Telugu rekka thalupula gosa - anilvaranasi/indianlanguages GitHub Wiki

టల ల సగ (ఈ శో ల “నాత్ర

హక గా (గో పా స్తో క 2 (1 జము క్యా ప య? [న టో ఖా నం స్‌, లో ॥

సె ్ర్గోా నల కా ల కు

స గ్‌ రెక్కతలుపు క. | గ్‌ ళా త లనాయుడు * సిరికి స్వామినాయవేడు హాక్‌ ' షె” చింతా అప్పలనాయుడు వన్‌ ననన

రెక్కతలువుల గోస (కవిత్వం, చింతా అప్పలనాయుడు సిరికి స్వామినాయుడు స్నేహ కళాసాహితి కురుపాం

రెక్కతలుపుల గోస (కవిత్వం) చింతా అప్పలనాయుడు సిరికి స్వామినాయుడు ముఖచిత్రం ర్క ర్‌ చందన పల్లి గోపాలరావు శంంపో ఆగష్టు - 2003 క! లో ప్రతులు : 8500 ర్చి క... ల్తు వెల : 30/- కుచురణూ : ఖా స్నేహ కళాసాహితి, పాం. చ్‌ కురు య [ప్రతులకు : / ౮ శ్రీ మంచుపల్లి శ్రీరాములు (అధ్యక్షులు, సాపొతీ లహరి, పార్వతీపురం,) శ్రీ జి. రామక్రిష్ణ ( శాంతి) గా ఈనాడు రిపోర్టర్‌ బ్రందదః న్‌ా వీధి, కురుపాం - 5385 524 లా వణ. ం య్‌ లభ గం ౫) ఎ్యిఅప్పలనాయుడు ఈ / ప క 1 ౯2కు వం లో ; విశాఖా గ్రామీణ బ్యాంకు లద బ్రాం 0% మధురవాడ న్వు “000 ల నాన్నా విశాఖ పట్టణం ముదల : సప్తగిరి స్మీన్స్‌ & ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌, పార్వతీపురం. ఫోన్‌ : 222617. సెల్‌ : 9440106719

అదే వరస చింతా ... 2. జెల్లకాకుల చీకటి తెరల్లోంచి వ. =. తె, కొండ అజతంలం2 త్తే త ఊరడింబే జ్ఞాపకాలు ఎం 6 ర్‌. విరిగిన నాగలి ఏ లా 6. అమ్మ చూపు న. 06. ముఖచిత్రం అ శై 9, గాయం ల 12 10. చెరుకులమునల్లి జి 13 శం ఒక్క ఆమెకే చెల్లింది టి కేడి 12, మబ్బును చూసి ఆల 15 13. దాడి అఆ 16 కడ కనుమరుగైన దృశ్యం య. క 15. గోస ఆ 16 సిరికి...

శ మట్టి ఆతని చిరునామా! ఆం 19 2 మట్టి ఆద్దం ఎఎ 20 ౩. కతగాత్రగానం ఆ. 22 త్త భరణం అలల ఇలం8 224 6. కురిసే నిప్పులవానలోంచి అఆ 26 ల తెగినదారప్పేగు అ 27 ౪68 కొలను ఇ ఎఎ... 26 9. వెన్నెల రాత్రికి ఆహ్వానం ఆం... 29 10. వలనసరాగం ఎల ఏ1 శ రెక్కల గూడు ఆల. 32 12 గొర్రెతోక బెత్తెడే న... 39. నాగళ్ళుపాతిస సమాధి జజ. 36 14 కటేళాదారిలో అం... వలె 15, ఎండమావులు ఆఆ వీ0

వళ్లిద్దరూ - ఇల్లూ, పొల్లూ!

మీకో పుస్తకాన్ని పరిచయం చేస్తాను. పుస్తకమంటే - కొన్ని కాగితాలు, అక్షరాలు, ఆశలూ, నిరాశలూ, కధలూ బాధలూ, ఎండిన భూంవులూ, ఎగిసిపడే గుండెలూ, ఇల్లూ, పొల్పూ, నీళ్లూ కన్నీళ్లూ, వెలుగూ, చీకట్లూ... యిలా ద్వంద్వాలు గదా! వొక ద్వయం గురించి పరిచయమే గదా యీ పుస్తక పరిచయం.

వీరిద్దరూ నాయుడులు ! నాయుళ్లు - నేటి దాకా హాలికులే....సత్మవులే. సత్మవుల్‌ ( సత్మవుల్‌ హాలికులైన నేమి... అనిన కవిగారికి హాలికుల కంటే అధికుడు కవి అనే భావన ఉన్నదని బోధ పరుచుకోవాలి. సరే ఆయనే సందర్భములో యెందుకన్నాడో చూడాలనుకోండి) సరిగదా, నేటిదాకా - సాహిత్యంలో కూలీలూ, వృత్తి పనివాళ్ళు, కార్మికులూ, సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు వొచ్చినా వ్యవసాయం ప్రధానమైన దేశంలో అవ్యవసాయ సంబంధమైన సాహిత్యం అతి తక్కువగా వొచ్చింది. దాన్ని అనుకున్న అన్ని జీవితాలమీదా వొచ్చినంత విపులంగా వ్యవసాయ జీవులమీద రాలేదు. కవిత్వమయితే మరీ తక్కువ.

ఈ మద్దెకాన ఆ యవసాయ కుటమాల పిల్లలు కొంతమంది కలాలొట్టుకొని రాయబట్టిగానీ - కళింగాంధ్ర సాహిత్యంలోనయితే - బొత్తిగా లేదుబావూ...! అదిగో - అలాగ, కలాలొట్టుకొని పార్తుపురం ( పార్వతీపురం) పట్నంకాంచి బయలెల్లిన పిల్లలు - చింతా అప్పలనాయుడు, సిరికి స్వామినాయుడు!

చింతా అప్పలనాయుడు - కతలు కూడా రాస్తాడు. కవిత్వమూ రాస్తాడు. కలిసినామా

  • కడుపు చెక్కలయ్యేట్టు నవ్వించి కన్నీళ్లు కార్చే యిధంగా మనకి కబుర్లూ, కాకరకాయలూ చెప్తాడు. కత, కవిత, నాటిక, మాట, పాట, - అన్నిటితోటీ అప్పలనాయుడు తన నేల గురించి, అక్కడి బతకుల గురించీ, జ్ఞాపకాల గురించీ, కొండగురించీ, కోన గురించీ, ఆకాశం మీది మబ్బు గురించీ మమకారాల గురించీ, గాయాల గురించీ గోస గోస పెడతాడు. ఆయనకు ముసలి తల్లి - కాలికట్టుల తెగిన కుక్కి మంచం లానే కనబడుతుంది. వలసబోయే రైతు - వసంతం కోల్పోయిన వాడిలా, విరిగిన నాగలిలా కనిపిస్తాడు. బతుకుబండి పరుగెత్తడానికి _ పగలంతా పొలంలో పచ్చజెండాలు నాటే కష్టజీవులనేకుల్ని - ఆయన మన కళ్లకు చూపిస్తాడు. వొక ముసురువేళ్ళ పూరిగుడిసెల వూరిమీద దుఃఖపు మేఘం కమ్మిన వేళ ,- తదిసిన దేహంతో వూరిబయటి చిత్తడి బురద మెరకమీద పశులు గాస్తూ మునకాల కర్రమీద దరువువేస్తూ గొంతెత్తే పశుల కాపరి , కళింగాంధ్ర సాహితీ క్షేత్రం మీద కలంతో దరువేస్తూ గళమెత్తిన వాడు చింతా అప్పలనాయుడు.వూరిబయటి చిత్తడి బురద మెరకమీద పశులు గాస్తూ, మునకాల కర్రమీద దరువువేస్తూ గొంతెత్తే పశుల కాపరి , కళింగాంధ్ర సాహితీ క్ష మీద కలంతో దరువేస్తూ గళమెత్తిన వాడు చింతా అప్పలనాయుడు. మరో నాయుడు సిరికి స్వామినాయుడు ! కొందరు దోర్‌ నెంబర్లూ, ఫోన్‌ నెంబర్హూ ఊరు, వాదా, వగయిరాలు చెప్తారు తమ చిరునామాకోసం ! అయినా వారి చిరునామా గుర్తించలేం. గానీ స్వామినాయుడ్ని సులువుగా గుర్తిస్తాం, మర్చిపోలేనంతగా గుర్తుంచుకుంటాం 1 ఏందుకంటే మట్టి అతని చిరునామా! నీరింకిన నూతుల్లోంచి కన్నీరు తోదుకుంటున్న చేదలు, ఇంటి పెణక్కి వేలాడే - మాయమైన విత్తనాల కట్ట, మగ్గం మీద మాయమైన హరివిల్లు, బతుకు పాడెమీద గోరంచుకోక,

కరువు ముసురులో తడిసిన కట్టెలూ, కులాచారాల చాకిరేవు, కొడిగట్టిన దీపాలూ, ప్రశ్నల కొడవళ్లూ, నాగళ్ల ఆయుధాలూ, కొత్త వేకువను మోసుకొచ్చేందుకు బయళ్టేరిన కావుళ్లూ - కన్పిస్తాయి మనకితని కవితల నిండా,

ఈ కవిద్వయం - కళింగాంధ్ర రైతు కన్నీళ్లని, గుండె ( పాలం) పగుళ్లనీ యింటి కళ్లానిక్కీ పొలానికీ మధ్య చిక్కుపడిపోయి తెంచుకుంటోన్న లేదా తెగిపోతోన్న పేగుముళ్లనీ వలస బోయే ఐతుకుల్నీ ఆర్తితో, ఆవేదనతో కవిత్వీకరించేరు. ఈ “తడి” కల కాలం వీరి గుండె కలాల్లో వుంచాలని ఆకాంక్షిస్తూ .... అభినందిస్తున్నాను. మధురవాడ, ప 1.809. ఎ, అప్పలనాయుడు

గుండెగోస

ఇంటికి ఎన్నుపట్టి ఎలాగో దేశింకి రైతూ అలగే.అందుకే గదేటి పాదయాతర్లనీ, జనమబూంవులనీ నాయకులు జనం దగ్గిరికి ఎలిపొచ్చీసి మేది పట్టి దుక్కులు దున్నెత్తన్నారు. ఎన్నుపట్టిలాటి రైతులు మాత్రం ఎన్నుకంటిన డొక్కల్లోటి పట్టిడు మెతుకులికనీ, బుక్కడు గెంజికనీ, పొట్టసేత బట్టుకోని పట్నాలకి కూల్లుకి ఎలిపోతన్నారు. కులవుర్హుల్లేవు... కాటేరేసిన నాగళ్లూలేవు... పశువుల్లేవు... పాడీ పంటల్లేవు. మునకాల కర్ర మూలజేరిపోయింది ఊళ్ళిప్పుదెలగున్నాయి? దుఃఖపు మూటల్లాగున్నాయి.

