Telugu repekkadiki velthav - anilvaranasi/indianlanguages GitHub Wiki

రపెక్కడికెళావ్‌...! (ఓ క అతితిలి మరికొన్ని భారతీయ అనువాద కథలు మ న - కతన న (్‌ లు ట్రే న ట్‌ గ అ టే భీ వొ విత్ట్యగ ప్రస్‌ ఖై! ల వ. శ ఇం ట|6(౧[05 టీ (౧. ” క 11 ( శా . సె నవతెలంగొణ పబ్లిషింగ్‌ పస్‌

రేపెక్కడికెళ్తాన్‌...! మరికొన్ని భారతీయ అనువాద కథలు అనువాదం - సంకలనం డా. రూప్‌ కుమార్‌ డబ్జీకార్‌ ళ్ళ “తా (6౮ సాళ్ల ర ఈ |! 4. నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ ఎమ్‌హెచ్‌ భవన్‌, ప్లాట్‌ నెం, 21/1, అజామాబార్‌, ఆర్‌టిసి కళ్యాణమండపం దగ్గర హైదరాబాద్‌ -20, ఫోన్‌ : 040-27673787

వుంలకకతుంలికులకిట..! 2టంంగు! 9220062 సంటాడరేడ కడ4018121 = 7 తం02 తం467 లిడర్‌లిగడ/ వా లల లి , వడా నుప డా చటయ న ం "న్న | న. 192538 మ నా. ప ఇతర డా లో ॥ | = గం సి* న , లం జ్‌ అికంఉ6ం0 సం : 1633 ఖ్‌ థ్‌” రభితాలి. హైద ంంకియడంం : ౦ంయంక9లు 2023 మనో 6ం?జ స్ట... లుయ6ం0 (0, క్వరలణం2రే. ౫౦౪6016 : 6- ౧010 వజా2చలేటంల్రైడం2 400908 ంఉ56 4. 301%, కంటటాం. 21/1, త౭జంం2స026, ంజ [6 1మడ్వుడుం గశజంళంటుు శశ్తారల2016-500 020. ౨౬ : 040-27673787 వ2ా2లేజంల్రిముండ వు సంమంంత్రై చంళ86 వెంజుంంయే68 ; క్రూరలణ0:4 (001026202)11-9490099373); 3280 00810002111 (ాగ౬9490099378); [జ్యింగ61 (0490618739); 2యిజంం042 (0490099197; కయుంులు (0490618749); 1ముయుుంు2ంు (0400099329); 02202046 (8332995395) & 0200000202 0490094439) విరుంా:6ే 16 వజాాలేజంై02 కుంటలం ౨76 1664. గూరేల202041 శం 9ష్ర్రం : 017206208్ర020000900800156 ఇతః : ఇగాాబం2726ట20ల్రజం20001మ.0002 606 :₹ కే50/ లా

కథాక్రమం

భారతీయ సమాజాన్ని ప్రతిబింబించిన కథలు ................0000 ల్‌

సందర్భం ౨.

  1. పాదుకల పూజ (ఒరియా) ఏ (ప్రతిభారాయ్‌ ...............౨౨ కనే
  2. ప్రయాణం (అస్సామీ) ; ఇందిరా గోస్వామి .............. 21
  3. అస్తిత్వాల మూలాలు (ఉర్జూ) ; ఇస్మత్‌ చుగ్తాయి................ తిక 4 రేపెక్కడికెళ్తావ్‌..! (దోగ్రీ) : పద్మా సచ్‌దేవ్‌................... 47
  4. ద్రౌపది (బెంగాలీ) ; మహాశ్వేతాదేవి .................. 56
  5. పేగు తెగిన దుఃఖం (సింధీ) : మోతీలాల్‌ జోత్వాణి ............ 76
  6. గుక్కెడు నీళ్లు... పిడికెడు రక్తం (మరాఠీ): నారాయణ గణేష్‌ గోరె......... 88
  7. జులూస్‌ (కొంది) ; మున్ని (ప్రేమ్‌చంద్‌ .............. 95
  8. ఢిల్లీ సందర్శన (ఉర్జూ) : రషీద్‌ జహాన్‌.................. 108
  9. రక్తం ఓడుతున్న గాయం (తమిళం) : అశోక మిత్రన్‌ ................ 112
  10. శవ యాత్ర (హిందీ) : ఓం ప్రకాష్‌ వాల్ళీకి........... 128 12 చెమట గుర్తులు... (మలయాళం) : సారా జోసెఫ్‌ ............* 184
  11. చెదిరిపోయిన పరిమళాలు (పంజాబీ) : అస్టల్‌ అహసాన్‌ రంధావా... 142 14 ఇంటి వైపుకు (గుజరాతి) : ప్రవీజ్‌సింగ్‌ చావడా.......... 149
  12. ఓ నా చిట్టి తండ్రీ (కొంకణి) : మీనా కాకోడ్యర్‌............... 159

కృతజ్ఞతలు

'సవ్భృాదయంతో నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ తరపున పుస్తకాన్ని ప్రచురించే బాధ్యత తీసుకొని ఈ అనువాద కథా సంకలనాన్ని వెలుగులోకి తెచ్చిన సంపాదకులు శ్రీ కటుకోజ్వల ఆనందాచారి గారికి, ఇందులోని కథలను ప్రచురించిన సోపతి, పునాస, సాక్షి పాలపిట్ట, తంగేడు పత్రిక సంపాదకులకు, వెబ్‌/ఆన్‌లైన్‌ పత్రికలు మయూఖ, ఆసియా నెట్‌, సారంగ సంపాదకులకు, నా ఈ సాహితీ ప్రయాణంలో తోడుగా నిలిచి సహకరించిన

సాహితీ మిత్రులందరికీ కృతజ్ఞతలు.

  • దా. రూప్‌ కుమార్‌ దజ్జీకార్‌

భారతీయ సమాజాన్ని ప్రతిబింబించిన కథలు

భారతదేశంలోని సామాజిక వ్యవస్థ, స్వాతంత్ర్యానంతరం అనేక సవాళ్లను, ఆటుపోటులను ఎదుర్కొంటూనే డెబ్బయి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు, ఇంతకు ముందు కంటే విపత్మర పరిస్థితులు ఎదురుపడి సవాలు చేస్తున్నాయి. స్వాతంత్ర్యానికి ముందూ, పోరాట కాలంలోనూ దేశంలోని రచయితలు, సాహితీకారులు, సామాన్య ప్రజలను ఐక్యపరచడం కోసం, సామాజిక రుగ్మతలను పారద్రోలడం కోసం సాహిత్య రంగంలో తమ కర్తవ్యాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించారు. చాలామందికి శ్రేరణగానూ నిలిచారు. ఆనాటి ఉన్నతమైన సమతా ఆశయాలు కలిగిన నాయకులు, ఉద్యమాలూ అందుకు ప్రేరణనిచ్చాయి.

కానీ ఇప్పుడు మనుషుల మధ్య విభజన బీజాలు నాటబడుతున్నాయి. మతతత్వము, కులతత్వమూ విజృంభిస్తున్న కాలంలో మనమున్నాము. దీనితో పాటుగా అసమానతలు, అణచివేతలు, నిర్బంధాలు, వివక్షతలు పెరుగుతున్నాయి. ఈ రెండింటినీ ఎదుర్శొనే స్థయిర్యాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం వున్నది. ఆ రకమైన చైతన్యాన్ని కలిగించి, మనుషులలో దాగివున్న మానవీయతను వెలికి తీసేందుకు నేటి సాహిత్య సృజన జరగాలి. దేశ సామాజిక విషయాల పట్ల అవగాహన, జరుగుతున్న పరిజామాలను అర్థం చేసుకోగలిగిన సాహితీకారుల అవసరం నేడు మరింత వున్నది. అలాంటి అవగాహన కలిగివున్న భారతీయ ప్రసిద్ధ రచయితల, రచయిత్రుల కథలనే గుదిగుచ్చి శే పెక్కడికెళ్తావ్‌ అనే సంపుటిగా మీ ముందుకొస్తున్నది. దేశంలో విభిన్న ప్రాంతాలలోని రచయితలు వేరు వేరు భాషలలో రాసిన కథలను తెలుగులోకి కేవటం నేటి సామాజిక పరిస్థితులకు అవసరంగా భావిస్తాను.

పదిహేను కథలున్న ఈ సంపుటిలో ఎనిమిది మంది ప్రసిద్ధ రచయిత్రులు, ఏడుగురు ప్రముఖ రచయితలున్నారు. ఇందులో ఎనిమిది కథాంశాలు మహిళ ప్రధానంగా రేపెక్కడికెళ్తావ్‌...? ర్‌

కొనసాగినవే కావడం, అవి సమాజమంతటికీ సంబంధించిన సమస్యలుగానే చర్చించబడటం జరిగింది. ఏ ప్రాంత రచయిత అయినా, ఏ భాషా రచన అయినా, కాలం ఏదయినా ఇందులోని కథలన్నీ సమకాలీన సామాజికతకు సంబంధించిన కథలుగా, చైతన్యాన్ని మానవీయతను పెంపొందించేవిగా వుండటం వీటి ప్రత్యేకత. ఉద్యమాల స్ఫూర్తిని, మతతత్వాల వల్ల మనుషులకు కలిగే వానిని, మన సమాజంలోని కుల చట్రంలో మనుషులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో అనే అంశాన్నీ రాజ్యహింస, నిర్భంధాల గురించి, ఉగ్రవాద మూలాలు, ఫలితాల గురించి పురుషాధిక్య సమాజంలో మహిళల ఇక్కట్ల గురించి, మానవ సంబంధాలు, ఎదురవుతున్న సవాళ్ల గురించి, మనుషుల మనస్తత్వాలను గూర్చి ఎంతో ప్రతిభావంతంగా కథలను తీర్చారు. ప్రముఖ ఒరియా రచయిత్రి ప్రతిభారాయ్‌ రాసిన “పాదుకల పూజు కథలో రామాయణం ప్రస్తావనతో ఆరంభమై, భరతుని పాలన - పాదుకలను గుర్తు చేస్తూ, మానవ సంబంధాలను, అనుబంధాలను అద్భుతంగా చిదత్రించారు. ముఖ్యంగా చెప్పులు వేసుకోవాలన్న కోర్కె తీరని బాబాయి జ్ఞావకాలలో.. మనుషుల మధ్య ఉన్న (ప్రేమానురాగాలను, జీవితపు ఖాళీలను హృద్యంగా చూపెడతారు. ఇక శవయాత్ర కథ చదువుతుంటే, కన్నీళ్ళు నిండని కళ్ళుండవు. ముఖ్యంగా భారతీయ సమాజంలో వేళ్లూనుకొనిపోయిన కుల పీడన సమస్య, వివక్షతలు, అగ్రవర్దాలు దళిత వర్గాలపై చేసే దాష్టీకాలుగానే చూస్తాము. కానీ ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో చిక్కుకుపోయిన బ్రాహ్మణీయ భావజాలపు చట్రంలోకి లాగబడిన దళిత వర్షంలోనూ మరింత హీనంగా చూడబడుతున్న 'బల్హారొ కులస్తుల జీవనంలోని ఒక సంఘటనను కథగా మలిచారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓంప్రకాశ్‌ వాళ్ళీకి రాసిన ఈ కథా వస్తువుపై ఇప్పటికీ చర్చించాల్సిన విషయంగా వుంది. రాజ్యం చేసే హింసను ఓ ఆదివాసీ స్త్రీ ఎలా ఎదుర్కొన్నదనే అంశాన్ని కౌరవ వారసులైన కిరాతక సమూహం నేటి ద్రౌపదినీ ఎంత చిత్రహింసకు గురిచేసిందో కళ్లకు కట్టిస్తుంది మహారచయిట్రి మహాశ్వేతాదేవి. ఇక ప్రసిద్ధ రచయిత్రి ఇస్మత్‌ చుగ్దాయి రాసిన 'అస్తిత్స మూలాలు” కథ నేటి మన దేశ పరిస్థితులలో చాలా ప్రాముఖ్యతను పొందే కథ. “ఈ రోజు మళ్ళీ మరో దేశం కోసం బయలుదేరాలా! వేరే దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలా! దేశమంటే కాలి చెప్పులా, నొప్పి కలిగితే తీసిపారెయ్యటం, మళ్ళీ కొత్తవి వేసుకోవటమా ? మనుషులు ఎక్కడ వుంటే అదే వారి దేశం. ఏ నేల మీద పుట్టామో, ఏ మట్టిలో పొర్గాడి పెరిగామో, అదే మన 6 డా. రూప్‌కుమార్‌ డబ్ఫీకార్‌

దేశం. ఇక్కడి మట్టిలో, గాలిలో, ఆవరణంలో జ్ఞాపకాలన్నీ తిరుగాడుతుంటే మరో ప్రదేశం నా దేశం ఎలా అవుతుంది...” అనే వేదనను, దేశ విభజన సందర్భపు ప్రజల గాథలను అక్షరాల్లోకి ఒంపిన గొప్ప కథ. మరో గొప్ప రచయిత మున్నీ ప్రేమ్‌చంద్‌ రాసిన 'జులూస్‌” కథ స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలోనిదయినా, ఈనాటికీ జరుగుతున్న అనేక ప్రజా ఉద్యమాలకు చైతన్యాన్ని అందించే కథ. 'జులూస్‌ అంటే ఉద్యమకారులు చేసే ఊరేగింపు. 'జులూస్‌లో ఏ ఒక్క పెద్దమనిషీ లేడు. అసలు ఊరేగింపులు తీస్తే స్వాతంత్ర్యం వస్తుందా? అందులో వున్నదంతా చిల్లరగా తిరిగేవాళ్ళే. పనీపాట లేని మేళమే” అని వ్యాఖ్యానిస్తున్న వారికి సమాధానంగా "పెద్దమనుషులు ఊరేగింపులోకి ఎందుకొస్తారు. వాళ్ళకు ఈ సర్మారులో ఏం లోటుందని, బంగళాలు, దేవిడీల్లో వుంటున్నారు. మోటారు కార్లలో తిరుగుతున్నారు. వాళ్లకేమి కష్టమొచ్చిందని, ఏదైనా కష్టముందంటే మనకే కదా!” అని జులూస్‌ గురించిన అభిప్రాయాలను మనం ఈనాటికీ అన్వయించుకోవచ్చు. అలాంటి ఉద్యమ కథ జులూస్‌. కేరళకు చెందిన ఫెమినిస్టు రచయిత్రి రాసిన 'చెమట చుక్కలు కథలో, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఆచరణలో ఎదురవుతున్న సవాళ్లు, సామాజిక పరిస్థితుల్లో మనుషుల్లోని మానసిక స్థితినీ, ప్రవర్తనలనూ, అవినీతిని చిత్రించిన కథ. 'ప్రయాణం' అనే కథను ప్రసిద్ధ అస్సామీ రచయిత్రి ఇందిరా గోస్వామి రాసారు. ఈశాన్య భారతంలోని అలజడి, ఆందోళనను, జీవన దృశ్యాలను ఎంతో అద్భుతంగా చిత్రాన్ని చూస్తున్న అనుభూతిని కలిగిస్తారు. జమ్మూ ప్రాంతంలోని డోగ్రీ భాషలో ప్రధమంగా సాహిత్య సృజన చేసిన రచయిత్రి పద్మా సచ్‌దేవ్‌ ేపెక్కడికెళ్తావ్‌...!' అనే కథలో ఒక పేద యువతి జీవితం నేటి పురుషాధిక్య సమాజంలో ఎన్ని బాధలకు గురవుతుందో చెబుతూనే, చేరదీసేందుకు సంకోచించే స్త్రీల ఆలోచనలు ఎలా వుంటాయో వాస్తవ పరిస్థితులను చిత్రించారు. ఒక మహిళ రేపు ఎలా, ఎక్కడ ఉండబోతోందో తెలియని స్థితిని చర్చించిన కథ. ప్రముఖ మరాఠీ రచయిత నారాయణ గణేశ్‌ గోరె రాసిన 'గుక్కెడు నీళ్లు - పిడికెడు రక్తం) కథలో స్వాతంత్రానంతరం చెలరేగిన మత వైషమ్యాల వలన ఎంత భయానక సంఘటనలు జరిగాయో, మనుషుల మధ్య అంతకు ముందున్న ప్రేమ, స్నేహాలు మతాల వల్ల మటుమాయం కావటాన్ని చాలా సున్నితంగా స్పృశిస్తుందీ కథ. సింధీ రచయిత మోతీలాల్‌ జోత్వాని 'పేగుతెగిన దుఃఖం) కవితాత్మక శైలిలో జన్మభామిపైనున్న మమకారాన్ని చిత్రించారు. ఇక సికింద్రాబాద్‌లో జన్మించిన తమిళ రచయిత అశోక మిత్రన్‌ రాసిన “రక్తం ఓడుతున్న గాయరిలో ఇద్దరు మనుషుల్లో కొనసాగే ఆలోచనలు, ఘర్షణలు, మానసిక స్థితులను సంఘటనాత్మకంగా వివరిస్తారు.

గేపెక్కడికెళ్తావ్‌...? 7

ఇక ప్రముఖ కొంకణీ కథా రచయిత్రి మీనా కాకొద్మర్‌ రాసిన ఓ నా చిట్టి తండ్రీ! పసి హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. కుటుంబాలలో జరిగే మార్పులు పిల్లలపై ఎలా ప్రభావం కలిగిస్తాయో చిత్రస్తుంది. పంజాబీ, ఉర్జూ రచయిత అస్టల్‌ అహసాన్‌ రంథావా రాసిన “చెదిరిపోయిన పరిమళాలు అనే కథలో మానవీయ సంబంధాలలో ఎంత తీయనైన (పేమ నిండి వుంటుందో తెలియజేసే కథ. అలాగే గుజరాతీ రచయిత ్రవీజ్‌ సింగ్‌ రాసిన 'ఇంటివైపుకు' స్నేహితుల సంబంధాన్ని వర్ణించిన కథ. తొలి తరం ప్రీవాద ఉర్జూ రచయిత్రి రషీద్‌ జవాన్‌ రాసిన 'ఢిల్లీ సందర్భన' అనే కథ భార్యల పట్ల భర్తల ప్రవర్తనను, ఒంటరి స్త్రీల పట్ల పురుషులు ప్రవర్తించే తీరును గురించి చిత్రిస్తుంది.

మొత్తంగా అన్ని కథలలోనూ మానవీయతకు ధ్వంసమొనరుస్తున్న అంశాల చిత్రణలే వున్నాయి. సమాజంలోని అనేక రుగ్మతలను ప్రతిబింబిస్తాయి. సమతాభావాన్ని, సహనాన్ని కోరుకుంటాయి. ప్రసిద్ధులైన మన దేశీయ రచయితల కథలన్నింటినీ హిందీ, ఇంగ్రీషుల్లోంచి తెలుగులోకి అనువదించి తెలుగు నుడికారపు సొబగులతో తీర్చిదిద్దిన రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌ నిజంగా అభినందనీయులు.

= కె, ఆనందాచారి

8 దా. రూప్‌ కుమార్‌ డట్బీకార్‌

సందర్లం ఇ

సమకాలీన సాహిత్య ప్రక్రియల్లో కథా సాహిత్యానిది ప్రముఖ స్థానం. కథ ఒక కాలంలో, ఒక సందర్భంలో, ఒక ప్రాంతంలో చైతన్యమై వున్న రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిజామాలను, మానవీయ సంబంధాలను చిత్రీకరిస్తుంది. చారిత్రాత్మక సంఘటనలను దర్శింపజేస్తుంది. 2107 1 0/61” అన్నది భారతీయ ప్రధాన సంస్కృతిలో ఇమిడి వున్న ఆత్మ. దేశం మొత్తంలో అనేక భాషలు, భిన్న సంస్కృతులు, జీవన శైలి, విభిన్న ఆలోచనలు, మనస్తత్వాలు, రాజకీయ, ఆర్థిక సమీకరణాలు. ఏకమొత్తంగా చూస్తే ఒక సంకీర్ణత, సంక్లిషలతో అల్లుకున్న విషయం మనకు తెలిసిందే. (బ్రిటిష్‌ ఇండియాలో విదేశీయుల ఆధిపత్యం కారణాన వారి పాశ్చాత్య సంస్కృతి, విద్యా విధానం, జీవన శైలి మన వారి మీద తీవ్ర ప్రభావం చూపించింది. 1947 ఆగస్ట్‌ 15న స్వాతంత్ర్యం పొందిన తరువాత దేశ విభజన జరగడం దాని ప్రభావం ఇరుదేశాల ప్రజల మీద పడటం జరిగింది. రాజకీయ దృశ్యం మారింది. మానవ సంబంధాలను గాయపరచడానికి మతం అనే ఒక అంశం తెర పైకి వచ్చి రాజకీయ అవసరాలకు ప్రధాన పాత్ర వహించసాగింది.

తెలుగు సాహిత్య రంగానికి కవిగా పరిచయమయ్యాను. కవుల కవిత్వ ఆలోచనా పరిధిని, భిన్న పార్భ్వాలను అర్ధం చేసుకోవాలనే కోరిక, తద్వారా నాలోని కవిని మెరుగు పరుచుకోవాలనే ఆకాంక్ష ఇతర కవుల కవిత్వాన్ని విస్సతంగా చదివించింది. ఆ కవిత్వం మీద నాలో కలిగిన స్పందనలను వ్యక్తీకరించుకునే దిశగా సాగి సమీక్ష విమర్శను స్పర్శించడం జరిగింది. కవిత్వంలో ఇమద్బలేని భావోద్వేగాలను కథారూపంలో చెప్పడానికి అప్పుడప్పుడు కథలను ఆశ్రయించాను. కథా రచన చేస్తున్నప్పుడు ఇతర కథకుల కథా వస్తువు ఎన్నిక, వాటి అల్లిక, కథనం ఎలా వుంటున్నది అని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలగడం సహజమే. అయితే తెలుగు సాహిత్యంలో వచ్చే అనేక కథకుల రచనలు చదవడం ద్వారా కథలు చాలావరకు ఒకే మూసలో సాగుతున్నట్లనిపించింది. ఫలితంగా భారతీయ కథా సాహిత్యంలో ప్రసిద్ధుల కథలను చదవడం తిరిగి వాటిలో కొన్నింటిని తెలుగులో అనువదించి తెలుగు పాఠకులకు అందించాలనే ఉద్దేశంతో అనువాద ప్రక్రియను ఆకళింపు రేపెక్కడికెళ్తావ్‌...? రి

చేసుకున్నాను. చాలావరకు భారతీయ భాషల నుండి జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీతల కథలు, ఇతర సుప్రసిద్ధ కథకుల కథలను ఎన్నుకొని అనువదించడం జరిగింది. ఈ అనువాద కథలను చదివితే దేశంలో 054 00100121 9ఆ1౦4 లో భారతీయ కథా సాహిత్యంలో వస్తువు మీద ఎలాంటి ప్రభావం చూపింది, మతం నేపథ్యంలో మానవ సంబంధాల మీద సమాజంలో ఎలాంటి ఆలోచన పుట్టుకొచ్చింది, ఎలాంటి మార్పులను చూడటం జరిగింది అన్న విషయాలపై ఒక అవగాహన కలుగుతుంది. హిందీ, ఉర్జూతో పాటు బెంగాలీ, ఒరియా, అస్సామీ, పంజాబీ, గుజరాతీ, మరాఠి, దోగ్రి, కొంకణి, తమిళం, మలయాళం భాషల్లోని కథలను వాటి కథనం, శైలీ, వస్తువు, శిల్చం ఇత్యాది మౌలికాంశాలను దృష్టిలో పెట్టుకొని, ఉత్తమమైనవి అని భావించిన వాటిని అనువదించి ఈ సంపుటిలో చేర్చడం జరిగింది. అందరూ భారతీయ రచయితలు, రచయిత్రులే. కానీ, పంజాబీ రచయిత అస్టల్‌ అహసాన్‌ రంధావా అమృత్‌సర్‌ దగ్గరలోని ఒక జిల్లాలోని ఒక గ్రామవాసి. బ్రిటిష్‌ ఇండియాలోని ఆ (ప్రాంతం విభజన తర్వాత పాకిస్తాన్‌లోకి వెళ్లిపోవడంతో అతను పాకిస్తాన్‌ నివాసిగా మారాడు. అక్కడ (ప్రముఖ కథా రచయితగా, సాహితీవేత్తగా గుర్తింపు తెచ్చుకోవడమే గాక మంచి రాజకీయ నేతగా కూదా ఎదిగాడు. ఇతని పంజాబీ కథను డా. గురుచరణ్‌సింగ్‌ హిందీలో “భోయీ హుయి ఖుష్ఫూ' శీర్షికతో అనువదించగా, హిందీ నుండి “బెదిరిపోయిన పరిమళాలు అనే శీర్షికతో తెలుగులోకి అనువదించాను. హిందీ, ఉర్దూ కథలు మినహాయించి మిగతా కథలకు ఆంగ్లం, హిందీ అనువాదాల సహకారం తీసుకోవడం జరిగింది. ఇందులోని కథా రచయితల, రచయిత్రుల కథాశిల్పం, శైలి, నిర్మాణం, కథా వస్తువు ఎన్నిక వాటి గమనం ఇంకా ఇతర అనేక అంశాల సమ్మేళనంతో కథలన్నీ అద్భుతమైన నైపుణ్యంతో సాగుతాయి. వారి రచనా శైలిని, కథను నడిపించే మార్మిక విధానాలను అర్ధం చేసుకునే దిశగా, అనువాదంలో కథల అంతఃస్సారం చెడకుందా మూల రచయితల లక్ష్యానికి దూరంగా జరగకుండా వుండే ప్రయత్నం చేసాను. సుప్రసిద్ధ భారతీయ కథా రచయితల కలం నుండి జాలువారిన భారతీయ కథా సాహిత్యాన్ని చదివి అవగాహనలోకి తీసుకునే సందర్భం. ఈ అనువాద కథలు పాఠకులచే చదివింపజేస్తాయని ఆశిస్తూ... తేదీ : 09-09-2023 - దా. రూప్‌ కుమార్‌ దబ్బీకార్‌ హైదరాబాద్‌ 10 దా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

. ఎ. న్‌ 21 జనవరి, 1948న ఒడిశాలోని జగత్‌ ల యా సింగ్‌ పూర్‌ జిల్లా లోని ఒక చిన్న 'అలబొల్‌ |; య. స. గ్రామంలో జన్మించారు. సుప్రసిద్ధ ఒరియా

ప్రతిభా రాయ్‌ ప్రసిద్ధ రచనలు : యాజ్ఞసేని, శిలాపద్మ, అరణ్య , బర్నా బసంత బైశాఖ. నవలలు,

కథలు విరివిగా రాశారు. మూర్తి దేవి

అవార్డ్‌, జ్ఞానపీఠ్‌ పురస్కారాలు అందుకున్నారు. ఒరియా కథను “పాదుకా పూజన్‌ ' పేరుతో రాజేంద్ర ప్రసాద్‌ మిశ్రా హిందీలో అనువదించారు. ఈ కథలో లోకం పోకడ తెలియని తన తండ్రి

స్వంత తమ్ముడు, బాబాయి చూపిన (ప్రేమ, తన చదువుకై అతను

పడిన కష్టం చూసి చలించిపోతాడు ఆ పిల్లవాడు. ఐతికివున్నంత

కాలం కాళ్లకు చెప్పులు లేకుండా వున్న అతన్ని చూసి ఆ పిల్లవాడు పెద్దయ్యాక ఒక జత చెప్పులు కొనిస్తానని మాట ఇచ్చి ఉద్యోగం వచ్చాక కొనిస్తాడు. కానీ, అనారోగ్యం కారణంగా మంచమెక్కిన

అతని బాబాయి చెప్పులు తొడగలేని పరిస్థితిలో వుండి చనిపోతాడు.

అతను పోయాక కొద్ది సమయం తొడిగిన ఆ చెప్పులను ఎంతో

భక్తిగా ఆరాధించటం, బాబాయి పట్ల తన కృతజ్ఞతా భావాన్ని

ప్రకటించడం, (పేమను వ్యక్తం చేయటం ఈ కథలోని ప్రత్యేకత.

గేపెక్కదికెళ్తావ్‌..? 1

పాదుకల పూజ

. రాముడంతటి పితృభక్తి కలిగిన వారు, సోదర భక్తిలో లక్ష్మణుడు, భరతుణ్ణి మించిన వారు ఇంతవరకు పుట్టనే లేదు. పాదుకల పూజా సంస్కృతిని అచరించే వ్యక్తులు భారతదేశంలో మినహా ప్రపంచంలో మరెక్కడా లేరు. విధాన్‌ బాబు ఇంట్లో సాగే ఇలాంటి పాదుకా పూజను చూసేవారు కొందరు నవ్వుకుంటారు. ఇదంతా బయటి ప్రపంచానికి చూపే భేషజం అని భావిస్తారు. పైపైకి చూపే భక్తిగా చూస్తారు. పాదుకల పూజ - అది కూడా తండ్రి పాదుకలు కావు. అలాగని తల్లివి కావు. మరి ఎవరివయ్యా అంటే తండ్రి తమ్ముడు బాబాయివి. తల్లిదండ్రుల పాదుకల మాట వదిలెయ్యండి. కనీసం వారి చిత్రపటాలు కూడా విధాన్‌ బాబు ఇంటి గోడలను అలంకరించలేదు. కానీ బాబు గారి పాదుకల పూజ మాత్రం కొనసాగుతుంది.

ఆ రోజుల్లో ఫోటోలు తీయడం ఉండేది కాదు అంటారా! అలా ఎలా అంటారు? అంత పాత మాట కాదు? విధాన్‌ బాబు చిన్నప్పటి మాటేనేమో! ముప్పయి, ముప్పై ఐదేళ్ల వెనకటి మాటే గదా! అప్పటికే నగరాల్లో ఫోటోలు తీయించి (ఫ్రేమ్‌ కట్టించి వేళ్ళాడదీసే ఫ్యాషన్‌ మొదలైంది. కానీ అచ్చమైన పల్లెలో వుండే వారి ఇండ్లలో గోడలకు బతికి వున్నవారి ఫోటోలు తీసి వేళ్ళాడదీయడం చూడలేదు. దేవుడి పటాలు తప్పించి మనుషుల ఫోటోలు పెట్టి వారిని చూడటం - ఇంత అనర్ధం ఎవరైనా చేస్తారా?! పెద్ద పెద్ద షావుకార్ల ఇండ్లలో, జమిందారీ ఇండ్లలో ఒకటి రెండు ఫోటోలు, దేవుడి పటాలు వేలాడదీయడం జరిగేది. చనిపోయినవారి పటాలైతే పూలమాల వేసి అగరుబత్తీలు వెలిగించేవారు పటాల ముందు. అందువల్ల విధాన్‌ బాబు ఇంట్లో తల్లి, తండ్రి, బాబాయి, పిన్ని అలా ఎవరి ఫోటో కూడా లేదు. అందరి మొహాలు పరలోక ప్రాప్తితో మట్టిలో కలిసిపోయాయి. కేవలం జ్ఞాపకాల్లో ఏం మిగిలిందో అదే వుంది. ఈ మధ్యనే విధాన్‌ బాబు ఇంట్లో ఫోటోలు తీయించే ఫ్యాషన్‌ రోజు రోజుకి పెరగసాగింది. ఎంతలా అంటే క్ష దా. రూప్‌ కుమార్‌ డవ్చీకార్‌

తిన్న తర్వాత ఎంగిలి చేతిని కడుక్కునే దృశ్యాన్ని కూడా తీయసాగారు. తల్లి, తండ్రి, బాబాయి, పిన్ని వీరి ఏ ఫోటో కూడా లేకపోవడం విధాన్‌ బాబుకు ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ, కేవలం బాబాయికి చెందిన రెండు తోలు చెప్పులను మాత్రం పూజాపీఠంపై పెట్టి పూజించడానికి కారణమేమై వుంటుంది? పాదుకల పూజ విషయం విధాన్‌ బాబు బంధుమిత్రుల మధ్య ఒక చర్చా విషయమై పోయింది. బాబాయి అంటే తనకు అమితమైన ప్రేమ, భక్తి అని చూపించే ప్రయత్నం కాదు కదా! కానీ విధాన్‌ బాబు, పడగ్గదిలో ఓ మూల చెక్క పీట వేసి దాని పైన ఎర్రటి మఖ్మల్‌ గుడ్డను పరిచి వాటిపైన రెండు పాత తోలు చెప్పులు పెట్టాడు. వాటిపైన చల్లిన కొన్ని గంధపు చుక్కలు ఎండిపోయి వున్నవి. ప్రతి ఏటా బాబాయి పుణ్యతిథి రోజు చందనం, ధూపంతో పూజింపబడుతున్నాయి.

విధాన్‌ బాబుకు దగ్గరి మిత్రులు, బందువులు విధాన్‌ బాబులోని పితృపక్షంపై వున్న లోతైన భక్తిని పాదుకా పూజలోనే కాదు - అతనిలో విచిత్ర రూపంలోవున్న దయాగుణాన్ని కూడా గమనించారు. ఎవరైనా అతని సహాయం కోరి వస్తే ముందుగా వారి కడుపు కాకుండా కాళ్ళ వైపు చూసేవాడు. ఒక దీర్జశ్వాస తీసుకొని సహాయం చేసినా చేయకపోయినా అడిగేవాడు - “మీకు ఒక జత చెప్పులు కావాలా? నా చెప్పులు తీసుకుంటావా? కావాలంటే రూపాయలిస్తాను, ఒక జత చెప్పులు కొనుక్కొని తొడుక్కో! చూడు నీ కాళ్ళు ఎంతగా అరిగి పోయాయో, ఎండలు మండుతున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా! సిమెంటు రోడ్డు పైన, కాలుతున్న ఇసుక బాటపైన నడుస్తున్నప్పుడు...!”

రోగులకు, బిచ్చగాళ్లకు, పేద విద్యార్థులకు ఇంకా సహాయం అడగడానికి వచ్చిన వయసు పైబడిన పేద బంధువులకు అందరికీ కొత్త చెప్పులు కొనిచ్చేవాడు. అడిగితే చెప్పేవాడు - “అన్నదానం, వస్త్రదానం మాత్రమే పుణ్యకార్యాలు కావు. ఎండాకాలంలో గాని, చలికాలంలో గాని చెప్పులు దానం చెయ్యడం మవిో పుణ్యకార్యం, అలా అని నా చిన్నప్పుడు బాబాయి ఒకసారి చెప్పాడు...”

తన తండ్రిలా లోకం పోకడ తెలియని వ్యక్తి బాబాయి. ఏ పని చేయాలో నిర్ణయించి అందులోకి దిగుతాడా, అక్కడ పూర్తిగా నష్టపోయేవాడు. అలా బాబాయి చేతిలో నాన్నగారి డబ్బులు చాలా మునిగి పోయాయి. అలా క్రమంగా బాబాయి అందరి దృష్టిలో ఒక పనికిమాలిన వ్యక్తిగా మిగిలిపోయాడు. బాబాయికి వ్యవసాయం పని ప్రధానంగా వుండేది. ఉమ్మడి కుటుంబం కావడంతో ఏ ఒక్కడు పనికిమాలిన వాడైనా ఆకలితో వుందకపోయేవాడు. కానీ విధాన్‌ బాబు తన బాబాయిని వ్యర్థజీవిగా చూడలేదు. ఇంట్లో బాబాయి చేసినంత పని మరెవ్వరూ చేయకపోయేవారు. పిన్నికి వంటపని బాధ్యత రేపెక్కడికెళ్తాన్‌...? 18

వుండేది. ఆమె జీవితంలో చాలా సమయం వంటింట్లోనే గడిచిపోయింది. అందరూ తిన్న తర్వాత అంట్లు శుభ్రం చేసి, వంటిల్లు కడిగి అన్నీ సర్దుకునేసరికి అర్ధరాత్రి దాటేది. దాంతో పిన్నికి నడుము నొప్పితో తెల్లారే లేవడానికి కష్టమయ్యేది. బాబాయి, పిన్ని కాళ్ళు వత్తడం, మోకాళ్ళకు మర్దన చేయడం ఎన్నోసార్లు చూసాడు విధాన్‌ బాబు. అవన్నీ పెళ్ళాం చాటు మొగుడు చేసే పనులనీ చెప్పేవారు. కానీ బాబాయి పెళ్ళానికి బానిస కాదన్న సంగతి విధాన్‌ బాబుకు తెలుసు. అదే నిజమైతే ఉమ్మడి కుటుంబం ఏనాడో విచ్చిన్నమయ్యేది. పిన్ని ఆరోగ్యంపై (శ్రద్ధ బాబాయి గాక మరెవ్వరు పెట్టాలి? పిన్ని అన్ని పనులు చూసుకొని అమ్మ కాళ్లు పట్టేది. మరి పిన్స్సి చిన్న కోడలు కదా! పిన్ని ఉదయం పూట త్వరగా నిద్ర లేవలేకపోయేది. అందుకే బాబాయి తెల్లారగానే వంటింట్లోకి వెళ్లి గిన్నెలో టీ నీళ్లు పెట్టేసేవాడు. ఇంట్లో అందరికీ చివరికి నౌకర్లు, పనిమనుషులందరికీ టీ ఇచ్చేవాడు. ఆ తరువాత పిల్లలకు నాస్తాగా రవ్వ ఉప్మా, సాబుదానా ఖీర్‌, ఆడాళ్లకు జావలాంటి వంటకం, ఒక శాకాహారం చేసేవాడు. పిన్ని నడుం నొప్పి కారణంగా ఆలస్యంగా స్నానం చేసేది. శుచి, శుభ్రత లేకుండా వంటింట్లోకి ఎలా వెళ్ళేది? బాబాయి పనికిమాలిన వాడు అనుకున్నా మగాడు కదా! స్నానపానాదులు లేకున్నా వంటింట్లోకి దూరిపోయేవాడు. కూరలు వండవచ్చు. పెళ్లి పేరంటాళ్లలో, పండుగలు పబ్బాలప్పుడు బాబాయి రాత్రి పగలు తేడా లేకుండా కజ్టికాయలు, అరిసెలు, పూర్ణాలు, బూందీ లాంటి పిండి వంటలు చేసేవాడు. ఇలాంటి పనుల్లో ఆరితేరినవాడు. పిన్ని కూడా బాబాయిలా రుచికరమైన పిండివంటలు చేయలేదు. బాబాయి మధ్యాహ్నం అంతా పొలం పనులు చూసుకునేవాడు. వంట పూర్తయ్యే వరకు ఎవరూ కునుకుపొట్లు పడకుండా వుండాలని సాయంకాలాల్లో పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని కథలు చెప్పేవాడు. ఇవన్నీ కాకుండా బంధుమిత్రులను పలకరించడం, ఠాకూర్‌ బాడీ (హవేలీ) పర్యవేక్షించడం కూడా బాబాయి పనే. ఆవులు, సమయానికి నీళ్లు పెట్టడం, కడగటం, పేడ ఎత్తడం అయిందా లేదా చూడటం కూడా బాబాయి పనుల్లో ఒకటి. అందరూ పాలు, పెరుగు, నెయ్యి తిని తాగేవారు. కానీ, పేడ, విసర్జకాలు, చెత్త ఎత్తే పని ఎవరూ పట్టించుకునేవారు కారు. కుడితి గోళం, నీళ్ల గాబు శుభ్రపరచడం, కొబ్బరికాయలు దింపడం, ఇతరులతో లావాదేవీలు జరపడం అన్నీ అనాయాసంగా చేసుకునేవాడు. కానీ ఇవన్నీ మగవాడి పనుల కింద లెక్క గట్టేవి కావు. మగాడు ఏ పనుల వల్ల రెండు రూకలు సంపాదించలేడో, అతను చేసే పనిని శ్రమ కింద లెక్క కట్టదు సమాజం. కేశ డా. రూప్‌కుమార్‌ డల్ఫ్బీకార్‌

బాబాయికి పిల్లలంటే చాలా (ప్రేమ. గుళ్ళు గోపురాల మీద పావురాలు కూర్చున్నట్లు పిల్లలు అతని భుజం మీద, వీపు మీద ఎక్కి కూర్చునేవారు. రెండు భుజాల మీద పిల్లల్ని కూర్చోబెట్టుకొని వీధుల్లో బయట తిప్పడం రోజువారి దృశ్యం. పంచదార బస్తాలా పెద్ద పిల్లాడ్ని వీపు మీద మోసేవాడు. ఆ రోజుల్లో పిల్లలందరిలోకి విధాన్‌... ఈ రోజుకి కూడా విధాన్‌ బాబు అంటే బాబాయి ఎంతో ఇష్టపడేవాడు.

విధాన్‌ చిన్నప్పటి నుంచే శాంత స్వభావంతో, సౌమ్యంగా ఉంటాడు. చదువులో ద్ద పెట్టేవాడు. మాష్టారు బెత్తం అతని మీద పడకపోయేది. ప్రతి తరగతిలో ఫస్ట్‌. అందుకే విధాన్‌ బాబాయి మెళ్ళో హారం అయ్యేవాడు. ప్రతి క్షణం విధాన్‌, విధాన్‌ అంటూ తిరిగేవాడు. ముందు విధాన్‌ ఆ పిదపే విరాజ్‌ ఒకవేళ ముందుగా విరాజ్‌ను పలకరిస్తే, విధాన్‌తో మీ బాబాయి పక్షపాతం చూపుతున్నాడు అనేవారు బంధుమిత్రులు. కానీ విధాన్‌ ముందు విరాజ్‌ తర్వాత కావడంతో అందరూ బాబాయిని ఈ విషయంలో దైవ సమానుడిగా చూస్తున్నారు. తన స్వంత కొడుకును వెనక్కి నెట్టి తన సోదరుడి కొడుకు పైనే (ప్రేమను చూపిస్తున్నాడు. తన అల్లరి చేష్టల కారణంగా విరాజ్‌ పై బాబాయి తరుచుగా విరుచుకుపడేవాడు. విధాన్‌కు ఎప్పుడూ మెప్పుకోలు, శభాష్‌ ఇచ్చేవాడు. బహుశా ఇదే కారణం కావచ్చు విరాజ్‌ మంకుతనానికి. విరాజ్‌ అల్లరి, మంకుతనం రోజు రోజుకి పెరగసాగింది. మిగతా సోదరులందరూ అతన్ని అనుసరించసాగారు. విధాన్‌కు పాఠశాలలో స్మాలర్‌షిప్‌కై పరీక్ష రాయడం కోసం ఐదు మైళ్ళ దూరంలో వున్న హరిపూర్‌ స్కూల్‌కు వెళ్లవలసివుంది. కానీ ఎలా వెళ్ళాలి? ఆ రోజుల్లో ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. బాబాయికి సైకిల్‌ నడపడం రాకపోయేది. నాన్నకు సైకిల్‌ నడపడం వచ్చు. కానీ ఆఫీస్‌ పని వదులుకొని రాలేడు.

బాబాయి చెప్పాడు- “విచారించాల్సిన పని లేదు. విధాన్‌ చాలా బలహీనంగా వున్నాడు. నడవలేడు. నేను అతన్ని భుజాలపై ఎక్కించుకొని తీసుకెళ్తాను. “కేవలం పరీక్ష రోజు మాత్రమే కాదు, ఆ నెల మొత్తం స్కాలర్‌షిప్‌ పరీక్ష కోసం ట్యూషన్‌ ఇచ్చే హరిపూర్‌లోని ఒక టీచర్‌ దగ్గరికి విధాన్‌ను హరిపూర్‌ పాఠశాలకు తీసుకొని పోయాడు. ఎండాకాలం. ఎండలకు వేడెక్కిన ఇసుక - కాళ్ళు కాలిపోతుండేవి. బాబాయికి నిజంగానే కష్టమయ్యేదేమో? ఎందుకంటే ఆయన కాళ్లకు చెప్పులు లేవు. ఆయన చెప్పులు వేసుకునేవాడు కాదు. నాన్న చెప్పులు తొడిగేవాడు. ఎందుకంటే ఆయన ఆఫీసులో పని చేసే ఉద్యోగి. పొలం పనులు చూసుకునే ఓ పల్లెటూరి బైతు ఆ రోజుల్లో చెప్పులు వేసుకునేవాడా!? ఒకవేళ ఎవరైనా వేసుకున్నా అతన్ని ఫ్యాషన్‌ చూపుతున్నాడు అంటూ రేపెక్కడికెళ్తావ్‌..? కర్‌

ఎగతాళి చేసేవారు. అందుకే బాబాయి కాళ్ళు బొబ్బలెక్కినా చెప్పులు మాత్రం తొడిగేవాడు కాదు. అందుకు ఇష్టం కూడా చూపలేదు. బాబాయికి ఒక జత చెప్పులు కూడా కొనలేని

స్థితి కాదు ఆ కుటుంబానిది. కానీ ఈ ఆలోచన ఎవరి తలలోకి రానే లేదు. ఎలా వస్తుంది, బాబాయి ఏమైనా సంపాదించే పని చేస్తున్నాడా? నలుగురిలో కూర్చొని లేచే వ్యక్తి కూడా కాదు. మరి చెప్పులు ఎందుకు తొడగాలి? అన్న భావన వారిలో వుండేదేమో!

విధాన్‌, బాబాయి భుజాలపై కూర్చున్నాడు. తలపైన గొడుగు వుంది. హరిపూర్‌ చేరేసరికి బాబాయి కాళ్లకు పట్టిన దుర్గతి చూడలేము. విధాన్‌ చదువయ్యేంత వరకు బాబాయి అక్కడే అరుగు మీద కూర్చొని సేద తీరేవాడు. విధాన్‌ రాగానే అతన్ని బజార్లో టిఫిన్‌ పెట్టించి తాను చాయ్‌ మాత్రం తాగేవాడు. అప్పుడప్పుడు రెండు వడలు.. అవీ వాడిపోయినవి.

విధాన్‌ను భుజం మీద కూర్చోబెట్టుకొని తిరుగు ప్రయాణంలో అడిగేవాడు, “ఏం పరేషాని లేదు కదా బిడ్డా?”

“నాకేం పరేషానీ, రోజూ కాలుతున్న కంకర బాటలో పది, ఇరవై మైళ్లు నడిచేది నువ్వు నేను హాయిగా భుజం మీద కూర్చున్నాను.”

“కానీ చదివేది నువ్వేకదా. మనసు పెట్టి చదవాలంటే కష్టమైన పని! అన్న కూడా ఆఫీసులో అంతే మనసు పెట్టి పని చెయ్యాలె. నాదేం పనిలే - రావడం, పోవడం, తినడం, తాగడం అంతేకదా. బుర్ర వేడెక్కే పనంటూ ఏమీ లేదు. కష్టమెందుకవుతాది?”

“కానీ బాబయ్‌, నీ కాళ్లకు కష్టమైతది కదా. వేడెక్కిన ఇసుకపై నడక వల్ల చూడు నీ కాళ్ళు బొబ్బలెక్కాయి కూడా”.

నవ్వుతూ అన్నాడు - “ఏం పర్వాలేదు, ఈ కష్టాలు ఎప్పుడూ ఉంటాయా, నీ పరీక్షలు అయిపోవచ్చాయి. స్కాలర్‌షిప్‌ రాగానే వెంటనే నువ్వు హరిపూర్‌ వాస్టల్‌లో చేరి చదువుకుంటావు. పెద్ద ఆఫీసరు అవుతావు భవిష్యత్తులో. మన వంశం పేరు నిలబెదతావు.”

విధాన్‌ అర్థమైన స్వరంతో అన్నాడు- “కానీ బాబాయ్‌ నన్ను భుజాలపై మోస్తూ మోస్తూ నీ రెండు కాళ్ళు బొబ్బలెక్కడం నేను చూడలేకపోతున్నాను”

“బాధ ఎందుకురా పిచ్చోడా! పెద్ద ఉద్యోగం వచ్చాక నాకు ఒక జత చెప్పులు

కొనివ్వలేవా?” బాబాయ్‌ బదులిచ్చాడు.

ఆశ్చర్యపోతూ, ఆనందంతో విధాన్‌ అడిగాడు, “చెప్పులు కొనిస్తే నువ్వు

తొడుగుతావు కదా బాబాయి” “ఎందుకు తొడగన్రా. డబ్బు సంపాదించనంత మాత్రాన 16 డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌

మరెవరైనా చెప్పులు కొనిస్తే ఎవరెందుకు నవ్వుతారు.” ఎంతో ఆత్మవిశ్వాసంతో జవాబిచ్చాడు బాబాయి.

విధాన్‌కు స్కాలర్‌షిప్‌ వచ్చింది. చిన్న పల్లే, అందులో చిన్న వీధిలో అది పెద్ద వార్త అయ్యింది. మహంతి కుటుంబంలోని పిల్లాడికి స్మాలర్‌ షిప్‌ వచ్చిందన్న వార్త. నాన్నగారికి మాలిష్‌ చేస్తూ చేస్తూ నాహూ అడిగాడు - “మాలిక్‌, మీ తమ్ముని కొడుక్కి స్మాలర్‌ షిప్‌ వచ్చిందని విన్నాను. ఏమైనా కానివ్వండి మాలిక్‌, వంశం పేరు నిలబెట్టాడు.”

నాన్నగారు ఒక్కసారిగా నాహూ చెంప చెళ్లుమనిపించారు. కళ్ళెర్ర జెసి “ఏంరా సాలె, ఈ రోజుదాకా తెలియలేదా విధాన్‌ నా కొడుకని, తమ్ముని కొడుకంటావా? పో, వీధిలోకి వెళ్లి అందరితో చెప్పు విధాన్‌ నా కొడుకని, అతనికి స్కాలర్‌ షిప్‌ వచ్చిందని...”

నాన్న బక్షీస్‌గా పది రూపాయలను నాహూ కిచ్చారు. నాహూ పళ్ళికిలిస్తూ అన్నాడు, “చిన్న దొర తన భుజాలపై కూర్చోబెట్టుకొని హరిపూర్‌ తీసుకెళ్లేవారు కదా! అందుకే అలా అనుకున్నాను మాలిక్‌ ...”

“ఐతే ఏమైంది? కొడుక్కి అన్న కొడుక్కి మధ్య తేడా ఏముందని? అన్న కొడుకుని భుజాలపై కూర్చో బెట్టుకొని పొగూడదా? నాకు తీరిక ఎక్కడిది?” అని నాన్నగారు కోపంతో ఊగిపోయారు.

బాబాయి ఈ సంఘటన విని ఒకటే నవ్వుతూ ఇలా చెప్పారు, “విధాన్‌ పుట్టినప్పుడు వదిన ఇక బతకదేమోనని గొడవ చేశారు. అన్న స్వయంగా నా భార్యను పిలిచి చెప్పారు, ఇకనుంచి ఈ పిల్లాడి బాధ్యత నీదే, ముందుగా నీ పిల్లాడు, తరువాతే అందరూ. పసికందు తల్లి బతికి బట్టకట్టే నమ్మకం లేదు. ఈ రోజు విధాన్‌కు స్కాలర్‌షిప్‌ దొరకగానే విధాన్‌ నా కొడుకు అని చెస్తున్నాడు. అదృష్టం బాగుండి వదిన బతికి పోయింది. కానీ అన్నగారిచ్చిన మాట ప్రకారం విధాన్‌ ముందు నాకు చెందినవాడు, తరువాతనే అందరూ.” నాన్నగారు పోయిన చాలా రోజుల తరువాత కూడా బాబాయి, నాహూ చెంప దెబ్బలు జ్ఞప్తికి దెచ్చుకొని ముసిముసిగా నవ్వుకుంటాడు. ఒక దీర శ్వాస తీసుకుంటూ “విధాన్‌ ఎంత కష్టజీవి. మనసు పెట్టి చదివాడు. పెద్ద ఆఫీసరయ్యాడు. వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. అన్నగారికి చూసే అదృష్టం లేకుండా పోయింది” అని వాపోయేవాడు. నిజునికి విధాన్‌ బాబు వయసు పదమూడు లేదా పద్నాలుగేళ్ళ వయస్సు. దాని తరువాత తాను (శ్రద్ధగా, బుద్ధిబలంతో చదువుపై దృష్టి పెట్టి పేరు సంపాదించాడు. ఉన్నతమైన హోదాలో వున్నాడు. మరి బాబాయి ఏమి చేయలేదని చెప్పగలమా? విధాన్‌ బాబుకు స్కాలర్‌షిప్‌ దొరికిన విషయం వాస్తవమే. కానీ అందులోనే వారి జీవితాలు రేపెక్కడికెళ్తావ్‌...? 17

గడిచిపోయాయా? బాబాయి ఊర్లోకెళ్లి బియ్యం, అటుకులు, బెల్లం, కొబ్బరికాయలు, నెయ్యిలాంటి వస్తువులు తీసుకొచ్చేవాడు. విధాన్‌ బాబు మెస్‌ సిద్ధం చేసి వుంచేవాడు. ఉద్యోగం దొరికిన తరువాత కూడా విధాన్‌ బాబు బియ్యం తేవడం ఆపలేదు. విధాన్‌ బాబుకు బాబాయి పైన ఎంతో నమ్మకం, విశ్వాసం. బాబాయికి శ్వాస సంబంధ రోగం వున్నందుకు చ్యవనప్రాశ్‌, విటమిన్‌ మాత్రలతో పాటు మిఠాయి, పంధ్లు ఊరికి పంపేవాడు. బాబాయ్‌ అందులోనే ఆనందించేవాడు. ఆశీర్వాదాలు కుమ్మరించేసే వాడు బాబు మీద. చూస్తూ చూస్తుండగానే విధాన్‌ బాబు ముసలివాడై పోయాడు. బాబాయి పందు ముదుసలి. ఇప్పుడు నగరానికి పోలేని పరిస్థితి. కొడుకు, కోడలు ఎంత (శ్రద్ధ పెట్టి చేయాలో అంత సేవ అందడంలేదు. రోజు రోజు ఎవ్వరడుగుతారు ముసలి వాళ్ళను. విధాన్‌ బాబు కూడా ఉద్యోగరీత్యా పెళ్ళాం బిద్దలతో ఈ రోజు కటక్‌లో ఉంటే మర్నాడు కోరాపుట్‌లో ఉందేవాడు. ముసలాయన, ముసలమ్మను తీసుకొని ఎన్ని వూర్లని తిరుగుతాడు. బాబాయి, పిన్ని కూడా ఊరాదిలి నగరానికి శాశ్వతంగా పోలేరు. వాళ్లకు నగరం నచ్చుతుందా? ఈ రోజుల్లో బాబాయిది నడవలేని పరిస్థితి. పిన్ని అతన్ని చూడసాగింది. ఆస్మా పెరిగిపోయింది. శరీరం బలహీనపడింది. వృద్దాప్యం పైబడింది. పండిపోయిన మామిడి పండులా శరీరం మెత్తబడింది. విధాన్‌ బాబు కూడా బాధ్యతలు వదులుకొని ఊర్లో నెల పదిహేను రోజులు ఉండలేక పోతున్నాడు. మిఠాయిలు తీసుకొని ఊరికొస్తాడు. రెండో రోజే తిరుగు ప్రయాణం కడతాడు. పోయినసారి బాబాయి బాగా లేకుందె. ఇరుగు పొరుగు, బంధువులు, మిత్రులు అతన్ని పరామర్శించడానికి వచ్చేవారు. వస్తూ వస్తూ మంచి తినుబండారాలు వెంట తెచ్చేవారు. దీని అర్ధం ఏమిటంటే పైనుండి ఇక చివరి పిలుపు వచ్చే సమయం ఆసన్నమైందని భావించేవారు. సమాచారం అందగానే విధాన్‌ బాబు కూడా వచ్చేసాడు. కందర్పూర్‌ నుండి ఒక రసగుల్లాల కుండను వెంట తీసుకెళ్లాడు. బాబాయి రసగుల్లాలంటే ఎంతో ఇష్టపడతాడు. కానీ బాబాయి వంతు రసగుల్లాలు విధాన్‌ బాబునే తినాల్సి వచ్చింది. చిత్ర బాబాయి దగ్గర కూర్చొని తినిపించసాగింది. రసగుల్లాను నోట్లోకి తీసుకోవడానికి ముందు బాబాయి అడిగాడు, “విధాన్‌ బాబుకు రనగుల్లా ఇచ్చావు గదా?” విధాన్‌ బాబు ఇంకా పిల్లవాదే అనుకుంటున్నాడు. విధాన్‌ కళ్ళు చెమ్మగిల్లాయి. ఏమైనా కావాలంటే, కోరికలుంటే మనసు విప్పి చెప్పు, విధాన్‌ బాబు వచ్చాడు. పైసలకేం కొదవ లేదు. ఏం కావాలన్నా కటక్‌ నుండి తీసుకొస్తాడు. కార్లో వచ్చాడు, చింతపడవలసిన అవసరం లేదు.” ఇరుగుపొరుగు ముసలాయనకు సలహాలివ్వసాగారు. 18... దా. రూప్‌కుమార్‌ దబ్బీకార్‌

బాబాయి కళ్ళలో దాగిన (ప్రేమ కన్నీటి రూపంలో ఉబికివచ్చింది. వణుకుతున్న స్వరంతో అన్నాడు, “విధాన్‌ బాబు నా అన్న కొడుకు కాదు, నా కొడుకు. అన్నకు కూడా కొడుకే. అతను కొడుకే కాగలడు. మరింకేమి కాదు.”

“సరే, అలాగే కానివ్వు, అతను నీ కొడుకే. అది లోకానికంతా తెలుసు. ఈ వీథి, వాడంతా తెలుసు. అందుకే నాహూ మీ అన్నగారి చేత్తో చెంపదెబ్బ తిన్నాడు. గుర్తులేదా?” పిన్ని చెప్పింది. బాబాయి ముఖం మీద నవ్వు వెల్లివిరిసింది. గతాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు, “అన్న కూడా పిల్లలకు మంచి పాఠం నేర్చించాడు ఆ రోజు..”

“సరే ఇప్పుడు చెప్పు, నీ కోరికేమిటో?” ఎవరో అడిగారు.

“కోరికనా! బెను, చాలాకాలం నుండి ఒక కోరిక వుండె. ఒక జత చెప్పులు తొడగాలని. అన్నలా నేను కాలేను. కానీ ఆయనలా ఒక జత చెప్పులు తొడిగి నడవాలని ఉండేది. విధాన్‌ అన్నాడు, చిన్నప్పటి మాట, బహుశా మర్చిపోయివుంటాడు. లేకపోతే ఒక జత మామూలు చెప్పులు కొనలేడా? ఇప్పుడేం చేయగలను? కాళ్లు వాచి ఇంత లావయ్యాయి, ఇప్పుడు చెప్పుల్లోకి దూరలేవు. వాపు తగ్గవచ్చు, అని డాక్టర్‌ ఐతే అన్నాడు గదా...

బాబాయి మాటలు వినగానే విధాన్‌ బాబు మనసు లోలోపలే విలవిల్లాడింది. నిజమే, బాబాయ్‌ పూర్తి జీవిత కాలంలో ఒక జత చెప్పులు కొనలేకపోయాడు.

విధాన్‌ బాబు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. చెప్పులు కొనడం మర్చిపోయానన్నది విషయం కాదు, నిజానికి ఎలా మర్చిపోగలను? బాబాయి భుజాలెక్కి పరీక్ష రాయడానికి వెళ్లిన విషయం, స్కాలర్‌షిప్‌ రావడానికి ప్రధాన కారకుడైన వ్యక్తిని ఎలా మరిచిపోగలను. కానీ ఎప్పుడూ ఆ దిశగా ఆలోచనే చేయలేదు - ఆయన మనసులో చెప్పులు తొడగాలనే కోరిక వుందన్న విషయం. పిల్లల మనసు పెట్టడానికి అలా అన్నాడేమో అన్న భావనలో వున్నాను.

నిజానికి బాబాయి మనసులో ఈ కోరిక ఉంటే కనీసం విధాన్‌ బాబుకు గాని, చిత్రకు గాని గుర్తు ఎందుకు చేయలేదు? పిన్ని ఐతే అన్ని విషయాలు దాపరికం లేకుండా మాట్లాడుతుంది. ఉన్ని దుప్పటి, మందులు, గొడుగు ఇలా ఏది కావాలన్న గుర్తు చేసేది మరి. విధాన్‌ బాబు స్వంత కొడుకు కాదు, అన్నకొడుకు గదా యని బహుశా సంకోచించి వుంటుంది. కొడుకైతేనే అడిగేవాడా? విధాన్‌ బాబు కూడా ఒకటి రెండుసార్లు చెప్పులు కొనాలని అనుకున్నాడు. మళ్ళీ అనుకున్నాడు బాబాయి చెప్పులు తొడిగి ఇప్పుడెక్కడికి వెళ్తాడు? నిజంగా తొడిగేవాడా? విధాన్‌ బాబు కూడా అందరిలా మనసులో భావించాడా, “బాబాయి లాంటి వ్యర్థజీవికి చెప్పుల అవసరం ఏముంది అని ప్రమాణం చేసి చెప్పులు రేపెక్కడికెళ్తావ్‌...? 19

కొనకపోవడం ద్వారా విధాన్‌ బాబు, బాబాయిని తన తండ్రికన్నా తక్కువ న్థాయిలోకి నెట్టి వేసాడన్నదానికి సాక్ష్యం కాదా..? అదే రోజు బాబాయికి ఒక జత చెప్పులు కూడా కొని తెచ్చాడు. భగవంతుడు దయజూపితే కాళ్ల వాపు తగ్గిపోతుంది. కనీసం ఒక్కసారైనా కాళ్లకు చెప్పులు తొడుగుతాడు కదా!

బాబాయి కాళ్ళ వాపు నిజంగానే తగ్గిపోయింది. వాపు తగ్గిన తన పాదాలను చూసుకొని మురిసి పోసాగాదు. విధాన్‌ బాబు, బాబాయి కాళ్లకు చెప్పులు తొడగడం చూసి మనవలు, మనవరాండ్రు అల్లరి చేస్తూ నవ్వసాగారు. అందులో ఒకరు, “తాత, చేతికర్ర పట్టుకొని ఇప్పుడు ఆఫీసు కచేరీకి వెళ్తారు...” అంటూ సరదాగా నవ్వుకున్నారు.

అదృష్టం బాగుండి బాబాయికి సరిగా వినబడదు. కానీ ఆడాళ్ళు మాత్రం పెదాలు అదిమిపట్టి నెమ్మదిగా నవ్వసాగారు. “ముసలాడికి చచ్చేముందు సోకు ఎక్కువైంది..” అని గుసగుసలు పోయారు ఒకరిద్దరు ఆడాళ్ళు.

విధాన్‌ బాబు స్వయంగా అపరాధ భావనతో వున్నాడు. వాళ్లు ఎందుకు ఇలా పరిహాసొలాడుతున్నారు. తనకు తానుగా అపరాధ భావన నుండి విముక్తి పొందడానికి చెప్పులు కొని తెచ్చాడని, బాబాయికి తొడిగించడానికి కాదు అని ఈ విషయం తనకు మాత్రమే కాదు అక్కడ వున్న వారందరికీ స్పష్టంగా తెలుస్తుంది. వమవసరమొచ్చింది, చావుకు దగ్గరగా వున్న వ్యక్తికి చెప్పులు కొని తేవడం?

బాబాయి ఈ లోకం విడిచి వెళ్లారు. చెప్పుల జత అక్కడే కాళ్ళ దగ్గర పెట్టి వున్నాయి. చనిపోయే కొన్ని క్షణాల ముందు కూడా పలవరించసాగాడు, “అవి అక్కడే ఉండనివ్వండి, నా విధాన్‌ కొనిచ్చాడు. “బహుశా తిరిగి లేచి నడవగలిగితే! ఒకవేళ విధాన్‌ కొన్న చెప్పులు తొడిగి నడవడానికి భగవంతుడు నన్ను బతికిస్తే చనిపోయే ముందు బతకాలనే ఆశతో ఎంతో అలజడికి గురయ్యేవాడు. కానీ బాబాయి తిరిగి రాని లోకాలకు వెళ్లే బండిని ఆపగలిగే శక్తి విధాన్‌ బాబు కొన్న ఆ చెప్పులకు ఎక్కడిది?

ఏ చెప్పులకైతే ఒక్కసారి మాత్రమే బాబాయి పాదాల స్పర్శ అంది చో ఆ చెప్పులను, బాబాయి అంత్యక్రియల తర్వాత విధాన్‌ బాబు తలవంచి నమస్కరించి, భుజాలపై అక్కణ్డుంచి తీసుకొచ్చాడు.

పధ్నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తానని భరతుడితో ప్రమాణం చేసాడు (శీ రామచంద్రుడు. బాబాయి ఇలాంటి ఏ ప్రమాణం చేయలేదు. కానీ విషాదం నిండిన (గ్రీష్మపు మధ్యాన్నం ఎండలకు, నేల మలమల మాడుతున్న సమయంలో బాబాయి అవే చెప్పులు తొడిగి థప్‌-థప్‌ అని శబ్ధం చేస్తూ విధాన్‌ బాబు గుండెలపై నడుస్తూ వుంటాడు!

ళ్ధ

20 డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌

ఇ

న 14 నవంబర్‌, 1942న గౌహతీలో జన్మించారు. 1 ్‌ మ "కల తల్లి: అంబికా దేవి. తండ్రి: ఉమాకాంత్‌ గోస్వామి. లగ భర్త : మాధవన్‌ రైజన్‌ అయ్యంగార్‌. కలం పేరు ఇందిరా గోస్వామి : మమోని రైజమ్‌ గోస్వామి. మమోనిబాయి దేవ్‌గా సాహితీ లోకానికి సుపరిచితురాలు. ప్రఖ్యాత అస్సామీ కవయిత్రి , కథకురాలు, నవలా రచయిత్రి. సాహిత్య అకాడమీ అవార్డు (1983), జ్ఞానపీఠ్‌ పురస్కార (2000) గ్రహీత. అనేక అస్సామీస్‌ రచనలు ఆంగ్లంలో అనువదించ బడ్డాయి. ప్రసిద్ధ రచనలు : గౌటం సెం 62160 [ంళ6డజ 0౯8416 ౩1008 886 8621066 ౪౧4 01006, 06 21 షం 019922022564. 29 నవంబర్‌, 2011లో స్వర్గస్తులైనారు.. 'ది జర్నీ! అనే అస్సామీ కథకు అనువాదం. ఇద్దరు ప్రాఫెసర్లు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి అస్సాంకు సాహిత్య సభల నిమిత్తం ప్రయాణమవుతారు. ప్రయాణంలో వీరు చూసిన దృశ్యాలు, ఎదురైన సంఘటనలు, ఈశాన్య (ప్రాంతాలలోని మిలిటెంట్ల కారణంగా ఉత్పన్నమైన యువత దైన్యస్థితిని గగుర్పాటును కలిగించే విధంగా రచయిత్రి చాలా ఆర్ధంగా చూపుతుంది. కథాకథనం మనసును మెలిపెట్టేస్తుంది. ఈశాన్య

ప్రాంతాలలోని అడవి దృశ్యాలను సజీవంగా చిత్రీకరించారు. ఇందిరా గోస్వామి & ఎం. అసదుద్దీన్‌ ఈ కథను ఆంగ్లానువాదం చేశారు.

ప్రయాణం

డిసెంబర్‌ 2008. మిలిటెంట్లు తిరుగాడే ప్రాంతం. దట్టమైన అడవి. నేను, (పా.మిరాజ్‌కర్‌ ఇద్దరమూ కాజీరంగా నేషనల్‌ పార్క్‌ నందర్శించి తిరుగు 'ప్రయాణమయ్యాము. ఢిల్లీ విశ్వవిద్యాలయం “ఆధునిక భారతీయ భాషలు, సాహిత్య పరిశోధనలు శాఖలో పనిచేస్తూ అస్సాంలోని విద్యార్థులు నిర్వహిస్తున్న సభలకు హాజరు కావడానికి వచ్చాము. చీకటిపడే వేళకు ముందే గువహాటి చేరుకోవాలనే తొందర మాలో వుంది. అడవి జంతువులంటే తనకెంత మాత్రం భయం లేదంటాడు మిరాజ్‌కర్‌. కాని టెర్రరిస్టులంటే చెప్పరాని భయం. తన సన్నిపొతుల్లోని ఒక మిత్రుడు పంజాబ్‌లో తీవ్రవాదుల చేతిలో మరణించాడు.

“ఇంత అందమైన ప్రదేశం కదా, ఇక్కడ మీరు టెర్రరిజంను అదుపులో వుంచగలిగారా?” అని దారెంట అడుగుతూనే వున్నాడు. నిజానికి నాకేం సమాధానం చెప్పాలో తోచలేదు. ఎందుకంటే మా తిరుగు ప్రయాణంలో అనేక చోట్ల చెక్‌పోస్ట్‌లు తగిలి మమ్ముల్ని నిశితంగా పరీక్షించాయి. ముఖాల మీద టార్చి వేసి మరీ చూసారు.

కారులో కూర్చొని, బయటికి చూస్తూ, కాజీరంగా టూరిస్ట్‌ లాడ్జిలో వరండా వెనకాల కూర్చొని వున్నట్లు, బిజులీ వెదురు తోపుల నుండి మ్యుగా సిల్కు వస్త్రాల పెళ పెళ ధ్వనుల పోలినట్లు వీచే గాలుల సవ్వడుల నాస్వాదిస్తున్న అనుభూతిని ఊహించుకుంటూ వున్నాను. చట్యన్‌ వృక్షంపై కూర్చున్న ఓ పెద్ద గుడ్లగూబ, దాని తల, పురిటి శిశువు తలను బోలి పెద్దగా వుండి, చంద్రుడి కాంతి దాని పైన పడి దర్శనమిచ్చిన వింత దృశ్యం ఇంకా కళ్ళకు కట్టినట్లు మదిలో మెదులుతూనే వుంది. మిరాజ్‌కర్‌ టెర్రరిస్టుల గురించి ఆలోచిస్తూ విచారంగా కూర్చున్నాడు. టెర్రరిస్టులు బబ్బర్‌ ఖల్సా, 22 డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

జె.కె.ఎల్‌్‌ఎఫ్‌. వారితో స్నేహ సంబంధాలు ఏర్పరచుకొని అస్సాం అడవుల్లోకి అక్రమంగా ప్రవేశించి స్థానిక తీవ్రవాద సంస్థలను కలుపుకోవడంలో సఫలమయ్యారని ఎవరో చెప్పగా విన్నాడు. జాతీయ రహదారిపై వేగంగా కారు కదిలిపోతుంది. దారికిరువైపులా దూరంగా కొండలు, వరి పొలాలు గాఢమైన వర్ధాలతో, బంగారు ఛాయతో అలరారుతున్నాయి. అవి ఎదిగి నమ్రతతో వంగిపోవడమో, బౌద్ధ సన్యాసుల మఠాలను ఆశ్రయించే జేగురు వర్ణంలోకి మారడమో, ముడుచుకుపోయి చీకటిలోకి ఒదిగిపోవడమో జరుగుతుంది. తుపాకుల శబ్బాలు వినే ఆరాటంలో చెవులను రిక్కపొడుచుకొని అప్పుడప్పుడు ఉలిక్కిపడుతున్నాడు. తిరిగి స్వప్నావస్థ నుండి మేల్మొని విచారంగా కిటికీ గుండా బయటి పొలాలు అడవులు చూస్తున్నాడు. పత్తి, ఖైరా, సీసూ, హోలాంగ్‌, పోమా, బోగీ పోమా, బొకుల్‌ టేకు వృక్షాలతో మమేకమవుతున్నాడు. సాయంకాలపు గాధత, సిల్కు వస్త్రపు ముక్కలుగా టేకు వృక్షాలను కప్పితే. ఆకుల సందుల్లోంచి చుక్కలు చుక్కలుగా రాలి పడిన సూర్యకాంతి, జింక చర్మాన్ని పోలి మం(త్రముగ్గుల్ని చేస్తోంది. డైవర్‌ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, “గత సంవత్సరం ఈ రోడ్డంతా రక్తంతో తడిసిపోయి వుండేది. ఎప్పుడు చూసినా మెషీన్‌ గన్ల మోత, గ్రెనేడ్ల (పేలుళ్ళు, ఇప్పుడింత ప్రశాంతంగా వుంది. తుపాకులు లేవు. తుపాకులు చేతబట్టి ఎవరూ కానరావడం లేదు. రక్తపు మరకల మీద, తుపాకుల మీద గన్‌ పౌడర్‌ వాసన వీటన్నింటి మీద ఇప్పుడు తివాచి పరిచినట్లుంది.” “క్సపాకులు, ఆయుధాలు మనకు కానరావడం లేదేమో!? కాజీరంగ వద్ద ఫారెస్ట్‌ డిపార్టుమెంటు అధికారి మిస్టర్‌ అహ్మద్‌ చెప్పలేదా, వేటగాళ్లు విదేశీ ఆయుధాలు .3085, 600 డబుల్‌ బారెల్స్‌, 470 5 కార్పైన్‌ లు పట్టుకొని తిరుగుతున్నట్లు. మోరి ఢథిపు వద్ద కొందరు స్మగ్తర్లను పట్టుకున్నారని, ఇద్దరు వేటగాళ్లను కాల్చి చంపారని? మిరాజ్‌కర్‌ అన్నాడు.” మిరాజ్‌కర్‌ తుపాకులు, ఆయుధాల గురించి లోతైన అధ్యయనం చేసిన వ్యక్తి. మొదటి ప్రపంచ యుద్ధం విశేషాలను ఇప్పుడు కథలుగా వివరిస్తున్నాడు. డైవర్‌ రమాకాంత కూదా ఈ వేటగాళ్ల గురించి విశేషంగా తెలిసినవాడు. “బార్డర్‌ ఏరియాల నుండి ఎలా వస్తారు...” అన్న విషయాల మీద కథలు కథలుగా చెప్పగల నేర్పరి. మధ్య వయస్ముడు. నెత్తి మీద బట్టతలను ఎండ నుండి తప్పించడానికి నేపాలీ టోపీని ధరిస్తాడు. పొట్టిగా, బలిష్టంగా వుండి అతని మెడ, చొక్కాకాలర్‌ లోపల కప్పబడిపోయి వుంటుంది. లోయలో వుండే ఇతర 'బోడోస్‌' మాదిరి కళ్ళు చిన్నవిగా వుండి సన్నని మీసాలతో వుంటాడు. డ్రైవింగ్‌లో ప్రావీణ్యం కలిగినవాడు. ్రేక్‌ను గాని, క్లచ్‌ గాని అరుదుగా వాడుతాడు. రేపెక్కడికెళ్తావ్‌,..? 28

కాని, నా ఆలోచన ఎక్కడో వుంది. తుపాకులు, టెర్రరిస్టుల మీదనా ధ్యాస లేదు. నెమ్మదిగా కదిలిపోతున్న అడవిని కారు కిటికీ నుండి గమనిస్తున్నాను. పొడవైన కోతుల కాళ్ళ మీద మొలిచిన వెంట్రుకల మాదిరి నాచు మొక్కలతో కప్పబడి పెద్ద పెద్ద “వేల్‌ వృక్షాలు దర్శనమిస్తున్నాయి. రకరకాల వృక్షాలు అడవి తీగలతో చుట్టబడి వున్నాయి. సాలెగూడులోని సన్నని మెరుస్తున్న దారాలతో తొడగబడి కొన్ని వృక్షాలు అద్భుతమైన అవశేషాలుగా కనబడుతున్నాయి. అంతటా పచ్చదనమే. దళసరి ఆకులు నిండుగా వుండి, 'పుతి అనే చిన్న చేప పిల్లలను గుర్తుకు తెస్తూ, మరికొన్ని పత్రాలు గుండ్రంగా వెండి నాణెంలా వుండి వాటిపై క్వీన్‌ విక్టోరియా బొమ్మను ముద్రించినట్లు ఆకర్షణీయంగా వున్నాయి. బార్జ్నియా వృక్షాలు తెల్లని పుష్పాలతో విరబూసే తెల్లని మేఘాలు, నేలతో దోబూచులాడుతున్నాయి.

