Telugu saamparaayam - anilvaranasi/indianlanguages GitHub Wiki

.. సుప్రసన్న " అనంతేతిహాసం ధ్‌ సాంపఠాయుం త్తే " క్ష

సుప్రసన్న అనంతేతిహాసం కింతు బ్వుఆల్ల ళాల్వే షార్జ వాత 0౪ 2000 సాంపీఠాయం

ప టు! తగ తాం ౧/48/2౧70 ఖు 90 కం?612 5011580200 20/1 కహి 064 : 00020” 2002 లీ అ శరం ఎ శ ౮02168 : 600 యా నె “నా నా నిగం6 : మొ.50 600౧1౫ అ 96 26 మం గ్‌ వొాగగిగాడూ నొ౭0272 లగాయంగ022/4 9-/-/90 67౫4లో 14241645- 506002. పా ప్‌ వంాాం 2 వంగరాగింగాం వంగాగన? శ్‌ 40% లం 242242 ఉం27/7202న వాల గం. ౨ తోం్రాం గండం? 02077044 - 00 029, (న ఈ విగయటా ౧ సం/ంగడగగ0 లొంంగ 8206ల / 9౨.79.86 (/ |424424 ౮౧౫7౧౫౬ క "77 ా్రడేం వొంయగడల4ల64 ా ర్టరయక ఆంధొల్చు అగి 040-706746 హ్‌. నల ఖా ళా గ ఏల క కిగుణరే 2 నట. ఓ.312౧ ఖు లిండగి44 ౮౧౭౫౧౧ వ 6224248460 తటదాంరిండ వైనాఆయలు జ .! "సపాలూతక సు గో ఉష్ల్లూకాద్‌ కర్తం

గురుమత్రులు శ్రీ సుప్రసన్న

దొదాపు 1950నుంచి కవితలతో, రచనలతో ఆరంభించి వివుర్శలతో, ఆధ్యాత్మికతతో నదీప్రవాహంలా సాగుచూ ఎన్నో గ్రంథాలు రచించి అనన్య ప్రతిభా పాటవాలు ప్రదర్శించి ప్రచురించి పాఠకలోకానికి అందించుటే కాక ఎందరెందరో కవిదిగ్గజాల వంన్ననలు పొందిన వుహావునీషి శ్రీ కోవల సుప్రసన్నాచార్య. జీవితమూ, సాహిత్యమూ ఒక్కటేయని నిర్ధారించి సాధించిన గొప్ప తపస్సు. ఓరుగల్లు పేరు చెబితే బమ్మెర పోతనామాత్యులు ముందుగా స్ఫురించి ఆవెనుక కాకతీయులు జ్ఞప్తికి వస్తారు నేటికీ. సాహిత్య వర్తచూన లోకంలో జంటకవుల్లా స్ఫురించే వ్యక్తులు సుప్రసన్న సంపత్కుమారులు.

శ్రీ సుప్రసన్నగారు శ్రీ అరవిందులవంటి వారి రచనలతో ఉత్తేజం పొందినా విశ్వనాధులవారి సాహిత్యానికి ముగ్భుడై వారి రచనలన్నింటిని ఆపోసన పట్టిన సాహితీవరూర్తి. అలాగే రావాయుణ, భారత, భాగవతవములను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పుణ్యచరితుడు. శ్రీవైష్ణవ విద్వాంసుల ప్రభావం గురుకటాక్షం వీక్షణంలోనే వారిలో గోచరిస్తుంది. ప్రాచీన ఆధునిక సాహిత్యాలను ఆమూలాగ్రం అధ్యయనం చేసిన సమగ్ర సాహితీవిమర్శకుడు ఆయన. వారు రచించిన, కూర్చిన ఎన్నో వ్యాసాలు పుస్తకాలు చూస్తే వారు సాగించినది తపస్సుగా, అవగత మవుతుంది. వీరు శ్రీ కందుకూరి శివానందమూర్తిగారికి అత్యంత ప్రియశిష్యులు. అందుచేతనే కాబోలు అధునాతన ఆంధ్ర సాహిత్య దార్శనికతకు కరదీపికలా నిలిచారు. వారితో పరిచయ భాగ్యం కలిగిన నాటినుంచి నాకు ఆయన చైతన్య సహృదయ సాత్త్విక గురుతుల్యులుగా కనిపిస్తారు. వారు మాత్రం నన్నుఎల్లప్పుడూ

శ్రేయో భిలాషగల మిత్రులుగా సమాదరించడం నా భాగ్యంగా భావిస్తాను. సుప్రసన్నగారి “సాంపరాయంిలో ప్రపంచ భవిష్యత్తు, యుద్ధము, పరలోక విషయము, ముక్తి వంటి అనేక విషయాలను లోతుల్లోకి వెళ్లి విశదీకరించారు. దీనినే ఇంగ్లీషులో చెప్పినట్టు ౬౯016 0 ౬16గ౫|/ యనుటచే అనంతమైన పురాతన ఇతిహాసము లేదా గాథయనియూ స్ఫురించుచున్నది. ఈ సృష్టిలో మానవులు యుగయుగాలుగా నేను, నాది యను భ్రవమలనుండి తేరుకోలేక పోతున్నాడు. అనంతకోటి మానవ జీవుల్లో సత్యాన్వేషణకై సమాజ కళ్యాణాన్నికై సాహితొసేవ గావించ తహతహలాడుతున్న శ్రీ సుప్రసన్నగారి వంటి జీవులు అరుదు. వారి జీవితం ధన్యం. పురుషోత్తముడు ఆయురారోగ్యాలతో నిండా నూరు వత్సరాలు సాహితీ సేవకు వినియోగించుగాక అని వేడుచున్నాను. ప్రజ్ఞావంతులైన సుప్రసన్న “సాంపరాయంి వంటి అమోఘ రచనను ముద్రింపజేయు భాగ్యం కలిగించి నందులకు నాచే ఈ నాలుగు తెలిసీ తెలియని మాటలు వ్రాయ కోరినందుకు కృతజ్ఞతలు. నర్వే జనాః నుభినోభవంతు హైదరాబాద్‌ పి.వి మనోహరరావు 16-02-2002

ఆఅఆముఖం ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య ఆంధ్రళాఖ అధ్యక్షులు కేంద్రీయ విళ్టువిద్యాలయం, హైదరాబాద్‌ “సొంపరాయం' అన్న ఈ కావ్యం ఈ శతాబ్దిలో వచ్చిన తొలి మహేతిహాసం. ఈ ఇతిహాస కావ్యంలోని వస్తువరణంలో కవి చూపిన విశాల హృదయమూ, ధైర్యమూ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సృష్టాదే కాదు - నిర్గుణ బ్రహ్మంనుంచి సర్గ వరకూ ప్రాచీన పురాణాలలో మొదటి పుటలలోనే కనబడుతుంది. ఈ సాంపరాయంలోనూ సృష్టి ప్రారంభ బిందువునుంచి వెలుగుల సముద్రంలో కదిలే వెన్నెల పడవ దాకా మనకు కొత్త రీతులతో కనబడుతుంది. ఒక జీవిత కాలంలో కవి శ్రీసుప్రసన్నులు తాను ఆర్జించిన సర్వ సంస్కారాన్ని ఈ సాంపరాయం కావ్యంలో నింపారు. ఉపనిషత్తులనుంచి శ్రీ అరవిందుల దాకా ఎన్నెన్ని సత్యదర్శనాలు జరిగాయో వాటినంతా కవిత్వీకరించి ఈ కావ్యసృజన చేశారు సుప్రసన్నగారు. వచన కవిత అల్పసంఖ్యాక వస్తువులకే పరిమితమన్మీ అనువైనదనీ చేయబడిన 'దు' ప్రచారాన్ని తన కావ్య రచనలద్వారా బ్రద్దలు కొట్టిన ఇద్దరు ముగ్గురిలో శ్రీ సుప్రసన్నులు ఒకరు. చలం సుధనుంచి సుప్రసన్నుల శతాంకుర వరకు ఒక ప్రవాహం ఆధునిక తెలుగు వచన కావ్య ప్రక్రియలో సాగింది. ఇప్పుడీ సాంపరాయం. ఇది కేవలం ఆధ్యాత్మిక కావ్యం కాదు భౌతిక్క మానసిక్క ఆధ్యాత్మిక జీవనాలను జీవిస్తూ ఈ త్రిదళాన్ని ఆధ్యాత్మికమన్న ఏకదళ బిళ్వంగా పరిణమింపజేసుకొంటున్న ఉత్తమ జీవియొక్క అనుభవ ఉపనిషత్తు ఈ సాంపరాయం. కవి గుండె నాలుగు గోడల ఇరుకులలో మనలేనిది. ఏ మార్గమూ పరిహార్యం కాదు- లక్ష్యసాధనకు అది పనికి రావడమొక్కటే కావాల్సింది, ““విళ్చవరిణాహంలోఎ్నన్నైనా దాడులు ఉండనీ అటూ ఇటూ ఎన్ని అంతన్తులైనా కట్టనీ నాఠు కావలసింది అనంతమైన ఆనందశాల భూమి పైననే, ళరీరంలోన్నే మృత్యు రాషాత్యం”

శ్రీ అరవిందుల శిష్యుడు ఇట్లా అనకపోతే ఆశ్చర్యపడాలి. ఆధ్యాత్మిక రంగంలోనూ పదివేల సంవత్సరాల నాటి భావనలు అట్లాగే ఇప్పటికీ ఉండవు. వాటిల్లోనూ సిద్ధపురుషులు తమ అనుభవ జ్ఞానాన్ని జోడించి పరిణామాన్ని తేగలిగారు. దాన్తో మానవ హృదయానికి రోజురోజుకీ వైశాల్యం పెరుగుతున్నది. దీనికి దర్పణం పట్టే కావ్యం ఈ సాంపరాయం.

ఆతి గహన విషయాలను, ఎంతో సాధన మీద లభించే సత్యాలను శ్రీ సు ప్రసన్న ఈ కావ్యంలో ఎంతో లాఘవంతో హృద్యంగా చెప్పారు. ఈ కింది పాదాలను చూడండి.

“ఒకసారి నిళ్ళబ్దాన్ని అందుకుంటే సూర్యోదయోలు నీకు లే)

ఒకసారి భౌతిక లోకద్వారాలు దాటితే ఆత్మకోళం న్ఫురించేను

అకలుషమైన ప్రేమతో జగన్మాత ఒటిలో తల మోపీనంత

నీవు వెలుతురు కొలన్నువె అనంత కాలహంనలకు మాననమై”

(ఈశ్వర విరహం)

“జగత్తును అనునంధించేది ఏకసూత్ర చేతన (ప్రేమ,

(వేమ- లోకంలో ఈళ్చురుడు వేసుకున్న వెలుగుల శరీరం,

అహంకారకాసార నేతువులను తొలగించేది ఆత్హీయలాభివ్యక్తి

పృద్విమీద నిమ్నోన్నుతాలను నరిచేసేది ఆనురాగవర్లం””

(ఈశ్వర విరహం)

ఈ జగత్తమిటి? దాన్ని దాటడమేమిటి? దాన్లో ఉంటూనే దాటడం ఎట్లా? ఈశ్యరుడెవ్యరు? పృథ్యిమీద నిమ్నోన్నతాలు సరిచేయడం ఎట్లా? జీవుని బాధ్యత ఆ సరిచేయడంలో ఉందా? అతడు సరిచేయాలని ఈశ్వరుని కోరికనా? అంతవరకూ ఈశ్వరుడు జీవునినుంచి విరహంలో పంటాడా? మనిషివెలుతురు కొలనవుతాడా? కాగలడా? ఆత్మ ఆవిష్కారమవుతే అహంకారపు డలు బద్దలవుతాయా? ఎన్నెన్నో చిక్కు ప్రశ్నలకు సులభంగా, రమ్యంగా సమాధానాల న్భురణ్య మతోన్మాదాన్ని కాని, సిద్ధాంతోన్నాదాన్ని కానీ బాంబులతోనో, నైరంకుశ్యంతోనే రూపుమూప్రలేన్ఫ, అటు మతోన్నాదాస్పా ఇటు "పెట్టుబడి" అమానుషత్వాన్నీ గ్రహిస్తూ ఈ కావ ల న్మాదాన్ని, స

| వితిహాసికత్తాన్ని బలిష్టం చేసే ఈ కింది పాదాలను చూడండి -

““కల్పించుకొన్న శ్రార్యదంప్రలకు కట్టు బడ్డ దైెవభావనను”

“ధర్భ గ్రంధాలు ఆయుధాగారాల్రై ధనముఖంమీద ర్తకం వులిమి”

“పర్వతాల్లో వేసిన బాంబులు శాంతిబీజాలయి మొలక్షెత్తవు

దాడీచెలయ్యు గతంమీద మౌఢ్యంమీద, అహంతమీద,

రక్తసిక్షమైన చరిత్ర ఖండాలు, పరాభూలు, ప్రతీకారాలు

జీవించడం ఎకుడ - భూత నముద్రంలో గాయాల ఎడారిలో”

(సత్యకామన) కవికి ఈశ్వరుడు తప్ప మరొక్కటి లేదు. ఈశ్వరుడంటే ప్రేమ తప్ప మరొకటి కాదు. నిరర్ధక కర్మకాండకు ఈశ్వరుని “బలి కానీయడు కవి. మతం సాధకునికి మైలురాయే కాని అది వాడీ లక్ష్యం కాదు. వముతం యొక్క అంతరార్భాన్న మూలతత్వాన్నీ గుర్తించడంలో సుప్రసన్నగారు పరమ అధునికుడు.

“మతంమైలురాయి, అది లక్ష్యాన్సి ఎపుడూ చూచి వుండదు

తరాలు దాటి మ్యళ్యూసాలు ప్రాణాలు కోల్పోయి మౌఢ్యఖిన్నులై

మనన్సు నిర్ధించుకున్న ప్రతీకలు, ప్రతిమలు సింహననం ఎక్సీ

బాహ్యవేషాలు ఆడంబరాలు, కర్ళకాండలు ప్రబలి

తన ప్రతీకళన్నా మరొక ప్రతీకను అంగీకరించని

తనకన్నా మరొకవిధానాన్ని తిరస్కరించే అహంత

ప్రాణి లోకంలోని అల్సళక్తులు వరివేస్టింపగా ఈ ప్రతీకలు

అల్పవాంభల పరిష్కరంచేను, నత్యానుభూనికి వెలిగా”

(ఈశ్వర విరహం) రాజకీయార్థిక సిద్ధాంతాలతోపాటుగా, ఈనాటి దుస్థితికి మతమౌఢ్యాలూ దోహదపడ్డున్న మాట వాస్తవం. మతం తన ప్రాణాన్ని కోల్పోయి చెలరేగడాన్ని సూచిస్తున్న కవికి సత్యదర్శనం అయిందనడంలో అనుమానం లేదు.

ఈ ఇతిహాస కావ్యాన్ని చదువుతున్నంత సేపూ జీవన సత్యాలను అనుభవిస్తున్నట్లుగా ఉన్నది. సత్యకాముని మాటగా ఈ కావ్యంలోనే కవి రాసిన '“పుట్టిన చోటు తెలిసినా నేలలోకి బీజాన్ని ఎరుగను సత్యాన్ని కామిస్తున్నాను - ఎరుగగా సృష్టిమూలతత్త్వ్యాన్నా” రెండు పాదాలే ఈ కావ్యమంతా పరచుకొన్నమౌలిక విషయం. సత్యాన్వేషణకు కవితా రూపమే ఈ సాంపరాయం.

సత్యాస్వేషణ వల్లనే తత్త్వశాస్త్రం ఏర్పడింది. అట్లా లభించిన సత్యమే శివసుందర రూపాలను రంగరించుకొని కళ అయింది, కవిత్వం అయింది. శ్రీ సుప్రసన్నతాత్తికుడు, కవీ. బ్రహ్మానంద రసానందాలు రెండింటిలోనూ వారు మునిగి తేలుతున్నారా? ఈ కావ్యం ఇచ్చే సాక్ష్యం ఆ విషయానికే! అవ్యక్త సమష్టి తానై ఈ వ్యక్తాన్ని తాను చూడాలన్న ఆకాంక్ష వెలిబుచ్చుతాడొకచోట ఈ కవి. గహనాతిగహన బెపనిపదిక విజ్ఞానాన్నిసు ప్రసన్న రసప్రపంచంలో కి ఈ కావ్యం ద్వారా తెచ్చారు.

“తాత్తాకవిచారణ ఒకముఖం అనుభూతి వ్రకాళం మరొకముఖం”

(ఈశ్వర విరహం) అన్న రెండు ముఖాలూ లీనమై ఏకముఖంగా ఆవిష్కారమైన కావ్యం ఈ సాంపరాయం. “కవి పద్యమై పుడతాడు” అని అంటూ ఈ మహాకవి.

“పద్యం దిక్కాలాలను ముడి వేస్తుంది. దాని ఫణామణి అవుతుంది. అందరిలో అది ప్రతిఫలించి, ఆందరూ దానిలో ప్రతిబింబించి” అని కావ్య స్వభావాన్ని దేన్నైతే సాధారణ సూత్రంగా చెప్పారో అదే ఈ 'సాంపరాయం” కావ్యస్వ్యభావం కూడా. ఒకశతాబ్లి లౌకిక జీవనంతో పాటు చతుర్వుగాల తాత్త్యిక సంపత్తి కూడా ఈ ఇతిహాసంలో ప్రతిఫలించింది. ప్రాచీనుల దర్శనానికి ప్రభావితుడౌతూనే దానికి పరిణామాన్ని కల్గించిన శ్రీ రమణుల, శ్రీ అరవిందుల అనుభవ జ్ఞాన భాండాగారాన్ని రమ్యంగా ఈ ఇతిహాస కావ్యంలో చూస్తాం. అది వేదం కానీండి, వేదాంతం కానీండి - ఈ కావ్య యోజనలో పనికి వచ్చిందనుకొన్నప్పుడు కవి దాన్ని ఉన్నదున్నట్టుగా తీసికొన్నాడు.

“దోసకాయ తోడియను వీడినట్లు నన్ను వీడనీ ఈ తనువును”

“ఉర్వారుకమివ బంధనా నృృతోర్ముక్రీయ మామృతాత్‌”

అన్న మహామృత్యుంజయ మం త్రపాదంలోని కవిత్వాభివ్యక్తికి ముగ్గుడయి అట్లాగే తెలుగు చేశారు కవి. కొన్ని బుగ్యేదమంత్రాలనూ ఇట్లాగే చేశారు. వాటిని పాదపీఠంలో తెలిపారు కూడా. మార్కండేయుణ్ని గురించి రాసినప్పుడు శ్రీరమణ మహర్షిని సాదృశ్యంగాచూపి తన దన శకిని చాటుతారు సుప్రసన్న, కొన్నివైదిక గాధలను, పురాణ గాధలను, బుద్ధగాధనూ

సర్వాస్వేషుగా రీతికి పనికి వచ్చినంతగా అందంగా సూచిస్తూ పోతారీకావ్యంలో శ్రీసు ప్రసన్న న ది రాసినా అంతా కవితమయమే. అంతా అనుభూతుల ఇంద్రధనుస్సులే. అనుభూతి

ంతమైతే అభివ్యక్తి గమ్యుమౌతుంది. మృత్యువును గురించి చెప్తూ-

“ఒకానొక దివ్వశకి అపరిహార్వమైన ఆదేశాన్ని

తల ఒగ్లి మృత్యువు వ్యాక జగత్తు ళధిలాలను తొలగిస్తున్నది”

  • అని అంటారు కవి. ఎవరైనా ఇంత అందంగా అన్నారా? ఈ కావ్యంలోని 'పద్యాలు' అందుకే “జ్ఞానరస లోకాలు”. మనిషి సత్య, జ్ఞానాల కోసం చేసే అన్వేషణను గుర్తిస్తాడు. గుర్తిస్తూనే అందులోని లోపాన్నీపట్టుకుంటారు.

“ఒక్షవెవు ఇంద్రియ లోకంలోకి ముడుచుకుపోతున్ను లక్షణం

మర్గోవైపు జగళత్తుగా విస్రరిన్తున్ను విళ్చాభావనా విస్తారం

అనంత బాహువులలో ఇదంతా నేనే కావాలనే శరదృతువు

అనంత ముఖాలతో ఇదంతా నాకే కావాలనే ళిళిర విన్యానం””

  • అని మనిషి అన్వేషణలోని గుణ దోషాలను రమ్యంగా కవిత్యీకరిస్తాడు.

ఆరంభక్ష్తణం, ఉద్గమరీతి, ప్రాణ ప్రవాహం, బ్రదుకు కదలిక, సర్గ గ్రంధి మొదలుగా

ఇది వెన్నెల పడవ అన్న చివరి 12వ అధ్యాయం వరకు ఈ మహాకావ్యం మానవుని పుట్టుకనుంచి మోక్షం వరకు నడిచే జీవితాన్ని బ్రదుకున్సి సాధనను దివ్యంగా, కవిత్వంగా తెలుపుతున్నది. అది సహజరీతిలో ఈ కావ్యంలో శిల్ప విన్యాసం ఉన్నది. కథ లేకుండా మానవ జాతి (ఇంకా మాట్లాడితే సమస్త సృష్టిజాలం) పుట్టుకా వికాసాల “కథనం అకర్షణీయమైన కవితాభివ్యక్తితో ఉన్నది. వచన కావ్య వికాసంలో ఇది తుఠాయి పువ్వులాంటి కావ్యం. మినీ కవిత్వం వచన కవిత్వాన్ని బ్రదికించి బట్టకట్టించిన మాట వాస్తవమే అయినప్పటికీ, అది ఇవ్వలేని సంతృప్తిని దీర్దకావ్యం ఇవ్వగల్లింది. అందులోనూ ఇతిహాస దృష్టితో రాసిన ఇలాంటి కావ్యాలు సాహిత్య చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందగల్గుతాయి. పారకులపై ఇలాంటి కావ్యాలు ఎనలేని (ప్రభావాన్ని వేయగల్గుతాయి. గతంమీద, వర్తమానంమీద, భవిష్యత్తు మీద మన దృష్టి ఎట్లా ఉండాలో గుండెల్లో సంగీతంలో నేర్చే సత్కావ్యం ఇది.

“గడచిన కథ అంతా విస్తారమైన అన్వేషణ

అడచుల్లో కొండల్లో వనౌషధుల నెలవుల్లో

ఎరిగిందానికీ మరోకఎరిగిన అంశం జోజింపు

ఉదయానికి మురో ఉదయం, శోధనల సార్ధవాహం”

(ఇతిహాసం) ఈ శోధన కేవల భౌతిక విషయాలకే పరిమితం కాదు. భౌతికా ధ్యాత్మిక మానసికాలన్న

త్రిస్తరాలలోనూ సహస్రాబ్బాలుగా శోధన జరుగుతూనే ఉన్నది. పాక్షికంగా మాత్రమే ఒక్క మూడోవంతు మాత్రమే చూసేవానిది ఖండదృష్టి. వాడు నిజానికి ఏ కాలానికీ, ఏమంచికీ పనికిరాడు. “ ప్రపంచం నిండా పరచివున్న సమస్య భయం” దాన్నిపోగొట్టడానికే దార్శనిక కవిమాత్రమే పూనుకోగల్నుతాడు. త్రికరణ శుద్ధిలేని కవి వాక్కు వ్యర్థం. ఆచరణ, భావన, రచనలన్నవి ఏకసూ త్రితమయినప్పుడే రచనకు శక్తి రచన నాది ఆచరణ నీది ఆనే మూర్ధకవితో కాన్మి వాణ్ని సమర్థించే బుద్ధోహీనుడితో. కానీ మనకు పనిలేదు. ఈ సాంపరాయం ఒక ఉత్తమ వ్యక్తి, సాధకుడిగా, దార్శనికుడుగా రాసిన ఇతిహాస కావ్యం. సల్లక్ష్యం కోసం జీవిస్తున్నవ్యక్తి కవిగాతన అనుభవాన్నంతా, కావ్యంగా తీర్చిదిద్దిన ఘట్టం ఇది. త్రిమతాచార్యులిచ్చిన తాత్త్విక సంస్కారంతోపాటు ఆధునిక బుషులు కల్లించిన సంస్కారమూ సండి ఈ కావ్యంగా రూపొందింది.

““ఎడుకవెనుకనున్న వెలుగుల నముద్రాన్ని చూచి

వెలుగుల నముద్రంలో కదలే వెన్నెల వడవను చూచి

ఎప్పుడోనేను ఆ వడవలో ప్రయాణీస్తున్న సంస్కృతి

సంపుల్లమైన అరవిందమే వడవ, జగన్నాత కర్టధారి”

ఈ జీవుడు ఈశ్వరుని నుంచి జారిపడినవాడే కాని ఇతని విరహం శాశ్వతం కాదు. ఈ మూడో పాదం ఈ మొత్తం కావ్యానికి పరమార్థం. వెన్నెల పడవలోని ప్రయాణం ఛాయగా జప్తికి వస్తున్నది. ఈ సాంపరాయం ముముక్షుతార్థంలోనే కవి వాడారని కావ్యానికి ముందు రాసిన మాటల్లో ఉంది. విశ్వలయను విడిచి సొంత లయల్లోకి జారిపడేవాడు జగత్తుకీ తనకీ కమం కరగించుకోలేడు. శ్రీసుప్రసన్నుల దృష్టి వశ్వలయాదృష్టి. ధర్మదృష్టి ఈ దృష్టి త్రికరణ న్న ౦ది. కవిత్వ రచనా జీవనంలోనే ఒక సాధనే. కవిత్వం ఒక్క అబద్ధాన్నీఓర్చుకోదు. సత్యాన్వేషకులకు కరదీపిక ఈ సాంపరాయం. కవీ ధన్యుడే. చదివిన పాఠకులూ ధన్యులే, వచన దీర్దకావ్యాలు ఇవేళ మహా సంతృప్తిని కల్గిస్తున్నాయి.

తే

ఠి హిరణ్మయ వొత్ర ఇచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు ఎశ్రాంతాబార్యులు శ్రీకృష్ణదేవరాయ విక్టవిద్యాలయం, అనంతపురం “ఓయీ పోషకుడా సత్యముఖమొక బంగారు పాత్రలో గుప్రంగా ఉంది. సత్య ధర్మ దృష్టి కోసం నిన్ను అర్థిస్తున్నా. దాని పైమూతను తొలగించు - సోహమనస్ని. ఇది 'ఈశిలోని వుంత్రం. విశ్వమే బంగారుకోశం, అందులోనే సత్యరత్నము గుప్తంగా ఉంది. దానిని దర్శించాలంటే మనసన్న మూత తొలగాలి. తొలగించే బాధ్యత సూర్యునిది. అతడే పూషణుడు. దానిని అతడు తొలగించగానే బుషికి సత్యధర్మం ప్రకాశించింది. లోపలకు తొంగిచూస్తే అందులోనివాడు తానూ ఒకటే. విశ్వమొకశిలావేణువు. శిల స్థూల దివ్యమయ ప్రకృతి. దివ్యదర్శన లాభం కలుగగానే అదే వేణుగానం ఆలపిస్తున్నది సత్యయధార్థ శ్రవణానికి. అసత్య భౌతికేంద్రియాలకు కేవలం జగత్తే గోచరిస్తే అంతరింద్రియ హృదయగృహద్వారం విచృతం కాగానే జడపదార్థమే మధుకోశమై మధు హ్రదమై, దివ్యదర్శనమై, స్వర్ణపద్మమై గోచరిస్తున్నది. ఈ దివ్యదర్శనకర్త పూషణుడు. అంతస్సత్యాన్ని వికసింపజేసి పోషించేవాడు. శిలలోనే శిల్పమున్నది. అది ఆవరణను తొలగించ గానే శిల్పవే. అహల్యగా అవిష్కృత మవతున్నది. ద్వారం తీయటమెలాగో తెలియనివాడు బాలుడు. ప్రేయోమార్గగామి. తెలిసిన వాడు శ్రేయోమార్గగామి - యోగి. లాగాలో, తోయాలో తెలియనివాడు బాలుడు. ప్రతి మహాకావ్యం ఇంతే. అదొక హిరణ్మయ పాత్ర. శిలావేణువు - అహల్య శిలాకృతి తొలగించేవాడు భాస్కర ప్రతిముడైన విమర్శకుడు. ఆవిష్కర్త కవి. విమర్శ అంటే ఊర్థ్వ చైతన్య మార్గం. దర్శకుడు చైతన్య భూమికల నడుమనున్న పారలు చీలిస్తే ఒక మహా చైతన్యమై సమష్టి దర్శనమై అవతరిస్తుంది. ఈ పొరలను విచ్చేదించేవాడు విచర్శకుడు. విచుర్శ అంటే అచ్చమైన అహంతానుభూతి

భౌతికాహంత కలుషితవళూర్తి. విశ్వాహంత అకలుషిత, సవుగ్ర దివ్యాను భవ సంపన్నుడు కనుక సమష్టి సమగ్ర చైతన్యావిష్కర్త కవి. మార్గదర్శకుడు విమర్శకుడు. ఈ కావ్యమొక భవిష్య కవితా సేతువు. అపూర్వ దార్శనిక పధావతరణ రూపమైనది. నరావతరణం,. ఆధునిక కాలమొక దివ్యచైతన్యాభిముఖంగా ప్రయాణం చేస్తున్నది. భౌతిక పదార్థమే సత్యమన్న 18, 19 శతాబ్బులనుండి సాగిన ప్రయాణం 20వ శతాబ్దంలో ప్రాణ చైతన్యం, మనోమయ చైతన్యం, సుప్త విరాట్‌ చైతన్యం దాకా ప్రయాణం సాగించింది. అతీత మనశ్చేతన పరాత్పర చైతన్యం దాకా విక్రమించినది. నేనూ, విశ్వము, విశ్వాతీత చైతన్యము కలసిపోతున్న వ్యక్తిరూపమైన ఆత్మ - విశ్వాత్మ అతీతాత్మ పదార్థ సమన్వయ రూప త్రివిక్రమ చంక్రమణ భూమికలో ఉన్నాము. రాజకీయ సంరంభం ఒక పొంగే లావా. కాలీ అది రాబోయే శాంత సమయావతరణకొక సూచన. కనుకనే అంతర్గతంగా విశ్వమానవ సమతా భావం తొంగిచూస్తూనే ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంకూడా మానవ ఆరోగ్యాన్ని ఆయుష్తును దీర్టీకరిస్తున్నది. ఇదొక మృత్యుజయమే. అలాగే చైతన్యవాదం వల్ల మృత్యురూప జగత్తు స్వర్ణరూప అమృతత్త్య స్థాపనకు ఉన్ముఖమైనది. ఒక విరాట్‌ బృహత్‌ చేతన విశ్వోన్నుఖ ప్రయాణం చేయడానికి మార్గం సుగమమైనది. విష తరుణాన ధర్మాన్నిశరీర ఆత్మలుగా ఈ నవీన ఉద్గీధ అవతరించడమొక అపూర్వ 0. '%5 5గ ఉ॥౧001%60 58/5 ౧01109 ౧౧౪౩06 01/6౧ ౪౧, ౧0 6/- ౧౮5 06 66౪6 0౧66 న0110/ 13 16 &1056౧/00 06156 ౪౪౩ (11.2. ౧౭౧64)' ఈ దారికి మార్గం ప్రేమ. అవతలి వ్యక్తితో విశ్వంలో సమైక్యం కావటమే కర్తవ్యం తప్ప మేధోజన్య అద్ధాంతంవల్ల కాదని నిరూపిత సత్యమే. క్‌ వో నవీనేతిహాస వస్తువు, ప్రారంభంలోని మంత్రంలోని మూత చృుత్యువే. అంటే బృన బ్రాల = ప్రేయోమార్గం భౌతిక సత్తాయే సత్యమనుకోవడం,. అంతస్సత్య కా మన తత్‌సమైక్య భావదర్శనం - అదే “సోహమస్మి. కాగా సమైక్య సమతా దర్శనం వం. మానవ జీవితమొక మహాప్రస్థానం. మృత్యువునుండి అమృతత్వం ద్‌ [లమీదుగా చేసే అనంత ప్రయాణం. అది స్యర్గారోహణకు మార్గం.

1!

ఆరంభక్షణం, ఉద్గమరీతి, ప్రాణప్రవాహం, బ్రతుకు కదలిక్క సర్గగ్రంధి, ఇతిహాసం, అనుభవతీర్థం, సంకులమార్గం, ఈశ్వర విరహం, సత్యకామన, మృత్యుజయం, వెన్నెల పడవ - ఇలా ఈ నవీన అరవింద భాగవత రత్నసౌధంలో 12 స్కంధాలు, అంతరువులు, అంతస్తులున్నాయి.

బుగ్వేద నాసదీయ సూక్తంతో ఆరంభమైన కావ్యవుంతా శ్రుతివూతృతశ్రీ చరణలాక్షాంక ముద్రితమే. ద్వితీయ స్కంధం ఇంద్రసూక్తం సెనెజర్‌ దేవ భాషా సంకలితం కాగా - తృతీయ స్కంధంలో దేవీసూక్తం శ్రవణ చక్షుర్గోచరమౌతున్నది. బ్రతుకు కదలికలో సూక్తస్పర్శ లేదు అలాగే ఇతిహాసమన్న ఆరవ ఆఅంతస్తులోనూ. 7 లోని అనుభవంలో వాల్మీకి దర్శనమిస్తున్నాడు. ఆయనతోపాటు విడిపోని విశ్వనాధ. వాల్మీకి లోకం మేల్కొనటానికి పాడిన ఉషోగానమే - ఉషస్పూక్తమే వాగ్దేవీ పాదమంజీర నాదమైన ఆదిమ కావ్యం. “మనుజుడను నేను - మనుజ ధర్మంబు నాది అన్న ధీరుని చరిత్ర ప్రకటితమైంది. శరత్‌జ్యోత్స్నలు క్రమ్మినట్లు అన్న 70వ పుటలోని వాక్యంలో తొంగిచూస్తూ - మానవధర్మ ప్రబోధం చేస్తున్నాడు వాల్ళీకి గళంతో తానూ గొంతు కలుపుతూ. కనుకనే ప్రబోధిత దివ్యచక్షువునకు

ఈ జగత్తంతా చిదంబర సభాపతి తాండవహేల

ఎనిమిదిలో యమునితో ప్రస్తావించిన మహాపురుషుడు యుధిష్కరుడు - అతని తమ్ముల కధలోని మార్మిక వేదనతో సాక్షాత్కరిస్తాడు. కవి చేసిన భారత కధావ్యాఖ్యానంలో ఎంతో యోగదర్శన మున్మనీ భావిత రమణీయాంశం. ప్రాచీనేతిహాస పురాణగాధా ప్రపంచమెంత మానవ మార్మిక జీవన రహస్య ప్రబోధమో ఆధునిక విశ్వమానవ చింతననుండి బహిర్గతమైన అంశం. కనుకనే యక్ష ప్రశ్న గుప్తార్ధాన్నీ సూక్ష్మంగా వ్యాఖ్యానించగలిగాడు కవి. బ్రతుకు కదలిక సంకులమైనాక మానవ చేతస్సులో ఒక ఊర్థ్యముఖ ప్రస్థానమారంభమవుతున్నది. (ఆధునిక యుగంలో ఆత్మపన్థానమన్న యూంగ్‌ గ్రంధం ఈ శతాబ్ది ప్రారంభంలో వచ్చింది) శ్రీ వివేకానంద, శ్రీ ఆరవిందాది మహాత్ములుదయించిన దివ్య యుగమిది. నిజానికి ఇది కలియుగం కాదు. ద్వాపర ప్రారంభమన్న శ్రీ స్వామి యుక్తేశ్వరుల (పరచముహంస యోగానందుల గురువు) మాటలోని సత్యాన్ని ఆవిష్కరిస్తూ అవతరించిన చుహాయుగం. భారతకధలో

మహాప్రస్థానం - స్వర్గారోహణం కలుపుకుంటే - సాంపరాయం - సిద్ధిస్తుంది. కరంలోని సాంపరాయమే భారత కధా రహస్యం. సంకుల మార్గం చివరకు మృత్యుదేవతాలోక కవాటం కొంచెం వదులై దివ్యజగత్తు రెండడుగులు క్రిందకు దిగివచ్చింది. దాని స్పర్శ తగిలీ తగలగానే మానవ చేతనలో ఒక అవ్యక్త వేణుగానం వినిపించి ఈశ్వర విరహంతో అది గోపికగా పరిణమించింది. అతడే సత్యకామ జాబాలియ్చై చాందోగ్యం పాడు తున్నాడు. తుదకు నచికేతుడై సాంపరాయం సిద్ధింపచేసుకొన్నాడు. మృత్యుజేత యైనాడు. ఇదే మవృత్యుజయ ఖండం. చివరి అధ్యాయం మహాబోధి వికసించిన భూమిక. సమ్యక్సంబోధిని - భూమిపైకి అవతరింపచేసిన బుద్ధదేవుని పూర్వరూపమే “నేను. నేనదిగా పరిణమింపచేసుకోవడమే జీవిత సాఫల్యం. అదే వెన్నెల పడవ ప్రయాణం. ఆ పడవ పేరు అరవిందం. కర్ణధారి తల్లి. సువర్జ నౌకగా వర్హింపబడిన ఉపనిషద్దేవత. ఆ పడవలో ప్రయాణించిన నా పూర్వరూపాలే సత్యకాముడు - నచికేతుడు. భవభూతి ఉత్తరరామ చరిత్రలో విదూషక పాత్ర లేదు. ఉన్నదంతా నదీదేవతలు

  • బుషులు - దేవతలు. ఈ వాతావరణ భంజకం కనుక విదూషక పాత్ర లేదు. అలాగే ఇక్కడా. చిత్రిత వాతావరణమతా వేద సరస్వతీ పరీవాహ ప్రదేశం. ఎక్కడా ఈ కెదార్యం భగ్నం కాలేదు. కాకపోగా సత్యకాము, నచికేత కథామార్శ్మికత - భారతాది రహస్య సంపుటి ఎంత వింతగా ఆవిష్కృతమైది - ఈ యుగారంభంలో ఈ పురాణేతిహాసగాధా యోగ రహస్యాలను ఆవిష్కరించిన సారస్వతం విస్పతంగా రావడం - దియోసఫీ వంటివి మార్మిక భాషా జగత్తులను ఆవిష్కరించటం శ్రీ అరవిందాది మహాయోగుల తీవ్ర సాదనా ఫలితంగా ఆవిష్కృతమైన అతి మానస ప్రపంచదీధితులతో ఈ యుగం యుగమంతా చలించిపోయింది. కళ్లు చెదరిపోయేటంత కాంతిమంతమైన జగత్తు అవతరించింది. పళ్చిమదేశాల్లో మనస్తత్వ శాస్త్రం విశ్వసుప్తచేతనదాకా చొచ్చుకొని పోయింది. మేటి యుగీన స్పృహ ఇది. ఇదంతా కవి చేతనలో జాగృతమై అరవిందపుష్పంగా వికాసం పొందినది. ఈ లక్షణమే షట్పక్ర స్వరూపమైన నాందిగా అవతారం పొందినది. అదే కావ్యభూమిక, నాందీ లక్షణ దృష్ట్యా వస్తుతత్త్వావిషృతి అందులోనే గుప్తంగా ఉంది. వాసుదేవ స్తుతి ఆరంభ పద్యం. ఆద్య చైతన్యం కనుక అదే త్రివిధ వ్యూహాత్మకంగా దిగివచ్చి సృష్టిగా పరిణమించింది. మరల ఈ త్రివిధ వ్యూహ నిశ్రేణినుండే ఊర్ధ్యముఖ

ప్రయాణం జరుగుతున్నది ఈ అవరోహణారోహణమే సృష్టి రహస్యం. జీవచైతన్య పరిణామమే సృష్టి. మరలా వాసుదేవ తత్త్యంలోకే ప్రయాణం. ఇదే సాంపరాయమంటే. సాంపరాయం నతేస్తు బాలాః అని కరంలోని మాట.

