Telugu repati mukha chitram - anilvaranasi/indianlanguages GitHub Wiki

ళ |

చాంయలల€లముమురిత౦

ము గీ . ౧ || శ! . స్ట

| క - క్‌ త ౯ ౧/ 1 లే క ఫో! నస | |

| న. కన న్‌ త క వే న.

॥ - "| / క కో. టైం 1 క స్ట ఏ

ః/ ఆ జ న | / | న.

న్‌

వాల న త జే. క్‌ య. . ౧ ,. ॥ " బీ 4 (2 ఖ్‌ ట్‌ సతీ

_----=*ఉషఈ స్త్ర

ఖ్‌ | రప్‌టీ ముఖచిత్రం (కఐితా నంవ్రుటి జనప వరంర్దు గ్రపొత దాః సీ. నారాయణ లెడ్డి గారి డాళ్టుల్‌. జరం సుంచలరరావు | జాషువా సాంస్కృతిక సమితి | ఇంకొల్లు - 523 167. పకాశం జిల్లా. 1.

ఆస ర్రేనిద్‌ ముఖ చిక్రం కవితా సంపుటి డొ జరం సుందరరావు +. ప్రథమ ముద్రణ : డిసెంబరు - 2001. న లం ప గ శి ప్రతులు :1000.. లం న. ఓ ల్‌ క బార (0 ఇసి ముద్రణ : క న, డాన్‌ బోస్కో టెక్నికల్‌ స్కూల్‌ ప్రెస్‌, “ రింగు రోడ్డు గుంటూరు - 7. ఫోన్‌ : (0863) 350832. ఆస్ట ప్రతులకు : ట్య)

  1. డాః జరుబుల సతీష్‌బాబు యం.డియస్‌. (ఆర్జోడాన్షియా) సన కిరణ్‌ డెంటల్‌ శ్రినిక్‌ మ కొత్తపేట - గుంటూరు - 52 న్యు ఫోన్‌ :221 678 ష్రందరర కి దాల్చినా / ణి ల రా 1 క్‌ (| *, డా! బీర దర ॥ ౦య౧ుం రా (|. ల ఢా ట్ట ఛి తెలుగు లెక్చరర్‌ ఓ స ఇంకొల్లు = 523 1్ర్ర7, న్‌ హా - లో ఫోన్‌: 08594 - 44111. “దగర 044 [1 [నన్‌ [షు ము

ఖీ అంకితం ఖై వల్లిటూరులో ప్రభవించిన ప్రతిభామూర్తి “ప్రాచార్యూ ఫదవికి ఇన్ని తెచ్చిన ప్రవిమలకిర్తి గణిత శాస్రప్రారంగతులు అగణిత గుణగరిళ్టులు విలువలు తెలిసిన విద్యావేత్త మంచిని ప్రేమించే మానవతావాది సాహితీ ప్రియులు, సహృదయులు క శే; జరుబుల ఆంజనేయులు గారి దివ్యస్పృతికి “రేపటి ముఖచిత్రం” సగౌారనంగొ సమర్పితం.

కన్నీప్‌ ఠనత

అవును -

అంతా జరిగి పోయింది

అమృతం ఒలికి పోయింది

కిరణం మరణించింది

చీకటి వ్యాపించింది

గువ్వ ఎగిరి పోయింది

గూడు చెదిరి పోయింది

పువ్వులు వాడి పోయాయి

నవ్వులు మాడి పోయాయి.

అప్పటి దాకా మాట్లాడిన కంఠం అంతలోనే మూగ వోయింది అరక్షణంలో వార్తగా మిగిలి

ఆవరణ జనంతో మూగి పోయింది కళాశాలకు వెళ్లిన నిలువెత్తు రూపం కర్తవ్యం ముగించుకొని వస్తూ

కాళ్లు తడబడి నేలమీద ఒరిగి పోయింది కన్నీటి వీడ్కోలుతో అంతా జరిగి పోయింది. చిరునవ్వు చెదరని మీ రూపం

చిన్ని పాపాయిలా నిద్రపోయింది !

| అవన నత స రూ 4 వ ర తంయాన

పూల పొత్తిళ్ల మధ్య ఒత్తిగిలి

ప్రశాంతంగా ప్రయాణ మయ్యింది |]

మాష్టారూ |!

ఎదుటి మనిషిని ఏకవచనంతో

పలకరించే ఈ రోజుల్లో

బహు వచనానికి భాష్యం చెప్పే

మీ వ్యక్తిత్వం భాషకందనిది-

రండి మాష్టారూ ! అంటూ

గుండెల్టోని ఆత్మీయతతో

పండు వెన్నెల్లా పల్కరించే-మీ

నిండు మనస్సు ఎంతగొప్పుది.

మీరుపోయినా మీ బాట వుంది

మీరునాటిన చదువుల తోట వుంది

విద్యార్దుల గుండెల్లో నిత్యం (మోగే

మీ జ్ఞాపకాల పాట వుంది.

(ప్రతిభను (ప్రేమించే మీ హృదయానికి

'ప్రణామాలతో సమర్పిస్తున్నా నా కవితా పత్రం

భవిష్యత్తును కాంక్షించే నిండు మనసుకు

భక్తితో అంకిత మిస్తున్నా 'రేవటి ముఖ చిత్రం" ఇంకొల్లు గౌరవాభి నందనాలతో 01-12-2001 భవదీయుడు

= బీరం సుందరరావు

ఎమ కృతబ్దతాంబలి ఎప *ఫి నా ఊపిరి, ఉత్సాహం, ఉత్తేజం అన్నీ మా గురువు గారే! తమ పాద ముద్రల్లో నన్ను నడిపిస్తూ, కవిగా ఎదగాలని దీవిస్తూ వాత్సల్యపూరిత హృదయంతో శుభాశీస్సులు పలికిన పూజ్య గురుదేవులు, కనకాభిపిక్త జాతీయ కవివర్యులు డాక్టర్‌ నాగభైరవ కోటేశ్చరరావుగారికి- ద్ర పారకజన హృదయ పీరం మీదుగా “జ్ఞానపీరాన్ని” అధిష్టించిన మహాకవి, సాహితీ “విశ్చంభరు”లు, అభిమాన కవివర్యులు డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి గారికి = *సీ “నాన్నగారికి పుస్తకం ఆంకితమిస్తున్నాను”అని చెప్పగనే ఎంతో సంతోషించి, అవ్యాజమైన ఆప్యాయతతో అన్ని విధాల సహకరించి, అండగా నిలిచిన సహృదయులు, విఖ్యాతదంతవైద్య నిపుణులు డాక్టర్‌ జరుబుల సతీష్‌బాబు గారికి, వారి మాతృమూర్తి శ్రీమతి జరుబుల పుష్పావతి గారికి, కుటుంబ సభ్యులకు, డాక్టర్‌ ఈదర కృష్ణమూర్తిగారికి, శ్రీమతి కల్పనగారికి - అహా నా అభ్యుదయం కోరుకునే అమ్మా, నొన్నలకు, కుటుంబ సభ్యులకు, నా చిరునవ్వులసిరి భాగ్యలక్ష్మికి, చిరంజీవులు సాయిచంద్‌, గోపీచంద్‌లకు - "ఫీ దత్తప్తుత్రుడిగా నన్ను అభిమానిస్తూ, నా అభివృద్దిని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదించే ' మాతృమూర్తి, స్వాతంత్ర్యసమరయోధురాలు కొడాలి కమలమ్మగారికి -

క వుత్రవాత్సల్యంతో నన్ను 'అబ్బాయి' అని పిలుస్తూ ఆత్మీయతతో (ప్రేమామృతాన్ని కురిపించే అమ్మ, నాన్నలు (ప్రముఖ స్వాతం(త్య్య సమరయోధులు, మహాదాత, విద్యాభిమాని శ్రీ గోరంట్ల రామస్వామి సుశీలగార్లకు -

“ఫీ అత్మీయభాషణంలో అనురాగ వర్జాన్ని కురిపిస్తూ నడతలో, నవ్యతలో చెలం" గారికి చిరునామాగా భాసిస్తూ మా గుండెలపై “రాగనర్తన” చేసే సహృదయ, సాహితీ ప్రియంభావుకులు శ్రీ గొట్టిపాటి నరసింహస్వామి గారి సౌజన్య, సహకారాలకు -

“ఫీ సౌజన్యం, సౌహార్రం మూర్తీభవించిన సాహితీ సువ్రతులు డాక్టర్‌ మండువ

“ నరసింహారావు గౌరికి = $ నిలువెత్తు సహృదయతతో “వెన్నెల పువ్వు"గా విప్పారిన మా ప్రర.సం, సారధి ఇ న్పరిన మా (గ్ర

శ్రీ బి. హనుమారెడ్డి గారికి, *కవితా సరస్వతి' (శ్రీ. క. బాలకృష్ణా రెడ్డి గారికి-

"ఫ్‌ హర్షంతో అభిమానాన్ని వర్షించే ఆత్మీయులైన అన్నగారు డాక్టర్‌: భూసురపల్లి వెంకటేశ్చర్టు గారికి, జానపదుల గుండె చప్పుళ్ళకు భాష్యం చెప్పే అక్షరళిల్పి డాక్టర్‌ యు. దేవపాలన గారికి, నన్ను అభిమానించే “రమ్య శిల్పి” శ్రీ ఉల్చిగారికి, “అమ్మ ఒడి”కి అర్ధం చెప్పిన ఆత్మీయులు డాక్టర్‌ ధేనువకొండ శ్రీరామమూర్తిగారికి, హితైషి ఆర్‌.వియస్‌. భరద్వాజ గారికి, ప్రియసోదరులు (శ్రీ చేగిరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారికి, డార్టర్‌ సి.హెచ్‌. దాసయ్య గారికి, “అంకుర స్పర్భ” కవి శ్రీ కొండ్రెడ్డి గారికి, “మిత్రరత్నం”. సి.హెచ్‌: వెంకట రత్నం గారికి -

*ఫీ నా అభివృద్దిని ఆకాంక్షిస్తూ, నిరంతరం ప్రోత్సహించే మా కళాశాల యాజమాన్యం వారికి, అధ్యాపక సోదరులకు -

“ఫి నన్ను అభిమానించే “మైత్రి” మిత్రులు చిలుకూరి శ్రీనివాసరావు, వీరారెడ్డి, లక్ష్మీ నారాయణ, వెంకట్రామి రెడ్డి, నాగార్జున, సాంబశివరావు, వెంకటేళ్ళర్థు గార్లకు -

=ఫీ నన్ను అన్నగా అభిమానించే ఆత్మీయ సోదరులు (శ్రీ మంచికంటి, పొన్నూరి, కె యస్వీ, కరీముల్దా కెజె. రమేష్‌, (క్రోసూరి రవికుమార్‌, మల్లవరపు ప్రభాకర్‌ గార్ల సహృదయతకు -

"హీ చదరంగం సమాఖ్య పి.వి కృష్ణా రెడ్డి గారికి-

*ఫే పుస్తక్షప్రచురణకు ఆర్థిక సహాయమందిస్తూ కవులకు కల్పవృక్షంగా నిలుస్తున్న పొట్టి (శ్రీరాములు తెలుగు విశ్చవిద్యాలయం వారికి-

"1 కవితలు ప్రచురించిన వివిధ పత్రికలవారికి, ప్రసారం చేసిన 'ఆకాశవాణి' విజయవాడ, మార్కాపురం రేడియో కేంద్రాల వారికి-

=ఫ* అందంగా ముద్రించిన “డాన్‌బోస్కో టెక్నికల్‌ స్కూల్‌ (ప్రైన్‌” యాజమాన్యం వారికి ముఖ్యంగా ఫాదర్‌ జ్ఞాన ప్రకాశం గారికి, సిబ్బందికీ -

| “ఫీ నా మేలుకోరే శ్రేయోభిలాషులకు, కవిమిత్రులందరికీ - నా వృదయపూర్వక కృతజ్ఞతా నునూలు ననుర్చించుకుంటున్నాను. ఇంకొల్లు భవదీయుడు

25-12-2001 = బీరం సుందరరావు

ఎవతి యమునాచితల కు 13 ఎ తా కలం వందరాశతు,

. ముందుమాట కవిత్వం నా కన్నతల్లి ఏడుపొచ్చినా, నవ్వొచ్చినా అమ్మనే స్మరిస్తాను కవిత్వం నా బాల్యం సజీవ జ్ఞాపకాల్ని స్మరించుకుంటూ గాయాల పొత్తిళ్ళలో వి(శ్రమిస్తాను - కవిత్వం నాభాష ముఖమ్మీద చిరునవ్వుగా జీవితాన్ని ఆవిష్కరించుకుంటాను - కవిత్వం నాళ్యాస నిట్టూర్పు సైతం నిషేధమైనపుడు దుఃఖా(శ్రువునై (్రవిస్తాను. కవిత్త్సం నా ఆయుధం తల్లిభాషలో నన్నునేను ఆవిష్కరించుకునే “ముందుమాట కవిత్వం. 'రపటిదునా లల సర 1 ద రా చత.

రేవ్‌టి ముఖచిత్రం

మనకు తెలియకుండానే

కాలం కొత్త కలల్ని కంటుంది. రేపటి ముఖచి(త్రం

ఇవాల్టి వాస్తవంతో కరచాలనం చేస్తుంది. ఒకానొక హైటెక్‌ నాగరికత

బతుకు తెరమీద సైబర్‌నృత్యం చేస్తుంది. ఉగాదులూ-సం(క్రాంతులూ

కుండీల్లో పూలమొక్కల్లా కుంచించుక పోయి మరుగుజ్ఞులై మాయమవుతాయి. వేడుకలూ వినోదాలూ శుభకార్యాలూ అన్నీ ఆర్టిఫిషియల్‌ మంత్రాలతో

టి.వీ. తెరమీద తెల్దారిపోతాయి- పండగపూటయ్యినా దేవుడి ముందు కొట్టడానికి కొబ్బరికాయ దొరకదు-

కోనసీమ కొబ్బరితోటలు

కొన ఊపిరితో కొట్టుకొని నేలపొత్తిళ్ళల్లో నిద్రిస్తాయి. చేల్తన్సీ చేపల చెరువులవుతాయి. జీవితాలు గిలగిలా కొట్టుకుంటాయి. పలకలస్లానంలో ఫ్లాపీలు వస్తాయి.

అఆలుమా యమై

ఐ,టి.తోనే అక్షరా భ్యాసం- 1, అంతా డిజిటల్‌ విన్యాసం-

అంతటా కృత్రిమనటన

ఆప్యాయతలూ, అనురాగాలూ అంతరించిపోతాయి.

కంప్యూటర్లే కాపురాలు చేస్తాయి-

నవ్వులు కన్పించవు - పువ్వులు విప్పారవు. అంతంలేని బతుకు నాటకంలో

భరతవాక్యం వుండదు.

