Telugu rajyam samkshemam - anilvaranasi/indianlanguages GitHub Wiki
[రాజ్యం-సంక్షేమం కె.బాలగోపాల్ ఉపన్యానాలు ఫ్ధ్ర' శసృజ్నో గళ ॥ న. | | షక (92400 క
04 8 ౧ గ ఆం॥120 [౧0+ ౮6|| [404101 ర1001 90-34. 58016. 8410216010 6112-/00064 న నా 10.6.1952 08.10.2009 | | ఆదర్శానికి ఆచరణకు - విశ్వాసానికి వ్యక్తిత్వానికి | మధ్య అంతరం లేనివాడా జీవించే మానవ హక్కుకోసం అహర్షిశలు శ్రమించి పట్టణం వదిలి పల్లెవెంట తిరిగినవాడా పౌరహక్కుల సాధనలో రాజ్యాన్ని ప్రళ్ళించి | హింసకు గురైనవాడా ; -. -- సెలవంటూ మమ్మల్నందరినీ వదిలివెళ్ళిన | |! “ఇ పొర మానవ హక్కుల బాటసారి
- ఛ్రీ కె. బాలగోపాల్ సరా ర న “= సొత్రనమన్సాలత్తో! న. హం.
+] కం. అ న్ 7 శ ॥ ల్ యట్టి 4 ఆ . % మా . న. 1 లా వా వి న. ॥ 7 ॥ ॥ | మ్ (శ ల్ ॥ య ,” క. నే ఇ స ఎనీ ళో న = లా న మా (7 వో ల్ ॥ రజ! శ (క 1 ల స రం ఈ! . న కై. గ, గ ఇ నా (4 లే గ / నం ౯ గల ( సోల్ ( టు స చం అ శి న గ య వ. న ఖీ 1 ళీ ఖే / 4 లా యు. న్. 2౨ భ్ శే ఖ్ 'భ్ష| హో క్ల | ఇతే! - మ 1 క చ్ త్త. న. (మ ము... మ / యం న | క. త్ర. గ య్ న. న లం లక్ క్ ఖా 1 న నాం బ్ స క క. గా (| ( లం. (1 నం. || నా క 1, గం! క్ .. బ్గో గస గ 1... షః / గ ః శ? స సగ న 1 శవ న. న న. మ స న. , (| న. న ఖగ బు | గ. స లు టం టల. సం లట న... 7 ,. ||. స “ల శ బ్ న
శః పట నా. (స్తం! / గార్ల సం మిన ప 1. స య 7! స || తానా 1 గే న్ లల... /1 ఇన్ టు మనను క”, 1 లం! న “తాం గ! న్న క జ్. లన | (గ కే. |. న [తోము న్లో ను న! య స న స ర య కే శ య మో కాస్త వగ సనా. వ (జక క ా కలు. ్టా, హా. క వ... శ్ న! / ఏ / [| (| స్ట ॥ న. య మ పం | (+ / లై క్ లా | సక్తి న్ ల! స వు లో ఓ ల , త . ల! | ॥ ల నారా శు చు వ . న. గ్ పం న్జం | న్ా మ ? , స ' 1 పర్ స్పెక్టివ్స్ జీ న్తం / సాహిత్తం సామాజిక శాస్త్రం ల్ జ బాద్ హైదరా 2010
బాలగోపాల్ జననం - బళ్ళారి (కర్ణాటకులో తండ్రి కందాళ పార్ధనాధళర్మ, తల్లి నాగమణి. జర్టులిస్ట్ వేమన వనంత జీవిత సహచరి. చదివింది ఎమ్,ఎస్.సి. (ఆర్ఇ.న్- వరంగల్ గణ్తంలో డాక్టరేట్ - న్యాయవాద శాస్త్రం. కాకతీయ యూనివర్సిటిలో గణితళాస్త్ర ఉపాధ్యాయుడు (1987-1985). ఆం.ప్ర. పౌరహక్కుల నంఘంలోనూ (1987- 1998), అ తర్వాత చివరివరకూ మానవహక్కుల వేదికలో వనినేశారు. లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. చాలాకాలం విరనం నభ్యుడు. ద్రజాబంధు అనే మునుగు నంస్ద 1989లో కిడ్డాప్ చేసింది. అనేక న్వతంత్ర రచనలతో సాట్టు, బిన్సు వత్రికలలో కూడా కాలమ్స్ రాశారు. ఇంగ్రీషులో ఈ.పి.డబ్లు ఇంకా ఇతర మాగజైన్గ లోనూ, అనేక తెలుగు వత్రికల్లోనూ వ్యాసాలు రాశారు. బాలగోపాల్ వర్ స్పె క్రీ వు నంస్థావక నభ్యుడు. బాలగోపాల్ ఇంగ్లీష్ రచనల కోసం : ₹ెగాగ-అ21280021.028 ్్న 199.978-81-905756-5-2 శ్ర / /. ప్రింట్ సపోర్ట్ ప్రచురణ సంఖ్య : 38 భే గే ల. వేమన వసంత లక్ష్మి అక్టోబరు 2010 భా. | మన్నం బ్రహ్మయ్య ఫో రాజ్యం = సంక్షేమం / స్ బ్ బుక్ మేకింగ్ (ఉపన్యాసాలు) స నో బ్లీ విశ్వేశ్వరరావు ర్త సెల్ : 94906 34849 కె. బాలగోపాల్ లో స్ట్ = వజ | కవర్ డిజైన్ ళీ న్నా స రమణజీవి పబ్లిషర్స్ ప్త పర్ స్సెక్టివ్స్ న్ (7 కారికేచర్ సామాజిక శాస్త్రం / సాహిత్యం 7/1 శ శంకర్ (సాక్టి "హైదరాబాద్ జ్ 41010 గ కంపోజింగ్ సోల్ డిఫ్టిబూటర్స్ గ లి శ్రీశ్రీ గ్రాఫిక్స్ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ క్ హైదరాబాద్ విజ్ఞాన్‌భవన్ - బ్యాంక్స్టీట్ లి ముద్రణ హైదరాబాద్ - 500 001 య్ శ్రీశ్రీ ప్రింటర్స్ న్ నెం. 040-247445 యాల _10- ఫో జయ స 28-10-26/1, గ సాని గ్ా. ఈ గ్యరండల్పేట ఖలాలా న్ సగ -బజవాడ - 2 వెల : ఆ ౧. టం టీ8ర06- ' వట కంయా రం తలా ల + = .
ఓ నన ర్ న. 1 య న... నే త [లభ క య. మిం ల థి (నయ వ్ టన నై. మ తననే స శ శభ క్! నం వాసా * బాలగోపాల్ ఉపన్యాసాలు...
9 క్రియాత్మక ఆచరణకి నిజాయితీకి
కొండగుర్హు బాలగోపాల్ 7
౨ రాజ్యం - సంక్షేమం 11
త అభివృద్ధి విధ్వంసం తీర్
గ్ ఆల్మట్టి 63
ఈ
4 రాయలసీమ రాజకీయ ఆర్థిక జీవితం 77
| వాకపల్లి య కోర్టులు 101
- నక్సలైట్ ఉద్యమం 111
9 అమెరికా యుద్గోన్మాదం, 123
-
చైనా ఆర్థిక అభివృద్ధి - సింహావలోకనం 134
-
భయాంధ్రప్రదేశ్ 153
అత్త వ మచ్చా వ ల న మై చుపు స్టా మనన. స్స హ్ గ్ా న. న న్న వి _ ల్ వసా? న న టం సెస్ న నన! స. కస. స్నా మ స అమ్మా నం వక = ఖో శ న్ ఫా గా కటిం ల్ భ్ర మా యట ఇ “1 ప్ టు ల స్ వ కా? నో న. ళన ణే మా 2 నా సు యాన క న పాం ॥ మా వ్ సా సే స క్ గాబా పల వ న న నే. న నం స్టా స మ మ్మ య. ప సైపో టం. న... న ల గ్ [న ల్ య ఆ వన తే ళు షల్ య. పే ప్రా షా మ్ శక న? 11 సా 4వ వా. క్ న న. 1 తన. న్దా స [ "వై ష్. స్. | లలి నన్న స స న. వ వ. స్ట త సల నా ల పై ల స 1 వు గ ళం బీ లీ చ (కాక ప్ ఆ షో య రా ల 14 - లఎఫాి ె హాం మాన వా వ్ న ( కష... జస గె _ ఎన్నవ ప్తె టప 0. నం | టి ష్ న మ (| మ 0 చౌ _ వక వ్లన [చే యో ల వ క చేట గో ల్ల వ్ వు. వ వస గంత ఇ వ త్ నం తపా వ శనగ, క ళల (జ్ కాంగా. జౌ చ్యన్నాక్ష్వ్వా న్ , ష్ | న్స శ్రా ం హ్ష్ మ అశ స్టే న. న న ట్ న వళ్లే ఖః ఆలా ంతాాంా, క న మ నా! శ్రీలత. నా ఆ న్నా వః పా వే ॥ నన్న న. - పప త క గయా వై హమ సాన్నాక్ న: 5 కళలు ల! సా | ్ ళం 2 స వా. ౯ నై | స ను. సను న షా భా. జ ఇ శమ వ్ర వశ వూ: జ్ న్ మ్ స టి 1 “౬ ఉమ డ్ టి వ ళా వ్వా నం... మ. న య, వలెనే టి వ్వ నో! ల! ం న స గ / న్ మటు సా + వస మ. ॥ | స | నవ! నాం స్త స్ టల |” నాసి . ॥ ఇ క న, క |. న. ౧. య... స చా న” సై న్ నాన” టో ప జె. . మ య య్ | న్ ముగ? 2! అడ. న. సస స స ్ట న వో ౯ నం ష్ట వా గ... స స స న నటాషా ప (కా నాల. వీ ల. | స్ట . ను స్ మైన నైన్ గ్ా మ్. | లా" షె గ్? క్ రన్. వ్ శక త స స మ, ళ్! క 1 మజ. 2 స్మ సన్న న క్రమ తీ ॥ వ్వా కక్క నాన్ ప రం క 1 టే య ట్య షల క ష్ 1/ ఇచే
(క్రియాత్మక ఆచరణకి నిజాయితీకి కొండగుర్హు బాలగోపాల్
జక్కో సంవత్సరం వెళ్ళిపోతూ కొండంత దుఃఖాన్ని మిగిల్చిపోతోంది. మనుషు లందరికీ ఒకే విలువ ఉండే సమాజం కోసం కృషి చేస్తూ, బాధిత ప్రపంచం తరపున క్రియాశీలంగా నిలబడ్డ యోధుడు బాలగోపాల్. మన కాలంలో మన మధ్యే జీవించి, పీడిత ప్రజలకోసం పని చేసిన బాలగోపాల్‌ది ఒక అరుదైన వ్యక్తిత్వం. సమాజాన్నే తప్ప వ్యక్తిగతమైన ఇతర వేటినీ తను పట్టించుకోలేదు. 2009 అక్టోబరు 8న అనారోగ్యంతో చనిపోయిన బాలగోపాల్ ప్రజల కొరకు, పౌరహక్కుల కొరకు అవిశ్రాంతంగా పనిచేశాడు. ఆచరణ - అదర్శాల నడుమ వైరుధ్యరహిత జీవితాన్ని గడిపిన బాలగోపాల్ ఎక్కడ ఆధిపత్యం, అణచివేత, అసమానత లున్నా వాటిని ప్రల్హించాడు, మాట్లాడాడు, రాశాడు.
బాలగోపాల్ రచనలను కొందరం సంపుటాలుగా తేదలచుకున్నాం. అందులో మా బాధ్యతగా మూడు సంపుటాలు తెస్తున్నాం. త్వరలో దళిత ఉద్యమాలపైనా, ఎమ్.ఎల్, ఉద్యమాలపైనా రాసిన వ్యాసాల్ని తీసుకురాబోతున్నాం ఆ రెండు సంపుటాలు కొంత ప్రయత్నించి, వీలైనంత సమగ్రంగా తేవాలనే ఉద్దేశ్యంతో వాయిదావేశాం. ప్రస్తుతానికి రికార్డు అయిన బాలగోపాల్ ఉపన్యాసాల్లో వ్యాసాలుగా రాని విషయాలను కొన్నింటిని ట్రాన్స్్కైబ్ చేసి ప్రచురిస్తున్నాం. బాలగోపాల్, తన ప్రసంగాల్లో ఎక్కడా అతిశయోక్తులు వాడేవాడు కాదు. తను మాట్లాడే ప్రతి అంశాన్ని ఎంత వాస్తవంగా (నిజ నిర్ధారణగా) విశ్లేషించాలో అంత మేరకు చేసేవాడు. విషయాలను వివరించేప్పుడు కార్యాకారణ సంబంధాలని చాలా శాస్త్రీయంగా, సహేతుకంగా వివరించి, విశ్లేషించేవాడు. సామాజిక అనుభవాన్ని అర్థం చేనుకోవడానికి కొత్త కోణూలని ఆవిష్కరించేవాడు. అందుకే ఆయన ప్రసంగాలకి ఆయన రచనలకుండే శక్తి ఉన్నది.
ఈ ప్రసంగాలు ఆయన భిన్న సందర్భాల్లో చేసినవి. బాలగోపాల్ చరిత్రను, సమాజాన్ని - దాని ఘర్షణను ఒక “మౌలిక విలువలు, నైతిక ప్రమాణాల చట్రం నుండి చూసాడు. సామాజిక సంబంధాలు ఉన్నతీకరించడానికి నైతిక ప్రమాణాలు చాలా అవసరమని బలంగా వాదించాడు. ఈ విశ్వాసం వల్లే ప్రజాఉద్యమాల్లో, విప్లవ పోరాటాల్లో తాము ఏ “విలువలి చట్రంలో పనిచేస్తారో ప్రకటించి, తాము చెప్పిన ప్రమాణాలకు లోబడి ఉద్యమాలు నిర్వహించాలనేవాడు. దీనివలన ఉద్యమాలకు ఒక న్పష్టత వస్తుందని, వాళ్ళ ప్రవర్తనను నమాజం అర్థం చేసుకొని, వాళ్ళతో చర్చించడానికి తోడ్పడుతుందని భావించాడు. పర్ స్పెక్టి వ్ మూడు దశాబ్దాల ప్రచురణల కృషిలో బాలగోపాల్ ఒక భాగస్వామి. 'నూరు వూలు వికసించని, వేయి ఆలోచనలు నంఘర్షించనీ' అన్న స్ఫూర్తికి మా ప్రచురణలు దోహద పడతాయని నమ్మి తన నిరంతర సహకారాన్ని అందించాడు. నిజానికి పర్ స్పెక్టి వ్స్ ఎందుకోసమో వివరిస్తూ ఒక చారిత్రక మేనిఫెస్ట్రోని ఈ విధంగా రాశాడు -
“మానవజాతి భవిష్యత్తును గురించి ఇవ్వాళ చాలా చర్చ జరుగుతూనవుంది ఏ రకమయిన అనమానతగానీ, అణచివేతగానీ లేని నమాజం కావాలని అభ్యుదయ వాదులందరూ కోరుకుంటారు. కానీ ఆ నమాజు స్వరూప న్వభావాలను గురించి వకాభిప్రాయం మట్టుకు అభ్యుదయవాదులలో నర్వత్రా లేదు. మార్చ్ రచనలతో ఒత (పామాజీళమయిన రూవం తీనుకున్సు బర్చు ఈనాటికీ ముగియలేదు. అణఖబివేతలోనూ అనమానతలోనూ కొత్త కోణాలను చరిత్ర ముందుకు తెచ్చేకొద్ధీ చర్చ మరింత వాడీగా సాగుతూవుంది. మరింత జటిలం అవుతూవుంది. తొల్త కోణాలలో కొని నిజానికీ చాలా పాతవే కావడంతో వాటిని ఇన్దాళ్ళూ ఎందుకు చూడలేకసోయామన్సు విమర్భ బర్చకు కొంత వేడిని కూడా చేరున్తూ ఉంది.
ఆ చర్చలో అనేక రకాల దృత్సథాలు గల వ్యక్తులు పాల్గొంటున్నాడు. అనేక ఉద్యమాలు పాల్గొంటుస్తాయి. అనమానతత్యూ అణబివేతకూ కొత్త కోణాలను ఆవిష్కరించే వారు, ఇవ్పటికే ఉన్సు విస్ణవ నిద్దాంతాలు వాటిని ఆకళింవు చేనుకోలేవనే వారు అనలు కొత్త కోణాల ఆవిష్కరణో నిరుపయోగమయిన టప్రయాన అనుకునేవారు, ఇవ్పటికి ఉన్స నద్ధాంతాలే సామాజిక జీవితంలోని అన్ని పార్వాలనూ అవగాహన బేనుకోగలవనుకునే వారు, అనలు “సిద్దాంతం” నిర్మాణం” అనేనే మానవ జాతి వికాసానికి అవరోధం అనుకునే వారు అభ్యుదయం కోసం ఇవ్చటిదాకా జరిగిన ప్రయత్తమంతా వృధా అనుతకొనేవారు, దాని మంచి చెడులనుంజి గుణపాఠాలు తీనుకోగల
మనుకునేవారు, రాజకీయ ఆచరణలో నిమగ్చం అయినవారు, ఆచరణతో నిమిత్తం లేనివారు...... ఇంకా అనేకులు ఇవాళ మానవ భవితవ్యాన్ని గురించిన ఈ చర్చలో పాల్గాంటున్నారు,
ఈ చర్చకు నంబంధించి వర్ స్పై కీ వ్రో'కు ఒక దృక్పథం ఉంది. మానవ నమాజం గురింబీ దాని భవిష్యత్తు గురించీ బుద్ధుడి నుండీ ఈనాటిదాకా అనేకులు ఊవాలు చేశారు. నీద్ధాంతాలు చేశారు. ఎవ్వరూ కాదనలేని ఆదర్శ్హాలు మన ముందుంచారు. ఆ ఆదర్శాలను సాథించే మార్గాలను వ్రతిపొదించారు. ఈ అన్వేషణకు శాస్త్రీయ (ప్రాతిపదిక కల్పించి నేలమోద నిలబెట్టింది మార్క్సిజం. మూర్చ్స్ రచనలు చేయడం మొదలు పెట్టిన తరువాత చర్చ యావత్తూ అయన ప్రతిపాదించిన అధ్యయన బం చుట్టూ వరిభమిన్తూ ఉంది. అంగీకరించే వాళ్ళూ, నవరించేవాళ్ళూ, తిరన్కరించేవాళ్ళూ అందరూ దానినే వ్రమాణంగా స్వీకరించారు. ఇవ్వాళ తూర్పు యూరప్, సోవియట్ రష్యా, బైనా దేశాలలో వన్తూన్హు మార్చుల వలితంగా బెలరేగుతున్లు చర్చ స్వభావం కూడా ఇందుకు భిన్సంగా లేదు. ఇక మోదట ఉండబోతుందని మేము అనుకోవడం లేదు.
ఇవ్సటికీ సిద్దాంతం ఆచరణలకి సంబంధించిన నమన్యలని మార్క్సిజం అధిగ మించిందని చెవ్సలేం. పాత సమన్యలు వరిష్కరించుకొనే క్రమంలో కొత్త నవాళ్ళు మార్క్సిజం ముంగిట కొన్తున్హాయి. కొత్త నిర్వచనాలు, కొత్త (వతిపాదనలు, వ్రత్యామ్హాయాలు రూపొందు తాయి. సామాజిక పరివర్తన కోసం జరుగుతున్లు మొత్తం చర్చలో భాగము మార్క్సిజం గురించిన చర్చ కూడా.
ఈ చర్చలో అన్లి కోణాలకూ అన్దిపోకడలకూ వేదిక కల్పించాలని వర్ స్పె క్రి వు" భావిస్తూ ఉంది. ఆర్ధిక పరిమితుల వల్ల అన్ని వుస్తకాలు ప్రచురించ వీలుకాకున్హా, ఆ దిళగా చర్చను ప్రతిపాదించే వుస్తకాలను ప్రచురించాలను కొంటున్హాం. అణబివేతనూ, అనమానతనూ వ్యతిరేకించేది ఏదయినా వ్రజాస్వామిక దృక్పథమే. మౌలికంగా అభ్యుదయ దృక్పథమే. ఆపైన ఎన్‌సి తేడాలున్హా వినదగినదే చర్చించదగినదే, అధ్యయనం చేయదగినదే. నూరు ఫూలు ఎికసీంచన్సీ వేయి ఆలోచనలు నంఘర్షించనీ” అని మావో ఒళ చారిత్రక నందర్భంలో ఇచ్చిన వీలువుకు ఈ నిర్హిప్రమయిన అర్టంలో సార్దత్రిక ప్రాతివదిక ఉందని ఏ ర్ స్పె కీ వ్వ్' భావిన్తూ ఉంటి. ఆ అవగాహనతో ప్రచురణలు చేవడుతుంది. ప్రజాస్వామిక న్వభావం కలిగిన నమర్ధవంతమయిన
రచనలను వ్రచురించడం ద్వారా కొనసాగుతున్న 'భ్రేట్ డిబేటొకు దోహదం చేయాలని మా సంకల్పం.” విలువైన రచనలను, విలువల కొరకు నిలబడే రచనలను ప్రచురించటం మా సామాజిక బాధ్యతగా మేం భావిస్తున్నాం, ఆ లక్ష్య ప్రకటన వెలుగులోనే బాలగోపాల్ 'ప్రసంగాలని ఇప్పుడు ప్రచురిస్తున్నాం. బాలగోపాల్ రచనలని ప్రచురించే ప్రయత్నంలో మితృల సహకారం మరువలేనిది. ముఖ్యంగా వేమన వనంత లక్ష్మి మన్నం బ్రహ్మయ్యలు దివారాత్రాలు కష్టపడ్డారు. ఈ ప్రచురణ విషయంలో మరో నలుగురు మిత్రులు అందించిన సహకారం మరువలేనిది, వారు విశ్వేశ్వరరావు (శ్రీశ్రీ ప్రింటర్స్ - విజయవాడ), రవీందర్ రెడ్డి (శ్రీశ్రీ గ్రాఫిక్స్ - హైదరాబాద్), రమణజీవి, రావికంటి సుధాకర్. ఈ మిత్రులందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం. ఉపన్యాస రూపంలో ఉన్నవాటిని చదువుకోవాల్సి రావడం కొంత ఇబ్బందే కావచ్చు కాని మరో మార్గం లేక అలాగే ప్రచురిస్తున్నాం. ఉపన్యాసాలవటం వల్ల సాధారణ వాక్య నియమాల ఉల్లంఘన కొన్ని చోట్ల జరిగింది. కాలవ్యవధి రీత్యా ఇంతకన్నా బాగా తీసుకురాను వీలుకానందుకు మన్నించండి, బాలగోపాల్ ప్రారంభించిన చర్చని, ఆలోచనలని కొనసాగించే (క్రమంలో భాగంగా మా తరపు నుంచి జరిగిన మరో ప్రయత్నాన్ని కూడా మీతో పంచు కొంటున్నాం. మా సభ్యులు వి.ఎస్.ప్రసాద్ చొరవ, సౌజన్యంతో కాకతీయ యూనివర్పిట్ ప్రతి సంవత్సరం వరంగల్‌లో ఒక స్మారక (ఎండోమెంట్) ఉపన్యాసం జరిగేలా ఏర్పాటు చేసింది. ఇందుకు సహకరించిన యూనివర్సిటీ అధికారులకు మా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం, బాలగోపాల్ వెలిగించిన ప్రజాస్వామిక జ్యోతిని, విలువలని కడదాకా కాపాడు కునేందుకు ప్రయత్నిస్తూ... బాలగోపాల్‌కి మా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మీ జి. హరగోపాల్, వి.ఎస్.ప్రసాద్, డి. నరసింహారెడ్డి, ఆర్.కె హైదరాబాదు పర్స్పెక్టివ్స్ 08.10.2010
రాజ్యం-సంక్షేమం
ఆశి
సం౦క్షేమమనే బాధ్యత మాకు లేదు అని ప్రభుత్వాలు ఈరోజు స్పష్టంగా అంటూ ఉన్నాయి. కాని వాళ్ళకు ఆఅ బాధ్యత ఉంది అని ప్రజలు భావిస్తున్నారు, ప్రజా ఉద్యమాలు భావిస్తున్నాయి. ప్రజలు, ప్రజా ఉద్యమాలు భావించటం మాత్రమే కాకుండా, భారతదేశాని కుండే రాజ్యాంగం కూడా భావిస్తున్నది, చాలావరకు. రాజ్యాంగం భావిస్తున్నది అంటే ఎవరో రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు భావించారు అని కాదు అర్థం, రాజ్యాంగం వెనకాల సామాజిక సంఘర్షణలుంటాయి, ఆఅకాంక్షలుంటాయి. ఆ ఆకాంక్షలూ, కోరికలూ ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా రాజ్యాంగంలో భాగమవుతాయి కాబట్టి ఈరోజు అకస్మాత్తుగా మాకు ఈ బాధ్యత లేదు అని ప్రభుత్వాలు ప్రకటించటానికి వీలులేదు. అది కేవలం ఈనాటి ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకం మాత్రమే కాదు. గతంలో మన సమాజంలో ముందుకొచ్చిన ఉద్యమాలు, పోరాటాలు, ఆకాంక్షలు, వాటి వారసత్వాన్ని వమ్ముచేయటం, తిరస్కరించటం అవుతుంది. అందుకే ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన అవసరం చాలా ఉంది. గతంలో సాధించుకున్నటువంటి విలువలనూ, ప్రమాణాలనూ, హక్కులనూ కాపాడు కోవాల్సిన అవసరం చాలా ఉంది.
ఒక్కొక్క దశలో కొన్ని ఉద్యమాలు, పోరాటాలు ముందుకొస్తాయి. అవి కొన్ని హక్కు లనూ, ప్రమాణాలనూ, విలువలనూ ముందుకు తెస్తాయి. అవి వ్యవస్థలో రకరకాల రూపాలలో నిక్షిప్తమై కనిపిస్తాయి. వాటిని మనం కాపాడుకొన్నమేరకే ఇంకింత ప్రగతి, ఇంకింత అభ్యుదయం సాధించగలుగుతాం. సాధించుకొన్న ప్రగతిని కాపాడుకోలేకపోతే మళ్ళీ మళ్ళీ పాత వాటి కోసమే ఉద్యమాలు చేయవలసి వస్తుంది. ఇవ్వాళ మనల్ని ఆ స్థితికే నెట్టేస్తున్నారు. చాలా ప్రత్యక్షంగా ఇది కార్మిక రంగంలో జరుగుతోంది. కార్మిక చట్టాల్లో ఏ చట్టాన్నీ ఇప్పటి దాకా మార్చలేదు కానీ, ఆచరణలో వాటిని పాటించాల్సిన అవసరం లేదు అనే పద్ధతిలో మొత్తం లేబర్ డిపార్ట్మెంట్,
జే నా “నకం
ప్రభుత్వమూ, కోర్టులూ వ్యవహరిస్తున్నాయి. సెంటర్లో స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఏర్పడితే ఆ చటాల్ని కూడా మార్చేయవచ్చు. అప్పుడు కార్మికులు 50 ఏళ్ళక్రింద, 70 ఏళ్ళ క్రింద, నూరేళ్ళ క్రింద చేసిన పోరాటాలు మళ్ళీ చేయాల్సి వస్తుంది. 1990లలో, 21వ శతాబ్దంలో ఏమి పోరాటాలు చేస్తారంటే ఈ శతాబ్దపు పోరాటాలు కాదు, గతశతాబ్దపు పోరాటాలు చేసుకోవాల్సి వన్తుంది ఇంకొకసారి. అట్లే అన్ని రంగాలలో కూడా జరుగుతుంది. కాబట్టి సాధించుకాన్నటువంటి ప్రగతిని మనం కాపాడుకోవటం చాలా అవసరం. కాపాడుకుంటే మనం ఇంకింత ప్రగతిని భవిష్యత్‌లో సాధించుకోగల్లుతాం దానికి ప్రాతిపదిక ఏర్పడుతుంది. ఇప్పటిదాకా మనం సాధించుకున్న వాటిల్లో ఒకటి ప్రభుత్వానికుండే ఈ సంక్షేమమనే బాధ్యత. సంక్షేమమనే దానిని కేవలం మనల్ని కాపాడటం అనే అర్ధంలో తీసుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలోగాని, మామూలు ఆలోచనలోగాని అట్లా లేదది. కాపాడాల్సిందే. ప్రభుత్వమనేది, పరిపాలన వ్యవస్థ అనేది బలహీనులను కాపాడి తీరాల్సిందే. కాని సంక్షేమానికి అర్థం అదొక్కటే కాదు. పాజిటివ్‌గా కూడా దాన్నర్థం చేసుకోవచ్చు. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్ - అంటే ముందుమాటలో ఎందుకోసం ఈ రాజ్యాంగం రాసుకోవడం జరిగింది, ఈ రాజ్యాన్ని ఎందుకోసం నెలకొల్బటం జరిగింది అనే వివరణ ఉంది. ఏదో పరిపాలించాలి, శాంతిభద్రతలు నెలకొల్పాలి, దేశ సమగ్రత సార్వభౌమత్వాలను కాపాడాలి, దానికోసం ఒక గవర్నమెంట్ కావాలి అని మాత్రమే కాదు. దానికి కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం మనం - సామాజిక న్యాయం, అర్థిక న్యాయం, రాజకీయ న్యాయం. ౮39406 500121 9001001062] &గ6 ౨016021 అని వీటిని ప్రాతిపదికగా కలిగినటువంటి సామాజిక వ్యవస్థను నిర్మించటం కోసమే రాజ్యాంగాన్ని రాసుకున్నామని ఆనాడే చెప్పుకున్నాం. ఇట్లాంటి ప్రకటనలను బూటకమని కొట్టేయవచ్చు. కేవలం కొంతమంది ఆస్తిపరులు, భూస్వాములు, పెట్టుబడిదార్లు వాళ్ళ రాజ్యం నెలకొల్పడానికి బూటకంగా ఇవన్నీ రాసుకున్నారు అని కొట్టిపారేయొచ్చు కాని దానివల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు. ఇవన్నీ రాసుకోవాల్సిన స్థితి వచ్చిందీ అంటే, దాని వెనకాల ప్రజా ఉద్యమాల విజయాలు ఉన్నాయి, ప్రజల ఆకొంక్షలున్నాయి, ఆకాంక్షలు సెట్టిన ఒత్తిడి ఉంది, అవి సాధించుకొన్న విలువలున్నాయి. మన దృష్టి వాటి మీద ఉండాలి. పరిపాలించే వాళ్ళు ఎంత నిజాయితీపరులనే దాని మీద కాదు. వాళ్ళలో నిజాయితీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది సాపేక్షికంగా మారుతూ ఉంటుంది 22 క ాగోపాల ఉవన్వాట
పరిస్థితులను బట్టి. వాళ్ళ సంగతెట్టా ఉన్నా, కొన్ని ఆదర్శాలనూ, కొన్ని విలువలనూ వ్యవస్థీకరించుకున్నామంటే దాని వెనకాల ఏదో ఒక రూపంలో ప్రజల విజయాలున్నాయి, పీడిత వర్గాల విజయాలున్నాయి, ఆ వాక్కులు అవనరవ్షైన (వ్రజానీకం సాధించుకొన్నటువంటి విజయాలున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మనం దీనిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా చూసినప్పుడు ఇది కేవలం కాపాడటం, క్షేమం చూడటం అనే అర్ధంలో కాకుండా పాజిటివ్‌గా సామాజిక న్యాయం, అర్థిక న్యాయం, రాజకీయ న్యాయం - వీటిని సమకూర్చే సాంఘిక వ్యవస్థ, సామాజిక, అర్థిక, రాజకీయ వ్యవస్థ, దాని సాధన అనే విశాల లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడే ఈ సంక్షేమ భావన మనకు అర్థం అవుతుంది. దానిని ఆర్టికల్ 38 క్లాజ్ 2లో ఇంకొంచెం నిర్దిష్టంగా చెప్పారు. 38 క్లాజ్ 2లో ఏమంటారంటే తన విధానాలను ప్రభుత్వం ఏ రకంగా రూపొందించుకోవాలంటే, ఆర్థిక అసమానళలు, స్థితి గతులలో అసమాన తలు, అవకాశాలలో అసమానతలు, సౌకర్యాలలో అసమానతలు - వీటిని తొలగించే దిశగా నడుచుకోవాలి అని అంటే హక్కులు కల్పించాలి, సదుపాయాలు కల్పించాలి, అవకాశాలు కల్పించాలి, నమానత్వం కల్పించాలి. మనం నంక్షమాన్ని అర్థం చేసుకొనేటప్పుడు ఆ రకంగా అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో నుంచి ముందుకొచ్చినటువంటి ఆదర్శాలు రాజ్యాంగంలోకి వచ్చిన స్వరూపం అది కాబట్టి. ఇట్లా చూసినప్పుడు, ఈ నలభై, యాబై ఏళ్ళలో ఏమయింది, ఈ రోజు ఏమవుతోంది? ప్రజల నుండి ముందుకొచ్చిన అకాంక్షలు ఏ విధంగా రాజ్యాంగ నిర్మాతల ఆలోచనలుగా మారాయి అనేది మనం చూసుకో వాల్సిన అవసరముంది. రాజ్యం అనేది, రాజ్యాంగం అనేది, రాజ్యవ్యవస్థ అనేది కేవలం ఆస్తిని కాపాడటానికి, స్వంత ఆస్తిని, ఆధిపత్యాన్ని కాపాడటానికి మాత్రమే ఉంది అనుకుంటే, అంటే ఒక వర్గం ఆధిపత్యాన్ని నిలబెట్టడం కోసం మాత్రమే ఉంది అనుకొంటే - దాని నిర్వచనాన్ని అక్కడికి మనం ముగించేస్తే, ఈ నంక్షేమ భావన - రాజ్యాంగంలో ఉండే రూపంలోనున్నా, వేరే ఏ రూపంలోనున్నా - అది మహా అయికే ఓ బూటకంగా, వర్గ అధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఉపయోగించే ఒక బూటకపు వాగ్దానంగా కనిపించవచ్చు లేదా ప్రజల ఒత్తిడి వల్ల తప్పనిసరియై వాళ్లు ఆమోదించిన విషయాలుగా కనిపించవచ్చు.
ఈ రెండవ విషయం కూడా కొంతవరకు విశ్లేషణలో సరిపోవచ్చు. ప్రజల ఒత్తిడి వల్ల తప్పనిసరియై వాళ్లు ఆమోదించారు....ఇష్టంలేకపోయినా అనేది కూడా కొంత
క!
వరకు విశ్లేషణకు సరిపోవచ్చు కాని నేననుకోవడం ఇంకొంచెం విశాలంగా దీనిని ఆలోచించాలని. సామాజిక జీవితానికి సంబంధించిన ప్రతి వ్యవస్థా అది ఆర్థిక వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థయినా కావచ్చు, అది ఏ రూపంలో ఉండాలీ, ఏ విధంగా ఉండాలీ అనేదానికి సంబంధించి కొన్ని విలువలూ, కొన్ని ప్రమాణాలూ చరిత్రలో ముందుకొస్తుంటాయి. చరిత్ర పురోగమన (క్రమంలోనే కాదు, చరిత్ర తిరోగమున క్రమంలో కూడా విలువలు ముందుకు వస్తాయి, విలువలు పతనం అవుతూ ఉంటాయి. ఈ విలువలు రావడానికి సమాజంలో వివిధ వర్గాల ఆధిపత్యం, ఆ ఆధిపత్యంపై ప్రతిఘటనా ప్రయత్నాలు - ఇవన్నీ దాని వెనకాల ఉంటాయి. రాజ్యానికి సంబంధించి గాని, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గానీ, వేరే ఏ వ్యవస్థకు సంబంధించి గానీ ఏయే విలువలు, ఏఏ ప్రమాణాలు ఆ సమాజంలో ఉంటాయి అనే దాని వెనకాల తప్పనిసరిగా వివిధ వర్గాలు, ప్రజా సమూహాలు, వాళ్ళ అవసరాలు, ఒత్తిళ్ళు ఉంటాయి కాని ఈ విలువలూ, ప్రమాణాలూ కేవలం ఆ వర్గాల ప్రయోజనాల దగ్గరే అగిపోవు. అవి ఒకసారి ముందుకొచ్చిన తరువాత వాటికి ఒక అస్థిత్వం ఉంటుంది. సామాజిక ఆలోచనలో, చైతన్యంలో అవి ఒక భాగమవుతాయి. ఏ అవసరాల నుంచి అవి పుట్టాయో ఆ అవసరాలు తీరిపోయిన తరువాత కూడా ఈ విలువలు కొనసాగుతాయి, ఈ ప్రమాణాలు కొనసాగుతాయి. అవి ఆ సమాజం సాధించుకున్న నాగరికతా ప్రమాణానికి ఒక సూచికగా మిగులుతాయి. ఆ నాగరికత పతన మయినప్పుడు ఆ పతనంలో భాగంగా అవి కూడా పతనమవుతూ ఉంటాయి. అట్టా అర్ధం చేసుకున్నప్పుడు రాజ్యమూ, రాజ్యవ్యవస్థ అనేది వర్గ ఆధిపత్యాన్ని కాపాడటం కోసం పుట్టిందే అని ఒప్పుకొన్నా అంతవరకే అర్థం చేసుకుని ఊరుకోలేం. వివిధ వర్గాల ఆధిపత్యంలో కజేడాలుంటాయి, ఆ ఆధిపత్యం చెలాయించే రూపాలలో తేడాలుంటాయి, దానికి ప్రతిఘటన ఉంటుంది, ఆ ప్రతిఘటన రకరకాల రూపాలు తీసుకుంటుంది, పాలకవర్గాల మీద రకరకాల ఒత్తిళ్ళు పెడుతుంది, కొత్త అవసరాలను ముందుకు తీసుకొస్తుంది. దాంతో ఏమవుతుందంటే రాజ్యం ఏమి చేయాలి, రాజ్యం ఏ విధంగా ఉండాలి అన్న దానికి సంబంధించి కొన్ని విలువలూ, ప్రమాణాలూ చరిత్రలో పుడుతూ ముందుకొస్తాయి. ప్రతి విలువ పుట్టుక వెనకాల ఏదో ఒక వర్గం, ఏదో ఒక గ్రూపు, ఎవరో ఒకరి ప్రయోజనాలు ఉండవచ్చు. కాని ఆ ప్రయోజనాలు తీరిపోయినా, ఆ ప్రయోజనాలు బలహీనమయిపోయినా సరే, ఈ విలువ శశ కడపల దవన్నాన ద
అనేది ఇతర ఆలోచనలలో, ఇతర అవసరాల కోసం, ఇతర ప్రయోజనాల కోసం, అది అట్లా కొనసాగుతూ ఉంటుంది. అది ఆ సమాజం సాధించుకొన్న నాగరికతకు ఒక వ్రమాణంగా నిలిచిపోతుంది. ఇది వెనుకకు పోవడానికి వీలు లేదు. ఇవి అవసరమైనటువంటి ఆ ఉద్యమాలు, ఆ పోరాటాలు, ఆ వర్గాలు, వర్ల ప్రయోజనాలు సమసిపోయినా ఈ విలువ మాత్రం వెనుకకు పోవడానికి వీలు లేదు అనేటటువంటి ఆలోచనా స్థాయి కూడా ఆ సమాజానికి వస్తుంది. మనం చరిత్రలో వెనక్కిపోతే, ఒకప్పుడు రాజ్యానికి ఒకే ఒక్క కర్తవ్యం ఉండేది. అదేమిటీ అంటే ఆ సమాజం దేన్నైతే ధర్మంగానో, చట్టంగానో భావిస్తుందో దానిని బలప్రయోగంతో అమలు చేయటం. అది జ్జైస్తవ సాంప్రదాయమైనా, ఇస్లామిక్ సాంప్రదాయమైనా, హైందవ సాంప్రదాయమైనా రాజుగారి కర్తవ్యం ఏమిటీ అంటే ఆ సమాజం దేన్నైతే ధర్మం అని భావిస్తుందో అది బైబిల్ నుంచి రావచ్చు, ఖురాన్ నుంచి రావచ్చు, హిందూ ధర్మశాస్త్రాల నుంచి రావచ్చు, వేరే ఎక్కడ నుంచైనా రావచ్చు - దానిని దండ ప్రయోగంతో అమలు చేయటం. అక్కడ మనకు ఒక వర్గ ప్రయోజనమో, ఒక వర్గ ఆధిపత్యాన్ని కాపాడటమో మనకు స్పష్టంగానే కనిపిస్తుంది. మన భారతీయ హైందవ సాంప్రదాయంలోని ధర్మశాస్తాలలోకి పోతే ఇతర దేశాల కంటే కూడా ఎక్కువగా దండ ప్రయోగాన్ని నమ్ముకున్నది అదే. ఇతర దేశాలలో బైబిల్, ఖురాన్, వాటి పవిత్రత....వాటిని ఎక్కువగా నమ్మారు. మన వాళ్ళు నమ్మలేదు అని గాదు, నమ్మారు. ఆ బెదిరింపును కూడా ఉపయోగించారు. కాని అంతకంటే ఎక్కువగా రాజు దండం ఉపయోగించాడు. దండమే రాజు, రాజే దండమని మనువు అంటాడు. వాడి చేతిలో నున్న లాఠి ఉందే అదే రాజు అన్నారు. లారీయే రాజు, రాజే లాఠీ. అంత దూరం పోయినటువంటి ధర్మ శాస్త్రకారులు వేరే సంప్రదాయంలో మనకు కనిపించరు, ఇస్లాంలో గాని, క్రెస్తవంలోగాని. అంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు అని కాదు, కేడొలు చెపుతున్నాను. ఒక సమాజం దేన్నెతే నీతిగా భావిస్తుందో, ఆ నీతిని అమలు చేయటమే రాజు కర్తవ్యం అనే దశ నుంచి రాజ్యాని కుండే కర్తవ్యాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి, విస్తరణ చెందుతూ వచ్చాయి. అలాంటప్పుడు వాటిని కేవలం బూటకమని, కేవలం బుకాయింపని అర్ధం చేసుకోవడం సరికాదు. నాగరికత పెరిగే క్రమంలో పరిపాలనా వ్యవస్థ అనే దానికి ఏమేమి కర్తవ్యాలుంటాయి, ఏమేమి విలువలు అది పాటించాలి, ఏమేమి ప్రమాణాలను పాటించాలి అనేది క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. అట్లా ముందుకొచ్చిన ఒక్కొక్క ప్రమాణానికి, ఒక్కొక్క విలువకు వెనకాల ఏదో ఒక వైర్
వర్గం, అది పెట్టిన ఒత్తిడి ఉంటే ఉండొచ్చును గాని, ఆ వర్గాలు పోయాక, ఆ ఒత్తిడిలు పోయాక కూడా ఆ విలువలు మిగిలి పోతాయి. ఎందుకంటే అవి నాగరికతలో భాగమయిపోతాయి. అవి మానవ చైతన్యంలో భాగమయి పోతాయి. నైతికసంస్కృతిలో భాగమయిపోతాయి. అట్లా ముందుకొచ్చినటువంటి అనేక అంశాలలో ఇవ్వాళ మేము పౌరహక్కుల ఉద్యమంలో ఎక్కువగా చెప్పే రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ ఒకటి. రాజు అయినా, రాజ్యమయినా దండాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రయోగించటానికి వీలులేదు. అందరూ ఒప్పుకౌనే ఓ చట్టం సమాజంలో ఉండగా, ఆ చట్టం ప్రకారం మాత్రమే ప్రయోగించాలి. అందరూ ఒప్పుకొనే చట్టమంటే ఏమిటీ అంటే ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకొనే అసెంబ్లీలూ, పార్లమెంట్లూ, వాళ్ళు తయారు చేసే చట్టాలు మాత్రమే అందరూ ఒప్పుకొనే చట్టం. ఇట్లా కొన్ని విలువలుంటాయి. ఇష్టానుసారం దండ ప్రయోగం చెయ్యచ్చు రాజు అనే పాతకాలపు విలువలు పోయి, ఒక చట్టం ప్రకారం మాత్రమే చేయాలనే విలువ ముందుకొచ్చింది. అది అక్కడితో ఆగిపోదు. ఆ చట్టం ఏ రకంగా ఉండాలి, ఏది బడికే అది చట్టం కావచ్చునా అంటే అట్లా కావడానికి వీలులేదు. ప్రాథమిక నియమాలు కొన్ని ఉంటాయి. సహజ హక్కులు కొన్ని ఉంటాయి. ఆ సహజహక్కులకు లోబడి మాత్రమే చట్టాలుండాలి, దానికి లోబడి మాత్రమే పరిపాలన సాగాలి అని ఒక విలువ ముందుకొస్తుంది. అట్లా రాజ్యమనేది ఏమి చేయవచ్చును, ఏమి చేయకూడదు, దాని కర్తవ్యాలేంటి, దాని విలువలేంటి, ప్రమాణాలేంటి అనేది చరిత్రలో మారుతూ వచ్చింది. దాంట్లో భాగంగా ఆధునిక కాలంలో 19వ శతాబ్దం, 20వ శతాబ్దంలో రెండు కొత్త కర్తవ్యాలు రాజ్యానికి వచ్చాయి. ఒక సమాజం దేన్నెతే నీతిగా ధర్మంగా, చట్టంగా భావిస్తుందో దానిని బలప్రయోగంతో అదుపు చేయడం, అమలు చేయటం అనే కర్తవ్యంతో పాటు - అది పోలేదు, అది కొనసాగుతూనే ఉంది. అది చట్టానికి లోబడి మాత్రమే జరగాలి. ఆ చట్టం కూడా సహజ హక్కులకు లోబడి ఉండాలి అనేకాక ఈ పంథొమ్మిదో శతాబ్దం, ఇరవయ్యో శతాబ్దంలో కొత్తగా ఏమొచ్చింది అంటే, ముఖ్యంగా వెనుకబడిన దేశాలలో అభివృద్ధి కర్తవ్యం వచ్చింది. రోడ్డు వేయాలి, రైల్వేలైన్లు వేయాలి, ఫ్యాక్టరీలు కట్టాలి, ఉత్పత్తి చేయాలి, భార్ పరిశ్రమలు నడపాలి, ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధి సాధించాలనే కర్తవ్యం కూడా రాజ్యానికి వచ్చింది. నేననుకునేది, ఇరవయ్యో శతాబ్దంలో మూడవ ప్రపంచ దేశాలలో ఇది ముందుకొచ్చింది. ఇది రావడానికి కారణాలు లేవని నేను అనడంలేదు, రావడానికి చాలా కారణాలుంటాయి. శ్రే జ బాలగోపాల్ ఉవన్వాసాలు క్
ఇక్కడి పెట్టుబడిదారీ వర్గం దగ్గర ఎక్కువ పెట్టుబడి లేదు, పాశ్చాత్య పెట్టుబడి దారులు చాలా బలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు తమ దగ్గర పెట్టుబడిలేని కారణంగా రాజ్యం మీద ఈ భారం పెట్టారు అనే విశ్లేషణ ఉంది. అది వాస్తవం కూడా కావచ్చు. కాని దానితో ఏమయింది అంటే రాజ్యానికి ఒక కొత్త కర్తవ్యం వచ్చింది. రేపు ఈ అవసరం తీరిపోయినా కూడా ఆ కర్తవ్యం అట్టాగే కొనసాగవచ్చు. ఎందుకంటే దానికి కొత్త కారణాలు, కొత్త భూమికలు లేదా మనుషుల ఆలోచనలలో, చైతన్యంలో, సామాజిక నీతిలో దానికో గుర్తింపు వచ్చేస్తే - అది అట్లా నిలిచిపోవచ్చు. పంచ వర్ష ప్రణాళికలు, ప్లానింగ్ కమీషన్, భారీ పరిశ్రమలు, రైల్వేలైనులు, రోడ్డు ఇప్పటికి కూడా ఎంత వదిలించుకున్నా కొంత అభివృద్ధిని ప్రభుత్వం తానే చేస్తానని అనవలసి వస్తోంది. అట్లా ముందుకొచ్చిన వాటిలో ఒకటి సంక్షేమమనేది. ఇవ్వాళ మనం మాట్లాడుకునే టటువంటి ఈ విలువ దండంతో అణిచివేయడం మాత్రమే రాజు కర్తవ్యం అనే దానికి పూర్తి భిన్నమైన కర్తవ్యాన్ని తెచ్చిపెట్టింది. ఇది రావడానికి రకరకాల చారిత్రక కారణాలుంటాయి. వాటిలోకి మనం పోనవసరం లేదు. అది ఏమంటుంది అంటే చట్టాన్ని బల ప్రయోగంతో అమలు చేస్తే సరిపోదు, చేయాల్సిందే, కాని అది సరిపోదు. అభివృద్ధి తీసుకొస్తే సరిపోదు అది చేయాల్సిందే, కాని అదీ సరిషోదు. రాజ్యమనేది, రాజ్య వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ అనేవి ఏం చేయాలంటే సామాజిక సంక్షేమాన్ని కూడా చూడాలి. సామాజిక సంక్షేమాన్ని చూడటం అంటే అర్థం ఏంది? ఏమేమి పనులు చేస్తే సామాజిక సంక్షేమాన్ని చేసినట్టు అవుతుంది? అన్ని దేశాలలోనున్న సామాజిక సంక్షేమ భావనలను తీసుకుంటే కనిపించేదేమిటి అంటే అప్పటి సామాజిక, అర్థిక వ్యవస్థలో ఎవరైతే బలహీనులుగా ఉంటారో, ఎవరైతే బహిష్కృతులుగా ఉంటారో, ఎవరైతే తిరస్కృతులుగా ఉంటారో, ఎవరికైతే హక్కులు లేకుండా, అవకాశాలు లేకుండా, సదుపాయాలు లేకుండా ఉంటారో... వాళ్ళకు కొంత హక్కులు కల్పించడం గానీ, అవకాశాలు కల్పించడం గానీ, వాళ్ళ సంరక్షణ చూసుకోవడం గానీ, వాళ్ళ అణచివేతను వ్యతిరేకించడం గానీ - ఈ రకమైన కర్తవ్యాలు సంక్షేమ కర్తవ్యాలలో భాగంగా మారాయి. అది అమెరికాలో నల్ల జాతీయుల సంరక్షణ కావచ్చు, దాదాపు అన్ని దేశాలలో స్రీల సంరక్షణ కావచ్చు, భారతదేశంలోనైతే ఆదివాసులు, దళితులు, వెనుకబడిన కులాలు, స్రీలు, ఎవరెవరైతే ఆ సామాజిక ఆర్థిక వ్యవస్థలో బలహీనులుగా ఉంటారో, వాళ్ళ సంరక్షణ చూడవలసిన కర్తవ్యం ఒకటి రాజ్యానికి ఇరవయ్యో శతాబ్దంలో ముందుకొచ్చి నటువంటి ఒక విలువ. రావడానికి కారణమేమైనా కావచ్చు - కార్మిక పోరాటాలు
27
నడిచినాయి, పీడిత వర్గపోరాటాలు నడిచినాయి, ఆ పోరాటాల నుంచి ముందుకొచ్చిన విలువలే ఇవన్నీ.కూడా. ఇవ్వాళ రాజ్యమనే భావనలో ఇవన్నీ కూడా ఒక భాగం. రాజ్యం అంటే పోలీసు కస్టడీ అంటే ఇవాళ ఒప్పుకొనే స్థితిలో ఎవ్వరూ లేరు. ఒకప్పుడు మీరు మనుధర్మ శాస్త్రం చదివినా, పాశ్చాత్య దేశాలలో దాని సమకాలీన చట్టంగాని, శాసనాలు గాని, వాటికి సంబంధించిన సిద్ధాంతాలు చదివినా రాజ్యమంటే పోలీస్‌స్టేషన్. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యమేమి చేస్తుందంటే పోలీసు డ్యూటీ, సైన్యం డ్యూటీ. దేశం సరిహద్దులను పరాయివాళ్ళ నుంచి కాపాడుతుంది, దేశం శాంతి భద్రతలను దేశం లోపలి తిరుగుబాటు దార్లు నుంచి, నేరాలు చేసే వాళ్ళ నుంచి కాపాడుతుంది. 51246 15 6౦121 10 2౦100288. అది పోయిపోయి ఇవ్వాళ ఎక్కడి దాకా వచ్చిందంటే రాజ్యం కేవలం పోలీసు డ్యూటీ కాదు, ఒక రకంగా పోలీసు డ్యూటీకి విరుద్ధమైనటువంటి సంక్షేమ డ్యూటీ కూడా. ఒక రకంగా అని ఎందుకంటున్నానంటే, భద్రతను కాపాడే పోలీస్ డ్యూటీ కొన్ని సందర్భాలలో ఆ భద్రత వలన నష్టపోయేవాళ్ళ మీద, ఆ భద్రత వలన హక్కులు లేకుండా పోయేవాళ్ళ మీద అణచి వేతగా మారుతుంది. నాకు ఈ వ్యవస్థలో న్యాయంలేదు, నేను న్యాయం కావాలని బయటకు పోతే వాళ్ళు 144 సెక్షన్ ఉల్లంఘించావని లాళీ ఛార్జీ చేస్తారు. ఫ్యాక్టరీలో ఉద్యోగాలు తీసివేస్తున్నారు. వేరే ఉద్యోగాలు కల్పించండంటే, పర్మిషన్ లేకుండా ఊరేగింపు తీస్తారా అని లాఠీ ఛార్జ్ చేస్తారు భద్రతను కాపాడే డ్యూటీనే చివరకు ఏమవుతుంది అంటే అసమానతలు అనుభవించే వాళ్ళ మీద అణచివేతగా మారుతుంది. ఈ పోలీసు డ్యూటీతోపాటు దీనికి పూర్తి భిన్నంగా అసమానతలు అనుభవించే వాళ్ళ సంక్షేమం చూడటం కూడా రాజ్యం డ్యూటీయే అనే భావన ఈ రోజు రాజ్యం అనే కాన్సెఫ్ట్‌లో భాగం, నేననుకోవడం ఈ రకమైన కాన్సెప్ట్ బాగా బలపడే క్రమంలో రాజ్యమనేది ఇవ్వాళ్టి అణిచివేత సాధనంగా కాకుండా, కాలక్రమంలో బలహీనమయిపోయే అవకాశం కూడా ఉంది. ఒక్కసారిగా మొత్తం పోవడం కాకుండా, కొత్త కొత్త విలువలు, ప్రజాస్వామికమైన విలువలు, నాగరికమైన విలువలు, మానవీయమైన విలువలు, దాంట్లో భాగమవాలనే ఒత్తిళ్ళు ఏవైజే ముందుకొస్తుంటాయో -అవే అంతిమంగా రాజ్యాన్ని బలహీనపర్చగలుగుతాయి. ఆ రకంగానే రాజ్యమనేది కాల క్రమంలో లేకుండా పోగలుగుతుందేమో. అది తరువాత సంగతి అనుకోండి అందువల్ల ఈ రోజు మనం సంక్షేమాన్ని గురించి మాట్లాడుతున్నాం అంటే, చారిత్రకంగా రాజ్యవ్యవస్థ అనేదానికి వచ్చిన ఒక నాగరికతా విలువ గురించి కూడా వేలో శేాంగోపాల్ ఉమానాట
మనం మాట్లాడుకుంటున్నాం అని. కేవలం ఇవ్వాళ్టి పేద ప్రజానీకం అవసరం గురించి మాత్రమే మాట్లాడటం లేదు. చరిత్ర క్రమంలో రాజ్యవ్యవస్థ అనేదానికి నూతనంగా వచ్చి చేరినటువంటి ఒక నాగరికతా విలువ గురించి మాట్లాడుతున్నాం దానిని ఈ రోజు ఈ మానవ నాగరికతలో ఏ రాజ్యమూ కాదనటానికి వీలులేదు. ఎవరైనా కాదంటున్నారు అంటే అర్ధం నాగరికతా క్రమంలో మనం సాధించుకున్న ఒక విజయాన్ని తిరస్కరించడం అవుతుంది. కాని ఇవ్వాళ ఏమి జరుగుతోందంటే ఆ సంక్షేమమనే విలువను రాజ్యానికి లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇరవయ్యవ శతాబ్దంలో రకరకాల వామపక్ష ఉద్యమాల నుంచి, (వజాఉద్యమాల నుంచి, కార్మిక ఉద్యమాల నుంచి ముందుకొచ్చినటువంటి ఈ భావన - వాళ్ళు దానిని ఏ రకంగా భావించుకున్నా, వాళ్ళ సిద్ధాంతాలలో దానికి ఏ రూపం ఇచ్చుకున్నా జరిగింది ఏమిటీ అంటే రాజ్యవ్యవస్థకు సంక్షేమమనే బాధ్యత ఒకటి ఉంది అనే నాగరికతా విలువ ముందుకొచ్చింది. దానిని కరక్ష్గా 20వ శతాబ్దం చివరి భాగంలోనే సంపూర్ణంగా తిరస్కరించడం జరుగుతోంది. అది కేవలం ఒక భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. ఇవ్వాళ నూతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అని అమెరికా వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, ఆ నూతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెనుక ఒక రాజకీయ సిద్ధాంతం కూడా ఉంది. ఆ రాజకీయ సిద్ధాంతం ఏమిటి అంటే ప్రభుత్వం అనేది పోలీస్ డ్యూటీ మాత్రమే చేయాలి అని. మళ్ళీ వెనుకకు వెళ్ళిపోవడమన్నమాట. రాజ్యవవస్థ, పరిపాలనా వ్యవస్థ పోలీస్ డ్యూటీ మాత్రమే చేయాలి. మిగిలినవన్నీ కూడా ప్రైవేటుగా ఎవరి యోగ్యత, ఎవరి సామర్థ్యం, ఎవరికి చేతనైనది, ఎవరికి చేతగానిది వారికి విడిచిపెట్టాలి. అప్పుడే సమాజం బాగుంటుంది అనేటటువంటి సిద్ధాంతం ఈ రోజు అది మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా ముందుకొస్తోంది. అది ఇవ్వాళ మీకు ప్రపంచ బ్యాంకు వాళ్ళ సలహాలలో, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళ సలహాలలో, అన్నిటికంటే మించి ఇవ్వాళ కొత్తగా వచ్చిన వరల్డ్ బ్రేడ్ ఆర్గనైజేషన్ - ₹/.2.0 వాళ్ళ సలహాలలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ₹గ౦ వాళ్ళ గురించి మనకింకా ఎక్కువ తెలియదు. భవిష్యత్తులో చాలా తెలుసుకోబోతాం. ఇవ్వాళ మనం "1/06 కెజు!ం [7 అంటున్నాం గాని ఇంక ఐదేళ్ళ తరువాత /.].0. అనే అంటాం. ఎందుకంటే వాళ్ళ మొత్తం ఆలోచనా విధానం అంతా కూడా దేశం లోపల, ప్రభుత్వాలకు సంక్షేమ బాధ్యత ఏమీ లేదు, మొత్తం శైలీ
థైవేటు పరం అని చెప్పడమే సంక్షేమాన్ని (పైవేటు రంగానికి అప్పగించాల్సిందే. నువ్వు పోలీస్ డ్యూటీ మాత్రం చేస్తేచాలు. ప్రపంచ వాణిజ్యం పేరిట, ₹/0॥16 1266 పేరు మీద, ఈ ఆలోచనా విధానాన్ని వాళ్లు అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. 64] గురించి మనం మాట్టాడుకునేటప్పుడు - చాలా మంది వక్తలు చెప్పే ఉంటారు, 64లో ప్రధానంగా అభ్యంతరకరంగా ఏముంది అని అంటే ప్రపంచ వాణిజ్యం పేరు మీద అంతర్గత రాజకీయ ఆర్థిక విధానాన్ని వాళ్ళు మార్చే ప్రయత్నం చేస్తున్నారని. ఆతమ వారసత్వంగా ₹/.2.0. ఉంది. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి.
ఇవ్వాళ మనం చంద్రబాబు గురించి మాట్లాడుకున్నా, దేవెగౌడ గురించి మాట్లాడు కున్నా, ప్రపంచం మొత్తం మీదనే ఈ శతాబ్దంలో ముందుకొచ్చిన ఒక బలమైన నాగరికతా విలువను తిరస్కరించడం జరుగుతోంది. అది ఏమిటి అంటే రాజ్య వ్యవస్థ అనేదానికి ఒక సంక్షేమ బాధ్యత ఉంది. సంక్షేమమంటే కేవలం కాపాడటం అనే నెగిటివ్ సెన్స్‌లో మాత్రమే కాకుండా - సామాజిక, ఆర్ధిక, రాజకీయ అనమానతలను తొలగించడానికి తోడ్పడేటటువంటి అవకాశాలు కల్పించాలి, సదుపాయాలు కల్పించాలి, హక్కులు కల్పించాలి అనే పాజిటివ్ బాధ్యత. ఈ కర్తవ్యం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 38 క్లాజ్ 2లో ఒక ఆదేశిక సూత్రంగా ఉందని కూడా చెప్పి ఉన్నాను. నాంది ప్రస్తావనలో ఇది స్పష్టంగా ఉంది. రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగ పరిషత్‌లో దీనిమీద చాలా చర్చలు జరిగినాయి. అందులో ఈ ప్రస్తావన ఉంది. అంబేద్కర్ ఉపన్యాసంలోనే, ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్‌గా ఇచ్చినటువంటి ఉపన్యాసంలోనే
- భారత రాజ్యాంగంలో మీలో చాలా మందికి తెలుసును - పార్ట్ 3, పార్ట్ 4 ముఖ్యమైనవి. పార్ట్-3లో (ప్రాథమిక హక్కులుంటాయి. పార్ట్ 4లో ఆదేశిక సూత్రాలుంటాయి. పార్ట్ 3లో నున్న ప్రాధమిక హక్కులు కోర్టుల ద్వారా అమలు చేసుకోగలిగిన ప్రాథమిక హక్కులు. పార్ట్ 4లోని ఆదేశిక సూత్రాలు కోర్టుల ద్వారా అమలుచేసుకోలేము గాని, రాజ్యాంగం ఏమి చెపుతుందంటే, దేశ పరిపాలనలో వాటికి మౌలికమైన ప్రాధాన్యం ఉంది. 706 *6 మండేజంలు2] 10 16 8&[07ఆు2166 0 116 ౧౦౪౧1)/ అంటుంది రాజ్యాంగం. ఈ ఆదేశిక సూత్రాలలో ఏముంటాయి అంటే మనమీ రోజు సంక్షేమం పేరు మీద ఏ హక్కులనైతే భావిస్తున్నామో, ఏ అవకాశాన్ని ఏ సదుపాయాన్ని భావిస్తున్నామో అవన్నీ కూడా ఈ పార్ట్ 4లో ఉన్నాయి. పార్ట్ 3లో కూడా కొన్ని ఉన్నాయి. లేవనికాదు. కాని సంక్షేమానికి సంబంధించిన విషయాలు పార్ట్ 4లో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకోసం వీటిని పెట్టాల్సి వచ్చింది? స్పెయిన్
20 క ాలగోపాల్ ఉవన్యాసాద
రాజ్యాంగంలో మొట్టమొదట ఈ ఆదేశిక సూత్రాలనే చాప్టర్ ఒకటి పెట్టారట. తరువాత ఐర్లండ్ రాజ్యాంగంలో ఉండిందని, వాటిని చూసి మన భారత రాజ్యాంగంలో రాయడం జరిగిందని చెపుతారు. రాజ్యాంగ కర్తలు అన్ని రాజ్యాంగాలను చదివి రాశారు కాబట్టీ, స్పానిష్ రాజ్యాంగం, ఐరిష్ రాజ్యాంగంలో ఉండేటటువంటి ఈ అంశాలను భారత రాజ్యాంగంలోకి తీసుకువచ్చారు. ఎందుకు ఇవి అవసరమైనవి అనే విషయాన్ని మాట్లాడుతూ అంబేద్కర్ - మన రాజ్యాంగం ఏమి చేస్తుందంటే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో నెలకొల్చు తుంది అంటాడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి క్లుప్తంగా ఒక్క మాటలో అంబేద్కర్ ఇచ్చిన నిర్వచనం ఏమిటి అంటే ఒక మనిషికి ఒక ఓటు. అదొక్కటే కాదు కాని, క్లుప్తీకరించేటప్పుడు చాలా విషయాలు పోతాయి. ఇవ్వాళ 18సం॥ల వయస్సు దాటితే ఎవరికైనా ఒక ఓటు వస్తుంది. నువ్వు కోటీశ్వరుడు గాని, భిక్తకుడు గాని, ఎవరైనా గాని ఒక ఓటు నీకు వస్తుంది. కాని ఒక మనిషికి ఒక ఓటునిచ్చే ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దేనికోసం మనం నెలకొల్పు కున్నామంటే ప్రతి మనిషికీ ఒక విలువనిచ్చే ఆర్థికవ్యవస్థ కోసం నెలకొల్పుకొన్నాం అని అంబేద్కర్ అంటాడు. 016 22 016 ౪7048 అనే ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దేనికోసం అంటే 016 ౫౧ 026 2126 ఇచ్చేటటువంటి 20010090 06000260 సాధించడం కోసం వీనిని నెలకొల్పుకున్నాం అని అంటాడు ఆయన. 80080090 ౨లుంయ10)/ అంటే 500121 0ల౫0010% కూడా దాంట్లో కలిసే ఉంటుంది. ప్రతి మనిషికి సమానంగా ఒక ఓటు ఇచ్చే ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య
వ్యవస్థ ప్రతి మనిషికి సమానంగా ఒకే విలువనిచ్చే అర్థిక వ్యవస్థకు దారి తీయాలి,
ఆర్థిక సాంఘిక వ్యవస్థ దాకా దారితీయాలి. అందుకోసం దీనిని నెలకొల్సాం అని
అంబేడ్కర్ తన రాజ్యాంగ పరిషత్ ఉపన్యాసంలో అంటాడు. ప్రతి మనిషికి ఒక సమాన
విలువనివ్వాలి అనే ఈ ఆదర్శం సాధన కోసం ప్రభుత్వం ఏమేమి చేయాలనేది మనం
పార్ట్-4లోని ఆదేశిక సూత్రాల జాబితాలో రాసుకొన్నామని చెప్పి అంటాడు. అంటే ఈ
రాజ్యాంగాన్ని రాసినప్పుడు రాజ్యాంగం రాయడమూ అంటే అంబేద్కర్ ఒక్కడే రాశాడని
కాదు, అంబేద్కర్ గొప్పవాడే కాదని కాదు. నిజానికి కులనిర్మూలనా సిద్ధాంతవేత్తగా
మాత్రమే అర్ధం చేసుకోకుండా, ఒక రాడికల్ డెమోజ్రాట్గా అర్ధం చేసుకుంటే ఆయన ఆలోచనలు ఎంత విలువైనవో గుర్తించవచ్చు. అయితే వర్గపోరాటం నేపథ్యం నుంచి వచ్చిన సిద్ధాంతాలు మాత్రమే అలవాటు కావడం వల్ల భిన్నమైన సిద్ధాంతాలను
22 పూన
గౌరవించడం మనమింకా నేర్చుకోలేదు. అంబేద్కర్‌లాంటి రాడికల్ డెమోక్రాట్ని అర్ధం చేసుకోవాలంటే కొంత భిన్నంగా ఆలోచించటం నేర్చుకోవాలి. ఆయన తన ప్రతిపాదన లలో ఈ 06 1020 016 ₹/2106 మాట అంటాడు. అయితే ఈ రకమైన ఆలోచనలు అంబేద్కర్‌కు రావడానికైనా, అప్పటి రాజ్యాంగ పరిషత్ అమోదించటానికైనా, దాని వెనకాల ఉన్న నేపథ్యం ఏమిటి అంటే భారత జాతీయ ఉద్యమం. కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమం కాదు అది. భారత జాతీయ ఉద్యమంలో కార్మిక పోరాటాలు, రైతాంగ పోరాటాలు, ఆదివాసీ పోరాటాలు, దళితుల పోరాటాలు, స్త్రీల పోరాటాలు, మైనారిటీల పోరాటాలు జరిగాయి బ్రిటీషు వాళ్ళు బైటికి వెళ్ళిపోవాలనే రాజకీయ డిమాండ్‌లో భాగంగానే అవన్నీ జరిగాయి. ఇవ్వాళ క్లాసులలో చెప్పే పాఠ్య పుస్తకాలలో ఈ అంశాలు ఎక్కువగా రావు. రాజకీయంగా కాంగ్రెసు వాళ్లు జరిపిన జాతీయోద్యమం మాత్రమే ఎక్కువగా ప్రస్తావనకు వస్తుంది. దానితోపాటు, దానికి అనుసంధానంగా, ఒక్కొక్కప్పుడు దానిని విమర్శిస్తూ, దానిని వ్యతిరేకిస్తూ, ఇది సరిపోదు అని మాటాడుతూ అంబేద్కర్ గాని, కొన్ని సందర్భాలలో కమ్యూనిస్టులు గాని ఆ రకంగా నడచిన పోరాటం అంతా కూడా మన పార్యాంశాలలో భాగం కాలేదు. ఇప్పుడిప్పుడు మార్పులు వస్తే నేను చెప్పలేను. నేను క్లాసు పుస్తకాలు చదివి చాలా కాలం అయింది.
ఈ ఒత్తిళ్ళ ఫలితంగానే రాజ్యాంగ పరిషత్ ప్రతిమనిషికీ సమాన విలువనిచ్చే ఆదర్శం మనకుండాలని భావించింది 500121, 8001001021, 9011021 ౮45606 ను ఇవ్వగల 26100016 ఎదైతే రాసుకొన్నారో దానిని అంబేద్కర్ 016 14122 0౧6 *246 అంటాడు. ఆ రకమైనది రావాలి అనంటే మనం ఏదో ఒక రాజ్యాంగాన్ని రాసుకొని - కేంద్రానికి ఈ అధికారాలుంటాయి, రాష్ట్రానికి ఈ అధికారాలు ఉంటాయి, ఇది కేంద్రం లిస్టు, ఇవి రాష్ట్రాల లిస్టు, ఇది ఎగ్జిక్యూటివ్, ఇది జ్యుడీషియల్, ఇది లెజిస్లేచర్
- ఇట్లా రాసుకొన్న రాజ్యాంగం సరిపోదు. అట్లా రాసుకుంటే మనం కోరుకునే ప్రతి మనిషికి సమాన విలువనిచ్చే సమాజం వస్తుందని నమ్మకమేముంది? మనం ఈ రాజ్యాంగం దేనికోసం రాసుకున్నామని చెప్పన్నామో - అఆ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం వస్తుందనే నమ్మకమేముంది? &60101304476 00౧5646608 మాత్రమే రాసుకుంటే, పరిపాలనా పరంగా విధుల విభజన, అధికారాల విభజన, అధికారాల పరిమితులు - ఇవి మాత్రమే రాజ్యాంగంలో రాసుకుంటే సరిపోదు. కాబట్టే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించేటటువంటి వాటిని కూడా రాసుకోవాలని చెప్పి ఈ ఆదేశిక
వి క ాగోపాల దవనానాట
సూత్రాల జాబితా రాయడం జరిగింది. దాంట్లో మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా దాదాపుగా సంక్షేమమనే పేరు మీద మనం ఏయే విషయాలను ఈ రోజు డిమాండ్ చేస్తున్నామో, సంక్షేమ రాజ్యమనే భావనలో రాజ్యానికి ఏఏ బాధ్యతలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నామో, అవన్నీ కూడా ఉన్నాయి. ఏ రూపంలో ఉన్నాయంటే, దేశ పరిపాలనకు ఇవి మౌలికం, ఇవి ప్రాధమికం అనుకునేలా. అంటే వీటి వెలుగులో దేశ పరిపాలన సాగాలి. వీటిని సాధించే రీతిగా దేశ పరిపాలన సాగాలి. ఏ పార్టీ అయినా పరిపాలించవచ్చు. అది ఏ రకంగానైనా సాధించవచ్చు. అంబేద్కర్ ఆ మాటే అంటాడు. సమానత్వం ఏ రకంగా రావాలి అనే దానిలో భిన్నమైన అభిప్రాయాలున్నాయి. ముందే ఒక సోషలిష్టు రాజ్యాంగాన్ని రాసేసి దానిని బల ప్రయోగంతో అమలు చేస్తే ఆ రకంగా సమానత్వం వస్తుందని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏక పార్టీ నియంతృత్వం ద్వారా వస్తుందని నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వేరే రూపాన వస్తుందని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు.
ప్రతి మనిషికి సమాన విలువనిచ్చే సమాజాన్ని ఏ రూపంలో సాధించుకోవాలో మనం ప్రజానీకానికి వదిలేద్దాం. దానికోసం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఇద్దాం. ప్రతి మనిషికీ ఒక ఓటునిచ్చే రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఇచ్చి దీని ద్వారా మీరే ఏ రూపంలో ప్రతి మనిషికి సమాన విలువనిచ్చే ఆదర్శ సమాజాన్ని సాధించుకోవచ్చునో మీరే నిర్ణయించుకోండి అని ప్రజలకు వదిలేద్దాం. కాని ఈ ఆదర్శాన్ని మాత్రం రాజ్యాంగంలో పెడదాం అన్నాడు. ఏ పార్టీ అయినా నాది ఈ మార్గం, నాదింకొక మార్గం అని చెప్పుకోవచ్చు. ఆ మార్గాలను బట్టి ప్రజలు ఎన్నుకోవచ్చు. కాని ఈ ఆదర్శాన్ని మాత్రం రాజ్యాంగంలో పెడదాం అన్నాడు. అంటే పాపం వాళ్ళు ఆ రోజు అట్లా పెడితే అది ఉంటుందనో, రాజకీయాలలోకి వచ్చే వాళ్ళందరూ దానిని గౌరవిస్తారనో, దానికి భిన్నంగా నడుచుకుంటాం అనే బి.జే.పి. లాంటి పార్టీ రాదనో, దీనికి భిన్నంగా నడుచుకుంటాం అని ఏ పార్టీలు అనవనో ఆ రోజు నమ్మినట్టుంది. మొత్తానికి అయితే ఒక విశ్వాసంతో వాళ్ళు - జాతీయోద్యమం మిగతా ఉద్యమాల నుంచి ముందు కొచ్చిన ఉత్సాహం ఉంటుందిగా, ఆ ఉత్సాహంతో వాళ్ళు - రాజ్యాంగంలో గట్టిగా రాసేస్తే అందరూ దానిని గౌరవిస్తారని అనుకొన్నారు పాపం. వాళ్ళను మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. తప్పు ఏమన్నా ఉంటే మనదే. అంటే ఆ ఒత్తిడిని మనం కొనసాగించలేక పోయాం. అ రోజు రాజ్యాంగ నిర్దేశకుల మీద ప్రజల ఉద్యమాల నుంచి, అకాంక్షల నుంచి ఎంత ఒత్తిడి వచ్చిందో, అంత ఒత్తిడిని మనం కొనసాగించలేక పోతున్నాం. మొత్తానికి
28 జ రాజ్యం - నంక్షేమం *
ఈరోజు అది మన తప్పయితే కావచ్చు. ఆ రకంగా ఈ అదేశిక సూత్రాల జాబితా
రాయడం జరిగింది. దాని ప్రక్కనే ప్రాథమిక హక్కుల జాబితా ఉంటుంది. అవి
2001012016 0 ౦౦4గఏ. ఈ ప్రాథమిక హక్కుల జాబితాలో అప్పటికి భారతదేశంలో
ఉన్నటువంటి స్వంత ఆస్తి వ్యవస్థ, స్వంత వ్యాపారాల వ్యవస్థ - వీటికి కూడా చోటు
కల్పించడం జరిగింది.
పార్ట్-3లో ఉండే ప్రాథమిక హక్కులలో అత్యవసర మైనటువంటి ప్రాథమిక హక్కులతో పాటు, నాగరిక సమాజం వచ్చిన తరువాత ఈ హక్కులు తప్పనిసరిగా ఉండాలి అనే విలువ ఒకటి వచ్చేసింది. 16 0124లో భాగంగా ఎవ్వరినీ కూడా అక్రమంగా శిక్షించటానికి వీలులేదు, ఎవ్వరినీ కూడా క్రూరంగా శిక్షించడానికి వీలులేదు, భావ ప్రకటనా స్వేచ్చ తొలగించటానికి వీలులేదు, సంఘాలు పెట్టుకునే హక్కు ఉండాలి, సమావేశాలు పెట్టుకునే హక్కు ఉండాలి. ఈ రకమైన నాగరికతకు తప్పనిసరి అవసరమైన అన్ని హక్కులతో పాటు, ఈ పార్ట్ 3లో సొంత ఆస్తి హక్కును ఒక (ప్రాథమిక హక్కుగా, ఇష్టమొచ్చిన వ్యాపారం చేసుకోవడం కూడా ఒక ప్రాథమిక హక్కుగా ఈ రెండూ దాన్లో చేర్చడం జరిగింది. స్వంత ఆస్తి ఇష్టమొచ్చిన వ్యాపారం చేసుకోవడం అనేవి ప్రాథమిక హక్కులుగా పెట్టేసి, వాటిని కోర్టుల ద్వారా అమలు చేయించుకోవచ్చు అని అవకాశం ఇచ్చేసి, ఆదేశిక సూత్రాలలో సంక్షేమమనే దాన్ని - దాంట్లో ముఖ్యమైనవి ఆర్టికల్ 38,39 - పెట్టేసి, వాటిలో సమానత్వం దిశగా ప్రభుత్వం కృషి చేయాలి. సమాన అవకాశాలు, సమాన ప్రతిపత్తి, సమాన స్థితిగతులు, సమాన సదుపాయాలు, సమాన సౌకర్యాలు - వీటి దిశగా ప్రభుత్వం తన విధానాలను రూపొందించాలి అని పెట్టేస్తే రాగల సమస్యలేమిటి అనేవి రాజ్యాంగం రాసినప్పుడు వాళ్ళకు స్పష్టంగా అర్థం కాలేదు. తరువాత స్పష్టంగా అర్ధం అవుతూవచ్చాయి. సంక్షేమం కోసం ఏ చట్టం చేసినా నా వ్యాపార స్వేచ్చ దెబ్బ తినింది అని, అర్థిక అవకాశాల కోసం, ఆర్థిక సమానత్వం కోసం ఏ చట్టం చేసినా నా ఆస్తి హక్కు దెబ్బతినింది అని అవతల వైపు నుంచి వాదనలు రావడం మొదలుపెట్టినాయి. దాంతో చాలా కొలం పాటు భారత రాజ్యాంగానికి సంబంధించి కోర్టులలోగాని, బయటగాని, రాజకీయాలలో గాని - మీలో కొంత వయస్సు ఎక్కువున్న వాళ్ళకు - ఇందిరాగాంధీ కాలంలో చర్చ జ్ఞాపకం ఉంటుంది. మేమంతా అప్పుడు హై స్కూలు అయిపోయి, కాలేజీలో చేరుతున్న కొత్త. నేనైతే గొప్ప ఇందిరాగాంధి అభిమానిని పియుసిలో చేరిన కొత్తలో. ఏమంటే ఆమె పెట్టుబడిదారులను దెబ్బతీసిందని. నేను ఎస్ఎస్ఎల్సె పూర్తి లశ శమన
చేసిన సంవత్సరంలో ఆమె బ్యాంకులను జాతీయం చేసింది. బ్యాంకులను జాతీయం చేసి మొత్తం బిర్లా టాటాల పెట్టుబడి అంతా ప్రభుత్వం చేతిలో పెట్టి మనకంతా ఇచ్చేస్తుంది, ప్రజలందరికీ ఇచ్చేస్తుంది అని చెప్పి ఆశ పడిన వారిలో నేను కూడా ఉన్నాను. ఆ రోజులలో ఇందిరాగాంధి దాన్ని బాహాటంగా సమాజం చర్చగా పెట్టింది. ఏమని పెట్టింది అంటే ఈ రాజ్యాంగంలోని పార్ట్-3 అనేది దుర్మార్గమైనది. పార్ట్-4 గొప్పది. కాని కోర్టులు ప్రాథమిక హక్కుల పేరుమీద ఆదేశిక సూత్రాలను దెబ్బ తీస్తున్నాయి అని చెప్పింది. కాని ప్రాథమిక హక్కులలో ఉండే స్వంత ఆస్తిహక్కు, వ్యాపార హక్కు అనే వాటి మీద చర్చ పెట్టలేదు. ప్రాథమిక హక్కులు నాకు అడ్డం అని మాత్రమే చెప్పింది. అని చెప్పి ఎమర్జెన్సీ కూడా పెట్టింది చివరకు. అప్పుడు చాలా మందికి అర్ధం అయింది. ఆమె మాట్టాడిందేమిటి, చేసిందేమిటి? ప్రాధమిక హక్కుల లోని ఆస్తిహక్కు, వ్యాపార 'స్వేచ అనేవి తప్పనిసరిగా - సంక్షేమానికి, సామాజిక సమానత్వానికి, ఆర్థిక సమానత్వానికి, ప్రజాస్వామ్య పురోగమనానికి ఆఅటంకమే. కాని మొత్తంగా ప్రాధమిక హక్కులన్నీ నాకడ్డం వస్తున్నాయి అని చెప్పి అమె ఎమర్జెన్సీ పెట్టింది. అప్పట్లో పెద్ద సంవాదం రాజకీయాలలో నడిచేది.