మిరాజ్‌కర్‌ ఇంకా కిటికీ నుండి తొంగి చూస్తూనే, “తుపాకుల శబ్దమా? లేదు. అవకాశమే లేదు! ఢిల్లీతో పోలిస్తే ఇది స్వర్ణం. ఢిల్లీ హుం ఇప్పుడు అక్కడ ఎవరుండగలరు? అపాన్‌, తుర్క్‌ కవులకు పేరణగా నిలిచిన నిండైన యమున, ఇప్పుడొక మురికి కాలువ. జన సమూహంతో కళకళ లాడే సదర్‌ బజార్‌ ఒక యుద్ధరంగం..” అన్నాడు.

సూర్య కిరణాలు తమ వాడిని కోల్పోయి, ఒక పెద్ద కొండచిలువ తన కుబుసాన్ని విడిచి చీకట్లోకి జారిపోతున్నట్లు సమయం నెమ్మదిగా మసకబారుతున్నది. దాదాపుగా ఏమీ కనబడుట లేదు.

(ర గ్ర, కుట్‌, కుట్‌ కిర్ర్‌ ర్‌..! కారు ఒక్క కుదుపుతో చప్పుడు చేస్తూ రోడ్డు పక్కన ఒక గుడిసె లాంటి అంగడి ముందు ఆగిపోయింది. కారు నుండి ఒక్క ఉదుటున బయటికి దూకాడు రమాకాంత. బానెట్‌ తెరిచి చూసి మా వద్దకు వచ్చి రేడియేటర్‌ లీకవుతుందని, నీళ్లన్నీ ఆవిరైపోయాయి. ఏమీ చేయలేము, కారును గ్యారేజికి తీసుకెళ్లాల్సిందే అన్నాడు. చేసేదేమిలేక మిరాజ్‌కర్‌, నేను కారు దిగి మసక మసగ్గా వెలుగుతున్న దీపాలతో వుండి లేత కొబ్బరి బోండాలు, టీ అమ్మే రెండు చిన్న దుకాణాల వైపుకు నడిచాము.

“కారు అడవిలోనే ఆగిపోతే నేనైతే భయపడిపోయేవాణ్ణి? చూదు..! అప్పుడే ఎంత చీకటయ్యింది” మిరాజ్‌కర్‌ అన్నాడు. అవునన్నట్లు తలవూపాను. ఈ సమయంలో రమాకాంత రోడ్డు పక్కన వున్న అంగళ్లలో అటూ ఇటూ తిరుగుతూ లోపలికి, బయటికి వస్తూ గ్యారేజీ గురించి ఆరా తీస్తున్నాడు.

జాతీయ రహదారికి కాస్త పల్లంలో వున్న ఒక అంగడి నుండి అకస్మాత్తుగా ఒక బక్క పలచని వ్యక్తి బయటికి వచ్చాడు. అతని చేతిలో కిరోసిన్‌ లాంతరు వుంది. 24 డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

వదులుపాటి కుర్తా, ధోతి ధరించి మోకాళ్ళ మీద నిలబడినట్లున్నాడు. అతను కాళ్లకు చెప్పులేసుకున్నాడా? అన్నది స్పష్టంగా తెలియడం లేదు. మా కారు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. బలహీనంగా, వయసు పైబడిన వాడిలా వున్నాడు. లాంతరును కాస్త పైకెత్తి “బండి బేక్‌డౌన్‌ అయ్యిందా? వర్క్‌షాప్‌ ఏడు మైళ్ళ దూరంలో వుంది. ఆగండి, ఏదైనా కారును మీ కోసం నిలుపుతాను. దైవర్‌ వెళ్లి మెకానిక్‌ను తీసుకొస్తాడు, ఈలోగా మీరు నా అంగడిలో కూర్చుందురు. వేడి టీ తాగుదురు గాని. కావాలంటే వక్కపొడి కూడా వుంది...” అంటూ రోడ్డు మధ్యలో నిలబడ్డాడు. అతని చేతిలోని లాంతరు ఊగుతూ వుంది. అతని వదులైన జుట్టు భుజాల పైకి వాలుతోంది. మిణుకు మిణుకుమంటున్న వెల్తురులో అతను రంగులు మారుతున్నట్లుగా వున్నాడు.

మిరాజ్‌కర్‌, నేను అతని అంగడి వైపుకు నడిచాము. హరికేన్‌ లాంతరొకటి వెదురు బొంగు స్తంభానికి వేలాడుతోంది. దీపం బుడ్డి పగుళ్లతో మసిబారి వుంది. చెక్క బల్ల మీద ఒక పాత స్టవ్‌ను, తుప్పుబట్టీన కొన్ని డబ్బాలు, మట్టి గోడపై సిగరెట్టు తాగుతూ ఒక విదేశీ అమ్మాయి బొమ్మతో వున్న క్యాలెండర్‌ చూసాము.

బెంచీపై కూర్చున్నం. అంతలో లోపలి గదిలోంచి ఒక ముసలావిడ చేతిలో చిన్న దీపంతో బయటి కొచ్చింది. “ఈ రోజంతా ఇలాగే గడిచిపోయింది. సముద్రంలో చేపలు పట్టినట్లు ఒక్క ఆత్మ కూడా దృష్టికి ఆనటం లేదు...!”

ముసలావిడ గొణుగుతోంది. “కస్టమర్హు ఒక్కరూ రాలేదా?” ఆశ్చర్యంతో అడిగాను.

ఆమె మెల్లగా చెపుతోంది. “దారికి రెండు పక్కలా చాలా అంగళ్ళు ఇప్పుడు పుట్టుకొచ్చాయి. కస్టమర్లను ఎలా అకర్షించాలో వాళ్లకి బాగా తెలుసు. వాళ్ళు సంగీతం కూడా వినిపిస్తారు..” నెమ్మదిగా నా పక్కకు చేరి చెవిలో గుసగుసలాడింది. “వాళ్ళు చెడు పదార్థాలు కూడా అమ్ముతారు. మేము సాంప్రదాయకంగా వుంటాం. ఆ గోడ మీద బొమ్మ వున్నదే, చివరికి దానికోసం నేను, నా భర్త పిల్లలతో పోరాటమే చెయ్యాల్సి వచ్చింది.”

అమె కెటిల్‌ తీసికొని కాళ్ళీడ్చ్డుకుంటూ మా కోసం టీ పెట్టడానికి నీళ్లకై గది బయటికెళ్లింది. లాంతర్‌ వెల్తుర్లో ఆమె రవిక చిరిగివుందని గమనించాను. నడుముకు గుడ్డ చుట్టుకుంది. తమలపాకు ఎంగిలి మరకలతో వున్న పాత దుప్పటి కప్పుకొనివుంది. వెనక్కి వచ్చి స్టవ్‌ వెలిగించింది. బహుశా అందులో కిరోసిన్‌ లేదేమో, వెంటనే ఘాటైన వాసన గదంతా నిండిపోయింది. రేపెక్కడికెళ్తావ్‌...? 25

ముసలావిడ గ్లాసులు సిద్ధం చేసి వణుకుతున్న చేతులతో టీ కోసం పాలు పోస్తుంటే బాధగా అనిపించి “అవ్వా! నీకు సహాయంగా ఎవ్వరూ లేరా” అని అడిగాను.

“కోడలు పిల్ల నా పెద్ద కొడుకు భార్య తోడుగా ఉందేది. గత యేడాది వరదలొచ్చినపుడు కొడుకు తెలియని రోగంతో పోయాడు. వాడికి మందులే దొరకలేదు. దాక్టర్లు దోపిడీదారుల్లా ముఖం చాటేసారు. కొడుకు చనిపోయినపుడు కోడలు గర్భవతి. ఇప్పుడొక కొడుకున్నాడు కోడలు పిల్లకు. కోడలు చాలా బలహీనంగ వుంటది. తన కాళ్ళ మీద తాను నిలబడలేదు!”

“ఇంకెవ్వరూ లేరా ?”

“నాకిద్దరు కొడుకులు, ఒక కూతురు. బడికెళ్ళేవారు. హు! ఇప్పటి పరిస్థితులు వేరు. కూతురు ఇక్కడున్న తఈవ్రవాదులను ఏరి పారెయ్యడానికి వచ్చిన ఇండియన్‌ ఆర్మీ లోని ఒక సైనికుడి ప్రేమలో పడిపోయింది. అందుకు ఒకసారి స్థానికంగా వున్న మగపిల్లలు ఆమెను కొట్టారు. ఆ దెబ్బలకు తట్టుకొని కోలుకోవడానికి ఏడు సంవత్సరాలు పట్టింది. బిడ్డ నరకం చూసింది. వరదలొచ్చినపుడు నది (ప్రమాదకరంగా మారి మా భూముల్ని మింగేసింది. ఇప్పుడు ఒక్క గింజ కూడా లేకుండా...”

ఆ బక్క పలచని వ్యక్తి తిరిగొచ్చాడు. అతను ఆ లాంతరును అలాగే పట్టుకొని వున్నాడు. బహుశా అతను ఏదైనా ఒక కారును ఆపడంలో విజయం సాధించి డ్రైవర్‌ను మెకానిక్‌ కోసం పంపి ఉంటాడు. నిలబడ్డ చోటినుండే తన భార్యను కేకేసి “ఆయీ, నిర్మలికి మా, నీ కష్టాల కథలు చెప్పి అతిధులను విసిగించకు. ఇప్పటికే అలసిపోయారు. టీ తీసుకు రా..” అని చెప్పాడు.

అతన్ని చూసి ముసలావిడ అమాంతంగా లేచి దగ్గరికెళ్లి గొణిగింది. “మనోహర్‌, మరికొందరు ఈ రోజు రైల్వే ట్రాక్‌ దగ్గర అతన్ని చూశారట.”

ఆ వ్యక్తి ఒక్కక్షణం నివ్వెరపోతూ, “పోయినసారి కూడా కొందరు అతన్ని రైల్వే ట్రాక్‌ దగ్గరే చూసారని చెప్పారు. ఈ చెత్త మాటలు పట్టించుకోకు!” అని అన్నాడు.. “వెళ్లు వచ్చిన కస్టమర్లకు టీ పట్టుకు రా పో. వాళ్ళు కాజీరంగా నుండి తిరిగి వస్తున్నారు. బాగా అలసిపోయి వుంటారు. బిస్మట్లేమయినా ఉన్నాయా?”

“బిస్కట్లా..? ఉన్న డబ్బంతా పోయిన వారం పంచదార, టీ పొడి కొనడానికే సరిపోయింది ...”

మిరాజ్‌కర్‌, నేను ఇద్దరం ఒక్కసారిగా అరిచినంత పనిచేశాం... “వద్దు వద్దు ఏం బాధ పడొద్దు, బ్లాక్‌ టీ చేసినా సరిపోతుంది...”

26 డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

ముసలావిడ టీ చేసినట్లు తనలో తాను గొణుక్కుంది. “భగవంతుడికే తెలియాలి. ఈ అంగడిని నేనెలా నెట్టుకొస్తున్నానో..” గత ఏడు సంవత్సరాల నుండి నది భూమినంతా మింగేస్తూ వచ్చింది. రోడ్డు పక్కన వరద బాధితుల సంఘం వారు తమ కార్యాలయం పెట్టాక కేవలం వంద రూపాయలిచ్చి మా నోళ్లు మూయించారు.

“నోర్ముయ్‌ ముసల్టానా?” అంటూ వ్యక్తి అరిచాడు.

అతని మాటలు విననట్లుగా ముసలావిడ చెప్పుకుపోతూనే వుంది.

“ఈ ముసలోడు అధికారుల కాళ్ళు పట్టుకోవడానికి నామోషీగా భావిస్తాడు. వరద బాధితుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బంతా ఈ అధికారులు మెక్కేసారు. గత ఏడేళ్లనుంచి ఈ కుటుంబం ఎన్ని అవస్థల పాలయ్యింది. ఈ మనిషికి సహాయం తీసుకోవడానికి అహం అడ్జొస్తుంది. వాడి తలనిండా గతంలో అనుభవించిన డాంబికాలే నిండి వున్నాయి. బంగారు రేకు తొడిగిన పొన్నుగర్ర, వెండి వొంకుతో గొడుగు వున్న మహారాజు కుటుంబంలో వుంటేనేం! నగిషీలు చెక్కబడిన పడక్కుర్చీలో కూర్చుంటేనేం? ప్రభుత్వాధికారుల దగ్గరికి పొమ్మని పదే పదే దెప్పిపొడిచినా లాభం లేకుండా పోయింది. అలా అవస్థలు పడుతూనే ఏడేళ్లు దొర్లిపోయాయి. దయచేసి మా గడ్డు పరిస్థితులను ప్రభుత్వానికి మీరైనా అటుగా వెళ్ళినప్పుడు...”

పెద్దమనిషి ఆమె వైపు కోపంగా చూసి మా వైపుకు తిరిగి, “దయచేసి ఆమె మాటల్ని పట్టించుకోకండి. కస్టమర్లు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒకటి గొణుగుతూనే వుంటది. పైగా వచ్చిన టూరిస్టులను కాజీరంగాకు వెళ్లడం కన్నా వరద తాకిడికి గురై దౌర్భాగ్య స్థితిలో వుండి పశువుల కన్నా హీనంగా బతుకీడ్చే వాళ్ళను చూసి రమ్మంటది.” ఆమెవైపు తీక్షణంగా చూసి, “వెళ్లి త్వరగా టీ పట్రా, అల్లం చితక్కొట్టి వేయడం మరవకు. అల్లం లేకపోతే ఒకటో రెండో 'కేసియా' అకులైనా వెయ్యి.” ఆ క్షణంలో నా దృష్టి గోడకు వేళ్ళాడుతున్న 'దోతారా” పై బడింది. నేను కూర్చున్న బెంచీ వెనకాల వుండటంచే నా దృష్టిలో అంతవరకు పడలేదు. పాత సంచులు, డబ్బాలు, పగలకొట్టిన కొబ్బరి బోండాల చిప్పల మధ్య దాన్ని చూడటం ఆశ్చర్యం కలిగించింది. సాంప్రదాయకమైన రెండు తీగల వాయిద్యం. నగిషీలు చెక్కబడి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు కనబడింది.

“దోతారాను ఎవరు వాయిస్తారు, దాదా ?”

ఆ పెద్ద మనిషి ముఖం ఒక్కసారిగా ఆనందంతో వెలిగిపోయింది. ఇంత చక్కగా నవ్వగలడా ఇతను! అని ఒక క్షణం క్రితం వరకు ఊహించలేకపోయాను కూదా. “డిఫోలు రేపెక్కడికెళ్తావ్‌...? 27

తీరాన వున్న నమ్‌ ఘర్‌ (ప్రార్ధనా మందిరం)ను దర్శించే సందర్శకులందరికి నా ఈ వాయిద్యం గురించి బాగా తెలుసు. కాని దురదృష్టవశాత్తు, నది వరదలతో ఇక్కడున్న నమ్‌ఘర్‌లను మింగేసింది - అరిమిరా, హాలాపార్‌, కోహరా, మిహిముఖ్‌ ఇక్కడున్న (ప్రజలందరికి తెలుసు నా సంగతి. అంతెందుకు, బ్రహ్మపుత్ర కావలనున్న బహులీ గ్రామస్తులు కూడా నా పాటలను మెచ్చుకుంటారు.. అంటూ చెప్పుకొచ్చాడు.

ముసలావిడ అల్లం దంచడం పూర్తి చేసింది, “ఈ పెద్దమనిషి నగిషీలతో అద్దాలు పొదగబడిన పల్లకీ గురించి ఇప్పుడు థాంబికాలు పోతాడు... పిల్లాడు ఇల్లు విడిచి రెండు నెలలయ్యింది. రైల్వే ట్రాక్‌ పక్కన నిలబడి ఆకలితో బక్కదిక్కిపోయి. ఎదురు చూస్తున్నాడో ఏమో! ఈ బండరాయి అసలు పట్టించుకుంటే గదా!”

“నోర్ముయ్‌ ముసలి దయ్యమా! రెండు కప్పుల టీ చెయ్యడానికి యుగాలు చేస్తివి..” పెద్ద మనిషి ఉరిమాడు.

“ద్రోత్రారా వాయిస్తే వినాలని వుంది.” - ప్రా. మిరాజ్‌కర్‌ అడిగాడు.

“శ్రప్పకుండా..” అన్నాడు. ఎవరైనా అలా అడుగుతారా అని వేచి చూస్తున్నట్లు ఆ పెద్ద మనిషి నుండి జవాబు వచ్చింది. “మీ మెకానిక్‌ రావడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చు. ఇక్కడ టీ కోసం వచ్చిన వారందరూ నా పాట వింటారు.”

“కస్టమర్లా? గత కొన్ని రోజులుగా ఒక్కడూ రాలేదు. ఎన్ని కార్లు ఈ అంగడి దాటి పోలేదు..” అతని భార్య విసుక్కుంది. పెద్ద మనిషి వైపు తిరిగి చెప్పింది. “కస్టమర్లకు టీ ఇచ్చేలోగా ఓ సారి దీపం పట్టుకొని రైల్వే ట్రాక్‌ దగ్గరికి పోయి ఓ చూపు చూసి రాకూడదూ! బాతాఖానీ పెట్టడానికి, పాడటానికి కూసున్నవంటే ఇక లేవడం చాతకాదని ఆ దేవుడికీ తెలుసు.”

“ఈ కథ ఇంతకు ముందు విన్నాను. కొన్ని నెలల ముందు ఈ గాలి వార్తలు మనం వినలేదా?” అని పెద్దమనిషి గులుక్కుంటూ భార్య చేతిలోని రెండు గ్లాసులు తీసుకొని నమ్రతతో మాకందించాడు. ప్రశాంత స్వరంతో “టీ తీసుకోండి మీరు. నేను పాట పాడుతాను” అన్నాడు. అంతలోనే కుంటుతూ కర్ర ఆధారంగా ఒకమ్మాయి గదిలోకి ప్రవేశించింది. గాలికొదిలేసినట్లున్నా పట్టుకుచ్చులాంటి పొడవైన శిరోజాలు ఆమెవి, ఆమెను చూడగానే ముసలి దంపతులు, “ఎందుకొచ్చావిక్కడికి తిరుగుబోతుదానా..!”

అంటూ గట్టిగా అరిచారు. ఈ ప్రాంతంలో వున్న మిలిటెంట్లను ఏరివేయడానికి వచ్చిన ఇండియన్‌ ఆర్మీలోని 'సైనికుడితో సంబంధం పెట్టుకున్న అమ్మాయి కాబోలు అని వెంటనే ఊహించగలిగాము. 28 దా. రూప్‌ కుమార్‌ డల్ఫీకార్‌

టీ అద్భుతంగా వుంది. పెద్దమనిషి 'దోతారా” తెచ్చాడు. దాన్ని సరిచేస్తూ అడిగాడు, “కాజీరంగాలో పులులను చూసే అవకాశం కలిగిందా? 1966లో కేవలం ఇరవై పులులు ఉన్నాయని ప్రజలు చెప్పేవారు. ఇప్పుడు దాదాపుగా వాటి సంఖ్య అరవై, రైనోల సంఖ్య మూడు వందల నుండి పెరిగి పదిహేను వందల వరకూ చేరింది. ఐదు వందల వరకు ఏనుగులున్నాయి..”

“వేము కొన్ని ఏనుగులను చూసాము. ఇటువైపు ఎప్పుడైనా వస్తాయా..?” నేనడిగాను.

“ట్రాఫిక్‌ కారణంగా ఈ రోజుల్లో రావడం లేదు. ఇంతకు పూర్వం, వరదలకు ముందు దాటి వచ్చి మా వరి పొలాల మీద పదేవి. రైతులంతా ఒక్కటై వాటిని తరమవలసి వచ్చేది. కానీ, అడపాదడపా పులులు వస్తాయి. మీకు తెలుసా ఒకరోజు ఏమైందో? రోడ్డు పక్కన చెరువు గట్టున వున్న ఒక చెట్టుకు 'దిముయి గుడియా' మహంతా గారి ఏనుగు కట్టేసి వుంది. ఏనుగు చాలా సౌమ్యంగా వుండేది. డిఫోలులో స్పానానికి తీసుకు వెళ్లిన ప్రతిసారి అక్కడి పిల్లలతో ఆడుకునేది. ఆ రోజు చెరువు గట్టున పడుకున్న ఏనుగు మీద పులి దాడి చేసి దాని వీపు భాగాన్ని చీల్చి మాంసం ముద్దను వేరుచేసింది!”

“జగవంతుదాొ భయంతో అరిచాను ? ఆ తరువాత?

“ఏనుగులు సర్వం తెలిసిన జ్ఞానజీవులు. మీకు తెలుసా! మోమారియా విప్లవం గురించి. అహోమ్‌ రాజులకు వ్యతిరేకంగా వైష్ణవులు జరిపిన యుద్ధం. ఇది ఒక ఏనుగు వల్ల మొదలైంది?

“నన్సుగా?”

“జెను?..” బక్క పలచనిది, బలహీనమైన ఏనుగు. ఈ సంఘటన లక్ష్మీనాథ సింహ రాజు కాలంలో జరిగింది. ఈ రాజు ముసలి వయసులో సింహాసనం అధిష్టించాడు. కీర్రినాథ్‌ అనే బోర్‌ బారువా (మంత్రితో చాలా స్నేహంగా వుండేవాడు. ఇద్దరూ స్నేహితులు. ఇప్పుడు అహోమ్‌ రాజుల్లో లక్ష్మీనాథసింహ, గౌరీనాథ్‌సింహ చాలా దుర్గుణాలు కలిగిన వారు. గంజాయి అలవాటుతో ఎప్పుడూ మత్తులో మునిగి వుండేవారు. గౌరీనాథ్‌, డిఫోలు తీరాన నివసించే ఒక బేస్త కన్య వ్యామోహంలో పడి తన పల్లకిని ఆమె నివాసం ముందు నిలిపి బయట వేచి చూస్తూ వుండగా.... *

“ఏనుగు సంగకేమిటి..?” అడిగాను.

“క్రీర్తినాధ్‌ బోర్‌ బారువా (మంత్రి), మోమారియా మహంతతో గొడవపడ్డాదు. అప్పుడొక చట్టం వుండేది. ఆ చట్టం ప్రకారం మహంతాలు ప్రతి సంవత్సరం రేపెక్కడికెళ్లావ్‌...? 29

రాజ దర్భారుకు ఏనుగులను కప్పంగా బహూకరించాలి. ఒకసారి ఈ మహంతాలు ఒక ముసలి, రోగిష్టియైన ఏనుగును బోర్‌ బారువాకు ఇచ్చారు. ఒక మహంత ఈ బక్క పలచని, బలహీనమైన ఏనుగుతో బోర్‌ బారువా వద్దకు వెళ్ళాడు. ఎప్పుడైతే కాళ్లు వంకరగా వుండి కుంటుతూ వున్న ఏనుగును చూశాడో మంత్రి ఆగ్రహంతో ఊగిపోయి మహంత నాయకుడి చెవులు నరికేసాడు ?” మధ్యలో అసహనంతో ముసలావిడ అద్దు తగిలింది. “చెవులు నరికేసాడా! నిజంగానా! ఓ పెద్ద మనిషి! భగవంతుడి కోసం దీపం తీసుకొని ఒక్కసారి చుట్టుపక్కల చూసి రాకూడదూ? మిలట్రీ బుల్లెట్లు తగిలి ఎక్కడైనా పడిపోయి వుండొచ్చు కదా! పెద్దమనిషి ఏమీ విననట్లు తన ధోరణిలో తాను చెప్పుకు పోసాగాడు. “క్క అఘోన్‌ నెలలోనే తొమ్మిది వేల మోమారియా సైనికులు, కీర్తినాధ్‌ సింహను రొంగ్‌పూర్‌ వెళ్తున్నప్పుడు దారిలోనే అటకాయించి నిర్బంధంలోకి తీసుకున్నారు. నేను చెప్పినట్లు ఇదంతా కేవలం అంగవికలత్వంతో వున్న ఆ ఏనుగు వల్లనే కదా 1౫” టీ తాగుతూ పెద్ద మనిషి మాటలు వింటూ కూర్చున్నాము. రమాకాంత కూడా కొద్ది సమయానికి వచ్చి టీ తాగి వెళ్ళిపోయాడు. వెళ్తూ, “పని పూర్తి కావడానికి ఇంకా గంటన్నర పడుతుంది, మెకానిక్‌ రేడియేటర్‌ తీసుకొని వర్క్‌ షాప్‌కెళ్ళాడు” అని చెప్పాడు. ముసలావిడ నా దగ్గరకొచ్చింది. “ఈ రోజు ఇద్దరు కస్టమక్లే వచ్చారు బిడ్డా! ఇద్దరూ ఇంకో గ్లాసు టీ తీసుకోకూడదు. చక్కర, టీ పొడి వుంది.” మేము మరో రెండు కప్పుల టీ కోసం చెప్పాం. ఈలోగా పెద్ద మనిషి “దోతారాకున్న రెందు తీగల్ని సరిచేస్తున్నాడు. “ఈ వరదల్లో దోతారాను కాపాడటానికి కష్టపడాల్సి వచ్చింది. ఈ విధంగా దోతారాను సరిచేయడానికి ఈ (ప్రాంతంలో నేను తప్ప ఎవ్వరూ లేరు...” మునలావిడ అతన్ని మరోసారి రెచ్చగొట్టింది. “ఈ కస్టమర్లను నేను చూసుకుంటాను. లాంతరు పట్టుకెళ్ళు. రైల్వే ట్రాక్‌ల వద్దకు వెళ్ళు. ఎవరికి తెలుసు... ఎవరికి తెలుసు... పెద్దమనిషి వివరిస్తున్నాడు - నేనా, చూపందక దాదాపుగా గుడ్డివాజ్ఞయ్యాను. ఈ ముసల్దా, నన్ను ఈ చీకట్లో వెళ్లి పిల్లాజ్జీ వెతకమంటది. ఒకసారి నేను అతన్ని వెతకడానికని వెళ్లి రైల్వే ట్రాక్‌ దగ్గర పడిపోయా. మోకాలి చిప్పలు గీరుకుపోయి ఇప్పటికీ నొప్పి పెడ్తున్నాయి. నా ఛాతీకి కూడా గాయాలయ్యాయి బిడ్డా! విను.. ఎప్పుడూ ఇలా వుండలేదు మేము. అంతా వరదల (ప్రభావం. 80 గా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

ఇలా రహదారి పక్కన గుడిసె వేసుకొని రోజు రోజు కస్టమర్ల కోసం వేచి చూస్తూ బతుకీద్చే దయనీయమైన స్థితి వచ్చింది. మేము మర్యాద గల కుటుంబీకులం. మాకు రెండు ధాన్యాగారాలుండేవి. ఎప్పుడూ ధాన్యంతో నిండుగా వుండేవి.

కొత్తవాళ్ళైనా సరే, మా ఇంటికి వస్తే సువాసన గల బియ్యంతో వండిన అన్నం, కావో చేపల కూరతో భోజనం తప్పకుండా ఆరగించి పోయేవాళ్లు. నేరస్తుల మోకాలి చిప్పలు చితక్కొట్టి శిక్షించే అధికారం కలిగిన బోర్‌ బారువా కుటుంబానికి చెందిన వారం.

కానీ, నా తండ్రి దయాగుణం కలవాడు. ఇదే పగటి సమయమైతే మిమ్ముల్ని మా ఇంటికి తీసుకెళ్లి ఇంకా జాగ్రత్త పరచివుంచిన, శోభాయమానంగా వెలిగే తలపాగా, అతని ఛత్రం, వెండి పాత్ర, అలంకారితమైన పడక్కుర్చీ, పోకలు కత్తిరించే వెండి అడకత్తెర అన్నీ చూపించేవాణ్ణి. కాని మా వరిపొలాలు.. నా రక్త మాంసాల కన్నా ప్రియమైనవి. బంగారం ముత్యాలు పందేవి. లేకుండా పోయినవి.

“ముసలావిడ కోపంతో వూగిపోయింది.. “ఆ పాత సమాధులన్నీ ఎందుకు తవ్వి తీస్తున్నావు. నేనే వెళ్లి చూసొస్తాను రైల్వే ట్రాక్‌ల దగ్గరికి పోయి...”

“నోర్ముయ్‌ ముసల్టానా, ఎన్నిసార్లు వినలేదు అతను తిరిగి వచ్చాడని. అయినా లాభం లేకుండా పోయింది. అతను వెనక్కి రాలేదు. మనకు ముఖం చూపలేదు. ఇద్దరు మంచి మనుషులు ఈ రోజు మన అంగడికి వచ్చారు. వారికి మంచిగా సేవ చేయాలి. వాళ్ళకు సౌకర్యంగా వుండేట్లు చూడాలి” అని చెప్పి పెద్దమనిషి ఆలాపించడం ప్రారంభించాడు. వైష్ణవియైన పద్మప్రియ కూర్చిన కృతి.

తామరాకు మీద నీటి బిందువులా

ఈ ప్రపంచం నశ్వరమైనది!

బలమైన విధి, మనలను బూడిద కుప్పగా చేస్తుంది

ఈ జీవితం, ఈ యవ్వనం

కనుమరుగయ్యే ఓ స్వప్నం.

అతని కళ్ళ కింద అస్తవ్యస్తంగా వున్న మడతలు చూసాను. పళ్ళు లేవు. సహజంగా వున్న ముక్కును పొడవుగా సాగదీసినట్లు చేస్తున్న చెంపలు లోతుకు పోయాయి. పాటకు అంతం లేనట్లు పాడుతున్నాడు. పద్మప్రియ కూర్చిన పాట, తర్వాత వైష్ణవ సాధువులు కూర్చిన అనేక కృతులను పాడి వినిపించాడు. డిఫోలు తీరాన కూర్చొని, రేపెక్కడికెళ్తావ్‌...? 31

చంద్రుడు నీటితో సరాగాలాడుతుంటే చూస్తున్న అనుభూతి లాంటి ఆనందాన్ని ఆస్వాదించాను.

ఓ గంట వరకు అతని పాటలు విన్నాము. మధ్య మధ్యలో అతని భార్య అసహనంగా అడ్డు తగులుతూనే వుంది. గొణుక్కుంటూ కూర్చున్నది - “జనం వచ్చి రైల్వే ట్రాక్‌ దగ్గర అతన్ని చూసామని చెబుతూనే వున్నారు. కుర్రాడు మిలట్రీ బుల్లెట్లకు బలైనా అతనేం పట్టించుకోడు.”

ఒక్కసారిగా పెద్దమనిషి పాడటం ఆపేసాడు. మిరాజ్‌ కర్‌ తన కోటు జేబులోంచి సర్రున డబ్బులు లాగి పెద్దమనిషి ముందున్న వకృపాడి ప్లేటులో పెట్టాడు.

“ఓ నిర్మలికి మా” పెద్దమనిషి పిలిచాడు. “టీ కి ఎంత ఖర్చయ్యిందో అంత తీసుకొని మిగతాది తిరిగి ఇచ్చెయ్యి,” మిరాజ్‌కర్‌ వైపు తిరిగి అన్నాడు. “అంత డబ్బు ఎందుకిస్తున్నారు సార్‌... నా పాటలు సాధువుల కృతులకు ప్రతిధ్వని మాత్రమే. దానికి ప్రతిఫలంగా ఎవరైనా డబ్బిస్తే నా మనసు గాయపడుతుంది. ఎవరూ అర్ధం చేసుకోరు! ఎవ్వరూ అర్థం చేసుకోరు.”

“ముసలావిడ డబ్బు వంక తదేకంగా చూస్తోంది. ఆమె డబ్బును తాకలేదు. ఆమె మౌనంగా వుంది. అదే క్షణంలో బయట భూమి అదిరిన తీరున పెద్ద శబ్దం వినబడింది. విసురుగా నేల పైకి మమ్ముల్ని ఎవరైనా విసిరేసారా అన్న కంపన కలిగింది. అంతలో దగ్గరలోని ఓ చెట్టునుండి ఎవరో నీడలా బయటికి వచ్చి నెమ్మదిగా అంగడి వైపుకు నడిచి మా ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతా క్షణంలో జరిగిపోయింది. అతని ముఖం చూడగానే నా గొంతు తడారిపోయింది.

ఎదురుగా యువకుడు కంటి నుండి పెదవి దాకా లోతైన గాటు అతని చెంపపై స్పష్టంగా కనబడుతుంది. బులెట్‌ లేదా కత్తి గాయం కావచ్చు. ఆ గాయం చీము పట్టి నెత్తురుతో నిండి పచ్చిగా వుంది. పెదవి కింద లోతుగా చీరుకుపోయి బయటపడిన

పచ్చి కండరం, మిణుకు మిణుకుమంటున్న వెలుతురులో అతని నోటి పళ్ళు కూడా మేము చూస్తున్నాము.

నేను ముసలావిడ దగ్గరికి వెళ్లి ఆమె చేతిని నా చేతిలోకి తీసుకొని గట్టిగా పట్టుకున్నాను. సన్నగా వణుకు పుట్టింది. ఆ యువకుడు నల్లటి జీన్స్‌ ధరించి ఆ పైన ఖాకీ జాకెట్‌ వేసుకున్నాడు. అతని చేతిలో ఏముంది? రివాల్వర్‌? కిరోసిన్‌ దీపపు మసక వెలుతురులో కూడా దాని బారెల్‌ మెరుస్తోంది. ముసలావిడ హిస్టీరియా వచ్చినట్లు గట్టిగా ఏడవసాగింది. 82 డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

“అయ్యో నా కన్ఫప్‌, నా కొడుకా! మీ తండ్రికి వెయ్యి సార్లయినా చెప్పి వుంటాను. రైల్వే ట్రాక్‌ దగ్గరున్న నిన్ను తీసుకురమ్మని. ఏమైంది నీకు? ఎందుకిలా రక్తం ఓడుతున్నావు నాయనా?..”

ఆ యువకుడి చూపు ఒక్కసారిగా అమ్మాయి మీద పడింది. మూలన కూర్చొని భయంతో వణకసాగింది. బులెట్‌లా ఆమె వైపుకు దూసుకెళ్లి జుట్టు పట్టి పిడికిళ్లతో కొట్టసాగాడు. కడుపులో తన్నుతూ అరుస్తున్నాడు. “నీ గర్భంలో వున్న పిండాన్ని నాశనం చేస్తాను. నీ కడుపులో పెరుగుతున్న ఆ సైనికుడి అక్రమ పిండాన్ని చంపేస్తాను. భారత 'సైనికుడితో (ప్రేమకలాపాలా, చెత్త లంజ! థూ! థూ..!”

ఆమె కడుపుపై కసిగా ఒక తన్ను తన్నాడు.

“అయ్యో! అయ్యో! అమ్మాయిని చంపేస్తాడు వాడు” అంటూ ఆవేశంతో ఊగిపోతున్న ఆ యువకున్ని ముసలి తల్లిదండ్రులు పట్టి లాగుతున్నారు. ఆ యువకుడు తల్లి వైపు చూడను కూడా చూడటం లేదు. పెద్దమనిషి ముందున్న డబ్బు మీద అతని దృష్టి పడింది. రాబందులా వాటి పైకి లంఘించాడు.

పెద్దమనిషి అరుస్తున్నాడు. “ఆ డబ్బు నాది కాదు బిడ్డా! మర్యాదస్తులైన మన కస్టమర్లది. తిరిగిచ్చెయ్యి.” యువకుడు తండ్రి మాటలను లెక్క చేయలేదు. తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు, ఆ వేటగాళ్లు ౮5 కార్సైన్‌ను అమ్ముతున్నారు. పాత గన్‌ అది. కాని బందోబస్తు గున్నది. ఈ డబ్బుతో.

అతను తుఫాన్‌లా వచ్చాడు. అంజే వేగంతో చీకట్లో మెరుపులా మాయమయ్యాడు. రాత్రి నిశ్చలంగా వుంది. అమ్మాయికి ఐన గాయాల నుండి కారుతున్న రక్తాన్ని తుడుస్తూ వున్న ఆ పెద్ద మనిషి పెదవుల మీద సన్నగా నవ్వు లాంటి కదలిక కదలాడింది. నా జీవితంలో అంతటి విషాదకరమైన నవ్వును ఎప్పుడూ చూడలేదు.

మిరాజ్‌కర్‌ నేను గుహవాటి వైపుకు తిరుగు ప్రయాణమయ్యాము. మా మధ్య మౌనం మాత్రమే వుంది. ఒక అనంతమైన చీకటి సొరంగం గుండా మా ప్రయాణం సాగుతున్నదా! అన్న తీవ్రమైన సంఘర్షణ,

రు రేపెక్కడికెళ్తావ్‌...? 83

కళ ష్ట్ర. 21 ఆగస్టు, 1915న ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బదాయున్‌లో న జన్మించిన ఈమె ప్రఖ్యాత ఉర్దూ నవల, కథా రచయిత్రి. ఇస్మత్‌ చుగ్తాయి నాటకాలు రాశారు. స్రీల సమస్యలు, ప్రధానంగా లైంగికత, స్వేచ్చ, వ్యక్తిత్వాలకు సంబంధించి, మధ్య తరగతి కుటుంబ సమస్యలను తన రచనల్లో ప్రతిబింబింప చేశారు. పేద, ధనిక వర్గాల మధ్య ఆర్థిక అసమానతలను ఎత్తి చూపారు. మార్చిజం నేపథ్యంతో వర్గ పోరాటాలు, వివక్షతలపై కూడా తమ కలాన్ని సందించేవారు. ఇన్మత్‌ చుగ్తాయి. కథ "లివీఫ్‌” సంచలనాన్ని రేపింది. శారీరక, మానసిక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ కోణాలలో ప్రీ తత్వాన్ని స్వభావా తన రచనల్లో దర్శింప జేశారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. ఫిలిం ఫేర్‌ అవార్డులు కూడా లభించాయి. తల్లి : నుస్రత్‌ ఖొనం, తండ్రి : మీర్జా ఖాసీం బేగ్‌ చుగ్తాయి. ప్రముఖ రచనలు : తేడీ లఖీర్‌, జిద్దీ అజీబ్‌ ఆద్నీ జంగ్లీ కబూతర్‌, కొన్ని సినిమాలకు స్క్రీన్‌ప్లే, డైలాగులు రాసారు (ఆర్టూ, ఫరేజ. “సోనే కి చిడియా” సినిమా కథను రాసి, భర్తతో కలిసి తానే నిర్మించారు. 24 అక్టోబర్‌, 1991న ముంబాయిలో మరణించారు. దేశ విభజన తర్వాత అన్యోన్యంగా, స్నేహంగా వుండే రెండు హిందూ - ముస్లిం కుటుంబాల మధ్య ఉత్పన్నమైన మనస్పర్ధలు. ముస్లిం కుటుంబంలోని వృద్ధ స్త్రీ దేశం, తన ఇల్లు వదిలిపోనని హఠం చెయ్యడం, మిగతా సభ్యలు పాకిస్తాన్‌ వెళ్లిపోవడానికి సిద్దపడటం, చివరికి హిందూ కుటుంబ పెద్ద అందరికి సర్ది చెప్పి వారిని ఇంటికి తీసుకు రావడంతో తిరిగి వారిలో ఆనందం పొడసూపదడం ఇవన్నీ చక్కగా పాత్రల మధ్య సంభాషణలతో కథను నడిపి రచయిత్రి రక్తి కట్టించారు. ఈ ఉర్దూ కథ “డేను నందు కిశోర్‌ విక్రమ్‌ హిందీలో అనువదించారు. లెక దా. రూప్‌కుమార్‌ దబ్బీకార్‌

ట్నె అస్తిత్వాల మూలాలు ...

అందరి మొహాలు పాలిపోయివున్నాయి. ఇంట్లో కనీసం వంటా వార్పు కూడా లేదు. ఇలా ఆరవరోజిది. పిల్లలు స్కూల్‌ లేకుండా ఇంటి పట్టునే వుండి అల్లరితో ఇల్లు పీకి పందిరి వేయసాగారు అదే పనిగా తన్నుకోవడాలు, గుద్దులాటలు, మళ్ళీ అవకాశం దొరకదు అన్న రీతిలో వీరి అల్లరితో ఇల్లంతా సంత అంగడి అయ్యింది. ఈ వెధవలకేం తెలుస్తుంది, ఆంగ్లేయులు వెళ్లిపోయారు కానీ, పోతూ పోతూ లోతైన గాయాలు చేసి మరీ పోయారు అని. అవి సంవత్సరాలు గడిచినా మానని గాయాలు. భారత్‌ మీద ఇంతటి దుర్మార్గమైన, క్రూరమైన చేతుల మీదుగా ఆయుధాలతో అత్యాచారాలు జరిగాయి. రక్తపుటేరులు ప్రవహించాయి. ఆ గాయాలను మాన్సే శక్తి ఎవ్వరికీ లేదు.

కొన్ని రోజుల నుండి పరిస్థితులు ఎంత భయానకంగా వున్నాయంటే, పట్టణంలోని ముస్లింలు ఒక విధంగా గృహ నిర్బంధంలో ఉన్నారా? అన్న అనుమానం కలగసాగింది. ప్రతి ఇంటికి తాళాలు వేసి వున్నాయి. బయట పోలీసు పహారా! ఈ విధంగా బతుకులు, 'దిన దిన గండం నూరేళ్లాయుష్లు' అన్నట్లుగా సాగుతున్నాయి. ఒక విధంగా చూస్తే, 'సివిల్‌ లైన్స'లో వాతావరణం ఎప్పటిలానే ప్రశాంతంగా వుంది. ఈ దుర్భర పరిస్థితి ఎక్కువగా యువకులున్న చోటే పుట్టుకొస్తది. వాళ్ళే సమస్యలను కెలుకుతూ వుంటారు. ఎక్కడైతే పేదరికం వుంటుందో అక్కడే అజ్ఞానమనే గుర్రం మీద ఈ సాంప్రదాయపు దండోరా మోగుతూ వుంటుంది. అందుకు తగినన్ని కారణాలు తవ్వి కుప్పలుగా పోయబడ్డాయి. దానికి తోడు పంజాబ్‌ నుండి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుండటంతో అల్బ సంఖ్యాకుల గుండెల్లో భయం పెరగసాగింది. దిగజారిన పరిస్థితులను కెలికే వారి సంఖ్య, రెచ్చగొట్టే వారి సంఖ్య పెరుగుతూ, పెరుగుతూ నెమ్మదిగా ప్రశాంతమైన, స్వచ్చమైన ప్రాంతాల్లోకి పాకిపోయింది

రెండు మూడు (ప్రాంతాల్లోనైతే బహిరంగ ప్రదర్శనలు కూడా జరిగాయి. కానీ, మార్వాడ్‌ ప్రాంతంలో హిందువులు, ముసల్మానుల మధ్య వారి వస్త్రధారణలో కాని, రేపెక్కడికెళ్లావ్‌...? 85

ముఖకవళికల్లో గాని, పేర్లలో గాని అంత పెద్దగా తేడా వుండక బయటి వారికి బేధం గుర్తించడం కష్టంగా వుంటుంది. కాని, బయటి నుండి వచ్చిన అల్బసంఖ్యాకులను మాత్రం చాలా సులువుగా గుర్తించగలరు. దానితో వారంతా పంధ్రాగస్టు వాసన పసిగట్టి పాకిస్తాన్‌ సరిహద్దుల గుండా తప్పించుకు పోయారు. ఇక మిగిలిపోయింది స్థానికంగా చాలా కాలంగా వున్న కుటుంబాల వారు. వారిలో అంతగా తెలివి లేదు. స్థాయి కూడా లేదు. ఎవరైనా ముందుకు వచ్చి భారత్‌ పాకిస్తాన్‌ మధ్య వున్న సమస్యను కూర్చాని సావధానంగా విడమర్చి చెప్పేవాడు లేడు. ఎవరికైతే చెప్పవలసిన అవసరం వుండేదో వారికి చెప్పడం జరిగింది. వారంతా అర్ధం చేసుకున్నారు. సురక్షితమై పోయారు. ఇక మిగిలిన కొందరు ఎవరైతే వున్నారో వారు పావలాకు గోధుమలు, పావలాకు చేతి మందం రొట్టె దొరుకుతున్నది చాలు అన్న ఆశతో వున్నారు. అక్కడికి వెళ్ళాక గాని తెలిసి రాలేదు, నాలుగు శేర్లు గోధుమలు కొనడానికి ఒక రూపాయి అవసరం పడుతుందని, ఇంకా చేతి మందం రొట్టె కోసం పూర్తిగా ఒక పావలా ఇచ్చుకోవలిసివస్తుందని. మరి ఈ రూపాయి, ఈ అర్ధ రూపాయి ఏ దుకాణంలో దొరకలేదు, ఏ పొలంలో పండలేదు. బతుకు వెళ్లదీయడానికి ఎంతగా పరుగులు పెట్టాలో ఈ మాత్రం డబ్బు సంపాదించాలన్నా అంత కష్టపడాల్సి వస్తుందన్న వాస్తవం సోయిలోకి వచ్చింది.

అల్ప సంభఖ్యాకులను తమ ప్రాంతాల నుండి బహిరంగంగానే వెళ్ళగొట్టాలి అన్న నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు ఒక పెద్ద చిక్కు సమస్య ఎదురయ్యింది. స్థానికులతో అధికారులంతా కలిసిమెలిసి తిరుగుతూ వుంటారు, కనుక ముసల్మానులను మరీ ఏరి వెళ్ళగొట్టాలంటే విడిగా, ప్రత్యేకంగా స్టాఫ్‌ అవసరమవుతుంది అందుకు అనవసరంగా ఖర్చు చెయ్యాల్సి వస్తుందంటూ ఠాకూర్లు వ్యతిరేకించారు. ఒకవేళ్క శరణార్థుల కోసం ఇంత భూమి కావాలి అని అనుకుంటే చెప్పండి. నేల చెక్క ఖాళీ చేయించే ఏర్పాటు చేయగలం. పశువులు ఎలాగూ వుందనే వుంటాయి. మీరెపుడు అవసరమనుకుంటే చెప్పండి అప్పుడు అడవి శుభ్రం చేయిస్తాము, అన్న సమాధానం ఎదురయ్యింది.

ఇక లెక్కకు కొన్ని కుటుంబాలే కదా మిగిలివున్నాయి. ఆ కుటుంబాలు మవారాజా వారి శిష్యబ్బందం లోనివి కావచ్చు. కొందరికి గాఢమైన స్నేహం వుండి వుండవచ్చు. వాళ్ళెతే పోయే ప్రశ్న తలెత్తదు. ఎవరైతే వెళ్లిపోవడానికి గట్టి నిర్ణయం తీసుకున్నారో వారైతే మూటాముల్ల సర్జేసుకుంటున్నారు. మా కుటుంబం కూడా అదే కోవలోకి వస్తుంది. తొందరేమీ లేకుందె, కానీ ఈయన ఆవేశంతో పిచ్చి పిచ్చిగా వాగేసాడు. ఐనా ఎవ్వరూ ఈయన మాటలకు విలువివ్వలేదు. ఎవ్వరూ ఇతని మాటల్ని చెవికెక్కించుకోలేదు. సామాన్లు సర్జుకుంటున్నారన్న విషయంలో ఎవ్వరికీ గాలి కూడా సోకలేదు. ఈ ఛబ్బామియాను 86 దా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

అల్లాయే కాపాడాలి. ఇంత ఢథాంబికం ప్రదర్శించకపోతే పెద్దన్నయ్య ఐతే అన్నింటికీ సిద్ధమే అయ్యాడు చెప్పి చెప్పి అలసిపోతే మియాఛబ్బా ఏం జేసాడు. స్కూలు గోడల మీద, 'పాకిస్తాన్‌ జిందాబాద్‌ రాయడానికి తీర్మానించుకున్నాడు. రూప్‌చంద్‌ పిల్లలు దీనిని వ్యతిరేకించి అదే స్థానంలో “అఖండ్‌ భారత్‌” అని రాసేసారు. ఫలితంగా చెప్పులతో కొట్టుకోవడం, తన్నుకోవడం, చివరికి ఒకరి మీద ఒకరు అంతు చూస్తామని ప్రతిజ్ఞలు కూడా చేసుకున్నారు. మాటా మాటా పెరిగింది. పరిస్థితి ఎంత దాకా వచ్చిందంటే పోలీసులు కలుగజేసుకొని వేళ్ళ మీద లెక్క పెట్టగలిగే సంఖ్యలో ముస్లింలు మిగిలివుంటే వాళ్ళను లారీల్లో ఎక్కించి ఇళ్ళకు పంపించి వేసారు.

ఇక చూడండి... పిల్లలు ఇంటికి రాగానే... “వీళ్లకు కలరా తగలనీ, వీళ్లకు మహమ్మారి రోగం వచ్చి పోనీ..” అని తిట్టుకునే తల్లులు, ఎంతో (ప్రేమతో ఆందోళనకు గురై గుందెలకత్తుకున్నారు. కొన్నిసార్లు ఇలా కూడా జరిగేది, రూప్‌చంద్‌ పిల్లలతో గొడవపడి చబ్బా వస్తే, 'దుల్బన్‌ బాబీ అతన్ని అక్కడే చెప్పు దెబ్బలతో సత్కరించి తిరిగి అతన్ని లేపి రూప్‌ చంద్‌ దగ్గరికే పంపి చికిత్స చేయించేది. ఎందుకంటే రూప్‌చంద్‌ మా ఫ్యామిలీ డాక్టరే కాదు, అబ్బాకు పాత దోస్త్‌ కూడాను దాక్టర్‌ సాహెబ్‌ దోస్తీ అబ్బా తోటి, ఆయన కొడుకుల సోపతి అన్నల తోటి, ఆయన కోడళ్ళకు మా వదినలతో ఇలా ఏ తరం వారు ఆ తరం తోటి '*ఒకే కంచం ఒకే మంచం, అన్నంతగా గాఢమైన స్నేహం వుండేది. రెండు కుటుంబాలకు చెందిన వర్తమానంలోని మూడు తరాల వాళ్ళు ఒకరితో మరొకరి అన్యోన్యత ఎంత గాఢంగా వుండేదంటే భారత్‌ విభజన తర్వాత వీరి (ప్రేమలో ఇంత పెద్ద అగాధం ఏర్చడుతుందన్న అనుమానం లేశ మాత్రం కూడా కలగక పోయేది. అంతే కాదు రెండు కుటుంబాలలో కూడా ముస్లిం లీగ్‌ కాంగైస్‌ మహాసభకు చెందిన పాద్దీ పక్షం వారున్నారు. ధార్మికమైన, సాంప్రదాయకమైన రాజకీయ విషయాల పైనా కూడా చర్చలు వాడిగా వేడిగా సాగేవి. అదేదో ఫుట్‌బాల్‌ వ్యాచ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్నంత హుషారుగా వాగ్వాదాలుండేవి. ఇక్కడ అబ్బా కాంగ్రెస్‌ వాది. అక్కడ డాక్టర్‌ సాహెబ్‌ ఇంకా పెద్దన్నయ్య లీగ్‌ను సమర్ధించేవారు. అకృ్కణ్డుంచి జ్ఞాన్‌చంద్‌ మహాసభ పక్షమైతే, ఇక్కణ్ణుంచి రెండవ అన్నయ్య కమ్యూనిస్టు వాది. అక్కడ గులాబ్‌చంద్‌ సోషలిష్ట్‌, ఈ లెక్కన మగాళ్ల భార్యలు, పిల్లలు వారి వారి పార్టీలకే సానుభూతి చూపేవారు. సాధారణంగా ఏదైనా విషయంపై చర్చ వేడిగా, వాడిగా నడిచినా కాంగ్రెస్‌ పక్షమే ఎప్పుడూ బలంగా నిలబడేది.

కమ్యూనిష్టు, సోషలిస్టు పక్షం వారు తిట్లు తినేవారు. చివరికి కాంగ్రెస్‌ పక్షం వైపే మొగ్గు చూపేవారు. మహా సభ, లీగ్‌ వాళ్ళు మిగిలిపోయే వారు. వీరిద్దరికీ ఒకరంటే రేపెక్కదికెళ్తావ్‌...? 87

మరొకరికి పడదు. కానీ ఎదుటి పక్షం తరపున వివాదం మొదలవ్వగానే ఒక్కటవుతారు. చివరికి ఇద్దరూ ఒక్కటై కాంగ్రెస్‌ మీద విరుచుకు పడతారు. కానీ, ఇక్కడ కొంత కాలం నుంచి ముస్లిం లీగ్‌ జోరు అధికం కాసాగింది. అలాగే మహాసభది కూదా. కాంగ్రెస్‌ పరిస్థితి మరీ అన్యాయంగా మారసాగింది. పెద్దన్నయ్య కనుసన్నల్లో ఇంట్లోని మిగతా మొత్తం దళం, కాంగ్రెస్‌ కట్టర్‌ వాదులు ఒకరిద్దరు తప్పించి, నేషనల్‌ గార్డ్‌, మాదిరి ఒక్క గుంపయ్యారు. ఇక్కడ జ్ఞాన్‌చంద్‌ నాయకత్వంలో, "సేవక్‌ సంఘ్‌'గా ఒక చిన్న దళం ఏర్పడింది. ఇన్ని వర్గాలుగా (గ్రూపులుగా విడిపోయినా, సిద్ధాంతాలు వేరైనా వారి మధ్య వున్న(ఢేమ మాత్రం చెక్కు చెదరకపోయేది. ఇప్పటికీ అలాగే మొదటిలా కొనసాగుతోంది.

“మన లల్లూ పెండ్లి మాత్రం మున్నీ తోటీ జరిపిస్తాను...” మహాసభ జ్ఞాన్‌చంద్‌గారి లీగ్‌ తండ్రితో అంటున్నారు. “బంగారు పట్టీలు చేయిస్తాను?”

“ధ్లార్‌, ఇవి పై పై మాటలు, థాంబికాలని వంకపెట్టి తీసిపారెయ్యకు...” అంటూ జ్ఞాన్‌చంద్‌పై దాడి చేస్తారు.

ఒకవైపు నేషనల్‌ గార్డ్‌ గోడల మీద “పాకిస్తాన్‌ జిందాబాద్‌..” అని రాతలు రాస్తే అటువైపు, "సేవక్‌ సంఘ్‌” వాటిని చెరిపి.. “అఖంద్‌ భారత్‌..” అని రాసేస్తారు. ఇవన్నీ పాకిస్తాన్‌, భారత్‌తో లావాదేవీలు జరుపుతున్నప్పటి సందర్భంలోని సంఘటనలు, మాటలు ఒక వాస్యంలా వుండేవి.

అబ్బా ఇంకా రూప్‌చంద్‌, వీరి మాటలు విని సన్నగా నవ్వుకొని అందరిని ఒకటిగా వుంచే ప్రయత్నం చేసేవారు. అమ్మ, చాచీ రాజకీయ విషయాలకు దూరంగా వుంటూ పసుపు, ధనియాలు, కూతుళ్ల పెళ్లిళ్లకు కట్టకానుకల గురించి మాట్లాడుకునేవారు. ఇక కోడళ్ళేమో ఒకరి ఫ్యాషన్లను మరొకరు ఎలా నకలు చేయాలి అన్న అవకాశాల కోసం ఎదురు చూసేవారు. డాక్టర్‌ సాహెబ్‌ దగ్గరి నుండి వెచ్చాలు తెప్పించుకోవడమే కాదు, మందులు కూడా తెప్పించుకునే వారు. ప్రతి రోజు ఏదో వంకతో తుమ్ము వచ్చినా, దాక్టర్‌ సాబ్‌ దగ్గరికి పరిగెత్తడం, ఒంట్లో చిన్నపాటి నలతగా వున్న దాక్టర్‌ గారు. ఇక అమ్మ పప్పు, రొట్టె చెయ్యడం మొదలు పెడుతుందో లేదో డాక్టర్‌ సొబ్‌కు కబురెళ్లి పోతుంది, భోజనానికి రమ్మని. కబురందడమే ఆలస్యం దాక్టర్‌ సాహెబ్‌ తన మనవళ్ల సైన్యాన్ని వెంటేసుకొని పొలోమంటూ వచ్చేస్తారు.

వెళ్లే సమయాన... “భోజనం చెయ్యకూడదు సుమా! విన్నారా..” అంటూ భార్య హెచ్చరిస్తుంది.

“అది సరే, మరైతే ఫీజెలా వసూలయ్యేది చూడు! లాలా, ఇంకా చున్నీని పంపించు..” అని బదులిచ్చేవారు. తెలి దా. రూప్‌కుమార్‌ దబ్బీకార్‌

“అయ్యో రామా! మీకే మాత్రం లజ్జ రాదు..” అని విసుక్కుంటుంది. కానీ అసలు మజా ఎప్పుడొస్తుందో తెలుసా? ఎప్పుడైతే అమ్మ ఒంట్లో నలతగా వుందని గాభరాపడి వణికి పోతుందో చూడాలి.. “వద్దు నాయనా వద్దు ఈ జోకర్‌ దగ్గర చికిత్సనా! నేను చూపించుకోను" అంటూ మారాం చేస్తుంది. కానీ ఇంటి డాక్టర్‌ను వదిలి పట్టణానికి వెళ్లి ఎవరు తీసుకొస్తారు డాక్టర్‌ సాహెబ్‌ను అలా పిలవగానే ఇలా పరిగెత్తుకు వచ్చేస్తారు. “ఒక్కరే అలా పులావ్‌ మెక్కేస్తే ఆరోగ్యం పాడుగాదు?”” ఆయన గట్టిగా వారిస్తారు.. “మ్సీరలాగే తింటారు కదా. అందర్నీ మీలాగే అనుకుంటే ఎలా!” అని పర్షా వెనకనుంచి అమ్మ సణుగుతూ ఎదురు దాడి చేస్తుంది. “అరే ఒంట్లో బాగులేదనడం ఒక వంక మాత్రమే. మీరు ఉన్న ఫలానా నన్ను రమ్మంటే నేనే వచ్చేస్తాను గదా. ఈ నాటకాలన్నీ ఎందుకు ఆడటం..?” అతను కళ్ళలో కాసింత కోపం నటిస్తూ ముసి ముసి నవ్వులు పోసాగాడు. అమ్మకు ఒళ్ళు మండి చెయ్యి వెనక్కు లాక్కొని ఏవో మాటలు వినిపిస్తుంటుంది. అబ్బా నవ్వుతూ వుండిపోతాడు. “ఒక్క రోగిని చూడటానికని వస్తే ఇంట్లో వున్న రోగులందరూ వరస కట్టి నిలబడిపోతారు. ఒకడు కడుపు నొప్పి అంటాడు. మరొకడు పుండు మీద తొక్క ఒలిచిపోయి పచ్చి గయ్యిందంటాడు. ఒకరికి చెవి పోటు, ఇంకొకరికి ముక్కు వాచిపోతుంది.” “ఇదేం బాధ డిప్యూటీ సాహెబ్‌, ఒకరిద్దరికి ఇంత విషమిచ్చేస్తాను, సరిపోతుంది. నన్నేమైనా పశువుల డాక్టర్‌ అనుకున్నారా? దేశంలో వున్న పశువులన్నీ ఇక్కడికే ఎగబడి వచ్చేసాయి...” అని రోగుల వైపు చూస్తూ లోలోన నవ్వుకుంటూ వుంటారు. కొత్త శిశువు పుట్టడానికి సిద్ధంగా వుంటే ఇలా అంటారు “ఉచితంగా వచ్చే డాక్టరున్నాడు కదా.. అంటూ ఏడి, అందరికి చెప్పండి సార్‌ వొకడున్నాదని.” కానీ ఎవరికైనా ప్రసవపు నొప్పులు అలా మొదలవుతాయో లేదో వారి వరండా నుంచి మా వరండాకు చక్కర్లు కొట్టడం మొదలవుతుంది. అరుస్తూ అందరినీ హైరానా పెట్టిస్తారు. ఆ భయానికి ఇరుగు పొరుగు రావడానికి కూడా కష్టమవుతుంది.

ఎలాగైతే శిశువు మొదటి కేరింత ఈయన చెవుల పడుతుందో, అంతే వరండా నుంచి దర్వాజా దగ్గరకు, దర్వాజా నుండి గది లోపలికి వచ్చేస్తారు. ఈయనతో పాటు అబ్బా కూడా కంగారుగా వచ్చేస్తాడు. ఆడాళ్ళంతా నెత్తి నోరు కొట్టుకుంటూ, విసుక్కుంటూ పర్దాలోకి వెళ్ళిపోతారు. శిశువు నాడి చూసి తల్లి వీపు మీద చరుస్తూ, “వహ్‌ మేరీ రేపెక్కడికెళ్లావ్‌...? తం

శేర్‌నీ.. యని శిశువు బొద్దుపేగును కోసి స్నానం చేయించడం మొదలు పెడతారు. అబ్బా బెదురు బెదురుగానే ఆయా లాంటి పనుల్లో సహాయం అందిస్తాడు. ఇక అమ్మ అరవడం మొదలుపెడుతుంది. అల్లాహ్‌ ఇదేమి విచిత్రం, 'జచ్చా - బచ్చా' దగ్గర ఈ మగాళ్లకేం పని?

పరిసరాల్లో వేడి పుట్టించి ఇద్దరూ చివాట్లు తిని పిల్లల్లా బయటికి పరుగెత్తుతారు.

అబ్బా పక్షవాతానికి గురైనపుడు రూప్‌చంద్‌జీ ఆస్పత్రి నుండి రిటైర్‌ అయి వున్నారు. అప్పటినుండి ఆయన ప్రాక్టీస్‌ అంతా స్వంతానికి మరి మా ఇంటికి మాత్రమే పరిమితమై పోయింది. ఆ సమయంలో చికిత్స మాత్రం వేరే డాక్టర్లు చేసినా నర్స్‌తో పాటు అమ్మ ఇంకా డాక్టర్‌ సాహెబ్‌ మాత్రమే మేల్మొని ఉందేవారు. ఎప్పుడైతే అబ్బా చివరి కర్మలు చేసి వచ్చారో తరాలుగా వచ్చే (ఢేమ, అభిమానంతో పాటు బాధ్యత కూడా భుజాలపై వేసుకున్నారు. పిల్లల ఫీజులు మాఫీ చేయించడానికి స్కూలుకు పరుగులు తీసేవారు. పిల్లల పెళ్లిళ్లకు కట్నం కోసం జ్ఞాన్‌చంద్‌ నోరు మూయించేవాడు. ఇంట్లో ఎలాంటి విశేషమైన కార్యం జరిగినా అది డాక్టర్‌ సాహెబ్‌ సలహా మేరకే జరిగేది. ఇంటి పడమటి మూలను కూలగొట్టి రెండు గదులు పెంచి వేయాలన్న ప్రశ్న తలెత్తినప్పుడు అది దాక్టర్‌ సాహెబ్‌ సలహా మేరకే కూలగొట్టించడం జరిగింది.

“దాంతో రెండు గదులు పైన వేసి పెంచుకోండి” అని ఆయన సలహా ఇచ్చాడు. దానిని స్వీకరించడం జరిగింది. ఫజన్‌ ఎఫ్‌.ఏ.లో సైన్స్‌ తీసుకోవడానికి సిద్ధంగా లేకుంటే డాక్టర్‌ సాహెబ్‌ చెప్పు తీసుకొని వెంటబడితేగాని గొడవ పరిష్కారం కాలేదు. ఫరీదా మొగుడితో కొట్లాడి ఇంటికొచ్చి కూర్చుంది. డాక్టర్‌ సాహబ్‌ దగ్గరికి ఆమె భర్త చేరిండు, మరుసటి రోజు ఆయన రెండవ కోడలు షీలా పెళ్ళై వచ్చిన తర్వాత, 'ఆయా సమస్య కూడా కొలిక్కి వచ్చేసింది. పాపం బేచారీ, ఒకరోజు ఆస్పత్రి నుండి పారిపోయి వచ్చింది. ఫీజు ఇవ్వడం దేవుడెరుగు ఆపైన ఆరవ రోజే కుర్తా టోపీ వెంట తీసుకొని వచ్చింది.

అటువంటి గాఢానుబంధాల మధ్య ఇప్పుడు ఛబ్బా కొట్లాడి వస్తే ఇంతలా స్వాగత సత్మారాలా! ఎలాగైతే రణరంగం గెలిచివచ్చిన ఒక మహాయోధుడిలా మర్యాద జరిగింది. అందరూ అతని గొప్పదనాన్ని తెలుసుకోవాలనే కుతూహలం చూపుతున్నారు. యువకుల ముందు అమ్మ గొప్ప విజయం సాధించినట్లు అమాయకంగా ప్రదర్శన ఇవ్వసాగింది. ఈ మార్పు ఈ రోజుది అని కాదు. ఎప్పుడైతే 15, ఆగస్టు నుండి డాక్టర్‌ సాహెబ్‌ గారి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగిరిందో, తమ ఇంటి మీద లీగ్‌ జెండా వేళ్తాడసాగిందో అప్పట్నుంచి వారి నోరు మూతపడింది. ఈ జండాల మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడింది. దీని భయంకరమైన లోతుల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ 40 దా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

లోలోన కుమిలిపోతూ వుంటుంది. మళ్ళీ శరణార్థుల సంఖ్య పెరగసాగింది. పెద్ద కోడలు తల్లిగారి వైపు వారు బహావల్పూర్‌ నుండి దోపిడీకి గురై అన్నీ కోల్పోయి ఏదో విధంగా (ప్రాణాలు కాపాడుకొని రాగానే ఈ అగాధం వెడల్పు మరింత పెరిగింది. అలాగే రావల్పిండి నుండి నిర్మల అత్త వైపు బంధువులు స్పృహ తప్పిన అవస్థలో వచ్చిన తర్వాత ఈ అగాధం లోతుల్లో కొండచిలువలు బుసకొట్టసాగాయి. చిన్న వదిన తన పిల్లవానికి కడుపు నొప్పియని చూపించటానికి పంపిస్తే, షీల వదిన తమ నౌకర్‌ను తరిమేసింది.

ఈ విషయాన్ని తీసుకొని ఎవ్వరూ కూడా ఎలాంటి వివాదం రేపి రెచ్చగొట్టి సమస్యను పెద్దగా చేయలేదు. ఇంట్లో అందరూ ఒక్కసారిగా అటువైపు వెళ్లడం మానేసారు. పెద్ద వదిన ఐతే తన హిస్టీరియా ఫిట్స్‌ మరిచి హడావుడిగా బట్టలు సర్దడం మొదలుపెట్టింది.

“నా ట్రంకు పెట్టెను మాత్రం తాకకండి?” చివరికి అమ్మ నోరు తెరిచింది దాంతో అందరూ అవాక్కయి చూస్తుండి పోయారు.

“ఏం నువ్వు రావా 7” పెద్దన్నయ్య అవేశంగా అన్నాడు.

“ఈ వయసులో సింధ్‌కు వెళ్లి చావాలా... ఈ రాజీ పడే బళుకు నాకెందుకు?”

“అయితే డాకేకు సాంజ్‌లే దగ్గరికెళ్ళిపో..”

“ఆమె డాకేకు ఎందుకెళ్తుంది. అక్కడికెళ్లి ఏమైనా బెంగాలీలా వరన్నం పిసికి పిసికి తినదానికా?” సాంజ్లి అత్త కూడ వెటకారంగా అంది.

“లయితే ఫరీదా దగ్గరికి రావల్పిండి వెళ్ళు..” ఖాలా చెప్పింది.. “తౌబా మేరీ.. అల్లాహ్‌ పవిత్రమైన పంజాబీల చేతుల మీదుగా నేలను అపవిత్రం చేయించకు, పాపిష్టి మాటలు మాట్లాడే వారు నరకానికి పోతారు..” ఈ రోజు, ఎన్నడూ నోరు తెరవని మా అమ్మ చిటపటలాడసాగింది.

సామెతలు, మాటలతో వాతావరణం వేడెక్కసాగింది. ఐనా మాటల తాకిడి తగ్గడం లేదు. మా అమ్మ ముఖం కాస్త కోపంతో ఎర్రబడింది.

“పిల్లల్లా మాట్లాడుతున్నారు.” నేషనల్‌ గార్జ్‌ సర్దార్‌ అలీ మధ్యలో జోక్యం చేసుకున్నారు.

“తలా తోక లేని మాటలు ఏమనుకుంటున్నారు. ఇక్కడే వుండి చస్తారా ఏమైనా 1?” మీరెళ్ళండి. ఇప్పుడు నేనెక్కడికి వెళ్తాను చివరి ఘడియల్లో,

అయితే చివరి రోజుల్లో కాఫిర్ల తోటి చివరి కర్మలు చేయించుకుంటావా? ఖాలా బీ మూటలు లెక్కబెడుతూ పోతూ వుంది. మూటల్లో బంగారం, వెండి నగలతో రేపెక్కడికెళ్తావ్‌...? శ్రే

సహా కరక్‌ పళ్ళపొడి, మెంతిపొడి, ముల్తానీ మిట్టి దాకా వున్నాయి. ఈ వస్తువులను ఎంత డ్రేమగా గుందెలకత్తుకొని తీసుకువెళ్తుందంటే చూసేవారికి ఈ వస్తువులే లేకుంటే పాకిస్తాన్‌కు కరువు వచ్చేస్తుందా అన్న భ్రమ కలుగుతుంది. పెద్దన్నయ్య కోపంతో విసుక్కొని మూడుసార్లు పనికిమాలిన మూటలను విసిరేసాడు. ఐతే ఆమె ఈ ఆస్తులను తీసుకు వెళ్లకపోతే పాకిస్తాన్‌ పేద దేశంగా మిగిలిపోతుంది అన్న తీరులో ఆమె ప్రవర్తన వుంది. చిన్న చితకా సామాన్లు సర్దేసింది. వంట పాత్రలు గోనె సంచుల్లో మూట కట్టింది. మంచాలు విప్పి కట్ట కట్టింది. చూస్తూ చూస్తూ వుండగానే అన్నీ అమర్చి, పొందికగా వున్న ఇల్లు కాస్త చిందరవందరగా, పెంటకుప్పలా మారింది. ఇప్పుడు సామాన్లకు కాళ్ళొచ్చేసాయి. కాస్త సేద దీరడానికి కూర్చున్నాయా! అన్నట్లు వున్నాయి. కానీ ఎంతో సేపు అవి అలా వుండవు. తిరిగి నాట్యం చేస్తాయి. అమ్మ ట్రంకు పెట్టి మాత్రం ఎలా వుండేదో అలానే వుంది.

“ఆషా కోరిక ఇక్కడే రావాలని వుంటే ఎవరాపగలరు... చివరికి భాయి సాహెబ్‌ తన అభిప్రాయాన్ని తెలుపుతాడు. అమాయకపు మొహంతో వుండే మా అమ్మ శూన్యపు కళ్ళతో ఆకాశం వైపు చూడసాగింది. ఆమె తనలో తానే ప్రశ్చ్నించుకుంటుంది. ఎవరు చంపుతారు? మరి ఎప్పుడు చంపుతారు?”

“అమ్మకు మతి చెడింది.” ఈ వయసులో బుద్ధి నిలకడగా వుండదు. రెండవ సోదరుడు చెవిలో గుసగుసలు పోయాడు. వీళ్ళకేం తెలుసు ఈ కాఫిర్లు, అమాయకుల పైన ఇంకా అత్యాచారాలు చేస్తూనే వున్నారు. మన దేశమైత కనీసం ప్రాణాలకు ఆస్తులకు రక్షణ వుంటుంది.