ఎన్నుపట్టి యిరిగిపోయి.. ముంజూరు గడ్డి ఎగిరిపోయిపెచ్చులూడిన గోడల్తోటి సుడిగాలికి కొట్టుకుంటున్న తలుపులోటి ఇల్లు... పట్నం ఎలిపోయిన కొడుకుని తలుసుకోని దుఃఖంతోటి గుందెబాదుకుంటున్న ముసిలి తల్లిలాగ...;సిమోరైపోయిన ఆ ఇంటి

  • రెక్కతలుపుల గోస ' యిది...ఆలకించుదుం రండి... ఆగోసతోటి మన గుండెగోసని జతకలుపుదుం రండి! పరం, గంటేడ గౌరునాయుడు.

కృతజ్ఞతలు న్‌ ఈ రెక్కతలుపుల గోసను నలుగురికి వినిపించడానికి తమ సహాయ సహకారాలందించిన విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండల విద్యాశాఖ, ఉపాధ్యాయ మిత్రులకు... అక్షరలోకపు కవాటాలను తెరచి మాకు సాహితీ ప్రపంచాన్ని చూపించి

  • అక్షరాల దారిలో ముందుకు నడిపిస్తున్న ఆత్మీయ మిత్రులు ఎ. అప్పలనాయుడు, ఇగంటేడ గౌరునాయుడు, జి.ఎస్‌.చలం, వెలుగు రామినాయుడు ... కవిమి(త్రులు, సాహితీ బంధువులు రామసూరి, అప్షచైతన్య, పీ. కమలకుమారి, సువర్ణముఖి, బడబాగ్ని శంకరరాజు, మానాపురం రాజాచంద్రశేఖర్‌, మల్లిపురం జగదీష్స్‌ జి,రామక్రిష్ట (శాంతి), డి. పారినాయుడు (జట్టు ట్రస్టు) , రౌతు వాసుదేవరావు, సముద్రాల సత్యన్నారాయణ ... అవసరమైన సలహాలనిచ్చి ప్రోత్సహిస్తున్న మిత్రులు, నఖచిత్ర కళాకారులు పల్ల పరిశినాయుడు, మంచుపల్లి రాములు (అధ్యక్షులు సాహితీ లహరి, పార్వతీపురం), దర్శకులు, నాటక ప్రయోక్త దోమాన సూర్యనారాయణ గారు, తనికెళ్ళ కళ్యాణి, పి.వి.బి. శ్రీరామమూర్తి ... కథానిలయం రూపశిల్సి, కధా దీపదారి... గురువుగారు శ్రీ కాళీపట్నం రామారావు మాష్టారు ...

మా ఆలోచనలకు పదును పట్టి ప్రోత్సహిస్తున్న శ్రీకాకుళ సాహితీ మిత్రులు ఛాయరాజ్స బి.వి.ఎ. రామారావు నాయుడు, పదాల జోగారావు, దాసరి రామచంద్రరావు కొప్పల భానుమూర్తి శ్రీకాకుళ సాహితీ మిత్రులందరుకు.....

ముఖచిత్రాన్ని అందంగా అందించిన చిత్రకారులు చందనపల్లి గోపాలరావు మాష్టారు ....

ఇందులోని కవితల్ని ఇదివరకే ప్రచురించిన ఆంధ్రజ్యోతి ఆదివారం, రచన, ప్రజాశక్తి ఆదివారం, ఉత్తరాంధ్ర, (ప్రజాసాహితి పత్రికల సంపాదకులకు...

పుస్తకాన్ని ఆకర్షణీయంగా ఆచ్చువేసిన సప్తగిరి స్కీన్‌ & ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌, పార్వతీపురం వారికి...

'స్నేహకళా సాహితీ కురుపాం

మేడివట్టి దుక్కి దున్ని బొరిగి వట్టి గొప్పు తవ్వి బ్రతుకు అర్ధం ౩లియజిప్పిన శఅమ్మనాన్నలకు .........

15కళఈదరువులేన్తూ......వాడు !

ఎప్పుడు చూసినా అమ్మ కడుపు

కాలకట్లు తెగిన కుక్కి మంచం లానే కనబడుతుంది!

వాడి అయ్య మామూలే...

పడమటిదొర మడిచెక్కలకు పచ్చరంగులద్దడానికి

చెమటకాలువై సాగుతుంటాడు 1

రంగు రంగుల సీతాకోక చిలుకల్లా

రూపాయి రెక్కలు మొలిచిన తోటి గుంటలు

ఇంగ్లీషు బడికెగిరిపోతే.....

శిధిలమైన ఊరిబడిగోడల మధ్య బందీగా వాడు

కన్న పేగు చుట్టూ రంగు రంగుల కలలు

శూనీగల్లా అల్లుకున్నప్పుడు

అక్క పురిటి నొప్పులు ఇంటిని ఆవహిస్తాయి !

కత్తిని ముద్దాడిన పేగు

పొత్తిళ్ళలో బిద్దను ప్రసాదిస్తే

అయ్య జీతం గింజలు గైప్‌ వాటరీ చుక్కలై

ఐనింటిలో ఆరిపోతాయి !

పొయ్యిలో అగ్గిరాజుకున్నట్లే

అమ్మ కడుపులోని ఆకలి అల్సరుమంటై

వాడి ఇల్లు అంటుకున్నప్పుడు

ఆసుపత్రి జలగల వార్డులో అమ్మ !

ఎప్పుడు విడుదలవుతాడో తెలీని

యావజ్జీవిత పాలేరు శిక్షలో అయ్య

పశువులు కసువు మేసే కమ్మని సంగీతానికి

కర్రదరువులేస్తూ ... మడిగట్టుమీద వాడు |! పలా చింతా అప్పలనాయుడు =

  1. “వెల కాకుల చకటె తెరల్తక్షంచి” నేనింకా అమ్మ కడుపులోనే వున్నాను ఈ లోకానికి రాడానికి కలలు కంటున్నాను మంచం కట్లు మీదుగా సాగిన అమ్మనొప్పులపయనాన్ని ఆసుపత్రిగోడలు చేయి చాచడమే తప్ప చేయి అందించనని తెలుసుకున్న అయ్య నాయుడోరి ఇంటి ముందు చేతులు జోడించి పాలేరుగా అమిరిపోవడాన్ని ... మా లేమితనం రసిగారే పుండుమీద తెల్లకాకులు తమ బేరాల ముక్కులతో అమ్మను సంతలో గొడ్డును చేసి పొడుచుకుతినదాన్నీ పసిగడుతూనే ఉన్నాను ! అన్నం కుండను .... మసిగుడ్డ తుడిచినట్లు గానైన ఆసుపత్రి స్టెరెల్డ్‌ పేద్స్‌.... మా అమ్మను తాకనేలేదు | నేను ఈ లోకానికి రాదానికి దారులన్నీ సజావుగానే ఉన్నాయి. కాసిన్ని కాసులకు లొంగిపోయి క్రీస్తును అప్పగించిన 'యూదా' ల్లా ఆసుపత్రి గణాలు శిలువ లాంటి అబద్దాన్ని మోసుకొచ్చి మాఅయ్యకు ముళ్ళ కిరాటాన్ని అలంకరించాయి ఎ. శెక్కతలుపుల గోస లాలా టా
  • అమ్మ పురుడవ్వదని ఆపరేషన్‌ తప్పదని * | ఆపై ...... స్పెతస్మోపు పామై బుసలు కొట్టి తనవాడి సిరంజి కోరలతో అమ్మ నరాల మీద పొడిచింది! అణువణువునా సెడేషన్‌ అలముకుంటుంది ! అమ్మ కడుపు మీద కత్తుల నదక 11 చుక్క చుక్కలుగా జారిన సెలైన్‌ “అమ్మ పసుపు కుంకానికిచ్చిన మడి చెక్ష ఆసుపత్రిలో ఇంకిపోయింది ! మొదలు నరికిన పచ్చని చెట్టులా ఆపరేషన్‌ థియేటరులో అమ్మ! అయ్య సర్వం కోల్పోయి.... గజగజా వణుకుతున్న తుపాను బాధితుడయ్యాడు 1 తెల్లకాకులు దించిన చీకటి తెరల్లోంచి అపుడే అరవిరిసిన ఎర్రమందారంలా నేను! ఆ ప్ర బాాడాంాడవాంావాయాలాంాాాా చింతా అప్పలనాయుడు ==

క. క గా

ఇప్పుడు నా కళ్ళతో ఈ కొండను

చూడలేని బాధను

ఎవరితో చెప్పుకోగలను?

నా కడుపులో మండే మంటను

చలా ఆర్పుకోగలను?

మా అయ్య వెనుక మేకల మందలో

నేనూ ఒక మేకనై

కొండ గుండెల మీద నడిచినప్పటి

సజీవ దృశ్యాన్ని

మళ్ళీ నేను చూధగలనా ?

నా వొంటి గాయనికి వైద్యుడై

మందు మొక్క నిచ్చిందీ

మా అకలి బాంబులై.....

కొండగుండెలో పేలినపుడు

తన దేహాన్ని ముక్కలు ముక్కలుగా

మా ఇళ్ళముందు పరిచిందీ

ఈ కొండేగదా?

మా పొయ్యిలోకి కర్రలమోపులిచ్చిందీ

మబ్బులతో మంతనాలాడి వర్షాన్ని రప్పించిందీ

మా కాలనీ ఇళ్ళు కూలిపోజే

పునాడై మా ఉనికిని కాపాడిందీ

ఈ కొండేగదా ?