మానవ చేతన ఉఊర్జ్యారోహణం పొందడానికి వాసుదేవ తత్త్యమే గురురూపంలో దిగివస్తున్నది చేతికందిన పక్వఫలశాఖలాగా వారే శ్రీ అరవిందులు. జగన్మాత - శ్రీ శివానందులు - వాల్మీకి విశ్వనాధులు - శ్రీరమణ వివేకానందులు - సుస్తదైతన్య ప్రబోధకులు వీరు. కనుకనే నాందిలో సంస్తుత్యులైనారు.

మానవ వైతన్యమంతా సమష్టిగా ఒకటే. నేనే సమస్తమూ.

“జనిసాహన్ర బహు ప్రయాణమగు సంసారంవు ద్రోవన్‌ నదా

చనుచుండున్‌ బనుదుఃఖ మోహమలమలన్‌ సంసారి వొంధుండు వా

సననలన్‌ ధూళి మునుంగుగాగో”

_ అని రాయలవారిలోని యోగి చెప్పినమాట. వాసుదేవుని నుండి వికసించిన సమస్త జీవరాశి క్రిమికీటకాదులనుండి వాసుదేవ పర్యంతమైన జగత్తు సమస్తమూ అతని రూపమే కనుక క్రీమినుండి వివేకానందుని దాకా నేనే ప్రయాణించాను. ఇదీ ఈ కావ్య వస్తువు. ఆత్మ నాయకమైన నవీన భవిష్య కవితా కావ్యం.

భారతీయ శిల్పంలో చెక్కిన రూపం భోగకాయం కాదు. యోగకాయం. భౌతిక శరీరం కాదు. సాంపరాయ స్వర్గారోహణ ధ్యేయమైన మహాప్రస్థానం చేసే నచికేతుని శరీరం. ఇదే మృత్యుజయం. సాధించే సాధనం. ఈ కావ్య కథ యోగకాయుని ఆత్మకధ.

ఒకరకంగా చూస్తే - అదే సత్యదర్శనమున్నూ - భారత కథారహస్యమూ ఇదే. ఎక్కడో స్వర్గంనుండి వచ్చిన మానవుడు (సంభవపర్వం) సంకుల సమరం ద్వారా ఆధ్యాత్మికమైన శాంతిసప్తకం ద్వారా యోగియైై స్వర్గారోహణం - తిరిగి అవ్యక్తబిందువు లోనికే పోతున్న విశ్వమానవకధ.

భారతంలో రెండు యుద్దాలు ప్రస్తావితములైనవి. (1) మిధ్యాయుద్ధం (2) సత్యయుదధ్ధం. వెందటిది బాహ్యశత్రు నాశకమైనది. రెండవది అంతశ్ళ్శత్రు విజయాత్మకం, కనుక విజయుడే సవ్యసాచి. బాహ్యాభ్యంతర యుద్ధవిజేత అతని గాండీవమే - అగ్నిదత్తం కనుక - దివ్యప్రణవ౦ం - ప్రణవోధనుః - అని ముండకం.

మహావీరుడు - ధీరుడు - భారతీయ రాజనీతి శాస్త్రమంతా ఈ వీరుని రాజుని చేసింది. వాడు కేవలం బాహ్యశత్రు విజేత కాడు. కనుకనే వాడు జ్ఞానకర్మయోగ సముచ్చయ మూర్తియైన రాజర్లి. కనుక అధోలోక పతనం ఊర్థ్యలోక ప్రస్థానం కోసమే. భాగవతా కధానాయకుడూ ఇంతే. మృత్యుభీతుడై హరి పదాశ్రయుడై తరించాడు. రామాయణమూ ఈ ధర్మ్శ్మమార్గాన్నే బోధిస్తుంది. ప్రతి వ్యక్తి రాముడై అవతరించడం

  • రావణాది శత్రు హననం చేయటం - పునః వశిష్టాది గురు ప్రబోధితుడై ఆద్యబిందువు లోకి పోవడం. కనుక ఈ కావ్యం ఆ మూటిని ముడివేసుకుని పుట్టింది. అవి దీనికి తల్లి 'ప్రేవు. కనుకనే వాటి ప్రస్తావన - వ్యాఖ్యానాలు చోటుచేసుకున్నాయి. మొదటి రెండు ఆశ్వాసాలు ఆరంభ క్షణం, ఉద్గమరీతులు. మొదటిది ఆద్యమైన కాళరాత్రి. కాళీగర్భమని తంత్రం. బుగ్వేదంలోని రాత్రిసూక్తం. శ్రీ అరవిందుల సావిత్రి ప్రారంభం - టిబెటన్‌ రాత్రి సూక్తం - 7౫౭ తెంం్‌ ౧ లెద్రాడ? అంతా ఆద్యాశక్తి మహాగర్భస్తుతి, అదే అసత్తు. దానినుండి సద్రూపజగత్తు ఏర్పడినదని బుషి దర్శనం అభావం తీర్చిన ఈ బిందువు - ప్రధమ వాక్యం చివరికి వచ్చేసరికి - కడలి కడుపుల రత్నగృహంలో కాపురం ఉన్న తల్లిగా రూపుదిద్దుకున్నది. ఈ మాతృదేవతే కావ్యాంతంలొ కర్ణధారియై సాంపరాయ నౌకలో సూక్ష్మవానవ చేతన నెక్కించుకొని తిరిగి తన మహాకాలగర్భంలోకి తీసుకొనిపోతున్నది. ఆ పడవ ప్రయాణం వెన్నెల్లో. ఎంత ఆనంద ఘనమైన ప్రయాణం! ఆ పడవే వికసితారవిందం। మహోదార ప్రయాణం. 1 ఇంతకూ ఆ తల్లి ఎవరట! తృతీయ స్కంధంలో స్తుతించబడిన తల్లి సంగతి అలావుంచి తంత్రా భివర్షిత మహాదేవి, సప్తశతిలో _ లలితా సహ్రసంలో కనిపించి శ్రీ రామకృష్ణుల దర్శనపధంలోకి అవతరించి శ్రీ అరవిందుల దివ్యవాణీలో సావిత్రిగా ప్రతిఫలించి ఆ దివ్యబుషినుండి వ్యాఖ్యాతయైన తల్లి, ఆమె జగత్తులోకీ అవతరించకపోతే ముక్తిలేదు, రక్తిలేదు. రక్తిముక్తుల స్వరూపమామె. సావిత్రి మహేతిహాసంలో మవాయోగి అశ్వపతి పార్థిస్తాడు

0706446 016 1006 గ్రియాడ0౫ 6౯ 016 తనా/0/7 00 66001 90726 తదా లాలా ౧౯ (1౯ ఈ 7/00/6400 440 14 4౮ 4660207 తంల గట ఆస 2 0/6 లండు [0౬ 2702220060. ౯664౫8 6 6000 10% 20420264 తీ ౧౭2౫౬2 హి లితంగరి ౧౮౫౪4 2 427020 726 ఇదే విషయం దేవీ సప్తశతీ వర్హిస్తుంది. అన్వేషణలో ప్రయాణిస్తున్న వానికాతల్లి కారుణ్యం శ్వేతచ్భత్రమవుతుంది. ఆమెను దర్శించగల ప్రజ్ఞాచక్ష్తుస్సే సహ స్రాక్షుడైన ఇంద్రుడు. కేనోపనిషత్తులో అగ్ని - వాయువులు తెలియలేని యక్షతత్త్యం ఇంద్రునకు వివరించినది తల్లి. అతనికే ఆ దర్శవం సాధ్యం కనుక. ద్వితీయ స్కంధంలో ఇంద్రసూక్తానువాద తాత్పర్యమిదే. సృష్టిగా పరిణమించిన శ్రీ మాతృచైతన్యం సుప్రదశలో పదార్ధగతంగా ఉండిపోగా తద్దర్శనం చేసే మనిషి ప్రజ్ఞాన చక్షుస్సు ఇంద్రుడు కాబట్టే 'ఈ మనస్సుతో సృష్టిలోకి తొలుతగా వచ్చినవాణ్ణి నేను - అని అంటున్నాడు ఇంద్రుడు. ఈ ఇంద్రత పదార్థగత ప్రజ్ఞానేత్రం. అది సహస్రవిధాలుగా ఉంటుంది. ప్రధమ స్కంధం బీజవర్హన. ద్వితీయం అది మొలకెత్తిన దశ. తృతీయం పదార్థంలోకి ప్రాణాను ప్రవేశం చేసిన స్థితి. కనుకనే అది ప్రాణసవిత్రి వర్ణనతో ఆరంభమైనది. ఆ మహాప్రాణశక్తి బుగ్వేదంలో వాగ్గేవత. అంధభ్రుణీసూక్తానువాద ప్రస్త్తమైన రహస్యం. ఆమె ప్రాణవివర్త వాగ్దేవత. ఆమె రాకతో పదార్థంలో గతి ప్రారంభమైనది. జడం జగత్తుగా మారింది. సృష్టి కదలిక ఏర్పడింది. తర్వాతది బ్రతుకు కదలిక. అందులో రహస్య (గంధి ఉన్నది. అది తర్వాతి ఆశ్వాసం. ఆ గ్రంధి నిష్ణు గ్రంధి. విచ్చేదకుడు ఇంద్రుడు. ప్రజ్ఞావజాయుధధారి. చైతన్యం గగ్రంధిగానైన దశ పగులగొట్టవలసినవాడు శాక్యమౌని, వజచ్చేదికా రూపమైన మహాబోధి సమ్యక్సంబోధిని జగత్తునకందించిన కారు జ్యృమూర్తి. చివరి అధ్యాయంలో ఈ విషయం స్పష్టమైనది. అతని కారుణ్యనేత్ర దృక్పసారంతో విముక్తుడైన క్షుద్రపంధకుని గాధ, ప్రసక్తం కావడంలోని గుస్తార్ధమిదే. ఆ క్తుద్రపంధకు డెవరు? నరుడు విశ్వమానవుడు. ఉద్ధర్త నారాయణుడు ఇరువురూ మహాబోధి (వృక్ష) స్వరూపులే. ఆ అశ్వళత్థమే విశ్వం. దాని కధే కురుక్షేత్రం. ఇందులో మహేతిహాసం. తర్వాతి

ఖండం అనుభవ తీర్థం. ఇందులో మానవ చేతన రెండు దళాల బీజ ప్రస్తావనగా అద్భుతంగా ఆవిష్కృతమైంది. ఆ రెండు దళాలే 1) విచారణ - శాస్త్ర మార్గం. 2) సృజన - అనుభవ స్వరూపం. శాస్త్రకళా సృష్టులకాధార పీరం ఈ బీజం. మనిషి అటూ ఇటూగా ప్రసరిస్తూ అనుభవంవైపునకే చివరకు ఒరిగిపోతాడు. తప్పుదు. అదే సంకుల సమరంగా తర్వాతి ఖండిక. మత్యువు = పదార్ధం; ముక్తి = పదార్ధ చైతన్య దర్శనం, చేసినవాడే మార్కండేయుడు, మధుచ్భ్చందసుడు. “పదార్ధం ఈ కారాగారంనుండి విమ్తుక్తమయ్యే శుభవేళ ”- తో ఆ ఖండంముగుస్తుంది. చేదు జీవితంనుండి మధువును పిండినవాడే మహామనీషి మధుచ్భందసుడు. బుగ్వేద ప్రధమ మంత్రద్రష్ట. తర్వాతి ఖండాలు ఊర్జ్యముఖ ప్రస్థాన వర్ణనలు. సత్యకామ, నచికేత, క్షుద్రపంధకులే “అత్మ లోకపథకులు.

ఇదీ - ఈ కావ్యవస్తు క్రమోన్మీలన సౌందర్యం.

ఈ వస్తుక్రమంలో అసత్తునుండి ఆరంభమైన కావ్యం కేవలం యోగశరీర ప్రస్థానాన్నే వర్ణించక నిన్నమొన్నటి అమెరికా పెంటగాన్‌ భవన నిర్మూలనం కూడా సేర్కొన్నందున ఆధునిక రాజకీయ హింసాకాండను, మతోన్మాదాన్నివస్తువుగా చేసుకొన్నది. ఇది కేవల భారతీయేతిహాస మార్గం.

“వరవస్తు ప్రతిపత్తి ధుర్యమగునైశ్వర్యంబు పంచాశదక్షర సంవ్యాప్తి - నుద్దీప్తమై పరగం గల్పలతా సవిత్రియగుచుం (బ్రజ్ఞావిశేషాఢ్యులన్‌ గరుణం బ్రోచు సవిత్రి వాణి. త్రిజగత్కళ్యాణి గీర్తించెదనో - అని ఎర్రనగారన్నట్లు ఈ కావ్యవరస్తూన్మీలనమిది.

ఎంత వస్తు ప్రగాఢత ఉన్నా కవితా సాంద్రత లేకపోతే శబ్ద సౌందర్యం లేకపోతే దానికి కవితాసిద్ధి లేనట్లే. ఆధునికులు వురచిపోతున్న విషయం ఇదే. ప్రాచీనా లంకారికులు పట్టించుకొన్నదిదే. బహుధా చర్చించినదీ ఇదే.

ఈ కావ్య నిర్మాత ప్రాచీనాధునిక ఆంధ్రాంగ్ల కావ్యవేత్త, కవితా సిద్ధాంతవేత్త, కావ్యనిర్మాణ మార్గదక్షుడు కావటం చేత ఏమాటన్నా అది రసప్లావితం కావలసిందే. ఆశబ్దమయి రసి బిందువు అవుతూనే “వస్తుబీజ గర్భం కూడా అవుతుంది. 'అభావం తీర్చిన ఈ బిందువు ఈ ప్రారంభ వాక్యంలో తీర్చిన - బిందువు రెండూ సై సిద్ధాంతానికుదాహృతులు. తీర్చిన అన్నమాటలో తీర్పు - నిర్మాణ పధకంలోని సాంద్రతను వ్యక్తీకరిస్తుంది. ఈశలో “కవిః మనీషీః పరిభూః స్వయంభూః దగ్గర - ఈ

యుగ వేదబుషులైన శ్రీ అరవిందులు చేసిన వ్యాఖ్యానమంతా ఆకృష్ణమవుతున్నది కవియ్టైన సృష్టికర్తలోని సమష్టి సందర్శనం కలవాడై నిర్మాణ పధక సూత్రానుసారంగా

  • మనిషితో సృష్టిస్తున్నాడు. సృష్టి అంతా ఒక రహస్య స్పందితమైన సుందర - సృష్టినిర్మాణం కలది.

కనుకనే అతడు ప్రతి వస్తువునూ ఎక్కడ ఎలా ఉండలో అలాగే నిర్మిస్తున్నాడు. ఈ నిర్మితిలో ఒక నియతి ఉన్నది. అది యోగదర్శనానికే అందుతుంది. ఆ నియతిని శ్ఞాఘిస్తూ అదే ఉపనిషత్తు అంటున్నది.

యధాతధ్యతోర్థాన్‌ వ్యదధాల్‌ శాళ్వుతీభ్యః నమాభ్యః

పరమాత్మ శాశ్వతంగా యధాతధంగా బుతబద్ధం చేశాడు. చేస్తున్నాడట. ఇదీ తీర్పు.

అంటే కావ్యనిర్మాణ విషయాన్నీ వ్యంజిస్తున్నది కదా. కవిరేవ ప్రజాపతిః కనుక

ఇక ప్రతిమలు (1౧౧౬౮౭౩)

చీకటి కాకి లేమి - నిద్రించే యేనుగు, ప్రాణపుష్పం, రామచిలుక్క నక్షత్రగోళాల [గ్రహాల పందిరి - గగనంలోంచి హర్యక్షం - చిత్రంగా కవి అదే సమయంలో శ్రీ నృసింహ ప్రపత్తి వ్రాశాడు. అందులోంచి ఇందులోనికో, దీనిలోంచి దానిలోకో దూకిన నృసింహమే ఈ హర్యక్షం]

ఈ పర్వతాలు నిశ్శబ్ద ధ్యాన మౌన ఘనాలన్నవాక్యం ఎంతో చిత్రంగా శ్రీ ఆరవిందుల పర్వత వర్ణనను పట్టుకొచ్చింది.

7006 707౭4సా ౦ ం4లాం6 67౯ ౧ 800071

2 4 తలం బ్రిణాాడలలు 7066 2040 ౮౫ల/00124

(0% 16 మంటలను

గురువంటే వున జీవలక్షణంగా పరిణమించేవాడు దానిని మలిచేవాడే. రత్న గృహంలో కాపురమున్నడే నా తల్లి.

ఎంతగా తాంత్రిక దేవతా విద్యారూపాన్ని స్కృతికెక్కుతున్నదీ వాక్యం. మానవచేతనా పుష్పాన్ని వికసింపచేసే మహావాక్యం! సౌందర్యలహరీ స్మారకమైన దివ్యవాక్యం.

అమృతావృతమైన రోదసి - పుష్పించింది సహ స్రాక్షరావాక్‌ - పరమేవ్యోమన్‌ -

అన్న వేదమంత్రార్థాన్ని గర్భకరించుకొన్న ఈ భారతీయ శిల్ప సదృశమైన వాక్యమెంత పవిత్ర గంభీరమో. “పుప్పాడీని రేపిన గాలిని పూవు వూవునూ కలిపింది “బోధివృళ్లం నీడలను పరచుకొంటున్నది “చిద్రూప కిరణ గోగణాస్ని - ఇది కేవలం శ్రీ అరవిందుల వేద రహస్యాన్ని తాకే ప్రతిమ ప్రాణసవిత్రీ అదితిని దేవమాతృకను అన్నది కేవలం యాప్రాణీన సంభవతి అదితిః దేవతామయీ అన్న కరమంత్ర వాక్యమే.

ఇంతగా కవి జీవలక్షణంలో శ్రుతి నిశ్వసిస్తున్నది.

ఇందుకు అవ్యక్త బీజం- అన్నపద్యమంతా పై పద్యంలోని ఆరవింద విషదీకరణమే వ్యాఖ్యానమే. కుండలినీయోగంలోని చక్రం పద్మమే ఈ పద్యంగా ఆవిష్కృతమైనది.

' ఆకాశంనిండా హొయలుచూపే' బహుసుందరమైన ప్రతిమ. గురుపుత్రులను తిరిగి తెచ్చిన కధ హరివంశములోనిది. "పూల కారులో షికారుగా కదలిపోయే మదనదేవుడు' - సృష్టికర్త మనస్సంకల్పమైన మదనదేవుని వర్ణనలో సౌకుమార్య సౌభాగ్యాన్ని ఏ రామకృష్ణుని మన్మధవర్ణననో స్పృతికెక్కుతున్నది. "సముద్రం గర్జిస్తుంది ఆకాశాన్ని చూచి శార్చూలమైై" . ఇదొకరకమైైన ఉల్లేఖాలంకారం. ఒకే వస్తువు అనేక రూపాలుగా వర్ణించడముల్లేఖం. ఒకే ఉపమేయం అనేకోపమానాలుగా వర్ణింపబడాలి. కానీ ఇక్కడ సముద్రమన్న ఒకే ఉపమేయాంశం శార్జూలగర్జగా లేలివాన నిశ్వాసంగా చెప్పబడటం ఒక ప్రత్యేకత. శార్దూల లేలిహాన మరాళ మయూరాలు లేకుండా గర్జా నిశ్వాస కూజిత నర్తనాదులు మాత్రమే ప్రాచీనోల్లేఖంలో ఉంటాయి. కనుక ఈ ఉల్లేఖమొక ప్రతిమోల్లేఖనమనాలి. ఉల్లేఖరూపమైన భావప్రతిమ.

“ అంతస్సుకూ బహిరంగానికి వేసుకొన్న కవిత్వపు వంతెన - అన్న కవితా నిర్వచనం చాలా నవీనం,

7

ప్రాచీనులు విమర్శగా దీనినే స్తుతించారు. దానినే దేవిగా - ప్రతిభాం శివాం వందే _ అని కీర్తించారు. ఆధునిక కాలంలో యాంగ్‌ సుప్రచైతన్య వాదానుసారంగా కళ చేనతావిస్తృతి - కన్పిస్తుందన్నారు. ఇది ఆసియా నిర్వచనం. నేటి పాశ్చాత్య నిర్వచనం. దీని వివరణమే 4 8వ పుటలోని కలల విమానం. అలాగే 4 7వ పుటలోని సురసుందరి, క్రౌంచశోకం, 84వ పుటలోని అతి మనస్సు, కామపల్యంకి (51), మృత్యుసింహం (52), పసరిక, విభాండకుని బిడ్డ (58) ఈ సవుద్రంమీద ప్రతిఫలించే హంసమిధునం (82),

ఒక శ్రీమాత శిష్యురాలు చిత్రించిన చిత్రం దాన్ని అతిమానసావతరణగా తల్లి చేసిన వ్యాఖ్యానాన్ని అనుసరించి పలికిన ప్రతిమ. 110వ పుటలోని చువాంగ్‌జూ ఆమ్రవనం

  • అఆత్మమగ్నవచైతన్యపురి - ఎంతగా ప్రాచీనేతిహాస భావ చైతన్యాన్ని రంగరించుకుని పుట్టిన ప్రతిమలో - దాని వెనుక వున్న అగాథ చైతన్య గాధ- మహాత్ముల తపఃఫలంగా ఆవిర్భవించిన గాధాసప్తశతి వున్నదో వ్యాఖ్యానించుకోవాలి వివేకమున్న సహృదయ పారకుడు. వివేకమంటే మేథాశక్తి కాదు, చైతన్యమగ్న సహజ ప్రతిభ.

రమణమహర్షి నచికేతుని వయస్సులో అన్న మాటతో నచికేతుడంటే శ్రీరమణుడే అని తాత్పర్యం. అలా అనటంతో తాత్పర్యం ప్రాచీనాధునిక మానవ చైతన్యమొకటే. ప్రస్థానమొకటే. ఇదే నిరంతరేతిహాసం. ఇదే సాంపరాయమంటే.

కనుక ఇది శాశ్వతేతిహాసం.

నిరంతర మానవ కురుక్షేత్రం. గీతాగర్భితమైన భారత గాథ.

ఇక ఛందోవృత్త వివేచనం ప్రత్యేకించి చూడదగ్గది కవి తానై కల్పించుకొన్నది కనుక. నాటీ ఇతిహాసం త్రిష్టుప్‌ - అనుష్టుప్‌ రూపబంధితం. నేటిది కవినిర్మిత స్వచృందో గీతిక,

ఈ ఉషోగీతికను హృదయ దఘ్నంగా అనుభవించి వునసారా కవిమిత్రుని కౌగిలించుకుంటున్నాను.

ఫై

ప్రస్తావన

కవిగా నేకు రూపొందిన నాటినుంచీ నాలో ఈ కావ్యం - సాంపరాయం - బీజభూతంగా ఉన్నదనే తోస్తున్నది. 1995, 1996లలో రేడియో కవిసమ్మేళనాల కోసం రాసిన కవితల్లో “ఆరంభక్షణాలు ఉన్నాయి. అయితే 199 9 నుంచీ ఈ కావ్యం అవ్యక్తంనుంచి వ్యక్తంలోనికి మొలకెత్తడం కొనసాగింది. మొన్న 2001 నవంబర్‌లో పది పన్నెండురోజులు కావ్యం నావెంటబడి అప్పటిదాకా సగం సగంగా ఉన్నస్థితినుంచి పరిపూర్ణం అయింది.

సాంపరాయం సృష్ట్యారంభంనుంచీ భావిదుఃఖరహిత జగన్మిర్మాణందాకా గతానాగతాలు చర్తమానంలోనికి వచ్చి ముడివేసుకున్నాయి. సర్గ విస్తరణలోని ప్రసవ వేదన భౌతిక ప్రాణిక చైత్త్యస్థరాలలోని సంక్షిష్టత అనిరతంగా చైతన్యం దుఃఖ విముక్తి కోసం చేసే తపస్సు దీనిలో ఇతివృత్తాలైనవి.

వస్తు విన్యాసంలో ఏ సరిహద్భులూ లేవు. నాలోనుంచి అమూర్తమైన జీవనదృశ్య పరంపర “పికాసో” చిత్రసంపుటిగా అభివ్యక్తమై తన ఆంతర్యాన్ని వ్యాఖ్యానించింది. బిందువునుండి మండలం దాకా పరివ్యాప్తి పొందే క్రమంలో విశ్వవికాసంలోని అన్ని ఘట్టాలను సభ్యతల విస్ఫోటనాన్ని జీవనంలోని పరిమితులను స్వప్న సంకలనాలలోని సామరస్యాన్ని విశదం చేసింది.

“ఆనంత్యం”' రూపుకట్టుకుని వచ్చి - మృత్యుకవాటాన్ని వివృతం చేసే ప్రయత్నంలో ఈ కావ్య ప్రపంచం ఒక ఇతిహాసమైై అవ్యక్త శిలాగర్భంలోనుంచి ఆవిష్క్పృతమైనది, వేదోపనిషత్తులూ, జానపద పురాగాధల్టూ ప్రాగ్రోపాలు తామై కావ్య ద్రవ్య సము ద్రంలోనికి ప్రవహించాయి. ఈ మెటామార్భసిస్‌లో ముడిసరుకుగా ఉన్న సంస్కారాల్హూ భావనలూ, బింబాలూ, కల్పనలూ అన్నీ అనుభవ జగత్తులోనికి ఒకానొక అపూర్వ పరిమళాలను మోసుకువచ్చాయి.

ఈ కావ్యరచన నాకు అంతర్భహిర్షగత్తులకు నిరంతరానుసంధానాన్ని కల్పించింది. ఏ దిగిరాని ఆకాశాంచలాలలోని జ్యోతిష్యమతియైైన నేత్రద్వయం నాకు దారి చూపించింది. స్వేచ్ళతోటి ఛందస్సులోకి విశ్వమంత కాన్వాస్‌మీద పద్యరేఖా చిత్రంగా సాక్షాత్కరించింది.

ఈ కావ్యరచనా వేళ నాకు తెలియవచ్చింది తపస్సు అంటీ ఇదేనని, “తపస్వాధ్యాయనిరతం' అంటే బయటి ప్రపంచం, లోపలి ప్రపంచం రెంటికీ మధ్య సేతువును నిర్మించడమేనని. ఆ

స్థితిలో ప్రచేతస్సు మేల్కొని తన రహస్యాన్ని జగత్తు ప్రకాశింపజేస్తుందనీ.

సుమారు పదిహేను సంవత్సరాలైంది. మృత్యుంజయ విద్యతో నాకూ మా శ్రీమతి శారదకు పరిచయం కలిగించి - నాలోని కవిని చిటికెన వ్రేలు పట్టుకుని నడిపించుకుపోతున్న మహాపురుషులు శ్రీ కందుకూరి శివానందమూర్తి. ఈ కావ్యంనిండా వారి స్మితరోచులు నాకు కనిపిస్తున్నాయి. అందుకే వారికి దీన్ని అర్చించడం.

“కెలాస దర్శనం రచనా కాలంనుంచి బాగా చేరువైన వూన్యమిత్రులు శ్రీ పి.వి.మనోహరరావు ఈ రచన గురించి తెలియగానే అత్యల్ప సమయంలో అచ్చువేయించే బరువును నెత్తికెత్తుకొన్నారు. వారు దశాబ్ద కాలంగా సర్వార్థ సంక్షేమ సమితి సంస్థ ద్వారా

థి మానవ జీవనం సార్థకమయ్యేందుకు పురుషార్ధ సంపుటి సఫలంగా అందేందుకు భారతీయ సంస్కృతి పరమార్థాన్ని ఆచరణలోనికి తీసుకు వస్తున్నారు. విద్యద్గోష్టులు, యువజనులకు స్పర్థలు, ప్రత్యేక యజ్ఞయాగాదులు చేస్తూ, సాహిత్య, సాంస్కృతిక కళా రంగాల్లో దివ్య జీవన స్పర్శను కలిగించుకున్న శ్రీ మనోహరరావును అభినందించడం కృతజ్ఞతావిష్కారమే మరొకటి కాదు.

ఈ కావ్యరచన ఆరంభంనుంచి నాతోపాటు అనుగమిస్తున్న పినతండ్రి ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య. ఈ కావ్యాన్ని చదివి ముందుమాటలు వ్రాసినవారు ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు, ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యలు. నా సాహిత్య ప్రస్థానంలో వారి తోడ్పాటు ఎప్పుడూ ఉంటున్నదే. నావలెనే సాహిత్య నిర్మాణాన్ని సాధనలో భాగంగా చేసుకున్న ఆత్మీయులు వాళ్లు, కావ్యరహస్యవేదులైన వారికి నా ధన్యవాదాలు.

ఈ కావ్యం ముద్రించబడి బయటకు వస్తున్నప్పుడు అనేక దశల్లో సహకరించిన వాళ్లు మిత్రులు శ్రీ వెంకటరామారావు, డాక్టర్‌ కె.వి.ఎన్‌, రాఘవన్‌, శ్రీ ఎస్‌.మోహన్‌, డాక్టర్‌ శ్యామ్‌కుమార్స్‌ మాపిల్లలు శ్రీనివాస్‌, సంతోష్‌ శ్రీవాణి, శ్రీలతలు. వీరందరికీ అభినందనలు, ఆశీస్సులు.

ఈ కావ్య ప్రాంగణంలోనికి సహృదయులందరికీ స్వాగతం.

16-02-2002 కోవెల సుప్రసన్నాచార్య

సాంపరాయం 5010 01 616010/

సాంపరాయం అంటే యుద్ధం అనీ, భవిష్యత్తనీ నిఘంటువులు చెప్పుతున్నాయి. శ్రీ శంకరులు కరోపనిషత్‌ వ్యాఖ్యలో సాంపరాయుం పరలోక విషయువునీ పరలోక ప్రాప్తి ప్రయోజనమనీ తెలిపారు. సం-పరేత ఉత్తమ పరలోక భావన చేసిన వాడనీ, సంపరాయమును - వటఖముక్షుతను పొందినవారు సాంపరాయులనీ చెప్పవచ్చు.

ఈ ఇతిహాసం ఇహలోకంలోనే జీవించి ఉండగానే మృత్యువును జయించి, స్వేచ్ళగా శరీరాన్ని విడువగలిగి, ఈ జగత్తును దివ్యభూమిగా అవతరింపజేయగల భావనను కేంద్రంగా చేసుకొన్నది. పరలోకమును ఇక్కడనే ప్రాప్తింప జేసుకోవడం వల్ల ఇది పరమలోళ ప్రాప్తి సాధనమే అవుతుంది.