'ప్రతిబియ్యపు గెంజమీద

తనపేరును లిఖించుకున్న అన్నదాత

నాగేటి చాలులోనే ఆఖరిశ్వాస విడుస్తాడు. దుక్కి దున్నీ అలసి పోయిన బక్క ఎద్దు దిక్కులేని చావు చస్తుంది.

మేడి పట్టేవాడే లేనప్పుడు

నాగలి సైతం కొష్టంచూరులో దిగ

ఒకానొక్ష వర్షం రాత్రి

పాయ్యిలోకి దూకి ఆత్మహత్యచేసుకుంటుంది- కళ్ళముందే పంటకళ్ళం అదృశ్యమైనపుడు ఇళ్ళల్లో దూలాలకువేలాడేది విత్తనాలసంచులుకాదు- రైతుల శవాలు |!

-నేటినిజం (దినపత్రిక) ఉగాది సంచిక 2000 మార్చి. ||

మనుషులమై మొలకెత్తుదాం ! జీవితం ఇప్పుడు వ్యాపార కేంద్రమయింది. (ప్రేమలు పేగుబంధాలూ తెగిపోయి ఆప్యాయతలూ, అనురాగాలు పంచతంత్రం కధలై ప్రవహిస్తున్నాయి - బతుకు భరత వాక్యం లేని నాటకమైంది. అనుభవాలు అంకాలవుతున్నాయి

అంక (ప్రారంభంలో మొదలైన నటన ఆత్మవంచనతో ముగుస్తుంది -

వేదికల మీదేకాదు

నలుగురిలోనూ నమయవంచనతో

స్వార్ధం కత్తుల్ని దించుకుని

మనల్ని మనం తల్లకిందులుగా ప్రతిస్టించుకుంటున్నాం. అఖరి శ్వాసను నిలుపుకోవడానికి అ(గ్రిమెంట్టు రాసుకుంటున్నాం-

ఇప్పుడు ప్రతిమనిషీ ఒక మహానటుడు ప్రతివాడూ “బాలనాగమ్మ” మాయలఫకీరు మర్రిచెట్టుతొర్రలో చిలుకనేకాదు మారణాయుధాల బొడ్డులో మర్మాన్ని సైతం పసిగట్టగల బాలవర్జులున్నారు మనలో - యుద్ధం జరగకుండానే

రక్తపుటేరులు ప్రవహింపజేసే ధృతరా'ష్రులున్నారు మనలో-

గాయాలు కన్పించకుండానే

శరీరాన్ని నెత్తురుమయం చేసే మహాత్ములున్నారు- కరెన్సీ కట్టలతో

బతుకు వైశాల్యాన్ని కొలిచి సుఖసంతోషాల చతురస్రాలు నిర్మించుకునే మేధావులూవున్నారు - ఇవాళ బతుకు , కొల్లగొట్టబడిన బంజరు భూమి. ముఖచిత్రం లేని పుస్తకం.

కర్త కర్మ, క్రియ లేని వాక్యం,

రాగం అల్టుకోవాల్సిన చోట

రక్తం వెల్టువవుతుంది.

మమత పల్లవించాల్సిన చోట

మనసు చిల్లులు పడుతుంది.

రాత్రి నిద్రలో కలలుసైతం .

నెత్తురు భాషనే మాట్టాడుకుంటున్నాయి. దృశ్యాలు తరుముతుంటే

హృదయం పాదరసమై పారిపోతుంది. స్వార్థపుటెడారిలో

ఆవిరైపోయిన ఆత్మీయత

మళ్లీ మన మధ్య మొలకెత్తాలంటే (ప్రతివాడూ ఒక కరుణ మేఘం కావాలి. వాన చినుకుగా రాలాలి |

మబ్బులు దూది పింజల్లా

తేలి పోతుంటాయేతప్ప

కళ్ళుమాత్రం తుడుచుకోవు. కొండలమీద, బస్తీల

గుండెల మీద కురిసే మేఘాలు

కనిగిరి సీమను కనికరించవు. శతాబ్దాలుగా సాగుతున్న మానవేతిహాసంలో

రైతుకుమూ(త్రం

నేల చూపు తప్పడంలేదు.

చేలో విత్తనంగా మొలకెత్తడానికి

అతడు ఎన్నిసార్లు

మేఘాలముందు మోకరిల్టాడో? గట్టుమీద కూచొని

ఎన్నిసార్టు కన్నీళ్ళకాల్వగ ప్రవహించాడో? ఎంతకీ పగలని పత్తికాయనుచూసి ఎన్నిసార్హు గుండెకాయ పగిలి రోదించాడో? ఆర్నిల్లయినా

అంగుళంపెరగని పైరును చూసి అన్నదాత ఊపిరి

ఆశను వదులుకుంటుంది.

దూలానికి వేలాడే విత్తనాల సంచికి నెలలు నిండకుండానే + మళ్ళీ గర్భ 'ప్రావమవుతుంది-

ఎప్పుడూ ఇంతే!

ప్రకృతి ఆటలో మొదట అవుటయ్యేది ఆటతీరు తెలియని అమాయకరైతే 1 అనాదిగ అతడికి

మృగశిర ముసురుగురించో పునాసకు పండే పుట్టెడుగురించో తెలుసుగాని

కాలం కంప్యూటర్‌లో దాక్కుందని కొత్త చేతులు చేలోకి వస్తున్నాయని అతడికి తెలియదు పాపం!

నేలతల్లి ఆత్మీయ స్పర్శకోసం నేలచూపు చూసే అతడికి

ఇప్పటికీ గుడ్డినమ్మకం ఏరువాకరోజు

ఏడికర్రకు నమస్కరిస్తే

ఎడ్లజతను సింగారిస్తే

ఏడుపుట్టు పండుతాయని-

గాదెలు పుష్కలంగా నిండుతాయని; పాపం! అతడికి తెలియదు పాదాలకు పారాణి పెట్టాల్సిన చేతులు తలగుడ్డను తడుముతున్న సంగతి- పాపం! అతడికి తెలియదు

వానకీ రెండు ముఖాలుంటాయని అది అడవుల మీద, ఎడారుల మీద తప్ప ఆధారపడే చేలమీద కురవదని;

మట్టిలోంచి మొలకెత్తాల్సింది విత్తనాలే కాదు; మనుషులు కూడ | పరిమళించాల్సింది మట్టేకాదు మనిషి హృదయం కూడ | అందుకే- మనం మనుషులమై మొలకెత్తి జీవితాన్ని వ్యాఖ్యానం లేని పద్యంగా ఆవిష్కరించుకుందాం | ఆవిష్కరించుకుందాం 1!

  • నేటినిజం (దినపత్రిక) రిపబ్లిక్‌డే ప్రత్యేక సంచిక జనవరి - 2001 లు = య లొ పట్‌ ముతత నా 21 యలు తనాంరానా. గం, ర11

నంిచూవు

పండగ పూటకూడ

రైతుచూపు నేల మీదనే

ఆశలన్నీ ఆకాశం మీదనే !

ఆనకట్టల నోళ్ళు ఎండుతుంటే రైతులకళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి కురవని వర్షం కోసం

రోజుల్నీ, మాసాల్నీ లెక్కించే రైతులకు పంచాంగం పాతకాలపు

చాదస్తమని తేలిపోయింది. మరగుజ్ఞుగా మారిన మేడి

వాన కురవని వైనాన్ని ప్రశ్నిస్తోంది? మేఘాలు కురవాలంటే

ఇపుడు

వాయుగుండానికి దండం పెట్టుకోవాలి. కాస్తంత కనికరించమని

సము'ద్రుడికి అర్జీసమర్పించుకోవాలి ! అన్నదాత ఆశలన్నీ

అలలమీద లిఖించబడుతున్నపుడు ఉప్పు సముద్రం సైతం

ఉదాసీనత నటిస్తుంది.

ఊళ్ళన్నీ ఊర్ధ్వ ముఖంగా

చేతులెత్తి నమస్కరించినా సముద్రానికి పురుడురాదు.

పాపం! అతడికి తెలియదు నాగలిని ఓ పురావస్తువును చేసి తర తరాల భూమిస్వష్నాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్న అంతర్జాతీయ కుట్రగురించి- ఇపుడు రైతు నిరాయుధుడు రధం కుంగిన రాధేయుడు గిట్టబాటుధరల మాయాజూదంలో మళ్ళీ మళ్ళీ ఓడుతున్న ధర్మరాజు. సంక్రాంతి వస్తేచాలు ఇళ్ళ ముందు ధాన్యాన్ని ఆరబోయాల్సిన రైతులు అప్పుల్ని ఆరబోసి కన్నీటి ముగ్గుల్ని పెడుతున్నారు. కూడికలు తీసివేతలు తప్ప కూడబెట్టింది శూన్యమని తేలినా పాలం తల్లి పొత్తిళ్ళలోనే నిద్రిస్తానంటాడు. నేల మోసం చేయదని అతడి విశ్యాసం. మట్టి మనిషంత (క్రూరమైంది కాదని నమ్మకం. అందుకే కాబోలు అన్నీ పోయినా అమ్మ మట్టిని నమ్ముకుని ఆత్మాభిమానం చావని అతడు నాగేటి చాల్లోనే ఆఖరి శ్వాస విడుస్తాడు. (ఆకాశవాణి (విజయవాడ) లో ప్రసారితం సంక్రాంతి కవిసమ్మేళనం - 14-01-2001

బపహువచినంల

మట్టిలోపుట్టి

మట్టిలో పెరిగి

మట్టినే ఆరాధిస్తూ

మట్టి స్నానం చేసి

పసిడి రాశులు పండించే

అతడు ఏకవచనం కాడు. సూర్యోదయానికి ముందే నాగలితో భూమధ్యరేఖ గ్‌సి పిడికడు మెతుకులతో

జాతికి నైవేద్యం పెట్టే అతడు ఎప్పటికీ ఏకవచనం కాడు. ఆకుపచ్చదనాన్ని అలంకరించుకొని “పచ్చనాకు సాక్షిగా” పరవశించిపోయే అతడు ఏనాటికీ ఏకవచనం కాడు. పదవులకోసం ఎవరెన్ని

పలీలు కొటినా

ల న!

“వన్నెముక” లేని వాళ్ళు

“జాతి వెన్నుముక” ను అంతర్జాతీయ విపణిలో తాకట్టు పెట్టినా చెమటను ప్రేమించి

చెమటను పండించి

చెమట సిరిని జాతికి బహుకరించే

అతడిముందు ఎప్పటికీ

మీరంతా మరగుజ్ఞాలే |

హామీలతో బతుకుతూ

దేశానికి దరిద్రాన్ని బహుకరించే వాళ్ళు

అతడిముందు ఎప్పటికీ పిగ్మీలే !

అన్నదాత జాన్నత్యం గురించి

అర్భకులారా! మీకేంతెలుసు?

పిడికెడు గింజల్ని తీసుకొని

దేశమంతా వెదజల్లితే

అవి ఉద్యమాలై మొలకిత్తుతాయి.

మట్టిని ప్రేమించేవాడే

మనుషుల్ని (ప్రేమించగలడు.

మట్టి మొలకెత్తుతున్నంతకాలం

అతడి బతుకు నిత్యబహువచనం,.

న జ.

న.

వాల్‌ పోస్టల్లోడు అతడు ని(ద్రలేస్తూనే తుకతుక ఉడికే మైదా అవుతాడు. మంచందిగుతూనే పోస్టర్ల కట్టలతో బయలుదేరుతాడు. ఆతడి కరస్పర్శకోసం వీధుల్లో గోడలన్నీ ఎదురు చూస్తుంటాయి. సినిమా మారినప్పుడల్లా అతడి మొహం వాల్‌ పోస్టరై విప్పారు తుంది. రోడ్డమీద నడిచే వాళ్ళంతా అభిమాన తారల ప్రతిమల్ని చూసి ఉదయం ఆటకోసం ఉరకలు వేస్తారు. టిక్కెట్టు దొరకని వాళ్ళు మ్యాట్నీకోసం మకాం వేస్తారు. ఊరు ఊరంతా పోస్టరై ఊరేగిన అతడు ఉసూరు మంటూ ఓనరు వద్దకు వస్తాడు. కలెక్షన్‌డబ్బుతో కసరత్తు చేసే “ాసుల” పురుషోత్తముడు కొంచం ఆగరా అంటూ కసురు కుంటాడు. నిత్యం బతుకుసోపానాలు ఎక్కిదిగే వాడికి నిచ్చన లాగా నిరీక్షించడం కొత్తేమీ కాదు. అరకప్పు 'టితో ఆకలి వైశాల్యాన్ని కొలిచే అతడు

అన్నం ముద్ద కావడానికి అఆహర్చిశలూ (శ్రమిస్తూనే వుంటాడు. బొట్టుబొట్టుగా చెమటను పిండి సినిమా తారల చెంపలకు చల్లదనం పూస్తాడు. ఎండనక వాననక వీధి గోడకు పోస్టరై వేలాడే అతడు విషాద మేఘమై వి(శ్రమిస్తాడు. అక్కడ బాక్సాఫీసు బద్దలైనా ఇక్కడ వీడు చిరిగిన పోస్టరై రెపరెప గోడకు కొట్టుకుంటూనే వుంటాడు. ణ్‌ న్న (ఆకాశవాణి (విజయవాడ) లో ప్రసారితం) / టో 13-10-1998 /ఆఫటియుఖఛతం న సగం చు 27 మతా -భకంనుందరరాను

ఉప్పితిన్న మనుషులు గుప్పెడు ఉప్పును పిడికిలితో మంత్రించి సా(మ్రాజ్యవాదాన్ని సాగనంపిన చరిత మనది. ముఫష్టైమూడు కోట్ల జనానికి ఉప్పు ఊపిరై బానిస సంకెళ్ళు తెంచిన ఘనత మనది. ఉప్పు ఉప్పెనై సముద్రతీరాన్ని తాకగానే స్వేచ్చా వాయువులు పీల్చిన జాతిమనది, నాడు ఉప్పు ఓ చైతన్య శంఖారావం. ఓ సత్యాగ్రహ సమరజ్యాల. ఉప్పు దొంగల్ని తరిమికొట్టిన మనం ఇప్పుడు మన ఉప్పును మనం తినడమే పెద్ద నేరం. వాడెవడో డాలర్‌ రెక్కలతో ఎగిరి వచ్చి ఉప్పు కొరార్లమీద వాలుతుంటే నేలతల్లి హక్కును ప్రశ్నించిన వాళ్ళు దేశద్రోహులు. ముద్ద చద్దన్నంలోనో గుక్కెడు గంజిలోనో ఉప్పుగల్లయ్యేవాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకులు. ఎరివతి ముఖులితంగ మంచ స 28 ఎన ఎడ్వా జర్‌ నుందరరాను:

రూపాయల్ని రొళ్ళుకునే దొంగలు

ఉప్పును కుప్పచేసుకొని

బతుకుల్ని “అయొడైజ్లో' చేస్తామంటే

అడ్డుకున్న భూమి పుత్రుల్ని

అడ్డ గోలుగా కాల్సారు

ఉప్పుతిన్ల్న మనుషులు.

