Telugu raati chigullu - anilvaranasi/indianlanguages GitHub Wiki

" శ + గీ | | లే | ం 1 ” గ , ఇ! గ 4 న్నీ " [ 7 . ల ? / / ॥ - రాతిచిరుకు ళు ల యా. కవితా సంపుటి తి స్తన న్‌ స ష్రైసారాఅళ్తా క్షం వీ అమ్మ గ క్ట. | శెలజామిత్ర ల ం. ఎన టన రా న నానన మన న న ౧.

శైలజామిత్ర: చిత్తూరు జిల్లాలోని చిన్నగొట్టిగల్లులో జన్మించారు.

తల్లిదండ్రులు తెలికిచెర్ల అనసూయదేవి, శేషగిరిరావు. ఎం.ఏ ఇంగ్లీషు,

తెలుగు చదివారు. రచన జర్నలిజం కళాశాలలో పి.జి.డిప్లామా కోర్సు చేశారు. కర్ణాటక సంగీతంలో డిగ్రీ పట్టా పొందారు. పలు ప్రక్రియల్లో సృజనాత్మక రచనలు చేస్తున్నారు. ఆంగ్రంలోనూ రచనలు చేస్తుంటారు.

అంతేగాక తెలుగు నుంచి ఆంగ్లంలోకి, ఆంగ్లం నుంచి తెలుగులోకి

అనువాదాలు చేయడంలో మంచి ప్రావీణ్యం వుంది. కవిత, కథ, నవల,

సమీక్ష విమర్శనా ప్రక్రియలలో నిరంతర రచనా వ్యాసంగం వీరి ప్రత్యేకత.

పత్రికలకు మాత్రమే కాకుండా పలు వెబ్‌సైట్లకు రచనలు చేశారు. సాహిత్య పరమైన వ్యాసాలు మాత్రమే గాక సామాజికపరమైన, ఆధ్యాత్మికమైన

వ్యాసాలు రచించారు. “ఉషోదయ వెలుగులో 'మానవీయం' అనే అంశంపై 48 సామాజిక వ్యాసాలు రచించారు. 'భక్తిరంజని'లో 'ఆధ్యాత్మికం-జీవితం' అనే అంశంపై 54 వ్యాసాలు వచ్చాయి. భక్తిపాటలు కూడా రచించడం

వీరి ప్రత్యేకత. పెద్దల కోసమే గాక పిల్లల కోసం రచనలు చేయగల

నైపుణ్యం వుంది. 'నేలపైని నక్షత్రాలు” శీర్చికన వచ్చిన చిన్న పిల్లల నవల

ఇందుకు తార్మాణం. ఇప్పటి వరకు ఆరు కవితా సంపుటాలు నచ్చాయి.

ఇదివరలో 'తరంగాలూ అనే కథానికల సంపుటి వచ్చింది. తర్వాత రెండో కథానికల సంపుటి 'అడ్డా. వెలువడింది. పలు సాహిత్య సభల్లో పాల్గొన్నారు.

దాదాపు డజనుకు పైగా ప్రతిష్టాత్మకమైన సాహిత్య పురస్కారాలు అందుకున్నారు. కథానికలకు గాను పలు పత్రికల నుంచి బహుమతులు పొందారు. అనువాద గ్రంథాలకు మంచి గుర్తింపు లభించింది.

రాయకుండా ఉండలేనితనం లోంచి రచనలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ కవితా సంపుటితో పాఠకుల ముందుకు వచ్చారు. కవితా రచనలో ఈమె సృజనాత్మక ప్రతిభకు నిదర్శనం ఈ కవితల సంపుటి. వస్తువులో, అభివ్యక్తి సంవిధానంలో తనదైన ప్రత్యేకతను సంతరించుకున్న కవిత్వాన్ని రచించారు.

రాతిచిగుళ్ళు కనితా సంవ్రుటీ శైలజామిత్ర పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి పాక్షిక ఆర్థిక సహాయంతో ముద్రితం.

గం, శ మ్‌ ౨. తే ల జ క్ట శ. ళ్‌ రీ షష?! 60/1ఆ౮౬౬౮ ల (౧[0/0ర/0/౧౧౦6౧౩) 4 $0/ కడితంత 8114౯. (న. 67744: 981440౧1162అ91%4|.007 యో ర్‌ అ ౧౦౪ / 09౪౦6౪5880 : 1120990 1121626 ( ౯16౬061100 : ం1006॥ 2013 [౯0/000163 వ 85241212 111012 0: 98, 500)18208 8౧46 581 0010౧౫, 6౭౧౮౧! 123౬ 1/69౧2086-500 080 061: 92909 00879 గ౧౭12౧|44 8003 పో 16-11-20/6/1/1 403, ౪12౫/2921 గం9|66౧0/ 5216801 204౧ 42121061 [1/66/2026 - 500 036 న౧౦౧6: ౦040-2767 8430 ౧౭|2౧11200016(ఆ్రింగు౭॥1.000 ౧౧౧66 21 ; 0౧ 521 6౧801164 మం 1/66౧2026 ౯౧. 040-27564141 ౧|08 వ; ₹100

న జ్‌ | తు ఓ సౌజన్యమూర్తి సాహితీ ్రవంతి త్రుముతి తమిరశ జానకి గారికి అంకితం

న. పుట్టించేదే కవిత్వ సృజన

ఈనాడొస్తున్న కవితా సంపుటాలన్నింటిలో దాదాపుగా సమకాలీనమైన అంశాలు ప్రతిఫలిస్తే, వర్గభేదాలు, సాంస్కృతిక పతనం, అస్తిత్వ పోరాటం, ప్రపంచీకరణ వ్యతిరేకత, ప్రాకృతిక సౌందర్యం, మానవ సంబంధాలు ఇలా ఎన్నో విషయాలు. ఐతే, ఒక కవికి మనస్సులో అనుసూడత్రంగా, ప్రవహించే ఒక చైతన్యం ఉన్నదా లేదా అన్నది ఒక పరిశీలించదగిన అంశం. అలా అది 'అత్మద్రవ్యం' బెతుంది. ఆత్మ- అనేది ఆధ్యాత్మికత అర్ధంలో కాదు. అంతరాంతరంలో ఉండి, నిరంతరం ప్రవహించే వస్తువే ఆత్మద్రవ్యం. దీన్నె సొంత ముద్ర అనవచ్చు. ఒక కవి విభిన్న వస్తువుల మొద రాయవచ్చు కానీ అతని ఆత్మద్రవ్యాన్ని (అదంటూ ఉంటే) అంచనా వేయడం పెద్ద కష్టం కాదు. పాబ్లో నెరుడానో మరే కవియో (పేమగీతాలు రాసి ఉండవచ్చు కానీ, అలాంటి వారి ఆత్మద్రవ్యం నిస్సంశయంగా విప్లవ భావనయే బెతుంది. అలాగే విప్లవ భావన గూర్చి కొందరు ఎక్కువగా రాయవచ్చు. వారి ఆత్మద్రవ్యం అనుభూతి కావచ్చు.

ఈ రోజుల్లో కవుల్లో చాలా మంది సామాజిక వస్తువునే రాస్తున్నారు. అస్తిత్వ వేదనను తీవ్రంగా, విసృతంగా చెప్పేవారు తక్కువ. అస్తిత్వ వేదన రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సామాజిక పరిస్థితుల వల్ల కలిగింది. రెండోది తనలోకి తాను చూసుకోవడం వలన కలిగింది. ఈ రెండోదానికి కూడా సమాజం కారణం కావచ్చు లేదా తనలోని (ప్రేరణలకు గూర్చిన ఆలోచనలు కావచ్చు. అంతరంగ దర్శనం ద్వారా వచ్చే అవేదన ప్రవాహరూపంగా రాసే కవులు ఈనాడు చాలా తక్కువగా ఉన్నారు. వారిలో ఆవేదనను కేవలం ఆలోచన, అవగాహన రూపాల్లోనే కాకుండా కవితాత్మకంగా చెప్పే కవయిటత్రి శైలజామిత్ర. ఆమె, సామాజికంగా ఆవేదన ప్రకటించినా తనలోకి తాను మధనపడే ధోరణి ఎక్కువ సమాజ వైరుధ్యాల్ని గూర్చి చెబుతున్నా వైయక్తిక వేదనతో కలగలిపి చెప్పడం శ్రైలజామిత్రలో ఎక్కువగా చూడగలం. అలాగే తాత్విక చింతనతో కూడిన ముగింపు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఉదాహరణకు 'గుండె పగిలిన దృశ్యం' అనే కవితలో ముందుగా కొన్ని సామాజిక దృశ్యాలు

