Telugu sahithi sumaalu - anilvaranasi/indianlanguages GitHub Wiki
ం క్. న.
నాసొత్ మనూలు (భారతీయ రచయితల పరిచయాలు పవ. ్ర్రదరంలా! (| నలిమెల భాస్కర్ ౫01 నయనం ప్రచురణలు సిరిసిల్ల.
5గగ[1101108 50%44410 | జ బ/౦౧/65 ౦0 ౧6|| ॥/ ( 020౧ 1/69) (౧ లి 10 ద ౨౯ 14౬1౬౬4 81145గకగ 0 గ | అంగ్యరపం (అ తీట110/ ర్ట్ణ / ష్ త దర ౯150040 15066 : ఓ ల6౦., 2000 రలోకీ మ ౧/09 : ౧6. 25-00 భి ంలాా-య ఖ్ / ఢం అభ్య ; ఉ౦0 గర్సోడ్ష రో 016010 శో య పంల ఫ12800 ౪6౧8219902 నా, ఆ 122040) ౯౬0౧6160 పస లా ద్.ర05 కష. న;200401204 : 10. 8 [01 000195 ; సీ'3. 542౪1071 1.00. 25-4-2709, ౪ 90౧౧60౪”, 12206506 003, 8092 (0) [12౭౧2౧ ని20%0140214 6-5-101 00202020 3/0112-505 301. & 4॥ [604186 8001. 5669 ౧ 4.5 00గ౧౦966 41 12510/ 1296 620%,0 గగగి|11040|గి. పట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఇర్జిక సహహాళంతో ముభ్రించబడింది
“సుమ” సొరభాలికో సాహిత్యవ్వారాలు తెరచిన భాస్కరుడు!
సాహిత్య పరంగా ఇప్పటికే మనమంతా కొన్ని వైరుధ్యాల మధ్య జీవిస్తున్నాము. మరీ ముఖ్యంగా బారతీయ భాషల సాహిత్యానికి సంబంధించి విరోధాభాస స్టితిని ఎదుర్కొంటున్నాము.
మనదేశంలోని సాహిత్య వేత్తలకు, సాహిత్యాభిమానులకు యూరోపియన్, రష్యన్, అమెరికన్, ఆఫ్రికన్ సాహితీ వేత్తలు, రచయితల గురించి ఎంత ఎక్కువ తెలుసో మన పొరుగునే వున్న సోదర భాషా సాహిత్యాల గురించి అంతే తక్కువ తెలుసు! కొందరికైతే “ఇండియన్ లిటరేచర్” వ్యవహారం మనకెందుకు అనే గర్వం కూడ వుంది. అయితే గత మూడు దశాబ్దాల కాలంలో ఈ దుస్థితి మారిపోయింది. పరస్పరం అనువదించుకొని “ఆదాన్- ప్రదాన్” అనే ఇచ్చిపుచ్చుకొనే మహోన్నత సహోదర సాహితీ సంప్రదాయాన్ని కొనసాగించారు కానీ ఇటీవల కధలకు తప్ప ఇతర ప్రక్రియల అనువాదాల్లో మళ్ళి ఈ సత్ సాంప్రదాయం బాగా సన్నగిల్లిపోయింది.
ఈ తరుణంలోనే మిత్రులు నలిమెల భాస్కర్ తమకున్న పరిధిలోనే అనేక భారతీయ భాషలు నేర్చుకొని “అనుసంధాన వారధిని” మరింత పటిష్టం చేస్తూ వచ్చాడు. “ఆంధ్రజ్యోతి ' ఆదివారం అనుబంధంలో 35 వారాలపాటు వరసగా “సాహితీ సుమాలు” వెదజల్లి మనకు తెలియని మనవారినే పరిచయం చేసి మనకున్న సాహితీ పరిజ్ఞానాన్ని పెంచాడు.
ఈ పదచిత్రాల్లో 17వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ఉరూ కవి మార్ నుంచి ఇరవైయవ శతాబ్దం చివర అంకురించి ఆకస్మికంగా అంతరించిన కొండజాతి అక్షరం “ఛుని” దాకా మనం ప్రయాణం చేస్తాం.
వీటిలో వివిధ భారతీయ బాషల్లోని రచయితల పరిచయాలను భాస్కర్ అద్దంలో కొండంత ఆకారంగా మనకు చూపించాడు. సంస్కృతం “సాత్వలేకర్' మొదలు మనవాడైన తెలుగు పెద్ద
యా న్
సామల సదాశివ గురించి ఈతరం చదివితే-అపారమైన వైదుష్యం, కళాత్మక హృదయం ఆ వ్యక్తిత్వాల్లో ఎంతగా రక్తరంజితమైపోయామో అర్దం చేసుకోగలము. ఈ అర్దం చేసుకొనే అవకాశాన్ని నలిమెల భాస్కర్ సాహిత్యాభిమానులకందించాడు. పరిశ్రమించి, పరిశోదించి అద్యయనం చేసి మనకోసం ఆయన ఈ పరిచయ వ్యాసాల ద్యారా సాహిత్య ద్వారాలు తెరిచాడు.ఈ “సాహితీ సుమాలు”ను ఆఘ్రాణిస్తూవుంటే నా సాహితీ స్మృతులు కొన్ని మేల్కొన్నాయి. విశ్వమానవ హృదయానికి అనువాద అనుసంధానం చేసిన 'లీలారాయ్'ను నేను వ్యక్తిగతంగా కలుసుకొన్న ఘట్టం గుర్తుకొచ్చింది. ఏలిస్ వర్జీనియా ఆర్నడర్స్ అనే యువతి లాటిన్ అమెరికాలోని ఒక దేశం నుంచి ఇండియావచ్చి బెంగాలీ రచయిత “అన్నదా శంకర్‌రాయ్'ను వివాహమాడి “లీలారాయ్”గా రూపాంతరం చెంది దాదాపు 70 అనువాద గ్రంధాలను తన సొంత సృజనాత్మక రచనలను అందించి “ట్రాన్స్‌లేటర్స్ సాసైటీ' ' స్థాపించిన విశిష్ట వ్యక్తిత్వం ఆమెది. లీలారాయ్ గారిని నేను, చెరబండరాజు 1969 చివర కలకత్తాలో జరిగిన అఖిల భారత కవి సమ్మేళనంలో పాల్గొన్నపుడు ఒక గోష్టిలో కలుసుకొన్నాము.
ఈ పరిచయ వ్యాసాలు చదువుతూ వుంటే ఒకచోట మనం అకస్మాత్తుగా ఆగి ఆలోచిస్తాం! 'విధి' వక్రీకరించిన్నా వోడిపోని అజేయ సంకల్ప బలంతో, జీవితాన్ని సార్జకం చేసుకొన్న మన కరీంనగర్ (ఊటూరు గ్రామం) ముద్దసాని రాంరెడ్డిగారు మన ఎదుట పడుకుని పల్కరిస్తారు! గత 38 సం. లు మంచం మోద బోర్లాపడుకొని తనకు తోచినరీతిలో సాహిత్యసేవ చేస్తూనే వున్నారాయన-1967లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నెముక విరిగి శయ్యాగతుడుగా శేషజీవితాన్ని గడుపుతున్నా, అక్షరాన్ని ఆరాదిస్తూనే వున్నారు.
మన పొరుగునే వున్న తమిళ కదాశిల్సి 'పుదుమై పిత్తన్, కన్నడ అభ్యుదయ రచయిత “అశ్వత్థ, మలయాళీ రెబెల్ నవలా రచయిత 'కోవిలన్' మనలో ఎంతమందికి తెలుసు? చాలామందికి అసలు తెలియదు అని అంగీకరించే పరిస్టితి ఈనాటికే నెలకొనివుంది. భాషాపరమైన ఇబ్బందులున్నా, కనీసం ఇంగ్లీషు లేదా హిందీ అనువాదాల ద్వారానైనా
మన భారతీయ రచయితలను మనం ఏమాత్రం చదువుతున్నామనే ఆత్మపరిశీలన అవసరం! 1950-70 మధ్య ఆనాటి తరానికి శరత్, ప్రేమ్‌చంద్, రాహుల్ సాంకృత్యాయన్ తదితరులు అనువాదాల ద్వారా ఎంతో దగ్గరైనారు. మరి ఈరోజు అనువాదాలను పత్రికలు
ప్రాత్సహిస్తున్నాయా? .
మార్కెట్ “స్వేచ్చా విపణి” కబళించిన తర్వాత మన పత్రికలన్నీ, వాడకం దినుసుల రంగురంగుల అందాల భామల బొమ్మలను ముద్రించి డబ్బుచేసుకొనే ప్రయత్నంలో పోటీ పడుతున్నాయి తప్ప భారతీయ సాహితీ-సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే కర్తవ్యాన్ని మరచిపోయాయి.
ఆ కర్తవ్యాన్ని తిరిగి నలిమెల భాస్కర్ ఈ “సాహితీ సుమాలు” ద్వారా గుర్తు చేస్తున్నాడు. తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అనువాదాల్లో నిమగ్నమై వున్నాడు. ఇలాంటి కృషిని ప్రోత్సహించి ప్రచురించిన 'ఆంధ్రజ్యోతి' దినపత్రికను అభినందించక తప్పదు.
మన భారతీయ రచయితల్లో ఇలా కొందరిని నలిమెల పరిచయ వ్యాసాల్లో దర్శించగానే, అపారమైన జీవనవైవిధ్యమున్న ఆయాదిగ్గజులైన రచయితల సాహితీ సంపన్నత సమక్షంలో మనం వినములమై నిలుచుండిపోతాం!
అమూల్యమైన మన సాహిత్య వారసత్వాన్ని వివిధ భాషల సాహితీ గవాక్షాల నుంచి పరిశీలించే వివిధ కోణాలున్నాయని మరోసారి అర్థం చేసుకొంటాము.
ఆయా ప్రాంతాలలోని వివిధ సృజనాత్మక సాహితీ మూర్తులను కొందరినైన ఒకచోట నిలిపి మన దృష్టి వైశాల్యాన్ని విస్తృతం చేసినందుకు- - - నలిమెల భాస్కర్‌ను మనసారా మెచ్చుకొంటున్నాను.
6 డిసెంబర్ 2000
శారదానగర్
హైదరాబాద్-500 013. -- నిజిర్యోర్
విషయ సూచిక శ విజయ్ టెండూల్మర్ 11 రై నిరంజన్ భగత్ 14 | హరిశంకర్ పర్సాయీ 17 ర్, కందస్వామి 22 6. సాగర్మయ్ఘోష్ 24 7 సుజాతారావు 27 న సదాశిన 30 9, అజిత్ కౌర్ 3౩2 10. మిర్ 35 11, సాత్వలేకర్ 38 112 నాగార్జున్ 41 13 నిన్నీమ్ఎజికీల్ శ 14, పావర్థిన్ ఉ7 15. అతులానంద గోస్వామి క5్0 16 యోగేష్జోష్ 53 17. ప్రతిభా శతపథి ర్5్ 18 నానీ, ఫడ్కే 57
19... శైలజా ఉదచణ 60 20. ప్రేమ్‌జీ 62 21... లీలారాయ్ 65 ౭2 ముద్దసాని రాంెడ్డి 67 23... ఆర్కే. నారాయణ్ 69 24. సారభ్కుమార్ చలిహా 71 256, డా.కెకృష్ణమూర్తి 73 26 మిర్దాగాలిబ్ 75 27. పుదుమైపిత్తన్ 78 28 అశ్వత్ధ 80 29. చాత్రిక్ 82 30. మనోరంజన్ దాస్ 84 31. విభావరీ శరూర్మర్ 86 32 మేఘానీ 88 3% మలయాట్టూర్ రామకృష్ణన్ 90 34 మాథుర్ 92 35 ఛునీ 94
ఆంధ్రజ్యోతిలో ప్రతి ఆదివారం “సాహితీ సుమాలు” శీర్చికతో ఈ వ్యాసాలు రాయించిన మిత్రులు ఆర్.ఎమ్. ఉమా మహేశ్వరరావు సుమసౌరభాలను ముందుమాట ద్వారా అందరికీ పంచిన నిఖిలేశ్వర్ సార్ పత్రికలో వేసినంతకాలం రచయితల పరిచయాలు ఆపకూడదని గుర్తుచేసిన మిత్రుడు జూకంటి జగన్నాథం ఈ వ్యాసాలు ఇలా పుస్తక రూపంలో రావాలని నిత్యం ప్రోత్సహించిన మిత్రుడు వారాల ఆనంద్ సందర్భం వచ్చినపుడల్లా సాహితీ సుమాలను పుస్తకంగా వేయాలని ప్రస్తావించిన పత్తిపాక మోహన్, చైతన్య ప్రకాశ్‌లు అయాచితంగానే ఆయా భాషా పత్రికల్ని పదేళ్ళుగా అందిస్తోన్న మా సార్ నిజాం వెంకటేశం ఎదుటి మనిషిలోని పాజిటివ్ అంశను గుర్తించి వెలికి తీయగలిగే వి.సి. డా॥ ఎన్. గోపి గారు నాకన్నా శ్రద్ధగా ప్రూపులు చూసిన అల్లుడు ఆకుల శ్రీనివాస్ కఠీంనగరలో వుండగా నాకోసం ప్రత్యేకించి వివిధ భాషా పత్రికల్ని తెప్పించిన బుక్‌స్టాల్ మారుతి ఇంకా గూడూరి సీత్రారాం, అఫ్సర్, 'సేతుమాధవరావు, పంజాల జగన్నాథం, దర్భశయనం శ్రీనివాసాచార్య పి.ఎస్. రవీంద్ర, జింబో, నా అర్జాంగి సావిత్రి, కూతురు చైతన్య, గ్రాఫిక్స్ ప్రభాకర్ ----- వీళ్ళందరినీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం నా కనీస బాధ్యత.
సీరియస్నాటకరంగానికి అిద్గునిక మరారీ నాటక రంగమ్మీద ఒక ఉత్తుంగ తరంగం. . . మరొక అలజడి కేంద్రం. .. ఇంకొక ఆందోళన బిందువు విజయ్ టెండూల్కర్ ఆయన 1928లో పుట్టాడు. పూర్తిపేరు విజయ్ ధనదోపంత్ టెండూల్కర్ కొంతకాలం 1948 ప్రాంతంలో నవభారత్ పత్రిక్కి జూనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేశాడు. అతనికి ఎలాంటి అకడమిక్ అర్హతలు లేవు. పత్రికలో పనిచేయడాని కన్నా ముందు పూనాలో ఫ్రూఫ్ రీడర్‌గా పనిచేశాడు. విజయ్ టెండూల్కర్ రచయితగా తన జీవితాన్ని ప్రారంభించింది కధలతో. చిత్రమేమిటంటే అతని కధల్లో కధనం కన్నా నాటకీయత ఎక్కువగా ఉండేది. అతని “ఓలాఖ్ .ఓలాఖ్” చక్కని ఏకాంకిక. మరారీ నాటకరంగంతో మమేకమైన దామూ కేంకర్గారి ప్రోత్సాహంతో విజయ్ టెండూల్కర్ నాటకాలు రాయడం ప్రారంభించాడు. 1355లో అతను రాసిన 'గృహస్థ్ మొదటి నాటకం, ఒక్క మహారాష్ట్రలోనే కాదు దేశంలోని యితర భాషీయులు కూడా విజయ్ రాసిన నాటకాల పట్ల బాగా అకర్షితులయ్యారు. అతని 'ఘాసీరామ్ కొత్వాల్, “కమలా నాటకాల్లో కొరడా కొనల్లోని విసురు వుంది. మరారీలో విజయ్ టెండూల్కర్ ఎన్నెన్నో ప్రయోగాత్మక నాటకాలు రాసి పేరు తెచ్చుకున్నాడు. పలు సామాజికోద్యమాలతో మమేకమయ్యాడు. కలకత్తాలోని రవీంద్రభారతి విశ్వవిద్యాలయం అతనికి డి.లిట్ ప్రదానం చేసింది. విజయ్ టెండూల్కర్ రాసిన “నియతీచా బాయిలాలా” గొప్ప నాటకం. నలభైనాలుగేళ్ళుగా నాటక రచనకు అంకితమైన ప్రయోక్త టెండూల్కర్. అతని నాటకాల్లో స్వకపోల కల్పిత కధలు మచ్చుకైనా కనిపించవు. విజయ్ రాసిన ఎ నాటకమైనా మన 'కడుపులో కవ్వం పెట్టి గుంజినంత' పనిచేస్తుంది అతను నాటకాలు రాయడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తాడు బొంబాయిలోని సౌఖిన్ నాటక బృందంలో విజయ్ మంచి నటుడు. వాళ్ళ నాన్నతో చిన్నతనంలో నాటకాల రిహార్పళ్ళకి వెళ్ళేవాడు అలా విజయ్ టెండూల్కర్‌కు నాటకాల పట్ల ఆసక్తి బాల్యంలోనే కలిగింది. ఆ రోజుల్లో ప్రీ పాతల్ని పురుషులే ధరించే వాళ్ళు ముఖ్యంగా పిల్లలతో వేయించేవాళ్ళు విజయ్ టెండూల్కర్ చాలాసార్లు అలా స్రీ పాత్రల్లో నటించాడు. విజయ్ టెండూల్కర్‌కు నాటకాన్ని గొప్ప నాటకంగా మలచగలిగిన నేర్పు పుష్కలంగా వుంది దృశ్యరూపాన్ని విశ్వరూపంగా ప్రదర్శించగల్లిన సామర్థ్యం ఖచ్చితంగా వుంది అందువల్లే అతను 1955 నుంచి నాటకరచనలో కొత్త పోకడల్ని ప్రవేశపెట్టాడు ఇండియన్ ధియేటర్ గురించీ, ప్రపంచ నాటకం గురించీ ఏమాత్రం అవగాహనలేని దశలోనే విజయ్ టెండూల్కర్ గొప్ప నాటకాలు రాశాడు నలిమెల భాస్కర్ శప ప్రజ్యయస్తట్టుల్త పా స్టులిటా తరాపతనతా 11
అతను నాటకరంగం గురించి సమగ్రంగా అద్యయనం చేద్దామనుకునేసరికి కమర్షియల్ నాటకరంగర్త కూడా దాదాపు కనుమరుగైపోయింది. విజయ్‌కు సాంప్రదాయక మరారీ నాటకరంగంతో పరిచయ వుంది కనుక ఆ జ్ఞానం కొంత మేలు చేసింది. విజయ్ టెండూల్కర్ నాటకాలు హిందీ, బెంగా తదితర భాషల్లోకి వెళ్ళి ప్రదర్శనలకు నోచుకున్నాయి. అతని విజయానికి కారణం వాస్తవిక దృష్టిని నాటకాల్లో ప్రవేశపెట్టడం. అతను తనని తాను ఒక '“ఓలటైల్ మనిషిగా పేర్కొంటాడు. ప్రస్తు వ్యవస్థ పట్ల అతనికి ఈనాటికీ విపరీతమైన అసంతృప్తి, ఆగ్రహాలున్నాయి. అతని నాటకాలు అన్నే మౌలిక ప్రశ్నల్ని లేవదీస్తాయి. సీరియస్ డ్రేుక్షకుల్ని ఆద్యంతం ఆకర్షిస్తాయి. విజయ్ టెండూల్మల్లీ దూరదర్శన్ కోసం ఓసారి సీరియల్ రాశాడు. ఆ తర్వాత శుభ్రంగా చేతులు దులుపుకున్నాడు. జ్య మాధ్యమం పట్ల అతనికి సదభిప్రాయాల్లేవు. అయితే సినిమా రంగంతో అతనికి సంబందాలున్నాయి. పత్రికా రంగంలోంచి బయట పడ్డాక విజయ్ టెండూల్కర్ కొంతకాలం పాటు సినిమాలకు స్కిప్పులు రాశాడు. విజయ్ టెండూల్కర్ నాటకాల్లో జానపద బాణీలు, జానపద నృత్యాలు జమిలిగా' కలిసిపోతాయి. భారతీయ సంప్రదాయ నృత్యాలూ, సంప్రదాయ సంగీతమూ లేకుండానే ఆ నాటకాలు విజయవంతమవుతాయి. విజయ్ దృష్టిలో బారతీయత అంటే కరడుగట్టిన జాతీయత కాదు. సంప్రదాయం అంతకన్నా కాదు. క్లాసీకల్ లోర్‌లో కన్నా “ఫోకొలోనే నిజమైన జీవదార వుందని నమ్మే వ్యక్తి విజయ్ టెండూల్కర్.
విజయ్ టెండూల్కర్‌కు ఆర్థర్ మిల్లర్, టెన్సి విలియమ్స్, ప్రిస్ట్లర్ నాటకాలంటే యిష్టం ఆయన ఆయనోవస్కీ నాటకాల్లోంచి అనేక మెళకువలు నేర్చుకున్నాడు. నిస్సీమ్ ఎజికీల్ నించి అబ్బర్డ్ ధియేటర్ గురించి నేర్చుకున్నాడు. ఆయనోవస్కీలాగా తను యిప్పటికీ నాటకాలు రాయలేకపోతున్నానని వాపోతాడు. విజయ్ టెండూల్కర్ నాటక ప్రక్రియను ఏనాడూ ప్రేక్షకుల మానసికానందం కోసం చేపట్టలేదు. అతని ప్రతి నాటకం ఏదో ఒక సాంఘిక ప్రయోజనం కోనం రాయబడిందే. “ఘాసీరామ్ కొత్వాల్” గొప్ప సంచలనాన్ని కల్గించినప్పటికీ, అతనికి నచ్చిన నాటకం “గిర్ధరి'. అయితే ఆ నాటకానికి సెన్సార్ సర్టిఫికెట్ లభించలేదు. “మహారాష్ట్రలో సినిమాలకే కాదు నాటకాలక్కూడా కొంతకాలం సెన్సారులాంటి ఆంక్షలుండేవి. విజయ్ టెండూల్కర్ రాసిన 'సబారామ్ బావుండర్' నాటకానిక్కూడా సెన్సార్ ధృవీకరణ లేకపోవడంతో, అతను కోర్టుకి వెళ్ళాడు. 'ఘాసీరామ్ కొత్వాలో నాటకం మహారాష్ట్రలోని సాంఘిక, రాజకీయ వాతావరణానికి షాక్ ట్రీట్మెంట్ యిచ్చింది. కొందరైతే అది బ్రాహ్మణ వ్యతిరేక నాటకం అన్నారు. మరికొందరు మొత్తంగా నాటకరంగ చరిత్రకు కళంకాన్ని ఆపాదిస్తున్న రూపకం అన్నారు. విజయ్ టెండూల్కర్ రాసిన 'కమలా' నాటకం... జర్నలిజం మీద సంధించిన బాణం. జర్నలిజం మనిషి మనస్సునెలా అవినీతిమయం చేస్తోందో. వివరించి చెప్పింది “కమలా”. విజయ్‌కు జర్నలిజం పట్ల సానుభూతి లేదని కాదు “కరప్లు" అయిన జర్నలిస్టుల మీదే ఆయుధాలు ప్రయోగిస్తాడు. 'ఇండియాటుడే'లో ఓసారి ప్రచురించబడ్డ వాస్తవిక సంఘటన ఆధారంగా 'కమలా' రాయబడింది. అతని 'కన్యాదాన్' కూడా గొప్ప నాటకం 122 ాంలలలటటతయలారకకుడ్ సావాతీ సుమాలు
విజయ్ టెండూల్కర్‌కు నేపధ్యంలో ఎ సిద్ధాంతాలూ లేవు. సామాజిక దురన్యాయాలను నిలదీయడమే అతని సిద్ధాంతం. అతనికి 'పాంటసీ' నచ్చదు. అయితే అతని ఇటీవలి “సఫర్"లో పాంటసీ వుందని కొందరు ఆరోపిస్తారు ఏమైనా విజయ్ టెండూల్కర్ “రియాలిట్ నించి ఎన్నడూ పారిపోవాలని ప్రయత్నించలేదు. అతను మహారాష్ట్రలోని “నవ్య దియేటర్ ఆందోళన్'తో చాన్నాళ్ళు మమేకమయ్యాడు. కొంతకాలం 'గణతాంత్రిక్ అదికార్ ఏవం నాగరిక్ స్వాదీనతా రక్షా" కొరకు పోరాడిన కలం యెొధుడు. 1998వ సంవత్సరపు జ్ఞానపీర బహుమతిని అందుకున్న గిరీక్ కర్నాడ్ “ఈ బహుమతి నాబోటి వాళ్ళకన్న ముందుగా, విజయ్ టెండూల్కర్‌లాంటి ప్రయోక్తలకు వచ్చివుంటే బావుండేది” అంటాడు. నాటక రచనలో అంతటి శక్తిసామర్థ్యాలు కలిగిన వ్యక్తి విజయ్ టెండూల్కర్. నలిమెల భాస్కర్ 13
గుజరాతీ కవిత్వానికీ, స
విమర్శకూబిశానిర్దేశం
రంజన్ భగత్ న నిరంజన్‌కు శబ్దాలు శస్తాలు. అర్థాలు అస్త్రాలు. అతడు తన వాగర్థాలను సమాజ లక్ష్యమ్మీద ఏకాగ్రతతో సంధిస్తాడు . ప్రతి సమస్యకి స్పందిస్తాడు. గుజరాతీ సాహిత్య విమర్శను సంపన్నం చేసి కవిత్వానికి దిశానిర్దేశం చేశాడు అతని పూర్తి పేరు నిరంజన్ నరహరి భగత్, నిరంజన్ భగత్ 1926లో పుట్టాడు అతని నివాసం అహమదాబాద్ నగరం. ఆంగ్లంలో అధ్యాపకత్వం. సాహిత్య సమరాంగణంలో అతనికతనే సాటి. నిరంజన్‌కు నిజాయితీ ప్రాణం. అన్యాయాల పట్ల అసహనం. అతని మాటల్లో అలా ఒక పాండితీ స్పర్శ అలవోకగా అల్లుకుపోతుంది. దంబాచారులైన రాజకీయ నాయకులను స్వచృమైన గుజరాతీలోనూ, స్పష్టమైన ఇంగ్రీషులోనూ అధిక్రేపించగలిగిన గుండె చేవ నిరంజన్‌ది. నిరంజన్ బగత్ బాల్యం అహమదాబాదు సందుగొందుల్లో గడిచింది. పట్టణ సంస్కృతీ నాగరికతల్లో నడిచింది వాళ్ళ ఇల్లంతా పూజా పునస్కారాలతో ఎప్పుడూ సందడిగా వుండేది! అయితే అతనిమీద పూజలూ భజనలకు సంబందించిన “మధ్యయుగాల సాంప్రదాయికతి
ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది.
“నాకు పూజా పునస్కారాల్లోనూ, మతపరమైన ఆచారాల్లోనూ బొత్తిగా గురి కుదరలేదు. భగవంతుడన్నా, మతమన్నా నాకు నమ్మకాల్లేవు. అయితే యిది సుమారుగా వ్యక్తిగత వ్యవహారం సుమా.” ఆంటాడు పేరులోనే భగత్ వున్న నిరంజన్ బగత్.
మతం పేరుతో, దైవం పేరుతో అమాయక జనాన్ని అదేపనిగా వంచిస్తోన్న దగాకోరుల పట్ల జాగ్రత్త అవసరమని నిరంజన్ భగత్ అబిప్రాయం పది సంవత్సరాల ప్రాయంలో తండ్రిని కోల్పోయిన నిరంజన్ “నేను కోల్పోయిన బాల్యాన్ని కవిత్వంలోనూ, కనుమరుగైన మా నాన్నని జీవితంలోనూ వెతుకుతున్నాను” అంటాడు విచారంగా.
నిరంజన్ భగత్‌కు చదవడం, ఆలోచించడం... ఈ రెండూ ప్రదాన వ్యాసక్తులు. ఉపన్యాసాలివ్వడం బాగా యిష్టం. ప్రపంచాన్ని చుట్టిరావడమంటే పరమ ప్రీతి, నిరంజన్ బగత్ 1943 నుంచి 1958 వరకు రాన కావ్యాలన్నింటిని కలిపి 'చందోలయ్ బృహత్ పేర సంకలనం చేశాడు ఇది గుజరాతీ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలవగిలిగిన పుస్తకం, అజంతా కవిత్వం 14 టాం మాుయాజయాయరు ౩ జశశశ. సావెతీ సుమాలు
దాదాపు 'స్వప్నలిపి'లో వున్నట్లు; నిరంజన్ కావ్యాలు దరిదాపు 'ఛందోలయ్ బృహత్'లో చేరిపోయాయి గుజరాతీ కవిత్వ పాఠకులకు భగత్‌ని బాగా అర్ధం చేయించగల బృహత్ సంకలనం “ఛందోలయ్. “ప్రవాల ద్వీప్' కావ్యం చందోలయ్లో చ్పెకోదగిన గొప్ప కావ్యం. అర్బ్భనైజేషన్ గురించీ, పట్టణ సంస్కృతి గురించీ చక్కగా చిత్రికపట్టిన కావ్యం “ప్రవాల ద్వీప. న “పారదర్శక వ్యక్తిత్వం కల్గిన నిరంజన్ బగత్ సంవేదనతోనే అధునిక గుజరాతీ కవిత్వం ఆరంభమైందని చెప్పవచ్చు” అంటాడు ప్రముఖ గుజరాతీ సాహితీవేత్త రఘువీర్ చౌదరి. అయితే గత ఒకటీ రెండు దశాబ్దాలుగా నిరంజన్ రాసిన కవిత్వం చాలా తక్కువ. 1958 వరకూ రాసినంత ఉదృతితో ఇప్పుడు రాయడం లేదన్నది నిజం. అయినప్పటికీ మూజ్ఞాలుగు కావ్యాలు రాయగలిగాడు. ఈమధ్య తక్కువగా రాయడానికి కారణం . పునరుక్తి దోషం లేకుండా వుండడానికే. అహమదాబాదులోని ఎల్ డి. ఆర్ట్స్ కాలేజీలోనూ, ముంబైలోని ఎల్ఫిన్స్టన్ కాలేజీలోనూ ఉన్నత విద్యను అభ్యసించిన నిరంజన్ భగత్ 1950 నుంచి అహమదాబాదులోని వివిధ కళాశాలల్లో అధ్యాపకుడిగా పనిచేశాడు. 1986లో పదవీ విరమణ జరిగింది. సాహితీ వ్యాసంగానికి విరమణ లేదు. సంస్కృత నాటకం “స్వప్న వాసవదత్త'ను ఆంగ్లంలోకి అనువాదం చేశాడు. దీన్ని పెంగ్విన్ వాళ్ళు ప్రచురించారు. ఐరోపా, ఆంగ్ల, అమెరికన్ సాహిత్యాలను గుజరాతీలోనికి తీసికొచ్చిన అపర బగీరధుడు నిరంజన్ చగత్. అనేక వ్యాసాలు రాసాడు. “సాహిత్య” లాంటి ఎన్నెన్నో పత్రికలకు సంపాదకత్యం వహించాడు. ఫ్రాయిడ్ లాంటి మనస్తత్వ శాస్త్రవేత్తలు మొదలుకొని షేక్స్పియర్ వంటి నాటక రచయితల వరకూ సాధికారికంగా మాట్లాడగల్గిన సామర్థ్యం కల్గిన వ్యక్షి..వక్త.. నిరంజన్ భగత్. గుజరాతీలో జ్ఞానపీర బహుమతి పొందిన ఉమాశంకర్ జోషీ లాంటి ప్రసిద్ధ సాహితీ వేత్తలు ఎందరో అతనికి మంచి మిత్రులు. అందుకేనేమో అతణ్ణి అంతా ఆత్మీయంగా నిరంజన్ భాయీ అంటూ పలకరిస్తారు.
“నేను నా చిన్నతనంలో పెద్దవాళ్ళతో స్నేహం చేసేవాణ్ణి! పెద్దవాడినయ్యాక చిన్నపిల్లలే నాకు మిత్రులయ్యారు. ఎటొచ్చీ మిత్రులంటే నాకు చాలా యిష్టం” అంటాడు నిరంజన్ భగత్, నీలేశ్ రూపాపరాతో
నిరంజన్ భగత్‌కు సమాజం అన్నా, జీవితం అన్నా సంపూర్ణమైన శ్రద్ధాసక్తులున్నాయి. ఒకసారి ఓ పిల్లాడు నిరంజన్‌తో “ప్రపంచంలోని జంతువులన్నింటిలోనూ మానవుడు అతి క్రూరుడు కదా!' అన్నాట్ట. నిరంజన్ రకీమని “నిజమే! అయితే మానవుడతి క్రూరుడే కాదు అత్యంత దయామయుడు కూడా” అని జవాబిచ్చాడట మానవాళిమీద, మానవత్వం పైన అచంచలమైన నమ్మకం కట్లిన వ్యక్తి నిరంజన్.
“అతిగొప్ప జీవిత రహస్యం ఏమిటంటే...మానవునిలో బతకాలనే ఆశ, తను అభివృద్ది కావాలనుకునే ఆకాంక్షలు వున్నప్పటికీ; అతడు యితరుల కోసం సునాయసంగా మరణాన్ని సైతం వరిస్తాడు” అంటూ మనిషిలోని త్యాగగుణాన్ని మాగ్నిఫై” చేసి చూపిస్తాడు నిరంజన్ చగత్ నలిమెల భాస్కర్ (5
నిరంజన్ భగత్ అనగానే “చందోలయ్'తో పొటు, చప్పున గుర్తుకొచ్చే పుస్తకం మరొకటి వుంది అది 'స్వాద్యాయ లోక్. ఎనిమిది సంపుటాలుగా ప్రచురించబడిన గ్రంధం. గత నాలుగన్నర్మ దశాబ్దాలుగా నిరంజన్ భగత్ రాసిన వ్యాసాలు, చేసిన విమర్శలు, రచించిన సాహిత్య చరిత్రలు అన్నీ పొల్లుపోకుండా “స్వాధ్యాయలోక్' సంపూటాల్లో చోటుచేసుకున్నాయి. “ఛందోలయ్ బృహత్! లో నిరంజన్ భగత్ ప్రముబ కవిగా కనిపిస్తే, “స్వాధ్యాయలోక్'లో అతడు ప్రసిద్ధ విమర్శకుడిగొ గోచరిస్తాడు. ఎనిమిది సంపుటాల 'స్వాధ్యాయలోకొలో ఒకవైపు గుజరాతీ సాహిత్యానికి సంబంధించిన విషయాలు, మరోవైపు అమెరికన్, ఆంగ్ల, ఐరోపా సాహిత్య విషయాలూ పారకుణ్ణి ఆశ్చర్యంల్లో ముంచెత్తుతాయి. మొదటి సంపుటంలో “కవి అనే కవితా-కవి మరియు కవిత' లాంటి మౌలిక వ్యాసాలతో పాటు నవల, నాటకం వంటి అనేక ప్రక్రియలమీద చేసిన రచనలున్నాయి. రెండో సంపుటం పేరు “ఆంగ్ల సాహిత్యం". మూణ్ఞాలుగుల్లో ఐరోపా, అమెరికన్ సాహిత్యాలుంటే; తర్వాత్తి మూడు సంపుటాల్లో గుజరాతీ సాహిత్యం వుంది. చివరి 'అంగత్'లో అవీ-యివీ అంటూ అనేకమైన అంశాలున్నాయి. గుజరాతీలో ప్రముణ కవిగా, ప్రసిద్ధ విమర్శకుడిగా నిరంజన్‌ది ప్రత్యేకమైన గొంతు. నిరంతర అధ్యయనశీలి నిరంజన్. గొప్ప ఆలోచనాపరుడతను. అతని “చందోలయ్ బృహత్, “స్వాధ్యాయలోక్లు లోకులున్నంతవరకూ వెలుగులినే దీపస్తంభాలు. ఈసారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గుజరాతీలో నిరంజన్‌కు దక్కింది. 16 పాటా భప్క సాహితీ సుమాలు
త్తి శ న. విరిసిన వ్యంగ్యం న హారిశండల్ మ అప్పటి వరకూ హిందీ సాహిత్యంలో రెండు లోపాలు కొట్టవచ్చినట్టు కనిపించేవి. అవి హాస్య, వ్యంగ్యాలకు సంబంధించినవి. కనుక అనాటి దాకా హిందీ సారస్య్వ్యతంలో హాస్యవ్యాసాలు కానీ, వ్యంగ్యరంగాలు కానీ ఉజ్జాయింపుగా లేవనే చెప్పుకోవచ్చు ఈ రెండింటి కొరతల్ని సమర్హవంతంగా తీర్చడానికి ప్రయత్నించి సఫలీకృతుడైన రచయిత హరిశంకర్ పర్సాయీ. హరిశంకర్ పర్సాయీ 24 ఆగస్టు, 1924 నాడు మధ్యప్రదేశ్‌లోని హోశంగాబాద్ జిల్లా జిమానీ గ్రామంలో జన్మించాడు. 1957 వరకు ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. తరువాత సాహితీ వ్యాసంగంలోనూ, స్వతంత్రంగా రచనలు చేయడంలోనూ పూర్తిగా నిమగ్నమయ్యాడు. హరి శంకర్ పర్సాయీని హ్యూమర్, సెటైర్లు ఆకర్షించి హిందీలో అతిగొప్ప రచయితని చేశాయి. వీటికి తోడు ఐరనీ, మాకరీలు కూడా తోడయ్యాయి. అధునిక హిందీ సాహిత్యంలో వ్యంగ్యం అనగానే గుర్తుకొచ్చే కధారచయిత ఖచ్చితంగా హరి శంకరే! వ్యంగ్యాన్ని హిందీలో సుప్రతిష్టితం చేసి ఆపైన జనప్రియం కావించడంలో హరిశంకర్ పర్సాయీది చెప్పుకోదగిన కృషి సాహిత్యంలో చక్కని వ్యంగ్యాన్ని సాధించడం కోసం సునిశిత పరిశీలనా దృక్పథాన్ని అలవరచుకున్నాడు పరీసాయీ తన రెండు కళ్ళని రెండు సజీవ కెమెరాలు చేసి అన్ని కోణాల్లో గాలించాడు. సామాజిక దురాచారాల తీరుతెన్నులకు సంబంధించిన సమస్త అంశాల్ని వ్యంగ్య వైభవంతో ఆవిష్కరించాడు. ప్రజల దైనందిన వ్యవహారంలోని మాట విరుపునీ, వ్యావహారిక భాషలోని సజీవమైన అందచందాలనూ వ్యంగ్యానికి అదనపు అంగాలుగా జోడించాడు. హరిశంకర్ పర్సాయీ ఉద్యోగాన్ని వదిలేశాక వసుధా" అనే సాహిత్య మాసవత్రికను వెలువరించాడు నయీ దునియా, సునో భాయిసాధో, ఉల్టు - ఉల్యు, కల్పనా మే బెర్ అంతమే జట మొదలైన చాలా కాలమ్స్ క్రమం తప్పకుండా అనేక పత్రికల్లో ఏళ్ల తరబడి నిర్వహించాడు. హస్తే హై రోతేహై మొదలైన అనేక కధా సంకలనాలు ప్రచురించాడు హరిశంకర్. అంతేకాకుండా అప్నీ ఆప్నీ బీమారి, రిరుర్తా హువా గణతంత్ర, తిర్ఛీ రేఖాయే, పగ్డండియోంకా జమానా, భూతీకే పావ్ పీచే, వైష్ణవ్కీ ఫిస్లన్, సమాచార్ కా తావీజ్ మొదలైన పలు రచనలు చేశాడు. హరిశంకర్ పర్సాయీ పలు పత్రికల్లో వ్యంగ్య కధలకు తోడు హాస్యకదలు కూడా రాశాడు. నలిమెల భాస్కర్ ఫటగ టలమ్యట్లుమ్టననాట త సుష య పాల” 17
వ్యాసాల్నీ, స్క్రృతి సాహిత్యాన్నీ రచించాడు. “రాణి పగ్పణ్కీ కహానీ, 'తట్కీ జోజ్లు అతన ముబ్యమైన నవలలు. “పర్సాయీ రచనావళి” పేరున ఆరు బాగాలుగా తన రచనల్ని హరిశంకర్ పర్ సాయీ వెల్లడించాడు. జబల్పూర్ విశ్వవిద్యాలయం గౌరవ డిలిట్ పట్టాని ప్రదానం చేసిందో 1982లో సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నాడు. 1983లో మధ్యప్రదేశ్ ప్రభుత్వపు “నిఖ్లరీ సన్మాన్”ని పొందాడు. హరిశంకర్ పర్సాయీ మధ్యప్రదేశ్ రాష్త్ర అభ్యుదయ రచయితల్త సంఘాధ్యక్తులుగానూ కొంతకాలం పనిచేశాడు.
“స్వాతంత్రోత్తర యుగ' హిందీ కధాసాహిత్యంలో హరిశంకర్ పర్సాయీది అద్వితీయ స్థానం దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక భారతీయుల్లో కొంగ్రాత్త ఆశలు మోసులెత్తినట్టుగానే, ప్రజల ఆలోచనల్లోనూ కొత్తదనం చొచ్చుకొచ్చింది. తతృ్సలితంగా హిందీలో “నయీ కహానీ" పుట్టింది వస్తుపరంగా, శిల్పరీత్యా ఈ కొత్త కధ తత్పూర్వ (ప్రేమ్‌చంద్ యుగంలోని కద కన్నా చాలా ముందుక్తు వెళ్ళింది. విస్తృతినీ, లోతునీ సంతరించుకున్న ఈ కధ, అప్పటిదాకా తెలీని కొత్తకోణాల్ని కుప్పపోసింధి. అయితే తాము ఆశించినట్లుగా స్వాతంత్ర్య ఫలాలు తమ చేతికి అందలేదనే సత్యాన్ని ప్రజలు తొందరగానే గ్రహించారు. ఈ విపర్యయ పరిస్థితుల్ని, స్వాతంత్ర్యం వచ్చాక ఏర్పడిన దుష్పరిణామాల్ని రచయితలు జాగ్రత్తగా గమనించారు. హరిశంకర్ పర్సాయీ సైతం ఈ విపరిణామాల్ని ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా పరిశీలించాడు. జడీభూతమైన సంఘాన్ని, వ్యంగ్యాన్ని ఆసరా చేసుకొని తట్టిలేపాడు. అతని “చంద్రలోకంలో మటాధీన్” అన్న ఒక్క కద చాలు, వ్యంగ్యం ఎంత ప్రబావాన్ని కల్గిస్తుందో చెప్పడానికి మొద్దుబారిన పోలీసు వ్యవస్థని కళ్ళకు కట్టినట్టు, మనసుకి 'పట్టినట్టు చూపించాడు ఈ కధలో. తన రచనలకు వాచ్యం కన్నా వ్యంగ్యం సముచితంగా వుంటుందని తలపోశాడు పర్సాయీ. సరళంగా చెప్పే వాచ్యరీతిలోని వాక్యవిన్యాసం తన కాన్వాసులో ఇమడదనసి గ్రహించాడు. ప్రత్యక్ష పద్ధతి కన్నా అన్యాపదేశంగానో, వ్యంగ్యాత్మకంగానో చెబితే తప్ప పారకులు ప్రభావితులు కాలేరన్నది పర్సాయీ విశ్వాసం,
హరిశంకర్ పర్సాయీకి ఈ సమాజం పట్ల కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు కూడా వుండేవి. దోపిడీ దుర్మార్గాల్ని సమూలంగా నిర్మూలించకుండా మరో ప్రపంచాన్ని సృష్టించుకోలేమని చెప్పేవాడు. కేవలం వ్యక్తి సంస్కారంతో వ్యవస్థ మారదని హరిశంకర్ బావన. పైగా ఊకదంపుడు ఉపన్యాసాలు. ఉపదేశాలు, డొల్లబారిన ప్రణాళికలూ.. అన్నీ వృధా అని నిర్మాగమాటంగా చెప్పేవాడు మందంగా వున్న వ్యవస్థకు వ్యంగ్యమే సూదిమందు అని హరిశంకర్ పర్సాయీ నిర్ధారణ. సంఘంలో తల్లివేరు దాకా వ్యాపించిన సమస్త అత్యాచారాల గురించీ, ప్రయోజకత్వం పట్లా, స్వార్రపరత్వం పైనా మూఢ విశ్వాసాల మీదా, లంచగొండితనం గురించీ, సవాలక్ష అవలక్షణాల మీదా అనేక రచనలు చేశాడు. నాలుగైదేళ్ల క్రితం ఈ ప్రపంచం నించి శాశ్వతంగా పర్సాయీ సెలవు తీసుకొని వెళ్ళిపోవడం హిందీ వ్యంగ్య కధా వైభవానికి పెద్దలోటు.
