయన ఆధునిక కావ్యభాషలో ఎన్నో భావ చిత్రాలను, శబ్ద చిత్రాలనూ నిర్మించాడు. వెలుతురు బాకు, మించుకాగడా, చీకటి కలలు, నగ్నతరువు, అగ్నిచేలము, మోదుగు ముత్రైదువ, దీపాంగన, నయన శయనాగారం ఇలా ఎన్నైనా పేర్కొనవచ్చు ప్రగతివాద కాల్పనిక వాదాల సంగమంగా (ప్రారంభమైన దాశరధి కవితా యాత్ర క్రమంగా పునః కావ్యరచన వైపు, పునః ప్రయోగశీలతవైపు సౌగింది. ఇంచుమించుగా ఒకే కాలంలో వచ్చిన మహాంధ్రోదయం, పునర్నవం కావ్య సంపుటాలు ఈ భావనకు దోహదం చేస్తాయి. తరువాత మహాబోధి కథాకావ్య రచనకు మార్గదర్శకం కాగా పునర్నవంలో అంతుర్ముఖు దైనా, కవి ప్రయోగవాదం నుంచి మార్మికత వైపు మరలినట్లుగా గోచరిస్తుంది దాశరథి వల్ల తెలుగు కవిత్వంలోనికి నూతన సౌందర్య ప్రపంచం ప్రవేశించింది. అరబీ పారసీ కవితా రీతుల విస్సార రీతి అది. ఆయన కవిత్వం చేప్పేప్పటికి సాగివస్తూవున్న (ప్రగతివాదం కేవలం నినాదాలలోకి అకవిత్వంలోకీ జారిపడుతూ వున్నది. ఆయనవల్ల కావ్యవస్తు విషయంలో పార్టీల నియంత్రణకు గురౌతూవున్న యువకవిలోకం ఒక్కసారి విముక్త మైనట్లు భావించుకున్నది. అంతర్జాతీయ దృకృధం పేర జాతీయోద్యమాలనూ, సంస్కృతినీ జీవన మూల్యాలనూ తిరస్మరించి, స్వయంకృత పరాయీకరణ నుంచి తప్పించి కవితా చైతన్యాన్ని 118
ఆక నకున్సీణ
ఈ దేశపు మట్టిలో నిలబెట్టడం జరిగింది. అంటే దాశరధి మతవాదీ, మితవాదీ సంకుచిత జాతీయవాదీ కాదు 'ముసలిమొగం పడిన వృక్షం మీద యౌవనం చిగురించడం కవిత్వం" “రోజు కనబడే నక్షత్రాలలోనూ రోజూ కనపడని కొత్తదనం చూసి రోజూ పొందని అనందానుభూతిని పొందటం అంటేనే కవిత్వం' అని నిర్వచిస్తాడు కవిత్వాన్ని అందుకే అతని దృష్టిలో - శక్తిమంతమైన శబ్దానికి జననమే కానీ మరణంలేదు.
తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవనంలో దాశరధి పాత్ర గణనీయమైంది. ఈ ప్రాంతపు సాహిత్య సంస్కృతులలో ఆధునికత సంపూర్ణంగా ఆయన వల్లనే ప్రవేశించింది. దాశరధి తీసుకువచ్చిన ప్రగతివాద, కాల్చనికవాద జాతీయోద్యమాల సమన్వయం వలన పద్యరచనకు అధునిక పరివేషం కల్పించడం వలన, సామ్యవాదం నుంచి మానవతావాదం దాకా ప్రయాణించడం వలన తరువాత నవ్య సంప్రదాయ సిద్ధాంతం బలం పుంజుకోవడం జరిగింది.
దాశరధి పద్యం కాల్బనికోత్తరకాలానికి చెందిన శిల్పమర్యాద కలది. సాధారణ జనజీవన వ్యవహారంలోని శబ్బాలే కవి స్పర్శతో సుందర కవితా తోరణాలైనాయి. పూర్వం చెళ్లపిళ్ల వెంకటశాస్రి చేసిన ధోరణికి ఇది కొత్త తరపు పొడిగింపు. ఆయన పద్యం ఆధునిక భావనకు ఆధారంగా నిలిచిపోయింది. 'గాలిబో మొదలైన కవుల రచనల అనువాదం చేత తెలుగు కవితా ప్రపంచం వస్తు విస్తృతిస్థానంలో రస ప్రచుర వాగ్వ్యక్తికి ఆలంబనమైంది. దాశరథి కవిత్వం తెలుగువాళ్లకు ప్రాణాన్ని జ్వాల. ఆత్మలక్షణ దర్చణం
వార్త జులై 28, 2001 119
దాశరధి కవితా వైభవం
దాశరధి కవిత్వం తెలుగు కవితారంగం మోదకు ఒక పభంజనంలా ప్రవేశించింది.
“తెలంగాణము రైతుదే - ముసలినక్కకు రాచరికమ్ము దక్కునే' పద్యం తెలంగాణాన్ని జాగృతం చేసింది. ముష్కరులు, మతోన్నాదులైన రజాకారులను గడగడలాడించింది. సంకెళ్లు వేసుకుని వరంగల్ నగర వీధులలో నుంచి కదలిపోతూవున్న కవి తానొక జీవత్ కవితా ప్రవాహమై - శత్తీగెలను శ్రెంపి అగ్నిలో దించినాడు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ) అని నినదిస్తూ సొగిపోయి రాజ్యపు పునాదుల్ని కదల్చి వేసినాడు.
“వోలీసు చర్య” ద్వారా విముక్తమైన తెలంగాణంతో ఆయన స్వస్నం సాకార మైంది. సామ్యవాద దళం నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం లక్ష్యం వేరు. వ్యూహం వేరు. భారత స్వాతంత్ర్య సముపార్డన వారికొక సాఫల్యం కాదు. వారిచర్యలు తరువాత కూడా జాతీయప్రభుత్నానికి వ్యతిరేకంగానూ సాగిపోయినవి.
“అరుణారుణ వైజయంతి రమ్మన్నది వస్తున్నా అని పలికిన దాశరథికి అప్పటికి సామ్యవాద దళం మాద ఉన్న (భ్రమలు తొలగిపోయాయి.
“జెండా ఒక్కటి మూడు వన్నెలది - దేశంబొక్కడే భారతాఖండాసేతు హిమా చలోర్వర'- పిలిచిన “అరుణారుణ వైజయంతి” తొలగిపోతూ జాతీయ పతాకానికి స్థానమిచ్చింది. భారతదేశ సాంస్క తిక వారసత్వం దేశాన్ని ఒక్కటిగా, సమగ్రంగా అభిన్నంగా దర్శించే అవకాశమిచ్చింది. 'రవీంద్రుండొక్కందె కవీంద్రుడు.” ఇది సాంస్కృతిక జీవనంలో ఐక్యభావ సంక్రాంతి.
సంఘర్షణ స్థానంలోకి సమన్వయం చోటు చేసుకున్నది. శాంతిపరివర్తనం లక్ష్యమైంది. “శాంతి కోదండోద్య ద్విజయుందు గాంధియొకద్దే' మార్చు మార్గదర్శనం, రష్యా నేతృత్వంలో సాగుతూన్న సామ్యవాద దళంలో ఇమిడిపోలేని ఆత్మదర్శనం కలిగింది క్రమంగా దాశరధి గాంధీ మార్గంలో తన ప్రతిఫలనం చూచుకున్నాడు.
ఈ ఆత్మదర్శనం తేలుగుకవితా వేదికపైన అనేకాలైన అద్భుతాలు సాధించింది. అప్పటి వరకూ సాగుతూవచ్చిన ప్రగతివాదం చదికిలబడింది. 'పులిచంపిన వేడినెత్తురు'
120
ఆ నకుప్పల మాత్రమే ఉద్దిష్టమై, హింస ఒక్కటే మార్గమై సాంస్కృతిక పరంపరను సర్వతోముఖంగా నిరాకరించటమే ప్రధానాంశమైై, నాస్తికత్వం మూలద్రవ్యమై, సాగిన ప్రగతివాద రధచక్రం బురదలో చిక్కుకుపోయింది. కర్ణుడు రణరంగంలో అసువులు వీడకతప్పలేదు.
ప్రగతివాదోద్యమపు సందడిలో ఆ శిబిరంలోకి ఏవో కారణాల వల్ల దూరి పోయిన కృష్ణశాస్త్రి, ఇంద్రగంటి హనుమత్శాస్తి మొదలైన వాళ్లు వెనక్కి వచ్చేశారు. శ్రీశ్రీ ఏమో 'సదసత్సంశయం'లో పడ్డాడు. “శ్రీశ్రీ మార్కు పద్యాలనే వాడరంిడని 'ప్రయోగవాదపు సుడిగుండాలలో పరిభ్రమిస్తున్నాడు. తెలంగాణా రచయితల సంఘం ప్రచురించిన 'మంజీర' తొలిసంచికలో 'శ్రీశ్రీ మార్కు పద్యాలనే వాడండి అనే రచన ప్రచురితమైంది. ఈ శూన్యమైన అగాధంలోకి అపూర్వమైన సమన్వయ లక్షణం ప్రవేశించింది. సజీవ సంప్రదాయం, ఆధునికతలకు సేతువు అయింది. “తెలంగాణా రచయితల సంఘం' ఈ సమన్వయ భావానికి కేంద్రం అయింది. దాని వార్షికోత్సవాలు నూతన సమన్విత యుగానికి వేదికలుగా రూపొందాయి.
దాశరధి వ్యక్తిత్వం దేశంతో మమైక్యం పొందింది. దేశమంతా ఒక శిధిలా లయం, చుట్టూ 'క్రమ్ముకొని ఉన్నది చిక్కని శర్వరీ తమోరాశి. దాని శిభాగ్రం మోద ఒక దీపము పెట్టి వద్దామని బయలుదేరుతున్నాడు. ఒక దీపం పెక్కు దీపాలవు తుంది. దీపతోరణమాల బెతుంది. 'దూర దూరాన దీపాల తోరణాలు' - అందులో - 'భరత వీరుల నెత్తుటి వరద కలదు జాతీయ సమరంలో బలియైన మహావీరులు యిక్కడ స్మరింపబడ్డారు. వారి నెత్తుటి వాగులో బంగారు తామరలు పూస్తున్నాయి. ఈ తామరలు తల్లి పాదపూజ కోసం, ఉపాసన కోసం కవి వాడుకుంటాడు. ఈ మాత భరతమాత. అమె పొదార్చనం దేశంలో ఉజ్జ్వలమైన భావి నిర్మాణం. మెట్టు మెట్టుకట్టుతూ పోవటం. మహోన్నతమైన దేశాన్ని నిర్మించటం. ఇది దాశరధి దర్శనం.
నారాయణ రెడ్డి అన్నట్లుగా- దాశరధి తాను మేల్మొని కోటి మంది తమ్ములను మల్మొలిపినవాడు. అతని కవిత 'శరదిందు చంద్రికా పేశల కావ్య ఖండములనూ, మహోల్మాశని పాతములనూ' కురియగలదు. జగజ్జీవనంలోని రెండు పార్వాలూ యిక్కడ వ్యక్తమవుతున్నది.
భావి నిర్మాణం- దర్శనం అనేక సంకేతాల ద్వారా కవి వ్యక్తం చేస్తాడు. నిజామాబాదు జిల్లాలోని 'మంజీరి వాగు ఆయనకు ఒక సంకేతం అయింది. కాల్బని కోద్యమ కాలంలోని కిన్నెరసాని ఒక కోడలు. వివాహ వ్యవస్థలోని కారిన్యానికి బలియైన యిల్లాలు లోకంలో పెద్దలైన వారి కామపిపాసకు గడగడలాడింది. చివరకు
121
నుతునత్తు ఆ తాను సొమాజిక సేవతో తాదాత్యన్ని పొందింది. అక్కడ కుటుంబ వ్యవస్థ కేంద్రం. వ్యక్తి నిష్టమైన సుఖదుఃఖాలు వస్తువు. “మంజీర సమాజ పునర్నిర్మాణేచ్చా సంకేతం. ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర, ఎవరి కజ్ఞల బాప్పధారవే మంజీర అని ఆరంభంలో వ్యక్తి బిందువు నుండి కరగుతూవచ్చినా - తాను ప్రాతినిధ్యం వహించే గజ్జెల రవళి, కజ్ఞల బాప్పధార మొత్తం సమాజ సంకల్పాలు, (శ్రమలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందువల్లనే కదలినంతనే మంజీర మొత్తం నేలను ఆత్యంతికంగా పరివర్తింపజేస్తున్నది. నీవు పారిన దారిలో ఇక్షుదండాలు నీవు జారిన జాడలో అమృతభాండాలు సీవు దూకిన నేల మాకు విద్యున్నాల నీవు ప్రాకిన పథము మాకు చైత్రరధమ్ము ఈ (ప్రబలమైన పరివర్తన శీలమైన, భావిసువర్షస్వష్నాల నిర్దిష్ట రేఖాచిత్రమైన ఒక మహా సంకల్పంగా 'మంజీర' రూపుకట్టింది. చైత్రరథమన్నది కుబేరుని ఉద్యానమే అయినా దానిలోని రధశబ్దం వసంతంతో పాటు నిరంతర పురోగమన శీలాన్ని వతీకీకరిస్తున్నది. “'పునర్నవం” ఆయన దర్శనం వచ్చిన మార్పునూ సమన్వయాన్నీ సూచించే కవితా సంపుటం. ఆయన తాత్త్విక స్ఫూర్తి కూడా ఈ కావ్య సంపుటిలో ఉన్నంత స్పష్టంగా మరెక్కడా వ్యక్తం కాలేదు. సర్వజగత్తులోనూ సర్వజనంలోనూ పరివ్యాష్తమై ఉన్న సత్యశివసుందర భావాలను ప్రస్ఫుటీకరించటమే కవిత్వ ప్రయోజనంగా భావిస్తాడు కపి. “అమృత భావనా వీథిలో ప్రతివాడూ కాళిదాసు కాళిదాసు భారతీయ సంస్కృతికీ చైతన్యానికి (ప్రతీక. మనోమయ భూమికలో కాల్పనిక శిఖరాలను తాకబోయే భావ సమాధిలో ప్రతివ్యక్తీ అనందమును పొందుతున్నాడు. ఈ ఆనందం లోక జీవన గూఢగుహలలో నిదురించిన 'రసము'. ఇది ఈ భావ సమాధిస్థితిలో మేలుకొంటున్నది, ప్రవహిస్తున్నది. ఆ రసానుభవవేళతో అతడు కాళిదాసే అవుతున్నాడు. అమృత భావనా వీథి అన్నమాట జెపనిషదతత్త్వాన్ని పట్టియిస్తుంది. 'తమేవం విదిత్వా అమృత ఇహ భ్రవ్షత్రి నాన్యః పంధా విద్యతే అయనాయి' అని బుగ్వేదం చెప్పుతున్నది. ఈ అమృతము ఒక స్తరంలో ప్రీతి. మరొక స్తరంలో మాధుర్యము, మూడవ స్తరంలో లల్రౌక్రిక్షానందమ్స, క్ గాశరథి 'రేపటి జలపాతాలు! అన్న కవితలో అనంతమైన ఈ సృష్టిలోని అనుస్యూతి , అవిచ్చిన్నంగా సాగివచ్చే సందర్భాన్నీ వివరిస్తాడు. జడమైన ప్రకృతి, పాం టనరలని చరాచరమూ, మనోభూమికలోని మానవవికాసమూ ఏదైన ఒక నవి కావు. గతాన్ని సుందర స్వప్నంగానో, పీడకలగానో భావించే 122
ఆకు సకుప్పలణ లక్షణం సృష్టిలోని సనాతనత్వాన్ని పట్టి ఈయలేదు. “మనిషి నేడా మమత నేడా మానవత ఈ నాటిదా' అని (ప్రశ్నించి ఈ భావాల (ప్రవాహ నిత్యత్వ లక్షణాన్ని స్టాపిం చుతాదు. ఈ పరిణామక్రమంలో ఎప్పుడూ పునారచన సాగుతూనే ఉంటుంది. “జలదసరస్వతి” అనే ఖండికలో కవి భామమయమైన జీవన పరిమితుల నుంచి దివ్వజీవన పరిమితుల దాకా సాగిపోయే తత్త్వాన్ని విపులికరిస్తాడు. నవనీరద రథమ్ము నడిపింతు దివిదాక పవమాన జవనాశ్వపటలి గూర్చి..... నరులతో సురల చుట్టరికముల్ పెరుగగా ధరకు నాకమును తొందరగ తెత్తు భూదివములేకమై కాంతి పుంజమట్లు అచ్చరలవెంట మేఘ పల్యంకి నెక్కి వానదారుల పయనింప వలతు నేను (నవ్యసాహితి'- కవితాసంకలనం 1958) కవి భావించిన (ప్రయాణం మేఘ నౌకల మోద, వానదారులలోన ఈ సంకేతాలు సామ్యవాద దళం భావించిన హింసామయ రక్త్రయుద్దాన్ని సూచించటం లేదు. ఈ ఖండం పప్రారంభపద్యం “ఆకసము జూచినంత గ్రీష్కాతపాతి భీకరంబయి గురడియదాక మండు, లోకమెల్ల పయోధరాలోకనార్ధి శీకరస్నాన సౌఖ్యమాశించు నేదు” ఆ ప్రగతివాద గ్రీష్మమంతరించింది. చల్లటి వార్డుక బుతువు ప్రవేశించిందని సూచిస్తుంది. దాశరధి ఈ సందర్భంలో భావించిన దివ్య నూతనలోక దర్శనమునకు చేయదలచిన సాధనము మేఖఘప్రతీకలలో దాగి వున్నది. ఈ మేఘము ఆరోహణ అవరోహణ క్రమంలో వికసించేదే. సముద్రము - మేఘము - వర్షం ఇది ఈ క్రమము. ఈ క్రమంలో నాటికే వ్రఖ్యాతమైన ఆధునిక ఆధ్యాత్మిక మార్గమున్నది. అది ఆయన మనస్సున ఉన్నదో లేదో నిర్ధారించి చెప్పే సాక్ష్యాలు లేవు. అయితే ఒక తహతహ. ఉద్విగ్నతాశాంత ప్రయత్నము, అభీప్ప దాశరధిలో నిలిచే ఉన్నాయి. ఆధునికాంధ్ర కవిత్వచరిత్ర నిర్మాణంలో అనేక సమస్యలున్నాయి. ఉద్యమాల పేరుతో సామ్యవాద వర్గం వేసే రకరకాల “వేషాల' భీషణ దృశ్యాలే క్రమంగా చూపుతూ మిగతా వారిని ప్రక్కకునెట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఈ చరిత్ర క్రమంలో దాశరథి వంటి మేరుశిఖర 'ప్రాయుడైక కవికే ఉచితమైన స్థానం లేదు. ఐతే నారాయణరెడ్డి కాళోజీ తదితరులకూ స్థానమెక్కడ? ధోరణులు యిట్లా సాగుతూవుండగా వానమామలై 123
నుత్రుసన్న ఆ వరదాచార్యులు, జగన్నాధ్రాచార్యులు. పల్లాదుర్ల్గయ్య, అడ్లూరి అయోధ్యరామకవి, గంగుల సాయిరెడ్డి గార్లపాటి రాఘవరెడ్డి, వేముగంటి నరసింహాచార్యులు, ఇత్యాది కవులను స్మరించే అవకాశం ఏదీ? మాదిరాజు రంగారావు, బాపురెడ్డి, సుప్రసన్న ముకురాల రామిరెడ్డి, సంపత్కుమార, పేర్వారం జగన్నాధం (ప్రభృతులు కవులౌదులో? కారో? తాంభైయేళ్ల సాహిత్య చరిత్ర నిర్మాణం జాగ్రత్తగా పరిశీలించితే ఒక ప్రాంతాన్ని ఆ మట్టి బిడ్డలను సంపూర్ణంగా విస్మరించే ప్రయత్నం అని భావించే దశ వస్తున్నది. ఒక విధంగా ఇది “గోలకొండ కవుల సంచికి (1934) ప్రకటించిన నాటి సందర్భానికి పోలిక ఉన్న అంశమే. తెలంగాణా నాటికీ నేటికీ ఉపేక్షికమైందే. ప్రస్తుతం ప్రచారంలో వున్న ఆధునిక కవిత్వ చరిత్రను మళ్లీ తిరిగి వ్రాయవలసి ఉన్నది. తెలంగాణాలో సాగివస్తూవున్న సమన్వయం - రూపాలమధ్య, ధోరణుల మధ్య, తత్త్వాల మధ్య, వ్యక్తీకరణల మధ్య - కొనసాగుతూ వచ్చిందే. తెలంగాణా కవులు తెచ్చిన సమన్వయం జత్తిడి అఖిలాంధ్ర కవిత్వంలోనూ ప్రబలంగా రూపుదిద్దు కున్నది. దీనికి ప్రబలమైన ఉదాహరణలు 1955 తరువాత తెలుగు కవిత్వంలో పెరిగిన సాంస్కృతిక చైతన్యం విస్ఫోటం పొందిన రచనా ధోరణియే. దాశరథి ఈ సమన్వయ భావనను ప్రధాన ప్రేరణయె నిలిచినవాడు. ప్రగతివాద గ్రీష్మాంతాన తెలుగు కవిత్వపు పొలిమేరలను దాటి “దాశరధి మేఘం అరవిక్, పారశీల ఉర్జూ కవిత్వానుభవాల వర్షాన్ని కుండపోతగా కురిసింది. గాలిబ్ తెలుగు వాడైనాడు. సూఫీ కవిత్వ స్పర్శ అల్పాక్షరముల అనల్పార్ధరచను తెలుగు కవితలో దారితీసింది. సంస్కృత కవితలోని వైదర్భీరీతిని తన రచనలో జొప్పించి ఆయన కాల్పనిక కవిత్వపు అమృత వృష్టిని పునరాగమింపడేశాడు. కాళిదాసన్నా, కీట్సన్నా గాలిబ్ అన్నా నజ్రుల్ ఇస్తామన్నా సమానంగా ప్రేమించాడు. రవీంద్రుని కావ్య మార్మికతనూ, విశ్వనాధ భావనా పారమ్యాన్నీ కృష్ణశాస్త్రి రీతి మాధుర్యాన్నీ శ్రీశ్రీ కవితలోని జలపాతధోరణినీ ఇవన్నీ తనలో సంలీనం చేసుకున్నా తనదైన గొంతులో, తనదైన నూతన ప్రతీక సామగ్రితో అమేయుడై, తెలుగు రసికలోకానికి అమృతాభిషేకం చేసినాడు దాశరధి జోహారులు. అలై 2004 దాశరధి ఆయంతి సందత్భంగా శ్రేళ్ళష్ణ కవచ భావ్వా్షూ 'ప్రకటించదలచిన ప్రత్యేక సంచికకోసం పంపిన రచన 124
ఎప్పిడూ ఎదిగిపోయే చేరా
చేరా- అంటే ఆచార్య చేకూరి రామారావుతో స్నేహం సుమారు నలఖైఐదు సంవత్సరాలు. 1955 జూన్‌లో నేను బి.ఏ. చదువుకోవటానికి ఉస్మానియా విశ్వ విద్యాలయం చేరుకున్నాను. నాకు యూనివర్సిటీ కాలేజిలో సీటు వచ్చింది. అక్కడ ఆచార్య మాదిరాజు రంగారావు నాకు సీనియర్. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు అప్పటికే ఎం.ఏ.లో విద్యార్థి. చేరా అప్పుడు నిజాం కాలేజీలో చదువుకునేవారు. సాహిత్యం మా అందరినీ ముడివేసిన స్నేహదామం.
వామపక్ష భావాలతో నేను ఏకీభవించకపోయినా- వాళ్ళు సంపూర్ణంగా వ్యతిరేకించే విశ్వనాథ సత్యనారాయణ రచనలు అంటే నాకు అత్యంత ప్రియమే అయినా _ చేరాతో నా స్నేహం వర్ధిల్లటానికి ఈ భేదాభిప్రాయాలు అడ్డురాలేదు. ఆయన ఉందే నిజాం కాలేజి హాస్టల్‌కు వెళ్ళి రాత్రిళ్ళు గడపటం నాకు ఇంకా స్పష్టంగా గుర్తే. రాత్రి కండు గంటలదాకా మాట్లాడుకుంటూ ఉండటం- వద్యాలు చదువుకోవటం, చర్చించుకోవడం, వెక్కిరించుకోవటం ఇలా సాగి రాత్రి బషీర్‌బాగ్ చౌరస్తాలోని ఇరానీ హోటల్లోనో, ఆయన యూనివర్సిటీ హాస్టల్‌కు వచ్చినప్పుడు కాంపస్‌లో బషీర్ కాంటీన్లోనో టీ త్రాగి మళ్ళీ కొంతసేపు ఆ వాదధోరణిని కొనసాగించుకునే వాళ్ళం.
అకలుషమైన కచ్చితమైన చేరా వాగ్దోరణి, స్నేహసంపద అఖభిప్రాయాలలో తేడాలున్నా ఆత్మీయతలో దగ్గర దగ్గరగా ఉండటానికి వీలిచ్చింది. కవిత్వాన్ని ఆస్వాదించే విషయంలో అనుభవానికి పెద్దపీట వేయటం, కవిత్వాన్ని అంచనా వేయడంలో (ప్రమాణాలను, హేతువును ప్రధానంగా (గ్రహించటం వల్ల చేరా నిశ్చయాలు వైయక్తిక సంకోచ పరిమితులనుండి దూరమై సార్వజనీనతకు చేరువయ్యాయి
ఆ రోజుల్లోనే నాయని సుబ్బారావు పదవీ విరమణ చేసి హైదరాబాదు వచ్చి పెద్దన్మూయి నాయని కృష్ణకుమారి దగ్గర ఉండేవారు. లిబర్టీ టాకీసు వెనకాల గగన్‌మహల్ రోడ్డులో వారి యిల్లు, రామారావు ఆ ఇంట్లోనే ఒక రూములో ఉండేవారు. సుబ్బారావు గారితో సాహిత్యగోష్టులతో ఆయనా నేను పాల్గొనేవాళ్ళం. నాయనివారి సంభాషణల్లో సున్నితమైన హాస్యము, మావంటి చిన్నవాళ్ళమీద వాత్సల్యమూ కానవచ్చేవి. ఆ రోజుల్లో
125
నుత్రుసద్న ఆ నాయనివారు తమ అధ్యాపకులనే భావంతో వారి రచనలన్నింటినీ ఒకే సంపుటంగా అచ్చువేసి ఇచ్చారు. అజంతా ప్రెస్ అధిపతులు శ్రీనివాస సోదరులు. తెలుగుసాహిత్యంతో పాటు భాషాశాస్తంలోనూ ఎం.ఏ. చేసి పై చదువులకు చేరా అమెరికా వెళ్ళాడు. ఆమెరికాలో భాషాశాస్త్రవేత్తీ అయిన ఆయనకు తెలుగుసాహిత్యం మీద ప్రీతి తగ్గలేదు స్వస్థాన వేషభాషాభిమతాలకు దూరం కాలేదు. తిరిగివచ్చినా మళ్ళీ చేరాయే. అవే జోకులు, పద్యాలు, ముచ్చట్లతో కాలం గడపటాలు. ఫారిన్ రిటర్నీడ్ అయినా దర్చం ఏర్చడనేలేదు. కవిత్వం రాసే వాళ్లందరికీ సహజమైన సోమరితనం చేరాలో లేదు. ఒక క్రమశిక్షణ ఉన్నది. చిత్తశుద్ధి కూడా ఉండటంవలన ప్రణాళికాబద్ధంగా తన కార్యం నిర్వహించుకుంటూ పోతాడు. భీదాభిప్రాయాలు చెప్పటంలో దాపరికాలు లేవు. వ్యక్తి అత్యంత 'ప్రియుడైనా, అతని కృషిని అభినందిస్తూనే అభిప్రాయంతో విభేదిస్తాడు హేతుబద్ధంగా. ఈ లక్షణం సంపత్ముమూరాచార్యులకూ ఆయనకూ వచన పద్యం-లక్షణ చర్చ సందర్భంగా స్ఫుటమయింది. చాలాకాలం ఇద్దరూ స్నేహపూర్వకంగా విభేదిస్తూ వూర్వవక్ష సిద్ధాంతాలు చేస్తూపోయారు. అయితే నిశ్చయంలో ఎవరికి వారే ఉండిపోయారు. కాని చేరా చొరవ తీసుకొని ఈ వ్యాసాలను సంకలితం చేసి నాయని సుబ్బారావు జయంతి రోజున (ప్రకటించే కృషి చేసి యిద్దరూ ఆయనకు అంకితంగా ప్రచురించారు. వ్యావహారిక (గ్రాంధిక భాషావిషయ వాదనలో ఇప్పుడు చేరా దృక్పధం మారిపోయింది. ఆ సరిహద్దులు నిర్దిష్టంగా గీయటానికి వీలులేదని అంటాడు భాషావాదం పోయిన విపరీతపు పోకడలను తాను పూర్తిగా వ్యతిరేకిస్తాడు. సామాజిక పరిస్థితులు మారినంతలో ప్రాచీన సాహిత్యాన్ని తిరస్మరించ నవసరం లేదనీ దానిలోని అనేకాంశాలు ఇంకా భావప్రకాశన వ్యూహాలు మనం గ్రహించవలసి ఉందనీ స్పష్టంగా పేర్కొంటాడు. ఆధునికకవుల రచనల్లోను మంచి పద్యానికి పరవశిస్తాడు. ఇటీవల ఒకచోట రాశాడు- ఖండకావ్యం - మహాకావ్యం కంటే గొప్పదని అనుకోలేము అని. సౌభద్రుని ప్రజయయాత్రను జన్మభూమి కంటే గొప్పదని చెప్పలేం కదా అన్నాదు. చేరా తమచుట్టూ నిర్మించుకున్న మనోబంధాలకు (కండిషనింగ్‌కు) బందీ అయ్యే వ్యక్తికాదు. సాహిత్యరంగంలో చాలామంది ఈ మనసులోని చిన్ని మారుమూల గదిలో 126
ఆఅ సకుద్పబు బద్భులయ్యే వాళ్ళే దాన్నించ బయటపడి వెలుగులోకి రాలేరు. చేరా మాత్రం తాను ఆ చిక్కుముళ్లను విప్పుకుంటూ ఎదిగిపోయేవాడు. ఒకసారి తెలుగు యూనివర్సిటీలో అచ్చ తెలుగును గూర్చిన సెమినార్ జరుగుతున్నది. చేరాయే డైరెక్టర్ అనుకుంటాను దానికి తను పేపరు రాస్తున్నాడు. నేను దానిలో పాల్గొనేందుకు వెళ్లి అక్కడే ఉన్నాను. అచ్చతెలుగులో కొత్త పదబంధాలు నమాసాలు గురించి ఆలోచిస్తూ- మా మాతామహులు 1920 ప్రాంతాలలో (ప్రచురించుకున్న 'అచ్చ తెలుగు కుబ్బాకృష్ణవిలాసం'లోని పదబంధాలను వెదకుతూ -విశ్లేషిస్తున్నారు. నాకు ఆ కావ్యం చిన్ననాటి నుంచి తెలిసిఉన్నా దాన్ని అలా ఎందుకు చూడలేకపోయానని నాకే సిగ్గయింది. చేరా పరిశోధనలో, విషయ సేకరణలో ఎంత క్లిష్టమైన అంశమైనా చిక్కుముడి విప్పుకోవలసిందే. చేరాకు రాజమండ్రిలో ప్రతిభా పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఆంధ్రభూమిలో ప్రచురితమైన వ్యానం 127
ఏమర్శ పరిధులను విసృతపిరచిన చేరా
మేం ఇంటర్ చదువుతున్న రోజులు. పేర్వారం జగన్నాథం మరికొందరు మిత్రులు తోడుగా అప్పట్లో- సాహితీఖంధుబ్బందం అనే సాహిత్య సంస్థను స్థాపించు కున్నాం. లక్ష్మణరావు అనే మరొక కవి మిత్రుడు ఖమ్మంనుంచి వచ్చాడు- దీని కార్యదర్శి. ఆ సంస్థ పేరు పెట్టటానికి ఖమ్మంలో సాహితీ మిత్రబృందం అన్న సంస్థ అప్పటికే పనిచేస్తూ వుండటం కారణం. తెలంగాణా రచయిత సంఘం దాశరధి, నారాయణరెడ్డి మొదలైన మిత్రుల నేతృత్వంలో తెలంగాణా క్షేత్రంలో కవిత్వపు మొక్కలను నాటి దోహదం చేసి పెంపొందిస్తున్న కాలం ఇది. 'మంజీరి ఒక సంచిక వచ్చింది. “స్రవంతి” ఈ ఆశయాలకే అంకితమై కొనసాగుతున్నది. తెలంగాణా రచయిత సంఘం “ఉదయ ఘంటలు' అనే కవితా సంకలనం వెలువరించింది.
మేం సాహితీ బంధుబ్బందం పక్షాన ఒక కవితా సంకలనం తీసుకువద్దామని సంకల్పించాము. కాళోజీ సోదరులు మాకు అండగా ఉన్నారు. తెలుగు స్వతంత్ర, స్రవంతి, భాగ్యనగర్ మొదలైన పత్రికలలో యువకవుల నూతన రచనలు అచ్చవుతూ వున్నవి. మా కవితాసంకలనం అంతగా ప్రసిద్ధికెక్ళని, గ్రంధరూపప్రచురణలో రాని రచయితల రచనలను ఉద్దేశించినది. వాటిల్లో తెలంగాణా రచయితలకే ప్రాథమ్యం కూడా ఉన్నదనుకుంటాను. ఆ సంకలనం 1955లో అచ్చయింది. దాని పేరు “కొలికారు'. రచనలను అకారాదిగా వేద్దామని క్రమం ఏర్పరచుకున్నాము. అయితే శ్రీతో ప్రారంభం అయితే బాగుంటుందనో, శ్రీకారం తొలి అక్షరంగా ఉండాలనో ఏదో భావంతో ఆ సంకలనంలో తొలి రచన '్రీయుత నామంతోనే చిరతర సంపద లబ్బవు' అన్న చేకూరి రామారావు గేయం అచ్చయింది.
నాకు చేకూరి రామారావుతో పరిచయం అదే ప్రారంభం అనుకుంటాను- అక్షర రూపంలో. అప్పుడే తెలంగాణా రచయితల సంఘం కవిత్వపు పోటీ నిర్వహించింది. దానికోసం వరంగల్ నుంచి 'ఎవరెస్టు అనే గేయం పోటీకి పంపాను. తెన్నేటి పూర్ణచంద్ర రావు 'దయ్యాల మర్రిచెట్టు' అన్న రచనకు ప్రధమబహుమాోనం, నా రచనకు రెండు బహుమతీ వచ్చాయి. ఆ గేయాలు స్రవంతిలో అచ్చయ్యాయి. నేను హైదరాబాదులో
128
ఆక సకుద్పీబు
బి.ఏ. చదివేందుకు వెళ్లితే అక్కడ ప్రతిష్టగల కవులు దాశరధి, నారాయణరెడ్డి ప్రభృతులు, యువకవులు మాదిరాజు రంగారావు, బాపురెడ్డి, చేకూరి రామారావు ప్రభృతులు హృదయపూర్వకంగా స్వాగతించారు.
అప్పుడు యువకవులకు రచనలకు ప్రోత్సాహం “తెలుగు స్వతంధత్రి ఇచ్చేది. దానిలో రచన ప్రచురింపబడటం ఒక మంచి గుర్తింపు. అప్పుడు తెలంగాణంలో సాహిత్య వసంతం వెల్లివిరిసిన రోజులు. దాశరధి నారాయణరెడ్డి రచనలకు అధికప్రాధాన్యం ఉందేది అఖిలాంధ్రంలో. అబ్బూరి వరదరాజేశ్వరరావు ఆధ్వర్యంలో 'కవిత' పత్రిక రెండు సంచికలూ అప్పుడే వచ్చాయి. నూతనాఖివ్యక్తి , ప్రయోగధోరణి, వచనకవిత్వ మాధ్యమం ఈ పత్రికలో ప్రాధమ్యం వహించాయి. ఆ సంచికలలో దాశరథి, నారాయణ రెడ్డి ప్రభృతుల రచనలు స్థానం పొందలేదు. ఒక్క కవిరాజమూర్తికి తప్ప తెలంగాణంలో పుట్టి పెరిగిన కవులెవరికీ ఈ సంకలనంలో స్థానం లేకపోవటానికి అభివ్యక్తిని గురించిన, ఆధునికతను గురించిన భేదాభిప్రాయాలే కారణం కావచ్చు. కాని తత్కాలంలో ప్రాంతీయ భావన కారణమనే భావం వ్యాప్తిలో ఉండేది.
అప్పటికే చేకూరి రామారావు వామపక్ష భావాలతో నిమగ్నమైైనవాదే. నాకేమో వరంగల్లు నుంచి హైదరాబాదు చేరేప్పటిక్సి పాములపర్తి సదాశివరావు, పి.ఎన్. స్వామి వంటి వామపక్షీయులతో పరిచయాలు, స్నేహాలు ఉందేవి. గార్లపాటి రాఘవరెడ్డి, కాళోజీవంటి అందరినీ కలుపుకుపోయే, సమన్వయ ప్రధానమైన చిత్తవృత్తిగల పెద్దల సామరస్యధోరణి మమ్మల్ని ప్రధానంగా ఆవరించివుండేది. అందువల్ల నా వ్యక్తిత్వంలో వివృతకవాటలక్షణం (ఓపెన్ డోర్) నాటినుంచే నెలకొని వున్నది.