నోరు మెదపని మా అమ్మ గనక ఒకవేళ నోరు తెరిస్తే తప్పకుండా ఈ మాటలు చెప్పేది ? “మన దేశం అంటే ఎవడబ్బ సొత్తు అది. మనుషులు ఎక్కడ వుంటే అదే వారి దేశం, ఏ నేల మీద పుట్టామో ఏ మట్టిలో పార్తాడి పెరిగి పెద్దయ్యామో.”

“అదే మన దేశం కాకపోతే మరి కేవలం ఓ నాలుగు రోజుల కోసం ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడ బతుకుదెరువు వెళ్లదీసే ఆ నేల మన దేశం అయిపోతుందా? ఇంకా ఎవరికీ తెలుసు, అక్కణ్లుంచి కూడా ఎవరైనా తరిమేస్తే?!

వెళ్ళండి వెళ్లి మరో చోట కొత్త దేశం ఏర్పాటు చేసుకోండి... అని చెబితే, ఇక్కడే నా బతుకు ఇంతవరకు వెల్లదీశాను. ఓ చిన్న గాలివాటు వచ్చింది. దేశంలో వున్న కొట్లాటలు సమస్యలు ముగిసిపోతాయి. దేశ నాశనం కానీ, దాని పునర్చిర్మాణం కానీ ఏమైనా తియ్యని అనుభవాలను మిగిల్చే ఆట కాదు కదా, ఒక సమయముండే, మొఘల్‌లు

తమ దేశాన్ని వీడి కొత్త దేశం నిర్మించుకోవడానికి ఇక్కడికి నచ్చారు కదా! ఈ రోజు శం స దా. రూప్‌కుమార్‌ దబ్బీకార్‌

మళ్లీ దేశం కోసం బయళ్దేరాలా?! అటువంటప్పుడు దాన్ని దేశం అనాలా? కాలి చెప్పు అనాలా? కాస్త నొప్పి కలిగిందో లేదో తీసి పారెయ్యడం, మళ్లీ కొత్తవి వేసుకున్నాం అంటే సరిపోదు. కానీ అమ్మ మౌనంగానే వుంది. ఇప్పుడు వారి మొహాల్లో ఇంతకు ముందు కన్నా అలసట ఎక్కువగా కనబడుతుంది. ఎలాగంటే కొన్ని వందల సంవత్సరాల నుండి దేశం కోసం అన్వేషిస్తూ, మట్టిని వడబోస్తూ, వడబోస్తూ అలసిపోయి కూర్చున్నారా, కానీ ఈ అన్వేషణలో తమని తాము కూడా కోల్పోయారు. పెద్ద గాలిదుమారం తుఫానులో కూదా చెక్కు చెదరక తన పేర్లను బలంగానే వుంచే మరర్రిచెట్టులా అమ్మ తాను కూర్చున్న చోటే నిబ్బరంగా కూర్చుంది. కానీ కూతుళ్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లు ఏకమొత్తంగా చెప్పాలంటే జన సమూహం అంతా కదిలి గేటు దాటి, పోలీసు సంరక్షణలో లారీల్లో ఎక్కి కూర్చోగానే ఈమె గుండె ముక్కలై చెదిరి పోసాగాయి. విచలిత మనస్కురాలై, అలజడి చూపులతో అగాధానికి ఆవలి వైపు నిస్సహాయురాలై చూడసాగింది దూరాన నేల బద్దలవడానికి ముందు కల్లోల గగనంలో మబ్బుతునకలా దారి పక్కనే వున్న ఆ ఇళ్లు ఇప్పుడు ఎంతో దూరంగా కనబడసాగింది. రూప్‌చంద్‌ వరండా బావురుమన్నట్లుగా వుంది. ఒకరిద్దరు పిల్లలు బయటికి వచ్చారు గాని వాళ్ళను కొన్ని చేతులు పట్టి లాక్కుంటూ లోపలికి తీసుకెళ్లిపోయాయి. ఆ తలుపుల చాటున చెమ్మగిల్లి, కన్నీళ్లు నిండిన అమ్మ కళ్ళ నుండి ఆ కళ్ళు తప్పించుకోలేకపోయాయి. లారీలు దుమ్ము రేపుకుంటూ మొత్తం ఇంటినే లేపుకుని వెళ్లిపోయాయి. రేగిన దుమ్ములో అస్తిత్వాల మూలాలున్నాయా? కాని ఓ మూల శవంలా పడివున్న లజ్జ దీర్టమైన శ్వాస తీసుకుంది. తలుపులు తెరుచుకున్నాయి. బరువైన అడుగులతో రూప్‌చంద్‌జీ దొంగలా ఎదురుగా, ఖాళీగా పడివున్న ఇంటిని చూడటానికి బయటికొచ్చి కాసేపు ఆ ధూళి మేఘంలో ఎడబాసిన వదనాలను వెతికే ప్రయత్నం చేసాడు. కాని ఓడిపోయిన తన చూపుల్లో అపరాధ భావం నిండగా జీవం కోల్పోయిన తలుపుల గుండా, దారి తప్పుతూ తిరిగి అతని చూపులు నేలలోకి చొచ్చుకొనిపోయాయి.

జీవితం మొత్తంలో గడించిన వాటిని ఆ అల్లాహ ఇష్టానికే వదిలేసి వైభవం కోల్పోయిన వాకిట్లోకి వచ్చి నిలబడితే చంటి పాపలాంటి అమ్మ హృదయం భయంతో ముడుచుకు పోయింది. ఎలాగైతే నాలుగు వైపుల నుండి దయ్యాలు చుట్టుముట్టి తనను పట్టుకుంటాయా అన్నట్లు. ఆ క్షణంలో కళ్ళు తిరిగి స్తంభానికానుకుంది. ఆసరా కోసం ముందు దృశ్యం కనపడగానే కడుపులోని కార్టం నోటిలోకి వచ్చింది. ఈ గదిలోనే కదా పెళ్ళికొడుకు ఒడిని తనదిగా చేసికొని వచ్చాను. ఇక్కడే కదా మొగ్గలాంటి బెదురు కన్నుల ముగ్ధ అమాయకమైన వదనంతో పెళ్ళికూతురిలా వచ్చింది. తన చంద్రబింబం లాంటి రేపెక్కడికెళ్తావ్‌...? శ్రి

ముఖంపై నుండి ముసుగు తొలిగించబడినది ఇక్కడే కదా. అతను జీవితాంతం తోడు వుంటానని బాస చేసింది. ఆ ఎదురుగా, మూలనున్న గదిలోనే తొలి కాన్సు జరిగింది. ఆ మూలనే మాయిముంతను నేలలో నిక్షిష్తం చేసింది. పెద్ద కూతురు జ్ఞాపకం ఒక్కసారిగా జ్వాలలా ఎగసి గుండెను చుట్టుకుంది. ఒక్కటి కాదు, రెండు కాదు అలా పది వరకు జరిగాయి. పది ఆత్మలు తమ మొదటి శ్వాస ఇక్కడే తీసుకున్నాయి. పది రక్తమాంసాల ముద్దలు ఇక్కడే కదా మనుషులుగా మూర్తీభవించి ఈ పవిత్రమైన గదిలో జన్మలెత్తాయి. వాళ్ళే గదా ఈ పవిత్రమైన గర్భగుడిని ఈ రోజు వదిలేసి వెళ్లిపోయారు. శాంతి, సుఖజీవనం వెతుకులాటలో, రూపాయికి నాలుగు కిలోల గోధుమల కోసం పరుగులు తీసింది. తమ చిన్ని చిన్ని ముద్దుగుమ్మల నాజూకైన, సొగపైన *ఆ.. గూ, ఆగూ అన్న సుస్వరాల శబ్దాలు ఇప్పటికీ ఈ గదిలో ప్రతిధ్వనిస్తూనే వున్నాయి. ఒక్కసారిగా ఆ గదిలోకి వెళ్లి తన ఒడిని పరిచింది. కానీ ఆ ఒడి శూన్యంగానే వుండి పోయింది. ఏ ఒడినైతే ముత్తయిదువులు పవిత్రంగా భావించి, తాకి ఆ చేతిని తమ సాత్తికడుపులపై వుంచుకునేవారు. ఆ ఒడి ఈ సమయం అనాథలా బావురుమంటుంది. గది ఖాళీగా వుండి విషాద వీచికలు వీస్తుంది. పిచ్చిదానిలా అక్కడి నుండి వెనక్కి తిరిగింది. తాను వెనుతిరిగింది కానీ ఆమె కాళ్ళు కాదని మొరాయించాయి. వేరే గదిలో తటపటాయిస్తూ వుండిపోయింది. ఇక్కదే జీవిత భాగస్వామి యాఖై సంవత్సరాలు కాపురం చేసి ముఖం చాటేసాడు. ఈ దర్వాజా ఎదురు గానే గదా కఫన్‌లో చుట్టి శవాన్ని పడుకోబెట్టింది. పరివారమంతా చుట్టూ నిలబడి చూస్తూ వుండిపోయింది. అదృష్టవంతుడు, ఐనవాళ్ళందరూ ఎదురుగా వుండగానే పరలోక ప్రాప్తి చెందాడు. కానీ తన జీవిత భాగస్వామిని మాత్రం వదిలివెళ్ళ్లాడు. ఈ రోజు తాను కఫన్‌ లేని శవంలా, అనాథలా పడివుంది. ఎక్కడైతే తన పెనిమిటి తల దగ్గర వణుకుతున్న చేతులతో సంవత్సరాలుగా దీపం వెలిగించేదో అక్కదే కాళ్లు జవాబుగా కూలబడిపోయాయి. ఈ రోజు దీపంలో నూనె లేదు, వత్తి కూడా పూర్తిగా కాలిపోయింది.

ఎదురుగా రూప్‌చంద్‌ తన వరండాలో వేగంగా పచార్లు చేస్తూ పెళ్ళాం, పిల్లలను తిట్టసాగాడు. నౌకర్లను, ప్రభుత్వాన్ని తన ఎదురుగా బోసిపోయివున్న రోడ్డును రాయి రప్పను, కత్తులు కటార్లను అంతేకాదు పూర్తి ప్రపంచాన్ని తన తిట్ల దండకంతో కుమ్మేయసాగాడు. ఇంకా విశేష మేమిటంటే, ఇతనే స్వయంగా ఈ అనర్దానికి కారణమన్నట్లు రోడ్డుకావల ఖాళీగా పడివున్న ఆ ఇల్లు ఇతన్ని మొహం పట్టి వెక్కిరించసాగింది. అనేక సంఘటనలను తన మస్తిష్కం లోంచి తీసి పారెయ్యాలని పూర్తి శక్తితో వాటిని పెకిలించి వేయాలని ప్రయత్నించసాగాడు. కానీ తనవల్ల సాధ్యం కాక పరాజితుడై కుప్పకూలిపోయాడు. వంచనకు గురిచేసే వేర్ల మాదిరి, ఏ విషయమైతే తత్తే దా. రూప్‌ కుమార్‌ డట్బీకార్‌

అతని అస్తిత్వంలో గూడు కట్టుకుందో అది తన సర్వ శక్తులతో అతన్ని పట్టి లాగుతున్నాయి. ఆ శక్తులు తన మాంసపు కండరాలను లాక్కుని వస్తున్నాయా? అన్న బాధతో విలవిల్లాడిపోయాడు. ఒక్కసారిగా అతని తిట్ల దండకం ఆగిపోయింది. దానితో పాటు పచార్లు కొట్టడం ఆగిపోయింది.

చివరికి మోటారు వాహనంలో కూర్చొని వెళ్ళిపోయాడు.

చీకటి పడింది. సందు మూలమలుపులో నిశ్శబ్దం రాజ్యమేలసాగింది. వెనక దర్వాజా నుండి రూప్‌చంద్‌ భార్య వడ్డించబడిన రెండు ప్లేట్లను ఒకదానిపై ఒకటి వుంచి లోపలికి దొంగలా వచ్చింది. ఇద్దరు వృద్ధ స్రీలు మౌనంగా ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. నోళ్లు మౌనం వహించాయి, కాని కళ్ళు మాత్రం మాట్లాడుతూనే వున్నాయి. రెండు ప్లేట్లలోని అన్నం ఎలా వుందో అలానే వుండిపోయింది. ఆడాళ్ళు ఎప్పుడైతే వేరే వాళ్లకు వంకలు పెట్టాలని చూస్తారో అప్పుడు నాలుకలు కత్తెరలా నడుస్తాయి పాపం. భావోద్వేగాలు దాడి చేస్తే మాత్రం నోటికి తాళాలు పడతాయి.

రాత్రంతా జ్ఞాపకాల దొంతర్లు ఎడతెరిపిలేకుండా ఎందుకో ఒంటరిదాన్ని చేసి ఒక్కసారిగా దాడి చేయసాగాయి. ఏమవుతుందో ఎవరికి తెలుసు, దారి మధ్యలోనే అందరూ మృత్యువాత పడరని, ఈ మధ్య కాలంలో ఎన్ని రైళ్లు పట్టాలు తప్పిపోవడం లేదు, యాఖై సంవత్సరాలు రక్తం ధారపోసి పొలాలను పండించాము. మరి ఈ రోజు కొత్త నేల అన్వేషణలో కట్టుబట్టలతో దేశాన్నే వదిలి వెళ్లాల్సి వచ్చిందా. ఎవరికి తెలుసు కొత్త నేల ఈ మొక్కలకు కలిసి వస్తాయో లేదో అమాయకమైన ఈ దేశపు మొక్కలు మృత్యువాత పడవు కదా? చిన్న కోడలు నిండు గర్భిణీ. తెలియదు ఏ అడవిలో బాలింతగా ఆశ్రయం పొందాల్సి వస్తుందో, ఇల్లు, కుటుంబం, ఉద్యోగం వ్యాపారం అన్నీ వదిలేసుకొని పోయారు. కొత్త దేశంలో కాకులు, గద్దలు ఏమైనా వదిలేసి వుంటాయా, ఈ ప్రాణం అలసిపోయేలోగా తిరిగి వస్తారా? తిరిగి వచ్చాక తమ మూలాలను గట్టిపర్చుకోవదానికి అవకాశం దొరుకుతుందో? లేదో? ఈ ముసలి ప్రాణం వాళ్ళు తిరిగి వచ్చే సమయానికి జీవించివుంటుందో లేదో, ఎవ్వరికీ తెలియదు.

అమ్మ ఇప్పుడు ప్రాణం లేని రాతి బొమ్మ. నిద్ర మాట దేవుడెరుగు రాత్రంతా బిడ్డల తెగిపడిన శవాలు. యవ్వనంలో వున్న కోడళ్లను నగ్నంగా ఊరేగించడం, మనవళ్ల పిర్రల మీద వాతలు కమిలి, తేలిన బొబ్బలు అన్నీ మనసు తెర మీద కదలాడి ముసలి శరీరం వణికి పోయింది. ఎప్పుడు కునుకు పట్టిందో తెలియదు, దర్వాజా దగ్గర ఏదో పెద్ద గొడవ జరుగుతున్నదన్న అనుమానం కలిగింది. ప్రాణం మీద తీపి లేకపోవచ్చు కానీ నూనె లేక ఆరిపోయే సమయంలో దీపం కూడా వణికిపోతోంది. చావు రేపెక్కడికెళ్ళావ్‌...? శీర్‌

సాధారణమైనదైనా అది ఎంత నిర్ణయగా వుంటుందంటే మనిషి రూపంలో దయ్యమై ఎదురు పడుతుంది. వృద్ధ స్త్రీలైనా జుట్టు పట్టి రోడ్లెంబడి ఈడ్చుకుంటూ లాక్కెళతారని విన్నాను. అంతేకాదు చర్మం ఒలిచి, ఎముకలు బయటికి కనబడేటట్లు చేసి ఎంతగా హింసిస్తారంటే చివరికి ఆ యాతన చూసి యమదూతలు కూడా భయపడిపోతారు.

దర్వాజా మీద చప్పుడు ఎక్కువ కాసాగింది. యమరాజుకు తొందరెక్కువైంది. మళ్ళీ అంతలోనే తలుపుకున్న సంకెళ్లు వాటంతట అవే తెరుచుకోసాగాయి. వత్తులు వెలగసొగాయి. దూరంగా వున్న బావి అడుగు నుండి ఎవరిదో గొంతు వినిపించింది. బహుశా పెద్ద కొడుకు పిలుస్తున్నాడు. కాదు, కాదు చిన్న కొడుకు, నడిపి కొడుకుల గొంతులు అవి ధ్వంసమైన మరో ప్రపంచం మూల నుండి అయితే అందరికి వారి దేశం దొరికిపోయిందా? ఇంత త్వరగా సంజ్ఞా, వెనకాల చిన్నోడు సరిగానే నిలబడియున్నారు. ఒళ్ళో పిల్లల్ని ఎత్తుకొని కోడళ్ళు, మళ్ళీ ఒక్కసారిగా పూర్తి ఇంటి వాతావరణం పరివారం తిరిగి జీవం పోసుకుంది. అన్ని ఆత్మలు మేల్మొన్నాయి. దుఃఖితురాలైన తల్లి దగ్గరికి చేరుకుంటున్నాయి. చిన్న పెద్ద చేతులు (ప్రేమతో స్పర్శించసాగాయి. ఎండిన పెదవుల మీద తిరిగి కొత్త చివుర్లు పూసాయి. ఆనందం అవధులు లేకుండా గజిబిజిగా చీకట్లో గంతులేస్తూ మాయమవ్వసాగాయి. అప్పుడు కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. పరిచయం వున్న వేళ్ళు నుదుటి మీద పాకసాగాయి.

“అరె వదినా నన్ను అలా పిలిస్తే వచ్చేసే వాణ్ని గదా. ఈ నాటకాలన్నీ ఎందుకేస్తావు..” రూప్‌చంద్‌జీ పర్టా వెనక నుండి సరదాగా చెప్పసాగాడు.

“శాన్సు వదిన కనీసం ఈ రోజైనా ఫీజు ఇప్పించు. చూడు నీ పనికిమారిన వెధవలను తీసుకురావడానికి జంక్షన్‌కు వెళ్లి పట్టుకొచ్చాను. పరిగెత్తుకు పోతున్నారు బద్మాష్‌ గాళ్ళు, పోలీస్‌ సూపరింటెండెంట్‌ను కూడా నమ్మటం లేదు.”

ఎదురుగా వున్న దృశ్యం మళ్లీ ముసలి పెదవుల మీద కొత్త ఆశల వసంతాన్ని పూయించింది. నెమ్మదిగా లేచి కూర్చుంది, కాసేపు మౌనంగా వుండిపోయింది. రెండు వెచ్చని ముత్యాలు ఆమె కంటి నుండి జారి ముడతలు పడిన రూప్‌చంద్‌ చేతి మీదకి రాలిపడ్డాయి,

ఛం శం డా. రూప్‌కుమార్‌ దల్బీకార్‌

న్‌ భ్‌ ( య్‌ యు ' _జమ్మూలోని పురమండల్‌ గ్రామంలో 17 ఏప్రిల్‌, త 1940లో జన్మించారు. డోగ్రీ భాషలో ఆధునిక పద్మా సచ్‌దేవ్‌ సాహిత్య రచనలు చేసిన మొట్టమొదటి కవయిత్రి. సుప్రసిద్ధ కవయిత్రి, నవలాకారిణి, కథా రచయిత్రి. హిందీలో కూడా రచనలు చేశారు. 1971లో కనిత్వంలో సాహిత్య అకాడమి అవార్డు పొందారు. భారత ప్రభుత్వం ద్వారా 2001లో పద్మశ్రీ అవార్డును, మధ్యప్రదేశ్‌ రాష్ట ప్రభుత్వం ద్వారా కబీర్‌ సమ్మాన్‌ పురస్కారాన్ని అందుకున్నారు... ఇతర అనేక విశిష్ట పురస్కారాలు కూడా అందుకున్నారు. ప్రముఖ రచనలు : 'మేరీ కవిత మేరే గీత్‌, 'తవి తె రూన్న్దా, 'పొటా పొటా నింబలొతో పాటు అరవైకి పైగా పుస్తకాలను ప్రచురించారు. 'కల్‌ కహా జాహోగి” పేరుతొ డోగ్రి కథను తానే హిందీలో అనువదించారు. ప్రీతో అనే ఒక పేద యువతి జీవితాన్ని ఆమెను చేరదీసిన మరో ఇద్దరి స్నేహితురాళ్ల వ్యక్తిత్వాలు ఈ కథలో అల్లబడినాయి. రేపెక్కడికెళ్తావ్‌...? త్తి

రేపెక్కడికెళ్తావ్‌ !

ఉదయపు తొలి కిరణంలా నా వాకిట్లోకి సుస్పరమై వాలింది. వాలిన మరుక్షణమే చెదిరిన కాంతిపుంజమై నలుదిశలా పాకింది. స్వర్ణకాంతులు వెలిగి వాకిలి మూలమూలకు వ్యాపించాయి. విచ్చుకున్న కాంతిపుంజం తుళ్లిపడుతూ ఎప్పుడైతే ఒద్దికగా ఒదిగిపోయిందో, ఒక గాధమైన కాంతి బిందువు వాకిలి మధ్యలో అల్లరి చేస్తూ నిలిచి పోయింది. ఇంకా తన నిష్మల్మషపు నవ్వు వాకిలి మల్లెతోటలో విరిసిన పూల పరిమళమై నలువైపులా వ్యాపించింది.

తన పేరు ప్రీత్‌. నేను ప్రీతో అని ముద్దుగా పిలిచేదాన్ని.

అసలు జరిగిందేమంటే నా పాత స్నేహితురాలొకరు తన ఇంటికి పోతూ ఒక ప్రస్తావన ముందుకు తీసుకు వచ్చింది. ప్రీతోను కాన్ని రోజులకు నా ఇంట్లో ఉండనివ్వమని కోరింది. అందుకు నేను వెంటనే సరేనన్నాను. ఎలాగూ నా భర్త వేరే దేశంలో వున్నాడు. ఇల్లు ఒంటరితనంతో చికాకు కలిగించేది. నా స్నేహితురాలికి కుడిభుజంలా వుందేది ప్రీతో. ఆ విషయం నాకు బాగా తెలుసు. కిండర్‌ గార్డెన్‌ స్కూల్‌ పిల్లలు ఆమెను 'తీతో' అని పలకరిస్తూ లోనికి ప్రవేశిస్తారు. దాంతో ప్రీతో వాళ్లకు ఆంటీగా, ఆరిందాలా మారిపోతుంది.

ప్రీతోకు ప్రీత్‌ అని పిలిపించుకోవాలనే సరదా వుండేది. స్కూల్‌ నుండి దిండు గిలాఫ వరకు ఏ పనైనా ప్రీతో అజమాయిషీలోనే. ఎప్పుడైతే మేడమ్‌ సెలవుల్లో ఇంటికెళ్ళడం జరిగేదో ప్రీతోను వెంట తీసుకెళ్లకపోవడంతో మేడమ్‌ పిసినిగొట్టుతనానికి విసుక్కునేది. ఈనా స్నేహితురాలు చిన్నప్పట్నుంచి తెగింపుగలది. ఎలాంటి భయం లేదు. ఒకసారి, “గోల్‌గప్పా' వాడితో జగడం జరిగింది. అప్పుడు మేడం గారి చెప్పుదెబ్బలతో వాడు పరుగుతీసాడు. వెంటనే మేమంతా 'గోల్‌గప్పా' బండి మీద ఒక్కుమ్మడిగా పడిపోయే శతి డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

వాళ్ళమే. కానీ, మేడంగారు బండి మీద అతడి స్థానంలో కూర్చొని ప్లేట్లలో మరీ సర్ది అందరికీ ఇవ్వసాగింది. ఈ సందడిలో గోల్‌గప్పాలు గాలిలో ఎగిరిపోయాయి. అప్పుడు తాను చింతపండు నీటిని ఎంతో ఇష్టంగా స్‌.. స్‌.. అంటూ శబ్దం చేస్తూ, చూపిస్తూ చెప్పింది, “ముహా నన్ను ఒంటరిగా వుండటం చూసి కన్ను గీటసాగాడు. నేను నాటు చెప్పు తీసుకొని వీపు చింతపండు చేస్తే ఒకటే పరుగు లంకించుకున్నాడు.” అప్పట్నుంచి ఆమెను మేము మేడమ్‌ అనే పిలుస్తున్నాము. అసలు పేరే మర్చిపోయాము. కానీ, మేడమ్‌ను ఎవరూ మర్చిపోలేదు. ఆ ప్రస్తావన నాకేమి సంతోషం కలిగించలేదు. కానీ, ప్రీతో రావడం వలన కాస్త ఇంటికి కళ వుంటుందని ఆలోచించాను. రెండు రోజుల క్రితమే మేడమ్‌ ట్రీతోను తీసుకొని నా ఇంటికి వచ్చింది. ఎన్నో విధాలుగా నచ్చచెబితే గాని మేడమ్‌ రైలు ఎక్కి కూర్చోలేదు. ప్రీతో, దాని సామాన్లు ప్రతి ఒక్కటీ జాగ్రత్తగా అందిస్తూ అలిసి కుపష్పయిపోయింది.

ఇంటికి రాగానే రెండు సొరిడాన్‌ మాత్రలు వేసుకొని పడుకుంటే, నేను కూడా ఏమీ అడగడం సరికాదని వూరుకున్నాను. మరుసటి రోజు ఇంకా తెల్లవారనే లేదు. కానీ, ఇంట్లో ఎవరో అపరిచిత వ్యక్తి నడక, హడావుడి ధ్వని రావడం మొదలయ్యింది. ఈ అపశబ్దాలను ఎలాగో సహిస్తాను గాని, బాత్‌రూమ్‌లో ఆగకుండా నీరు ఏకధాటిగా ప్రవహిస్తూ వుండటం చూసి ఇక ఆగలేక అడిగే ధైర్యం చేసాను. ఇనుప బకెట్లో నల్లా పూర్తిగా వదిలి వేస్తే పడే నీళ్ల చప్పుడు కలిగించే అసౌకర్యం బహుశా మరే దాని ద్వారా కలగదనుకుంటాను. పక్కలోనే పడుకొని కళ్ళు మూస్తూ, తెరుస్తూ గట్టిగా... అరిచాను. “ప్రీ, తో..”

“ఆం మేడమ్‌” అంది. తలకెక్కి కూర్చున్నట్లు అనిపించసాగింది. “ఖబడ్డార్‌ నన్ను మేడమ్‌ అంటే,” నేను కోపంతో, ఆవేశంతో ఆమె మీద అరవగానే అమాయకంగా చెప్పింది - “మరి ఏమని పిలవను మేడమ్‌ గారు..!”

“ముందు ఆ నల్లా బంద్‌ చెయ్‌! ఇక నుండి నువ్వు నన్ను దీదీ అని పిలవ్వచ్చు..” అన్నాను. ఎప్పుడొచ్చి నన్నల్లుకుందో నాకే తెలిసిరాలేదు. “దీదీ, దీదీ” అంటూ ఇల్లంతా ఒకటి చేసింది. నా ఉదార స్వభావం మీద నాకే కించిత్‌ గర్వం కలిగి ఉప్పాంగిపోయాను.

మళ్లీ ఆమె గతం జ్ఞాపకాల మూటలు కొన్ని నా ముందు పరుచుకున్నాయి.

ప్రీతో ఒక్కగానొక్క కూతురు. వారికి ముగ్గురు, నలుగురు అన్నదమ్ముల మధ్య ఒక్క సోదరి. కానీ, ఆమె తండ్రి వడ్రంగి. పని తక్కువ, తాగుబోతు ఎక్కున అనే తీరులో వుంటాడు. ఈమెకు కాస్త వయసు రాగానే నంబర్‌దార్‌ (వడ్డీలు నడిపేవాడు) కొడుక్కిచ్చి రేపెక్కడికెళ్తావ్‌...? శర

పెళ్లి జరిపించేసాడు. అతను చాలా కాలం నుంచి దమ్మూ, ఆస్మా రోగంతో బాధపడుతూ వున్నాడు. ఈ అన్యాయాన్ని ఎదిరించి ఎవరు ఎదురు నిలబడతారు. ఆమె సోదరులు తాగుబోతు తండ్రి చేతిలో దెబ్బలు తిని తిని, రెక్కలు రాగానే ఎగిరిపోయారు. ఇక తల్లి ఇంటిగోడల మాదిరి తానూ ఓ గోడలా వుండిపోయింది.

శోభనపు రాడ్రే సప్తపది సమయంలో హోమం నుండి వచ్చిన పొగ పీల్చి పీల్చి

పెళ్ళికొడుకు మహాశయుడికి దమ్ముతోటి ఫిట్స్‌ వచ్చినంత పనయి ఆస్పత్రి పాలయ్యాడు. ఇది కర్మ ఫలం. శోభనపు శయ్య పైన కూర్చొని ప్రీతో నిద్ర పోయింది. ఎవ్వరూ అటువైపు తొంగి కూడా చూడలేదు. తెల్లవారగానే అందరూ గుసగుసలు పోయారు. “నష్ట జాతకురాలు.. వచ్చీ రాగానే మొగుడి ప్రాణాల మీదికి తీసుకువచ్చింది. నంబర్‌దార్‌కు దీనివల్ల ఏం చెడు జరుగుతుందో అర్ధం కావడం లేదు. దీని అడుగు పడగానే ప్రాణాంతకమైంది.”

అప్పుడే మా మేడమ్‌ అక్కడికి చేరుకుంది. ఇంకా మొగుడు చావకముందే ప్రీతోను ఇంటికి తీసుకొని వచ్చేసింది. వూరు మొత్తంలో ఒంటరిదైపోయింది ప్రీతో. కానీ ఆమె చొరవ, దుందుడుకుతనం చూసి నంబర్‌దార్‌ ముక్కావదిలేసి లేచి నిలబడేవాడు. ఆమె తెగింపు, నిర్లక్ష్య వైఖరి చూసి ఆమెను వివాహమాడటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆమె ప్రతిష్ట ఎంతగా పెరిగిపోయిందంటే చివరికి పురోహితుడు కూడా ఆమె జన్మ ప్రీ తీసుకొని పోవడానికి నిరాకరించేవాడు. ఫలితంగా కుమారి గానే వుండిపోయింది. ప్రీతో కళ్ళలో ఈదులాడే కలలను మేడమ్‌ సులువుగానే తుడిచేసి, నగరానికి వచ్చి పిల్లల కోసం కిండర్‌ గార్టెన్‌ ప్రారంభించింది. దీంతో ప్రీతోకు అండ దొరికినట్లయి పూర్తిగా తన మనసును పిల్లల మీద లగ్నం చేసింది. మేడమ్‌ ఆమెను (పేమగానే చూసుకుంటుంది. కానీ ఆ (ఢేమ ఎవ్వరికీ తెలిసేది కాదు.

ఏ ప్రీత్‌ పెళ్లి పేరుతో ఏడడుగులు నడిచి దాంపత్య జీవితంలోకి సిగ్గుపడుతూ అడుగుపెట్టిందో... ప్రీత్‌ ప్రమాణాల సమయంలో అగ్నిసాక్షిగా, తాపానికి కరిగిపోయిందో ఆ ప్రీత్‌ ఎంతకాలం అదుపు ఆజ్జలో బందీగా వుంటుందోనన్న భయం నాలో ఆనాడే ఖచ్చితంగా కలిగిందని చెప్పాలి. నా ఇంట్లోకి రాగానే లభించిన కొద్ది సానుభూతి తోనే తిరిగి ఆమె కళ్ళలో కలల సంకేతాలు అల్లుకోసాగాయి. ప్రతి పనీ నవ్వుతూ తుళ్ళుతూ పూర్తి చేస్తుంది. రోజు మొత్తంలో ఐదారుసార్లు తల దువ్వుకుంటూ జాగ్రత్తగా హెయిర్‌ స్టైల్‌ చేస్తూ వుంటుంది. బొట్టు. బ్లిళ్లుతు?దిద్దుకునే గొప్ప మక్కువ వుంది. నేనాక రోజు అడిగాను ... “ప్రీతో, నువ్వు.జోత్ల్‌ దిద్దుకొని మళ్ళీ చెరిపిస్తావు ఎందుకని.”

50 " డా. రూప్‌కుమార్‌ డట్సీకార్‌

ఉదాసీనంగా జవాబిచ్చింది, “అతను చచ్చిపోయాడు గదా! కానీ దీదీ, నా మనసు బొట్టు పెట్టుకోవాలని తహతహలాడుతూ వుంటుంది” అని.

“అతనితో నీకేమి సంబంధం..? దాన్నేమైనా పెళ్లంటారా?” నేనన్నాను.

ఉత్సాహంతో అన్నది. అదే నేనంటున్నాను. కానీ, మేడమ్‌ ఎప్పుడూ ఎత్తిపొడుపు మాటలతో అద్దు చెబుతూ వుంటుంది. “ఎర్రబొట్టు ఎప్పుడూ ముత్తయిదువలే పెట్టుకోవాలి అని హెచ్చరిస్తుంది...”

“నువ్వు నల్లరంగు బొట్టు బిళ్ళ పెట్టుకో!”

శాను దీదీ.. నల్లరంగు బొట్టు బిళ్లనైతే పెట్టుకోవచ్చు. అతను చచ్చిపోయి ఎలాగూ ఏడాది గడిచిపోయింది. ఇప్పుడతని (ప్రేతాత్మ నన్ను ఇబ్బంది పెట్టలేదు.” ఇలా చెప్పి పగలబడి నవ్వసాగింది. ఎంతలా నవ్విందంటే ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి.

కారుతున్న ముక్కు చీదుకుంటూ, కళ్ళనీళ్లను తుడుచుకుంటూ చెప్పసాగింది? “ద్రిద్రీ ఒకవేళ అతను బతికేవుంటే నేను అస్సలు వూరు వదిలిపెట్టక పోదును.” పెళ్ళికి ముందు ఒకసారి అతను దారిలో నా చేయి పట్టుకొని చెప్పాడు.

“ప్రమాణం చెయ్యి ప్రీతి.. నన్ను వదిలిపెట్టి ఎన్నటికీ పోవు కదాొయని..

“ఫ్రీత్రో నీకు ఇంకా ఇరవై సంవత్సరాలు కూడా నిండలేదు” అని గుర్తు చేశా. “ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతావు? ఏ విధంగా చూసినా, నీ పెళ్లి కాలేదు అనిపిస్తుంది. నీ పెళ్లి నిర్ణయం మేడమ్‌ తెలిసి తెలిసి తీసుకున్నది. ఇక దీన్ని ఇక్కడితో వదిలెయ్యాల్సిందే!”

“ద్రిద్సి భర్త విషయంలో నేనేమైతే కలలు అల్లుకున్నానో ఆ కలల రాకుమారుదైతే ఇతను కాలేదు. విధి, ఆ కలల్ని ఎంతో నిరయగా నా కళ్ళ నుండి తుడిచిపెట్టేసింది. ఇప్పుడు ఆ కొత్త పలక మీద ఎవరో ఒకరు ప్రతిరోజు వచ్చి అస్పష్టంగానే ఏవో రేఖలు అద్ది కదిలిపోతారు. వాటికి ఏ రూపం ఆపాదించబడదు!”

నేను ఎంతో ప్రేమగా అడిగాను. “నీ దృష్టిలో ఎవరైనా వున్నారా ప్రీతో!”

“లేదు ..కానీ మనసు కోరుకుంటుంది, నేనెవరికో ఒకరికి నచ్చితే బాగుండును అని?”

“కాళ్ళు చేతులకు గోరింటాకు, పాపిటలో సింధూరం, ఎరుపు రంగులో పెళ్లి జోడా, కాటుక దిద్దిన కళ్ళు ఇలా సింగారించుకుని శోభనం జరగాలంటే అది నాతో కూడా జరిగిపోయింది. కానీ శోభ్హురోబ్టిక్‌రన్లా మ్‌ జరుగుతుంది. కానీ నేనతన్ని చూడనే లేదు.” న శేపెక్కడికెళ్తావ్‌...? ర ౧లాా రే

మ 1 ల 3

“*ఫ్టీత్రో వేడమ్‌ కిండర్‌ గార్జెన్‌ నీ అజమాయిషీలోనే కదా నడిచేది, ఒకవేళ నీకెవరైనా నచ్చితే, అన్నీ వదిలేసుకొని వెళ్ళిపోతావా?”

“తెలియదు దీదీ..”

“కానీ మేడమ్‌ ఈ విషయాన్ని ఎప్పటికైనా సహించగలదా?”

“అదే కదా, మేడమ్‌కు నా మీద చాలా విశ్వాసం వుంది. అందుకే నాకు భయమేస్తుంటుంది. ఎక్కడ ఎలాంటి భేదాభిప్రాయాలు పుట్టుకొస్తాయోనని. మేడమ్‌కే కాదు స్మూల్‌ పిల్లల తల్లిదండ్రులకు కూడా నా మీదనే భరోసా. మేదమ్‌కైతే అందరి పేర్లు కూడా తెలియవు. అంతేకాదు, ఒక్కరోజు కూడా నా చేతివంట లేకపోతే భోజనమే చేయదు. అప్పుడప్పుడు మనసు బాగులేకున్నా వంట చేయక తప్పదు. ఎవరినైనా కానీ ఆకలి మీద ఉంచడం పాపం కదా దీదీ ?

నేనామెవైపు చూసా, నువ్వు కూడా ఆకలితోనే వున్నావు కదా ప్రీతో! అని చెప్పాలనుకున్నాను. కానీ అంతలోనే మేడమ్‌ రావడంతో నా నోటి మాట నోటిలోనే వుండిపోయి మౌనం దాల్చాను.

రెండు నెలలు ఎలా గడిచిపోయాయో తెలిసిరాలేదు. ఒకరోజు మేడమ్‌ వచ్చి ప్రీతోను తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళే సమయంలో ప్రీతో రహస్యంగా నాతో చెప్పింది.. “దీదీ నన్ను మర్చిపోవద్దు, నేను రాలేను కానీ నువ్వు రావాలి. నన్ను పిలుస్తావు కదూ దీదీ...” అయోమయ స్థితిలో పడిపోయా. నేను ఆమె చేతులను నా చేతిలోకి తీసుకొని నా కన్నీళ్లను ఎలాగోలా దాచుకొని ఆమెకు ధైర్యం చెప్పాను. ఆ తర్వాత ఇంటి వ్యవహారాల్లో మునిగిపోయి ప్రీతో సంగతే మర్చి పోయాను.

ఒకరోజు మిట్ట మధ్యాహ్నం, మగతగా వుంటే పడుకుందామనుకున్న సమయంలో మేడమ్‌ ఊడిపడింది. వస్తూ వస్తూనే ఆయాసం తీర్చుకోకుండా, “ఇక్కకికి ప్రీతో వచ్చిందా..” అని అడిగింది.

నేను ఆశ్చర్యంతో స్థాణువులా నిలబడిపోయా. ఏం సమాధానమివ్వాలో పాలుపోలేదు. వయసులోవున్న పిల్ల ఎక్కడికి పోయి వుంటుంది. నేను మౌనంగా

ఉండిపోవడం చూసి మేడమ్‌ అన్నది. “దానికి పొగరెక్కింది. నాతో ఒక్కటి తప్పు జరిగిపోయింది. నేను చేసిందల్లా కూరగాయలకు దాన్ని ఒంటరిగా పంపుతూ వచ్చాను. కూరగాయల గంపలో దొంగచాటుగా బొట్టు బిళ్ళలు పెట్టుకొని పోతూ వుంటేనే ఈ విషయం నాకప్పుడే అర్ధమయిపోయింది.”

ర్‌2 డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

“ఆ సచ్చినోడి దగ్గరికి వెళ్లి పెట్టుకునేది. అంత పిచ్చి ఎందుకో అ బొట్టు పెట్టుకోవడానికి. ఎప్పుడొచ్చినా ఆ దరిద్రపుది ఆలస్యంగానే వచ్చేది. బట్టలు ఇస్రీ చేసే సమయంలో, కూరగాయలు తరిగే సమయంలో గాని, రొట్టెలు కాల్చేటప్పుడు గాని ఎట్లా సిగ్గుపడుతూ, ముసిముసి నవ్వులు నవ్వుతూ వగలు పోయేది. వీరి సంగతి నాకేం తెలుసు, దీని చావు ఇట్లుంటదని తెలిస్తే ఎగిరిపోయే ముందే దాని రెక్కలు కత్తిరించి పారేసేదాన్ని. ఎక్కడైనా ఇది పిచ్చిదై పోదు గదా అన్న భయం పట్టుకుంది. లక్షణాలన్నీ అవే వుందే. కొన్ని రోజుల ముందు స్మూల్‌ పిల్లల తల్లి ఒకామె చెప్పకపోతే నాకూ తెలిసేది కాదు. ఎవడో దర్టీవాడు. కూరగాయల దుకాణం దగ్గర వుంటాడు. వాడితోటే లేచిపోయి వుంటుంది. ముందు, వాడివైపే దొంగచూపులు చూస్తూ వయ్యారాలు పోయేది. ఒక్కసారి చేతికి చిక్కితే పోలీసులకు అప్పజెప్పి అంతుచూడనూ. ఇనస్పెక్టర్‌ తివారి పిల్లలు నా స్కూల్లోనే చదువుతున్నారు..!”

మురికి కంపులా ప్రవహించే ఆమె మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ.. “మేడమ్‌, నువ్వా మోడువారిన చెట్టు కట్టెలాంటి దానివి. ప్రీతో ఎదుగుతున్న తీగ లాంటిది. ఆధారం వెతుక్కుంటూ పోయింది. పోనీ, తన ఆనందాన్ని సుఖాన్ని వెతుక్కోనీ [7

కోపంతో మేడమ్‌ అరిచింది? “ఓహ, అయితే ఈ యవ్వారం, ఈ అగ్గి నువ్వంటించిందేనా, నా శిక్షణలో ఎక్కడ తప్పు జరిగిందో నేను ముందే అర్ధం చేసుకునేదుండే. దాన్ని మీ ఇంట్లో వుంచకపోతే నాకు ఈ రోజు ఈ దరిద్రం చూడాల్సి రాకపోయేది.”

దాంతో నాలో కూడా ఆవేశం రెచ్చి పోయింది. నేనూ అరుస్తూ చెప్పాను. “ఈ అగ్గి నేను పెట్టింది కాదు. కానీ, నిజానికి ఈ మంట నేనే అంటించాల్సింది. నువ్వు నాకు స్నేహితురాలివి కదా, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు. నీకేం తెలుసు, మగాడి ప్రేమ లేకుండా జీవితం ఎడారిలా ఎలా మారిపోతుందో, దురదృష్టవంతురాలు జీవితంలో మోసపోయింది. క్రమశిక్షణ పేరుతో దాని కాళ్ళు కట్టేసావు. దుర్మార్గురాలవు. తోష్కి మనిషివి కావు. (శ్రేమ జీవితాన్ని చవిచూడని దానివి. ఎప్పుడైనా, ఎవరినైనా (ప్రేమిస్తే తెలిసేది ఇప్పటివరకు నువ్వేమి కోల్పోయావో..”

కోపంగా మేడమ్‌ చెప్పింది.. “నీ జ్ఞానబోధ నా కక్క్మరలేదు మిసెస్‌ ఆదిత్య వర్మ. ఇంట్లో పెట్టుకొని చూడు తెలుస్తుంది. నీ అడుగులకు మడుగులొత్తే ఆదిత్యకు కూడా ఒక “ర్సుట్‌ కా” ఇవ్వకపోతే నా పేరు తోషియే కాదు. రాత్రి పగలు లేకుండా దాని వెకిలిచేష్టలు నా దృష్టికి రాకుండా పోలేదు. ఒకవేళ ఈ స్మూల్‌ అనే దరిద్రమే లేకుంటే రేపెక్కడికెళ్తావ్‌...? 58

దాన్ని అదే వూరు ఎక్కడి నుంచైతే కసాయివాళ్ళ చేతుల్లో నుండి విడిపించుకొని వచ్చానో అక్కడికే పంపించేసేదాన్ని”

“పెళ్లి చేసెయ్యి దానికి” నేను చెప్పాను.

“అవును ఇదే కారణం కావలసి వచ్చింది. మరి, నువ్వు కూడా చేయించవచ్చు కదా!”

నేనన్నాను, “అది నీ బాధ్యత తోషీ నేను కేవలం పెళ్ళికి రాగలను. సరే టీ తాగుదువు గాని రా, నీళ్లు మసిలిపోతుండొచ్చు.”

తోషీ అన్నది. “నా కడుపు మండిపోతూ వుంటే ఇంకా దాని పైన నిప్పులు చెరగాలని చూస్తున్నావు..”

నేను ప్రేమతో ఆమె చెయ్యి పట్టుకొని, “ఛలో మేడమ్‌, నీకు రూహ్‌ ఆఫ్‌ జా, తాగిస్తాను అన్నాను. దాని తర్వాత ఆమె మనసు కాస్త తేలిక పడింది.

“వ్వేడ్రమ్‌, ఆమె పెళ్లి చేసెయ్యి. అమ్మాయి వయసులో వుంది. తోడు కోసం తపించిపోతుంది. ఆమె స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకొని ఆలోచించు ఒక్కసారి..”

మేడమ్‌ అంది.. “నేను ఒక మంచి కుర్రాణ్డి చూసి ఏదో నిర్ణయం తీసుకుంటాను. కానీ, అంతకు ముందే అది ఎవరితోనో లేచిపోయినట్లనిపిస్తుంది. ఈ రోజు రెండవ రోజు. రామ, రామ ఇప్పుడు సాయంకాలం క్లాసులకు పెద్ద పిల్లలు వస్తూ వుండవచ్చు. నేను వెళ్తాను..” అంటూ వెళ్ళిపోయింది.

మేడమ్‌ వెళ్లి రోజులు గడిచిపోయాయి. ఆమెతో ప్రీతో గురించి అడిగే ధైర్యం చేయలేక పోయాను. తర్వాత అంతా మర్చిపోయాను.

ఒక రోజు సాయంకాలం తలుపు తెరిచి చూస్తే ప్రీతో ఎదురుగా నిల్సొని వుంది. వెనకాల ఒడ్డు పొడుగు వుండి అందంగానే వున్న యువకుడు.

సారా తాగి, వీర బాహు కళ్ళతో వున్న అతన్ని చూడగానే నా లోపల సన్నని వణుకు పుట్టింది. చెదిరిన జుట్టు, ఇంకా అతని ముఖంలో డాంబికం, నిజాయతీ లేనితనం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకో అతనిపై నాకు నమ్మకం గాని, విశ్వాసం గాని కలగలేదు. అతనితో ప్రీతో చెప్పింది, “నా దీదీ..” అని.

స్నేహపూర్వకంగా ఇద్దరినీ లోపలికి తీసుకెళ్ళాను. సన్నగా నవ్వుతూ గదిలో కూర్చోబెట్టాను. టీ నీళ్లు పెట్టడానికి ఎలాగైతే వంటింట్లోకి దూరగానే ప్రీతో వెనకాలే వచ్చింది. నవ్వుతూ అడిగింది, “ఎలా వున్నాడు.”

“బాగున్నాడు " అన్నాను. ర్‌ డా. రూప్‌ కుమార్‌ దల్బీకార్‌

నవ్వి మళ్ళీ చెప్పింది. “సారా రాత్రికే తాగుతాడు. కళ్ళు ఎప్పుడూ ఎర్రగానే వుంటాయి.” పెదవుల మీద నవ్వు బలవంతంగా తెచ్చుకొని నవ్వసాగింది. నవ్వుతూ నవ్వుతూ నీళ్లు నిండిన ఆమె కళ్ళను చూడనట్లు నటించి, “మేడమ్‌ను కలిసావా?” అని అడిగాను. ప్రీతో కళ్ళను నేలకు వాల్చి, “వెళ్లాను, కానీ వెళ్లగొట్టి, మళ్ళీ ఇక్కడికి రాకు” అంది. ్రకాష్స్‌ ఇతనే చాలా కోపానికి గురయ్యాడు. కాస్త అగి.. “దీదీ నాకు పాత ధోతులివ్వవా! ఒక్క ధోతియే వుంది. మేడమ్‌ ది!” నేను ధోతులతో పొటు, 'శగున్‌' రూపంలో కొంత డబ్బు కూడా ఇచ్చి ఢ్రేమతో “ప్రీతో నేనున్నాను. ఎప్పుడైనా, ఏదైనా కష్టమొస్తే నన్ను మర్చిపోకు..” అని దైర్యం చెప్పాను. ప్రీతో నన్నల్లుకొని ఏడవసాగింది. నాకు తెలుసు తాను తప్పు చేసింది. ఈ మనిషి ఒక భర్తలా కనబడటం లేదు. అతనికి కూడా శగున్‌ రూపంలో కొంత డబ్బు చేతిలో పెట్టాను. ఏమనుకున్నాడో తెలియదు కానీ, అతను నా కాళ్లకు మొక్కాడు. అప్పుడు నాకనిపించింది ఆడకూతుళ్ళను ఇలాగే సాగనంపుతారు కాబోలు అని. కొన్ని రోజుల తర్వాత మేడమ్‌ ఫోన్‌ వచ్చింది. ఎలాంటి భూమిక లేకుండానే “స్నేహాన్ని ఎంత బాగా నిలుపుకుంటున్నాన్‌ మిసెస్‌ ఆదిత్యవర్మ. నిన్న.. అదే... నీ చీర తొడిగి ప్రీతో కలిసింది. ఆ చీరని కాలేజీ మేళలో మనం ఇద్దరం కలిసి కొన్నాము. ఎంత ఘనకార్యం చేసావు నువ్వు చీర ఇచ్చావ్‌, కానీ ప్రీతో వచ్చినట్లు నాతో మాట మాత్రం కూడా చెప్పలేదు. చీర ద్వారా ఆదిత్యకు పిలుపు అందకుండా జాగ్రత్త పడు..” ఈ మాటలు చెప్పి టక్కున ఫోన్‌ పెట్టేసింది. ఆదిత్య ... నేను ఆశ్చర్యపోయాను. ఈ మేడమ్‌ ఎంత కఠిన హృదయం గలది. ఫోన్‌ వచ్చిన మరుసటి రోజే ప్రీతో మళ్ళీ వచ్చింది. కానీ ఒంటరిగా, వస్తూనే నా వెనకాల వంటింట్లోకి వచ్చి, “నాకు వంకాయల పకోడీ చేసి పెట్టగలవా?..” అడిగింది. నేను ఆమెను ఎగాదిగా చూసాను. సిగ్గుతో, ఇప్పుడు మూడు. “నాలుగో నెల నడుస్తుంది” అంది. ఈ రోజు అతను నాసిక్‌ వెళ్ళాడు. అందుకే రాగలిగాను. నాకు కొంత డబ్బు కూడా కావాలి... ఇస్తావ్‌ కదూ! అతను కేవలం రేషన్‌ తెచ్చి పెట్టేస్తాడు. ఒక్క పైసా కూడా చేతికివ్వడు. బయటి నుండి తాళం వేసుకొని దుకాణానికి వెళ్తాడు. అప్పుడప్పుడు వేపిన శనగలు తినాలనిపిస్తుంది. రాత్రికి అతని ప్యాంటు నుండి కొన్ని పైసలు జారిపడిపోతాయి. అవి తీసుకుంటాను. తిరిగి వెంటనే ఆనందంతో అంది. అక్కడ ఒక కిటికీ వుంది, అందులో నుంచి దూకి అప్పుడప్పుడు బయటికి వెళ్ళిపోతాను. కానీ ఒక రోజు పొరుగింటావిడ ఈ విషయం అతనికి చెప్పేసింది. ఆ రాత్రి అతను నన్ను బాగా చితక్కొట్టాడు... రేపెక్కడికెళ్తావ్‌...? ర్‌5

నేను ఆమె వైపు చూడకుండానే అడిగాను, “పెళ్ళైన పత్రాలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర.” “లేదు పెళ్లి గుళ్లో జరిగింది 1” పైసలు తీసుకొని ప్రీతో వెళ్ళిపోయింది. మూడు, నాలుగు సంవత్సరాల వరకు ఆమె గురించి ఎలాంటి సమాచారం లేదు. ఒక రోజు మేడమ్‌ స్వయంగా వార్త పట్టుకొచ్చింది. ప్రీతో భర్త ఎప్పుడూ ఆమెను చావబాదుతాడు అని. ఒక రోజు ఆమె మరిది విడిపించడానికి వస్తే అతన్ని కూడా చావబాది ప్రీతోని ఇంటినుంచి వెళ్ళగొట్టాడు అని. ఇరుగు పొరుగు కల్పించుకొని సర్ది చెప్పారట. నాకు బాధ కలిగింది. తిరిగి ఆలోచించా... పిల్లలున్నారు. పిల్లల ఆసరాతో ఆడది రావణుడితోనైనా సర్జ్దుకుపోతుంది. రేపటి రోజు పిల్లలు పెరిగి పెద్దవారవుతారు. వారితో పాటు ప్రీతో కూడా పెద్దదైపోతుంది. కాలం సాగిపోతుంది. ఎప్పటిలాగే రోజూ తెల్లారుతోంది. సంధ్య వాలుతోంది. పిల్లలు స్కూలుకు వెళ్తున్నారు, ఇంటికి వస్తున్నారు. ఆదిత్య నేను కూడా జీవితంలో ఒక విడదీయరాని భాగంగా మారిపోయాము. ఏ రోజు పని ఆ రోజే అయిపోవాలి. ఏ మాత్రం అలస్యం జరిగినా మనసు కంగారు పడేది. మా చిన్ని ప్రపంచంలో మొత్తం విశ్వం ఇమిడి పోయింది. ఆ ప్రపంచంలో ప్రీతో ఉండదు. ఆమె జగడాల మారి మొగుడు వుండడు. ప్రతిరోజూలానే సాయంకాలం అయింది. వస్తూ వస్తూ వెంట అతిధులను వెంటేసుకొచ్చింది. ఆదిత్య సామాన్లు తేవడానికి బజారుకెళ్ళాడు. అప్పుడే దర్వాజా దగ్గర బెల్‌ మోగింది. తలుపు తెరిస్తే ఎదురుగా ఒక అపరిచిత మపొళ, తన పువ్వుల్లాంటి ఇద్దరు పిల్లలను తీసుకొని నిలబడివుంది. ఎవరిదైనా అడ్రస్‌ అడగాలనుకుంటుందేమో అని నేననుకున్నాను. ప్రశ్నార్థకంగా ఆమెవైపు చూసాను. ఆమె నవ్వింది. పెదాలు ముడుచుకు పోయి వున్నా ఆ నవ్వును గుర్తు పట్టడానికి నాకంత సమయం పట్టలేదు, “ప్రీతో” అన్నాను. వెంటనే తాను పిల్లల చేతిని వదిలించుకొని ఈ ప్రపంచంలో నేను తప్ప తనకు మరెవ్వరూ లేరన్న విశ్వాసంతో గట్టిగా అల్లుకుంది. ఆమెను వదిలించుకుంటూ “ప్రీతో ఇంట్లో బంధువులున్నారు రా లోపలికి నడు..” అన్నాను. ఆమెను కూర్చోబెట్టి పిల్లలకు పాలు, బిస్కట్లు ఇచ్చాను. వాళ్ళు తింటూ వుంటే, పిల్లల్ని వదిలి ప్రీతో నా వెనకాలే వచ్చి ఏ విషయం చెప్పకుండానే “దీదీ అతను వెళ్ళిపోయాడు దుబాయ్‌. ఇల్లు కూడా ఎవరికో వేరే వారికి ఇచ్చేసాడు. కేవలం ఈ రాత్రికి ఇక్కడ వుందడనివ్వు” అంది. 56 డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

ప్రీతో, ఈ బంధువులు ఈ రోజే వచ్చారు. నిన్నెక్కడ పడుకోబెట్టను. వెంట పిల్లలు కూడా ఉన్నారు అన్నాను.

ప్రీతో “పిల్లల్ని తీసుకొని నేను వరండాలో పడుకుంటాను. రేపు ఉదయం ఇక్కడే ఒకరిని కలవాలి. వారు ఏదో ఒక ఏర్పాటు చేస్తారు. మేడమ్‌ నన్ను ఒక ఆశ్రమానికి పంపాలని ఆలోచిన్తుంది. కొన్ని రోజుల మాట మాత్రమే?” అంది నా బుర్ర మొద్దుబారిపోయింది. “నువ్వు మేడమ్‌ ఇంటికి ఎందుకెళ్ళలేదు.. ?”

“తాను ఇంట్లో ఎప్పటికీ ఉండనివ్వదు దీదీ. నాకు ఆశ్రమానికి వెళ్లాలని లేదు.”

“కానీ ఎందుకు?”

“ఒకవేళ ఎప్పుడైనా వీళ్ళ తండ్రి వస్తే?”

“వచ్చేవాడైతే, ఎందుకెళ్ళిపోతాడు.”

కొన్ని రోజులు ఎదురు చూస్తాను. “కొన్ని రోజుల మాటే !”

నా కళ్ళ ముందు ఆదిత్య ముఖం కదలాడింది. మేడమ్‌ చెప్పిన మాటలు కూడా గుర్తుకు వచ్చాయి. తాను చెప్పిన హెచ్చరిక కూడా ఇంకా జ్ఞాపకమే. ఒక్క రాత్రి అతని ఇష్టం లేకుండా కూడా ఉంచగలను, కానీ '్రీతోకు, “రేపెక్కడికెళ్తావు?” అని అడిగే సాహసం ఆమెలో లేదు. నాకు తెలుసు మేడమ్‌ తప్ప మరెవ్వరు కూడా ఆమెను ఆశ్రమానికి వెళ్ళడానికి ఒప్పించలేరు. ఈ క్షణమే ఒక అవకాశం. ఒకవేళ ఇప్పుడు నేను బలహీనపడిపోతే, ప్రీతో వెళ్లే “రేపు, మళ్ళీ ఎప్పుడొస్తుందో,” నా లోపల వున్న మానవత్వం గొంతు పిసికి చెప్పాను. “లేదు ప్రీతో, ఇక్కడ వుండటం సాధ్యపడదు. వీళ్ళు నా బావగారి కూతుర్ని చూడటానికి వచ్చారు. అమ్మాయి రేపు ఢిల్లీ నుండి వస్తుంది. ఇలాంటి సందర్భంలో నాజూకు బంధుత్వం మధ్య నేను ఎలాంటి రిస్క్‌ తీసుకోలేను. జరగరానిది జరగటం ఊహించలేను. డబ్బులు తీసుకో. ఒకవేళ ఇక్కడే ఎవరినో కలవాలి అనుకుంటే టాక్సీ తీసుకొని రా! ఇప్పుడు మాత్రం వెళ్ళిపో..” అని చెప్పి ఆమె ఇద్దరు పిల్లల చేతులను ఆమె చేతిలో పెట్టేసాను. ఇంటి తలుపులు దాటి చౌకీదార్‌ను పిలిచి టాక్సీని తెప్పించాను. పిల్లలతో సవా ప్రీతో కూర్చోవడం చూసా. చెమటతో తడిసి ముద్దయిన ఆమె చేతిలో కాన్ని నోట్లు పెట్టేసాను. టాక్సీ వెళ్ళే వరకూ వేచి వుండకుండా ఇంట్లోకి వచ్చి తలుపులు మూసేశాను.

ఈ తలుపులు నేను ప్రీతో కోసం మూసేసానా?! లేక నా కోసమా?! నాకే అర్ధం కాలేదు. రాత్రంతా నాకు పీడకలలు రాసాగాయి. ఎన్నోరోజులు గోడలను ప్రశ్నిస్తూ వుండిపోయాను - “రేపెక్కడి కెళ్తావు...?”

ట్జ రేపెక్కడికెళ్తావ్‌...? 57

జా 1 గ్‌ 14 జనవరి, 1926న బెంగాల్‌ (పెసిదెన్సీలోని ష్య య! డాకాలో జన్మించారు. తల్లిదండ్రులు ధరిత్రి దేవి, మనీష్‌ ఘటక్‌. సుప్రసిద్ధ బెంగాలీ రచయిత్రి.

మహాశ్వేతా దేవి సామాజిక కార్యకర్త. ఆదివాసీల హక్కుల కోసం ప్రసిద్ధ రచనలు : హజార్‌ చురాసిర్‌ (చౌరాసికి మా), రుదాలి, అరణ్యేర్‌ అధికార, సాహిత్య అకాడమి, రామన్‌ మెగసెసే, పద్మశ్రీ, పద్మభూషణ్‌ అవార్డులతో బాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. మహాశ్వేతాదేవి జులై 28, 2016న కోల్‌కతాలో మరణించారు. 1996లో జ్ఞానపీఠ్‌ పురస్కారం అందుకున్న మహాశ్వేతాదేవి రాసిన కథ “ద్రౌపది” బాగా (ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ కథను గాయత్రి చక్రవర్తి స్పివాక్‌ ఆంగ్లానువాదం చేశారు. జమీందారీల ఆధిపత్యం, జులుంను వ్యతిరేకించి ఉద్యమించిన, సంతాల్‌ తెగకు చెందిన ఆదివాసీ మహిళ దోప్టి (ద్రౌపది) పై పోలీసులు జరిపిన సామూహిక అత్యాచారం లాంటి హృదయ విదారక దృశ్యాలను చిత్రించారు. పశ్చిమ బెంగాల్‌లోని ఆదివాసీ ప్రాంతాలలో నక్సలైట్‌ కదలికలు, జమిందారీ పెత్తనాలు, పోలీసు వ్యవస్థ సామాన్య ప్రజల పట్ల అతిగా వ్యవహరించే

తీరును చూపించారు రచయిత్రి. 58 దా. రూప్‌కుమార్‌ దబ్బీకార్‌

ద్రౌపది

ఎస్టీ ; దోస్టి మేజెన్‌, వయస్సు : 27, భర్త : దుల్న మారు, నివాసం : చేరాఖన్‌ బాం[క్రర్సుఢ్‌. “ప్రాణంతో వున్నా చనిపోయినా సమాచారమిచ్చిన వారికి లేదా అరెస్ట్‌ చేయడానికి సహాయపడే సమాచారమిచ్చి సహకరించిన వారికి వంద రూపాయలు...” మెడల్స్‌ అలంకరించబడిన రెండు యూనిఫామ్‌ల మధ్య సంభాషణ.

మొదటి యూనిఫామ్‌ : “ఏవిటిది , దోస్టి - ఆదివాసీ పేరు ? నేను తెచ్చిన లిస్ట్‌లో ఈ పేరు లేదే ! లిస్ట్‌లో లేని పేరు ఎలా వచ్చింది ?”

రెండవ యూనిఫామ్‌ : “దోస్టి మేజెన్‌. వీళ్ళమ్మ, బఐకులి వూర్లో సుర్దా సాహూ

  • చనిపోయాడే ! అతని పొలాల్లో ధాన్యం నూర్చిళ్లకు వెళ్లిన సమయంలో పుట్టింది. అప్పుడు సుర్దా సాహూ భార్య పెట్టింది ఈ పేరు.”

మొదటి యూనిఫామ్‌ : “ఈ అధికారులు ఇంగ్లీష్‌ తప్పితే మరేది రాయటానికి ఇష్టపడరు. ఏమిటీ చెత్తంతా, ఈమె గురించి ?

“రెండవ యూనిఫామ్‌ : “అబ్బో! భయంకరమైన ఆడది. చాలా కాలం నుంచి వెతుకుతున్నారు. అనేక ....”

16 : దుల్బ, దోప్టి. పంటలు కోతల కొచ్చిన కాలంలో రైతు కూలీలుగా బిర్భుమ్‌, బుర్ద్వాన్‌ , ముర్షిదాబాద్‌, బంకుర మధ్య తిరుగుతూ వుంటారు. 1971లో బాగా పేరుపడ్డ '౦0౧౪100 34101 లో మూడు ఊర్లను చుట్టుముట్టి మెషిన్‌ గన్ల తోటి ఫైరింగ్‌ చేస్తే వీళ్ళు కూడా చచ్చారేమో అనుకున్నారు. కాని, నేల మీద పడుకొని చచ్చినట్లు నటించి .., నిజానికి వీళ్లిద్దరే (ప్రధాన నేరస్తులు. కరువు కాలంలో సుర్దా సాహుని, అతని కొడుకుని హత్య చేసి, అగ్రకులాల వారి బావులను, బోరుబావులను రేపెక్కడికెళ్తావ్‌...? 59

ఆక్రమించుకున్నారు. వారిలో అసలైన ముగ్గురు యువకులను పోలీసులకు అప్పగించనే లేదు. ఈ దాడులన్నింటిలో జనాలను రెచ్చగొట్టింది వీళ్ళే. తెల్హారగట్ల, మనుషులను లెక్కపెట్టే సమయానికి ఈ జంట కనబడలేదు. ఈ పథకం పన్నిన కెప్టెన్‌ అర్జున్‌సింగ్‌కు ౨1006 50్రఖా 16761 ఒక్కసారిగా పెరగడం, డయాబెటిస్‌ మళ్ళీ తిరగబెట్టడం జరిగి ఆందోళనకు గురికావడం, డిప్రెషన్‌ లోకి వెళ్లిపోవడానికి ఈ ఘటనే ప్రధాన కారణమని రుజువు చేస్తుంది. డయాబెటిన్‌లో ఆందోళనతో బాటు మరో పన్నెండు మంది మొగుళ్ళు కూడా వున్నారు ! దుల్న దోప్టి చాలాకాలం వరకు నియాండర్తల్‌ చీకట్లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ చీకట్లను చీల్చడానికి ఆయుధాలు చేబూనిన ప్రత్వేక దళం, పశ్చిమ బెంగాల్‌ పలు జిల్లాల్లోని సంతాల్‌ ఆదివాసీలను వారి ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళ నాయకుడిని కలవమని బలవంతపెట్టింది. భారత రాజ్యాంగ చట్టం ప్రకారం కులం, మతం అని తేడా లేకుండా మనుషులందరూ పవిక్రులే. ఐనప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. దీనికి రెండు కారణాలు : 1) అజ్ఞాతంలోకి వెళ్లిన దంపతులు తమకు తాముగా నిర్బంధంలోకి వెళ్లే తెలివి కలిగివుండటం 2) కేవలం సంతాల్‌ ఆదివాసీలు కాకుండా, ఉ&3ళ0 - 31240 ముండా తెగకు చెందిన ఆదివాసులందరూ కూడా ఒకటే ఈ ప్రత్యేక దళాలకు. నిజానికి, అకృత్యాలకు నెలవైనదిగా పేరున్న 1౫19401 అడవి ప్రాంతం బాంక్రర్సుఢ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది (మన భారతదేశంలో చివరికి ఒక పురుగు కూడా ఏదో ఒక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకే వస్తుంది). ఆగ్నేయం, నైరుతి మూల ప్రాంతాల్లో దొరికిన సాక్ష్యాలు చెప్పే విషయాలు వింటే వెంట్రుకలు నిక్కబొడుచు కుంటాయి. మొత్తానికి అనుమానాస్పద మనుషులు ఎవరైతే పోలీస్‌ స్టేషన్లపై దాడి, తుపాకులు దొంగిలించడం (అపహరించే వారికి అంతగా చదువు లేకపోవడంచే వాళ్ళు “తుపాకులు వదిలి వెళ్ళండి అనడానికి బదులు “ఛాంబర్స్‌ను వదిలి వెళ్ళండి అని సంబోదిస్తారు), ధాన్యం కొనుగోలు చేసే దళారులు, జమిందారులు, వడ్డీ వ్యాపారులు, లాయర్లు, ఉన్నతాధికారులపై దాడి చేస్తారో, వారి గురించిన సమాచారం గగుర్పాటు కలిగిస్తుంది. సంఘటనకు ముందు కమిలినట్లు నల్లని చర్మంతో వుండే దంపతులు పోలీస్‌ సైరన్‌లా వింత ధ్వనులు చేస్తూ ఊళలు వేస్తారు. వారు ఉల్లాసంగా, మోటైన భాషలో సంతాల్‌ లకు కూడా అర్ధం కాని విధంగా పాట పాడుతారు. నడరుడంఉు/ గపుట1లు1160 42 206 [006 ఖర వేల0రేం [20004 [000 16006 , 0061 8200014 16006 16016

60 డా. రూప్‌ కుమార్‌ దబ్బీకార్‌

ముగింపుగా చెప్పేదేమిటంటే ఇవన్నీ కూడా కెప్టెన్‌ అర్జున్‌సింగ్‌ డయాబెటిస్‌కు కారకాలు.

సాంఖ్య తత్వశాస్తంలోని 4216 001016లా లేదా ము1001001 చిత్రాల్లా తిరిగి మళ్ళీ అర్జున్‌సింగ్‌నే '0062101 1061 పై ]0జ0యజం? కి పంపించారు (ప్రభుత్వపు విధానాలు ఎంత సాగతీతగా వుంటాయో దీన్ని బట్టి తెలుస్తుంది. ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా తెలిసిందేమిటంటే ఊళ వేస్తూ, నృత్యం చేసిన జంట ఎవరో కాదు, అవి తప్పించుకుపోయిన శవాలని. అర్జున్‌ సింగ్‌ 2002016 - లాంటి దశకు చేరి చివరికి కారణం లేకుండానే నల్లరంగు చర్మం గల వ్యక్తిని చూస్తే భయంతో బిగుసుకు పోతాడు. నలుపు రంగు మనిషి వృషణాలతో నగ్నంగా ఎదురైతే ఇక మూర్చ వచ్చినంత పనై “వాళ్ళు నన్ను చంపేస్తున్నారు” అంటూ నీళ్ళు తాగి వెంటనే తాగిన నీళ్లన్నీ ధారగా వదిలేసేవాడు. యూనిఫాం కానీ, పతకాలు కాని అతనిలోని భయాన్ని ఆందోళనని దూరం చేయలేక పోయేవి. ఆఖరుకి "02604016 206 *01066 16ల౦౦౧6 సాకుతో, గెరిల్లా యుద్దం, తీవ్రవాదులు - లెఫ్ట్‌ రాజకీయాల విషయాల్లో స్పెషలిస్ట్‌ అయిన సీనియర్‌ బెంగాలీ అధికారి మిస్టర్‌ సేనానాయక్‌ డెస్క్‌ ముందు హాజరు కావాల్సిన పరిస్థితులు వచ్చేవి.

సేనానాయక్‌కు ఎదుటి పక్షం వారి కార్యకలాపాలు, వారి శక్తి సామర్థాల గురించి వారికన్నా ఇతనికే బాగా తెలుసు. అందుకే ముందుగా సిక్కుల మిలట్రీ నైపుణ్యాన్ని పొగుడుతాడు. తుపాకీ బారెల్‌ కున్న శక్తి కేవలం ఆ ఎదుటి పక్షం వారికేనా తెలిసింది? అర్జన్‌ సింగ్‌ సామర్థ్యం కూడా తుపాకీ కున్న ౧1216 0౯820 ద్వారా విస్ఫోటనమవుతది అని గొప్పలు పోతాడు. ఈ రోజున, ఈ కాలంలో 11౪6 9 కూడా తుపాకీ లేకుండా ఏమీ చేయలేవు అంటూ ఇలాంటి ఉపన్యాసాలు అందరికీ, అనామకులకు కూడా ఇచ్చేవాడు. ఫలితంగా, పోరాటదళానికి '4ు్రు/ ₹జ060001 మీద తిరిగి విశ్వాసం పుట్టుకొచ్చేది. అందరి కోసం కాదు ఈ పుస్తకం. ఈ పుస్తకం అతి తుచ్చమైన, అసహ్యకరమైన పద్దతులను (అనాగరీకమైన ఆయుధాలతో చేసే గెరిల్లా పోరాట శైలిలోని) వివరిస్తుంది. కంటి ముందు విధ్వంసం కనబడుతున్నా, శిక్షణ పొందే ప్రతి సైనికుడు ఈ పోరాట శైలిని పవిత్రంగా భావిస్తాడు. దోప్టి, దుల్న కూడా ఇలాంటి 0216800/కి చెందినవారే. వీరు కూడా గొడ్డళ్లు కొడవలి, విల్లంబులు వగైరా చేతబట్టి అనేకులను చంపినవారే. వాస్తవానికి వీరి పోరాట శక్తి సమాజంలోని పెద్దమనుషుల కున్న శక్తి కన్నా ఎక్కువే. పెద్దమనుషులందరూ 0180060 ను పేల్చివేయగల నైపుణ్యం ఉన్నవారేమి కాదు. వాళ్ళ దృష్టిలో చేతిలో తుపాకీ వుంటే ధైర్యం, బలం దానంతట అదే వస్తది అన్న రేపెక్కడికెళ్లావ్‌...? 61

ఆలోచన. కానీ దుల్టు దోప్టి నిరక్షరాస్యులు. తరతరాలుగా వారి మనుషులు మారణాయుధాల వాడుకలో అలవాటు పడినవారు. నేను ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ఎదుటి పక్షం ఇతన్ని చిన్న చూపు చూసినప్పటికీ, 'సేనానాయక్‌ను అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అతని ప్రాక్టీస్‌ ఎలాంటి దైనప్పటికీ, [1600/ ప్రకారం శత్రువును గౌరవిస్తాడు. “మర్యాదగా ప్రవర్తిస్తే అటు వాళ్ళను అర్ధం చేసుకోలేము. ఇటు పడగొట్టలేము. ఏమీ లేదు, తుపాకులతో ఓ చిన్న ఆట - విడుపు మాత్రమే - 12 0164ల 10 6636౯0) గ6 అలలు? , 0600006 016 అన్న ఆలోచనతో అతను (1601611021 వారిలో ఒకడై వారిని అర్ధం చేసుకున్నాడు.” భవిష్యత్తులో ఈ విషయాలన్నింటిని (గ్రంథస్తం చెయ్యాల్సిన ఆలోచన అతనిలో వుంది. పెద్దమనుషులు అనుకునే వారందరినీ మట్టి కరిపించి, రైతు కూలీల మను సందేశంగా వినిపించాలి తన రచనల ద్వారా అన్న నిర్ణయానికి వస్తాడు. మెదడులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలు సొకారం కావాలంటే కాస్త కష్టమే, కానీ నిజానికి అతను చాలా సాధారణ మనిషి. తన పూర్వీకుల మాదిరి తాబేలు మాంసంతో భోజనం పిదప సంతోషపడిపోతాడు. వాస్తవానికి అతనికి తెలుసు, జనరంజకమైన పాత పాటలోని సారంలా [1 9 ౧6, 16 ౪01164 ౪111 4ఖుర6 అని. ఏ రంగంలోనైనా గౌరవంగా నిలదొక్కుకోవాలంటే సాక్ష్యాధారాలు కావాల్సిందే. అవసరమైతే సమాజానికి నేను మాత్రమే విషయాలను సరియైన అవగాహనతో అర్ధం చేసుకోగలను అని చూపాలి. అతనికి బాగా తెలుసు ఈ రోజు తనేం చేస్తున్నాడో. ఆ విషయాన్ని సమాజం మరిచిపోతుంది, కానీ ఎప్పటికప్పుడు తనూ తన పంథా మార్చుకొని , ప్రశ్నార్థకంగా మారిన సమస్యను తీసుకొని అవసరానికి తగినట్లు రంగు మారడం అతనికి తెలుసు. ఈ రోజు 200౯01613100 ఇర అమి*600 పద్ధతిలో యువతను వదిలించుకుంటున్నాడు. ప్రజలు త్వరగా వీటన్నింటిని మరిచిపోతారని ఎలాంటి విపరీతమైన గుణపాఠాలు గుర్తుకుండవన్న సంగతి తెలుసు. అదే సమయంలో షేక్స్‌పియర్‌లా భవిష్యత్తును యువత చేతికి వారసత్వంలా అందజేయాలని నమ్ముతాడు. అరచేతిలో స్వర్గం చూపి మాయ జేయడంలొ కూడా నిపుణుడు. ఏది ఏమైనా సమాచారం అందుతూనే వుంది. యువకులు, యువతులు 921001 09 02401 జీపులెక్కి ఒకదాని తరువాత మరొకటిగా పోలీస్‌ స్టేషన్లపై దాడి చేస్తూ బీభత్సం సృష్టించి, అలజడి రేపి జోరుజు! అడవిలోకి అదృశ్యమవుతున్నారు. 21011 నుండి తప్పించుకున్న తర్వాత దోప్టి, దుల్ననిజానికి ప్రతి భూస్వామి దగ్గర ఇండ్లలో పని చేశారు. ఈ భూస్వాములు హత్యలు, దాడులు చేసిన వారి సమాచారం, వారి తదుపరి లక్ష్యం ఏమిటి అన్న సంగతి ధైర్యంగా అందించగల సమర్థులు. సమాచారం అందిస్తూ మేము కూడా సైనికులమే, జక జు6ే [1ల' లో భాగమేనన్న భావంతో గొప్పగా చెప్పుకుంటూ వుంటారు.