ఉప్పుతిన్న విశ్వాసాన్ని

ఊపిరి తీయడంతో తీర్చుకున్నారు.

ఉప్పునుకూడ

డబ్బుసంచిగా భావించే (ప్రభుత్వానికి

ఎవడి ఉప్పువాడు తినడమే నేరం.

మొన్న కాబ్బరి నిన్న టంగుటూరు

నేడు చినగంజాం

ఊరు ఏదైతేనేం

అక్కడ పొలాలమీద వీచేది

పైరగాలి కాదు ర్రేతాల గాలి.

తుపాకి ఏదైతేనేం

అది ఎక్కుపెట్టేది రైతుల గుండెలనే-

ఇవాళరైతు బతుకు

రక్షసిక్త రణక్షేత్రం.

చెమటోడ్చినా బతుకు గడవని

చిమ్మ చీకటి విషాద నేత్రం.

(ప్రకాశం జిల్లా చినగంజాంలో ఉప్ప రైతులపై పోలీసు కాల్పులకు నిరసనగా)

నడుస్తూనవుంటాను ణకు పసితనంలో దాగుడుమూతలాడిన తెలివితో నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావ్‌ - నువ్‌ నా ఉనికిని గుర్తించేలోగా నా పాట నేలంతా పాకిపోతుంది. నా గుండెను చీల్చుదామని తూటాలను ఎక్కుపెట్టేలోగా నేను వేలగుండెల్లో పల్లవిగా మారతాను. | నీ దగాకీ నీ దుర్మార్గానికీ బలైపోయిన కళ్లల్లోని కన్నీళ్లకోసం నా కాలి గజ్జెలు ఎంతగా రోదిస్తున్నాయో నీకేం తెలుసు? కోట్టాది జనం కళ్లల్లోని ఎరుపును నా ఒంటిమీద కంబళిగా కప్పుకున్నాను. నిన్ను నువ్వు వేలం వేసుకుంటున్నపుడు జనం పొలికేక నీకు పీలగొంతుగా విన్పిస్తుంది - నా ఉనికిని ప్రళ్నించే నువ్‌ నన్ను రెండుగా నరికినా వానపాములా రెండువైపులా నడుస్తుంటాను.

మోదుగులా విరబూసిన నేను రుధిర పతాకమై ఎగురుతూనే వుంటాను. (ప్రపంచంలో ఏభాషలోనైనా మనిషి మనిషే అవుతాడు - మనుషుల కన్నీళ్లతో చెమ్మగిల్లిన నేలమీద గుప్పెడు మట్టిలోంచి మొలకెత్తుతాను నేను. అంకురాన్ని మొండెంగా మార్చినా

హల! న! కొ ఆతి నాశిరస్సు దీపమై దారి చూపిస్తుంది. (ప్రజాగాయకుడు గద్దర్‌ కోసం) షం పాం లి

నేపథ్య సంగీతం!

అతడు పదునైన పాళీతో

(ప్రపంచాన్ని చుట్టివస్తాడు.

అక్షరాల అంతర్నీత్రంతో

వర్తమానాన్ని అభిముఖం చేస్తాడు.

కుర్చీల కుమ్ములాటలో

నేపధ్య సంగీతమై

కోర్టుహాలులో బోనవుతాడు.

మనిషికి-మనిషికీ మధ్యదూరాన్ని

మరింత దగ్గరచేసి

తెల్లవారక ముందే గుమ శం ముందు నిలబడతాడు. అసెంబ్లీ రగడనించి

అమెరికా సెనేట్‌ దాక

అక్షర ప్రపంచంలో విహరింపచేస్తాడు.

వీధుల్లో జనం బాంబులై పేలినపుడు

'పతాకళశీర్షిక గా ప్రత్యక్షమవుతాడు.

నగరంలోనో, [గ్రామంలోనో

హామీలు జనార్లవమైనపుడు

లారీలను వేడుకుంటూ వెళ్లి

వేదికముందు కలంగా మారతాడు.

దౌర్జన్యాలను, దుర్మార్గాలను

అవినీతిని, అన్యాయాన్ని బయట పెట్టినందుకు రాజకీయ పద్మహ్యాహంలో అభిమన్యుడవుతాడు. భుజం తట్టిన చేతులే

న ళా గ న

నిజం రాసినందుకు తుపాకులవుతాయి. చొక్కా గుండీలు ఊడిపోయి జేబులో పెన్ను కింద పడిపోతుంది- అప్పటిదాకా సూర్యుడి చుట్టూ తిరిగిన భూమి కొద్దిసేపు ఆగి రోడ్డుమీద మౌనం పాటిస్తుంది. ఇంతకాలం వర్తించని మేఘాన్ని నమ్ముకున్న పాపానికి భవిష్యత్తు భిక్షాపాత్రవుతుంది. (అక్షర యోధుడు గులాం రసూల్‌ కోసం)

  • ఆంధ్రభూమి (దిన పత్రిక) వసేసషము న ప్త జీ ష్‌ [1 సు వ్య // న. [1 గీ | క్‌ 0 ( 'గి వీ! | గ్ర ల్‌ గటి, దపా నత త న న రు 33 వా రా మారతాన. షె

రేపటి తరానికి ఇవాళ్సి పీరిటీగది! ఉదయించే సూర్యుడిమీద ఉమ్మేసి ఉజ్బల కాంతిని ఒడిసి పట్టాలనుకుంటున్నావ్‌. కొమ్మల్లో తొంగి చూసే అమాయకత్వంపై నిర్దాక్షిణ్యంగా నెత్తురు పులుముతున్నాన్‌. నీ అధికార దండాన్ని ప్రయోగిస్తూ పదముద్రల్ని సైతం నిషేదిస్తున్నావ్‌ - వాగ్దానం జనాకర్షక వస్తువైన నీకు నినాదం చౌకబారుగా కన్పిస్తుంది.

చిలక పలుకులకు అలవాటు పడ్డనీకు గుండె గీతాలు కరోరంగానే వుంటాయి. అద్దెకు తెచ్చుకున్న నీ పధకాలు

ఆకలి కేకల్ని ఆపలేక పోతున్నాయి - చెట్టుకు చెట్టు రాసుకుని

నిప్పులు పుట్టే అడవిలో

భుజం భుజం రాసుకుని

బందూకులు పేలుతున్నాయి.

బలగాల్ని మోహరించి భయపెట్టగలవేమోగాని

ఉగ్గుపాల బలాన్ని

ఉరితీయలేవు.

రాత్రికి రాత్రే పుట్టిన ఆలోచనతో

రగిలే నిప్పుకొండను ఆర్బలేవు.

నీ నిషేదాల బూచికి భయపడి / విషప్త్రవ కోయిల పాట ఆపదు. నీ బూట్ల చప్పుడుకు సలాం చేసి అడవిగుండె నీముందు మోకరిల్లదు - విప్లవ మంటే నీ కొళ్ళ కింద తివాచీకాదు నొప్పిలేకుండా నడచి వెళ్ళడానికి ఆ విష్షవమంటే నీయింట్లో “టామీ” కాదు ఊరింపు బిస్కట్ట్లకు తోక ఊపడానికి - విష్లైవమంటిే త్యాగాలతో తడిసిన చరిత్ర. చారికలు కట్టిన చెక్కిళ్ళమీద ఎగరేసిన చిగురాకుల జెండా |! బీడుభూములపై కురిసిన పోరాట మేఘం, రేపటి తరానికి ఇవాళ్టి పురిటిగది ! _ “అరుణతార' (చూసపత్రిక) మే - 1999 నం! ంచాాతమయనన్యన 36 వసత ళాల.

విన్ను విరిగిన కంకులు అన్నదాత మళ్ళీ మరణించాడు. దానకర్షుడు అధర్మ యుద్దంలో అసువులు పోగొట్టుకున్నాడు - తూటాలకు మాటలొచ్చి

అకృత్యంగా కాల్చి చంపితే

తలలు వాళ్ళింది రైతులు కాదు;

పచ్చని పొలాల్లో వరికంకులు - అధికారందే పైచేయి అయినపుడు అన్నం పెట్టే చేయి

అనాదిగా మోసగింప బడుతూనే వుంది. అధర్మ శాసనానిదే రాజ్యం అయినపుడు అన్నదాత ఆక్రోశం కొనసాగుతూనే వుంటుంది. కోండ్ర వేయాల్సిన కోటేరు

తూటాలకు బలైపోతే

పొలంలో వరివెన్నులు వెక్కివెక్కి ఏడ్చి విషాదంతో తలలు వాల్చాయి.

ఈ విషాద నాటకానికి

సూ(త్రధారు లెవరైనా కావచ్చు -

కాని కధానాయకుడు ప్రధమాంకంలోనే నెత్తురు కక్కుతూ నేల కొరిగాడు.

అది కాల్దరి కావచ్చు, కాళీపట్నం కావచ్చు, తుపాకు లెప్పుడూ

కట్టు కథలు చెబుతూనే వుంటాయి.

గుప్పెడు మెతుకుల్ని జాతికి నైవేద్యంగా పెట్టే అన్నదాతను బాయ్‌నెట్‌తో పైకి లేపే తూటాలు ఎన్‌కౌంటర్ల సీరియల్‌ను వల్లె వేస్తుంటాయి. బియ్యపు గింజలకు ('ప్రాణంపోసే రైతన్నలు చిరునామాలున్న వాళ్ళు శిరసెత్తుకుతిరిగే వాళ్ళు శిస్తులు కట్టేవాళ్ళు పస్తులు వుండేవాళ్ళు - చేయూత నివ్వాల్సిన శాసనం శిరోభారంగా మారితే అన్యాయమని అడిగారే తప్ప అసెంబ్లీని ముట్టడించలేదే? ఆదుకోండి! అని అరిచారే తప్ప అరాచకం సృష్టించలేదే? మరి రుధిరయజ్ఞం ఎందుకు జరిగినట్టు 9 క్యాలెండర్‌లో పన్నెండు నెలలూ కారుచీకటిని బహుకరించేవాళ్ళు కాలువలకు గండ్డ్లుపడితే కన్నెత్తి చూడని వాళ్ళు కష్టం విలువ తెలియని వాళ్ళు కంకులమీద వాలిన పిట్టలై సుంకును సుంకాలుగా తింటుంటే శపతచపమునత నమా 37 త తతనాంతంయాను.

కేకలు పెట్టడమే కర్షకులు చేసిన తప్పు -

ప్రాజెక్టులు తేవడం తెలియని 'ప్రభువులవారికి పన్నులు పెంచడమొక్కటే తెలుసు.

కట్టుకధలు చెప్పే చట్టానికి

లారీచార్జి ఒక్కటే తెలుసు.

జరగవలసిందంతా జరిగాక

చేయాల్సిదంతా చేశాక

అధికారం సానుభూతి వాక్యాలు

గోదాట్లో కలిసిన నల్లపూసల్ని

మళ్లీ గుప్పెట్లో 'ట్లలేవు -

ళా గ. ళు

ఎక్స్‌గ్రేషియా ఊరింపులు

నేలకొరిగిన రైతును (బ్రతికించలేవు -

ఇప్పుడు చెంపలేసుకొని

పిలాడికి పిప్పరమెంట్లు "పెటినటు

ల! న్‌ ల్‌ యలు

వాయిదాలవారీగా తీరువాను

తగ్గించి ఏం లాభం?

ఓ నా అధికారమా!

నేలతలిని నమ్ముకొని రూపాయల్ని ఎదపెట్తేంతుకు

క్‌ మ!

వ్యవసాయం వ్యాపారం కాదు -

అధికారమే వ్యాపారమైనపుడు

అన్నదాత బలిపశువుకాక ఏమవుతాడు?

(పుగోః జిల్లా 'కార్దరి' పోలీసు కాల్పుల్లో అసువులు బాసిన అన్నదాతల

కోసం అశ్రు నయనాలతో)

  • స్వతంత్ర వాణి - వార పత్రిక 24-11-1996

సైనికుడి సంతళం !

ఇప్పుడు మనం

మంచు పర్వతాలసాక్షిగా

వీరజవాన్‌ విశ్చనాధ్‌ను స్మరిద్దాం న వి.యస్‌. అధికాదికి

ఆ(ర్రంగా నివాళులర్పిద్దాం ఆ

మస్తాన్‌వలీ, మాలిక్‌సింగ్‌

భట్టాచార్య, పద్మఫణి, బాలయ్య, గోపయ్య శ్రీనివాస్‌ - ఎవరైతేనేం ?

దేశమాత నుదుటి దీపాలైన వారికి మనసారా కన్నీటి పుష్పాలు సమర్పిద్దాం ! ఇపుడు

సరిహద్దుల్లోని ట్రిగర్‌ మీదివేళ్ళు

చినారీ వృక్షాల్లా విరబూస్తున్నాయి. వీరజవాన్త కరచాలనం కోసం మంచుకొండలు మరగుజ్జులవుతున్నాయి. వీరమాతల కన్నీళ్ళతో తడిసిన శిఖరాలు సెలయేళ్సై కదిలిపోతున్నాయి -

రా! వీరుడా! రా

నీ పాదాలతో మమ్మల్ని ముద్దాడు - అంటూ అంబరచుంబిత పర్వతాలు ఆహ్వానం పలుకుతున్నాయి - కాలుమోపితే చాలు కత్తుల్లా కోసుకపోయే మంచుపెళ్ళలు

కరిగి కరిగి; కదిలి కదిలి

కర్తవ్యం బోధిస్తున్నాయి -

ఇపుడు దేశానికి కావల్సింది

క్రికెట్‌ మ్యానియా కాదు;

కార్షిల్‌ ఫోబియా -

వీరపూజ చేయాల్సింది

క్రికెట్‌ బ్యాటుకు కాదు;

కన్నతల్టుల కడుపు కోతకు -

విలువ కట్టాల్సింది

సిక్సర్లకూ, సెంచరీలకూ కాదు; శిరసువంచని సాహసానికి సరిహద్దుల్లో చిమ్ముతున్న రక్తానికి - అంగుష్ట మాత్రుడు

హద్దుమీరితే

సైనికుడు చూస్తూ వూరుకోడు - పిరికివాడు పళ్ళ బిగువుతో హుంకరిస్తే వీరుడు పలాయనం చిత్తగించడు - వీరుడు ఎవరి కాళ్ళ వద్దా మోకరిల్లడు. నెత్తురోడే పాదముద్రల్లో

నేల తల్లి గుండెల మీద సంతకమవుతూ సాగిపోతూనే వుంటాడు. వీరుణ్ణి ముక్కలుగా నరికినా వానపాములా రెండు వైపులా నడుస్తాడు. శత్రువు బుల్లెట్‌

పేగుల్ని చీల్చుకుంటూ వెళ్ళినా

వారసుల నుదుటి తిలకమై వెలుస్తాడు.