మాదిరాజు రంగారావులో ఎంతగా అందరితో కలసి తిరిగినట్లున్నా- ఒక సంకోచం, ఒంటరితనం, తనలోకి తాను ముడుచుకుపోయే లక్షణం మొదటినుంచీ ఉందేది. రోజూ కబుర్లలోవున్నా గంటలకొద్ది కాలం గడిపినా- ఒక పాటి తగినంత దూరం వుండేది. చేకూరి రామారావ్లు అప్పుడు నిజాం కాలేజి వోస్టల్లో ఉండేవాడు. నేను ఉస్మానియా కాంపస్‌లో హాస్టల్లో ఉండేవాణ్ణి.
చేకూరి రామారావు చైతన్యంలో ఆత్మీయత, అకలుషప్రవృత్తి ప్రధానం ఏదైనా మనసువిప్పి చెప్పుకునే లక్షణం ఉంది. మా అభిప్రాయాలలో సామ్యాలకంటే విభేదాలే ఎక్కువ అయినా మాట్లాడుకుంటూ ఉంటే రాత్రుళ్ళు పొద్దుదాకా పోయేవి పగళ్లు
129
నుతుసన్న ఆ సాగిపోయేవి. ఉస్మానియాకు ఆయన వచ్చినా, నేను నిజాంకాలేజి హాస్టల్‌కు వెళ్లినా రాత్రుళ్లు అక్కడే ఉండిపోయేవాళ్ళం. హాస్టల్లో గొరికినంతలో కడుపు నింపుకునేవాళ్లం ఏ ఉద్యమంలోనైనా, భావసంక్రాంతిలోనైనా తన వివేకాన్ని దానికి పూర్తిగా అప్పగించుకుని షారతంత్ర్యాన్ని అనుభవించే ధోరణిగల మనుష్యులు ఒకరకం. మరొక రకం అ ప్రవాహంలో మునిగి తేలుతూవున్నా తమను కోలుపోక, వివేకం, విచక్షణ కోలుపోకుండా ఉండేవాళ్లు మరొక రకం. చేకూరి రామారావు ఈ రెండో రకానికి చెందిన వ్యక్తిత్వం గలవాడు. సామాన్యంగా చూచినప్పుడు తాలిపద్ధతి జనం సిద్ధాంతబద్భులైనట్లు కనిపిస్తారు. కాని వాళ్లు ఆ సంకెళ్లును స్వయంగా చేతులకు తొడుక్కున్నవాళ్ళు. రెండవ వారు ఎప్పుడూ ఎదుగుతూ పోతారు. ఏ బిందువు దగ్గరా ఆగరు. ఏ భావధోరణికీ పట్టుబడరు. వారి దర్శనంలోనుంచి ఒక నూతన సమన్విత దృక్పధం అవిష్కృత మవుతుంది. ఈ సందర్భంలో నేను 'ఆధునా' అన్ననా కవితాసంకలనాన్ని గోపీచంద్‌కు అంకితం చేస్తూ చెప్పుకున్న పద్యం (1964) గుర్తుకు వస్తున్నది. శ్రీ అరవింద దర్శన నివిష్ట మనస్కత నీవు నేను, రా మాయణ భారత ప్రవణ మంజుల భావన నీవు నేను, స్వే చ్భాయత జీవన (ప్రవహణాద్భత భిన్న విచిత్ర సం ధాయిత నీవు నేను ఒకదారినె పోయెడునట్టివారమై ఈ పద్యంలో మొదటి రెండు లక్షణాలెట్లా ఉన్నా మూడవ అంశం రామారావు విషయంలోనూ నాకూ అన్వయిస్తున్నది. స్వేచ్బాయత జీవనం-కట్టుబడనిది దేనికీ. అందువల్ల అనేక విరుద్ధములుగా కనిపించే విలక్షణ భావములు మాలో ప్రవహించుకవి. దేనికీ తలుపులు మూయటంలేదు. లొంగిపోవటం లేదు. ఈ విస్తృతమైన మార్గం అత్యంత విశాలమూ, సర్వస్థానాపాదకము కూడా. సాహిత్యరంగంలో నేనూ, రామారావు- మా తరం ప్రవేశించేనాటికి, భావకవుల నాటి కవిత్వన్నృహ తొలగిపోతున్నది. ప్రగతివాదోద్యవు గాలులు భావనలకు, సిద్ధాంతాలకు ప్రాథమ్యం సంతరించుతూ వచ్చాయి. తత్పూర్వం ఉన్న కవిత్వస్పృహ యెడ ఒక నిరాదరభావం, ఒక తిరస్కార భావం పెంపొందుతూ వచ్చాయి ఈ వైపరీత్యం 130
ఆఅ నకుప్పబ నించి తట్టుకుని బయటపడటానికి రామారావుకు నాయనిసుబ్బారావు మొదలుగా భావకవుల కవితాఖండాలు కారణములైనయ్. అలాగే భావకవుల, విశ్వనాథవారి కవిత్వాలు నాకు దారితప్పకపోవటానికి కారణాలయ్యాయి.
మేం హాస్టల్ రూములలో చర్చలు ఎంతసేపు చేసినా సమాపనం మాత్రం 1920-50 నాటి కవుల అందమైన పద్యాల, గేయాల, వచన పద్యాల పరనంతో జరిగేది. నిద్రంతా-నిద్రపట్టలేకపోతే మిగిలిన రాత్రంతా, ఆ పద్యాల మననంతో సాగిపోయేది. బౌద్ధిక చర్చల వాగులు రెండూ చక్కని కవిత్వమనే సముద్రంలో సంగ మించేవి. సంగమించిన తరువాత నదుల వ్యక్తిత్వం వేరుగా నిలచివుండదు కదా.
చేకూరి రామారావు ఏం.ఏ. కోసం విశాఖపట్నం వెళ్లాడు. అక్కడ భాషా శాస్త్రంలో పడ్డాడు. తెలుగుదేశపు సాహిత్య ధోరణులలో ఉండే పట్టుదలలు, నమ్మకాలు, పురశ్చింతనలు (ప్రిజుడిస్లు) సడలిపోవటానికీ తొలగిపోవటానికీ- భాషాశాస్త్రాధ్యయనం లోని శాస్రీయధోరణులు, పద్ధతులు తోద్పడ్డా యనుకుంటాను. అతనిలో పెద్ద పరివర్తనం ప్రారంభం అయింది. ఒక నూతన ప్రపంచంలోకి (ప్రయాణం చేసి వచ్చాడు.
1960 జనవరిలో - రామారావు కొత్తగా కాపురం పెట్టాడు విశాఖపట్టణంలో. శేను పరిశోధన నిమిత్తం ఆంధ్రదేశమంతా తిరుగుతూ విశాఖపట్టణం వెళ్లాను. అక్కడ వస్తుసేకరణ నిమిత్తం వున్నప్పుడు ఆయన కుటుంబానికి నేను కొత్త అతిథిని. ఈ పదిరోజులూ కొత్త కాపురపు అనుభవ ప్రపంచాన్ని సాహిత్యసమాలోచనలతో ఎంతో కొంత తగ్గించిన ప్రాపం నాకే చెందుతుంది. అప్పుడే గంటి జోగి సోమయాజిగారినీ, దువ్వూరి వెంకటరమణ శాస్రిగారినీ, బొమ్మకంటివారినీ, అబ్బూరి రామకృష్ణారావుగారినీ, శావి శాస్రిగారినీ రామారావుతో కలిసి కలుసుకోవటం జరిగింది. కావ్యాలంకార సంగ్రహం గురించి ఎంలిట్ చేసిన వేదుల రాజేశ్వరిగారూ అక్కడే కలిశారు (ఇటీవల ఢిల్లీలో ఆమె కనిపించారు)
రామారావుకు అప్పటికే ఛందస్సులో, వ్యాకరణంలో, ఆసక్తి కలిగింది. ముత్యాల సరాలు ఇష్టమైనై 1958లో 'తేజశ్చక్రం” అనే కవితాసంపుటి ప్రచురించాను నేను. దానిలో తొలిభాగం యతి్రాసలున్న వచనపద్యం. ఆ పద్యాలు బాగానే వున్నాయనే అనుకున్నాడు రాస్తున్నప్పుదే తానై అభ్యుదయ పత్రికకు కొన్ని పద్యాలను ప్రచురణ నిమిత్తం పంపాడు (అవి వాళ్లు ప్రచురించలేదనే అంశం వేరే సంగతి.) కాని ఛందస్సు విషయంలో ఉన్న అనిశ్చితి, నియమరాహిత్యం తనకు నచ్చవని ముందే నాకు చెప్పేవాడు.
131
నుప్రునన్న ఆ రామారావు ఆమెరికాకు వెళ్లేముందు - ఒక అసూయాగగ్రస్తుడైన కవిమిత్రుడు “రామారావు కమ్యూనిస్టు ఆ విషయం అమెరికన్ ఎంబసీకి రాస్తానని ఎక్కడో వాచాలత్వం ప్రకటించాడు. ఒక రాత్రి ఆంధ్రయువతీమండలి బస్‌స్టాండ్ దగ్గర కలసిన రామారావు నేనేం అపకారం అతనికి చేశానని అతనట్లా అంటున్నాడని బాధపడ్డాడు అంతేకాని అప్పుడుకానీ తరువాతకానీ, తరువాత ఇప్పటిదాకా కానీ ఆ కవిని గురించి చెడుగా మాట్లాడటం అశను చేయలేదు. వెంటనే అపకారిని మరచిపోవటం అతనికున్న గొప్పసుగుణం అనుకుంటాను. ఇటువంటి వ్యక్తికి సాహిత్యరంగంలో తనతో విభేదించే వ్యక్తులను వైరులుగా చూడలేకపోవటం అతి సహజమైన అంశమేనని అనిపిస్తుంది. అబ్బూరివారి దగ్గరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఛందస్సు మీద (గ్రంధాల్లో పోటీ ప్రకటించినప్పుడు వచ్చిన పుస్తకాలు, బహుమతి నిర్ణయం కోసం వచ్చాయి. వాటిల్లో అబ్బూరి వారికి సంపత్కుమారగ్రంథం “తెలుగుఛభందోవికాసం” నచ్చింది, బహుమతి గిడుగు సీతాపతిగారి గ్రంథానికే దక్కినా, సంపత్కుమార గ్రంథం అచ్చు కావటానికి అబ్బూరివారే కారణం. విశాఖలో వారిదగ్గర ఆ గ్రంధాలకు సంబంధించిన చర్చలో అబ్బూరివారి ప్రశంసకు నోచుకున్న సంపత్కునూర (గ్రంధం కారణంగా ఆయన మీద రామారావుకు ప్రీతికలిగింది. తరువాత చేరా, సంపత్కుమార చర్చలలో -ఛందస్సు 'ప్రధానాంశమే అయినా, ఇద్దరూ ఒక అంగీకారానికి రాలేకపోయినా-ఇద్దరిలో వున్న సత్మవిత్వ స్పృహ ఆ చర్చాగ్రంధాన్ని నాయనివారి పుట్టినరోజు కానుకగా- వెలువరించ టానికి దోహదం చేసింది. చేరా స్నేహధర్మం మొగమాటపు టొప్పుదలకూ మెచ్చుకోలుకూ ఎప్పుడూ కారణం కాలేదు. ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు నేను ఒక ఉత్తరంలో సాహిత్యానికి సంబంధించిన మౌలికతత్వాన్ని గురించి ఒక ఉత్తరం రాశాను. అయితే వెంటనే నాకు ఆయన రాసిన సమాధానం- నాకు నీ ఉత్తరంలోని ఒక ముక్క కూడా అర్ధం కాలేదని, నా ఉత్తరంలోని పప్రతిపాదనలే అస్పష్టంగా ఉన్నాయేమోననిపించింది -నాకు. సాహిత్య వ్యాసాలలో సాధారణంగా కనిపించని, ఒక వైలక్షణ్యం చేరా వ్యాసాలలో కనిపిస్తుంది. ఆసందిగ్ధంగా, స్పష్టంగా తన అభిప్రాయాలను చెప్పటం- ప్రశంసగానీ లోపాలను ఎత్తిచూపటం కానీ ఒక సంతులనం కలిగి ఉండటం-మూడవది ముఖ్యమైన లక్షణం అత్మీయంగా చెప్పటం. దానివల్ల రామారావు వ్యాసాలు శుష్మమైన 132
ఆ సకుర్పజ సిద్ధాంతచర్చలుగా కానీ, ప్రశంసోదాహరణ వ్యాసాలు కానీ మిగిలిపోలేదు. అవి రుచిగా వుంటున్నవి చదివిస్తున్నవి పత్రికకోసం రాసినా తరువాత కూడా చదివిస్తున్నవి. ఎవరు గుర్తించారో లేదో కానీ సాహిత్య వివేచనలో రామారావు శైలి (ప్రత్యేకమైందే.
చలంగారి శ్రైలిని గురించి కవితాత్మకంగా ఉంటుందని అర్ధశతాబ్దం పైగా వింటున్నమాట. వజీర్ రహ్మాన్ 'కవిగా చలరి అనే పుస్తకం యాఖైలలో ప్రచురించటం అందరికీ గుర్తే. ఈ విషయమే చేరా వివేచిస్తే కొన్ని సాధారణీకరణలు, సూత్రీకరణలు కనబదతాయి 1 అర్ధభేదంలేని సమాంతర పదాల్ని వరసగా గుప్పించటం-దీని పదగుంఫన శైలి అని మొదట పేర్కొని తరువాత తనను దిద్దుకుని వాక్యగుంవనశైలి అని పేర్ళొన్నాడు. తన్నుతాను సరిదిద్దుకుంటూ పోవటం చేరా రచనలో గమనించదగిన ఒక వ్రత్యేకాంశం. 2. _ వాక్యశకల ప్రయోగం-పాత్రలమనోవేగాన్ని సూచించే పద్ధతి. 3. సంభాషణలో అసంబద్ధతను ప్రవేశపెట్టి తద్వారా యాంక్షయిటీని, టెన్షన్‌ను ప్రకటించే పద్ధతి. శ ప్రకృతిపరవశమైన వర్ణనలు 5. _ అ్రాజివాచకాలను (ప్రాణివాచకాలుగా వర్ణించటం (చేరా- భాషానువర్తనం 95-97వ పేజీలు) శాస్త్రీయవచనానికి ఉండవలసిన లక్షణాలను చేరా ఇలా క్రోడీకరిస్తున్నాడు. శాద్రసంక్షిప్తతకు, నిరిష్టకకు కొంత కొంత (గ్రాంథికమే నయం. శాస్త్రసంక్షిస్తత అంటే వ్రకరణానికి అవసరమైనదంతా చెప్పటం. అవసరమైనది మాత్రమే చెప్పటం. అర్ధాంతరబోధ, వ్యంగ్యవైభవాలు వగైరా లేకపోవటం, వాస్యచతురోక్తులు లేకపోవటం, చెప్పింది తార్మికంగా సహేతుకంగా ఉండటం. శాస్త్రవచనం ద్వారా మనం ఆశించేది వినోదం కొదు. మనోల్లాసం కాదు. హృదయాహ్హాదం కాదు విజ్ఞానం”. ఇంత నిర్దిష్టంగా స్రేర్మొనటం శాస్త్ర శిక్షణ ఉన్న వ్యక్తికే సాధ్యం మన రచయితల్లో ఎక్కువమంది కవులు కావటంవల్ల సృజనాత్మక రచనకూ, విశ్లేషణాత్మక రచనకు నడుమ సరిహద్దులు (౮ చెరిగిపోయాయి. 133
నువ్రుసన్న ఆల
చేరా 1958-60లలో 'జయంతిలో “జలాంతశ్చంద్రచపల' పేర గ్రాంధిక వ్యావహారిక భాషావాద సందర్భంలో వ్యావహారిక భాష పక్షాన జువ్వాడి గౌతమరావుతో పేచీపెట్టుకున్న మాట ఈనాడు ఎవరికీ గుర్తుండక పోవచ్చును. అయికే కచ్చితమైన శాస్త్రదృష్టిని అలవరచుకున్న తరువాత తాను క్రింద నిశ్చయాలకు రావటం గమనించ వలసిన అంశం.
- _ ఏకాలంలో అయినా మాట్లాడే భాషకూ, రచనా భాషకూ గుర్తింపదగిన వైషమ్యం వుంటుంది. ఇందులో తప్పొప్పుల (ప్రసక్తి లేదు. ఉచితానుచితాల (ప్రమేయం లేదు.
2 _ గ్రాంధిక వ్యావహారిక భాషావాదాలకు కాలం చెల్లినట్టుగానే భావిస్తున్నాను.
- _ వాక్యనిర్మాణంలో జాతీయతా ముద్రతో రచించే గ్రాంథిక భాషా ఉంది. అందుకు విరుద్దంగా రాసే వ్యావహారిక భాషా ఉంది.
శ గురజాడ అప్పారావు గారి దృష్టి 'కొత్త గ్రాంథిక భాషను ప్రవేశపెట్టటమే అనేది స్పష్టంగానే తెలుస్తుంది.
-
శిష్టవ్యావహారికం పేరుతో ఇంతవరకు ఎవరు రాసిందయినా కచ్చితమైన అర్ధంలో మౌఖిక వ్యవహార భాష కాదు.
-
_ భాషలో కొత్త సూత్రాలు సామాజిక కారణాల వల్ల ఎర్బడవు
-
ధ్వనుల మార్పుకు సామాజిక కారణాలు చూపించారు. కొందరు. ఈ రకమైన మార్పులు ఒకే దశలో ఉన్న సామాజిక వ్యవస్థలోనే వ్యవహర్తల మానసిక ప్రవృత్తుల ననుసరించి జరుగవచ్చు. మార్చిస్టుల అర్ధంలో ఈ రకమైన మార్పులకు వర్గస్వభావం లేదు.
& _ కధలకూ, సైన్సుకూ, రాజకీయాలకూ కరపత్రాలకూ టెక్ట్స్ పుస్తకాలకు పిచ్చాపాటీ తేలికవ్యాసాలకూ సాహత్య విమర్శలకూ, యూనివర్సిటీ ధీసిస్సులకూ ఒకేరకపు పత్రికాభాష పనికొస్తుందనే భ్రమలో నేటి వచన రచయిత లున్నట్టు కనిపిస్తున్నది. (భాషానువర్తనం - పే. 48-56)
విశ్వనాథ సత్యనారాయణ వచనశైలిని గురించి రాస్తూ అది “ప్రాచీనభాసమైన ఆధునిక వ్యవహార భాష అని తేల్చాడు చేరా 134
అక్కిరాజు ఉమాకాంతంగారి 'నేటి కాలపు కవిత్వాన్ని" గురించి రాస్తూ- 'అయితే ఆ కాలంలో ఆయన దుయ్యబట్టిన “సాహిత్య రోగాలు" ఇప్పటికీ ఉండటం ఎంత ఆశ్చర్యకరం” అంటాడు చేరా. వచన రచనలో వాదపద్ధతిలో నా కాదర్భం ఈ పుస్తకం అని, వెంటనే ఆదర్శాలన్నీ ఆచరణ సాధ్యం కాకపోవచ్చునంటాడు. (వచన రచన- తత్వాన్వేషణ) కవిత్వానికి కాలం చెల్లిందా? అని ప్రశ్నించుకుని సమాధానం ఇచ్చేష్పుడు చేరా ఉద్వేగం పొందుతాడు అరుదుగానైనా. 'పదార్జానికిలాగే కవిత్వానికీ నాశనం లేదు. మనిషిలో సృజనశక్తి ఉన్నంతవరకూ కవిత్వం ఉంటుంది. దానికి ఎప్పుడూ కాలం చెల్లదు. ఈ సృృజనశక్తి నశిస్తే మనిషిని మనిషి అనం ఇంకేదో పేరు పెట్టుకుంటాం. అయితే కవిత్వం వచనానికి దగ్గరయీ అయీ అందులో గుర్తుపట్ట రానంతగా కలిసిపోతుంది. బహుశా అప్పుడు వచన కవిత్వం ఉండదు, కవిత్వ వచనమే ఉంటుంది.” (సాహిత్య వ్యాస రింఛోళి, పే. 177) ఇట్లా అరుదుగానే ఎక్కడో ఒక్కచోట ఆయన ఆవేశం బయటపడుతుంది. కావ్యార్ధ నిర్ణయంలో పారకునిదే పారమ్యం. అతని సంస్కారం స్ఫురణ సమయోచిత భావనాలక్షణం ప్రాధాన్యం వహిస్తాయి. కాని సాధారణంగా ఆధునిక కవిత్వం విషయంలో కవులు అనవసరంగా చేయి చేసుకుని నేను ఇలా అనుకున్నాను, ఇలా భావించాను, ఇలా ప్రయోగించాను, ఈ అర్థం నేను ఊహించలేదు అని చెప్పటం, దాన్ని ప్రామాణ్యంగా స్వీకరించటమూ ఉంది. కావ్యోద్గమం తరువాత కవికి కావ్యతాత్చర్య నిర్ణయంలో [ప్రాధాన్యం ఉండనే ఉండదు. నేను కుందుర్తి 'నగరంలో వానిలో గీతాలను గురించి వ్యానం రాస్తే మొదట బావుందని మెచ్చుకున్న కవి, తరువాత వామపక్ష విమర్శకులు దాడిచేయగా, తాను ఆ అర్ధాన్ని భావించలేదనీ, విమర్శకుడే అపాదించాడనీ చెప్పుకున్నాడు. అయితే ఇక్కడే ప్రధానాంశం కవి ఉద్దేశ్యం కాకుండా కావ్యం కలిగించే స్ఫురణ, అది ఉచితంగా వ్యాఖ్యానింపబడ్డదా లేదా అనేది ముఖ్యంగా విచారించవలసిన అంశం ఈ విషయలో చేరా కూడా ఈ అభిప్రాయానికే చేరుకున్నాడు. అద్దేపల్లి-రారా వివాదం సందర్భంలో చేరా చేసిన వ్యాఖ్య ముఖ్యమైంది- *ఒక కవి తాను ఫలాని అర్ధంలో ఒక మాట వాడాను అని చెప్పింది, ఎంత సీరియస్‌గా తీసుకోవచ్చో నాకు 135
నుర్రునన్న ఆల
తెలియదు. కావ్యవస్తువుకు బలం కలిగించే అర్జాన్ని చెప్పటానికి విమర్శకునికి హక్మున్నదని నా నమ్మకం. పైగా తన కవిత్వాన్ని గురించి శ్రీశ్రీ (కవి) చెప్పేవన్నీ నిజాలని నమ్మటానికి వీల్లేదనుకుంటాను' (సాహిత్య వ్యాస రింఛోళి. పే. 184)
'కరుణశ్రీని గురించి చేరా “తెలుగు పద్యాన్ని తెలుగువాడికి చేరువ చేసిన కవిగా కరుణశ్రీకి తెలుగు సాహిత్యంలోగల స్థానాన్ని ఎవరూ చెరపలేరు అన్నాడు (కవిత్వానుభవం. పే. 31). ఇది అందరూ ఒప్పుకునే సత్యం నిశితమైన పరిశీలన లక్షణంగల చేరా 'సంప్రదాయ కవితా ధోరణులలో ఏదైనా ఎప్పుడైనా అంతరించిపోవచ్చు నేమో కాని శతకం మాత్రం సజీవంగా నిలిచే అవకాశం కనిపిస్తున్నది. అత్యాధునికులు కూడా శతకాన్ని వదలలేదు ఎందుకంటే 'ఆత్మవ్యక్తీకరణకు కనిపెట్టిన (డిస్కవర్ చేసిన) కావ్యరూపం శతకం'. (అదే పే. 28)
చేరాతలతోనే చేరా వ్యక్తిత్వంలోని విసృత పారం అవిష్కృతమైైంది. అతని వల్ల సాహిత్య విమర్శ, పరిభాష విస్తృతమైంది. కొత్త పదబంధాలు విమర్శరంగంలోకి అడుగుబెట్టాయి- కొత్త పెళ్లికూతుళ్ల వలె.
చేరా నా “శతాంకుర' చదివి ఒక మంచి వ్యాసం రాశాడు. నా షష్టిపూర్తి సందర్భంలోనూ మరొకవ్యాసం రాశాడు. వాటిల్లో సాహిత్యానుభవము, ఆత్మీయత, వివేచన మూడూ వున్నాయి.
రూపంగానీ, భావంగాన్సీ, సిద్ధాంతంగానీ, మరొకటిగానీ చేరా తన్ను తాను అన్నివైపులా పెంచుకుంటూపోవడానికి అద్దం కాలేదు. విరసం వారి ధూమగగనతలంలో చేరావంటి శీతల నీలమేఘాలు కురిసి ఉండకపోతే సాహిత్య విమర్శలో ఈ నాటి సౌహర్ద శరత్కాలం వచ్చి ఉండేదా అని నా అనుమానం. (కవిత్వం వచ్చేస్తోందా?)
నత్తా లన నో 136
స్పేద్చా ఠవిత్సం ఆధునిక కవితా జగత్తులో శ్రీ మాదిరాజు రంగారావు స్థానం విశిష్టమూ, విలక్షణమూ అయింది. యాఖై సంవత్సరాలనించీ ఆయన నిరంతరాయంగా కవితా సాధన చేస్తున్న వ్యక్తి. కవిగా వేదిక పొందిన తన కావ్య సంవుటితో వచ్చిన క్షణం 1957లో కిర్మీరంతోనైనా, దాదాపు నలఖై కవితా సంపుటులతో వచన కవితా రంగంలో ఒక పార్షాన్ని తనకుగా నిర్మించుకున్న సాధకులు. ఇప్పుడు వెలువరించిన 'స్వేచ్భా కవిత్వం అర్ధశతాబ్దపు కవితా సంపుటి. క్రమక్రమంగా పూర్వ రచనలను తీర్చిదిద్దుకుంటూ, మార్చుకుంటూ సారభూతంగా ఈ సంపుటి రెజ్సెల్లక్రితమే వెలుగులోకి వచ్చింది. రచనల సంపుటాలు యధాతధంగా తేవటం సులభమైన పనే. అయితే కవికి పునర్నిర్మితి చేయటంలో రెండు చిక్కులున్నాయి. ఒకటి కవి భావనారీతిలో, రచనా నైపుణ్యంలో శిల్ప చేతనలో వచ్చిన పరిణామం, రెందవది కవిత్వ చరిత్రలో వచ్చిన, పాఠకులలో వచ్చిన పరిజామం. ఈ రెండూ సున్నితమైన అంశాలు. తన రచనలో దేన్ని తొలగించాలి, దేన్ని ఉంచాలి అనే విషయంలో ఎన్నో చిక్కులున్నాయి. అయితే పాఠకుల దృష్టిలో చూచినప్పుడు ఒక రకమైన అబ్జెలిటీ వన్తుంది. ఈ పునర్నిర్మితిలో ఈ కవికి తోడైంది వివేచన గల పారకురాలు ఆయన బిడ్డ హరిత. అందువల్ల ఈ సంపుటి సమర్థంగా రూపుకట్టింది. తెలుగులో వచన కవిత్వ వరిణామం చరిత్ర సుమారుగా అరవై యేళ్ళుగా జరుగుతున్నది. అయితే ఈ కవి చాలాకాలం ఈ పరిణామంలో క్రియాశీలమైన పాత్ర వహించారు. వచన కవిత్వ సృష్టిలో తెలుగులో అంతకు పూర్వం అక్కడక్కడా కొన్ని రచనలు ఉన్నా అబ్బూరి వరదరాజేశ్వరరావు, ఛాయాదేవి దంపతులు ప్రకటించిన “కవిత” పత్రిక రెండు సంచికలూ ఆ ఆవిష్కారాన్ని నిర్దేశించిన ప్రధాన ఘట్టాలు వచన కవిత్వాన్ని ఒక ఉద్యమంగా చేపట్టిన కుందుర్తి పందొమ్మిదివందల యాఖైల చివర దానికొక స్పష్టమైన రూపం కలిపించే ప్రయళ్నం చేశారు. అయితే రంగారావు తన రచన ద్వారానే ఆ ఉద్యమాన్ని బలంగా నిర్వహిస్తూ వచ్చారు. మిగతా కవులు ఎప్పుడైనా, పద్యమో, గేయమో రచించినా ఈయన మాత్రం ఒక నిష్టగా వచన 137
నుత్రునన్ను ఆ
పద్యమే రచనావ్రతంగా స్వీకరించారు నిశ్శబ్దంగా ఉద్యమ నిర్వహణం చేయటం వలన ఆయన రూపొనికి బలాన్ని సమకూర్చారు. రంగారావు రచనలు క్రమపరిణామాన్ని స్పష్టంగా పరిశీలించిన వారికి తెలియవచ్చే అంశాలు వచన పద్యంలోని పరిణామాలను కూడా స్పష్టం చేస్తాయి.
- వచన కవిత్వ రూప నిర్వహణలో, ఆరంభంలో భాషలో ఇముడని శబ్బాలని తెచ్చి పెట్టి ప్రయోగాలు చేయటం. అంత్యప్రాసలు విపులంగా, చాలా చోట్ల నియతంగా ప్రయోగించిన ఆరుద్ర మొదలైన కవుల మార్గంలోకి రంగారావు ఎప్పుడూ సాగిపోలేదు.
2 తొలి రచనలో సంస్కృత భాష సామాసికతల ప్రాబల్యం ఉన్నా(క్రమంగా దాన్ని
వదలించుకోవటంలో కృతకృత్యుడైనాడు.
-
వచన రచనకు ఒక క్రమాన్ని ఒక నియతినీ - అనియతంగానైనా సమకూర్చి దాన్ని శక్తిమంకం చేసే ప్రయత్నం చేశాడు.
-
రంగారావు భాషలో నియతమైన ప్రతీకలను బింబాలను ఉపయోగించటం ద్వారా అర్ధశతాబ్దింగా ఒక ఏక రూపాన్ని నిర్మాణం చేయటం జరిగింది. అయితే ఈ ఏకరూప నిర్మాణం వల్ల ఒక మొనాటనీ వచ్చిందనే అంశమూ విమర్శలోకంలో పరివ్యాప్తమై ఉన్న మాట సత్యమే.
ఈ. ముక్తక రచనలు ప్రారంభించింది, వచన కవిత్వంలో రంగారావే. ముక్తక రచన విస్తృతంగా చేసి లోక ప్రవృత్తినీ, చైతన్యపు అన్ని పార్య్యాలనూ, సృష్టి ధర్మాన్నీ అనేకానేక జీవన పరిణామాలను వ్యాఖ్యానించటం ద్వారా దాని వస్తు పరిమిశులను బ్రద్దలు కొట్టి ఒక వైపుల్యాన్ని కలిగించారు.
6 వచన కవిత్వంలో వాచ్యలక్షణం రాకుండా అత్యధికంగా జాగ్రత్త పడ్డ కవులు కొందరున్నారు. అయితే అందరి కంటే ఈ అంశంలో దాన్ని అత్యంతము ముఖ్యాంశంగా భావించి కేవలం సంకేతాల ద్వారానే దాన్ని ప్రవ్యక్తం చేసిన గొప్పతనం రంగారావుదే.
రంగారావు కవిత్వం పరిశీలనకు ఈ ఆరు అంశాలూ ప్రాణ స్థానాలు. ఈ సంపుటానికి ముందు మాటలో కవి కొన్ని ప్రధానాంశాలు చర్చించారు సహృ్మదయలోకంలోనే కవితా పరంపర నిలిచేదీ ప్రకాశించేదీ. . (అది) రచనా 136
ఆకు నకువ్పణ
ప్రభావాన్ని ప్రసారం చేస్తుంది. ఆనందాన్ని పంచుతుంది ఆలోచనకు దీప్తి నిస్తుంది. కవి హృదయంలో ఈ విధమైన సంవాదం వల్లా ఆస్వాద పరిపూర్ణత చేకూరుతుంది.” ఇంకా కవిత్వ వస్తువును గురించి చెప్పుతూ “అన్నింటిలో సామాన్యమైన విశేషాంశం ఒకటే అది కవిత్వ స్పర్శ. సరస్సులో ఉందే జలమూ, (ప్రవాహంలో ఉందే జలమూ, బావిలో ఉందే జలమూ ఒకటే. అయితే వాటి విస్తృతి అగాధత్వమూ, నిడివీ, వేగమూ వేరు. దీన్ని బట్టి ఆలోచనా (ప్రసారం అనుభవ సాంద్రత వేరు కావటం సహజం. అయినప్పటికీ సహృదయుల్ని ఆకర్షించడం, మనోజగత్తును మహనీయంగానూ, రామణీయకంగానూ ప్రకాశమానం చేయడం ముఖ్యం. ఇది జీవనసారంతో జీవతేజంతో సమాహితం కావడం విశేషం. ఇది సాధారణనుభవాన్ని దాటింది బహిర్వాక్కున కందనిదీ అవుతుంది.” (పృాదయ సంవాదం)
ఇక్కడ కవి స్పష్టం చేసిన సహృదయ సిద్ధాంతం అలంకారిక శాస్త్ర సారాంశం కవికీ కవితా ప్రపంచానికీ ఉండే అవిచ్చిన్నమైన అనుబంధాన్ని స్పష్టంగా వ్యాఖ్యానిస్తున్నది. ఏ సిద్ధాంతమో ప్రధానమై, కవి బెపదేశికుడై లోకమంతా అతని ఉపదేశం విని యుద్ధరంగంలోకి దూకిపోయేంత స్థితికి కల్పించుకుంటుదనే కుహనా కవితా సిద్ధాంతాల (భ్రమలు ఈ కవికి లేవు. కవిత్వం ఆనందాన్ని పంచుతుంది. రమణీయార్థ ప్రతి పాదనం ద్వారా మనస్సుకు ఒక సంస్మారమును కల్పించటం ద్వారా ఆలోచనకు ఉద్దీప్తిని కలిగిస్తుంది. ఈ రెండు పార్య్యాలూ ఈ కవికి స్పష్టమే.
కవిత్వానికి కవిత్వమే ప్రాణం. ఇతరాంశాలన్నీ అంగములే. వాటికెప్పుడు 'ప్రాధమ్యం గానీ, ప్రాధాన్యం గానీ లేదు. సరస్సులో, ప్రవాహంలో, బావిలోనూ ఉండే సామాన్యాంశం జలం అయినట్లే-ఏ కావ్యానికైనా, కావ్యరూపానికైనా ప్రాణం, జీవధాతువు, ఆత్మ కవిత్వమే. ఆది లేకుంటే జలరహితమైన ప్రవాహం వంటిదే ఆ రచన భవభూతి చెప్పిన - 'ఆవర్త బుద్చుద తరంగ మయాన్ వికారాన్ అంభో యధా సలిల మేవహి తత్సమస్తమ్' అన్న వాక్యభావం ఇక్కడ స్ఫురిస్తున్నది.
ప్రజాస్వామ్య కవిత్వమన్నా, స్వేచ్చా కవిత్వమన్నా మరొక మాట అన్నా ఈ కవి ఆధునిక వచన కవిత యొక్క అత్యంత విస్తృతమైన పరిణామాన్ని భావిస్తున్నారు. “స్వేచ్చా కవిత్వమనేది వచన పద్యం. వచన గేయం, ముక్తచ్చందం, వచనగీతం, స్వచ్భంద కవిత్వం, వచన కవిత్వం మొదలైన వాటికుండే పరిమితుల్ని తనలో అంతర్భవించుకున్న విస్సృతరూపం (భిన్నంగా, ప్రత్యేకంగా) అందువల్ల దీనికి ఏ గిరిగీతలూ గీయటానికి
139
నుత్రునన్న ఆ వీలులేదని ఆయన స్పష్టం చేస్తున్నారు “ఇందులో భావనాతలంపై లౌకిక స్థాయినుండి మానసతలంపై లౌకికేతరం దాకా పర్యాప్తమై ఉంటుంది మానవ ప్రగతి సహజ వికాసం వ్యక్తి పురోగతి వివిధ గతుల్లో పరస్పర సహయోగంలో వర్తించే విధము స్వేచ్చా కవిత్వంలో దృష్టికి వస్తుంది.” కవి ఈ 'ప్రకటన ద్వారా ప్రగతి సహజ వికాసం, పరస్పర సహయోగమే ఆధారమని, పరస్పర సంఘర్షణ కానేశాదని విశదం చేస్తున్నారు. పద్యాన్ని గురించి ఇతర సామాన్య వచన కవులకన్నా ఈయన విలక్షణంగా స్పందిస్తున్నాడు. “పద్యం పరిణతి చెందింది. స్థిరపడింది. దీనికి క్షతిలేదు స్వేచ్చాకవిత వికాసోన్ముఖంగా ఉంది.” ఈ సమన్విత దృష్టియే ఈ కవికి బలం, రంగారావు కవిత్వం మానవ జీవనానుభవంలో ఏ ఒక్క పార్వ్వానికో పరిమితం కాదు. జీవనంలోని అన్ని పార్ష్వాలనూ అన్ని కోజాలనూ వెదకి వెలిగించి ముందుకు తెస్తుంది. అధికార పిపాస కీర్తి కాంక్ష ప్రబలి అంతరించి ఒక రాజవంశం, మరొకటి ఆవిష్కృత మవుతుంది. అణచబడిన జాతి మతం స్థానంలో మరొక జాతి మతం అభ్యుదితమవుతుంది (క్రీస్తుకు పూర్వం తొలి సహస్రాబ్ధిలో చరిత్ర తెచ్చిన పరిణామాలను ఇరాన్, మెనపటోమియా నాగరికతలు శిథిలం కావటం. మతాలు విచ్చిన్నం కావటం స్పష్టీకరిస్తున్నాయి ఈ పంక్తులు. ఎన్ని ఏండ్ల గ్రహణం నుండో విడిపించి నభోమణిని మరుద్గణంతో దుణ్థితిని పారద్రోలి సుస్థితి కల్పించే వజ్రి శతక్రతువు, శచీపతి, ఇంద్రుడు హిరణ్యవర్డుడు నిత్యపవిత్రమూర్తి దేవతలకూ మానవులకూ దగ్గరి బంధువు ప్రతి ఉదయం అవతరించే కవిక్రతువు, అగ్నిమూర్తి పవిత్ర బింబనేత్రంలో సకల సృష్టిపర్యాలోకన చేస్తూ హస్తవిధృత పాశాలతో సువర్ణపక్షాలతో క్షమామూర్తి ధృడవ్రతుడు వరుణుడు 140
ఆం నదుచ్చీల సర్గ స్థితి లయాలకు హేతువులై నిల్చిన (క్రిమూర్తులు
బ్రహ్మ విష్ణు శివులు దివ్యమనోరూపాలు (౧1? పే)
ఈ వర్ణన దేవతా భావనలో, ధ్యానకల్చ్బనలో బుగ్వేదంలోనూ తరువాత వచ్చిన పరిణామాన్ని విశదీకరిస్తున్నడి- “దివ్యమైన అనుభూతి బిందువులై దేవతలు (ప్రేమతో కరుణతో వెలిగే జ్యోతిః ప్రతీకలు."