62 డా. రూప్‌కుమార్‌ దబ్బీకార్‌

చివరికి దూరడానికి కష్టమైన, దట్టమైన ౮12ఇ॥02%1 అడవిని అసలు సైనికులు చుట్టుముట్టారు. ఆర్మీ ప్రవేశించి యుద్ధక్షేశ్రాన్ని నాల్గు వైపులా ఆక్రమించు కుంటుంది. జలపాతాలు, వాగులు, నీటి బుగ్గల దగ్గర దాక్కొని కాపలా కాస్తున్నారు. ఎందుకంటే మంచినీళ్లకు అవే వనరులు కాబట్టి. కాపలా కాస్తూనే వున్నారు, ఇంకా చెప్పాలంటే కన్నేసి వుంచారు. ఈ క్రమంలో ఆర్మీ ఇన్‌ఫార్మర్‌గా వున్న దుఖిరామ్‌ ఘరారి, ఒక సంతాల్‌ యువకున్ని పరుపు బండ పైన కదుపు మీద పడుకొని తాగడానికి తలను నీళ్లలో ముంచడం చూస్తాడు. సైనికులు అదే స్థితిలో అతన్ని షూట్‌ చేయగా .303 తుపాకీ గుండు దెబ్బ, పక్షిలా ఎగిరిపడిన అతని నోటి నుండి రక్తపు నురగ వచ్చేట్లు చేస్తుంది. ఒక్కసారిగా '42 - 10' అని అరిచి నిర్జీవంగా పడిపోతాడు. తరువాత వారు ఆ యువకున్ని కరడు గట్టిన దుల్న మాయి గా గుర్తిస్తారు. ']42 - 10' అర్ధం ఏవిటి? ఆదివాసీ భాషలో హింసను సూచించే నినాదమా?! ఎంత ఆలోచించినా శ) 660106 1005 006 కు కూడా అంతుబట్టలేదు. ఇద్దరు 11021 9060121133 లను కలకత్తా నుంచి రప్పించారు. వారు వాఫ్‌మన్‌ - జెఫర్‌, గోల్డెన్‌ - సామర్‌ నిఘంటువులు చెమటోడ్చి శోధించారు. చివరికి సర్వజ్ఞుడైన సేనానాయక్‌ క్యాంపులో నీళ్లు తెచ్చే పనివాడు చమ్రుని పిలిపించి అడగ్గా వాడు ఇద్దరు నిపుణులను చూడగానే ఇకిలించడం చేసి బీడీ తోటి చెవిని గీరుకుంటూ “మాల్దా లోని సంతాల్‌లు దాడికి ముందు గాంధీ రాజు కాలంలో అలా చెప్పేవారు. ఇది పోరాటానికి పిలుపు. 1/44 - 10' అని ఇక్కడెవరు చెప్పారు? మాల్దా నుంచి ఎవరైనా వచ్చారా? అని అడిగాడు.

ఆ విధంగా అనుమానం తీరింది. దుల్న శరీరాన్ని ఆ పరుపు బండ మీదనే వదిలి సైనికులు చెట్ల పైకి ఎక్కి ఆకుల పచ్చదనంలో కలిసిపోయారు. ఆకులతో నిండుగా వున్న కొమ్మలను కప్పుకొని ఎవరైనా వచ్చి శవాన్ని తీసుకెళ్తారా అని ఎదురు చూస్తూ, వారి మర్మాంగాలను ఎర్ర చీమలు కుట్టడానికా అన్నట్లు కూచున్నారు. ఇది వేటగాళ్ల పద్దతి . సైనికులది కాదు. కానీ ఈ మూర్చలు అంగీకారయోగ్యమైన ఏ పద్ధతిని అనుసరించరని సేనానాయక్‌కు తెలుసు. అందుకని సేనానాయక్‌ తన మనుషులకు ఆదేశమిచ్చాడు, శవాన్ని ఎరగా వేసి మనకు కావలిసిన ఆహారాన్ని దగ్గరికి లాగాలి, అందరూ వస్తారు, అనుమానం లేదని అన్నాడు. దోప్టి పాటలోని గూఢార్థము తెలుసుకున్న సైనికులు అతని ఆదేశాన్ని పాటించడానికి సిద్ధమయ్యారు. కాని దుల్న శవాన్ని తీసుకుపోవటానికి ఎవరూ రాలేదు. రాత్రి చీకట్లో సైనికులు అడ్డదిడ్డంగా కాల్పులు జరిపి కిందికి దిగి చూసారు. ఎండుటాకుల మీద సంపర్మం జరుపుకుంటున్న రెండు ముళ్ళ రేపెక్కడికెళ్తావ్‌...? 63

పందులు చచ్చిపడివున్నాయి. దుల్న జాడను తెలిపిన అడవిలో వుండే ఆర్మీ ఇన్‌ ఫార్మర్‌ దుఖిరామ్‌ తనకు అందాల్సిన బహుమతి కన్నా ముందే అతని మెడ మీద కత్తి వుందన్న వాస్తవాన్ని ఊహించడం లేదు. దుల్న శవం సంగతెలా వున్నా ఎర్రబీమలు కరుస్తూ వుంటే తీవ్రమైన మంట, నొప్పితో అల్లాడిపోతున్నరు. ఎప్పుడైతే సేనానాయక్‌, శవాన్ని తీసుకుపోవడానికి ఎవరూ రాలేదన్న విషయం తెలుసుకున్నాడో తన దగ్గరున్న ౦౪) జః - 120151 400201 000ని నేలకేసి కొట్టి ౪20' అని అరిచాడు . అంతలో ఒక ఆదివాసి భాషా నిపుణుడు ఒంటి మీద బట్టల సోయి లేకుండా ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి "261 20 511 1ల౧66 120072" అర్ధం నాకు తెలిసిపోయింది. ఇది ముండారి 12884486 అన్నాదు.

దోప్టి కోసం అన్వేషణ మళ్ళీ మొదలయ్యింది. ౮[జుయబం! 102651 0616లో 0962408 కొనసాగుతోంది. కొనసాగుతూనే వుంటుంది. ఇది ప్రభుత్వం వెన్ను మీద వ్రణం. ఎలాంటి మందులకు నయం కాదు. ఎలాంటి జెషధీ మొక్కలకు చితికిపోదు. అసలు ముందుగా తప్పించుకు పోయిన వారికి అడవిలోని దారితెన్నుల గురించి సరిగా తెలియకపొతే సులువుగా దొరికిపోతారు. అడ్డు అదుపు లేక, హద్దు దాటిన స్ధితికి వస్తే పన్ను కట్టే వాళ్ళ ఖర్చుతో వాళ్ళను షూట్‌ చేస్తారు. చట్టానికి ఎదురు తిరిగిన వారి కనుగుడ్లు, పేగులు, గుండె కాయ, మర్మాంగాలు అలా ప్రతిదీ నక్కలకు, రాబందులకు, చీమలకు, పురుగులకు ఆవారమవుతాయి. చివరికి అంటరానివాళ్ళు వారి అస్తికల్ని సంతోషంగా పట్టుకెళ్లి అవసరమైన వాళ్లకి అమ్ముకుంటారు.

బహిరంగంగా, ఎదురు దాడిలో వాళ్లంతటగా వాళ్ళు చిక్కడానికి చివరి వరకు ఏ దశలో కూడా ఇష్టపడరు. ఇప్పుడు వాళ్లకు ఓ నమ్మకమైన కొరియర్‌ దొరికింది. పదిలో ఒక్కరుగా. ఆ నమ్మకమే దోప్టి. తన ప్రాణం కన్న మిన్నగా దుల్నను (పేమించింది దోప్టి. అజ్ఞాతంలో వుండి తిరిగే వాళ్ళను దోప్టియే కాపాడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.

“వాళ్ళు” అన్నది కూడా ఒక 1)/0౦46313.

“ఎందుకు ?”

“ంగ్రమర్పు/ ఎంతమంది వెళ్లారు?” - ప్రశ్న,

సమాధానంగా మౌనం. దీనికి సంబంధించి చాలా కథలున్నాయి. పుస్తకాలే

అచ్చుకు వున్నాయి. అసలు అన్నీ నమ్మక పోవటమే ఉత్తమం . 64 డా. రూప్‌కుమార్‌ డబ్ఫీకార్‌

“క్క అరు సంవత్సరాలలో ఎదురు దాడిలో ఎంత మంది చచ్చారు”

మౌనమే సమాధానం.

“ఎదురుదాడి తరువాత దొరికిన అస్థిపంజరాల చేతి ఎముకలు ఎందుకు విరిగి, తీవ్రంగా నలగబడి దొరుకుతున్నాయి? చేతుల్లేని అవిటివాళ్లేమైనా దాడికి దిగారా?”

“భుజాల ఎముకలు చెదిరిపోయి ఉంటాయి, ఎందుకని? ఎందుకు కాలి ఎముకలు, పక్కటెముకలు చితికిపోయి వుంటాయి ?”

రెండు రకాల జవాబులు. ఒకటి - మౌనం. రెండు చివాట్లు తిన్న బాధ కళ్ళలో.

“సెగ్గుపడాలి! ఇదంతా ఎందుకు తీసుకొస్తారు? ఏం చేద్దాం, ఏం చేద్దాం ...?”

=ల్రడ్రవిలో ఎంత మంది వుండిపోయారు?” సమాధానంగా మౌనం.

“ఒక రక్షణ దళం? పన్ను కట్టే సామాన్య (ప్రజల కష్టార్టితంపై ఒక పెద్ద 9021211098 ను ఆ అడవి (ప్రాంతంలో వుంచి పోషించడం న్యాయమని సమర్ధించుకోవచ్చా?”

సమాధానం : 0%)60/101%. “అడవి ప్రాంతం” అని చెప్పడం సరికాదు. 02102110 కు మంచి పోషకాలతో కూడిన బలవర్ధకమైన ఆహారం, అన్ని మతాల వారు ప్రార్ధనలు చేసుకోవడానికి సరంజామా, “వివిధ భారతి వినే అవకాశం, సంజీవ్‌ కుమార్‌, థీ కృష్ణ ముఖాముఖిగా చూడటానికి సినిమాలు. ₹13 ఏ 1ష౬ ఇదీ జీవితం. అటవీ ప్రాంతం కాదు.

“ఎంత మంది వుండిపోయారు ?”

మౌనం సమాధానం

“ఎంత మంది వుండిపోయారు ? ఇంతకీ ఒక్కడైనా వున్నాడా ?”

పొడవైన సమాధానం.

1660: ₹అ, 2ంగం0 ఇంకా కొనసాగుతూనే వుంది. వడ్డీ వ్యాపారులు, భూస్వాములు, దళారులు, రహస్యంగా వేశ్యాగ్భహాలు నడిపేవారు, పాత ంగ౧లలు అందరూ భయబ్రాంతులై వున్నారు. ఆకలితో వుండి బరిబత్తల తిరిగేవారు ఇంకా ధిక్కరిస్తూనే వున్నారు. వారిని అణచివేయలేకపోతున్నాం. కొన్ని గ౦01ఓ68లలో రైతు కూలీలకు మంచి కూలీ దొరుకుతోంది. అజ్ఞాతంలో వున్న వారిపై గ్రామాలు సానుభూతి చూపుతున్నాయి. న.

ఇంకా శత్రు వైఖరితోనే వుండి సమాచారమిన్వరు. ఈ సంఘటనలన్నీ ఆలోచనకు పురికొల్పుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో దోప్టి మేజెన్‌ను ఎలా అంచనా వేయాలి ? కన్నుగప్పి తిరిగే వారి తోటే ఆమెకు సంబంధాలుండి వుంటాయి. భయానికి కారణం మరేదో వుంది. వాళ్లంతా అడవుల్లో ఆదిమ మానవుల్లా బతకడానికి అలవాటు పడి వుంటారు. పేద రైతు కూలీలతో, ఆదివాసులతో సహవాసం చేస్తారు. చదువు సంధ్యలు ఎప్పుడో మరిచిపోయి వుంటారు. బహుశా 'వాళ్ళు' వారి భూమినెలా కాపొడుకోవాలోనన్న కొత్త చదువులు చదవడానికి అనుగుణంగా తమని తాము మార్చుకుంటున్నారు. కొత్త పద్ధతులు, గెరిల్లా, 00102619 యు[006 లు నేర్చుకుంటూ వుండవచ్చు. 'తూతూ' మంత్రంగా నేర్చుకునే విద్యలు ఏవైనా వాటిని వదిలించుకోవడం అంత కష్టమేమికాదు. కానీ, ప్రాక్టికల్‌గా ఎవరైతే అదే పని మీద వుంటారో వారిని సమూలంగా ఏరివేయడం అంత సులువైన పని కాదు.

కాబట్టీ 00౬260౦ ౮౧౧0401 10165 ఆగిపోదు.

61801 : తుము? తఖు4 9001 లో వున్న హెచ్చరిక సూత్రాలు. “౧6 ఇ0163 01 ౪జయు2".

2

దోప్టిని వెంబడించండి. ఆమె తన అనుచరుల స్టావరానికి తప్పక దారి తీస్తది.

కొద్ది పాటి అన్నం మూటను నడుంకు పట్టీలా కట్టుకొని దోప్టి నెమ్మదిగా ముందుకు సాగిపోతుంది. మొషాయి 'టుడు” భార్య ఆమె కోసం కొద్దిగా వండింది. ఆమె అప్పుడప్పుడు అలా చేస్తుంది. ఎప్పుడైతే అన్నం చల్లగా ఉంటుందో అప్పుడు దాన్ని చిన్న మూటలా ముడి వేసి నడుముకు కట్టుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది. నడుస్తూ నడుస్తూనే తలలోని పేలను ఏరి గోర్ల మధ్య ఒత్తుకుంటూ పోతుంది. కిరోసిన్‌ వుంటే నెత్తికి రుద్దుకొని పేల నుండి ఉపశమనం పొందుతుంది. తరువాత బేకింగ్‌ సోడా రుద్ది నెత్తిని శుభ్రం చేసుకుంటది. కానీ ఈ లంజ కొడుకులు ప్రతి వాగు, వంక మలుపుల దగ్గర కాపు కాసి వలపన్ని వుంచుతారు. ఏ మాత్రం నీటిలో కిరోసిన్‌ కంపు వచ్చిందనుకో, ఆ వాసన పసిగట్టి వెంటపడతారు.

“ద్రోష్ట”

ఆమె జవాబివ్వలేదు. ఆమె స్వంత పేరుతో ఎవరు పిలిచినా పలుకదు. ఈ రోజే చూసింది. పంచాయతీ ఆఫీసులో తన పేరు మీద బహుమతి ప్రకటించిన నోటీసును. 66 దా. రూప్‌కుమార్‌ డచ్బీకార్‌

మొషాయి “టుడు భార్య అడిగింది. “ఏం చూస్తున్నావ్‌? దోప్టి మేజెన్‌ ఎవరు ? ఆమెను పట్టిస్తే దబ్బు.. 1”

“ఎంత ౩”

“రెండు వందలు 1”

“ఒది దేవుడా

మొషాయి భార్య ఆఫీస్‌ బయట చెప్పింది. “ఈసారి పెద్ద ఎత్తున తయారీ జరుగుతుంది. కొత్త పోలీసోల్లు ౯

హు”

“మళ్ళీ రాకు”

“ఎందుకు ?”

మొషాయి భార్య చూపు నేలకు వాలింది. టుడు చెపుతుంది.. “అదే.. సాహెబ్‌, పెద్ద సారూ మళ్ళీ వచ్చాడని. వాళ్ళు ఒకవేళ నిన్ను పట్టుకుంటే, ఈ పల్లె మన గుడిసెలు... మళ్ళీ తగలబెడతారు.”

“బెను. మరి దుఖిరామ్‌ సంగతి ...?”

“సాహెబ్‌ కే తెలుసు.”

“మమై , బుద్న మనల్ని మోసం చేశారు.”

“ఎక్కడున్నారు వాళ్ళు?”

“రైలెక్కి పారిపోయారు.”

దోప్టి మనసులో ఆలోచనలు మెదలసాగాయి. “ఇంటికెళ్ళు, ఏం జరగబోతుందో నాకే తెలియదు అని చెప్పింది. ఒకవేళ పట్టుకుంటారేమో.. నాకేం తోచడం లేదు.”

“త్రప్పించుకుపోలేవా ?”

=ల్రేదు. చెప్పు నువ్వే ? ఎన్నిసార్లని తప్పించుకు తిరగ్గలను ? ఒకవేళ నన్ను పట్టుకుంటే ఏం చేస్తారు? చంపేస్తారు. 00420491 చేస్తారు అంతేకదా ! చేయనీ 1”

“తప్పించుకోడానికి మనకే దారి లేదా ?” మొషాయి భార్య అడిగింది.

దోప్టి మెల్లగా చెప్పింది, “నేనెవరి పేరు కూడా చెప్పను.”

దోప్టికి తెలుసు. చాలామంది నోట విన్నది. పోలీసులు పెట్టే చిత్రహింసల బాధను తట్టుకోలేక ఎలా దారికొస్తారోనని. తనని మానసికంగా, శారీరకంగా హింసలకు గురిచేసిన ప్రతిసారీ నాలుకను పళ్లతో గట్టిగా కరుచుకుంటది. ఆ పిల్లాడు అలాగే చేసాడు. రేపెక్కడికెళ్తావ్‌...? 67

అందుకు అతన్ని ఆం౦ట౫8లూ చేసారు. ఎప్పుడైతే ౧౦౪19 చేస్తారో రెండు చేతులను వెనక్కి మడిచి కట్టేస్తారు. మక్కెలిరగతంతారు. జననాంగాలు తీవ్రంగా గాయపడతాయి. "1౬11066 0 001106 11 జం ౧౦౦౪016 .. బకమం* 216 ...... 226 [6/౧6 ౧౫/౦" అంటూ వార్త.

నడుస్తున్నప్పుడు ఈ ఆలోచనలు ఆమె మెదడును తొలిచి వేస్తున్నాయి .

“ద్రోజ్జ” - ఎవరో పిలుస్తున్నారు తనని.

ఆమె జవాబిబివ్వలేదు. తన స్వంత పేరు పెట్టీ ఎవరు పిలిచినా పలకదు.

ఇక్కడ ఆమె పేరు ఉపి మేజెన్‌. కాని ఎవరు పిలుస్తారు?

అనేక అనుమానాలు ఆమె మెదడును తొలిచివేస్తున్నాయి. 'దోప్టి - అన్న మాట వినగానే ముళ్ళ పందిలా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. నడుస్తూ ఒక్కొక్కరినీ, తెలిసిన ముఖాలను మననం చేసుకుంటోంది. “ఎవరు?” షోమ్రా కాదు. షోమ్రా అజ్ఞాతంలోకి పోయాడు. షోమై, బుద్న కూడా వేరే కారణాలతో తప్పించుకు పోయారు. 'గోలాక్‌ కాదు - అతను ఐకులిలో వున్నాడు. కజంు1 నుందే ఇంకెవరైనా ఉండొచ్చా? బకులి నుండి వచ్చిన తర్వాత తన పేరు ఉపి మేజెన్‌గా, దుల్న పేరు మాతంగ్‌ మాయిగా మారిపోయాయి. ఇక్కడ మొషాయికి, అతని భార్యకు తప్ప మరెవ్వరికీ మా అసలు పేర్లు తెలియవు. యువకుల్లోనూ, పాత బ్యాచ్‌కి తెలియదు.

ఆ సంఘటన గుర్తుకొచ్చిన ప్రతిసారి దోప్టి గందరగోళానికి గురైతది. అదొక గడ్డు సమయం. బఐకులిలో “0౬264౦1 9ఖేయి!'. సుర్దా సాహు, తన రెండిండ్లలో బిడ్డి బాబుతో కలిని రెండు (406 ౪/6115, మూడు బావులను తవ్వడానికి నిర్ణయించుకున్నాడు. ఎక్కడా చుక్కనీరు లేదు. 301000 లో కరువు. సుర్దా సాహు ఇంట్లో నీరు వరదై పారుతది.

“కాలువ పన్ను తోటి నీటిని తోడు, ప్రతిదీ మండి పోతున్నది కదా 1”

“పన్ను డబ్బుతో పంట దిగుబడి పెంచితే నాకేం లాభం ?”

“ఆలం: 00 67”

“వెళ్ళవతలికి? నీ పంచాయతీ తలతిక్క లెక్కలు నా కక్కర లేదు. నీళ్లు పారించి పంట పెంచాలి. పొలం పనిలో సహాయం పేరుతొ సగం ధాన్యం నీకు కావాలి. పుణ్యానికాచ్చే ధాన్యంతో అందరికీ సంతోషమే. మా ఇంటి అవసరానికి కొంత ధాన్యం, నాకు కొంత డబ్బు సహాయం , ఇలా..! నాకు బుద్ధొచ్చింది. నీకు మంచి చేసి గుణపాఠం నేర్చుకున్నాను.” 68 డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

“ఏం మంచి చేసావు?

“ఊరికి నీల్లివ్వలేదా?”

“నీ ఐంధువు భగునాల్‌ కిచ్చుకున్నావ్‌.”

“నీకందలేదా నీళ్లు?”

“లేదు. అంటరానివాళ్లకు నీళ్లు అందవు .”

జగడం అక్కడ మొదలైంది. కరువు కాలంలో మనిషి సహనం సులువుగా నశించి పోతుంది. సతీష్స్‌ జుగల్‌ ఆ ఊరి నుండి ఓయువకుడు - “రానా అతని పేరు ? భూమి స్వంతదారులు, వడ్డీ వ్యాపారులు ఏమి సహాయం చెయ్యరు. వాణ్ని కూల్చేస్తే సరి.

రాత్రి సమయం. సుర్దా సాహు ఇంటిని చుట్టుముట్టారు. సుర్దా సాహు తన తుపాకిని బయటికి తీసాడు. సుర్దాను ఆవును కట్టే తాడుతో కట్టేశారు. అతను తెల్లని కనుగుడ్లు గిర్రున తిప్పుతున్నాడు. అలా అలా తిప్పుతూనే వున్నాడు. దుల్న చెప్పాడు - “అన్నా మొదట నేనొక పిడిగుద్దు వేస్తాను. మా ముత్తాతలు ఇతని దగ్గర కొద్దిపాటి ధాన్యం తీసుకున్న పాపానికి, ఆ అప్పు తీర్చలేక నేనింకా వెట్టి చాకిరి చేస్తూనే వున్నాను.”

దోప్టి అందుకుంది. “నన్ను చూడగానే వీడికి నోరూరింది. వీడి కళ్ళు పేకేస్తాను.”

సుర్దా సాహు. షివురి నుండి టెలిగ్రాఫిక్‌ మెసేజ్‌. 5060121 టు. తుణ్యు? ౮660 బకులి వరకు రాలేదు. జయ -- ఖం -- ఖం... అడుగు భాగాన మేకులు కొట్టబడిన బూట్లు, వాటి కింద గులకరాళ్లు, కంకర నలిగిపోతూ ఖర్‌, ఖర్‌, కర్‌ శబ్దం. ౮06401 ౪0. చుట్టుముట్టండి. మైకులో ఆదేశాలివ్వబడుతున్నాయి. జుగల్‌ మండల్‌, సతీష్‌ మండల్స్‌ రానా అలియాస్‌ ్రబీర్‌ అలియాస్‌ దీపక్‌, దుల్న మార్పు, దోప్టి మేజెన్‌

  • 50000664 కలంలురేలం తళంలరేలు 0 880060రేట, 900606 శం? ౧0% 10౪7-60౪0 6 ౪111286. లొంగిపోండి. పట్‌-పట్‌ -పట్‌మని శబ్దం - బాప్పవాయుగోళాలు గాలిలో - పట్‌ - పట్‌ [ంళు6 116 01068 - పట్‌-పట్‌. నిప్పు గోళాలు విసురుతూ. బకులి తగలబడి పోతుంది. ఆడ, మగ, పిల్లలు .. తేడా లేదు. ఫైర్‌
  • ఫైర్‌, కాలువ వైపు దారిని మూసివేయండి. ౦౪౪౫-- ౦౧౪౬ -- ౦౪౪ 9 9౭00620. దోప్టి, దుల్న సురక్షిత ప్రాంతానికి కడుపు మీద ప్రాకుకుంటూ ...

బకులి నుండి పట్టాకురి కి చేరకపోదురు. భూపతి, తాప తీసుకువచ్చారు.

అక్కడ దోప్టి, దుల్న 0210201061 చుట్టుపక్కలే పనులు చూసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. దుల్బ, దోప్టికి చెప్పాడు - “ఇక్కడ బాగానే వుంది, మనం మన పిల్లల్ని కుటుంబాన్ని మాత్రం తీసుకురావద్దు. కాని, ఎవరికి తెలుసు ? భూమి స్వంతదారు, వడ్డీ వ్యాపారులు, పోలీసోల్లు ఏదో ఒక రోజు తుడిచిపెట్టుకుపోరని!” రేపెక్కడికెళ్తావ్‌...? 69

“వెనకనుండి ఎవరు పిలిచారు తనను ఈ రోజు.”

దోప్టి నడుస్తూనే వుంది. పల్లెలు, పొలాలు, పొదలు, రాళ్లు రప్పలు 140116 17080 ౨69బార0ల06 గుర్తులు పెట్టేవాళ్ళు - పరుగెత్తే శబ్దాలు వెనకవైపు. ఒకే ఒక వ్యక్తి పరుగులు తీసేది. 1౪02221 107656ఇంకా రెండు మైళ్ళ దూరం. ఆమెకు మరో ఆలోచన లేదు, అడవిలోకి ప్రవేశించాలి. వాళ్లకు తెలియజేయాలి తన కోసం తిరిగి నోటీసులంటిచారని. ఆ.. ఆ..సాహెబ్‌ లంజకొడుకు మళ్ళీ కనబడ్డాడన్న విషయం కూడా చెప్పాలి. 16602ు మార్చాలి. భవిష్యత్‌ ఎజెండాను కూడా. లక్కీ బేరా, నారన్‌ బేరా, 'సందారిలో పొలం పనికి రమ్మని చెప్పిన సుర్దా సాహుతో వ్యవహరించిన పద్ధతిని కూడా క్యాన్సిల్‌ చేయాలి. షోమై, బుద్నక్షు అన్నీ తెలుసు. దోప్టి పక్కటెముకల కింద గొప్ప ప్రమాదం ముంచుకొచ్చిన 126060) షోమై, బుద్నలు చేసిన (ద్రోవానికి సంతాల్‌గా నేను సిగ్గుపడాల్సిందేమి లేదు అని అనుకున్నది. దోప్టిది కల్తీ లేని చంపా భూమి, స్వచ్చమైన నలుపు రక్తం, చంపా నుండి బకులి వరకు అనేక రాత్రులు, వారి రక్తం మలినమయ్యే అవకాశాలుండదేవి. దోప్టి తన పూర్వీకులను తలుచుకొని గర్వపడింది. వారి జాతి ప్రీల రక్తం పవిత్రత కోసం నల్లని కవచంలా రక్షణగా నిలిచారు. షోమై, బుద్న సంకర జాతి కొడుకులు. రాధాభూమికి, షియాన్‌డంగలో స్థావరమేర్చరచుకున్న అమెరికన్‌ సైనికుల సహకార ప్రతిఫలం. లేకపోతె సంతాల్‌ సంతాల్‌కే ద్రోహం చేయడమంటే 'పాము తన పిల్లల్ని తానే తిన్న వైనం కదా!”

ఆమె వెనకాల అడుగుల చప్పుడు. అడుగులు కొద్ది దూరంలో పడుతున్నయి. అన్నం మూట, పొగాకు కట్ట నడుముకు కట్టుకుంది. అరిజిత్‌, మాలిని, షాము, మంటు

  • వీళ్ళలో ఎవ్వరూ పొగతాగరు. చివరికి టీ కూడా. పొగాకు, సున్నపు రాయి పొడి, తేలు కాటుకు మంచి మందు. ఏది వదలకూడదు.

దోప్టి ఎడమ వైపుకు మళ్లింది. ఈ వైపుకే క్యాంపు వుంది. రెండు మైళ్ళు. ఈ వైపు నుండి అడవి రాదు. తన వెనకాల పోలీసును వెంటబెట్టుకొని దోప్టి అడవిలోకి ప్రవేశించదు.

నా ప్రాణం మీద ప్రమాణం. నా ప్రాణానికి ప్రాణమైన దుల్న ప్రాణం మీద ఒట్టు. ఏ విషయమూ బయటపెట్టకూడదు.

అడుగుల చప్పుడూ ఎడమవైపుకు మళ్లింది. దోప్టి నడుం మీదకు చేతిని పోనిచ్చింది. ఆమె చేతికి నెలవంకలా - చిన్న కొడవలి. కంసాలులు అద్భుతమైన పనిమంతులు. దాని పదును తస్సాదియ్యా ఉపి, వందమంది దుఖిరామ్‌లు - నయమైంది 70 దా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

దేవుడా ! దోప్టి మంచి బాలుడు కాకుండా పోవడం. బహుశా వాళ్లకి అర్ధమయ్యి ఉంటుంది. కొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులు మంచివని. నిశ్శబ్దంగా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. దూరాన క్యాంపులో లైట్లు. దోప్టి ఇటువైపు ఎందుకు వెళ్తున్నట్లు? కాస్త నిలబడదాం. దారి మరో మలుపు తీసుకుంటోంది. హు ..! కళ్ళు మూసుకొని రాత్రంతా తిరిగినా ఎక్కడున్నానో చెప్పగలను. నేను అడవి లోపలికి వెళ్ళను. అలాగని ఇతన్ని వదులుకోలేను. వదిలి పరిగెత్తిపోను. “గుంటనక్కపోలీసు నా కొడుకా! చావంటే భయంతో చస్తావు. ఈ అడవిలో ఎక్కడికని పరుగెత్తుతావు. పరిగెత్తించి, పరిగెత్తించి ఊపిరి తీసుకోకుండా చేసి, బొందల పారేసి ఖతం చేస్త.” ఒక్క మాట కూడా మాట్లాడకూడదనుకుంది. దోష్టి కొత్త క్యాంపును చూసింది. బస్సు స్టేషన్‌ల కూసోని బీడీ కాలుస్తూ పోలీసు కాన్వాయిలు ఎన్ని వచ్చాయి, రేడియో 720 లెన్ని వచ్చాయో లెక్క కడుతూ రోజంతా గడిపింది. స్వ్వాష్‌ నాల్గు, ఉల్లిగడ్డలు ఏడు, మిరియాలు యాఖై , చిక్కులేని సూటిలెక్క ఈ సమాచారం ఇప్పుడే అందజేయకూడదు. వాళ్ళు అర్ధం చేసుకుంటారు. దోప్టి మేజెన్‌ అ00016 అయ్యిందని. అప్పుడు కాళ్లకు బుద్ది చెపుతారు. అరిజిత్‌ గొంతు. ఎవరైనా పట్టుబడితే మిగతా వాళ్ళు అవకాశం చూసుకొని స్థావరాలను మార్చాలి. కామ్రేడ్‌ దోప్టి ఒకవేళ రావడంలో ఆలస్యం చేస్తే , మనమిక్కడ ఉండలేము. మనమెక్కడికి వెళ్తున్నామో ఆ సంగతి తెలిపే గురుతు మాత్రమే ఉంటుంది. ఆమె కోసం ఏ కామ్రేడ్‌ కూడా ఇతర కామ్రేడ్‌లకు హాని కలిగించలేడు. అరిజిత్‌ గొంతు. నీళ్లు పుక్కిలించినట్లు. మన తరువాత స్థావరం ఎక్కడో తెలియడానికి రాతి కింద కట్టె బాణం, దాని చివరి కొస దిశను చూపటానికి గుర్తుగా ఉంటుంది. దోప్టికి ఇష్టమే, అర్ధం చేసుకుంటుంది. దుల్న చనిపోయాడు కాని ఒక్క విషయం చెపుతున్నాను, అతను ఎవరి ప్రాణాలు పోకుండా జాగ్రత్త పడ్డాడు. ఏది మన చేతిలో లేదు. ఎవరి వల్లో ఎన్‌కౌంటర్‌ అయ్యాడని చెప్పడానికి లేదు. దోప్టి తిరిగి వస్తే - మంచిదే; రాకపోతే - విషాదమే. కానీ .. స్థావరాలు మారాల్సిందే. మనం వదిలే జాడ ఎలా ఉండాలంటే మన శత్రువు కంటబడకూడదు. కనపడినా అర్ధం కాకుండా వుండాల.. అడుగుల చప్పుడు ఆమె వెనకాలే. దోప్టి ఇంకో మలుపు తీసుకుంటోంది. ఈ మూడున్నర మైళ్ల నేల బండరాళ్లతో నిండి అడవిలోకి దారితీస్తుంది. కాని దోప్టి గేపెక్కడికెళ్తావ్‌.? ల

ఆ దారిని వెనకే వదిలేసింది. కొద్దిదూరంలో కాస్త చదునుగా వున్న ప్రదేశం. తిరిగి బందరాళ్లతో నేల. రాతి నేల చేయబట్టి క్యాంపు దరిదాపుల్లోకి ఆర్మీ రాలేక పోయి వుండవచ్చు. ఈ ప్రదేశం చాలా బాగా సరిపోయింది. చిట్టడవిలా వుండి దిబ్బలన్నీ ఒక్క తీర్ణ వుండి అనుకూలంగా వున్నాయి. మంచిదే. దోప్టి పోలీసోన్ని 0000002 820 వైపుకి దారి మళ్లిస్తది. 'సారందికు చెందిన పతిత పావన్‌, కాళీ అమ్మవారి పేరు మీద ఇదే ఘాట్‌ పై బలిపీఠమెక్కాడు. “పట్టుకోండి!” అరుపు. బండరాయి ఎదురుగా నిలబడినట్లు. ఒకటి. మరొకటి. ఒక్కసారిగా విజయోత్సాహం, ఒక రకమైన నిరాశ కలగలిసిన 2లఎ0ల౦జ| సేనానాయక్‌. “0/0 ఇజం410 66300 46 అ౧౦౧౦) 0600016 016. అతను సాధించాడు. ఆరేళ్ళ నుండి వాళ్ళ కదలికలను గమనిస్తున్నాడు. ఇప్పటికి ... అందుకే అతను గర్వంతో ఉప్పొంగి పోతున్నాడు. ఎప్పటికప్పుడు సంబంధిత సాహిత్యాన్ని చదువుతూ ...₹3691006 పుస్తకం చదివాడు - ఫలితం ఏమిటో చూసాడు. దోప్టి అతన్ని వమార్చలేకపోయింది. అందుకు అతను సంతోషంగా లేడు. రెండు రకాల కారజాలు. ఆరు సంవత్సరాల క్రితం అతనొక వ్యాసం రాసాడు. సమాచారం మొత్తం మెదడు కణాల్లో ఎలా నిక్షిప్తం చేసుకోవాలోనని. ఆ విషయస్ఫూర్తితో కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని తన పోరాటాన్ని బలోపేతం చేసుకున్నాడు. దోప్టి ఒక కార్యకర్త - కేలర[బురే. 744201 కై0185 కార్యరంగంలోకి దూకి పనిచేసే చురుకైన కార్యకర్త. 502౯00 ఖ0రే ౧6300) దోప్టి మేజెన్‌, ఇక చేతికి చిక్కడానికి సమయం దగ్గరపడింది. దానికి కష్టకాలమొచ్చింది. ౪111 06 46380066 , వొపం! 162161 ప్ప్‌! న్సిల్పు” దోప్టి క్షణకాలం ఆగుతుంది. వెనకాల వున్న అడుగులు ఇపుడు తన ముందుకు వచ్చాయి. ఆమెలో ఆవేశం పెల్లుబికింది. నమ్మలేదు. సుర్దా సాహు సోదరుడు రోతొని సాహు. రెండు బండరాళ్లు కూడా ముందుకు వచ్చాయి - షోమై, బుద్న. "రైలులో తప్పించుకుపోలేదా వీళ్ళు?!” అరిజిత్‌ గొంతు.. “తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం - అదేమంటే గెలుపును ఎలా స్వాగతిస్తామో ఓటమిని కూడా అదే స్ఫూర్తితో స్వాగతించి తదుపరి చర్య ఏమిటో దానిని కార్యరూపంలో పెట్టడానికి ప్రయత్నించాలి.” 72 దా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

దోప్టి తన రెండు చేతులను విప్పార్చి, ముఖాన్ని ఆకాశం వైపుకు చూపుతూ అడవి వైపు తిరిగి తన శక్తినంతా కూడగట్టుకొని ఊళలాంటి అరుపులతో ధ్వనిని పుట్టిస్తూ తన వాళ్లకు సంకేతాన్నందించింది. ఒకటి, రెండు, మూడు సార్లు మూడవసారి అడవికి వెలుపల, చెట్ల మీదున్న పక్షులన్నీ ఒక్కసారిగా రెక్కలు రెపరెపలాడిస్తూ పెద్దగా చప్పుడు చేస్తూ ఎగిరాయి. పిలుపు ప్రతిధ్వనిస్తూ చాలా దూరం వరకు పయనించింది.

(ద్రౌపది మేజెన్ను సాయంకాలం 6. 50 నిమిషాలకు నిర్బంధంలోకి తీసుకున్నారు. క్యాంపుకు తీసుకు రావడానికి గంట సమయం పట్టింది. (ప్రశ్నించదానికి గంట పట్టింది. ఎవ్వరూ ఆమెను తాకలేదు. క్యాంపు ప్లాస్టిక్‌ స్టూల్‌ మీద కూర్చోడానికి అనుమతించారు. 8.57 నిమిషాలు. సేనానాయక్‌ డిన్నర్‌కు సమయం కావొచ్చింది. “సిద్ధం చెయ్యండి. జరగాల్సింది ఏదో చూడండి” అంటూ అతను వెళ్ళిపోయాడు.

యుగాలు గడుస్తున్నట్లు .. కొన్ని యుగాలు దాటిఫోయినట్లు ... వేదనానుభవం. యుగాల అనంతరం ఆమెకు మెలకువ వచ్చింది. విచిత్రంగా ఆకాశం వైపు, చంద్రుని వైపు చూస్తోంది. విపరీతమైన తలనొప్పి, నెమ్మదిగా తగ్గుతున్నట్లు .. కదలాలని చిన్న (ప్రయత్నం. ఇంకా ఆమె కాళ్ళు, చేతులు నాలుగు గుంజలకు కట్టి పదేసినట్లు బాధ. ఏదో జిగటగా ఆమె నడుము కింద, పిరుదుల మధ్య... తనదే రక్తం. నోటికి కట్టిన గుడ్డ మాత్రమే తొలగించబడింది. బాగా దాహమేస్తోంది. “నీళ్లు అని అడగవలసి వచ్చినపుడు తన పంటితో కింది పెదవిని గట్టిగా కరిచి పట్టుకునేది. యోని నుండి రక్తం కారుతున్న స్పర్థ ఆమెకు తెలుస్తోంది. ఎంతమంది వచ్చారో, ఆమెను సిద్ధం చెయ్యడానికి!?

అవమాన భారం, కన్నీటి చుక్కలు ఆమె కనుకొనుకులలోంచి రాలిపడుతున్నాయి. మసక వెన్నెల. కాంతి విహీనమైన ఆమె కన్నులు కిందికి వాలి స్తనాలను చూస్తున్నాయి. ఆమెకు అర్ధమవుతోంది. ఆమెను సరిగానే సిద్ధం చేశారు. ఆమె స్తనాలను అనాగరికంగా కొరికిన ఆనవాళ్లు. చనుమొనలు చీలిపోయాయి. ఎందరుండవచ్చు? నలుగురా - ఐదుగురా

  • ఆరుగురా - ఏడుగురా... ఇందరినా (ద్రౌపది భరించగలిగింది. ఆమె చూపులను తిప్పి చూస్తే ఏదో తెల్లగా. మరేమి లేదు తనదే గుడ్డ ముక్క అకస్మాత్తుగా ఆమెలో నమ్మకం పైనే నమ్మకం కలగసాగింది. బహుశా వాళ్ళు వదిలేసి వెళ్ళి వుంటారు. నక్కలకు ఆహారంగా, కాని అడుగుల చప్పుడు ఆమెకు వినిపిస్తోంది. తలతిప్పి చూసింది. గార్డు తన తుపాకీ బానెట్‌ మీదికి వాలుతూ ఆమె వైపు ఓరగా చూస్తున్నాడు. (ద్రౌపది కళ్ళు మూసుకుంది. ఆమెకు పెద్దగా వేచివుండాల్సిన అవసరం పడలేదు. మళ్ళీ ఆమెను 'సెద్ధం చేసే కార్యక్రమం మొదలైంది. పనులు జరుగుతూనే వున్నాయి. ఉన్న కాస్త వెలుగు మసక బారింది. చంద్రుడు రేపెక్కడికెళ్తావ్‌...? 78

నిష్క్రమించాడు. చీకటి మాత్రమే మిగిలిపోయింది. బలవంతంగా రెక్కలు విప్పార్చి... మాంసపు 10130005 చురుకుగా పైకి కిందకు, పైకి కిందకూ.. శరీరం మీద బరువు...

తెల్లవారుతోంది. అప్పుడు ద్రౌపది మేజెన్‌ను టెంట్‌లోకి తీసుకొచ్చి విసిరేశారు. ఆమెదే గుడ్డముక్క శరీరంపై విసురుగా పడేసి ...

“బ్రేక్‌ ఫాస్ట్‌ తర్వాత వార్తా పత్రిక చదివి “ద్రౌపది మేజెన్‌ పట్టుబడింది" వగైరా అని రేడియో మెసేజ్‌ ఇచ్చి ద్రౌపదిని లోపలికి పంపమని ఆదేశం.

అనుకోకుండా సమస్య తలెత్తుతుంది.

“నడూ” అన్నమాట వినగానే (ద్రౌపది లేచి కూర్చుంటూ “ఎక్కడికి

నడవమంటావు ”? అని అడిగింది

“బుర్రా సాహెబ్‌ టెంటుకు”

“టెంట్‌ ఎక్కడుంది?”

“అటు వైపూ

(ద్రౌపది తన ఎర్రబారిన కళ్లతో టెంట్‌ వైపు చూపు నిలుపుతుంది. “రండి, నేను వెళ్తాను” అంది.

గార్డు నీళ్ల కుండను ముందుకు తోస్తాడు.

ద్రౌపది నిలబడుతుంది. నీళ్లను నేలమీద ఒలకబోస్తుంది. పళ్లతో గుడ్డముక్క్మను చింపేస్తుంది. ఆమె వింత ప్రవర్తనను గమనించిన గార్డు ఆమెకు పిచ్చెక్కిందంటూ ఏం చెయ్యాలోనని తదుపరి ఆదేశాలకు పరుగులు తీస్తాడు.

గార్జుకు ఖైదీని తీసికెళ్లడమే తెలుసు కాని ఒకవేళ ఖైదీ విపరీత ధోరణిలో ప్రవర్తిస్తే ఏం జెయ్యాలో తెలియదు. అందుకే తదుపరి చర్వకు తన సుపీరియర్‌ వద్దకు వెళ్తాడు.

జైలులో అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక జారీ చేసినపుడు వుండే గందరగోళం సృష్టించబడింది. సేనానాయక్‌ బయటికి వచ్చి బిత్తర పోతాడు ద్రౌపదిని నగ్నంగా చూసి. తల పైకెత్తి మంచి ఎండలో తనవైపే నడుచుకుంటూ వస్తోంది. ఆశ్చర్యంతో గార్డులు అతని వెనక వైపుకు వెళ్లి నిల్చుండిపోతారు.

“వవిటిదంతా?” గట్టిగా అరవబోయాడు. కాని మాట పెగలదు. (ద్రౌపది అతని ముందుకెళ్లి నిలబడింది, నగ్నంగా. తొడల మీద, జననేంద్రియాల పైన వెంట్రుకలు ఎండిన రక్తంతో అట్టకట్టుకు పోయాయి, రెండు స్తనాలు, రెండు గాయాలుగా...

74 డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

“ఏమిటిది ?” మళ్ళీ గట్టిగా అరవబోయాడు .

(ద్రౌపది దగ్గరగా వచ్చి ఒక చెయ్యి తన పిర్ర మీద ఆనించి నిలబడి నవ్వుతూ

  • “నువ్వు వెతుకుతున్న వస్తువునురా ! దోప్టి మేజెన్‌.”

“నువ్వే కదా వాళ్లకు ఆదేశాలిచ్చింది, నన్ను 'సెద్ధం) చేయమని. చూడాలను కోవటం లేదా వాళ్ళు ఎలా 'సెద్ధం చేసారో నన్ను?”

“ఆమె బట్టలెక్కడ ?”

“వేస్పకోవడం లేదు సార్‌, వాటిని చింపేస్తుంది.”

(ద్రౌపది నల్లని శరీరం ఇంకా దగ్గరికి వచ్చేసింది. (ద్రౌపది గట్టిగా నవ్వుతోంది. ఆ నవ్వుకు శరీరమంతా ఊగిపోతుంది. సేనానాయక్‌కు అర్ధం కాక ఎటూ పాలుపోవడం లేదు. నవ్వుతున్న కొద్దీ ఆమె గాయపడిన పెదాల నుండి రక్తం కారుతోంది. (ద్రౌపది తన అరచేత్తో రక్తాన్ని తుడిచేసుకుంటూ ఆకాశం చీలిపోతుందా అన్నట్లు భయంకరంగా అరుస్తూ, ఊళలు వేస్తూ తీవ్రమైన స్వరంతో “ఐట్టలేం చేస్కోనురా? ఐట్టలూడదీయగలవు, కాని మళ్ళీ తొడగ్గలవా? మనిషివేనా నువ్వు?”

చుట్టూ చూసింది, చివరికి సేనానాయక్‌ తెల్లని బుష్‌ షర్ట్‌ ముందు భాగంపై రక్తంతో నిండిన ఉమ్మిని ఖాండ్రించి ఉమ్మేసింది. “ఇక్కడ నేను సిగ్గుతో తలదించుకోవడానికి ఏ మగాడు ఉన్నాడా? నా వొంటి మీద కప్పడానికి నిన్ను దగ్గరికి కూడా రానివ్వను. ఇంకా వముంది నువ్వు చెయ్యడానికి, రా! దమ్ముంటే ఎన్‌కౌంటర్‌ చెయరా? ౧00016 చెయ్‌! ఎదుర్కో నన్ను?”

ఆవేశంతో తీవ్రంగా గాయపడిన తన రెండు స్తనాలలో సేనానాయక్‌ను ముందుకు తోస్తుంది. (ద్రౌపది - నిరాయుధంగా నిలబడిన తన 11861 ముందు నిలబడటానికి సేనానాయక్‌ మొట్టమొదటిసారిగా భయంతో వణికిపోయాడు.

ళ్ధ

రేపెక్కడికెళ్తావ్‌...? 75

జ న. న్‌ా మా. స్‌ 18 జనవరి,19836లో బ్రిటిష్‌ ఇండియా, సింధ్‌ 20 ప్రాంతంలోని సుక్కూర్‌ జిల్లా రోహి గ్రామంలో దా, మోతీలాల్‌ జోతాళ జన్మించారు. 1947లో దేశ విభజన సందర్భంలో వీరి కుటుంబం ఇండియాకు వచ్చి ఢిల్లీలో స్థిరపడింది. వాధూమల్‌ జోత్వాని, చంద్ర జోత్వాని వీరి తల్లిదండ్రులు. సింధీ, హిందీ భాషలలో సుప్రసిద్ధ రచయిత. సాహిత్య అకాడమీ అవార్డు, పద్మశ్రీ పురస్కార గ్రహీత. ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు. అరవైకి పైగా సింధీ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో గ్రంధాలు ప్రచురించారు. వీరి ప్రముఖ రచనలు; సందన్‌ ధాని జె సరకుని తే, పురుష్‌ అయిన్‌ ప్రకృతి, సుంజానప్‌ జో సంకట్స్‌ ఖయాల్స్‌ రిస్తా నాతాా సూఫీస్‌ అఫ్‌ సింధ్‌. 28, జనవరి, 2008న పూణేలో దివంగతులయ్యారు. వీరి సింధీ కథ 'ధర్తీ సే నాతాలో ఒక రచయిత అస్తిత్వ వేదన చిత్రీకరించబడింది. తన జన్మ భూమి మీద (క్రేమ, తన నేలకు దూరమయ్యానన్న అంతర్గతంగా వుండే బాధ వ్యక్తమవుతోంది. ఈ కథను వీరే హిందీలో అనువదించారు. 76 దా. రూప్‌కుమార్‌ దన్ఫీకార్‌

పేగు తెగిన దుఃఖం...!

బస్టాపులో జనం గుంపు పెరగసాగింది. బస్‌ అలా రాగానే జనం లోపలి కెక్కడానికి ఒకరినొకరు తోసుకుంటూ హడావుడి చేయసాగారు. బస్సు దిగడం బసంతాణికి అతి కష్టం మీద సాధ్యమైంది. కిందికి దిగిన తర్వాత వెనక వైపుకు తిరిగి తన దృష్టిని మరల్చి చూసాడు. గుంపులో కొందరు ఆడ, మగ. ఆడ, మగ కాదు కానీ నిరర్ధకమైన, పనికిమాలిన ఆడంగి చేష్టలతో మానసిక రోగం పాలైన కొన్ని జంతువులు అవి.

సంధ్య వాలింది. మహానగరం పల్లె సంధ్యతో పోలిస్తే పూర్తిగా వేరుపడిపోయింది. పల్లెలోని సంధ్య, క్షితిజం నుండి మెల్ల మెల్లగా ఊరి కాపురాలను పలకరించి తిరిగి పొలాల మీదికి దిగుతుంది. నగరాల్లో సాయంకాలాలు ఇంటికి త్వరగా చేరుకోవాలన్న ఆత్రుత జనానికి వుండదు. చేరుకోవాలన్న ఆత్మీయత కనబడదు. చేరుకున్నా తృప్తి వుండదు. ఇక్కడ కరెంటు దీపాల కాంతిలో కూడా తమ వైయుక్తికమైన, వ్యక్తిగత జీవితమనే దుప్పటిని కప్పుకొని వుండి, అందరూ ఏదో కోల్పోయినట్లు బరిబత్తలతనాన్ని వెంటేసుకొని తిరుగుతూ వుంటారు.

బసంతాణి ముందుకు కదిలాడు. ఫెడరేషన్‌ హౌస్‌ ఇంకా కొద్ది దూరంలో వుంది. నగరం మధ్యలో రీగల్‌ సినిమా టాకీస్‌ దగ్గర ఫెడరేషన్‌ వొస్‌ పేరుతొ ఒక పెద్ద భవంతి వుంది. అది భారతదేశానికి ఒక చిన్న ప్రతిరూపమని చెప్పుకోవచ్చు. ఆ భవంతిలో భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడినవారు తమ తమ సాంస్కృతిక సంస్థలను నెలకొల్పి వున్నారు. ఆ భవన నిర్మాణం పూర్తి కాగానే అన్ని తరగతుల, వర్ధాల వారి సంస్థలు వచ్చి చేరాయి. దేశ విభజన తరువాత మా వర్గం వారి ధ్యాసంతా రోటి, కపడా, మకాన్‌ నేపథ్యంలో ఉత్పన్నమైన సమస్యల పరిష్మారంలోనే మునిగిపోయి వుంది కదా అని బసంతాణి విచారించసాగాడు. లేకపోతే, నిస్సందేహంగా వారి సాంస్కృతిక సంస్థకు కూడా ఈ భవంతిలో యధోచిత స్థానం దక్కేది. మా సంస్థలోని రేపెక్కడికెళ్తావ్‌...? 77

వారు ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు. వీళ్ళు అన్ని (ప్రాంతాల్లో వ్యాపించియున్నారు. దేశ విభజన అనే దుస్సంఘటన కారణంగా వారికి చాలా అన్యాయం జరిగింది. ఎవరికైనా అధిక నష్టం జరిగిందంటే అది వీరికే జరిగింది. ఇంకా నయం, ఈ భవంతి పై భాగంలో టెర్రస్‌ పైన ఒక గది వేసుకోవచ్చని అనుమతి దొరకడం, ఒక విధంగా అదృష్టమే. అప్పట్నుంచి ప్రతి ఆదివారం పద్ధతి ప్రకారం తమ ఈ సంస్థ నిర్వహించే సమావేశానికి వోాజరవుతూ వస్తున్నాడు బసంతాణి. నగరంలోని ఒక అద్భుతమైన ఈ భవంతిలో సాయంకాలం పూట పండగ వాతావరణంతో సందడిగా వుండి అందరూ గుమికూడుతారు. మనుషుల హడావుడి అధికంగానే వుంటుంది.

రకరకాల, రంగు రంగుల దుస్తులు వేసుకొని చాలా బిజీగా కనబడుతారు. కానీ, వారికి అతి దగ్గరగా, సమీపంగా వుంటూ వారి మనసులలోకి తొంగి చూస్తే మాత్రం వాళ్ళంతా తమ తమ ఖాళీ సమయాన్ని ఎలా గడపాలా? అన్న ఆలోచనలోనే మునిగి వుంటారనే విషయం తెలిసివచ్చింది. ఈ రోజుల్లో మనిషికి జ్ఞానాన్ని ఆర్జించాలనే తాపత్రయం వుంది.

కానీ మనిషి ఎలా మారి ఎదిగిపోయాడు అంటే తన ఖాళీ సమయాన్ని సినిమా టాకీస్‌లలో, కళారంగాల, వ్యాపార రంగాల ప్రదర్శన వాటిల్లో గడిపి వృధా చేస్తున్నాడు. తన కుటుంబం, సంసారం ఉన్నప్పటికీ ఆ కుటుంబానికీ ఆవల జులాయిగా, సోమరిగా తిరగడానికి మాత్రం సమయం అలా సులువుగా దొరికిపోతుంది.

బసంతాణికి దాదాపుగా అరవై ఏళ్ళు వుండి వుంటాయి కానీ, ఆయనలో ఇంకా అదే ఉత్సాహం, చురుకుదనం వుంది. అతను నగరంలోని ఒక మూల దూరంగా వున్న బస్తీలో రెండున్నర అంతస్తుల భవనంలోని, 'బర్సాతి' గదిలో అద్దెకు వుంటున్నారు. సాధారణంగా స్థానికులు ఇంకా ఇంటి యజమాని కింది భాగంలో వుంటారు. నగరానికి వచ్చి వుందే బయటి వాళ్ళు, దాదాపుగా క్లర్కు స్థాయిలోని ఉద్యోగాలే చేస్తున్నారు. ఈ ఇంటీ “బర్సాతి' గదుల్లో వారి జీవితాలు గడిచిపోతూ వుంటాయి. బసంతాణి స్వయంగా క్లర్కు గాదు కానీ అతనికి తెలుసు. అతని సంస్థలో వేళ్ళ మీద లెక్కపెట్టగలిగే కొందరు పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు. మిగతా వాళ్ళు కనీసం చిన్న దుకాణపు యజమానులు లేదా కేవలం క్లర్ములయి ఉండొచ్చు. బెంగాలీలకు సగం బెంగాల్‌ పంజాబీలకు సగం పంజాబ్‌ దొరికింది కానీ.. మా సింధీలకు ప్ప్‌.. మా సింధ్‌ పూర్తిగా పాకిస్తాన్‌లో కలిసిపోయింది అంటూ బసంతాణి మథనపడసాగాడు.

ఇలా ఆలోచనల్లో మునిగిపోయి అతను ఫెడరేషన్‌ హౌస్‌ బయట వాకిలి ముందుకు చేరాడు. అంతలో వెనక నుంచి ఎవరో అతని భుజంపై చెయ్యి వేశారు. వెనక్కి తిరిగి చూస్తే మోహన్‌ పలకరింపుగా నవ్వుతూ... “ఐసంతాణిజీ, నమస్కార” నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద, ఇంటి టెర్రస్‌ పైన మంచం వేసి పడుకొని ఒక 78 డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

అద్బష్ట రహస్యాన్ని కనుగొని వుంటారు. గత రాత్రి కూడా ఇలాంటిదేదో అనుభవం జరిగి వుంటుంది చెప్పకూడదూ..” అని అడిగాడు

ఈ రోజు బసంతాణి హృదయం బస్సు దిగగానే అలజడితో చెదిరిపోయింది. ఎప్పుడైతే బుద్ధిజీవి, విషాద క్షణాలననుభవిస్తాడో అప్పుడు నిస్సందేహంగా అతను జీవితపు లోతుల్లో దాగిన సత్యం వరకు చేరుకుంటాడు. అతను గంభీరంగా అన్నాడు. “నిన్నటి రాట్రి మాట వదిలేయ్‌! ఇప్పుడు ఈ సంధ్యా కాలంలో ఎలా అనిపిస్తుందంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాంటి సాహిత్య సమావేశాల్లో పాల్గొంటూ సమయం వృధా చెయ్యాలో కదా? జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు సాధించగల ఉత్సృష్ట కావ్యాలు, కృతులు అందించలేమా.. 1?”

ఆరు గంటలకు సమావేశ కార్యక్రమాలు ప్రారంభం కావడానికి రంగం సిద్ధమవుతున్నది. ఆరు గంటలు కావస్తుంది. వేరు వేరు మార్గాల నుండి జనం వచ్చి చేరారు. వారందరి కృత్రిమమైన, కుత్సితమైన నవ్వుల్లో బఐసంతాణి మాట మరుగున పడిపోయింది.

ఫెడరేషన్‌ హౌస్‌ కింది అంతస్తులో గోష్టి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అక్కణ్డుంచి బయటికి వస్తూ వస్తూ రామ్‌మోహన్‌తో చెప్పాడు... “మన స్వంత భాష కిచిడీ అయిపోతున్నది. ఇప్పుడు మనం ఒక ప్రాంతానికి పరిమితమై వుండకపోవడంతో మన ప్రాంతీయ భాషపై వేరే భాషల ప్రభావం పడుతున్నది. అలాంటి సందర్భంలో వారి పదాలు మన భాష్క మన కలంపై పెత్తనం చేయడం సహజమే కదా ?”

మోహన్‌ ఎలాంటి సమాధానమివ్వలేదు కానీ అతను లోలోపల తప్పకుండా ఉద్వేగాన్ని అనుభవిస్తున్నాడు. మన జీవితాలు చాలావరకు నగరీకరణం చెందినవి. అందుకే మన భాష్క నగర వాతావరణానికి తగినట్లుగా పరిమితమై, మిశ్రమ శబ్దాల భాండాగారం అయిపోయింది. అతను తన కథలోని సారాంశంపై మనసును కేంద్రీకరించి వున్నాడు. తన సాహితీ మిత్రులకు తప్పకుండా ఈ కథ నచ్చుతుందన్న ఆశ అతనిలో పుట్టింది. తన కథానాయిక ఆధునిక జీవన సంక్షిష్టతలకు నిజమైన ప్రతినిధి అన్న భావన అతనిలో కలిగింది. తాను ఒక స్కూల్‌లో ఉపాధ్యాయురాలు. కొత్తగా పెళ్లయ్యింది. కాన, కొత్త పెళ్లికూతురు ముఖంలో వుండాల్సిన సంతోషపు ఛాయలు, కాంతి దాదాపుగా లేదనే చెప్పాలి. ఎప్పుడైతే ఆమె భర్త ఆమెను సమీపిస్తాడో, ఇద్దరూ ఒకరి బాహువుల్లో మరొకరు బందీలవుతారో ఆమెకు ఈ నెల కాకుండా వచ్చే నెలలో తనకు తానుగా పూర్తిగా సమర్పించుకోవాలి, అన్న అలోచన ఆమెను బాధిస్తూ వుంటుంది. ఎందుకనగా ఇలా చేయడం ద్వారా తన 'మెటర్నిటీ లీవొను వేసవి సెలవులతో పాటు కలిపి పూర్తిగా నాలుగు నెలలు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చన్నది ఆమె ఆలోచన. రేపెక్కడికెళ్తావ్‌...? 79

రామ్‌ అడిగాడు - “మీరు నా (ప్రశ్చకు జవాబివ్వలేదు. వమాలోచిస్తున్నారు?”

మోహన్‌ అతనికి తన కధలోని సమస్యతో పరిచయం చేసాడు. దగ్గర్లోనే వున్న మెట్ల రెయిలింగ్‌ను పట్టుకొని బసంతాణి గారు నెమ్మది నెమ్మదిగా పైకెక్కసాగారు. భవనంలోని రెండవ అంతస్తుకు రాగానే రామ్‌ తన సిగరెట్టు చివరి దమ్ములాగి మిగిలిన సగం సిగరెట్టు ముక్కను ఆర్పేస్తూ అడిగాడు - “మోహన్‌, నా కథలో కూడా ఇలాగే ఒక “టెన్షన్‌ వుంది. కానీ, ఆ కథను హిందీ మూల భాషగా రాసొను. మిత్రమా, నేను హిందీ సాహిత్య రంగంలో ప్రముఖుణ్జి కావాలనుకుంటున్నాను” అని చెప్పి సగం కాలిన సిగరెట్టు ముక్కను పారేసి రెండవ అంతస్తులో జరుగుతున్న హిందీ సాహిత్య సమావేశానికి వెళ్ళిపోయాడు. మోహన్‌ ఆలోచనలో పడిపోయాడు. దేశ విభజనలో మా హస్తం ఏమీ లేదు గదా! మరి ఎందుకు రామ్‌ నుండి అతని అసలైన, ప్రామాణికమైన మాధ్యమం అతనినుండి దూరమవుతుంది. ఒక రామ్‌ హిందీ సాహిత్య రంగంలో విజయం సాధించవచ్చుగాక ! మిగతా వారి జన్మతః వచ్చిన శక్తి సామర్థాల విషయం గురించి ఏమిటి? కేవలం మేము మామూలు చిన్న వ్యాపారులుగానే వుండిపోతామా?

బసంతాణి అనాయాసంగానే ఒక దీర్ధమైన శ్వాస తీసుకున్నాడు. వెనకాల వున్న ఒకరిద్దరు దగ్గరవుతున్న ఫీలింగ్‌. హరి దగ్గరికి వచ్చి బసంతాణితో అన్నాడు. “ఏం దాదా, ఈ రోజు మిమ్ముల్ని ఈ విధంగా, నెమ్మది నెమ్మదిగా మెట్లెక్కుణూ వుంటే మీరు నిజంగానే ముసలివాళ్ళయి పోతున్నారు అని నాకనిపిస్తుంది.”

జవాబుగా బసంతాణి ముఖంపై మెట్లమీద వెలుగుతున్న “జీరో పవరొ, బల్చులా పేలవంగా ఓ జీవం లేని నవ్వు వెలిగింది.

భవనం పై కప్పుకు చేరగానే ఒక కార్పెట్‌ పరచబడివున్న దృశ్యం కనబడింది. ఎంతో కాలం నుంచి సంస్థ సభ్యులు, ఇతర సంస్థలకు చేసిన సహాయంలా మాకు (గ్రాంటు మంజూరు చేసి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా లాభం లేకుండా పోయింది. కనీసం కార్పెట్‌కు బదులుగా కుర్చీలు, ఒక మేజా బల్ల వేసుకునే వాళ్ళం కదా! కానీ, మా బాధ ఎవరు పట్టించుకుంటారు ?

ఇప్పుడు మా సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను కాపాడుకోవడానికి కూడా రాజకీయ అధికారంపై ఆధారపడే స్థితికి వచ్చింది. వారి అధికార మార్పిడి సమయంలోనూ మమ్ముల్ని పట్టించుకున్నవారు లేరు.

వచ్చిన వారు తమ తమ చెప్పులు, బూట్లను తమ అభిరుచులతో పాటు వదిలి ఒక మూలన బెట్టి కూర్చుండి పోయారు. బసంతాణికి కూర్చోవాలన్న మనసాప్పడం లేదు. లోపలి గదిలోకి వెళ్లి అక్కడ గోడకు వేళ్ళాదుతున్న షాహ లతీఫ్‌, సచల్‌, సామి వేసినటువంటి తైల వర్ణ చిత్రాలు చూస్తుండి పోయాడు. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ చిత్రాలన్నీ చిత్రకారుల అద్భుత కల్పనా శక్తికి ప్రతీకలు. పూర్వ కాలంలోని కవులు, 80 డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

రచయితల చిత్రాలు ఒక ఎత్తు. కాని వారు చివరికి తమ జీవిత వివరాలను, విశేషణాలను కూడా వదిలి వెళ్లలేదు. ఈ రోజు అలా కాదు వర్తమాన కవులు, రచయితల చిత్రాలు కాల ప్రవాహంలో సురక్షితంగా ఉంటున్నాయి. అతను బయటికి వచ్చి టెర్రస్‌ పైన పెట్టిన పూలమొక్కల కుండీలను చూస్తూ అలా వుండిపోయాడు. కుండీల్లో, 'సదా బహార్‌ పూలు వికసించి వున్నాయి. చాలా అందంగా వున్నాయి.

అంతలో కృష్ణ వచ్చి అతని ఏకాగ్రతను భగ్నం చేసాడు. కృష్ణ ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వులు నాట్యమాడుతూ వుంటాయి. ఆ నవ్వుల్లో ఇతరుల కష్టాల మీద దయాగుణం, కొన్నిసార్లు తనమీద తనకే జాలి, అలా భిన్న భావాలు ముప్పిరిగొని వుంటాయి. అతను నమస్మారంలో తన నవ్వును మార్మికం చేస్తూ బసంతాజితో చెప్పాడు... “ఎందుకు బసంతాణి గారు, ఇక్కడ నిలబడ్డారు, రండి వచ్చి కూర్చోండి?”

బసంతాణి కూడా జవాబులో ప్రశ్నను మిళితం చేసి “ఎలా వున్నారు కృష్ణా? ఇక్కడ ఈ రోజు సింధీలో వినిపిస్తారు గదా? “కాఫీ లేదా, 'వాళఈ' వినాలనే ఇష్టంతో వచ్చాను.. అన్నాడు.

కృష్ణ చెప్పాడు ... “కాఫీ” లేదా *వాఈ'లో సింధీ లోయ విసృృతి వుండాలి. వర్తమానంలో మనం నగరపు ఇరుకు సందుల్లో వచ్చి జీవిస్తున్నాము. ఈ రోజుల్లో ఆ చిన్న చిన్న గజల్‌లు కూడా బరువెక్కి మన ఇరుకు జీవితాలతో మమేకమై పోతున్నాయి.

బసంతాణి నిరుత్సాహంగా అన్నాడు.. “ఐతే ఈ రోజు కూడా నువ్వు గజల్‌ వినిపిస్తావనన్న మాట?”

“కృష్ణు బెను ఆధునిక ఆధునిక గజళ్ళు లయాత్మకంగా, మార్మికంగా వుంటూ జీవితం బరువును భుజాలపై మోసుకెళ్తుంది. మీకు తెలుసా, నేను ఈ రోజు చదవబోయే నా గజల్‌ లోని ఒక “షేరొలో ఏమని చెప్పానో...

బసంతాణికి తెలుసు, కృష్ణ హృదయం ఎంత సంవేదనాభరితమో... “ఏమిటది.” అడిగాడు.

కృష్ణ బదులిచ్చాడు... “ఇప్పుడు, సంతానం పితృరుణం తీర్చుకోవాలి అన్న కాంక్షతో పిల్లల్ని కనడంలేదు. అలాంటి భావనలు అన్సలు లేవు, పిల్లలు వద్దనుకున్నా, కేవలం యవ్వన వాంఛలు తీర్చుకోవాలన్న తపనలో పిల్లలు పుట్టుకొస్తున్నారు. మరి, ఈ పిల్లలు ముందుకు నడిచి మన ఆకాంక్షల మేరకు నడుచుకోక, తమ కర్తవ్యాన్ని నెరవేర్చకపోతే అందులో వాళ్ళ తప్పేముంది.

కృష్ణ గట్టిగా నవ్వసాగాడు. కానీ, ఎందుకో ఐసంతాణి ఆ నవ్వులో భాగస్వామి కాలేకపోయాడు. అతని కనిపించింది, రాజధాని లేదా రాజధాని లాంటి పెద్ద నగరాలలోని జీవితం సగటు భారతీయుడి జీవితాన్ని దర్శింపజేయదు. ఈ నగరం పల్లెకు పై “టెర్రస్‌ రేపెక్కడికెళ్తావ్‌...? 81

లాంటిది. మనం ఇంటి పై కప్పు మీద కాలక్షేపానికి చేరతాము. ఫలితంగా నేలతో మన సంబంధం తెగిపోతుంది ఈ రోజు ఒక శ్రామికుడు, రైతు కూడా ఇలా అర్ధరహితమైన, నిరద్ధకమైన జీవితాన్ని గడుపుతున్నాడా? రైతు తన ఎడ్లను తన సంతానం కన్నా ఎక్కువగా (ప్రేమిస్తున్నాడు. అతనికి కూడా ఈ ఎడ్లను చూసుకోవడానికి ఒక కాదుకు అకృల్లేదా? అతనికి కూడా కొడుకు పుట్టుకొస్తాడు. నాలుగు కాళ్ళ జంతువులైన మేకలు, గొర్రెలను పోషిస్తూ తమ సంతానమనుకునే ఈ 'గడరియాలు తమకు సంతానం కావాలని ఆశించరా?

అతను కృష్ణతో అన్నాడు... “నువ్వు పూల మొక్కలతో వున్న ఈ కుండీలను చూసావా?” కృష్ణ ఆశ్చర్యంతో పూలకుండీ వైపు చూడసాగాడు.

బసంతాణి “మనమంతా ఈ టెగ్రస్‌ పైన వున్న ఈ కుండీల్లోని పూల మొక్కల్లాంటి వాళ్ళం. వేరు, వేరు కుండీల్లో వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చి ఆవాసమేర్చరచుకున్న 'సదాబహారొ లా మన కళా పరిమళం, సొందర్యం నిస్సందేహంగా వికసిస్తూ వుంది. కానీ ఈ పూల మొక్కలు కుండీలకే పరిమితమై పోయాయి. మరి ఈ కుండీలు నేలకు దూరంగా ఎక్కడో టెర్రస్‌ మీద వుంచబడి వున్నాయి. అంతేగాదు, అలాగే మన సంబంధం కూడా ఈ నేలతో తెగిపోయివుంది. అందువల్ల మన ద్వారా రచింపబడిన భూమిక, పాత్ర కృత్రిమమైనది. న్యూఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ కావచ్చు. ముంబాయిలోని వ్లోరా ఫౌంటెన్‌ ప్రదేశంలో తిరిగే జనం కావచ్చు, ఆ పాత్రధారులందరి ముఖాలు, అస్తిత్వాలు చెరిపేయబడినాయి. ఆల్‌ ఆఫ్‌ దెమ్‌ ఆర్‌ ఫేస్‌లెస్‌, వారికి ఏమైనా ప్రత్యేక గుర్తింపు గాని, వ్యక్తిత్వం గాని వుందా? అందరూ ఈ జన సమూహంలో కాటగలిసిపోయారు.