శైలజామిత్ర ష 7

“ఆకలికేకల్ని మంచినీళ్ళలో బంధించి మసక వెలుతురులో నిలబడ్డ బిక్షువు బేలచూపులు హింసను తెల్లపావురం రెక్కల కింద దాచి కొత్తనోట్ల తళతళల మధ్య ఎటూ తేల్చుకోలేని మందహాసపు మధ్యతరగతి నిదాశాదృక్కులు...” ఇలా చెప్పి ఇంకా దృశ్యాల్ని వర్డిస్తూ ఒక మలుపు ఇలా సాగుతుంది “న్రేన్సు ఉంటున్న ఇల్లూ, నేను నివసించే గదీ చుట్టూ కృత్రిమబంధాలు మాటళల్లో మంచుముద్దలూ, మనసుల్లో బొగ్గముజ్కిలూ కళ్ళల్లో అంగారక కణాలతో పూల మొక్కలను వెదుక్కుంటూ ఈ ఒంటరిపోరాటం సూర్యోదయం నుండి అస్తమయం వరకు నా మనసు ఒక కోలాహలం జంతవు, పిట్ట , పువ్వు దేని ప్రత్యేకత దానిదే. జీవన విధాన గమనంలో ఎవరి వృత్తి వారిదే ఇలా వైయక్తికత, తాత్వికత- కలిసిపోయి ఏ వస్తువును గూర్చి చెబుతున్నా కొనసాగుతూ ఉంటాయి. అస్తిత్వ వేదనకు సంబంధించిన కవితల్లో తప్పని సరిగా కొంత ప్రత్యేక సామగ్రి ఉంటుంది. ఒంటరితనం, మౌనం, కాలం, సృష్టి అన్వేషణ, మనసు, ఢేమ కోసం ఆవేదన, కలలు, కన్నీరు, మృత్యువు, జీవన తాత్వికత, నైరాశ్వం, తన ఎదుట తాను నిలబడటం మొదలైనవి. ఈ సామగ్రి శైలజామిత్ర కవితల్లో గాధమైన భావ చిత్రాలతో కదిలిపోతూ ఉంటుంది. వీటిలో కొన్ని ఆవిష్కరణలు పరిశీలిద్దాం శైలజామిత్ర కవితల్లో చాలా బలంగా కనబడే భావధారల్లో ఒకటి (ప్రేమ కోసం పడే ఆవేదన. తానిచ్చిన ప్రేమను సమాజం తనకు తిరిగి ఇవ్వలేదనే వేదన మనస్సుకు తనలోపలికి తీసుకువెళ్ళి ఒంటరితనానికి మూలమౌతుంది. నేను నేనుగానే జీవించాలనే పట్టుదల ఇందువలనే కలుగుతుంది. ఈ భావాలకు రచయిత్రి ఇచ్చిన భావ చిత్రాలు అసంఖ్యాకంగా చూడవచ్చు. “ఒంటరితనం మరింత ఒంటరిగా భరించలేనంతగా బరువెక్కినపుడు 8 ₹ రాతి చిగుళ్ళు

ఆత్మీయ సహచర్యం వెంట

నా భొవాలు పరుగులు తీస్తుంటాయి

ఆకాశంలో నిత్యం పలకరిస్తున్న

నాకై వీక్షిస్తున్న ఇంద్ర ధనుసు రంగుల మధ్య

పగిలిన నా గుండె ముక్కల్ని ఏరుకుంటూ ఉంటాను”

తనను పలకరించేది సమిపంలో ఉన్నవారు కాదు. నిత్యం పలకరించేది ఇంద్రధనుస్సు అంటే వాస్తవ జీవితాన్ని తప్పించుకోవడానికి స్వప్పలోకంలో విహరించడమే. తన గుండె ముక్కలు ఆ స్వప్న వర్జాల్లోకే చెదిరిపోయినై. అలాగే...

ప్రతి అంగుళం అంగుళం గాలించినా దొరకని

అమాయకత్వాన్ని పక్షుల కిలకిలా రావాలలో

విని తరిస్తుంటాను”

అంటే లోకంలో ఎక్కడ చూసినా వంచన ఎదురౌతోంది. అందుకే పిట్టల కూతల్లో ఉపశాంతి లభిస్తోంది. ఏ విధంగానైనా తనలోకి తాను వెళ్ళడమే తనకు విశ్రాంతి. ముగింపులో..

“ఒకింత విరామచిహ్నంలో

నన్ను నేను తరచి చూసుకుంటున్నాను”

సమాజం తనను చూసినా, తాను తన మానసిక వికాసాన్ని మాత్రం భయం చేతగానీ, మరో కారణం చేత గానీ, ఆపకుండా తన సహజ ప్రేరణతో పురోగమిస్తూనే ఉంటుంది. తన వ్యక్తిత్వాన్ని వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ఇంకా ఇంకా బలంగా నిర్మించుకుంటుంది. ఎక్కువగా ఈ కవయిత్రి (ప్రకృతి దృశ్యాల్ని తన భావ ప్రపంచానికి అనుగుణంగా కవితాత్మకం చేయడంలో సిద్దహస్తురాలు. “రాతిచిగుళ్ళు” కవితలో ఈ భావనలు చూడండి.

“వేట్రగ్రాడు పొంచి ఉంటాదని గూటీలోగువ్వ దాక్కోదు

ఎపుడో ఒకప్పుడు గొడ్డలి వేటు పడుతుందని

కొమ్మ ఎదగడం ఆపదు

రహస్యాలన్నీ బయటపడతాయని

సూర్యబింబం సముద్రంలో దాక్కోదు”

అందువల్ల తానెంత వైయక్తిక మనోజీవియైనా ఆశావాదం, మనోధైర్యం కోల్పోయి

శైలజామిత్ర శఊ 9

వెనకడుగు వేయదు. ఈ అంశాలను పోలికలే పై భావాలు. మనో లక్షణం ఎలాంటిదో రెండు మాటల్లో బలంగా చెప్తారు.

“తరచి చూస్తే అన్నీ సమస్యలే

సమాజం మనం ఎలా చూస్తే అలా కనబడుతుంది

మనసు కూడా అంతే!

బంధిస్తే తుపాకీ గుళ్ళు కురిపిస్తుంది

ప్రేమిస్తే పూలవర్ష్నంలో ముంచేస్తుంది”

కాబట్టి, మనస్సునే నమ్ముకున్న అస్తిత్వవాది. మనస్సును గురించిన ఎన్నో ఆలోచనలు ఈ కవితాసంపుటి నిండా కనిపిస్తె.

“'మృత్యువంటే శరీరానికి సంబంధించినది కాదు

మనసు ముక్కలయినపుడే మృత్యువు మనల్ని చేరినట్లే

“మనసును తెలుసుకోలేని మనిషి

ఎపుడూ బతికున్న శవమే”

ఎవరినీ అర్ధం చేసుకోలేని మనసు

ఎప్పటికీ ఆరని గాయమే”

తన అంతరంగ వేదన మరొకరికి తెలిపే అవకాశం లేదనడానికి చెప్పిన పోలికలు గమనింపదగినవి

“చీకటిలో తగిలిన గాయం

రక్తమోదుతున్నా కంటికి కనిపించదు

గుండెకు తగిలిన విఘాతం

ఎంత పెద్దదైనా మరో గుండెకు తెలియదు”

తనలోని నిరాశను, నిస్పృహను జయించడానికి తన తండ్రిని తలచుకుని ప్రేరణ పొందిన అంశం “ఇప్పుడిప్పుడే అర్ధం అవుతున్నావు” తండ్రి గురించి వచ్చిన కవితల్లో అందులోనూ ఒక స్త్రీ రాసిన వాటిలో ఈ కవిత విశిష్టంగా నిలబడుతుంది. ఈ కింది భావచిత్ర గాఢత ప్రశంసనీయం

“నా గుండెలో నిన్నటి వరకు

నా కోసమే నేనున్నానని అనుకున్నాను

బతుకు సాయంత్రపు గూటిలో 10 ఛీ రాతి చిగుళ్ళు

కొడిగట్టే దీపం తాలూకు నుసిని గుర్తించి

ఈ నుసి గతంలో వెలిగిన దీపం తాలూకేనని

ఇపుడిప్పుడే నాకు అర్ధమవుతున్నావు”

తన బతుకు, సగానికి పైగా గడిచిన తర్వాత గూటిలోదీపం కొడిగడుతోంది. వెలుగును కోల్పోయి అంటే జీవితంలో నిరాశా నిస్పృహల చేత మనస్సు తేజస్సును పోగొట్టుకుంది. నుసి రాల్తోంది కానీ ఈ నుసి గతంలో వెలిగిన దీపం తాలూకని ఇప్పుడర్ధమయింది నాన్న బాగా అర్ధమైన దశలో మాత్రమే ఈ విషయం తెలిసింది. అంటే తనలోని ఆ దీపం నాన్న వెలిగించిందే. దీని వెలుగును తాను నిలుపుకోలేకపోయింది. ఇపుడైనా అర్ధం చేసుకుని నిరాశ నుండి ఆశావాదానికి, నిస్స్రహనుండి చైతన్య స్పృహలోనికి, నుసి దశ నుండి మళ్లీ దీపం వెలుగును నిలుపుకునే దశకి ప్రయాణం చెయ్యగలుగుతోంది. అందుకే ఇలా అంటుంది.