బుగ్వేద కాలంనుంచీ మానవ సంస్కృతి, మతవేదాంతాలు, తత్త్వశాస్త్రమూ, జీవనంలోని అనేకానేక భాగాలను వెలిగించే అనంత విజ్ఞానమూ ఈ కవికి వస్తువే అయింది. సంతులనంతో దాని అంతస్తత్వాన్ని వెల్లరిస్తున్నారు.
ఈ స్వేచ్భా కవిత్వం సంపుటంలో పదికావ్యాలు సంపుటీకరింపబడి ఉన్నాయి. 'స్వేబ్భావాదం, ఆవాహనం, ముక్తకాలు, సమయదర్చణం, కిర్మీరం, వర్తమానం స్రీన్‌పై, అగ్ని నుండి ఆనందానికి, అనేక ఖండ కావ్యాల సంపుటం 'ముక్షకాలూ అనేక భావ మధుకోశం, మిగతారచనలన్నీ చిన్నవో పెద్దవో కావ్యాల పరిణత రూపాలు.
మానవీయం మానవ నాగరికత, చరిత్ర వీటి పరిణామాన్ని విశదం చేసే కావ్యం. ఈ కావ్యము వచన కవిత్వ చరిత్రలో విశిష్టస్థానాన్ని పొందింది.
పునర్జన్మ ఎత్తాలి మనిషి తప్పదు సుమి ఇక
దుఃఖంలో మగ్గి పోక, కష్టంతో నిల్చి పోక
పతనంతో పారిపోక, మరణంతో మారిపోక
మరో మనోలోకాన్ని కల్చించుకోవా లిప్పుడు (48)
ఈ పరిణామం కోసం 'మానవీయం'లోనేకాక తన సమస్త కవితలోనూ సంస్కార నిర్మాణం చేస్తున్నాడు ఈ కవి. ఆగామి సమాజం కష్టం తొలగించుకోవటమే కాదు దుఃఖాన్నీ తొలగించుకోవాలి. పతనాలు నిరాశకు హేతువులు కారాదు మరణాన్ని కూడా జయించి మరో మృత్యుంజయత్వాన్ని పొందుతాడు. అప్పుడే కవి తాను కలగనే సమాజం సంపూర్ణంగా ఆవిష్కారం పొందుతుంది. ఈ లోకం కేవలం భౌతిక స్థాయిలోనే లేదు. అది మనోలోకం. చైతన్యం యొక్క స్పందం. మానవజాతి సమస్టిగా సాక్షాత్మరించు కోనెంచిన మహోలోకం - అందుకే సామ్యవాదం చెప్పే భౌతిక పరిమితులను దాటి నూతన ప్రపంచాన్ని ఊహిస్తున్నాడు కవి. 'మానవ జాతి సమగ్ర వికాసం ఏనాటికైనా భౌతికశక్తులతో, నైతికరక్తితో, మానసిక వికాసంలోనే అనే సృష్టీకరిస్తున్నాడు
141
నుత్రునన్న ఆల ఈ పరిణామ స్వరూపంలో ఎంత మధనం ఉన్నదో, ఎంత తపస్సు ఉన్నదో ఆవాహనంలో '“దేవుడైనా సరే అన్న గీతం స్పష్టం చేస్తుంది. ఒక జలబిందువు సముద్రం లోళు తెలుసుకోవాలని సముద్రంలో పడింది. దాని ఉప్పదనాన్ని సహించలేకపోయింది. దాని వేగాన్ని తట్టుకోలేకపోయింది. అలగామారింది. అప్పటికీ ఈ తరంగ చలన సౌభాగ్యం ఎంతో తృప్తి నిచ్చింది. గ్రీష్మం వచ్చింది మళ్లీ ఆ బిందువు ఆవిరయింది. మళ్లీ ఆ బిందువు పూర్వపు బిందువేనా ఆ స్మృతి నిలిచి ఉంటుందా అన్ని ప్రశ్నతో ఈ గీతం ముగిసింది. పూర్వపు బిందువు కంటే ఈ బిందువు పరిణామాన్ని ఎరిగిన సంస్కారాన్ని తనలో గర్భితంగా దాచుకుని ఉంటుంది. ఈ బిందువునకు సముద్రం తెలుసు. తరంగం తెలుసు. గ్రీస్మం తెలుసు. అవిరవటం తెలుసు. పరిణామచక్ర పరిభ్రమణంతో పరిణతి చెందిం దీ బిందువు. అది ఇంకా పురోగమనశీలమైన ఉత్తమమైన మార్చునకు కారణం అవుతున్నది. దైవానికి సంబంధించిన భావనలో ఈ కవి ఆధునిక హేతువాదులకు సన్నిహితంగా ఉన్నాడు. *ఏ ఆకారం లేని నీకో రూపం కల్పించి పూర్వం' ఈ మతాల చరిత్ర యుద్ధాలతో రక్తసిక్తమైందంటాడు కవి. కాలం భవిష్యత్తు శ్రేయోరూపం. కాలాన్ని నియమించలేని దేవుడు కాలానికి తలఒగ్గక తప్పటం లేదు అని చివరకు అంటాడు. “నిజం చెబుతున్నా మనిషే ఒక దశలో దైవం. నీవనుకునే నేనే నీ రూపం. అక్కడక్కడా మాదిరాజు రంగారావు కవితలో కాల్చనిక బింబాలు గోచరించడం అరుదుగానైనా కనిపిస్తుంది. “నవ్వుతూంది వెలుగు నాలో” అన్న ఖండికలు 'స్పష్నహంసగా సమాజాన్ని ఆరోపీంచటం జరిగింది. “నేను పయనిస్తూనే ఉన్నా రాత్రి తరగలపై పడవనై నీవు రావాలి మళ్లీ చీకటి చివుళ్ల నుండి తెల్ల గులాబీ వలె.” జీవన లక్ష్యం విషయంలో కవి కోరుకునేది “మానవతా మనోజ్ఞసిద్ధ” “నాకు వద్దు స్వర్గం, అంతకన్నాముక్తి, రానీ హృదిలో రక్తి శాంతినీ ప్రేమనూ రంగరించుకున్న నవనవోన్నేషశక్తి.” చివురులో మొగ్గలో పూవులో ఉంది సుమో మరో జన్మ వాడిన పూవులో ఎండిన గుండెలో ఉంది సుమో మృత్యువు బీజనాశనం నుండి మొక్కవలె చావు అంచుల్లో జీవనం అందుకే చావంటే భయం లేదు మరోజన్మకు సంకేతం ఉగాది (194) 142
అటా సక్కుప్పణ.
ఆఎినిక జీవనం నసాచెంఒష ఒకానొక గొప్ప అక్ష్య్రం ఈ అంశం ౧వ
స్వర్గం నా పునర్భువం' కామయే దుఃఖ తప్తానాం ప్రాణినాం ఆర్తినాశనం' ఇది
యుగయుగాల నుంచీ సాధువులు మహాత్ములు, బుషులూ కోరుకుంటున్న అఆదర్శంలోని
ప్రధానాంశమే. శిల్చదృష్ట్యా చూస్తే రంగారావు రచనలో “నాలో (ప్రవహిస్తోంది నది,”
ముక్తధాత్రి, పదగెత్తిన ఉదయం విశిష్టమైన రచనలు. ఇవి ఒక్కోరచన ఒక్కో సంవిధాన వైభవంతో విస్ఫుటమై ప్రకాశించాయి.
రంగారావు కవిత్వంలోని దివ్యజీవన స్వాప్నికతకు అద్దం పట్టే అంశాలు
కిర్మీరంలో కాన వస్తాయి. శ్రీ అరవిందుల దివ్యజీవనం, సావిత్రి రచనల సంస్కారం వీటికి ఆధారభూతమైనట్లుగా కవి పేర్కొంటున్నాడు. ఈ రచనలో అమూర్త లక్షణం ఉన్నట్లు కవి పేర్ళొన్నాడు.
“జీవితంలో బాధల నుండి దుఃఖాల నుండి హాద్దుల నుండి, అజ్ఞానం నుండి, అసంపూర్ణం నుండి మృత్యువు నుండి ఉన్నత స్థితికై ఉన్నత దశకై, దివ్యదశక్రై జరిగే (ప్రయత్నాల్లో, సంఘర్నణల్లో విజయమే మానవ బక్ష్యం కావాలి. పరిపూర్ణత సిద్ధించాలి” (242)
ఈ స్పష్టమైన ప్రకటన ఆధునిక కవిత్వం తెలుగులో సాధించిన ఒక శిఖరా రోహణం కొందరు కవులు విశిష్టంగా ఈ పార్య్వాన్ని నిర్దిష్టంగా వివేచించి ఉత్తమ కవితా సృష్టి చేశారు మానవత అనే అస్పష్టమైన పరిమితుల్లో ఇరుక్కున్న కవులు
భౌతికా భౌతికాల మధ్య ఊగులాదుతున్నారు అయితే ఈ ధ్యానస్థితిని వెల్లడిస్తూ కవి దాన్ని వర్ణిస్తున్న అంశం అత్యంతమూ మనోహరమైంది
మౌనానికీ ధ్యానానిక్తీ వ్యాఖ్యానంగా ఉందీ స్థితి
లౌకిక వాస్తవ కధా మనోదశలర్ని దాటిందీ
మృత్యునిరంకుశత్వం నుండి స్వాతంత్ర్యం పొందిందీ గగన రహాస్యం (బద్దలై శబ్దధాని ఆవహించింది శారీరక జగత్తును స్పృశిస్తూ నవలోకం కదలిపోతూంది జననాంతర సౌహృదంతో హృదయాకాశం వెలుగుతుంది శక్తికణ సౌందర్య కాంతి నాలోకి ప్రవహిస్తోంది ఇక్కడ ఎక్కడా చీకటి ప్రసక్తి లేదు (273 పేజీ) ఈ అనుభవ వర్ణన వ్యాపించిన కావ్యభాగం చాలా విస్తృతమైంది. 143
సుత్రుసన్న ౪= మతం వేరు. ఆధ్యాత్మిక అనుభవ ప్రపంచం వేరు. ఆధ్మాత్మిక అనుభవ 'ప్రపంచాన్ని మనస్సులో మతానికి అతీతంగా సాక్షాత్కరించుకున్న దశ ఈ రచనలో 'ప్రసన్నమవుతున్నది. “ఇక్కడ కంటికి కన్పించదు, దేవుళ్ల పూజారుల లోకం (269) “ఈ శతాబ్చి రెక్కలపై అన్నరచనలో దళితవాదం స్రీవాదం 'ప్రసక్తాలయినాయి. వర్తమానంలో కవి ఎలా ముడిపడి ఉన్నాడో ఈ భాగం సాక్ష్యం ఇస్తుంది. ఇది స్రీవాద ప్రసక్తి: సమాజ దాహానికి ఖజురాహో అర్ధ నగ్న శ్రైలి ఉండనే ఉన్నది సమాజ రూపాని కిప్పుడు అర్ధవంతమైన రీతి ఏర్పడుతున్నది. (5386) ఖుజురాహో శిల్పాలలో ఉన్న శృంగారమో, కామమో, తాంధ్రికమో, సౌందర్య భావనమో అది ఒక గత కాలపు జ్ఞాపకం కావచ్చు కాని వర్తమానంలో సినిమాలూ, టీవీలూ, పత్రికా ప్రకటనలూ స్టీని ప్రదర్శించే రీతి ఎంతవరకు అర్థవంతమైనదో మనం ఇంకా విచారించవలసే ఉన్నది. దళితవాదం విషయంలో మరొక దర్శనం ఉన్నది. ఇప్పుడు మేం దళితులం కాదు, జ్వలితులం ఇప్పుడు మేం దళితులం కాదు ఉన్ముఖులం ఇరవై ఒకటో శతాన్టీ ముఖబింబాలం మా కళ్లలో ఇప్పుడు చీకటిలేదు స్వప్నం లేదు వాస్తవముంది. అదే మాకు ఉషస్సు ఉషస్సు బుజాలపై ఎగిరే పావురముంది పావురాన్ని ముంజేయిపై ఆడించే హృదయముంది (546) ఈ మెలకువ ఎంతో సత్యమో దీని వెనుక ఉన్న స్నేహబిందు స్పర్శ, ఆత్మస్పర్భ అంతే ముఖ్యం. అందుకే ఉషస్సు బుజాలపై ఎగిరే పావురం, పావురాన్ని ముంజేయిపై ఆడించే హృదయం- భావి సామరస్య నిర్మాణానికి ప్రతీకలవుతున్నాయి ఇంత విస్తృతమైన కావ్య సంపుటిని సమోక్షించటం పరిమిత సమయంలో దిజ్మాతమే అవుతున్నది. మాదిరాజు రంగారావు కవిత్వాన్ని సమగ్రంగా అధ్యయనం చేయటం వల్ల ఆధునిక తెలుగు కవిత్వం సాధించిన కొన్ని ఉజ్బల సన్నివేశాలు మనకు ప్రత్యక్షం అవుతాయి. ఆకాశవాణి, వరంగల్ 15 జూన్ 2008 శ44
అంతర్జగ్ ద్యాత్రికుడు
శ్రీ శంకరులు శ్రీదేవీ దృక్కులను వర్ణించిన క్రింది శ్లోకం సరిగ్గా కవిత్వ
కళకు అన్వయిస్తున్నది. విశాలా కల్యాణీ స్ఫుటరుచి రయోధ్యా కువలయైః కృపాధారా ధారా కిమపి మధురా£_&. భోగవతికా అవంతీ దృష్టి స్తే బహునగర విస్తార విజయా (ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే.
ఈ వర్ణనలో కవిత్వ లక్షణంగా చెప్పిన అంశాలు - అపరిమితమైనది, లోక(థశ్రేయః కారకమైందీ, తన దీప్తిచేత లోకమునంతా ్రకటించేదీ, లోకంలోని పరిమితులను అతిక్రమించిందీ, కారుణ్య ప్రవాహాల అనంత (్రోతస్వినియైందీ, అవ్వక్తమాధుర్యం గలదీ, అంతస్సులో గూఢమైన విస్తారం కలది - అని. బహునగర విస్తార విజయా అనటంచేత భాషాభేదాలు, దేశాల సరిహద్దులూ కవిత్వానికి లేవనీ తాత్చర్యం కవిత్వం సమష్టిగా మానవ సమ(గ్రానుభవాల దర్చణం.
ఇరవైయవ శతాబ్దంలో తెలుగు కవిత్వం ఒక నూతన భావజగత్తులోనికి ప్రవేశించింది. రకరకాల ఒత్తిడులూ, ఖ్రోపుడులూ దానికి అనంతమైన వైవిధ్యాన్ని యిచ్చాయి. రాయప్రోలు వారి నూతన ప్రతీకలు సర్వ చరాచర జగత్తునూ మానవ జీవనానుభవంలో భాగం చేశాయి. దానితో కవులు “అతాంతార్ధ రాగాలను తేటులతో' పాడించారు. నదీ సుందరులు (ప్రేమోపాసికలయినాయి. “'వనములను దాటి వెన్నెల బయలు దాటి, తోగులను దాటి దుర్గమాద్రులను దాటి, పులుల అడుగుల అడుగులు కలుపుకొంచు రాళ్లవాగు దాటి పధాంతరములు దాటి వచ్చిన' కిన్నెర సానియై కవి ఆత్మలో ప్రవేశించి నిరంతంగా గీతాలాపన చేసింది. కవిత్వం “గుండె గొంతుకలోన కొట్లాడింది కూసింతసేపైనా కూర్చుండనీయలేదు ” వ్యక్త జగత్తులోని వెలుగు నీడలలో తాదాత్యం పొందింది. అనంతాంబరంపు నీలి నీడలను తన కన్నులలో నిలువరించింది.
తెలుగు కవితా యాత్రలో కాల్చనికోద్యమం ఒక నూతన వసంతాన్ని తెచ్చింది కవిత్వ మధురయాత్రను సాగించింది. తెలుగు పాఠక జగత్తు కోసం నూతన అనుభూతి లోకపు కవాటాలను తెరచింది
145
నుత్రునన్న ఆల ఈ కాలంలోని కవితా సాధనలో మార్మిక కవిత్వం కూడా వెలుగులోనికి వచ్చింది. కాల్చనికోద్యమం, జాతీయోద్యమం జమీలిగా సాగటం వలన, తన మూలాలను వెతుకుతున్న జాతి ఉపనిషన్మూలాలలోనికి సాగిపోయింది. రవీంద్రుడు ఈ యుగానికి వెల్లగొడుగును నిలబెట్టాడు. తెలుగు కవులు ఈ బాటలో చాలాదూరం సాగిపోయారు. చాయప్రోలు, కృష్ణశాప్రి, విశ్వనాథ, నాయని ఇలా మార్మిక కవితా యా(త్రికులు ఎంతో మంది మనకు కానవస్తారు.
ఈ పద్యయాత్రలో వీరు తెచ్చుకున్న ఛందఃపాథేయం ్రాయికంగా - తేటగీతి. సుందరమైన తెలుగు పలుకుబడి. వైదర్భీరీతి. పద్యంలో ప్రసాదగుణం ప్రకటించే సంభాషణరూపం. ఇక్కడ వచనానికీ పద్యానికీ సరిహద్దు రేఖలు చెదరిపోయినై. ఆ నడుమ ఒక మిత్రుడు ఎక్కడా లభించని విశ్వనాథ వారి ఇరుత్రోవలు అన్న ఖండికను వినిపించాడు -
ప్రభు 1! భవద్దర్శనార్థమై బయలుదేరి వచ్చుచుంటిని నీదు దేవళము వరకు అట నెవరొ చెప్పినార లీ వన్మదర్ధ మరిగి నావని మా నిలయంబునకును దేవ ! ఏ మార్గమున చనుదెంచినావా యేమొ, మే మే పథంబుల నేగినామొ నీ పదాంచల మంటని మా పథంబు ముగ్ధవిభు ! ఎంత దురదృష్ట ముద్రితంబు ఇంత గాధమైన భావము - ఎంత సౌలభ్యంతో ్రకాశించినది. భావ కవిత్వం ఈ సారళ్యాన్ని తన మార్మిక కవికాప్రపంచం మీద ముద్రించు కున్నది. గీతపద్యం కవుల చేతిలో వేయి పోకడలు పోయింది. నడిమి కాలంలో ఆత్మవేదన, అంతర్విలోకనమే పాపమన్న తీరులో పప్రగతివాద (ప్రయోగవాదాలు కొనసాగి తుదకు పరాగ. వల్ల వీగిపోయినయ్. మళ్లీ అనుభూతి ప్రాధాన్యం వచ్చింది. కవిత్వం వో ండాలలోనికి సాగిపోయింది. జీవనమూలాల్లోని విలువలను అన్వే సంది వ్ వెలుగుల కోసం సాధన కొనసాగించింది. సౌందర్య కల్పవృక్షమైంది.
- వెలుగు తోరణాలలోకి సాగివచ్చిన నూతన తెలుగు కవితా యాథత్రికులలో 146
ఆస సకుద్పీణు శ్రీ అనుమాండ్ల భూ మయ్య ఒకడు. కాల్చనికోద్యమపు పాధేయాన్ని అందిపుచ్చుకుని తాను నూతన దిశల్లోకి ప్రయాణం సమకట్టినాదు. శ్రీ భూమయ్య కవిత్వం ఈ సౌకుమార్య లావణ్య గుణలతలకు ఆలవాలమైంది. కూర్మంవలె లోలోతుల్లోకి శ్రవ్వుకుంటూపోయి. మౌలికమైన సంవేదనలను పట్టుకో గలిగినాడు. శ్రీ భూమయ్య కవిత్వం నిండా మాతృపదమంజీర కుణుకుణుక్వాణాలు సన్నసన్నగా నినదిస్తూ వినబడుతూవున్నవి. ఎడదలోతుల తెలివిడిని తెలియజేసే అధ్యాయాల పేర్లు - ఎర్రగోరంట, వెన్నెల కన్ను భూమిపుండు, మెదడుపూవు చూడగానే సంభ్రమాన్ని కలిగించేవి తొలి కవితా గ్రంథం వేయి నదుల వెలుగులోనే కనిపిస్తవి. ఒక దుర్భరమైన అనహక్షణంలో- దేవి కన్నుల వెలుగొందు దివ్యమైన కప్పురపు సుగంధము లివ్లు కానరావు పాద కమలాలు చల్లవు పరిమళకముల పూల కడుపున కత్తులు వూచెనేమి చెట్టుపైనున్న చిలుకను పట్టదలచి తెగ నరికినాను చెట్టును తెలివి గాను చిలుక పోయెను, పోయె నా చెట్టు దేవి! మొద లెరుగని తెలివి కెంత మోసమయ్యె మొదటి పద్యంలో అసాఫల్యం, రెండవది వ్యర్థమైన - దారితప్పిన ప్రయత్నం జీవితం యొక్క రెందు పార్య్య్వాలు ఇవి. ఈ స్థితి దాటేందుకు మహాత్ముల జీవితాలలో గురువులు ప్రవేశిస్తారు. సరియైన దర్శనము, సరియైన మార్గమూ చూపుతారు. అప్పటి స్థితిలో ఈశ్వరానుగ్రహం వానర్లు కురుస్తుంది. ఎట్లువచ్చినదో వచ్చి ఎదుట నిలిచి వండిగిన్నెలో ఒక కొన్ని వెన్నెలలను పోసి, పాటలో తన దరహాస రుచుల నిన్ని కలిపి నా నోటి కందించె దేవి ఇది దివ్యస్థితి. ఆ స్థితిలో కవి సున్నితపు పద్య మెదలోన సుడులు తిరిగి తడిసి ముద్దయై రాగాల తమలపాకు తీగయైన వేళ. అనుభవం కవిత్వమయ్యే పారవశ్య స్థితిలో శబ్దము, వాక్యము, సమాసము, ఛందస్సు అన్నీ కరిగి ఒక ప్రవాహమై కవిత్వ 147
నుత్రునన్న ఆల రూపంలోకి పరిణమిస్తవి. హృదయాకాశంలో పద్యం ఒక సుందరేంద్ర ధనువవుతుంది. శాస్తాంశం కూడా కవి చేవగలిగిన స్థితిలో సుందరవా[గ్రూపం పొందుతుంది. అది సరస్వతి యొక్క ఒక ముఖం. కోరి పద్మాసనము వేసికొన్న నేను చూడగా (త్రికోణపు దివ్వై గూడునైతి దీని హృదయ మధ్యమునందు దేవి ! సూర్య దీపికవయి వెలుగరావె, దిగులు చెదర ఇందులో పద్మాసనము, త్రికోణము, సూర్యదీపిక అన్నీ సాంకేతికాలే. “ఒకటి నాకుడి బుజము, మరొకటి నా ఎడమ బుజ మొకండు పుచ్చభాగము' ఇదీ తైత్తిరియము లోని అంశమే. ఇలా ఎన్నో కావ్యాంతర్గతంగా శాస్తాంశాలు నిగూఢ గుప్తమాణిక్యాతై సంలీనత చెందుతున్నాయి. అగ్ని రూపమ్ముతో దేవి అహరహమ్ము నా కనుబొమల మధ్యలోననె వెలుగుచు మనసు నాకట్టుకొన, నన్నె మరచినానొ కనులు రెండైన నేను ముక్కంటినైతి ఇక్కడి యోగ విద్యారహస్యం విపులీకరిస్తే ఒక గ్రంధమే అవుతుంది. పద్యం చివరిపాదం ఎంత చమత్మారంగా కవితాత్శ్మకతను సంతరించుకొన్నదో మనకు అచ్చెరువు గొలిపే అంశం. సాధనలో లక్ష్యం అందీ అందనంత దూరంగానే ఉంటుంది. ఉపాధి సంలగ్నత వల్ల నేల మీది ఉనికి, దీని వాసనలు, బంధాలు ఎవరికో గాని తొలగిపోవు. శ్రీ అరవిందులు సాధన దశలో కేవలం మనోభూమికలోనే కాకుంచా భౌతిక, ప్రాణిక దశల్లోనూ పరిణామం జరిగి తీరవలెననే నిర్దేశించారు. కేవలం బౌద్ధిక దశలోని ఎరుక ఎప్పుడో మరుగున పడుతుంది. మహర్షుల తపోభంగ వృత్తాంతాలన్నీ ప్రాణమయ చైతన్యం దివ్యాభిముఖంగా తీర్చబడక పోవటం వలన సంభవించిన నికృతులే. మానవుని సకల్పం ఎంత తీవ్ర సాధన వలన సాధించవలసి ఉన్నదో ఎవరూ చెప్పలేరు. దీని వేరు నే నరకెద దీని రూప మింత లేకుండ జేసెద, నిపు డటంచు 148
ఆ నకుద్పణ ఎంత లోతు త్రవ్వియు, దీని అంతుగనను నా వలెనె క్రోధవృక్ష మృనాది యేమొ !
ఇందుకే సాధకుని తపస్సు సత్యతేజోమార్గంలో కదలి పోవటానికే గురు పరంపరా ప్రాప్త విద్య ఏర్పడింది. ఈ విద్య విజ్ఞానమూలమైంది మాత్రమే కాక తపోమూలమైంది గురువుల తపస్తేజస్సు అవిచ్చిన్నమై సాధకుని హృదయంలోనికి ప్రవేశించటం దీని ప్రయోజనం. (గ్రంధాలు - పాండిత్యాలు - బిరుదులు - సన్మానాలు వవీ మనోబుద్ధులను అహంకారాన్ని దాటి ముందుకు పోనీయవు. అందుకే తపస్సాధన గురు అనుగ్రహమునకు-ఏకాంతమునకు సంబంధించింది. దీనికి నిదర్శనాలు, (ప్రకటనము ఏమీ ఉండవు. అస్థాన పతితమైన వైరాగ్యము, మార్గదర్శనం లేని 'ప్రయత్నము, అవాన్ని తృప్తి పరచేందుకు సాగిపోయే ఏకాకితనం ఏ గమ్యమూ చేర్చటానికి సమర్ధం కావు.
ఇది కనకు మదియు వినకు మెప్పు డిదితి
ననె తినకు మని చెప్పగా వినుచు చివర
కిట్టులైతి, ఇంద్రియభూము లెండిపోయి. ఇదీ సరియైన త్రోవ దొరకనప్పటి స్థితి. ఐహికాముష్మిక జీవనాలనదుమ సమన్వయం కొరవడిన దశ జీవనసారాన్ని దూరం చేసుకునే దురదృష్టం. పోతన్న చెప్పినట్లు కమలాక్షు నర్చించు కరములు కరములు అన్నట్లుగా ఇంద్రియవ్ఫత్తులన్నింటినీ దివ్య జీవనాఖి ముఖంగా తీర్చిదిద్దే స్వభావంలో నుంచి శిశిరం దాటి వసంతం ఆవిర్భవిస్తుంది. అందువల్లనే కవి తిరిగి వెనక్కివచ్చి ఇంద్రియభూము లెందిన స్థితిలో - ఇక ప్రవాహమై నన్ను పండించుకొందు నంటున్నాడు
ఈ స్థితిలో తనదారి తనకు స్పష్టమైంది ఎవరో వచ్చి దీపము వెలిగిస్తారని, ఏకాంతముగా చీకటింట్లో ఎదురుచూస్తూ శుష్కించిన తాను - “నేనె దీపమై దిక్కునైనాను నాకు? అని స్పష్టంగా చెప్పుకొంటున్నాడు. ఇంత 'ధైర్యంగా చెప్పటానికి కారణం - చదువుతున్నప్పుడు, శబ్దమై సాగుచున్నప్పుడు నిశ్శబ్దమై పాడేస్పుడూ, యుద్ధరంగంలో ఒంటరిగా పోరాదేప్పుడూ తన్ను త్వరపెట్టి నడిపించే శక్తి ఉన్నది. ఆ శక్తియే ఇక్కడ గురువు, అక్కడ ఈశ్వరుడు
అప్పటిస్థితి ముందుకు పోవటమే వసుదేవుని శిరస్సుమీద భగవంతు డుండగా- అతనికి కారాగారం ద్వారాలు తెరిచింది. యమున నడుమచీలి దారి
149
నుత్రుదన్న ఆ
యిచ్చింది. ప్రయాణం గాలిలో ఎగిరి పోవటమే. నెత్తిమీద ఉన్న ఈశ్వరుణ్ణి ఎరుగక
పోవటమే దోషం. అవిద్యావిలాసం, అది గుర్తించితే తాళం చెవి చేతిలో ఉన్నట్లే మూసినట్టీ గుడి తలుపు ముందు సిలిచి
నిన్నటి వరకు నే నేద్చి, నేడు తలుపు
తట్టగనె తెరచుకొనెను) తలుపు తట్ట
కుండ ఏద్చినందుకు నవ్వుచుండె ప్రమిద.
ఈ అనుభూతి ప్రవాహం వెంట సాగిపోవలసింది సహృదయుడు. హృదయ పద్మంలో మేల్ళొన్న సాధకుడు. ఈ కవి అంతర్జగత్తులో సాగిన దూరం ఎంతో గుర్తించటం కష్టం. ఈ కవిత్వ గమనం అంతా సుదూర జగత్తులను అత్యంత సమీపంలోనికి చేర్చుకోవటం -
అకసపు గంగవచ్చి ముందాగినట్లు
భూమి మల్లిపూతోటయై మురిసినట్లు
తల్లి కౌసల్య ఒకరీతి తనయు జూడ
సూర్యు దుదయించె శ్రీరాము చూడ్ములందు.
మనుష్య భావనలో ఉన్న శ్రీరామునిలో మూడు పరిణామాలు స్ఫుటంగా చెప్పబడ్డవి. ఆకాశగంగావతరణము దివ్య జీవనం పైనించి క్రిందదాకా దిగిరావటం, భూమిపైన మల్లెపూలతోట - పృథ్వి తన దివ్యాభిముఖమైన ఆకాంక్షతో ఊర్జ్వ్యాఖిముఖంగా ఉన్ముఖం కావటం. దానితో దివ్య స్ఫురణత నేత్రాలలో సూర్యదీప్తి పవిత్ర దీప్తిగా సాక్షాత్కరించింది. మనిషిలోని ధర్మోత్మర్ష పొందగల శిఖరారోహణ ఇందులో స్పష్టంగా చిత్రితమైంది. జీవనం అంతా యోగమేనన్న శ్రీ అరవిందుల దర్శన తాత్పర్యం యిది.
కవిగా శ్రీ భూమయ్య ఉపలబ్ధి సామాన్యమైంది కాదు. సమకాలీనమైన అల్పాల్ప ధోరణులకు లొంగకుండా - కావ్య రచనను జీవన సాఫల్య భూమికగా చేసుకోవటం ఈ కాలంలో అరుదైన అంశమే, వ్యక్తిగా మనకు తెలిసిన శ్రీ భూమయ్య కంటే ఆయనలోని కవి దేశకాలా వధులను దాటి సర్వాత్మ చైతన్యంతో తాదాత్య్యాన్ని అనుభవించినవాడు. చిన్ని అందాల చిలుకయై రసపఫ్లతమైన వాక్కు ఆయన పద్యంలో కుదురుకొని ఉన్నది. ఆ దీప్తీ 'నారాయణానంద'యోగ కిరణ సమూహము. కవిగా టో రీ భూమయ్యకు చిరాయురారోగ్రైశ్వర్యాలను కోరుకొంటూ -
్యకు ఆనంత్యం కలదని విశ్వసిస్తూ - స్వస్తి. 150
అంతర్చీక్షణ సార్భభామము
- “అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా” అని శ్రీ లలితాదేవిని సహ(్రనామం స్తుతిస్తున్నది. అంథర్ముఖము, అంతర్ముఖీనత ఒక విధమైన చేతఃప్రవృత్తి. అంతర్ముఖ దర్శనం- ఈ విశ్వాన్నంతా పరమసూక్ష్మంగా తీసుకుని తన చిత్తంలో నిలువరించుకుని దాన్ని అహం విరహితాతఃకరణంతో సందర్భ్శించటం చేస్తుంది. ఇక్కడ అనుభూతి స్పష్టమౌతుంది. లలితకళలు ఉద్భవిస్తవి. సృజన శీలం పెల్లుబుకుతుంది. సృజన బిందువు విశ్వజనీనమై, సార్వకాలీనమై ఉపాధిరహితుడైన జీవుని వైపు దారులు ఏర్పరుస్తుంది.
శ్రీ అనుమాండ్ల భూమయ్య కవితా పరిశీలన ఈ దృష్టితో చేసిన, ప్రయత్నించిన ఆ మేరలలో ఇమిడీ ఇముదని కొన్ని వ్యాసాలను కలుపుకున్న యాఖై వ్యాసాలు సమీక్షల సంకలనం. కొందరి సమిక్షలు, వ్యాసాలు ఒకటి కంటే ఎక్కువగానే ఉన్నాయి.
ఈ సమీక్షాగ్రంథానికి సంపాదకులు ఆచార్య చేకూరి రామారావు, ఆచార్య బేతవోలు రామబ్రహ్మంలు. వారు భూమయ్య పుస్తకాలకు (వ్రాసిన ముందు మాటలూ ఇందులో చేరాయి.
విపులంగానూ, విశదంగానూ రహస్యవాద కవిత్వాన్ని అభ్యాసం చేస్తున్న భూమయ్య ప్రకటించిన కావ్యాలు - వేయినదుల వెలుగు - వెలుగు నగల హంస - అగ్నివృక్షం - జ్వలిత కౌసల్య - చలువపందిరి. ఈ ఐదు కావ్యాల సమిాక్షలు సమాకలితం చేసిన బృహ(ద్దంధం ఇది.
- రహస్యవాద కవిత్వం ప్రధానంగా పారలౌకికమైన అనుభవాన్ని పాలించేది. అక్కడ అది శబ్దాన్ని దాటి, అర్ధాన్ని దాటి తాత్పర్యాన్ని కూడా అతి(క్రమిస్తుంది. వాచ్యార్థమును, అలంకారములను దాటి 'ప్రతీకలను చీల్చి ముందుకు కొనసాగుతుంది. రూపాన్ని వస్తుభావములను త్రోసి ముందుకు వస్తుంది. మత తాత్త్వికాంశాలను దాటి తర్మాన్ని అతితరిస్తుంది. ఇక్కడ అనుభూతికి ప్రాథమ్యం, స్ఫురణకు ప్రాధాన్యం, ఆత్మవేదనావిష్కారానికి పట్టాభిషేకం.
151
నువ్రనన్న ఆల
ఈ కవితానుభనం - సాధారణ బహిర్ముఖ కవిత్వానుభవానికంటే అత్యంతమూ భిన్నమైంది. చదివిన సహృదయుని హృదయదర్పణంలో అతని జన్మజన్మలోతులను త్రవ్విన వేదనలను పట్టి యిస్తుంది. బావిలో రాయిపడి, దాన్ని షగులగొట్టితే ఆ సందులలో నుంచి పొంగ వచ్చే కొబ్బరి పాలవంటి నీరెలాంటిదో ఈ కవిత్వం అలాంటిది. 'అంధువు 'పెనులోతు (త్రవ్వినను నూల్మొను కొబ్బరిపాల వంటి నీరవిసిన యట్టి పెద్ద జలి - ఈ అనుభవం నర్వజీవ సామాన్యమైంది. సర్వచేతః ప్రసాదనకరమైంది.
