Telugu sahithi salapalu - anilvaranasi/indianlanguages GitHub Wiki
సాహితీ సులావాలు (విన్నవి... కన్నవి...) కై మా. మున. ననన ఖీ గి రం08 రళ8 1 ళ్ళ ్యో ం" బి 120 109 _ హమ్ నానన. డా. ఆచార్యఫణింద్ర ' .:.:.
09569 సతాం షం. న మ. ప్రముఖ చలనచిత్ర దర్శకులు శ్రీకె. విశ్వనాధ్ గారు, ప్రముఖ గీత రచయితలు వేటూరి, సిరివెన్నెల గార్ల సమక్షంలో సుప్రసిద్ధ సినీ నటులు దా॥ అక్కినేని నాగేశ్వర రావు గారిచే సత్కారం మ మా... బాం న. ష్ . . ల. నం ఉం న టట చ. ర... స శే ణా శ న షు. [ భం. హే క! ప్రముఖ కవులు దా తిరుమల శ్రీనివాసాచార్యులు గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా॥ నందిని సిధారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు దా॥ కె.వి. రమణాచారి గారి సమక్షంలో తమిళనాడు మాజీ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ రోశయ్య గారిచే సత్కారం స. ఆ. “శారరారా. . చలల దూరదర్శన్ న స ల *| పూర్వ కార్యక్రమ నిర్వాహకులు నం |. గ. ఇ , శ్రీ వోలేటీ పార్వతీశం గారి సమక్షంలో ము. ఎ! /| షై న... శ్రీ మహాకవి డా! సి, నారాయణరెడ్డి గారిచే
సాహితీ సల్లాపాలు దా. ఆచార్య ఫణీంద్ర
ఆడి సాహితీ సల్లాపాలు (విన్నవి .. కన్నవి...) “పద్య కళాప్రవీణు, “కవి దిగ్గజ, “ఏక వాక్య కవితా పితామహ” డా. ఆచార్య ఫణీంద్ర భా జతను 4 ఉల నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం హైదరాబాదు.
5410117111! 54౬౬4౧46౬౮ 1౧ 7916664) (1112/069 0౦౧౪౪౧౪4110౧3 ౦01 1౬1620 612౧9) య్ ఇ ణల 00116066 & 4//1118౧ 689 ౮ 0 శింగ2గ/4 నిగషగ66౧6/2 005, శ్రీ న. ౯1/91 ౬61910౧ : 2019 గ్ర) క అ షల(01 ళ్ ఖీ అం న106 : ౧5. 60/- ర 120/0 ఇ సి లల "సీ టా ఆర” ట్ హైద వో
౮౦౧169 0620 09 ౧౭6 1/0౧ : స్ 5111. 527110%1 60౪47608౧4
5/1%444గ, 6-34/48/1, 5212) ౧2౦౭౯ 0౦010౧౪,
0౧౧. 10 0౬021 8641116100, ౫౧౧౭184662,
౧/౮6౧42046 - 500 089.
౧౧. 1౦. 9959882963, 040-271333286
న౧౧|66ే &1
7252002 గగ ౧౧౧16౧3
8501., గ౪/6౮6/2026-62.
౯౧ : 9848385099, 9010643424
ఆచార్య ఎస్వీ రామారావు
విశ్రాంత డీన్, ఆర్ట్స్ విభాగం,
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
అవ్వ్వులు బల్లులు సాహితీ మూర్తుల సరస సల్లాపాలు చమత్నార గర్భితంగా, సహృదయ రంజకంగా అలరిస్తాయి. వారి ఆగ్రహాలు, అనుగ్రహాలు సమయానుగుణంగా సమన్వయిస్తూ హాస్య పూరిత వాతావరణానికి దారి తీస్తాయి. పాతిక మందికి పైగా ప్రముఖ రచయితల సంభాషణల్లోని, సన్నివేశాలను వివరిస్తూ చిన్న పుస్తక రూపంలో “సాహితీ సల్లాపాలు” పేరుతో వెలువరిస్తున్నారు ఫణీంద్ర. ఇవి చదువగానే నవ్వుల జల్లుల్లో మునిగిపోతాం. ఆచార్య ఫణీంద్ర కవి, విమర్శకుదే కాక హాస్య ప్రియుడు కూడా
ఇందులో ఆయన హాస్య చమక్కులు కూడ చోటు చేసుకొన్నాయి. కీ॥శే॥ నండూరి రామకృష్ణమాచార్యులు గారితో “ఆంధ్ర పద్యకవితా సదస్సు”లో కలసి పనిచేస్తున్నప్పటి నుంచి ఫణీంద్రతో నాకు పరిచయం ఉంది. “19వ శతాబ్ది తెలుగు సాహిత్యంలోని వినూత్న ప్రయోగాల” పై నా పర్యవేక్షణలో పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టం పొందటం నాకు ఆనందదాయకం. ప్రస్తుతం “యువభారతి సంస్థ అధ్యక్షులుగా బాధ్యతలను సముచితంగా నిర్వహిస్తున్నారు. ఆచార్య ఫణీంద్ర భావి జీవితం జయప్రదంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ నా శుభాభినందనలను తెల్పుతున్నాను.
తేది. ౩0 మార్చి 2019 ం ఉబ్వాకాలా బశాో
2౬9౦కెత్ం “నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం) అధ్యక్షులు, (ప్రముఖ వ్యాపారవేత్త, విద్యావేత్త, సహృదయులు శ్రీ కళ్ళెపు సాగర రావు గారికి గౌరవ పురస్సరంగా - శా పారిశ్రామిక వేత్తగా ప్రగతి సంభావించు విద్వన్మణీ! సారార్థంబుల బోధ సేయు బడి సంస్థాపించు విద్యా మునీ! “తారా తోరణ” రామకృష్ణ కవిచంద్ర స్మార పీఠళాగ్రణీ! ధీరా! “సాగర రాయా నామ! జగతిన్ దీపించు నీ ఖ్యాతియే! కం ధవళము నీ వస్తమ్ములు - ధవళ ప్రభ లొలుకు నీ ముదమలరు ముఖమున్ - ధవళమె నీ కీర్తి - నిరత ధవళమ్మే నీదు హృదయ ధామమ్ము గనన్! తే.గి.॥ సాటి లేనట్టి గురుభక్తి చాటుకొన్న నీకు నే సతీర్థ్యడ నాట నిజము గాన - ఓ వదాన్యవర! సహృదయోత్తమ! కొను డస్మదీయ సద్రచన - నీ కంకితమ్ము! = డా॥ ఆచార్య ఫణీంద్ర
(గ్రంథ స్వకర్త | | న్ 1 | | ॥ (. | | _ ఈ తఅుకసువుతతొనవ్తుడాతు ] ॥ | గ్ ॥ | 1 |
కళ్ళెపు సాగర రావు అధ్యక్షులు, నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం వ్వ్క్పలు
గురుదేవులు కీ॥శే॥. నండూరి రామకృష్ణమాచార్యులు గారి ప్రియ శిష్యులు, ప్రముఖ కవి డా॥ ఆచార్య ఫణీంద్ర గారు నండూరి వారి సాహిత్య పీఠానికి కార్యదర్శిగా ఎన్నుకొన్నప్పటి నుండి దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ బాధ్యతలను సహృదయంతో సక్రమంగా నిర్వహిస్తూ, గురువు గారి పట్ల తమ భక్తి ప్రపత్తులను చాటుకొంటున్నారు. ఆయన సమర్ధవంతంగా కార్యవర్గ సమన్వయంతో పీఠం కార్యక్రమాలను నడుపుతున్న తీరు ప్రశంసనీయం. ఫణీంద్ర గారు గుండె పండిన కవి. “పద్యకళా ప్రవీణ”, “కవి దిగ్గజ”, “ఏక వాక్యకవితా పితామహ” బిరుదాంచితులు. మాకెంతో ఆత్మీయులు.
“సాహితీ సల్లాపాలు” అనే ఈ (గ్రంథంలో (ప్రముఖ కవుల కలయికలలో జరిగిన కొన్ని గొప్ప సంఘటనలను కళ్ళకు కట్టినట్లుగా చిత్రించారు. ఇందులో గంభీరమైన సన్నివేశాన్ని హాన్యరసంతో ముగించడం, సంతాప సభను సన్మాన సభగా మార్చిన సమయస్ఫూర్తి, ఆవేదనను ఆనందంగా తీర్చి దిద్దిన గొప్ప గురువుల వాత్సల్యం, గొప్ప గొప్ప సాహితీ మూర్తుల మధ్య సాగిన హాస్య సంభాషణలు మొదలైనవి అబ్బుర పరచేవిగా ఉన్నాయి. చిత్రకారులు, సినీ దర్శకులు అయిన శ్రీ బాపు గారు అన్న మాట సమయం, సందర్భాన్ని బట్టి కడుపుబ్బ నవ్విస్తుంది. అభ్యుదయ కవిత్వంపై కాళోజీ గారి వివరణ అర్ధవంతంగా, ఆశ్చర్య పరిచేదిగా ఉంది.