వీరుల “బతుకు పుస్తకం' చించేయడం

అంత తేలికకాదు -

దేశ సరిహద్దుల్లో దీపాలై

మనకు నిద్రను దానంచేసే వీరజవాన్లను గుండెపూలతో అభిషేకిద్దాం!

నరాల తీగల మీద

వారి స్కృతుల్ని శ్రుతులుగా పాడుకుందాం! మనల్ని మనం

యుద్దభూమిగా ఆవిష్కరించుకొని

జన చైతన్యపు చిరునామాగా మారుదాం!

వీరుల గుండె చప్పుళ్ళను

కోట్టగొంతుల కోరస్‌గా

పల్లవింపచేద్దాం! పల్లవింపచేద్దాం!

(కార్గిల్‌ అమరవీరులకు అక్షర నివాళి)

  • తెలుగు విద్యార్థి మాసపత్రిక ఆగష్టు - 1999

విరిగిన మగ్గం నువ్వు కిందపడగానే బొడ్డుకొస్తే పాత్తిగుడె నెత్తురు అదింది వాళ్ళు. న నో క్‌! టె బికారిగా తిరిగే నీకు జోలె కట్టింది వాళ్ళు. నీకు నువ్వే సన్మానమైనప్పుడు నీభుజం మీది శాలువా అయింది వాళ్ళు. నవ్యొచ్చినా, ఏడుపొచ్చినా ముఖం కప్పుకునేందుకు జేబులో చేతిగుడ్డ అయిందివాళ్ళు. నీకోసం జెండాలై, బ్యానర్లయినవాళ్ళు పోగు బంధాన్ని గుర్తుచేస్తూ పేగుల నూలుదండల్ని బహూకరిస్తున్నారు. జీవితమే మగ్గమయిన వాళ్ళకు వ(స్తదాన మొక్కటే తెలుసు, నరాలను ఆసుపోసి దారాలను తీయడమే తెలుసు. సిరిసిల్ల, చీరాల, జాండ్రపేట వెంకటగిరి, పొందూరుల్లో మగ్గం ముక్కలై పోతుంది దారం ఉరిపోసుకుంటుంది. దగాపడ్త తమ్ముళ్లు నలుగురూ (కా! న. విరిగిన మగ్గం బొమ్మగీసి (క్రింద “దేశం” అని రాస్తున్నారు.

  • విశాలాంధ్ర (దినపత్రిక 7-5-2001 అవవ నముతర తు 42 యా జాసరం నురథరరావ:

దగ్గ స్పష్నం నిద్రలేస్తూనే అలా ఒక్కసారి నా కవిత్వ భాండాగారాన్ని చూసుకుంటాను. సుగంధపరీమళంతో తన్మయత్వం చెందుతాను. నా అంతరాంతరాళాల్లో కొలువుతీరిన నా పుస్తకాలను ప్రతినిత్యం కంటి పాపలా చూసుకుంటాను. నా పుస్తకాలబీరువా ముఖచిత్రమై విప్పారగనే అక్షరాల్ని హృదయపీరంపై ముద్రించుకుంటాను. వీరువాలో పుస్తకం ముట్టుకుంటే ప్రపంచం చుట్టి వచ్చినంత పరవశం- ఎన్నో అనుభూతి సముద్రాల్ని -ఈదినంత ఆనందం - నదులు కలిసిన జలనిధిలా నా పుస్తకాల బీరువా ఓ జ్ఞాన ప్రపంచం ఓ చైతన్య శ్వాస ఓ అక్షర నిధి. నాకు తెలీకుండానే నా గుండె పొరలను చెదపురుగులు తినేశాయి- నా ఆలోచనలను సుగంధ భరితం చేసే సంపుటాలను అట్టలతో సహా కొరికేశాయి - వరుసలుగా పేర్చుకున్న కవిత్వాన్ని పట యమునా అతల న క ను 432. లా తరనంథతరరాన.

శీర్షికలతో సహా నమిలేశాయి -

నిన్నటిదాక నా పుస్తకాల బీరువా -

కొలువుదీరిన కవిసమ్మేళనం లావుండేది.

పసిడి నిండిన ధాన్యం గాదెలావుండేది.

పట్టు చీరె కట్టిన జాషువా పద్యంలా వుండేది.

చెలం వాక్యంలా

రీ శ్రీ కవిత్స్వంలా

సి.నారె. శైలిలా

“శ్ఞష్నన్‌” శేముషిలా

నాగభైరవ నవ్యతలా

గోపి నానీలా

రోజూ నాకో కొత్త ప్రపంచాన్ని

చూపించే పుస్తకాల పుటలు

బీరువాలోంచి అదృశ్యమైపోయాయి.

నా దుఃఖాశ్రువుల్ని తుడిచి

నిత్యం నన్నో మనిషిగా చేసే

నా అక్షరప్రపంచం శిధిలమైంది.

నన్నో శాపగ్రస్త అహల్యను చేసి

చెదలు నా శరీరమంతా పాకింది.

ఇపుడు నేను చాలా పేదవాణ్ణో . ఏమీ తెలియని పసివాణ్డి, స

  • ప్రకృతి సాహితి (మాసపత్రిక) 28-10-1998. ;

ఫాదర్‌ ఈజ్‌ యాన్‌ అన్‌ సంగ్‌ హీరో ! ఇప్పుడు నేను అమ థను గురించికాదు నాన్నను గురించి పాడుతున్నాను. నాన్న ఓ అన్‌ సంగ్‌ హీరో! కుటుంబ దేహానికి రక్తాన్ని మోసుకెళ్ళే ధమని నాన్న. బరువు బాధ్యతల ముఖచి(త్రమై బతుకు పుస్తకానికి భాష్యం చెప్పేవాడునాన్న. నాన్న ళు నమ్మకం ఓ కర్తవ్యం ఓ స్వర్గం ఓ దుర్గం. నాన్న అనుభవాల బడి. బాల్యం చెవిలో వూదిన బ్రహ్మోపదేశం. తన మట్టి గుండెల మీదుగా నడక నేర్పిన వాడు. కళ్ళ కిటికీ లోంచి లోకాన్ని చూపించినవాడు. బతుకు చెట్టుకు నాన్న తల్లివేరు. పంట చేలో సూర్యుడై ఉదయించే నాన్న లోకం ఉంగరంలో చెమట ముత్యమై మెరుస్తాడు. నల్లరేగళ్ళ నాగేటి చాల్లో నాన్న అన్నం ముద్ద మొలకెత్తుతాడు.

నాన్న నడిచేలో

మడవ తిప్పి మలిపింది నీళ్ళు కాదు మా భవితవ్యాన్ని =

నల్లరేగడి చాలులో

నాన్న ఎదబెట్టింది విత్తనాలు కాదు చెమట ధారల్ని ఆ

నాన్న వరివెన్నుల్ని నిమిరినప్త్పుడల్హా నన్ను వెన్నుతట్టిన ఉత్సాహం. సుంకు పట్టిన జొన్నకంకిని చూసి నాన్న మురిసిపోయేవాడు

“ఎదిగిన పంట” చేతికందుతుందని - పంటకళ్ళాన్ని చూసిన నాన్నకు (ప్రపంచాన్ని జయించినంత సంబరం. దరిద్ర నారాయణుల “ధర్మ ప్రభో” సంబోధనతో ఒళ్ళంతా పులకరింత !

ఆయుధం పట్టినవాడే కాదు

అన్నం పెట్టినవాడూ అలగ్జాండరే. దిక్కుల్ని జయించినవాడే కాదు దీనుల్ని ఆదుకునేవాడూ ధరాధిపుడే. బతుకు పూలతీగకు

నాన్న పందిరి.

అమ్మ కోపానికి

నాన్న ఓదార్పు.

గతాన్ని తలుచుకున్నప్పుడల్హా

నా చేతులకు నాన్న వాసనే తగుల్తుంది -

నాన్నను చూసినపుడల్లా

వంకెకు వేలాడే మువ్వల పట్టెడ గుర్తొస్తుంది.

కోడెగిత్తల నడక గుర్తొస్తుంది.

నడిచేలో నాగలి గుర్తొస్తుంది.

నాన్ను అనుభవం

నాగాయాలకు వెన్నపూస పూస్తుంది.

నాన్న ధైర్యం

నాకు వెన్నుపూసలా నిలుస్తుంది.

నేను పుస్తకమై విప్పారడానికి

నాన్న దధీచిలా

ఆత్మ విశాసపు ఎముకను దానం చేశాడు.

తన పాదము(ద్రల్లో దారి చూపించిన

నాన్న పాదాల వద్ద కృతజ్ఞతా పుష్వాన్నై

నిత్యం మొక్కుతూ చందాల గు

యా స

  • ప్రకృతిసాహితి (మాస పత్రిక) వ త 1

31-10-2000 క

జ,

నన్ను ఓదార్సేది నా సైకిలే! వేకువ చీకటి తెరలు వీడక ముందే

నా సైకిల్‌ అలారమై నన్ను ని(ద్రలేపుతుంది. రాత్రంతా విరహం అనుభవించిన సైకిల్‌ సీటు నాస్పర్శకోసం తహతహలాడుతుంది. గడియారం ముల్గు ఆరుమీదకు రాగానే ఆశ్చకుడిలా సైకిలెక్కి

"ఫెడల్‌ మీద కాలు పెడతాను.

అంతే 1

శరీరం దూది పింజలా గాలిలో తేలిపోతుంది. అలా బయలుదేరి

కూరగాయల మార్కెట్టుకో

కిరాణా కొట్టుకో పోతూవుంటే

స్వపష్నదృశ్యాలు దృశ్యకావ్వాలై

కళ్లముందు 'కధాకళి' చేస్తాయి.

జ్ఞాపకాలు చువ్వల్దా సుళ్టు తిరుగుతాయి.

పొగమంచును ఛేదిస్తూ

సైకిల్‌ పోతూనే వుంటుంది.

జరీపోగుల్దాంటి బాల్యస్కృతులు

సైకిల్‌తో పరుగెత్తుతాయి.

ఊళ్లో పిల్లలందరూ సైక్షిళ్లై ఊరేగుతుంటే

నాకళ్లు అద్దెస్టైకిల్‌ కోసం ఎంత ఆరాట పడ్డాయో !

అమ్మపైట కొంగు పావలాతో

మోజుపడి తెచ్చుకున్న సైకిల్‌

మాట వినకుండా ముళ్లకంపలోకి పోతూవుంటే

అమాయకంగా వెంటబడేవాణ్ణే !

పంకృర్లను చూసిన కొట్టువాడు

ఇంటికి రాగానే నాన్న యజ్ఞదత్తుడై

చెంప ఛెళ్లు మనిపించేవాడు.

అయినా ఇంటిముందుస్తెకిలాగితే చాలు

వీధుల్లో విశ్వరూపం ప్రదర్శించేవాణ్ణి !

సైకిల్‌లాగే కాలమూ గి(ర్రునతిరిగింది.

ఇవాళ సైకిలేకాదు

సొంతవస్తువులు చాలావున్నాయి.

సైకిల్‌లాగానే వాటినీ

(ప్రాణప్రదంగా చూసుకుంటాను.

ఉదయంనించి సాయం[త్రందాకా నాతోనే వుంటూ

నన్ను గమ్యం చేర్చే సైకిల్‌కు

ఏమైనా అయితే అమ్మలా బాధపడతాను.

ఎందుకంటే -

రిటైరైనరోజు ఇంటికి చేర్చి

నన్ను ఓదార్చేది నా సైకిలేగా !

(బాల్యంలో నాకు సైకిల్‌ నేర్పిన ఆత్మీయ బంధువు మన్నం ప్రసాదరావు కోసం)

  • యువకవిత (మాసపత్రిక) వార్షికోత్సవ ప్రత్యేక సంచిక తి

ట్ర్‌ జవాబులేని ప్రశ్న తనెవరో తనకే తెలియదు. తన బతుకు పుస్తకానికి ఎవరు “ముందుమాట” రాశారో అంతుబట్టదు. దయలేని ఈ లోకంలోకి ఎవరు విసిరేశారో అంతకన్నా తెలియదు. సాటి పిల్లలంతా తరగతి గదుల్లో పలకా, బలపమై ౧, పుస్తకంలో పేజీల్హా ఎగురుతుంటే తను మాత్రం చిత్తుకాగితాల పట్టగోతామై రోడ్డు వెంట ఎందుకు తిరగాలన్నదే (ప్రశ్న? పిల్లలందరూ మధ్యాహ్నం బాక్సులైనపుడు అమ్మలూ, ఆయాలు కొసరి కొసరి తినిపిస్తుంటే తను రోడ్డు మీద ఆకలై గుమ్మం ముందు చీదరింపై ఎంగిలి మెతుకులా ఎందుకు బతకాలో తెలియదు, కాఫీ కప్పుగా, పలకల పొడిగాపాగాకు ఘాటుగా, క్యారీముక్కరాయిగా, తారురోడ్డు మీద కంకరగా అమ్మ ఆత్మీయతకు దూరంగా అమ్మే తెలియని అమాయకత్వంగా ఏ తప్పుకు శిక్షగానో ఇక్కడ...... ! జవాబులేని ప్రశ్నగా ఇలా....... ! = ఆదివారం ఆంధ్రప్రభ 10-10-1993.

కాటేసిన ఠంటీపాప్‌

పేగుబంధం తెంచుకున్నాక

గొంతుకాయను

సొరకాయలా కోయడానికి

అరనిమిషం చాలు -

పోలేరమ్మ ముందు

మేకపోతును బలియిచ్చినట్టు

పసిపాపను చంపడానికి

మెషీన్లు ఎందుకు?

మనసు చంపుకుంటే చాలు -

వాళ్ళెవరైతేనేం

ఖచ్చితంగా కన్నవారే !

“వెన్నెల” గొంతుకోయడానికి

చీకట్లో నిద్రలేచినవాళ్ళు

ఎవరైతేనేం

వాళ్ళు ఇచ్చితంగా తల్లిదండ్రులే !

స్వప్నాల జరీపోగుల్ని తెంచి

ఉయ్యాల తొట్టెలోని భవిత్త భణ: ౮ం ర్యా

ఊపిరితీయడానికి, మ. గ. ల.