క. 5/4స4ఉ04 000 న 945౯4011 ౧౫4 - 531 163 ౪ వడుం+ంషాణ8 (0 87)4 ౧ ౧11 089] - 809505 మసుష్టని శరీరం షే ఖస్తేందం వా సుక సుస్తుది సుద యోగగోస్తుం- ప జి టా నాన దో రసు చలన ంని ట్రహ్తేఫవులచ్షాణా భువికి దిగేన్వని , నుస మహర్షుల తపము వ మె, నటినీయయా అర్మోభస్తక్టులలో అటనట అంతర్హాహినియై, ప్రజకు ననగ పపు మై హో ఉద. విద్తావుదగం, మూర్త బుంభ పలు అశ్చేషులయు ఆ తేశలప్రక పై యుస్తుట్‌ దా నిష్టలు మ లంగ ముల కక ముల తెలీసన* నబులకో “తీ ఖ్రంత్తర్లా నయన ర! నానరు సా్షాత్యంంయ్మన్తుడి. కళమంషమ్పు నా వి గతసారి క చాశని ఒకింత త్భూఖ్భానిం౭ి “మిత్రుల పొస్తమందుంని కప] వయమటుండనిండం. ల వి నో కనాన కొ౭లకు తోన్రదుగు అకాంశ్హ- పచ్చ, లం అజా. శేర్యాపుతరం కష లో నాసకొక జీ వొవచిండువు బా. జ్యాలుగు ౫ బీోరిణాలిన గురువు ట క సర్ట్‌ సాగా ల నో లే బీయాగాళ్తుముయు యే చై (ఈతి కవిభానే ( ల... స౦ం కోజందుంఓ నీ చేర దద్దానం న న సూ నా న న -పలింినది బ్రుబంతయు క్‌ భర్యయడ చక పస్‌ ప్రయోగేయు-. రోని రసము నాస్తావంచుట పక శ వు క్ష కూ్టుడించేలఓిన ఈ న్వార్ట్యము. "గా, వానితో టి జాసుళసజ్డులోలికున్ల! లో తచిత్తష్టతికిముయుగనే స్పోదీయింగమమై దస దాచాను రేర్చిచ్సి, వోచిన నివ ము మహోహరముకాగలదు . సువసుడు దోడ్షేతముగ నో నల ప. రే భల్సి మము “కీల కచ్తరంయా 6 తరగా

సద్గురు శ్రీ కందుకూరి శివానందమూర్తిగారికి అంకితము

ప్రాణాలు ముడివేసుకొన్న

సట్టున నెలకొన్న మకు,

కానరాని మనస్సు పారల

గట్టుల మెరుసైన మీకు,

అనంద వనవాసి, శద్ది

మందలి రసమైన మీకు,

అఆనంత్క మితిహాస మిద్ది

అర్చింతు నాంపరాయమ్ను సుప్రసన్నాచార్య 27-02-2002

ఉషస్సు అవ్యక్తం నుంచి వ్యక్తం దాకా ప్రసరించి తన్ను ప్రస్తరించుకుని వ్యక్తమై దానిలో సుసూక్ష్మతేజో బిందువుగా మిగిలిపోయి స్థితియై దిక్కుల రూపాన, కదల్సికై కాలరూపాన ఆధారమై అనంతుడైన వాసుదేవునకు నమస్సు అవిదిత యోగమార్గాల అంచల స్వర్హరేఖికల ప్రకటించి, భిన్న చైతన్య స్తరములలో వెలి నెరిగి సవితృ మండల దివ్యరోచి - మృత్యు సీమలు తొలగించు ప్రకట వేద రహస్య వేది శ్రీ అరవిందులకు ప్రణతులు ఆవిష్పృతమైన ఈ జగత్తు అట్టడుగున కట్టుబడినా జడమున తమమున న్హోతన్య గర్భగుహలను నిల్చి ఉన్నా పడగ విప్పి ఆకాశ మంచుల దాటిన “ అభీప్ప' తానైన సతత జా గ్రదుద్గమకీల జగన్మాతకు జేజేలు ఇన్ని లోకాలలో తిరిగినా, ఎక్కడా దారులు పూడిపోయి అకించనతలో - ధర్మ సమ్మూఢ ధీపరిధి ఇరికినప్పుడు సంక్షిష్ట - మనస్సు చీకట్లో వెదకులాడుతున్నప్పుడు నన్నుచేదుకున్న*వెలుగు దారి శ్రీశివానందులకు జోహారు

నాంపరాయం

బుతసత్య దర్శనులు శ్రీ వశిష్టగాధి పుత్రులకు - అంతర్విహృతి ద్రష్టలైన అగస్త్యృదూర్వాసులకును - భాగవత మార్గ దీపకులు ప్రహ్లాదనారదులకును - బ్రాహ్మమయ బుషులు వాల్మీకి విశ్వనాధలకు వందనము జగద్గురువు యోగేశ్యరేశ్వరుని సందేశ పధంలో భవ్యబుద్ద్ధులు మై త్రేయుల చైతన్య బోద్ధ వలయంలో కదలి వచ్చిన అవధూతలకు, మహాత్ములకు, పరమహంసలకు సాయికి రమణులకు, వివేకానందులకు సంస్తుతులు

ఇది నాంధి

శ్‌

మొదటి నర

అభావరో తీర్చిన ఈ బిందువు ఎవరికి కుదురుగా ఉన్నది? అగాదంలో కూరుకున్న ఈ మూలుగు ఎవరికి శ్రావ్యమవుతున్నది? భయం అజగరమై, మేలుకొనని ఈ జగత్తును చుట్టేస్తున్నది జడం ప్రకటమై - అజండ గాఢనిద్రలో కలవరిస్తున్నది తేజస్సర్శ లేని చీకటి కొండక్రింద నలిగిపోయే సంవేదన ఎరుకగంట చిరుసవ్వడులు లేని శూన్యతామందిర క్రమణ పరిచితికి సుదూరమైన అవ్యక్త గహ్వర కాళికా గ్రహణ రికమౌ బయళలైన కలుగని చిక్కని భావ సంవరణ కరడుగట్టిన ఈ అసత్తు కడుపులో ఎన్ని యుగాలు - కల్పాలు కరిగిపోయిన “నేను” లో క్షుబ్ధమైనవి ఎన్నిలోకాలు చిందర వందరగా పడివున్న ఈ గృహం దేనికోసం సజ్జితమవుతున్నది అదరిపడుతూ హరాత్తుగా ఉనికి గడియలను స్మరిస్తున్నది వ్యధలు కధలుగా అల్లుకొని చీకటి రధాల మీద ఊరేగుతున్నవి తరగలు లేని ఈ జలధి తన్నుతాను వెదుకుకొంటున్నది లఘు స్వప్నపరిచ్చేదాలను, అనుభవ సంధివేళలను తలచుకొంటున్నది - నిద్రను తరిమి వేయబోతున్నది 1 బుగ్యేదం - నాసదీయ సూక్తం (10-129) నాసదాసీత్‌ నోసదాసీత్‌ అని ప్రారంభించుతుంది సృష్ట్యారంభాన్ని

3 నాంపరాయం

కోల్పోవటం ఒక్కక్షణం, కోలుకోవటం యుగాలశ్రమ సృష్టి పదార్థంలో సమత లోపించిన వ్యధాంగణం అన్నీ ముడుచుకుని ఒక ముద్దగా ఎక్కడో దాగిన వేళ ఒక సుదీర్ణ మౌనం, ఒక అనంత నిద్ర, ఒక అవిదిత లిప్త. శూన్య వృత్తిలో చీకటిళాకి రెక్కలను ముడుచు కొ ంటున్నద్సి మొదలెక్కడో తుది యెక్కడో, మను వెక్కడో తను వెక్కడో, “లేమి పాతాళ గర్భంలో నాల్గు గోడల మధ్య నిద్రించే యేనుగు- రహస్యమయ సాగరంలో అనంతభావమై ఈదుతూ వస్తున్నది. అనాది మూలం అనుతృన్నమైన పాదులో ఆస్టితి నెలకొన్నది, ఆనంత్య గర్భంలో ఒడలు మరచి నిదురిస్తున్నది కాలం, అరూపంలోంచి మెల్లగా ఏర్పడుతున్నరేఖా సమూహం పిలుపుల కందని అభావ గర్భంలోంచి ఉదయించింది దేవమాత. శబ్దమూ నిశ్శబ్దమూ అవిశ్రాంత అనంత నిశ్వాసంలో లీనమై, అస్మితను కనబోయే ఇరుల చూలాలు పరవశిస్తున్నది- జీవన సలిలాల పైన మంద్రంగా శ్వసిస్తున్నది ఉనికి కదలిపోతున్నది ఒంటరిగా తీరంలేని వహ్ని సముద్రం వైపు. తెరలు చీల్చి గనులు పగిల్చి అవ్యక్తం ఆగమిస్తున్నది అధొలోకాల గర్భం నుంచి ఒక దుఃఖ శ్యాస్క విరహ గీత్తి అనుప సర్గితమైన సర్గ సంకల్పం దారిని ఏర్పరచుకుంటున్నది బిందువు స్ఫురిస్తుంది, నాదం కదలి వస్తుంది. సాం పరాయం లే

సృష్టి ఆద్యంతాలకు సంగమమైన ఒక దివ్యక్షణం ప్రాణం ఆవాహనకు బీజ మంత్రమైన మృత్కణం అప్పుడే మేలుకొన్న అగాధమైన 'నాస్తి- అస్తి” అప్పుడే కదలుతూ వున్న జీవసంస్పంద ముద్ర పేరులేని ఊరులేని ఏకాంత సరోరుహంలో పాలిచిన సంకల్ప రుంకారం ఎచ్చోట వికసించిందో కదలికయింది అణువైంది, ప్రాణమైంద్హి ఆది వసంతమైంది అనంత గ్రహనక్షత్ర గోళ మయింది, అవిదిత నిశాంతమైంది. అకుసుము జడ సంపుటిలో కుసుమమై వికాసించి అనుచ్చ్వసిత కామనలో హంసరెక్కలై ఆవరించి వైరుధ్యాలకు ముడివేసి నామరూపాలు జతగూర్చి అనవగాహ్యమై స్వయం ప్రవృత్తమై ప్రకాశించి తెలియని కారాగారంలో నుంచి, తెలియని స్వప్నంలో నుంచి తాను మృత్యు గర్భాన్ని తొలిచి, ప్రాణ బీజాలను చల్లినట్లు జగమంతటి మహస్సు కదలి ఒకసారి ఊపిరి పీల్చి విచ్చుకొన్న జడాణువుల్లోకి ప్రాణశ్వాసను నింపినట్లు అనుమతితో పరిమితిలో ఒత్తిడిలో చిక్కులలో నిదుర మెలకువల నడిమి సరిహద్దు రేఖల మీద ఇంకా మేలుకోని యింద్రియాల ఇరుకు బాటలలో చీకట్ల సముద్రాల లోతులలో దొరికింది జీవరత్నం.

షే నాంపరాయం

అర్జ దీప్రమైన అవిద్యలో నుంచి, ఆకాంక్షలై వెలిగిన కాగడాలు బండ జండాల దివ్యయోజనను సమన్వయించే భావ శిఖరాలు ఇంతటి ఇరుల గదుల్లోనూ అణిగి వున్న ప్రాణాంకురాలు ఇంతటి దీర్ణ దుఃఖంలోనూ భావిని నిర్మించే ఆనంద లేశాలు ఆకాశం ప్రత్యుత్తరమై అవనిని కౌ గిలించబోతున్నది

ప్రాణ దేహళి సమీపాన బంగరు గంటలు మోగుతున్నవి

గాలిలో గల గలల వెనుకపొంచిన గీతికా సమూహాలు అతిధియ్టైన అఖండతకు నిలువెత్తు ఆహ్వానాలు

సంకల్పం నిశ్వ్వసిస్తున్నది, నీల గగనం అవరోహిస్తున్నది

ఎక్కడో రహస్యద్వారం తెరచుకొని ఇతి హాసం ప్రవహిస్తున్నది అపూర్వమైన అనుభావ మేఘాల మీద అంతస్సు సాగిపోతున్నది మృత్యుమాత ప్రకటిస్తున్నది, క్రొత్త సృష్టి అవిష్కారాన్ని

జీవ సముద్రం ఉరుముతున్నది, లోపల సుడులు తిరుగుతున్నది సంస్పందం కూర్మమై మధనానికున్ముఖ మవుతున్నది

అగ్ని ఉఛ్వసింపగా పొంగులెత్తిన ఐరావతాలు, అప్పరలు, అజగరం నిశ్శ్వసింపగా సర్వమునూ దహించే కాలకూటం. తపస్సు చేసిన అవికృతి దిక్కులను ఏర్చరుస్తున్నది

అవ్యయమైన అశ్వత్థం ఆకులలో నిమేషాలను ప్రసవిస్తున్నది మట్టిలో ఎన్నెన్ని సుప్రప్రపంచాలు, చైతన్య ప్రస్తారాలు ఛందస్సులను పొంగించే చిదావర్తాలు - చిరముహూర్తాలు

నాంపరాయం 6

తూర్పు గుడిలో ధ్వజస్తంభవు చిరుగంటల కదలికలు చెదరించెనో దివ్యాదివ్య జగత్తుల సుసంగతిని అవిదిత నిశీధ గర్భాల నుండి వెడలి వచ్చిన ఉషసి మాత అవని యజ్ఞ వేదిక మీద అంశువుల ఆహుతులిచ్చి అవ్యక్షాన్ని ఆహ్వానించి వ్యక్త పరిణాహం సమకూర్చి అజండాన్ని ప్రకటించి అనంత వైవిధ్యం కలిపించి దిక్కులు, కొలతలు, కొండలు, నదులు సముద్రాలు బుతువులుు, నెలలు, దివానిశలు, దీప్తసుప్తనిమేషాలు ప్రతి స్పర్శలోని తాదాత్యంలో తన అనంతత్వాన్ని మరపించి ప్రతి పరీరంభంలోనూ నూతనాద్వితీయతను కోల్పోయి ప్రతి క్షణమూ మరొక ఉత్తర క్షణాన్ని సమకూర్చుకుని ప్రతి పగటికీ జతగా మరొక రాత్రిని కల్పించి గాఢమైన అవిదితమైన దివ్యస్పంద సమూహంలో నుంచి ఊపిరి తీయటమే ఒకానొక పరమ సుఖానుభవమై ఎన్ని ఎన్ని అపూర్వ దృశ్యాలు, ఎన్ని ఎన్ని మంద్రస్వర రేఖలు ఈ జగత్తు సమాకలిత ముజ్జుల భోగ విభూతి సృష్టిలోని అంశాల్ని పరస్పరాకర్ణక సూక్ష్మదామాలతో ప్రకృతి అనుసంధించింది, ప్రతి స్తరాన్ని అన్నివెపులా లోతులలో ఒక నక్షత్రానికీ, ఒక నేలలోని అంకురానిక్స్కీ ఒక గర్భస్థ శిశువుకూ అవిభాజ్యమైన ప్రాణ బంధం చైతన్యాను సంధానం,

గా నాంపరాయం

ఇప్పుడు పుట్టిన నేను బాహువులతో దిక్కులు కొలిచే వృక్షాన్ని - పాయలు పాయలుగా సముద్రంలోకి సాగే ప్రవాహాన్ని దిక్కులన్నింటినీ ప్రకాశింప జేసే తేజఃప్రసారాన్ని

అంతర్యామినై అంతటా విరిసిన ప్రాణ పుష్పాన్ని

ఈ ప్రియమైన క్షణాన్ని గూర్చి, ఈ కుద్దురైన బిందువును గూర్చి ఎక్కడ మొదలు పెట్టేను, దేనిని వదలి పెట్టేను

గుహలోంచి ఒళ్లు విరుచుకొని బయటకు దూకింది కాంతి సింహం ఎన్నోరోదసీ కాననాలలో ఒకేసారి కానవచ్చింది.

మేల్కొని చూద్దునుగదా గుండెలో కామన పొంగులెత్తి స్వపష్నంలోంచి కదలివచ్చి ఎదుట నిల్చింది రామచిలుక

మావి చివురుల్లోంచి తొంగిచూచిన భాస్కర బింబం

వికసించే హృదయ పద్మాన్ని చుంబించిన హృదయకేంద్రం ఆకాశంలో పుట్టిన ఈసింహం అకాశాన్నే గ్రసించింది

తన చుట్టూ వలయీకరించుకుని సృష్టిని పరిభ్రమింపజేస్తున్నది నక్షత్రాల గోళాల గ్రహాల పందిరి క్రింద విలాసంగా జన్మమృత్యువుల డోలకం మీద ఉయ్యాల లూగుతున్నది ఖనిలోంచి వెలువడి మొలిచిన తప్త కాంచన వేదిక వైపు

కదలి వచ్చిన గజరాజు మధురసాన్ని పైకి చిమ్మించింది ఎక్కడనించో ఎగిరి వచ్చిన ఒక పాలపిట్ట ఆశావహ స్వప్న (గ్రంధాన్ని ఆవిష్కరించింది.

శాంపరాయం 8

సృష్టి శిరస్సు మీద ప్రకటమైన దీప్తదివ్య మకరముఖం వ్యష్టినుంచి సమష్టి దాకా పరుగులెత్తే జ్వాలా సైన్యం అంతర్భహిస్సులలోనూ వికసించే నిత్యజీవకల్పారం సర్వతో ముఖంగా ఆవరించే అగ్నిపుత్రుల ధీర భావం ఈ వైభవం స్పృశించిన కణకణమూ పచ్చదనమై ఈ కాంతిలో తడిసిన నీరు సర్వరసాను భవంగా రూపించి రోదసి లో ప్రతిఫలించిన చోట విద్యుత్తుగా పరిక్రమించి గాలి వివశయై బుతువులను కన్నది, ఆకాశం తరిగిపోయింది నేను జీవాన్నివృక్షాన్ని ఫలాన్ని రసాన్ని నేను ఆవర్తాన్ని బుద్భ్బుదాన్ని తరంగాన్ని తధాగతము, తధా దృష్టము, తధా భావితము నిత్యభావం కనిన స్వప్నము, అర్థరాత్రి గర్భంలో పగలు. ఇప్పుడు నేను ఈ ఎల్లకు కుద్దురెన శృంగాటకాన్ని ఈ క్షణాన నా హృదయం ఉన్నుక్త మత్తవిహంగం పూవు కరిగి పోయింది గాలిలో ప్రవహించే తావిలా అహం చెదరిపోయింది ఉదధిలోకి ప్రవహించే వాగులా కనులలోకి ఆహ్వానిస్తున్నాను, కంరంలో భద్రపరచుకొన్నాను గగనంలోంచి దహరంలోకి కదలి వచ్చిందీ హర్యక్షం నిరంతరం మోగుతుంది సితబంభరీ నిస్వానం అసంకులము అవివృతము అనంద సోపాన మార్గం,

ం్ర సాంపరాయం

కదలే ప్రతిగడియ అదృష్టా వ్యక్త భవ్యగర్భం లయ గ్రస్త జీవబీజ నిహిత రహఃపేటిక ప్రతిక్షణాన్ని అనుభవించి దానిని విశ్వాత్మగా రూపించి ప్రతి నిమేషం సూక్ష్మ లక్ష్యానంత సాక్షాత్కారమై జ్ఞాపకం మృతి కాగూడదు, నిత్య జాగృతి కావాలి శిశిరానికీ వసంతానికీ విభాజక రేఖ సాపేక్షకం సృష్టి ఆరంభ బిందువులోనే ప్రళయం కేంద్రితమైంది సూర్యుణ్ణి వెంబడిస్తుంది రాత్రి గీతం నిశ్శబ్దంలో లయిస్తుంది క్షణాలను ఎడ తెగని మాలగా కట్టుతుంది ఉనికి అనులిప్తా మారిపోతున్నది అభూత పూర్వ సర్గమై మృత్యువూ ప్రాణమూ భూత భవిష్యత్తులై సంగమిస్తున్నవి వర్తమానంలో నిలిచిన నినదించిన తాత్పర్యమే ఎరుక!

. పొర్ధన చేస్తున్న ఆర్త శూన్యం అక్రందనకు బదులుగా విస్సృత మవుతున్న గగనం, విసృత మయ్యేవాస్తు శిల్పం కురుస్తూన్న చైతన్యపు తొలకరి, అసుజన్మలిప్త ఒక అనుక వచో మాతృక - భవ్యజగత్తుకు ప్రాతిపదిక అవ్యక్తం వాకిటి క్రొత్త పిలుపు తలుపు తడుతున్నది ఆకస్మిక జాగృతి తడబాటును కలిగిస్తున్నది కాల రహితంక్షణాల వలలో చిక్కుకుంటున్నది జడ గ్రాసాన్ని మేసిన కామధేనువు జీవక్షీ రాలను కురియగా

నాంపరాయం 10

లిప్తలు ప్రాకుతున్నవి భవ్యమైన అనంతశిఖరం వైపు ఆప్తభావం వలయాలుగా జగత్తును ఆవరిస్తున్నది పరావర్తితమైన ఖరకిరణం చెలిమి వెన్నెల కురుస్తున్నది జీవ పరిణామం ఎక్కే నిచ్చెన ఎక్కడికక్కడే శిఖర భావం. ఈ పర్వతాలు నిశ్శబ్ద ధ్యానమౌన ఘనాలు ఈ ఉదయాలు జ్వలన్ముహూర్త నిత్య స్వప్నాలు ఈ తరంగాలు ప్రతి ఫలదాశా ప్రసాధనాలు ఈ కుసుమాలు రహోవిద్యా మాధుర్యాలు నీవు నిలిచి వుంటీ పూర్ణం, నీవుతొలగిపోతే శూన్యం పూవు వికసించటం, వాడిపోవటం, రాలిపోవటం నీవు పూవ్లువె చూస్తే నిజంగా అద్భుత చిత్రం అప్పుడు ప్రతి నిమేషం సృష్ట్యాది, ప్రతి కదలిక వసంతం దిగంచలాల కొంగులను ముడీివేస్తుంది మనికి కడలి కడలి కడుపులో రత్న గృహంలో కాపురమున్నది నా తల్లి ఆకాశం నడిబొడ్డున సహ్తాశ్వాలు సాగినప్పుడు ఆమె శబ్బమై ప్రాకుతుంది, శ్వాసయై పరవశిస్తుంది రూపుతాల్బబోయే బొమ్మను గీచే చిత్రకారుని వేళ్లల్లో అల్లుతున్నమాలలో ముత్యానికీ ముత్యానికీ నడుము కుదురుకున్నతాను - పద్య గంధమై ముసరుకొని వచ్చి ఆక్రమించింది నన్ను ఇతిహాసమై చైతన్య సంఘాతమై.

ఆరంభ క్షణం

శే (|. నాంపరాయం

రెండవ నర్గ అ(గ్రమందున ఉనికి బిందువై భూమిని మోసింది అగ్రమున నడిపించు జ్యాలయ్దై పై పైకి ఎగసింది అగ్నియ్డై పరాపర జగత్తుల నడిమి వంతెనగ రూపిల్లి లీనమయింది బుతమూలాన - సత్యమై లోకమూర్గాన సప్త భూమికలు, సప్తాశ్వాలు, సప్రజిహ్వాకలు సప్త వ్యాహృతులు, పెకి క్రిందికి సాగిన మెట్ల వరుసలు సచ్చిదానందముల ఏకాకృతి మొరసిన వివృత ఘంటికలు సృష్టి నిండా విరిసిన నైకవర్ణ సౌందర్య చిత్రశాల పరిణామమో వివ్వర్తమో నభస్సున రధనేమి విక్రమించింది ప్రాగ్జిశ ఆహతమైన సవ్వడి ఛందస్సులో ప్రస్తరించింది ఇప్పుడు బ్రాహ్మీవేళ- భూర్భువస్స్యర్లోకాలకు ముడి నిద్రకు స్వప్పాన్ని బిగించి జా గ్రదస్రాన్ని సంధించింది. అమృతావృతమైన రోదసి ప్రతిఫలించింది అవనిపైన ఆదిమ గుహల్లో నుంచి ఆదిమవచస్సు పుష్పించింది గగనమై ఈ యెల్ల విస్తారమైన “బహుత' ను వరించి తెరతీసిన వేదిక పైన కొత్త రూపకం సాగింది.

సాంపరాయం కేం

భూగోళం చుట్టూ పరినర్రించిన బుతుచక్రం నిప్పులు కురిసి, నీటిని కురిసి, వెన్నెల కురిసి మంచును కురిసి అవనిని అవిభాజ్య ప్రాణారణ్యంగా పరిణమింప జేసి

కొండలు, నదులూ, మైదానాలు, ఎడారులుగా దర్శనమిచ్చి అద్భుతమైన ఈ క్షణాన్ని అదృశ్య హస్తం ముందుకు తోస్తున్నది- అనంత పార్య్యాలతో, అనంత శిఖరాలతో, అనంత చక్రాలతో విశ్వచూర్తాండుని జీవరధం నెమ్మదిగా కదలి వచ్చింది సుషుప్తిలోని అభావసర్పం మృత్యువుకుబుసాన్ని వదలుతున్నది అపరిష్కృతమైైన ఈ కానుపులో ఏదో అదృష్ట సామరస్యం అనిశ్చితమైన ఈ జననంలో ఒకానొక అపూర్వ క్రమరీతి

తొందర పడుతున్న ప్రకృతి సుదీర్హ నిశ్చ్వాస రేఖ

తృప్తిని ప్రకటించే అనుభావం- ఉద్గమించిన ఒయాసిస్సు. ప్రధానం - ఉనికి సరిహద్బల్లోకి ప్రవేశించిన వేళ

అసంఖ్యాక నామరూప కల్పన - అనంత వస్తు విన్యాసం ఇంతటి నిర్మితికి - సాక్షులు లేరు, ఖావుకులు లేరు

ఇంతటి నిశ్చలనమూ అంతః స్ఫురణతో రెక్కలు తొడుక్కుంటున్నది క్షణాలు, పగళ్లు రాత్రులు, బుతువులు వారాలు

ఉళ్లు, దేశాలు, గోళాలు, దిక్కులు, నక్షజ్రాలు

ఎంత అద్భుతమైన సమావేశం, శూన్యగర్భం ప్రకటించిన ఉభయ సంధి బంధంలోనే విశ్వ చైతన్య సందోహం

13 సాంపరాయం

నిత్య పరిక్రమ భావ నిరత దళావృత పద్మం రత్నధాతమమైన సారమణి- మణి పద్మ సంపుటము సౌరమండలాల గ్రహ సంఘాతాల సార్థవాహం ఎక్కడకు పాల పుంతలోనికో ఆవిర్భావ మూల బిందువు లోనికో. తామసీ గర్భంలో నుంచి ఉషళ్శిశువు జన్నవెత్తింది సాము చీకటి సాము వెలుగుగా జగత్తు సంభవించింది ద్యావా పృథ్వులుగా, దివానిశలుగా, మిత్రావరుణులుగా మిధునమైన సృష్టి ద్వంద్వనిష్టను ప్రకటించింది. గింజ మట్టిని చీల్చే వేళ ఊపిరినంతా బిగపట్టి పైకి పొడ్చుకువచ్చి ఒకసారి తన్ను ప్రకటించుకునే క్షణం చివురు విచ్చుకునే వేళ మొగ్గ కనబడే వేళ వినబడని మట్టి మూలుగు - ఆ లిప్త విశ్వ చైతన్య సంవేదన అనంత జలౌషధీ రసాపూర్ణ ప్రకృతి విలాసం అడుగున ఆవిర్భావ వేళ సూక్ష్మాణు సంచలన విన్యాసం విస్ఫోటం వెంటసౌందర్యం, విధ్యంసం వెంట నిర్మాణం వేదన వెంబడి సంతృప్తి కోలాహలం రూపించు ప్రశాంతి తరలి వచ్చిన ప్రాణ వధువు గగన మణిని వరించింది హృదయ పద్మంలో నిలుపుకుంది అనేక వర్ణాల శిశువులనుకంది జగచ్చక్షువు తన సంతతికి వేయి కళ్లతో ప్రాణదీప్తిని కూర్చ ప్రకృతి విశదమైన ప్రస్తావన చేసింది పరిణామ దేహళిపైన నాంపరాయం [వ

పుప్పొడిని రేపినగాలి పూవు పూవునూ కలిపింది

కోరికను రేపిన రక్తం మనిషి మనిషినీ కలిపింది

చినుకు రాలే వేళ చేతస్సు శూన్యత చేరుకోగా

ఈజగత్తు విస్తరించింది అనూహ్య స్పంద మాధురుల. రెండు అస్మితల తొలగింపు, సర్వతో ముఖ సమాగమం, సర్వాణువుల రగిల్చే కాంక్ష భావిలోకా విర్భావం, చరాచరమైన ప్రవ్యక్తి నిత్య సంగమ చికీర్షువు

ఈ ఉనికి స్త్రీ పుంసయోగ ప్రస్తార రేఖాసరస్సు

శిల్పాన్ని కడుపులో దాచిన శిల నిశ్శ్వసిస్తూనే ఉంది రాగాన్ని గుండెలో నిలిపి భావం తొంగిచూస్తున్నది తొలకరికి ప్రతిమృత్క్మణ కణమూ కోర్కెతో నిక్కిచూస్తున్నది గూఢ గర్భ బహిర్వుతికి ప్రతికణమూ సిద్ధమై ఉంది

మన ఇద్దరి ఉనికి నీవూనేనూ కదలినప్పుడే

మనం కలసి అనుభవించితేనే ఈ ప్రకృతిలో బుతుచక్రం మనకు చిరతను సమకూర్చేది ఈప్రేమ సంయోగ దీక్ష మన అనుభవాలు పరిశీలనలూ మన ఎరుక దారి క్రొత్త వెలుగులు ఒకరి మీద ఒకరికి అనిష్ట మెందుకు, ద్వేషమెందుకు ఇద్దరం కలిస్తేనే ఈ చరాచర జగదావిష్కృతి

భూమిక్సీ అంతరిక్షానికీ - జలానిక్కి వాయువునకూ- మనో బుద్ద్యహం కారాలకు అక్షుబ్ధ శాంతస్థితి

కే5్‌ సాంపరాయం

తన ఉనికి దేహమే అయితే దేశకాలాల పంజరంలో తాను, క్షణికమైన తాను దేని కోసం త్యాగం చేయటం? విప్లవమైనా స్వాతంత్ర్యమైనా, దేశమైనా మరేదైనా తన అనుభవంలో చేరనివే, తన చేతన హద్దుల చొరనివే. అత్మ ఉనికి అనంత తను యాత్ర - జీవితానికి అర్ధం కూర్చేను మరల మరల పుట్టేభావం అనంతత్వంతోడి తాదాత్యం అమృతత్వానికి ఆమ్రేడితం, అవిచ్చిన్నం, అనవరతం విశ్వాత్మతో తాను ఐక్యమయ్యాేలిప్త నిత్యతాస్ఫురణ అడుగడుగున సంగమ భావం, అడుగడుగున నిర్గమ భావం అవిచ్చిన్నంగా సాగే ప్రజాతంతు సందోహం ద్యంద్వం నుండి ఏకం వైపు, ఏకం నుండి ద్వంద్వంవైపు కదలిపోయే మహా మైధున ప్రస్థాన సంజ్ఞామహస్సు. ఖః ఒక్కణ్ణి ప్రాణహిత తీరాన నిల్చి ఉన్నాను ధ్యాన యోగంలో తర్జని చేత నిర్దేశిస్తున్నాను - చూస్తున్నాను అంతటా నన్ను మబ్బులలో కొండలలో చెట్లల్లో వాగులలో నాలో ఈ ప్రపంచాన్ని నన్నుఈ ప్రపంచమంతటా. నేను నిల్చినచోట బోధి వృక్షం నీడలు పరచుకొంటున్నది అశ్వళ్ధ వృక్షం చతుర్భుజాలతో ఆవరిస్తూవున్నది సర్వతోముఖంగా బీజావాపం చేసుకుంటున్నాను నేను వైతన్యాన్సై బుద్ధినై మనస్సునై, ప్రాణాన్నై నాంపరాయం 16

కూర్చున్న క్షణం నుంచీ నా గొంతులో చిరుమువ్వల సవ్వడి ఎక్కడో దాగివున్న వీణానాదం సాగుతూ వున్నది జీవకోటి చివురించిన నవ వసంతం అనుగమిస్తున్నది ఈ వైపు మృత్యువై కదలి వచ్చి యిక్కడ యింకి పోతున్నది “ఈ మనస్సుతో సృష్టిలోకి తొలుతగా వచ్చిన వాణ్ణి* పృధ్యి- వరుణ వహ్నిముఖదేవ భావ సూత్రమైన వాణ్ణి సింహనాదం చేసి రోదసిన కంపింపజేసిన వాణ్ణి మింటి చివరి హద్దున నిలిచి మెలగిన ఇంద్రుణ్ణి నేను చంచలమైన భూమండలిని క్రమకక్ష్యలో నిలువరించి క్రోధించిన పర్వతాలకు వనౌషధుల చెలువం సమకూర్చి ఆనంత్యాన్ని అంతరిక్షంగా ద్యులోకాన్ని అనుభవ పరిధిగా నిర్మించిన అదితిగర్భాన్ని తమోహరిని ఇంద్రుణ్ణి నేను పామైన చీకటిని హరించి సప్తసింధువుల విడిపించి చిద్రూపకిరణగోగణాన్ని జగత్తున చరింపజేసి పాషాణసదృశ జడమధ్యాన ధ్యానజ్వాలను వెలిగించిన వాణ్ణి సృష్టి ముఖద్వారాన్ని నిశ్శబ్ద గుహాసంతానాన్ని నాల్గుకొమ్ముల, మూడుపాదాల, రెండుముఖాల వృషభాన్ని సప్తరశ్శినై ద్యులోకాన్నిశాలువగా కప్పుకొన్నవాణ్ణీ విజృంభించి వస్తున్నవజ్రబాహువును, దేవతాధ్యక్షుణ్ణి, ద్యావా పృధ్య్వుల సంపుటాన్ని గుండెలో దాచుకున్నవాణ్ణి.'” 2 బుగ్వేదం (2-12)లోని ఇంద్రసూక్త మంత్రాలలో కొన్నింటికి పునారచన 17 సాంపరాయం

ఎవ్వడింద్రుడు ఎవరు వరుణుడు ఎవ్వడు మాతరిశ్వుడు ఈ పురాణ వటవృక్షం వ్రేళ్లూ బోదెలూ, కొమ్మలూను పరిణాహ సంపుటిలో ప్రతిస్పందమూ దేవతయే సహస్ర శిరః స్ఫురణ, సహస్రపాద సంచలన కశ్యపుని రెండు పార్వ్వాలు అదితీ, దితీ పరిణామానికి రెంండుముఖాలు వినతా, కద్రువా జీవ మృత్యువులు, దివానిశలు, దేవాసురులు పరమార్థం వ్యవహారంలో రూపుదిద్దే రెండు వైఖరులు ప్రాణసాగరం తరచినప్పుడు పరిణామం విస్తరిస్తుంది ఏకకణ జీవినుంచి మహాలక్ష్మి దాకా వ్యక్తమవుతుంది అసీమ వ్యక్త భూమికలో ప్రాణకోశ బహిరుద్గమం పొరలు పొరలుగా పొంగులు పొంగులుగా హద్దులు దాటీను. ఎప్పుడు వచ్చెనో ప్రాణ యాత్రికుడు ఈ జడభూమికలోకి పాధేయమైన బీజ సంపుటి ఎట్లా వెదజల్లెనో అంతటా వసంతుర్హు విస్మయ లాస్య విన్యాసాలు నేల నిండా విరిసి వున్న రంగుల దీపాల పండుగ అప్పుడే మొలచిన చివురాకు సూర్యునితో ముచ్చటిస్తున్నది అప్పుడే విచ్చిన పూవు గాలికి తావుల విందు చేస్తున్నది కర్మదేవతలు తమ శక్తులన్నీ వెలువరించే ప్రయత్నం అలుపులేని శ్రమ, విరామంలేని తపస్సు, వినబడని పిలుపు నాంపరాయం 198

నామ రహితమైన అకాంక్ష తెలియని లక్ష్యాన్లికె అభీప్స్ప అగాధమైన రాత్రి ఎప్పుడో ప్రారంభమైన జీవయాత్ర సూర్య చంద్రులు నక్షత్రాలు దారిచూపే దివ్వెలు సమష్టి మనస్సులోంచి ఆగామిని గూర్చిన సంకేతాలు పంచదళమైన ప్రాణ పద్మాన్ని విస్తరించే యోజన అడుగడుక్కూ నిరోధం, ఆరని తీరనిపిపాస స్ఫోతన దేహళి దగ్గరనుంచి ఎంతదాకా ప్రయాణం కలలు గన్న దివ్య జగత్తు ఎప్పటికో సాక్షాత్కారం. ఉషస్సు పుట్టినచోట తూర్పుగా గుర్తు పెట్టుకుని సూర్యుడు మొలచిన చోట ఉదయంగా నిర్మించుకొని దిక్కుల క్రమంలో విదిక్కులను కూడా కూర్చుకుని ఉదయ భావంతో క్షణాల మాలలను (గుచ్చుకొని ప్రకృతి మాత ప్రాణజగత్తుతో బయలుదేరిన ఊరేగింపులో క్షణ క్షణమూ విస్మయ పరచే దృశ్యమాలికా పరంపర ఆవిర్భవించిన సర్పాలూ, పక్షులూ, మృగాలు ఆ విష్కరించుకొన్నమనోమయుడు చైతన్య భావుకుడు తప్పుటడుగులు వేస్తున్నది చైతన్యం కునికిపాట్లతో ప్రాణికోటి అంతఃస్ఫురణతో సదాజాగరితమవుతూనే వుంది విస్తరించిన అవధులు లేని తనను పోల్చుకుని ప్రతిక్షణం చీకటి ముద్దల్లో వెలుగులను నింపుతూనే వుంది 19 సాంపరాయం

అనవధిని జన్మపరిధిలోనికి నిబంధించే ఉత్సాహం అకారణాన్నికారణ జలధి లోనికి రప్పించే సంకల్పం అమేయ భావానికి వ్రమేయ సీమల్లోకి ప్రియమైన ఆహ్వానం ఉన్నత్తలైన బుతుదేవతల అనిరుద్ధ పరాక్రమం జగత్తు ప్రాణ సూర్యునికి ప్రొద్దు తిరుగుడు పూవైంది స్థావర తిర్యకృమప్టి శికుభావం పొంది కదల్తూంది ఇప్పటి దాకా నిళ్ళీబ్బం, ఇప్పుడు ప్రకటమైన కోలాహలం ఇప్పుడు నభస్సును తాకిన జీవకాంక్షా రజతస్తంభం. ప్రళయం చైతన్యానికి నిద్ర ప్రభవం జాగ్రదవస్థ సంకల్పం రెంటినడుము సంధ్యా రూపమైన కల విశ్వతైజన ప్రాజ్ఞులు సలిలానల మరుత్తులు సూత్రమైన చితి నిలుస్తుంది బీజమై అవికారంగా జీవయజ్ఞం ఆరంభమయింది ఆదికుమారులు హోతలుగా ఇంద్రియాలను, మనస్సును అహంకారాన్ని పురుషుణ్ణీ ద్రవ్యంగా పరిణామ చక్రం పరిక్రమిస్తూ వ్యక్తపరుస్తున్నది చతుర్దశ భువనాలను, చతుర్దశ మన్వంతరాలను పక్షికూతలోంచి పాము కుబుసంలోనుంచి గాండ్రింపులోనుంచి కేకానాదం నుంచీ కాదు కుదురులోనే ప్రకటమయ్యింది "సెనెజరొ్‌* దేవభాష రోదసిలో అనేకచాక్కులుగా శ్రుతులుగా రూపిల్లి ల 3. సెనెజర్‌- దేవ భాష- దివ్యజ్ఞాన సమాజంవారు కనుగొన్న అతి ప్రాచీన భాష-చిత్ర లిపి కలిగింది సాంపరాయం 20

మూలం అందరాక అవ్యక్త బీజంలో నుంచి నిర్ణమించిన అశ్వత్థ వృక్షం జీవకిసలయితమై ఆకాశాన్ని కప్పివేసింది సర్గపు తొలిమొలక తాను స్కంధంలో ఎన్ని ఎన్ని ప్రాణరహస్య కోటరాలు ఉద్గమరీతి నే నై! ళ్‌ ము. ఛి భి వ్‌ త్త స్తా లో 'సహ్రైదూా డొ-గ00 ఫీనీలో 21 నాంపరాయం

మూడవ నర “ ప్రాణసవిత్రీ, ప్రభామయి, ఉషపోదేవి ఆహ్వానిస్తున్నాను నిన్నుఅదితిని దేవ మాతృకను విశ్వసుషుమ్నవు, చైతన్య సవన వేదికవైతివి తల్లి అవిచ్శిన్న సర్గసారణికి పరిష్కరివె జనని శ్రుతినయి వాగాంభ్పణికి దర్శన మిచ్చిన జగద్దాత్రో వసు రుద్రాదిత్త్సుమయత నీవు దిక్కాల చైతన్యత్రివుటివి నీవుమిత్రావరుణులౌదు, నీవె యింద్రాగ్నులవెతి ఆశ్వినులయి మ్యోదేవతలయి లోకమందెల్లెడ నీవె నీవె రాష్ర్రానివి సకల సంపదల కేంద్రానివి, యజ్ఞభావ బిందువవు సర్వ భూత చిత్మళవు అవినాశి సోమరసానివి, త్వష్ట భగపూష రూపాల వెలసి యజమానికి ఐశ్వర్య మయిన తర్పయితవు సర్గతత్త్వ జన విరోధుల శిక్షించేందుకు రుద్రుని ధనువూని శరసంధానం చేస్తున్నావు దుర్గవై ద్యావా వృథివీతలాలను ఆవరిస్తున్నావు కాళిక వై శ్వసిస్తున్నాము, భుజిస్తున్నాము, చూస్తున్నాము మేము నీ వలన 4. బుగ్యేదం 10-125 దేవసూక్త మంత్రాలకు పునారచన సాంపరాయం 22

భువన శిఖరాలపైన దివాన్ని నిర్మించి ఆంతర వార్థిలో నిలచి ఆద్యంతాలకు ఏకసూ త్రానివై అన్నిటికీ సన్నిహితంగా వాయువై ఎల్లెడల నీవె, ఊర్జ్వ్యాధోలోకాల మీదు క్రిందుల వెలసి వున్న నిత్య మహిమా రహస్సువు” ఇంతటి బ్రతుకు, ఇంతటి పరిణాహం, ఇంతటి వైవిధ్యం ఒకే అనంత చైతన్య బిందువు చుట్టూ పరిభ్రమణం ఈ మూలం నుండి అనంత దళ విస్ఫార విన్యాసం కదలికలు, మెదలికలు, పొదలికలు, ఒదుగులు, పొంగులు, తరగలు. అనంత కల్లోల దళ సమావృతి జలధి పద్మమ్ము అనంత ఫణామణి కాంతికలిత శేషాహి పద్మమ్ము పద్మావతి, పద్మనాభుడు పద్మదళా యతాక్తు డతని నాభి పద్మంలో పొల్చించి నాల్గు దళాల మహాపద్మం వడివడ్డ ఆదిజలాలలో వట్రువ తామరనేల కడకొని మింట వేయంచుల తమ్మికొప్పురము ఖజ్యోతి ఆరంభ సమాపనల నడుమ, ఆకృతి నిరాకృతుల మూలాన సంకల్ప జలధి తరంగ నిత్య సంకుల సమాకలనం కర్షిక నుంచి అసంఖ్యాక బహుముఖ విస్తార సముధ్గమం కేంద్రానికి ప్రతి దళంతో అవిచ్భిన్నమైన అనుసంధానం దేని కదిగా వున్నావిశిష్టమైన ఏకాకార దర్శనం అరవిందం - సృష్టికి ప్రతీక, మహామాతృతాభఖి వ్యక్తి.

