Telugu rasarna sudhakara sudha - anilvaranasi/indianlanguages GitHub Wiki
, ం . నయ టు అ! బంలడూ్ భై త కహాకజ ఉళాకర సుఠ్ జ ) (లో యా . . ళో = సహ క బ్కవతో సేకరించిన జ్సం ( 1: ఎగ ము నుల | య | వ. సుందరయ్య విజ్తోన న్నాం
- ఏ ఆనందంతో బహూకలిజ ఎ బం సజ్జ వ. _ చుల్లిమాల కుటుం వ్, . | వ ను (| . వ్. | . అలసటా దా పతర సమత ( జ్ స్మ ,' హైదరాబాదు .
రజతోత్సవ[గ్రంథమాల - త్రయోదశకుసుమం రసార్హవ సుధాకర సుధ సంపాదకుడు దా॥ పుల్లెల శ్రీరామచంద్రుడు శ్రీమతి 8.7.6 వసంతలక్ష్మి ఆ4గ౧|0? ౬600476! 1౧ 5409171 [12౧2|3౧1 ౮౮౧1౦౧ 0011806, గ/6612046 ్రూ ఛీ న మతి జ గ్ర సంస్కృతభాషా ప్రచార సమితి హైదరాబాదు 2004
రసార్జవ సుధాకర సుధ న ర్ట గ
అజో ప్రథమముద్రణ : 2004 వెల ; రూ. 25/-
[6 గ్
(ప్రకాశకులు : (౬ సంస్కృతభాషా ప్రచార సమితి 5-4-743సి, శో శ్వా నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్, సు నో 420 టి హైదరాబాద్ - 500 001. ష్ య యాం. 1 అక్షరాల కూర్చు : సమంత గ్రాఫిక్స్ బేగంపేట, హైదరాబాద్-500 016. ముద్రణ : విఠల్వాడి, హైదరాబాదు = 500 029.
3 శ్రీః తొలిపలుకు
వివిధవిద్యాసంస్థలను నెలకొల్పి నిర్వహిస్తూన్న జి. పుల్లారెడ్డి చారిటీస్ ట్రస్టుకు అనుబంధసంస్థగా సంస్కృతభాషాప్రచారసమితి హైదరాబాదు నగరంలో, 1978లో స్థాపించబడింది. నాటి నుండి ఈ సమితి ఆంధ్రప్రదేశంలో సంస్కృత భాషాప్రచారకార్యం అవిచ్చిన్నంగా సాగిస్తూన్నది. సమితి చేపట్టిన ప్రధాన కార్యక్రమం క్రమబద్ధరీతిలో రూపొందించిన ఏడు సంస్కృతపరీక్షలు నిర్వహించి తద్ద్వారా పాఠశాలా-కళాశాలా విద్యార్ధులకు, ఇతర సంస్కృతప్రియులకు సంస్కృతభాషను అభ్యసించడానికి తగిన అవకాశాన్ని కల్పించడం. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశం లోని వివిధవిద్యాస్థానాల్లో ఉన్న దాదాపు 250 కేంద్రాల ద్వారా నిర్వహింప బడుతున్నది.
సమితి పరీక్షానిర్వహణకార్యక్రమానికి అనుబంధంగా గ్రంథప్రచురణ కార్యక్రమం కూడా చేపట్టి నిర్వహిస్తూన్నది. సంస్కృతభాషాసాహిత్యాలకు సంబంధించిన గ్రంథాలను తెలుగుభాషద్వారా తెలుగువారికి అందించడం దీని ప్రధానలక్ష్యం. ఈ కార్యక్రమానికి సంస్కృతభాషాశ్రద్ధాలువులనుండి ప్రోత్సాహం లభించడం సమితికి ఆనందజనకం.
ఈ సంవత్సరంలో (2008-2004) రజతోత్సవం జరుపుకొంటూన్న సమితి సుప్రసిద్ధులైన సంస్కృతవిద్వద్విదుషీమణులచేత సంస్కృతసాహిత్యానికి సంబంధించిన, ఆ యా కవులను, వారి కావ్యాలను పరిచయం చేసే ఇరవైయైదు లఘు [గ్రంథాలను వ్రాయించి ప్రచురిస్తూన్నది. ఈ సాహిత్యయజ్ఞంలో ఆర్త్విజ్యం వహించినవా రందరికీ మా కృతజ్ఞతలు,
ఈ రజతోత్సవ[గ్రంథమాలా బ్రయోదశకుసుమంగా శ్రీమతి వసంతలక్ష్మి గారిచే రచింపబడిన రసార్దవ సుధాకర సుధను ప్రచురిస్తున్నాము. దీనిని సంస్కృతాభిమానులందరు ఆదరించగలరని విశ్వసిస్తున్నాము. సంస్కృతభాషాప్రచారసమితి, పుల్లెల శ్రీరామచంద్రుడు హైదరాబాద్. కులపతి
సంస్కృతభాషా ప్రచారసమితి "హైదరాబాదు కార్యనిర్వాహకసంఘసభ్యులు క త్రీ బి. పుల్లారెడ్డిగారు, అధ్యక్షుడు 2 మహామహోపాధ్యాయ డా. పుల్లెల శ్రీరామచంద్రుడుగారు, కులపతి 8 దా. కే. రాజన్నశాస్రిగారు, ఉపకులపతి త్తే శ్రీ చలమచర్ల వేంకటశేషాచార్యులుగారు, కార్యదర్శి 5. శ్రీ పి. రామకృష్ణగారు, సభ్యుడు 6. _ శ్రీ ఆర్.రామానుజాచారిగారు, సభ్యుడు /4 శ్రీ పి.వేంకటేశ్వర్లుగారు, సభ్యుడు & శ్రీబియన్.రెడ్డిగారు, సభ్యుడు 9, శ్రీ ఆకెళ్ల సత్యనారాయణమూర్తిగారు, సభ్యుడు 10. థ్రీ ఆర్.వి. శేషాచార్యులుగారు, సభ్యుడు 11 శ్రీ వై. నాగభూషణరెడ్డిగారు, సభ్యుడు 12. శ్రీ పి. సుబ్బారెడ్డిగారు, సభ్యుడు
శ్రీః రసార్దవ సుధాకర సుధ
భారతభూమి రత్నగర్భ. ఈ భూమిపై అమేయ శేముషీ సంపన్నులైన కవి పండితులకూ, వారిని మహాగౌరవంతో పోషించి వారిచేత చక్కని గ్రంథరాజాల్డు, కావ్య నాటకాలు వ్రాయించుకున్న సరసులైన మహారాజులకూ కొదువలేదు”. “బోడ్డారో మత్సరగ్రస్తాః ప్రభవః స్మయదూషితాః ... అని భర్తృహరి వంటివారు వాపోయినా కవిపండిత పోషకులైన మహారాజులు, చక్రవర్తులూ ఎందరో మన చరిత్రలో దర్శనమిస్తారు. మన దేశంలో లెక్కకు మించిన అలంకారశాస్త్ర గ్రంథాలు, వివిధ కావ్యనాటకాలూ రచింపబడి ప్రచారంలోకి వచ్చాయంటే దానికి మహారాజుల సాహిత్యతృష్టే కారణం. స్వస్థమైన మనస్సుతో కవితామయ భావనలు చేయడం, వాటికి మెరుగులు దిద్ది గ్రంథస్థం చేయడమూ - రాజాశయంలో ఉన్న కవికి సాధ్యమైనట్లుగా స్వతందత్రుడైన కవికి సాధ్యం కాదు. అతని కవిత్వానికి గుర్తింపూ, ప్రచారమూ కూడా లభించవు. లబ్బప్రతిష్పలైన కవులు హెచ్చుభాగం రాజుథయంలో ఉన్నవారే. మహారాజులు తాము స్వయంగా పాండిత్యమూ కవనశక్తీ గలవారు కాకపోయినా, పండితులూ కవులయొక్క వైశిష్ట్యాన్ని గుర్తెరిగి, వారిని గౌరవించడం తమని తాము గౌరవించుకోవడంగానే భావించి, వారిని పోషించారు. ఆ కవులు తమ ఆశ్రయదాతయొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ కావ్యాలు వ్రాసి, పండితులు తాము రచించిన లక్షణ[గ్రంథాలలోని లక్షణాలకు లక్ష్యాలు (ఉదాహరణలు)గా తమ రాజుయొక్క ప్రశస్తిని చిత్రించే శ్లోకాలు వ్రాసీ తమ తమ కృతజ్ఞతలను వెల్లడించుకున్నారు.
కేవలం కవిపండిత పోషణతోనే సంతృప్తిచెందక తామే స్వయంగా గ్రంథరచనకు పూనుకొన్న మహారాజులూ తక్కువేమీ కాదు. ధారానగరాధీశ్వరుదైన భోజరాజు సరస్వతీ కంఠాభరణం, శృంగారప్రకాశం మొదలైన అలంకార[గ్రంథాలను, రామాయణ చంపూ కావ్యాన్నీ రచించాడు. స్టాణ్వీశ్వరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేసిన హర్ష వర్ధనుడు ప్రియదర్శిక, రత్నావళి, నాగానందం అనే నాటకాలను రచించాడు. ఆంధ్ర దేశానికి చెందిన రాజులలో కొండవీటి రాజ్యాన్ని పాలించిన పెదకోమటి వేమారెడ్డి సాహిత్యచింతామణి అనే అలంకార గ్రంథాన్ని సంగీత చింతామణి అనే సంగీతశాస్త్ర (గ్రంథాన్ని, అమరుకశతకానికి వ్యాఖ్యానాన్నీ వ్రాశాడు. ఓరుగంటి రాజ్యాన్ని పాలించిన రెండవ ప్రతాపరుద్రుడు (రుద్రమదేవి మనుమడు) యయాతి చరిత్ర అనే నాటకాన్ని
6 రసార్దవ సుధాకర సుధ వ్రాశాడట. ఆరాజవంశానికి బంధువూ, ఆరాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడదూ అయిన జాయపసేనాని నృత్తరత్నాకర మనే నాట్యశాస్త్రగ్రంథాన్ని రచించాడు. రాచకొండను పాలించిన అనపోతనాయకుడు అభిరామరాఘవమనే నాటకాన్ని వ్రాశాడు. అతని కుమారుడే రెండవ సింగభూపాలుడు. అతడు రసార్ణవసుధాకర మనే అలంకారశాస్త్ర గ్రంథాన్ని రత్నపాంచాలికకువలయావళి అనే నాటికనూ (వ్రాశాడు. అతడు మంచి కవి, ఆలంకారికుడూ మాత్రమే కాక సహృదయుడైన కవిపోషకుడు కూడా. అతని ఆస్థానపండితుదైన విశ్వేశ్వరుడు చమత్కారచంద్రిక అనే అలంకారగ్రంథాన్ని, వీరభద్ర విజయమనే డిమాన్నీ వ్రాశాడు. బొమ్మకంటి అప్పయార్యుడనే మరొక పండితుడు అమరకోశానికి వ్యాఖ్యానాన్ని వ్రాశాడు. “సర్వజ్ఞనామధేయము శర్వునకే రావుసింగ భూపాలునికే యుర్విం జెల్లును” అని శ్రీనాథకవిసార్వభౌముని చేత ప్రశంసించ బడినవాడూ, పోతన మహాకవి విరచితమైన భోగినీదందకాన్ని కానుకగా అందుకున్న వాడూ అయిన మూడవ సింగ భూపాలుడు అతని మనుమడే. రెండవసింగ భూపాలు నికి గూడా సర్వజ్ఞబిరుదం ఉండేదట.
సింగభూపాలుడు రసార్ణవసుధాకరంలోని తన ముత్తాత దాచయనాయకుని వద్ద నుండి తన కుమారులదాకా తమ వంశక్రమాన్ని వివరించాడు. అనుమనగల్లు (నేటి ఆమనగల్లు)కి చెందిన రేచర్ల వంశీయులు - శౌర్యపరాక్రమాలకే గాకుండా స్వామిభక్తికీ విశ్వాసపాత్రతకూ గూడా పేరెన్నికగన్నవారు. దాచయ నాయకుని తాత ప్రసాదిత్య నాయకుడు కాకతీయ వంశాన్ని విశ్వాసంతో కొలిచాడు. అతడు గణపతిదేవ చక్రవర్తి కాలంలో సేనానాయకుడుగా ఉన్నాడు. గణపతి దేవుని తరువాత - ఆయనకు పుత్రసంతానం లేని కారణంగా ఆయన పెద్ద కుమార్తె రుద్రమదేవి “రుద్రదేవ”డనే పేరుతో రాజ్యాధికారానికి వచ్చింది. ఒకస్త్రీ రాజ్యాధికారాన్ని చేసట్టడాన్ని అప్పటి మిత్ర సామంత రాజవర్ణాలు సహించలేక తిరుగుబాటును లేవదీశాయి. దేవగిరి రాజైన మహాదేవుడు అపారమైన సైన్యసంపదతో దండెత్తి వచ్చాడు. అటువంటి గడ్డు సమయంలో ప్రసాదిత్యనాయకుడు రుద్రమదేవికి బాసటగా నిలిచి రాజ్యంలోపలి తిరుగుబాట్లను అణిచివేయడంలోను, బయటినుండి వచ్చిన దండయాత్రలను ఎదుర్మోవడంలోనూ ముఖ్య పాత్రను పోషించాడు. రుద్రమదేవి అతనిని “కాకతీయ రాజ్యస్థాపనాచార్య”, “రాయ పితామహాంక” బిరుదులతో గౌరవించింది. రుద్రమదేవికి నమ్మినబంటుగా ఉండి 'సీవించడమే గాక, ఆమె తరువాత రాజ్యాధికారానికి వచ్చిన ఆమె దౌహ్రితుడు ప్రతాపురుద్రునికి కూడా అతడు సింహాసనానికి వచ్చిన కొంతకాలం
రసార్దవ సుధాకర సుధ 7 వరకూ మార్గనిర్దేశనం చేశాడు ప్రసాదిత్యనాయకుడు. అతని తమ్ముడు దామానాయకుని కొడుకు వెన్నమ నాయకుడు. ఆ వెన్నమ నాయకుని కొడుకే సింగ భూపాలుని ముత్తాత దాచయ, లేదా దాచానాయకుడు. అతని భార్య పోచమాంబ. వారి పెద్ద కొడుకు సింగమనాయకుడు/మొదటి సింగభూపాలుడు. ఈ తండ్రీ కొడుకులిద్దరూ ప్రతాప రుద్రుని సైన్యంలో సేనానులుగా ఉన్నారు. ప్రతాపరుద్రుడు కాంచీపురంపై దందెత్తినప్పుడు దాచానాయకుడు అమితమైన పరాక్రమంతో పాండ్యుల గజబలాన్ని చెల్లాచెదరు చేసి కాకతీయసైన్యాల విజయానికి కారకుడయ్యాడు. అందువలన ప్రతాపరుద్రుడు అతనికి “పంచపాంద్యదళవిభాళ” బిరుదునిచ్చి సన్మానించాడు. అది జరిగిన కొంతకాలానికి ఓరుగల్లుకోట మహమ్మదీయుల వశమైంది. అనంతరకాలంలో ఆంధ్రరాజులు మహమ్మదీయుల మీద తిరుగుబాటు చేసి స్వతంత్రరాజ్యాలను స్థాపించుకున్నారు. ఆ క్రమంలో సింగమనాయకుడూ తన రాజ్యాన్ని స్టాపించి, క్రమంగా విస్తరించాడు. మరికొన్ని దుర్గాలతో బాటుగా కృష్ణాతీరాన ఉన్న ఏలేశ్వరాన్ని జయించి, అక్కడి శివాలయంలో వేదపారాయణాన్నిి నిత్యవిధులనూ నెరవేర్చడంకోసమై చాలా మంది బ్రాహ్మణులను కుటుంబాలతో బాటుగా అక్కడ నిలిపి వారి దినవెచ్చానికి, దేవుని కైంకర్యానికీ కావలసిన ఏర్పాట్లను సమృద్ధిగా చేశాడు. రాజ్యవిస్తరణ ప్రయత్నంలో జల్లిపల్లికోటను ముట్టడించిన సమయంలో ఆ దుర్ధాధిపతులైన సోమవంశక్ష్మత్రియులు అతనిని మాయోపాయంతో సంహరించారు. ఆ వార్తను విన్న అతని కుమారులు అనపోతనాయకుడు, మాదానాయకుడు ససైన్యంగా ఆ దుర్దాన్ని ముట్టడించి, ఆ కోటలోని సోమవంశ క్షత్రియులను వారి సహాయులనూ సంహరించి, వారి రక్తంతో తమ తండ్రికి తర్పణాలు విడిచారట. ఆ తరువాత అనపోతనాయకుడు రాజై తన రాజధానిని అనుమనగల్లు నుండి రాచకొండకు మార్చాడు. 'సోమకులపరశురామ, “భుజబలభీమి”, 'అరిగాయ గోవాలి బిరుదులను వహించి అతడు బ్రాహ్మణులకు విస్తారంగా దానాలు చేశాడు. శ్రీ శ్రైలదేవాలయానికి మెట్లు కట్టించి జనులు సుఖంగా దేవదర్శనం చేసుకోవడానికి వీలు కలగజేశాడు. అతని భార్య అన్నమాంబ. వారికి కలిగిన ఇద్దరు కొడుకులలో రెండవవాడు సింగభూపాలుడు. అతనిని కుమార సింగ భూపాలుడనిగూడా పేర్కొనడం కద్దు. తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన విజ్ఞానసర్వస్వం మొదటి సంపుటంలో అతని పరిపాలనా కాలం క్రీ.శ. 1388-1899 సం॥ మధ్యకాలంగా పేర్కొనబడింది. అతడు తండ్రి వారసత్వంగా శౌర్యపరాక్రమాలనే గాకుండా సాహిత్యాభిలాషను, కవి పండితవత్సలత్వాన్నీ గూడా అందిపుచ్చుకున్నాడు.
68 రసార్దవ సుధాకర సుధ చమత్కారచంద్రికాకర్తయైన విశ్వేశ్వరుడు, అమరకోశానికి వ్యాఖ్యానం వ్రాసిన బొమ్మకంటి అప్పయార్యుడూ మాత్రమే కాకుండా చాలామంది కవులు, పండితులు అతని ఆస్థానంలో ఉందేవారు. సింగభూపాలుడు రసార్జవసుధాకరం, కువలయావళీ (గ్రంథాలతో బాటు కందర్పసర్వస్వమనే రూపకాన్ని సంగీతసుధాకరమనే (గగ్రంథాన్నీ కూడా వ్రాశాడు. ఆ సంగీతసుధాకరం శార్జ్ఞదేవ విరచితమైన సంగీతరత్నావళికి వ్యాఖ్యానం అయి ఉండ వచ్చునని పెద్దలు అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఒక రాజు ఏదైనా గ్రంథాన్ని వ్రాస్తే అతని ఆస్థానకవి ఎవరో తాను వ్రాసిన (గ్రంథాన్ని అతని పేరున పెట్టి ఉంటాడని లోకం భావించడం పరిపాటి. హర్షవర్ధనుడు మొదలుకొని ఏ రాజుకూ ఇది తప్పలేదు. అదే మార్గంలో రసార్జవసుధాకరాన్ని విశ్వేశ్వరుడు రచించి సింగభూపాలుని పేరున పెట్టాడని గూడా ఒక వాదం ఉంది. కాని సర్వజ్ఞబిరుదాన్ని పొందిన సింగభూపాలుడు ఇతరులు వ్రాసిన గ్రంథాన్ని తన పేరుమీద ప్రచారం చేసుకుని ఉంటాడని భావించడానికి తగిన ఆధార మేదీ కనిపించదు. అదీగాక విశ్వేశ్వరుడే తన చమత్కారచంద్రికలో రసార్ణవసుధాకరం సింగభూపాలునిచేత రచింపబడినదని స్పష్టంగా పేర్కొన్నాడు. శ్లో॥ ప్రేక్ష్యం ద్విధా రూపకాఖ్యం ఉపరూపక మిత్యపి ॥ రూపకం దశధా ప్రోక్తం నాటకాదివిఖభేదతః | మహాప్రబంధసామ్రాజ్యమధికర్తుమిదం క్షమమ్ ॥ సింగభూపాలరచితే రసార్ణవ సుధాకరే అస్య ప్రపంచో విజ్లేయః కే తథా వక్తు మీశతే ॥ శ్లో అనుక్తానా మిహాన్యేషాం లక్ష్యలక్షణవిస్తరః ॥ సింహభూపాలరచితే రసార్ణవసుధాకరే ఆదిద్వితయయోః సాధు శీలనీయో విలాసయోః 1 ఈ రెండు నృలాలలోనూ సింగభూపాలుడదే రసార్థవసుధాకరకర్తగా పేర్కొనబడ్డాడు. అదీగాక - ఇటు విశ్వేశ్వరుడు, అటు బొమ్మకంటి అప్పయార్యుడూ ఇద్దరూ తమ తమ కృతులలో అతని పాండిత్యాన్ని గొప్పగా ప్రశంసించారు. రాజా సంస్కృతవాదిషు ప్రణయవానిత్యాశయా గుంఫితం త్వద్బృత్యత్ర భవామహే పదరజైరేధేమ మౌలిస్థితై: 1 ఇత్థం పండితమానినాం క్షితిభుజాం దుస్సంస్కృతంవాచినాం తైః సాకం సుపదీకరోతి కృపయా శ్రీసింహనారాయణ: ॥
రసార్జవ సుధాకర సుధ 9
(రాజు సంస్కృతం మాట్లాదే వారిపట్ల ఆదరం కలవాడు గదా అని ఆశతో దీనిని (కావ్యాన్ని/శ్లోకాన్ని) కూర్ప్చాము. ఆయన ఎట్లాగూ ఇతర రాజులు మాట్లాడే దుస్సంస్కృతాన్ని దిద్దుతూనే ఉంటాడుగదా. వారు మరీ - నీ భృత్యులలో ఒకరమై ఉంటాము అనడానికి “త్వద్భృత్యత్ర భవామహే” అంటారు. సర్వనామంకాని భృత్యశబ్బానికి త్రల్ ప్రత్యయం చేర్చి భృత్యత్ర అనడం దోషం. భూధాతువు పరస్మై పది. దానిలో ఆత్మనే పదరూపంతో భవామహే అనడమూ దోషమే. నీపాదధూళిని శిరస్సున ధరించి వృద్ధిని పొందుతాము అనడానికి “పదరజైరేధేమ మౌలిస్థితైొ అంటారు. సకారాంత నపుంసకలింగశబ్దమైన రజశ్ళబ్దాన్ని తృతీయాబహువచనంలో రజోఖభిః అని ప్రయోగించాలి. దానిని అకారాంతశబ్దం లాగా రజైః అనడం దోషం. ఏధధాతువు ఆత్మనేపది. దానిని ఏధేమ అనడం కూడా దోషమే. ఈ అతి చిన్న సంగతులు గూడా తెలియకుండా తనను మెప్పించాలనే కోరికతో సామంతరాజులు మాట్లాడే దుష్టమైన భాషను దిద్దే అలవాటుగల సింహనారాయణుడు (సింగభూపాలుడు) నా వాగ్దోషాలను గూడా దిద్దుతాడులే).
దీనిని బట్టి సింగభూపాలుడు మంచి జ్ఞానం గలవాడని, ఇతరుల తప్పులను దిద్దే నేర్పుగలవాడనీ స్పష్టంగా తెలుస్తోంది.
బొమ్మకంటి అప్పయార్యుడు తాను వ్రాసిన అమరకోశవ్యాఖ్యానం చివర దాని యొక్క దోషరాహిత్యాన్ని ఉగ్గడిస్తూ ఇట్లా అన్నాడు. శ్లో కుమారసింహభూపేన లక్ష్యలక్షణవేదినా
శోధితశ్చేదయం [గగ్రంథః కిం శోధ్యః శోధకాంతరైః 1
(లక్ష్యలక్షణజ్ఞానం గల కుమారసింగభూపాలుడు ఈ గ్రంథాన్ని శోధించాడంటే ఇంక ఇతరు లెవరైనా దీనిని సవిమర్శంగా శోధించవలసిన అవసరం ఉందా?)
విశ్వేశ్వరుడు చెప్పినట్లుగా ఇతరులు పలికిన మాటలలోని దోషాలను దిద్దగలవాడైన సింగభూపాలుడు సహజంగానే ఆగ్రంథంయొక్క వ్రాతప్రతిని గూడా శోధించి తప్పొప్పులు సరి చూచి ఉండవచ్చు. అతడు చూస్తే మరింకెవరూ ఆ గ్రంథాన్ని సరిచూడవలసిన అవసరం లేదు అనే ప్రత్యయం కలగడానికి అతని లక్ష్యలక్షణ జ్ఞానంతో కూడిన పాండిత్యమే కారణం. విశ్వేశ్వరుని పై శ్లోకాన్ని అప్పయార్యుని ఈ శ్లోకాన్నీ బట్టి అతడు వారికి కేవలం ఆశ్రయదాతయైన రాజుగానే కాక వారి కృతులను మొదటగా చదివి తప్పొప్పులు సరిజూచే విమర్శకుడుగానూ సాహితీమిత్రుడుగానూ కూడా ఉన్నాడన్నది స్పష్టమవుతుంది.
10 రసార్దవ సుధాకర సుధ అదీగాక అప్పయార్యుడు అతనిని కుమార సింగభూపాలుడు అని సంబోధించా డంటే ఆయన తప్పకుండా సింగభూపాలుని తండ్రి అనపోతనాయకుని ఆస్థానంలోని వాడై ఉండాలి. ఎందుకంటే ఈ కుమారశబ్దం యువరాజవాచకంగా ప్రయోగించ బడినదైనా కావచ్చు లేదా తెలుగులోని “చిన్న” అనే మాటకు సమానార్థకంగా వాడబడినదైనా కావచ్చు. అట్లా అయితే కుమారసింగభూపాలుడు అంటే “చిన్నసింగభూపాలుడు” అనే అర్ధం వస్తుంది. పెద్ద సింగభూపాలుడు అతని తాత సింగమనాయకు డవుతాడు. ఆ పెద్దరాజుతో పరిచయం ఉన్నవాళ్లే ఆయన పేరుగల మనుమణ్ణి చిన్నరాజు అనడం కద్దు. అందువలన బొమ్మకంటి అప్పయార్యుడు పెద్దసింగభూపాలునితో గూడా పరిచయం గలవాడై ఉండాలి. లేదా సింగభూపాలుడు ఇంకా యువరాజపదవిలోనే ఉన్నప్పుడు అతని తండ్రి ఆస్థానంలో ఉన్నవాడై ఉండాలి. ఏ విధంగా చూచినా అతడు వయోవృద్ధుడు కావడానికే అవకాశం ఉంది. మరీ ముదివగ్గు కాకపోయినా సింగభూపాలుని కంటె వయస్సులో చెప్పుకోదగినంత పెద్దవాడే అయి ఉండాలి. అటువంటి వ్యక్తికి అతనియందు అంతటి 'ప్రామాణ్యబుద్ధి ఉందంటే- సింగభూపాలుని యొక్క ప్రతిభావిశేషాలు సామాన్యమైనవి కావడానికి వీలులేదు. సాధారణంగా తాతపోలిక మనుమనికి వస్తుందంటారు. అతని మనుమడు మూడవ సింగభూపాలుడు అతని వంటి ప్రజ్ఞాశాలి కావడం వలననే అతని సర్వజ్ఞ బిరుదాన్ని వారసత్వంగా కూడా పొందాడేమో. అంతేగాకుండా సింగభూపాలుడు రసార్జ్దవ సుధాకరంలోని వివిధలక్షణాలకు లక్ష్యాలు (ఉదాహరణలు)గా తానే వ్రాసిన శ్లోకాలను ప్రదర్శించాడు. అవి బహుశః ఆ లక్షణాలకు లక్ష్యాలుగా ఉద్దేశించి వ్రాయబడినవే అయి ఉండవచ్చు. కాని వాటిలోని వస్తువు దృష్ట్యాగాని, కవితా సౌందర్యదృష్ట్యా గాని అవి మహాకవుల శ్లోకాలకు ఏమాత్రం తీసిపోవు. ఈ కారణా లన్నింటివలనా రసార్జవ సుధాకరం సింగభూపాలుని యొక్కస్వీయరచనే అని నిర్వంద్వంగా నిర్ధారించవచ్చు. రసార్జవసుధాకర[గ్రంథంయొక్క ప్రారంభంలో సింగభూపాలుడు తన (గ్రంథరచనకు హేతువులను పేర్కొంటూ భరతకృతమైన నాట్యశా'స్తాన్ని అనుసరించి ఇతరులు వ్రాసిన లక్షణ గ్రంథాలు జటిలంగా ఉండడం, క్రమాన్ని కోల్పోవడం మొదలైన కారణాలవలన దానిని ఎరిగినవారు తక్కువై పోయారని, అందువలన ఆ దోషాలు లేకుండా నాట్యశాస్తాన్ని ప్రకాశింపజేయడమే తన ఉద్దేశమనీ వివరించాడు. గ్రంథరచనలో అడుగడుగునా తన ప్రతిజ్ఞను అతడు చక్కగా నిలబెట్టుకున్నాడు. ప్రతివిషయాన్నీ తేలికైన పదాలతోను, సందేహానికి తావులేకుండానూ చక్కగా విశదీకరించాడు. భరతముని విరచితమైన నాట్యశాస్తాన్ని సంపూర్తిగా అనుసరిస్తూ
రసార్జవ సుధాకర సుధ 11 మూడు విలాసాలలో విషయనిరూపణ చేశాడు. రంజకోల్లాసమనే మొదటి విలాసంలో -నాట్యశాస్తోత్పత్తి, నాట్యలక్షణం, రసలక్షణం, నాయికానాయకుల లక్షణాలు, భేదాలు, వారి సహాయులు, చతుర్విధ ఉద్దీపనవిభావాలు, చతుర్విధ అనుభావాలు, ఎనిమిది సాత్త్వికభావాలూ సోదాహరణంగా వివరించబడ్డాయి. రసికోల్లాస మనే పేరుగల రెండవ విలాసానికి విషయమైనవి - ముప్ఫైమూడు సంచారి (వ్యభిచారి) భావాలు, భావాభాసాలు," భావోదయ భావసంధి భావశబలతా భావశాంతులు,ఎనిమిది స్థాయిభావాలు, ఎనిమిది రసాలు, రసవిరోధ, రసాభాసాలూను. ఇక భావకోల్లాసమనే మూడవ విలాసంలో రూపకలక్షణం, రూపకభేదాలు, ఇతివృత్తం, అయిదు అర్ధప్రకృతులు, పంచావస్థలు పంచసంధులు, వాటి అంగాలు, ఇరవైఒక్క సంధ్యంతరాలు, ముప్ఫై ఆరు భూషణాలు, అయిదు అర్జోపక్షేపకాలు, దశవిధ రూపకాలు, నాటకపరిభాష నిరూపించబడ్దాయి.
గ్రంథరచనలో సింగభూపాలుడు పూర్తిగా నాట్యశాస్తాన్నే అనుసరించాడు. ఏ సందర్భంలోనూ భరతమునిని అతిక్రమించడానికి అతడు ఇచ్చగించలేదు. భరతుడు నిర్వచించిన స్థాయిభావాలు, రసాలు ఎనిమిదే కాగా కొందరు పూర్వాలంకారికులు నిర్వేదం స్థాయిభావంగా శాంతరసాన్ని అంగీకరించారు. సరస్వతీకంఠాభరణకర్తయైన భోజుడు - గర్వం, స్నేహం, ధృతి, మతి అనే స్థాయిభావాలు- గల ఉద్ధత, (ప్రేయః శాంత, ఉదాత్తరసాలను కూడా అంగీకరించాడు. సింగభూపాలుడు నిర్ద్వంద్వంగా దానిని ఖండించి భరతుడు నిర్వచించిన స్థాయిభావాలు ఎనిమిదేననీ, మరింక ఏవీ స్థాయిభావాలు కాజాల వనీ ప్రకటించాడు. భరతమతాన్ని ఇతరులు తప్పుగా అర్ధం చేసుకున్న సందర్భాలలో భరతకృతమైన ఆ యా కారికలను ఉద్ధరించి వాటికి సరియైన వివరణను ఇచ్చాడు.” ప్రధానమైన విషయాలలో భరతమతాన్నే అనుసరించినా కొన్ని కొన్ని సందర్భాలలో తన స్వాతంత్ర్యాన్నీ చాటుకున్నాడు. పంచసంధులను, సంధ్యంగాలనూ నిరూపించిన తరువాత సంధ్యంతరాలను నిరూపిస్తూ - అవి భరతప్రోక్తమైనవి కాకపోయినా చమత్కృతిని కలగజేస్తాయి గనుక వాటిని ప్రదర్శిస్తున్నానని చెప్పాడు. భావప్రకాశికాకారుడైన శారదాతనయుణ్ణి, రుద్రభట్టుని ప్రమాణంగా స్వీకరించి వారి కారికలను చాలా సందర్భాలలో ఉట్టంకించాడు. మహారాజభోజుణ్జి ఖండించినదే ఎక్కువ గాని ఆయననూ అనుసరించాడు.