18 యయా తట యయ లంట శక 320. $ సాహితీ సుమాలు
నిత్య సంచలన శీలి . నులయాళ కోవిలన్ “నే ను నిజం మాట్లాడుతోంటే కొంతమంది నాకు 'రెబెల్ అనే లేబుల్ తగిలిస్తున్నారు. విప్లవవాది
అనే మాటని అప్లై చేస్తున్నారు. ఫరవాలేదు నేను పచ్చి నిజాల్నే చెబుతాను. ఇప్పటి ఈ 'సిస్టమ్' లో ఏ రకమైన మార్పుల్ని కూడా మనదేశంలో ఆశించలేం. ఈనాటికీ దరిద్ర నారాయణుల సంబ్య పెరగడమే తప్ప తగ్గడం లేదు ఈ నిరుపేదలు శాశ్వతంగా నిరుపేదలుగానే మిగిలిపోతారు. అలా మిగల్బడం ఈ దేశంలో కొందరికి అవసరం కూడా రాజ్యం ఆ కొంతమంది చేతుల్లోనే వుంది నాకున్న చారిత్రికావగాహననీ, సాహితీ స్పర్శనీ నేపద్యంగా తీసుకొని ఆలోచిస్తోంటే మనదేశంలోని పేదల బతుకులు గత నాలుగైదు వేల యేళ్ళకి ముందు కూడా యిలాగే ఏడిచాయనిపిస్తోంది. అయితే, . యివాళ నన్ను తీవ్రంగా కిలచివేస్తున్న విషయం ...ఈ అమాయక ప్రజలు ఈనాటికీ దోపిడీకి గురవడం. మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా అనడిగితే ఖచ్చితంగా వుందంటాను. మనిషి తన వెన్నెముకని వజ్రాయుధంగా మార్చుకోవాలి. పేదల్ని రకరకాల ముసుగుల్లో మోసగిస్తోన్న నయవంచకుల మెడలు వంచాలి. ఇవాళ స్టార్ హోటల్స్‌లో వుండేవాడు సామాన్య మానవుని మీద బోలెడు సానుభూతిని ఒలక పోస్తున్నాడు. మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ఇందులో వున్న నటనమ ప్రజలు గుర్తిస్తే వాళ్ళ బతుకులు తప్పక మారుతాయి అలా ప్రజలు గుర్తెరిగేలా, రగిలేలా చేయడానికి కవులూ, రచయితలూ, కళాకారులూ కలాలు నూరాలి” అంటాడు బరాఖండిగా (1999లో) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ప్రముఖ మలయాళ రచయిత కోవిలన్. మలయాళ భాషలో కోవిలన్ రాసిన 'తట్టగం' నవలకు పాతికవేల రూపాయల నగదు మూల్యం గల అవార్డు లబించింది
ఎంటి. వాసుదేవన్ నాయర్ ఎడిటర్‌గా వున్న 'మాతృబూమి' వారపత్రికలో కోవిలన్ రాసిన 'తట్టగం' నవల డిసెంబరు పన్నెండు 1993 నించి ధారావాహికంగా ప్రచురించబడి అక్కడ పారకుల్తో గొప్ప సంచలనాన్ని కల్గించింది. నిజానికి కోవిలన్ ఆ నవలను 1974 లోనే రాయడం ప్రారంబించి ఆనారోగ్య కారణాల వల్ల అప్పుడు పూర్తి చేయలేకపోయాడు డెబ్బెయ్యారు సంవత్సరాల తన జీవితం 'తట్టగం' నవలతో సార్ధకమైందని పట్టరానంత సంతోషంగా చెబుతాడు కోవిలన్
అయినప్పటికీ... 'మనం మన జీవితాల్లోంచి గుణపారాలేవైనా నేర్చుకొన్నామా” సంస్క త్రీ నలిమెల భాస్కర్ 1౧
సంపన్నమైన తాత ముత్తాతల పారంపర్యం అంది పుచ్చుకోవాడానికి మనకేమైైనా అర్హతలంట్లూ వున్నాయా? సమసమాజ నిర్మాతలందరూ “ప్రపంచం బాదని తమ బాద'గా స్వీకరించిన యదార్థాన్నా మరచిపోవడం లేదా?” అంటూ కోవిలన్ అంతలోనే అంతర్ముబుడై “నేను ఈ సమాజానికి మిస్ ఫిట్" అనేస్తాడు. మలయాళ భాషలో నందనార్, పారప్పురత్తు, కోవిలన్ ఈ ముగ్గురూ సైనిక సాహిత్యాన్ని పుష్కలంగా సృస్టించిన రచయితలు కోవిలన్ తన ప్రతి రచనలోనూ సమస్త విద్వంసకారియైన యుద్దానికి వ్యతిరేకంగా గళమెత్తి నినదించాడు. “తోట్టంగళ్' (తోటలు) అనే నవల మాత్రం కొంకే భిన్నమైన రచన. దీనికి అనేక పురస్కారాలు లభించాయి. ఈ నవలలో 'పీ' ప్రధాన విషయంగా భాసిల్లింది. మలయాళ సాహిత్యంలో కోవిలన్ కధలక్కూడా నవలలకున్నంత ఆదరణ వుంది. నిశితంగొ తీర్చీదిద్దన వాక్యాలతో, చక్కని శిల్ప విన్యాసంతో కోవిలన్ కధాసాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. 1923 జులై పది నాడు కోవిలన్ కేరళ లోని కందాణిశ్శేరిలో పుట్టాడు నిజానికి అతని పేర్తు అయ్యప్పన్. తల్లి దండ్రుల పేర్లలోంచీ, ఊరి పేరులోంచీ కొన్ని అక్షరాలను తీసుకుని కోవిలన్ అవే కలం పేరు పెట్టుకుని రచనలు చేస్తున్నాడు. స్వగ్రామంలో నాలుగో తరగతి వరకూ, నెమ్మినియల్ హైయ్యర్ ఎలిమెంటరీ స్కూళ్ళో ఎనిమిది దాకా, పావరట్టి సాహిత్య దీపిక సంస్కృత కళాశాలలో కొంతకాలమూ చదువుకున్నాడు. “ఒకవైపు గాంధీజీ దేశమాతని బానిస బంధాల నుంచి విముక్తం చేయడానికి కారాగార వాసం చేస్తోంటే చదువుకోవడం నావల్ల కాదు గాక కాదని” విద్యకి వీజ్ళోలు చెప్పాడు. ఈలోపు మాతృవియోగం. పొట్టచేత పట్టుకుని వుద్యోగం కోసం వూళ్ళూ పూళ్ళూ తిరగక తప్పని దుస్థితి, రేషన్ షాపులో మూన్నెళ్ళు ధాన్యం కొలిచే పనిమనిషిగా వుద్యోగం చివరికి 1943లో నేవీలో సద్యోగం. 1948లో ప్రైవేటుగా ఎస్ఎస్ఎల్సి పాసయ్యాడు. 1968లో రిటైర్మెంట్ తీసుకున్నాడు. కోవిలన్ యిప్పటివరకు పన్నెండు నవలలూ, పన్నెండు కధా సంకలనాలూ, ఒక నాటకమూ, రెండు వ్యాస సంకలనాలనూ ప్రచురించాడు. “నిండె విశ్వాసం నిన్నె పాజుప్పిక్యుం-నీ నమ్మకం నిన్ను రక్షిస్తుంది" అనే రచన మలయాళ నాటక సాహిత్యంలో మంచిపేరు తెచ్చుకున్న దృశ్యేకళో రూపం, 1972లో కోవిలన్ రాసిన “తోట్టంగళో నవలకూ, 1977 నాటి 'శకునం' కధా సంపుటికీ కేరళ సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చాయి. కోవిలన్ అత్యంత సున్నిత మనస్కుడు. ఏ చిన్న సంఘటనకైనా యిట్టే కదిలిపోతాడు. మానవ సంబంధాల ప్రస్తావనవస్తే చాలు చెవి కోసుకోవడంతో పాటు ఏకంగా హృదయమూ పారేసుకుంటాడు తన వూరి ప్రజలతో తలలో నాలుకలా అంతబాగా కలిసిపోయే రచయిత మలయాళ సాహిత్యంలో మరొక్కరు లేరు. అదే అతని రచనలకు బలం. కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో అవస్థలు పడుతున్నాడు. పదునాలుగేళ్ళ క్రితం మెడల్లో భరించరాని వేదన ప్రారంభమై చేతులు బలహీనపకీ
పోయాయి. అయినప్పటికీ 'తగర్న్న హృదయంగళ్-అలసి సాలసిన హృదయాలు” అనే నవలని రీరైట్ చేశాడు. 1987లో ఓసారి గుండెపోటు వచ్చింది. వయస్సు మళ్ళిన కోవిలన్లో ఈనాటికీ రక్తం మండుతోంది. శక్తులు నిండుతున్నాయి. 1393లో “తట్టగం' నవలా రచనకు శ్రీకారం చుట్టాడు. అది మలయాళ పాఠకులకు శిరోధార్యంగా స్వీకార్యమైంది. కేంద్ర సాహిత్య అకాడమీ ఆలస్యంగానైనా కోవిలన్ సేవలను గుర్తించి 'తట్టగం' నవలకు 1999 సంవత్సరానికి అవార్డు ప్రకటించడం మలయాళ సాహిత్య రంగానికి కొంత వూరటని కల్గించింది. యు గంఠాలయ హీ ల వాంగ గ2న్..! [01.0 స తగ! ర. ష్ జం. [1 (4 ఆలో | హు. జో (1. పెదా తసు ఏ పమిదవభాటద్.90 నలిమెల ॥ పద్ న్. న. చ వ. ల చపా న =. ల్ 2
తమిళసాహిత్యసర్వస్వం కందసాని య
వివిధ భారతీయ భాషల్లోని కవులకూ, రచయితలకూ ఏటా ఇచ్చే అవార్డుల్లో భాగంగా కేంద్ర" సాహిత్య అకాడమీ 1999సంవత్సరానికి గాను తమిళ రచయిత సా. కందసామికి అవార్డును ప్రకటించింది. అతడు రాసిన “విచారణై కమీషన్ అనే నవలను బహుమతికి అర్హమైన రచనగా అకాడమీ ఎంపిక చేసింది.
కందసామి 23వ జులై 1940 నాడు మాయవరంలో పుట్టాడు. అతనికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందన్న వార్త వెలువడటంతోటే ఆధునిక తమిళ రచయితలంతా తమ ఆనందోత్సాహాలను ప్రకటించారు. గత ముప్పై సంవత్సరాలుగా అనేక ప్రశస్తమైన, ప్రశస్తమైన రచనల ద్వారా తనను తొను సమగ్రంగా నిరూపించుకుంటోన్న రచయిత సా.కందసామి అతను 1969లో తన మొదటి నవల 'ఛాయావనం' ప్రచురించాడు. కందసామి పేరు ప్రఖ్యాతులకు ఆ నవల బచ్చితంగా శ్రీకారం చుట్టిందని మాత్రం చెప్పలేం. అప్పట్లో ఆయన నడిపిన 'ఇలక్కియ సంగం' (సాహిత్యసంఘం) అనే సంస్థా, 1968లో కందసామి మరో ముగ్గురు ఇతర రచయితలతో కలసి ప్రకటించిన 'కోణల్గళ్ (వంకర గీతలు) అనే పన్నెండు కధల సంకలనమూ తమిళ సాహిత్యలోకంలో పెద్ద సంచలనాన్ని కల్గించాయి. కందసామిని అమాంతం అందరాని ఎత్తులకు చేర్చాయి. కొత్తఢిల్లీ నించి వెల్వడే 'ధాటొ అనే పత్రిక 'కోణల్గల్' గురించి ఒక ప్రత్యేక సంచికను ప్రచురించింది. కందసామి రచించిన మొదటి నవల (చాయావనం) మరి తక్కువేమీకాదు ఈ శతాబ్దిలోనే పేరుగడించిన బారతీయ రచనల్లో ఒకటిగా ప్రొఫెసర్ కె.ఎమ్ జార్జి నేషనల్ బుక్‌ట్రస్టు కోసం సంకలనం చేసిన “కలై కళంజియం' లో చేర్చబడింది
తమిళనాట వ్యవసాయరంగంలోని మార్పుల గురించీ, ప్రాచీన సేద్య విధానాల స్థానంలో వచ్చిన యంత్రాల గురించీ 'ఛాయావనం' నవల ఛాయామాత్రంగా కాకుండా సమర్థవంతంగా చిత్రీకరించింది. అతని మరో నవల “అవన్ ఆనదు” (వాడేమైంది) విశాల దృక్పథానికి తెరతీసింది. అది ప్రాపంచిక స్పృహని నిలబెట్టిన గొప్ప రచన. మనిషి స్వార్ధం కోసమే కాదు, సమాజం కోసం కూడా 'నేను సైతం' అంటూ నిలబడవలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది. సామాజిక స్పృహను అనివార్యమైన అంశంగా సహృదయుల ముందుకు తీసుకొచ్చింది. కందసామి రాసిన 'తాలైందు పోనవర్గళ్, 22 సాహెతీ సుమాలు
"సూర్యవంశం , "వేలైయట్రవన్, 'ఎట్టావదు కడల్ మొదలైన నవలల్లో ఏ ఒక్కటీ దేనికేదీ తీసిపోనిదే! కందసామి నవలల్లో ఎదీ పత్రికల్లో ఇంతవరకు సీరియల్‌గా రాలేదన్నది కూడా గమనించవలసిన విషయం. అన్నీ డైరెక్టుగా పుస్తక రూపంలో పాఠకుల ముందుకు వచ్చినవే! అకాడమీ అవార్డు పొందిన “విచారణై కమీషన్' (విచారణా సంఘం) నవల ఓ బన్ కండక్టర్‌కు సంబంధించిన కధలా మొదట అన్పించినప్పట్కీ, ఇవాల్టి సమాజాన్ని పట్టి పల్లార్చుతోన్న అధికార దర్పాన్నీ రాజ్యహింసనీ ఆ రచన బలంగా ఆవిష్కరిస్తుంది.
కందసామి కదలు కూడా తమదైన ముద్రను కాపాడుకొన్న రచనలు, తమిళ 'ఇండియాటుడే' లో వచ్చిన “ఇరణ్యవదం' చెప్పుకోదగిన గొప్ప కధ. కందసామి సంప్రదాయ పద్ధతిలో పాఠశాలలోనూ, కళాశాలలోనూ చదువుకోలేదు. అయితే అనుభవపూర్వకంగా తెలుసుకొన్న అనేక విషయాలు అతని రచనలకు కొత్త ఊపిరులనుకోవచ్చు. అతని మొదటి నవల “ఛాయావనం' దూరదర్శన్‌లో ప్రసారితమైంది. 'తొలైందు పోనవర్గళ్ కూడా పదమూడు భాగాలుగా ప్రసారం చేయబడింది. కందసామి అనేక లఘుచిత్రాలు తీశాడు. తమిళనాడు “లలిత కళా అకాడమీ” కందసామికి శిజంద కలై విమర్శకర్' (ప్రముఖ కళా విమర్శకుడు) అనే బిరుదును ప్రదానం చేసింది.
తమిళంలోని చిన్న పత్రికల్లో ఒక మైలురాయి అని చెప్పదగిన 'కచటతపజ' అనే సాహిత్య పత్రికకు సంపాదకుడిగానూ, అనేక ఇతర సంకలన గ్రంధాలక్కూడా సంపాదకుడిగానూ కందసామి పనిచేశాడు. అతని అద్వర్యంలో వెల్వడిన రెండు కవితా సంకలనాలు సైతం కవితా వికాసాన్ని చక్కగా ఆవిష్కరించాయి. 'కవిదై ఎన్రుమ్" (ఏనాటికైనా కవిత్వమే) అనేది కూడా కందసామి మౌలికమైన ప్రతిభకు గొప్ప నిదర్శనం.
కందసామి కధలు సాహిత్య అకాడమీ, నేషనల్ బుక్ట్రస్ట, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్సు మొదలైన సంస్థల కధా సంకలనాల్లో చోటుచేసుకున్నాయి. కందసామి “కావల్ దైవం అనే లఘుచిత్రొనికి రాసిన స్రిష్టుకు 1989లో నికోసియాలో జరిగిన ఆర్షినో ఫెస్టివల్లో ప్రధమ బహుమతి లభించింది కందసామి ఇప్పటివరకు ఐదు కధా సంకలనాలు ప్రకటించాడు. అతను అనేక వ్యాసాలు రాశాడు.
“కందసామి అదృష్టవంతుడు. అతని భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తి వీళ్ళంతా సాహిత్య వ్యాసంగంలో అతనికి చేదోడువాదోడుగా వుంటారు. దూరదర్శన్ కోసం అతడు రాస ప్రతి ప్కిప్తులోనూ వాళ్ళ భాగస్వామ్యం చెప్పుకోదగిందే!” అంటాడు ప్రముఖ తమిళ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అశోక మిత్రన్. నలిమెల భాస్కర్. గ్లాళృట్లిళ్ళష్ణస్టైము షాటు? 3
ఇరనయ్యోశతాబ్దికిప్రతినిధి జక మనిషి తన జీవితకాలంలో అరవై సంవత్సరాలు ఒకే పత్రికకు సంపాదకుడిగా పనిచేయడమంటే మాటలు కాదు. అదీ ఈరోజుల్లోనైతే మామూలు విషయం కాదు. అలా పనిచేయడానికి ఎంతో సహనం, మరెంతో సంయమనం, అందరినీ కలుపుకొనిపోగలిగిన సమన్వయ దృక్పధం కావాలి. యాజమాన్యంతోనూ, పారకలోకంతోనూ, కవులు, రచయితలు, కళాకారులతోనూ, ప్రకటనకర్తల్లాంటి మరెందరితోనో సత్సంబంధాలు వుంటేనే కాసి అత్యంత ప్రసిద్ధమైన పత్రికకు సంపాదకత్యం వహించడం సాధ్యంకాని పని, అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేసుకుని పత్రికారంగంలో అత్యున్నత ప్రమాణాలను పాదుకొల్పిన వ్యక్తి సాగగిమయ్ఘోష్. ఆరు దశాబ్దాలు... అంటే 'దేశో పత్రికలో చేరిన నాటినుండి తను చనిపోయేదాకా ఎడిటర్‌గా పనిచేసిన సాగర్ మయ్ ఘోష్ ఇటీవల ఫిబ్రవరి 19న (1999) కన్నుమూయడం బెంగాలీ బాషాసాహిత్యాలకు పెద్దదెబ్బ. సాగర్ మయ్ ఒక వ్యక్తికాదు, సంస్థ చిన్నా చితకా రచయితలు మొదలుకొని దిగ్గజాల పర్యంతం అతను ఇచ్చిన స్ఫూర్తి అంతా యింతాకాదు. ఆనంద్ బజార్ పత్రికా యాజమాన్యం తరపున వెలువడే దేశ్ పత్రిక 1933లో ఆవిర్భవించింది అది బెంగాలీలను అధికంగా ఆకట్టుకొన్న పత్రిక బెంగాలీ భాషా సాహిత్యాలకు పెద్దపీట వేసిన పత్రిక. “దేశ్ ప్రారంభమైన ఆరేళ్ళకు 1939లో సాగర్మయ్ఘోష్ పత్రికలో చేరాడు. అసిస్టెంట్ ఎడిటర్, అసోసియేట్ ఎడిటర్ ..యిలా అంచెలంచెలుగా ఎదిగి పూర్తిస్థాయి ఎడిటరై తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకున్నాడు. ఎనబై ఏడేళ్ళ వయస్సులో కన్నుమూసాడు. అరవై ఏళ్ళ సంపాదకత్వ బాధ్యతల్లో నిండుగా పండిపోయిన అతని జీవితం మిగిల్చిన స్కృతుల్ని, అనుభూతుల్ని తలచుకొని, అతను నెలకొల్పిన వున్నత ప్రమాణాలను నెమరువేసుకుని బెంగాలీ ప్రజలు దుఃబసాగరంలో మునిగిపోయారు అతని మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకషోతున్నారు. సాగర్ మయ్ చావువార్త అబద్ధమైతే బావుండునని భావిస్తున్నారు. అశనిపాతంలాంటి అతని దుర్వార్త విని అశ్రువులు కారుస్తున్నారు సాగర్ మయ్ఘోష్ ఇరవయ్యో శతాబ్దాన్ని పూర్తిగా శాసంచిన సంపాదకుడు. బహుగ్రంధకర్త. అనేక అవార్డుల గ్రహీత. పరిణతమనస్కత అతని ప్రత్యేకత బెంగాలీ సాహిత్య చరిత్రలో నిలిచిపోదగిన అనేక పుస్తకాలకు సంపాదకత్వం నెరపిన మహాశయుడు మానవతావాది. కొత్తపాతల కలబోత. తను పనిచేసిన పత్రికలో తన రచనను ఏనాడూ ప్రచురించుకోసి అసలుఏసలు ఆదర్శవాది
సాగర్ మయ్ఘోష అనేక సాహసాలు, ప్రయోగాలు చేసిన ధీశాలి. ఉదాహరణకు. ,అతడు గత వందేళ్ళ బెంగాలీ సాహిత్యంలో వచ్చిన వంద కధల్ని ఎంపిక చేసి మూడు సంపుటాలుగా ప్రచురించాడు. వంగవాణి సంస్థ వీటిని ముద్రించింది. రెండోసారికూడా ఈ మూడు నంపుటాలు ముచ్చటగా ముద్రణకు నోచుకున్నాయంటే వాటికి ఎంత ఆదరణ వుందో తెలుస్తోంది. వందేళ్ళ బెంగాలీ కదా వికాసానికి ఈ కధలు మంచి ఉదహరణలు. మరొక దృష్టాంతం....1933లో ప్రారంభమైన దేశ్ పత్రిక 1983లో స్వర్ణజయంతి ఉత్సవాలను జరుపుకుంది. ఆ సందర్భంగా గత యాభై ఏళ్ళుగా “జేకో పత్రికలో వచ్చిన ఉత్తమ కధల్ని ఏరి మరో కదల సంకలనం ప్రచురించాడు సాగర్మయ్ఘోష్. ఆది 1990 నాటికి, ముద్రించబడిన ఏడేళ్ళలోపు ఏడు ముద్రణలు పొంది 32,000 ప్రతులు అమ్ముడుపోయింది. అంతేకాదు గత యాఖైఎళ్ళలో దేశ్ పత్రికలో అచ్చయిన గొప్ప కవితల్ని ఏర్పికూర్చి మరో సంకలనం చేశాడు. అలాగే వ్యాసాల సంపుటి కూడా ప్రచురించాడు. చరిత్రలో యిలా... చిరస్తాయిగా నిలువగలిగిన సంకలనాలేకాదు, “ఏక్టీ పేర్కేర్ కాహినీ, దండకారణ్యేర్ బాఘ్, సంపాదకేర్ బైరకే, హీరేర్ వాక్ఛాబి లాంటి ఆనేక సొంతరచనలు పుస్తకాలుగా ప్రచురించాడు. సాగర్ మయ్ఘోష్ 1912వ సంత్సరం జూన్ 22న బంగ్లాదేశ్‌లో జన్మించాడు. తండ్రి కాథిమాహన్దాస్, తల్లి మనోరమాదేవి. శాంతినికేతన్లో చదువుకున్నాడు. 1932 నాటి శాసనోలంఘనవుద్యమంలో పాల్గొని ఆరునెలలు కారాగారవాసం చేశాడు. బి.ఎ. పాసయ్యాక చిన్నాచితకా వుద్యోగాలు చేసి చివరకు 'నవశక్తి, 'యుగాంతర్' పత్రికల్లో చేరాడు. అశోక్‌కుమార్ సర్కార్ పిలుపుతో 'దేశ్ పత్రికలో 1939 డిసెంబర్లో చేరాడు. 1978 వరకు అసిస్టెంట్ ఎడిటర్ మొదలెన బాద్యతల్లో వుండి ఆ తర్వాత ఎడిటర్‌గా తనేమిటో బుజువు చేసుకున్నాడు. ఐరోపా, అమెరికా, జపాన్, హంకాంగ్ లాంటి దేశవిదేశాలు తిరిగి అపారమైన జ్ఞానం నంపాదించిన విజ్ఞాన సర్వస్వం సాగర్ మయ్ఘోష్. నారాయణ్ గంగోపాద్యాయ స్మృతి అవార్డుని 1982లో, అశోక్‌కుమార్ సర్కారు స్మృతి ఆనందపురస్కార్ను 1984లో, దేశికోత్తమ విశ్వభారతి అవార్డును 1986లో అందుకున్నాడు. “బెంగాలీలో ఇరవయ్యవ శతాబ్దమంతా సాగర్ మయ్ఘోష్ రాసిన సంపాదకీయాల సామ్రాజ్య చరిత్రే' నంటాడు ప్రసిద్ధ రచయిత శంకర్. దేశ్ పత్రికలోని ప్రతి పేజీ వెనుకాల అక్షరాల్లో అత నైపుణ్యం దొాగివుంటుంది. తన జీవితకాలంలో బెంగాలీలోని అగ్రశ్రేణి రచయితలెందరి త్ర స్నహపూర్వక సంబందాలను కలిగివున్నాడు. బెంగాలీ బాషలో అత్యంత ప్రతిభామూర్తులైన రచయి లు ఎందరినో తయారు చేసిన ఘనత సాగర్ మయ్ది. సాగరు మయ్ోష్ నిరంతర అధ్యయన శీలి. చిన్నపత్రికల దగ్గర్నించి సేకరించి చదివేవాడు కవులు, రచయితల సమ్మేళనాల్లో, సబల్లో తప్పనిసరిగా కన్పించేవాడు అతడు మంచి గాయకుడు. చక్కటి చిత్రకారుడు. క్రికెట్టు, పుట్‌బాల్ లాంటి ఆటల్ని ఆడేవాడు. సినీనాటక రంగాలంటే అమితమైన ఆసక్తి. చిత్రకళా ప్రదర్శనల్లో తప్పనిసరిగా దర్శనమిచ్చే వక్తి మంచి రసికుడు. హేతువాది. నలిమెల భాస్కర్. 277 సభట్లైళ్ళ ం - పజ హాఖ్ఞఖట్టుస్టై పరా ప ంచహంచలాట్యు. 26
ప్రతి ఆదివారం 'దేశ్ పత్రికను మృష్ణాన్నంలా తయారుచేసిన కీర్తి సాగర్దా గారిది. శంకర్, బిమల్మిత్రా లాంటి రచయితలు ఎంతోమంది సాగర్దా యిచ్చిన ప్రోత్సాహంతో తీర్చిదిద్దబడి జెంగాలీ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు. స్వాతంత్రోత్తరకాలంలోని బెంగాలి సాహిత్యంలో నిలదొక్కుకున్న ప్రతి రచయితా ఏదో ఓ సందర్భంలో 'దేశ్ పత్రిక చేసిన సేవల్ని గుర్తు చేసుకోకపోడు. దానిక్కారణం సాగర్దా. అతను చేసిన కృషి అనితరసాధ్యం. ఎంతో అరుదైన వ్యక్తిత్వం. సాగర్దా లాంటి వ్యక్తులు “నభూతో నభవిష్యతి". బెంగాలీ పారకులకు ఓ సమగ్రమైన పత్రికను అందించిన గొప్పతనం సాగర్దా గారిదే! నిజమైన రచయితలను గుర్తించడం, వాళ్ళని వదలకపోవడం, స్నేహం చేయడం, వాళ్ళతో రాయించడం....సాగర్ీమయ్ తన సంపాదకత్వంలో భాగంగా గుర్తించేవాడు. “జేశొ పాత సంచికల ప్రత్యక్షరంలో సాగర్మయ్ ప్రతిభ ప్రత్యక్షమవుతుంది. ఇక ప్రత్యేక సంచికలైతే సాగర్ మయ్ సూక్ష్మప్రతిభకు ఎత్తిన అద్దాలు. రచయితలు ప్రకటించిన భావాలకు వాళ్ళనే బాధ్యుల్ని చేయకుండా న్యాయపరమైన చిక్కులేవైనా తలెత్తినప్పుడు రచయితలకు ధైర్యం చెప్పి వాళ్ళ తరుపున తనుకూడా న్యాయస్థానాలకు వెళ్ళేవాడు. బెంగాలీ సాహిత్యంలో మొత్తం ఇరవయ్యో శతాబ్దానిక్రి ప్రాతినిధ్యం వహించిన సాగరిమయ్ఘోష్ జీవితం ఇటు సాహితీవేత్తలకూ, అటు సంపాదకులకూ గొప్ప స్ఫూర్తి. 20తో తట టటటటోటనోడ సావాతీ సుమాలు
ఆమె కేరళ'సంక్రాతి. దొదాపు ఏబై ఏళ్ల కిందట జరిగిన సంఘటన. అది కేరళ రాష్ట్ర రాజధానీ నగరం త్రివేండ్రం. ప్రముఖ బాషా శాస్రజ్ఞుడూ, అద్యాపకుడూ అయిన డా. గోదవర్మ నివాసం. ఇంటిల్లిపాదీ సాహిత్యభిలాష కల్గినవాళ్లే! సాయంకాల సమయం. ఆరేళ్ల ఒక అమ్మాయి నించుని వుంది ఆమె అంత చిన్నతనంలో రాసిన ఓ నాటకం విన్పించడానికి సిద్ధంగా వుంది. 'తెర లేస్తుంది" అంటూ కాసింత కంగారు కలిసిన స్వరంతో ఆ అమ్మాయి చదవడం ప్రారంభించింది.
“భాస్కరన్ నాయర్ ప్రవేశిస్తాడు. అతడు 'సరస్వతమ్మా! అని పిలుస్తాడు. తెర పడుతుంది.” ఇంకా వినాలని ఆత్రుతగా వేచి చూస్తోన్న ఆ కుటుంబ సభ్యులు తెరపడుతుంది అనడమే తరువాయి పగలబడి నవ్వారు. ఆ అమ్మాయి కూడా నవ్వకుండా వుండలేకపోయింది. డా. గోదవర్మ ఆ పిల్లని దగ్గరకు తీసుకుని డ్రేమగా తల నిమిరాడు. తర్వాత ఆ అమ్మాయి మాతృభూమి, కౌముది, మలయాళ రాజ్యం మొదలైన మలయాళ మాసపత్రికల్లోని బాలపంక్తికి రెగ్యులర్‌గా రాయడం మొదలు పెట్టింది, ఏబై ఏళ్ల తర్వాత యివాళ ఆ అమ్మాయి పరిణితి చెందిన సాహితీ వేత్తగా ప్రపంచ గవాక్షం ముందు నించుంది. 1998 కామన్వెల్తు కధల పోటీల్లో మొదటి బహుమతి పొందిన “సుజాతా సంక్రాంతి” గారే అలనాటి అమ్మాయి
మలయాళ వైయాకరణుడు రాజరాజవర్శ మనవరాలూ, డా. గోదవర్మ కూతురూ అయిన సుజాతకు సారస్వతం వారసత్వంగా సంక్రమించిన వరం, తండ్రి మరణం తర్వొతే ఏడెనిమిదేళ్ల వయస్సులో కేరళను వదిలిన సుజాత తన సాహితీ సృజనను ఇంగ్లీషులో ప్రారంభించింది. ఆ భాషలో రాసిన '“ద వార్ అండ్ వెప్ట్' (పడుగూ-పేకా) అనే కధకు రెండు వేల పౌండ్ల బహామతి అభించింది.
కామన్ వెల్తు పొండేషనూ, కామన్ వెల్తు బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషనూ సంయుక్తంగా నిర్వహించైన పోటీకి 1998లో రెండువేల ఐదొందల కధలు వచ్చాయి. వాటిల్లోంచి సుజాతా సంక్రాంతి రాసిన “పడుగూ ఫేకా' అన్న కధ బహుమతికి ఎంపికైంది. బ్రిటిష్ సాహిత్య కౌన్సిల్ అధ్యక్తుడు అలగ్జాండర్ నివేన్, కెనడియన్ కధా రచయిత్రి పుల్లింగర్, బిబిసి లోని ఫయోనలెడ్డర్ మొదలైన వాళ్ల జ్యూరీ సుజాత కథకు ప్రధమ బహుమతి ప్రకటించింది. నలిమెల భాస్కర్. జలకళ ఫ్లూ ఎజ్లాఖటు లఖన సత 2?
“కేరళలో నేను గడిపిన కొన్ని సంవత్సరాలే ఒక నిండు జీవితానికి సరిపడినన్ని అనుభవాలను సమకూర్చి పెట్టాయి” అంటుందావిడ తన గతంలోకి తాంగి చూసుకుంటూ. “గుప్రన్నాయర్, జి. కుమార పిల్లై లాంటి ప్రముణ సాహితీ వేత్తలతో నాకు పరిచయబాగ్యం బాల్యం నించే కలిగింది ప్రపంచ సాహిత్యంలోనూ, మలయాళ సాహిత్యంలోనూ వున్న అమూల్య గ్రంధాలను మానాన్నను అడుక్కొని చిన్నప్పుడే చదవడం మొదలెట్టాను” అంటూ సుజాత తన జ్ఞాపకాలను రివైండ్ చేస్తుంది
సుజాతా సంజ్రాంతి విద్యాభ్యాసం కేరళలోనూ, వార్థాలోనూ, ఢిల్లీలోనూ పూర్తయింది. ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కాలేజి నుంచి ఆంగ్లంలో ఎం.ఏ. పొందింది. ఆ కళాశాలలోనే ఆమె లెక్చరర్‌గా పనిచేస్తోంది. సెయింట్ స్టీఫెన్ కళాశాలలో లెక్పరర్గా పని చేస్తున్న ఆంధ్రుడు విజయ బాస్కర్రావుగారితో సుజాత జీవితాన్ని పంచుకుంది. తెలుగింటి కోడలైంది. అలా సుజాత తన పెల్లితో సుజాతారావ్గా మారినప్పటికీ సుజాతా సంక్రాంతి పేరుతోనే రచనలు చేస్తోంది.
కళాశాల స్థాయిలో సాహిత్యంలో అనేక బహుమతులు పాందిన సుజాత గృహస్థ జీవితంలోని ఒత్తిళ్ల వల్ల కొంత తక్కువగా రచనలు చేసింది. అయినప్పటికీ ఆమె డైరీల నిండా కధలే! గత రెండేళ్ల నించి ఆమె బాగా ఏక్టివైజ్ అయ్యింది. ఈ మధ్య ఫెమీనా, యంగ్ ఇండియాల్లో సుజాతా సంక్రాంతి కధలు వచ్చాయి.
“ఓ మిత్రురాలి ప్రోత్సాహంతో నేను గత మార్చిలో కామన్ వెల్తు కదల పోటీలో పాల్గొన్నాను. ఆ పోటీకి కొన్ని ప్రత్యేక నిబంధనలున్నాయి. ఏడు వందల పదాలే వుండాలి. రేడియో ద్వారా ప్రసారం చేస్తారు కనుక ఆరేడు నిముషాల్లో పూర్తవ్వాలి. పడుగూ పేకానా కధల్లో పుత్తమమైందేమీ కాదు. పై నిబంధనలకు సరిపోయేది కాబట్టి పంపించాను. ఎంపికైంది. అదీ అసలు కధ” అంటూ కధానేపధ్యాన్ని వివరిస్తుంది.
ఆసుపత్రిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోన్న ఒక మహిళ తన చుట్టూ వున్న జీవితాల్లోకి నిశితంగా తొంగిచూడటమే '“పడుగూపేకా' కదకు వస్తువు గతాన్ని మాత్రమేకాక వర్తమానంలోని ఆశావహమైన జీవన మాధుర్యాన్ని, బతుకు కదలికల్ని ఆ పాత్ర చక్కగా గమనిస్తుంది. జీవన మరణాల మధ్య నుంచుని అనశ్వర జీవితం గురించి ఆలోచిస్తుంది. సంక్షిప్తంగా యిదీ కధ. రాజ్యలక్ష్మి, ఎం.టి వాసుదేవ నాయర్, మాదవి కుట్టి (కమలాదాస్/కమలా సురయ్యా) మొదలైన రచయితల ప్రభావంతో రాస్తోన్న సుజాతకు సాహిత్య ప్రక్రియలన్నింటిలోకీ అత్యంత యిష్టమైంది కధే!
“మీరు నవలలెందుకు రాయడం లేదు?" అని ప్రశ్నిస్తే, “రాయవచ్చు కానీ కదలకు వున్న స్కోప్ నవలలకు లేదు. మలయాళంలో అత్యున్నతమైన కదలు బోలెడున్నాయి ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న దాన్ని నేను, కధా ప్రక్రియ నన్ను నడిపించినంతగా మరే ప్రక్రియా కదిలించడం లేదు” అంటూ జవాబు చెబుతుంది 28 ఉజళాాోాయయాహాాాాాాాిాజడిటము నం “0034 సాహితీ సుమాలు
'పడుగూ-పేకా' (ది వార్ఫ్ అండ్ వెఫ్ట్) అనే ఆంగ్ల కథలో ప్రధాన పాత్ర స్తీ. ఆమె అన్ని బలహీనతలకూ, అన్ని బలాలకూ మూర్త రూపం. సుజాత రాసిన యితర కథల్లోనూ ముఖ్యపాత్రలు స్రీలే! అయితే ఆమెకు స్రీవాదం, స్త్రీవాద సాహిత్యం పట్ల గుడ్డినమ్మకాల్లేవు.
“ఫెమినిజమూ, వుమెనిజమూ.... రెంటిలో నేను వుమెనిజమ్ పక్షపాతిని. చుట్టూ వున్న పరిసరాలను నిశితంగా చిత్రీకరించడం నా సాహిత్య లక్ష్యం. మగవాళ్ల దృష్టి నుంచీ ఆలోచించి రాస్తే తప్పులేదు. రచయిత్రి స్వేచ్చాజీవి. అలాగని అట్టడగు వర్గాల గురించీ, అబలల గురించీ రాయనవసరం లేదని కాదు నా వుద్దేశం. మలయాళంలో మాధవి కుట్టి, రాజ్యలక్ష్మి, సారాజోసఫ్, చంద్రలతల కథలు నేనిష్టపడతాను” అంటుంది ఉత్సాహంగా సుజాత.
మలయాళ భాషలోని ఉత్తమోత్తమ కథల్ని అనువాదాల ద్వారా ప్రపంచానికి ప్రపంచించ్చాలన్నది సుజాత లక్ష్యం. సుజాత ఆంగ్లంలో రాసిన కథల్ని అప్పుడే కొందరు మలయాళంలోకి అనువదిస్తున్నారు.
“మీరు మీ మాతృభాష మలయాళంలో కథలెందుకు రాయరు?” అంటే "నేను చిన్నప్పుడు పరిచయం చేసుకున్న మలయాళం యివాళ ఎంతో అభివృద్ధి చెందింది. ఎదిగిన భాషా స్థాయికి చేరలేని అశక్తురాలిని. అయితే నా ఆంగ్ల కథలన్నింటికీ దాదాపు కేరళే నేపథ్యం. ముందు నేను మలయాళంలో ఆలోచించాకే ఆంగ్లంలో కథలు రాస్తున్నాను” అంటూ సమాధానం చెబుతుంది సుజాతా సంక్రాంతి. .
నలిమెల భాస్కర్. ప్లా 20
నసాదులసదాశనన సదాశివ ఉర్దూలో ఉద్దండుడు. పారశీలో ప్రచండుడు. సంస్కృతంలో సమర్భుడు మరారీలో మంచి పండితుడు. ఆంధ్రాంగ్లాల్లో ఆరితేరిన మనిషి. హిందీ మొదలైన బాషలాయనకు కరతలామలకాలు, కాదు... కంరంలోంచి ఘంటాపధంగా నాలుక కొసమీది కొచ్చిచేరిన ఉసిరికలు. అనువాదరంగానికి అనేకానేక సేవలందించినందుకుగాను, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటును 1998 డిసెంబర్ 15 నాటి స్నాతకోత్సవంలో అందుకొన్న మేటి సాహితీవేత్త. సాముల సదాశివ అదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని తెనుగుపల్లెలో 1928లో పుట్టాడు. ఉపాధ్యాయ. వృత్తిని చేపట్టాడు. సదాశివ “బోధన అషామాషీ వ్యవహారం కాదు. అబిల లోకం గురువు గొంతులోంచే పెకులుతోంది అత్యంత ఉత్తమోత్తమ కళ ఉపాధ్యాయ వ ఎత్తి” అంటాడు. సురభ్యాది నాట్యకళా మండలివాళ్ళు అప్పటికప్పుడు భారీ సెట్టింగులు వేసి డేక్షకులకు సకల రసానందాల్ని పంచినట్లుగానే,సదాశివగారి తరగతి గది అమాంతం సాహిత్య వాతావరణంలోకి రూపవిక్రియ చెంది విద్యార్థులను మంత్రుముగ్గుల్ని చేస్తుంది అతని సాంగత్యంలో సంగీత సాహిత్యాలు రెండూ వెల్లివిరుస్తాయి అతని సంభాషణలో పాతతరం సాహితీవేత్తలతో తనకున్న పరిచయాలు, ప్రచ్చాయలు, ప్రభావాలు, సంబంధాలు. . అన్నీ దొర్తి మన “వినికిడి జ్ఞానానికి పదును పెడతాయి. సదాశివ ఉర్జూ, పారశీ భాషాసాహిత్యాలను, వాటి సాపత్యాలను, మాదుర్యాలను తెలుగు పాఠకులకు పంచిన వ్యక్తి అనువాద రంగవల్లులను తెలుగు ముంగిళ్ళలో దించిన సదాశివ మంచి చిత్రకారుడు కూడాను. ఉరూ కవుల కవితా సామాగ్రి, పార్శీ కవుల ప్రసక్తి, ఉరూ సాహిత్య చరిత్ర, మోర్దా గాలిబ్ జీవిత చరిత్ర, మరారీ కవి కేశవ సుత్ జీవిత చరిత్ర, అమ్జద్ రుబాయీలు, పారశాల విద్యార్ధుల కోసం పాఠ్యపుస్తకాలు రాశాడు సదాశివ. ఎవరి పాదస్పర్శతో అడవి తల్లి పులకరించి గడ్జిపోచలు గడ్డపారలై రాళ్ళు వీరరస రాగాలాపనలు చేశాయో, ఆ గిరిజన వీరుడు “కొమురం బీము'ను పార్య పుస్తకాల్లో ఒక పారంగా చేర్చిన సంస్కారం సదాశివదే గ్రంధ రచన మాత్రమే కాక సాహిత్య వ్యాసాలు రాయడంలోమా సదాశివ కాకలుతీరిన యోధుడు. తెలుగు, ఉరూ మొదలై న బాషాపత్రికల్లో దాదాపు నాలుగువందల సాహిత్య వ్యాసాలు వ్రాసిన సవ్యసాచి.