23 నాంపరాయం

బిందువు అవ్యక్త బీజం, ప్రధమ వ్యక్తి త్రిభుజ కర్ణిక

స్వస్రిక చతుర్దళం, పంచదళం ప్రాణగ్రంధి

ఆరురేకుల తమ్మి బుతు కౌమారం, అష్ట భుజం శ్రీదిగ్గజావృతం

అనంత్య బిందువుల నడుమ వ్యక్తా వ్యక్త ప్రయాణం

మృత్తును వీడి నీటిని చీల్చివచ్చే ప్రాణాంకురం మృణాళం

నాళంచివర చేతస్సు కర్షిక్క కర్ణిక చుట్టూ విరిసిన భావజగత్తు

అగణ్య దళ సమూహం - అమేయశిల్ప సౌభాగ్యం

రస సంగతి, రసావిష్కృతి, విలక్షణ రస పరిష్కృతి

అమేయంగా విస్తరించే ఈ పుండరీకానిక్షి నాఖివి

అపారంగా ముంచి వేసే కల్లో లానికి గంగోత్రివి

ఈ మహాపద్మంలో ఒక్కో దళంలో ఒక మహాశక్తి

ఆనుపద సంభావనం, అనుక్షణం నవ్య భవ్య రచన

ఆరంభం వేరు, విస్తారం వేరు. శెధిల్యం మరోపేరు

ప్రవహిస్తున్నతాను హరాత్తుగా కుంచించుకు పోవటం

పంచ భూతాలను పంచుకున్నతాను పంచిపెట్టి మిగిలిపోవటం

ఇతిహాసంలో మరో దశ, వ్యధల తోరణం కట్టినట్లు,

మరణించే కణంతో పాటు అవిర్భవించే మరో కణమై

బాల్య యౌవనాలు, జరా రుజలు, జీవన మృత్యువులై

నేలచీల్చ్బగా సముద్రమై సర్గప్రధమ యోనిగా

నీరు చీల్చగా ఖండ ఖండాలెన జనావాస కోశంగా నాంపరాయం డత

నిరత వస్తు వినిర్మాణ నిత్య జాగ్రత్తతో కూడి అనుపద కుశలసమాదృతి కణ కణం తీర్చి జీవకోటి చైతన్య శిఖరి వ్రేలిన శక్రచాపఖండం ఈ అధోముఖ మహావృక్షం ఫలించిన నవరసాల గుచ్చం ఎప్పుడూ ఎరుగని ఈ కోలాహలం సంగతోజ్జీవ సాంతత్యం ఎన్నివేడుకలుు, ఎన్నివాడుకలు, ఎన్ని కవ్వింపుల పల్లకీలు ఎన్ని నవ్వుల పండుగలు, ఎన్ని కలబోసుకున్న విపణులు అవని నిండా జీవసంహిత - సంకుల సంభావనా దోహల. ఒడలి కడలిలో సంచరించే యింద్రియాల మొసళ్లు ఒడలి పాదులో మొలచివచ్చే ఆకలి పాముల కసరింపులు ఒడలి కడపమీంచి మరో కడపమీదకు దూకే కామపు నెగళ్లు ఒడలి పూలతోటలో స్వరగీతిక లొలయించే సౌందర్య దేవతలు తానుగాక తనలో నుండి పుప్పించిన తన ప్రపంచం తన కోసం అల్లుకొన్నపరివారపు రక్త రేఖలు తను విస్తరించి, పరివారం విస్తరించి, విశ్వమంతా తానై స్ఫురించిన యాధార్థ్యం - సర్వమూ ఏక మేవాాద్వితీయం తను ప్రయోగశాలలో రసాయన క్రియ సాగేందుకు వ్రైలెడంత పాప వెన్నుడంతగా పెరిగి వచ్చేందుకు పంచ భూతాల సారం ఒక గింజయో, ఒక పండో చాలు గోక్షీరమో పుష్పసారమ్లో, నీరమో క్షుత్సిపాసలకు

2భ్‌ సాంపరాయం

గగనం పందిరికి కట్టిన వెన్నెల వెండి అంచుల మబ్బులు కొబ్బరి గుబురుల్లోంచి జారిపడే నార వస్త్రాలు నదుల ఉపరితలాలను పోలిన పాముల జిలుగు కుబుసాలు ఊహ కలిపించెనో పరిధాన సౌభాగ్య ధారణ కొరకు చెట్లతొర్రలొ, పొదరులో, చిక్కని అడవుల వసతుల్లో గుహలో, కొండ చరియలో, కొమ్మలో, ఊడల పందిరులుగా శీతవాతాతపాలకు చెలరేగు వర్ణధారలకు

తొలగు మనిసికి ఆనాడు తోపింప జేసెనో నెలవు

ఉనికి క్రమంగా కట్టుకున్న అంతస్తుల క్రమం

ఇంకా ఎంత ప్రయాణం మహళ్శిఖరం చేరటానికి

అక్కడ రవికిరీటం ధరించిన సనాతనులు, మహాత్ములు ఎక్కివచ్చే బిడ్డల కోసం ఎదురు చూచే పురాతనులు కల్పనలు, కలలు వేసిన దారులు యదార్థం వైపు కదలి అఆదర్శాలూ భావనలూ సమాజస్థితికి భావిని చూపి

అతిలోక దర్శనాలు, తత్తశా స్రాన్ని ప్రస్తరించి

అండాండ పిండాండాలకు అభినవ (గంధిని వెలయించి కుప్పలు కుప్పలుగా ప్రోగుపడుతన్న జయాపజయాలు

ప్రతి క్షణమూ ఎటో కదలుతున్నది, ఎందుకో బెదరుతున్నది అంతస్సులో ఒక సూక్ష్మృజ్యోతి, అది అదృష్ట మార్గ దర్శిక

ఈ ప్రయాణ లక్ష్యం అవ్యక్త గహన గుహాముఖం

నాంపరాయం 26

సన్నివేశాల అనుక్రమ గమనం ఖండకాలం అనితర పరిచలన బిందువు ఎక్కడా పట్టుదొరకదు వర్తమానం సదా స్ఫురించినా - అనుభవంలో ఎప్పుడూ గతకాలం భావనలో ఆగామి - నిలుకడ లేని సంచారం ఆకాశం నిండా హొయలు చూపే రెక్కలు వచ్చిన పూలు గగన సరస్సులో ఈదులాడే బహువర్హ మేఘశకలాలు కుదురు కదిపితే సాగివచ్చే దారంలా ఎడతెగని భావసూత్రం వివరించే వార్తికం, ప్రక్రమంలో విహితమైన ఏకతా దీప్తి ఉత్తపింప జేస్తున్నది భూమిని నిప్పులు కురిసే నభస్సు నూతనాగామి కోసం తీవ్రాంశువుతో దున్నుతున్నది త్యజిస్తున్నది ప్రాగ్రూపాన్ని జగత్తు తప సంస్కారంతో ఉసురు పుట్టల్లోకి జారుతున్నది దెసలు వెనక్కు తగ్గుతున్నవి. బిడ్డ ఆర్తికి తాళ లేక కరగి పోతున్నది హిమాలయం మందాకిని శిరస్సున నిలచినా ఆరని తీరని పిపాస తీవ్రాంచలాలతో చీలుస్తున్నది సూర్య బాణం నేలను అయినా రసాలం మధుర ఫలాలను రాలుస్తూనే ఉంది చల్ల బడుతున్న గాలితో బాటు వచ్చింది సిగ్గుల మొగ్గల చిన్నారిమబ్బు నేల ఎదురు చూచింది మౌక్తిక బిందు లేఖల కోసం సూర్యునితో పెండ్లికోసం ప్రకృతి మబ్బుల తెర నిలిపింది జీవం సహస్ర ముఖాలతో అంకురించింది హరిత సంగీతమై. 27 నాంపరాయం

గింజ రెండు బద్దలై దాంపత్యాన్ని సూచించింది

చివురు ముకుళమై పూవైె యౌవనాన్ని తెలియ చేసింది ఆకురంగు మారి వాడి పోయి వార్థక్యాన్ని చిత్రీకరించింది రాలిపడ్డ కాయ అంతిమ క్షణాన్ని గుర్తు చేసింది.

గర్జనల్లో పురాజన్మ నృతులన్నూ శంపాలతల్లో అత్మ విస్కృతినీ

ఎడతెగని వర్షధారల్లో దుఃఖ నైరంతర్యాన్నీ

పూచిన కడిమి పూల వలపులో అరుదైన ఓదార్పునీ

ఆగని నదీ ప్రవాహాలలో అసదృశ మాతృ భావాన్నీ

నింగి పెరుగన్నం ఒంటినిండా పూసుకున్న పసిపాప వేపధుశీతము, అధరోష్టము అయిన కవుగిలింత పోలిన రోదసి

అలరులు కురియగ నాడినట్లు వెన్నెల పరచు కొన్నరాత్రి కాల పురుషుల ప్రమాది శీధు పాత్రిక శరత్తు

సువర్ణ భూమిలో ధాన్యలక్ష్మి వరికంకి బుజాన వేసుకుని

నడచి వస్తున్నది సమకుట, సమేఖల, సపాద కటక వెనువెంట కదలి వస్తున్నది కైదండయిచ్చి తోడుగా

జంటయై ఊర్జానుగామి సుందర తాంబూల లతిక. వసంతబుతు విస్ఫోటాన్ని పాలించే దేవుడు ' గ్లోచిసిల్లి” స్వేచ్చగా సంచరిస్తాడు, సుమనః శిల్పిత దేహి

చుట్టూ సౌందర్య భావ పరిణతి సీతాకోకచిలుకల వలయాలు మెక్సికోలో అజ్జెక్‌ సభ్యత వెలుగు అనంగమాధ్యవైక్య భావం నాంపరా యం 28

నవావరణలు దాటివచ్చిన బాలింత ఈ మహాప్రకృతి

అవికలమైన క్రీర సముద్రమై అవహితభావ విమోహమై

ఒంటరితనం విరిచే ప్రయత్నం, ఒక సమష్టి గోళం వైపు ప్రస్థానం

ఒకశాంత భావన, ఒక సమృద్ది, అసురేఖావిజయోత్ప్సవం

ప్రబలుతున్న వార్ధక్యమేమో మంచుగా కురుస్తూనే ఉంది

ఎక్కడకక్కడ అంగాంగాల్నశైథిల్యం, ముడుచుకు పోతున్న బ్రతుకు

బయటకు పోలేనంత వణకు ఎక్కడా దొరకని వెచ్చదనం

జగత్తంతా కుంచించుకు పోతున్న పంకేరుహం

గడ్డకట్టుకు పోయెనో ప్రాణ ప్రవాహ రేఖలు

అప్పటికప్పటికే రాలిపోతున్న జీవన పత్రాలు

నిలబడ్డ శవాల సభకి మైడులయిన వృక్షాల పంక్తులు

మన ప్రయాణం ఇంత వరకేనా నెచ్చెలీ, ఆగి పోయేమా

ప్రాణం నిలిపే భాస్కరుని కడుపులోనే మృత్యువు కలిమి

చైతన్యమై అంతటా జ్వలించే అగ్ని ఆవరించితే సర్యభుక్కు

శ్వాసయై బ్రతికించే వాయువు కుంభించితే సద్యోచ్చుతి

మృత్యువు కోరచాచనిది ఎక్కడ? బ్రతుకును వెంబడించి చావు

పేలిన శబ్దం తాకిడికి తాళుకో లేకుంటే మృత్యువు

జారిపడ్డా, ప్రవాహంలో పడ్డా, కూరుకు పోయినా

పిడుగురాలినా, గాలివిసిరేసినా, ఊబిలో చిక్కినా

మృత్యువు కోరచాచనిది ఎక్కడ? బ్రతుకును వెంబడించేది చావు 20 నాంపరాయం

ఉప్పెన పొంగి బడబాగ్ని మధ్యలో చిక్కుబడినా అడవిలో నడుస్తూ దావాగ్నినడుమ కట్టుబడినా చుంచు దట్టంగా కురిసినా అవని కొంచెం కంపించినా చృుత్యువు కానరాని దెక్కడ? ఇదంతా దానిక్రీడాస్థలి నిత్యమూ ప్రదర్శితమయ్యే అపఘన మహారూపకంలో ఎవరు తమభాషను మరచినా, ఏ పాటలో శ్రుతి తప్పినా ఏ అంచు చెలియలికట్ట దాటినా, ఏ తనుభాగమో స్తంభించినా ప్రకటితమయ్యేది కణకణాల నడుము దాగిన మృత్యువు ఎంత హేతువు పెంచుకున్నా - అది బారెడంత దూరం మరణానికి జా(గ్రద్దశలోని జా గ్రత్తలన్నీ అనంత సుషుప్తిలో లయించేవి (బ్రతుకులోని బంధాలు, విలువలు, ఆశాస్వప్నాలు ఆ నిశ్శబ్ద కాసారంలో చేరి తిరిగి రానేరావు. ఇంతగా కలసివున్నా ప్రాణ మరణాల జంటలో ఎంతవైరుధ్యం ఆరంభానికీ సమాప్తికీ నడుమ, ఆకృతికి నిరాకృతికీ నడుమ మనస్సుకీ అమనస్కతకూ నడుము, పరిచితికీ పరిమితికీ నడుమ అనిర్దేశ్య భావరహిత బిందువు మృత్యువు అన్నింటినీ తనలోకి తాగేను గతిచ్యుతికీ అనుచితికీ క్రమభంగానికీ స్తబ్ధతకు చిహ్నం, వికార రహితమైన జడతకూ శిలాసదృశమైన ఏకతకూ గుర్తు, ఒకటి మరొకటిగా పరిణమించే సంధి బిందువు మృత్యు వంటే భయం, సంకోచం, అవికాసం.

శాంపరాయం 30

ఏదో అద్ది, దానికి రెండు పార్స్యాలు జీవన్మరణాలు ఏదో తమోమయబిల మార్గం, తెలియరాని ఆకలి గురుపుత్రులను తిరిగి తెచ్చిన వాసుదేవునికి అది తెలుసు కురుపుత్రులను తిరిగి తెచ్చిన వ్యాసదేవునికి అది తెలుసు మళ్లీ మరో అవర్హం, సర్వ జీవన పునారచన పృధ్వి మళ్ళీ జడ పరిధుల్లోంచి ఉన్న్ముక్తమైన లిప్త మనసు కొలను లోంచితొంగి చూచింది బయటకు చంద్రబింబం పూల కారులో షికారుగా కదలిపోయేను మదన దేవుడు ప్రకట ప్రకృతి అణుమూలాలలో ప్రవేశించింది అనిర్దేశ్యం పరివేషపు కారాగాల ఒత్తిడిలో వెలుగును ప్రసరించలేకున్నది “మీరా' పగులగొట్టి రండి, జైలు గోడలను, సంకెళ్లను విహాయసం నిండా మీరె, విలోచన పరిధుల మీరె.

పి మ్య్‌

ప్రాణ ప్రవావాం న్‌ 311 నసాంపరాయం

నాలుగో నర్గ

చంద్రుణ్ణి నేలలో విత్తి మొలచిన బహుర సౌషధులు సూర్యుణ్ణి నీళ్లల్లో నిలిపి పాలిచిన శఫర సంతతులు చెట్ల గుబురుల్లోంచి లేచివచ్చిన పుష్ప మంజరులు పక్షులు

రాలిన పండులోనుంచి మొక్క, పూర్ణం నుంచి పూర్ణం పుట్టినట్లు నింగిని క్రమ్ముకున్నమొయిళ్లు కురిసిన నిత్య రస వర్షం

వేయి చేతులతో సృష్టి సంకలిస్తున్న భోగ సామగ్రి

నాదని గిరి గీసుకున్న వాడు దాన్ని పరులకు అందనీయడు “మమికారాలు సృష్టించిన యుద్ధాలు, సృష్టి చూపిన దైత్యముఖం పరిణమించింది జీవితం కన్నతల్లి ప్రకృతికి దూరంగా

పంచభూత సమష్టిలోనూ కాలుష్యం ఆవరించింది

ఒక్కక్షణం స్తిమితంగా నిలువక్క లోనికి చూడనూలేక

(భ్రాంతుల వెంట, మృగమరీచికల వెంట్క ఆశాసముద్రాల వెంట ఇదంతా ఒక సముద్రం- ఎప్పటికీ ఆగనట్టు కదలిక

నిరంతర ఘోష్క అనంతమైన సంఘర్షణ, అబోధ విన్యాసం నాభిలో నుంచిపొడుచుకు వస్తున్న విషాదగీతం,

అమేయమైన సుఖానుభవం గురించి కలైనా కాంచలేని పరుగు

నాంపరాయం ఏ2

మనం సముద్ర జీవులం- ముద్ర వేస్తుంది మనస్సు క్తుబ్బమైన, వికలమైన, నగర కాలుష్యంలా ఉన్నది లాలసమైన, క్షణికమైన, కోరికల పంక్తిలా ఉన్నది అడుగు నుంచి పై అంచు దాకా ఎంత జీవన తారతమ్యం సముద్రం గర్జిస్తుంది ఆకాశాన్ని చూచి శార్జూలమై సముద్రం విశ్వ్వసిస్తుంది పడగలు విప్పిన లేలిహాన మై కూజితం చేస్తుంది మరాళమై రెక్కలు విప్పి రోదసిలో నర్తిస్తుంది సూర్యోదయ వేళ ఉన్మత్తమయూరమై ఎక్కడికో ఉరుకులాట- కూడలి దగ్గర వాహనాల ఒత్తిడిలో ఎగర్రదీపం - కదలనీయదు ఎక్కడికక్కడే నిలువరింత (బ్రతుకు ఈ వ్యవహారం కోసమా బ్రతుకు కోసం వ్యవహారమౌ ఎటూ తేలడం లేదు, గమ్యం చేరేమా ప్రమాదాలు లేకుండా. ఈ సముద్రం ఎక్కడిది, దాని బీజం ఎప్పటిది ఆవిల జీవకోటి ఈనాడు ప్రశ్న వేస్తున్నది మనస్సుతో చిలుకుతూనే వుంది, కాలమే దాని తరిత్రాడు జిజ్ఞాస రజస్సు, సత్తృతమో ముఖాలు రెండువైపులా “కలసి నడచి, కలసి జీవించి, కలసి అనుభవించటం” ఒక దారి “నాకోసమే ఈ జగత్తు, ఈ నభస్సు, ఈ సమప్టి' మరోదారి ఈ తరిత్రాడు రెండుకొనలు, చేతస్సు ఒరిపిడిని పెడుతూనే ఉంది యాతాయాత ప్రసారాలు వ్యక్తినుంచి సమస్తం దాకా 33 నాంపరాయం

కూర్మమై మనస్సు అడుగున కూర్చున్నది విశ్వచేతన

సముద్రంలోని ప్రతి బిందువునూ తనతో కట్టి వేస్తున్నది

(ప్రతి బిందువూ తన నైజ వైశిష్ట్యాన్ని సమర్పిస్తూనే వున్నది

ప్రతి తడ ఒకసారి కూర్మ పదాన్ని తాకుతూనే వుంది

చిలుకుతున్నసముదద్రంలోకి జీవితం ఎదురు చూస్తున్నది

కలల గూళ్లు కట్టు కుంటున్నది, ఆశ్చర్యాన్ని భావిలో నింపుకుంటున్నది

లిప్త లిప్తకొక పరిణతి- నూత్నరూపం, అభినవ మార్గం

దిన చక్రం ఒకసారి భమించేలోగా ఎన్ని నూత్నావతారాలు

ప్రాణి పెరుగుతూనే వుంది యుగయుగానికీ క్రొత్త దీప్తితో

కణానికి కణాన్నికూర్చుకుంటూ, కణకణమునూ జార్చుకుంటూ

ప్రాకుతూ, నిలువబడుత్తూ నూతన శిఖరాల నధిరోహిస్తూ

తొలి కదలికే ఒక అద్భుతం - లిప్తపాటైనా బ్రతుకు ఆశ్చర్యం

ఈవుల ఆవైనా కోర్కెల మానైనా బ్రతుకు కడలిలోంచి వచ్చిందే

నిరంతర పరిశీలన నుంచి నిరంతర కామనలలో నుంచి

ఇంద్రియార్థాల అధిపతి తాను- అనంత వాంఛా వంచితుడు

ఎప్పుడూ దీన వదనంతో అర్భార్థి- చెట్టు దగ్గర్కో ఆవు దగ్గరో

అడవిలో జనపదాల్లో భద్ర మార్గాల కాలి బాటల నుంచి

సంకుల నగరంలో నిర్మించే చంక్రమణ సేతు పధాలు

శ్రమను కనీసం చేసే యంత్రాలు, కాళ్లకు కట్టుకున్న చక్రాలు

మర నాగళ్లు, మర రోకళ్లు మరల మరల మారే యంత్రాలు సాంపరాయం ప్రశ

తనలో నుంచి పూచిన భావ సంక్రాంతి పొంగిన సృష్టి వెనుకబడి, మూసలో బడి, విస్తార వస్తు సంపత్తి తనకూ వస్తువునకూ నడుమ తాత్పర్యభావ వికార ఘనమైన విఘ్నమై - జగతి యెల్ల పెట్టుబడికి బిడ్డ కూలివాడయి సృష్టిక్తర్త వృత్తి కుశలత గంగలో కలసి వ్యష్టిముద్ర నిపుణత లేమి సర్వసామాన్యమై పోయి ప్రతిభ, విద్య, శిల్పమన్న భావనలు సుప్తిగుహ నిల్పి అన్ని దేశాల హద్దులు మీరి యంత్రాల నీడలు కమ్మి భోగికి భోగ్యతకు నడుమ కోటగోడయ్రైన ధనము ఫలమునకు కాంక్షకు నడుమ అగడ్తగా నిల్చిన వణిక్కు అనుభవ మార్గ నిర్దేశ్యలైన ప్రకటనల అచ్చరలు శ్రమకు వినియుక్తికీ నడుము అసమతులామానరేఖ కరిన శ్రమ కరగి వరమీయని వేల్పుగా మారిపోతున్నది నెత్తి పై కోరికల మూటతో నిరంతరం ప్రయాణించటం సుఖసాధనాల నిత్యోదయ ప్రాచి వర్తమానం చాచిన పద్మ హస్తాలకు అందని కిరణ ప్రసారం ఉదయం నుంచి అస్తమయందాకా సూర్యుని దొక్కటే పరుగు ఫాక్టరీకో, యంత్రానికో, కార్యస్థానానికో , పారశాలకో కట్టు బానిస తనంతోడ నిస్త్రేజమైన జనసమూహం అసంతుష్టి పతాక అసహనం జీవన యాధార్థ్యం

ఏ5 నాంపరాయం.

సర్వానుభవ సాధన సంపత్తి కల్పకమైన నేలను

తనదని చాపచుట్టుకునే హిరణ్యాక్షుల సమావేశం

ఏ అట్టడుగు నుంచి పుట్టుకు వచ్చినా ఒకపందికోరచాలు-

అందరికీ ఆస్వాద చింతామణి ఆత్మీయమైన ఈజగతి.

అడవులు కొండలు ఎడారులడ్డంకి లేక పరుగెత్తి

ఆంతటా యంత్రాల గుడులు కట్టి, పీరాలు నిర్మించి

అనుదినమూ నిత్యకర్మరతులను య జ్ఞ పశువులుగా జేసి

(బ్రతుకులు అడవులు, సమస్యలు కొండలు సామరస్యం లేమి ఎడారులు

లక్ష్యం లేని నిత్యధావన శీలునకు మృత్యువు ప్రేయసి

(బ్రతుకు ఎప్పుడూ చేరరాని శిఖరం, చెదరి పోయే సుజానుభవం

దైవం తొలగి ధర్మం తొలగి, సమగ్ర జీవసూత్రం తొలగి

తౌనెక్కిన చెట్టు కొమ్మను నరుక్కునే మూర్ధ మానవుడు

కౌశలము కోల్పోయిన వ్యక్తిని పాదులో నుంచి తొలగించి

యంత్ర గుహల వెంట పరువెత్తించి, యిరుకు గదుల్లోనే బంధించి

నగరాలై, రోడ్డయి వాహనాళలై, ధూళినిండి

మురికివాడర్రై, యిరుల జాడలై, ఒత్తిడుల పూలు పూయించి

ప్రకృతి తల్లి అందించిన భౌమ దివ్యానుభవము చెంది

చెరువుల పంటపొలాల సందిట పెరిగిన తాను

కదలి వచ్చి నగరాల దయ్యాల మర్రిచెట్ల ఊడలకు

తగులు వడి దారులు తప్పి, ఆశల పద్మవ్యూహాల చిక్కి సాంపరాయం 36

పొడుచుకువచ్చిన ధన సూర్యుని చుట్టూ ఉప గ్రహమైన సభ్యత - బ్రతుకు పరుగుల బండి గుండెల బరువుల సందడి పెరగాలి ఎరుగని పూల కారునెరుగని, పక్షుల కిలకిలలు మరచిపోయిన, కుదుట బడని మనిషిని గ్రీష్టమై తరుమగా అడవిలో పూచే ప్రతి పూవూ అదనపు విలువ కావచ్చు కురిసిన నీరొక్కటీ కారణం కాబోదు దానికి

అదనపు విలువ సంసారం నాటుకున్న ప్రతిచెట్టూ

రసాలం భావికి ఆస్వాద్యం, వర్తమానం పండించ్చేరెతు

ఏ రోజు చివుళ్లు ఆరోజే తినేస్తే మొక్క ఎక్కడ

పగలంతా మిగిలిస్తేనే రాత్రికి పిడికెడు అన్నం

మిగులు పేర విద్వేష గ్రీష్మానికి నేల ముక్కలయింది

(కోధ నిశ్చ్వాసాలతో గాలి కలుషితమయింది విభ్రాంతిలో ఎప్పుడు శకలిత మయిందో ఈ అగ్ని పర్వతం

ఉగ్రంగా వమించే “లావా” బ్రతుకు చుట్టూ వహ్నిమయం ఎక్కడో ఉదయించకపోదు కాళిదాస అషాఢ మేఘం ఎక్కడో కానవస్తుంది ఇంత గ్రీష్మంలోనూ చలివేందిర ఆశకు మకుటం పెట్టింది ఆధునిక జీవన రీతి “అడవి చిలుక పారిపోతున్నది ఓజోన్‌ చిరిగిపోతున్నది కాంక్రీటు మహారణ్యాల కలుషపు కోరలకు చిక్కి పొగలో, సెగలో, దుమ్ములో మొసతీయగా రానివేళ

37 సాంపరాయం

చిటిఃలో దూసుకుపోయి చేరగవచ్చు [గ్రహాళి లిప్తలో మాయించవచ్చు నిఖిలమౌ భూత సంచయము దీప్తులు నింపగా వచ్చుదిసలెల్ల నిశిపవలు గాగ దృషప్తమౌ సభ్యత సంశయ తోరణా లెల్లెడ నిల్ప. చృుత్యు పర్యంత పరిమితికి మిగులుగా జని పరంపరలు పరలోకములు పాపపుణ్యాలు ప్రక్కగా తొలగించి వైచి కనకపు సింహాసనం మీద కొలువైన గాఢేంద్రియ వృత్తి నియమింపబడుచున్న (బ్రతుకులో నెలవగు వ్యధల దొంతరలు బ్రతుకు కర్ణిక మీద పూచిన అర్థకామముల చెందొవలు అడుగున ధర్మజలం ఆధారంగా వున్న వేళ అల్లంత దూరాన నిందుని ఆనంద రశ్శిముద్రితము కాకున్నవిప్పుదలలేని కసటు జీవితమె సంతతము చుట్టాలు, ఊళ్లు, దేశాలు, భాషలు, విశ్వాసపటలి ఎక్కడికక్కడే హద్దు ఎక్కడికక్కడే మమత మమత పరిధి దాటినంత అలవిమాలిన స్వేతరత స్వస్వేతర స్థితుల నడుమ సాగెడు నిత్యకలహమ్ము. కలహపు తీగసాగి గుబురుగా పందిరులెక్కి నెల కొల్పెనో ద్వేష వాహినీ తటములు రెండు పరచిన మమకార భావ పారంపరీ పరివ్యాప్తి నెజియలై భూమియు, నీరు, వెలుతురు, గాలియు నభము నాంపరాయం 38

ఒక కొమ్ము పూయను వచ్చు ఉన్మత్త రాజసాహంసుమాల ఒక కొమ్మ విరియించవచ్చు ఉద్విగ్నభీతి విహ్వాలత మరొక శాఖలో దుఃఖ ఫలము విరివిగా కాయనువచ్చు ఎవరికి తెలుసు ఈ చెట్టు కొమ్మలెన్నో ఊడలెన్నెన్నో బంధుత సడలి, మైత్రి తెరలి, ముక్కలైన పరివారం శిశువుకు తల్లి ఒడి దక్కదు, ఆమె కెక్కడో కట్టడి కొలువు చిక్కుకుపోతూ మనం, ఒంటరితనపు సుడిగుండంలో పలకరింపు లేని, ఓదార్చులేని సహచరులు లేని మనికి భయం చుట్టుకున్న ఆశల దుప్పటి, అసంతృప్తి శిఖరం దుఃఖాన్ని ఆవరించిన ఆత్మవిశ్వాసం - భవిష్యద్యుగ సంకేతం ఈలోకం విశాల జలసరస్సు, దానిలో తాను ప్రతిఫలించి అనుస్యూత స్వప్న ధారలోబడి ప్రచేతస్సు పొరలలో చిక్కి తనకు తెలియని తనలోని తనతనంతో పోరు తన నెరిగిన వారితో పోరు, తన వ్యవస్థతో పోరు పంచభూతాత్మకమైన భవ్య జగత్తుతో పోరు మెట్టు మెట్టుపై బొమ్ములతో పోరు నిత్యసిద్ధమైంది పోరు గట్టెనా గుట్టెనా ప్రవాహాన్ని నిరోధించేను ప్రతిభను విరోధించేను దోహదం చేయని ఒత్తిడి విఘ్నం, నిరోధం, వైఫల్యం, అలసత్వం ఏదైనా సరే ఊోర్ధ్యగమైన ఆరోహణను అవరోధించే కారణాలు

30 సాంపరాయం

అగమ్య గోచరమైన ముహూర్తాన నాకు నాకే ఆశ్చర్యం ఎందుకీ వైఫల్యాల నిరంతర వాహినిలో చిక్కుకున్నానని నాకు నాకే ఆశ్చర్యం ఇంతటి దుఃఖనైరంతర్యంలోమూ ఆగిపోని భవిష్యదాశ - అణగీపోని ఆంతర జ్వాల ఒకదానివెంట సాగిపోయే సుఖ దుఃఖాల జంటలు హద్దులు చెరిపి చూస్తే- పరిణతిలో ఏకాకృతిగా తోచు అనుభవానికి రెండు పార్య్యాలు ఊర్భ్యాధోముఖాలు సృష్టిమూలంలోని ప్రతి అడుగువేతలోనూ ఉంది అవ్యక్త వేదన ఉసురూడ్చుటకు చాలు బొందినున్న ఒకానొక జబ్బు ఒక ఇంత విషమ్టైన చాలు పిడుగులు రాలినా చాలు ఊబిలో పడవచ్చు, నీట ఉక్కిరి బిక్కిరి కావచ్చు ఇంతటి వదులైన ముడిని నిలుపేందు కింత ప్రయత్నం వైరుధ్యాలు జంటలైన క్షణాలు - వీటిలో ప్రతి ఒక్క క్షణమూ గతకాలపు శవం మీద కూర్చుని తపస్సు చేస్తున్నది అంతలోనే ఆ క్షణం శవం, గగన మెత్తు క్షణాల శవాలు ఏదినెవ్యగ ఏది పగ ఏది హాయి, ఏది వ్యధాసమాప్లి నూర్గురు బిడ్డలను చంపిన గాధిజుని క్షమించిన (బహ్మర్షి కడుపులో పిండాన్ని చీల్చిన ఇంద్రుని చున్నించిన దితి జగద్దుఃఖాన్ని తలదాల్సి దాసి మూలాన్ని తొలచిన శాక్యమౌని అవును దుఃఖం తొలగి పోతుంది, వృత్నువైనా తొలగుతుంది. బ్రతుకు కదలిక లో శాంపరాయం 40