“ఆశల పందిరికి చిల్లులు పడినా

ఆశయాల వైపే నడవాలనీ

నా ఆకలిని మరొకరికి అవకాశంగా ఇవ్వకూదదనీ

సగానికి పైగా జీవితం గడిచాక

ఇపుడిపుడే నాకు అర్ధం అవుతున్నావు!'

ఇలాటి ప్రభావాన్ని గూర్చి చెప్పిన ఈ కవిత హృదయానికి హత్తుకుంటుంది.

సమకాలీన మాతృత్వం దీనదశలో నెట్టబడటం కూడా ఈ నాటి కొత్త వస్తువే. “మాతృత్వం మృగ్యమౌతోందా” అనే కవితలో తల్లి మనసును గూర్చి భావచిత్ర మాలికలో ఈ కవయిట్రి ఇలా చెప్తంది.

“గడ్రప బయట కన్నీళ్ళతో ఉన్నా

ముగ్గులా అందాన్నిస్తోంది

ఇక్కడ ముగ్గు స్వచ్చతకీ, ఆరోగ్యాన్నివ్వడానికీ, సౌందర్యానికీ సంకేతం. తల్లిని అమానుషంగా గడపబయటకు తోసేసినా, ఆమె బిద్దల ఆరోగ్యాన్ని మాత్రమే కోరే స్వచ్చతా సౌందర్యమూర్తి. అటువంటి మాతృత్వాన్ని ఈనాడు అన్ని అవమానాలకు గురి చేయడం కవయిత్రిలో ఆవేదన కలిగిస్తున్నది.

“అమ్మ (ప్రేమకు అణువంత ఆశ్రయం లేకపోవడం

ఎంతటి హాస్యాస్పదం?”

శైలజామీత్ర కవిత్వం భావ చిత్ర సంభరితం ఆ భావ చిత్రాలు గాఢంగా భావాన్ని

శైలజుమిత్ర ఛ 11

బాగా ధ్వనింపజేసే శక్తిని నింపుకుని ఉంటై. ఒక్కొక్క చోట భావచిత్ర మాలికలు కూడా అలవోకగా అల్లుకుంటై. మాలికగా ఉన్నపుడు క్రమంగా దృశ్యాల్లోని గాఢత ఒకదానికంటే ఒకదానిలో నిచ్చెన పైకెక్కి నట్లుండాలి. అలాగే ఈ కవయిత్రి రాయడం ప్రశంసనీయం. ఉదొహరణకి

“త్యాగం తెలిసిన మేఘం

కోరకుందడానే కన్నీళ్లు తుడుస్తుంది

కాంతినివ్వడం మాత్రం తెలిసిన దీపం

ఎదురుగా ఎవరున్నా వెలుగుతుంది

ప్రవహించడంలో ఆనందం చూపుతున్న నీరు

నేలపై ఉన్న మట్టికణాలను కూడా తీసుకుపోతుంది

దూరంగా ఉండటమే తెలిసిన అనురాగం

మనసును సూదీర తీరాల్లోకి పయనింపజేస్తుంది

అందనంత ఎత్తులో ఉందే ఆలోచన

ఎవరూ అందుకోలేనంతగా ఎగిరిపోతుంది!”

అన్న భావచిత్రాలు నిస్వార్థం, త్యాగాన్ని గురించినవే! ఒక దాని తర్వాత మరొకటి చదువుతుంటే క్రమంగా మనసు ఊర్వచలన వేగం సాధిస్తుంది. ఇలా రెండో మూడో నాలుగో దృశాల మాలికలు శైలజామిత్రలో ప్రత్యేకతగా గమనించ గలం!

ఒక భావచిత్రాన్ని, భావచిత్రంగానే కాకుండా ఇతర కోజూల్లో అర్ధం విస్తృతమయ్యే విధంగా రాయడం కూడా శైలజామిత్రలో గమనించగలం. “గుండెపగిలిన దృశ్యం” కవిత సామాజికమైన అనేక వేదనలను చిత్రిస్తుంది. అందులోని ఒక భావచిత్రం

“పూలు ఏంత సున్నితమైనా

ఆరుబయట నిద్రించాల్సిందే”

చెట్లు ఆరుబయటనే ఉంటై. వాటి పూలుకూడా అంతే! పూలు సున్నితం కదా అని చెట్టుని వదిలి లోపలి నిద్రపోయి మళ్లీ బయటకు వెళ్ళలేవు. ఈ వ్యవస్థలో బలహీనుడైనా రక్షిత ప్రదేశంలో ఉండలేడు. బయటకు రండి ఆపదల పాలు కావలసిందే లేదా పోరాద్డానికి సిద్దం కావాల్సిందే , పూలుగానీ, మొదలైన వాటితో పోరాడి నిలిచినట్లు. ఇదే బాట పక్క నిద్రించే అనాధలకూ అన్వయిస్తుంది. పూలు ్రీలకు ప్రతీకగా తీసుకుంటే ప్రీ కూడా బయటకి వస్తే ఆపదలకో, పోరాటానికో సిద్ధం కావలసిందే. ఇలాంటి అర్ధచ్భాయలున్న భావచిత్రాలు ఈ కవయిత్రిలో అధికం. భావచిత్ర భరితంగా కవిత్వం రాస్తున్న కొద్దిమంది 12 ఛీ రాతి చిగుళ్ళు

కవయిక్రుల్లో శైలజామిత్ర ఒకరు. ఆత్నాళయ వేదన శైలజామిత్ర ఆత్మద్రవ్యమే అయినా సామాజిక చైతన్యం కూడా బలంగానే ఉంటుంది. 'నేను నేనుగానే' అనే కవితలో స్త్రీ అస్తిత్వ బలాన్ని ఇలా చెప్తుందీ కవయిథ్రి “సాఫ్ట్‌వేర్‌ భార్యగా ప్రింటింగ్‌ మిషీన్‌ అయ్యేకన్నా హార్డ్‌వేర్‌ గుండెతో బతికే విధానాన్నే ఎంచుకున్నాను నిందల్ని మోస్తూ నివురుగప్పిన నిప్పులా బతికేకన్నా మండుతున్న కాగదానై ఆఅ వెలుతురులోనే జీవించాలనుకుంటున్నాను” ఆత్మాశ్రయ అస్తిత్వ వేదన, సామాజిక అస్తిత్వ సంవేదన, నమ్మిళితంగా కొనసాగుతూ, అభివ్యక్తిలో సాంద్రమైన భావచిత్ర రచనకూ, శైలిలో సౌందర్యవంతమైన లయకూ ప్రాధాన్యమిచ్చే శైలజామిత్ర 'రాతి చిగుళ్ళు మంచి స్థాయి కల కవిత్వంతో నిండి ఉంది. ఏది చెప్పినా, వచనత్వాన్ని వదిలి కవితాత్మకంగా చెప్పాలనే ప్రయత్నం అభినందనీయం.

  • దా॥ అద్దేపల్లి రామ్మోహనరావు శైలజామిత్ర ఛి 13

వివిధ పత్రికల్లో కనిపిస్తున్న యువకవయిత్రి శైలజామిత్రగారి కవితాధారను చూస్తున్నానీమధ్యే! వీరి శైలి నాకు ఎపుడూ వింతగా, విలక్షణంగా కనబడుతుంది పీరి కవితలకు పేర్లు పెట్టడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ కవితా సంపుటి పేరు “రాతిచిగుళ్ళు. రాళ్ళమధ్య చిగుళ్ళు ఉండటం చూస్తుంటాము. కానీ ఈ రాతిచిగుళ్ళు మాత్రం శైలజామిత్ర హృదయ కేదారంలో మొలిచినట్లున్నాయి కాబోలు... మట్టిగిన్నెలో మనసుపాత్ర నాలో జ్వలిస్తోంది నది ప్రీ ఏకాక్షరం కాదు బతికివున్న మరణం నా మనసు సమయం ఎవరో దొంగిలించారు తెగిపదుతున్న దేశపు రెక్కలు” లాంటి శీర్షికలు వింత గొలుపుతున్నాయి. పడవ ఎంతగా నడి సముద్రంలో ఉన్నా తీరం చేరేవరకు వేచి ఉండాల్సిందే! రాత్రి నిశ్శబ్దంతో నిద్రరాదు పగలు వెలుతురుతో ఆకలితీరదు అంగుళం అంగుళం వెదకినా దొరకని మనసురూపం.. లాంటి వాక్యాలు అనంతం, వీరి కవితల్లోని పదాలు అలవోకగా కుదిరి సర్మస్‌లో పులులు మాస్టర్‌ చెబితే వచ్చి కూర్చున్నట్లుగా వినయాన్ని ప్రదర్శిస్తాయి. కానీ కవితల్లోని పదాల మధ్య సమన్వయం 14 ఈ రాతి చిగుళ్ళు

కోసం వెదుక్కోవసిన పరిస్థితి కలుగుతుంది కొన్ని కొన్ని చోట్లలో... ఒక సంఘర్షణ లోంచి ఒక ఆందోళన లోంచి ఒక అస్తవ్యవ్యస్త స్థితిలోంచి అరిస్తే వినిపించిన పదాల్లా ఉన్నాయి సంపుటిలోని పదాలు. సంయమనం, సమతుల్యత, సమ్యక్‌ దృక్చధంతోపాటు పరిణతి చెందిన కవితలింకెన్నెన్నో.యువకవయిత్రి శైలజామిత్ర కలం నుండి ముందుముందు ఇంకా వస్తాయని ఆశిస్తూ. శుభాకాంక్షలతో...