మానవ హృదయానికి ఉత్తరం అద్దం. అత్యుత్తమ శ్రైలితో ఉత్తరాలు రాయడం సదాశివకి చాలా యిష్టమైన వ్యవహారం. లేబారచనకు సాహిత్యంలో సమున్నత స్థానం కల్పించాలన్నది వారి ప్రగాఢ విశ్వాసం. సదాశివ వద్ద ప్రముబులైన ఆ తరం సాహితీవేత్తల ఉత్తరాలు ఎన్నెన్నో దొరుకుతాయి. ఉత్తరాలు. . . ప్రధానంగా సాహితీమూర్తులు పరస్పరం రాసుకునే ఉత్తరాలు. . . ఉత్తమ సాహితీ విలువలతో గుబాళించే శాశ్వత రికార్డులంటాడు సదాశివ. కాకతీయ విశ్వవిద్యాలయం సెనెట్ మెంబర్‌గా కొంతకాలం పనిచేశాడు సదాశివ. తెలుగు విశ్వవిద్యాలయం లోగడ వీరిని ప్రతిబాపురస్మ్కారంతోనూ సన్మానించింది. 'అంజద్ రుబాయీలు" అనే రచనకు 1964లో రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, 1969లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డూ లభించాయి. 1983లో రచన ప్రారంభించి 1993 డిసెంబర్లో ముగించిన 'రాముడు' ఖనే గ్రందాన్ని ప్రచురించడానికి సదాశివ ప్రయత్నాలు చేస్తున్నాడు. అనేక పత్రికల్లో ఫీచర్లు రాశాడు. మిసిమి, ఆంద్రప్రభ, గీటురాయి, సియాసత్, మిలాప్, వార్త మొదలైన పత్రికలన్నింటిలోనూ క్రమం తప్పకుండా శీర్షికారచన నిర్వహించాడు కొన్ని పత్రికల్లో యిప్పటిక్తీ నిర్వహిస్తున్నాడు. భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేసిన సదాశివ సాహిత్యవ్యాసంగం లోంచి మాత్రం రిటైర్ కాలేదు. అవిశ్రాంతంగా రచనలు సాగిస్తూ యువ సాహితీవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వసంతరావు దేశపాండే తన 'అడవి" నవలను సదాశివకే అంకితమిచ్చారు. సాహిత్య విమర్శలో సదాశివ తమదైన 'ఒరవడి'ని స్టాపించాడు. ముక్కుసూటి విమర్శవారిది ద్రావిడ ప్రాణయామం లాంటి సాహితీ విమర్శవల్ల 'ఎనిచ్' కామని సదాశివ దృఢమైన అభిప్రాయం. కవులు, రచయితలు చేస్తోన్న తప్పుల్ని ముక్కుమీద గుద్దినట్లు భళ్ళున వెల్లడి చేస్తాడు. సదాశివ మాట తీరు కూడా యిలాగే వుంటుంది. _ కానీ అంతర్లీనంగా అతని విమర్శలోనూ, మాటలోనూ మార్దవం జాలువారుతుంది. రాచమల్లు రామచంద్రారెడ్డి కట్టమంచి రామలింగారెడ్డి వంటి దిగ్ధంతుల విమర్శులోని ముక్కుసూటి విన్యాసాలు సదాశివలోనూ కన్పిస్తాయి. అనువాద రంగం గురించి సదాశివకి కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ విస్తరించి సమస్తదూరాలు చెరిగి పోతోన్న ఈ సంధికాలంలో అనువాదకులు మాత్రమే విశ్వమానవాళికి దగ్గరి బంధువులు అంటాడు సదాశివ “ఈతరం కవులు, రచయితలు సమర్థవంతంగా రచనలు చేస్తున్నారు. వాళ్ళకి పరిశీలనా పాటనం కూడా ఎక్కువే. అయితే పరనాసక్తి మాత్రం మాతరంవాళ్ళలా లేకపోవడం విచారించవలసిన విషయం. పైగొ ఎదుటివాళ్ళని అంగీకరించకపోవడం, ఒకటి రండు పుస్తకాలతో మవారచయితలుగా ఎదిగి పోయామనుకోవడం, పరస్పర ఈర్వాసూయలతో సాహిత్య వాతావరణాన్ని కలుషితం చేయడంలాంటి అనారోగ్య లక్షణాల్ని వదిలించుకోగలిగికే, ఈతరం మాకన్నా మహత్తరమైన తరం అంటాడు సదాశివ. కవిగా, విమర్శకుడిగా, వ్యాసరచయితగా, అనువాదకుడిగా, బహుభాషావేత్తగా, లేఖారచయితగా, మంచి స్నేహితుడిగా పలు కోణాల్లో వికసించిన సదాశివ సాన్నిధ్యంలో కాలం పసీపిల్లలామారి కేరింతలు కొడుతుంది యుగాలు క్షణాలుగా మారి అతని ప్రబావంలోంచి మనం వెళ్ళిపోతున్నప్పుడు, ఒక భారీ పుస్తక భాండాగారాన్ని వదిలి వెళుతున్న అనుభూతి కలుగుతుంది. తెలుగు విశ్వవిద్యాలయం ప్రదానం చేసిన గౌరవ డాక్టరేట్ వల్ల సదాశివ గౌరవం పెరగడం కన్నా డాక్టరేట్ డిగ్రీకి ప్రదానంగా గౌరవం కలిగిందనడంలో న. వలి లాను బాకు నలిమెల భాస్కర్ ?సోష్యట్య్యూ న హన నాక ల సన్నీ
సాహిత్యమూసాహసమూ రెండింటి కలబోత వ. అజిత్ ౩9 మీ. ప్రఖ్యాత పంజాబీ రచయిత్రి అజిత్ కౌర్ 'జానాబదోక్ అనే స్వీయ చరిత్రని 1986లో ప్రచురించినప్పుడు తలెత్తిన వివాదాలు ఈనాటికీ సమసిపోలేదు. ప్రస్తుతం ఆ పుస్తకాన్ని 'హార్న! అండ్ కొలిన్స్' కంపెనీ వాళ్ళు “పెబిల్స్ ఇన్ టిన్డ్రమ్' పేరుతో ఇంగ్లీషులోకి అనువదింపచేని అచ్చు వేస్తున్నారు. ఒక సాహిత్య రచనలోని మౌలికతనీ, జీవితంలోని సత్యసందతనీ, పైగా స్రీవాద భావజాలాన్నీ ఈ పుస్తకం అద్దం లాగా ఎత్తిచూపింది. చదివించే గుణం (రీడబులిటీ)టో ఈ పుస్తకం పారకుల హృదయాలకు మరింత చేరువైంది.
అజిత్‌కౌర్ కేవలం కధా రచయిత్రి మాత్రమే కాదు. జీవకారుణ్య సంఘాల్లో ఆమెది క్రియాశీలకమై; పాత్ర. అతీగతీ లేని మురికివాడల స్త్రీలకు పునరావాసం కల్పించడంలో అజిత్‌కౌర్ ప్రధాన సూత్రధారి 1934లో లాహోర్‌లో పుట్టిన అజిత్‌కౌర్ “దేశ విభజన దేశాన్నే కాదు .. నా వ్యక్తిత్వాన్నీ రెండ ముక్కలుగా చీల్చింది” అంటూ బాధపడుతుంది. _ శారీరకంగానూ, మానసికంగానూ ఆమె అనుభవించిన సుఖదుఃఖాల జమిలి కలబోతను అజిత్‌కౌర్ తన రచనలకు అజేయమైన శక్తిగా మార్చుకున్నది, అంతేకాదు... విఫలమైపోయిన తన దాంపత్య జీవితపు చితిలోంచి పునరుత్థానం చెందిన అజిత్‌కౌర్ కొత్తగా, కొంగ్రాత్తగా అనేకమైన ఉత్తమ రచనలు చేస్తున్నది.
“పిరికితనమే! ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచీ అందరూ నూరిపోస్తున్నది పిరికితనమే!. కనిపెంచిన తల్లిదండ్రులతో సహా మొత్తం సమాజమంతా ఈ సిరికితనాన్ని ఆడపిల్లలకు ఒక అనివార్య అవయవంగా తగిలించి ఆమె వ్యక్తిత్వాన్ని తగలేస్తున్నారు' అంటూ “విద్యాభ్యాసంతోనూ, ఆ రిక స్వావలంబనతోనూ సర్వస్వతంత్రురాలిని అనుకునే స్రీలోనూ ఈ పిరికితనం, ఈ మురికితన్వం వున్నాయి. స్వాతంత్ర్యం రావాల్సింది మనిషి మనస్సులోంచి. అయితే తమ తమ జీవితాల్లో సంభవించిన ఎదురుదెబ్బలు మాత్రం ఈ పిరికి మురికిని వదలగొట్టి స్త్రీని జీవిత యుద్ధ రంగంలో వీరోచితంగా నిలబెడుతాయి నా జీవితంలోనూ అలాంటి సంఘటనలే జరిగాయి” అంటుంది, ఇటీవల ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపు మలయాళంలో ప్రారంభించిన వారపత్రిక 'మలయాళం"త్రో మాట్లాడుతూ.
32 సృజతి సాహాతీ సుమూలు
నిజమే! అజిత్కార్కు తోబుట్టువులు కష్టాలూ, కన్నీళ్ళూ. రెక్కలు రాని ఇద్దరు పసి పిల్లలను తీసుకుని మెట్టినింటి నుండి బయటపడిన అజిత్‌కౌర్ పిరికితనంతో వణికిపోలేదు. భయంతో జెణకలేదు. స్థిరచిత్తంతో "ఉమెన్స్ హాస్టల్లో చేరింది సాహస సముద్రాలను ఈదింది. ధైర్యగ్రంధాల్ని చదివింది. కలాన్ని గుప్పిట బిగించి పితృస్వామిక సమాజంలోని సమస్త రహస్యాల్నీ పుక్కిటబట్టింది. తన చిన్నకూతురు క్యాండి ప్యారిస్‌లో చదువుకోవడానికి వెళ్ళి రెండు పదుల వయస్సులోనే చనిపోయినప్పుడు కూడా అజిత్ కౌర్ దైర్య దీపాన్ని చేతిలోంచి జారవిడువలేదు.
“పేమ గుడ్డిది' అనే మాట అజిత్‌కౌర్ పూర్వాశ్రమ జీవితానికి బాగా సరిపోతుంది. ఆమె కళాశాల విద్యార్థినిగా వున్నప్పుడు బల్దేవ్ అనే ప్రాఫెసర్తో (ప్రేమలో పడింది. అయితే అది ఫలించలేదు. తర్వాత ఓంప్రకాశ్ అనే ప్రచురణకర్తతో అజితకౌర్ స్నేహం చేసింది... అతణ్జీ ప్రేమించింది. ఆ వ్యవహారం కూడా విపలం కావడంతో ఒంటరిగా పోరాటం చేయక తప్పదనుకొని స్రీల బాధలను తన కలంతో పలికించింది.
“ఊహాజగత్తులోంచి వాస్తవికతలోకి మళ్ళించడమే నేను స్వీయ చరిత్రలో చేసిన పని. ఊహ ఏనాడూ కరోర వాస్తవాన్ని మొత్తంగా కబభించకూడదు. వాస్తవంలో ఒక భాగంగానే ఊహల్ని, కల్పనల్ని రిసీవ్ చేసుకోవాల్సి వుంటుంది” అంటుంది ఆజిక్కౌర్ 'ఖానాబదోకొలోని విషయాలను వివరిస్తూ.
సొంత కాళ్ళమీద నించుని వశ్రిత్వాన్ని కాపాడుకోవలనుకునే ప్రీలమీద ఈ మగసమాజం నీలాపనిందల్సి, అర్ధంపర్థంలేని అబాండాల్ని మోపుతుందని అజితకౌర్ నిప్పులు కక్కుతుంది. తనక్కూడా ఇలాంటి అపజ్యాతిని అంటగట్టారంటూ పురుష సమాజాన్ని పరుషంగా హెచ్చరించింది.
“అయితే ఇలాంటి లేనిపోని ఆరోపణలతో డీలాపడేదాన్ని కాను నేను. నేను వీరనారీమణిని. నా జీవితంలో ఆనాడూ, ఈనాడూ పోరాటమ” అంటున్నది అజితకొౌర్.
అజిత్‌కౌర్ 'అకాడమీ ఆఫ్ ఆర్ట్ అండ్ లిటరేచర్' అనే సాహితీ సాంస్కృతిక సంస్థని ఢిల్లీలో స్థాపించింది. ఈ సంస్థ సైతం ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. స్థలానికి సంబంధించిన వివాదాల్లో అజితకౌర్ తలదాకా కూరుకుపోయింది.
పంజాబీ సాహిత్యంలో ప్రదానంగా ముగ్గురు రచయిత్రులు త్తమ బలమైన గొంతుల్ని వినిపిస్తున్నారు. ఒకరు జ్ఞానపీర బహుమతిని అందుకున్న అమ్మతా వ్రతం, మరొకరు దిలీప్‌కౌర్ తివానా, మూడో వ్యక్తి అజిత్త్కౌర్. ముగ్గురి రచనల్లోనూ కలిసివచ్చే అంశాలు ఉన్నప్పటికీ ఎవరి ప్రత్యేకతలు వాళ్ళవి. అజిత్‌కౌర్ రచనల్లో పట్టణాల్లో నివసించే స్త్రీల బాధల్యు కనిపిన్తైయి. స్తీ పురుష సంబంధాల శైధిల్యం మామూలే! “గుల్‌బానో, బుత్-శికొన్, మౌత్ అలి బాబే దీ” ఆ్రవ్సై ప్రకటించిన కదా సంకలనాలు. గృహస్థ జీవితంలోని ఢ్రేము సంబంధా లను తృణీకరించి కామ సంబంధాలను స్టిరీకృతం చేసిన “మౌత్ అరీ బాబే దీ" గొప్పు రచన. సామౌజి యధార్భాల్ని, మానవ సంబంధాల్నీ, సున్నితమైన స్తీ సంవేదనల్నీ ప్రగాఢంగా ఆవిష్కరించిన కధల పుస్తకమది ఆవ్చై కధల్లో 'బేబాకీ'కి మంచి పేరు వచ్చింది 'పాత్ర చిత్రణలో అజికీకౌర్ చాలొ శ్రద్ధ వహిస్తుంది, మానసిక ప్రవృత్తుల్ని బాగా విశ్లేషిస్తూ మనకు తెలీని అనేక కొత్త కోణాల్ని బహిర్గతం చేస్తుంద, నలిమెల భాస్కద్ (9, 3 ప్రేం తుంది ేాపత్త్యర్య్య్యా క్
అజిత్‌కౌర్ కధల్లో “నా మారో” 'కుత్తే'లు కూడా గొప్పగా పేరు తెచ్చుకున్నాయి. అజిత్‌కౌర్ ఇటీవల *నా మారో సావీయాం చిడియాం'" మొదలైన కధా సంకలనాలను ప్రచురించింది. 'సూలీి పర్ లట్కే క్షణ్ (శూలంమ్మీద వేలాడిన క్షణం) గొప్ప కద
“ఆర్థిక ఇబ్బందులూ, సామాజిక అసమానతల్లాంటి రుగ్మతలతో మానవ సమాజమంతా బాదలకు గురవుతోంది. కానీ కొన్ని కష్టాలను స్త్రీ, ఫ్రీగా పుట్టినందువల్లే అనుభవిస్తోంది. స్త్రీ అనుబవించే కష్టాలను ఆర్థిక స్వాతంత్ర్యంతోనూ, ఇతర వెసులుబాట్లతోనూ పరిష్కరించలేము. అందుకే ప్రదానంగా నారచనలు స్రీ బాధలకు ప్రతిరూపాలు” అంటుంది అజిత్‌కౌర్ స్రీ జొతిపట్ల ఒకింత సానుభూతిని కోరుకుంటూ. 94 పాల ాతతతాళయయాటన 4 కట్ సావాతీ సుమాలు
కష్టాల కడలిని మధించిన కఠం
మిర్జాగాలిబ్ స్థానం నిస్సందేహంగా ఉరూ సాహిత్యంలో ఎంతో ఉన్నతమైనది. అయితే
అతనికన్నా వున్నత స్థానం ఒకరకంగా మీర్ గారిది. మీర్ అంటే సముద్రం, హద్దు యిత్యాది స (ట జ్
అర్జాలున్నాయి. కొలవలేని హద్దులదాకా, ఈదలేని లోతుల దాకా విస్తరించిన మీర్ స్థానం నిరుపమానం, ఉర్జూలోని ప్రముఖ కవులంతా మీర్ రాసిన కవితల్ని ప్రశంసించడమే గాక వాటి నుంచి ప్రేరణ పొందారు. గొలిబ్, బెక్, నాసిబ్, అతిశ్, సౌదా లాంటి ఉర్దూ ప్రసిద్ధ కవులు మీర్‌ను తమ గురువుగా గౌరవించారు. స్వయంగా ఓ సందర్భంలో గాలిబ్ యిలా అన్నాడు.
శబ్తా. కో తుమ్హీ ఉస్తాద్ నహీ హో 'గాలిబొ
కహతే హై ఆగ్లే జమానే మే కోయి 'మీర్' భీదా
(గాలిబ్! ఉరూ బాషకి నువ్వే గురువ్వి కాదు. నీ కన్నా ముందు మీర్ కూడా వున్నాడంటారు.)
మరో ఉరూ ప్రసిద్ధ కవి బెక్ కూడా మీర్‌ను మీరలేకపోయాడు.
మీర్ కేవలం కవే కాదు. కవులందరికీ ఆదర్శప్రాయుడు. ఉర్జూ భాషలో ఆరంభకాల కఫలైనా ఇప్పటి కవులైనా, మీర్ కావ్యాల నుంచి నిరంతరం ఏదో రకమైన న్ఫూర్తిని పొందారు, పొ ందుటా వున్నారు. ఉర్తూ సాహిత్యంలో ప్రస్తుత యుగ ప్రవర్తకుడు ఆయిన మౌలానా అల్తాఫ్ హాస్స (హాలి)కూడా మీర్‌ను అనుసరించకుండా వుండలేకపోయాడు. అయితే మీర్ కవితల్లోని ఆర్హతేను మరెవ్వరూ పట్టుకోలేకపోయారు.
మీర్ ఉరూ సాహిత్యానికి వాస్తవికతను జోడించిన కవి. ఉరూ ఆదికవిగా “వలీ'ని అంగీకరించినా, అతని మీద దక్కనీ ప్రబావం ఎక్కువ నిజానికి వలీని దక్కనీ భాషలోని చివరి కవుల్లో ఒకరిగా గుర్తించడం సబబు మీర్ ఉర్జూని చిత్రికపట్టాడు. ఆ భాషలో తన స్థానం అద్వితీయం చేసుకున్నాడు. అతని కావ్యాల గొప్పతనం ఉత్తరాదిలోనే కాదు దక్తిణంలోనూ లక్షణంగా వ్యాపించింది
ఏది ఏమైనప్పటికీ మీర్ ప్రజల కవి. మీర్ జీవితమంతా కష్టాల కడలిలో మునిగితేలింది ఈ కష్టాలూ, కడగండ్లే మీర్ కావ్యాల్ని సారభూతం చేశాయి నలిమెల భాస్కర్ కర
మీర్ 1722లో ఆగ్రాలో జన్మించాడు. ఆగ్రా నుండి పొట్టచేత పట్టుకుని ఢిల్లీకొచ్చాడు. ఢిల్లీలో గల్లీలన్నీ తిరిగాడు. అప్పుడది దురాక్రమణల, దోపిడీల సమయం. ఢిల్లీ యావత్తూ తల్లడిల్లి పోతోంది. నాదిర్షా ఢిల్లీని కొల్లగొట్టాడు. మీర్‌కు ఎక్కడా నౌకరీ దొరకలేదు. ఏ నౌక అతణ్ణి కష్టాల కడలి దాటించలేదు. ఇల్లిల్లూ తిరిగాడు. పిడికెడు అన్నంకోసం తన మానమార్యాదలను మంటగలుపుకున్నాడు. ఒక చోట తన నిస్సహాయ పరిస్థితిని చాలా మార్మికంగా వెల్లడి చేశాడిలా... దర్ పర్ హర్ ఏక్ దీన్ కే సమాబిత్ మేరీగయీ నాలాయకోంసే మిల్తే లియాకత్ మేరీ గయీ (గృహములోని ప్రతి పిసినిగొట్టుని వేడి, గుణము కోల్పోయితి నయోగ్యులయో[) ఇది మన మహాకవి వేమన్న '“లోభివాని నడుగ లాభంబు లేదయా'లాంటిది. చివరికి మీర్ ఢిల్లీ వదిలి లక్నో వెళ్ళాడు. అక్కడొక సత్రంలో దిగాడు. పట్టణంలో ఓ కవి సమ్మేళనం వుందని తెలిసీ, తెలియడంతోబే అక్కడికి వెళ్ళాడు. లక్నో వాసులు చిరిగి పేలికలైన అతని ఒంటిమీది గుడ్డల్ని చూసి పక్కున నవ్వారు. అతనికెందుకో లక్నో నచ్చలేదు. అక్కడ అతని అర్హతల్ని ఎవ్వరూ ఖాతరు చేయలేదు. ఆతనీ విషయంలో బాగా వ్యథచెందాడు. పాషాణ హృదయుల మీద తన వ్యంగ్య కవితా బాణాలు సంధించాడు. కొందరైతే మీర్‌ను పిచ్చివాడని సైతం తిట్టిపోశారు. మీర్ కరుణా సముద్రుడు. లొకం పోకడల్నీ, లోతైన తాత్వికతేనీ ఎరిగిన బుషిపుంగవుడు. “పొట్ట పోసుకోవడం కోసం ఎవరిని చేయి చాచి ఎలా అడగను?” అంటూ బాధపడిన కవి మీర్, “జీవిత లోలుపత్క విషయ. లాలసతలు వినా, బతకగల్లితే బావుండును కదా” అంటూ బావురుమన్నాడు. అబ్తో బెకే హై మైకదే సే మీర్ ఫిర్ మిలేంగే అగర్ ఖుదా లాయా . అంటూనే మీర్ లక్నోలో కన్నుమూశాడు. అక్కడి మట్టిలో మట్టిగా లీనమయ్యాడు. మీర్ కవితల్లో వేదన వుంది. గొంతుకలో గుండె కొట్లాటలున్నాయి. మీర్ కావ్యాలు ప్రజల కోసం ప్రజల భాషలో రాయబడ్డాయి. మీర్ ఏ దేశంలో జన్మించి పెరిగి పెద్దవాడయ్యాడో, ఆ దేశాన్ని నేపథ్యంగా తీసుకుని నేపద్యం రాస్తాను, రచనలు చేస్తాను అని నిరూపించాడు. అందువల్లే అతని కావ్యాల్లో భారతీయతత్వం మూలభూతంగా నిలిచింది. మీర్ రచనలు చేస్తున్నప్పుడు ఉర్దూ భాష యిప్పటిలా వికాసదశకు చేరుకోలేదు. అది అప్పడప్పుడే బుడిబుడి నడకలతో అడుగులు వేస్తోంది. సాహిత్యంలో కొంగ్రొత్త ప్రయోగాల కాలమది. హిందు ఈ, దక్కనీ భాషల్లోంచి భారతీయతత్యాన్ని లాగి ఓ కొత్తరకం ఉరూ కోసం వురకలేస్తోన్న సమయం. అంతా అయోమయం. పురిటి నొప్పులు....బాలారిష్టాలు. చాలా మంది ఉర్దూ కవులు తమ కాళ్ళను భరత భూమిలో వుంచి...అరబ్, ఇరాన్ దేశాల శ్వాసలు తీసుకొనేవాళ్ళు. ఉర్పూ కవులంతా యింతే కాదు. నజీర్ అక్బర్ బర్బాదీ లాంటి వాళ్ళు భారతీయత ఉర్జూ రచనల్లో ఈర పాంటు సాహెతీ సుమాలు
వుండాల్సిందే అన్నారు మీర్ కూడా నజీర్ లాంటి వాడే!
మీర్ చేసిన కావ్యరచనలు దాదాపు వేయి పేజీలకు మించి పోయాయి. మీర్ “షేరొలలో ఒక పదిశాతం యిప్పటి బాషకి దూరమై పోయాయి. మీర్ రాసిన ఏడువేల పద్యాల భావాలను ఈనాటి పరిస్టితులకు కూడా అన్వయింప చేయవచ్చు. అవి యిప్పుడు రాయబడినవా అన్నంత ఆశ్చర్యాన్ని గొలుపుతాయి. అతని 3లిలో ఏదో ఇంద్రజాలం వున్నదేమో అన్నట్లు చదువరుల్ని మంత్రముగ్గుల్ని చేస్తాయి.
మీర్ రచనలన్నింటిలోనూ జీవితం అంతర్హయగా వుంటుంది. వీటిల్లో మానవత, కరుణ, వినమ్రత స్వాభావికతలే కాకుండా దాశరధి 'బండనుకోయాలి కుసుమదళం, గుండెను కోయాలి నయనజలం' అన్నట్టుగా గుండెను నిలువుగా చీల్చగల మృదుత్వం కూడా వుంది.
ఆతిషె ఇష్క్నే రావణ్కో జలాకే మారా
గర్చే లంకా సాధా ఇస్ దేవ్కా పుర్ పానీ మే
(ప్రేమాగ్ని కదూ రావణుని ప్రాణాలు కాల్చింది. లంకా దేశమింకా అందుకే చుట్టూ నీళ్ళతో మిగిలింది)
డాక్టర్ ఫారూకీ “మీర్ సృష్టించిన సాహిత్యం, ఫారసీకి కార్బన్ కాపీ కాదు. అతను తన చుట్టూ వున్న వాతావరణంతో, పరిసరాలతో ప్రబావితుడ్రై రాశాడు"అంటాడు. “మీర్ స్వానుభవంలోంచి వచ్చిన సాహిత్యమది" అన్నాడు డాక్టర్ పరమానంద్ పాంచాల్.
“అనుభూతుల్ని కోల్పోయి దివాళాతీసిన మనస్సు కొల్లగొట్టబడిన నగరంలాంటి"దంటాడు మీర్. మనసు కవి అయిన మన సుకవి ఆత్రేయ కూడా మనన్సుని ఊహల ఉయ్యాలవే, మాయల దయ్యానివే అంటూ అందరాని లోతుల్ని చూపించాడు కదా!
మీర్ శ్రేమ గురించి
'“అంఛర్ హైతో ఇష్క్కే దోహ,
లేకిన్ హై విస్తార్ బహుత్” అన్నాడు.
(అక్షరాలు గ్రేుమకు రెండే రెండు అయితే వాటి విస్తీర్ణం,మరి మెండు)
మతాల సంకుచిత పరిధుల్లో మీర్ సంచరించని వ్యక్తి. మానవతా మతం అతని అభిమతం, మీర లేని మేరల దాకా ఎదిగిన వ్యక్తిత్వం మీర్ది. " నలిమల భాస్కర్ " ఫ్లష్లుాుుుాుుం7
అసలు సిసలు భూమిపుత్రుడు 1867వ సంవత్సరం సెప్టెంబర్ 19 రోజున శ్రీపాద దామోదర్ సాత్వళేకర్ జననం మహారాష్ట్రలోని కోల్గామ్లో జరిగింది. తండ్రి పేరు దామోదర్, తల్లి లక్ష్మిబాయి. వాళ్ళది వైదిక కుటుంబం. సాతీవళేకర్ ముంబయ్‌లోని జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చిత్రకళను నేర్చుకున్నాడు. అక్కడే ఓ ఆరు మాసాలపాటు చిత్రకళలో అధ్యాపకత్వం నెరపాడు. తర్వాత ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు, అతని చిత్రకళా నైపుణ్యానికి హైదరాబాద్ నిజాం ముగ్ధడయ్యేవాడట! సరిగ్గా ఈ సమయంలోనే ఆర్య సమాజం పట్ల ఆకర్షితుడయ్యాడు సాత్వళేకర్. కేశవ్‌రావ్ కొరట్కర్ ద్వారా సొత్వళేకర్ ఆర్య సమాజ అనుయాయిగా మారాడు. తతృ్సలితంగా అతడు వేదాల్ని ఉదృతంగా ప్రచారం చేసే కార్యక్రమంలో లీనమయ్యాడు. తర్వాత్తర్వాత వేదపండితుల సరసన సాత్వళేకర్ సముచిత స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఒకసారి కర్ణాటకలోని రాయచూరు నగరంలో సోమయాగం జరుగుతోంది. వచ్చిన పండితుల్లో “వైదిక యజ్ఞాల్లో పశువధ సమంజసమేనా?” అనే చర్చ ఉత్పన్నమైంది. ఆర్య సమాజ ప్రతినిధిగా వచ్చిన సాత్వలేకర్ 'మాంసం లేకుండా చేసే యజ్ఞమే వేదాల్లో ఉచితమైందిగా ప్రస్తావించబడింది" అని సహేతుకంగా ప్రతిపాదించాడు. కొంతమంది అతని వాదనని ఖండించారు. చర్చ చాలాసేపు జరిగింది. దాదాపు ఐదువేలమంది. ఆ చర్చలో రోజూ పాల్గొనే వాళ్ళు. చివరికి జంతుబలి మంచిది కాదనే నిర్ణయం జరిగింది. తర్వాతి కాలంలో సాత్వళేకర్ వేదార్థ మీమాంస రంగంలో చాలా సేవ చేశాడు. “వైదిక యజ్ఞ సంస్థ” పేరుతో ఓ పుస్తకం ప్రచురించాడు. జాతి, వర్ణ వ్యవస్థల్ని నిరసిస్తూ అస్పృశ్యతను నివారించవలసిన అవసరముందని వాదిస్తూ పలు వ్యాసాలు రాశాడు. సాత్వళేకర్ దాదాపు నాలుగు వందల పుస్తకాలు రాశాడు. 'సుబోధ్ భాష్య" (బుగ్వేద వ్యాఖ్యానం) _ ఆగమన నిబంధమాల, యోగసాధన గ్రంథమాల, అగ్నిదేవతా మంత్ర సంగ్రహం మొదలైనవి 38 ఏయ్ సాహాత్ సుమాలు
అతని ప్రసిద్ధ గ్రందాలు. 'వైదిక వ్యాజ్యానమాల' లాంటి వందలకొద్దీ వ్యాసాలు రాశాడు నాలుగు వేదాలకు పరిషృత ముద్రణలు సాధించాడు భగవద్గీత ఆదారంగా “పురుషార్థ బోధిని” పేరుతో ఓ స్వతంత్ర వ్యాజ్యాన గ్రందాన్ని రచించాడు.
సాత్వళేకర్ రామాయణ, మహాబారతాలపై విస్తృత విమర్శా గ్రంధాల్ని రాశాడు. వేదాలలో వర్ణించబడిన గో మహత్యాన్ని తెలిపేందుకు “గోజ్జానకోశం' అనే గొప్ప గ్రంధం అందించాడు.
హిందీలో “వైదిక దర్శి, మరారీలో 'పురుషార్ట్, గుజరాతిలో “వేద సందేశ్ సంస్కృతంలో అమృతమాల మొదలైన మాస పత్రికల్ని సాత్వళేకర్ ప్రచురించేవాడు. వైదిక ధర్మ ప్రచారం కోసం సాత్వళేకర్ సాగించిన కృషి మరెవ్వరూ చేయలేకపోయారని చెప్పడం అత్యుక్తి కాదు.
సాత్వళేకర్ 'స్వాద్యాయ మండలం' అనే సంస్థని స్టాఫి౦చి వేద ప్రచార కార్యక్రమం చేపట్టాడు. ఆ సంస్థని 1918లో బెంధ్లో స్టాపించాడు.
సాత్వళేకర్ సంస్కృత భాషని పునరుజ్జీవింప చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా 24 భాగాల పుస్తకమాలను ప్రచురించాడు. సంస్కృత భాషా పునరుద్ధరణ కొరకు 1300ల స్వాద్యాయ కేంద్రాల్ని స్థాపించాడు. ఆ కేంద్రాల ద్వారా 45,000ల మంది ప్రతి యేటా సంస్కృతాన్ని నేర్చుకొనేవాళ్ళు.
అయితే సాత్వళేకర్ చేసిన ఇన్ని పనులూ అప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న ఆంగ్లేయులను వెళ్ళగొట్టడం కోసమే చేశాడు. జాతీయోద్యమం కన్నా ముందు మనదేశంలో సాంస్కృతిక పునరుజ్జేవన ఉద్యమంకొనసాగింది (కల్చరల్ రినయజెన్స్) నిద్రాణమైన భారతీయుల్ని తట్టిలేపడానికి సాంస్కృతిక పునరుజ్జీవనం ఎంతగానో తోడ్పడింది. 1918లోనే సాత్వళేకర్ ఈ రెండురకాల ఉద్యమాలకూ అంకితమయ్యాడు. దేశభక్తి ప్రపూరితాలైన ఆతని ప్రసంగాలు జాతీయతాభావ బీజాల్ని నాటాయి. హైదరాబాద్ నిజాం నవాబుకు సాత్వళేకర్ బాగా నచ్చాడు కానీ ఆంగ్లేయులు దీన్ని సహించలేకపోయారు,. వాళ్ళు నిజాం ప్రభువుతో సాత్వళేకర్కు దేశ బహిష్కార శిక్ష పడక తప్పదని హెచ్చరించారు ఆంగ్లీయుల ఒత్తిడి కారణంగా నిజాం సాత్వళేకర్ని కాస్త తగ్గమని కోరాడు. దానికతను “నేను ప్రజల్లో దేశబక్తిని పాదుకొల్పడానికి ఉద్యుక్తుణ్ణయ్యాను. ఇదే దేశ హితం. నా పని ఆపను. సర్కారు ఏం చేసుకున్నా ఫరవాలేధు” అని గుండె బద్దలుకొట్టి చెప్పాడు.
1907లో సాత్వళేకర్ 'వైదిక రాష్ట్ర గీత' అనే గ్రంధాన్ని ప్రచురించాడు. అది అధర్వణ వేదంలో ఉన్న ఓ సూక్తికి వ్యాఖ్యానరూపగ్రంధం. “భూమి సాక్షాత్తూ తల్లి వంటిది. నేను భూమిపుత్రుణే (మాతా భూమిః పుత్రోహం ప్పధివ్యాఖ మొదలైన మంత్రాలు అందులో ఉన్నాయి. ఇది దేశ ద్రోహమేనని అంగ్ల ప్రభుత్వం ఆ పుస్తకాలన్నింటినీ స్వాధినం చేసుకుంది. అగ్నికి ఆహుతి చేసింది.
హైదారాబాద్‌లో ఉండడం నిజాం రాజు క్కూడా ఇబ్బంది కలిగించే విషయమని భావించిన సాత్వళేకర్ హరిద్వార్ చేరాడు 1908 సంవత్సరం 'విశ్వవృత్త' మాస పత్రికలో “దేశం ఇబ్బందుల్లో వలిమెల భాస్కర్ ఫ్లోస్లుతప్ట నట్ట నన ప ైుహ్నట్లు 50
ఉన్నప్పుడు మౌనంగా ఉండడం మంచిది కాద ని, “దేశరక్షణ కొసం ప్రయత్నాలు కొనసాగించడమె శ్లాఘనీయం” అనీ మళ్ళీ ఓ వ్యాసం రాశాడతడు. అది ఆంగ్ల ప్రభుత్వ ఆగ్రహానికి కారణబూతమైంది. సాత్వళేకర్ను అరెస్టు చేయాలని భావించింది. అతడు అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నాడప్పుడు. చివరికి అతణ్జి హరిద్వార్‌లో పట్టుకున్నారు. దేశద్రోహ నేరాన్ని మోపి చెరసాలలో బంధించారు. కొన్ని మాసాల తర్వాత సాత్వళేకర్ను విచారించడానికి కోర్టుకు తీసుకొచ్చారు. న్యాయమూర్తితో అతనుచెప్పిన మాటలు చూద్దాం: “దేశం బానిసత్యంలో మగ్గుతున్నప్పుడు జాతిజనుల్ని ఉద్దీప్తం చేసేందుకు వేదాధ్యయనం చేయాలని వేదాలే ఆదేశిస్తున్నాయి. వేదాల్లోని దేశభక్తి పూరితమైన ఆలోచనల్ని నేను వ్యాసాలుగా రాశానన్నది నిజమే! నేను చేసిన ఈ పని సమంజసమైనదే!! ఈ విషయంలో నేను పశ్చాత్తాపపడడం లేదు. మీరు ఏ శిక్ష వేసినా నేను సిద్దం. మీ ఇష్టం” చివరికి నిర్జోషిగా విడుదలయ్యాడు సాత్వళేకర్. మనస్సుంటే మార్గం లేకపోలేదు కదా! మళ్ళీ దేశబక్తిని కల్గించే రచనలు చేశాడు. నీండునూరేళ్ళు జీవించాడు. 1968లో కన్నుమూశాడు. “అసాధారణ ధారణ, అపూర్వ స్మరణశక్తి, అసామాన్యమైన వక్తృత్వ ధోరణి, దేశభక్తి అతని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన విశిష్టమైన అంశాలు” అని మన్మోహన్ ఉపాధ్యాయ అభిప్రాయం. వేదప్రచారం, గీతా ప్రచారం, సంస్కృత భాషా ప్రచారం, యోగ వ్యాయామ ప్రచారం... ఏది చేసినా దేశంనించి బ్రిటిష్ ముష్కరుల్ని శాశ్వతంగా వెళ్ళగొట్టడమే సాత్వళేకర్ లక్ష్యం, ఉద్దేశ్యం ఉదాత్తమైంది. గమ్యాన్ని చేరడానికి సాత్వళేకర్ ఎంచుకున్న మార్గం వేద ప్రచారం భారత ప్రభుత్వం అతజణ్డి 'పద్మభూషణ్'తో సత్కరించింది. [0 అంక సాహితీ సుమాలు
హిందీ సారస్వతానికి య.
పూజాకవినాగార్జున్
జూబా నాగార్జున్ అటు సామ్రాజ్యవాదం పైనా, ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థమీదా ధ్వజమెత్తిన ప్రముఖ హిందీ రచయిత. అతని రచనలన్నింటినీ క్రమబద్ధంగా ఆధ్యయనం చేస్తే, మన దేశ సాంఘిక చరిత్రకు సంబంధించిన రూపురేఖలు స్పష్టంగా తెలుస్తాయి. నాగార్జున్ అనేక వ్యంగ్య కవితలు రాశాడు. వాటిల్లో చాలా భాగం స్వాతంత్ర్యానంతర కాలంలో రాయబడీనవే! కారణం. . . స్వతంత్ర బారతంలోని అభివృద్ధి కార్యక్రమాల పట్ల అతని గుండె పట్టు సడలిపోవడం.
నాగార్జున్ కవిగానే చిరపరిచితులైనా వచనం కూడా బాగా రాస్తాడు. మిధిలా జనజీవనాన్ని ఆలంబనగా తీసుకొని అతను రాసిన నవలల్లో నూతన వాస్తవికవాద వికాసం స్పష్టంగా కన్పిస్తుంది. నాగార్జున్ మైధిలీ భాషలో రచనలు చేసినప్పటికీ, హిందీ రచయితగానే సుప్రసిద్ధుడు. ఆయన రైతులు, రైతుకూలిలు, నిరుపేదల పక్తం వహించి రచనలు చేసిన ప్రజాకవి.
బాబా నాగార్జున్ అసలు పేరు బైద్యనాథ్ మిళశ్ర్. అతను 1911లో బీహార్ రాష్ట్రం దర్భంగా జిల్లాలోని తరౌనీలో జ్యేష్టపూర్ణిమ రోజున పుట్టాడు. కబీర్దాసు సైతం జ్యేస్టపూర్ణిమ నాడే జన్మించాడు. కబీర్ మధ్యయుగాల విప్లవ కవే కాకుండా సంత్‌కవి కూడాను. నాగార్డున్ భావజాలం కబీర్ మానవతావాదానికి దగ్గర కనుక నాగార్జున్‌ను 'అభినవ కబీరొగా వ్యవహరిస్తారు. బుద్ధుని బోధనల్లోని సారాంశాన్ని వంటపట్టించుకున్న తర్వాతే బైద్యనాథ్ మిశ్ర్ బాబా నాగార్జున్గా మారాడు మైధిలీలో విద్యాపతి తర్వాత ఆ సాహితీ కేదారంలోకి నూత్న జలాల్ని ప్రవహింప చేసిన అపర భగీరధుడు నాగొర్జున్. అతను 'యాత్రీ' పేరుతోనూ రచనలు చేశాడు. హిందీలోని నిరాలా, ప్రేమ్‌చంద్, భారతేందుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొన్న నాగార్డున ప్లాబోనెరూడా, లోర్కా, మయకోవస్కీల నుండి అంతర్జాతీయ దృక్పధాన్ని అలవరుచుకున్నాడు. యవ్వనంలో బౌద్ధాన్ని స్వీకరించాడు తర్వాత మార్క్సిస్టుగా మారాడు మరణించే వరకూ మార్క్సిజాన్ని గట్టిగా సమర్థిస్తూ వచ్చాడు. నాగార్జున్ గారికి హిందీతో పాటు సంస్కృతం, పాలీ, బెంగాలీ, పంజాబీ మొదలైన బాషలు బాగా తెలుసు. సాహిత్యం ద్యారా సమకాలీన సమస్యల్ని ప్రతిఫలింపచేయడంలో నాగార్జున్‌ను మించిన మరొక రచయిత నభూతో న భవిష్యతి. అతని మరొక ప్రత్యేకత. . . జానపద సంస్కృతిపట్ల విపశీత శ్రద్దాసక్తులు. “ప్రజల నుండి ప్రజల వద్దకు” అనే వాక్యం అతనికి బాగా తెలుసు. గ్రామీణుల రసనల మీది బాణీల్ని తన రచనల్లో ప్రవేశపెట్టాడు. నలిమెల భాస్సర్ త్శీ్షే
బాబా నాగార్జున్ తన “బల్చన్మా' నవలలో ఒక పల్లెటూరి పిల్లవాడు కూలిగా మారిన వైనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపాడు. నాగార్జున్కూ, ఈ దేశ సుదీర్హ సాంస్కృతిక వారసత్వానికీ అవినాబావ సంబంధం వుంది. అతను వారణాసిలో చదువుకుంటూనే దేశ స్వాతంత్ర్య సమరంలోకి దూకాడు. స్వామి సహజానంద సరస్వతి, మహాపండితుడు రాహుల్ సాంకృత్యాయన్లతో రైతాంగ పోరాటాల్లో పాల్గొన్నాడు. సాయుధ గుండాలు రాహుల్‌ని గాయపరిస్తే, పోలీసులు నాగార్జున్‌ను జైళ్ళో పెట్టారు.