గురువు గారు నండూరి వారు, వారి మాటలలోనే చెప్పాలంటే- “గొప్ప గురువులకు శిష్యులు” గా, “గొప్ప శిష్యులకు గురువులు గా ఉన్నారు. “శిష్యదేవోభవ” అన్న వారి మాటను సార్ధకం చేస్తూ, ఆచార్య ఫణీంద్ర గారు తమ సాహిత్య ప్రస్థానాన్ని సాగిస్తున్నారు. చిరస్థాయిగా ప్రసిద్ధినొందే విధంగా ఈ (గ్రంథం రూపొందింది. ఇంత గొప్ప (గ్రంథాన్ని అంకితం పొందడం నేను చేసుకొన్న సుకృతం అని భావిస్తున్నాను. ఆచార్య వణీంద్ర గారికి నా అభినందనలను, ధన్యవాదాలను తెలియజేస్తున్నాను తేది. 19 మార్చి 2019 సం॥ హైదరాబాదు. (కళ్ళెపు సాగర రావు)
చమయి౭తలత్నితర చంటత్రికలు
లబ్ద ప్రతిష్ట కవుల, పండితుల వాగ్గోరణిలో చక్కని చమత్మారం, హాస్యం, వ్యంగ్యం తొణికిసలాడుతుంటాయి. అందునా ఇద్దరో లేక ముగ్గురో పండితులో, కవులో కలిసినప్పుడు, వారి మధ్య సాగే ఆ సంభాషణ మరీ రసవత్తరంగా ఉంటుంది. అట్లాంటి సంభాషణలను ప్రత్యక్షంగా విన్న సాహిత్యాఖిమానుల హృదయాలు అప్పుడు ఆనందంలో ఓలలాడడమే గాక, ఆ తరువాత కాలంలో కూడ పలు మార్లు నెమరు వేసుకొని ఆనందిస్తుంటాయి. సందర్భం వచ్చిన ప్రతి సారీ రసజ్ఞులైన సాహిత్యాభిమానులు ఆ ఛలోక్తులను, అందులోని చమత్మారాలను మిత్రులతో పంచుకొని ఆనందిండం మనం తరుచుగా చూస్తూ ఉంటాం. మౌఖికంగా సాగే ఈ ప్రక్రియ వలన ఆ చమత్నార చంద్రికలు కొన్నాళ్ళకు గాలిలో కలిసిపోతుంటాయి. అట్లా కాల గర్భంలో కలసిపోవడం వలన ఆ సరస వినోద సల్లపాలు చాలా మట్టుకు తరువాత తరానికి అందకుండా కనుమరుగు, చెవి మరుగు కావడం సహజమే.
కానీ ఆ సాహితీ సల్లాపాలను అక్షర బద్ధం చేస్తే అవి అక్షరమై అజరామరంగా తరతరాల ప్రజలు ఆస్వాదించే భాగ్యం కలుగడం అన్నది యోచించవలసిన విషయం, కానీ ఆ ప్రయత్నం ఎక్కడో ఒకటి, అర తప్ప పెద్దగా జరుగకపోవడం వలన కొన్ని శతాబ్బులుగా ఎంత నష్ట పోయామో తలచుకొంటే కించిత్తు బాధ కలుగుతుంది. అందుకే కనీసం నా దృష్టికి వచ్చి, నేను విన్నవి, కన్నవి కొన్నైనా ఒకచోట చేర్చి ఒక చిన్ని గ్రంథంగా రూపొందించాలన్న ప్రయత్న ఫలమే మీ చేతిలో ఉన్న ఈ లఘు (గ్రంథం. .
మా “నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం” పేరిట అంతర్జాలంలో నేను నిర్వహించే ఒక బ్లాగులో కొన్నేళ్ళ క్రితం వీటిని ఆడపాదడపా వ్రాసినప్పుడే మంచి స్పందన లభించింది. ఆ తరువాత “పతిలివి” తెలుగు ఆన్లైన్ సాపొత్య వెబ్ నంచికలో ఇవి
'ప్రచురితమైనప్పుడు మరింత విశేషాదరణను చూరగొన్నాయి. అయితే (గ్రంథంగా వెలువరిద్దానున్న నా కోరిక ఇన్నాళ్ళకు ఫలించిది.
ఈ గ్రంథాన్ని మా *నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం” అధ్యక్షులు శ్రీ కళ్ళెపు సాగర రావు గారికి అంకితం చేయాలన్న నా తలంపుకు ఆ సహృదయ శేఖరులు దయతో ఆమోదం తెలిపినందుకు, ఆయనకు అనేక ధన్యవాదాలను తెలుపుకొంటున్నాను. అంతే కాకుండా ఈ (గ్రంథాన్ని వారి ఆర్థిక సహాయంతో మా పీఠం ప్రచురణగా వెలువరిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా గురువు గారు స్వర్గీయ నండూరి రామకృష్ణమాచార్యుల ఆశీస్సులు నాపై, సాగరరావు గారిపై సదా వర్షించాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈ చిన్న పుస్తకానికి తమ పీఠిక ద్వారా ఆశీస్సులను అందించిన సుప్రసిద్ధ విమర్శకులు, నా పి.హెచ్.డి. గురువు గారు ఆచార్య ఎస్వీ. రామారావు గారికి వినమ్రంగా సమస్కరిస్తున్నాను.
ఈ (గ్రంథాన్ని ఇంత అందంగా ము(ద్రించినందుకు “ప్రసన్న ఆర్ట్ ప్రింటర్స్” కు, ముఖ్యంగా శ్రీ పి. శ్రీనివాస్ మరియు శ్రీ పి. భాస్కర్ సోదరులకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
సాహితీ ప్రియులు చికాకుగా ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని సరదాగా చదువుకొంటూ పోతే కాస్త ఊరట చెందడం ఖాయం. నా గత విరచిత గ్రంథాల వలెనే, ఈ గ్రంథాన్ని కూడ సాహిత్యాభిమానులు, సహృదయ పాఠకులు విశేషంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
తేది. 11 ఏప్రిల్ 2019 - డా. ఆచార్య ఫణీంద్ర
ఎంకుంతి సులళ్లచంలు
మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య గోదావరి జిల్లాలో జన్మించారు. ఆయన గురువుగారు దా. కట్టమంచి రామలింగారెడ్డి గారు రాయలసీమకు చెందినవారు. ఒకరోజు నండూరి వారు తమ (పాంతానికి చెందిన ఆదికవి నన్నయు గురించి గొవ్పగా చెప్పుకపోతున్నారు. అది విని కట్టమంచి వారు తమ ప్రాంకానికి దగ్గరలో ఉన్న నెల్లూరుకు చెందిన తిక్కన చాలా గొప్పకవి అని వాగ్వివాదానికి దిగారు. చర్చ కొద్దిగా వేదెక్కింది.
భబందూలి దావముక్పష్ణమాచార్వ
రామలింగారెడ్డి గారు “* ఏమిటయ్యా మీ నన్నయ గొప్ప ? పద్యమంతా సంస్క ఖతం పులమడమేనా ? మా తిక్సనను చూడు - తేట తేట తెలుగు మాటలలో ఎంత చక్కగా (వ్రాన్తాడో - ” అన్నారు. శై సాహిల్ సల్హాపాలు గ: ౮4 _ చా. ఆచార్యఫకీంద్ర శే
దానికి నండూరి వారు తిక్కన వ్రాసిన “దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ ...” అన్న పద్యాన్ని ఉటంకిస్తూ, * ఇది సంస్క ఎతం పులమడం కాదేమిటి ?” అని అడిగారు. అప్పుడు రామలింగారెడ్డి గారు ఏం మాట్లాడాలో తెలియక కాసేపు నిశ్శబ్దంగా ఉండి, తరువాత తేరుకొని, * ఆహా ! ద్రౌపదీ ! నీ ఊపిరి తిత్తులు ఎంత బలమైనవి 1” అని నవ్వుతూ అన్నారు. భష్మా [1 న. (శ న. |. టం 1 1, |. , తా స శ పళ్ల డి య రట కట్టముంచి రామణం౧అరెడ్డె దానితో రామకృష్ణమాచార్యులు గారు కూడా నవ్వాపుకోలేక ఆయనతో (శ్రుతి కలిపారు. వాతావరణం ఒక్కసారి చల్లబడింది.
ణి
1960.. 70 ల నాటి సంగతి. నా చిన్ననాట ... మా పెద్దలు చెప్పుకొంటుంటే విన్న మాట! అప్పటికి ప్రసార సాధనాలుగా ఉన్నవి వార్తా వథత్రికలు మరియు ఆకాశవాణి మాథతవమే. అవీ అంతంతమాత్రంగానే ఉండేవి.
ఆ రోజుల్లో ప్రసిద్ధ కవి, 'పోతన చరిత్రము” మహాకావ్య కర్త, డా. వానమామలై వరదాచార్యులు గారు క్షయ వ్యాధి సోకి, చాలా జబ్బుపడ్డారు. అంతలో ఎవరో ఆగంతుకుడు అనాటి యువకవి, బెత్సాహికుడు అయిన సి. నారాయణ రెడ్డి గారికి ఆచార్యులవారు పరమపదించినట్టుగా వార్త మోసారు, అశనిపాతంగా తాకిన ఆ వార్తకు ఎంతో కుందిన నారాయణరెడ్డి కవిగారు వెంటనే సంతాప సభకు ఏర్పాట్లు చేసారు. కాని... నిజానికి ఆ వార్త అసత్యం.
స న్ . ౯౩. మలనముంయక్లై మరద బణర్పులు
వరదాచార్యుల వారు అప్పుడే కొద్దిగా కోలుకొన్నారు. ఇంతలో మరొక వార్తావహుడు ఈ విషయాన్ని ఆచార్యుల వారికి అంటించాడు. ఆచార్యుల వారు కోపంతో ఊగిపోతూ, సంతాపసభ కరపత్రాన్ని చేతిలో
పట్టుకొని, సరిగ్గా సభామందిరంలోకి అడుగుపెట్టారు. అక్కడ సభాసదులు వక్తలతోబాటు యువకవి నారాయణరెడ్డి గారు ఈ విషయం తెలుసుకొని ఒకింత నిశ్చేష్టులైనా, మళ్ళీ తమాయించుకొని, వానమామలై వారికి ఎదురుగా వెళ్ళారు.
వరదాచార్యులు గారు కట్టలు తెంచుకొన్న ఆ(గ్రహంతో “నారాయణరెడ్డీ! నేను ... పోతనా?” (* నేను అంత సులభంగా పోతాననుకొన్నావా?” అని.) అన్నారు.
మ. వాంంాంయరుణలెడ్డె
అప్పుడు నారాయణరెడ్డి గారు సమయసూర్తీ చాకచక్యాన్ని రంగరించి - “అన్నా! నీవు పోతనే! మా పాలిట అభినవ పోతనవు!” అన్నారు.