కృష్ణ అతని వైపు కన్నార్బకుండా చూస్తున్నాడు. బఐసంతాణి ఒక దీర్హ శ్వాస తీసుకొని, *ఈ రోజు టెర్రస్‌ మీద ఈ సమావేశంలో పాల్గొనాలని వున్నా మనసొప్పడం లేదు...” అని చెప్పి పెద్ద పెద్ద అంగలు వేస్తూ, కిందికి దిగడానికి మెట్ల వైపుకు తిరిగాడు. కృష్ణ మెదడులో ఒక రోమాంచితమైన ఆలోచన మెరుపులా మెరిసి మాయమయ్యింది. “అరే, రేపటి సమాచార పత్రికలో ఈ వార్త చదవాల్సి వస్తుందేమో; నేలతో పేగుబంధం ముడివేసే ఆలోచనతో ఒక సింధీ రచయిత ఫెడరేషన్‌ హౌస్‌ భవనపు టెర్రస్‌ మీద నుండి వేగంగా మెట్లు దిగే సమయంలో అకాల మృత్యువుకు గురయ్యారు..” అన్న వార్త వినాల్సి వస్తుందా..! వెంటనే మరుక్షణంలో అతనూ ఇలాంటి మృత్యువు నిరీక్షణలో వున్న భ్రాంతికి లోనయ్యాడు.

ట్రే బర్బాతి భవంతి : టెర్రస్‌ పైన కిచెన్‌, టాయిలెట్‌ లేకుండా వుండే చిన్న గది.

82 డా. రూప్‌కుమార్‌ దబ్బీకార్‌

ల య.సు.... 15 జూన్‌, 1907లో కొంకణ్‌లో జన్మించిన

గోరె ప్రముఖ మరాఠీ రచయిత, స్వాఠంత్ర్య

నారాయణ గణేష్‌ గోరె పోరాట యోధుడు, సోషలిస్టు నాయకుడు.

పూణే నియోజకవర్లం నుండి 1957-62

(నా.గ. గోరె) వరకు లోక్‌సభ సభ్యుడిగా వున్నారు.

01964 మకరం లో 1977-79 మధ్య

భారత హై కమిషనర్‌గా కూడా పని చేశారు. కథా సంకలనాలు

అనేకం ప్రచురించారు. ప్రముఖమైనవి : సీకేచె పోహె, కాహి

పానె, కాహి పూలె. పొలిటికల్‌ విషయాల మీద వ్యాసాలు చాలా

వచ్చాయి. అనువాదాలు చేశారు. అందులో కాళిదాసు సంస్కృత

పద్య కావ్యం 'మేఘదూత్‌” కూడా వుంది. 01 మే, 1998లో

క్తీర్రిశేషులయ్యారు. *చుల్లూ భర్‌ పాని, చుల్లూ భర్‌ ఖూన్‌' మరాఠీ

కథను వసుధా మానే హిందీలో అనువాదం చేసారు. మూల

రచయిత ఈ కథలో మత విద్వేషాల వర్యవసానం ఎంత

భయానకంగా ఉంటుందో చూపుతాడు.

రేపెకడికెళ్తావ్‌...? 88

గుక్కెడు నీళ్లు... పిడికెడు రక్తం ...

ఆకాశంలో ఎక్కడా ఓ చిన్న మబ్బు తునక కూడా కానరావడం లేదు. పైగా అగ్గిలా కురుస్తున్న ఎండ. బయట కాస్త ఎండ మెత్తబడుతోంది. బెల్లం ముక్క మీద ఈగ పాకుతున్నట్లు మా బండి నెమ్మదిగా అలహాబాద్‌ వైపుకు పరుగెడుతోంది. బండి లోపల జనం గుంపులు, గుంపులుగా కిక్కిరిసి పోయివున్నారు. ఒకవేళ ఎవరికైనా ఎమర్జెన్సీగా బాత్రూం వెళ్ళవలసి వస్తే మనుషుల కాళ్ళు, చేతులు తొక్కుకుంటూ, తోసుకుంటూ వెళ్ళాలి లేదా వారి లగేజి, సామాన్ల మీద నుండి ఈదుకుంటూ మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి అలహాబాదు చేరగానే పాసింజర్ల గుంపు తుఫాన్‌లా చుట్టుముడుతుంది, లేకపోతె ఢిల్లీ చేరలోగా ఈ మాత్రం సుఖం కూడా దక్కదు. ఈ విషయం అందరికీ తెలుసు. ఎలాగైతే బండి దిశ మార్చిందో, బండి చక్రాల 'ఖడ, ఖడి మన్న శబ్దం వినబడిందో అప్పటి వరకు బోగీలో వున్న ప్రతి ప్రయాణికుడు ఎలా సర్దుకొని కూర్చున్నారంటే, ఎలాగైతే యుద్దానికి సన్నద్ధమవుతున్న మోర్చా లాగా సర్దుకొని కూర్చున్నారు. కిటికీల దగ్గర కూర్చున్న “ప్రవాసీలు' కిటికీ షట్టర్లు కిందికి దించేసి, యుద్ధ సైనికుల మాదిరి అటెన్షన్‌లో కూర్చున్నారు. ఆ దృశ్యం చూస్తే ప్రయాణీకులంతా ఒకే కుటుంబ సభ్యుల్లా ఒక్కుమ్మడిలా, ఐక్యతతో వున్నారనిపిస్తుంది.

ఐండి అలా అలహాబాద్‌ స్టేషన్‌ స్లాట్‌ఫారం మీదకు వచ్చేసింది. అక్కడ ఆగడానికి ముందే పచ్చరంగు యూనిఫామ్‌లో వున్న సైనికులు మా బోగీని చుట్టుముట్టారు. అలా చూస్తే ప్లాట్‌ఫారం నిండా ఎక్కడ చూసినా సైనికులే కనబడుతున్నారు. మొఘల్‌ సరాయ్‌ నుండి ఒక మార్వాడి తన భారీ లగేజీతో కూర్చొని వున్నాడు. ఎవరో బయటి నుండి తలుపు తోయడంతో పాపం ఆ మార్వాడి వలలో చిక్కిన ఎలుక పిల్లలా గింజుకులాడుతూ అరవసాగాడు. మేమంతా కూడా “ఎక్కడ జొరబడుతున్నారు? ఇక్కడ 84 డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

ఖాళీలేమీ లేవు?” అంటూ గట్టిగా అరుస్తూ చెప్పాము. అయినా, ఎవరూ మా మాటలను లెక్కజేసే స్థితిలో లేరు. గడ్డం, మీసాలతో వున్న సిక్కులు, ముందుకు పొడుచుకు వచ్చిన టోపీలతో వున్న పంజావీ, జాట్‌ సైనికులు చూస్తూ, చూస్తూ ఉండగానే లోపలికి దూసుకొచ్చారు. వస్తూనే వారంతా కిటికీ తలుపులన్నీ తెరిచి అక్కడినుండి తమవి, తమ తోటివాళ్ళ సామాన్లు లోపలికి తీసుకోవడం మొదలెట్టారు. తుపాకులూ, కిట్‌ బ్యాగ్స్‌, బెడ్డింగ్‌, పెద్ద పెద్ద ట్రంకు పెట్టెలు చెప్పొద్దూ.. ఒక పక్క కిటికీల నుండి సామాన్లు లోపలికి వస్తున్నాయి, మరోవైపు తలుపు తోసుకొని ఫౌజీ జవాన్లు ముందు నుంచి వస్తున్న 'ప్రయాణీకులం, వారి పోకడలతో విసుగెత్తిపోయాం. మా బట్టలు చెమట వాసన వేస్తున్నాయి. శరీరమంతా నలిగిపోయి, బట్టలన్నీ మాసిపోయాయి. మూడు నాలుగు రోజుల ప్రయాణం, పె నుంచి ఈ దరిద్రం,

కోపంతో అరిచాను - “అర్ధం కాదు, మా నెత్తిమీదనే ఈ దరిద్రం అంతా ఎందుకొచ్చిందో? వారి, వారి బోగీల్లోకి వెళ్లిపోవచ్చు కదా 1?”

“భాయ్‌, వీళ్ళు సైనికులు. ఎవరాపగలరు వీరిని? ఇంకా నయం మనలని తీసి అవతల ఎత్తి బయటికి పారి్యయ్యనందుకు సంతోషపడాలి,” ఎప్పట్నుంచో పొగాకు నములుతూ ఎదురుగా వున్న సీట్లో కూర్చున్న ఒక వృద్ధ ముసల్మాన్‌ నసిగాడు. ఒక మహిళ, నడి వయస్కురాలు, నెత్తిమీద కింది వరకూ లాగివున్న కొంగు చాటునుండి “నీరు నిజమే చెప్పారు బాబా, ఈ ఫొజీలకు సిగ్గు శరం వుండదు” అంటూ వంత పాడింది. వీళ్ళలో మానవత్వం అన్నది మచ్చుకైనా వుండదు.

పై స్టేషన్‌ నుంచి వస్తున్న ప్రయాణీకులమైన మేము వారి గురించే మాట్లాడుతున్నాం. కానీ, వాళ్లేమాత్రం మా వైపు దృష్టి కూడా పెట్టలేదు. వారి, వారి లగేజి సర్దుకోవడంలోనే మునిగిపోయారు. పెద్ద పెట్టెల మీద చిన్న సామాన్లు సర్ది కనీసం కాళ్ళు చాపుకోవడానికి చోటు చేసుకున్నారు. చెమటతో వారి శరీరాలు తడిసిపోయాయి. కొన్ని చోట్ల వారి యూనిఫారంలు తడిసి ముద్దయ్యాయి. గంపలో కమ్మేసిన కోళ్ల మాదిరి మా పరిస్థితి కూడా అధ్వాన్నంగా మారింది. ఇంతలో గుంపులో ఓ చోట నిలబడిన సర్ద్టార్డీ, తన గంభీరమైన స్వరంతో అడిగాడు, “అంతా సర్దుకున్నారు గదా”

జ్‌జ్రీ సర్దార్‌ జీ, అంతా సరిపోయింది”

“చాలా మంచిది. ఇక విజ్రాంతి తీసుకోండి బేటా” అని అతను తన బెల్టు వదులు చేసి కూర్చుంటూ తనలో తానూ మాట్లాడుకోసాగాడు, “యుద్ధం ముగిసింది. కానివ్వు, ఐదు సంవత్సరాల తర్వాత ఇంటి దర్శనం అవబోతుంది.” రేపెక్కడికెళ్తావ్‌...? 85

ఇ తో మాట కూడా పూకి గడ్డం, మీసాలు దట్టంగా అడవిలా పెరిగి వుండటం యూద చేయలేకపోయాడు. కళ్ళలో తడివూరింది. కాస్త ముందుకు వంగి మౌనంగా వుందిపో ౮ పక్కనే కూర్చున్న ముసల్మాన్‌ సిపాయి. “ఫెకర్‌ చేయమాకు యార్‌, ఖుదా ర నరకం నుండి బయట పడ్డాం. ఇప్పుడంతా మంచే జరుగుతుంది. “సర్దార్‌జీ ఏమీ చెప్ప న గడ్డాన్ని నిమురుకుంటున్న సర్దార్‌ జీ నోటివెంట “వాహె గురూ, చాహె గురూ” తన్నే మాటలు వెలువడ్డాయి. బెంచి వెనకాల నుంచి ఒక్ష చిన్న తెల్లని చేయి సర్దార్జీ భుజాలపై వాలింది. పిల్ల ముద్దొచ్చే నత్తి నత్తి మాటలు వినబడ్దార్సు, “చాచాజీ, చాచాజీ” మేమంతా అటు వ చూస్తున్నాము. బంగారు ఛాయలో మృదువుగా వున్న కేశాలు, అల్లరి పెట్టే కళ్ళు, ల్‌ శరీర ఛాయతో పిల్లాడు, కుందేలు పంజాలను పోలివున్న తన అరచేతులను సల్టో భుజాలపై పెట్టి పిలుస్తున్నాడు “చొచాజీ చాచాజీ..౫ స్టైైరటే వెనక్కి తిరిగి ఆ పిల్లాడి లేత్ర అరచేతులను తన బలిష్టమైన చేతులో దగ్గరికి తీసుకొని తదేకంగా చూస్తూ వుండిపయాడ్స, ప్లిల్షాడ్రు కూడా చూపు తిప్పుకోకర్య అలాగే చూస్తున్నాడు, పర్వతం లాంటి ఆ ఫాజ్ట సిపాయి జ మృదువెన స్పర్శకు లోలోపీ మంచులా కరిగిపోతున్నాడు. సర్గార్‌జ్రీ జ్ర 9 తమన్న సవాదో చ * పీర్గొడి చేష్టలకు ఎదురు చెప్పలేని అస స్థితిలోకి వెళ్ళాడు. ప్రారంభంలో ఆ పిల్లాడు యూని ఫామ్‌ను దటంగా పెరిగిన గడ్డం, మీసాలను భయంగా చూసాడు, ఇప్పుడు అతని అడవిలా త మయింది సర్దార్‌జీ గడ్డంలో తన వేళ్ళను గుచ్చుత్తూ ల గ్‌ భయం మా నో బుర్ధా ధరించి కూర్చున్న మ్షష్టి్ఞ మందల్రింప్త్యా ౬ పలాదెక్కో అన్నది. జిగా అన్వర్‌, అల్లరి పిల్లా టె ద వ | నేను పులినా, మరి నువ్వు కుందేలు పిల్లవ్రాలు నవ్వుకు నవ్వుత్తూనే అడిగాడు, “అలి ఆ ముచ్చటైన దృశ్యం మేమంత్రి చూస న పురుగులా తొలుస్తున్నది, “ఈ తల్లీ పల్ప్క ఇబ్టల. కానీ నా మ్రనసులో అలోస్స్‌ ముందు వీళ్ళు మాతో పాటు లేరు. శ్యా ఇంత * సృడొచ్చారా” అని, అలవాబొ క బహుశా, వరదలా వచ్చిన సైనికుల తాకిగ్రిత్ర అన్య నాహంలో ఎలా వచ్చివుంటోరో మెత్తని శరీరంతో, వసపిట్టలా వాగుతున్న ఆ పిల్ల టూ వచ్చి వ్రట్రార్త * క్తుందేలొ సర్దార్జీ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా గే చూపూల్పూ చూస్తూ వున్నానో “మన బండి ఎప్పుడు బియళ్దేరుక్యల్మ 86 / దౌ. రూప్‌ క్సూమార్‌ దట్బీ”

“ఇంకెంతసేపు, బయలుదేరడానికి సిద్ధంగావుంది.” “క్క బట్టలెందుకేసుకున్నారు మీరు” 'ఇిప్రాయిలు ఇలాంటి బట్టలే వేసుకుంటారు" “ఇది తుపాకీ కదా? దీంతో ఏం చేస్తారు?” “క్పృష్రాక్రీత్రో ఏం చేస్తాం? శాం) అని పేలుస్తాం” “ఎవరి మీద పేలుస్తారు?” “మనుషుల మీద” “శానా కానీ ఎందుకు ?” “చ్రాధ్ర పెడ్తారు కదా, అందుకని” అన్వర్‌ తల్లికి తెలుసు, అతని ప్రశ్నలకు అంతు వుండదని. “శ్రేఖ్రో అన్వర్‌, బక్‌ బక్‌ బంద్‌ కరో, లేకపోతె సర్దార్‌ జీ నిన్ను అల్లరి కుఠాడు, అనవసరంగా కష్టపెడతాడూ” అని అంటారు. అతనేమైనా భయపడేవాడో! తన రెందు చేతులను స్టూర్డీ చేతుల్లో వుంచి తల్లి వైపుకు వంగి వెక్కిరిస్తూ, “అప్పుడు చాచాజీ నన్ను తుపాకీ గుండ్లతో లేపేస్తాడు గదా?” అంటాడు. అతను నవ్వుతున్నాడు. అతని వెంట్రుకలు పుంజు జుట్టులా వూగసాగింది. సర్దార్జీ సుతారంగా అతన్ని తన చేతులతో గిల్లి బుగ్గలను నిమురుతూ “వెర్రి పిల్లాడా, బుల్‌ బుల్‌ పిట్టలొ ముద్దుగొ మాట్లాడే పిల్లల్చెవరైనా తుపాకీతో పేలుస్తారా భాయి 1౫ వెంటనే అతని ధ్యాసను మళ్లించడానికి స్టార్‌ జీ “ఏం తింటావో చెప్పు” అని అడిగాడు. “ఏమీ వద్దు” అన్నాడు అన్వర్‌. అప్పుడతనికి దాహం వేస్తున్నట్లనిపించి తలి ఒడిలోకి వెళ్ళిపోయాడు. “అమ్మా నీళ్ళివ్వు నాకు దాహం వేస్తోంది” అని మారాం చేసాడు. తల్లి అతనికి ఖాలీ చెంబు చూపించి, “తెల్వదా, గుంపు తోపులాటలో నీళ్ళన్నీ ఒలికిపోయాయని, ఇప్పుడు నీళ్ల కోసం మారాం చేయకు బేటొ! లక్నో చేరగానే ఇస్తాను, నా మంచి బంగారం కదూ” అంది. సర్టార్‌ జీ వెంటనే లేచి నిలబడి “ఐహెన్‌ జీ, ఆ లోటా నాకివ్వండి. నేనిప్పుడే నింపి రేపెక్కడికెళ్తావ్‌...? స్‌?

చెంబు తీసుకొని కిటికీ నుండి బయటికి తొంగి చూస్తుండగానే అతని స్నేహితుడు, “ఉధమ్‌సింగ్‌, బండి బయల్దేరే సమయమైంది. నా దగ్గర వాటర్‌ బాటిల్‌లో నీళ్ళున్నాయి. నేనిస్తాను పోవద్దు” అన్నాడు.

కానీ అప్పటికే ఉధమ్‌ సింగ్‌ బయటికి దూకి నల్లా వైపుకు వేగంగా పరుగెత్తసాగాడు.

కొద్ది క్షణాల్లోనే బండి విజిల్‌ ఇచ్చి నెమ్మది, నెమ్మదిగా కదలసాగింది. కిటికీ దగ్గర కూర్చున్న (ప్రయాణీకులు చూస్తూ వున్నారు. ఉధమ్‌ సింగ్‌ బండినందుకోవడానికి పరుగెత్తసాగాడు. అతని కొందరు మిత్రులు తరువాత స్టేషన్‌లో వచ్చి బండి ఎక్కమని సలహా ఇవ్వసాగారు. మరికొందరు ఇంకా వేగంగా పరుగెత్తమని అరవసాగారు.

ఈ గందరగోళాన్ని అన్వర్‌ అర్ధం చేసుకోలేకపోతున్నాడు. ఇందులో తనదేమైనా తప్పుందా? లేకపోతె చాచాజీ బండి నుంచి పడిపోయాడా? అతని అల్లరి చూపులు మెత్తబడిపోయాయి.

చూపుల్లోని అల్లరి అవిరైపోయింది. అతనికి చాలా దాహం వేసింది. ఎండ గొడ్పు కావడంతో అన్వర్‌ లేత బుగ్గలు ఇంకా ఎర్రబారాయి. బండి వేగం అందుకుంది. దగ్గర్లో కూర్చున్న పంజాబీ ముసల్మాన్‌ “ఇక రాలేడు అతను” అని చెబుతూ తన దగ్గరున్న వాటర్‌ బాటిల్‌ను అన్వర్‌ ముందుంచాడు. అన్వర్‌ నోటి దగ్గరికి తీసుకుంటూ ఉండగానే తలుపు దగ్గర నుండి సర్దార్జీ గొంతు వినిపించింది, “అన్వర్‌ బేటా, ఇవిగో నీళ్లు

గొంతు వినబడగానే నీళ్ల బాటిల్‌ నోటి నుంచి పక్కకు జరిపి, సర్దార్దీ తెచ్చిన లోటాను చేతిలోకి తీసుకొని నీళ్లు తాగసాగాడు. సర్టార్టీ మొరటు వేళ్ళు అతని మృదువైన, పట్టుకుచ్చులాంటి కేశాలను నిమరసాగాయి.

ఆ దృశ్యాన్ని చూస్తూ, నవ్వుతూ తన వాటర్‌ బాటిల్‌ను ఆ సిపాయి వెనక్కి తీసుకున్నాడు. చూసేవాళ్ళలో వున్న ఒక జాట్‌ నవ్వుతూ “ప్రేమ కూదా ఎంత విచిత్రమైనది యారో అన్నాడు.

అన్వర్‌ నోటి వెంట రాలుతున్న నీటి చుక్కలను సర్దార్టీ సున్నితంగా గులాబీ రెక్కల నుండి జారిపడుతున్న మంచు బిందువులను తాకుతున్నట్లు తుడవసాగాడు,. “నా లచ్‌మన్‌ కూడా ఇంత పెద్దగా అయ్యుంటాడు” అన్నాడు. ఒక్కసారిగా అతని కళ్ళు చెమ్మగిల్లాయి. గొంతు తడారిపోయింది.

ఈ సంఘటన జరిగి రెండు, రెండున్నర సంవత్సరాలయ్యింది. రెండ్రోజుల తర్వాత స్వాతంత్ర దినోత్సవం. భారతదేశపు మొదటి స్వతంత్ర దినోత్సవం. కరోల్‌బాగ్‌లోని 88 డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

జామియా మిలియా స్కూల్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తరగతి గదులన్నీ రంగు రంగుల కాగితాల జండాలతో అలంకరించబడి వున్నాయి. పిల్లల్లో ఉత్సాహం పొంగి పొరలుతోంది. మేము వారు వేసిన బొమ్మలు, చిత్రపటాలు, ఫోటోలు అన్నీ చూసాం. అక్కడి ఫలహారశాల కూడా పిల్లల పర్యవేక్షణలోనే వుండేది. భారతదేశపు భావిపౌరుల భవిష్యత్తు నిర్మాణ పునాదుల తయారీ కాబడుతున్నది. అది కేవలం పాఠశాల కాదు. అదిడా. జాకీర్‌ హుసేన్‌ ఇంకా అతని ఇతర సహచరుల స్వప్నం. గంట (మోగగానే మేమంతా సభాగృహంలో సమావేశమయ్యాము. పిల్లలు రెండవ రోజు కార్యక్రమాలకు రిహార్సల్స్‌ చేస్తున్నారు .

అన్నింటికన్నా ముందు జామియా మిలియా జెండా వందనం మొదలైంది. తరువాత షరా మామూలుగా ప్రతి పాఠశాలలో జరిగే కార్యక్రమాలే. నేను నిలబడడానికి సిద్దమయ్యాను. అంతలోనే ఇక్బాల్‌ పంక్తులు వినబడ్డాయి. తిరిగి కుర్చీలో కూర్చున్నాను. తెల్ల గులాబీలా ప్రకాశవంతమైన ముఖం, బంగారు ఛాయలా మెరిసే కళ్ళు అతను పాడుతున్నాడు.

“హమ్‌ బుల్‌ బులే హై ఇస్‌కీ

యహ గులిస్తా హమారా..

బుల్‌ బుల్‌ తెల్లని మొహం, బంగారు ఛాయ లాంటి కళ్ళు. నాకు కొద్ది కొద్దిగా గుర్తుకు రాసాగింది. అతను పాడుతూ వున్నాడు.

ఏ ఆబ్‌-రూ, ఎ గంగా

ఆతా హై యాద్‌ ముజ్‌కో

ఉత్‌ రా తేరే కినారే

జబ్‌ కార్వాం హమారా !

“నాకెందుకు గుర్తుకు రావడం లేదు? ఇతన్ని ఎక్కడ చూసాను?”

హిందీ హై హమ్‌ వతన్‌ హై

హిందుస్తా హమారా...

కవితా పఠనం అయిపోయింది. నేను నా పక్కనే కూర్చున్న ఉపాధ్యాయుని అడిగాను - “ఎవరీ కుర్రాదు”

“ఇతను అన్వర్‌ హుసేన్‌, చాలా చురుకైన కుర్రాడు” అని జవాబు వచ్చింది . “లక్నోకు చెందినవాడా?” నేనడిగాను. “అవునండి, మీకు తెలుసా ఇతను ?” “లేద్సు, తెలియదు. ఇలాగే అడిగాను” - జవాబిచ్చాను.

రేపెక్కడికెళ్తావ్‌...? 89

“అన్వర్‌.” ఇప్పుడు గుర్తుకొస్తున్నది. ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో చాలా కాలం నుండి కోల్పోయిన ఏదో ఒక వస్తువును తిరిగి పొందిన అనుభూతి కలగసాగింది. మనసు తేలికపడింది. అది ఎండాకాలపు మధ్యాహ్న సమయం. బోగీలో జనాలు కిక్కిరిసిపోయారు. ఇంటికి తిరిగి వెళ్లాలనే ఆతురతలో సైనికులు, అ సిక్కు ఇంకా అన్వర్‌. నాకింకా బండిలోనే వున్నానన్న భావనలో మునిగిపోయా.

ఆలోచనల్లో ఎంతగా మునిగిపోయానంటే బారాకంభ వైపు వెళ్లే బస్సు (డైవర్‌ హారన్‌ ఇచ్చి సైగ చేసినా నాకు వినిపించలేదు. ఒక్కసారిగా (బ్రేక్‌ వేయడంతో తృటిలో బతికిపోయాను. వీధి మూలలో వున్న దుకాణంలోని సిక్కు “బాబూజీ, బాబూజీ” అంటూ పరుగెత్తుతూ నా దగ్గరికి వచ్చాడు. డైవర్‌ నా వైపు ఓసారి చూసాడు. నా ఒంటిపై వున్న ఖాదీ దుస్తుల్ని చూసి నోటిదాకా వచ్చిన తిట్లను తానే మింగేసి గమ్మున తన దారిన తాను వెళ్ళిపోయాడు. దగ్గరికి వచ్చిన సర్టార్టీ నా భుజం పట్టుకొని నవ్వుతూ అడిగాడు. “ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం ఏమైనా వుందా ఏమిటి?”

“లేదు లెండి” అని నేను నవ్వుతూ జవాబిచ్చాను.

“కొద్దిలో ఐతికిపోయారు. అంతలా పగటి కలలు ఏం కంటున్నారు మీరు?” అతనడిగాడు.

నేను ఆశ్చర్యంతో *“ఉధమ్‌ సింగ్‌జీ, మీరిక్కడ.. ఎలా...” అని అడిగాను. నేనలా అతని పేరు తీసుకున్నానో లేదో అతను చకితుడై వుండిపోయాడు. తన దుకాణం వైపుకు నడిపించుకుంటూ, తనలో తానే మాట్లాడుకుంటూ పోతున్నాడు.

“చాలా విచిత్రంగా వుంది. మిమ్ముల్ని ఎక్కడ చూసానా అన్న విషయం గుర్హుకే రావడం లేదు. రండి బాబూజీ, దుకాణం లోపలికి రండి, కూర్చోండి.” కూర్చున్న వెంటనే అతన్ని అడిగాను, “మీ లచ్‌మన్‌ ఎలా వున్నాడు? ఇప్పుడు స్ఫూల్‌కు వెళ్తుండవచ్చు గదా?”

ఉధమ్‌ సింగ్‌ మరింతగా ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అపరిచితుడు, అతనికి నా విషయాలు తెలుసు. మరి నాకేమో ఏమీ గుర్తుకు రావడం లేదు. తానేదో పెద్ద అపరాధం చేసి వుండవచ్చు అన్న భ్రాంతికి లోనవ్వసాగాడు.

“లచ్‌ మన్‌ 'పిండీ' లో వున్నాడు” అని జవాబు చెప్పి తిరిగి తన జ్ఞప్తిని కెలకసాగాడు. నేనే అతన్ని ఇంకా పరేషాన్‌ చేయడం మంచిది కాదని భావించి మా ప్రయాణం గురించి జ్ఞప్తికి తెచ్చి అడిగాను. “మీకు గుర్తుందా ఆ అన్వర్‌ గురించి? అతను ఇక్కదే జామియాలో వున్నాడు. ఈ రోజే నేనతన్ని చూసాను.”

90 దా. రూప్‌కుమార్‌ దబ్బీకార్‌

“అచ్చా, ఆ ముసల్మాన్‌ పిల్లాడా? జామియాలోనే ఉండొచ్చు. ఇంకెక్కడ ఉంటాడు?” ఉధమ్‌ సింగ్‌ జవాబిచ్చాడు. నేనతనివైపు చూస్తూ వున్నాను. కానీ ఆ రోజు బండిలో అన్వర్‌పై చూపిన ఆ (ప్రేమ, మమతా మచ్చుకైనా అతని కళ్ళలో కానరావడం లేదు. నాకనిపించింది ఈ ఫౌజీ జవాన్లు మన దక్కన్‌ నదులు ఒకే తీరులో వుంటాయేమో? వర్షాకాలంలో వరదలు లేకపోతె బంజరు. నేనతన్ని ఇంకాస్త గుచ్చుతూ చెప్పాను “చాలా ముద్దొచ్చే పిల్లాడు వుండే కదూ!

చాయ్‌ కప్పును నాకందిన్తూ జవాబిచ్చాడు.”ముద్దుగానైతే వున్నాడు, కానీ పాము పిల్ల”

కప్పు కిందపెట్టి అడిగాను “దీని మతలబు ఏమిటి?”

“మతలబు స్పష్టంగానే వుంది బాబూజీ, మునల్మాన్‌ నంతతి కదా! అది ఎప్పుడూ మరిచిపోవద్దూ. “అతని కళ్ళు కృపాణంలా తళుక్కునున్నాయి.

స్వాతంత్ర దినోత్సవం. ఉత్సవం మళ్తు ఒక్కసారిగా దిగిపోయింది. కంటి ముందు దృశ్యం పూర్తిగా మారిపోసాగింది. మామిడి చెట్టునిండా పూసిన పూత, పళ్ళు కాస్తాయనే ఆశ చూపుతుంటే అకస్మాత్తుగా కురిసిన మంచు, ఆశలపై నీళ్లు చల్లిపోయింది. స్వతంత్రత, భారతమాత మెడలో జయమాల అలంకరించే సమయంలో మండపం, వేదిక కుప్పకూలిపోయింది. అమృత్‌సర్‌, సియాల్‌ కోట్‌, లాహోర్‌, పల్లె పల్లెన, బస్తీ, వాడల్లో నిప్పులు కురవసాగాయి. అగ్గిలో కాలి బూడిదైపోతున్నాయి. విద్వేషాలు చెలరేగి రుద్రుని ప్రళయ తాండవమాడసాగింది. ఒకసారి ఒక ప్రాంతం, మరోసారి మరోచోట సర్వనాశనం నాట్యమాడుతోంది. ధమరుకం ధ్వని ఢిల్లీ పీఠాన్ని గజ గజ వణికించసాగింది. దాని అట్టహాసం మనలోని ఆలోచనా శక్తిని బలహీనపర్చసాగింది. ముఖాల మీద కప్పబడిన మానవత్వపు ముఖౌట తొలిగిపోసాగింది. మనిషి లోపల దాగివున్న నక్క కళ్ళు ఉగ్రరూపం దాల్బసాగినాయి. వేళ్ళ మీద పులిగోర్లు అడవిపంది దంతాలు మొలకెత్తాయి. మేక లింగం లాంటిది పొడుచుకొని వస్తుంది. ఈ రోజు వరకు మనిషి ఏ వస్తువును నిజాయితీగా ఢ్రేమించాడు? ప్రియురాలి (ప్రేమనా? ఏ వస్తువును పవిత్రంగా భావించాడు ? కన్నతల్లి కస్నీళ్ళనా? ఏ వస్తువు అతనికి మధురంగా తోచింది ? పసిపాప లేత నవ్వా? మరి అటువంటప్పుడు ఎందుకు మనిషి వాటన్నింటిని తన కాళ్ళ కింద నలిపేస్తూ, వారి రక్తంలో స్పానిస్తూ ప్రపంచం ఎదురుగా సిగ్గు, లజ్జ వదిలి నగ్నన్ఫత్యం చేస్తున్నాడు? ఎందుకు మనిషి ఒకరికొకరు శత్రువుగా మారి తల్లుల స్థనాలను, భార్యల మర్మాంగాలను గాయపరుస్తూ, పసికందుల కుత్తుకలు కోస్తూ బీభత్సాన్ని సృష్టిస్తున్నాడు? రేపెక్కడికెళ్తావ్‌...? న్‌!

ఇప్పటిదాకా ఢిల్లీ రగులుతూనే వుంది. మంటలింకా ఆరలేదు. పంజాబ్‌ నుండి వస్తున్న సమాచారాల ప్రకారం పంజాబ్‌ లోలోపలే కుమిలిపోతుంది. దానితో హిందువులు, సిక్కుల కళ్ళు కోపంతో ఎర్రబడుతున్నాయి. ముస్లింలు సృష్టిస్తున్న భయాందోళనలు, దావానలంలా వార్తలుగా అందుతూనే వున్నాయి. సబ్టిమండిలో ఎవరినో పొడిచి చంపారని, ఒక్కోసారి మున్లిం కుటుంబం పైన రాళ్లు విసిరారని, ఒకచోట మజీదులు కూలగొడుతున్నారని. తుఫాను రాకకు, భయంకరమైన సునామీలకు ఇవి స్పష్టమైన సంకేతాలు. పంజాబ్‌లోని పళ్చిమ ప్రాంతాల నుండి వచ్చిన నిర్వాసితుల వరద, సోనిపథ్‌ నుండి ఢిల్లీని తాకింది. వారి ద్వారా వచ్చిన వార్తా కథనాలు విన్న మొదట్లో ఇక్కడి వాళ్ళ పృాదయాలు రగిలి మళ్ళీ నిప్పుకణికలుగా మారాయి. నిర్వాసితుల కథనాల్లోని ఒక్కొక్క మాట విన్న వారిని ఆందోళనకు గురి చేయసాగోయి. వాతావరణం వేడెక్కి ఒక్కటే నినాదం ప్రతిధ్వనించసాగింది, “ప్రతీకారం, రక్తానికి రక్తం.”

ప్రతి చోటా, ప్రతి వీధి మలుపులో జనం గుంపులు గుంపులుగా గుమికూడసాగారు. కాసేపు చర్చ జరిగిన వెంటనే మళ్ళీ అందరూ మాయమవుతారు. చూడబోతే ఢిల్లీలో అపరిచితుల సంఖ్య పెరగసాగిందా? లేక పరిచితులే అపరిచితుల్లా కనబడుతున్నారా? అన్న సందేహం కలగసాగింది. జనం మౌనంగా వుండటమో, ఇంట్లో పడి వుండటమో లేదా వీధుల్లో పడి బూతులు, తిట్ల వర్షం కురిపించడం చేస్తున్నారు. రోడ్లమీద మహిళలు, పిల్లలు తిరగడం దాదాపుగా బంద్‌ అయిపోయిందని చెప్పొచ్చు.

ఇంత జరుగుతున్నా ఉధమ్‌సింగ్‌ దుకాణం వద్ద మాత్రం జనం రాకపోకల రద్దీ అధికమైంది. వాళ్ళేమి కొనుగోలుదారులు కాదు. ఒకసారి నేనక్కడ చాలామంది గుమికూడి వుండటం గమనించాను. ఆ రోజు అతనితో కలిసిన తర్వాత అడపాదడపా కలవడానికి వెళ్ళేవాడిని. అందుకే నేను ఉధమ్‌ సింగ్‌ బండరాయిలా కదలకుండా కూర్చొని వుండటం, అతని చుట్టూ మిగతా వాళ్ళు కమ్ముకొని వుండటం చూసాను. ఎవ్వరూ ఏమీ మాట్లాడక పోయేవారు. కానీ వారి మనసులో ఏదో ద్వేషభావం ఉందన్న విషయం నాకు అర్ధమయ్యింది. ఎలాగంటే ఒక జంతువు మరో జంతువు వాసన పసిగట్టి దాని మనసులో ఏముందో తెలుసుకోగలదు. బహుశా, నాలో కూడా ఈ రోజుల్లో కొద్దిగా మార్పు వచ్చింది. నేనతన్ని పిలిచాను, “సర్దార్జీ, ఉధమ్‌ సింగ్‌”.

పట్టుకున్న చెయ్యి వదలకుండా ఆతను గడ్డకట్టిన మంచులాంటి చూపుతో నా వైపు చూసాడు. “ఏమైంది?” అని అడిగాను.

“వది జరగకూడదో అది జరిగిపోయింది” అని ఒక చేదు నవ్వు నవ్వి జవాబిచ్చాడు. “ప్రిడ్రీ సియాల్‌ కోట్‌ లో అదే జరిగిపోయింది, బాబూజీ” అన్నాడు. 92 దా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌

“వ్రుళ్లణ్‌ 2౫

“న్పేన్సు సర్వనాశనమై పోయాను బాబూజీ” తన ఉక్కులాంటి చేతులను నా భుజాలపై వేస్తూ అన్నాడు. నేనే కాదు అని, ఢిల్లీ వాసులందరిని ఉద్దేశిస్తూ “ఢిల్లీ మీద ప్రళయం ముంచుకొస్తది. విషసర్పాల తలలు చితక్కొట్టబడతాయి” అంటూ ఆవేశపడసాగాడు. అతను చెప్పిన మాట నిజమయ్యింది. రెండవ రోజు ఢిల్లీలో ప్రళయం ముంచుకొచ్చింది. ముసల్మానులు తమ తమ పిల్లాపాపలతో, భార్యలతో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలనే కోరికతో పరుగెత్తసాగారు. రోడ్ల మీద వారిపై దాడులు జరగసాగాయి. ఇండ్లు తగలబెడ్డున్నారు. నగరమంతా ఇదే జరుగుతుంది. “మరి నేను ? నేనెక్కడున్నాను? ఏం చేస్తున్నాను?”

ఈ సంఘటనలకు నేను విముఖంగా ఉన్నానా? నిజం చెప్పాలంటే “క్రాద్రు” అనే జవాబు వస్తుంది. స్వయంగా నేనెవరినీ లూటీ చేయలేదు. ఎవరినీ పొడిచి చంపలేదు. అంతేకాదు ఏ ముసల్మాన్‌ అమ్మాయిని హింసించలేదు. కారణం ఒక్కటే, నేను మానసికంగా బలహీనుజ్జి - నపుంసకుడను. ఇతరుల ద్వారా జరిగే ఈ విధ్వంసకాండను చూసి చాలా ఆనందిస్తాను. అందుకే నేను నగరమంతా తిరుగుతూ వున్నాను. అలా చేయడం వల్ల ప్రత్యేకమైన బాక్స్‌లో కూర్చొని నాటకం చూస్తున్న అనుభూతి పొందుతూ వుంటాను. చిరుత, జింకపై దాడి చేస్తుండగా చూసేవాళ్ల రక్తం వేదెక్కినట్లు, పశువుల సంభోగ దృశ్యం చూస్తే కామోద్రేకం కలిగినట్లు, అచ్చం అలా అలా అనుభూతిని, సుఖాన్ని పొందే స్థితి నాది. నాలోపల అలా ద్వంద్వ వైఖరితో ఒక ప్రేక్షకుడు దాగి వున్నాడు. ఇతరులు పొడిచిన కత్తి కార్చే రక్తపుటేరులో చేతులు ముంచేవాడు. వివస్త్ర చేయబడిన అమ్మాయిల స్తన మర్దనంతో ఆనందించే గుణం కలవాడు... నేను ప్రతి సంఘటనలో మానసికంగా

మధ్యాహ్నం రెండు గంటలకు జామియా మిలియా దగ్గర గొడవ జరిగిందని విన్నాను. కడుపులోని పేగులు ఎవరో లాగుతున్నట్లనిపించింది. అటువైపు వెళ్లాను. చూస్తే స్కూల్‌ బిల్లింగ్‌ నుండి పెద్ద పెద్ద మంటలు ఎగసిపడుతున్నాయి. దగ్గర్లో వున్న చెట్టు నుండి రాలి, కుళ్లిపోయిన ఆకులు గాలిలో ఎగిరిపడుతున్నాయి. కొన్ని కాగితపు ముక్కలు వాటికి తోడుగా వున్నాయి. కాకులు, పావురాలు భయంతో అటు ఇటు ఎగరసాగాయి. ప్రజల అరుపులు వినబడుతున్నాయి. రెండు మూడు వందల వరకు ముసల్మాన్‌ మహిళలు, పిల్లలు, పురుషులు మావైపు పరుగెత్తుకు రాసాగారు. అంటే దాదాపుగా బలవంతంగా ఈడ్చుకు రాబడుతున్నారు. నడవలేకపోతున్నారు. దారికిరువైపులా వరసలో నిలబడి వున్న రేపెక్కడికెళ్తావ్‌...? 903

జనం ఆ అభాగ్యులను చూసి తిట్టసాగారు. కొందరు నవ్వుతున్నారు. కానీ అంతవరకూ వారెవ్వరూ ఎవ్వరి మీద చెయ్యి ఎత్తలేదు. వీధి మలుపులో ఉధమ్‌సింగ్‌ దుకాణం వుంది. అక్కడికి చేరుకోగానే మొత్తం దృశ్యం తారుమారైంది. దుకాణం నుండి ఓ యాఖై మందికి పైగా మనుషులు వారి మీద విరుచుకు పద్దారు. లాఠీలు, కత్తులు, బరిసెలు, రకరకాల మారణాయుధాలు గాలిలో ఎగురుతున్నాయి. మగవాళ్ళు పరుగెత్తసాగారు. మహిళలు చంటి పిల్లల్ని గుండెలకెత్తుకొని కేకలు పెట్టసాగారు. బోర్లా పడిన గిన్నెల్లోని నీరు ఎలా ఒలికిపోతుందో అలా రక్తం ప్రవహించసాగింది. శవాల గుట్టలు పడసాగాయి.

ఈ గొడవల్లో నేను ఒక ఆర్తనాదం విన్నాను. చూస్తే ఉధమ్‌సింగ్‌ తన ఉక్కులాంటి చేతులతో ఒక బాలుని జుత్తు పట్టుకొనివున్నాడు. మరో చేతిలో రక్తంతో తడిసిన కృపాణం ఆ కుర్రాడి గుండెలపై గుచ్చి ఉంచాడు. ఆ బాలుని కళ్ళు ఆరిపోతున్న దీపాల్లా వున్నాయి. పెదాలు తెల్లగా పాలిపోయివున్నాయి. ఇంకా ముడుచుకుపోయాయి. అతనేదో చెప్పాలనుకుంటున్నాదు. కానీ నోట మాట పెగలడంలేదు.

నేనతన్ని గుర్తుపట్టాను. అతను నిస్సందేహంగా అన్వర్‌. అన్వరే... “గ్లాడియోలొ పూవు మాదిరి, “బుల్‌ బులొలా అన్వర్‌! అతన్ని కాపాడాలి. నేను గట్టిగా అరిచి చెప్పాలనుకున్నాను. “ఉధమ్‌సింగ్‌, అతన్ని వదిలెయ్యి, అతను అన్వర్‌! మన అన్వర్‌!”

కానీ చెప్పబోవడానికి ముందే ఉధమ్‌సింగ్‌ కృపాణం అన్వర్‌ గుండెను చీల్చివేసింది. అదే అన్వర్‌ - ఎవరి పట్టుకుచ్చులాంటి కేశాలను ఒకప్పుడు ఉధమ్‌సింగ్‌ (ప్రేమతో నిమిరాడో, అదే అన్వర్‌ ఎవరి కోసం గుక్కెడు నీళ్లు తెచ్చి తదారిన గొంతును తడిపి దాహం తీర్చాడో ఆ అన్వర్‌ ఇప్పుడు పిడికెడు రక్తం ధారబోసి అతని దగ్గరే ప్రశాంతంగా నిద్దరోయాడు. అన్వర్‌ పెదాలు తిరిగి ఎరుపెక్కాయి. బుగ్గలు మెత్తబడ్దాయి. కేశాలు మెరవసాగాయి. ఆ దృశ్యం చూస్తుంటే అనిపించసాగింది - అన్వర్‌ లేచి తన లేత చేతులను ఉధమ్‌సింగ్‌ భుజాలపై వుంచి ప్రేమగా పలకరిస్తాదు, “చాచాజీ!”

ళం 94 దా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

[| ౨ ఎహా ...... మున్నీ (ప్రేమ్‌చంద్‌ పేరుతో హిందీ, ఉర్టూ (త గస. సాహిత్యరంగంలో సుప్రసిద్దదైన ధన్‌పత్‌ రాయ్‌ థీ వాస్తవ 81 జులై, 1880న వారణాసి మున్నీ ప్రేమ్‌చంద్‌ దగ్గర లని (గ్రామంలో జన్మించారు. హిందీ, ఉర్జూ సాహిత్య రంగంలో ఈయన పేరు భారతదేశంలోనే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన ప్రసిద్ధ నవలలు : గోదాన్‌, కాదంబరి, గబన్‌, నిర్మల, సేవా సదన్‌, ఈద్దాహ్‌. లెక్కకు మించిన కథల రచనలు చేశారు. తల్లిదండ్రులు : ఆనంది దేవి, అజైబ్‌ లాల్‌. 8 అక్టోబర్‌, 1986లో వారణాసిలోనే తుదిశ్వాస వదిలారు. దేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో జరిగిన అనేక ఉద్యమాల నేపథ్యంలో రాసిన కథ '*జులూస్‌. జులూస్‌ (ఊరేగింపు) సమయాన పోలీసులు జరిపే లాఠీ ఛార్జీలు, అందులో భాగంగా ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ క్రూరమైన ప్రవర్తన ఫలితంగా జులూస్‌కు నాయకత్వం వహించే వ్యక్తి తీవ్రంగా గాయపడడం, చివరికి మరణించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సాగే కథలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ చివరికి భార్య (ప్రేరణతో ఉద్యమకారుల షక్షపాతిగా మార్పు చెందే వైనాన్ని దర్భ్శింపజేస్తాడు రచయిత. రేపెక్కడికెళ్తావ్‌...? 95

జులూస్‌

సంపూర్ణ స్వరాజ్యం కోసం జులూస్‌ కదలసాగింది. వందేమాతరం పాట పాడుతూ నినాదాలతో కొందరు యువకులు, మరికొందరు వృద్ధులు, బాలురు జెండాలు ఎగురవేస్తూ 'మాలొ ముందు నుంచి కదులుతుండ్రు. బాట పొడవునా జనం గోడ కట్టినట్టు నిలబడి చూస్తుండ్రు. జులూస్‌ను ఓ తమాషా దృశ్యంలా మాకేమి సంబంధం లేనట్టు, వాళ్ళ పని కేవలం నిలబడి చూడటమే అన్న తీర్గ వుంది. శంభూనాథ్‌ తన దుకాణం గడప మీద నిలబడి పొరుగున వున్న దీన్‌దయాళ్‌తో, “అందరూ చావు నోట్లోకి పోతున్నరు. ముందున్న పోలీసు గుంపు, గుర్రాల మీద స్వారీ చేసే పోలీసులు వీరిని చావబాది తరిమెయ్యక పోతేచూడు అని అంటున్నాడు!?”

“మహాత్ముడికి కూడా బుద్ధి మందగిస్తోంది. ఊరేగింపులు తీస్తే మాత్రం స్వాతంత్ర్యం వస్తుందా !? వచ్చేదైతే ఈ పాటికి ఎప్పుడో వచ్చేసేది. విడ్డూరం కాకపోతే చూడు, జులూస్‌లో ఎవరున్నారు. అంతా తల తిక్క వెధవలు, అల్లరి చిల్లరగా తిరిగే జులాయిగాళ్ళు, పనీపాటా లేని మేళం. ఒక్కడైనా నగర ప్రముఖుడున్నదాకొ వంతపొడాడు దీన్‌ దయాళ్‌.

చెప్పులు, స్లిప్పర్లు కట్టిన వరుసను మెడలో దండలా వేసుకొని పక్కన మైకూ నిలబడ్డాడు. ఇద్దరు సేఠ్‌ల సంభాషణ విని నవ్వుకున్నాడు.

శంభు అడిగాడు... “ఎందుకు నవ్వొస్తుంది మైకూ, ఈ రోజు తేలిపోతుంది అసలు రంగు.”

మైకూ : “ఈ జులూస్‌లో ఏ ఒక్క పెద్ద మనిషి లేడనే గదా మీరన్నది? పెద్దమనుషులు ఊరేగింపులోకి ఎందుకొస్తరు. వాళ్లకు ఈ సర్మార్‌లో ఏం లోటుందని? బంగళాలు, దేవిడీల్లో వుంటున్నరు. మోటార్లల్లో తిరుగుతున్నరు. బడా బాబులతో కూచొని దావత్‌లు చేస్కుంటున్నరు. వాళ్లకేం కష్టమొచ్చిందని. ఏం లోటుందనీ. ఏమైనా కష్టం 96 డా. రూప్‌కుమార్‌ దట్బీకార్‌

ఉందంటే మనకే గదా, ఆకలైతే రెండు రొట్టె ముక్కలకు గతిలేనోల్లం! ఈ సమయంలో ఒకడు టెన్నిస్‌ ఆడుతుండొచ్చు! ఒకడు చాయ్‌ తాగుతుండొచ్చు! ఒకడు (గ్రామఫోన్‌లో సంగీతాన్ని వింటూ సంబరపడి పోతూ వుంటాడు! పార్కులో షికార్లు కొడుతూ ఒకడు ! ఈ ఉద్యమంలో పాల్గొంటే వవుంది? పోలీసుల లాఠీ దెబ్బలు, హంటర్‌ దెబ్బలు తప్ప! మీరు కూడా ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు” ఆవేశంతో అన్నాడు.

శంభు : “ఈ విషయాలు నీకు అర్ధం కావు, మైకూ “ఇలాంటి సమయాల్లో నల్టురు పెద్దమనుషులు ముందుండి నడిస్తే సర్కార్‌ మీద కూడా ఆసర్‌ పడ్తది. జులాయి వెధవలంటే ఎవరు పట్టించుకుంటరు?!”

తన మాటలను అర్ధం చేసుకోలేదనుకున్నాడు మైకూ. “వీళ్ళను పెద్దమనుషులు చేసింది ఎవరు? మనమే గదా! ఎంత మంది లేరు, నిన్న మొన్నటి దాకా వాళ్ళనెవరూ పట్టించుకునే నాధుడే లేకుండే, అలాంటి వారిని మనమే నెత్తికెక్కించుకొని పెద్దమనుషులుగా చేస్తే ఇప్పుడు వారే కార్లలో తిరుగుతూ మనల్ని చిన్నచూపు చూస్తున్నారు. వాళ్ళ అదృష్టమే బాగుంది. కాస్త ఉన్నత స్థితికి ఎదగగానే చాలు మనం ఎదురుపడితే చూపు తిప్పుకుంటరు. ఎవడైతే బుడ్డగోచి కట్టి కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతాడో వాడే మనకు పెద్ద మనిషి మన బతుకులు బాగు చేయటానికి ప్రాజాలరచేత బెట్టుకొని ముందుండి నడుస్తాడో వాడే మనకు పెద్దమనిషి మనకు మీరనుకుంటున్న పెద్దమనుషులతో పనేలేదు. నిజం చెప్పాలంటే ఈ పెద్దమనుషులు మన మాతృభూమిని కళంకితం చేశారు. సర్మారిచ్చిన జాగీర్లనుభవిస్తూ అహంలో మునిగితేలుకున్నారు..” అంటూ చెప్పాడు.

దీన్‌ దయాళ్‌ : “ఈ కొత్త సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ చాలా దుర్మార్గుడు. చూస్తూ వుండు చౌరస్తా చేరగానే లాఠీ తీసుకొని వాయిస్తడు. అప్పుడు తెలిసొస్తది ఎట్లా తోకముడిచి పారిపోతారో. చూస్తుంటే మజా వస్తది..”

జులూస్‌ సమరోత్సాహంతో ముందుకు సాగుతూ చౌరస్తా చేరుకుంది. అక్కడ పోలిసులు, అశ్విక దళం ఒకటి దారికడ్డ్దంగా కాపు కాసివుంది. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బీర్చల్‌ సింగ్‌ తన గుర్రాన్ని ముందుకు నడిపించి ఉద్యమకారులను హెచ్చరించాడు. “వినండి, మీరు ముందుకు వెళ్ళడానికి అనుమతి లేదు.”

జులూస్‌ను ముందుండి నాయకత్వం వహిస్తూ నడిపిస్తున్న వృద్ధ నాయకుడు ఇబ్రాహీం అలీ ముందుకు వచ్చాడు.

“అయ్యా, నేను మీకు మాట ఇస్తున్నాను. మా వల్ల ఎలాంటి గొడవ, అల్లరి గాని జరగదని, మేమేమి దుకాణాలు కొల్లగొట్టడానికి, వాహనాలు ధ్వంసం చేయడానికి రాలేదు. మా లక్ష్యం వీటన్నింటి కన్నా ఉన్నతమైనది, పవిత్రమైనది.” రేపెక్కడికెళ్తావ్‌...? 97

చీర్చల్‌ : నాపై అధికారుల ఆజ్ఞ. జులూస్‌ ఇక్కడి నుండి ముందుకు సాగడానికి వీల్లేదు.”

ఇబ్రహీం : “ఈ విషయమై మీరు మీ పై అధికారులతో కాస్త సంప్రదించండి?”

బీర్బల్‌ ; “సంప్రదించాల్సిన అవసరం లేదనుకుంటాను.”

ఇబ్రహీం : “అలా ఐతే మేమిక్కడి నుండి కదలం. మీరీ స్థలం వదిలి వెళ్ళినపుడే మేము ముందుకు కదుల్తాము..”

బీర్బల్‌ : “ఇక్కడే బైఠాయించడానికి కూడా అనుమతి లేదు. మీరంతా వెనక్కి వెళ్ళక తప్పదు.”

“వెనక్కి మళ్లడం సాధ్యం కాదు. మీకు గాని, మరెవ్వరికి గాని మమ్ముల్ని అడ్డుకునే ఎలాంటి హక్కులేదు. మీరు మీ రక్షక దళం సిపాయిలు మమ్ముల్ని బెదిరించి, తుపాకులతో భయపెట్టి ఆపగలిగితే ఆపండి. కానీ మీరు మమ్ముల్ని అడ్డుకోలేరు - ఇబ్రహీం గంభీర స్వరంతో జవాబిచ్చాడు. *ఈ నేలను, జాతిని బానిస సంకెళ్లతో బంధించి పాలించాలనుకునే వాది తుచ్చమైన కోరికలను సాకారం కాకుండా, నిరంకుశ పాలకుల అజ్ఞలను తిరస్కరించి మాతృభూమి విముక్తికై మా సోదర అధికారగణం మాతో చేతులు కలిపే ఆ రోజెప్పుడొస్తుందో తెలియదు” అని తన మనసులోనే సందేహాన్ని మననం చేసుకుంటున్నాడు ఇబ్రహీం.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బీర్బల్‌ గ్రాడ్యుయేషన్‌ వరకు చదివాడు. అతని తండ్రి సూపరింటెండెంట్‌ పోలీస్‌గా పని చేసాడు. అతని నరనరాల్లో అధికార దర్చం, అహం ప్రస్ఫుటమవుతుంది. ఆఫీసర్ల దృష్టిలో అతడంటే ఎనలేని గౌరవం, అభిమానం. తెల్లని శరీర ఛాయ, నీలి కళ్ళు ఒత్తయిన శిరోజాలతో, అందమైన ముఖవర్చ్పస్సుతో అందర్నీ ఆకర్షించే శరీర సౌష్టవం. నిజానికి ఎప్పుడైతే అతను కోటు, టోపీ ధరించి వుంటాడో అప్పుడు తాను స్థానికుడన్న సంగతే మర్చిపోతాడు. బహుశా తాను రాజ్యాధికారం నడిపే వారిలో ఒకడన్న భావనలో మునిగిపోయి వుంటాడు. కానీ ఇబ్రహీం మాటల్లోని తిరస్కార భావం బీర్చల్‌ అహాన్ని దెబ్బ తీసింది. పరిస్థితి చూస్తే విషమంగా వుంది. ఒకవేళ జులూస్‌ను ముందుకు సాగనిస్తే తానూ ఓటమిని అంగీకరించినట్లవుతుంది. కాదని అడ్డగిస్తే, తెలియదు, ఎంతసేపు ఇక్కడే బైఠాయిస్తారో ఈ జనం. ఇలాంటి సంకటస్థితిలో సతమతమవుతుండగా గుర్రం మీద డి.ఎస్‌.పి. రావడం గమనించాడు బీర్చల్‌. ఇక ఆలోచిస్తూ కూర్చునే సమయం కాదు. తన శక్తి సామర్ధ్యాలు చూపించు కునేందుకు ఇదే మంచి అవకాశం. అనుకున్నదే ఆలన్యం నడుముకున్న బాటన్‌ తీసి గుర్రాన్ని కాలి మడమతో తన్ని ముందుకు అదిలించి జనం పైకి తోలాడు. అది చూసి అశ్చికదళం కూడా తమ గుర్రాలను కార్యకర్తల పైకి నడిపించారు. ఇబ్రహీం, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గుర్రం ముందున్నాడు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ చేతిలోని బాటన్‌ అతని తలపై గట్టిగా పడింది. అంతే 98 డా. రూప్‌కుమార్‌ దట్బీకార్‌

కళ్ళు బైర్లు కమ్మి నిలబడలేక తలపట్టుకొని కింద పడిపోయాడు. అదే సమయంలో కింద పడివున్న ఇబ్రహీంను గుర్రం కాళ్లతో తాక్కించసాగాడు. గుర్రం కాళ్ళ కింద నలిగిపోతున్నాడు ఇబ్రహీం. ఇంతవరకు పరిస్థితి ప్రశాంతంగానే వుంది. కిందపడిపోతున్న ఇబ్రహీంను చూసి కొందరు సహాయానికి ముందుకురికారు. కానీ, వారి ప్రయత్నం ఫలించలేదు. పోలీసుల లాఠీలు కార్యకర్తలపై నిర్దాక్షిణ్యంగా నాట్యం చేస్తున్నాయి. చేతులడ్డం పెట్టి తమని తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులెంత కఠినంగా ప్రవర్తించినా ఎవరూ హింసకు దిగలేదు.

“ఇలా హింస, అవమానాలకు గురవుతూ సహిస్తూ ఉండటం కంటే హింసకు ప్రతిహింసగా మనమెందుకు హద్దు దాటకూడదూ?!” అని ఒక అలోచన జనంలో అంకురించసాగింది. ప్రజల దృష్టంతా మనపైనే వుంది. ఓటమిని అంగీకరిస్తూ జెండాలు చేతబట్టి వెనుతిరిగితే మళ్ళీ ఏ మొహం పెట్టుకొని స్వరాజ్యం పేరెత్తగలం. ప్రాణరక్షణ కోసం ఒక్కరికి కూడా వెన్నుచూపాలన్న ఆలోచన రాలేదు. కిరాయికి వచ్చిన దుండగుల ముఠా కాదు. డబ్బుకు ఆశ పడి వచ్చిన అలగాజనం అంతకన్నాకాదు. స్వాతంత్ర్యం కోసం వచ్చిన స్వయం సేవకులు. స్వరాజ్య పోరాటం కోసం బాధ్యతనెరిగి ప్రాజాలొడ్డదానికి సిద్ధమైన సంఘటిత శక్తి. ఎంతో మంది తలలు పగిలి రక్తం ఏరులై ప్రవహించసాగింది. కొందరి చేతులు విరిగాయి. గాయపడ్డ జనం వోహాకారాల మధ్య తలుచుకుంటే పోలీసుల గోదను కూల్చి దాటిపోగల సత్తా వున్న జనవాహిని, కానీ వారికి వారి పోరాట సిద్ధాంతాలు తెలుసు. లక్ష్యం తెలుసు. ఆదర్శాలకు కట్టుబడిన వారికి వారి సిద్ధాంతాలే కాళ్లకు సంకెళ్లయ్యాయి. పది పన్నెండు నిమిషాలు గందరగోళం కొనసాగింది. ప్రజలు ప్రశాంతం గానే వారి లక్ష్యం కోసం నిలబడియున్నారు.

లై

ఇబ్రహీం గుర్రం కాళ్ళ కింద నలిగి తీవ్రంగా గాయపడిన విషయం, కొందరికి చేతులు విరగడం, అనేకులు గాయపడటం జరిగిన గొడవ సంగతంతా క్షణాల్లో నగరమంతా వ్యాపించింది. ఇంత జరిగినా ఉద్యమకారులు వెనుదిరగలేదు. పోలీసులు సైతం వారిని ముందుకు కదలనివ్వలేదు.

“అన్నా ఇగ ఇక్కడ ఉండలేము, నే వెళ్తాను మైకు ఆవేశంతో అన్నాడు.

“మేమూ వెళ్తాం. చూద్దాం, ఏం జరగబోతుందో” దీన్‌ దయాళ్‌ జవాబిచ్చాడు.

శంభు ఒక్కక్షణం మౌనం వహించాడు. వెంటనే తన దుకాణం షట్టర్‌ కిందికి లాగి అన్నాడు, “ఏదో ఒక రోజు చావక తప్పదు కదా, ఎలా జరగాలో అలా జరగక మానదు. వీళ్లంతా తమ ప్రాణాలను లెక్క చేయకుండా ఉద్యమంలోకి దిగారు” ఒక నిర్వేదం అతని గొంతులో ధ్వనించింది. రేపెక్కడికెళ్తావ్‌...? 99

చూస్తుండగానే దుకాణాలన్నీ మూతబడ్డాయి. పది నిమిషాల క్రితం ఏ జనమైతే తమాషాలా చూస్తూ నిలుచున్నారో వారంతా కంగారుగా అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. అలా చూస్తూ ఉండగానే కొన్ని వేల జనం ఘటనాస్థలికి చేరుకాని ఒక (బ్రహ్మాండమైన ఊరేగింపుకు సిద్ధమయ్యారు. అందరూ ఆవేశంతో ఒక రకమైన ఉన్మాదంలో ఊగిపోతున్నారు. సిద్దాంతాలు, ఆదర్భాలు అన్నీ పక్కన పెట్టారు. చావడానికే కాదు, చంపడానికీ సిద్ధపడ్డారు. గుత్చలు చేతబట్టారు. కొందరు జేబుల్లో రాళ్లు నింపుకొని దేనికైనా తెగించామన్నట్లు వున్నారు. ఎవరూ ఎవ్వరి సలహాల కోసం వేచి చూడటం లేదు. అంతే అందరిలో తెగింపు, ఒకే ధృడ సంకల్పం, పెద్ద తుఫాను చెలరేగింది.

జనావేశాన్ని చూసేసరికి అశ్విక దళంలో సంచలనం రేగింది. బీర్చల్‌కు ముచ్చెమటలు పోశాయి. డి.ఎస్‌.పి. తన వాహనాన్ని పక్కకు నడిపించుకుని వెళ్ళి పోయాడు. కట్టలు తెంచుకున్న అవేశం, ఉన్నాదంతో ఊగిపోయే జన సమూవాన్ని నియంటత్రించడ మంటే శాంతి, అహింస సిద్ధాంతాలకు కట్టబడియున్న వ్రతదారుల మీద లాఠీల వర్షం కురిపించడమంతా సుళువు గాదు. అశ్విక దళం పోలీసులు నెమ్మదిగా వెనక్కి తగ్గారు.

గుర్రవు దెక్కల తాకిడికి తీవ్రంగా గాయపడి సొమ్మసిల్లిన ఇ(బ్రహీం ఈ గందరగోళానికి నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. సైగ చేసి ఒక యువకుణ్ణి దగ్గరగా పిలిచి కైలాష్‌ ఏం జరుగుతుంది? నగరం నుండి ఎవరైనా వస్తున్నారా?ొయని అడిగాడు.

కైలాష్‌ తరలి వస్తున్న జనాన్ని చూపి, “అవునయ్యా, వేల సంఖ్యలో జనం తరలి వస్తున్నారు” అంటూ జవాబిచ్చాడు. పరిస్థితి చేయి దాటిందని భావించిన ఇబ్రహీం అందర్నీ ఉద్దేశించి “అందరూ వెంటనే వెనక్కి మళ్ళాలి. లేకపోతే గొప్ప అనర్ధం జరిగి పోతుంది. మనం మన సోదర సమూహంతోనే పోరాటం చేయటం ఉచితం కాదు. జెండాతో సహా వెనక్కి మళ్ళండి” అంటూ లేచి నిలబడటానికి ప్రయత్నం చేస్తూనే కుప్పకూలిపోయాడు.

సంఘటిత సైన్యానికి ఒక్క సైగ చాలు. ఆజ్ఞ జారీ కాగానే అందరూ కాస్త తగ్గారు. కొందరు జెండాలు కట్టిన వెదురు కర్రలతో, కండువాలతో (స్టెచర్‌లా తయారు చేశారు. ఇబ్రహీంను దానిపై పడుకోబెట్టి వెనక్కి తీసికెళ్ళారు. స్వాతంత్ర్యం కోసం పోరాడే ప్రజలకు అది పరాజయమా? అది కొందరికి పరాజయమన్న భావన కలిగి అనందాన్నిస్తే ఇవ్వొచ్చు గాక! వాస్తవానికి ఉద్యమకారులు ఒక గొప్ప విజయాన్ని సాధించారు. వాళ్లకు తెలుసు వారి సోదర సమానులతో ఎదురుపడటం జరుగుతున్నదని. వారిని ఆ మార్గంలో నడిపించే పరిస్థితులు వేరు. మమ్ముల్ని ఈ పోరాట దారిలో నడిపించే 100 డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

కారణాలు వేరు. వారి తోటి మేము శత్రువుల్లా వ్యవహరించదలుచుకోలేదు. నగరంలో లూటీలు, గొడవలు, అల్లర్లు జరగాలని ఆశించడమూ లేదు. దుకాణాలు లూటీ చేయడం, తలలు పగలగొట్టి రక్తపాతం చేయడం కాదు గదా ! మా విజయానికి చిహ్నం మా ధర్మయుద్ధమే. ప్రజల సానుభూతి సంపాదించడమే! ఎవరైతే మమ్ముల్ని చూసి అపహాస్యం చేశారో వారే ఈ రోజు మా ధైర్య సాహసాలు, తెగింపును గుర్తించి సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చారు. వారిలో వచ్చిన ఈ మానసిక మార్చే మాకు ఈ రోజు లభించిన గొప్ప విజయం. అసలైన గెలుపు.. పోరాటం చేయటం మా అవసరమేమీ కాదు. స్వాతంత్ర్య పోరాటం కోసం ప్రజల ఐక్యతను, సానుభూతిని అనుకూలంగా పొందటం, వారి మనసును ఉద్యమం వైపు మళ్లించడం మా ప్రధాన ఉద్దేశం. ఏ రోజైతే ఈ లక్ష్యాన్ని సాధించగలమో ఆ రోజే “స్వరాజ్య సూర్యోదయం' జరుగుతుంది. తి

మూడ్రోజులు గడిచిపోయాయి. బీర్బల్‌ తన గదిలో కూర్చొని చాయ్‌ తాగుతున్నాడు. ఆయన భార్య మిట్టన్‌ బాయి పొప నెత్తుకొని అతని ముందు నిల్చుంది.

బీర్చల్‌ : ఆ సమయంలో నేనేం చేయగలను.

వెనక డి.ఎస్‌.పి. నిలబడివున్నాడు. నేను కాదని అతనికి దారిస్తే కష్టంలో పడిపోదును.

మిట్టన్‌ బాయి : తలూపుతూ అంది, “కనీసం జనాల మీద లాఠీఛార్జీ చేయకుండా వుండగలిగే వారు గదా! మీ పని లాఠీచార్జీ చేయడమేనా? కనీసం వాటిని ఆపే ప్రయత్నం చేసి వుండొచ్చు గదా!? రేపటి రోజు మీకు నేరస్తులను దండించమనే పని పురమాయిస్తే మహా సరదాగా వుంటుంది కదూ...” బీర్చల్‌ మధ్యలోనే అందుకున్నాడు. “నీవు పరిస్థితిని అర్థం చేసుకోవటం లేదు...!”

మిట్టన్‌ బాయి : “బాగా అర్థం చేసుకోగలను. డిఎస్పీ చూస్తున్నాడని మీరు మీ గొప్పతనాన్ని ప్రదర్శించే అవకాశం మళ్ళీ రాదనుకున్నారు కాబోలు. ఆ గుంపులో మంచి వాళ్లెవరు లేరనుకున్నారా? అందులో ఎంతోమంది ఉండవచ్చు. మీలాంటి వారిని తమ పనుల్లో నౌకరీ ఇచ్చే శక్తి గలవారు మీ కన్నా విద్యావంతులుండవచ్చు. కానీ అవేవీ పట్టించుకోకుండా వారి మీద లాఠీచార్జీ చేశారు. గుర్రాలతో తొక్కించారు. వారెవ్వా మగతనమంటే మీదే?”

బీర్చల్‌ నిస్సిగ్గుగా ఒక నవ్వు నవ్వి “డిఎస్సీ నా పేరు నోట్‌ చేసుకున్నాడు, తెలుసా” అన్నాడు. రేపెక్కడికెళ్తావ్‌...? 101

ఈ విషయాన్ని చెప్పి మిట్టన్‌బాయిని సంతోషపరిచానని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బహుశా అనుకొని వుంటాడు. మంచితనం. పరోపకారగుణం ఇవన్నీ పై పై మాటలే. గుండె లోతుల్లో నుంచి గాక నాలుక మీద నాట్యం చేసే పదాలు. స్వార్థం మనసు లోతుల్లో దాగివుంటుంది. ఇవన్నీ చాలా గంభీరమైన విషయాలు. కానీ మిట్టన్‌ బాయి ముఖంలో ఎలాంటి హర్షాతిరేఖల ఛాయలు కనబడలేదు. పై పై మాటల ఆంతర్యాన్ని గ్రహించి ఉంటుంది. అందుకే ఇలా అంది. “చేసుకొని ఉండొచ్చు. మీకు పదవిలో ప్రమోషన్‌ కూడా రావొచ్చు, కానీ అమాయకుల రక్తంతో తడిసిన చేతులు ఏ స్థాయికి ఎదిగినా ఏం లాభం? ఇదిమీ సామర్థ్యానికి బహుమానం కాదు. మీరు చేసిన దేశ ద్రోవినికి ఖరీదు నిజమైన దోషి ఎవరన్నది ఏ రోజు తెలుసుకుంటారో అప్పుడే బహుమానం దొరుకుతుంది...”

అంతలో ఒక సిపాయి వచ్చి వరండాలో నిల్చొని “హుజూర్‌, ఈ కవర్‌ తీసుకొచ్చానూ” అన్నాడు.

బీర్బల్‌ బయటికి వచ్చి కవర్‌ అందుకొని అందులోని సర్కారీ చిట్టీని బయటికి తీసి చదివి మేజాపై పెట్టేశాడు.

అది చూసి మిట్టన్‌ అడిగింది. “ప్రమోషన్‌ పత్రం వచ్చేసిందా?!”

బీర్చల్‌ : నీకు పరాచికంగా వుంది. ఈ రోజు మళ్ళీ జులూస్‌ బయల్దేరడానికి సిద్ధంగా వుందట... నన్ను అతనికి తోడుగా ఉండమని చెప్పే ఆజ్ఞా పత్రం” విసుగ్గా బదులిచ్చాడు.

మిట్టన్‌ : “అయితే ఇక మీకు పండగే. ఈ రోజు కూడా బలి పశువులు దొరక్కపోరు. డి.ఎస్పీ, ఎలాగూ వస్తాడు గదా! అతనికి మీ తెలివి, చతురత చూపించి సంతోషపెట్టొచ్చు. ఈసారి తప్పకుండా ఇన్‌స్పెక్టర్‌ ప్రమోషన్‌ ఖాయం.” మిట్టన్‌ మాటల్లో వెటకారం ధ్వనించింది. బీర్చల్‌ నెత్తి కొట్టుకుంటూ “అప్పుడప్పుడూ తలాతోక లేని మాటలు మాట్లాడుతుంటావు. తెలుసా నీకు! వెళ్లి చేతులేలాడేసుకాని నిల్చుంటే దాని ఫలితం ఎలావుంటుందో! నన్నో చేతకాని వెధవలా లెక్కగట్టి మరొకణ్జి తెచ్చి నియమిస్తారు. నేను ఉద్యమకారులకు సానుభూతిపరుణ్ణి అంటూ తేల్చేసి వమైనా చెయ్యొచ్చు ఉద్యోగం ఊడడం సంగతి అలావుంచితే సర్కారుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నానని అనుకోరు.”

“మనిషి తానున్న పరిస్థితుల్లోనే జీవించాలి. దానికనుగుణంగానే నడుచుకోవాలి నాకు తెలివి లేదనుకుంటున్నావు. అంత తెలివితక్కువ దద్దమ్మనేం కాను. నాకు తెలుసు వీళ్లంతా దేశం కోసం, జాతి విముక్తి కోసం పోరాటం చేస్తున్నారని. ఇది కూడా తెలుసు వీరి ప్రయత్నాలను, ఆశయాలను తొక్మిపడెయ్యాలన్నది సర్కారు కోరిక. బుద్ది లేని గాడిదనేం

102 దా. రూప్‌కుమార్‌ దవ్బీకార్‌

కాను కేవలం బానిస ఐతుకునే గడిపేస్తూ గర్వించడానికి. కానీ ఏం చేస్తాను. ఏమీ చేయలేని నిస్సహాయుణ్జి అయ్యాను” అంటూ చెప్పుకొచ్చాడు.

దప్పు చప్పుళ్ళు దగ్గర కాసాగాయి. బీర్బల్‌ బయటికొచ్చి విషయాన్ని వాకబు చేసాడు. జులూస్‌ దగ్గరికొచ్చేసిందని తెలుసుకున్నాడు. వెంటనే యూనిఫామ్‌ వేసుకొని పిస్తోలు తీసుకొని బయటికొచ్చాడు. క్షణంలో గుర్రం సిద్దమయ్యింది. కానిస్టేబుళ్లు ముందే రెడీగా వున్నారు, అందరూ “డబల్‌ మార్చ్‌” చేస్తూ జులూస్‌ వైపుకు కదిలారు.