అతనక్కడ కమ్యూనిస్టుగా మారాడు. ఈ రైతాంగ పోరాటం మొత్తంగా నాగార్జున్ 'బల్చన్మా'లో వ్యక్తమైంది. హిందీ సాహిత్యంలో జైనేంద్ర్, అజ్జేయల ప్రభావం విపరీతంగా వున్న కాలంలో నాగొర్జున్ నవల అక్కడి పాఠకుల్ని ఒక. ఊపు ఊపింది. శ్రీశ్రీలాగా నాగార్జున్‌కు ప్రపంచమంతా కవితామయం అలాగీ భాషలోని సమస్త పదజాలమూ కవిత్వానికి పనికొచ్చేదేనంటాడు. అతను రాజకీయ కవితలెన్నింటినో రాశాడు. నాగొర్జున్ కవిత్వానికి ప్రాణం వ్యంగ్యం. “ప్రత్ కా బయాన్” అతని ప్రసిద్ద వ్యంగ్య కావ్యం. రాజకీయ మదపుటేనుగులపై కలాన్ని అంకుశంగా ప్రయోగించవలసిందే అంటాడు నాగార్జున్, పైగా నాగార్జున్ స్వతంత్ర భారతంలోని ప్రజాస్వామిక ఉద్యమాలన్నింటికి కొండంత అండ.
నాగార్జున్ “బహుత్ దినోంకే బాద్మే'లో గ్రామీణ మిధిల పట్ల గాఢాతిగాఢమైన యేమని వెల్లడించాడు. అతను 'సిందూర్ తిలకిత్ భాల్మే'లో కూడా అలాంటి పనే చేశాడు.
కేంద్ర సాహిత్య అకాడమీ వారి ఇండియన్ లెటరేచర్ ఎడిటర్, ప్రముఖ మలయాళ రచయిత
అయిన కే.సచ్చిదానందన్ “ఒక నాగార్జున్ లేదా ఒక త్రిలోచన్, ఒక మోహన్రాకేశ్ లేదా ఒక నిర్మల్వర్మ, అధవా ఒక కృష్ణాసోబతీ మినహా నాకు హిందీలో బలమైన సంతకాలు కన్పించవు” అంటాడు.
అస్సామీ రచయిత్రి ఇందిరాగోస్వామి కూడా “నాగార్జున, కున్వర్ నారాయణ్ లాంటి రచయితలు
నన్ను బాగా ప్రభావితం చేసిన వాళ్ళు” అంటుంది. కన్నడ కవి హెచ్ ఎస్.శివప్రకాశ్ సైతం తన కవిత్వమ్మీద నాగార్జున, కబీర్, ధూమిల్ లాంటి కవుల '్రభావముందని ఇండియాటుడే 1995-96 హిందీ సాహిత్య సంచికలో అభిప్రాయపడ్డాడు.
“నాగార్జున్ వెల్లిపోయాడు. అయితే అతని మహాప్రస్థానం అతని రచనల ద్వారా కొనసాగుతూనే వుంటుంది. మనమంతా మరో ప్రపంచాన్ని నిర్మించుకున్నప్పుడు, అతను తప్పకుండా స్ఫురిస్తాడు. నాగార్జున్ కలలు సాకారం కావాల్సింది నిజానికి ఇప్పుడే!” అని నాగార్జున్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రజాకవి ఖగేంద్ర కుమార్ అన్నాడు. నాగార్జున్‌కు అత్యంత అప్రమిత్రుడైన రామ్‌విలాస్‌శర్మ “ఒక నక్షత్రం రాలిపోయింది. ఇక ఇప్పుడు హిందీలోని యువకవులంతా సామాజ్యవాదానికి వ్యతిరేకంగా కత్తులే కాదు కలాలు కూడా నూరుతారు' అంటున్నాడు “నవభారత్ టైమ్స్” పత్రిక ద్వారా. ఎనబై ఏడేళ్ళ పండు ముసలి బాబా నాగార్జున్ ఈ లోకంలోంచి 1998 నవంబర్ ఐదునాడు నిష్క్రమించడం అంటే హిందీ సారస్వతం నుంచి కొంత సారమూ, ఒకింత సత్వమూ లోపించడమే!
42 శాపం మా సాహితీ సుమాలు
సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు భారత్ భారతి, రాహుల్ లాంటి పురస్కారాలెన్నో నాగార్జున్‌కు లభించాయి. వివిధ భారతీయ భాషల్లోకి అతని కవితలు అనువదింపబడ్డాయి. 1934లో సన్యాసిగా, 1936లో బుద్ధ దర్శనాలకై శ్రీలంకలో విద్యార్థిగా, రాహుల్ సాంకృత్యాయన్ సహచరుడిగా, రైతాంగ పోరాటాల భాగస్వామిగా, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా, 1974లో జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ విష్తవంలో పాలు పంచుకున్నవాడిగా, హిందీలో ప్రజాకవిగా బాబా నాగార్జున్ క్రమ పరిణామం భవిష్యత్తరాలకు స్ఫూర్తిదాయకం, వలిమెల భాన్మక్ కు 45
దేశదేశాలు దాటిన వ నిస్సీమ్ కవిత ...
“ నేను చాలా నీరసించిపోయానని నర్సు మాటిమాటికీ గుర్తు చేస్తోంది. నాకు ఎంతో విశ్రాంతి అవసరమని చెబుతోంది. మీరే చెప్పండి. ఏ మనిషైనా ఎంతకాలమని ఊరకే విశ్రాంతి తీసుకోగలడు? అంటున్నాడు ప్రసిద్ధ భారతీయాంగ్ల కవి నిస్సీమ్ ఎజికీల్ తనని పరామర్శించడానికి వచ్చిన వ్యక్తులతో. బొంబాయిలోని దాదర్ శుశ్రూష ఆసుపత్రైలో పక్కమీద పడుకొని వున్న నిస్సీమ్ ఎజికీల్ను తీవ్రమైన అనారోగ్యం శారీరకంగా బాధించినప్పటికీ, అతని మెదడు మాత్రం దివ్యంగా పనిచేస్తోంది. ఒక్కసారి కవితా చర్చ లేవదీస్తే చాలు. . . నిస్సీమ్ ఎజికీలలో అంతర్లీనంగా వున్న సృజనశీల రచయిత హరాత్తుగా నిద్రలేస్తాడు. ఆసుపత్రిలో ఆ సుపుత్రుడేమంటున్నాడో చూద్దాం : 'నేను కవిని, ఏదో తెలియని రుగ్మత నన్ను పట్టి పల్గ్లార్చుతోంది. అంత మాత్రాన నేను అస్త్రసన్యాసం చేయలేను. రోజూ రాస్తున్నాను. రాసి పంపిస్తున్నాను. హాస్పిటల్లోంచి డిస్పార్జి అయ్యాక మళ్ళీ రాస్తాను. విరివిగా రాస్తాను, రాస్తూనే చనిపోతాను” ఆంగ్ల సాహితీ ప్రియులకు నిస్సీమ్ ఎజికీల్ సాహిత్యమూ, మనస్తత్వమూ కొత్తవేమీ కావు. భారతీయాంగ్ల కవిత్వ రచనలో దేశంలోనే అగ్రగామి కవిగా చలామణి అవుతోన్న నిస్సీమ్ రాతలు, ఉల్లాసభరితమైన మాటలు, మజిలీలు, సాహిత్య చర్చలు, యాత్రా చరిత్రలు, నాటకాలు, వ్యాసాలు . . ఒకటేమిటి సవాలక్ష సాహితీ వ్యాసంగాలు పారకులకు చిరపరిచితాల!
సాహితీ క్షేత్రంలో ఎజికీల్ సంపాదించిన కీర్తి, ఒక వినమసహృదయ సంవేదనాశీల రచయిత సంపాదించిన కీర్తికన్నా ఒకింత ఎక్కువే! అతని పిలాసపీకి మూలం సత్యశోధన ఈ శోధనలక్తీ, సాధనలకీ ఫలశ్రుతి. . . కొందరికి అప్రియంగా వున్నప్పటికీ నిస్సీమ్ ఎజికీల్ కించిత్తు కూడా తటపటాయించడు. ప్రముఖ భారతీయాంగ్ల కవిగా ఎజికీల్ దేశవిదేశీ సాహితీ పరుల దృష్టిని బాగా ఆకర్షించగలిగాడు అతని కవితల్లో బోలెడు వైవిధ్యం వుంది అన్నిటికన్నా ముఖ్యమైంది ఎజికీల్ కవితల్లోని స్పష్టత. శుష్క పదాడంబరాలూ, వృధా పదచిత్రాలూ, ప్రొఢ భాషా పదజాలమూ మచ్చుకైనా కానరాని కవిత నిస్సీమ్ది. అది వ్యాకరణాల సంకెళ్ళను తెంపుకున్న తెంపరి కవితకూడా. నిస్సీమ్ గారికి ఈ విశాలమైన మానవారణ్యం ససేమిరా నచ్చదు. కిటకిటలాడే నగరంలోని మురికివాడలో. . . ఒకానొక వొంటరి గదే తనదనుకుంటాడు. ఆ గది తన మమతానురాగాల నిజమైన నివాసం అంటాడు. నిస్సీమ్ ఎజికీల్ రాసిన చాలా కవితల్లో బగవంతుని ప్రస్తావన 44 జాం డాంాాాాాాాాాాాా3పాంాటపుటు సాపాతీ సుమాలు
వున్నప్పటికీ అతనికి ఈ విషయంలో కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి... “నేను సంప్రదాయవాదులు కోరుకునే రీతిలో మతవాదిని కాను, నాకు మతం వైయక్తికం. 'ఈ రెండు వాక్యాల మధ్యవున్న అంతరమే నా కవిత్వమంతా” అంటాడు నిస్సీమ్. మెదడుతో పోలిస్తే- రాళ్ళు చెక్కుచెదరకుండానే వున్నాయి మేఘాలు సైతం స్పష్టంగా వున్నాయి ఇదెలా సాధ్యమో గానీ నేను దాదాపు పిచ్చివాణ్సవుతున్నాను నేనెన్నిసార్లు సర్వస్వతంత్రుడిగా వున్నాను? నేనెన్నిమార్లు ప్రవాహశీలిగా' వున్నాను? మనిషి బానిస కావడం ఎంత చిత్రం! అతణ్జీ ఎవరూ నిర్బంధించడం లేదు తనకు తానే బానిసై పోతున్నాడు
వోమ్లెట్లోని “టు బీ, ఆర్ నాట్ టు బి అనే గుంజాటన నిస్సీమ్ ప్రతి కవితలోనూ అంతస్తూత్రంగా ప్రవహిస్తుంది.
భగవంతుని విషయంలో నిస్సీమ్ బొత్తిగా అసాంప్రదాయిక వాది. దేవుడు అతని దృష్టిలో జీవుడు. పైగా మిత్రునితో ముచ్చటించినట్లుగా కవిత్వం రాస్తాడు. పోస్టర్ పోయెమ్స్లోంచి ఓ పోయెమ్ : లేదు భగవాన్! కర్మ ఫలంనా ఉద్దేశ్యం కాదు కానీ నువ్వు ఆ ఫలాన్ని సగమైైనా రుచి చూశావా? అది మధురాతి మధురమైన ఫలం, పైగా నేను ఆకలిగొని వున్నాను. . , నాకు ఫలమే కావాలి
నిస్సీమ్ ఎజికీల్ తన గురించీ, కుటుంబం గురించీ, సమాజం గురించీ, దైవం గురించీ అనేకానేక కవితలు రాశాడు. నిప్సీమ్ పండుమీది తొక్కగానో పండులోపలి గుజ్జుగానో, యింకా లోపలి విత్తనంగానో కావాలని కోరుకోరు. విత్తనం మళ్లీ మరో ఫలానికి జన్మనిస్తుంది. కనుక అతనికది నచ్చదు. విత్తనం లోంచి మొక్కగా బయటపడటానికి అవనరమైన ఆంతరిక శక్తిగా మారాలని (ట్రిబ్యూట్ టు ద ఉపనిషత్'లో) వెల్లడించాడు ఎజికీల్. “నేను తలుపులు మూసి ఒంటరిగా కూచుంటాను నభిమెల భాస్కర్. పత
అప్పుడు ప్రపంచానికి దగ్గరవుతాను ప్రతి ఒకరికీ దగ్గరవుతాను నాకు నేనుగా దగ్గరవుతాను' (హాప్పెనింగ్)
ఈ రణగొణ ధ్వనుల ప్రపంచానికి దూరంగా నిస్సీమ్ ఒంటరిగా తన గదిలో కూచోవడం ఈ ప్రపంచానికి దగ్గరవ్వాలనే! కవి ఏకాంతంలో సంఘజీవిగా వుండగల్గుతున్నాడు. మనుషుల్లో తిరుగుతున్నప్పటికీ ఏకాకిగా అనుభూతి చెందుతున్నాడు. తను కోరుకునే ప్రపంచం వేరు. అయికే నిరంతర ధ్యాన మగ్నుడైన నిస్సీమ్ ఎజికీల్ ఆత్మావిష్కరణలకు మినీ కవిత సరిపోదేమో అనిపిస్తోంది. అందుకే సత్యనారాయజణ్ సింగ్, కీట్సులా సుదీర్హమైన కేన్వాసుని (ఓడ్స్ కవిత) ఎంచుకుంటే నిస్సీమ్ ఎజికీల్ యింకా బాగా రాసివుండేవారని అంటాడు. ఏది ఏమైనప్పటికీ పెద్దతరం బారతీయాంగ్ల కవ్లుల్లో ఒకరైన నిస్సీమ్ ఎజికీల్ది ఒక విలక్షణమైన ముద్ర. 1824లో పుట్టిన నిస్సీమ్ ముంబైలోని విల్సన్ కళాశాలలోనూ, లండన్‌లోని బిర్క్‌బెక్ కాలేజీలోను విద్యాభ్యాసం చేశాడు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్ని చూశాడు. బ్రిటన్‌లోని, అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ముంబై యూనివర్శిటీ ఆంగ్ల విభాగంలో ప్రాఫెసర్‌గా పనిచేశాడు. 1952లో “ఎ టైమ్ టు ఛేంజోను, 1953లో 'సిక్స్ిటీ పోయెమ్స్”ను, 1959లో “ద ధర్జు'ను, 1960లో “ద అన్ఫినిష్డ్ మ్యాన'ను, 1965లో “ద ఎల్జిక్స్ నేమ'ను, 1976లో హిమ్న్స్ యిన్ డార్క్‌నెస్‌ను, వెలువరించాడు. ఇవి కవితా సంకలనాలు. ఇవే కాకుండా మూడు నాటకాలు రాశాడు. అనేక
సాహిత్యవ్యాసాలు రాశాడు. క్వెస్టు, ద ఇండియన్ పెన్ లాంటి పత్రికలకు సంపాదకత్వం వహించారు. నిస్సీమ్ ఎజికీల్ పూర్వీకులు ఇజ్రాయిల్ దేశీయులైనప్పటికీ కవితల్లో భారతీయత వుట్టిపడేలా రాస్తోన్న నిస్సీమ్, తన ఆరోగ్యం కుదుటపడి మరిన్ని రచనలు చేయాలని ఆశించడం అసంగతంకాదు కదా!
46 ₹ాాాాాాాాాాాాాంాాాాంాంాాాాాాాాాాాాాా30ట4 సాహాత్ సుమాలు
పట్టకొంచం-కూతఘనం | నణ్ణి వ.
కొంతమంది తమ నలబైయ్యవ యేట రచనావ్యాసంగాన్ని ప్రారంభించి ఆ తరువాతి కాలంలో గొప్ప రచయితలుగా పేరు ప్రబ్యాతులు తెచ్చుకున్నారు. పోర్చుగీసు రచయిత సరమాగో సైతం తన జీవితంలో చాలా ఆలస్యంగా రచనలు చేయడం మొదలుపెట్టి, ఏకంగా 1998లో నోబుల్ బహుమతినే అందుకొన్నాడు. బెంగాలీ మహా రచయిత శరత్చంద్ర, అస్సామీ రచయిత శీలాభద్రలు కూడా తమ ముప్పైఐదు, నలబై ఏళ్ళ ప్రాంతంలోనే రచనా వ్యాసంగాన్ని ఆరంభించారు. ఇది యిలా వుండగా మరి కొందరి పరిస్థితి వేరు. వీళ్ళు తమకు నలబై ఏళ్ళు వచ్చేటప్పటికే గొప్ప రచయితలయ్యారు. చిన్న వయస్సులోనే రచనలు ప్రారంభించి పేరు తెచ్చుకున్న రచయితలు వీళ్ళు. తమిళంలో పావబ్ఞాన్ అనే కలంపేరుతో రాస్తోన్న భాస్కరన్ యిలాంటి రచయితే! పావణ్ఞన్ పాండిచ్చేరి దగ్గరలో ఉన్న వళవనూరులో 1958 అక్టోబర్ 20నాడు పుట్టాడు. నలభై ఏళ్ళ వయస్సు వచ్చేటప్పటికే విభిన్న, సాహితీ ప్రక్రియల్లో పుష్కలమైన పుస్తకాలు రాశాడు
తమిళనాట పుట్టిన పావణ్ధన్కు తమిళంతోపాటు కన్నడం బాగా తెలుసు. ఇంగ్లీషు, హిందీ లాంటి బాషలు సరే! మొదట చదివింది బి.ఎస్ సి ఆ తర్వాత ఎం ఏ. చేశాడు. ప్రస్తుతం బెంగుళూర్లో వుంటున్నాడు.
ఇప్పటి వరకూ పావణ్ఞన్ వెలువరించిన కధా సంకలనాల సంఖ్య ఏడు. “కథగళ్ తొలైవిల్ ఇరుక్కిన్రన' (వేర్లు దూరంలో వున్నాయి) 1987లో, 'పావణ్ణన్ కదైగళ్' (పావణ్ఞన్ కధలు) 1990లో, “వెళిచ్చం' (వెలుతురు) 1990లో, 'వేలియేట్రమ్' (కంచె) 1991లో, 'నేట్రువాళందవర్గళ్ (నిన్న జీవించినవాళ్ళు) 1992లో, 'అడుక్కుమాళిగై' (అంతస్తుల మేడ) 1998లో, నెల్లిత్తోప్తు' (ఉసీరితోట) కూడా 1998లోనే వెలువడ్డాయి. పావణ్ఞన్ రాసిన ప్రతి కధకూ జీవితం ఆలంబనం. వ్యాపార లేపనాలతోనూ, సినిమా ప్రబావంతోనూ తమిళ కదకు కొంత నష్టం ఏర్పడినప్పటికీ, తమిళంలో చిన్న పత్రికలు వ్యాపార కధలకు బిన్నంగా గొప్ప సాహితీసేవ చేస్తున్నాయి. 'కళైయాళి' లాంటి పత్రికలు శ్రేష్టమైన కదల్ని తమిళ పాఠకులకు అందిస్తున్నాయి. పావణ్ఞన్ కధలు సైతం సమాజం నుండీ, జీవితం నించీ వైదొలగని గొప్ప కధలు పావణ్ఞన్ ఇండియాటుడే (తమిళం)లో రాసిన “ప్రయాణం' కదకు 1997 సంవత్సరపు కధా అవార్డు (ఢిల్లీ) కూడా వచ్చింది. నలిమెల భాస్కర్ త
1986లో పావణ్ణన్ రాసిన 'ముల్' (ముల్లు) కధకు 'ఇలక్కియ చింతనై' అవార్డూ, 1991లో వేలియేట్రమ్” కథల పుస్తకానికి విల్లి దేవసైగమణి అవార్డూ, 1994లో “కినరు' (బావి) కథకు అగ్ని అండ్ శుభమంగళ్ అవార్డులూ లభించాయి. పావణ్ఞన్ నవలా రచనలోనూ చేయి తిరిగిన రచయిత. అతడు 1987లో 'వాళక్కై ఒరు విచారణై' (జీవితం ఒక విచారణ)నూ, 1989లో “ఇది వాళక్కైయిల్లై' (ఇది జీవితం కాదు)నూ, 1989లో “ఒరు మనిదరుమ్ శిల వరుషంగళుం' (ఒక మనిషీ కొన్ని సంవత్సరాలూ) అనే నవలనీ, 1990లో 'సిద్దర్గళ్ (సిద్దులు), 1995లో 'పాయ్మర కప్పల్గళ్' (తెరచాప పడవలు) అనే నవలల్నీ ప్రకటించాడు. ఈ నవలలన్నీ సడలిపోతున్న మానవసంబంధాల పట్ల, జీవన శథిల్యాల పట్ల హడలి పోతూ రాయబడినవే! మనుషుల్లో వేళ్ళూనుకుపోయిన నయవంచన, కుహనా సంస్కారం, కపట గ్రేమలు మొదలైన ఎన్నో అంశాలకు పావణ్ఞన్ నవలలు చక్కని కేన్వాసులు. _పల్లె జనాలు పట్టణాలకు వలసవెళ్ళే అర్భనైజేషన్ పట్ల పావజ్ఞన్ ఆందోళన వెలిబుచ్చాడు. దెబ్బతింటోన్న పర్యావరణం పట్ల రచయిత ఆవేదన 'పాయ్ మరకప్పుల్గళ్'లో చక్కగా ప్రతిఫలించింది. నవలలో ఒకచోట “మట్టికి సంబంధించిన సూక్ష్మాతిసూక్ష్మమైన కణాలను కూడా అతని మనోనేత్రం చూడగలుగుతుంది. హోరుగాలితో వచ్చే వానను సైతం అతని ముక్కు చక్కగా తెలుసుకోగలుగుతుంది. ప్రకృతికి సంబంధించి అతనికి వున్న జ్ఞానం ఏ శాస్త్రవేత్త రాసిన పుస్తకంలోంచీ మనం సేకరించలేనిది. వీధిలో అతణ్లి ఎవరు ఆపి మాట్లాడినా నుంచుని హాయిగా ఓ ఐదు నిముషాలు వాళ్ళతో కబుర్హాడుతాడు' అంటూ ప్రధానే పాత్రకు వున్న ప్రకృతి జ్ఞానాన్నీ, మానవ సంబంధాలపట్ల ప్రగాఢమైన (ప్రేమనీ పావణ్ఞన్ చక్కగా చూపుతాడు. 1997 కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత అయిన తోప్పిల్ మహమ్మద్ మీరాన్ “తమిళంలో గొప్ప నవలలు రావడం లేదని పెదవి విరిచే కొందరికి పావజ్జన్ రాసిన 'పాయ్మర కప్పల్గళ్ మంచి సమాధానం” అని అంటున్నాడు. 1987లో వచ్చిన ఉత్తమనవలగా '“వాళ్క్కై ఒరు విచారణై'కు పాండిచ్చేరి ప్రభుత్వ అవార్డూ, 1990 ఉత్తమనవలగా 'సిద్దర్గళొకు తమిళ ప్రభుత్వ అవార్డూ, ఆ నవలకే అముదసురభి అవార్డూ లభించాయి. కథా ప్రక్రియలో, నవలా రచనలో ఉరుకులూ పరుగులూ తీసిన పావణ్ఞన్ కలం పిల్లలకోసం గత సంత్సరం' కవితలు రాసింది. (కుళందైయై పిన్తొోడరుమ్ కాలం' (పిల్లల్ని వెంటాడే కాలం) అనే పుస్తకాన్ని వెలువరించింది. తమిళం మాతృభాష అయినప్పటికీ కన్నడం క్తుజ్జంగా తెలిసిన పావణ్ఞన్ అనేక అనువాదాలు చేశాడు. ప్రసిద్ద దర్శకుడు, నటుడు, రచయిత, ప్రయోక్త అయిన గిరీశ్ కర్నాడ్ గారి తలెదండను బలిపీఠంగాను (1991), నాగమండలను నాగమండలగానూ (1993), అగ్ని మత్తు మళెను అగ్నియమ్ మలైయుమ్గానూ (1996) తమిళీకరించాడు. ఇవన్నీ నాటకాలు. తెలుగులో ఈ అనువాదాలు భార్గవీరావు చేశారు. శివప్రకాశ్గారి మధురైకాండ నాటకాన్ని మధురైకాండంగానూ (1993), కన్నడ భాషలోని 39 మంది,ఆధునికుల 50 కవితలను 'నవీన కన్నడ కవిదైగళ్' పేరుతోనూ తమిళంలోకి అనువదించాడు. 1995లో పుట్టజ్ఞగారి 'మాడిద్దున్నో మహారాయ' నవలను “వినై విదైతవస్ వినైయ 408 మాయాం సాహితీ సుమాలు
యిప్పాన్' (చేసుకున్నవాడికి చేసుకున్నంత)గా అనువాదం చేశాడు. ఇది నేషనల్ బుక్ ట్రస్ట్ థి తరపున అచ్చయింది. కేంద్ర సాహిత్య అకాడమీ (ఢిల్లీ) పావణ్ఞన్ చేత భైరప్ప నవలను తర్జుమా చేయించింది. అంతేకాదు. . . కన్నడ సుప్రసిద్ధ కథారచయిత పి.లంకేశ్ కధల్ని 'కల్ కరైయుమ్ నేరమ్” (రాళ్ళు కరిగే కాలం)గా ఈ సంవత్సరం అనువదించాడు. 1998లోనే 'గవర్నమెంట్ బ్రాహ్మణన్' అనే అనువాద గ్రందాన్ని ప్రచురించాడు. మాతృభాషలో కధల్నీ, కవితల్నీ, నవలల్నీ రాసిన పావణ్ఞన్ _ . కన్నడంలోంచి నాటకాల్నీ, కవితల్ని, కధల్న, నవలల్నీ, జీవితచరిత్రనీ, సమర్దంగా తమిళం చేశాడు. అనువాద సాహిత్యం గురించి పావణ్ఞన్ “ఇతర భాషల్లోంచి మాతృభాషలోకి అనువాదాలు చేయడం జచ్చితంగా సాహిత్యసేవలో భాగం. పైగా ఈ 'సేవమాత్రమ మాతృభాషా సంస్కృతుల్ని సుసంపన్నం చేస్తుంది. ఇలాంటి అనువావాలకు ఇప్పటి ప్రపంచంలో పెద్దగా గుర్తింపు లేనప్పటికీ, భవిష్యత్తులో వీటికే ఆదరణ వుంటుంది” అంటాడు. పిన్న వయస్సులోనే ఇరవైరెండు పుస్తకాలు రాసిన పావణ్ణన్ మరిన్ని ఉత్తమ రచనలతో తమిళ
సాహిత్యాన్ని సంపన్నం చేయగలడని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు.
నలిమెల భాస్మర్. 12 ౧ అతు ుుమసపుపు సట 40
అస్పామీకథలఠసామా ' అకులానంద నోస్వాని ప. అస్సామీస్ కధానికా రచనకు పూర్తిగా అంకితమై గత నాలుగైదు దశాబ్దాల నుంచి ఉత్తమ కధానికలను అందిస్తూ, ఆ ప్రక్రియను అనేక ప్రత్యేకతలతో పరిపుష్టం చేస్తోన్న ప్రసిద్ద రచయిత అతులానంద గోస్వామి. అంతేకాదు. . కధానికను కధానికగానే రాయడం బాగా ఎరిగిన రచయిత ఆతను.
“షార్టు స్టోరీ ఈజ్ ఎ స్టోరీ విచ్ ఈజ్ షార్టు” అనే నిర్వచనాన్ని పూర్తిగా అన్వయించడానికి వీలున్న కధల్ని అతులానంద బోలెడు రాశాడు. అస్సామీస్ బాషలో అతి చిన్న కద రాసిన రచయిత కూడా అతులానంద గోస్వామే 'లఖూతి' అనే కదకు నిడివి కేవలం నలబై నాలుగు పంక్తులు. లక్ష్మీనాధ్ బెజ్ బారువా గారి 'భోదోగి' అనే కధ నుంచి అబ్బుల్ మాలిక్ రాసిన 'బోరోశున్' వరకు అస్సామీస్ క్రధా సాహిత్యాన్ని ఎంతగా తరచి చూసినా అంత చిన్న కధ మరొక్కటి మన కంటికి తగలదు. 'పైగా అతి పెద్ద కధ రాసిన ఖ్యాతి కూడా అతులానందకే దక్కుతుంది. 1990లో అతులానంద గోస్వామి 122 పేజీల “నామ్ షొరియా' అనే కదను రాశాడు. దీన్ని నిడివి రీత్యా చెకోవ్ రాసిన “వార్డు నంబర్ ఆరు' కధతో పోల్పవచ్చునంటాడు మాజీ డైరెక్టర్ జనరల్ ఆప్ పోలీసు, అస్సామీస్ ప్రముఖ సాహితీవేత్తా అయిన జ్ఞానానంద శర్మ పాఠక్. కదానికల సైజు పరమైన ప్రత్యేకతలే కాకుండా వస్తు నిర్ణయంలోనూ చాలా విశిష్టతలు పాటించిన రచయిత అతులానంద.
అతులానంద గోస్వామి అస్సామ్ రాష్ట్రంలోని జోర్జాట్లో 1935 మే ఒకటినాడు జన్మించాడు. సైన్సు పట్టభద్రుడు. ఆంగ్లంలో, అస్సామీస్లో ఆ తరువాత బి.ఎ. చేశాడు “993లో ప్రభుత్వ పన్నుల శాఖ నుంచి పదవీ విరమణ పాందాడు. అతులానంద గోస్వామి మొదటి కద “బైదు 1958లో ప్రచురించబడింది. అప్పటినుంచీ ఎడతెగకుండా రాస్తున్నాడు. అతనికి అస్పామీస్తో పాటు ఒరియా, బెంగాలీ, హిందీ, ఆంగ్లాలు 'కొట్టకనే పిండి” గా ఏర్పడ్డ భాషలు. అస్సామీస్ నుంచి ఒరియా, బెంగాలీ, ఆంగ్లాల్లోకి అనేక రచనలు తర్హుమా చేశాడు. అతని కదలనేకం హిందీ, బెంగాలీ,
తెలుగు, మరారీ, ఒరియా, తమిళం, మలయాళం, కన్నడం, ఆంగ్లాల్లోకి వెళ్ళాయి
అతులానంద గోస్వామి రాసిన అతి పెప్ప కథ 'నామ్ ఘౌరియా' 1990 ముంచి 1997 వరకు మూడు ముద్రణలు పొందింది. కొంతమంది దీన్ని 'నవల' అన్నారు. 1991లో నామ్ షూరియాకు 50 సభాం తయళళాాా డా భయంటాథం ఇం 4... సాహితీ సుమాలు
అంబికారాయ్ చౌదురి సాహితి బొట అవార్డూ, 1997లో కుమార్ కిశోర్ సాన్వరాణి బొట అవార్డూ లభించాయి. ఆ గ్రందం ఆకాశవాణి, దూరదర్శన్ల ద్వారా ప్రసారానికి నోచుకుంది. ప్రస్తుతం ఎన్.బి.టి. నామ్ ఘొౌరియాను పన్నెండు భాషల్లోకి అనువాదం చేయిస్తోంది. అతులానంద ఇప్పటివరకు అస్సామీస్లో ప్రకటించిన కధా సంకలనాలు ఐదు అవి. 1996లోని 'హముదై పులార్ జోన్, 1967లోని 'గొల్ప',1976లోని “రాజ్‌పత్',1983లోని 'పలాతక్, 1993లోని 'ఆశ్రయ్'లు అంతేకాదు. . . “నీగ్రో కపుల్ ఇన్ సెర్చ్ ఆఫ్ శివా అనే కధల సంకలనం ఆంగ్లంలో వేశాడు అతులానంద బహుముఖ ప్రతిభకు దర్పణం అనువాద క్షేత్రం. ఒక రచయిత సమగ్ర సాహితీమూర్తిమత్వానికి తర్హుమా గొప్ప సాధనం అని అతులకు బాగా తెలుసు. అందుకని ఆంగ్లం నుంచి జేమ్స్ హిల్టన్ రచన “గుడ్‌బై మిస్టర్ ఛిప్స్'ను, ఎన్.బి.టి. తరపున ఒరియాలోంచి శ్వేతపద్మ్ అండ్ బనహంసి'ని, బెంగాలీ నుంచి మళ్ళీ ఎన్.బి.టి. కొరకే “ఏకుష్ట్ బాంగ్లా గొల్స్'ను, సాహిత్య అకాడమీ పక్షాన 'సాంబ'ను మాతృభాష అస్పామీస్లోకి అనువదించాడు. గ్లోబల్ భాషగా చలా మణీ అవుతోన్న ఆంగ్లంలోకి అస్సామీస్ నుంచి అనేక రచనలు అనువాదం చేసి మాతృభాషా స్వారస్యాన్ని ఇతరులకు చూపించాడు. ఇలాంటి పనికి తెలుగులో ప్రయత్నాలు తక్కువ. మన సాహిత్యంలో గొప్ప కధలూ, ఉత్తమ కవితలూ పుష్కలంగా వున్నప్పటికీ ఇంగ్లీషులోకి పోకపోవడం చేత నిష్ఫలం అవుతున్నాయి. అతులానంద అలా కాదు. . . తన వంతు పాత్రని “నేను సయితం .అంటూ నిర్వహించాడు. ఆంగ్లంలోకి అస్సామీస్లో జ్ఞానపీర్ గ్రహీత అయిన బీరేంద్ర కుమార్ భట్టాచార్య కధలను, శీలాభద్ర లాంటి ఇతరుల రచనలను, హీరేన్ భట్టాచార్య మొదలైన చారి కవితలను ఎన్నింటినో అనువదించాడు. ఈశాన్య రాష్ట్ర సాహిత్య సారాన్ని ఇతర దిక్కులకు పంచాడు. అతులానంద గోస్వామిలోని మరో కోణం ఆయా పుస్తకాలకూ, పత్రికలకూ సంపాదకత్వం వహించడం. అస్సామ్ సాహిత్య సబకు చెందిన 'హిరక్ జ్యోతి'కీ, వివేకానంద కేంద్రకు సంబంధించిన ఆంగ్లంలోని 'ప్లేసెస్ ఆప్ వర్షిప్ అండ్ పిల్గ్రిమేజెన్ ఇన్ అస్సామ్'కూ, 'జాగృతి' శ్రైమౌ సికకూ, ఇతర పుస్తకాలకూ అతను ఎడిటర్, అచతులానంద రాసిన “బొలియా హాతి' అనే కధకు 1992 కధ అవార్డు లభించింది. ఈ కధను “మదపుటేనుగు' పేరుతో విపుల ప్రచురించింది (1996 జులై). మంచి కథ. కధ అతుల చేతి ఆటబంతి అయితే అతనికి ప్రక్రియలో ఒజ్జబంతులు ఒకరు కాదు చాలా మంది. భబేన్ పైకీయా, మొహిమ్ బోరా, లక్ష్మీనందన్ బోరా లాంటి రచయితలు మధ్యతరగతి ప్రజల, అట్టడుగు వర్గాల సజీవ దృశ్యాలను తమ కదల్లో చూపించారు. వాళ్ళందరూ ఆతులానందకు మార్గదర్శకులే! అయితే అతులానంద ప్రత్యేకత అతులానందదే!! మొహిమ్ బోరా లాంటి రచయితలు అతిసూక్ష్మ వివరాలతో సహా కధలు రాస్తే, అతులానందకు ఎడిటింగ్ విద్య బాగా తెలుసు కనుక పాఠకులకు ఎంతవరకు అవసరమో అంతే చెప్పాడు పైగా అతుల్తాన్హ్రడ్తణ తయన, మాండలికాన్నీ చాలా ఎత్తుకు
అతులానంద కధలన్నీ ప్రారంభం కోసం చాలాసేపు తన్నుకుంటాయి “ఆదిలో హంసపాదులు కావు మంచిపాదులు వేసి తన కధాలత నిరామాటంగా పారకుని గుండె పందిరిని అల్లుకుపోతుంటే అనందిస్తాడు అతులానంద. ఓ హెన్రీ కధలు ఎంత గొప్పగా మొదలవుతాయో అంత బాగా రాయడానికి ఆరాటపడతాడు. అతుల రాసిన 'భూలే - భక్తే శిబిర్, 'హమ్దై పూలర్ జోన్, “దరబ్, “డేకిసాలర్ బిసోన' లాంటి కధలెన్నింటినో దీనికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. అతులానంద రాసిన 'నిరుత్తర్ అస్సామీస్లో అతులితమైన కధ అది ఎల్లలు దాటిన శాశ్వత 'ప్రేమకు ఎత్తిన పతాక. పిసి.సర్కార్ ఇంద్రజాలంలా అతులానంద పారకుల్ని అద్భుత రసానందభరితుల్ని చేస్తాడు. అతని కదలు సమకాలికాలే కాదు సార్వకాలికాలు అతుల రాసిన హమ్దై పూలర్ జొన్ను కూడా ఆ సాహిత్యంలో గొప్ప కధగా అంతా చెప్పుకుంటారు ఓ హెన్టీ 'ఇకిలాగా, ఆండర్భన్ 'ఎమలీ' వలె, గోర్కీ 'నటాషా' మాదిరిగా, శరత్చంద్ర “దేవదాసు. తీరుగా “నామ్ ఘొరియా' అతులానందకు గొప్ప గుర్తింపును తీసుకొచ్చిన రచన. అతుల అస్సామ్ సాహిత్య సభలో సభ్యుడు. సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ మాజీ సభ్యుడు. భారతీయ జ్ఞానపీరానికి సలహా సంఘ కన్వీనరు. 'నామ్ ఘౌరియా' రచయితగా రెండుసార్లు అస్సామ్ సాహితీ సభ అవార్డు గ్రహీత. అతి చిన్న పెద్ద కధల రచయితగా, బహు భాషావేత్తగా, 'అనువాదకుడిగా, సంపాదకుడిగా గ్రామ సీమల నేపధ్య సాహిత్యవేత్తగా, మాండలికమే కాక 'స్లాంగ్'ను వుపయోగించిన రచయితగ్గా, కథల ప్రారంభం గురించి మెళకువలు పాటించిన సాహితీవేత్తగా అనేక ప్రత్యేకతల కధల రచయితగా అస్సామీస్లో అతులానంద గోస్వామిది నిస్సందేహంగా తులలేని, ఆనందకరమైన నిరుపమాన స్థానం. 52 ఉషా 14 హా సాహితీ సుమాలు
గుజరాతీ రచయిత ప. యోసేష్ వ.
గుజరాత్ రాష్ట్రం అనగానే మనలో చాలామందికి 'పోరుబందరు గుర్తుకొస్తుంది. ఆసేతుశీతనగం జాతిని ఏకంచేసి పరాయి పాలకులకు అశేష ప్రజలతో చరమగీతం పాడించి రాజకీయ స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన మహాత్ముడు జ్ఞప్తికొస్తాడు. గుజరాత్ పేరెత్తగానే నర్మాదానదం స్ఫురిస్తుంది. అది నది కాదు. నదంగానే ఉరుకులూ పరుగులూ తీస్తుంది. తపతిని సైతం నదంగానే పేర్కొంటారు. ఇలా రాజకీయంగానూ, బౌగోళికంగానూ వున్న కొన్ని ప్రత్యేకతలు గుజరాత్ అనగానే గుర్తుకు రాక మానవు.
గుజరాత్సీ సాహిత్యం అనగానే మనలో కొందరికి 'ఘనతర గూర్జరీ కుచయ్యుగ క్రియ గూఢము గాక... అనే పద్యపాదమూ, మహాకవి పోతనకిష్టమైన లాటానుప్రాసమూ, సౌరాష్ట్ర సాహిత్యం అనే సమానార్ధకమూ, గుజరాతీ జానపదుల కళలూ మదిలో మెదులుతాయి. ఇంకా కొంతమందికి జ్ఞానపీర పురస్కార గ్రహీతలైన పన్నాలాల్ పటేల్ ఉమాశంకర్ జోషీలు గుర్తుకొస్తారు. నిరంజన్ భగత్, సుందరం, నర్మదాశంకర్, రువేర్చంద్ మేఘానీ, (ప్రేమానంద్, కన్నయ్యాలాల్ మున్నీ ఫాదర్ వాలెస్, ధూమకేతు, కాకా సాహెబ్ కాల్కేలర్లు. .. ఈ రకంగా ఎందరినైనా చెప్పుకుపోవచ్చును. కాబట్టి మనలో మరికొందరికైనా ఇలాంటి సాహితీవేత్తలు జ్ఞాపకానికి వచ్చే అవకాశం వుంది. ఇటీవలి దళిత కవులూ, రచయితలూ కూడా గుర్తుకు రావచ్చు.
యోగేష్ అనేక సాహితీ ప్రక్రియలు పోషించినప్పటికీ ఒకే ఒక కధల పుస్తకం రాసి గుజరాత్ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కావడం అతని ప్రత్యేకత. 'హాజీయే కేట్ లూన్ దూర్?” (ఇంకా ఎంత దూరం?) అనే కధల సంకలనాన్ని 1993లో ప్రకటించి ఆ కధలతో గుజరాతీ పాఠకలోకానికి బాగా చేరువైన రచయిత.