సంక్షేమాన్ని సాధించటానికి ప్రభుత్వం ఏమి చేసినా వాళ్ళు హక్కుల పేరు మీద కోరకు పోతున్నారు. కొన్ని ఘటనలు జరిగినవి అట్లా. అయితే అన్ని హక్కులూ కాదు. అస్తి హక్కు ఆర్టికల్ 31లో ఉండేది. తరువాత ఇందిరాగాంధి దానిని తీసివేసింది. ఆర్టికల్ 31 ప్రకారం ఆస్తి ఒక ప్రాథమిక హక్కు, అస్తి ప్రాథమిక హక్కు అంటే అందరికీ ఆస్తి ఉండాలను కునే హక్కు అనుకోవచ్చు ఎవరైనా. అందరికీ అస్తి ఉండాలనే హక్కు ఉంటే అభ్యంతరం లేదు. కాని అందరికీ ఉండకపోవడమే అస్తి కుండే ప్రత్యేక లక్షణం. అస్తి ప్రాథమిక హక్కు అంటే అర్థం ఏమిటంటే ఆస్తి ఉన్నవాడి నుంచి ఆ ఆస్తి పీకెయ్యటానికి వీలు లేదు. అది ప్రాథమిక హక్కు. అది అర్జికల్ 31లో ఉండేది. అట్లాగే ఆర్టికల్ 19 క్లాజు 1, సబ్ క్లాజు ౮ లోనో, దేంట్లోనో వ్యాపార స్వేచ్చ ఉంది. ఇష్టమొచ్చిన వృత్తిగాని, ఇష్టమొచ్చిన వ్యాపారం గాని చేసుకోవచ్చు అని. వృత్తి వ్యాపారం కలిపేసేసరికి ఇష్టమొచ్చిన వృత్తి చేసుకోవడ మనేది మంచి హక్కే కదా, నాకు ఇష్టమొచ్చిన వృత్తి నేను చేసుకుంటే, నీవు చేసుకోటానికి వీలు లేదు అని అదేశాలు "పెడితే నాకు కోపం వస్తుంది కదా అనుకున్నాం. కొని నా వ్యాపారం దెబ్బ తీసే పని ప్రభుత్వం చేస్తే నా హక్కు దెబ్బ తినిందని నేనంటాను అని వ్యాపారస్తులు ఒకసారి కోర్టుకు పోయారు. ఎప్పుడంటే కనీస వేతనాల చట్టం చేసినప్పుడు. కనీస వేతనాల
ఖల్ చం నక్ష
చట్టాన్ని 1948లో మొదటిసారి చేశారు. అంటే 1947లో స్వాతంత్ర్యం వచ్చింది, 1948లో దీన్ని చేశారు. ఇంకా రకరకాల ఉద్యమాలు పోరాటాలు నడుస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చింది కేవలం ఢిల్లీలో సర్దార్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూలకు పదవులు రావటానికి కాదు, మాకూ హక్కులు కావాలని ప్రజలు కోరుతున్నారు. కాబట్టి కనీస వేతనాల చట్టం చేశారు. వెంటనే కోర్టుకు పోయారు పెట్టుబడిదారులు. నాకు వ్యాపార స్వేచ్చ ఉందని నీవు అంటున్నావు. నా వ్యాపారం స్వేచ్చగా చేసుకోవాలంటే కూలి వాళ్ళకు నేను ఎంత ఇవ్వగలిగితే అంత ఇస్తాను. కూలివాడికి ఇంత ఇవ్వవలిసిందే నువ్వు అంటే నా వ్యాపారం దెబ్బ తిని, నా వ్యాపార స్వేచ్చ పోయినట్టే. మరి వాడికి కనీస వేతనాలు ఇయ్యాలని (ప్రాథమిక హక్కులలో ఉందా, లేదు. అది ఆదేశిక సూత్రాలలో ఉంది. ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 43 ఏదో ఉంది, నెంబర్ గుర్తులేదు - తరువాత చెపుతాను కావాలంటే - మీకు దాంట్లో ఏముంటుంది అంటే 11/10 ₹/286 ఉండాలి అని ఉంది. కనీస వేతనం కాదు, బతికే వేతనం ఉండాలి అని ఉంది. అదొక ఆదేశిక సూత్రం.
ఇప్పటికీ మన భారత దేశంలో ట్రేడ్ యూనియన్స్ చాలా కాలంగా కనీస వేతనం కాదు, బ్రతికే వేతనం కావాలి అని ఆందోళన చేస్తున్నాయి. ఈ కనీస వేతనం అంటే అర్ధమేమిటంటే, దాన్ని వీళ్ళు ఎట్లా లెక్క పెడ్తున్నారంటే - ఒక భార్య, భర్త ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే అందరికీ తిండి తినడానికి సరిపోయినంత వస్తుందా లేదా అని లెక్క పెడుతున్నారు. తిండి మాత్రమే బ్రతుకు కాదు, ఓ[1108 ₹/286 అంటే అర్ధమేమిటి అంటే తిండి, బట్ట, చదువు, వైద్యం, కొంచెం శుభ్రంగా ఉండే పరిసరాలు. ఇవన్నీ లెక్క పెట్టుకుంటే 11718 11/286 అవుతుంది. కాని బ్రతికే వేతనం ఉండాలనేది ఆదేశిక సూత్రం మాత్రమే. దేశ పరిపాలనలో అది ప్రాథమికమే కాని అది హక్కు కాదు. ఏది హక్కు? వ్యాపార స్వేచ్చ హక్కు. వ్యాపారస్వేచ్చ హక్కు కాబట్టే కనీస వేతనాలు, బ్రతికే వేతనాలు చట్టంకాదు, కనీస వేతనాల చట్టం చేసినా కుడా నా వ్యాపార స్వేచ్ళ దెబ్బతిందని కోర్టుకు పోతే అది కరక్టే గదా అని కోర్టులు అన్నాయి. అట్లా జరిగినప్పుడు - అంటే ఆదేశిక సూత్రాల అమలుకు, ఆర్థిక అవకాశాలకు, ఆర్థిక పురోగమనం, అర్థిక సమానత్వం, కనీసవేతనాలు - వాటికి వ్యాపార స్వేచ్చ, ఆస్తి హక్కు అడ్డం వచ్చినప్పుడంతా కూడా కోర్టులు వ్యాపార 'స్వేచ్భనూ, ఆస్తి హక్కునూ రక్షిస్తూ వచ్చేటప్పటికి, ఇందిరాగాంధి రాజకీయాలకు ఒక భావజాలం దొరికింది. ఆమెకు ఏమి దొరికింది అంటే - నాకు ప్రాథమిక హక్కులు అడ్డం వస్తున్నాయి దేశాన్ని డెవలప్
వం డాగపాల దవా
చేద్దామంటే. నేను ప్రజలకు మేలు చేద్దామంటే ప్రాధమిక హక్కులు అడ్డం వస్తున్నాయి, ఆ వాక్కులు తీని వేయాలి. ఎమర్జెన్సీ పెడతాను అంది. అప్పట్లో చాలా చదువుకున్నటువంటి కమ్యూనిస్టు మేధావులు కూడా - ముఖ్యంగా (09 పార్టీకి చెందిన వాళ్ళు - (ప్రాథమిక హక్కులు అన్నింటినీ తిట్టాల్సిన అవసరం లేదు. వాటిలో మంచి హక్కులు చాలా ఉన్నాయి, వాటిలో అస్తి హక్కు ఒక్క దాని మీద మాట్లాడమంటే ఆమె మొత్తం ప్రాథమిక హక్కులు పీకేస్తానంటూ ఉంది అని చెప్పడానికి కూడా, ఆపాటి విజ్ఞత కూడా లేకుండా పోయింది ఆ రోజులలో. ఆమెను వామపక్ష మేధావులు ఎవరూ తప్పు పట్టలేదు. ఎమర్జెన్సీని కూడా సమర్దించారు.
అయితే ఏమవుతూ వచ్చిందంటే కాలక్రమంలో ఈ ఘర్షణ ఫలితంగా కోర్టుల వైఖరి క్రమంగా నూరుతూ వచ్చింది ఇందిరాగాంధి తన రాజకీయాల కోసమే అనుకోండి, ప్రజల ఒత్తిడి వల్లే అనుకోండి, ప్రజా ఉద్యమాల ప్రభావమే అనుకోండి, మొత్తానికైతే ఎక్కడ నుంచి ప్రభావం పడింది అనేది ఒక అంశమైతే, అది ఏ మార్చు తీసుకొచ్చింది అనేది ఇంకొక అంశం. ఆ తేడా పాటించాలని మొదట్లో కూడా చెప్పాను. ఆ వచ్చిన మార్చు కేవలం ఒక వర్గం ప్రయోజనం కోసం వచ్చింది అని పుల్‌స్టాప్ పెట్టేస్తే మనకు ఆ మార్పు పూర్తిగా అర్ధంకాదు. ఆ రకంగా వచ్చిన మార్చు ఆ తరువాత ఒక నాగరికతా విలువగా ఏరకంగా అది వ్యవస్థీకృతం అవుతుంది, అది ఏ రకంగా ఒక విలువగా సమాజంలో మిగిలిపోతుంది, అది ఏ రకంగా సామాజిక జీవితాల్ని తీర్చి దిద్దుతుంది, రూపొందిస్తుంది అనేది చాలా ముఖ్యమైన అంశం. అది ఎక్కడ నుంచి పుట్టింది అనే అంశం ఒక్కటేకాదు - ఇందిరా గాంధి రాజకీయాలా - ఆమె కుటుంబ రాజకీయాలా, నియంతృత్వ రాజకీయాలా - మొత్తానికి కొన్ని మార్చులను ఆమె చేసింది. నిజానికి జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచే కొన్ని మార్పులు వస్తూ వచ్చినాయి. మనవాళ్ళు ఆదేశిక సూత్రాల అమలు కోసం చేసిన మొట్ట మొదటి పని భూసంస్కరణలలో మొదటి మెట్టు.
మన దేశంలో భూసంస్కరణలు మూడు దఫాలుగా జరిగాయి. మొదటిది జాగీరులు, ఈనాముల్ని రద్దు చేయడం. 512165 4౦01401 అంటారు. రెండవది కౌలుదారీ చట్టం. అంటే కౌలుదారులకు భద్రత కల్పించే చట్టం, మూడవది భూ గరిష్ట పరిమితి చట్టం లేదా 1206 0౬1108 చట్టం. మూడు దశలలోనూ మా ఆస్తి హక్కు పోయిందని చెప్పి అడ్డురావడం మొదలు పెట్టారు భూస్వాములు. జాగీర్జార్డు, జమీందార్లు, ఈనాందార్డు, తాలుకుదార్లు రకరకాల పేర్లతో ఉండేవాళ్ళు ఒకప్పుడు.
వ
వాళ్ళందరూ పండించే రైతుకూ, పన్ను వసూలు చేసుకునే ప్రభుత్వానికీ మధ్యన యింరు॥ట గా ఉంటారు. ఒక 30, 40 గ్రామాలలో పండించే రైతులందరూ, ఆ గ్రామాల మీద పెత్తనం చేసే జమీందారులకు, జాగీర్జారులకు పన్నులు చెల్లిస్తే వాళ్ళు దాన్లో కాస్త ఉంచుకుని మిగిలిన దాన్ని ప్రభుత్వానికి ఇస్తారు. అంటే రైతుల శ్రమ పన్నుల రూపంలో ప్రభుత్వానికే కాకుండా వీడికి కూడా పోతుందని మొత్తం రద్దు చేశారు. వెంటనే కోర్టుకు పోయారు జమీందారు, జాగీర్జార్లు. పోయి ఏమన్నారూ, మా ఆస్త్ హక్కు పోయిందన్నారు. ఆర్టికల్ 19, ఆర్టికల్ 31, ఆర్టికల్ 14కింద, 14 ఏమంటుంది? చట్టం అందర్నీ సమానంగా చూడాలంటుంది. చట్టం అందర్నీ సమానంగా చూడాలని చెపుతూ జాగీర్జారులైన మాకు నష్టం చేస్తే ఎట్లా అని జాగీర్జార్లు కోర్టుకు పోయారు. చట్టం అందర్నీ సమానంగా చూడాలంటుందని సమానత్వం లేని వాళ్ళు కోర్టుకు పోలేదు. ఉన్నవాళ్ళు పోయారు కోర్టుకు. నువ్వు జాగీర్షను మాత్రమే రద్దు చేస్తే ఎట్లాగ, మిగిలిన (ప్రైవేటు ఆస్తులను అంతా అట్లాగే పెట్టి అని వాళ్ళు కోర్టుకు పోయారు. సుట్రీంకోర్టు అప్పట్లో ఆర్జికల్ 14, ఆర్జికల్ 19, ఆర్టికల్ 31 అన్నీ ఉల్లంఘింప బడ్డాయి అని కొట్టేస్తే ఆ తర్వాత రాజ్యాంగాన్ని సవరించారు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట సంక్షేమానికీ ఆస్తి హక్కుకీ ఘర్షణ చాలాకాలం పాటు ఒక ముఖ్యమైన ఘర్షణగా ముందుకు వచ్చింది. మొదట్లో అస్తి హక్కే ప్రధానమని కోర్టులు అంటూ వచ్చాయి. పార్లమెంటు, కాలక్రమంలో కోర్టులు కూడా వైఖరి మార్చుకొని ఆస్తి హక్కుకు (ప్రాముఖ్యం తగ్గించి తగ్గించి ఇవాళ్టి భారత రాజ్యాంగ పరిస్థితి ఏమిటంటే ప్రజా సంక్షేమం కోసం -అంటే ఆదేశిక సూత్రాలు పార్ట్ 4 లో ఉన్నటువంటి ఏ అంశం కోసమైనా - ప్రభుత్వం ఏం చేసినా సరే ఆస్తి వ్యాపార హక్కులకు అది ఆటంకమని చెప్పి కోర్టులు కొట్టేయడానికి వీలులేదు. ఇవాల్టి పరిస్థితి అది. ఇది చెప్పడం కోసం ఈ చరిత్ర చెబుతున్నాను.
దీన్ని గురించి ఇంతసేపు ఎందుకు చెప్పుకోవాలంటే ప్రభుత్వం ఈ రోజు - మేమేం చేయాలి డబ్బులు లేవు మా దగ్గర - మీరు గనక తాగకపోతే నా దగ్గర రెవిన్యూ లేదు, రోడ్డు వేద్దామంటే పైసలు లేవు, బిల్లింగులు కడదామంటే పైసలు లేవు, స్కూళ్లకు పైనల్లేవు అనడానికి వీల్లేదు. రోడ్డు వేయటం, స్కూళ్ళు వేయడం, మద్యపానం నిషేధించడం, 'పేదవాళ్లకు స్కాలర్షిప్లు ఇవ్వడం - ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలలోని సంక్షేమ బాధ్యతలు. ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రభుత్వం ఏ చర్య చేపట్టినా అది ఎవ్వరి ఆస్తికీ వ్యాపారానికీ అడ్డమొస్తుందని కోర్టుకు పోవడానికి వీలులేదు. కోర్టులు
వరో క్చాగావాల్ దవన్యానాట
ఒప్పుకోవు. అదీ ఇవాళ్టి పరిస్థితి. ఇది చెప్పడం కోసమే ఈ మాట చెబుతున్నాను. వీళ్ళ బూటకాన్ని మనం ఎండగట్టాలి. ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు. అది లేని రోజులలో చాలా ఘర్షణ జరిగింది ఆదేశిక సూత్రాలకూ, ఆస్తి హక్కుకూ మధ్య జరిగిన ఘర్షణను ఆదేశిక సూత్రాలకూ, ప్రాథమిక హక్కులకు మధ్య జరిగిన ఘర్షణగా ఇందిరాగాంధి చూపింది. తన నియంతృత్వ రాజకీయాలను నడుపుకుంది. అది వేరే చరిత్ర. అది పక్కన పెట్టండి. దీంట్లో భాగంగా ఏం చేసుకొచ్చారంటే రాజ్యాంగ సవరణగా 96) 50164116 తీసుకొచ్చారు. 13 5606616 206 50166416 3కే 50166216 లాగా 9 50664216 ను చేర్చారు. ఈ 96 50166116 అనే జాబితాలో ఏ చట్టాలనైతే పెట్టడం జరుగుతుందో - ఒక చట్టాన్ని చేసి ౧118 20613 ఏలం286 14066 1 9 కంగంతేం!6 అని అంటే అప్పుడు 94! 3016801లలో పెట్టిన ఆ చట్టాన్ని, దానివల్ల ఆర్టికల్ 14గాని, 19 గాని, 31 గాని భంగమవుతుందని - ప్రశ్శించటానికి వీలులేదు. ఆస్తిహక్కూ వ్యాపార 'స్వేచ్చల నుంచి ఆదేశిక సూత్రాలను కాపాడటం కోసం చేసిన మొట్టమొదటి రాజ్యాంగ సవరణ అది. మీకు బాగా తెలిసే ఉంటుంది. మండల్ కమీషన్ చట్టాన్ని కూడా ఇవాళ 91 ౩0166016 లోనే పెట్టారు. ఇవాళ అ అవసరం లేదు. ఎందుకంటే కోర్టులు కూడా ఆ వైఖరిని మార్చు కున్నాయి.
ఇవాళ మీరు ఆ 9 3యం6016 జాబితా గాని చదివితే అన్ని భూసంస్కరణ చట్టాలూ దాంట్లో ఉంటాయి. భూ సంస్కరణల కోసం చేసిన అన్ని చట్టాలు అంటే 8169 4౦001608 కానీయండి, కౌలుదారీ చట్టాలు కానీయండి, 1.26 ౦ల138 చట్టాలు కానీయండి - ఇవన్నీ కూడా రాజ్యాంగంలోని 90 30[664416లో ఉంటాయి. అలా ఎందుకోసం పెట్టాల్సి వచ్చిందంటే ఆస్తిహక్కు నుంచి ఆదేశిక సూత్రాలను కాపాడటం కోసం; సమానత్వ సాధన, సమాన అవకాశాలు, ఆర్థిక సమానత్వం వైపు ప్రభుత్వం పోవాలి అనే దానిని కాపాడటం కోసం అ పని చేసారు. ఆ తరువాత కాలక్రమంలో ఇందిరాగాంధి ఇంకొక పని కూడా చేసింది. అమె ఆర్టికల్ 31ని తీసేసింది, రద్దు చేసేసింది. అంటే అస్తి హక్కు ఒక (ప్రాథమికమైన హక్కు అనేది ఇవ్వాళ లేదు. అది పోయింది కాని వ్యాపార స్వేచ్చ ఒక ప్రాథమిక హక్కు అనేది ఇంకా ఉంది. ఆర్టికల్ 19 ఆస్తిహక్కు ప్రాధమికహక్కు అనేది పోయినా ప్రాథమిక హక్కుగా ఉన్న వ్యాపార స్వేచ్భను వాళ్లు వాడుకోగలుగుతున్నారు, వాడుకుంటున్నారు కూడా. ఉదాహరణకు మనం పొల్యూషన్ గురించి కోర్టుకు పోతాం అనుకోండి, ఫలానా ఫ్యాక్టరీ వాళ్ళు ఈ రకంగా కాలుష్యాన్ని బయటకు పంపేయడం వలన చాలా మంది ఆరోగ్యాలు
29
నాశనం అవుతున్నాయి, చనిపోతున్నారని మనం గాని కోర్టుకుపోతే, కోర్టుగాని ఏదన్నా ఉత్తర్వు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే నా వ్యాపార స్వేచ్చ దెబ్బతినింది అంటాడు. వ్యాపార స్వేచ్చ ఇప్పటికీ ప్రాథమిక హక్కే. దీని వెనక చాలా ఉంది. చెప్తాను తరువాత - అయితే ఆమె ఏమి చేసిందంటే, ఆస్థిహక్కు అనే దానిని రాజ్యాంగం నుంచి తీసేసింది. తీసేసి ఏం చేసిందంటే 31 తీసేసి 31 ఎ, 31 బి, 31 సి అని మూడు పెట్టింది. వీటన్నింటి సారాంశం ఏమిటి అంటే ఆదేశిక సూత్రాలను అమలు చేయటం కోసం ప్రభుత్వం ఏ పనైనా చేస్తే, అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు గాని, 19కు గాని విరుద్ధం అని కోర్టుకు పోవడానికి వీలు లేదు అని. ఇంతకుముందు చెప్పిన విషయమే. అయినా దాని మీద సుప్రీంకోర్టులో చాలా వివాదాలు నడిచాయి. మినర్వా మిల్స్ అనే కేసులో సుప్రీంకోర్టు కూడా ఒప్పుకొంది ఇది రాజ్యాంగబద్ధమైన సవరణ అని చెప్పి,
మినర్వా మిల్స్ కేసు తీర్చు ప్రకారం ఈ రోజు ఆర్టికల్ 31 ఎ,బి,సి మూడూ రాజ్యాంగ బద్ధమే. వాటి ప్రకారం ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రభుత్వం ఏ పని చేసినా - అంటే ఏ రకమైన పన్నులు వసూలు చేసినా, ఏ వ్యాపారం మీద ఏ నియంత్రణలు పెట్టినా, ఏం జేసినా సరే, నా వ్యాపార "స్వేచ్చ దెబ్బతింది, నా అస్తిహక్కు పోయింది అని కోర్టుకు పోవడానికి వీలులేదు. మద్యపాన నిషేధం కూడా ఆదేశిక సూత్రాలలో ఒకటి. రెవెన్యూ సమకూర్చుకోవాలని మద్యపాన నిషేధం కోసం చంద్రబాబునాయుడు ఎవ్వరిమీద ఏ పన్ను వేసినా నా వ్యాపార స్వేచ్చ దెబ్బతింది అని కోర్టుకు పోవడానికి వీలులేదు. అంత అధికారం ఆర్టికల్ 31 క్లాజ్ బి క్రింద చంద్రబాబు నాయుడుకుంది. ఆయనేమో నా దగ్గర పైసలు లేవు అంటున్నాడు. నా దగ్గర డబ్బులు లేవు, మీరు తాగకపోతే నేనెట్లా పరిపొలించేది రాష్ట్రాన్ని అంటాడు. మీరు తాగాలి, మీరు లాటరీ టిక్కెట్లు కొనుక్కోవాలి, మాకు డబ్బులివ్వాలి, మేము పరిపాలించాలి, లేకపోతే మార్గమేంది అంటాడు. మనమేమి చెప్పాలంటే ఆర్టికల్ 31 బి ప్రకారం నువ్వు ఈ రాష్త్రంలోనున్న ప్రతి ఒక్కరూ సంవత్సరానికి లక్షరూపాయలు, పదిలక్షల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రతి ఒక్కడు ఆదాయంలో 10% ప్రభుత్వానికిచ్చేయ్యాలని నువ్వు చట్టం చేయి - ఏ కోర్టూ నీకడ్డం రాదు. ఎందుకంటే రాజ్యాంగం అంత మారింది. కోర్టులు అంతగా మారాయి. మినర్వా మిల్స్ కేసులో ఈ రాజ్యాంగ సవరణ చెల్లుతుంది అని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ప్రకటించింది అని చెప్పడం కోసం నేను ఈ మాటలు చెపుతున్నాను. ఆ రకమైన మార్పులు కాలక్రమంలో రావడం మొదలుపెట్టాయి.
తిం శే ాపాడ్ దవన్యాసాద
సుప్రీంకోర్టు ఇంకా కూడా కొన్ని పనులు చేయటం మొదలుపెట్టింది. ఉదాహరణకు వ్యాపార స్వేచ్చ ఉంది. వ్యాపార స్వేచ్చ ఒక ప్రాధమిక హక్కు అని ఆర్టికల్ 19011456 1 $20 ౧10569 అని ఏదో ఉంటుంది. కాని దానికీ మినహాయింపు లుంటాయి, ప్రతిహక్కుకు కొన్ని మినహాయింపులుంటాయి. కొన్ని సహేతుకమైన మినహాయింవులు ఉంటాయి. ఒక మినవహోయింవు ఏమిటి అంటే (ప్రజా ప్రయోజనాలకోసం ప్రభుత్వం వ్యాపార స్వేచ్చను అదుపు చేయవచ్చు అని ఒక మినహాయింపు రాజ్యాంగం రాసినప్పుడే ఉంది ఈ ప్రజా ప్రయోజనాలు అంటే ఏమిటి అనే చర్చ సుప్రీమ్ కోర్టులో చాలాసార్లు వచ్చింది. సుప్రీంకోర్టు చివరకు దానిని ఎట్లా తేల్చింది అంటే ఆదేశిక సూడత్రాలన్నీ ప్రజా ప్రయోజనాలలో భాగమే, ఇట్లా కూడా సుప్రీమ్ కోర్టు వ్యాఖ్యానం చేసింది. వ్యాపార స్వేచ్భ ఒక ప్రాథమిక హక్కు అని రాజ్యాంగమే చెపుతుంది. ప్రజా ప్రయోజనాలకోసం హేతుబద్ధమైన పరిమితులు పెట్టవచ్చని రాజ్యాంగమే చెపుతుంది. మొదట్లో ప్రజా ప్రయోజనం అంటే ఏమిటి అంటే సుప్రీంకోర్టు చాలా సంకుచితంగా వాఖ్యానించేది. ప్రత్యక్షమైన ప్రజా ప్రయోజనం ఏదో ఒకటుండాలి. మన కళ్ళకు కనిపించే ప్రయోజనం ఉండాలి, లేకపోతే ఒప్పుకోదు రాజ్యాంగం అనేది. తరువాత సుప్రీంకోర్టు వైఖరి మార్చుకొని ఏం చెప్పింది అంటే ఆదేశిక సూత్రాలు ఏవైనా ప్రజా ప్రయోజనాలలో భాగమే అంటే ఆదేశిక సూత్రాల అమలు కోసం వ్యాపార స్వేచ్చను అదుపు చేయవచ్చు అంది. అట్లా కూడా, మళ్ళీ ఇంకొక రూపంలో కూడా అ హక్కు మనకుంది. ఇవ్వాళ ఇట్టా చేస్తూ వచ్చారు.
ఈ రకమైన మార్పులనేవి కూడా క్రమంగా కోర్టులలో రావడానికి కారణమేమిటి అంటే బయటి సమాజంలో ఈ స్వంత ఆస్తి అనే హక్కు, వ్యాపార స్వేచ్చ అనే స్వేచ్చ ఈ రెండూ సన్నిహితంగా ముడిపడి ఉంటాయి. ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో అస్తి వ్యాపారం కోసమే ఉంటుంది. కేవలం ఆస్తి కోసం కాదు. అస్తి పెట్టకొని న్యాపారం కోసం దానిని వాడుకొంటాడు. అందువలన ఆస్తిహక్కు, వ్యాపార స్వేచ్చ అనేవి కలిసే ఉంటాయి. ఇవి ఏ ప్రజానీకానికైతే తమ జీవనానికి, జీవితానికి, కనీస ఉపాధికి, బతుకుకు ప్రమాదకరంగా తయారవుతున్నాయో, వాళ్ళందరూ రకరకాల రూపాలలో ఉద్యమాలు చేస్తున్నారు. ఆ చేసే ఉద్యమాలనుంచి ముందు కొచ్చే ఆకాంక్షలన్నీ కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా రాజకీయ పార్టీల విధానంలో భాగం కావలసిన అవసరం ఏర్పడుతుంది. వాటి ప్రభావం కోర్టులపై కూడా ఉంటుంది. కోర్టులు కూడా తప్పనిసరిగా వాటిని వ్యాఖ్యానించాల్సిన అవసరం ఏర్పడుతుంది.
తై
ఎవరికైతే హక్కులు అవసరమో, వాళ్లు చేసే ఉద్యమాల ప్రభావం కోర్టులపై చాలా బలంగా ఉంటుందని మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది జడ్జీలు కూడా పేపర్లు చదువుతారు. చదవకుండా ఏమీ ఉండరు. వాళ్లేదో గౌను వేసుకొని, బోనులో బెంచి మీద కూర్చొంటారు కాబట్టి వీటన్నిటికీ అతీతమయిన వ్యక్తులని మనం అనుకుంటే చాలా పొరపాటు. అన్ని రకాల సొమాజిక ప్రభావాలు వాళ్ల మీద ఉంటాయి. ఒక్క పేపర్ చదవటం మాత్రమేకాదు, వాళ్లు పుట్టిన సంస్కృతి, వాళ్లకులం, వాళ్ల వర్గం, వాళ్ల ఆస్తులు, వాళ్ల సంబంధాలు అన్నీ ఉంటాయి. బయట సంఘటనల ప్రభావం చాలా బలంగా ఉంటుంది. ఒక్క రిజర్వేషన్ల విషయంలో కోర్టుల వైఖరి ఎట్లా మారుతూ వచ్చిందో చూస్తే కూడా ఈ విషయం తెలుస్తుంది. దళితులు, వెనుకబడిన కులాలకు చెందిన మేధావి వర్గం రాజకీయాలలో కొంచెం ముందుకొచ్చి బలంగా మాట్లాడటం మొదలుపెట్టడం, కోర్టుల వైఖరి మారటం మనకు సమాంతరంగా కనిపిస్తుంది. అది ఊరికే రాలా. ఈ జఒత్తిడి తప్పని సరిగా పనిచేస్తుంది. అట్లాగంటే జడ్జీల గొప్పతనం, ఆలోచనను మనం ఒప్పుకో కూడదని కాదు. ఎంతవరకు ఒక మనిషి గొప్పతనాన్ని ఒప్పుకుంటావముంటే నమాజంలో వస్తున్న మార్పులను గుర్తించి, గ్రహించటానికి సిద్ధంగా ఉంటే ఆ వ్యక్తిని గొప్పవాడుగా భావించాల్సిన అవసరం ఉంది. ఆ సంసిద్ధతను ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత బెన్నత్యంగా మనం భావించవచ్చు. కాని సమాజం నుంచి ఒత్తిడి అనేది చాలా అవసరం. కోర్టుల నుంచి వచ్చే తీర్పులు గాని, వ్యాఖ్యానాలు గాని, మార్పులు గాని, రాజకీయ పార్టీల విధానాలు గాని, అసెంబ్లీలో, పార్లమెంటులలో చేసే చట్టాలు గాని ఆ రకమైన మార్పులు చాలా వస్తున్నవి. కొన్ని కొన్ని ఉదాహరణలు వాటన్నిట్లో తీసుకుంటూవస్తే, జీవించే హక్కు అని ఒకటుంది భారత రాజ్యాంగంలో. అది ప్రాథమిక హక్కే మరి ఇంతకు ముందు చెప్పినట్లు ఆస్తిహక్కు అంటే అందరికీ ఆస్తి ఉండాలనే హక్కుకాదు, ఉన్నవాడి ఆస్తికి రక్షణ కల్పించే హక్కు. అట్టే జీవించే హక్కు వినడానికి బాగుంటుంది ఈ మాట. అది ఉంటే మంచిదే కదా. అంటామో అనమో అనే పరిస్థితి ఎవరికైనా ఎందుకు ఉండాలి? కానీ భిక్షగాళ్లు ఉండాల్సిన అవసరం లేదు భారత రాజ్యాంగంలో జీవించే హక్కు అంటే చట్టం నిర్దేశించిన పద్ధతులలో తప్ప ఇతరత్రా ఎవ్వరి ప్రాణాలు తీయడానికి వీలులేదని. 1601106%)/ ప్రాణంగాని, స్వేచ్చగాని, అం౦౭01 1200016108 10 ౧0066016 1464 60౪౫0 9 12౪ తీసేయడానికి వీలులేదు అన్నంత వరకే జీవించే హక్కు భారత రాజ్యాంగంలో ఉన్నది. అది మంచిదే.
తై క్చాగావాల దవన్వానాద
మనం ఇవ్వాళ ఎన్కౌంటర్స్ గురించి మాట్లాడుతున్నాము. వాటి విషయంలో ఇంతకంటే పెద్ద హక్కు మనకు అవసరం లేదు. చట్టం నిర్దేశించినది ఏమని - హత్య చేసిన వాళ్లనయినా, కోర్టులో నిరూపణ అయిన తరువాతే శిక్షించాలని. మరి అది కూడా లేకుండా ఎట్లా కాల్చేస్తావు అనే కదా మనం అడుగుతున్నది. ఎన్కాంటర్స్ వ్యతిరేకించడానికి, లాకప్ హత్యలు వ్యతిరేకించడానికి మనకు ఈ జీవించే హక్కు సరిపోతుంది. కాని అన్నిటకీ అది సరిపోదు కదా. జీవనం, జీవితం అనేదానికి అనేక అర్థాలున్నాయి. విశాలమైన అర్థాలున్నాయి. వాటికొచ్చేటప్పటికి ఆర్టికల్ 21లో ఉండే జీవించే హక్కు సరిపోవడం లేదు. అప్పుడెట్లా చేయాలి? కరువు వస్తుంది ప్రభుత్వం ఏ చర్యలూ చేపట్టదు. ప్రాజెక్టులు మంజూరు అవుతాయి, కట్టరు తిండిలేక మనుషులు చచ్చిపోతూ ఉంటారు, పశువులు చచ్చిపోతూ ఉంటాయి, ప్రభుత్వం తిండిగింజలు సరఫరా చేయదు. చాలామంది చచ్చిపోతారు. ఈ రకంగా పోయిన ప్రాణాల విషయంలో కోర్టులు ఏమీ చేయలేవా? ఆర్టికల్ 21లో ఉండే జీవించే హక్కు చాలా పరిమితంగా ఉంది, ఏమి చేయాలి? ఇటువంటి ప్రశ్నలు చాలా కోర్టుల ముందుకు రావడం మొదలు పెట్టాయి ఈ ప్రశ్నలు లేవదీసిన వాళ్లు ఏం చేస్తూ వచ్చారంటే అదేశికసూత్రాలలో ఇవన్నీ ఉన్నాయి కదా! ఉదొహరణకు ఆదేశిక సూత్రాలలో ఒక ఆర్టికల్ సమాజంలో అందరికీ స్ర్రీలకైనా, పురుషులకైనా తగిన జీవనం ఉండేటట్లు ప్రభుత్వం చూడాలి అంటుంది. ఎడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ - జీవనానికి తగిన ఆధారం ఉండేటట్లు ప్రభుత్వం చూడాలి అనేది ఒక ఆదేశిక సూత్రం ఆర్టికల్ 42 అనుకుంటా...ఈ ఆదేశిక సూత్రం ఉందిగదా అని కోర్టుకు పోతే మొదట్టో, కోర్టులేమన్నాయంబటే, అది ఆదేశిక సూత్రం మాత్రమే. మేము అమలు చేయలేం, మేము అమలు చేయగలిగినవి ప్రాధమిక హక్కులే, వెళ్ళిపొండి ఇక్కడనుంచి అని కోర్టులు అన్నాయి. తరువాత కోర్టుల వైఖరి మారింది. ఇప్పుడెట్లా అర్థం చేసుకుంటున్నా రంటే, ఒక ప్రాథమిక హక్కులో ఉవయోగించిన మాటలకు అర్థం చెవుకొనేటవ్పుడు, ఆదేశిక నూత్రాలను ఉపయోగించుకొని అర్జాన్ని విస్పృత పరుచుకోవచ్చు అన్నారు.
లైఫ్ అంటే బ్రతుకు అని మాత్రమే కాకుండా పార్టు 4 లోకి పోయి, అదేశిక సూత్రాలలో చెప్పిన విషయాలను లెక్కలోనికి తీసుకొని దీనిని విసృత పరుచుకోవచ్చు అని భగవతిగారు, కృష్ణయ్యర్‌గారు, చిన్నప్పరెడ్డి గారు మెల్లగా కొత్త అర్ధాన్ని ఇందులో ప్రవేశపెట్టారు. అట్లా ప్రవేశపెడుతూ వచ్చి ఏం చేశారంటే కొద్దికొద్దిగా ఆదేశిక సూత్రాలను కూడా ప్రాధమిక హక్కులలోకి తీసుకొచ్చి తీర్పులు ఇవ్వడం నేర్చుకున్నారు. నేను
తతొ
మరికొన్ని ఉదాహరణలు ఇస్తాను. ఎవరికైనా తమ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకొనే హక్కు ఉంది అని చెప్పానుగదా. ఇంతవరకు మనం దాని గురించి నెగిటివ్‌గా మాట్లాడుకున్నాం, అది ఒక కేసులో పాజిటివ్‌గా వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అటవీ ప్రాంతంలో ఒక గిరిజన తెగ నివసిస్తోంది. వాళ్లు బుట్టలు తయారుచేసి అమ్ముకుంటారు. అధి వాళ్ల వృత్తి. వ్యాపారం. అయిజే వాళ్ల సమస్య ఏంటంటే వాళ్ల గిరిజన గూడేనికి రోడ్డు లేదు. వాళ్లు అలహాబాద్‌లో అమ్ముకుంటా రనుకుందాం. అలహాబాద్‌కు పోవాలంటే వాళ్లకు రోడ్డు లేవు. రోడ్లు లేకపోతే బుట్టలు ఎట్లా తీసుకుపోయి అమ్మాలక్కడ? ఒక ట్రాక్టరో, లారీయో రావాలి, బుట్టలు వేసుకు పోవాలి. అక్కడ అమ్మాలి. ఎవరికో ఒక ఆలోచన వచ్చింది. మా ఊరుకు రోడ్డు కావాలి అని అడగాలని? ప్రతి గ్రామానికి రోడ్డు వేయాలని మనకు ప్రాథమిక హక్కు ఏమీ లేదు. ఉంటే బాగుండును. మనమంతా కోర్టులలో కేసులేయకుండానే రోడ్లు వచ్చి ఉండేవి. ఇప్పుడయితే రోడ్డు వేయమని ధర్మా చేయాలి. టెంట్లు వేయాలి, దెబ్బలు తినాలి. అలా చేస్తే మీనా గారిలాంటి పోలీసు ఆఫీసర్లకు కోపం వస్తుంది - మా ఊరుకు రోడ్డు కావాలి అనేది ప్రాథమిక హక్కు కాదు కాబట్టి. ఎవరికి ఇష్టమొచ్చిన వృత్తి వాళ్ళు చేసుకోవచ్చు అని ప్రాథమిక హక్కులలో ఉందన్నారు గదా, నా వృత్తి బుట్టలు తయారుచేసి అమ్ముకోవడం, నా వ్యాపారం బుట్టలు తయారు చేసి అమ్ముకోవడం. రోడ్డు లేకపోతే నేను అమ్ముకోలేను. కాబట్టి మాకు రోడ్డు వేయాలని వాళ్లు అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. అంటే ఏమిటి అర్థం? ఇది ఎందుకు చెపుతున్నానంటే దీనిలోని సూత్రం అర్థం చేసుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇష్టం వచ్చిన వృత్తిని వ్యాపారాన్ని చేసుకోవడం ఒక (ప్రాథమిక హక్కు అన్న చోట వృత్తి అంటే ఏమిటి? వ్యాపారం అంటే ఏమిటి? వృత్తినీ వ్యాపారాన్నీ చేసుకోవడం అంటే ఏమిటి? బుట్టలు చేయడానికి వీలులేదు మీరు ఈ ఊర్లో ఆని గవర్నమెంట్ తాఖీదిస్తే ఆర్టికల్ 19 ప్రకారం వెంటనే కోర్టు ఆర్డర్ ఇస్తుంది. బుట్టలు చేసుకోండి మీరు అంటూ. అమ్ముకోవడానికి రోడ్డు లేదు మాకు అంటే కోర్టు నేను ఏమీ చేయలేనంటే ఎట్లా? అంటే బుట్టలు తయారు చేసుకోవడం అనే దాంట్లో దానిని అమ్ముకునే అవకాశం కూడా భాగం = (0 061626 1010 11 అంటారు లాలో.
అట్లా పార్ట్ 4లోని ముక్కలు లాక్కొచ్చి పార్ట్ ౩లో చేర్చుకుంటూ వచ్చాయి కోర్టులు మెల్లగా. అట్లా చేస్తూ వచ్చి ఏమన్నారంటే అమ్ముకునే అవకాశం వాళ్ళకు లేకపోతే వ్యాపార స్వేచ్చ లేనట్లే కాబట్టి వాళ్ళకు రోడ్లు వేయాలి అన్నారు. సరే ఆ
తశ కాపాడ నా ాదో
ముఖ్యమంత్రి, మన చంద్రబాబునాయుడు లాగే, డబ్బులు లేవని అన్నాడు. ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఆర్.బి.ఐ.ని నువ్వు డబ్బులు ముద్రించి ఇవ్వాలని ఆర్డర్ ఇవ్వలేదు. ఇవ్వటం సాధ్యం కూడా కాకపోవచ్చు. కాని ఇదొక ప్రిన్సిపల్ చెపుతుంది ఫిన్సిపల్ ఏమిటంటే సంక్షేమం అనేది ప్రాథమిక హక్కులలో భాగం కాకపోయినా, ప్రాధమిక హక్కులలో ఉపయోగించిన మాటలకు విశాలమైన వ్యాఖ్యానం ఇవ్వడం ద్వారా సంక్షేమాన్ని దాంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కాలక్రమంలో కోర్టులు చేస్తూ వచ్చాయి భగవతి గొప్పవాడే, కృష్ణయ్యర్ గొప్పవాడే, చిన్నపరెడ్డి గొప్పవాడే, కానీ వాళ్ల గొప్పతనాన్ని ఎలా గుర్తిస్తున్నామో, అలాగే ప్రజాజద్యమాలనుంచి, ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి దీనికొక ముఖ్యకారణమని గుర్తిస్తే, భవిష్యత్తులో మనమింకా ఎంత ఒత్తిడి పెట్టాలో అర్ధం అవుతుంది.
అట్లా చాలా విషయాలు వాళ్లు చేసుకుంటూ వచ్చారు. ఉదాహరణకి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఉంది. అది ప్రాథమిక హక్కుకాదు. సమాన పనికి సమాన వేతనమనేది మన దగ్గర ప్రాథమిక హక్కు కాదు. అది ఆదేశిక సూత్రం మాత్రమే. ఇది చాలా చోట్ల స్రీలకు సమస్య ఒకేరకమైన పని చేస్తుంటారు ఆడవాళ్లూ, మగవాళ్ళూ,. కానీ అడవాళ్లకు తక్కువ జీతం ఇస్తారు. పని ఒకటే ఉంటుంది. ఇది ప్రాథమిక హక్కుగా లేదు. ఆదేశిక సూత్రంగా మాత్రమే ఉంది. ప్రభుత్వం ఏం చేయాలి? మరోచోట కొంతమందిని పర్మనెంట్ వర్కర్సనీ, కొందరిని క్యాజువల్ వర్కర్స్ అనీ తీసుకొని పర్మనెంట్ వర్కర్స్ ఏ పని చేస్తారో వీళ్ళూ అదే పని చేసినా, వాళ్ళకు తక్కువ కూలి ఇస్తుంటారు. చాలా కామన్‌గా జరుగు తుంటుంది ఇది. అటువంటి కేసులు కోర్టుకు వచ్చినప్పుడు - 6002౫ 043౫ 10౯69221 ౪/01 13 2012 ంరజుఅం2 5806 113 [062 256[%12016 ౫814 - కోర్టులు దానిని అమలు చేయలేవు, మీరు ఉద్యమం చేసుకుంటారో, ఏమి చేసుకుంటారో చేసుకోండి అని కోర్టులు అనేవి.
ఇప్పుడు ఎంత మారారు అంటే దాదాపు ఈరోజు 60021 2) [08 6402] ౪08 ఒక 0602000012] [3£6గా మారిపోయింది. ఎట్లా చేసారు దీనిని అంటే మనకు ఆర్టికల్ 14 ఉంది. 14 ఏమంటుంది అంటే చట్టం అందరినీ సమానంగా చూడాలి అంటుంది. చట్టం అందరినీ సమానంగా సంరక్షించాలి అంటుంది. దీనికి విరుద్ధంగా ఏ ప్రభుత్వ రంగ సంస్థా వ్యవహరించటానికి వీలులేదు అనే దాన్ని క్రమ క్రమంగా లాగి లాగి గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళు ఎవరైనా, గవర్నమెంట్ కార్పోరేషన్లో పనిచేసేవాళ్ళు ఎవరైనా, ఎయిడెడ్ సంస్థలో పనిచేసే వాళ్ళు ఎవరైనా, ప్రభుత్వం ఫైనాన్స్ ఏ కొంచమైనా
తి్ర్ చం = నక్షమం
ఉన్న సంస్థలలో పని చేసేవాళ్లెవరైనా అవి చట్టపరంగా ఏర్పడిన ప్రభుత్వ సంబంధిత సంస్థలు కాబట్టి, అక్కడ పనిచేసేవాళ్ళు సమాన పనికి సమాన వేతనం పొందాలని ఇవ్వాళ చెపుతున్నారు. పూర్తిగా (ప్రైవేటు కంపెనీలైతే మీరేమీ చెయ్యలేరు, కానీ ప్రభుత్వంతో ఏ కొంచెం సంబంధమున్న సంస్థలైనా - యూనివర్సిటీ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఎయిడెడ్ సంస్థ కావచ్చు, పాక్షికంగా గవర్నమెంట్ కార్పొరేషన్ కావచ్చు - వాటిలో కోర్టుకుపోయి సమాన పనికి సమాన వేతనం అనేది తెచ్చుకోగలుగుతాం. ఇట్లా ఉదాహరణలు ఎందుకు ఇస్తున్నానంటే, సంక్షేమమనే భావన మొట్టమొదట రాజ్యాంగాన్ని రాసినపుడు, అప్పుడున్నటు వంటి సామాజిక ఆర్థిక వ్యవస్థలో లేదు. అందుకే నంక్షేమాన్ని ఒక హక్కుగా రాజ్యాంగంలో రాసేనీ మొత్తం దానిని మార్చేయాలంటే అది రాజకీయంగా సాధ్యపడుతుందని చెప్పి రాజ్యాంగకర్తలు అనుకోలేదు. మంచో చెడో...అనుకోలేదు వాళ్లు కాబట్టి వాళ్ళు ఏం జేశారు అంటే ఏదో ఒక రాజ్యాంగాన్ని రాసి, అధికార విభజన, బాధ్యతల విభజన, అధికారాల పరిమితులు పెట్టేసి మీరు పరిపాలిం చండి అనకుండా - స్వాతంత్ర్యం ఎందుకోసం మనకు, ప్రతి మనిషికీ సమాన విలువనిచ్చే సమాజం కోసం కదా, దానిని సాధించే కొన్ని లక్ష్యాలను ఆదేశిక సూత్రాల జాబితాగా రాజ్యాంగం లో పెడదాం అనుకొన్నారు. పెట్టారు. అయితే వాటిని వ్యవస్థీకృతం చేయడం సాధ్యం కాదు అనుకున్నారు కాబట్టి వాటిని హక్కులుగా పెట్టలేదు. వేటిని వ్యవస్థీకృతం చేయడం వారికి సాధ్యమైంది? అస్తి హక్కును వ్యవస్థీకృతం చేయడం సాధ్యం అయింది. వ్యాపార స్వేచ్చను వ్యవస్థీకృతం చేయడం అవసరమూ అయింది, సాధ్యమూ అయింది. వాటిని చేసారు. దీనికీ దానికీ వైరుధ్యం చాలాకాలం పాటు భారత రాజకీయాలలో, కోర్టులలో నడిచింది. నడిచినప్పుడు ఏమి జరిగింది అంటే, కొలినాడు వ్యాపార స్వేచ్చ, ఆస్తి హక్కు అవే గెలుస్తూ వచ్చాయి. కాని తరువాత కాలక్రమంలో రాజ్యాంగంలో మార్పులు వచ్చాయి. కోర్టుల వ్యాఖ్యానంలో మార్చులు వచ్చాయి. కోర్టుల వైఖరిలో మార్పులు వచ్చాయి.
ఇవ్వాళ చాలా దూరం పోయి కోర్టులు, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో ఉన్నటు వంటి ఒక్కొక్క విషయాన్నీ వాథమిక వాక్కుల జాబితాలోనికి తీసుకువస్తున్నాయి. నేనింతకు ముందు జీవించే హక్కును ప్రస్తావించాను. చట్టం ప్రకారం తప్ప ఇతరత్రా ఎవరి ప్రాణం తీసివేయడానికి వీలులేదు; జీవించటం అంటే బ్రతికి ఉండటం, 0౪06 ౧౫10? 21/6 అనే అర్ధంలో ఉపయోగిస్తూ వచ్చిన మన కోర్టు, క్రమంగా వ్యాఖ్యానాన్ని ఎంతదాకా తీసుకుపోయిందంటే, ఉన్నికృష్ణన్ కేసులో
తొ పాగల్ దవన్యానాద
విద్య కూడా జీవితంలో భాగమే కాబట్టి విద్యకూడా ప్రాథమిక హక్కే అన్నాయి. విద్య ఎట్లా ప్రాధమిక హక్కు అయింది? జీవితం, స్వేచ్చ అనే ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిలో విద్య కూడా భాగమే, అరోగ్యం కూడా భాగమే, పరిశుభ్రమైన పరిసరాలు కూడా భాగమే, వాటిలో నివాసం కూడా భాగమే. ఇట్టా క్రమంగా కోర్టులు వ్యాఖ్యానాలిచ్చుకుంటూ వస్తున్నాయి. ఉన్నికృష్ణన్ కేసులో విద్య కూడా దానిలో భాగమే అన్నారు కదా, తరువాత మోహిని జెయిన్ కేసులో కాబోలు దానిని కొంచెం మార్చి ప్రాథమిక విద్య మాత్రమే జీవించే హక్కులో భాగం అని సుప్రీంకోర్టు పుల్‌బెంచ్ అన్నది. అంటే ప్రాధమిక విద్య తప్పనిసరిగా అందరికీ ఉండాలనే సంక్షేమలక్ష్యం ఏదైతే ఉందో, ఇవ్వాళ అది ప్రాధమిక హక్కులలో భాగం అని చెప్పి మన కోర్టులు వ్యాఖ్యానిస్తు న్నాయి.
నివాసం కలిగి ఉండటం ప్రాథమిక హక్కు అనేది చాలాకాలం క్రిందట ఓల్లాటెలిస్ కేసులో వచ్చింది. అప్పుడు మహారాష్ట్రకు అబ్బుల్ రహమాన్ అంతూలేగారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయనకు ఒక వర్షాకాలంలో బొంబాయి నగరాన్ని సుందరంగా తయారు చేయాలనే కోరిక వచ్చింది. వేసవి కాలంలో వచ్చినా పరవాలేదు. వర్షాకాలంలో కోరిక వచ్చింది. బొంబాయి నగరంలో మీకు తెలుసో తెలియదో జనాభాలో 40 శాతం చట్టవిరుద్ధమైన నిర్మాణాలలో ఉంటారు. వాళ్లు దొంగలు కాదు. బందిపోట్లు కాదు. అంతా కూలిచేసుకుని బ్రతెకేవాళ్లు. వాళ్లకి చట్టం స్థలాలు చూపించలేదు కాబట్టి చట్టవిరుద్ధంగా వాళ్లు బ్రతుకు తున్నారు. పేవ్మెంట్స్ మీదా, ఇక్కడా అక్కడా అన్ని చోట్లా ఉంటారు. మీరు బొంబాయి నగరానికి పోతే డబ్బారేకులు, సినిమా పోస్టర్లు, తడికలన్నీ కూడా ఇళ్ళుగా కనిపిస్తాయి. మనం అదేదో సినిమా పోస్టర్ అనుకుంటాం, కాని దాని వెనకాల ఇల్గుంటుంది. ఇంటికది గోడ. ఇట్లా బ్రతుకుతున్నారు 40 శాతం ప్రజానీకం. వీళ్లందరినీ తరిమేసి, బొంబాయి నగరాన్ని సుందరంగా తయారు చేయాలని అంతూలే గారి కోరిక ఆయన బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ వారికి చెప్పాడు. మున్సిపల్ కార్పొరేషన్ వారు ఒక నోటీసు జారీ చేసి, వాళ్లందరినీ అక్కడ నుండి బయటికి వెళ్లమన్నారు. వాళ్లేమో కూలిచేసుకొని బ్రతికే వాళ్లు. వెళ్లిపోయి ఎక్కడ కూలి చేస్తారు? బొంబాయిలోని బ్రహ్మాండమైన బిల్దింగులు కట్టేద్ వీళ్లే ఆ బంగ్లాలలో పనులు చేసేదీ వీళ్లే కార్డు డ్రైవ్ చేసేదీ వీళ్లే, లిఫ్ట్ ఆపరేటర్సూ వీళ్లే, అంట్లు తోమేదీ వీళ్లే, ఫ్యాక్టరీలో కూలి చేసేవాళ్ళూ, కార్మికులూ వీళ్లే. నివసించేది బొంబాయిలో, పనిచేసేది బొంబాయిలో. సంపాదించిన కూలి వచ్చి పోవడానికి, బతకడానికి సుమారుగా
త్ర కాం = నక్షమం
సరిపోతుంది. నివాసం 40 కిమీ. దూరంలో అయితే రానూ పోనూ మొత్తం కూలి అంతా అయిపోతుంది. టైమ్ కూడా మొత్తం అయిపోతుంది. ఆరోగ్యం కూడా నాశనం అవుతుంది. కాబట్టి మమ్మల్ని తొలగించడానికి వీలులేదు అని కోర్టుకు పోయారు. ఎక్కడ బడితే అక్కడ నివసించే హక్కు మీకు లేదు కదా అని కోర్టు అంది. ఈ దేశంలో, మన రాజ్యాంగంలో ]₹06 గ80610 163166 20 ౪166 ౫౦౦ ౪20610 15 2 0630లు(21 800 048 46 గ౭ైం[ 40 165166 19 ౧06 & 1064200009] గశ0[ఓ. ఎక్కడైనా నివసించే హక్కు మనకున్నా, నివసించే హక్కు మనకు ప్రాధమిక హక్కు కాదు. ఈ పరిమితులు గురించి ఆలోచించండి.
ఎక్కడైనా నివసించే హక్కు ఉండడం ఒక విషయమే. దానిని గౌరవించాలి. ఎందుకంటే చాలా దేశాలలో ఒక ప్రాంతానికి పోవడానికి వీలులేదు అని నిషేధాలు ఉంటాయి. అట్లా లేదు భారతదేశంలో. మీకు చేతనైజే హర్యానా పోయి ఉండొచ్చు కావాలంటే. కొన్ని ప్రాంతాలలో మాత్రం ఆదివాసుల హక్కుల సంరక్షణకు పరిమితులు పెట్టారు. నాగాలాండ్‌లో కూడా. వేరెక్కడా పరిమితులు లేవు. అంతవరకు అది మంచి హక్కే కాని నివాసం ఏర్పరచుకొనే హక్కు, ౪8210 963166, 6811 10 1276 2 0056 1 1062 2601206062! గ8[1 మన దేశంలో. జీవించే హక్కు అంటే జీవనం పొందే హక్కు ఉండాలని, మరి జీవనం పొందే హక్కు అంటే జీవనం పొందడానికి అవసరమైన పని కూడా దాంట్లో భాగమేనని, కాబట్టి వాళ్లు తమ నివాసం చాలా సమీపంలో ఉండాలను కోవడం కరక్టే అని కోర్టు తీర్పు ఇచ్చింది. సరే ఈ తీర్చ్పులన్ని కూడా ఆచరణలో అమలు కావడం లేదనేది వేరే సంగతి. ఎందుకోసం చెపుతున్నానంటే సంక్షేమమని చెప్పి మనమేదైతే ఇవ్వాళ అనుకుంటూ ఉన్నామో-సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, అవకాశాలు, సదుపాయాలు, హక్కులు, సమానమైన పనికి సమానమైన వేతనం, స్తీలకైనా, పిల్లలకైనా, పురుషులకైనా అందరికీ కనీస జీవనాన్ని పాందడానికి అవకాశాలు, గరంర816 146203 01 11761006, పిల్లల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా ఉండటం - ఇవన్నీ మెల్లమెల్లగా ప్రాధమిక హక్కుల్లో భాగమవుతూ వచ్చాయి.
రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో పిల్లలకు సంబంధించి ఏముంది అంటే 14సం॥ వయస్సు లోపున్న పిల్లలను ప్రమాదకరమైనటువంటి పనులలో పెట్టకూడదు అని ఉంది. ఏ పనిలో పెట్టకూడదూ అనేది లేదు రాజ్యాంగంలో. ప్రమాదకరమైనటు వంటి పనులలో పెట్టడానికి వీలులేదు అని మాత్రమే రాజ్యాంగంలో (ప్రాథమిక హక్కుగా
తత్ కాంగోపాల్ ఉవన్నాసాల
ఉంది. ఆదేశిక సూత్రాలలో ఏముంటుంది, పిల్లల పసితనాన్ని ఎవ్వరూ కూడా ఎక్స్వ్లాయిట్ చెయ్యకుండా చూడాలి. పసితనాన్ని పిల్లల యొక్క ఆ సౌకుమార్యాన్ని ఎవ్వరూ ఎక్స్‌ప్లాయిట్ చెయ్యకుండా చూడాలని ఆదేశిక సూత్రాలలో ఉంది. ఆదేశిక సూత్రాలలో ఉండే ఈ అంశాన్హి కోర్టులైనా, మనమైనా చేయాల్సినది ఏమిటంటే - పిల్లల సౌకుమార్యాన్ని, సున్నితత్వాన్ని, వాళ్ల పసితనాన్ని ఎవ్వరూ కూడా ఎక్స్‌ప్లాయిట్ చెయ్యకుండా చూడాలనేదానిని ఎట్లాగైనా లాగిలాగి 14 కంటే లోపు వయస్సున్న వాళ్ళని ప్రమాదకరమైన పనులలో పెట్టడానికి వీలులేదు అనే దాంట్లో మెల్లగా చేర్చాలి తీసుకొచ్చి. ఆ ప్రయత్నం శివకాశి ఫ్యాక్టరీల విషయంలో జరిగింది. అక్కడ సుప్రింకోర్టు వ్యాఖ్యానం ఏం జేసింది అంటే, ప్రమాదకరమైన పని అంటే ఏమిటి? బ్లాస్ట్ ఫర్నేస్‌ల దగ్గర పని మాత్రమే అనుకోవాల్సిన అవసరంలేదు, వాళ్ళ ఆరోగ్యానికి హానికరమైనది ఏదైనా ప్రమాదకరమని చెప్పి మెల్లిగా ఆదేశిక సూత్రాన్ని తీసుకొచ్చి ప్రాధమిక హక్కులలో కొంచెం, కొంచెం జోడించే ప్రయత్సం చేసి, మెల్లమెల్లగా దానిని విశాలం చేసుకుంటూ వచ్చింది. ఇవన్నీ ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి. చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. కరెక్టుగా చెప్పుకోవాలంటే ఎప్పుడైతే నూతన ఆర్ధిక విధానం అని మన్మోహన్ సింగ్గారు, పి.వి.నరసింహారావుగారు మొదలు పెట్టారో అప్పటికి భారతదేశంలో చట్టం పరిస్థితి ఏమిటి, రాజ్యాంగం పరిస్థితి ఏమిటి అంటే - ఆదేశిక సూత్రాలలోఉన్న సంక్షేమ చర్యల అమలుకు చట్టంగాని, కోర్టులు గాని, రాజ్యాంగంగాని ఎక్కడా అడ్డం రావనే పరిస్థితి వచ్చేసింది. ప్రజా ఉద్యమాల జత్తిడి వల్ల, ప్రజల ఒత్తిడి వల్ల, కోర్టులలో కొంత ఆలోచనా పరులైనటువంటి న్యాయమూర్తులు రావడం వల్ల, పౌరహక్కుల ఉద్యమాలూ, మహిళా ఉద్యమాలూ, రకరకాల ఉద్యమాలూ ఒత్తిళ్ళు పెట్టడం వలన ఆ మార్చులు వచ్చాయి.
ఇవ్వాళ ఏమైపోయింది అంటే చట్టంలో రాజ్యాంగంలో ప్రభుత్వానికి ఏమీ అడ్డంలేదు, రాజకీయ సంకల్పమే అవసరం. 1850లలో మాకు రాజకీయ సంకల్పం ఉంది, చట్టమే మాకు అడ్డంగా ఉంది అని మన రాజకీయ నాయకులు మాట్టాడేవాళ్లు. జవహర్లాల్ నెహ్రూ మాట్లాడేవాడు. ఆయన ఫేమస్ కామెంట్ ఒకటుంది - మనం రాజ్యాంగం అనే దేవాలయాన్ని నిర్మించి దేవతా విగ్రహాన్ని ప్రతిష్టించే లోపల దయ్యాలొచ్చి కూర్చున్నాయి అనన్నాడు. నా జ్ఞాపకంలో ఆయన ఎప్పుడు ఈ మాట అన్నాడంటే, ఆర్టికల్ 14ను వాడుకొని భూస్వాములు ఎస్టేట్ ఎబాలిషన్కు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసినప్పుడు. 'మనమేమో, ఈ దేవాలయాన్ని ప్రజలకు హక్కులిద్దామని
తతి నతు
నిర్మించాం. దీన్లో ఈ భూస్వాములు వచ్చి కూర్చొన్నారు' అని. జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధి దాకా వాళ్ల తర్కమేంది, వాళ్ల రాజకీయమేంది అంటే - వాళ్లు నమ్మారా లేదా అన్నది విషయం కాదిక్కడ - వాళ్లు ఉపయోగించిన పొలిటికల్ పోలిమిక్స్ ఏమిటి అంటే - ప్రజా సంక్షేమానికి, సమ సమాజ సాధనకు మేము కృషి చేయాలి అనుకుంటూ ఉంటే ఈ రాజ్యాంగం అడ్డం వస్తోంది, ఈ కోర్టులు అడ్డం వస్తున్నాయి అని. వాళ్లు ఏ కారణంగా అన్నారో గాని ఆ మాట అన్నారు. దానిపైన సంవాదం సాగింది. కమ్యూనిస్టు పార్టీలలో ఒక ప్రధానమైన భాగం ఈ వాదనతోనే వాళ్లతో ఉంది. ఈ రాజ్యాంగం, ఈ కోర్టులు పెట్టుబడిదారులను సపోర్టు చేస్తున్నాయి. మనం ఈ దేశాన్ని అభ్యుదయ పధంలో తీసుకుపోదలచుకుంటే నెహ్రూ కుటుంబానికి మనం సహాయం చేయాలి అని చెప్పి సి.పి.ఐ. పార్టీ వాళ్లు అండగా ఉంటూ వచ్చారు. ఆ క్రమంలోనే రాజ్యాంగం మారింది. కోర్టుల వైఖరి మారింది. కోర్టుల వైఖరి ఎక్కడిదాకా మారిందంటే, ఇవ్వాళ ఆదేశిక సూత్రాల అమలుకు ప్రభుత్వం ఏం చేసినా సరే రాజ్యాంగం అడ్డమొచ్చే పరిస్థితి లేదు. సోషలిజం తేవడానికి ఇన్నాళ్ళూ మాకు కొర్టులు అడ్డమున్నాయి అన్నవాళ్లు ఇప్పుడు మాకు అ ఉద్దేశం లేదు అంటున్నారు. వాళ్ళకి బహుశా ఎప్పుడూ ఆ ఉద్దేశం లేదేమో. అప్పుడు కోర్టులు అడ్డం ఉన్నాయి, రాజ్యాంగం అడ్డం ఉందన్నారు. ఇప్పుడు వాళ్ళకు సంకల్పమే పూర్తిగా పోయింది. ఇవాళ సంవాదం ఏమైపోయిందంటే ఒకవైపు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్., వాళ్ళు నిర్దేశిస్తున్నటువంటి సామాజిక, ఆర్థిక విధానాలకూ, ఇవతలవైపు ప్రజల అవసరాలూ, ప్రజల ఆకాంక్షలూ, ప్రజాఉద్యమాల డిమాండ్స్, వాటితో పాటు రాజ్యాంగంలో, కోర్టుల తీర్చులో ఉన్నటువంటి ప్రగతిశీలమైన అంశాలూ నెలకొన్న పరిస్థితి ఉంది.
రంగం మారింది. కోర్టులూ రాజ్యాంగం ఒక పక్క, అభ్యుదయం ఒక ప్రక్క అనే పద్ధతితో చూపించబడింది ఒకప్పుడు, అది అవునా కాదా అనే చర్చ చాలా పెద్ద చర్చ. దొనిలోకి పోదలచుకోలేదు నేను. ఆ రకమైన పోలిమిక్స్ సాగింది చాలా కాలం. ఇవాళ పోలిమిక్స్ ఏమైంది - కోర్టులు మారాయి. రాజ్యాంగం మారింది. చాలావరకు దృక్చధాలు మారినాయి. కోర్టుల తీర్పులు సంక్షేమానికి అనుకూలంగా ఉన్నాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా దేశ రాజకీయ వ్యవస్థ ఆర్థిక విధానాలు, సాంఘిక విధానాలు అంటే తిరిగి చర్చంతా మొదటికి పోయింది.
శి శో ాంగోపాల్ ఉవన్వాసాల
ఉదాహరణకు ఒకప్పుడు చౌక డిపోలలో బీయ్యం అమ్మటానికి ప్రభుత్వం లెవీ బియ్యం సరఫరా చెయ్యాలి అని మిల్లులకు ఆదేశాలు జారీచేస్తే, మిల్లులు కోర్టుకు పోయినాయి - మా వ్యాపారస్వేచ్చకు ఆటంకం అని. వ్యాపార స్వేచ్చ అంటే నేను మిల్లులో ఆడిన బియ్యాన్ని నా ఇష్టం వచ్చిన రేట్లకు నేను అమ్ముకుంటా బజార్లో. దానికి లెవీ అని కంపల్సరీగా 4 రూపాయలకో 3౩ రూపాయలకో ఇవ్వాలని ఆర్డర్ జారీ చేస్తే నా వ్యాపార స్వేచ్చకు అంటే ప్రాథమిక హక్కుకు ఇది ఆటంకం అని చెప్పి అన్నారు వెరుట్టవెొందట కోర్టులు కూడా మిల్లు యజమానుల వాదనలతో అంగీకరించాయి. తరువాత ఏం చేసారంటే ఇన్ పబ్లిక్ ఇంట్రస్ట్ ప్రభుత్వం వ్యాపార స్వేచ్చను అదుపు చేయవచ్చు అన్నారు. ప్రజా ప్రయోజనాలలో ఆదేశిక సూత్రాలు అన్నీ కూడా వస్తాయి. ఆదేశిక సూత్రాలలో ప్రతి ఒక్కరికీ కనీస జీవన ప్రమాణాలుండాలి అని కూడా ఉంది. కనీస జీవన ప్రమాణాలకోసం చౌకబియ్యం అవసరం కాబట్టి లెవీ బియ్యం సరఫరా సరైనదే అని కోర్టు తీర్పు ఇచ్చింది.
అంటే రాజ్యాంగంలోని వ్యాపార 'స్వేచ్ళకూ, చౌకబియ్యానికీ మధ్య ఘర్షణ తొలగి పోయింది. ఇప్పుడా ఘర్షణ ఎక్కడికి పోయింది? 10కు పోయింది. 1710 ఏమంటుంది - ఈ రోజు నువ్వు చౌకబియ్యం అమ్మటానికి వీలులేదు అంటుంది. వ్యాపార స్వేచ్చ సంపూర్ణంగా ఉండాలి అంటుంది. స్వేచ్చా వాణిజ్యం ఉన్నప్పుడే దేశం బాగుంటుంది. బజార్లో ఎంత ఎక్కువ ధర ఉంటే అంత ఎక్కువ ధరకు నీవు కొనుక్కుంటేనే నీకు బాధ్యత ఉంటుంది. చౌకగా దొరికితే తినేవాడికి, బాధ్యత తెలియదు. ఊళ్లో వాళ్లు అంటారు గదా రెండు రూపాయలకు, మూడురూపాయలకు ఇస్తే పేదవాళ్ళు పనిచేయడం మానేస్తారని. అలాగన్నమాట. బీదవాళ్ళ గురించి ఎవరిదైనా అదే లాజిక్ - ₹/10 దైనా 64 దైనా ప్రపంచ బ్యాంకు దైనా. సబ్సిడీతో నువ్వు ఏది ఇచ్చినా సరే తీసుకునేవాడికి బాధ్యత ఉండదని వాళ్ల తర్కం. కాబట్టి సబ్సిడీ ఇవ్వకూడదు. సంపూర్ణమైన వాణిజ్య స్వేచ్చ వాళ్లకు ఉండాలి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ మాటలలో భాగంగా క్రమక్రమంగా ఈ చౌక బియ్యం అనే దాని ధర పెంచు కుంటూ, పెంచుకుంటూ ఎక్కడిదాకా తీసుకుపోతారంటే, చౌక అనే మాటే లేకుండా చేసేస్తే అవుడు మొత్తం తీసేయవచ్చు అనేదాకా. ఒక్కసారిగా చౌక దుకాణాలను తీసేస్తే గొడవ అవుతుంది కదా. అందుకు మన వాళ్ళు ఏం జేశారు? రెండు రూపాయల నుండీ మూడున్నర రూపాయలకు, మెల్లగా 4.50కు, ఐదురూపాయల 50 పైసలకు అలా పెంచుకుంటూ పోయారు. అక్కడికి పోతే ఏంది,
జై చం = నక్తం
బజారుకుపోతే ఏంది అని ప్రజలు అనుకున్నప్పుడు - మీరు రావడం లేదు మా చౌకడిపోకు, రేషన్ కార్డులు వేస్ట్ అవుతున్నాయి - అని వాటిని మూసేయ వచ్చు. ఇప్పుడు రాజ్యాంగం కాదు, చట్టంకాదు, వ్యాపార స్వేచ్చ కాదు అడ్డం వస్తున్నది. ప్రపంచ బ్యాంకు ఆదేశాలు, డబ్బుటివో ఆదేశాలు, అంతర్జాతీయంగా రాజ్యం చేస్తున్నటు వంటి నూతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆదేశాలు.
ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ స్కూళ్ళు, వాటన్నిటికి సంబంధించి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయింపులుండాలి. దానికోసం సెస్సు వసూలు చెయ్యవచ్చు. వ్యాపారస్తుల మీద వసూలు చేస్తే, దానిని కమర్షియల్ టాక్స్‌లో, సేల్స్ టాక్స్‌లో కలిపేస్తే అది వ్యాపార స్వేచ్చకు ఆటంకం కాదు. ఎందుకంటే చదువు అనేది ఆదేశిక సూత్రం కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్‌లో ఉన్నట్లే అని కోర్టులు తీర్పులు ఇస్తూ వస్తాయి. ఇవ్వాళ రాజకీయ విధానమే మారిపోతోంది. ఏమని మారిపోతోంది అంటే “ప్రభుత్వరంగంలో చదువు చెప్తే పంతుళ్ళు చదువు చెప్పరు, పిల్లలు చదువుకోరు. ఫ్రీ అయితే ఎవ్వరికీ బాధ్యత ఉండదు. డబ్బు పెట్టి కొనుక్కుంటేనే బాధ్యత తెలుస్తుంది. కాబట్టి, (ఫైవేటుగా చదువుకోండి మీరు." అంటే మొత్తం తర్కం, చర్చ మళ్లీ వెనకకు తీసుకుపోయారు. నేను అందుకే అంటున్నాను. సంక్షేమ రాజ్య మనేది ఏదో ఒక వర్గరాజ్యం, వర్గ పరిపాలన, వాళ్ళు బూటకంగా ప్రవేశ పెట్టినటువంటి ఒక మేలిముసుగు అంటే ఏం ప్రయోజనం లేదు - అదొక నాగరికతా విలువగా, ప్రపంచ నాగరికతలో భాగంగా, రాజ్యానికి-దండ ప్రయోగం మాత్రమే బాధ్యతగా ఉన్న రాజ్యానికి కాలక్రమంలో వచ్చినటు రకమైన ఆర్థిక వ్యవస్థ ఉండడానికి వీలులేదు అనేది ఆర్టికల్ 39 క్లాజ్ 3 2040లో ఉన్నటువంటి ఒక ఆదేశిక సూత్రం. ప్రైవేటు ఆస్తిని రద్దు చేస్తూ ఇందిరాగాంధీ 31ఎ, 31బి, 31సి పెట్టినప్పుడు వచ్చిన సవరణ ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పిన దేశ సంపద కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కావడానికి వీలులేదనేది. మెజారిటీ ప్రయోజనాలకు నష్టకరంగా పరిణమించటానికి వీలులేదు. ఈ ఆదేశిక సూత్రాలను అమలు చేయటం కోసం ప్రభుత్వం ఏమిచేసినా అది ప్రాథమిక హక్కులకు భంగకరం అని ప్రశ్నించటానికి వీలులేదు అని చెప్పి ఆమె రాజ్యాంగ సవరణ జేసింది. ఆ రాజ్యాంగ సవరణ అమలు అయ్యింది మినర్వా మిల్స్ కేసులో. అది రాజ్యాంగ బద్ధమేనని సుప్రీంకోర్ట్ తీర్చు ఇచ్చింది. ఇవ్వాళ ప్రభుత్వానికి ఏమీ అడ్డం లేదు - రాజకీయ సంకల్పం తప్ప, సంకల్పం ఏమైపోయింది అంటే 393 ని ని మొత్తం పక్కన పెట్టేసి దేశసంపద కొద్దిమంది చేతిలో ఉంటేనే అందరికీ మంచిది అనే సూత్రం ఇవ్వాళ ముందుకొచ్చింది. దేశ సంపద
శై శ బాలగపాల్ దవనాసాల
కొద్దిమంది చేతిలో కేంద్రీకృతమయితేనే అందరికీ మంచిది, వాళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారు, మిగిలిన వాళ్ళకు నాలుగు మెతుకులేస్తారు. అప్పుడే తిండి దొరుకుతుంది. ఒకేసారి అందరికీ కావాలంటే ఏమీ దొరకదు. కొంతమంది చేతిలో కేంద్రీకృతం కావడం మెజారిటీ ప్రయోజనాలకు భంగకరమనే ఆలోచనే తప్పు. ఆస్తులు పెంచుకునే అవకాశం ఎంతగా ఉంటే అభివృద్ధి అంతగా ఉంటుంది. ఈ సూత్రాలనే ఇవ్వాళ ప్రపంచంలో నూతన ఆర్జిక వ్యవస్థ పేరుమీద వ్యవస్థీకృతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ ఆదేశాలు ముందుకొస్తున్నాయి. దాంతో ఏమవుతుంది అంటే చాలా కాలం పొటు భారతదేశంలో ప్రజా ఉద్యమాలు పోరాడి సాధించుకున్నటువంటి ఈ సంక్షేమ విలువలన్నీ కూడా వాటికి వ్యవస్థలో స్థానం లేకుండా పోయే పరిస్థితి ఉంది.
ఈ నేపధ్యంలో మనమీరోజు ఇవ్వాళ్టి పరిస్థితులన్నింటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏవైతే రాజ్యాంగంలో ఫండమెంటల్ టు ది గవరెన్స్ ఆఫ్ ది కంట్రీ అని చెప్పబడ్డాయో, ఆ సంక్షేమ సూత్రాలు - కేవలం రాజ్యాంగంలో చెప్పారు కాబట్టి, రాజ్యాంగం పవిత్రం కాబట్టి అని కాదు - రాజ్యాంగంలో చెప్పడానికి వెనకాల చరిత్ర ఉంది కాబట్టి, ప్రజా పోరాటాల నేపథ్యం కాబట్టి దాని గురించి తెలుసుకోవాలి. మన పూర్వీకుల పోరాటాలను మనం సొంతం చేసుకుంటూ వాటి వెలుగులో మాత్రమే పరిపాలన సాగాలని కోరాలి. దాని కంటే భిన్నంగా పోయేది ఈ రాజ్యాంగాన్ని తిరస్కరించేటటువంటి పరిపాలన.