డబుల్‌ మార్చ్‌ చేస్తూ పదిహేను నిమిషాల్లో జులూస్‌ ముందు వాలారు. వీళ్ళను చూడగానే ఒక్కసారిగా 'వందేమాతరం' అంటూ కొన్ని వేల గొంతుకలు నినదించాయి మేఘాలు ఘర్టించినట్లుగా. అంతలోనే నిశ్శబ్దం. ఆ రోజు జులూస్‌కు ఈ రోజు దానికి ఎంత తేడా?! అది ఒక స్వరాజ్య భావనతో సొగిన ఉత్సవం. ఇది ఒక దేశభక్తుడు అమరుడైన సందర్భాన్ని తీసుకొని చేస్తున్న 'మాతమ్‌” మూడు రోజులు తీవ్రమైన జ్వరంతో బాధను అనుభవించి ఆరిపోయిన ఒక దీపం. ఆ జీవికి ఏ అధికారం ముందు బానిస భావంతో తలొంచని థైర్యం తప్ప ఎలాంటి పదవుల మీద వ్యామోహం లేకుండె. అతను ప్రాణాలాదులుతూ తన మరణ వాంగ్మూలంలో తన శవాన్ని గంగలో స్టానమాదించి పూద్చేయాలని, తన సమాధి మీద స్వరాజ్య పతాకాన్ని ఎగరెయ్యాలన్నదే చివరి కోరికగా కోరాడు. అమరుదయ్యాడన్న వార్త దావానలంలా వ్యాపించగానే నగరమంతా విషాదం అలుముకుంది. అతని మరణవార్త విన్న ప్రతి ఒక్కరు తమ గుండెల మీదనే తుపాకీ గుండు పేలినంతగా బాధపడ్డారు. క్షణాల్లో ఐబజారంతా బందయ్యింది. టాంగాలు, బగ్గీలు ఎక్కడా మచ్చుకైన కానరాలేదు. నగరమంతా దోపిడీకి గురయ్యిందా? అన్న భావం. శవం జులూస్‌ మొదలవ్వగానే లక్షకు పైగా జనం పోగయ్యారు. కళ్ళలో తడి లేకుండా ఒక్కడూ కానరాలేదు. ఏడ్చి ఏది అందరి కళ్ళు ఎరుపెక్కాయి. బీర్చల్‌ తన కానిస్టేబుళ్లను, అశ్విక దళాన్ని (ప్రతి ఐదు గజాల ఎడంతో తైనాత్‌ కావాలని ఆజ్ఞ జారీ చేసి తాను మాత్రం వెనకే వుండిపోయాడు. వెనక వరసలో ఓ యాఖై గజుల వరకు మహిళలు వున్నారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వారి వైపు చూసి తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు. ముందు వరుసలోనే మిట్టన్‌బాయి కనబడింది. మళ్ళీ మళ్ళీ చూసాడు ఆమెనే. ఎలాంటి సందేహం లేదు. మిట్టన్‌ అతని వైపు ఓసారి చూసి చూపును తిప్పుకుంది. ఆమె ఒక్క చూపులో అతనికి ధిక్కారం, వేదన, అసహ్యం అన్నీ కలగలిసిన భావాలు ప్రత్యక్ష మయ్యాయి. ఆ ఒక్క చూపు అతని నరసరాల్లో సన్నటి వణుకును ప్రవహింప చేసింది.

ఎప్పుడూ అతను ఇంతలా లజ్ఞారపాతుడిగా దిగజారిన భావనను అనుభవించలేదు. బీర్బల్‌ వైపు ఓ మహిళ చూసి.. “కొత్వాల్‌ సాబ్‌ మిమ్ముల్ని చూస్తే భయమేస్తుంది. ఎక్కడ మా మీద లాఠీచార్జి చేస్తారోనని” అని అంది. రేపెక్కడికెళ్తావ్‌...? 109

రెండో మపాళ : “మీ అన్నో తమ్ముడో కదా, మాల్‌ చౌరస్త దగ్గర ఈ అమాయకుని మీద దౌర్జన్యం చేసింది.” మిట్టన్‌ అందుకుంది, “వీరి సోదరుడెవ్వరూ గాదు, ఈయనే స్వయాన ఈ గొప్ప పని చేసింది.” అందరూ ముక్తకంఠంతో పలికారు. “అచ్చా! ఈ మహానుభావుడేనా, మహానుభావా, మీకో నమస్మారం. మీ దయ ఈ రోజు మా అందరిని ఇక్కడికి రప్పించింది. మీ లాఠీ దర్శన భాగ్యం కలిగింది.” బీర్చల్‌ మిట్టన్‌ వైపు తీక్షణంగా చూసాడు. కానీ ఏమీ అనలేకపోయాడు. మూడవ మహిళ : “అయ్యా, మేమంతా కలిసి ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి మీకు జయమాల వేసి అలంకరించి, మీ యశోగానం చేస్తాము, అనుగ్రహించండి” అంది. నాలుగో మహిళ : “అంగ్రేజీ కా హోగా, అందుకే ఇంత తెల్లగా వున్నావు” వెటకారంగా అంది. ఒక వృద్ధ మహిళ ఆవేశంతో ఊగిపోతూ, “నా కడుపున ఇలాంటి కొడుకే గనుక పుడితే వాడి గొంతు పిసికేస్తుంటి” అంది. మరో యువతి - “పెద్దమ్మ నువ్వు బాగానే చెప్పావు. కుక్కలు సైతం తిన్న ఇంటీ విశ్వాసం చూపుతాయి. ఇతను మనిషి కదా..!” అంటూ అనుమానంగా చూసింది. మరో వృద్ధ మహిళ అరవసాగింది. “కడుపుకు కక్కుర్తి పడేవాడ! కక్ళుర్తి వెధవా! కక్కుర్తి...” ఈ మాటలు విని అక్కడున్న కొందరు మహిళలు ఆ మునలావిడను మందలించారు. ఆమె తన తొందరపాటుకు సిగ్గుపడుతూ "*నేనేమైనా అనాలని అన్నానా?! ఏం మనిషి ఇతను, స్వార్ధంతో గుడ్డివాడయ్యాడు” అంటూ తనకు తాను సమర్ధించుకుంది. బీర్చల్‌లో సహనం నళించిపోయింది. వారి విమర్శలు, ఎత్తిపాడుపు మాటలు వినలేకపోయాడు. తన గుర్రాన్ని అదిలించి జులూస్‌కు చాలా వెనక్కి వెళ్ళిపోయాడు. మగాడు అవమానపరిస్తే కోపం వస్తుంది. అదే ప్రీ తక్కున చేసి మాట్లాడితే మగాడు ఆత్మగౌరవం దెబ్బతిన్న భావనకు గురై న్యూనతకు లోనవుతాడు. బీర్చల్‌కు మళ్ళీ ఆ మహిళల ముందుకు పోవడానికి ధైర్యం చాల్లేదు. తన పై అధికారుల మీద చెప్పరాని కోపం వచ్చింది.“నన్నే ఇలాంటి కార్యక్రమాలపై ఎందుకు పంపుతారు?! ఇంకా వున్నారు కదా?” వాళ్ళనెందుకు పంపరో..? అందరి కన్నా నేనే పనీ పాటా లేకుండా 104... దా. రూప్‌కుమార్‌ దల్బీకార్‌

ఉన్నానా 7 లేక బేఖార్‌గా పడి వున్నాననుకుంటారా?. అనేక (ప్రశ్నలు అతని మనసును కలిచివేస్తున్నయి.

మిట్టన్‌ ఈ సమయాన మనసులో అనుకుంటూ వుండవచ్చు. నేనెంతో పిరికివాణ్డని, నీచుణ్జి అని”, బహుశా నన్నిపుడు ఎవరైనా చంపేసినా తాను నోరు కూడా విప్పదనుకుంటా? పైపెచ్చు మనసులో సంతోషపడొచ్చు కూడా, తగిన శాస్తి జరిగిందని... ఇప్పుడెవరైనా వెళ్లి పై అధికారులతో ఫిర్యాదు చేస్తే “బీర్చల్‌ సింగ్‌ భార్య కూడా జులూస్‌లో పాల్గొన్నదని" “ఇంకేమైనా వుందా! పరువు ఐజారుపాలవుద్ది.” మిబ్టికి తెలుసు, తెలివిగలది అన్నీ అర్ధం చేసుకోగల తెలివున్నది. అయినా బయటికి వచ్చేసింది. నన్ను కనీసం అడగను కూడా అడగలేదు. నేనంటే ఎంత నిర్లక్ష్యం ? అసలు ఎవ్వరికీ ఎలాంటి ఫికర్‌ లేదు. కాలేజీ, స్కూల్‌ పిల్లలు, కూలీ నాలీ చేసుకునేటోళ్లు, ఉద్యోగులు ఎవ్వరికీ ఎలాంటి చీకుచింతా లేదు. (పతి దానికి మేమే చావాలి! వాళ్ళకే పిల్లా పీచు వున్నది. కుల మర్యాదలున్నాయి. ఇప్పుడే గదా అందరూ నా వైపెలా మిర్రి మిర్రి చూసారో! తినెయ్యాలన్నంత కోపంగా ఆవేశంలో వున్నాడు బీర్చల్‌..

జులూస్‌ నగరం (ప్రధాన వీధులగుండా ముందుకు సాగిపోతుంది, ప్రజలు ఇంటికప్పుల మీద, సజ్జల మీద, చెట్ల కొమ్మల మీద నిలబడి చూస్తున్నారు. బీర్బల్‌ సింగ్‌ ఈ రోజు అందరి ముఖాల్లో ఒక స్ఫూర్తి (ప్రేరణ ఒక కొత్త ఉత్సాహం, ఒక విధమైన గర్వం దర్శిస్తున్నాడు. “చెట్లు ప్రేరణనిస్తున్నాయా”? యువకుల ముఖాల్లో ఉత్సాహం, వారి ముఖాల్లో తొణికిసలాడుతున్న గర్వం.. ఒక రమణీయమైన దృశ్యం. స్వరాజ్యమే లక్ష్యంగా వున్న మార్గంపై వుట్టిపడుతున్న ఉల్లాస డోలిక. ఇప్పుడు వారి యాత్రలో ఎలాంటి దాపరికాలు కనబడటం లేదు. దారి తప్పిన వారి మాదిరి కాకుండా లక్ష్య దిశలో సాగుతున్న దండు. తలొంచి నడిచే దళితుల నిర్భంధ బానిస భావం లేదు. స్వాతంత్ర్యం ఇంకా ఎంతో దూరం లేదు, ఆకాశంలో నక్ష్మత్రంలా మెరుస్తూ దర్శనమిస్తుంది. ఉద్యమకారులు వారి దారి కద్దంగా వచ్చే ఎలాంటి విపత్తులను లెక్కచేయని మనోబలంతో తమ బంగారు లక్ష్యం వైపే చూస్తూ ముందుకు సొగే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. పదకొండు గంటల సమయానికి జులూస్‌ నది ఒడ్డుకు చేరింది. పాడెను కిందికి దింపి శవాన్ని గంగా స్నానానికి తీసికెళ్ళారు. చల్లబడిన అతని దేహం పసుపు రంగులోకి మారగా ప్రశాంతంగా వున్న ముఖం మీద లారీ అనవాళ్ళు స్పష్టంగా కనబడ్డున్నయి. రక్తం కమిలిన గుర్తులూ వున్నాయి. పొడవాటి తల వెంట్రుకలు రక్తంలో తడిసి జిగటగా వుంటూ నెత్తికి అంటుకొని పోయి ఒక చిత్రకారుడి రంగుల కుంచెను తలపిస్తున్నది. అమరుడైన అతని పార్ధివ దేహం చివరి దర్శనానికి వేలాది జనం వరస కట్టి నిల్చుండి పోయారు. బీర్చల్‌ గుర్రం మీదనే కూచొని వెనక వున్నాడు. లాఠీ దెబ్బల గుర్తులు అతనికి కనబడ్డాయి. అమరుడి రేపెక్నడికెళ్తావ్‌...? 105

ఆత్మ తనని ధిక్కరించిన భావన కలిగినది. శవం వైపు తిరిగి చూసే ధైర్యం చేయలేక పోయాడు. మొహం తిప్పేసుకున్నాడు. ఏ మనిషి దర్శనం కోసం, ఎవరి పాదధూళిని తమ నుదుట ధరించడం కోసం వేల జనం ఆత్రంగా ఆరాటపడుతున్నదో ఆ శరీరాన్ని చూడటానికి విముఖతను చూపుతున్న అతని వ్యక్తిత్వంలోని అహం, దేహాన్ని త్యజించిన ఆత్మను దాని మర్యాదను అవమానించింది. కర్తవ్య నిర్వహణ, బాధ్యత ముసుగులో నిర్దాక్షిణ్యంగా చేసిన దాడిలో తన స్వార్ధమే వున్నదని, అదే సత్యమనీ బలిపీఠం పైకెక్కిన ఆత్మ గ్రహిస్తుంది. అతని చేష్టలో కార్య దీక్షత చూపాలన్న తీవ్రమైన వాంఛపై అధికారుల మెప్పు కోసం తాపత్రయమే దర్శనమవుతుంది. కొన్ని వేల కన్నులు ఆగ్రహంతో నిండివున్నాయి. కానీ ముందుకు రావడానికి సాహసించలేకపోతున్నయి.

ఒక కానిస్టేబుల్‌ ముందుకు వచ్చి బీర్చల్‌ను ప్రశంసించసాగాడు. “అయ్యా, మీ చేతి వాటం చాలా గట్టిదే, ఇప్పుడు కూడా పగిలిన తల అలాగే విచ్చుకునే వుంది, అందరి కళ్ళు తెరుచుకున్నాయిప్పుడు!”

బీర్చల్‌ నిర్లక్ష్యంతో “ఇది నా మగతనానికి కాదు క్రూరత్వానికి నిదర్శనమని భావిస్తాను..”

కానిస్టేబుల్‌ బీర్చల్‌ను సంతోషపెట్టే ప్రయత్నంలోనే వున్నాడు “అతనివన్నీ విద్రోహ చర్యలే సాబ్‌”

బీర్చల్‌ తీవ్రమైన స్వరంతో “నోర్ముయ్‌, తెలుసా నీకు విద్రోహ ఎవరినంటారో! ఎవడైతే దారి దోపిడీలు, దొంగతనాలు చేస్తాడో, ఎవడైతే హత్యలకు పాల్పడుతాడో వాడు విద్రోహి. దేశం కోసం ప్రాణాలరచేత బట్టుకొని తిరిగే వాణ్ని విద్రోహి అనరు. ఎవరికైతే సహాయం చేయాలో వారికి వ్యతిరేకంగా మనం పని చేయడం మన దురదృష్టం. ఈ సంఘటన మనం ఆనందించి గర్వపడాల్సిన విషయమేమి కాదు. సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయం” అన్నాడు.

స్నానం పూర్తయ్యింది. జులూస్‌ పునః (ప్రారంభమయ్యింది.

శ

శవాన్ని పూద్చేసి జనం వెనక్కి మళ్ళేసరికి సమయం రెండు గంటలు కావచ్చింది. మిట్టన్‌ బాయి మహిళలతో కలిసి కొంత దూరమైతే వచ్చింది. కానీ, క్వీన్స్‌ పార్క్‌ దగ్గరికి రాగానే ఆగిపోయింది. ఇంటికెళ్లాలనే కోరిక కలగలేదు. జీర్ణావస్థలో వుండి గాయపడి రక్తసిక్తమైన శవం ఆమె మనసును సంఘర్షణకు గురిచేస్తోంది. భర్త అంటే ఆమెలో ఎంతగా విరక్తి కలిగిందంటే ఇక అతన్ని ధిక్కరించాలన్న ధ్యాస కూడా రావడం లేదు. తన భర్త ఇంత స్వార్ధపూరితుడైన మనిషని, తానెప్పుడూ ఇలా అవుతుందని అనుకోలేదు. 106 దా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

ఆమె చాలాసేపు పార్కులోనే పచ్చిక మీద ఆలోచిస్తూ కూర్చొని వుంది. ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటాయన్న నిర్ణయానికి రాలేక సతమతమవుతోంది. పుట్టింటికి పోవచ్చు గాని నెల రెజ్ఞాళ్లకు ఇదే ఇంటికి తిరిగి రావలసింది కదా?!

లేదు, నేనెవరినీ ఆశ్రయించను. నా జీవితానికి సరిపడా నేను సంపాదించు కోలేనా? మిట్టన్‌ భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ఊహించసాగింది. కానీ ఆమెలో ఇంతలా మనోబలం ఎక్కడినుండి వచ్చిందో ?! ఇలాంటి కల్పనలు వ్యక్తిని బలహీన పరుస్తాయన్న నిర్ధారణకాచ్చింది.

వెంటనే ఆమెకు ఇబ్రహీం అలీ వృద్ధ విధవ యాదికొచ్చింది. ఆమెకు పిల్లలు లేరన్న విషయం తెలిసి ఓదార్చేవారు కూడా లేక పాపం ఒంటరిగా కూచాని ఏడుస్తూ వుంటుంది. వెంటనే ఆమె ఇంటివైపు నడిచింది. ముందుగానే ఇంటి అడ్రస్‌ తనతో వున్న మహిళల దగ్గర నుంచి అడిగి తెలుసుకున్నది. “ఎలా కలవాలి? ఆమెతో ఏం మాట్లాడాలి? ఎలా మాటలతో సాంత్వన పరచాలి” ఇలా అనేక (ప్రశ్నలు ఆమెను తికమకపెడుతూ వుండగా ఆమె ఇంటికి చేరుకుంది. ఇల్లు ఒక సండులో వుంది, కానీ శుభ్రంగా వుంది. గుమ్మం మీద వేలాడుతున్న త్యాగజీవి ఆశయాల తోరణం చూసేవారికి కనబడకపోదు? మిట్టన్‌ వేగంగా కొట్టుకుంటున్న గుండెతో లోపలికి అడుగుపెట్టింది. ఓ వృద్ధ ప్రీ ముందు వరండాలో మంచం మీద కూర్చొని వుంది. స్వరాజ్యం కోసం తన (ప్రాణాలను అర్చించిన వ్యక్తి ఆమె భర్ర్తయే! ఆమె ఎదురుగా సాధారణ దుస్తులు ధరించి నిలబడిన ఒక యువకుడు కన్నీరు పెడ్తున్న ఆ స్త్రీతో సంభాషిస్తున్నాడు. దగ్గరికి వెళ్లిన మిట్టన్‌ ఆ యువకుణ్ణి చూసి ఒక్కసారిగా చకితురాలయ్యింది. అతనెవరో కాదు - బీర్బల్‌ సింగ్‌.

కోపం, ఆశ్చర్యం నిండిన గొంతుకతో ప్రశ్నించింది - 'మీరు ఇక్కడా ?! ఎలా రాగలిగారు.”

బీర్బల్‌ సింగ్‌ : “అలాగే ! నువ్వెలా వచ్చావో నేను అలాగే వచ్చాను. నేను చేసిన తప్పుకు క్షమాపణ కోరడానికి వచ్చాను.”

అతని మాటలకు తెల్లని ముఖవర్చస్సు కలిగిన మిట్టన్‌ వదనంలో ఒక్క క్షణం ఆనందం, గర్వం, ఉజ్జ్వలమైన కాంతి దర్శనమిచ్చింది. అది వర్ణనాతీతం. జన్మజన్మల మనోక్లేశం అంతమయ్యిందన్న అనుభూతి ఆమెలో కలిగింది. ఆమెను వేధిస్తున్న చింత, మాయామోహంతో కూడిన ఐహికబంధాల నుండి ముక్తి పొందిన అనుభూతి ఆమెలో కలిగింది.

ళం

రేపెక్కడికెళ్తావ్‌...? 107

ము

వ [ 25 ఆగస్ట్‌, 1905న అలీగఢ్‌లో జన్మించిన రషీద్‌ (జవాన్‌ తొలి తరం స్త్రీ వాద ఉర్పూ రచయిత్రి. లల అప్పటి కాలంలో సంచలనం రేపిన ఉర్హూ కథల రషీద్‌ జహాన్‌ “అంగారే' కథా సంపుటిలోని నలుగురు రచయితలలో ముగ్గురు పురుషులు. కాగా ఈమె ఒకృరే మహిళా రచయిత్రిగా వున్నారు. కజంయ36లు101901 నేపథ్యంతో సాగే రషీద్‌ రచనలను అప్పటి మత ఛాందసవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. కథలు, నాటకాలు రాశారు. 02 జులై, 1952లో గర్భాశయ కాన్సర్‌ చికిత్స కోసం రష్యా వెళ్లి అక్కడే మరణించారు. 'ఢిల్లీకి సైరొ ఉర్దూ కథను సైదా హమీద్‌, సుగ్రా మెహదీ ఆంగ్లానువాదం చేశారు. ఢిల్లీ నగరాన్ని చూపిస్తానని భార్యను వెంట తెచ్చిన భర్త ఆమెను రైలు ప్లాట్‌ఫామ్‌ మీద ఒంటరిగా వదిలి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఒంటరిగా వున్న మహిళ పట్ల మగవాళ్ల ప్రవర్తన ఎంత అసహ్యంగా ఉంటుంది అన్న విషయాలతో పొటు భార్య పట్ల భర్త నిర్లక్ష్యాన్ని కథలో చూపుతుంది రచయిత్రి. చాలా ఆలస్యంగా తిరిగొచ్చిన భర్త వైఖరితో విసుగు చెందిన భార్య నగర సందర్శన అక్కర్లేదు తిరిగి వెళ్ళిపోదామని చెప్పడం అతను

సరే అనడంతో కథ ముగుస్తుంది. 108 దా. రూప్‌కుమార్‌ దల్బీకార్‌

ఢిల్లీ సందర్శన

“మా మంచి అక్కా ! నన్ను కూడా రానివ్వ” అంటూ వరండా నుండి ఒకమ్మాయి చేతిని తను వేసుకున్న కుర్తాతో తుడుచుకుంటూ గది లోపలికి దూసుకు వచ్చింది.

తన స్నేహితులందరిలోనూ మలా బేగం మాత్రమే మొదటిసారిగా రైలు ఎక్కిన వ్యక్తి. అది కూదా ఫరీదాబాద్‌ నుండి ఢిల్లీ వరకు వెళ్లి వచ్చింది. అలా వెళ్లి వచ్చిన తన యాత్రా కథనం చెబితే వినడానికి కుళూహలంతో బస్తీ వాళ్ళే గాక దూరాన వుండే వాళ్ళు కూడా అందరూ వచ్చి కూర్చున్నారు.

“వచ్చే వాళ్ళు త్వరగా రండి ! చెప్పి చెప్పి నా నోరు అలసిపోయింది. అల్లావ్‌ నాతో అబద్దం చెప్పించకపోతే బహుశా వందలసార్లు చెప్పి వుంటాను. సరే, ఇక్కడి నుండి రైల్లో కూర్చొని ఢిల్లీ చేరుకున్నాం. అక్కడ ఆయనకు తెలిసిన పనికిమాలిన స్నేహితుడొకడు స్టేషన్‌ మాస్టర్‌ దొరికాడు.”

“నన్ను లగేజీ దగ్గర వదిలేసి ఆయన మాయమయ్యాడు. నేను చేసేదేమిలేక బుర్ధాలో చుట్టబడి లగేజీ మీద కూర్చున్నాను. ఒకటి చిరాకెత్తించే ఈ బురఖా ఆపైన తినేసే చూపులతో ఈ మగాళ్లు. మగాళ్లు అలాగే చెడుగా ప్రవర్తిస్తారు. ఇక ఆడది ఒంటరిగా ఇలా కూర్చొని వుంటే చెప్పనక్కరలేదు. చుట్టూ ఒకటే చక్కర్లు కొడతారు. తమలపాకు వేసుకుందామన్నా కుదరకపాయె. ఒక పోకిరోడు దగ్గుతాడు, ఒకడు పిల్లికూతలు కూస్తాడు. ముందే భయంతో నా ప్రాణాలు బిగుసుకుపోయి వున్నాయి. దానికి తోడు ఆకలి దంచేస్తుంది. దేవుడిపై భారం వేసి కూచున్నాను. చెప్పొద్దు గాని ఢిల్లీ స్టేషను ఎలా వుందంటే అత్తా! కోట గూడా అంత పెద్దగా లేదనుకుంటా. చూపు ఆనినంత మేర స్టేషనంటే స్టేషనే కనబడుద్ది. రైలు పట్టాలు, ఇంజన్లు వచ్చిపోయే మాల్తాడీలు, అన్నిటికన్నా ఎక్కువ ఆ ఇంజన్‌ డబ్బాలో వుండే నల్లటి మగాళ్లను చూస్తేనే భయమేసేది.” రేపెక్కడికెళ్తావ్‌...? 109

“ఇంజన్‌ డబ్బాలో ఎవరుంటారు” - మధ్యలో అడ్డుపడుతూ ఒక స్పేహితురాలు అడిగింది.

“ఎవరుంటారో నాకేం తెల్సు” నీలం రంగు బట్టలేసుకుని వున్నారు. ఒకడు గడ్డపోడు, ఒకడు నీటుగా గడ్డం చేసుకొని వుండు. ఒకడైతే తలుపు దగ్గర ఒక చేత్తో పట్టుకొని నడుస్తున్న రైలింజన్లో వెళ్ళాడుతూ వుంటే చూసేవాళ్లకు భయంతో గుండె గొంతులోకి వచ్చేస్తది. సాహిబ్‌లు, మేమ్‌ సొహిబ్‌లైతే లెక్కబెట్టలేం. ఒకరి చేయి ఒకరు పట్టుకొని లొడలొడా వాగుతూ పోతుంటారు. మన దేశం మగాళ్లు కూడా కళ్ళు ఇంతింత పెద్దవి చేసుకొని చూస్తూ వుంటారు. దుర్మార్గులు వాళ్ళ కళ్ళు పేలిపోను. ఒకదైతే నాకెదురొచ్చి నాతో “కాస్త ముఖం చూపరాదు...” అంటూ అల్లరి చేసాడు.

“మరి నువ్వు చూపలేదా 1?” ఒక స్నేహితురాలు అల్లరిపెడుతూ అడిగింది.

“దేవుడా దేవుడా! అత్తా నేను ఆ వెధవలకు ముఖం చూపడానికి వెళ్ళానా? గుండె వేగంగా కొట్టుకోసాగింది. “ఇష్టం వుంటే వినండి, ఇలా మధ్యలో అడ్డు తగలకూడదు సరేనా..* కోపం తెచ్చిపెట్టుకొని అంది.

ఒక్కసారిగా అందరూ నిశ్శబ్దంగా వుండిపోయారు. ఇలా సరదా కబుర్లు ఫరీదాబాద్‌లో చాలా తక్కువగా చెప్పుకుంటారు. దానికి తోడు మల్కా కబుర్లు వినడానికి ఆడాళ్ళంతా చుట్టుపక్కల నుండి వచ్చి చేరేవారు.

అవునత్తా తిండ్లు, సరుకులు అమ్ముకునే వాళ్ళు ఇక్కడ మన దగ్గరలా వుండరు. శుభ్రమైన ఖాకీ బట్టలు, కొందరైతే తెల్లటి దుస్తులు వేసుకుంటారు. కానీ అత్తా, కొందరి ధోవతులు మాత్రం మురికిగా వుండేవి. వారు గంపలెత్తుకొని తిరుగుతూ పాన్‌, బీడీ, సిగరెట్లు, దహి వడలు అమ్ముతుంటారు. బొమ్మలు, బొమ్మలంటూ కొందరు, అద్దాల డబ్బాలో మూసి వుంచిన మిఠాయిలు అమ్ముకునే వారు, రైళ్ల వద్దకు పరుగెత్తుకుంటూ పోయే వారు. ఒక రైలు వచ్చి ఆగింది.. అంతే చెవులు పగిలేటట్లు గోల, కేకలు మొదలయ్యాయి. ఒక వైపు కూలీల అరుపులు, మరోవైపు తినుబండారాలు అమ్ముకునే వాళ్ళ కేకలు, బుర్ర తినేసేవాళ్ళు. ప్రయాణీకులు ఒకరి నొకరు తోసుకుంటూ, తొక్కుకుంటూ ఒకటే తొక్కిసలాట. నేను బిక్కుబిక్కుమంటూ లగేజీ మీద కూర్చుండిపోయా. వందల మంది ఒక్కసారిగా జనం పైన బడి తోసుకుంటూ వెళ్తారు. అలా నన్ను ఎన్నిసార్లు తోసుకుంటూ వెళ్ళారో, ఎటూ తోచక ఆందోళనతో... “జల్‌ తూ జలాల్‌ తూ ఆయీ బలా కో టాల్‌ తూ...” అంటూ భయం భయంగా చదువుకుంటూ వుండిపోయా.

110 డా. రూప్‌కుమార్‌ దబ్బీకార్‌

చాలా సేపటి తర్వాత రైలు స్టార్ధయ్యింది. అంతే ప్రయాణీకులు, కూలీల మధ్య బేరసారాలతో గొడవ మొదలయ్యింది.

“రూపాయి తీసుకుంటాను..!”

“లేదు రెండణాలు మాత్రమే ఇస్తాను ...!?”

గొడవ జరుగుతూనే వుంది. దాదాపుగా గంట తర్వాత గాని రైలు కదిలి స్టేషన్‌ ఖాళీ కాలేదు. స్టేషన్‌లో కాస్త ప్రశాంతత ఆవరించింది. కానీ, ఆ అల్లరి వెధవలు మాత్రం అలాగే వేళ్ళాడుతూ చుట్టూ వున్నారు. రెండు గంటల తర్వాత గానీ ఆయనగారు మీసాలు మెలేసుకుంటూ వచ్చి ఎంతో నిర్లక్ష్యంగా అడుగుతారు, “నీకేమైనా ఆకలేస్తే చెప్పు పూరీ.. పూరీ తీసుకు వస్తాను. తింటావా? నేను అక్కదే హోటల్‌లో తినే వచ్చాను...”

నేను చెప్పాను, “మీకో దండం, నన్ను నా ఇంటికి చేర్చండి చాలు, అదే పదివేలు. ఢిల్లీ యాత్ర తోటి కడుపు నిండిపోయింది. తీసికెళ్తానంటే ఎవరు కూడా మీ వెంట ఆ స్వర్గానికి కూడా రారు. చాలా బాగా యాత్ర చేయించారు” అన్నాను.

ఫరీదాబాద్‌ బండి సిద్ధంగా వుంటే నన్నందులోకి ఎక్కించి, “నీ ఇష్టం.. లేదు వద్దనుకుంటే ఢిల్లీ నగర యాత్ర మానెయి. తర్వాత నన్ను తప్పు పట్టకు” అని తను మొహమంతా సాగదీసుకున్నారు.

త్‌ బ్‌ స రు ళ్ధ

రేపెక్కడికెళ్తావ్‌...? క్ష11

మ! తమి... 22 సెప్టెంబర్‌, 1991లో సికింద్రాబాద్‌లో అశోక మిత్రన్‌ జన్మించారు. సుప్రసిద్ధ తమిళ రచయిత. అసలు పేరు - జగదీశ త్యాగరాజన్‌. తండ్రి మరణానంతరం 1952లో చెన్నైకి తరలి వెళ్ళారు. అశోక మి(త్రన్‌ కలం పేరుతో రచనలు చేశారు. స్వాతంత్ర్యానంతర తమిళ సాహిత్యంలో ప్రభావపూరితమైన రచయిత. రెండు వందలకు పైగా కథలు, ఎనిమిది వరకు నవలలు, దాదాపుగా పదిహేను నవలికలు రాశారు. అనేక పురస్కారాలతో పాటు సాహిత్య అకాడమి అవార్డు కూడా పొందారు. 28, మార్చి 20017న చెన్నైలోనే మరణించారు. ఇద్దరు అపరిచిత ప్యాసింజర్ల మధ్య జరిగిన సంఘటన అపార్దానికి దారితీయటం, దాని పర్యవసానం చివరికి ఎవరికి ఎవరు అన్యాయం చేశారు అన్న సందేహాన్ని పాఠకుల్లో రేకెత్తిస్తుంది. ఆ ఇద్దరి మానసిక స్థితిని “పొన్‌ ఉమిళ్‌ కురుది' అనే తమిళ కథలో చిత్రీకరించారు. ఈ కథను ఎన్‌. కళ్యాణ్‌ రామన్‌ ఆంగ్లంలో అనువదించారు. 112 డా. రూప్‌కుమార్‌ డల్చీకార్‌

రక్తం పడుతున్న గాయం

“ఏయ్‌, నడు ముందుకు!” వెనకాల నుండి ధన్‌పాల్‌ను ముందుకు తోశారు. అతను కష్టం మీద కొద్దిగా ఒక అడుగు ముందుకు కదలగలిగాడు. ముందు కిక్కిరిసి నిలబడివున్న ప్యాసింజర్లలో ఒకడు చుట్టబడిన గొడుగును చంక కింద జాగ్రత్తగా పెట్టుకున్నాడు. గొడుగు చివరంచు పదునుగా మొనదేలివుండటంతో గుంపులోని జనం మధ్యలో కొద్దిగా గ్యాప్‌ వదిలారు. దాంతో ధన్‌పాల్‌కు కదలడానికి కాస్త వెసలుబాటు దొరికింది.

“నడవండి ముందుకు, ముందుకు నడవండి, ఖాళీ జాగా చాలా వుంది. పైకి జరగండి, జరగండి,” బస్సు కప్పెగిరిపోయేట్లు కండక్టర్‌ గట్టిగా అరవసాగాడు. కదలడానికి ముందు ఖాళీ చోటు అస్సలు లేదు. అయినప్పటికీ నిలబడివున్న ప్యాసింజర్లు హడావుడిగా కదిలినట్లు కనబడినా అతి నెమ్మదిగా చలనం వారిలో కలిగింది. ఒక్కసారిగా ధన్‌పాల్‌ ముందు నిలబడిన వ్యక్తి “ఎందుకలా తోస్తున్నావు..” అంటూ అరిచాడు.

ధన్‌పాల్‌ జవాబివ్వలేదు. ఆ వ్యక్తి వెనుదిరిగి చుట్టూ చూసాడు. ధన్‌పాల్‌ చేతిలో క్యాన్‌ వుండటం గమనించాడు. వెంటనే తన లుంగీ చివర వైపు పరీక్షగా చూసి ముందుకు కొద్దిగా జరిగాడు.

ధన్‌పాల్‌ కాస్త ఊపిరి పీల్చుకోగలిగాడు. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి తన లుంగీ మీదవున్న పచ్చటి మరకను గమనించలేదు. ధన్‌పాల్‌ తాను పట్టుకున్న క్యాన్‌ ఎవ్వరికీ తాకకుండా వుండే విధంగా జాగ్రత్తగా కాస్త వొంగి నిలబడ్డాడు.

ఎంత జాగ్రత్తగా వున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఎప్పుదైతే బస్సు ముందు స్టాప్‌లో ఆగిందో మరికొందరు ప్యాసింజర్లు ఎక్కేసారు. తాక్కిడి ముందుకన్నా ఇంకాస్త పెరిగింది. రేపెక్కడికెళ్తావ్‌...? 118

ధన్‌పాల్‌ తన క్యాన్‌, ప్యాసింజర్ల బట్టలకు మరకలంటించడం గమనించాడు. బస్సు ఆగిన వెంటనే ఆ కొద్దీ సెకన్లలో హడావుడిగా క్యాన్‌ మూత చుట్టూ ఎడం చేత్తో సాధ్యమైనంతవరకు తుడిచాడు. అదే చేత్తో బస్సు లోపల పట్టుకొని నిలబడే పై బారు కడ్డీని పట్టుకోవడంతో దానికి పచ్చరంగు చాలాచోట్ల పూతలా పూయబడింది.

“బస్సు వెంటనే కదలలేదు ఫుట్‌ బోర్డు మీద నిలబడి వేళ్ళాడే ప్యాసింజర్లను లోపలికి రమ్మనడం కందక్టర్‌కు కష్టువసాగింది.” ముందుకు నడవండి. ఉడికిపోతుంది లోపల” అంటూ గుంపు మధ్యలో నిలబడిన ఒక ప్యాసింజర్‌ కేకలేయసాగాదు. నిజానికి లోపల వున్న ప్యాసింజర్లు ఉక్కపోతతో నలిగిపోతున్నారు. కానీ సర్జుకుపోతున్నారు. ఈ మధ్య గందరగోళంలో ధన్‌పాల్‌ క్యాన్‌ ముందు “షార్ట్స్‌'లో వున్న ఓ వ్యక్తి దుస్తుల మీద మరకలంటించింది. వెంటనే ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూసాడు. ధన్‌పాల్‌ ముఖం మీద భయం, ఆందోళన లేకుండా ఏమీ తెలియనట్లు నిశ్చలంగా వున్నాడు.

“ఏంది ఇదంతా?” షార్ట్స్‌లో వున్న వ్యక్తి అడిగాడు. ధన్‌పాల్‌ జవాబివ్వలేదు.

ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు. “ఏంటప్పా ఇదంతా... రంగు డబ్బా..?”

కనున

“బుద్దుందా నీకేమైనా? జనంతో నిండివున్న బస్సులో ఎందుకెక్కావ్‌. నీ రంగు డబ్బా అందరికీ తాకుతూ వుంటే...?”

“ఎవరికీ అంటకుండా ఉండేట్లు జాగ్రత్త పడ్తలే...!”

“ఏడ్చినట్లే వుంది ? నా బట్టలన్నీ పాడు చేసావు... చేసావా, లేదా..?” కోపంతో ఊగిపోతున్న ఆ వ్యక్తి ముఖం చూసి బస్సు లోపల పట్టుకున్న పై బారును కాస్త వదిలాడు. అంతే,. అప్పుడే బస్సు స్టార్టయ్యి ఒక్క కుదుపు కుదిపింది. దాంతో పాటు వెంటనే బస్సు వేగం అందుకోవడంతో ఒక్కసారిగా ధన్‌పాల్‌ అతని వెనక నిలబడి వున్న జనం మీదకి తూలి పడ్డాడు. చేతిలో వున్న రంగు డబ్బా, (బష్‌ జారి కింద పడిపోయాయి. ఆ తొక్కిసలాటలో కూడా ధన్‌ పాల్‌ వెంటనే వంగి రంగు డబ్బా అందుకున్నాడు. అదృష్టవశాత్తు రంగు ఒలికిపోలేదు.

ధన్‌పాల్‌ నిలబడ్డ చోటే పక్క సీట్లో కూర్చొని వున్న ఒక పెద్ద మనిషి అతని అవస్థను చూసి కొద్దిగా పక్కకు జరిగి “ఇక్కడ కూర్చో..” అన్నాడు.

ఇద్దరు కూర్చునే సీటు అది. ఇదివరకే ఇద్దరు ప్యాసింజర్లు కూర్చున్నారు. అంచున కొన్ని అంగుళాల జాగా మాత్రమే ధన్‌పాల్‌ కు చిక్కింది. ఆ పెద్ద మనిషి పట్టుకోకపోతే తప్పకుండా ధన్‌పాల్‌ జారి పడిపోయేవాడే..! క24 డా. రూప్‌కుమార్‌ డబ్ఫీకార్‌

ధన్‌పాల్‌ నిలబడివుండటానికే ప్రయత్నించాడు. కానీ ఆ పెద్ద మనిషి ధన్‌పాల్‌ చేతిలోని క్యాన్‌ తీసుకున్నాడు.

“పర్వాలేదు సార్క్‌” ధన్‌పాల్‌ నిరాకరించాడు.

“ఇక్షడ కింద జాగ్రత్తగా పెడతాను" అని చెప్పి పెద్దమనిషి రంగు డబ్బాను తన కాళ్ళ మధ్య కింద పెట్టాడు. ఇప్పుడిక కూర్చోండి అన్నాడు.

“వద్దు సార్‌... ముగ్గురికి కష్టమవుతుంది.”

ఇంతలో పెద్ద మనిషి పక్కన కూర్చున్న ప్యాసింజర్‌ లేచి నిలబడ్డాడు. “వచ్చే స్టాప్‌ దగ్గర దిగిపోతున్నాను..” అని చెప్పాడు. ఇప్పుడిక ధన్‌పాల్‌కు ఆయన ఆఫర్‌ను కాదనడానికి అవకాశం లేకుండా పోయింది.

సర్దుకొని కూర్చున్న తర్వాత ధన్‌పాల్‌ కర్చీఫ్‌ తీసుకొని చేతులు తుడుచుకున్నాడు. అదే కర్చీఫ్‌తో రంగు డబ్బాను బయటి నుండి శుభ్రంగా తుడిచాడు. చివరికి కర్ప్చీప్‌ను రంగులేసే బ్రష్‌ చుట్టూ చుట్టి ఎడం చేత్తో పట్టుకున్నాడు ధన్‌పాల్‌, పెద్దమనిషి కళ్ళలో కళ్ళుపెట్టి చూడటం తప్పించుకుంటున్నా.. అతను ధన్‌పాల్‌ను గమనిస్తూనే వున్నాడు.

“ఎక్కడికెళ్ళాలి..” అడిగాడు పెద్దమనిషి.

“చింతాదిరి పేట్టో

“అక్కడికి రంగులేసే పని మీద వెళ్తున్నావా?..”

“లేదు ఇంటికెళ్తున్నాను..”

“ఈ రంగు డబ్బా నీదేనా?”

“కాదు, ఒక పార్టీది. ఈ రోజు పని పూర్తయ్యింది. వారే తమ ఇష్టంతో ఇచ్చారు...”

“రంగు చాలానే వున్నది. పది, పదిహేను రూపాయల విలువ చేస్తది..?”

ధన్‌పాల్‌ రంగు డబ్బా వైపు చూసి.. “వుండొచ్చు” అన్నాడు. “కానీ, లెడ్‌, పాళ్ళు ఎక్కువ మిక్స్‌ అయివుంది.”

“ఏమిటి?”

“ఇది ఒరిజినల్‌ రంగు డబ్బాలోని పెయింట్‌ కాదు. దీంట్లో చాలావరకు తెల్లటి లెడ్‌ ఆయిల్‌ కలిపారు...”

“అయినప్పటికీ ఎక్కువగానే వుంది కదా?” గేపెక్కడికెళ్తావ్‌...? కేక్‌

“తక్ష్మువ రేటుకు పోతుంది సార్‌..”

“రోజుకెంత వస్తుంది?”

“సాధారణంగా పెయింటింగ్‌ పనికి, పనివాళ్ళు రోజుకు పది లేదా పన్నెండు రూపాయలు ఛార్జీ చేస్తారు..”

“నాకు ఎనిమిది రూపాయలే ఇస్తారు.”

“.. నువ్వు ఎనిమిది రూపాయలే తీసుకుంటే వేరే పనివాళ్ళు నీవైపు కోపంగా చూడరా?”

“మందలిస్తారు. కానీ రోజువారీ పద్ధతిలో చేస్తే పది రూపాయలిస్తారు..”

“మరి రోజు ఎందుకు చేసుకోవు?”

“లేదు సార్‌... నేను చేయలేను. రోజు పని కుదిరినా నేను పోలేను..”

“ఎందుకని?”

“సాధారణంగా సెలవు రోజుల్లో వగటి పూట వనికెళ్తాను. లేకపోతే సాయంకాలాల్లో రెండు లేదా మూడు గంటల పని చేస్తాను. అది కూడా నాకు తెలిసిన వారి దగ్గరే పని చేస్తా.”

“అలాంటప్పుడు కాంట్రాక్టర్‌ దగ్గర పని కుదుర్చుకోవచ్చు కదా?”

“అది సాధ్యపడదు సార్‌..”

“ఎందుకని

ధన్‌పాల్‌ సంకోచించసాగాడు. “నేను స్టూడెంట్‌ని సార్‌.. ఇక్కడే పాలిటెక్నిక్‌లో..”

అలాగా! “చదువుకుంటూనే పని చేస్తూ కష్టపడుతున్నావన్న మాట?”

పెద్దమనిషి స్వరంలో అభినందన వుంది.

“పనికెళ్లకపోతే నా చదువు ముందుకు సాగదు ...”

పెద్దమనిషి ఇంకా ప్రశ్నలు వేయకపోవడంతో తన మనసును గాయపరచడ మెందుకని భావించి వుంటాడు అని అనుకొని ఊరుకున్నాడు ధన్‌పాల్‌. కానీ ధన్‌పాల్‌ సంభాషణ కొనసాగించాడు. “నా తల్లిదండ్రులకు నా చదువు చెప్పించే ఆర్థిక స్తోమత లేదు. వాళ్ళు రైళులు. వూళ్ళో వుంటారు. వారి సంపాదన కుటుంబం గడవడానికి కూదా సరిపోవడం లేదు..”

“ఇక్కడెక్కడుంటావు?”

116 డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

“బంధువుల దగ్గర ఉంటున్నాను. బయట తింటాను. అందుకే నెలలో పది, పదిహేను రోజులు కనీసం పని మీద వెళ్తాను. వున్నందుకు పదమూడు రూపాయలిస్తాను. అప్పుడప్పుడు వీలు కుదిరితే కొంత డబ్బు ఇంటికి పంపుతాను.”

“అంత సంపాదన ఉంటుందా నీకు ?”

“*ల్రేద్సు అందుకే తినడానికి రూపాయిన్నర కన్నా ఎక్కువ ఖర్చు పెట్టను. ఏదో విధంగా నా చదువు పూర్తి చేసుకొని ఒక ఉద్యోగం సంపాదించుకుంటే అన్ని సమస్యలు సర్దుకుంటాయి.”

“ఎక్కడుంటున్నావో అక్కడే భోజనం చేసి వారికే కొంత డబ్బివ్వవచ్చు కదా ?”

“అది కుదరదు”

“ఎందుకు..?”

“నేను వారికి అతిధిని కాను.. వాళ్ళకా అవసరం లేదు..”

“పదమూడు రూపాయలకు అని ఎలా నిర్ణయానికొచ్చావు?”

“మొత్తం సొమ్ము ఇంటి యజమానికిచ్చేస్తాను.” ఇప్పుడు కూడా నేను నిజానికి ఇంటికెళ్ళాల్సిన అవసరం లేదు కానీ.. నా దగ్గర ఈ రోజు పదిహేను రూపాయలున్నాయి. యజమానికి నేరుగా ఇచ్చెయ్యవచ్చు.”

బస్సు అన్నా విగ్రహం దాటుకొని సింప్సన్‌ కంపెనీ గేట్‌ దగ్గర ఆగింది. పెద్ద మనిషి అక్కడ దిగి వెళ్ళిపోయాడు.

ప్యాసింజర్ల రద్దీ కూడా పలచబడింది.

ధన్‌పాల్‌ చింతాదిరి పేట్టై మార్కెట్‌ దగ్గర దిగి నిలబడి పోయాడు. బస్సు కదిలిన తర్వాత అతను తన ప్యాంటు జేబులోకి చేతిని పోనిచ్చాడు. జేబులో పెట్టిన

పదిహేను రూపాయలు మాయమయ్యాయి.

ధన్‌పాల్‌ బస్సు వెనకాల పరిగెత్తాడు. కానీ అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు.

పాదాచారులకు నీడనిచ్చే షెల్టర్లు లేవు. నీడ కావాలంటే దగ్గర్లో వున్న ఏదో ఒక దుకాణం లోకి వెళ్ళాలి లేదా ఎవరి ఇంట్లోకైనా వెళ్ళాలి.

ధన్‌పాల్‌ రోడ్డు దాటి బస్సు స్టాప్‌ దగ్గర నిలిచిపోయాడు. అతను రాత్రంతా ఇంటికెళ్ళకుండా పని చేశాడు. పనివాళ్ళు బహుళ అంతస్తు నిర్మాణపు పనులు పూర్తి రేపెక్కడికెళ్తావ్‌..? 7

చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాత్రింబవళ్ళు పని చేస్తున్నారు. పగటి వెల్తురును మరిపించే బల్బుల కాంతిలో గోడలకు ప్లాస్టరింగ్‌ పనులు, మొజాయిక్‌ పాలిషింగ్‌ కొనసాగుతున్నాయి.

దాంతోపాటే పెయింటింగ్‌ పనులు కూడా జరుగుతున్నాయి. పని చాలావరకు ఇందోర్‌ పనులకు సంబంధించినది. ఫ్లోర్‌ ఇంకా తడిగానే వుంది. తాను రెండు గంటలు కూడా సరిగా నిద్రపోలేకపోయాడు. తెల్లవారుతున్న సమయంలో ధన్‌పాల్‌ బయట కుప్పపోసిన ఇసుక మీద కాసేపు ఒరిగి నిద్ర పోయాడు. ఇంటి యజమాని భార్యకు ఆ రోజు డబ్బులిస్తానని ప్రమాణం చేసొదు. పని చేస్తున్నప్పటి నుండి ఏనాడు కూడా తాను ఇచ్చిన మాట తప్పలేదు.

రోడ్డు నిండా బస్సులు అగివున్నాయి. ఎలాంటి భావోద్వేగానికి లోను కాకుండా జాగ్రత్తపడుతూ నిరీక్షిస్తున్నాడు.

కానీ, ఆకలి కోరల నుండి తప్పించుకోలేక పోతున్నాడు. కడుపులో ఎలుకలు పరుగెత్తసాగాయి. కాలం గడుస్తున్న కొద్దీ ఆకలితో పేగులు కరకర లాడసాగాయి.

తాను ఎదురు చూస్తున్న బస్సు ఒక గంటకు గాని రాలేదు. అదృష్టవశాత్తు అదే కండక్టర్‌ వున్నాడు. బహుశా ఉద్యోగుల మధ్యాహ్నపు డ్యూటీ షిస్ట్‌ టైం కావచ్చు. “ఫుట్‌బోర్డు మీద నిలబడకండి. లోపలికి రండి” కండక్టర్‌ చెప్పుకుంటూ పోతున్నాడు. బస్సు దాదాపుగా భాళీగా వుంది. స్టాండింగ్‌ ప్యాసింజర్లు లేరు. ధన్‌పాల్‌ ఫుట్‌ బోర్డు మీదే నిలబడి వున్నాడు.

“లోపలి వస్తున్నావా? లేకుంటే దిగిపో..?”

“ఇక్కదే నా డబ్బులు పోయాయి..”

కండక్టర్‌ అప్రమత్తమయ్యాడు.

“ముందు ట్రిప్పులో మీ బస్సు నుండి ఇక్కడే దిగాను. నా డబ్బులు ఇక్కడే పోయాయి”

“మీ పాకెట్‌ ఎవరైనా కొట్టేసారా?” తన సీట్లోనే కూర్చొని ఓ వ్యక్తి ఎంక్వయిరీలా అడిగాడు.

“కాదు.” నా పాకెట్‌ ఎవరూ కొట్టెయ్యలేదు. ఇక్కడే బస్సులో జారి పడిపోయి వుండాలి. ధన్‌పాల్‌ బస్సెక్కి ప్రతి సీటు కింద వెతకనారంభించాదు. “మీరు ఇదే బస్సులో ప్రయాణించారా..” కండక్టర్‌ అడిగాడు.

“కాను తీసుకున్న టికెట్‌ కూడా వుంది నా దగ్గర.” 316... దా. రూప్‌కుమార్‌ దల్ఫీకొర్‌

కండక్టర్‌ టికెట్‌ తీసుకొని పరీక్షించాడు. అతను కూడదా వెతకనారంభించాడు. అందరూ కూర్చున్న సీట్ల కింద చూడసాగారు.

(డైవర్‌ ఇంజన్‌ ఆపుచేసాడు. కండక్టర్‌ బస్సు కింద పడివున్న టికెట్లను చింపి పడేసిన ముక్కలను చూడసాగాడు.

“పర్సు పోయిందా?”

“క్రాదు.. రెండు నోట్లు, ఒక పది రూపాయల నోటు, ఒకటి ఐదు రూపాయల

“ఎక్మ్మడ పడేసుకున్నావో ఏమో ఎవరికి తెలుసు...” అని డైవర్‌ తన సందేహాన్ని వెలిబుచ్చాడు.

“లేదు, బస్సెక్కినప్పుడు డబ్బులు నా దగ్గరే వున్నవి.”

“నీ పక్మన ఎవదైనా పిక్‌పాకెట్‌ గాడున్నాదేమో?”

“ఏమో నాకెలా తెలుస్తుంది. బస్సు ప్యాసింజర్లతో రద్దీగా వుంది”

“నోటు ఏమైనా ఇచ్చావా అప్పుడు నాకు...?” కండక్టర్‌ అడిగాడు.

“లేదు. చిల్లర డబ్బులు మాత్రమే ఇచ్చాను. రూపాయల నోట్లను నా జేబులోనే వుంచుకున్నాను..”

“మడు మరి ఆలస్యమవుతోంది..”

ధన్‌పాల్‌ బస్సంతా వెతికాడు. కానీ లాభం లేకుండా పోయింది. కూర్చున్న ప్యాసింజర్లు చెన్నైలో వున్న పిక్‌పాకెటర్ల మీద చర్చ చేయసాగారు. తమ అభిప్రాయాలు చెప్పుకోసాగారు. ఒక్క ప్యాసింజర్‌ మాత్రం “అతని డబ్బు ఇక్కడ దొరకలేదు. ఇంకా ఎందుకాపుతున్నావయ్యా మమ్ముల్ని.” అంటూ అరవసాగాడు.

కండక్టర్‌ ధన్‌పాల్‌ను అడిగాడు, “ఎక్కడైనా కూర్చున్నావా?”

“బ్రెన్సు, అక్కడొక పెద్దమనిషి నా పక్కన కూచున్నాడు?”

“పిక్‌పాకెట్‌ విషయానికి వస్తే పెద్ద, చిన్న తేడా ఏమీ వుండదు, బోడి పెద్దమనుషులు. ఈ మధ్యకాలంలో చూడటం లేదా, ఎంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారో?”

అతని కామెంట్‌తో బస్సులోని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో ఒక కుర్రాడు డబ్బు పోగొట్టుకున్నాడన్న జాలి అదృశ్యమైపోయింది. రేపెక్కడికెళ్తాన్‌..? 119

ధన్‌పాల్‌ నిర్లక్ష్యంగా బస్సు దిగాడు. బస్సు తన దారిలో వెళ్ళిపోయింది. ధన్‌పాల్‌ రంగు డబ్బాను హార్టువేర్‌ షాప్‌కు తీసుకెళ్ళితే ఆ రంగు డబ్బాకు కేవలం మూడు రూపాయలు మాత్రమే దక్కాయి. బ్రష్‌ను జాగ్రత్తగా తుడిచి పాత న్యూస్‌ పేపర్లో చుట్టాడు. రెండు గంటల్లోపల (బ్రష్‌ను కిరోసిన్‌తో కడిగి ఆఅరబెట్టకపోతే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. నడుచుకుంటూ వెళ్లే వారికి కణ్జగి విగ్రహం దగ్గర అనేక ఆటంకాలు వుంటాయి. నడకతో వెళ్లేవారికోసం సబ్‌వేను తవ్వనారంభించారు. ధన్‌పాల్‌ ఒక వ్యక్తి ఒంటరిగా మసక వెలుతురులో వడివడిగా నడుచుకుంటూ వెళ్లడం చూసాడు. ఎక్కడో చూసినట్టు, తెలిసిన వ్యక్తిలా కనదిడసాగాదు. ఆ వ్యక్తి రోడ్డుకు చివర అంచున పెరిగిన పొదలమాటు నుండి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ధన్‌పాల్‌ ఒక్క వుదుటున దుంకి రోడ్డును దాటాడు. రోడ్డు అంచున వున్న పొదల వైపుకు పరుగెత్తి భుజంపై చెయ్యివేసి ఆ వ్యక్తిని నిలిపి, “పెద్దమనిషిలా వున్నావ్‌ దొంగ వెధవా..! ఆగు..” అన్నాడు. “ఏమిటి.., ఏమిటి.. ?” “మంచోడిలా నటించి నీ పక్కనే కూచోబెట్టుకున్నావ్‌.. ఎక్కడ్రా నా డబ్బు.” “ఏమిటి, ఏమిటి ?” అంతలో అక్కడ ఐదారుగురు గుమికూడారు. “పనికిమాలిన లంజ కొడకా..! చిన్నపిల్లల జేబులు కొడ్ద్డావా.. ఇదారా నీ బతుకుతెరువు?” ధన్‌పాల్‌ ఆ పెద్దమనిషి చొక్కా పట్టుకుని, పిక్‌ పాకెటర్‌ అని చెప్పగానే అక్కడ గుమికూడిన జనం ఒక్కసారిగా తేరుకొని ఆ పెద్దమనిషిని కొట్టడం తన్నడం మొదలు పెట్టారు. అతను నేల మీదికి పడిపోయాడు. గుంపులోంచి ఒకడు అతని చొక్కాను చింపేసాడు. ఇంకొకడు అతని లుంగీ పట్టి లాగేసాడు. నడుం మీద చిన్న సంచి మిగిలింది. “మదతబెట్టి కొట్టండి దొంగ వెధవను!” “పట్టుకోండి వదలకండి!” “ఇదివరకే పర్సును తన గుంపులో ఒకరికి అందజేసివుంటాడు!” “ఎక్మ్మడరా పర్సు?” “ఇలా మెత్తగా అడిగితే ఈ దౌంగ గ్యాంగ్‌ ఒప్పుకుంటారా?” “మొహం మీద నాలుగు తన్నితే అప్పుడు గాని నిజం చెప్పరు ?” “ఎప్పుడు దొంగిలించాడు ?” ాాాాోాాాాాాాాాాాాాాాాాాాా దవదమకట్యన

“ఎప్పుడు జేబు కొట్టాడు..?”

“ఇప్పుడేనా?”

“పర్సు ఎక్కడ్రా? ముసలి నక్క పైకి ఎంత బాగా నటిస్తున్నావు బుద్ధిమంతుడిలా!”

“వోలీసును పిలవండి!

“పిలవాల్సిన అవసరమేముంది. తీసుకెళ్లి పోలీస్‌స్టేషన్‌లో అప్పగిస్తే సరి.”

“పర్సు కాదు..” ధన్‌పొల్‌ అన్నాడు.

“ఏమంటున్నావు..?”

“నా పర్సు పోలేదు నోట్లు పోయాయి...”

“నీ నోట్లు తీసుకున్నాడా? ఇప్పుడేనా..?”

“ఇప్పుడు కాదు..”

“ఇప్పుడు కాదా!”

“సుమారుగా మూణ్జ్ణెళ్ల క్రితం బస్సులో నా పక్కన కూచొని నా డబ్బు దొంగిలించాడు.”

గుంపులో ఒక్కసారి మార్చు వచ్చింది. అక్కడే తిరుగుతున్న ఒక పోలీసు కానిస్టేబుల్‌ దగ్గరికి వచ్చి విచారించాడు. “ఏం జరుగుతుందిక్కడ? సమస్య ఏమిటి..?” ధన్‌పాల్‌, పెద్దమనిషి ఇద్దరే మిగిలారు. ఇద్దరూ నేల మీద.. కూర్చున్నారు.

“ఈ గొడవెందుకు... ఏం జరిగింది.”

దానికి పెద్దమనిషే జవాబిచ్చాడు. “ఏమీ లేదు, మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం అంతే.”

కానిస్టేబుల్స్‌ ఏ గొడవ లేనందుకు ఒక ప్రశాంతమైన ఊపిరి తీసుకొని వెళ్ళిపోయాడు. ధన్‌పాల్‌ ఆ పెద్ద మనిషిని లేపి సహాయం చేసాడు. ఇద్దరూ కలిసి కొంత దూరం నడిచి వెలుతురులోకి వచ్చారు. పెద్దమనిషి లుంగీ అడ్డదిడ్డంగా కట్టుకొనివున్నాడు. మొహం మీద అక్కడక్కడా గీరుకుపోయిన గాయాల నుంచి రక్తం చారలుగా (్రవిస్తోంది.

“అకస్మాత్తుగా నాపై దాడి చేసి ఎందుకు కొట్టావు. ఎవరు నువ్వు”, పెద్దమనిషి అడిగాడు. ద్వేషంతో కుతకుతలాడిపోతూ ధన్‌పాల్‌ మొహం తిప్పేసుకున్నాడు. ఆ పెద్దమనిషి కళ్ళు చిట్లించి ధన్‌పాల్‌ వైపు చూశాడు.

“నువ్వు పెయింటర్‌ పిల్లాడివి కదూ?”

పెద్దమనిషితో మాట్లాడటం ఇష్టం లేక ధన్‌పాల్‌ ముందుకు సాగిపోయాడు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి ధన్‌పాల్‌ను భుజం పట్టుకొని నిలబెట్టి, “నువ్వు ఆ పిల్లాడివే కదా, బస్సులో నాతోబాటు ప్రయాణం చేసావు?”

“బెను నువ్వు సహాయం చేస్తున్నాననే నెపంతో నటించి నా సొమ్ము దొంగతనం చేసావు...”

“నేను నీ సొమ్ము దొంగతనం చేసానా?”

ఆ పెద్దమనిషి వెలుతురులోకి వచ్చి ధన్‌పాల్‌ మొహంలోకి సూటిగా చూస్తూ, “నేనలాంటి మనిషిని కాదు నాయనా అన్నాడు.”

“ఎవ్వర్ని బుకాయిస్తావ్‌?”

పెద్దమనిషి తన మొహం మీద కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ, “అదా సంగతి నేను నీ సొమ్ము దొంగిలించానని, జనాన్ని పిలిపించి నన్ను కొట్టించావు. సీ సొమ్ము గురించి నాకేమీ తెలియదప్పా.”

ధన్‌పాల్‌ ఒక్కమాట మాట్లాడకుండా అలా అచేతనంగా, మౌనంగా వుండిపోయాడు.

చివరికి, పట్టణమంతా మూగబోయిందా.. సముద్రపు ఘోష కూదా నిలబడి పోయిందా అన్నట్లు అంతటా నిశ్శబ్దంలా...

“ఆ క్షణం నుండి ఇప్పటివరకు వదో ఒక సందర్భంలో నీ గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని కానీ, నేను వూహించనూ లేదు, నువ్వు నన్ను దొంగ అంటావని, జనాలతో ఇలా కొట్టిస్తావని..”

“ఎవరికి తెలుసు నిజానికి ఏమైందోనని.. నా సొమ్మయితే పోయింది కదా..!”

“నేను తీసుకోలేదు నాకేమీ తెలియదు...” అని చిరిగిపోయిన చొక్కాను తొడుక్కుంటూ అన్నాడు.

ధన్‌పాల్‌ ఉద్దేశపూర్వకంగానే అతని మొహం వైపు చూసాడు. ఆ పెద్ద మనిషి మోహంలో ఎక్కడా కోపమనే ఆనవాలు కూడా కానరాలేదు.

“నన్ను నమ్ము నాయనా నీ సొమ్ము నేనేమీ తీసుకోలేదు. నాకేమీ తెలియదు...” అని గొణుక్కుంటూ పెద్దమనిషి నెమ్మదిగా ముందుకు కదిలిపోయాడు.

ళ్ధేం 22... దా. రూప్‌కుమార్‌ దల్ఫీకార్‌

ఖ్‌ వం 4 ర. ల దళిత సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మట యు ర నా ॥ వన్‌ జ్‌ ధో ఓం ప్రకాష్‌ వాల్ళీకి చరిత్ర సృష్టించిన ఒక మైలురాయి. కవిత్వం, కథ, విమర్శ వ్యాసాల ద్వారా దళిత సాహిత్యానికి ఒక గుర్తింపు తెచ్చిన రచయితగా ప్రముఖ పాత్ర వహించారు. దళితుల్లో కూదా షెడ్యూల్స్‌ ఉపకులాల మధ్య వున్న కుల వివక్షను ప్రశ్నించిన వారిలో ప్రముఖుడు. 80 జూన్‌, 1950లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజాఫర్‌ నగర్‌ జిల్లా బర్లా గ్రామంలో జన్మించారు. 'సదియో కా సంతాప్‌, 'బస్‌ బహుత్‌ హో చుకా, 'అబ్‌ బెర్‌ నహీ' అనే మూడు కవితా నంవుటులతో బాటు రెండు కథా నంవుటాలు కూడా ప్రచురించారు. 'దళిత్‌ సాహిత్య్‌ కా సొందర్య శాస్త అనే వచన రచన బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వీరి రచనలు కొన్ని ఆంగ్లం లోకి అనువదించ బడ్డాయి. 2013, 17 నవంబర్‌న దెహ్రాడున్‌లో కాన్సర్‌ వ్యాధితో తుది శ్వాస విడిచారు. హిందీ కథ శవ యాత్రలో ఒక దళిత కుటుంబం పట్ల గ్రామ ప్రజలు చూపిన అమానవీయ ప్రవర్తన, వివక్ష ఫలితంగా చిన్నపిల్ల చావుకు దారి తీస్తుంది. చివరికి ఆ పిల్ల శవాన్ని కూడా అంటరానిదిగా చేసి గ్రామానికి దూరంగా దహన సంస్కారం చేయాలని (గ్రామ పెద్దలు వారి పట్ల నిర్జాక్ష్య్య్యంగా వ్యవహరించిన తీరు కన్నీరు పెట్టిస్తుంది. కథను నడిపించిన తీరులో కథకుడి నైపుణ్యం కనబడుతుంది. రేపెక్కడికెళ్తావ్‌...? 123

శవ యాత్ర

మాదిగల పల్లె. ఆ పల్లెలో ఒక చిన్న చెరువు కట్టకు ఆవలి అంచున ఒక బల్త్హార్‌ కులస్తుల కుటుంబం. ఆ చెరువు కట్ట, పల్లెకు, ఈ బల్హార్‌ కుటుంబానికి మధ్య ఒక సరిహద్దు రేఖలా వుంటుంది వానకాలంలో చెరువు నిండితే ఈ కుటుంబానికి పల్లెతో సంబంధం తెగిపోతుంది. మిగతా కాలాలలో నీరు తగ్గిపోతే ఏదో విధంగా చెరువు దాటి పల్లె చేరుకుంటారు. అనగా ఈ కుటుంబానికి, పల్లెకు మధ్య ఎలాంటి దారి లేదు, రోడ్డు వేయాల్సిన అవసరాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఆ అవసరం పల్లె జనాలకు కనిపించ లేదు.

ఎప్పుడైనా మాదిగ కుటుంబానికి వారి అవసరం పడితే చెరువు కట్ట మీద నిలబడి కేక వేస్తే సరిపోతుంది. చెరువు అంత పెద్దదేమీ కాదు, ఇటువైపు నుంచి పిలిస్తే వారికి వినబడకుండా వుండటానికి. పిలుపు విని వారు బయటికి వచ్చేవారు.

ఆ బల్హార్‌ కుటుంబంలో ఇప్పుడు కేవలం ఇద్దరు మాత్రమే మిగిలారు. వయసు పైబడిన సుర్దా ఇంకా అతని కూతురు సంతో. ఈమె పెళ్ళెన మూడు సంవత్సరాలకే భర్త ఏము చనిపోయి విధవరాలిలా పుట్టింటికి చేరుకుంది. సుర్దా భార్య చనిపోయి కూడా మూడు సంవత్సరాలు దాటింది. ఇంటి వనులు, బాధ్యతలు అన్నీ సంతోనే చూసుకుంటుంది. సుర్దా వయసు పైబదటంతో బలహీనంగా ఉంటాడు. దాంతో అతనికి ఎటూ తోచక అలా పడివుంటాడు. అవసరమైనప్పుడు ఊరి వారి చిన్నా చితక పనులు చేసి పెద్దాడు.

సుర్దాకు ఒక కొడుకు కూడా వున్నాడు. పది, పన్నెండేళ్ల వయసులోనే ఇల్లు వదిలి పారిపోయాడు. కొన్ని సంవత్సరాలు జులాయిగా తిరిగి తరువాత చివరికి రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. ఆ ఉద్యోగం పుణ్యమా అని అతనిలో చదువుకోవాలనే తపన, కోరిక కలిగి చదువు వైపు ఆకర్షితుడయ్యాడు. దాంతో హైస్కూల్‌ వరకు చదివి ఐటిఐలో 124 దా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌

శిక్షణ పొంది రైల్వేలోనే ఫిట్టర్‌గా స్థిరపడిపోయాడు. పేరు కల్లూ. ఇప్పుడు కల్లూ, కల్లన్‌గా ఎదిగాడు,

సంతో పెళ్లి అయినప్పుడు కల్లన్‌ పెళ్లి ఖర్చులన్నీ భరించాడు. సుర్దా దగ్గర చిల్లిగవ్వ లేకుండే. కల్లన్‌ పెళ్లి కూడా రైల్వే కాలనీలోనే జరిగింది. అతని మామ కూడా రైల్వే ఉద్యోగి, చదువుకున్న భార్య దొరకడంతో అతని జీవన శైలి, వ్యవహారం అంతా మారిపోయింది.

కల్గుకు ఊరు గుర్తుకు వచ్చేది. కానీ, అతను ఊరికి వెళ్లిన ప్రతిసారీ ఊరి జనం అతన్ని విచిత్రంగా చూసేవారు. కల్లూ, కల్లన్‌గా మారడం వారు సహించలేక పోయేవారు. వారి దృష్టిలో అతను ఇంకా బల్పాన్‌ తక్కువ కులం వాడిగానే కనబడుతున్నాడు. సామాజిక వ్యవస్థలో అట్టడుగు, కడజాతి వాడిలాగే, అంటరానివారి కన్నా అంటరానివాడుగా కింది స్థాయిలో నీచంగా కనబడేవాడు.

ఊర్లో అతను ఒంటరితనాన్ని ఆనుభవించేవాడు. కుటుంబ సభ్యులు మినవి బయటి వ్యక్తులు ఎవరూ కూడా అతనితో మాట్లాడేవారు కాదు. ఊర్లో వుండే చదువుకున్న వ్యక్తులు కూడా అతనికి దూరం దూరంగా ఉండేవారు. సమాజంలో కాస్త ఎదిగినా చివరికి అతను కడజాతివాడే! చెరువు దాటి ఆవల వుందే అంటరానివాడే! ఊరోళ్లు అతన్ని కల్గు బల్హార్‌ అనే పిలిచేవారు. అలా వారు పిలుస్తుంటే అతనికి నచ్చేది కాదు. వారి పిలుపు కత్తిలా అతని గుందెను చీల్చి ఒక హీనభావంతో నింపేసేది.

చాలా రోజుల తరువాత ఈసారి ఊరికొచ్చాడు. వస్తూనే అతను సుర్దాతో అడిగాడు. “బాపూ నాతో పాటు ఢిల్లీ నడు, అందరం కలిసి సర్కారు క్వార్టర్‌ లోనే వుందాం” అన్నాడు.

“లేదు బిడ్డా, ఈ చివరి రోజుల్లో ఊరికి దూరమెందుకు చేస్తవ్‌. మన పెద్దోళ్ళు ఎప్పుడో వచ్చి ఇక్కడ కాపురాలు పెట్టి ఇక్కడి మట్టిలోనే కలిసిపోయారు. ఈ చెరువు కట్ట మీదే బతుకులు తెల్లారిపోయాయి. ఇగ ఇప్పుడెక్కడికి పోతం,” సురా చెమ్మగిల్లిన కళ్ళతో గతంలోకి వెళ్లి ఏదో వెతుకుతున్నట్లు తన మనసులోని మాటను చెప్పేసాడు.

కల్లన్‌, సంతో వైపు తిరిగి చూసాడు. సంతోకు ఈ దరిద్రం నుండి బయట పడటానికి మనసు గింజుకుంటా వుంది. కానీ బాపు మాట కాదని ఎదురు చెప్పే ధైర్యం ఇంతకు ముందు లేకుండే, ఇప్పుడూ లేదు. బదులివ్వలేక కాలి గోళ్లలో ఇరుక్కున్న మట్టిని కెలుకుతూ కూసున్నది.. రేపెక్కడికెళ్తావ్‌...? 125

కల్లన్‌ కాస్త గట్టిగానే చెప్పాడు. “బాపూ, ఇక్కడ మనకు మర్యాద లేదు, ఓ పూటకు రొట్టె దొరకదు. ఈ మాదిగలకు మనం బల్తార్లమే. నీ కోసం మనసు తండ్లాడితే ఇక్కడికి వచ్చానా పిల్లలకు ఏ మాత్రం ఇటు రానీకి మనసాప్పెలే..” వాళ్ళకీ గడ్డ మీద మనసు మల్లదు, బాగనిపించదు ?

కల్లన్‌ మాటలను మధ్యలోనే తుంచి సుర్హా చెప్పాడు, “ఐతే బిడ్డా, ఇగ ముందూ ఇక్కడికి రాబాకు, నాదేముందిలే ఎట్టాగో జరిగి పోతాది. సంతో బెంగ తప్ప...? అది ఒక్కతే ఉండిపోవాల్సి వస్తది ? ఈ పాత కొంప వచ్చే వానకాలం కూడా సూసేట్టు లేదు..! మా మీదే నీకంత బెంగ వుంటే ఈ కొంపనీ పక్కాగా మరమ్మత్తులు చేయించు సాలు” సుర్దా మనసులో ఈ మాట ఎంత కాలం నుంచో వుంది. కానీ చెప్పలేక పోయాడు. ఈ రోజు సమయం చిక్కేసరికి చెప్పేసాడు.