యోగేష్ జోషీ పూర్తి పేరు యోగేష్ భానుప్రసాద్ జోషీ జులై మూడు 13955నాడు గుజరాత్ రాష్ట్రంలోని మెహసనాలో పుట్టాడు. మెహసనా జిల్లాలోని విస్నగర్ యోగేష్ జోషీ స్వస్థలం. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో నివసిస్తున్నాడు. చదివింది ఎం.ఎస్.సి అహ్మదాబాద్‌లోని సర్కిల్ టెలికాం టైనింగ్ సెంటర్లో సబ్ డివిజనల్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు యోగేష్ జోషీ 1984లో “ఆవాజ్నూన్ అజ్వలూన్' అనే కవితా సంపుటిసీ, మరో ఏడేళ్ళ తరువాత 1991లో 'తేజ్నా ఛాస్' కవితా సంకలానాన్నీ నలిమెల భాస్కర్. సనా? ఎటట ప్ర తట కట్లైు 53
ప్రకటించాడు. గాఢమైన సమాజ చిత్రణ అతని ప్రతి కవితలోనూ తొంగి చూస్తుంది. యోగేష్ జోషీ 1984లో రాసిన “సముది' అనే నవలిక 1989లోను, 1994లోనూ, 1998 లోనూ పునర్ముద్రణలు పొందింది. పారకుల ఆదరాభిమానాలను చూరగొంది. 1987లో 'జీవ్తార్' అనే నవలనూ ప్రచురించాడు. మొత్తంగా యిప్పటికి నాలుగు నవలలు వెలువరించాడు. మానవ జీవనాల సమగ్ర చిత్రణకు ఈ నాలుగు నవలలూ మంచి ఉదాహరణలు. ఈ సంవత్సరమే 'మోతిబా' ఆనే జీవిత చరిత్రను రాసాడు. యోగేష్ జోషీ గుజరాతీ బాలసాహిత్యంలోనూ విశేషమైన కృషి చేసాడు. “పతంగా పంఖే' అనే పిల్లల పుస్తకానికై 1989లో జోషీకి గుజరాత్ సాహిత్య అకాడమీ ఆవార్డు వచ్చింది. పిల్లల కోసమనే అతడు 'కేసున్నో రంగో అనే మరో పుస్తకం 1990లో తీసుకొచ్చాడు. 1987లో “మృత్యు సమీపే' అనే అనువాద గ్రంధం -రాసాడు. అనేక సాహిత్య ప్రక్రియల్ని చేపట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. పరిణతి చెందిన మనస్సు చాలా అవసరం. నిరంతర పరిశ్రమతో యోగేష్ జోషీ ఇన్ని పనులూ చేస్తున్నాడు. వైవిధ్యం కలిగిన సాహితీ ప్రక్రియల్ని పోషించగలిగిన ఏ రచయితైనా అనువాదం వైపు తొంగిచూడకుండా వుండలేడు. అలా యోగేష్ జోషీ అటు సృజనతో పాటూ ఇటు ఆనువాదమూ చేశాడు. ఈ పనులే కాకుండా చాలా పుస్తకాలకు సంపాదకత్వం వహించాడు. యోగేష్ జోషీ 'గూర్జర్ ఆద్యతన్ కావ్య సంచయ్' (గుజరాతీ ఆధునిక కవితా సంకలనం 1998), “గూర్జర్ గీత్ సంచయ్' (గుజరాతీ పాటల సంకలనం 1998), “గూర్లర్ గజల్ స్తంచయ్' (గుజరాతీ గజళ్ళు 1998), “గూర్జర్ ప్రణయ్ సంచయ్' (గుజరాతీ శ్రేమ పాటలు 1998) అనే నాలుగు పుస్తకాలకు ఈ సంవత్సరమే ఇతరులతో కలిసి సంపాదకత్వం వహించాడు. టెలికాం సబ్ డివిజనల్ ఇంజనీరుగా పనిచేస్తోన్న యోగేష్ జోషీకి సంచార్శ్రీ అవార్డు వచ్చింది. 1987లో యోగేష్ రాసిన కవిత్వానికి బల్వంత్రాయ్ రాకూర్ బహుమతి సైతం దక్కింది. నుం ఎమైపట (మోప జోషీ అనునిత్యం తన ప్రవృత్తిని విస్మరించకుండా 1984 ప్రాంతాల ౫ ట్ట ళ్ళ కేవల వ్యవధిలో పదకొండు విభిన్న సాహితీ ప్రక్రియలకు అంబంధించిన పుస్తకాలను, తన సంపాదకత్వంలో వెల్వడిన నాలుగు గ్రంధాలను గుజరాతీ పాఠకులకు అందించాడు. నిరంతర రచనా వ్యాసంగంలో నిమగ్నమైన యోగేష్ జోషీ తన మనోవిశ్లేషణాత్మకమైన కధలతో మరో వైపు గుజరాతీ సాహిత్యాన్ని సారవంతం చేస్తున్నాడు. న 54 బాం సాహిత్ సుమాలు
పుడమిపాత్తిళ్లోపురడు వుతిభాశతపథి
ఆమె అక్షరాలకు బచ్చితంగా మట్టివాసనలుంటాయి. ఆవిడ కవిత్వానికి వేళ్ళు బలంగా నేలతల్లి కుదుళ్ళలోనే వుంటాయి. ఆ కవయిత్రి తన కావ్యాల్ని భూమిని భూమికగా చేసుకొని తీర్చిదిద్దుతుంది. పైకి పరీమళంగా, లోన మరీ మలంగా వుండే మనుషుల పట్ల ఆమె రచనల్లో తీవ్రమైన ఆక్షేపణలుంటాయి. పుట్టి పెరిగిన పుడమి పాత్తిళ్ళలో ఆమె పుస్తకాలు పురుడుపోసుకుంటాయి. ఆమె కళ్ళు సెర్పిలైటై అతి జాగ్రత్తగా ప్రపంచాన్ని పరిశీలిస్తుంటాయి. కూడూ, గుడ్డా, గూడులే కాకుండా అన్నింటికీ ఈ మట్టే మూలమని ఆమె గట్టిగా నమ్ముతుంది. ఆ కవయిత్రి పేరు ప్రతిభా శతపది. ఆమె ఒరిస్సా రాష్ట్రంలోని కటక్‌లో పుట్టింది. మాతృభాష ఒరియాలో ఎం.ఏ. పిహెచ్.డి. చేసింది. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని ఆర్.డి. ఉమెన్స్ కళాశాలలో రీడర్‌గా పనిచేస్తోంది 1962 నుంచి ప్రతిబా శతపది అవిచ్చిన్నంగా ఒరియాలో కవిత్వం రాస్తోంది. ప్రతిభా శతపధి మొదటి కవితా సంపుటి “అమా కవితి 1962లో అచ్చయింది. ఒరియాలో 'అమా కబిత అంటారు. బెంగాలీయులకూ, ఓఢ్రులకూ. వర్ణమాలలో 'వ" లేకపోవడం దీనిక్కారణం. మనం సైతం “వబయోరబేదః' అన్నాం కదా, 1962 నుంచి ఇప్పటివరకూ ప్రతిభా శతపధి తొమ్మిది కవితా సంకలనాలు ప్రచురించింది. 1969లో 'అష్టజనహర్ ఎలిజీ అనే స్కృతికావ్యం రాసింది. ఆ తరువాత ఆమె వరుసగా 1974లో “గ్రస్త సమయ్”, 1976లో “సాహారా సుందరి”, 1980లో “నియత వసుధ, 1985లో 'నిమిషే అక్షర, 1986లో 'మహామేఘ', 1991లో “శబరి”, 1996లో “తన్మయ ధూళి'నీ వెలువరించింది. ఇవన్నీ కవితా సంపుటులే! ప్రతిభా శతపధి తన పుస్తకాలకు చాలా శ్రద్ధగా పేరు పెడుతుంది. 'తన్మయధూళి, 'నియత వసుధ' అనే కావ్యగ్రంధాల్లోని ధూళి, వసుధలనే పదాలు ఏదో అలవోకగా పెట్టినవి కావు నేలకు సమానార్థకాలైన ఆ పదాలు చాలా సాలోచనగా పెట్టబడ్డాయి. కాలం వ్యాదిగ్రస్తమైపోయిందని “గ్రస్త సమయిలో, సహజ సుందరమైన పల్లెపిల్లల అందచందాల్ని 'సాహారా సుందరిలో ప్రతిభా శతపధి తన భావాల్ని ప్రతిభావంతంగా ప్రకటించింది. దుర్శ్భిక్షంతో అల్లాడిపోతోన్న మాతృసీమను ఏ మహామేఘమైనా తడపకపోతుందా అనే ఆశని “మహామేషు'లో చూపింది,
ప్రతిబావంతులైన రచయితలు పక్క సాహిత్యంలోకి తొంగిచూడకుండా వుండలేరు ఇరుగు పొరుగు సాహిత్యాల అధ్యయనంతో తమ అవగాహనను ఇబ్బడి ముబ్బడి చేసుకొనకుండానూ నలిమెల భాస్కర్ స్5్
_ఎ=డలేరు. ప్రతిభా శతపథి కన్ను అనువాదాల మీదా పడింది. దృష్టి మళ్ళడం తరువాయి అనువాద
వహితీ సృష్టి మొదలైంది. ఆ వరుసలో ప్రతిభా శతపధి అనేక గ్రంధాలు తర్జుమా చేసింది పెరల్ ఎ.బక్ రాసిన నవల “ద హిడెన్ ప్రవరొను ఒరియాలోకి '“అవపబిధ' అనే పేరుతో అనువాదం చేసింది. సింగర్ రాసిన “ద సేవ్ నవల “కృతదాస'గా ఒరియా బాషలో రూపం పోసుకుంది. కేంద్ర సాహిత్య అకాడమీ కొరకు 'కల్దణ చరిత్రనూ, 'నగరమంధన్'నూ, నేషనల్ బుక్ ట్రస్ట్ ఢిల్లీ వాళ్ల కోసం తమిళ జాతీయ మహాకవి “సుబ్రహ్మణ్య భారతొనీ ఒరిస్సా వాసులకు అందించింది. అంతేకాదు. . . ఛింగిజ్ ఐత్మతోవ్ రాసిన “ద క్రేన్స్ ప్లై ఎర్లీ'ని సైతం ఒరియీకరించింది.
ఈ రకంగా సృజనలో కవిత్వ ప్రక్రియని మాత్రమే ఏకైక వాహకంగా చేసుకుని ప్రతిబా శతపధి రచనలు చేసినట్లే అనువాద సాహిత్యానికీ ఆమె ఎంతో సేవ చేసింది ఇంతేకాకుండా అనేక సాహిత్య వ్యాసాలను రాసింది. 1975 నుండి “ఇష్టహార్" అనే సాహితీ పత్రికకు ఎడిటర్‌గానూ పనిచేస్తోంది. ఆమె రాసిన శబరి హిందీలో వాణి ప్రకాశన్, ఢిల్లీ వాళ్ళు “సవరి'గా వెల్వరించారు. రాధాకృష్ణ ప్రతిష్థాన్, ఢిల్లీ సంస్థ 'సమయ్ నహీ హై' పేరుతో ప్రతిభా శతపధి రాసిన పుస్తకాన్ని వెల్వరించింది. ఒరిస్సా రాష్ట్రంలోని అనేక సాహిత్య సంస్థలు ప్రతిభా శతపధిని ఎన్నోసార్లు సన్మానించాయి. ఆమె ఒరియా సాహిత్యంలో ప్రసిద్ధ కవయిత్రి. జాతీయస్తాయి. సెమినార్లలో, సమావేశాల్లో ప్రతిభా శతపధి పాల్గొనడమే కాకుండా తనదైన భావజాలాన్ని చాలా అందంగా ఆవిష్కరించింది. ఆమె కవిత్వం చాలా “తేట తేట ఒరియాలా వుంటుంది మానవ హృదయాంతరాళాల్లో దాగిన స్పర్శనీ, స్పిందనల్నీ ప్రతిభా శతపధి ప్రభావవంతంగా ప్రకటిస్తుంది. మనిషిక్సీ మనిషికీ మధ్య శిధిలమైపోతోన్న మానవ సంబంధాల పట్ల, మనిషికీ, ప్రకృతికీ మధ్య విలుప్తమైపోతోన్న బంధాల పట్ల ప్రతిభా శతపథి తన కవితల్లో చాలా ఆర్తినీ, ఆందోళననూ ప్రకటిస్తుంది.
ప్రతిభా శతపధి సాహిత్య జీవితంలో పొందిన అవార్డులు, (పైజులు కోకొల్లలు. ఆమె రాసిన 'నిమిషే అక్షరకు 1986లో ఆ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ప్రతిష్టాత్మకమైన 'సారళా' అవార్డు సైతం ప్రతిభను శబరి" రాసినందువల్ల 1992లో వరించింది. ప్రజాతంత్ర ప్రచార్ సమితి ఏటేటా యిచ్చే “బిసుబా అవార్డు ప్రతిభా శతపధికి 1981లో దక్కింది. 1996లో క్రిటిక్ సర్కిల్ ఇండియా అవార్డు వచ్చింది. ఒరిస్సా రాష్ట్రంలోనే కాక యితర ప్రాంతాల్లో నిర్వహించిన సమావేశాలకూ, సెమినార్తకూూ సభలకూ ప్రతిభా శతపధి రంచన్గా హాజరైంది. సమావేశాల్లో ఆయా భావజాలాలు, సాహిత్యాంశాలు పరస్పరం పంచుకోవడం ఎరిగిన కవయిత్రి కనుక 1971 నుంచి నేటివరకు దాదాపు దేశమంతా తిరిగింది. 1971లో న్యూఢిల్లీలో జరిగిన కవుల జాతీయ సింపోసియమ్లోనూ, 1975 నాటి నైనిటాల్ అఖిల భారతీయ కవయిత్రుల సమావేశంలోనూ, 1985లో బెంగుళూరులో జరిగిన బై లింగ్వల్ సాహిత్య సమావేశంలోనూ, 1994లో ఢిల్లీలోని “ద్వైభాషిక సాహిత్య సమావేశంలోనూ. . . 1981లో కలకత్తా భారతీయ భాషా పరిషత్ తూర్పుజోన్ సమావేశంలోనూ ఇలా. . .భోపాల్ రాణిగంజ్, జలగాం, అస్సాం సాహిత్య సభల్లోనూ ప్రతిభా శతపధి పాల్గొంది ఇన్ని చేసినప్పటికీ ప్రతిభా శతపధి అనగానే ఒరిస్సా పారకులకు ముందుగా ఆమె ఓ ప్రఖ్యాత కవయిత్రి అనే గుర్తుకొస్తుంది. 50 ాాాాాాాాాాాాాాాాా0ా:10:0000ాాాా305114 సావాతీ సుమాలు
.__ జకనిషథధరచయిత య. నాసీఫడ్మే అరవై రెండు నవలలను, ఇరవై ఎనిమిది కథా సంపుటాలను, ఇరవై ఐదు వ్యాస సంకలనాలను, తొమ్మిది నాటకాలను, ఇరవై నాలుగు హాస్య రచనలను, ఎనిమిది జీవిత చరిత్రలను, నాలుగు స్వీయ చరిత్రలను, ఒక కావ్యాన్ని, పదిహేను ఆంగ్ల గ్రంథాలను ఏకబిగిన ఒకే ఒక వ్యక్తి రాశాడు. ఇది పచ్చి వాస్తవం. ఈ రచనలన్నీ ప్రఖ్యాత మరాఠీ సాహితీవేత్త నా.సీ.ఫడ్కేవి. పద్దెనిమిదేళ్ళ వయస్సులో నా.సి.ఫడ్కే మొదటిసారిగా కథలను రాశాడు. హరిభావ్ అస్టే తరువాత మరాఠీ సాహిత్యంలో మళ్ళీ అతనిలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న రచయిత నాసీ.ఫడ్కే. ఫడ్కేగారూ, 'యయాతి' రాసిన జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత విష్ణు సఖారామ్ ఖండేకరూ. .. యిద్దరూ సమకాలికులు. ఎనభై ఐదు సంవత్సరాలు నిరంతర రచనా వ్యాసంగంలో తన బతుకును పండించుకున్న ధన్యజీవి నా.సీ.ఫడ్కే. అతని రచనలకు నిండైన అనుభవమే ఆలంబనం. భారత ప్రభుత్వం ఫడ్కే గారిని 1962లో “పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. మరారీ సాహిత్యంలో 1930 నుండి 1970 వరకు వున్న కాలాన్ని కథలకూ, నవలలకూ స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు. పైగా మరాఠీ కథను ఉత్తుంగ శిఖరమ్మీద నిలబెట్టిన కాలమది. అ సమయంలోనే ఎందరెందరో పాఠకుల హృదయాలను దోచుకుని, వాళ్ళ మనో ఫలకాల మీద చెరగని బలమైన ముద్రలు వేసిన రచయితలిద్దరు. ఒకరు నా.సీ.ఫడ్కే, మరొక వ్యక్తి విష్ణు సఖారామ్ ఖండేకర్. కథా రచయితగా ఖండేకర్, నవలాకారునిగా నా.సీ.ఫడ్కే పుష్కలమైన రచనలు చేయడం మరాఠీయులు చేసుకున్న అదృష్టం. నా.సీ.ఫడ్కే 1926లో కథల్ని రాయడం ప్రారంభించాడు. అచ్చు కట్టినట్టుగా వుండే ప్రణాళికతో, చక్కని శైలితో, శబ్దాడంబరంతో, సాధికారికమైన భాషతో, హాస్యరసస్ఫోరకమైన రచనా విధానంతో, చక్కని సంభాషణా పద్ధతితో రాసిన ఫడ్కే రచనలు చదువరుల్లో బాగా నిలదొక్కుకున్నాయి. అతని కథలకు ప్రాణం శిల్పం. ఆరంభం ఆకర్షణీయంగా వుంటుంది. ముగింపులో మాంఛి బిగింపు తప్పనిసరి. అద్యంతమూ చదివించగల ఆసక్తిని కలిగిస్తూ అతని కథల్లు ఉత్కంఠతో పాఠకుల్ని ఉర్రూతలూగిస్తాయి. మరాఠీ సాహిత్యంలో ఫడ్కే అంతగా పేరు తెచ్చుకోవడానికి ఇవి ముఖ్యాతిముఖ్య కారణాలు. బలిమెల భాస్కర్ “హా పాషు 57
ఫడ్కే నవలలన్నింటిలో దాదాపుగా (ప్రేమే కదా వస్తువు. వాటిల్లో అడుగడుగునా మధ్యతరగతి జీవులే సాక్షాత్కరిస్తారు. కధా నాయకురాల్ని సమ్మోహనంగా బొమ్మ కట్టించడం పడ్కే ప్రత్యేకత. నా,సీ.ఫడ్మే నగర జిల్లాలో కర్ణతలో పుట్టాడు. అతనికి చిన్నతనంలో యోగాసనాలంటే ఇష్టంగా వుండేది. పదిహేనేళ్ళకు మెట్రిక్ ఉత్తీర్ణుడయ్యాడు. మాట్లాడ్డం, చదవడం, రాయడం లాంటి భాషా ప్రయోజనాల్లో (కమ్యూనికేషన్ స్కిల్స్) నిషప్పాతుడయ్యాడు. సంస్కృతం, ఆంగ్ల బాషలంటే అబినివేశం ఎక్కువ. 1914లో బి.ఎ. పరిసమాప్తి. 1916లో న్యూ పూనా కాలేజీలో అద్యాపకత్వం. సహాయ నిరాకరణోద్యమంలో బాగా భాగస్వామ్యం. ఆరేళ్ళు ఉద్యోగ నిమిత్తం ఊళ్ళూ పూళ్ళూ తిరగడం. తుదకు కొల్లాపూర్‌లోని రాజారామ్ కళాశాలలో మళ్ళీ అధ్యాపక వృత్తి. నాస్తికుడు అబ్యుదయవాది. బ్రాహ్మణ వ్యతిరేక సంస్థలో ఫడ్కే ఉపన్యాసకుడిగా నిరుపమానమైన సేవలు చేశాడు. అధ్యయనం, అధ్యాపకత్వం, రచనలు చేయడం, టెన్నిస్ ఆడడం ఫడ్కేగారికి నిత్యకృత్యాలు నాసీ. ఫడ్కే “రత్నాకర్, “కిర్టోస్కర్, “స్తీ మొదలైన పత్రికలకు రెగ్యులర్‌గా రాసేవాడు. కధలూ నవలలతో పాటు జర్నలిజం, సంగీతాదులతో సాంగత్యముండేది. సినిమా ప్కిప్లు రచనలోనూ డిష్టమా పొందాడు. ప్రసిద్ద రచయిత “బ్రామ్ ఫీల్డు'ని కలుసుకున్నాడు. 1940లో రత్నగిరిలో జరిగిన మరారీ సాహిత్య సమ్మేళనానికి ఫడ్కే అధ్యక్షుడు. నాసీ.ఫడ్మే ఆంగ్రంలోనూ నవలలు, కధలు, వ్యాసాలు, సమీక్షలు రాశాడు. నాటక రచనలో పైతం వేలు పెట్టాడు. ఇన్ని చేసినప్పటికీ అతనికి ప్రియాతి ప్రియమైన ప్రక్రియ మాత్రం నవలే! ఇండియా”, “కార్వాన్” పత్రికల్లో క్రికెట్ గురించి వ్యాసాలు రాశాడు. ప్రత్యక్షానుభవం రచయితను గొప్ప రచయితగా నిలబెట్టగలిగిన అంశం కనుక “చల్లగాలికి దారికిరువేపులా వున్న బియ్యం చెట్లు తలలు ఊపుతున్నాయి' లాంటి రచనలు ససేమిరా చేపట్టని రచయిత ఫడ్కే, ప్రత్యకమైన అనుభవం కోసం దేశమంతా తిరిగాడు. ఆయా ప్రదేశాల ప్రత్యక్ష వర్జనల కోసమూ, రకరకాల మానవ స్వభావాల అధ్యయనం కొరకూ ఫడ్కే కన్యాకుమారి నుండి కాశ్మీరం దాకా తిరిగాడు. నిండైన అనుభవం సంపాదించాడు. “అల్లాహో అక్సర్' అతని మొదటి నవల. “దౌలత్, *“జాదూగర్' ఫడ్కేకి బాగా పేరు తెచ్చిన పుస్తకాలు. నా.సీ. ఫడ్కేకు పరితల్ని మంత్రముగ్ధుల్ని చేయగల పాటవం కరతలామలకం. అతడు నవల రాయడానికి ఉపక్రమించే ముందు ఆ నవల ఆద్యంతాల గురించి బాగా ఆలోచించేవాడు. మొదలూ ముగింపుల నిర్ధారణ జరిగిందంటే చాలు, గొలుసుకట్టు శైలితో కధా సూత్రం ఎక్కడా దెబ్బతినకుండా పరుగులు తీసేవాడు. నా.సీ.ఫడ్కే వ్యక్తిత్వం కూడా చిత్రమైంది ఎవరికీ లాంగని మనస్తత్వం అతనిది. ఓసారి కొల్లాపూర్ దివాన్ సుర్వేకు “విద్వాన్ సర్వత్ర పూజ్యతే! మరి నీ సంగతేంటి?” అంటూ ఛురికలాంటి చురక అంటించాడు. “గుంకార్” పత్రికా సంపాదకుడిగా వుంటూ కేసరి" పత్రిక మీద తనకే సరి అంటూ యుద్ధం ప్రకటించాడు. ప్రతి ఘటనకూ ప్రతిఘటనే పద్ధతిగా ఎంచుకున్నాడు ఫడ్కే రాసిన 'శాకుంతల' 58 టాకా 21 సావాతీ సుమాలు
నవల ఆంగ్ల ప్రభుత్వంతో నిషేధించబడి, అతనిమీద రాజద్రోహ నేరం మోపబడినా వనణకలేదు, తొణకలేదు ఏదిఏమైనా ప్రజల్లో ప్రాచుర్యం (పబ్లిసిటీ) కలిగిన రచయిత ఉత్తమ రచనలు చేయడం, ఉత్తమ రచయితలకు పబ్లిసిటీ రావడం చాలా అరుదు. నా.సీ.ఫడ్కే ప్రాచుర్యమూ, జనప్రియత్వమూ కల్గిన ఉత్తమ నవలా రచయిత. నిస్సందేహంగా చంద్రకాంత్ పోకలే అన్నట్టు 'మరారీ నవలా' వినీలాకాశంలో ఎప్పటికీ వెలుగులీనే ధ్రువతార మాత్రం నా.సీ.ఫడ్కేగారే!”
నలిమెల భాస్కర్. - ప్త ుసు మననము 50
విసించనకన్నడకవిత జైలజాచదచణ
ఆనాటి నిజాం రాష్ట్రంలో తెలంగాణా జిల్లాలతోపాటు కర్ణాటకలోని బీదర్, గుల్పర్లా, రాయచూర్ జిల్లాలే కాకుండా మహారాష్ట్రలోని బెరంగబాద్ మొదలైన జిల్లాలు కూడా వుండేవి. కన్నడిగులందరూ ఇప్పటికీ బీదర్, గుల్బర్గా, రాయచూర్ జిల్లాల్ని కలిపి హైద్రాబాద్ కర్ణాటకగా వ్యవహరిస్తుంటారు. ఈనాటికీ ఆమూడు జిల్లాల ప్రజల జీవన విధానం తెలంగాణా వాసుల జీవన విధానంలాగేవుంది. భౌగోళికంగానూ, ఆచార వ్యవహారాల విషయాల్లోనూ హైద్రాబాద్ కర్దాటక ప్రాంతానికీ, తెలంగాణాకూ అనేక సామీప్యాలూ, సారూప్యాలూ వున్నాయి. ఒక్క భాష మాత్రమే వేరు.
ఉర్దూ ఆనాడు అధికార భాష. పాఠశాలల్లో అ ఆ ఇ ఈ లకు బదులు “అలీఫబే'లుండేవి. అక్షరాస్యుల సంఖ్య చాలా తక్కువ. అందులోనూ ఆడవాళ్ళు చదువుకోడం ఎంతో అరుదైన విషయం. అది చాలా వెనుకబడిన ప్రాంతం అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నిజాం పాలనలో వున్న రాయచూరు జిల్లాలో 26.5,1935 నాడు పుట్టిన డాక్టర్ శైలజా ఉడచణ ఈనాటి మేటి కన్నడ కవయిత్రుల్లో ఒకరంటే విస్మయం కల్గుతుంది. ముస్లిమ్ స్రీలలాగే బురఖా పద్ధతి ఖచ్చితంగా పాటించాలని గురకాయించే హిందూ సనాతన సంప్రదాయంలో పుట్టి, ఉర్దూ మాద్యమం ద్వారా చదివి పదిహేడేళ్ళ వయస్సులోనే ప్రధమ కవితా సంకలనమైన ఒందుగళిగె (ఒక గడియ) ద్వారా వెలుగులోకి వచ్చారు.ఆనాటి నుండి నేటి వరకూ శ్రైలజా ఉడచణ నడిచిన దారిలో ఎన్నెన్నో మైలురాళ్ళు ఆరు కవితా సంకలనాలతో స్రీల బాధలకు భాష్యం చెప్పిన కవయిత్రి ఆమె నిలువెత్తు స్రీ సంవేదనకు ఎత్తిన అక్షర దర్పణాలు శైలజ పుస్తకాలు.
ఒక చోట ఆమె యిలా అంటుంది.
“త్రేతాయుగంలో ఒక్క సీతే నిప్పులో దూకింది. కానీ ఇక్కడ నిత్యం నిప్పుల్లో వేగుతున్న వేలకొద్ది సీతలు నవ్వుపువ్వుల్ని ధరించి మనముందు నడుస్తూ వుంటారు. మరొక సందర్భంలో. _,
“స్తీ విముక్తి కోసం నీవు
నిత్యం కడాయిలా కాలిపోతుంటావు”
అంటూ సానుభూతి చూపుతుంది. 60 డాటా: పథ్ సాహితీ సుమాలు
శైలజా బదిచణ కవితల్లో మన దాంపత్య జీవితాల్లో దాగిన ప్రీల దోపిడితోపాటు ఆకలీ,నిరాశా నిస్సృహలు, నేటి సమాజ స్వరూపం, ప్రకృతి, ప్రస్తుత దుస్థితికి సంబందించిన లోచూపు స్పష్టంగా కన్పిస్తాయి అంతేకాదు ప్రీల పరాదీనత,పరాయీకరణం, అభద్రత, అసహాయతల గురించి శైలజ తన గొంతును చాలా బలంగా విన్పిస్తుంది. ఆమె1981లో 'స్వగత'*, 1987లో “కప్పునెల సాక్కిద సూర్య", 1991లో 'తుంతురు హనిగుళు, 1995లో 'నన్నంధవరు", 1997లో 'కేళుమగా' అనే కవితా సంకలనాలను ప్రకటించింది కన్నడ రచయిత్రుల సంఘం... ఏటేటా యిచ్చేఅనుపమా నిరంజన అవార్డు 1997 సంవత్సరానికిగాను డాక్టర్ శైలజా ఉడచణరాసిన 'నన్నంధవరు' (నాలాంటివారు) గ్రంధానికి వచ్చింది. ఇది ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటో పురస్కార నిలువ పది వేల రూపాయలు. శ్రైలజ రాసిన ఈపుస్రకానికే 1997 కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు కూడ దక్కింది. జీవితంలోని అనివార్యమైన సంషుర్షణలకు “నన్నంధవరు' గొప్ప నిదర్శనమని డాక్టర్ హెచ్ఎస్. సుజాతా అభిప్రాయం. కన్నడ అదికార బాషా సంఘం అద్యక్షులైన డాక్టర్ చంద్రశేఖర్ పొటిల్ మాటల్లో చెప్పాలంటే గత పది పదిహేనేళ్ళుగా కన్నడ సాహిత్యంలో వినిపిస్తోన్న బలమైనగొంతుల్లో శైలజ గారిదొకటని. డాక్టర్ శైలజా ఉడచణకు తను పుట్టి పెరిగిన ప్రాంతమ్మీద విపరీతమైన మమకారం. అది వెనుకబడిన ప్రాంతమైనా ఆ మట్టి మీద ఆమె వాత్సల్యం చూద్దాం: “వంద సంవత్సరాల వ్యవదిలో రెండువందల సార్లు యుద్దాలు చూసిన ఈనేల పది సంవత్సరాల్లో మూణ్ఞాలుగు సార్లు దుర్భర దుర్శిక్షాలతో కునారిల్లెన ఈనేల తనకి ఉత్తర దక్షిణాల్లో కృష్ణా తుంగబద్రలు ప్రవహిస్తుంటే .... ఒక్క నీటి చుక్క కోసం నిరతం తపిస్తోంది. డాక్టర్ శైలజా ఉడచణ అసలు పేరు మహంతమ్మహస్మకల్. ఆమె “మదర్స్ నిస్వామ్ పాకానియా “(బాలికల ఉన్నత పారశాల)లో చేరి హెచ్ఎస్సి పాసయ్యింది. తర్వాత ఇంటర్ బి.ఎ.లను కూడా ఉర్పూ మీడియంలో చదివి డ్రైవేటుగా హైద్రాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఎ.చదివింది. తర్వాత బి ఇడి.శిక్షణ పొందింది రాయచూరు జిల్లాలోని కొప్పళ బాలికల ప్రాధమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగానూ, హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌గానూ, కలబుర్గి ప్రభుత్వ కళాశాలలో, మైసూర్ మహా రాణి కాలేజీలో లెక్పరర్ గౌనూ పనిచేస్తూ కవిత్వం రాసిన శైలజా ఉడచణ ఎదుటి వారిని మంత్రముగ్గుల్ని చేయగల మంచి ఉపన్యాసకురాలు కూడా. శైలజా ఉడచణ కవిత్వంతోపాటు వచనం కూడా రాసింది. మంచి విమర్శకురాలు. సాహిత్య పత్రికల్లో బోలేడు వ్యాసాలు రాసింది..వచనకారుల దృష్టిలో స్తీ అనే అంశం మీద పి.హెచ్.డి. చేసింది. నిరంతర సంపుర్షణల మయమైన జీవితంలోనూ,అరవై మూడేళ్ళ వయస్సులోనూ శైలజా ఉడచణ బారతీయ స్రీల దుస్థితి గురించి తీవ్రంగా స్పందిస్తోంది. డాక్టరు శైలజా ఉడచణ గురించి గవిసిద్దప్పు హెచ్ పాటిల్ యిలా అంటాడు “ఆమె ఉర్దూ నేలలో కన్నడ పువ్వుగా వికసించిన పెద్దతరం కవయిత్రి” నలిమెల భాస్కర్ 01
_ బహముఖప్రతిభాశాలి ' _నుంయాశ పేమ్లీ య
'కేంశీయుడైన. ప్రేమ్‌జీ మహానటుడు మాత్రమేకాదు సంఘ సంస్కర్తకూడా.పైగా అతడు నాటకరచయితగా,దర్శకుడిగా, చిత్రకారుడిగా, అనువాదకుడిగా,ప్రూఫ్‌రీడర్‌గా, గేయరచయితగా, కవిగానూ యింకా యింకా ఎన్నెన్నో ఉత్తమోత్తమ కార్యాల్ని నిర్వహించిన వ్యక్తిగానూ మలయాళ కవిత్వానికి పర్యాయంగానూ,పూరణంగానూ చెప్పకోవచ్చు.
(ప్రేమ్‌జీ యిన్ని పనులూ కేవలం ఆత్మసంతృప్తి కోసమే చేశాడు. అతనికి ప్రచారం ససేమిరాగిట్టదు.కాంగ్రెస్,కాం గ్రైస్సోషలిస్ట్ పార్టీరైతు కూలీ పోరాటాలు,కమ్యూనిస్తు పార్టీ మొదలైన ప్రగతిశీల ఉద్యమాల ఆరోహణాక్రమమూ-ప్రేమ్‌జీ జీవితమూ వేరువేరుకాదు ఒక్కటే! ప్రేమ్‌జీ అంటేనే ఉద్యమం,అంతేకాదు... ప్రేమ్జీఅంటే కవిత్వం. అతడు కవిత్వంలో ఏం చెప్పాడో జీవితంలో అదే చెప్పాడు. ఆలోచనకీ, ఆచరణకీ మధ్య ఎలాంటి అగాథాలూ, అఖాతాలూవుండవద్దని కుండబద్దలు కొడతాడు.సంక్షిష్టతా, అస్పష్టతలు లేకుండా పొడి పొడి మాటల్లో గంభీరమైన అర్జాల్ని ఆపాదిస్తూ ప్రేమ్‌జీ కవిత్వాన్నిరాశాడు.అతని కవిత కట్టెల్లోంచి వెల్వడే మంట కాదు.చాలా ష్లాన్డ్గా దీపనాళం లోంచి బయటపడే జ్యాల వంటిది. ప్రేమ్‌జీ కవిత్వం ఆర్ధమైంది. పాదుపైనది. అది 'పైగా సారవంతమైన కవిత. (ప్రేమ్‌జీ కవిత్వం తిమిరంతో సమరం చేసింది. పరిస్థితులతో తలపడి ధైర్యంగా నిలబడింది.“మగవాళ్ళు యింట్లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడానికా భగవానుడు వాళ్ళకి రెండు బలమైన చేతులను కూర్చింది” అన్న మలయాళ జాతీయ మహాకవి వళ్ళత్తోల్ కవిత ప్రేమ్‌జీకి బతుకు పొడుగూతా స్ఫూర్తి. ఛందోబద్ధంగా రాస్తూనే * ప్రపంచం బాధ శ్రీ శ్రీ కి బాధి అన్నట్లుగా ప్రపంచాన్ని పట్టించుకున్న, సమాజ స్పృహని, దట్టించుకున్న కవిత్వం గ్రేమ్జీది. అనేక రూపాల్లో వున్న ప్యూడల్ తత్వశాస్తాలకు హడల్ అతని కవిత. కొత్తదీ, ప్రజలదీ అయిన భౌతిక దర్శనం కోసం రాసినప్రేమ్జీ కవిత్వం పటిష్టమైనదే కాదు, వాస్తవికత కలిగింది కూడాను. (ప్రేమ్‌జీ రాసిన “రక్తసందేశం' పుస్తకం మొట్ట మొదటి సారిగా మలయాళీలకు రాజకీయ స్పృహని కలిగించింది. మలయాళంలో అభ్యుదయ సాహిత్యం రావడానికి చాలా ముందు ఆ కవితలు అక్కడి పాఠకుల్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి.
ప్రేమ్‌జీ సొంతరచనలే కాదు అనువాదాలు కూడా చేశాడు. జ్ఞానపీఠ బహుమతి గ్రహీత సర్దార్ ఆలీ జఫ్రీ,ఇక్సాల్ మొదలైన కవుల రచనలనూ, ఫెంచ్, పంజాబీ కవితలనూ అనువాదం చేసి
మాతృభాష అయిన మలయాళ భాషకు ప్రాపంచిక దృక్పథాన్ని సమకూర్చడం అంటే అప్పట్లో మాటలు కాదు మలయాళ అభ్యుదయ సాహిత్యోధ్యమానికి కొత్త కుదుపు నివ్వడమే కాక రాజకీయ కవిత్వానికి బావ కవిత్వంలో వున్న సొగసుని దిద్ది సోయగాన్ని అద్దిన ఘనత ప్రేమ్‌జీది. అభ్యుదయ కవుల్లో చాలామంది ఆ తర్వాత దారి తప్పి రాజకీయాదికారంలో పాలు పంచుకొన్నారు. వ్యాపారంతో చేతులు కలిపారు. కల్చరల్ పోలీసుల పాత్ర నిర్వహించారు. 'ప్రేమ్‌జీ అలాంటి వారు కాదు. అజన్మాంతం తన నమ్మకాలను చెక్కుచెదరనివ్వలేదు. తాటాకు చప్పుళ్ళ ఉప్పెనలకూ, ఆర్ధిక సంస్కరణల సుడి గాలులకూ, వ్యాపార దోరణుల ఊపులకూ, కించిత్తు కదలక మెదలక స్థిరంగా నించున్న కులశైలం ప్రేమ్‌జీ. పరిసరాలను అందమైన విరి సరాలుగా మార్చుకోవడం తెలిసిన గ్రుమ్జీ, పరిసరాలను వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే పరికరాలుగా తీర్చుకోవడం ఎరిగిన డ్రేమ్జీ ఏనాడూ ఎత్తిన తల దించలేదు. హీనాతి హీనంగా పరిస్థితులకు రాజీ పడలేదు. స్వరంలోనూ, స్వభావంలోనూ అత్యంత విలక్షణమైన కవిత్వం ప్రేమ్‌జీది.
డ్రేమ్జీ రాసిన 'బుతుమతి' అనే విశిష్టమైన నాటకంలోనూ, అతని బలమైన కవితలలోనూ, హృదయంలోనూ, ఉత్తరాల్లోనూ, నోట్స్‌లోనూ... ఒక్క ముక్కలో ప్రేమ్‌జీ సాహిత్యంలో మొత్తంగానూ నిలువెత్తు రూపంలో ఈ లోకంలోని పీడిత తాడిత ప్రీలే కన్పిస్తారు. నిజానికి వీళ్ళే ప్రేమ్‌జీ సాహిత్యానికి జీవధాతువులు. అతడు వట్టి వాగాడంబర శూరుడు కాదు. వాస్తవంగా కార్య ధీరుడు. మాటకూ, చేతకూ పాంతనా, వంతెనా వుండాలని గట్టిగా వాదించే మహామానవుడు. ఒక వితంతువును తన జీవిత భాగస్వామిగా చేసుకొని ఆమెకు ఆలంబన కల్పించి మోడువారిన జీవితాన్ని పుష్పింపచేస్తిన మనీషి గ్రుమ్జీ. కేరళ రాష్ట్రంలోని కవుల్లోనూ, రచయితల్లోనూ చాలా మందిని యాక్ట్విస్టులుగా చెప్పుకోవచ్చు. మహాకవి కుమరన్ ఆశాన్ నిమ్నకులాల ఉద్ధరణకు నడుంకట్టాడు. మలయాళ జాతీయ మహాకవి అయిన వళ్ళత్తోల్ కూడా ఆశాన్ లాంటి నంస్కర్త, దళిత వర్గ్ణాభ్యుదయాన్ని కోరుకున్నాడు. పది కవితా సంకలనాలు వేసి ప్రసిద్ధి పొందిన సుగతకుమారి 'అభయ'ను స్థాపించి మానసిక రోగులకు నిరంతరం సేవ చేసున్నది బెంగాలీ సాహిత్యంలోనూ మహాశ్వేతాదేవి, నిఖిల్చంద్ర సర్కార్, లీలారాయ్ మొదలైన సాహితీవేత్తలు అహరహం ఏదో ఒక రంగంలో సంఘంలో సేవ చీస్తూనే వున్నారు. ప్రసిద్ద మలయాళ సాహితీవేత్త కే.జి. శంకరపిళ్ళ గ్రుమ్జీని కుమరన్ ఆశాన్ లాంటి సంపు పంస్కర్తలకు సరైన వారసుడిగా ప్రశంసించాడు.
ఢేమ్జీ అసలు పేరు ముల్లమంగళం పరమేశ్వరన్ భట్టత్తిర్పాడు. అతడు కేరళలోని వన్నేరిలో 1908 సెప్టేంబర్ 23నాడు జన్మించాడు కరడు గట్టిన సంప్రదాయ సిద్ధమైన నంబూద్రి బ్రావ్మాల కుటుంబంలో పుట్టిన (ేమ్జీ, ఆ కుటుంబాల్లో స్రీలు (అంతర్జనం) పడుతోన్న వేదనల్ని చూసీ నిలువునా నీరయ్యాడు అప్పట్లో వి.టి. భట్టత్తిరిపాడు “నంబూద్రి పురుషులను మనుషులుగా మార్ప్చుదాం” అంటూ లేవదీసిన ఉద్యమంలోకి దూకి సంఘ సంస్కరణకు నాటక ప్రక్రియను మించిన వాహిక లేదని గ్రహించాడు (ప్రేమ్‌జీ. 1929లో మొదటిసారిగా “అడుక్కళయిల్ నిన్ను అరంగత్తేయ్క్కు' (వంటింటి నుండి అరంగ్రేటానికి) అనే నాటకంలో అద్భుతమైన తన నటనా కౌశలం చూపాడు. అది మొదలు కేరళ రాష్ట్రం దశదిశలా నాటకాలు వేసి ఉదాత్తమైన ఆశయాలను ప్రచారం చేశాడు అనేక సినిమాల్లో నటించాడు 'పిరవి' సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులకు ఢేమ్జీ అబినయ కౌశలం గుర్తుకురాక మానదు. సపత్ని, నాల్ కాలిగళ్, రక్తసందేశం, ,పేమ్జీ పాడుతున్నాడు... నలిమెలభాస్కద్ "* స జజహసపను షష రాయలు 65
మొదలైన కవితా సంకలనాలు ప్రకటించాడు. సంచలనాలు కలిగించాడు. ప్రసిద్ద నాటక ప్రయోక్త క్రిస్టఫర్ ఎమ్.బ్రస్కీ (యిప్పటికీ కేరళలో నాటక ప్రక్రియా, కమ్యూనిజమూ సజీవంగా వున్నాయని చెబుతాడు. డ్రేమ్జీ ఆ నాటక ప్రక్రియను ఊపిరిగా చేసుకున్నాడు. కమ్యూనిజం పట్ల అచంచల విశ్వాసం కల్గివున్నాడు.
'కేమ్జీ రాసింది ఒకే ఒక నాటకం. దానిపేరు 'బుతుమతి'. మహాకవి కాళిదాసు ప్రతిభ శానుంతలంలోని నాలుగోఅంకంలో వేయి రేకులుగా ఎలా విచ్చుకుందో, (్రేమ్జీ రాసిన ఏకైక నాటకంలో అతని సామర్థ్యం అలా నిరూపించబడింది. మలయాళ నాటక సాహిత్యంలో ఆదో మైలురాయి.
మలయాళ సాహిత్యంలో యింత బలమైన ముద్రవేసిన బహుముబ ప్రజ్ఞాశాలి ప్రేమ్‌జీ తన తొంభై ఏళ్ళ వయస్సులో 1998లో మరణించడం అక్కడి సంస్కరణోద్యమాలకు పెద్ద దెబ్బని చెప్పకతప్పదు.
6 టు సాహిత్ సుమాలు
విశ్వమానవహృదయానికి. అనువాదంఆమెలక్షరం |.
ఏలిన వర్జీనియా అర్నడర్స్ అనే అమ్మాయి తన 20 ఎళ్ళ వయస్సులో లీలారాయ్గా పేరు మార్చుకుంది ఈ కొత్త పేరుతోనే ఆమె ఆ తర్వాత చాలామందికి పరిచయమైంది. దేశాలకు, ద్వేషాలకు, మతాలకు, బాషలకు అతీతంగా ఎదిగిన ఆమె ప్రపంచ మానవాళికి ఒక అపూర్వమైన నమూనాగా వెలిగింది.