వెంటనే సినారె ఆ సంతాపసభను సన్మానసభగా మార్చి, వానమామలై వరదాచార్యులు గారికి “అభినవ పోతన బిరుదప్రదానం చేయడంతో ఆ విద్వత్శవి శాంతించారు.
1954 నాటి మాట. అప్పటికింకా “ఆంధ్ర ప్రదేశొ రాష్ట్రం ఏర్పడలేదు. మహాకవి దాశరథి విశాలాంధ్ర (ఆయన దానిని 'మహాంధ్రి అనడానికి ఇష్టపడేవారు)ను ఆకాంక్షిస్తూ, “'మహాంధ్రోదయం' కావ్యాన్ని రచిస్తున్నారు. టి లం. భముతాంకము దాశరఖి “ నేనురా తెలగాణ నిగళాల తెగద్రొచ్చి ఆకాశమంత ఎత్తార్చినాను - నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు పాడి మానవుని కాపాడినాను - నేను పోతన కవీశాను గంటములోని ఒడుపుల కొన్నింటి బడసినాను - నేను వేస్తంభాల నీడలో నొక తెన్లు తోట నాటి సుమాల దూసినాను = ”
అని సీస పద్యాన్ని ఆయన పూర్తి చేసి, పైన “ఎత్తు గీత పద్యం” వ్రాయడానికి ఉపక్రమించారు.
- కోటిమంది తెలంగాణ ప్రజలకు రెండు కోట్ల ఆంధ్రా ప్రజల గురించి వివరాలు తెలియజెప్పి, ఆ మూడు కోట్ల ప్రజల (ఆ రోజుల్లో అక్కడ, ఇక్కడ కలిపి మొత్తం తెలుగు వాళ్ళ జనాభా మూడు కోట్లు) గొంతుల నొక్కటి చేసి, వారి ప్రతినిధిగా తాను 'మహాంధ్ర గీతాన్ని పాడినట్లగా పద్యం వ్రాయాలనుకొన్నారు.
దాశరథి అంతటి వారికి భావం స్ఫురిస్తే, పద్యం జలపాతంలా ఉబికి గుండె నుండి పొంగిరాదా? ఆయన కవితావేశం అలాంటిది.
“ కోటి తమ్ముల కడ రెండు కోట్ల తెలుగు
టన్నల గూర్చి వృత్తాంత మంద జేసి,
మూడు కోట్ల గొంతుల నొక్క ముడి బిగించి
పాడినాను మహాంధ్ర సౌభాగ్య గీతికా అని వ్రాసారు.
వెంటనే తన తమ్ముడు 'దాశరథి రంగాచార్య" గారు (ఆ రోజుల్లో తమ్ముడే ఆయనకు ప్రథమ శ్రోత ) కు వినిపించా రాయన. రంగాచార్య గారు (శ్రద్ధగా విని, “అంతా బాగుంది గాని, అన్నయ్యా ! ఆ 'మూడు కోట్ల గొంతుల నొక్కముడి బిగించి" అన్నదే బాగా లేదు. మూడు కోట్ల గొంతులకు ప్రతినిధిగా నిన్ను నీవు చెప్పుకోవాలన్ననీ ఉద్దేశ్వం మంచిదే గాని, దాని అర్ధం మరోలా వస్తోంది” అన్నారు. దాశరథి గారు ఆలోచనలో పడ్డారు. మళ్ళీ రంగాచార్య గారు “మూడు కోట్ల 'గొంతుల'కు ముడి బిగిస్తే చచ్చి ఊరుకొంటారన్నయ్యా! దాన్ని మార్చు” అన్నారు.
న | సగ 0. క న సం ప... బాశరఖ రంణచార్వ అప్పటివరకు కాస్త మౌనంగా ఉన్న దాశరథి గారు వెంటనే, “ నిజమేరా! ఆవేశంలో నేను గమనించనే లేదు” అని, దాన్ని“ మూడు కోటుల నొక్కటే ముడి బీగించి” అని మార్చారు. “ఇప్పుడు బాగుంది” అన్నట్టుగా రంగాచార్య గారి కళ్ళు మెరిసాయి. ( రంగాచార్య గారు నాతో స్వయంగా చెప్పిన ఉదంతం -) గ్ల సాహితీ సల్లాపాలు _ గ్రరి 1... డా.ఆచార్యఫకీంద శ్లో
నిజాం రాష్ట్రంలో కమ్యూనిస్ట్ భావాలతో ఫ్యూడల్ వ్యతిరేక పోరాట కవిగా అప్పుడప్పుడే ప్రసిద్ధిని పొందుతున్న కాళోజీ గారిని, అప్పటి “యాదగిరి గుట్ట దేవస్థాన కార్యవర్దం, ఒక కార్యక్రమంలో కావ్యగానం చేయమని ఆహ్వానించింది. ఆ యువకవి అందిందే అవకాశమనుకొని, తన 'నిజాం వ్యతిరేక పోరాట కవిత్వం) వినిపించి, వ్రజలను ఉ(రూతలూగించారు.
ఆ తరువాత ఒక కమ్యూనిస్ట్ స్నేహితుడు, కాళోజీ గారిని “నువ్వొక అభ్యుదయ కవివైయుండి, దేవస్థానంలో కవిత్వం చదువుతావా?ో అంటూ నిలదీసాడు.
ఆ కాళలేజు
దానికి కాళోజి గారు “ నేను దేవస్థానంలో చదివినా, చదివింది మాత్రం అభ్యుదయ కవిత్వమే!” అని చెప్పి, * పైగా ... నాకు నరసింహ స్వామి ఆదర్శం!” అన్నారు.
ఆశ్చర్యంగా చూసిన ఆమిత్రునికి కాళోజీ గారు ఇట్లా వివరించారు
“విశ్వ చరిత్రలో అరాచకాలు చేసిన మొట్టమొదటి నియంతృత్వ చక్రవర్తి - హిరణ్య కశిపుడు! ఆ నియంత ఎంత వేధించినా, శాంతియుతంగా సత్యాగ్రహం ద్వారా తన స్వాతంత్ర్యం కోసం పోరాడిన మొట్టమొదటి స్వాతంత్ర్య సమర యోధుడు - ప్రహ్లాదుడు! ఆ నియంతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, చట్టాన్ని చేతిలోకి తీసుకొని, చక్రవర్తినే హత్య చేసిన మొట్టమొదటి విప్లవకారుడు - నరసింహ స్వామి !”
ఆ సమాధానం విని నిరుత్తరుడయిన సదరు కమ్యూనిస్ట్ మిత్రుడు తోక ముడిచి వెళ్ళిపోయాడు.
పన వాన
కొన్ని దశాబ్దాల క్రితం మాట. ఒక ప్రముఖ పట్టణంలో తెలుగు సాహిత్య సభలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఆనాటి లబ్ధ ప్రతిష్ట మహా కవులనందరినీ ఆహ్వానించి, వారికి పెద్ద హోటల్లో బస, అన్ని వసతులను సమకూర్చారు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి మహాకవి ్రీశ్రీ గారికి ప్రక్క ప్రక్క గదుల్లో బస ఏర్పాటు చేయబడింది.
(శీథీ గారు (ఫైెష్ అప్ అయ్యాక, విశ్వనాథ వారిని పలుకరిద్దామని ఆయన గదికి వెళ్ళారు. విశ్వనాథ వారు అప్పుడే స్నానం చేసి, బాత్ రూమ్ నుండి బయటికి వస్తూ శీశ్రీ గారిని చూచి లోపలికి ఆహ్వానించి
. ప స స్ు కా త్
కుశల ప్రశ్చల తరువాత, గ్రీశ్రీ గారు చిలిపిగా “నీళ్ళోసుకొన్నారా?” అని ప్రశ్నించారు.
అప్పుడు విశ్వనాథ వారు అంత కన్నా చిలిపిగా “అవును! మీరు కంటున్నారు కదాగ౯” అని సమాధానం చెప్పారు.
గ సాహిత్ సల్లాపాలు _ గ్రే 20 ౮ళత్త _ డా.ఆచార్య ఫకీంద్ర
1950వ దశాబ్దిలోని మాట.
మా గురువుగారు “నండూరి రామకృష్ణ మాచార్య” గారిని భీమవరంలో ఒక సాహిత్య సంస్థ ఘనంగా సన్మానించాలనుకొంది. మా గురువుగారి గురువుగారు 'పింగళి లక్ష్మీకాంతం” గారిని సన్మాన కర్తగా ఆహ్వానించారు. అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి ...
తు కెంగళి లక్షీకాంతం
ఇంతలో ఒక దుర్వార్త... మహాకవి, గురువులకే గురువు “చెళ్ళపిళ్ళ వేంకట శాస్తి గారు పరమపదించారని నిర్వాహకులకు తెలిసింది. వెంటనే ఒక వార్తాహరుని మా గురువుగారి వద్దకు పంపారు. “ చెళ్ళపిళ్ళ వారు మరణించిన సందర్భంలో సన్మాన కార్యక్రమం జరుపడం బాగుండదు. ఎలాగూ ... లక్ష్మీకాంతం గారు వస్తున్నారు కాబట్టి, వారి ఆధ్వర్యంలోనే ఆ నభను చెళ్ళపిళ్ళ వారి నంతాప నభగా జరుపాలనుకొంటున్నాం. మీరూ తప్పకుండా రావాలొ అని అతడు చెప్పాడు. నిండు యవ్వనంలో అప్పుడప్పుడే కీర్తి రుచి చూస్తున్న మా గురువుగారికి ఈ వార్త అశనిపాతంలా తగిలింది.