ఈ ఐదు కావ్యాలలోను “జ్వలిత కౌసల్య" ఒక్కటే వస్త్వాశితం. మిగిలినవన్నీ ఆత్మాశయాలైన కావ్యాలు. అందువల్లనేమో బహిర్ముఖ దృష్టి ఎక్కువగా ఉన్న విమర్శకుల దృష్టికి “జ్వలిత కౌసల్య కావ్యం చర్చాసహంగా కానవచ్చింది.
- ఏ గొప్ప కవి ఐనా గాధానుభవవ్యంజకంగా రచన సాగించినప్పుడు వైయక్తిక పరిమితులను దాటి అనుభూతినీ, స్ఫురణకు, జీవవేదనకు ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. అప్పుడే కవిత్వం వస్తుభావ పరిమితులను అతిక్రమిస్తున్నది. శ్రీశ్రీ అంతటి కవి కుక్కసిల్ల, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా అన్నీ కవితా వస్తువులేనన్న వస్తువాది - 'కవితా ఓ కవితా" అన్న గీతంలో -
నా సృష్టించిన గానంలో
ప్రక్షాళిత మామక పాప పరంవర
లానంద వశంవద హృదయునని చేస్తే నీకై మేలుకొనిన సకలేంద్రియములతో వది రచిస్తున్నానో, చూస్తున్నానో ఊపిరి తీస్తున్నానో నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందిందో అటు నను మంత్రించిన సమ్ముగ్ధం గావించిన - ఆ గాంధర్వానికి తారా నివహపు (ప్రేమ సమాగమంలో జన్మించిన సంగీతానికి .... సుఖ దుఃఖాదిక ద్వంద్వాతీతం 152
ఆల నకుప్సణ అమోఘ, మగాధ, మచింత్య, మమేయం
ఏకాంతం వకైకం
క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం
(బ్రహానుభవం కలిగించిన
నను కరగించిన కవనఘృణీ
ఈ పంక్తులకు మార్క్సిస్టు పండిత వర్యులేమి అర్జ్భాలకు చెప్పుతారో కాని దీనిలో ప్రధానాంశం సృజనవేళ ఉపాధి పరిమితులు తొలగిపోయి విశ్వచైతన్యంతో తాదాత్యం పొందిన ఉత్తమ కవి పొందిన అలౌకికానుభవం. దీని సరియైన వివరణ భారతీయ సంస్కృతిలోని మూలాలతో అనుసంధించుకుంటేనే వ్యాఖ్యా సాధ్యమవుతుంది. సైద్ధాంతిక స్వయం శృంఖలిత చైతన్యంతో పలికే అపవ్యాఖ్యానాలు ఎప్పుడో ఒకప్పుడు కాంతిని కోల్పోతాయి.
4 ఈ సమిోక్షా సంపుటిలో కొన్ని వ్యాసాలు తెలుగు సాహిత్య విమర్శ సమిక్ష ఎంతగా ఆత్మాశయంగా ఉన్నదో, రాగద్వేషాల పరిమితులకు లోబడి వున్నదో తెలుసుకునేందుకు ఉపకరిస్తాయి. కొర్లపాటి శ్రీరామమూర్తి తమ వ్యాసం చివర అన్న మాటలో ఊగిసలాట స్పష్టంగా గోచరిస్తుంది. “ఇది సామాజిక స్పృహ కాలము. ఇందు ఆధ్యాత్మిక స్పృహ కలదు. ఏ స్పృహ అయినను స్ఫురణీయము రమణీయము అయిన సహృదయులకు ఉపాదేయమే”' ఏ రచన కయినా స్ఫురణీయత, రమణీయత (ప్రధాన లక్షణమయినప్పుడు - అది ఎప్పుడైనా సహృదయులకు ఉపాదేయమ యేట్లయితే ఇది సామాజిక స్పృహకాల మన్న మాటకు బెచిత్యము కన్పించదు.
వ్యక్తిత్వ వికాసం అన్న వ్యాసంలో అద్దేపల్లి రామమోహనరావు అగ్నివృక్షంలో ఉండే వైదిక ప్రతీకలకు, అధ్యాత్మిక భావనలను లౌకికార్థాలను అనుసంధానం చేసే ప్రయత్నం చేశారు. వ్యక్తిత్వం వికసించటానికి, ముఖ్యంగా దాన్ని గురించిన స్పృహ ఉండాలి. ప్రాకృతిక సామాజిక సంబంధాల్లో, మనిషికి తనను తాను అంచనావేసుకుని వైఫల్యాన్ని సూటిగా (గ్రహించగల వివేచన ఉందాలి. ్రతిక్షణమూ తన చైతన్యం అంతకంతకూ ఉన్నత దశలకు పోతోందా అన్న పరిశీలన ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే వ్యక్తిలో ఒక నిరంతరమైన 'తపన' ఉండాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు గలవారు దీన్ని జీవుని వేదని అనుకోవచ్చు. ముక్తి, దైవం అన్న విశ్వాసాలతో ఉండవచ్చు. కాని పై తాడుగు తీసేస్తే తపన” ఒకటే.” ఈ పంక్తుల్లో సమిక్షకునికి అధ్యాత్మికపుటంచులను
153
సుత్రునన్న ఆస
తాకకూడదన్న స్పృహ కనిపించుతుంది. చైతన్యం ఉన్నత దశలకు పోవటమంటే శ్రీ, అరవిందులు ఆధ్యాత్మిక దర్శనం సహాయం లేకుండా వ్యాఖ్యానించటం కష్టం. ఈ జీవుని వేదన విశ్వనాధ చెప్పిన జీవుని వేదనయే. నిరంతరమైన “తపన” అస్తిత్వవాదుల గగగ్రజ5% కావచ్చు. అందువల్లనే సమిక్షకుడు అస్తిత్వవాదులను, జిడ్డు కృష్ణమూరినీ తన చింతనకు ఆధారాలుగా (గ్రహిస్తున్నాడు. ఈ కావ్యాన్ని జాగ్రత్తగా చదివి తుమ్మపూడి వారి, సంగనభట్ల వారి వ్యాసాలు చదివిన వారికి ఈ వ్యాసం ఎంత ఉపరితలమాత్ర స్పర్శియో తేటతెల్లం అవుళుంది.
- సామాజిక పక్షాన రాసిన వ్యాసాల్లో జ్వాలాముఖిది ఒక్కటే ఏ మొగమాటానికీ పోకుండా మంచినీ, చెడునూ విశ్లేషణాత్మకంగా చెప్పింది. మనం ఆయన అభిప్రాయాలళో ఏకీభవించిక పోవచ్చు కాని ఎక్కడా అనిర్దిష్టమైన 'గోడ మిది పిల్లి వాటం” కనిపించదు. తన వ్యాసం మొత్తం “జ్వలిత కౌసల్య గురించి వ్రాసి దాని నామకరణం దగ్గరనించీ అభిప్రాయ భేదాలను చర్చించారు.
ఈ వ్యాసంలో కావ్యం వ్యాజంగా గ్రహించి రామాయణ మహాభారతాల గురించీ, వాటి చారిత్రకత గురించీ, రాచరిక వ్యవస్థలలోని కట్టుబాట్ల గురించీ, తెలుగు రామాయణాల గురించీ, శ్రీమద్రామాయణ కల్పవృక్షం గురించీ, విశ్వనాథ ధిషణాంకారం గురించి ఎన్నో అభిప్రాయాలను సృష్టంగా ఆయన వెల్లడించారు. జ్వలిత కౌసల్య కావ్య వివేచన చేస్తూ - చేకూరి రామారావు చెప్పినట్లు 'ఫ్రీవాదం రామాయణ పునర్నిర్వచనానిక్రి
భూమిక కారాదు. కుటుంబవ్యవస్థకు బీజాలు వేసిన కల్పవృక్షం రామాయణం, ఏక పత్నీవత తత్త్వానికి బాధ్యత వహించిన సంస్కారం రామాయణం. ఏక పత్నీవ్రత తత్త్వాన్ని హేళన చేసే మదపిచ్చి స్త్రీ వాదం, కుటుంబ హింస పేరిట బజారున పడ్డ ప్ల్షీన్స కాపొదదు. 6అ(౪/0॥9/ను చేస్తుంది. 'స్త్రీవాదం ఒక అబద్ధం. దాని ప్రభావం భూమయ్య గారి మీద వుందనడం మరో అభాండం. రామాయణం మానవ సంబంధాల కోసం ప్రొకులాడుతుంది. విధేయతను అనుబంధాన్ని కోరుతుంది. ఆత్మీయతను ప్రసరింప చేస్తుంది. రామాయణ లక్ష్యంలో భాగంగా ప్రతిపాత్రను పరిమితం చేయాలి. మామూల్లు లోక వ్యవహారంలోని రాగద్వేషాలతో పాత్రల్ని సందర్భాన్ని చిత్రించరాదు.' జ్వాలాముఫి వివేచన జాగ్రత్తలో పరిశీలించవలసి ఉంది. 6 ఈ సమిక్షాగ్రంధంలో బేతవోలు రామబ్రహ్మం వ్యాసాలు పేర్కొనదగినవి. వాటిల్లోని కొన్ని అంశాలు వివేచించవలసినవి. 154
ఆ నభుట్పలు
“శంకర భగవతాత్పదులు శ్లోకాలను కొన్నింటిని వీరు చాలా అలవోకగా అనువదించి అక్కడక్కదా పొదిగారు. యత్ తత్ శతాబ్దాల నుడికారాన్ని మార్చగలిగితే ఇవి పుట్టు పద్యాలే అనిపిస్తాయి.”
“'వేయినదుల వెలుగులో (ప్రధానంగా న్తోత్ర సాహిత్యానికి అకృష్టుడైన కవి కనిపిస్తాడు. వెలుగు నగల హసంలో వైదిక సాహిత్యానికి ఆకర్షితుడైన కవి కనబడతాడు. ఇది కచ్చితమైన ఎదుగుదల. అసలు భారతీయమైనది వదయినా పనికి మాలినదే అని బద్ధకంకణులై బురద జల్లే సంస్కృతి విరోధులు మాత్రం దీన్ని జీర్ణించుకోలేరు.”
“ఈ కావ్యంలోని పద్యాలు అతుకుపువ్వులు కాదు. బతుకుపువ్వులే.”
“ఈ మార్శికత వైదేశికం కాదు. అంచేత చదువగానే అర్ధం అవుతుంది. తత్త్వం తెలుస్తుంది. సూచికలూ, పాదసూచికలూ అవసరపడవు.”
“వీరి పద్యనిర్మాణతైలి వచనానికి దగ్గరగా ఉంటుంది.”
“గణ విభజన జాగ్రత్తగా చూచుకుంటే తప్పు, యతినీ ప్రాసయతినీ గుర్తించడం కష్టమయ్యే పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనివల్ల మనం అలవాటు వడ్డ గతిమాధుర్యం దెబ్బతిని వచన గంధులు అవతరించాయి. ఈ అవస్థ వేయినదుల వెలుగులో ఉన్నంతగా ఇందు - వెలుగునగల నగల హంసలో లేకపోవడం అద్బష్టం. ఇటుపైనవ్రాసే వాటిల్లో అస్ప్సలుండదని భరోసా ఇస్తోంది ఈ ఎదుగుదల.”
ఈ వాక్యాలను జాగ్రత్తగా గమనించితే భూమయ్య (గ్రంథాలను అనివార్యంగా ముందు మాటలు రాస్తూనే తమ సమతులాబుద్ధితో వస్తు భావ రూపాలను అంచనా వేసిన బేతవోలు వారి సమబుద్ధి లక్షణాన్ని తెలుసుకోవచ్చు.
-
గుంటూరు శేషేంద్ర శర్మ తమ వ్యాసంలో ప్రాస్తావికంగా ఒక విషయం (ప్రస్తావించారు. అప్పాదశ పురాణాలలో ఆంధ్రభాగవతం శశ్రేష్టమైందనీ, దానిలోనూ అష్టమనస్మంధమనీ, అందులో ఐదుపద్యాలు పరమోత్కృష్టాలని ఆయన పేర్మొన్నారు. అవి ఎవ్వనిచే జనించు, లావొక్కింతయు లేదు, అలవైకుంఠపురంబులో, సిరికింజెప్పడు, తనవెంటన్ సిరి అనే పద్యాలు. సాహిత్య స్థాణువులు కానట్టి సాహిత్య పుష్పాలపై (మోయు తుమ్మెదలైన సహృదయులకిది అనుభవైక వేద్యం.
-
పరమార్ధదృష్టితో కవితా ప్రయోజన్ని గురించి ముదిగొండ వీరభద్రయ్య ఇలా అంటున్నారు. 'కవిత్వం రాసినప్పుడు తాత్కాలికంగా వాసనాక్ష్యయం అయిందన్న
155
బుతుసడు ఆల
భ్రమ కలుగుతుంది. కాని అది గజస్నానమేనన్న విషయం కొద్ది కాలంలోనే తెలుస్తుంది. సాధనలో ఒక భాగం కవిత్వం అవుఠేనే సిద్ధి శాశ్వతమవుతుంది కాని, అదే సర్వస్వ మనుకొన్నవాడు భంగపడక తప్పుదు. విరక్తి లేనిదే సాధన ఫలవంతం కాదు.” కళారూప సాధనాలు పరమార్ధ ప్రాప్తికి దోహదాలే కాని ఆత్యంతికంగా ఏకైక సాధనాలు మాత్రం కాజాలవు.
ఈ వ్యాసాలన్నింటినిలోనూ వస్తు చర్చ, తత్త్వ చర్చ ప్రాధాన్యం వహించాయి. అయితే ప్రయోగ నైపుణ్యాన్ని గురించి చర్చించిన కె. సర్వోత్తమ రావు ప్రయోగ పరిమళం అన్న వ్యాసంలో “భూమయ్య గారి ఉపమానాలలో సంప్రదాయం ఉంది. జానపద వాక్యరవళి కూడా ఉంది అని పేర్కొని కవిరూప కోపమ (ప్రతీక సామగ్రిలో గ్రామాణ, నాగరలక్షణాలు ఎలా కలసి ఉన్నాయో వివరించారు. అగ్ని వెలుగు, వెన్నెల, గుండె, హృదయము మనసు వీటినాశ్రయించి అనేకానేక శబ్బదిత్రాలు ఆయా కవితలో ఎలా వెల్లడి అయిందీ తెలియజేశారు.
ఈ సంకలనంలో సంగనభట్ల నరసయ్య, ముదివేడు ప్రభాకరరావు ప్రభృతుల వ్యాసాలు కావ్య విశ్లేషణతో, అనేకానేకాంశాల సమన్వయంలో (ప్రకాశిస్తున్నవి.
- రెంటాల శ్రీ వేంకటేశ్వరరావు వ్యాసంలో ఆధునిక వచనకవులు ప్రాచీన కవుల కన్నాకొత్త అభివ్యక్తి సామగ్రిని నిర్వహించిన విషయాన్ని విస్తారంగా చర్చించారు-
“పై పద్యంలో కనిపించే కలలెరుగని వ్రేళ్ళ వంటి అభివ్యక్తి ప్రాచీన కవిత్వం అంతా తిరగేసినా దొరకదు. ప్రాచీన కవులు వ్రేలు - కల వంటి సంబంధాలు చెప్పడానికి వీలు లేని జంటల్ని కలుపలేదు. ఆధునిక వచన కవులు అలా కలపటానికి సంకోచించ లేదు.”
“గడచిన బ్రతుకులోన చీకట్ల గుహలవెన్నా కలవు అని రాశారు భూమయ్య గారు. ఇక్కడ అలంకారం ఉంది. ఇది ప్రాచీన కవుల రూపకం కాదు. పాత కవుల రూపకాలంకారంలో ఉపమానాన్ని లోపింపజేసి రాయడం అరుదు. అలా రాసిన సందర్భాల్లో ప్రసిద్ధ రూపకాలు అంటే కోపాగ్ని సంసార సాగరం, అసిభుజగం వంటివి, ఉపమాన ఉపమేయాలుగా తీసుకున్న వస్తువుల మధ్య తరచూ వాడటం వల్ల - ప్రసిద్ధమైన సంబంధం ఏర్పడినది. పాతకవి తానే ఒక కొత్త జంటకు ఉపమాన ఉపమేయ నిర్దేశం చేసినప్పుడు, సావయవ రూపకాన్ని విస్తృతోపమని వాడతాడు ఆధునిక కవి యధేచ్చగా లుప్తరూపకాలని, లుప్తోమలని వాడేస్తాడు కొత్తవైనా సరే,
156
ఆం నకువ్పణ “బతుకులో చీకట్ల గుహలున్నాయంటున్నారంటే (శతుక్కి పర్వతత్వాన్ని నిద్దేశిస్తున్నాడన్నమాట. . .- . . లేదయ్యా ఇక్కడ (బతుక్కి పర్వత లక్షణాన్ని ఆరోపించటం లేదు. (బతుకు దారిలో చీకటి గుహల్ని చూచానంటున్నాడు, అని చెప్పినా చీకట్ల గుహలు అనే ఉపమానం ఏ ఉపమేయానిదో ఆ ఉపమేయం - వ్రసిద్ధ ఉపమేయం లోపించనే లోపించింది. ఉపమేయం లోపించిన రూపకాలు వచన కవితలో చాలా ఎక్కువ.”
“వచన కవితలో మాత్రమే కనిపించే అలంకార క్లిష్టత ఇందులో ఉంది”.
దీర్టమైన పై ఉటంకింపు వల్ల ఆధునిక కవితలో అలంకార వివేచన చేయ వలసిన అవసరం ఎంతగా ఉన్నదో మనకు స్పష్టం అవుతుంది. కవితలో ఆధునికతా ప్రాచీనతా భేదాలు పద్యరూపంవల్ల కాదనీ అభివ్యక్తి ముఖ్యమనీ తెలియవస్తుంది.
- ఇంత సమాీక్షా[ంథంలోనూ ముందుకు రాలేదు కాని ఒక విషయం స్పష్టంగా చెప్పవలసి ఉన్నది. లాక్షణిక భాష ఎవరికీ అర్ధం కాదనీ, వ్యావహారిక భాష ఐతే అందరికీ సులభంగా తెలియ వస్తుందనీ ఒక విపరీత ప్రచారం జరిగింది. ఇన్నాళ్ళుగా వేయినదుల వెలుగు నుంచి, చలువపందిరి దాకా వచ్చిన ఐదు కవితా సంపుటాల్లోనూ భాష లాక్షణికమే అయినా కవిత్వం అందరికీ అందుబాటులో ఉంటున్నది. ఆధునిక కవిత్వం వచన కవిత్వం అధివాస్తవికత, (ప్రతీకాత్మకత, తాత్త్వికత మొదలైన పేర్షతో సృష్టించిన కవిత్వం వైయక్తికమై అనవగావ్యామై పజిల్‌లాగా, చిక్కు ముడిలాగా మిగిలి పోవటం సహృదయులు గమనించవలసిన విషయం ఈ కావ్యాలలో వర్జితమైన వస్తువు జాతి జీవనంలో భాగమైంది. సంకేతాలు పదబంధాలు, పలుకుబళ్ళు అన్నీ ఈ (బతుక్కి నిత్యపరిచితాలు. అందువల్ల భాష కాదు వస్తువు, కవిత్వాన్ని సరళం చేసేదీ, కఠినం చేసేది. సంవిధానం మరీ ముఖ్యం. ఈ నూతన సంవిధానాలు కవి ప్రయోగరీతులు పరంపరాయాతంగా సాగివచ్చే కవితా ప్రవాహంలో సంగమించే భాగాలుగా పొడిగింపుగా ఉండాలే తప్ప అతుకని నూతనానుబంధాలుగా ఉండరాదు.
ఈ సమిక్షాగ్రంథం '“అంతర్వీక్షణ సార్వభౌమం' - కవినామ ముద్రాంకితమైంది. ఈ వ్యాస సంకలనం చదువగా మనకు సారభూతంగా తెలియవచ్చే అంశాలు-
- ఈ భూమికీ, ఈ జీవనానికి చెందిన జీవన విధానం, మూల్య పద్ధతి దాదాపు అరవై డెల్ఫై ఏళ్ల నుండి నిరసింపబడుతూ వచ్చినా తెలుగు కవిత్వ సంప్రదాయం 157
సుత్రురన్న ఆ ఇప్పటికీ ఆ మూలాలకు అనుబద్ధమయ్యే ఉన్నది. శ్రీ శంకర భగవత్పాదులు స్థాపించిన అనేక పంధాల, ఆరాధనా విధానాల సామరస్యం మాత్రమే ఇక్కడ చెల్లుబాటు అవుతున్నది. 2. సాధనకు, శరణాగతికీ మధ్య ఒక సామరస్య సంబంధం ఉన్నది. దివ్య జీవనాకాంక్ష, ఈశ్వరానుగ్రహమూ రెండూ సాగి ఒక నామరస్య బిందువు దగ్గర సమావేశమవుతున్నాయి. 8. వ్యక్తంగానో, గుప్తంగానో అనేకులైన తెలుగు కవులకు ఆధ్యాత్మిక మార్గాలు ముఖ్య స్పందకేంద్రాలుగా ఏర్పడుతున్నవి. 4 వర్తమానంలోని సంక్షోభం, అసామరస్యం కవిని చీకాకు పెడుతున్నాయి. పరిమళములె జాల్వారు ఈ పాల కొలను నందు దేవి, రక్తపు టల, లివేమి హంస కాలికి మెత్తనైనట్టి చిన్ని కత్తి కనిపించు నిన్నటి గజ్జె లేదు ఇది కవి పొందిన సంక్షోభానికి గురైన పద్యం. మొత్తం మీద తెలుగు కవిత్వం వర్తమానం తెలుసుకోవటానికి, తెలుగు విమర్శకుల భావి దిశను నిశ్చయించుకోవటానికీ ఈ (గ్రంథం తప్పక ఉపయోగపడుతుంది. ఆకాశవాణి, వరంగల్ 22 జూన్, 2008 158
“బుతు భ్రమణం' గురించి
తొలి రోజుల్లో కవిత్వంలోనే అన్నీ విజ్ఞానం, అనుభవం, విశ్లేషణ, కల్పన, గాథలు, చరిత్ర - ఇలా ఎన్నైనా క్రమంగా దేనికి దానికీ ప్రత్యేక ప్రక్రియా రూపాలు ఏర్పడుతూ వచ్చాయి. దాంతో కవిత్వం - “ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని" అన్న స్థితి నుంచి “రహస్య ద్వారం అన్న స్థితి దాకా వచ్చింది. ఆశు, మధుర, విస్తర చిత్ర కవిత్వాలను చతుర్విధాలన్నా ముక్తకానికి ప్రత్యేక విభాగ ప్రతిప్రత్తి లభించలేదు.
వైదిక మంత్ర బృందంలో ముక్తక మాధుర్యం ఉన్న రచనలెన్నో ఉన్నాయి. మంటత్రద్రష్టలను 'కవి' అని వేదం వ్యవహరించింది. కవులు సత్యతశుతులని వర్ణించింది. “నిశ్శబ్దం స్థితి పృదయం మోద ప్రసరించే శిఖరాల మిద పరిక్రమించే శబ్దాల తోడి లయబద్ధచ్చందాల దాకా (వ్రేతాగ్నుల సంగతుల సమర్చనం సాగించినవాడని కవిని ఆ సందర్భంలో శ్రీ అరవిందులు వర్డించారు. దీన్ని ఇంకా వివరిస్తూ ఆ కవిత సుషుప్తికీ సమాధికీ నడిమి అనుక్త సత్యధ్వని అని వ్యాఖ్యానించారు. వేదమంత్రాలలో వెన్నెల పరచినట్లు వ్యాప్తమైన కవితా సౌందర్యం ఇప్పటికీ అరుదైన నవ్యత్వంలో ప్రకాశిస్తూనే ఉన్నది. వాక్కును గురించి అత్యంత సుందరంగా ఒక బుషి ఇలా అంటాడు.
చూచినా చూచినట్లు కాదు
విన్నా వినినట్లు కాదు
ఐనా ఎవరికో కాని
పతి ముందర నుందరి అంబరాల్ని త్యజించినట్లు
ఆంతర్యాన్ని విప్పి చెప్పుతుంది వాక్కు బుగ్వే - 10.714
కవి బాహ్య ప్రపంచాన్ని విస్మరించి అంతర్ముఖుడై పరిమితులను ఛేదించుకొని విశ్వజనీనతను పొందినప్పుడు వాక్కు ఉన్న్మనీ (111806? గాం౧12) సీమలలో నుంచి దిగివస్తుంది.
కావ్య సాహిత్యం కొనసాగినట్లే ముక్తక సాహిత్యమూ ఆదికాలం నుంచీ కొనసాగుతూ వచ్చింది. ఉపనిషత్తులలో, బౌద్ధ సాహిత్యంలో అనేక ముక్తకాలు మనకు కనిపిస్తాయి.
159
నుపునన్న ఆల గాధా సప్రశతులూ, చాటూక్తి సంగ్రహాలు, సుభాషిత కోశాలు అమరుకాది శతకాలూ ఇలా ఎన్నో ముక్తకాలు భాండాగారాలు. మౌఖిక దశలో అధికప్రచారం కలిగివుండడం వలన ఎన్నో ముక్తకాలు కాలగర్భంలో లీనమై పోయాయి. ఐనా అలంకారశాస్త్రం ముక్తకాలకు అత్యంత ప్రాధమ్యం కలిగించింది. అమరుకుని శతకంలో ఒక్కో పద్యం నూరు ('ప్రబంధాలకు సమానమైందనే ప్రశంసలు ఉన్నట్లే - 'ముక్తకాలలో కవులు అనంతం, సంఘాతాలో ఐతే నూర్ల కొద్దీ ఉంటారు. మహా ప్రబంధ నిర్మాణంలో ఐతే ఒకరో, ఇద్దరో- మూడవ వ్యక్తి దొరకటం దుర్లభం” అన్న తేలిక అంచనాలూ ఉన్నవి. తెలుగు కవితా జగత్తులో కాల్పనిక కవిత్వంలో ఖండకావ్యాలు చాలా వరకు మహాకావ్యం నుంచి ముక్తక రచన వైపుగా సాగిపోయాయి. తరువాత కవిత్వరంగంలో రాజకీయోద్యమాల నియంత్రణ పెరిగి - ఒక సుదీర్హ ప్రచండ గ్రీష్మం ఆవరించింది. నిశ్శబ్దంలోంచి మొలకెత్తవలసిన కవిత్వం ఊరేగింపులలోకి, కల్లోలాలలోకి, నినాదాల లోకి, హోరులోకి ప్రయాణించింది. మళ్లీ 'తనదైన అనుభూతి తనదిగాన' అన్న స్థితికి తిరిగి రాక తప్పలేదు. “అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా' అని వర్ణితురాలైన దేవి సరస్వతి, మెలమెల్లగా అడుగులు వేస్తూ, తన తంబురను శ్రుతి చేసుకుంటూ కదలి వచ్చింది. అనుభూతి ప్రధానవస్తువైంది. చేతనలో సుళ్లు తిరగటం ఆరంభమయింది. అతి వాస్తవికత అంతః ప్రపంచాల చీకటి దారులను వెదకింది. కవిత్వం “అల్పాక్షరముల ననల్పార్ధ రచన'గా రూపొంద నారంఖభించింది. కవులు విస్మృత రూపాలను, అతినవ్య రూపాలను వెదుకుతూపోయారు. పత్రికలు ప్రన్వకవితకు కిరీటాలు పెట్టాయి. ముక్తకాలూ, నిశాంతాలూ, శతాంకురాలూ, రాత్రి వచ్చిన రహస్యపు వానలూ, వేయినదుల వెలుగులూ, చమత్మారికలూ ఎన్నో ఈ పరిస్థితికి రంగం సిద్ధం చేశాయి. ఖలీల్జిబ్రాన్, గాలిబ్ మొదలైన కవులు తెలుగు కవిత్వ దేహళిలోకి కొత్త వెలుగులతో అతిధులై అడుగులు పెట్టారు. కవుల దృక్పధంలో ఒక ఉద్ధతమైన మార్చు వచ్చింది. 1954లో అబ్బూరి వరదరాజేశ్వరరావు 'శాశ్వతాన్ని ప్రస్తుతం ఆవిష్కరించదు అంటాడు. అప్పుడే ఆరుద్ర “వర్తకుని మనసులో పెట్టుకుని శుక్తి మౌక్తికాలను ధరించదు. ప్రజలను దృష్టిలో నింపుకొని కవి రచించడు. బేహారి తానై ముత్యముల సేకరించు అటులె ప్రజలుకూడ కావ్యముల నాదరించు అన్నాదు. ఈ వెదుకులాటలో తరలి వచ్చిన రూపమే “హైకూ' 160
ఆ నకుప్పల ఈ ప్రక్రియ జపాన్‌లో జెన్ బుద్ధ ధర్మ పరుల్లో అనుభూతిని చెక్కుకునే చిన్న కవితారూపంగా ఆవిర్భవించింది సృష్టిని అంతర్ముఖంగా చూస్తూ దానిలో లీనమైన దశలో ఒక అపూర్వ చిత్రం మనస్సులో స్ఫురిస్తుంది కాళిదాను చెప్పినట్లుగా “'పర్యుత్సుకోభవతి యత్సుఖితోపి జంతుః తచ్చేతసా స్మరతి నూన మబోధపూర్వం' ఈ చేతస్సు న్మరించిన అభోధ పూర్వమైన అంశమే “హైకూ” కావ్య ద్రవ్యం. షెన్ హిసియు “జెన్ మనస్సునూ గూర్చి చెప్పిందీ, హుయినెంగ్ చెప్పిందీ వింటే మనకు విభ్రమం కలుగుతుంది. షెక్ హిసియు: శరీరమే బోధివృక్షం మనస్సు ప్రకాశించే అద్దం - దాన్ని జాగ్రత్తగా శుభ్రం చేయి - దుమ్ము ఉండకుండా చూడు. హుయినెంగ్: బోధి వృక్షమే లేదు - అద్దం కూడా లేనే లేదు ఎక్కడ దుమ్ము రాలిపోతుంది. అంతా శూన్యమే. అయికే బౌద్ధ ధర్మద్భృష్టిలో యధార్ధ్థం యొక్కరెండు ముఖా లీ రెండు ప్రకటనలు. మహాయాన బౌద్ధంలో సద్ధర్మ పుండరీక సూక్తం ముఖ్యమైంది. అంతకు ముందున్న భిన్న భిన్న మార్దాలను సమన్వయ పరచి అది ఏకాయన సూత్రాన్ని బోధించింది. సాధకుడు తన సాధనలో అర్హతుడు కావటమే కాదు - బుద్ధుడు దేశకాలాలకు అతీతంగా ఉందే ప్రభూత రత్నబుద్భుడనీ, శాక్యముని ఇతనిలో ఒక అంశమనీ బోధించింది. యోగ దర్శనం ధ్యాన ప్రక్రియను గురించి చర్చించినా దాన్ని విస్తారంగా వృద్ధి పొందించినవి తాంత్రిక బౌద్ధ దర్శనాలు విమలక్తీర్తి సూత్రంలో మంజుశ్రీ బోధిసత్తుడు. విమలకీర్తి మౌనాన్ని వర్ణిస్తూ 'ఆ మౌనం గగ్జిస్తున్నది' అని ప్రశంసించాడు. అంటే ఆ మౌనం విస్ఫోటన శీలమైంది. ప్రపంచమంత విశాలమైంది. దుఃఖం నుండి విముక్తం చేయగలది. మన చైతన్యంలో ఆలయ విజ్ఞానం, మనో విజ్ఞానం రెండంశాలు. ఆలయ విజ్ఞానం మనలో గూఢంగా నిక్షిప్తమైన ద్రవ్యం ధ్యానం చేయటమంటే నిగూఢమైన బుద్దుడన్న శిశువు మనలో ఉన్నట్లు గ్రహించటం. ఆయన పరిపూర్చుడై జన్మించే అవకాశం ఇవ్వాలి. గర్భస్ట్థుదైన బుద్ధశిశుపిండం స్పర్శ అనుభవంలోనికి వచ్చినప్పుడు మనలో ప్రేమ, కరుణ మొదలైన దివ్య లక్షణాలు వికసించుతవి. '“బోధిచిత్తం మేలుకొంటుంది. బోధిచిత్తం మేలుకొనటమే సిద్ధిస్థితికి ఆరంభం ్రవాహశీలమైన ఈ జగత్తులో ఏదీ నిత్యంకాదు. ప్రతీదీ మారిపోతుంది ఈ భావమే ఆయనను నిత్యమైన 161
సుతుసన్న ఆ
ఆత్మను అంగీకరింప నీయలేదు. నిర్వాణం అంటే అది ఈ ప్రవాహం నుండి తొలగి పోవటమే. నిర్వాణం గురించి చెప్పటమంటే అది- 'ఆశ్రయతీరం, శీతలగుహ, వరదల మధ్య ద్వీపం, ఆనందస్థానం, దోష భేషజం, అమృతం, తరువాతి తీరం, పవిత్రనగరం.” ఈ సాధన కోసం బౌద్ధం పరిణామంలో అనేక ధ్యానపద్ధతులను సాధనలను వివరించింది.
మహాభారతంలో సనత్సుజాతీయంలో అప్రమతత్ర్తయే (1/11064141%659) అమృతత్త్వమని వివరించబడ్డది. “సతిపత్తాన సుత్త అ అంశాన్నే వివరిస్తుంది. ప్రతిక్షణం 'ప్రతికార్యంలోనూ జాగరూకుడై ఉండటం ఈ లక్షణం. ఏ క్షణంలో ప్రమత్తత ఆవరించినా మిగిలేది ధ్యానభంగమే. శంకరుల తరువాతి అద్వైత యోగశాస్త్ర గ్రంధాలు. అచల
సంప్రదాయము, రమణ మహర్షిమార్గము, జిడ్డు కృష్ణమూర్తి తత్త్వము అన్నీ ఈ బౌద్ధ సాధనపు పదాలలోనుంచో సంగతినుంచో దిగివచ్చినవే. “హైకూ' ప్రక్రియను, దాని పరిణామాన్ని ఈ పృష్ట భూమి నుంచి చూడాలి. "హైకూ లక్షణాలన్నింటికీ మించిన ఒక లక్షణం- తాదాత్య స్థితిని కలిగించటం. విశ్వమయతను పొందించటం, అస్మితను దాటి ఎదిగిపోవటం.
ప్రధాన లక్షణం దాని నిడివి పదిహేడు చిత్తక్షణాలలో ఒదిగి పోవటం ఈ చిత్త క్షణాలను ఒన్జీలన్నారు. వీటిని సిలబుల్స్తో అక్షరాలతో అనువదించుకోవటం మన సౌకర్యం కోసమే తప్ప మరేమి కాదు. ఈ చిత్త క్షణాల ఉనికి మూడు పాదాలై 5-6-5గా ఉండటం సామాన్య లక్షణం. ఇది అనుష్పుబర్ధం కన్నా ఒకక్షరం ఎక్కువ. గాయిత్రిని త్రిపాదిగా చూచినప్పుడు దానికన్నా ఒకక్షరం తక్కువ. అనుష్టుప్పు వలె “పాద బద్జోక్షర సమః తంత్రీలయ సమన్వితః అన్నట్టిది కాదు. ఒక మంద్ర నిశ్చాసం వలె వెలువడే గద్య విశేషం,
“హైకూ కవుల్లో నాకు పెన్నా శివరామకృష్ణతో కొంత పరిచయం ఉంది. ఆయన “రహస్య ద్వారం? 'చినుకుల చిత్రాలు నా కిష్టమే. ఆయన అన్నట్లు 'మూసిన కన్ను, నాలోని లోకానికి రహస్యద్వారం.? ఈ కవిత "హైకూ' కవిత్వం తత్త్వమునంతా సమగ్రంగా వ్యాఖ్యానిస్తుంది. డా తలతోట పృథ్వీరాజ్ కవితలు విరళంగానే చూచి ఉన్నానా గుర్తులో ఉన్న కవియే. 'హైకూ'లను ఒక ఉద్యమంగా చేపట్టడం ఈ కవిలోని వైళిష్ట్రం. ఇవేకాక “హైక్యూ,, 'పెన్ర్యూలు* తంకాలు' ఇలా దాని పరిణామ రూపాలనూ కవితా రూపంలో స్థిరపరచే (ప్రయత్నమూ చేస్తున్నా రీ కవి హైకూల సంకలనాలు, ఇండియన్ హైకూ క్షబ్ స్థాపన, హైకూ మాసపత్రిక నిర్వహణ ఇవన్నీ ఈయన కావ్య దక్షతకూ, కార్యదక్షతకూ సంకేతాలు.