రసార్ణవసుధాకర గ్రంథం పూర్తిగా కారికల రూపంలో సాగింది. అవసరమైనచోట్ల వృత్తిని వ్రాసి విషయాన్ని వివరించడం జరిగింది. చాలవరకు లక్షణరచన వివరణ
12 రసార్దవ సుధాకర సుధ అవసరం లేని రీతిలోనే ఉంది. తన లక్షణాలు కొన్నింటికి వివిధ కావ్యనాటకాలనుండి లక్ష్యాలను ప్రదర్శించాడు సింగభూపాలుడు. కొన్నింటికి తానే వ్రాసిన శ్లోకాలను, పరిమిత సంఖ్యలో - తననూ తన కుటుంబసభ్యులనూ స్తుతిస్తూ వివిధకవులు వ్రాసిన చాటుళశ్లోకాలనూ కూడా ఉదాహరణలుగా ఇచ్చాడు. నాయికాలక్షణాలనుండి మొదలుపెట్టి ప్రథమ ద్వితీయ విలాసాలలో స్వీయకృతులైన శ్లోకాలను లక్ష్యాలుగా ప్రదర్శించాడు. ద్వితీయవిలాసంలో మాత్రమే తననూ తన కుటుంబసభ్యులను స్తోత్రం చేస్తూ కవులు వ్రాసిన శ్లోకాలను చేర్చాడు. మళ్లీ తృతీయవిలాసంలో వీరభద్రవిజ్బంభణ/ విజయమనే విశ్వేశ్వర విరచితమైన డిమంలోని ఒక శ్లోకం తప్ప చాటుశ్లోకాలకు స్థానం లేకపోయింది. ఆ స్వీకరించిన చాటు శ్లోకాల నైనా ఆయా శ్లోకరచయితలైన కవులను గౌరవించడానికే (గ్రహించి ఉంటాదేగాని ఆత్మ శ్లాఘాపరత్వంకాదనీ, ఆ చాటుశ్లోకాల ఉనికివలన సింగభూపాలునికి ఈ [గ్రంథ కర్శృత్వాన్ని నిరాకరించవలసిన అవసరం లేదనీ అభిప్రాయపడ్డారు టి. వేంకటాచార్య (టొరంటో యూనివర్శిటీ). తృతీయవిలాసంలో ప్రస్తావనాలక్షణాలను వివరిస్తూ, తన తండ్రి అనపోత నాయకుడు వ్రాసిన అభిరామరఘువంశంలోని శ్లోకాలను ఉదాహరణలుగా ప్రదర్శించాడు సింగభూపాలుడు. ప్రాచీనకవుల కృతులైన శాకుంతలం, మాలవికాగ్ని మిత్రం, బాలరామాయణం, అనర్హరాఘవం, వేణీసంహారం, మాలతీమాధవం, రత్నావళి, నాగానందం వంటి రూపకాలూ సమకాలీనుల రచనలతో బాటు వీరభద్ర విజయడిమం, ఆనందకోశప్రహసనం వంటి రూపకాలనుండి కూడా భాగాలను ఉద్ధరించి ఉదాహరణలుగా ఇచ్చాడు. దశవిధరూపకాలను నిరూపించిన తరువాత, నాటకపరిభాషను వివరించాడు దానిలో వివిధప్రాకృతభాషలు, రూపకాలలో వివిధపాత్రలు సంబోధించబడవలసిన తీరు, ఆ యా పాత్రలకు ఉచితమైన నామధేయాలు - వీటన్నింటినీ విశదంగా ప్రదర్శించాడు. మొత్తం మీద లక్షణాలలో గాని, లక్ష్యాలలో గాని ఎక్కడా క్షిష్టత్వం, సందిగ్ధత లేకుండా చక్కని విశదమైన ధోరణిలో గ్రంథరచన చేశాడు. దశవిధరూపకాలను సాధికారికంగా నిరూపించిన మరొక ప్రామాణికగ్రంథం ధనంజయవిరచితమైన దశరూపకం. దానితో పోల్చిచూస్తే రసార్జవ సుధాకరం అతివిస్తృతమైన గ్రంథం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఉపమాది అలంకారాలను విడిచిపెట్టి అలంకారశాస్త్ర విషయకంగా ఏ సందేహం కలిగినా తెరిచి చూడదగిన ప్రామాణిక గ్రంథం. దానిని అనతి విస్తృతంగా అనతి సంక్షిప్తంగా సంస్కృతప్రియులకు అందించడానికి చేసిన ప్రయత్నమే ఈ రసార్దవ సుధాకర సుధ.
రసార్దవ సుధాకర సుధ 13 ఈ ప్రయత్నం ఎంతవరకు తన ప్రయోజనాన్ని సాధించిందో నిర్ణయించడానికి సహృదయులే ప్రమాణం. ప్రథమ విలాసం
మంగళాచరణం తరువాత దాచయనాయకుని దగ్గరనుండి తమ వంశావళిని వర్ణించిన సింగభూపాలుడు తన రసార్దవసుధాకర (గ్రంథాన్ని నాట్యవేదం యొక్క ఉత్పత్తితో ప్రారంభించాడు.
పూర్వం ఇంద్రాదిదేవతలు బ్రహ్మదేవుణ్ణి దర్శించి నమస్కరించి, వినడానికీ చూడడానికీ యోగ్యమైనదీ, మనోహరమైనదీ, అన్ని వర్ణాలకూ అధికారం గలదీ అయిన అయిదవ వేదాన్ని సృష్టించమని అడిగారు.
జ(గ్రాహపాఠ్యం బుగ్వేదాత్ సామభ్యో గీతమేవ చ ।
యజుర్వేదాదభినయం రసమాథర్వణాదపి ॥ బ్రహ్మదేవుడు నాలుగు వేదాలనూ నెమరువేసుకుని బుగ్వేదంనుండి సాహిత్యాన్ని, సామవేదంనుండి సంగీతాన్ని యజుర్వేదం నుండి అభినయాన్ని అథర్వవేదంనుండి రసాన్నీ స్వీకరించి, నాట్యవేదాన్ని సృష్టించాడు. అతడు దాన్ని మొదట భరతునికి ఉపదేశించి అతని కొడుకులతో కలసి దాన్ని ప్రచారంలోకి తెమ్మని ఆదేశించాడు. భరతుడు తన కొడుకులతో కలసి దేవసభయైన సుధర్మలో ఇంద్రాది దేవతల ఎదుట అప్సరసలచేత దాన్ని ప్రదర్శింపజేశాడు. ఆతరువాత అతడు లోకోపకారంకోసమై నాట్యశాస్తాన్ని రచించాడు. దానిని అనుసరించి అతని కుమారులైన శాండిల్యుడు, కోహలుడు, దత్తిలుడు, మంగళుడు మొదలైనవారు వేరు వేరు గ్రంథాలను వ్రాశారు. అవి అన్నీ కఠినమైనవి కావడం, వాటిలో క్రమం చెడిపోవడం, నాట్యసంప్రదాయం విచ్చిన్నమై పోవడం, దానిని బాగా ఎరిగిన వారు తక్కువైపోవడం - ఇన్ని కారణాల వలన నాట్యపద్ధతి అస్ఫుటంగా తయారయింది. అందువలన దానిని లోకానికి 'ప్రకాశింపజేయడమే తన ఆశయమని ప్రతిజ్ఞ చేసి, తన కృతి సారగ్రాహులైన పండితులను మెప్పిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు సింగభూపాలుడు.
నటునియొక్క సాత్త్వికాది అభినయాల కారణంగా (ప్రేక్షకులకు అతనియందు అతడే ఆ నాయకుడు అనే తొదాత్యబుద్ధి కలుగుతుంది. అందువలన నటునియొక్క వ్యాపారం నాట్యమని చెప్పబడుతుంది. ఆ నాట్యానికి ప్రాణం రసంయొక్క ఉత్మర్న విభావ, అనుభావ, సాత్త్విక వ్యభిచారిభావాలచేత సామాజికులకు ఆస్వాదయోగ్యంగా చేయబడిన రతి మొదలైన స్థాయిభావాలే రసం. వాటిలో రసానికి ఆధారభూతమై
14 రసార్దవ సుధాకర సుధ దానిని అవ్యక్తస్థితినుండి వ్యక్తస్థితికి తెచ్చేది విభావం. అది 1) ఆలంబన విభావం, 2) ఉద్దీపన విభావం అని రెండు విధాలు. మళ్లీ వాటిలో రసానికి ఆలంబనమైన నాయకుడు, విషయమైన నాయిక - ఈ ఇద్దరూ ఆలంబనవిభావాలు.
నాయకుడు గుణవంతుదైన పురుషుడు. మహాభాగ్యం, బెదార్యం, స్టైర్యం. దక్షత, బెజ్జ్వల్యం, ధార్మికత్వం, కులీనత్వం, వాగ్శిత్వం, కృతజ్ఞత్వం, నయజ్ఞత్న ,. శుచిత్వం, మానశాలిత్వం, తేజస్విత్వం, కళావత్త్వం, ప్రజారంజకత్వం మొదలైనవి నాయకుని సామాన్య గుణాలు. ఈ గుణాల నన్నింటినీ కలిగినవాడు ఉత్తమనాయకుడు. కొన్ని గుణాలు తక్కువైతే అతడు మధ్యమనాయకుడు. చాలా గుణాలు తక్కువైతే అతడు అధమనాయకుడు. ఆ నాయకుడు 1) ధీరోదాత్తుడు, 2) ధీరలలితుడు,3) ధీరశాంతుడు, త్తి ధీరోద్ధతుడు అని నాలుగు విధాలు.
దయ గలవాడు, అతిగంభీరుడు, వినయశీలి, తన (మానసిక శారీరక) బలమే తన సారంగా గలవాడు, దృఢమైన దీక్ష గలవాడు, సహనశీలుడు, తనను తాను పొగుడు కోవడానికి ఇష్టపడనివాడు, నిగూఢమైన అహంకారం గలవాడూ అయిన వ్యక్తి ధీరోదాత్తుడు.
రాజ్యపాలనాన్ని గురించిన చింత లేకుండా స్త్రీలోలుడై కాలం గడిపే యువకుడైన నాయకుడు ధీరలలితుదు.
సుఖదుఃఖాలు మొదలైన ద్వంద్వాలను సమానంగా చూచే స్వభావం గలవాడు, కష్టాన్ని ఓర్పుతో సహించేవాడు, ఏది మంచో ఏది చెడో వివేచన చేయగలిగినవాడు, లాలిత్యం మొదలైన గుణాలు గలవాడూ అయిన మంత్రిగాని, వ్యాపారిగాని ధీరశాంతు డనబడతాడు.
మత్సరమూ అహంకారమూ గలవాడు, మాయావి, రోషమూ చలస్వభావమూ గలవాడు, తనను గూర్చి తానే గొప్పలు చెప్పుకునేవాడూ ధీరోద్దతనాయకుడు.
ఈ నాయకులు నలుగురూ అన్ని రసాలకూ సమానమైన వారుగా చెప్పబడ్డారు. అయితే శృంగారరసంలో మాత్రం ఒక్కొక్కరూ మూడు భేదాలను కలిగి ఉంటారు. ఆ భేదాలు - 1) పతి, 2) ఉపపతి, 8) వైశికుడు. వారిలో పతి.అంటే నాయికను విధ్యుక్తంగా వివాహం చేసుకున్న భర్త. ఆ పతి నడవడికను బట్టి నాలుగు భేదాలను పొందుతాడు. అవి 1) అనుకూలుడు, 2) శరుడు, 3) ధృష్టుడు, 4) దక్షిణుడు. ఒకే సీకి భర్తయైనవాడు అనుకూలుడు. నాయికకు తెలియకుండా అన్యప్రీలను సంగమించి ఆమెపట్ల అపరాధం చేసేవాడు శకుడు. అన్యయువతితో తన సంగమంయొక్క గుర్తులు
రసార్దవ సుధాకర సుధ 15 తన శరీరంపై స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా నిర్భయంగా ఉండేవాడు ధృష్టుడు. అనేక నాయికలయందు సమానమైన అనురాగాన్నే కలిగి ఉండేవాడు దక్షిణుడు. ఇక్కడ ధృష్టనాయకునికి ఉదాహరణంగా తాను రచించిన శ్లోకాన్నే ఇచ్చాడు సింగభూపాలుడు. శ్లో; కో దోషో మణిమాలికా యది భవేత్కంఠే న కిం శంకరో
ధత్తే భూషణమర్ధచంద్రమమలం చంద్రే న కిం కాలిమా
తత్సాధ్వేవ కృతం కృతం భణితిభిర్షైవాపరాద్ధంం త్వయా
భాగ్యం (ద్రష్టు మనీశయైవ భవతః కాంతాపరాద్ధం మయా ॥ తా॥ కంఠం మీద వృత్తాకారంగా ఉన్న పంటిగాట్లు (స్త్రీలు ధరించే ఆభరణమైన మణిమాలికుతో తన వద్దకు వచ్చిన భర్తను చూచి నాయిక అంటోంది” నీ కంఠాన మణిమాలిక ఉంటే వమయిందిలే. శివుడు అర్ధచంద్రుణ్ణి ఆభరణంగా ధరించలేదా, ఆ చంద్రునిలో నల్లని మచ్చ లేదా? నీవు మంచిపనే చేశావు, దాన్ని గురించి ఇక మాటలెందుకు? నీవేమీ అపరాధం చెయ్యలేదులే. నీ వైభోగాన్ని చూడలేక బాధపడడంతో నేనే నీపట్ల అపరాధం చేస్తున్నాను.
కట్టుబాట్లను ఉల్లంఘించి, విధివిరుద్ధంగా ఇతరప్త్రీలతో సంగమానికై సంకేతాన్ని ఏర్పాటు చేసుకునేవాడు ఉపపతి. ఈ నాయకుడు ఒక నాయికతో నియతంగా ఉండేవాడు కాకపోవడం వలన అనుకూలత్వం, ధృష్టత్వం దక్షిణత్వం - ఈ మూడు గుణాలూ ఇతనికి ఉండవు. ఇతని గుణం శఠత్వం ఒక్కటే.
వేశ్యాసంగమంపట్ల అనురక్తి గలవాడు వైశికనాయకుడు. అతడు చక్కని రూపం, మంచి శీలం, శాస్త్రజ్ఞానం, కులీనత్వం, తెలివితేటలు, శౌర్యం, చక్కని వేషధారణ, యౌవనం, దాతృత్వం, చాతుర్యం, సహనం, త్యాగం, మాధుర్యం, సౌభాగ్యం మొదలైన గుణాలు కలిగి ఉంటాడు. దైన్యాన్ని పొందడు. పరిమళ ద్రవ్యాలతో చక్కని సువాసనలను వెదజల్లుతూ ఉంటాడు. స్వాఖిమాని. ఏ ప్రదేశంలో ఏ సమయంలో ఏ పని చెయ్యాలో ఎరిగి ఉంటాడు. ఈ వైశిక నాయకుడు 1) జ్యేష్టుడు, 2) మధ్యముడు, 8) నీచుడు అని మూడు విధాలు అని వివరించి, భావఫప్రకాశికనుండి ఆ మూడు భేదాల యొక్క లక్షణాలనూ ఉద్ధరించి, ప్రదర్శించాడు సింగభూపాలుడు.
జ్యేష్టాయకుడు స్వభావతః నిస్సంగుడైనా ఆ యా వేశ్యల పట్ల అనురాగం కలవాడి లాగా ప్రవర్తిస్తాడు. అతడు త్యాగశీలి, మధురమైన స్వభావం గలవాడు. సుఖాన్ని దుఃఖాన్నీ సమానంగా చూస్తాడు. స్వచ్చమైన శీలం గలవాడు, కామకళలో నిపుణుడు. కోపగించిన నాయికను అనునయించడంలో నేర్పు గలిగి ఉంటాడు.
16 రసార్జవ సుధాకర సుధ మర్యాదగా ప్రవర్తిస్తాడు. ఇతడు తన ప్రియురాలు తన విషయంలో కొద్దిపాటి అనాదరం చూపగానే ఆమె పట్ల విముఖు డవుతాడు. ప్రియురాలు తనను మోసగిస్తున్నట్లు తోచినా ఆమెపట్ల ఇటు అనురాగాన్ని గాని, అటు వైముఖ్యాన్నిగానీ చూపకుండా తటస్థంగా ఉండేవాడు, తరచుగా ఆమెకు ధన మిచ్చేవాడు, అన్ని విషయాల్లోనూ తటస్టుడుగా ఉండేవాడూ మధ్యముడు. అతడు నాయిక తనను రెండవసారి మోసగిస్తేమాత్రం ఆమెపట్ల విరక్తిని పొందుతాడు. అధమవైశిక నాయకుడు కామకళలో నిర్లజ్జగా వ్యవహరిస్తూ రతిక్రీడలో కర్మశత్వాన్ని చూపుతాడు. అతడు భయమూ, కోపమూ లేనివాడు, ఇది చేయదగిన పని, ఇది చేయగూడనిది అనే వివేచన ఎరుగనివాడు, మూర్చుడు. తనయందు అనురాగం లేని ప్రీ యందు కూడా అనురక్తుడు. మిత్రులు తనను వారిస్తున్నా ఆమె తనను పరుషంగా తిరస్కరించినా కూడా - ఇతరులపట్ల (ప్రేమతో తనకు విముఖు రాలైనదీ, లేదా ఇతరులను కూడి ఉన్నదీ అయిన స్త్రీని కూడా కోరుతాడు. ఇక శృంగారనాయకులకు పీఠమర్చుడు, విటుడు, చేటుడు, విదూషకుడూ సహాయకులుగా ఉంటారు. వారిలో పీఠమర్ద్హుడు నాయకునియందు భక్తితో ఎల్లవేళలా అతజణ్జి అనుసరించి ఉంటాడు. అతడు నాయకుని పట్ల అలిగిన నాయికను ప్రసన్ను రాలిని చేయడంలో నేర్పుగలిగి, నాయకునికంటె గుణాలలో కొద్దిగా తక్కువవాడై ఉంటాడు. కామకళను చక్కగా ఎరిగినవాడు విటుడు. నాయికా నాయికులను సంధాన పరచడంలో నేర్పు గలవాడు చేటుడు. వికృతమైన చేష్టలు, వేషధారణ, మాటలతో హాస్యాన్ని కలిగించే వాడు విదూషకుడు. ఎక్కడ ఎప్పుడు ఏ పని చేయాలో ఎరిగిన నేర్పు, మాట పొందిక, నిపుణత, నాయికా నాయకులను ప్రోత్సాహపరచడంలో కౌశలం, ఒకరు చెప్పిన మాటను రెండవవారికి తు.చ. తప్పకుండా చేరవేయడం, రహస్యంగా వ్యవహారాన్ని నడప గలగడం మొదలైనవి సహాయకుల లక్షణాలు. ఇది నాయకప్రకరణం నాయకునియొక్క సాధారణగుణాలైన మహాభాగ్యం బెదార్యం మొదలైన గుణాలు కలిగిన స్త్రీ నాయిక. ఆమె 1) స్వీయ, 2) పరకీయ, 3) సామాన్య అని మూడు విధాలు. వారిలో సంపదలలోను ఆపదలలోనూ భర్తను విడిచిపెట్టకుండా ఉండి, సచ్చీలం, బుజుత్వం, (నిజాయితీ), మొదలైన గుణాలు గలిగిన స్తీ స్వీయ. ఆ నాయిక
- ముగ్ధ, 2) మధ్య, 3) ప్రౌఢ అని మూడు విధాలు.
రసొర్జవ సుధాకర సుధ 1/7
ముగ్ధయైన స్వీయానాయిక అప్పుడే అంకురిస్తున్స యెావనమూ కామభావనలూ కలిగి ఉంటుంది. ఆమె రతిలో మారుమొగమై ఉంటుంది, కోపంలోనూ మృదువుగానే ఉంటుంది. రతి క్రీడలో సిగ్గుతో మనోహరంగానూ, రహస్యంగానూ యత్నిస్తుంది, ప్రియుడు తన పట్ల అపరాధం చేసినా కన్నీరు పెట్టుకుంటూ అతనిని చూస్తుందేతప్ప పరుషంగా గాని, ప్రియంగాగానీ మాట్లాడదు. ఈ ముగ్గానాయికకు ఉదాహరణంగా సింగ భూపాలుడు తానే రచించిన శ్లోకాన్ని ఇంకొకదాన్ని ఇచ్చాడు. శ్లో కాంతే కృతాగసి పురః పరివర్తమానే
సఖ్యం సరోజశళినోః సహసా బభూవ । రోషాక్షరం సుదృశి వక్తు మపారయంత్యాం ఇందీవరద్వయమవాప తుషారధారామ్ ॥|
తా॥ తనపట్ల అపరాధం చేసిన ప్రియుడు ఎదుట తిరుగుతూ ఉంటే తామరలకు చంద్రునికి జత కలిసింది. అంటే నాయిక చంద్రుని వంటి తన ముఖాన్ని తామరల వంటి అర చేతులతో మూసుకుంది. చక్కని కళ్లు గలిగిన ఆ ముగ్ధ కోపంగా మాట్లాడ డానికి నోరాడని స్థితిలో ఉండగా నల్లకలువలు మంచుధారలని వర్షించాయి. అంటే నల్లకలువలవంటి ఆమె కళ్లు అశుధారలు వర్షించాయి.
సమానస్థాయిలో ఉన్న లజ్జ, మన్మథోదేకమూ కలది, వృద్ధి పొందుతున్న యౌవనం గలదీ అయిన మధ్యానాయిక తానే ప్రియునియందు ఆసక్తురాలై ఉంటుంది.
కోపం ప్రదర్శించే తీరులోని భేదాల దృష్ట్యా మధ్యానాయిక 1) ధీర, 2) అధీర, 3) ధీరాధీర అని మూడు విధాలు. వారిలో ధీరమధ్యానాయిక అపరాధం చేసిన నాయకుణ్ణి వక్రోక్తులతో నేర్పుగా ఎత్తిపొడుస్తుంది. అధీరమధ్య పరుషమైన మాటలతో నొప్పిస్తుంది. ధీరాధీరమధ్య కన్నీరు పెట్టుకుంటూ వక్రోక్తులతో దెప్పిపొడుస్తుంది.
పరిపూర్ణమైన యౌవనంతో మత్తిలిఉన్నది, స్థిరపడిన మన్మథోద్రేకం కలదీ,అ యిన ్రొఢానాయిక భర్తశరీరంలో తాను లీనమై పోతున్నట్లుగా రతిలో వ్యాపారం కలిగి ఉంటుంది. రతి ప్రారంభంలోనే ఆనందంతో సొమ్మసిల్లి పోతుంది. ఈమె కూడా ధీర, అధీర, ధీరాధీర అని మూడు విధాలు. ధీరప్రగల్భ కోపగించినప్పుడు రతిలో ఉదాసీనురాలై ఉండి, మనస్సులో ఆదరం ఉన్నా కనిపించనీయకుండా గంభీరంగా ఉంటుంది. అధీరప్రగల్భ ప్రియునితో కటువుగా మాట్లాడి, కొడుతుంది గూదా. ధీరాధీరప్రగల్భ ఈ రెండు లక్షణాలనూ కలిగి ఉంటుంది.
మధ్యాప్రొఢా నాయికలిద్దరూ జ్యేష్ట, కనిష్ట అనే భేదాలను కలిగి ఉంటారు.
18 రసార్దవ సుధాకర సుధ మళ్లీ వాటితో ఒక్కొక్క దానిలోనూ ధీర, అధీర, ధీరాధీర, అనే భేదాలు మూడూ ఉంటాయి. ఆ విధంగా (2౫%2౫8=12) మధ్యాప్రాఢా నాయికలలో పన్నెండు భేదాలు, ముగ్గా నాయిక ఒకతె, మొత్తం అన్నీ కలిసి స్వీయానాయిక పదమూడు భేదాలను కలిగి ఉంటుంది.
పరకీయా నాయిక కన్య, పరోఢ అని రెండు విధాలు. కన్యయైన పరకీయ సాధారణంగా ముగ్గాగుణాలను కలిగి ఉంటుంది. అటువంటి నాయిక నాటకం మొదలైన రూపకాలలో ప్రధానపాత్ర గాని, అప్రధానపాత్రగానీ కావచ్చు.
ఒక వ్యక్తిని వివాహమాడి కూడా ఇతర పురుషుల పొందుకై ఆరాటపడే నాయిక పరోఢ. ఇటువంటి నాయికలు క్షుద్రప్రబంధాలలోనే కనిపిస్తారు.
కళలలో చాతుర్యమూ, దురుసుతనమూ గల గణిక సామాన్యానాయిక. ఈమె రక్త, విరక్త అని రెండు విధాలు. వారిలో రక్తగణిక నాటకమనే రూపకభేదంలో మాత్రం అఆప్రధానపాత్ర అయిఉండాలి. మిగిలిన తొమ్మిది రూపకాలలోనూ ప్రధానపాత్ర అయినా కావచ్చు, అప్రధానపాత్ర అయినా కావచ్చు. ఆమె దివ్యగణిక గనుక అయితే నాటకంలో గూడా ప్రధానపాత్రే కావచ్చు.
విరక్త గణిక ప్రహసనం మొదలైన రూపకాలలో మాత్రమే కనిపిస్తుంది. ఆ యా రూపకాలకు అనుగుణంగా ధూర్తత్వం మొదలైన గుణాలను కలిగిఉండి ఆమె ధనికులన్గు అనురాగం అభినయించి అలరిస్తుంది, నిర్ధనులను తల్లిచేత వెళ్లగొట్టిస్తుంది. కొందరు “ఎంత గుణవంతుడైన నాయకునియందైనా గణికకు అనురాగం ఉండదు. అనురక్తురాలు కాని స్రీని నాయికగా వర్ణిస్తే రసాభాసమవుతుంది. అందువలన ఆమెను నాయికగా వర్ణించడం తగదు అని వాదించారు. ఆ వాదాన్ని సింహభూపాలుడు ఎన్నో యుక్తులను చూపుతూ ఖండించాడు.
శృంగారంలో కలిగే వేరు వేరు అవస్థ (దశుల కారణంగా ఈ నాయికలందరూ ఎనిమిది భేదాలను పొందుతారు. అవి 1) ప్రోషితభర్తృక, 2) వాసకసజ్జిక, 3) విరహోత్మ్కంఠిత, 4) ఖండిత, 5) కలహాంతరిత, 6) అభిసారిక, 7) విప్రలబ్ధి, 8) స్వాధీనపతిక,
భర్త దూరదేశానికి వెళ్లి ఉంటే ఆనాయిక ్రోషితభర్త్శృక అనబడుతుంది. నిద్రలేమి, కృశత్వం, శకునాలను చూసుకుంటూ ఉండడం, మనస్సు నిలకడ లేకపోవడం ఎక్కువగా మంచంమీదే గడపడం, జడత్వం చింత, ఆమెకు కలిగే వికారాలుగా చెప్పబడ్డాయి.
రసార్జవ సుధాకర సుధ 19
భరతుడు మొదలైనవారు వాసకశబ్దానికి వంతు అని అర్ధం చెప్పారు. అందు వలన - ఆనాడు ప్రియునితో గడిపేవంతు తనది కావడం వలన అలంకరించుకుని అతని రాకకై ఎదురుచూస్తూ సిద్ధంగా ఉండే నాయిక వాసకసజ్జిక. తమ సమాగమాన్ని గురించే ఆలోచిస్తూ ఉండడం, కాలం గడవడానికై సఖులతో కలిసి వినోదిస్తూ ఉండడం, ప్రియునికి తన మనస్సును తెలుపుతూ లేఖ వ్రాయడం, మాటిమాటికీ దూతిక కొరకై ఎదురు చూస్తూ ఉండడం, ప్రియుడు వచ్చే దారినే కనిపెట్టుకుని ఉండడం - ఈమె చేష్టలు.
తన పట్లనే ప్రేమగల భర్త ఎంతకూ రాకపోవడంవలన ఉత్సుకత్వంతో బాధపడే నాయిక విరహోత్కంఠిత. ఈమెయొక్క చేష్టలు హృదయపరితాపం, వణుకు, శరీరం పట్టుదప్పిపోవడం, దేనిపైనా ఇచ్చలేకపోవడం, తన అవస్థను చెలులతో చెప్పు కోవడమూను.
తన ఇంటికి వస్తానని మాటఇచ్చిన నాయకుడు మాటతప్పి మరొక నాయికను కూడి ఆ ఉపభోగచిహ్న్హాలతో మరుసటి ఉదయాన తన ఇంటికి వస్తే ఆ నాయిక ఖండిత అవుతుంది. చింత, నిట్టూర్పులు, మాట్లాడకుండా ఉండడం, కన్నీరు పెట్టు కోవడం, ఖేదం, భ్రాంతి అస్ఫుటమైన మాటలు - మొదలైనవి ఆమె యొక్క వికారాలు.
మన్మథతాపాన్ని ఓపలేక వెన్నెలరాత్రులలో తెల్లని వస్త్రాభరణాలను, చీకటి రాత్రులలో నల్లని వస్తాలనూ ధరించి తానే ప్రియునివద్దకు వెళ్లే నాయిక అభిసారిక అనబడుతుంది. ఈమెకు కూడా సందర్భాన్ని బట్టి చింత మొదలైన వికారాలు ఉంటాయి. స్వీయా నాయిక ఇతరులు చూస్తే పరువుపోతుందన్న భయంతో బెదురు చూపులు చూస్తూ, దట్టమైన నీలిరంగు వస్త్రాన్ని మేలిముసుగుగా ధరించి, ముడుచుకుపోయి నడుస్తూ, తనపై ప్రేమగల ఒక్కతే చెలికత్తెను వెంటబెట్టుకుని నిశ్శబ్దంగా, త్వరపడుతూ వెళుతుంది. కన్యయైన అభిసారికకూడా స్వీయానాయికవంటి వ్యవహారాన్నే కలిగి ఉంటుంది. వేశ్యాభిసారిక వైశిక నాయకునివద్దకు వెళుతున్నప్పుడు స్వీయమాదిరిగా గోప్యంగా వెళ్ళదు. చిరునవ్వు ముఖంతో, మదిర యొక్క మత్తుతో చంచలంగా ఉన్న నేత్రాలతో, శరీరమంతా అంగరాగం ఆభరణాలూ ధరించి, భోగసాధనాలను పరిజనులచేత మోయించుకుంటూ, మధురంగా మోగే గంటల మొలనూలు, అరీదెలూ ధరించి వెళుతుంది. (ప్రేష్యాభిసారిక చేతులు విసురుకుంటూ నడుస్తూ, సిగలోని మల్లెలు జారుతుండగా, విడవకుండా మదిర తాగడం వలన మత్తుతో తడబడుతున్న మాటలతో, పరిచారికలతో కలిసి ప్రియుని వద్దకు వెళుతుంది.
బు రసార్జవ సుధాకర సుధ
చెలికత్తెల ఎదుట తనపాదాలపై బడి వేడుకున్న నాయకుణ్ణి తూలనాడి వెళ్లగొట్టి ఆ తరువాత పశ్చాత్తాపపడే నాయిక కలహాంతరిత. భ్రాంతి. సంతాపం, మోహం, నిట్టూర్పులు, జ్వరం, మాటిమాటికీ సంబంధం లేకుండా మాట్లాడడం మొదలైనవి ఆమెయొక్కచేష్టలు.
సంకేతస్థలానికి వస్తానని మాట ఇచ్చిన ప్రియుడు రాకపోవడం వలన బాధపడే నాయిక విప్రలబ్ధి. ఆమె వికారాలు - నిర్వేదం, చింత, ఖేదం, అశ్రువులు, మూ ర్భ నిట్టూర్పులు మొదలైనవి,
ఎల్లప్పుడూ తన కనుసన్నలలోనే మెలగుత్తూ తన సన్నిధిలోనే ఉండే ప్రియుడు గలిగిన నాయిక స్వాధీనపతిక. మన్మథపూజ, వనవిహారం, జలక్రీడ, పువ్వులు కోయడం, మొదలైనవి ఈమె చేష్టలు.