అడిగిందే తడవుగా అపర శిబి చక్రవర్తిలా

తన దేహంలోని ఒక్కొక్క ముక్కను అర్పించిందీ ఎ. రెక్కతలుపులగోస లాలా

కర్టుడిలా కవచకుండలాలును వొలిచి యిచ్చిందీ, తుఫాను వచ్చినపుడు మా ఊరు ఊరంతటినీ శల్లి కోడై తన రెక్కల్లో పొదువుకున్నదీ ఈ కొండేగదా? ఈ కొండదే తిరిగి రోడ్డె మా ఊరికి నాగరికతను మోసుకొచ్చిందని సంబరపడ్డామే గాని మా శ్రమ చమట చుక్కలై ఈ రోడ్డు మీదుగానే ప్రవహించి పట్నంలో ఇంకిపోతాయనే విరుకలేని వాళ్ళం | కరిన శిల గుండెల్లో ఇంతటి కారుణ్యం దాగుందని కొండ కనుమరుగైతేగానీ కానుకోలేని వాళ్ళం! రోడ్డు కాంట్రాక్టరు మా ఊరొచ్చినపుడు కొండ ఎలా ఉండేది? పుడమి తల్లి పట్టిన పచ్చ జెండాలా ఉండేది! ఇప్పుడు కొండను చూస్తే యుద్ధభూమిలో అవయవాలు తెగి పడ్డ "సైనికుడిలా వుంది ! =ళలా యూ న్‌ ని చింతా అప్పలనాయుడు అజా

4 ఊరడదెంచే జ్ఞాపకాలు అమ్మా! ఇక్కడ అంతా క్షేమమే ! కాలే కదుపు మీద చెమట చుక్క ఎసరై మరుగుతుందిక్కడ జీవితం నన్నికృడికి విసిరేసిందనే బాధ నీ గుండెలో పుండులా సలపరం పెడుతునే వుండడం పసిగట్ట భేకపోదానికి... ఇంకా పసిదాన్ని కానుకదా?” అంతా సజావుగానే సాగినట్టుందిగానీ ఒక అభద్రతా భావమేదో బతుకంతా కొౌండచిలువై మింగుతునే వుంటుంది! ముఖాలమీద పలకరింపు పూలు బాగానే పూస్తుంటాయి 1 చూపులు చురకత్తులై వొంటిని అంటుకుంటాయి! ఏ మల్లెమొగ్గో..... ఏ మడిగట్టు మీదో! ఒక దున్నపోతు కాళ్ళకింద నలిగిన వైనం గుండెలోనే ఇంకిపోతుంది 1 అక్కడ మన అరుగుల మీద తెగిపడ్డ జముకు పాటలు ఇక్కడ పచ్చని చేలగట్లమీడ ఎండిన పెదాల మీద కధలుగా మొలుచుకొస్తాయి! ఈ చెమట గంధపు చెక్క... సీ మనవడికి పాలిచ్చిన ఆ కాసింత భాళీ సమయంలోనే గతం సల్లేరుల మీదుగా నడిచొచ్చిన నా పొదాల మీద గుండె పొట్లాంలో దాచుకున్న నీ జ్ఞాపకాల మల్లెలు జారిపడి నన్ను ఊరడిస్తునే ఉంటాయి! ఎ. రెక్కతలుపులగోస ఎలాం

ప్‌ ఐరిగెన నాలి వలసపోయిన దారిలో వసంతాల్ని కోల్పోయినవాణ్ణి | కదలబారుతున్న నేలమీద పాలేరు పాటై సాగుతున్న వాణ్జి ! ఎద్దు కొమ్ముల్లోంచి పొడుచుకొచ్చిన సూర్యోదయాల్ని చూడలేకపోతున్నవాణ్ణి 1 కోడికూతలు పాలధార చప్పుళ్ళూ టైరు పాదాల కింద నలిగిపోగా రంగు రంగుల పాములేవో నట్టింటిలో చేరి నాట్యమాడుతున్నాయి ! పాలిచ్చీ తల్లిలా లాలించీ .... దుక్కి దున్ని పిడికెడు మెతుకులిచ్చిన మూగ జీవాలను కాసుల యంత్రాలమీద కబేలాకు సాగనంపి ఎక్కిన కొమ్మ నరుక్కున్న ఎర్రిబాగులోజ్జి 1 ఇపుడు గోధూళి వేళ అన్నమాట ఒక మధురమైన జ్ఞాపకం మాత్రమే ఏదాది రెక్కల కష్టం కన్నీళ్ళ కల్లాన్ని ముంచినపుడు జీవితం అచ్చం నాటకం లానే అగుపిస్తుంది ! అప్పులోడు భూతంలా ఎదురౌతాడు కంపెనీవోదు పురుగై భయపెడతాడు కాన్వెంటు పామై కొడుకుని కాటేస్తుంది భార్య అమ్ముడుపోయిన చంద్రమతే అవుతుంది 1 మట్టిదేహాలు మూటలు మూటలుగా విషాదమై సాగిన పాసింజరు రైళ్ళవుతాయి | పడమటి కామందు అరటి బోదులకు పచ్చరంగు పరికిణీలు కడతాయి పొమాయిలు పడగనీడల్లో చైత్ర పున్నములు చేజారిపోతాయి పెట్టుబడులు ప్రవాహమై నామట్టి పాదాలను చుట్టముట్టి ఊబిలోకి లాక్కుపోళున్నప్పుడు ఇనుప దున్నల స్వైర విహారంలో ఇప్పుడు నేను విరిగిన నాగలిని !

బతుకు రైలుబండి

పరుగెత్తడానికి అమ్మ

పగలంతా పొలంలో

పచ్చజెండాలు నాటేది !

బుగత పొలాన పొద్దస్తమానం

ఎద్దులతో పోటీపడిన అయ్య

పొద్దు వాలేక బురద ద్లొళ్ళె

మత్తుగా తేలిన సారాగమైనపుడు ఎదిరించిన పాపానికి

అమ్మ వీపుమీద తేలిన తట్ల జ్ఞాపకాలు

కట్ల పాముల్లా యిప్పటికీ

నాదేహాన్ని తాకుతాయి!

బొరిగై నేలను తవ్వి

బుగ్గి తలకెత్తుకొని వచ్చిన అమ్మ కదుపు పలకా బలపం లేని ఖాళీ సంచిలా గాలికి అదేది! లోతుకుపోయిన కళ్ళతో అమ్మ ముఖం మసిబారిన దివ్వగూడులా ఉందేది! అయ్యనోటినుండి జారిన కాటిసీను పద్యాలు బియ్యానికి నోచుకోని దాకలో

ఎసర నీళ్షై మరిగితే

అమ్మ చెమట చుక్కలు మెతుకులై

నా పిడికిట్లో దానిమ్మ గింజలై మెరిసేవి ! నా చిరుగుల బాల్యం చుట్టూ

అమ్మ కోక ముక్కై చుట్టుకొనేది !

అమ్మ తనే రెందు కమ్ములుగా మారి

నన్ను రైలు బండిని చేసింది ! నన్ను గమ్యానికి చేర్చే పచ్చజెండా ఎప్పటికీ అమ్మ చూపే |

పా రెక్క తలుపుల గోస

గుందె గుడిసెలో పేరుకుపోయిన చీకటిని నాలుగు దందెల పలకగా మలిచి అక్షరమై వెలగదానికి వాదడదాటుకుంటూ వస్తున్నావా..... రా....నాయినా....రా నా చిట్టిపాదాల పిట్ట పిల్లా .....రా అయ్య భుజాలమీద కాళ్ళూపుతూ,.., కేరింతలు కొడుతూ ఐదివేపు నీవు వస్తుంటే దప్పుమీద సిరత దరువులేస్తున్నట్టుగానే ఉంటుంది నా కళ్ళకు రా... నాయినా ....రా నా నబ్ల కోదిపిల్లూ ....ల౮ా నిన్ను ఐడికి మోసుకురావడమే. అసిరమ్మ పండుగలో ఘటం మోసినంత ఆనందంగా మీ అమ్మ అడుగులేస్తూ వస్తుంటే అది చదువుల సంబరమే కదరా కన్నా రా... నాయినా...రా నా నల్ల కుందేలు పీల్లా....రా నీవు నడిచొచ్చిన దారిలో దిగబడిన బురద నీ బుల్లి పాదాలకు బూట్లుగా మురిసిపోతూ జారుతున్న చిరుగుల వదులు నిక్కదు ఎగేసుకోవదానికి అవస్థపడుతున్న నీకు ఆ సెట్లు... ఈ సెట్లు... ఇంటర్నెట్లు.... హైటెక్ళువై ఎప్పుడూ నీచేతికందవురాకన్నా ! పడిపోయిన ఐడిగోడల మధ్య ధం చింతా అప్పలనాయుడు అవాణు

నిన్నొాక మొక్కగా నాటి ... చూట్టూ కంచై కాపాడుకుంటానురా కన్నా రా..... నాయినా......రా నా నల్ల పంది పిల్లా ...రా కలవారి గడపల్లో నిన్ను బోన్సాయ్‌ మొక్కను కానివ్వనురా కన్నా వేళ్ళతో నేలను బలంగా పట్టుకొని ఆకాశాన్ని గుందెలకు హత్తుకొనే మహావృక్షంలా నిన్ను పెంచుకుంటానురా కన్నా రా... నాయినా....రా నా నల్ల కోయిల పిల్లా... రా.... నా పాటల పిట్ట పిల్లా... రా....

తా లెక్క తలుపుల గోస

8 ముఖచిత్రం

ఓట్ల విమానం మీడ

విదేశీ యానం చేసే అధికారం

బిల్‌గేట్స్‌ ముందు మోకరిల్లి

బిచ్చమెత్తుకుంటుంది !

రూపాయి రెక్కలు తొడుక్కున్న

“ వలస పక్షులు ”

అమాంతాన అక్కున చేర్చుకొని....

జన్మభూమిని విఫణి వీధిగా మారుస్తాయి

హైటెక్‌ రికార్డింగ్‌ ధియేటర్‌లో

రైతుల ఆకలి కేకలు !

పాప్‌ సంగీతమై వినిపిస్తాయి !

వాగ్భాన్తాల మూటల్లోంచి...

గన్నేరు పిక్కలు......