162
ఆ సకువ్పీజ ఇప్పుడీ కవి 'బుతుభ్రమణం' అనే నూతన కవితా సంపుటితో కావ్య లోకంలోకి వస్తున్నారు. ఈ రచన అంతా ప్రకృతి విలాసానికి సంబంధించింది. ప్రత్యేక బుతువర్ణన కావ్యాలు కాళిదాసు సంస్కృతంలో, తెలుగులో విశ్వనాధ, పైడిపాటి సుబ్బరామశాన్తి, సి. నారాయణరెడ్డి రచించారు. హైకూల్లో “మినియేచర్ పెయింటింగ్” లాగా తీర్చి దిద్దిన బుతుమంటపాన్ని శ్రీష్టధ్వీరాజ్ మనకు అందిస్తున్నారు. ఈ ధ్యాన కవితలు నెమ్మదిగా ఒక్కొక్కటీ చదివి తనలోకి మునిగిపోయి నెమ్మదిగా తేలి రావలసినది. కవి సమ్మేళనాలు, మహాసభలూ, కరతాళధ్వనులూ - వీటికి ఇవి యోగ్యమైనవి కావు. సమూహంలోనైనా ఏకాంతంలోనికి వెళ్ల గలవారే వీటిని చదువుకోవాలి లోతులలోనికి చొచ్చుకోవాలి, పుస్తకం అంతా చదవండి. మీలోని నిశ్శబ్దాన్ని విస్ఫోటం చేయండి. ప్రతి “హైకూ” తరువాత ఒక నిశ్శబ్దఘనం ఉంటుంది. బుతు భ్రమణంలో కవిత కవితకూ మధ్య కాన్వాస్ మారిపోతుంది. కవి వేసిన బొమ్మలైనా కొంతవరకు తోడ్పడవచ్చు “ఆ వచియింపగా బడిన దాధారంబుగా నీవు చిత్తానం జూచిన దానిలోని దగు సౌందర్యంబు సువ్యక్తమౌ.! పండు వెన్నెల / చీకటంతా చేరింది / చెలి కళ్లల్లో (గ్రీష్మబుతువు / ఇంకిపోని నూతులు / నయన ద్వయం సృష్టిసమస్తం / పరిభ్రమణ సూదత్రం / బుతువులునూ శిశిర వృక్షం / అపురూప మకుటం / కుంగే సూరీడు మంచువలలో / చిక్కుకు పోయిన మనం / నిండు జాబిల్లి వృక్షం భూమిక / శిశిర వసంతాలు / రూపశిల్చులు పచ్చని స్వప్నం / శిశిర వృక్షానికి / వసంతబుతువు చేంతాళ్లన్నిట్ని / మరుగుజ్జుల్ని చేస్తూ / గ్రీష్మయితువు వర్షానంతరం / పురివిప్పే మయూరం / రంగుల నింగి సూర్యుని జ్వాల / శశిక్షీరకలశం / వెన్నెల పొంగు ఇలా ఉదహరించటమే. ఒక కావ్యనేత్రం పూచిన భావమణి దీపాలు ఈ పంక్తులు. ఈ కవికి నిత్యాభినందన ఈయన రచనలు చూస్తుంటే నిత్యమూ ధ్యానంలో మునిగి ఉంటారేమోనని నా అనుమానం “= బుకుభ్రమణం - హైకూ సంకలనానికి ముందుమాట 163
ఛామా చంద్రమౌళి కవిత వసంత పుసూగమనం “ఎటు? అని నిర్దిష్టంగా సమాజాన్ని ప్రశ్చిస్తున్న కవి శ్రీ రామా చంద్రమౌళి ప్రసిద్ధ కధకుడు, నవలా రచయిత “ఇక్కడి ఈ ప్రజలు / నిజంగా నిద్రపోతున్నారా / నిద్రలో మరణించారా / నిద్ర నటిస్తున్నారా” ఇది కవికి కలిగిన సంశయం.
నాల్గో సింహం తల్లివలె జాతీయ స్తంభం
వెనుకే దుఃఖిస్తూ మరుగుననే ఉంది.
వేళ్లు భూమిలో రహస్యంగా. . . గుప్తంగానే ఉన్నాయి.
నీళ్లు సముద్రాలలో, జనం కళ్లలో భద్రంగానే ఉన్నాయి.
ప్రజలు ఎన్నో కోటానుకోట్ల అవినీతిని క్షమించి
నిశ్శబ్దంగా నిద్రపోతూనే ఉన్నారు.
ఈ నాల్గో సింహం సమష్టి చైతన్యం మూర్తీభవించిన భారతమాత. వ్యవవార మంతా సాగుతూనే ఉన్నది- సాగవలసిన దానికి విరుద్ధంగా. రాజకీయవాదులు సిద్ధాంతాలను మరచి వ్యభిచరిస్తున్నారు అంటున్నారు కవి. ఈ నిద్ర స్వభావం ఏమిటి? ఈ క్షమ వెనుక ఉన్న అసమర్థత ఏమిటి? మేధావుల 'స్వస్నాలలో స్టలించటం' వెనుక- అవార్డులను గౌరవంగా స్వీకరించటం వెనుక, అంగీలు చింపుకుని అరిచే 'స్వవంచన వెనుక, ఎంతగా గాధతమస్సర్చమై కదలి పోతున్నది ఈ తీవ్రస్వరం వెనుక అనంతమైన
వేదన ఉన్నది.
రామా చంద్రమౌళి కవిత్వభాష విలక్షణమైంది. ఆయన ఎన్నుక్రాన్న శబ్దజాలం, వాక్యవిన్యాసం, బింబాలు ప్రతీకలు సామాన్య తెలుగు కవితా పారకునికి చిరపరిచితమెనవి కొవు. ఈ రచనలో 'వాచ్యాభాసతి ఒక ముఖ్యలక్షణం వాచ్యాభాసత వాచ్యం కాదు ఉద్వేగతీవ్రత వల్ల వాచ్యంలా కనిపిస్తుంది. ఈ భాషలో ఆధునిక ఎలక్ష్రానిక్ పదజాలం ఉంది. గణిత విజ్ఞాన శాస్త్రాంశాలు ఉన్నాయి. వాక్యం సాగదు. ఎక్కడైనా విరుగుతుంది. ఆగుతుంది. నెమ్మది నెమ్మదిగా సాగుతుంది. మధ్యలో చిన్నప్పుడు తాను విన్న పాఠంలోని వాక్యం-= “నీరు కదలనిచో నాచుషట్టీ నీచు వాసనతో మరణించును * నీరు మరణించునా
164
ఆక సకుప్పీణ అని వెంటనే ప్రశ్న “ప్లాటు ఫారంపై భారతీయుడు” గీతం శీర్షిక, రైలుకోసం నిరీక్షణం ఇంకా రైలు రాదు వాన ఆగదు. చీకటి విడిపోదు ఈ నిరీక్షణలో అనంతమైన మనోవల్శీకంలోంచి పొడుచుకువచ్చే పాముల బుసబుసలు. చైతన్య స్రవంతి పద్ధతిలో సాగే గీతం 'అతని తలలో నగ్న వృక్షాలు, నగ్న సముద్రాలు గిర్రున తిరుగుతున్నాయి. అతన్ని 'సాదీ సాదీ చీకిపోయిన అవ్వముఖం. ఎడతెగని నిరీక్షణ *“చూపులు ఎర్రని లైట్లో దిగబడి ఎంత పీకినా రావడంలేదు.” ఎర్రలైట్ బురద ఐందా, సుడిగుండమైందా అని మనం విచారించాలి. మన స్మృతిధార అంచునబడిపోతే అన్నమయ్య అంటున్నమాట 'నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగ నంటిన నెత్తురు కాదుగదా” అని గుర్తుకు వస్తున్నది. భావభూమికలు వైరైనా సృజన భూమికలు ఒక్కటే “రూ. వేయి నోట్లపై లేజర్ చూపులు” అన్న గీతం- పురపాలక సంస్థలూ, ఆసువత్రులూ ఎలా వ్యర్థమైన వ్యవస్థను నిలబెట్టటమే 'పప్రయోజనమై, సాఫల్యం వైపు చూడనైనా లేని పరిస్థితిని వ్యక్తీకరిస్తున్నది. “కోయ్ వాడి గుండెను' వేసేయ్ లైఫ్ టాక్స్? మూడు ముక్కల్లో రామాయణం చెప్పినట్లు ఈనాటి అర్ధవ్యవస్థలో అధికారులు, వైద్యులు మొదలైన వారి జీవితం 'అద్దమైన డబ్బు సంపాదించె సంషాదించె సంపాదించె చచ్చె” ఇదీ ఈ మానవమూల్యాలను పోగొట్టుకున్న ధనమునకు దాస్యం చేసే వ్యవస్థ చేరుకున్న భయంకరమైన కాలతీరం. అదిరిపడి అర్ధరాత్రి లేచి కూర్చుంటే పెళ్ళాం వేసే సాంబ్రాణి పొగ. . చూపించే వేయి రూపాయల కట్టలు మార్చరీ వాసన ఎంతకూ కలలు తెగిపొవు జీవితం అంతా కారుణ్యం, స్నేహం మమకారం, వాత్సల్యం, బెదార్యం, కృతజ్ఞత ఇలా అన్ని దైవ గుణాలను కోల్పోయిన స్థితి. కవి వాక్యాలలో వాస్తవాన్ని చెప్పుతూవున్నా ఎంత కసి ఉన్నది? ఈ కసి వెనుక ఎంత క్రోధం ఉన్నది? ఆ క్రోధం వెనుక ఎంత దుఃఖభారం ఉన్నది? “బట్టల్లో లోపల అసలు నీవు లేనట్టు బోలుతనంతో క్షణం క్షణం చచ్చిపోతూ' ఇదీ అతని స్థితి. ఈ మానవుడు సగటు మానవుడు చేరుకోనెంచే లక్ష్యం (ప్రైమరీ యూనిట్ చంద్రమౌళి కవిత్వంలో వాక్ తీవ్రధార ఒక పారం. మరొకచోట కరిగి కన్నీరై ప్రవహించగల చోట అతనిలోని మృదు కుసుమ పార్చ్వమూ గోచరిస్తుంది 165
నువ్రునన్న ఆల హృదయాన్ని తపసుతో పూరించి ఆవేశ పరచినప్పుడు తల ధనధ్రువమై పాదాలు బుణ ధ్రువాలౌతాయా? మరొకడు తలతో పాదాలకు ప్రణమిల్లి హస్తాలతో ఆశీస్సులు పొందితే విద్యుద్వలయం పూరణమై శక్తి హృదయానికి చేరుతుందా మృదు మధుర కోమల హస్త స్పర్శలో శాంత సముద్ర దృక్కులతో ఆ మనిషి మహామానవుడైనా- పిడికెడు గుండెతో ఆకాశమందు అగ్నిని ధరించిన పసివాడౌ తున్నాడు. తన్నుతాను తపస్సులోకి ఉపసంహరించుకుంటున్నాడు. పై ఖండిక జీవ చైతన్యంలో ధ్యేయ పరంపర ఎలా వరివర్తనాన్ని సాధించగలదో తెలియజేసింది. తపః ప్రసారాన్ని జీవనంలోనికి నిలువరించుకునే లక్షణాన్ని వ్యాఖ్యానించింది. జీవితంలో అన్ని పార్భాలూ దుఃఖపు అగాధాలై నడిమి బొద్దు మాద నిల్చున్న వ్యక్తి ఎలా కలల్లో తన భావనాజగత్తులో సుభానుభవాన్ని (ప్రోది చేస్తుందో ఈ ప్రపంచం ఆ కలను ఎంత క్రూరంగా భంగింపజేస్తుందో 'పగటిపూట పనిమనిషి కల” అనే గీతంలో వ్యక్తమవుతున్నది. తుఫానులో రెండు గడ్డిపరకల్లా. . . రెండు జీవితాలు మిగిలాయి. శల్లీబిడ్డలు. ఆ తల్లి ఏంచేస్తుంది. వ్యభిచారం. * _ ప్లీజొ అన్న గీతం ఆ బాలుని క్షోభను వ్యక్తం చేయటానికి పుట్టింది. అ పసిగుండె ఎంత వేదన పడుతున్నదో ఈ రచన అద్భుతంగా ప్రకటించింది. “నాన్న చనిపోయారు బీదరికముంది చుట్టు 'క్రూర నిర్ణయ వికృత దయాహీన సమాజ ముంది.” ఇదంతా భూమిక. విలువలు లేని సమాజం. పరదుఃఖ దుఃఖిత లేని సమాజం (సర్వ మున్నతని దివ్యకళామయ మంచు' భావించలేని సమాజం, ముడుచుకు పోయి ఇరుకైన చీకటి గుహలతో అభద్రతా భావంతో, నిత్య మృత్యు సన్నిహిత భయంతో సగం చచ్చిన సమాజం ఆమెకు ఏ దారి చూపించగలదు? రాజకీయ వ్యవస్థలు, సిద్ధాంతాలు, రాసులు పోసిన సంపదలు, విజ్ఞానము, సాంకేతికత ఇపన్నీ మనిషిలోని దైవీయ పార్యాన్ని లోతులలో నుంచి చేది ముందుకు తీసుకురాగలవా అంటే అది అసంభవమనే చెప్పాలి. సర్వాత్మ చైతన్య స్పృహలేని సమాజం తప్పక ఎక్కడో కుప్పకూలుతుంది. అందుకే ఆ బిడ్డ తల్లి తలను నిమిరితే పాము చుట్టపై బడ్డట్లు జలదరించిపఫోయినాడు. 166
ఆహ నరుప్పణ ఈ సంపుటిలో ఒకటి రెండు వియోగ గీతాలు ఉన్నవి. ఈ గీతాలు మృత్యు వేదనకు సుస్పష్ట ప్రతీకలు “నీవు వెళ్లి పోయాక' అన్న గీతం ఆమె వెళ్ళిన తరువాత రెక్కలు తెగిన పక్షిగా తాను మారిపోవటంతో ప్రారంభమయింది. గృహము వట్టి ఇల్లయింది. గృహము అంటే [1026 అనీ, ఇల్లు అంటే [10056 అనే శబ్దాలకు పర్యాయంగా ఇక్కడ, తెలుగులో కవి ప్రయోగించాడు. ఇది భాషలో పలుకుబడిని 'సహజమార్గం'లో సంపన్నంగా చేసే పని. ఆమె లేకపోవటం వల్ల బయటి ప్రపంచమూ లేకుండా పోయింది. గృహం అంతటా అణువణువునా ఆమె జ్ఞాపకాలే ఎందుకంటే ఆమె సహచరి ప్రథమ సమాగమంలోనే ఆమె జీవితాన్ని ఉమ్మడి పోరాటంగా నిర్వచించింది. ఎక్కువ తక్కువలు లేవు లొంగుబాట్లు అధిక గౌరవస్థానాలు లేవు రెండు చేతులకు బదులు మరో రెండు చేతులు. రెండు కాళ్లకు బదులు మరో రెండు కాళ్లు. ఈ గీతం జీవనంలో గార్జస్థ్య ధర్మ సంపూర్ణతా లక్షణాన్ని ఆధునిక పరిభాషలో చాలా బలంగా, చాలా సమచిత్తంలో, నిమగ్నతతో వ్యాఖ్యానించింది గృహస్థ జీవనంలో ఒకటి పతాకం - పతంగి, రెండవది దాని నింగిదాకా మోసుకుపోయే దారం చివరకు అంటాడు అత్యంత కరుణాస్పదంగా, ప్రతీక గర్భంగా- “ఒక చెప్పు తెగి ఎక్కడో పడిపోతే రెండో చెప్పు పనికి రాదు దీన్ని తప్పకుండా పారేయాల్సిందే” అని 'అసలు వీళ్ళద్దరూ ఇద్దరు కాదని” ఆరంభించి ఐదు పంక్తులలో జీవనంలో దంపతుల సహకార సౌమనస్య జీవన తాత్పర్యం సంప్రదాయ ప్రతీకలు వాడకుండా ఎంత భావుకంగా చిత్రింపబడిందో ఆశ్చర్యం వేస్తుంది. మరొక వియోగ గీతం నాన్న జ్ఞాపకాల్లో అనేది. తండ్రి తనకు ఎలా జీవితాన్ని విప్పి చెప్పాడో, వివరంగా వర్ణిస్తాడు కవి అనివార్యమై దుఃఖాలు దండెత్తినపుడు ఒక్కనివే భరిస్తూ మాకు మండే సూర్యుణ్ణి చూపించావు ఒక్క అకాశం తనను తాను చినుకులుగా, చినుకులుగా భూమికి దానం చేసుకున్నట్లు నీవు వేలమంది శిష్యులకు ఓ చిర్నవ్వువై విస్తరించావు మిగతా ఎక్కువ గీతాల్లో కరుణరసభావం క్రూరమైన అధిక్షేపంలో, నిశితమైన వెక్కిరింపులలో నిండివున్న కవివాక్కు ఈ వియోగ గీతాలలో నగ్నంగా, అనుద్విగ్న 167
సుత్రురన్ను ఆల జలపాతంగా గోచరిస్తుంది. 'ఆజంజాహి మిల్లును గూర్చి మరొక వియోగగీతం రాయటం అరుదైన అబ్బురమైన అంశం.
“ఎటూ అన్న (ప్రారంభ గీతం జీవితంలో ఉండే నిర్ణయను, కరినమైన దోపిడీని, మాయాసభ్యతల వలల విసరడాన్ని చిత్రిస్తున్నది. 'మెడబట్టి నెట్టబడినచోట కాళ్లకూ కళ్లకూ ఐచ్చికాలుందవు. నిర్బంధాటే అనివార్యాలౌతాయి' మన విద్య మన నాగరికత, సినిమాలు, కళలు, భాషలు ఎలా ప్రపంచ ఆర్థిక సంస్థల నియంత్రణలో, పశ్చిమ దేశాల సాంస్కృతిక సామ్రాజ్యవాదంలో ఓడిషోయి చైతన్యం కోల్పోయి, నిరాశోపహతమై, హతమె జీవిస్తున్నాయో చిత్రిస్తుందీ కత్తివాదరవంటి గీతం “పావురాన్ని మూసిన హాల్లో బంధించి తరుముకే దానంతటదే నేల కూలుతుంది - కుట్ర అంటారు కవి.
కవి యువజనుల దైన్యస్థితిని కళ్లకు కట్టిస్తున్నాడు. ఆ వేగంతో కొట్టుకుపోతూ జ ప్రవాహంలో మనను లాక్కొని పోతున్నాడు. చివరకు -
ఇక్కడి జీవావరణం కలుషితమైంది. . . జీవనచిత్రం ఛి(ద్రమైంది.
జీవన ధర్మాలు, జీవన విధాలు. , . జీవన గమనాలు గతి తప్పాయి.
యిక్కడిపుడు చెట్లపై వాలిన పక్షులను ఆకులే తుపాకుటై హత మారుస్తున్నాయి.
రోజ్లే ఉన్నట్లుండి విచ్చుకొని పర్రైలై కబళిస్తున్నాయి. అని ఈ భయంకర చీకటి రాత్రిని వర్ణిస్తున్నాడు. దీని అనుస్యూతిలో 'వేణువు కనిపించడం లేదు. కాని పాట వినిపిస్తోంది.” చదివిజే వెలుతురు కిరణాల కోసం యుగయుగాల నిరీక్షణ యికనైనా ముగుస్తుందా అని ప్రశ్నిస్తాడు కవి. అందుకే ఇక్కణ్జించి 'పరుగు గునపా ల్లాంటి చినుకుల వర్షంలో ఒకటే పరుగు. ముందు ఓ చెట్టు కిందకు చేరనీ? ఈ చెట్టు జీవవృక్షం, సంసార వృక్షం, అనంతకాలాన్ని తనలో సంలీనం చేసుకున్న మవాోవృక్షం. సర్వజీవులకు ఆశ్రయమిచ్చే వృక్షం.
ఈ వృక్ష (ప్రతీక ప్పధ్విలోకి చొచ్చుకొని ఉన్న ఆనంత్యాన్ని సూచిస్తుంది. అది భూమి మీద నుంచి ఆకాశం నలువైపులా వ్యాపించి దాన్ని ఆవరిన్తుంది. పరిమితినుంచి అపరిమిత స్థానండాకా ఎదిగిపోతుంది. సర్వమునూ తనలో గర్భితంగా చేసుకుంటుంది. అందుకే తర్వాత “వేణువు కనిపించకున్నా ఎక్కడ నుందయితే నేమి ఓ (బతికించే
పొటను వినవచ్చు.” 168
ఆక నకుద్పణ “పెనునిద్రూ అన్న గీతం జీవన విధానమే అవినీతిని భాగంగా చేసుకున్న అంశాన్ని దేశ జీవనాన్ని చిత్రిస్తుంది. ఆడిటర్ భార్య దీనిలో వక్త. జీవితంలో ఎన్ని పొరలున్నాయి. ఎన్ని వేల ముసుగులున్నాయి. ముప్పయ్యేళ్లుగా ఈ వ్యవవారానికంతా సాక్షి తాను మాంగళ్య్ళధారణతోనే 'మరణించింది.” నిద్రైలేవవలసినవాళ్లు పెనునిద్దుర -నుండి మేల్కోవడం లేదు అంటుంది. ఈ నిద్ర మేలుకొల్పుకు ఆమె వాడుకున్న ప్రతీకగానం కౌసల్యా సుప్రజా రామి అని ఈ కౌసల్య నిరీక్షణ రామునికోసం ధర్మ సంస్థాపకుడైన, సత్యపరాశక్రముడైన రామునికోసం. ఈ కౌసల్య దేశం. పృథ్వీగర్భం. అందుకే సగటు భారతీయుని సంబోధిస్తూ కవి అంటున్నాడు. యోజనాల దూరాలను అడుగుల్లోకి సూక్ష్మీకరించడం దూరాలను సంకలీకరించుకుని సమీకరణాలను సమీక్షించుకుని దండయాత్రను రచించుకోవడం ఇవన్నీ ఒంటరిగా నీవు గరళధారి శివుడివికావాలి నిశ్చల సముద్రంగా గంథఖీరునివి కావాలి అష్టుడు పోరాటం 'ఓ మాటను పెంచేసుకుని, ఓ పాటను వెంటేసుకొని ఒక సూర్యుడిలా ఒక ఆకాశంలా ఒక భూమిలా ఒంటరిగా ఒక వ్యక్తిగా పోరాటానికి ఉపక్రమిస్తావు.” ఈ ఒంటరిపోరాటం ఆత్మవిశ్వాసంలోనుంచి పొడుచుకు వస్తుంది. గాంధీజీ దేశంలో పోరాటం ఇలాంటి స్థితిలోనే ప్రారంభించారు. ఆ ఒక్క వ్యక్తిలోనే కోట్లాది భారతీయుల చైతన్యం సమీకృతమై అహింసా సేవావాహిని అయింది. అందుకే “గాంధీ జీవన విధానం కంటే గొప్ప పరిత్యాగ సిద్దాంతం ఉన్నదా” అని కవి ప్రశ్న రామా చంద్రమౌళి కవితలో వరంగలు మాండలిక భాషలోని జీవలక్షణం ఉన్నది. ప్రాంతీయ మాండలిక ప్రయోగాల బిగంపు ఉన్నది. 'పెంకాను', “ఠక్కున, 'ఇసిరె' 'సద్దులి, “దబదబా, 'పతంగీ”, 'మాంజా, “బొక్క మొదలైనవి గమనించవచ్చు. అభివ్యక్తి విషయంలో చంద్రమౌళి కవితకు వాడి ఎక్కువ. 'ఏండ్లకు ఏండ్లు గొడ్రాలైన ఆకాశం చినుకు రాల్బదు' 'ఆడబొడ్డు చుట్టూ మగచీమలు' 'మొస్స పోసుకుంట' “పనియంత్రాలే మంత్రాలపై ఓరుగల్లు నగరాన్ని ఓ ఎగిరే జెండగా' “నీ ఉత్తరం చంద్రుణ్ణి తోడ్కొని వచ్చే ఓ ఆకాశం.” ఈ వాక్యాలు కవి భావుకతను వట్టియిస్తాయి. శ్రీ రామాచంద్రమౌళి ఇంతకు ముందు ప్రచురించిన కవితా సంపుటాలు శిలలు వికసిస్తున్నాయి (1979) స్మృతిధార (1984)ల్లో కవి ఇంత విసృతంగా కవితా 169
నుత్రునన్న ఆల
గంగా ప్రవాహాలను క్రుమ్మరించలేదు. వాటిల్లో పరిమిత బింబాల ప్రతీకల వాక్యవిన్యాసాల పునరావృత్తి ఉన్నది. గొంతులో ఇతర కవుల ముద్రలు ఉన్నాయి. అయితే “ఎటు వచ్చేసరికి ఈ కవి సర్వతంత్ర స్వతంత్రుడు. భాషలో అనూహ్య మైన వేగం, అభివ్యక్తిలో విలక్షణమైన వినూత్న వైఖరి, వస్తువ్యాసంలో ఆత్మీయత ఈ అంశాలు దీన్ని సర్వతో ముఖంగా వర్చస్వంతం చేశాయి.
ఈనాటి శిధథిలమవుతున్న కుటుంబ వ్యవస్థను చిత్రించే 'గుందెపుండు' గితంలో శ్వాసించేశవం అయిన తండ్రి దుర్భర పరిస్థితిని చిత్రించి 'నెలక్రితం అమ్మచావును పెళ్లిలా జరిపిన కన్న పీల్లలు' తను జీవించి వుండటాన్ని ఎంత భారంగా భావిస్తున్నారో హృదయ విదారకంగా చిత్రించాడు కవి. తుదకు తన స్ధితి పాయలు పాయలుగా ఎడతెగని దుఃఖం, నీడలు నీడలుగా చంపకుండా వెంటాడే భయం' ఈ భయం చంపదు ఛేజ్ చేస్తుంది.
“'యుద్ధరహస్యం' గీతం ప్రపంచీకరణలోని తాత్పర్యాన్ని వెల్లడిన్తున్నది. విద్యావంతుల “బానిసల వలసలు ఎలా ఐడెంటిటీని పరిహరిస్తున్నవో “మనిషిని ఓ మార్కెట్ చేసి చివరకు నీకు తెలియకుండానే నిన్ను హర్రాజు చేస్తుంది. ఈ కొత్త దోపిడీని వెల్లడిస్తాడు కవి. భారతీయ జీవనాదర్శ శిఖరాలు ఎలా పడిపోతున్నాయో ఆశ్చర్యకరమైన శబ్ద సంపుటితో వ్యక్తం చేస్తున్నాడు.
కాండ శిఖరంపై ఓ రమణమహర్షి - మరణ మహర్షి - రణమహర్షి మర మహర్షి రాలిపోతున్నట్లు, కూలిపోతున్నట్టు-' '“మణ మహర్షి శబ్దం పొందిన వికారాలు మూడూ జాతి పతనాన్ని సూచించే విలక్షణ పదబంధాలు, శబ్దం అక్షర వ్యత్యయంతో నూత్నావతారం ఎత్తిందో ఈ పంక్తులు శక్తివంతంగా రూపించాయి. రామా చంద్రమౌళి శిల్ప పారమ్యం ఇలాంటి ఘట్టాలలో చూడవచ్చు.
వ్యతిరేక పార్య్వాన్ని ఇంత బలంగా చూపిన ఈ కవి సమాజంలోని అనుకూల
పార్వాన్నీ ప్రకటించటమూ అవసరమే. భావుకజగత్తులో కొత్త జండాలు ఎగురవేస్తున్న కవి రామా చంద్రమౌళి. 170
నల్లాన్ చక్రవర్తుల రఘమునాథాచార్యుల వారితో ప్రత్యక్ష భాషణం 1972 ఏప్రిల్ నెల. ఏ.వి.వి జూనియర్ కాలేజీలో సంస్కృత విజ్ఞానవర్థనీ పరిషత్ వారి సభ జరుగుతున్నది. శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు తాము అవ్చుడే రచించిన గుప్తపాశుపతం అనే సంస్కృత నాటకాన్ని వినిపిస్తున్నారు. నాటకం వినిపించటం అయిన తరువాత అధ్యక్షులు అందులోని అపాణజినీయ ప్రయోగాలు చూపిస్తూ నాటకం యొక్క గొప్పతనానికి ఇవి పరిష్ఫుతములైతే అధికళోభ కలుగుతుందని పేర్కొన్నారు. ఏ ఇతర సభల్లో అయితే విశ్వనాధ ఎంతగా విజృంభించే వారో కాని ఆ సభలో నెమ్మదిగా అవును- అపాణీనీయాలే అయినా పూర్వకవి ప్రయోగసిద్ద్ధాలు, అందుకు ప్రయోగించాను అని సమాధానం చెప్పారు. అధ్యక్షులు ఒకసారి చిరునవ్వు నవ్వారు. ఆయన పాండిత్యపు లోతులు అంతటివి. ఆనాటి సభాధ్యక్షులు శ్రీ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల రఘునాధాచార్యులుగారు. బక్కగా నలుపుగా, కొంచెం పొట్టిగా ఉండే వ్యక్తి, సాధారణులకు పరిచయం ఉంటే తప్ప వెంటనే ఆదరం కలిగించే వ్యక్తిత్వం కాదు. తమ పాండిత్యాన్ని అడుగడుక్కూ వ్యక్తం చేసే సంభాషణా ధోరణీ అంతగా లేదు. అయితే కొంచెం పరిచయం ఏర్పడితే ఆయన విద్వత్త, ఉదారమైన వ్యక్తిత్వం, ఆసాధారణమైన జీవన తత్త్వావగాహన అన్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి శ్రీ రఘునాధచార్యులుగారిది విద్వత్ముటుంబం. పూర్వులు అగ్రహారికులు. విశ్వనాథవారి శృంగారవీధి” కృతిభర్త రఘునాధాచార్యులు వారు వీరికి పెద్దతండ్రిగారు అవుతారు. ఆంధ్రదేశంలో విశిష్టాద్వైత సంప్రదాయరక్షణ చేసిన కొన్ని గొప్ప కుటుంబాలలో వీరిది కూడా ఒకటి. శ్రీ రఘునాధాచార్యుల వారి అభిమానశాస్త్రం వ్యాకరణం. ఆదరించే శాస్తం వేదాంతం ఈ రెండు శాస్త్రాలనూ మరీ చిన్న వయస్సులోనే క్షోదక్షమంగా అధ్యయనం చేసినవారు. అయితే విద్యను ఒక ఆదర్శం కోసం నేర్పారు కాని ఉదర పోషణ కోసం కాదు ఆయన జీవనానికి రెండే లక్ష్యాలు- ఒకటి సంస్కృత భాషా ప్రచారం - రెండు [171
నుత్రుసన్న ఆ
రామానుజుల వర్ణభేదాలకు అతీతమైన భక్తితత్త్వాన్ని ప్రజలకు అందించడం - సేవే గీర్వాణ వాణీ మనిశ మపి యతిక్ష్మాభ్ళ దుక్తే విషక్తా భూయాసం - అని తమ కృతజ్ఞతావిష్క్మరణ అనే (గ్రంథంలో 1948లో తమ ఇరవైయేళ్ల వయస్సులోనే చెప్పు కున్నారు.
ఆచార్యుల వారి పూర్వులు వరంగల్లు జిల్లాలోని కునూరుగ్రామంలో స్థిరపడ్డారు. చిన్నతనంలో సంస్కృత విద్యారంభం నాన్న గారి దగ్గర అభ్యసించడమే ఆ రోజుల్లోనే ఇంగ్లీషు విద్య ప్రారంభించారు. కాని తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఆ చదువు మానేయడం జరిగింది. 14ఏట సీతారాంబాగ్ కళాశాలలో సంస్కృత శాస్త్రాభ్యాసాని కోసం చేరారు. సీతారాంబాగ్ ఆ రోజుల్లో తెలంగాణా ప్రాంతంలో సంస్కృత విద్యలకు శాస్త్రాలకు కాణాచిగా ఉందేది. అక్కడ శరగోపరామానుజాచార్యులు గారు నాలుగు శాస్త్రాలలో ఉద్దండ పండితులు, అనాటి విద్యాభ్యాసాన్ని గూర్చి ఆచార్యుల వారిలా చెప్పారు-
ఈ కళాశాల ప్రధానంగా శాస్త్రాలను బోధించడానికి వాటిని రక్షించడానికి ఏర్పడ్డది. ఆ రోజుల్లో హిందువులకు విద్యాభ్యాసానికే అవకాశం తక్కువ. అందులోనూ 'ప్రాచ్యవిద్యలకు ఆదరం పూర్తిగా ఉండేదికాదు. కళాశాలలో విద్యార్థులందరికీ ఉచిత భోజన వసతి సౌకర్యాలు కలిపిస్తూ విద్య గరవవలసి ఉండేది. తీవ్రమైన క్రమశిక్షణ ఉండేది. కళాశాల అధ్యాపకులు కాలేజీ సమయంలోనే కాక ఎల్లప్పుడు విద్యార్థులకు బోధించడానికి సిద్ధంగా ఉందేవారు. ఈ విధమైన నిర్వహణలో ధనం ఉదారులైన (ప్రజల దగ్గర నుండి వచ్చేది. విద్యార్థులకు విద్యపైన ఆస్థ - అధ్యాపకులకు అధ్యాపనలో అధికమైన నిమగ్నతా ఉందేది- అది దాదాపు పూర్వ భారతీయ గురుకులాల పద్ధతిలో నడిచింది”-
ఈ సంస్కృత కళాశాలలో ఆచార్యులవారు (ప్రత్యేకంగా ప్రతివాది భయంకరం వేదాంతచార్యుల వారి వద్ద శాస్త్రాభ్యాసం చేశారు. ఇంకా ఇరవైయ్యేకైనా నిండలేదు. రఘునాధాచార్యుల వారి పేరు ఆంధ్రదేశ సంస్కృత విద్వాంసులకు పరిచితమైంది ఒక వివాదకారణంగా. కాంచీపురంలో ఉండే ప్రసిద్ధి దాక్షిణాత్య విద్వాంసులు, సంస్కృత బ్రావిదాంధ్రాది భాషల్లో సహస్రాధిక గ్రంధకర్తలూ అయిన శ్రీమాన్ ప్రతివాది భయంకరం అజ్జంగరాచార్య స్వామివారు “'మదిరేక్షణ శబ్బార్థాన్ని ఒక విధంగా చెప్పితే అదికాదని దాని అర్ధాన్ని నిరూపించే 'మదిరేక్షణార్థ పరిష్కారం” అనే (గ్రంధాన్ని ఆచార్యుల వారు
172
ఆఅ నకుద్స్పీు రచించారు. క్రమంగా వాదగ్రంథాలు ఖండనమండనాలుగా వచ్చాయి. ఈ వివాదంలో అణ్జంగరాచార్యులవారి పక్షమూ, ఆచార్యుల వారి పక్షము అయి పండితవర్గం రెండు పాయలైంది. క్రమంగా ఒక దశలో వివాద విషయం తగ్గిపోయి పరస్పర దూషణకు దిగడం జరిగింది. ఈ వివాద విషయం ఎలా ఉన్నా ఆచార్యుల వారి పాండిత్యానికి బహుశాస్త్ర గ్రంధ పరిశీలనకూ ఇది నికషోపలం అయింది. నిరర్గళమైన సంస్కృత వచన రచనలో వారి నైపుణ్యం కూడా వెల్లడి అయింది. ఒక విచిత్రమైన సన్నివేశం వల్ల వారు వరంగల్లులోని వైదిక కళాశాలలో (సింహాద్రిబాగ్) అధ్యాపకులుగా చేరడం జరిగింది. ఇచ్చిన వేతనం బహుస్వల్బం. దానిలోనూ కొంత భాగం విద్యార్థి వేతనంగా వారు చెల్లిస్తూ వచ్చారు. ఆ తరువాత 1967లో శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో అధ్యాపకులగా చేరారు. ఆచార్యులవారికి ఎంత శాస్త్రాభినివేశమున్నదో అంతటి సరస కవితాఖి మానమూ ఉన్నది. ఆయనను మెప్పించడం సాధారణంగా చాలా కష్టం అయినా మెచ్చారంటే ఆయన ఎంతో అభిమానం చూపిస్తారు. ఒకసారి రేడియోలో మదరాసు ప్రభుత్వ సంస్కృతాన్థానకవులు కవిరాజు కె.యస్, కృష్ణమూర్తి శాస్త్రి గారి కవితలు విన్నారు. దాని సారస్యమాధుర్యాలు, నిర్జుష్టక ఆయన్ను ఎంతగానో ఆకర్షించాయి. వెంటనే మో రచనలు ఏమైనా ఉంటే పంపించండి అని రాశారు. కృష్ణమూర్తి శాస్త్రి గారి గ్రంథాలు అప్పటికేమీ అచ్చు కాలేదు. ఈ విషయం తెలిసి ఆచార్యులవారే వారి “ప్రకృతి విలాసము' “త్రిపురాభరణము' అనే రెండు పుస్తకాలు తెలుగు లిపిలో అచ్చు వేయించారు. అప్పటినుంచి కృష్ణమూర్తిశాస్త్రిగారికీ ఆచార్యులవారికీ బద్దాదర దృష్టి 1968లో కృష్ణమూర్తి శాస్త్రి గారిని వరంగల్లుకు పిలపించి సంస్కృతంలో ఉపన్యాసాలు ఏర్పాటు చేయించి ఘనంగా సత్కారం జరిపించారు ఆచార్యులవారు. శ్రీ శాద్రిగారు ప్రధానంగా వైయాకరణులు, ఎన్నోసార్లు మహాభాష్యపారం చెప్పినవారు. మహామహోపాధ్యాయులు. అయినా వారు చమత్కార సంభాషణా చతురులు. నిగర్వి వారు సంస్కృతంలో ఉపన్యసిన్తుంటే (శ్రోతలు తెలుగు అనువాదం అక్కర లేదన్నారు వరంగల్లు సభలలో. శ్రీ కృష్ణమూర్తి శాస్త్రిగారికి రాష్ట్రపతి సంస్కృత విద్యాంసునికిచ్చే పురస్కారం లభించింది. వారు ఆచార్యుల వారి ప్రతిభా పాండిత్యాలను గమనించి “కవిశాబ్టిక కేసరి” అనే బిరుదాన్ని ప్రసాదించారు 1/3
నుపురన్న ఆ
ఆచార్యులవారికి అసాధారణమైన అప్రతి[గ్రహవ్రతము ఉంది “సాలగ్రామము మున్నుగా గొనడు.” 1964 ప్రాంతాలలో ఆయన శిష్యులు, అభిమానులు ఆయనను సన్మానం చేద్దామని సంకల్పించి ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు వారి శాస్త్ర గురువులు వేదాంతచార్యులు గారు కూడా విచ్చేశారు. సభలో ఆచార్యుల వారికి వేయి న్నూటపదహార్లు సన్మానం చేయగా - ఆయన తానుగా మరికొంత ధనం కలిపి దాన్ని సంస్కృత విజ్ఞాన ప్రసారానికి మూలనిధిగా ఏర్పాటు చేసి సంస్కృత విజ్ఞానవర్ధినీ పరిషత్ స్థాపనకు హేతుభూతులైనారు.