  • కె.వి. రమణాచారి విశ్రాంత ఐ.ఏ.యస్‌ అధికారి శైలజామిత్ర ఉశ 15

[ఈక

కవిత్వం కవితత్వం నిజమే! నిత్యం నన్ను నన్నుగా నిలదీయలేని, నిన్నునిన్నుగా నిలబడనీయని సమాజంనుండి వచ్చిన ఆవేదనాక్షరాలు ఇవి. నన్ను ఎవరూ వినడంలేదే అనే ఆవేదన నుండి వచ్చిన భావాలివి. నన్ను నన్నుగా ఎవరూ చూడటంలేదనే నిరాశలోంచి వచ్చిన శైలి ఇది. ఈ “నేను మనం లోకి ఎందుకు మారడంలేదనే ఆవేశంలోంచి వచ్చిన వ్యక్తీకరణలివి. ఈ (ప్రశ్నలన్నీ నాతోనే పుట్టాయి. అవి సెరిగి వటవృక్షాలై కవితలుగా కొన్ని కన్నీళ్లతో, కొన్ని ఆవేశంతో చేతులు కట్టుకుని మొ ముందు నిలబడ్డాయి. ఎంతటి గొప్పవారైనా, పేదవారైనా, పనికొచ్చేవారైనా, పనికి రానివారైనా ఎవరైనా రాత్రయితే నిద్రపోతారు. ఉదయాన్నే నిద్రలేస్తారు కదా? కాకుంటే సమయ పాలన ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుందంతే! అది ఎందుకు గమనించుకోరనే ఆలోచనలోంచి వచ్చిన పదాలివి.. సమికరణలివి!

నాది కవిత్వం అని, నేనే కవిని అని నేను అనను. కానీ నేను కూడా కవినేమో అని అపుడపుడు అనుకుంటానంతే!. కవిత్వం రాయడానికి ఎవరో చనిపోకృ్లేదు. మరెవరో జన్మించి సాధించక్మ్లేదు. వేరెవరినో (ప్రేమించక్ళల్లేదు. ఇంకెవరినో ద్వేషించకృళ్లేదు. ఒక కిలోమిటరు దూరం నడిస్తే చాలు. కనిపించేవన్నీ కవితావస్తువులే! వేదనాశ్ళవులే! పిచ్చి వాళ్ళు, మోసగాళ్ళు, శారీరక అవిటివారు, మానసిక అవిటివారు, తెలివైనవారు, అభాగ్యులు, అనాధలు, బిచ్చగాళ్ళు, కత్తులు దూసేవారు, బాంబులువెసే వారు, ఇలా అన్నీ కవితా సమరాంగాణలే! ఏ వస్తువు తీసుకున్నా నా కలం సిరాను మరచిపోయి కన్నీటితో తడిసిపోతుంది. గుండె ఒక్కసారిగా ఆగినట్లవుతుంది. అదే కవిత్వంగా రూపు దిద్దుకుంటుంది. వేదన లేనిదే కవిత్వంలేదు. స్పందన లేనిదే సాహిత్యం రూపుదిద్దుకోదు. పసితనపు రోజుల్లో ఉపాధ్యాయుడు కనిపించే దేవుడు. అప్పట్లోని ఊహమేరకు నేనెందుకు ఉపాధ్యాయుడిలా పుట్టలేదు అనుకుంటాము. కానీ ఉపాధ్యాయుడైనా, ఎంత గొప్ప ఉద్యానవనం అయినా పెరిగిన వాతావరణం కారణం అవుతుంది. కవీ అంతే! కవిత్వమూ అంతే!! 1ేర ఛీ రాతి చిగుళ్ళు

నాలోని కవితాత్మను అద్భుతంగా స్పృశించి వాటి అంతర్గత భావాలను విశదీకరించి రచించిన ప్రఖ్యాత కవివరేణ్యులు దా॥ అద్దేపల్లి రామ్మోహనరావు గారికి, నాలోని అభివ్యక్తీకరణను అందంగా ప్రశ్నిస్తూనే అంతకంటే హృద్యంగా సమాధాన పరచిన ప్రముఖ కవులు, వక్త, డా! కె.వి.రమణాచారి గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు. ఈ నా కవిత్వాన్ని ఆదరించి ప్రచురించిన ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రప్రదేశ్‌, విపుల, నేటినిజం, మూసీ, చిత్ర, నది, చినుకు, వత్రిక, తేజోప్రభ సంపాదక వర్గానికి, బహుమతులు అందజేసిన న్యాయనిర్లేతలకు పేరు పేరునా నా కృతజ్ఞతలు. అందంగా తీర్చిదిద్ది ఈ (గ్రంధాన్ని ముద్రించి సకాలంలో అందించిన (ప్రముఖ పబ్లిషర్స్‌ పాలపిట్ట గుడిపాటి గారికి నా కృతజ్ఞతలు.

  • శైలజామిత్ర వైలజామిత్ర శ 17

కవితాక్రమం 4 విస్తరిస్తున్న హృదయపాత్రే .ంంంటయంంయంరంంరంరరంంలలం లలల 27 5 నిలదీస్తున్న నీడలు............000000020000000000000020000200000000600 04600 4002000044 మద్ర 6 విరామచిహ్నం ...........000244044002444400042044 00000642 2020202 42 ఏ04 2220602428 2880088 260040 222044000 ప 7. నిజం చెబుతున్నాను.......౨౦౦౦౦౦౦వ0000000టరంమరవం రంల ంం ఆఆ 33 8 నేను నా ప్రపంచం... ౦000ల వవలంవవలం0000000000000000002 టైద్‌ 9 నన్ను నన్నుగా ........40400000000000000000 00000000ళ5006 వరరవరక వరలలక 00060 5000002000042. పైగ 10 మట్టి మనిషి.........౨లలలంలలలలలవయలలలలం. పత్తి 11 _ మాతృత్వం మృగ్యమౌతోందా?........౨౦ంంరంలలంటులంలలలలలంలంల 40 12 శజ్దంచే ప్రపంచ స్పందున.....౨౨౨౨౨౨౦౦౦౦౨౭౦౦౭౭06100620000పవవవనతననవవనరరనంవవంంవుయంం44. ఉప +3 _ ప్రార్ధనా గళంలో స్రీ... తీట 14 మట్టి గిన్నెలో మనసు పొత్ర.........౨౨౨౦౦౦౦ లలల దీది 15 ఈ గుండె ఏ కాలానిది? ...........౦౦౦౦౦లలంలటవయంవలలమలలల:00000400451 16 చిరిగిపోతున్న చివరిపేజీ ...................౨౦౦౦4400000000000000000000004244442 ర్‌ం 17 ప్రతి వృష్టికై.......................ంంంంంంంంంంంలలలలలంలలలలలమలలలల2 రక్‌ 18 గుండె పగిలిన దృశ్యం..........౨౦000000000000టలులలలఐ ద్‌8ి 19 సృష్టిరహస్యం.........టంరంయలరలంలయలరరలలమలులలంలలయలం 62 20 గతించిన గతం... ..............౦౦టలంంరలలతలలరవలంలంల 6డీ 21 తప్పదు...! మనం మళ్ళీ జన్మించాలి... 67 22 అ(స్రుంత జీవితం మధ్య భూగోళం... ..౨౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౭౭ ల 69 23 _పలకరిస్తున్న పరిశోధన...................ంంంలలలలరంలలరలంలలపనవతల తంల పే 24 మహానగరఫు నీడలలో.......ంలరలంలరదదలరరమరరనతతలంంలలంుంలంు 73 25 తాకట్లో చంద్రబింబం ...........౦౦౦౦౦౦౦౦౦లంచలలలలంంలంరంంలలు లము 75 26 ఒకానొక బతికిన క్షణం..........౨౨౨౦42200020000000000000ట0000000000ఆంఐ 79 27 _ ప్రతిరోజు ఏదో ఒకరోజు...............లయలలయల లె! [ర ఈ రాతి చిగుళ్ళు