స్తీ లందరూ 1) ఉత్తమ 2) మధ్యమ 3) నీచ అనే భేదాలతో మూడు విధాలు. మంచి వంశంలో పుట్టినవారు, తృప్తి కలిగేటంతగా భోగాలను అనుభవించిన వారు, గుణవంతులూ అయిన పురుషులచేత క్షోర్రబడ్లే స్తీ ఉత్తమ. ఆమె సరియైన కారణ ముంటేనే కుపితురాలవుతుంది. కాని అనునయంతో ప్రసన్నురాలవుతుంది. భర్త తనకు అప్రియాన్ని కలగజేసినా తానుమాత్రం అతనికి ప్రియాన్నే చేకూరుస్తుంది. భర్త తన పట్ల అపరాధం చేసినా సహించి ఊరుకుంటుంది.
మధ్యమస్తీ తానే స్వయంగా పురుషులను కోరుతుంది. తానూ వారి చేత కోరబడు తుంది. ప్రియుడు తనపై కోపగిస్తే - తానూ కోపగిస్తుంది. అతడు అబద్ధమాడితే తానూ అబద్ధం చెప్పుతుంది. అతడు అపకారం చ్రేశ్స తానూ అపకారం చేస్తుంది, అతడు ప్రేమిస్తే తానూ క్రేమిస్తుంద్ది న వాంఛిస్తుంది, కర్జ్య, కోపం ఆమెస్స ప్ప నురైనా ఫరుషుణ్జి మాటిమా
న్వభావం, తగాదాలకు ఆమె ముందుంటుంది. ఎనిమిది విధాల్సు, మ్షృల్దీ వారిలో ఒకొక స గోదాలతో వారు క దొల', ఓ
నాయికలు మూడ్రు వందల ఎనభై నాచ్ ఖే _క్తహామద్యమా భేదాలతో మొ
కొందరు పరస్త్రీ ఎనిమిది దాలను కలిగి ఉంటారు.
కాకుండా మూడ్తే అవస్థలు ఉంటాయని అంటారు.
రసార్ణవ సుధాకర సుధ 21 ఆమెకు విరహోత్మంఠితావస్థ, అఖభిసారికావస్థ, విప్రలబబ్ధావస్థ మాత్రమే ఉంటాయని వారి మతం.
ఈ నాయికలకు చెలికత్తె చేటిక, సన్వ్యాసిని, పొరుగింటామె, దాదికూతురు/ దాది, శిల్పకారిక, పదిపన్నెండేళ్ల మధ్యవయస్సుగల బాలిక, కథలు చెప్పే స్త్రీ, అలంకారిక, సోది చెప్పే స్త్రీ, వీరందరూ దూతికలుగా పనిచేస్తారు. ఈ దూతికలు నాయకుని సహాయుల యొక్క గుణాలనే కలిగి ఉంటారు.
ఇది నాయికా ప్రకరణం
శృంగారానికి ఆలంబన విభావాలైన నాయికా నాయకులయొక్క లక్షణాలను చెప్పిన తరువాత సింగభూపాలుడు ఉద్దీపన విభావాలను గూర్చి వివరించాడు. ఉద్దీపన విభావాలు నాలుగు రకాలు - ఆలంబన గతాలైన (నాయికానాయకులయొక్క గుణాలు, చేష్టలు, అలంకారాలు, తటస్థవస్తువులూను. వాటిలో గుణాలు-1) యౌవనం 2) రూపం 3) లావణ్యం 4) సౌందర్యం 5) అభిరూపత్వం 6) మృదుత్వమూను.
'ప్త్రీ లందరికీ యౌవనంలో నాలుగు దశలుంటాయి. ప్రతి దశలోనూ వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది. వాటిలో మొదటిదశ ప్రథమయౌవనం. ఈ ప్రథమయౌవన దశలో నాయిక కొద్దిపాటి చంచలత్వం గల కనుకొనలను, ఎర్రదనం పూర్తిగా నిండని పెదవులను, అప్పుడే లావణ్యం అంకురిస్తూ ఉన్న శరీరాన్ని అప్పుడప్పుడే వ్యాపిస్తున్న (పేమ భావనలను, స్ఫుటత్వాన్ని పొందని అవయవాలనూ కలిగి ఉంటుంది. ఆమె మృదు స్పర్శను కోరుతూ రతిలో జెద్ధత్యాన్ని సహించలేకపోతుంది. చెలికత్తెలతో ఆటలలోనే ఆమెకు ఆసక్తి ఉంటుంది. సవతులు కనిపించినా కోపాన్నిగాని, హర్షాన్ని గాని పొందదు. సంగమంలో భర్తపట్ల ఎక్కువగా (ప్రేమ చూపించవు, పైపెచ్చు సిగ్గుపడుతుంది.
ద్వితీయయౌవనంలో ఉన్న నాయిక స్ఫుటంగా ఉన్న అవయవాల పొందికతో సుందరమైన శరీరాన్ని వెంట్రుకలు, దంతాలు వీటన్నింటిలో చక్కని మెరుపునూ కలిగి ఉంటుంది. ఆమె తన మనస్సు నెరిగిన చెలికత్తెలపట్ల స్నేహాన్నీ సవతులపట్ల అసూయనూ కలిగి ఉంటుంది. తరచుగా అలుగుతుంది, అనునయించినా ప్రసన్నురాలు కాదు. ప్రణయకోపంతో కలతపడుతూ ఉన్నదై ప్రియుడు తనపట్ల చేసే ఏ అపరాధాన్నీ సహించదు. రతిలో ఉత్సాహంగా ఉంటుంది. ఏకాంతంలో గర్వితురాలై వర్తిస్తుంది.
నా రసార్దవ సుధాకర సుధ తృతీయయౌవనంలోని నాయికకు కళ్లయొక్క కాంతి తగ్గిపోతుంది. చెక్కిళ్లు మెరుపుతగ్గి గరుకైన స్పర్శను కలిగి ఉంటాయి. అవయవాలు కొద్దిగా బిగువు తగ్గుతాయి. పెదవుల ఎరుపురంగు పేలవంగా ఉంటుంది. ఆ దశలో నాయిక రతికళలో నేర్చరియై ప్రియుణ్జి విడిచిపెట్టకుండా ఉంటూ అతణ్జి ఆకర్షించే కౌశలాన్ని కలిగి ఉంటుంది. అతని అపరాధాలనూ పట్టించుకోదు, సవతులపట్ల ఈసునూ పొందదు. చతురయౌవనంలో నాయికయొక్క అవయవాలు సడలి, శరీరం మాంస రహితంగా అవుతుంది. అప్పుడు ఆమె చేష్టలు - రతిలో ఉత్సాహం లేకపోవడం, అసమర్ధత, సవతుల పట్ల అనుకూలత్వం, భర్తను ఎడబాసి ఉండక పోవడమూను. ఈ నాలుగు దశలలో రసికులకు ఆహ్లాదాన్ని కలిగించే శృంగార యోగ్యత్వం మొదటి రెండు దశలలో మాత్రమే ఉంటుంది. అలంకరించుకోక పోయినా నాయిక యొక్క అవయవాలను సుందరంగా కనిపింప జేసే గుణం రూపం. శరీరావయవాలలోని మిసమిసలాదే మెరుపును లావణ్యమంటారు. అంగాలు ప్రత్యంగాలయొక్క చక్కని అమరిక, పొందికైన శరీరపు తీరూ సౌందర్య మనబడతాయి. ఏ గుణం తన గొప్పదనంవలన తన దగ్గరలో ఉన్న ఇతర వస్తువులను గూడా తనలాగానే కనిపింపజేస్తుందో అది అభిరూపత్వం, న్ ఏ గుణంవలన నాయిక శరీరాన్ని తాకినా తాకినట్లు అనిపించదో అది మార్గవం (మృదుత్వం). -్ శరీర స సు బళ్ళ ల వ్ర క్రపలమన వస్తువుల స్పర్శను గూడా సహించలేకపోవడం సౌకుమార్యం. ఓపలేకపోవడం వ స భేదాలతో మూదు విధాలు. పువ్వుల స్పర్శను కూడా సొకువార ఎ. కుమార్యం. చేతి స్పర్శను తట్టుకోలేకపోవడం మధ్యమ ఫ్ ౦ద మొదలైన వాటిని సహించలేకపోవడం అధమ సౌకుమార్యం. ఉద్గపన వి అలంకారం 8) వ్రభావాలలో మూడవదైన అలంకారం 1) వ(స్తాలంకారం 2) భూషణా (| రార 4) అనులేపనాలంకార మని నాలుగు విధాలు. సాలుగవ ప కళళ చంద్రోదయం అం తటస్థవస్తువులు. వెన్నెల, ధారాగృహం, భూగృహం: దిగుడు బావి రన ది హతనిగుళ్ల పిల్లగాలి, లతామండపం, నది... ఇట్లా బుతువును టి న భవనంలోపలి భాగం, సంగీతం, క్రీడాపర్వతం,
రసార్దవ సుధాకర సుధ జం ఆలంబన విభావాలైన నాయికానాయకుల యొక్క మనోగతభావాలను ప్రత్యక్షంగా వ్యక్తం చేసే - వారియొక్కకనుబొమల కదలికలు, చిరునవ్వులు మొదలైనవి అనుభావాలని చెప్పబడతాయి. అవి 1) చిత్తం యొక్క ఆరంభం (ప్రయత్నం) వలన కలిగేవి 2) గాత్రం (శరీరం) యొక్క ఆరంభం వలన కలిగేవి, ౩) వాక్కు యొక్క ఆరంభం వలన కలిగేవి, 4) బుద్ధియొక్క ఆరంభం వలన కలిగేవీ అని నాలుగు విధాలు. వాటిలో 1) భావం 2) హావం 3) హేల 4) శోభ 5) కాంతి 6) దీప్తి 7) ప్రగల్భత్వం 8) మాధుర్యం 9) ధైర్యం 10) బెదార్యం ఇవి చిత్తజ (మనస్సులో కలిగే) భావాలు. వాటిలో నిర్వికారమైన మనస్సులో కలిగే మొదటి వికారం (మార్చు) భావం. ఆ భావం మెడయొక్క కదలికలు, కనుబొమల కదలికల రూపంలో కొద్దిగా అభివ్యక్తమైతే అది హావ మవుతుంది. ఆ హావం శృంగార భావాలను సూచించే వివిధమైన కదలికలు, సుకుమారమైన అభినయమూ ద్వారా చక్కగా అభివ్యక్తం చేయ బడితే అది హేల. సహజమైన రూపమూ భోగానుభవం వలన కలిగిన ఆనందమూ
- వీటితో శరీరం అలంకరింపబడినట్లుండడం శోభ. మనస్సులో కలిగిన మన్మథోద్రేకం వలన ఆ శోభ మరింత ఉజ్జ్వలంగా ్రకాశిస్తే అది కాంతి. ఆ కాంతి వయస్సు, భోగం, ఆ దేశ కాలాలు, గుణాలచేత విస్తృతిని పొందితే అది దీప్తి. కామకళా విషయక ప్రయోగాలలో జంకులేకపోవడం ప్రగల్భత్వం. ఏ అవస్థలోనైనా సుకుమారమైన కదలికలు కలిగి ఉండడం మాధుర్యం. స్థిరమైన హృదయౌన్నత్యం ధైర్యం. ఏ అవస్థలోనైనా వీడని వినయం బెదార్యం. ఇక్కడ సింగభూపాలుడు భోజుడు నిర్వచించిన స్టైర్యం, గాంభీర్యం అనే మరి రెండు చిత్తారంభానుభావాలను ధైైర్యంలోనే అంతర్భావాన్ని పొందజేసి పది చిత్తారంభానుభావాలనే నిరూపించాడు. ఇక స్త్రీల యొక్క గాత్రజ అనుభావాలు పది. అవి 1) లీల 2) విలాసం త్రి విచ్చిత్తి ఓ) విభమం 5) కిలికించితం 6) మోట్టాయితం 7) కుట్టమితం 8) బిబ్బోకం
- లలితం 10) విహృతం. మధురమైన మాటలు, చేష్టలు, నడక వీటితో ప్రియుణ్జి అనుకరించడం లీల. ప్రియ సమాగమసమయంలో కనుబొమలు మొదలైన వాటియొక్క కదలికలలో అప్పటికప్పుడు వచ్చి చేరే విశేషం ఏదైతే ఉందో అది విలాసం. అలంకారం స్వల్పంగా ఉన్నప్పటికీ అమితమైన కాంతిని కలిగించేది విచ్చిత్తి. ప్రియుడు వచ్చే సమయంలో
జ రసార్ణవ సుధాకర సుధ మన్మథోద్రేకంపలన తొందరపాటుతో ఆభరణాలను తారుమారుగా ధరించడం విభ్రమం. శోకం, రోషం, హర్షం, అశ్రువులు మొదలైన విరుద్ధ భావాల కలయిక కిలికించితం. మనోగతమైన అభిలాషను శారీరక చేష్టలతో వ్యక్తీకరించడం మోట్టాయితం. ప్రియుడు తన కేశాలనో పెదవులనో గ్రహించినప్పుడు మనస్సులో ఆనందిస్తున్నా పైకి దుః ఖాన్ని కోపాన్నీ ప్రదర్శించడం కుట్టమితం. గర్వంతోనో రోషంతోనో తనకు ఇష్టుడైనప్పటికీ నాయకునియందు అనాదరాన్ని ప్రదర్శించడం బిబ్బోకం. కనుబొమల విలాసాలు, శరీరంయొక్క సుకుమారమైన భంగిమలూ కలిసి లలితమనబడతాయి. ఈర్య్యతోను, కోపంతోను, సిగ్గుతోనూ సమాధానం చెప్పకుండా దానిని క్రియతో వ్యక్తపరుస్తే అది విహృతం. మొదట నిరూపించబడినవి స్త్రీలకు చెందిన అనుభవాలు కాగా ఇప్పుడు పురుషుల యొక్క చిత్తజగాత్రజ అనుభావాలు నిరూపించబడుతున్నాయి. 1) శోభ 2) విలాసం 3) మాధుర్యం 4) ధైర్యం 5) గాంభీర్యం 6) లలితం 7) బెదార్యం 8) తేజస్సు. తన కంటె తక్కువ వారిపట్ల దయ, అధికులపట్ల స్పర్ధ, శౌర్యం, ఉత్సాహం, దక్షతలు (ప్రకటత్వాన్ని పొందితే అది శోభ. ఆబోతు నడకలాగా గంభీరమైన నడక ధీరమైన చూపు, చిరునవ్వుతో కూడిన మాటలూ కలిగి ఉండడం విలాసం. చేష్టలు: చూపులు ఇతరులకు ఇష్టాన్ని కలిగించేటట్లు ఉండడం మాధుర్యం. ధైర్యగాంభీర్యాలు నాయకగుణాలను వర్ణిస్తున్నప్పుడే చెప్పబడ్డాయి. శృంగారంలో నిండిన చేష్టలను కలిగి ఉండడం లలితం. బెదార్యం తేజస్సు నాయకగుణాలలోనే వివరించబడాయి. వీటిలో గాంభీర్యం, ధైర్యం, చిత్తజభావాలు; మిగిలినవి గాత్రజభావాలు. గో అక వాగారంభభావాలు పన్నెండు : అవి 1) ఆలాపం 2) విలాపం 89) సంలాపం ౪ ప్రలాపం 5) అనులాపం 6) అపలాపం 7) సందేశం 8) అత్తిదేశం 9) నిల్తేశం 10) ఉపదేశం 11) అపదేశం 12) వ్యపదేశం. - ప్రియోక్తులు పలకడం ఆలాపం. దుఃఖంతోకూడిన మాటలు విలాపం. ఇద్దరు వలు పరస్పరం మాట్లాడుకోవడం సంలాపం. వ్యర్థమైన మాటలు ప్రలాపం. టని మళ్లీమళ్లీ అనడం అనులాపం. తాను మొదట చై రొక అర్గంలో అన్వయించుకోవడం అపలాప ట చెప్పిన మాటని స సమాచారం పంపడం స ద నేను వ రాన కి తమను గహ అనడం అతిదేశం అదిగో శం. నేను మాట్లాడుతున్న మాటలు అతడు చెప్పినవే. | అతడు, ఇదిగో నేను - అని చెప్పడం నిర్లేశం. జ్ఞానాన్ని. కలిగించడం కోసమై పలికే మాటలు ఉపదే స్ఫులో ఒక భావన్ని సంచ యై లు ఉపదెశం. మనస్సులో ఒక భావాన్ని ఉంచుకుని
రసార్దవ సుధాకర సుధ 25 అన్యాపదేశంగా మాట్లాడడం అపదేశం. ఏదో ఒక మిషతో తన అభిలాషను వ్యక్తపరచడం వ్యపదేశం.
బుద్ధారంభానుభావాలు మూడువిధాలు. అవి 1) రీతి 2) వృత్తి ౩) ప్రవృత్తి. వాటిలో పదాలను పేర్చే తీరు రీతి అనబడుతుంది. అది మూడు విధాలు 1) కోమల 2) కఠిన 3) పరుష అని.
వాటిలో వర్ణలయొక్కరెండవ నాలుగవ అక్షరాలతో కూర్చబడినది, అల్బప్రాణాక్ష రాలు ఎక్కువగా గలది, ప్రాణంతో సమానమైన పది గుణాలు గలది, సమాసాలు లేనిది, ఒకవేళ ఉంటే చిన్న సమాసాలు కలదీ అయిన రీతి కోమల. అది విదర్భ దేశీయులకు ఇష్టమైనది కావడం వలన వైదర్భి అని పిలువబడుతుంది. వైదర్శీరీతికి ప్రాణస్థానీయాలైన పదిగుణాలు ఇవి. 1) శ్లేష 2) ప్రసాదం 3) సమత 4) మాధుర్యం 5) సుకుమారత 6) అర్ధవ్యక్తి 7) ఉదారత్వం 8) ఓజస్సు 9) కాంతి 10) సమాధి.
కేవలం అల్పటప్రాణవర్దాలు కలిగినా పదాలకూర్చుతో ఎక్కడా వదులుతనం కనిపించకపోవడం శ్లేష. ప్రసిద్ధమైన అర్ధంగల పదాలే ప్రయోగించబడడం ప్రసాదం. పదాల పొందికలో ఎగుడుదిగుళ్లు లేకపోవడం సమత. ఆ పొందిక (బంధం) మళ్లీ మృదువర్ణబంధం, స్ఫుటవర్ణబంధం మిశ్రవర్ణబంధం అని మూడు విధాలు. వాటిని బట్టి సమతగూడా మూడు విధాలు. శబ్బ్దార్దాలు రెండింటిలోనూ స్ఫుటమైన రసస్ప్ఫూర్తి ఉండడం మాధుర్యం. కటువుగా లేని వర్జాలు కలిగి ఉండడం సౌకుమార్యం. వినబడిన వాక్యానికి మరొక శబ్బ్దంయొక్క అ పేక్షలేకుండా అర్ధం తెలియడం అర్ధవ్యక్తి. పలకబడిన వాక్యంలో ఒక విషయం యొక్క గొప్పతనం తెలియరావటం ఉదారత్వం. సమాసాలతో నిండి ఉండడం ఓజస్సు. లోకంలో జరిగే తీరుని ఉల్లఘించకుండా మనోహరమైన అర్ధాన్ని ప్రతిపాదించడం కాంతి. అది కుశలప్రశ్న పూర్వకమైన సంభాషణలో ఉండేది, వర్జనంలో ఉండేదీ అని రెండు విధాలు. ఒక వస్తువు యొక్క ధర్మాలను మరొకవస్తువుపై ఆరోపించడం సమాధి.
అతి దీర్ధసమాసాలు గలది ఎక్కువ మహాప్రాణ వర్ధాలతో కూడినదీ అయిన కఠినరీతి గౌదపండితులకు నచ్చేది కావడం వలన 'గౌడీయారీతి' అని చెప్పబడుతుంది.
పై రెండు లక్షణాలు సమానంగా కలిగిన “మి(్రారీతి' పొంచాలదేశీయులకు ప్రియమైనది కావడం వలన 'పాంచాలీరీతి అని పేర్కొనబడుతుంది.
ఇవే కాకుండా ఆంధ్రీ, లాటీ, సౌరాష్ట్ర, మొదలైన ఆ యా దేశీయులకు ఇష్టమైన
నా రసార్జవ సుధాకర సుధ మిశ్రరీతులు గూడా చాలా ఉన్నాయి. కాని వాటి లక్షణాలు ఇప్పుడు అనవసరమని తేల్చివేశాడు సింగభూపాలుడు. ఇక వృత్తులు క్రైశికి, ఆరభటి, సాత్త్వతి, భారతి, అని నాలుగువిధాలు. అవి ఉత్పన్నమైన విధానమేమిటంటే ప్రపంచమంతా ఒకటే సముద్రంకాగా భగవంతుడైన శ్రీమహావిష్ణువు ఆదిశేషుని శయ్యగా చేసుకుని యోగనిద్రలో మునిగిపోయాడు. అప్పుడు బలగర్వితులైన మధుకైటభులనే రాక్షసులు యుద్ధకాంక్షతో ఆయనవద్దకు వచ్చారు. పరుషవాక్యాలతో నిందిస్తూ, పిడికిళ్లతోనూ మోకాళ్లతోనూ పొడుస్తూ ఆయనను బాధించారు. అప్పుడు ఆయన నాభికమలంలో ఉన్న బ్రహ్మదేవుడు - “స్వామీ! వీరి యొక్క ఈ భారతీవృత్తిని (మాటలను) ఇంకా సాగనిస్తున్నావేమిటి? వీరిని త్వరగా వధించు” అన్నాడు. అప్పుడు విష్ణువు “కావ్యప్రక్రియకోసమై ఈ భారతీవృత్తి పుట్టింది. వాక్యాలు, సంభాషణలూ ఎక్కువ వుండడంవలన ఇది భారతి అని పిలవబడుతుంది” అని చెప్పి అభినయంతో కూడిన అంగాలతో వారితో యుద్ధం చేశాడు. ఆయన యొక్కపాదవిన్యాసాల వలన భూమికి భారం కలిగింది. అందువలన కూడా అది భారతీవృత్తి అయింది. వేగంగా కదులుతున్నవీ, సత్త్వగుణంతో నిండినవీ అయిన ఆయన బాహువులనుండి సాత్త్వతీవృత్తి పుట్టింది. విష్ణువు విచిత్రమైన అభినయాలతో అవలీలగా వారి కేశాలను పట్టుకొని బంధించగా కైశికీవృత్తి ఆవిర్భవించింది. సంరంభంతోను, వేగంతోనూ కూడిన ద్వంద్వయుద్ధపు భంగిమల నుండి ఆరభటీవృత్తి పుట్టింది. చిత్రమైన అభినయాలతో శ్రీమహావిష్ణువు చేసిన దానవసంహారాన్ని చూచి బ్రహ్మ లోకంలో జనులకై ద్వంద్వయుద్ధమనే కట్టుబాటును చేశాడు. అది శస్రాస్త్రప్రయోగసమయంలో న్యాయ్యమైనదిగా చెప్పబడింది. నాట్యం కావ్యం మొదలైన వాటిలో మాత్రం వీరరసాన్ని దాని అనుభావాలనూ ఆశ్రయించిన ఆ కట్టుబాటును ఆయన వృత్తి అని పేర్కొన్నాడు. మహావిష్ణువుచేత తన వల్గితాలతో ఏ వస్తువు ఎట్లా ప్రదర్శించ బడిందో అదే విధంగా బ్రహ్మదేవునిచేత ఆయన న్ ము గ్యజుస్సామాథర్వ వేదాల నుండి పుట్టాయని అంటారు. సాత్తికగుణాలైన అతల ౧ ౨. టసావనాలక్ష్యంంలోనే వివరించబడుతుంది. ౯ అలత్యాగమూ శౌర్యమూ మొదలైన గుణాలతో కూడినది. హర్షం
రసార్దవ సుధాకర సుధ 2/7 (ప్రధానంగా గలదీ సాత్త్వతీవృత్తి అనబడుతుంది. దానికి 1) సంలాపం 2) ఉత్చాపకం 8) సంఘాత్యం 4) పరివర్తకం అని నాలుగు అంగాలు. వాటిలో ఈర్ష్య, క్రోధం మొదలైన భావాలతో వీరం మొదలైన రసాలతో పరస్పరం సంభాషించుకోవడం సంలాపం. ఎదిరిని యుద్దానికై (ప్రేరేపించడం ఉత్తాపకం. ఏదో ఒక కారణంతో కలిసి ఉన్న వ్యక్తులు విడిపోవడం సంఘాత్యం. మొదట చేయడానికి ఉపక్రమించిన పనిని విడిచిపెట్టి మరొక దానిని స్వీకరించడం పరివర్తకం.
మృదువైన శృంగారచేష్టలతో కూడినది, సుకుమారమైన ఆహార్యం గలదీ కైళికీ వృత్తి. దానిలో నర్మం, నర్మస్సంజం, నర్మస్ఫోటం, నర్మగర్భం అని నాలుగు అంగాలు ఉన్నాయి. శృంగారరసంతో కూడినది, ప్రియుని మనస్సును రంజింపజేసేదీ అయిన పరిహాసం నర్శం. అది మూడు విధాలు - 1) శృంగార హాస్యజం 2) శుద్ధ హాస్యజం 3) భయ హాస్యజం అని. వాటిలో శృంగార హాస్యజం సంభోగేచ్చా ప్రకటనం వలన కలిగేది, అనురాగ ప్రకటనం వలన కలిగేది, ప్రియుని యొక్క అపరాధాన్ని కనుగొనడం వలన కలిగేదీ అని మూడు విధాలు. శుద్ధహాస్యజనర్మం కూడా 1) వాక్కు 2) వేషం 8) చేష్టల వలన కలిగేదిగా మూడువిధాలు. ఇవి మళ్లీ ఒకొక్కటీ 1) వాక్కు 2) వేషం 3) చేష్టల వలన కలిగేదిగా మూడు విధాలు. భయహాస్యజనర్మం 1) ముఖ్యం 2) అంగం అని రెండు విధాలై, మళ్లీ ఒక్కొక్కటీ 1) వాక్కు 2) వేషం 8) చేష్టల వలన కలిగేదిగా మూడు విధాలు. ఈ విధంగా నర్మం పద్ధెనిమిది విధాలు.
నూత్న సంగమంలోని సుఖం కోసమై చేయబడే ప్రయత్నం భయంతో అంతం కావడం నర్మస్ఫంజం.
భావాలచేత సూచించబడిన అలతిశృంగారం నర్శ్మస్ఫోటం. కొందరు సంభోగం మధ్యలోనే విచ్చిన్నం కావడం నర్మస్ఫోటమని అంటారు.
నాయకుడుగాని నాయికగాని తన ప్రయోజనంకోసమై దాగి ఉండడం నర్మగర్భం. మొదట ఉన్న నాయకుడు నశించగా అతని స్థానంలో మరొకడు రావడాన్ని గూడా నర్మగర్భంగా భరతుడు నిర్వచించాడు.
మాయలు మంత్రాలు ఇంద్రజాలాలతో నిండినది, ఖద్గంతోనూ గదతోనూ చేసే చిత్రయుద్ధక్రియలతో కూడినదీ అయిన వృత్తిని ఆరభటి అంటారు. దానికి 1) సంక్షిప్తి 2) అవపాతనం 3) వస్తూత్థాపనం 4) సంఫేటం అని నాలుగు అంగాలు ఉన్నాయి.
సంక్షిప్తమైన వస్తువు విషయంగా కలిగి మాయాశిల్పంతో కూడినది సంక్షిప్తి.
28 రసార్దవ సుధాకర సుధ ఒక పక్షం యొక్క ప్రవేశంతో రెండవ పక్షం వారు పారిపోవడం వలన కలిగిన విభ్రాంతి అవపాతం. మాయచేత కల్పించబడిన ఒక సంఘటన వస్తూత్ధాపనం. ఒండొరులపై కోపం గల వీరులిద్దరు పరస్పరం మార్కొనడం సంఫేటం.
ఈ నాలుగు వృత్తులలో భారతి శబ్దవృత్తి-అంటే సంభాషణా రూపంగా ఉందేది. మిగిలినవి అర్ధవృత్తులు - అంటే ప్రదర్శింపబడేవి. ఈ నాలుగూ వృత్తి అనే సామాన్య నామంతో పిలవబడతాయి. కొందరు ఈ నాలుగు వృత్తులూ కలిసిన “మిశ్రావృత్తి' అన్ని రసాలకూ సమానమైనదని భావించి నిర్వచించారు.
శృంగారరసంలో కైశికీ వృత్తి, వీరరసంలో సాత్త్వతి, రౌద్ర భీభత్సరసాలలో ఆరభటీవృత్తి అన్ని రసాలలోనూ భారతీవృత్తీ ఉపయోగించబడతాయి. కారికలో సంక్షిప్తంగా ఉన్న ఈ విషయాన్ని వృత్తిలో మరింత వివరించాడు సింగభూపాలుడు. శృంగారహాస్యాలలో కైశికి, వీరాద్భుతరసాలలో సాత్త్వతి, రౌద్ర, కరుణ, భీభత్స, భయానక రసాలలో ఆరభటీ వృత్తీ ప్రయోగించబడతాయని వివరించి, నాట్యశాస్త్రంలో వివిధరసాల విషయంలో వృత్తులను నియమించిన కారికలను ఉట్టంకించి వాటిభావాన్ని విశదీకరించాడు.
ఇక ఆ యా దేశాలకు ఉచితమైన భాష, చేష్టలు, వేషం ఇవి అన్నీ ప్రవృత్తులు. వాటిలో భాష - 1) భాష 2) విభాష అని రెండు విధాలు. భాష 1) ప్రాచ్య 2) ఆవంత్య 3) మాగధి 4) బాహ్లీక 5) దాక్షిణాత్య 6) శౌరసేని 7) మాలవి అని ఏడు విధాలు. విభాష కూడా 1) శబర 2) ద్రమిల 3) ఆంధ్రజ 4) శకార 5) ఆభీర 6) చండాల 7) వనేచరులు మాట్టాడేదిగా ఏడు రకాలు. ఆ యా దేశజనులకు ఉచితమైన వేషధారణ, వారివారికి పరిమితమైన చేష్టలూ స్పష్టమైన భేదాలను కలిగి ఉంటాయి.
ఇతరుల (రామాది పాత్రల) యొక్క సుఖదుఃఖాల విషయంలో వాటిని మననం చేసే ఆ భావకుల మనస్సులు ఆ యా భావాలకు అనుకూలంగా స్పందించడం సత్త్వమన బడుతుంది. ఆ సత్త్వంనుండి కలిగిన భావాలను సాత్త్విక భావాలని భరతాది మహర్షులు పేర్కొన్నారు. ఏ సాత్త్విక భావాలను బట్టి వాటికి కారణమైన మనఃస్థితి ఊహించుకో బడుతుందో అవి సాత్త్విక భావాలు. అవి 1) స్తంభం 2) స్వేదం 8) రోమాంచం 4) స్వరభేదం 5) వేపథువు 6) వైవర్ద్యం 7) అశ్రువులు 8) ప్రళయం అని ఎనిమిది.
హర్షం, భయం, క్రోధం, విషాదం, అద్భుతం వీటన్నింటివలన కలిగేది స్తంభం. దానిలో అనుభావాలు సృృహలేకపోవడం, శూన్యత్వం, కదలలేకపోవడం.
రసార్దవ సుధాకర సుధ 29
ఎండ, సంతోషం, వ్యాయామం, శ్రమ, క్రోధం, భయం వీటి వలన స్వేదం (చెమట) కలుగుతుంది. దాని యొక్క అనుభావాలు చెమటలు తుడుచుకోవడం, గాలి కావాలనుకోవడం, విసనకర్ర తీసుకోవడం, మొదలైనవి.
విస్మయం, ఉత్సాహం, హర్షం, మొదలైన వాటివలన రోమాంచం (గగుర్పాటు) కలుగుతుంది. దాని యొక్క వికారాలు రోమాలు నిక్కబొడుచుకోవడం, జలదరింపు, ఒంటిని నిమురుకోవడం.
సుఖం దుఃఖం మొదలైనవాటి వలన స్పరభేదం (స్వరంలో మార్పు) కలుగుతుంది. దీనిలో కలిగే వికారం గద్ద్గదిక.