ఆమెరికా దక్షిణ ప్రాంతంలోని ఎల్పాసో నగరం ఆమె జన్మస్థలం, పశ్చిమ ప్రాంతంలోని లాస్ఏంజెల్స్లో కళాశాల విద్యను పూర్తిచేసింది. తూర్పున వున్న న్యూయార్కులో సంగీతాన్ని నేర్చుకుంది. అక్కణ్ణించి మరింత తూర్పుకు భారతీయ సంగీతాధ్యయనంకోసం పయనం చేసింది. 1930లో కలకత్తాలో దిగి 'పధే ప్రవాసే” పుస్తకం రాసి అప్పటికే పేరు పొందిన ప్రఖ్యాత రచయిత అన్నదా శంకర్రాయ్ని కలిసింది. అతనప్పుడు బెహరమ్పూర్లో అసిస్టెంట్ జడ్జిగా పనిచేస్తూ వున్నాడు అతని ఆహ్వానం మేరకు వర్డీనియా (అప్పటికింకా ఆ యువతి లీలారాయ్గా పేరు మార్చుకోలేదు) బెహరమ్పూర్ వెళ్ళింది. ఇద్దరూ కలిసి సైకిల్‌మీద చరిత్ర ప్రసిద్ధి వహించిన ముర్షిదాబాద్ వెళ్లారు. రాంచీని చూశారు పరిచయం పరిణయంగా మారింది. ఉభయులూ పెల్లిచేసుకున్నారు. వర్డీనియా అనే ఆ ఆమెరికా వనిత అప్పటినుంచి లీలారాయ్గా మారింది. బర్త అన్నదా శంకర్‌రాయ్ శతాధిక గ్రంధకర్త. అతడు ఒరిస్సాలో జన్మించాడు. ఒరియా, బెంగాలీ, అంగ్లాలలో ఏమానంగా గద్యపద్యాలు రాయగల సమర్థుడు. అతడి' సేతుబంధన్' హిందూ ముస్లింల ఐక్యతకోసం రాయబడిన గొప్ప వ్యాసగ్రందం. సాహితీ ప్రక్రియలన్నింటినీ అవలీలగా పోషించినవాడు. భార్య లిలతో కలిసి “బెంగాల్ లిటరేచర్ అనే గ్రంధం రాశాడు. రెండువేల ఐదువందల పేజీల 'సత్యాసత్య' అనే బృహన్నవల రాశాడు. ఇది ఆరు బాగాలుగా వెల్వడింది. గత 40 ఏళ్లుగా బెంగాలీ కదలు రాస్తున్నాడు కలకత్తాలో ఈనాటికీ పూర్తికాలం సాహితీ సేవలో నిమగ్నమైవున్నవాడు. సాహిత్య సేవ కోసమే స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్నాడు. అతని సాంగత్యంలో భార్య లీలారాయ్ సంగీతమేకాక సాహిత్యాన్ని నేర్చుకుంది. వంగ కోడలమ్మగా మారిన ఆ అమెరికా యువతి ఆ తర్వాత బెంగాలీ బాషను నేర్చుకుంది భారతదేశ జీవన విధానంతోనూ, పబ్యతా సంస్కారాలతోనూ పూర్తిగా మమెకమైైంది అమెరికాలోని తల్లిదండ్రులు తమ కూతురి పెళ్ళికి అంగీకరించనప్పటికీ అన్ని అమరికలూ, ఎర్బాట్లూ కలిగిన అమెరికాను వదిలి అన్నదా శంకర్రాయ్కు అండగా నిలిచింది
అనాదిగా పాలకుల నిరాదరణకు గురవుతున్న బారతీయ గ్రామాలకు తంలివెళ్ళింది ఆంకితబావంతో అనేక సేవా కార్యక్రమాల్ని నిర్వహించింది గాందీగారి ఏత్కాగ్రవోల్లా పాల్గుంద లీలారాయ్ని లీలామౌాత్రంగా కాదు బాగా ప్రబావితం చేసిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు గాందీజీ, మరొకరు వినోబాజీ. అసిస్టెంట్ మెజిస్ట్రేట్గారి అర్జాంగి అయిన అమెరికా అమ్మాయి లీలారాయ్ క్విట్ ఇండియా. ఉద్యమంలో పాల్గొంది. బాదీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఇంట్లో చరబా తిప్పింది ఒంటికి ఖద్దరే కట్టింది వినోబా భావే బూదాన ఉద్యమంలో క్రియాశీల కార్యకర్తగా కాలిశడకన అనేక గ్రామ సీమలను చుట్టింది. వినోబాగారి రచనల్ని అనువాదం చేసింది. బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి లీలారాయ్ విరివిగా అనువాదాలు చేసింది. వంగ కదా దిగ్గజత్రయంలో ఒక్కరైన సతీనాద్ భాద్రీ రాసిన 'జాగ్లిని తర్దుమా చేసింది. బెంగాలీ భాషలో మొదటిసారిగా జ్ఞానపీం పుంస్కారం పొందిన పుస్తకం 'గణదేవతా'ను ఆంగ్లంలోకి అనువదించింది. ఈ పుస్తకం తారాశంకర్ బందోపాద్యాయది. వనపూల్, సత్యజిత్‌రాయ్, జరాసంద్ మొదలైన ప్రసిద్ద బెంగాలి రచయితల గ్రంచాల సుగందాలను" లీలారాయ్ ఆంగ్లేయులకు అందించింది “అశని సంకేత్ 'ఘరే బాఇరే' మొదలైన సినిమాలకు పనిచేసింది. సాహిత్యంలో అనువాద సమస్యల గురించి లీలారాయ్ ఎంతో లోతుగా చర్చించింది. తన శేష జీవితంలోని ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్హ కాలాన్ని ప్రదానంగా అనువాదాలకే ప్రదానం చేసింది అనువాదమంటే నిఘంటువుల్లోంచి సమానార్దక పదాల్ని వెలికితీసి ఉపయోగించడం కాదని ఆమె అభిమతం. అనువాదం. . .ఒక భాషతో మరో భాష మమేకం కావడం లాంటిది ఒక మనస్సుతో వేరొక మనస్సు, ఒక జీవన విధానంతో ఇంకొక జీవన విదానం పూర్తిగా కలిసిపోవడం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక మానవ హృదయం మరో మానవ హృదయాన్ని గాడంగా ఆలింగనం చేసుకోవడం అనువాదమే అంటుంది లీలారాయ్. వ్యక్తి సంపూర్ణ వికాసానికీ, మూనవతా పరిమళాల వ్యాప్తికీ అనువాదం చక్కని సోపానం అని ఆమె భావన. అందుకే ఆమె కలకత్తాలో “ట్రాన్స్‌లేటర్ సొసైటీని స్థాపించింది. 1969-70లో నిర్వహింపబడిన 'ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ టాన్స్లేటర్స్” కు ఆమే సభాధ్యక్షురాలు, ప్రదాన నిర్వాహకురాలు. 1961లో రోమ్‌లో జరిగిన “రౌండ్ టేబుల్ ఆన్ ట్రాన్స్లేషనోకు లీలారాయ్ భారతదేశ ప్రతినిదిగా హాజరైంది దాదాపు డెబ్బై అనువాద గ్రందాలనూ, సృజనాత్మక రచనలనూ ఆమె రచించింది లీలారాయ్ రాసిన పుస్తకాల్లో ఎడు ఆంగ్ల కావ్యాలున్నాయి. ఒక బెంగాలీ కావ్యం ముద్రణకు సిద్ధంగా వుంది 1956లో “అట్లాంటిక్ మంత్లి' సంకలనం చేసిన కొత్తకలాల్ల లీలారాయ్ కవిత కూడా చోటుచేసుకుంది 1961లో ఆమె రాసిన ప్రదమ కావ్యం “ఎంట్రన్స్” వెలువడింది మొట్టమొదటి కవితా సంకలనానికి ఆ పేరు పెట్టడం ఎంత చక్కటి ఆలోచన! 66 ాాడాాపంటోటు. తస 2. సాహితీ సుమాలు
అనేక యుద్ధాల్లో వ ఆరితేరిన వృద్దమూర్తి . ద్రసానిరాంరడ్డి విది అతని వెన్నెముకను పెరిల్లున విరిచి కాసెపు విగ్రవీగింది. అయితే ఆ దీరచిత్తుని “వజి సంకల్పం ముందు వెలవెలా పోయింది. కాలం అతని కడుపు కింది నుండి మొత్తం శరీరాన్ని స్పర్శకు శాశ్వతంగా దూరం చేసింది కానీ ఆ స్థితప్రజ్జుని సాహితీ స్పృహను గమనించి విస్తుపోయింది. ఘోరమైన కారు ప్రమాదం అతణ్ణి ఆజన్మగ్భృహనిర్భందానికి గురి చేసింద్ని అయినప్పటికీ ఆ సంచలన శీలి మంచమ్మీద బోర్లా పడుకొని సమస్త ప్రపంచాన్ని శ్రద్దగా గమనిస్తుకీటి ఏమీ చేయలేకపోయింది అతనెవరో కాదు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఒక చిన్న పల్లెటూరు-ఉఊటూరు కని పెంచి పెద్ద చేసిన ముద్దుబిడ్డ ముద్దసాని రాంరెడ్డి పదహారు ఆగష్టు 1967లో జరిగిన రోడ్డు ప్రమాదంలో శారీరక వైకల్యాన్ని పొందినా, ముప్ఫై సంవత్సరాలనుండి సారస్వత సాఫల్యాన్ని అంది పుచ్చుకుంటున్న రాంరెడ్డి రచయితే కాదు పాత్రికేయుడు కూడా, పైగా మంచి విమర్శకుడు గొప్ప బావుకుడు లోతైన తాత్వికుడు బహుబాషజ్జుడు. ఈయన ఆంగ్లంలో గ్రంధరచనచేశాడు ఎన్నో పుస్తకాలను తెలుగు చేశాడు. సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ పత్రికలో ముద్దసాని రాంరెడ్డి అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశాడు 1955-57ల మద్య కాలంలో 'కన్నవీ-విన్నవీ' అన్న కాలం రాశాడు. జ్ఞానపీర బహుమతి గ్రహీత డాక్టర్ సినారె మొదటి పుస్తకం 'విశ్వగీతి'ని ముద్దసాని అచ్చు వేయించాడు సంస్కృతం, ఆంగ్లం, ఉర్టూ. హిందీ, మరారి, కన్నడాది బాషలు ఆయనకు తెలుసు. ఇటీవల ఢిల్లీ-సాహిత్య అకాడమీ అబ్బుల్ సమద్ ఉర్జూలో రాసిన “దోగజ్ జమీన్' నవలను ముద్దసానితో తెలుగులోనికి అనువాదం చేయించింది రాంరెడ్డి జూ56, 1928న పుట్టాడు జిల్లా కేంద్రం కరీంనగర్లో ప్రాధమిక విద్యాబ్యాసం నుండి మెట్రిక్యులేషన్ వరకు చదివాడు 1945-47ల మధ్య నాగపూర్‌లో ఇంటర్ చదివాడు హైదరాబాద్‌లోని నిజాం కళావాలలో బిఎ పూర్తిచేశాడు. ఉస్మానియాలో ఎం.ఎ -తెలుగు చదివాడు అదే విశ్వవిద్యాలయంలో డిప్లమా ఇన్ జర్నలిజాన్నీ, లా డిగ్రీనీ చదివాడు. 1974లో మరవరం ప్రతాపరెడ్డి జీవితం రచనలు' అనే పుస్తకాన్ని రాశాడు. ఆంద్ర సారస్వత పరిషత్తు ఈ గ్రిందాన్ని ప్రచురించింది ఇది 1972-73లో బహుమతిని కూడ పొందిన గ్రందం తెలుగు విశ్వవిద్యాలయం ఎటేటా యిచ్చే ప్రతిబా పురస్కారం సైతం ఈ గ్రందానికి వచ్చింది. నలిమెల భాస్కడ్ 6
కీశే. సయ్యద్ సజ్ఞాద్ జహీర్ గారి ఉర్దూ రచనను "లండన్‌లో ఒ రాత్రిగా తెలుగులోకి అనువదించాడు. తెలుగు అకాడమీ బొత్సాహికులైన రచయితలకు నిర్వహించి పోటిలో ప్రధమ బహుమతి పొందిన వీరి మరో పుస్తకం “అధునిక రాజ్యాంగతత్వానికి అరవిందు3 తోడ్పాటు". అద్ 1985లో ప్రచురించబడింది. “భారతీయ సాహిత్య నిర్మాతలు” శీర్షికన కేంద్రసాహిత్య అకాడమీ- ఢిల్లీ ప్రచురించిన ఆంగ్ల గ్రంధం “నర్మద్ శంకర్' పుస్తకాన్ని రాంరెడ్డి 1985లో తెలుగు చేశాడు. నర్మద్ శంకర్ ప్రముఖ గుజరాతీ రచయిత. ముద్దసాని రాంరెడ్డి 1985లో “ఇందిరాగాంధీ జీవిత చరిత్ర" అనే మరో గ్రందాన్ని రాశాడు. 1986లో యితని 'హిస్టరీ ఆఫ్ ప్రీఢథమ్ మూవ్మెంట్ అనే ఆంగ్ల గ్రందం వెలువడింది ఈ పుస్తకానికి అప్పట్లో కేంద్రప్రభుత్వం బహుమతిని ప్రకటించింది. ముద్దసాని రాంరెడ్డి హిందీ రచయిత లాల్శుక్లా రాసిన నవలను 'దర్చార్ రాగం' పేరుతో అన్నువాదం చేశాడు. అంతర్ భారతీయ గ్రందమాలలో భాగంగా ఢిల్లీ నేషనల్ బుక్ ట్రస్ట్ దీన్ని 1993లో అచ్చు వేసింది నరేంద్ర లూదర్ ఉర్లూలో రాసిన రచనను రాంరెడ్డి 1995లో “గాలిమేడల కొలంబస్" పేరున తెలుగులోకి అనువదించాడు. ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాబ కోసం “సమైక్యతా పధంలో తెలుగువారు, “శ్రీ బూర్గుల రామకృష్ణారావు", 'సురవరం ప్రతాపరెడ్డి" మొదలైన మరికొన్ని రచనలు చేశాడు ప్రముఖ ఉర్దుశీదినపత్రిక 'సియాసత్' వ్యవస్థాపకులు కీ.శే ఆబిద్ అలీ బాన్ ఉర్దూ భాషకు చేసిన విశిష్ట సేవలను తెలుగులోకి అనువాదం చేస్తున్నాడు. ముద్దసాని రాంరెడ్డిని చూస్తే మనకు ఆంగ్ల సాహిత్యంలో ప్రప్రధమంగా ఉదాత్తశైలికి ఆద్యుడైన ఆంద్రుడు మిల్టన్ మహాశయుడు స్ఫురిస్తాడు. 08 ాాాళాాాాాాాంాాాాాోాంంటాాా21- : సాహితీ సుమాలు
విలక్షణభారతీయాంగ రచయిత ఆర౯3.నారాయత్ 1906లో పుట్టిన ఆర్కె. నారాయణ్ తన రచనా వ్యాసంగాన్ని 1924లో ప్రారంభించాడు. “స్వామి అండ్ ప్రెండ్స్' అనే మొదటి నవలను 1932లో పూర్తి చేశాడు. పట్టువదలని విక్రమార్కుడిలా పలు ప్రయత్నాలు చేసి, ఆ నవలను 1935లో ఇంగ్లాండులో ప్రచురింపచేశాడు. అది మొదలుకొని ఆర్.కె. నారాయణ్ అవిచ్చిన్నంగా నవలలు, నవలికలు, కధానికలు, స్కెచ్‌లు, వ్యాసాలు మొదలైనవి అనేకం రచించాడు. 1993లో తన అత్యాధునిక నవలను రాశాడు. భారతీయాంగ్ల రచయితల్లో ఆర్.3. నారాయణ్ అత్యంత ప్రముఖుడు... ఉదాత్త సాహితీ మూర్తి. అతని రచనలు సార్వకాలికాలు, ఏడు దశాబ్దాల నుండి సృజానాత్మక సాహితీ వ్యాసంగంలో నిమగ్నమైన విలక్షణ సారస్వత తపస్వి. పారకుల్ని అమితంగా ప్రభావితం చేస్తోన్న సృజనశీల రచయిత ఆర్కే ఆర్కే నారాయణ్‌ను మనం అతి సన్నిహితంగా చూసినప్పుడు, అతని నవలా ప్రపంచంలో ఖచ్చితంగా చెప్పుకోదగిన మార్పులు కనిపిస్తాయి. పైగా ఈ మార్పులు భారత స్వాతంత్ర్య కాలానికి అటూ యిటూ వచ్చిన అతని రచనల్లో విరివిగా కనిపిస్తాయి కారణం... నారాయణ్ రచనా ప్రపంచం నిత్య పరిణామ శీలం కావడమే! కాలం తన వెంట మోసుకొచ్చిన మార్పులు ఆర్కే నారాయణ్ రచనల్లో అతి స్పష్టంగా ప్రతిపలించడం చూసి మనం విస్తుపోతాం కూడాను. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష ముద్రాపకులతోనూ, పారకలోకంతోనూ నారాయణ్‌కు సంబందాలు పుటుక్కున తెగిపోయాయి. అనుకోని ఈ పరిణామంతో రచనలతోనే ఉపాధి ఏర్పరచుకున్న నారాయణ్ అష్టకష్టాల పాలయ్యాడు అత్యంత దయనీయంగా తన మిత్రుడైన గ్రాహంగ్రీన్కు కనీసం తన కదలకైనా ఒక సంపాదకుణ్ణి చూడమని ప్రాధేయపడుతూ ఉత్తరం రాశాడు. గ్రీన్ ఎంతగానో ప్రయత్నించాడు. కానీ విఫలుడయ్యాడు అలాంటి గడ్డు పరిస్థితుల్లో నారాయణ్‌కు 'ది హిందూ' పత్రికా సంపాదకుడు కస్తూరి శ్రీనివాసన్ తన స్నేహ సహాయ హస్తాల్ని అందించాడు పత్రికలో క్రమం తప్పకుండా రాయమన్నాడు ఇండియాలో ఒక పారక వర్షాన్ని ఏర్పరచుకోమని రారాయణ్కు సలహా యిచ్చాడు. శ్రీనివాసన్ జెమిని స్టూడియో యజమాని కూడా కావడంతో తన స్ప్టూడియోలోని కధా విభాగంలో ఆర్కేకు పని కల్పించాడు పైగా నారాయణ్ నవల 'స్వామి అండ్ ప్రెండ్స్'ను ప్రముఖ పత్రిక 'అనంద విగటన్'లో తమిళంలోకి ధారావాహికంగా అనువదింపజేశాడు కష్టాల కడలిలోంచి నారాయణ్‌ను గట్టెక్కించిన కారుణ్యమూర్తి శ్రీనివాసన్. నలిమెల భాస్కర్ 69
ఆ తర్వాత ఆర్కే నారాయణ్ ఆల్ ఇండియా రేడియోకు “ప్రీ-లాస్వింగ్' చేవాదు. కృత్రిమత్వం లేని నిత్య సంచలన శీలం సహజమైన ఆత్మగౌరవం ఆ మహారచయితకు పెట్టని బూషణాలు. రెండోప్రపంచ యుద్ధ సమయానికి పూర్వమే నారాయణ్ తన మిత్రుడైన గ్రీక్ సాయంతో ఇంగ్లండులో అచ్చు వేయించిన మొదటి మూడు నవలలు పెద్దగా అమ్ముడుపోలేదు. అది అతనికి ఆశనిపాతంలాంటిది. యుద్ధం అతని జీవితంలో కవ్టాలు గుమ్మరించిన పుట్టం. అతనికి జీవితమూ, సాహిత్యమూ ఒక్కటే! ఆరెండూ దెబ్బతిన్నాయి మీదు మిక్కిలి తన ప్రాణంలో ప్రాణమైన భార్య రాజం చనిపోయింది. కరడుగట్టిన చాందస సంప్రదాయాలను కాలదన్నిన నారాయణ్ ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆరోజుల్లో యిది అత్యంత సాహస కార్యమని మనం యిట్టే అర్దం చేసుకోగలం. పులి మీద పుట్రలా ఆర్థిక యిబ్బందులు. అతనికి జీవితం పెద్ద “పజిల్ అయికూచుంది. మనుగడ కోసం పెనుగులాట తప్పలేదు. అయితే తన నవలల ప్రారంబకాలం నించీ కష్టాలు పరంపరగా కొనసాగడంతో అతడు తీవ్రమైన నిరాశా నిస్పృహలకు లోనయ్యాడు బార్య మరణం నారాయణ్‌ను బాగా క్రుంగదీసింది. ఆర్కే నారాయణ్‌ను బాగా అసెస్ చేసిన ప్రముఖుల్లో ఒకరైన రంగారావు యిలా అంటాడు. “సమస్యల్ని ఎదుర్కోలేని నారాయణ్ 1940-42లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.” అదృష్టవశాత్తూ నారాయణ్‌కు పాల్ బ్రింటన్తో పరిచయం కలిగింది పాల్ అతనికి మనో ధైర్యాన్ని నూరిపోశాడు. అంతర్లీనమైన మానసిక శక్తుల్ని మేల్కొలిపాడు. ఎట్టకేలకు 1942 సంవత్సరాంతంలో నారాయణ్ సమస్యల సుడిగుండంలోంచి బయటపడ్డాడు. రెండో ప్రపంచ యుద్ధానంతరం. అంటే బ్రింటన్తో నారాయణ్‌కు పరిచయం కలిగాక్ష ఆర్కే నారాయణ్ తన రచనా వ్యాసంగాన్ని బాగా పండించాడు. భారత స్వాతంత్ర్యానంతర కాలంలో వచ్చిన నవలల్లో నారాయణ్ తన విరాట్‌రూపాన్ని చూపాడు. తన జీవితంలోని అనుభవ జ్ఞానం, పేమ, ఒంటరితనం, శూన్యత్వం, విసుగు, విఫలత్వం మొదలైన అనేకాంశాల్ని ఏమాత్రం పొల్లుపోకుండా తర్వాతి రచనల్లో ప్రతిబింబింపజేశాడు. స్వాతంత్ర్యానికి ముందు రాసిన నవలలక్తూ, స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన నవలలకూ స్పష్టమైన అంతరం వుంది ఆర్కే నారాయణ్ తన ప్రారంభ నవలల్లో చక్కటి కుటుంబ సంబంధాలకు, చిక్కటి అనుబంధాలకు పెద్ద పీట వేశాడు నూటికో, కోటికో ఒక్కరు అన్నట్టుగా ఆర్కే నారాయణ్ నవల “స్వామి అండ్ ఫఫెండ్స్' పదివేల పుస్తకాలకు ఒకటని గ్రీన్ అభిప్రాయం. ఏ యితర విదేశీ రచయిత సైతం వర్ణించలేనంత సానుబూతితోనూ, ఆంతరిక దృష్టితోనూ నారాయణ్ “బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ నవలలో పాత్ర చిత్రీకరణ చేశాడని ఐరిష్ టైమ్స్ పత్రిక చెప్పింది. అతని ఆలోచనా సరళిలోని స్పష్టతకూ, స్యచ్చతకూ ఆ నవల మచ్చుతునక. నారాయణ్ రచించిన మరొక నవల 'ద ఇంగ్లీష్ టీచర్. మనిషి జీవన మరణాలను చక్కగా వ్యాఖ్యానించింది. సున్నిత మనస్కులైన పారకులెందరినో ప్రగాఢంగా ప్రబావితం చేసింది. ప్రసిద్ధ రచయిత సోమర్ సెట్మూమ్ ఆర్కేకు ఉత్తరం రాస్తూ “ఈ నవలలో నన్ను మంత్రముగ్గ్భుణ్ణి చేసిన అంశం మీరు పూసగుచ్చినట్టు చెప్పిన గృహస్థ జీవితం” అంటాడు. నారాయణ్ మొదటి రచనల్లోని స్వామి నుండి శ్రీనివాస్ (మిస్టర్ పంపత్-నవల) వరకు గల కథానాయకులు సున్నిత మనస్కులు, సృజన శీలురు ప్రశ్నించే మనస్తత్వం గలవాళ్ళు. అన్వేషణా దృక్పధం గల వ్యక్తులు. గట్టిపిండాలు, నిబద్ధతతో కూడిన మనుషులు.
రో అసమాన అస్బామీ కథా సౌరభం సౌరభ్ కునూర్ చఛభిహాో సౌరబ్ అస్సామీ సాహిత్యంలో గొప్ప ఆసామీ అతనికి మాతృభాష అస్సామీ అయితే ధాత్రీభాష బెంగాలీ తన కదా సౌరబాలతో అస్సామీ వాజ్నయాన్ని సుసంపన్నం చేసిన సాహితీవేత్త. అతని "పీరు సౌరబ్కుమార్ చలిహా. అస్సామీ సాహిత్య విమర్శకుడు రంజిత్ కుమార్ దేవ్గోస్వామి సౌరభ్‌కుమార్ గురించి ఇలా అంటాడు. “అదునిక అస్సామీ సాహిత్యంలో ప్రముఖ కథారచయిత నిస్సందేహంగా సౌరభ్గారే, అధునిక జీవితంలోని ఏకాకితనం, మానసిక వత్తిడి, పెరుగుతోన్న క్రూరత్వం, బాధలు, అస్థిరత్వం, సంక్షిష్టత...వీటన్నింటిని చక్కగా చిత్రీకరించిన రచయిత సౌరభ్‌కుమార్". “అశాంత్ ఎలక్ష్రాన్" (అవిశ్రాంత ఎలక్ష్రాన్) అనే కదతో తన సత్తా నిరూపించుకొన్న సౌరభ్‌కుమార్ ఆతర్వాత అనేక కదలు రాసి అస్సామీ సాహిత్యాన్ని పరిపుష్టం చేశాడు అతని ప్రారంభ కధల్లో ప్రొాఢరచనా పద్దతులు, బౌద్ధిక విషయాల ఆవిష్కృతులు వున్నప్పటికీ క్రమేపి జనప్రియ కధలు రాసి ప్రాచుర్యం పొందాడు, నిజానికి 'అశాంత్ ఎలక్ర్రాన్' అనే కధ రాశాక అతను మళ్లీ వెనక్కి తిరిగి చూళ్ళేదు అవిశ్రాంతంగా కధలు రాయవలసి వచ్చింది పాఠకులు కూడా అంత వేగంగానూ అతని కదల్ని స్వీకరించారు. 1974లో “గోలామ్' (కదా సంకలనం) గ్రందానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అశాంత్ ఎలక్ర్రాన్ (కదా సంకలనం-1962), దుప్పురీయా (కధా సంకలనం-1863), ఏహాత్ డాబా (కదా సంకలనం-1972), గోలామ్ (కధా సంకలనం-1973), గల్ఫ్ నహయ్ (నానా రకాల రచన-1988), ఆఓపేక్రవార్ (విదేశీ కదలకు అస్సామీ అనువాదం-1992), అవరుద్ధ్ చహర్ (కధా నాటకం-1994), సౌరబ్ చలిహార్ సునిర్యాచిత్ సంకలన్ (1994)... ఇవి సొరభ్కుమార్ రచనలు. పైగా అనేక కధా సంపూటాలకు సంపాదకత్వం వహించాడు. ఎన్నో అకడమిక్ గ్రంధాలు రాశాడు, సౌరబ్కుమార్ చలిహా గౌహతిలో మాలిగావ్ అనే ప్రాంతంలో సాదాసీదా జీవనం గడుపుతున్నాడు. వాస్తవానికి సౌరభ్‌కుమార్ పేరు సురేంద్రనాథ్ మేధీ. ఇతడు భౌతికశాస్తంలో చాలకాలం అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ పొందాడు ఈ సురేంద్రనాథ్ మేధీగారు సౌరబ్కుమార్ చలిహా పేరుతో దాదాపు ఏబై ఏళ్ళు అస్సామీ సాహిత్య సేవ చేశాడు. సౌరబ్ మితభాషి, మృదు స్వబావం కలవాడు పాశ్చాత్య సంగీతం అంటే విపరీతమైన ప్రీతి చిన్నతనంలో సైన్స్ ఫిక్షన్ కధలూ, డిటెక్టివ్ కదలూ
బాగా చదివేవారట! విద్యార్ధి దశ అంతా విదేశాల్లోనే గడిచింది. దాంపత్య జీవితంలో ఎ రకమైన ఒడిదుడుకుల్లేవు. రోజూ ఇప్పటికీ బజారుకు వెళతాడు. కుటుంబ సభ్యులతో కాలం గడుపుతాడు. “ది మేగర్ ఎడ్యూకేషన్ ట్రస్టు అనే సంస్థ, అస్సామీ సంస్కృతీ సాహితీ వికాసాల కోసం కృషి చేస్తోన్న విశిష్ట సంస్థ ఈ సంస్థ 'అస్సామ్ ఉపత్యకా సాహిత్య పురస్కార్ అనే అవార్డుని సొరభ్కుమార్ చలిహాకి ప్రకటించింది. పురస్కార మూల్యం ఒక లక్ష రూపాయలు అవార్డు పొందిన సందర్భంగా బెంగాలీ విమర్శకుడు హర్షదత్త “ఈ పురస్కారం పొందారు కదా! మీరెలా పీలయ్యారు?” అని అడిగితే సౌరభ్ “నేను నాకన్నా ముందున్నవాళ్ళని అనుసరించాను. అంతే! నేను ఏనాడూ రచయితని కావాలని అనుకోలేదు. శాస్త్రవేత్త కావాలనేది నా సంకల్పం. అది నెరవేరలేదు ఇప్పటికీ నేను సైన్స్ విద్యార్థిని రచనా మాధ్యమం ద్వారా స్వీయ ఆలోచనలకు తెర తీశాను. అంతే!” అన్నాడు. 1996 ఫిబ్రవరి మొదటి వారంలో గౌహతిలోని రవీంద్రభవన్లో ఒక సభ జరిగింది. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు యు.ఆర్. అనంతమూర్తి ప్రధానోత్సవానికి విచ్చేశాడు. అతనే సభాధ్యక్షుడు. అనంతమూర్తి భారతదేశంలో విభిన్న ప్రాంతీయ భాషల అనువాదాలు విరివిగా జరగాల్సిన ఆవసరాన్ని ఆ సందర్భంలో నొక్కి చెప్పాడు. పైగా ఆ అనువాదాలు ఆంగ్లంలోంచి నసేమిరా కాదు అన్నాడు. నేరుగా మూలంలోంచి చేయాల్సిన అవసరాన్ని పదేపదే గుర్తుచేశాడు. పాశ్చాత్య విద్వాంసులు మన దేశంలోని విభిన్న భాషలు నేర్చుకొని మన భాషాసాహిత్యాలకు సేవ చేసినట్లుగానే భారతీయులు ప్రాంతీయ భాషల్ని అధ్యయనం చేయాల్సిన అవసరముందని చెప్పాడు అనంతమూర్తి. సౌరభ్‌కుమార్ అనంతమూర్తి అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవించే వ్యక్తి. విలియమ్సన్ మేగర్ కంపనీ తరపున శ్రీ ఆర్.ఎల్, ౦ఖే హాజరయ్యాడు. ఆ సభకు సౌరభ్ గారిని అభినందించడానికి అస్సామీ ప్రసిద్ధ సాహితీవేత్త సయ్యద్ అబ్బుల్ మాలిక్ కూడా వచ్చాడు. ఆ సభావేదిక మీద సౌరభ్ లేడు. అతనికి ఈ ఆడంబరాలూ, అట్టహాసాలూ నచ్చవు. అతను సభాసదుల్లో వినయంగా కూచుని వున్నాడు. పారకుల హృదయాల్లో అతనిది ఒక ప్రత్యేక స్థానం. లక్ష రూపాయాల చెక్కునీ, జ్ఞాపికనీ అతని తరపున రంజితా బౌదరి స్వీకరించింది. అయితే [్రేక్షకుల కోరిక మేరకు సౌరభ్‌కుమార్ అంతర్ముఖుడై వేదిక మీదికి వచ్చి నాలుగు మాటలు మాట్లాడాడు. అవి అతని హృదయంలోంచి వచ్చిన స్వానుభవాలు...సాహిత్య సంబంధిత ప్రవచనాలు. తనదైన స్వతంత్ర ముద్రతో అస్సామీ సాహిత్యాన్ని అయిదు దశకాల నించీ దశ మళ్ళిస్తున్నారు. దిశ మారుస్తున్నారు. అతని మెదడులో శాస్త్రం (సైన్స్), హృదయంలో సాహిత్యం రెండూ సమాన స్థాయిల్లో తిష్టవేసుకొని వుండడం అస్సామీయులు చేసుకున్న అదృష్టం. 22ాాాంంాంాాంాాాంాాంాాంంాాాంాాంాంాాాంాాాడంాజాు సాహెత్ సుమాలు
షీ సాహిత్య శాస్తాల రూపం అనే డౌ పనలాలి టా ; ఫ్ఫట్తనలాది డౌక్టర్ 3. కృష్ణమూర్తి సంస్కృత విద్యత్రపంచంలో అత్యంత సుపరిచితుడు. సంస్కృతం, కన్నడం, ఆంగ్లం మూడు భాషల్లోను అతని పరిశ్రమ సాటిలేనిది. అసాధారణ ప్రతిభావంతుడైన కృష్ణమూర్తి కర్నాటక రాష్ట్రం హాసన్జిల్లాలోని కేరళాపురంలో జన్మించాడు. తండ్రి సంస్కృతంలో దెట్ట. అందుచేత ఇంటివద్ద తండ్రి శిక్షణలోనే కృష్ణమూర్తి సంస్కృతం నేర్చుకున్నాడు. చిన్నతనంలోనే ఆమరకోశం నెమరువేశాడు. 'అప్టాద్యాయి'ని అష్టకష్టాలు పడైనా అధ్యయనం చేశాడు. 'ధాతురూ పావళి'ని రక్షధాతు హృదయగతం చేసుకున్నాడు. “ఆ తర్వాత మైసూర్ నగరానికి వచ్చి విద్యాభ్యాసం ప్రారంభించాడు. తరగతులన్నింటిలోను ప్రధమతశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. మైసూర్ మహారాజా వారి విద్యాలయంలో కృష్ణమూర్తి బి.ఏ. పూర్తిచేశాడు. ఎం ఏ మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి తీసుకున్నాడు. డాక్టర్ కృష్ణమూర్తి బాగల్‌కోట, మైసూర్, కుమ్టా నగరాల్లో సంస్కృత అధ్యాపక వృత్తిని నిర్వహిస్తూ తదనంతరం దార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయ సంస్కృత విబాగంలో ప్రవేశించాడు తను పదవీ విరమణ చేసేవరకు ఎందరెందరో అంతేవాసులకు సంస్కృతాన్ని బోధించి ఎంతో వాసికెక్కాడు. “ధ్వన్యాలోక-తద్విమర్శకాళ్చ” అనే అంశంమీద కృష్ణమూర్తి చేసిన కూలంకషమైన పరిశోధనకు ముంబయ్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేసింది. ఆ తరువాత అతడు నిరంతర సాహితీసేవలో లీనమయ్యాడు. ప్రధానంగా పరిశోధనారంగంతో మమేకమయ్యాడు. పరిశోదనలు ఉపరిశోధనల్లా వుండకూడదనుకున్నాడు. అతని ఆంగ్లభాషా పరిజ్ఞానం కూడా ఉపరిజ్ఞానం కాదు. సంస్కృతంలోసి ధ్వన్యాలోకాన్నీ, వక్రోక్తి జీవితాన్నీ ఓం ప్రధమంగా ఆంగ్లబాషలోకి అనువదించిన ఘనత కృష్ణమూర్తికే దక్కుతుంది సంస్కృత బాష మీద పెద్దగా అధికారంలేని కొంతమంది పెద్దలు తెలిసీ తెలియక తమ సంభాషణలో కొన్ని వ్యర్థ పదాలను దొర్లిస్తుంటారు. ఈ విషయంలో కృష్ణమూర్తికి కొన్ని స్థిరాభిప్రాయాలు వున్నాయి. భాషపై ప్రభుత్వం నెరపలేని కొందరు ఇలాంటి వ్యర్థపదాల్ని ఉపయోగిస్తూ వుంటారని అతని బావన,
డాక్టర్ కృష్ణమూర్తి ఇప్పటి వరకు చేసిన కృషి ఒక పార్వం. అతడు సాహిత్యశాస్త్ర గ్రందాలను అద్యయనం చేయడం మరొక పార్య్యం. వాటిని లోతుగా అద్యయనం చేశాడు. సాహిత్యం వేరు, సాహిత్య శాస్త్రం వేరు. సాహిత్యశాస్త్రం మింగుడు పడని ముద్ద. దాన్ని సుబోదకంగా చదువరులకు అందించిన ఘనత కృష్ణమూర్తిది. ఈ సాహిత్య శాస్త్రాన్ని అధ్యయన౦ చేయడమే కాకుండా వాటిసి తన మాతృభాష అయిన కన్నడంలోకి అనువాదం చేశాడు. సంస్కృత సాహిత్యంలో వున్న ప్రసిద్ద సాహిత్య శాస్త్రాలన్నింటినీ దాదాపుగా కన్నడీకరించిన గొప్పతనం మళ్ళీ కృష్ణమూర్తిదే అతడు అనువదించకుండా మిగిలిపోయిన సంస్కృత _సాహిత్యశాస్త్ర గ్రందాలను వేళ్ళమీద లెక్కించవచ్చునేమో! ధ్యన్యాలోకం, కావ్యాలంకారం, కావ్యాదర్శం, కావ్యాలంకార సూత్రవృత్తి, బెచిత్యవిచార చర్చ, కావ్యప్రకాశం... మొదలైన సాహిత్య శాస్త్ర గ్రంధాలన్నీ కృష్ణమూర్తి కన్నడంలోకి బాషాంతరీకరణం చేశాడు, సాహిత్య శాస్త్రాల అను వాదం ఆషామాషీ వ్యవహారం కాదు కదా! అసలు అనువాదం...అణువాదం, పరమాణువాదం కన్నా జటిలమైంది. అనువాదం ఎంతో సులబంగా చేసుకుపోవచ్చును అను వాదం మనలో చాలామంది చేస్తూ వుంటారు. వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే అనువాదం ఎంత సులభమైందో. అంతే కష్టమైంది కూడాను. కష్టసాధ్యమైన అనువాదాన్ని కృష్ణమూర్తి సుసాధ్యం చేసుకొని, మూలాల్లోని స్వారస్యం ఏమాత్రం చెడకుండా జాగ్రత్తపడ్డాడు. ప్రతిమా నాటకం, యజ్ఞఫలం, ఉత్తర రామచరితం, మృచృ్భకటికం మొదలైన నాటకాలను కూడ్లా కన్నడంలోకి అనువదించాడు. “అలంకార శాస్తకావ్యవైవిధ్య విమర్శః” అనే గ్రందాన్ని కృష్ణమూర్తి సంస్కృతంలో రచించాడు. సంస్కృతంలో అనేక హృద్యమైన పద్యాలను సైతం కృష్ణవ ౮ార్తి రాశాడు అంతేకాకుండా వందలాది పరిశోధనా వ్యాసాలు వ్రాశాడు అవి దేశంలోని సుప్రసిద్ధ పత్రిక శే అచ్చయ్యాయి. కేరళ విశ్వవిద్యాలయం కృష్ణమూర్తిని సేతుపార్వతీ పురస్కారంతో గౌరవించింది. కర్నాటక సాహిత్య అకాడమీ అవార్డు, కర్నాటక రాష్ట్ర ప్రశస్తి, రాష్ట్ర పురస్కారం మొదలైన అనేక అవార్డులతో కృష్ణమూర్తి గౌరవాదరాలు పొందాడు. 1994వ సంవత్సరంలో రోహ్టక్లో జరిగిన అఖిల భారతీయ (ప్రాచ్యవిద్యాసమ్మేళనంలో అధ్యక్ష పదవిని అలంకరించి అలరించిన కార్యదక్తుడు డాక్టర్ కృష్ణమూర్తి. 1997 జనవరి నెలలో బెంగుళూరులో జరిగిన పదవ ప్రపంచ సంస్కృత మహాసబల్లోనూ అతనికి పురస్కారం లభించింది. కృష్ణమూర్తి 1997 జూలై మాసంలో మరణించాడు ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం. ..ఈ మూడు గుణాలూ ముప్పేటలా అల్లుకుపోయిన కృష్ణమూర్తి రచనా వ్యాసంగం వెలకట్టలేనిది. డాక్టర్ కృష్ణమూర్తి భౌతికంగా మనమద్య లేకపోయినప్పటికీ, అతడు వెలయించిన కృతులు మాత్రం చిరంజీవులై కీర్తిచంద్రికలు ప్రసరింపచేస్తున్నాయి ..అనడంలో అత్యుక్తిలేదు 4 ఏటా: సాహితీ సునూలు
ఉరూ సాహిత్యా ది నికిటనికి ' గొలిబ్ కాసుల పరంగా గరీబు: కవితల దృష్టా అమీరు... అమరుడు. తన తాత ముత్తాతలు త్రుర్కీయులు. అతనికి మాత్రం బారతదేశమే పరమ పవిత్రదేశం. గాలిబు పుట్టుకతో ముస్లిమ్. అతని ప్రియశిష్యుడు హిందువైన తాష్తా. కవిత్వం రాయడం గాలిబ్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే మిత్రులూ ఇతరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం పెన్నుతో పుట్టిన విద్య. అతడు పస్తులుంటూ దానదర్మాలు చేసిన మహోన్నత మానవతామూర్తి. కారాగార వాసం అనుభవిస్తూ సర్వస్వతంత్ర బావాలు కల్సిన స్వాభిమాని. పుట్టెడు వేదనతో జీవితం మంచి గంధం చెక్కలా హరించుకుపోతున్నా నవ్వులు పండించిన హాస్యప్రియుడు. చెక్కు చెదరని జీవితం-మొక్కవోని కవిత్వం. ఇన్ని ద్వంద్వాల మద్య కవిత్వాన్ని ఏకోన్ముఖంగా లోకోత్తరంగా సృష్టించిన మహాకవి మిర్జా గాలిబ్. నరములందందరికి రక్తమురుకుగాని కంటజారని దెట్లు రక్త్రమగునోయి? (దాశరధి అనువాదం) గజల్ జగత్తులో దర్జాగా వెలిగిపోయే మిర్దాగాలిబ్ అసదుల్లా ఖాన్ కలంలోంచి జాలువారిన ఈ కవిత, అతని విషాదబరిత జీవితాన్ని మనముందు సజీవంగా బొమ్మకట్టిస్తుంది. గాలిబ్ ప్రతిభా పాటవాలను సంపూర్ణంగా అవగాహన చేసుకోలేకపోయిన ఆనాటి ప్రభుత్వం అతనికి కారాగారవాసాన్ని ప్రసాదించింది. ఉర్జూ కవితా ప్రపంచానికి తన తనువున, మనస్సునీ, దనాన్నీ దారపోసిన గాలిబ్‌ను మొగల్ ప్రభుత్వం, తదనంతర ఆంగ్ల ప్రభుత్వం గరీబుగా మార్చాయి. కమనీయమైన కవితలను, గజళ్ళను, శాయిరీలను ప్రపంచ మానవాళికి మహోన్నత బహుమతులుగా సమర్పించి కవితాభిమానుల మనస్సుల్ని దోచుకున్న గాలిబ్‌ను దుర్భర దారిద్ర్య కూపంలోకి తోసింది ఈ లోకమే! తన తోబుట్టువుల్ని, బంధుబలగాన్ని, సర్వస్వాన్ని క్రీ.శ. 1857 సిపాయిల తిరుగుబాటులో కోల్పోయి అవాదగా మారిన గాలిబ్‌ను ఆనాటి సమాజం కనీసం కనికరించి కన్నీరు తుడిచిన పాపాన పోలేదు. నలిమెల భాస్కర్ -ఫఫుష్టష్ట ఊప యషుహోష్షు సూ “2 5
ఢిల్ల మహానగరం పర్యాటకుల పాలిట స్వర్గం. ఎర్రకోట, కుతుబ్‌మినార్, రాష్ట్రపతి భవనం మొదలైనవే అక్కడ దర్శనీయ స్థలాలు. అయితే... సమస్త ఉర్దూ ప్రపంచ కవితా పిపాసువుల హృదయ సమ్రాట్టూ, మహోన్నత మానవుడూ, డిల్లీలో వుండి సిపాయిల తిరుగుబాటును కళ్ళారా కాంచి, అనుభవించి, నొచ్చుకుని, అలసి సాలసి.. ఆ తిరుగుబాటు గురించి ప్రాచీన పారసీ బాషలో గ్రంధం రాసిన అమరకవీ మిర్దా అసదుల్లా ఖాన్ గాలిబ్ నివసించిన యిల్లుగాని, అతడు ఆట పాటలతో పరుగులు తీసిన గల్లీగానీ, మరణించి సమాధిగా మిగిలిపోయిన ప్రాంతం గానీ పర్యాటకులకు దర్శనీయ స్థలంగానో, కనీస ఆకర్షణీయ స్థలంగానో మిగలకపోవడం మిక్కిలి శోచనీయం. ఢిల్లీలో 'బల్లిమరాన్' అనే ప్రదేశంలో గాలిబ్ నివసించిన యిల్లు యిప్పటికీ వుంది. పాత ఢిల్లీలోని వందలాది సందుల్లో “బల్లిమరాన్' ఒకటి. చరిత్ర ప్రసిద్ధి వహించిన ఎర్రకోటకు ఎదురు గల్లీ పడమరగా కనిపించే వీధిలోకి నడిస్తే చాందినీ బాక్స్ అక్కణ్జీంచి ముందుకొచ్చి ఎడమకి తిరిగితే బల్లిమరాన్. ఇటీవల కన్నడ సుప్రసిద్ధ సాహితీ విమర్శుకుడు ఎ.ఎస్, నటరాజ్ గాలిబ్ యిల్లు చూడ్డానికని వెళితే పూర్తిగా శిధిలమైపోయిన యింటి అడుగు జాగాలో ఓ కట్టెల కొట్టు కనిపించింది. అతని మనస్సు చివుక్కుమంది. ఫారసీ, ఉర్దూ గజళ్ళతో కన్నీటి జల్లులు కురిపించి తన ఉత్తరాలతో సరళమైన ఉర్దూ వచన వాజ్మయ వికాసానికి కృషి చేసిన మహాకవి గాలిబ్‌కు పట్టిన దుర్గతి యిది. గాలిబ్ పూర్వీకులు టర్కీ నుంచి వచ్చినవాళ్ళు. ఆగ్రాలో గాలిబ్ 27 డిసెంబర్ 1797 నాడు జన్మించాడు. ఐదేళ్ళ వయస్సులో తండ్రినీ, తొమ్మిదేళ్ళ ప్రాయంలో బాబాయిని కోల్పోయిన గాలిబ్ తన పదోయేట ఉర్దూలో కవిత్వం రాయడం ప్రారంభించాడు. 1810లో ఢిల్లీ వెళ్ళి ప్రసిద్ధ ఫారసీ కవి అబ్బుల్ సమీద్ వద్ద పారసీ భాష నేర్చుకున్నాడు. 1837లో చివరి మొగల్ చక్రవర్తి అయిన బహద్దూర్ షాజపర్ ఢిల్లీని పరిపాలించాడు. ఈ నమయంలోనే గాలిబ్ తన ఫారసీ గజళ్ళను ప్రకటించాడు. గాలిబ్‌కు పారసీ గజళ్ళంటేనే యిష్టం. అయితే ఆనాటి సమాజం ఆతని ఉర్దూ గజళ్ళకు పెద్దపీట వేసింది 1857 సిపాయిల తిరుగుబాటు కారణంగా తన మిత్రులంతా చెల్లాచెదరై పోయారు. గాలిబ్ చాలా కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. మొండితనం, గుండె నిబ్బరం, స్వతంత్ర భావాలు, చిన్నప్పుడు తిన్న డక్కామొక్కీలు గాలిబ్‌ను పుటంపెట్టి మకుటంలేని మహాకవిగా తీర్చిదిద్దాయి. ఏ క్ష్రణంలోనూ ఆత్మాభిమానమ్మీద ఈగ కూడా వాలనీయని అభిజాత్యం గల అమర కవి గాలిబ్, గాలిబ్ గజళ్ళ ప్రత్యేకత రూపం, సారం... రెండింటి మధ్య అవినాభావ సంబందం కల్గివుండడం. అమోఘమైన కల్పనా చాతుర్యంతో, అద్వితీయమైన భావనాశక్తితో గాలిబ్ రాసిన గజళ్ళు ఉర్దూ చదువుల తల్లి కాలి గజ్జెలయ్యాయి. ఉర్దూ పద్య సాహిత్యంలో “ద చాయిస్ ఆఫ్ ద బెస్ట్ వర్ట్స్ యిన్ ద బెస్ట్ ప్లేసికి సజీవ దృష్టాంతంగజల్. “ద ఎకనమీ ఆఫ్ వర్ట్స్'కు నిలువెత్తు అద్ధం గజల్, ఫక్తు రెండు పంక్తుల గజల్ అనంత భావ గాంభీర్యానికి చక్కని ఉదహరణ. 76 పాం యాాాాాంాాయంాాాాాటడయయాంయంతడ ల. 4 సాహితీ సుమూలు
'ప్రత్ది ఘులభమ్ముగా సాద్యపడదు లెమ్ము
నరుడు నరుడౌట యెంతొ దుష్కరము సుమ్ము"
ఎంత అనుభం గడ్డకడితే పై పంక్తులొస్తాయి! ఎంతయినా గాలిబ్ది ప్రత్యేకమైన స్థాయి
పడగ విప్పిన మతోన్మాదం సభ్య సమాజాన్ని సంక్షోభం పాలు చేస్తోన్న స్వర్ణోత్సవ భారతంలో మహాకవి గాలిబ్ జీవితం నుండీ, కవిత్వం నించీ, ఉత్తరాల్లోంచీ మనం గ్రహించదగిన విషయాలు అనేకం వున్నాయి.