ఇంతలో లక్ష్మీకాంతం గారు మా గురువుగారి ఇంట్లోనే దిగారు. చిన్నబోయి ఉన్న శిష్యుని నుండి విషయం తెలుసుకొన్న లక్ష్మీకాంతం గారు, * సరే! నువ్వయితే పద! చూద్దాం!” అని శిష్యుని వెంట తీసుకొని బయలుదేరారు.
నభ ప్రారంభమయింది. వింగళి లక్ష్మీకాంతం గారు ప్రసంగిస్తున్నారు ...
“చెళ్ళపిళ్ళ వారు జగద్దురువులు. నేను వారి శిష్యుణ్ణి అయినందుకు గర్విస్తున్నాను. ఆయన తెలుగు సాహిత్య చరిత్రలో ప్రాచీన యుగానికి భరత వాక్యం, నవీన యుగానికి నాందీ వాక్యంలాంటి వారు. వారికి మరణం లేదు. ఆ మాటకు వస్తే, ప్రతిభకు మరణం ఉండదు. అది ఒక జీవనదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. నిన్నటి వరకు మా గురువుగారిలో ఉన్న ప్రతిభ, ఈ రోజు నాలో, తరువాత నా శిష్యుడు నండూరి రామకృష్ణమాచార్యలో ప్రకాశిస్తూనే ఉంటుంది. అంచేత మా శిష్యుణ్జి సన్నానిస్తే, పైనున్న మా గురువుగారు తనను సన్మానించినట్టుగా సంతోషిస్తారు. పాపం! ఈ నిర్వాహకులు మా శిష్యుడు నండూరి రామకృష్ణమాచార్యను ఘనంగా సన్మానించుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకొన్నట్టున్నారు. ఇప్పుడా కార్యక్రమాన్ని జరుపుకొందాం” "అన్పి లక్ష్మీకాంతం గారు నిర్వాహకుల వైపు తిరిగారు. నిర్వాహకులు కాసేపు అవాక్కయి, తరువాత తేరుకొని, సన్మాన సామాగ్రిని ఆయన ముందుంచారు. లక్ష్మీకాంతం గారు శిష్య వాత్సల్యంతో తన చేతుల మీదుగా నండూరి వారిని ఘనంగా సన్మానించారు.
తరువాత లక్ష్మీకాంతం గారు, * ఇన్నాళ్ళు నేను చెళ్ళపిళ్ళ వేంకట్చ శాస్త్రి గారి శిష్యునిగా చెప్పుకొని జీవించాను. ఇక ఈ రోజు నుంగ్ష “నండూరి రామకృష్ణమాచార్య” గురువుగా చెప్పుకొని గర్విస్తాను.” అన్స తన ప్రసంగానికి ముక్తాయింపు పలికి, కూర్చున్నారు.
“యాకు”
7
వ్రాసింది పద్య కవిత్వమైనా, మా గురువుగారు కీశే. నందూరి రామకృష్ణమాచార్య అభ్యుదయకవిగా బహుళ ప్రసిద్ధి చెందారు. ఆయన రచించిన *ప్రగతి గీతి, 'కవితా ప్రభాసి, 'ఆలోచనమూ మొదలైన (గ్రంథాలలోని వేలాది ముక్తక పద్యాలలో ఆలోచనాత్మకమైన తాత్వికత, హేతువాదంతోబాటు అక్కడక్కడా మార్చిస్ట్ దృక్పథం కూడా తొంగి చూస్తుంటాయి. ఆ లక్షణాలే ఆయనను ఆధునిక పద్య కవులలో ఒక విశిష్ట కవిగా అగ్రేసర స్థాయిలో నిలబెట్టాయి.
అలాంటి ఆయన ఒకసారి శ్రీ సత్యసాయిబాబా గారి ఆహ్వానం మేరకు, పుట్టపర్తికి వెళ్ళి ఆయనను సందర్శించుకొన్నారు. ఈ రోజుల్లో విలేకరులకు ఇలాంటి విషయాలలో అంత నిశిత పరిశీలన, వివేచన ఉండడం అరుదు. కాని, ఆ రోజుల్లో ఒక విలేకరి మా గురువుగారు బాబా గారి ఆశ్రమం నుండి బయటకు రాగానే, ఆయనను ఇంటర్వ్యూ పేర పట్టుకొని, ఇరుకునబెట్టే ప్రయత్నంగా - “ మీరు బాబాను దైవంగా భావిస్తున్నారా ?” అని ప్రశ్నించాడు.
దానికి గురువుగారి సమాధానం : “ఆయన నిజంగా దైవమే అయితే, ఆయనలోని మానవత్వానికి నేను నమస్కరిస్తున్నాను. ఆయన మనలాంటి మానవుడే అయితే ఆయనలోని దైవత్వానికి నేను నమస్కరిస్తున్నాను.”
అంతే ... ఆ విలేకరి మరో ప్రశ్న వేయలేకపోయాడు.
“ఆలు?”
హైదరాబాదులో ఒకానొక సాహిత్య సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళాను. చాలా మంది రచయిళ్రులు, కవులు విచ్చేసారు. సమావేశ ప్రారంభానికి ముందు పెద్ద సందడిగా ఉంది. నేను, డా. ద్వానాశాప్త్రి గారు కలిసి కబుర్లు చెప్పకొంటున్నాము. మా చుట్టూ మరో పది మంది చేరారు. ద్వానా చాత్ర ఇంతలో ఒక రచయిత్రి అందరినీ కలుస్తూ, పలుకరిస్తూ హడావుడి చేస్తున్నది. నేను ద్వానాశాస్త్రి గారితో “ఎవరీవిడ?” అన్నాను. ద్వానాశాస్త్రి గారు నవ్వుతూ “ఆమె ఒక స్త్రీవాద రచయిత్రి. పురుషుణ్ణి ఉతికి ఆరేస్స, మడతబెట్ట గలదు.” అన్నారు. వెంటనే నేను “అప్పు డామెను 'స్తీవాది అనకూడదు. “ఇస్త్రీ వాది? అనాలి.” అన్నాను. ఒక్కసారిగా మా చుట్టూ నవ్వులు వెల్లివిరిసాయి.
“కవి సమ్రాటో విశ్వనాథ సత్యనారాయణ అవసాన దశలో హాస్పిటల్లో ఉన్నారు. ఇవాళో, రేపో అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి.
ఆయనకు ఆత్మీయుడయిన ఒక శివ్యుడు ఆయనను పరామర్శించడానికి వెళ్ళాడు. ఏదో రకంగా ధైర్యం చెప్పాలి కాబట్టి, ఆ శిష్యుడు గురువుగారితో “డాక్టరు గారితో మాట్లాడాను ... ఏం భయం లేదన్నారు” అన్నాడు.
మిచ్వబాంథ సత్వభారాయణ
వెంటనే విశ్వనాథ వారన్న మాట -
“వాడి బొంద! వాడికేం భయం? పోతే ,... నేను పోతాను.”
పక్కనే ఉన్న నర్ఫు కిసిక్కుమంది.
ఆత్రేయ గారు - వ్రాసి ప్రేక్షకులను, వ్రాయక నిర్మాతలను ఏడిపించేవారని ప్రతీతి. హీరో కృష్ణంరాజు గారు ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మవాకవి ఆత్రేయ గారిని "హోటల్ చోళ అన్న స్టార్ హోటల్లో పెట్టి, సకల సౌకర్యాలు సమకూర్చి, మంచి పాటలు వ్రాసిమ్మని కోరా రాయన. పది రోజులు గడిచాయి. ఆత్రేయ గారు సకల భోగాలను అనుభవిస్తూ హాయిగా తింటున్నారు, పంటున్నారు గానీ ఒక్క పాటా... చివరికి ... ఒక్క పల్లవిని కూడా వ్రాసివ్వలేదు. కృష్ణంరాజు గారు మొహమాటానికి మరో ఐదు రోజులు వేచి చూసారు. 29(ేయ అయినా, కవిగారి నుండి ఉలుకు లేదు.. పలుకు లేదు. హోటల్ బిల్లు తడిసి మోపెడయింది. గ్ల సాహిల్ సల్లాపాలు ౭2 _ దా.ఆచార్యఫడీంద బే
హీరో- కం- నిర్మాత కృష్ణంరాజు గారికి తెగ కోపం వచ్చింది. వెంటనే ఆత్రేయ గారిని ప్రక్మనే ఉన్న అర కొర వసతుల 'పల్లవ హోటల్ లోని రూమ్ కు మార్చారు. ఆత్రేయ గారు రెండు రోజుల్లోనే అన్ని పాటలు వ్రాసిచ్చి, రూం ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. అద్భుతమైన ఆ పాటలను చూసుకొన్న కృష్ణంరాజు గారు మనసు నొచ్చుకొని ఆత్రేయ గారి ఇంటికి వెళ్ళి, కృతజ్ఞతలు చెప్పి, ఆసక్తిగా - “చ్రోళ్లు లో పదిహేను రోజులున్నా బయటకు రాని పల్లవులు 'పల్లవిలో రెండు రోజుల్లోనే ఎలా వచ్చాయి మాష్టారూ?” అని అడిగారు. ఆత్రేయ గారు నవ్వుతూ, “చోళులకు, పల్లవులకు పడదురా! చోళ సామ్రాజ్యం నుండి బయట పడ్డాక, పల్లవులు పరుగెత్తి వచ్చాయి” అన్నారు. తీ నమ్ము | ఖే 1౦01ల. 1 లి (స లకి వాచ్ సం
విజయవాడలో ఒకప్పుడు 'కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారితోబాటు అనేక లబ్ధ ప్రతిష్ట సాహితీమూర్తులు ఉండేవారు. వారంతా సాయంత్రం కాగానే ఒక టిఫిన్ సెంటర్ దగ్గర కలుసుకొని, టిఫిన్ చేస్తూ, సాహిత్య చర్చలతోబాటు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొని, చీకటి పడ్డాక ఇళ్ళకు వెళ్ళేవారు. ఒకనాటి సాయంత్రం విశ్వనాథ వారు టిఫిన్ సెంటర్ వద్దకు కాస్త ఆలస్యంగా చేరుకొన్నారు. ఆలోపే అక్కడకు చేరుకొన్న సాహితీ మిత్రులు 'అట్లు వేయించుకొని ఆరగిస్తున్నారు. విశ్వనాథ వారు రాగానే ఒక మిత్రుడు - “మీకూ "అట్లు వేయించమంటారా?” అని అడిగాడు. దానికి విశ్వనాథ వారి సమాధానం -- “అట్లే కానిండు!”. యాకు”
నా పాత మిత్రుడైన ఒక అర్ధజ్ఞాని కలిసాడు. 'జ్ఞాని' విన్నాం - “అజ్ఞాని విన్నాం. ఈ '“అర్ధజ్ఞాని ఏంటి - అనుకొంటున్నారా? సగం తెలిసి, సగం తెలియనివాణ్ణి ఏమనాలో తెలియక ఆ పదబంధాన్ని సృష్టించాను మరి.