మామూలుగానే పోరాటాలు ఉద్యమాలు చేస్తే అంటుంటారు - చట్ట ప్రకారం నెలకొల్పబడినటువంటి అధికారాన్ని ధిక్కరించడానికో, కూలదొయ్యడానికో నీవు ప్రయత్తం చేస్తున్నావని కేసులు పెడతారు. నీదసలు లాపుల్లీ ఎస్స్టాబ్లిష్ట్ అథారిటీ ఏనా ఈ రోజు? లా అంటే ఏమిటి? 00034401 15 టం మ?60జంల21 1౪. చట్టానికి ఓ పునాది రాజ్యాంగం. రాజ్యాంగంలో చాలా ముఖ్యమైనది ఆదేశిక సూత్రాలు. దాంట్లో చాలా కీలకమయినది ఆర్టికల్ 39 3 246 అంటే దేశ సంపద కొద్దిమంది చేతిలో కేంద్రీకృతమయి మెజారిటీ ప్రజలకు నష్టకరంగా పరిణమించకూడదు అనేది. దానికి భిన్నమైన విధానాలను నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీదసలు ఈరోజు 1జ౫గ10 0013011664 220000 యేనా? ఈ రోజు దీనిని వ్యతిరేకించడం నేరం కాగలుగుతుందా? నీ చట్టం ప్రకారమైనా సరే అనే ప్రశ్చ దగ్గర మొదలుపెట్టి, రాజ్యాంగం మీద ఒట్టు పెట్టి పరిపాలించే వాళ్ళు రాజ్యాంగానికి పూర్తిగా భిన్నమైన విధానాలను ఆచరించడానికి హక్కు ఉంటుందా? అది పరిపాలన అవుతుందా? అన్ని పార్టీలు
త్తతి కాం -నళ్షమం
రాజీనామా చేసి, బయటకొచ్చి, ఈ రాజ్యాంగం బాగాలేదు, ఈ పార్ట్ 4 మొత్తం అంతా తీసేద్దాం, సంక్షేమానికి అవకాశంలేని రాజ్యాంగం రాసుకుందామని చెప్పి ఓట్లకురండి, ఎన్నికలకు రండి - అప్పుడు కావాలంటే ప్రజలు చెప్తారు తమకు కావలసినదేమిటో. రాజ్యాంగానికి సంబంధం లేని పరిపాలన అంటే కుదరదు. ఈ రాజ్యాంగంతో మాకు ఏమీ సంబందంలేదు. ప్రాధమిక హక్కులను గౌరవించం. పోలీసు రాజ్యం నడుపుతాం అదేశిక సూత్రాలను పూర్తిగా పక్కకు పెట్టి దానికి భిన్నమైన ఆర్థిక విధానాన్ని నడుపుతాం అని చెప్పి బయటకొచ్చి మీరు ఓట్లకోసం రండీ. ఎన్నికలకోసం రండి. అప్పుడు ప్రజలు తమ తీర్చు ఏమి చెప్పుతారో వినండి అని మనం రాజకీయపార్టీలకు చెప్పాల్సిన అవసరం ఉంది.
అందువలన సంక్షేమం అంటే ఈ రోజు నిర్దిష్టంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క సమస్య ఉంది. మీకు రేషన్ కార్డులు ఇయ్యలేదని, కులం సర్టిఫికేట్ ఇయ్యడం లేదని, ఇళ్ల స్థలాల కోసం అప్లికేషన్ పెట్టుకొని రెండేళ్ళయినా మూడేళ్లయినా ఇవ్వడంలేదు అని - ప్రభుత్వం ఎస్.సి., బి.సి. కాలనీలకు శాంక్షన్ చేసిన డబ్బు చాలా తక్కువగా ఉంటోందని, అది ఇళ్ళు కట్టుకోవడానికి సరిపోవడంలేదు అని - ఇలా అనేక సమస్యలు ముందుకొస్తున్నాయి. వాటన్నిటి వెనకాల విధానాలున్నాయి. ఆ విధానాల వెనకాల రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం వెనకాల ప్రజల ఉద్యమాలు, పోరాటాలనుంచి వచ్చిన అకాంక్షలున్నాయి. ఈ మొత్తం లింక్‌ను దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంక్షేమ రాజ్యాన్ని ఇక్కడున్న పోస్టర్స్‌లో చెప్పినట్టుగా వాళ్ళ భిక్షగా కాకుండా మనం గతంలో సాధించుకొని, ఈ రోజు కోరుకుంటున్న ఒక హక్కుగా నిలబెట్టాల్సిన అవసరం చాలా ఉంది.
ఆయ5ళ్తాా (చిశాఖవట్టంలో విడిఎన్యు నిర్వపొంచిన “రాజ్యం - నంక్షేమం” 'సెమినాల్ (ప్రారంభ ఉపన్యానం - మే 1996) శ్తీశ కాన
అభివృద్ది విధ్వంసం టు
కొన్ని మాటలకు అర్జాలు ఎంతగా మారిపోతాయంటే దానికి వేరే అర్ధం ఉండింది ఒకప్పుడు అని మనమే మర్చిపోతాం. పది పదిహేను ఏళ్ళుగా సరళీకరణ అన్నమాట ఒకటి వాడుతున్నాం. మామూలుగా తెలుగు భాషలో సరళం అంటే మంచిమాట. సులభంగా ఉంది, నేరుగా ఉంది, తిన్నగా ఉంది, సులువుగా ఉంది అనే అర్థం వస్తుంది. అట్లే వాడే వాళ్ళం అందరం చిన్నప్పుడు. ఇప్పటికీ వాడతాం కొన్ని సందర్భాలలో. కానీ సరళీకరణ అనేది ఒక భయపెట్టే మాట అయిపోయింది ఇప్పుడు.
ఏమిటీ సరళీకరణ? పెట్టుబడిదారీ కంపెనీలకు, కంపెనీలు పెట్టుకోవడానికి, వ్యాపా రాలు చెయ్యడానికి ఉన్న నిబంధనలను వాళ్ళకు సరళం చేశారు. దీనివల్ల వాళ్ళు కంపెనీలు సులభంగా పెట్టుకోవచ్చు. అనుమతులు సులభంగా వస్తాయి. దిగుమళులు సులభంగా చేసుకోవచ్చు. కాలుష్య నియంత్రణ బోర్డు, కార్మికశాఖ అధికారులు అందరూ వాళ్ళకు సులభంగా అన్ని పర్మిషన్లు ఇస్తారు. ఇలా వాళ్ళకు అన్నిటినీ సరళం చేయడాన్నే సరళీకరణ అన్నారు కాబట్టి మనకు అది కఠినంగా తయారయ్యింది. అందువల్ల సరళీకరణ చెడ్డమాట అయ్యింది.
ఇప్పుడు అభివృద్ధి కూడా అట్లాంటి మాటే అయిపోయింది. మేము స్కూల్లో, కాలేజీలో ఉన్నప్పుడు అభివృద్ధి కావాలని ఆందోళన చేశాం. విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ కావాలి అని ఆందోళన చేశాం. నేనప్పుడు తిరుపతిలో చదడువుకునేవాడిని. విశాఖపట్సం ఎక్కడుందో నాకు తెలుసనుకోండి గానీ, వేరే నా మిత్రులెవ్వరికీ తెలియదు
- “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అని గోడలమీద రాసేవాళ్ళం. అభివృద్ధి అంటే మామూలుగా ఒక దృశ్యం, ఒక చిత్రం మనకుంటుంది. ఏమిటా చిత్రమంటే రోడ్డులేని గ్రామాలకు రోడ్డు వస్తుంది. బస్సులేని ఊరికి బస్సు వస్తుంది. స్కూల్ లేని ఊరుకు స్కూల్ వస్తుంది. అసుపత్రి వస్తుంది. ఒక ఫ్యాక్టరీ వస్తే ఒక వందమందికి ఉద్యోగాలు వస్తాయి. వెనకబడిన ప్రాంతాలలో, వ్యవసాయం అంతగా గిట్టుబాటు కానటువంటి
త్తే
ఆ ప్రాంతాలలో వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఒక ఫ్యాక్టరీలో పని చేసుకొనే అవకాశాలు లభిస్తాయి. అభివృద్ధి అంటే ఈ చిత్రం ఉండేది కాబట్టి అభివృద్ధి కావాలనే వాళ్ళం అప్పుడు మనం మూర్చులమా? లేదా చిన్నప్పుడు మాకు కావాలని, ఇప్పుడు మీకు వస్తుంటే వద్దంటున్నామా - అది కూడా ఆలోచించుకోవాలి.
సమస్య ఎక్కడొచ్చిందంటే దేన్ని అభివృద్ధి అంటున్నామో దాని అర్ధం మారింది. అందువల్ల అది ఇవ్వాళ ఒక భయపెట్టే మాటయ్యింది. గ్రామాలకు రోడ్డు కావాలి, స్కూళ్ళు కావాలి, బస్సులు కావాలి అనేది ఇప్పటికీ అభివృద్దే. వాటికి అవి అక్కరలేదని ప్రభుత్వం కూడా ఏమీ చెప్పదు. అయితే ఇటువంటి సదుపాయాలని ప్రభుత్వమే ఒక పనిగా పెట్టుకొని కల్పించు కొంటూ పోతే ఉన్న డబ్బంతా దానికే అయిపోతుంది. దాని బదులు ప్రభుత్వం తన దగ్గర ఉన్న నిధులు, తన దగ్గరున్న జాతి సంపదను పెట్టుబడి దారులకు పెట్టుబడులు భారీగా పెట్టడానికి అవసరమైన వసతులు, సదుపాయాలు కల్పించ డానికి ఖర్చుపెడితే, వాళ్ళొచ్చి పెట్టుబడులు పెడితే, దానితో సంపద "పెరిగితే, ఆ పెరిగిన సంపద నుంచి ప్రజానీకానికి ఫలితాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వస్తాయి. అది సరయిన అభివృద్ధి పంథా అనేది ఇవ్వాళ ప్రభుత్వం మాట్లాడుతున్నమాట. అక్కడ మనకు కేడా వస్తోంది.
మన దేశానికి ప్రణాళిక సంఘం ఒకటుంది. ప్లానింగ్ కమీషన్ అంటారు 11వ ప్లానింగ్ కమీషన్ రిపోర్టు మొన్న వచ్చింది. అయిదేళ్ళకోసారి ప్రణాళిక సంఘం ఒక నివేదిక తయారుచేస్తుంది. దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని వాళ్ళు కొన్ని రాస్తారు. దాంట్లో భాగంగా అభివృద్ధి, ప్రగతి - వీటికి నిర్వచనం, సూచికలు రాస్తారు. సూచిక అంటే ఏమిటి? అయిదేళ్ల కింద అయిపోయిన 8వ పంచవర్ష ప్రణాళికకు, ఆ తర్వాత అయిపోయిన 9వ సంచవర్ష్న ప్రణాళికకు మధ్య ఏవిధమైన మార్పులు వచ్చాయి? ఏమైనా అభివృద్ధి జరిగిందా? ప్రగతి వచ్చిందా? వీటికి కొలబద్దలు కావాలి గదా, ఆ కొలబద్దలే సూచికలు, అప్పట్లో ఏమేమి సూచికలుండేవి? ఉదాహరణకు దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవాళ్ళ సంఖ్య ఎంత తగ్గింది? అదొక సూచిక. ఎంత అభివృద్ధి వచ్చిందనడానికి అదొక కొలబద్ద, ఒక కొలమానం.
ప్రసూతి సమయంలో సరయిన వైద్య సదుపాయం లేక, సరయిన ఆసుపత్రి లేక ఎంతమంది ఆడవాళ్ళు కాన్సుల్‌లో చనిపోతున్నారు? ఆ సంఖ్య ఏమయినా తగ్గిందా? వెయ్యి కాన్చ్బులకు చనిపోయే ఆడవాళ్ళు 60 ఉంటే ఇప్పుడు 40కి తగ్గిందా, వందకు
త్తే కో బాలగోపాల్ దవన్వాసాల .
పెరిగిందా? అదొక సూచిక. బాల్యం గడవకముందే చనిపోయే పిల్లలు - ఇన్ఫాంట్ మోర్ట్రాలిటీ అంటారు ఇంగ్లీషులో - అదేమన్నా తగ్గిందా? లేక పెరిగిందా? అక్షరాస్యత, స్కూలుకు హాజరవుతున్న పిల్లలసంఖ్య ఇత్యాది సూచికలన్నీ రాసుకొని వాటితోపాటు ఇంకో సూచిక కూడా పెట్టేవారు. అదేమి సూచిక అంటే మొత్తంగా ఆర్థిక వృద్ధిరేటు ఎంత ఉంది అని? అంటే మొత్తంగా దేశంలో జరిగే ఉత్పత్తి - ప్రైవేటు రంగం, ప్రభుత్వ రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, హోటళ్ళు అన్నీ కలుపుకొని జరిగే ఉత్పత్తి ఉంటుంది గదా - ఆ స్తూల జాతీయ ఉత్పత్తి, జి.డి.పి. అంటారు ఇంగ్లీషులో - అది ఎంత పెరిగింది అని. అది కూడా ఒక సూచికగా ఉండేది. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఏం చెప్పిందంటే, మీరు ఇన్ని సూచికలు పెట్టుకొని, ఇన్ని కొలమానాలు పెట్టుకొని, దీనికి 15 కోట్లు, దానికి 30 కోట్టు, దీనికి 40 కోట్లు ఇట్లా ఖర్చుపెట్టకుంటూ వస్తే దేశం అభివృద్ది కాదు. అభివృద్ధి కావడమంటే ప్రపంచబ్యాంకు చిత్రమేమిటి? దేశం అమెరికా కావాలి, ఇండియా అమెరికా లాగుండాలి, ఇంగ్లాండు లాగుండాలి, ఫ్రాన్స్ లాగుండాలి. అట్లా మీ దేశం కావాలంటే మీరు పది పన్నెండు సూచికలు పెట్టుకొని - ప్రసూతి మరణాలు తగ్గించడానికి ఈ 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం, బాల్య మరణాలు తగ్గించడానికి ఈ 700 కోట్లు ఖర్చు పెడుతున్నాం, అక్షరాస్యత పెంచడానికి ఈ వెయ్యి కోట్లు ఖర్చుపెడుతున్నాం - ఇట్టా ఖర్చు పెట్టుకుంటూపోతే మీకు ఫలితం రాదు. మీరు ఏం చేస్తారంటే పెట్టే ఖర్చంతా కూడా మన ముఖేష్ అంబానీగారు లేకపోతే అనీల్ అంబానీగారు లేకపోతే జిందాల్గారు, మిట్టల్గారు, లేకపోతే వాళ్ళ అమెరికా మిత్రులు... వీళ్ళంతా ఉన్నారు కదా భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి - వాళ్ళకు వసతులు చాలా కావాలి. వాళ్ళకు అద్భుతమైన రోడ్డు కావాలి. అద్భుతమైన విమానాశ్రయాలు కావాలి. విశాలమైన భూభాగం కావాలి. ఇట్లాంటి గతుకు రోడ్డుండే ఊర్లు వాళ్ళకు వద్దు వాళ్ళకు అంతర్జాతీయ ప్రమాణాలుగల టౌన్‌షిప్పులు కావాలి, అంతర్జాతీయ ప్రమాణాలు గల నగరాలు కావాలి. నేలమీద రైళ్ళుపోతే చాలదు. మా హైద్రాబాదులో ఇప్పుడు గాల్లో ప్రయాణించే రైలు వస్తుందట. మీరు పదేళ్ళ తరువాత హైద్రాబాదుకు వస్తే ఆ రైల్లో పోవచ్చు- మేమక్కడ ఉంటే ఇంకా, మీరు ఇంకా ఉంటే, హైద్రాబాద్ ఇంకా ఉంటే అప్పటికి. అంతర్జాతీయ ప్రమాణాలు గల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 24 గంటలు కరెంట్ కావాలి. అడిగినంత నీళ్లు కావాలి. పక్కనే ఓడ రేవు కావాలి. ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం కావాలి. వీటిమీద ఖర్చు పెట్టండి మీరు. అనవసరంగా వేరేవాటిమీద ఖర్చు పెట్టొద్దు. వీటిమీద మీరు త
ఖర్చుపెడితే పెద్ద పెద్ద పెట్టుబడిదారీ కంపెనీలు - స్వదేశీయమూ, విదేశీయమూ - వచ్చి పెట్టుబడులు పెడతారు. అలాగే మీ దేశంలో కార్మిక చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి - ఏం కఠినంగా ఉన్నాయో? కార్మిక నాయకులు ఎవరూ మాట్టాడరుగానీ, వాళ్ళు అనుకుంటు న్నారు కరినంగా ఉన్నాయి ఇక్కడ అని. ఉద్యోగం నుంచి తీసేయాలంటే కష్టం, రిట్రైంచ్ చేయాలంటే కష్టం, లే ఆఫ్ చేయాలంటే కష్టం. మీ దేశంలో అవన్నీ సరళించండి. సరళీకరణ అంటే అర్ధం ఇది. అందుకే మనకు చెడ్డమాట అయిపోయింది అది. పనుంటే పని ఇస్తాడు లేకపోతే ఇంటికి పంపించేస్తాడు. హైర్ అండ్ ఫైర్ అంటారు ఇంగ్లీషులో. చాలా ప్రాసయుక్షమైన మాట. అటువంటి కార్మిక సంబంధాలుండాలి. డబ్బు దీనిమీద ఖర్చుపెడితే పెట్టుబడులు భారీగా వస్తాయి. ఉత్పత్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. వృద్ధిరేటు బ్రహ్మాండంగా ఉంటుంది. సంపద బాగా పెరుగుతుంది. అది ఎప్పుడో ఒకప్పుడు క్రిందికి పోకుండా పోదు గదా. పైన పెంచుకొంటూ పోతే ఎప్పుడో ఒకప్పుడు క్రిందికి జాలువారి కింద ఉన్న పదిమందికి అందకుండా పోదు. ఆ రకంగా పేద (ప్రజానీకానికి కూడా ఏదో ఒక రోజు తిండి దొరుకుతుంది. పనులు దొరుకుతాయి. ఈ ; శమంలో ఏం దొరికితే అది దొరికినట్టే. లేకపోతే చెయ్యగలిగిందేమి లేదు. అనవసరంగా మీరు సంక్షేమం అని, బహుముఖమైన అభివృద్ధి అని, విశాలమైన ప్రాతిపదిక అని ఈలోగా ఖర్చులు పెట్టుకోవద్దు అని ప్రపంచ బ్యాంకు చెప్పింది. మన వాళ్ళకు అది బాగుంది. మనవాళ్ళంటే వాళ్ళ వాళ్ళే అందరూ కూడా. మనవాళ్లు అంటే అర్ధం ఏందంటే కేంద్ర కేబినెట్, రాష్ట్ర కేబినెట్లో ఉండే వాళ్ళవాళ్ళు. అయితే ఈ కంపెనీలకు ప్రత్యక్షంగా ఏజెంట్లు కాకపోతే వాళ్ళకు కాంట్రాక్టర్లు. ఢిల్లీలో ఉంటే ఏజెంట్లు, హైద్రాబాదులో ఉంటే కాంట్రాక్టర్లు దళారులు. అందువల్ల వాళ్ళు ఇవ్వాళ అభివృద్ధి అని దేనిని అంటూ ఉన్నారంటే గ్రామానికి రోడ్డు వేయడమో, బస్సులు వేయడమో, స్కూలో, ఆసుపత్రో కట్టడమో కాదు - వీళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించడం మీద ఖర్చు పెట్టడాన్ని అభివృద్ధి అంటు న్నారు. అందుకు మనకు కడుపు మండుతుంది. అభివృద్ధి అంటే కోపం వస్తుంది ఇవ్వాళ. వారు చెప్పే వాదనేమిటి? సెజ్ విషయంలో చేస్తున్న వాదన ఏమిటి? మనకు యు. కొత్తపల్లి, తొండంగి మండలాల సెజ్ విషయంలో ఏం చెప్పారు? మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు ఉపాధి లభిస్తుంది. ఇది చాలా పనికట్టుకొని ఎందుకు శ్తీరొ కే ాలగోపాల్ దవన్వాసాణ *
చెబుతున్నారంటే గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా చిన్న రైతులు, వ్యవసాయకూలి కుటుంబాల వాళ్ళకు, ఈ వ్యవసాయాన్ని వదిలిపెట్టి పనిచేసుకుంటే హాయిగా బతకగల్గుతాం అని ఒక ఆశ ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే వ్యవసాయమనేది బాగా భూమెక్కువ ఉంటే వేరే సంగతిగానీ లేకపోతే చాలా సమస్యాత్మకమైన విషయమది. ఏరోజూ పంట పండేది తెలియదు, పండక పోయేది తెలియదు. ధర పలికేది తెలియదు, పలకనిది తెలియదు, వర్షం వచ్చేది తెలియదు, రానిది తెలియదు. నెల నెలా జీతం వచ్చే ఉద్యోగం - అందునా చాలామంది ఉద్యోగులు పనేమీ చేయరు. రైతులు కూడా చూస్తూ ఉంటారు కదా. కాబట్టి ఉద్యోగమంటే హాయిగా బ్రతకవచ్చుగదా అనేది వారికి ఉంటుంది. దానిని దుర్మార్గంగా వాడుకొని రాజశేఖరరెడ్డిగారు ఏమంటున్నారంటే - లక్షలు దిగడు ఆయన - 25 లక్షల ఉద్యోగాలు, 30 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నాడు. అక్కడే మనబోటి వాళ్ళు విశ్లేషణ చేసి అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఇవ్వాల్టికి 58 సెజ్‌లు ఆమోదం పొందాయి. దేశంలో మనం నెంబర్ 2, మహారాష్ట్ర నెంబర్ 1. మన వెనక తమిళనాడు, మిగిలిన వాళ్ళు పోటీపడుతూ పైకి పైకి వస్తున్నారు. ఈ 58 సెజ్ లలో 50 లక్షల ఉద్యోగాలు వస్తాయని రాజశేఖరరెడ్డిగారు మాట్లాడుకున్నారు. కాని ఈ 58 సెజ్ లలో 37 సెజ్‌లు ఐ.టి. రంగానికి చెందినవి. ఐ.టి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజి రంగంలో ఉద్యోగాలు పదుల సంఖ్యలో తప్ప వందల సంఖ్యలో కూడా రావు. ఇక వేల సంఖ్య, లక్ష సంఖ్య 'మర్చిపోండి.
ప్రత్యక్షంగా అబద్దాలు చెపుతున్నారు వీళ్లు. ఒక్క అంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా, చైనాతో పోలుస్తూ చాలాసార్లు చెపుతారు. ఆ పోలిక మంచిచెడు ఇంకొకసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం గాన్హీ చైనా అంతా అద్భుతంగా ఉందని నేనేమీ అనడం లేదు కాని చైనాలో మాన్యుఫ్యాక్చరింగ్ సెజ్‌లు ఎక్కువ భాగం. అంటే ఉత్పత్తులను ఎక్కువ చేసేటటువంటి సెజ్లవి. ఉద్యోగాలు ఎక్కువ వచ్చే అవకాశముందక్కడ. అయినా చాలా సమస్యలున్నాయి. సెజ్‌లలో కనీస వేతనాలు దక్కడం లేదు. ఆత్మహత్యలు జరుగుతున్నా యని కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అది పక్కన బెట్టి మన సెజ్‌లలో మాన్యుఫాక్చరింగ్ సెజ్‌లు చాలా తక్కువ. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, నాలెడ్స్ ఇండస్ట్రీ, సర్వీసు ఇండస్టీ- వీటికి సంబంధించిన సెజ్లే భారతదేశంలో ఎక్కువ. ఇవి ఉద్యోగాలు చాలా తక్కువ కల్పిస్తాయి ఆ వచ్చే కొన్ని ఉద్యోగాలు కూడా బాగా చదువుకొని డిగ్రీలున్నటువంటి పట్టణ ప్రాంతాల
శే ష్య - నయత్షమం *
అగ్రకులాల ధనవంతుల పిల్లలకు మాత్రమే దక్కుతాయి తప్ప, .వేరే ప్రపంచానికి, ఎవరైతే భూములు కోల్పోతారో వాళ్ళకు దక్కేంఫ్రపక్తే ల్తేద్దు
రెండవది, హక్కుల ఉద్యమంలో పనిచేసేటప్పుడు మేము పదే పదే చెప్పేదే మంటే ప్రభుత్వం మాట్లాడేదంతా అబద్ధమని కొట్టి పారయ్యొద్దు ఎప్పుడు కూడా. కానీ ఏమి దాచిపెట్టారో చూద్దాం. ప్రభుత్వం కొన్ని వాస్తవాలు చెబుతుంది, కొన్ని పాక్షిక వాస్తవాలు చెబుతుంది. కొన్ని వక్రీకరణలు చెపుతుంది. చాలా దాచిపెడుతుంది. దాచిపెట్టే వాటిగురించి మనం ప్రశ్నలు వేయడం నేర్చుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి. క్రమంగా బయటకు వస్తాయి. మన ఆలోచన పరిపూర్ణం అవుతుంది.
ఎప్పుడైనా ప్రభుత్వం పదివేల ఎకరాలు తీసుకుంటున్నాము, ఇక్కడోక సెజ్ వస్తుంది, ఫలానా పరిశ్రమ వస్తుంది, 25 వేల ఉద్యోగాలు వస్తాయిక్కడ అన్నప్పుడు - ఇప్పుడు ఆ పదివేల ఎకరాలలో ఎంతమంది పనిచేసుకొని బ్రతుకుతున్నారు? ఆసంఖ్య ఎందుకు చెప్పదు ప్రభుత్వం? ఆ 10 వేల ఎకరాలు వ్యవసాయానికో, పశువుల మేతకో, లేకపోతే చేపలు పట్టుకోడానికో, బట్టలుతుక్కోడానికో, రకరకాల వాటికి ఉపయోగపడుతూనే ఉంటుంది కదా. 25 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నానని చెపుతున్నవాడివి ఎన్నివేల ఉద్యోగాలు షోగొడుతున్నావో చూసుకోవద్దా? ఉద్యోగమంటే జీతం వచ్చే ఉద్యోగాలే కానక్కరలేదు.
కాని ఒక సెజ్నో, ఫ్యాక్టరీనో పెడుతున్నప్పుడు ఎన్నివేల మంది ఉపాధి పోగొడుతున్నామన్న సంఖ్య ఎప్పుడన్నా ప్రభుత్వం ఇవ్వగా చూశారండీ? వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే శూన్యంలో నుంచి ఇస్తున్నట్లు చెపుతారు. వాళ్ళు సెజేకిస్తున్నటువంటి, పరిశ్రమ కిస్తున్నటువంటి భూమి శూన్యంలో ఉన్నట్టు, ఇప్పుడు అక్కడ ఏమీ లేనట్టు, పంట పండనట్టు, పని దొరకనట్టు, ఖాళీగా ఉన్నట్టు మాట్లాడతారు. వాస్తవానికట్లా ఖాలీగా ఉన్న జాగా భారత దేశంలో ఎక్కడా లేదు. థార్ ఎడారిలో కూడా లేదు. ఒంటెలను తోలుకుని తిరిగే ఒక మనిషయినా ఉంటాడు థార్ ఎడారిలో. భారతదేశంలో భూమి యొక్క అవసరం ఎంత ఉందంటే ఎక్కడ ఏ కొంచెం ఫటమున్నా దానిని తీసుకొని బ్రతికేవాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. అటువంటి దేశం మనది. మనం మొట్టమొదట అడగవలసింది, పోగొడుతున్న వాటి సంఖ్య చెప్పు నువ్వు ఇస్తానని చెపుతున్న సంఖ్యలో వాస్తవంగా ఎంతిస్తుందీ, ఎన్ని అబద్దాలు చెపుతున్నదీ మేము చెపుతాం. ఇవ్వాళ కాకినాడ, యు. కొత్తపల్లి, తొండంగిలోని ఈ 10వేల ఎకరాల సెజ్‌లో,
ర్0 " కాగావాల్ దవన్నాాల
నడం ను | ర్స
వాళ్ళు త్రము వేల్ల “లు వస్తాయనేది ఇవ్వాళ ఆ కాకినాడ సెజ్ లిమిటెడ్ శీకోకట్ లేకప టిలో రాసుకున్నారు. 16 గ్రామాల భూములు వాళ్ళు తీసుకొని 60 వేల ఉద్యోగాలు కల్పిస్తారట, ఒకవేళ కల్పించినా కూడా ఆ 50 వేలూ స్టానికులకేమీ రావు గదండీ దాంట్లో ఒక వెయ్యి వస్తాయో, రెండు వేలు వస్తాయో, మూడు వేలు వస్తాయో అది పక్కన పెట్టండి. ఆ 16 గ్రామాలు ఇవ్వాళ 50 వేల మందికి తిండి పెట్టడం లేదా? ఎందుకు పెట్టవు? 50 వేల మంది కంటె ఎక్కువ మందికే తిండిపెడుతున్న గ్రామాలను నువ్వు తీసేసి, 50 వేల మందికి నువ్వు పని కల్పిస్తున్నా నని ఛెప్పి ఆ 50 వేలలో 40 వేలమంది బయటి వాళ్లనే తెచ్చి పెడతావా? ఒకవేళ పదివేల మంది స్థానికులకు ఉద్యోగాలు వచ్చినా ఏమి మిగిలినట్టు? 40 వేల మంది నిరుద్యోగు లైనట్టు లెక్క. అంతేగదా. అంటే ఏమి జరుగుతుంది ఇవ్వాళ? వాళ్ళు అభివృద్ధి పేరుమీద ఉపాధి కల్పించడం లేదు. ఉన్న ఉపాధి పీకేస్తున్నారు. దాన్ని దాచిపెడుతూ అబద్దాలు మాట్లాడుతున్నారు. ఆ అబడ్డాలు బయటికి తీసి, వాస్తవాలను వెలికితీసి చెప్పడ మనేది హక్కుల సంఘాలు, ఇతర సంఘాలు, ఉద్యమాలు, రాజకీయ ఉద్యమాల ముఖ్యమైన కర్తవ్యాలలో ఒకటి. అబద్ధాలను, అవాస్తవాలను వెలికి తీసి ప్రజల ముందు చర్చకు పెట్టడం చాలా అవసరం.
శెండవది, ప్రీభుత్వం 10 వేల ఎకరాలు ఇచ్చేస్తుంది ఒక కంపెనీకి. కాగితంలో ఏమి చూపిస్తుంది? జిరాయితీ భూములను మాత్రమే చూపిస్తుంది. ఇది మాత్రమే ప్రజానీకానికి తిండిపెట్టే భూమయినట్టు. జిరాయితీ భూమి కాని ప్రభుత్వ భూమినంతా ఎవరికీ చెప్పకుండానే ఇచ్చేస్తుంది. మా భూమి మేము ఇచ్చేశాం అంటుంది. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ సెజ్ అని ఒకటి వస్తోంది. 11,500 ఎకరాల భూమి. ఇది అంతా గవర్నమెంటు భూమి కింద లెక్క. అంటే ఆ 11,500 ఎకరాలు ఇప్పటిదాకా ఖాళీగా పడున్నాయా? అంతటా వ్యవసాయం జరుగుతోంది. ఎవరు వ్యవసాయం చేస్తుకుంటున్నారు? ప్రభుత్వమే అసైన్ మెంట్, డిఫారమ్ పట్టాలిచ్చిన పేద ప్రజానీకం చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఏం చెపుతోంది - నా భూమిని నేను ఇచ్చేస్తున్నాను, కాబట్టి నేనా లెక్కలు చూపించనక్కరలేదు, అక్కడ ఎంతమంది ఉపాధి పొందుతున్నారు,! ఎంతమందికి ఉపాధి పోతుందో అవేమీ తను చెప్పనక్కరలేదు అనుకుంటోంది. ఏం మాట్లాడుతుంది - నాలెడ్డ్సెజ్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది అని చెపుతోంది. ఏం ఉద్యోగం అని చెబుతోంది? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోగానీ, బయోటెక్నాలజీలో గాని అతికొద్దిమంది పట్టణ ప్రాంత అగ్రకులాలకు చెందినటువంటి
ల్2
ధనవంతుల పిల్లలకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. వేరే వాళ్ళకు రావు పోయేది మాత్రం 11500 ఎకరాలలో అసైన్మెంట్ పట్టాలతో వ్యవసాయం చేసుకుంటున్నటు వంటి కొన్ని వేల మంది పేద ప్రజానీకం బ్రతుకులు. అది బంజరు భూమయినా సరే పశువులు మేపుకునే వాళ్ళ ఉపాధి ఏం కావాలి? మీ దగ్గిర తగ్గిపోయింది కాని, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో తాటిచెట్ల, ఈతచెట్ల కల్లు తీసుకునే చాలా పెద్ద పెద్ద కులాలే ఉన్నాయి. అదొక పెద్ద ఉపాధి. ఆ ప్రాంతాలలో కుంటలుగాని చెరువులుగాని ఉంటే అక్కడ చేపలు పట్టుకునేవాళ్ళు, బట్టలుతుక్కునేవాళ్లు ఎందరో ఉంటారు. ఈ కుల వృత్తులన్నీ కూడా మన హైందవ సమాజంలో అట్టడుగు కులాలవాళ్ళే చేస్తారు. వాళ్ళ జీవనం మొత్తం దెబ్బ తింటుందనేది ఎక్కడా చెప్పకుండ బుకాయిస్తూ ప్రభుత్వం దీనిని అభివృద్ధి అని మాట్లాడు తుంది. మనమందుకనే - అసలు అభివృద్ధి గురించి మీ అవగాహన ఏమిటి? మీ నమూనా ఏమిటి?- అనే ప్రాథమిక ప్రశ్న వేస్తాం. ప్రత్యక్షంగా ప్రభుత్వం రకరకాల రూపాలలో ప్రజానీకం జీవితాలు బాగు చేయాల్సిన అవసరమేమీ లేదు. పెట్టుబడిదారి కంపెనీలు పెట్టుబడులు పెట్టటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే సరిపోతుంది. దాన్నించే ప్రజానీకానికి అభివృద్ది వస్తుందనే ఆలోచన దుర్మార్గమైన ఆలోచన. అది మన విమర్శలో ఒక ముఖ్యమయిన భాగం.
రెండవది, ప్రత్యక్షంగా జీవనం కోల్పోవటం మాత్రమే కాకుండా, ముఖ్యంగా మీ (ప్రాంతంలో, తీరప్రాంతంలో మత్స్యకారులకు రాగల ప్రమాదం ఎంత భయంకరంగా ఉండబో తుందంటే మొత్తం కోస్తా ప్రాంతం అంతా కూడా పరిశ్రమలు రాబోతున్నాయి. అందులో థర్మల్ ప్లాంటులు చాలా ఎక్కువగా వస్తాయి - నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా. ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? థర్మల్ ప్లాంట్ పెట్టడానికి బొగ్గేమి దొరకదు ఇక్కడ. మన రాష్ట్రంలో బొగ్గు తెలంగాణలో ఉంది. ఆ బొగ్గు సరిపోకపోతే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి తేవాలి. అవి ఇంకా చాలా దూరంలో ఉన్నాయి - నెల్లూరుకుగాని, శ్రీకాకుళానికిగాని. మరి ఇక్కడెందుకు పెడుతున్నారు? ఒకటే ఒకటి చూస్తున్నారు. థర్మల్ ప్లాంట్‌కు నీళ్లు కావాలి. ఇక్కడ సముద్రం ఉంది. ఆ నీళ్ళున్నాయి. ఈ నీళ్లు దూరప్రాంతానికి తీసుకుపోవాల్సివస్తే ఖర్చెక్కువ. కాబట్టి దగ్గర్లో నీళ్ళుంటే ఖర్చు తక్కువవుతుంది అనే ఏకైక విషయం పెట్టుకొని ఇస్తున్నారు. అన్నీ ప్రైవేటు కంపెనీలే. వీటివల్ల వచ్చేటటువంటి కాలుష్యం చాలా భయంకరంగా ఉండబోతుంది.
మధ్యప్రదేశ్‌లో 12వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేసే (ప్రాంతం ఒకటుంది. చాలా కంపెనీలు ఉన్నాయి అక్కడ. అక్కడ ఎంత ప్రమాదకరమయిన
ర్ కాగడాల వనాల
కాలుష్యం వచ్చిందో ఒకసారి చూస్తే శ్రీకాకుళం జిల్లా, నెల్లూరు జిల్లాలలో ఏం జరుగబోతుందీ అర్థమవుతుంది. అంతే విద్యుదుత్పత్తి సామర్ధ్యం ఉండబోతున్న ఈ ప్రాంతమంతా కూడా ఎటువంటి కాలుష్యాన్ని భరించవలసి వస్తుందో? ఆ కాలుష్యానికి ప్రధాన బాధితులు మత్స్యకారులు కాబోతారు. ఎందుకంటే మన కాలుష్య నియంత్రణ మండలి ఈ పర్మిషన్లు ఏవిధంగా ఇస్తుందంటే నువ్వు బయటికి వదెలిపెట్టేటటువంటి వ్యర్ధ పదార్థాలను శుద్ది చేసి సముద్రంలోకి వదిలేయ్ అని చెప్పి ఇస్తుంది. శుద్ధి ఎంత చేస్తాడు? సమగ్రంగా చేస్తాడా? థర్మల్ ప్లాంటయినా కొంత చేస్తుంది. థర్మల్ ప్లాంట్లతోపాటు, కోస్టల్ కారిడార్‌లో భాగమయి ఈ [ప్రాంతంలో రసాయన పరిశ్రమలు, మందుల పరిశ్రమలు రానున్నాయి. రసాయన పరిశ్రమల, మందుల పరిశ్రమల కాలుష్యం మేము హైద్రాబాదులో చూస్తున్నాం. హైదరాబాద్ దేశంలోనే డ్రగ్ ఇండస్ట్రీలో నెంబల్ వన్. పటాన్చెరు ప్రాంతం మీకు తెలుసు, చాలామంది వస్తుంటారు హైద్రాబాద్‌కు. కూకట్సల్లికి దగ్గరో ఉంటుంది. ఆ కాలుష్యం మూసీనదిని ఎంత ధ్వంసం చేసిందో, ఆ ప్రాంతంలో చెరువులు ఎట్టా ధ్వంసం అయ్యాయో మేము చూస్తూనే ఊన్నాం. హక్కుల సంఘాలుగా 30 ఏళ్ళుగా ఆ ప్రాంతాలకు పోతూనే ఉన్నాం. ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. కేసులు వేస్తూనే ఉన్నాం. అయినా కాలుష్యం వస్తూనే ఉంది. ఎందుకంటే నిపుణులే చెపుతారు రసాయన కాలుష్యం, ఫార్మా స్యూటికల్ కాలుష్యం ఎంత శుద్ది చేసినా పదిశాతం మిగిలి పోతుందని. రేపు వీళ్ళు కాలుష్యాన్ని తూముల్లోకి నెట్టి సముద్రంలోకి వదిలేస్తూ ఉంటే రాబోయే రోజులలో ఆ సముద్రంలో చేపలు దొరుకుతాయా? జల జీవాల పునరుత్పత్తి జరుగుతుందా? క్రమంగా అన్నీ చచ్చిపోతాయి. ట్రాలర్డు వేసుకొని, మెషిన్ బోట్లు వేసుకొని దూరంపోయే వాడికి చేపలు దొరకొచ్చు. కాని దగ్గర్జో చేపలు పట్టేటటువంటి ఈ (ప్రాంత మత్స్యకారులెవరికి కూడా జీవనం మిగలదు. అంటే ప్రత్యక్షంగా ఉపాధి కోల్చోవటమే కాక కాలుష్యం ద్వారా, పర్యావరణ విధ్వంసం ద్వారా కూడా కోల్పోవడం.
ప్రకృతి అనేది ప్రజానీకానికి జీవనాధారం. సహజ వనరుల దోపిడీ గురించి మాట్లాడు తున్నాం అంటే మా గ్యాసు తీసుకుపోతున్నాడు, మా నీళ్ళు తీసుకుపోతున్నాడనే కాదు
- ప్రకృతి మీద ఆధారపడి బతికే హక్కును కూడా తీసుకుబోతున్నాడని. అది సారవంతమైన నేల రూపంలో కావచ్చు, చేపలు పట్టుకునే నీళ్ళ రూపంలో కావచ్చు. ఆరోగ్యాన్ని కాపాడే గాలి రూపంలో కావచ్చు. అనేక రకాల జీవనానికి అవసరమయిన సంపద నిచ్చే అడవుల రూపంలో కావచ్చు. గాలిగానీ, నీళ్లుగానీ, నేలగానీ, చెట్లుగానీ
త్తి కాం = నడమ
- ఇవి కేవలం ్రకృతి కాదు. ప్రజానీకానికి జీవనాధారం. ప్రభుత్వం దృష్టిలో రెండే రెండు కేటగిరీలు. పట్టాలుంటే జిరాయితీ భూమి, నష్టపరిహారం ఇస్తాము మిగిలింది వ్యవసాయానికి పనికిరాని వృధాభూమి. అది మాదే కాబట్టి ఎవరికీ ఏమీ ఇవ్వనక్కర్లేదు. కాని వాస్తవానికి అదంతా కూడా జీవనానికి ఆధారమైన నేలే. ఆ స్పృహ ఎక్కడా ఉండదు వాళ్ళకు. తెలియకకాద్దు, లెక్క లేదు. దాన్ని దాచిపెట్టేసి మీకు పట్టా ఉందా, అయితే నష్టపరిహారం ఇస్తాం తీసేసుకో, వెళ్ళిపో ఇక్కడనుంచి అంటారు. ఎక్కడికి పోతాడు అతను? ఎంతమంది ఎక్కడికి పోతారు? ఎంతమంది ఆ డబ్బు తీసుకొని వ్యాపారాలు చేసుకొని బాగుపడగలుగుతారు? ఎంతమంది ఆ డబ్బు తీసుకొని మళ్ళీ భూములు కొనుక్కొని వ్యవసాయం చేయగలగుతారు? ఒక గ్రామంలో ఇద్దరు రైతుల దగ్గర భూమి తీసుకొని తలో రెండులక్షలిస్తే ఇంకొక గ్రామంలో కొనుక్కోగలరు. 10 వేల ఎకరాల భూములు తీసేసుకొని డబ్బులిస్తే చుట్టుపక్కల భూముల ధరలంతా కూడా పదిరెట్లు పెరిగిపోతాయి. తెలిసిన వాస్తవాటే ఇవన్నీ కూడా. జరుగుతున్న వాస్తవాలే. గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది ఇవ్వాళ? చట్టం ప్రకారం రావలసిన దాని కంటే రెండు రెట్లు ఎక్కువ ఇస్తున్నాం కదా అంటుంది. ఇస్తున్నారు కొన్నిచోట్ల, ఇవ్వడం లేదని గాదు. ఇంక హాయిగా బతుకుపో అంటారు. నువ్వు హాయిగా అనే లోపలే ధరలు నాలుగు రెట్లు పెరిగిపోయుంటాయి. ఎందుకంటే ఒకడికి ఇవ్వడం లేదు నువ్వు. ఎంతమంది కిస్తున్నావు? 10 వేల ఎకరాలకు ఇస్తున్నావు. 10వేల ఎకరాల రైతులు డబ్బు తీసుకొని బయట కొనుక్కుందామనిపోతే భూముల ధరలు ఊరుకుంటాయండి? రేట్లు బాగా పెరిగి పోతాయి కాబట్ట అందరి అనుభవమేందంటే భూసేకరణలో భూములు కోల్పోయిన వాళ్ళు ఎక్కువ నష్టపరిహారం ఇచ్చినా కూడా తక్కువ భూమే కొనుక్కోగలుగు తున్నారు. సమానంగా కాదు గదా సగం కూడా కొనుక్కోలేకపోతున్నారు. ఇక మిగిలిన ప్రజానీకం - భూములు లేని వాళ్ళు, చాకలివాళ్ళు, మంగలివాళ్ళు, వ్యవసాయ కూలి చేసుకునేవాళ్ళు, ఏమైపోతారు వాళ్ళంతా? అంటే, వాళ్ళను బికారులుగా మార్చి, విశాల ప్రజానీకానికి జీవనాధారమైన ప్రకృతిని పెట్టుబడికి ఒక వనరుగా చూడటం అనేది దుర్మార్గమైన ఆలోచన. అదే పెద్ద దోపిడి. ఒక ప్రాంతం వనరులు తీసుకోబోతున్నారు లేదా ఇంకొక ప్రాంతం వనరులు తీసుకో బోతున్నారు అనేది కాదిక్కడ. ప్రకృతి, గ 900 ప్రకృతి అనేదే ప్రజానీకానికి జీవనాధారం. ప్రజానీకానికి జీవనాధారమయిన ప్రకృతిని పెట్టుబడికి వనరుగా చూపించి, పెట్టుబడికి ల్శ్త శాల వ్యాసాల
అప్పగించేసి, డబ్బులిస్తున్నాం గదా, కాలనీ గట్టిస్తాం గదా, మీరక్కడ బతకండీ అని తరిమేస్తానంటే, అదే దోపిడి. ఇంక వేరే దోపిడి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. మరి అభివృద్ధి ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? ఎక్కడ వస్తుంది? అంటే ఇవన్నీ అర్ధంలేని మాటలు. అమెరికాలో జరగలేదా? ఇంగ్లాండులో జరగలేదా? అంటే ఆ దేశాలు ఈ మోడల్లో వృద్ధి చెందగలిగాయి అంటే వాటికి వలసలుండేవి. అ వలసలను దోచుకుని, వలస దేశాల వనరులను దోచుకొని దాన్ని సప్లిమెంట్ చేసుకొని తమ దేశాలను అభివృద్ధి చేసుకోగలిగారు. అది ఇప్పుడు ఏ దేశానికీ సాధ్యం కాదు. ఈ నమూనాలో అభివృద్ధి చెంది అందరి జీవితాలు బాగు చేయడం ఇవ్వాళ ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు.
ఇవ్వాళ మనకు వలసలు వద్దు. కావాలనుకున్నా అవి లేవు. భారతదేశం లాంటి దేశాలలో ప్రజల దైనందిన జీవితాన్ని జీవన ప్రమాణాలను ప్రత్యక్షంగా పెంచే అభివృద్దే అభివృద్ధి తప్ప, వేరే నమూనా అభివృద్ధి అనేది సాధ్యం కాదు. దానికి అనుబంధంగా పరిశ్రమలు పెట్టు. ఎవ్వరూ వద్దనడంలేదు. ఒకే ఒక గీటురాయి పెట్టుకో. నువ్వు ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం వలన ఎవ్వరి జీవనమైనా దెబ్బ తింటే తిరిగి అంతే జీవనాన్ని పొందేరకంగా వాళ్ళకు పునరావాసం కల్పించగలవా, కల్పించలేవా? ఇవ్వాళ్సికీ భారతదేశంలో ఆ రకమైనటు వంటి చట్టం లేదు. ఇవ్వాళ్టికీ భారతదేశంలో అభివృద్ధి కోసం ఎవరైనా భూములు కోల్పోతే, ఎవరైనా జీవనం కోల్పోతే తిరిగి అంత భూమి లేక అంత జీవనం అదే మోతాదులో వాళ్ళు పొందాలి అని చెప్పే చట్టం లేదు. ఏముంది? మార్కెట్ రేటు ప్రకారం ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. ఏం చేసుకొంటావా చేసుకో అనే మాటబిరుసుతనం ఉంది. పార్లమెంట్లో మూడు సంవత్సరాలుగా రెండు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మూడేళ్ళుగా ఎప్పుడు చర్చ వచ్చినా ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడతారు - కొత్త భూసేకరణ చట్టం చేస్తున్నాము, కొత్త వునరావాన చట్టం చేస్తున్నాము, భయపడొద్దు మీరు అంటాడు. చెయ్యడు దాన్ని. అవి మూడేళ్ళుగా అట్లాగే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మూడేళ్ళలో లక్షలాది ప్రజానీకాన్ని నిర్వాసితులు చేసేటటువంటి భూసేకరణ మాత్రం జరిగిపోతూనే ఉంటుంది. పోనీ ఆ చట్టాలేమన్నా బాగున్నాయా? మా బులెటిన్‌లో దాని మీద విశ్లేషణ రాశాము. ఆ చట్టాలు ఇవ్వాళ ఉన్న చట్టాలకంటే మెరుగేగానీ, మళ్ళీ అంతే జీనన ప్రమాణాన్ని కల్పించే చట్టాలు కావు అవి. రేపు ఈ బిల్లులు చట్టాలయినా అభివృద్ధికోసం జీవనం కోల్పోయిన వాళ్ళకు
త్ర్ జ రాజ్యం - నంక్షేమం శ
అంతే జీవనాన్ని తిరిగి కల్పిస్తాం అనే శాసనపరమైన భరోసా, హామీ వాళ్లకు బేదు. ఇది సాగడానికి వీలులేదు.
పదిహేనేళ్ళకింద ఒక పరిశోధకుడు చాలా వివరంగా పరిశోధించి ఒక మాట చెప్పాడు. అందరూ చాలా సిగ్గుతో తలవంచుకోవాల్సిన మాట. ఈ అరవై సంవత్సరాల భారతదేశ ప్రగతిలో భూసేకరణవల్ల భూములు కోల్పోయి నిర్వాసితులైన ప్రజానీకంలో 40 శాతం మంది ఆదివాసులు అని చెప్పాడు. దేశ జనాభాలో ఆదివాసులు ఎంతమందో తెలుసా? కానీ ప్రాజెక్టులకోసం, పరిశ్రమలకోసం, జీవనాన్ని కోల్పోయి నిర్వాసితులు అయిన వాళ్ళలో వెయ్యికి నాలుగువందల మంది ఆదివాసులు. అంటే ఈ దేశం అభివృద్ధి అయింది -ఆదివాసులను చావగొట్టి. ఇవ్వాళ భారతదేశం ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందింది అంటున్నారు. అంటే ఆదివాసుల జీవితాలను నాశనం చేసి వాళ్ళను బికారులు చేసి దేశం ఈ స్థాయికి వచ్చిందంటే ఎంత లజ్ఞాకరమయిన పరిస్థితి ఇది! ఆ రోజు వాళ్ళకి మాట్టాడ్డానికి నోరు లేదు, వాళ్ళ తరపున మాట్లాడే ఉద్యమాలు లేవు. ఇవ్వాళ అయినా కనీసం మేల్కొందాం. అభివృద్ధి అనేది ప్రత్యక్షంగా ప్రజల జీవన ప్రమాణాలు సపెంచేదే కావాలి తప్ప నీ మనసులో సిద్దాంతం ఒకటి పెట్టుకొని, పెట్టబడుదారులకు వసతులు కల్సించుకొంటూ పోతే - దానివల్ల అభివృద్ధి వస్తుందనేది వట్టి అబద్ధం. ఏ మేరకైనా ఎవరినైనా నువ్వు విస్థాపితులను చెయ్యవలసి వస్తే, నిర్వాసితులను చెయ్యవలసి వస్తే ఆ ప్రజానీకం ఒక సమాజంగా మళ్ళీ మరొకచోట ఇవ్వాళున్న జీవన ప్రమాణానికి ఒక్క రూపాయి కూడా తగ్గకుండా బ్రతికేటటువంటి పునరావాసం నువ్వు కల్పించగలిగితేనే చెయ్యి, లేకపోతే చెయ్యడానికి వీలులేదు అనేది ఒక డిమాండ్‌గా ముందుకు రావలసిన అవసరం ఉంది. ఇవ్వాళ మనం మాట్లాడుతున్నటువంటి జీవన వనరుల దోపిడి ప్రధానంగా ఇదే.
కె.జిబేసిన్ గురించి మిత్రులు పొద్దున్నించి ఇచ్చిన నినాదాలు వింటున్నాము. పేపర్లో చూస్తున్నాం. కాని వెయ్యవలసిన ప్రశ్న ఏమిటి? వేస్తున్న ప్రశ్చ ఏమిటి? స్థానిక వనరుల మీద హక్కు స్థానికులకే ఇవ్వాలి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ గ్యాసు ఇచ్చిన తరువాత బయటికి పోవాలని ఆవేశంగా అంటున్నాముగానీ, కొంచెం ఆలోచిస్తే అందరూ ఇదే అంటే వనరులు లేని (ప్రాంతాలు ఏమవుతాయి? దేశంలో ఎక్కడ వనరులున్నా అది దేశసంపద. ప్రజల సంపద. స్టానిక ప్రజల సంపద కాదు, ప్రజల సంపద. వనరులు ఎక్కడున్నా వాటి ఫలితం దేశమంతా కూడా సమానంగా పొందగలగాలి అనేది ప్రజాతంత్ర సూత్రం తప్ప ఎక్కడ వనరులుంటే అక్కడి వాళ్ళకే దక్కాలన్నడి
ర్ కౌ ాగోవాల్ ఉవనాపాల
ప్రజాతంత్ర సూత్రం కాదు. అప్పుడేమవుతుంది అంటే వనరులు లేని ప్రాంతాలు రెండవశ్రేణి పొరులుగా బతకాల్సి వస్తుంది. అది న్యాయం కాదు. సహజ వనరులు ప్రజల సంపద, స్టానిక ప్రజల సంపద మాత్రమే కాదు, మొత్తం దేశ ప్రజల సంపద. దాని ఫలితాన్ని దేశ ప్రజానీకం అందరూ కూడా సమానంగా పొందగలగాలనేది ఒక ప్రజాతంత్ర సూత్రం.
కె.జి. బేసిన్ గురించి వెయ్యవలసిన ప్రశ్న అది కాదు. ఉద్యమం చెయ్యవలసింది అందుకు కాదు. ఏమని ప్రశ్నించాలి మనం? మిత్రులు మాట్లాడుతూ చాలామంది చెప్పారు కూడా. ఓఎన్జిసి అనేది చాలా నైపుణ్యంగల సంస్థ. ఎంత నైపుణ్యం ఉందీ అంటే ఆసియాలో, ఆఫ్రికాలో అనేక దేశాలు తమ దేశాలలో ఉండే పెట్రోలియం, సహజ వాయువులను పరిశోధించి వెలికి తీయడానికి ఓఎన్జిసికి కాంట్రాక్టులు ఇస్తున్నాయి. అటువంటి ఓఎన్జిసి ఇండియాకి అక్కరలేకుండా పోయిందా? ఇండియాకి రిలయన్స్ కావల్సివచ్చిందా? ఎందుకు అవసరమయ్యింది? ఒఎన్జిసికి సామర్థ్యం ఉంది, నేర్చు ఉంది. కానీ వాళ్ళు కేబినెట్లో ఉన్నవాళ్ళకు బంధువులు కారు, కేబినెట్లో ఉన్న వాళ్ళకు రాజకీయ మిత్రులు కారు. అదొక ప్రభుత్వ కంపెనీ. కాబట్టి దాన్నించి కమీషన్స్ ఎక్కువ రావు. (పైవేటు కంపెనీక్రైతే కమీషన్లు వస్తాయి. ఇదొక అన్యాయం.
రెండవది, బయటకు తీసినటువంటి ఆ గ్యాసు ధర ఎంత ఉండాలి అనేది ఎవరు నిర్ణయిస్తున్నారు? మన రాష్ట్రంలో అనేక ప్రైవేటు కంపెనీలు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి ట్రాన్స్‌కో వాళ్ళ దగ్గిర కొనుక్కుని డిస్కామ్కు అమ్ముతుంది. డిస్కామ్ మనకమ్ముతుంది. ధర ఎవరు నిర్ణయిస్తున్నారు? ఎలక్రిసిటి రెగ్యులేటరీ కమీషన్ ఒకటుంది. ఆ కమీషన్ సంవత్సరానికి ఒకసారి కూర్చుంటుంది. కూర్చాని ఏం చేస్తుంది? ట్రాన్స్‌కో వాళ్ళు, డిస్కమ్ వాళ్ళు, జెన్కో వాళ్ళు, పైవేటు ఉత్పత్తిదారులు - మా ఖర్చింత, మా కయ్యిందింత అని చెపుతారు. తను సబ్సిడీ ఇంతిస్తానని ప్రభుత్వం చెబుతుంది. ప్రజానీకానికి నోటీసు పోతుంది. ప్రజలు వస్తారు. నాణ్యమైన సరఫరా ఇవ్వడం లేదు వీళ్ళు, 7 గంటల కరెంట్ ఇవ్వడం లేదు వీళ్ళు. పరీక్షలప్పుడు కరెంట్ తీసేస్తున్నారు. ఇలా మన కష్టమేదో మనం చెప్పుకుంటాం, అంతా విని ఒక స్వతంత్రమైన సంస్థగా ఎలక్ట్రిసిటి రెగ్యులేటర్ కమీషన్ ధర నిర్ణయిస్తుంది. న్యాయంగా జరుగుతుందా? న్యాయంగా జరగదా? వేరే విషయం. కనీసం ఒక న్యాయమైన వ్యవస్థ అది.
మరి గ్యాసు ధర కూడా అట్లాగీ నిర్ణయం కావాలి కదా. పెట్రోలియం రెగ్యులేటరీ యాక్ట్ ఒకటుంది. దానికింద పెట్రోలియం రెగ్యులేటరీ కమీషన్ ఒకటి ఏర్పాటుచేసి
ల్
గ్యాసుధరను వాళ్ళు నిర్ణయించాలి. కాని అలా జరగడంలేదు. ఎవరు నిర్ణయిస్తున్నారు అని అంటే కేంద్ర కేబినెట్లో కొంతమంది మంత్రులు £000౪6766 6029 01 కలు 060]/4) అనే ఒక మంత్రుల బృందం నిర్ణయిస్తుంది. ఎవరు ఆ మంత్రులు అంటే మన కందరికీ తెలుసు. కేంద్ర కేబినెట్ మంత్రులందరూ కూడా ఒకడు ముఖేష్ అంబానీకి, ఒకడు అనీల్ అంబానీకి, ఒకడు నవీన్ మిట్టల్‌కు, ఇంకొకడు జిందాల్‌కు అమ్ముడుపోయినవాళ్ళు. వాళ్ళు ఎట్టా నిర్ణయిస్తారు? మనం డిమాండ్ చేయవలసింది గ్యాసు ధరను నిర్ణయించ వలసింది కేంద్ర కేబినెట్లోని పిడికెడు మంది మంత్రులు
- మురళీదేవరా, ప్రణబ్‌ముఖర్జీ; వీళ్ళు కాదు - ఒక స్వతంత్రమైన పెట్రోలియం రెగ్యులేటరీ కమీషన్ ఉండాలి, ఆ కమీషన్ ప్రజానీకానికి నోటీసు ఇవ్వాలి. మనకు నోటీసు ఇవ్వాలి. మన అభిప్రాయాలు వినాలి. ఆ తరువాత నిర్ణయించాలి అని. మూడవది ఒకసారి గ్యాసు బయటకు వచ్చిన తరువాత దాని మార్కెటింగ్‌లో రిలయన్స్ వారికి ఏమాత్రం ప్రమేయం ఉండటానికి వీలులేదు. ఇవ్వాళ పరిస్థితి ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఎవ్వరికిమ్మంటే వాళ్ళకిచ్చి ఆపైన మార్కెటింగ్ చేసుకుంటాడు వాడు. దానికి రకరకాల తగాదాలు. నాకివ్వలేదంటే నాకివ్వలేదని కోర్టులో కేసులు. బయటికి తీసేంతవరకే - రిలయన్స్‌కు అయినా, ఓఎన్జిసికు అయినా బాధ్యత. మార్కెటింగ్ అంతా కూడా ప్రభుత్వమే చూసుకోవాలి. ఈ డిమాండ్ ప్రధానంగా ముందుకు తీసుకురావాలి. దీనికోసం మనం ఆందోళన చెయ్యాల్సిన అవసరముంది. ఆసలు ప్రాథమికంగానే ఇవ్వాళ రిలయన్స్ కిచ్చిన కాంట్రాక్టు రద్దు చెయ్యండి. వాళ్లెట్లాగు ఖర్చు అడుగుతారు, కోర్టుకు పోతే వాళ్లకు పరిహారం వస్తుంది. ఇచ్చేసేయండి, మహారాష్ట్రలో ఎన్రాన్ అనే కంపెనీతో ఒక అగ్రిమెంట్ చేసుకున్న ప్రభుత్వం వాడికి ముడిసరుకు ఇవ్వలేక, వాడు ఉత్పత్తి మొదలుపెట్టక - ఆ అగ్రిమెంటులో భాగంగా వాడికి వేలకోట్ల రూపాయల ప్రజాధనం మహారాష్ట్ర గవర్నమెంటు ఇవ్వాల్సి వచ్చింది. అటువంటి ఘోరాలు జరుగుతాయి. కాబట్టి, కె.జి. బేసిన్ గ్యాసును తిరిగి ఓఎన్జిసికి అప్పగించండి అనే డిమాండ్ ప్రధానంగా ముందుకు రావాలి. వనరులనేవి ఎప్పుడూ కూడా మొత్తం దేశానికి చెందుతాయి. దేశంలోని ప్రజానీకానికి అందరికీ వనరులపైన సమానమైన ఫలం పొందే హక్కుంటుంది తప్ప ఎవరి వనరులు వారికే అన్నది సరైనది కాదు. ఆదివాసీ ప్రాంతాలలో స్టానిక వనరులు స్థానికులకే అని ఎందుకంటామంటే వాళ్ళ ఆర్థిక జీవితానికే కాదు, వాళ్ళ సంస్కృతికి కూడా ఆ వనరులు ముడిపడి ఉంటాయి. బయట ప్రాంతాలలో వనరులనేవి అర్థిక జీవితానికి మాత్రమే ల్టి శలాగాల దచన్యానాదో
ఆధారం. ఆదివాసులకు అట్లా కాదు. వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సామాజిక అలవాట్లు, ఆచరణ, ఆచారాలు అన్నీ కూడా వాళ్ళ వనరులతో ముడిపడి ఉంటాయి కాబట్టి వాళ్ళ వనరులపైన వాళ్ళకే యాజమాన్యం ఉండాలి తప్ప వేరేవారికి కాదు. దాన్ని సాధారణ సూత్రంగా చేసేస్తే కష్టం. ఏ వనరులు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. బొగ్గు లేనివి, గ్యాసు లేనివి, పెట్రోలు లేనివి, నీళ్ళు లేనివి - వాళ్ళు బతకనక్కరలేదా భారతదేశంలో? వాళ్ళకు ఎక్కడనుంచి వనరులు వస్తాయి? వాళ్ళు సెకండ్ క్లాస్ సిటిజన్స్ అయిపోరా? ఇది సరయినటువంటి వైఖరి కాదు. పెట్టవలసిన డిమాండ్ ఏమంటంటే - రిలయన్స్‌ను పక్కకు పెట్టండి. ఓఎన్‌జిసిని తీసుకోండి. ధరలు స్వతంత్ర రెగ్యులేటరీ కమీషన్ నిర్ణయించాలని చెప్పండి. గ్యానుపైన, మార్కెటింగ్ పైన ప్రభుత్వానికి అజమాయిషీ ఉండాలనే డిమాండ్ ముందుకు తీసుకురండి. ఆ డిమాండ్‌తో ఆందోళన చేద్దామనేది ఇవ్వాళ ఉద్యమకారులకి మానవ హక్కుల వేదిక విజ్ఞప్తి.
మనం హక్కులుగా మాట్లాడుతున్నవి, జనం నుంచి హక్కులుగా ముందుకొస్తున్నవి
- వీటిని ఎట్లా వశ్రీకరించి కుదించి చట్టాలు చేస్తున్నారో కూడా తెలుసుకోండి. పైకి ఇచ్చినట్టే అనిపిస్తుంది హక్కు. రెండే ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తా. ఇవ్వాళ ప్రభుత్వం ఆహార భద్రత చట్టం ఒకటి చేస్తోంది. ఒక రకంగా మంచిదే. ఇవ్వాల్టీదాకా చవక బియ్యం పాలసీలు ఉండేవి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు రూపాయలకు కిలో బియ్యం పాలసీ ఉంది - తెల్లకార్డు ఉన్నవాళ్ళకు. తమిళనాడులో మూడు రూపాయలు, పంజాబ్‌లో ఒక రూపాయికి కిలో బియ్యం, గోధుమలు ఇలా ఏవో ఉన్నాయి. తప్పుకాదు కానీ, ఇవ్వాల్టిదాక ఈ చవక బియ్యం విధానం అంతా పాలసీగా ఉంది. పాలసీగా ఉంటే ఏమవుతుంది అంటే ఇవ్వాళ ఉండొచ్చు రేపు తీసెయ్యవచ్చు. చట్టంగా ఉంటే అది హక్కుగా ఉంటుంది. కాబట్టి అది చట్టం చేయడాన్ని మనం ఆహ్వానిస్తాం. తప్పేమీ లేదు దాంట్లో. చట్టం చేయాల్సిందే. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమని చట్టం చేస్తుంది? దారిద్ర్యరేఖకు దిగువన ఉండే ప్రతి కుటుంబానికి కిలో మూడు రూపాయలకి 25 కేజీలు - అది బియ్యమైతే బియ్యం, గోధుమలైతే గోధుమలు - సరఫరా చేస్తాం దేశవ్యాప్తంగా అని అంటున్నారు. 20 ఇవ్వాలా, 30 ఇవ్వాలా, 35 ఇవ్వాలా అనేది పక్కన బెట్టండి. దారిద్ర్య రేఖ నిర్వచనాన్ని, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తూ ఉంది అనంటే ఆ నిర్వచనాన్ని కుదించేసి, తగ్గించేసి కొద్దిమంది మాత్రమే దరిద్రులు దేశంలో ఉండేటట్టు, వాళ్ళకి మాత్రమే అందేటట్టు దానిని నిర్వచించాలని ప్రయత్నం చేస్తున్నారు.
ల్9 పా నక్ష
ఇక్కడ మళ్ళీ ప్రపంచ బ్యాంకు ఆదేశాలు పనిచేస్తాయి. ప్రపంచ బ్యాంకు పదే పదే ఏం చెవుకుంటూ వచ్చిందంటే, 1990లలో వాళ్ళు ఇండియన్ ఎకానమీలో తలదూర్చినప్పటినుంచి ఏం చెపుళున్నారంటే - అప్పటిదాకా మనకున్న ఆలోచనలేమిటి? మొత్తంగా దేశంలో రకరకాల వెనకబాటుతనం ఉంది. రకరకాల పేదరికం ఉంది. క్రమంగా ఈ పేదరికాన్ని, వెనకబాటుతనాన్ని తగ్గించుకుంటూ అందరిని సమానం చేసుకోవాలి - రిజర్వేషన్లైనా, చవక బియ్యమైనా, రేషన్ షాపులైనా ఇవన్నీ దానికోసమే అన్న ఆలోచన మనకుంది. కాని ప్రపంచ బ్యాంకు ఆలోచన రీతి ఏమిటి? వాళ్ళు చెప్పిందేమిటి మన వాళ్ళకు అంటే, ఇంతకు ముందే చెప్పాం - ఇట్లా చేసుకుంటూపోళతే వనరులు వృధా అవుతాయి. నీ వనరులు దేనికోసం ప్రధానంగా ఉండాలి? పెట్టుబడి దారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రధానంగా ఉండాలి. సంక్షేమానికి కొంచెం మాత్రమే ఖర్చు బెట్టాలి.
సంక్షేమానికి కొంచెం మాత్రమే పెట్టాలంటే మీరేమి చేయాలి? టార్లెటెడ్ వాళ్ళకు మాత్రమే మీరు సదుపాయాలు కల్పించాలి. అంటే మొత్తంగా వెనకబడిన వాళ్ళకు కొంచెం కొంచెం ఇచ్చుకుంటూపోదాం. అందరూ [క్రమంగా పైకి వస్తారు, మొత్తంగా వెనకబాటుతనాన్ని తగ్గించు కుంటూ పోదామని ఖర్చుపెట్టవద్దు మీరు. ఎవరిమీద మీరు ఖర్చుపెట్టాలంటే ఇవ్వాళ నువ్వు అన్నం పెట్టకపోతే రేపు చచ్చిపోతాడే వాడికి మాత్రం అన్నం పెట్టు. ఇవ్వాళ నువ్వు ఆసుపత్రికి తీసుకొని పోకపోతే రేపు చచ్చిపోతాడే వాడికి మాత్రమే ఆసుపత్రి సేవలు అందియ్యి. అంటే పూర్తిగా బెకారులు అయిన వాళ్ళకు మాత్రమే పరిమితం కావాలి నువ్వు ఇచ్చేటటు వంటి సదుపాయాలు. ఆపైన నీ డబ్బంతా కూడా పెట్టుబడిదారులకు హైవేలు, విమానా శ్రయాలు ఇవన్నీ కల్పించడానికి ఖర్చు పెట్టాలి. మౌలిక సదుపాయాల కోసమే ఖర్చుని పెట్టాలి అని కదా ప్రపంచ బ్యాంకు ఆదేశం. దాంట్లో భాగంగా వాళ్ళు ఏం జేస్తున్నారు అంటే ఒక పక్కనేమో చట్టం చేస్తున్నాం ఆహార భద్రతకు అని చెప్పుతూ, ఇంకొక పక్కేమో పేదవాళ్ళ నిర్వచనాన్ని మార్చేస్తున్నారు. రెండు పూటలా అమ్మా నాయినా, పిల్లలూ ఇంత అన్నం తినడానికి సరిపోయే ఆదాయం లేనివాళ్ళు కూడా వాళ్ల లెక్కలోకి రావడం లేదు. అంతకంటే ఇంకా తక్కువ ఉంటేనే వాళ్ల దృష్టిలో పేదవాళ్ళు. మనుషులెవరైనా రెండు పూటలా అన్నం తినగలగాలి, పిల్లలను స్కూలుకు పంపించగలగాలి, ఉండటానికో నివాసం కలిగి ఉండాలి, కనీసమైన, శుభ్రమైన జీవితం గడపాలి. అలా గడపలేని వారందరికీ ప్రభుత్వం ఆసరా ఉండాలంటే కొంత అర్థముంది దాంట్లో. కాని బాగా
౮0 సంగోపాల్ దవన్యానాద
కుదించాలనే ఆలోచన చేస్తున్నారు ఈ వైఖరి మీద ఇవ్వాళ చాలా విమర్శ అవసరం. ఒక్కొక్క హక్కు, హక్కుగా మనమడిగేది, డిమాండ్ చేసేది కల్పిస్తున్నారు కాని దానిని ఎట్లా వక్రీకరిస్తారో, కుదిస్తారో - అర్ధం చేసుకోకపోతే, ఆలోచించకపోతే చాలా నష్టపోతాం.
విద్యా హక్కును చట్టం చేశారు. మంచిదే కాని రాజ్యాంగం ఏమి చెప్పింది? పద్నాలుగేళ్ళ వయస్సు వరకు పిల్లలందరికి నిర్బంధంగా చదువు కల్పించమంటే దాని ఉద్దేశమేమిటి? ప్రభుత్వం తన బాధ్యతగా ఆ పని చేయాలని. ఇవ్వాళేం చేశారు? మేము చదువుకున్న రోజులలో, ఇక్కడ పెద్దవాళ్ళందరూ చదువుకున్న రోజులలో ఊర్జో ఒకే స్కూలు ఉండేది. హైద్రాబాదు, విశాఖపట్నం లాంటి సిటీలను మినహాయిస్తే గవర్నమెంట్ స్కూళ్ళే ఉండేవి. అందరం అ స్కూల్‌కే పోయేవాళ్ళం. ఊర్లో కోటీశ్వరుడో, లక్షాధికొరో ఉంటే వాళ్ళు కార్గో వచ్చేది, మేము సైకిలమీద పోయేవాళ్ళం. అంతే తేడా తప్ప, అందరం ఒకే స్కూలుకు పోయేవాళ్ళం. ఒకే పంతులు దగ్గర్క ఒకే సిలబస్ చదువుకుని ఒకే పరీక్షలు రాసేవాళ్ళం. అయినా అసమానంగా ఉండేది. ఇవ్వాళ స్కూళ్ళు ఏమయ్యాయి? రకరకాల స్కూళ్ళు, మీ కులాన్ని బట్టి, మీ డబ్బును బట్టి, మీ హోదాను బట్టి మీరు స్కూలు ఎంచుకోవచ్చు. అట్టడుగు వర్గ ప్రజానీకం అంటే ఎస్సీలు, ఎస్టీలు, బాగా వెనకబడినటువంటి బి.సి కులాలు మాత్రమే ఇవ్వాళ ప్రభుత్వ స్కూళ్ళకు పోతూ ఉన్నారు. దీనిని బాగు చెయ్యకుండా నువ్వు విద్యా హక్కు కల్పిస్తానంటే ఏమన్నా అర్థం ఉందా దానికి?
పదే పదే డిమాండ్ చేస్తున్నాయి విద్యా హక్కుల సంఘాలు - కామన్ స్కూల్ సిస్టం రావాలి ఇండియాలో అని. అమెరికాలో ఉంది అది. అంత ధనవంతుల దేశం, కోటీశ్వరుల దేశం అయినా అమెరికాలో అందరూ ఒకే స్కూల్‌కి పోతారు. ఆయా ప్రాంతాలలో ఉండే నైబర్‌హుడ్ స్కూలుకే పోతారు. ఒకే సిలబస్ చదువుతారు. ఒకే టీచరు చదువు చెపుతారు. ఒకే పరీక్షలు రాస్తారు. అన్నిట్లో అమెరికా మనకు నమూనా. కొని దీనికి మాత్రం వద్దు. ఇక్కడ మనమేం అడుగుతున్నాం? ఒకే ప్రభుత్వ స్కూళ్లు పెట్టు. తెలుగులో చెప్పు తమిళంలో చెప్పు, మరాఠీలో చెప్పు, స్థానిక భాషలో చెప్పు. అదే సిలబస్, అదే టీచర్లు, అదే స్కూల్లో అందరూ చదువుకోవాలి. అప్పుడు నువ్వు తప్పనిసరిగా అందరికీ చదువు చెప్తావంటే అర్ధముందిగానీ, విద్యావ్యవస్థను మొత్తంగా ఈ రకంగా వర్గీకరించేసి, కులాన్నిబట్టి, డబ్బును బట్టి, హోదానుబట్టి ఎంచుకోవచ్చు నువ్వు అని చెప్పేసి, ఇవ్వాళ ఈ చట్టం చేస్తే అర్ధమేమిటి? దిక్కులేని పిల్లలకు చదువు చెప్పని స్కూళ్ళలో మేము బలవంతంగా చదువు చెపుతాము అని చెపుతున్నారు వాళ్లు.
రై పం సక్రమం
అదీ చట్టం ఇవ్వాళ. చాలా హక్కులు కల్పిస్తున్నట్టే అనిపిస్తుంది పేపర్లో వార్తలు చదివితే. కాని వాళ్ళు ఈ హక్కులన్నింటినీ కూడా వక్రీకరించి, కుదించి, తల్లక్రిందులు చేసి, అమలు చేస్తున్నారనేది అర్ధం చేసుకోవాలి. నిండైన మనిషిగా బతికే, నిండైన మనిషిగా ఎదిగే అవకాశం అందరికీ సమానంగా ఉండాలి అనే మానవ హక్కుల నిర్వచనాన్ని మేము అభివృద్ధికి ఇస్తూ ఉన్నాం అభివృద్ధికి నిర్వచనం మా దృష్టిలో ఏమిటీ అనంటే ప్రతి మనిషికి, ఇవ్వాల్సి భారతదేశంలో ఉండేటటువంటి అభివృద్ధిస్థాయిలో ఎంత నిండుగా బతికే అవకాశం ఉంటుందో, ఎంత నిండుగా ఎదిగే అవకాశం ఉంటుందో అది ప్రతి ఒక్కరికి సమానంగా దక్కాలి. కులమని గాదు, ఆడా మగా అనికాదు, పట్టణవాసులు, గ్రామీణవాసులు అనిగాదు, ఆదివాసులు, ఇంకొకరు అనిగాదు - అందరికీ సమానంగా దక్కాలి. అటువంటి అభివృద్ధి మనకు కావాలి. దానికి భిన్నంగా ప్రజానీకానికి కనీన జీవనం కల్పిన్తున్న ప్రకృతి వనరులను మొత్తం తీసుకొని పెట్టుబడిదారీ కంపెనీల లాభాల వేటకు అప్పగించేసి మీ చావు మీరు చావండి, బెకారులుగండి అనే అభివృద్ధి పంధాను అనుస రిస్తున్నారు. దాన్ని అందరం గట్టిగా వ్యతిరేకిద్దాం. హక్కులు కల్పిస్తున్నామని చెపుతూ ఏ రకంగా వాటిని వాళ్లు కుదించి, వక్రీకరించి, తల్లకిందులు చేస్తున్నారో దాన్ని గుర్తించి, విశ్లేషించి వ్యతిరేకిద్దాం. ప్రజల కనీస జీవన ప్రమాణాలను, సమాన అభివృద్ధి హక్కును కాపాడుకుందామని, ఈ 'వయత్నంలో అన్ని ఉద్యమాలూ కలినిరావాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈమ ఇవి (చూనవహక్కుల వేదిక బహిరంగసభ “అభివృద్ధి - నహజవనరుల దోపిడి” - అమలావురం, 23-8-2009) 6౮2 పాగపాల్ దవనానాట
ఆల్మట్టి
ఇక్కడ ఏ గొడవా కాదు. కానవసరం లేదు. శివాజీరావుగారు ఆంధ్రా ప్రతినిధి, నేను కర్ణాటక ప్రతినిధి కావాల్సిన అవసరమూ లేదు. అంటే ఎవరైనా కనిపెట్టి దాడీ చేసే ముందే నేనే చెప్పేస్తే మంచిది. మాది రాయలసీమ (ప్రాంతమే కాక మా అమ్మమ్మది కోలార్ జిల్లా, కర్ణాటక. నేను పుట్టింది బళ్ళారి. ఆంధ్రప్రదేశ్‌లో చేరవలసి, చేరలేదు అని శివాజీరావుగారు చెప్పిన బళ్ళారిలో నేను పుట్టాను. అయితే నేను చెప్పే మాటలకు ఇది కారణం కాదు.
చరిత్ర అనేది చూసేవాళ్ళను బట్టి, చెప్పేవాళ్ళను బట్టి చాలా మారుతుంది. రాయల సీమకు నీళ్ళు లేకపోవడానికి, నల్గొండలో ఫ్లోరోసిస్ రావడానికి వేరే వేరే కారణాలు కూడా చాలా చెప్పుకోవచ్చు. నదీజలాల సమస్య దానితో పరిచయం లేనివాళ్ళకు అర్ధం కావడం కొంచెం కష్టం టిఎంసిలు, క్యూసెక్కులు అని ఏమిటేమిటో అంటూ ఉంటారు. అది సులభంగా మింగుడు పడదు. టిఎంసి అంటే 100 కోట్ల ఘనపుటడుగులు, అంటే పెద్ద బిల్డింగ్ నిండే నీళ్ళు అని ఊహించుకోండి. ఒక్క టిఎంసి ఎంతా అంటే 10 వేల ఎకరాల ఆరుతడి సాగుకు సరిపోయే అంత. అంత నీళ్లు ఒక్క బిల్టింగ్‌లో ఊహించుకుంటే అది ఒక్క టిఎంసి మనం వందల టిఎంసిల గురించి మాట్లాడుకుంటున్నాం. అంత పరిమాణం నీటిగురించి మాట్లాడుకుంటున్నాం.