ఆచార్యుల వారు విజ్ఞానవర్థినీ పరిషత్ ద్వారా నెలనెలా సమావేశాలు వన్పూటు చేసి సంస్కృతంలో ఉపన్యాసాలు యివ్వడం యిప్పించడం కొంతకాలం పాటు నిర్వ హించారు. సంస్కృత తరగతులు ఏర్పాటు చేసి విద్యార్థులకు అధ్యాపనం జరిపించారు.
ఆచార్యుల వారి వినయ ప్రవృత్తి ఆయనతో పనిచేసేందుకు ఎవరికైనా జంకు లేకుండా చేస్తూంది. ఆచార్యుల వారు ఎంత విద్యాంసులో అంత కార్యశూరులు. హనుమకొండలో దాదాపు ఒక లక్ష ఖర్చుకాగల సీతారామస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ కార్యం నిర్వపాస్తున్నారు. ఇటీవల ఒక (బ్రహ్మండమైన యజ్ఞం నిర్వహించారు.
ఆచార్యులవారు విద్యా బోధలో శాస్త్ర బోధలో వర్జభేదాలు పాటించడం అంగీ కరించరు. ఆయన దగ్గర అన్ని వర్ణములవారు 'ప్రకరణ(గ్రంథాలు, అలంకార వ్యాకరణ శాస్తాదులు అభ్యసించటం జరిగింది. సంస్కృత విజ్ఞానవర్థినీ పరిషత్ కార్య కలాపాలను గూర్చి ఆచార్యులవారు ఇలా అన్నారు-
“1963-64లలో ఉత్తరదేశం నుంచి ఒక విద్వాంసుడు వచ్చాడు. ఆయన ఇక్కడి విద్వాంసులతో పరిచయం చేసుకోదలిచాదు. ఎంతటి విద్వాంసులు కూడా విషయ పరిచయం ఎంత ఉన్నా సంస్కృతంలో వివరించవలసి వచ్చేసరికి చాలామంది ఇబ్బందిపద్డ్దారు. ఆ స్థితి చూచి సంస్కృతంలో మాట్లాడటం అభ్యాసం చేయించవలెననే సంకల్పంతో ఈ నంస్థ న్థాపించడం ఉపన్యాసాలు ఇప్పించడం జరిగింది. ఈ ఉప
న్యాసాలు కొన్ని పరిషత్ ప్రచురించిన 'సుధాలహరి' అన్న ప్రత్యేక సంచిక్రలో ప్రచురణ పొందాయి. ఇంకా విద్యార్థుల చేత చిత్తూరు వారివీ, విద్యాభవన్ వారివీ పరీక్షలు కూడా యిప్పించడం జరిగింది. దాదాపు ఏడెనిమిదిమంది సంస్క ల్రతీ విద్యాంసులను సన్మానించటం కూడా జరిగింది
1/74
ఆహ్ నకువ్పలు సంస్కృతంలో ఆచార్యుల వారు 'స్తుతిమణిమాలికా'- 'దివ్యసూరి సూక్తి సుధా అనే రెండు గ్రంధాలు ప్రచురించారు. రెండో గ్రంధంలో ఆళ్వారుల ద్రవిడ ప్రబంధాలలోని కొన్ని పద్యాలకు సంస్కృతానువాదం ఉన్నది వారితో ముచ్చటించిన అంశాలు కొన్ని పః సంస్కృతం ఎన్నడైనా వ్యావహారిక భాషగా ఉండేదా? “దేశభాషలన్నింటిలోనూ సంస్కృతం మొదటిది. రాజశాసనాలు సంస్కృతంలో ఉండటం బట్టి ఈ విషయం బుజువౌతుంది. నాధ హరిః అనేమాట ఉంది. ఈ మాటను ప్రత్యేకంగా వ్యాకరణం సాధిస్తుంది అంటే- ముకుత్రాడు వేయదగిన వయస్సు లోని ఎద్దు అని అర్ధం. శంబాకరోతి అంటే ఒకసారి దున్నిన పిదప కొబ్టుకొట్టుట అని అర్థం. ఇలా వందలాది శబ్దాలు సాధారణ వృత్తులకు సంబంధించి సూక్ష్మ సూక్షాంశాలను తెలిపేవి ఉన్నవి. ఈ మాటలు అన్నీ వ్యవహార దూరమైన భాషలో ఉండవు. అందువల్ల ఇది కేవలం వైదిక వృత్తికి సంబంధించిన భాష అనడం అజ్ఞానమే. ఆనాడే వైదిక తాత్త్వీక గ్రంధాలతోబాటు లౌకిక భౌతిక శాస్త్ర గ్రంధాలు కూడా విరివిగానే వచ్చినయ్” జాని తరువాత తరువాత సంస్కృతం క్రమంగా కొన్ని శాస్త్రాలకూ వాద (గ్రంధాలకూ పరిమితమైపోయింది. దానివల్ల క్రమంగా భాష ప్రజలను దూరమౌతూ వచ్చింది. పాండిత్య ప్రకర్ష పెరిగింది. ఇతరులకు బోధించవలసిన పద్ధతిలో ఆది సరళం చేయబడవలె. ఒక దశలో శాస్త్రాలు అన్నీ నిష్పయోజనాలుగా తయారైనై. ప్రాచీన తర్మం కట్టెలు మోయడానికీ, నవీనతర్శం శవాలు మోయడానికి అనే సామెతలు ఇందువల్లనే పుట్టాయి. వాద([గ్రంథాలు అన్నీపోయినా భాషకు నష్టమేమీ లేదు. మూలసూత్రాలు, వివరణలూ ఉంటే చాలు. రామాయణానికి అంతటి ఆదరం లభించడానికి కారణం దానిలోని భాషాసారళ్యమే ప్ర; సంస్కృతాన్ని బహుళ ప్రచారంలోకి తీసుకురావలెనంటే ఏం చేయాలి? భాతువులను చాలావరకు తగ్గించాలి. ఆత్మనేపది, పరస్మైపది అనే నియమాన్ని కూడా సడలించాలి ఈ విషయంలో పాణిని నియమాన్ని కాళిదాసాదులనాటికే సరిగా పాటించలేదు. క్రియారూపాలలో కూడా కొన్ని లకారాలను తగ్గించవచ్చును. అలా చేస్తే సంస్కృతము సరళము కావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నవి.” ప సంస్కృతాన్ని రాష్ట్రభాషగా చేస్తే ఎలా ఉంటుంది? “బాగానే ఉంటుంది. నిత్య వ్యవహారంలో ఉన్న తెలుగులాంటి భాషలే రాజభాషలు కావడం ఇంత కష్టంగా ఉంటే వ్యవహారస్థితి తొలగిపోయిన సంస్కృతం 175
సుప్రసన్న ఆ ఎలా రాజభాష కాగలదు. హిందీ కూడా ఇంకా కానేలేదే. ఆ నిర్ణయమేదో శాసన రూపంలో కావాలి. అయినా ఇంత వైవిధ్యము, వైమనస్యము గల ఈ దేశంలో సంస్కృతం అధికారభాషకావడం చాలా కష్టమయిన పనే.” ప్ర; సంస్కృత విద్యాభ్యాసం ఆధునిక విజ్ఞాన అవగాహనకు దూరం చేస్తుందా? శాస్త్రీయ దృష్టి ఉంటే అలా జరుగుకూడదు. విజ్ఞానము ఎప్పటికప్పుడు పెరుగుతున్నది. ప్రకృతి పరిణామరూపమైంది ఉత్తరోత్తరులైన మునుల వాక్యాలు 'ప్రమాణమని ఏ శాస్త్రమైనా చెప్పుతున్నది. అందువల్ల ఆధునిక విజ్ఞానం స్వీకార్యమే. చంద్రమండలయాత్రాదులన్నీ వేదాల్లోనే ఉన్నాయనడం ఇంకా ఇలాంటి చాదస్తాలు అన్నీ సత్యదూరమైనవే. ఆయుర్వేదం మొదట చరకుని కాలంలో మూలికావిచారణే ఉంది. రస గంధకాది జ్ఞానం తరువాతదే. నవీన విజ్ఞానము స్వీకరించవలసిందే. అది వేదములోనే ఉన్నది అనడం తప్పు.” (వః ఈనాటి సామాజిక వైక్లబ్యానికి కారణాలు ఏమిటి? “ఆదర్శంలేని జీవనం. గృహస్థుడికి విధించబడ్డ అహింసా సత్య మస్తేయం ఇత్యాది నియమములు పాటింపబడటం లేదు. పరాన్నేన ముఖం దగ్ధం హస్తాదగ్గా పరిగ్రవాత్ పరస్త్రీఖిః మనోదగ్ధం కుతః శాపః కలౌయుగే అన్నట్లు ప్రవృత్తి అంకా స్వార్థం ప్రధానమై సంస్కారానికి దూరంగా తొలగి పోవడం జరుగుతున్నది. ప్రాచీనులు విధించిన పంచయజ్ఞాలు ఆత్యోన్నత్రిక్తి ఆరోగ్యానికీ లౌకిక వృత్తిని సక్రమంగా నిర్వహించేందుకూ క్రమశిక్షణకూ హేతువులుగా ఏర్పడ్డవి. పూర్వం విద్యార్థులకు విద్యతోపాటు సంస్కారము నైతిక బాధ్యత ఏర్పడేది. ఇప్పుడు అది పూర్తిగా తొలగిపోయింది.” ప్ర వర్ణవ్యవస్థ, అస్పృశ్యతను గూర్చి మా అభిప్రాయం ఏమిటి? “వ్యక్తిలోని దైవాసుర సంపత్తిని బట్టి స్పృశ్యతా స్పృశ్యతలు ఉండవచ్చు గాని నర్ణభేదాన్ని బట్టి కాదు అది (భ్రమాత్మకమైంది. శంకర భగవత్సాదులకు చండాలాదులు 176
శిష్యులుగా ఉన్నట్లున్నది. (బ్రహ్మవేత్తకు యజ్ఞోపవీతం కూడా అక్కరలేదని శంకర భగవత్పాదులు చెప్పారు శ్రీరాముడు జటాయువునకు బ్రహ్మమేధ సంస్కారము చేశాడు. భగవద్రామానుజులు ఒక్క హరిజనునికి (బ్రహ్మమేధ సంస్కారము చేశారు. ఈ దృష్టితో చూస్తే వర్ణభేదం కేవలం నడుమ వచ్చిందే కాని అనాది అనడం సరియైంది కాదు. రామానుజులు మోక్షధర్మాన్ని వర్జభేదానికి అతీతంగా అందరికీ అందించారు.”
ఆచార్యులవారు శ్రీరామానుజ సిద్ధాంతం యెడల అత్యంత ్రశయం ఉన్న వారు ఆ విజ్ఞానాన్ని అధీతి బోధాచరణ ప్రచారముల చేత వ్యాపింపచేస్తూవున్నారు. శ్రీ భాష్యాన్ని ఎంత మందికో అధ్యాపనం చేయించారు. రెండేళ్లక్రితం ఆధునికులకు సరిపడే విధంగా శ్రీభాప్య సారాన్ని ముప్పయి ఉపన్యాసాలలో పూర్తిగా సరళంగా ఉపదేశించారు. శ్రీభాష్యాన్ని అధ్యయనం చేస్తానంటే వారు ఎంత దూరం నుంచైనా వచ్చి ప్రవచించి పోతూ వుంటారు. సరళమైన తెలుగుభాషలో ఉపనిషత్తులకు వివరణ గ్రంధాలు వ్రాస్తూవున్నారు. ఈశావాస్య ముండకోపనిషత్తుల వివరణలు ఇదివరలో అన్చైనవి. రామాయణంలో నుంచి ఒక 108 శ్లోకాలను వివరణ వ్రాసి ప్రచురించారు. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలోని సంప్రదాయ తాత్త్వికాంశాలను వివరించే ఒక (గ్రంథం కూడా ఆచార్యులవారు రచించారు.
1972లో రాష్ట్రపతి ఉత్తమ సంస్కృతాధ్యాపకులుగా ఆచార్యుల వారిని సత్మవించారు. అయితే సత్మారానికి ముందే ఆ రాగల వేయి రూపాయలను ఒక దేవాయ లయ జీర్ణోద్దరణకు వాగ్దానం చేసి, తరువాత ఆ కార్యక్రమానికి పూనుకున్నారు. యాఖైఏళ్ళ వయస్సులో ఉన్న ఆచార్యుల వారు పండితులలో అ[గ్రణి. భాగవతాలలో ఉత్తములు, అధ్యాపకులలో ఆదర్శప్రాయులు. చక్కని గృహస్టు.
శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు (10-10-1928) కవిశాబ్దిక కేసరి, మహామహోపాధ్యాయ, శాస్త్రరత్నాకర బిరుదాంకిళులు, ఈశ, కర, ముందకో పనిషత్తుల ఠెలుగు వివరణలు, విష్ణు సహస్రనామ భాష్య విపులానువాదము మొదలుగా పాతిక గ్రంధాల రచయితలు. శ్రీభాష్య, భగద్విషయ ప్రవచనపరులు. సత్సంప్రదాయ పరిరక్షణసభ-మొదలైన సంస్థల స్థాపకులు. క రా న మా
177
శ్రీ ప్రసాదరాయ కులపతి సిద్ధళావ్య వ్యక్తిత్సము శ్రీ ప్రసాదరాయ కులపతి తన తరంలోని అత్యంత (ప్రతిభావంతులలో అగ్రగణ్యులు. ఆయన కవిజావేశం ఎప్పుడూ ఒక పరిధిలోకి ఇమిదేది కాదు. తిక్కనగారు సేర్మాన్న భవ్యకవితావేశం ఆయనది. “నాదు పదముల కవితా స్వర్గంగ ఉదయి మయిందని ఆయన పేర్కొన్నారు. సిద్ధమంత్ర విద్య, సాహిత్య విద్య, కావ్యసిర్మాణ విద్య, బాహూగ్రవిద్య ఇన్నీ సమున్నత దశలో ఫలించిన వ్యక్తిత్వం ఆయనది.
“ఒక ఉన్నతి-ఒక ఉద్ధతి, ఒక కవితావేశమొసగు నున్మాదము సంచికితాఖిల నమ్మోదము” ఇవన్నీ ఆయన కవిత్వపు మూలధాతువులు. కవిత్వము ఆయనకు కొంత కలలో విన్నిది. కొంత కలలలోని కలలు కూర్చినది, మరి కొంత యిలలో విన్నది. ఈ అన్నింటి యొక్క అద్భుత సమ్మేళనంకోసం ఆయన కవిత్వాన్ని ఒక తపస్ఫాధనంగా తీర్చిదిద్దుకున్నారు. తనకే తనకావ్యం వింత సృష్టిలాగా తోచగలిగిన స్థితిలో ఆయన జాగ్రదవస్థలోని తనను విస్మరించి కావ్యనిర్మాణం చేసినారు.
సంస్కృత సాహిత్యంలో 'సహస్రు కావ్య నిర్మాణం సహస్రనామ సంప్రదాయం నుంచి ఉద్భవించిన కావ్యసరణి. వేదాంతదేశికుల పొదుకాసహస్రము వేంకటాధ్వరి లక్ష్మీసహనస్రము ఈ రెండూ ప్రసిద్ధాలు. తిరుపతి వేంకటకవుల కాళికా సహస్రము' కావ్యకంఠ గణపతి మునుల 'ఉమాసహస్రము” ఆధునిక కాలంలోని ప్రసిద్ధ రచనలు, గణపతిమునుల ఉమాసహాస్రానికి శ్రీ కపాలి శాస్త్రి వ్యాఖ్య తంత్ర మార్గోపదేశకంగా రూపొంది అత్యంత (ప్రాశస్త్యాన్ని పొందింది.
శ్రీ ప్రసాదరాయ కులపతి మంత్రసిద్ధులై - అద్భుతమైన ఆవేశంతో ఐంద్రి
సాహప్రి, శివసాహస్రి అనే రెండు సహస్ర కావ్యాలు రచించారు. అయితే రెండు కూడా ఉభయ భాషలలో సమకూర్చారు. ఐంద్రీ సాహస్రిలో సప్తశతి సంస్క ఎతమై, తెలుగు తిశ్రతియెంది. శివసాహస్రిలో అది వ్యత్యస్తమై సంస్కృతములో (త్రిశతియై, తెలుగులో సప్తశతియైంది
178
ఆహ నకుద్పణ
బంద్రీ శక్తి వజస్వరూపిణి. ఉజ్వలమైన మహాశక్తి. పరమేశ్వరుదైన ఇంద్రుని
(క్రియాశక్తి ఈమె రేణుకయై పరశురామునికి తల్లిర్లై శ్రైవ వైష్ణవ ధర్మాలకు సమన్వయం
కలిపించింది. (వైష్ణవాంశయైన రాముడు ధరించిన పరశువు శైవమైంది). యోగ
మార్గంలో ఈమె కామజేత్రియు, నియంశ్రియునైన ప్రచండ చండిక. ఉత్ధాపితయైన కుందలిని.
ఈ రహస్య తత్త్వాన్ని వేనోళ్ళ ప్రశంసిస్తూ ఈ సహస్ర రచన అత్యంత మనోహరంగా రచించారు శ్రీ కులపతి సహస్రాధిక సభలలో శ్రీ కులపతి తొలుతగా చదివే పద్యం ఈ సహ(స్రారంభంలోనిదే.
ఐంద్రీమ్ జాగ్రదుదగ్ర మూలపదవీమ్ ఐరమ్మదావాహనామ్
అంతస్తాంత్రిక వామదక్షిణ పధ హ్రీంకార మధ్యాత్మికామ్
జ్యోతిర్మండల చాక్రిక వ్యతికరామ్ - ఓంకార ఘంటార్భటీమ్
వందే వశ్యముఖీమ్ - మహాకవిసఖీమ్ మంత్రాధిదేవీశ్వరీమ్ ఈ మహాశక్తి వశ్యముఖి-మవిోకవి సఖి. అంతటి భయంకలిగించే ఆ మూర్తిని చూచికూడా సఖిగా భావించటమంటే ఆమె తత్త్వ రహస్యమెరిగిన లక్షణం కానవస్తుంది.
ఆమె సౌరకుటుంబానికి సత్యముగా కారకురాలు - సౌరకుటుంబ సత్యజనని. (ఢుతిమార్గంలో శక్రుని లీలాసఖి, తంత్రమార్గంలో మహేశ్వరి, అట్టి వేళలో 'అంబాం పరిణత మనస్సీమ్న సంభావ్య భవ్యాం మంత్రేంద్రోహం మధుర మధురం నవ్యకావ్యం కరోమి' అని ఆమె కేంద్రంగా భావించి నవ్య కావ్యనిర్మాణం చేయనెంచినాడు శ్రీ కులపతి. ఒకచోట కవి తను వైయక్తికంగా ముక్తిని కోరటంలేదని, లోకంలోని దుః ఖాన్ని తొలగించమని ప్రార్థిస్తాడు.
నాహం వాంఛామి మే ముక్తిం కేవలం స్వార్ధ చింతయా
శక్తిం యాచామి సంస్మర్తుం కులమేతత్ సుదుఃఖితమ్
ఇక్కడ కులమంటే భారతీయ సమాజమంతా అని తాత్పర్యం. తర్వాత నాలుగైదు శ్లోకాల వెనుక 'దురాచార పరిషక్తం కులభేద సుదుర్భరం' అని వర్తమాన సమాజదోషాన్ని స్పష్టంగా పేరొన్నారు. దీనిలో ప్రసక్తంగా బంద్రీ సహ(స్రనామాన్ని కూడా కులపతి రచించారు. అయితే ఇది ప్రాచీన స్తోత్రాలవలె రహస్యము, గోష్యము కాదు. విశ్వశ్రేయస్సు కోసం ఆయన సమర్పిస్తున్నారు 179
నుగ్రనన్న ఆ
ఐంద్రీసాహాస్రిలో తంత్ర విద్యాంశాలు, అనే కోపాసనా రహస్యాలు దశమహా విద్యల తత్త్వము, వైదిక తాంత్రిక ఖొవనల సమన్వయము గోచరిస్తాయి.
ఆ తరువాత వివిధ క్షేత్రాలలో జగన్మాత నామరూపాలను వివరించారు వెంటనే ఆమె దివ్యావతారాలను వివరించారు శ్రీ కులపతి. భారతంలో ఆమె (ద్రౌపదిగా శక్తిస్వరూపగా పాండవుల క్రియాశక్తిగా రూపుదాల్చింది. అక్కడ ఆమె అగ్విజ్వాలయే. ఆమె ఏసుక్రీస్తు ప్రభువును గర్భమున ధరించిన మేరీమాత కూడదా.
బుద్ధునికి జ్ఞాన ప్రదానం చేసిన మహాశక్తి ఆమెయే. అంతేకాదు, 'ప్రతికల్బం లోనూ అనేకమంది బుద్ధు లవతరించారు. వారందరూ విశ్వగురువులు, వారికి జ్ఞానమునిచ్చే మహాశక్తియైన 'ప్రజ్ఞాపారమిత ఆమెయే. ఈ జగన్నాత శ్రీ శంకరుల కాలంలో సరస్వతి అవతారమైన ఉభయభారతిగా ప్రవర్తించింది. శ్రీరామకృష్ణుల పత్నియైన శ్రీ శారదాదేవిగా, శ్రీ అరవిందుల ఆశ్రమములో శ్రీమాతగా వర్తించినది ఆ జగన్మాతయే. ఆమెయే మేడమ్ బ్లావట్స్కీగా మరొకసారి ఆధునిక కాలంలో రహస్య విద్యలను ప్రపంచవ్యాప్తంగా ప్రకటించదానికి విచ్చేసింది.
మనకాలంలో గణపతి అంశతో జన్మించిన గణపతిముని ఈ ఐంద్రీశక్తినే ఉసాసించి సజీవులుగానే కపాలభేదస్థితిని పొందినారు. రమణమహర్షి శిష్యులై బ్రహ్మ విద్యాపారమ్యాన్ని ప్రకటించారు. ఈ ప్రచండ చందిని ప్రత్యక్షంగా ప్రియ ప్రతీక్షావ్యగ్రతలో సాగర తీరంలో వేచియున్న కన్యాకుమారిగా - అగ్నిలో శరీరత్యాగం చేసిన కన్యకాపరమేశ్వరిగా - తన కాలంలో నిలచి ఉండిన జిల్లెళ్ళమూడిలో (అర్మగ్రామము) అనసూయాదేవిగా భావించారు.
కవి ఈ వర్ణనతో ఆగిపోక తన పూర్వజన్మలకు గూర్చి కూడా విస్తృతంగా వివరించారు. తాను శివపరశుశక్తితో జన్మించినవాడు. హిమాలయాలలో తీవకోపుడైన ఒక బుషిగా, భానుదేవుడనే మహారాజుగా, తాంత్రిక సార్వభౌముడైన ఖైరవనాధుడుగా, ఏసుక్రీస్తు ప్రభువు శిష్యుడైన జానుగా, యింకా అదేబియాలో గ్రీకు మొదలైన దేశాలలో అనేక విచిత్ర కార్యక్రమాలలో సంలగ్బుడైన ప్రసిద్ధుడుగా పేర్కొన్నారు.
ఐంద్రీ సాహస్రిలో తరువాత భాగం ఉపాసకులమిోది అనుగ్రహంతో మంత్ర ప్రస్తారమును చెప్పినది. దీనిలో మంత్రాలకు ఆయనయే నియమాలను సడలించి సిద్ధిమార్గాన్ని ఉపదేశించారు. 180
ఆఫీం సమద్పణు ఐంద్రీ సాహస్రిలో ఆయన రచన పరిపక్వంగా పరమసుందరంగా, అక్షిష్టంగా, అశిధిలంగా ప్రాబీనస్తోత్రవాజ్బయానికి ఏందునా తీసిపోనివిధంగా సాగింది. శివసాహస్రి- ఇంద్రరూపాయ రుద్రాయ - సర్వశక్తి ప్రదాయినే నమశ్శివాయ శాంతాయ విస్ఫుర ద్వజధారిణే అని ఆరంభమవుతుంది. శివుడు - ఇంద్రుడు ఒకే పరమేశ్వరరూపం - విభూతి విశేషం ఇక్కడ శివునకు ఇంద్రునకు అఖేదాన్ని ప్రతిపాదించారు శ్రీ కులపతి. వైదికదైవతాధీశుదైన ఇంద్రుదే పరమేశ్వరుదైన శివుడు - రుద్రుడు. ఇంద్రుని వృతసంవారమే శివుని శ్రిపుర సంవార గాధయెంది.
అందువల్లనే ఇంద్రుని నామాలతో శక్తులతో రుద్రుని స్తుతించారు. శ్రీ కులపతి ఈ స్తోత్రంలో. ఈ శివుడు సుప్తకుండలినీ శక్తిప్రచోదన విధాయకుడు. మూలాధార సహస్రార చక్రాల నడిమి ప్రదేశంలో అగ్ని స్వరూపంగా ప్రజ్వలించేవాడు. అందుకే ఆ జ్వాలనే సుషుమ్నగ్రా తంత్రశాస్త్రం పేర్పొన్నది.
ఈ సర్వభీజస్వరూపుడైన శివుని సర్వాక్షరాలతో స్తవం చేశారు. ఈ రచన అంతా మంత్రయత్వాన్ని పొందింది ఈ స్తోత్రంలోనూ అనేక విధములైన శివోపాసన విధములు వివరింపబడ్డాయి. దీనిలోనూ బహుచ్చందములు వాడి తన ఛందోధికారాన్ని నిరూపించుకున్నారు.
ఈ రెండు సహస్ర కావ్యాలలో ఉభయభాషా స్తోత్రాలున్నా సంస్కృతము రెంటిలో కలిపివేయి, అలాగే రెంటిలో తెలుగువేయి అవి రెండుభాషలలోనూ నహస్ర రచన చేసినట్లయింది.
శ్రీ ప్రసాదరాయ కులపతి రచన చేయటం ఒక అంశమైతే-దానియందు అంటీ అంటనట్లుగా అనాసక్తంగా ఉండటం మరొక అంశం. ఈ సహస్ర కావ్యాలేకాక మరికొన్ని కావ్యాలు, నవల ఒకటి, మరెన్నో వ్యాసరచనలూ ఆయన చేశారు అయితే “పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండటి అన్న విధంగా తన రచన కాదన్నట్లుగా ప్రవర్తించారు ఆయన
181
నుతుసన్న ఆ శ్రీ కులపతి వ్యక్తిత్వం 'భువనవిజయ' సభల్లో అత్యంత విశిష్టంగా ప్రకాశిస్తుంది. ప్రతి సభ ఒక క్రొత్ర ఏర్పాటే. “సిద్ధసాధన'" దోషమంటదు ఎక్కడా. యీ సభలద్వారా పాతికసంవత్సరాలపైగా సాహిత్యరాసిక్యానికి తెలుగుదేశంలో పట్టం కట్టారాయన వామపక్ష సాహిత్య రాజకీయాలు, కులరాజకీయాలు మూలచ్చేదం చేసే ప్రయత్నం కొనసాగింపగా భువనవిజయ సభలు అసంకల్పితంగానే జాతిజనుల చైతన్యంలో ఆత్మకళా వైభవాన్ని ఉజ్వలంగా నిలబెట్టాయి. యీ గౌరవమంతా శ్రీ కులపతికి చెందవలసిందే. యీ సాహిత్యపతాకాన్ని ఆయన ఆంధ్రేతర ప్రాంతాలలోనే కాక విదేశాలలోనూ నిలబెట్టారు. శ్రీ కులపతి జాతీయయోద్ధ. అత్యవసర పరిస్థితి విధించి దేశాన్ని మొత్తం ఒక కారాగారంగా మార్చిన పదవీలాలస వరిపాలన సాగిస్తున్న రోజులలో దేశంలో కొనసాగిన రహసోద్యమాలలో క్రియాశీలంగా (ప్రవర్తించిన మహావ్యక్తులలో ఆయన ఒకరు. ఇంతటి మహనీయమైన శ్రీ కులపతి వ్యక్తిత్వానికి నాజోహారులు సమర్చించు తున్నాను. ఏ సిద్ధ తేజస్సు యీ ఉపాధిని ఆశ్రయించి ఉన్నదో ఆ తేజస్సు లోకకల్యాణ కారకమైన తన నిర్దిష్ట కార్యాన్ని సఫలంగా నిర్వర్తించవలెనని కోరుకుంటున్నాను. శ్రీ ప్రసాదరాయ కులపతి గుంటూరులో శ్రీ, సిద్ధకాళీ పీఠం స్థాపించారు. 2002 సంవత్సరం నడుమ కుర్తాలంలోని శ్రీ సిద్ధేశ్వరీ పీరాధిపత్యం వహించి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి నామంతో సాధకులను, భక్తులను అను(గ్రహిస్తున్నారు. డా. ప్రసాదరాయకులపతి షష్టిపూర్తి సాహిత్య సంచిక (గుంటూరు) 1997 182
అంతర్హుఖుడు శ్రీ నవీన్
శ్రీ నవీన్ నాకు 1960 ప్రాంతాల నించి పరిచయమే. “అంపశయ్య?” ద్వారా అంతవరకు తెలుగు సాహిత్యంలో అంతగా (పచలితంకాని చైతన్యస్రవంతి సంవిధానాన్ని ప్రయోగించి తాలి నవలను పూర్తి చేశాడాయన.
1955 ప్రాంతాలలో మేము - నేను, పేర్వారం జగన్నాథం ప్రభృతులం - “సాహితీబంధు బృందం” స్థాపించటం (ప్రధానంగా కళాశాల విద్యార్థులుగా, సాహిత్య రంగంలో ప్రక్రియగా ఉండటం కోసం మేము హైదరాబాదు చదువుకోసం వెళ్లగానే మా ఆర్ట్స్ కాలేజి అధ్యాపకులు పి.జి, లాలే, ఇరివెంటి కృష్ణమూర్తి జి.వి. సుబ్రహ్మణ్యం ప్రభృతులు కాళోజీ సోదరులు కేంద్రంగా మిత్రమందలిని స్థాపింఛటం జరిగింది. 1957-58లలో. అయితే మిత్రమండలి వక్షానికో, వారానికో సమావేశమై యువ రచయితల రచనలకు పదునుపెట్టింది. ఒక కార్యశాల వలె నడిచింది. ఆ కార్య శాలనించి బయటకు వచ్చిన రచయితలలో నవీన్ ఒకరు.
వరంగల్లు సాహిత్యంలో తొలి నాళ్లనుంచీ రెండు రకాల (స్రవంతులు సమాంతరంగా ప్రవహించటం ఉన్నది. దేశీయత - కళామయత, అంతర్పహిర్ముఖాలు, ఆధ్యాత్మికత - అధిభౌతికత జంటలు జంటలుగా సాగివస్తుంటవి. పాల్కురికి సోమన, పోతన్న నాటి నుంచీ ఈనాటి వరకు ఈ జంట జంటల పద్ధతి సాగిపోతూనే ఉంది.
సర్వతః బహిర్ముఖంగా కనిపించే కాళోజీ ఉర్దు, పారశీక కవితా సొందర్యానికి పరవశమయ్యే వ్యక్తియే. త్రీ గార్లపాటి రాఘవరెడ్డి భక్తి కవితా ధోరణికీ, ఉదయరాజు శేషగిరిరావు “మనోరమ అనే శృంగార పద్యలహరికీ తన్మయమలయ్యే లక్షణం ఉన్నవారే.
కాళీజీ ప్రభృతులు నిర్వహించిన మిత్రమందలిలో నుంచి వెలువడడ్డ శ్రీ నవీన్ రచయితగా అంతర్ముఖుడైనాడు. అతని నవలలూ కథలూ ఎంతగా లోకాన్ని వర్ణించినట్లు కానవస్తూన్నా ఆత్యంతికగా అంతర్జగత్తులో విలీనమయ్యేవే. నవీన్ రచనల మొద ఒక సౌందర్య అనుభవ ముద్ర ఉన్నది. ఈ ముద్ర చలం ద్వారా ఆయనకు సంక్రమించింది. అందువల్ల జీవితాన్ని పై అంచులో వర్ణిస్తూ 183
సుర్రుసన్న ఆల
వర్ణిస్తూనే చివరకు ఆయన అంతర్జగత్తులోకి జారిపోతాడు. పైన బుద్ధిబలం వల్ల, హేతువాదం వల్ల ఏ ఏ పరివేషాల కానవచ్చినా అసలైన నవీన్ కేవలం వాటి పొరలు చించినప్పుడే కానవస్తాడు.
“మనస్సును కలచి కలచి మేధస్సును, సంఘటన అనే కవ్వంతో చిలికి చిలికి జీవిత రధ చక్రాల క్రిందపడి నలిగి నలిగి ప్రతిపాత్రను కలం కుంచెతో బొమ్మ గీసి గీసి, ప్రతి అక్షరాన్ని మార్చికూర్చి, ఇటుక మీద ఇటుకకను పేర్చినట్టుగా పేర్చిపేర్చి తన బాధను ప్రపంచబాధగా, ప్రపంచబాధను తన బాధగా చేసుకొని, జీవితం అనే సూది మొన మీడ నిరంతర తపస్సు చేసి చేసి - అప్పుడు గదా కధ పుడుతుంది- అప్పుడు గదా నవల పుడుతుంది. అదో తపస్సు-అదో సాధన- అదో ప్రసవవేదన.... అదో అన్వేషణ, అదో తీరని దాహం” (అంతస్స్రవంతి పేజి. 41)
ఒక రచయిత రచనాక్రమాన్ని సోపాన పద్ధతిలో వెల్లడిస్తున్నారు శ్రీ నవీన్. “ఇటుకమీద ఇటుక పేర్చినట్టుగా పేర్చిపేర్చి - ఇంతవరకు రచయిత జాగ్రదవస్థలో చేసే కార్యం. అంతస్సులోనికి ప్రవేశించే ప్రయత్నం. తన వ్యుత్పత్తీ లోకానుభవమూ, అభ్యస్త సాహిత్య విద్యావైదుష్యమూ వెల్లడించేవి. తరువాత భాగం ఆయన అంతస్సును గురించి తెలియజేస్తుంది.
“తన బాధను ప్రపంచబాధగా - (ప్రపంచబాధను తన బాధగా చేసికొని ... ఇది అంతర్భహిస్సుల సంధి దశ. ఈ మాటలు మహాష్రస్థానం పీరికలో చలానివి. ఒకటి కృష్ణశాస్త్రిని గురించి, రెండవది శ్రీశ్రీని గురించి చెప్పినవి. వ్యక్తి క్రమంగా విశ్వచైతన్యంగా పరివర్తించటం - విశ్వచైతన్యాన్ని తన వ్యక్తిత్వంలోనికి స్వాయత్తం చేసుకోవటం . . . ఈ రెండూ ఉన్నేషనిమేష దశలు, ప్రతి రచయితా రచనావేళలో ఈ దశల్లో ఎక్కడో ఒకచోట తప్పక నిలిచివుంటాడు.
తరువాత మూదడవదశ వర్ణించబడింది. ఇది అత్యంతమూ ముఖ్యమైంది. ఒక విధంగా నిర్వికల్పసమాధివంటి దశ అహంత సరిహద్దులు చెరిగిపోర్చిన స్థితి. ఆ స్థితి - 'జీవితం అనే సూదిమొన మీద చేసే నిరంతర తపస్సు! సర్వ చరాజగత్రులోని
జీవచైతన్యమూ - సుసూక్ష్మీకరింపబడి కేంద్రితమై రచయితకు ఆధార స్థానమవుతుంది. ఈ ఆధార పద్మం మీద నిలిచి ఉంటాడు రచయిత. సృష్టికర్త ఈ కేంద్రీకృతమైన సర్వజీవన చైతన్యాన్ని గర్భీకరించుకున్న బిందువు మీద ఉన్న రచయిత మనం ఎరిగిన 184
ఆ నదుర్పబ లోకంలోని వ్యక్తి మాత్రమే కాదు అతడు - తనకుమించిన జగత్తునంతనటినీ తనలోనికి చేదుకున్నవాడు ఒక వ్యక్తావ్యక్త సంధి బిందువు మీద ఉన్నస్థితిని చెప్పుతాడు. అప్పుడది తపస్సు-తీవ్రభావన-అవుతుంది అప్పుడది సాధన - అంతర్జగత్తునుంచి ఎప్పుడు చేదుకునే ప్రయత్నం అవుతుంది. అదే తానెరుగని అపూర్వమైన నూతనా విష్మారం కోసం చేసే ప్రయత్నం అవుతుంది. శ్రీ నవీన్ ఈ విధంగా రచనా్రక్రియలోని భిన్నఖిన్న దశలను ఇంత విశదంగా చెప్పారు. రచయితగా ఉన్న ఆయన వివేకం స్థాయిని ఇది తెలియజేస్తుంది.