రావడం, రావడమే వాడు నాపై దాడి చేస్తూ, “మీ కవులు - ఎక్కడో ఆకాశంలో ఉన్న సూర్యునికి, నేలపై కొలనులో ఉన్న కమలానికి సంబంధాన్ని అంటగడతారు. వాటి మధ్య ప్రేమ... దోమ... అంటూ కథలు చెబుతారు. నిజానికి సూర్యుని దగ్గరగా కమలం వెళితే చచ్చి ఊరుకొంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే, మాడి మసైపోతుంది. “ అన్నాడు.
“దాన్ని *కవీ సమయం” అంటారు నాయనా! సూర్యుని కిరణాలు సోకి, కమలం ఆనందంగా వికసిస్తుంది కాబట్టి అది సూర్యునికి (పేమికురాలుగా మనం భావించాలి. అంతే!” అని వివరించాను.
వెంటనే వాడు “కమలం (ప్రేమికురాలైతే ... మరి 'పొద్దు తిరుగుడు పువ్వు, సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతుంది. - దాన్ని *కామ పిశాచి” అనాలా?” అన్నాడు.
నేను కంగు తిని, “ఇక వాడికేమి చెప్పను?” అనుకొని మౌనంగా ఉండిపోయాను. 4__సాహితీ సల్లాపాలు 44224౬ __చా.ఆచార్యఫకీంద్ర
ఒకానొక కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ పోస్టుకు ప్రకటన వెలువడినప్పుడు, కరీంనగరులో కళాశాల “పిన్సిపాలొ గా పనిచేస్తున్న మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు అపై చేసుకొన్నారు. ఇంటర్వ్యూ రోజు తెలుగు శాఖాధిపతి - అభ్యర్థి విశ్వనాథ వారికి ప్రశ్చలు సంధించడం (ప్రారంభించారు.
తెలుగు శాఖాధిపతి : నీ పేరు?
విశ్వనాథ వారు : (నన్నే గుర్తించ లేదా? పైగా ఏక వచన ప్రయోగమా?” అని కోపం వచ్చినా తమాయించుకొని ...) విశ్వనాథ సత్యనారాయణ.
తెలుగు శాఖాధిపతి ; ఏమేం కావ్యాలు వ్రాసావు?
విశ్వనాథ వారు : (పేరు చెప్పాక కూడా అటువంటి ప్రశ్న వేసేసరికి పట్ట లేని కోపంతో ...) నేనేం కావ్యాలు వ్రాసానో కూడా తెలియకుండానే ఇక్కడ 'తెలుగు శాఖాధిపతి ఎలా అయ్యావు? నీలాంటి వాడు ఉన్నంత కాలం ఈ విశ్వవిద్యాలయం మెట్లపై అడుగిడను. ( అంటూ కోపంగా వెళ్ళిపోయారు.)
ఇంత వరకు చాలా మందికి తెలిసిన కథే. చాలా ఏళ్ళ తరువాత ఈ విషయం విశ్వనాథ వారు కూడ స్వయంగా వ్రాసుకొన్నారు.
కొసమెరుపు : విశ్వనాథ వారు స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాక, రిటైరైన ఆ తెలుగు శాఖాధిపతిని ఒక సాహిత్యాభిమాని “ ఇది నిజమేనా?” అని అడిగాడు. దానికి ఆ సాహితీమూర్తి సమాధానం -*“ ఆయన మహాకవి అని నాకు తెలుసు. ఆయన రచించిన గ్రంథాల వివరాలు కూడ తెలుసు. కాని, ఇంటర్వ్యూలలో పరీక్షకుడు తనకు సమాధానాలు తెలిసి కూడా అభ్యర్థిని ప్రశ్చిన్తాడని ఆయనకు తెలియక పోతే నేనేం చేయను?” ప శ కో మం. 1 (1. జకరుదురాబా రామరాజా ఆనాటి ఆ తెలుగు శాఖాధిపతి - ఆచార్య బిరుదురాజు రామరాజు గారు.
చాలా కాలం క్రితం నాటి మాట!
మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారికి కేంద్ర ప్రభుత్వం “పద్మ విభూషణ్” పురస్కారాన్ని (ప్రకటించింది. విజయవాడలో ఆయనకు అభిమానులు ఘనమైన సన్మాన సభను ఏర్పాటు చేసారు.
ఆయనతో సిద్ధాంతపరమైన వైరుధ్యాలున్న (శ్రీభీ గారు కూడ ఆయనపై గల వ్యక్తిగత గౌరవంతో ఆ సభకు వెళ్ళారు. అయితే చాలా మంది సంప్రదాయవాద కవులున్న ఆ సభలో ఆయన చివరి వరుస కుర్చీలలో ఒక మూల కూర్చున్నారు.
సభాప్రారంభ సమయానికి విచ్చేసిన విశ్వనాథ వారు వేదిక పైకి వెళ్ళే మెట్ల నెక్కబోతూ ఆగి, సభాసదులందరినీ ఒక్కసారి పరికించారు. దూరంగా చివరి వరుసలో కూర్చున్న శ్రీఖ్రీ గారిని చూసిన విశ్వనాథ వారు ఆయనతో - “జ్రీభ్రీ! ఇలా రా!” అని పిలిచారు. శ్రీశ్రీ గారు తప్పదన్నట్టుగా వెళ్ళి ఆయన ముందు నిలుచున్నారు. విశ్వనాథ వారు ఆయనతో - “నాకు “పద్మవిభూషణ్” పురస్కారం ఇచ్చారు ... వచ్చి కలసి అభినందించవలసిన అవసరం లేదా?” అని ప్రశ్నించారు. దానికి (థీథీ వెంటనే - “లేదండి! ఎకంగా “భారత రత్న వచ్చాక కలసి అభినందిద్దామనుకొన్నాను.” అని సమాధానమిచ్చారు,
విశ్వనాథ వారు ఇకీ మరోమాట లేక, నవ్వుతూ వేదిక పైకి ప్రస్టానించారు.
సమా వాన
మహాకవి (శ్రీశ్రీ గారికి ప్రసిద్ధ కవి ఆరుద్ర గారు వరుసకు మేనల్లుడవుతారు. ఆరుద్ర గారు కొంత శ్రీశ్రీ గారి ప్రభావంతోనే తొలి అడుగులు వేసారని చెప్పవచ్చు. ఆరుద్ర గారి తొభి కావ్యాన్ని (ీభ్రీ గారు మెచ్చుకొని ఎంతో ప్రోత్సహించారు. 'తెలంగాణ” అని ఆరుద్ర గారు పెట్టుకొన్న ఆ కావ్య శీర్షికను *త్వమేవాహరి గా మార్చింది కూడా ీథీ గారే. లన పష | ల జ్ ఆరు అయితే ఆ తరువాతి కాలంలో వాళ్ళిద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. ఆ పైన ఆరుద్ర గారు స్వతంత్ర భావజాలంతో ఎదిగారు. 4 సాహితీ సల్లాపాలు ముం యడ దాంఆచార్వఫనీంద 1
అలవాటు ప్రకారం శ్రీశ్రీ గారు అడపాదడపా ఇతర కవుల మీద విసుర్లు విసిరినట్టు (పింగళి గారి సినిమా పాటను మార్చి * ఎంత ఘాటు (ప్రేమయో... ఇంత లేటు వయసులో...” అనడం, “ప్రధాన మంత్రి కాగోరు - రబీంద్ర నాథ్ టాగోరు, “సినారె... మూసీ కినారె అని ప్రాసలు ప్రయోగించడం వంటివి అన్న మాట) ఆరుద్ర గారి పైనా విసిరే వారు,
ఇది తెలియని ఒక సాహితీ మిత్రుడు ్రీశీ గారితో “మీ శిష్యుడు ఆరుద్ర ...” అంటూ ఏదో చెప్పబోయాడు. వెంటనే గశ్రీభీ గారు గట్టిగా నవ్వి - “* వాడు నా శిష్యుడు అంటే ... నేనొప్పుకోను. నేను వాడి గురువంటే వాడొప్పుకోడు.” అన్నారు.
“త్తాకలు?
శమ. లూ రర
చాలా కాలం క్రితం ఆంధ్ర సచిత్ర వార పత్రికలో చదివిన జ్ఞాపకం-
“భక్త కన్నప్పు సినిమా షూటింగ్ జరుగుతోంది. కథానాయిక వాణిథీ గారు డైలాగ్ చెబుతున్నారు ...
“= నా మావను బ్రతికించు సామీ!”
దర్శకులు బాపు గారు మాటల రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి వంక చూసారు.
బాపు
ముళ్ళపూడి గారు వాణిథ్రీ గారితో - “చూడమ్మా! బ్రతుకు
కాదు - “బతుకు అనాలి.” అన్నారు.
వాణిశ్రీ గారు మళ్ళీ చెబుతూ - “నా మావను బ్రతికించు సామీ!” అన్నారు.