29 వర్ణ చిత్రాలు...ంంలలలలతంరంరలదంందంలలంంయంంమ001000000 దటి 3౦ గడచినంత వరకు... ..4424240242200420200460 25055 260665000005900605000020000224004042 దెదె 31 నిజం చెబుతున్నాను.. .......4444020242202602210422406262200266202606260044240440040042 890 32 చివరి వీడ్మోలు......ంలంటంంంరరందరలలలవనరలలటలయంంంలం 92 33 భవిష్యత్‌ దృశ్యాలు...............ంంంంంంంలంంట00000000000000000000400200444400002000- కద్‌ ౩4 బతికివున్న మరణ౦.........44040420000వ006ం వరల వరద వవవదవవడవకఏ60226060420244422424420022 ఈట్‌ 35 చెబితే వినరు కానీ... ..౨౨౨౨౨౦4౦4422002ష వక వడవ0వవ0 000 000ళర 00000026 06ర600000650000650002 101 36 రాతి చిగుళ్ళు... .౨౨౦లంంంలలలలలందరలదంంరంంరంరరలయలయలంలంం:00 104 37 ఉరి......౦002000000000వ0వవవనంవరవదంవయరర0ననరవం వద వవం0వ00060500000000000004000000060000000002 107 38 క్యాలెండర్‌ మారిపోతోంది... ............౦౮౦౦౦౦౦40000000000000000000046 108 39 వ బొమ్మ గీసినా ...టటలంతరందలయదదవవందమలంలలంంటంంల00000004442 110 ౨౦ ఒక చోట ఉండనే ఉంది..............ంంంంంంంంంంలంందందద వదం వరదడవటదవంంంం062000020000622. 12 త్త] మనసు ఒక మారణాయుధం౦ .......4040040420602 2040200456 26000 ఇళ ఇళ ర నలలదళ రర వచ రడవటంచందంటంంంలల కే కే కే 42 నేనునేనుగానే............౨౨౨౨౦౦౦౦౦ంల020000రలం దవన వనం వలల 1116 43 మనిషి - మనసు.........4000000000600602605520600024 02 20228 2600620 00460600620 0040020424 110 44 ఓమాటా...! మేలుకో... .....౦౦౦౦౦4200002000002000000000600600006000000604404 1200 తై స్తీ ఏకాక్షరం కాదు ౨౨౦౦౦౦ ౦444440020020002000020000002020606 6000006 0000640000400004000. 122 వటి నిశ్శబ్దం వవ వ పటషటక షటష ఏడవ విటవవ ని పటన రన దవన రతన గరవల ననన నటన డన వడ రిరడ వర0 6202202 2060624006 20040222002000404042. $2ట్‌ 47 _ అక్షరం.......౨౨౨౨౨4౨4444404000000000వ6000వరరంంవ వటం వవటనవవటరడవకలవవఏ126502260055030660004064400042. 126 4౨8 నా ఉనికి ఈ ప్రపంచానికి సున్న.!...440000000000002000000000000000000400000444040440= 12టె ౨9 ఇఫుడిఫుడే నాకు అర్ధం అవుతున్నావు! ౨౦౦౦౦౦౦౦౦౦౦చటంరటంరంలలలలలల 131 50 ఇంకా మెలకువగానే ఉంది గత౦॥1...........౨౨౨౨4౦౦౦44220200200000200000000 042 1 పైత 52 జీవితం ఒకటే !!...౨౦౦౦౦౦440వటరంంకంరరరరరరరపవరవవవవంర0606002వట00000000000040= 140 53 వసంతంతో మానవత్వం..............౦౦౦౦౦ల2వవవవరరరందవలరంంంవం50066600000000+60= శతు 54 స్నిద్ధత్వంంంంంంంలంంంలంంలలచరరరంరంంలలలలలంరలంంలంంలల $ేతట్‌ 55 ఇది భారతీయ చిహ్నం.....౨౨౨౨౨౨242222442026420020020062600620202 222402 260042224662104042 శే 56 శూన్యం .000000000000000వరందదతరరందంరంవవంరరంరలం వరం 00000060065006005000000002 శే టకై శైలజామిత్ర + 19

ఒకానొక స్వప్నం

ఏదైనా ఒకటి...,

మనల్ని నిత్యం పలకరిస్తోంది అంటే

అది మనం వదిలి వచ్చిన బాల్యమే...,

మరేదైనా ఒకటి

మనల్ని ధైర్యంగా నిలదీస్తోంది అంటే

ఖచ్చితంగా మనం చేసిన పాపమే...,

ఏదో ఒకటి

ఆరాతీస్తున్నాము అంటే

అది మనకు దొరికిన విరామమే..,

మరేదో ఒకటి

ఆలోచిస్తున్నాము అంటే

తప్పించుకోడానికి మనం చేసే ప్రయత్నమే...

ఒక్కొక్క సంఘటనకు ఒక్కో ఘటనే సాక్ష్యమయితే

జ్ఞాపక చిహ్నంలా నిలిచిపోయే

జీవితం మాత్రం

ఒకానొక స్వప్నంలా మిగిలిపోతోంది.

ఆశ్చర్యం కాకపోతే

ఆకాశమంతా ఆవిరయిపోతున్నట్లు

ఏమిటో ఈ అసహనపు జల్లులు...!!!

పరుగుపరుగున వెళ్లి

పాదరసాన్ని పట్టుకోవాలని చూస్తున్నట్లు

ఎందుకీ దాగుడుమూతలు?

మనిషి మనిషికీ మధ్య ఎన్నో అంతరాలు? శైలజుమిత్ర ఛి 21

స్థాణువయ్యే పరిస్థితులు

క్షణక్షణానికి పెరుగుతున్న మృత్యుఘోషలు

ఒంటరి ఆర్తనాదాలు

గడియ గడియకూ మధ్య

కొన్నీ విలువల్ని కాలరాస్తున్న

లిప్తకాలపు తూటా చప్పుళ్ళు..., ఇలా

కదులుతున్న కలాలన్నీ

నిశ్చల నిరాశల మధ్య

అనుభవాల దోబూచులాటలే..,

నింగీనేలా మధ్య దూరమెంతున్నా

ఒకదానిపై ఒకటి ఆధారపడుతున్న

అనుబంధ ఆలంబనలే....

నిరంతర ప్రయాణ సూచికలే..., 22 ఛీ రాతి చిగుళ్ళు

అగ్ష ఇద రశ ఒర

(ప్రవవాస్తున్న క్షణాలు

భూమి తిరుగుతోంది

భూమిపై కదులుతున్న భారానికి

పగలు రాత్రీ రూపాల్లో

ప్రతి వ్యక్తీ ఒక గాజుగదిలో నివాసం

ఒకవైపు నుండి మరోవైపుకు రాళ్ల ప్రహారం

ఒక అంచునుండి మరో అంచుకు బుల్లెట్ల విహారం

తాళలేని సగటు మానవుల హాహాకారం

నిరంతర సంక్షోభం

ఏమీ ఎరగనట్లుగా మబ్బులతో ఆకాశం

మనిషి అత్యాశకు

చెదిరిన తేనెటీగల సందోహం

నిశ్శబ్ద బాటలో బూట్లశబ్దం

నిప్పులు తొక్కుతున్నట్లుగా గంతులేస్తున్నాయి

హక్కుల పోరాటంలో పదవులక్రై,

సంబంధిత స్థానాలకై

ఏది దొరికితే దాన్ని అందుకోవాలనే ఆత్రంతో

కుమ్ములాటలతో కరపత్రాలను అందిస్తూ

రానున్న రోజులన్నీ విహరిస్తున్నాయి స్వప్నంలో

ఏ మాత్రం పరిచయం లేకుందా

అందర్ని ఒకేలా పలకరిస్తోంది ఉదయం

వదలలేని బంధాలతో,

కదలలేక కదులుతున్నట్లుంది దేశం

పగిలిన లైటు అద్దాల్లాంటి పలకరింపులతో శైలజామీత్ర ఛి 23

ప్రవహిస్తోందీ క్షణం క్షణం

జీవించడానికి ఇంత అవసరం లేదు

ఆనందం పరుగులో ఏమాత్రం లేదు

అలసి సౌలసిఫోతేనే అది రాత్రి కాదు

ఆఅవేశంలోనే ఆశయసాధన లేదు

అవసరంలోనే అద్వైతం లేదు

ఇది ఒక మనో వికార స్వరూపం అంతే.., 2డీ భా రాతి చిగుళ్ళు

నాగరికత సోపాొనాలసై....

నేను నడుస్తున్నాను.

నా వెనుక నా వాళ్ళు నడుస్తున్నారు

ఈ దేశ స్వరూపం భిన్న స్వరాలతో

ఈ ప్రకృతి విభిన్న సంస్కృతులతో కదులుతున్నాయి.

కులమతాలను భుజాలపై మోస్తూ

ధనిక, పేద వరాలను వీపుపై భరిస్తూ

అత్యాశ, అసూయలను తోబుట్టువుల్లా ఆదరిస్తూ

ప్రాణం లేని రూపాయి నోట్లకై పోరాడుతూ

అలసి సొలసి దేశ దిగ్గజం

స్వాతంత్ర్యదినమంటూ వినమ్రంగా మునివేళ్ళపై నిలుస్తోంది

అందరికీ వుంటుంది ఆకాశాన్నంతా ఆక్రమించాలని...

సముద్రపు అలలతో ఆటలాడాలని

జల తరంగమై స్వేచ్భా వృక్ష ఛాయల్లో

స్వర్ణకాంతిని నింపుకుని సస్యశ్యామలయై జీవించాలని...