కృష్ణానదితో సమస్య ఏమిటంటే నదిలో నీళ్ళు తక్కువ, అవసరం ఎక్కువ. ఆ నది ఎక్కువ భాగం మైదానాలలో ప్రవహిస్తుంది గోదావరి ఎక్కువ భాగం అడవులలో ప్రవహిస్తుంది. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో ఎక్కువ భాగం ఇతరత్రా కూడా వెనకబడిన (ప్రాంతం. అంటే వర్షపాతం ఎక్కువగా లేని ప్రాంతంలో ప్రవహిస్తుంది. గోదావరి అట్లా కాకుండా ఇతరత్రా కూడా కొంత వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ప్రవహిన్తుంది. అందువల్ల కృష్ణానది జలాల గురించి కొంత కొట్టాట సహజం. నాక్కొవాలంటే నాక్కావాలని అందరూ కొట్టుకోవడం సహజం. ఈ కొట్లాట జరగకుండా
ళ2
ఉండాలంటే పంచుకోడానికి ఒక నహేతుకమైన ప్రాతిపదిక ఉండాలి ఎవరికి అందుబాటులో ఉండే నీళ్ళు వాళ్ళు ముందు వాడుకొని, ప్రాజెక్టులు కట్టేసుకోని, వేము (ప్రాజెక్టులు కట్టుకున్నాము కాబట్టి నాకు నీళ్ళు ఇయ్యాల్సిందే అని తరువాత ట్రిబ్యునల్ దగ్గర వాదించడం ఎక్కువగా జరుగుతూ వస్తున్నది. లేదా ట్రిబ్యునల్ ఒక అవార్డు ఇస్తే ఆ అవార్డును ఎవరికి తోచిన మేరకు, ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు అతిక్రమించి ఎదుటి వాళ్ళ మీద మాత్రం నిందలు వేయడం - ఇది కూడా జరుగుతూ ఉంది. ఇది ఒక నాగరిక సమాజంలో ఉండవలసిన పద్ధతి కాదు - అందులోనూ మనం ఒక ఫెడరల్ వ్యవస్థగా రూపొందాలి అనుకుంటున్నాం కాబట్టి . మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ - ఈ మూడు రాష్ట్రాలు కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉండే రాష్ట్రాలు. కృష్ణానదీ జలాలు ఏ రకంగా పంచుకోవాలనే దానికి ప్రాతిపదిక ప్రజల అవసరం, భాష కాదు. తెలుగు కాదు, కన్నడం కాదు, ఇంకొకటి కాదు, ప్రజల అవసరం ప్రాతిపదిక. ఈ అవసరం అనుకుంటే సహజంగానే వారు చెప్పినట్టు ఆ ప్రాంతంలో పండే పంట లేమిటి, వాటికి నీళ్ళు ఎంత కావాలి అనేదే కాకుండా ఆ ప్రాంతంలో ఇతర జలవనరులు ఏమున్నాయి? భూగర్భ జలాలు ఎంతున్నాయి? ముందు నుంచీ చెరువులు ఏమన్నా ఉన్నాయా అక్కడ? కృష్ణానదిలో కలిసేవి కాకుండా, వేరే వాగులు ఏమన్నా ఉన్నాయా? వాటి నుండి నీళ్ళేమైనా వస్తాయా? ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకొని పంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడున్నటువంటి పంపకంలో అంటే బచావత్ అవార్డులో మనకు తక్కువ ఇచ్చారు. కర్ణాటక, మహారాష్ట్రకు ఎక్కువ ఇచ్చారు. అంటే కారణం అంతకు ముందే మనం ఎక్కువ వాడుకుంటున్నాం. వాళ్ళు తక్కువ వాడుకుంటున్నారు. ముందునుంచీ ఉన్నటువంటి ప్రాజెక్టుల వాడకం తీసుకుంటే ఆర్ధర్ కాటన్ కృష్ణా డెల్టా వర్క్స్ కట్టినప్పుడే మొట్టమొదటి వాడకం మొదలయ్యింది. అది ఆంధ్ర ప్రాంతంలో వచ్చింది. తరవాత నాగార్జున సాగర్ వచ్చింది. ఎక్కువ భాగం మనం అప్పటికే ప్రాజెక్టులు కట్టుకొని వాడుకుంటున్నాం.
కాబట్టి బచావత్ అవార్డు ఏం చేసిందంటే ఉన్న ప్రాజెక్టులకు వాడుకుంటున్న దానిని ఖరారు చేసి ఆపైన మిగిలిన దానిని పంచింది. అట్లా పంచినప్పుడు మనకు తక్కువ వచ్చింది, వాళ్ళకు ఎక్కువ వచ్చింది. ఎందుకంటే మనం ముందే ఎక్కువ వాడుకుంటున్నాం కాబట్టి. కానీ మొత్తం మీద మనకే ఎక్కువ వచ్చింది. 2060 టిఎంసిలలో 800 ఆంధ్రప్రదేశ్‌కు, 700 కర్ణాటకకు, 560 మహారాష్ట్రకు. ఇవి నికర జలాలు, అంటే 75శాతం 4లం॥6440110' మేరకు లెక్క కట్టిన జలాలు. నూరు
య్ నాదో
సంవత్సరాలలో 75 ఏళ్ళు తప్పనిసరిగా ఇంత నీళ్ళు ఉంటాయి అనుకొని, ఆ నీళ్ళు మాత్రమే తీసుకొని దానిని పంచారు. అవి 800 ఆంధ్రప్రదేశ్‌కు, 700 కర్ణాటకకు, 660 మహారాష్ట్రకు వచ్చినయి. ఆపైన కూడా ఎప్పుడూ కొంత నీళ్ళు ఉంటాయి- అప్పుడప్పుడూ అంతకంటే తక్కువ అయితే కావచ్చు- ఈ నీళ్ళను మిగులు జలాలు అంటారు. దాన్నే 50109 ₹/216? అంటారు. దాన్నే 1006 7/24 అంటారు. దానిని కొంత వర్గీకరణ శివాజీరావుగారు చేశారు కానీ ఆచరణలో ఆ వర్గీకరణ ఎవ్వరూ చెయ్యడం లేదు. నికర జలాలని బచావత్ చెప్పిన 2060 టిఎంసిలకు మించి ఉన్నదంతా కూడా మిగులు జలాలే. దీనికి సంబంధించి ఒక అసంతృప్తి కర్ణాటకలో, మహారాష్ట్రలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. బచావత్ అవార్డును ఎంతగా తెలుగువాళ్ళం 0౪2 చేసుకుంటున్నామో, మహారాష్ట్రవాళ్ళు, కర్ణాటక వాళ్ళు 0౪౧ చేసుకోవడం లేదు. వాళ్ళకు అసంతృప్తి ఎందుకంటే ఎక్కువ నీళ్ళు వచ్చేది పడమట కనుమలు అని ఇందాక శివాజీరావుగారు కూడా చెప్పారు. కానీ ఎక్కువ వాడుకుంటూ ఉన్నది కింద ఉన్న ఆంధ్రప్రదేశ్. నీళ్ళు పుట్టేది మా మహారాష్ట్రలో, లేదా కొంత కర్ణాటకలో - ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఎట్లా వాడుకుంటుంది అని వాళ్ళ వాదన. వాళ్ళ వాదననూ మనం వినాలి - ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా. ఎక్కువ నీళ్ళెట్లా వాడుకుంటారు? అంటే దిగువకు పోయేకొద్దీ ఏమవుతుందంటే వేరే వేరే నీళ్ళంతా వచ్చి కలుస్తాయి. పైనుంచి వచ్చిన నీళ్ళకు కింది నుంచి వాగులు, వంకలు, ఉపనదుల నుంచి, అడవుల నుంచి నీళ్ళొచ్చి కలసి నది వెడల్పు అవుతుంది. నీళ్ళు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దిగువన ఉన్నవాడికి ఎక్కువ నీళ్ళు అందుబాటులో ఉంటాయని ఎక్కువ వాడుకొనడం, అది ఎట్టా సరైనదవుతుంది అనేది వాళ్ళ వాదం. వినాలి మనం దానిని, పైన అవసరం ఎక్కువ ఉండి, కింద లభ్యత ఎక్కువ ఉంటే కిందనుంచి పైకి దానిని వెనక్కి పంపించే మార్గం ఏమైనా ఆలోచించ గలుగుతామా, ఖర్చు పెడతామా - అవసరమైతే జాతీయ సమస్యగా తీసుకొని అది కూడా ఆలోచించాలి అనేది వాళ్ళ వాదన,
సరే వాళ్ళు అన్నది ఏమటంటే ఈ 75% లభ్యత ప్రాతిపదిక మీద నికర జలాలు అని ఏవైతే పంచడం జరిగిందో అవి పోను ఉన్న మిగులు జలాల మీద మూడు ర్మామ్రాలకూ సమాన హక్కు ఇచ్చి ఉండాలి అనేది ఆనాడు వాళ్ళు పెట్టిన ప్రతిపాదన, ఇప్పటికీ వాళ్ళకున్న అసంతృప్తి. బచావత్ ఏం చేసినాడంటే మిగులు జలాల మీద ఎవ్వరికీ హక్కు ఉండదు. అంటే ఎవ్వరూ ప్రాజెక్టులు కట్టుకోడానికి వీలులేదు. అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఉన్న ప్రావెక్టుల ద్వారా కానీ, లిఫ్టు
6త్
స్కీవముల ద్వారా కానీ, తాత్కాలికమైన ఏర్పాట్ల ద్వారా కానీ వాటిని
ఉపయోగించుకోవచ్చు. అంతే తప్ప ప్రాజెక్టులు కట్టుకోవడానికి వీలులేదు మిగులు
జలాలమీద. అది కూడా ఆంధ్రప్రదేశ్‌కే ఆ హక్కు ఉంటుంది. పైవాళ్ళు తాత్కాలికమైన
ఏర్పాట్ల ద్వారా కూడా ఆ నీళ్లను వాడుకోడానికి వీలులేదు. దీనిపట్ల అసంతృప్తి కొంత
ఉంది కర్ణాటకలో, మహారాష్ట్రలో చాలా ఉంది. దీనికి ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే
వర్షం తక్కువగా ఉన్న సంవత్సరాలలో కిందివాళ్ళకు నీళ్ళు ఎక్కువగా రావు కాబట్టి
వాళ్ళకు అవసరం ఉంటుందీ అనేది. కానీ 6110092601 అంతా పైనే లేదు కదా,
౧౭(0మ9680 నది మొదటి నుంచి చివరి వరకు ఉంటుంది. ౧400౧00౬ అంతా మొత్తంపైనే ఉంటే అప్పుడు పైవాళ్ళకు వచ్చేస్తుంది, కింది వాళ్ళకు రాకుండా పోతుంది అనుకోవచ్చు. 011[0:లఅ అంతా అట్లా ఏమీలేదు. మన శ్రీశైలం నల్లమల అడవులు సుమారైన 0212691 కృష్ణానదికి. తుంగభద్రా నది కృష్ణానదిలోకి ఆఅంధ్రఫప్రదేశలోనే వచ్చి కలుస్తుంది. కాబట్టి తుంగభద్రలో వచ్చే ప్లో అంతా ఆంధ్రప్రదేశ్‌లో వచ్చి కలిసేదే. భీమా నది దాదాపు మన మహబూబ్‌నగర్ బోర్డర్లో వచ్చి కృష్ణా నదిలో కలుస్తుంది. 100 టిఎంసిలు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తాయని శివాజీరావుగారు అన్నారు. నాకు తెలిసిన లెక్క 340 టిఎంసిల వరకు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చి కలుస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్‌లో కూడా సుమారయిన (6210022601 ఉంది. ౧410000601 పైన మాత్రమే ఉండేటట్లయితే అప్పుడు వర్షం తక్కువ ఉన్న సంవత్సరాలలో కింది వాళ్ళకు నీళ్ళు ఉండవు కాబట్టి మామూలు సంవత్సరాలలో మిగులు జలాలు వాళ్ళే వాడుకోనివ్వాలి అనే తర్కంలో అర్ధం ఉంటుంది. 022౫ల పైనుంచి కిందవరకు ఉండేటప్పుడు తక్కువయినప్పుడు పైన తక్కువ అవుతుందో, కింద తక్కువ అవుతుందో, అలాగే తక్కువ అయిన సంవత్సరంలో మనకు సరిగ్గా రావచ్చు, వాళ్ళకు తక్కువ కావచ్చు, అటువంటప్పుడు మామూలు సంవత్సరాలలో మిగులు జలాలు అందరూ ఎందుకు వాడుకోకూడదు అనేది ఒక ముఖ్యమైన వాదన. వాళ్ళు, కర్ణాటక వాళ్ళు పెడుతున్నారు ఇది. వాళ్ళు ఇవ్వాళ అంటున్నది ఏమిటంటే మీరెట్టాగైతే తెలుగుగంగ, గాలేరు - నగరి, హంద్రీ - నీవా అనే పేర్ల మీద మీకు హక్కులేని మిగులు జలాల మీద హక్కులు కల్పించుకొని తదుపరి అవార్డు కోసం వాదన తయారు చేసుకుంటున్నారో మేము కూడా మాకు హక్కులేని మిగులు జలాలు కోసం ఆల్మట్టి కట్టుకొని భవిష్యత్ కోసం వాదన తయారు చేసుకుంటున్నామని వొళ్లు అంటున్నారు. తెలుగు గంగకు సంబంధించి శివాజీరావుగారు చెప్పేది మనవాళ్ళు తెలియక లేదా తెలివితక్కువగా అది మిగులు
ళం ాగానాల దవన్వాసాల
జలాలు అన్నారు అని. అది వాస్తవం కాదు. మిగులు జలాలనే వాడుకుంటున్నాం మనం, మూడు రామ్షాల కోటాగాకాక, 5టిఎంసిలు, 5టిఎంసిలు, క5కటిఎంసిలు ఆ 15 కాక ఇంకొక 14.8 టిఎంసిలు తెలుగుగంగలో వాడుకుంటూ ఉన్నాం. 29.8 టిఎంసిలు తెలుగుగంగ సామర్థ్యం. అంటే దాదాపు 30 అనుకోండి. అందులో సగం బచావత్ అవార్డు ప్రకారం ఈ మూడు ర్యాష్ట్రాలు 5, 5, 5 ఇచ్చినాయి మద్రాసుకు నిళ్ళివ్వడానికి. మిగిలిన సగం కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలకు నీళ్ళు ఇచ్చేదానికి మనవాళ్ళు పెట్టుకున్నారు. దన్ని ఇప్పటికీ మనం ఒప్పుకోలేదు.
ఆల్మట్టి విషయంలో డాక్యుమెంట్లు చూపించండి అంటే కర్ణాటక చూపించడం లేదు. కరక్టే చూపించడం లేదు. మనం ఏం చేస్తున్నాం? మనం తెలుగు గంగ ప్రాజెక్టు డాక్యుమెంట్లు చూపిస్తున్నామా కర్ణాటకకు? మనమూ చూపించడం లేదు. ఈ దొంగ వ్యవహారం అందరికీ అలవాటయ్యింది. ట్రిబ్యునల్ ఎందుకు పెట్టుకోలేదు? బచావళ్ అవార్డు వచ్చిన తరవాత అవార్డు అమలుకు సంబంధించి ఒక నిష్పాక్షికముయిన అథారిటీ, ఒక ట్రిబ్యునల్ ఒకటి ఎందుకు పెట్టుకోలేదంటే మన అలసత్వమో, బద్ధకమో, మన వాళ్ళకు తెలియకపోవడమో కాదు - కారణం అందరూ దొంగలు కాబట్టి. దొంగలు పోలీస్‌స్టేషన్ పెట్టుకోరు కదా. అక్కడ మనమీద కూడా కేసులవుతాయి. సమస్యను అర్ధం చేసుకోవడం అవసరం. సమస్య ఏందంటే కృష్ణానదిలో నీళ్ళు తక్కువ, అవసరం ఎక్కువ కాబట్టి అందరూ దొంగతనం చెయ్యాలి దాన్నే ఎట్లోకట్లా. కాబట్టి ఎవ్వరికీ ట్రిబ్యునల్ వద్దు. చేతనైనకాడికి దొంగతనం చేసుకుంటూ ఉందాం మనము. ఎదుటివాడు చేసినప్పుడు మాత్రం గొడవచేద్దాం = ఈ రకమైన వైఖరి ఉంది అందరిలోనూ. మనం తెలుగుగంగకు సగం నీళ్ళు మిగులు జలాల్ని - అంటే ప్రాజెక్టులు కట్టుకోవడానికి వీల్లేని జలాల్ని వాడుకుంటున్నాం. రాయలసీమ కోసమని కడుతున్న గాలేరు - నగరి, హంద్రీ - నీవా.... ప్రకాశం జిల్లాలోని పాత రాయలసీమ ప్రాంతానికి కొత్తగా ప్రపోజ్ అయిన వెలిగొండ ప్రాజెక్టు - వీటన్నిటికీ కలిపి 140 టిఎంసిలు నీళ్ళు కావాలి. దాంట్లో పదో వంతు కూడా ఆ వాగుల్లో లేవు. గాలేరు - నగరి అనేదాంట్లో నీళ్ళు కనిపించేది కష్టం ఎప్పుడయినా సరే. ఆ పేర్లు పెట్టి, మనవాళ్ళు చేస్తున్నదేంటంటే గాలేరు అనే ఒక వాగు మీద ఒక ప్రాజెక్టు, ఇంకొక వాగుమీద ఒక ప్రాజెక్టు, ఇంకేదో పెద్ద కాలువ అని ఒక ప్రాజెక్టు. అక్కడేమీ నీళ్ళుండవు. అయినా ప్రాజెక్టులు కట్టేసి, రిజర్వాయరు పెద్దది కట్టి శ్రీశైలం నుండి కృష్ణానదిలోని మిగులు జలాలు తీసుకుపోయి దానిలో కలపాలి. ఇవి మిగులు జలాలు. ప్రాజెక్టులు కట్టుకునే హక్కులేని మిగులు
67 శః రాజ్యం - నంక్షేమం శః
జలాలు కాబట్టి ఏం చేస్తారు అంటే ఆ వాగులు చూపిస్తారు. ఈ వాగు మీద కడుతున్నాం కానీ మేము కృష్ణా నది మిగులు జలాలేమీ వాడుకోవడం లేదు అని మనవాళ్ళు ఆర్వూ చేస్తారు. ఈ పని చేసింది రాయలసీమ వాళ్ళు. నేను ఎందుకు చెప్పున్నానంటే ఈ మాట....ఈ పని చెయ్యాలి అని ఆందోళన చేసింది రాయలసీమ వాళ్ళే. శ్రీశైలం రిజర్వాయరు నుంచి తెలుగుగంగ కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అని చెప్పి కాలవ పక్కకు తీశారు. దాని సామర్ధ్యం 11 క్యూసెక్కులు ఉంటే చాలు తెలుగుగంగ కోసం. కాని దానిని 40 క్యూసెక్కులకు పెంచింది రాయలసీమ ఉద్యమకారులు, రాయలసీమ అంటే మీకు తెలుసు - బాంబులు తీసుకొని పోతారు. బాంబులు తీసుకొని పోయి పెద్ద బండరాయి అక్కడేసి దీన్ని మీరుగాని 11 క్యూసెక్కులు నుంచి 40 క్యూసెక్కులకు పెంచకపోతే మేము బాంబులేసి దీనిని పగులగొట్టి పెంచుతాము అని ఎం.వి.రమణారెడ్డి, రాజశేఖరరెడ్డి, రాజగోపాలరెడ్డి గొడవ చేసి పెంచినారు. మరి ఈ లెక్క రాసి ఇచ్చినామా కర్ణాటకకు? మేమిట్టా పెంచినాము, 11 క్యూసెక్కులు నరిపోక 40 క్యూసెక్కులు సెంచుకున్నాము, పారపాటయ్యిందని కర్ణాటక గవర్ష్నమెంటుకు మన గవర్షమెంటు ఏమీ ఇయ్య లేదు. అది బ్రహ్మాండంగా అట్లాగే ఉంది. మీరు పోతిరెడ్డిపాడు పోయి హెడ్ రెగ్యులేటర్‌ను కావాలంటే చూసిరండి. అది (బ్రహ్మాండంగా పెరిగి ఉంది. ఎందుకోసం పెరిగి ఉంది? ఎప్పటికయినా రాయలసీమలో ఏవో నీళ్ళు లేని వాగులు చూపించి ప్రాజెక్టులు కట్టి కృష్ణానదిలోంచి నీళ్ళు తీసుకుపోవాలి. ఇది దొంగతనం అవుతుంది. దొంగలు ఏమంటారు? పేదవాడిని దొంగతనం ఎందుకు చేస్తానయ్యా అంటే ధనవంతులు అస్తి అంతా ఆక్రమించుకున్నారు కాబట్టి దొంగతనం చేయక తప్పదు అంటారు. అంటే రాయలసీమ పరిస్థితి ఏంటంటే కృష్ణాజిల్లా వాళ్ళు నికర జలాలంతా తీసుకున్నారు కాబట్టి దొంగతనం చేయడం మాకు తప్పవదు. రాయలసీమ పరిస్థితే అది. కృష్ణానది నికరజలాలకు సంబంధించి 800 టిఎంసిలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ వాటాకు వచ్చిందో దాంట్లో రాయలసీమకు వచ్చేదానికంటే మూడురెట్లు కృష్ణా జిల్లా తీసుకుంటున్నది. కృష్ణాజిల్లా అంటే నాగార్జునసాగర్, కృష్ణాడెల్దా ప్రాజెక్టు కలిపి తీసుకుంటున్నది. దాంట్లో 1/3వ వంతు మాత్రమే రాయలసీమకు వస్తుంది. కాబట్టి రాయలసీమ వాళ్ళు ఏం చేయాలి? దొంగతనం చేయాల్సిందే. ఆస్తిలేని వాళ్ళు దొంగతనం చేయక తప్పదు కదా. రాయలసీమలో పెట్టే వాదన ఇదే. మనం రిపోర్టులు తీసుకుపోయి కర్ణాటకకు ఇచ్చిందేమీ లేదు. 68 ఉలాగోవాల్ దవన్నాసాల
ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఈ రోజు ఆల్మట్టికి సంబంధించి రెండు విషయాలున్నాయి. ఒకటి సాగు విస్తీర్ణం పెంచుకోవడం కోసం వాళ్ళు కొంత ఎక్కువ నీళ్ళు - అప్పర్ కృష్ణాకు కేటాయించిన 155 టిఎంసిల కంటే ఎక్కువ 173 కో దేనికో వాళ్ళు పెంచుకుంటా మంటున్నారు. దీనికి వాళ్లకి నీళ్ళెక్కడవి అని ఒక ప్రశ్న. ఒకటి వాళ్ళకు 60ణు 110౪ కింద 34 టిఎంస్లకు హక్కు ఉంది. ఆ 34 టిఎంసిలు వాళ్ళు అప్పర్ కృష్ణాలోనే ఉపయోగించు కునేటట్లయితే వాళ్ళు అనుకున్నట్టుగా సాగును పెంచుకోవచ్చు. అప్పుడు అది మనకు కష్టం కాదు. బచావత్ అవార్డుకు వ్యతిరేకమేమీ కాదు. వాళ్ళు ఈ పని చేస్తారో, ఏ పని చేస్తారో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ల ఉద్దేశ్యాలేమిటో మనకు తెలియదు. మనం 1.081021 గా ఆలోచిస్తే అసాధ్యం అయితే కాదు. 155 టిఎంసిలు ఏవైతే అప్పర్ కృష్ణాకు బచావత్ అవార్డులో కేటాయించబడ్డాయో దానికి 34 టిఎంసిల £6[౫ 0౪ అంటే ఊటజలం - ఊట జలం ఎక్కువ కర్టాటకకే కేటాయించబడింది. మనకు 11 టిఎంసిలే వచ్చింది. దానిని కలుపుకుంటే వాళ్లు ఆల్మట్టి కింద కాలువలు తవ్వుకొని ఒక 3,40,000 ఎకరాలకు నీళ్ళు పారించుకొన్నాసరే సాధ్యమే అవుతుంది. అసాధ్యమేమీ కాదు. అంతే చేస్తున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా మనకు తెలియదు. వాళ్ళు పరిశుద్ధులని నేనేమీ అనడం లేదు. చెయొ్యొచ్చు వాళ్ళు చెయ్యదల్చుకుంటే. ఈ రకంగా పెంచుకోదల్చుకుంటే వాళ్ళకా హక్కుంది. దాంట్లో తప్పేమీ లేదు. వాళ్ళు ఇదికాకపోతే ఇంకొకటి చేస్తున్నారా అని చూడటానికి మార్గం ఏముంది? మనవాళ్ళు బయలుదేరిపోయి, ]/14లు, ]49లు పోయి అక్కడ జు చూసాచ్చారు. వీళ్ళకు ౭0 అంటే ఏమిటో తెలియదు, హైట్ అంటే ఏమిటో తెలియదు, నీళ్ళు అంటే ఏమిటో తెలియదు. చూసివస్తే ఏమి తెలుస్తుంది? అందుకే ట్రిబ్యునల్ ఒకటి, కృష్ణా రివర్ వ్యాలీ అథారిటీగానీ, వేరే నిష్పాక్షిక ట్రిబ్యునల్ గానీ ఒక పరిష్కార యంత్రాంగం పెట్టకొని అందరూ దానికి కట్టుబడి ఉండాలి. పెట్టుకోవడానికి అభ్యంతరం లేదు కానీ వాడికుండాల నాకు మాత్రం వద్దు. పోలీస్ స్టేషన్ వాడికుండాల నాకు మాత్రం వద్దు. అట్లా కాదు అందరికీ వర్తించేటటువంటి ఒక నిష్పాక్షిక అథారిటీని పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే వాళ్లు చూడగలుగుతారు. అఆల్మట్ట్కి వీళ్ళు 155 టిఎంసిలకు 34 టిఎంసిలు మాత్రమే కలువుకుని దాని ప్రకారం మాత్రమే పెంచుకుంటున్నారా? లేకపోతే వేరే ఏమన్నా చేస్తున్నారా అనేది చూడగలుగుతారు. కర్ణాటక గవర్నమెంటుకు సరయిన నలహాదారులు లేరు కానీ రాయలసీమ వాళ్ళనెవరినన్నా అడిగి ఉంటే వాళ్ళు ఇంకొక సలహా ఇచ్చి ఉందురు ఈపాటికి. అక్కడ
69 కం = నక్షమో
ఏదో ఒక వాగు ఉండకపోదు. నీళ్ళు లేని వాగు ఒకటి. నువ్వు దాన్ని చూపించి ఆ నీళ్లను మేము కలుపుకుంటాం ఆల్మట్టిలో అని చెప్పి ఉండొచ్చు. నీకు బుద్దిలేదు అని చెప్పి ఉండేవాళ్ళు. మనం గాలేరు - నగరిలో అదే పని చేస్తున్నాం. హంద్రీ - నీవాలో అదే పని చేస్తున్నాం. వెలిగొండలోనూ అదే పని చేస్తున్నాం. ఇంకా ఎన్నో చేయబోతాం రాయలసీమ జిల్లాలలో. చెయ్యకపోతే రాయలసీమకు నీళ్ళు రావు.
రెండవది పవర్ జనరేషన్ కోసం ఇంకా ఎక్కువ పెంచుకుంటున్నారనేది. ఇక్కడ సమస్య ఏమిటంటే పెంచుకున్నదంతా కూడా వాళ్ళు పవర్ జనరేషన్ కోసమని చెప్పి తప్పని సరిగా సొగుకే వాడుకుంటారు అని మనం అనుకొని వంద టిఎంసిల నిల్వ సామర్థ్యం ఉంటే 150 టిఎంసిల వరకు దాన్ని పెంచుకోవచ్చు కాబట్టి అంత వాడుకుంటారు. ఇంత పోతుంది మనకు అని అలా ముందే ఊహించుకోడం అర్థవంతమైనదేనా అని నేను అడుగుతున్నాను శివాజీరావుగారిని.
150 టిఎంసిలు పారించుకోదలచుకుంటే నూరు టిఎంసిల రిజర్వాయరు కావాలన్నది కరక్టే. కాబట్టి నూరు టిఎంసిల రిజర్వాయరు ఉంటే నువ్వు ఆటోమేటిక్‌గా 150 టిఎంసిలు పారించుకోబోతున్నావు అని అనుమానించడం కరక్షేనా? నేను బెంగుళూరులో ఒక ఇంజనీరురో మాట్లాడుతుంటే - బెంగుళూరు వాళ్ళతో మాట్ట్లాడబట్టి కొన్ని విషయాలు వాళ్ళు ఎట్లా చూస్తున్నారనేది నేను చెప్పగలుగుతున్నాను. ఆయన ఒక మాట అన్నాడు - 260 మెగావాట్ల ఉత్పత్తి కోసం అంత చేయాల్సిన అవసరం లేదు అని, ఎందుకు నిల్వ చేస్తున్నారని అడిగితే దాని కింద ఇంకొన్ని మేము కట్టుకుంటున్నాం కదా వాటి టర్పెన్లు తిప్పడానికి అందుకోసం మేము ఎక్కువ నీళ్లు పెట్టవలసి వస్తున్నది 10 116 9216 01 65416 అన్నాడు. నేను ఇంజనీర్‌ను కాను కాబట్టి నాకు ఆ వాదన తప్పో ఒప్పో తెలియదు. వాళ్ళకిదో ఒక వాదన ఉంది. నేనైతే ఇటువంటివి అన్నీ కూడా వాళ్లు నిజాయితీగా చెపుతున్నారా లేదా అనే దృష్టి నుంచి చూడాలనుకుంటాను. వాళ్ళు 60 టిఎంసిల సామర్ధ్యం మాత్రమే ఉండవలసిన అల్మట్టిని ఇవుడు 250 టిఎంసిలకు పెంచుకుంటూ ఉన్నారు- కొంత పెంచుకునే ఆయకట్టుకోసం. అంతవరకైతే 34 టిఎంసిల వరకు - నేను ఇంతకుముందే చెప్పాను రిటర్స్ ప్లోాలో వాళ్ళకు హక్కు ఉంది కాబట్టి తప్పేం లేదు. కాని అంతకుమించి వాళ్ళు పెట్టుకుంటున్నారు. దాన్ని వాళ్ళు పవర్ జనరేషన్ కోసమే వాడుకోవడం లేదు. 250 టిఎంసిలో, 400 టిఎంసిలో వాళ్ళు వాడేసుకుంటున్నారని మనం ఊహించుకోవాల్నా.
70 కాగల దవన్యాసాద
లేకపోతే సెంట్రల్ గవర్షమెంట్కు సహకరించి మన హైకోర్టు ఆర్డరిచ్చింది, సుప్రీంకోర్టు కూడా సూచించింది, ఇప్పుడయినా సరే ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా వాళ్ళు దీనికి కట్టుబడి ఉండేటట్టు మనం చూడలేమా? నిజానికి వాళ్ళు 250 టిఎంసిల దాకా దాచిపెట్టుకున్నా, దాన్ని ఉపయోగించుకోకపోతే మనకు తక్కువ అయ్యేది కొంచమే. భారీ వర్షాలు ఉన్నటువంటి సంవత్సరములో మాత్రమే మీరు నిల్వ చేయాలని వాళ్ళకు ముందే ఒక కండీషన్ పెట్టేస్తే ఆ సంవత్సరము వాళ్ళు 250 టిఎంసిలు పెట్టుకున్నా దానినుంచి ఆవిరయ్యే 25, 30 టిఎంసిలు మాత్రమే మనకు సంవత్సరానికి తగ్గుతాయి. అది పెద్ద సమస్యేమీ కాదు. అసాధ్యం ఏమీ కాదు.
ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఈ అప్పర్ కృష్ణా ప్రాజెక్టు లేదా ఆల్మట్టి ఉండే బీజాపూర్ జిల్లా పాత హైద్రాబాదు రాష్ట్రంలోని జిల్లా. మరాఠ్వాడ, కర్ణాటక, తెలంగాణ ఎట్లా ఉంటుందో బీజాపూర్ అట్లే ఉంటుంది. చాలా వెనకబడిన ప్రాంతం, సాగునీరు చాలా అవసరమున్న ప్రాంతం. వాళ్ళు తమకున్నటువంటి రిటర్డ్ ఫ్లోని కూడా ఉపయోగించుకొని బచావత్‌లో మంజూరు కాకపోయినా, ప్రాజెక్టు మంజూరు కాకపోయినా, మంజూరు అయిన రిటర్న్ ఫ్లో ని ఉపయోగించుకొని కొంత ఆయకట్టు పెంచుకుంటే, బచావత్ అవార్డు పరిధిలో ఉన్నంత కాలం మనం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కరెంటు ప్రొడక్షన్ కోసం వాళ్ళు ఇంకా ఎక్కువ నిల్వ చేసుకుంటే వాళ్ళు కరెంటు ్రాడక్షన్ కోసం మాత్రమే దానిని వాడుకొనేటట్టు చూడటం మనకు సాధ్యమే. ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకుంటే - దాంట్లో తెలుగువాళ్ళు వద్దు, కన్నడం వాళ్ళు, తమిళులు కూడా వద్దు, బెంగాలీలను పెట్టుకుందాం కావాలంటే. బెంగాలీలనో, పంజాబీలనో పెట్టుకుందాం ట్రిబ్యునల్‌లో. ఆ రకమైన ఏర్పాటు చేసుకోవడం అసాధ్యం కాదు. వాళ్ళ వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏర్పాటు మనం చేసుకోలేమా అని ఒక ప్రశ్న. సాధ్యమవుతుందని నేననుకుంటాను. మన హైకోర్టు కూడా అదే చెప్పింది. హైకోర్టు చివరకి ఏమందంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ బచావత్ అవార్డుకి కట్టుబడి ఉంటామని హోమీ ఇస్తున్నాయి కాబట్టి నువ్వు దొంగ నువ్వు దొంగ అని మేం తేల్చము, ఇద్దరూ కలిసి ఒక ట్రిబ్యునల్ పెట్టుకోండని మన హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం కూడా సాధ్యమని నేననుకుంటాను.
రెండవది ఇప్పుడు 2000 సంవత్సరం వచ్చేటప్పటికి ఈ అవార్డు అయిపోతుంది. బచావత్ అవార్డు టైమ్ అయిపోతుంది. కొత్త అవార్డు రావాలి. ఈ కొత్త అవార్డును
శ్!
దృష్టిలో పెట్టుకొని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హక్కులను సృష్టించుకుంటూ ఉన్నారు. బచావత్ అవార్డు అ టైమ్‌లో ఉపయోగించిన పద్ధతి ఏమిటంటే ఇప్పటికున్న ప్రాజెక్టులను ఖరారు చేస్తాము. మిగిలిన దానిని 61౪146 చేస్తాము. మీ ప్రతిపాదనల ప్రకారమే 41/46 చేస్తాము అన్నారు. రాబోయే అవార్డులోనూ అదే అనబోతారు కాబట్టీ ఇప్పుడే కట్టేసుకుందాం ప్రాజెక్టులను. అందుకే గాలేరు - నగరికి పునాదిరాయి, హంద్రీ
- నీవాకు పునాదిరాయి, వెలిగొండకు పునాది రాయి, ఆల్మట్టికు పునాది రాయి. రాళ్ళు బండలూ వేస్తున్నారు. 6015600108 అవుతుందో లేదో, నీళ్ళు ఉన్నాయో లేవో ఎవరికీ తెలియదు. రాళ్ళు పడితే ప్రాజెక్టు ఉంది, ఇంత ఆయకట్టు ఉంది, మాకియ్యి అని కొట్లాటకు కూర్చోవాలి. కొట్లాటకు కూర్చొనే ఆ టైమ్‌లో కర్ణాటక, ఆంధ్రా అన్న విషయం కొంచెం సేపు పక్కకుపెట్టి అసలు కృష్ణానది జలాలు ఏ ప్రాతిపదిక మీద పంచుకోవాలి? అనేదాని గురించి ఒక పునరాలోచన అవసరమనేది మేము భావిస్తున్నాం. రాయలసీమ ఉద్యమకారులు బలంగా ముందుకు వెడుతున్నారు. చర్చకోసం ఒక 10 నిమిషాలు మీకు దాన్ని వివరించి నేను ముగిస్తాను.
రాయలసీమకు నీళ్ళ విషయంలో ఎప్పుడు అన్యాయం జరిగిందంటే తుంగభద్ర మీద పెద్ద ప్రాజెక్టు కట్టించుకోవడంలో రాయలసీమ ఉద్యమకారులు విఫలమైనారు, అప్పటి నాయకులు విఫలమైనారు అని శివాజీరావుగారు అన్నారు. అదొక అంశం. బళ్ళారి జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో కలప లేదంబే అది ఒకరు ఇచ్చేది, ఒకరు తీసుకొనేది కాలేదు జనాభా ప్రాతిసదిక మీద పోయారు. జిల్లాల పునర్విభజనలో బళ్ళారిటౌన్ తెలుగు మెజారిటీ కానీ గ్రామాలంతా కన్నడం మెజారిటీ గ్రామాలే. అందువల్ల బళ్ళారి ఆంధ్రప్రదేశ్‌కు రావడం సాధ్యం కాలేదు. పాలిటిక్స్ ఏమీ నడవలేదు అని నేను అనడం లేదు. పాలిటిక్స్ కొంత నడిచినా సెన్సెస్ లెక్కల ప్రకారం కరెక్టే. పోనీ అక్కడ ప్రాజెక్టు కట్టడం వల్ల ఉపయోగం ఏం రాలేదా తెలుగువాళ్ళకు అంటే స్థానిక తెలుగు వాళ్ళకు రాలేదు కానీ, కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు చాలామంది అటుపోయి భూములు కొనుక్కున్నారు. హోస్పేట, బళ్ళారి, సింధనూరు, గంగావతి మొత్తం అంతా వాళ్ళే భూములు కొనుక్కొని ఉన్నారు. ప్రయోజనం రాకుండా ఏమీ పోలేదు తెలుగువాళ్ళకు. ఇప్పుడు ఈ గొడవ వస్తే వాళ్ళను తన్ని తరిమేస్తే వాళ్ళు మళ్ళీ ఇక్కడకు వస్తారు - విజయవాడకో, గుంటూరుకో, అది వేరే సంగతి. రాయలసీమకు అన్యాయం జరగడమనేది ఎప్పుడు మొదలయ్యింది అంటే రాయలసీమకు ఉండేది రెండే రెండు
7 స వాలగోపాల్ ఉవన్వాసాలు శః
నదులు కృష్ణానది, పెన్నా పెన్నానది అయితే కడప జిల్లాలో, అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా ప్రవహిస్తూ ఉంటుంది. దాని ఉపనదులు ప్రవహిస్తూ ఉంటాయి. కర్నూలు జిల్లాలో తుంగభద్ర చాలా భాగం సమీపంగా పోతుంది. కృష్ణానది అత్యధిక భాగం (ప్రవహించేది మహబూబ్‌నగర్ జిల్లాలో. ఆ నంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. కృష్ణానది అంటే కృష్ణా జిల్లాలో అనుకుంటాం మనం. అది అత్యధిక భాగం ప్రవహించేది మహబూబ్‌నగర్ జిల్లాలో. వాళ్ళకు ఈ రోజు మొట్టమొదటిసారి జూరాల ప్రాజెక్టు వచ్చింది. ఇన్ని ఏళ్ళు వాళ్ళకు ఏ ప్రాజెక్టు రాలేదు. కృష్ణానదిలో చుక్క నీళ్ళు వాళ్ళకు ఉపయోగంలోకి రాలేదు. ఈ రోజు వచ్చింది. ఈ జూరాలకు కూడా ఆయకట్టు తక్కువ, నాగార్జున సాగర్కింద కృష్ణా డెల్టాతో పోలిస్తే. జూరాల గురించి కూడా కర్ణాటక వాళ్ళకు అనుమానాలు ఉన్నాయి. మీరు చూపిస్తున్న ఆయకట్టు నిజం కాదు, మీరు చూపిస్తున్న నీళ్ళు మీకున్న ఈ 17 టిఎంసిలకు పరిమితం కావడం లేదు, మీరు కూడా మిగులు జలాలు వాడుకుంటున్నారు అని కర్ణాటక అంటుంది. లెక్కలు చూపించండి అంటుంది. మన దగ్గర లెక్కలు లేవు. చూపించం మనం. వాళ్ళేకాదు మనమూ చూసించం. ఎవ్వరూ చూపించరు.
పులిచింతల మంజూరు అయ్యింది. పులిచింతల ఉండేది నల్లగొండ, గుంటూరు జిల్లాల సరిహద్దులో. కృష్ణానది నల్గొండ, గుంటూరు జిల్లాలను వేరు చేస్తూ పోతుంది. మునిగేది గుంటూరు జిల్లాలో కొంచెం, నల్గొండ జిల్లాలో కొంచెం. నీళ్ళు వచ్చేది కృష్ణా జిల్లాలో ఇప్పటికీ నీళ్ళు రాని ప్రాంతాలైన నందిగామ, కంచికచర్ల ఆ ప్రాంతానికి. కొంత గుంటూరు కూడా వస్తే రావచ్చు. అయితే పులిచింతలకు నీళ్ళు ఎక్కడివి అని రాయలసీమ వాళ్ళు అడుగుతున్నారు. మా హంద్రీ - నీవాకు ఇవ్వడానికి నీళ్ళు లేవు. మా గాలేరు - నగరికి నీళ్ళు లేవు. మరి పులిచింతలకు నీళ్ళు ఎక్కడినుంచి వచ్చాయంటే కృష్ణానది డెల్టాను ఆధునీకరణ చేస్తూ ఉన్నాం దానివలన నీళ్ళు మిగులుతాయి. ఆ నీళ్ళు ఉపయోగిస్తున్నాము అన్నారు. ఈ మాటను రాయలసీమ వాళ్ళే నమ్మడం లేదు, అబద్ధం అంటున్నారు. ఇక కర్ణాటక వాళ్ళకు ఇంకెంత అనుమానం ఉండాలి? నువ్వు ఎక్కడనుంచి నీళ్లు తీసుకుంటున్నావు, నీకు హక్కు లేని 9200103 ౪2164 నువ్వు వాడుకుంటున్నావు. 0015151606 గా ఆంధ్రప్రదేశ్ ఈ పని చేస్తూ ఉంది. అదే అనుమానం ఇంకా ఎక్కువ కర్ణాటకకు, మహారాష్ట్రకు ఉంది. అట్లే మనకూ అనుమానం ఉంది ఆల్మట్టి విషయంలో. నువ్వు ఒక మాట చెప్పి ఇంకొక పని చేస్తున్నావు, పవర్ జనరేషన్
78 శః రాజ్యం - నంక్షేమం శ
కోసమని చెప్పి నువ్వు సాగుకోసం వాడుకోబోతున్నావు, అ నిర్ధారణకు ముందే వచ్చేసి మొత్తం కృష్ణా జిల్టా, ఖమ్మం జిల్లా ఎట్టా నాశనం అయిపోతాయి అని ఊహిస్తూ కూర్చోకుండా నివారించడానికి మనం ఏం చర్యలు తీసుకో గలుగుతాము, ఏ రకమైనటువంటి ట్రిబ్యునల్స్గానీ, అథారిటీగానీ ఏర్పాటు చేయగలుగుతామని ఆలోచించాలి. ఆ ప్రాజెక్స ఇంకా నిర్మాణం ఏమీ కాలేదు. ఇప్పటికైనా రెండు గవర్నమెంట్లు ఒప్పుకుంటే మనలాంటి వాళ్ళందరం ఒత్తిడి పెట్టి ఇక్కడ తెలుగు అని కాదు, కన్నడ అని కాదు న్యాయం కావాలి మనకు. ఆ న్యాయం ఏ ప్రాతిపదిక మీద జరగాలి? 2000 సంవత్సరం తరువాత నదీ జలాలు మళ్లీ పంచుకునేటప్పుడు, రాయలసీమ ఉద్యమకారుల నుంచి ఒక ప్రపోజల్ ముందుకు రావొచ్చు. ఏమనంటే కృష్ణా నదీజలాల మీద, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలవాళ్ళ కుండే హక్కును సగానికి తగ్గించుకోవాలి. ఎందుకంటే మీకు అక్కడ భూగర్భ జలాలు సుమారుగా ఉన్నాయి. చెరువులు ఉన్నాయి. మీ పంటలు కొంత మార్చుకోవాల్సి రావచ్చు. ఇప్పుడున్నంత పుష్కలంగా పంటలు అప్పుడుండకపోవచ్చు. ఒక 25 శాతం తగ్గొచ్చు మీకు. తగ్గినా తగ్గించుకోవాలి. శ్రీశైలం దగ్గర ఇంకా ఎక్కువ ఆపేసి అక్కడ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ - మేము ముందే వెడల్పుచేసి పెట్టుకున్నాం కదా దాన్ని రెడీగా, ఎప్పుడైనా మీ మీద జత్రిడి పెట్టి సాధించుకోవచ్చని - దానితో తీసుకుపోతాం మేము రాయలసీమకు నీళ్ళు. ఇదీ రాయలసీమ వాళ్ళ డిమాండు. ఇది రాబోతుంది. ఇది సీరియస్ డిమాండ్. ఇవ్వాళ ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక రాయలసీమ ఉద్యమాలు చాలా సీరియస్ డిమాండ్స్‌తో ముందుకు రాబోతున్నాయి. ఆలోచించకపాతే ప్రయోజనం లేదు. మొన్న ఇక్కడ కాల్దారిలో కాల్పులు జరిగాయి. నిడదవోలు దగ్గర బావులకు పెట్టుకునే మోటార్లకు కరెంట్ చార్జీలు పెంచితే మేము కట్టము అని గొడవ చేశారు. | చంద్రబాబు నాయుడు ఏమన్నా డంటే అక్కడసలు బావులు ఎక్కడ ఉన్నాయి, మోటార్లు ఎక్కడ ఉన్నాయి - అంతా అబద్ధం అన్నాడు. నాకూ అదే ఆలోచన వచ్చింది. నిజమే బావులు ఎందుకు ఉంటాయి? అది 15 కిలోమీటర్ల దూరంలో ఉంది కాటన్ కట్టిన ఆనకట్ట నుంచి. బ్రహ్మాండమైన ఆనకట్ట. అయితే అనకట్ట నీళ్ళు రెండు పంటలకే వస్తాయి. మూడో పంటకు వాళ్ళు బావి నీరు పెట్టుకుంటున్నారు. అక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. ఎంత లోతుకు పోతే మీకు నీళ్ళాస్తాయని అడిగాను, ఎందుకంటే నల్గొండలో 400 అడుగులు పోవాలి. అనంతపురంలో 450 అడుగులు 7శ కోటాంగోపాల్ దవన్నాసాల
పోవాలి. లోతుకు పోయేది ఏందండీ, అరటిబోద కొట్టేస్తే నీళ్ళు పైకే వస్తాయి అన్నాడు. నీళ్ళు పైకే వస్తాయి, మేము లోపలికి పోనక్కర్లేదు అంటున్నారు వాళ్ళు. నెలకు లక్షల రూపాయల కరెంటు బిల్లులు కట్టే మోటార్లు పెట్టుకున్నారు కాల్దారిలో. తెలంగాణ వాళ్ళయినా, రాయలసీమ వాళ్ళయినా అడిగేది ఏమిటంటే నీకు కాలువ నీళ్ళే కాకుండా ఇంత భూగర్భజలాలు ఉన్నాయి. మాకు మాత్రం ఏమీ లేకుండా ఎందుకు పోవాలి? మీకు భూగర్భజలాలు అంత బాగున్నప్పుడు అవి వాడుకోండి మీరు, నది నీళ్ళు మాకు వదిలిపెట్టండి. రాయలసీమ కంటే కోస్తా జిల్లాలలో వర్షపాతం రెండు రెట్లు ఎక్కువ ఉంది. అక్కడ 600 మి.మీ. లు అయితే ఇక్కడ 1200 మి.మీ. ఉంటుంది. అయినా కృష్ణా నది జలాలలో మూడు రెట్లు వాళ్ళే వాడుకుంటున్నారు.
పోలవరం ప్రాజెక్టు మీద ఇప్పుడు ఆందోళన మొదలయ్యింది పశ్చిమ గోదావరి జిల్లాలో. మేము పౌరహక్కుల సంఘం ఒక నిర్ణయం తీసుకున్నాం పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించాలని. ఎందుకు వ్యతిరేకించాలంటే మిత్రులు చెప్పారు అల్మట్టి కడితే బాగల్కోట్ మునిగిపోతుందని. అట్లా పోలవరం కడితే దేవీపట్నం మునిగిపోతుంది. పోలవరమూ మునిగిపోతుంది. పైకి భద్రాచలం వరకు కూడా మునిగిపోతుంది. దేవుడు ఉండడు. శ్రీరాముడు ఉండడు భద్రాచలంలో. అంతా మునిగిపోతారు. మా వరంగల్ జిల్లాలో ఏటూరు నాగారం మునిగిపోతుంది. గుడులు మునిగిపోతాయని కాదు, వేలాదిగా కోయ, కొండరెడ్డి, గోండు ప్రజానీకం మునిగిపోతారు. నిర్వాసితులు అవుతారు. వాళ్ళు ఎక్కడికిపోయి రిక్షాలు తొక్కుకోలేరు. వేరే కూలి చేసుకోలేరు. ఏమీ చేసుకోలేరు. పోలవరం ఎందుకోసం వస్తోంది? జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నందిగామ అంటే కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇప్పటికీ ఇంకా నదీ జలాలు రాని ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చేదానికి. అక్కడ బ్రహ్మాండమైన భూగర్భ జలాలు ఉన్నాయి. ఫస్ట్ క్లాసయిన నేల అది. మంచి మామిడి తోటలు, జీడి మామిడి తోటలు పండించుకుంటారు. ఏమి అవసరం వాళ్ళకు? పోలవరం ప్రాజెక్టు కట్టి గిరిజనులు అందరినీ ముంచి నీళ్ళు తెచ్చుకోవాల్నా? నదీజలాలు, భూగర్భ జలాలు, వర్షపాతము, చెరువులు, ఇంకా కట్టగల చిన్న చిన్న ప్రాజెక్టులు అన్నీ కూడా లెక్కలోకి తీసుకోవాలి. నీటి వనరు ఒక ప్రకృతి వనరు. గాలి ఎట్లా ప్రకృతి వనరో నీళ్ళు అట్లా ప్రకృతి వనరు. అది అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి. ఇదొక మౌలికమైన వ్రజాస్వామ్యు నూయత్రం అని నేననుకుంటున్నాను. అది అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి. ఈ
755 చా నత్తం
ప్రాతిపదిక మీద ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి నా అంచనా ఏమిటంటే అన్ని రకాల నీటి వనరులనూ కలిపి అందరూ అందరికీ సమానంగా వాడుకొనేటట్లయితే ప్రతి ఎకరానికి ఒక పంటకు సాగునీరు ఇవ్వచ్చు. ఈ మాట కొన్ని ప్రాంతాల వాళ్ళకి పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు కానీ అనంతపురం జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లాలలో ఈ మాటంటే వాళ్ళు ఎంత ఆనందపడతారో. వాళ్ళకు అది ప్రాణంగా లేచాచ్చినట్టుగా అనిపిస్తుంది. నీళ్ళు అనే వనరును పంచుకోవడం ఒక ప్రజాస్వామ్య సూత్రంగా అన్ని ప్రాంతాల వాళ్ళు - ఒక ప్రాంతానికి వ్యతిరేకం, ఇంకొక ప్రాంతానికి అనుకూలమని కాదు - ఒప్పుకోవాలి. ఆహ బతి (విశాఖవట్టుంలో వీడిఎస్యు నిర్వహించిన “రాజ్యం-నంక్షేమం” 'సెమినాల్ - మే 1996) 76 తాగావా ఉవన్యాసాల
రాయలసీమ రాజకీయార్లిక విళ్లేషణ థి
నౌకిచ్చిన టాపిక్ ఏమిటి అనేది పొద్దున్నించి చాలామంది కుతూహలంగా ఉన్నట్టున్నారు. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడతావా అని అడిగారు చాలా మంది. మాట్లాడతాను తప్పనిసరిగా. ఎందుకంటే రాయలసీమ సమన్యల్లో సాగునీరు ముఖ్యవ్లైనది కాబట్టి. రాజశేఖరరెడ్డి చేన్తున్న జల రాజకీయాల గురించి మాట్ట్లాడుకోవలసిందే, తప్పదు.
రాజకీయ, ఆర్థిక విశ్లేషణ అంటే మామూలుగా మార్క్సిస్టు పరిభాషలో ఒక అర్ధం ఉంది - వర్గం ప్రాతిపదికన వ్యవస్థను విశ్లేషించడం అనేది. కాని నేను అది చేయబోవడం లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ ఎందుకుగాని ఆర్.ఎస్.రావుగారు ఒక మాట అన్నారు. మనం సమస్య గురించి మాట్లాడుకునే టప్పుడు వర్గాన్ని మర్చిపోతున్నామని. అది న్యాయమైన అభిశంసనే; వర్గం ఒక్కటే కాదు-. సామాజిక, సాంఘిక అంతరాలు చాలా ఉన్నాయి. కాబట్టి వర్గ విశ్లేషణ కాకుండా సాంఘిక నిర్మాణాన్ని ప్రాతిపదికగా చేసుకున్న విశ్లేషణ అనే అర్ధంలో కొంతవరకూ మాట్లాడతాను, దానిలో వర్గం ఉంటుంది, కులం ఉంటుంది, ప్రాంతాలు ఉంటాయి
- ఉపప్రాంతాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి.
మూడవది రామ్మోహన్ ప్రస్తావించిన రాయలసీమ ఐడెంటిటీ, గుర్తింపు. దాని గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అది ప్రజలలో విసృతంగా లేదు. ప్రజలలో విసృతంగా లేనిది మాట్లాడుకోకూడదనేమీ కాదు కానీ దానికి తొందర లేదు. తెలంగాణలో ప్రజలలో తెలంగాణా గుర్తింవు వినృతంగా ఉంది. కాబట్టి దాని గురించి మాట్టాడుకోవడమనేది తప్పనిసరి, రచయితలయినా ఎవరైనా సరే. రాయలసీమకు ఆ తొందర ఏమీలేదు.
నాలుగవది, చంద్రశేఖర్ కొంచెం గాభరాగా సాహిత్యం గురించి మాట్లాడతావా అని అడిగాడు. నేను మాట్లాడను. పొరబాటున కూడా సాహిత్యం ప్రస్తావన రాదు నేను మాట్లాడే దాంట్లో ఈ నాలుగు హామీలతో నేను చెప్పదల్చుకున్న విషయాలు చెప్తాను.
77 కర్మం - నక్షమంే
ఇంకొకటి కూడా ఉంది. తెలంగాణ, రాయలసీమ అని మాట్లాడేటప్పుడు సహజంగానే అభివృద్ధి, వెనుకబాటుతనం అనే పదాలు వస్తాయి, ఆ భావనలు వస్తాయి. ఏ అర్ధంలో ప్రయోగిస్తున్నాం అనేది కూడా వస్తుంది. ఆర్.ఎస్.రావుగారు ఒక శ్రేమ్వర్క్ ఇచ్చారు. నేను దానిని ప్రయోగించను. మామూలుగా ప్రజాతంత్ర ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు ఒక అర్ధంలో ఉపయోగిస్తున్నాయి ఈ మాటలను. మాకు అభివృద్ది లేదు, మేము వెనుకబడి ఉన్నాము అని ఒక ప్రాంతమైైనా, ఒక జిల్లా అయినా అన్నప్పుడు ఏ అర్థంలో ప్రయోగిస్తున్నా మంటే రెండు పూటలా తినడానికి తిండి, ఆ తిండి పెట్టగల వనరులు, ఉపాధి - ఉద్యోగాలు, పని, చదువుకునే అవకాశాలు, వైద్య సదుపాయాలూ, రాబోయే తరం ఇంకొంచెం బాగా బతకడానికి కొంచెం మిగులూ- ఈ మేరకు ఉండాలి, అది మాకు లేదు అనే అర్ధంలో వాడుతున్నాము. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థ చట్రంలో భాగంగానే అడుగుతున్నాము. దీని వెలుపల కాదు. ప్రస్తుతం ఉన్న ఈ ఆర్థిక వ్యవస్థ చట్రమే తప్పు కావచ్చు. తప్పు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ జరుగుతున్న సంవాదం దీంట్లో భాగంగానే జరుగుతోంది కాబట్టి నేను కూడా దానికి వరిమితమయే్యే అభివృద్ది, వెనుకబాటుతనం అనే మాటలను ప్రయోగిస్తాను. ఆర్.ఎస్.రావుగారు ఉపయోగించిన ఫ్రేంవర్క్‌లో అయితే తెలంగాణ 050 44/6100661 ఒజ6& అవుతుంది. మీకు సెపరేట్ స్టేట్ ఎందుకు అంటే దెబ్బలు పడతాయి అక్కడ. అందువల్ల ఇవ్చుడున్నటువంటి రాజకీయ నంవాదంలో అంతర్భాగంగా, ఆ గ్రేమ్వర్క్లోనే ఈ విషయాలను ప్రయోగిస్తాను.
ఈ కోణం నుండి.. అంటే తిండి, పని, కనీసమైన జీవన సదుపాయాలు అనే కోణం నుండి రాయలనీవును చూనీనవుడు... నీటిలేవి అనేది చాలా ప్రధానమైనటువంటి లక్షణంగా మనకు కనిపిస్తుంది. రాయలసీమను మొత్తంగా తీసుకుంటె కూడా వర్షపాతం బాగా తక్కువ ఉండే నేల అది. ఆ కురిసే వర్షాన్ని కూడా నిలుపుకోగల, ఆ రకమైన మట్టి లేనటువంటి... నేల. అసలే వర్షపాతం తక్కువ. దానివల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి ఉండటం, దానివల్ల వాటిని బాగా పైకి తీసుకునివచ్చి పంటలు పండించటమనేది చాలా కష్టతరం అయింది-ఆర్థికంగానూ, ఇతరత్రా కూడా. పోనీ ప్రధానమైన నదులేమైనా ఉన్నాయా ఆ జలాల మీద అధారపడటానికి అంటే పెన్నానది ఒక్కటే అక్కడ ప్రధానమైన నది గోదావరి తీరం నుంచి చూస్తే కృష్ణ ఒక సారహీనమైన నదిగా కనిపిస్తుంది. కృష్ణ ఒడ్డున నిలబడి చూస్తే పెన్నా ఇంకా సారహీనమైన నదిగా కనబడుతుంది. అయినా రాయలసీమకు ఉన్నది అదే. కడపజిల్లా మొత్తం పెన్నా బేసిన్లోనే ఉంది. అనంతపురం ప్రధానంగా
78 కంగోపాల్ దవన్వాసాల *
పెన్నా బేసిన్లో, పాక్షికంగా కృష్ణా బేసిన్లో ఉంది. కర్నూలు కొంచెం ఎక్కువగా కృష్ణా బేసిన్లో ఉన్నా గణనీయంగా పెన్నా బేసిన్లోనూ ఉంది. చిత్తూరుకు ప్రధానంగా ఉన్నది పెన్నా ఉపనదులే. మిగిలినవన్నీ కూడా సువర్ణముఖిలాంటివి అక్కడ పుట్టి, అక్కడే నము(ద్రంలో కలుస్తాయి. ఈ నేలలు-జఒక్క పెన్నా బేనిన్ మినహాయించి-మిగిలిందంతా కూడా ఎగర్రనేలలే. సెన్నా బేసిన్ మాత్రమే నల్ల రేగడి నేలలు. ఎర్రనేలలు నీటిని ఎక్కువ నిలుపుకోలేవు. అందువల్ల కురిసే కొంత వర్షం కూడా ఆ నేలను సారవంతం చేయలేదు. అది మినరల్స్‌ని జీర్ణం చేసుకోలేదు. రాయలసీమకు సంబంధించి ఇది భౌతికమైనటువంటి వాస్తవం. నిజానికి రాయలసీమకే కాదు... మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్హాల్లోనూ, ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం డివిజను ప్రాంతం - ఇదంతా కూడా 700 మి.మీకంటె తక్కువ సగటు వర్షపాతం ఉండే ప్రాంతం. కొంతమేరకు మహబూబ్ నగర్లో సారవంతమైన నేలలు ఉన్నప్పటికీ మొత్తం మీద సారహీనమైనటువంటి నేలలు ఉన్న ప్రాంతమే ఇదంతా. చారిత్రక కారణాల వల్ల ఇవ్వాళ వీటిని కొంత రాయలసీమ అనీ, కొంత తెలంగాణ అనీ, కొంత ఆంధ్రా ప్రాంతమనీ మాట్లాడు కుంటున్నాము. ఆ చరిత్రను ఇవ్వాళ కాదని ప్రయోజనం లేదు, అది వాస్తవం.
నిజాం నవాబు 1800లో రాయలసీమను ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేయకుండా తనే పరిపాలించి ఉంటే ఇవ్వాళ ఈ ప్రాంతానికి కొంత ఎక్కువ న్యాయం జరిగే అవకాశం ఉండేది. చీలికలు లేకుండా ఉండేది. ఈ ప్రాంతం అంతా కూడా నైసర్గికంగా, ప్రకృతిరీత్యా అననుకూలమైన జీవిత పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతం, దురదృష్టవశాత్తూ చారిత్రక కారణాలు కూడా దానికి తోడయ్యాయి- అది విడిపోయి ఉందివ్వాళ. రాయలసీమకూ, దక్షిణ తెలంగాణకూ మధ్య ద్వేషాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అ చరిత్రను కాదని ప్రయోజనం లేదు. ఒక వాస్తవంగా దాన్ని అంగీకరించక తప్పదు.
రాష్ట్రజనాభాలో రాయలసీమ జనాభానూ, రాష్ట్రం విస్తీర్ణంలో రాయలసీమ విస్తీర్దాన్ని తీసుకున్నప్పుడు విస్తీర్ణం నిష్పత్తికంటె జనాభా నిష్పత్తి దాదాపు మూడవవంతు తక్కువ ఉంది. రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో రాయలసీమ విస్తీర్ణాన్నీ రాష్ట్రజనాభాలో రాయలసీమ జనాభానూ పోల్చి చూసుకుంటె ఇది మూడవవంతు తక్కువ ఉందంటే అంత తక్కువగా జనాభాను పోషించగల నేల ఇక్కడ ఉంది అనేది మనకు అర్ధం అవుతుంది. ఇక్కడ జన సాంద్రత కూడా చాలా తక్కువ మిగతా ప్రాంతాలతో పోలిస్తే.
79 చం 2 నంక్షమం
నేల పోషించలేదు కాబట్టే జనాభా తక్కువ ఉంది. ఇంకొకరకంగా తీసుకుంటె కూడా సాగుయోగ్యమైన భూమి మొత్తం విస్తీర్ణంలో ఎంత ఉందీ అంటే రాష్ట్ర నిష్పత్తికంటే 25 శాతం తక్కువ రాయలసీమలో ఉంది. బంజరుభూమి, సొగుయోగ్యంకాని భూమి తీసుకున్నా రాష్ట్ర నిష్పత్తితో పోలిస్తే 25శాతం ఎక్కువ రాయలసీమలో ఉంది. పోనీ సాగుయోగ్యం కాకపోయినా పశుపోషణకు పనికివచ్చేటటువంటి పచ్చిక బయళ్ళా అంటే అవి కూడా రాయలసీమలో మూడోవంతు తక్కువే. అంటే ప్రధానంగా పశుపోషణకుగానీ, వ్యవసాయానికిగానీ పనికిరానటువంటి భూములే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ అతి తక్కువ సాగుయోగ్యమైన భూమి ఉన్నది కడపజిల్లాలో. జిల్లా వైశాల్యం, సాగు యోగ్యమైన భూముల వైశాల్యం నిష్పత్తి తీసుకున్నా అతి తక్కువ ఉండేది రాష్ట్రం మొత్తం మీద కడప జిల్లాలోనే. చాలా పెద్దఎత్తున రిజర్వు ఫారెస్టు ఉన్న ఖమ్మంకంటె కూడా కడపజిల్లాలో సాగుయోగ్యమైన భూమి తక్కువగా ఉంది.
అయినా రాజశేఖరరెడ్డీ, రమణారెడ్డీ...ఈ రెడ్డీ ఆ రెడ్డీ వీళ్ళు చేసిన ఘనకార్యం ఏమిటీ అంటే తక్కువగా ఉన్న ఆ సాగుయోగ్యమైన భూమికి ఎక్కువ నీళ్ళు ఇవ్వగలిగారు. అనంతపురం కంటె డబుల్‌గా నీళ్ళు ఇవ్వగలిగారు అది... వాళ్ళ రాజకీయాలు.. తర్వాత చెప్తాను - అది ఏరకంగా వాళ్లు ఈ పనులన్నీ చేయగలిగారు అనేది.
అనంతపురంలో మరీ ఘోరమైన పరిస్థితి... అక్కడ సగటు వర్షపాతం 550 మి.మీ. పైగా సారహీనమైన నేలలు, అందుకే ఎడారి అయిపోయింది అని తరచుగా అంటూ ఉంటాం అనంతపురం జిల్లా గురించి. ఇవన్నీ ఒక పక్క. ఈ కారణంగానే భూగర్భ జలాలు కూడా వెయ్యి అడుగులదాకా పోయింది రాయలసీమలో, తెలంగాణలో రూడౌ చాలా ప్రాంతాల్లో 600 అడుగుల దాకా పోయింది కానీ రాయల సీమలో ముఖ్యంగా రాయచోటి, మదనపల్లె, వాయల్పాడు-అంటే కడప జుల్లా తూర్చుప్రాంతం, చిత్తూరు-కడపను ఆనుకుని ఉన్న ప్రాంతంలో దాదాపు వెయ్యి అడుగులు పోతే తప్ప నీళ్ళు రావు. అక్కడొక రైతు మేం మాట్టాడుతూ ఉంటే... నవ్వుకుంటూ ఒకమాట అన్నాడు... అంటే అంత కష్టంలోనూ ఒక 56096 0110300001 ఉంటుంది. - వెయ్యి అడుగులు పోయినా రాలేదు సారూ, ఆపేసినాను. ఇంకొంచెం పోతే పెట్రోలు దారికేదేమో నాకు... అన్నాడాయన.
దీనివల్ల నీళ్ళు బయటకు తీయడమూ కష్టమే, కరెంట్ ఖర్చూ ఎక్కువ
80 కోాలగోపాల్ దవన్యాసాల *
అవుతుంది. ఎంత ఫ్రీగా కరెంటు ఇస్తాం అన్నా-అంత హెవీ మోటార్లు పెడితే... తరచుగా కరెంటు పోతూ ఉంటుంది. వోల్టేజి తేడాలు కూడా ఎక్కువ ఉంటాయి. అది సాధ్యమయ్యే వ్యవసాయం కాదు. మీరు ఒకవేళ అనవచ్చు - చాలామంది అంటూ ఉంటారు కూడా - ఇవన్నీ ఉన్నపుడు దానికి తగినటువంటి పంటలే పండించుకుని బతకలేరా అని. ఇపుడు ఆర్.ఎస్,.రావుగారు అన్నదాంతో ఇది కలుస్తుంది ఒక రకంగా. కొన్ని 2550006 చేసుకుంటున్నాం మనం. పండిస్తే వడ్డే పండించాలి, చేస్తే ఉద్యోగమే చేయాలి, ఫ్యాక్టరీ నాఖరీయే కావాలి అనుకుంటూ ఉన్నాం మనం. నేను ఇంతకుముందే అన్నాను....ఇవ్వాళ ఉన్న ఆర్థిక వ్యవన్స చట్రంలో భాగంగానే వమునం మాట్ట్లాడుకుంటున్నామని. ఈ సంవాదం దాంట్లో భాగంగానే జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని నేను 2953126 చేసుకుంటున్నా. నజ్ఞలు పండించుకోవచ్చు, జొన్నలు పండించుకోవచ్చు, బతకొచ్చు - ఏమవుతుందీ అంటే ఏమీ మిగలదు. ఏదీ అమ్ముడుపోదు, పిల్లల్ని చదివించటం సాధ్యం కాదు. పిల్లలు కూడా ఇంజనీరింగ్ తప్పితే చదువుకోరు. అది కూడా బతుకే అనుకోరు. అనుకుంటే బాగానే ఉండు, కానీ అనుకోవడం లేదు ఇవ్వాళ. కాబట్టి వడ్డే పండించుకోవాలి. అవి పండకపోతే వేరుశనగ పండించుకోవాలి. సన్‌ఫ్లవర్ పండించుకోవాలి. రాయలసీమ వ్యవసాయం ఇవ్వాళ ఎంత అస్థిరమూ అంటే ఏ కారణంగా నైనా డిఫ్ట్రీబ్యూషన్ మార్కెట్లు దెబ్బతింటే రాయలసీమలో మళ్ళీ క్షామం రాగలదు. క్షామాలు గతించిపోయాయి, మార్కెట్ పెరిగింది, రవాణా సదుపాయం పెరిగింది, ప్రజా పంపిణీ వ్యవస్థ ఒకటి వచ్చేసింది - కాబట్టి ఎంత కరువొచ్చినా క్షామాలు రావు, ఎక్కడ నుంచైనా వస్తాయి ధాన్యం అంటున్నారు. అది వాస్తవమే కొంతవరకు. కాని ఇవ్వాళ నడుస్తున్న ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్రజా వంపిణీష్యవనను తగ్గించి, బాగా తగ్గించి మూసేస్తే... ఏ కారణంగానైనా ట్రాన్స్పోర్టేషన్గానీ దెబ్బతింటే, రాయలసీమలో భయంకరమైన క్షామం రాగలదు. ఎందుకంటే ఇక్కడ తిండిగింజలు పండించట్సేదు. తెలంగాణ, ఆంధ్రా - రెండు ప్రాంతాల్లో ఇవ్వాళ్సికీ 70 శాతం తిండిగింజలు పండిస్తున్నారు. రాయలసీమలో దాదాపు 70 శాతం నూనెగింజలు పండిస్తున్నారు- అది పల్లీలు కావచ్చు, సన్‌ఫ్లవర్ కావచ్చు. మనం మాట్లాడుకుంటున్న ఆర్థిక వ్యవస్థ చట్రంలో భాగంగా దీనికి ప్రత్యామ్నూ యంగా వచ్చే ప్రశ్న ఏమిటి అంటే - ఫ్యాక్టరీలు ఏమన్నా ఉన్నాయా, ఉద్యోగాలు ఏమన్నా వస్తున్నాయా-ప్రభుత్వోద్యోగాలు ఎట్లాగూ లేవు- ఫ్యాక్టరీలో పనులేమన్నా దొరుకుతున్నాయా అన్న ప్రశ్న ఈ చట్రంలో భాగంగా వస్తుంది. నేను ఇంతకు ముందే త్‌ే
అన్నా, ఈ చట్రాన్ని 292006 చేసుకుంటున్నా. దాంట్లో భాగంగానే మాట్లాడుకుంటూ ఉన్నాం మనం - వెనుకబాటుతనమైనా, అభివృద్దెనా... ఫ్యాక్టరీలూ, ఫ్యాక్టరీల్లో చూపించే పనీ-ఇవేమన్నా పెరిగినయ్యా అన్న ప్రశ్న దీంతోపాటు అనుబంధంగా వస్తుంది. ఇవ్వాళ ఉన్నటువంటి అభివృద్ధి నిర్వచనంలో దాన్ని లెక్కలోకి తీసుకుంటూ ఉన్నాం. దానిక్కూడా జవాబు ఏమిటీ అంటే- రాష్ట్ర జనాభాలో రాయలసీమ జనాభా 19 శాతం ఉంది. రాష్ట్ర ఫ్యాక్టరీల్లో రాయలసీమ ఫ్యాక్టరీల సంఖ్య 11 శాతం మాత్రమే. ఫ్యాక్టరీ కార్మికుల శాతం 5 మాత్రమే. మీకు డౌట్ రావచ్చు- ఫ్యాక్టరీల సంఖ్య 11 శాతం, కార్మికుల సంఖ్య 5 శాతం ఎందుకవుతారూ అని. అంటే చిన్నవి ఇవన్నీ కూడా. నాపరాయి పాలిషింగ్ మిల్లులు... చాలా ఉన్నా అందులో పనిచేసేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ఫ్యాక్టరీల సంఖ్య కొంచెం ఎక్కువగా కనపడినా- చిన్నమిల్డులు స్టోన్ పాలిషింగ్ మిల్లులు లేకపోతే... లైమ్‌స్టోన్ ఫ్యాక్టరీలు కావడం వల్ల ఇంకా తక్కువ కార్మికులు ఉంటారు. వ్యవసాయరీత్యా వేనుకబాటుతనంతో పాటు, పారిశ్రామికంగా ఉపాధి చాలా తక్కువ. ఇవ్వాళున్న పరిస్థితుల్లో ఇది తప్ప వేరే ఉపాధి మార్గాలనేవి లేవు. 1980 నుంచి కూడా రాయలసీమలో చాలామంది రచనలు చేస్తూ వస్తున్నారు- రాయలసీమ ఏ విధంగా అభివృద్ధి కావాలి అని. ఒక భ్రమ ఒకటి - అపారమైన ఖనిజ సంపద రాయలసీమలో ఉందని, దానిని అభివృద్ధి చేస్తే బాగుంటుందని అంటూ ఉంటారు. నాకు తెలిసి అటువంటిదేదీ బేదిక్కడ. సంఖ్య రాసుకుంటె అనేక రకాలైన ఖనిజాలు ఉన్నాయి కానీ అపారమైనదేమీ లేదిక్కడ. ఉండేది లైమ్స్ట్రోన్ ఒక్కటే. డోన్‌లో, లేకపోతే మన తాడిపక్రి, కొలిమిగుండ్ల, కొండాపురం - ఆ ప్రాంతాల్లోఉంది. వాటితో ముద్దనూరు, ఎర్రగుంట్ల వంటి ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు నడుస్తా ఉన్నాయి. అంతకంటె పెద్ద ఎక్కువేమీ లేదు. రెండోది ఇంటి నిర్మాణంలో పనికొచ్చే రకరకాల స్లాబ్ స్టోన్స్, అవేమీ కూడా పెద్దగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి పనికొచ్చేవి కావు. ఇక మిగిలిన ఖనిజాలు చాలా కొద్దికొద్దిగా ఉన్నాయి. అవేమీ పెద్దగా అర్ధిక అభివృద్ధికి ఆధారం కాగలవి కావు. అయినా ఒక భ్రమ ఒకటి రాయసీమలో ఉంది. తమకు అపారమైన ఖనిజ సంపద ఉందని, అయినా తమను ఎవరూ పట్టించుకోవడం లేదు, అననుకుంటున్నారు వాళ్ళు. వాస్తవంగా ఐతే లేవు. మరి ఎట్లా బతకాలి అంటే వనరులు బైటనుండి వస్తే తప్ప రాయలసీమ బాగుపడే అవకాశం లేదు. నీటి వనరులు కానివ్వండి, పెట్టబడి వనరులు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. తెలంగాణ వనరులు ఉండీ, వాటిని వినియోగించని కారణం వల్ల అభివృద్ధి చెందని ప్రాంతమైతే, రాయలసీమ తై తా హాగావాత వనాల ఆ
వనరులు లేక వాటిని తీసుకురాలేక పోవడం వల్ల అన్యాయం జరిగిన ప్రాంతం. ఆ తేడా ఉంది రెండు ప్రాంతాల్లో.
ఒకే ఒక విషయంలో బ్రిటీష్ పరిపాలనలో ఉండటం వల్ల ఇవ్వాల్టి ఆధునిక జీవితానికి తగినటువంటి పాలనావ్యవహారాలు, ఇంగ్లీషు చదువులు అవీ అలవాటు కావడం వల్ల విద్య ఒక్కదాంట్లో రాయలసీమ తెలంగాణ కంటె కూడా బాగా అభివృద్ధి అయింది, దాదాపు అంధ్ర ప్రాంతంతో సమానంగా, అందువల్ల మీకు హైదారాబాద్‌లో చాలా చోట్ల రాయలసీమ వాళ్ళు ఉద్యోగాల్లో కనిపిస్తారు. హైకోర్టు నిండా రాయలసీమ లాయర్లు కనిపిస్తారు. ఇక్కడ కొట్లాటలు ఎక్కువ, లిటిగేషన్స్ ఎక్కువ కనుక హైకోర్టు నిండా రాయలసీమ లాయర్లు కనిపిస్తారు. ఒకే కులం అనుకోండి అంతా, కానీ మొత్తానికి కనిపిస్తారు హైకోర్టులో.
అదొక్క విషయంలో చారిత్రక కారణాల వల్ల వచ్చిన అభివృద్ధి ఉంది. రెండు ప్రధానమైన (ప్రాజెక్టులు ఉన్నాయి. తుంగభద్రా డ్యాం నుంచి అనంతపురం జిల్లాకు ఒక హైలెవెల్ కాలువ, కర్నూల్‌కు ఒక లోలెవల్ కాలువ తీశారు. సుంకేసులు దగ్గర కె.సి.కెనాల్‌కు డ్యాం కట్టారు. రాజకీయ పార్వ్వంలో వచ్చినపుడు చెబుతాను. ఈ కె.సి.కనాల్ను ముఖ్యంగా కడవజిల్లా నాయకులు చాలా నమర్థవంతంగా కాపాడుకుంటూ వచ్చారు. మన రాష్ట్రంలో కృష్ణాడెల్టా, గోదావరి డెల్టా, వంశధార స్టేజ్-1
- ఈ మూడింటితో సమానంగా కాపాడబడ్డ ప్రాజెక్టు అంటే కె.సి.కనాల్. ఎప్పుడూ కూడా దాని ఆయకట్టుకంటే ఎక్కువ నీళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. అయినా చాలదంటూనే ఉంటారు ఎప్పుడూ. ఇంకా కె.సి.కెనాల్ బాగుచేస్తానని జలయజ్ఞంలో అదనంగా కూడా పెట్టుకున్నాడు రాజశేఖరరెడ్డి, చెయ్యొద్దని కాదు కానీ సమదృష్టి ఉండాలా, అక్కర్లేదా అన్నది ప్రశ్న ఇవ్వాళ పోరుమామిళ్ళ ప్రాంతానికి పోయి చూస్తే అర్ధమవుతుంది, ఎంత దుర్భరంగా ఉంది అక్కడ జీవితం అనేది. అన్ని ప్రాంతాలకు ఒకే రకమైన 'ప్రాముఖ్యాన్నిచ్చి అవసరాన్ని బట్టి చేయాలి. చెయ్యకపోవడం సహజంగానే ఆగ్రహం తెప్పిస్తుంది. తప్పు కూడా కాదది.
తుంగభద్ర హై లెవెల్, లోలెవెల్ కెనాళ్ళు బాగా పాడయినా, వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. తుంగభద్ర డ్యాంలో పూడిక చాలా ఉండటం వల్ల నీళ్ళు నిలవడం లేదు. కాబట్టీ కాలువలోకి పోయేలోపునే అది పార్గొచ్చేస్తోంది. తుంగభద్ర హైలెవెల్ కెనాల్, లోలెవెల్ కెనాల్ రెండూ కూడా కొంత కర్నాటకకు, కొంత మనకు వస్తాయి.
న! చా నత్తం
అందుచేత కర్నాటక వాళ్ళే సమాంతర కాలవ తీద్దామని చాలాకాలంగా ఒక ప్రతిపాదన చేస్తున్నారు. ఇది చాలా సులభమైన విషయం. కాని ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఆ నీళ్ళు అనంతపురానికి పోతుంది. అనంతపురం అంటె పట్టింపు లేదు.