ఐదవ నర అవని అంత విశాల రత్న కంబళం ఈ మహేతిహాసం విప్పుకుంటూ విస్తరించుకుంటూ పోయింది వెన్నెల పరచుకొన్నట్లు అగాధమైన రత్నఖనిలో నుంచి కాలం పలుగు పారలతో వెలికి విసరి వేసింది వేగంగా అనేక కోట్ల జీవరాసుల్ని ఒక్కో జీవగణం తన ప్రకాశనంతో పాటు తెచ్చింది ఒక కథను అది ప్రతిస్పందించిమానవచిత్తమహారణ్యంలో ఒక కథ పులివేట, ఒక కథ చలిపాట, ఒక కథ కలహాల కోట అతీత మనస్సు తేనె తెట్టను కదలించి తెచ్చిన మాట మరోటి. సూక్ష్మ హృదయ కుహరాల్లో పరిదృష్టమైన పురాగాథలు సృష్టి రహస్య ద్వారాలను పగులగొట్టిన వెండి సమ్మెటలు ఆశల రహదారుల్లో సాగే ఆర్హజీవులకు విశ్రాంతి స్థానాలు ప్రాణమూలం కన్నస్వప్నాలు, సృష్టి పురోగమనిశ్రేణికలు భాస్కర మండలం నిర్మించుకున్న ఏకచక్ర రథాశ్వసప్తకం క గిల్గ మేష్‌ పురాగాధలో షంపునపిష్టం గాథగా ప్రతిబింబించి (త్రివిక్రమ సుషర్హ గాధలకు ఆమ్రేడితాలైన ఫిన్లెండ్‌ ప్రాక్కథలు పురాణం మానవ సభ్యత కట్టుకున్నతాలి విజయ ప్రాసాదం ర్‌ ప్రప చంది. గిల్లమేష్‌ సుమేరియన్‌ గాథ. గిల్గమేష్‌ ప్రపంచవ్యాప్తంగా పురాగాథల్లో ఒక సామ్యం ఉం . గల్ల మృత్త్య విజయంకనం పూ భీస్తాడు. త్రవలో షంునపిష్టంను కలుస్తాడు. ఇతడు మృత్యువును జయించినవాడు, | సాంపరాయం

చెట్లతో, చేమలతో, అడవులతో, ఆమనితో

పాములతో, పక్షులతో, హస్తులతో, హర్యక్షాలతో

శిశువులై, పశువులై, స్త్రీలై, పురుషులై

కాపులై, మాపుల్రై దాగుడుమూతలాడుతున్న జనం

అతిరుచిర వాగ్దేవతా మనోహర స్మేరకపోల

మణిదర్పణంలా ప్రతి ఫలించిన సభ్యత గీచిన చిత్రమాలికలు

ఆశ్చర్యవత్పశ్యతి - భూన భోంతరాళాలలో పాలిచిన ప్రాణశిఖరాలను,

జీవించి, జీవించి, పృథ్విని క్రీడాంగణంగా నిరూపించి

తన స్కృతిలో కామనలో తనభావి సంభావనలో

తన చుట్టూ వలయీకరించుకున్న కాలసర్స వలయంలో

ఇంద్రియానుభవాలను రంగుల తెరలను కప్పి, ఆశల జరీ కుట్టి

ఒక్కొక్కరికీ కంరహారంగా, అందరి ఊహల విహారంగా

అన్ని గగనాలలోనూ వెల్లి విరిసిన వెన్నెలలు పురాగాథలు

అన్ని వాయుమండలాలలోనూ ప్రసరించిన తావులు వీరగాధలు

అన్నివాగులలో వంకల్లో తరంగించిన ఊసులు జానపద కధలు

పృథ్వి నిండా అల్లుకున్నకధల పందిరి పురాణ మంజరి

ప్రతి కోనలో కొండపైన పాడుకొంటున్న వ్యాసుడు

ప్రతిగ్రామంలో ప్రతి ఉత్సవంలో వ్యాఖ్యానించే పౌరాణికుడు

యుగయుగాల్లో వ్యాసుడు దేశ దేశాలలో వ్యాసులు

సమష్టివేతన పలవరిస్తే వెంట పరవశించేవాడు వ్యాసుడు సౌంపరాంయ్రం 42

మనస్సుకు ఎన్ని పొరలు, మహస్సుకు ఎన్ని తెరలు నడుమ తన నీడను చూచి జడుసుకునే మానవుడు గళితమయ్యే క్షణం ఎక్కడో దాగివుంటుంది స్పృతి తరగిపోదు, వ్యక్తా వ్యక్త దేహళిపైన అధోలోకాల్లో చికటి కొటారుల్లో పడివున్న తలపులు, కలతలు, భయాలు అల్లుకొన్న అపూర్వరీతి హరాత్తుగా ఆవిష్కరించు స్వపష్నమై, అపూర్వ దృశ్యమై అవిరతంగా సాగిపోవు ఆలోచనా పరంపరయై మెలకువ, స్వప్నం, నిద్ర, తురీయం, నాల్ను పార్య్యాలు చైతన్య చతుర్ముఖం స్థితి పొల్చు చతుర్భుజం మనస్సులోంచి పుట్టిన వాళ్లు నల్గురు ఆది కుమారులు 6 ఆంత; కరణం నాల్నురెక్కల పూవు, చతుర్దంతి గజం మనస్సు నుండి అధి మనస్సు దాకా నిల్చుకున్నమజిలీలు నాల్గు నాల్గు అంతస్తుల విమానం చతుర్ముఖ బ్రహ్మ సాదృశ్యం మనం మనస్సును దాటలేం - క్రిందికి పోతే అవచేతనాదులు యోగం ప్రకటించిన మణిరళ్ళి మార్గం - దుర్గమమైన లక్ష్యం ఉదయకిరణం వేయంచుల కత్తి, వేయి చివురాకుల గుత్తి, వేయి తరాలైనా వెంబడించే మౌలిక జీవన సంపత్తి కడలి కొండలైన ప్రాక్కధల అదిమ పర్వతాలు కదలే సారణులైన అవిచ్భిన్న సంప్రదాయాలు 6 సనక, సనంద, సనత్కుమార, సనాతనులు

శం నాంపరాయం

తొలుత నేల దున్నింది వజపు నాగలితో యింద్రుడా తొలుత విత్తింది మబ్బుల చిన్కులతోడి వరుణుడా తొలుత కుప్పు పెట్టింది వెలుగు రెక్కల తోడి సుపర్టుడా తొలుత అనుభవించింది వేయి పడగల అనంతుడా నేలనాల్ను చెరగులా వరికంకులు, గోధుమలు, సజ్జలు జరరాగ్నికి తర్ప్చణంగా ఆహుతమయ్యే లిప్తలు జగచ్చేతన తృప్తమైన యజ్ఞివేదికలు పొలాలు జగద్భావన విస్తరించిన ప్రవాహాలు నాగళ్లు చరిత్ర సాగిపోయింది అడవుల్లోంచి, కడలుల్లోంచి నదుల్లోంచి వాగుల్లోంచి జనపదాల్లోంచి వట్టణాళల్లోంచి చరిత్ర మోస్తున్న బరువు ఒత్తిడికి నదులు కానలు దారియిచ్చాయి గాలి అలసట తీర్చింది, ఆకాశం విశ్రాంతి నిచ్చింది అరణి మధింపగా - అగ్ని ఉదయించినప్పుడు ఒక అద్భుతం దేవలోకాలు హర్షించి తావుల వర్షాన్నికురిశాయి చెట్ల బోదెలు నదుల్లో చేరి తీరాల చేరినప్పుడు భిన్న భిన్నతీరాలు చేరువై ఏకతను పొందాయి అధీనమైన వృషభం తోబుట్టువై నేలను దున్నిన వేళ సంవత్సరం పాటు సాగిన క్షుదపాకరణోత్సవం గోమాత కరుణకు రూపయి కురియగా క్షీరధారలను అనుసంధించింది మానవత మనోలోక దీపికాతతిని శాంపరాయం శశీ

తను నిర్మించుకునే శ్రమస్వర్గానికి సూర్యుడు సాక్షి తను కూర్చుకునే కల్పనా ప్రపంచానికి చంద్రుడు సాక్షి ఊహలకు నక్షత్రాలు సాక్షి హృదయంలో ప్రకాశించే వెలుగుకు అంతస్సులో జ్వలించే నిరంత చిదగ్ని మండలం సాక్ష్‌ చేతులెత్తి అకాశం వైపు, విశ్వాన్ని ఆవగాహన చేసుకునే ఒక జలదరేఖ, అంతస్సులోంచి పొడుచుకు వచ్చే కదంబశాఖ ఆశ్రమ గర్భాలలో తపోధారలో తత్త్వ లతాంతాలు, పాదులోంచి కదలిపోతూ మజిలీలు మారుస్తూ అంతస్సుకూ బహిరంగానికీ వేసుకున్న కవిత్వపు వంతెన మీంచి తరలి వస్తున్నారు ఎందరో హిరణ్మయ పురుషులు ఆమె కనుచూపు త్రోవల్లోనుంచి అనందశో భాసనాధులు మీన కేతనులు, ఇక్షు చాపులు, పుష్ప సాయకులై వారు లోనుంచి ప్రీతి వల్కరించింది లోతుల్లోంచి పిలిచింది ఆత్మీయత పాదులోంచి పొంగిపాటల వాకయ్దై పారింది పురి విప్పిన నెమలి, అంశువులు పరచిన నభస్సు ప్రతిఫలించింది తనలో అప్రతిమ సుత్రామచాపమై బుతువుకొక్క రూపుతో సాక్షాత్కరించే ప్రకృతి సుందరి ప్రతి ఉదయం బంగరు వెలుగుల జల్లులో స్నానమాడుతుంది విస్మయమైన ఆ దర్శనంతో కాలం ఉత్సహిస్తుంది సూర్యుడై వెంట వస్తుంది, చంద్రుడై గొడుగు పడుతుంది త్‌ నాంపరాయం

రెండు రెండు జతకూర్చిన నాల్గు చేతుల (బ్రతుకు నాలు పురుషార్థాల సారం బ్రతుకులో ప్రకాశించి అంత వత్త్యాన్ని అనంతంగా పెంచుకునే జీవన వేదం ఎదురుగా సాక్షాత్కరించే ఘటనల మాలికలు, లీలాకాళికలు వ్రేళ్లల్లోంచి ఉలిమొనలోంచి ప్రాకి వచ్చిన కొత్త స్ఫూర్తి శిలల గుండెలను చీల్చి చేదుతుంది మంత్ర మాలలను అక్షయ సంకల్పాలను ఫలింప జేసే గుహాలయాలలో (ద్రవీభవించిన పాషాణం, ఘనీభవించిన పీయూషం సారనాథ్‌లో, సాంచీలో, ఖుజురాహోలో, కోణార్కలో మధురలో, అరుణాచలంలో, కంచిలో, రామప్పలో జడత్వాన్ని శాశ్వతంగా వదలించుకున్న శిలా ఖండం అతీత కాల రధ్యలో ఊరేగుతున్న సురసుందరి గుండెలో నుంచి గొంతులోకి ప్రాకి దానిలో ఆహతమై హిందోళం క్రమ్మినప్పుడు జగత్తును క్రమ్మిన మేఘజులం వెలుగును కప్పిన చిరుచీకట్ట్లు, కన్నీళ్లతో పలకరింపులు బాధల ఒత్తిడిని పలుచనచేసే గాఢ పరిష్వంగాలు ఎన్నియుగాలకు పూర్వం నన్నుకదలించిన శ్రౌాంచశోకం పొరలి పొరలి వస్తున్నది ఈ గతపు అగాధ కూపంలోనుంచి అడవుల్లో ఆలుమగలు తప్పిపోయిన గాధర్చై సముద్రాలు దాటిన, విమానాలు ఎగిరిన విక్రమణమై నాంపరాయం జీ

శిలల్లోంచి కరిగి వచ్చిన రసధుని సౌందర్య చింతామణి నేలమీంచి నడచి వచ్చినప్పుడు అనుభవ సముద్రం పొంగు నేత్రద్రవ్యం త్వ్యగింద్రియం దాకా ప్రాకే ఇచ్చావధి. ఎద జాబిలి మొగం మీద పొడిచే చెలువుల ప్రొద్దు పాడుపు కొలనులోంచి పెరిగి వచ్చిన గీతరాగ పుష్పం ఆలాపనల నూరు రేకులతో, స్వర సంపుటుల గంధంతో మిత్రోన్మేష దిశాభిముఖ గవేషణ, హృదీషణ అదృశ్యంగా కదలి సాగే విశ్వలయ విన్యాసం కలల విమానం మీదనుంచి కదలి వస్తున్నది పద్యం అనాహూతంగా ప్రయాణంలో గొంతులో మొలుస్తుంది పద్యం అపరిచితంలో గుండెగుహలో శబ్దాలు ముడివేసుకుంటవి వక్రరేఖలై, అలంకారాలై, రసార్హవాలై, ధ్వని ఫణామండలులై ప్రతి అంగుళంలో మెరసిన సృజన సౌదామనులు లోపలి చీకట్ల కొటార్లలోకి ప్రవేశించటం లేదు శిలాయితమైన ఈ ప్రబల జీవరాహిత్యంలోన ఉలితాకదు, జలపాంగదు, తొంగి చూడదు స్వప్నం 7 స్వభావ విభావ జగత్తుల మధ్య ఎంత అగాధం పరిణామం ఎంత నెమ్మది, పరిణాహం అమేయం శిలాజాలమై మనం ప్రదర్శన శాలలో ఎంతకాలం? అనాగతాన్ని వర్తమానంలోకి వెంటనే పగులగొట్టి రండి 7 వాస్తవ జగత్తు స్వభావం, కార్య జగత్తు - విభావ జగత్తు విభావం,

శీ సాంపరాయం

నిరపేక్షమైన ఉనికి లేదు, నిర్లిద్రమైన (బ్రతుకులేదు

కదలిక సాపేక్షికం, కాలగర్భ విలీనం ఎదుగుదల

ఒక లిప్త కాలం పాటు కాలం స్తంభించితే ఏమవుతుంది?

అనంతతా గాఢ శూన్యం, అనుభవానికి అందని శిఖరం

ఆకాశం కోసం నాల్గు భూతాల సారాన్ని ఒక చిన్ని పూలమొక్క

నేలలోంచి పెళ్లగించి ప్రాణశక్తులను, సుమ గుచ్చాలను కూర్చి

రేకులను, మరందాన్ని రంగుల తావులను కలిగిస్తుంది

పరచుకొన్న ఏకాత్మభావాన్ని ప్రకటిస్తుంది సౌందర్యంగా

మనిషి గుహాశిఖరం, మనస్సు గుహలోని చీకటిని

పొరలు పొరలుగా గతాన్ని దాచుకునే లోహ సంపుటం-

అడుగున నలిగిపోయే కల్పనలు, ప్రాకుతూ వచ్చే దృశ్యాలు-

సమష్టి జ్ఞాపకం ఎక్కడికో మోసుకుపోయే గుజ్జం

సూర్యగోళం చుట్టూ తిరుగుతున్నాను ఆత్మ సము ద్రమై

కిరణాలలోంచి జారి చస్తున్నాను భూగోళం మీదకు

ప్రాణమై భూమిలోకి చొచ్చుకు పోతున్నాను ప్రభవమై

టైకిపొడుచుకు వస్తున్నాను భావ చిత్రాన్నై

జడం సృ్పందించితే జీవం, జీవం ఎల్లెడలా నవీనం

నవీనత వైచిత్రి, సామరస్యం సౌందర్యం

సౌందర్యం జడాన్నైనా దైవంగా మలుస్తుంది

అనంత ప్రాణ సముద్రం సౌందర్యం, అగాధ జీవసౌభాగ్యం నాంపరాయం 48

అంజలి విప్పిందేమో ఆదిదేవి పరిణామ విస్ఫోటం

చేతివేళ్ల గోళ్ల కాంతుల్లో ప్రాణ పరిణాహరేఖా కృతి

కాలం కలిపించిన దూరాన్నిమరచి చూస్తే - అవతార క్రమం సూర్యకిరణ స్పర్శకు పులకించి కరగిపోతున్నహిమ ప్రవాహం సిద్ధమయ్యే వుంది సృష్టి నిన్న సంసేవించటానికి

తల్లి ఒడిలోకి చేరుకో, (ప్రేమతో పలుకరించు

ఎప్పుడూ బానిసగా చూడకు, జడమని అంచనా వేయకు ఐక్య సూత్రం ఎప్పుడు తెగినా మిగిలేది అనంతక్ష్రతియే సామరస్యం ఉన్నచోట చిత్తం ప్రసన్నమవుతుంది

దేశకాల పరిమితులు దాటి వ్యక్తి అనంతమవుతుంది

అవ్యక్తం తన్ను ప్రకటించుకుంటుంది తెరలు తొలగించి గుహలోనుంచి నడచి వస్తుంది రహస్యం విశ్వరూపం తాల్చి మన హేతువు కురుచది ఎన్నోహద్దులు దాటవలసి వుంది మన ఎరుక అసమ గ్రం ఎన్నో అనుక్తాలను గ్రహించవలసి వుంది చిక్కుముడి వద్ద ఈ సర్గ (గ్రంధిని మెల్లగా విచ్చి దాటగలిగితే మరెంత దూరమైనా సాగవచ్చు, గాలిలో ఈదుతూ, ఆడుతూ మౌనులు, బుషుల్పు, సాధువులు, సూఫీలు, ఫకీర్లు ఒక పంక్తి మనీషులు, శాస్త్రజ్ఞులు, కవులు, శిల్పులు మరో పంక్తి మహాత్ములు, నీతివేత్తలు సమాజ నేతలు కూడిన పంక్తి సర్గ గ్రంధిని విడదీసేది ఎవరు, ఎవ్వరు, ఎవ్వారు

సర్గ గ్రంథి శ్‌ 4౦0 నాంపరాయం

ఆరవ నర అడవుల్లో తిరిగేప్పుడు చేసింది విశ్వజిద్యాగమే ఆశ్రమాల్లో బ్రతికినప్పుడు చేసింది విశ్వజిద్యాగమే. గుటజ్టాలెక్కి సముద్రాలు దాటి జనాన్ని హననం చేసి (బ్రశుకుల్ని కల్లోల పరచింది విశ్వజిద్యాగమే. నూయార్కులో, మాస్కోలో, సియోల్‌లో, టోక్యోలో ముంబైలో, చెన్నైలో, హస్తినలో, పాటలిలో మనిషి మెలకువలోనే స్వప్నం కంటున్నాడు విశ్వ విజయానికి నిద్రలో కలవరిస్తుంటాడు, చీకటి గదుల్లో అలమటిస్తుంటాడు ముఖంనిండా క్రక్కుతున్న అనంత క్రోధ జ్వాలలు చేతస్సులో సంగ్రసించిన అత్యూహ శబల దృశ్యాలు సముద్రాలు మృదుల శయ్యాస్థానాలు, ఆకాశం ముత్యాల పందిరి ఈ జగత్తంతా తను తీర్చిదిద్దుకున్నకామ పల్యంకిక అవనిని చాపగా చుట్టి బుజాల పెట్టుకున్న వాళ్లు అంగార గ్రహం మీదకు, వ్యోమ నౌకలను పంపిన వాళ్లు అణువు గుండెలు చీల్చిన వాళ్లు, అహంతకు కోట కట్టినవాళ్లు కాళ్లకింద కాలాన్ని పరచుకున్నామని భ్రమించే వాళ్లు నాంపరాయం 50

కోరికల కుంపటిలో మాడుతూ (మ్రగ్గుతూ జీవ బీజ సంపుటి కామధేనువునూ కల్పవృక్షాన్ని కలిపించుకొన్నది కలలో కర్మ చేయకుండానే తనకు సర్వతోముఖ ఆరక్షణ నిద్ర లేపి పలుకరించాలి మధు చషకంతో సుర సుందరి గడచిన కధ అంతా విస్తారమైన అన్వేషణ అడవుల్లో, కొండల్లో, వనౌెషధుల నెలవుల్లో ఎరిగిందానికి మరొక ఎరిగిన అంశం జోడింపు ఉదయానికి మరో ఉదయం, శోధనల సార్ధవాహం ఎంత దూరమైనా సాగిపోతున్నాను గంగో త్రిదాకా ప్రయాణం కొండలు ఎక్కుతూ జారిపడుతున్నా, వాగుల్లో పడవలు పగులుతున్నా ఇంద్రియ ద్వార పాలికలు నిరంతరం లోనికి లాగుతున్నా లక్ష్యం స్ఫురించని, దేహాలు శిధిలమవుతున్నానిరంతర మహాభియానం ఒకవైపు ఇంద్రియ లోకంలోకి ముడుచుకుపోతున్న లక్షణం మరోవైపు జగత్తుగా విస్తరిస్తృన్న విశ్వభావనా విస్తారం అనంత బాహువులలో ఇదంతా నేను కావాలనే శరదృతువు అనంత ముఖాలతో ఇదంతా నాకు కావాలనే శిశిర విన్యాసం జడం గదా అని స్తంభాన్ని చరిస్తే వెలువడింది మృత్యుసింహం అబల గదా అని లీలగా ఎగిరేస్తే అష్టభుజదుర్గ ఐంది దైత్య ప్రవృత్తిని ఉన్మత్తతనూ, తమస్సునూ ఎప్పుడూ సృష్టి చెదరిస్తూనే ఉంది, దా పుచీలుస్తూనే ఉంది 51 అం రాయపి్న. సాంపరాయం గిం గం 211200

మనస్సు హఠాత్తుగా వికటిస్తే, విశ్వాసం పామై కరిస్తే

విధ్యంసమవుతున్నది క్షణాలలో జీవన సౌందర్యం

ఒకచేత కృపాణమూ, మరోచేత ధర్మ (గ్రంథమూ ధరించిన

ఉన్మత్త సార్ధవాహులకు ఇలలోన మిగిలింది అశాంతి

చరిత్ర స్కృతి సంపుటి- తలచినంతనే నీడలకు ప్రాణాలు

సాకారమైన గతం వర్తమానానికి ర్తక్తమాంసాల నిస్తుంది

విజితుడు పడగెత్తి కాటీస్తాడు, విషం ఒడలెల్లా ఆక్రమించుతుంది

అదికాటికాపరి। ఎన్ని గోరీలని కాపలా కాస్తుంది

చరిత్ర మెలికల పాము, చరిత్ర ఊసర వెల్లి

ఏ క్షణాన్నైనా - ఒకప్పుడు చూచినట్లు మరోసారి చూడదు

ఈనాడు నెత్తిన పెట్టుకుని మరోనాడు క్రిందకు తోస్తుంది

చరిత్ర అసమ దేశం, సంఘటనల మణికర్ణికా ఘట్టం

చరిత్ర నిచ్చెన అవుతుంది- బలంపుంజుకుని ఎగబ్రాకవచ్చు

చరిత్ర ఊబి అవుతుంది- వర్తమానాన్ని వికలితం చేస్తుంది

ఇరిగి పోయి కదలనే లేవు, వెంట వచ్చిన వాళ్లు సాగిపోతారు

శిధిలాల నడుమ ఇరికిపోయిన జీవచ్చవమవుతుంది బ్రతుకు.

భూగోళం ర్తక్తస్పికృమైంది ఎందువల్ల - దురాశవల్ల

భూగోళమెల్ల క్షుధా విభక్త్రమయింది ఎందువల్ల - ప్రలోభంవల్ల

భూగోళమెల్ల రుజా గ్రస్తమయింది ఎందువల్ల - అశ్రద్ధ వల్ల

భూగోళం ద్వేష బహుళ మయింది ఎందువల్ల - అవిశ్వాసం వల్ల నాంపరాయం న

దురాశా ప్రలోభాల్క అశ్రద్ధల, అవిశ్వాసాల చతుర్ముఖ సృష్టికి మృత్యువు గొడుగుపట్టింది దుఃబం నారుపోసింది, భయం తోడుగా వచ్చింది ఈతను ఎంతగా వ్యాపించినా ఏముంది చేరేది వ్యధల గుహాల్లోకే అయినా జయించేది ఎవరిని ఈ విజయం ఎప్పటి వరకు క్షణికమే - కాని దీని ఫలితం అహంతకు పట్టాభిషేకం అహంతల సందోహం పరంపరగా పట్టాభిషేకాలు అణగిపోతవి జాతులు, మతాలు, రాజ్య వ్యవస్థలు అనంత కాలంలో ఏ విజయమైనా లిప్తపాటే పదిలిప్తల జీవితానికి లిప్త పాబెనా పరితృప్తి పరాభవం తప్పకపోవచ్చు, దాన్నికలల దరికి రానీయవు చివరకు మిగిలేది తన గోడల్లో బద్గుడైన తాను ఇప్పుడు పారిపోయిన బెబ్బులి ఎప్పుడో మీదికి దూకుతుంది ఏమార్చి మెడ కొరుకుతుంది, రక్తాన్ని పీల్చి వేస్తుంది ప్రతీకారం హరాత్తుగా ఎదురయ్యే బీభత్సం ఇవాల్టి కీటకం రేపు మానవ ప్రపంచానికి నియంత గుర్తుంచుకున్నంత వరకు గత౦ మన ఇతిహాసం కాలెండరు పక్కన పెడితే ఉద్గమ నిర్గమాల సంపుటి యుగానికీ వత్సరానికీ క్షణానికీ ఎన్ని ముఖాలు గమనించే ప్రతి చలనంలోనూ ఎన్నివిభాజన రేఖలు

53 సాంపరాయం

అలాగే ఉండిపోతే అడవిలో కాచిన వెన్నెల అవుతుంది ఎవడో స్పృశించితేనే అనుభవ కాసారమవుతుంది

ఆ స్వాదకుడు లేకపోతే ఫలం సిజంగా నిష్ఫలం

నిర్జన గుహలో చీకటి ఎవరినీ భయపెట్టలేదు

భయం కన్ని సన్నికర్ణ మేలైంది అనుభవ పరిధిలో

కలత నిద్ర కన్నాకల మేలైంది అవస్థా త్రయంలో పిరికితనం కన్నామృత్యువు మేలైంది బ్రతుకు బాటలో పరిక్రమించు, పరాక్రమించు, లక్ష్యం చేరేదాకా హింసర్న్దొనా అహింసయ్టైనా సత్యమైనా అసత్యమైనా తర్మవిచారణ నిర్ణయించిన దైనా కాకపోయినా

జగత్తును సమలయలో నిలిపి వుంచేది మాత్రమే ధర్మం జగత్తుకు శాంతి కవచమయిందే వికసించే సంగీతం

ఏ క్షణానికి ఆ క్షణమే విశిష్టమైంది మనోబంధం నిరోధకం తర్మానిక్కీ ఉదాహరణలకూ అతీతమైంది సమ్యబజ్నారయం క్షణం దాటిపోతే ఎవరో నిన్ను క్రోసిముందుకు వస్తారు అపనిర్థయం ఏదైనా సృష్టి దారినే మార్చవచ్చు

ప్రవృత్తిని నిర్ణయించే ధర్మమేదీ లేదు నీచిత్తం తప్ప ఆక్రణం లోనే తప్ప- లోపల మేల్కొనే అగ్నిజ్వాల తప్ప మనోబంధాలకు లొంగిపోక్కు మనస్సు దట్టపు పొరల్లో అణగిపోకు - అన్నివైపులా రెక్కలను మొలువనీ,

నాంపరాయం ట్‌ల్మే

ఈ అవని బిందువు మీద అప్పటి లిప్త అప్పుడు అదే నిత్యం మరొక స్థలాన మరొక లిప్ర, అన్నింటా సామ్యం లేదు

ఒకచోట సూర్యోదయం, మరొక చోట చంద్రోదయం

ఒకరికి శౌర్య (ప్రవృత్తి, మరొకరికి క్రౌర్య ప్రసక్తి

నాగరకత ముదిరి చెట్టు కూలి కొండలు పగిలి

పాములు పక్షులు మృగాలు ఉనికి పట్టు కోల్పోయి

వేషం మార్చుకున్న “పసరికి యైనప్పుడు ప్రకృతి

వాయువు ఉరమదెందుక్కు ఉప్పెనలో నిప్పులు కురియవెందుకు అడవి మొక్కలలో మొక్క పక్షులలో పక్షి

ఒక జింక్క ఒక పొము, ఒక పికిలిపిట్ట ఒకవాక

తానుగా పెరిగిన విభాండకుని బిడ్డ అకలుష వృత్తి

గాలియ్చై, చిన్నారి పడియయై కరగిపోయిన చేతన

ఎండల నిప్పులు పరచిన దారిలో - కదలి వచ్చినప్పుడు అడుగుల వెంట నడచి వచ్చింది నగరంలోకి వలాహక పంక్తి ప్రకృతికి స్వస్థత చిక్కింది ప్రాణంలేచి వచ్చింది

మళ్లీ వసంతం పొంగెత్తి పృథ్వి మరొకసారి పెండ్లి కూతురయింది అయినా బుష్యశృంగుని ఉనికి కారడవిలోనే

ప్రకృతిని పరాభవించిన ప్రమత్తులకే కిరీటం

చివరకు భూమి అణు విచ్చేదకుల కేళాకుళి

జ్వలద్ధ సంతిక మృత్యువు మెడలో రణల్లలంతిక

ఆత్మ హననం ఎన్నివిధాలు, కాలక్రకచంతో నలిగిపోయే

సహస్ర ప్రాణి పరంపర మానవుని జీవనం కుదిలించగా

తాను మాత్రం తక్కువా - విశ్వాసం కిరీటంగా ధరించి

“మోక్షం ఇచ్చేందుకు బయలు దేరాడు మూర్ధ మానవుడు

సర్పయాగం ముగియనేలేదు జనమేజయుని కొలువులో -

ధర్మంపేర ఎడారులు కొండలు దాటి వచ్చే వాళ్లు

ఒంటిెలపై కదలినా, ఓడలపై తరలినా తుదకు

రక్తంతో అభిషేకిస్తున్నారు ధర్మ[గ్రంధాలను గర్వంతో

రాచపుండయి అఖండాన్ని ఖండితం చేసింది మౌ ఢ్యం

లక్షలాది భూమి పుత్రులు గూళ్లులేని దిక్కులేని పక్షులై

ఎంత దూరంకదలినా ఎక్కడ (ప్రప దొరికేను

ఎవరు విదిల్చేరు పిడికెడు మెతుకులు, దోసెడు నీళ్లు

పెరికి వేయగా కాందిశీకులై లక్షలమంది వ్యధార్తులు

క్రోధాన్ని అవమానాన్ని, అసహ్యాన్ని గొంతులో నిలిపి

బెడ్డలను కోల్పోయి, సంపదలను కోల్పోయి, స్వత్వాన్ని కోల్పోయి

వీధుల్లో, మైదానాల్లో గుడారాల్లో సంలీనమై

రాచపుండు శస్త్ర చికిత్నకెనా లొ గనే లేదు

నరనరాలా వ్యాధి చేరుతున్నది చావులను మోస్తూనే వుంది

భిన్నాంగమైనా శేషాంగమైనా రక్షకు నోచుకోలేదు

చరిత్ర చేసిన పాపంవల్ల కణకణమూ విషదిగ్ధమైంది నాంపరాయం 56

కృత్రిమంగా నిర్మించిన సరిహద్దులలో కళేబరాల కందకాలు మంచుకొండల్లో కురుస్తూంది నిరంతరాగ్నివర్హం ఎంతవరకు ఈ సంక్షోభం ఎవరికొరకు ఈ అనువాకం ప్రాణలతలు చిగురించని మరుభూమి ఈ దేశం మట్టిని పంచుకున్నా మనుషుల్ని ముక్కలుగా చీల్చినా తుదకు నష్టమైంది మానవీయ జీవన సంస్కృతి జీవన తత్త్యాన్ని సనాతనంగా తీర్చిన పరమార్ధ దృక్పథం ఛిన్నమస్రయైంది - సహస్రాబ్బాల ఆత్మవిశ్వాసం స్వాతంత్ర్య రధం రక్తపు బురదలో దిగబడిపోయింది పరప్రాభవం దూరం నుంచి మనను పరిహసిస్తూనే ఉంది అక్షతలు వేయటం మరచిన అకాశంలోని బుషిగణం శాంతి సూక్తం గద్గద కంరంలోనుంచి వెలువరించ లేకున్నది అర్ధరాత్రి చతుష్టష్ట్రర చక్రవై జయంతిని ఎత్తింది మహా మానవుడు కాడు - పరాజితుడు ప్రకంపితుడు త్రయస్త్రింశ త్కోటి గళాల జయరావంలో అపశ్రుతులు “ఆయని మాత్రం ఎక్కడో హింసల కారడవిలో ఒక్కడు తన కళ్లముందే తన ప్రతిఫలనం ఖండితమై ఎదలో దాచుకున్నచిరు దీపానికి స్నేహం కరవై అశోచ్య శోకం ఎరుగని ఆత్మవేది యైనందున రాముడుతోడుగా ఆశరీరుడై సాగిపోతున్నాడు

వ్‌7 నాంపరాయం.