సున్నుండటై జారి చావులూరిస్తాయి! రా చింకా అప్పలనాయడు -

9.₹[90రు0 గాలి ఉయ్యాలలో..... హాయిగా ఊగవలసిన అడవి సంతరోజు గాయమై రోడ్డంతా పరుచుకుంటుంది! వెలుగు నీళ్ళతో ముఖం కడిగిన అడవి కడుపులో ఎర్రటి ఎండ అకలై కొస్తుంది ! ఎంతకీ తెగని బేరాలు అడవి దేహం మీద సర్పాలై పాకుతాయి ! ఎప్పటికో రాలిన కొద్దిపాటి చిల్లర చినుకులు అడవి చేళుల్లో ఇంకిపోయి కర్రల కావుళ్ళు ఉప్పు గడ్డలౌతాయి 1 కిరోసిన్‌ చుక్కలౌవుతాయి! చింతపండు బుట్టలు సావుకారి చేతుల్లో తేలిపోయి 1 చిన్న చిన్న నూకల మూటలై కడుపును కౌగిలించుకుంటాయి ! సంతలోంచి గాయమై జారిన గోచీగుడ్డ కొండెక్కి పోదుమంటై మండుతుంది 1! ఎ శకృతలపలగన లాలా

10 చెరుకుల ముసజ్లి

కోడిని నిద్రలేపి.... ఆమె కదుపులో అగ్గి రాజేసుకుంటుంది! చెరుకు బొద్దులు రెలిసీ రెలిసీ గాయమై సాగిన ఆమెపై

విర్రటి ఎండ వర్రగుండై పరుచుకుంటుంది!

అంబల్లేలకు ఆకలి డొక్క

ఖాళీదాకై వెన్నుకు చేరబడుతుంది ! నూనెసుక్కనోచుకోని సింపిరి బుర్రమీదకి ఆమె చెరుకుల బుట్ట ఎత్తుకుంటుంటే.... ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు రిహార్సల్‌ చేస్తున్నట్లుంటుంది ! “సెవ్వాకులు....... సెవ్వాకులో'

అన్న ఆమె తీపి అరుపు

పిల్లలకు తేనె పాటై నోరూరిస్తుంది ! రామమందిరం అరుగుమీద రోజంతా పదిమందికీ తీపిని పంచే చెరుకామె! సాయింకాలానికి పొయ్యిమీద

చేరదు నూక గింజలౌతుంది 1

అకలి రోగంతో మంచానికి

బల్లిలా అంటుకున్న కన్న పేగుకు గరిటెడు జావై ఉడుకుతుంది!

గ్రా చింతా అప్పలనాయుడు =

11 ఒక్కఆమక చెల్తింల

ఆడతనమే అమె నేరమైనందుకు

అత్త చూపులే అగ్ని శిఖలౌతాయి ! అందం తన పాపమై

పెనిమిటి అనుమానపు చూపులు సరిహద్దు గీతలౌతాయి!

ఆఫీసులో తోడి ఉద్యోగులే

తోడేళ్లయి చుట్టి ముట్టినపుడు

ఆమె మేకపిలై ముడుచుకుంటుంది | షరామామూతలే ......

చూపుల సూదులు దిగబడ్డవొంటిని వొంటిని మెత్తగా హత్తుకున్న నేత చీరని మరుపు నీళ్ళలో ముంచి జాడించీ రాత్రి గుండెలమీద ఆరేసి తెల్లారేక మళ్ళీ వంటింటికీ, ఆఫీసు నడుమ అరిగిపోయిన స్లిప్పరవుతుంది 1

అమె బెటర్‌ హాఫే............ చిరునామా మాత్రం వైఫ్‌ ఆఫ్‌ ! షాపింగ్‌ కాంప్లెక్సులు...... రంగురంగుల ఛానల్లు

కడకు కాలేజీలు సహితం.

ఆమెను వేధించదానికి

బహిరంగ వేదికలౌతాయి 1!

అమ్మకానికి అందాలు ముందుకొస్తున్న నేలమీద ఈ హైటెక్‌ సీజన్లో ....

కంప్యూటరైజ్డ్‌ హింసేదో

కమ్ముకురాదని గ్యారంటీ ఏముంది ? అయినా

రసం పీల్చి విసిరేసిన టెంకలా...

నేల పొరలలోంచి

మొక్షై మొలుచుకు రావడం ఒక్క ఆమెకే చెల్లింది !

=== రెక్క తలుపుల గోస

12 మబ్బును చూసి

కాల సంచల జబ్బుతో

ఎడ్లు కదల లేనపుడే...

ఆకాశం మీద మబ్బులు

ఆలమందల్లా పెనుగులాడతాయి!

మబ్బును చూసి నెమలి పిట్టై

ఆడాల్సిన మనసు....

సాలవైపు చూసి సతికిలబడతుంది!

ఎడ్లను మింగిన సంత సాయింకాలానికి పామై

బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటుంటే...

దళారోడు మాత్రం దున్నపోతులేని యమధర్శ్మరాజులా

దర్జాగా సొగిపోతాడు !

చిల్లర నోట్లు చేతిసంచీడు సామానై వెక్కిరిస్తాయి !

పనమువ్వల సవ్వడితో నెమరువేత సంగీతం

వినిపించలేని పశువుల సాల....

శవం పోయిన ఇల్లులా గుబులు రేపుతుంది!

మళ్ళీ మొదలైన వెదుకులాట!

జల్లెడ పట్టిన సాలలు సంతలు ఊళ్ళు,

కడకు తను కట్టిన శతమానం..

ఎడ్ల జతగా మాదితే....

సాల అటుకుమీద ఏటి కర్ర

కొత్తరాగమాలపించే సమయానికి

మేఘాలకు రోగాలొచ్చి.....

అకాశ మంచాన్ని అంటుకుంటాయి ! ప్రత చింతా అప్పలనాయుడు ==

13 “దాటె” అడుగులకు మడుగులొత్త లేదనే అక్కసు వరద గంగై ఐడిసాలమీద విరుచుకుపడినపుడు గురువు జడలు విప్పిన పరమ శివుడే కావాలి మరి అధికారుల యక్ష ప్రశ్చలకు ప్రతి విద్యార్థీ ధర్మనందనుదేఅయినపుడు పిల్లల సమాధానాలు.... పెద్దమనుషుల మెడలో చెప్పుల దండలౌతాయి! అక్షరాలను ఏరుకుంటున్న పిల్లల్ని కాన్వెంటు గద్దలు తన్నుకుపోతే దిక్కుతోచని ఐడి పంతులు తల్లి కోడై తల్లడిల్లుతాదు! ఊరుపెత్తందారు పశువుల పలుపుతాడుతో క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ బడిసాల చూరుకు ఉరిబోసుకుంటుంది! కనురెప్పలై కాపాడాల్సిన కమిటీలు కాలనాగుటై బుసలు కొడిరే.... పసిపిల్లలు చూపులానని కనుపాపలౌతారు! హక్కులకోసం ఉరమడమే తప్ప బాధ్యతల చినుకులై రాలని నేలమీద

  • బడిసాల మొక్షై ఏపుగాఎదిగి అక్షరాలు పూస్తుందని ఎలా నమ్మగలం [9 ఆ. రెక్కతలుపుల గోస

14 కనుమరురైన దృశ్వం

కళ్ళముందు అను నిత్యం

ఎర్రని ప్రవాహమై కదిలిపోయే దృశ్యం

కనుమరుగైంది

అయ్య భుజం మీద గుర్రం పందేసుకుని

అనుకున్న చోటుకు మోసుకుపోయే

అద్భుత స్పర్శ అందకుండా పోయింది!

రోడ్లు దీవితో జ్వరం పెట్టుకుంటున్నాయి!

శనివారం సంతలా

సందడిగా కనిపించే కాంప్లెక్సులు...

కదలని ఎర్రబస్సుల సాక్షిగా

మనిషి జాదకోసం వెతుకుతూనే ఉన్నాయి!

కలలు రాని కళ్ళు......

పొగ నిండిన వంటిల్లులా దిగులు జారుస్తున్నాయి!

సమ్మెకట్టిన చేతులు సమ్మెటలై ఎగస్‌

సగటు మనిషి మీద జారకముందే....

పురిటికేక చావుపాటై

పల్లెను పరిహసించకముందే

ఎక్కడో , ఏ రోద్దమీదో ఆక్రోశం

బస్సు అద్దమై పగులుతుంది |

స్టీరింగ్‌ తిప్పిన చేళులు కటకటాలను కావలిస్తాయి !

సాగే సీరియళ్ళ నడుమ

ప్రకటనల హోరులో చర్చల వార్తల తునకలు

శ్రమ సౌందర్యం గుండెలో శతఘ్నలై పేలతాయి!

పిల్లాడి అలక తీర్చాల్సిన తండ్రి

ఆగ్రహంతో అగ్గిలో తోసేసినట్లు

పట్టుదలకు పోయిన అధికారం

ప్రకటనల అణుబాంబుల్ని పేలుస్తుంది!

బతుకు యుద్ధమై...