బాపు గారు - “ఇది గిరిజన కన్య పాత్ర కదా! “బ్రతుకు అనకూడదు. “బతుకు అనాలి” అని వివరించారు.
సరేనన్న వాణిభ్రీ గారు యథాలాపంగా మళ్ళీ - “నా మావను బ్రతికించు సామీ!” అనేసారు.
వెంటనే బాపు గారు చిరాకుగా - “చూడమ్మా! ఆ “బ్ర” తీసేయ్ ” అన్నారట.
షూటింగ్ సిబ్బంది పగలబడి నవ్వకుండా ఎలా ఉండగలరు?
- అక్కినేని నటించిన 'దేవదాసు' విడుదలై, ఆ చిత్రంలోని పాటలు మారుమోగుతున్నాయి.
ఆ చిత్రానికి మాటలు, పాటలు రచించిన సముద్రాల రాఘవాచార్య గారు చెన్నపట్నంలో ఒకరోజు బంధువుల ఇంటికి వెళ్ళడానికి రిక్షా ఎక్కారు. ఆ రిక్షా కార్మికుడు అయ్యవారిని గుర్తించి రిక్షా తొక్కుతున్నంత సేపు ఆ చిత్రంలోని మాటలు, పాటల గురించి ఒకటే పొగుడుతూ ఉన్నాడు.
రిక్షా దిగుతున్న సముద్రాల వారితో ఆ రిక్షా కార్మికుడు * అన్నీ బాగా అర్ధమయ్యాయి గాని - ఆ “కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్” అన్న పాటే సరిగా అర్ధం కాలేదు బాబయ్య - ఆ పాట అర్ధం ఏంటండి?” అని అడిగాడు.
ఎంతో తాత్తిక ద ఎహో (వ్రాసిన ఆ పాటకు అర్ధం వివరించే ఓపిక, సమయం లేకో, లేక ఆ వివరణను అందుకొనే స్థాయి వాడికి లేదనుకొన్నారో గాని, ఆచార్యుల వారు నవ్వుతూ - “త్రాగుబోతు పాడే పాటకు అర్ధమేముంటుందిరా అబ్బీ!” అంటూ వాడి చేతిలో డబ్బులు పెట్టి, ఇంటిలోకి వెళ్ళిపోయారు.
యాకు”
నగరంలోని "త్యాగరాయ గానసభిలో ఒక ప్రసిద్ధ సంస్థ నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని, కవులమంతా సరదాగా మాట్లాదుకొంటూ రోడ్డెక్కాం. పక్కనే ఉన్న 'సుధా దర్శని” హోటల్లో గొట్రీ తాగుదాం రండి” అంటూ కవులందరినీ ఆహ్వానించాను. హోటల్లోకి వెళ్ళాక - “నేను టీ తీసుకొంటాను. మీకు 'టీ యా? "కాఫీ యా?” అని అడిగాను. వెంటనే కవి మిత్రుడు 'మరుమాముల దత్తాత్రేయ శర్మ' - “మేమంతా “టీ'చరులమే!” అన్నారు. అందరం నవ్వుకొంటూ 'టీ' సేవించాం.
1974 - 75ల నాటి మాట -
నల్లని జుత్తు(హెయిర్ డై చేసిందే లెండి), తెల్లని జుబ్బా వేసుకొని ట్రిమ్ గా ఉన్న గీత రచయిత ఆత్రేయ గారు ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఆఫీస్ నుండి రెమ్యూనరేషన్ తీసుకొని బయటకు వస్తున్నారు. బయట అప్పుడప్పుడే ఫీల్డ్ లోకి వస్తున్న నడి వయస్సుడు.. కాస్త నలుపు, తెలుపు జుత్తు ... కొద్దిగా బట్టతల ఉన్న రచయిత కనబడి నమస్కరించారు. ఆయనను వేటూరి సుందరరామమూర్తి గా గుర్తించిన ఆత్రేయ గారు - “ఏమిట్రా ఆ తెల్ల జుత్తు? కాస్త రంగు రాసుకొని ట్రిమ్ గా కనిపిస్తే నాలుగు చాన్సులొస్తాయి. నన్ను చూడు .. ముసలాడిని - ఎంత ట్రిమ్ గా ఉన్నానో!” అన్నారు. వేటూరి గారు నవ్వుతూ - “మీతో పోటీ పడగలనా గురువుగారు? ” అన్నారు.
చటుల సుందరంయా ముముణక్లై
గ సాహిత్ సల్లాపాలు 44404 _దా.ఆచార్యఫజీంద్ర __శ్లే
రెండేళ్ళ తరువాత 'సిరిసిరి మువ్వ), “అడవి రాముడు పాటలు ఒక ఊపు ఊపుతున్నాయి. మళ్ళీ ఆ ఇరువురు కవి దిగ్గజాలు ఒక స్టూడియోలో తారసపడ్డారు. ఈ మారు వేటూరి గారు ఉన్న కాస్త జుత్తును చక్కగా డై చేసి ట్రిమ్ గా ఉన్నారు. ఆత్రేయ గారు వూర్తిగా తెల్ల జుత్తు, మాసిన జుబ్బాతో కనిపించారు. వేటూరి గారు ఆత్రేయ గారితో - “వంటి గురువుగారు! నా జుత్తుకు రంగు రాసుకొమ్మని చెప్పి, మీరు రాసుకోలేదే? *” అని అడిగారు. ఆశ్రేయ గారు కాస్త పెదవి విరిచి - “సరే .. ! నువ్వు రాయడం మొదలు పెట్టాక, నేనెక్కడ రాస్తున్నానురా?” అన్నారు,
వేటూరి గారు ఆత్రేయ చేయి పట్టుకొని శిరస్సు వంచి నమస్కరించారు.
“కలు?
హైదరాబాదులోని ఆంధ్రమహిళాసభ కళాశాల ఆడిటోరియంలో కడిమెళ్ళ వరప్రసాద్ గారి అష్టావధానం జరుగుతున్నది. నాతోబాటు సాహితీమిత్రులు కొందరు పృచ్చకులుగా కూర్చొని ఉన్నాం.
దత్తపది అంశం నిర్వహిస్తున్న పృచ్చకుడు- “చికెన్, మటన్, ఫిష్ ప్రాన్స్” అన్న పదాలిచ్చి భారతార్థంలో పద్యం చెప్పమన్నారు.
అవధాని - “* మొదటి మూడు పదాలను గురించి విన్నాను గాని, నాలుగో పదమేంటో నాకు అర్ధం కాలేదు ” అన్నారు.
అప్పుడు అవధానికి సభాసమన్వయకర్త 'ప్రాన్స్ ” అంటే ఏమిటో చెప్పే ప్రయత్నం చేసారు. ఇంతలో నేను అందుకొని - “అదేనండి! ప్రాన్స్ అంటే ప్రాణులు అన్నాను.
సభలో అందరూ పగలబడి నవ్వారు.
“జికా”
చాల నాళ్ళ క్రితం ప్రముఖ కవి 'ఉండేల మాలకొండారెడ్డి గారితో ఒక కవి మిత్రుడు - తనకు రావలసిన పురస్కారం ఫలానా వారి సిఫార్సుతో వేరే కవికి వెళ్ళిపోయిందని చెప్పుకొని బాధపడ్డాడట. || వ్ గ్ వి చందేల మాలకొండారెడ్డి అప్పుడు మాలకొందారెడ్డి కవి గారు - “చ్రూడు నాయనా! ఈ లోకమే అంత! - (క్రింద ఉన్నది భువి - పైన ఉన్నది రవి - నడుమ ఉన్నదంతా "పైరవి%” అని ఆ కవిని ఓదార్పారట.
చరిత్రలో దాఖలాలు లేవు గాని, కవయిత్రి మొల్లమాంబకు, తెనాలి రామకృష్ణునికి వాగ్యుద్ద్ధాలు జరిగినట్లుగా కొన్ని కథలు ప్రచారంలో ఉ న్నాయి. అలాంటిదే ఇది.
కవలయి[క్రై మొల్లముాంబ
మొల్ల కుమ్మరి పిల్ల అని జగమెల్ల ఎరిగినదే. ఒకనాడు ఆమె సంతలో కుండలను పెట్టుకొని అమ్ముకొంటుంది. ఆ సమయంలో అటువైపు వచ్చిన తెనాలి రామకృష్ణుడు కొంటెతనంతో ఆమె చెంతకు చేరి, సమాన పరిమాణంలో ఉన్న రెండు కుండలను చేతితో చూపుతూ, కళ్ళతో ఆమె స్థన యుగాన్ని వీక్షిస్తూ - “పిల్లా! నీ కుంభద్వయిని ఎంత కిస్తావు?” అని అడిగినాడు.
దానికి ఆ కవయిత్రి ఇచ్చిన సమాధానం - “నేను నీకు అమ్మనురా!”
238
ఒక పండితుడు కిరాణూ కొట్టుకు వెళ్లి “మా ఆవిడ బిర్యానీ చేయాలనుకొంటుంది. శ్రేషఘమయిన బియ్యం చూపవయ్యా!” అని అన్నాడట. ఆ కొట్టు యజమాని -“వసుమతి” అన్నాడు. “వసుమతా? బాసుమతా?” అని (ప్రశ్నించాడు ఆ పండితుడు. దానికి ఆ కొట్టువాడు “పండితులు! మీకు చెప్పాలా? ఉత్తరాది వారు *“విని '*బిగా పలుకుతారు. వసుమతేనండి!” అన్నాడు. ఆ పండితుడు “వీడి పాండిత్యం కూలా!” అని మనసులో అనుకొని, బియ్యం తీసుకొని ఇంటికి వెళ్లాడు.