స్వామి ఉపసంహృతి అనంతరం హస్తినకు చేరిన అర్జునుడు కురు పాండవ సమరం దాటి విచలితుడైన వ్యాసుడు సంశప్తకుల కులవ్యూహంలో చిక్కిన బాల భాస్కరుడు అస్త్రదగ్గుడైన ఉత్తరా గర్భశిశువు- భారతీయుడు తరిమి తరిమి కొట్టినా - నేల తానై వస్తుంది నాల్గు చెరగుల నుంచి తన వేరును వెదుక్కుంటుంది జన్మభూమిని నిర్మించుకొంటుంది పురాణభాష విచ్చుకొంటుంది. జాతి తల యెత్తి తిరుగుతుంది పద్మవ్యూహాన్ని భేదించి పదిమందినీ తప్పక ఓడిస్తుంది అవిచ్భిన్నపరంపరలో వినవచ్చే గాధలలో వినబడు- ఈ నేలపైకి దేవతలు విహారార్థం వచ్చేవారని అచ్చరల కొప్పు తావుల్ని ఈ గాలులు మోసేవని గంధర్వుల గీతాలకు అనులయగా జలతరంగిణులు మోగేనని సారధి 'ప్రమత్తుడైనప్పుడు అశ్వాలే దారితీస్తాయి నేతృగణం విఫలమైనప్పుడు జనమే బంగారం పండిస్తారు క్షీరధారలు సమావరిస్తవి పగలంతా వెన్నెలయినట్లు నిరోధాలనడుమ, యుద్ధాల నడుమ, దేశం ఉద్గమిస్తూనే ఉంది సంఖ్య ఎంత అనీకాదు, స్థలం కొలతలూ ముఖ్యం కాదు టైతన్య గర్భంలో నుంచి శక్తిని పుంజుకోవటం ముఖ్యం వ్రేళ్లు తెగక పోవటం ముఖ్యం, అస్మిత చెదరిపోవద్దు కల్పాది జీవులు కదలి వస్తారు సమకుటు లాజానుబాహువులు శాంపరాయం వ్‌

అర్థశతాబ్దంలోనే మూడు యుద్ధాలలో జయించింది చేతన అయినా తేరుకోలేదు అవమాన స్వప్నంలోనుంచి అస్త్రాలు కాదు అత్మ విశ్వాసం జయిస్తుంది యుద్ధంలో జెండాలు కాదు నాగరకతను నడిపించేవి నాగళ్లు. మనిషిని జీవితమంతా భ్రమ పెట్టవచ్చు కలల వలల్లో ఏదో పేర నిప్పుల్లో నడిపించవచ్చు, బాంబులు కురిపించవచ్చు జీవదస్త్రంగా మార్చవచ్చు, విష పుత్రికగా తీర్చవచ్చు జీహాద్‌ పేర, విప్లవం పేర భాష పేర, శాంతి స్థాపన పేర గోడ ప్రక్కన పొంచి వుండి ఏక్షణాన దూకి వచ్చెనో ఆకాశంలో అశనియై దూకుతుందో, మంచుకొండల్లో అగ్నియై రగులుస్తుందో ఎన్నికోటలు కట్టగలం, ఎన్ని అగడ్తలు త్రవ్యగలం అంతులేని విద్వేష చరిత్ర, అకారణ మారణ హోమం. లక్షలాది జనం పరాభవ నిరాదృతులు అభిశస్తులు హరాత్తుగా తలలెత్తి పలుగులలో పారలలో సాగి సంస్కృతి బిందువు అగ్ని బీజంతో సంగమించి విస్ఫారమైన క్షణం కూలిపోయిన పరాభవ చిహ్నం, పునారచితమయ్యే ఇతిహాసారంభం శిధిలాలను చీల్చుకుంటూ లేచింది నవజీవన గర్వరేఖ మానవుని నూతనావతారం, ధర్మశిఖర పరిష్కారం నాగేటి చాళ్లలో నుంచి కదలి వచ్చేరు భూమి పుత్రికలు ఎన్నిసార్లు పరాభవించినా సాగిపోయే ప్రాణ స్రోతస్సులు ర్‌ం నాంపరాయం

ఈ విజయ యాత్ర శిఖరం చేరే దాకా అగదు ఆత్మవంచనలు, అత్మ న్యూనతలు విదలించుకొన్న హర్యక్ష సమూహం ఈ కత్తుల వంతెన మీద సాగేప్పుడు అందరూ భగత్‌సెంహులు ఈ సమర వాజు లెక్కిన అందరూ రూన్సీలక్ష్ములు ఇతిహాసం నే నాంపరాయం 60

ఎడవ నర ఆగామి ప్రతిక్షణమూ నవ్య చిదావర్తమై ఎప్పటికప్పుడు స్పహణీయమై, భీగర్భమై సదా జాగ్రత్తలో నిలిపే అనుభవ తీర్థం జీవితం బుతురేఖ వలె సదాతనము, వినూతనము. ఈ జగత్తు ఈశ్వరుని స్వప్నం, నా స్వప్నం సర్వ కళాజగత్తు ఈ జగత్తు అవ్యక్త పరిణామం, నా పరిణామం ఈ విజ్ఞాన ప్రపంచం హేతువు పదార్థ వల్మీకంలోన ప్రవేశించే వాసుకి అనుభవం కల్పనా జగత్తును ధరించే సహస్రఫణీి అనుభూతి సృజన శిఖరాల అధిరోహణ క్రమం వివేకం ప్రకృతి గర్భంలోనికి నిమజ్జితం కావటం హృదయం వేసేదారి స్వప్నలోకాల అంచుల పైకి హేతువుతీర్పు గర్భిత రహస్యా విష్కారం, పురస్కారం జ్ఞాన రసలోకాలు భాషలోని వాగర్భాలు జీవ సార తీరాలు వాక్కు సంకేతం, పరిమితం, నియతం -

అర్థం బహుముఖం, అనంతతావ్యంజకం ఒకటి చేతిలోని వేయంచుల దీపికా చక్రం మరొకటి అంతరంగంలోని ప్రేయోమూర్తి ఆనంద సరస్సు 61 నాంపరాయం

కట్టుబడి లేని అశరీర వల్గనం సృజన రేఖ--

అర్హవాన్నైనా కట్టడి చేస్తుంది, మ్లోషిస్తుంది హేతువు-

ఒక్ష దశలో రెంటి సరిహద్దులూ చెదరి పోవటం కద్దు

రెంటి సంగమ శిఖరం సంస్కృతి, అదే జీవన తాత్పర్యం

హేతువు అనుభవం- సృజన ఆవిష్కారం

జగద్యాత్రలో అనుపదం జంట జంటగా ప్రయాణం

రెంటికీ పృథ్వి ఆధారం, రెంటికీ రోదసి ప్రయోగశాల

ఒకటి అపూర్యం, మరొకటి అనావృతం - ఈమిధునం ఐశ్వర్యం

క్క కదలింది - ఎందుకో కదలించిన చేయి ఎరుగదు

అఇ ఉణ్‌బు ౪ క్‌ ఇలా చతుర్దశ భువన నాదాలు

రోదసి ప్రతి స్వనించింది- ధరించిన మనీషులకు

వాగ్రహస్యం వ్యాఖ్యాత మయింది - మునిత్రయమై పొల్చింది

అంతరంగం తానైన విధాత కలల మాలలు కట్టగా

కచ్చపి వేయిరాగాలను దహరంలో ప్రస్తరించగా

సంధ్యలు రంగులను ఒలికినయ్‌, కొండలు శిల్పాలను విరిసినయ్‌

అమూర్తమైన రోదసి ఇతిహాస కావ్య పరంపర అయింది

భువేననుంత వ్యాపించిన హేతువు న్యాయమై తోచి

అణు గర్భంలో కణాదం అయింది, కర్మ మార్గంలో మీమాంస అయింది

సృష్టి మూలాలను లెక్కిస్తూ సాగి సాంఖ్య తత్త్వమై

హృదయ మూలాలను శోధిస్తూ అత్మయోగాన్ని చూపింది నాంపరాయం 62

క్షేత్రంలో వ్యాధుల కలుపు మొక్కలను వస్తు గుణదీపిక పెరికింది ప్రాణి లోకాన్ని అదుపుచేసే ధనుర్వేదం అవతరించింది హేతువు విశ్వరూపం ఎంతని, నిత్యమూ అగణ్య విజృంభణ ప్రాణము సుఖించింది హేతుకల్పిత సుఖ జగత్తులో హేతువు విభజన అన్నింటినీ సూక్ష్మ సూక్ష్మంగా ముక్కలు చేస్తుంది అంగాంగ విభజన - అనంతంగా చేస్తూ అభావం దగ్గరగా చేరుతుంది అన్నీ మ్లోషిత శకలాలు, దేనికీ వ్యక్తిత్వం ఉండదు శబలితమైన స్పతుల సంకలనం- అఖండం స్వష్నసదృశం ఏక దేశదృష్టి తాత్కాలికం, ఆ స్థలానికి పరిమితం సమగ్రమైన సర్వదర్శనం సాధ్యం కానేకాదు ఎక్కడి కక్కడిదే సత్యం, ఎప్పటి దప్పటిదే సత్యం అంతటా, ఎప్పుడూ అందరికి దర్శనమయ్యేది భావైక గమ్యుం నిగూఢమైన గుప్రమైన రహస్యాన్ని వెలికి తోడి జగత్కధను వ్యాఖ్యానించేది కావ్య సంగతి ఒక జీవకణమైనాచాలు విశ్వాన్ని సాక్షాత్కరించేందుకు ఒక లిప్తయైనా చాలు అనంతాన్ని ఆవహించు కునేందుకు మనకు తెలియని శిఖరాల నుంచి శబ్దాన్ని ప్రసరింపజేస్తే ఎక్కడో ఎప్పుడో ఎవరికో తన రహస్యాలను వెల్లడించేది ఈ అభివ్యక్షిహిరణ్య గర్భ- విశ్వాన్ని గుప్త్రపరచుకొంటుంది జ్యాలయ్రై వెలికివస్తుంది అనుభవం ఒకానొక చిత్తంలో

63 నాంపరాయం

ఎక్కడో మెదలిన నాదపు చిన్నారి కదలిక

ఆకాశంలో రంగుల చిత్రాలను గీస్తుంది

మేఘాలను మొరయిస్తుంది బాధలను మరపిస్తుంది అకారం ఆలాపన కొనసాగుతుంది భూమి చివరల దాకా పాట పుట్టిన చోటనే రూపు కట్టుతున్నది వలయంగా అంతస్సులో పందిరి వేస్తున్నది సర్వజీవకోటికి చింతనానుభవం వెతలూ సుఖాలైపారి

పురాగాధా గర్భాలలోకి ప్రవేశింప జేస్తున్నది యుగాన్ని చిత్తం పొందే నీరవతలో స్ఫురించే దృశ్య పంక్తులు

తనువు కదలికలోనో, కనుల పొలయికలోనో

హస్త కరణాల విశిష్టమైన రూప రీతిలోనో

చలన వేగంలోనో వివర్తితమై ప్రసారించు

వ్యక్తి మాధుర్య సముద్రంలో సంలీన మయితే రసం కర్పూరంలా రోదసిలో అ దృశ్యమయితే రసం

అందరి చేతస్సులనూ €నలోనికి చేర్చుకోవటం రసం అనహంతలోకి, సమాథిలోకి ప్రవేశించటం రసం

కళకు నాల్గు పార్వాలు ఆకృతి వాచ్య లక్షణం -

కట్టుకొన్న జీవన సన్నివేశం, వెంబడించిన సుఖ దుఃఖాలు - రెండు విశ్వ జనీనమైన స్థితికి పరావర్తనమైన రసం - మూడు నాల్గవ అంచు మిక్కిలి అనువైంది, విశ్వరహస్య కధనం

హేతువు పట్టాలమీద నడుస్తుంది - అటూ ఇటూ ఏమున్నాపట్టదు పచ్చ జెండాచూపితే కదులుతుంది - నియతికృత నియమ సహితం తప్పకుండా చేరుస్తుంది, నిర్దిష్ట స్థలాలకు యాత్రికుణ్ణి యధాదృష్టము, యథా జాతము- పరిమితులను పగులగొట్టలేదు ఎదలో వెలిగే దేన్నైనా తర్కం ఒప్పుకోవలసిందే అంతః స్ఫురణకు చోటులేదు, అన్నీతత్కాల సత్యాలు పేజీ తిరగేస్తే మారిపోతుంది సత్యశోధ పురస్కారం సర్పరజ్జ్టువు వలె వివర్తాన్నాశ్రయించిన చైతన్యం తర్కం పరివార సంపుటికి వచ్చి పాములా బుస కొట్టింది అనుబంధం ఆర్టతలు తగ్గిన ఉపయోగిత కొప్పు ముడిచింది ఆత్మీయత సమర్పణము తరిగి అతిసంచయేచ్చ పెంపొంది ముక్కలు ముక్కలై అహంత ముడులలో చిక్కులు పడుతూ ప్రజాపతి చెప్పిన అక్షరం ఒక్కొక్కళ్లకూ ఒక్కొక్కటై తోచి సృష్టి గమన భావనము విపరీత మార్గాన స్ఫురించి సమాజంలో దీర్హంలోపించి, చదరంగమై గుగ్రపుటెత్తులకు పోయి క్రిక్కిరిసిన జన సందోహంలోనూ భీగూర్చు ఒంటరిపాటై ప్రచండ గ్రీష్మంలోనూ గొడుగు చెప్పులూ లేని నడక పరస్పర హనన శంక, దోపిడిని గురించిన సంశయం ఎక్కడ నించి రాలిపడునోపిడుగు, ఎవరినీ నమ్మని క్షణం భయం అలముకొన్న లిప్త బ్రతికివుండగానే మృత్యువు

రక నాంపరాయం

ప్రతిసృష్టి సర్గనిగూఢ ప్రజ్ఞా నివేదిక - విజ్ఞానం శంకా హేతువుల పర్యాస్తిలో తెరుచుకునే నవద్వారం ఎక్కడో మెరుస్తుంది విద్యుత్తుగా రేడియోగా దూరభాషగా, గనిలో వజంగా, గగనంలో విమానంగా ఒక శతా బ్బమైనా కాలేదు ఎంతగా మారిపోయింది బ్రతుకు ఎత్తులు దిగి వచ్చాయి, దూరాలు కరిగిపోయాయి వెలుగు తీగెలు, ఎక్స్‌రేలు, అయో మార్గాలు వ్రైలాశ్వాలు, అపూర్వ విచిత్ర శస్తాస్తాలు విచ్చుకునే ప్రాణ రహస్యాలు, వివతమయ్యే అణు గర్భాలు అవని అవధులు దాటిన వ్యోమ నౌకలు, ప్రయోగశాలలు అక్కడ భూమి సన్నికర్షలేదు, రోదసిలో తేలిపోవటమే దిక్కెక్కడ క్షణమెక్కడ అక్కడ క్షణబిందువే అచ్బెరువు ఈ ద్రుతగతిలో ఒక మరప్పు ఒక భయమూ ఉన్నది ముందుకు దూకటంలో గ్రహాంతరాలకు చేరటమూ ఉన్నది రెండవవైపు మనస్తీరాలలో తనను పూర్తిగా కోలు పోవటం కృత్రిమ ప్రవర్తన౦ం, మెరుగు కాగితంపూల పరిమళం తన నీడకు తన మీద అవిశ్వాసం నిరాశలు క్రమ్ముకొన్ననిశ ఒంటరి తనం, క్రౌర్యం పులియై కప్పుకున్నపీడకల ఒకదాన్ని మరొకటి కప్పే నూరు పొరల చేతస్సంపుటి తనను నిర్మూలిస్తున్నట్లు మరీ దూరంగా విసరివేస్తున్నట్లు సాంపరాయం ర6

“డాలరొ వృక్షాల అడవుల్లోకి కదలి వస్తున్నాడు ప్రాచీనుడు పురాణారణ్యాలలోనుంచి - చరిత్ర లోంచి వర్తమానంలోకి రక్తసిక్త పధాలనుంచి - రసలోక శాద్వలాల మీంచి సత్యాగ్రహి నడచిన నేల మీదకు- భయం ఎరుగని మానవుడు అడవులలో గర్జనలు, గాండ్రింపులు కలస్వనాలుగా విన్నవాడు ఎండిన ఆకుల గలగలలో రహస్యాలు భావించినవాడు వాకలతో, తీవెలతో నేస్తంకట్టి, మేఘంలా ఉరిమేవాడు కరకుతనం కప్పుకున్నవాడు కారుణ్యం కుదురులో వాడు కొండ చరియల్లోంచి మేల్కొన్నతనకు ఉషస్సు ప్రాణం పోయగా లోపల నుంచి ఒక క్రూర మృగం అగ్నిశిఖయ్లై గర్జించగా బండలతో కొట్టి, వడిసెల విసరి, బాణాలు వేసి పక్షులనూ మృగాలనూ ఆకలికి ఆహుతిగా మార్చుకున్నవాడు ఆశ్రయంకోసం గుహలోకి చేరిన మరొక మానవాభివ్యక్తి తెలియని ఒదుగుదలలో ఒరుసుకున్న రెండు మేఘాలు తమ్ము కోల్పోయిన క్షణం లోయల్లో కురిసిన వర్షం తామర తంప్టరె విరిసిన జీవనోద్యానం అడవుల్లోంచి గుహల్లోకి అరణి చీలివచ్చిన వహ్ని ఆకలిని తీర్చటమే ఒక మహాభోగంగా కొనసాగించి ఇంటింటా గార్హపత్యమైంది ఊరూరా ఆహవనీయమైంది ఒదుగుదల అనురాగమై ప్రేమ విశ్వరూపాన్ని తాల్చింది

67 సాంపరాయం

భోగవాంఛ తనను మృత్యువుగా చేసింది పశుపక్షి కులానికి

పరివారానికి అమృతాన్న ప్రదాత అయింది

వ్యాధత ధర్మమే అయింది తన మనికి నిలిపేందు కోసం

హృదయం గ్రామాన్ని దాటలేదు, చిత్తం ప్రాణమయాన్ని దాటదు

మృత్యువు గ్రసించే జింక మృత్యు వేదనలో కలగి

వ్యాధితో విలవిలలాడే బిడ్డ స్పతిలోన సంచలించి

ఎడద మొగిలయింది ఎప్పుడూ తెలియని వగపు

తిన్నమాంసం రుచించలేదు పాపం అన్నభావం స్ఫురించి

ప్రతిక్షణం, ప్రతికణం జగచ్చైతన్య సంపుటియై

కమ్ముకొన్నట్లు చుట్టూ పుట్టగా మట్టి లేచినట్లు

పురాతన కిరాతుడు భువనైక భావసమాధి

తానొక్కడై చేతస్సు మెట్లెక్కగా ఊర్థ్యమార్థాన

శూన్య ధ్వని వెంట అగ్ని బీజాన్ని పొడిగించి

చేతస్సులో పదిల పరచి ప్రచేతస్సుదాకాప్రాకి

ఎన్నుకున్ననిద్రలోకి జారి ఉరగాలు మేన ప్రాకినా

పక్షులు జడల్లో విరిసినా- కాలతీరం దాటినవాడు

లోకం మేల్కొనక ముందే తమస ఒడ్డు తన ప్రతిబింబం

క్రౌంచ మిధునాన్నివధించటం - తానె క్రౌంచమైనట్లు

నిరంతరాశ్రుధారయై వేదనల పొడి మంచు కురిసి

పలికిన పలుక్తు వాగ్దేవి పాద మంజీర నాదమై సాంపరాయం 68

సర్వ భూతమయ స్థితిలో సర్వలోకమూ తానై సత్త్యరజస్త్రమోవరణాల సర్వతస్సమావేశమై తానహంతయై తాన సాక్షియ్దై, తాన ఉన్నుక్త పుష్పమై కరిగి నీర వారె ఆడవులు కొండలు దాటి సముద్రమై తనలో సర్వము ప్రతిఫలించగా చతుర్ముఖ ప్రచేతస్సు గుప్త ప్రకాశ లోకముల నడిమి సీమలు చెరిపివేసి మనుజుడను నేను మనుజ ధర్మంబు నాది అన్నధీరుని చరిత్ర ప్రకటితమైంది శరత్‌జ్యోత్సలు క్రమ్మినట్లు దైవిక ఆసవ టైత్తన్థాయి సుసజ్జితమయిన - భావసీమల స్పందించు భువన రహస్యకోశం ఆభాస వికృతిలో, వైవిధ్యంలో సంక్షిష్ణతలో భాసించుతుంది సామరస్యం, ఏకత, చైతన్యసూత్రం సృష్ట్యాది ఒక బిందువు దానిలోంచి ప్రవ్యక్తమైంది మండలం సూక్ష్మం ఎప్పడూ పరిక్రమం చేస్తుంది స్టూల విస్సార న్ఫూర్తికి సౌరమండలం, భూమండలం, తారామండలం ఏకంనుండి పెంపాందిన నైకరూప సాక్షాత్కారం ఈ జగత్తంతా చిదంబర సభాపతి తాండవహేల అంతరంగ బహిరంగాల నడుమ కుదురుకొన్నలయ విన్యాసం ప్రతి క్షణమూ, ప్రతి కణమూ మనఃస్పందమూ ససూత్రితమైన నిరంతర లీలా విభవం, హృదయంలో నెలకొన్న జ్వాల

69 నాంపరాయం

పరచుకొన్న మభుమయ ఫణితి మార్గాన ఈనాటికి సాగు జనుల సంక్షుబ్ధ జీవన శాఖల పూచిన సంపెగ కవిత బ్రతుకు లోనికి ప్రవహించిన భూతదయ మాగిన పండు విస్తరించిన తావులపెల్లు సమస్పంద సౌభాగ్యం అదే అరుపు ప్రియురాలికోసం అడవుల్లో ఉన్మత్తుడై 'ప్రతిపిట్టనూ, గుట్టనూ, చెట్టునూ, చెరువు గట్టునూ ప్రశ్నించింది మరల మరల వినిపిస్తుంది ప్రతి యుగంలో ప్రతిభా వసంతంలో ప్రతిశతాబ్దం కొత్త దుస్తులు తొడుగుతుంద్సి అది విస్తరిస్తుంది

అనుభవ తీరం

ళా శ్‌ నాంపరాయం 70

ఎనిమిదవ సర్గ

బ్రతుకుకు తొలి అభివ్యక్తి జరిగింది మృత్తులోనే మృత్తు పాదులోంచే ప్రాణవల్లిక పడగ ఎత్తింది అసు పరిస్పందానికి ముందు మృత్తు - అసత్తు- మృత్యువు . ఈ జగత్తు మృత్యుకందం- ఆనంద శశికలా సుదర్శనం. . (బ్రతుకు వెంట పడుతూనే ఉంది మృత్యువు తొలి క్రణంనించే భయంభయంగా - శరీరశైథిల్యంగా- అనిశ్చిత ముహూర్తంగా . | అప్రతిహతమైన రథం క్రింద నలిగిపోయే, కోటానుకోట్లు న్న్న ప్రాణ కోటరం నుంచి బ్రతుకు పిట్టను రహస్యంగా మింగే కాలసర్చం స్మ జగత్తు దారివేస్తుంది మృత్యులోక ద్వారాభిముఖంగా తెలియకనే ఆ బిందువు దాకా పొడిగించుకుంటుంది తన్ను అన్నితగులులూ, బరువుల్లూ అన్నీ మనస్సు పండించిన ఫలాలు హఠాత్తుగా వదలి పారిపోవటమే- వెనక్కి తిరిగి చూడకుండా

తిరిగి రాని పాతాళ గుహాగర్భంలోకి దిగి పోయినట్లు

మిగుల్చుకోకుండా సర్వమూ కాలాగ్నిలో వేల్చినట్లు

అనల్పమై ఈ మృత్యు కోశంలోకి చేరిపోయి విస్కృతియై రాలిన అక్తె కూలిన ్రూక్తె - ప్రేలిన భవనమై భ నాంపరాయం

కాలం సర్శమై చుట్టుముట్టే వుంది ప్రతి శికువునూ నేలమీద పడగానే మృత్యువు ఒళ్లో పడ్డట్లే ప్రారంభ బిందువులోనే నిశ్చితమైన ఉపసంహారం దిగంతాలను ముడివేసిన వాడికైనా తప్పదు ఈ ప్రహారం వ్యక్తిత్వ పరిమితుల్లోని తపస్సు దిక్కాలాల నడిమి ఖైది! విశ్వ జనీనం కాని సృష్టి చేరుతుంది అగాధశూన్యంలో విద్యలు, పరిశోధనలు వ్యక్తి అందుకోగల శిఖరాలు పేక మేడల్లా కూలేను, అభావంలో కూరుకుపోయేను పొత్తిళ్లలో ఉన్నప్పుడే తరిమేది ఎరిగిన. అంత్యబిందువు ఎదిగివచ్చే వయోదంతికి గడ్డికప్పిన గ్రుడ్డి బావి ఎప్పుడూ మింగుతూనే వున్నా ఆ చీకటికి ఆకలితీరదు ఉదర క్రకచంలోకి ఎప్పుడూ విసరే కబంధుని చెల్లెలు ఒకప్పుడు మృకండుడన్నపురాణముని - జీవన తాత్పర్యం ఎరిగినవాడు పుత్రుని వల్ల అమరత్వాన్ని ఇపాదించుకొన నెంచినాడు శివవరం ఆయుష్యం పదారేళ్లుగా ఆ శిశువు నిచ్చింది నిసుగు పెరిగి వచ్చాడు నిరంతర మృత్యుంజయ ధ్యానంలో అతనికి జీవితమంతా శివుడే- కాలం పట్టనే లేదు అడుగునించి ఆజ్జదాకా సంచరించగలవాడు ప్రాణగుహా రహఃస్థలాలలో శివనామం చెక్కినవాడు ఒక ఈశ్వర పుష్పం పూస్తున్నట్లు సర్వతోముఖంగా వికసించేవాడు నాంపరాయం 72

రానే వచ్చింది ఆ లిప్త లక్షతేళ్లు కుట్టిన బాధ శాఖోపశాఖలను ఉపసంహరించి ఒక చెట్టు కూలిపోతున్నట్లు ఎక్కడికో జారుతున్నట్లు ఉనికి అంతమౌతున్నట్లు భూమి ఆకాశమూ ఓకదానికొకటి అతుక్కుపోతున్నట్లు - వెన్నెముకలో నుంచి ఒకచిన్ని పాము ప్రాకిపోయినట్లు ఒక వెలుగు నుదుట ప్రత్యక్షమయింది త్రిశూలమై అనుకోకుండా మృత్యువు వెనుకంజ వేసింది, కాలం గడ్డ కట్టింది భయం నీడ దరిదావుల్లోంచి నెమ్మదిగా తరలిపోయింది మూడు కళ్లున్న ఒకమొక్క తావిగలది (బ్రతుకును నిలిపేది ఘనీభవించి శిలగా తన కౌగిట ఒదిగి పోయింది హర హరమహాదేవ। హరించితివి భయాన్ని శివ శివ మహాదేవ తొలగింపుమా చీకట్ల దాడిని మూగవోయిన గొంతును పెగల్చుకోవటం ఒక దశ లోనుంచిపిలిచే పిలుపు ప్రణవ సహిత పంచాక్షరి ఎదుట జ్యోతిళ్ళలాక తుదిమొదళ్లను తోచనీయదు కాంతిలో అభిషిక్తుణైన నేను సదాతనుణ్ణి సనాతనుణ్ణీ అయినా ఆరికొళ్లను తాకుతూ ప్రవహిస్తూనే ఉంది కాలం సర్వగ్రాసి అనిత్యతగా, మృత్యువుగా, పరాభవాన్నిమ్రింగి సాగుతున్న పరిణామానికి సాక్షినైనా స్థాణువునైనా ఈ చిరంజీవితలోంచి అనంత మృత్యురూపకం చూస్తున్నాను ంయ౪౭ంఉ౦౯ి “73 నాంపరాయం

యుగాల నుంచీ ఎన్నికోట్ల జీవులు వెళ్లారో మృత్యు గహ్వరంలోనికి తమంతగా ప్రవేశిస్తున్నారు తలవంచి చీకట్లు సముద్రాలలోకి నిత్య భీతులు, శిధిలితశయులు నూరేండ్ల దర్షికెనారారు (బ్రతుకాలనే గాఢ వాంఛకూడాలేదు ప్రాణ రహస్య మెరుగరు స్వేచ్చ లేకుండా జన్మించటం, స్వేచ్భ తొలగి మరణించటం (బ్రతికినంత కాలం కల్లోలం, అనిర్దేశ్య దుఃఖ వలనం

ప్రతి ఒక్కడూ కోర్కెల చెట్టు, వ్రేళ్లు ఎంత లోతుల్లోనో

ప్రతి క్షణం ఆశా శిఖరం, అంతవదలవత్ర్రయాణం

ఒకానొక దివ్యశక్తి అపరిహార్యమైన ఆదేశాన్ని

తల ఒగ్గి మృత్యువు వ్యక్త జగత్తు శిధిలాలను తొలగిస్తున్నది పరిమితులు లేని అవకాశంలోకి లాగుతున్నది జీవులను

సుదీర్ద విభావరి నెలవులో నిదురింపజేస్తూ వున్నది

అచేతన ద్రవ్యమై ఇంత జగద్వ్యావహృతికి బృహత్తను కల్పించి

గాఢతమమై భవ్య విజ్ఞాన మూలాలను కడుపులో దాచి

మానవుని జీవాత్మ తేజోవధులను అందుకునే సమరంలో మృత్యువు అనేక జన్మలనిస్తుంది, అనేక శక్తులను పెంచుతుంది ఎంత భయంకరరూపం కల్పించింది పురాణం సమవర్తికి సూర్యసుతునికి సూర్యుని మరో రూపం- కర్మజగత్తునించి విశ్రాంతి స్థానం అతడు లోకరూపకానికి నిర్దిష్టమైన ఆహార్యశాల మృత్యులోకం

ప్రాణ శక్తుల పూర్వావతారం, నిశ్శబ్ద ప్రతీకాంశం

నాంపరాయం ౯74

మహాభారత ప్రళయం నేతృత్వం వహించింది మృత్యువుబిడ్డ (ప్రవృత్తిలో నియతిని పరమార్థాన్ని వ్యాఖ్యానించింది మృత్యువు బిడ్డ మృత్యువు శరీరం తాల్చి ధర్మాన్ని తలపైన పెట్టుకు మోసింది అరణ్యాజ్ఞాతవాసాలు చేసి దుఃఖపు చేను పండించింది యమునితో ప్రస్థానించిన మహాపురుషుడు యుధిష్టిరుడు (బ్రతుకును వ్రతంగా నిత్యమైన ఈశ్వర సాన్నిధ్యంగా శత్రుత్వాన్ని వైరంగా మార్చని ఉదారుడు అద్వేష్ట ఎప్పుడూ చెదరిపోడు దేనికీ బెదరిపోడు తమ్ములతో తరుణితో తరలివచ్చి కానలకు తమను ప్రతిఫలించే అద్దాలవంటి గాధావళుల వినికితో సమచిత్తాన్ని సమకూర్చుకున్న నెమ్మదికాడు భయమెరుగని ధీరుడు, అలుపులేని ధర్మ్శపధికుడు మృత్యు బీజంలో నుంచి వెలువడిన అసంగి యోగి ప్రచేతస్సులో ఆత్యంతిక సుఖస్సర్శ వీడని ధీశాలి మనసున పార్గుడై, ప్రాణకోశాన వృకోదరుడై దేహేంద్రియ సంపుటిని పాలించే మాద్రి సంతానమై తనువు నుండి ప్రచేతస్సు దాకా అనుసంధించి అగ్ని సంతతిని ఊర్థాభిముఖ యాత్రలో వెనుకంజ వేయనివాడు పై పారల్లో మనికి అంతాజూదం, అదృష్ట సంగమం పాచికలైనా ప్రస్థానమైనా మిగిలేది తానొక్కడు మాత్రం

౯5 నాంపరాయం

దాహం కోసం వెళ్లిన తమ్ముల్లు ఇం ద్రియోన్ముఖులు, ధర్మ సూక్ష్మాల

పరిజ్ఞానం లేకపోయి ప్రాణాలు పోగొట్టుకోగా

ధర్మం వివేచించి వ్యాఖ్యానించి, రహస్యం తెలిపి

మృత్యువు నుంచి తమ్ములను విడిపించు కొన్న మహాత్ముడు

ధర్మజుడు ప్రశ్నిస్తున్నాడు బ్రతుకుకు అర్ధం ఏమిటని?

చిరంజీవిని, జీవ పరిణామ సాక్షిని నన్ను

భూమి మీద వెలుగు కంబం నిలపిన వాణ్ణి నేను

భూమి మీంచి స్వర్గం దాకా మెట్లు కట్టినవాడు తాను

““దక్షకన్య శరీరాన్ని వీపున వేసుకుని పరుగెత్తే

కృత్తివాసుని వియోగ దుఃఖానికి రుచీ రంగూ ఉంటవా?

అశ్రువుల చెలమలై రెండు కళ్లే మిగిలిన ఆ క్షణంలో

మెడ చుట్టిన ఎన్నిపురైలు పరిహసించెనో వికృతంగా

శకలితమైన శవఖండం పడ్డచోటల్లా శక్తి కేంద్రం

నిలువెత్తుగా లేచిం దిక్కడ మాతృకా కీలావలయం

స్థితి ధర్మం వికలతకు సమరసతను సమకూర్చేను

అభిభూతమైన స్త్రీ అనంతరూప పునరుత్థానం

మృత్యుంజయుని దుఃఖం శక్తిబీజ వినివేశమా।

ప్రాణ వీధుల్లో వియోగోత్స పీడకు ప్రతీక బెనా?

జీవితంలోని ఏ పార్స్వం ప్రకటమయింది ఈ ప్రాక్కథలో

దుఃఖం కొండంతగా పొంగి ఎవరివైనా ముంచేస్తుంది నాంపరాయం 76

వెతల వర్ణం తిరుగబడి ఎగదన్నిన క్రోధ గ్రీష్మ జ్వాలలు భయంలోంచి నిర్మించుకున్న ఆణవాస్త్ర మాలికలు మనో లోకంలో సంక్షోభం జీవ లోకంలో [ప్రళయం వ్యక్తి ఉన్మాదం భస్మంగా చేసేను ప్రాణాల గులాబీ తోటను ఈ గోళం మీదకు జీవం ఎందుకోసం చేరినట్లు అప్రాణిత లోన జీవకణం ఎందుకోసం రగిలినట్లు సంకల్పం దిక్కు ఎటు? మృత్సాగరంలోకా నిరంతరోన్మీలన ముఖర చిదాకాశసుధాప్తికేనా? యుగారంభంలో మిగిలిపోయిన యోగపధాలే ప్రాణఖేలను నిరంతరంగా పొడిగించగలవని అమృత మార్గానికి చేర్చే మృత్యు యోగశాఖ కార్యరీతి నిర్వహించేది ఎవరు? కాయసిద్ధి కొదుగుతుందా శింతుమార ముఖం దిశను మారిస్తే చాలు - అవుతుంది పృధ్వి అనంత సాధ్వి, మృత్యురహిత హేలా మహోబ్ధి జీవకోటి ప్రయాణం ఎటు? పునరపి పరిమితులు దాటదో అభీతమైన ఆ క్షణం ఎప్పుడు ఆవిష్కృతమయ్యేను నేను మర్ష్యుణ్ణే కావచ్చు, గడచిపోతున్న యుగప్తు అవేషాన్ని సత్య దిశగా కదలిపోయి బుత సిద్ధినందుకో గలను పెరిగివచ్చిన దేహంలోని మృజ్జల కణాలు తొలగించి తేజస్సనాధమై బ్రతుకు సిద్ధించదో యోగరీతి లాగా నాంపరాయల

యుధిష్టిరుడు ఏనాటి మానవుడైనా కావచ్చు వర్తమానపు లోయలోకి గతానాగతాలు ప్రవహించితే - ఈ ఘట్టంలో శంకాకులాత్ముడు మృత్యువర పుత్రుడు కురుక్షేత్ర యుద్ధ నాయకుడు విజయపధ ప్రవర్తకుడు మార్కండేయుని మనస్సులో ప్రచరించిన గాథాచక్రాలు శునళ్ళేపుడు మధుచ్భందసుడైన చరిత్ర సత్యకామ జాబాలి ఆత్మ వేదియైన ఇతివృత్తం నచికేతుడు మృత్యుజేతయై తిరిగివచ్చిన సంగతి మన బుద్ధిని ప్రచోదింపజేసే మహర్లోక జనయిత్రి సూర్య గర్భంలో నుంచి తొలుచుకు వచ్చిన సావిత్రి అవతరించి ఈ పరిమితులను ఖండించి, ఆనందలోక సంధాతర్జై సత్యజీవ సౌరభం నెలకొల్పుగాధ వేదమాతను దర్శించిన ధీరుణ్ణి మృత్యుభీతి శరణు జొన్పింది గాధేయుని కారుణ్య శ్రుక్తి గర్భాన పొల్చిన ముక్తారళ్ళి బలిపీరం మీద యమపాశం కూల్చి తలవంచింది సత్యలోకం గ్మీ బొగ్గు వజమైంది బుగధ్యాలు కొత్త పాటలు పాడినయ్‌ గాలులు తీయగా వీవనీీ సముద్రాలు తేనెలు జార్చనీ మధువులై ప్రకాశింపనీ ఓషధులు ఈ మంటి గడ్డమీద మధుమయిమాత ఈనేల మధుచృందసుని గానంలో అగ్ని వంతెనయ్లై పొల్చి అవతలి తీరాలక్రు చేర్చనీ నాంపరాయ్రైం 786

బ్రతుకు చేదునుంచి తీయని తీరాలకు చేర్చే సర్వ చేతన ప్రయాణానికి మధుచ్భందసుడే గుర్తు పామునోట్లోంచి లాగి కప్పుకు ప్రాణం పోసిన విధం మనిషి మెట్లెక్కటం, శిఖరం చేరటం, చిరబుద్ధ పధం స్వర్గ మనే అడ్డకొయ్యకు వ్రేలాడే ఆదిత్యుడే మధువు నిరంతరం కురిపించే ప్రాణకాంతి వర్షమే తేనె తేనెపట్టును పిండిన కౌశికుని వరపుత్రుడు తాను ఈ జీవనమంతా అనంతంగా సాగే మధుర యాత్ర అపరిమిత వాగ్దేవతా ప్రసార ప్రవాహవేగంలో ఎన్నియుగాలు ప్రతిఫలించి ఎన్ని ప్రాణాలు ఉన్మీలితాలై మృత్యుదేవతాలోక కవాటం కొంచెం వదులయ్యింది ఈనాటికి దివ్య జగత్తు రెండడుగులు క్రిందుగా దిగివచ్చింది తాదాత్మ్య సముద్రాలు పోటెత్తి చంద్రుడనే జీవాత్మను స్పృశించి అనంత దేవతా ముఖాన విస్మేరం వెన్నెల లొలికి భగవంతుడు ఒక ప్రవాహమై పారుతున్నట్లు దృశ్య జగత్తంతా నేత్రాల, శ్రావ్య జగత్తంతా శ్రోత్రాలె లోకం నిండా సత్యవంతులై జీవ గాఢత్వ వేదులై అధోలోకాల దాకా సూర్యకిరణాలు జలపాతాలై దూకి స్వప్నాల కడపలదాటి సత్యం అగ్నిలా ప్రసరించు పదార్థం ఈ కారాగారాన్నించి విముక్తమయ్యే శుభవేళ సంకుల మార్గం నే 77 నాంపరాయం

తొమ్మిదవ నర

మనం ఎరిగిన జ్ఞానాన్ని మించిన ఒక సజీవ నిశ్శబ్దం సృష్టి అంచులో పైనుంచి వ్రేలాడు సుందర నీరదమై సత్యం పలుకరిస్తుంది దాన్ని అఖండ బుత వృక్షశాఖను ఆనంద ద్వీప కాందిశీకుణ్ణి, అనంత ముఖ మాధుర్యాన్ని ఈభూమి అఆ నిశ్శబ్దం రత్నకాంతిని భరించలేదు

ఈ భూమి అ నీరవతలోని విశ్రాంతిని అందుకోలేదు ఎష్టుడూ విరతిలేని, స్థిరత లేని కదలికల పుట్ట