క్షణ క్షణం భయపెడుతునే ఉంది ! రాలా చింతా అప్పలనాయుడు =

15గోస కొడుకా నా కొంగు బంగారమా భూమికీ ఆకాశంకీ మద్దిని గెడగర్రమీద ఎన్ని యిద్దిలు 'సేసినా ఏటినాబం సేతల నాలుగు పైసలు రాలని యీటీవోడి సందాయమే నేలబుగ్గి నెత్తికెత్తుకొని వంటకలగన్న పాపానికి నీ ఇంటిల కరువు పామై మటమేసింది గదరానాయినా! తొలిసూరి కొడుకా తొలకరి మెరుపా మూడు కాలాలూ ముచ్చుదేవతల్లాగ కళ్ళల్ల నిప్పులు బోసుకొని నీమీద పగబట్టినపుడు బువ్వ తినిపించిన బూదేవత గుండె బీటలు దేరిపోయింది రా నాయినా! నా ఎండికొందా..... సల్లంది కుండా....... మూటా ముల్లె సర్ది నువ్వు ముంజూరు దాటుతుంటే మూగదాయినాగ నాగరి మూలసేరిపోయిందిరా అవమానంతోటి కొడవలి అట్టుగెక్కిపోయిందిరా నాయినా నా కంటిదీపమా... నా ఇంటి ఎల్తురా గతించిపోయిన గరిక పచ్చటిరోజుల్ని నెమరేసుకొని గద్దిపరకల్ని కలగంటున్న పశువుల్ని ఇనుప గెద్దలు సొల ముందల వాలి కబేలాకు రమ్మని కవుర్లు పెడతన్నాయిరా కన్నా! నా నోముల పంటా.... నా నోమదోసకాయ.... నరతోటనాలికి మీద నాలుగు మెతుకులవ్వడ్రాఇనికి తెచ్చిన అప్పులకి తెగ్గోసి ఇవ్వడానికి నువ్వు సిబిసెక్రవార్తివే గాని .... నీ వొంటిల ఎంవికులు తప్ప వటిమిగిల్నాయిరా నాయినా! ఆడితప్పనోదా ... అరిచ్చెందురుడా... తెల్లారక మునుపు సీకటి ముసుగేసి ముకం సాటుసేసుకొని ఊరుదాటెలిపోతుంటే ఊరు ఊరంతా కన్నీటి వరయ్యిందిరా కన్నతంద్రీ! దగా తెలీనోదా... దరమరాజా... నీ మట్టి కాళ్ళను సుట్టుకోని నువ్వు మల్లా సల్లగ తిరిగి రావాలని నాగావళి తల్లి గుంపసోమన్న తండ్రిని కోరతందిరా కొడకా! నా మొలేసిన మొక్కా.. నా ముదేసిన పేగా! ా. రెక్కతలుపుల గోస న (ఘా

1మభట్సై అతని బరునామా

అతడు

ఓ శకం మైలురాయిదాటి

నవసహస్రాబ్ది వేపు నదక సొగిస్తున్నాడు

అతడి సుదీర్హ జీవనయానం వేపు చూపుసారిస్తానా

అక్కడ

ఛిద్రమైన హృదయ శకలాలు

శిధిలమైన స్వప్న ఫలకాలు

అతడు

ఎందకు ఎండి వానకు తడిసి

చేలను కలగంటున్న మడిచెక్క

మందే అప్పుల పెనంమీద

అవిరౌతున్న కన్నీటి చుక్క

పోసిన ప్రతి చాలులోనూ

పండేది విషాదమే

చిరిగిన గోచీ విరిగిన నాగలి తప్ప

అతనికి మిగిలిందేమిటి?

అతడొక స్వేద సముద్ర కెరటం

తీరానికి తల బాదుకోవడమే అతని దినచర్య

అయినా

అతడి మనసు పొరల్లో ఆకాశం మీద ఆశ

ఆగామికాలాన్ని చినుకును చేసి రాలుస్తుందని

బతుకు మోదు కొత్త చివుర్లు వేస్తుందని

అతదు

కన్నీళ్ళతో కడుపు నింపుకునే

అవిశ్రాంత పథికుడు

మొక్క అతని గమ్యం

మట్టీ అతని చిరునామా. అర్ర సిరికి స్వామినాయడు -

2 మళ్లు అద్దం తొలకరి జల్లులోనూ చినుకు పడ్డపుడు లేచే ధూళిలోనూ పారే పంట కాల్వలోనూ... నువ్వే! సాగే ఏరువాకలోనూ పొరతో చెక్కిన మట్టి పెళ్ళలోనూ దమ్ము మళ్ళలోనూ... కొంగల బారుల్లోనూ... నువ్వే,.! విపుడు చూసినా నీ కళ్ళు కొడిగట్టిన దీపాలే విపుడు చూసినా నీ మొహం ఓ కరువు మండలమే పల్లెను తలకెత్తుకొని కన్నీళ్ళు మీంచి కాలాన్నీ దాటుతున్న కర్షకుడా... నాగేటి చాలు మీద నడుస్తున్న శ్రమవి నువ్వు తూర్చు పడమర కనుమల్లోకి కాళ్ళు చాపి నదుల్ని ఏతమేసి తోడితే పంటకాల్వలె పారిన చెమట అగ్నికర్తెలో ఆవిరౌతుంది కొటేరేసిన నాగలి కొన ఊహారేఖలే గీస్తుంది కళ్లంలోని ధాన్యపు రాశులన్నీ అప్పుల గాలికి కవ్వల్లా ఎగిరిపోతే కుంచాన కొలచేవి కన్నీళ్ళే నేల పొరల్నెవరో కొల్లగొడుతున్నట్టు ఆ రెక్కతలుపుల గోస

లోహపాదమేదో నెత్తిన తొక్కుతున్నట్టు మట్టి అద్దంలో.... ఓ భయానక దృశ్యం ! నీ దేహాన్ని ధాన్యపు రాశులు చేసి జేశానికి ధారపోస్తే ఓట్ల పండుగనాడు వాగ్దానాల పల్లకిలో ఊరేగించిన అధికారం కోతల వాతలు పెట్టి అధిక ధరల అగ్ని గుండంలో నిన్ను పడదోస్తుంది దోచుకున్నవాడు దోచుకుంటుంటే పన్నుల వలలు నీ మీద పర్చుకుంటాయి - యింత జరుగుతున్నా... యదేచ్చగా ధ్వంస రచన కొనసాగుతున్నా... కొడవలి ఓ ప్రశ్నయని నాగలి ఓ ఆయుధమని "నీ కింకా గుర్తుచేయాలా? ద్ధందరణన లోదా ద్య గ 6 ఖు. ఉం -జ్రిగిక1)) యయ వ్‌. ధా సిరికి స్వామినాయుడు అజా

౩3 క్షత? 18650 మధ్యయుగ కట్టడం మాయమైనపుడే అయోధ్య వధ్య శిల మీద హింస అక్షరాలు నేర్చుకుంది ...- అల్లుకున్న విధ్వంసం లోంచి మత రక్కసి విరగబడి నవ్వుతోంది అస్థి పంజరాల గుట్టల మీంచి మొలుచుకొచ్చిన అధికార ప్‌రం పోగులు పడ్డ చితాభస్మం లోంచి కిరీటాన్ని కత్తిమొనతో అందుకుంటోంది ఓ శిథిల మసీదును కూల్చడనుంటే అమ్మవారికి మేకపోతుల్ని బలిచ్చినట్టు మానవ దేహాల్ని తరుక్కుపోవటమే ఓ కోవెల శిఖరం నేల మట్టం చేయడమంటే ఓ విశ్వాసాన్ని సమూలచ్చ్ళేదన చేయటమే ఇప్పుడక్కడ ..... వ్యక్తి స్వేచ్ళ సాంస్ఫృతిక ఉగ్రవాదపుటుక్కువలలో చిక్కుకున్న పావురాయి అక్కడ ..... సగటు జీవితం మతాధిపతుల శాసనాల ముళ్ళ కంచెల్లో తెగిపడ్డ గాలిపటం డెమోక్రసీ డేరాల మీద నియంతృత్వపు పతాకాన్నెగరవేస్తున్న మతం కల్చరల్‌ పోలీసై మనిషి మీద కవాతు చేస్తోంది నమ్మకాల దస్తావేజుల మీద సాగే ధ్వంస రచనలో వివర్ణమవుతున్న మానవీయ విలువలు షాదానికున్న వేళ్ళు నేలమీద పట్టు నిలువదానికైతే మతాలన్నీ జాతికి మూలవేర్లు కావాలి మరి..... సంసృృతీ పరిరక్షణ ముసుగులో మతం మృత్యు ద్వారాలు తెరుస్తుందేమిటక్కడ ? బోగీలనిండా మానవత్వాన్ని దహనం చేసి థ్‌ ఎ రెక్కతలుపుల గోస బాలా అూ

మతాన్ని హింసగా మార్చినదెవరు?

కాలాన్ని కత్తుల వంతెన మీద నడిపి

మనిషిని భయం కొక్కానికి వేలాడదీసిందెవరు?

అక్కడ ఎగిసిపడే అశాంతి కీలల్లోని అఖరి అర్హనాదాలకు ఏ మత (గ్రంథం చలించింది?

హింసకు ఏ పుటను కేటాయించింది ?

ఉందో లేదో తెలియని స్వర్గానికి ఉట్టి కట్టి

పట్టెడన్నం పెట్టని మతం

చిరిగిన శరీరాలమీద జానెడు గుద్దవ్వని అధికారం బాధల బ్రతుకుల్లోకేనాడు తొంగి చూశాయి కనుక? ఒకప్పుడు అహింసను మోసిన ఆ నేల నేలంతా

ఇప్పుడు రగులుతున్న స్మశానం

అక్కడ వినిపించే క్షతగాత్ర గానమే నేటి జీవన నేపథ్య సంగీతం,

ట్రైాాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాా సిరికి స్వామినాయుడు -౫=

4 భలం అమ్మ పసుపు కుంకాలకిచ్చిన మడి చెక్కంటే అయ్యకు పెద్ద కూతురే పెద్ద చెరువు నూనె రాసి నాగలితో పాపిట తీసేవాడు నొల్లతో నలుగు పూసి పారతో చెక్కిళ్ళద్దేవాడు విత్తనం విసిరి పిలిస్తే మొలకై ఊసులాడేద్‌. గొప్పు తవ్వి , గాబు తీసి కూతురి ఒళ్ళంతా చెమటగంధం పూసేది అమ్మ వేలబుగ్గి నెత్తిపోసుకున్న అయ్య

పాతాళాన్ని పితికి పాలధారగా పోసేవాడు చినుకుల సిల్కు దారాలతో పచ్చకోకనల్లి కస్టేవాదు వపుగా ఎదిగిన పంట చేనుతో మడిచెక్కను చూస్తుంటే డల ముస్తాబైన కూతురే కదలాదేది ఎత్తేసిన సన్సీడీల చెంపదరువుల్ని ఓర్చుకుంటూ సన్నిపాత జ్వరమెొస్తే కూతుర్ని పొత్తిళ్లలో పాదుముకుంటూ కనురెప్పలకు బతుకుటుయ్యాల వేలాడ దీసి కలల పారవశ్యంలో ఊగుతూ ..... అయ్య ఉన్నట్టుండి ఉయ్యాల తెగిపోయింది ఐతుకు కల్లోలమైపోయింది ! కళ్ళంలో కూతురు పురుదోసుకుంటుందనుకుంటే పొంచి ఉన్న ప్రోనోటు పత్రాల వాది కోరలతో దాడిచేసిన గుంట నక్కలు కళ్ళముందే నెత్తురోదుతున్న కూతురు పుట్టింటి భరణం పురుగుల మందై అమ్మ గొంతున జారితే పాదెమీద చెమట చుక్కై యింకిన ... అయ్య దెల్దా తీరానికి తలబాదుకుంటూ .... నేను !