లక్ష్యం బాటలో పయనిస్తూ హృదయ క్షేశ్రాల్ని

సొంతం చేసుకోవాలని..., కానీ...

ఇక్కడ మనుషులు నిజంగా జీవించిలేరు

అపుడే రెక్కలొచ్చిన పక్షిపిల్లలతో పోటీపడుతున్నారు

ఆకలి కడుపులతో చీకట్లో దాక్కోవడం ఇష్టం లేక

ఆ అంధకారంలోనే వ్యాపారం చేస్తున్నారు

ఏమీ తెలియక నిలబడేది చివరకు

పొలంగట్టుపై దిక్కుతోచక శల్యంలా కర్షకుడు

వీధిచివర వెలగని దీప స్తంభంలా కార్మికుడు శైలజామిత్ర + 25

వివిధ వర్జాల, వర్ణాల మధ్య సమాజం

పూసల దండ తెగినట్లు ఎవరికి తోచిన దిక్కులో

ప్రయాణిస్తున్న ప్రజానాయకులు

చెట్టులా ఒకరు, నీడలా ఒకరు...

శిథిలావస్థలో మరొకరు వున్నా

అందరికీ ఒకటే అత్మ... అదే భారతాత్మ..,

నిన్నటి కథ... నేటి కథనం...

ఈనాడు నాగరికత సోపానాలపై

జాతిచిహ్నం త్రివర్ణపతాకం రెపరెపలాడుతున్నా

మనకంటూ మిగిలింది...

నడవలేక నడుస్తున్న స్వర్ధ్ణాంధ్రయుగం

పురాతన అవశేషాలతో రాతిగోడలు...

నాది, నీది అనుకునే మానసిక సంఘర్షణలు. 26 ఈ రాతి చిగుళ్ళు

బి అఒగ్భ విస్మరిస్తున హృదయపాత్ర నేను నా హృదయ పాత్రను విస్మరించలేను నన్ను భరిస్తున్న భరతమాత పరిష్వంగాన్ని పరిత్యజించలేను హిమశిలా డ్రేణులపై చరిస్తున్న నేను వేరెవరికోసమో బతకలేను మాసిన మనసులు తిరిగే ప్రపంచంలో నా నీడను కూడా భరించలేను మెడపై నిత్యం పడుతున్న కత్తివేటుకు భయపడి తల వంచుకుని మౌనంగా నడవలేను. ఈ ఎదారి హృదయంలో పేమ చినుకులకు చేతులు అడ్డుపెట్టగలనేమో కానీ పూర్వ స్కృతుల్ని మరచిపోలేను నా గుండెతో పాటు శరీరం కూదా అంపశయ్యపై నిదురిస్తున్నా ప్రపంచం కోసమే అని తప్పించుకోలేను జీవన పెను తుఫానుకు గాలి ఎదురొస్తున్నా..., కిరణమై నన్ను అలరిస్తున్న నేస్తాన్ని వీడలేను... నడిరోడ్డుపై తెగిన తల తాలూకు రక్తాన్ని చూస్తూ జాతీయగీతం పాడలేను కులమతాల విచ్చుకత్తుల పోరాటంలో పాల్గొంటూ మవాత్మునికి నమస్మరించలేను ఇజాల మెస్మరిజంలో మైమరచిపోతూ నా మనస్మాక్షిని తాకట్టు పెట్టలేను సంధ్యకీలా సమయం శ్శ్మశాసంలో వున్నానని శైలజామీత్ర + 2/7

నేను లేనని అనుకోలేను నేను బొమ్మలాంటి అమ్మనని తెలిసి నా బాధ్యతను విస్మరించలేను. రక్తసంబంధాలు రక్తం కళ్ళచూస్తున్నాయని రక్తానికే విలువలేదని నేననలేను. అసమతలంపై నడుస్తున్నానని శరీరాన్ని ముళ్ళ మధ్యకు నెట్టలేను అద్దంలో ముఖం మసకబారుతోందని నా ముఖాన్ని మార్చుకోలేను... గుండె నిత్యం అలసిపోతోందని వేరొకరి హృదయాన్ని కావాలనలేను ఈ మనసు ఎవ్వరికీ అర్ధం కాని సముద్ర సంరంభం జీవితంలో కరువు తప్పదు అందుకని ఆవేదన తప్పదు.., రెంటినీ కాచివడబోసిన జీవితంలో ఏదో కావాలని తపన తప్పదు..., 28 ₹ రాతి చిగుళ్ళు

ల నిలదీస్తున్న నీడలు ఖక్కసారిగా వెనక్కు చూసుకున్నాను ఏమిటో అర్ధం కాలేదు ఇపుడిపుడే లీలగా అర్ధం అవుతోంది ఎక్కడో నమ్మకం వమ్ము అయ్యిందని... మందుతున్న గుండె అరచేతిలో ఇమిడిపోతున్న వైకుంఠం ఎదురుగా ఏమి కోల్పోయానో తెలుస్తున్న శిథిలావస్థలో వుంది నా వదనం మంచితనాన్ని మంచులా దాచుకునే నా మనోభాగం వ్యక్తిత్వాన్ని ప్రతివ్యక్తిలో చూడాలనుకునే కళ్ళు..., దశాబ్దాల పాటు దుఃఖాన్ని దాచుకుంటున్న గమ్యం.., దెబ్బతిన్న పక్షిలా విల విల లాడుతూ ప్రాణం ఎందుకిలా జరుగుతోంది? ఎంతకాలమని ఇలా సాగుతుంది? శరీరమంతా బాధిస్తున్నా అసలు బాధెక్కడో తెలుసుకోలేకపోతున్నా.., ఉన్నట్లుండి సముద్రపు అలలా కదులుతోంది నా స్వప్నం ఒక్కో కెరటం నన్ను తాకుతున్న నైరాశ్యంలా వెంటాడుతూ రక్తపు రంగుకు తెలియని స్వార్థంతో జతకలుపుతోంది. ఎవరికీ అంతుచిక్కని ఈ అంతరాలు

శైలజామిత్ర శ 29

సమయానుకూలంగా వెంటవస్తున్న సాన్నిహిత్యాలు పౌర్ణమి అమావాస్యల రెప్పల్ని తాలగించుకుంటున్న దేహంలో ఇమడలేక ఏదో కోల్పోతున్నట్లుంది వెలుగుళున్నా కాంతిని కోల్పోతున్న ఈ దీపాలు తిరిగి నమ్మకం కొల్పోయాక నిలబదవన్నది నిజంగా నిజం. జీవితంలో ప్రతి పేజీ నన్ను నన్నుగా నిలదీస్తున్న నీడలు అయినా ఇవి మానవ నైజాలు తెలుసుకోలేక పోవడం నా తప్పిదం... 30 * రాతి చిగుళ్ళు

నిరామచిహ్నం

ఆవేదన అగ్నికీలల్లో

ఈ వృాదయం దహించుకుపోతున్నపుడు

అంతరంగంలో

అలజడి చేస్తున్న ఆశలరెక్క్మలు

గాలికి చప్పుడు చేస్తున్నపుడు

ఒంటరితనం

మరింత ఒంటరిగా

భరించలేనంతగా బరువెక్కినపుడు

ఆత్మీయ సాహచర్యం వెంట

నా భావాలు పరుగులు తీస్తుంటాయి

ఆకాశంలో నన్ను నిత్యం పలకరిస్తున్న

నాకై వీక్షిస్తున్న ఇంద్రధనుస్సు రంగులమధ్య

పగిలిన నాగుండె ముక్కల్ని ఏరుకుంటూ వుంటాను...

నా ఈ విశ్రాంతి లోకంలో

నాకంటూ మిగిలివున్న దిక్కులతో

పసిపిల్లనై కబుర్లు చెబుతూంటాను

అప్పుడపుడూ చేసే అనురాగపు అల్లరి స్పర్శతో

మరో నులి వెచ్చని జ్ఞాపకాన్ని కాగితాల మధ్య దాస్తుంటాను

నాకేమీ మిగల్బని ఈ ప్రపంచపు సరిహద్దుల మీద

ఒక్క రోజయినా నా వునికి ఊహా చిత్రాన్ని చిత్రిస్తుంటాను

బతుకంతా బతకనిస్తున్న ఈ కొద్దికాలాన్ని

తనివితీరా కళ్ళకద్దుకుంటాను

ప్రతి అంగుళం అంగుళం గాలించినా దొరకని నైలజామిత్ర శ 31

అమాయత్వాన్ని పక్షుల కిలాకిలా రావాలలో విని తదిస్తుంటాను రివ్వున 'ప్రాణబంధువై వచ్చి మునివేళ్ళపై నిలబడిన ఒకానొక వెలుగు పరిష్వంగంలో నా మౌనానికి అర్ధం తెలుసుకుంటున్నాను ఓంకార శబ్ద సుందరమై సుదూర తీరం నుండి వచ్చే పిలుపులలో నిరంతరం చైతన్యాన్ని ఒకింత విరామ చిహ్నంలో నన్ను నేను తరచి చూసుకుంటున్నాను..., 32 ఫీ రాతి చిగుళ్ళు