ఈ జగతి ఎప్పటికీ సమత పొందని గిరిరురీ దేశం

కాల వేగంలో కొట్టుకు పోతున్న వ్యధాతా దాత్యం

భూదేవి వక్షస్‌ స్థలం మీద కుదురుగా శయనించలేదు ఒక లిప్పైనా ఈ కాలపు కాపలాదారుని తప్పించుకొని తనను విష్పుకొంటూ సింహావలోకనం చేసికోలేదు

ఈ భూమి తొలి ఉషస్సులోనే తీవ్రమైన ఈశ్వర విరహంతో కలగిపోతున్నది సుదీర్ల జీవ వేదనా భారంతో

అపరిమిత దివ్య దీప్తి తొలగి ఖండిత దివానిశలతో ఖండిత దేశకాలాలతో, ఖండిత చైతన్య స్తరాలతో

సాంపరాయం 80

ఈ సముద్రం మీద ప్రతిఫలించే హంస మిధునం ఎనాట్టికైనా నా ఇంటిముందరి చెట్టు మీద వ్రాలుతుందో లేదో ఈ పర్వత శిఖరంమీద తురగలించే జ్యోత్స్నా సరస్వతి ఎప్పుడైనా నా జీవన మహాకావ్యంలో అనురణించేనో స్వప్నాలు తోరణాలు వ్రేలాడుతున్న ఈ మంత్ర నగరం కోట తలుపులను ఎప్పుడు తెరిచేరు జనులకు ఎన్ని జన్మలయింది ఎదురుచూస్తున్నాం ఇందుకోసం ఎన్నిసార్లు శంఖాలు మో గించాము ఢక్కాలు నినదించాము ఒకానొక గంధర్వుడు హరాత్తుగా ఈ లోయలోనికి దిగివచ్చి పాతాళ గంగ కోసం త్రవ్వుతూనే వున్నాడు అచ్చరల పాదముద్రల లోంచి కదలి వచ్చిన ఒకపాట ప్రీతి జగత్తులో సామరస్యాన్ని నింపుతున్నది అక్కడ కొండ చరియ మీద దేవదారువుల సమీపాన - ఒక మహపురుషుడు యుగాల కన్నా ప్రాచీనుడు దర్శించుకుందాం పదండి అక్కడ మనకు వ్యధలు తరిగిపోతవి ఒత్తిడి కరగిపోతుంది శాంతి సముద్రాలకు హద్దులు లేవు స్మర్‌స్తేచాలు నీలో తడల వెంటతడలుగా తరుముకొని వస్తవి బిందువు పుష్పించుతుందినాదమై, మధురహాసమై చూపు జన్మాంతరాలను కదలిస్తుంది రహశ్ళూలమై 81 సాంపరాయం

శీధు మంద్రంగా ధ్యాన జగత్తులోకి ప్రవేశించవచ్చు అనుకోకుండా స్వప్నంలో సామరస్యం దర్శించవచ్చు లయానుగుణంగా కదలి తన్మయతలో స్ఫూర్తి పొందవచ్చు పసిపాపలు కొత్త సృష్టిని చూడవచ్చు ప్రారంభ క్షణంగా మనస్సు ఒక మాయల గుర్రం, కళ్లు మూసుకుంటే చాలు వేయి బొమ్మల వరుస, వేయి సన్నివేశాల సంపుటి నీపనిలో లీనంకా, ఊపిరితో కట్టేసి దాన్ని అప్పుడు అదృశ్యం, అస్వనితం, అఖండ నీరవ జగత్తు అసంకలితంగా ఉన్న ఇన్నియుగాల తపస్సుల నిధులు ఎక్కడో నిక్షేపంగా దాచబడే వున్నయ్‌ గుహల్లో ఎన్ని అఖండతా స్వప్నసాక్షాత్కారాలు, రహస్య దీపికాతతులు దాగివున్న అగ్ని జ్వాలలు, సువర్ణ రోచిః ప్రభావాలు ఆశ్రయం లభించితే చాలు అభ్యాసి తొలిఘట్టం దాటినటల్లే గురు తేజస్సు హృదయంలో చేరి వృత్తులను నియమిస్తుంది ప్రలోభపెట్టే దృశ్యాలను, సిద్ధులను కట్టడి చేస్తుంది గురుభావం బుజం మీద నిలుపుకొని చివరిదాకా తీసుకువెళ్లుతుంది వాసుదేవునితో పాటీ పొండ్రక వాసుదేవులుంటారు అనుగ్రహ రూపులైన గురువులతోటేీ అపరిగ్రాహ్యులుంటారు గాఢంగా లోలోతుల్లోకి వెదుక్కుంటే దారి దొరికిపోతుంది ప్రతిరూపం ధ్యంసమవుతుంది, దీపిస్తుంది ఆత్మ ప్రకాశం సాంపరాయం 82

గురువు ఈశ్వర లీలా రధ శిఖర వైజయంతి

గురువు ఆత్మారోహ గిరి శిబరం మీది జ్యోతి

గురువు జిజ్ఞాసువుల దాహం తీర్చే ప్రపాశాల

గురువు సుషుమ్నా ద్వారం, గురువు శివుని మారురూపు సంసిద్ధమైన (బ్రతుకులో తానై వచ్చే వినూత్నాతిధి

అతీత జీవానుభూతుల రహస్యాల భాండాగారం

సనాతన పరంపరా తేజస్సును మనదాకా మోసుకువచ్చి

ఈ హృదయంలో ప్రతిష్టించి తాను మరుగయ్యే దివ్య తీర్థం అతిమనస్సులో నుంచి జలపాతమై దూకే కవిత

సమష్టి మనస్సులో నుంచి ప్రాకివచ్చే ప్రాగ్రూపం

ధ్యాన వేళ అభీప్పును ఊర్జ్యంగా మోసుకుపోయే జ్వలదగ్ని పంచభూతాల సమపష్టిని మన కోసం దయతో (గ్రహించిన ఈశ్వరుడు మతం మైలురాయి, అది లక్ష్యాన్ని ఎప్పుడూ చూచి వుండదు తరాలు దాట్సి విశ్వాసాలు ప్రాణాలు కోల్పోయి, మౌఢ్య ఖనులై మనస్సు నిర్మించుకున్న ప్రతీకలు, ప్రతిమలు సింహాసనం ఎక్కి బాహ్య వేషాలు అడంబరాలు, కర్మకాండలు ప్రబలి తన ప్రతీక కన్నామరొక ప్రతీకను అంగీకరించని తనకన్నామరొక విధానాన్ని తిరస్కరించే అహంత ప్రాణిక లోకంలోని అల్ప శక్తులు పరివేష్టింపగా ఈ ప్రతీకలు అల్ప్బవాంఛల పరిష్కరించేను, సత్యానుభవానికి వెలిగా

83 సాంపరాయం

తొలుత ధర్మకిరీటం పెట్టుకుని నడుస్తుంది మతసార్ధవాహం తొలుత నీతి చట్రంలో బిగించుకొంటుంది సమాజ వర్తనను ఏకరూపం, ఏక ప్రవృత్తి, ఏక ప్రచారం అవసరమై- పుట్టుతుంది వికృతి- గట్టు తెగిన నది, అపరిష్కృతి, చిత్తద్రుతుల బాట. రాజసం అలంకరించుకుని మతం వేయి వేషాలు వేస్తుంది వాంఛలకు సుఖాలకు నిరోధానికి ధర్మ గ్రంధాన్ని చూపిస్తుంది తమ వైభవం సాగేరీతిలో అనంత వ్యాఖ్యానాలు కర్మకాండ అంతా దంభంగా, దురాచారంగాా, నిరర్ధకంగా మారిపోయి కట్టుబడులూ, కట్టు కధలూ కట్టు బానిసతనం పతనమైన మతం విసిరే వలల్లో పడిపోయి ఇంతకాలం సత్యం వికసించే అరణ్య మార్గం వేరు అది యోగం దాన్న ఎన్నుకున్న వాళ్లకు అది తపో మార్గం ఐకాంతికం యోగం దారి తప్పి సమాజ ధర్మం విస్ట్రుతమై సాంకర్యంగా రూపొందుతుంది మతం ఊహల పేకమేడ మూలంలో ద్రష్టల వాక్కులున్నా అవి మరుగున బడిపోయి అపసవ్య రాజ్య పురుషులకు తోడవుతుంది- చేకటి బొమ్మై నిత్యం హృదయంలో జ్యలితమయ్యే అచంచల నిర్వేదం ఎప్పుడూ అంతర్చహిర్దగత్తులలోని ఏకసూత్రతను గుర్తించటం అన్వేషణ ఎకాంత ద్వీపం - ఒక్కడే నడిచి నడిపించే సేన అక్కడ చైతన్య విహంగం ఎగురుతుంది - అంతస్సులో మిగులుతుంది. సాంపరాయం 84

మనస్సుకు ఎన్ని అంతస్తులో జ్ఞానమూ అన్ని అంతస్తులలో ఉన్నది ఎదిగే కొద్దీ క్రొత్త వెలుగును ఆషాఢ మేఘం కురుస్తుంది బంధనాలు త్రెంచుకున్నకొద్దీ దూరం సమీపమవుతుంది

శబ్దం రహస్యాన్ని విప్పుతుంది, గుండెలో గుసగుసలాడుతుంది క్రోధ శిఖరం మీద వున్నప్పుడు అది అగ్నిపర్వతంగా కనిపిస్తుంది కామ ప్రవాహంలో ఈదులాడినప్పుడు అది వైతరణిగా తోస్తుంది సాధకునికి జీవితం అంతా యోగం, ప్రతి కర్మా నూత్నప్రయోగం అహంత పలుచబడినప్పుడు అందరోలో తన ప్రతిఫలనం తోస్తుంది జగద్వేదనకు స్పందించగా మనస్సు హద్దులు దూరంగా జరుగుతవి ఆకాశ తీరానికి అక్కడెక్కడి నుంచో క్రొత్త పడవ కదలివస్తుంది

కొంత ప్రాణాయామం, కొన్ని జీవితం వెలిగించే ప్రవృత్తులు సమపష్టిలో ఉన్నా అంతర్ముఖుడు కావచ్చు, నిరంత్యరె కాంతికము నిల్చి వేదోదితాగ్ని చైత్యస్థ, వేద సూర్యుడు దహరంలో వాడు

ఆహుతులు అంతరగ్నిలో వేల్చటం, చైత్యపురుషుణ్ణ మల్కొల్పటం సవితను అర్చించే త్రికాల సంధ్య హృదయోపాసన

సర్వ దేవతావిర్భావం దహర సూర్యుని నుంచే జరిగింది

స్వార్ధము కోరికలు లేకుంటే ప్రతి ప్రార్ధనా పరాత్పరుని పాదమంజీరం

సత్త్వమయత సిద్ధిస్తే ప్రతి పూజా కేవల శివార్చనమే

గృహత్రత్తికెన్తా ప్రియంకృత్నికెనా కావలసింది అహంకార ముక్తి

సమర్పణంతోడి విశ్వాసం, సర్వతోముఖ సాక్షాత్కతి

రన్‌ నాంపరాయం

హృదయంలోని అంగుష్టమాత్ర పురుషుని కోసం నీవు

మాయల పొరలు చీల్చుకుని, ఒక పసిపాపవై పోవాలి

బుద్ధి ఇంద్రజాలం కల్పించిన ముసుగుల్ని చీల్చి

అహంత తెచ్చుకున్న అభిమాన విస్తారాలను కాల్చి

వినయ వినమితంగా బోధ గంగలోకి మెట్లు దిగేప్పుడు

నెమ్మదిగా నీ చేతి వేళ్లను ముంచు- శీతల వాగగ్నులను తాకేవు నదీ దేవత పరిష్యంగంలో జన్మజన్మల బంధువుల స్మరణ

ఒకే ఒక స్నానంతో అజ్ఞాన పంకిలం కరగిపోతుంది క్షణంలో మనలోని పరిణామ చక్రప్రవర్తనం హృదయ దేశానికే తెలుసు మనలోని అనుభావాల మార్చుమన మనస్సుకే తెలుసు

మన చైతన్య భూమికలలో ప్రసరించే తేనెల కాలువలు

మన కలల్లో మాలలు కట్టే జన్మజన్మల పుష్పలావికలు

శిల శిల్పంగా మారుతుంది కవి పద్యమై పుడతాడు

పద్యంగా ప్రవహిస్తూ ప్రవహిస్తూ అనంత సాగరంలో లీనమౌతాడు పద్యం దిక్కాలాలను ముడి వేస్తుంది దాని ఫణామణి అవుతుంది అందరిలో అది ప్రతిఫలించి, అందరూ దానిలో ప్రతిబింబించి శరీరాలు రాలిపోవచ్చు చిత్త సంస్కారాలు తోడౌతాయి హృదయం మాత్రం పొడిచి వచ్చే క్రొత్త తారల పుట్టినిల్లు

ఒక్క క్షణంలో సిద్ధిస్తుంది సమాధి - ఆక్షణం ధ్యానధారలో తడిసింది ఒక్కలిప్త చాలు అమృతత్వానికి- ఆ లిప్త కన్నది అతీత చేతనను నాంపరాయం 86

చైత్య పతాకం ఎగిరే నీ యాత్రను అడుగులోకం జీవులు తాకలేరు - నిన్ను బంధించుకున్న సంకెళ్లు - స్వార్థం, అసూయ, దురాశలు వ్రీలి పోతాయి ఒక్కొక్కటీ - ఎదురువచ్చిన దివ్య గగనాలు నీపూజ గది నేల పరిమళాన్ని గ్రహిస్తాయి- నిన్నుతమతో తరలించి (బ్రహ్మ చర్యం - జ్ఞానశక్తుల, శాంతి తేజస్సుల, 'స్వేచ్భానందాల బుతు చక్రం ఏకకాలంలో విరిసిన నిత్య సంవత్సరం బ్రహ్మచర్యం విశ్వ వ్వాతీత సంగమ బిందువును తాకటం అది మెలకువ తోడి సమాధి అవస్థాత్రయంలోనూ ఎరుక ఒకసారి నిశ్శబ్ధాన్ని అందుకుంటే సూర్యోదయాదులు నీకు లేవు ఒకసారి భౌతిక లోక ద్వారాలు దాటితే ఆత్మకోశం స్ఫురించేను అకలుషమైన ప్రేమతో జగన్మాత ఒడిలో తలమోపినంత నీవు వెలుతురు కొలనువై అనంత కాల హంసలకు మానసమై తాత్త్విక విచారణ ఒకముఖం, అనుభూతి ప్రకాశం మరోముఖం సాధనకు రెండుపక్షాలు, ఈనదికి రెండు తీరాలు ఊర్ధ్వ దీప్తి కాంతి జ్వాలను శరీరం నిండా నింపుకుంటే సరిహద్దులు ఉండవు జీవితానికి, స్వప్నాలకు అంతే ఉండదు ప్రకటిత మయింది శివాదేశం, జటాజూటంలోగంగ పొంగెత్తింది చిత్త కాననంలో పురి విప్ప్తుకున్న నెమళ్ల నృత్యాలు బుద్ధి లోహల్లో గుంపులైన ఏన్గుల ఘీంకారాలు తల్లి ఫాల చంద్రరేఖకు కొత్త ముక్తాలంకారాలు'

87 శాంపరాయం

హృదయాలలో మోగుతున్న అనంత జీవ పుంటికలు బ్రతుకంతా పరచుకొన్నసంగీత వసంత విలాసం నుదుట వెచ్చని కప్పురపు వెలుగులు, తావుల పెల్లువలు అమోఘం విస్ఫుటమైన సత్యం, ఒడలెల్లా కైలాసం నెమ్మదిగా నడుస్తున్నాను గాలిలో మంత్ర రహస్య స్ఫురణలు అప్రయత్నంగా కుదురుకుంటున్న అంతర్వేశ్మ సౌందర్యం మధురలో నుంచి కదలివచ్చిన మీనాక్షీ సుందరేశ్వరులు నారాయణునితో కలసి - రూపుగొన్న సచ్చిదానందాలు 'క్రమ్ముకు వస్తున్న సేనా వాహిని సీమల్లోంచే పారిపోయింది ఆకాశం నిండా సౌందర్య వారిధరాలు కురిసిన పూలతేనెల పెల్టు అలంఘ్య సముద్రాలు దాటినట్లు, అప్రావ్రనిధులు పొందినట్లు అనంత యుగాలు కుదించుకున్న ఈ క్షణం, మాత దరహాసం జగత్తును అనుసంధించే ఏకసూత్ర చేతన ప్రేమ ప్రేమ- లోకంలో ఈశ్వరుడు వేసుకున్న వెలుగుల శరీరం అహంకార కాసార సేతువులను తొలగించేది ఆత్మీయతా భివ్యక్తి పృధ్విమీద నిమ్నోన్నతాలను సరిచేసేది అనురాగ వర్ణం అక్కడ స్థాన మానాలు లేవు వేద శాస్త్రాలు లేవు సహజమైన ఆనంద తాత్పర్యం అందరినీ క్రమ్ముకొని వుంది అదిశూన్యమో, శాంతియో వింగడించటం సులభం కాదు తనకు మాత్రం ఈ (బ్రహ్మాండం ప్రీతిరూప నైవేద్యం

ఈశ్వర విరహం

శ్‌ నాంపరాయం 88

వదవ నర

అంత సంపదా నాగరకత్సా విజ్ఞానం, ఏమైంది క్షణాలలో నూయార్కులో రెండు శిఖరాలు నేల కూలిన ముహూర్తం ఉన్మత్త లోహ గరుడా స్త్రాలు నేలమట్టం చేసింది మానవుణ్ణి కల్పించుకున్న క్రౌర్య దంష్టలకు కట్టుబడ్డ దైవభావనను విశకలితమైన చేతస్సుతో ఎంతదాకా పరుగెత్తగలవు అంధకారంలో మొలకెత్తిన పిశాచాలు గగనాన్ని మంగగా ఆడుతున్నవి శకుని పాచికలు భూగోళం నిండా

వికటాట్టహాసం చేస్తున్నవి గాంధార్యశ్రైల సానువులు

ఎన్నివేల శవాలు ఈ శిధిలాల క్రింద, ఎన్ని ఎలక్ర్రానిక్‌ సాధనాలు పేకమేడల్లా కూలిపోతున్నప్పుడు ఏ ధర్మం వ్యాఖ్యాతమైంది ధర్మగ్రంథాలు ఆయుధాగారాలై, ధన ముఖం మీద రక్తం పులిమి సభ్యతాసన్న స్మశానంలో తాండవించే రక్త బీజ సంతతి పర్వతాల్లో వేసిన బాంబులు శాంతి బీజాలయి మొలకెత్తవు దాడి చెయ్యి గతంమీద, మౌధ్యంమీద, అహంతమీద, రక్తసిక్తమైన చరిత్ర ఖండాలు, పరాభవాలు ప్రతీకారాలు, జీవించటం ఎక్కడ - భూత సముద్రంలో, గాయాల ఎడారిలో

89 నాంపరాయం

ఉఊబిలోంచి లే- మనస్సుమీది ఉన్మాదపు పాఠరను చించు అగ్నులు కురిసే ఈ గ్రీష్టం నుంచి- కదలిపో కారుణ్య వర్షర్తువులోకి అక్కడ విరుస్తుంది- నూతన చైతన్య సంఘచ్చ్భత్రం

అక్కడ పొలుస్తుంది బుతచేతన - ఆత్మవీణా వాదన.

మురికి మింగి పంటలనూ పూలనూ భూదేవి ప్రకటిస్తుంది మన నిశ్య్యాసాలను మింగి ప్రాణ సమీరం ప్రసరిస్తవి పాదపాలు ఇంతప్పధ్వి ఈశ్వరుని క్రీడాభూమి, లీలాసరస్సు

అతని శిశువవై, వశుడవై స్వేచ్భగా తిరుగాడు

సృష్టి మాధుర్యాన్ని అనుభవించి, ద్వేషాన్ని విషాన్ని క్రార్యాన్ని వెలికి జిమ్ముతున్నావు- సజ్జితాణ్యస్తుడవై నీవు - సహస్రాబ్బాలుగా గీసుకున్న సీమారేబలను చెరుపుకో

నీ మనః కూట గుహల్లోంచి నిన్నునీవు విముక్తుణ్ణి చేసుకో ప్రపంచం నిండా పరచివున్న సమస్య భయం

భయం వెంట నంటివచ్చే దుఃఖం, భయం అవ్యక్తమైన భావి వ్యక్తావ్యక్త పరిణామం తట్టుకోలేకనే భయం

ఆశలు విఫలమయ్యే భయం - ఆకృతి తలగే భయం

అయినా హృదయంలో ప్రజ్వరిల్లిన సూర్య తేజం రజస్త్రమస్సులను ఆహరించి తనలో విలీనం చేసుకోనే సత్త్వం ప్రతి లిప్త ఏ కొలతకూ అందనంత ఎత్తుగా

నిర్మింపబడుతున్న మణిమయ సుందర నిర్మాణం

భూమాత విరహ గీతం ఎదిగి వచ్చి చంద్రుణ్ణి తాకింది

స్వరాల పుష్పాలు, రంగులు, గ్రహ మండలాల ఇంద్ర ధనువులు ఎందరో సాలప్రాంశులు, ఆజాను బాహువులు చేతులెత్తినా

అందీ అందని ఆకాశం, అలసి మూర్చితమయ్యే చిత్తం

నడుస్తూ పరచిన చిరునవ్వుల వంతెన ఆ అతిధిని చెంతకు చేరుస్తుంది చూస్తున్న నీ హస్త చంపకం తావులదూతలను పంపేను

భంగ పడదు జగత్తు - ఇంత శోకంలోనూ అనుపమ జ్యోతిర్మణి నీళ్లు మింగకుండా చేతులు చాస్తూ ఈదటమే తీరం చేరుస్తుంది యోగ్గికైనా కవ్లికెనా మహాత్మున్నికెనా దేశికున్నికెనా

జగత్తుతోనో, దాని ఉద్ధ్గమ స్థానంతోనో తాదాత్మ్యం

తాదాత్యుమే ప్రేమ, అదే భక్తీ, నూతనాభివ్యక్తి

విశ్వపురోగతి సూత్రం - ఈశ్వరుని ఉత్తరీయాంచలం,

ఆ కొంగుతో ముడిపడ్డ నిమేషంలో - అబ్ధిలో చేరిన ఉప్పు బొమ్మవు సర్వమూ అక్కడ లయం పొందుతుంది- ఆత్మ విస్టాతమవుతుంది సాయుజ్యం పై మెట్టు- మాతువును మరచిన ధాతువు

మితినుంచి అమేయతలోనికి బుత పరిధిలోకి ప్రస్థానం

కితిజ రేఖపై వేయి సూర్య మండలాలు పొడవనీ,

భువన శాఖపై వేయి రామచిలుకలు పలుకనీ,

అంతటా పరివ్యాప్రమైన చరాచర సృష్టి విన్యాసం

గుండెలువిచ్చి భావి హిరణ్యస్వష్నాన్ని సాక్షాత్కరించుకోనీ

ఈశ్వర శిరస్సు మీది గంగ పాతాళం దాకా దిగిపోయింది

గుణ కర్మల మీద నిర్మితమైన వ్యవస్థ ఇనుపకట్టడై పోయింది

ఎగువ దిగువలు, ఉచ్చనీచాలు, అర్షతాన్ర్షతలు

మనుష్యులలో చీలికలై, నాభి పద్మం నూరుగా చీలి

వేల శరత్తులొకవెపు, వేల శిశిరాలొక్షవెపు

ఎవరి బ్రతుకుల్లోనెనా బుతుచక్రం కదలటంలేదు

న్ల్లోతుకంగా నిర్వచించిన పుణ్య పాప సూర్యోదయాలు

కృత్రిమ పంజరమైన బ్రతుకులోంచి పారిపోయిన దైవం

మాతృ గర్భంలో నుంచి మాయతోడ పుట్టిన శిశువులు

అందరికీ అదే కళ్ళలం, అందరికీ అదే స్తన్యం

కర్మ సూక్ష్మశరీరానిది, కర్మ జీవకోటిది

ప్రారబ్ధం మోస్తూనే కర్మ నాచరించే స్వేచ్చ జీవునిది

వామనుడు త్రివిక్రముడు కావచ్చు - వ్యాధుడు బ్రహ్మవేత్త కావచ్చు

తనువు కరో ]పకరణం, జీవుడు సర్వమునకూ అధికారి

తనువు బట్టి కాక తపస్సును బట్టి మాత్రమే సిద్ధి

రుజాజరలను మృత్యువును పొందటంలో అందరూ సమానులే.

8 హరిద్రుమంతమైన హరిద్రుమంతుని నెలవు

ప్రక్కగా తీయని నీటివాగు - పలుకోకిలలకు తావు

తన కౌగిట్లోకి చరాచరాన్నంతా చేర్చుకో గల మహస్సు

ఎన్ని గోశాలలు, పచ్చిక బయళ్లు, ఎన్ని సస్యశ్యామల క్షేత్రాలు తి ఛాందోగ్యోపనిషత్తులోనిగాధ నాంపరాయం 02

ఆశ్రమం నిత్య స్వాధ్యాయంతో తీవ్ర తపస్సుతో సరస్వతీ దేవి స్వర కిరీట మణిలా ఉన్నది యమ నియమాల బలంతో చెట్లు, పక్షులూ వాగులూ నెలకొల్పుకొన్న సామరస్యం భైరవీరాగ విస్తారం అగంతుకులకూూ అతిధులక్హూ అప్తులకూ, జిజ్ఞాసువులకూ ఆశ్రమం వెయ్యేళ్ల సుఫలకేదారం - తల్లియైై ఆకలి తీరుస్తుంది అంత పాన హరిద్రుమంతుని ఆశ్రయనిలో దుఃఖంలేదు అడవి మృగాలకు క్రార్యం లేదు - అకుసుమిత ఫలరహిత వృక్షం లేదు వార్థివీచిపై అర్కకాంతి ప్రతిఫలించిన మేనిచాయ సూచీ దృశాంతుడు ఒకడు బాలుడు పర్ణశాల గడపపై తోచగా ఆజ్యగంధంతో, తలలూచే కొమ్మలతో - అశ్రమం పూల నవ్వుల పలుకరింపులతో, నెరపింది స్వాగతం సమిధలతో దర్భలతో సమీపించిన సత్యకాముడు హరిద్రుమంతుని చరణ సన్నిధి అశ్రయించి పలికాడు “పుట్టిన చోటు తెలిసినా నేలలోని బీజాన్ని ఎరుగను సత్యాన్ని కామిస్తున్నాను - ఎరుగగా సృష్టి మూలతత్త్యాన్ని సరిహద్దు రేఖలలో చిక్కి జగత్తు ఖండితమైంది భావ కల్లోలంలో చిక్కి మనస్సు విశకలితమైంది కాల వాహినిలో కలగి బ్రతుకు శిధిలమవుతున్నది లోనికీ బయటకూ కదలలేక ముక్కలైనాను నేను

న! నాంపరాయం

దైహిక ప్రాణిక గాఢ బంధాలలో చిక్కిన నేను

స్తనంధయుణ్ఞి, లోక వృత్తిలోని చిక్కువీడను

సంభావ్యత అసంభావ్యతల కూలాల సంగతి కూర్చలేను

ఇప్పుడు మీ సన్నిధిలో స్వతంత్రుణ్ణి, మరో జన్మ ఇది నాకు

తొలుస్తున్నది సందేహం - బ్రతుకుకు తాత్పర్యం ఏమిటి?

అంతస్సులో ఎన్ని పారలు బహిరంగంతో లంకె ఏది

వ్యక్తమైన దంతా ఎప్పుడూ మారుతూ సాగిపోతున్నది

ఏ సముద్రంలోనిక్కి ఏ గగనమండలాల లోనికి

నేను పలుకుతున్నపలుకు మూలం ఎక్కడ దాగివుంది

ప్రతి అంశం ఏదో నాకు చెప్పబోతూ వున్నట్లు తోస్తున్నది

విషయాలు, ఇంద్రియాలు, మనస్సు దేనిని లగించి నిలచినవి

అనంతమైన సృష్టికీ నాకూ నడుము ఉన్న అనుబంధమేది””

సత్య కాముని పరీప్స హరిద్రుమంతుని గుండెలో

స్తబృతలోంచి ఒకతెల్లని తుమ్మెద రుంకారం చేసినట్లయింది

తన తపోలోకాల కాంతులు వెల్లువలు కట్టినట్లయింది

తొనే ఒక వృషభం, ఒక్ష హంస, ఒకనీటి కాకి అగ్నిజ్వాల

అతనిలో కానవచ్చిన తన స్వప్న ప్రతిబింబం

అసమ[గ్రత నుంచి సమగ్రత వైపు సాగిపోయే తపోరేఖ

పరిపూర్ణతనందుకోబోయే “మానిషాది శ్లోక ఫణితి

భావి సమృద్ధ వృక్షం, తొలకరి కోసం వేచిన కేత్రం సాంపరాయం 094

నిన్ను స్వీకరిస్తున్నానని అన్న ఆ మౌని అతనిలో

ఈ జగత్తునంతా హరిద్రుమవంత౦ చేయగలవాణ్ణి

దేవ జగత్తును అవనిమీద నడిపించగలవాజ్ణీ

ప్రాణపు పొలాలపై తీయని వర్దాన్ని కురిపించగలవాణ్ణి

ఏ జడగర్భంలోనైనా ఓజస్సును [గ్రహించగలవాణ్ణి

ఒకటిని ఇబ్బడి ముబ్బడిగా - అనేకాన్ని ఏకంగా

ఏకకాలంలో దాచుకునేవాణ్ణి- ఇహలోక స్వర్గభావుకుని

ఆశ్చర్యంగా చూచి ఆశ్చర్యాన్ని తనలోకి ఒత్తుకుని

నాల్గువందల బక్కచిక్కిన గోవులను అప్పగించి

“పునరుజ్జీవింప జేసి వేనవేలుగా వృద్ధి పొందించు

అడవిలో నీవు మెట్టినచోట గోలోకం నిర్మించు

సమృద్ధమైన దుఃఖ రహితమైన జగమును నిర్మించు”' మన్నంత

తనదారి స్పష్టమయింది, అప్పుడు సత్యకామునికి

సృష్టి అంతా ఉధద్గమనం, వికాసం, పరిణామ పరిణాహం

అహంతను వేల్చుకోవచ్చు, క్రమంగా దేవతలను చేరుకోవచ్చు

నిహితమైన రహస్య ద్వారం వివృతమయింది ఆ క్షణాన

మొలకెత్తే బీజాన్ని తెలుసుకుంటే అంతా తెరచిన [గ్రంధం

నాల్గు శ్రుతి సంపుటులు గోవులు- అధ్యయనం జగత్తులోనే

అసంతులిత ప్రకృతిలో ఎగుడుదిగుడైన నాల్గు భూతాలు

పర్వతా([గ్రం నుంచి క్రిందకు జారిపోతున్న అంతఃకరణాలు ౦5 సాంపరాయం

అవిదితంగా ఒక గుహలోంచి నిర్గమించి కళ్లు నులుముతూ

విశాలమైన వెలుగుల మైదానంలోకి చేరినట్లు

అతనిలోని జిజ్ఞాస శతాంకురితమై మొగ్గలు తొడిగి

వెలికి వచ్చిన గంధవాయువులు గురురూప వివర్హమైన

నాల్గు కొమ్ములుండవచ్చు ఆ వృషభానికి- తనమంద పెరిగి

సర్వతో వృద్ధిని చూచి, ప్రకాశవంతమైన పార్యంగా

చతుర్దిశామయ విశ్వంలో బ్రహ్మభావం నిరూపించి

వ్యక్తమైనదంతా ఆత్మ విస్తారమని చెప్పింది

మింటికి వేసిన నిచ్చెన హృదయంలో మేల్కొన్న అగ్ని

వృషభం ప్రణవమైతే అగ్నిదానిలో గర్భితమైన నాదసూత్రం

నాదసూత్రం నిబంధించింది భూమిన్సీ రోదసినీ, ఆకాశాన్నీ

చుట్టూ ఆవరించిన పృధ్వి మేఖలను ఆనంత్య ద్వితీయ పార్శ్యంగా

నిరంతర ప్రాణ యాత్రలో పైకీ క్రిందికీ ప్రస్తరించే

ప్రాణం మూడవ గురువు హంసమై స్ఫురణకు వచ్చి

ఉనికిని అను భవంలోనికి తెచ్చే అగ్ని సూర్యేందు విద్యుచ్చయం

ఈశ్వరుని జ్యోతిర్మయ పార్స్యం సంకల్పానికి ఆయతనం

ఎవరైనా గురువు కావచ్చు- గ్రహించ గలిగితే ప్రతికణం

దేనినో సూచిస్తుంది తత్త్య రహస్యాన్ని ప్రకటిస్తుంది

ప్రత్యణువు తత్త్యం ఎరిగించే రహస్య దేహళి

పశువు కావచ్చు, పక్షి కావచ్చు, సర్వమయుడు అగ్నికావచ్చు నాంపరాయం 0గ్ర

నీటి కాకి వచ్చి చేరింది సత్యకాముణ్ణి పిలిచింది అంతర్జగత్తులోనికి దారితీసింది మనికి ఆధారమైన పార్యంవైపు లోనికి చేర్చే దృక్‌ శ్రోత్రాలు - అనుభవించే మనస్సు కూటస్థమైన ప్రాణం ఇదీ బ్రతుకు తాత్పర్యమని అనుకున్నంత సేపు పట్టలేదు హరిద్రుమంతుని దర్శనానికి అతనికి తెలియ వచ్చింది సత్యకాము డవాప్తకాముడని ప్రీతచిత్తుడు, ప్రీత శిష్యుడు గౌతముడు షోడశకలామయ మభివ్యక్త లోక రహస్యాన్ని సమన్వయం చేసి చూపింపగా సత్యకాముడు పొందిన అవగతిలో వైరుధ్యాలు లేవు సత్తుకూ - అసత్తుకూ, తేజస్సుకూ - తపస్సుకూ, బ్రతుక్కూ- మృత్యువుక్సూ దశా భేదం మాత్రమే తోచింది లోకం అంతా శిశిర వసంతాల యుగపత్తుగా గోచరించింది. సత్సకామన లే 07 నాంపరాయం

పదకొండవ నర్ధ

క ఉద్దాలకుని యజ్ఞం సాగుతున్నది, సర్వత్యాగ మయమైంది

ఆయన పరంపర సూర్య తేజస్సుకు కొటారు, చంద్రకాంతి విస్తారం

ఫలాభిషంగం లేక అన్నింటినీ పరిత్యబిస్తున్నాడు

పొలాలు, పర్ధశాలలు, పశువులు, ధన సంపదలు

ఇంత తపస్సూ జన్మలోనే నిరుద్ధమై పోయి

స్పృతి కోల్పోయిన సూక్ష్మతనువు మళ్లీ జన్మలో మేల్కొని

పునఃపాక ప్రయత్నం, అడుగునించీ మళ్లీ నిర్మాణం

ఎన్ని యుగాలు సాగాలి, ఎన్ని అర్ధ భగ్న కులాయాలు

సచ్చ్భిద్రమైన ఈ భాండం ఎప్పుడు నిండిపోతుంది

గూట్లోంచి లేచిన పక్షి ఏ దూర సముద్రాలు దాటునో

ఈ అధ్యపారం అందుకోవాలి ఈ మనికిలోనే

ఈ జీవసారాన్ని ప్రవహింప జేయాలి దివ్యసము ద్రంలోకి

మృత్యుభయం నరకం- అక్కడ క్రుంగిపోతే తపస్సు లేదు

ఎదకు అమృతం దాకా నిచ్చెన వేయి, సాధన సాగుతుంది

ఉద్దాలకుడు బహిరగ్నిని హృదయంలో సంధించిన జ్ఞాని

యజ్ఞ్వ్సు కనబడుతున్నా, స్వర్గాలు దాటిన అన్వేషణ నాంపరాయం 01

ఈశ్వరార్పితం చేసిన అధ్యరం కర్మత్యాగ సంకేతం

అన్ని గోవులన్తూ ధనాన్ని అర్పించి కర్మఫలాన్ని వదులుకున్నాడు మిగిలింది ప్రజ, ఊన షోడశవర్డుడైన నచికేతసుడు

తపస్సునూ అధ్యయనాన్నీ ముడివేస్తున్న పుణ్యశిశువు

తాను మిగిలిన బంధం కారాదు అదత్తుడై తండ్రికి

ఊర్ధ్వ ముబ చేతస్కుడై తండ్రిని ముమ్మార్లు ప్రశ్న చేశాడు “నన్నుఎవరికిస్తున్నావు తండ్రీ" అని- ఆవేళ ఆయన ఎదలో జీవకోటిని అపరిహార్యంగా మధించే మృత్యుదేవత కానవచ్చింది మృత్యువైన ధర్మ దేవతకు మాత్రం తన పైని వెలుగులు తెలుసు స్వర్గం తెలుసు అపవర్గం తెలుసు, ఆ దారుల వివరాలు తెలుసు ఆ రహస్యం భూమి మీదకు తెచ్చేవాడుగా తన పుత్రుడు తోచి అన్నాడు' మృత్యువునకిస్తున్నాను అని ఆ అమోఘ వచస్కుడు మృత్యు గృహంలో తాను ఏంచేయగలడు అతన్ని దాటిపోగలడా తన అధిష్ట్థానంలోని వహ్నిముఖం ప్రయాణానికి సిద్ధ మౌతున్నది ఆ గడప దాటు, దాటించు అందరినీ అనిపితరుల ఆదేశం సృష్టిలో విప్పరాని ముడి- ఎవరికీ అంతుపట్టని నుడి పితృవాక్యం అదేశమై - ఊర్థ్యలోకాలక్షె కదలి

అధిష్టానం నుంచి హృదయంలో చేరి- అక్కడ హంసగా రూపొంది ఆజ్ఞ ద్వారాన నిశ్చాసమై బయలు దేరిన నచికేతుడు

ప్రాణం మాత్రం హృదయంలో నెలకొల్పి - ముందుకు సాగి

09 నాంపరాయం

అవిజ్ఞేయ పథాలలో- అవ్యక్త గహనాలలో సాగి దక్షిణా ముఖాన సంయమని- ద్వారం దాకా ప్రక్రమించి అక్కడ మృత్యు దేవున్నికె ఎదురుచూచే ఉపనీతుడు మూడు అహోరాత్రులు వ్యయమై - మృత్యు దర్శనమే కాలేదు నాల్గవ నాటికి మృత్యువు తేజోమూర్తి బుత గర్భశిశువు ఎదురుగా వచ్చినంతనే తన మృతి భావం తొలగింది

తాను వైశ్వానరుడై, జగత్రాణలోకాల కుద్దుర, కానవచ్చినంత అతిధి వేచిన మూడహస్సులకు సమవర్తి పరిహారాకాంక్షి అనర్చితుడైన అతిథి హరించే పుత్ర పశుసంపదలు -

యాతా యాత జీవుల పుణ్యపాస నిర్భయం ఒకటి

మృత్యువై సృష్టి క్రమాన్ని సక్రమీకరించటం ఒకటి

దేవతయై విధి చక్రంలో లయ భావ నిర్భయం ఒకటి.