రాజశేఖరరెడ్డికీ లేదు, ఎవరికీ లేదు. దీనికి ఖర్చక్కర్తేదు. సగం సగం పంచుకోవచ్చు, భారీ ప్రాజెక్టులక్కర్లేదు. ఇప్పటికే కాలువ ఉంది. అయినా చెయ్యరు. రాజశేఖరరెడ్డి జల రాజకీయాలలో కీలకమైన అంశం ఏమిటంటె కాంట్రాక్టర్లకు భారీగా 'పైసలొచ్చే పనులు మాత్రమే జరుగుతాయి. డ్యాం ఇప్పటికే ఉంది కాబట్టి ఎక్కువ పైసలు రావు. ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగ ్రొజెక్టు ఒకటి ఉంది. సందర్భం కాబట్టి చెబుతున్నాను - రాజశేఖరరెడ్డి రాజకీయాలను అర్థం చేసుకోవడానికి. మహారాష్ట్రలో ప్రాజెక్టు కట్టేశారు వాళ్ళు ఖర్చు పెట్టుకుని. వాళ్ళేమి అడుగుతు న్నారంటే - మాకు "పైసలు కొంత ఇవ్వండి, ఒక కాలువ తవ్వుకొని పొండి. ఆదిలాబాద్ జిల్లాలో జైలన్, బేలా, తాంసీ బాగా వెనుకబడిన మండలాలు. అక్కడ 40 వేల ఎకరాలకు నీళ్ళొస్తాయి అని. కాని మొత్తం జలయజ్ఞంలో అది ఎక్కడా కనిపించదు. ఏమంటె కాంట్రాక్టర్లకు ఏమీరాదు. వారి జలరాజకీయాలను అర్ధం చేసుకోవా లంటె ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అనంతపురానికిచ్చే 13.0 దగ్గర నుండి ఆదిలాబాద్కిచ్చే పెనుగంగ వరకు ఎందుకు వాటి ప్రస్తావన ఉండదు అంటె రాజశేఖరరెడ్డిగారి మనసు నిండా ఉండేది సివిల్ కాంట్రాక్టరు యోగక్షేమాలు మాత్రమే. ఆ కాంట్రాక్టరుకు పనికిరాని ప్రాజెక్టు వారికి అక్కర్లేదు. అది పక్కన పెడదాం. అందువల్ల ఏమైందీ అంటె నదీజలాల నుండి ఇప్పటికే కట్టిన ప్రాజెక్టుల ద్వారా ఏ మేరకైతే ప్రయోజనం వచ్చి ఉండగలదో ఆ మేరకు కూడా రాని పరిస్థితి ఇవాళ ఏర్పడింది రాయలసీమలో. సమస్య ముందుకు ఎట్లా పోతుంది అనే దాని కంటె ముందు రాయలసీమ సామాజిక స్థితిని కొంత అర్ధం చేసుకుంటె బాగుంటుంది. రామ్మోహన్ ప్రస్తావించారు - రాయలసీమ అనగానే ఫాక్షన్లు అని ఒక కారికేచర్ తయారయింది అని. కారికేచర్ అయిన మాట వాస్తవమే కావచ్చు కానీ వాస్తవం కూడా అది. ఈ వాస్తవం వల్ల చాలా నష్టపోయింది రాయలసీమే, వేరే ఎవరూ కాదు.
కనీసమైన ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థకానీ, ఇంతకంటె మెరుగైన జీవితం సాధించుకోవడానికి - నిర్వచనాల్లోకి పోకుండా అభివృద్ధి అందాం టూకీగా- అవసరమైన ఉద్యమ చైతన్యంగానీ, ప్రజాఉద్యమాల ఒత్తిడి కానీ లేకపోవడం రాయలసీమ అభివృద్ది
తశ శ గవాల్ దవన్యాసాల
కాకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం. ఇక్కడున్న పెత్తందారీ వర్గం తాము ఏవైతే ముఖ్యమని అనుకున్నారో వాటిని రాష్ట్ర రాజకీయాలలో ఒత్తిడి పెట్టి, దౌర్జన్యం కూడా చేసి సాధించుకున్నారు. మీరు కడపనూ, మహబూబ్నగర్నూ పోలిస్తే వర్షపాతం కడపలోనూ, మహబూబ్‌నగర్‌లోనూ దాదాపు ఒకటే కాబట్టి నైసర్గికమైన అననుకూలత రెండు ప్రాంతాల జనజీవనంలోనూ ఒకటే. కానీ కడపజిల్లాకు మన దినపత్రికల పరిభాషలో సమర్ధవంతమైన నాయకులు - రౌడీ నాయకులు అందాం వాళ్ళని - ఉన్నారు. మహబూబ్ నగర్‌కి లేరు. మహబూబ్‌నగర్‌కు సాధారణ రాజకీయ నాయకులు కూడా లేరు. కాబట్టి మహబూబ్‌నగర్‌కు భీమా ప్రాజెక్టు రాలేదు. జూరాల సగం, సగం జరిగి ఆగిపోయింది. కె.సీ.3నాల్ మాత్రం భద్రంగా తయారయింది.
ఆ నాయకులకు చేతనయినది ఏమిటంటే తాము కావాలని అనుకున్నదాన్ని రకరకాల రూపాల్లో దౌర్జన్యం చేసైనా, ఒత్తిడి పెట్టెనా తెచ్చుకుంటున్నారు వాళ్ళు. సరే దానివల్ల బాగా వెనుకబడిన ప్రాంతాలకు నీళ్ళు కొన్ని వచ్చాయి, కాదనడం లేదు. కానీ ఈ రకమైన రాజకీయాలు సాగితే - ఎప్పుడైతే ఒత్తిడిపెట్టేవాళ్ళు, దౌర్జన్యం చేసేవాళ్ళు సాధించగలుగుతారో, వేరే వాళ్ళు సాధించలేరో.... అప్పుడు అసమానతలు పెరుగుతాయి. అది లేనివాళ్ళ మధ్య అసమానతలు. లేమిలో అసమానతలు పెరిగితే అది మరింత ఎక్కువగా విద్వేషానికి, నష్టానికి దారి తీన్హుంది. ఇవ్వాళ అదే జరుగుతూ ఉంది.ప్రజాతంత్ర వాతావరణంగానీ, ప్రజాతంత్ర రాజకీయాలకు ఒక స్ట్థానంగానీ రాయలసీమలో చాలా తక్కువ. ఒకప్పుడు కమ్యూనిస్సృ పార్టీ బలం చాలా ఉండింది రాయలసీమలో, మొదటి మూడు నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కడప ఎంపి - సి.పి.ఐకి చెందిన వ్యక్తే. కాని ఎట్లా గెలిచారు అంటే ఈ రకరకాల ఫ్యాక్షనిస్టులతో మంచి సంబంధాలు పెట్టకొని, మంచివాడు అనిపించు కొని. నువ్వు, నేను కొట్టుకోవడం ఎందుకు, వాడికి ఓట్లు వేస్తే సరిపోతుంది కదా అనుకున్నారు మొదట్లో, కాలక్రమంలో అది కూడా లేకుండా పోయింది- ఆ కమ్యూనిస్టు పార్టీల ప్రభావం కూడా లేకుండా పోయింది. ఆ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కూడా గ్రామీణ ప్రాంతాల కొచ్చేసరికి, (గ్రామ రాజకీయాలలో ఫ్యాక్షనిస్టులుగా వ్యవహరించడం మొదలుపెట్టారు.
సాహిత్యకారులకు కోపం రావచ్చు. రాచమల్లు రామచంద్రారెడ్డి గురించి ఒక కధ చెప్తారు, కడపలోనే చెప్తారు. చాలా చదువుకున్నవాడు. నేను చూళ్ళేదు ఎప్పుడూ. కాని ఆయన గురించి వింటే నెమ్మదస్తుడు, పెద్దమనిషి అని అనుకుంటాం. పులివెందులకు పోతే మాత్రం... ఆయన ఊళ్ళో ఉన్నపుడు ఎవరోవచ్చి - అన్నా అవతలి
తర్ క నక్ష
వాళ్లు ఓట్లు వేస్తున్నారు అనిచెపితే, ఏనా కొడుకురా ఓట్లు వేసేది అని ఆయన కొడవలి తీసుకుని పోయాడంటారు. అంటే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా గ్రామీణ ప్రాంతాల ముఠాకక్షల వాతావరణం కొచ్చేటప్పటికి అంతకంటె భిన్నంగా వ్యవహరించలేని పరిస్థితి. లోతుగా విశ్లేషిస్తూ మేం రిపోర్టులు వేసాం, ఒకసారి చదివితే అర్ధం అవుతుంది - కమ్యూనిస్టు రాజకీయాలు ఏవిధంగా తమకే తెలియకుండా ఈ ఫ్యాక్షన్లు పెరగడానికి దోహదం చేశాయన్నది మనకు చరిత్రలో చాలా స్పష్టంగానే కనిపిస్తుంది. రామ్మోహన్ అన్నారు ఫ్యాక్షన్లు అంటే కేవలం హత్యలుకాదు, అధికారాన్ని, వనరులనూ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఒక సాధనం అని. తొలినాడు అది కాదు. తొలినాడు గ్రామాలలో పెత్తనం కోసం పోటీ ఉండేది. ఒక రెడ్డి ఇటువైపు ఉంటే, ఒక రెడ్డీ ఆవైవు... పెత్తనం నీదా, నాదా... ఊళ్ళో పెద్దరికం... నీదా నాదా అని కొట్లాటలు ఉండేవి. వాళ్ళు గమనించిందేమిటంటే ఈ కొట్లాటల్లో భాగంగా గ్రామాన్ని చీల్చి కంట్రోల్లో పెట్టకోగలుగుతున్నారు. సగం గ్రామం, ముప్పావు వంతు (గ్రామం వింటారు చెప్పిన మాట అన్నపుడు దీన్ని రాజకీయాల్లో ఎందుకు ప్రయోగించ కూడదు అన్న ఆలోచన 1960ల నించీ వచ్చింది. రాజకీయాల్లో దీన్ని ప్రయోగిస్తే ఇంక ఏ హామీనీ ఇవ్వనక్కర్లేదు. ఏ చేతిబోరూ వేయనక్కర్లేదు. ఓ రోడ్డూ వేయించనక్కర్లేదు. ఎన్నికల్లో గెలుస్తూ ఉండవచ్చు. సివిల్ కాంట్రాక్టుల్లో దీన్ని ప్రయోగిస్తే ఎవర్నీ అడుక్కోనక్కర్లేదు. ఎవరికీ డబ్బులిచ్చి మాన్చించ నక్కరలేదు. దౌర్జన్యంగా కాంట్రాక్టులు చేసుకోవచ్చు.
ఈ అవగాహన 1960, 70ల నుంచీ పెరిగింది. ఎమర్జెన్సీ తర్వాత మొదటితరం నాయకులైన వై.ఎస్.రాజశేఖరరెడ్డి దీన్లో ప్రధానుడు. ఎం.వి. రమణారెడ్డి, మిగతావాళ్ళు దీన్ని పెద్దఎత్తున అసెంబ్లీ, పార్లమెంట్ రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఒక వినాశకరమైన వాతావరణాన్ని రాయలసీమలో తయారుచేసారు. రాజశేఖరరెడ్డి అయితే కడపజిల్హాకే పరిమితం కాలేదు. కర్నూలు, అనంతపురం ఎక్కడైతే అక్కడ తన మనుషులకు వ్యతిరేకంగా ఎవరూ ఎదగడానికి వీల్లేదు. ఎవడైనా వ్యతిరేకమైనవాడు ఒక ప్రాంతంలో ఏకగ్రీవంగా నాయకుడిగా ఉంటే వాడికి వ్యతిరేకంగా ఒకణ్డీ పుట్టించాలి. ఒకణ్ణి రెచ్చగొటాలి. వాడికి బాంబులివ్వాలి. వాడికి ధైర్యమివ్వాలి. హత్యలు చేయడాన్ని ప్రోత్సహించాలి. ఎదుటివాణ్ణి నాశనం చెయ్యాలి. చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ నేను చెప్పదలచుకున్న ఒక విషయం చాలామందికి బహుశ కొంత ఇబ్బంది కలిగించేది ఏమిటంటే ఇది కేవలం నాయకుల్లో మాత్రమే ఉంది అనుకుంటే పొరపాటు. కేవలం నాయకుల్లో మాత్రమే ఈ రకమైన సంస్కృతి ఉందని అనుకోవద్దు. దౌర్జన్యం చేసి,
తల్ శో ాంగోపాల్ దవన్నాాదో
ఏమైనా చేసి సాధించుకోవచ్చు. తప్పేమీలేదు. ఒక పద్ధతి అవసరం లేదు, ఒక ప్రమాణం అవసరం లేదు అనే ధోరణి అందరిలో ఉంది. ఇవ్వాళ రాజశేఖరరెడ్డి ఎట్లా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో చూస్తున్నాం. మనం అంటూ ఉంటాం ఎట్టా చేస్తావయ్యా ఈ పని నువ్వు? నదీజలాల విషయంలో ఎవరి వాటా ఎంతో నిర్ణయించిన తర్వాతే ప్రాజెక్టు కట్టు అంటే ఆయనకు అర్ధం కాదు. ఎందుకంటే ఏదైనా ఒక పని చేయడానికి ఒక నియమం ఉండాలి అనే భావన అర్థంకాదు ఆయనకి. అధికారం ఉంది, నేను చేస్తానంటాడు. నియమబద్ధంగా పరిపాలన చెయ్యాలి, నియమబద్ధంగా బతకాలి అన్న భావనే లేకపోవడం ఆయన ఒక్కడి ప్రత్యేకతేమీ కాదు. సాధారణ సామాజిక సంస్కృతిలోనే ఒక అంశంగా ఉంది కాబట్టి వాళ్ళది సాధించుకో గలుగుతున్నారు, చెయ్యగలుగుతున్నారు. ప్రజలు వీళ్ళ దగ్గరికి పోకపోతే - తప్పు మార్గమైనా ఒప్పు మార్గమైనా నా అవసరం తీరాల్సిందే అని ప్రజలు ఒక నాయకుడు దగ్గరకు పోకపోతే నాయకులు నాయకులు కారు. పోతారు జనం వారి దగ్గరికి. చాలాకాలం నుండి ఈ మాట అంటూ ఉన్నాను. నియమబద్ధమైన జీవితం ఉండాలి. సామాజిక జీవితం అ రకంగానే ఉండాలి, ఆ రకంగానే సమస్యలు పరిష్కారం కావాలి అన్న సంస్కృతి అభివృద్ధి కాకపోతే ఫాక్షనిజం పోదు రాయలసీమలో. దాన్ని పోగొట్టడానికి ఏమేరకు రాజకీయ ఉద్యమాలు కృషి చేయగలుగుతాయి అన్నది ప్రశ్న అది జరగనంతకాలం నాయకులను ఎంత తిట్టినా, ఫాక్షనిస్టులను ఎంత తిట్టినా మనం తిట్టిన వాళ్ళమే అవుతాం. తిట్టి నందుకు మనల్ని గౌరవిస్తారు కూడా.
నాకు బాగా జ్ఞాపకం - అప్పట్లో సంధ్యగారి నాయకత్వంలో కర్నూలు జిల్లాలో మంచి ఉద్యమం నడిచింది, భూస్వామ్య సాయుధ ముఠాల వ్యతిరేక పోరాటం అని. మేం దాంట్లో పాల్గొన్నాము. కోయిలకుంట్లలో మీటింగ్ పెట్టినపుడు పెద్దవాళ్ళొచ్చి ఏడుస్తూ తలచుకున్నారు - ఇట్లా మాట్టాడొచ్చని తెలియదు మాకని. అది కూడా అచీవ్మెంట్, కాదని నేననడం లేదు. కానీ అక్కడే ఆగిపోకూడదు. ప్రజా జీవిత సంస్కృతిలోనే ప్రజాస్వామిక విలువలను 'పెంపాందించకపోతే ఫాక్షనిజం పోదు. అది పక్కన పెట్టీ ఆ సంస్కృతి అనేది సాధారణ సామాజిక జీవితంలో ఉండబట్టే ఈ నాయకుల ఆధిపత్యమనేది, ఫ్యాక్షనిజం అనేది వర్థిల్లగలుగుతోంది. దీన్ని పోగొట్టడానికి ఏ కార్యాచరణ, ఏ రచన - ఎవరూ చేస్తున్నట్బ నాకైతే అనిపియ్యడం లేదు. ఉదాహరణకు చాలా చోట్ల చెపుతుంటాను, మీటింగ్‌ల్లో కూడా. చిత్తూరు జిల్లాలో దామల చెరువు నుంచి పీలేరు దగ్గర ఒక గ్రామానికి పోవాల్సివచ్చినప్పుడు బస్ లేక
త్ క్యా = నక్షమం
ఏదో పౌళ్టీవ్యాన్ పోతుంటే ఎక్కాను. అక్కడ లెవెల్ క్రాసింగ్ గేట్ ఉంది. దసరా పండగ దగ్గరపడ్డ రోజులవి. ఆ గేట్‌మాన్ గేట్ వేసేసి - రైలు రావడం లేదు - డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. 10 రూ, 20 రూపాయలు... రోజూ వచ్చి పోతావు కదా అని. మిగతా చోట్ల కూడా చేస్తారు... కాని ఎపుడు చేస్తారు? రైలొచ్చినపుడు గేట్ వేసి ఉన్నపుడు రోజూ వచ్చే బండొస్తే నాకు మామూలియ్యవయ్యా అని అడుక్కుంటారు. అది మామూలే, అలవాటే అది. ఇక్కడ అలా కాదు. గేటు నా చేతిలో ఉందిగా వేసేస్తా, వేసి తీసుకుంటా పైసల్నేను. చాలా చిన్న విషయమే. కాని అది కల్చ్పరలో భాగం అయినపుడు ఏమవుతుందంటే ఆధిపత్య రాజకీయాలు, పెత్తందారీ రాజకీయాలు, దౌర్జన్యం చేసి ఏదైనా సాధించుకోవచ్చనే రాజకీయాలకు ఒక పునాది ఏర్పడుతుంది. అది ఏర్పడింది.
ఇది రాయలసీమను భయంకరంగా నాశనం చేసింది. రాయలసీమకే నష్టం
చేసింది. వేరే వాళ్ళు అంటున్నారు, వెక్కిరిస్తున్నారు అని కోపమొస్తే ఏం ప్రయోజనం? నష్టపోయింది రాయలసీమ. దాన్ని పోగొట్టుకోవాలి. ఎట్టా పోగొట్టుకుంటామన్నది ఆలోచించుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఆ నాయకుల వెనకాలే పోతూ ఉండటం కాదు. బహుజన సమాజ్ పార్టీ బహుశ 1994 ఎన్నికలప్పుడనుకుంటాను, ఒక వెలుగు వెలిగింది. ఆ రోజుల్లో వాళ్లకు... మీరు.... ఊహించగలరా.... వాళ్లకు పెద్ద ఆఫీసు ఎక్కడుందని? బహుజన సమాజ్ పార్టీ దళితుల పార్టీ. ఏమి ఆఫీసులుంటాయి దానికి? ఒక చిన్న మురికివాడలో, స్లమ్‌లో దానికి ఒక రూం ఉండేది. ఎన్నికలు వచ్చేసరికి కడపలో నాలుగు రూమ్‌ల ఆఫీసు అయింది. ఎవరిచ్చారయ్యా అంటే వై.ఎస్, ఇచ్చాడు. ఆయన పిల్చి అన్నాడట - ఆఫీసు పెట్టుకోండి. రాజకీయాలు అవసరం కదా చెయ్యండి అని. ఆయన అనడం అళ్చర్యం కాదు, వాళ్ళు తీనుకోవడం ఆశ్చర్యం. దాన్ని వ్యతిరేకించేటటువంటి రాజకీయ సంస్కృతి పెంపాందించకసోతే కష్టం అవుతుంది. ఈ పెత్తందారీ, అప్రజాస్వామిక రాజకీయాలు జీవితాలు బాగు చేసుకోవడానికి అవసరమైన - నేను విప్లవాల గురించి మాట్లాడడం లేదు - జీవితాన్ని బాగు చేసుకోవడానికి అవసరమైన కనీస ప్రజాతంత్ర ఆచరణకు కూడా ఆటంకంగా ఉన్నాయనేది వాస్తవం.
ఏ యూనియన్‌కు పొండి, యూనియన్ నాయకుడు ఈ రెడ్డి ఆ రెడ్డి- అంటే నేను కులాల గురించి మాత్రమే మాట్లాడం లేదు. కులం గురించి మాట్లాడతా కాని అది మాత్రమే మాట్లాడటం లేదు. ఇక్కడ రెడ్డి ఎవరు అంటే ఎవరో ఫ్యాక్షనిస్టు, కారణం
తతి శో నంగోపాల్ ఉవన్యాసాల
అడిగితే ఏమంటారు యూనియన్ నాయకులు? ఎవరో ఒకరి దగ్గరకి పోకపోతే అవతలివాడు ఇంకొకరి దగ్గరకు పోతాడు కదా అంటారు. అవతలివాడు పోకమునుపే నేను పోతే నా ప్రయోజనాలు కాపాడబడతాయి కదా అంటాడు. ఏం జరుగుతుంది చివరికి? కొట్లాట అవుతుంది. మీరు చస్తారు. లేదా జైలుకి పోతారు. వాళ్ళు బాగానే ఉంటారు. అది కూడా ముఖ్యమైన విషయం కాదు. ప్రజాతంత్ర వాతావరణం ధ్వంసం అవుతుంది. అది ఇప్పటికే ధ్వంసమయ్యింది. దానికి అనుబంధంగా చెప్పుకోవలసిన విషయం ఏమంటె చాలా తరచుగా రాయలసీమ ప్రయోజనాల గురించి వింటూ ఉంటాం మనం. రాయలసీమకు మేలు చేసారనో, మేలు చేయలేదనో, రాయలసీమ ప్రయోజనాలు ఇవనో, అవనో అంటూ ఉంటారు. ఇదంతా కూడా ఒక్క ప్రాంతానికి చెందిన మాటలు మాత్రమేనన్న సంగతిని గుర్తించాలి. బయటివాళ్ళు రాయలసీమ అని వినేదంతా కూడా కడపజిల్లా పడమటి భాగం, కర్నూలు జిల్లా తూర్పు భాగం. సాలకొండ నుంచి ఎర్రమల కొండలదాకా మధ్య ఉండే ప్రాంతం. అటునుండి - నంద్యాల, ఆళ్లగడ్డ, కోయిలకుంట్ల, జమ్మలమడుగు, ఇటునుండి ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల, కడప - ఈ ప్రాంతం. ఇదంతా కూడా పెన్నానది పరీవాహక ప్రాంతం. కుందూ పరీవాహక ప్రాంతం. నల్లరేగడి నేలలున్న ప్రాంతం. సారవంతమైన నేలలున్న ప్రాంతం. కె.సి.కెనాల్ నీళ్ళొచ్చే ప్రాంతం. మైలవరం ప్రాజెక్టు నీళ్ళాచ్చే ప్రాంతం. ఇక్కడుండే రెడ్డి కులస్తులెవరైతే ఉన్నారో వాళ్ళ ఆధిపత్యం రాయలసీమ పేరుమీద నడుస్తూ ఉంటుంది. నాకు బాగా జ్ఞాపకం. దళితోద్యమ కార్యకర్త ఒకరు దీనికి రెడ్డిస్తాన్ అని పేరు పెట్టాడు. ఈ రెడ్డిస్తాన్ వాక్కే రాయలసీమ వాక్కయి వినబడుతూ ఉంది ఆర్ ఎస్,రావుగారు అన్నారు - మర్చిపోవద్దు వర్గ విశ్లేషణను అని. ఇది కూడా ఒక వర్గమేనని నేననుకుంటాను. వర్గమంటే ఒక సాంఘిక నిర్మాణం. దానికి వ్యతిరేకమైన వాక్కును ఎక్కడా బలంగా రానీయలేదు.
ఎంతమందికి తెలుసు నల్గొండ జిల్లా మునుగోడు, నారాయణపురం ప్రాంతాల్లో ఉన్నట్లుగా కర్నూలు జిల్లాలోని పత్తికొండ తాలూకాలో కూడా ఫ్లోరైడ్ సమస్య ఉందని? ఎవరూ మాట్లాడలేదు దాని గురించి. మాట్లాడే నోరు లేదిక్కడ. రాయలసీమ గురించి గొంతు చించుకునేవాళ్ళవరూ మాట్లాడరు దాని గురించి. అదే రకంగా మార్కాపురం ప్రాంతంలోనూ ఫ్లోరైడ్ సమస్య ఉంది. అదీ ఎవరూ మాట్లాడరు. ఈ వాయిస్ అంతా, గొంతంతా కూడా రెడ్డిస్తాన్ నుంచే వస్తుంది. బయటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడినా ఈ గొంతుతోనే మాట్లాడతారు. ఈ ప్రాంతం గురించే మాట్లాడతారు. అది కూడా చాలా
తతి
నష్టం చేసింది. ఎందుకంటే జలరాజకీయాలేవైతే రాజశేఖరరెడ్డి చేస్తున్నాడో అదంతా కూడా రెడ్డిస్తాన్కు నీళ్ళిచ్చేవే. గాలేరు - నగరైనా, తెలుగుగంగైనా, గండికోటైనా- చివరికి ఆ ప్రాంతం నూటికి నూరుశాతం సాగునీరు లభించే (పాంతంగా వమార్చదలుచు కున్నాడాయన. ఉండడెక్కువ కాలం కానీ ఉంటే మూత్రం మార్చదల్చుకున్నాడాయన, ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకు పోవాలి రాయలసీమ? ఇంతకు ముందే చెప్పాను, ఖనిజాలు ఉన్నాయన్నారు కానీ పెద్దగా లేవిక్కడ. ఎం.వి.రమణారెడ్డిగారి పుస్తకాలు చదివితే అపారమైన ఖనిజ సంపద ఉందని రాస్తూ ఉంటాడాయన,
రాయలసీమ గురించి “కదలికి అని ఒక పత్రిక వస్తుంది. నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు కాని లైమ్ స్టోన్, స్లాబ్ స్టోన్ తప్ప అక్కడ వేరేమీ లేవు. అవి రెండూ కూడా పెద్దయెత్తున పారిశ్రామికంగా ఉపయోగపడే ఖనిజాలు కావు. స్వతహాగా నీటి వనరులు లేవు. ఈ మధ్య కాలంలో అంటున్నారు - వనరులే ఉండనక్కర లేదు. నాలెడ్డ్ ఇండష్టీ కూడా రావచ్చు అని. ఇవ్వాళ విజ్ఞానమే ఒక వనరు. కాబట్టి ఎడారిలో కూడా డెవలప్మెంట్ రావచ్చు అని ఆంటున్నారు. కాని జమ్మలమడుగులో, రాయచోటిలో ఉరవకొండలో ఐ.టి. ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళను నేనింతవరకు చూడలేదు. వచ్చినప్పుడు చూద్దాం. దాన్ని నమ్ముకుంటే చాలా కష్టం. మరింక ఎక్కడ్నుంచి రాయలసీమకు డెవలప్మెంట్ రావాలన్నది చాలా పెద్ద ప్రశ్న సాగునీరు మరింత ఎక్కువగా రావడం - ఇది జరక్కపోతే ఇక ముందుకు పోయే అవకాశం ఉండదు. అది మాత్రం వాస్తవం. అది ఎక్కడ నుంచి రావాలి? ఇక మన రాష్ట్ర జల రాజకీయాల దగ్గరకు వస్తాను.
రాజశేఖరరెడ్డిగారు జలయజ్ఞం పేరు మీద ఏవైతే మాట్లాడుతున్నాడో ఈ జల రాజకీయాల వల్ల జరుగుతున్న ముఖ్యమైన నష్టం తెలంగాణ, రాయలసీమ మధ్య ఒక విద్వేషపూరితమైన వాతావరణం పెరగడం. దీంట్లో పెత్తందారీ రాజకీయాల్లో ఉండే వాళ్ళు మాత్రమే పాల్గొంటే ఆశ్చర్యమేమీ లేదు కానీ ప్రజాతంత్ర ఉద్యమాలు కూడా భాగమవుతున్నాయి. ప్రజాతంత్ర భావాలుగల రాజకీయ కార్యకర్తలు, రచయితలు, మేధావులు కూడా భాగమవుతున్నారు. ఒక చిన్న ఫార్ములా తోటి నడుస్తోంది ఈ ఘర్షణ అంతా కూడా. అవతలవైపు తెలంగాణలో విద్యాసాగరరావుగారు కృష్ణానది మిగులు జలాలలో రాయలసీమకు ఒక్క చుక్క కూడా హక్కు లేదు అంటున్నారు. నికర జలాల్లో
90 కడాగహాల్ దవన్వాసాద
బచావత్ అవార్డు ఇచ్చింది కాబట్టి ఉందన్నారు. విద్యాసాగరరావు గారికి అది కూడా ఇష్టం లేదు కానీ బచావత్ అవార్డు ఇచ్చింది కాబట్టి ఉందని అన్నారు. విద్యాసాగరరావుగారు టి.ఆర్.ఎస్.నాయకుడు మాత్రమే కాదు. టి.ఆర్.ఎస్ సాగునీటి సిద్ధాంతవేత్త మాత్రమే కాదు. తెలంగాణ ఉద్యమానికే సాగునీటి సిద్ధాంతవేత్త, ఆయన అభిప్రాయాన్ని ఈ విషయంలో తప్పు అన్నవాళ్ళనెవర్నీ చూడలేదు తెలంగాణలో. ఇటు రాయలసీమ కొచ్చేసరికి ఎం.వి.రమణారెడ్డి, రాజశేఖరరెడ్డి వాళ్ళ కాలం నుంచి కృష్ణానది మిగులు జలమంతా రాయలసీమకే, తెలంగాణ గోదావరితో సరిపెట్టుకోవాలి అంటూ వస్తున్నారు. పూర్తిగా పరస్పర విరుద్ధమైన ఆలోచనలు. రాయలసీమలో కూడా కృష్ణానది మిగులు జలాలు మొత్తం రాయలసీమకే అనే అభిప్రాయం తప్పు అన్నవాళ్ళను, ప్రజాతంత్ర వాదులతో సహా, ఇప్పటిదాకా చూళ్ళేదు. మాబోటి వాళ్ళం మాటాడితే కోవం. కడవలో నేనంటే చాలా ద్వేషం ఉంది. పోతిరెడ్డిపాడును వ్యతిరేకిస్తున్నాడు, కడపకు అన్యాయం చేస్తున్నాడు అని. నేనేం అపలేదు దాన్ని. తప్పు అంటున్నానంతే. మేం చేయగలిగింది పెద్దగా ఏమీ లేదు. అది వేరే సంగతి. ఈ వాతావరణం పోవాలీ అని అంటే కృష్ణా జలాలకు సంబంధించిన ఒక వాస్తవికమైన ప్రజాతంత్ర స్వభావం కలిగిన చర్చ అవసరం, చాలా వివరంగా మాట్లాడుకోవచ్చు కానీ క్లుప్తంగా మాట్టాడతాను. మరోసారి ఎవ్వుడైనా దీనిమీద మాట్టాడుకోవచ్చు 24గంటలసేపు. ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో చాలా కీలకమైన విషయం అవుతుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగానే ఉన్నా, వేరైనా ప్రజల మధ్య - వెనుకబడిన ప్రాంతాల ప్రజల మధ్య - వివక్షకు గురైన ప్రాంతాల ప్రజల మధ్య - విద్వేషాలు చాలా చాలా నష్టకరం. చాలా బాధాకరం. దానికి ఇది దోహదం చేస్తుంది. రాజోఖరరెడ్డి ఆయన ఆలోచన చెప్తూ వస్తున్నారు. రాయలసీమలో చాలామంది ఆయనకు ఓకే అంటున్నారు. ఎట్ల్టయిపోయిందంటే కృష్ణాజలాల గురించి సూత్రబద్ధంగా మాట్లాడితే తెలంగాణ మిత్రులేమో రాయలసీమకు హక్కు ఉందని అనాల్సి వస్తుంది. కాబట్టి సైలెంట్‌గా ఉందామనుకుంటున్నారు. రాయలసీమ మిత్రులేమో ఎందుకు అనవసరంగా- రాజశేఖరరెడ్డి ఏదో చేస్తున్నాడు కదా చెయ్యనియ్యరాదు - మాట్లాడితే తప్పో ఒప్పో అనవలసి వస్తుందని వీళ్ళు కూడా సైలెంట్‌గా ఉంటున్నారు. ఆ విధంగా రాజశేఖరరెడ్డి లాభపడుతూ ఉన్నాడు. ఎట్టా లాభవడుతున్నాడంటే పూర్తిగా అహేతుకమైన, అన్యాయమైన వైఖరిని రెండవ కృష్ణా ట్రిబ్యునల్ దగ్గర తీసుకోవడం ద్వారా. ఆయనకు నీళ్ళక్కరలేదు. కాంట్రాక్టులు కావాలి. కాంట్రాక్టులు మాత్రం గ
అద్భుతంగా ఇచ్చేసుకుంటూ పోతున్నాడు. మిత్రులకు జేబులు నిండుతున్నాయి. నష్టమంతా జరిగిపోతోంది. మనమెవ్వరం మాట్లాడం. ప్రజాతంత్ర శక్తులు మాట్లాడవు. ఆయన ఏమంటున్నాడు అక్కడకు పోయి - కృష్ణా నది మీద మిగులు జలాల ఆధారంగా అనేక ప్రాజెక్టులు మేమూ కట్టిస్తున్నాము అని చెపుతున్నాడు. ఇప్పటికే కాలువలు తవ్వేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడికిపోయినా ఇక రాజశేఖరరెడ్డి కాలువలే కనిపిస్తాయి.
వరంగల్లు పోతే కాకతీయ శిథిలాలు ఉంటాయి. ఇంకో పదేళ్ళకు రాజశేఖరరెడ్డి శిథిలాలు ఉంటాయి. ఎక్కడకు పోయినా కాలువలుంటాయి. అర్థం కాదు ఎవరికీ కూడా. అప్పుడు చరిత్రకారులు చెప్పాలి - ఈ కాలువలేమిటని. కృష్ణా ట్రిబ్యునల్‌కు పోయి ఏమంటా డాయన - ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నామిక్కడ.... మహబూబ్‌నగర్‌కు నెట్టెంపాడు, కల్వకుర్తి నల్గొండకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ, ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ, దానికి మరో ఒక తోక వరద కాలువ కూడా. అసలే లేదు దానికో తోక కూడా. గాలేరు - నగరి కడపకు, హంద్రీ - నివా కర్నూలుకు, అనంతపురానికి జాయింటుగా, ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతానికి వెలుగొండ అని ఒక (ప్రాజెక్టు... ఇలా. నిన్న ఎ(ర్రగొండపాలెం పోయాం మేము. అక్కడ నల్లమల్ల అడవులలో కూంబింగ్ పేరు మీద చెంచులను పోలీసులు బెదిరించి - మీరు ఖాళీ చేయండి, లేకపోతే ఇళ్ళు తగలబెడతాము అంటే పాపం అందరూ పారిపోయారు. అక్కడి వాళ్ళతో మాట్లాడుతూ ఎప్పుడు బాగుపడతారంటే వెలుగొండ వస్తుంది సార్ అన్నారు. వెలుగొండ ఎప్పుడు వస్తుందో! ఎట్లా కడతాడు రాజశేఖరరెడ్డి వెలుగొండను. అది వచ్చే ప్రాజెక్టా! వచ్చే నీళ్ళా! కాలువలు వస్తాయి గ్యారెంటీగా. ఎవరి జేబులు నిండాలో అవి నిండుతాయి. ఇవన్నీ ఆయన రెండవ కృష్ణా ట్రిబ్యునల్ దగ్గరకు పోయి ఏం చెబుతాడంటే- అవన్నీ మిగుల జలాల ప్రాజెక్టుల, హక్కులడగము కాబట్టి మీరు దీని గురించి పట్టించుకోవద్దు అంటే వాళ్లు అద్భుతం అన్నారు. చాలా బావుంది అన్నారు. అక్కడ బ్రిజేష్ మిశ్రాయో ఎవరో ఉన్నారు, ఆయన సుప్రీంకోర్టు జడ్జి, ఆయనకైనా తోచాలిగదా, హక్కు అడగకుండా ప్రాజెక్స ఎలా కడుతున్నావని! ఆయన అడగలేదు. రాజశేఖరరెడ్డికేం కావాలి?! కర్ణాటకవాడు ఒక అప్లికేషన్ వేశాడు. అంధ్రా ప్రాజెక్టుల పై స్టే ఇవ్వండి అని. ఈయనేం అన్నాడు - హక్కు అడగనన్నాడు. హక్కు అడిగితే కదా స్టే ఇవ్వాలి? హక్కే అడగనప్పుడు ఎందుకు పో అన్నాడు. మరి ఏం చేయదలచుకున్నాడు ఈయన? ఒకటేం చెపుతాడు ఒక ప్రక్క, వచ్చినపుడే వస్తాయిలే అని.
92 త ాావర వ్యానాదో
కడపజిల్లా వాళ్ళు కూడా వచ్చినపుడు వస్తుందిలే, పదేళ్ళకి ఒకసారి వస్తే మాత్రమేమి అంటారు. పదేళ్ళకు ఒకసారి వస్తే రైతులు రెడీగా ఉంటారా- భూములున్నా కూడా ఆ నీళ్ళు వచ్చినపుడు పంటలు తయారు చేసుకోవడానికి? ఆయనా రైతే, సాధ్యమవుతుందా అట్టా వాడుకోవడం పదేళ్ళకు? వస్తే ఎవరికి పంచుతావు నువ్వు? ఎనిమిది చెప్పాను నేను ప్రాజెక్టులు, ఎనిమిది ప్రాజెక్టులలో ఎవరికి పంచుతావు? దేనికి ముందిస్తావు, దేనికి వెనకిస్తావు, ఎవరికి ఎంతిస్తావు? నీ దగ్గర చట్టం లేదు. జి.వో. లేదు. ఒక విధానం లేదు. కొట్టుకోవాలి అంతే కదా? ఇప్పటికే మహబూబ్‌నగర్, కర్నూలు వాళ్లు కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకా కొట్టుకోవాలనా? ఇప్పటికే కడపంటే ద్వేషం వచ్చేసింది రాష్ట్రమంతా కూడా, వాళ్ళకేం చేయకపోయినా కూడా. ఇంకా పెరగాలి కదా ద్వేషం - రాజశేఖరరెడ్డి రాజకీయాలే అవి. ఫ్యాక్షన్ రాజకీయాలలో ప్రాథమిక సూత్రం ఏమిటంటే ప్రజలు ఎంత కొట్టుకుంటే నాయకులు అంత బావుంటారని. మీరు పులివెందులకు పోయిరండి. ఏవైనా నాలుగు గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయంటే రాజశేఖరరెడ్డి వెతుకుతాడు- ఎవరిని లేవగొట్టాల అక్కడ అని. ప్రశాంతంగా ఉంటే ఓట్లు రావు, ప్రశాంతంగా ఉంటే గుంపు రాదు. కొట్టుకుంటే గుంపు వస్తుంది. ఒకడి లేవగొట్టాలి, బాంబులేయాలి, కానీండ్రా నేను చూసుకుంటా అని చెప్పాలి.
దీన్నే ఆయన ఇప్పుడు రాష్ట్రరాజకీయాల్లో ప్రయోగిస్తున్నాడు. అది మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. రెండవది ఏమంటాడూ అంటే రాజశేఖరరెడ్డి - ఇది చాలామంది నమ్ముతున్నారు సీరియస్‌గా - గోదావరి నుంచి 200 టిఎంసిలు కృష్ణాబేసిన్కి వస్తాయి. ఆ రెండు వందల టిఎంసిలతో ఎనిమిది ప్రాజెక్టులకు తలా 20, 30 ఇస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయి కదా అనేది రెండవ వాదన. చాలామందిలో ఇది సరైనదే కదా, ఉత్తర తెలంగాణలో అనవసరంగా దీనిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే అభిప్రాయం ఉంది. చాలామందికి విషయాలు తెలియక అభిప్రాయపడుతున్నారు. దానిలో మూడు రకాల నష్టాలున్నాయి.
గోదావరి నుంచి రెండువందల టిఎంసిల నీరు కృష్ణాబేసిన్కి వచ్చేస్తే దాన్నించి రాయలసీమ కిస్తానంటాడు. ఆయన ఎట్లిస్తాడు రాయలనీమకి మాత్రవే? మహబూబ్‌నగర్‌కి ఎందుకియ్యవు? నల్గాండకి ఎందుకియ్యవు? ఇదంతా కూడా కృష్ణాబేసిన్ కాదా! తీసుకురావడం అంటూ జరిగితే మహబూబ్ నగర్ కివ్వాలి, నల్గొండకివ్వాలి నువ్వు - ఎనిమిది ప్రాజెక్టులు ఉన్నాయి కదా! 2 మహబూబ్‌నగర్,
తతి
3 నల్గొండ, 1 కడప, 1 అనంతపురం, కర్నూలు, ఒకటేమో మార్కాపురం డివిజనుకు అందరికీ ఇవ్వాలిగా నువ్వు....అట్లా చెప్పడు రాయలసీమకే ఇస్తానంటాడు సరే అది పోనీయండి. ఆ 200 టిఎంసిలు వస్తే ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి.
మూడు కారణాలున్నాయి. ఒకటి మనకు మాత్రమే తెలివి ఉందనుకుంటే తప్పు, బచావత్ ట్రిబ్యునలప్పుడే కర్ణాటక వాళ్లు ఒక ప్రశ్న వేశారు. మహబూబ్నగర్ని చూపించి, అనంతపురాన్ని చూపించి నీళ్ళు చాలా అడిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని. వీళ్ళు రేపు గోదావరి నుంచి నీళ్లు బదిలీ చేయబోతారు. అప్పుడు మాకివ్వరు దాన్ని అన్నారు. అంటే బచావత్ అవార్జ్డులో ఏం రాశారంటే- ఎప్పుడైనా గోదావరి బేసిన్ నుంచి కృష్ణా చేసిన్కు ఆంధ్రప్రదేశ్ నీళ్ళు గానీ బదలాయిస్తే దాంట్లో వాటా కర్పాటక, మహారాస్త్ర కూడా పొందవచ్చు అని రాసి ఉంది. ఆ 200 టిఎంసిలు వస్తే ఏం జరుగుతుంది అంటే - కృష్ణాజలాలలో 90 టిఎంసిలు కర్ణాటక, మహారాష్ట్ర వాటాకు వస్తుంది. 110 మాత్రమే మన వాటా అవుతుంది. ఇది ఒక ప్రాథమిక వాస్తవం. కాని అంతైనా వచ్చింది కదా అనొచ్చు మీరు. రెండవది ఏమౌతుంది అంటే, ఆ వచ్చే 110 టిఎంసిలు ఎక్కడికొస్తాయవి? ప్రకాశం బ్యారేజికి నాగార్జున సాగర్‌కు వస్తాయి. పోలవరం నుంచి 80 ఏమో ప్రకాశం బ్యారేజీకి, దుమ్ముగూడెం నుంచి 120 సాగర్‌కు అవి పైకి పోవుకదా. కర్ణాటకకి, మహారాష్ట్రకి ఎట్ల పోతాయి? అవి పోవు. మరి వాళ్ళు వాటా ఎట్లా తీసుకుంటారు. పైన ఆపేస్తారు. ఏమి ఆపేస్తారు వాళ్ళు - తుంగభద్ర నుండి కిందికి వచ్చే నీళ్ళను ఆపేస్తారు.
తుంగభద్ర నుంచి అనంతపురానికి హెచ్ఎల్సి తీసుకుపోయే నీళ్ళు అపేస్తారు. తుంగభద్ర నుండి ఆర్డిఎస్ రాజోలిబండ డైవర్షన్ స్కీంకు వచ్చే నీరు ఆపేస్తారు. తుంగభద్రనుండి కర్నూలు ఎల్ఎల్సెకి వచ్చే నీళ్ళు ఆపేస్తారు. జూరాల వెళ్ళే నీళ్ళు ఆపేస్తారు. ప్రతి సంవత్సరం ఆపకపోవచ్చు. కాని కరువు సంవత్సరంలో మాత్రం గ్యారంటీగా అపేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? కరువు ప్రాంతాల పేరుమీద గోదావరి బేసిన్‌నుంచి కృష్ణా బేసిన్‌కి ట్రాన్స్ఫర్ చేసి, కరువు సంవత్సరంలో కరువు ప్రాంతాల ప్రాజెక్టులకు వెళ్లాల్సిన నీళ్ళు ఆగిపోతాయి. ఎవరికి పుష్కలంగా ఉంటాయి? కృష్ణా డెల్టాకి మాత్రం గ్యారంటీగా నీళ్ళుంటాయి. సాగర్ కుడి కాలువ, ఎడమ కాలువలో కూడా గ్యారంటీగా నీళ్ళుంటాయి. పైన మాత్రం నీళ్ళు ఆగిపోతాయి. ఇది రెండవది.
9జీ రాగాపాల్ దవన్వాసాట
మూడవది ఉత్తర తెలంగాణ వాదులు చేస్తున్న న్యాయమైనటువంటి ఫిర్యాదు. గోదావరిలో నీళ్ళు అనంతంగా ఉన్నాయని రాయలసీమ వాళ్లు అనుకుంటున్నారు. అనంతంగా ఏమీ లేవు అక్కడ. 680 టిఎంసిలు మిగిలి ఉన్నాయిప్పుడు. 680 టిఎంసిలలో 325 పోలవరం ద్వారా తీసుకోబోతున్నారు. దాంట్లో ఒక చుక్క కూడా తెలంగాణకు రాదు, గోదావరీ నదీ పరీవాహక (ప్రాంతం ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు. 325 టిఎంసిలు పోలవరం ద్వారా తీసుకుంటే ఒక చుక్క కూడా ఈ జిల్లాలకు రాదు. అదంతా కూడా కోస్తా జిల్లాలకు పోతుంది 680లో 325 పోతే ఎంత మిగిలిందండి? 355 మిగిలింది. ఆ 355లో 120 ఇటు దుమ్ముగూడెం నుండి కృష్ణాబేసిన్‌కు తీనుకుంటున్నారు. అంటే 235 మిగులుతుంది. ఉత్తర తెలంగాణకు మిగిలేది 235. ఎవరికైనా కోపం వన్తుంది. మా పక్కన పోయే నీళ్ళు కొంత తీసుకుంటే తీసుకో, మాతో సమానంగా కృష్ణా బేసిన్‌కి పంపిస్తావు. మాతో సమానంగా కింద వాడుకుంటావు, మూడు వంతులు పంచి మాకు ఒక వంతు ఇస్తావు అనంటె ఎట్లా? ఒక జిల్లా రెండు జిల్లాలు కావు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఆరు జిల్దాలు. నహజంగానే అభ్యంతరాలు ఉంటాయి. ఇక్కడొక ప్రశ్న తెలంగాణ వాళ్ళను కూడా అడగాలి. ఏమంటె రాజశేఖరరెడ్డి గోదావరి బేసిన్, కృష్ణాబేసిన్ నీళ్ళు రాయలసీమకే అన్నప్పుడు రాయలసీమకే అని ఎట్టంటావు, నల్గొండ మహబూబ్‌నగర్‌లకు కూడా ఇవ్వాలి అనే బదులు అసలు ఇవ్వనేవద్దు అంటున్నారు వాళ్ళు. ఆ టోన్ ఎందుకు వస్తోంది? గోదావరీ జలాలు కృష్ణా బేసిన్కంటూ వస్తే రాయలసీమకి మాత్రమే కాదు, నల్గొండకివ్వాలి నువ్వు, మహబూబ్‌నగర్ కివ్వాలి నువ్వు అనే బదులు ట్రాన్స్ఫర్ని మొత్తం వ్యతిరేకిస్తాం మేము అంటున్నారు. ఇంత ట్రాన్స్ఫర్ కాదు కొంచెం తీసుకోండి మీరు - ఆ కొంచెంలో దక్తిణ తెలంగాణకు కూడా ఇవ్వండి అనే వాదన కాకుండా, అసలే ఇవ్వడానికి వీలులేదు అన్న వాదన ఎందుకొస్తోంది?
ఇది నేను తెలంగాణలో కూడా అంటూనే ఉన్నాను. తెలంగాణ ఉద్యమం ఉత్తర తెలంగాణ ఉద్యమంగానే ఉంది. గోదావరి బేసిన్ ఉద్యమంగానే ఉంది. అది కృష్ణా బేసిన్ ఉద్యమంగా కూడా ఉండి ఉంటే, దక్షిణ తెలంగాణ ఉద్యమంగా కూడా ఉండీ ఉంటే వాళ్ళ అభ్యంతరం ఇట్లా వచ్చి ఉండేది కాదు. రాజశేఖరరెడ్డి రాయలసీమకు మాత్రమే అనడానికి వీలులేదు. రాయలసీమ, దక్షిణ తెలంగాణ రెండూ
తి
కృష్ణా బేసిన్ ప్రాంతాలే. రెండూ కలిపి మాట్టాడాలి. ఇవన్నీ వివరిస్తూ చాలాసేపు మాట్లాడొచ్చు. కాని ఏం చెయ్యాలి అన్న ప్రశ్నగానీ వేస్తే నేను చాలా కాలంగా అంటున్నది ఒకటి - ఇంతసేపు మనం మాట్లాడుతున్నది కృష్ణా నదిలోని మిగులు జలాల గురించి. ఈ మిగులు జలాలు తెలంగాణకా! రాయలసీమకా? బదిలీ చేయాలా వద్దా ఈ మాటలు మాట్టాడుతున్నాము. కాని నికర జలాలను పునఃపంపిజీ చేయాలి వేరే మార్గం ఏదీ లేదు అని నా ఉద్దేశ్యం. అ పునః పంపిణీ ప్రాతిపదిక క్యాచ్మెంట్ ఎవరిది, ఎవరి క్యాచమెంట్ ఎక్కువుంటే వారికే ఎక్కువ రావాలి అని కాకూడదు. మహబూబ్‌నగర్ మిత్రులు చాలామంది ఇక్కడున్నారు. వాళ్ళు అంటూ ఉంటారు- కృష్ణానది ప్రవహించేది వముహబూబ్నగరలో కాబట్టీ మాకే ఎక్కువ రావాలి అని. ఇది అవునా కాదా అనుకునేముందు మనం గమనించాల్సింది క్యాచ్మెంట్ ఆర్గుమెంట్ అయితే నీళ్ళన్నీ కర్ణాటకవి మనవి కావు. మనం తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా అంటున్న నీళ్ళన్నీ కర్ణాటక నీళ్ళు, 20లక్షల ఎకరాల సాగుకు మనం కర్ణాటక నీళ్ళు తీసుకుంటున్నాము
- వారి క్యాచ్మెంట్ నీళ్ళు. ఆ ప్రాతిపదిక కాదు నేను పెడుతున్నది. అన్ని (ప్రాంతాలకు అందరి ప్రజానీకానికి నీటి మీద హక్కు సమానంగా ఉండాలి అని. ఆ ప్రతిపాదన ఉండాల నంటె ఎక్కడ వర్షపాతం తక్కువ ఉంటె అక్కడ నదీజలాలు ఎక్కువ ఇవ్వాలి. సాంకేతిక సాధ్యాసాధ్యాలు ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టుకు సౌొంకేతికంగా చాలా కష్టంగా ఉంటుంది ఇవ్వడం. సూత్రప్రాయంగా సాగునీటిమిద, తాగునీటి మీద నమానమైన హక్కు ఉండాలి అంటే ఎక్కడ వర్షపాతం తక్కువ ఉంటుందో, ఎక్కడ నీటిని నిలుపుకునే 5016120601 కెపాసిటీ తక్కువ ఉంటుందో, ఎక్కడ భూగర్భజలాలు మరీ లోతుగా ఉంటాయో ఆ ప్రాంతానికి ఎక్కువ నదీ జలాలు, వర్షపాతం ఎక్కువ ఉండే ప్రాంతాలకు తక్కువ నదీజలాలు అనే ప్రాతిపదికగానీ పెట్టుకుంటే - రకరకాల చారిత్రక కారణాల వల్ల ఇవ్వాళ ఈ ఎనిమిది ప్రాజెక్టులు లిస్టవుట్ చేశాము. అవన్నీ కూడా ఒక హక్కుగానే భావించడం బావుంటుంది. అదనంగా అంటే కష్టం. నెట్టెంపాడు, కల్వకుర్తి, శ్రీశైలం ఎడమగట్టు కాలువ, ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ, రాయలసీమకు హంద్రీ-నీవా, గాలేలు - నగరి, ప్రకాశం జిల్లాకు సాంకేతికంగా సాధ్యమయితే వెలిగొండ ప్రాజెక్టు- వీటన్నిటిని హక్కుగానే భావించడం బావుంటుంది.
మరి నీళ్ళు ఎట్టివ్వాలి వీటికి? ఎప్పుడొస్తే అప్పుడిస్తామన్నది సరియైనది కాదు. గోదావరి బేసిన్ నుంచి ట్రాన్స్ఫర్ కూడా సరియైనది కాదు. అవి రెండూ సరియైనవి కానపుడు ఎక్కడనుండి వస్తాయి అంటే, కృష్ణా డెల్టాకిచ్చే వాటాను రెండు రకాలుగా
తో కారాల వ్యాన
తగ్గించడం అవసరం. సాధ్యమే అది. ఒకటి భౌతికంగానే నీటి పరిమాణాన్ని తగ్గించడం. సుందరయ్యగారు కూడా అన్నారని చెవుతారు - కృష్ణా డెల్టా వాసులు పంట మార్పిడికి రెడీ కాకపోతే పైవాళ్ళకు న్యాయం జరగదు అని. అది వాస్తవమైన వైఖరే. న్యాయమైన వైఖరే! దానివల్ల ఎంత వస్తుంది అంటే 80 టిఎంసిలు మాత్రమే వస్తుంది. ఎందుకంటే సాగర్‌కు ఎగువన నదిలోకి వచ్చి చేరే నీళ్ళలో దిగువన నికర జలాలుగా కృష్ణ డెల్దాకు ఎంత పోతాయి అంటే 80 టిఎంసిలు మాత్రమే పోతాయి. ఇంకా తగ్గియ్యాలి అంటే ఒకే ఒక మార్గం పాలేరు మీద గానీ, మూసీనది మీద గానీ కొత్త ప్రాజెక్టు కట్టి తగ్గించవచ్చు. కానీ అవి ఇప్పుడు అవుతాయో లేదో చెప్పడం కష్టం. కాని ఆ 80 టిఎంసిలు చాలవు. సాగర్ ఎగువన - అంటే సాగర్ డ్యాంను గోడగా మార్చాలి. గేట్లు ఉండవు. దానికి దిగువన వచ్చే నీళ్ళు మాత్రమే కృష్ణా డెల్టాకు పోతాయి. మిగిలినదంతా కూడా సాగర్. సాగర్ ఎగువన ఉంచుకుంటే 80 టిఎంసిలు అదనంగా వస్తాయి. కానీ అవి కూడా చాలవు, ఇప్పటికే మనం మిగులు జలాల ప్రాజెక్ట్సలు రెండు కట్టేస్తున్నాము. ఒకటి తెలుగుగంగ దాదాపు అయిపోయింది. రెండోది ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ - ఆది కూడా దాదాపు అయిపోయింది.
ఎలిమినేటి మాధవరెడ్డి కాలువలో జరిగిన మరొక అన్యాయమేంది అంటే, సైలెంట్‌గా ఎవరూ మాట్లాడకుండా హైదరాబాద్‌కు 16 టిఎంసిలు తీసుకొస్తూ ఉన్నారు. పేరు చెప్పిందేమో నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రాంతాలు మునుగోడు, నారాయణపురం మండలాలకు నీళ్ళియ్యాలి, అక్కడ ఫ్లోరైడ్ తీవ్రంగా ఉంది అని చెప్పి - దానికోసం ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ కట్టి, 4 టిఎంసిలు మాత్రమే హైదరాబాదుకు అని చెప్పి ఇప్పుడు 16 టిఎంసిలు దొంగతనంగా తీసుకువస్తున్నారు. అయినా ఎవ్వరూ మాట్లాడరు. ఎంతమంది నల్గొండ వాళ్ళు మాట్లాడినా సరే ఉద్యమంగా రాలేదు. ఆ కాలువ అయిపోయింది. అంటే ఇవాళ తెలుగుగంగ పేరుమీద 30 టిఎంసిలు అదనంగా తీసుకుపోతున్నారు. కడపకు, నెల్లూరుకు, చిత్తూరుకు కూడా తీసుకుపోతున్నారు దానిని. ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ పేరుమీద మరో 25 టిఎంసిలు పోతున్నాయంటే, 55 టిఎంసిలకు ఇప్పటికే జరిగిపోయింది నిర్మాణం.
కాబట్టి 80 టిఎంసిలు మాత్రమే సాగర్ దగ్గర ఆపితే చాలదు. నెట్టెంపాడుగానీ కల్వకుర్తిగానీ, శ్రీశైలం ఎడమగట్టు కాలువగానీ, హంద్రీ - నీవాగానీ, గాలేరు - నగరి గానీ పూర్తికావాలంటే, వాటికి నీళ్లు రావాలంటే దానికి ఒకటే ఒక మార్గం శతిపాదిస్తున్నారు చాలా కాలంగా. నికర జలం అనే దానిని అంచనా వేసేటప్పుడు డిపెండబిలిటీ ఫ్యాక్టర్
త్ క్యా
ఒకటి తీసుకుంటారు. ఏమని అంటే నాలుగింట మూడు సంవత్సరాలు అయితే 75% డిపెండబిలిటి అంటున్నారు. అంటే నాలుగింట మూడు సంవత్సరాలు గ్యారంటీగా ఉంటున్న నీళ్ళకే ప్రాజెక్టులు కట్టుకుంటాము అని. దానినే నికర జలం అంటున్నారు. అవే 2080 టిఎంసిలు ఉన్నాయని అంటున్నారు. దాన్ని ఎవరూ హేతుబద్ధమైనది కాదు అని అనడం లేదుగానీ కృష్ణానది మీద ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనంగానీ దానిని 60%కి తగ్గిస్తే, నాల్గింట మూడేళ్ళు కాదు ఐదింట మూడేళ్ళు గ్యారంటీ ఉంటుంది రైతుకు అనిగాని తగ్గిస్తే మరొక 200 టీఎంసిలకు ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. ఆ రెండు వందల టిఎంసిలకు ఈ అన్ని ప్రాజెక్టులకు సరిపోతాయి. ఒకోదానికి 30, 40 గానీ కేటాయిస్తే 3 లక్షల, 4 లక్షల ఎకరాబకు నీళ్ళు ఇవ్వడానికి, ఐదింట మూడేళ్ళు నీళ్ళు అందియ్యడానికి అది సరిపోతుంది. కాబట్టి కృష్ణా డెల్టాకు సాగర్ దిగువ నుంచి పోయే 80 టిఎంసిలు అపితే సాగర్దగ్గర ఆ 80 టిఎంసిలు+ డిపెండబిలిటీ 75 నుండి 60శాతం దాకా తగ్గించడం ద్వారా వచ్చేటటువంటి మరొక 200 టిఎంసిల నికర జలాలను కలుపుకుంటె ఈ అన్ని ప్రాజెక్టులు కట్టుకోవచ్చు.
దీనికి కూడా మన కృష్ణాడెల్దా వాసులు ఒప్పుకోవాల్సిందే. సాగర్ కుడి కాలువ, ఎడమ కాలువ వాళ్ళు కూడా అప్పుడు ఒప్పుకోవలసిందే. వాళ్ళ భరోసా తగ్గుతుంది గానీ నీళ్ళుంటాయి. వాళ్ళకు కూడా లేని సంవత్సరాలలో వర్షపాతం మీద ఆధారపడక తప్పదు. అప్పుడు అందరిలాగా వాళ్ళు కూడా బతకాలి. దీనికి వాళ్ళు అంగీకరిస్తే బాగుంటుంది గానీ దురదృష్టవశాత్తు ఈ చర్చ ప్రజాతంత్ర ఉద్యమాలలో కూడా పెట్టడం సాధ్యం కావడం లేదు. ఎందుకంటె తెలంగాణలో వైఖరి మిగులు జలాలు మొత్తం తెలంగాణకేనని రాయలసీమ వైఖరి మిగులు జలాలు మొత్తం రాయలసీమకేనని. రెండూ అవాస్తవికమైన ఆలోచనలు. ఈ అన్ని ప్రాజెక్టుల మధ్య వాటిని పంచుకోవాలి. మిగులు కాకుండా ఉండాలి, నికరజలాలే కావాలి అంటే ఈ రకమైన మార్గాలు అనుసరించాలి అనే ప్రతిపాదన పెట్టాలి. దాని మీద చర్చ జరిపి ఒక వైఖరి తీసుకోగలిగితే ప్రజాతంత్ర ఉద్యమకారులు - ప్రజలను విడగొట్టి ద్వేషాలను పెంచే రాజకీయాలకు విరుద్ధవైన వాతావరణాన్ని వెనుకబడిన (పాంతాల వుద్య వనం పెంపాందించగలుగుతొము. చివరిగా పోతిరెడ్డిపాడు గురించి చెప్పి ముగిస్తాను.
రాజశేఖరరెడ్డిగారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుతున్నాడు అంటే ఎక్కువ నీళ్ళు తీసుకోవటానికి పెంచుతున్నాడు. ఆయన చెప్పున్న వాదన ఏమిటి?
తి భూ వా
వర్షాలు పడ్డాక కృష్ణా నదిలో ఇదివరకు 45 రోజులకు నీళ్ళు వచ్చేవంట తీరికగా. ఇప్పుడు ఆల్మట్టి కట్టిన తరువాత 33 రోజులలో వచ్చేస్తున్నాయంట. ఎవరు చెప్పారో నాకు తెలియదుగాని నిజమేనని అనుకుందాం కొంతసేపు. 45 రోజులలో మెల్లగా వచ్చేవి ఇప్పుడు 33 రోజులలో వచ్చేస్తుంటే. మరి తెలుగుగంగకు, గాలేరు - నగరికి నీళ్ళు తీసుకోవాలి కదా! వచ్చి వెళ్ళిపోతాయి కదా అవన్నీ కూడా త్వరగా తీసుకోకపోతే. 33 రోజులలో క్రిందికి పోతాయి అవి, త్వరగా తీసుకోవాలంటే సామర్థ్యం పెంచుకోవాలి. అందుకని పెంచుతున్నాను అన్నాడు. బాగానే ఉంది. ఆ మిగులు జలాల మీద ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కదా! నెట్టెంపాడు ఉంది, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఉంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఉంది, ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ ఉంది. రాయలసీమకి హంద్రీ - నీవా ఉంది. ప్రకాశం జిల్లాకు వెలిగొండ (ప్రాజెక్టు ఉంది. వాటికి నీళ్లుపోయే ప్రాజెక్సల మూతి వెడల్పు చేయవా నువ్వు? అవి మూతి ఉండేవి కావనుకోండి; లిప్టలు అయితే ఎక్కువ మోటార్లు పెట్టు. నెట్టెంపాడుకు రెండురెట్లు మోటార్జు శాంక్షన్ చేయి. కల్వకుర్తికి రెండురెట్ట్లు ఎక్కువ మోటార్లు శాంక్షన్ చేయి. అవి చేయకుండా ఇది మాత్రం చేస్తా అని నువ్వంటె సహజంగానే అందరికీ కోపం వస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తే బహుళ ఇంకా బాగా అర్ధమవుతుంది. టిఎంసిలు, మోటార్లు అంటే అర్ధం కాకపోవచ్చు. చిన్న కాలువ పోతూ ఉంటుందండి ఒకచోట - ఎనిమిదిమంది రైతులుంటారు. రోజులో అర్ధగంట మాత్రమే నీళ్ళు పోతాయి ఆ కాలువలో, ఎనిమిది మందికీ హక్కుంది. ఒకాయన బకెట్‌తో తీసుకుంటాడు, ఒకాయన ట్యూబ్ పెట్టి నాల్లుకుంటాడు నోటితో. మొత్తం ఎనిమిది మందీ తీసుకుంటూ ఉన్నారు. అర్థగంట వచ్చేది పావుగంటలో వెళ్ళిపోతాయి నీళ్ళంతా. అకస్మాత్తుగా మారిపోయింది అంతా. రాజశేఖరరెడ్డిగారు చెప్పారు కాబట్టి మారిపోతుంది పరిస్థితి. ఆల్మట్టి వచ్చేసింది కాబట్టి పావు గంటలో వెళ్ళిపోతాయి నీళ్ళంతా కూడా. వాళ్ళలో ఒకాయన ఆయన బంధువు. ఆయనకు రెండో బకెట్ ఇస్తాడు - నువ్వు రెండు బకెట్లు పెట్టుకో అంటాడు. మిగిలిన వాళ్ళకి ఏమీయడు. ఏమనుకుంటారు వాళ్లు? మా వాటా వేము తీసుకోలేకపోగా రెండో బక్కెట్‌తో ఆయన మా వాటా కూడా తీసుకుంటాడేమోనని డౌట్ రాదా ఎవరికైనా. చిన్న విషయమది. ఎందుకు కడప వాళ్ళకి అర్థం కాదిది? కడపలో డెమోక్రసీ లేకుండా పోలేదు కదా. ఈ లోగా హైదరాబాద్ బ్రదర్స్ ఏమంటారంటే తీసుకునేవి మిగులు జలాలు అయినపుడు అంత కింది నుండి ఎందుకు పైనుండి తీసుకోరాదా అంటున్నారు. ఇది సాంకేతిక విషయం. ఇది పొన్నాల లక్ష్మయ్య, జనార్దన్‌రెడ్డి తలి కల్యా “నడ్తేుం
స్టేజి ఎక్కి తిట్టుకుంటె అయ్యేదికాదు. ఇంజనీర్లు చెప్పాలి. స్టేజి ఎక్కి సవాళ్ళు విసురుకునే, రాజీనామా చేసుకునే విషయం కాదది.
ఈ కొట్టాటలు శాశ్వతంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఒక రివర్వాలీ అథారిటీ (నివారణా యంత్రాంగం) పెట్టుకుంటె మంచిది. అంటే ఈ కృష్ణా జలాల్గో- మిగులు జలాలు, నికరజలాలు ఎలా పంచాలి, ఎవరికి పంచాలి, ఏ గేటు ఎప్పుడు తెరవాలి, ఏ గేటు ఎప్పుడు మూయాలి... బైరెడ్డి రాజశేఖరరెడ్డిలాంటి వాళ్లు వచ్చి గేటు పగలకొట్టే ప్రమాదం ఒకటి ఉంటుంది కాబట్టి అలాంటి అథారిటీ ఒకటి ఉండాలి. దాంట్లో రాయలసీమ వాళ్ళాద్దు, తెలంగాణ వాళ్ళొద్దు, ఆంధ్రావాళ్ళొద్దు, బెంగాల్ వాళ్ళని పెట్టుకుందాం కావాలంటే. ఇంజనీర్లని కూచోబెట్టి నిర్ణయం చేయమందాం. నియమాలు శ్లీయర్గా ఉండాలి. జి.ఓ,లు క్లియర్‌గా ఉండాలి! అవి అమలు కావాలి! అట్టయితేనే కొట్లాటలు లేకుండా ఉంటుంది. ప్రాథమికంగా నీటి హక్కు అనేది అందరికీ సమానంగా ఉండాలి అనే ప్రాతిపదిక మీద తెలంగాణ, రాయలసీమల మధ్య ఉన్న ఈ తగాదా పరిష్కారమైతే బాగుంటుంది అని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.
ఆహ భాతి (చిరనం 5వ రాష్త్ర సాపొత్య పాఠశాల- కర్పూలు 13,14 జనవరి 2007) 006 కారాపాల్ దవన్నాాద
వాకపల్లి - కోర్టులు న్్ ణల
"హైకోర్స నుంచి ఏదో ఒక అర్జర్ వస్తుంది; దోషులను అరెస్టు చేస్తారు; నేర పరిశోధన, నేర విచారణ జరుగుతాయి అన్న ఒక అభిప్రాయం ఉండింది ఇన్నాళ్లూ. కాని హైకోర్టు చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా, వాకపల్లిలో ఏమైనా జరిగిందో లేదో మేము చెప్పలేక పోతున్నాం కాబట్టి కేసు మూసేస్తున్నాము అని కేసు మూసేయడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. నేరం జరగలేదు అని మేము అనుకుంటున్నాము కాబట్టీ మూసేస్తున్నాము అంటే అది అబద్ధమైనా అది ఒక తీర్చు అనుకోవచ్చు. కాని హైకోర్టు నేరం జరగలేదు అని చెప్పలేదు. జరిగిందనీ చెప్పలేదు. మాకు అర్ధం కావడం లేదు కాబట్టి కేసు మూసేస్తున్నాము అనేది న్యాయస్థానాల పాత్ర గురించి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చాలా ఆశ్చర్యమూ, బాధా, ఆవేదనా కలిగించేటటువంటి విషయం.
అయినా హైకోర్టును ఎవరడిగారు నేరం జరిగిందా లేదా నువ్వు చెప్పు అని. హైకోర్టు డ్యూటీ ఏమిటి? అన్ని వ్యవస్థలూ సక్రమంగా పని చేసేటట్లు చూడటమే హైకోర్టు చేయాల్సిన పని. ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చెయ్యాలి, చార్జిషీటు వెయ్యాలి - అది వాళ్ళ డ్యూటీ. డాక్టర్లు, వైద్యులు సక్రమంగా వైద్య పరిక్షలు జరపాలి, ఆ రిపోర్టు వాళ్ళు ఇవ్వాలి - అది వాళ్ళ డ్యూటీ. ఈ లోపున మేజిష్టేటు కోర్టు దోషులకు రిమాండ్ ఇచ్చి వాళ్ళు తప్పించుకొని పారిపోకుండా, నేరపరిశోధనకు అందుబాటులో ఉండేటట్లు చూడాలి - అది కింది కోర్టు డ్యూటీ. ఎస్.సి. ఎస్.టి. కేసు కాబట్టీ ప్రభుత్వమే 1989లో జారీ చేసిన జీ.వో. ప్రకారం బాధితురాళ్ళకు తక్షణం కొంత అర్థిక సహాయం ఇచ్చి, చార్జిషీటు వేసిన తరవాత మరికొంత ఇచ్చి, వాళ్ళుగానీ పునరావాసం కోరుకుంటే పునరావాసం ఇవ్వాలి - అది ప్రభుత్వం డ్యూటీ. వీళ్ళందరూ వీళ్ళ వీళ్ళ డ్యూటీలు సక్రమంగా చేసేటట్లు చూడటమే హైకోర్టు డ్యూటీ. రాజ్యాంగంలో దాని పాత్రే అది.
102 4 రాజ్బుం - నంక్షేమం శ
హైకోర్టును మనం అడిగింది తమ విధి నిర్వహణను పోలీసులు చెయ్యడం లేదు - చెయ్యించండి వాళ్ళ చేత అని, తన విధి నిర్వహణను ప్రభుత్వం చెయ్యడం లేదు - చెయ్యించండి దాని చేత అని. అత్యాచారం జరిగింది అని పదకొండు మంది మహిళలు ఫిర్యాదు చేసినప్పుడు, ఏఏ వ్యవస్థలు ఆ ఫిర్యాదు మీద ఏమేమి చెయ్యాలో వాళ్ళివ్వరూ అవేమీ చెయ్యలేదు. అంతా పడుకొన్నారు, నిద్రపోతున్నారు, నేరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళచేత చట్టం వాళ్ళకు నిర్దేశించినటువంటి బాధ్యతలను నిర్వర్తింపచెయ్యండి అని హైకోర్టుకు పోతే హైకోర్టు కూడా తన డ్యూటీ మర్చిపోయింది. తను ఎందుకోసం ఉందో హైకోర్టూ మర్చిపోయింది.
"హైకోర్టు కేసు తీసుకున్నవెంటనే ఏం చెప్పాలి? చాలాసార్లు అన్నాం ఈ మాట
- మీరూ అన్నారు, మేమూ మొదటినుంచీ అంటూనే ఉన్నాం - ఆ రోజు కూంబింగ్‌కు పోయిన పోలీసులు ఎవరు? వాళ్ళ పేర్ణు బయట పెట్టాలి అని హైకోర్టు ఆదేశించాలి అని అడిగాం. ఆ పని హైకోర్టు చెయ్యలేదు. వాళ్ళ పేర్లు ఎవరికి తెలుస్తాయి? మనకు తెలియదు. బాధితురాళ్ళకూ తెలియదు కదా. మరి తెలిసింది ఎవరికి? పోలీసులకే కదా. పోలీసులకు హైకోర్టు ఆదేశం ఇచ్చి వాళ్ళ పేర్లు బయటపెట్టు, ఎఫ్.ఐ,ఆర్‌లో వాళ్ల "పేర్లు రాయి, రిమాండ్‌కు పంపు అనొచ్చు కదా! వేరే ఎవరైనా రేప్ చేసినా, మర్దర్ చేసినా, నేరం చేసినా ఏం జరుగుతుంది? అరెస్టు చేస్తారు, రిమాండ్ చేస్తారు. ఆ పనే చెయ్యాలి మీరు అని హైకోర్టు పోలీసు ఎస్పినని గానీ, గ్రేహండ్స్ ఎస్పి.ని గానీ ఆదేశించవలసి ఉండింది. ఆ పని హైకోర్టు చెయ్యలేదు. వెంటనే బాధితురాళ్ళ వాంగ్మూలాలు నమోదు చెయ్యి అని ఆదేశం ఇయ్యవలసి ఉండింది. ఆ పని హైకోర్టు చెయ్యలేదు. మొట్టమొదట జరగవలసింది ఒక ఫిర్యాదు చేసినప్పుడు - ఫిర్యాదు చేసినవాడు, సాక్షులు, బాధితులు వాళ్ళందరి వాంగ్మూలాలు నమోదు చెయ్యాలి. వాళ్ళు విషయం మర్చిపోయే లోపల, వాళ్ళు భయపడిపోయే లోపల, వాళ్ళు బెదిరిపోయే లోపల, వాళ్ళను బెదిరించే లోపల, వాళ్ళను ఇంకొక రకంగా నోరు మూయించే లోపల త్వర త్వరగా వాళ్ళ వాంగ్మూలాలు నమోదు చెయ్యాలి. పోలీసులు చెయ్యలేదు. ఆ పని చెయ్యమనే ఆదేశము హైకోర్టూ ఇవ్వలేదు. హైకోర్టు ఏం చేస్తూ వచ్చిందంటే వీళ్ళ ఫిర్యాదు నిజమా కాదా అని తాను పరిశీలించడం మొదలుబెట్టింది. తన డ్యూటీ అది కాదు. విచిత్రంగా బాధితురాళ్లు దోషులయి కూర్చున్నారు. దోషులు స్వేచ్చగా ఉన్నారు. నేరం చేసినోడు "స్వేచ్చగా ఉన్నాడు. నేరానికి గురయిన వాళ్ళు దోషులయ్యారు. నిజమైన ఫిర్యాదా, అబద్ధమైన ఫిర్యాదా అని పరిశీలిస్తున్నారు. అన్ని ఫిర్యాదులూ అట్లే
202 తోహ్హాగపాల్ దవన్వాదాదో
చేస్తారా? ఆదివాసుల మీద అడవిలో చెట్లు నరికారని కేసు పెడతారు. పోడు కొట్టారని కేసు పెడతారు. దోషులు అఆదివాసులా, ఫారెస్టు వాళ్ళా? ఆదివాసులే అవుతారు కాని ఫారెస్టు వాళ్ళు కారు కదా, ఫారెస్టు వాళ్ళు సక్రమంగా కేసు పెట్టారా అని పరిశోధన చేస్తారా ఎవరైనా? ఆ ఆదివాసుల మీదే కేసు పెడతారు. జైలుకు పంపిస్తారు. నేర విచారణ ఏదో జరుగుళుంది. సరిగ్గా చేశారా లేదా అనేది కోర్టు నిర్ణయం చేస్తుంది. ఇదీ ఎక్కడైనా జరిగేది.
కాని మొదలు పెట్టడం పెట్టడమే ఇచ్చిన ఫిర్యాదు రైటా కాదా అనేది కోర్టు పరిశీలన చేయడం చాలా అన్యాయమైన వైఖరి, పదే పదే అంటూ వచ్చాం - అదివాసులు కాకపోతే, ఆదివాసీ మహిళలు కాకపోతే ఇలా జరిగేదికాదని. వేరే ఎవ్వరయినా ఈ రకమైనటువంటి ఫిర్యాదు చేస్తే సీరియస్‌గా తీసుకునే వాళ్ళు. అరెస్టులు చేసేవాళ్ళు. కేసు పెట్టేవాళ్ళు. నేర విచారణ జరిగేది. ఇంత నిర్లక్ష్యం, ఇంత లోకువ ఎందుకూ అంటే ఆదివాసులు కాబట్టి, ఆదివాసీ మహిళలు కాబట్టి. ఏజెన్సీలో బతికే అమాయకులు కాబట్టి. ఆ లోకువ, నిర్లక్ష్యం ఎస్.ఐకు ఉంటే దుర్మార్గుడు అనుకుంటాం. పోలీసు వ్యవస్థ సంస్కృతే అట్లా ఉంది అనుకుంటాం. ఇతర అధికారులకు ఉంటే పాలనా వ్యవస్థ సంస్కృతి అట్లా ఉంది అనుకుంటాం, న్యాయస్థానం వైఖరే అట్లా ఉంటే ఏం చేయాలి? రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ వైఖరీ అదే రకంగా ఉంటే ఏం చేయాలి? అప్పుడు ఏమనుకోవాలి... మొత్తం సమాజం ఇట్లా ఉందనే అనుకోవాలి. మొత్తం సమాజం ఈ రకంగా ఏడ్చింది. వాళ్ల దృష్టిలో మనుషులందరి విలువా ఒక్కటి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్‌కు పూలమాల వేశాం ఇప్పుడే. ఆయన పదే పదే అన్నాడు - మనుషులందరిక్షీ ఒకే విలువ ఉండే సమాజం కావాలి మనకు అని. అందరికీ తిండి కావాలి, అందరికీ బట్టలు కావాలి, అందరికీ పనులు కావాలి - అవన్నీ జరగాలంటే వాటి మూలం అందరికీ ఒకే విలువ ఇవ్వడంలో ఉంది అన్నాడు. అందరికీ ఒకే విలువ ఉండే సమాజం కావాలి అని ఆయన కోరుకున్నాడు. అందుకోసమే రాజ్యాంగం రాశాను అన్నాడు ఆయన, రాజ్యాంగంలో కోర్టులు పెట్టాం, ఎన్నికలు పెట్టాం, పార్లమెంటు, అసెంబ్లీ ఇవన్ని ఎందుకోసం పెట్టాము అంటే అందరికీ ఒకే విలువ ఉండే సమాజం రావడం కోసం అన్నాడు. అది ఇప్పటికీ రాలేదు. దరిదాపుల్లోకి కూడా రాలేదు అనడానికి ఈ వాకపల్లి అత్యాచారం ఉదంతం చాలా ఘోరమైన, బాధాకరమైనటు వంటి ఉదాహరణ.