ఆ మహాకవికి మతం పట్ల నమ్మకాలు వున్నాయి. అయితే అతడు మతోన్మాది కాడు. జన్మతః ముస్తిమ్ అయిన గాలిబ్, హిందూ శిష్యుడు తాష్తాని నోరార "కొడుకా! అని పిలిచేవాడు
15 ఫిబ్రవరి 1869 రోజున మిర్దాగాలిబ్ అంతిమ శ్వాస విడిచినా అతని కవితలకు మరణం లేదు. అవి ఉర్జూ పద్య కేదారంలో అంకురించి పుష్పించి పరిపక్వత పాందినఅమృత ఫలాలు.
అధభురూప తమిళ కథాశిలి. ,. ల నుదుస్రైపిత్తన్ స్లో నలభై రెండేళ్ళు మాత్రమే జీవించిన పుదుమైపిత్తన్ మరణించి యాబై సంవత్సరాలు గడిచాయి. తమిళ భాషా సాహిత్యాలను అతి ఎక్కువగా ప్రభావితం చేసిన గొప్ప సాహితీ వేత్త అతడు. దైనందిన జీవితంలో బొత్తిగా సంబంధం లేని స్వాప్నిక జగత్తు నుంచి తమిళ కధను విముక్తం చేసి వాస్తవికత వైపు మళ్ళించిన పురోగామి పుదుమైపిత్తన్. మారుతున్న కాలంతో పాటు చోటు చేసుకునే పరిణామాలను తమిళంలోకి ఆహ్వానించి ఆ సారస్వతాన్ని సుసంపన్నం చేసిన మహా రచయితగా పుదుమైపిత్తన్ ప్రాతః స్మరణీయుడు పుదుమైపిత్తన్ అసలు పేరు చొ వృద్ధాచలం. సొంత ఊరు తిరునెల్వేలి పుట్టింది 1906లో. బి.ఏ. పట్టభద్రుడు. స్వతంత్ర బావాలుగల ఈ రచయిత మొదట పత్రికా రంగంలో ప్రవేశించి తరువాత రచనా వ్యాసంగంలో తలమునకలయ్యాడు. ఊళియన్, దినమణి, దినసరి మొదలైన పత్రికల్లో పని చేశాడు. అనేక ప్రత్యేక సంచికల్లో రచనలు చేశాడు పుదుమై పిత్తన్ రచనల్లో చాలావరకు “మణిక్కొడి, కలైమగళ్' అన పత్రికల్లో వచ్చాయి. కధలు, నాటకాలు, కవితలు, వ్యాసాలు, జీవిత చరిత్రలు, రాజకీయ విశ్లేషణలు మొదలెన అనేక ప్రక్రియల్లో చేయి తిరిగిన రచయిత. ప్రపంచ ప్రసిద్ధి వహించిన కదానికల్ని అరోజుల్లోనే “విశ్వ కధా మంజరి" పేర తమిళంలోకి అనువదించి ప్రచురించిన సాహితీ సాహసి. “దినమణి' అనే పత్రిక ప్రత్యేక సంచికల్ని ప్రచురించడంలో పుదుమైపిత్తన్ది ప్రత్యేకమైన కృషి. ఇన్ని చేసినప్పటికీ పుదుమైపిత్తన్ అనగానే అతడు ముఖ్యంగా తమిళ కధా రంగానికి చేసిన సేవలే గుర్తుకొసాయి పుదుమైపిత్తన్ మొత్తంగా జీవించింది నలబై రెండేళ్ళ! అందులో రచయితగా బతికింది ఒక పుష్కరం మాత్రమే.! ఇంత తక్కువ కాలంలో పుదుమైపిత్తన్ తన రచనలకు కొత్త వైశాల్యాన్నీ, వింత లోతుల్ని సంతరింపజేసి పాఠకుల్ని సంతసింపజేశారు. రొటీన్ క్రధా సంవిదానంతో నిర్జీవమైపోయిన తమిళ కధకు కొత్త రక్తం ఎక్కించాడు. అతని ప్రతి రచనలోనూ అతనిదే సాటి ఐన ప్రత్యేక ముద్ర చోటుచేసుకుంది అది అనువాదాల్లో సైతం ప్రగాడంగా కనిపిస్తుంది తమిళ సంస్కృతిని బాగా ఆవాహన, అవగాహన చేసుకొన్న రచయిత పుదుమైపిత్తన్ గాాయంసాములళడంభ లా హత ... 2. సౌహితీ సుమాలు
ఆ సం బ్బృతిని సగర్వంగా తలకెత్తుకునే విశిష్ట సాహితీవేత్త అతను. సాహిత్య రంగంలోని భిన్న ధృవాల్ని అనుసందానం చేయగల దిట్ట పుదుమైపిత్తన్ “మీకు ఆస్తిక నాస్తిక వాదాల్లో ఏది నచ్చుతుంది?” అని ప్రశ్నిస్తే, ఆస్తికత్యంలోని నాస్తిక వాదమూ, నాస్తికవాదంలోని అస్తీకత్యమూ నన్ను బాగా ఆకట్టుకుంటాయంటాడు పుదుమైపిత్తన్. ఏ రోకటి దగ్గర ఆ పాట పాడే రకం కాదతడు. రోకటి దగ్గర కలుపు పాటలూ, కలుపుల వద్ద రోకటి గీతాలూ ఆలపించగల చిత్రమైన రచయిత, ప్రపంచ సాహిత్యాలూ, పాశ్చాత్య సిద్దాంతాలూ ఈ రచయితను బాగా ప్రభావితం చేశాయి. తద్వారా తమిళ బాషా సాహిత్యాలకు కొత్త కిటికీలు అమర్చిన వ్యక్తి. అరవం అధ్వాన్నం కాదు అదీ తెలుగులాగే తేటగానూ వుండి కన్నడంలాగే కస్తూరి పరిమళాలు వెదజల్తుతుందని ఘోషించిన మహారచయిత పుదుమైపిత్తన్.
జీవితాన్ని ఎలాంటి సంకోచాల్లేకుండా తరచి చూడడం, చేదునిజాలను నిస్సందేహంగా బహిరంగపర్పడం, ఆలోచనకీ ఆచరణకీ మద్య నెలకొన్న అగాధాలు పూడ్చటం, ముసుగుల్ని బట్టబయలు చేయటం, ప్రతి విషయాన్ని నిశితంగా ప్రశ్నించడ౦ి, దేన్నీ అంత సులువుగా నమ్మకపోవడం ... పుదుమైపిత్తన్ ఆలోచనాసరళిలో ముఖ్యాంశాలు. అతడు తన ఆలోచనా విధానాన్ని నాటి తమిళనాడులో నాటి తమిళ బాషా సారస్వ్యతాలు ఫల పుష్పభరితం కావడం చూసి సంతోషించాడు. అప్పటివరకూ “ఈ రాణీ (క్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు” అంటూ వున్న తమిళ కదా ప్రపంచానికి సాదా సీదా బతుకు వెంపర్లాటలను ప్రాణ స్పందనలతో సహా పరిచయం చేసిన మేటి రచయిత పుదుమైపిత్రన్.
తమిళ సుప్రసిద్ద సాహితీ విమర్శకుడు క్కనా.సు. పుదుమైపిత్తన్ను మహామేదావిగా అంచనా వేశాడు.
జీవితం చాలా విలువైంది. బతుకు మూల్యాలు పుదుమైపిత్తన్కు బాగా తెలుసు ఈ విలువల్ని అతడు సూక్ష్మాతి సూక్ష్మంగానూ, ఎంతో లాపువంతోనూ తన రచనల్లో ఆవిష్కరించాడు అతనికి మన జీవితాల్లోని ఎగుడు దిగుళ్ళూ, అందమూ, అనాకారితనమూ తెలుసు. మతంపడగలో గొడుగు విప్తుతోన్న మారణహోమాలూ, కులం కుమ్ములాటలూ తెలుసు. ఆర్థిక అసమానతలూ, బానిస బతుకులూ బాగా తెలుసు. ఇన్ని కరోర వాస్తవాలను పుదుమైపిత్తన్ తన రచనల ద్వారా సజీవంగా చిత్రీకరించాడు. అందుకే “జీవితానికి అర్జాన్ని చెప్పగలిగింది తత్వం. జీవితాన్నే చెప్పగలిగేది సాహిత్యం” అంటాడతడు
తమిళ కదానికను స్వకపోల కల్పనాచాతుర్యాల్లోంచీ, ఊహాపోహల్లోంచీ, కలల ప్రపంచాల్లోంచీ సామాన్యుడి ముంగిట్లోకి రప్పించిన అపర బగీరధుడు పుదుమైపిత్తన్. “ఇవాళ శ్రీరామచంద్రుడు స్తోర్ గుమాస్తాగా పనిచేస్తున్నాడు” అంటాడు. “సీ తమ్మ సినీనటిగానూ, బ్రహ్మనాయకుడు బిజినెస్ మన్గొనూ మన మన కళ్ళముందు కదలాడుతుంటే, కధలుగా రాయకుండా ఎలా మిన్నకుండిపోగలం అని పూటుగా ప్రశ్నిస్తాడు పుదుమైపిత్తన్. సమాజంలోని ఎత్తుపల్లాలు చెప్పలేనిది కధ కానేకాదు అని కుండ బద్దలు కొట్టినట్లు మాత్రమే కాదు కొండలూ, గుండెలూ బద్దలు కొట్టినట్లు ఖరాబండిగా చెబుతాడు ఈ రచయిత.
ఇది స్వర్ణోత్సవ స్వతంత్ర భారతం దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు గడచినట్టుగానే తమిళ కదా వస్తుశిల్పాల్లో నవ్యతను పాటించిన పుదుమైపిత్తన్ చనిపోయి 50 సంవత్సరాలు నడిచాయి. ఆ సందర్బంగా అతనికిది స్వర్ణోత్సవ అక్షరాంజలి (30 జూన్ 1948 పుదుమైపిత్తన్ చనిపోయిన రోజు) నలిమెల భాస్కర్ చం పట్ర యస్టాన్తనప్తగిస్రతష్తాతమునత ౮ 70
క శ ఆలోచన ఆచరణల సమ్మేళనం | క్ర కం కన్నడ అభ్యుదయ కధా రచయిత అశ్వత్థ అంద విశ్వాసాలను మానవజాతికి అందనంత లోతులో పాతరవేసి రావాలంటాడు. మూఢ విశ్వాసాల మాడు పగులగొట్టాలంటాడు. దైవ భావన మనిషిని బానిసను చేసి కట్టుకొయ్య చుట్టూ తిరిగే జంతువుగా మారుస్తుందని హితవు పలుకుతాడు. అతని పూర్తి పేరు కూదువళ్ళి అశ్వళ్ళ నారాయణరావ్. 18-6-1912లో చామరాజ నగర్న్లో పుట్టాడు. మైసూర్ యూనివర్శిటీ నుండి బి.ఇ. (సివిల్) డిగ్రీ పొంది పలు ప్రాంతాల్లో పనిచేశాడు. “బోధన అత్యంత ప్రీతికరమైన వృత్తి కనుక సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేశాడు. మహాత్మాగాంధీ, మదన్మోహన్ మాలవ్యా లాంటి మహానీయుల ప్రభావంతో అశ్వత్థ వ్యక్తిత్వం అపురూపంగా రూపుదిద్దుకుంది. తను నాస్తికుడు కావచ్చును. కాని అత్రి నిరాడంబర జీవితం గడిపినవాడు. కించిత్తు కీర్తి కండూతి లేని ఏకైక కన్నడ రచయిత అశ్వళ్ళ తనని వెతుక్కుంటూ వచ్చిన అవార్డులు, రివార్డులనన్నింటినీ తిరస్కరించాడు. దాదాపు రెండొందలు కదలు రాసిన అశ్వత్థ తను జీవించివున్నంత కాలం ఏ ఒక్క కన్నడ భాషా పత్రికక్కూడా ఇంటర్వ్యూలు గానీ, స్వీయ పరిచయ వ్యాసాలు గానీ, ఫోటోలుగానీ ఇవ్వని సంయమనశీలి. ఇంటర్వ్యూలూ, ఫోటోలూ తదితర కార్యక్రమాల వల్ల కలిగే హింస అంతా యింతా కాదంటాడాయన 1994లో అశ్వత్థ చనిపోయినప్పుడు “తుషార పత్రిక తరపున డాక్టర్ ఎచ్ ఎస్. సుజాత అతని ఇంటికి వెళ్ళి రేషన్‌కార్డు మీది ఫోటోను సేకరించి వ్యాసం రాసింది. అశ్వజ్చ అస్తమయం తర్వాత మాత్రమే అతని గురించిన పరిచయ వ్యాసం కానివ్వండి, ఫోటో కానివ్వండి అలా ఆ పత్రికలో అచ్చయ్యాయి. ఎక్కడో ఒకచోట మీ గురించి రికార్డు చేయకపోతే భవిష్యత్తరాలు ఎలా గ్రహిస్తారని ప్రశ్నిస్తే నా వ్యక్తిత్వం, సాహిత నం ఇవి రెండే భావితరాలకు స్ఫూర్తి నిస్తాయంటాడు రచయితకు రాజకీయ నాయకులు కోరుకునే చవకబారు ప్రచారం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదంటాడు. సాహిత్యాన్ని అలవోక కార్యక్రమంగా కాక జీవన వ్యాసక్తిగా ఆవాహన చేసుకున్న వ్యక్తి అశ్వత్థ. అతనికి బోదన ఎంత ఇష్టమో, రచన అంతే ఇష్టం, స్వచ్చంద పదవీ విరమణ చేసి పూర్తికాలం సాహితీ సేవలో తరించిన మనిషి ఆయన కధలు, రాటకాలు, వ్యాసాలు, నవలలు, కవిత్వం 80 ఆజటపాాటటహాడంటా త టటాతట్తత్తషస్ట తాం. .: సాహితీ సుమాలు
యిలా అన్ని రకాల సాహిత్య ప్రక్రియల్లో పాఠరంగతుడతను. అతని అనేక కధలు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీషుల్లోకి భాషాంతరీకరణం చెందాయి. అశ్వత్థ ఆరు సాంఘిక నవలలు రాశాడు. ఆ రచయిత సంపాదించిన సమృద్ధమైన జీవితానుభవాలన్నీ “'మునియన మాదిరి' (1949), “మర్యాదెమహలు' (1951), “రంగనాయకి (1953), 'హంబల' (1959), “బరదసిరి” (1965), 'అజ్ఞాతన నంబిండాయణ (1983) నవలల్లో గమనించవచ్చు. అతనికి ఆదర్శమూ, వాస్తవికతా ఈరెండూ సహజ సాహితీ భూషణాలు. నిర్మల మొదలైన పద్దెనిమిది నాటకాలు రాశాడు. “మూగిన మేలె” అతని వ్యాస సంకలనం. సున్నితమైన హాస్యం, అచంచల మానవీయతలను ప్రతివ్యాసంలోనూ వ్యక్తీకరించిన ప్రతిభా సంపన్నుడు చివరి రోజుల్లో మాత్రం కధానికా ప్రక్రియను ఉద్యమప్రాయంగా పోషించిన సారస్వతమూర్తి అశ్వత్థ, కర్ణాటక సాహిత్య అకాడమీ తయారు చేయ సంకల్పించిన సాహితీవేత్తల పరిచయగ్రందానికి సైతం తన వివరాలను తెలియజేయని నిగర్వి. ఆదర్శాలు రాతల్లో కాదు చేతల్లో వుంటేనే రచయితకు ఆందం, ఆనందం అనేవాడాయన. అధిక సంతానం మంచిది కాదని అందరూ ఆదర్శాలు వల్లించేవారే కాని, అతను ఆ రోజుల్లోనే ఒక్క కొడుకు పుట్టాక సంతానం ఆపేసిన ఆచరణ శీలి ఇంజనీరింగ్ పిల్లలకు పాఠాలు చెప్పడం అతను కోరుకున్న ఉద్యోగం. అయితే సాహితీ వ్యాసంగం సైతం ప్రాణప్రదమైన అంశం. ఏకకాలంలో రెంటినీ నిర్వహించడం కష్టమని స్వానుభవంలో గ్రహించాక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆజీవనపర్యంతం సారస్వత “సవ చేశాడు కోరికలను నిగ్రహించుకోవడం రచయితకు మరీ అవసరమని నొక్కి చెప్పాడు. రచయితలకు సాహిత్యం కన్నా వ్యక్తిత్వం మిన్న అని చాటిచెప్పిన మేటి రచయిత అశ్వళ్ళ. ప్రజలకూ, పారకులకూ రచయిత ఆదర్శప్రాయుడు కావాలని ఉద్భోధించాడు. ఎన్నో నిక్కచ్చి అభిప్రాయాలను కభిగిన అశ్వేత్ధ “బారత ప్రజలు పరిణత మనస్కులు కాకముందే స్వాతంత్ర్యాన్ని పొందారు, ఈ స్వాతంత్ర్యం దుర్వినియోగమై ప్రజాస్వామ్యం అభాసుపాలు కాక తప్పదు” అని హెచ్చరించిన దీశాలి- సమకాలీన రచయితల్లో తలమానికంలా వెలిగిపోయిన అశ్వత్థ కేవలం కన్నడ రచయితలకే
కాదు యావద్బారత సాహితీవేత్తలకు సైతం స్ఫూర్తిదాత కీర్తి కండూతీ, ధన పిపాసా రెంటిని వర్ణించిన నిగ్రహ సాహితీవేత్త. అశ్వత్థ సాహిత్యం, జీవితం... ఈ రెండింటిని సున్నితవు ర్ న వేసి తూకం చూసినప్పటికీ, దేనికి ఎక్కువ ప్రాముఖ్యం కల్పించాడని యిదమిళ్ళంగా న్ నిది అశ్వేళ్ణ స్తితి. అయితే వాస్తవానికి అశ్వత్థ సృష్టించిన సాహిత్యం కన్నా అతని జీవితం మహాగొప్ప కన్నడ పారకుల స్థిరాబిప్రాయం.
నలిమెల భాస్కర్ ,స్లఫ్ రస పూస అతోటో ఏ శ్వాస వ్యజలటు చలు న్య క
పంజాబీ 'సాహిత్యంలో యిరవయ్యో శతాబ్దపు ప్రారంభకాలాన్ని “అదునిక యుగం"గా పరిగణిస్తారు. క్రీశ. 1905 నుండి మొదలవుతోన్న ఈ యుగంలో అప్పటిదాకా దాదాపుగా లేని అనేక ప్రక్రియలు కొత్తగా వూపిరిపోసుకున్నాయి. నవల, కద, నాటకం మొదలైన ప్రక్రియలు ఎన్నెన్నో ఈ కాలంలోనే ఆంగ్లేయుల సాంగత్యంతో స్వేచ్చగా వికసించాయి. మనకు అచ్చతెనుగులాంటి శుద్ధ పంజాబీ భాషోద్యమం రెక్కలు విప్పుకుంది కూడా ఈ దశలోనే అయితే అమృత్సర్ పట్టణంలో ఈ ఉద్యమానికి నేతృత్వం వహించిన విశిష్ట వ్యక్తి లాలా ధనీరామ్ చాత్రిక్. పంజాబీ బాషా సాహిత్యాలకు నిరుపమాన సేవ చేసిన సాహితీవేత్తగా చాత్రిక్ పేరు చిరస్మరణీయం ..స్పిరస్మరణీయం. లాలా ధనీరామ్ చాత్రిక్ క్రీ.శ. 1876లో అమృతసర్ జిల్లాలోని సియాల్ కోటలో పుట్టాడు. ఆటాపాటలతో బాల్యం హాయిగా గడిచింది. అతని స్వగ్రామంలో ఒక దేవీ మందిరం వుండేది! అందులో గ్రామస్తులు ప్రతిరోజూ కీర్తనలు పాడేవాళ్ళు చాత్రిక్ కమం తప్పకుండా మందిరానికి వెళ్ళి కీర్తనలూ, భజనలూ శ్రద్ధగా వినేవాడు. అతని కవిత్వానికి అవి అలా (ప్రేరణగా నిలిచాయి. ఛందోబద్ధమైన చాత్రిక్ కవితల స్వరలయలకు చిన్ననాడు అతను విన్న కీర్తనలే స్ఫూర్తి. చాత్రిక్ “గురుముఖి గరుముఖతా కాకుండా యింటి వద్దే నేర్చుకున్నాడు. పాఠశాలలో ఉర్జూ బాషను అయిదవ తరగతి దాకా చదివాడు. అమృత్‌సర్‌లోని ఇస్లామియా స్కూల్లోనూ, చొంక్ పరీద్లో జూనియర్ స్పెషల్ క్లాస్ లోనూ ఇంగ్రీష్ చదివాడు అతనికి బుక్ బైండింగ్ కూడా తెలుసు. చక్కగా 'గురుముఖి" లిపిని టైపు చేయగలడు. చదువు ఆపేసి పదిహేనేళ్ళ వయస్సులో ప్రెస్సులో ఉద్యోగిగా చేరాడు. చాత్రిక్ తన చిన్నతనంలో పంచ్గ్రంధీ, దస్గ్రంధీ, హీర్, వారిన్ షాహ్, కిషన్‌సింగ్ ఆరిఫ్ గారి 'పూరణ్' కాళిదాస్ రాసిన హక్షీకత్ రాయే మొదలైన గ్రంధాలు చదివాడు. తద్వారా అతనికి చందస్సు బాగా తెలిసొచ్చింది. క్రమేణా చాత్రిక్ కవిసమ్మేళనాలకు హాజరయ్యేవాడు ఆరంబ్ దినాల్లో యితరుల కవితా పరనానికి ఇతను వహ్వా వహ్వా అంటూ వంత పాడేవాడు. కొన్నాళ్ళకి మైక్ ముందుకి వెళ్ళగలిగాడు ఆ తర్వాత పరిణతి చెందిన కవితలు అనేకం అల్లగలిగాడు చాత్రిక్ 1905లో “భర్శృహరి' అనే కదా కావ్యాన్నీ, నలదమయంతి అనే కదాకావ్యాన్నీ రాశాడు 82 హాహా: 0% సావెతీ సుమాలు
పంజాబీ పాహిత్యంలో కదాకావ్యాలకు కిస్సాలు అని పేరు ఈ కదాకావ్యాల మీద పూర్తిగా పంజాబీ పూర్వీకుల ప్రబావం వుంది అయితే అతని సొంతగొంతు మాత్రం 1931లో రాసిన “చందన్ బాడి పుస్తకంలో చూడవచ్చు. ఇది అతని మొదట్ కవితా సంకలనం. ఆ తళ్వాత 'కేసర్ క్యారీ, 'నయాజహా” , “సూపీబానా' మొదలైనవి రచించాడు. అంతేకాకుండా '“పుల్లాందీ టోకరీ' ధరమ్ బీర్ ఈసఫ్ నీతి” చెప్పకోదగిన రచనలు. ఆరోజుల్లో గురుముబీ వైపు చేయడం ఎవరికీ తెలియదు. చాత్రిక్ బొంబాయికి వెళ్ళి గురుముఖీ టైపుచేయడమే కాకుండా టైపు తయారుచేశాడు మూడేళ్ళ అవిశ్రాంత పరిశ్రమకు ఫలితంగా ఆరేడు రకాల బపు అక్షరాలు తయారుచేసి సరంజామాతో సహా అమృత్‌సర్‌కు తిరిగొచ్చాడు. 1914 ఆగస్టులో “స్పాండర్ష్ బైపు ఫొండరీ' ప్రారంభించాడు. హిందూ, ముసల్మాన్, క్రైస్తవుల్లో శుద్ద పంజాబీ భాషోద్యమాన్ని ప్రచారం చేసేందుకని 1926లో “పంజాబీ సబ'ని అమృత్‌సర్‌లో 'స్థాపించాడు. దానికి చాత్రిక్ అధ్యక్తుడు. రాష్ట్రంలో ఏ మూలన చూసినా ఉవ్వెత్తున సాగుతోన్న పంజాబీ ఉద్యమమే! “పంజాబీ సభిలో సభ్యుల సంఖ్య క్రమంగా పెరగడం మొదలైంది. ఈ సంస్థ పక్షాన అనేక కవిసమ్మేళనాలు జరిగాయి. 1927లో అమృత్‌సర్‌లో మొట్టమొదటి పంజాబీ కాన్ఫరెన్స్ ఏర్పాటైంది. ఈ కాన్ఫరెన్స్‌లో రిసెష్టన్ కమిటీ అధ్యక్తుడిగానూ, జనరల్ సెక్రటరీగానూ చాత్రిక్ సేవలు ఎంతో విలువైనవి కనీవినీ ఎరగని రీతిలో కాన్ఫరెన్స్ విజయవంతం కావడంతో కవులకు ఎక్కడలేని ఉత్సాహం కలిగింది “అప్పుడు జరిగిన కవిసమ్మేళనం ఆధునిక పంజాబీ సాహిత్య చరిత్రలో ఒక మైలురాయి” అంటాడు ప్రసిద్ధ పంజాబీ విమర్శకుడు చానజణ్ గోబింద్ పురీ. పంజాబ్ రొ ఫ్ర్రంలో ఆ తర్వాత జరిగిన శుద్ధ పంజాబీ కవిసమ్మేళనాలకు, స్వచ్భమైన పంజాబీ భాషోద్యమాలకు ఇది నాంది. వీటికి మూలకారకుడూ, ముఖ్య ్రేరకుడూ లాలా ధనీరామ్ చాత్రిక్. చాత్రిక్ చాలా నిదానంగా వుండేవాడు ముభావం అతని స్వభావం అయితే కార్యసాధకుడు. చురుకైన మేదావి. తన కవితల్ని మిత్రులతో కూచుని చిరునవ్వుతో వినిపించేవాడు. అప్పుడప్పుడు రకలు అంటించేవాడు. అయితే ఎవరి హృదయాలనూ అకారణంగా గాయపరిచేవాడు కాదు. చందన్‌సింగ్ జేర్వాలియా, డాక్టర్ దేవీదాస్ హిందీ, ఫరోజుద్దీన్ షర్ఫ్, డాక్టర్ మోహన్సెంగ్ దీవానా లాంటీ పంజాబీ ప్రసిద్ధ సాహితీవేత్తలు చాత్రిక్ సమకాలికులు. వాళ్ళలో కలిసిమెలిసి వుంటూ నిత్యనూతనంగా రాసిన కవితలు వినిపించడం చాత్రిక్ అలవాటు. సాహిత్య సేవ చేస్తోన్న సమకాలికుల్నీ, తన కన్న చిన్న వాళ్ళనీ బాగా ప్రోత్సహించేవాడు. అలా గురుబబ్స్సెంగ్ లర దేవేంద్ర సత్యార్థి వంటి ఎందరో సాహితీవేత్తలు చాత్రిక్ సహాయ సహకారాలతో వృద్ధిలోకి వచ్చినవాళ్ళ. చాతిక్ కవితల్లో దేశభక్తి , హిందూ ముస్టిమ్ల ఐక్యత, మానవీయ విలువల పట్ల ఆవేదన మొదలైన అంశాలు ముఖ్యంగా చోటుచేసుకున్నాయి. క్తుద్ర రాజకీయ నాయకమ్మన్యుల స్వార్ధపరత్యాన్నీ ఆర్టిక అసమానతల్ని తన కలం ద్యారా చాలా బలంగా ఎదిరించాడు చాత్రిక్. “ఆధునిక పంజాబీ వాజ్కయంలో చాత్రిక్ ప్రబావం అంతా యింతా కాదు అంటాడు” పంజాబీ సాహిత్య చరిత్రకారుడైన ఆచార్య మోహన్‌సింగ్. పంజాబీ సమున్నతి కోసం చాత్రిక్ చేసిన సేవలు దృష్టిలో వుంచుకుని అతనికి చక్కని అభినందన సంపుటిని ప్రదానం చేశారు అక్కడి అభిమానులు. పంజాబీ బాష శ్వాసగా, సాహిత్యమే సర్వస్వంగా జీవించిన చాత్రిక్ 18 డిసెంబర్ 1954లో చనిపోయాడు. నలిమెల భాస్కర్
మసోరంజన్ధాస్ .
మనోరంజన్ గత యాఖై ఏళ్ళుగా ఒరియా సినీ నాటక కళారంగాలతో అవినాబావ సంబంధం కలిగిన వ్యక్తి. ఈ ఐదు ధశకాల కాలంలో ఎందరో నటీనటులు, దర్శకులు, కళాకారులు అతని నాటకాలకు ప్రాణం పోసి ఒరిస్సా రాష్ట్రమంతటా సజీవమైన ప్రదర్శనలు యిచ్చారు. మరెందరో ప్రచురణకర్తలూ, అనువాదకులూ అతని కృతుల్ని ప్రజాబహుళ్యానికి సమర్థవంతంగా చేరవేశారు. ఎందరెందరో గ్రుక్షక మహాశయులు, పారకులు, సుప్రసిద్ధ విమర్శకులు అనేక రకాలుగా అతనికి స్ఫూర్తిని అందించారు.
ఆతడు 1921లో ఒరిస్సాలోని రుర్కట పాట్నాలో జన్మించాడు. వాళ్ళ నాన్న కటక్ నగరానికి తూర్పున వున్న అప్పటి కుజంగా ఎస్టేటులో పనిచేసేవాడు. మనోరంజన్దాస్ విద్యాభ్యాసం కొన్నాళ్ళు కటక్‌లో సాగింది. అతని చిన్నతనంలో వాళ్ళ వూళ్ళో వేసే నాటకాలు పసిమనస్సుపై చెరగని ముద్ర వేశాయి. ప్రతియేటా క్రమంగా నిర్వహించే సరస్వతీ పూజోత్సవాల్లోనూ, గణపతి పూజోత్సవాల్లోనూ అనేక నాటకాలు ప్రదర్శించేవాళ్ళు. అతడు వాటిల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాడు. అదృష్టవశాత్తూ వాళ్ళ నాన్న బాగా ప్రోత్సహించేవాడు. అలా క్రమేపీ మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతులు గడించాడు మనోరంజన్దాస్. “నాటకం శరణం గచ్చామి అన్నంతగా ఆ రంగంతో తాదాత్మ్యం చెందాడతను.
ఆతర్వాత మనోరంజన్దాస్ కటక్‌లోని రావెన్షా కళాశాలలో జాయినయ్యాడు (1940)లో. అక్కడి “ఒరిస్సా ధియేటర్" అనే సంస్థతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు నాటకాలు వేశాడు. వేయడమే కాదు రాయడం కూడా చాలా ముఖ్యమనే ఆలోచన అతనికి అప్పుడే కలిగింది. ఇంకేం? ప్రారంభించాడు. ఆ వ్యాసంగాన్ని ససేమిరా ఆపలేదు. సుందరమ్ అనే ఇంగ్లీష్ టీచర్‌ను తను ముందుగా ఏయే నాటకాలు చదవాలో అడిగి తెలుసుకున్నాడు. అతనో జాబితా యిచ్చాడు. ఇతను కుస్తీ పట్టాడు. అలా గాల్సువర్తీ, ఇబ్బన్ ప్రభృతుల నాటకాలు ఎన్నింటినో మనోరంజన్దాన్ శ్రద్ధగా చదివాడు.
అప్పట్లో ఒరిస్సాలో 'ఒరిస్సా ధియేటర్' మాత్రమే కాక దాంతో దీటుగా పోటీపడే ఓ సంచార ధియేటర్ కూడా వుండేది! దాని పేరు “అన్నపూర్ణ ప్రప్రధమంగా 1944లో ప్రదర్శనకు నోచుకున్న అతని నాటకం 'జవ్వన్' (యవ్వనం) అది అశేష ప్రజల ఆదరాభిమానాలకు పొత్రమైంది 1947లో
అతడు రాసిన “కవి సమ్రాట్ ఉపేంద్రభంజ్' అనే నాటకం యావత్తు ఒరిస్సా రాష్ట్రాన్ని వంద ప్రదర్శనలతో ఉర్రూతలూపింది. ఆ యేడే “ఆగస్ట్ నా' రాశాడు (అంటే ఆగస్ట్ 9 అని అర్ధం). గాందీ నేతృత్వంలోని క్విట్ ఇండియా ఉద్యమం దీనికి స్ఫూర్తి. తను స్తయనా ఉద్యమంలో పాల్గొన్న రీత్యా 'ఆగస్ట్ నా ఆద్యంతం జాతీయ భావ స్ఫోరకమై అక్కడి ప్రజల్లో చైతన్య బీజాల్ని నాటింది. 1949లో “బక్తి జగబంధు” రాశాడు. అది మన అల్లూరి సీతారామరాజులాంటి రచన. దాదాపు యాబై ఏళ్ళ తర్వాత... అంటే యిప్పటి క్కూడా ఈ నాటకాన్ని జనం విరగబడి చూస్తారు.
“ఆగామి? 'అవరోద' అనే రెండు నాటకాలు అతని వ్యాసంగంలో కొత్త మలుపుని తీసుకొచ్చాయి. స్వాతంత్ర్యం సిద్ధించింతర్వాత విశాల బారతదేశ ప్రజల ఆశలు స్వార్థ రాజకీయ నాయకుల పాలనలో ఎలా అడియాసలయ్యాయో ఈ నాటకాలు బలంగా ఎత్తిచూపాయి.
అతడు రాసిన 'వనహంసి' అనే నాటకాన్ని 1968లో 'సృజని' సంస్థ ప్రదర్శించింది. అప్పటి నుండి నాటక రచనలో, ప్రదర్శనలో శిల్పపరంగా అనేకానేక మార్పులు చోటుచేసుకున్నాయి. “వనహంసి'ని ఓఢ్రప్రజానీకం వేనోళ్ళ కొనియాడింది.
1970లో మనోరంజన్దాస్ 'అరణ్యఫసల్' రాశాడు. దీనికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. “మీ నాటకాలు యింతగా జనామోదం పొందడానికి కారణం?” అని అడిగితే అతను ఇలా అంటాడు. “నీను ఎన్నడూ నాటకాన్ని తొందరగా రాయాలని హడావుడి పళ్ళేదు. బయటి వత్తిళ్ళకూ, అభ్యర్థనలకూ తలొగ్గి నాటకాలు రాయలేదు. నేను రాయబోయే నాటక యితివృత్తం నా రక్తంలో కలిసి నా గుండెని కలచివేసేంతవరకూ నేను రచనకు పూనుకొనకపోయేవాణ్ణి .