=== రెక్కతలుపుల గోస పోటూ

5 చబంకెరేస్వు

నాయుదోళ్ళ వీధి గుమ్మాల ముందు

మురికి మూటల్ని మోసినపుడు

మా అయ్య ఓ హెర్మ్యులస్‌

వాళ్ళు ముట్టు వేదుకల్లోని మైలంతా

ఒంటికి పులుముకున్న మా అమ్మ మొహాన

అంటు గుద్దల్ని విసిరినపుడు

ఆమె తలదించిన భూదేవి

కన్నీళ్ళ రేవులో

గుండె బండమీద తల బాదుకుంటున్న

మావాళ్ళ కళ్ళలోని నెత్తుటి జీర

నాకిప్పటికీ గురుతే

సూరీడ్ని మండే కట్టెను చేసి

మూడు దిక్కుల పొక్కళ్ళ పొయ్యిమీద

గూనలో క్షారజలమై మరిగి

వాళ్ళు దేహాల మీద తెల్లదనాన్ని ఆరేస్తే

మా అమ్మ కొంగున వాళ్ళు విదిల్చింది

పిదికెడ్డు గింజలే 1

సమర్త కవుర్లు చెప్పి

సారె కావుళ్ళు మోసినంత కాలం వాళ్ళ పండుగ పబ్బాల్లో

మనము అడుగుదలోళ్ళమే 1

కాలాన్ని బంతిలా తన్నాల్సింది పోయి

ఇంకెంత కాలమని వాళ్ళని

ఏకో ఏకో రంగని భుజాలరిగిపోయేలా పల్లకీలో మోస్తాం

అందుకే ...

బానిస వృత్తుల మురికి కూపాల నుండి

పచ్చని నాగరిక మైదానాల మీదుగా పదంది

కులాచారాల్ని చాకిరేవు పెట్టి

కొత్త వేకువను కావుళ్ళతో మోసుకొద్దాం. ాధయ్రాాాాాాాలాాాాాాా సిరికి స్వామినాయుడు =

6కురలన్‌ నవ్వుల వానలకేంలు బహుళ జాతి బళ్ళదారిలో ఎడ్లబండి యిరుసిరిగినట్టు, బక్కచిక్కిన దుక్కిబెద్దు టైరుపాదం కింద నలిగినట్టు చాలుపోసే నాగలి నక్కూదిన చప్పుడు గ్రీష్మమే తప్ప, రుతువులు లేవు ఆరుగాలమూ అగ్ని కార్తెలే బీడువారిన నేల పగుళ్ళలో దుర్భిక్ష సంగీతం పొలం పెనం మీద విరిగిపడి యింకుతున్న స్వేద సముద్రం దుక్కిరాని బీళ్ళమ్‌ద దుఃఖ (ప్రవాహం కరువు కంచంలో కన్నీళ్ళు నిండుతున్న వైనం జముకు తీగ తెగినట్టు నొల్ల మేదిరిగినట్టు అన్నదాత వెన్నుముక విరిగిన చప్పుడు మండే ముప్పాద్దుల పొక్కళ్ళ పొయ్యిలో నేలతల్లి పయ్యాడ కొంగు కాలుతున్న దృశ్యం కడుపును పొడుచుకుతింటోంది కాటకం పిట్ట ఎండిన వేకువ పెదాలమీద కరువు పాట నిట్టూర్చు....... ఓ వదగాలి నాగేటి చాళ్ళు కంటి నెత్తుటి చారికలు ఎంద అద్దం పగిలి దేహం నిందా గాయాలు కొండంత మబ్బు కొంగరెక్కై ఎగిరిపోతే కురిసేది కన్నీటి వానే ఎంద చిలువ అగ్ని శ్వాసలో బతుకు బూదిదై కురిసే నిప్పుల వానలోంచి రెక్కలల్లార్చుకుంటూ ఎగిరిపోతుంది వలస పక్షి, ఎ రెక్కతలుపులగోస లాాాలాాాాాాాాాోోోోోంంంాఅా

7 తెగిన దారప్పేణు

పుట్టుమైల పాడెమీద యింకిన వరకు

బతుకు బతుకంతా పుడమి సిగ్గును కప్పిన చేనేత

చివికిన జీవన వస్తమై శిధిలమవుతుంది

ఆరాటం రాట్నం మీద ఆశల నూలు వడికి

ఆసుతో ఐతుకు తోడి

పేగు పేగును పోగుచేసి నేసిన పసిడినేత

సంబంధాల సంతలో చెల్లని ఆడపిలై చివికిపోతుంది

యంత్ర భూతం కోరల్లో చిక్కిన మగ్గం

ఊపిరాడక విలవిల్లాడుతోంది

కన్నీటి గంజితో పడుగు మీద సర్రికొట్టి తోడిన

ఆశల ఇలకర్ర జారిపోతోంది

నరాల నాది తెగిపోతున్నా

చిక్కులు పడ్డ బతుకు పేకను చక్కదిద్దాల్సిన అచ్చు

తెగిన హోగును అతకదు గాక అతకదు

అంతటి మండుటెండలోనూ నాకబద్దయి నిలబడి

చెమటను చల్లని మంచు తెరను చేసి

ఉక్కబోసే శరీరాలమీద ఉల్లిపొరవుతాడు

కన్నీటి పోగుల్తో పచ్చడం నేసి

వణికే శరీరాలమీద వెచ్చని చలిమంటవుతాడు

మగ్గం గుమ్మిలో బతుకంతా సజీవ సమాథై

దేహాలమీద వెన్నెల పూవై పూస్తాడు

అగ్గిపెట్టెలో బాధను యిమిద్చిన సాలీడు

తెగిన దారప్పోగై తల్లడిల్లుతున్నాడు

చిరిగిన కోకలో అత్తిపత్తిలా ముడుచుకుంటున్న యింటిది

కంటి ముంజూరు చినుకులతో కండె చుడుతుంది

కాలేసిన కూటి కుండలో

కురిసిన పసికళ్ళ ఆకలి చూపులు

తెగిన బొటన వేలు సాక్షిగా

బతుకుమీద ఆశ కొడిగట్టిన దీపమై కొందెక్కి పోతుంది

మగ్గం మీద నూయమైన హరివిల్లు

పాడెమీద గోరంచుకోకై పరుచుకుంటుంది. ార్రాాాలాలాలాలాలాలాలాలాలాలాడా సిరికి స్తారునాయుడు

8 కంణలును కొలను, నేల మీదపర్చుకున్న ఆకాశం తలారా కాంతి స్నానం చేసిన తెల్ల తామరలు నీటి తంత్రులు మీటే జల పుష్పాల సంగీతాన్ని వింటూ గట్టుమీద నేను గట్టు నా అవాసమే కాదు..... అమ్మ ఒడి ఊసుపోనపుడు గులక రాయితో పలుకరిస్తే తరంగమై తూలి పగలబడి నవ్వేది కెరటమై ఒడ్డుకు వచ్చి నా పొదాలను ముద్దెట్టి పోయేది మోకాళ్ళపై వంగి నీటి అద్దంలో నానీడ చూసుకొని మురిసిపోయే వాడ్ని దాని పిల్ల కాలువ మా పంట పొలంలో పాల ధారై పొంగేద్‌ కొలనంటే నాకు అమ్మ అలసిన వేళ నా శరీరాన్ని అలా కొలను ఒద్దున ఆరేస్తే | అలల పయ్యాదతో ముఖాన్ని అద్దేది దోసిళ్ళతో నీరు తాగినపుడల్లా... అమ్మ ఒడిలో చేరి అకలి తీర్చుకున్న అనుభూతి కొలనులో. ఈతకొట్టినపుడల్లా... అమ్మ కడుపున ఉమ్మ నీటిలో యిలానే ఉందేవాద్నేమోనన్సించేది గొంతులోంచి జారుతున్న పాలదారల పరవళ్యంలో ప్రశాంతంగా...నేను ఎపుడు కమ్ముకున్నాయో కారు మబ్బులు తెగిన తల్లి పేగులా వెల్లువై వరద కొలను మీద పరుచుకుంటున్న రంగు రంగుల వలలు కమ్ముకున్న బహుళ తెరల మాయాజాలం జలాలన్నీ విషపూరితాలయ్యాయి తేలిపోయిన పత్తిపింజల్లా తెల్ల తామరలు చేపలకోసం కుమ్మి కుమ్మి బురదైన కొలనిప్పుడు చెరబడ్డ అమ్మలా ఉంది కొలను నీరు ఉప్పు సంద్రాల్లోకి తరలిపోకుందా నేనిపుడు అడ్డు కట్ట కావల్సిందే మరి. ! _ శక్కతలపు గోన లాలా 6

8 వెన్నెల రా[తికె ఆహ్వానం మతం గురిపెట్టిన మారణాయుధం మొనమీద భూగోళం బొంగరమై తిరుగుతోంది విశ్వాసాల మట్టి పొరల్లో విధ్వంసాన్ని విత్తులుగా నాటుతోంది ఫాసిజం నల్లని మృత్యు వలయమై ప్రపంచ పటం మీద పరుచుకుంటోంది పసికందులమీద, దుఃఖమై పొర్లుతున్న తల్లితనంమీద కసిగా దూసే కత్తులు గూడు చెదరి గుందె పగిలిన అనాధ పక్షులు పునరావాస గుదారాలై ఎగిరిపోతున్నాయి మత ప్రమేయం లేని రాజ్యాంగం సాక్షిగా మైనారిటీ గుండెలమీద రాజ్యం పాతిన నెత్తుటి జెండా ఎక్కడ విన్నా... దేహాలు దుఃఖటద్దాలై పగిలిన చప్పుడు బితుకు-బితుకు మనే బతుకు భుజాన్ని తాకితే తల్వార్‌ వేటకు తెగిపడ్డ శిరస్సులే తగుల్తాయి మోదు మీద ఏ ఎండుటాకు అల్లల్లాడినా శూలం దిగబడి నేలరాలిన నెత్తుటి పక్షి రెక్కల చప్పుడే వినిపిస్తోంది. వ్‌ నీడను చూసినా .... వెంటాడుతున్న మృత్యు రాకాసే కనిపిస్తోంది