పాప పుణ్యం తెలియని ప్రన్‌ల్మనాన్ని .. ,

పాశవికంగా చంపడానికి, ష్య ప్ట్టై ష్ట్ర డో

కన్న పేగుకు కత్తితో పనిలేదు కసాయిగా మారితే చాలు - రూపాయి రాజ్యం చేసేచోట కంటిపాప గుడ్డిదై చంటిపాపను కాటేస్తుంది. దగాకోరు వ్యవస్థలో ఆర్టిక దుస్థితి ముందు అమ్మతనం ఓడిపోతుంది. అంగట్లో పూలదండ పాప పాలిట మృత్యు దండమవుతుంది. నిమ్మకాయ నిలువునా చీలి నిలువు గుడ్డు వేస్తుంది. గుండెకు హత్తుకోవలసిన మమకారాన్ని గుప్పెడు డబ్బులు కోసం గొంతుకోశాక బాలింతగుడ్డ బావురుమంటుంది. 'అమ్మ' పదానికి నిఘంటువుల్లో అర్హం మారుతుంది. తూర్పున ఉదయించిన సూర్యుడు అమ్మ పొత్తిళ్ళలో అస్తమిస్తాడు. (రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని తారామతి పేటలో కన్నకూతురు 'వెన్నెలిను కసాయిగా గొంతుకోసి చంపిన తల్లి దంద్రుల ఉదంతం” “వార్త” చదివాక) 26-8-1999

వాత్‌ శాసీనుడు

అక్కడ నిళ్చితార్జానికి

తాంబూలాలు సిద్దం కాగానే

ఇక్కడ పచారీ సరుకుల

పట్టిక తయారవుతుంది.

ముహూర్తానికి గడువు సమీపించే కొద్దీ వియ్యంకుల మనస్సుల్లో

ఆలోచనలు పెరగుతుంటాయి. చేతివేళ్ళమధ్య

జనం పంక్తిభోజనాలుగా మారతారు. విస్తళ్ళ లెక్కతో ప్రారంభమైన పట్టీ పిండివంటల లిస్టుతో ముగుస్తుంది. ముహూర్తానికి ముందురోజునుండే బంధువుల రాకతో

ఇల్లు పెళ్ళి పందిరవుతుంది. వంటమాష్టారు కాశయ్యకు కబురెళ్ళ్తుంది, జనం నాలుకల్ని కైవల్య వేదికలు చేసే కాశయ్య పలావుడేగిశాలా కదిలివస్తాడు. ఉల్లిపాయలు తరగడంతో (ప్రారంభమైన వంట వాళ్ళ ఉఛ్చ్వాస

ఉర్లగడ్డల పొట్టు తీయడంతో ఆగిపోతుంది.

జనం ఆకలిని పెరుగు పచ్చడిగ చేసి

రుచిని పలావుగ మారుస్తారు.

అన్నం రాశిముందు

కాశయ్య నైవేద్యం కాగానే

విస్తరాకులు ఒళ్ళు విరుచుకుంటాయి.

గుమాయించే గోంగూర

గుత్తి వంకాయ వేపుడు

జనం గుటకలుగా మారతాయి.

బంతి వెంట బంతి

సాగుతూనే వుంటుంది.

నాన బోసిన బియ్యం లోంచి

అన్నంగా మొలకెత్తే కాశయ్య

గొడి పొయ్యి మీద గుండిగై

గుండె లవిసేలా ఉడుకుతూనే వుంటాడు.

అలసి పోయిన కాశయ్యను

అన్నంతెడ్డు అమై శై లాలిస్తుంది.

ఊపిరిపీల్చుకుంటున్న కాశయ్యను

అంతలోనే బజ్జీల బాండీ పిలుస్తుంది.

అప్పుడాలు- ప్యాకెట్టు ప్యాకెట్టుగా చీలి

పిండిరుబ్బిన చేతుల్లో బొబ్బలవుతాయి. నై నం.

సాంబారులో గర్గిటై తిరిగే కాశయ్య-

చివరబంతిదాక నిలువుకాళ్ళమీద

కాగులా కాగిపోతూనే వుంటాడు.

చెమటల్గో స్నానం చేసి

నడికట్టు ఊడదీస్తాడు.

భోజనాలు ముగుస్తాయి.

బంధువులంతా భుక్తాయాసంతో త్రేన్చుతారు.

జనం వెళ్ళిపోతారు.

సన్నాయిమేళాలు సద్దుమణుగుతాయి.

వేలాది మంది నోట్లో

అన్నం ముద్దయిన కాశయ్య

చెమటను రూపాయిలుగా చూసుకుని

ఖాళీకడుపుతో ఇంటిదారి పడతాడు.

(వంటమాష్టారు కాశయ్య కోసం) 26-1-1999

క్రీస్తు మూడన రాకడ మరోసారి క్రీస్తు శిలువ ఎక్కాడు. నిలువునా నెత్తురోడుతూ గాయాలకు మందు రాసుకుంటున్నాడు, ఆరిపోతున్న కొవ్యాత్తులను చూచి “ఆమెన్‌” అంటున్నాడు. (ప్రవచనం పరీమళించాల్సినచోట పచ్చిరక్తం చిందుతుంది. సువార్త వినిపించాల్సిన మందిరాల్లో చేతి బాంబులు పేలుతున్నాయి. దిక్కుల్లో సర్వమానవ సమానత్వప్పు దీనారాలను చల్లిన “దీన్‌ ఇన్‌లాహి” అల్టా సాక్షిగా ఆక్రోశిస్తుంది. మక్కాలోని మహమ్మద్‌ గుండెల్లో మత దురహంకారపు కత్తులు దిగుతున్నాయి. ఖురాన్‌ ముఖచిత్రం మరకలు పడుతుంది. వాక్యం తప్ప మరే ఆయుధమూలేని శాంతిదూతల మీద దౌర్జన్యం సాగుతుంది. ఎత్తిన చేతుల మధ్య నమస్కారం తప్ప మరేమీ లేని ధార్మికుల మీద ధాష్టీకం పెరిగింది.

(ప్రభువును (ప్రార్ధించడమే తప్పయినపుడు

అంతరంగ భాషణమే తప్పు

అల్లాహో ! అనడమే అపరాధమైనపుడు

షు(క్రియ ఆలింగనమేతప్పు -

ఇవాళ

ప్రార్థనకు పోవాలంటే పోలీసుల పహారా !

నమాజు చేయాలంటే కర్ఫ్యూతో కాపలా !

ధ్వంసం చేయడానికి ఏమీ దొరకనపుడు

దేవాలయాలను ధ్వంసించుకుంటున్న

సమస్తమానవులారా !

మళ్ళీ వస్తానన్న (క్రీస్తు బహుశా రాడేమో !

బ|క్రీద్‌లు, (క్రిస్మస్‌లూ

నిఘంటువుల నెత్తురు పుటల్లో

అలా మిగిలి పోతాయేమో !

“ప్రయాస పడి భారమును మోసికొని పోవుచున్న

సమస్త జనులారా !”

మీరు నావద్దకు రాకండి

మీ చివరి శ్వాసనైనా మిగుల్చుకోండి !

“తండ్రీ ! వీరేమి చేయుచున్నారో

వీరెరుగరు కనుక క్షమింపుము”.

ఆమెన్‌ !

(ప్రార్ధనా మందిరాల్లో బాంబు పేలుళ్ళకు నిరసనగా) -నవజీవన్‌ (మాసపత్రిక)

డిసెంబరు - 2000

కొత్త దస్‌రా! దసరా వచ్చిందంటే చాలు మనుషులు మామూళ్ళవుతారు. జానెడు పొట్టకోసం పులి వేషాలై ఊరేగుతారు. అప్పటికప్పుడే ఆప్యాయతలు మొలకెత్తి మనుషుల మధ్య సరికొత్త సంబంధాలు (ప్రారంభమవుతాయి. ఎదుటి వాడి చూపు రూపాయి కాగానే మన చేయి జేబులోకి వెళ్తుంది. మనం వెళ్ళాల్సిన ద్వారం తెరుచుకుంటుంది. ఆమూల వైకుంరపురంలో అన్నీ డబ్బు సంబంధాలే ! మనల్ని చూడగానే ఆఫీసు సైలు ధనదాహంతో పరుగెత్తుకొస్తుంది. పచ్చనోటు ఆకుపచ్చ సంతకం కావడానికి పగలు టీస్టాళ్ళ దగ్గరో రాత్రికి రెస్టారెంట్‌ల వద్దనో కాలం కబుర్జుగా మారకతప్పుదు. దసరా వచ్చిందంటేచ్తాలు బడిపిల్లలు పుస్తకాల సంచుల్ని గిరవాటు కొడతారు. టి.వి. తెరకో, సి.డి. కాసెట్‌కో (క్రికట్‌ బ్యాట్‌కో అంకితమవుతారు. “ధరసింహాసనమై......” పద్యాలు చదువుతూ దండిగా పప్పు బెల్జ్లాలు అడగాల్సిన పిల్లలు నతతతావత్తనల- ఈ వసా నత తదా నారవంతాత

పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఎస్టైన్‌మెంట్టు, ఎమ్‌సెట్టూ తరుముతూ వుంటే దారి తెలియని బాటసారుల్లా దిక్కులు చూస్తున్నారు. బతుకు గాలిపటమైనపుడు ఆకాశంలోకి ఎగరెయ్యాల్సింది జీవితాన్నా ? భవితవ్వాన్నా ? ఐదువరహాలు అడిగే అయ్యవార్త తరం మారిపోయింది. ఇం[క్రిమెంట్ల మేష్టార్డు వచ్చాక పనిచేయకుండానే ప్రమోషన్గు వస్తున్నాయి. ఇప్పుడు పిల్లలకు నేర్చవలసింది చదువుకాదు - చేతి బాంబులు విసురుకోవడం. దిద్దించాల్సింది అక్షరాలు కాదు దొంగ ఓట్టు గుద్దే విధానం. రాజకీయం పదవి చుట్టూ పరి[భ్రమిస్తుంటే గాయపడ్డ నినాదం గొంతెత్తి అరుస్తుంది. దసరా వచ్చిందంటే చాలు అంతా ఒకటే సందడి. అటు పగటి వేషగాళ్ళు ఇటు పచ్చిగూండాలు వీధుల్లో వీరంగం వేస్తారు. మామూలు దసరాను ఇక మరచిపోండి. మామూళ్ళ దసరాను స్వాగతిద్దాంరండి, -నేటినిజం దినపత్రిక దసరా (ప్రత్యేక సంచిక - 2001

భరత్‌ వాళ్యం

“సెంటర్‌ (స్పెడోల సాలెగూళ్ళు

మన బాల్యాన్ని, యౌవనాన్ని చుట్టేస్తున్నాయి. "ఫైనల్‌ ఎట్రాక్షన్‌ ఫోటోలు

పర్సనల్‌ అల్బమ్‌లోకి జొరబడుతున్నాయి.

“సెక్స్‌ క్లినిక్‌'లు "సైకో”లు సరసశ్చంగార గాధలు- మనుషుల్ని ఆడమ్‌ - ఈవ్‌లుగా మార్చేస్తున్నాయి. దిగుమతి భావాలు నిద్రమాత్రలై

మెదళ్ళకు మత్తెక్కిస్తున్నాయి.

“కైం - సస్పెన్స్‌ - ఫాంటసీ (ధ్రిల్లర్జు

మన నరాల గుర్రాలపై స్వారీ చేస్తున్నాయి ! పాలకోసం ఏడ్చే పసిబిడ్డ

తల్లిరొమ్ముని తాకడం కూడా

మల్టీకలర్‌ చిత్రమై కొందర్ని ఊరిస్తున్నపుడు - “య'త్ర నార్యస్తు పూజ్యంతే” దేశంలో

'బ్యాక్‌కవరో శృంగారం బరితెగిస్తున్నప్పుడు -

బ్లో ఆప్‌లూ, క్టోజప్‌ల పోస్టర్టు

మాన విక్రయ - కామోద్దీపిత కేందద్రాలైనప్పుడు - అశ్తీలమంటూ అరిచేవాళ్లు

దోషులుగానే కన్పిస్తారు మరి !

“అక్షరం” వ్యాపారమైనపుడు -

బాధపడే వాళ్ళంతా, భాష తెలియని వాళ్ళవుతారు.

భావ దరిద్రులుగా కన్పిస్తారు ! బెడ్‌ కాఫీలోనూ అశ్రీలతను సిప్‌ చేసేవాళ్ళకు తల్లీ - చెల్లి తేడా తెలియదు. ఆధునిక భారతంలో అత్యాచార పర్వాన్ని లిఖిస్తున్న అభినవ కీచకులు వీళ్ళు ! చీరకు బదులు సినిమారీలును ఒంటికిచుట్టి “కళాత్మాక దృశ్యం” గా అంగాంగాలను ఆవిష్కరిస్తున్న జాయపసేనానులు వీళ్లు ! సంతాన “నిరోధ్‌” క నినాదాన్ని సైతం కామాన్ని రెచ్చగొట్టే “కండోమ్‌” గా మార్చే వాళ్ళు ఈ దుష్ట సంస్కృతికి పాకుడురాళ్ళు | అరాచక వ్యవస్థకి తార్పుడుగాళ్ళు ! ॥ అందుకే....... పొంగిపొర్లే మురికి భావాల కాల్వలు ఇళ్ళను - ఊళ్ళను ముంచెత్తక ముందే, “సెంటర్‌ స్పైడ్‌ సెన్సేషన్ల” సుడిగుండాల్లో భవిష్యత్తు బుగ్గిపాలుకాక ముందే ఈ దుష్ట సంస్కృతికి భరతవాక్యం పలకాలి. నైతిక విష్టవానికి నాందీ గీతం పాడాలి.

  • నైతిక విప్లవం (మాసపత్రిక) ఆగష్టు 1992

మెఖల! ఓ మేఖలా! ధర్మేచ, అర్దేచ, కామేచ, మోక్షేచ వేదమంత్రాలు “నాతిచరామి” అంటూ సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ సాక్షిగా ఘఫోషించాయి. పుట్టింటి పేదరికం

అత్తింటి ఆరడులు

మరో 'పుణ్యవతి' ని పొట్టన పెట్టుకున్నాయి. ఆడపిల్లగా పుట్టిన పాపానికి

వెండిపళ్ళెం సాక్షిగా

నిండు నూరేళ్ల జీవితకావ్యం

మొదటి ఆశ్వ్యాసంలోనే ముగిసిపోయింది. కొంగుముడి వేసుకొని

నడచిన ఏడడుగుల 'సప్తపది"

మృత్యు నగరానికి మహాప్రన్ధానమయింది. కొడుకునుకన్న తల్లి ధనదాహానికి ఆకారం లేకుండా నిద్రిస్తున్న నెత్తురుముద్ద మూడు నెలలు నిండకుండానే ముక్కలయింది, కాసులకోసం

కానుకల కోసం

పుట్టింటికి - అత్తింటికీ

అనాదిగా యుద్దం సాగుతూనే వుంది.