హర్షం, భయం, ముసలితనం, కోపం, మొదలైనవాటి వలన వేపథువు (వణుకు) కలుగుతుంది. దానియొక్క వికారాలు అదిరిపడడం, అవయవాలు కంపించడం, మొదలైనవి.
విషాదం, ఎండ, కోపం మొదలైన వాటివలన వైవర్ష్యం (కందిపోవడం, పాలి పోవడం) కలుగుతుంది. దానితో బాటు ముఖంయొక్కరంగు మారడం, చిక్కిపోవడం మొదలైన అనుభావాలు కలుగుతాయి.
విషాదం, రోషం, సంతోషం, పొగ మొదలైనవాటి వలన అథ్రువులు (కన్నీళ్లు) వస్తాయి. వాటితో కలిగే అనుభావాలు కన్నీటి బిందువులు రాలడం, కళ్లు తుడుచుకోవడం మొదలైనవి.
దుఃఖం, దెబ్బ మొదలైన వాటివలన కలిగేది ప్రళయం. దీనిలో కలిగే చేష్టలు విసంజ్ఞత, స్మృతి తప్పడం.
అన్నిభావాలూ సత్త్వం వలన కలిగేవే అయినా ఈ ఎనిమిది మాత్రం కేవలం సత్త్వమే మూలంగా కలిగినవి కావడంవలన సాత్త్విక భావాలని పేర్కొనబడ్డాయి. ఇవే భావాలను సూచిస్తాయి గనుక అనుభావాలని గూడా చెప్పబడ్డాయి. అందువలన భావవేత్తలైనవారు ఇవి రెండు రూపాలు కలిగినవని అంటారు.
సింహభూపాలవిరచితమైన రసార్ణవసుధాకరంలోని రంజకోల్లాసమనే ప్రథమవిలాసం సమాప్తం, ద్వితీయ విలాసం
సింగభూపాలుడు తనగ్రంథం యొక్క రెండవ విలాసాన్ని లక్ష్మీస్తుతితో
ప్రారంభించి మొదటగా వ్యభిచారి భావాలను నిర్వచించాడు.
తం రసార్జవ సుధాకర సుధ వ్యభిచారి అనే పదంలోని వి, అభి అనే ఉపసర్గలకు విశేషమైన అభిముఖత్వం అని అర్ధం. ఆ విశేషాభిముఖత్వంతో వాచిక ఆంగిక సాత్త్వికాభినయంతో కూడినవై స్థాయిభావాన్ని గూర్చి చరిస్తాయి గనుక అవి వ్యభిచారిభావాలు. స్థాయిభావాన్ని చక్కగా చరింపచేస్తాయి కనుక అవి సంచారిభావాలని గూడా పిలవబడతాయి. అవి సముద్రంలో అలలలాగా స్థాయిభావంలో మునుగుతూ తేలుతూ దాన్ని వృద్ధిపొందజేస్తాయి, తామూ దానిరూపార్ని పొందుతాయి. 1) నిర్వేదం 2) విషాదం 8) దైన్యం 4) గ్లాని 5) శ్రమ 6) మదం 7) గర్వం 8) శంక 9) త్రాసం 10) ఆవేగం 11) ఉన్మాదం 12) అపస్మృత్రి 13) వ్యాధి 14) మోహం 15) మృతి 16) ఆలస్యం 17) జాద్యం 18) వ్రీడ 19) అవహిత్ధ 20) స్మృతి 21) వితర్మం 22) చింత 28) మతి 24) ధృతి 25) హర్షం 26) ఉత్సుకత్వం 27) ఉగ్రత్వం 25) అమర్నం 29) అసూయ 80) చాపలం 31) నిద్ర 32) సుప్తి ౩౩) బోధం - అని వ్యభిచారి భావాలు ముప్పైమూడు. తత్వజ్ఞానం, దారిద్ర్యం, ఆపద, ప్రియజన వియోగం, ఈర్ష్య మొదలైన వాటివలన కలిగే స్వావమానం (తనను తాను నిందించుకోవడం) నిర్వేదం. దానిలో చింత, అత్రువులు, నిశ్య్వాసాలు, వైవర్ష్యం, ఉచ్చ్వాసాలు, దీనత్వం ఇవన్నీ వికారాలు. తలచినపని పూర్తికాకపోవడం, క్రోర్రినద్రి అందకపోవడం, తన తప్పు తాను తెలుసు కోవడం ... వీటన్నింటి వలన కలిగే సంచారిభావం విషాదం. అది
- జ్యేష్టాకయం 2) మధ్యమాశ్రయం 3) అధమాశ్రయం అని మూడు విధాలు. జ్యేష్టాశయ విషాదానికి తమక్తు సహాయపడే వారి కోసం అన్వేషించడం, దానినుండి బయటపడే మార్గాలు ఆలోచించడం అనుభావాలు. మధ్యమాళశ్రయ విషాదానికి నిరుత్సాహం, విమనస్మత అనుభావాలు, అధమాశ్రయవిషాదాన్సికి నిరాశ, శూన్యంలోకి హ్ చ్రందదం, ఏడవడం, నిట్టూర్చులు, విచారం, నోరు ఎండిపోవడం మొదలైనవి మనస్సులోని బాధ, దారిద్ర్యం మొదలైన వాటివలన ఉద్ధతత్వం లేకపోవడం దైన్యం. మాలిన్యం, శరీరం కదలకపో_డం మొదలైనవి దాని అనుభావాలు. మానసిక బాధ వ్యాధి, ముసలితనం, దాహం, వ్యాయామం, సురతం మొదలైన మి వన మా గో అనబడుతుంది, దీని అనుభావాలు - శరీరం, మొదలైనవి, న గగ కాణుకు, నిరుత్సాహం, వైవర్ద్యం, కళ్లు తిరగడం
రసార్ణవ సుధాకర సుధ 31
థమ అంటే - ప్రయాణం, నృత్తం, రతి మొదలైన వాటి వలన కలిగే మానసికమైన ఆయాసం. ఒళ్లు పట్టించుకోవడం, వేగంగా ఊపిరి విడవడం, కాళ్లు నొక్కుకోవడం, ఆవులింతలు, మెల్లగా నడవడం, ముఖం కళ్లూ తిరగడం, ఉస్సురుస్సు రనడం మొదలైనవి దీని అనుభావాలు.
మదిర (కల్లు) వలన కలిగే ఆనందకరమైన మత్తు మదమని చెప్పబడుతుంది. అది 1) తరుణమదం 2) మధ్య మదం త్ర అపకృష్ణమదం అని మూడు విధాలు. చిరునవ్వుతో కూడిన చూపులు, మాటలు, ముఖంలో ఎర్రదనం, కొద్దిగా తూలుతున్న నడక - తరుణమదంలోని చేష్టలు.
మధ్యమమదంలో తడబడుతున్న మాటలు, కళ్లు తేలిపోవడం, నడకలో తూలుడు, చేతులు విసరడం, పట్టుజారిపోవడం వంటి చేష్టలుంటాయి.
అపకృష్ణమదంలో నడవలేకపోవడం, తెలివిలేకపోవడం మాటిమాటికీ ఉమ్మి వేయడం, బరువైన ఊపిరి, వెక్కిళ్లు వాంతులు మొదలైన చేష్టలు ఉంటాయి.
వీటిలో తరుణమదం ఉత్తమపాత్రలకు, మధ్యమమదం మధ్యమపాత్రలకు, అపకృష్ణమదం నీచపాత్రలకూ ఉంటాయి. ఆ మదం వృద్ధి అయితే ఉత్తమప్రకృతి గలవారు నిద్రపోతారు. మధ్యమప్రకృతులు పాటలు పాడతారు, లేదా నవ్వుతారు. అధమహ్రకృతులు (గ్రామ్యభాషలో పరుషొక్తులు పలుకుతారు, లేదా ఏడుస్తారు.
ఐశ్వర్యం, చక్కని రూపం, యౌవనం, మంచిపుట్టుక, మంచివిద్య, గొప్పబలం, తాను కోరుకున్నవన్నీ పొందగలగడం - వీటన్నింటి కారణంగా ఇతరులను చిన్నచూపు చూడడం - గర్వం. పెద్దల ఆజ్ఞను మీరడం, బదులు చెప్పకపోవడం, మాట్లాడడానికి కూడా విముఖత చూపడం, ఇతరుల మాటను కాదనడం, వారిని పట్టించుకోక పోవడం పైపెచ్చు పరుషంగా మాట్లాడడం తన శరీరాన్ని తాను మురిపెంగా చూసుకుంటూ ఉండడం, ఒళ్లు విరుచుకోవడం ... ఇవన్నీ దానియొక్క అనుభావాలు.
తాను చేసిన దొంగతనం, అపరాధం వంటి వాటి వలన తనకు అపాయం కలుగుతుందని శంకించడం - శంక. పక్కచూపులు చూడడం, నోరు ఎండిపోవడం, ముసుగువేసుకోవడం, భయంతో పాలిపోవడం, గొంతు క్షీణించి పోవడం - దాని చేష్టలు. ఆ శంక 1) స్వోత్స 2) పరోత్ట అని రెండు విధాలు. స్వోత్టశంక తాను చేసిన అకార్యం వలన కలుగుతుంది. ఇది ముఖభావాల వలన తెలియబడుతుంది. పరోత్టశంక ఇతరులు చేసిన అకార్యం వలన తనకు కలిగేది. ఇది ఆకార మనే సాత్త్విక భావం నుండి, అంగ ప్రత్యంగాల యొక్క చేష్టల నుండీ ఊహించబడుతుంది.
32 రసార్దవ సుధాకర సుధ
మెరుపులు, హింస్రజంతువులు, ఉరుములు, భూతాలు, పాములు మొదలైన వాటిని చూచి మనస్సు చెదిరిపోవడం త్రాస మనబడుతుంది. వణుకు, శరీరం ముడుచుకు పోవడం, రోమాంచం, నిశ్చేష్టత, గొంతు బొంగురుపోవడం, కనురెప్పలు కొట్టుకోవడం, విభ్రాంతి, పక్కనున్నవారిని ఊతగా పట్టుకోవడం, మొదలైనవి దీనియొక్క వికారాలు.
ఏ కారణంవల్లనైనా మనస్సుకి కలిగే తత్తరపాటు ఆవేగ మనబదుతుంది. అది ఎనిమిది కారణాల వలన కలుగుతుంది. అవి 1) ఉత్పాతాలు (భూమి కంపించడం, తోకచుక్క కనబడడం మొదలైనవి) 2) తీవ్రమైనగాలి ౩) వర్షం 4) అగ్ని 5) మదించిన ఏనుగు 6) ప్రియాన్నిగాని 7) అప్రియాన్ని గాని వినడం 8) శత్రువుల ముట్టడి. వీటిలో ఉత్పాతావేగం వలన కలిగే వికారాలు - శరీరావయవాలు పట్టుతప్పిపోవడం, ముఖం తిప్పేసుకోవడం, ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లిపోవడం, విషాదం, ముఖం కళతప్పిపోవడం, విస్మయం మొదలైనవి.
వాతావేగం యొక్క వికారాలు త్వరగా నడవడం, బట్టలు ఎగిరిపోకుండా పట్టు కోవడం, దుమ్ము పడకుండా ముసుగువేసుకోవడం కళ్లు నలుపుకోవడం మొదలైనవి.
వర్షావేగం యొక్క వికారాలు గొడుగు పట్టుకోవడం, అవయవాలను ముడుచు కోవడం, చేతులను స్వస్తికాకారంగా గుండెలమీద పెట్టకోవడం, పరుగెత్తడం, వేడికోసం నిష్పుసెగన ఉండడం, మొదలైనవి,
అగ్బ్యావేగం వలన కలిగే వికారాలు చల్లదనం కోసం విసురుకోవడం, శరీరావయవాలను విదిలించడం ఎత్తి ఎత్తి అడుగులు వేయడం కళ్లలోకి పాగపోకుందా ఉండడంకోసమై కళ్లు చిన్నని చేయడం మొదలైనవి.
మదపుటేనుగు వలన కలిగిన ఆవేగంలో త్వరగా అక్కడినుండి తప్పుకోవడం, మాటిమాటికీ వెనుదిరిగి చూడడం, భయంతో వణకడం వంటి వికారాలు ఉంటాయి.
ప్రియవార్త వినడం వలన కలిగిన ఆవేగంలో ఆసనంనుండి లేవడం, ఆ వార్త తెచ్చిన వారిని, లేదా పక్కనున్నవారిని కౌగిలించుకోవడం, అమూల్యవస్తువులు దాన మివ్వడం, గగుర్పాటు చెందడం మొదలైనవి వికారాలు.
అప్రియశ్రవణం వలన కలిగిన ఆవేగంలో విలపించడం, అటు ఇటూ పచార్లు
చేయడం, ఆశక్రందించడం, కుప్పగూలిపోవడం వంటి వికారాలు ఉంటాయి. శత్రువుల వలన కలిగిన ఆవేగంలో కవచమ్రూ శస్త్రాలూ ధరించడం రథాన్నో
రసార్దవ సుధాకర సుధ ల గుర్రాన్నో ఏనుగునో ఎక్కడం, త్వరితంగా వెళ్లిపోవడం మొదలైన వికారాలు కలుగుతాయి. శరీర ధాతువులలో హెచ్చుతగ్గుల కారణంగా కలిగిన దోషం వలన, భూతావేశం వలనా కలిగే చిత్తక్షోభ అపస్మార మనబడుతుంది. దానిలో వణకడం, పరుగెత్తడం, పడిపోవడం, బిగుసుకుపోవడం, దొర్లడం, వికారమైన చూపులు, పెదవి కొరుక్కోవడం, భుజాలు చరుచుకోవడం, నురగలు కార్చడం వంటి చేష్టలు కలుగుతాయి. ధాతు వైషమ్యదోషం వలన కలిగే అపస్మారం జబ్బు కనుక అది అనవసరం. శరీరంలో దోషం కలగడంవలన లేదా ప్రియజనవియోగం వలన కలిగే జ్వరం
- వ్యాధి. శరీరం కొయ్యబారిపోవడం, అవయవాలు పట్టుదప్పడం, మూలుగు, నోరు బిగుసుకుపోవడం, కళ్లు చెదరడం, బరువైన ఊపిరి మొదలైనవి దానిలో కలిగే వికారాలు. అది చలితో కూడినది, వేడిమితో కూడినదీ అని రెండు విధాలు. శీత జ్వరంలో దవడలు కొట్టుకోవడం, కన్నీళ్లు కారడం, వణుకు, మూలుగు, మోకాళ్లు దగ్గరగా ముడుచుకోవడం, ఒళ్లు గగుర్పొాడవడం, నోరు ఆరిపోవడం మొదలైనవి వికారాలు. దాహజ్వరంలో చల్లని వస్తువులు, పూలమాలలూ కోరుకోవడం, కాళ్లు చేతులు కొట్టుకోవడం, నోరు ఎండిపోవడం మొదలైనవి చేష్టలు. ఆపదలు, భయం, వియోగం, మొదలైన వాటివలన మనస్సుకి కలిగే దిక్కుతోచని స్థితి మోహ మనబడుతుంది. దానిలో కలిగే వికారాలు - ఏమీ గ్రహించలేకపోవడం, నిశ్చేష్టత, ఒళ్లు తిరగడం, పడిపోవడం, తూలడం మొదలైనవి. శరీరంలో ఉండే ధనంజయమనే వాయువు ఆత్మను విడిచిపోవడం మరణమని చెప్పబడుతుంది. అది 1) వ్యాధి వలన కలిగేది 2) అకస్మాత్తుగా కలిగేదీ అని రెండు విధాలు. మొదటిది చికిత్స లేని గుండెనొప్పి, విషూచి మొదలైన వాటివలన కలుగుతుంది. దానిలో కలిగే అనుభావాలు, అస్పష్టమైన మాటలు, శరీరం పాలిపోవడం, మందమైన ఊపిరి, కళ్లు మూతలుపడడం, వెక్కిళ్లు, పరిజనుల సహాయాన్ని కోరడం మొదలైనవి. రెండవదైన అభిఘాతం వలన కలిగే మరణం - దెబ్బతగలడం, కిందపడడం. కాలడం, ఊపిరి సలపకపోవడం, విషపానం, మొదలైన వాటివలన కలుగుతుంది. వాటిలో దెబ్బతగలడం మొదలైన వాటివలన కలిగిన మరణానికి అనుభావాలు నేలమీద పడిపోవడం ఆక్రందన చేయడం మొదలైనవి. విషమంటే వత్సనాభం వంటివి. దానివలన ఎనిమిది విధాలైన వేగాలు
34 రసార్జవ సుధాకర సుధ కలుగుతాయి. 1) శరీరం నల్లబడడం 2) వణుకు 3) దాహం 4) వెక్కిళ్లు 5) నోటినుండి నురుగులు రావడం 6) కంఠం బిగుసుకుపోవడం 7) చైతన్యం లేకపోవడం 8) మరణం - ఇవి అన్నీ క్రమంగా కలిగే వికారాలు.
స్వభావం, (శమ, భుక్తాయాసం, గర్భభారం, మొదలైన కారణాలవలన కష్టంగా పనికి ఉపక్రమించడం - ఆలస్యం (అలసత్వం). దానిలో కలిగే క్రియలు - ఒళ్లు విరుచుకోవడం, పనిమీద ద్వేషం, ఆవులించడం, కళ్లు నులుముకోవడం, శయ్యనో ఆసనాన్నో విడిచిపెట్టకుండా ఉండడం, బద్ధకం, నిద్ర మొదలైనవి.
ఇష్టమైన లేదా అనిష్టమైన వార్తలను విన్నప్పుడు, అటువంటివే వస్తువులనో వ్యక్తులనో చూచినప్పుడూ విరహావస్థలోనూ కలిగే మొద్దుబారినతనం జడత్వమన బడుతుంది. దానిలో కలిగే వికారాలు రెప్పవాలకపోవడం ఏదీ వినకపోవడం, మాట్లాడకపోవడం, పరవశత్వం. ఈ సంచారిభావానికి తానే రచించిన ప్రాకృతగాథను ఉదాహరణంగా ఇచ్చాడు సింగభూపాలుడు.
ప్రాకృతగాథ:- ససురేణ ధజ్ఞమాణే ఘరనిఅదభవే ణిఉంజపుంజమ్మి |
ణ సుణఇ సుణ్జా బహుసో కహిదంవి ససురావ ॥
ఛాయ:- శ్వశురేణ దహ్యమానే గృహనికటభవే నికుంజపుంజే ।
న శృణోతి స్నుషా శూన్యా బహుశః కథితమపి శ్వశ్రా ॥|
మామగారు ఇంటికి దగ్గరలో ఉన్న పొదలను తగలబెడుతూ ఉంటే కోడలు శూన్యమైన మనస్సుకలదై అత్తగారు పదేపదే చెపుతున్న మాటలని కూడా వినలేకపోయింది. ఇంటిలో ఏకాంతం దొరకని ఆమెకూ ఆమె భర్తకూ ఆ పొదలు సంకేతస్థానంగా ఉండేవి. అవి కాలిపోవడం చూచిన ఆమెను జడత్వం ఆవరించింది. అనిష్టదర్శనం వలన కలిగే జదత్వానికి ఇది ఉదాహరణం.
చేయగూడని పనిచేయడం, ఇతరులు తనను అవమానించడం, లేదా స్తుతించడం, నూతన సంగమం మొదలైన వాటివలన దూకుడు తగ్గిపోవడం ఆ వ్రీడ (సిగ్గు) అన బడుతుంది. దానిలోని చేష్టలు వినిపించనంత మెల్లగా మాట్లాడడం, తలదించుకోవడం, ఆలోచిస్తూ ఉండడం బయటికి వెళ్లకుండా ఉండడం, ఇతరులను చూచి దూరం నుండే ముసుగువేసుకోవడం, నేలమీద కాలిగోళ్లతో గీయడం మొదలైనవి.
కుటిలత్వం, గాంభీర్యం, రాజనీతిజ్ఞత, సిగ్గు, భయం, దాక్షిణ్యం తెలివితేటలు, పరాజయం మొదలైన వాటివలన తన ఆకారాన్ని (మనస్సులోని భావాలను ప్రతిఫలించే
రసార్జవ సుధాకర సుధ 35 చిన్నాలను) కప్పిపుచ్చుకోవడం ఆ అవపొత్ధ. జరిగినదానిని మరొకరకంగా మార్చి చెప్పడం, కపటపు ధైర్యాన్ని అభినయించడం, పక్కచూపులు చెపుతూ ఉన్నమాటను మధ్యలోనే ఆపెయ్యడం - మొదలైనవి దీనియొక్క అనుభావాలు. మనస్సు యొక్కస్వస్థత్వం, ఆలోచన, అలవాటు, దానిని పోలిన మరొక వస్తువును చూడడం మొదలైన వాటివలన పూర్వం తాను అనుభవించిన విషయాలు గుర్తుకు రావడం స్మృతి. దానిలో కలిగే వికారాలు తలనుఊపడం, ఎత్తడం, కనుబామలు పైకెత్తడం మొదలైనవి, సందేహం, విమర్శ (ఆలోచన) మొదలైన వాటితో చేసే ఊహను వితర్మమంటారు. అది అసత్యమైనది, సత్యమైనది అని రెండు విధాలు. ఆ రెండూ నిర్ణయంతోనే అంత మవుతాయి. దాని యొక్క అనుభావాలు తలపంకించడం, కనుబొమలు పైకెత్తడం ముడుచుకోవడం మొదలైనవి. ఇష్టమైన వస్తువు దొరకకపోవడం, అధికారం చేజారిపోవడం మొదలైన కారణాల వలన ఎప్పుడూ వాటిని గురించే ఆలోచిస్తూ ఉండడాన్ని చింత అంటారు. దానిలో- చిక్కిపోవడం, తలవంచుకునిఉండదడం, బాధపడడం నిట్టూర్చడం, బరువుగా ఊపిరి పీల్చడం మొదలైన వికారాలు ఉంటాయి. వివిధశా(స్తాలను మథించడం వలన చేయదగిన విషయాన్ని నిర్ధారణ చేసుకోవడం మతి అనబడుతుంది. దానిలోని చేష్టలు - చేయదగిన పనిని చేయడం, సందేహ నివారణం, ఊహాపోహలు, శిష్యులకు ఉపదేశం చేయడం మొదలైనవి. స్వతః ఉన్న జ్ఞానం, శాస్తాధ్యయనం వలన కలిగిన విజ్ఞానం. పెద్దబ్దయందు భక్తి వివిధ సిద్ధులు కలగడం, సిగ్గు - మొదలైన వాటివలన ఏ కోరికలూ లేకపోవడం ధృతి. దానిలోని అనుభావాలు - దొరికినదానిని తృప్తిగా అనుభవించడం, దొరకని వాటిని, జరిగిపోయిన విషయాలను, చేజారిన వస్తువులనూ తలచుకుని బాధపడకపోవడం మొదలైనవి. తాను కోరుకున్నది లభించడం, తనకు యోగ్యమైనది దొరకడం, మిత్ర సమాగమం, దేవతల అనుగ్రహం, మొదలైన వాటివలన మనస్సుకు కలిగే ప్రసన్నత
- హర్షం. దీనిలోని విభావోలు - కళ్లు ముఖం వికసించడం, పులకరింతలు, చెమటలు పట్టడం, ప్రియంగా మాట్లాడడం, ఎదుటివారిని కౌగిలించుకోవడం, చేతులు నలుపుకోవడం మొదలైనవి.
36 రసార్దవ సుధాకర సుధ ఇష్టమైన వస్తువు దూరం కావడం, దూరమైన వస్తువు కనిపించడం అందమైన వస్తువులను చూడాలని కోరిక, మొదలైనవాటివలన కాలం గడవక బాధపడడం బెత్సుక్యం. దానిలో కలిగే విభావాలు తొందరపాటు, నిలకడ లేకపోవటం, మాటిమాటికీ లేవడం, ఆలోచించడం, శరీరం బరువుగా ఉండడం, బద్ధకం, నిట్టూర్పులు మొదలైనవి. ఇతరులు తనపట్ల చేసిన అపరాధం, అవమానం, దుర్భాషలాడడం, తాను ఇతరుల చౌర్యాన్ని పట్టుకోవడం మొదలైన వాటివలన కలిగే చండత్వం - బెగ్ర్యం (ఉగ్రత్వం) అని చెప్పబడుతుంది. దానిలో కలిగే క్రియలు కళ్లు ఎర్రబడడం, స్వేదం, తల పంకించడం, అపరాధిని పట్టి కట్టెయ్యడం, కొట్టడం, బెదిరించడం, వధించడం మొదలైనవి. ఇతరులు చేసిన అధిక్షేపం (నీవెంత అనడం) అవమానం మొదలైన వాటివలన కలిగే క్రోధం అమర్న మనబడుతుంది. దానిలో చెమటలు పట్టడం, తల పంకించడం, ముఖం వాల్చుకోవడం, ఆలోచించడం, బదులు తీర్చుకోవడానికై ఉపాయాలు అన్వే షించడం, అందుకై ఉత్సాహం, ప్రయత్నం మొదలైన చేష్టలు ఉంటాయి. ఇతరుల యొక్క సౌభాగ్యం, సంపద విద్య, శౌర్యం మొదలన వాటిని చూచి ఓర్వలేక వారిగుణాలను కూడా దోష్టాలుగా చిత్రించడం అసూయ అనబడుతుంది. దానిలో కలిగే వికారాలు - ముఖం తిప్పుకోవడం,' నిందించడం, కనుబొమలు ముడుచుకోవడం, అనాదరం మొదలైనవి. ఎదుటివారిపట్ల ఇష్టం, ద్వేషం మొదలైన వాటితో వెంటవెంటనే మనస్సు మారిపోతూ ఉండడం - చాపలం. దానిలోని వికారాలు - ఆలోచించకుండా ఎదుటివ్యక్తిని కౌగిలించుకోవడం, మళ్లీ పరుషంగా మాట్లాడడం, కొట్టమని ఆజ్ఞాపించడం, వెళ్ల గొట్టడం మొదలైనవి. మదిరాపానంవలన కలిగిన మత్తు, స్వభావం, వ్యాయామం, నిశ్చింతత్వం మొదలైన కారణాలవలన మనస్సు విశ్రాంతిని పొందడం నిద్ర అనబడుతుంది. దానిలో కలిగే చేష్టలు ముఖం బరువెక్కడం, కళ్లు తూలడం, మూతలు పడడం, శరీరం ఒరిగిపోవడం, ముడుచుకోవడం, జడత్వం మొదలైనవి. నిద్రయొక్క గాఢత్వమే సుప్తి అనబడుతుంది. దానిలో కలిగే వికారాలు - ఇంద్రియాలు పనిచేయకపోవడం, కళ్లు పూర్తిగా మూసుకుపోవడం, అవయవాలు జారిపోవడం, నిశ్చలత్వం, క్రమబద్ధంగా ఉన్న ఊపిరి మొదలైనవి.
రసార్దవ సుధాకర సుధ 37
కల రావడం, ఇతరుల స్పర్శ, శబ్దం కావడం, ని(ద్రపూర్తి కావడం మొదలైన కారణాల వలన మెలకువ రావడం ప్రబోధం. దానిలో కలిగే చేష్టలు కళ్లు నులుముకోవడం, పక్కపైనుండి లేవడం, వేళ్లు విరుచుకోవడం, తల గోక్కోవడం శరీరాన్ని అటూ ఇటూ తిప్పడం మొదలైనవి.
ఉత్తమ మధ్యమ అధమనాయకుల విషయంలో వారివారికి ఉచితమైన విభావాలు, అనుభావాలతో బాటు, వారికి ఉచితమైన వ్యభిచారిభావాలు కూడా వర్ణించబడాలి. ఉద్వేగం, స్నేహం, దంభం ఈర్ష్య మొదలైన చిత్తవృత్తులు కూడా ఈ వ్యభిచారి భావాలలోనే భాగాలు. ఈ భావాలన్నీ ఒకదానికి ఒకటి విభావాలు (కారణాలు) అనుభావాలూ (కార్యాలూ) కూడా అవుతాయి. ఈ వ్యభిచారిభావాలన్నీ స్వతంత్రంగాను, పరతంత్రంగానూ కూడా ఉంటాయి. మరొక భావానికి పుష్టిని కలిగించడం కోసమైఉన్న భావం పరతంత్రమని, స్వతఃప్రధానమైన భావం స్వతంత్రమనీ చెప్పబడుతుంది. ఈ కారికయొక్క వృత్తిలో పరతంత్రంగాను స్వతంత్రంగానూ ఉన్న నిర్వేదానికి ఉదాహరణలను ప్రదర్శిస్తూ సింగభూపాలుడు - ఆ నిర్వేదం స్థాయిభావంగా శాంతరసాన్ని అంగీకరించినవారి మతాన్ని తోసిపుచ్చి నిర్వేదానికి స్థాయిభావత్వం లేదని నిష్కర్న చేశాడు.
ఈ భావాలు అనౌచిత్యంతో ప్రవర్తిస్తే అక్కడ భావం కాకుండా భావాభాసం కలుగుతు2ది. ఆ అనౌచిత్యం రెండు విధాలు. 1) అసత్యత్వం వలన కలిగినది ల్త్రో అయోగ్యత్వం వలన కలిగినది అని. వాటిలో అసత్యత్వం వలన కలిగే అనౌచిత్యం అంటే ఒకానొక భావం అచేతనమైన వస్తువునందు ఉన్నదిగా వర్ణించబడడం. అయోగ్యత్వం వలన కలిగే అనౌచిత్యమంటే నీచులైన మానవులయందు, పశుపక్ష్యాదులయందూ ఉన్నదిగా వర్ణించబడడం.
ఈ వ్యభిచారిభావాలయొక్క ఉదయం, సంధి, శబలత, శాంతి అనే నాలుగు దశలను బట్టి అవి నాలుగు విధాలు. వాటిలో భావం యొక్క ఉత్పత్తి అంటే ఆ భావం మొదటగా ఉత్పన్నం కావడం. ఒకదాని నొకటి పోలినవి, లేదా ఏమీ పోలిక లేనివీ, వేరు వేరు కారణాలవలన కలిగినవీ అయిన రెండు భావాలు ఒకదాని కొకటి కలిస్తే అది భావసంధి. పరాకాష్టకు చేరుకున్న భావం అణిగిపోవడం భావశాంతి అనబడుతుంది. చాలా భావాలు ఒక్కసారే కలిగి అవి అన్నీ ఒకదానితో ఒకటి ఒత్తిడికి లోనయితే అది భావశబలత. ఈ సందర్భంలో సింగభూపాలుడు తనపై వివిధ కవులు వ్రాసిన చాటుశ్లోకాలను ఉదాహరణలుగా ఇచ్చాడు. వాటిలో ఒక శ్లోకం ఇది.
38 రసార్దవ సుధాకర సుధ శ్లో? శుద్ధాంతస్య నివారితో౭ ప్యనునయెర్నిశ్ళంకమంకూరితః వృద్ధామాత్యహితోపదేశవచనై రుద్ధోఇ_పి వృద్ధిం గతః ॥
మానోద్రేకతరుః ప్రతిక్షితిభుజామామూలమున్నూల్యతే
వాహిన్యామనపోతసింహనృపతేరాలోకితాయామపి 11
తా॥ శత్రురాజులయొక్క స్వాభిమానమనే వృక్షం అంతఃపురంలోని తల్లి, భార్య మొదలైన ్రీలయొక్క అనునయాలచేత నివారించబడినదై కూడా మొలకెత్తింది. వృద్ధులైన మంత్రుల యొక్క హితోపదేశాలతో కట్టివేయబడికూడా వృద్ధిపొందింది. కాని అనపోత సింహ భూపాలుని యొక్క సేనావాహిని కంటపడగానే సమూలంగా పెకలించబడింది. ఈ శ్లోకంలో గర్వమనే భావం అణిగిపోవడం వర్ణించబడింది గనుక ఇది భావశాంతికి ఉదాహరణంగా ఇవ్వబడింది.
ఏ భావాలు సజాతీయాలుగాని, విజాతీయాలుగాని అయిన ఇతరభావాలచేత కప్పిపుచ్చబడవో, ఏవి క్షీరసాగరం మాదిరిగా తమలో కలిసిన ఇతరభావాలను తమరూపంలోకి మారుస్తాయో అవి న్థాయిభావాలని చెప్పబడతాయి. ఆస్థాయిభావాలు
- రతి 2) హాసం 8) ఉత్సాహం 4) విస్మయం 5) క్రోధం 6) శోకం 7) జుగుప్ప
- భయం అని ఎనిమిది.