1985లో మనోరంజన్దాన్ 'నందికా కేసరి" అనే నాటకం రాశాడు. అది అతని యిటీవలి సుద్ర్హ రచన- అతను “జవ్వన్ నుండి 'నందికా కేసరి వరకు ఏది రాసిన ఒరియా సరస్వతికి అదొక వినోళత్నే అలంకారంగా భాసించింది. చలనచిత్రరంగమూ, నాటకరంగమూ అతని జీవితాల తీర్చిదిద్దిన కళా ప్రపంచాలు. గత ఐదు దశాబ్దాలుగా మానవ జాతి సంక్షేమం కోసం, సంట షం కసం నాటక కళారంగాలకు అంకితమై విశేషమైన కృషి సాగిస్తోన్న కళాయోధుడు మ రంబ మ ఇప్పటికి ఇరవైకి పైగా రచనలు చేశాడు. సాహిత్య అకాడమీ అవార్డుతోపాటు సంగీత న అకాడమీ అవార్డునూ అవలీలగా అందుకొన్న ప్రయోక్త మనోరంజన్దాస్. 1964లో ఒరిస్సా న స అర పురస్కారం కూడా యితణ్జి వరించింది. ఒరిస్సా సాహిత్య, సంగీత నాటక అకొడ ల వ్ కాక లలిత కళా అకాడమీకి కూడా మనోరంజన్దాస్ కార్యదర్శిగా పనిచేశాడు. కలకత్తాల్ ని ఆ కఫ్స్ యూనివర్సిటీ ్రెన్వాళ్ళు యితని “అరణ్య ఫస్లా'ను ఆంగ్లంలో ప్రచురించారు. ఇతను స మూడు నాటకాలు బెంగాలీ భాషలోకి తర్జుమా అయ్యాయి. మనోరంజకమైన ఒరిస్సా నాటకరంగాసి ఇ మనోరంజన్దాస్ విష్ణవపార్వ్యాన్ని సంతరింపజేసిన విశిష్ట రచయిత. *“నాటకాంతం హి సాహిత్యం అన్న సూక్తి యికనికి తెలిసినంతగా మరొకరికి తెలయదేమో అన్నంతగా నాటకంతో మమేకమైన సుప్రసిద్ధుడితడు. నలిమెల భాస్కర్ 1శశవ పనన తటముపసుటటటటం 65
స్య సీసంవేదనా రూపం న్; ఛ్ రం! సంప్రదాయ చట్రంలో తరతరాలుగా మగ్గిపోతున్న స్రీ సంవేదనకు మరారీ సాహిత్యంలో ప్రప్రధమంగా అక్షరరూపం కల్పించిన రచయిత్రి విభావరీ శిరూర్కర్. ఆమె మాలతీబాయిీ బేడేకర్ పేరుతో కూడా అనేక రచనలు చేసింది. 1993 ప్రాంతంలో విభావరీ శిరూర్కర్ మరారీ సాహిత్యంలో స్త్రీలకు సంబంధించిన అనేకానేక మౌలిక ప్రశ్నల్ని లేవదీసి కొంగ్రొత్త ప్రభంజనాన్ని స ఎపఫ్టించింది. “కళ్యాంచే నిశ్వాస్' (1933), 'హిందోళ్యావర్' (1934). . ఈ రెండు రచనలు ఆమె కీర్తిని అజరామరం చేశాయి. అక్కణ్ణించి ఆమె మరారీ సాహిత్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. 1966లో ఆమె “ఉమా' అనే నవల రాసినా, 1993లో “జరే మాస్టర్" (చారిత్రక నవల) రచించినా... సహజసిద్ధమైన, స్నిగ్ధమైన స్రీ సంవేదనను ప్రతిఫలింపచేసింది. ఉరూ సాహిత్యంలో ఇస్మత్ చుగ్తాయ్ ప్రభావం ఎంత బలోపేతమైందో, మరారీలో విభావరీ శిరూర్కర్ పాత్ర కూడా అంతే ప్రశస్తమైంది. ఈ ఉభయులూ ఏ భయాలూ లేక అనాటి సమాజంలో వేళ్ళూనుకొనిపోయిన స్రీ వివక్ష పట్ల గొంతెత్తి అరిచారు. పురుష దురహంకార వ్యవస్థ వల్ల అనేకానేక విమర్శల పాలయ్యారు. ఎన్నో దూషణలకు గురయ్యారు. రచనల్లో అశ్లీలాన్ని పోషిస్తున్నారన్న అపవాదుని కూడా బరించారు. ఈ ఇద్దరూ ప్రపంచంలో మొత్తంగా మారుతున్న విలువల్ని గమనించండని పురుషులకు ప్రవచించారు. మరారీలో విభావరీ శిరూర్కర్ అరవై ఏళ్ళ కిందే బలమైన గొంతుతో తన స్థానాన్ని పదిలపరచుకొన్న రచయిత్రి. 'హిందోళ్యావర్' అనే నవల ప్రచురించబడ్డాక... అందులోని అంశాలు చాలామంది మగ మహారాయుళ్ళకు మింగుడుపడలేదు. ఆ నవలా నాయిక '“అచలిను భర్త వదిలేస్తాడు. ఆమె చాలా తెలివైనది. కలుపుగోలుతనంగలది. ఆమె విధవగా జీవితం వెళ్ళదీస్తున్నప్పటికీ మాత త్వం కోసం ఆరాటపడుతుంది. నాటి సమాజం భర్త వదిలేసిన స్రీ, తల్లి కావడాన్ని నసేమిరా సహించని సమాజం కాబట్టి ఆ నవలా నాయకురాలి అభిమతాన్ని జీర్హించుకోలేకపోయింది వైవాహిక సంప్రదాయం పురుషులు పాటించనప్పుడు. . ఒక్క స్రీలు మాత్రమే నియమ నిష్టలతో ఎందుకుండడం అని కుండబద్దలు కొట్టి ప్రశ్నించిన రచయిత్రి విభావరీ శిరూర్కర్. వివాహానికి బాహిరంగా వున్న సంబంధాలను 'అచల' విషయంలో గట్టిగా సమర్ధించింది ఈ రచయిత్రి విశ్శంఖలత్యానికి ఊపిరులు పోస్తుందనే ఘాటైన విమర్శులను తలకెత్తుకుంది ఆ రోజుల్లోనే ఈమె అత్యంత వివాదస్పద 86 2ాాాాాాాాాాాాాాాాాాాాంాయాాాాాాాాాాాాాాాోకు సాహితీ సుమాలు
రచయిత్రిగా అనేక ఇబ్బందుల నెదుర్కొంది. భారత స్వాతంత్రానికి పూర్వమే రాయబడ్డ 'హిందోళ్యావరొ' నవల స్రీల కష్టాలకు నిలువెత్తు దర్పణంలా నిలిచింది 1935లో 'విర్లేలే స్వన్న్, 1952లో బెయీ, 1963లో “శబరి'.. ఇలా ఏది రాసిన ఆమె స్రీల
జీవితాలను బలంగా ఆవిష్కరించింది. ఏ మాయల మరారీలకూ భయపడని మరారీ రచయిత్రి విబావరీ శిరూర్కర్. తన వయస్సు తాంబైఏళ్ళు దాటినప్పటికీ... ఆమెలో అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదు. ఆమె నవలల్లో 'బలి' అత్యంత శక్తివంతమైన గొప్ప కృతి ఆదొక విశిష్ట కళాణండం. 1950వ సంవత్సరంలో అచ్చయిన '“బలి' నవల షోలాపూర్ నివాసులైన మాంగ్ అనే గారడీవాళ్ళ జీవాతాల్ని చిత్రీకరించింది 'మాంగొ అనే జాతిపట్ల సమాజానికి చిన్నచూపు వుండేది! “క్రిమినల్ కమ్యూనిటీ'గా ముద్రపడిన 'మాంగో ప్రజల లోతైన జీవితాలకు బలి నవల చక్కని దృష్టాంతం. అప్పటివరకూ మరారీ సాహిత్యంలో వివక్తక్షు గురైన జాతుల జీవితాలను “రికార్డు చేసినవాళ్ళు ఎవ్వరూ లేరు విభావరీ శిరూర్కర్ 1936 నుండి 1940 వరకు షోలాపూర్‌లో “క్రిమినల్ ట్రైబ్ “సెటిల్మెంటొోలో లేడీ సూపరింటెండెంట్‌గా ఉద్యోగం చేసింది కనుక ఆమె మాంగ్ జాతి అశానిరాశల్ని, కష్టసుఖాల్ని, ఆచార వ్యవహారాల్ని బాగా అర్ధం చేసుకోగలిగింది. అలా వచ్చిందే “ఐలి' నవల, బయటి ప్రపంచానికి క్రిమినల్స్‌గా కనిపించే మాంగ్ గారడీవాళ్ళ మనసు లోతుల్డోకి వళ్ళు వాలా మనుషులే అని నిరూపించింది. అలా “బలి" నవల మరారీ సాహిత్యంలో కొత్త దృక్సదొలకు తెరతీసింది గొప్ప సంచలనాన్ని కల్గించింది. పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టులు, ఉపేకితులైన జనుల షట్ల్ట హృదయపూర్వకమైన సానుభూతిని ప్రదర్శించింది. ఒక్కమాటలో చెప్పాలంటే మరారీలో తదనంతర దళిత సాహిత్యానికి 'బలి' గొప్ప వూర్వరంగాన్ని సిద్ధపరిచింది. ఈ రచయిత్రి మాలతీభాయీ బేడేకర్ పేరుతో అనేక ఆలోచనాత్మకమైన వ్యాసాలు రాసింది. ఆ వ్యాసాల నేపధ్యం ఆమె జీవితానుబభవాలే పూణాలో 'మహిళా' సేవాగ్రామ్ సంస్థకు సంచాలకురాలుగా వున్నపుడు అనాధబాలలకు, భర్త విగతలైన స్రీలకు తన ఆదర హస్తాన్ని అందించింది. కధలు, నవలలు, ఆలోచనాత్మకమైన వ్యాసాలు, నాటకాలు, అనువాదాలు, అక్షరాస్యులైన వయోజనుల కసం ప్రశే[కమైన వ్యాసాలు, అనేక పత్రికల్లో కాలమ్స్... ఒక్కటేమిటీ, ఆమె ఏం చేసినా, ఎది రాసినా సమాజానికి ఉపయోగపడాలనే దృక్పథం నుండి మాత్రం వైదాలగలేదు. 'బలి, శబరి, “సారధ్', ఘరాలా ముక్లేల్యా స్రియా... మొదలైన రచనలకు రాష్ట్రప్రభుత్వ పురస్కారాలు లభించాయి 1993లో ప్రచురించబడిన “ఖరే మాస్టర్" పుస్తకానికి “కోరావలే' అవార్డు వచ్చింది. 1992వ సం వత్సరంలో మహారాష్ట్ర సాహిత్య పరిషత్ వారి పురస్కారం కూడా దక్కింది. ఆమె అనేక మహిళా సంస్థలకు అచ్యక్షురాలిగా ఉన్నది. ప్రీల జీవితాల పట్ల ఆమెకు నిజమైన సానుభూతి వుంది వాళ్ళ కష్టాల పట్ల నిజాయితీతో కూడిన ఆందోళన వుంది. స్త్రీ విముక్తి కోసం ఆమె చేసిన సాహిత్య సివేలో నిబద్ధత వుంది స్త్రీల తరపున బలంగా మాట్లాడగలిగిన మొట్టమొదటి మరారీ రచయిత్రి విభావరీ శిరూర్కర్.
నలిమెల భాస్కర్ శ్లుష్షఖ్లసనటు ఎప పత్తుట్తటామ్పు పు సస టలం?
పర్యాయ పదం వ.
గంగా జలంతో సమానమైన ధారాశుద్ధి విసుగూ వేసటలను దూరం చేయగలిగే విషయ వైవిధ్యం, శ్రోతలను మంత్రముగ్గుల్ని చేయగలిగిన గాత్ర మాధుర్యం ఈ మూడూ త్రివేణీ సంగమంలా అల్లుకుపోయిన విశిష్ట గుజరాతీ సాహితీవేత్త రువేర్ చంద్ మేఘానీ. అతను జర్నలిస్ట్. శిష్ట సాహిత్యంతోపాటు అతనికి అత్యంత యిష్టమైన జానపద సాహిత్యంలోనూ తలస్పర్శిగా పనిచేసిన మార్గదర్శకుడు. అతనికి వారం రోజులలో నాలుగు రోజులు జర్నలిజం మీద దృష్టి. మిగిలిన మూడు రోజులూ నిసర్గ సుందరమైన పల్లెపదాల మీద వల్లమాలిన అభిమానం. అతని ప్రతి పనికీ వెన్నెముక ప్రణాళికే! జర్నలిజం, శిష్ట సాహిత్యం, జానపద సాహిత్యం ,.. ఈ మూడురకాల పనుల్లో. ఊపిరి సలపనంత మానసిక ఒత్తిడి అయినా ఏ ఒక్కదానినీ వదలకుండా ప్రాణపదంలా చూసుకున్న సాహిత్య పిపాసి. గుజరాతీలోని గ్రాంధిక, వ్యావహారిక భాషల్ని ఏకకాలంలో పోషిస్తూ రచనలు చేసిన నమద్రష్ట.
అతని సాహిత్య పిపాస ఎంతదూరం పోయిందంటే తను కలకత్తాలోని జీవన్‌లాల్ కంపెనీ
మేనేజర్ పదవిని పరిత్యజించాల్సి వచ్చింది. ఎంతో అలవోకగా ఆ ఉద్యోగాన్ని వదలి గుజరాతీ జొతీయ వారపత్రిక 'సౌరాష్ట్రాతో పూర్తిగా మమేకం అయ్యాడు. ఇది అతని సాహిత్తీ ప్రస్థానంలో చెప్పుకోదగిన సంఘటన అప్పటినుంచీ అతని మరణానికి రెండేళ్ళు ముందు వరకూ (1945 దాకా) అతను పాత్రికేయుడు. సౌరాష్ట్ర, పూల్ ఛాబ్స్ జన్మ భూమి మొదలైన పత్రికలకు కాలమిస్ట్. మాతృభాషతో పాటు ఆంగ్లం, సంస్కృతం, బెంగాలీ భాషలపై ప్రబలమైన ఆధిపత్యం కలిగిన బహుభాషావేత్త. పైగా జానపద సాహిత్యరంగంతో సన్నిహిత పరిచయం క్రనుక విపరీతమైన జనప్రియత్వం కలిగిన ఏకైక గుజరాతీ రచయిత.
ఆ కాలంలో జాతీయోద్యమంలతోపాటు గుజరాతీ భాషోద్యమం కూడా ప్రబలంగా ఉండేది. వీటన్నింటికీ సంబంధించిన ప్రగాఢమైన స్పృహ అతను కలిగివుండేవాడు అంతేకాదు పరాయి పాలకుల పట్ల అతని కలం నిప్పులు చెరిగేది! నాయకత్వం వహించేది ! ఆనాటి సాంస్కృతిక పరిణామానికి అతని రచనలు చక్కని దృష్టాంతాలు
అతడు స్పృశించని సాహిత్య ప్రక్రియ అంటూ గుజరాతీ సాహిత్యంలో ఏ ఒక్కటీ మిగల్లేదు. 88 అంట సాహితీ సుమాలు
పదమూడు నవలలు రాశాడు. వాటిల్లో 'తారా వహేతీ పాణీ' ఉత్తమ నవల. '“వేవిశాల్' సైతం గొపా నవలే! 'తులసీకయారో'లో గృహస్థ జీవితం చక్కగా చూపబడింది. అతడు రాసిన 125 కధల్లో “ఓభీపో", వహూ అనే ఘోడో'... శ్రేష్టమైన కధలు. వీరగాధల్లాంటి కధాగీతాలు, పిల్లల పాటలు, భజనలు, పడవ పాటలు మొదలైన వాటిల్లో ఇతని సృజనాత్మకత వేయి రేకులుగా విచ్చుకుంది. అతని కావ్యాలు సామాన్య పాఠకులను సైతం సమీపించగలిగినంత సుబోధకంగా వుండేవి. సరళమైన గేయాల ద్వారా తనదైన ముద్ర కలిగిన రచయిత మేఘానీ.
“మాణ్ సాయీనా దీవా' అనే రచన దాదాపు స్వీయచరిత్ర లాంటిది. మేఘానీగారు అనువాదాలు కూడా చేశాడు 'వేరాొన్మా' మరియు 'పరిభ్రమణ్'లలో ఉత్తమ సాహితీ విలువల్ని, సజీవ శబ్ద చిత్రాల్ని పరిపోషించాడు. 'వడ్వాగడ్' అనే వ్యాసం అతని సాహిత్య వ్యాసాల్లో తలమానికం. న
ఇవన్నీ ఒక ఎత్తు అయితే గుజరాతీ జానపద సాహిత్యంలో చేసిన-కృషి మరో ఎత్తు. గుజరాతీ జానపద సాహిత్యానికే కాదు... భారతీయ జానపద విజ్ఞానానికీ, ప్రపంచ జానపద విజ్ఞానానికీ అతను అపారమైన సేవ చేశాడు. ఇది అత్యుక్తి కాదు. ఖచ్చితమైన నిజం. ఆ రోజుల్లోనే జానపద విజ్ఞానానికి సంబంధించిన ముప్పైఐదు పుస్తకాలు ప్రచురించాడు. జానపద కధలకు సంబంధించినవి అందులో పదహారు. పది జానపద గేయాల గ్రంధాలు. సమీక్షా సంబంధిత పుస్తకాలు ఐదింటిని ప్రకటించాడు.
క్షేతకారా లకు చెందిన పుస్తకాలు రెండున్నాయి. మరో రెండింటితో యిలా ముప్పైఐదు గ్రంధాలు మౌఖిక సాహిత్యానికి సంబంధించినవే కావడం చేత అతని కృషి అమూల్యమని చెప్పక తప్పదు. అయిదువందల జానపద గీతాలు అతనికి కంఠరతాపారం. ప్రజల్లో నాలుకలా మెలిగాడు. ప్రజల భాషనీ, సంస్కృతినీ,సాహిత్యాన్నీ రక్తమాంస మజ్ఞాగతం చేసుకొన్న సాహితీ మేరునగధీరుడు... మఘానీ. శౌప్రీయ దృక్తుధం సైతం అతని సాహితీ పిపాసకు చక్కని వూతం కల్పించింది. ఆశ్చర$కరమైన విషయం ఏమిటంటే జానపద విజ్ఞానానికి సంబంధించి శాస్త్రీయమైన అధ్యయనం యింకో ప్రారంభం కాని తాలి రోజుల్లోనే మేఘానీ లోతైన పరిశోధన చేసి అసంఖ్యాకమైన గ్రంధాలు వలువరించటం.
అంతేకాదు. బెంగాలీ, సింధీ, మరారీ, రాజస్టానీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లోని జానపద సాహిత్య సామగిని సంపూర్ణంగా ఉపయోగించుకుని మాతృభాష అయిన గుజరాతీతో తులనాత్మకంగా అనేక వ్యాసాలు రాశాడు. అనేక వ్యయప్రయాసలకు ఓర్చి గుజరాత్ రాష్ట్రం నలుచెరుగులా తిరిగి (ఫీల్డు వర్క్ చేసి) అమూల్యమైన జొనపద సంపదను సేకరించాడు.
“జానపద సాహిత్య విషయంలో యింత పెద్దమొత్తంలో కృషి సలపడం ప్రపంచంలోనే ఎంతో అరుదైన అంశం” అన్నాడు ఉమాశంకర్ అనే గుజరాతీ సాహితీ విమర్శకుడు.
“నా యితర రచనల్ని, ప్రజలు మరిచిపోతే మరిచిపోతారేమో! కానీ గుజరాతీ జానపద విజ్ఞానంలో మాత్రం నా ముద్ర శాశ్వతమైంది పైగా అది చిర స్టిర స్మరణీయం” అని సగర్వంగా చెప్పుకున్న మేఘానీ మాటలు సంపూర్ణ సత్యాలు.
రువేర్చంద్ మేఘానీ క్రీశ. 1896లో జన్మించిన సందర్భంగా 1996లో అతని శతజయంతి ఉత్సవాల కోసం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరీ చేసింది నలిమెల భాస్కర్ పటపట పన్ను హన్షరప్యష్నమటాడప బస్పనసపల పిటకం
నవ్వుమొగ్గలు ఆ కథలు టి నుంయాట్లూర్ రానుకృష్ణన్ | త్త టీ గ 'నవలా రచయిత, కధా రచయిత, చిత్రకారుడు, కార్టూనిస్ట్,అడ్మిన్నిస్టేటివ్ ఆఫీసర్, చిత్ర కదా రచయిత, హాస్య రచయిత యిలా పలు రకాలుగా బహుముబాలుగా భాసిల్లిన సాహితీ వ్యక్తిత్వం మలయాట్టూర్ రామకృష్ణన్ది. మలయాళ సాహిత్యంలో మలయాట్టూర్ రామకృష్ణన్ తమదైన ఒక ప్రత్యేక స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మలయాళ ఇండియా టుడేలో చాలా రోజుల్నించి కాలమిస్టుగా వున్నాడు.
రామకృష్ణన్ కేరళ రాష్ట్రంలోని పాలక్కాడు పుదియ కల్పాత్తిలో మే ముస్పైయవ తేది -1927లో
జన్మించాడు. ఆలువయూసి కళాశాలలో ఇంటర్నీ, తిరువితాంకూర్ యూనివర్సిటీ కళాశాలలో బి.ఎస్.సి డిగ్రీనీ, తిరువనంతపురం లా కళాశాల నించి బి.ఎల్.నీ తీసుకున్నాడు. విద్యార్థిగా వున్న ఇ రోజుల్లో వామపక్ష భావజాలం కలిగి వున్నాడు కొంతకాలం ఇంగ్లీష్ ట్యూటర్‌గానూ, మరికొంతకాలం అలాయర్గానూ పనిచేశాడు. తరువాత రెండు నెలలు బొంబాయిలోని పీ ఫెస్ జర్నల్‌లో సబ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. 1951లో కమ్యూనిస్ట్ పార్టీ నిషేధానికి గురైన సమయంలో “ఇడతు పక్షం” (వామపక్షం) అనే వారపత్రిక ప్రారంభించాడు. 1956లో మెజిస్టేటుగా పనిచేశాడు 1959లో ఐ.ఎ.ఎస్., పాసయ్యాడు. ఆ తర్వాత అనేక ఉన్నత పదవుల్ని అలంకరించాడు. పదవీ విరమణకు ఐదేళ్ళ ముందే ఐ.ఎ.ఎస్. లోంచి రాజీనామా చేశాడు. (ప్రభుత్వ సర్వీసులోంచి బయటికి వచ్చాడు).
మలయాట్టూర్ 19 నవలలు, ఇండియన్ అడ్మిన్మిస్టేటివ్ సర్వీసుకు సంబంధించిన కతలు మాత్రమే కాకుండా 13 కధా సంపుటాలు వెలువరించాడు అదనంగా ఒక హాస్య రచననీ, ఒక న్యాయ గ్రంధాన్నీ, నాలుగు అనువాద పుస్తకాలనూ రాశాడు.
“వేరుగళో (వేళ్ళు) అనే నవలకు కేరళ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 'యక్తి,' 'పాన్ని” అనే నవలల్ని చలనచిత్రాలుగా తీయడం జరిగింది. ఇంకా అనేక చిత్రాలకు స్కీవ్లు రాశాడు వేరుగళ్, యక్తి పొన్ని, అంజు సెంటు, వేళాంబల్ అనే నవలలు వివిధ భారతీయ బాషల్లోకి తర్జుమా అయ్యాయి. వేరుగళ్, యక్షి నవలలు ఇంగ్లీషులోకి కూడా అనువదించబడ్డాయి
మలయాట్టూర్ మొదట కవిత్వంతో తన సాహితీ జీవితాన్ని ప్రారంభించాడు. ఏ కారణం చేతో
కవితలకు తిలోదకాలిచ్చి 1942లో రిక్షాక్కారన్ (రిక్రావాలా) అనే మొదటి కధను రాశాడు. ఏది ఏమైనా మలయాళంలో అతను నవలా రచయితగానే నిలదొక్కుకున్నాడు. రెండు డిటెక్టివ్ నవలలు కూడా రాశాడు. ఇతని 19 నవలల్లో వేరుగళ్స్ ద్వంద్వ యుద్ధం, యంత్రం, వెట్టూర్ మరం, యకి అంజుసెంట్, అమృతం తేడి అనే ఏడు నవలలు చాలా ముఖ్యమైనవి. “యక్షొలో మనస్తత్వ విశ్లేషణ '“అంజుసెంటోలో రాజకీయాలు, “ద్వంద్వ యుద్ధం” నవలలో నాస్తిక పాత్ర అస్తికుడిగా మారి ఆత్మహత్య చేసుకోవడం, యంత్రం, వేరుగల్ నవలల్లో ఐ.ఎ.ఎస్. పాత్రని నాయకుడిగా చూపడం, అమృతం తేడి (అమృతం కోసం)లో చారిత్రక నేపధ్యంతో కధ నడపటం ప్రధాన కధా వస్తువులు. ఐ.ఏ.ఎస్. గురించి భారతీయ భాషల్లోనే ప్రప్రధమంగా రాయబడిన నవల ఇతని యంత్రం, మళ్ళీ ఈ ఏడు నవలల్లోను తలమానికంగా వెలిగిపోయే నవల వేరుగళ్ ఇక కదల విషయానికొస్తే ఇతని ప్రతి కధలోనూ హాస్యం అంతర్జారగా ప్రవహిస్తుంది. హాస్యం చాటున పూటైన విమర్శ తొంగి చూస్తుంది. ఈ రచయితకు బాగా పేరు తెచ్చిపెట్టిన కధా సంకలనం బ్రిగేడియర్ తిరిచ్చువరవు. (బ్రిగేడియర్ పునరాగమనం) ఇతని మరో పుస్తకం పేరు 'సర్వీస్ స్టోరి దీన్ని అతను నవలగానో, కధల పుస్తకంగానో కాకుండా తన జ్ఞాపకాల, అనుభవాల దొంతరగా తీర్చి దిద్దాడు. ఈ పుస్తకం మలయాళ సాహిత్యంలో వచ్చిన ఆ తరువాతి సర్వీస్ స్టోరీలకు మంచి ఒరవడిగా మారింది. 19 నవలలు, 13 కధా సంపుటాలు (దాదాప రెండు వందల కధలు) రాసినప్పటికీ చర్విత చర్వణంగా కాకుండా వైవిధ్యాన్ని పోషించాడు. హోమర్! సెటైర్... రెండింటినీ సరిసమానంగా కధల్లో పరిపోషించినప్పటికీ “మీరు దేన్ని షపడతారు?” అని ప్రశ్నిస్తే, హ్యూమరే అంటాడు అక్సర్ కక్కట్టిలతో పైగా హ్యామర్కి అనేక యి రకాల ఫామ్స్ వున్నాయంటాడు. ఇతనికి స్ఫూర్తినిచ్చిన రచయితలు శ్రీ గుప్తన్ నాయర్, డా. కె.ఎం. జార్జిగార్లు. ఇప్పుడున్న జకీయాలపట్ల ఈ రచయితకు విపరీతమైన ఎల్జీ. బ్యురాక్రాట్లకన్న మిక్కిలిగా దేశాన్ని పాడుచేస్తున్న నో రాజకీయ నాయకులే అని కుండబద్దలు కొడుతున్నాడు. చాలా సెలెక్టివ్‌గా మాత్రమే థొ చదువుల డు ఇతని దృష్టిలో సృజన, అనుసృజన రెండు సమానమే. 1 షెర్దాక్ హోమ్స్ నాలుగు కధలు 2. ల న బర్ క్ర హోమ్స్ 6 కధగళ్ 3. షెర్లాక్ హోమ్స్ కదగళ్ 4. నాడోడి కప్పలిల్ నాలుమాసం (జానపదుల లో నాలుగు మాసాలు). . అనే ఈ నాలుగు పుస్తకాలను అనువదించారు ప కలెక్షర్, డిప్యూటీ సెక్రటరీ, రెవిన్యూ బోర్డు మెంబర్, సెక్రటరీ, సివిల్ సపైస్ డైరెక్టర్, విజిలెన్సు కటక్, లేబర్ సెక్రటరీ, కె ఎస్.ఆర్ టిసి జనరల్ మేనేజర్ మొదలైన అనేకానేక పదవుల్ని వృత్తిపరంగా నిర్వహించినప్పటికీ ఈ రచయిత ప్రవృత్తి సాహిత్య వ్యాసంగం మాత్రమే! మలయాళ సాహిత్యంలో హాస్యం ద్యారా మలయానిలాన్నీ వ్యంగ్యం ద్వారా ప్రళయానలాన్నీ ఏకకాలంలో పోష్షించిన మలయాట్టూర్ రామకృష్ణన్ 1998లో మరణించాడు
ప్రయోగాలవెపర్హాటలేనిప్రయోక్త ఖౌవవాదోత్తరకాల కవుల్లో కళాత్మకమైన భాషనీ, సంస్కరణతో ముడివడిన సామర్యాన్నీ ఉపయోగించి విస్పష్టమైన స్వంత ముద్రతో హిందీ సాహిత్యంలో ఓ గుర్తింపు తెచ్చుకున్న సాహితీ వేత్త గిరిజాకుమార్ మాధుర్. కవితా క్షేత్రంలో అతను ప్రవేశించింది పైలా పచ్చీసు వయస్సులోనే! “'మంజీరొ అనే కవితా సంకలనం అతని యవ్వనంలోని ప్రణయ భావోద్రేకాలకు చక్కని దర్శణం. ప్రారంభంలో గిరిజా కుమార్ దృష్టి చందస్సు, లయ, స్వరం, ధ్వని మొదలైన అంశాల మీద వుండేది! ప్రణయ గీతాలకు అతడు అలతి అలతి లలిత పదాలనూ, శిష్ట వ్యావహారికాన్నీ వాడుకున్నాడు. 'తార్ సప్తకొ అనే సంకలనంలోని “చూడీ. కా టుక్డా, 'భీగా దిన్ మొదలైన కవితల స్వారస్యం హిందీ పరితలకు బాగా నచ్చింది ఆ తర్వాత తర్వాత గిరిజా కుమార్ మాదుర్ దృక్పధం మారి, ప్రణయ గీత రచన నుండి సాంఘిక స్పృహ వైపు మళ్ళింది. అదునికతకు తన కవితల్లో పెద్దపీట వేయడం జరిగింది. కవుల భ్రూకంపం లోంచి భూకంపం పుడుతుందన్నట్లుగా.. గిరిజా కుమార్ తన కవిత్వాన్ని భూమార్గం పట్టించాడు. 'యదార్ధ లోకపు వ్యధార్ధ దృశ్యాలు" చూపించాడు. 1950 తర్వాతి అతని రచనలన్నీ మనిషిని గురించి పట్టించుకున్న రచనలే! అతని ప్రతి స్పజనలోనూ సమాజపు నిలువెత్తు చిత్రమూ, మానవుడి మనిషెత్తు బొమ్మా కలగలసి కనిపిస్తాయి “తార్ సప్తకొ సంకలనం మళ్ళీ ప్రచురించబడినప్పుడు ఈ కవి ఇలా అంటాడు. “ఎవం ద్వారానో ఒక మార్గం నుండి మరొక మార్గానికీ, ఒక సైద్ధాంతిక అవగాహన నుండి మరో వైపుకూ మారడం సత్ఫలితాల నివ్వదు. స్వానుభవంతో కలిగిన మార్పు చిరకాలం వుండి చక్కని ఫలితాల నివ్వగలదు" . సంప్రదాయ సిద్ధంగానూ అనుశ్రతంగానూ వచ్చే పోకడల్ని కూడా గుడ్డిగా నిరాకరించడమో, మూర్థంగా అనుకరించడమో అతనికి నచ్చదు. “స్వానుభవరాహిత్యంతో సాహిత్యంలో దృక్పధాలు ఏర్పరచుకోవడంవల్ల కవిత్వం అనుకున్నంతగా పండదు” అంటాడు గిరిజా కుమార్ మాధుర్. “ధూప్కే ధాన్' అనే కవితా సంకలనం హిందీ పారకలోకాన్ని బాగా ఆకర్షించింది. ఈ పుస్తక అవతారికలో కవి తన్నుతాను నవకవిగా పేర్కొన్నాడు. పైగా 'ధూప్కే ధాన్' కవిత నవ్య కవిత్వానికి భవ్యమైన శ్రీకారంగా ఉదహరించారు. మరో రకంగా చెప్పాలంటే ఈ కవిత అభ్యుదయ సాహితీ పస్థానంలో ఓ మైలురాయి. గిరిజా కుమార్ మాధుర్ సాహిత్య పురోగమనానికి ఈ కవితా సంకలనం 92 భాంతి సాహితీ సుమాలు
ఒక చక్కని కొలబద్ద శ్రేమ, ప్రకృతి ఈ రెండింటినీ కేంద్ర బిందువులుగా తీసుకుని గిరిజా కుమార్ వైయక్తిక, సాంఘిక అభివ్యక్తుల్ని 'బీతరీ నదీకీ యాత్రా'లో ఆవిష్కరించాడు. వైయక్తిక దశతో పాటు సాంఘికీకరణం అవశ్యంగా ఏర్పడవల్సిన పరిణామం. సోషలైజ్ అయిన మనిషి సమాజ స్థాయీ భేదాల్ని గుర్తించి మానవతావాదిగా మారతాడు. అదే గిరిజా కుమార్‌లోనూ జరిగింది. శ్రేమ వ్యక్తిగతమైంది ఫ్రకృతి సాంఘిక పరమైనది. ఈ ఉబయాంశాలకూ చక్కని పొందిక “బీత్రర్రి నద్ర క్ర యాత్రా" ఒక రకంగా ఈ కవితా సంకలనం... పెచ్చు పెరిగిన హింస, పేబ్రేగిపోయిన లంచగొండితనం, హద్దులు దాటిన అవినీతి, సమాజాన్ని సంక్షుభితం చేస్తున్న దురా చారం, అసభ్యత మొదలైన అనాచారాల నుండి మనిషిని రక్షించే ప్రయత్నంలోంచి వచ్చింది. విశ్వశ్రేయః కావ్యమ్"-అనే సూక్తిని నిజం చేయాలన్న సత్సంకల్పంతో ప్రభవించిన కవిత్వమే గిరిజాకుమార్ మాధుర్ కవిత్వం. పెగ్గా నవ్యకవిత్యం పేరుతో 1960 ప్రాంతంలో ఇష్టమొచ్చిన చెత్తనంతా రాసిపారేసిన కనివరేఖ్యులక్ర “భీతరీ నదీ కీ యాత్రా'-ఒక చెంప పెట్టు...ష్లస్ ఒక గోడ దెబ్బ. గిరిజా కుమార్ మాధుర్ ప్రాహ త్య కాలుష్యాన్ని ఏమాత్రం ఇష్టపడని వ్యక్తి. కలుషిత వాతావరణం కన్నా కలుషితమైన సాహిత్యం చేసే హాని అక్షరాల కందనిది అంటాడాయన. మనిషిని ప్రకృతితో ముడివేసే అత్యంత స్వాబావిక్రచ్చ్యా ప్రక్రిలుకు విఘాతం ఏర్పడితే సహించని వక్తి గిరిజా. నా క్రవిత్వంలో గిరిజా కుమార్ మాధుర్ ఒక మంచి ప్రయోక్త. అయితే ప్రయోగాల కోసం కవిత్వాన్ని పణంగా పెట్టి తృప్తిపడడం ససేమిరా గిట్టదు అతనికి ప్రత్యేకించి ప్రయోగాల కోసమే కలం నడిపించడం కాదు ఆత్యంత సహజంగా కవితలో ప్రయోగం లీనమవ్వాలి అనేది అతని అభి తం, ఈ శలొబ్ల్ ఆరవ దశాబ్దంలో 'పృధ్వీ' శీర్షికతో ఒక నాటకం రాయాలనుకున్నాడు. అయితే ఎందుచేత్తో దాన్ని పొక్తి చేయలేకపోయాడు. అతను “కల్పాంతర్-అనే ఒక సైన్సు కావ్యం రాసాడు. అద్రి హిందీ సాహిత్యంలో మొట్టమొదటి సైన్సు కావ్యం. గిరిజా కుమార్ మాధుర్ సాహిత్యం ప్రపంచమంత విశాలమైనది. పది కవితా సంపూటాలతో పాటు ఒక నాటకం కూడా రాశాడు. బోలెడు వ్యాసాలు రాశాడు “అతని సమస్త సాహిత్యం సంపుటాల రూపంలో రావాల్సిన అవసరం ఎంతైనా వుంది” అంటాడు డాక్టర్ విజయేంద్ర స్నాతక్. ప్రచురణ కఠలు ఎవరైనా ముందుకొచ్చి గిరిజా కుమార్ మాధుర్ సాహిత్యాన్ని సంపుటాలుగా ప్రచురిస్తే హ్ దీ సాహిత్యానికి ఎంతో మేలు చేసిన వాళ్ళవుతారు. గిరిజా కుమార్ 10-]3-1994 నాడు చనిపోయాడు. నలిమెల భాస్కర్. *.హన్నప్యాళ్టు ఖల వ్యాప్త సల్యుంన్న తంట పతటిదలాలా ర?
కొండ న్ ఉ. '0డజాతి అక్షరం మం
ఆత్మగౌరవం ఛునీకి ఆరోప్రాణం. ఆంగ్లేయులతో క్రిమినల్ టైబ్గా పేర్కొనబడి బహిష్కృతమైన లోధా గిరిజనుల మానమర్యాదలు బహిఃప్రాణం. చదువూ సాహిత్యాలంటే అమెకు పంచప్రాణాలు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆదివాసీ జాతుల్లో “లోధా' ఒకటి. ఆ గిరిజన జాతిలో 1965వ సంవత్సరంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది ఛునీకోటాల్ 27 ఏళ్ళ ప్రాయంలో ఈ మానవమృగాల ప్రపంచంలో యిమడలేక ఉరిపోసుకొని ఊపిరి తీసుకున్న తొలి లోదా జాతి రచయిత్రి ఛునీ. ఆమె లోధా గిరిజనుల్లో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ కూడా.
పొద్దస్తమానం ఛునీ తల్లిదండ్రులు అడవితల్లి ఒడిలో ఆకుల్లో అకులై, పువ్వుల్లో పువ్వులై కష్టపడినా అర్జాకలితో గడుపవలసి వచ్చేది అతి కష్టమ్మీద ఆమెను బళ్ళో చేర్పించారు. అక్కడా అడుగడుగునా అవమానాలే! “దొంగలు'గా ముద్రపడిన లోధా జాతీయులకు సమాజంలో సముచిత స్థానం లేకపోవడం ఛునీ భరించలేకపోయింది చదువులో చాలా హుషారైన అమ్మాయి. అయితే తరగతిలో ఎప్పుడూ ద్వితీయ శ్రేణిలోనే వచ్చేది.
ఛునీ ఏడవ తరగతిలో ఉన్నప్పుడు బెంగాల్ రాష్ట్రం దుర్భిక్షంతో అల్లాడుతోంది. ధరలు మండిపోతున్నాయి. రోజంతా పనిచేస్తే రెండు రూపాయల పది పైసలు కూలీగ్గా వచ్చేవి. కిలో బియ్యం దర మూడు రూపాయల నలభై పైసలు. ఆకులూ అలములతో, దుంపలూ కాయలతో ఆకలి తీర్చుకుంటూ ఛునీని చదివించారు తల్లిదండ్రులు. ఎనిమిదో తరగతిలో ఉండగా తల్లికి క్యాన్సర్ కష్టాలు క్షణక్షణ ప్రవర్ధమానమవుతున్నాయి. అయినా చునీ చదువు ఆపలేదు. 1980లో ఆమె మేదినీపూర్ కళాశాల ప్రాంగణంలో అడుగుపెట్టింది అక్కడా ఆమెకు పోర పరాభవాలే ఎదురయ్యాయి. ఆమెది సున్నిత హృదయం. విపరీతమైన భావోద్రేకానికి లోనవుతూ వ్యాసాలూ, కధలూ, కవితలూ రాసేది. తోటి మనిషిని ప్రేమించలేని మనుషులు ఏ సంతృప్తితో జీవించగలుగుతున్నారని మధనపడేది!
మేదినీపూర్‌లో చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు ముప్పై కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చేది చునీ. ఇంట్లో ఛభునీపై యింక చదువకూడదన్న ఆంక్షలు పెరుగుతున్నాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడితోనూ, శారీరక శ్రమమూలంగానూ క్రమేపీ భునీ ఆరోగ్యం క్షీణించసాగింది ఏటిలో కొట్టుకొనిపోయే ప
మనిషికి గడ్జఎర5 దారికిసట్లుగా అక్షరాస్యతా కేంద్రంలో టీచర్ పని లబించింది. అది తాత్హ్యాల్రిక్ర్వ, ఇన్ని ఆటంకాల మద్య ఆమె కళాశాల జీవితాన్ని ప్రారంబించినప్పటికీ తన వ్యాసంగాలూ, ఆసక్తులూ కాపాడుకొంది కళాశాలలో ఆర్థికశాస్త్రం బోదించిన కుమారేశ్ ఘోష్ "ఆమె మొత్తంగా మా కళాశాలకు గర్వకారణం... ప్రతి సాహితీ సాంస్కృతిక కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేది! కవితలూ, కదలూ, మౌలికమైన వ్యాసాలూ రాసేది అంటాడాయన. 1982లో ఒక బల్ వెల్ఫేర్ సంస్థలో ఆమెకు ఉద్యోగం దొరికింది. ఇది ఒకింత్ర ఊరట. అయినా చదువును కొనసాగించింది. గిరిజన సంక్షేమశాణలో పని దొరికాక... “గిరిజన్సుల కసం ప్రభుత్వం కేటాయించిన డబ్బులు పెద్దల చేతుల్లో ఎలా మారుతున్నాయో? గమనించింది. ఆమెక్షు ఈ దోపిడీ విషయం మరింత స్పష్టంగా విశదం అయ్యింది. పై అదికారులకు ఎదురు తిరిగింది ఇక్కడా ఆమె విపరీతమైన ఆందోళనకు గురైంది. 1985వ సంవత్సరంలో ఛునీ భారతదేశంలోన ప్రప్రదమ లోదా మహిళా గ్రాడ్యుయేట్‌గా తన స్టానాన్ని పదిల పర్చుకుంది. పశ్చిమ బెంగ్లాళ్ర రాష్త్రంలో అత్యదిక సర్కులేషన్ కలిగిన ఆనంద్ బజార్ వార్తాపత్రిక ఈ విషయానిక్రి అత్యధిక 'ప్రాముజ్యాన్ని కల్పిస్తూ వార్త ప్రచురించింది. అప్పటికీ ఆమె బతుకుదారి పొడుగునా కంటకాలే! విశ్వవిద్యాలయంలో ప్రవేశించినప్పుడు ఆమెకు ఎదురైన సంఘటన కంటతడి పెట్టించకమాన దు తోటి విద్యార్థులంతా “లోదా పిల్ల దొంగ పిల్ల అంటూ అల్లరి పెడుతుంటే... అదికారుల దగర తన గోడు వెళ్ళబుచ్చుకుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పిన మాటలు టేపుల్లో ఇప్పటికీ వున్నాయి. 1980లో చునీకి మన్మద్ శబర్తో పరిచయం కలిగి అది పరిణయంగా పరిణమించింది. అతడు ఖరగ్‌పూర్‌లో రైల్వే వర్క్‌షాపులో పనిజేస్తాడు. మన్మధ్ తండ్రి లోధా జాతీయుడే కాని తల్లి సంతాల్ జాతికి చెందిన స్రీ. అందువల్ల ఛునీ వివాహం ఇరుపక్షాల వాళ్ళకూ నచ్చలేదు మళ్ళీ కష్షాల పరంపర ప్రారంబమైంది. పర్యవసానంగా ఆమె స్వచ్భృందంగా మృత్యువుని వరించింది. ఈ పాళ్వక్త ప్రపంచంలో బతకలేక ఉరిపోసుకొని చనిపోయిన ఛునీ జీవితం సభ్యసమాజానికి ఒక గుణపారం... మరొక కనువిప్పు ఆమె చనిపోయినప్పుడు ప్రసిద్ధ బెంగాలి పక్షపత్రిక 'దేశో ఛునీ కోటాల్ ముఖచిత్రంతో వచ్చింది. కవర్ పేజ్‌ల చ్చునీతో ప్రచురించబడిందంటే ఆమెకి బెంగాలీ సాహిత్యంలో, సమాజంలో ఎంతే 'పాధాన్యం వుందో అర్ధం చేసికోగలం. అ సంచికలోనే (3110-1992) కుమారేశ్ షోష్ ఛ్చన్స గురించి రాసిన ప్రత్యేక వ్యాసమూ, ఛునీ స్వయంగా రాసిన బారతదేశంలో ఆదివాసీ శిశువుల సమస్య అనే వ్యాసమూ, ప్రతిఘటన అనే కవితా, ఎవరి సుఖం కోసం సహిస్తున్నాను?' అన్స మరో కవితా చోటు చేస్తుక్సున్నాయి. ఛునీ కోటాల్ ఆత్మహత్య చేసుకున్నాక ఆమె భర్త మన్మథ్ శబర్ని ఓదార్బడానిక్రీ ఆత్మహత్యా కారణాలు ఆరా తీయడానికీ జ్ఞానపీర పురస్కారం గ్రహీత్ర మహాశ్వేతాదేవి భుసీ గ్రావ్రన్సిక్రి వెళ్ళింది. ఆదివాసీ జీవితాల్లోని ఆశానిరాశల గురించి అవిశ్రాంతంగా కృషి సల్పుతోన్న మహాశ్వేత లా, ఛునీ జీవించి వున్నట్లయితే శమె మరోశ్వేత అయ్యేది! సళక యి రాలయ ఫు క ఖీ! లో
.. 92201069 900440 - ౨1. సిజసంం12 కెకి29128 (
(౧౧౦౪9 01 1౧61౬౧ '౧/౧|16/9) . న. . నే. న న... మ. న. న... న సు ం! స ప స న చ న చ న [ య. రయం చేయటం కరం లం ర గ్ర యంయయుకుతు | తయా సంప ప్రతుల న లఖకతంకము ఉఇరదంతర్లోచెయంద్ది . న. 0కి 59 సంవత్సరాలు లే ఆ రెండేట్టి కర్ట్ యా యట వివధ ఇషాసహత్షప |...”
|. గర్తిపను మీయకొళ్ళరతొళ్ళు, ఓ ర్యపాల్టో రచయతల రచకలక్న వళ్ళ జీవితలద ఎను ప్రోషుఖ్యం ౧ఏక్పడం జరిగింది. _ ॥ .