చివరకి హైకోర్టు ఏం చేసింది? ఇక్కడ ఎస్.సి., ఎస్.టి. చట్టం తెలిసిన వాళ్ళు
08 శ రాజ్యం - సంక్షేమం శ
చాలామంది ఉన్నారు. మీకు తెలుసు, ఆ చట్టం కింద నమోదు అయిన నేరంలో నేర పరిశోధన, ఇతర చర్యలు ఏవైతే చేపట్టాలో అవి సక్రమంగా చేపట్టని అధికారి కూడా నేరస్తుడే అని ఉందని. వేరే ఏ చట్టంలో అట్లా లేదు. భారత దేశంలో ఉన్న చట్టంలో, రాజ్యాంగంలో ప్రభుత్వ ఉద్యోగి తన డ్యూటీ చేయకపోతే నేరం కాదు. చేస్తే చేస్తాడు లేకపోతే లేదు. అయినా జీతం వస్తూనే ఉంటుంది. ఒక్క ఎస్.సి. ఎస్.టి. చట్టంలో మాత్రమే ప్రత్యేకంగా ఏమి రాశారు అంటే ఈ చట్టం కింద ఒక నేరం నమోదు అయితే ఆ నేరం విషయంలో ఎవరెవరు ఏమేమి చెయ్యాలో, ఎవరెవరు ఏమేమి పాత్ర నిర్వర్తించాలో, అది నిర్వర్తించకపోతే కూడా నేరమే; దానికి ఒక సంవత్సరం జైలు శిక్ష అని రాశారు. ఈ సంగతి హైకోర్టుకు తెలియదా? రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌కు తెలియదా? ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన తరవాత నేరపరిశోధన చెయ్యనటువంటి ఆ పోలీసు అధికారి దీని కింద నేరస్తుడే కదా? ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన తరవాత జీ,వో.3 ప్రకారం బాధితురాళ్ళకు నష్ట పరిహారం ఇవ్వనటువంటి ప్రభుత్వ అధికారులు
- వాళ్ళూ నేరస్తులే కదా? గ్రేహాండ్స్ దళం అక్కడకి పోయింది అని ఒప్పుకొంటూ కూడా వాళ్ళ పేర్లు బయట పెట్టనటువంటి గ్రేహౌండ్స్ ఎస్,పీ - అతనూ నేరస్తుడే కదా? వీళ్ళందరూ నేరస్తులే. వీళ్ళమీద కూడా కేసు పెట్టండనే ఆదేశం హైకోర్టు ఇవ్వవలసి ఉండె. మరి ఎందుకు ఇవ్వలేదు హైకోర్టు? ఆ మాత్రం చట్టాలు తెలియని జడ్జీలేమీ లేరు. ఎవరికి వాటిని వర్తింపచేస్తారు, ఎవరికి వాటిని వర్తింప చేయరనేది నిర్ణయించుకుంటారు వాళ్ళు. ఎప్పుడు వర్తింపచేస్తారు, ఎప్పుడు వర్తింపచేయరో కూడా వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇది చాలా చురదృష్టకరం.
రాజకీయాలకు, ప్రభుత్వాల అవసరాలకు, ప్రభుత్వాలకు ఉండేటటువంటి ఒత్తిళ్ళకు అతీతంగా న్యాయవ్యవస్థ పని చెయ్యాలి, అప్పుడప్పుడు చేస్తుంది. అందుకే ఇంకొద్దిగా గౌరవం మిగిలిఉంది. అప్పుడప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందయిన తీర్పులు ఇస్తూ ఉంటారు. అందుకే ఆ గౌరవం ఇంకా మిగిలిఉంది. కానీ ఇక్కడకొచ్చేసరికి ప్రభుత్వ యంత్రాంగం దగ్గర మొదలు పెట్టి న్యాయవ్యవస్థదాకా ఒకే ఒక ఆలోచన, గ్రేహౌండ్స్ పోలిసులను అరెస్టు చేస్తే, వాళ్ల మనో స్టైర్యం దెబ్బతింటే - నక్ళలైట్ల మీద పోలీసులు చేస్తున్న యుద్ధం, ప్రభుత్వం చేస్తున్న యుద్ధం అగిపోతుందేమో, దెబ్బ తింటుందేమో అని. కానీ దానిక్రీ వాకపల్లి కేసుకు ఏమి సంబంధం? ఆ భయాన్నో ఆ ఆందోళననో, ఆ శంకనో మీరు అడ్డం పెట్టుకొని పదకొండు మంది స్త్రీలు తమపైన
శే0శ శాంగపాల్ దవన్యానాద
అత్యాచారం జరిగింది అని చెపుతుంటే నేరపరిశోధన జరిపించము, జరపము అంటే అది ఏ రకంగా న్యాయం అవుతుంది. నీ పోరాటం నువ్వు చేసుకో, నక్సలైట్ల మీద. సరయినటువంటి పద్ధతులద్వారా, క్రమశిక్షణ కలిగినటువంటి పోలీసు యంత్రాంగం ద్వారా, ప్రజలను అత్యాచారాలకు, హింసకు గురి చేయని పోలిసు యంత్రాంగం ద్వారా ఆ పని చెయ్యి. ఎవ్వరూ కాదనరు. కానీ దానికోసం ఒక రౌడి మూకను తయారుచేసి....వాళ్ళు ప్రజలను హింసించినా, వేధించినా, అత్యాచారాలు వేసినా కేసు పెట్టము, విచారణ జరపము - ఆ పని చేస్తే వాళ్ళ మనోస్టైర్యం దెబ్బతింటే తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న మహత్తర కార్యక్రమం దెబ్బతింటుందీ అనంటే మరి ప్రజలు దీంట్లో పావులా? ప్రజలేమన్నా గొర్రెలు, మేకలా? బలి పశువులా? చాలా అన్యాయమైన వైఖరి ఇది. ప్రభుత్వానికుంటే ఏమో అనుకోవచ్చు, న్యాయస్థానానికి ఇదే వైఖరి ఉంటే ఏమనుకోవాలి?
మేము చాలా కేసులు వేస్తుంటాం కోర్టులో. న్యాయస్థానాన్ని మేము ఏవేవో అభ్యర్థిస్తాం - అవన్నీ మమ్మల్ని అడగవద్దు, ఒకటే అడగండి మమ్మల్ని. చట్టం ఏమిటో చెప్పండి. ఆ చట్టాన్ని అమలు చేయమని ఆదేశాలు ఇస్తాం - అంటారు. వేరే విషయాలు మా దగ్గరికి తీసుకురావద్దు అంటారు. ప్రజల తరపున అడుగుతాము అప్పుడప్పుడు. ఏమని? అయ్యా! చట్టం పరిధికే పరిమితం కావద్దు మీరు, చట్టాన్ని దాటిపోయి చూడండి, ప్రజల కష్టాలు చూసి కొంచెం అధికంగా ఒక ఉత్తర్వు ఇవ్వండి అని కోర్టును అడిగితే మా న్యాయమూర్తులు ఏమంటారు? మాకు అవన్నీ చెప్పాద్దు మీరు; మీ కష్టాలు, మీ సమస్యలు మాకనవసరం. మాకు చట్టం ఒకటే కావాలి. చట్టం అమలు చేయించడం ఒక్కటే మా డ్యూటీ అని మాకు చెప్తారు. మరి ప్రభుత్వానికి ఆ మాట చెప్పలేకపోయారే వాళ్లు? ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేకపోయారు వాళ్లు? ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి వాళ్ళను అరెస్టు చెయ్యి, పేర్లు బయటపెట్టు, చార్జిషీటు వెయ్యి, నేరపరిశోధన విశాఖపట్నంలో ఉండే ఎస్.సి, ఎస్.టి. ప్రత్యేక కోర్టు చేస్తుంది అని ఎందుకు హైకోర్టు ఆదేశం ఇవ్వలేకపోయింది? చాలా అన్యాయమైనటువంటి వైఖరి ఇది. చివరకు సిబిసిఐడి నేరపరిశోధన చేసి రెండు వారాలలో నివేదిక ఇవ్వమన్నారంట. చాలా ఆశ్చర్యమనిపించింది నాకు దీన్ని చూసినప్పుడు. రెండు వారాలలో ఎట్లా ముగిస్తారు వాళ్ళు? అంటే మీ అభిప్రాయం ఏమిటి? ఏదో ఒక రిపోర్టు ఫైల్ చెయ్యమనా? వాళ్ళు ఆ ప్రకారమే నివేదిక ఇచ్చారు. సిబిసిఐడి నేరపరిశోధన ఎట్టా సాగిందంటే నేరం చేసినవాడి మీద కాదు, ఫిర్యాదు దారులమీద పరిశోధన చేశారు.
శ్రేంిర్
“మొదట్లో ఏం చెప్పారు - గుర్తు పట్టగలం అన్నారు. తరవాత ఏం చెప్పారు - గుర్తుపట్టలేం అన్నారు” అని సిబిసిఐడి నెపం వాళ్లమీదే పెట్టింది. అవును కాలం గడిచింది. జరిగిన తెల్లవారి ముఖాలు జ్ఞాపకం ఉండి గుర్తు పడతామని ధైర్యంగా అన్నారు. మూడు నెలలు కావస్తుంది, ఏమో గుర్తుపట్టలేమేమో అనడం తప్పా! అయినా ఇదంతా ఎందుకు? వాళ్ళను ప్రవేశపెట్టండి. గుర్తు పట్టగలరో లేదో తేలిపోతుంది కదా. ఈ మీమాంస ఎందుకు? వాళ్ళపేర్లు చివరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి నాగిరెడ్డిగారు తన నివేదికలో బయటపెట్టారు. ఆ రోజు కూంబింగ్‌కు పోయినటువంటి ఆ గ్రేహౌండ్స్ సిబ్బంది ఎవరు అని ఆయన తెలియజేశారు. వాళ్ళు వాళ్ళను తీసుకొచ్చి ఈ పదకొండు మంది స్త్రీల ముందు ఫ్రవేశపెట్టి గుర్తు పడతారా లేదా అని అడిగి చూడొచ్చుగా! వాళ్ళు చెప్పే వాళ్ళు కదా. గుర్తుపడతారో లేదో తేలిపోయేది అక్కడే. ! పని చేయకుండా, మొదటేమో గుర్తుపడతామూ అన్నారు, ఇప్పుడేమో గుర్తుపట్టలేమూ అంటున్నారు కాబట్టి మాకు అనుమానంగా ఉంది అన్నారు. వెంటనే తేలిపోయే విషయానికి ఈ తర్కమెందుకు? ఇందులో మీమాంస ఏముంది?
అక్కడ పడిఉన్న గాజులు ఆమె సైజువి కాదు అని అడగటమేమిటి? అయినా నువ్వు ఎప్పుడు చూశావు అ గాజులను- రెండున్నర నెలల తరువాత. కృత్రిమంగా అక్కడ గాజులు పగలగొట్టి వేసే ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు అమె నిజమైన గాజులే వెయ్యగలరు కదా. చిన్నగాజులు తెచ్చి వేస్తారా, కృత్రిమంగా వెయ్యదల్పుకుంటే! చిన్న గాజులు ఎవరు వేసి ఉండవచ్చును? ఫిర్యాదు తప్పు అని రుజువు చేసే ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు వేసి ఉండవచ్చును కదా. నీకు ఆ అనుమానం ఎందుకు రాలేదు? బాధితుల మీద అనుమానం ఎందుకు వచ్చింది నీకు? ఎందుకంటే ఆయన దర్యాప్తు చేస్తున్నది దోషులను కాదు, ఫిర్యాదిని. చాలా విచిత్రంగా ఉంది. ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు నేర పరిశోధన జరగాల్సింది దోషిపైన, ఫిర్యాదిపైన కాదు. కానీ సిబిసిఐడి ఫిర్యాదిపైన దర్యాప్తు చేస్తూ ఉంది, దోషిపైన కాదు. ఈ రెండు వాక్యాలు చెప్పి నాగిరెడ్డిగారు తన నివేదికలో నేరం జరిగినట్టే భావిస్తున్నాను అనడానికి చూపించిన ఆధారాలు పక్కకు పెట్టేసి - “ఒక చిన్నబ్బాయి చెప్పాడు, నేను చూశాను” అని, “11, 12 ఏళ్ళ పసిబాలుడు అబధ్భం చెప్తాడు అని నేను అనుకోవడం లేదు కాబట్టి జరిగిందని నేను అనుకుంటున్నాను” అని నాగిరెడ్డిగారు అన్నారు- మరి సిబిసిఐడికి ఆ మాట తోచలేదు. హైకోర్టుకూ తోచలేదు. హైకోర్టు దగ్గర రెండు రిపోర్టులు ఉన్నాయి. సిబిసిఐడి రిపోర్టూ ఉంది. గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి నాగిరెడ్డిగారి నివేదికా ఉంది. కాని "హైకోర్టు
206 శ ాగోపాడ ఉవన్నాసాల
మాకేమీ అర్థం కావడంలేదు అంది. అర్థం కాకపోతే ఏం చెయ్యాలి అది? చిన్న విషయం ఇది. చిన్న తర్కమే ఇది. దీనికి లోతయిన ఆలోచనేమీ అక్కర్లేదు, రాజ్యాంగం చదవనక్కర్లేదు, మనం అంబేద్కర్లం కానక్కరలేదు.
సిబిసిఐడి వాళ్ళు ఏమీ జరగలేదు అన్నారు. ఫిర్యాదీదారులు జరిగింది అన్నారు. కోర్టు నాకు అర్థం కాలేదు అంది. మూసేస్తారా కేసు? సిబిసిఐడి కంటే, ఇంకా నిష్పక్షపాతంగా నేరపరిశోధన చెయ్యగల సంస్థకు అప్పగించి నువ్వు పరిశోధన చెయ్యి అని చెప్పాలి. అ అలోచన ఎందుకు రాదు న్యాయస్థానానికి? చాలా అన్యాయమైనటువంటి వైఖరి న్యాయస్థానం ప్రదర్శించింది. కోర్టుకే పోకపోతే ఎట్టా ఉండేదో అట్లా ఉంది ఇవ్వాళ. ఇంత కష్టపడి కోర్టుకుపోయి కేసువేసి, తొలినాటి నుండి, కేనువేనిన రోజు నుంచి ఫిర్యాదీదారులే ముద్దాయిలు అయినట్టుగా, వాళ్ళే దోషులయినట్టుగా కోర్టులో విచారణ జరిగిందె. మీ ఫిర్యాదు న్యాయమా కాదా, నిజమా కాదా మేము తేలుస్తాం....కాదో అవునో చెప్పలేక పోతున్నాం కాబట్టి మూసేస్తాం కేసు అనే వైఖరి కోర్టులు ప్రదర్శించడం వల్ల ఇవ్వాళ చివరికి మళ్ళీ మొదటకొచ్చింది కేసు.
హైకోర్టు చిన్న ఆదేశం ఇచ్చి ఉండాల్సింది - నేరపరిశోధన జరపండి, రిపోర్టు ఫైల్ చెయ్యండి అని. ఒకవేళ పోలీసులు కానీ, సిబిసిఐడి కానీ ఫిర్యాదు అవాస్తవం అంటే ఆ కాపీలు బాధితురాళ్ళకు ఇవ్వండి. వాళ్ళు దాని మీద - చట్టం పరిభాషలో ప్రొటెస్ట్ పిటిషన్ - ఇది తప్పుడు నివేదిక అని వాళ్ళు దానిమీద పిటిషన్ వేసుకుంటారు. లాయర్‌ను పెట్టుకుంటారు, కేసు నడుపుకుంటారు. ఇది మామూలుగా జరిగేది. చివరకు మనం అక్కడికే వచ్చాం. మిత్రులు అడుగుతున్నారు ఏముంది ఇంకా, ఏం చెయ్యాలి అని.
సరే సి.బి.ఐ పరిశోధన కావాలి అని అడిగాము. హైకోర్టు ఆ ఆదేశం ఇవ్వలేదు కాని, ఇవ్వకపోయినా ప్రభుత్వం ఆ పని ఇప్పటికీ చేయవచ్చు. ప్రతిపక్ష పార్టీలు వరికి మద్దతు ధర కావాలని, ఇంకొకటని, మరొకటని ఏ స్థాయిలో ఆందోళన చేస్తున్నాయో
- అవన్నీ అనవసరమని నేను అనడం లేదు - ఆ స్థాయిలోనే ఈ పదకొండు మంది ఆదివాసీ మహిళల ఫిర్యాదు, తమపైన అత్యాచారం జరిగింది అన్న ఫిర్యాదు మీద కూడా జరగాలి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకంటే హైకోర్టు తేల్చలేకుండా ఉన్నానని చెప్పింది కాబట్టి - కేంద్రానికి లెటర్ రాసి సిబిఐ చేత దర్యాప్త జరిపించాలి. ప్రతిపక్ష పార్టీలన్నీ ముందుకొచ్చి ఆదివాసీ ఐక్యవేదిక, ఇతర సంఘాలు, హక్కుల సంఘాలు
407
అందరితోనూ కలిసి ఈ డిమాండు పెట్టి, ఒత్తిడిపెట్టి సిబిఐ దర్యాప్తు జరిగేలా చేయాలి. అదొక రాజకీయ ఉద్యమంగా దానిని మనం కొనసాగించాలి. చేద్దాం. అసాధ్యమేమీ కాదు. పశ్చిమ బెంగాల్లో హైకోర్టు నందిగ్రామ్ కాల్పులకు సంబంధించి ఈ ఆదేశం ఇచ్చింది. అది ఇవ్వకపోయినా కేంద్రప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉంది. అ నిర్ణయం రాజకీయంగా కూడా తీసుకోవచ్చును కాబట్టి, ముఖ్యంగా హైకోర్టు ఎటూ తేల్చలేను అని చెప్పి మూసేసింది కాబట్టీ మనం ఆ ఉద్యమం చేద్దాము. ఒకవైపు ఆ ప్రయత్నం చేద్దాము. ఇంకొకవైపు మామూలుగా అందుబాటులో ఉండే ఒకమార్గం బాధితురాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళలో ఒక్కరు ప్రైవేట్ కంప్లెయింట్ వేసి దీనిని కొనసాగించడం. ఎట్లాగూ సిబిసిఐడి వాళ్ళ రిపోర్టు ఒకటుంది ఇప్పుడు. దానిని హైకోర్టు చూసిన తరవాత వాళ్ళు మీ పాడేరు మొబైల్ మేజిస్టేట్ కోర్టులో ఫైల్ చేస్తారు, మొబైల్ మేజిస్టేట్ చట్ట ప్రకారం అయితే. వారికి ఈ చట్టం తెలియకపోతే నేనేమీ చెయ్యలేను. అట్లే అనాల్సి వస్తుంది. హైకోర్టుకే తెలియకపోతే ఇంకా మేజిస్టేట్కు తెలియకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. చట్ట ప్రకారం అయితే వారు ఫిర్యాదికి అంటే ఎ.పి గిరిజన సంఘానికి కాపీ పంపించాలి, వారు తీసుకొచ్చి మీకు ఇస్తారనే అనుకుంటున్నాను. దాని మీద అంటే సిబిసిఐడి నివేదిక మీద మన అభ్యంతరాలు తెలియచేస్తూ వివరంగా పదకొండు మంది ప్రీల వాంగ్మూలాలను జతచేసి మేజిస్ట్రేట్ కోర్టులో ఫైల్చేసి, పైవేట్ కేసుగా దాన్ని కొనసాగించవచ్చు. విడిగా అయినా మనం ్రైవేటుకేసు వేసుకోవచ్చు. ఆ నిర్ణయం గాని మీరు తీసుకుంటే మేము మానవ హక్కుల వేదిక తరపున, మా మిత్రులు పౌరహక్కుల సంఘం వారు, అందరం కలిసి సహాయం చేస్తాము. విశాఖపట్నంలో న్యాయవాదులు ఉన్నారు, నేనూ వస్తాను. ఇక్కడే కూర్చుందాము. వాంగ్మూలాలు తయారు చేసి, ఫిర్యాదు తయారుచేసి వేద్దాము, ప్రైవేటు కేసుగా కొనసాగిద్దాము. మరొకవైపు సిబిసిఐడి చేత దర్యాప్తు కోసం ఆందోళన కొనసాగిద్దాం. ఎందుకంటే సిబిసిఐడీ నివేదికను హైకోర్చ ఆమోదించలేదు కాబట్టి; అఆమోదించాను అని ఏమీ అనలేదు కాబట్టి; పక్కకు పెట్టింది కాబట్టి; ఆ ఆందోళన కొనసాగిద్దాము. శంకరన్‌గారి చేత ఎంక్వయిరీ చేయిస్తే బాగుండునని అడిగారు. శంకరన్గారిని ఎవరూ అడిగినట్లు లేదు ఇప్పటిదాకా. నిజానికి ఆయన ఆరోగ్యం అసలు బాగాలేదు. అయినప్పటికీ ఒక మచ్చ లేనటువంటి, ప్రజలను (ప్రేమించే అధికారిగా ఆయనకున్న 208 కాగాం దమన చో
గుర్తింపు, పేరు రీత్యా అదీ చేద్దాం. కానీ చట్టపరంగా శిక్షపడే విచారణ కాదు అది. శిక్ష పడాలి అంటే పోలిసులు దర్యాప్తు చెయ్యాలి బేదా బాధితులయినా సరే కోర్టులో కేసు వేసుకోవాలి. అదైతేనే శిక్షకు దారి తీస్తుంది. శంకరన్‌గారు విచారణ జరిపి నివేదిక ఇచ్చినా, నాగిరెడ్డిగారి నివేదిక అయినా నిజంగా అన్యాయం జరిగిందనే అభిప్రాయం సమాజంలో కలిగించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. వాళ్ళు పెద్ద మనుషులు. నాగిరెడ్డి గారికి ఆఫీసరుగా మంచి పేరే ఉంది. శంకరన్‌గారి స్థాయి కాదనుకోండి. శంకరన్గారికి ఇంకా మంచి పేరుంది. ఆయనగానీ ఒక పరిశోధన జరిపి వాస్తవాలను బయటకు తీసుకొస్తే సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది. నిజమే అన్యాయం జరిగింది ఇక్కడ, వ్యవస్థ విఫలం అయ్యింది న్యాయం చెయ్యడంలో అని. అంతవరకే అవి ఉపయోగపడతాయి. శిక్ష పడాలి ఆ ఘోరానికి పాల్పడిన వాళ్ళకు, ఆ అత్యాచారానిక్ పాల్పడిన వాళ్ళకు అంటే దానికి రెండే రెండు మార్గాలు. ఒకటి సిబిఐ దర్యాప్త జరిపించాలి లేదా బాధితురాళ్ళు పైవేట్కేసే వేసి కొనసాగించాలి. ఈ రెండూ కూడా మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి, ఇక్కడున్నటువంటి ఆదివాసీ సంస్థలు, బాధితురాళ్ళు, వాకపల్లి గ్రామస్తుల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మీరు నిర్ణయం తీసుకోండి, అందరం సహకరిస్తాము.
నయం కాగల రోగాల వల్ల మనుషులు వేల సంఖ్యలో చనిపోవడమనేది మీరు చూస్తూనే ఉన్నారు చాలా కాలంగా. మేము చాలా బాధపడుతున్నాం - ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతున్నాం. వాకపల్లి విషయంలో అట్లా కాకుండా పట్టుదలగా ఇక్కడదాకా ఉద్యమాన్ని తీసుకొచ్చారు అందరూ కలిసి. ప్రధానంగా ఇక్కడి ఆదివాసీ సంఘాలు, వాకపల్లి మహిళలు, వాకపల్లి గ్రామస్తులు. వారికి అండగా నిలబడినటువంటి ప్రజా సంఘాలు, మీడియా, పత్రికలు ఇక్కడదాకా తీసుకొచ్చాయి. ఇక్కడ మనం వదిలేయకుండా ముందుకు తీసుకుపోయి, ప్రజా చైతన్యంవల్ల, సంకల్పం వల్ల, పట్టుదలవల్ల ప్రభుత్వ యంత్రాంగం నుంచి న్యాయవ్యవస్థదాకా, తమ విధి ఏమిటీ, తమ కర్తవ్యం ఏమిటీ అని అందరూ మర్చిపోయినా కూడా వాళ్ళచేత వాళ్ళ విధులు జ్ఞాపకం చేయించగలము, నిర్వర్తింస చేయించగలము అనే సంకేతాన్ని ప్రభుత్వానికి పంపుదాం. ఇప్పటిదాకా చేస్తూ వచ్చింది వదిలేయకుండా దాన్ని ముందుకు తీసుకుషోదాము. కనీసం ఇక మీదటైనా సరే ఈ వ్యవస్థకు, ఈ వ్యవస్థలో అధికారం ఉండే వ్యక్తులకు, అధికారం చెలాయించే పెద్ద మనుషులకు -న్యాయమూర్తులతో సహా - అషామాషీగా తీసి పారియ్యడానికి వీలు లేదు వీళ్ళను, ఏం జరిగినా
089 కం -నక్షకం
చెల్లుతుందిలే, ఏం చేసినా చెల్లుతుందిలే అనుకోనివ్వకూడదు. అసెంబ్లీలో చర్చలు తీసుకోండి, సెక్రబేరియట్లో, ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారుల వైఖరి తీసుకోండి, కోర్టుల్లో న్యాయమూర్తుల వైఖరి తీసుకోండి - ఒకటే ధోరణి. బలవంతుల సమన్యలు,
ధనవంతుల సమన్యలు వాళ్ళ దగ్గరకువస్తే - అసెంబ్లీ కానివ్వండి, ప్రభుత్వ
కార్యాలయాలు కానివ్వండి, కోర్టులు కానివ్వండి - చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.
కాదంటే ఏమవుతోంది? వీడికి బలముంది. వీడికి సంబంధాలు ఏవో ఉన్నాయి. వీడు
ఒత్తిడి పెట్టగలడు. నా ఉద్యోగం పోతుందేమో, నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారేమో అన్న భయం వాళ్ళలో ఉంటుంది. రచ్చ చేస్తారు, అల్లరి చేస్తారు, నేను నా డ్యూటి సక్రమంగా చెయ్యలేదు అని చెప్పి నామీద ఒక నల్లమచ్చ వచ్చేటట్టు చేస్తారేమో అన్న భయం ఉంటుంది. అటువంటి వాళ్ళ సమస్యలు వాళ్ళు పట్టించుకుంటారు. దీర్ధంగా చర్చిస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టులు తీర్చులు ఇస్తూ ఉంటాయి. బలహీనవర్గాల విషయానికి వచ్చేటప్పటికి - మేము చూస్తూనే ఉంటాం, కోర్టులలో చూస్తాం, బయట చూస్తూనే ఉంటాం - రెండు నిమిషాలలో, మూడు నిమిషాలలో నిర్ణయాలు జరిగిపోతుంటాయి. ఏముందిలే, ఫర్వాలేదులే, దాటవేయ వచ్చులే, పక్కకు పెట్టవచ్చులే, వాయిదా వెయొొచ్చులే. అట్టా సాగడానికి వీలులేదు అన్న ఒక భయం, ఒక హెచ్చరిక ఇప్పటిదాకా వాకపల్లి బాధితురాళ్ళు, వాళ్ళకు అండగా నిలబడ్డ ఉద్యమకారులు ఇస్తూ వచ్చారు. ఈ వరవడిని చివరదాకా తీసుకొని పోదాము.
జరిగినటువంటి ఘోరం ఏమిటీ అనేది బయటకు రావాలి. చేసిన వాళ్ళకు శిక్ష పడాలి.
బాధితురాళ్ళకు, న్యాయం జరగాలి. దానికోసం మనం ప్రయత్నం చేద్దాం.
ఆను ఇవి (ఆదివాసి ఐక్య పోరాట నమితి - పాడేరు, 18-77-2007) 220 శ ాగపాల దవన్వాా దో
నక్సలైట్ ఉద్యమం
నక్సలైట్ ఉద్యమానికి సామాజిక, ఆర్థిక నేపథ్యం ఉంది అని అంటూ ఉంటాం. నేపథ్యం ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ నేపథ్యం నుంచే నేరుగా ఆ ఉద్యమం పుట్టలేదు. సామాజిక, ఆర్థిక నేపథ్యం ఒక సందర్భం. దానితో పాటు రాజకీయ నిర్ణయం కూడా ఒక సందర్భం. భారతదేశంలో కమ్యూనిస్టు విష్ణవం లేదా సోషలిస్టు పరిపాలన, సోషలిస్స సమాజం అనేవి పార్లమెంటరీ పంథా ద్వారా రావు, వాటికి ప్రత్యక్షంగానే సాయుధపోరాటం అవసరం అనే నిర్ణయం తీసుకోకపోతే నక్సలిజం వచ్చేది కాదు. కానీ ఆ నిర్ణయమే దానికి కారణం కాదు. అది రాజకీయ నిర్ణయం. ఒక సామాజిక సందర్భం కూడా ఉండింది. అది పశ్చిమ బెంగాల్లో ఏమిటి, బీహార్‌లో ఏమిట్ - అనేది అట్లా ఉంచి, ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేటప్పటికి రెండు ప్రధానమైన సందర్భాలున్నాయి.
ఒకటి, ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న పరిస్థితులు; రెండవది తెలంగాణ మైదాన ప్రాంతాలలో ఇవ్వాళ మనం ఊహించలేనటువంటి తీవ్రమైన వ్యూడల్ దోపిడీ, కులపెత్తనం. రెండో మూడో కులాల వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా మాత్రమే కాకుండా, సామాజికంగా కూడా సంపూర్ణంగా ప్రజల శ్రమను, వాళ్ళ ఆత్మగౌరవాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న సందర్భం - ఈ రెండూ ఉండేవి.
అదివాసీ ప్రాంతాల మాటకొస్తే ఇవ్వాళ మనం ఆదివాసుల హక్కుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటున్న విషయాలేవీ ఆ రోజుల్లో లేవు. నిజానికి అవన్నీ కూడా శ్రీకాకుళ పోరాటం ఫలితమే. శ్రీకాకుళ పోరాటం వల్ల వచ్చినటువంటి ప్రత్యక్ష ప్రయోజనం ఏమిటీ అంటే 1/70 చట్టం, 1౯04 లాంటి వ్యవస్థలు, గిరిజన సహకార కార్పొరేషన్లు పటిష్టం కావడం. ఇవ్వాళ అవన్నీ కొంత మేరకయినా ఉన్నాయి అంటే, వాటికోసం నక్సలైట్లు పోరాటం చెయ్యలేదుకానీ, వాళ్ళ పోరాటం ఫలితమే అది. అంతకు ముందు ఆదివాసులకు చట్టపరమైనటువంటి రక్షణగాని, హక్కులుగాని చాలా తక్కువ ఉండేవి, నామమాత్రంగా ఉండేవి. వాటికి కూడా అమలు అనేది ఉండేది కాదు.
శై కలాం 2 నస్రేమం
తెలంగాణ జిల్లాలలో ముఖ్యంగా రెండు మూడు కులాలు - వెలమ, రెడ్డి, బ్రాహ్మణ - ఈ కులాల అధిపత్యం సంపూర్ణంగా ఉండేది. కూలికి పనిచేయించుకొని తక్కువ కూలి ఇవ్వడమనేదే కాదు, అన్నిరకాల శ్రమ దోపిడీ - మామూలుగా ప్యూడల్ అనే మాట వాడతాం మనం - చాలా విసృతంగా ఉండేది. తెలంగాణ మైదాన ప్రాంతాలలో నక్సలైట్ ఉద్యమం ప్రధానమైన ఫలితం ఈ సామాజిక సంబంధాలను తల్లక్రిందులు చెయ్యడం. ఒక ఇరవై అయిదు, ముఫ్పై సంవత్సరాలక్రింద తెలంగాణ చూసినటువంటి వాళ్ళు, ఇక్కడ బ్రతికినటు వంటి వాళ్ళు ఆ మార్చును ఇవ్వాళ స్పష్టంగా జ్ఞావకం చేనుకోగలరు, గుర్తించగలరు. సామాజిక నంబంధాలు పూర్తిగా తల్లక్రిందులయినాయి. నోరులేనివాళ్ళు నోరున్నవాళ్ళయ్యారు. మాకు చాలా నోరుంది అనుకున్న వాళ్ళు గ్రామాలే విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అది నక్సలైట్ ఉద్యమం - నా దృష్టిలో అయితే - ఈ సామాజిక విజయం చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి కంట్రిబ్యూషన్, ఆ ఉద్యమ విజయం. నోరులేని ప్రజానీకానికి ఆత్మగౌరవాన్ని నోరును ఇచ్చింది.
అర్థిక ప్రయోజనం ఎంతొచ్చిందో చెప్పలేము. ఎందుకంటే భూమికోసం పోరాటం ప్రధానం అని నక్సలైట్లు భావించినప్పటికీ, ఏజెన్సీ ప్రాంతాలలో, ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీయేతరుల నుంచి భూములు పెద్దగా లాక్కోలేకపోయినా, ప్రభుత్వ అధీనంలోని అటవీ భూములను చాలా పెద్దఎత్తునే ఆదివాసులకు ఆనాడు వాళ్ళు పంచగలిగేరు. ఆదివాసులు అడవికొట్టకొని వ్యవసాయం చేనుకున్నారు. చాలా నిర్పంధం అనుభవించారు అందుకు, పదేపదే అటనవీశాఖవాళ్ళు, పోలీసులు వాళ్లమిదబడటం, కొట్టడం, తన్నడం, ఇళ్ళు కాలబెట్టడం, కేసులు పెట్టడం జరుగుతూనే ఉండింది. అయితే ఇవ్వాళ కొత్తగా వచ్చినటు వంటి అటవీహక్కుల చట్టం ఫలితంగా నక్సలైట్ ఉద్యమం ద్వారా సాధించుకున్న టువంటి ఆ అడవి భూమికి ఆదివాసులు బహుశా పట్టా పొందగలరు. అందరూకాకపోయినా కొంతమందయినా పొందుతారు. ఆ రకంగా అదొక విజయంగా - చట్టపరమయిన విజయంగా - కూడా చెప్పుకోవచ్చు, ఉద్యమం నడిపిన వాళ్ళ ఉద్దేశ్యం అదిగాక పోయినప్పటికీ,
మైదాన ప్రాంతాలలో మాత్రం భూమి పోరాటం పెద్దగా జరిగిందని చెప్పలేము. ఎంతమేరకయికే సాధ్యం అవుతుందనో, సాధ్యం కావాలనో వాళ్ళు భావించారో దాంట్లో ఒక చిన్న నిష్పత్తి మాత్రమే వాస్తవానికి సాధ్యమయ్యింది. అది కూడా భూస్వాములు
పేలి స జూలగోపొల్ ఉవన్వాసాలు శ
ఆ భూములు విడిచిపెట్టి వెళ్ళిపోవడం వల్ల మాత్రమే జరిగింది. దానిని పేద ప్రజానీకానికి పంచడం గానీ, వాళ్ళు దానిని నిలబెట్టుకోవడం గానీ జరగలేదు. ఏ రకంగా అయితేనేం, భూములు పేద వాళ్ళకు దక్కాయి గదా, అది వాళ్ళద్వారా జరగకూడ దనుకుంటే ప్రభుత్వం తనద్వారా చేసి ఉండవచ్చును... పట్టాలిచ్చి ఉండవచ్చును...సీలింగ్ చట్టాలు సతక్రమంగా అమలుచేసి అదే భూమిని తాను పేదలకు పంచి ఉండవచ్చును గాని ఆ పని చేస్తే నక్సలైట్లకు విజయం అవుతుంది అనేటటువంటి ఒక తప్పుడు భావనతో చేయలేదు. ఆ భూములంతా కూడా బీడుబెట్టే పరిస్థితి కల్పించింది. ఇవ్వాల్లికీ కొన్ని వేల ఎకరాలు బీడుపడే ఉన్నాయి తెలంగాణ జిల్లాలలో. కాబట్టి "పేదలకు భూమి చాలా వచ్చిందని చెప్పలేము. కొంత వచ్చింది. భూస్వాముల భూములు గాని, ప్రభుత్వభూములు గానీ కొంతమేరకు మాత్రమే ఆక్రమించుకో గలిగారు. కూలి రేట్టు, తునికాకు రేట్టు కొంత పెరిగాయి గానీ, బహుశా అవి ఇతరత్రా కూడా పెరిగి ఉండేవేనేమో, ప్రధానమైన విజయం మాత్రం స్వాభావికంగా, స్వతహాగా కొందరు ఎక్కువ కొందరు తక్కువ అనేటటువంటి ఆ వ్యూడల్ భావజాలాన్ని తల్లక్రిందులు చేసి, అందరూ కూడా - మాల, మాదిగ, బి.సి కులాలు, ఆదివాసీ ప్రజానీకం కూడా - మేమూ మనుషులమే, మేమూ సమానులమే, మేమూ నిర్ణయాలు చేస్తాము, ఏది మంచో ఏది చెడో చెబుతాము అనేటటువంటి అఆ అత్మధైర్యాన్ని ఉద్యమం ఇవ్వగలిగింది. అది చాలా పాజిటివ్ కంట్రిబ్యూషన్. ఎటొచ్చీ ఇదంతా కూడా ఒక రాజకీయ వ్యూహంలో అంతర్భాగంగా జరిగింది. అలా జరగకూడదని కాదుగానీ, జరిగిన మాట వాస్తవం. జరగొచ్చా, జరగకూడదా అనేది ఇక్కడ విషయం కాదు. జరిగింది. ఆ వ్యూహం ఏమిటీ అనంటే ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూపోతే సమాజం మారుతుందా అంటే మారదు. అ మార్పులు కూడా భారతరాజ్యం పైన ఒక సాయుధ పోరాటాన్ని నిర్మించి, దానిని కూలదోసి ప్రజారాజ్యాన్ని నిర్మించేటటువంటి క్రమంలో భాగమే అని మావోయిస్టులు
- ఇవ్వాళ మావోయిస్టులంటున్నాం వాళ్ళను, అ రోజులలో నక్సలైట్ పార్టీలనేది, ]4.1..పార్టీలనేది - వాళ్ళ అవగాహనలో అంతర్భాగంగా జరిగాయి. దానివల్ల వాళ్ళు - కొంత హింసను ప్రయోగించడం, ఆ సందర్భానికి అవసర మయిన దానిని మించి కూడా ప్రయోగించడం - ఎందుకంటే ఒక రాజకీయ లక్ష్యం కూడా దానికి అనుబంధంగా ఉంది కాబట్టి. అదీ జరిగింది. 228
వ్రభుత్వం దీనిని కేవలం పేదల పోరాటంగా చూడకుండా, దాని వెనకున్నటువంటి రాజకీయ పోరాటాన్ని లక్ష్యంగా పెట్టుకొని చాలా తీవ్రమైన అణచివేతను ప్రయోగించింది - నిజానికి నక్సలైట్లు ఇంకా పెద్దగా హింస చేయడం మొదలుపెట్టక ముందే, ప్రధానంగా వాళ్ళు రైతు - కూలీ సంఘాలు, లేకపోతే గిరిజన సంఘాల ద్వారా పనిచేస్తున్న కాలంలోనే. మహా అయితే ఎప్పుడైనా ఒక నాటుబాంబు తప్ప వేరే ఆయుధాలు ప్రయోగించే వాళ్ళు కాదు. ఆ రోజుల్లో, అటువంటి సందర్భంలో కూడా- అప్పటి తక్షణ పరిస్థితులతో ఏమీ సంబంధం లేనటువంటి నిర్బంధాన్ని... గ్రామాల్లో పోలీసు క్యాంపులు పెట్టి, విసరీతంగా చిత్రహింసలుపెట్టి, కూలిరేట్లు పెంచమని ఆడిగినవాళ్ళను, భూములు పంచమని అడిగిన వాళ్ళను, దొరల పెత్తనాన్ని వ్యతిరేకించిన వాళ్ళను చాలా హింసించారు. వరంగల్‌లో ప్రత్యక్షంగా చూసాము మేము అ రోజులలో. వరంగల్, కరీంనగర్‌లలో ఎవరైనాసరే, అరే ఏమిటి ఇంత నిర్బంధం? ఎందుకు పెట్టాలిక్కడ? అని అడిగితే ప్రభుత్వం దగ్గర జవాబేమీ లేదుగానీ, ఒక దీర్ధకాల రాజకీయ లక్ష్యం దాని వెనకాలుండింది. ఈ నక్సలైట్ ఉద్యమం బలపడకూడదు. దీర్ధకాలికంగా ఈ ప్రభుత్వం పరిపాలనా భద్రతకు అది భంగకరం అవుతుంది, నష్టకరం అవుతుంది, హాని చేస్తుంది అనే ఉద్దేశ్యంతో చేశారు. చాలా దూరం వెళ్ళిందది.
అక్కడ నుంచి మొదలయి - అంటే నక్సలైట్ ఉద్యమం అనేది ప్రజలలో పనిచేస్తూ, ప్రజాసంఘాల ద్వారా పనిచేస్తూ, అదివాసీ (ప్రాంతాలయిన్తా వరంగల్, కరీంనగర్, నిజామా బాద్, మెదక్‌లాంటి జిల్లాలలోని మైదాన ప్రాంతాలయినా, వారికి మానసిక బలాన్నీ సామాజిక సమానతనూ, కొంతమేరకు ఆర్థిక ప్రయోజనాలనూ ఇస్తున్నటువంటి సమయంలో చాలా తీవ్రమైనటువంటి అణచివేతను ప్రభుత్వం ప్రయోగించడంతో బహుశా ఒక నిర్ణయం - దానిని ఏ రకంగా ఎదుర్కోవాలనే నిర్ణయం వాళ్ళు చేశారు. అది చాలా కీలకం. వాళ్ళు ఆ దశలో బలప్రయోగంతో తిప్పికొట్టాలి, దెబ్బను దెబ్బతో తిప్పి కొట్టాలి అనే నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని అమలు చేయడం జరిగింది. దానితో క్రమంగా వారి ఆయుధ సంపత్తి పెరగడమూ, మరిన్ని ఆయుధాలను వాళ్ళు ప్రయోగించడమూ జరిగింది, దానికి ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా “నేను తప్పుచేశాను, నేను చేసిన తప్పువల్ల వాళ్ళు ఇప్పుడు తిరిగి దాడులు మొదలు "పెడుతున్నారు, ఇది ప్రాణానికి, జీవితాలకి హాని కలిగిస్తుంది కాబట్టీ వెనక్కి తగ్గుదాం' అని అనుకోలేదు. మరింతగా నిర్బంధాన్ని పెంచింది. యాంటీ నక్సలైట్ స్క్వాడ్లు ఏర్పాటు
శేైేశ శః వాలగోపాల్ ఉవనాసాలు శ
చేసింది. మామూలుగా మస్కట్ ఉండే పోలీసుస్టేషన్లో క్రమంగా సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, ఇంకొంత కాలం తరువాత శ.ష47లు వచ్చాయి. వాళ్ళూ అటువంటి ఆయుధాల్నే సంపాదించు కున్నారు. అంటే ప్రభుత్వ అణచివేతను ఇక్కడ ప్రారంభంగా చెప్పుకోవచ్చునేమోగానీ, ఆ అణచివేతను ఎదుర్కోవడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం, దానిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎంచుకున్న మార్గం, తిరిగి వాళ్ళు ఎంచుకున్న మార్గం...ఇదొక వలయాన్ని టయారు చేసి చాలా దూరం తీసుకుపోయింది. ఇవ్వాళ నక్సలైట్ ఉద్యమం - తాత్కాలికంగానే కావచ్చు - ఇంతగా ఎప్పుడూ గతంలో దెబ్బతినలేదు. కానీ అంతమాత్రంతో అయిపోయిందని కూడా ఏమీ కాదు. ఎందుకంటే ఒకప్పటి పరిస్థితి ఏమోగానీ, గత పదిహేను పదహారు సంవత్సరాలుగా ప్రభుత్వాలు అనుస రిస్తున్నటువంటి విధానాలు ఎట్లా ఉన్నాయంటే - మాకు బాగా జ్ఞాపకం...మొదట్లో మేము ఎన్కౌంటర్లు, చిత్రహింసలు తప్పు అన్నప్పుడు వాళ్ళు హింస చేసినప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయకూడదు అని గట్టిగా వాదన పెట్టుకున్న వర్గాలు కూడా, ఇవ్వాళ, ప్రభుత్వాల విధానాలు ఈ విధంగా ఉంటే చెయ్యక ఏంజేస్తారు అనేటటువంటి ఒక మూడ్‌లోకి వస్తున్నారు. గత 30 సంవత్సరాలతో పోలిస్తే ఇవ్వాళ ప్రభుత్వ దుష్పరిపాలనను హింసాత్మకంగా ఎదుర్కోవడం అనే విషయంలో సొమాజిక అభిప్రాయం కొంత అనుకూలంగానే తయారయ్యింది. మంచో చెడో వేరే సంగతిగానీ, అనుకూలంగా తయారయిన మాట వాస్తవం. కాబట్టి మళ్ళీ రాదు ఉద్యమం అనేదేమీ లేదుగానీ, అటువైపు ప్రభుత్వం మాత్రం దీనిని, దీనికున్నటువంట్ సామాజిక, అర్థిక మూలాలను పదేపదే ఒక రొటీన్‌గా అంటున్న ప్పటికి కూడా, ప్రధానంగా అణచివేత ద్వారా ఎదుర్కోవాలని భావిస్తున్నది. ప్రభుత్వానికి ఏరకమైన నీతిగాని, నియమాలుగాని, చట్టంగాని, విలువలుగానీ ఏమీ ఉండడం లేదు. రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు. ఒకప్పుడు యాంటీ నక్సలైట్ స్క్వాడ్డు, ఇప్పుడేమో గ్రేహౌండ్స్, ఇంకా ముందుకు పోతే పైవేటు గ్యాంగులని కోబ్రాలనీ లేకపోతే శ్రీన్టైగర్స్ని రకరకాల పేర్లతో గ్యాంగులను తయారుచేసి అట్లా ఎదుర్కొనేటటువంటి వ్యూహాన్ని ప్రభుత్వం ఒక పక్క రచించింది. ఎంత చేసినప్పటికి కూడా మళ్ళీ ఉద్యమం రాదని కాదుగానీ, ఎప్పుడు వచ్చినా రూడా వాళ్ళ విధానాలలో గాని మార్చులేకపోతే లేదా ప్రభుత్వ స్పందనలో మార్పు లేకపోతే, పదేపదే ఇదొక - ప్రభుత్వానికి వాళ్ళకు మధ్య - డింగ్‌డాంగ్ బ్యాటిల్ అంటారు ఇంగ్లీషులో - అంటే నువ్వా నేనా అనేటటువంటి 225
ఒక ఘర్షణగా తప్ప, మళ్ళి ప్రజల దగ్గరికి పోయి, ప్రజల సామాజిక స్థితిగతులు, వాళ్ళ మవోధైర్యం - వీటిని పెంచేటటు వంటి రూపం తీసుకునే అవకాశం ఉందా అంటే - ఇవ్వాళయితే అది ప్రశ్నార్థకమే.
ప్రత్యేకించి మన రాష్ట్రం స్ఫూర్తితో నక్సలైట్ ఉద్యమం వ్యాపించినటువంటి
ఒరిస్సా, జార్టండ్, ఛత్తీస్‌గఢ్‌లాంటి ప్రాంతాలను ఒకసారి చూస్తే ఇక్కడ చేసిన దానికంటే కూడా మరింత ఎక్కువ హింస, మరింత విస్తృతస్థాయిలో హింస, అక్కడ చేయడం జరుగుతూవుంది. మావోయిస్టులు ప్రజలను సమీకరించి, రైతు కూలి సంఘాల ద్వారా ఆర్థిక సామాజిక పోరాటాలు చేసుకుంటూ బలపడే దశ దొటిపోయింది - వేరే దశకు చేరామని అనుకుంటు న్నారేమో, వాళ్ళ అంచనా అది. ఏ విధంగా అఆ అంచనాకు వస్తున్నారోగానీ సామాజిక ప్రయోజ నాన్ని, ఆర్థిక ప్రయోజనాన్ని వాళ్లు ప్రజానీకానికి ఇవ్వగల స్థితి తిరిగి వస్తుందా అంటే కొంత సందేహంగానే ఉంది.
ఈ లోపల సమాజమూ మారింది. కొంతవరకు వాళ్ళ పోరాటం వల్ల మారింది. చాలా రాజకీయ అవగాహన పెరిగింది. తెలంగాణ జిల్లాలలో ఇవ్వాళ మనం ఎన్ని రకాల రాజకీయ అవగాహనల గురించి మాట్లాడుకుంటున్నామో దానికి ప్రధానంగా నక్సలైట్ ఉద్యమమే కారణం. తెలంగాణ రాష్ట్రం ఒకటి కావాలన్న ఆకాంక్ష బలంగా ఉందన్నకూడా - ఆ ఆలోచన, ఆ తెలివితేటలు, ఆ విశ్లేషణ, న్యాయం - అన్యాయం, అణచివేత - ప్రతిఘటన అన్న విశ్లేషణ తెలంగాణ ప్రాంతానికి నేర్పించింది నక్సలైట్ ఉద్యమమే. కార్యకర్తలు కూడా ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమంతో రకరకాల సంబంధాలున్నటువంటి వాళ్ళే. ఆ తెలివితేటలు, రాజకీయ తెలివితేటలు, విశ్లేషణా సామర్థ్యం, ఒక అవగాహన తెలంగాణ జిల్లాలను లేదా మన రాష్ట్రంలాంటి రాష్ట్రాలను, కమ్యూనిస్టు ఉద్యమాలు, నక్సలైట్ ఉద్యమాలు లేని రాష్ట్రాలతో, ప్రాంతాలతో పోల్చినప్పుడు ఆ జేడా మనకు బాగా కనిపిస్తుంది. న్యాయం - అన్యాయం, అణచివేత
- ప్రతినుటన అనే చట్రంలో ఆలోచించడమనేది సమాజ పురోగతికి చాలా ఉపయోగకరం. దాన్ని నేర్పించింది నక్సలైట్ ఉద్యమం వాళ్లకు. బహుశా ముందునుంచి కమ్యూనిస్టు ప్రభావం ఉన్న రాష్ట్రం కావడం వల్ల కూడా అది వచ్చి ఉండవచ్చును. అదొక పక్క జరిగింది.
కానీ మరొక పక్క - ఈ మధ్య కాలంలో చాలాసార్లు అనిపిస్తుంది - తెలంగాణ జిల్లాలలో రైతులు ఎక్కువగా అత్మహత్యలు చేసుకుంటున్న ప్రాంతాలను చూస్తే 116 స బాలగోపాల్ ఉవన్వాసాలు స్
అన్నీ కూడా నక్సలైట్ల ప్రాబల్యం బాగా బలంగా ఉండినటువంటి ప్రాంతాలే. ఇవ్వాళ సింగరేణి ప్రాంతంలో సింగరేణి యాజమాన్యం చాలా పెద్దఎత్తున గ్రామాలకు గ్రామాలను లేపేసి ఓపెన్‌కాస్ట్ మైనింగ్ సరు మీద, బహుశా రెండుమూడు లక్షల ఎకరాలు తీసేసుకునే ఆలోచన చేస్తూ ఉంది. అదంతా నక్సలైట్ల ప్రాబల్యం బలంగా ఉండినటువంటి ప్రాంతాలే. అనేక సందర్భాలలో ఏం చూస్తున్నాము అనంటే, ఇక్కడేగాదు, వేరే ఏజెన్సీ ప్రాంతాలలో కూడా - విశాఖపట్నం గానీ, తూర్పుగోదావరి గానీ - ఏం కనిపిస్తుందంటే ఇంత ఉద్యమం జరిగిన ప్రాంతాలలో ప్రజలు ఇవ్వాళ స్తబ్దంగా ఎందుకున్నారు అనే ప్రశ్న పదేపదే ముందుకు వస్తుంటుంది. అక్కడ జనంతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొంత నవ్వుతారు, రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు. మాకనుభవం అయ్యింది ఉద్యమాలు చేస్తే నిర్బంధం వస్తుందని, పోలీసులు వస్తారని అయి ఉండొచ్చు. కానీ మాకేమనిపిస్తుందంటే, అంతకంటేకూడా, ఈ సాయుధ పోరాట రాజకీయాలు తీసుకున్నటువంటి రూపం వల్ల ప్రజలు తమకోసం తాము చేసుకోవడం అనేదానికంటే కూడా ఎవరో చేసిపెట్టేవాళ్ళు ఒకరున్నారు, వాళ్ళకు మనం ఆశ్రయమిస్తాం, వాళ్ళకు మనం అనుచరులుగా ఉంటాం, వాళ్ళకు కావలసినటువంటి అండదండలు ఇస్తాం అనే వైఖరిలోకి వచ్చారని. ఉద్యమకారులే ప్రజలు, ప్రజలే ఉద్యమ కారులు అని ఇప్పటికీ సిద్ధాంతపరంగా, భావజాలపరంగా నక్సలైట్లు చెప్పుకుంటూ ఉన్నప్పటికీ, ఉద్యమకారులు, ప్రజలు అనేవి రెండు వేరే వేరే వర్గాలు లేదా రెండు వేరేవేరే విషయాలు. ఇవ్వాళ ఆ ఉద్యమకారులు లేరు - పోలీసులు విపరీతంగా నిర్బంధం పెట్టడం వల్ల, చాలా దుర్మార్గంగా తీసుకుపోయి కాల్చిపారేసి ఎన్కౌంటర్ కథలల్లడం వల్ల. అసలు రాష్ట్రంలోకి ఒక ముఖ్య నాయకుడు ఎవరైనా వస్తే కొద్ది రోజులలోపు పసిగట్ట్ వాళ్ళను పట్టకోవడం, చంపేయడం - అంత విసృతమయినటువంటి ఒక ఇన్ఫార్మర్ వ్యవస్థను కూడా పోలీసులు తయారు చేసు కున్నారు.
వీటి కారణంగా ఇవ్వాళ ఉన్న పరిస్థితి ఏమిటీ అనంటే - ఒక పోరాటప్రాంతం, ఊద్యమ (ప్రాంతం, ఉద్యమించిన అనుభవం ఉన్న ప్రాంతాలలో కూడా ప్రజలకు ఉండవలసి నటువంటి మనోనిబ్బరమూ, బలమూ కంటే ...వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేశారు, ఇప్పుడు వాళ్ళు లేరు...అనే ఒక నిస్సహాయత చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, సెజ్‌లు ఇటువంటి వాటికి వ్యతిరేకంగా వేరే రాష్ట్రాలు జరుపుతున్న పోరాటాలను, ఉద్యమాలను చూసినప్పుడు అక్కడున్న మనో నిబ్బరం మన దగ్గర కనబడటంలేదు. ఎక్కడ కనబడటం లేదంటే నక్సలైట్ల ప్రభావం చాలా
127
బలంగా ఉన్న ప్రాంతాలలోనే కనబడటం లేదు. అంటే, ఎక్కడో లోపం ఉంది. అ ఉద్యమం తీసుకున్నటువంటి రూపంలోనే ఉంది. తొలినాడు ఆ పరిస్థితి ఉండేదికాదు. నిరర్వంధమూ, నిర్బంధానికి ప్రతిఘటనా, దానికి మళ్ళా ఎక్కువ నిర్చ్బంధమూ, మళ్ళా ఎక్కువ ప్రతిఘటన - ఈ స్పైరల్ - ఈ వలయం పైకిపోయే క్రమంలో ఎక్కడో ఒక గ్యాప్ లాంటిది ఏర్పడటం వల్ల గావచ్చు. మనకు కనిపించే విషయం ఏమిటనంటే పోరాటం చేసే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తే మనకు ఫలితం వస్తుంది అనే వైఖరి. రెండు మూడు సందర్భాలలో అడగడం జరిగింది, కూలిరేట్టు బాగా తక్కువ ఉన్నాయి కదా అని. 'ఇంకా పోస్టర్లు పడలే, పోస్టర్లు పడితే వస్తాయి" అన్నారు - పోస్టర్లు వే సేటివాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు వేస్తే - కూలి రేట్లు పెరుగుతాయి. లేకుంటే అవి పెరగవు అనేటటు వంటి మాట నేను వరంగల్‌లో రెండుమూడుసార్లు విన్నా ఇది కొంత నష్టకరమైనటువంటి పరిస్థితి,
బహుశా ఒక పునఃసమీక్ష ప్రజలు చేసుకోవాలి. ఆ ఉద్యమాలూ చేసుకోవాలి. అంతిమంగా ఏ ఉద్యమమైనా - ఉద్యమాలు ఉండొచ్చు, పోవచ్చు, దెబ్బతినొచ్చు, మళ్ళీ రావచ్చును కానీ - అది పని చేసిన ప్రాంతంలో ప్రజలకు మనోనిబ్బరం ఇవ్వగలిగితే... సమస్యాస్తే మేము కదులుతాం, మేము ఒకటవుతాం, పరిష్కారం చేసుకుంటాం, పోరాటం చేస్తాం అనేటటువంటి అ సంస్కృతి, దానికి కావలసినటువంటి అత్మస్టైర్యం ఇచ్చే ఉద్యమా లైతే...ఆ ఉద్యమం ఒకవేళ ఏకారణంగా దూరమైనా ఏమయినా సరే - ఫలితాన్ని మిగిలించి పోతుంది.
ఆ ఫలితం బహంశా నక్సలైట్ ఉద్యమం మిగిలించలేదేమో ననిపిస్తుంది. సామాజి కంగా మొదట్లోనే చెప్పాను - ఈ ఉద్యమం తల్లక్రిందులు చేసింది సమాజాన్ని. నోరులేని వాళ్ళకు నోరిచ్చింది, నిలబెట్టింది, ఆ మార్చు తీసుకొచ్చింది. ఆర్థికంగా కొంతమేలు చేసింది. రాజకీయంగా విజ్ఞత చాలా ఇచ్చింది, అలోచన చాలా ఇచ్చింది, విశ్లేషణ చాలా ఇచ్చింది. కానీ చివరికి ఒక బలమైనటువంటి ఉద్యమం పనిచేసిన ప్రాంతాలలో, ముఖ్యమైన ఫలితం ఏదైతే ఉండవలసి ఉండెనో, అది ప్రజలకు లేకుండా పోయింది. వేరే ఏదీగాక పోయినా, ఇవ్వాళ ఆ పార్టీ లేకపోయినా, ఉద్యమాల్లేక పోయినా మేమున్నాం, మేము ఉద్యమం చేనుకుంటాం, వేము పోరాడుతాం, మేము విడిచిపెట్టం, న్యాయం కొరకు మేము కొట్టాడుతామనేటటువంటి సంస్కృతిని ఇవ్వలేకపోయారు. అక్కడ నుంచి మొదలుపెట్టి మళ్ళీ వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి
శైేటి రాయాలా.
తాము అనుసరించిన విధానాలను. పదే పదే విమర్శ ఎప్పుడు వచ్చినా కూడా నిర్బంధం ఉంది కాబట్టి ఈ పనిచేశాము, నిర్బంధం ఎదుర్కోవడానికి చేయవలసి వచ్చింది తప్ప మా అవగాహన లోపం కాదు అని అంటూ ఉంటారు. నిర్బంధానికి ఒక రకంగా మాత్రమే స్పందించాలనేమీ లేదు. ఇంకొకరకంగా కూడా స్పందించి ఉండవచ్చు. వేరేరకంగా స్పందించి ఉంటే ఏ ఫలితం ఉండేది అనంటే అది ఆలోచించుకోవాల్సిన అంశం. వాళ్లు ఎంచుకున్న మార్గాల ఫలితమే గావచ్చు, నిజంగా రాగల ఫలితాన్ని మిగిలించకుండా ఆ ఉద్యమం ఇవ్వాళ దూరం అయ్యింది. తిరిగి రావచ్చును, రాదనేమీ కాదు గానీ, తిరిగొచ్చినా కూడా మళ్ళీ ఇదే రకమైనటువంటి పంథాలో నడిస్తే ఇదే రకమైన ఫలితాలో, ఫలితాల రాహిత్యమో మనకు చివరికి కనిపిస్తే అది బహుశా అంతిమంగా ఒక నెగటివ్ కామెంట్గానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మన దేశమేకాదు, ప్రపంచ వ్యాప్తంగా నయా ఉదారవాదం అనేటటువంటి ఆ ఫిలాసఫీలో చాలా కీలకమైన ఆలోచన ఏమిటనంటే ఎవరి వనరులతో వాళ్ళు తమకున్న సామర్థ్యం మేరకు ప్రయోజనం పొందుతూ పోతారు. వనరులు లేనివాళ్ళు చస్తే చస్తారు, బ్రతికితే బ్రతుకుతారు. వనరులున్న వాళ్ల నుంచి ఏమయినా కొంత రాలితే వీళ్ళు ఏరుకొనితింటారు అనే ఒక ఫిలాసఫీ ఒకటి ఇవ్వాళ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను శాసిస్తూ ఉంది. వనరులు అనే వాటిని ప్రభుత్వం ప్రయత్న పూర్వకంగా ప్రజానీకానికి జీవనాన్ని కల్పించే రూపంలో అభివృద్ధి చెయ్యాలనే ఆలోచన పూర్తిగా పక్కకిపోయి వనరులు ఉన్నవాడిదే సొత్తూ, లేని వాళ్ళకు లేవు, వాళ్ళకు బ్రతుకు ఉండేదీ లేనిదీ పరిస్థితులను బట్టి ఉంటుంది అనే అభిప్రాయం వచ్చింది.
ఈ నేపథ్యంలో అసంతృప్తి చాలా ఉంది. ఆ అసంతృప్తిని ముఖ్యంగా మన రాష్ట్రంలో గత అయిదారు సంవత్సరాలుగా - చంద్రబాబు నాయుడు పరిపాలనలోని చివరి రెండు సంవత్సరాలు లెక్కబెట్టుకొని రాజశేఖరరెడ్డి పరిపాలనని మనం గానీ చూసుకుంటే చాలా పెద్దఎత్తున ప్రజానీకం జీవితానికి అవసరమయిన మౌలిక భౌతిక వనరులను బలవంతంగా వాళ్ళకు కాకుండా చేసి అభివృద్ధి "పేరుమీద వాటిని కార్సొరేట్ కంపెనీల చేతిలో పెడుతూ ఉన్నారు. అది సెజ్ కానీయండి లేదా సింగరేణి కార్పొరేషన్ వాళ్ళ ఓపెన్ కాస్ట్ గనులు కానీయండి, కోస్టల్ కారిడార్గానీ అదే చేస్తూ ఉన్నారు.
ఎంత ప్రతిఘటన అయితే రావలిసి ఉండిందో అది రాకపోవడానికి ప్రజలలో ఉన్న నిస్తేజం ఒకటే కాకుండ బలమైన ప్రజాఉద్యమం ఏదీ లేకపోవడం ఎంత లోటో ఇవ్వాళ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇవ్వాళ రాగలుగుతుందా అటువంటి
శైలి కార్యం -నక్షమం
ఉద్యమం ఒకటి? రావడానికి ఎన్ని రకాల అవాంతరాలున్నాయి? ఎందుకంటే మన వామపక్ష ఉద్యమా లలో మొదటినుంచీ కూడా కలుపుకొనిపోయి ఐక్యంగా బలంగా ఉమ్మడిగా ఉండేకంటే కూడా ఎవరికి వాళ్ళు చీల్చుకొని పోయేటటువంటి పోకడే ఎక్కువ. అది ఇవ్వాళ చాలా దూరంపోయింది. అది ఒకటి జరిగింది. రెండవది ఒకనాటి తెలంగాణను గాని, ఒకనాటి ఆదివాసీ ప్రాంతాన్ని గాని, ఆంధ్రప్రదేశ్‌ను గాని వ్యాఖ్యానించుకోవడానికీ ఉపయోగించినటు వంటి అ సిద్ధాంత చట్రం ఇవ్వాళ పనికొస్తుందా? ఈ వాస్తవాన్ని విశ్లేషించడానికి ఏ రకమైనటు వంటి చట్రం కావాలి, ఏ రకంగా ప్రజానీకాన్ని సమీకరించాలి? ఎందుకంటే ఒక దుర్మార్గుడైన దారను తంతే, కొడితే, చంపేస్తే, లేకపోతే బెదిరించి నోరుమూయించేస్తే లేదా జనమంతా ఒకటయి ఇక సాగదు నీ ధాష్టీకాలు అని అంటే అది ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థ అట్ట్లాంటిది కాదు. సామాజ్యవాదమనేది, పెట్టుబడి దారి వ్యవస్థ అనేది ఒక వ్యక్తిగాదు దానికి ప్రతినిధి. అది ఒక వ్యక్తి కాదు, ఒక చోటు, ఒక స్థలం కాదు -అదొక విసృృతమైన సామాజిక సంబంధం. ఆ విస్తృతమైన సామాజిక సంబంధానికి వ్యతిరేకంగా చేసే పోరాటమనేది చాలా మెలకువతో, చాలా విజ్ఞతతో వ్యవహరించాల్సిన అవనర ముంటుంది. దానికి కావాల్సిన సిద్ధాంతం కూడా మురింత గాఢత సంపాయించుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఉద్యమాలు ఇవ్వాకైతే కనబడటం లేదు. అయితే తిరుగుబాట్లు బహుశా ఇంకా చాలా జరగబోతాయి. మళ్ళీ వామపక్ష ఉద్యమాలు, నక్సలైటు ఉద్యమాలు ప్రవేశించి, కొంత బలం సంపాయించుకోగలిగితే ఆ తిరుగుబాట్లకు వాళ్లు అండగా ఉంటారు గానీ, వారి ఆలోచనారీతులు, ఆచరణరీతులు చాలా లోతుగా పునఃనమీక్షించుకొని, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా తయారుచేసుకోకపోతే ఫలితం ఎంతుంటుందో చెప్పడం కష్టం. ప్రస్తుతానికి చెపమంటే మాత్రం నిరాశే ప్రధానమైనటువంటి స్పందనగా ఉంటుంది నా వరకైతే,
మావోయిస్టులు గాక ఇతర ఎమ్.ఎల్ పార్టీల వాళ్ళు మొదటి నుంచీ కూడా ప్రజలను సమీకరించాలి అనే పంథాను అనుసరిస్తూ వస్తున్నారు కదా అన్న ప్రశ్న కూడా వస్తుంది. కానీ నిజానికి ఆ పార్టీలు కూడా కారణమేదైనా గానీయండి ఎంత విస్తృతంగా నమన్య లున్నాయో అంత వినృతంగా వ్యాపించలేకపోతున్నారు. ఎందుకు వ్యాపించలేకపోతున్నారు? ఎందుకు ప్రజలను సమీకరించలేకపోతున్నారు? లేకపోతే
420 కలాగపాల్ దవన్వాాద
ప్రజలే సమీకృతం కావడం లేదా? ఈ ప్రశ్నలకు జవాబులు ఆలోచిస్తే చాలా లోతుగా పోవల్సివస్తుంది.
ఒకనాడు ప్రజలలో మన దీర్ధకాలికమైనటువంటి బాగుకోసం, రేపటి బాగుకోసం ఇవ్వాళ త్యాగం చేద్దాము అనేటటువంటి ఒక రాజకీయ గుణం, సామాజిక గుణం కూడా బలంగా ఉండింది. ఎక్కడో అది కూడా దెబ్బతినింది.
ఆహ) ఇవి (హెబ్ఎమ్.టి.వి ఇంటర్వ్యూ - 2008) 222] శ రాజ్యం - నంక్షేమం శ
యె యుదో అమరికా బ్రన్మూదం
ఇరాక్ ప్రధానంగా ఎడారి దేశం. మన మాదిరి సస్యశ్యామలమైన దేశం కాదు. చమురు అమ్ముకుని ఇతర అవసరాలు దిగుమతి చెసుకుని బతికే దేశం. చమురు బాగా ఉంది కాబట్టి, అంతా బాగుంటే సంపన్నదేశంగానే ఉండగలదు. కాని అమెరికా యుద్ధం ప్రకటించి ఆంక్షలు విధించింది. ఏవిధంగా విధించింది అంటే నిత్య జీవిత అవసరాలు కూడా దిగుమతి చేసుకోడానికి వీలులేని పద్ధతిలో ఆంక్షలు విధించి వాళ్ళ ఆరోగ్యానికి, ఆహారానికి, వైద్యానికి కావల్సిన వస్తువులు కూడా వాళ్ళకు దక్కకుండా చేసి, ఏడున్నర లక్షలమంది పసిపిల్లలు అనారోగ్య కారణంగా చనిపోయేలా చేశారు. ఇది ౮7౭500 వాళ్ళ అంచనా. నా అంచనా కాదు. సద్దాం హుస్సేన్ అంచనా కాదు. అాభా5ం0 అంటే ఐక్యరాజ్యసమితి సంస్థ.
ఆంక్షలు పెట్టింది అమెరికా. ఐక్యరాజ్యసమితి చేతే ఆంక్షలు పెట్టించింది. వీటి అమలును పర్యవేక్షించే బాధ్యత కూడా ఐక్యరాజ్యసమితిదే. రష్యా బాగున్న రోజులలో అమెరికా, రష్యాలిద్దరూ దానితో పుట్‌బాల్ ఆడుకున్నారు. అమెరికా ఈ పక్క రష్యా ఆ పక్క. ఇప్పుడు ఒకటే టీమ్ పుట్‌బాల్ ఆడుతూ ఉంది ఐక్యరాజ్యసమితితో. ఐదేళ్ళ కిందవరకు అమెరికా తాను చేయదల్చుకున్న అన్ని దుర్మార్గాలు ఐక్యరాజ్యసమితి ద్వారా చేయించేది. ఇప్పుడు ఐక్యరాజ్యసమితితో నిమిత్తం లేకుండా చేస్తోంది. ఇరాక్‌పైన భయంకరమైన ఆంక్షలు పెట్టించి, పసిపిల్లల వైద్యానికి అవసరమయినటువంటి మందులు కూడా దక్కకుండా చేసి దీన్ని అమలు చేసే బాధ్యత ఐక్యరాజ్యసమితికి అప్పగిస్తే దానికి ఇన్చార్జిగా ఉన్న ఒక అధికారి రాజీనామా చేశాడు. ఏమన్నాడూ అంటే “ఇవి ఆంక్షలు కాదు. ౫1౩ 1 6౦6166” అన్నాడు - “జాతి హననం ఇది. మా జాతిని మొత్తం హత్యచేసే పని ఇది. నేను పర్యవేక్షించ లేను దీన్ని” అని రాజీనామా చేశాడు. ఆయన స్థానంలో ఇంకొకరిని పెట్టారు. రెండేళ్ళు అయినాక ఆయన కూడా రాజీనామా చేశాడు - 'నా ముందు వాడు చెప్పినదే రైటని.” ఇప్పుడు కోఫీ అన్నన్
22 కాగపాల్ దవన్వాాణ
రాజీనామా చేస్తే, యుద్ధం ఆగదు కానీ అమెరికా ఏం చేస్తోందో ఇరాక్‌లో అనే విషయం మరింత బట్టబయలవుతుంది.
అమెరికా, అమెరికాకు తోడుగా బ్రిటన్. అయినా ఇవ్వాళ నేను ప్రధానంగా మాట్ట్లాడాలనుకున్నది అది కాదు. అమెరికా దౌర్జన్యాలు అనంతమైనవి. వాళ్ళేదో 26015100 80110108 మా దగ్గర ఉంది. ఎక్కడెక్కడ ఆయుధాలు తయారు చేస్తారో వాటి మీద మాత్రమే దాడి చేస్తున్నాము అంటున్నారు గానీ అంత 16013108 వాళ్ళ దగ్గర ఏమీ లేదు. సాధారణ నిరాయుధులైన పౌరులను చంపుతున్నారు. గత యుద్ధం లోనూ చచ్చిపోయారు. అట్లాగే ఇప్పుడూ చస్తున్నారు. ఆస్టనిస్తాన్లో కూడా చాలా మంది చనిపోయారు. మొత్తం లెక్క ఈ మధ్యనే బయటికి వచ్చింది. ₹/016 1266 0౪1౪ మీద ఆల్జ్టైదా వాళ్ళు కూడా దుర్మార్గమైనదాడి చేశారు. ఇక్కడేదో మేము ఒకరి హింసను సమర్థిస్తాము, రెండోవాళ్ళ హింసను వ్యతిరేకిస్తాము అనుకుంటే చాలా పొరపాటు. 7/06 1266 ౮౬౧౬ పైన జరిగిన దాడి ఖచ్చితంగా దుర్మార్గమైనది. మూడు వేల మంది, నాలుగు వేల మంది చనిపోయారని అంచనా. కానీ ఆ పేరు పెట్టుకొని ఆస్థనిస్తాన్ పైన అమెరికా చేసిన యుద్ధంలో ఇరవై రెండు వేల ముంది చనిపోయారు. వాళ్లలో ఎక్కువ భాగం నిరాయుధులైన పౌరులు అనేది ఈ మధ్యనే బయటకొచ్చింది. ఎవరో చేసింది కాదు పాశ్చాత్య విలేఖరులే లెక్కలు కట్టారు. ఇవ్వాళ ఇరాక్‌లో కూడా అంతే. కరక్టుగా సైనిక టార్గెట్టను మాత్రమే కొట్టగల 1£78013100 అమెరికా దగ్గర ఏమీ లేదు, ఎవ్వరి దగ్గరా లేదు. అది ఒట్టి అబద్ధం. చాలామంది పౌరులను చంపితేనే, దాంట్లో భాగంగా కొంతమంది సైనికులు చస్తారు. ఆ రకమైన యుద్ధం చేస్తున్నది అమెరికా ఇప్పుడు. చాలా దుర్మార్గమైన విషయం. కాని నేను ఇవ్వాళ మాట్లాడాలనుకున్నది అది కాదు.
ఊరేగింపు మొదలుకాకముందు కడప నుంచి ఒక మిత్రుడు వచ్చాడు. విలేఖరిగా వచ్చినావా ఊరేగింపు కోసం వచ్చినావా అంటే రెండూ కాదు, ఈ ఊరేగింపులో హిందువులు ఎంతమంది ఉన్నారో చూద్దామని వచ్చినాను అన్నాడు. నిజంగానే ఎక్కువ భాగం ముస్లింలు ఉన్నారిక్కడ. హిందువులున్నారు, కాని కొంతమందే ఉన్నారు. నేను వచ్చిన వాళ్ళను తప్పు పట్టడం లేదు. రానివాళ్ళ గురించి నాకు నేను ప్రశ్న వేసుకుంటున్నా. నీ మీటింగ్‌కి మేం రావాలా అంటారేమోగాని, నా మీటింగ్‌కు అని కాదు. ఇది ఎందుకు తమ సమస్యగా ఈ దేశంలోని ముస్లిమేతరులు అనుకోవడం లేదని? ఈ ప్రపంచంలోని ముస్లిమేతర దేశాలు తమ సమస్యగా ఎందుకనుకోవడం లేదని? ఇది ముస్లింల
22తి
సమస్యగా ఎందుకను కుంటున్నారు అసలు? అమెరికా ముస్లిం దేశాల మీద మాత్రమే దాడి చేస్తోంది అనుకుంటున్నారా ఎవరయినా సరే? అదే అనుకున్నా అదీ అన్యాయమే. ప్రపంచమంతటా చాలాపెద్ద సంఖ్యలో ప్రజలుండే మతం ఇస్తాం. ఆ ప్రజలు బతికే దేశాల మీద మాత్రమే దాడి చేసి అణచివేయాలని అమెరికా ఒకవేళ అనుకున్నా అది చాలా అన్యాయమైన విషయమే. కానీ అది కూడా వాస్తవం కాదు. మన ప్రభుత్వం ఏమనుకుంటోంది? ఇప్పటి వరకు స్పష్టంగా ఒక్కమాట మాట్లాడలేదు. వాజ్పాయ్గానీ, అద్వానీ గానీ మొదట ఏమన్నారు - యుద్ధం వస్తే పెట్రోలు ధరలు పెరుగుతాయేమో అన్నారు. మన ఊరిలో లారీ కంపెనీల యజమానులు ఉంటారు గదా, వాళ్ళు అనుకుంటారు ఇలా. లారీ ట్రాన్స్పోర్ట్ యజమానికి మొదట ఏమొస్తుంది ఆలోచన - డీజిల్ ధర పెరుగుతుందేమో అని. దేశ ప్రధానమంత్రి కూడా అట్లే అనుకుంటే ఎట్ల? ఒక రాజకీయ పార్టీ నాయకుడు అయి ఉండి సాంస్కృతిక జాతీయ వాదం అనే సిద్ధాంతం పెట్టుకొని ఉండే నీకు అంతకంటే గొప్ప ఆలోచనలు రావా? ధర "పెరుగుతుందేమో అనే దానికంటే, మనుషులు చస్తారనే బాధ లేదా నీకు? అసలు ప్రపంచంలో శాంతే లేకుండా పోతుందనే బాధ లేదా నీకు? దేశాల సార్వభౌమత్వం అనే మాటకు అర్ధం లేకుండా పోతుందనే బాధేమీ లేదా నీకు? పెట్రోలు ధరలు పెరుగుతాయి అనా బాధపడతావు నువ్వు? వాజ్‌పాయి గారు మనసులో ఏమనుకుంటూ ఉండొచ్చంటే - చచ్చేది ముస్లింలేగదా అని.
ఆమెరికా సంయుక్త రాష్ట్రాలు అని పిలువబడే ౮.5. అనే ఈ దేశానికి 150 ఏళ్ళ యుద్దాల చరిత్ర ఉంది. ఒక్క ముస్లిం దేశాల మీద మాత్రమే దాడి చేయలేదు అమెరికా. 1846లో, 156 ఏళ్ళ కింద మొట్టమొదటి యుద్ధం చేసింది మెక్సికో మీద. ఏమని యుద్ధం చేసింది? విస్తారమైనటువంటి, సారవంతమైన భూములున్నాయి మీ దగ్గర, మాక్కావాలి అని. మాక్కావాలి కాబట్టి మాకియ్యనివాడు దుర్మార్గుడు, కాబట్టీ మేము ఆక్రమించుకుంటాం అన్నారు. అక్కడ మొదలయ్యింది. మొట్టమొదట అమెరికా చేసిన యుద్దాలన్నీ కూడా శ్రైస్తవ దేశాలతోనే. క్రైస్తవ దేశాలు అంటే రాజ్యాలు క్రైస్తవ రాజ్యాలు కావు గానీ, క్రైస్తవులు బతికే దేశాలు అని. రాజ్యాలు సెక్యులర్ రాజ్యాలు కావచ్చు. వామపక్ష రాజ్యాలు కావచ్చు. మత రాజ్యాలు ఒకటి రెండూ ఏమన్నా ఉంటే ఉండొచ్చు. మెక్సికో, హైతీ, క్యూబా, నికరాగువా, గ్యాటమలా, హోండూరాస్ - ఒకటి కాదు, దక్షిణ అమెరికా మధ్య అమెరికా అన్ని దేశాలలో ఒకటే ఒక్క పాయింటు.
వళ కో హాగోసాల్ దవన్యాసాల
అదేమిటంటే నాకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఎక్కడా ఉండటానికి వీలు లేదు. నాకు అనుకూలంగా ఉంటే నువ్వు దుర్మార్గుడువి అయినా ఫర్వాలేదు.