వాటిలో యువతీయువకులకు ఒండొరులవిషయంలో స్థిరంగా నిలిచి ఉండే కోరిక రతి అనబడుతుంది. అది బహువిధాలుగా కలుగుతుంది. తదేకబుద్ధివలన, ఎదుటి వ్యక్తికి సంబంధించిన ఇతరవ్యక్తులపై గౌరవం వలన, ఈ వ్యక్తియే నాకు ప్రియమైనది / వాడు మరింకెవరూ కారు అనే అభిప్రాయంవలన, తనకు తానే ప్రమాణరి కావడం వలన, ఆవ్యక్తికి సంబంధించిన శబ్బస్పర్భరూపరసగంధాలనే విషయాల కారణంగా - ఇట్లా ఎన్నో విధాలుగా కలుగుతుంది. దానిలో పరస్పరం చూచుకోవడం, కనుబొమల విలాసాలు, ప్రియమైన మాటలు మొదలైన వికారాలు ఉంటాయి,
ఈ రతి మొలకెత్తడం, చిగురువేయడం, మొగ్గతొడగడం, పువ్వులు పూయడం, పండు అనుభవానికి రావడం వంటివైన క్రమపరిణామంగల దశలను కలిగి ఉంటుంది. అవి - 1) ప్రేమ 2) మానం (అలక) 38) ప్రణయం 4) స్నేహం 5) రాగం 6) అనురాగం,
యువతీ యువకుల మధ్యన నీవు, నేను అనే భేదాలు లేని పరస్పర (ప్రేమ భావబంధనం ఏదైతే కలుగుతుందో అది - ప్రేమ. ఆ (ప్రేమానుబంధం కుదరడం
రసార్దవ సుధాకర సుధ 39 వలన కలిగిన స్వాతంత్ర్యంతో హృద్యమైన కుటిలభావనలను (అసూయను) కలగజేసేది మానం. అప్పటికే కుదిరి ఉన్న (ఢేమ, మానం - వీటిచేత కలిగించబడిన బాహ్యమైన (ప్రేమ ప్రకటనలు, మానసికమైన భావనల వలన కలిగే నమ్మిక ప్రణయం. ఆ నమ్మిక పరస్పరం చూచుకోవడం మొదలైన వాటితో పరాకాస్ట్రకు చేరుకోగా ప్రియవ్యక్తి పట్ల మనస్సు ఆర్టతని పొందడం స్నేహమనబడుతుంది. ఆ స్నేహం ప్రౌఢస్నేహం, మధ్యస్నేహ్హం, మందస్పేహం అని మూడు విధాలు. వాటిలో ప్రేయసీప్రియులలో ఒకరు దూరంగా ఉన్నప్పుడు అతని/ఆమె యొక్క మనోభావాలు తెలియకపోవటం వలన రెండవ వ్యక్తికి బాధను కలిగించేది ఫ్రొధస్నేహం. ఒక వ్యక్తిపట్ల (ప్రేమ ఉన్నప్పటికీ తాను ఇతరులతో క్రీడించాలని కోరిక కలిగితే అది దోషంగా తోచకపోవడం జరిగితే అది (ఆవ్యక్తిపట్ల ఉన్న ప్రేమ) మధ్యస్నేహం. (ప్రేయసి/ప్రియునియొక్క మానం స్నేహం మొదలైన వాటిపట్ల రెండవవారు ఇటు అపేక్షనుగాని అటు ఉపేక్షనుగానీ చూపకపోతే అది మందస్నేహం.
ఏ స్నేహఫ్రకర్షవలన మనస్సులోని అధికమైనబాధకూడా సుఖంగానే భావించబడి అనుభవించబడుతుందో అది రాగమని పిలవబడుతుంది. అది కుసుంభరాగం, నీలీ రాగం మంజిస్టరాగం అని మూడు విధాలు. వాటిలో ఒక్క క్షణంలో (ప్రేమ కలిగి మళ్లీ ఒక్కక్షణంలోనే తగ్గిపోతే అది కుసుంభరాగం. మనస్సులో కలిగిన (ప్రేమ ఇటు పూర్తిగా పోకుండానూ, అటు ప్రకాశమానంగా లేకుండానూ ఉంటే అది నీలీరాగం. ఏది త్వరగా కలిగి ఎప్పటికీ పోకుండా మంచి ప్రకాశంతో శోభిస్తుందో అది మంజిష్టరాగం. ఇతరుల చేత తెలియబడేటంత పరిణతిని పొంది బయలుపడిన రాగం దానికి ఆశ్రయమైన వ్యక్తి ఉన్నంతకాలమూ నిలిచి ఉంటే అది అనురాగమన బడుతుంది.
మాట్లాడడం, ఆకారం వేషధారణ పనులు - వీటన్నింటిలో కనిపించే వికారం. చపలత్వం, ఇతరుల యొక్క మాటలు 'ప్రవర్తనలలోని వికారాలను అనుకరించడం మొదలైన వాటివలన మనస్సులో కలిగే మార్పు హాసమనబడుతుంది. దానిలో వికారమైన చూపులు, ముక్కు పెదవులు, చెక్కిళ్లు అదరడం మొదలైనవి కలుగుతాయి.
శక్తి, ధైర్యం, ఇతరులనుండి లభించే సహాయం - వీటితో శ్లాఘ్యమైన ఫలంగల పనులయందు వెంటనే మనస్సు లగ్నం కావడం ఉత్సాహం. దానిలోని చేష్టలు - ఆ పనిని ప్రారంభించడానికి తగిన కాలాన్ని చూచుకోవడం, ధైర్యం, దానిని గురించి
4౦ రసార్దవ,సుధాకర సుధ మాట్లాడడం మొదలైనవి. ఆ ఉత్సాహం సహజమైనది, ఇతరుల ప్రోత్సాహం వలన కలిగినదీ అని రెండు విధాలు.
లోకోత్తరమైన వస్తువులను / సంఘటనలను అదే మొదటిసారిగా చూడడం వలన మనస్సుకి కలిగే వికాసం విసయమనబడుతుంది. దానిలో కలిగే క్రియలు - కళ్లు పెద్దవి చేయడం “బాగుంది” అనడం గగుర్పాటు చెందడం మొదలైనవి.
ఇతరులు తనవారిని చంపడం తనను అవమానించడం మొదలైన వాటివలన మనస్సు జ్వలించడం క్రోధం. అది క్రోధం, కోపం, రోషం అని మూడు విధాలు. దానికి కారణమైనవారిని తెగటార్చే వరకూ కొనసాగే క్రోధం క్రూరులైన పురుషులు ఆశ్రయంగా కలది. సాధారణంగా ఎదుటివారు క్షమను యాచించే వరకు మాత్రమే నిలిచి ఉండే కోపం వీరపురుషులను ఆశ్రయించి ఉంటుంది. ఆ కోధకోపాలు రెండింటికీ శత్రువులు, సేవకులు, మిత్రులు పూజ్యులు - ఈ నలుగురూ విషయ మవుతారు.
వాటిలో శత్రువిషయకమైన క్రోధంలో మాటిమాటికీ పెదవి కొరుక్కోవడం, కనుబొమలు ముడివేయడం, పళ్లు కొరకడం, చేతులు నలుపుకోవడం, శరీరం వణకడం, తరచుగా ఆయుధాలవైపు దృష్టిని సారించడం, తన భుజాలను తాను చూచుకోవడం, సింహనాదం చేయడం మొదలైన వికారాలు ఉంటాయి. భృత్యవిషయక క్రోధంలో చూపుడువేలు చూపి బెదిరించడం, తల విదిలించడం, రకరకాలుగా భయపెట్టడం, మాటిమాటికీ భయం కొలిపేలా చూడడం మొదలైన చేష్టలుంటాయి. మిక్రులపట్ల కలిగే క్రోధంలో కనుకొలకులనుండి అశ్రువులు రాలడం, మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండడం, నిశ్చలత్వం, పదే పదే నిట్టూర్చడం, మౌనం, తలవంచుకుని ఉండడం, కుటిలంగా చూడడం మొదలైన చేష్టలు ఉంటాయి. ఈ మిత్రక్రోధానికి తాను వ్రాసిన శ్లోకాన్నే ఉదాహరించాడు సింగభూపాలుడు. శ్లో; సుభద్రాయాః (శ్రుత్వా తదనుమతిమత్ తేన హరణం
కృతం కౌంతేయేన క్షుభితమనసః స్తబ్ధవపుషః |
నమద్వక్షాః స్వాంతే కిమపి విలిఖంతో౭_తికుటిలై
రపశ్యన్నుద్చా ప్పైర్యదుపతి మపాంగైర్యదుభటాః 1
తా॥ కుంతీసుతుడైన అర్జునుడు సుభద్రను ఎత్తుకుపోవడానికి కృష్ణుని అనుమతి ఉన్నది అని విన్న యాదవభటులు కొయ్యబారిపోయారు. క్షోభతో తలలు వంచుకుని మనస్సులో ఏదో ఆలోచిస్తూ కన్నీళ్లు ఉబుకుతున్న కళ్లతో కృష్ణుణ్ణి కుటిలంగా చూశారు.
రసార్దవ సుధాకర సుధ 4
పూజ్యులైన వారిపట్ల కలిగే క్రోధంలో తమను తాము నిందించుకోవడం, ముఖం వాల్చుకోవడం, సమాధానం చెప్పకపోవడం, ఒళ్లంతా చెమటలు పట్టడం, కంఠం బొంగురుపోవడం మొదలైన వికారాలు కలుగుతాయి.
శత్రువుపై కోపంలో భావగర్భితంగా మాట్లాడడం, కనుబొమలు ముడివేయడం, నుదురు చెమటపట్టడం, చూపులు (కళ్లు) ఎర్రబడదం మొదలైన వికారాలు కలుగుతాయి. భృత్య మిత్ర పూజ్యుల విషయంలో కలిగే కోపంలో వారి విషయంలోని కోధంలో కలిగే వికారాలే ఉంటాయి.
రోషం స్త్రీ పురుషుల మధ్యలోనే, అందునా హెచ్చుగా స్త్రీలకే కలుగుతుంది. అది ఎదుటివ్యక్తి ఒట్లూ శపథాలు చేసి తనపట్ల విశ్వాసాన్ని కలిగించుకునేటంతవరకే ఉంటుంది. దానిలో నిట్టూర్పులు, కుటిలమైన చూపులు, పెదవులు వణకడం, కనుకొలకులు ఎర్రబడడం, మొదలైన వికారాలు ఉంటాయి. స్రీలకు పురుషుల పట్ల కలిగే రోషం సపత్ని (సవతి) హేతువుగా గలది, ఇతర కారణాల వలన కలిగినదీ అని రెండు విధాలు. సపత్నీ హేతుకరోషం విప్రలంభశ్చంగార ప్రకరణంలో వివరించ బడుతుంది. ఇతర హేతువులవలన కలిగిన రోషంలో పురుషుల రోషంలో కలిగే వికారాలే ఉంటాయి.
బంధువులు మరణించడం, దారిద్ర్యం, ధనం నష్టంకావడం, మొదలైన వాటివలన కలిగిన బాధ శోకమనబడుతుంది. దానిలో కలిగే చేష్టలు వివర్ణత్వం నోరు ఎండిపోవడం, కొయ్యబారిపోవడం, నిట్టూర్పులు, మొదలైనవి. ఉత్తముల యొక్క శోకం ప్రాధశోకమన బడుతుంది. ఇతరుల యందుగాని, తమయందేగాని ఉన్న శోకరసం యొక్క విభావాలతో వారిశోకం పరాకాష్టకు చేరుకున్నప్పటికీ అది శౌర్యంతో ఉపశమిస్తుంది. ఆ ఉత్తమగత ప్రొఢశోకంలో మరణించిన వ్యక్తియొక్క గుణాలను వర్ణించడం లోలోపలే రోదించడం మొదలైన వికారాలు ఉంటాయి. మధ్యములకు తమయొక్కగాని, ఇతరులయొక్కగాని విభావాలతో కలిగేశోకం మరణంవరకు దారి తిసేదిగా ఉంటుంది. దాని వికారాలు పైకి ఎక్కువ వ్యక్తం కాకుండా రోదించడం మొదలైనవి. నీచపాత్రలు, స్త్రీ పాత్రలకు చెందిన శోకం తమయొక్క విభావాలతోనే కలుగుతుంది. అది మరణించడానికి ప్రయత్నించడం వరకు వెళుతుంది దానిలో కలిగే చేష్టలు నేలమీద పడిదొర్లడం, గుండెలు బాదుకోవడం, చీరుకోవడం, పడిపోవడం, బిగ్గరగా ఏడవడం మొదలైనవి.
అసహ్యంగా ఉన్న పదార్థాలను చూడడం లేదా వాటిని గూర్చి వినడం వలన
తం రసార్దవ సధాకర సుధ మనస్సు ముడుచుకు పోవడం - జుగుప్స. దానిలో కలిగే వికారాలు ముక్కు మూసుకోవడం, త్వరగా వెళ్లిపోవడం, నోటిని చేతితో అదుముకోవడం, ఒళ్లంతా జలదరించడం వెగటు పడడం, మాటిమాటికీ ఉమ్మివేయడం మొదలైనవి.
తొను చేసిన అపరాధం వలన, భయంకరమైన వస్తువులని చూడడం వాటిని గురించి వినడం మొదలైనవాటివలన మనస్సుకి కలిగే తీవ్రమైన తత్తరపాటు - భయం. సాధారణంగా అది నీచులు మధ్యములు అయిన వారికి మాత్రమే కలుగుతుంది. ఉత్తములకు లోకాతీతకారణాలవలన మాత్రమే భయం కలుగుతుంది. భయంలో కలిగే చేష్టలు పాలిపోవడం, కదలలేకపోవడం, శరీరం వణకడం, పారిపోవడం, వెనుదిరిగి చూస్తూఉండడం, దాక్కోవడం నోరు ఎండిపోవడం, బిగ్గరగా ఆక్రోశించడం, తనకు అభయమివ్వగల వ్యక్తికోసం వెదకడం మొదలైనవి. ఈ సందర్భంలో సింగభూపాలుడు సోడ్డలసూనుడు నిరూపణ చేసిన కృత్రిమభయం, విత్రాసితకం అనే రెండు భేదాలను గూర్చి చర్చించి అవి రెండూ అసలు భయం యొక్కభేదాలుగా అంగీకరించబడడానికే వీలు లేనివని నిరూపించాడు. అట్లాగే సరస్వతీ కంఠాభరణ కర్తయైన భోజుడు నిరూపించిన - గర్వం, స్నేహం, ధృతి, మతి అనే వ్యభిచారి భావాలు స్థాయిభావాలుగా కలిగిన ఉద్ధత, 'పేయః, శాంత, ఉదాత్తరసాలను గూర్చి కూడా విపులంగా చర్చించి ఆ నిరూపణను ఖండించాడు.
అందువలన భరతమునిచేత అంగీకరించబడిన స్థాయిభావాలు ఎనిమిదే. ఎనిమిది స్థాయిభావాలు, ముప్పైమూడు సంచారిభావాలు, ఎనిమిది సాత్త్వికభావాలు
- అన్నీ కలిపి నలఖైతొమ్మిది అవుతాయి. ఆస్థాయిభావాలు తమతమ విభావాలు అనుభావాలు సాత్త్విక వ్యభిచారిభావాలతో నటుల అభినయంకారణంగా ప్రత్యక్ష మైనట్లుగా తోచినవై స్వాదురూపత్వాన్ని పొందినవై, సామాజికుల మనస్సులలో రసత్వాన్ని పొందుతాయి. పెరుగు, చింతపండు, బెల్లం మొదలైన ద్రవ్యాలను సరియైన పాళ్లలో కలిపి ఉడికించడం వలన షాడవమనే మంచిరసం నిష్పన్నమైనట్లుగా విభావాదులయొక్క ప్రయోగంచేత రసం నిష్పన్నమవుతుంది. ఆ ఆనందభేదం సామాజికుల చేత అనుభవించబడుతుంది.
ఈ సందర్భంలో సింగభూపాలుడు రసం నాయకనిష్టంగాని, నటనిష్టంగాని కాదని, అది సామాజిక నిష్టమనీ నిష్కర్షచేసి భట్టనాయకుని యొక్క భుక్తివాదాన్నిి అభినవగుప్తాచార్యుని అభివ్యక్తివాదాన్నీ రెండింటినీ వివరించి అవి రెండూ రసం సామాజిక నిస్టమే నని అంగీకరించేవే గనుక రెండూ ఆమోదయోగ్యాలేనని తేల్చాడు.
రసార్దవ సుధాకర సుధ 4
ఆ రసం ఎనిమిది భేదాలను కలిగి ఉంది. అవి. 1) శృంగారం 2) హాస్యం 3) వీరం 4) అద్భుతం 5) రౌద్రం 6) కరుణం ?) భీభత్సం 8) భయానకం. వీటిలో బేసి సంఖ్య గల రసాలు - అంటే శృంగార, వీర, రౌద్ర, భీభత్సరసాలనుండి సరిసంఖ్యలు గల రసాలు హాస్య, అద్భుత, కరుణ, భయానకరసాలు క్రమంగా పుట్టాయి. వాటిలో మొదటగా శృంగారరసం వివరించబడుతోంది. కారణమేమిటంటే దాన్ని గురించి చెప్పడానికి చాలా ఉంది, అది అందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కూడా.
విభావాలు అనుభావాలు సాత్త్విక వ్యభిచారి భావాలచేత సదస్యులకు ఆస్వాదించ డానికి యోగ్యంగా చేయబడిన రతి అనే స్థాయిభావం శృంగార మనబడుతుంది. అది విప్రలంభ శృంగారమని, సంభోగ శృంగారమనీ రెండు విధాలు. ఒకరికొకరు దూరంగా ఉన్న ఇద్దరు యువతీయువకుల యొక్క పరస్పరానురాగం వారికి అభీష్టమైన ఆలింగనం మొదలైనవి లేకపోవడం వలన ్రకర్షను పొందితే అది విప్రలంభ శృంగారమనబడు తుంది. అది నాలుగు విధాలు 1) పూర్వానురాగం 2) మానం 3) ప్రవాసం 4) కరుణం.
నాయికానాయకులు ఒండొరులను గూర్చి వినడం చేతగాని, ప్రత్యక్షంగానో, చిత్రంలోనో, కలలోనో చూడడం చేతగాని (ప్రేమ ఉత్పన్నమయితే అది పూర్వానురాగ మనబడుతుంది. దీనిలో సంగమంకోసమై సంకల్పమే తప్ప సంగమం జరగదు గనుక ఇది విప్రలంభంగా పేర్కొనబడింది. దీనిలో నాయికా నాయకులు పరతంత్రులై ఉంటారు గనుక ఆ పారతంత్ర్యం దైవకృతం, మానవకృతం అని రెండు భేదాలు ఉంటాయి. దీనిలో కలిగే సంచారిభావాలు. గ్లాని, శంక, అసూయ, శమ, భయం, నిర్వేదం, బెత్సుక్యం దైన్యం, చింత, నిద్ర, ప్రబోధం, విషాదం, జడత్వం ఉన్మాదం, మోహం, మరణం.
ఈ విప్రలంభ భేదంలో మొట్టమొదటగా కలిగిన అభిలాష మొదలుకొని మరణం వరకు ఆయా సంచారిభావాల తీవ్రత వలన కలిగిన వివిధమైన దశలుంటాయి. కాని ప్రాచీనులు దీనిలో మొత్తం పది దశలుంటాయని వివరించారు. అవి 1) అభిలాష 2) చింత 3) అనుస్కృతి 4) గుణసంకీర్తనం 5) ఉద్వేగం 6) విలాపం 7) ఉన్మాదం 8) వ్యాధి 9) జదత్వం 10) మృతి.
నాయికానాయికులు పరస్పరం కలుసుకోవడానికై చేసే ప్రయత్నాల వలన సంభోగేచ్చ కలగడం అభిలాష అనబడుతుంది. దానిలోని వికారాలు ఎదుటివారి దృష్టిలో పడడానికై లోపలికీ బయటికీ తిరుగుతూ ఉండడం, అనురాగాన్ని తెలియజేసే
త్త రసార్దవ సుధాకర సుధ చేష్టలు, అలంకరించుకుంటూ ఉండడం అన్యాపదేశంగా మాట్లాడడం, వకాంతంలో ఉండడం మొదలైనవి.
“ఏ ఉపాయంతో ఆ అభిలాష సిద్ధిస్తుంది? దూతికద్వారా ఏమని కబురు పంపాలి.” మొదలైన ఆలోచనలు చింతనం అనబడతాయి. దీనిలోని వికారాలు పోకముడిని (చీరె ముడిని) స్పృశించడం, పడకమీద అటూ ఇటూ దొర్లడం, కన్నీళ్లతో వాలుగాను, శూన్యంలోకీ చూస్తూ ఉండడం మొదలైనవి.
ఆయా ప్రదేశాలలో ఆయా సమయాలలో తనచేత అనుభవిం బడిన విషయాలను నిరంతరం మనస్సులో భావిస్తూ ఉండడం అనుస్మృతి. దానిలో నిట్టూర్పులు, ఆలోచిస్తూఉండడం, చేయవలసిన పనులు చేయలేకపోవటం, పడకపై ఆసనంపై ద్వేషం కలగడం మొదలైనవి వికారాలు.
ప్రియునియొక్క గుణాలను పొగడడం గుణకీర్తన మనబడుతుంది దానిలో కలిగే చేష్టలు - రోమాంచం, గద్దదమైన మాటలు, ప్రేమ భావంతో బరువెక్కిన చూపులు, అతనితో సమాగమాన్ని గూర్చి చెలికత్తెతో ఆలోచించడం, చెక్కిళ్లు చెమరించడం మొదలైనవి.
మనస్సుకి కలిగే వణుకు ఉద్వేగమనబడుతుంది. దానిలో కలిగే వికారాలు చింత, సంతాపం, నిట్టూర్పులు, శయ్యపై ఆసనంపై ద్వేషం, స్తంభం, అశ్రువులు, వైవర్ణ్యం, దీనత్వం, మొదలైనవి.
“అతడు నాకు ఇక్కడ కనిపించాడు, ఇక్కడ నిలుచున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ మాట్లాడాడు - మొదలైన మాటలు - విలాపం. దానిలో కలిగేచేష్టలు ఎక్కడికో వెళ్లడం, ఎక్కడో చూడడం, అక్కడక్కడా ఆగుతూ ఉండడం, ఒకచోట అటుఇటూ తిరుగుతూ ఉండడం మొదలైనవి.
అన్ని అవస్థలలోను, అన్ని చోట్లా ప్రియుణ్ణే మనస్సులో ధ్యానిస్తూ, అతడు కాని దానిని కూడా అతడే అని భ్రాంతి పడడం విరహం వలన కలిగిన ఉన్మాదం. దానిలో క గే చేష్టలు - తనకు ఇష్టమైన వస్తువుపట్ల గూడా ద్వేషం, మాటిమాటికీ దీర్హంగా నిట్టూర్భడం, రెప్పవాల్బకుండా చూస్తూ ఉండిపోవడం, అకారణంగా నవ్వడం, ఆలోచించడం, పాటలు పాడడం, మౌనంగా ఉండిపోవడం మొదలైనవి.
కోరుకున్నవ్యక్తితో సంగమం కలగకపోవడంవలన కలిగే సంతాపమే వ్యాధి అనబడుతుంది. దానిలో సంతాపం, నిష్దూర్పులు, చల్లని వస్తువులను సేవించడం,
రసార్దవ సుధాకర సుధ జర్ జీవితాన్ని ఉపేక్షించడం, తెలివి తప్పిపోవడం, చనిపోవాలనే కోరిక, నిబ్బరాన్ని విడిచి పెట్టెయ్యడం ఎక్కడబడితే అక్కడ పడిపోవడం మొదలైనవి.
నాయిక ఇది తనకు ఇష్టమైనదని, ఇది అనిష్టమైనదనీ తెలుసుకోలేని స్థితిలో ఉంటుంది. ప్రశ్చిస్తే సమాధానం చెప్పదు, చూడదు, వినదు. స్పృహ లేకుండా కేవలం ఆలోచిస్తూ ఉంటుంది. ఆస్థితి జడత్వమని చెప్పబడుతుంది. దానిలో - స్పర్శ తెలియక పోవడం, పాలీపోవడం, శిధిలమైన అవయవాలు గలిగి ఉండడం, అవసరం లేకుండా ఊకొట్టడం, కొయ్యబారిపోవడం, నిట్టూర్పులు, చిక్కిపోవడం, మొదలైన వికారాలు కలుగుతాయి.
తానుచేసిన ఆయాప్రయత్నాలు ఫలించక పోవడంవలన ప్రియసమాగమం కలగకపోతే అప్పుడు నాయిక విరహాగ్నికే ఎరయై మరణించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ అవస్థలో కలిగే వికారాలు తాను పెంచుకుంటున్న చిలుకలు, చకోరపక్షులు మొదలైనవాటిని తనపై (ట్రేమగల స్నేహితురాళ్లకు అప్పగించడం, కోకిలకూతలను వినడం, మందమారుతాన్ని సేవించడం వెన్నెలలోకి వెళ్లడం మామిడిపూతను చూడడం మొదలైనవి.
ఈ దశలన్నింటికీ సింగభూపాలుడు తనపై కవులువ్రాసిన చాటుశ్లోకాలను ఉదాహరణాలుగా ఇచ్చాడు. అవి అన్నీ చక్కనివే అయినా అన్నింటినీ ఉట్టంకించడం సాధ్యం కాదు గనుక వాటికి కొలికి పూసవంటి ఆఖరు శ్లోకాన్ని ఉద్ధరించడం జరుగు తోంది. శ్లో; తన్వీ దర్శనసంజ్ఞయైవ లతికామాప్పచ్చ్య సంవర్ధితాం
న్యాసీకృత్య చ శారికాం పరిజనే స్పిగ్గే సమం వీణయా |
జ్యోత్సామావిశతీ విశారదసభఖీవర్గేణ కర్ణాంతికే
సిక్తేన వ్యనపోతసింహనృపతేర్నాన్నూ పునర్జీవితా ॥॥
తా॥ ఒకనాయిక తాను పెంచుతున్న లత వద్ద సెలవు తీసుకుని తన గోరింకను, వీణను తానంటే' ప్రేమగల సఖుల వద్ద ఉంచి మరణించాలనే కోరికతో వెన్నెలలోకి వెళ్లింది. తెలివైన ఆమె చెలులు అనపోత సింహభూపాలుని పేరును ఆమెచెవి వద్ద చెప్పి ఆమెను మళ్లీ బ్రతికించారు.
మాటిమాటికీ “మా” “న” (వద్దు, కాదు) అనే నిషేధార్ధకపదాలతో తనకు ఇష్టమైనప్పటికీ ఆలింగనం మొదలైన వాటిని నిషేధించడం మానమని చెప్పబడుతుంది. అది సహేతుకమని, అహేతుకమనీ రెండువిధాలు. వాటిలో హేతువువలన కలిగే
46 రసార్దన సుధాకర సుధ మానం ఈర్ష్యవలన కలుగుతుంది. ఈర అంటే తనప్రియుడు మరొకస్తీతో సంపర్మాన్ని కలిగి ఉంటే సహించలేకపోవడమే. అది నాయిక తనభర్తయొక్క అన్యాసక్తిని ప్రత్యక్షంగా చూడడంవలన, ఊహించడంవలన, వినడంవలనా కలుగుతుంది. ఈర్వ్యామానంలో నిర్వేదం, అవహిత్ట, గ్లాని, దీనత్వం, చింత, చపలత్వం, జడత్వం, మోహం మొదలైన వ్యభిచారిభావాలు కలుగుతాయి. అనుమితి (ఊహ) ప్రియుడు అన్యపస్టీతో సంగమంయొక్క గుర్తులను తనశరీరం మీద కలిగి ఉండడం చేత, పొరబాటున తనని ఆ అన్యస్తీయొక్క పేరుపెట్టి పిలవడం చేత, నిద్రలో ఆమెపేరు కలవరించడం చేత, మూడువిధాలుగా కలుగుతుంది. వినికిడి అంటే తనభర్తయొక్క అపరాధాన్ని గురించి చెలికత్తెల ద్వారా వినడం. నాయికానాయకులిద్దరికీ కారణంవలన కాకుండా కారణాభాసం వలన (కారణం లాగా కనిపించేదానివలన) కలిగిన మానం నిర్దేతుక మానమని చెప్పబడు తుంది. దానిలో అవహిత్సమొదలైన వ్యభిచారిభావాలు కలుగుతాయి. ఆ నిర్దేతుకమానం ఎదుటివారు తనంతట తానుగా కాగలించుకోవడం, చిరునవ్వునవ్వడం మొదలైన వాటితో దానంతట అదే తగ్గిపోతుంది. హేతుజమానం దానికి తగినట్లుగా కల్పించబడిన సామదానభేదోపాయాలు, నమస్కరించడం ఉపేక్తించడం, ఇతర రసాలను ప్రయోగించడం మొదలైన వాటితో ఉపశమిస్తుంది. వాటిలో ప్రియంగా మాట్లాడడం సామోపాయమని చెప్ప బడుతుంది. చెలికత్తెలు మొదలైనవారిచేత మందలింపజేయడం భేదమని చెప్పబడు తుంది. ఏదో ఒక మిషతో ఆభరణాలు మొదలైన వాటిని ఇవ్వడం దానం. పాదాలకు నమస్మరించడం నతి అనబడుతుంది. మాట్లాడకుండా ఉండడం ఉపేక్ష హఠాత్తుగా భయపెట్టడం మొదలైనవి రసాంతర ప్రయోగమనబడతాయి. అది యాదృచ్చికం, బుద్ధిపూర్వకమని రెండువిధాలు. విధి అనుకూలించడంవలన అదే సమయానికి ఏ ఉరుముల వల్లనో నాయికకు భయంకలగడం సంభవిస్తే అది యాదృచ్చికం. తెలివి తేటలుగల పురుషునిచేత స్వయంగా కల్పించబడినది బుద్ధిపూర్వకం. అంతకుముందు కలిసిఉన్న నాయికానాయకులకు దేశాంతరం వెళ్లడం మొదలైన కారణాలవలన వియోగం కలగడం ప్రవాసమని చెప్పబడుతుంది. దానివలన కలిగిన విప్రలంభంకూడా ప్రవాసవిప్రలంభమనే చెప్పబడుతుంది. హర్షం, గర్వం, మదం, వీడ - ఈ నాలుగింటినీ విడిచిపెట్టి శృంగారానికి యోగ్యమైన వ్యభిచారి భావాలన్నీ ప్రవాస విప్రలంభానికి కూడా వ్యభిచారి భావాలవుతాయి. అది - కార్యవశాన కలిగినది,
రసార్దవ సుధాకర సుధ తా సంభ్రమం వలన కలిగినది, శాపంవలన కలిగినదీ అని మూడు విధాలు. పరిస్థితుల కారణంగా కలిగే బుద్ధిపూర్వకమైన కార్యజవిప్రలంభం జరిగినది, జరుగుతున్నది, జరగ బోయేది అని మూడువిధాలు. సంభ్రమమంటే ఆవేగం. అదికూడా దివ్యం మొదలైన చాలా భేదాలను కలిగి ఉంటుంది. ప్రవాసవిప్రలంభాన్ని కలిగించే శాపం కూడా వైరూప్యాన్ని (రూపం మారిపోవడాన్ని) కలిగించి ప్రవర్తించేది, రూపం అట్లాగే ఉండగా ప్రవర్తించేదీ అని రెండువిధాలు.
నాయికానాయకులలో ఒకరికి మరణం సంభవించి మళ్లీ తిరిగి జీవించడానికి అవకాశం ఉన్నప్పుడు అది జరిగేటంతవరకూ ఉండే విరహం కరుణ విప్రలంభ మనబడుతుంది. దీనిలో తిరిగి సమాగమాన్ని పొందడానికి ఆశ అనుగతంగా ఉండనే ఉంటుంది. కరుణమేమోనన్న భ్రమకలిగించడంవలన ఇది కరుణ విప్రలంభ మన బడుతుంది. ప్రవాసవిప్రలంభం యొక్క సంచారిభావాలు, అనుభావాలే దీనికీ వర్తిస్తాయి.