సిరికి స్వామినాయుడు -

భూగోళ మిప్పుడొక భీభత్స సంకేతం మనిషి తనం అంతరించి ఆవరిస్తున్న అనంత ఘోష నరతోట పుట్టుక నాడు పూయని మతాన్ని నడుమ సృష్టించిందెవరు ? మెతుకే దొరకని బతుక్కి మతాన్ని పూసి మారణాస్త్రంగా మలచిందెవరు? ఒక చేత పావురాన్నెగరేసి మరో చేత మారణాయుధాన్నందించిందెవరు ? మతమేదైనా... వాదమేదయినా మానవ జీవన మహా పయనానికి శాంతి మార్గమై సాగాల్సింది పోయి కత్తుల వంతెన మీద ఎంతకాలమీ నెత్తుటి నడక? తన జాతిని తనే బలి తీసుకుంటున్న సర్పనీతి యింకెంత కాలమని ? మతం కన్నా మానవత్వం గొప్పదన్న స్వప్నం సాకారమవ్వాలిపుడు శాంతి వెన్నెల కురిసే పున్నమి జాబిలిని ఆహ్వానించాలిపుడే... -ా రెక్కతలుపుల గోస రారా

16 వలస 0౩౦ యిక్కడే ప్రవహించే చెమట కాల్వల్ని మబ్బు తునకతో మొహం తుడుచుకునే నేల తల్లిని చూశాను పచ్చని చేలమీదుగా తొంగి చూసే ఆకుపచ్చని సూరీద్ని చూసాను పూలు పరిచిన దారుల్లో మట్టి పాదాలు నడవటం చూసాను వెలుగు ముగ్గుల వాకిళ్ళలో గొబ్బెమ్మ పాటలు విన్నాను వసంతాన్ని ముక్కున కరుచుకొని ఎగిరొచ్చే పక్షుల గుంపు పెరటి తోటల్లో వాలడం చూశాను యిప్పుదిక్కడ.... కళ్ళముందు ఎడారులై పరుచుకున్న పొలాల్ని ముళ్ళదారుల్లో మట్టి మనిషి పాదాల నెత్తుట్‌ ముద్రల్ని చూస్తున్నాను దేశాన్ని ధరించిన దేహాలమీద పర్చుకున్న ఉక్కు వలల్నీ బజారు యిసుక చారుల్లో యింకుతున్న చెమట కాల్వల్ని చూస్తున్నాను చాలుపోసిన నేలమీద కూలిగింజలేరుకునే కోడిపిల్లల్ని గెద్దల గుంపు తన్నుకు పోవటాన్ని చూస్తున్నాను. వలస వచ్చిన ప్రవాహాల్లో కొట్టుకుపోతున్న గడ్డి పోచల్ని కంటి ముంజూరు చినుకుల్లోంచి చూస్తున్నాను దుక్కిటెద్దు మెళ్ళో కనుమ నాడు కట్టిన అప్పాల దండ తెగిపోవటాన్ని చూస్తున్నాను పుడమి తల్లికి పాపిట తీయాల్సిన నాగలి పురాతన ప్రదర్శనా వస్తువు కావటాన్నీ చూస్తున్నాను యిప్పుడిక్కడ రైతు, పడమట గాలికి కొమ్మ విరిగి గూడు చెదిరి పల్లె తల్లి తీపి గురుతులు ముక్కున కరచుకొని వలస రాగమాలపిస్తూ ఎగిరిపోతున్న దిక్కుతోచని పక్షి యాలాల సిరికి స్వామినాయరు

11 రెక్కల గూడు

దేహాన్ని పునాదులుగా తవ్వి

అయ్య కట్టుకున్న రెక్కల గూడు ..... ఇల్లు

అమ్మ తన చేతుల్ని అలుకు పాతలు చేసి

పేదతో నలుగు పెట్టి

ముగ్గు బొట్టు పెట్టి ముస్తాబు చేసేది

వేలాడే విత్తనాలు క్ష్దె

నాబాల్యమంతా ఇంటి పెణక్కి ఉయ్యాలలూగేది ఆకాశాన్ని దున్నే సూరీడులా

అలసి వచ్చిన అయ్యకు

ఇంటి ముంజూరు విసన కర్రయ్యేది

మట్టి గంధం పూసుకొని

మునిమాపువేళ మునువై వచ్చిన అమ్మ

ఎసరు పెట్టని పొయ్యలో

పరువుకోసం పొగను రాజేసేది

ఎన్ని ఆకలి రాత్రుల్ని

గుట్టుగా కడుపున దాచుకోలేదీ అయినిల్లు ?

ఎన్ని కన్నీటి చుక్కల్ని

తనలో దిగమింగుకోలేదీ నట్టిల్లు ?

మా నగ్నదేవాల మీద

మట్టి గోడల దుష్పటై కప్పుకున్నదీ ఇల్లేకదూ! కుటుంబమంతటినీ కోలగూడై పొదుముకున్న ఇల్లు యిపుడు... కూలిపోయిన పిడకల కుచ్చిరై కుమిలిపోతుంది దాయమీద పాలబిడ్డె పొంగిన నట్టిల్లు పొయ్యి తాడవ మీద కాలేసిన కూటి కుండయింది.

= రెక్కతలుపుల గోస ాాాాోపడూా

కార్తీక దీపమై వెలుగులు పంచాల్సిన ఇల్లు

మసిబారిన దివ్వ గూడయింది

కుదురు కుమిలి

చెదిరిన పిట్టల గూడయ్యింది.

గరిసె ధాన్యాలు కదుపున మాసిన గాదె

ఖాళీ గాడి తట్టయింది

పొలధారల్లేవు

పశుసంపద లేదు

కొండచిలువై తార్రోద్డు

ఇంటి అరుగును మింగేసింది

ఇంటి వెన్నుపట్టిమీద వాలిన

కరువు తీతువు పిట్ట రెక్కలు చప్పుళ్ళకు

మడి చెక్కలు మట్టి దీపాలై ఆరిపోయాక

వలస దారిలో....... మేము

ఇపుడు ఇల్లు |!

మా గురుతుగా నిలిచివున్న ఓ మట్టి దిబ్బ మాత్రమే. రహా సిరికి స్వామినాయుడు

12 గా తోక బెత్తైడే ముడిచిన మెట్ట ముక్కున కమ్మి పాలె మొలతాడు బద్దల గొడుగు గొర్రెల మందలో వాడో గొగరై కలసిపోతాడు. ఆకాశాన్ని పచ్చడం చేసి బరికమ్మ పరుపులమీద దొర్లి దొర్లి పోగేసిన పిండ్రికల సెంటలోంచి తొలి పొద్దుకు ఆహ్వానం పలుకుతాడు. మట్టి బెడ్డ్దల పొయ్యి పొక్కళ్ళమీద ఎసరై మరిగి దాంగ(ర్రలో చల్లారిన చెమటను అంకుదాకు దొన్నలో జావజేసి తాగుతాదు రాత్రంతా కంటిమీద కునుకు పిట్టను వాలకుండా జేసి మందచుట్టూ ప్రాణాలు కంచెలా పాతిన కోనారి ఆకాశానికి దాపేసి రెక్కల దొనిగర్రతో మబ్బుల్ని తెంప్‌ మందకు మేతేస్తాడు ఎండముళ్ళు గుచ్చుకుంటున్నా శీతగాలి కమ్మకత్తె కోత పెడుతున్నా మందసారాన్ని మట్టి తల్లికి అందిస్తాడు బగాది పెట్టి పిడుగులు పడుతున్నా కప్పుకున్న తట్ట కమ్మలోంచి నీట్‌ మొక్కై మొలుచుకొస్తాడు కళ్ళం పెందిని మంద మేసిందని నాయుడు కొట్టిన కొరడా దెబ్బలకి జా రెక్కతలుపుల గోస ల

కన్పించే చుక్కల్ని కళ్లంట రాల్బుకున్న ఎ(ర్రిబాగులోడు

మన్నెం కని మేకల మందతో అడివి పట్టీసి

ఇటికీ పున్నమికి ఏడాదైనా

పిక్కురోడుమీద దేలపోయినపుడు

గొగ్రైపిల్లను చంకనెత్తుకుంటాదు.

టిర్‌........టిర్‌....... అంటూ పగలంతా

నాయుడోళ్ళ పొలాలమీద మందాసి

పొద్దు వాలాక ముత్తుం గింజల బత్తెం కోసం

వాళ్ళ మునివాకిట కుక్కై ఎదురుచూస్తే

గావంచాన రాలేవి మూడు సోలల గింజలు

వాళ్ళ పండగ పబ్బాల్లో

గుందెను తప్పెట గుళ్ళు చేసి ఎంత బాదుకున్నా

గొల్లోడి బతుకు గొర్రెతోక బెత్తెడే

మాయదారి రోగమేదో మబ్పై ముసిరి

మందను మింగేస్తే ...... వాడు

ఓ తప్పిపోయిన గొర్రెపిలై తల్లడిల్లుతున్నాడు. ాహ్రాాలాాలాలాలాలాలాలాాలా సిరికి స్వామినాయుడు

  1. అంగళ్ళు ఇఅంతతెగు ముతుణతి సూర్య దీపం ఒలికి కరువు మంటల్లో బతుకు పత్రం కాలిపోతుంది మడిని కొలిచే వానపాము మట్టి పెళ్ళల్లో మాడిపోతుంది ఇపుడీ కరువు పీల్చిన నేలలో .... నాగేటి చాలు వెనుక నడిచే మట్టి పాదాల్లేవు ఉడిసే మొనలకు ఊపిరి పోసే ' నోమి నోమన్నాలి పాటల ప్రాణవాయువుళ్లేవు గౌరీ పున్నమి నందెన్న ముంగిట గౌరీ దుబ్బుళ్లేవు పోల్లామాస కలగొప్పులనాడు పొలం గట్లమీదుగా పరుగెత్తే * కోబలి కోబలి ” కేకళ్లేవు దేశతల్లి వారాల పండక్కి మోసే కాళీకావృళ్ళు లేవు ఉరుముల్లేవు, ఉదుపుల్లేవు మెతుకులేదు, బతుకులేదు ఏటికేతాం పట్టిన ఏడాది ఐళుకు కన్నీటి మేఘమై కదలిపోతోంది భూగోవు పొదుగెండి పగుళ్ళుదేరుతుంది మట్టి మనిషి కనుగుద్దుపై ఆర్ధతలా అవరించిన కన్నీటి చెమ్మ కరువు కొరడా దెబ్బకు కడుపుమీద అకలి తట్టు ఆ రెక్కతలుపులగోస -లాలాలాలాలాాాంాఆశా-

నీరింకిన నూళుల్లోంచి కన్నీరు తోడుకుంటున్న చేదలు

ఊళ్లన్నీ ఉసూరుమంటూ వలస బకళ్లెక్కీ పోతున్నాయి.