మరో రోజు... ఆ పండితుడు మళ్ళీ ఆ కొట్టుకే వెళ్లి “మా ఆవిడ నువ్వుల లడ్డులను చేయాలనుకొంటుంది. మేలు రకం నువ్వులను చూపించు” అన్నాడు. వెంటనే ఆ కొట్టు యజమాని “తిలోత్తమ” అన్నాడు. అర్ధం కాక ఆ పండితుడు “అదేమిటి?” అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ కొట్టు యజమాని “పండితులు! మీకు చెప్పాలా? తిలలలో ఉత్తమమైనది.” అన్నాడు. దానికి ఆ పండితుడు “ఓరి నీ తెలివి మండగొ అని మనసులో అనుకొని, మారు మాట్లాదకుండా నువ్వులను, నవ్వులను తీసుకొని ఇంటి దారి పట్టాడు.
(2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో కవులందరూ కబుర్లు చెప్పుకొంటున్న సమయంలో, కవి మిత్రులు “రసరాజు గారు చెప్పిన ప్రహసనం ఇది.)
“ఆలు?
1980 ప్రాంతంలో “ఆధునిక కవిత - అభిప్రాయ వేదిక” అన్న (గ్రంథాన్ని రూపొందిస్తూ, ప్రముఖ కవి డా. ఆచార్వ తిరుమల - పలువురు ఆధునిక మహాకవులు రచించిన కావ్యాలపై ఆనాటి మహాకవుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
ఆ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ రచించిన “ఖడ్గ సృష్ట కావ్యంపై తన అభిప్రాయం చెప్పమని మరొక మహాకవి గుంటూరు శేషేంద్రశర్మను అడిగారు.
శుంటూరు శషంగ్రశర్న దానికి ఆ కవీంద్రుడు ఇచ్చిన సమాధానం -
“= అందులో ఖద్గ్దమూ లేదు - సృష్టీ లేదు”
(“ఈ అభిప్రాయం సరైనదా? కాదా?” - అన్నది ఇక్కడ చర్చనీయాంశం కాదు, ఆ కవి పలుకులోని చమత్మారమే ప్రధానం.)
కాళోజీ నారాయణరావు గారు నడివయన్సు దాటుతున్న సమయంలో గడ్డం గీసుకోడం మానివేసారు.
అప్పుడొక సన్నిహిత మిత్రుడు ఆయనను - “ఏంది కాళన్నా! గడ్డం 'పెంచుతున్నవ్?” అని ప్రశ్నించాడు.
కాళోజీ గారు వెంటనే - '“నేనెక్సీడీ పెంచుశున్నరా? అదో "పెరుగుతున్నది! నేనేమన్నా .. ఎరువు వేసి పెంచుతున్ననా ఏంది?” అని ఎదురు ప్రశ్నించారు.
అంతే! .. ఆ మిత్రుడు అవాక్కయి, ఆ పైన తేరుకొని నవ్వుతున్న కాళోజీ గారితో (శుతి కలిపాడు.
“ఎ్రా్టతైలు?
హైదరాబాదులో “రమ్య సాహితీ సంస్థ” వారి సాహిత్య పురస్కారం స్వీకరించేందుకు వెళ్ళాను.
కార్యక్రమానికి ముందు సాహితీ మిత్రులు సాధన నరసింహాచార్య, మరుమాముల దత్తాత్రేయ శర్మ, వి.వి. సత్యప్రసాద్, నేను సరదాగా మాటాడుకొంటున్నాం. మాటలు సినిమాల్లో పతనమవుతున్న విలువల పైకి మళ్ళాయి. “నాటి హీరోయిన్లకు, నేటి హీరోయిన్లకు ఎంత తేడా!” అని నిట్టూర్భారు దత్తాత్రేయ శర్మ గారు.
॥ శ్ తా | న ల వసో ...
వెంటనే సత్యప్రసాద్ గారు అందుకొని -*అవునవును ... నాటి హీరోయిన్లు చండీ రాణులు! నేటి హీరోయిన్లు చెడ్డీ రాణులు!!” అన్నారు.
అందరం నవ్వుల్లో మునిగి తేలాం.
“భక్తి ప్రసూనాలు, 'పద్య (ప్రసాదం' గ్రంథాల రచయిత వి.వి. సత్యప్రసాద్ గారు కవి మిత్రులందరినీ వారింట్లో భోజనానికి ఆహ్వానించారు.
భోజనానికి ముందు అందరు సత్యప్రసాద్ గారి (గ్రంథాలలోని పద్య రచనా పాటవాన్ని గురించి మాటాడుతున్నారు.
“సత్య ప్రసాద్ గారి వృత్తి బ్యాంక్ ఉద్యోగమైనా, ప్రవృత్తి అయిన పద్య రచనలో ఎప్పుడూ లెక్క తప్ప లేదు” - అన్నారు సాధన నరసింహాచార్య గారు.
“ఎలా తప్పుతారు? ఆయన చేతిలో ఉండేది 'మని' అయినా, గుండెలో కొలువుండేది “ఆమని” మరి!” అన్నారు వై. రామకృష్ణా రావు గారు!
నాతోబాటు మరి కొందరు కవి మిత్రులు “బాగుంది! బాగా చెప్పారు!” అని స్పందించాం,
(గ్రంథకర్త పరిచయం (తెలుగు వికీపీడియా నుండి) దా. ఆచార్యఫణీంద్ర (కలంపేరు)
జననం వ 27 జూలై 1961
నిజామాబాదు పట్టణం తల్లిదండ్రులు : కీ.శే. గోవర్ధనం దేశికాచార్య
కీశే. గోవర్ధనం ఇందిరాదేవి నివాసం హైదరాబాదు అసలుపేరు : గోవర్ధనం వేంకట ఫణీంద్రశయనాచార్వ చదువు : మెకానికల్ ఇంజనీరింరింగ్లో పట్టభద్రుడు
తెలుగులో ఎం.ఏ., తెలుగులో డాక్టరేట్ డిగ్రీ విద్యాసంస్థలు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా)
ఉస్మానియా విశ్వవిద్యాలయం వృత్తి ఏ “అణు ఇంధన సంస్థలో “ఎఫ్” (గ్రేడు సైంటిస్టు (ప్రవృత్తి కవి, విమర్శకుడు
డా. ఆచార్య ఫణీంద్ర ప్రముఖ తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు.
వృత్తిరీత్యా శాస్త్రవేత్త ఆయన తెలుగు కవిత్వంలో పద్యం, గేయం మరియు వచన కవిత్వంలో సుప్రసిద్ధులు. పరిశోధకునిగా, విమర్శకునిగా కూడ ప్రసిద్ధినొందారు. ఆయన కవితలు, వ్యాసాలు నాలుగు దశాబ్దాలుగా వివిధ పత్రికలలో, అనేక సంచికలలో విరివిగా ప్రచురించబడుతున్నాయి.
జీవిత విశేషాలు
ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా. బండలింగాపురం (గ్రామం. ఆయన తండ్రిగారు వృత్తిరీత్యా నిజామాబాదు పట్టణంలో నివాసమున్న కాలంలో, ఆచార్య ఫణీంద్ర 27 జూలై 1961 (వ్యాస పూర్ణిమ) నాడు నిజామాబాదు పట్టణంలో జన్మించారు. హైదరాబాదులో ఉన్నత విద్యాభ్యాసం చేసారు. ఆయన తండ్రి గారు కీ.శే. గోవర్ధనం దేశికాచార్య, తల్లి కీ.శే. ఇందిరాదేవి.
ఆయనది పండిత కుటుంబం. ఆయన పితామహులు (నాన్నగారి నాన్నగారు) “గోవర్ధనం నారాయణాచార్యులు”, మాతామహులు (అమ్మకు నాన్నగారు) “ఆచి వేంకట నృసింవాచార్యులు సంస్కృతాంధ్ర పండిత కవులు. అలాగే అమ్మకు తాతగారు “ఆచి రాఘవాచార్య శాస్తులు గారు” కూడా పండితులు, కవులు. ఈ ముగ్గురి గూర్చి తెలంగాణ వైతాళికులు, సుప్రసిద్ధ సాహితీమూర్తి కీ.శే. సురవరం ప్రతాపరెడ్డి గారి సంపాదకత్వంలో (ప్రచురితమైన “గోలకొండ కవుల సంచికలో ప్రస్తావించబడింది.
ఆచార్య ఫణీంద్ర మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడు. తెలుగులో ఎం.ఏ. డిట్రీని సాధించారు. తెలుగులో డాక్టరేట్ డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “19వ శతాబ్ది తెలుగు కవిత్వం” అనే విషయం పై పొందారు. ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాన్మో స్కృతులు, వరాహ శతకం, తెలంగాణ మహోదయం వంటి పద్యకవితా (గ్రంథాలను రచించి మంచి పద్యకవిగా గుర్తింపు పొందారు.