అత్తలు శివతాండవం చేస్తున్సంతకాలం ఓ మేఖల, ఓపార్వతి, ఓ బీనాల బతుకు పుస్తకాలకు చావు 'ముందు మాటి రాస్తుంది. -ఈ 'పశువుల సంత' సాగినంతకాలం పేగుబంధం వరకట్న హోమంలో సమిధగా మండుతుంది. ఎదిగిన కూతుళ్ళున్న ఓఒ నాతల్టులారా ! కర్మ సిద్దాంతం వల్లిన్తారెందుకు ? కోటి గొంతుల కొత్త పల్లవిని అందుకొని కొత్త చరిత్రకు పురుడు పోయండి. (వరకట్నపు అగ్నికీలల్లో సమిథగా నూరిన మేఖల మరణవార్తను చదివాక) _ ఆంధ్రభూమి దిన పత్రిక 5-7-1993 న. /] నానా. స న (షి స్టా ఛి

పరాధీనత సూర్యుడి చుట్టూ తిరగాల్సిన భూమి ఇపుడు డాలర్‌ చుట్టూ తిరుగుతుంది. ఇంట్లో జరగాల్సిన పండగలు ఇంటర్నెట్‌లో జరుగుతున్నాయి. కన్నతల్లి ప్రేమ సైతం కంప్యూటరైజ్‌డ్‌ అయిపోయింది. బతుకు కొలువులో ఉదయం పదిని సాయంత్రం ఐదును చూపించే గడియారాలమయ్యాక మనకు అనుభవాలుండవ్‌. అనుభూతులూ మిగలవ్‌ - పిల్లలు పుస్తకాలుగా మారి పరుగెత్తే యూనిఫాంలవుతుంటే మనకళ్ళు కాల యవనికమీద సైబర్‌ కలల్నికంటున్నాయి. ఇపుడు భార్యాభర్తలుగా బతకడం ఓ సామాజిక ఒడంబడిక - ఎవరి రూపాయి వాళ్ళదే ! జీవితం వ్యాపార కేంద్రమైనపుడు

బతుకు భరతవాక్యం లేని నాటకమవుతుంది. ప్రతి అంకం ఆత్మవంచనతో ముగుస్తుంది. మనుషులు బజారులో వేలం వస్తువులై ప్తాస్టిక్‌ పూలగుత్తుల్లా వేలాడుతున్నారు. బలవంతపు నవ్వుని ముఖంమీద పులుముకుని ధృతరా(ష్ష్రుల్లా నటిస్తున్నారు. కాంతిదీపం కావాల్సిన మనిషి కరచాలనాన్ని కూడా ద్వేషిస్తున్నాడు. మాట్టాడాల్సిన మనిషి మూగవాడయిపోతున్నాడు. రేపటి స్వర్గం కోసం ఇవాళ్చి సుఖాన్ని నిషేధించుకుంటున్నాడు. ఎవరో వెలిగించిన దీపస్తంభంలా పతనం అంచున పరాధీనుడై నడుస్తున్నాడు - ఇవాళ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి మనిషే లేడు.

  • విశాలాంధ్ర - దిన పత్రిక 2-7-2001 న న

చిటారు కొమ్మని మిఠాయి పొట్లం అమ్మా ఆవూ ఏవండీ? మమ్మీ, డాడీ నడగండి- ఇల్లూ ఈగను వెతకండి ఇంగిలీషునే గతకండి. ఉడుతా, ఊయెల ఏమాయె ? ఉగ్గుపాలతో అవిపోయె - కమ్మని కధలూ ఎటుపోయె ? అమ్మకు కూడా రావాయె | ఎక్కాలన్నీ చెబుతారా ? చక్కని సామెత వింటారా ? ఎక్కాలంటే వెక్కిళ్ళు | సామెత కేమొ సంకెళ్లు ! 1 ఒకటో తరగతి చదివే దెవరు ? ఓనమాలూ చెప్పేదెవరు భ్గి అ ఆ ఇ ఈ అన్నీ పోయె ! ఆంగ మొక్కటే దిక్కాయె ! ! పలకా బలపం పట్టిదెవరూ ళా బంతులు వరుసగ దిద్దే దెవరు ? ఫ్లాపీలే మనపంతుళ్ళ్లాయె! కంప్యూటర్తో కసరత్తాయె! తరగతి చదువుకు (గ్రహచారం తాతల తెలివికి అపచారం చ న డన

జీరో తోనే (శ్రీకారం కే.జీ. చదువులె మమకారం. పంచా, చొక్కా ఏదయ్యా? ఫ్యాంటూ, షర్టూ చూడయ్యా- తెలుగు పద్యాలే రావయ్యా? ఇంగ్రీష్‌ “రైమ్సే” ముద్దయ్యా! “బాలళిక్షోలూ లేవాయె “పెద్ద”లకే అవి రావాయ సిలబస్‌ లేవో వచ్చాయి చిక్కులు ఎన్నో తెచ్చాయి “తెలుగు వాచకా” లే పోయాయి తెలియని రీడర్పొచ్చాయి పిల్లల వీపున సంచీలు భారం పెరిగిన బెంచీలు - బందిఖానాలే మన స్కూళ్ళూ బందీలేగా మన పిలగాళ్ళు చదువే చదువు రేబవళ్ళు శ్మశానాలు మనలోగిళ్ళు- రోజులు మారీపోయాయి ఫీజులు బాగా పెరిగాయి పిల్లల చదువూ ఇవ్వాళ చిటారు కొమ్మన మిరాయి పొట్టం. -నేటినిజం (దినపత్రిక) -విద్యావిషయ (ప్రత్యేకసంచిక జూన్‌ - 2000

నామినేషన్ల రోజు ఉన్నట్టుండి జనమంతా వాహనాలవుతారు. 'ప్రశాంతంగావున్న వీధులు నినాదాలహోరుతో కూడలి వద్దకు పరుగెత్తుతాయి. కిరాయి జనం జిందాబాద్‌లు బాణాసంచాలై మార్మోగుతాయి = కూడికలూ తీసివేతలూ ముగిశాక జాబితాలోంచి బయట పడ్డవాడు అచ్చు పత్రం మీద సంతకం అవుతాడు. అప్పటిదాక జేకొట్టిన నోళ్ళు ఎగురుతున్న జెండాలు కాస్తంత సేద తీర్చుకుంటాయి. అభ్యర్థిపేరును ఇద్దరు 'బల' పరుస్తారు. ఊపిరి బిగపట్టిన అధికారులు నిట్టూరుస్తారు. ముఖద్వారం మందహాసం చిందించగానే వీధులు వేదిక లవుతాయి. లౌడ్‌ స్పీకర్లకు వాంతులవుతాయి. ఊరంతా ఒకటే సందడి ఎటుచూసినా హడావిడి కాకులు అరవడానికి రుతువుతో పనేముంది? అచసుసుపాన న జంతు రా ద!

తప్ప్‌ల సీజన్‌

అలా వాకిట్టోకి వచ్చిందో లేదో వసంతం వలస పోయింది.

గూళ్లు వదిలిన కాకులన్నీ టేప్‌రికార్లర్హై అరుస్తాయి.

ఐదేళ్ల స్వేచ్చను

దొంగిలించిన వాళ్లు

పధకాల్ని భూజాన వేసుకొని

(ప్రచార రధాలపై పర్యటనకు వస్తారు. బతుకుల్ని సరళీకృతం చేస్తామని సంపన్న దేశాలముందు

సరళరేఖలై మోకరిల్లినవాళ్ళు - చిక్కిపోయిన రూపాయి బిళ్ళతో అచ్చు - బొమ్మ ఆడుకునే వాళ్ళు - మళ్లీ మనముందుకు వస్తారు. కప్పల సీజన్‌ రాగానే

తక్కెడ బంధువులతో బరువెక్కుతుంది. చూపు టెక్కెట్‌ వేపు మొగ్గగానే కొసరు కోసం కాచుకున్న కప్పలన్నీ

ఏదో ఒక చెరువులో దూకుతాయి. అప్పటిదాక ఉద్విగ్నంగా ఎగిరిన ఉభయచరాలన్నీ ఉసూరు మంటూ ఊళ్లకు బయలు దేరుతాయి. ఓట్ల గద్దలు చ క కే నియోజకవర్గాల కోడిపిల్లల కోసం 'బి' ఫారం చుట్టూ గిరికీలు కొడతాయి. తల్పికోడి పొదిగిన టికెట్లను ళా ళా తస శ్రైదీయులు తన్నుకుపోగానే అస్మదీయులంతా అంగలారుస్తూ ఎదురింట్లోకి పోయి వీరంగం వేస్తారు. | బెదిరింపులూ బహిష్కరణలూ ముగిశాక అభ్యర్జులంతా కరువు మేఘాల్హా కమ్ముకొస్తారు. గజకర్ణ గోకర్ల విద్యలన్నీ ప్రదర్శించి హామీల కాకి రెట్టల్ని మన చూపుడు వేళ్ళ మీద జార విడుస్తారు. యాస్టాచ్టాటాల్టు

నాగలితో నమస్కారం ! ఇపుడు

రైతుకు జరుగుతున్న అన్యాయం గురించే నేను ప్రళ్నిస్తున్నా ?

మేడిని మాయం చేయాలనుకుంటున్న అంతర్జాతీయ కుట్రను

బట్టబయలు చేయాలనుకుంటున్నా ! యాభై ఏళ్లుగా చూస్తున్నా -

ఆగష్టు పదిహేనులూ,

రిపబ్లిక్‌డేలూ వస్తున్నాయి; పోతున్నాయి - సంబరాలు చేసుకుంటున్నాం.

సాధించిన దాన్ని భూతద్దంలో చూసుకుంటున్నాం. చంకలు కొట్టుకుంటున్నాం.

నాకు తెలీక అడుగుతున్నా రాజ్యాంగంలో ఏ అధికరణం

రైతును గుర్తించిందో చెప్పండి ?

ఏ ఆదేశ సూత్రం అన్నదాతకు రాయితీలు ప్రకటించిందో చూపండి ? ('ప్రకరణాలకేం ?

పంచతం[త్రంలా పరుచుకున్నాయి. జరుగుతున్నదంతా పచ్చి కుతంత్రం-

రైతును నిరాయుధుణ్జిచేసి

పక్కా బికారిగా మార్చి

"పై పంచను కూడ మాయం చేస్తున్న

రాజకీయ జూదగాళ్లనే నేను ప్రళ్నిస్తున్నా ! ఇవాళ ఊళ్ళు భిక్షాపాత్రలుగా మారి

బస్తీకి వలసపోయి బావురుమంటున్నాయి. పిండిన పాలను పట్నాలకు పంపి

గుక్కెడు నీళ్లకోసం గొంతెండి అరుస్తున్నాయి. దేశానికి వెన్నెముక కావాల్సిన రైతు

ఇపుడు ఆఖరిశ్వాస పీలుస్తున్నాడు.

పచ్చనిచేలో పడగలెత్తాల్సిన రైతు

పత్తిదారమై వేలాడుతున్నాడు.

ప్రతిదాన్నీ ఎక్స్‌(గ్రషియాతో కొలిచే వాళ్లు "హైటెక్‌ డ్రామాలో ఆఖరి అంకం ముగిస్తారు. దూదిపింజ అస్తిపంజరంగా ఎందుకు మారిందో కంప్యూటర్లకేం తెలుసు?

ఆఫీసర్ల కాకి లెక్కలకేం తెలుసు ? దగారాజ్యంలో ధాన్యం రాశులు

కళ్లముందే కదిలి పోతున్నపుడు

ప్రతి బియ్యం గింజమీద

తన పేరును లిఖించుకున్నరైతు

అన్యాయాన్ని చూసి ఆక్రోశించక ఏం చేస్తాడు ?

తల 2 వరయ తతంతతాళతాతానో

ఇపుడు నా ఆవేదనంతా

చేలో ఇంకిపోయిన చెమట చుక్క గురించే -

నా ఆలోచనంతా

పిడికిళ్లు బిగించాల్సిన కొడవళ్ళ గురించే -

నా కవిత్వమంతా

ఆకలి పేగులకు అన్నం పెట్టే

ఆకుపచ్చని తలపాగా గురించే -

కవుల అక్షరాలు

ప్రజాక్షేత్రాల్లో ఉద్యమాలై మొలకెత్తినపుడు

కవుల కలాలు

గళాలెత్తి అభ్యుదయ గీతాలు పాడినపుడు -

నాగలికి కట్టిన జాతీయ జెండా

ఎర్రకోట మీద గర్వంగా ఎగిరినపుడు

రైతు సర్వ స్వతంత్రంగా బతికినపుడు

నాగలికి నమస్కరిస్తాను.

గణతంత్రాన్ని గౌరవిస్తాను.

మళ్లీ జన్మంటూ ఉంటే

నాగలిగానే జన్మిస్తాను. *'నేటి నిజం' దినపత్రిక గణతం(త్రదినోత్సవ (ప్రత్యేక సంచిక జనవరి - 2001

ఆపతి మపఖాలితం రు 73 టాడు బరరానుగదరరాన

అమ్మకుండ ఒక కల చెదిరి పోయింది

ఒక కధముగిసి పోయింది

ఒక 'స్వష్నం కరిగి పోయింది

ఒక స్వర్గం కదలి పోయింది.

యాఖై ఏళ్ళుగా అపురూపంగా పెంచుకున్న ఫలభరిత వృక్షం నిలువునా కూలిపోయింది. అవిభాజ్యంగా సాగిన నిండు కుటుంబం నిలువునా చీలిపోయింది.

కళ్ళముందే నోటిదగ్గరి

అమృత భాండం ఒలికి పోయింది. పదిమందికీ ఒకే చోటపంక్తి భోజనంలా అన్నం పెట్టిన అమ్మకుండ

రెండుగా పగిలిపోయింది.

తండ్రి దశరధుడైతే

రామలక్ష్మణుల్లా నలుగురు సోదరులు తండ్రి పాండురాజు అనుకుంటే

పంచ పాండవుల్లా ఐదుగురు -

అంతా కలసి పండంటికాపురం ఆత్మీయతకు గుడి గోపురం. అన్నదమ్ములం కలసి కబుర్జాడుతూ

హాయిగా మజ్జిగ బువ్వ తాగినా అమృతం తాగినంత ఆనందం - మధ్యాహ్నం

జొన్న సంకటి కుండ కడిగే ముందు మాడు చెక్కలు తింటుంటే

మధురాతి మధురమైన రుచి - పండక్కో, పబ్బానికో సన్నన్నం తింటుంటే సామ్రాజ్యాన్ని జయించినంత సంతోషం. పెళ్ళికో, పేరంటానికో అందరం కలిస్తే _ అలంకార లంకలా వుండేది ఇల్టు,

పిల్దా పాపా తిరుగుతుంటే

సింగరకొండ తిరునాళ్లయ్యేది యిల్టు. పుట్టి, బుద్దెరిగినప్పటి నుండి

నాన్నంటే భయం ! భక్తి! గౌరవం ! ఇనబింబంలాంటి

ఇంటి పెద్ద ఏల్చడి కింద సాగిన ఇల్టు అద్దంలా భళ్ళున పగిలిపోయి ఐదు ముక్కలయింది. ఇం(ద్ర ధనుస్సులాంటి ఇల్టు

ఇరుకు మనుషుల రాకతో ఏడురంగులుగా విడిపోయింది.