“బాప్తూ నా దగ్గర నాలుగు రూకలున్నాయి. అవి ఇక్కడ ఖర్చు పెట్టడం వలన ఉపయోగమేమి? నీ తర్వాత నేను మాత్రం ఇక్కడ ఉండను గదా, సంతో నాతో బాటు ఢిల్లీ వచ్చేస్తది..” అంటూ కల్లన్‌ స్పష్టంగానే చెప్పాడు.

ఆ మాటలు వినగానే సుర్దా ఒక్కసారిగా మండిపడ్డాడు. తిట్లు అందుకున్నాడు. అరుస్తూ అన్నాడు, “నువ్వు నా చావు కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది, దాన్ని ఈ రోజే తీసుకెళ్ళు. హా! నీ పైసల రుజాబునా దగ్గర చూపకు నీ దగ్గరే వుంచు. ఇంత కాలం గడిచింది, ముందు కూడా జరిగిపోతుంది.”

వారిద్దరి మధ్య అనుకోకుండా వాగ్వివాదం చెలరేగిపోయింది. మౌనం ఒక్కసారిగా ఆవహించింది.

తెల్లారగానే కల్లన్‌ ఢిల్లీ వెళ్ళిపోయాడు. పైసల బందోబస్తు చేసి వారం రోజుల్లో తిరిగి వచ్చేసాడు. వెంట భార్య సరోజ్‌ను, పదేళ్ల కూతురు సలోనిని కూడా తెచ్చాడు. కొడుకును వాళ్ళ అమ్మమ్మ దగ్గరే వదిలి వచ్చాడు. కల్లన్‌ వస్తూనే బాపుతో అన్నాడు, “ఎవరైనా మేస్తీతో మాట్లాడు, రేపు ఇటుకల ట్రక్‌ వచ్చేస్తుంది” అన్నాడు... అది వినగానే సుర్దా కళ్ళల్లో మెరుపు వచ్చేసింది. అతనికి కల్లన్‌ మాటలను నమ్మబుద్ది కాలేదు. కానీ, కల్లన్‌ మాటల్లో నమ్మకం కుదిరాక మేస్తీని వెతకడానికి వెళ్ళాడు..

ఊర్లో చాలా వరకు అందరి ఇండ్లను సూరత్‌ రామ్‌ టేకేదారే మరమ్మతులు చేసేవాడు సుర్దా అతని దగ్గరికే వెళ్లి “టేకేదార్‌జీ, మా కోసం ఒక ఇల్లు కట్టించి ఇవ్వండి” అన్నాడు.

సూరత్‌ రామ్‌ ముందుగా సుర్దాను కింది నుంచి పై దాకా చూసాడు. “ఒంటి మీద బట్ట సరిగ్గా లేదు కానీ పక్కా ఇంటిని కట్టించాలని బయల్టేరాడు..” అనుకుంటూ 126 డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

సూరత్‌ రామ్‌ తొందర్లో ఉండడం, అతనికి మరో చోట వెళ్ళవలసి రావడంతో నవ్వుతూ అతను సుర్దాను దాటవేసాడు. “ఈ రోజైతే కుదరదు మళ్ళీ మాట్లాడుదాం” అన్నాడు.

సుర్దా ఓటమి అంగీకరించలేక పోయాడు. తెల్లారే మసక చీకట్లో బయళ్టేరి వెళ్ళాడు. పక్క ఊర్లో సాబీర్‌ మేస్త్రీ ఉంటాడు. పాత పనివాడు. సాబీర్‌ను కలిసి సుర్దా తాను వచ్చిన పని చెప్పాడు. సాబిర్‌ ఒప్పుకుంటూ... “సరే, రేపు నేను వచ్చి చూస్కుంటా. నా కష్టానికి తగిన కూలీ మాత్రం తీసుకుంటాను అన్నాడు.”

“మంచిది మేప్తీ రేపు వచ్చేసేయ్‌. చెరువు ఆవల మా ఇల్లుంది...” సుర్దా తన సంతోషాన్ని పట్టలేకపోతున్నాడు. తిరిగి వెళ్తున్న సమయంలో తన కాళ్ళు నిలబడడం లేదు. బక్క పానానికి ఎక్కడలేని బలం వచ్చేసింది.

అతను ఇంటికి చేరుకునేసరికి ఇటుకలు వచ్చేసాయి. ఎ(ర్రటి ఇటుకలు చూసేసరికి సుర్దా తన అలసటను మర్చిపోయాడు. అతని ఆనందానికి అవధుల్లేవు. ఇంతటి అనందాన్ని ముందెన్నడూ అనుభవించి ఎరుగడు.

చెరువు కట్ట మీద ఇటుకలు దిగేసరికి ఊరి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మొత్తం ఊరిలోనే భూకంపం వచ్చేసినంత పనయ్యింది. ఊర్లోని జనం అంతా చెరువు అంచున నిలబడి వింతగా చూస్తున్నారు.

రామ్‌జీ లాల్‌ క్తీర్తన్‌ ఊరి కమిటీ పెద్ద. రవి దాస్‌ జయంతి సందర్భంగా రాత్రంతా కీర్తన - భజన సాగింది. గుంపులో అతను కూడా వున్నాడు. అతను ఉండబట్టలేక పోయాడు. అక్కణ్డుంచే పెద్దగా కేకవేస్తూ, “అబే, ఓ సుర్దా - ఈ ఇటుకలు ఎవరు తెచ్చార్రా?..

సుర్దా ఉత్సాహంతో అన్నాడు.. “అయ్యా, మా కల్లన్‌, ఇంటిని పక్కాగా మరమ్మత్తులు చేయిస్తున్నాడు...”

రామ్‌జీ లాల్‌ కళ్ళు తేలేసాడు. తెరిచిన నోరు తెరిచినట్లే ఉండిపోయింది. తన లోపల రేగిన ఈర్వ్యాద్వేషాలను లోపలే అణుచుకోని ఇలా అన్నాడు. “మాట అనకూడదు గాని సుర్దా, పక్కా ఇంటిని కట్టుకోవాలంటే ముందుగా ఊరి పెద్ద ప్రధాన్‌తో ఒక మాటైనా చెప్పావా? లేదా?”

రామ్‌జీ లాల్‌ మాట అతని గుండెల్లో గునపంలా దిగింది. ఎదురుగా వడ్డీ వ్యాపారి నిలబడి నిలదీసి బెదిరిస్తున్నట్లుగా అనిపించిందతనికి. కోపాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తూ సుర్దా అటువైపు గట్టిగా అరిచాడు, “ఊరి పెద్దను అడిగేదేముంది..?”

“అయినా ఒకసారి అడిగితే బాగుండేది కదా!?” అంటూ రామ్‌జీ లాల్‌ అక్కణ్డుంచి వెళ్ళిపోయాడు. కానీ, సుర్దా మనసులో ఒక అనుమానపు బీజాన్ని వదిలి రేపెక్కడికెళ్తావ్‌. కి 127

రామ్‌జీ లాల్‌ నేరుగా ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళాడు. చెరువుకు కట్టకావల జరుగుతున్న తతంగాన్ని ఒకటికి నాలుగు చేర్చి ప్రధాన్‌జీ బలరాం సింగ్‌ను రెచ్చకొట్టాడు. బలరాంసింగ్‌ ఆ క్షణంలో ఎలాంటి ప్రతిక్రియ చూపలేదు. కేవలం తలవూపుళతూ, మీసాలను దువ్వుకుంటూ మౌనంగానే వుండిపోయాడు. ఎందుకంటే అతనికి రామ్‌జీ లాల్‌ స్వభావం బాగా తెలుసు. అతను వెళ్ళిపోయిన తరువాత ఐబలరాంసింగ్‌ కూడా కలవరపడ్డాదు. “స్సర్జా ఐల్దాన్‌ పక్కా ఇంటిని కట్టుకుంటున్నాడా!?..” ఈ విషయం చాలు అతన్ని అశాంతికి గురి చేయడానికి. ప్రధాన్‌ దృష్టిలో సుర్దా ఊరి కోసం ఇప్పుడు అవసరం లేని వ్యక్తి.

చెరువుకు ఆవలి పక్క సుర్దా పక్కా ఇంటి నిర్మాణం చేపట్టడం ఊరిలో పెద్ద వార్త దావానలంలా పాకిపోయింది. రైల్వే ఆదాయంతో ఇటుకల ట్రక్‌ వచ్చేసింది. సిమెంట్‌, ఇసుక, కంకర, ఇనుప సామాన్లు వస్తున్నాయి. వార్త వ్యాపిస్తూ ఎంతలా మారిందంటే ఊర్లో చిన్న ఇల్లు కాదు కదా, ఊరి గుండె మీద సుర్దా హవేలీ కట్టబోతున్నాడన్న భ్రమలో పడిపోయారు. కిటికీలు, దర్వాజలు, కలప వస్తున్నది. రంగు రంగుల పాలరాతి పలకలు వస్తున్నాయని వింటున్నారు. ఎవరికీ తోచినట్లు వారు పుకార్లు వినిపిస్తున్నారు.

మర్షాడు తెల్లారే ప్రధాన్‌ మనిషి చెరువు అంచున వచ్చి నిలబడ్డాడు. సుర్దా విధి లేక మనసును చంపుకొని అతని వెంట వెళ్ళాడు.

సుర్దాను చూడగానే బలరాం సింగ్‌ అరవడం మొదలుపెట్టాడు. “చేతుల్లో నాల్గు కాసులు పడగానే నీ అంతస్తు మరిచిపోయినావురా? బల్హార్‌లను మా గుండెల మీద భవంతులు కట్టుకొని ఉండమని ఇక్కడ ఉండనివ్వలేదు. ఏ నేల మీద నువ్వుంటున్నావో అది మా తాతలు, తండ్రులది. ఎలా ఉన్నావో అలా పడి వుండు, ఎవరికి అభ్యంతరం లేదు. తలెత్తి నిలబడాలని ప్రయత్నం చేసావో, ఈ ఊరు పొలిమేర కవతలికి తరిమేయాల్సి వస్తది..”

బలరాం సింగ్‌ మాటలు పదునైన బాణాల్లా అతని శరీరాన్ని ఛిద్రం చేసాయి. సుర్ధా కళ్ళ ముందు జీవితంలోని కష్ట సుఖాలన్నీ వచ్చి నిలబడ్డాయా! ఈ సంఘటనలన్నీ నిన్నటి రోజే జరిగాయా! అన్న భావనలో వున్నాడు. తాను ఈ ఊరి కోసం ఏం చేయలేదు! ఎంతగా కష్టపడ్డాడు బలరాం సింగ్‌ గెలుపు కోసం. ఎందరిని ్రార్ధించ లేదు, ఓటు వేసి గెలిపించమని ఎందరి కాళ్ళు పట్టుకోలేదు. అప్పుడు ఈ నుర్దా బల్హార్‌ కాదు, 'సుర్దా పెద్దయ్య'గా' అయ్యేవాడు గదా! సుర్దా ఒక నిట్టూర్పు విడిచాడు. ఎలాంటి సమాధాన మివ్వకుండా వెనుదిరిగాడు. బలరాంసింగ్‌ కేకలు వేస్తూ ఆపడానికి ప్రయత్నించాడు. కానీ, అతను నిలవలేదు. బలరాం సింగ్‌ అరుపులు ఇప్పుడు తిట్ల వర్షంగా మారిపోయింది. ఆ తిట్లు ఊరంతా వినపడసాగాయి. 128 డా. రూప్‌ కుమార్‌ దబ్బీకార్‌

ఇంటికి చేరుకోగానే సుర్దా కల్లన్‌తో తన బాధను చెప్పుకోసాగాడు. “నిజం చెప్పావు కల్లు ఈ ఊరు ఉండడానికి సరైంది కాదు.” అతని మీసాలు కోపంతో విచ్చుకోసాగాయి. కనుకొలుకుల్లో తడి నిండిపోయింది.

“బాపూ ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. ఈ ఇటుకలు ఎవరో ఒకరు కొనకపోరు. ఈ ఊరి జనం ఇంటిని మరమ్మత్తు చేయనివ్వరు.” కల్లన్‌, సుర్దాను సముదాయించే ప్రయత్నం చేయసాగాడు. కానీ, సుర్దా కూడా తన మంకు పట్టు వదల్లేదు. “ఏదైతే అది, చూస్తాను..” అంటూ మనసులో గొణగసాగాడు.

“లేదు వీడ్డా.. ఇల్లయితే ఇప్పుడు కట్టి చూపిస్తాను. ప్రాణాలైనా వదులుతాను. కానీ, ఈ ఊరు మాత్రం వదిలేది లేదు.” సుర్దా గాఢమైన ఆత్మవిశ్వాసంతో వున్నాడు.

కల్లన్‌ ఎటూ తోచక అయోమయ స్థితిలో పడిపోయాడు. భావావేశంతో అతను ఇటుకలైతే తెచ్చాడు కానీ, ఊర్గో పరిస్థితులు చూస్తే అతనికి జనం గొడవ లేవనెత్తరు కదా! యని లోలోన భయం పట్టుకుంది. భార్య సరోజ్‌, కూతురు సలోని వెంట వున్నారు. కానీ, సలోని ఇక్కడికి రాగానే ఆరోగ్యం చెడి జ్వరంతో బాధపడసాగింది. సరోజ్‌ దగ్గర ఓ నాలుగు మందు బిళ్లలుంటే అవి సలోనికిచ్చింది. కానీ జ్వరం తగ్గలేదు. సరోజ్‌ మనసు గాభరా పడసాగింది. ఆమె తిరిగి వెళ్ళిపోదామని కల్లన్‌ వెంట పడింది. “అనవసరంగా ఇక్కడ డబ్బులు ఖర్చుపెడుతున్నావు. సంతో మన వెంట వుంటుంది. బాపుకు నచ్చజెప్పు” అంది. కాన, కల్లన్‌, సుర్దాకు నచ్చజెప్పడంలో విఫలుడయ్యాడు. అతను సరోజ్‌తో అన్నాడు. ఇప్పుడు, ఈ వయసులో బాపును కష్టపెట్టడం మంచిది కాదు గదా? సరోజ్‌ మౌనం దాల్చింది.

సుర్దా రాత్రంతా జాగారం చేసి ఇటుకలను కాపలా కాస్తూ వున్నాడు. ఒక్క ఘడియ కూడా కునుకు తీయలేదు. తెల్లారేసరికి సాబీర్‌ మేస్తీని పిలవడానికి బయల్దేరాడు. సుర్దాకు మనసులో ఆందోళన మొదలైంది. ఎవరైనా అతన్ని బెదిరించి మనసును మళ్లిస్తే ఇప్పుడు ఎవ్వరినీ నమ్మేట్లు లేదు.

సలోని జ్వరం తగ్గడం లేదు. సరోజ్‌, కల్లన్‌తో డాక్టర్‌ను పిలవనంపమని అడిగింది. ఊరి మొత్తానికి ఒకే డాక్టర్‌ వున్నాడు. కల్లన్‌ అతన్ని పిలవడానికి బయల్టేరాడు.

కల్లన్‌నీ చూడగానే డాక్టర్‌ మొహం చాటేశాడు. ఉబుసుపోక మాటలు మాట్లాడించి ఏవో నాలుగు మందు బిళ్లలు పొట్లం కట్టి ఇచ్చాడు. కల్లన్‌ పదే పదే ప్రార్ధించినా రావడానికి నిరాకరించాడు... “డాక్టర్‌ గారు ఒక్కసారి వచ్చి చూసి పొండి లేదా రోగిని మీ క్షినిక్‌కి తెస్తాను” అన్నాడు కల్లన్‌. డాక్టర్‌ మొండికేసాడు, “వద్దు, ఇక్కడికి తీసుకురావద్దు. రేపట్నుంచి నా దుకాణమే మూతబడ్రది. నువ్వు ఒక బల్బర్‌ కులం వాడివి రేపెక్కడికెళ్లావ్‌...? క929

అన్న సంగతి మర్చిపోకు.” “డాక్టర్‌ స్పష్టమైన మాటల్లోనే హెచ్చరించాడు. ఈ మందు బిళ్ళలు తినిపించు, తగ్గిపోతుంది” అని చెప్పి పంపించేసాడు.

నిరాశతో కల్లన్‌ వెనుతిరిగాడు. డాక్టరిచ్చిన మందు బిళ్ళలు ఏమీ పని చెయ్యలేదు. జ్వరంతో సలోని ఒళ్ళు కాలి పోతుంది. తీవ్రమైన జ్వరంతో ఒకటే కలవరించసాగింది. సంతో ఆమె సేవలో మునిగిపోయింది. ఒక్క నిమిషం కూడా సలోనిని వదిలి పెట్టి పోలేదు. సరోజ్‌ భయం పెరగసాగింది. ఆమె మనసులో రాకూడని ఆలోచనలు రాసాగాయి.

సుర్జ్దా పొద్దుననగా వెళ్లి మధ్యాహ్నం వచ్చాడు. అలసిపోయి వున్నాడు. పరిస్థితులకు ఓడిపోయి వున్నాడు. హతాశుడయ్యాడు. అతన్ని ఈ స్థితిలో చూసి కల్లన్‌ అడిగాడు,.. “ఏమైంది బాపూ...?”

సుర్దా బలహీనమైన స్వరంతో అన్నాడు. “ఏం కావాలి? మేస్త్రీ ఎక్కడో దూరపు బంధువు దగ్గరికి పోయాడట. పది, పదిహేను రోజుల తరువాత గాని రాడు బిడ్డా! ఇక అతను తిరిగి వస్తాడని నేననుకోను..” సుర్దా తన మనసులోని మాటను చెప్పేసాడు.

“ఎందుకు బాపూ, మనం అతని కష్టానికి ఫలితంగా కూలీ డబ్బులు ఇస్తున్నాం గదా మరి ముఖం ఎందుకు చాటేసాడు” కల్లన్‌ ఆశ్చర్యం వెలిబుచ్చాడు.

“ఊరివాళ్ళే ఎవరో అతన్ని ఆపేసి వుంటారు. సాబీర్‌ అలాంటి వ్యక్తి కాదు. అతను కూడా వీళ్లకు భయపడి ఉంటాడు.”

సుర్దా బాధతో చెప్పాడు. ఇద్దరూ ఏం చేయాలో పాలుపోక విచారంలో మునిగిపోయారు.

“సలోని ఒంట్లో ఎలా వుందీ. ...?” సుర్దా అడిగాడు.

“దాని ఆరోగ్యం చాలా దెబ్బతింది. ఆస్పత్రికి తీసుకుపోవాల్సిందే,” కల్లన్‌ విచారంతో అన్నాడు.

“ఎవ్వరైనా మంత్రించే వాళ్ళుంటే తీసుకురానా..?”

దరిదాపుల్లో ఎవరైనా ఓప్రా మంత్రగాడు వుండకపోడు.. సుర్దా మనసులో వున్న శంకను బయటపెట్టాడు.

“వద్దు బాపూ, నేను రేపు ఉదయమే ఆమెను తీసుకొని పట్నం వెళ్తాను. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు,” కల్లన్‌ స్వరంలో ఎంతో విషాదం, ఒత్తిడి నిండి వుంది. సుర్దా అతనికి ధైర్యం చెప్పాడు.

రాత్రంతా మేల్మొనే వున్నాడు. సలోని ఆరోగ్యం ఇంకా బాగా దెబ్బతింది. తెల్లారగానే కల్లన్‌ సలోనిని వీపు మీద పడుకోబెట్టుకొని చుట్టూ గుడ్డ కప్పాడు. సరోజ్‌ వెంట వుంది. ఎండ ముదరడానికి ముందే పట్నం చేరుకోవాలనే తాపత్రయంలో వున్నారు. 180 డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

పట్నం, ఊరినుండి దాదాపుగా ఎనిమిది, పది కిలోమీటర్ల దూరంలో వుంది. రానూ పోనూ ఎలాంటి సౌకర్యం లేదు. కల్లన్‌ ఊర్లో వున్న ఆర్థికంగా బలం వున్న మాదిగ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఎద్లబంది సహాయంగా అడిగాడు కానీ, బల్హాన్‌ కులస్తులకు వారు బండి ఇవ్వడానికి సిద్ధంగా లేరు.

వీపు మీద సలోనిని పడుకోబెట్టి నడవడం కాస్త కష్టం కాసాగింది. తను మాటి మాటికీ వీపు మీది నుండి కిందికి జారిపోతా వుంటే కల్లన్‌ భార్య తోడుండి సహాయం చేస్తూ వెనకాలే నడవసాగింది. సాధ్యమైనంత తొందరగా పట్నం చేరుకోవాలి. కానీ, ఎంత వడివడిగా నడిచినా దారి దూరం తగ్గడం లేదు.

ఎండ పెరుగుతున్న కొద్దీ సలోని జ్వరం తీవ్రత పెరగసాగింది. శ్వాస వేగం నెమ్మదించింది. పట్నం ఇంకా అర కిలోమీటరు దూరంలో వుంది. అకస్మాత్తుగా సలోని బరువు పెరిగినట్లుగా కల్లన్‌కు అనిపించింది జ్వరంతో కాలిపోతున్న శరీరం చల్లబడిపోయింది. అతను సరోజ్‌ను అడిగాడు. “చూడు, సలోని బాగుంది కదా...”

సలోని శరీరంలో ఎలాంటి స్పందన లేదు. సరోజ్‌ గుండెలు బాదుకుంటూ గట్టిగా కేకలు వేయసాగింది... “నా బిడ్డకు ఏమైంది. చూడయ్యా, ఎందుకు కదలడం లేదు...” వడుస్తూ అడిగింది.

కల్లన్‌, వీపు మీద నుంచి సలోనిని దించి దారి పక్కన పడుకోబెట్టాడు. అతను చేష్టలుడిగి నిల్చుండిపోయాడు. నవనాడులు కుంగిపోయాయి. ఎగిరి గంకులేసే పదేళ్ల వయసులోనే తన చేతుల్లో శవంలా మారిపోయింది. అంతా కళ్ళ ముందే జరిగిపోయింది. గుండెలు బాదుకుంటూ వెక్కి వెక్కి ఏడవసాగారు. దారి నిర్మానుష్యంగా వుంది. వారి రోదనలు వినే నాధుదెవ్వరూ దరిదాపుల్లో లేరు. చాలాసేపటి వరకు అలా వడుస్తూ కూర్చుని వున్నారు. ఎటూ తోచని పరిస్థితి ఏం చేయాలి, దారి పక్కన సలోని శవం పెట్టుకొని తల్లడిల్లిపోతున్నారు. చాలాసేపటి తరువాత ఒక వ్యక్తి పట్నం వైపు నుండి వస్తూ కనబడ్డాడు. కాస్త నమ్మకం ఒక మెరుపులా మెరిసింది. బహుశా వచ్చే వ్యక్తి వమైనా సహాయం చేయగలడేమోనని!

బాటసారి ఓ క్షణం సేపు ఆగాడు. కానీ, ఏమీ మాట్లాడకుండానే ముందుకు కదిలిపోయాడు. బహుశా అతను వాళ్ళను గుర్తు పట్టి వుంటాడు. అదే ఊరివాడు. మనిషికి కులమే అంతా అయ్యింది కదాయని కల్లన్‌కు అనిపించింది. చివరికి లేచి కూతురి శవాన్ని భుజంపై వేసుకొని ఊరి వైపుకు మళ్ళాడు.

భుజం మీద ఎంత బరువుందో అంతకు మించి ఎన్నో రెట్ల బరువు వారి గుండె లోపల గూడు కట్టుకుంది. రేపెక్కడికెళ్తావ్‌...? 18]

సలోని బాల్యపు కేరింతలు వుండి వుండి వారి జ్ఞాపకాల్లో కదలాడసాగాయి. బరువెక్కిన గుండెతో సలోని శవాన్ని మోసుకుంటూ ఊరి వైపుకు నడవసాగాడు. దారి ఎంతకూ ఒడవడం లేదు. పట్నం చేరుకోవడానికి ఎంత సమయం పట్టిందో అంతకన్నా ఎక్కువ సమయం ఊరికి చేరడానికి పడుతున్నది. సరోజ్‌ స్థితి దారుణంగా వుంది. కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్నది. కల్లన్‌ కూడా మానసికంగా కుంగిపోయాడు కానీ, తప్పనిసరి పరిస్థితి. ఎలాగోలా సంబాళించుకుంటూ నడుస్తూ వున్నారు. సరోజ్‌ అప్పటికే సగం చచ్చిన పీనుగులా మారింది. మనిషి సత్తువలేక నడవలేకుండా పోతుంది.

సుర్దా వారిని దూరం నుండే చూసి వారి ఆకారాలను ఊపహించగలిగాడు. కానీ, దగ్గరికి వచ్చాక గాని గుర్తు పట్టలేదు. వాళ్ళు సలోనిని తెచ్చే విధం చూడగానే అతనిలో వణుకుపుట్టింది. ఇంటి నుండి బయటకు వచ్చి రోడ్డు పైకి పరిగెత్తాడు. సలోని శవాన్నీ చూసి తన్ను తాను సంభాళించుకోలేక తల్లడిల్లిపోయాడు. నేల మీద పడి దొర్లి దొర్లి వఏడవసాగాడు. కల్లన్‌ కళ్లు ఏకధాటిగా ప్రవహిస్తున్నాయి. అందరి వడుపులు, పెడబొబ్బలు విని సంతో కూడా బయటికి వచ్చింది. వాళ్లకు ధైర్యం చెప్పే వాళ్ళెవరూ లేరు.

పట్నం నుండి తిరిగి వచ్చేవరకు అలాగే వారికి సమయం చాలా దాటిపోయింది. ఎవరిని పిలవాలన్న సమయం లేదు. రాత్రంతా వేచి చూసే పరిస్థితి లేదు. చీకటి పడే వేళకు ముందే దహన సంస్కారాలు చేయాలని కల్లన్‌ అనుకున్నాడు. సలోని శవం చూసిన ప్రతిసారి స్పృహ తప్పి పడిపోసాగింది సరోజ్‌.

ఇప్పుడు కట్టెల సమస్య వచ్చిపడింది. దహన సంస్కారానికి కావలిసిన కట్టెలు వారి దగ్గర లేవు. సుర్దా, సంతో కట్టెలను పోగేసే పనిలో ఉండిపోయారు. మాదిగల ఇండ్లకు వెళ్లి వారి ఇంటి తలుపులు తట్టి సహాయం కోసం అర్ధించసాగారు. కానీ, ఎవరూ కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. గంట సేపు తిరిగినా సరిపోను కట్టెలు జమ కాలేదు. ఇంట్లో పిడకలున్నాయి. కట్టెల స్థానంలో పిడికెలు వాడుదాం అని సంతో అన్నది.

మాదిగల శ్శృశానవాటిక ఊరికి దగ్గర్గోనే వున్నది కానీ, అక్కడ బల్హార్‌ కులం వారికి తమ పీనుగలను కాల్చే అనుమతి లేదు. కల్లన్‌ తల్లి పోయినప్పుడు కూడా ఇదే సమస్య ఎదురైంది. మాదిగలు అడ్డగించారు. ఊరవతల మూడు, నాలుగు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి కార్యక్రమం ముగించాల్సి వచ్చింది. అంతదూరం సలోని శవం తీసుకెళ్ళాలి. కట్టెలు, పిడకలు కూడా వెంట తీసుకెళ్ళాలి. ఈ పనిలో సహాయం అందించడానికి సుర్దా, కల్లన్‌ మినహా మరెవ్వరూ లేరు 182 డా. రూప్‌కుమార్‌ దబ్బీకార్‌

బల్హార్‌ల శవాన్ని తాకడానికి శవయాత్రలో పాల్గొనడానికి ఊరి నుండి ఒక్క వ్యక్తి కూడా రాలేదు. కులం, వారి దారికడ్డంగా నిలబడింది. కల్లన్‌ చాలా ప్రయత్నం చేసాడు. అతను, రవిదాస్‌ మండల్‌ సంస్థ, డా. అంబేద్కర్‌ యువక సభ సభ్యులను కలిసాడు. కానీ, ఒక్కరు కూడా వెంట వుండి సహకరించడానికి ముందుకు రాలేదు. ఏదో ఒక వంక చూపి తప్పించుకున్నారు.

రైల్వే కాలనీలో “అంబేద్కర్‌ జయంతి", రోజు వాళ్ళిచ్చే ఉపన్యాసాలు అతనికి గుర్తుకు వచ్చాయి. వారి ఆదర్శాలు, ఆలోచనా ధోరణుల డొల్లతనం అతన్ని బాధించాయి. తీవ్రమైన ఆవేదన అతని మనసులో పొంగుకొచ్చింది. వీరి ఉపన్యాసాలు, ఆదర్శాల్లో అంతా డొల్లతనమే, కృత్రిమత్వమే.

కల్లన్‌ తండ్రి సుర్దాతో అన్నాడు, “బాపూ ఇంకా ఆలస్యం చేయకు”, వాళ్లిద్దరూ బట్టలో చుట్టబడిన సలోని శవాన్ని ఎత్తుకున్నారు. బల్టార్‌ కులంలో స్త్రీలకు స్మశానానికి వెళ్లే ఆచారం లేదు. కానీ, సంతో, సరోజ్‌కు ఈ ఆచారాన్ని కాదని వెళ్లడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. సంతో నెత్తి మీద కట్టెల మోపు పెట్టుకొని చేతుల్లో నిప్పు కుండ ఎత్తుకున్నది. వెనకాల సరోజ్‌ పిడకలు నిండిన గంప తీసుకొని బయల్దేరింది. శవయాత్ర మొదలైంది. ఈ శవయాత్ర చూడ్డానికి మాదిగ ప్రీలు తమ ఇంటి కప్పుల పైకి ఎక్కారు. వారి కళ్ళలో తడి వూరింది కానీ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఆడాళ్ళు వారి వారి హద్దుల్లో నియంత్రించబడ్డ్దారు. బల్హార్‌లు చివరికి బల్బాన్‌లే కదా! వారివే కాదు ఇతరుల చావు మేళాలకు కూడా దహన సామాగ్రి మోయాల్సిన అలవాటు వుంది.

మాదిగల పల్లె, అందులో ఒక బల్దార్‌ కుటుంబం.

టం

రేపెక్కడికెళ్తావ్‌...? 138

, ॥ ష్‌! | 10 ఫిబ్రవరి, 1946లో కేరళ లోని త్రిస్సుర్‌లో ల జన్మించారు. మలయాళం భాషలో ప్రముఖ కథ,

సారా జోసెఫ్‌ నవలా రచయిత్రి. కేరళలో ప్రీవాద ఉద్యమానికి ముందుండి నడిచిన ఉద్యమకర్త కేంద్ర సాహిత్య

అకాడమి అవార్డు గ్రహీత. ఇతర పురస్కారాలు

కూడా అందుకున్నారు. నవలలు, అనేక కథా సంపుటాలు

ప్రచురించారు. సబాల్దర్న్‌ నేపథ్యంతో అనేక రచనలు చేసి

టు స[ సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారు.

“మట గుర్లులు' కథలో ఒక నిమ్న కులానికి చెందిన

అమ్మాయి మెరిట్‌ లో ఉత్తీర్ణురాలైనా కులం పేరుతో కాలేజీ

అడ్మిషన్‌లో రిజర్వ్‌డ్‌ లిస్ట్‌లో పెట్టడం, శరీరం నలుపు

రంగును హేళన చేస్తూ వుండే ఉన్నత వర్గాల కులాల

కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ అధికారుల అవినీతిని, వారి చర్యలను,

అలాగే అమ్మాయి ధైర్యాన్ని చొరవను చూపబడింది.

మలయాళం కథను ఆంగ్లంలో ఎ.జె. థామస్‌, ప్రతీక్‌

కంజీలాల్‌ కలిసి అనువదించారు.

134 డా. రూప్‌ కుమార్‌ డల్పీకార్‌

చెమట గుర్తులు...

ఈ మెట్లు నావి కావు. ఈ వరండా, దూలాలు, బిల్టింగ్‌, వాకిలి, ఈ దారి, ఈ మైదానం, ఈ లాబర్నమ్‌ చెట్టు, పుస్తకాలు, ఉపాధ్యాయులు ఇవేవి కూడాను. వీరెవరునూ నన్ను వాళ్లకు సంబంధించిన ఆత్మీయ వ్యక్తిగా భావించరు.

చంద్రిక చేచి చెప్పింది నిజమే.

ప్రతి మెట్టు మీద కాసేపు నిలబడి బాధపడటం, తిరిగి ఒక్కొక్క మెట్టు దిగడం. నా శాండిల్స్‌ ధూళితో కప్పబడి వున్నాయి. అరికాళ్ళు చెమటతో తడిసి పోయాయి. మడమలు చీలిపోయి పచ్చి పుండ్లయ్యాయి. '016 [*2మ 008008 0౦100%)”కి, కాలేజీకి మధ్య చాలా దూరం ఊపిరి తీసుకోకుండా అంత దూరాన్ని చెరిపేస్తూ, పరుగు పరుగున ఈ మెట్ల దగ్గరికి వచ్చాను. పురాతనమైన ఈ మెట్ల చివర సంబ్రమాశ్చర్యంతో ఒక పురుగులా నిలబడిపోయాను. నా తండ్రి, తల్లి, నా సోదరులు, ఈ ఆడంబరమైన మెట్లను చూడనే లేదు. నా ఆశ్చర్యం వారిది కూడా.

కొద్ది సమయం క్రితం అడ్మిషన్‌ కమిటీ ముందు నిలబడి ఫిర్యాదు పత్రం అందజేసాను. కమిటీలో పదకొండుగురు నభ్యులుగా వున్నారు. వారంతా అర్ధచంద్రాకారంలో కూర్చున్నారు. సాధారణంగా ఏ విషయం మీద కూడా నాకు ఫిర్యాదులుండవు. నిజానికి చంద్రిక చేచి, “నీ కన్యాయం చేశారు వాళ్ళు, తప్పని సరిగా నువ్వు ఫిర్యాదు చేయాల్సిందే”నంటూ రెచ్చగొట్టింది చంద్రిక చేచి న్యూస్‌ ఏజెంట్‌.

తెల్లవారక ముందే నేను వాకిలి ఊడుస్తుండగా న్యూస్‌ పేపర్ల కట్టలను సైకిల్‌పై పెట్టుకొని చంద్రిక చేచి హుషారుగా పోవడం చూస్తూ వుంటాను. సైకిల్‌ దిగకుందానే ఒక కాలు నేలకు ఆనించి నాతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటుంది. వంగి ఊడుస్తున్న నేను నిటారుగా నిలబడి చేతిలోవున్న చీపురును సరిచేస్తూ చీపురు అడుగు భాగాన్ని రేపెక్కడికెళ్తాన్‌...? 185

అరచేతి మధ్యలో కొట్టి పుల్లలను లెవెలింగ్‌ చేస్తూ నేనూ ఉబుసుపోక కబుర్లు పెట్టేదాన్ని చంద్రిక చేచినే నా 'సీనియర్‌ స్కూల్‌ లివింగ్‌ సర్టిఫికెటొ రిజల్ట్స్‌ అద్వాన్స్‌గా చెప్పింది. ఫలితాల్లో నాకు డిస్టింక్షన్‌ వచ్చిందని చెప్పింది కూడా తనే. కాలేజీ నుండి అడ్మిషన్‌ ఫారం తెచ్చి, నింపి నాతో సంతకం చేయించి దాఖలు చేసి, కాలేజీలో ర్యాంక్‌ లిస్టు చూసి, వచ్చిన ఫలితాలు కూడా చెప్పింది. నా పేరు మెరిట్‌ లిస్టులో కాకుండా, రిజర్వేషన్‌ లిస్టులో వుందని చెప్పి ఒక కల్లోలం సృష్టించింది తానే. ఈ విషయంలో నేనెంతో మధనపడ్డాను. మెరిట్‌ లిస్ట్‌ ఏమిటి? రిజర్వేషన్‌ లిస్ట్‌ ఏమిటి? నా బుర్రలో ఒకటే ఆలోచన. లిస్టు ఎటువంటిదైనా సరే నా పేరుందా లేదా? నాకు కావలసింది కాలేజీలో అడ్మిషన్‌. బతుకుదెరువు కోసం పరాయి వాళ్ళ ఇంటి వాకిళ్లు ఊడ్చే పని వాదులుకొని, ఈ చీపురును అవతల పారేసి నేరుగా ఆ కాలేజీ మెట్లు ఎక్కడమే నాకు కావాల్సింది. “దరిద్రం మొహమా... చంద్రిక చేచి గట్టిగా అరిచింది..” నువ్వు ఇక మారవు.. అంది. పిచ్చెక్కినట్లు నాపై కేకలు వేసింది. ఇక మారు మాట్లాడకుండా సైకిలెక్కి పెడల్‌ తొక్కుకుంటూ ట్రింగ్‌, ట్రింగ్‌ మని ఆపకుండా బెల్లు మోగించుకుంటూ వెళ్ళిపోయింది.

ఏమైనా మాట్లాడే విషయాలు మిగిలివుంటే న్యూస్‌ పేపర్లు పంచి పెట్టిన తరువాత వచ్చి పూర్తి చేస్తుంది. అందుకే త్వర త్వరగా వాకిలి ఊద్చి, అంట్లు తోమి, ఇల్లంతా కడిగి శుభ్రం చేసి, చేతుల్ని స్మర్ట్‌కు తుడిచి, పొడిగా చేసుకొని ఆమె కోసం వేచి చూస్తున్నాను.

“వెప్పాద్దు గానీ, నీకు గర్వంగా అనిపించడం లేదూ? నువ్వు కంప్లైంట్‌ చెయ్యాల్సిందే..” చంద్రిక చేచి ఒత్తిడి చేసింది. “కంప్లెంట్‌? నేనా? సమస్యలేమీ రావా?” చంద్రిక చేచి రూల్స్‌ గురించి వివరించింది. అడ్మిషన్‌ కమిటీ రూల్స్‌ను అతిక్రమించింది. నీకు న్యాయం అక్మ్లేదా ?

న్యాయం తమకు జరగకూడదని ఎవరైనా ఆశిస్తారా? కానీ అందరిలా కాకుండా నేను జాష్యం చేస్తూ వచ్చాను. చంద్రిక చేచి కోపంతో ఊగిపోయింది. నాతో తగువు పెట్టుకొని చిర్రుబుర్రులాడుతూ వెళ్ళిపోయింది. తిరిగి వచ్చింది, మాట్లాడింది, మళ్ళీ వెళ్ళిపోయింది. కమిటీ ద్వారా నాకు అన్యాయం జరిగిందని నాకు అర్ధమయ్యే వరకు రుసరుసలాడుతూనే వుంది. అన్యాయం జరిగిందని తెలుసుకున్నాక చాలా బాధపడ్డాను. జనరల్‌ మెరిట్‌ లిస్టు, ఒక సోదర భావంతో కూడుకున్న నిర్ణయం మరి, అధిక మార్కులు సాధించిన నన్ను సోదర సమూహం నుండి ఎందుకు వెలివేసినట్లు. వారిలో ముందు వరసలో నేనొకరిగా ఉండవలసింది. 186 డా. రూప్‌ కుమార్‌ డల్బీకార్‌

చంద్రిక చేచి చెప్పింది. మార్చ్‌ ఆధారంగానే కాదు, ఇతర విషయాలు కూడా చాలా వున్నాయి లెక్కలోకి తీసుకోవడానికి. ఇతర విషయాలా? ఏమిటవి? వంశం, కులం, మతం, రంగు, భాష్క దుస్తులు. ఫిర్యాదు చేయాల్సిందేనన్న భావం గట్టి పడింది. నేనెంత భయస్తురాలినైనా లెక్కచేయను, ఫిర్యాదు చేసి తీరుతాను. ఇదంతా చంద్రిక చేచి వెయ్యిసార్లు నాలో స్వాఖిమానం లేనందుకు నన్ను దుమ్మెత్తి పోయడంతో చివరికి కాలేజీకి, '౧౧61జలు కం29ఏ8 ౮౦101%)/ కి మధ్య దూరాన్ని సాధించాల్సిందేనని నిర్ణయించు కున్నాను. చంద్రిక చేచి ఈ విషయంలో సహాయం చేయ నిరాకరించింది. “కాలేజీ విద్యార్థులు న్యూస్‌ ఏజెంట్ల ద్వారా కంప్టెంట్‌లు చేయరు” అంటూ వాదించింది. “ఎదురు తిరుగు, నువ్వే స్వంతంగా రాసి వెళ్లి కంప్లెంట్‌ చెయ్యి” అందుకే కంప్లెంట్‌ నేనే స్వయంగా రాసాను. చదివిన తర్వాత అడ్మిషన్‌ కమిటీ నావైపు చూసి, “ఆశ్చర్యం ఏ “ఇటువంటి ఫిర్యాదు వుందా నీ దగ్గర..” అన్నట్లు చూసింది. నాకు గుర్తుంది.. చంద్రిక చేచి హెచ్చరిక. సాహిబ్‌ను చూడగానే నెర్వస్‌నెస్‌తో నువ్వు తప్పక తడబడే అవకాశముంటుంది. ఆమె చెప్పింది వాస్తవం. అలాంటి సమయం మొదలయ్యింది, ఒక సభ్యుడు “ఇలాంటి ఫిర్యాదు రాయకుండా వుండేది..” అన్నాడు. “నీకెంత ధైర్యం... ఇలా చేసి ఈ కాలేజీలో నీ చదువు సాగించగలననుకున్నావా?” చివరికి మేమే నీకు చదువు చెప్పేది. మా మొహంలో సూటిగా చూడగలవా? ఇంతకీ నిన్ను రెచ్చగొట్టింది ఎవరు?!”

కమిటీ సభ్యులు, వారి ద్వారా తప్పయిందా? అన్న భావనను, సానుభూతి చూపుతున్నట్లు నటిస్తూనే ఈ ర్యాంక్‌ పిచ్చిలో అమాయకంగా ధైర్యం చేసావు అన్న భయాన్ని నాలో కలిగిస్తూ ఏదైతే జరిగిందో అంతా సవ్యంగానే జరిగింది అన్నట్లు (ప్రవర్తిస్తున్నారు.

కానీ వారు ఒక అశాంతికి గురవుతున్నారనేది నాకు స్పష్టంగా తెలుస్తున్నది... “మెరిట్‌ లిస్టా? రిజర్వేషన్‌ లిస్టా? అన్నది ముఖ్యమా, ముఖ్యమైన విషయమేమిటంటే నీకు అడ్మిషన్‌ దొరికింది. అది చాలదూ..? సభ్యులడిగారు.

ఏదైతే జరుగుతుందో అది సరిగా జరగడం లేదన్న విషయం అర్ధమవుతోంది. నోట మాట రాక చలనం లేకుండా అలా నిల్చుండిపోయాను. అడ్మిషన్‌ కమిటీ ముందు నేను 5510 పరీక్షలో మార్కులు అధికంగా సాధించిన టాప్‌ ర్యాంకర్‌నని, విజేతనని గర్వంగా నన్ను చూపదల్బుకోవడం నా కోరిక కాదు.

కేవలం ఈ ఒక్క అంశం బలం మీద గర్వంగా తలెత్తుకొని ఎలా నిలబడగలను? వంశం, కులం, మతం, రంగు, భాష్క ధరించే దుస్తులు ఇవన్నీ చూసుకోవాలి. నేనా నల్లగా వుంటాను, వికారంగా వుంటాను. సన్నటి మొహం, శుష్కించిపోయిన కాళ్ళు, రేపెక్కడికెళ్తావ్‌...? 187

చేతులు, ఎవరివైపు చూసినా కళ్ళు భయం భయంగా, బెదురు చూపులతో వుంటాయి. దుర్వాసన వేసే తలనూనెతో, కంపుకొట్టే నెత్తి సరిగా దువ్వుకోక అడ్డదిడ్డంగా చిట్లిపోయిన చివర్లతో వున్న తల వెంట్రుకలు, గుండెలకత్తుకుంటూ రెండు చేతులతో పట్టుకున్న పుస్తకాలు అవి కూడా నా శరీర ఆకృతిలో ఒక భాగమే. ఛాతీపై నుంచి చేతులు పక్కకు జరిగితే భయంతో వణికిపోతాను. చేతులు పెదాలు ఎప్పుడూ నీళ్ల మాదిరి చల్లగా చెమట పోస్తూ వుంటాయి. అర్ధచం(ద్రాకృతిలో అమర్చిన సింహాసనాల మీద కూర్చున్నట్లు ఎదురుగా వ్యక్తులు కానీ, క్షితిజం వరకు వ్యాపించి వున్న ఈ గది మధ్యలో నేను కూర్చున్నట్లు, ఏదో నన్ను పట్టుకున్నట్లు, భయపెడుతున్నట్లు ఒక (భ్రాంతి..??

“మెరిట్‌ లిస్ట్‌లో నీది సెకండ్‌ ర్యాంక్‌ మాత్రమే. రిజర్వేషన్‌ లిస్ట్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ ఏది మంచిదంటావ్‌?””

కుట్రపూరితమైన చూపుతో, తియ్యగా మాట్లాడుతూ, ఒకమ్మాయి వైపు కన్ను గీటుతూ నా కంప్లెంట్‌ వెనక్కిచ్చేసాడు. నేను జవాబిచ్చే లోగానే కమిటీ సభ్యులు తమ చర్చల్లో నా విషయం కూడా అసంకల్పితంగా వచ్చిందన్నట్లు మాట్లాడుకోసాగారు.” ఒకవేళ ఈ స్ప్టూడెంట్‌ను రిజర్వేషన్‌ లిస్టులో పెడితే, మన ఒక విద్యార్ధి మెరిట్‌ లిస్ట్‌లో రాగలడు. ఆ విద్యారిని “అక్కడినుంచి కదిలించి ఈ స్తూడదెంట్‌ను అక్కడ పెడితే ఇంకా వేరే విద్యార్ధిని తు మన పదం ర. కం.

అ బి

“నా వైపు చూసి జీవం లేని నవ్వు నవ్వి, “అంతా సరిపోయింది గదా ఇప్పుడు..” అని చెప్పాలనుకున్నారు. నా ఫిర్యాదును టేబుల్‌ అంచుకు తోశారు. వారు చెయ్యాల్సిన పని చాలా వుంది అన్నట్లు అందరూ వారి పనుల్లో మునిగి పోయారు. నా విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. నేను నిలబడ్డ చోటునుంచి కదలడానికి భయపడ్డాను. అక్కణ్జుంచి నేను కదిలితే ఫ్లోర్‌ మీద చెమట, దుమ్ముతో వుండిపోయిన నా అడుగు గుర్తులు చూస్తారు. నా ఫిర్యాదు పత్రాన్ని వెనక్కి తీసుకోవడానికి ముందుకు కదిలినపుడు నన్నెవరూ గమనించకుండా జాగ్రత్తపడ్డాను.

“ప్రతిక్షణం చంద్రిక చేచి నా మెదడులో కదలాడుతూనేవుంది. గద్దిస్తూనే వుంది.” నా దగ్గరికి రాకు, వూరికే నీ ఏడుపు చూడదల్బుకోలేదు, గట్టిగా మాట్లాడాలి అలా భయపడితే మనలాంటోళ్ళు ఇక్కడ బతకలేరు.*కానీ నేను, నా సోదరులు, నా తండ్రి గాని నా తల్లి గాని, వారి తల్లిదండ్రులు గాని ఎవ్వరూ అంత ధైర్యం చేయలేదు.”

“మెట్లపై నుంచి ప్రొఫెసర్‌ థేవన్‌ కళ్ళు ఆమెను దగ్గర నుంచి గమనిస్తున్నాయి. ప్రతి మెట్టు మీద దుమ్ము, చెమటతో పడిన ఒక పాదముద్ర. ఒక చారిత్రాత్మక రికార్డు.

188 డా. రూప్‌కుమార్‌ దల్బీకార్‌

తలవంచుకొని ముందుకు కదిలిపోతున్న ఆ అమ్మాయి నడుస్తున్న చరిత్రకు కొనసాగింపు. ఇలా చరిత్రలోకెక్కని ప్రధాన సందర్భానికి ప్రతీక. ఈ సందర్భంలో కల్పించుకొని చరిత్రలో నిలిచిపోయే విధంగా చూడటం చరిత్ర ప్రొఫెసర్‌గా ఇది తన బాధ్యత. అతని ఆలోచనలు అంత దూరం వరకు వెళ్లాయి. ఎప్పటిలానే అతని కుడి చెయ్యి సన్నగా వణుకుతుంది. క్షణాలు చారిత్రాత్మకమైనవి అంటే ఆచార్యుల వారికి విషాదంతో శరీరంలో సన్నటి కంపన మొదలవుతుంది. అలా జరగకపోతే అతను జీవించి వుండటం సంభవం కాదు. ఈ చర్య అతనిలోని మేధకు, శరీరానికి మధ్య జరిగే తీవ్రమైన సంఘర్షణకు భావప్రకటన ప్రొఫెసర్‌ థేవన్‌లోని తీవ్రమైన ఆకాంక్షకు ప్రతిస్పందనగా వున్న అతని వణుకుతున్న చేయి, మెల్లగా మెట్లు దిగుతున్న ఆ అమ్మాయిని వెనక్కి రమ్మని హెచ్చరించడానికి ఉద్యుక్తమవుతోంది. ఒక్కొక్క మెట్టు దిగుతూ వుంది.

“ఇప్పుడు నేను త్వరగా దిగి ఆమెతో మాట్లాడాలి...” అని ఆలోచించాడు. “నేనేం సహాయం చేయగలనో చూస్తాను అని చెప్పి ఆమెను ఓదార్చాలి.”

ఆమె మెట్లు దిగిపోతూనే వుంది.

మెట్లెక్కి వస్తున్న వాచ్‌మెన్‌, బాలన్‌ నాయర్‌ను చూసి, “ఆమెను వెనక్కి రమ్మని” చెప్పాలి అని అనుకున్నాడు.

కానీ, మెట్టు మెట్టుగా, చివరి మెట్టు కూడా దిగి వరండా దాటి మరో వరండా, అలా మూడో వరండా కూడా దాటి పూర్తి చివరంచు వరకు వెళ్లి కనుమరుగయిపోతుంది.

కేవలం చెమటతో తడిసిన తడి పాదముద్రలు వరండాలో అచ్చులా వుండిపోతాయి. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఇప్పుడు అతని పూర్తి కుడిచెయ్యి వణికిపోతోంది. తెరవబడిన చరిత్ర పుస్తకంలోకి మెడ విరిగి పడిపోయినట్లు అతని తల ఒరిగిపోతుంది. చెమటతో తడిసిపోయాడు. బూట్ల నుండి తన పాదాలను బయటికి తీసి వాటికి స్వేచ్చ కల్పించాడు. కళ్లద్దాలు తీసి కళ్ళు రుద్దుకున్నాడు. అతనికి దాహం వేస్తోంది. అల్లం వేసి మరగబెట్టిన నీటిని అతను కోరుకుంటున్నాడు. ఆ క్షణంలో అతని కూతురు నమిత మాటలు అతన్ని చుట్టుముట్టాయి. “ఇలా భయపడుతూ వుంటే సమస్యల నుండి విముక్తి కలగదు, కొన్నిసార్లు ఈ భయాలు సమంజసమైనవే కావచ్చు కానీ, చాలాసార్లు అకారణంగా పుట్టుకొస్తాయి. నాక్కూడా ఈ భయం అనే రోగం వుంది. జన్యువుల ద్వారా నాకు సంక్రమించింది.”

నమిత (గ్రహించింది తాను భయస్తుడని, మడమ తిప్పేవాణ్ణని, సమయానికి నోరు పెగలదని. బస్సులో, షాపింగ్‌ కాంప్లెక్స్‌లో, పెళ్లి రిసెష్షన్‌లో, ఆఫీసులో, హాస్పిటల్లో, రేపెక్కడికెళ్తావ్‌...? 139

గుళ్లో తాను అన్ని రకాల భయాలకు బాధితుడినని నమిత భావిస్తుంటుంది. చిన్నది, పెద్దది, చీకటి అన్నా దొంగలన్నాా పోలీసులన్నా, పాములన్నా, దయ్యాలన్నా, చివరికి తన తల్లియన్న్క దేవుడన్నా భయమే. నువ్వెందుకు భయపడాలి. ఎవరి వల్ల, ఎందువల్ల భయం, నమిత అడుగుతూ వుంటుంది. అతనూ నమ్ముతాడు. ఈ భయం అనేది తనకు తన తాత, ముత్తాతల నుండి సంక్రమించిందియని. అతి విధేయత చూపుతూ, అరచేతులతో నోళ్లు మూసుకొని, వొంగి వాంగి వుండేవారేమోనని చరిత్ర తెలుపుతోంది. చెమటతో నిండిన ఈ పాదముద్రలు ఏం ఆశిస్తున్నాయో అతనికి తెలుసు. సూటిగా అడ్మిషన్‌ కమిటీ ముందుకు వెళ్లి వెంటనే ఈ అన్యాయాన్ని ప్రశ్నించమని డిమాండ్‌ చేస్తున్నాయి. అతను వణుకుతూ తన ముఖాన్ని వంచి టేబుల్‌ టాప్‌ మీద ఆనించాడు. ఆందోళనకు గురైన చాలా సమయం తర్వాత ప్రొఫెసర్‌ థేవన్‌ మెలకువలోకి వస్తాడు. ముఖం కడుక్కొని కళ్లద్దాలు పెట్టుకుంటాడు. అడ్మిషన్‌ కమిటీని దాటుకుంటూ లెటర్‌ బాక్స్‌ దగ్గరికి వెళతాడు. హిస్టరీ డిపార్దుమెంటకు చెందిన క్యూబికల్‌లో వున్న ఉత్తరాలను చిందరవందర చేస్తూ నిలబడి వుండగా అతని బుర్రలో ఒక ప్రశ్న ఊగిసలాడుతోంది. మెరిట్‌ లిస్ట్‌లో వున్న పేరు ఆ అమ్మాయిది ఎందుకు కాకూడదూ,. నా కోసం ఆమె నా నమిత కావచ్చు కదా...! కనుక్కోవాలా. ఒకవేళ ఉండకపోతే లేదా లిస్ట్‌లో చూపకపోయివున్నట్లయితే ? ప్రొఫెసర్‌ థేవన్‌ ఒక సందిగ్ధావస్ట స్థితిలోకి వెళ్లి అలా క్యూబికల్‌లో పడి వున్న ఉత్తరాలను పరిశీలించసాగాడు. తన చిరునామాతో ఉత్తరాలు లేకున్నా. ఇప్పుడు తననావరించిన బలహీన క్షణాల అనుభవం, సరిగ్గా తన పెళ్లి ఫోటోను చూసినపుడు కలిగింది. తన పరివారంలో అందరూ నల్లవారే. నలుపు రంగులో వున్న పిల్లలు, పెద్దల మధ్య తెల్లగా మెరిసిపోతున్న రేణుక నిలబడి వున్నప్పుడు, ఆమె తన నల్లని చేతిని పట్టుకున్నప్పుడు కలిగిన అనుభవం. ఈ సంఘటన ప్రతిదీ బహిరంగ పరుస్తుంది. వారి కళ్ళలోని కంగారు బేలతనానికి, తరాల నుండి వారసత్వంగా వస్తున్న భయానికి దర్చణం పడుతోంది. కానీ రేణుక కెమెరాకు ఎదురుగా జన్మతః వచ్చిన ఆత్మవిశ్వాసంతో నిల్చుంది. ప్రొఫెసర్‌ థేవన్‌ ఆ ఫోటోను అగాధంలోకి తోసివేసి భయాల నుండి తప్పించుకోవడానికి దాచిపెట్టాడు. ఐనప్పటికీ తన పెళ్లి ఫోటోలు తన జీవిత చరిత్రలోని క్లిష్ట సమయాలలో ధథైర్యాన్నిచ్చి తన జ్ఞాపకాల్లోని అస్పష్టతలను చెరిపిస్తుంది. చిన్నగా నవ్వుకొని, ఇవన్నీ అల్ప్బవిషయాలే అని తలపోస్తూ అడ్మిషన్‌ కమిటీ వైపుకు నడుచుకుంటూ వెళ్తాడు. త40ం దా. రూప్‌కుమార్‌ దబ్బీకార్‌

నిజానికి చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపులో నిలబడి పొరబాటు సరిదిద్దుటకై ఆ అమ్మాయి తన కంప్టైంట్‌తో అక్కడ నిలబడింది, అని తనకు -తాను సాంత్వన పరుచుకున్నాడు. కానీ అతను తలుపులను సగం తెరిచి చూడగానే వరండాలో కనబడిన అమ్మాయి పాదాల చెమట గుర్తులు అక్కడ కనబడగానే భయంతో బిగుసుకుపోయాడు. “ర్రేప్టు బెను రేపు, నేను తప్పనిసరిగా కొన్ని విషయాల మీద ప్రశ్నలు వేయాలి. ఏ పెళ్లి ఫోటో కూడా నన్ను నిలవరించి, భయపెట్టే ప్రశ్నే తలెత్తదు.”

బాలన్‌ నాయర్‌, వాచ్‌మెన్‌ అమాయకంగా అడిగేవాడు. “ఈ రోజుకు వెళ్ళిపోతున్నారా థేవన్‌ మాస్టారు? “కానీ రేణుక అతని అమాయకత్వాన్ని నమ్మకపోయేది. థేవన్‌ మాష్‌ థేవన్‌ మాష్‌ అని ఏదో ఉద్దేశంతో అతను అలా పిలుస్తున్నాడు. అతను ఒకరోజు ముందు జాయిన్‌ ఐన పిల్లల్ని కూడా “ప్రొఫెసర్‌ అని పిలిచేవాడు. “ఎన్నిసార్లు పట్టుబట్టాను మిమ్మల్ని మీ పేరు స్పెల్లింగ్‌ మార్చుకొమ్మని ? కేవలం ఒక్క అక్షరం సమన్యనే, కేవలం మీ పేరులోని “|, అక్షరం చోట '' అక్షరాన్ని చేరిస్తే ఈ అవమానాన్ని భరించే బాధ పోతుంది కదా |”

ప్రొఫెసర్‌ థేవన్‌ చెమటతో తడిసి ముద్దయ్యాడు.

చెమట వాసన జన్యువుల్లో కూడా ప్రవహిస్తుంది. దున్నబడి, బురద నిండిన వరిమళ్ళలోని మట్టి వాసన నమితలో కూడా వారసత్వంగా ప్రవహిస్తుంది. ఆ వాసనని పారిస్‌లోని అన్ని పరిమళ ద్రవ్యాలకు బదులుగా బేరం పెట్టనని ఆమె పట్టుబడుతోంది.

ర మాష్‌ : 'మాష్టారు'కు బదులుగా క్లుప్తంగా పిలిచే పేరు. థేవన్‌ : ఉన్నత కులాల వారి 'దేవన్‌" పేరును, నిమ్న కులాల వారిని 'థేవన్‌' పేరుతో ఉద్దేశ పూర్వకంగా, అవహేళనగా పిలుస్తారు.

రేపెక్కడికెళ్తావ్‌...? 1త1

బ్రిటిష్‌ ఇండియా లోని అమృత్‌సర్‌లో

అప్టల్‌ అహసాన్‌ రంధావా 01 సెప్టెంబర్‌, 1987లో జన్మించిన పంజాబీ, ఉర్దూ కవి, రచయిత. దేశ

విభజన తర్వాత పాకిస్తాన్‌ లోని

ఫైసలాబాద్‌లో స్థిరపడి అక్కడి రాజకీయాల్లో

కూడా చురుకుగా పాల్గొన్న వ్యక్తి. నాలుగు నవలలు, నాలుగు కథా సంపుటాలు, ఆరు కవితా సంపుటులు వేయడమే గాక నాటికలు, అనువాదాలు కూడా చేశారు. ఉర్దూలో కవిత్వం రాశారు. అనేక

ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. ఇతని రచనలు పాకిస్తాన్‌లో

ఎంతగా ఇష్టపడేవారో, ఇండియాలో కూడా అదే స్థాయిలో ఇష్టపడే పాఠకులున్నారు. 18, సెప్టెంబర్‌ 2017లో పాకిస్తాన్‌ లోని సైనలాబాద్‌లో మరణించారు. రంధావా వంజాబీ కథను

దా. గురుచరణ్‌ సింగ్‌ '“ఖోయీ హుయి ఖుష్పూ' శీర్షికతో హిందీలో అనువదించారు. ఈ కథలోని శైలి, కథనం పాఠకులను ఆకర్షిస్తుంది.

ఇద్దరు స్నేహితుల మధ్య వున్న స్నేహంలోని మాధుర్యాన్ని అదే స్నేహం

దూరమైతే కలిగే విషాదాన్ని ఈ కథ వ్యక్తీకరిస్తుంది.

142 డా. రూప్‌కుమార్‌ దబ్బీకార్‌

చెదిరిపోయిన పరిమళాలు

నేను ఏ కథ రాయను ?

కథ రాయాలన్న ఆలోచన వచ్చిన ప్రతిసారీ వెంటనే నలుదిక్కుల నుండి కథలు నన్ను చుట్టుముడ్డాయి. ఒక కథకు రోజువారీ కష్టంతో మొద్దుబారిపోయిన చేతులు, ఒక కథకు అందమైన ముఖం మీద మందుగుండ్ల గాయాలు ఇంకా రక్తపు మరకలు. మరో కథకు భుజాలు తెగిపడి వున్నాయి. ఒక దానికి కాళ్ళు లేవు. ఒక దాని కళ్ళు 'పేలిపోయి బయటికి పొడుచుకొని వచ్చాయి. ఒక దాని కండరాలు అణుబాంబు పేలిన అగ్గి కారణాన కాలి మాడి వున్నాయి.

నలువైపులా చూస్తాను కానీ ఏ ఒక్కకథ కూడా పూర్తి రూపం సంతరించుకున్నట్లు కనబడదు. ఏ ఒక్క దానికి అందం సరిగా కుదరదు... కొన్నిటికి దేహాలపై ఆచ్భాదనలు సరిపడ వుండవు. వికారమైన గాధమైన మరకలు మాత్రం కప్పి వేస్తాయి. కానీ ఈ వికారత్వం కూడా ఒక రకమైన అందమే మరి. కవులు, సాహితీవేత్తలు అంజలి ఘటిస్తూ, సౌందర్యాన్ని పంచుతూ, సౌందర్య ప్రశంస చేస్తూ వచ్చారు గదా! అలాంటప్పుడు మరి నేనెందుకు కురూపితనాన్ని అందమైన అబద్ధపు దుప్పటిలో కప్పి ప్రపంచానికి చూపెట్టాలి. దువ్పటిని తొలిగించి ఎందుకు చూపించకూడదు, కానీ దాని అవసరమేముంది? నా కథలన్నీ మట్టి నుండి పుట్టినవే. ఇంకా వీటి పాదాలు నేల మీదనే వున్నాయి. వీటి కురూపితనంలో కూడా మట్టి వేదనలే వున్నాయి. ఈ వేదనలే దీనికి కురూపితనాన్ని అంటగడుతున్నాయి. ఇకనుండి నేను కురూపితనం అనే పదం రాయను. ఎందుకంటే మట్టి గాయం... మట్టి దుఃఖం... మట్టి స్పర్శ ఎప్పుడూ కూడా కురూపితనంతో లేదు. అది సౌందర్యానికి మచ్చుతునక. మట్టి, మనిషి పుట్టుకకు ముందు ఇలాగే వుండేది. నిజానికి మనిషి ఈ మట్టిని గాయపరిచాడు. వేదనకు గురిచేశాడు.

ఇంకా కురూపితనాన్ని ఇచ్చాడు. అటువంటి మనిషి ముఖం చూడకుండానే మట్టి ఎప్పుడూ మనిషికి తోడుగా వుంది. ఆసరాగా నిలిచి సహకరించింది. సహకరిస్తూనే వుంటుంది. మనిషి మట్టి ఇంకా ఆసరా... కానీ, మట్టిని మనిషి నుండి దూరం చేసే వాదెవడూ? నా పంటను అమ్ముకొని నా శ్రమ ఫలితంగా తెచ్చుకున్న ఈ మర్యాదలు, తలపాగా, చెప్పులు ఎవరు లాక్కున్నది? పంట - దేన్నైతే నా చమటను ప్రవహింపజేసి మట్టితో మమేకం చేసి, మట్టి నుండి పుట్టించింది. నా లోలోపలి నుండి కూడా రక్తాన్ని పిండేసిన యంత్రాలు, ఏ రక్తాన్నయితే ఆధారంగా చేసుకొని నా పిల్లాజెల్లా బాధ్యతలకు నేను కట్టుబడియున్నానో! నా కడుపు ఖాళీగా ఎందుకున్నదో? ఇంకా నా రక్తమంతా యంత్రాలకప్పగించిన తర్వాత కూడా నా పిల్లలు ఆకలితో ఎందుకు మాడిపోతున్నారు? నా మట్టి మీద ఎవరు గిరిగీసి ఉంచారు. నా కళ్ళం పాత్తిపై ఎవరి నియంత్రణ రేఖలు? ఎందుకని జమీలా సౌందర్యాన్ని అల్జీరియా ఏ చేష్టలు వికృత పరిచాయి. వియత్నాంలోని హరిత వనాలను ఇంకా చిన్న చిన్న ఇళ్లను ఎవరు బూడిద కుప్పలుగా మార్చేశారు. సహారా ఎడారిని ఎవరు, ఎందుకు రక్తసిక్తం చేసి దాని అస్తిత్వాన్ని ధ్వంసం చేశారు. తెల్లవాళ్లు వివక్షతో నల్లవాళ్ళను బెల్లం సోదరుడని ఎందుకు బెల్లం రాశుల్లోకి విసిరేసారు. మనిషి జన్మతాః స్వేచ్చాజీవియైతే మరి అతన్ని బానిసగా మార్చడానికి ఇంతగా శాస్త్ర విజ్ఞానం అవిష్కరింప జేయాల్సిన అవసరమేమొచ్చింది. మట్టిని ఆంత పవిత్రంగా భావిస్తే ఎందుకు ఇంతగా దాని గుండెల్ని గాయపరిచి, రక్తాన్ని చిందింపజేసి దాని శరీరాన్ని జల్లెడ చేస్తున్నారు. దేవుడు ఒకవేళ ప్రతిరోజు తోడు ఐతే మరి మనిషి ఆసరాను ఎందుకు లాక్కుంటున్నాడు? దేవుడు మట్టి మనిషి. ఇంకా ఆసరా ఒక సమూహమైతే, అతని నాలుగు స్థంబాలుగా ఆధారమైతే మరి అక్కడ ఏ హస్తం ఈ నియంత్రణ రేఖలను తుడిచేసి వీటిని తొలిగించే ప్రయత్నం చేస్తుంది. నాజీలు ఆక్స్‌ఫర్డ్‌ శైలిలో ఆంగ్లం చెబుతారు, ఇంకా మాట్లాడుతారు. నా నోటి నుండి పంజాబీ భాష విని, నాపైన పెద్ద షర్చతీ కళ్ళ వైపు ప్రశ్నించే చూపులు దర్శనమిస్తాయి. “రబ్‌ వర్గా ఆస్రా తేరా వస్‌ దా రహూ మిత్రా” (దేవుడు నీకు తోడు నీడ లాంటివాడు. సర్వకాలాలలో నీతోనే స్నేహంగా వుంటాడు). మరి అతనికేం జవాబివ్వాలి? దేవుడికి చాలా పనులుంటాయి. ప్రపంచం చాలా పెద్దగా మారింది. సమస్యలు పెరిగాయి. వ్యస్తుడై వున్నాడు. మరి ఆసరా? ఎవరికీ ఆసరా ఇంకా ఎలా? ఎవరికైతే తోడునీడ అవసరం ఉందో వారి సంఖ్య పెరిగినా నీడల్ని లాక్కునే వాళ్ళ సంఖ్య వేల మీద అధికంగా వుంది. టహల్‌ సింగ్‌ చాచా సరిగానే నతశత న... దా. రూప్‌కుమార్‌ దల్ఫీకార్‌

చెబుతుండేవారు. “బేటా, మనమంతా కధలమే, కానీ మన రచన చేసేవాడే లేడు.” జెను చాచా టహల్‌ సింగ్‌ మీరు నిజం చెబుతున్నారు. నిన్నమొన్నటి మాటనే, ఎప్పుడైతే మీరు ఇక్కడ భూమిపుత్రుడిగా ఈ మట్టినుండి పుట్టారో, బంగారంతో సమానంగా తూగేవారు. ఈ నేల మిమ్ములను గారాల బిడ్డగా చూసుకొని మురిసిపోయేది. గాలి కన్నా వేగంగా పరుగెత్తగల మీ గుర్రాల సందడి పూర్తి గ్రామంలో ఉండేది. మీ అందమైన పశు సంపత్తిని చూడటానికి దూరదూరాల నుండి వచ్చేవారు. మీ దగ్గర వున్న ఐర్లకు సరితూగ గల బర్లు పంజాబ్‌ మొత్తంలో ఎవరి దగ్గర వుండేవి, మీ వరండా రంగు రంగుల మంచాలు, పెట్టెలు, రంగు రంగుల పూల అల్లికలతో వున్న మఖ్మల్‌ పరదాలు, ఇంకా తివాచీలు, లెక్కకు మించిన రకరకాల వస్తువులతో నిండి వుండేది. మీ ఇంటి గడప నుండి సహాయార్ధ్థిగా వచ్చిన ఏ వ్యక్తి కూడా ఖాళీ చేతులతో వెళ్ళలేదు. ఒక పెద్ద సర్టార్‌ అయి వుండి కూడా మీ నౌకర్లను స్వంత బిడ్డల్లా చూసుకునే వారు. ఊరి ఆదడపడుచులను, ఆడబిడ్డలను మీ స్వంత అక్క చెల్లెళ్లుగా, కూతుళ్లుగా ఆదరించేవారు. ప్రతి ఒక్కరి దుఃఖంలో మీరు భాగస్వామిగా వుండేవారు.

బైణి సాహెబ్‌ గారు, గురుద్వారా వారు వటవృక్షం కింద అందరితో కలిసి కూచున్నారు. మీ హవేలీలో వందల మందికి భోజనం సిద్ధం చేయబడేది. అల్లరి పిల్లలు చాటుమాటుగా “నామ్‌ ధారీలు భోజనానికి వచ్చేసారు” అంటూ పాటలు పాడేవారు.

(గ్రామంలో మేళ ప్రారంభమైంది. మేము చిన్నపిల్లలం గురు దర్శనం కోసం వెళ్ళాం. ఇంకా చాలామంది భక్తులు గురు దర్శనం కోసం దూర దూరాల నుండి వచ్చియున్నారు. మీరు నన్ను ఇంకా పాల్‌సింగ్‌ను పట్టుకొని గురూజీ ముందు నిలబెట్టారు. “వీళ్ళు నా పిల్లలు” అని మీరన్నారు. పాల్‌ తలపై ఎలాంటి ఆచ్చాదన లేదు. చిన్నదైన జుట్టు ముడి బిగించి వున్నాడు. గురూజీ ముందుగా అతని తల మీద చేతితో నిమిరి మీ వైపు ప్రశ్నార్థకంగా చూపులను విసిరాడు. ఏ విధంగానంటే, “ఈ రెందవ ముసల్మాన్‌ పిల్లాడు ఎవరు?” అన్నట్లు, మీరేమో నా సోదరుడి కొడుకన్నారు. గురూజీ నవ్వుతూ రెండు చేతులతో నా తల మీద (ప్రేమగా ముద్దిడి ఆశీర్వదించారు.