నిజం చెబుతున్నాను ... | నిజం చెబుతున్నాను ఒక్కసారి పగిలిన గుండె చిట్లిపోతూనే ఉంటుంది ... అతకదడం అతుకించడం ఒక వేషమే ! బతుకు అతుకుల బొంతయినపుడు నివసించే ఇల్లు ఒక స్మశానం ! నిద్రరాక కనురెప్పలు బరువయినపుడు పవళించే పరుపు ఒక సమాధి ! ఒక్కో బాధకు భారమెంతో కదా ! తగిలిన చోటే దెబ్బ తగులుతుంది పదే పదే ! అద్దాల మేడలన్నీ చమురులేని వత్తుల్లా ఉన్నపుడు సమయాన్ని చుట్టి అటకమీదుంచిజే మంచిదేమో |! మనసులకు మరల్ని అమర్చడం అవసరమేమో ! నడిచే కొద్దీ

శైలజామిత్ర శ 33

దూరం పెరుగుతుంది పరుగులు తీసిన కొద్దీ భారం పెరుగుతుంది బతుకు బావి ఎపుడూ ఎండదు కన్నీటితో పార్లిపోతూనే ఉంటుంది తప్పదు ఇక అందరూ సంఘర్షణల ఘర్షణలకు స్వస్తి పలకాల్సిందే ! మనో యంత్రాన్ని వాడి తీరాల్సిందే 1 చివరాఖరికి కొన్ని సమాధానాలు సంధులై సమాసాకై మనల్ని పట్టి పీడిస్తుంటాయి ఎన్నో యోజనాల దూరం ఉన్నా సరే 1 అస్తిత్వానికి మిగిలేది బూడిదే ! వృద్ధాప్యం వీధి చివర అందుకునే ప్రతి చేయి కొత్త పదాలు నేర్చుకుంటుంది సరికొత్త అర్థాలు తెలుసుకునే లోగా వీధి మలుపు తిరిగిపోతుంది 1 రెడీ ఈ రాతి చిగుళ్ళు

నేను నా ప్రపంచం |!

గొ (ప్రాణం ఉన్న

(ప్రపంచం కదా ఇది!

అందుకే నాకీ ప్రపంచమంటే

అంత (ప్రాణం!

నేను ప్రపంచాన్ని ప్రేమించాను

నాపై కప్పిన నవ్వుల శాలువాతో

అన్ని రంగుల్ని గుర్తించి మరీ

నేను నా ప్రపంచాన్ని ప్రేమించాను

అదే ఒకరోజు మనసు విప్పి

చెప్పాను కదా!

ప్రపంచం నన్నైప్పుడో ప్రేమించానంది

పైగా తనది ప్రాచీన ప్రేమ అని అంది *

అమ్మాయిగా నా బాల్యాన్ని

అమ్మగా నా బాధ్యతను ్రేమించిందట

ప్రపంచం నా కళ్ళల్లో

కొలను అయ్యింది

నేను ఆ కొలనులో కలువగా మారాను

ఎవరిని ఎవరు అల్లుకు పోయారో కానీ

నాపై ప్రపంచ (ప్రభావం,

ప్రపంచంపై నా ప్రభావం పడిపోయింది ! శైలజామిత్ర + 35

అలిగిన ప్రతిసారి నాలో ఒక ప్రపంచం కనబడుతుంది మరింతగా (మించిన ప్రతిసారి అపుడు (ప్రపంచమంతా ననై కనిపిస్తాను అందరూ అంటారు ప్రపంచానికి ఢేమంటే తెలియదని నేనంటాను ప్రేమే ఒక ప్రపంచమయితే ప్రత్యేకంగా ప్రపంచానికి తెలిపేదేముందని ? అల్లంత దూరాన ఉన్నా అజ్ఞాతంలో ఉన్నా సరే నేను నా ఆలోచనలన్నీ 'ప్రపంచంమీదే ఉంచాలి ప్రపంచం పసిపిల్లలాంటిది దరికి చేర్చుకుంటే ఒదిగిపోతుంది తరిమి కొడితే అందకుండా పారిపోతుంది ప్రాణాన్ని ప్రాణంలా (ప్రేమను అచ్చమయిన '్రేమలా చూపే ప్రపంచం ఒక వస్తువు కాదు కనిపించకుండాపోవదానికి ద్రవపదార్థం కాదు ఒలికిపోవడానికి ప్రపంచం ఒక గ్రంధం అందులో ప్రతి ఒక్కరూ ఒక గీతా సారాంశం! 36 * రాతి చిగుళ్ళు

ఎపుడో గాయపరచి

సరాసరి గుండెలోకి దూసుకుపోయిన బాణం ఇప్పటికీ జ్ఞాపకాల

ముందు వరుసలో ఉంది

మానవీయ ప్రదర్శన అక్కడే!

నా గుర్తుగా ఉండనీయండి!

గాజుచెట్లతో నిండిన మానవారణ్యంలో శరీరం ఒక వెదురుబద్దలా ఉంది అజానఇానం మనిషిని శిలగానో, చీకటిగానో మార్చితే అప్పటికప్పుడు ఆయుధంలా మారింది అనుమానపు నీడలు అక్కడే!

నా రూపాన్ని అక్కడే అక్కడే పాతెయ్యండి! మనసులో ఎప్పటికీ ఒక

మరువలేని కల!

అంతా అలంకృతమే!

పుట్టుకతో రెక్కలు మొలిచినట్లు!

మరణం మొక్కై నిలిచినట్లు!

గేటుముందు బిక్షువు నిలబడేది అక్కడే!

నా మాటగా అతనికి నీడనివ్వండి!

అడుగు అడుగుకు వాడిపోయే మస్తకం అధ్వాన్నంగా నలిగిపోయే హృదయం గతంలో మతంతో రాలేదు

జీవన్నాటకంలో ఒక పాత్రతో వచ్చింది నోట్లుకోరే ముఖ యంత్ర స్థానం అక్కడే! నన్ను నన్నుగానే బతకనీయండి!!

వైలజుమిత్ర ఉస ౨౯

మట్సి మనిషి అ ఏళ్ళతరం మోస్తున్న బండను మట్టిమనిషి ఇంతవరకు దించనేలేదు ఇదేదో శిక్ష అనుకుని కొందరు సర్మస్‌ అనుకుని కొందరు బతికేస్తున్నారు కాళ్ళు చక్రాలై, చేతులు బిక్షాపాత్రలై ఏ గమ్యానికి చేరుతారో కానీ అదో వలయం అంతే ! పంట చేతికి రాకున్నా జవాబు చెప్పాల్సింది ఆ మట్టిమనిషి మండే కుంపటి అతని గుండె 1 ఆరని గళం అతని చెమటధార |! సముద్రాన్ని మధిస్తే వచ్చే అమృతమయినా వెనువెంటనే తీయకుంటే కలిసిపోతుంది ఎంతగా చెమటోద్భి తీసినా ఉప్పు కషాయం మట్టి మనిషికి మిగులుతుంది పూతోటలో వెన్నెల కాస్తే మట్టిమనిషి అవసరంలేదు పూలకుండీకి మట్టి అవసరం! 38 ఫీ రాతి చిగుళ్ళు

కాపలాకు మట్టి మనిషి అవసరం బతుకుబండకు మిగిలేది (శ్రమే కానీ ఆశ్రమం కాదు ఇదేదో జ్ఞాపకమని పిచ్చిగీతలు గీసుకుని అద్దాల్లో దాచుకునేవారు ఉన్నారు శిల్చంగా మలచి మార్గదర్శకంగా ఎంచుకున్నవారున్నారు జారే ప్రతి చెమట బిందువు శ్రమకు చిహ్నం కాదు (ప్రతి పాదముద్ర భవితకు మార్గదర్శకం కాదు ప్రతి అరచేయి జీవితం కాదు ప్రతి నోసలు కణం మూల్యాంకనం కాదు. జీవన్నాటకంలో మట్టితో అవసరం లేదు నాటకంలో సమాజంలో ఉంది కానీ మట్టిలేదు మట్టినుండి మట్టిలోనికి చేరుకునే ఈ ప్రాణానికి విలువలేదు అంతరంగానికి మట్టి విలువ తెలిస్తేనే మట్టి మనిషి కొంతకాలమయినా జీవిస్తాడు.. మట్టి మనిషిలోనే ఉంది మనిషి మాత్రం మట్టిలో లేడు ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నిలబడటానికి వీలులేదు మట్టి మమకారంతో కూడిన తల్లి లాంటిది ! అందుకే అందర్ని సమానంగా తనలో దాచుకుంటుంది..!! జీవిత సత్యాలను బోధ చేస్తుంది..! వైలజామిత్ర ఉ 39