వృత్తిరీత్యా 1983లో కేంద్రప్రభుత్వ సంస్థ “ఎన్. ఎఫ్.సి.”లో చేరారు. ప్రస్తుతం హైదరాబాదులో “ఎఫ్” గ్రేడు స్రెంటిస్టుగా కొనసాగుతున్నారు. ఉద్యోగపరంగా అనేక సదస్సులలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వం దిగుమతి చేసుకొన్న అణు ఇంధనాన్ని తనిఖీ చేయడానికి రష్యాకు పంపిన బృందంలో ఈయన కూడా ఒకరు. ప్రవృత్తి పరంగా సాహితీవేత్త తెలుగు సాహిత్యంలో “మాస్కో స్కృతులు” పేరిట 'తొలి సమగ్ర విదేశ యాత్రా పద్య కావ్యాన్ని
రచించారు. తెలుగు వచన కవిత్వ సాహిత్యంలో “ఏక వాక్య కవితల” ప్రక్రియకు ఆద్యులు. ఆయన చూపిన మార్గంలో చాల మంది యువ కవులు, కవయిత్రులు అంతర్జాలంలో వేలాది ఏక వాక్య కవితలను రచిస్తున్నారు. “వాక్యం రసాత్మకం” పేరిట తెలుగు సాహిత్యంలో ఆయన రచించిన తొలి ఏక వాక్య కవితల [గ్రంథం "51౧916 58౧[6౧06 06॥8౧19" పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది. ఆయన శ్రీశ్రీ శతజయంతి (2010) సందర్భంగా, నిండు సభలో, మహాకవి శ్రీశ్రీ “మహా ప్రస్థానం” నంవూర్మ కావ్యగానం ఏకబిగిన వ్యాఖ్యాన నపాతంగా చేని మన్ననలందుకొన్నారు. “తెలంగాణ మహోదయం” పేరిట ఉద్యమ కవిత్వాన్ని రచించి, ఇటీవలే గ్రంథ రూపంలో పాఠకులకు అందించారు. రచనలు :
ముద్రితాలు
-
ముకుంద శతకం (కంద పద్య కృతి)
-
కవితా రస గుళికలు (మినీ కవితల సంపుటి)
-
పద్య ప్రసూనాలు (పద్య కవితా సంపుటి)
4 _ విజయ విక్రాంతి (కార్గిల్ యుద్దంపై దీర్హ కవిత)
-
ముద్దు గుమ్మ (పద్య కావ్యం)
-
వాక్యం రసాత్మకం (ఏక వాక్య కవితలు)
7 మాస్కో స్మృతులు (విదేశ యాత్రా పద్య కావ్యం)
-
"510016 56016౧06 061006" (వాక్యం రసాత్మకం' అనువాదం,
-
_ వరాహ శతకం (అధిక్షేప, హాస్య, వ్యంగ్య కృతి)
-
తెలంగాణ మహోదయం (ఉద్యమ కవితల సంపుటి)
-
సాహితీ సల్లాపాలు (సాహితీ ఛలోక్తుల సంపుటి)
అముద్రితాలు
- పద్య పరిమళాలు (పద్య కవితా సంపుటి)
2 సీతా హృదయం (గేయ కావ్యం)
- _ కులీ కుతుబు కావ్య మధువు (పద్య కృతి)
శీ భారత భారతి (వ్యాఖ్యాన గ్రంథం)
-
ఉషోదయ యుగం (పందొమ్మిదవ శతాబ్ది తెలుగు కవిత్వంలో నవ్యత, (పి. హెచ్.డి. సిద్ధాంత గ్రంథం)
-
పాద రక్ష (పద్య కావ్యం)
-
నీలి కురుల నీడలో (లలిత గీతాలు)
& _ నవ్య పద్య విద్యానాధులు (ప్రముఖులతో ముఖాముఖి)
- మౌక్తికం (ముక్తక పద్యాల సంపుటి)
అవార్డులు ఆయన అనేక అవార్డులు, గౌరవాలు ప్రభుత్వం మరియు ఇతర
సాంస్కృతిక సంస్థల నుండి పొందారు. ప్రధానంగా - 'వానమామలై
వరదాచార్య” స్మారక పురస్కారం, 'దివాకర్ల వేంకటావధాని" స్మారక
పురస్కారం, 'పైడిపాటి సుబ్బరామశాపస్తి స్మారక పురస్కారం, “ఆచార్య
తిరుమలి స్మారక పురస్కారం, '“బోయిపాటి వేంకట రామారావు స్మారక
పురస్కారం, “రంజని - విశ్వనాథ” పురస్కారం, 'సిలికానాంధ్రి చేయ
కవితా పురస్కారం, మూడు సార్లు విజయవాడ 'ఎక్స్రే' పురస్కారాలు,
పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం 'ఉగాది' సత్మారాలు పేర్కొనదగినవి. ఆయన
2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, 2014
లో అమెరికాలోని అట్లాంటాలో జరిగిన “నాటా తెలుగు సభలలోనూ
గౌరవింపబడ్డారు. ఆయన హైదరాబాదులోని “వి. ఎల్.ఎస్. లిటెరరీ అండ్
సైంటిఫిక్ పౌండేషన్” నుండి “పద్య కళా ప్రవీణ” పురస్కారాన్ని పొందారు.
తూర్పుగోదావరి జిల్లా ఏలూరు లోని “నవ్య సాహిత్య మండలి” నుండి
“కవి దిగ్గజ” పురస్కారాన్ని పొందారు. హైదరాబాదులోని “నవ్య సాహితీ సమితి” నుండి “ఏకవాక్య కవితా పితామహ” పురన్మారాన్నిి కరీంనగర్ లోని “శరత్ సాహితీ కళా స్రవంతి” నుండి “ఏకవాక్య కవితా శిల్పి” పురస్మారాన్ని పొందారు.
ఆయన ప్రస్తుతం “యువభారతి” కి అధ్యక్షులుగాను, “పద్య సారస్వత పరిషత్” తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగాను, “ఆంధ్ర పద్య కవితా సదస్సు"కు ఉపాధ్యక్షులుగాను, “నవ్య సాహితీ సమితి"కి ఉపాధ్యక్షులుగాను మరియు “నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం” నకు ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. ఆయన “ఆంధ్రపద్య కవితా సదస్సు” యొక్క పత్రిక “సాహితీ కాముదికి పదేళ్ళపాటు సహసంపాదకులుగా వ్యవహరించారు. ఆయనకు 2018 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు “పద్య కవిత్వంలో “కీర్తి పురస్కారాన్ని” ప్రదానం చేసారు.
2017 డిసెంబరులో తెలంగాణ రాష్ట ప్రభుత్వం హైదరాబాదులో నిర్వహించిన “ప్రపంచ తెలుగు మహాసభల” లో పద్యకవి సమ్మేళనం అధ్యక్షులుగా వ్యవహరించి సత్మరించబడ్డారు.
“౧౮ '్ర్యాజైబు?-
యా. ధయ లం | ఫ/ శం, జ్జ లే 1 పి గ
షట ఫస! త ాా మ్య ్ష ( లా క ఏ. కం నాక్ ల ని కట = క ] తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర పూర్వ హోంశాఖామాత్యులు శ్రీ నాయిని నరసింహారెడ్డి గారిచే విశ్వవిద్యాలయ “కీర్తి పురస్కారం(2018)” ప్రదానం .. రట ము యాయ న! గ. [స్త న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వపొంచిన మ | న ము లీ పద్య కవిసమ్మేళనానికి (్ స (సగ. అధ్యక్షత వహించినందుకు గాను న భా న. (ఫో పార్లమెంట్ సభ్యులు గా, క్రైన్లి, రమణాచారి గారి సమక్షంలో వ్వ్యాహమూ ప య శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ | ఉగ చ్ న! విళంబి నామ సంవత్సర (2018 (తే గా న. ] ఉగాది పురస్కార ప్రదానం | క. | న న్ని
న. ట్ '5/ 0! 6౧౭౧/2 ౧౧౭౧66౧6౧2 సు. మషపస పొషురపండితజన రంజకుడు ప్రజీరట్ర- ౨. తచార్యస్పినాాాయణరెడ్డి.... | టో మస సాధారణ శబ్దాల్ని వాళ్యాలుగా అల్లిన అద్వితీయ కళ అతి సాధారణ భ్రాషను'కావ్ట భాష... -౧.. తిల్పించడం వశిష్ట నైపుణ్యం: ఆయనవిద్వత్మవి. (ర. . | . . డగ గుంటూరు.శేషేంద్ర.శర్యం... 2”) శ మ్రాడ్డుమా! ఫణీంద్ర సుకవి చోట్రుడె! కొడు; - గుండె! పండినట్టి గొప్ప వ్యక్తి! |: ....: పహితీతపస్తి సాహిత్య కలళాద్ది! ప్రతిభరూప్తుడాల్చు ప్రగతియోగ.. న . ర్ ' "ఇద్యా। నండూరి: రామకృష్ణమాచార్య .
- బార్య ఫజీరద్ర కావ్యశాప్ర ఫరిచయం; ఇలంకాఠానుశీలనం: కలవాడు. భాషా సౌఠదర్యానికి, 1... _ శమనా నైపుణ్యానికి ఉతృంశుడవుకున్న, ఆచార్య ఫటీంద్రుడు అనతి కాలంలో మహా | | -... 'శవీఠక్రుడవుతోడని నో విశ్వాసం: . స ॥ = శ్రీమాన్. ఉత్పలసత్యనారాయణాచార్య ' '. + సమకాలీన కవిత్వంలో సంక్షీప్రత వ్యంగ్య; గౌరవం, అభివ్యక్తి శక్షియుప్పేటగా సాగుతాయి. | : అభివ్యక్తీపరమైన మెళకువలను అనువుగా ప్రయోగించడం ఫణీంద్రగారిప్రజకుతార్మాణం | ,..
- ఫ్లణ్రీంవ్ర: పద్యవిద్యపై. 1అధికారం ఉన్నవాడు: అన్ని రకాలు ఛ్రందస్సులను అలషోకగా. ' |... నడిషించగలవాడు. శక్తిమంతుడై పట్టుకొన్న ప్రతి పద్యాన్ని పదిలంగా నడపగల కవి. .
- ఆచార్యచేకూరిరామారొవు. '; ఈ ఆచార్య ఫణీంద్ర:ఛందోబద్ధ పద్యాన్ని ఎంత సుళువుగా నిర్వహిస్తాడో, ముక్తచ్ళందమైన'వచన ' ...- కవిత్వాన్ని అంత సునాయాసంగా రచిస్తాడు. కవితా శిల్ప రహస్యాన్నీ గమనించ్మి వస్తు 7 '_ వైవిధ్యాన్నిగర్తెరిగికవిత్వపుఆయువుపట్టుపట్టుకోగల కావ్యకర్త " / | - దో॥ నాగభైరవ కోటేశ్వర రావు
- ఆచార్య ఫణీంద్ర'పద్యకళా ప్రవీణుడే గాడు - విద్వల్లోకంచే వద్వన్మణీగా' ప్రస్తుతింపబడే పద్య | విధ్యాధరుడు. హృదధ్య పద్యారాధకుడు. --దా॥ కె.వి, రమణాచారి నూ