సద్దాం హుస్సేన్ దగ్గర ఆయుధాలు ఉన్నాయి అని ఆయనను దించేసి ఇంకొకడిని కూర్చోబెడతాడు. మరి వాడి దగ్గర ఆయుధాలు ఉండనా? వాడి దగ్గరా ఆయుధాలు ఉంటాయి గదా. అయినా ఫర్వాలేదు. ప్రభుత్వం నాకు అనుకూలంగా ఉండాల. నువ్వు ఏమైనా చేసుకో. నాకు వ్యతిరేకంగా ఉంటే నువ్వు ఏం చేసినా నేను ఒప్పుకోను. ఆప్టనిస్తాన్‌లో ఏమయిందండీ? ఏం చెప్పన్నారు సెప్టెంబర్ 11 తర్వాత - ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకొనేంత వరకు నిద్రపోము అన్నారు. అతను దొరకలేదు. ఆల్‌ఖైదాకు సంబంధించి ఒక్క ముఖ్యుడు ఇప్పటిదాకా దొరకలేదు. ముల్తా మహమ్మద్ ఒమర్ దొరకలేదు. తాలిబన్‌కు సంబంధించిన ఒక్క ముఖ్యుడూ దొరకలేదు. మరిచిపోయినావా అస్థనిస్తాన్ను, ఇరాక్ మీదకు వచ్చావు. ఏం మారింది, ప్రభుత్వం మారింది? నీకు అనుకూలమైన గవర్నమెంటు వచ్చింది. అనుకూల ప్రభుత్వం వచ్చిన తరువాత ఆల్‌ఖైదాను శిక్షించకపోయినా ఫర్వాలేదు. ఒసామా బిన్ లాడెన్ దొరక్కపోయినా ఫర్వాలేదు, ముల్లా మహమ్మద్ ఒమర్ అక్కడే కాబూల్‌లో ఉన్నా ఫర్వాలేదు. గవర్నమెంటు నాకు అనుకూలంగా ఉండాల, ఇది చెప్పరాదా బహిరంగంగా. “ప్రపంచంలో అన్ని ప్రభుత్వాలు నాకు అనుకూలంగా ఉండాలి. నాకు వ్యతిరేకమైనది ఉంటే నేను ఒప్పుకోను' - అదీ అమెరికా చెప్పదల్చుకున్న సందేశం.
ఇది అర్ధం కాకుండా ఏదో ముస్లింలను చంపుతున్నాడులే, ముస్లిం దేశాల మీద మాత్రమే దాడి చేస్తాడులే అని అద్వానీ, వాజ్పాయిలు అనుకుంటే అది చాలా ఘోరమయి నటువంటి పొరపాటు అవుతుంది. ఏ విషయంలోనైనా రేపు ఇండియా మీద వాళ్లకు కోపం రావచ్చు. మనవాళ్ళు కూడా అణుబాంబు తయారు చేస్తున్నారు కదా. అమెరికాకి ఇష్టం లేదు. ఎందుకంటే అమెరికాకు తన దగ్గర మాత్రమే బాంబు ఉండాలి. వేరే ఏమీ లేదు. అణుబాంబుల పట్ల సూత్రప్రాయమైన వ్యతిరేకత అమెరికాకు ఏనాడూ లేదు. నా దగ్గర మాత్రమే ఉండాల. వేరేవాళ్ళ దగ్గర ఉండొద్దు. దానికి న్యూక్లియర్ నాన్-'్రాలిఫిరేషన్ అని పేరొకటి. కాబట్టి అమెరికాకు ఇష్టం లేదు ఇండియా దగ్గర అణుబాంబులు ఉండటం. కాని మనవాళ్ళు పెట్టుకున్నారు. సాంస్కృతిక జాతీయ వాదమో, హైందవ జాతీయ వాదమో ఏదో ఒకటి దానికి ఒక్క బాంబు కావాలి. రేపు అమెరికా వాడు అంటాడు, ఇట్లే సద్దాం హుస్సేన్‌తో అన్నట్టే, నీ దగ్గరి అణుబాంబును
125 శ్యాం “నత్షమం
తీసుకొనిపోయి బంగాళాఖాతంలో పారేయి అని. అప్పుడు వాజ్‌పాయి ఏమంటాడు - నేను పారేయను. మా గోల్వాల్కర్ చెప్పాడు. ఒక్కటైనా సరే పెట్టుకోపోతే నువ్వు మగవాడివే కావు, నీకు పౌరుషం లేనట్టే అని చెప్పాడు. అందుకే ఒకటి పెట్టుకుంటా
- అంటాడు. అప్పుడు బుష్ ఏమంటాడు - అద్వానీ, వాజ్పాయిలు వెళ్ళిపోండి ఇండియా నుంచి అంటాడు. పోతారా మరి? అప్పుడు బుద్ది వస్తుంది మీకు. ఇక్కడ సమస్య ఇరాక్ కాదు, ముస్లింలు కాదు. ఇది అమెరికా అహంకారం సమస్య.
ఎందుకు ఇంత తొందర పడుతోంది అమెరికా అంటే 1989 వరకు సోవియట్ రష్యా ఒకటి ఉండింది ప్రపంచంలో. అదేం పెద్ద మంచి దేశమని కాదు కానీ, తన ప్రయోజనాల కోసమైనా కొన్నిటికి అడ్డం పడుతూ ఉండేది. మన ఊరులో ఇద్దరు ఫ్యాక్షనిస్టులు ఉంటే ప్రజలకు కొంత స్వేచ్చ ఉంటుంది కదా. ఒక్కరే ఉంటే అసలు ఉండదు. అంతే గదండీ రాయలసీమలో కూడా. ఇద్దరు ఫ్యాక్షనిస్టులుంటే ఈ రెడ్డిగారూ, ఆ రెడ్డిగారూ కొట్టుకుంటారు, మనకు కొంత స్వేచ్చ వస్తుంది మధ్యలో. ఒక్కరే ఉంటే మనం అయిపోతాం. ప్రొద్దుటూరు వాసులకు నెను చెప్పాల్సిన అవసరం లేదు ఆ సంగతి. అట్లానే 89 వరకు రష్యా ఒకటి ఉండేది. అప్పుడు ప్రపంచ ప్రజానీకానికి ఒకసారి వీళ్లదగ్గరకు, ఒకసారి వాళ్లదగ్గరకు పోతుంటే - ఈ రెడ్డి దగ్గరకు, ఆ రెడ్డి దగ్గరకు పోయినట్టు - కొంచెం స్వేచ్చ ఉండేది. కాని 89లో సోవియట్ రష్యా పోయింది, అమెరికా ఒక్కటే మిగిలింది. అమెరికాకు బాగా తెలుసు ఇది శాశ్వతంగా ఉండబోయే పరిస్థితి కాదని. మళ్ళీ ఇంకొకడు ఎవడో వస్తాడు. ఈ లోపల ప్రపంచాన్ని మొత్తం చక్కబెట్టేసుకోవాల. ఈ లోపల ప్రపంచమంతటా తన కనుకూలమైన గవర్నమెంట్లు పెట్టేసుకుంటే ఇంకొక దేశమేదీ ఎదగకుండా చూసుకోవచ్చు. అమెరికాకు కావాల్సింది అదే. దాంతోపాటు చమురు, రకరకాల ఖనిజాలు, ఆ ఖనిజ నిక్షేపాలుండే దేశాలు, ఆఖరికి మంచి నీళ్ళుకూడా - మనం ఇంకా పూర్తిగా అర్ధం చేసుకోవడం లేదు, మంచినీటికి ఎంత సమస్య రాబోతుంది రాబోయే రోజులలో అంటే... అర్జెంటీనా అని ఒక దేశం ఉంది దక్షిణ అమెరికాలో. విస్తారమైన మంచినీటి వనరులున్న దేశం అది. మంచినీటి వనరులు ఉండడమేమిటి అనుకోవద్దు మీరు. ఆ రోజులూ వస్తాయి. మంచినీటి వనరులు ఏ దేశంలో ఉంటే ఆ దేశం మీద కూడా యుద్ధం జరిగే రోజులు వస్తాయి. అర్జెంటీనా నుంచి ఒకామె వచ్చింది మొన్న. హైద్రాబాదులో ఆసియన్ సోషల్ ఫోరమ్ అని చెప్పి మీటింగులు పెడితే ఆమె వచ్చి ఒక మాట చెప్పింది. “రాబోయే రోజులలో చమురు కోసం కాదు మంచినీటి కోసం యుద్దాలు జరుగుతాయి. మా
206 కేల ాంగోపాల్ ఉవన్వాసాల *
దగ్గర బ్రహ్మాండమైన మంచినీటి వనరులున్నాయి, అమెరికా వస్తుందేమోనని భయపడుతున్నాం.”
ఎందుకయ్యా నీకు ఇంత చమురు, ఎందుకు నీకు ఇంత పెట్రోలు అంటే ప్రపంచం మొత్తం ఉపయోగించేటటువంటి పెట్రోలులో 25 శాతం ఒక్క అమెరికాలో మాత్రమే ఖర్చవుతుంది. అంత పెట్రోలు వాళ్ళు తాగుతారు. ఇంటింటికి రెండు కార్డు, మూడు కార్డు, నాలుగు కార్డు, తండ్రికి కారు, తల్లికి కారు, కొడుకుకు కారు, ఠూతురుకు కారు. విపరీతంగా వాళ్ళు ఇంధనాన్ని ఉపయోగిస్తారు. ఆ జీవన ప్రమాణం అనేది దెబ్బ తినడానికి వీలులేదు. ఆ విలాసవంతమైన అమెరికన్ల జీవితం ఏదైతే ఉందో -
- కార్డు ఒక్కటే కాదు, అన్ని రకాలుగా కూడా అత్యంత ఖరీదైన జీవన ప్రమాణాన్ని
వాళ్ళు నెలకొల్పుకున్నారు. అది సురక్షితంగా ఉండాలి. అంటే ఇంధనాల మీద ప్రపంచ వ్యాప్తంగా పూర్తిగా నియంత్రణ కావాలి.
అత్యంత విలాసవంతమైన జీవితానికి అవసరమయిన ఖనిజాల మీద వాళ్లకు పూర్తి నియంత్రణ కావాలి. రేపు మంచినీళ్ల మీద కూడా నియంత్రణ కావాలి. కాని ప్రపంచమంతా అమెరికా రాష్ట్రాలలో కలిపి వేసుకోవాలంటే కష్టం కాబట్టి అనుకూలమైన గవర్నమెంట్లు పెట్టుకుంటూ పోవాలి ప్రపంచమంతా కూడా. 150 ఏళ్ళుగా అమెరికా ఈ పని చేసుకుంటూ వస్తోంది తన స్థాయిలో. దక్షిణ అమెరికాలో చేసింది. మధ్య అమెరికాలో చేసింది. తూర్చు ఆసియాలో చేసింది. ఇప్పుడు పశ్చిమ ఆసియాకు వచ్చింది. కాబట్టి ఇది ముస్లింల సమస్య కాదు. ఇస్లామిక్ దేశాల సమస్యకాదు. ఇన్లాం సమస్యా కాదు. అందుకే ఇక్కడికి ముస్లింలు మాత్రమే రావాల్సిన అవసరం కాదు, అందరూ రావాలి. ఇది ప్రపంచం సమస్య.
మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తరువాత, లక్షలాదిగా ప్రజానీకం చచ్చిపోయిన ఆ యుద్ధం తరువాత అందరికీ ఏమనిపించిందంటే దేశం లోపల గవర్నమెంటు లేకపోతే మనం తట్టుకోలేమే....పరిపాలన లేకపోతే, ప్రభుత్వం లేకపోతే, పోలీస్ స్టేషన్ లేకపోతే, శాసనసభ లేకపోతే, చట్టాలు లేకపోతే బలవంతుల రాజ్యం అయిపోతుందని భయవపడతామే. అలాంటిది ఒకటి ప్రపంచంలో ఉండొద్దా అనుకున్నారు. దేశం లోపల ఏ విధంగా అయితే బలహీనులకు భద్రత కల్పించే ఒక పరిపాలన కావాల్నో ప్రపంచంలో కూడా ఒకటి కావాలి కదా అని చెప్పి అప్పట్లో లీగ్ ఆఫ్ నేషన్స్ అని ఒకదానిని సృష్టించారు. అది సక్రమంగా పని చేయలేదు. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో మొదటి ప్రపంచ యుద్ధం
22? కాం నజుం
కంటే పదిరెట్లు ఎక్కువగా ప్రాణనష్టం జరిగింది. భయంకరంగా చచ్చిపోయారు మనుషులు - దేశాల లోపల, దేశాల మధ్య యుద్ధాలలో. యుద్ధం అయిపోయినాక మళ్ళీ కూర్చున్నారు అందరూ, బలమైన దేశాలు బలహీన దేశాలమీద దాడులు చేస్తూనే ఉంటే, చంపుతూనే ఉంటే ఎలా? మళ్ళీ ఒక అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేసుకుందాము, ఎవ్వరూ యుద్ధాలు చెయ్యడానికి వీలులేదని...అనుకున్నారు. ఏ సమస్య ఉన్నా దేశాలమధ్య మా అంతర్జాతీయ వేదికకే రావాలి, అక్కడే మాట్లాడుకోవాలి. అక్కడనుంచే పరిష్కారం కావాలి. ఆఖరి పరిష్కారంగా మాత్రమే యుద్ధమనేది ఉండాలి అని ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసుకున్నారు.
అప్పుడు ఈ బలమైన దేశాలు ఏం చేశాయి? ఐక్యరాజ్యసమితిలో అధికబలాన్ని తమకే కట్టబెట్టుకున్నాయి. ఏమని వాదించాయంటే ప్రపంచదేశాలన్నీ కూడా ఇట్లా సభ్యులుగా ఉంటే, చాలా చిన్న చిన్న దేశాలుంటాయి, పదివేలమంది జనాభా ఉండే దేశాలు, లక్షమంది జనాభా ఉండే దేశాలు ఉంటాయి, వాళ్ళకు బాధ్యత ఏముంటుంది? వాళ్ళకు ఏం తెలుస్తుంది? వాళ్ళూ ఒకటే, అమెరికా ఒకటే, రష్యా ఒకటే, చైనా ఒకటే, ఇండియా ఒకటే అంటే ఎట్లా? అట్లా కాదు. పెద్దవి కాబట్టి పెద్ద దేశాలకు వీటో హక్కు ఉండాలి, వాటికి భద్రతా మండలిలో శాశ్వతమైన సభ్యత్వం ఉండాలి. ఏ దేశం 'పైనైనా యుద్ధం చేసే నిర్ణయం భద్రతా మండలి చేయాలి, దాంట్లో శాశ్వతంగా అమెరికా రష్యా, చైనా, ఇంగ్లాండ్, ఫ్రాన్సు ఉంటాయి, అవి నిర్ణయం చేస్తాయి అనే ఒక అన్యాయమైనటు వంటి షరతును ఆరోజు పెట్టారు. కారణం ఏం చెప్పారు అంటే చిన్నదేశాలు, అప్రధానమైన దేశాలు వాటికి విచక్షణ ఏముంటుంది? వాటికి బాధ్యత ఏముంటుంది? - అని. ఇప్పుడు మనకు స్పష్టంగా ఏం అర్థం అవుతూంది అంటే వాటికే ఎక్కువ విచక్షణ ఉంది, వాటికే ఎక్కువ బాధ్యత ఉంది.
ఈ పెద్ద దేశాలు, బలమైన దేశాలకు ఏముందీ అంటే స్వార్ధం మాత్రమే ఉంది. వాళ్ళ స్వార్ధం, వాళ్ళ స్వప్రయోజనం, వాళ్ళ అధికారం, వాళ్ళ బలం దానికోసం వాళ్ళు ఏమయినా చేనుకుంటూ పోతూ ఉన్నారు. ఇవ్వాళ మనబోటి దేశాలు అర్థం చేనుకోవాల్సింది ఏమిటంటే ఐక్యరాజ్యసమితి పూర్తిగా పతనం అయిపోయింది. యుద్ధాలను ఆపడం కోసం వచ్చిన సంస్థ ఐక్యరాజ్యసమితి. ఇవ్వాళ ఐక్యరాజ్యసమితి ఏం చేస్తోందంటే నువ్వు యుద్ధం చేసుకో, నేను తరువాత మందులిస్తాను అంటుంది. నీ యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళకు నేను తీసుకుపోయి అన్నం ఇస్తాను, నేను మందులు ఇస్తాను, నేను వాళ్లను ఫ్రైెచక్ల మీద పడేసి హాస్పటల్‌కు తరలిస్తాను అంటోంది. రెడ్‌క్రాస్
128 కంగోపాల్ దవన్నాసాల
చేస్తుంది ఆ పనులు. నువ్వెందుకు చెయ్యాలి? రెడ్‌క్రాస్ ఉండేదే దానికోసం. యుద్దాన్ని ఆపడం కోసం పుట్టిన వ్యవస్థ పాడె మోసే వ్యవస్థగా మారటం చాలా అన్యాయమైన పరిస్థితి.
మనబోటి దేశాలు అర్ధం చేనుకోవాల్సింది ఏమిటంటే వ్రపంచంలో బలవంతునిదే రాజ్యంగా ఉంటే, ఆర్థికంగా, రాజకీయంగా, సైనికంగా అన్ని రకాలుగా బలహీనమైన మనదేశం లాంటి దేశాల గతేమిటి? ఆ జాబితాలో ఇండియా నంబర్ వన్‌గా ఉంటుంది. ఈ తెలివిలేకుండా, ఈ ఆలోచన లేకుండా చచ్చేది ముస్లింలే అనే వైఖరిలో మన పాలకులు ఉన్నారు. మనకేం గాదులే, అమెరికా వాడికి మనకు స్నేహం బాగా ఉంది అనుకుంటున్నారు. అదే వ్యాసాలు రాస్తున్నారు పత్రికలలో - ఇప్పుడు అమెరికాకు ముస్లింలవల్ల ప్రమాదం ఉండే దేశాలు స్నేహితులని. ముస్లింలవల్ల ప్రమాదం అంటే ఏమిటో నాకర్థం కాలేదు. రష్యా, చైనా, ఇండియా, ఇజ్రాయెల్, అమెరికా అందరూ కలిసి ప్రపంచాన్ని ఏలాలంట ఇప్పుడు. ఎటువంటి పరిస్థితిలో అయినా అన్యాయమైన ఆలోచన ఇది. అలాంటిది మనం ఒక బలహీనమైన దేశంగా ఉన్నప్పుడు పూర్తిగా పనికిమాలిన ఆలోచన. మనబోటి దేశాలు ఏం కోరుకోవాలి అంటే ఏ ఉద్దేశ్యంతో, ఏ లక్ష్యంతో, ఏ జాగ్రత్తతో ఒకనాడు లీగ్ ఆఫ్ నేషన్స్, తరవాత ఐక్యరాజ్యసమితి ఏర్చడినాయో దానిని పునరుద్ధరించి ప్రపంచస్థాయిలో ప్రతి దేశానికి ఒక్క ఓటు మాత్రమే ఇచ్చే స్థితి ఉండాలని. ఎవ్వరికీ వీటో పవర్ ఉండకూడదు, ఎవ్వరికీ ప్రత్యేకమైన అధికారాలు ఉండకూడదు. దేశంలో ఉండే ప్రతి పౌరుడికి ఒక్క ఓటే కదా - భిక్షగాడికయినా ఒక్క ఓటే, లక్షాధికారి కయినా ఒక్క ఓటే. అట్లా ప్రపంచదేశాలలో కూడా ప్రతి దేశానికి ఒకే ఓటు ఉండేటటువంటి ఒక ప్రజాస్వామికమైన అంతర్జాతీయ వేదిక ఒకటి ఉండాలి. సద్దాం హుస్సేన్ మీద నీకు కోపమున్నా, బుష్ మీద నాకు కోపమున్నా అక్కడికే పోయి చెప్పుకోవాలి. ఆ వేదిక అందరిని పిలిచి పరిష్కారం చెయ్యాలి. ఆ పరిష్కారానికి అందరూ తలవొగ్గి ఉండాలి. తలవాగ్గి ఉండకపోతే యావత్ ప్రపంచమూ ఒకటయి ఆ దేశాన్ని ఏ రకంగా శిక్తించాలో అ రకంగా శిక్షించాలి. దానిలో యుద్ధమనేది ఉపయోగించనే కూడదు. ఆ ఒక్క దేశం మినహాయించి మిగిలిన వాళ్ళు ఒప్పుకొంటే మాత్రమే ఏమైనా చెయ్యాలి. అది కూడా అంతర్జాతీయ వేదిక చెయ్యాలి. వేరేదేద్ చెయ్యడానికి వీలు లేదు. ఈ రకమైన వ్యవస్థ కోసం మనం ప్రయత్నం చేస్తే మనబోటి బలహీనమయిన దేశానికి - మన స్వార్ధమే ప్రథధానమనుకున్నా, మన గురించే అఆలోచించుకున్నా కూడా - అది తగినటువంటి ఆలోచన అవుతుంది.
329
ఈ ఆలోచన ఏమీ లేకుండా ఇవ్వాళ భారతదేశానికున్న విదేశాంగ విధానం ఏమిటి అంటే ఒకనాడు నెహ్రూ బతికున్నకాలంలో - నెహ్రూ చాలా గొప్పవాడనికాదు, చాలా లోపాలు ఆయనలోనూ ఉండేవికానీ, కొంతవరకు అయినా ఒక ఆలోచన ఉండేది ఆయనకు - అగ్రరాజ్యాల అధికార పరిధికి వెలుపల ఉండే బలహీన దేశాలను ఐక్యం చేసి ఒక అలీన ఉద్యమం నడపాలనే ఆలోచన ఒకటి ఉండేది. ఆ అలీన ఉద్యమం కాలక్రమంలో సోవియట్ అనుకూల ఉద్యమంగా మారిపోయింది. అది వేరే సంగతి కాని ఆలోచన అయినా ఉండేది. ఇవ్వాళ మనవాళ్ళకున్న ఏకైక విదేశాంగ విధానం ఏమిటీ అంబే ఏమి జరిగినా పాకిస్తాన్ కంటే కొంచెం ఎక్కువ ప్రయోజనం మనకు జరగాలి, వేరే ఏమీ ఆలోచన లేదు. ఏమైనా జరగనీయండి, ఎవడైనా బాంబు వేయనీయండి, ఎవడైనా చావనీయండి, ఇరాక్ యుద్ధం కానివ్వండి, సెప్టెంబర్ 11 కానివ్వండి, ఆఫ్థనిస్తాన్ యుద్ధం కానివ్వండి. ఒకటే ఆలోచన ఢిల్లీలో - పాకిస్తాన్‌కు ఎక్కువ ప్రయోజనమా, మనకు ఎక్కువ ప్రయోజనమా? ఇప్పుడు ఒకవేళ మనంగానీ బుష్ ఇరాక్‌పైన యుద్ధం చేయడం అన్యాయం అంటే వాడు పాకిస్తాన్‌కు అనుకూలం అవుతాడా? కాకూడదు అంటే మనమే ముందు వాడి దగ్గరకు పోవాలి. మీకు జ్ఞాపకం ఉండొచ్చు ఆఫ్టనిస్తాన్ మీద యుద్ధం మొదలు పెట్టినప్పుడు మనల్లు పట్టించుకోలేదే అని బాధ పడ్డారు మనవాళ్ళు. పాకిస్తాన్ దగ్గర సహాయం తీసుకొంటున్నారు, అమెరికా విమానాలు వచ్చి అక్కడ ఆగి ఆస్థ్యనిస్తాన్ పైన దాడులు చేస్తున్నాయి. అరే మనల్ని అడగలేదే. విమానాలు ఆగేదానికి స్థలం చూపించేవాళ్ళమే అని బాధపడ్డారు ఆ రోజున. బుద్ధుందా ఏమయినా? నీకు ఒక నీతి లేదా? విలువలు లేవా? ఆదర్శాలు లేవా? మాట్లాడితే గాంధీ అంటావే నువ్వు, మాట్టాడితే అత్యున్నతమైన, అతి ప్రాచీనమైన సంస్కృతి అంటావే, ఇంగ్లాండ్‌లో అమెరికాలో గోచులు తప్ప ఏమీ లేని రోజులలో మాకు గొవ్ప గొవ్పృ నాగరికతలు ఉండేవి అంటావే. నాస్తవం కూడా అది. ఏమయిపోయాయి నీ ఆలోచనలన్నీ కూడా.
ప్రపంచస్థాయిలో ఏ బలమైన దేశం కూడా ఏ బలహీనమయిన దేశాన్నయినా ఏమీ చెయ్యడానికి వీలు లేనటువంటి వ్యవస్థ కోసం కదా మనం కృషి చేయాలి. అమెరికా ఇరాక్‌పైన యుద్ధం చెయ్యడానికి వీలులేదు. కుర్దుల మీద భయంకరమైన అణచివేత ఇరాక్ ప్రయోగిస్తోంది, టర్కీ ప్రయోగిస్తోంది, అది జరగడానికి వీలు లేదు. బలవంతులు బలహీనులపైన ఏ రకమైన అణచివేత ప్రయోగించడానికి వీలు లేనటువంటి ఒక నిజమైన ప్రజాస్వామిక అంతర్జాతీయ వ్యవస్థ కోసం కృషి చేస్తే ఒక
శత0 కంగోపాల దచ్యానాల
మంచి పని కోసం చేసినట్టు, ఒక ఆదర్శానికి నిలబడినట్టు, నీకేమన్నా విలువలు ఉన్నట్టు అవుతుంది. పత్రికలలో వస్తున్నటు వంటి వార్తలన్నీ కూడా అమెరికాను ఎవడూ ఆపలేడు, తర్వాత ఎవడు అని వ్యాసాలు రాస్తున్నారు. ఇరానా తర్వాతి గురి? ఆస్థనిస్తాన్ అయిపోయింది. ఇరాక్ అయిపోతుంది. త్వరగా కాకపోవచ్చు ఎందుకంటే ఆస్ట్యనిస్తాన్లో వాళ్ళకు అనుకూలమైన గవర్నమెంటు దొరికింది, ఇరాక్‌లో వెంటనే ఎవ్వరూ దొరకలేదు వాళ్ళకు. అమెరికా సమస్య ఏందంటే రేపు ఒకవేళ బాగ్జాద్ను ఆక్రమించుకున్నా ఆ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టాలన్నా ఎవ్వడూ లేడు ఇప్పుడు అక్కడ. ఎవర్నో పట్టుకుంటారు లేండి. దొరుకుతారు. దొరకకుండా ఏమీ పోరు...సింహాసనం చూపిస్తే వచ్చే వాళ్ళు చాలామందే ఉంటారు.
అన్ని ఆయుధాలు ఇరాక్‌లోనే ఉంటాయి, ఎక్కడికీపోవు. రసాయనిక ఆయుధాలు, అన్నీ అక్కడే ఉంటాయి. గవర్నమెంటు మారితే చాలు అంతే. సద్దాం హుస్సేన్ పోయి, అమెరికాకు “జీ హుజూర్” అనేవాడు ఉంటే చాలు. ఇంకేమీ అవసరం లేదు. ఏమి ఆయుధాలండి? ఇరాక్ సైంటిస్టులు ఏమన్నా కనిపెట్టారా? అంతా మీ సైంటిస్టులే కనిపెట్టారు. ప్రపంచంలో ఎవ్వడి దగ్గరున్న ఏ అయుథమైనా కనిపెట్టింది తెల్లవాళ్ళే. నల్లవాళ్ళు కొనుక్కున్నారు. మాబోటి వాళ్ళం కొనుక్కున్నాం మీ దగ్గర. మీకు లాభాలు వచ్చాయి. అన్ని ఆయుధాలు కనిపెట్టింది మీరే. లాభాల కోసం అమ్ముకుందీ మీరే. మీ దగ్గర ఉన్నాయి కాబట్టి నాశనం చేస్తాము అంటున్నది మీరే. ఏం న్యాయమండీ ఇది? మేము - “నీ కంపెనీలు మూసేయ్. అమెరికాలో, ఇంగ్లాండ్‌లో ఉండే ఆయుధ ఉత్పత్తి కంపెనీల్ని మూసేస్తే శాంతంగా ఉంటుంది ప్రపంచమంతా ళూడా' - అనంటే. సద్దాం హుస్సేన్ అయినా ఒసామా బిన్ లాడెన్ అయినా ఎవ్వరూ పోనవసరంలేదు. అందరూ హాయిగా ఎవరిపాటికి వాళ్లు ఉండొచ్చు, నువ్వు ఆయుధాలు ఇయ్యకపోతే.
1981 నుంచి 88 వరకు ఇదే నద్దాం హుస్సేన్ అమెరికాకు, బ్రిటన్‌కు అనుకూలంగా ఇరాన్‌పైన యుద్ధం చేశాడు. ఆయనకు ఆయుధాలు ఇచ్చింది ఎవరు? అమెరికా ఇచ్చింది (బ్రిటన్ ఇచ్చింది. మార్గరేట్ థాచర్ సద్దాం హుస్సేన్‌కు 34కోట్ల పౌండ్ల అప్పు ఇచ్చింది. ఆయుధాలు కొనుక్కోమని - మావాళ్ళవే, మా కంపెనీలవే కొనుక్కోమని. మా కంపెనీలకు లాభం ఉంటుంది. నువ్వు యుద్ధమూ చేయొచ్చు అంది. ఇప్పుడేమో నువ్వు దుర్మార్గుడివి అంటావా? ఎందుకు? వాళ్ళు చెప్పినట్టు ఇరాన్‌పైన యుద్ధం చేస్తే మంచివాడు. ఉన్నాయిగదా నా దగ్గర అని కువైట్ పైన యుద్ధం చేస్తే చెడ్డవాడు. ఎవరు ఎవడిపైన యుద్ధం చేసినా చెడ్డవాడే. సద్దాం హుస్సేన్‌ను
శతి
సాగిడే ఉద్దేశం నాకేమీ లేదు. ఆయన ఒక నియంత. బుష్ కంటే పెద్ద నియంత. బ్లెయిర్ నియంత కాదల్బుకున్నవాడు. ప్రపంచంలో నియంతలే ఉండాద్దు అంటే నాకు చాలా సంతోషము. ఇరాక్‌ను నిరాయుధీకరించాలి. ఇరాక్ ఆయుధాలు ఎక్కడెక్కడ దాచి పెట్టిందో ఇనస్పెక్టర్లకు చూపించాలి. కరెక్టే, మరి నువ్వు చూపిస్తావా? ఐక్యరాజ్యసమితి ఇన్స్పెక్టర్లు అమెరికా దగ్గరకుపోయి, జార్జిబుష్ దగ్గరకు పోయి అన్నీ చూపించు, మీ ఆయుధాలు ఎక్కడున్నాయో వెతుకుతాం అంటే వాడు తన్ని తరిమివేస్తాడు అక్కడ నుంచి. ఇరాక్ మాత్రమే ఎందుకు చూపించాలి? ఇరాక్‌ను మాత్రవే ఎందుకు నిరాయుధీకరించాలి? 50 ఏళ్ళుగా ఐక్యరాజ్యన మితి, ఇవ్వుడున్నటువంటి బలహీన నీతిలో కాదు, కొంచెం బాగున్న రోజులలో ప్రపంచవ్యాప్తంగా నిరాయుధీకరణ కోసం అనేక చర్చలు, కమిటీలు, తీర్మానాలు, రిపోర్టులు తీసుకొచ్చింది. ఒక్కనాడు కూడా వాటిని గౌరవించనిది అమెరికాయే, ఐక్యరాజ్యసమితిలో ఏరోజు తీర్మానం పెట్టినా - ఆయుధాలు తగ్గించాలంటే కూడా ఒప్పుకోనిది అమెరికాయే. అందరూ తన చెప్పు చేతల్లో ఉండాలనుకుంటుంది అమెరికా.
దీనిని వ్యతిరేకిద్దాం. దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడుకుందాం. ఒక సార్వభౌమ దేశం మరొక సార్వభౌమ దేశంపైన దాడులుగానీ, యుద్దాలుగానీ, అణచివేతగానీ చెయ్యడానికి వీలులేదు - సైనికంగా అయినా, ఆర్థికంగా అయినా. మన పాలకులకు అర్థం కాని ఒక విషయం ఏమిటంటే చమురు ఒక్కటే కాదు. నీళ్ళు ఒక్కటే కాదు. ఇవ్వాళ అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలకు సరుకులు ఎగుమతి చేసుకోవడానికి కూడా మనపైన ఆంక్షలు పెడుతున్నారు. మీరు బియ్యం దిగుమతి చేసుకోండి. గోధుమలు దిగుమతి చేసుకోండి. యాపిల్ పండ్లు దిగుమతి చేసుకోండి అని బలవంతం చేస్తున్నారు. అందుకే యాపిల్ పండ్లు వస్తున్నాయి అగ్రైలియా నుంచి, ఇంకా ఎక్కడెక్కడో నుంచో వస్తున్నాయి. మన హిమాచల్ ప్రదేశ్, కాశ్మీరు రైతులు ఏడుస్తున్నారు. మంచి మంచి యాపిళ్ళు మావి. మాకు కొండ ప్రాంతం నుంచి మైదానానికి పోయేదానికి సరైన రోడ్లు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు. చలికాలం వస్తే ఇక్కడ నుంచి ఒక్క లారీ కదలదు. ఈ లోపున ఆస్ట్రేలియా యాపిల్ పళ్ళు వస్తున్నాయి. మేం ఏముయిపోవాలి అని అంటున్నారు. రేపు ఎప్పుడైనా మా దేశంలో రైతులు గొడవ పెడుతున్నారు కాబట్టి, ఆందోళన చేస్తున్నారు కాబట్టి మీ యాపిల్ పళ్ళు మేము కొనుక్కోము అంటే బుష్ ఏమంటాడు? కొనుక్కుంటావా, లేదా?- లేకపోతే నిన్ను దించేస్తాను అంటాడు. ఆయుధాలు మాత్రమే కాదు. ప్రపంచీకరణ అనే పేరుమీద అనేక రకాల ఆంక్షలు
శతి2 కాగల దవన్వానట
పెడుతున్నారు. మనకు కరెంటు ఛార్జీలు పెరిగింది ఎందుకు? ప్రపంచ బ్యాంకు చెప్పింది కాబట్టి పెరిగాయి. వేరేమీ కారణం లేదే! జనం ఓట్లు వేయరేమో అన్న భయానికి, జనం తిరగబడతారేమో అన్న భయానికి. రేపు మనవాళ్లు ఈ మార్చులకు ఒప్పుకోలేదనుకో
- అమెరికా వాడు ఏమంటాడు అంటే నీ ఆర్ధిక విధానాలు నాకనుకూలంగా మారుస్తావా లేక యుద్ధం చేయమంటావా? అంటాడు.
దేశానికి సార్వభౌమత్వం ఉండాలి. ఆ సార్వభౌమత్వం దేశంలోని ప్రజానీకం చేతుల్లో ఉండాలి. నియంతల చేతుల్లో కాదు. నియంతలు ఉండటానికి వీలులేదు. ఏ దేశం కూడా మరొక దేశం పైన పెత్తనంకానీ, దాదాగిరికానీ, గూండాయిజం కానీ చెయ్యడానికి వీలులేదు. ప్రపంచస్థాయిలో దేశాల మధ్య సమస్యలు ఏమైనా వస్తే శాంతియుతంగా పరిష్కారం చెయ్యడానికి ఒక నిజమైన ప్రజాస్వామిక వ్యవస్థ ఉండాలి. అవన్నీ కూడా ధ్వంసం చేసి ఏైక రౌడీప్టేట్గా ఇవ్వాళ అమెరికా ముందుకొచ్చింది. నూటయాభఖై ఏళ్ళుగా అదే పని చేస్తూ వచ్చింది. దాన్ని ఇవ్వాళ పరాకాష్టకు తీసుకొచ్చింది. అన్ని ప్రాంతాలలోనూ చేసింది. దక్షిణ అమెరికాలోనూ చేసింది. మధ్య అమెరికాలోనూ చేసింది. ఆసియాలోనూ చేసింది. యూరప్‌లోనూ చేసింది. ఇవ్వాళ పశ్చిమ ఆసియాకు వచ్చింది. ఇస్లాంకో, ముస్లింలకో, ముస్లిం దేశాలకో ప్రత్యేకమైన పరిస్థితి ఏమీ కాదు ఇది. దీన్ని అర్ధం చేసుకుని ప్రజాస్వామికమై నటువంటి ప్రపంచ వ్యవస్థ - నిజమైన, సంపూర్ణ, నమగ్రమైన నిరాయుధీకరణ కోసం కృషిచేద్దాం. ఒక్క ఇరాక్ మాత్రమే ఆయుధాలు వదులుకోవాలని కాదు. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆయుధాలు వదులుకోవాలి. ఏ దాదాగిరి, ఏ పెత్తనం లేనటువంటి అంతర్జాతీయ వ్యవస్థ - దానికోసం అందరం కృషి చేద్దాం. అటువంటి లక్ష్యం కోసం అమెరికా యుద్గోన్మాదానికి వ్యతిరేకంగా మన ప్రభుత్వాలు నిలబడాలని డిమాండ్ చేద్దాం. ఈదాడికి గురయిన ఇరాకీ ప్రజానీకమైనా, మొన్నటి ఆఫ్థృన్ ప్రజానీకమైనా, రేపు ఇరాన్ కావచ్చు, జోర్జాన్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఉత్తర కొరియా కావచ్చు, ఆ ప్రజానీకానికి మనకు చేతనైనటువంటి పద్ధతిలో అన్యాయం అని చెబుదాం. అంతకంటే ఆచరణ యోగ్యమైనటువంటి మార్గం ఏదయినా ఉంటే అది కూడా ఆలోచిద్దాం.
ఆహ వాలి (అమెరికా యుద్ధ వ్యతిరేక వేదిక - ప్రొద్దుటూరు, 5-4-2003) 1తితి కం నక్తం
చైనా ఆర్జికాభివృద్ది - సింహావలోకనం ళా థ
నేను మాట్టాడేదానికి పౌరహక్కుల సంఘానికి ఏమీ సంబంధం లేదు. ఇవి కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. చైనా ఆర్థికాభివృద్ధి - సింహావలోకనం అని అన్నారు. కొంతవరకు విఠల్రాజన్గారు ఆ కర్తవ్యాన్ని తను మాట్లాడే క్రమంలో పూర్తి చేశారు. చైనా ఆర్థికాభివృద్ధి, వారి ఆర్థిక వ్యవస్థలో జరిగినటువంటి పరిణామాలు చెప్పారు. సమస్య ఎక్కడ వస్తుందంటే చైనాలోగానీ, కమ్యూనిస్టు పార్టీలు పరిపాలించిన ఏ దేశంలోనైనాగాని వాస్తవంగా ఏం జరిగిందో తెలుసుకోవడంలోనే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ దేశాల్లోపల - పత్రికా స్వేచ్చ అని మనం ఏదైతే ఇక్కడ అలవాటుపడి ఉన్నామో, దాంట్లో ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ, అటువంటి పత్రికా స్వేచ్చ లేకపోవటం - పత్రికా స్వేచ్ళే కాదు - మేధావులకి గానీ, రచయితలకి గానీ, విశ్లేషకులకు గానీ తమ అభిప్రాయాలను స్వతంత్రంగా చెప్పే స్వేచ్చ అన్ని సందర్భాలలో లేకపోవటం పెద్ద సమస్య,
అయితే అసలే లేదని కాదు, అది రకరకాల మోతాదుల్లో, ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంది. మొత్తానికి పరిమితులైతే ఉన్నాయి అ స్వేచ్చ మీద. వాళ్ళకు అంటే దేశం లోవల ప్రాఫెనరొలు అయినవాళ్ళకు కూడా పూర్తి సమాచారం అందుబాటులో లేకపోవటం - మన దేశంలో ఉందని కాదు - కాని ఈ మాత్రం కూడా చాలా సందర్భాలలో ఆ దేశాల్లో మేధావులకు అందుబాటులో లేకపోవటం వల్ల, ఆ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు తమ గురించి తాము ఏమి చెప్ప దల్చుకుంటారో దాన్నే మనం ఆ దేశ చరిత్రగా స్వీకరించేటటువంటి ప్రమాదం ఉంటుంది. లేదా బయటనుంచి పోయినవాళ్ళు, విదేశీ పర్యాటకులు - వాళ్ళు సానుభూతి పరులు కావచ్చు, వ్యతిరేకులు కావచ్చు, వాళ్ళు 2 నెలలో, 3 నెలలో లేదా సంవత్సరానికి రెండు నెలలు చొప్పున నాలుగేళ్ళో, ఐదేళ్ళ అక్కడ గడిపి తాము చూడగలిగింది చూసి.... అక్కడ కూడా
లిక క ాగపాల ఉమా లే
మళ్ళీ వాళ్ళను పూర్తిగా చేతులు, కాళ్ళు కట్టి పడేస్తారని కాదు కానీ స్వేచ్చగా దేశంలో ఎక్కడికైనా పోవచ్చు, ఏ విషయాన్ని అయినా తెలుసుకోవచ్చు అనేంత పూర్తి స్వేచ్చ చైనాలో కూడా చాలా సందర్భాలలో లేదు. ఈ అన్ని విషయాలలో రష్యా కంటే, తూర్పు యూరప్ దేశాల కంటే చైనా మెరుగ్రైనప్పటికి పూర్తి స్వేచ్చ అయితే అక్కడ రూడా లేదు. అట్లా పోయిన వాళ్లు చాలా మంది ఉదాహరణకు - చైనాలో ఒక దశలో 50వేలు, 60వేలు, 70వేల కమ్యూన్లదాకా ఉండేవి - నేను ఫలానా కమ్యూన్ చూస్తాను అని అంటే కొన్ని సందర్భాలలో చూపించేవాళ్ళు, కొన్నింటిని మాత్రం మౌనంగా ఆ అవకాశం కలగనీయకుండా చేసేవాళ్ళు అనే వాళ్ళు. పుస్తకాల్లో రాశారు కూడా. అట్లని పూర్తిగా వాళ్ళకు నిజాలు తెలుసుకొనే అవకాశం రాలేదనేది కూడా వాస్తవం కాదు. చాలా సందర్భాలలో ప్రజలతో మాట్లాడగలళిగారు. ఒక ఫ్యాక్టరీలోకి, కమ్యూన్‌లోకి, పొలాలలోకి పోయి మాట్టాడగలిగారు. ఈ సమస్యలు ఊన్నాయి.
చైనా పాలకులు తమ గురించి, తమ విధానాల గురించి తాము చెప్పదల్పు కున్నది లేదా విదేశాల నుంచి వచ్చినటువంటి పరిశీలకులు తమకుండే దృక్పథంతో తాము చూడగలిగినదాన్ని, తాము తెలుసుకోగలిగిన దాన్ని వ్యాఖ్యానించి రాసినవి - ఇవి మన ముందు ఉంటాయి. ఈ విదేశీ పరిశిలకుల్లో మళ్ళీ వ్యతిరేకులు కొంతమంది అయితే, సానుభూతితో చూసినవాళ్ళు కొందరు. ఇందులో రెండురకాలు. మార్క్సిస్టు దృక్పథం ఉన్నవాళ్ళు కొందరు, మార్క్సిస్టులు కాకపోయినప్పటికీ... మావో అలోచన, ఆయన ఆచరణలోని మానవతా అంశాలనుండి - లేదా రొమాంటిసిజం...కాల్బనిక వాదం...అనే మాట మిత్రులు వాడారు - వాటికి చాలా ఉత్తేజతమైనటువంటి వాళ్ళు, ఆ దృక్చథంతో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యానాలు. ఇట్లా రకరకాల భాష్యాలు, వ్యాఖ్యానాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటినుంచి తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. అంటే వీటి నుంచి అసలైన వాస్తవం తెలుసుకుంటేనే ఉపయోగం. వీటివల్ల ఏం ఉపయోగం లేదు అనుకోవడానికి ఏమీ వీల్లేదు. మనుషులు ఉత్తేజాన్ని పొందటం అయినా, జ్ఞానాన్ని సంపాదించటం అయినా రకరకాల మార్గాల్గో చేస్తుంటారు. ఇప్పుడు విఠల్రాజన్గారు చెప్పింది - అదే సాంస్కృతిక విప్లవం కాకపోయినా - ఆ ఉత్తేజం, ఆ భావన, ఆ ఆలోచనను - సాంస్కృతిక విప్లవం ప్రచారం చేయగలిగింది ప్రపంచ వ్యాప్తంగా. ఆ ప్రచారం ఇచ్చిన ఉత్తేజమే భవిష్యత్ కార్యాచరణకు మనుషులకు (ప్రేరణ కలిగిస్తుంది. అది కూడా ఒక శక్తి కాగలుగుతుంది. అందుకే పొద్దున జ్ఞానసిద్ధాంతాన్ని గురించి చర్చ వచ్చినప్పుడు అంత సింపుల్‌గా పదార్ధం, చైతన్యం అంచే సరిపోదు అని అనుకున్నది.
వేతిత్ క నక్ష
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చైనా ఆర్థిక పరిణామాల గురించి చెప్పాలంటే 1957 వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక అంతమయ్యేవరకు భారీ పరిశ్రమలకు (ప్రాధాన్యం ఇచ్చి, వ్యవసాయ రంగంలో ప్రాథమిక సహకార క్షేత్రాలను నెలకొల్పి, ప్రధానంగా సోవియట్ రష్యాలాగా, సోవియట్ యూనియన్ నుంచి నేర్చుకుందాం అనే ఒక స్టోగన్తో కూడా ఆ మొదటి సంవత్సరాల్లో వాళ్ళు చేశారు. ఆ తరవాత 1958-59 (1841 1629 ₹0గ/బాగే అని విఠల్రాజన్గారు (ప్రస్తావించారు. కమ్యూన్లు చాలా పెద్ద ఎత్తున, చాలా వేగంగా నెలకొల్పటం, ఆ కమ్యూన్ల ఆధ్వర్యంలో ₹/2]]308 01 ౪/0 685 అనే పాలసీని - అంటే ఒక వైపు పెద్ద పరిశ్రమలు నెలకొాల్పుతూ, మరొకవైపు కమ్యూన్లోపల చిన్న పరిశ్రమలను చాలా పెద్ద సంఖ్యలో నెలకొల్పుతూ పోవటం - దాన్ని అనుసరించారు. కమ్యూన్ల లోపల మళ్ళీ సాంస్కృతిక విప్లవ కాలంలో జరిగినంత కాకపోయినా ప్రాథమిక దశలో సామాజిక సంబంధాల ప్రజాస్వామీకరణ, సమానత్వాన్ని సాధించడం అనండి ఆ ప్రయత్నం, (61621 1620 ₹0గా౭6 తర్వాత ఒక 2, 3 సంవత్సరాలు చేశారు. అప్పుడు క్షామం, విఠల్రాజన్గారు చెప్పారు - 1960-61 ఆ రెండేళ్ళు ఇబ్బంది పడ్డారు. దాంతోపాటు సరిగ్గా అదే సమయంలో సోవియట్ రష్యా వాళ్ళు తమ ఆర్థిక సహాయాన్ని వెనక్కి తీసుకున్నారు.
మొదటి పంచవర్ష ప్రణాళిక సమయంలో సోవియట్ రష్యా వాళ్ళు ఇచ్చిన సహాయం చాలా సహకరించింది. కాని వాళ్ళు 1960లో అకస్మాత్తుగా, అర్ధాంతరంగా - దాదాపు సగంలో 300 భారీ పరిశ్రమలు నెలకొల్పటానికి సహాయం చేస్తామని 160 నెలకొల్పిన తరవాత - వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ పెట్టుబడి, ఆ సాంకేతిక పరిజ్ఞానం దానిని ఉపయోగించుకొని తర్వాత కాలంలో - సోవియట్ రష్యాలో ఒకప్పుడు అనుసరించిన [౯౫ 2001010010 2010” లాంటిదే - 1961 నుంచి 64, 65 దాకా చైనాలో అనుసరించి 6648 620 పెంగాజుకే అప్పుడు తీసుకువచ్చిన మార్చును కొంతవరకు వెనక్కు తీసుకొనిపోయారు. దాని తరవాత సాంస్కృతిక విప్లవంలో (162 1629 00౫16 కంటే ఇంకా ఎక్కువగా - అంటే మామూలుగా 1211201616 అని, 161 901016 అని అంటుంటారు - సలం 9ంషం163 ను ఆశ్రయించటం, చివరకు సాంస్కృతిక విప్లవం విఫలమైపోయిన తరువాత క్రమక్రమంగా మెట్టు మెట్టుగా ఈ రోజు చైనా ప్రపంచంలోని పెద్ద ఆర్థికశక్తి అని కాదు కానీ, ఒక శక్తివంతమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన శక్తిగా పాశ్చాత్య గుత్త పెట్టుబడిదారీ సంస్థలను చాలా ఆకర్షిస్తోంది. అక్కడ బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది. కోట్లాది ప్రజానీకం ఉన్నారు. వాళ్ళకు కొనుగోలు
తార కాదా వనాని
శక్తి ఉంది. మనం ఇక అమ్మడమే తరువాయి అనేటటువంటి ఒక అభిప్రాయం వాళ్ళకి ఇచ్చింది. 1140240121 కళం[06(10/ పళిగ6 దగ్గర, ప్రపంచ బ్యాంకు దగ్గర చాలా పెద్ద ఎత్తున అప్పులు తీసుకుంటున్నది ఇవ్వాళ చైనా. 64౫ లో సభ్యదేశంగా ఉన్న భారతదేశం డంకెల్ ప్రతిపాదనలపైన సంతకం చెయ్యాలా, వద్దా... చెయ్యటం తప్పు అని మనం అంటూ ఉండగా ఆ4ఉగ లో సభ్యత్వం కూడా లేని చైనా అప్పుడే డంకెల్ ప్రతిపాదనలను ఒప్పుకుంటున్నాం అని ప్రకటించేసింది. ఇదీ సింహావలోకనం అంటే. రెండు వాక్యాల్లో చెప్పాలంటే ఈ 40 సంవత్సరాల పరిస్థితి ఇది.
మళ్ళీ వెనక్కిపోదాం. దీన్నంతా ఏ చట్రంలో చూడాలి అని అంటే పవర్ స్టగుల్గా చూడొచ్చు. రాజకీయాలు ఉన్నంత కాలం పవర్ స్ట్రగుల్ ఉంటుంది కదా. అట్లా చూడొచ్చు. లేదా ఒక సుందర స్వష్నాన్ని వాస్తవం చెయ్యాలి అనే ఆకాంక్ష దాని సాకారం కోసం జరిగిన ప్రయత్నం - అది కూడా ఒక అంశంగా ఉంది. లేదని ఏమీ కాదు. అట్లా చూడొచ్చు. కానీ వాస్తవంగా చైనా పరిపాలకులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పవరష్టగులైనా, లేకపోతే ఒక సుందర స్వష్నాన్ని అక్కడ వాస్తవం చేసే ప్రయత్నమైనా
- ఈ రెండింటిలో ఏదైనా సరే - ఏ నిర్దిష్టమైన సందర్భంలో వాటినివాళ్ళు అమలు చేశారు అనేది తీసుకొంటే నేలమీద కాళ్ళు నిలబెట్టి ఆలోచించిన వాళ్ళం అవుతాం. అది ఏమిటీ అంటే చైనాను ఒక ఆధునిక, పారిశ్రామిక దేశంగా మార్చే ప్రయత్నం. మార్క్స్ సోషలిజాన్ని గురించి ఆలోచించినప్పుడు, భావించినప్పుడు, సిద్ధాంతం చేసినప్పుడు, అప్పటికి ఉత్పత్తి శక్తులు బాగా అభివృద్ధి చెంది ఉండి ఇక పెట్టుబడిదారీ వ్యవస్థలో, పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాల చట్రంలో ఉత్పత్తి శక్తుల పురోగమనం సాధ్యం కాదు అనుకున్నప్పుడు, ఇంకా పురోగమనం కావాలి అనే అకాంక్త ఏ వర్గాల్లో అయితే సమాజంలో ఉంటుందో వాళ్ళు నూతన రాజ్యాన్ని నూతన వ్యవస్థను ఏర్పాటు చేస్తారు, ఆ కార్మిక వర్గం ఏర్పాటు చేస్తుంది అని భావించాడు. కాబట్టీ అట్టా ఆ కార్మిక వర్గానికి లేకపోతే కార్మిక వర్గ పార్టీకి రాజ్యాధికారం వచ్చిన తరవాత దేశాన్ని ఏరకంగా ఆర్థికంగా అభివృద్ధి చేస్తుంది అనేది మార్క్స్‌కు సమస్య కాదు. అయన ఆ ప్రశ్న వేసుకోలేదు. ఆయన చట్రంలో ఆ ప్ర్నే లేదు.
కాని వాస్తవానికి ఇప్పటివరకు కమ్యూనిస్టుపార్టీలు విప్లవం అనే దానిమీద అధికారానికి వచ్చిన అన్ని దేశాలలో కూడా ఎదుర్కొన్న సమస్య - ఒక వెనుకబడిన దేశాన్ని ఏరకంగా ఒక ఆధునిక దేశంగా మార్చాలి అని. దీనికి జవాబు ఎక్కడా మార్క్స్ రచనల్లో దొరకదు. ఒక వెనకబడిన దేశాన్ని కమ్యూనిస్టుపార్టీ అధికారంలో ఉండి కార్మిక
శేత7 క్యా సడ్షమం
నియంతృత్వం అనే పేరు మీడ పరిపాలన చేస్తూ ఏ రకంగా ఒక అధునిక దేశంగా మార్చాలి అనేది ప్రశ్న. ఈ మార్చేక్రమంలో దాన్ని సోషలిస్టు దేశంగా కూడా, సోషలిస్టు వ్యవస్థగా కూడా నిర్మాణం చెయ్యాలి. అది వెంటనే జరగాలా? కొంత దశ వరకు పెట్టుబడిదారీ నమూనాలో కమ్యూనిస్టుషార్టీ అధికారం కింద అభివృద్ధి జరిగిన తర్వాత, ఆఅ తర్వాతనే సోషలిజానికి పరిణామం చెందాలా? మొదటి దశనుండి రెండో దశకు ఎంత వేగంగా మారాలి? ఇవన్నీ కూడా దాదాపు ట్రాట్క్సీ, మెన్నివికలు, అెనిన్లు సంఘర్షించుకున్న కాలం నుంచి మొన్నటి వరకు చర్చగా సాగుతూనే ఉంది. ఆ పోలెమిక్స్లోకి మనం పోవాల్సిన అవనరం లేదు.
అంటే కమ్యూనిస్టు విప్లవం అనే పేరు మీద రాజ్యాధికారానికి వచ్చినటువంటి కమ్యూనిన్దుపార్టీలు ఎదుర్కొన్న నమన్య సోషలిజాన్ని అత్యధికంగా అభివృది చెందినటువంటి ఉత్పత్తి సాధనాల ప్రాతిపదిక మీద నిర్మాణం చెయ్యటం కాదు...అసలు ఉత్పత్తి సాధనాలను, ఉత్పత్తి శక్తులను ఏరకంగా ఆధునీకరించాలి? ఏ రకంగా ఒక ఆధునిక దేశాన్ని తయారు చెయ్యాలి? ఆ తయారు చేసే క్రమంలో ఏ రకంగా సోషలిజాన్ని నిర్మించాలి? లేకపోతే పూర్తిగా ఆధునిక దేశం అయిపోయేంతవరకు ఆగి ఆ తర్వాత సోషలిజాన్ని నిర్మాణం చేయవలసి ఉంటుందా? సోషలిజాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం, ఉత్పత్తి శక్తుల ఆధునీకరణ, పెంపుదల - ఈ రెంటికి మధ్య ఉండే సంబంధం ఏమిటి? మొదటిది ఎక్కువ వేగంగా బేస్తే రెండోది వెనుకబడి పోతుందా? రెండోది వేగవంతం చేస్తూ పోతే మొదటిది పూర్తిగా కుంటుబడీ పోతుందా? ఈ ప్రశ్నలు రష్యా విప్ణవంలోనూ, అ తరవాత విష్ణవాలు జరిగిన అన్ని దేశాల్టోనూ, చైనాలో కూడా వస్తాయి. వీటి గురించి అభిప్రాయబేధాలు, వీటి గురించి ఘర్షణ చాలా జరిగాయి. ఇదొక వర్గ సంఘర్షణ అని చెప్పి మావో సిద్ధాంతీకరించాడు కూడా. అయితే దాన్ని వర్గ సంఘర్షణ అనుకోవాలా? లేకపోతే సోషలిజం నిర్మాణానికి సంబంధించి ఒక వెనకబడిన దేశంలోని రెండు భిన్న పంథాలుగా మాత్రమే అనుకోవాలా అనేది ప్రశ్న మిత్రులు వేసిన కరపత్రంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. చైనా ఎట్లాంటి దేశం? 1949లో అక్కడ కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అ వెనకబాటుతనాన్ని మనం కూడా ఊహించలేం. అంత వెనకబడిన దేశం. మనకి కనీసం ఒక కేంద్రంగా బ్రిటీషు రాజ్యం పరిపాలించింది. వాళ్ళ అవసరాల కోసం అయిన్నా ఎగుమతి దిగుమతి అవసరాల హోసం అయినా - రైల్వే లైన్లు, కాలువలు, అక్కడక్కడా హార్చర్డు, కొన్ని ఫ్యాక్టరీలు
వవాతి సః ఖాబగోపాల్ ఉవన్వాసాలు శ
ఏర్పాటు చేశారు. వాళ్ళకు దళారులుగా ఉన్నటువంటి మన దేశ వ్యాపారస్తులు మేం కూడా ఫ్యాక్టరీలు పెట్టుకుంటామని చెప్పి అహ్మదాబాద్‌లోనూ మరొకచోటా నూలు మిల్లులు సెట్టారు, బట్టల మిల్లులు పెట్టారు.
చైనాలో అటువంటిది కూడా ఏమీలేదు. బయటినుంచి - ఇంగ్లాండ్గాని, ప్రాన్స్గాని, జపాన్గాని ఈదేశాలు స్థానికంగా ఉన్నటువంటి బాగా దిగజారిపోయిన ఫ్యూడల్ ప్రభువుల అండతో చైనాను చాలా ఘోరంగా దోచుకోవడం జరిగింది. పూర్తిగా మన నిజాం నవాబులాంటి ఒక ప్రభువు వాళ్ళని పరిపాలించాడు. స్థానికంగా ఆయనకు అధికారం లేనిచోట ఈ వార్లార్డులు పరిపాలించేవాళ్ళు.
ఒక ఉదాహరణ చెప్పాలంటే చైనా భూభాగం భారతదేశం కంటే చాలా ఎక్కువ. అయినా 1947నాటి భారతదేశాన్ని, 1949నాటి ఛైనాని పోల్చి చూసుకుంటే మనకున్న రైల్వేలలో 3వ వంతు మాత్రమే చైనాకు ఆనాడు ఉండింది. రోడ్లు అయినా అంతే, కాలువలైనా అంతే, పరిశ్రమలైనా అంతే. ఆ స్థితిలో చైనా ఉంది. వ్యవసాయరంగం మీద విపరీతమైన జనాభా ఒత్తిడి. మనకున్నంత సాగు యోగ్యమైన భూమి చైనాలో లేదు. చాలా భాగం వ్యవసాయానికి పనికిరానటువంటి విపరీతమైన చలి ప్రదేశాలు, కొండ ప్రదేశాలు. అటువంటి భూమి కూడా చైనాలో ఎక్కువ ఉండేది. భూస్వాములు అంటే జనాభాలో 10 శాతం మాత్రమే ఉండే భూస్వాములు 70 శాతం భూమి కలిగి ఉండే వాళ్ళు అని అంటారు కానీ, అక్కడ 20 ఎకరాలు ఉంటే భూస్వామే. వందల, వేల ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా ఉండి ఉండవచ్చునుగాని, 20 ఎకరాలు ఉన్నవాడిని కూడా పెద్ద భూస్వామిగా భావించేటటువంటి పరిస్థితి చైనాలో ఉండింది. మనకు హిందూ సివిల్ చట్టంలో ఉన్నట్టే వాళ్ళకి కూడా తండ్రి ఆస్తి కొడుకులందరికీ సమానంగా పంచడమనేది ఉంది కాబట్టి ఆ భూమి మళ్ళీ మళ్ళీ ముక్కలుగా అయిపోవడం, వాళ్ళు ఎవరికైనా కౌలుకి ఇస్తే, ఆ రైతు కూడా తన కొడుకులకు దాన్ని కౌలుగానే చిన్న చిన్న ముక్కలుగాచేసి ఇవ్వడం జరిగేది, దాన్ని వాళ్ళు రిబ్బన్స్ అంటారు. అంటే రిబ్బన్‌లాగా సన్నగా పొడుగ్గా ఉంటుంది ఒక్కొక్క ప్లాటు కూడా. అది సొంత భూమి కావచ్చు లేకపోతే కౌలుకు తీసుకున్నది కావచ్చు. అది ఎంత సన్నగా ఉంటుంది అంటే కాడికి ఎద్దుల్ని కడితే ఒక ఎద్దు ఒకరి పాలంలో ఉంటే పక్క ఎద్దు రెండవవాడి పాలంలో ఉంటుందట. అంత పల్చటి కారిడార్ లాంటి, రిబ్బన్లాంటి భూభాగాలు సేద్యం చేసే వాళ్ళు.
₹89 కం “నతు
ఇటువంటి వ్యవసాయక పరిన్టీతుల్టో, పూర్తిగా వెనకబడిన సారిశ్రామిక పరిస్థితులలో ఒక ఆధునిక దేశంగా చైనాను ఏరకంగా తీర్చి దిద్దాలి అనేది అప్పుడు వాళ్లముందున్న ప్రశ్న. రష్యాలో ఇదే ప్రశ్న 1917లో వచ్చింది. తర్వాత చైనాలో వచ్చింది. వియత్నాంలో వచ్చింది. అన్ని దేశాలలోనూ తరతమ బేధాలతో ఇదే ప్రశ్న వచ్చింది. ప్రాథమికంగా వాళ్ళకు ఏమి కావాలంటే పెట్టుబడి సమీకరణ బాగా కావాలి. పరిశ్రమలు పెట్టడానికైనా, వ్యవసాయాన్ని ఆధునీకరించడానికైనా, ప్రాజెక్టులు కట్టడానికైనా, రిజర్వాయర్లు కట్టడానికైనా, రోడ్డకు, రైల్వే లైన్లకు, బెలిఫోన్లకు - వీటికి పెట్టుబడి కావాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడి ఎక్కడినుంచి రావాలి అనేది వెనుకబడిన దేశాల ఆధునీకరణలో చాలా ప్రధానమైనటువంటి సమస్య. దీనిని రష్యాలో ఒక రకంగా పరిష్కారం చేశారు. ఏం చేశారు అనంటే బలవంతంగా రైతాంగాన్ని సహకార వ్యవసాయంలోకి తోసి వాళ్ళు పండించిన పంటలో అతి తక్కువ మాత్రమే వాళ్ళ దగ్గర ఉండనిచ్చి మిగిలినదంతా కూడా ప్రభుత్వం తీసేసుకొని, అ తీసుకొన్న ధాన్యాన్ని రకరకాల రూపాల్లో పెట్టుబడిగా మార్చి దేశపారిశ్రామికీకరణకు ఉపయోగించారు. దానితోపాటు రష్యాలో రైతాంగం మీద స్టాలిన్ ఆధ్వర్యంలో విపరీతమైనటువంటి హింస ప్రయోగించటం జరిగింది.
కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన అనేక ఇతర దేశాల్లో కూడా ఇటువంటివి జరిగాయి. మనబోటి దేశం సమస్య కూడా ఇదే. రాజకీయ వ్యవస్థ వేరే కావచ్చు. మనదేశం ఏం చేసిందంటే బైటిష్వాళ్ళ కాలం నుంచి మిగిలిపోయినటువంటి విదేశ మారక ద్రవ్యంను, ఆ తరవాత వేరే ఒక రూపంలో రైతాంగం ఉత్పత్తులకు - ఇప్పుడు శరద్జోషిలాంటి వాళ్ళు ఎప్పుడూ వాదిస్తూ ఉంటారు - భారతదేశం పారిశ్రామికీకరణ కోసం రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా చేశారని. రష్యాలో స్టాలిన్ బలవంతంగా చేస్తే మీరు మార్కెట్ ద్వారా చేస్తున్నారని. ఆ రకంగా రైతులకు తక్కువ మొత్తాలు చెల్లించి 'పెట్టుబడిరూపంలో దాన్ని పారిశ్రామికీకరణ కోసం వాడుకోవటం, విదేశాల నుండి అప్పులు తీసుకోవటం, ఇంకా ఎక్కువ అప్పులు తీసుకోవటం, అవి తీర్చలేక చెల్లింపుల లోటువస్తే మళ్ళీ 124 నుంచి అప్పులు తీసుకోవటం - ఆ రకమైన దాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం.
చైనాలో కూడా మొదటి పంచవర్ష ప్రణాళిక అప్పుడు తమ దగ్గరున్న పెట్టుబడి అంతా పెట్టేసి రష్యా నమూనాలో భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తూ తయారు చేశారు. వ్యవసాయరంగంలో ఏం చేశారంటే పెద్ద ఎత్తున సహకార క్షేత్రాల్ని వెంటనే
శైత0 కడాగోపాల్ ఉవన్వాసాల
ఏర్పాటు చెయ్యకుండా ఐదేసి, పదేసి కుటుంబాల వాళ్ళను కలిపి ఒక ప్రయోగం చేశారు. వాళ్ళలో ఒకరికి ఎడ్డు ఉంటే నాగలి ఉండదు. ఒకరికి నాగలి ఉంటే ఎడ్డు ఉండవు. ఒకరికి విత్తనాలు ఉండవు. మీరు 34110౫ 16 .62%13 అని చెప్పి పరస్పర సహకారంతో ఒకరికొకరు అప్పు ఇచ్చుకొని కావాల్సిన పరికరాలు తీసుకొని వ్యవసాయం చేసుకోండి - వచ్చిన ఫలితాన్ని మీకు ఉండేటటువంటి భూమి జాగానుబట్టి మీరు పంచుకోండి అనేది ప్రారంభించారు. అక్కడ నుంచి ఒక్క అడుగు ముందుకు పోయి కిందిస్థాయి సహకార క్షేత్రాలను ఏర్పాటు చేశారు. 20 కుటుంబాలు, 30 కుటుంబాలు, 40 కుటుంబాలు కలిసి తమ భూమిని ఉమ్మడిగా సాగుచేసుకుంటూ వచ్చిన పంటను పంచుకునేటప్పుడు ఎవరి భూమి ఎంత ఉండింది అనేదానిని బట్టీ వాటాలు నిర్ణయించుకొని పంచుకుంటారు. అంతకంటే పై స్థాయిలోని సహకార క్షేత్రాలు - నూరు కుటుంబాలు కావచ్చు, నూట యాఖై కుటుంబాలు కావచ్చు - తమకున్న భూమిని, తమకున్నటువంటి ఉత్పత్తి పరికరాలను ఉమ్మడిగా పెట్టుకుంటాయి. అయితే ఎవరి భూమి ఎంత ఉండింది అనే విషయాన్ని పక్కకుపెట్టి చేసిన పనిని బట్టి ప్రతిఫలాన్ని తీసుకొంటారు. ఇవన్నీ కూడా ఒక రోజులో అయిపోయేవి కావు. ఒక క్రమంలో అట్లా ముందుకుపోతారు. అయితే ఇప్పటివరకు ఎవరికైనా సరో ఈ సహకార క్షేత్రం నుండి బయటకు వెళ్ళిపోయే స్వేచ్చ ఉంటుంది. నా భూమి నాకు ఇచ్చేయండి, నేను దాంట్లో ఉండను అని కొట్లాటలు వస్తే వెళ్ళిపోయే స్వేచ్చ ఉంటుంది. కొన్ని చోట్ల ఆ స్వేచ్చ ఉండదు. ఈ రకమైనటువంటి పద్ధతిలో క్రమంగా సహకార క్షేత్రాలు పెంపాందించుకుంటూ పోయారు. దీనివల్ల ఏం జరిగింది అంటే వ్యవసాయ రంగంలో పెట్టుబడి లేమి మొదట్లో చాలా ప్రధానమైన సమస్య కాబట్టి, పెట్టుబడి ఎక్కువ పెట్టవలసిన అవసరం లేకుండా వ్యవసాయాన్ని క్రమంగా అభివృద్ధి చేయడానికి అది దోహదం చేసింది. అయితే ఇది సరిపోదు. సరిపోకపోతే తర్వాత ఏమి చెయ్యాలి? చాలా పెద్ద ఎత్తున పెట్టుబడి సమీకరణ జరగాలి. దేశం ఆర్థిక పురోగమనం కోసం, దాన్ని ఏరకంగా చెయ్యాలి అన్న ప్రశ్న వచ్చింది.
ఈ మధ్యకాలంలో ముఖ్యంగా చైనా అనుభవం తరువాత 6౪6100006౧ 2001- 09103 అనేదాంట్లో ఇవ్వాళ ఒక సిద్ధాంతంగానే వస్తున్నది ఏమిటంటే తమ జీవితాలను బాగు చేసుకునే క్రమంలో మనుషులు చైతన్యవంతంగా పాల్గొంటే వారిలో ముందుకు వచ్చేటటు వంటి ఉత్తేజం కాని, ఉత్సాహం కాని ఎక్కువగా ఉంటుందని. దానివల్ల వాళ్ళు కూలికోసం చేసే శ్రమకంటే ఎక్కువ శ్రమ చేస్తారు. తమకోసమే కాబట్టి,
పైత్తైై నతో
తమ భవితవ్యం కోసమే కాబట్టి వాళ్ళు ఉచితంగా కూడా చేస్తారు. వెనుకబడిన దేశాలు విదేశాలనుంచి పెట్టుబడి దిగుమతి చేసుకోవడమో, లేకపోతే రైతాంగం నుంచి తక్కువ ధరకు ఇచ్చి ధాన్యాన్ని తీసుకొని దాన్ని పెట్టుబడిగా వాడుకోవడమో, వీటికంటే పేద ప్రజానీకంలో తమ జీవితాలు తాము బాగు చేసుకోవటంలో, దాంట్లో భాగం పంచుకోవటంలో ఉండేటటువంటి ఉత్సాహం ఏదైతే ఉంటుందో అదే పెట్టుబడి అవుతుంది అనేది ఇవ్వాళ ం+బంగగల+ కం0%0౧0103 లో ఒక సూత్రంగా ఉంది. చైనాలో కూడా దీన్ని అమలు చేసే ప్రయత్నం చేశారు. నేనెందుకు చెబుతున్నానంటే దీంట్లో పవర్ స్ట్రగుల్ లేదా....?06 61211620 ౯0౧౫౫6 అంటే 1957 తరవాత దశ లేనే లేదా అంటే ఉండొచ్చు. ఎందుకంటే చాలా వివరాలు మనకు తెలియనివి క్రమక్రమంగా ఇక్కడొకటి, అక్కడొకటి బయటకు వస్తూంటాయి. ప్రజలను ఉత్తేజితులు చేయడం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయటం అనే అంశంతో సంబంధం లేని విషయాలు కూడా ఉండొచ్చు. అర్ధిక పురోగమనంతో సంబంధం ఉన్నటువంటి ఒక అదర్శవంతమైన ఊహ మావోలో ఉంటే ఉండవచ్చు. అప్పుడు కూడా మౌ లికమైనటువంటి ఒక ఆర్థిక క్రమంలో ఉంది చైనా. ఆ క్రమంలో ప్రాథమిక పెట్టుబడి సమీకరణ ఏ రకంగా జరగాలి అనే ప్రశ్నకు జవాబుగా ఇది ముందుకు వచ్చింది. దాంతో ఇతర అంశాలు కూడా ఏవైనా ముడిపడి ఉండవచ్చును. మనం మరీ కళ్ళు మూసుకొని బ్రమలతో, ఆదర్శవంతంగా ఆలోచించాల్సిన అవసరమూ లేదు, మరీ 67011 గా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. 61641 1620 [0౧౫౫4 అనేటటువంటి రెండో దశలో అంటే 1957 తరవాత వ్యవసాయ సహకార క్రేత్రాల్లోకి దాదాపు నూటికి 80 శాతం రైతాంగం వచ్చేశారు. సహకార క్షేత్రాల్లోంచి ముందుకుపోయి గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూన్ల ఏర్పాటు కూడా చేసుకున్నారు. ఒక కమ్యూన్ అంటే కేవలం వ్యవసాయ అవసరాల కోసం భూమిని సమిష్టిగా కలిగిజండి మీ పశువులు, మా పశువులు, మీ నాగలి, మా నాగలి కలిపి దున్నుకోవడం అని మాత్రమే కాకుండా ఆ వచ్చేటటువంటి పంట, ఉత్పత్తి నుంచి చేసిన పనిని బట్టి వర్క్ పాయింట్స్ లెక్కపెట్టి, దాని ప్రకారం ఫలితం ఇచ్చి ఆ మిగులు ఏవైతే ఉంటుందో దాన్ని తనకు తానే నిర్వహించుకొనే యూనిట్. వాళ్ళవరకు వాళ్ళే ఒక గవర్నమెంట్. ఆ మిగులులో కొంత పన్ను ప్రభుత్వానికి కడతారు. అది ప్రభుత్వానికి బయట పారిశ్రామిక రంగంలో పెట్టుబడిగా పనికొస్తుంది. కాని స్థానికంగా వ్యవసాయ రంగానికి సంబంధించినంతవరకూ మాత్రం తాము పండించిన దాంట్లో మిగులును ఉపయోగించుకొని - ఎప్పుడో ప్రభుత్వం వచ్చి రిజర్వాయరు కట్టిస్తుంది, శతం పాగోపాల్ దవన్నానాట
చెక్ డ్యాం కట్టిస్తుంది, బావులు తవ్విస్తుంది అనే పద్ధతి కాకుండా వాటిని తామే ఏర్పాటు చేసుకుంటారు. సమిష్టిగా వపండించుకోవటం వల్ల కొంత ఎక్కువ మిగల్బగలుగుతారు. దాంట్లో ప్రభుత్వానికి పన్ను కట్టగా మిగిలింది డ్యాములు కట్టుకోవటానికి ముఖ్యంగా చాలా పెద్ద రిజర్వాయర్లు కట్టుకోవడానికి ఉపయోగించుకున్నారు. భూమిని చదును చేయడం లాంటి పనులకు కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున తమ శ్రమనే ఉపయోగించారు. తమ శ్రమతోనే చిన్న డ్యాములు కట్టుకున్నారు. మన దగ్గరయితే ప్రభుత్వం (ప్రాజెక్టు మంజూరు చెయ్యాలి, ప్రపంచబ్యాంకు దగ్గరకి అప్పుకోసం పోవాలి, వాళ్ళు అప్పు ఇవ్వాలి, అప్పు ఇచ్చిన తరవాత ఎవడో కాంట్రాక్టరు ఆ ప్రాజెక్టును తీసుకోవాలి. వాడు దాంట్లో మట్టినో దేన్నో కలపాలి. అది కూలిపోవాలి. ఇవేమీ లేకుండా తమ కోసమే కాబట్టి తమ శ్రమతో తమకు మిగిలిన దాంతో వాళ్ళు కట్టుకుంటారు. భూమిలేని కూలివాళ్లు ఎవరన్నా ఉంటే వాళ్ళను కూలికి నియమించుకుంటారు. వాళ్ళకు తాము పండించిన దాంట్లో మిగిలింది ఇస్తారు.
నేను ఒక విధానంగా దీనిని చెప్తున్నాను. ఈ విధానం అమలులా అవకతవకలు, మిగిలిన విషయాలు పక్కకుపెట్టి చెబుతున్నాను. చైనా వాళ్ళు భూమిని బాగు చేసుకోవడం గురించి మీరు కూడా చాలా నవలల్లో చదివే ఉంటారు. అసలు ఏమాత్రం ఆవాసయోగ్యం కావు అనుకున్నటువంటి భూమిని కూడా తమశ్రమతో కొన్ని లక్షల ఎకరాలను చైనాలో సాగు కిందకి తీసుకువచ్చారు. ఇదంతా ఒక దీర్ధకాలిక ఆర్థిక క్రమంలో దేనికి దోహదం చేసింది అంటే పెట్టుబడి కొరత అనే సమస్య ఏదైతే ఉంటుందో దానివల్ల విదేశాలకు గులాములు కాకుండా, తమ కాళ్ళమీద తాము నిలబడేందుకు, పెట్టుబడి కొరత అనే సమస్యను పరిష్కరించేందుకు ఉపయోగపడింది. ఉద్దేశ్యం ఏదైనా దీంట్లో వేరే రాజకీయాలు, ఆదర్శాలు లేవా అంటే ఉండొచ్చు. దీంతోపాటు ఈ కమ్యూన్లలో మరొక ప్రయోగాన్ని కూడా ఆ దశలో ప్రవేశపెట్టారు. అది చాలా వివాదాస్పదమైనది. విఠల్రాజన్కూడా ప్రస్తావించారు ₹/జియుం్ 00 27/0 1685 అని. ఈ మాటను చాలా సందర్భాలలో మావో ప్రయోగిస్తారు. చైనా రాజకీయాలలో తరచుగా చెప్తారు. దీని అర్ధం పెద్ద పరిశ్రమలే కాకుండా చిన్న చిన్న పరిశ్రమలు స్థానిక అవసరాలకోసం, స్టానిక వనరులతో కమ్యూన్లలోనే తయారు చేయటం. అవి ఎరువులు కావచ్చు, పురుగుల మందులు లాంటివి కావచ్చు. నాగలికీ వాటికీ ఉపయోగించే ఇనుప ముక్కలు కావచ్చు. స్థానికంగా చెప్పులు లాంటివి కావచ్చు. మొత్తంమీద
వేశ్తతి శ్యాం నక్ష
ఉపయోగించే స్థానిక వనరులతో స్థానికంగానే చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని వాటిని తయారు చేయటం.
దాంతోపాటు కయ 2746 4002063 అని చెప్పి ఇనుము ఉక్కు ఉత్పత్తిని కమ్యూన్లలోనే చిన్న చిన్న 12 [000106 లు పెట్టి తయారు చేసే ప్రయోగం కూడా చేశారు. వీటిని కొంత వివరంగా పరిశీలించిన ఎకానమిస్టులు - ఆ రెండింటిని కలపకూడదు, వేర్వేరుగా చూడాలి అన్నారు. ఎందుకంటే ఈ 00/16 92గ4063 చాలా వరకు విఫలమయినాయి. చాలా నష్టం కూడా జరిగింది వాటివల్ల, ప్రజలకు అనుభవం రాలేదా? ఒక ఉత్సాహం రాలేదా? 1గ౫౦6 అంటే, 12010౧ అంటే పట్టణాలలో ఉండే కార్మికులు చేస్తారు, మాకేం అర్ధం కావు అని రైతాంగం అనుకోకుండా మేం కూడా చెయ్యగలం ఇవి అననుకోవడం మనిషికి ఆత్మ స్టైర్యం ఇస్తుంది. ఆ ధైర్యం మనిషిని మరింత సంపూర్ణమైన మనిషిగా తయారు చేస్తుంది. సోషలిజం అనుకున్నా, వేరే విష్ణవం అనుకున్నా...ఏదనుకున్నా అదొక ముఖ్యమైన ఆదర్శం. ఆ ఆదర్శంలో అదొక ముఖ్యమైన అంశం. మనిషిని మరింత నిండైన మనిషిగా, నేను పొలం మాత్రమే దున్నగలను, వేరెమీ చెయ్యలేను అనుకోకుండా ఇది కూడా నేను చెయ్యగలను అనే నమ్మకం ఇస్తుంది. అది విఫలం కావచ్చు, వృధా కూడా కావచ్చు. కొన్ని వృధా అయినప్పటికీ కమ్యూన్ల ఆధ్వర్యంలో చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే నెలకొల్పాలని ప్రయత్నం చేశారో అవి చాలావరకు విజయవంతమయ్యాయి.