మడిచెక్క కార్పోరేట్‌ కొక్కేలకు వేలాడుతోంది

అప్పుల గూడలు

చెమట చెరువుల్ని తోదుకుంటున్నాయి

ఆంక్షల వలలో

బతుకులు పిత్త పరిగలై తేలిపోతున్నాయి

పంటపొలాల్లో మాయమైన పచ్చదనం

పెట్టుబదీదారీ జేబులో పచ్చనోటై చిగురిస్తోంది

సామ్రాజ్యవాదమంటే

'స్వేద సంద్రాల్ని కొల్లగొట్టడమే కదా !

రైతు....

తన నేలకు తనే పరాయి

భూమీ...

నాగళ్ళు పాతిన సమాధి హ్ర్రాాలాలాలాలాలాలాలాాాాా సిరికి స్వామినాయుడు =

  1. కజ్‌ళా బంలల్‌కే... గోవుతల్లి కోడె దూడేసినపుడే .... నట్టింట్లో నేను నెత్తుటి పూవై పూసాను. దూడా నేను.... పొదుగు పంచుకొని పాలు కుడిచే వాళ్ళం నా చిన్నతనమంతా లేగదూడతోనే గంతులేసేది దూడ దుక్కిటెద్దయినపుడే నేను ఏరుపిడి అందుకున్నాను ఎద్దు జతకు ఎద్దును కొనితెచ్చి మేము ముగ్గురిమయ్యాము మెడలో గంటలు కొమ్ములకి పన మువ్వలు కట్టి బండిపూస్తే ఊరు ఊరంతా ఉత్సవమయ్యేది పెంట గెత్తం నెత్తికెత్తుకొని మడిలో ముగ్గేసినపుడు మూగబాసేడో మా ముగ్గిరికే ఎరుకయ్యేది ఐతుకు పలుపు ఎడ్ల మెడకు చుట్టి వదాది రెక్కల కష్టం ఎడ్ల మూపునేసి సంకురాతిరికి పంటగా ఇంటికొస్తే కనుమనాడు ఎడ్లమెడలో అప్పాల దండలు కిలకిల నవ్వేవి మొర్రాట పూసుకొని మాయింట రంగుల పండుగే జరిగేది ఎ. రెక్కతలుపుల గోస

దుక్కిటెడ్లంటే... నాదేహములో భాగమే

పశువుల సాలంటే నాకు పర్ణశాలే

దమ్ము మడిలో ముగ్గురము దొర్లి దొర్లి

బురద బుక్కి

విపుగా ఎదిగిన పంటచేనును కలగనే వాళ్ళం,

మా కలల గర్భమిపుడు కందుబారిపోయింది

కరువు తోడేలై కళ్ళంలో ఊళేసింది

కనుచూపు మేరా ఎదారి దృశ్యం

గాడి తట్టలో ఎండుగడ్డి పరకైనా మేతకు లేక

ఎముకల గూక్సై చిక్కిన దుక్కిటెదు

కరువును నెమరవేస్తూ

కుడితి గోళెంలో కన్నీరు తాగుతున్నాయి

యిపుడు...

నా ఆత్మను అంటుకట్టుకొని

కబేళా దారిలో ............నా దుక్కిటెడ్డు

కఠువు వాగులో కొట్టుకుపోతూ..........నేను. సిరికి స్వామినాయుడు

  1. ఎంటదముతత్తులుు కరువు ముసురులో తడిసిన ఏ కట్లెను కదిపినా కురిసేది కన్నీటి వానే. మేడి పట్టిన చేతులిపుడు మట్టి తట్టలు మోస్తున్న విషాదం కరువును తవ్విన కొద్దీ విరిగిన నాగళ్ళు మొలుచుకొస్తున్న విధ్వంస దృశ్యం కష్టపడినోడికి కాలెంవికులు కూకోని తిన్నోడికి గుందెకాయలు కడుపు మంట తీర్చాల్సిన పని బియ్యం నల్ల ఐజారుకు లాకీలై తరలిపోతున్నాయి పథకాల పేరు మార్చే తప్ప, పేదోడి నోటికాడ ముద్దెపుడూ గెద్దయి యంత్రం తన్నుకు పోతుంటుంది కాగితం మీద పెరిగిన కూలీ రేట్లు కాయకష్టం చేసిన చేతికి చేరనే చేరవు ఎత్తిపోసిన రాదారులన్నీ వలికల మేడలకు తోవలై పరుగెడితే పేదల ఐతుకులు మాత్రం బంటా గుమ్మిలై మిగిలిపోతున్నాయి పూరిగుడిసెల్లో బుడ్డీలారిపోయి కలిగినోడింట్లో కరెన్సీ వెలుగులౌతున్నాయి ప్రణాళికల్లో పూర్తయిన పథకాలు పచ్చతోరణాలై ఆ. లెక్కతలుపుల గోస

కలవారి దువ్వారాలకు కళ కళలాదుతున్నాయి పతాక శీర్షికల్లో ప్రవహించే నిధుల ప్రవావాలు 'సేదోడింటి ఇరుపంచలకు రావు బందెదు దేశాన్ని మూపును మోస్తున్న దుక్కిటెద్లకు ఎంవికలు తప్ప ఏటి మిగిలింది ? కాల్వలై చెమట కారినట్టు కాయ కష్టం చేయించుకొని ఏదుం బియ్యం ఎదాన కొడితే వఏదాదాకలి తీరుద్దా ? సగం పరువు సంతలోపోయి ఉన్న పరువు ఊరిలో పోయినట్లు ముఖం చాటేసి వలన పోదామంటే మట్టి తీపి ముంజూరు దాటనివ్వదు రాళ్ళు తేలిపోయి పిడకలు మునిగిపోతున్న పాపిష్టి కాలంలో బతుకులు భారమై చావులు తేలికవుతున్నాయి పచ్చదనాన్నెవరో దోచుకుంటే 'పేదోడు పందుటాకై రాలిపోతున్నాడిపుడు. దుంపలా ఇస్సి "ట్ర ఖం ఉ((౦-గ్రర్షిక[[]) స్‌ యో న్‌ /| పద వా సరికి స్వామినాయుడు -

౧౯664౫4000 ౬4 6054 - (౧౦దఖం. . " ... చింతా అప్పలనాయుడు - కతలు కూడా రాస్తాదు..

*... కవిత్వమూ రాస్తాడు. కలిసినామా - కడుపు చెక్కలయ్యేట్టు నవ్వించి కన్నీళ్లు కార్చే యిదంగా మనకి కబుర్లూ, కాకరకాయలూ చెప్తాడు. . కత, కవిత, నాటిక, మాట, పాట, - అన్నిటితోటీ అప్పలనాయుడు

ర తన నేల గురించి, అక్కడి ఐబతకుల గురించీ, జ్ఞాపకాల చవట యి కొండగురించీ, కోన గురించీ, ఆకాశం మీది మబ్బు గురించీ ". ... .. మమకారాల గురించీ, గాయాల గురించీ గోస, గోస పెడతాడు. నా. 7 అ ఆయనకు ముసలి తల్లి - కాలికట్టులు తెగిన కుక్కి మంచం లానే ౯ కనబడుతుంది. వలసబోయే రైతు - వసంతం కోల్పోయిన వాడిలా, విరిగిన నాగలిలా కనిపిస్తాడు. బతుకుబండి పరుగెత్తదానికి - పగలంతా పొలంలో పచ్చజెండాలు నాటే కష్టజీవులనేకుల్ని - ఆయన ఇంకా అప్పంవాయుడు _ న్స్రృన్స క్తళ్లక్తు చూపిస్తాడు. ” ఆ “ కొందరు డోర్‌ నెంబర్లూ; ఫోన్‌ నెంబర్లూ, ఊరు, వాడా, వగయిరాలు చెప్తారు - తమ చిరునామాకోసం 1! అయినా వారి . చిరునామా గుర్తించలేం. గానీ స్వామినాయుడ్ని సులువుగా గుర్తిస్తాం, . = మర్చిపోలేనంతగా.గుర్తుంచుకుంటాం ! ఎందుకంటే - మట్టి అతని' ... చిరునామా! ఇంటి పెణక్కివేలాదే - మాయమైన విత్తనాల కట్ట, మగ్గం స మీద మాయమైన హరివిల్లు, బతుకు పొడెమీద గోరంచుకోక, కరువు గ | ముసురులో తదిసిన కట్టెలూ, కులాచారాల చాకిరేవు, కొడిగట్టిన దీపాలూ, (వశ్నల కొడవళ్లూ, నాగళ్లు ఆయుధాలూ, కొత్త వేకువను క మోసుకొచ్చేందుకు బయల్దేరిన కావుళ్లూ - కన్పిస్తాయి మనకితని కవితల సిరికి స్వామినాయుడు. నిద్రా... ౫ . ' ఎ. అప్పలనాయుడు ; .. “ఊళ్ళిప్పుడెలగున్నాయి? దుఃఖపు చూటల్లాగున్నై. న ఎన్నుపట్టి యిదిగిపోయి.. ముంజూరు గడ్డి ఎగిరిపోయి పెచ్చులూడిన , గోడల్తోటి సుడిగాలికి కొట్టుకుంటున్న తలుప్లుల్తోటి ఇల్లు....పట్టు? ఎలిషోయిన కొడుకుని తలుసుకోని దుఃఖంతోటి గుందెబాదుకుంటున్లు._ ముసిలి తల్లిలాగ,..;సిమోరైపోయిన ఆ ఇంటి ' రెక్కళలుపుల గోస” యిది...ఆలకించుదుం రండి... ఆగోనతోటి మన గుండెగోనని జతకలుపుదుం రండి! ” " _గంటేద గౌరునాయుడు. ;