ఏ శృంగారంలో నాయికా నాయకులయొక్క పరస్పర అనుకూలత్వం వలన స్పర్శనం ఆలింగనం మొదలైన వాటితో ఆనందాన్ని పొందడం అనేది సంభవిస్తుందో అది సంభోగ శృంగారమనబడుతుంది. అది నాలుగు విధాలు. 1) సంక్షిప్తం 2) సంకీర్ణం 8) సంపన్న తరం 4) సమృద్ధిమాన్ అని. ఇవి నాలుగూ క్రమంగా 1) పూర్వానురాగ 2) మాన 8) ప్రవాస 4) కరుణ విప్రలంభాలతరువాత సంభవిస్తాయి. వాటిలో ఏ శృంగారంలో యువతీయువకులు బేదురు, సిగ్గు మొదలైన వాటి కారణంగా సంక్షిప్తమైన శృంగారచేష్టలను వెలయిస్తారో అది సంక్షిప్తసంభోగం. ఇది పూర్వానురాగ విప్రలంభం తరువాత కలిగే సంభోగం.
రెండవ వ్యక్తిచేత చేయబడిన అపరాధాల స్మృతులతో కలగా పులగంగా ఉండి కొద్ది కొద్దిగా ప్రసరిస్తున్న మన్మథబాణాలతో అలతిగా ఉండే సంభోగం సంకీర్ణ సంభోగం. ఇది మాన విప్రలంభం తరువాత కలుగుతుంది.
ప్రవాసంనుండి తిరిగివచ్చిన నాయకుడు నాయికలయొక్క సంభోగం - ముందరి రెండు సంభోగాలలోని భయంగాని, వ్యలీక (అపరాధ) స్మరణంగానీ లేకపోవడం వలన వైభవాన్ని పొందినదై సంపన్న సంభోగమని చెప్పబడుతుంది. ఇది ప్రవాస విప్రలంభం తరువాత కలుగుతుంది.
మరణించిన వ్యక్తి మళ్లీ బ్రతికివస్తే ఆ సంభోగంయొక్క సమృద్ది ఎంతటిదిగా ఉంటుందో పార్వతీపరమేశ్వరులకే ఎరుకగనుక ఆ సంభోగాన్ని సమృద్ధిమత్సంభోగమని చెప్పడం జరిగింది. ఇది కరుణవిప్రలంభం తరువాత సంభవించేది.
షి రసార్ట్దవ సుధాకర సుధ తనకు ఉచితమైన విభావ అనుభావ సాత్త్విక వ్యభిచారి భావాలచేత హాసమనే స్థాయిభావం సదస్యులకు ఆస్వాద యోగ్యంగా చేయబడితే అది హాస్యరసమవుతుంది. దానిలో ఆలస్యం, గ్లాని, నిద్ర, వ్యాధి మొదలైనవి వ్యభిచారి భావాలు. అది తనకు సంబంధించినది ఇతరులకు సంబంధించినది అని రెండు విధాలు. ఆత్మస్థహాస్యరస మంటే తనలోని వికారాలను చూచి తానే నవ్వుకోవడం. పరస్టహాస్యమంటే ఇతరుల యందు ఉన్న వికారాల వలన వాళ్లనుచూచి నవ్వడం. పాత్రలయొక్క స్వభావాలనుబట్టి ఆ హాసం ఆరు విధాలుగా ఉంటుంది. వాటిలో క్రమంగా ఉత్తమమధ్యమ అధమ పాత్రలకు రెండేసి భేదాలు గల వాసాలను వర్ణించవచ్చు. మొదటిదైన స్మితంలో పలువరుస కనిపించకుండా చూపులోను, చెక్కిళ్లలోనూ చిరునవ్వుయొక్క వికాసం కనిపిస్తుంది. ఆ స్మితమే కొద్దిగా కనిపిస్తున్న పలువరుస కలిగినదైతే హసితమనబడుతుంది. ఈ స్మితహసితాలు రెండూ ఉత్తమపాత్రల విషయంలో వర్ణించబడతాయి. ఆ హసితమే కుంచించబడిన కనుకొసలు, చెక్కిళ్లూకలిగి మధురమైన శబ్దంతో కాలోచితంగాను అనురాగసహితంగానూ నవ్వబడితే అది విహసితమవుతుంది. విప్పారిన ముక్కుపుటాలు కుంచించబడిన భుజాలు, శిరస్సు వంకరగా చూస్తున్నకళ్లూ కలిగిన నవ్వు అవహసితమనబడుతుంది. ఈ విహసిత అవహసితాలు రెండూ మధ్యమ పాత్రల విషయంలో వర్ణించబడతాయి. ఊగిపోతున్న శరీరంతో, కన్నీళ్లు కమ్మిన కళ్లతో కూడిన నవ్వు అపహసిత మనబడుతుంది. చేతులతో పక్కలు (డొక్కలు) పట్టుకుని బిగ్గరగా దీర్హంగా శబ్దంచేస్తూ కళ్లవెంట నీళ్లు కారుతుండగా నవ్వేనవ్వు అతిహసితం. అపహసిత అతిహసితాలు రెండూ అధమపాత్రల విషయంలో వర్ణించబడతాయి. తనకు ఉచితమైన విభావాలు అనుభావాలు వ్యభిచారిభావాలచేత సామాజికులకు ఆస్వాద యోగ్యత్వాన్ని పొందించబడిన ఉత్సాహమనే స్థాయిభావమే వీరరసమన బడుతుంది. ఆ వీరరసం దానవీరం, యుద్ధవీరం, దయావీరం, అని మూడువిధాలు. వాటిలో దానవీరంలో ధృతి, హర్షం, మతి, మొదలైన వ్యభిచారి భావాలుంటాయి. ముందు చిరునవ్వు నవ్వి ఆతరువాత మాట్లాడడం, చిరునవ్వే ముందుగల చూపు, ప్రసన్నత్వం కలిగితే ఇతరులు ప్రశంసించేటట్లుగా ఉదారంగా దానంచేయడం, అట్లా దానం చేసేటప్పుడు ఎదుటివారి సుగుణాలను గాని, అవగుణాలను గానీ విచారించక పోవడం మొదలైనవి దాని అనుభావాలుగా చెప్పబడ్డాయి. యుద్ధవీరంలో హర్షం గర్వం అమర్నం మొదలైనవి వ్యభిచారి భావాలు. తనకు
రసార్దవ సుధాకర సుధ త్రి తోడుగా ఎవరూ లేకపోయినా యుద్ధం చేసే కోరిక, యుద్ధరంగంనుండి పలాయనం చెయ్యకపోవడం, భయపడినవారికి అభయమివ్వడం, దానిలో కలిగే చేష్టలు. దయా వీరంలో ధృతి, మతి మొదలైన వ్యభిచారిభావాలు ఉంటాయి. తమయొక్క ప్రయోజనాన్ని/ ధనాన్ని ప్రాణాలనూ త్యాగంచేసి అయినా ఆపదలో ఉన్నవారిని రక్షించేస్వభావం, ఓదార్పుగా మాట్లాడడం, స్థిరంగా (చలించకుండా) ఉండడం మొదలైనవి దానిలో ఉండే చేష్టలు.
తనకు ఉచితమైన విభావాలు అనుభావాలు వ్యభిచారిభావాలచేత సామాజికులకు ఆస్వాదించడానికి యోగ్యంగా చేయబడిన విస్మయమనే స్థాయిభావం అద్భుతమనే రస మవుతుంది. దానిలో ధృతి, ఆవేగం జడత్వం హర్షం మొదలైన వ్యభిచారిభావాలు ఉంటాయి. దానిలో కలిగే చేష్టలు - కళ్లు పెద్దవికావడం, చెమటలు పట్టడం, అశ్రువులు కారడం, గగుర్పాటు మొదలైనవి.
తనకు ఉచితమైన విభావానుభావవ్యభిచారిభావాలచేత సదస్యులకు ఆస్వాద యోగ్యంగా చేయబడిన క్రోధమనే స్థాయిభావం రౌద్రరసమవుతుంది. ఆవేగం, గర్వం, ఉగ్రత, అమర్నం మోహం మొదలైనవి వ్యభిచారిభావాలు. చెమటలు కారడం, కనుబొమలు ముడిపడడం, కళ్లు ఎర్రబారడం మొదలైనవి దానిలోని వికారాలు.
తనకు ఉచితమైన విభావాలు, అనుభావాలు వ్యభిచారిభావాలచేత సామాజికులకు ఆస్వాదించడానికి అనుకూలంగా చేయబడిన శోకమనే స్థాయిభావం కరుణరసమవు తుంది. దీనిలో ఎనిమిది సాత్తికభావాలూ, జాడ్యం, నిర్వేదం, గ్లాని, దీనత్వం, ఆలస్యం, అపన్నారం, వ్యాధి, మోహం మొదలైన వ్యభిచారి భావాలూ కలుగుతాయి.
తనకు ఉచితమైన విభావాలు, అనుభావాలు వ్యభిచారిభావాలచేత పోషింపబడిన జుగుప్స అనే స్థాయి భావం భీభత్సరసమవుతుంది. దీనిలో గ్లాని, శమం ఉన్మాదం మోహం అపస్మారం, దీనత్వం విషాదం, చపలత్వం, ఆవేగం, జాద్యం మొదలైన వ్యభిచారిభావాలు కలుగుతాయి. స్వేదం, శరీరం గగుర్పొాడవడం, ముక్కుమూసుకోవడం మొదలైన వికారాలు ఉంటాయి.
తనకు ఉచితమైన విభావాలు, అనుభావాలు, వ్యభిచారిభావాలచేత సదస్యులకు ఆస్వాదించడానికి వీలుగా చేయబడిన భయమనే నస్థాయిభావం భయానక రసమవుతుంది. దానిలో సంత్రాసం, మరణం, చాపలం, ఆవేగం, దీనత్వం విషాదం, మోహం, అపస్మారం, శంకమొదలైన వ్యభిచారి భావాలు, నోరు ఎండిపోవడం మొదలైన వికారాలు, అశ్రువులు తప్ప మిగిలిన సాత్త్విక భావాలూ ఉంటాయి.
50 రసార్దవ సుధాకర సుధ
కొందరు సమానబలం కలిగిన రసాలకు సంకరం కలుగుతుందని అభిప్రాయ పడ్డారు. కాని అది సరికాదు. సమానబలం కలిగిన ఆ రసాలు ఆస్వాదించబడేటప్పుడు ఏది మొదట ఆస్వాదించబడుతుందో తేల్చడం కష్టం. ఒకదానితో ఒకటి స్పర్ధతో ఉన్న ఆ రసాలు రెండూ ఆస్వాదించడానికి యోగ్యమైనవి కాకుందాపోతాయి. ఏకకాలంలో రెండు రసాలు ఆస్వాదించబడడం సాధ్యంకాదు గనుక రెండురసాలు ఏకకాలంలో ఉండే టట్లయితే వాటికి అంగాంగి భావం యుక్తమయినది. భావాలు, రసాలు, వృత్తులు, ప్రవృత్తులు అన్నీ కలిస్తే ఏ రసం ప్రధానమయినదిగా రూపుదిద్దు కుంటుందో అదే న్థాయిరసం. మిగిలినవన్నీ సంచారులుగానే భావించబడాలి. ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి అంగమైన రసం పరిపుష్టిని పొందినా అది అంగిరసంతో సమానం కాజాలదు. ఎందుకంటే కవియొక్క తత్పరత్వం అంగియైన (ప్రధానమైన) రసం ఒక్కదాని విషయంలోనే ఉంటుంది గనుక.
ఇప్పుడు పరస్పర విరుద్ధమైన రసాలు వివరించబడుతున్నాయి. శృంగార భీభత్స రసాలు, వీరభయానకరసాలు, రౌద్ర అద్భుతరసాలు, హాస్యకరుణరసాలూ స్వభావతః ఒకదాని కొకటి విరుద్ధమైనవి. సహజంగానే విరుద్ధమైన ఈరసాలు కలిసిఉండడం అంగాంగి భావంతోనైనా సరే - అది గంధం గంధకం యొక్క కలయికలాగా సహృదయులకు రుచించదు. విరోధిరసంయొక్క సన్నిధిలోకూడా మరుగు పడకుండా ఉండడమే అంగిరసం 'బాగాపోషింపబడడానికి నిదర్శనం అనడం కూడా సరికాదు. ఆ విరోధిరసానికి అంగత్వం కూడా కలగాలిగదా. అది కలగదు. ఎందుకంటే - అది అంగి రసానికి వఏదోకొంచెమైనా ఉపకరిస్తేనే అది అంగరసంగా అంగీకరింప బడుతుంది. కేవలం అది అంగిరసంతో కలిసి ఉన్నంతమాత్రాన . చాలదు. అది రసచర్వణకు ఏమాత్రం ఉపకరించదు. కేవలం కలిసి ఉండడమే ఉపకారమంటే పానకంలో కలిసిన బెల్లంతోపాటు దానిలోపడిన గడ్దిపరకలకు గూడా పానకం రుచిలో భాగస్వామ్యం కలుగుతుంది.
ఒక స్థాయిరసం అంగిగా పోషింపబడుతున్నప్పుడు దానికి అంగాలుగా రెండు పరస్పరవిరుద్ధరసాలు వర్ణించబడవచ్చు. ఇద్దరు 'సేవకులు పరస్పరం శత్రువులై ఉండి కూడా ఒక యజమానిని విశ్వాసంతో సేవించినట్లు అవి ఆ రసానికి పుష్టినే కలగజేస్తాయి.
అంగ (అప్రథాన) రసం మితిమీరి పోషించబడితే అది - రాజాదేశాన్ని లెక్క చేయని మంత్రి రాజును పేరుకు మాత్రమే రాజుగా మిగిల్చినట్లుగా అంగిరసాన్ని
రసార్జవ సుధాకర సుధ ర్] రసాభాస చేస్తుంది. మోతాదుకు మించిన హాస్యరసంతో కూడిన శృంగారరసం శృంగారాభాసమవుతుంది. అధికమైన భీభత్సరసాన్ని కలిగిన హాస్యం హాస్యరసాభాసమ వుతుంది. భయానకరసం ఎక్కువగా గల వీరం వీరరసాభాసమవుతుంది. కరుణరసం అతిగా కలవడంవలన అద్భుతం అద్భుతరసాభాసమవుతుంది. రౌద్రరసంలో శోకం, భయం, ఎక్కువగా కలవడం వలన అది రౌద్రరసాభాసమవుతుంది. హాస్యంపాలు అతిగాగల కరుణ రసం కరుణరసాభాసమవుతుంది. అద్భుత శృంగారరసాలు కలిసిన భీభత్సరసం భీభత్సాభాస మవుతుంది. రౌద్రవీరరసాలు కలిస్తే భయానకం భయానక రసాభాసమవుతుంది. ఈ ఎనిమిది రసాలలో శృంగారానికి ఇవికాక మరినాలుగు రసాభాసాలు ఉన్నాయి. అవి 1) అరాగం (నాయికానాయకులలో ఒకరికి మాత్రమే అనురాగం ఉండి రెండవవారికి అనురాగం లేకపోవడం) 2) అనేక రాగం (ప్రీకి అనేకమంది పురుషులయందు, పురుషునికి అనేక మంది స్రీలయందూ అనురాగం ఉండడం) 3) మ్లేచ్చరాగం (నాగరకతలేని మోటు మనుష్యులకు చెందిన శృంగారం) 4) తిర్యగ్రాగం (పశుపక్ష్యాది ప్రాణులకు చెందిన శృంగారం).
వీటిలో మొదట అరాగం విషయంలో నాయికా నాయకులలో ఒకరికి మొదట ప్రేమ కలిగి రెండవవారికి కొంతకాలం తరువాత(్రేమ కలిగే సందర్భాలలో ఆ పూర్వాను రాగం రసాభాసమయిపోతుంది గదా అని ఒక ఆశంక కలిగింది. దానికి సింగభూపాలుడు ఇట్లా సమాధానం చెప్పాడు. నాయకునికి నాయికపట్ల (ప్రేమ ఉండి నాయిక ఇంకా అతనిని చూడకపోవడంవలన ఆమెకు అతనియందు (ప్రేమ కలగకపోతే అది ఆమె (ప్రేమయొక్క ప్రాగభావం. (ఒక వస్తువు పుట్టకముందు ఉన్న అభావం) ఆసందర్భంలో ఆమెకు నాయకుణ్ణి చూడగానే ప్రేమ కలిగే అవకాశం ఉంది గనుక అది రసాభాసం కాదు. కాని స్త్రీ పురుషులకు ఒకరిపట్ల మరొకరికి అసలే ప్రేమలేకపోయినా, అంతకు ముందు ఉన్నపేమ నశించిపోయినా అది రసాభాసమే.
అనేకరాగం విషయంలో మరొక ఆశంక. అదేమిటంటే నాయకునికి అనేక నాయికల పట్ల (ప్రేమ ఉండడం రసాభాసమయితే దక్షిణనాయకుని విషయంలో ఎప్పుడూ రసాభాసమే అవుతుంది గదా అని. దానికి సింగభూపాలుని ప్రత్యుత్తరం ఇది. దక్షిణ నాయకుడు అనేక నాయికలపట్ల సమానమైన ప్రవర్తనను కలిగి ఉంటాడు. కాని అతనికి గాధమైన అనురక్తి ఒకనాయికయందే ఉంటుంది. ఇతర నాయికలయందు మధ్యమం, లేదా మందం అయిన అనురాగం ఉంటుంది గనుక అక్కడ రసాభాసత్వం
52 రసార్దవ సుధొకర సుధ తిర్యగ్రాగం రసాభాసం కాదని వాదించిన వకావలీకారుడైన విద్యాధరుని మతాన్ని ఉట్టంకించి, అతని వాదం భరతముని మతానికి విరుద్ధమని నిష్కర్షచేసి దానితో ద్వితీయోల్లాసాన్ని ముగించాడు సింగభూపాలుడు. సింగభూపాల విరచితమైన రసార్దవసుధాకరంలో రసికోల్లాసమనే రెండవ విలాసం సమాప్తం. తృతీయ విలాసం
రాచకొండపై వెలసిన శ్రీరామ వేణుగోపాలస్వరూపుడైన శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ మూడవ విలాసాొన్ని ప్రారంభించాడు సింగభూపాలుడు.
ఇప్పటిదాకా వివరించబడిన రసాలకు ఆధారభూతమైన ప్రక్రియ నాట్యమని, రూపకమనీ పిలవబడుతుంది. అతి ప్రవీణుదైన నటునిచేత చేయబదేపని గనుక అది నాట్యమయింది. ముఖంపై పద్మత్వాన్ని ఆరోపించడం జరిగితే ఆ అలంకారాన్ని రూపకాలంకారమంటారు. అట్లాగే నటుని యందు ఆయా నాయకులు ఆరోపించ బడతారు గనుక ఈ ప్రక్రియ కూడా రూపకమని చెప్పబడుతుంది. వాక్యం యొక్క అర్ధాన్ని అభినయం ద్వారా వ్యంజింపజేయడమనే రూపంగల ఈ రూపకం పదివిధాలు.
భరతమునికృతమైన నాట్యశాస్త్రంలో ఇట్లా చెప్పబడింది. 1) నాటకం, 2) ప్రకరణం, 3) అంకం, 4) వ్యాయోగం, 5) భాణం, 6) సమవకారం, 7) వీథి, 8) ప్రహసనం, 9) డిమం, 10) ఈహామృగం అని నాటకం పదివిధాలు.
రూపకాలలోని రసం, ఇతివృత్తం నాయకుడు ఈ మూడూ వాటిలో భేదాలకు కారణం. నాయకుడు, రసం - రెండింటియొక్క లక్షణం ఇప్పటికే చెప్పబడింది ఇక. కథ, వస్తువు మొదలైన పేర్లు గల ఇతివృత్తం రూపకానికి శరీరం వంటిది. అది ప్రఖ్యాతం, కల్ప్యం, సంకీర్ణం అని మూడువిధాలు. ప్రఖ్యాతమంటే రామకథ వంటిది. కల్ప్యమంటే - మాలతీ మాధవం వంటి కవికల్పితమైన ఇతివృత్తాలు. సంకీర్ణమంటే
- ప్రఖ్యాత ఇతివృత్తంలోనే కవికల్పనలుకూడా కలవడం, రామాయణగాథలో కొత్తకల్పనలతో కూడిన ఎన్నో రూపకాలు దీనికి ఉదాహరణం. ఈ ఇతివృత్తం దివ్యం, మర్త్యం, అనే భేదాలతో వివిధమైన లక్ష్యాలను కలిగి ఉంటుంది.
ఆ ఇతివృత్తంలో 1) బీజం, 2) బిందువు, 8) పతాక, 4) ప్రకరి, 5) కార్యం అని అయిదు విభాగాలు ఉంటాయి. స్వల్పంగా ప్రారంభమై గొప్ప విస్త బతినిపొందే (ఒకకార్యంయొక్క కారణం బీజమని చెప్పబడుతుంది. ఒకబీజాన్ని నాటితే అది మొలకదశ నుండి వివిధ దశలగుండా ఎదిగి ఫలాలను ఇచ్చినట్లే ఈ రూపక బీజం
రసార్దవ సుధాకర సుధ రొ క్రమంగా పరిణతినిపొంది చిట్టచివరి ఫలానికి (0॥గ౭౫ చేరుతుంది. అందువలన దానికి బీజం అని పేరు. బీజం యొక్క ప్రధానమైనఫలం ప్రసంగవశాన వచ్చిన ఇతర ఫలాలచేత విచ్చిన్నం కాకుండా నిలిపేది బిందువు. ఏదైతే ప్రధానేతివృత్తానికి ఉపకరిస్తూ తద్ద్వారా తన ప్రయోజనాన్ని పొందుతుందో ఆ వృత్తాంతాన్ని పతాక అని' పిలుస్తారు. అది రామాయణంలో సుగ్రీవ వృత్తాంతం, మాలతీమాధవంలో మకరందుని వృత్తాంతం మొదలైనవి. ఏ వృత్తాంతమైతే తన ప్రయోజనం అంటూ ఏదీ లేకుండా కేవలం ప్రధానేతివృత్తానికే ఉపకరిస్తూ కొద్దిచోటుకి మాత్రమే పరిమితమై ఉంటుందో అది ప్రకరి. అది రామాయణంలో హనుమద్వత్తాంతం, మాలతీ మాధవంలో సౌదామనీవృత్తాంతం వంటిది.
'ప్రధానవృత్తంలో గాని అంగవృత్తంలోగాని రాబోయే దశలను - తాను వాటికి సహకారి కారణమవుతూ సూచించేది పతాకాస్థానకం. అది తుల్య సంవిధానమని తుల్య విశేషణమని, రెండు విధాలు. వాటిలో తుల్య సంవిధానం మూడు విధాలు. రెండవది ఒకటే విధం. కనుక మొత్తంగా పతాకాస్థానకం నాలుగువిధాలు.
మొత్తం నాటకవస్తువు యొక్క ధర్మ, అర్ధ, కామ రూపమైన ఫలం ఏదైతే ఉందో అది కార్యమని చెప్పబడుతుంది. అది శుద్ధంగాని, మిశంగాని కావచ్చు. అంటే నాటకం యొక్క ఉపసంహారంలో ఏ ఫలాన్ని సాధించడంకోసం కథాసంవిధానమంతా సాగిందో దానిని కేవలం ధర్మంగానో, అర్ధంగానో, కామంగానో నిరూపించడం జరిగితే అది శుద్ధం. ఏవైనా రెండు పురుషార్థాలు గానో లేదా మూడూగానో నిరూపించడం జరిగితే అది మిశ్రం.
వస్తువు ప్రధానమని, అంగమనీ రెండు విధాలు. వాటిలో ప్రధానుడైన నాయకుని యొక్క పనులను విస్తరించేది, ప్రధానమైన ఫలంతో సంబంధం కలిగినది, కావ్యం పొడుగునా వ్యాపించి ఉండేదీ ప్రధానేతివృత్తం. ఆ నాయకుని ప్రయోజనాలను సాధించి పెట్టే ఇతరపాత్రలయొక్కనడవడి అంగవృత్తం. పతాక, ప్రకరి రెండూ నాటకంలో అంగాలే అయివుంటాయి. ఇక బీజం కథకు బీజం వంటిది కనుక అది కథ ప్రారంభంలోను, కార్యం ఫలంగనుక అది చివరలోనూ ఉండాలి ఆ రెంటినీ కలిపేది
గనుక బిందువును మధ్యలో ఉంచాలి. పతాకా ్రకరులను అవసరాన్ని బట్టి ప్రయోగించాలి.
నాయకుడు మొదలైన పాత్రలయొక్క పనులవలన కావ్యానికి అయిదు అవస్థలు కలుగుతాయి. అవి - 1) ఆరంభం, 2) యత్నం, 3) ప్రాష్యాశ, ఉ నియతాప్తి,
54 రసార్దవ సుధాకర సుధ 5) ఫలాగమమూను. ముఖ్యమైన ఫలంకోసమై ప్రయత్నం ప్రారంభించడమే ఆరంభం. యత్నమంటే ఆ ఫలప్రాప్తి కోసమై ఉత్సుకతతో ఉండడం. ఒకగొప్ప ప్రయోజనం సిద్ధించనున్నది అనే భావన ప్రాప్యాశ. ఏవిఘ్నమూలేకుండా ప్రయోజనం సిద్ధిస్తుంది అనే నిశ్చయం నియతాప్తి. నాయకునికి అభీష్టమైన ఫలం సంపూర్తిగా లభించడం . ఫలాగమం.
ఈ అయిదు అవస్థలకు బీజం, బిందువు, మొదలైన అర్ధప్రకృతులలో ఒక్కొక్క దానితో కలయిక సంధి అని చెప్పబడుతుంది. పతాక గనుక లేకపోతే అక్కడ బీజాన్నిగాని, బిందువును గాని కల్పించాలి. ముఖ్యప్రయోజనంకోసమై పరస్పరం కూడిఉన్న కథాంగాలను సమన్వయం చేస్తూ వాటిలో మధ్యలో వచ్చే ప్రయోజనాలకు సంబంధం కల్పించడమే - సంధానం చేయడం అనే వ్యుత్పత్తితో సంధి అనబడుతుంది.
ఆ సంధులు అయిదు. అవి 1) ముఖం 2) ప్రతిముఖం 3) గర్భం శ) విమర్శం 5) ఉపసంహృతి.
వాటిలో మొదటిదైన ముఖసంధినుండే కథావస్తువుయొక్క బీజం ఉద్భవిస్తుంది, అదే నానావిధాలైన సంఘటనలకు/ప్రయోజనాలకు, వివిధ రసాలకూ కారణమైనది. బీజమనే ప్రకృతి, ఆరంభమనే అవస్థ - ఈరెండింటికీ అనుకూలంగా దానిలో పన్నెండు అంగాలు ఉంటాయి. అవి 1) ఉపక్షేపం 2) పరికరం 3) పరిన్యాసం 4) విలోభనం 5) యుక్తి 6) ప్రాప్తి 7) సమాధానం 8) విధానం 9) పరిభావన 10) ఉద్భేదం 11) భేదం 12) కరణం.
బీజంయొక్క సూచన. ఉపక్షేపం సూచించబడిన బీజాన్ని పుష్టిని పొందించడం పరికరం (పరిక్రియ). ఆ బీజం నిష్పన్నంకావడాన్ని వర్ణించడం పరిన్యాసం. నాయకుడు మొదలైన వారియొక్క గుణాలని వర్ణించడం విలోభనం. సాధించబడనున్న ప్రయోజ నాలను చెప్పడం యుక్తి, ఎవరికో ఒకరికి ప్రయోజనానికి అనుకూలమైన సుఖం కలగడం ప్రాప్తి. మొదట సూచించబడి పరిపుష్టం చేయబడిన ప్రయోజనాన్ని మరొకసారి ప్రతిపాదించడం సమాధానం. సుఖమూ దుఃఖమూ ఒక్కసారే కలగడం విధానం. పప్రశంసనీయమైన గుణాలు మొదలైన వాటితో మనస్సుకు చమత్కృతి కలగడం పరిభావన. నిగూఢంగా ఉన్న బీజాన్ని ప్రకటితంచేయడం ఉద్భేదం. బీజం ఉత్తేజున్ని పొందించబడడం, లేదా కలిసిఉన్న వారు విడదీయబడడం భేదం, రూపకం యొక్క కథను అనుసరించి ప్రస్తుతమైన కార్యం ఆరంభించబడడం కరణం.
దేనిలో బీజం కనిపించీ కనిపించనట్లుగా ప్రకటితమవుతుందో అది ప్రతిముఖ
రసాొర్జప సుధాకర సుధ 55 సంధి. దీనిలోని బిందువు అనే అర్ధప్రకృతి, ప్రయత్నమనే అవస్థ - ఈ రెండింటికీ అనుగుణంగా దీనిలో పదమూడు అంగాలు ఉంటాయి. అవి 1) విలాసం 2) పరిసర్పం 3) విధూతం 4) శమం 5) నర్మం 6) నర్శద్యుతి 7) ప్రగమనం 8) నిరోధం 9) పర్యుపాసనం 10) పుష్పం 11) వజ్రం 12) ఉపన్యాసం 18) వర్ణసంగ్రహణం. నాయిక, నాయకుడు రెండవవారితో సంగమంకోసమై చేసే వ్యాపారం విలాసం. మొదట కనిపించిన బీజం ఆ అంకం సమాప్తం కావడం మొదలైన కారణాల వలన మరుగునపడిపోతే దానిని మళ్లీ జ్ఞప్తికి తీసుకురావడం పరిసర్బం. నాయకుడు మొదలైన పాత్రలకు తాముకోరినది లభించకపోవడంవలన కలిగే అరతి (దేనిమీదా ఇష్టంలేక పోవడం) విధూతం. లేదా ఎంతో అనునయించినా తిరస్మరించడంకూడా విధూతమని చెప్పబడుతుంది. మొదట కలిగిన అరతి ఉపశమించడం శమం. పరిహాసం ప్రధానంగా కలిగిన మాటలు నర్మ్శ్మం. కోపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం హాస్యం చేయడం నర్శద్యుతి. ఉక్తి ప్రత్యుక్తులతో ఒకరివెంట మరొకరు మాట్లాడడం పప్రగమనం. పాత్రలకు కలిగిన కష్టం వర్ణించబడడం నిరోధం. కోపగించిన వారిని ఇతరులు అనునయించడం పర్యుపాసనం. ఒకవ్యక్తియొక్క గాని, వస్తువుయొక్క గాని గొప్పతనాన్ని వర్ణించడం పుష్పం; ముఖాముఖి కటువుగా మాట్లాడడం వజ్రం. యుక్తులు (64500100) ప్రదర్శిస్తూ మాట్లాడడం ఉపన్యాసం. అన్ని వర్ణాల యొక్క జనులూ ఒకచోట సమకూడడం, లేదా ఒక విషయంలో ఏకాభిప్రాయానికి రావడం వర్ణసంహారం. ప్రతిముఖసంధిలో కనిపించీ కనిపించుండా అంకురించిన బీజం కోసమై మాటిమాటికీ వెదకడం గర్భసంధి. దీనిలో పతాకం అనే అర్ధప్రకృతి, ప్రాష్యాశ అనే అవస్థ-ఈ రెండింటికీ అనుగుణంగా పన్నెండు అంగాలు ఉంటాయి. అవి 1) అభూతా హరణం 2) మార్గం 3) రూపం 4) ఉదాహరణం 5) క్రమం 6) సంగ్రహం 7) అనుమానం 8) తోటకం 9) అధిబలం 10) ఉద్వేగం 11) సంభ్రమం 12) క్షేపం. కపటంతో కూడిన మాటలు అభూతాహరణం. జరిగినది, లేదా జరగనున్నదీ అయిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం మార్గం. సందేహాన్ని కలిగించే మాటలు రూపం. ఒకానొక విషయం యొక్క గొప్పతనాన్ని గూర్చిన పొగడ్తలు ఉదాహరణం. ఎదుటివ్యక్తియొక్క భావాన్ని తెలుసుకోవడం, లేదా అనుకున్నపని నెరవేరడం క్రమం. సామం (ప్రియంగామాట్లాడడం) దానం (కానుకలివ్వడం) అనే ఉపాయాలను ప్రయో గించడం సంగ్రహం. కనబడుతున్న హేతువులను బట్టి ఒక విషయాన్ని ఊపొంచడం అనుమానం. తొందరతో కూడిన మాటలు తోటకం. కపటోపాయంతో ఇతరులను
56 రసార్దవ సుధాకర సుధ మిక్కిలిగా వంచించడం అధిబలం. శత్రువులు, దొంగలు మొదలైనవారివలన కలిగిస భయం ఉద్వేగం. శత్రువులు, క్రూరమృగాలవలన కలిగిన శంక, భయం - సంభ్రమం. గర్భసంధియొక్క బీజమైన ప్రాష్యాశ మరింతగా వ్యక్తంకావడం ఆక్షేపం.