త్యాగం తప్ప భోగం తెలియని నాన్న చాకిరి తప్ప సౌఖ్యం తెలియని అమ్మ

భరతుడిలాంటి చిన్నాన్న సుమిత్రలాంటి చిన్నమ్మ వేరుబడ్డ కొడుకుల్ని చూసి దుఖాన్ని దిగమింగుకున్నారు. అక్క వెక్కి వెక్కి ఏడ్చింది. బావగారు బావురుమన్నారు, మమ్మల్ని పెంచి, పెద్దచేసి బతుకునిచ్చిన ఉమ్మడి కుటుంబమా |! యాబై ఏళ్ళ నీ పెత్తనంలో ఎన్ని పెళ్ళిళ్ళు ! ఎన్ని పురుళ్ళు ! ఎన్ని పండుగలు ! ఎంత ఆనందం |! ఎంత కలివిడి 1 అమ్మకుండతో రుణం తీరిపోయింది. పంట కల్లం లాంటి యిల్టు పగిలి నెరైలు కొట్టింది. విడిపోయిన తమ్ముళ్ళు సడిపోయిన వేపచెట్టె ఏడిక[ర్రను దీనంగాచూస్తూ ఏడుపును దిగమింగుకుంటున్నారు. (యాబైఏళ్ళ ఉమ్మడి కుటుంబం రుణం తీరిపోయినందుకు బాధాతప్త హృదయంతో)

10-11-1997

వ్యాదయ భాష్‌ రండి! మిత్రులారా! రండి! హృదయాలతో మాట్లాడుకుందాం రండి. ఇంతకాలం తరువాత కలుసుకున్న మనం కాస్తంత మనసువిప్పి మాట్లాడుకుందాం రండి ! మూగవోయిన హృదయ తంత్రులను మీటి సరికొత్త స్నేహరాగాలను పాడుదాం రండి | మూసుకుపోయిన మనసు ద్యారాలను తెరిచి పసిలోకంలో విహరిద్దాం రండి.

మనసు పొరచుట్టూ కప్పుకున్న ఆచ్చాదనలన్నీ తొలగించి

మాటల మం(త్రనగరికి పోదాం రండి 1! మాటల్తో మౌన ప్రపంచాన్ని

బద్దలు కొడదాం రండి |!

మాట్లాడటమే నేరమైన లోకంలో

మాటను మరింత పదునెక్కిద్దాం రండి. మనిషిని జయించాల్సింది

మోసంతో కాదని

మాటల్తోనని నిరూపిద్దాం రండి !

మనిషిని నిలబెట్టాల్సింది సంపదలతో కాదని సంభాషణతోనని చాటిచెబుదాం రండి! మనిషికి కావల్సింది అన్నం మాత్రమే కాదని అనుభూతి కూడానని అందరికీ వివరిద్దాం రండి.

రండి ! మిత్రులారా ! రండి ! చిరునవ్వును బహిష్కరించిన ఈ లోకానికి నిండుగ నవ్వడం నేర్పుదాం రండి |! వసంతాన్ని కోల్పోయిన హృదయాలకు చారెడు సంతోష పుష్వాల్ని సమర్పించి సౌగంధాన్ని పంచుదాం రండి |! అనుభూతుల్ని కలబోసికొని అనుభవాల వెన్నముద్దల్ని ఆరగిద్దాం రండి | ఆనందపు హంసవాహన మెక్కి మానస సరోవరంలో విహరిద్దాం రండి ! పరిచయాల తేరుమీద మరో ప్రపంచపు సరిహద్దుల్ని తాకివర్దాం రండి |! ఒక కొత్త కరస్పర్శ కోసం ఒక కొత్త శ్వాస కోసం ఒక కొత్త స్వప్నం కోసం మనల్ని మనం ఆవిష్కరించుకుందాం రండి! (20 సంవత్సరాల తరువాత కలుసుకున్న క్లాన్‌మేట్స్‌తో కరచాలనం చేశాక “మైత్రీ సదస్సు”లో)

  • మూసీ (మాసపత్రిక)

జూన్‌ 2001

గాయప్‌డ్డ వాకిళ్ళు

ఇపుడు మనం ఒకరికళ్ళల్లోకి ఒకరం నిశ్శబ్దంగా సూదులు గుచ్చుకుంటున్నాం. చూపుల్ని బతుకు తెరమీద ఆరేసి

పాశవిక స్వష్నాల్ని కంటున్నాం.

చూపుల్ని సరికొత్త దృశ్యాలకు తగిలించి మనకు తెలీకుండానే మనం (క్రూర చేష్టగా మారుతున్నాం ఒక్కోదృశ్యం మనల్ని ఆవహిస్తుంటే

సవాలక్ష బలహీనతలతో

మనల్ని మనమే తల్లక్రిందుగా 'ప్రతిష్టించుకుంటున్నాం. సూర్యుడు అస్తమించడమే ఆలస్యం మీడియా దుష్యంతులు మన ముందుకొస్తారు. అమాయకత్వాన్ని (శ్రుతిచేసి

శరీరాన్ని ఛానళ్ళతో కుట్టేస్తారు.

పరకాయ ప్రవేశాల్నీ, భయంకర స్వష్నాల్నీ ప్రత్యక్షం చేసి నెత్తుటి వంతెనలు నిర్మిస్తారు. ఇపుడు అరచేతిని ముద్దాడినా నెత్తుటి వాసనే 1 ఎవళ్ళో పలకరించినా

ఎదుటివాడికి అర్ధంకాని సంభాషణే |

ఊళ్ళు గాయపడటం తెలుసు

రోడ్డు గాయపడటం తెలుసు

వాకిళ్ళు గాయపడటం చూశారా ?

కళ్ళ కవాటాల్లో

కత్తులు వేలాడటాన్ని వీక్షించారా ?

మనం ఉగాదుల్ని నిషేధించి ఉషస్సుల్ని ద్వేషిస్తుంటే లోగిళ్ళు ఆనవాళ్ళు కోల్పోక ఏం చేస్తాయి ? వసంతాల్ని బహిష్కరించి వల్లకాటిని (ప్రేమిస్తున్నప్తుడు వాకిళ్ళు గాయపడక ఏం చేస్తాయి ? ఆకాశాన్ని నరుక్కొని

శూన్యహస్తాలతో చూస్తే ఫలమేముంది ? అనుబంధాలు చంపుకొని

ఆత్మీయతను నటిస్తే అర్ధమేముంది ? కన్నీటి చుక్కను దానం చేయందే

బతుక్కి సార్ధకత లేదు ?

సైన్సు ఎన్ని వాస్తవాలు చెప్పినా

గుండె కురవందే వానకాదు.

కోయిల కూయందే కవిత్వం రాదు.

ఇవాళ (ప్రపంచంలో

పక్కపక్కనే మనుషులున్నా

ప్రతి ఇద్దరి మధ్య ఒక ఎడారి

అక్కడ సంభాషణేకాదు

చిరునవ్వు సైతం మొలకెత్తదు.

కంప్యూటర్‌. అడవుల్లో

మన కన్నీళ్ళు ఇంకిపోయాయి.

గుండె కవాటం కొడుకుకోసం

కొన ఊపిరితో కొట్టుకుంటుంటే

పోగుతెంచినంత తేలిగ్గా

పేగు బంధాన్ని తెంచేస్తున్నాం. ॥

విషాదించాల్సిన కళ్ళను వీడియోకు తగిలించాక

వర్షంతులూ, జయంతులూ

ఇంటర్నెట్‌లో కాక ఇంట్లో ఎలా చూస్తాం ?

ఈ దృశ్యాల్ని ఇక భరించలేం

హృదయాల్ని ఘనీభవింప చేసుకొని

ఉదయాల్ని కోల్ఫోలేం -

ఇకనైనా ఈ ష్టాస్టిక్‌ పొదల్ని నరికేసి

జీవితానికి కొత్త అంటుకట్టాలి.

బతుకు చెట్టు పుప్పించడానికి

పాదుచేసి కన్నీళ్ళను పోయాలి.

మనం ఇప్పటికైనా మేల్కోవాలి

ఇం(ద్రధనుస్సులతో ముఖాలు కడుక్కోవాలి

మౌనాన్ని పటాపంచలు చేసి

మాటను బతికించుకోవాలి.

రేపటి ఉగాది కోసం

ఇవాళే నవ్వుల తోరణాలు కట్టాలి.

(మానవతా మకరందాన్ని వర్షించే “మహర్షి

గురువర్యులు డా. నాగభైరవ కోటేశ్వరరావుగారికి కృతజ్ఞతతో)

  • విశాలాంధ్ర దినపత్రిక 26-03-2001

అ, మకవక మన 81 చపముతేరరనుతుంతని

ఒక్‌ నిరీక్షణ తర్చాత్‌ !

సముద్రమంత మనసు

గాజుకుప్పెలో పోసి ఘనీభవించిందామె.

జీవితం పూలకుండీ లోంచి

ఎత్తుగా పెరిగిన మొక్కై

రెండే రెండు మధుర ఫలాల్ని అందించి

పెరటి కల్పకంగా మిగిలి పోయిందామె !

ప్రతిరోజూ ప్రశ్నలు సంధించే మౌనాన్ని

ఒకే ఒక్క చిరునవ్వుతో ఛేదించేది.

బతుకు భాగహారంలో తాను శేషమై

భాగఫలాన్నిమాకు (ప్రదానం చేసింది.

జీవితం ముగింపు అంచుమీద

అవిశ్రాంతంగా తిరుగుతూ

అంతిమ కర్తవ్యమై మొలకెత్తింది.

తనపాద ముద్రలతో దారి చూపి

లాంతరై మము శ్రే నడిపించింది.

మాకు (ప్రాణవాయువును దానంచేసి

మా బ్రతుకు దీపాల్ని వెలిగించింది.

అరగదీసిన గుండెగంధాన్ని

ఎండతగలకుండా మాడెందాలకు పూసింది !

మా బతుకు పుష్షంపై పుప్పొడి అద్ది

జీవితాల్ని పరీమళభరితం చేసింది. తతత. 2 హరయ తా తాతా.

నిలువెత్తు జీవితమై (ప్రకాశించిన ఆమె ఇప్పటికీ అంతుబట్టని సృష్టిరహస్యంగా ఆశ్చర్యార్థకమై మాగుండెలమీద క్యాలెండర్‌లా కదులుతూనే.వుంది. | ఒక బాధాతప్త నిరీక్షణతర్వాత ఒక నిజం దుఃఖమై దేహమంతా ప్రవహించాక ఒక పరీమళభరిత ఆవేదనా (ప్రసూనం గుండెలమీద విరబూశాక, ఆమె మళ్ళీ మామధ్య ఆత్మోద్దరిణిగా ఉదయించింది. మాకు మాటలు కరువైనపుడు కావ్యంలా కర్తవ్యబోధచేస్తూ (ప్రాంగణమంతా పచ్చి పసుపులు పండిస్తూనే ఉంటుంది. . (మాగురుదేవుల అర్ధాంగి; పిన్నిగారు స్వర్గీయ సాగరత్నమ్మగారి జ్ఞాపకాల్లో) న వ 16-04-1993 స 1 జ జ

చేజారిన క్షణాలు ఉన్నట్టుండి పిడికెడు గుండెలో తుఫాను - (బ్రతుకు తప్పిపోయినంతభయం. | (ప్రపంచం కన్ప్సించనంత అంధకారం.

మాటలు రానంత మౌనఘోష 1

వాడెవడో

మా గుండె ప్రమిదను ఎత్తుక పోయి

మాటల పోగును దాచి పెట్టాడు. మా నవ్వుల జలపాతాన్ని

మా ఆశల స్వష్నాన్ని

మా ఐశ్వర్య దీపాన్ని మాయం చేశాడు. / నాలుగు గంటలు కాగానే

పూలతీగయి పెనవేసుకోవాల్సిన

పుస్తకాల సంచిని

వాడెవడో అపహరించుక పోయి |

ఎక్కణ్లించో ఫోనయి మోగగానే

కళ్ళల్థో అనంతశూన్యం.

ఆగుండె ఎన్ని అనుభవాలు పిండుకోలేదు -

ఎన్ని ఆటంకాలు అధిగమించలేదు -

ఎన్నెన్ని ఆటుపోట్లు తట్టుకోలేదు ఎ

ఫోను పోలీసులకెళ్ళగానే

కన్నపేగు కన్నీళ్ళు పెట్టుకుంది.

వయాతాతతత త తత తా చాంతాల!

జెండా లాంటిగుండె ఇంటిని కావలించుకుని బావురుమంది. గుండెల్ని గుప్పెట్టో పెట్టుకున్న వాళ్ళంతా యల్‌కె.జి. సంచులకోసం ఎదురుచూస్తుంటే ఊరు ఊరంతా ఊపిరి బిగపట్టి ఉద్వేగంతో ఊగిపోయింది. అక్కడ అద్దంకిలో, ఇక్కడ ఇంకొల్టులో , అనుబంధం అమ్మపేగై ఆక్రోశించింది. మమ్మల్ని వెలిగించే నవ్వు మాకోపాన్ని జయించే నవ్వు మా అసహనాన్ని ఓడించి ఆనందపు స్పర్శను ప్రసాదించే నవ్వు నాలుగు గంటల నరకం చూశాక నందివర్రనం పువ్వై నడిచి వచ్చింది. ఇల్లంతా తడిమి తడిమి గుండెల మీద పుప్పాడిలా పరీమళించింది - తిరిగి వచ్చిన కడుపు తీపిని కావలించుకుని నాన్న కళ్ళు జలపాతాలయ్యాయి. తడబాటు తెలియని తాతయ్యగుండిె భవభూతికి భాష్యం చెప్పింది. వార్త తెలిస్తే వరదగోదారి అయ్యే అక్క అపరంజి బొమ్మను అక్కున చేర్చుకుని ముద్దుల్లో తడిసిముద్దయింది. విషాద మేఘమైన ఐదో అంతస్తు ఆనందపు జల్టులో హాయిగా నిట్టూర్చింది. 5-10-1996 పట నముఖాంతంని సరు 85 2 తా బీఠళం నుందరరాన

త్తం అమ్మ దీపం అమ్మనడుస్తుంటే ఇల్టు అద్దంలా ప్రతిబింబిస్తుంది. అమ్మ నవ్వుతుంటే వున్నమి వెన్నెల పువ్వై విప్పారుతుంది. అమ్మ ఆతీ శ్రయత గోరుముద్దయితే స్వర్గం నట్టింట్లో నాట్యమాడుతుంది. అమ్మచూపుడు వేలు వెన్నపూసయితే నాలుక కైవల్య వేదిక అవుతుంది. అమ్మ కవ్వరి తిప్పడం చూసే నేను కలం తిప్పడం నేర్చుకున్నాను. అమ్మ అఆరచేతిగీతలే నా కవిత్వ గీతాలయ్యాయి. అమ్మ పైటకొంగు లాలనే అక్షరాలకు పైరగాలి పరీమళాన్నద్దింది. ఇవాళ అమ్మ కానిదేదీ నాకవిత్సం కాదు. కవిత్వం కావాలంటే (ప్రతివాడూ అమ్మకావాలి, 13-11-2000

అతలి గింజలు - ఆఖరిశ్వాస్‌ అచంచల ఆత్మవిశ్వాసం

అలా చూస్తుండగనే

కుప్పకూలిపోయింది.