ఈ చిన్న స్థాయి పరిశ్రమలు అనేవి అక్కడ చాలా పెద్ద ఎత్తునే వచ్చాయి. చైనాకు పోయి వచ్చిన ఒక ఎకానమిస్ట్ అంటాడు - భారతదేశాన్ని చైనాని పోలిస్తే ఇక్కడ మన $512౫1 50216 560101 అంతా కూడా ప్రభుత్వాన్ని దోచుకోవడం కోసం చిన్న చిన్న కంపెనీలు పెట్టుకోవటం, డబ్బులు తీసుకోవటం, ఎగ్గొాట్టేయటం, 510% అని ప్రకటించుకోవడం - ఇదే జరిగింది. కాని అక్కడ కమ్యూన్లలో ప్రజల శ్రమ, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళకు బయటనుంచి సైంటిస్టులు నేర్ప్చించేటటువంటి టెక్నాలజీ, వాటిని ఉపయోగించుకొని స్థానిక వనరులతో వాళ్ళు ఎన్నిటినో తయారు చేసుకున్నారు. వాళ్ళకి ఆత్మవిశ్వాసం సెరిగింది. వాళ్ళు మరింత సంపూర్ణమైన మనుషులుగా మారారు. మేధోశ్రమ, శారీరక శ్రమ అనండి లేకపోతే పారిశ్రామిక సాంకేతికత, వ్యవసాయ సాంకేతికత అనండి - ఆ తేడాలు తగ్గిపోవటానికి ఈ ప్రయోగం దోహదపడింది. ఇది వాళ్ళు బాగానే చేయగలిగారు.
శడ్తడ్లే శ ాలపాల్ దాన బ
ఇదే కాకుండా సోవియట్ రష్యాలో చాలా ప్రధానమైన లోపంగా వస్తూ వచ్చిన, కేంద్రీకృత ప్రణాళికా రచనను వాళ్ళు కొంతవరకు సరిదిద్దుకోగలిగారు. రష్యాలో దానివల్ల విపరీతమైన కేంద్రీకృతం జరిగి, బ్యూరోశ్రసి సెరిగి - మూర్జమైన నిర్ణయాలు, మూఢమైన నిర్ణయాలు, వాస్తవాలతో ఏమీ సంబంధం లేని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొన్ని జోకులు చెప్తారు. గోర్బబేవ్ వచ్చిన తరువాతే విషయాలు బయటికొస్తున్నాయి. అప్పుడు చెప్పటానికి స్వేచ్చ లేదు. సోవియట్ రష్యాలో లేదు, చైనాలోనూ లేదు. మాస్కో నుంచి బూట్లు సరఫరా జరగాలి. 2500 కి.మీ. దూరంలో ఉన్నటువంటి ఒక (గ్రామానికి బూట్లు వస్తాయి, వస్తాయి అని వాళ్ళంతా కాచుకొని ఉన్నారు. చలికాలం. ఒక రోజు గూడ్సు టట్రెయిన్లో మొత్తం బూట్లు దిగాయి. తీరా విప్పి చూస్తే అన్నీ ఎడమకాలి బూట్లే ఉన్నాయంట. కుడికాలు, ఎడమకాలు కలిపిన జత కాకుండా ఎడమకాలి బూట్లే ఉన్నాయంట దాన్నిండా. ఈ రకమైనవి చాలా జరిగాయి. చైనాలో కూడా జరిగాయి, జరగలేదని కాదు, అన్ని చోట్లా జరిగాయి. ఎవరో కొద్ది మంది వాళ్ళలో ఎంత లెక్కలు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నా, దేశంలోని ఇన్ని రకాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కేంద్రీకృతంగా ప్రణాళికా రచన చేసి, దాన్ని సమన్వయం చేసుకుని, అన్నీ నిర్ణయంలా చేయగలుగుతారు అనుకోవటం సరియైన ఆలోచనే కాదు. ఆ విషయం అర్ధం కావటానికి రష్యాకు చాలా కాలం పట్టింది. ఆ అనుభవాన్ని కొంతవరకు చైనావాళ్ళు నేర్చుకొని కొంతమేరకు దాదాపు రెండవ పంచవర్ష ప్రణాళిక అప్పటినుంచి వికేంద్రీకరణ వాళ్ళు ప్రారంభించారు. అది ఏంటంటే పెద్ద పరిశ్రమలను మాత్రమే వాళ్ళు కేంద్రీకృతంగా నిర్వహించేవారు. చిన్నస్థాయి పరిశ్రమలన్నిట్లో కూడా రాష్ట్రాల వాళ్ళకు నిర్వహణా స్వేచ్చ ఉండేది. అయితే చైనాలో రాష్ట్రాలు చాలా పెద్దవి కాబట్టి అప్పటికి అది కేంద్రీకృతమే కావచ్చు, అప్పటికే బ్యూరోశ్రాటిక్కే కావచ్చుగానీ అయినా ఆ మాత్రం తేడాను మొదటి నుంచి కూడా వాళ్ళు పాటించడం మొదలుపెట్టారు.
ఇక్కడ మనం కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మెచ్చుకునే టప్పుడు మెచ్చుకోవడం ఎంత అవసరమో, 6600002032608 లాంటి మాటలు ఉపయోగించే టప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కేంద్రీకృతంగా పీకింగ్లోనే కూర్చొని అన్ని నిర్ణయాలు తీసుకోవడం బదులు, ఆయా రాష్ట్రాల రాజధానుల్లో కొన్ని నిర్ణయాలు జరుగుతాయనేది మంచిదే. ఇంకా క్రింది స్థాయి నిర్ణయాలు అంటే ఒక కమూ్యూన్లో ఉపయోగించే ఎరువులు ఎక్కడ తయారు చేసుకోవాలనేది ఆ నిర్ణయం
వేత్తల కా నత్తం
కమ్యూన్ అడ్మిన్మిస్టేషన్ చేస్తుంది. కేవలం పన్ను ఒక్కటే ప్రభుత్వానికి కడుతుంది. లేదా తాను ఉత్పత్తి చేసే దానిలోంచి ఏమైనా ఉంటే ప్రభుత్వంతో అగ్రిమెంట్ పెట్టుకొని సరఫరా చేస్తుంది. ఇంతవరకూ ప్రజాస్వామికమే.
కానీ ఎంత సాంస్కృతిక విప్లవంలో అయినా, 61641620 0౧౫6 అయినా, మొత్తం మావో చేసిన ప్రయోగమంతా ప్రజాస్వామికంగా ఏమీ జరగలేదు. వికేంద్రీకరణ అంటే కింద స్థాయిలో నిర్ణయాలు తీసుకోవటం కొంతవరకు జరిగింది. అలాగే రాజకీయంగా తిరోగామి శక్తులను ప్రతిఘటించాలి అనుకున్నప్పుడు 12% గ0 26001 అనే పిలుపు ఇవ్వటం ప్రతిఘటించేటటువంటి 'స్వేచ్ళను, హక్కును ఇవ్వటం జరిగింది ఒక రాజకీయ సంఘర్షణలో భాగంగా. సమాజంలో దొంతర్జు దొంతర్జుగా అసమానతలు ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా పోరాడటం, ప్రతిఘటించడం, సామాజిక సంబంధాలలో సమానత్వాన్ని పెంపొందించటం - ఆ అర్థంలో ప్రజాస్వామీకరణ ఉంది. అక్కడ కానీ పౌరులుగా ఏదైతే మనం హక్కులు స్వేచ్చ అనుకుంటామో... ప్రజాస్వామ్యం అనుకుంటామో వాటి ఛాయలు వెతికితే మాత్రం కష్టమే. అది మావో ఆలోచనలలో అయినా సరే, మావో ఆధ్వర్యంలో జరిగినటువంటి సాంస్కృతిక విప్లవంలో అయినా సరే. పోరాటంలో భాగంగా పోస్టర్లు వెయ్యండి అన్నాడు. కానీ అది పోరాటంలో భాగంగా మాత్రమే, అది తిరోగామి శక్తులను ప్రతిఘటించటం కోసమే. పరిస్థితులతో నిమిత్తం లేకుండా ప్రజాస్వామ్యం అని మనం అనుకునేది, అది కూడా ఒక ప్రజాస్వామ్యమే. దానికి బూర్జువా ప్రజాస్వామ్యం అనే పేరు పెట్టినా ఏ పేరు "పెట్టినా మనుషుల 'స్వేచ్చాయుతమైన జీవితానికి అది అవసరం. దాని గురించి ఒక 608061 గానీ ఇవేవి మనకు కనిపించవు. ప్రతిఘటించు, పోరాడు, ఎదిరించు, హక్కులు డిమాండ్ చేయి అనే పిలుపు అనేక సందర్భాలలో ఇవ్వటం జరిగింది చైనాలో. కానీ వాటికి ఒక వ్యవస్థ, ఒక గ్యారంటీ, వ్యవస్థితమైనటువంటి భద్రత - ఇవి మూత్రం మనకు కనిపించవు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని విషయాలు చర్చించుకోవాలి. మంచి చెడు మొత్తం విషయాలు కూడా మన దృష్టిలో ఉండటం అవసరం.
సరే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ దగ్గరకు మళ్ళీ వస్తే ఆ ప్రయోగాలన్నీ బేశారు. ఆ ప్రయోగాలు చేసే క్రమంలో 1952 నుంచి 1960 వరకు రష్యా వాళ్ళకు సహాయంగా ఉండింది. దాదాపు ఒక 300 ఫ్యాక్టరీలను, పారిశ్రామిక కేంద్రాలను నెలకొల్బటానికి, సాంకేతిక శిక్షణ ఇవ్వటానికి రష్యా వాళ్ళు ఒప్పుకున్నారు. కొన్ని బిలియన్ల డాలర్ల పెట్టుబడిని ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు, ఇచ్చారు. ఆ పరిశ్రమలు సగం వరకు
శేశర్ శ జాలగోపాల్ ఉవన్వాసాలు జ
పూర్తయి, మిగిలినవి సగం సగం నడుస్తూ ఉండగా రాజకీయ విభేదాల వల్ల రష్యా వాళ్ళు అకస్మాత్తుగా మొత్తం వదిలి పెట్టి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ లోపల చైనాలో ఇంజనీర్లు కొంత నేర్చుకున్నారు. సాంకేతిక నిపుణులు కొంత నేర్చుకున్నారు గానీ అది సంపూర్ణం కాదు. అది సరిపోలేదు వాటిని వెంటనే వేగంగా పూర్తి చేయటానికి. సరిగ్గా అదే సమయంలో రెండు సంవత్సరాలు తీవ్రమైన క్షామం. అది ఎంత తీవం అంటే ౫6110౪ 1౪6 అని చెప్పి ఒక నది ఉంటుంది చైనాలో, అది ఎప్పుడూ ఎండిపోదంట. అటువంటిది ౩ వారాలు చుక్క నీళ్ళు లేకుండా ఎండిపోయింది. అది అంత తీవ్రమైన క్షామం అని చెప్పుకుంటారు. ఇవి రెండూ 1959-60 గానీ, 1960-61 గానీ, ఆ రెండు సంవత్సరాలూ ఆ ప్రాంతంలో కరువు రావడం, రష్యా వాళ్ళు అకస్మాత్తుగా వెనక్కి వెళ్ళిపోవడం, దీంతో అంతవరకు జరిగినటువంటి ప్రయోగం - ప్రాథమిక పెట్టుబడి సమీకరణ, పారిశ్రామిక - అభివృద్ధి, వ్యవసాయ రంగంలో అభివృద్ధి, 226 1601202400, రిజర్వాయర్లు కట్టుకోవడం ఇవన్నీ దెబ్బతిన్నాయి.
సహజంగానే ఎప్పుడైతే కరువు వస్తుందో, క్షామం వస్తుందో అంతవరకు సమిష్టిగా కలిసి పనిచేసుకుంటున్న వాళ్ళలో తేడాలు వస్తాయి, కొట్లాటలు వస్తాయి, ఘర్షణలు వస్తాయి. నా భూమి నాది, నీ భూమి నీదే పో అనుకున్నారు. ఇట్లాంటి ఘర్షణలు కమ్యూన్లలో కూడా వచ్చాయి. కమ్యూన్లలో ఏమైనా మిగిలితే ఆ మిగులును దేనికోసం ఖర్చు పెడదాము అంటే మనుషులకు ఇంకా ఆకలి అనేది సమస్యగా ఉంది కాబట్టి దాన్ని దాచిపెట్టుకుందాం అని, నాకు కావాలి, నాకు కొవాలి అని ఆలోచన వచ్చి కొంచెం అవినీతి వచ్చింది. ఈ సమస్యలన్నీ కూడా కమ్యూన్లలో, కమ్యూన్ల బయటా రాజకీయాలుగా మారాయి. చివరికి రాజకీయ ఘర్షణ రూపం తీసుకొన్నాయి. ఎక్కడ దీన్ని పవర్ష్టగుల్గా చూస్తాము, ఎక్కడ పునాదిలో ఉన్న సంక్షోభంగా చూస్తాము అంటే రెండింటికీ ముడి తప్పనిసరిగా ఉంటుంది. అది అర్ధం చేసుకుంటే ఇదా, అదా అనే చర్చ అనవసరం అవుతుంది. దాదాపు మొదటినుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ = లోపల మావో ఎప్పుడూ ఒక మైనార్జీగానో, ఒక బలహీనుడుగానో ఉంటూ వచ్చాడు. ఆయన మీద విమర్శ ముందుకు వచ్చింది. 1961 నుంచి 64, 65 వరకు సమిష్టి క్షేత్రాలను పూర్తిగా కాదు, కొంత వరకు ్రైవేట్పరం చెయ్యడం, ,పైవేటు ప్లాట్లు కావాలంటే పెట్టుకోవచ్చు అని చెప్పడం - ఒకప్పుడు మీరు ఈ సమిష్టి క్షేత్రానికి ఎంత భూమి ఇచ్చారో దాన్ని జ్ఞాపకం పెట్టుకొని దాని ప్రకారం మీరు కొంత అదనంగా తీసుకోవచ్చు వంటి ఏర్పాట్లు, మార్పులు జరిగాయి. లేదా పండించిన దాంట్లో కొంత
వేత?
మాత్రం ప్రభుత్వానికి ఇచ్చి మిగిలిన దాన్ని మీరు స్వేచ్చగా బయట అమ్ముకోవచ్చు అని చెప్పారు. వీటితో నల్లబజారు విపరీతమై ప్రభుత్వం అదుపు చేసే ధర కంటే 30 రెట్టు, 40 రెట్లు, 50 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడు పోవడం - ఇవన్నీ కూడా చైనాలో ఒక 2, ౩ సంవత్సరాల పాటు జరిగింది. ఈ నేపథ్యాన్ని మనం - అంటే ఆర్థిక పెట్టుబడి సంచయం ఏర్పడటం, పారిశ్రామికీకరణ, వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక రంగాలలో పురోగమనం - వీటిని పునాదిగా పెట్టుకొని ఆలోచించుకుంటూ వస్తే....ఎందుకంటే అదొక ప్రధాన సమస్య, వేరే పవర్ స్ట్రగుల్ ఉన్నా ఆదర్శాలు ఉన్నా సోషలిజం నిర్మాణమున్నా అన్నీ దీంతో ముడివడి ఉండవలసినవే కాబట్టి అక్కడినుంచి చూసుకుంటూ వస్తే సాంస్కృతిక విప్లవం కాలం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ పరిస్థితి కనిపిస్తుంది.
అప్పుడు మళ్ళీ ఒక పిలుపు. దేశం పెట్టుబడిదారీ దిశవైపు వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. మళ్ళీ దానిని 6:64 620 కంగాలాడే కంటే ఇంకింత ఎక్కువ చైతన్యంగా ముందుకు తీసుకొనిపోయి సోషలిస్టు సంబంధాలను నెలకొల్పటం ద్వారా మన ఆర్థిక సమస్యను పరిష్కారం చేసుకుందాము అని మావో పిలుపునిచ్చారు. రాజకీయ రూపంలో వేంగ026 6 కల6 “ఖలు - పార్టీ నాయకత్వం వెనకబడి పోతోంది కాబట్టి, తిరోగాములు అయిపోతున్నారు కాబట్టి, పెట్టుబడిదారీ మార్గీయులు అయిపోతున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేయండి. పార్టీ కేంద్ర నాయకత్వం మీద మాత్రమే కాదు, ప్రతి ఫ్యాక్టరీలో, ప్రతి కమ్యూన్లో అన్ని చోట్ల కూడా అధికారంలో ఉండేవాళ్ళు - వాళ్ళు పార్టీ వాళ్ళుగానీ, వేరే ఎవరయినాగానీ - వాళ్ళమీద, వాళ్ళ తిరోగమనం మీద దాడి చేయండి అని మావో పిలుపు ఇవ్వడం, సాంస్కృతిక విప్లవం ఆ రకంగా ప్రారంభం కావటం, దీన్ని నేపథ్యంగా పెట్టుకొని చూస్తే మనకు అక్కడ లింక్ కనిపిస్తుంది.
ఇక్కడ మళ్ళీ మనం వెనక్కిపోయి ఇంకో ప్రశ్చ వేసుకోవాలి. సరే 1961-64 వరకు ఒక రకమైన నూతన ఆర్థిక విధానం అమలులోకి వచ్చింది. ఎందుకు మావో దాన్ని ప్రతిఘటించాడు? తన ప్రతిఘటనను ఆయన ఏరకంగా సిద్ధాంతీకరించాడు? ఆయన కేవలం అధికారం కోసమే చేశాడనుకుంటే - దాన్ని కాసేపు పక్కన పెడదాం - ఏరకంగా నిద్ధాంతీకరించాడు? ఆ నిద్ధాంతీకరణ నుంచి మనం నేర్చుకునేది ఏముంటుంది? ఆ సిద్ధాంతీకరణలో ఉండే విలువైన విషయం ఏముంది? అది మనకు ముఖ్యమైన సంగతి అవుతుంది. ఏ రకంగా దాన్ని అర్ధం చేసుకున్నాడనే ప్రశ్న మనకు
శేశ్తర్ శాగపాల దవన్నాసాల
వస్తుంది. పొద్దున కొంత చర్చ వచ్చింది. పాలిటిక్స్ ఇన్ కమాండా, 2౭006 011603 12 ౧౦౧౫౧౭౫4 206 1002076 [0640608 అని మావో అన్న విషయం అంజయ్య గారు గుర్తించలేదు అని కొంత చర్చ వచ్చింది. సుబ్రహ్మణ్యం కొంత వివరణ ఇచ్చాడు. నేననుకుంటా ఒక పాయింట్ అందరమూ మిస్ అయ్యాం - ఒక కీలకమైన పాయింట్. ఆ పాయింట్‌ను మొదట్లో కొంత ప్రస్తావించాను, మళ్ళీ ఇక్కడ చెప్తాను.
ఉత్పత్తి శక్తుల మీద ఆధారపడే ఉత్పత్తి సంబంధాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా కొంత స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి ఉత్పిత్తి సంబంధాల గురించి విడిగా కూడా మాట్లాడొచ్చు అనో అటువంటిది కాదు ఇక్కడ. ఉత్పత్తి సంబంధాలు మార్చటం ద్వారానే ఉత్పత్తి శక్తులు మరింత ఎక్కువగా అభివృద్ధి చేయగలుగుతాము అనే ఆలోచన కూడా మావోలో ఉంది. అది కరెక్టా, కంక్టు కాదా, ఇది నూర్క్సిజం అవునా కాదా అనేది పక్కకుపెడదాం. మావో ఆలోచనలను మార్క్స్ రిఫరెన్స్ పాయింట్ చేసుకొని రైటా - తప్పా అని చూస్తామా? లేక మావో ఆలోచనలైనా, లెనిన్ ఆలోచనలైనా, మార్క్స్ ఆలోచనలైనా - అన్నిటినీ కూడా సోషలిజం అనే ఆదర్శానికి రిఫరెన్స్ చేసుకొని ఎవరు ఎంతవరకు కరెక్టు అని ఆలోచిస్తామా....అనేది కూడా ఒక చర్చకావచ్చు. మార్క్స్‌నే ఎందుకు ప్రాతిపదికగా తీసుకోవాలి? అది కూడా ప్రశ్నే కావచ్చు. మావో ఆలోచనలో ఒక అంశం ఏముంది అంటే ఉత్పత్తి సంబంధాల విష్లవీకరణ అనేది విపరీతంగా వెనకబడిఉంటే అది పునాదిని వెనక్కి లాగుతుంది కాబట్టి ఉపరితలాన్ని కూడా విప్లవీకరించాలి. అనేక సామాజిక సంబంధా లుంటాయి. వాటిని మార్చకపోతే మనం పునాది ఎంత అభివృద్ధి చేసినా సరే సమాజం వెనక్కిపోతుంది. కాబట్టి వాటిని మార్చాలి. ఉత్పత్తి శక్తులు - ఉత్పత్తి సంబంధాలు, పునాది - ఉపరితలం అనేవి 00610016 గా ఉండవు. కొంత స్వేచ్చ ఉంటుంది. కొంత స్వయం ప్రతిపత్తి ఉంటుంది. కాబట్టి విడిగా దాని గురించి ఆలోచించాలి అనే కాకుండా ఉత్పత్తి శక్తుల్లొ పురోగమనం కావాలంటే కూడా ఉత్పత్తి సంబంధాలను మరింత విప్లవీకరించాలి. ఉపరితలాన్ని విప్ణవీకరించాలి. దాని ద్వారా మనుషుల్లో వచ్చేటటువంటి చైతన్యమూ, ఆలోచనా, మరింత నిండైన మనుషులు కావటం, మరింత బాధ్యతాయుతమైన మనుషులు కావటం, తమ జీవితాల మీద తమకు కంట్రోల్ అనేది 'పెరగడం....ఇవన్నీ ఉత్పత్తి శక్తుల పురోగమనానికి దోహదం చేస్తాయన్న ఆలోచన కూడా మావోకు ఉండింది.
మావో రచనల్లో చాలా సందర్భాలలో మనకు అది స్పష్టంగానే కనిపిస్తుంది. ఒక ఫ్యాక్టరీలో కార్మికులు ఉంటారు. ఏ సూసర్వైజరో వచ్చి, ఇంజనీరో వచ్చి ఇట్లా
శశతి స్యాం నత్తం
చేయండి, అట్లా చేయండి అంటే పని చేస్తూ ఉంటారు అనుకుందాం. ఆ సంబంధమే ఉండకూడదు, అది పోవాలి. సూపర్వైజర్ అంటూ ఎవరైనా ఉన్నా సరే ఆ సూపర్వైజర్తో ఫ్యాక్టరీ కార్మికులు కూడా కలిసి ఉండాలి. అందరూ కలిసి ఫ్యాక్టరీని నడసాలి అనే ఆలోచనే ఒక సోషలిస్స ఆలోచన, ఒక పురోగామి ఆలోచన. విడిగా కూడా దాన్ని కాంక్షించవచ్చు, కాంక్షించాలి. కానీ ఆ రకమైన ఆలోచన అమలు చేయడం ద్వారా కార్మికులకు పెరిగే టటువంటి బాధ్యత, కార్మికులకు 'సెరిగేటటువంటి భాగస్వామ్యం
- ఇది మరింత ఎక్కువ ఉత్పత్తి చేయటానికి, ఉత్పత్తి శక్తులను మరింత ముందుకు తీసుకొని పోవటానికి, మరింత సృజనాత్మకంగా పనిచేయటానికి దోహదం చేస్తుంది.
ఎక్కువ పెట్టుబడిపెట్టి హెవీ ఇండస్ట్రీని మీరు అభివృద్ధి చేస్తే కదా ఆర్థిక వ్యవస్థ అధునికం అయ్యేది. మీరు కమ్యూన్లలో ఫెర్టిలైజర్స్, కమ్యూన్లలో పెస్టిసైడ్లు అంటే ఎప్పుడు అభివృద్ది అవుతారు అని అంటే సంప్రదాయకంగా వేపగాని, మరొకటిగాని, వీటికుండేటటు వంటి క్రిమి సంహారక లక్షణాలు ఏవైతే రైతాంగానికి పరిచయం ఉంటాయో వాటినుంచి చిన్న టెక్నాలజీని అభివృద్ధి చేసుకుని, కొన్ని పురుగు మందులు తయారుచేస్తారు. ఎరువులు తయారు చేస్తారు. చైనాలో, మనం ఎట్టాగైతే పశువుల పేడ వాడతామో, వాళ్ళు ఎరువుగా పందుల మలాన్ని ఎక్కువగా వాడతారు. ఆ ఎరువు నుంచి మనం ఇంకెంత ఆధునికమైన ఎరువులు తయారు చేయగలుగుతామో వాళ్ళు ఆలోచించుకోగలుగుతారు. ఇదేం చేస్తుంది, కేవలం ఎరువులు సప్లయ్ చేయటం మాత్రమే కాదు, వాళ్ళను చిన్న చిన్న సైంటిస్టులను చేస్తుంది. మరింత నిండైన జీవితాన్ని వాళ్ళకిస్తుంది. మరింత బాధ్యతాయుతమై నటువంటి అస్థిత్వాన్ని వాళ్ళకిస్తుంది. ఒకవైపు ఇదే ఒక కాంక్షణీయమైన పురోగమనం అని, మరొక వైపు ఇది ఉత్పత్తి శక్తులను మరింత అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తుంది అనే ఆలోచన కూడా మావోలో ఉంది. దీన్ని మళ్ళీ 1060001610 00620121 2000012400. 16 01001601 0019121 ₹ంగు&600, ఆ లేం108 6ం010%)/ కి పెట్టుబడి ఎక్కడినుంచి రావాలి అనే ప్రశ్నకు లింక్ చేసుకుంటే అమెరికా నుంచి పెట్టుబడి అక్కర్లేదు మాకు; రైతాంగాన్ని దోచుకొని సోవియట్ రష్యాలో చేసినట్టుగా ఆ రకంగా పెట్టుబడి 'సేకరించాల్సిన అవసరం లేదు మాకు, ఉత్పత్తి సంబంధాలను ఉపరితలాన్ని విస్ణవీకరించటం ద్వార్హా సమాజంలో అరలు, అరలుగా, దొంతర్జు దొంతర్లుగా ఉన్న అనేక రకాల అసమానతలను పోగొట్టడం ద్వారా మనుషుల్లో పెరిగే చైతన్యం ఏదైతే ఉంటుందో దాంతో వాళ్ళు మరింత ఎక్కువగా పనిచేస్తారు. ఆ ఎక్కువగా పని చేయడమే వారికున్న ఆ గ్యాస్‌ను, ఆ పెట్టుబడి లేమిని
శేతం్0 కో జలగోపాల్ ఉవన్నాసాల
తీరుస్తుంది అనే రకంగా కూడా మావో ఆచరణనుంచి, చైనా ఆచరణ నుంచి సిద్ధాంతీక రించడం జరిగింది. ఇట్లే జరిగిందా? ఇంత బాగా జరిగిందా అంటే నేనూ అలా అనుకోవటం లేదు. ఎందుకంటే మనుషులన్నాక రకరకాల ఘర్షణలు ఉంటాయి. రాజకీయ ఘర్షణలు ఉంటాయి. వ్యక్తిగత స్వార్థ్ధాలు ఉంటాయి. చాలా వైఫల్యాలు జరిగినట్లుగా - ముఖ్యంగా ౮612211620 పంగా జక లో - మనకు తర్వాతి కాలంలో తెలుస్తూ ఉంది. కాని ఈ ఆదర్శం నుంచి, ఈ దృక్పథం నుంచి, ఈ ఆలోచననుంచి ఒక సూత్రీకరణ వచ్చింది. ఆ నూత్రీకరణ సమాజాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఉపయోగపడే ఒక ఆలోచన. అది మనకు ఉత్తేజాన్ని ఇస్తుంది. అందుకే నేను మొదట్లో అన్నట్టుగా విఠత్రాజన్గారు చెప్పినట్లే సాంస్కృతిక విప్లవం అనే ఆలోచనే మనకు ఇచ్చే ఉత్తేజం - అదే ఒక రాజకీయ శక్తి.
పదార్థము, చైతన్యము అనే వాటిని అంత సింపుల్‌గా చూడకూడదు. పదార్థము నుండి చైతన్యము వస్తుంది, పదార్ధము లేకపోతే చైతన్యం రాదు అనుకోవటం సరైంది కాదు. జ్ఞాన సిద్దాంతాన్ని మరింత సంక్లిష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఆదర్శాలుగానీ, ఉత్తేజంగానీ, నైతికతగాని, అవి - ఆ నీతి ల్లా$44020108) లో భాగం కావాలి. 143 024001 60801176 006655. అది వేరే చర్చ అనుకోండి. ఆ జ్ఞాన సిద్ధాంతం మీద చర్చ, ఆ ఉత్తేజం అనేది సాంస్కృతిక విప్లవాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనకు ఉపయోగపడే ఒక సందేశం ఇస్తుంది. కమ్యూన్లలో ఉత్పత్తి, ఉత్పత్తికి కావలసిన ఏర్పాట్లు చేయడం మాత్రమే కాకుండా సమాజంలో అనేక ఇతర రకాల అసమానతలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రయత్న పూర్వకంగా పోగొట్టే క్రమం ఒకటి సాంస్కృతిక విప్లవ కాలంలో (ప్రారంభం అయింది. ఇది మళ్ళీ 200101) కి లింక్ అయింది అని చెప్పటం కోసమే ఈ విషయాలు చెప్తున్నాను.
మావో ౮[0007601[0841 గా ఆలోచించాడు అని చలసాని ప్రసాద్‌గారు ముందు చెప్పి తరవాత ఎందుకో సర్దుకున్నారు. సర్దుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ₹[0007ల[0%821 గానే ఆలోచించాడు. 00॥7జ[0%21 అంటే సంప్రదాయం, ఏది సంప్రదాయం? మార్క్స్ నుంచి లెనిన్ దాకా, స్టాలిన్ దాకా ఒక సంప్రదాయం ఉంది. మావో దానికి భిన్నంగానే ఆలోచించాడు. ఆ భిన్నత్వంలో దాంట్లో తప్పులు, దాంట్లో లోపాలు ఉండొచ్చు. ఉదాహరణకు ఆయన వ్యక్త్ పూజను విపరీతంగా ప్రోత్సహించిన తీరు. విఠల్రాజన్గారు వ్యక్తి పూజ ౮228 0₹ 2001 చేశారు, మిగిలిన వాళ్ళూ అలా చేశారు అన్నారు గానీ, మావో దానిని ప్రోత్సహించాడు. ప్రోత్సహించానని ఒప్పుకున్నాడు
శర్2
కూడా. అదొక రాజకీయ ప్రయోజనం కోసం పనికి వచ్చింది అని నమ్మిన వాళ్ళలో నేను కూడా ఒకడిని ఒకప్పుడు. అది తప్పని ఇవ్వాళ అనుకుంటున్నా. ఎందుకంటే చైనాకు పోయి వచ్చిన చాలామంది సానుభూతి పరులు కూడా చెప్తున్నది ఏమిటంటే అదేమిటో గానీ చైనాలో జనంతో మాట్లాడితే అప్పటి ప్రభుత్వ విధానం ఏముంటుందో దాన్నే ప్రజలందరూ చెప్తారట. జోన్ రాబిన్సన్ లాంటి వాళ్ళు, విలియం హింటన్ లాంటి వాళ్ళు - వీళ్ళు అదే చెప్తారు. సాంస్కృతిక విప్లవ సమయంలో అయినా అంతే, ముందైనా అంతే, తరవాత అయినా అంతే, ఇవ్వాళ పోయినా అంతే. ప్రభుత్వ విధానం ఏమిటో అదే చెప్తారు జనం. అంటే ఏమవుతుంది? వ్యక్తి పూజ రాజకీయ అవసరాల కోసం, ప్రయోజనాల కోసం ఒకప్పుడు ఉపయోగించుకున్నాడులే, పోనీలే అనుకుందాం అనుకున్నా అది మరి ప్రజల చైతన్యానికి అడ్డం రాదా? ప్రజల్లో చైతన్యం లేకపోవడాన్ని అది కప్పేయదా? ఇవన్నీ కూడా ప్రశ్నలే.
అందువల్ల 0001076040121 అనేదాన్ని ఒప్పుకుంటూ కూడా విమర్శనాత్మకంగా చూడటం అవసరమే. అయితే 100౧౪౪4004 అని ఒప్పుకోవటం కూడా అవసరమే. ఆ అసంప్రదాయకమైనటువంటి మావో ఆలోచనలో ఒకటి ఏమిటంటే కమ్యూనిస్ట్ పార్టీ చేతికి రాజ్యాధికారం వచ్చిన తరవాత కూడా - అంటే మామూలు కమ్యూనిస్టు పరిభాషలో కార్మిక నియంతృత్వం వచ్చిన తరవాత కూడా - సంఘర్షణ అనేది కొనసాగుతుంది అని. అది శత్రుపూరితమైన సంఘర్షణ కూడా కావచ్చు. రాజ్యం పైన కమ్యూనిస్ఫు పార్టీకి లేక కార్మిక వర్షానికి అధికారం వచ్చిన తరవాత కూడా ఇంక అంతా సాఫీగా అయిపోతుంది, చిన్న చిన్న సంఘర్షణలు, చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉంటాయి అని అనుకోవడానికి ఏమీ లేదు; సమాజంలో ఎన్నో రకాల అసమానతలు ఉంటాయి; ఆ అన్ని రకాల అసమానతల మీద కూడా పోరాటం చేయాల్సి ఉంటుంది. ఈ అసమానతల మీద పోరాటం చెయ్యకపోతే తిరోగమనానికి, ప్రతీఘాతుక విప్లవానికి తిరిగి మళ్ళీ పెట్టుబడిదారీ వ్యవస్థ ఏర్పడటానికి మార్గం సుగమం అవుతుందనే పాఠాన్ని మనం తీసుకోవచ్చు...
(అసంపూర్ణం. కొనసాగింపు ప్రసంగం సరిగా రికార్డు కాలేదు.)
ఆ౮౮౪అ్తూ (మూర్చిస్ట్ అధ్యయన వేదిక - బెజవాడ, 1-1-1994) శేత్లి క ాగోపాల్ ఉవన్నాసాల
భయాంధ్ర ప్రదేశ్ వయాంధ్ర ప్ర
గత నెల రోజులుగా బిగపట్టుకున్న అసహనాన్ని ఈ సభాధ్యక్షులు, సంస్థ అధ్యక్షులు కూడ ఇవ్వాళ వ్యక్తం చేశారు. నిజంగానే నా సితీ అదే. భరించలేని, సహించలేనటువంటి ఒక స్టితిని నెల రోజులుగా గమనిస్తూ వస్తున్నాను. మానవ హక్కుల వేదిక మహాసభకు దీన్ని అన్వయించుకోవాలంటే, భయం రాజ్యం చేసే చోట హక్కులసాధన అవేది సాధ్యంకాదు. సమాజం భయపడుతూ ఉంటే, నిజం చెప్పటానికి భయపడుతూ ఉంటే, అబద్దాన్ని అబద్ధం అనడానికి భయపడుతూ ఉంటే ఏ హక్కులు సాధించుకుంటాం?..
దళితులుగానివ్వండి, కార్మికులుగానివ్వండి, ఉద్యోగులుగానివ్వండి, ఎవరైనా గానివ్వండి, సత్యాన్ని సత్యం అనగలగాల, అసత్యాన్ని అసత్యం అనగలగాల. నాకిది న్యాయం అనిపిస్తోందని నిర్భయంగా చెప్పగలగాల. అది సాధ్యంగాని చోట హక్కులు అనే మాటకు అర్ధం ఉండదు. ఈ రాష్ట్రాన్ని భయం ఏలుతూ ఉంది. ఆ భయం నుంచి ఈ రాష్ట్రం బయటపడలేదు. పడింది అని మనం ఎప్పుడైనా ఒకవేళ అనుకున్నా రాజశేఖర రెడ్డి మరణం తరువాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ భయాలు మరింత స్పష్టంగా మన ముందుంచాయి.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి తన కుర్చీలో కూర్చోలేడు. ధైర్యం చాలడం లేదు. డేట్ ఇచ్చినాడు, కూర్చొంటానని. నాకేమీ నమ్మకం లేదు. అక్టోబరు 5న, ఏదో ఓ కారణంగా వాయిదా వెయ్యొచ్చు. తన తోటి మంత్రులు పని చెయ్యకపోతే, ఎందుకు పని చేయడం లేదని వాళ్ళ నడగకుండా, “ఏం? మంత్రి (ప్రతిరోజూ సంతకం చేయాలా సెక్రైటేరియట్లో కూర్చొని?” అని వాళ్ళ తరపున ఆయనే జవాబు చెప్తున్నాడు.
శేర్తి స్ రాజం - నంక్షేమం శ
అడగటానికి ఆయనకు భయం.
రాజశేఖరరెడ్డి చనిపోయినాక, రాష్ట్రంలో ఎవరో అన్నారంట - ప్రతి పెద్ద ఆసుపత్రిలోను రోజుకో ఇరవై అయిదు, ముప్పెఅయిదు మంది గుండె పోటుతో వస్తుంటారు, చని పోతుంటారు, కొందరు మళ్ళీ ఇంటికి పోతుంటారు. ఇవన్నీ కూడా ఆ చావుకు సంబంధించిన మరణాలే అని బుకాయిస్తున్నారని ఆంగ్ల మీడియా మనకు చెప్పవలసివచ్చింది. ఇక్కడ మీడియాకు ధైర్యం చాలడం లేదు, ఇక్కడ వ్యాఖ్యాతలకు ధైర్యం చాలడంలేదు. అన్నిటినీ తీవ్రంగా విమర్శించే వ్యాఖ్యాతలుగా టీ.వి.లో కనిపించినటువంటి మహానుభావులు - పేర్లు చెప్పొద్దు, బాగుండదు - వాళ్ళకి సాధ్యంకాదు.
ఎటువంటి సమాజంలో జీవిస్తున్నాం మనం? ఈ సాధ్యం కాకపోవడం, నిజాన్ని నిజం అనలేకపోవడం - కొందరిలో భయం కావచ్చు, కొందరిలో అవకాశవాదం కావచ్చు, రెండూ - కూడా ప్రజాస్వామ్యానికి వినాశకరమే. ఎందుకంటే, నిజాయితీ లేకపోతే - భయం ఉన్నా నిజాయితీ ఉండదు, అవకాశమున్నా నిజాయితీ ఉండదు, నిజాయితీ లేకపోతే ప్రజాస్వామ్యుముండదు. హక్కుల సాధన సాధ్యం కాదు. ఇటువంటి సమాజంలో బ్రతుకు తున్నాం మనం అనే ఓ సిగ్గుపడే పరిస్థితి. బుర్ర రాములు అననే అన్నాడు - వాస్తవానికి నెల రోజులుగా ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితులలో మనమున్నామని. అరే గమనించలేదే మనం అని మనకు మనమే చెప్పుకోవలసి వస్తున్నది. ఎట్లా దీన్నించి బయట పడాలా అనే ప్రశ్న వేసుకోవలసి వస్తున్నది.
హైదరాబాదులో బ్రతికిన వాళ్ళకు ఓ జ్ఞాపకం తప్పనిసరిగా వస్తుంది. ఇవ్వాళ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యకపోతే ఇది జేస్తాం అదిజేస్తామని అనడం, ఇక్కడా అక్కడా దౌర్జన్యానికి పాల్పడటం చూస్తూ ఉంటే, హైదరాబాద్ నివాసులమైన మాకు 1992 జ్ఞాపకం వస్తోంది. ఒక ముఖ్యమంత్రిని దించి మరొకరిని ఎక్కించడానికి పీకలు కోసిన ఆ మారణకాండ జ్ఞాపకం వస్తోంది. తండ్రి పీకలు కోసి ఆరోజు ముఖ్యమంత్రులను మార్చాడు, ఇప్పుడు కొడుకు అదే పని చేస్తాడా అన్న భయం. బయట వాళ్ళకు, మీకిది అతిశయోక్తిగా అనిపియ్యవచ్చు. హైదరాబాదులో బ్రతికిన వాళ్ళకు, చూసిన వాళ్ళకు, ఆ ఘటన కాలంలో అక్కడ జీవించిన వాళ్ళకు సహజంగా వచ్చేటటువంటి సందేహం ఇది. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు అనలేక పోతున్నారు, ఎందుకు మాట్లాడలేక పోతున్నాం?
న! కచ్చ నానో
ఈ జాతి హక్కుల సాధనకు యోగ్యమైన జాతేనా? అసలు ప్రజాస్వామ్యానికి అర్హతున్న జాతేనా ఈ తెలుగుజాతి? విమర్శకులుగా, మేధావులుగా, ప్రగతిశీల వ్యక్తులుగా పేరుబడ్డవాళ్ళు, భయం లోపల తమ అవకాశాలు వెతుక్కుంటూ, దౌర్జన్యం లోపల తమకు అవకాశాలు వెతుక్కుంటూపోతూ ఉంటే, ఈ జాతి భవిష్యత్తు ఏమిటి? మేధావులు, బుద్ధిజీవుల పాత్రను ఎక్కువగా అంచనా వేయనక్కరలేదుగాని, నిజాయితీ గల బుద్ధి జీవులు ఉండటమనేది సమాజం పురోగతికి ఒక అవసరమైన విషయం - వాళ్ళ చేతుల్లో అంతా లేకపోయినా కూడా. నిజాయితీ ఉన్న బుద్ధి జీవులు లేరా ఈ ఆంధ్రప్రదేశ్‌లో, ఈ తెలుగు జాతిలో? ఎంత బాధాకరమైన పరిస్థితి.
భయం సంగతి పోనివ్వండి, రాజశేఖరరెడ్డి పథకాలలో భాగంగా ఇందిరమ్మ ఇల్గాచ్చినటువంటి ఒక బీదవాడు ఆయన చనిపోయాడని ఏడిస్తే నేను అర్థం చేసుకుంటాను- తనకి తెలిసింది అంతే ప్రపంచం, అంతకంటే సమగ్రమైన స్పందన తనకు సాధ్యంకాదు, ఆ సమాచారం లేదు, ఆ విశదీకరణ తెలియదు. చాలాకాలం జబ్బు నయం కానివాడు ఆరోగ్యశ్రీ పథకం వల్ల రోగం నయమయితే ఆ వ్యక్తి అయ్యో రాజశేఖరరెడ్డి చనిపోయాడని ఏడిస్తే అంతకన్నా సమగ్రమైనటువంటి విశ్లేషణలో అంతర్భాగంగా దానిని చూడటం ఆ వ్యక్తికి సాధ్యం కాదని నేను అర్థం చేసుకుంటాను. కాని దేన్నెనా ఒక మొత్తంలో భాగంగా చూడాలి. మొత్తంలో భాగంగానే ఆ భాగానికీ అర్ధముంటుంది, మొత్తానికీ అర్ధముంటుంది అని విశ్లేష్టించు కునేటటువంటి ప్రగతిశీల సంప్రదాయమున్న ఈ రాష్ట్రంలో, ఈ సంక్షేమ చర్యలు, అన్నీ సంక్షేమ చర్యలేనా అనే ప్రశ్న వేసుకోవచ్చు! కొన్ని అవును, కొన్ని కాదు, కొన్ని ఆయనవి కానేకాదు. అదట్లాగుంచి, ఏమి తీసుకుని ఏమిస్తున్నారు? ఇవి ఇవ్వటానికి ఏం తీసుకొంటు న్నారు, ఏమి గుంజుకొని చేతిలో కొంత పెడుతున్నారు, ఎంత గుంజుకొంటూ ఎంత పెడుతున్నారు అనే ప్రశ్నలు వేసుకుంటే తప్ప ఈ మొత్తం అర్ధం కాదు, దాంట్లో భాగం అర్థం కాదు, ఆ సంక్షేమం అర్థం కాదు.
ఈ (ప్రాథమిక విశ్లేషణ, వివేచన కూడా చేయలేకపోతున్నారు. అంటే అది భయమైనా, అది అవకాశవాదమైనా, ఏదో పొందుదామనే టటువంటి ఆకాంక్ష అయినా, దౌర్జన్యానికి భయపడి నోరు మూసుకునే పరిస్థితి అయినా చాలా బాధాకరం, ఎక్కడనుంచి వస్తున్నాయి ఇవన్నీకూడా? ఎందుకు అకస్మాత్తుగౌ ఈ పది పదిహేను సంవత్సరాలలోనే కోట్లాది రూపాయలు దీనికి దానికి మరొకదానికి పేదవాళ్లకు ఇస్తున్నారు? కొందరు ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నారు. ప్రతిపక్తనాయకుడు గారైతే
శేల్ర్ క్యా నతో
ఫ్రీగా డబ్బులే ఇస్తాను, నగదు బదిలీ అన్నాడు. ఏమిటి దీని వెనకాల ఉన్నటువంటిది? ఆయన గెలిచుంటే ఇచ్చేవాడే, అంతా కాకపోయినా కొంతైనా ఇచ్చుండేవాడు. ఇవ్వాళగాకపోతే రేపైనా. ఈ దాతృత్వం వెనకాల, ఈ సంక్షేమం వెనకాల ఉన్నటువంటి ఒక టోటాలిటీ ఏమిటి? ఆ మొత్తం ఏమిటి?
నరసింహారెడ్డిగారు పొద్దున చెప్పారు - ప్రపంచీకరణలో భారతదేశం భాగం ఆయిన తరవాత మిగులు చాలాపెరిగిందని. ఆయన విదేశీ మారకద్రవ్య మిగులు గురించి మాట్లాడుతూ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా (3110 అంటారు) విపరీతంగా మిగులు సాధించుకున్నాయి ప్రపంచీకరణలో భాగం అయిన తరవాత అని చెప్పారు. ఆ మిగులు విదేశీ మారకద్రవ్యంలోనూ ఉంది, దేశం లోపల కన్సాలిడేటెడ్ ఫండ్‌లోనూ ఉంది. అ మిగులు నుంచి ఇవ్వగలుగుతున్నారు, చెయ్యగలుగుతున్నారు. ఆ మిగులు నుంచే అనేక సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతున్నారు. కానీ ఆ మిగులు పొందడానికి, ఆ ప్రపంచీకరణ అమలు చేయడానికి ఎంత లాక్కొంటున్నారు అదే ప్రజానీకం నుంచి? ఏమేమి గుంజుకుంటున్నారు అదే ప్రజానీకం నుంచి? ఒక హక్కుగా, ఒక పాలనా బాధ్యతగా ఈ ప్రజానీకానికి ఇవ్వవలసినటువంటి విద్యగాని, వైద్యంగాని, రోడ్డుగాని, రవాణా సదుపాయాలు గాని, వీటిమీద పెట్టవలసిన ఖర్చంతాకూడా ఆపేసి, తగ్గించేసి, కార్పొరేట్ పెట్టుబడి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టుకొంటూ పోతున్నారు. వైద్య వ్యవన్స ఎట్టా నాశనమయి్యింది? విద్యావ్యవన్స ఎట్లా నాశనమయ్యింది, రవాణా వ్యవస్థ ఎట్లా నాశనమయ్యింది? ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఇన్ఫ్రాస్టక్చర్కి పోయింది, కార్పొరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు పోయింది. అది మనం చూస్తూనే ఉన్నాం.
ప్రజానీకానికి నిత్య జీవితంలో జీవనం కల్పించే ప్రకృతి వనరులు - భూమి, నీళ్లు, అడవులు, గాలి. ఈ రాష్ట్రంలో వాళ్ల నుంచి 2 లక్షల ఎకరాలు గుంజుకొని, ఈ కార్పొరేట్ సెక్టార్‌కు ఇవ్వబడుతున్నాయి, ఇవ్వబడ్డాయి. అవంతా తీసేసుకొని, ఆ కార్పొరేట్ కంపెనీలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారుచేసి, సదుపాయాలు తయారుచేసి, వాటిని ఆహ్వానించి, ఆ పెట్టుబడుల నుంచి వచ్చిన గ్రోత్‌రేట్ నుంచి సంక్షేమం ఇస్తే, ఆ మొత్తంలో భాగంగా దాన్ని చూసినప్పుడు ఈ సంక్షేమానికి అర్ధమేమిటి?
చూడలేకపోతున్నానా నువ్వు? ఎందుకు చూడలేకపోతున్నావు? ఆ దృష్టి నీకు ఎందుకు లేకుండా పోయింది? ప్రగతిశీలవాదులు, అభ్యుదయవాదులు, విశ్లేషణా
లొ జ బాలగోపాల్ ఉనన్వాసాలు జ
చాతుర్యం ఉన్నవాళ్లు అని పేరుపొందిన వాళ్లు కూడా ఎందుకు చూడలేకపోతున్నారు? నేను అవకాశవాదమే అనుకుంటున్నాను. అందుకే బుద్దిజీవులంటే, తెలుగు బుద్ధిజీవులంటే, ఇవ్వాళ సీగ్గుపడు తున్నాను. బహిరంగంగా ప్రకటిస్తున్నాను - తెలుగు జాతి బుద్ధిజీవులపట్ల నేను సిగ్గుపడు తున్నాను.
నరసింహారెడ్డిగారు విశ్లేషించి చెప్పుకుంటూ వచ్చారు. పొద్దున మాట్టాడుతూ ఆయన ఒక మాట అన్నారు. మనం హక్కుల గురించి ఎన్ని కోణాలనుంచి మాట్లాడినా, ఏమేమి చెయ్యవచ్చు, ఏ విధంగా మనుషుల మధ్య సౌభ్రాతృత్వాన్ని గాని, స్నేహ సహకారాలను గాని పెంపొందించవచ్చు, ఏ విధంగా పరస్పర సహనం పెంపొందించు కోవచ్చు మతాలు కులాలు వీటిపట్ల - అని ఎన్ని మాట్లాడుకున్నా - ప్రపంచీకరణ, నయా ఉదారవాద పాలనా విధానాలు, ఆర్థిక విధానాలు, వాటి ఫలితంగా భౌతిక వనరుల పంపిణీ, వనరుల వినియోగం, దాన్నించి వచ్చే ఫలాల పంపిణీ వాటిని ఏంజేస్తున్నారు అని చూడకపోతే, మనం జేసే మిగిలిన పనులన్నీ కూడా అపరిపూర్ణంగా ఉంటాయి. సంపూర్ణంగా ఉండవు. దానిమీద తీవ్రమైన విమర్శ పెట్టాల్సిన అవసరం ఉంది. దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అవన్నీ మర్చిపోతే ఎట్లా? తెలియక కాదు. నరసింహారెడ్డిగారి మాటలు ఇదే మనుషులు గతంలో వినకా కాదు. చాలా బాధాకరమైన పరిస్థితి.
భయం నుంచి బయటపడి ధైర్యంగా ఆత్మస్టైర్యంతో మాట్ట్లాడేటటువంటి ఆ ప్రజాస్వామిక విలువను కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యమైన పనైపోయింది ఇవ్వాళ మన అంధ్రప్రదేశ్‌లో.
ఆత్మస్థైర్యం, ధైర్యం, నిర్భీతి - ఈ ప్రజాస్వామిక విలువలు, ఇవి టేకపోతే మనం హక్కులకోసం కొట్టాడటమనేది సాధ్యమయ్యే పనికాదు. అది చెప్పటం అవసరమని నేనను కుంటున్నాను.
రెండు విషయాలు రేపు మా మహాసభల సందర్భంగా తీర్మానాలుగా రాబోతాయి. క్లుప్తంగా వివరించి ముగిస్తాను. ఒకటి ఇవ్వాళ ఈ కరువనేది ఒక తీవ్రమైన సమస్యగా చూస్తున్నాం మన రాష్ట్రంలో. పర్యావరణ మార్పులు గురించి మాట్టాడేవాళ్లు ఒక కారణం చెప్పుతారు, కరువును ఎందుకు పట్టించుకోరూ అని అంటే - ప్రతి సంవత్సరం ఒకే రకంగా ఉండదు. వాస్తవానికి పర్యావరణ విధ్వంసం ఏదైతే జరుగుతూజఉందో, దాని పర్యవసానంగానే, బుతుపవనాలు మారడమనేది, సకాలంలో వర్షాలు రాకపోవడం,
శల?
ఒకసారి అతిగా రావడం, ఒకసారి తక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక పద్ధతి ప్రకారం తగ్గుతూ పోతూ ఉంటే గుర్తుంటుంది గాని, అట్టుండదు. అప్పుడప్పుడు వస్తూంది, అప్పుడప్పుడు రాదు కాబట్టి మర్చిపోతుంటాం. మళ్లీ మళ్లీ జ్ఞాపకం చేసుకుంటూంటాం. మనకు గత నాలుగు సంవత్సరాలు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మరిచిపోయాం. కాని ఇవాళ మళ్ళీ అందరూ అంటూ ఉన్నారు - ఏమవుతోంది, వర్షాలు లేకపోవడం, అకాల వర్షాలు రావడం ఏమిటి ఇది అని. ఇవన్నీ అట్లా ఉండనివ్వండి. వాస్తవంగా కరువు తీవ్రంగా ఉంది. నిన్న మొన్న పడ్డ వర్షాలు, పడుతున్న వర్షాలు తాగునీటికి, పశుగ్రాసానిక్రైతే ఉపయోగ పడతాయేమో గాని, ఒక పంటైతే చాలా వరకు పోయినట్టే,
హక్కుల సంఘంగా మేము వేసుకున్న ప్రశ్చ సమాజం వెయ్యాలని కోరుతున్న ప్రశ్న ఏమిటి అనంటే - తరచుగా పదేపదే అన్ని ప్రాంతాలలో కరువులొచ్చే ఈ భారతదేశంలో కరువు వచ్చినప్పుడు ఒక హక్కుగా మాకిది కావాలి, ఇది జరగాలి, ఇది చెయ్యాలి అని అడిగే పరిస్థితి ఎందుకు లేదు? ఎందుకు ప్రభుత్వాలు, ఎందుకు బ్యాంకులు రుణమాఫీ పథకాలు ప్రకటించలేదింకా? ప్రకటించండి. విత్తనాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఆలస్యంగా పడినటువంటి వర్షాలకు తగినటువంటి విత్తనాలు ఇంకా మాకు ఎందుకు సరఫరా చెయ్యడం లేదు? చెయ్యండి. అన్నీ కూడా ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాలు, ప్రభుత్వం యొక్క విచక్షణ, ప్రభుత్వం యొక్క నిర్ణయాలు, పాలసీలు వాటిపై ఎందుకు ఆధారపడాలి? ఒక హక్కుగా మనకు ఎందుకు లేదు?
ఇవ్వాళ డిమాండ్ చేయవలసింది - కరువంటూ వచ్చినప్పుడు కరువులో చిక్కుకున్న ప్రజానీకానికి, వారి పశువులకు, వారి కుటుంబాలకు, వారి భూములకు ఏవైతే అవసరమో, అవన్నీ కూడా, హక్కులుగా వాటిని క్రోడీకరించడం జరగాలి. హక్కులుగా అందే విధంగా ఉండాలి. అప్పుడున్న బ్రిటిష్ కాలంలో ఓ కరువు మాన్యువల్ ఉండేదట. అవన్నీ కూడా ప్రభుత్వాలు వీలైతే అమలు చేస్తాయి లేకపోతే లేదు అనే వద్భతిలో ఉంటాయి. అట్టాగాకుండా ఒక చట్టవరమైనటువంటి, కరువు సంబంధమయిన హక్కుల క్రోడీకరణ జరగాలి. అ హక్కుల క్రోడీకరణ అనేది శాసనరూపం తీసుకోవాలి. అది తప్పనిసరిగా అమలు కావాలి. అమలు కాకపోతే కోర్టుకు పాయో, కొట్టాడో - చట్టమంటూ ఉంటే దాన్ని అతిక్రమించిన అధికారిని శిక్షించేటటువంటి ఒక క్రిమినల్ ప్రావిజన్ కూడా దానిలో తప్పనిసరిగా ఉండాలి. (కోడీకరించబడ్డ ఆ కరువు చట్టానికి సంబంధించినటువంటి అంశాలు అమలు
శర్లో క చాగోవాల్ ఉవ్న్యాసాల .
చేయకపోతే ఆ కటెక్టర్నుగాని, ఆ తహళశీల్దారును గాని జైలుకు పంపేటటువంటి చట్టముండాలి అనే డిమాండ్ బలంగా ముందుకు రావలసిన అవసరం ఉంది. దానిలో ఏఏ అంశాలు ఉండాలి అనేది ఒకే రకంగా ఉండదు - ఎందుకంటే అది ప్రాంతాలవారీగా ఉంటుంది.
కొన్ని ప్రాంతాలలో ఒకరకమైన దానికి ఎక్కువ అవసరముంటుంది. కొన్ని ప్రాంతాలలో ఇంకొకటి అంతకంటే ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్ట మనం మాట్లాడుకొని ఆ క్రోడీకరణ అనేది చేసుకోవచ్చు. ఇదొక డిమాండ్‌గా ముందుకు రావాలని మానవహక్కుల వేదిక భావిస్తోంది. ఆ తీర్మానాన్ని ప్రవేశపెడ్డాం. రేపు మా మహాసభలో చర్చగా అది అందరి ముందుకు వస్తుంది. మీ అందరి సహకారం కోరుతున్నాం. ముఖ్యంగా ఆహ్వాన నంవుంలో ఉన్నవాళ్ళు ఎక్కువ భాగం వ్యవసాయానికి సంబంధం ఉన్నవాళ్ళుగా ఈ అవేదన వ్యక్తం చేశారు కాబట్టి మా వంతుగా ఈ చర్చ పెడతాం. రెండవది తరచుగా పత్రికలలో వస్తూంది. చిదంబరంగారు హోంమంత్రి అయినప్పటినించి జార్ధండ్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్, లాల్‌గఢ్ - ఈ ప్రాంతాలలో మావోయిస్టులను బలప్రయోగంతో ఏరివేస్తాం, పాఠరామిలటరీని దించేస్తాం అని పదే పదే మాట్లాడటం.
మన గ్రేహౌండ్స్ నమూనాలో య౯కు అనుబంధంగా కోబ్రా అనే ఒక యాంటీ గెరిల్లా ఫోర్స్‌ను తయారుచేసి వాళ్ళిప్పటికే దించారు. మావోయిజం మంచిదా చెడ్డదా, మావోయిన్టుల చర్యలన్నీ మంచివా, చెడ్డవా అని రకరకాల అభి(పప్రాయాలు ఉంటాయిగాని, ఇక్కడ సమస్య అది కాదు, వాళ్ళను ఏరివేయడం అనేది. వాళ్ళ రాజకీయాల తప్పాఒప్పులతో నిమిత్తం లేకుండా మనం డిమాండ్ చేయాల్సింది ఒకటి ఉంది, వాళ్ళకు పునాది ఉంది, అక్కడ ఉండే ఆదివాసీ ప్రజానీకం మద్దతు ఉంది, ఇటువంటి పని ఆ (ప్రజానీకానికి విపరీతమైన హానిచేసేటటువంటి దవుతుంది. అటువంటి పని ప్రభుత్వం పెట్టుకోడానికి వీలులేదు. ఆ పారామిలటరీ బలగాలను వెనక్కు తీసుకోవాలి అనే డిమాండ్ తప్పనిసరిగా రావాలి.
అలా అని మావోయిస్టుల గురించి అనకుండా ఏముండం. ఎందుకంటే వాళ్ళు కూడా - మీరు పత్రికలలో చూస్తూనేవున్నారు, వాళ్ళ వ్యాఖ్యలు, వాళ్ళు ఇస్తున్న ఇంటర్వ్యూలు, తొడగొట్టి సవాలు చేసే పద్ధతి, రారా చూసుకొందాం అని మామూలుగా బజారులో మాట్లాడు కుంటారే ఆ రకమైనటువంటి భాష ఇది మరి కొంత మర్యాద పూర్వకమైన భాష అయితే కావచ్చు. కాని హాంసాత్మకతను లేకపోతే యుద్ధవాతావరణాన్ని
ర్ జ్యా ానత్షుంోే
పెంచే పద్ధతిలో వాళ్ళు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మాట్టాడు తున్నారు. ఆ మాటలు వారు మానుకోవాలి. అలాగే ప్రభుత్వం పారామిలటరీని దించుతాననే నిర్ణయాన్ని తప్పనిసరిగా వెనక్కు తీసుకోవాలి అనే డిమాండ్ పెడతాం. అది కూడా తీర్మానంగా చేస్తాము. దీనికుండేటటువంటి సమస్యలు మాకు తెలుసు. ఎందుకంటే ఒక నెల కిందట, ఢిల్లీలో కొంతమంది మా మిత్రులులాంటి మేధావులు దీనికి స్పందించి ఒక మీటింగ్ పెట్టి, ఆంధ్రప్రదేశ్‌లో కాల్పుల విరమణ గురించి, చర్చల గురించి, రాజకీయ పరిష్కారం గురించి ఒక ప్రయత్నం జరిగింది కదా, వాటి గురించి మాకు చెప్పండి అంటే, పోయి మాట్టాడటం జరిగింది. ఒక మూట అన్నాం వాళ్ళతో, ఆషామాషీగా జరగలేదు ఇక్కడ. పౌరస్పందన వేదిక వాళ్లు ఐదు సంవత్సరాలు వీళ్లను కలిసి, వాళ్లను కలిసి, మళ్లీ వీళ్లను కలిసి, మళ్ళా నాళ్లను కలిసి సంబంధిత ప్రాంతాలలో మీటింగులు పెట్టి ప్రజాభి ప్రాయాలను ఆహ్వానించి, కొన్ని దినపత్రికలు ప్రజలనుంచి స్పందన ఆహ్వానించి, ప్రజాభి ప్రాయాన్ని బలంగా రూపొందించిన తరువాతనే వీళ్లూ వాళ్లూ ఇద్దరూ కూడా సరే అని ఒప్పుకొని ఒక ఆరు నెలలపాటు కాల్పుల విరమణ చేయించగలిగారు. అంత చేసినా నిష్ఫలమైన చర్చలు జరిగాయి. మావోయిస్టుల్లో తప్పులు ఉంటే ఉండవచ్చు, కాని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆ చర్చల నుంచి వెనక్కిపోయింది. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం - పేరు చెప్పి చెప్పాలి - రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చర్చల నుంచి వెనక్కిపోవడం వల్లనే ఆ కాల్పుల విరమణ గూడా ఆగిపోయింది, చర్చలు ఆగిపోయాయి. ఇది ఆంధ్రప్రదేశ్ అనుభవం.
ఇవ్వాళ మీరు ఇదే ప్రయత్నాన్ని మధ్యభారతంలో చెయ్యదల్పుకుంటే మరింత కష్టం. ఎందుకంటే శ్రీలంకలో ఎల్.టి.టి.ఇ.ని సైనికులు అణిచివేసిన తర్వాత, ఇక రాజకీయ పరిష్కారాలు అక్కర్లేదు, ఏరివేస్తాం అనే ఒక ధీమా ఈ ప్రాంతాలలోని అన్ని ప్రభుత్వాలకు వచ్చివుంది. మన వాళ్లు అదే రకంగా ఆలోచిస్తున్నారు.
వాళ్లు కూడా, మావోయిస్టులు కూడా, రాజకీయ చర్చల వల్ల నష్టపోయాం ఆంధ్ర ప్రదేశ్‌లో కాబట్టి మాకూ వద్దని అంటున్నారు. అందుకే ఒక బలమైన ప్రయత్నం రెండువైపులా కూడా అవసరం. లేకపోతే సాధ్యం కాదు అని చెప్పటం జరిగింది. అయినప్పటికీ ఒక సిటిజన్స్ కమిటీ ఫర్ పీస్ అనేది ఏర్పడి దాంట్లో మానవ హక్కుల వేదిక భాగమయ్యింది.
ఈ ప్రయత్నం చేస్తాం మా వైపునుంచి. ఆ కార్యశక్రమాన్ని కూడా ప్రజల ముందు పెడతాం - మధ్యభారత ఆదివాసీ ప్రాంతాలలో దింపినటువంటి పారామిలిటరీని వెనక్కు 260 కాగల దవన్నాాల గ
తీసుకోవాలి, మావోయిన్సులు కూడా సంయమనం పాటిస్తూ ఈ ప్రయత్నానికి సహకరించాలనే డిమాండ్‌తో.
ఈ రెండూ కూడా రేపు ముఖ్యమైన అనేక ఇతర తీర్మానాలతో పాటు ఉంటాయి. వాటితో మళ్లీ మీ ముందుకు వస్తాం.
ఈ 11 సంవత్సరాలుగా మానవ హక్కుల వేదిక నిర్వహిన్తున్నటువంటి కార్యక్రమాలు చాలామందికి న్పష్టంగా అర్ధమై ఉంటాయి. ఒకనాడు పోలీను అత్యాచారాలు, చిత్రహింనలు, ఎన్కౌంటర్లు వాటితో మొదలయి, క్రమంగా విస్తరించుకుంటూ వస్తూ ఈ స్థాయిని అందుకొంది. ఆచరణలో ఆ వైశాల్యాన్ని కూడా అందుకోవాలంటే సమయం పడుతుంది. చాలా శ్రమ పడుతుంది.
ఆ శ్రమ దిశగా ఆ సమయాన్ని మాకు మేము కల్పించుకుంటూ, మీనుంచి కోరుతూ, మరింత ఎక్కువమంది ముందుకొచ్చి తమ సమయాన్ని మా సమయానికి జోడిస్తే ఎక్కువ సమయం అందరికీ లభ్యమవుతుంది అన్న ఆశని కూడా, ఆ కోరికను కూడ వ్యక్తం చేస్తూ ఈ సంస్థ ముందుకుపోతుంది. దీనికి ఇక్కడున్న మా మిత్రులు ఇచ్చిన సహాయ సహకారాలకు ధన్యవాదములు తెలియజేస్తూ, మా కార్యకర్తలందరితో కలిసి రేపు మళ్లి ఇక్కడ మహాసభలో కూర్చొని చర్చించుకొని ఇంకింత ఎక్కువమందిని కలుపుకొని మరింత బలంగా ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక నేను సెలవు తీసుకుంటాను.
౮౪౮౪౯౨ (చూనవవాక్కుల వేదిక మూడవ రాష్ర్రమవానభలు - అనంతవురం, 2-10-2009) చై. కాం నత్తం
ఉద్యమ సొహిత్యాభిమానులకి విజ్ఞప్తి ర
పౌరహక్కుల, మానవ హక్కుల ఉద్యమానికి 'సైద్ధాంతి కంగానూ, అచరణాత్మకంగానూ రాబోయే తరాలు సైతం గుర్తుంచుకొనేంత కృషి బాలగోపాల్ చేశారు. ఆయన ఆలోచనలని చర్చించడానికి, స్ఫూర్తిని కొనసాగించడానికి, మానవ సమాజ మార్చులో ఆయన జ్ఞాపకం సమిష్టి జ్ఞాపకంగా ఎదగాలనే ఆకాంక్షతో పర్ స్పెక్టివ్స్ సంస్థ కాకతీయ విశ్వవిద్యాలయాన్ని 'బాలగోపాల్ స్మారకోప న్యాసం'ని ప్రతి ఏటా అక్టోబర్ 8న నిర్వహించాల్సిందిగా కోరింది. నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడ్డ మేధావులచే, ఉద్యమ నాయకులచే ఈ ఉపన్యాసాలుంటాయి. ఈ కార్యక్రమ నిర్వహణకు కావలసిన వనరులను పర్ స్పె కి వ్ విశ్వ విద్యాలయానికి సమకూర్చింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన కాకతీయ యూనివర్సిటీకి మా అభినందనలు. ఈ కార్యక్రమం (వ్రతి ఏటా విజయవంతం అయ్యేందుకు సహకరించాల్సిందిగా సమాజంలోని ప్రజాస్వామిక శర్తులందరిక్త విజ్ఞప్తి చేస్తున్నాం.
పర్ స్పెక్టి వ్వ్ ని నిర్వహించే అయిదు మందిలో బాలగోపాల్ ఒకరు. ఆయన మార్క్సిస్టు - లెనినిస్టు ఉద్యమాలపై, దళిత ఉద్యమాలపై వివిధ పత్రికలలో రాసిన వ్యాసాలను తెలుగులో రెండు నంపుటాలుగా తెస్తున్నాం. ఈ సంవత్సరంలోనే బాలగోపాల్ ఉపన్యాసాల్గోంచి కొన్నిటిని ఒక సంకలనంగా తెస్తున్నాం. ఉద్యమ, సాహిత్యాభిమానులందరూ తమ తోడ్పాటును అందివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎల గయటారూ (జి. హరగోపాల్)
ప అన్ ప? ప శీర్ ॥ గలం పరో గ్ న. ॥| కం! న లం న / 1 క్ న నలం గ, గ అం లే స (గ్ క 1, | శ డ్ మా | వం వ 0 ల “ న న ప 4 న వగ?! శ (1 సతి స శ 1 1 గీ మ స గ స కీ. 2. 17 ల దం శ గ్గ [. 1 న్న క్ నన్ ఖే న? రా మ న. ల్ు సస జ. న [/ గ ధాన గ ప్ హన న వై ర పళ 'బ్లీట ఎ ళం / లో //. || | ర్? గ న వ్ పు నీక గె 4 లం క్ స వ. క న "ల తీ మ. నా, న్ న! ? యా గ ప సం! గ. వ. ఓ న్య ల య. ల! న! లో సో స రర లే న! క. 1] స్ య చ న ర్ ను ర్ గ య. హో గ గ్ న మ శే, న వ్?! ఫే పా సగ! న టం. వ. స చ్ 2 వ. న |. 1 స వైర + న 2! య. తా వ 11. ర్ ప 1! న 2 నో హ్హా న . 1. మ చ య. సట భ్ స న! గ మ 1 నో న. 1 (2౧౮ మ. (1 న? న. రగా న. వ. అక్ర వ 1 ఫ్ (స చ్ ఉల సే? న! ఫ్ తే టల! న్ ఇం” | స ల్ త్త క ససర్న 0. తను జు 1 కీ! ఓ గ్ న. 1] 11 || (. గ య డు వం న, [ూ ప. ప్త మ. స! ట్ వం. ఎ. ల ॥ పొ న సన న! టం! ఎఖ. వ. న |? [7 2. లై నం మ. టా (4 స స్ట న. గన 11 గన్ స, భరో? సీ స | మ. 1 న ల 1 ప్ మా 4ో / ర్ షో న్ా గ్! న న్ న. ప జీత శ వ 1 క! (15 (2 (న న నం సగ! సు ॥/ ణు గ్ 1 11... 1117 న. మ. , యు /. న. స క్ నా టి ఆ న ప క్; ప ను 07] మా స న |. గ? | న ట్ర . వ. ఆ [| న్. ఖ్ న న. / పటన ఇ స ర. స | మ ||. (న ల్ షు [2 2 71 న్ స్టా (2 న. వ ఇద్దరు కొ + / ] వ ॥ మ] వో న్ లే ర్దూనిస్ట్ ట్ రస 1/1 14 వ. 11 స? లీ! మ న్న న
1988 నుంచి 2010 పర్ స్పెక్టి వ్ ప్రచురణలు వై! జ శ. ౧౦౦1౧09 1౧) 18 ౯014002! కంంగ0గ/౫/ 0 ని్ర'3గజం 0129399 2౧6 0౦౧16౩ - 6 గ. 8621290021 గీడు 1988 66. 6. 1121200041 ఐ 2, సహచరులు - జూలై 1989 వరవరరావు ఇ 3. పతంజలి భాష్యం - జూలై 1989 కె.ఎన్వై. పతంజలి ౩ 4. సృజన సంపాదకీయాలు జనవరి 1990 వరవరరావు/సాహితీ మిత్రులు ౫ 5. అభివృద్ధి వెలుగునీడలు మే 1990 ఆర్,ఎస్.రావు
-
- కఠోర షడ్డమాలు - తొలి ముద్రణ 1990 వసంత కన్నబిరాన్ మలి ముద్రణ 1996 ౫ 7. మతవర్గ తత్వం - ఫిబ్రవరి 1991 ఎడిటర్స్ : హరి, జ. హరగోపాల్ ౩ 8. ఇలా మిగిలేం - తాలి ముద్రణ 1991 చలసాని ప్రసాదరావు మలి ముద్రణ 1993 = 9. పఫరాధీన భారతం తొలి ముద్రణ 1992 ఎ.బికె. ప్రసాద్ మలి ముద్రణ 1393
-
- డంకెల్ దుశ్ళాసనం జూన్ 19393 నూర్ భాషా ౩ 11. దినదినగండం సెప్టెంబర్ 1993 అనువాదం : కోదండ రామిరెడ్డి = 12, మన చలం - మే 1394 ఎడిటర్ : కృష్ణాబాయి స 13. 1042603 ౮౧౮౭౨2౧61౧0 0/ ౧.౨. ౧౬౦
- 646441 అ౭౧ 19985 6౬6. 0. ౭౧491౧౧0౧4 గింరర౫/ 56౧] 00101121 9001698/ ౩ 14. ఏడోసారా కథ జూలై 1995 బుర్ర రాములు ౪ 15. శాక్కొ - వాంజెట్టి నవంబర్ 1995 బి, చంద్రశేఖర్ ౫ 16. బంగారమ్మ కథ జనవరి 1896 అనువాదం - కృష్ణాబాయి ఖ 17. కార్టూన్ కబుర్లు - సెప్టెంబరు 1396 మోహన్
- నాకో పిస్తోత్ కావాలి - అక్టోబర్ 1996 అనువాదం :చలసాని ప్రసాదరావు
- సాహిత్యంలో వస్తు శిల్పాలు మార్చ్ 1997 త్రిపురనేని మధుసూదనరావు
- 20, కల్లోల కథా చిత్రాలు డిసెంబర్ 1997 క. బాలగోపాల్ ఎడిటర్ : చలసాని ప్రసాద్ ౩ 21, ఆంధ్రప్రదేశ్ అర్థిక సంస్కరణలు మార్చ్ 1998 ఎడిటర్ : డి, నరసింహారెడ్డి
- ప్రపంచబ్యాంక్ ఎజెండా
౩ 22, మూడు దశాబ్దాల తొలి ముద్రణ ఎడిటర్స్ : నక్సల్పరీ గమ్యుం-గమనం ఆగస్ట్ 98 ఎస్. సుధాకర్, ఎం.కోదండరామిరెడ్డి మలి ముద్రణ అక్టోబర్ 98 = 23. పరాధీన భారతంలో డిసెంబర్ 98 ఎ.బికి. ప్రసాద్ దారితప్పిన రూపాయి = 24. శారద నవలలు ఆగస్ట్ 99 శారద (ఎస్. నటరాజన్) (ఏది సత్యం, మంచీ-చెడు, అపస్వరాలు)
-
- సింగరేణి నవంబర్ 2000 ఎం.డి. మునీర్ ఎం.డి. అన్వర్
-
- ఖాదర్ లేడు మే 2001 మహమ్మద్ ఖదీర్ బాబు
- ప్రమాదంలో ప్రజారోగ్యం ఫిబ్రవరి 2002 డా॥ ఎస్. తిరుపతయ్య డౌ॥ పి. జగదీశ్వర్ 7 28. ఎన్జీవోల కథ జనవరి 2003 బి. చంద్రశేఖర్
- జాగే రహో జూన్ 2003 చలసాని ప్రసాదరావు ఎడిటర్ : డి. వెంకట్రామయ్య
- ఉదయగీతిక డిసెంబర్ 2003 రచన - యాంగ్ మో (రెండవ కూర్పు తొలిముద్రణ) అనువాదం :; ఎన్. వేణుగోపాల్ శా 31. వరల్డ్ సోషల్ ఫోరం జనవరి 2004 2౮౧౬ (4౮స8%) ఆర్థిక రాజకీయాలు అనువాదం : బి. చంద్రశేఖర్
- ఎర్రమందారాల్సు మే 2005 రచన-లోకువాంగ్-పిన్ (రెండవ కూర్చు యాంగ్ యీ-యెన్ తాలి ముద్రణ) ॥ అనువాదం :; డొ॥ టి.నళిని ౩ 33. నూరేళ్ళు తెలుగు ఆగస్ట్ 2007 సహవాసి నవల (1878-1977) సంపాదకుడు :డి. వెంకట్రామయ్య
- అల్లంరాజయ్య జనవరి 2008 అల్లం రాజయ్య సాహిత్యం -1 సంపాదకులు-వరవరరావు మూడు నవలలు.
- విభిన్న ఆగష్టు 2008 హరిపురుషోత్తమరావు
- పతంజలి భాష్యం మార్చ్ 2008 కె.ఎన్.వై. పతంజలి ౩7. మృగన ఏప్రిల్ 2009 విమల
- రాజ్యం - సంక్షేమం అక్టోబర్ 2015 కె. బాలగోపాల్ = | ౧6౭/506011౪639 . * 500/8/ 0/0౧063 / ౬0౧2049 వ య ఇం టో గ01 నా సం వ్! 01 ణ్ గ 2060110280 గాశమన! ౯
న చం రం ఫ్ య నై స (4004 శ 004029 శలిళ్లూ మావా అ కం00్తోగ చూ,
౨౯2౯8 క '4/జ218 సంక్షేమ రాజ్యమనేది ఏదో ఒక వర్గరాజ్యం, వర్గపరిపాలన, వాళ్ళు | బూటకంగా ప్రవేశపెట్టినటువంటి ఒక మేలిముసుగు అంటే ఏం " ప్రయోజనం లేదు. అదొక నాగరికతా విలువగా, ప్రపంచ ॥ నాగరికతలో భాగంగా, రాజ్యానికిదండ ప్రయోగం మాత్రమే . ॥ బాధ్యతగా ఉన్న రాజ్యానికి- కాలక్రమంలో వచ్చినటువంటి కొత్త . బాధ్యతలలో భాగంగా వచ్చింది. అనేక రకాల అసమానతలతో బాధపడుతున్న మూడవ ప్రపంచదేశాలలో ఆ అసమానతలను తొలగించడం అనే ముఖ్యమైన బాధ్యతగా ఈ సంక్షేమబాధ్యత
- వచ్చింది. అదొక కాలక్రమంలో వచ్చింది. పోరాటాల ఫలితంగా వచ్చింది. ఉద్యమాల ఫలితంగా వచ్చింది. ప్రజాతంత్ర శక్తుల ఆకాంక్షల ఫలితంగా వచ్చింది. పరిపాలకులు దానిని ఎందుకోసం వాడుకున్నారు? దానిని బూటకంగా వాడుకునే ప్రయత్నం . చేశారనేది వేరే సంగతి. దానంతటదే సంక్రేమమనేది ఒక విలువ - . అది బూటకం కాదు. అది మేలిముసుగు కాదు. పరిపాలనా వ్యవస్థకు సమాజం పట్ల ఉండే బాధ్యత - రూల్ ఆఫ్ లా లాగా ఒక పాజిటివ్ విలువ. / / [ణా శ వ - లం స్త న్ ఇ); త సం! ( లి 1 = ౧8౯50 60(1౪785 . న ॥ (1 500128] 8616౧069/1220/6 తో శ న్క0150108 (0౯ 002036 * | ్ట " న 159[11-978-81-905756-5-2 | శ ( ₹ 100/-