మరి చాచా, మీరు అందమైన ఆ ఆడగుగ్రాన్ని కపుర్తలా మహారాజా వారి నుండి అమితమైన ఆకాంక్షతో పదివేలకు కొన్నారు. చాలా కాలం తర్వాత ఆ గుర్రం ఒక పిల్లదానికి జన్మనిచ్చింది. ఆ పిల్ల గుర్రంలో మీ ప్రాణం వుండేది. నాకు చాలాకాలం తర్వాత తెలిసింది, దాని విలువ చాలా ఎక్కువని, అప్పుడు దాని వయస్సు ఆరు నెలలు మాత్రమే. ఒకరోజు నేను ఆడుతూ ఆడుతూ మీ ఇంటికి వచ్చాను. బంగారు మనసు గల రేపెక్కడికెళ్తావ్‌...? 145

చాచీ నన్ను రెండు చేతులతో దగ్గరగా హత్తుకొని య్రేమగా తల నిమిరింది. నుదుటి మీద ముద్దిడి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఒక రొట్టె ముక్కను పొడిగా చేసి దాంట్లో చక్కర వేసి నాకు తినిపించసాగింది. ఇదే సమయంలో పాల్‌ వచ్చాడు. మళ్ళీ మేమిద్దరం కలిసి అడుకుంటూ హవేలీ లోపలికి వెళ్లిపోయాం. భాయ్‌ రతన్‌సింగ్‌ ఆ సమయంలో హవేలీ లోపల వున్నాడు. అతని కోతి, మనిషిలా ఫర్నెస్‌ లాంటి తొట్టిలో చెరుకు వేయసాగింది. భాయ్‌ ఉద్రేరకాలుగా వుండే గడ్డి వేసి మరుగుతున్న చెరుకు రసం నుండి పై మైల తెట్టును తొలగించసాగాడు (నాకింకా గుర్తున్నది - భాయ్‌ తీసిన బెల్లపు ముద్దలు పూర్తి (గ్రామంలోనే అందరికన్నా తెల్లగా, శుభ్రంగా ఉండేది). నిక్కు ఇసాయి కొలిమి తిత్తి నుండి గాలి ఊదసాగాడు. కొలిమి నుండి వచ్చే పొగలు, మరుగుతున్న బెల్లపు ఆవిర్ల వెనక వున్న భాయ్‌ దాక్కున్నట్లుగా తోచేది. కానీ అతను పాల్‌ను, నన్ను చూసాడు. “రసం తాగు,”బెల్లం తిను, “చెరుకు గడలు నమిలి పీల్చు”, “కూర్చో ఓ చిన్నా!” “ వీరూ చెక్క బల్లను తీసి కాస్త ఎండలో పెట్టు”... భాయ్‌ రతన్‌ సింగ్‌ ఒక్కసారిగా ఎన్ని ఆదేశాలిచ్చాడు. కానీ నా ధ్యాసంతా ఆ పిల్లగుర్రం పైనే మళ్లింది. నేను, పాల్‌ పిల్లగుర్రం దగ్గరికి వెళ్లి దాన్ని చూడసాగాము. అది ఎంతో అందంగా, సుందరమైన చిత్రపటంలా వుంది. ఎక్కడి నుండో అంతలోనే టహల్‌ సింగ్‌ వచ్చారు. ఏ బాల్య చేష్టయో అర్థం కాకపాయె. కానీ నేను వెళ్లి దాని ఒళ్ళో కూచున్నాను. పిల్ల గుర్రం మీద ఎక్కి కూర్చోవాలని మంకుపట్టు పట్టాను. ఏడేళ్ల వయస్సు పిల్లలకు ఏం తెలుస్తుంది! కానీ చాచా, మీరు ఒక్కసారి కూడా నా కోరికను కాదన లేదు, పోనీ వద్దని సముదాయించనూ లేదు. పైపెచ్చు ఆ అమాయకమైన, అమూల్యమైన పిల్లదాన్ని పట్టుకొని జీనుకు అల్లిక వేసి దాన్ని సిద్దం చేసారు. అక్కడున్న వ్యక్తి ఆశ్చర్యంతో దయ్యంలా చూస్తూ నిలబడిపోయాడు. భాయ్‌ ఉడికిన బెల్లాన్ని వదిలి వచ్చి నిలబడిపోయాడు. ప్రతి ఒక్కరు చాచా మీ వైపే చూస్తూ నిలబడి వుండిపోయారు. ఒక పిల్లవాడి తుంటరి చేష్టలో మీరు కూడా పిల్లవారై పోయారు. కానీ ఎవ్వరూ మిమ్ముల్ని కాదని చెప్పే ధైర్యం, సాహసం చెయ్యలేకపోయారు. మళ్ళీ మీరు భుజం మీది నుండి దుప్పటిని తొలిగించి కంగారులో బెదిరిపోయి ఎగిరే పిల్లగుర్రానికి రక్షణగా నిలిచి మృదువైన, సుందరమైన దాని వీపు మీద 'జీను” వేసి గట్టిగా బిగించారు. ఈ రోజు ఆలోచన చేస్తే ఆరు నెలల పసిషప్రాయం కలిగి పాలు తాగే సుకుమారమైన ఆ ప్రాణికి ఈ మాత్రం దుఃఖం, బాధ ఎక్కువే అని చెప్పాలి. కానీ చాచా మీరు నన్ను దాని మీద కూర్చోబెట్టి, ముందుండి పట్టుకొని హవేలీలో రెండు చక్కర్లు కొట్టించారు. కానీ అది బాధతో, రక్షణ లేదన్న భయంతో తండ్లాడుతూ పవ?

కుప్పకూలిపోయింది. మహారాజా కపుర్తలా వారి ప్రియమైన గుర్రం, దాని అందమైన సంతానం, దాన్ని మీరెంత (పేమగా చూసుకునేవారో నాకు తెలుసు. కానీ మీ ముఖం మీద ఏ మాత్రం నిరాశ ఛాయలు రానివ్వలేదు. నా తండ్రి మినహా ఎవ్వరు కూడా ఏ మాత్రం ఎదురు జవాబిచ్చే ధైర్యం చేయలేదు. ఎప్పుడైతే ఆయన ఈ విషయం విన్నారో అప్పుడు నన్ను, మిమ్ముల్ని కూడా కోపగించుకున్నారు కదా! కానీ మీరు మాత్రం ఒక్క నవ్వుతో ఊర్మున్నారు.

చాచా ఈ రోజు నేను పెద్దవాజ్ఞయ్యాను. లోకమంటే అర్ధం చేసుకోగలను. జీవితంలో దెబ్బలు తిని తిని రాటుదేలాను. సమాజంలోని మంచిచెడులు చూసొను. సగం ప్రపంచం తిరిగి చూసాను. అక్కడి ప్రజల జీవన విధానాలు చూసాను. వారిని అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాను. ఈ రోజు ఈ మాటలు కలలో మాట్లాడుతున్నట్లు అనిపిస్తాయి. అవి గతించిన స్వప్నాలు. ఎవరి కలలైతే చెదిరిపోతాయో అఆ మనిషి ఎంతటి దురదృష్టవంతుడో గదా, ఈ రోజు మనసులో అనుకుంటూ వుంటాను. చాచా, మీరుమా నాన్నగారికి సోదర సమానులు ఆయనతో మీరు తలపాగా మార్చుకున్నారు. మీరు స్వంత సోదరులు కాకున్నా నాపై చూపిన (ప్రేమ ఎంత గొప్పదంటే నా స్వంత బాబాయిలు కూడా అంతటి (ప్రేమను చూపలేదు. రక్షసంబంధం గట్టిదనం గురించి చెబుతుంటారు కానీ నా స్వంత మనుషులకన్నా మీరు నాకెంతో (ప్రియం. మీకు మీ పాల్‌ కన్నానా మీద (ప్రేమ ఎక్కువ. నేనంటే గారాబం. నా దగ్గర అతి చనువు ఎందుకో?

ఒక్కసారిగా ఇలాంటి తూఫాను చెలరేగుతుందని ఊహించలేదు. అది మనిషిని ఛిద్రం చేసింది. నేలను స్మశానంలా చేసి కనుమరుగయ్యింది. రావి, బసంతార్‌ ప్రవాహ వడి పెరిగి భయానకంగా మారాయి. ఇంకా అలలు కోపంతో నురగలు కక్కుళూ బయటికి వచ్చేసాయి. నాలుగు దిక్కులా నీళ్ళే వున్నాయి. మీరు నిండుకుండ లాంటి మీ హవేలి నుండి, అన్నీ పుష్కలంగా వున్న ఇంట్లో నుండి రెండు మూడు వస్తువులు మాత్రమే తీసుకున్నారు. నా బందు బలగంతో, నాన్నగొరితో ఆ ఐ౦డిలో బరిశెలు, బందూక్‌లు ఇతరత్రా సామాగ్రితో బయలుదేరి వెళ్లారు. బండిలో చాచి, పాల్‌ మీరు ఇంకా రతో వున్నారు. మీ దరిదాపుల్లో వుండాలని మీ భద్రతకై పొలిమేరలో వున్న వంతెన వరకు మేము వచ్చాము. మీరు కూడా భద్రతా లేకుండా అయిపోయారు. అలాగే మిమ్ముల్ని విడిచి వెళ్ళడానికి వచ్చినవాళ్లు... కూడా దారిలో దోపిడీ హత్యలు, దాడులు, వాటితో భయం. వంతెన చేరుకోగానే అప్పుడు మా నాన్నగారు మీరు ఒకరినొకరు గట్టిగా రేపెక్కడికెళ్తావ్‌...? క4?7

కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ వున్నారు. మీరు వంతెన దాటుళూ వుంటే మాటిమాటికి మిమ్ముల్ని తిరిగి చూస్తూ గుండెలవిసేలా ఏడ్చాడు మా నాన్న మీరు ముందుకు కదిలి గుంపులో కలిసి మాయమయ్యారు. కానీ మేము ఎందుకో అక్కడే వంతెన మీదనే సాయంకాలం దాకా దుఃఖిస్తూ కూర్చొని వుండిపోయాము. మిమ్ములను పోగొట్టుకున్నాక చెదిరిపోయిన మీ ఇంటిని చూస్తూ, మా ఇంటికి తిరిగి వచ్చాము. ఆ సమయంలో నేను ఎనిమిదేళ్ల వయస్సు వాడిని. ఇప్పుడు ముప్పయి ఎనిమిదేండ్ల వయస్సు. నేను అత్యంత కష్ట సమయంలో కూడా నా తండ్రిని వడ్వడం చూడలేదు, ఆ రోజు తప్ప. ఇప్పటికీ మీ పేరు వినగానే ఆయన కళ్ళలోని కాంతి బలహీనపడిపోతుంది.

ఈ రోజు ముకేరియాలోని ఒక పల్లెలో శరణార్థి టహల్‌ సింగ్‌ ఎంత ఆనందంగా వున్నాడో తెలియదు, ఇప్పుడు పాల్‌ సింగ్‌ నాలా సగం నెరిసిన నెత్తితో కాంతివంతమైన బాదం లాంటి కళ్ళలో ఏమైన కలలు నిక్షిప్తం చేశాడా? లేదా? తెలియదు.

చాచా టహల్‌ సింగ్‌ చెప్పేవారు, “మనమంతా కథలమే కానీ మన రచన చేసే వారు లేరు” అని. చాచా, చూడు నాకు మీ కథ జ్ఞాపకముంది. ఏదో ఒక రోజు నేను రాస్తాను. ఈ రోజు మాత్రం నాకు నలువైపులా ఎన్నో కథలు చుట్టుముట్టి వున్నాయి. నలువైపులా మహా ప్రళయం లాంటి అలజడి అలుముకొని వుంది.

నా కథలు రక్తసిక్తమై వున్నాయి. వాటి శిరస్సులు నగ్నంగా వున్నాయి. జుట్టు చెదిరిపోయి వుంది. దేహమంతా గాయాలు నిండి వున్నాయి. నా చేతిలో విరిగిపోయిన కలం, ఇంకా నేను నా కథల కోసం సంతోషాలను నింపుకొని రావాలని ఏ పాత్రను తీసుకొని బయలుదేరానో ఆ పాత్ర విరిగి ముక్కలై వుంది. నా కళ్ళ నిండా కన్నీళ్లే. నేను నా దారిని కూడా సరిగా చూడలేకపోతున్నాను. నా స్థితి కూడా నా కథల మాదిరిగానే వుంది. కానీ నేను ఆలోచిస్తూ వుంటాను. నేను కథను ఎలా రాయను?

న! శళర |... దా. రూప్‌కుమార్‌ దల్ఫీకార్‌

న మ్య్‌ న సస ప్రముఖ గుజరాతీ రచయిత. ఆరు కథా న సంపుటాలు, నవల ప్రచురించారు. గుజరా్‌ ప్రవీణ్‌ సింగ్‌ చావదా పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ మెంబర్‌గా వ్యవహరించారు. ప్రముఖ రచనలు : ఏక్‌ ఎవున్‌ ఘర్‌ మాలౌ, భజన్‌ నిర్గుణి, పవన్‌ కుమారి, జగు భాయినే పునర్జన్మ్‌ (100016 4001506 ౮482201%4ఏ. ఈ కథను మీరా దేశాయ్‌ (00008 1016 శీర్షికతో ఆంగ్లంలో అనువదించారు. ఇద్దరి స్నేహితుల మధ్య వున్న బంధాన్ని బంధువుల మధ్య వుండే ప్రవర్తన, వైఖరిని, భావ వైచిక్రిని ఈ కథలో చూడవచ్చు. రేపెక్కడికెళ్లావ్‌...? 149

టే ఇంటి వైపుకు

రంజిత్‌ జాగ్రత్తగా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని, “ఇప్పుడే వస్తాను..” అంటూ తండ్రికి చెప్పి బయళ్దేరాడు.

అతని తండ్రి భుజం మీద కండువా వేసుకొని బయట వాకిట్లో వాలు కుర్చీలో రోజంతా కూర్చుంటాడు. కోల్పోయిన చూపు అతను కూర్చునే తీరుకు ఒక గాంభీర్యం తెచ్చి పెట్టింది. ఏదైనా వాహనం శబ్దం విన్నా ఎవరి అడుగుల చప్పుడు దగ్గరవుతున్నా వాటిని ఊహించి నవ్వుకుంటాడు. అడుగుల చప్పుడు దూరమవుతూ ఆగిపోయినా, అతని నవ్వు మాత్రం అగిపోదు. ఆదివారం వస్తే చాలు సమయాన్ని ఎలా గడపాలా అన్నది రంజిత్‌కు పెద్ద సమస్య, ఖాళీ సమయాన్ని ఎలా పూరించాలా ? అని ఆలోచిస్తూనే ఏదో ఒక వైపుకు నడక ప్రారంభిస్తాడు. దారిలో ఏది ఎదురైనా వాటిని చూస్తూ ఆనందిస్తాడు. అతని దృష్టి చాలా పదునైనది, ఏది కనబడినా అనుభవంలోకి తీసుకొని సంతోషంగా జీవితానికి అన్నయిస్తాడు.

ఎక్కడికెళ్తావు బిడ్డా ? అని అలాంటి (ప్రశ్నలు అతని తండ్రి వేయడు. వాకిట్లో అలా సోమరిగా కూర్చోవడంలో, కొడుకు అలా పిచ్చిగా తిరగడం ఈ రెండింటిలో ఎలాంటి తేడా లేదన్న విషయం బహుశా అతని తండ్రికి తెలుసు.

ఆ ఉదయం రంజిత్‌ ఒక కొత్త ఉత్సాహంతో నడకకు బయల్దేరాడు. పాతకాలపు బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోగ్రాఫ్‌ నుండి బయటికొచ్చిన వాడిలా స్కూల్‌ యూనిఫామ్‌, బ్లాక్‌ నిక్కర్‌ వేసుకొని పలువరస బయటికి కనబడే విధంగా నవ్వుతూ వుండే శ్రీరాం మూలే గుర్తుకొచ్చాడు. ఈ మధ్య కాలంలో అంత తరచుగా కలుసుకోవడం లేదు. కొన్నిసార్లయితే ఆరు నెలలు దాటిపోతాయి. ఒక్కొక్కసారి సంవత్సరం కూదా అవుతుంది. నది పక్కన వున్న శ్రీరాం ఇంటి చుట్టూ వున్న పెరడు సజీవంగా నా జ్ఞాపకాల్లో కదలాడుతూ వుంటుంది 150 డా. రూప్‌కుమార్‌ దబ్బీకార్‌

స్కూల్‌కు వెళ్తూ, స్కూల్‌ బాగ్‌ మోసుకొని దారిలో 'సాల్వివాద్‌, చేరగానే (శ్రీరాం తల్లి వాకిట్లో నిలబడి అతన్ని సాగనంపడానికి సిద్ధంగా వుండేది. రోజు జరిగే సంఘటనలను, సేకరించిన వార్తలను జాగ్రత్తగా మోసుకొచ్చి ఆ ఇంటితో పంచుకునేవాణ్ణి. శ్రీరాం మంచినీళ్లకై నన్ను లోపలికి తీసుకెళ్లేవాడు, అక్కణ్ణుంచి పెరట్లోకి వెళ్ళేవాళ్ళం. తాను ఇప్పటికీ ఆ సంఘటనలను సజీవంగా చూస్తున్నట్లు అనుభూతి చెందుతాడు. శ్రీరాం తల్లి, చేతిలో గిన్నె నిండా బిస్కట్లు, లడ్డూలు, నువ్వుల ఉండలు పెట్టుకొని మా వైపుకి నడుచుకుంటూ వస్తుంది.

ఎలాంటి ఆర్భాటం లేని టీ కొట్టు, పొరుగున వున్న ఇంటివాళ్ల ప్రవేశ ద్వారం వద్ద ఆ పిండి గిర్నీ ఇంకా అలానే వున్నాయి. ఆ ప్రాంతంలో పెద్దగా ఎలాంటి మార్పులు లేవు. వాకిట్లోని అరుగు మీదకు మెట్లు ఎక్కుతూ వుంటే తాను గతంలోకి ప్రవేశిస్తున్న అనుభూతి కలిగింది. ఇనుపజాలి వున్న తలుపును మెల్లగా తట్టి కాసేపు నిలబడ్డాను.

బరువుగా అలసిపోయినట్లు నడుచుకుంటూ వచ్చి తలుపును లాగుతూ తన షర్ట్‌ సర్దుకుంటూ తలుపు చువ్వల వెనక నుండి నా వైపు ఎవరా అన్నట్లు ప్రశ్నార్థకంగా చూస్తున్న (భీరాంను చూస్తే ఏదో అనంతంలోకి తొంగి చూస్తున్నట్లనిపించింది.

“ఎవరది భయ్‌..”

“అలా దారినపోతున్న బాటసారిని. కాసిన్ని మంచినీళ్ళ కోసం ఇక్కడికి వచ్చాను..”

(ీరాం గట్టిగా ఏమీ నవ్వలేదు. “రండి..” అని నిర్లక్ష్యంగా చెప్పి వెనుదిరిగాడు.

ఇదొక కొత్త రకం పలకరింపు. గతంలో ఎప్పుడు కలిసిన ఒకరినొకరు పలకరింపుల్లో నిందించుకుంటూ వుండే వాళ్ళం. “నీవు చాలా పెద్దవాడివై పోయావు. నీ సమయం చాలా విలువైనది” అన్నాడు (శ్రీరాం. ఆఖరుకు, ఇద్దరిలో ఎవరూ గొప్ప కాదు అన్న నిర్ణయానికి వచ్చాక సంతృప్తి చెందాం. షాలిని బేన్‌ తెచ్చిన కప్పు టీ, మా శాంతి ఒప్పందానికి సాక్ష్యంగా నిలిచింది.

(ఢీరాం మెట్ల దాకా నడిచి వెళ్ళాడు. రంజిత్‌ ఇంకా హాల్‌లోనే వుండిపోయాడు. ఒకవేళ ఆ పాత పద్ధతిలోనే ఫిర్యాదులను నాపై వేస్తే మనఃస్ఫూర్తిగా అంగీకరించడానికి సిద్ధంగా వున్నాను. జెను నిశ్చయంగా ఈ రోజు నేను ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఎదిగిపోయాను. టెక్స్‌టైల్‌ మిల్లు మూతబడిన తరువాత టవర్‌ దగ్గరున్న బంధువుల ఒక హోటల్‌లో క్యాష్‌ కౌంటర్‌ పైన కూర్చునేవాణ్ణి. కాదా మరి, చెప్పండి. నాకైతే అది మేనేజర్‌ పోస్ట్‌ కన్నా తక్కువేమి కాదు గదా? రేపెక్కడికెళ్తావ్‌...? 151

అతని భార్య తన బ్యాగ్‌ సర్దుకొని తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినపుడు, నా విలువైన సమయాన్ని ఆడంబరమైన బహుమతిగా ఇవ్వడానికి శీరాం ఇంటికి వెళ్తే, ఆ పరిస్థితుల్లో అతని అవస్థను చూసి, ఈ వయసులో నేను ఒంటరిగా వుండడం ఒక వరమనే అనిపించేది. ఆ దూరపు బంధువు జెదార్యం ఇచ్చే జీతంతో ఏదో అంబలి, జావా తింటూ వయసుడిగిన ముసలి తండ్రి, అతని మధ్య వయస్సుడైన కొడుకు జీవితం సాఫీగా గడిచిపోతుంది. మహారాజా లాంటి జీవితం కాకపోవచ్చు. దీన్నేమంటావు శ్రీరాం?

పైన మొదటి అంతస్తుకు పోయి వద్దాం. శ్రీరాం చెప్పాడు.

అతను మెట్లెక్కుతుంటేనే తెలిసిపోయింది వోలు గదిలో కూర్చోవడం లేదని. ఈ గది ఖాళీగా ఏమీ లేదు మెట్ల పక్కనే మాటున ఒక స్త్రీ పురుషుడు ఇద్దరూ కుద్చీల్లో ఒదిగి కూర్చొని వున్నారు. వాళ్ళ శరీరంలోని ఏ భాగంలో కూడా చలనం కనబడటం లేదు. ఆ మసక వెలుతురులో కూడా వచ్చిన సందర్భకుడికి అటు వైపు దృష్టి పడితే. వారి చూపుల్లో ఒక రకమైన ద్వేష భావనని లెక్క చేయకుండా దాటవేస్తే, వారిద్దరూ శిలా ప్రతిమల్లా కనబడతారు.

(శ్రీ రాం ఇంటికి వచ్చిన విజిటర్స్‌కు ఈ దినం ఆదివారంలా కనబడుతుంది. ఆ ఇద్దరు ముందుగానే వచ్చి వేచివున్నారు. రంజిత్‌లో ఒక అపరాధ భావన కలిగింది. అతిధులుగా వారికి ప్రధమ హక్కువుంది. అతని విషాద గాథతో పాటు నిజానికి తాను వున్నపళానా వెనుతిరిగిపోవాలి.

రంజిత్‌ చివరి మెట్టు దగ్గర ఆగిపోయాడు. “శ్రీరాం, ప్రత్యేకంగా నాకెలాంటి పని లేదు. కేవలం అలా నిన్ను కలిసి పోదామని వచ్చాను.”

“నాక్షూడా ఏమి పనిలేదు...”

“అ మనుషులు ...”

“వారి సంగతేమిటి?”

“అతిధులా..”

అతిధులు కారు వారు. “బావమరిది, నా సాలొ” బావమరిది భార్యనేమని పిలుస్తారు.

(శ్రీరాం వళ్ళికిలిస్తూ, పెదాలు కదపకుండా, “వేలి వేలో, 'సాలవేలి, 430 గంటలకు, ఉదయం రైలు బండికి వచ్చినప్పటి నుంచి ఇలాగే కూర్చున్నారు. అంత తెల్లవారు, తలుపు చప్పుడైతే మేము భయపడి పోయాము. ఏ బందిపోటు దొంగలు దాడి చేశారో సమయం కాని సమయంలో?” అని భావించాము.

రంజిత్‌కు, మొదటి అంతస్తులో ముందు పెద్ద బాల్కనీలో వుందే ఊయల గుర్తుకొచ్చింది. శ్రీరాం నాన్నగారు ధోతీ, బనియన్‌ వేసుకొని సాధారణంగా అక్కడే 152 దా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

కూర్చునేవారు. అమ్మగారు దుమ్ము, ధూళి దులుపుతూ, తిరిగి వస్తువులను వాటి స్థానంలోనే అమర్చుతూ హడావుడి చేస్తూ వుండేది. శ్రీరాం ఊయల మీద కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. వచ్చిన అతిధిని గాలికి వదిలేసాడు. కిటికీ పక్కన వున్న కుర్చీని కదపకుండా తనూ అక్కడే కూర్చున్నాడు. కిటికీ నుండి ఎండిపోయిన నది అడుగు భాగం స్పష్టంగా కనబడుతుంది.

“ఇంకేమిటి కొత్త విషయాలు,” జ్రీరాం కళ్ళు తెరవకుండానే అడిగాడు.

“అంతా బాగానే వుంది, మజామే నువ్వెలా వున్నావు ?

“.అద్భుతంగా వున్నాను. ఎవరికైనా ఏం సమస్యలుంటాయి?”

క్షణం క్రితం తను చెప్పిన దానికి ప్రతికూలం అన్నట్లు శ్రీరాం తలను వూపుతూ వున్నాడు. కాసేపటి తరువాత లోపల గూడు కట్టుకొని, దాగివున్న మాటలు ఒక్కసారిగా బయటికొచ్చాయి. ఎదురుగా వింటూ వున్న వ్యక్తి మీద అకారణంగా కోపంతో మండిపోతున్నాడు. ఎలా అన్నీ బాగుంటాయి.. నువ్వనుకుంటుండవచ్చు. ఏదైనా బావుంటుంది.

ములియా కనబడటం లేదు కదాయని, కనీసం పిలవాలన్న ధ్యాస కూడా లేదు. కానీ ఈ ఇంటి పరిస్థితులను చూసావా!

“నీకు మంచినీళ్లు కావాలా..? కాస్త టీ యైనా..”

రంజిత్‌ వద్దన్నాడు. శ్రీరాం ఈ చర్యను తనపై ఒక సానుభూతిగా, జాలిగా పరిగణించాడు. తన జేబులో నుంచి ఒక ఉత్తరం తీసి “దీనిని చదువు..” అన్నాడు.

ఏమైనా గంభీరమైన విషయం వున్నదా మూలే”?

“అంతా సర్వనాశనం. ఇప్పుడేమి మిగల్లేదు. ఇవి కోర్టు సమన్లు చదువు, సరదాగా వుంటుంది నీకు.”

అతని ముందుంచిన దాన్ని చదవడానికి రంజిత్‌ ఏ మాత్రం అతురత చూపలేదు. కాగితాలతో తడబడుతూ మూలే కోర్టు కేసులో వున్న రహస్యం విప్పి చూపాడు. ఆతని ఒక్కగానొక్క కొడుకు సునీల్‌ ఇంట్లో పెంచిన విషసర్పంలా .. ఫిర్యాది. ప్రతివాది, నిందితుడు (శ్రీరాం వసంతరావు మూలే. వృత్తి : ప్రభుత్వ ఉద్యోగి, (శ్రీమతి షాలిని; (శ్రీరాం, మొదటి ప్రతివాది భార్య. నెలరోజుల క్రితం, సునీల్‌ అతని భార్య సామాన్లు సర్దుకొని అహ్మదాబాద్‌, మణినగర్‌లో వున్న సునీల్‌ మామగారింటికి బయల్దేరి వెళ్లారు. తండ్రి పబ్లిక్‌ వర్చ్‌ డిపార్టుమెంట్‌లో క్లర్క్‌ అతను సంపాదించిన ఆస్తంతా వీరికి కట్టబెట్టాలి

  • అని ఆ కాగితాల్లో వుంది. బ్యాంకుల్లో వున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు విత్‌డ్రా చేయాల్సి మూడంతస్తుల భవంతిని ఖాళీ చేయాలి. మూడు వేల ఐదు వందల రూపాయలకు.. రేపెక్ళడికెళ్తావ్‌...? - 153

1942లో అ ఇల్లు కట్టబడినది. అందంగా చెక్కబడిన దారు స్తంభాల మీద భవంతి నిలబడివుంది. దీని కార్చెంటర్‌ అంబాలాల్‌ సుతార్‌ కొడుకు ఇప్పటికీ సంవత్సరాలుగా మన్ననలు, గౌరవం పొందుతూనే వున్నాడు. మూలేకు, వంశపారంపర్యంగా వస్తున్న వాటిని కుర్రాడికివ్వడానికి అభ్యంతరమేమి లేదు. ముసలివాళ్లకు ఎక్కడో ఓ చోట అద్దె కొంప దొరకాలి కదా! ఎట్టకేలకు ఇవన్నీ చూడవలసి వచ్చింది. ఇప్పుడివన్నీ పనికిమాలిన విషయాలు. యువరాజుగారు, ముఖ్యంగా ఆ మహారాణి గారికి ఈ చిల్లులు పడి, పాతబడిన పడవలో వుండే ఉద్దేశం లేదు కదా? ఇంత పెద్ద పెరడు ఇప్పుడేం చేసుకుంటాం? దాగుడు మూతలు ఆడుకుంటామా? ఆ మామగారు, కొత్తగా దారికిన ఆ కొడుక్కి తన వ్యాపార సంస్కృతి, లెక్కపత్రాల సంస్కారం, కట్న కానుకల కింద ఇచ్చాడు. ఈ స్ధలం షాపింగ్‌ సెంటర్‌కు బాలా అనువుగా వుంటది. కనీసం ఓ పది అంతస్తుల అపార్ట్‌మెంట్‌ కట్టుకోవడానికి కూడా పనికొస్తుంది...

అతను చెప్పేదంతా వింటూనే రంజిత్‌ సంతోషంతో ఓ పేజీ దగ్గర ఆగిపోయాడు. భవంతి నిర్మాణం మొదట్లో తీసిన చిత్రాల మాలిక గతంలోకి లాక్కెళ్ళాయి. అప్పట్లో భవంతికి ముందు వెనకాల ఎలాంటి గృహ నిర్మాణాలు లేవు. జనం సందడి కూడా లేదు. పచ్చని పొలాలు, దట్టంగా పెరిగిన చెట్లు అదే విధంగా కనువిందు చేస్తూ నెమళ్ళ గుంపులు, అంబాలాల్‌ సుతార్‌ చెవిలో వెనకాల పెన్సిల్‌ గుచ్చి పెట్టుకొని ఆ సుందర ప్రకృతి దృశ్యాలను చెక్కుతూ ప్రాణం పోస్తూ వుంటే జిజ్ఞాసతో ఆ పక్షులు చూస్తూ వుండిపోయి ఉండవచ్చు. నది పొంగి పొర్లిపోతూ వుండేదేమో?

“నేను తెలియాలని చెప్పాను అయినా ఎందుకీ విషయాలన్నీ ఉబుసుపోక కబుర్లకు మంచి మేత?” శ్రీరాం.

రంజిత్‌ ఏమీ చెప్పలేదు. స్నేహితుడికి సలహా ఇచ్చే స్థితిలో లేడు. సునీల్‌ను వెతికి పట్టుకొని, కాలర్‌ పట్టి లాగి, అతని బాధ్యతలను గుర్తు చేయించాలి. సుఖమయంగా ముగింపు తేవాలి. ఈ ఆలోచనలు అతన్ని వెంటాడుతున్నాయి.

అతని కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు తనకు లేదు. అలాగని ఇతర విషయాల్లో కూడా తాను కల్పించుకోకూడదు. ఒక వేళ సునీల్‌ మామగారు కానీ, మరే బంధువు కానీ అమాయకంగా లేదా ఏమీ పనీ పాట లేక సమస్య పరిష్కారం కోసం మధ్యలో దూరి స్థాయి భేదాలు ప్రశ్నించవచ్చు. ఎలా సమస్యను పరిష్కారం జేస్తావు? అని అడగవచ్చు.

“నువ్వు, షాలిని బాబీ ఒంటరిగానే వున్నారా ఇప్పుడు...”

“మాతో ఇల్లు ఖాళీ చేయించవచ్చు. ఇంటి బయట, వీధుల్లోకి గెంటి పారవేయవచ్చు. నువ్వేమో మీరిద్దరే వున్నారా..?” అని అడుగుతున్నావు. 154 డా, రూప్‌కుమార్‌ డల్బీకార్‌

మాట్లాడేటప్పుడు ఎప్పుడూ తరుచుగా ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ వుంటాడు. గతంలోని జ్ఞాపకాలు దృశ్యాలుగా కదిలిపోతూ వుంటే పట్టుకొని నిలవరించవచ్చు. కానీ భవిష్యత్తును దర్శించడమే చాలా కష్టం. ఒక నిట్టూర్పు విడిచి లేచి నిలబడ్డాను బయలు దేరడానికి సిద్ధమవుతూ.

“క్రూర” అన్నాడు శ్రీరాం.

మెట్ల పక్కన గదిలో ముడుచుకు కూర్చున్న ఆ ఇద్దరు మనుషుల గురించి విచారం పట్టుకుంది రంజిత్‌కు.

కుర్చీలో తిరిగి వెనక్కి వాలి అన్నాడు. “మరెవరి ద్వారానో అంకుల్స్‌ ఆంటీ ఈ సంగతి విని వుండవచ్చు...

“ఏ అంకుల్‌, ఏ అంటే”

“అదే అఆ అతిథులు..”

“ఏ అతిధులు..”

పడే పదే అడగడం, తిరిగి అవే సమాధానాలు రావడం జరుగుతున్నది. అలసి పోయిన స్వరంతో రంజిత్‌ అన్నాడు -

“నీ బావమరిది, అతని భార్య - ఎవరైతే కింద మెట్ల పక్కన కూర్చున్నారు. నేను వారి నుద్దేశించే మాట్లాడుతున్నాను.”

శ్రీరాం ఒక్కసారిగా పగలబడి నవ్వాడు. “ఆ నమూనాలను దగ్గర నుండి చూసావా.”

రంజిత్‌కు వారిని దగ్గర నుండి చూసే అవకాశం దొరకలేదు. మేడ పైకి హడావుడిగా వచ్చేసాడు. ఆ కొద్ది సమయంలో, కుర్చీల్లో ముడుచుకు కూర్చున్న వారిని స్పష్టంగా చూడటంగాని, మాట్లాడటంగాని జరగలేదు.

(థీరాం గట్టిగా నవ్వి చెప్పినపుడు రంజిత్‌ స్పష్టంగా వినలేదు. తన స్పేహితుడి ముఖంలో వస్తున్న ఆ చిన్న మార్పులు ్రీరాంకు సంతోషాన్నిచ్చాయి. తనకు పరిచయమున్న గొంతు విన్నందుకు, తాము చర్చించే విషయాలను పక్కన పెట్టి ఆనందించసాగాడు.

పాలవాడు, న్యూస్‌పేపర్‌ బాయ్‌ కంటే ముందే ఈ అతిధులు వచ్చారు. అప్పటి నుంచి అక్కడే అలా కుర్చీలకు అతుక్కు పోయారు. ఉదయం పూట, కాలకృత్యాలు తీర్చుకోవడానికైనా సమయ సమయానికి మనుషులు కదలాల్సి వుంటుంది. కానీ ఈ తిరుగుబాటుదారులు అందుకు కూడా లేవలేదు. ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుండి కోపంతో వున్నారు. మంచినీళ్లు తాగారు. టీ ఇచ్చినా తీసుకోలేదు. ఇక వారి తిట్లకు రేపెకడికెళ్తావ్‌...? 155

అంతులేదు. వారి గురించి పట్టించుకోకు. మన సంగతి వాళ్లకేం పట్టదు. 'మేము మీ బంధువులం కాము. కేవలం రోడ్డు మీది గులకరాళ్ళం' అంటూ మండిపడుతున్నారు.

బంధువుల గురించి, వారి ప్రవర్తన గురించి శ్రీరామ్‌ వైఖరి... “ప్రతి ఒక్కరూ ఎంతో కొంత...!”

బావమరిది వృత్తి సరిగ్గా సాగలేదు. అతని తండ్రి అతనికి యదునందన్‌ అని పేరు పెట్టాడు. అంతటితో తన బాధ్యత పూర్తయ్యిందనుకొని వుండవచ్చు. మన మహాశయుడు ఆ పేరును కిరీటంలా ధరించి చాలా ఆటలే ఆడుకున్నాడు. యాఖై ఏళ్ళు వచ్చే వరకు దొమ్మి తిరుగుళ్ళు తిరిగాడు. వయసు పెరిగితే మాత్రం, కోతి తన బుద్ధులను మార్చుకుంటుందా?

కారణం, అతనికి నాటకాల పిచ్చి ఏదేదో సాధించాలనుకున్నాడు. దేని మీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోయాడు. తన లక్ష్య సాధన మీద గురిలేనివాడు. సమయం దొరికిన ప్రతిసారి నాటకాలంటూ తిరిగి ఏవో చిన్న చిన్న నౌకరు, వంటవాడు, దొంగ లాంటి పాత్రలు వేసేవాడు. అలా జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అలా కూర్చొని నిరసన తెలపడానికి కారణం చాలా చిన్నది. అతనికి రెండు లక్షల రూపాయలు అప్పు కావాలి. అదీ వడ్డీ లేకుండా అంతేకాదు తిరిగి ఇచ్చే ఒప్పందం. గ్యారంటీ ఏమీ వుండకూడదు. ఎందుకంటే వారికర్థమయ్యేది కేవలం (శ్రీరాం, పబ్లిక్‌ వర్చ్‌ డిపార్‌మెంట్‌లో పని చేస్తున్నాడు. దానితో అతని ఖజానా కరెన్సీ నోట్లతో నిండి వుంటుందన్న అపోహ మనుషుల్లో వుంది.

“మరేం చేస్తావు శ్రీరాం..?”

“..విచారించకు..” డిమాండ్‌ తీవ్రత గంట గంటకు తగ్గుతూ పోతుంది. నువ్వు తలుపు తట్టినపుడు అతని డిమాండ్‌ పదిహేను వేలకు తగ్గింది. ఒకటి రెండ్రోజులు ఆగుతారు. లడ్డూ దూద్‌ పాక్‌ లాంటి స్వీట్లు తింటారు. చివరికి ఐస్సు లేదా రైలు ఛార్జీలు తీసుకొని సంతోషంగా వెళ్ళిపోతారు. *నీకాలస్యం అవుతుండొచ్చు...”

చివరి మాట పూర్తికాగానే శ్రీరాం లేచి నిలబడ్డాడు.

“నాన్నగారొకృరే వున్నారు ఇంటి దగ్గర” - రంజిత్‌.

“ఎవరు కట్టి పడేసారు నిన్ను”

బాల్మనీలోనే అతన్ని వదిలి ముందుకు కదిలాను. బహుశా అతను అకృడే వుండి వుండొచ్చు.

“పాపం ఆ అమ్మాయి?”

తలుపు దగ్గర మెట్లకు కొన్ని అడుగుల దూరంలో వారు నిలిచిపోయారు.

“ఏ అమ్మాయి ?”

156 చా. రూప్‌కుమార్‌ దల్బీకార్‌

“మసక చీకట్లో నువ్వు సరిగ్గా గమనించలేకపోయావు. ఈ జోకర్‌తో వుండి ఆమె తన సౌందర్యాన్ని వృధా చేసుకుంది. కానీ ఒకప్పుడు దేవకన్యలా అద్భుతమైన అందంతో వుండేది. పేరు కూడా అంతే అందంగా వుండేది - రాజేశ్వరి.

“నీకో రహస్యం చెప్పనా?”

(శీరాం కన్నుగీటి, రంజిత్‌ చెవిలో మెల్లగా రహస్యం విప్పాడు... “నిజానికి, నాకు ఆమెతో...”

“ఆమెతో ఏమిటి?”

“ఇది...” అంటూ శ్రీరాం అతని చేతులు గట్టిగా కలిపి పట్టుకొని పెళ్లి సందర్భంలో జరిగే “హస్త్‌ మిలాప్‌” కార్యక్రమాన్ని సూచించే విధంగా సంజ్ఞ చూపాడు.

కానీ స్వర్గస్తులైన నా తండ్రికి సిక్స్‌ సెన్స్‌, అంతకు మించిన దూరదృష్టి అమోఘంగా వుండేది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ప్రపోజల్‌ను అంగీకరించలేదు. జరిగిందేదో మంచికే జరిగిందని ఇప్పుడు నేను భావిస్తున్నాను. అమె ఇప్పుడు ఈ జోకర్‌కు అంకితమైపోయిన భార్య. తన భర్త ఒక అసాధారణమైన వ్యక్తి అన్న అపోహలో వుంటుంది. లక్షల్లో ఒకడు, పైసా సంపాదించలేడు కాబట్టి అతను ఒక సాధుజీవి.

“ఆమె ఉద్దేశంలో అదేమీ తప్పు కాదు కదా..” అని రంజిత్‌ అన్నాడు.

“ఆమెదేం తప్పుకాదు. నా కొడుకుదేమి తప్పులేదు. ఏదైనా తప్పు వుంటే అది నాదే. లోకంలో తప్పులు నేను మాత్రమే చేస్తాను. రా! మెట్లు దిగి కిందికి పోదాం” (శ్రీరాం.

తాను ఇంటికి వచ్చినపుడు జరగాల్సిన ఫార్మాలిటీస్‌, బయళల్దేరేటప్పుడు మెట్లమీద జరిగాయి. “నువ్వు చాలా పెద్ద మనిషివై పోయావు!”

“నిజమే కదా!” రంజిత్‌ అన్నాడు.

“ఇక్కడికి రానే రావు. ముఖం కూడా చూపించవు.”

“ఈ మొహానికి చాటు వుంటేనే విలువ..” అని మనసులో అనుకున్నాడు రంజిత్‌. జీరాం నిందారోపణలు చేస్తూనే కిందికి దారి తీసాడు. రంజిత్‌ నేర్పుగా తప్పించుకుంటూ అతన్ని అనుసరించాడు.

నిర్జీవమైన శిలా ప్రతిమలను దాటుకుంటూ గేటు వరకు వచ్చాము.

“.ఏదో ఒక రోజు వెళ్లి మనం కూడా నాటకం చూద్దాం..”

“ఇంతకూ వీళ్ళ సంగతేమిటి?”

ఎటూ పూర్తికాని ఈ విషయాలను తీసుకొని రంజిత్‌ కాస్త గందరగోళానికి గురయ్యాడు. కుర్చీల్లో ముడుచుకు కూలబడిన ఆ ఇద్దరి చూపుల్లో వున్న దైన్యతను అర్ధం రేపెక్కడికెళ్తావ్‌...? 157

చేసుకోగలుగుతున్నాడు. (శ్రీరాం తన నిస్సహాయతను తెలిపే సైగలతో అతని ప్రశ్నలను గాలికొదిలేశాడు. “రజియా డాన్స్‌, మ్యూజిక్‌ అనేవి ఇష్టం లేవు ఇపుడు డామిట్‌..”

అప్పుడే రంజిత్‌కు ఇంటి వెనకాల వున్న గార్డెన్‌లో పికాక్‌ బ్లూ చీరపై దృష్టి పడింది. స్నానం చేసి వదిలేసినట్లున్న వదులైన కేశాలతో వున్న ఆమె పువ్వులను తెంపుకుంటోంది. కాలి వేళ్లపై నిలబడి పువ్వును అందుకునే ప్రయత్నం చేస్తూ తన దృష్టినంతా కేంద్రీకరించి చేతి వేళ్ళ కాసలతో విచ్చుకున్న పువ్వును తాకుతోంది. గులాబీ, తెలుపు రంగుల పూలతో నిండిన ప్లేటు ఆమె సుందరమైన మోమును పోలివుంది. ఎవ్వరినీ చూడలేదన్నట్లు, ఎవ్వరూ తనకు తెలియదన్నట్లు, తన ప్రపంచమే వేరుగా, సుతారంగా ఒక మొక్కనుంచి మరో మొక్క వైపుకు కదులుతూ ఎక్కడైతే వాళ్ళు నిలబడి వున్నారో అక్కడ వాకిలికి దగ్గరగా వస్తోంది.

ఆమెను, మోము నుండి కాలివేళ్ళ వరకు చూసి శ్రీరాం.. “తప్పకుండా ఆమె సతీదేవికి మరో రూపం” అన్నాడు.

గట్టిగా వినబడే విధంగా చేసిన పాగడ్తను అతని భార్య పట్టించుకోలేదు. వచ్చిన అతిధిని చూసినప్పటికీ, పలకరింపుగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొహం తిప్పేసుకుంది. ఆమె చర్యతో (్రీరాంకు అవకాశం దొరికిందని మరింత సంబరపడి పోయాడు. తల వూపుతూ “ఈ గెస్ట్‌ గంటసేపట్టుంచి ఇక్కడే వున్నా. ఎవ్వరూ అతనికి ఒక గ్లాసు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఈ ఇంట్లో ఎవరికీ భయం లేకుండా అయిపోయింది, రజియా” అన్నాడు.

నవ్వులు, కూనిరాగాలు అలుముకున్నాయి. తన భర్త వైపు చూడకుండానే షాలిని బేన్‌, రంజిత్‌ ముందు ఆగి, *ఈ రోజు ఉదయం మిమ్ములను కలగన్నాను. కలలో, నిద్ర నుండి లేపినందుకు చింతిస్తున్నాను.”

తరువాత ఆమె తలుపు వరకు వెళ్ళింది. అలాగే ఎలా వచ్చిందో అది వయ్యారంగా, ఒక్క అడుగు కూడా వెనకా ముందు కాలేదు.

(థీరాం నవ్వుకున్నాడు. “ఈ కుటుంబంలోని వ్యక్తులకు కాస్త పిచ్చి వుందని నీకనిపించదా రజియా?”

రంజిత్‌ సమాధానమివ్వలేదు. పెరట్లో వున్న ప్రతి చెట్టు వైపు నిశితంగా చూసాడు. ప్రౌఢ ప్రీ స్వప్నం మీద తేలియాడుతూ ఇంటివైపుకు బయళ్టేరాదు.

ఛి

158... దా. రూప్‌కుమార్‌ దల్చీకార్‌

ల... ను (|

యు గ (వముఖ కొంకణి కథా రచయిత. ళ్‌; వ య బాల సాహిత్యంలో కూడా కృషి చేశారు. రు సాహిత్య అకాడమి అవార్థుతో పాటు అనేక రచయిత్రి రాసిన 'ఓ రే చిరుంగన్‌ మేరే “ అనే కొంకణి కథను లీలా గాయ్‌ తోండే హిందీలో అనువాదం చేశారు. తల్లి పోయాక ఓ పిల్లవాణ్ణి తండ్రి దగ్గర నుండి అతని చిన్నమ్మ తన వెంట తీసుకెళ్తుంది. తల్లి వున్నప్పుడు, తల్లి పోయాక చిన్నమ్మ దగ్గర వున్నప్పుడు, సవతి తల్లి ఇంకా తండ్రితో వున్నప్పుడు పిల్లవాడి మనస్తత్వం ఎలా వుండేది, ఆ చిన్నారి

(ప్రేమ ఎటు వైపు మొగ్గుతుంది అన్న అంశంతో కథ నడుస్తుంది.

రేపెక్కడికెళ్తావ్‌...? 159

ఓనా చిట్టి తండ్రీ అమ్మ చనిపోయి రెండు రోజులు దాటింది. ఆమె యాదిలో నాకు ఏడుపు తెర్లు తెర్లుగా ముంచుకొస్తోంది. నాన్న తల మీద చెయ్యి ఆనించి ఓ మూలకు విచారంగా కూర్చున్న దృశ్యాన్ని చూస్తే నాకు అమ్మ జ్ఞాపకం మరింతగా పీడించేది. ప్రతి రాత్రి నన్ను అమ్మ తన దగ్గరే పడుకోబెట్టుకునేది. అమ్మ పోయిన ఈ రెండు రాత్రులు, సురంగ్‌ తన గుడిసెలోనే పడుకోబెట్టింది. ఆమె పక్కన చిన్న పసికందులా మూల్గుతూ నిద్రపోయేవాణ్ణి. కానీ, ఈ రోజు నాన్న నా పక్కను తన గుడిసెలో వేయించాడు. సురంగ్‌ నన్ను తీసుకోవడానికి వచ్చినపుడు, “ఇక్కడే పడుకోనీ అతన్ని ఒంటరిగా వున్న నన్ను ఈ ఖాళీ గుడిసె తినేస్తుంది.” అన్నాడు. సురంగ్‌ దగ్గరికి వెళ్ళడానికి నా మనసు తండ్లాడతది. ఐనప్పటికీ నేను మౌనంగానే ఉండిపోయాను. రాత్రి ఒంటరిగా పక్క మీద దొర్లుతూ చీకట్లో చేతులు చాపి వెతుకులాడుతుంటే అమ్మ వెలితి కనిపించి గట్టీగా ఏడవాలనిపించింది. కనీసం నాన్న తన దగ్గరైనా నన్ను పడుకోబెట్టుకుంటే బావుంటుంది కదా యని నాన్నను పిలవాలని నోరు తెరిచాను. అంతలోనే నాకు ఆయన ఏడుస్తున్న చప్పుడు వినిపించింది. ఆయనకు కూడా అమ్మ యాదికొస్తుండొచ్చు, అని తలుచుకొని నేను వెక్కి వెక్కి ఏదవసాగాను. “అమ్మా! అమ్మా..!” అని గట్టిగా ఏడుస్తూ ఒక్కసారిగా నాన్న పక్క మీద వాలిపోయాను. ఆయన నన్ను గట్టిగా హత్తుకున్నాడు. నేను ఆయన భుజాల చుట్టూ చేతులు వేసి గట్టిగా అల్లుకున్నాను. నాన్న కన్నీళ్లు నా చెంపలపై టప టపా రాలిపడసాగాయి. నా వీపు, తలా నిమురుతూ వుండిపోయాడు. అమ్మ కూడా అలాగే చేసేది. మరుసటి రోజు చిన్నమ్మ వచ్చింది. వస్తూ వస్తూనే నన్ను కౌగిలించుకొని ఏడవడం మొదలెట్టింది. ఆమె ఒళ్ళో తల దాచుకొని నేనూ ఏడవసాగాను. చిన్ని బట్టల నుంచి మంచి పూల పరిమళం రాసాగింది. కానీ అమ్మ బట్టలు ఎప్పుడూ 160... దా. రూప్‌కుమార్‌ దల్ఫీకార్‌

పొగచూరిన వాసన కొట్టేవి. చిన్ని బట్టలు కూడా అలా పాొగచూరిన వాసన వేస్తే ఎంత బాగుండేది అన్న కోరిక మనసులో కలిగింది.

సమయానికి కబురు పంపక పోవడంచే చిన్ని కోపం పట్టలేక నాన్నతో వాదానికి దిగింది. అమ్మను గుర్తు చేసుకొని ఆమె ముఖం కూడా ఎర్రబడిపోయింది. చిన్ని పోలికల్లో ఏ విధంగా చూసినా అమ్మలా ఉండేది కాదు. మాయమ్మ కాస్త చామనఛాయ. చిన్ని తెల్లగా వుంటుంది. మధ్యాహ్న సమయంలో చిన్ని నాన్నతో అంది, “రఘును నాతో పాటు, మా ఇంటికి తీసికెళ్తాను. ఇక్కడ అతని పెంపకం సరిగా సాగదు.”

నాన్న ఏమీ అనలేదు. “మీరు పని మీద బయటికెళ్తే అతను ఒంటరి వాదై పోతాడు. అలనా పాలనా ఎవరు చూసుకుంటారు.”

నాన్న నా వైపు తిరిగి చూసాడు.

“ఒక్రవేళ అతన్ని పంపించి వేస్తే ఒంటరిగా నా రోజులు ఎలా గడుస్తాయి..?”

“మీరు మగవాళ్ళు.. ఒకసారి పనుల్లో మునిగిపోతే అన్నీ మరిచిపోతారు. పాపం వీడు బాధపడుతూ వుండాలి.” నేను కూర్చొని ఇద్దరి ముఖాలు చూస్తూ వుండిపోయాను. నాకు వెళ్లాలని కూడా వుంది. మరోవైపు ఇక్కడే వుండిపోవాలని వుంది. చివరికి నాన్న నావి రెండు కమీజులు ప్యాంట్లు సంచిలో సర్దేసి చెప్పాడు. “రఘు, నువ్వ మీ చిన్నితో పాటు వెళ్ళు.”

ఎప్పుడైతే “వెళ్లు అన్నాడో అప్పుడు నా మనసు వెళ్ళడానికి అంగీకరించ లేకపోయింది. నాన్న నన్ను గారాబం చేసేవాడు. నన్ను వెంటబెట్టుకొని పక్కనే వున్న చిన్న వంతెన దగ్గరికి చేపలు పట్టడానికి తీసుకెళ్లేవాడు. అలా మేము పట్టుకొచ్చిన చేపలను అమ్మ నిప్పుల్లో చక్కగా కాల్చేది. శనివారం రోజు చౌరస్తా దగ్గర సంత జరిగేది. నాన్న అక్కడ చిన్నవి పెద్దవి తాళ్లు అమ్మడానికి కూర్చునేవాడు. నేను తోడుగా కూర్చునేవాణ్ణి. ఎండ ముదిరినపుడు నాన్న గొడుగు విప్పితే దాని కింద గంభీరంగా ఇద్దరం కూర్చునేవాళ్ళం. అక్కడ నాన్న శనగలు, పల్లీ విత్తనాలు పెట్టేవాడు.

ఈ రోజు కూడా శనివారం. కానీ నాన్న వెళ్ళలేదు. అమ్మ పోయిన తర్వాత ఆయన చాలా మారిపోయాడు. నాకైతే అమ్మ జ్ఞాపకాలతో అసలు ఊపిరాడకపోయేది.

“నాన్న నువ్వు కూడా రాకూడదూ ?”

“వెర్రివాడా ముందు నువ్వెళ్ళు?”

“మరి నువ్వెప్పుడొస్తావ్‌?” రేపెక్కడికెళ్తావ్‌...? 161

“వ్షస్తాను...!౫

“క్రాన్సీ ఎప్పుడు..?”

“క్ర రోజు వస్తాను కదాగొ

“తొందరగా రా..?”

నాన్న వూరకుండిపోయాదు.

“త్వరగానే వస్తావు కదా.. ?” ఇంకోసారి గుర్తు చేసా. దానికి ఆయన తల వూపాడు.

చిన్ని వేలు పట్టుకొని గుడిసె బయటికి వచ్చాను. నాన్న తలుపు వరకు వచ్చాడు. జువాంవ్‌ సారా దుకాణం చేరేవరకు వెనక్కి తిరిగి చూస్తూనే వున్నాను. నాన్న అక్కదే నిలబడి వున్నాడు. ఉత్తమ్‌ దుకాణం తర్వాత గుడిసె కనుమరుగయ్యింది. నాన్న కూడా మరుగైపోయాదు. చిన్ని చెయ్యి వదిలించుకొని నాన్న దగ్గరికి పరిగెత్తుకు పోవాలని పించింది. నేను చెయ్యి విడిపించుకున్నా, చిన్ని నా చెయ్యి గట్టిగా పట్టుకుంది.

“రఘు నువ్వు మంచి పిల్లాడివి గదూ! అవునా, కాదా..?”

నేను అవునన్నట్లు తలవూపి మౌనంగా ఆమె వెంట నడిచాను.

“మనం బస్సులో వెళదాం..”

“బస్సులోనా!?”

ను”

నాన్న అమ్మ, నేను ఓసారి జాతరకు వెళ్లాం. అప్పుడు బస్సులోనే వెళ్లాం. మళ్ళీ ఈ రోజు బస్సులోని మెత్తటి సీటులో కూర్చొని వెళ్లే అవకాశం దొరికింది కదా యని మనసులోనే సంతోషంతో పొంగిపోయా. చిన్ని చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకున్నాను.

చిన్ని ఇల్లు తెల్లగా సున్నం వేయబడి, మా గుడిసె కన్నా పెద్దగా వుంది. ఆ రాత్రి ఒకటే జోరుగా వర్షం. అంత కురిసినా ఎక్కడా చుక్క నీరు కారలేదు. మా గుడిసెలోనైజే మూల మూలకు వర్షపు నీరు కారేది. అన్ని చోట్లా గిన్నెలు పెడుతూ అమ్మ అలసటతో విసుగెత్తి పోయేది. వర్షపు నీరు కారడం మరీ ఎక్కువైతే నాన్న నిచ్చెన వేసి పై కప్పు మరమ్మతుకు సిద్ధపడేవాడు. నేను అమ్మ ఇద్దరం దీపం పట్టుకొని.. “ఇక్కడ కారుతుంది... అక్కడ కారుతుంది” అంటూ చూపించేవాళ్ళం. 162... దా. రూప్‌కుమార్‌ దల్చీకార్‌

ఈ రోజు ఒకవేళ గుడిసె కప్పు కారడం మొదలెడితే నాన్నకు దీపం పట్టుకొని ఎవరు చూపుతారు? చిన్ని పక్కలో పడుకున్న నాకు ఆలోచనలు రాసాగాయి.

“చిన్నీ...” పిలిచాను.

“గమ్మున పడుకో..” అని నన్ను ఇంకాస్త దగ్గరికి తీసుకొని వీపు మీద చేత్తో తడుతూ పడుకోబెట్టసాగింది. ఆమె చీర వాసన నా ముక్కుకు చేరింది. అమ్మ ఒళ్ళో పడుకుంటే వచ్చే పొగచూరిన వాసన మంచిగా అనిపించేది. అలాగే సురంగ్‌ చీర కూడా అదే వాసన వేసేది. అమ్మ చీర వాసనలా భావిస్తూ చిన్ని ఒళ్ళో దూరాను.

చిన్ని నన్ను అక్కడి బళ్ళో చేర్చించింది. నా మొదటి బడి దీనికన్నా చాలా బాగుండేది. అక్కడ బడికి ఎదురుగానే మర్రిచెట్టు ఉండేది. దాని ఊడలు పట్టుకొని అటూ ఇటూ ఊగే వాళ్ళం. అలాగని ఈ బడికి వెళ్లే దారిలో ఒక చింతచెట్టు వుండేది. చింతకాయలకు కొరతే లేదు. జేబునిండా చింతకాయలు నింపుకునే సమయంలో షిరీ, బెందిత్‌లు గుర్తుకు వచ్చేవారు.

మా గుడిసె దగ్గర ఒక కాలువ పారేది. ఎన్నోసార్లు మేమక్కడికి వెళ్ళేవాళ్ళం. డుబుక్‌ డుబుక్‌ మని డుబ్కీలు కొడుతూ తానం చేసేవాళ్ళం. చిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కాలువ లేదు. కానీ చేద బావి వుంది. చిన్ని సర్ర్‌ సర్ర్‌ మని తాడు లాగుతూ చిన్న బిందెతో నీళ్లు తోడి నా నెత్తి మీద గుమ్మరించేది. ఒళ్ళంతా సబ్బు రుద్దేది. ఇంటి దగ్గర నేనొక్కణ్ణి స్నానం చేసేవాణ్ణి. అమ్మను కూడా తాకనిచ్చేవాణ్ని కాదు. నేనేం చిన్నపిల్లవాణ్డా? కాని చిన్ని నా మాట వినేది కాదు. నాకు విపరీతంగా కోపం వచ్చేది.

“ఏడేళ్ల గుర్రంలా ఎదిగావ్‌. కాకిలా స్నానం చేస్తావ్‌! మురికి వెధవ..” అంటూ చిన్ని సబ్బుతో రుద్దేసేది. కళ్ళలో నురుగు పోయి కళ్ళు మండేవి. కోపంతో చిన్నిని గిచ్చాలనిపించేది. కానీ ఎప్పుడూ అలా చేయకపోయేవాడిని. అమ్మను ఎన్ని సార్లు అలా గిచ్చి విసిగించానో..

నాన్నతో కలిసి అప్పుడప్పుడు నదికి కూడా వెళ్ళేవాణ్ణి. అక్కడ మేమిద్దరం గులక రాతి పలకలు తీసుకొని ఒకరి వీపు మరొకరు రుద్దేవాళ్ళం. ఆ సంఘటనలు యాదికి రాగానే మళ్లీ నాన్న దగ్గరికి వెళ్లిపోవాలన్న ఆలోచన సతాయించేది. చిన్ని నా తడి నెత్తిని తుడుస్తూ వుంటే నేను కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ వుండేవాడిని. చిన్నికి పిల్లలు లేరు. చిన్ని చిన్నాన్న వాళ్ళ అమ్మ మాత్రమే ఉండేవారు. పొరుగున కూడా నా ఈడు వాళ్ళివరూ లేరు. వయసులో నా కంటే పెద్దవాళ్ళు. నన్ను వాళ్లతో కలువనిచ్చేవారు కాదు. నేను చాలా విసుగెత్తి పోయేవాణ్ణి. అప్పుడు చిన్ని తన పని వదిలేసి నాతో ఆడుకునేది. రేపెక్కడికెళ్తావ్‌...? 163

చిన్నికి రాతి పలకల ముక్కలు పేర్చి ఆడడం తెలియదు. ఐదు గచ్చకాయలతో చాలా బాగా ఆడేది. పిట్స్‌ పిట్‌ మని గచ్చకాయలు ఎగిరేసి పట్టుకునేది. చిన్ని దగ్గర చాలా గచ్చకాయలుండేవి. చిన్నితో ఆడుతూ వుంటే సమయమే తెలియదు. ఆటలో నేను మోసం చేసినా చిన్ని చూసీ చూడనట్లు ఉండేది. ఆట మొత్తం అయిపోయాక నేను గెలిచానని చెప్పి నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని “నా రాజా బేటా, చాలా హుషారు” అని పొగుడుతూ మురిసిపోయేది. బడికి వెళ్లే సమయంలో తాను వాకిట్లో నిలబడి నన్ను చూస్తూ వుండిపోయేది. “జాగ్రత్తగా వెళ్ళు” అని చెప్పేది.

“అలాగే చిన్ని అని జవాబిచ్చేవాణ్ణి.

చింతకాయలు ఆశతో నా కాళ్ళు వడివడిగా ముందుకు సాగేయి. చిన్ని ఇంటిముందు వున్న దారి నేరుగా వెళ్తుంది. తర్వాత మలుపు దగ్గర ఒక మామిడి చెట్టు వుంది. అక్కడికి వెళ్ళేదాకా నేను వెనక్కి తిరిగి చూసుకుంటూ పోయేవాణ్ణి. ఇంకా చిన్ని వైపు చెయ్యి ఊపుతూ చింతచెట్టు వచ్చేదాకా పరుగులు తీసేవాణ్ని. నేను చెయ్యి ఊపేంతవరకు చిన్ని వాకిట్లోనే నిలబడి వుంటుంది. ఒకసారి నేను చేయి వూపడం మరిచిపోయాను. చిన్ని అందుకు అలిగిపోయింది. బడినుండి వచ్చేసరికి వెంటనే అడిగేసింది.

“రఘు, ఈ రోజు నువ్వు వెనక్కి తిరిగి చూడనే లేదు..”

“ఎప్పుడు చిన్నీ?”

“బడికి వెళ్లే సమయంలో!”

“మర్చిపోయాను...”

“అలా ఎలా మర్చిపోయావు. నీకు నేనంటే ఇష్టమే లేదు. నేనే నువ్వంటే పడి చస్తున్నాను..!” చిన్ని కళ్ళలో నీరు ఉప్పొంగింది. నాకు చాలా బాధ అనిపించింది. వెనక్కి తిరిగి చూడనంత మాత్రాన చిన్నికి అంత బాధపడాల్సిన అవసరమేముంది. ఇదే ఆలోచిస్తూ వుండేవాణ్ణి. ఆ రోజు నుండి మామిడి చెట్టు దగ్గరికి రాగానే మర్చిపోకుండా వెనక్కి తిరిగి చూసేవాణ్ణి.

రాశ్రుళ్ళు చిన్ని కథలు వినిపించేది. ఆ రా(త్రి నాకు, “చిరుంగన్‌” కథ వినిపించింది.

“ఒక చిరుంగన్‌ ఉండేవాడు. చాలా చిన్నవాడు. ఒక రోజు అతని తల్లి చనిపోయింది. దాంతో చిరుంగన్‌ గూడులో ఒంటరివాడై పోయాడు. చిరుంగన్‌కు ఒక 164 డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

చిన్ని వుండేది. ఆమె ఎంతో (ప్రేమతో తన రెక్కల కింద నీడ నిచ్చింది. పెంచి పెద్ద చేసింది. నేను చిన్నిని అడిగా.. చిన్ని ఆ చిరుంగన్‌ చిన్నమ్మకు పిల్లలు లేరా?..” “లేరు నాన్న. ఆ పక్షికి పిల్లలు లేరు చాలా దురదృష్టవంతురాలు... “ముది.” చిరుంగన్‌ చిన్నమ్మ అతని మంచిచెడ్డలు చూడసాగింది. ఎంతో (ప్రేమగా ముద్దు చేసేది. తన స్వంత బిడ్డలా చూసుకునేది. చిరుంగన్‌ను ఎగరడం నేర్పించింది. పిల్ల పక్షికి రెక్కలొచ్చాయి. అది పొగరుగలదై ఎగరసాగింది. చిన్నమ్మ ఆనందానికి అవధుల్లేవు. ఒకరోజు చిరుంగన్‌ గూడు వదిలి బయటికి వచ్చింది. ఎగిరి చాలా దూరం వరకు వెళ్ళిపోయింది. చిన్నమ్మ చిరుంగన్‌ను మర్చిపోలేక ఎదురుచూస్తూ, చూస్తూ పలవరించేది. “ఓరే నా చిట్టి చిరుంగన్‌ ఎప్పుడొస్తావు నువ్వు? నువ్వంటే ప్రాణం ఇచ్చేదాన్ని, నిన్నెంతో య్రేమగా చూసుకునేదాన్ని కానీ నువ్వు నన్ను మర్చిపోయావు కదరా!” అలా చిరుంగన్‌ను యాది చేసుకుంటూ చిన్నమ్మ గూడులో ఒంటరిగా ఏడుస్తూ వుండేది. కథ వినిపిస్తూ, వినిపిస్తూ చిన్ని తాను ఏడవడం మొదలెట్టింది. ఆమె ఏడుస్తూ వుండడం చూసి నేనూ వఏదవసాగాను. “ఓ నా చిట్టి చిరుంగన్‌...” మా ఆరు నెలల పరీక్షలు ముగిశాయి కానీ, నాన్న ఒక్కసారి కూడా చిన్ని ఇంటికి రాలేదు. నాకు ఆయన, అమ్మ చాలా చాలా యాదికొచ్చే వారు. ఆదివారం పూట అప్పుడప్పుడు చిన్నాన్న వెంట బస్టాండ్‌కు వెళ్ళేవాడిని. అప్పుడు ఏదైనా బస్సు నుండి నాన్న దిగుతాడేమో అన్న ఆశతో బస్సుల వైపు చూసేవాణ్ణీ కానీ నాన్న రాలేదు. నేను ఆయనతో చెప్పాను. “త్వరగా రావాలి..” అని. చాలా ఎదురుచూసా. ఒక రోజు అకస్మాత్తుగా దిగాడు. బడికి సెలవులు. నేనొక్కజ్ణి వాకిట్లో ఏడు పెంకులాట ఆడుకుంటున్నాను. ఎదురుగా ఎవరో నిలుచున్నారు. తలెత్తి చూస్తే ఎదురుగా నాన్న. వెంటనే ఆట వదిలేసి, నాన్న నడుం చుట్టూ చేతులు వేసి అల్లుకున్నాను. ॥ రేపెక్కడికెళ్తావ్‌...? 165

“బిన్నీ నాన్నాచ్చాడు..”

నాన్న నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నా ముఖం ఆనందంతో విప్పారింది. చిన్ని బయటికి వచ్చింది.

చాయ్‌ తాగుతూ నాన్న “నేను రఘును తీసుకుపోవడానికి వచ్చాను” అన్నాడు. చిన్ని చేతిలో వున్న చాట కింద పడిపోయింది. అందులో వున్న బియ్యం చెల్లాచెదురుగా పడిపోయాయి. చిన్ని ఒక్కసారిగా నోట మాట రాక అలాగే ఉండిపోయింది. చాటను కూడా సరిగ్గా పట్టుకోలేని స్థితి...

“మీరు పనిమీద వెళ్తారు. రఘు ఒంటరిగా వుండిపోతాడు. అప్పుడు వాడి సంగతేమిటి?”

“అతనొక్కడే ఏమీ వుండడు..”

“ఎలా ఒక్కడే వుండడు?”

“నేను రెండో పెళ్లి చేసుకున్నాను.” నాన్న నెమ్మదిగా జవాబిచ్చాడు.

“విమిట్రీ, 'మోగ్రు' పోయి ఆరునెలలు కూడా కాలేదు. మీరేమో ...!”

“వం చేయగలను. ప్రపంచంలో బతకాలి గదా, చాలా కష్టంలో వుంటి. ఆఖరుకు రఘును ఇక్కడ ఎంతకాలం వుంచగలను?”

చిన్ని మొహం వెలవెలబోయింది, “రఘు పేరు ఎత్తకండి. అతన్ని అక్కడికి తీసుకెళ్లి సవతి తల్లి పంచన వదిలేస్తారా? ఎప్పటికీ నేనతన్ని పంపను.”

చిన్ని కోపావేశాలతో చెప్పుకుంటూ పోతోంది. నేను వారిద్దరి మొవాలు చూస్తూ వుండిపోయాను.

సవతి తల్లి ? చిన్ని సవతి తల్లి కథలు చాలా వినిపించింది. అందులో సవతి తల్గులందరూ చాలా చెడ్డవాళ్ళు. ఆ విషయం నాకు తెలుసు. నాన్న నా కోసం సవతి తల్లిని తెచ్చాడా, ఈ విషయం తెలిసి ఏడుపొచ్చింది. అమ్మ గుర్తుకొచ్చి వెక్కిళ్లు పెట్టి ఏడవసాగాను.

“రఘుకు సవతి తల్లితో ఎలాంటి సమస్యలు రావు. ఆమె కూడా అతన్ని ప్రేమగానే చూసుకుంటది”

“ఈ విషయం మీరు నాతో ఏం చెప్పనవసరంలేదు. మీకప్పుడే ఎలా తెలిసిపోయింది ...?” 166 దా. రూప్‌కుమార్‌ దల్బీకార్‌

“ఆమె పొరుగునే వుండేది. మన రఘు అంటే ఆమెకు చాలా ఇష్టం..”

“ఎవరామె?”

“స్పరంగ్‌”

“సురంగ్‌ ? నా కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి. చాలు.. సురంగ్‌.. ఎప్పుడైనా సవతి తల్లిలా మారగలదా..? ఆమె ఎంత మంచిది. ఆమె వొడిలో పడుకుంటే అమ్మ ఒళ్ళో పడుకున్నట్లే అనిపించేది.”

నేను ఒక్కసారిగా నవ్వేసాను. ఒక్క గంతువేసి నాన్న దగ్గరికి చేరాను.

“నాన్న నేనాస్తానుగొ

నాన్న నవ్వుతూ నా తల నిమరసాగాడు. చిన్ని మౌనంగా ఖాళీ చాటను తీసుకొని లోపలి కెళ్ళిపోయింది.

“చిన్నీ నా కమీజు ఎక్కడ..? ప్యాంటు ఎక్కడా..?” అంటూ ఆమె వెనకాలే పరిగెత్తాను.

చిన్ని వంటింట్లో వుంది. ఆమె మొహం ఎగ్రబారివుంది.

“రఘు నిజంగానే నువ్వు వెళ్ళిపోతావా..?”

నిజంగా అంటే, వమడుగుతుంది. అమాయకురాలు “చిన్నికి ఏమీ తెలియదు. నేను తల వూపాను..

“అవునన్నట్లు. .”

“ఇక్షడ నీకు మంచిగనిపించడం లేదా?”

“నాకిక్కడ బాగానే వుంది. కానీ నాన్న తోడు వుంటే ఇంకా బావుంటుంది” అలా చిన్నితో చెప్పాను.

“నేనే పిచ్చిదాన్ని.” అలా చెప్పూ, చెప్హూ చిన్ని చాటలో బియ్యం వేయసాగింది.

“బిన్సీ బయట బియ్యం పడిపోయి వున్నాయి. అలాగే పడివున్నాయి గదా..!”

“ఆ.. తెలుసు బియ్యం చెదిరి కింద పడివున్నాయి...”

“నేను దగ్గరికి చేసి తీసుకురానా..?”

“అక్కర్లేదు. రఘు, నా చేతినుండి పడిపోయాయి. నేనే ఎత్తుకుంటాను, వదిలేయి...” అని చిన్ని బయటి కెళ్ళిపోయింది. శకలక

మధ్యాహ్నం భోజనాలయ్యాక చిన్ని నా బట్టలన్నీ సంచిలో సర్టేసింది. నాకిష్టమైన పిప్పరమెంట్లు నా జేబులో నింపింది. కొన్ని లడ్డు వుండలు కట్టింది. “వస్తూ వుంటావుగా అప్పుడప్పుడూ...” నేను తల ఊపాను... నాన్న సిద్ధమవడానికి ముందే నేను చెప్పులు కూడా వేసుకొని వాకిట్లోకి వచ్చి నిలబడ్డా... చిన్ని నన్ను గట్టిగా హత్తుకుంది. ముద్దులు పెట్టింది. నాన్న ఎక్కడ చూస్తాడోనని నేను సిగ్గుతో ఎర్రబడిపోయాను. నాన్న చెయ్యి పట్టుకొని నడవసాగాను. “నాన్న కాలువలో నీళ్లు పారుతున్నాయి కదా?” “నాన్న, చిన్న వంతెన మీద చేపలు పట్టడానికి వెళ్తాం, జెనా ?” “సురంగ్‌ ఇప్పుడు మనతో కలిసి వుంటుందా..?!” నాలో చాలా విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం పెరిగింది. నాన్న నవ్వుతూనే అన్నింటికీ జవాబులిస్తూ పోయాడు. బెందిత్‌ ఇంకా షిరీలకు చాలా, చాలా విషయాలు చెప్పాలి. జేబులో వున్న చింతకాయలు ఇవ్వాలి. ఇంటికి ఎప్పుడు చేరుకుంటామా? అని ఆతృతగా వుంది. ఆనందంతో బస్సు ఎక్కాను. బస్సు బయల్దేరింది. మాటలు చెబుతూ, చెబుతూ జేబులో చెయ్యి పెట్టి చూసాను. చిన్ని ఇచ్చిన పిప్పరమెంట్లు చేతికి తాకాయి. వెంటనే చిన్ని నాకు యాదికొచ్చింది. మామిడి చెట్టు దగ్గరికి రాగానే వెనక్కి తిరిగి చిన్నికి చెయ్యి ఊపుతూ పలకరించాలన్న విషయం మరిచిపోయాను. పూ...ర్తి...గా... మర్చిపోయాను......! షు (0 సు దొర... క్‌ ఇయ్యావ గ! (వ గాకా యయ లిరాంయళం రోం సహ, నహ తో స (త్రం ఖ ఉం వ. నగ న న.

. న. (|. | టో ఖగ వపేట్టల ప మ థల 1 ఒ; | న. న. లో హు! వ. న. ల వ! ధ్‌ 2 ను న కం మ. న. వ న 071 ల. మ! గ. పళ నం. రన్‌ గ్గే: (1 ర ్‌ ల స సగ లీ ర క (వన్‌ వంతల న న లు. + న స రని? టి హాన్‌ (1 న సలు! మే. 1 శః శ రన య్‌ మ. సన శ్రి , | సుషరతు కట మ! ఓంల్‌, | న. 1 య. | / ళీ! 1? పే న. మచ మ | స మ [2 ము వ మం య. ట్‌ పీ? క్ష ళ్ళ ఇ... మక క్‌ న. (1 టీ గ్‌ సః | ళన?! గ్‌ గ హద పు భా ర | మం (1, న క వ సు త క / సం న ల శ్‌ (1 [1 స స వ. ; న జ న్‌ స వ లమ లు (1 న స. మ . చ వ మ. న్‌ స .. .. 1 | మ! చల్‌. వి న = యు! వ న. న. వ . ” సు తెలంగొణ , రు 1