బీజం గర్భసంధిలో చక్కగా ప్రకటత్వాన్ని పొందినా, ప్రలోభం కోపం కష్టం మొదలైన వాటి కారణంగా దాన్ని పొందడమెట్లాగా అని విచారించబడడం అవమర్శ (విమర్శ)సంధి. దీనిలోని ప్రకరి అనే అర్ధప్రకృతి, నియతాప్తి అనే అవస్థ-ఈ రెండింటికీ అనుగుణంగా దీనిలో పదమూడు అంగాలు కల్పించబడతాయి. అవి-1) అపవాదం 2) సంఫేటం 3) విద్రవం 4) ద్రవం 5) శక్తి 6) ద్యుతి 7) ప్రసంగం 8) ఛలనం 9) వ్యవసాయం 10) నిరోధనం 11) ప్రరోచన 12) విచలనం 13) ఆదానం.
ఎదుటివారిదోషాలను ఎత్తి చూపడం అపవాదం. రోషంతో కూడిన మాటలు పలకడం సంఫేటం. శత్రువులను వధించడం, వారి ఆస్తులను తగలబెట్టడం మొదలైనవి విద్రవం. పెద్దలను ఎదిరించడం ద్రవం. ఉత్పన్నమైన విరోధం శత్రువధతో ఉపశమనాన్ని పొందడం శక్తి. ఎదుటివారిని బెదిరించడం భయపెట్టడం ద్యుతి. జరిగిన విషయాన్ని చెప్పడం ప్రసంగమని కొందరి మతం. మరికొందరు పెద్దల గొప్పతనాన్ని కీర్తించడం ప్రసంగమని అంటారు. తమ కార్యం నెరవేర్చుకోవడం కోసమై ఇతరులను అవమానించడం ఛలం. తన సామర్దాన్ని చెప్పుకోవడం వ్యవ సాయం. పోరాడుతున్న యోధులిద్దరూ తమతమ ఆయుధాలతోగాని, మాటలతోగాని పరస్పరం నిరోధించుకోవడం నిరోధనం. ముందు ముందు జరుగనున్న సంగతులను అప్పుడే జరిగిపోయినట్లుగా సూచించడం ప్రరోచనం. తననుతానే శ్లాఘించుకోవడం విచలనం. చేసిన పనులను చెప్పుకోవడం కార్యసంగ్రహం.
బీజంతో కూడిన ముఖసంధి మొదలైన నాలుగు సంధులూ-చెల్లాచెదరుగా ఉన్న దశ నుండి ఫలప్రాప్తి అనే మహాప్రయోజనాన్ని పొందడం కోసమై కూడి రావడమే నిర్వహణసంధి. దీనిలోని కార్యమనే అర్ధప్రకృతి, ఫలాగమమనే అవస్థలకు అనుగుణంగా దీనిలో పధ్నాలుగు అంగాలు ఉంటాయి. అవి - 1) సంధి 2) విరోధం 8) గ్రథనం 4) నిర్ణయం 5) పరిభాషణం 6) ప్రసాదం 7) ఆనందం 8 సమయం 9) కృతి 10) భాష 11) ఉపనిగూహనం 12) పూర్వభావం 18) ఉపసంహారం 14) ప్రశిస్తి.
రూపకానికి బీజభూతమైన వస్తువు పొందబడడం సంధి. కార్యం (ఫలం) కోసమే అన్వేషణం విరోధం. ఆకార్యం ఉపసంహరించబడడం [గగ్రథనం. ఒక పాత్ర
రసార్దవ సుధాకర సుధ - ళ్ జరిగిపోయిన విషయాలనన్నింటినీ చెప్పడం నిర్ణయం. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, లేదా ఒక వ్యక్తిని గురించి నిందాపూర్వకంగా మాట్లాడడం పరిభాష పెద్దలబయొక్క సేవ మొదలైన వాటివలన వారి అనుగ్రహాన్ని పొందడం ప్రసాదం. వాంఛించిన వస్తువులను పొందగలగడం ఆనందం. దుఃఖం తొలగడం సమయం. లభించిన ఫలితం స్థిరత్వాన్ని పొందడం కృతి. గౌరవం మొదలైన వాటిని పొందడం భాషణం. అమితమైన ఆశ్చర్యాన్ని పొందడం ఉపగూహనం కార్యం యొక్క ఫలం దర్శించబడడం పూర్వభావం. ధర్మాద్ధకామరూపమైన ఫలం పొందడం వలన తాము కృతార్థులమైనామని ముఖ్యపాత్రలు చెప్పడం ఉపసంహారం. భరతులు (రూపకంలో నటించిన వారు చరాచరప్రపంచాన్ని ఆశీర్వదించడం భరతవాక్యం,
రసం భావం మొదలైన వాటికి అనుగుణంగానూ, ప్రయోజనాన్ని బట్టీ ఈ అరవై నాలుగు సంధ్యంగాలనూ పూర్తిగా నిర్వహించాలని ఆచార్యులు చెపుతున్నారు. వీటిలో కొన్ని అంగాలు లేకపోయినా ఫరవాలేదని కొందరిమతం. ఒక్కొక్క సంధిలోనూ లక్షణ సూత్రాలలో ఉన్న క్రమంలోనే అంగాలను '్రతిపాదించవలసిన అవసరం లేదు. మొట్ట మొదటి భరతులూ ఆ క్రమాన్ని పాటించలేదు, తరువాతి కాలంలోని కవులుగూడా తమతమ రూపకాలలో క్రమరహితంగానే సంధ్యంగాలను పొందు పరుస్తున్నారు. అందువలన వీటికి క్రమనియమం లేదన్నది స్పష్టం. సింగభూపాలుడు ఈ అరవైనాలుగు సంధ్యంగాలనూ రాజశేఖరవిరచితమైన బాలరామాయణనాటకంలో నిరూపించాడు.
ముఖసంధి మొదలైన అయిదుసంధులలో కథాక్రమంలో శైథిల్యం (వదులుతనం) లేకుండా ఉండడంకోసమై అక్కడక్కడ ఇరవైఒక్క సంధ్యంతరాలు ఉంచబడాలి. వీటిని భరతముని అంగీకరించకపోయినా కొందరు ఆచార్యులు అంగీకరించారు గనుక, వీటివలన చమత్కారం కలుగుతుంది గనుకా సింగభూపాలుడు వీటిని నిరూపించాడు. ఆ ఇరవై ఒక్క సంధ్యంతరాలూ ఇవి - 1) సామం 2) దానం 8) భేదం 4) దండం 5) ్రత్యుత్పన్నమతి 6) వధ 7) గోత్రస్థలితం 8) ఓజస్సు 9) ధీ 10) క్రోధం 11) సాహసం 12) భయం 139 మాయ 14) సంవృతి 15) భ్రాంతి 16) దూత్యం 17) హేత్వవధారణం 18) స్వప్నం 19) లేఖ 20) మదం 21) చిత్రం.
తాను ఎదుటివారికి అనువర్తనగా ఉన్న సంగతిని తెలియజేస్తూ ప్రియంగా మాట్లాడడం సామం. తనకు ప్రతినిధిగా (తనను తాను సమర్పించుకుంటున్నదానికి గుర్తుగా) అలంకారాలు మొదలైనవి సమర్పించడం దానం. అబద్ధపుమాటలతో
58 రసార్దవ సుధాకర సుధ పరస్పరం విశ్వాసంకలవారి మధ్యన చీలికలు కల్పించడం భేదం. ఇతరుల అవినయం కనబడినా, చెవినిబడినా వెంటనే దండించడమో బెదిరించడమో చెయ్యడం దండం. తత్కాలోచితమైన ప్రతిభ (సమయస్పూర్తి) ప్రత్యుత్చన్నమతి. ఆతతాయిని (తమకు బాధకలిగించినవాడిని) వధించడం వధ. ఒకరిపేరుకు మారుగా మరాకరి పేరును పలకడం గోత్రస్థలితం. తనయొక్క శక్తిని ప్రకటించే మాటలను పలకడం ఓజస్సు. తమకు ఇష్టమైన ప్రయోజనం సిద్ధించేటంతవరకూ దానిని గురించే ఆలోచించడం ధీ అని చెప్పబడుతుంది. ఇతరులు తమకు చేసిన అపరాధాన్ని చూచి మనస్సు రోషంతో మండిపడం క్రోధం. తన జీవితంపై ఆశపెట్టుకోకుండా చేసే పని సాహసం. అకస్మాత్తుగా కలిగే బెదురు త్రాసం. కపటకల్పనలు (ఇంద్రజాలం మొదలైనవి) చేయడం మాయ. తాను చెప్పిన మాటలను తానే కప్పిపుచ్చి మాటమార్చడం ్రచ్చాదనం సంవృతి. సందర్భం సరిగా తెలియకపోవడం వలన ఒకదానిని మరాకటిగా భావించడం విపర్యయం భ్రాంతి. దుర్జటమైనకార్యంలో ఇతరులకు తోడుపడడం దూత్యం. కనిపిస్తున్న హేతువులను బట్టి కార్యాన్ని నిర్ధారణ చేయడం హేత్వవధారణం. నిద్రలో రహస్యాలను బట్టబయలుచేస్తూ కలవరించడం స్వప్నం. తాను ఎదుటివారితో చెప్పదలచుకున్న మాటలతో కూర్చబడిన ఉత్తరం - లేఖ అనబడుతుంది. మద్యంవలన కలిగే మత్తు
- మదం, నాయిక/నాయకుని చిత్రాన్ని రెండవవారు గీయడం చిత్రం. ముఖసంధి మొదలుకొని అయిదు సంధులలో ఒకొక్మదానిలో భాగంగా కొన్ని సంధ్యంగాలు నిరూపించబడడం వలన ఏ సంధిలో భాగమైన అంగాలను ఆ సంధిలోనే నియోగించాలి. సంధ్యంతరాల ప్రయోగంలో మాత్రం ఆ నియమంలేదు. ఎక్కడ ఏ అం్యంశరం అవసరపదితే అక్కడ దానిని ఉపయోగించవచ్చు. దశరూపకకారుడు 9 రాలు సంధ్యంగాలలోనే కలిసిపోతాయని చెప్తా డు. దానిని సింగ భూపాలుడు ఖండించాడు. ఎ అలంకరించాలి. ఆ భూషణా వ స వస్తువును ముప్ఫై ఆరు భూషణాల
- హేతువు 4) ప్రాప్తి 5) ఉదాహం్ర (2) “పొం 2) అక్షరసంఘాతం
- అభిప్రాయం 10) నిదర్శనం మ న శభ “) సంశయం 8) దృష్టాంతే క
- విశేషణం 16) వరో | “(స్తీ 19) దాక్షి్యం 1ట) అర్ధాపకి
- విచారవిపర్యయం 20) న్ ఈత [లర 18) విచారం జాతిపాతం 21) అతిశయం 22) నిరుక్తం
రసార్దవ సుధాకర సుధ 59 23) గుణ కీర్తనం 24) గర్హణం 25) అనునయం 26) భ్రంశం 27) లేశం 28) క్షోభం 29) మనోరథం 30) అనుక్తసిద్ధి 31) సారూప్యం 82) మాల 88) మధురభాషణం 34) పృచ్చ 35) ఉపదిష్టం 86) దృష్టం.
శబ్దార్ధ గుణాలతోను, అలంకారాలతోనూ నిండిఉన్న మాటలు భూషణమని చెప్పబడతాయి. శ్లేషతో కూడినపదాలు గలదీ, భిన్నమైన అర్థాలను ఇచ్చేదీ అయిన వాక్యం అక్షరసంఘాతం. సాధ్యమైన (ఒక హేతువుతో 5౯౦౪ చెయ్యడానికి వీలయిన) ఒక విషయాన్ని బహిర్గత పరచేది (౧0౪6 చేసేది) హేతువు. విషయంలో కొంతభాగం తెలియడం వలన దానినిబట్టి మిగిలినది కూడా తెలియబడడం ప్రాప్తి. యథార్థాన్ని చెప్పకుండా ఉండడం కోసమై దానితో సమానమైన, గూఢమైన అర్ధంతో కూడినమాటలు చెప్పడం ఉదాహృతి. ఒండొరుల సమక్షంలో యువతీయువకులయొక్క గుణాతిశయం మరింత అధికంగా ప్రకటించబడడం శోభ. ఏ నిశ్చయాన్నీ ప్రకటించని (సందేహంతో కూడిన) మాటలు సంశయమనబడతాయి. ఒక విషయాన్ని నిరూపించడంకోసమై ఆశ్రయింపబడిన హేతువు దానితో సమానమైన ఇతర విషయాలను గూడా సాధించడం దృష్టాంతం. రెండు వస్తువుల మధ్యన సామ్యంకారణంగా కల్పించబడిన సుందరమైన అభూతకల్పన అభిప్రాయం. కొందరు
- సుందరమైన విషయంలో మమత్వం (అదినాది” అనే భావన) అభిప్రాయమని అంటారు. ఒకవిషయానికి ఉపోదృలకంగా ప్రసిద్ధమైన మరొక వస్తువును పేర్కొనడం నిదర్శనం. అనుకోకుండా కోరుకున్న వస్తువు లభించడం సిద్ధి. లోకంలో ప్రసిద్ధమైన వాటిని ఉదాహరణంగా చూపించి తాను చెప్పదలచుకున్న విషయాన్ని నిరూపించడం ప్రసిద్ధి. తన అభిప్రాయం ఎట్లా ఉన్నా ఇతరుల మనస్సును అనుసరించి హాటారడం దాక్షిణ్యం. తాను మొదట చెప్పిన మాట పొసగకపోవడగ వలన దానిక వాక్యాలతో మరొక అర్ధం కల్పించడం అర్భాపత్తి. పల దట చాలావాటిని చెప్పి వాటికి ఒక విశేషాన్ని కూడా కలిపి చెప్పడం వి న్ లో చాలా పదాలు ప్రయోగించబడి, ఆతరువాత ప్రయోగించబిడిన వరాల ౯ సమానార్ధకత్వం వలన కలయిక కలగడం పదోచ్చయం. పోలికను తెలిం ప్ప రూపకం, ఉపమవంటి అలంకారాల ప్రయోగంతో అప్రత్యక్షమైన విషయాన్ని నిరూపించడం తుల్యతర్మం. ఒక ఉపాయంతో సిద్ధించేపనికి అనేవ దపాయాలు చెప్పడం విచారం. చాలా ఉపాయాలు ఉన్నా అవి ఒకానొక విషయం ని ల్ వ క్ పోవడం విచార విపర్యయం. ఎదుటివారిని అధిక్షేపించడంకోసమై వారిదోషాల గుణాలుగా వర్ణించడం గుణాతిపొతం. సామాన్యమైన చాలా గుణాలను వర్ణించి
ఠి రసార్జవ సుధాకర సుధ ఒకానొక ప్రత్యేక గుణంవలన ఒక వ్యక్తి ఇతరుల కంటె అధికుడు కావడం వర్ణించబడితే అది అతిశయం. ఒక వ్యక్తియొక్క పేరు సార్ధకమైందని ప్రశంసించడం నిరుక్తం. ఒకవ్యక్తిని గుణాలకంటె భిన్నమైన చాలా పేర్లతో పిలవడం గుణకీర్తనం. దోషాలను పేర్కొంటూ వాటిని గుణాలుగా పర్యవసింపజేయడం, గుణాలుగా కీర్తించబడుతున్న వాటిని దోషాలుగా స్ఫురింపజేయడం గర్హణం. అర్ధించడానికై ఉద్దేశించబడినమాటలు అనునయమనబడతాయి. ప్రస్తుతమైన విషయాన్ని విడిచిపెట్టి మరొకవిషయంలో పడడం భ్రంశం. తని భావాన్ని ఎదుటి వారికి తెలియజేయడం కోసం గూఢంగా మాట్లాడడం లేశం. కారణం ఒకచోట ఉండగా కార్యం మరొకచోట ఉన్నట్లు చెప్పడం క్షోభం. ఏదో ఒక నెపంమీద తన మనస్సులోని మాటను చెప్పడం మనోరథం. ఒక విషయాన్ని చెప్పడం ప్రారంభించి పూర్తిగా చెప్పకపోయినా మిగిలిన విషయం (గ్రహించబడడం అనుక్తసిద్ధి, తాము ఒకవ్యక్తి తాను చూచినవీ విన్నవీ అయిన విషయాలను చెప్పడంవలన కలిగిన గందరగోళంతో ఒకవ్యక్తి మరొక వ్యక్తిగా భావించబడడం సారూప్యం. కోరినది నెరవేరడంవలన కలిగే అనేక ప్రయోజనాలు వరుసగా చెప్పబడడం మాల, ప్రసన్నుడైన ఒకవ్యక్తిచేత ఎదుటి వ్యక్తిని పూజించడం కోసమై అతనిని స్తుతిస్తూ పలకబడే మాటలు మధురభాషణమని చెప్పబడతాయి. అడగబడిన ప్రశ్నలోనే దానికి సమాధానం స్ఫురించడం పృచ్చ. శాస్త్రార్దాన్ని గ్రహించి విద్వాంసులకు మనోహరంగాను మంచి పర్యవసానం కలిగేటిట్లుగానూ ఒక వ్యక్తిచేత పలకబడే వాక్యం ఉపదిష్టం, తాను ప్రత్యక్షంగాగాని, అఫ్రత్యక్షంగా (మానసిక భావనతో)గాని చూచినదానిని ఆ ప్రదేశం, ఆ కాలం ఆ రూపం ఎట్లా ఉందో అట్లాగే కళ్లకు కట్టినట్లు వర్ణించడం దృష్టం. | అంగాంగి భావంతో క్రూడ్రిన అన్ని రసాలకూ ఆశ్రయం కావడంవలన, అర్హ ప్రకృతులు, అవస్థలు, సంధులు, సంధ్యంగాలూ సంపూరిగా నిర్వహించబడడం వలనా అన్ని రూపకాలకూ నాటకమే మూలమని పండితులు అంటారు. మిగిలిన రూపకాలు గూడా నాటకాన్నే పోలి ఉండడంవలన ఆ పోలికబలంతో నాటకాంగాలు వాటికీ ఫ్రా్తించి వాటిని నిలబెడతాయి. కనుక మిగిలిన రూపకాలు నాటకం నుండి ప న అందుకే ఇప్పుడు మొదటగా నాటకలక్షణం నాటకంలో నాయకుడు దివ్యడుగాని, మానవుడుగానీ _ ధీరోదాతుడ ఉందాలి. శ్రంగార వీరరసాలలో ఏదో ఒక్షటి ప్రధానరసమై వుండాలి. ఖ్యాతమైన కథను ఇతివృత్తంగా కలిగి, పంచసంధులు, అయిదు ప్రకృతులు, అయిదు అవస్థలు, అరవై
రసార్దవ సుధాకర సుధ 61 నాలుగు సంధ్యంగాలు ఇరవై ఒక్క సంధ్యంతరాలు, ముప్పెఆరు భూషణాలు, నాలుగు పతాకాస్థానాలు, నాలుగు వృత్తులు, వృత్త్యంగాలు, ప్రవృత్తులు, విష్కంభకం మొదలైన వాటితో కూడిన నాటకం ధర్మార్ధకామాలనే మూడు పురుషార్థాలను కలగజేస్తుంది. ఈ నాటకం ఆరంభించబడవలసిన తీరు మొదట చెప్పబడుతోంది.
ఎట్లాగైతే ఒక కార్యం జరగడానికి దానిని గూర్చిన సంకల్పం ముఖం వంటిది (ప్రారంభదశ) అవుతుందో అదే విధంగా ప్రధానమైన కథకు ప్రస్తావన ముఖస్థానీయం. నాటకంద్వారా కవి ప్రతిపాదించదలచిన పురుషార్ధం (ధర్మం, అర్ధం, లేదా కామం) ఒక నదీ ప్రవాహమైతే దానిలో దిగడానికి వీలైన రేవు - ప్రస్తావన. ఆ ప్రస్తావన యొక్క ప్రారంభంలో శుభాన్ని కలిగించే నాందిచేయబడాలి. నాంది అంటే - ఆశీర్వాదం (సామాజికులకు శుభం కలగాలనే ఆశాసనం) ఇష్టదేవతా నమస్కారర్శ లేదా వస్తునిద్దేశం ఈ మూడింటిలో ఏదో ఒకటి. నాంది తరువాత రంగంమీదికి' వచ్చిన సూత్రధారుడు నాటకానికి రంగాన్ని సిద్ధంచేయడం కోసమై భారతీవృత్తిని (మాట్లాడదాన్ని) ప్రయోగిస్తాడు. దానికి నాలుగు అంగాలు ఉంటాయి. అవి ప్రరోచన, ఆముఖం, వీథి, ప్రహసనం. వీటిలో వీథి ప్రహసనం రెండూ వాటివాటి ప్రకరణాలలో చెప్పబడతాయి. ప్రరోచన అంటే - ఒక బుతువునుగొని, ఒకానొక దేవతనో, తీర్థస్థలాన్నోగాని, కథా నాయకుణ్ణిగాని, నాటకకర్తయైన కవిని గాన్, ప్రేక్షకులను (సామాజికులను) గాని, నటులను గొని, ప్రశంసిస్తూ వర్ణించడం. ఈ విధంగా సభ్యులను నాటకదర్శనం పట్ల రుచి (ఆసక్తి) కలవారినిగా చేసి అప్పుడు సూత్రధారుడు ఆముఖాన్ని - అంటే నటితో తాను ప్రదర్శించ బోతున్న నాటకాన్ని గురించి దానికథను స్ఫురింపజేసే విధంగా చతురోక్తులతో మాట్లాడడాన్ని-ప్రారంభిస్తాడు. దానిలో మూడు అంగాలు ఉంటాయి. అవి - కథోద్దాతం, ప్రవర్తకం, ప్రయోగాతిశయం. సూత్రధారు ఇ పలికిన మాటలలో తనవృత్తాంతానికి సమంగా ఉన్న మాటలనుగొని, అర్థనిగాస అందిపుచ్చుకుని పాత్ర రంగప్రవేశం చేయడం కథోద్దాతం. బుతువర్జనం నాం దానిలోని పదాలు కథకు అనుగుణంగా ఉండడంవలన పొటత్ర ప్రవేశం జరగడం 'ప్రవర్తకం, “*ఇడుగో అతడు .....” మొదలైన మాటలతోను, అభినయంతోసూ సూత్రధారుడు పాత్రప్రవేశాన్ని సూచిస్తే అది ప్రయోగాతిశయం. అముఖం కన స్థాపన అని రెండు విధాలు. సూత్రధారుడు విదూషకుడు, నటి పారి ర్వ పలక మాట్లాడుతూ వీథ్యంగాలు తక్కువగా ఉన్న ఆముఖాంగాలను నిర్వహిస్తై అది అనా లు అనబడుతుంది. నటి, విదూషకుడు, నటులతో మాట్లాడుతూ అన్ని అయకొర అన్ని వీథ్యంగాలతో నాటకవస్తువును ఆక్షేపిస్తే అది స్థాపన అని చెప్పబడుతుంది.
ల రసార్దవ సుధాకర సుధ శృంగారరస ప్రధానమైన నాటకాలలో ఈ రెండూ ఉచితమైనవే. వీర, అద్భుతరస ప్రాధాన్యంగల నాటకాలలో ప్రస్తావన యోగ్యమైనది. హాస్యభీభత్స రౌద్రరసాలు ప్రధానంగా గల నాటకాలలో స్థాపన ఉచితమైనది. ఇప్పుడు వీథ్యంగాలు నిరూపించబడుతున్నాయి. అవి ఆముఖంలోనూ, వీథి అనే రూపకభేదంలోనూ సమానంగా ఉన్నప్పటికీ, వీథిలో అవి తప్పకుండా ఉండవలసినవి గనుక అవి వీథ్యంగాలుగానే పరిగణింపబదతాయి. అవి
- ఉద్దాత్యకం 2) అవలగితం 8) ప్రపంచం 4) త్రిగతం 5) ఛలం 6) వాక్కేలి
- అధిబలం 8) గండం 9) అవస్యందితం 10) నాళిక 11) అసత్ర్రలాపం
- వ్యాహారం 18) మృదవం. అని పదమూడు. వాటిలో ఇద్దరు వ్యక్తులు విడవకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఉద్భాత్యకం. అది గూధార్ధం కలిగిన పదాల పర్యాయక్రమం, (అంటే ఒకవ్యక్తి ఒక మాటను ఒక అర్ధంలో చెప్తే రెండవవారు దాన్ని మరొక అర్గ్షంలో (గ్రహించి దానిపై మరొక ప్రశ్న వేయడం) లేదా ప్రశ్నోత్తరక్రమం అని రెండు విధాలు. ఒక ప్రయోజనానికి లగ్నమై ఉండడమనే రూపంగల అవలగితం రెండు విధాలుగా ఉంటుంది. 1) ఒకపనిని ప్రారంభిస్తే మరొకపని సిద్ధించడం 2) వేరే పనివలన ప్రకృతమైన పని సిద్ధించడం. ఇద్దరు వ్యక్తులు ఊరికే హాస్యాన్ని సృష్టించడం కోసమై పరస్పరం స్తోత్రం చేసుకోవడం ప్రపంచం. వినడానికి అన్నీ ఒకే విధంగా ఉండడం వలన ఒక వస్తువుయందు అనేకమైన వస్తువులను ఊహించడం ్రిగతం. ప్రియంలాగా వినిపించేవీ, కాని వెటకారంతో నిండినవీ అయిన మాటలతో ఎదుటివారిని వెల్లడించడం అధిబల లో స్టీలు పోటీపడుతూ తమతమ సామర్యులను వెల్ల దం 0. ఒకరు మాట్లాడిన మాటలలో నుండి మరాకరు అకస్మాత్తుగా రకా విధ తీసుకోవడం గండం. మొదట చెప్పిన మాటను “ ్యనించడం అవస్యందితం. నిగూఢమైన అర్వం కలిగి హాస్యంకోసమై అడగబడే పొదుపుకథ నాల్సిక అనబడుతుంది. అది అంతర్జాప. బహిర్లాప అని రెండువిధాలు. ఆ పొడుపుకథకు సమాధానం దానిలోనే ఉంటే అది లంచరాపనాళిక అట్లా కానిది బహిర్లాపనాళిక. ఒకమాటకూ మరాక మాటకూ గుణాలుగాను. గు ఖు రో ననుట కలగజేయడం వ్యాహారం. దోషాలు ర్తింపబడడం మృదవం.
రసార్దవ సుధాకర సుధ గు
ఈ విధంగా ఆముఖాన్ని నిర్వహించి సూత్రధారుడు తన అనుచరులతో కలిసి నిషమించిన తరువాత అతడు ప్రవేశపెట్టిన పాత్రలచేత కథావస్తువును విస్తరింపజేయాలి. కథమొత్తాన్ని సూచించదగినది, ప్రదర్భ్శించదగినదీ అని రెండుభాగాలుగా విడదీయాలి. రసహీనమైన కథాభాగం సూచ్యమవుతుంది. రసవంత మైన భాగాలు ప్రదర్శించదగినవి. కథలో వయే భాగాలు నీరసంగా ఉన్నాయో వాటిని సూచింపజేయాలి. ఆ సూచకాలేవంటే 1) విష్కంభం 2) చూలిక 8) అంకాస్యం 4) అంకావతారం 5) ్రవేశకం.
వాటిలో విష్క్మంభం నాయికానాయకులకంటె భిన్నమైన పాత్రలచేత నిర్వహించ బడుతుంది. ఇది జరిగిపోయిన, లేదా జరగబోతున్న విషయాలను సూచించడానికై ఉద్దేశించబడింది. ఇది శుద్ధం, మిశ్రం అని రెండువిధాలు. మిశ్రవిష్కంభంలో మధ్యమ నీచపాత్రలు ఉంటే, శుద్ధవిష్కంభంలో ఒక్కరుగాని, అనేకులుగాని మధ్యమ పాత్రలు మాత్రమే ఉంటారు. తెరవెనుకనే ఉన్న వంది మాగధులు సూతులు మొదలైనవారిచేత అర్జోపక్షేపణం (జరుగుతున్న కథయొక్క సూచనం) చేయబడితే అది చూలిక అనబడు తుంది. అది చూలిక, ఖండచూలిక అని రెండు విధాలు. కేవలం తెరలోపల ఉన్న పాత్రలచేతనే అంకం మొదటగాని, మధ్యలోగాని నిర్మింపబడేది చూలిక. ఈ పాత్రలకు రంగంమీదికి ప్రవేశనిష్రమణాలు లేకపోవడం వలన అది అంకంలో భాగం కాదు. అంకం ప్రారంభంలో మాత్రమే, రంగంమీద ఒకపొత్ర, తెరవెనుక మరొకపాత్రా ఉండగా వారి సంభాషణలతో కల్పించబడేది ఖండచూలిక. దీనిలోనూ ప్రవేశ నిష్రమణాలు ఉండవు గనుక ఇదికూడా అంకం వెలుపలిదే. ముందరి అంకంలో చివరిగా ప్రవేశించిన పాత్రలచేత తరువాతి అంకం యొక్కకథ విచ్ళేదాన్ని పొందకుండా ముందే సూచించబడడం అంకాస్యం. ముందరి అంకంలోని పొత్రలన్నీ ఆకథనే కొనసాగిస్తూ తరువాతి అంకంలో రంగప్రవేశం చేయడం అంకావతారం. అంకంలో భాగంగా ప్రవేశించిన పాత్రలచేతనే సూచించబడడం వలన అంకాస్యం అంకావతారం రెండూ అంకంకంటె భిన్నమైనవి కావు. రెండు అంకాలమధ్యన కేవలం నీచపాత్రలచేతనే జరిగినదీ, జరగబోయేదీ అయిన కథసూచించబడదం ప్రవేశకం.
శుభమెైనవి, ఉదాత్రమైనవీ అయిఉండి కవియొక్క ఉపలాలనాన్ని (92౧6౧0 కోరుకునే రసాలు. భావాలతో నిండిన వస్తువుకు అంకం తల్లియొక్క అంకం (ఒడి) వంటిది. అందువలననే దానికి ఆపేరు వచ్చింది. రసానికి గాని వస్తువుగా ఆలంబన మైన ఇద్దరినుండి ఐదుగురివరకు పాత్రలతో మనోహరంగా ఉండే సంవిధా
నూ రసార్దవ సుధాకర సుధ విశేషం అంకమనబడుతుంది. దానిలో రసభావాలతో నిండిన కథావస్తువును విస్తరించాలి.
అసూచ్యమైన వస్తువు దృశ్యం, శ్రావ్యం అని రెండు విధాలు. వాటిలో ఢావ్యం స్వగతమని ప్రకాశమనీ రెండువిధాలు. స్వగతమంటే ఆపాత్రకి మాత్రమే తెలియ వలసినది. ప్రకాశం సర్వప్రకాశం, నియతప్రకాశం అని రెండువిధాలు. సర్వప్రకాశం అంటే రంగం మీద ఉన్న పాత్రలన్నింటికీ వినబడవలసినది. నియత ప్రకాశమంటే చాలామంది ఉన్నప్పటికీ వారిలో ఒకరిద్దరికి మాత్రమే వినబడవలసినది. అదికూడా జనాంతమని, అపవారిత మనీ రెండువిధాలు. *త్రిపత్రాకహస్తంతో ఇతరులను వేరుచేసి ఎవరికి ఈ మాటలు వినిపించాలో వారితో మాత్రమే మాట్లాడడం జనాంతం (జనాంతికం) అనబడుతుంది. పక్కకుతిరిగి మరొకరికి రహస్యం చెప్తే అది అపవారితమనబడుతుంది.
ఈ విధంగా దృశ్యం శ్రవ్యం అయిన వస్తువును పాత్రలన్నీ కలిసి చక్కగా నిర్వహించి అంకం చివర అందరూ ఒక్కసారే నిష్కమించాలి. కథయొక్క అవస్థ, కాలం ఈ రెండింటినీ అనుసరించి అంకపరిసమాప్తిని రచించాలి. ఒక్కొక్క అంకం యొక్క వస్తువు ఒక రోజుకో లేదా ఒకపూటకో సరిపోయేదిగా ఉండాలి.