అంతర్చహిర్దగత్తుల మధ్య సమన్వయంలోనే గొప్పరచన వెలువడుతుంది. శ్రీ నవీన్‌లో ఈ ఘర్షణ 'అంతస్త్రవంతి'లో వ్యక్తమయ్యే సన్నివేశం ఉంది. రచయిత భార్య రజని అంటుంది - “ఎప్పుడూ మల్లెపూల సువాసనలేకాదు. . . అప్పుడప్పుడు కిరోసిన్ కంపు కూడా భరించాలి” అని. భౌతిక ఆధిభౌతిక జీవనాల మధ్య వారధిని నిర్మించుకోవలసిన అవసరాన్ని ఈ సన్నివేశం స్పష్టం చేస్తుంది. రవి తన పారకురాలు సుధకు రాసిన ఉత్తరం సన్నివేశంలో ఈ సమన్వయం కుదరకపోవటం వల్ల వచ్చే వైరుధ్యం కానవస్తుంది ఇక్కడ రవి స్వాప్నికుడు. రజని భూమి. ఈ భూమ్యాకాశాల నడుమ సమన్వయం నవల చివర దాని సమావేశంలో సాధ్యమయ్యింది.
రవికి సంప్రదాయ సిద్ధమైన పతివ్రత వంటి విలువలమీద నమ్మకం లేక పోయినా తన సహచరి - ఇల్లాలు ఆయనకు సర్వమూ అవుతున్నది. “నువ్వే నారాణిని- నా ఎంకివి - నా ఊర్వశివి - నా పార్వతివి - కోమలివి - నా అమృతానివి - తాను మెచ్చిన స్త్రీల వ్యక్తిత్వాలన్నింటినీ తన ఇల్లాలు రజనిలో చూసుకోగలుగుతాడు రవి, అందువల్లనే ఆమె తన సంగమకాంక్ష తీర్చని వేళలో కూడా దగ్గరకు లాగి జోకొట్టింది. అతనికి ఓ చక్కని కలవచ్చింది. మత్తుగా ఉంది. తెల్లగా మంచుముద్దలు, పచ్చటి మైదానాలు సూర్యకిరణాలలో తళతళలాడే పర్వతాలు. ఎత్తైన యూకలిష్టస్ చెట్లు కాదు ఆపిల్ చెట్టు గుత్తులు గుత్తులుగా ఆపిల్ పళ్ళు. 'వాటి అందమంతా కళ్ళతోటే జుర్రేస్తున్నాడు” (పేజి. 12-18) అతని శరీరం కోరిన అనుభవం స్వప్నంలోకి పరివర్తిత మయ్యింది ఆ పళ్ళను డబ్బాలలో పెట్టి మేకులు కొట్టడం, పాలవాడు తలుపు బాదటం _ ఇవి భౌతిక జగత్తులోనికి దించే వాస్తవాంశాలు
అయితే నవల చివర నాయికా నాయకుల సంగమ దృశ్యం వర్ణించబడింది. అనుభూతి జగత్తులోంచి ఈ వర్ణన భౌతిక పరిమితులను దాటిపోయింది. దాంపత్యజీవన
185
సుప్రసన్న ఆల
తత్త్వాన్ని వ్యాఖ్యానించింది. “వాళ్ళిద్దరూ రెండు శరీరాలుగా రెండు ప్రాణాలుగా అంతమ్రైపోయారు. ఏకప్రాణిగా ఆవిర్భవించే ఆ క్షణాలు అతనికి మహత్తరంగా, మహాద్భుతంగా, మధుర మనోజ్ఞంగా కనిపిస్తాయి. అలాంటి క్షణాలు నిత్యమై శాశ్వతమై, అనంతమై” “ఈ సృష్టిలో ఇంత ఆనందం ఇంత వాయి తనకు మరొకటిలేదు. రాగం, ద్వేషం, కోపం, తాపం, ఈర్చ్య, ద్వేషం అన్నీ అంతమైపోయిన క్షణాలు” (శేజి 178) అనిర్వచనీయమైన అనుభవాన్ని చెప్పే గొప్ప ప్రయత్నం ఇది.
అందుకే శ్రీ నవీన్‌లో జీవితాన్ని గురించిన ఒక తాత్త్విక దృక్సధం సమగ్రమైంది ఉన్నది. ఇలాంటి దృక్చథం అనేది లేకపోతే ఏ రచయితా సృష్టినీ మానవ జీవితాన్ని వినూత్నంగా వ్యాఖ్యానించలేదు. ఇన్ని పాత్రల ఇంగితాన్ని స్పష్టంగా విశదీకరించలేదు.
అంతట్ర్రవంతి చివర జీవితాన్ని గురించి నవీన్ ఇలా అంటాడు.
“సృష్టి విచిత్రమైంది. సృష్టి అనంతమైంది. సృష్టి ఆద్యంతాలు లేనిది. సృష్టి ఒక ఆవిచ్చిన్న ప్రవాహం. నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి విరామం విశ్రాంతి లేవు. అనుక్షణం సృష్టికి ప్రతిసృష్టి జరుగుతూనే ఉంటుంది. అదే జీవిత రహస్యం. అదే జీవితాని కర్థం” సృష్టి యొక్క అనుస్యూతిని, నైరంతర్యాన్ని చెప్పిన ఈ రచయితకు ఈ జగత్తుమీద ఉన్న “మమకారం” గొప్పది. ప్రజాతంతువును శ్రేంచరాదు అని చెప్పే వైదికసూక్తి దీన్నే చెప్పింది. యూరోప్ దేశాన్ని ముంచెత్తిన నైరాశ్యవాదాల పాలబడకుండా, వ్యవస్థ సార్థకమైన ఉనికిని సమర్థించే నవీన్ మనకున్న కొద్దిమంది మంచి రచయితలలో ఒకరు నిత్య నవీనుడు - నవీన్ నాలుగు దశాబ్దాల సాహిత్య కృషి ప్రత్యేక సంచిక 200]
186
ఓురుపూజ (శ్రీ వేణుమాధవ్ (ఎమెల్సి) కన్వీనర్‌గా ఏర్పడిన అంతేవాసుల అవహ్వాన సంఘము నేడు శ్రీ వై. కె. శాస్త్రిగారిని సన్మానించుకుంటున్న సందర్భముగా “జనధర్మ తరపున శాస్త్రిగారికి మా నివాళి ఈ వ్యాసం) సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం వరంగల్లు నగరంలోకి వచ్చిన ఒక ఒక అపరిచితవ్యక్తి శ్రీ వై కె. శాస్త్రిగారు. ఆయన పూర్తిపేరు యద్దనపూడి కోదండరామశాస్త్రి అని చాలా మందికి ఇప్పటికీ తెలియదు అనాడు ఒక హైస్కూలుగా ఉన్న ఆంధ్ర విద్యాభివర్ధని సంస్థకు అధిపతిగా వచ్చి ఆ సంస్థ స్వరూపాన్ని పరుశవేది స్పర్శచేత ఇనుము బంగారం అయినట్లు ఆయన పూర్తిగా మార్చివేశారు. ఆంధ్ర విద్యాభివర్ధని ఆనాటికి ఇక్కడ ఉన్న హైస్కూలు. దానికి అనేక చారిత్రక కారణాలచేత ఒక ప్రత్యేకత ఉన్నది. శ్రీ చందా కాంతయ్య స్థాపించినది కావడం, ఎన్ కె. రావు వంటి విద్యావేత్తల జాతీయ విద్యాభావనల పునాదిలో ఎదుగటం కారణంగా అది ఒక విధంగా జాతీయ విద్యాకేంద్రంగా రూపొందుతూ వచ్చింది. అయినా తగిన సాధన సామగ్రి సమకూడక పోవడంలో అప్పటికి దాని పూర్తి రూపం ఇంకా వర్పడలేదనే చెప్పాలి. 1949లో శ్రీ వై. కె శాస్త్రిగారు మరికొందరు ఉపాధ్యాయులు కొత్తగా చేరడంతో పాఠశాల చరిత్రలో కొత్త మలుపు వచ్చింది. అప్పటికి “తెలుగు” మాధ్యమంగా బోధించే హైస్కూలు కూడా అదే శాస్త్రిగారిలో ఉన్న ప్రముఖ లక్షణాలు మూడు. ఒకటి స్పష్టమైన లక్ష్యం. రెండు సడలని క్రమశిక్షణ, మూడోది నాయకత్వపు లక్షణమూ, ఈ మూడు గుణాలు కారణంగా ఆయన పాఠశాలకాక లక్ష్య నిర్దేశం చేసి దాన్ని అదే మార్గములో నడిపించ గలిగారు స్వయంగా తాను పాటించే నియమాలనే తన సహచరులకు నిర్దేశించడం కారణంగా అవి అమలు జరిగేవి ఆయనలోఉన్న నాయకత్వ లక్షణం అందరు అధ్యాపకులనూ తన వెంట తన మార్గంలో నడిచేట్లు చేసేవి ఈ లక్షణాలే 'ఒకరి 187
నువ్రుసన్న ఆ మాటను సహజంగా వినని స్వతంత్ర ప్రవృత్తిగల ఆ పారశాల వ్యవస్థాపకులు శ్రీ చందాకాంతయ్య గారిని కూడా తన అదుపులో తాను ఉండేట్లుగా చేసింది శ్రీ దూపాటి రమణాచార్యులుగారు శతావధానులు, చారిక్రిక పరిశోధకులు నాడు టీచరుగా ఉన్నారు. వారితోబాటు శ్రీహరి రాధా కృష్ణమూర్తిగారు, శ్రీ విశ్వనాధ వెంకటేశ్వర్లుగారు ఈ ముగ్గురు ఆ రోజుల్లో తెలుగు 'భాష సాహిత్యం, కవిత్వం అన్నిటికి (ప్రేరక శక్తులుగా నిలిచేవారు. పారశాలలోని సభలూ, సమావేశాలు అన్నీ ఈ మువ్వురి కవితాగానాలచేత సరస్వతీదేవి కాలి ఆందెల మువ్వలు 'మైోగినట్టుగా స్ఫురించేవి. శ్రీకారుమంచి కొందలరావుగారు పేరుకు లెక్కల మాస్టారే అయినా ఆయన స్పృశించని విషయం ఉండేది కాదు. లెక్కలు ఆయన చెప్పితే వలాంటివాడి కయినా రాకపోవడం అనేది లేదు. వేదాంతమూ, తర్మమూ, సంస్క ఇత సాహిత్యమూ విజ్ఞాన శాస్త్రమూ ఇలా ఎన్ని అంశాలయినా ఆయన గంటల తరబడి విద్యార్ధులను ఒప్పిస్తూ, చర్చిస్తూ మెదడుకు పదునుపెట్టేవాడు త్రీ సోమేశ్వరరావుగారు (ఇప్పుడు జూనియర్ కళాశాల పిన్సిపాల్సొ సాంస్కృతిక కార్యకలాపాలన్నింటికి మూలకేంద్రం. విజ్ఞానయాత్రలన్నింటికీ ఆయన నాయకుడు. విద్యార్థులలో విద్యార్థిగా ఉంటూనే అప్పటికప్పటికి ఎన్నో కొత్త కొత్త వింతలూ విశేషాలు చెప్పేవారు. పోటోగ్రఫీ, చిత్రకళ, శిల్పములు, పురాతత్త్వము ఇవన్నీ ఆయన రుచి చూపించిన అభిరుచి కల్పించిన విద్యలు. ఇలా ఆనాడు పాఠశాల వాతావరణమంతా విద్యార్భులలోని వైయక్తిక (ప్రతిభను వెలికితీసే ప్రయోగశాలగా ఉండేది. ఈ కార్యకలాపాల అన్నింటి వెనకా శాస్త్రిగారు ఉండేవారు. వక్షృత్వ సోటీలు, వ్యాసరచన పోటీలు ఇంకా ఎన్నో అన్నింటిలోను చివర ఆయన ఉపన్యాసం తప్పనిసరి. స్కూలులో మామూలు పారాలు చెప్పడంకంటే అధికంగా సాంస్కృతిక కలాపాల కేంద్రంగా చేయడం ఆయన 'ప్రయత్నాలన్నింటి సాఫల్యాలకి కేంద్రం. మహా పురుషుల జన్మదినాలూ, జాతీయ ఉత్సవాలు, వినాయక చవితి, దసర్హా కృష్ణాష్టమి వంటి ఉత్సవాలు స్కూల్లో జరగడం ఆ విషయాలను గురించి పెద్దలు ఎంతో మంది మాట్లాడడం జరిగేది, ఆ ఉత్సవాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులూ కలిసి పాల్గొనడం ఒక విధమైన పార్టిసి ఫీషన్ భావం కలిగించేది. 188
ఆ సకుస్పణ నగరానికి పెద్దలు ఎవరు వచ్చినా వారి ఉపన్యాసాలు విధిగా ఈ పాఠశాలలో జరిగేవి, ఈ ఉపన్యాసాలు ఇంగ్లీషు హిందీ, తెలుగులలో ఉండేవి. ఇంకా నాట్యవేత్తలూ, కళాకారులూ, ఇంద్రజాల విద్యాప్రవీణులూ ఎందరో వచ్చిపోయేవాళ్లు. అందువల్ల విద్యార్థులకు పాఠశాలకు మించిన ఒక రిలీఫ్, తెలియకుండానే అనేక విషయాలు నేర్చుకునే అవకాశం ఉండేది. పాఠశాలలో ఆయన ప్రవేశపెట్టిన కార్యకలాపాలు అన్నింటిలోనూ శిఖర ప్రాయమైనది “పోతన జయంతి” ఉత్సవం. నెల్లూరులో తిక్కన జయంతి ఉత్సవం జరుగుతూ ఉండటం ప్రభావంగా ఆయన ఈ కల్పన చేశారు. ఇది కేవలం పారశాలకే కాక ఊళ్లో అందరికీ ఒక పండుగలాగా ఉందేది. అన్ని పారశాలల్లోంచి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉండేది ఉత్తమ విద్యార్థికి ప్రతిదాంట్లోనూ 'భాగవతం' ఒక సెట్ ఇవ్వడం ఆచారం నేను పదవ తరగతిలో ఉండగా మూడు పోటీల్లోనూ ప్రధమ బహుమతి వచ్చింది. అందుచేత మూడు భాగవతాల సెట్లకు బదులు ఒక భాగవతము, భారతము, ఇచ్చారు. ఇప్పటికీ అవి నా దగ్గర భద్రంగా ఉన్నవి పోతన జయంతిలో ప్రధాన వక్త ఎప్పుడూ తెలుగు దేశంలోని ప్రమాణ సాహిత్యకుడై ఉండేవాడు. అప్పుడు మాకు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ, భమిడిపాటి కామేశ్వరరావు, జటావల్లభుల పురుషోత్తం, దివాకర్ల వెంకటావధాని, నరిపల్లి విశ్వనాథశాస్త్రి మొదలుగా ఎందరో ప్రముఖుల ఉపన్యాసాలు వినే అవకాశం కలిగింది ఈ ఉత్సవాలకు అనుబంధంగా కవి సమ్మేళనాలు మొదలైన కార్యక్రమాలు ఉండేవి. ఇన్ని కార్యక్రమాలున్నా చదువు విషయంలో కించిత్తు అశ్రద్ధ ఉండేది కాదు మేము పదోతరగతిలో ఉండగా ఏ టీచరైనా రాకపోతే శ్రీ శాస్ట్రిగారు క్లాసుకు వచ్చేవారు. ప్రతి విద్యార్థిని గూర్చిన వైయక్తికమైన (శ్రద్ధ ఆయనకు ఉండేది. అందువల్ల ఆయన వచ్చిన తరువాత పబ్లిక్ పరీక్షముందు సెలక్షన్సు జరిగేవి. అందువల్ల ఫలితాలు ఎంతో గొప్పగా ఉందేవి. పరిపాలనలో విద్యార్థుల ప్రవర్తన విషయములోనూ ఆయన చాలా కఠినంగా వ్యవహరించినా ఎవరినీ నొప్పించేవారు కాదు. ఆయనంటే ఎంతో భయంగా ఉండేది, భయంకరంగా కనిపించకపోయినా. అది ఆయన వక్తిత్వం ప్రభావం కావాలె 189
సుత్రునన్న ఆల ఖద్దరు దుస్తుల్లో క్రమశిక్షణ గల ఆయన వ్యక్తిత్వం చూడగానే గౌరవం కలిగించేది. విద్యార్థులను పబుకరించడంలోనే ఆయనలో ఉన్న వాత్సల్యం స్ఫురించేది. దండించినా తండ్రిలాగా కనిపించేవారు. నెహ్రా మెమోరియల్ స్కూల్ స్థాపించినప్పుదు దానికి ఆయనే మొదటి హెద్మాస్టర్గా ఉన్నారు. ఆయన వేసిన పునాదు బిప్పటికీ ఆ స్కూలును భద్రంగా నిలభెడు తున్నవనే చెప్పాలి. విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల, చందాకాంతయ్య మెమోరియల్ కళాశాల, శ్రీ దుర్గేశ్చర మహిళా కళాశాల ఇలా ఎన్నో విద్యాసంస్థలలో ఆయన సభ్యుడు. ఇటీవలనే వీటన్నింటినీ వానప్రస్థ ధర్మంగా స్వయంగా వదులుకున్నారు. పాఠశాల (ప్రధానాధ్యాపకులుగా విశ్రాంతి తీసుకున్నా నగరంలోని సాంస్కృతిక సాహిత్య కార్యకలాపాలన్నింటికీ ఆయన సహాయ సహకారాలు ఉందనే ఉన్నవి. 1960-65లలో చక్కగా పనిచేసిన సాహిత్య సంస్థ 'కులపతి సమితికి ఆయన అధ్యక్షులు. ఈ సంస్థ కార్యకలాపాలన్నీ ఆయన నిర్దేశంతో జరిగేవి. 1968లో జిల్లా రచయితల మహాసభల సందర్భంలో ఆయన ఎనలేని సహాయం చేశారు. ఆయన ఆశీర్వచనాలు ఎంతో మంది వర్థిస్తువులకు ప్రోత్సాహమిచ్చి ఉన్నత స్థాయికి కొనిపోయినమాట నిజం. ఆయన అధిపతిగా ఉన్న రోజుల్లో ఆ పారశాలనుంచి బయటపడ్డ విద్యార్థు లందరి మీదా ఆయన వ్యక్తిత్వ ముద్ర ఉండటం తప్పనిసరి, శాస్త్రిగారిది సంపూర్ణ జీవనం. ఆయన జెరస సంతానం ఆయన ఆశించిన దానికన్న మిన్నగా సఫల జీవనంలో (ప్రవేశించారు. ఆయన విద్యాసంతానం రాష్ట్రం లోనూ దేశదేశాలలోనూ ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ఆయన ప్రవృత్తిలో ఈ మధ్య అనాసక్తి ఒకటి ప్రచురమైంది. దాదాపు తురీయా (శ్రమం కోసం కావలసిన పరిపక్వమైన మనఃస్థితిని పెంపొందించుకున్నారు. తరువాత ఆయనతో సంబంధంగల విద్యా సంస్థలన్నీ ఆయన సహాయాన్ని కృతజ్ఞతతో స్మరిస్తున్నవి. ఆయనకు ఈశ్వరుడు ఐహిక లోకంలో ఇతోధికమైన ఆయురారోగ్య సంపదలనూ, ఆముస్మికంగా పోతన్నా ధూర్జటీ మొదలైనవారు కోరిన ఐశ్వర్యాన్ని ప్రసాదించవలెనని కోరుతున్నాను 190
ఉషత్రీ సుసంధితమైన చాప్ం నుండి విముక్తమైన బాణం
ఎవరి వ్యక్తిత్వానికైనా మూడు మూర్తులు, ఒకటి తన మనస్సులో అంచనా
వేసుకునేదీ, ఇతరులు తన్ను గూర్చి భావించేదీ, మూడవది తన్ను తానే సమష్టి అవచేతనం లోంచీ, తవ్వుకుని చూచుకోవడం అయితే రెండవది బహుముఖమైంది. ఎంతమంది అంచనా వేస్తే అన్ని మూర్తులు, అన్నింటిలో ఎంతో వైవిధ్యం, వైరుధ్యం
విశ్వసిస్తే - బహుజన్మ పరంపరల నుంచీ వాసనా సంపుటినీ కర్మసంచయాన్నీ మోసుకు వచ్చే జీవుడు తన చైతన్యం మోది ముద్రలని ఎన్నని లెక్కపెట్టగలడు? ఏ ముద్ర ఎప్పుడు మేల్కొంటుందో ప్రవృత్తిలో ఏ అనూహ్య క్రియకు కారణమౌతుందో - ఎలా చెప్పగలం. అయితే మానవ (ప్రవృత్తిలోని సంక్లిష్ట లక్షణం మనోలోకంలోని రహస్య ద్వారాలు తెరుచుకున్నా తనకు తానే అర్థం కావడం కష్టం.
అందుకే సంప్రదాయం చెప్పింది, ప్రవృత్తిని కత్తివాదర మిద నుంచి నడిచే వాడిలాగా జాగరూకతతో రక్షించుకోవాలని, జారుపాటు ఏ క్షణంలో కలిగినా పతనమే. “ఇది ఏనాటికి ఏమగున్ తెలియదోయీ రామ ! ఎన్నేండ్లుగా బ్రతుకో అన్ని సమల్, నెలల్, దినము, లిప్తన్, లిప్త, రక్షింపగా” - తుద ఎప్పుడు ! ఏ అజాగ్రద్వేకలో ! ఏ మోహమా ! ఏ లోభమో ! కాలుబట్టి లాగవచ్చు.
మన చైతన్యంలో ఈ స్పృహ - జాగ్రత్త ఎప్పుడూ మేల్మొని ఉంటే పతనం పొందే అవకాశం తగ్గిపోతుంది. మాన్యుదైన ఉషశ్రీ వ్యక్తిత్వంలో ప్రచురమూ, ప్రకటితమూ అయిన వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వ రక్షాస్పృహ కలది.
“జగదుషోవేళా ప్రసన్న వాగ్దేవత అకాశమున లాస్యమాడినపుడు” అర్న కంఠాలలో (మోగిన ఉషన్సూక్తాలనుంచీ ఈనాటి జిడ్డు కృష్ణమూర్తి అంతర్ముఖ సమారాధ్యమూ, బహిర్ముఖ సుదుర్లభమూ అయిన వాగున్మేషం దాకా ఆయన చైతన్య సంపుటిలోకి ప్రవేశించిన పదార్థాలే.
ఈనాడు దేశంలో మానవుడు క్షుఖితుడై, ఆత్మ విశ్వాసం కోల్పోయి కుంచితుడై- ప్రాచీనాధునిక జీవన పరిస్థితుల ఘర్షణలో శిధిలుడై అరక్షితమైన వ్యవస్థలో నిత్యభీతుడై
191
సుత్రుసన్న ఆల ఉండగా - ఉషశ్రీ ఆ సంక్షోభంలోనించి ఉద్దమించి రెండు దశాబ్దాలుగా ఒక మూల వ్యవస్థను గూర్చి - దానిలోని అభయస్థితిని గూర్చీ సార్వకాలికతను గూర్చీ ఉప దేశిస్తున్నాడు.
ఈ ప్రవక్షృ లక్షణం తనంత తాను ఎంచుకొన్నది కాదు. తానూ ఇన్ని ఒత్తిళ్ళకూ మనస్సులో రాపిడి పొందినవాడు. ఉద్యోగం లేకా యజమానుల చేత అకారణ బాధలూ పొందినవాడు. ఆకలీ, దారిద్ర్యం ఎరిగినవాడు. ఆ బాధలలోంచి ఒక “కటు” లక్షణం వాక్కులో పెంచుకున్నవాడు. దానితో ధీర ప్రవృత్తి వచ్చింది. వ్యాస వాల్ళీకుల కధా కోశాలనుంచి తాను పునరుజ్జీవనం పొందాడు. తనకు తెలియకుందానే తాను ఆధునిక పారాణికుడూ, వర్తమానస్థితికి వ్యాఖ్యాతా అయినాడు. తాను పుట్టింది పురాణపండవారి (టోత్రియ కుటుంబంలో, అయితే తానూ పౌరాణికుడు కావాలని అనుకోలేదు. ఖీమవరంలో చదువు అఖండంగా సాగిస్తూ కవీ, కథకుడూ, నాటక కర్తా అయినాడు. 1952 నాటికే “విశ్వత్తీ” పత్రిక స్థాపించాడు.
“విశ్వనాథ ప్రత్యేక సంచిక ప్రకటించి సాహిత్యరంగంలో అపూర్వ సంచలనం సృష్టించాడు. అ సందర్భంలో జరిపిన దేశాటనంలో సాహిత్యరంగంలోని అనేకులైన పెద్దల వ్యక్తిత్వంలోని వెలుగు నీడలను దర్శించాడు.
న జ ఖః
రంగం హైదరాబాద్‌కు మారింది. ఉద్యోగాలు చాలా మార్చి పత్రికా రచయిత అయినాడు. చివరకు రేడియో ఉద్యోగం. అప్పటికి పిల్లలు, సంసారం 1 ఎలాగో ఆ ఉద్యోగంలో కుదురుకున్నాడు.
ఉషశ్రీ ఉద్యోగం చేస్తూ ఎప్పుడూ తలవంచలేదు ఆన్యాయంతో పొత్తు గలపలేదు. విజయవాడ రేడియోలో ఆయన చేరిన తరువాత క్రమంగా ఆయన వ్యక్తిత్వంలో వక్త, ప్రవక్షృ లక్షణాలు విచ్చుకొన్నాయి. రేడియో కార్యక్రమాలకు రంగూ, రుచీ వాసనా వచ్చాయి. ఉషశ్రీ గొంతు 'ోతలకు ఒక ఆకర్షణ. దానిలో మార్దవం లేదు. అయినా ఆ ధీరత్వం, వాడీ, నిశితమైన వ్యంగ్యం, అంతకు పూర్వం ఆ ప్రభుత్వ
సంస్థలో లేనివి.
ఉషత్రీకి రేడియో చాలలేదు. ఆయన వ్యక్తిత్వం ఎదిగింది. ఆయనకు తెలుగు
దేశమంతా వేదిక అయింది. ఎన్నివేల ఉపన్యాసాలో ఎన్ని వక్రోక్తులో ! దేశం త్ర అరుదైన వ్యక్తిని తన గుండెల్లో పొదువుకున్నది. 192
ఆ నమద్చీణ
సుసంధితమైన చాపం నుంచి సూటిగా లక్ష్యం వైపు దూసుకుపోయే బాణం లాంటి ఉషక్రీ వాక్కు ఎందరికో ధర్మ సందేహాలు తీర్చింది, జీవిత (గ్రీష్మాతపంలో తప్పులైన వారికి ఎందరికో దప్పిక తీర్చింది.
ఇప్పుడు మనం చూడవలసింది ఆయన చెప్పేది రామాయణమా, భారతమా, మరొకటా అని కాదు. అ మూసలో జనానికి ఆయన అందించే ఆత్మ విశ్వాసం పాలెంత అని. స్తబ్ధమైన జనంలో అఖీతిని కలిగించి కర్తవ్యోన్ముఖులను చేయడంలో ఆయన ప్రసంగాల పాత్ర ఎంత అని !
పురోగామి ప్రతీగామి శబ్దాలను పడికట్టు రాళ్లుగా వాడకపోతే ఆయన కృషి ఒక చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించిందనే చెప్పాలి, నిస్సందేహంగా ఆయన ప్రవచనం ఒకటి రెండడుగులు ముందుకే.
ఉషశ్రీ (ప్రారంభించిన కార్యం అవసరం ఇంకా తీరలేదు. ఆయన షష్టిపూర్తి నుంచి శతాబ్బుత్సవం వరకూ ఆ కార్యాన్ని కొనసాగించాలి.
ఆయనకు పౌభాగ్యమూ, ఆయన కృషికి సాఫల్యమూ కోరుకోవడం మనందరి కర్తవ్యం. నానన నాననా
ఉషశ్రీ షష్టిపూర్తి సన్మాన సంచిక- మార్చి, 1988 193
స్పయం వ్యక్తుడు - స్నేహశీలి శ్రీ బి.ఎన్, శాస్త్రిగారు శ్రీ బి.యన్. శాస్త్రిగారితో నా పరిచయం నేను ఎం.ఏ. చదువుకున్న నాటినుంచీ
ఉన్నది. ఆయన అప్పటికే వయస్సులో నాకంటే పెద్దవారు. నేను రెండో సంవత్సరంలో
ఉండగా ఆయన మొదటి సంవత్సరం ఎం.ఏ.లో చేరారు. అప్పుడు ముఖ పరిచయమే.
ఆయన మితహిత సత్యభాషి కావటం వల్ల పరిచయం స్నేహం దాకా అప్పుడు
సాగిపోలేదు. అప్పుడు మా తెలుగు శాఖకు అధిపతి ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు. ఆయనకు 'తన శిష్యులన్న ఎడదంగల (ప్రేముడి చెప్పలేని మెత్తన ” విద్యార్థులతో ఆయన ఒక మిత్రులుగా, తండ్రిగా, మార్గదర్శకులుగా ఉండేవారు. మా అధ్యాపకులలో ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారూ ఉండేవారు. ఆయన గొప్ప విద్వాంసులు, గొప్ప అధ్యాపకులు.
తెలుగుశాఖ విద్యార్థులలో గాఢమైన అధ్యయనాన్నీ పరిశీలననూ పెంపొందించే నిమిత్తం మేం ఫైనల్లో ఉన్న సంవత్సరం నుంచీ సెమినార్ ఉపన్యాసాలు ఏర్పరచింది. ఒక విషయాన్ని గ్రహించి దాని విభిన్నాంశాలు ఒక్కో విద్యార్థీ గ్రహించి, పరిశోధనపత్రం సిద్ధం చేయాలి. దాన్ని అధ్యాపకులు, పరిశోధకులు నగరంలోని విద్వాంసులు ఇతర విద్యార్థుల ఎదుట 'ప్రసగించాలి. మేం ఫైనల్లో ఉన్నప్పటి విషయం తెలుగు నాటక సాహిత్య వికాసం. మొత్తం 18మంది ప్రసంగాలు. నేను 'సంస్కృత రూపకాలు తెలుగు అనువాదము అనే విషయం (గ్రహించి సుదీర్హ ప్రసంగపత్రం సిద్ధం చేశాను. దానికో అనుబంధము కూడా చేర్చి (ఇది తరువాత జయంతిలో 1956 అక్టోబరు, నవంబరు, డిసెంంబరులలో ప్రచురితమైంది) తరువాతి సంవత్సరం శ్రీ శాస్త్రి ఫైనల్లో ఉన్నారు. ప్రల్యేక అధ్యయనాంశమైన శ్రీనాథుని సాహిత్యం ఆ సంవత్సరం ప్రధాన విషయం. శ్రీ బి.యన్. శాస్త్రి ఆ ప్రసంగాలలో తాము కాశీఖండం గురించి పత్రం సిద్ధం చేసుకున్నారు. ఆ మొత్తం ప్రసంగాలు పద్దెనిమిదే. శ్రీ శాస్త్రి చొరవ తీసుకుని ఆ ప్రసంగాలకు “శ్రీనాథ భారతము” అనే పేర ప్రచురించారు. తమ ప్రసంగం విడిగా కూడ కాశీఖండం-దాని ప్రాశస్త్యం అనే పేర అచ్చువేశారు. అప్పటికే ప్రచురణాంశంలో ప్రవేశం ఉన్న శాస్ట్రివల్లనే అది సాధ్యం అయింది 194
ఆకల సకుర్పీబ
శ్రీ శాస్త్రి ఏ ఉద్యోగంలోనూ చేరలేదు. ఒకవేళ చేరివుంటే ఒక సాధారణ
తెలుగు అధ్యాపకునిగానే ఉండిపోయేవారేమోనని తోస్తుంది. (గ్రంధ విక్రయం [గ్రంధ
ప్రచురణం ప్రధానంగా ఆయన జీవనం సాగించటం మొదలు పెట్టారు. బ్లద్బ్యాంక్-
నారాయణగూడ వద్ద ఆయన పుస్తక విక్రయశాల ఉందేది. నేను ఎం.ఏ. పూర్తి చేసి
పరిశోధకునిగా చేరిన తరువాత, శ్రీ మాదిరాజు రంగారావుతో కలిసి ఆయన దగ్గరకు
రాకపోకలు సాగించేవాణ్జి. అప్పుడు మా పరిచయం స్నేహంగా పరిణమించటం
ప్రారంభం అయింది. శ్రీ రంగారావు తొలి ప్రచురణల వెనుక ఆయన ప్రోత్సాహం ఉందని నాకు తెలుసు.
“ఇదం విష్ణుర్విచక్రమే” అన్నట్లుగా తరువాత శ్రీ శాస్త్రి వ్యక్తిత్వం ఎత్తు ఎత్తుగా పెరుగుతూ వచ్చింది. నల్గొండ జిల్లా దేవాలయాలు, చారిత్రకావశేషాలు, పురావస్తువులు, తాళ పత్ర గ్రంధాలు అన్నీ ఆయనకు (ప్రేరకాలు ఉద్చ్బోధకాలు అయి ఆయనలోని నిద్రాణంగా వున్న చారిత్రకుణ్ణి మేల్క్ళాలిపాయి. అపూర్వమైన శాసనాలు తొలిసారిగా ఆయన వల్ల వెలికి వచ్చాయి. ఆ క్షణం నుంచీ ఆయన వెనుకకు తిరిగి చూడలేదు. నల్గొండ జిల్లా దాటి తెలంగాణం అంతా ఆయనకు వీక్షాస్థాన మయింది. స్వయంవ్యక్త పరిశోధకులైనారు. తన పరిశోధనాంశాలు ప్రచురించేందుకు కూడా ప్రభుత్వం వైపో, ఆ సంబంధి సంస్థల వైపో చూడలేదు. తానే పరిశోధకుడు, ప్రకాశకుడు, విక్రేత అన్నీ అయి శరవరంవరగా (గ్రంధజాలాన్ని ప్రకటించ నారంభించినారు. ఈ వృత్తిలో చాలావరకు సాఫల్యం పొందారు.
శ్రీ చీమకుర్తి శేషగిరిరావు, శ్రీ బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వంటి అంతగా కీర్తి పొందని పరిశోధకులతో చారిత్రకులతో సారస్వత జట్టుకట్టి గోష్టీ ప్రసంగాలు నిర్వహించటంలో తోడ్చద్దారు. ఆ ప్రసంగాలు పుస్తకరూపంలోనూ ప్రకటింపజేశారు. స్వయంగా నన్ను తీసుకువెళ్లి నాకు చీమకుర్తివారితో పరిచయాన్ని ఒకసారి చేయించారు.