చూపుడువేలుతో (ప్రపంచాన్ని శాసిస్తున్న గ్గోబు గరిమనాభి దెబ్బతింది.

ఒంటిస్తంభం మేడ ఒరిగిపోయింది. కంప్యూటర్‌ గూళ్ళల్టోని వలసపక్షులు అన్నిజ్యాలల్లో ఆఖరిశ్వాస పీల్చుకున్నాయి. ఇంటర్‌నెట్‌ ముందు కూచున్న ఇళ్ళన్నీ కన్నీటి వరదలో కొట్టుకుపోయాయి. 'పేగుబంధాన్ని డాలర్‌తో ముడివేసి మూడురా(త్రులే అయింది.

అక్కడ పలకరింపు కోసం

ఇక్కడ మంగళసూత్రం రోదిస్తుంది. తంత్రులన్నీ తెగిపోయాక

హలో! అనడానికి మనిషెక్కడ దొరికుతాడు ? మనుషులు తప్ప అన్నీ దొరికే ప్రపంచంలో ఊరడించే హదయమెక్కడ దొరుకుతుంది ?

ఏదీ శాశ్వతం కాదని రాలుతున్న కన్నీటి బొట్టు కడసారిగ చెబుతున్నాయి. ఎవ్వడూ (ప్రపంచాన్ని ఒంటివేలు మీద నిలపలేడని సూదిమొన చాటుతూనే వుంది. ఇవ్వాళ కాకపోతే రేపయినా మనుషులు ఇలాగే చచ్చిపోతారు. అందరూ చచ్చిపోయాక అణువుల మధ్య ఆకలిగింజల్ని ఏరుకుంటూ అయ్యో 1! మానవుడా ! అంటూ చిట్లి చీమలు నిట్తూరుసాయి. లయ [ చవి కలు _ _-విశాలాంధ్ర (దినపత్రిక ) ఖా న ఇ 22-10-2001 టు గ్గ తీ ౧ చాన్తటైనాల్లా చడ లాన్‌ యి వా నో ఇభన్చే

అండు ఎలిజీలు

కొండగాలి తిరిగింద్‌

గుండె పగిలి పోయింది

“కార్త” కన్ను మూయగనే

కవిత చిన్న బోయింది 1

తెలుగు వారి “కూనలమ్మ”

వెలుగు దారి వెళ్ళిందీ

“నిని వాలి” పోయెననీ |

తెలుగుపాట ఏడ్చిందీ. 10-06-1998

ఆయనకేక “భువన ఘోష”

ఆయన ఆశయం “అంగారవల్లరి”

ఆయన అడుగు “అడవి”

కలం ఆయన బలం.

అక్షరం ఆయన ఆయుధం.

కావలి ఆయన కదనరంగం.

అన్ని ఉద్యమాలసారాన్ని

“అక్షరజగత్తు”లో చూపినవాడు -

ఆడ ఆ 9, షి విష్ణవం పుష్పించే భాషకు ఉద్యమవ్యాకరణం రాసినవాడు - జైల్లో వున్నా జనంలోవున్నా చైతన్యమై చిగురించినవాడు. సాహిత్య యోధుడు క. వీ. ఆర్‌. సాంస్కృతిక సైనికుడు కె. వీ. ఆర్‌. “జైలు కోకిల” కు నా జేజేలు జనం కవికి నా ఎర్రశాల్యూట్‌. 25-02-1998 మా. లు. ఆ న

రేప్‌టి స్పష్నం !

అ ఆ లతో ఆరంభం కావలసిన

ఆగామి భవిష్యత్తు

డివ్హామాటిక్‌గా డిజిటల్స్ఫ్‌ను నొక్కుతుంది. పద్యాలు, (ప్రతిపదార్జాలు

పాతమాటలై

“ఫ్లాపీ”లు పార్య(గ్రంథాలయ్యాయి. కంప్యూటర్‌ మోజులో పిల్లలు

కాలంతో పరుగెత్తుతున్నారు - జ్ఞానదీపాలను వెలిగించాల్సినవారు కర్తవ్యం విస శరించి

కోచింగ్‌ సెంటర్లకు వలసపోతున్నారు

స్టాఫ్‌ రూమ్‌లు స్టాక్‌ఎక్సేంజ్‌లు కాగానే క్లాసు రూమ్‌లు కవాటాలు మూసుకుంటున్నాయి. విలువలు వెలగాల్సిన విద్యాలయాలు విధ్వంసానికి వేదికలై వీరంగం వేస్తున్నాయి. బోధనతో పండాల్సిన తలలు

వేదనతో కుమిలిపోతున్నాయి. _ కళాశాలల్లో (క్రమశిక్షణ కరువు మేఘమైంది. (గ్రంథాలయాలు ఏచేతి స్పర్శకోసమో అహల్యల్లా నిరీక్షిస్తున్నాయి.

చైతన్యాన్ని కుమ్మరించాల్సిన చేతులు

వివేచనను వెలిగించాల్సిన మాటలు క్షీణ ఉపాంత ప్రయోజనానికి నిర్వచనాలుగా నిలుస్తున్నాయి. 'ప్రవచనంతో ప్రగతికి వాకిళ్ళు తెరవాల్సినవాళ్ళు 'సర్వేపల్లి' కి వారసులుగా సరికొత్త సమాజాన్ని ఆవిష్కరించాల్సినవాళ్ళు నిస్సహాయులై నిలబడిచూస్తున్నారు. 'రేపటిస్వప్నం' కళ్ళముందే కరిగిపోతుంటే నిర్లిప్తతతో నీరుగారి పోతున్నారు. ఇప్పుడే మనం మేల్కోవాలి ఇక్కడే మనం ఖఇడ్గచాలనం చెయ్యాలి ఇవాళే మనం మెరుపులమై విప్పారి కాంతి స్వప్నాలను ఆవిష్కరించాలి. పాంచజన్యాలను పూరించి (ప్రాంగణాల్లో ప్రతిభను పండించాలి. జాతి హృదయక్షేత్రంలో నైతిక విలువలను నాటి విజ్ఞానపు వృక్షాలను పెంచాలి. ॥ రేపటితరం కోసం త్యాగపుష్పాలమై ప్రగతి పరీమళాలు పంచాలి. “రేపటి స్వష్నాన్ని” ఇవాళే ఆవిష్కరించాలి ! తెలుగు విద్యార్థి మాసపత్రిక సెష్టంబరు - 1999

అమ్మ తెలుగు

నేనిపుడు

సృష్టి ఆదిమ బిందువునై

అమ్మ తెలుగును పాడుతున్నా !

ఓ నా ప్రియమైన చరిత్రమా !

నీకీ సోయగాలు దిద్దిందెవరు ? సొంపులు అద్దిందెవరు ?

పలకడం నేర్పిందెవరు ?

పాడటం నేర్పిందెవరు ?

పరవశించే పాటతో

పరీమళించడం నేర్పిందెవరు ?

నేలపై మన తొలి అడుగు పడకముందు గుం(డ్రంగా తిరిగే భూమి

తెలుగు అక్షరంగా 'ప్రభవించింది. సూర్యుడి వెలుగే తెలుగై ప్రకాశించింది. భూమ్యాకాశాలకు

విందు చేసే వెన్నెలమ్మ

అందమంతా తెలుగులో ఆరబోసింది. ఎవడో గంధర్వుడు

ఈ తల్లినేల మీద తిరుగాడి

మన కోసం వదిలివెళ్ళిన

మాధుర్యం తెలుగు.

దేవతలు తాగి మనకు మిగిల్సిపోయిన అమృత భాండం తెలుగు. దేశమాత ఒడిలో తొలిబిడ్డ తెలుగు. పోరుగడ్డ పెట్టిన పొలికేక తెలుగు. తేనెకు పర్యాయం తెలుగు. వెలుగుకు ఆహార్యం తెలుగు. తెలుగు మన భాష తెలుగు మన శ్వాస, తెలుగు మన అమ్మ ఒడి. తెలుగు మన తాలి బడి. అమరావతి పట్టణంలో పుట్టిన (ప్రథమ పదం తెలుగు. చాళుక్య రాజ్యాన నన్నయ్య మన తెలుగు, నెల్లూరు తీరాన తిక్కన్ల మన తెలుగు, అద్దంకి సీమలో ఎర్రన్న మన తెలుగు. ఏకశిలా నగరంలో పోతన్న మన తెలుగు.

(శ్రీనాధ కవిరాజు 'శ్రీకారమే తెలుగు.

పెద్దన్న ఘంటాన

పద్యమే మన తెలుగు.

వేమన్న వాదాన

తెలివియే మన తెలుగు. , గురజాడ మార్గాన | నవ్యతే మన తెలుగు. చెలం చైతన్యం తెలుగు. | శ్రీశ్రీ స్వప్నం తెలుగు.

కుందుర్తి కల తెలుగు.

ఆరు(ద్ర ఆస్తి తెలుగు. “స.నాంరె. సిరి తెల్పుగు.

నాగభైరవ నాజూక్రు తెలుగు.

ఓ నా తీయని పదబంధమా ! పరిమళించే సుగంధమా |

అమ్మ పాలవంటి

ఆ పద్యం ఏదీ ?

ఆపాత మధురమైన

ఆ కావ్యాలు ఎక్కడ ? భంద$ టంధాలర్య న్‌

ఇదిగో - పట్‌ వ ఛీ అందమైన మన భాష ల

ఎ పం భతస్ట్కు 0

ఆఖరి శ్వాసను వినండి. అమ్మ నాన్నలను మరచిన మమ్మీ డాడీలను అడగండి. అమ్మ తెలుగును మరచిన ఆంగ్ల వేషాన్ని అడగండి. రాని భాషలో చేస్తున్న రాగాలాపన చూడంది. అమ శ్రే తెలుగును చూచి అధోగతిని అడగండి ! తల్లి భాషను వదిలిపెట్టి తెలియని భాషలో మనం దేహీ ఆనడం ఎందుకు ? సోదరులారా ! రండి ! దిక్కుల్లో తెలుగు జెండాలెత్తి వెలుగు పండుగను చేసుకుందాం, మాతృభాషను (ప్రేమిద్దాం | జన్మభూమిని ఆరాధిద్దాం 1 తల్లి తెలుగుతో తరిద్దాం ! (4 ఆంధ్రప్రదేశ్‌[మాసపత్రిక) డిసెంబరు - 2000 స 1. |, . (3,411

లో / ౮ ల . / _ ళో గ) డాష్టర్‌, చరం సుందరరావు ళ్లు | / , 344, 980, 2064, 26015 న. |" ( 1 శ 13-6-1956 ప్రకాశం జిల్లా అద్దంకిలో వెంకట సుబ్బయ్య, పున్నమ్మ || | | దంపతులకు జననం. | ,, జ 1981 నుండి ఇంకొల్లు ౨.౫.31.జూనియర్‌ కళాశాలలో ఉద్యోగం. ష్ట్ర ( కు అద్దంకిలో “ఎర్రాప్రగడ సాహితీ సమితి”, ఇంకొల్లులో “జాషువాసాంస్క |." ప్‌ శ్వ =. తిక సమితి” “మైత్రి” సంస్థల నిర్వహణం. ఉం. 7 జి రంజని - కుందుర్తి అవార్డు : సావిత్రి స్మారక అవార్డు, జాషువా స్మారక 1 ! తా పురస్కారం, సాహితీ స్రవంతి వరైరా అవార్డుల స్వీకారం. . ల! వనే ముద్రితాలు :. తొలిరేఖలు (కవితా సంపుటి - 19810, చైతన్యం నా స ; చిరునామా ( కవితా సంపుటి -1988), రెప్పలు రాల్చిన స్వష్తాలు - న ళ్‌ క శ్‌ మ గ థ్‌ (కవితా సంపుటి - 1999) రేపటి ముఖచిత్రం (కవితాసంపుటి-2001, | _ గురజాడ అప్పారావు (తె.వి.వి. ప్రచురణ - 1988), , [| స్‌ /; జః అముద్రితాలు ; సౌందర్య సాహితి (వ్యాసాలు), సముద్రంమీదసంతకం | ; " (వచన కావ్యం), అమరం నా సమరం (కవిత్వం), అద్దంకి చరిత్ర | |. డాక్టర్‌ నుందరరావుకు సొంత గొంతువుంది. వస్తువును ఎన్నుకోవడంలో | ॥ ఎ వైవిద్యం వుంది. కవిత్వీకరించగల కమనీయ హ్యదయంవుంది. వెరసి . | సుందర్రావు అక్షరాలకు ఇవాళ యువసంతకాల్లో గుర్తింపువుంది. ఈ “కవి ల | కుమారునికి” ఉజ్హ్వల భవివృత్తు కోరుకుంటాను. . - నః -డా॥ నాగీటైరన. డిలిట్‌. (తీ ౯ ర్ట క ఒం . "4 గ్‌ వ్‌ ద్‌ | ' డాక్టర్‌ జీరం సుందరరావులో ఉత్తమ స్యజన, ఉదాత్త వస్తుపరిశీలన, లోతైన. న 1 సమ్‌క్షా దృక్టథం పుష్కలంగా వున్నాయి. వర్ధమాన కవులకు ఇది ముఖ్యం. | " " - డౌ సి నొరాయీణ రెడ్డి డిలిట్స్‌/ ౧౪౩9౧౪౮6 & ౧౧166 ౭ : 00% 6౦300 90౧1021 కథం) గణక, 60047-7. ౧౧: 350832