అంకం యొక్క ప్రకరణంగనుక ఇక్కడే గర్భాంకలక్షణం కూడా చెప్పబడుతోంది. నాయకుడు రసం, వస్తువులకు ఉత్కర్షను కలిగించడం కోసమై అంకం మధ్యలో నిర్వహించ బడే మరొక అంకం గర్భాంకమనబడుతుంది. దాని యొక్కనాంది వస్తువును సూచించేది గాను, ఆముఖం కేవలం నామమాత్రంగానూ ఉంటుంది. చూలికతప్ప ఇతర అర్జ్భోపక్షేపకాలేవీ ఉండవు. అది మూడు నాలుగు పాత్రలతో కూడి ఎక్కువ విస్తృతంకాని ఇతివృత్తాన్ని కలిగి ఉండి తనకు ఆధారమైన అంకానికి శోభను కలిగిస్తుంది. ప్రస్తుతకథకే సంబంధించి ఉంటుంది, పాత్రల యొక్క నిష్రమణంతో సమాప్తమై పోతుంది. అయితే దానిని ('ప్రథమాంకంలో మాత్రం ఉంచకూడదు.
నాటకంలోని అంకాలు అయిదు కంటె తక్కువ, పదికంటె ఎక్కువ కాకూడదు. అటువంటి నాటకం నటులకు భక్తిని కలగజేస్తుంది. భరతముని “నాట్యం ధర్మార్ధాలను
ధిస్తుంది, అన్నిదుఃఖాలనూ దూరం చేస్తుంది. అందువలన దాని నుండి పుట్టిన నాటకాన్ని సేవించండి” అని బుషులకు ఉపదేశించాడు. కొందరు ఈ నాటకంలో
- పదపద వాం ౦చాడు. కొందరు ఈ నాటకంలొ కన గ్రజవగా పెట్టి అనామికను మాత్రం కిందకుమడిస్తే దానిని
రసార్దవ సుధాకర సుధ 65 పూర్ణం ప్రశాంతం మొదలైన భేదాలను కల్పించారు. కాని అవి అంత సుందరమైనవి కాకపోవడంవలన, భరతముని వాటిని ఆదరించకపోవడం వలనా సింగభూపాలుడు వాటిని నిరూపించలేదు.
రూపకాలలోని రెండవదిగా చెప్పబడినది ప్రకరణం. దానిలో ఇతివృత్తం ఉత్పాద్యం, నాయకుడు ధీరశాంతుడు, అంగిరసం శృంగారం. మిగిలిన అన్ని లక్షణాలూ నాటకానివే. అది శుద్ధం, ధూర్తం, మిశ్రం అని మూడువిధాలు. కులస్త్రీ నాయిక అయితే అది శుద్ధం. గణికానాయిక అయితే అది ధూర్తం. దానిలో మోసగాళ్లు జూదరులు మొదలైన వారియొక్క వ్యాపారాలను వర్ణించాలి. కులప్రీ గణిక ఇద్దరూ నాయికలయితే అది మిశ్రమం, శుద్ధధూర్త ప్రకరణాలయొక్క లక్షణాలను రెండింటినీ కలిగి ఉంటుంది.
ఈ సందర్భంలో సింగభూపాలుడు నాటిక ఒక రూపకఖేదంగా అంగీకరించబడ వలసిన అవసరం లేదని నిష్కర్షచేశాడు. అది కొన్ని లక్షణాలు నాటకంనుండీ, కొన్ని లక్షణాలు ప్రకరణంనుండీ గ్రహించడం వలన కలిగినదనీ దానికొక ప్రత్యేకమైన లక్షణం ఇదమిత్ణంగా లేదనీ అందువలన అది, ప్రకరణిక, రెండూకూడా నాటక ప్రకరణాలయొక్క ఖేదాలుగా గ్రహింపబడాలనీ వివరించాడు.
తరువాతి రూపకభేదం ఉత్సృప్టికాంకం (అంకం). అది ప్రఖ్యాతంగానీ, కల్పితం గానీ అయిన ఇతివృత్తాన్ని కలిగి ఉండి, విద్యావివేకాలు లేని ప్రాకృత జనులతో నిండి ఉంటుంది. దీనిలో కైశికీవృత్తి ఉండదు. సాత్త్వతీ ఆరభటీవృత్తులతో' మృదువుగాను, స్రీలయొక్క ఏడుపులు, మాటలతో కూడి కరుణరస 'ఫధాసంగాసూ ఉంటుంది. రకరకాల యుద్ధసన్నాహాలు, ఆయుధప్రహారాలు మరణాల ి ఉంటుంది. ముఖనిర్వహణ సంధులకు మాత్రమే ఉండి కవియొక్క ఇచ్చథైకాం ఒకటో రెండో, మూడో అంకాలను కలిగిఉంటుంది. అర్జోపక్షేపకాలలో విషంలం ప్రవేశకాలు మాత్రమే ఉంటాయి. అమంగళమే ఎక్కువగొ ఉండే ఈ రూపకం: చివర మంగళాచరణం చేయాలి. నాయకుని యొక్క మరణాన్ని కల్పించాలి, కాసే అతడు తిరిగి బ్రతికించబడాలి. తిరిగి (బ్రతకడంకంటె ఎక్కువైన మనోరథప్రాప్తి బొండాల. దీనిలో
ఇప్పుడు వ్యాయోగమనే రూపకభేదం యొక్క లక్షం చెప్పదు ర ఇతివృత్తం ప్రఖ్యాతం. ఇతరులసహాయాన్ని అ ేక్షించేన వీరుడు నార టిమర ప్రసిద్ధులూ అయిన ప్రతినాయకులు పదిమందికంటి తక్కువగా ఉంటారు. గర్భ
65 రసార్జవ సుధాకర సుధ సంధులు ఉండవు. భారతీ ఆరభటీవృత్తులే ప్రయోగించబడతాయి. హాస్యశ్చంగార రసాలు లేకుండా రౌద్రరసాన్ని ఆశ్రయించిన కథ ఒక్క అంకంలోనే నిర్వహించ బడుతుంది. అది ఒక్కరోజుకే సంబంధించినదై ఉంటుంది. అర్జోపక్షేపకాలలో విష్మంభం చూలిక మాత్రమే ఉంటాయి. దానిలో జరిగే యుద్దానికి ప్రీ కారణం కాదు.
భాణమనే రూపకభేదంలో నిపుణమైన మాటతీరుగల విటుడు తనయొక్కగాని, ఇతరులయొక్కగానీ వృత్తాంతాలను ఉట్టంకిస్తూ తానొక్కడే మాట్లాడుతాడు. అతడు తనయొక్కగాని, ఇతరులయొక్కగానీ పరాక్రమాన్నో సౌభాగ్యాన్నో (శృంగారా నుభవాలనో) వర్ణిస్తాడుగనుక వీరశ్చంగారరసాలు సూచించబడతాయి. కవియొక్క బుద్ధిచేత కల్పించ బడిన దీనికథ ఒక్క అంకంలోనే నడుస్తుంది. ముఖ, నిర్వహణ సంధులుమాత్రమే ఉంటాయి. భారతీవృత్తితో ఒకటేపాత్రతో నడిచే ఈ భాణంలో ఆకాశభాషిత రూపంలో సంభాషణ జరుగుతుంది. ఒకవ్యక్తి అక్కడ లేని ఇతరవ్యక్తులు పలికినమాటలను తాను విన్నట్లుగా అభినయిస్తూ “ఏమిటీ? నీవు ఇట్లా అంటున్నావా?” అంటూ సంభాషించడాన్ని ఆకాశభాషిత మంటారు. భాణంలో లాస్యంయొక్క అంగాలు పది ఉంటాయి. అవి గేయపదం, స్థిత పాఠ్యం, ఆసీనం, పుష్పగంథిక, ప్రచ్చేదకం, త్రిమూఢం, సైంధవం, ద్విమూధకం, ఉత్తమోత్తమకం ఉక్తప్రత్యుక్తం.
నాయికయొక్క సుకుమారమైన గీతం వీణమొదలైన వాద్యాలతో కలిసి భావించ (పాడ) బడితే అది గేయపదం. చంచత్చుటం మొదలైన చతురశ్రగతితో నడిచే తాళంతోను, భూమిచారీ అనబడే పాదవిన్యాసాలతోనూ నాయికచేత చేయబడే వాక్యార్థాభినయం స్థితపాఠ్యం, కిందకూర్చున్న నాయికచేత కనుబొమలు, కళ్లు చేతులు, కాళ్లయొక్క విలానమ్రైన అభినయంతో నిర్వహించబడే పాఠాఖినయుం (వాక్యార్ధాభినయం) ఆసీనం. వివిధాలైన వాద్యాలసహకారంతో వివిధాలైన తాళాలు లయలతో కూడిన లాస్యం ప్రయోగించబడితే అది పుష్పగంధిక అనబడుతుంది. నాయకుడు ఇతర నాయికలతో సంగమాన్ని కలిగి ఉన్నాడని శంకించి అమితమైన రోషాన్ని పొందిన నాయికచేత తాను అతనిపట్ల (ప్రేమను తెంచుకున్నట్లు ప్రకటించడానికై చేయబడే లాస్యం ప్రచ్చేదకం. కఠినంగా లేని సుకుమారమైన పదాలు కలిగినది, సమవృత్తాలతో అలంకరించబడినది, పురుషభావాలతో నిండినదీ అయిన వగ మూరకం. దేశీయమైన (ప్రాకృత) భాషా విశేషంతో అభినయంతో క ల చెతికంకణాలు గొలుసులూ కలిగి లాస్యం ప్రయోగించబడితే అది ప్రంధవం. సుకుమారమైన అడుగులతో చిత్రమైన అర్ధంయొక్క అభినయంతో స్పష్టమైన
రసార్దవ సుధాకర సుధ 67 భావాలు రసంతో కూడిన లాస్యం ద్విమూఢకం. ఉత్కంఠతో నిండిన వాక్యాలుగలది, చక్కని గేయం యొక్క భావంతో సుందరంగా ఉన్నదీ అయిన లాస్యం ఉత్తమోత్తమకం. నాయికయొక్క కోపమూ నాయకుడు ఆమెను ప్రసన్నురాలిని చేసుకోవడమూ అనే ఈ [క్రియనుండి పుట్టినది, ఎత్తిపొాదువుమాటలతో కూడినదీ అయిన - యువతీయువకులయొక్క ప్రశ్నలు, సమాధానాలతో కూడిన మాటధోరణి ఉక్త ప్రత్యుక్త మనబడుతుంది.
తరువాతి రూపకం సమవకారం. దీనిలో ఇతివృత్తం ప్రఖ్యాతం. పన్నెండుమంది (ప్రఖ్యాతులైన దేవదానవులు నాయకులు. వీరందరూ వేరువేరు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కలిసి పనిచేస్తారు. వీర రస ప్రధానమైన ఈ రూపకంలో కైశికీవృత్తి 'ప్రయోగించ బడుతుంది. దీనిలో మూడు అంకాలు, విమర్శసంధితప్ప మిగిలిన నాలుగు సంధులూ ఉంటాయి. మూడు కపటాలు, మూడు విద్రవాలు, మూడుశ్చృంగారాలూ ఉంటాయి. మోహరూపకమైన భ్రమకపటమనబడుతుంది. అది మూడు విధాలుగా కలుగుతుంది. 1) క్రూరజంతువుల వలన (సత్త్వజం), 2) యుద్ధం మొదలైన వాటి వలన (శత్రుజం) సుడిగాలులు మొదలైన వాటివలన (దైవజం) ఈ కపటాలకారణంగా ప్రాణాలతో వట్టుబడడం లేదా మూర్చపోవడం విద్రవమనబడుతుంది. మూడుకపటాలవలన కలిగినది గాబట్టి ఆ విద్రవమూ మూడువిధాలే. ఇక శృంగారం కూడా శవ్రతదీక్షమొదలైన వాటివలన (సంతానా పేక్షతో) కలిగిన కామంతో కూడినది (ధర్మశ్ళంగారం), ధనంతోనూ ఐశ్వర్యంతోనూ ముడిబడిఉన్న కామంతో కూడినది (అర్ధశ్చంగారం), జూదం సురాపానం, పరస్త్రీ సంగమా పేక్షలవలన కలిగినకొమంతో కూడినది (కామశ్ళంగారం) అని మూడు విధాలు. సమవకారంలో ఈమూడు శృంగారాలూ ఉంటాయి. దీనిలో బిందువు, ప్రవేశకమూ ఉండవు. విమర్శసంధితప్పు మిగిలిననాలుగు సంధులు, మూడు అంకాలూ ఉంటాయి. మొదటి అంకం పన్నెండు నాడికలపాటు కొనసాగే కథను కలిగి ఉండాలి. (నాడిక అంటే 24 నిమిషాలకు సమానమైన సమయం) రెండవఅంకం నాలుగు నాడికలపాటు, మూ డవ అంకం రెండు నాడికలపాటూ కొనసాగాలి. దీనిలో వీథ్యంగాలను, ప్రహసనా ంగాలనూ కలిపి 'పయోగించాలి. వీథ్యంగాలను ప్రస్తావనయొక్క (ప్రకరణంలోనే వివరించడం జరిగింది. ఇక ప్రహసనం యొక్క పది అంగాలు ఆ ప్రకరణంలో వివరించ బడతాయి.
తరువాతి రూపకం వీథి. దీనిలో ప్రధానరసం శృంగారం. కాని ఇది దృష్యంగా కాకుండా (ప దర్శిం చబడకుండా) సంభాషణలద్వారా సూచించబడుతుంది. వలం ముఖనిర్వహణ సంధులతోను, వీథ్యంగాలతోనూ కూడిన ఒకటే అంకం ఉంటుంది.
68 రసార్ణవ సుధాకర సుధ ఒకటో రెండో పాత్రలు ఉంటాయి. కైశికీవృత్తి ప్రయోగించబడుతుంది. సాధారణంగా దీనిలో పది లాస్యాంగాలను ప్రయోగించవచ్చు. కాని అది నియమమేమీ కాదు. వీథ్యంగాలతో కూడి ఉండడం వలన కులప్రీ నాయికకావడం దీనిలో పనికిరాదు. అందు వలన నాయిక నాయకునిపై అనురాగం కలిగిన సామాన్యస్త్రీగాని, పరకీయగానీ అయి ఉంటుంది.
'ప్రహసనమనే రూపకంలో కల్పితమైన ఇతివృత్తం ముఖనిర్వహణ సంధులు, ఒకటే అంకం, పదిలాస్యాంగాలు, కైశికీవృత్తి ఉండి ప్రధానరసంమాత్రం హాస్యం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా 1) అవగలితం, 2) అవస్మందం, 3) వ్యవహారం 4) విప్రలంభం, 5) ఉపపత్తి, 6) భయం 7) అనృతం 8) విభ్రాంతి, 9) గద్దదవాక్కు 10) ప్రలాపం అనే పది అంగాలను కల్పించాలి. (ఈ పది అంగాలే సమవకారంలోనూ ఉంటాయి).
అవగలితం రెండువిధాలు 1) మొదటతాను గౌరవించి అలవరచుకున్న నడవడికను తప్పుపట్టడం 2) లేదా విడిచిపెట్టడం. అనేకమంది ఒక అయోగ్యమైన వస్తువుతో తమకు లేనిసంబంధాన్ని ఉన్నట్లుగా స్తాపించుకుని ఆవస్తువు తమకే యోగ్యమైనదని వాదించడం అవస్కందం. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చూచే వారికి నవ్వుపుట్టేట్లుగా తమలో తాము వాదించుకోవడం వ్యవహారం. భూతమో, గ్రహమో పట్టినట్లుగా నటించి ఎదుటివారిని మోసగించడం విప్రలంభం. ప్రసిద్దమైన ఒకానొక వస్తువును మరొక లోక ప్రసిద్ధమైన యుక్తితో సాధించడం ఉపపత్తి. నగర శోధకులు (రక్షకభటులు) మొదలైన వారిని చూస్తే కలిగే బెదురు భయం. అసభ్యమైన స్తుతులతో కూడిన మాటలు అన్ఫతమని కొందరు అంటారు. తాను మంచిదని భావించిన దానిని స్తుతించడం అన్ఫతమని మరికొందరి మతం, రెండు వస్తువులు ఒకటేమాదిరిగా వందర చీలన ఒరీదానిని చూచి మరొకటి అనుకోవడం భ్రాంతి. కల్లబొల్లి
లుల న మాటలు యోగ్యమైనదిగా అమెది అనబడతాయి. అయోగ్యమైన దానిని నియనది చి 'త్రియులు, చేటులు, చేటికలు మొదలైనవారి వేషభాషలతో కాముకులు, రం ల ఏటినీ కలిగిథండి ధూర్తులతో నిండినది కీర్ణప్రహసనం. ప్రహసనం. + అన్న్యాసులు వృద్ధులయొక్క వేషభాషలతో నిండినది వైక్ళత
రసార్జవ సుధాకర సుధ 600
తరువాతి రూపకమైన డిమంలో ఇతివృత్తం ప్రఖ్యాతమై ఉంటుంది. ప్రధానరసం రౌద్రం. హాస్యశ్చంగారాలు అసలే ఉండవు. సాత్త్వితీవృత్తి తక్కువగాను, భారతీ ఆరభటీవృత్తులు స్ఫుటంగానూ ఉంటాయి. ఉద్ధతులైన దేవతలు, యక్షులు, రాక్షసులు, నాగులు, గంధర్వులు, భూతాలు, భేతాళురు, సిద్ధులు, విద్యాధరులు, మొదలైన పదహారు మంది నాయకులు. వీరందరూ న్యాయమార్గాన నడిచేవారు. విమర్శసంధి తప్ప'మిగిలిన నాలుగు సంధులతో కూడిన నాలుగు అంకాలు ఉంటాయి. ఇది పిడుగుపాటు, ఉల్కలు రాలడం గ్రహణం పట్టడం మొదలైన ఉత్పాతాలవలన, యుద్ధంవలనా కలిగే ఆవేగంతో కూడి ఉంటుంది. అర్జోపక్షేపకాలలో ప్రవేశకం, విష్కంభం చూలిక ప్రయోగించబడతాయి.
ఇక చివరి రూపకం ఈహామృగం. దీనిలో ఇతివృత్తం మిశ్రమై ఉంటుంది. విష్కంభక ్రవేశకాలతో కూడిన నాలుగు అంకాలు ఉంటాయి. ముఖ, ప్రతిముఖ నిర్వహణ సంధులు మాత్రమే ఉంటాయి. (ప్రఖ్యాతుడు, ధీరోద్ధతుడూ అయిన దివ్య పురుషుడుగాని, మానవుడుగానీ నాయకుడు. అతడు తనను ఇచ్చగించని దివ్యస్తీనిగాని, కన్యనుగాని ఎ త్తుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రీ నిమిత్తంగా యుద్ధం ఉంటుంది. భయానక భీభత్సరసాలు తప్ప మిగిలిన ఆరు రసాలూ ఉంటాయి. ఐదుగురు ప్రతి నాయకులు ఉంటారు. కైశికీవృత్తి తప్ప మిగిలిన మూడు వృత్తులూ ప్రయోగించ బడతాయి. ఒకవేళ కైశికీ వృత్తికి ఉపయోగం ఉన్నా అది స్వల్పంగా ఉంటుంది. భీకరంగా పోరు జరగవలసిఉండి అది ఏదోఒక మిషతో ఆపివేయబడుతుంది.
ఈ విధంగా పదిరూపకాలయొక్క లక్షణాలనూ వివరించిన తరువాతే సిం భూపాలుడు రూపకరచనకు కావలసిన పరిభాషను నిరూపించాడు. పంప యుం ప్రాచీనులైన ఆచార్యులచేత కల్పించబడిన సంప్రదాయం. అది ౯ న విభాష అని మూడు భేదాలను కలిగి ఉంది. వాటిలో మొదటిదైన భౌ ఉన్నాయి. అని రెండు విధాలు. వాక్యవృత్తులైన ప్రాచీమొదలైన విభాషలు వ పయోగానికి వాటికి వ్యాకరణ సంస్కారం లేకపోవడం వలన అవి రూ లు తగినవి కావు. ఇక భాష సంస్కృతభాష ప్రాకృలీభాప అని లంద య
కౌమారమూ పాణినీయమూ మొదలైన వ్యాకరణాలబేతే షం విభాగంతో సంస్కరించబడినభాష సంస్కృతభాష అని చెప్పబదులర్నా మంత్రులు, దేవతలు, మునులు, నాయకుడు, బ్రాహ్మణులు, క్షత్రియుల వీరందరి విషయం కంచుకులు, సన్నాసులు, నీచపాత్రలు కాని విటులు మెదలైన) లోనూ ప్రయోగించబడుతుంది.
70 రసారవ సుధాకర సుధ ప్రకృతి యైన సంస్కృతభాష యొక్క వికృతి ప్రాకృతి అని పిలవబడుతుంది. అది ఆరు విధాలు. ప్రాకృతం, శౌరసేని, మాగద్ది, పైశాచి, చూలికాపైశాచి, అపభ్రంశం. స్త్రీ పాత్ర లన్నింటికీ నియతంగా ్రాకృతభాషే ఉపయోగించబడాలి. కొన్ని సందర్భాలలో మాత్రం దేవతాస్త్రీ, గణిక, మంత్రికుమార్తె, యోగిని, అప్సరస, శిల్చకారిణి - వీరికి సంస్కృతం ప్రయోగించబడుతుంది. పురుషపాత్రలలో ఎవరెవరు పుట్టుక చేతకాని, తమ ఉద్యోగం చేతగాని తక్కువవారో వారందరికీ ప్రాకృతమే ఉపయోగించ బడుతుంది. ఇంకా - కపటవేషంధరించిన వారికి, జైనులకూ గూడా ప్రాకృతాన్నే ఉపయోగించాలి. అధమపాత్రలలో మధ్యమపాత్రలకు శౌరసేని ప్రయోగించబడుతుంది. జాలరులు మొదలైన అతినీచపాత్రలకు మాగధి ప్రయోగించబడాలి. రాక్షసులు, పిశాచాలు, వారిలోనూ నీచులు, ఇటువంటి పాత్రలకు పైశాచి, చూలికాపైశాచి రెండూ 'ప్రయోగించ బడతాయి. చండాలురు, యవనులు మొదలైనవారి విషయంలో అపభ్రంశభాష ఉపయోగించబడుతుంది. నాటకం మొదలైన వాటిలో అపభ్రంశభాషను ఉపయోగించడానికి ఇష్టపడని వారు చండాలుర వంటి పాత్రలకు కూడా మాగధి మొదలైన భాషలనే ఉపయోగిస్తారు. ఇట్లా అన్నిపాత్రలకూ నియతమైన భాషజంది. ఆయాపాత్రలు తమకు నియతమైన భాషను కాకుండా వేరే భాషను మాట్లాడితే అది ఒక కారణంతో జరగాలి. ఆ కారణం గొప్పతనం (మహాత్యం) తగ్గిపోవడం, మితిమీరిన మత్తు, వేషం మార్చు కోవడం, విభ్రాంతి పొందడం, వ్రాసిఉన్నదానిని అట్లాగే చదవడం, ఇతరులు అన్నమాటలను అట్లాగే మళ్లీ చెప్పడం మొదలైన వాటిలో ఏదైనా కావచ్చు. సరాసరిగా పేరుపెట్టి పిలవడానికి వీలులేని వారిని మరొకపేరుతో పిలవడాన్ని నాట్యశాస్త్రజ్ఞులు నిర్దేశమని పేర్కొంటారు. అదిపూజ్యనిర్దేశం, సదృశ నిర్దేశం. కనిష్ట నిర్దేశమని మూడువిధాలు. పూజ్యనిర్దేశమంటే పూజ్యులను వేరేపేరుపెట్టి పిలవడం. మొదటగా దేవతలు, మునులు, సన్నాసులు “భగవన్” అని, దేవతాస్త్రీలు, తపస్వినులు, సన్యాసినులు “భగవతి” అనీ పిలవబడతారు. (బ్రాహ్మణులు “ఆర్యా” అనీ, వృద్ధులు తాతా (తండ్రీ) అనీ పిలవబడాలి. ఆచార్యుడు “ఉపాధ్యాయా” అని, గణిక “అజ్జుకా” అని, భూపాలుడు (రాజు) “మహారాజా” అని, విద్వాంసుడు “భావా” అని సంబోధించ బడతారు. బ్రాహ్మణులకు రాజును పేరుపెట్టి పిలవడానికైనా స్వాతంత్ర్యం ఉంటుంది. పరిజనులు, ఉద్యోగులు, సేనాపతులు మొదలైన ఉన్నతాధికారులూ రాజును “దేవా” అని పిలుస్తారు. సార్వభౌముణ్ణి అయితే పరిజనులు “భట్ట” “భట్టారక” శబ్దాలతో సంబోధిస్తారు. మునులు అతజ్లి తమ బిడ్డవంటి వాడనే వాత్సల్యంతో “రాజా” అనీ,
రసార్దవ సుధాకర సుధ 71 విదూషకుడు తన ఇష్టాన్నిబట్టి “సఖా” (మిత్రమా) అనిగాని, “రాజు” అనిగాని సంబోధిస్తారు. మంత్రిని బ్రాహ్మణులు “అమాత్యా” అనిగాని, “సచివా” అనిగాని సంబోధిస్తారు. ఇతరులు మాత్రం “అమాత్యా” అనే పిలుస్తారు. సారథి రథికుణ్ణి “ఆయుష్మన్” అని పిలుస్తాడు. ప్రశాంతులు (తపస్సు చేసుకునేవారు) “త్రపస్వీ” అని “నద్రో” అనీ సంబోధించబడతారు. యువరాజుగా అభిషేకించబడిన రాజకుమారుడు “స్వామీ” అని, కేవలం రాజకుమారుడు “భర్తృదారకా” అనీ పిలవబడతారు. సోదరి భర్త “ఆవుత్తు”డని సేనాపతి “స్యాలూడనీ చెప్పబడతారు. రాజపత్స్నులను పరిజనులు “భట్టినీ”, “స్వామినీ”, “దేవీ, “భట్టారికా? అనే పిలుపులతో పిలుస్తారు. రాజు పట్టమహిష్షిని మాత్రం “దేవో అనీ, ఇతరభార్యలను “ప్రియా” అనీ పిలుస్తాడు. పురుషపాత్రలన్నీ తమతమ భార్యలను “ఆర్యురాలా” అనిగాని, లేదా ఆమె తండ్రియొక్కగాని, కొడుకు యొక్కగానీ పేరుమీదుగా మాఠరపుత్రీ అనిగాని, సోమశర్మ జననీ అనిగానీ పిలవాలి. కొడుకు తండ్రిని “తాతపాదులు” అనీ, తల్లిని “మాతా” “అంబా” అనీ పిలవాలి. అన్నగారిని తమ్ముళ్లు, మేనమామను మేనల్లుళ్లు “ఆర్యా అని పిలుస్తారు.
ఇక సదృశ నిర్దేశమంటే సవయస్ములను సంబోధించే పద్ధతి. తనకు సమానులు, సవయస్కులూ అయిన వారిని పురుషులు “వయస్యా” అని గొని, పేరుతో గానీ పిలవాలి. స్రీలు తమకు సవయస్తలైన చెలికత్తిలను “హలా” అని గొని, “సఖీ అని గానీ పిలుస్తారు.
కనిష్టనిర్దేశమంటే తమకంటె చిన్నవారిని పిలిచేపద్ధతి. కొడుకు, శిష్యుడు, తమ్ముడు, పెద్దలచేత “వత్సా”, “పుత్రకా”, “దీర్దాయూ” “తాతా” (తండ్రీ) “జాతా”. (బిడ్డా అనే పేర్లతో పిలవబడతారు. ఈ ముగ్గురూ కాకుండా ఇతర చిన్నవాడు పెద్దలచేత వారివారి యొక్క వృత్తి, లేదా ఉద్యోగం పేరు మీదుగా గొని భద్రా “భద్రముఖా” అనిగానీ పిలవ బడతారు. నీచస్రీపాత్రలను “హందే” అని, అతినీచస్తి పాత్రలను “హంజే”అనీ పిలుస్తారు. ఈ విధంగా ఆయాపాత్రలవిషయంలో సంబోధనలు లోకంలో జరిగే ప్రయోగాలకు, శాస్త్రంలో చెప్పబడిన ప్రయోగాలకూ విరుద్ధం కాకుండా ప్రయోగించబడాలి. కంచుకి
'_ప్రఖ్యాతేతివృత్తంగల రూపకాలలో మూలకథలో పేర్లు చెప్ప అన్ని
మొదలైన పాత్రలకు, కల్పితేతివృత్తంగల రూపకాలలో నాయకుడు మొదలు కం పాత్రలకూ. కవి రసానికి అనుగుణంగా పేర్లను కల్పించాలి. కంచుకిపొత్రలకు వి
72 రసార్జవ సుధాకర సుధ ధరుడు, బాభ్రవ్యుడు, జయంధరుడు, జయుడు మొదలైన విశ్వాససూచకాలైన పేర్లను పెట్టాలి. చేటికలకు సుకుమారమైన లతలు, పువ్వులు, అలంకారాలు, మొదలైన వసువుల పేర్లుగాని, లేదా వారి గుణాలను సూచించే పేర్లు గానీ పెట్టాలి. సేవకులకు కరభుడు, కలహంసుడు మొదలైన పేర్లను, వందులకు కర్పూర చండుడు కాంపిల్యుడు మొదలైన పేర్లనూ పెట్టాలి. మంత్రులకు సుబుద్ధి, వసుభూతి మొదలైన పేర్లు, పురోహితులకు దేవరాతుడు, సోమరాతుడు, శ్రీవత్సుడు, గౌతముడు, గార్జుడు, కౌత్సుడు మౌద్ధల్యుడు మొదలైన పేర్లూ ఉచితమైనవి. ధీరోదాత్తనాయకుల పేర్లలో మొదట ప్రతాప, వీర, విజయ, మాన, విక్రమ, సాహస మొదలైన పదాలు, చివరన వసంత, భూషణ, ఉత్తంస, శేఖర, అంక పదాలూ ఉండాలి. ధీరలలితులకు చంద్రాపీడుడు, కామపాలుడు మొదలైనపేర్లు తగినవి. ఉద్ధతస్వభావంగల వారికి ఉగ్రవర్మ, చండసేనుడు, మొదలైనపేర్తు ఉచితమైనవి. వైశ్యులకు దత్తుడు, సేనుడు మొదలైన పదాలు చివరగల పేర్లుపెట్టాలి. నాయికలకు కర్పూరమంజరి, చంద్రలేఖ, రాగతరంగిక, పద్మావతి మొదలైనపేర్లు తగినవి. పట్టపురాణులు ధారిణి, లక్ష్మి, వసుమతి, మొదలైన పేర్లతోను, ప్రతిగ్రహ వేశ్యలు భోగవతి, కాంతిమతి, కమల, కామవల్లరి, ఇరావతి హంసపదిక మొదలైన పేర్లతోనూపిలవబడాలి. బ్రాహ్మణులపేర్ల చివరన శర్మ అని, క్షత్రియుల పేర్ల చివర వర్మ అని, వైశ్యుల పేర్ల చివర దత్తుడు అనీ ఉండాలి. విద్యాధరరాజుల పేర్లచివర అంగద, శిఖండ, చూడపదాలు ఉందాలి. కాపాలికుల పేర్లలో చివర కుండలుడు, ఆనందుడు, ఘంటుడు వంటి పదాలు చేర్చబడాలి. కాపాలికప్తీలకు యోగసుందరి, వంశప్రభ, వికటముద్రిక, శంఖకేయూరిక మొదలైన పేర్లు యోగ్యమైనవి. ఆనందిని, సిద్ధిమతి, శ్రీమతి, సర్వమంగళ, యశోవతి, పుత్రవతి మొదలైనవి పుణ్యస్త్రీలకు తగిన పేర్లు. ఇంతవరకూ చెప్పబడిన లక్షణాలనన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సూక్ష్మబుద్ధియైన కవి చక్కగా కావ్యాన్ని రచిస్తే అది ఆచంద్రతారార్శం నిలిచిఉంటుంది. లక్షణాలను, వాటికి తగిన లక్ష్యాలనూ రచించడమనే విశేషప్రక్రియలో అభినివేశంగల పండితులు అసూయకులోనుగాకుండా ఈగ్రంథాన్ని పరీక్షిస్తారుగాక. భరత నిర్మితమైన నాట్యశాస్త్రంలో ప్రవీణుడు, రసికుడూ అయిన సింగభూపాలుడు ఈ విధంగా - “రసార్లవసుధాకరమనే' (గ్రంథాన్ని రచించాడు. , భదరయ్య గ్రంద్యానా (* ((04292నట్న క2 ఆ ఆ౭ షౌ రగ
౮ పం - ఛో స _ (| [కట “శ్లూ/్ థీ ]