మూడు రోజుల ఉపవాసం త్రిగుణ పరిమితులను

మూడు రోజులు ఎదురుచూపు క్షుత్ప్చిపాసలను వ్యధలను దాటి వివేకం వైరాగ్యం ముముక్షుత మెట్లు మెట్లుగా ఎక్కినంత పరేతరాట్టు సంద్రీతచిత్తుడై ప్రసన్నుడై

కోరుకొమ్మన్న మూడు వరాలు, మూడు ముడులను విప్పి రహస్య ద్వారాలు విచ్చుకొని సృష్టి ఊోర్టాధోజగత్తుల చిత్రం ఒక్కసారి సాక్షాత్కరించి విస్మితుడు, అవిచలితుడు నచికేతుడు మృత్యువులోన ఆది గురువులను దర్శించె

నాంపరాయం 10

యముని హృదయస్థానంలో వివృతమైన ఆదిత్య మండలం ఆదిత్య మండలాంతర్గతమైన భర్గ తేజస్సు భర్గ దీప్తి కడుపులో చతుర్భుజ నారాయణమూర్తి విశ్వసరసిజం మీద వెలసి ఉన్నయోగ చతుర్ముఖుడు నచికేతునికి గురువై, పరమగురువై, పరమేష్టి గురువై దెవ్యాదివ్యలోకాల సంధి బిందువు ధర్మరాజుగా స్ఫురించి - నచికేతునికి మృత్యులోకం - అది బ్రహ్మజ్ఞానపు తాళపు చెవి ఒక బ్రహ్మర్షి ఆశ్రమం, ఒక ఉపనిష ద్వ్య్యాఖ్యానం తొలివరం తన పాదును గురించి, తన దేహం గురించి - “మృత్యు ముక్తుణ్జే తిరిగి వెళ్లిన నన్నుచూచి తన సంకల్పం నెరవేరి- సర్వ భావములూ శమించి తృప్తుడై వీతమన్నువై నా తండ్రి నన్ను కౌగిట చేర్చనీ" “అద్భుతంగా ఉంటుంది - నీతండ్రి మర్త్యలోక విముక్తి భావం సీ వల్ల సాఫల్యం పొంది యజ్ఞాం సద్యఃఫలదమైందని యోగ భూములలో, జ్ఞాన సముద్రాలలో విహరించు ఆరుణి ఉషస్సులు తానై, ముక్త జీవుడై నిలచు రెండవ వరం కోరుకొమ్మన్న పరేత రాజుకు ఏం చెప్పాలి ఏదో ఒక వాస్తవం ఉన్నది పరిణత లోకం, దుఃఖవిరహితం భౌమిక వపువు పరిమితులుండవు తేజోమయ జీవనం క్రుత్పిపాసలు, జరారుజలు అక్కడ భావనలో కూడా లేవు పరాయం 101 నాం

అందరూ అమృతాశనులు, ప్రీతిభావ మధు కోశం

గాలులన్నీ సుగంధ బంధురాలు రూపం స్వేచ్చా మంజులం

మృత్యువు సంగతి తెలీదు - అ దేశం అనంతం

ప్రకృతి బీజంలో నుంచి ఎదిగి వచ్చిన మధుర రసాలఫలం

ఊహల పందిరిలోంచి కదలి వచ్చి నచికేతుడు

జీవుల సర్వదుఃఖ రహిత కామనను సాక్షాత్కరించుకొని

ఆ లోకం గురించి చెప్పమని, *' అక్కడికి చేరుకొనేందుకు

సర్గం మొదలి వహిని ఎలా మెల్కొలుపాలి ఎలా అర్చించాలి

అసత్తులోంచి ఉద్ధతమై మొలకర్దై అన్ని లోకాలకు

మనోమయ జగత్తులో దేవ దూతగా సాక్షాత్కరించి

పరిణతమై తానె దివ్య జీవనమై ప్రభువై జ్ఞాతయైైన

నిత్య సన్నిహితమైన అందరాని అగ్నిని గూర్చి చెప్పు”

ఇంత వేదనను గర్భీకరించుకొన్న ఆవ్రతికి యముని వచనం

ఆ మహోలోక్ష 'సేతువైన మహాగ్ని సవనాన్ని

దహరాగ్గిని వెలిగించి నిలుపవలసిన రీతిని

సశరీరంగా శిఖరారోహణ పధాన్ని విశదీకరించింది

సవితృసంతానం సంప్రీత చిత్తంతో ఉత్తమ శిష్యునితో

“ఈ అగ్నికార్యం నీ పేరనే లోకంలో కొనసాగుతుంది

అనంత జీవ కోటికి నీవే అగ్రగామివి నేతవు

లోక కల్పకం చేరుకునే అనంత సాధక ప్రతీకవు శాంపరాయం 102

ఈ విద్య వెంట తెస్తున్నది సర్యోర్ధ్యలోకాలకు క్రింది లోకాలకూ యా త్రికుడవయ్యే అతి రహస్య విద్యను చతుర్దశ బువనాలు నీకు కంఠమాలలే అవుతవి కరణత్రయంతో చేసిన ఈ అగ్ని శాంతిభావ నిత్యవర్షిణి భౌతిక ప్రాణిక చైత్త్య పురుషుల ముప్పేటగాగ తొలి నాదం ప్రతిస్వనించిన వర్ణత్రయం మూడు స్తరాలనూ నోర్విచ్చి ఆహరించే తీరు ఈ అగ్ని మూర్తి బ్రహ్మభవం దేవసమర్చితం " మూడు ముళ్లను విప్పి కొనసాగి నచికేతాగ్నిని సాధించి ప్రాణాల ముడియైన రుద్రున్మి పరిమళించే మహొషధిని విశుద్ధ స్థానంలో శక్తితో అనుసంధించి దేహాన్ని దాటి నిచ్చెన మీద నుంచి రాకపోకలు సాగించవచ్చు ఈ దేహి నచికేత ఐహిక జీవనం నిండా స్టర్వైశ్వర్యాలను చేదుకుని హిరణ్మయ దేహం ధరించి స్వర్గాది లోకాల జయించి ఆదిత్య తాదాత్యమంది ఆనంద సమ్మోద శాఖి దారులెల్ల ఇరులులేని రత్న దీప్తి కలితలయ్యేను తుదకు ఇంకొక వరం అడుగి"మన్న మృత్యువును చూచి విశ్వనరుడు దీర్ణ భావ చింతనలో మునిగి “మృత్యువా, ఏది నీ పాదముద్రలు పడనిచోటు ఏది నీపాశం బంధించని చోటు, కల్పాంతాలలోనైనా 103 సాంపరాయం

దేవతలు భావనా ధీనులు నీవు మాత్రం పరిణామౌషధివి సృష్టి చక్రంలోని వారు వారు, నీవు సృష్టిచక్ర నేమివి నిత్యము నాభితో అనుబద్భుడవు, నీకు మాత్రమే సృష్టిమూలం చైతన్య గర్భరహస్యం తెలియక తప్పదు నిజం ఆయుష్యమైనా, అనంతమైన అర్థకామాలైనా

ఎందుకూ, అవి శిశిరంలోని పతత్‌ పర్దాలు

బ్రతుకు వలయంలో పుట్టుకా నాశనమూ

అంతర్భవించే ఉన్నాయి వాటికోసం ఎందుకు సమీహ

ఏ దేవతలైనా ఈ వరాలను ప్రసాదించగలరు

మృత్యుదేవా, నీ వెందుకు ఈ అల్ప ప్రసాదివయ్యేవు

శరీరం ఎలాగూ పోతుంది ప్రవాతకదళియై _

పరమ గురువవు నీకే సాధ్యం రహస్యం వివరించటానికి

విశ్వపరిణాహంలో ఎన్నైనా దారులు ఉండనీ

అటూ ఇటూ ఎన్ని అంతస్తులైనా కట్టని

నాకు కావలసింది అనంతమైన అనందశాల

భూమిపైననే, శరీరంలోనే చృుత్యురాహిత్యం

దోసకాయ తొడిమను వీడినట్టు నన్ను వీడనీ ఈ తనువును

నన్ను చూడనీ ఈ వ్యక్తాన్ని అవ్యక్త సమపష్టిని నేనై

ఈ జగత్‌ సుషుమ్నను నేను, మోగిన అనాహతాన్ని

ఐహికం సమృద్ధమైంది నీ దర్శనాన నాలోని ద్వారం విప్పాలి.

నవాంపరాయం 104

నాతండ్రి చూపించిన దేశికుడవ్సు మృత్యుంజయ విద్య న్‌వు నాకిచ్చిన వరం- నాతపో భూమి అవశిష్టమైంది తెలిపే నీవు ఒక ఆశ్చర్యం (గ్రహించే నేను ఈ సృష్టిలో మరొక ఆశ్చర్యం” నచికేతుని ప్రశ్న అనిదంపూర్వమైంది మృత్యువు తాను మేల్కొన్నసర్వ జీవాత్మ సాగరమైన మహానది అసత్తు గర్భంలోంచి వచ్చినా - అందుకొన్న దైవమస్తకం విరోధి ధ్రువాలు కలసిపోయిన నిర్విషణ్ణ బిందువు జ్వాలా శిఖరాలు నిశ్శబ్ద కాసారాలు ఇదంతా కాలం శ్రమించి చేరిన అనంత దేహళీ సన్నిధి అమేయమైన రత్న గృహం మీద ఎగిరే శక్తి పతాక అంతర్చోధన సీమా రహిత గవాక్షాలు సృష్టి రూపకానికి ఆహార్యశాలయై తాను ఎడతెగని అంకాలతో సాగిపోతున్న ప్రదర్శనం మానవుడు సగం పశువు సగం దైవం నచికేతుడు పశుతాహంత, దైవశిఖరయంత ఈ జగత్తుకు దేవతలు అరుదుగా యిచ్చిన బహూకృతి చృుర్య్యలోకపు అశ్శగర్తాలను చీల్చుకుని వచ్చిన దివ్యమణి ఇంతటి చిరుప్రాయంలోనే తపస్సు పరిపూర్ణమైన చేతస్సు అఆనంతాన్ని నిద్రలేపే మధుర మధుర ప్రీతి మంత్రం

105 నాంపరాయం

ఇహలోకానికి అనంత స్వర్గానికీ అంతరగ్నికీ

అను సంధానం చేసిన త్రిభుజ స్వరూపమై

మృత్యువును దర్శించి గురువుగా ఎన్నుకొని

సృష్టి శిశిరాన్నివసంతర్హువుగా మార్చబూనినవాడు

అజీర్యములు అమృతముఖైన విద్యలను

మనో లోకంలోన విద్యమానంగా ప్రకటించి

దేవతల చిరకాల సందేహాలను తీర్చి

మృర్శ్యతను అమర పధంలోకి మరలించిన నచికేతుడు

అగ్ని ప్రవేశం చేసి ఆధారమూ అధిష్టానమూ

తానై హృదయ దేశంలో అస్మితను జాగ్రత్తపరచి

ఇక్కడే సమత్యం పొందిన మనస్సు తనుతాన తొలగిపోయి

(బ్రహ్మ భావంతో ఉండే స్థితి కలిగినవాడు అతనికి ఎందుకు ముక్తి $ ప్రేయశ్షేయస్సులలో - అవిద్యా విద్యలలో

ఎదురెదురయినవి గుర్తించి - వాటి నడిమి దూరాన్ని లెక్కించి దుఃఖములకు దూరమైన మరో జీవనం ఉన్నదని

ఎరిగితే చాలు యముని దగ్గరకు పోనే పోరు ఎవ్వరూ

తర్కంతో పనిలేదు, నాల్గు కొలతలకూ అతీతమైన బాట

అక్కడ మరెక్కడికీ పోవటంలేదు, ఊర్చాధోగతులు లేవు

ధ్యాన లీనతలోనే ఆ అనుభవం, వినగలిగితే చాలు తొలగిపోతాయి శోకమోదాలు -_ నిర్మోహ వలిత చేతస్సు పాలిచి

నాంపరాయం 106

ధర్మా ధర్మాలు రెండూ అక్కడ నియమించవు బ్రతుకును సమస్త కర్మ వృక్షం కలిగీ తొలగే అవిదిత క్షేత్రం భూత భవిష్యత్తులను దాటిన నిత్య వర్తమాన బిందువు అది చిత్తంలో నిలుపుకున్న నీవు తే జోభండారానివి అన్నివేదాలూ కలలుగనే అనంత నీలాకాశం అన్ని తపస్సులూ కరగిపోయి ఆకృతి గొన్న “స్వ” భావ చక్రం దానికోసమే ధ్యాన యోగ తపస్సంచయ నదీ ప్రవాహాలు అదే బ్రహ్మచర్యం - సర్వ వ్యక్త బీజం ప్రణవం” మృత్యువు విశదం చేసిన కాలరహిత దీప్త వేళలు నిరంతర వర్తమానాలు, అనంత ద్వార కవాటాలు అక్కడ స్వరలయలు అపమార్గం పట్టవు చీకట్ల గుంపులు ఆ సూర్యుని రాకతో వెలుగులే అవుతాయి రమణ మహర్షి నచికేతుని వయస్సులోనే ఉన్నప్పుడు పరిమిత దేహంలోనికి అపరిమిత మృత్యువు దూకింది శరీరం బయటకు వచ్చి మళ్ళీ దానిలోకి ప్రవేశించి తామెవరో అనుభవించిన వారు నిరత బ్రహ్మాను భవమూర్తులు ప్రణవ గుహలోనికి చేరితే ఆ దీప్తి జగత్తుకు ఆవరణమై తానె ఆలంబనమై, మార్గమై తుదకు లక్ష్యమౌతుంది అక్షరములోనుంచి సగుణ నిర్గుణాలు సంగమించి పరాపరాలు ముడివేసుకుని అమృతత్వం ఆవహిస్తుంది మృత్యుజయం నే 107 నాంపరాయం

వన్నెండన నర అప్పుడే విచ్చుకుంటున్న ప్రాణపుష్పం వంటి చేతస్సు అప్పుడే ఉదయించే సవితృదేవుని వంటి వర్చస్సు సరస్సులో ఉంటూనే దేన్నీ అంటుకోని సుకుమూర శతపత్రం వంటి తపస్సు - బుద్ధ దేవునికి నమస్సు కారుణ్య వర్ణం కురుస్తున్నది నిరంతరంగా భూమండలం మరుభూమి కాదు, హరిత సముద్రం ఓ పుష్పమా నిన్ను త్రైంపనా - నీవు నాకు అకాశం యిచ్చిన బహుమతివి, అతిలోక యాత్రకు తోడువు వినబడటం లేదా మీకు అంతరిక్షం చేసే శంఖధ్వానం ఆశాపాశాలను విడిపించుకోండి, త్రైెంచుకోండి ఆశవెంట దుఃఖం, దుఃఖం వెంట జన్మ జన్మ జన్మల పరంపర దుఃఖ నౌకాయాత్ర “) ఈ ఉనికి ఐదు కొమ్మల వృక్షం, ఐదు రేకులు పూవు రూపం గుర్తు, వేదన స్పందం, సంజ్ఞ వ్యక్తిత్వం, సంస్కారాలు విజ్ఞానము ఈ వ్యక్తతకు భావబంధాలు మూలంలోకి ప్రవేశించు ద్వారాలుతెరిచే ఉన్నాయి ఎ పంచదార స్థములో ఉనికికి కారణములైన ఐదు స్కంధాలు - రూపము, వేదన. సంజ్ఞ, సంస్కారము, విజ్ఞానమ్సు, నే నవాంపరాయం 108

భౌతిక బంధాలు, మనో బంధాలు నిర్మించిన కర్మచక్రంలో ఉనికి ప్రపంచం అంతా నిరంతర పరివర్తనం ఊర్థ్యముభఖీనములైన ఈ బంధాలే ఉపకరణాలౌతవి అంతరగ్నిని (ప్రేరేపించేందుకు బోధిచిత్తంలో నిలిచేందుకు చూవాంగ్‌ జూ.కి కల వచ్చింది తాను కలలో సీతాకోకచిలుకనని సమస్య వచ్చిపడింది - ఎటూ తేల్చుకోలేకుండా- చువాంగ్‌ జూ సీతాకోక చిలుకగా కలగన్నాడా? సీతాకోక చిలుక చువాంగ్‌ జూగా కలగంటున్నదా అని ఏది స్వప్నం, ఏది మెలకువ, ఏది నిజం, ఏది భాంతి మన జీవితం అద్దాలమేడలో బ్రతుకు అన్నింటా ప్రతిబింబాలే ఎప్పటి కప్పటిదే నిజం, వర్తమానం అద్భుత జీవద్‌ లిప్త ఈ “నేనును బద్దలుకొట్టు వెలుగు గడప కానవస్తుంది 11 అకడ ఆమ్రవనం పర్హశాల ద్వారాలను వంగి పల్కరిస్తుంది వసంతంలో చిరు పిందెలు నేల జీవశక్తిని ప్రకటిస్తవి కొన్ని చెట్టు నేల దాకా ప్రాకి మనకు దారులు చూపిస్తాయి కోకిలలు సమ్యక్సంబుద్ధిని వ్యక్తావ్యక్తంగా పాడుతున్నాయి. అరుణ ఫలాంచల హస్తాలు చాచి ప్రతి చెట్టూ ఆహ్వానిస్తున్నది ఉదయకాంతిలో ఆ వనం కావి రంగు ఉడుపులు ధరించింది మౌనంగా ధ్యానంలో తమ్ము కరిగించుకుంటూ వున్న భిక్షు సమూహంలా ఉన్నది ఆ వనం - ఆత్మమగ్నదచైతన్య నగరి 12. బొద్ధగాథ

109 సాంపరాయంది

రాజగృహానికి చేరువలో ఆ విహారంలో సిద్ధార్థుడు వ్యధలను కరిగించి సుధలను కురిపించే దారిలో ఉన్నాడు నడుస్తూ వున్నమరొకసూర్యునిలా ఉన్న ఆయన్ను ఒక బాలకుడు చేరువ యై త్రిశరణముల నిమ్మన్నాడు ఎన్ని జన్మల పరంపరల కాంక్షా బంధాల బరువులు ఎన్నికర్మవాసనలు, ఎన్ని వేదనల సంపుటాలు మోసుకుని నెమ్మదిగా వస్తున్న బాలకుడు నిదానంగా పలికాడు ఆశ్రయం కోసం నిలబడ్డ భిక్తుకుడు, అర్హుడు నిత్యవిపన్నుడు అలసత్వం, సుఖలాలసత, స్వచింతల ఇరుకుదారుల్లోంచి తరలి వచ్చిన ఆ బాలుడు పేరైతే క్షుద్ర పంధకుడు గుండె గూళ్ళను తొలిచే శాక్యమౌని చూపుల దాడికి అతని పురాస్పృతుల జన్మల చీకటి ముద్ద కదలింది అదరిపడింది లోపలి తాక్రిడిక్ర తట్టుకోలేక సోమరితనాన్ని కప్పుకొని విసృతిలోకి జారిపడి విహారంలో కదలని మొద్దు ఒంటరిగా ఏడ్చేవాడు- విపస్సనలో మునుగ లేడు ఒజ్జల్బకెతే మూఢ శిష్యుడు, అకృత విద్యుడు, వ్యర్థుడు తర్మమ్సూ ప్రత్యక్షానుమానాలూ ప్రమాణమైన శాస్త్రం లోపలికి దారి చూపదు - చుట్టూ కలియబెడుతుంది బుద్ధిలోకి చొరబడే శాస్త్రం హేతువాదం సాలెగూడు అయితే ఏం" అన్న ప్రశ్నకు ఎక్కడా ఉత్తరం లేదు శాంపరాయం 110

విద్య కూడా అహంత కట్టుకునే కోటగోడ దానిలో ఇరుక్కున్న ఒజ్జలు తాత్పర్యం వంట బట్టించుతోరు అక్కడి దేశికుడు ఐదు వందల మంది శిష్యులతో బిక్షకు బయళ్టేరుతూ చెల్లని నాణెమని క్షుద్ర పంధకుని విడిచి అతిధి గృహం చేరాడు అక్కడ బుద్ధదేవుడు ఏడీ క్షుద్ర పంథకుడని అడిగి కొని తెమ్మని పండితుని వెనక్కి పంపించాడు. సమ బుద్ధి ఉదయించని విపశ్చిత్తు అయోమయంలో పడి అడుగులో అడుగు వేస్తూ వెనక్కు తిరిగి వచ్చాడు. క్షుద్ర పంథకుడు మిగిలిపోయి, జీవితం అనర్థకమైందని ఎంచి గుండె గాయమై ఒక్కడై నదిలో దూకబోయి త్రిశరణాలు గట్టిగా పలుకుతూ, కళ్లనిండా అశ్రుగంగ హృదయం నిండా నింపుకొన్న బుద్ధదేవుని పాదయుగం తన వేదనలోంచి నది ప్రకటించుకొన్నదో ఏమొ తన శరణు భావం నించి ఆకాశం వ్యక్తమైందో ఏమొ నదిలోనూ నభస్సులోనూ వెలుగొందిన సిద్ద్ధార్థని దరస్మితం కోటి జన్మల గూఢ తమస్సులను హరింప “పుట్టువుల వెనుక ఎప్పుడో బహుశాస్త్ర వేదివి తర్కం కొమ్మ ఎక్కి కూర్చున్న ప్రతివాది భయంకరుడివి ఎందరో విజ్ఞులు నీ ధాటికి తట్టుకోలేకపోయిన తిరస్కృతులు వారి దుఃఖం, హేతువు ఈ బుద్ధి హీనతకు 11 సాంపరాయం

రజో దిగ్ధమైన దర్పణం మీద పేరుకున్న మాలిన్యం చూపును మందగిస్తుంది మాయగా ఆవరిస్తుంది అహంత ఇంకా గడ్డకట్టిన మంచు, మూర్ధత దాని మీది అంచు పొంగిన దుఃఖపు ఊట, శుచీకరించు నీ చేతనను ధర్మశాస్త పలికి రజోహరణ మార్గం చూపగా తనలో నుంచి అవిద్య కరిగి కాలువలై పారింది భావ సమాధిలో నిలచిన ప్రశాంత లిప్తలో తనను ఆవరించింది బుద్ధ కిరణ పరీవాహ సారణి, తనలోని రాగమే రజస్సు క్రోధ విభాంతి జనకంగా తనలోని క్రోధమ్సే రజస్సు మోహ విశ్రాంతి రూపకంగా తనలోని మోహమే పాచిపట్టిన బండ క్రిందకు జార్చగా స్ఫురించిన ధర్మ తేజస్సు సర్వ సత్త్య సంభూతికాగా తన అధ్యాపకుడు తిరిగి వచ్చినప్పుడు విహారంలో నిండుకొన్న భిక్షుకులు, స్వస్వకార్య నిమగ్నులు అందరూ పూర్తిగా క్షుద్ర పంధకుని రూపమే అను భావమే అర్థమే కాలేదు బుద్ధికి ఇది ఎలా జరిగిందని అ ఒజ్జకు ఎవరిని పిలిచేది ఎక్కడ క్షుద్ర పంధకుడు బెద్ధ దేన్ఫని ఆదేశం ఎలా అమలుపరచేది అతి గొంతులోంచి వినబడుతున్నది ఒకే స్వరం క్షుద్ర పంధకుణ్ణి నేనేనని, క్షుద్ర పంధకుణ్ణి నేనేనని నాంపరాయం. 112

అందరిలోనూ తన్ను చూడగలిగిన ఆ వేళ ధర్మం అతనిలోంచి మధుర రసాల ఫలమయింది తధాగతుడు అతనిలో తన ప్రతిబింబం చూచుకున్నాడు బుద్ధమణికి వెల్లివిరిసిన జ్యోతిఃపద్మం అతడు. జ

సత్యం.సార్వజనీనం, సత్యం అత్యంత ఆత్మీయం తనను మొత్తంగా లోనికి మలచుకొన్నపుడు అది ఆత్మీయం తనను మొత్తం జగత్తు మీద పరచుకొన్నప్పుడు విశ్వజనీనం అనుభవం అణువుగా తాను, అద్వైతం సర్వమహత్తు వేళ్లతో భూమి చీల్చుకుంటూ నాభి పర్యంతం కొమ్మలలో ఈదుకుంటూపో ఆకాశావధులు దాటుతూ గొడ్డలిని దగ్గరకు రానీకు అడవిలా స్వేచ్చగా ఎదిగిపో అంతర్చహిస్సుల నిండా నీవే జీవతత్త్య ప్రతీకవై తుదకేమి మిగులుతుంది - ఈ రోదసితోడి పరిష్వంగం హృదయం నిండా నిండిన చైతన్య రసాంబుదరేఖ చితి పాదులోంచి పొడుచుకు వచ్చిన జ్వాలోధ్గతి అంతరిక్షం క్రమ్ముకున్న ఆనంద సహస్రపత్రం (వ్రేళ్ళుగా చివుళ్లుగా మట్టినిండా మిన్నునిండా (ప్రాణ ప్రోతస్సులు - భావ స్రవంతికలు, నవ్యవాహినులు స్వేచ్చగా తనువుల శ్రేణులను పరిక్రమిస్తూ అగమ్యూలు గమ్యూలుగ్శా ఆవాహితమైన దివ్యశిఖరి

113 సాంపరాయం

సాగిపోతుంటే కానవచ్చే శిధిల భవనాల్లో శకలితాలు మౌఢ్యబంధాలు, విధి గ్రంధాలు, పాపసంధులు మరచిపోవలసిన పీడకలలు, అదితి దాటివచ్చిన స్మశానాలు మీరందరూ శిల్పుల్హే మీరందరూ ఇటుకలే, అతుకులే మీరందరూ చెమట బిందువులే, మీరందరూ తమరించే చేతులే రండి రండి చరాచర సృష్టిగత ప్రాణి సమూహమ్హా సమాహిత మహాభవన నిర్మాణానికి నూతృక్రెలాస నిర్మితికి. మధుర మీనాక్షి మహా మందిరం నాల్గు శిఖరాలు ఆదిమత్స్యం నుంచి ఈనాటికి చివురించిన ప్రాణ పద్మశిల్పాలు ఆమె నేత్రాంచల సౌభాగ్య లేశం ఈ వ్యక్త ప్రకృతి ఆమె సౌందర్య సరస్సులో కలువలు సర్వ దేవతామూర్తులు అన్ని అభివ్యక్తుల అనుకూల ముఖాలు దేవతలే సర్వదీప్తుల్తూ తేజస్సులూ, ప్రీతివాకలూ దేవతలే (ప్రతికూల ముఖం అపస్వర సంకలనం దైత్యభావం - దేవతలెకడ్త ఇక్కడే, రాక్షసులెక్కడ ఇక్కడే. పుట్టలోనుంచి లేచి బుసలు కొట్టి నిలచిన ఉనికిపాము పడగల మణిదీప్రులు భవ్యజగత్తులకు శ్రోవలు ధ్యానశిఖర బిందువు మీద సంక్రమించిన సర్వచేతన విచ్చుకొన్న ఈ నవ్య ప్రభుత్వ చిహ్నం వెల్లగొడుగు సాంపరాయం కైష4

అర్ధరా త్రి గడిచిపోయింది, సూర్యోదయానికి సమాయత్తమైంది ఉషోదేవి పాదాలను అబిషేకించబోయే గజహస్తాలు ప్రతిక్షణం తన కడుపులో బంగారు ప్రతీకలను సృజిస్తున్నది ప్రతి క్షణం అనంత భండారంలోని తీయనలను తస్కరిస్తున్నది జఉొమ్ముపై అరచేతిచాటు సూరీడు అవతరించిన అభివ్యక్తి శ్రుతుల సహ స్రాక్షుడై, కృతి అనంత పద్మబీజుడై విరిసిన దినాన ఎక్కడ చూచినా, ఎల్లక్షణాలలో వేయి తలంపుల పారావతాలు విస్ఫోటమైన ఆకాశం దివ్య దేశమా దిగిరా, దివ్య కాలమా నిలిచిపో ఆర్హ ప్రపంచం మీదతెరవేయ్‌, మర్త్య ప్రపంచాన్ని మరచిపో ఇప్పుడు ఈ బ్రతుకును సమావేశించింది అమృత బుతువు ఈ జనువుల నిండా ప్రసరించింది భవ్య జీవన సవనం జాబిల్లి లేని వెన్నెల వాక గంగకు ఆమ్రేడితమైన వెలుగు 12 జ్వన్మనీ చరమభాగ లోకేశ్వరి కదలివస్తున్న స్పందనలు మనోలోకాలు ఏవో తుఫానుల్లో చిక్కుకున్నట్టు అధోలోకాలు భూకంపంలో హరాత్తుగా చెదరినట్లు ఇవి కడిమిపూల తావులో, ఆగామివర్షర్తు గుర్తులో నడిమిలోకంలో వైశ్వానరుని యుగయుగాల అభికాంక్షలో కల్పాలను యుగాలను దాటి తరలివచ్చి పరుగులెత్తి సూర్యమండలాలను దాటి పాలపుంతలను చేరుకొని 12 అంతిను లోకాలకు చివరిదైన 'సనూపర్‌ మైండ్‌" (అధి మనస్సు) ను క్రిందకు ఆవరోహింపజేసే తపస్సు సాగించిన శ్రీమాత

కేక నాంపరాయం

3 వ్రర్హమానం ఆత్మబలి చేస్తున్నది తాను లోకమై కాలమై 'ప్రజాపతియై వర్తమానం మే ధ్యాశ్వమౌతున్నది మృత్యువును అతితరించేందుకు ఉషస్సు దాని తల, సూర్యజ్యోతి నేత్రం, వాయువే ప్రాణం జగదహంకార గర్భం వైశ్వానరుడు వివృతమైన దాని ముణం ఈ నాగరికతా, అణ్వాయుధాలు, మౌఢ్య కాననాలు సమిధలు మనోవేదికమీద ప్రజ్యలించే మహాగ్ని వేదిక సిద్ధం దగ్ధమైన అనంత మన్యంతరాల వేదనల చితా భస్మాన్ని మేల్కొన్నమానవుడొక్కడే చాలు భావిదాకా మోసేందుకు దీన్ని కదలుతూ పోతున్నాను జన్మజన్మల గదుల్లోంచి సర్గసోపానాల మీంచి, ఒక్కొక్క వలయం అతిక్రమిస్తూ వెదజల్లుతూ పోతున్నాను అదుఃఖ భావ బీజాలను మూడు స్థితుల్లోనూ జాగరూకుణ్ణ, మూడు అగ్నులైనవాణ్ణి మృదువైన స్నిగ్ధమైన తేజోమయమైన ప్రశాంతి అంతస్సులో త్రవ్వుకు పోయినప్పుడు తళుకుమన్న ప్రమాస్ఫురణ, మనతోపాటు ఉంటూ కదులుతూ పలుకుతూనే నిత్య తాదాత్మ్యం, నిత్యనూత్నత్త శిథిలిత జడత్క ప్రాణ రేఖాలతాంతం ఆర్త నిశాంత గర్భంలోంచి దూకి వచ్చిన అనంత ప్రభాతాలు దివ్య దీపికా పరంపరకు అదేశమైన దివ్యసూర్యోదయాలు భరతవాక్యమే కుదురుకొన్ననాంది, నాంది రూపొందిన భరతవాక్యం మహా సంకల్ప కల్పతరుగళిత ఫలం, రసరమ్య భాగవతం నాననా 13 బృహదారణ్యకోప్రనిషత్తులో తొలి మంత్రం పునారచన సాంపరాయం 116

ఎరుక వెనుకనున్న వెలుగుల సము ద్రాన్ని చూచి వెలుగుల సముద్రంలో కదలే వెన్నెల పడవను చూచి ఎప్పుడో నేను ఆ పడవలో ప్రయాణిస్తున్న సంస్కృతి సంఫుబ్లమైన అరవిందమే పడవ, జగన్మాత కర్ణధారి ఎెన్షెల పడవ శ ఈ సరస్వతి ప్రవవాంపదజోయగా ఎడద (ోవలను, ఈ అనాది జీవనదీ యాత్ర కొనసాగి అంచులు లేని అమృత సముద్రంలో లీనమై, దుఃఖము తొలగి తొలగి మృత్యువు, తొలగి అహంత, తోరణం సృష్టికవుతుంది తరత (గంరాలయ ఖా వ్ల అం క్‌ ష్‌ [46 క మే ఖ్‌ న. పొద వావా డొర00 టా 117 సాంపరాయం

క న న న నన. |

తగ౫042ఈ40 0% 07612 500252002012072

. 47 ౯2/0 68/7౧” .

| వచన కవిత అల్పసంఖ్యాక వస్తువులకే పరిమితమని,

॥|| | అనువైనదనీ చేయబడిన “దూ ప్రచారాన్ని తన కావ్య

రచనలద్వారా బద్దలు కొట్టిన ఇద్దరు ముగ్గురిలో శ్రీ +

సుప్రసన్నులు ఒకరు. చలం సుధనుంచి సుప్రసన్నుల

| శతాంకుర వరకు బక ప్రవాహం ఆధునిక తెలుగు వచన

కావ్య ప్రక్రియలో సాగింది. ఇప్పడీ సాంపరాయం. .

. ఇది కేవలం ఆధ్యాత్మిక కావ్యం కాదు. భౌతిక, మానసిక, "

| ఆధ్యాత్మిక జీవనాలను జీవిస్తూ ఈ త్రిదళాన్ని ఆధ్యాత్మికమన్న

వెకదళ బిళ్వంగా పరిణమింప జేసుకొంటున్న ఉత్తమ

| జీవియొక్క అనుభవ ఉపనిషత్తు ఈ సొంపరాయం,.

ఈ కావ్య నిర్మాత ప్రాచీనాధునిక ఆంధ్రాంర్ల కావ్యవేత్త,

కవితా సిద్దాంతవేత్త, కావ్యనిర్మాణ మార్గదక్షుడు కావటం

| చేత పమాటన్నా అది రసష్టావితం కావలసిందే. ఆ శబ్బమయి

. రస' బిందువు” అవుతూనే 'వస్తుబీజ గర్భం* కూడా -

| అవుతుంది. "

శే (

| ॥

నర్వార్థ సంక్షేమ నమితి సౌజన్యంతో ం.

|

|

|