శ్రీ శాస్రి చేపట్టిన మహోద్యమాలతో జిల్లాల సర్వస్వాలు (ప్రకటించటం ఒకటి ఒక జిల్లాను ఒక ప్రాథమిక పరిశోధనాంశంగా గుర్తించి చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, మానవీయ సంపత్ స్థితులను విపులంగా సమకూర్చి వేల పేజీలతో ప్రకటించటం నెల్లూరు జిల్లా విషయంలో ఇటువంటి ప్రయత్నం అక్కడ జరిగింది అయితే శ్రీ శాస్త్రి తమ పూనికతో తెలంగాణా కంతా ఈ కృషిని కొనసాగించ పూనుకున్నారు. నల్గొండ, ఆదిలాబాదు, మహబూబునగర్ జిల్లాల సర్వస్వాలు
195
నుపుసన్న ఆ ప్రచురించారు. మరికొన్ని సిద్ధం చేశారు. ఒకసారి ప్రసంగవశాత్తు వరంగల్ జిల్లా సర్వస్వం నిర్మించే పూనికతో సమాచారాన్ని దాదాపు పూర్తిగా సేకరించినట్లు నాతో చెప్పారు. ఇదంతా పదిమంది కలిసి ఒక సంస్థగా, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ఆర్థిక వనరుల సహాయంతో చేసే పని. అయినా ఆయన జఒకృచేతి మీదుగా ఇంత దుర్గటమైన ప్రణాళికను చేపట్టి నిర్వహించారు. ఆయన ఈ కృషి పరిపూర్ణమైతే తెలంగాణా జీవన సంస్కృతులు అందరికీ తేజస్వంతంగా (ప్రకాశించేవి. ఒకవైపు జిల్లా సర్వస్వాలు, మరొకవైపు చారిత్రక పరిశోధనలు నిర్వహిస్తూనే గ్రంధ పరిష్కరణ, విపుల పీఠికతో ప్రచురించటం కూడా ఆయన చేపట్టారు. ఈ పద్ధతిలో ప్రకటితమైన ఒక (గ్రంధం "క్రీడాభిరామం * ఇంత కృషి కొనసాగిస్తూనే ఆయన తన మానస పుత్రికగా 'మూసీ” పత్రికను ఎన్నో సంవత్సరాలు నిర్వహించారు. సాహిత్య పరిశోధనలకు ఆలవాలంగా ఈ మానపత్రిక రూపొందింది. కొత్త రచయితలకు ప్రోత్సాహం ఇస్తూనే సంస్కృతి సంపన్నంగా దీన్ని తీర్చిదిద్దబం ఆయన ఏ. విలువలకు కట్టుబడి ఈ కార్యక్రమం చేపట్టారో తెలియజేస్తుంది. “మూసీ పత్రిక వెలవరించిన సాహిత్య, సాంస్కృతిక (ప్రత్యేక సంచికలు చాలా విలువైనవి. ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికల వతె దాచిపెట్టుకోదగినవి. శ్రీ శాస్త్రిలో ప్రకటితమ్రైంది సమగ్ర వికాసంతో కూడిన వ్యక్తిత్వం. భౌతిక సాంస్కృతిక అధ్యాత్మిక పార్భ్వాల సమన్వయం. అందుకే ఆయన ఇరవై ఒక్క సంపుటాలలో భారతదేశ చరిత్రను రచించారు. ఆంధ్రదేశ చరిత్రను అనేక సంపుటాలలో ప్రకటించారు. రజాకార్ల ఉద్యమం, నాటి జాతీయోద్యమ స్ఫూర్తి ఆధారంగా “విప్లవ జ్వాల” అనే చారిత్రక నవలను రచించారు. 'మూసీలో అది అనుక్రమంగా ప్రచురింపబడుతున్నది. తమ గ్రామంలో కొన్ని లక్షలు ఖర్చు చేసి హరిహర త్రిశక్తి దేవాలయం నిర్మాణం చేస్తున్నారు. అది పరిపూర్ణం కాలేదు. సాహిత్యంలోనుంచి, చరిత్రలో నుంచ్చి, జనజీవన సంస్కృతిలో నుంచి మౌలికమైన ఏకాత్మ దర్శనం చేసి తన వ్యక్తిత్వం యొక్క సమగ్ర స్ఫూర్తికి మెట్లు కట్టుకున్నారు. తాము సంపన్నులు కాకపోయినా, తమ స్వార్టితాన్ని జాతిశ్రేయస్సు కోసం వ్యయించిన మహావ్యక్తి శ్రీ శాస్త్రి. 196
ఆ నకువ్పీణ కొందరు రచయితలకు గుప్తంగా ఆర్థిక సహాయం చేసేవారు. ఎక్కడైనా ప్రకటంగా చేసినా అది ప్రచారమయ్యేందుకు విముఖతను చూపేవారు. ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య ఆధునిక విమర్శకుల గురించి నాలుగు (గ్రంధాలు రచిస్తే వాటిలో మూడింటిలో మూసీలో ప్రత్యేక భాగాలుగా ప్రకటించి విడిగా పుస్తకాలు అచ్చు వేశారు. నాల్గవది విశ్వనాథ విమర్శను గురించింది. అదీ ప్రకటించారు ఇంత పరిశ్రమ రచనా ప్రపంచం ఉన్నా ఎక్కడా ఆడంబరాలు లేని వ్యక్తి శ్రీ శాస్త్రీ ఏ ప్రచారం, ఆర్భాటాలు కాంక్షించని, సున్నితమైన హృదయం కలవారు. ఈ సందర్భంలో భర్శృహరి చెప్పిన పద్యం నాకు గుర్తుకు వస్తుంది. ఆయనను గురించి భావించినప్పుడు- జరయు, మృతియులేక జనునట్లు (ప్రాజ్ఞుండు ధనము విద్య గూర్చు దలపవలయు ధర్మ మాచరింపదగు మృత్యుచే జుట్టు పట్టి యీడ్వ బడెడివానివోలె ఈ పద్యంలోని పార్శ్వాలు రెండూ ఆయనలో రమ్యంగా సంగమించాయి. ననన ననన మూసీ (మాసపత్రిక) ఏప్రియల్ - 2003 197
శ్రీ చందన చంద్రిక శ్రీమాన్ టి.పి. రామచంద్రాచార్యులవారితో తొలి కలయిక రాజమహేంద్ర వరంలో ఒక సాహిత్య సమావేశంలో సుమారు పదిహేను సంవత్సరాలకు పూర్వం సంభవించింది. తొలి సమావేశంలోనే వారి వ్యక్తిత్వంలోని సౌహార్ట సౌరభం నన్ను లోబరుచుకొన్నది. శ్రీరామచంద్రాచార్యులవారి వాక్కూవక్ష్యృత్వం ఒక ఆత్మీయతా ముద్రవేసి కొన్నవి. సామాన్యశుష్కశాస్రవచనం వారికి సరిపదేదికాదు. వారి వాగ్రైఖరి అందరినీ సూక్తిమాలగా గుది(గ్రుచ్చేది. మా ఆచార్యులు, మహామహోపాధ్యాయులు, కవిశాబ్చికకేసరి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాధాచార్యస్వామివారి అంతేవాసిగా వారు శ్రీభాష్యాది గ్రంధాలను అధికరించటం వల్ల వారితో నాకు సతీర్ధలక్షణం సంభవించింది. నేను శ్రీ రఘునాధాచార్య స్వామి వారి వద్ద ఒకటి రెండు సందర్భాలలో కూర్చుని వారి అధ్యాపనకక్ష్యలో పాల్గొనే అవకాశం వచ్చినా ఏమి నేర్వనివాణ్ణి. పర్వతమందూ పరమాణువునందూ గల పదార్థత్వ సామ్యమే మా నడుమనున్నది. శ్రీరామచంద్రాచార్యులవారి రచనల్లో మూర్ధన్యమైంది 'కృష్ణమయ్య'. ఇది సింహగిరి నరహరి వచనాలకు సంపూర్ణ నిధి గ్రంథం. సింహగిరిస్వామి సన్నిధినే జీవించే స్వామివారు ఈ పనిని నిర్వహించటం ఎంత (ప్రియమైన కైంకర్యమో స్వామికి చెప్పటం సాధ్యంకాదు. ఈ (గ్రంధానికి ముభాలంకారంగా సంతరించిన 'కృష్ణమయ్య' సింహగిరి కృష్ణమాచార్యులువారి జీవనవృత్తాంతం ఎంతో విలువైంది. కాల్పనికత్ర, అతిలోక సన్నివేశాలు ఉన్నా రచన అంతా నవలలాగా 'ప్రత్యక్షీకరించింది మహాత్ముని జీవితాన్ని తంజాపురపు వ్రాత ప్రతులలో నుంచి వారు సంపాదించిన వచనములు ఇంకా పరిష్కారం పొందవలసే వున్నాయి. ఉభయవేదాంతపారంగతత్త్వము, రెండవ వైపు సాహిత్యవిద్యాపారమ్యము సంగమించిన స్వామి వారు మాత్రమే ఈ పరిష్కరణ పూర్తి చేయగలరని నాకు తోస్తున్నది. ఈ విన్నపాలవెనుక ద్రావిడ ప్రబంధపు 198
ఆ నకుద్పీఐ మూలాలున్నాయి. ఆచార్య పురుషులు అందించిన స్తోత్ర వాజ్బయమూ ఉన్నది. రెండు వాకలను తమలో సంలీనం చేసుకోగలిగితే తప్ప సింహగిరివచనాల పరిష్కరణ సాధ్యంకాక పోవచ్చు
వచన వాజ్మయం తొలుతగా మొలకెత్తిన వీరశైవవాజ్బయం-కన్నడ సాహిత్య సంబంధాలూ అధ్యయనం చేయాలి. ఇన్నింటికీ మూలంలో ఉన్న సంగీత సంప్రదాయం ఎరిగి ఉండటమూ అవసరమే. ఈ వచనగాన పద్ధతికి అధారాలు దివ్యప్రబంధ గాయకులైన అరయర్ అభినయంలో దొరికే అవకాశమూ ఉన్నది. వీరి విశిష్టతకు మరొక ఉదాహరణం 'ఆర్యోక్తి సుధ సుందర పాండ్యుని నీతిద్విషష్టిక గాధకు వివరణం ఇది ఈ వివరణం సర్వజనులకు సులభగ్రాహ్యమై జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడుతున్నది. “'విశ్వప్రతిష్ట ధర్శమైతే-సామాజిక వైయక్తిక జీవన సరళికి మార్గదర్శనం నీతి” అని పరమపూజ్యలైన చినజీయర్‌స్వామివారు తెలియజేసినారు. దీనిలో నీతివిశేషాలు లోక ప్రవృత్తిని, వ్యాఖ్యానించేవి, తృణమపి దుగ్భాయ గవాం. దుగ్ధమపీ విషాయ సర్పాణామ్ యత్మించన ్రలాపీ, పరమర్శ కూతూహలో విగతలజ్జః సర్వక్రియాసుశక్తః భవతిచ పారిప్లవో మూర్ధః,” “లోకప్రతీక్షణప రోనరో న కృతకృత్యతాం యాతి. ఇలా ఈ (గ్రంథంనిండా ఎన్నైనా రత్నాలు వెతుక్కోవచ్చు. జీవనతత్త్వాన్ని మధించిన నవనీతం ఈ ఆర్యోక్తిసుధ. వారి 'సిద్ధాంత కుసమాలు-సంప్రదాయ సౌరభాలు” విశిష్టమైన రచనావిశేషం సామాన్యులకు సిద్ధాంత రహస్యాలను విశదంగా తెలియజెప్పే గ్రంధం. అద్దంలో (ప్రపంచాన్ని చూపినట్లు శాస్తసంప్రదాయ రహస్యాలను, విశేషాలను, గ్రంధగ్రంథులను వివరించారు, అసాధారణ (ప్రసన్నసౌకుమార్య వచనంలో శ్రీరామచంద్రాచార్య స్వామివారు ఉపనిషత్తులలో వివరించిన ముష్ఫైరెండు విద్యారహస్యాలు, భక్తి భూమికలు, శరణాగతి స్వరూపం, రహస్యత్రయము, అర్ధపంచకము ఇన్నని షమి-ప్రపన్నునికి కావలిసిన సర్వవిషయాలకు ఇది విశిష్ట సంపుటి. శ్రీస్వరూప నిర్ణయం విషయంలో పడగలై, తెన్‌గలై వారికి గలభేదాన్ని అత్యంత సుకుమారంగా చెప్పకుండానే వివరించటం ఈ రచయిత గడుసుదనాన్ని తెలియజేస్తుంది. వారి 'సింహాచలక్షేత్రమానోత్యము' ఇలవేల్చునకు సమర్పించుకున్న పూజా పుష్పం. 199
సుప్రుకన్ను ఆలి శ్రీ టి.పి. రామచం(ద్రాచార్యులవారి సప్తతి ఉత్సవ సందర్భంలో మనం ఆశించగలిగింది-త్రీ వైష్ణవ విశిష్టాద్వైత సంప్రదాయానికి దీపస్తంభాలుగా నిలువగల మహాగ్రంధాలను, అవి సామాన్యులందరికీ తమ శైలీ సొందర్యముతో దరిచేర్చుకుని, విషయ వివరణతో అంతః పరిణామాన్ని కలిగించి ముముక్షువులుగా తీర్చిదిద్దాలని. ఇదంతా భావిస్తున్నప్పుడు నాకు విశ్వనాధ సత్యనారాయణ వాసిన పద్యాలు (38 సంవత్సరాల క్రింద (వ్రాసిన “చందనయాత్ర' పద్యాలు) గుర్తుకు వస్తున్నాయి. వాటిలో ఒకటి- ఒక చిత్రంబది నీకు చూపెదను రావో చెల్లెలా ! సింహనా మకమౌ పర్వత మొక్కడున్నది ధునీమంజూషికాభూత మ ల్ల కొసన్ గందపుపెళ్ళ లూద్చికొని మల్లాడుంజుమ్ 1 పోత్రి తా నొక యేడాదికి నొక్కనా డదియు నే డోస్ ! దృశాభాగసీ 1 శ్రీరామచంద్రాచార్యస్వామివారి జీవితంలోను, మన జీవితంలోనూ ఆ ఒక్కనాదే ప్రతిరోజూ కావాలని, వరమైన శ్రేష్టమైన అహస్సు ఉదయంగా బ్రతుకు వెలుగొందాలనీ ఆశిస్తున్నాను. స్వస్తి. శ్రీ రామచంద్రాచార్య సప్రతి పూర్తి సంచిక 2008 200
ఈ తరంవాని భాగ్యం
తెలుగు సాహిత్యంలో నంన్కృతేతిహాన వురాణాలను మళ్ళీ అనువచించే సంప్రదాయం ఒకటి ఆదినించీ ఉన్నది. “'మునివృషభాభిపాత మవోభారత ఇద్ధ నిరూపితార్థు మేర్చడ నన్నయ్యభట్టు తెలుగులో మనాభారతం పలకడం ప్రారంభించినాడు. తీకున ఎఅినలు ఆ మార్గమే అనుసరించినారు. అయితే మూలం ఆధారంగా సమకాలీన
మ.
పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, శ్రోతల జ్ఞాన గ్రహణ పరిమితుల దృష్టిలో ఈ అనువచన ధోరణి ప్రారంభమయింది. అందువల్లనే మూబంబోని అనేకాంశాలు -సామాజిక ధార్మికాంశాలు- ఈ రచనలో కనిపించవు. ముఖ్యంగా భగవద్దీత, సన త్సు జాతీయము మొదలైన అనేక ప్రముఖ గ్రంథ భాగాలు లోపించినవి. అయితే మూలం ఒక ఆధారమై
కవుల స్వేచ్భాచారణానికి అవకాశ మిచ్చిన ఈ రచనలు నన్నయాదుల కవితా శక్తికి
నికషోపలాలు అయినవి. మహాభారత మూల (గ్రంధ నిర్మాణవైఖరి, ఇతిహాస కథాంశ
ప్రత్యేకతలు, అనేక జ్ఞాన విజ్ఞాన భాగాలు తొలగి పోయినవి.
ఈ స్వాతంత్ర్య ధోరణి వాల్మీకి రామాయణం తెలుగులోకి తెచ్చినప్పుడు కూడా ప్రతిఫలించింది. భాస్మర రంగనాథులు లెండు మార్గాలను ఎన్నుకొన్నాా అనువచన పద్గతి నన్నయాదుల మార్గమే. అవాల్మీకీయ కథాంశాల 'ప్రకారం కూడా ఎక్కువగా,
ప రామాయణాలలో చోటు చేసికొన్నది. శ్రీనాథుని కాలంలో నైషధాదుల అనువాదం వచేసరికి ఈ స్వాతంత్ర్యం కొంచెం కుంచించుకుపోయింది అయినా భాషలోని పూర్వ సంప్రదాయం శాదిత్యంబు ప్రోషించియు, అనౌచిత్యంబు పరిహరించియు' సాగింది.
ణి
ఇతివోసం, పురాణం ఈ శెండూ వస్తు ప్రధాన రచనలు. కావ్యాలు భావ పభానాలు. నాటకాలు పద'ప్రధానాలు. అందువల్లనే కవుల ప్రయత్నమంతా పురా౭తి ల అనువచనమే శ్రీనాధుని నైషధం వడలివేస్తే కావ్యాలు నాటకాలు ప్రాలన సాహిత్యం పట్టించుకున్నవాళ్ళు లేరనే చెప్పాలి. ఏమైనా అనువాదం చేయవలసి వస్తె నాటకాలు కూడా కావ్యాలుగా రూపొందాయి
19వ శతొబ్దంలో పాళ్చాత్యే సాహిత్య సంపర్కం వల్లి, సాహిత్య దృష్టి ప్రధానం
వేయడం - అంతప్పులను నిర్ణయిం పతిభా విశేషాలను అంచనా ర్ణ కావడంపిలి కవల (6 201 సరి యనే ఆం ధాలు జ (౧ 1 ఇ. ఖ(నీ $ ౫0. 6. 2ఏషఖ మ ఓ
సుప్రసన్న ఆమ ప్రారంభం కావడంవల్ల రచనా ప్రపంచంలో మార్చు వచ్చింది. కవుల కౌశలం ఎంచుకునే ధోరణి పెరిగింది. సాహిత్యానువాదం ఆయా కవుల ప్రతిభా ప్రకటనకే కాని అనువక్త ప్రతిభా ప్రకారం కోసం కాదని ఒక నిశ్చిత భావం ఏర్పడ్డది. అందుకే శరపరంపరగా కావ్యనాటకాదుల అనువాదం (ప్రారంభం అయింది. మూల రచయితకు న్యాయం జరుగలేదనే ధోరణిలో ఒకే (గ్రంథానికి అనేకానువాదాలు ఏర్పడ్డవి. ఒక్కమేఘదూతానికి, ఒక్క శాకుంతలానికి ముప్ఫై పైగా అనువాదాలు రావడానికి ఇదే కారణం. ఇదే శతాబ్దంలో పురాణేతిహాసాల అనువాదం కూడా మళ్ళీ జరిగింది. శ్రీపాద వారు మళ్ళీ భారతం నిర్మించడం ఈ దృష్టితోనే. వావిలికొలను సుబ్బారావు గారి రామాయణం ఈ మార్గంలో నడచి సాగిన మరో రచన. ఆయన అనువాదంతోపాటు రామాయణానికి ప్రచారంలో ఉన్న వ్యాఖ్యానాలు ఆధారంగా ఒక బృహద్వ్యాఖ్య నిర్మించి మందరమనే పేర అందించారు. వాల్మీకి రచనకు ఏఏ వ్యాఖ్యాన విశేషాలు అన్వయిస్తున్నవో అవన్నీ దీనికీ అనువర్తించగలవని వావిలికొలను వారి అభిప్రాయం. వావిలికొలను వారి దృష్టిలో రామాయణ రచన ఒక విశిష్ట స్థానంలో ఉన్నది అనే కాధ్యాత్మిక సంప్రదాయాల బీజగర్భితత్వం దీనిలో ఉన్నదని. అయితే, మనకు రామాయణం వేదోపబ్బంహణార్థమని భావించే ధోరణి ఒకటైతే కావ్యకళాదృష్టతో ఆద్యంతమూ విలువగల రచనగా ఆదికావ్యంగా పరిగణించడం ఇంకో దృష్టి. ఈ దృష్టిలో వాల్మీకి రచనను యథాతధంగా “తుచ తప్పకుండా” తెలుగులోకి తెచ్చే ప్రయత్నం ఇంత కాలానికి రామానుజ రామాయణం” వల్ల జరిగింది. రామానుజ రామాయణం రచించిన మిత్రులు శ్రీ శ్రీనచ రామానుజా చార్యులుగారు నాకు ఆప్తమిత్రులు. తనలో నిద్రించి ఉన్న కవితా కుండలినిని మనో వాల్మీకంలోనించి తట్టిలేవి యేభై నంవత్సరాలు దాటిన ప్రాయంలో వాల్మీకి రామాయణాన్ని తెలుగులోనికి తీసుకువచ్చారు, దీక్షగ్రా ఆరున్నర సంవత్సరాల యజ్ఞంగా. రామాయణ మూల రచనకు అధ్యాత్మిక, ధార్మిక, సామాజిక, భాష్టా సంబంధి, కళాత్మక ముఖాలు అనేకంగా ఉన్నవి. అయతే ఈ అనువాదంలో భాషా కళాముఖాలకే (ప్రాధాన్యం ఉన్నది. వీలైనంతలో ఆయన శ్లోకం ఇముడగల దేశిచ్చందస్సులను ఎన్నుకోవడం, వీలైనంతలో దేశ శబ్దజాలాన్ని ఉపయోగించడం ఈ రచనలో ఉన్న విశేషాలు. శ్రీ.న,చు రామానుజాచార్యులుగారు వ్యాఖ్యానాలు పరిశీలించి అర్ధ విస్పష్టతను సాధించారు. అయితే ఆ ధోరణిలో విస్తరించి వ్యాఖ్యానించే (ప్రయత్నం ఎక్కడా చేయలేదు. 202
ఆహీలకుబ్పీబు ఆ ప్రలోభానికి లొంగక పోవడం - తన వ్యక్తిత్వాన్ని మరుగు పరచుకోవటానికి చేసే ప్రయత్నం - ఒక అసాధారణ సాఫల్యంగా నేను భావిస్తున్నాను.
అనువాదం చేసే సందర్భంలో పద్యం క్రమంగా సారళ్యం పొందింది “బడు ను పరిహరించినా, సంస్కృత వాక్య విన్యాస ధోరణిని పరిహరించడం సాధ్యం కాలేదు. కొంచెం ఆ మార్గం అలవాటయితే, సంస్కృత రామాయణం చదువలేని వాళ్ళు, దాన్ని చేరలేనివాళ్ళు దీన్ని చదివి వాల్మీకి ప్రతిబింబాన్ని పోల్పుకోవచ్చును.
ఈ అనువాద కార్యానికి తొలి ప్రోత్సాహం శ్రీ ఉషశ్రీది. అయితే ఈ రచనా సందర్భంలో అనువాదాన్ని మూలంతో సరిపోల్చుకుంటూ వినే అవకాశం నాకు చాలావరకు కలిగింది నా పరిమితిలో కొన్ని చోట్ల చర్చించటం. శ్రీ.న.చ రామానుజా చార్యులుగారు కొన్ని చోట్ల మన్నించడం జరిగింది. కొన్నిచోట్ల తమ దృక్చధాన్ని విశదీకరించడం జరిగింది. ఒక విధంగా నాకు రామాయణాధ్యయనం చేసే అవకాశం, వాల్మీకిని అత్యంత సన్నిహితంగా ఎరిగే స్థితీ కలిగింది.
శ్రీ.న చ రామానుజాచార్యులుగారి మాట ఎంత “కచ్చితమో'- జీవితంలో ఎంత (క్రమశిక్షణో - రచనలోనూ అంతే కచ్చితమైన క్రమశిక్షణ గల లక్షణము వ్యక్తమవుతుంది. ఎక్కడా అనమగ్రతతో ఆయన రాజీవడలేదు. ఎంత క్లిష్టమైన ఘట్టంలోనూ 'నామూలం లిఖ్యతే'- అన్న మార్గం ఆయన వీడలేదు.
పారిభాషిక పదబహుళంగా ఉందే యజ్ఞ ఘట్టమూ, విశేషణాల పరంపర కలిగిన ఆదిత్య హృదయము, దేశ భౌగోళిక స్వరూపాన్ని వర్ణించే కిష్కింధలోని మార్గోపదేశమూ, అన్నీ ఈ క్రమశిక్షణలో సాగినవి. విశిష్టాద్వైత సంప్రదాయంలో ఐహు విశేషభావనలకు తొవిచ్చే రామాయణ విశేష శ్లోకాల సంపుటికి 'తని శ్లోకి అని పేరు. ఆ శ్లోకాల రచనలో కూడా కత్తివాదర మీద నడకలాగా ఈ అనువక్త రచన సాగించి దీనికి రామానుజ రామాయణం అన్న పేరుంచడంలోని బెచిత్యాన్ని బుజువు చేశారు.
అయితే శ్రీ.న.చ. రామానుజాచార్యులుగారు గురుకుల క్షిష్పలవునో కాదో కొని ఆంధ్ర మహాభారత సముద్రము దరియంగ నీదిన ప్రయోగదక్షులైన విద్వాంసులు. ఏ సందేహం కలిగినా పూర్వకవి ప్రయోగమును చప్పున ఉదాహరించగలవారు కవిగా ఆయనకు ఈనాటిలోకం మీద ఉన్న నిరసన ధోరణి అంతా మూర్థ శతకంలో మికిలి
203
నుత్రునన్న ఆ కటువుగా వ్యక్తమవుతున్నది. రామానుజ రామాయణంలోని అనువాద ధోరణిని పరిశీలించడం, పైన పేర్ళొన్న అంశాలు ఆధారంగా జరగాలి తేషాం కేతురివ జ్యేష్టా రామో రతికరః పితుః బభూవ భూయో భూతానాం స్వయంభూ రివ సమ్మతః (బాల-18-23) దీని అనువాదం - వారిలోన పెద్దవాడు రాముడు పతా కమ్మువోలె ప్రీతికరుడు తండ్రి కఖిల భూతతతికి ఆత్మభవుం డట్లు సమ్మదమ్ము గూర్చు సంతతమ్ము ఈ అనువాదంలో '“పతాకమ్ము' అన్నమాట పాదాంతంలో గురువు మీద విరిగి విలక్షణమై తన వ్యక్తిత్వ ప్రత్యేకతను చాటుతున్నది. ఇక్కడ కవి పదాన్ని ఎన్నుకోవడంలో "కేతు! శబ్దం తొలగిపోయి మరింత అసందిగ్ధతను చాటుకున్నది. (ప్రియాతు సీతా రామస్య దారాః పిచ్చళ్ళతా ఇతి గుణా ద్రూపగుణాచ్చాపి ప్రీతి ర్భూయో భ్యవర్థత (బాల-77-96 దీని అనువాదం - ప్రీతిపాత్ర యయ్య సీత రామునకును తండ్రి కూర్చినాలు తానగుటను గుణము వలన రూపగుణమున "సైతము పెంపు మీరు చుండె ప్రీతి మిగుల ఈ పద్యంలో మూలం ఎక్కడా చెక్కుచెదరక పోవడం, సంస్కృతం పలుకుబడి తెలుగులోకి అందంగా దిగిరావడం గమనించవచ్చును. అసిధారావ్రతంగా ఈ అనువాద కార్యం నిర్వహించిన రామానుజా చార్యులుగారిని అభినందించడం తప్ప మనం చేయగలిగిన దేముంది? వాల్మీకి గిరి సంభూతయైన రామాయణ మహానది తేలుగృ శ్లేత్రంల్రోక్షి ఇంత సులభంగా ప్రవహించడం ఈ తరం తెలుగువాళ్ళ భాగ్యం ఈ యజ్ఞం పూరిచేని అవబ్భిధ స్నానం చేసిన రామానుజాదార్యులుగారిని వారి షష్టిపూర్తి సందర్భంగా హృదయ పూర్వకంగా అభినందించడం, వాల్మీకిని ఇష్టపడే సాహిత్య (ప్రవాహ వీరీ సాంయాత్రికు అందరికి ధర్మం. ంవపాద షత ళావకాాాా 204
కోవెల సుప్రసన్నాచార్య జననం ; 17 మార్చి 1986, వరంగల్ చదువు ఎం.ఏ; పిహెచ్డి. (ఉస్మానియా) సర్టిఫికేట్ కోర్సు ఇన్ లింగ్విస్టిక్స్ డిప్లామా డి మెరిటో (యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్, ఇటలీ) ఉద్యోగం “=. లెక్చరర్ (1959) రీడర్ (1969) (ప్రొఫెసర్ 1983) ప్రిన్సిపాల్స్ యూనివర్సిటీ ఈవెనింగ్ కాలేజ్, వరంగల్ (1987-90) హెడ్ డిపార్ట్మెంట్ అఫ్ తెలుగు 1990-98 డీన్, ఫాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ (1985-88) ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ (1985-87, 1993-96) ప్రిన్సిపల్స్ మాస్టర్టీ డిగ్రీ కాలేజ్ 1999-2002 ఇతరాంశాలు ; ఇతర విశ్వవిద్యాలయాలలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్, మెంబర్, హైపవర్ కమిటీ, తెలుగు విశ్వవిద్యాలయం 1993 మెంబర్, అకాడమిక్సెనేట్, తెలుగు విశ్వ విద్యాలయం (1993 నుంచి గ్రయెంబర్స్ ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫన్స్ (1987 నుంచి సాహిత్య విద్యాసంస్థలు వ న్థాపకాధ్యక్షులు ; సాహితీ బంధుబ్బందం (1955) న్థాపక సభ్యులు : కులపతి సమితి (1960) స్థాపక సభ్యులు : జాతీయ సాహిత్య పరిషత్తు- హైదరాబాద్ (1974) విశ్వనాధ భారతి (1994) వరంగల్, అజీవసభ్యులు మెంబర్, జనరల్ కౌన్సిల్, ఆం(ధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ (1964-73) సభ్యులు : హైపవర్ కమిటీ, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (1993-96) అధ్యక్షులు : ద్రవిడియన్ స్టడీస్ సెక్షన్ ఆలిండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ (1987 కోల్కత్తా) సంయుక్త కార్యదర్శి : పోతన విజ్ఞానపీరం, వరంగల్ కార్యదర్శి & కరెస్పాండెంట్ ; శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల (2003 నుంచి
న ల. వ పిహెచ్డి. 20, ఎం.పిల్ 16, దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల జాతీయ అంతర్జాతీయ సెమినార్లో పాల్గొని సుమారు 50 పరిశోధన పత్రాలు సమర్చణ
పరిశోధన పత్రాలు
ప్రచురితాలు న 120 సుమారు
ముద్రిత (గ్రంధాలు
కవితలు : హృాద్దీత (1954, అనందలహరి (1956)
(శ్రీ సంపత్ముమారతో కలిసి రచించినవి) తేజశ్చక్రము (1956), అధునా (1964), బుతంభర (19? పాండిచ్చేరి గీతాల పన్నెండు (1875) శ్రీ పాంచాలరాయ శతకము (1977) శతాంకుర (1987), స్తుతి ప్రబంధము (1958) కన్నీటి కొలను (1995), కృష్ణరశ్మి (1996) శ్రీ నిరుక్తి (1998), శ్రీ నృసింహ (ప్రపత్తి (2001) సాంపరాయం (2002), శేఫాలిక (2003) మజణిసేకువు (2003), ప్రీతి పుష్కరిణి (2004) విమర్శలు ఏ సాహిత్య వివేచన (1971), సహృదయ చక్రము (19838) విశ్వనాధ మార్గము (1992) భావుక సీమ (1993) పోతన చరిత్రము (సమీక్ష 1996, అధ్యయనం (2001) చందనశాఖి 6001), దర్పణం 2004, సమర్పణ 2004 సమర్చన 2004 వచన రచన వ దీపవృక్షం (000, సంపొదిత గ్రంధాలు : వసుచరిత్ర (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ) 1067 చేతనావర్తము శ (సాహితీబంధుబృందము) 1967 అగ్నిగర్భ (జాతీయ సాహిత్య పరిషత్తు) 1074 విశ్వనాథ వాజ్మయ సూచిక (1976) హిరణ్యగర్భ (జాతీయ సాహిత్య పరిషత్తు 103 దూపాటి వేంకటరమణాచార్యుల జీవిత చరిత్ర (1987) సాహితీ సంపద (సంపత్కుమారాచార్య అభినందన సంచిక్తు 1993
శ్రీ భాష్యం విజయసారధి కృతిస్వర్ణోత్సవ సంచిక (1995) వి.ఆర్. అంబేద్మర్ రచనలు సంపుటము 5, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ (1995) నవ్యాంధ్ర సాహిత్య వీధులు (1995) విద్వారణ్య విద్వద్దోప్టి (2 సంపుటాలు) విశ్వనాధ అసంకలిత సాహిత్యం వార్దాంశాలు [5 (19897) రూపకాలు సంపాదకీయాలు 17 (19895) ఏకశిలా సాహిత్య సౌందర్యము (1993) కాకతీయ విశ్వవిద్యాలయంలోని విమర్శన పత్రిక “విమర్శిని? 5 సంచికలకు సంపాదకత్వం “జనధర్మ ద్వైమాసిక సాహిత్యపట్రిక (1969-71) ఉస్మానియా విశ్వవిద్యాలయం (ప్రచరించిన ఆంధ్ర మహాభారత సంశోధిత ముద్రణ సంపాదక మండలి సభ్యులు : పీరికలు, సమీక్షలు సమకాలీన గ్రంథాలపై సమీక్షలు, 60 పైగా పీరికలు ముందు మాటలు. అవార్డులు, గౌరవాలు : ఉత్తమ అధ్యాపక బహుమతి (ఆం.ప్ర ప్రభుత్వము) 1987 ఉత్తమ కవిత బహుమతి (తెలంగాణా రచయితల సంఘం) 1955 “సాహిత్య వివేచనికు ఉత్తమ విమర్శ (గ్రంధం బహుమతి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ (1971) ఉత్తమ పరిశోధకునిగా ప్రతిభా పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం (1997) ఉత్తమ విమర్శకుడిగా జీవియస్ సాహితీ పురస్కారం (2001) “శ్రీన్సృసింహ (ప్రపత్తి ఉత్తమ పద్యకవిత వురస్కారం - ఆం(ధ్రసారస్వత సమితి 2001 మచిలీపట్నం ఉత్తమ విమర్శగ్రంధం “అధ్యయనం పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం, హైద్రాబాద్ (2002) వానమామలై వరదాచార్య స్మారక పురస్కారం (కోరుట్ల) 2004
మరికొన్ని అంశాలు: కొన్ని కవితలు ఇంగ్లీషులోకి, హిందీలోకి అనువదింప బడ్డాయి. కోవెల సుప్రసన్నాచార్యులు - వాబ్మయ జీవిత సూచిక టి. శ్రీరంగస్వామి (1991) సుజ్రసన్న - సమన్విత విమర్శ ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య (2000) 'ప్రసన్నశారద (సుప్రసన్న షష్టిపూర్తి అభినందన సంచిక) (1997) “సుప్రసన్న సాహితీ వైజయంతి” (సుప్రసన్న సాహిత్యంపై రెండు రోజుల సాహిత్య గోష్టి (శ్రీల సాహితి) (1997) 1982లో వరంగల్‌లో జరిగిన పోతన పంచశతి ఉత్సవాల నిర్వహణలో - ముఖ్యంగా సంగోష్టుల నిర్వహణలో కార్యదర్శి. సుప్రసన్న రచనలపై కేంద్ర విశ్వవిద్యాలయం (హైదరాబాదు), తెలుగు విశ్వవిద్యాలయం (రాజమండ్రి), కాకతీయ విశ్వవిద్యాలయంలలో ఎంఫిల్ పరిశోధనలు జరిగాయి. అవధానాలు వ 1978-75ల నడును సుమారు 70 అమ్టావధానాలు నిర్వహణ శ్రీ శృంగేరి జగద్గురువులు భారళతీతీర్థస్వామి, మాజీ (ప్రధానమంత్రి శ్రీ పి.వి. నరసింహారావుల సమక్షంలో జరిగిన అవధానాలలో వారి ఆశీస్సులు, అభినందనలు పొందారు. వందేమాతరం ప్రచారోత్సవం ఏ “వందేమాతరం” ప్రచారోత్సవం - 1999-2000లలో భారత (ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్యక్రమాలలో కాకతీయ యూనివర్సిటీ ప్రాంత సంఘానికి అధ్యక్షులు, నెహూ యువ కేంద్రాలు, ఎన్.ఎన్.ఎస్. శాఖవారి సహకారంలో క్ష కార్యక్రమాలు నిర్వహింపబద్ధాయి. ఇతరాంశములు వ్. 'శ్రీగురుతత్త్య వైజయంతి సద్దురు శ్రీ శివానందమూర్తి గురించిన జీవితము ఉపదేశము సంగీత రూపకము (1998) న 2 శ్రీ పి.వి. శేషయ్యశాస్త్రి నేళ్ళత్వంలో సంగీతము క్ర రృబడి దర్ య్ ఉగొరత ష్ ఆడియో కాసెట్ విడుదల చేయబడింది, చై భాం ఖో శ్మేగురువచన చంద్రిక (1999) సద్గురు శ్రీ కందుకూరి [4010 ఢి షం శి౧నందమూర్తి ఉపదేశముల సారముగా రచింపబడ్డ 16 ల బలీ జాల సంపుటి. వ చ జో ళో ష్ష్షైహాల డ్ స్ట డడ
| ॥ ళ్ _ _ కవిగా పద్యవిద్య మీద గాధానురాగంవున్నాా ఆధునిక కవిత్వ చేతనను ఆవిష్మరించడంలో వచన పద్యానికి గల అంతశ్శక్తిని న అంగీకరించి - సమర్థించిన వ్యక్తి శ్రీ సుప్రసన్న. స్తిమిత చిత్తంతో, మూడు తరాల భిన్న భావసరళులకు చెందిన రచయితల కృషిని అంచనావేయడంలో ఆయన విలువైన సంయమనం పొటించగల వ్యక్తి ఇందుకుగాను. స్థిరపడిన సూత్రీకరణల మీద కంటె, మనోధర్మం మీదనే ఎక్కువ . అధారపద్దారని తోస్తుంది. - || స్వభావతః' సాత్త్వికులైన శ్రీ సుప్రనన్నలో యోగ విషయాఖిరతి, కేవలం. స్వీయ _ సాధనాత్మీయాంశంగా . | మిగిలిపోలేదు; సాపొత్య, జీవన విషయాలను విశ్లేషించే | సాధనంగా పరిణమించింది - _ ఈ సాత్త్విక పరిక్రమం, శ్రీ సుప్రసన్నను మిగిలిన తెలుగు సాహిత్య విమర్శక పరిశోధకులకంటె భీన్నునిగా నిలపింది. -
- ఇంద్రగంటి శ్రీకాంతశర్మ || న స . క. ఖల