మాతృత్వం మృగ్యమౌతోందా? అవనిలో ఆంతర్యం వున్నట్లే అమ్మలో ఆవేదన దాగుంది కన్న కలలన్నీ కన్న తర్వాతేనని కన్నతల్లి ఆరాటం జన్మజన్మకు కలహధ్వని రాగంతో కన్నబిడ్డ కానితనం నేటి తల్లీబిడ్డల మధ్య కలిగేది పేగుబంధం కాదు గుండెను సైతం కొనుక్కునే గుణకార బంధం ఒక ఇల్లుదాటితే మరో ఇల్లు ఒక ఊరుదాటితే మరో ఊరు ఎక్కడైనా అమ్మ జన్మ గాయాల గేయమే ఎపుడైనా పలకలేని ప్రశ్నల ప్రతిబింబమే వివేకానికందని చక్రగతిలో ఎంత తీవ్రత వున్నా అమ్మ అవతారమే తప్ప ఆయుధం కాదు ఆదర్శం తప్ప అజ్ఞానం కాదు బిడ్డ వేళ్ళు తాకితే చాలు మౌనంగా రేకులు రాల్చే గులాబి లాంటి అమ్మ నేడు సముద్రమంత భయంతో దిక్కులేక రాత్రి వినిపించక కనిపించే నక్షత్రంలా వ్యర్థప్రయత్నం చేస్తున్న ఉదయంలా వుంది నిలువెత్తు అనురాగమంటూ వీథిలోకి విసిరేస్తున్నా రాయిలా నిశ్చలంగా వుంది గడపబయట కన్నీళ్ళతో వున్నా ముగ్గులా అందానిస్తోంది

జీ0 శీ రాతి చిగుళ్ళు

ఎప్పుడో తనను తాను మరచిపోయిన పలచటి నవ్వు మాత్రం పెదవుల మధ్య దాచుకుంది బిడ్డ ఒడిలోనే

చేతికందిన పూలమాల ఏదయినా

తురిమింది కూతురి జడలోనే

పిడుగుపడితకే గుండెకు చేర్చుకుంది

చినుకు పడితే గొడుగై నిలిచింది

సుఖం అంటే ఆ నవ్వే అనుకుంది

దుఃఖం అంటే తన చిరునామాగా దాచుకుంది ఆకాశం దృష్టి మేఘాలపైనే

అమ్మదృష్టి తనను నిత్య త్యజించే తన సృష్టిపైనే సృష్టి దృష్టి ఎపుడూ

తీక్షణతకు, తిరస్కారానికి మధ్య నలిగిపోతున్నా మట్టిముద్దలా కనిపించే మాతృత్వం మీదే... ఉదయ నదీ నదాల్లో దోసిట్లో తీసుకున్న నీటిలో కనబదేది సూర్యునికి బదులు ఎర్రబడిన అమ్మకళ్ళే.. కచ్చితంగా అది నీ వళ్లే...,

వినబడేది సుప్రభాతానికి బదులు అమ్మ వెక్కిళ్ళే..., అదీ నీ ఆనవాలే..,

మాతృత్వం బతికే వుంటుంది

మనుషుల్లో కాదు

మనసు మనో రీతుల్లో ..,

శిధిలాల పరంపర గాధల్తో...,

అయినా. ,

అరణ్యాలు, కొండలూ, నదులూ, వాగు

అన్నీ సమానంగా వున్న ఈ చరిత్రలో

అమ్మకు ఆకాశమంత స్టానమున్నా

అమ్మ (ప్రేమకు అణువంత ఆశ్రయం లేకపోవడం ఎంతటి హాస్యస్పదం?

ఒక్కసారిగా లేచి నిలబడి కిటికీ దగ్గర నిలుచుని ఆ ఇనప చువ్వలపై గడ్డాన్ని అనించి బద్ధకంగా

శైలజామిత్ర ళా త్వగే

బయటకు చూస్తుంటే కనబడుతున్న ఆ ఉదయం

జీవచ్చవాల నుండి వెలువదే నిట్టూర్పు సెగలా వుంది

అలసిపోయి ఒక్క నిదుర తీశానో లేదో

సర్వం మటుమాయం...,

మాతృత్వం కన్నీటి మయం.

కళ్ళు తెరచిచూస్తే... కనబడుతోంది

స్వార్ధంతో అలుముకున్న శూన్యం

మనలో ప్రతి వ్యక్తి

ఊహల గాజుగదిలో నివసిస్తూ

అవతలి వ్యక్తిని పరీక్షించడం తెలుసు.

అదే కళ్ళలోంచి చూస్తే నాకు జ్ఞాపకం వస్తుంది

వాత్సల్యంకై అలమటిస్తున్న రూపం

మాతృత్వం మాయమౌతోందా? అనే సందేహం. !! 42 శా రాతి చిగుళ్ళు

శబించే (ప్రపంచ స్పందన

[రో శగ్జించే ప్రపంచ స్పందనకై నిశ్శబ్దం ఎదురుచూస్తోంది వినిపించే సమాజ పిలుపుకై ఏకారతం కాపు కాస్తోంది పగటి సూర్యుడు నెత్తుటి మడుగులో తడిసి పడివున్నాడు రాత్రి చంద్రుడు కుట్రల కుతంత్రాలలో దాక్కున్నాడు ఎగసిపడే సముద్రుడు మృతజీవుల కళేబరాల్ని మోస్తున్నాడు అబద్దాల అలలపై అవినీతి ముళ్ళు ఆకర్షణను కలిగిస్తున్నాయి నేడు కొమ్మనుండి కొమ్మకు దూకుతూ చెట్టునుండిచెట్టుకు పరుగులు తీసే కపిగణాలదే కాలం.. నిత్యం మనసు పొరలకు వన్నెదిద్దుకుంటూ మనిషి నుండి మనిషికి మారిపోవడమే (ప్రేమతత్వం... తనువు తగలబడుతుందో మనసు రూపాంతరం చెందుతుందో మిడిసిపడే నాగరికత మాత్రం మానవత్వాన్ని కూల్చేస్తోంది. చీకటిలో తగిలిన గాయం రక్ష్తమోడుతున్నా కంటికి కనబడదు గుండెకు కలిగిన విఘాతం ఎంత పెద్దదయినా మరోగుండెకు తెలియదు సముద్రం ఎంత సంక్షోభంలో వున్నా దాని గంభీరతను కోల్పోదు గర్భశోకంతో తల్లడిల్లిపోయే తల్లిని ఓదార్చే సాహస మెవరికి వుంది? నష్టపోయిన మానవుని మనోజ్ఞ రూపాన్ని ఏ యంత్రం తయారుచేస్తుంది? అంతరించిపోతున్న మానవ సంబంధాల్ని ఏ ఆదర్శం నిలబెడుతుంది? ఆధునికత రెక్కలతో ఎగిరే కాలమపుడూ రాక్షసంగానే ఎదురవుతుంది ఇనప పాదాలతో వేసే అడుగులెపుడూ నిరంకుశత్వంతోనే ముందుకు

శైలజామిత్ర శ 43

వెళ్తాయి మాయ ఎక్కడో లేదు మనల్ని అనుసరించే మన నీడలోనే వుంది అంతా నాదనుకునే దురాశలో వుంది... భావాల పరంపరను పంచుకునే కలంలో వుంది ఒక్కో సమయం సముద్రమైతే, ఒక్కో సమయం ఎడారి అవుతుంది ఒక్కో మనసులో సాంద్రత వుంటే ఒక్కో మనిషి నిశ్చలమవుతాడు. ఆకాశం ఎవ్వరిదైనా కానీ, వర్షం మాత్రం అందరిదీ. మబ్బులు ఎంతదూరమైనా వుండనీ.., వైశాల్యమంతా ప్రతి పక్షిదీ .., ఊహలెట్లాగైనా సాగనీ... చూపులు ఎవ్వరినైనా తాకనీ సముచిత రాగాలాపన పలికితేనే జీవితానికి ఆనందం...! సూర్యునికి లేని వేడి, మేఘానికి లేని తడి, దేశానికి లేని శాంతి, దేహానికి లేని కాంతి మనల్ని ససేమిరా పలకరించదు. మనలోని అంతరాత్మను స్ఫురించదు ఉదయ కిరణాల తాకిడికి విరిసిన బంతి ముగ్ధమనోహరంగా నవ్వినా ఒక్కనాటి తన జీవితాన్ని గుర్తుచేస్తూనే వుంటుంది ఎదురైన విఘాతాల ఒత్తిడికి భరించలేక మనిషి నిద్రిస్తున్నా..., ఆ కళ్ళు కన్నీటిని మోస్తూనే వుంటాయి భూమి మన అడుగుల్ని మోయడానికే కాదు కాలం వెలుగుల్ని భరించేందుకే కాదు మనిషిలో దేవుడూ లేదు రాక్షసుడూ లేడు మనసులో మంచు వుండదు అగ్ని వుండదు దీపం హారతైతే అందం లేకుంటే బీభత్సం మనిషికి మనసుంటే అందం లేకుంటే మారణాయుధం నిశి పిడికిట్లో వెలుగు, కీర్తి పిడికిట్లో చీకటి కంటికి కనబడవు స్వార్ధం అంచులో విజయం, అసూయ ఆవరణలో అధికారం కలిసిరావు ఎవరినో చంపడానికో, చావదానికో, కావలసినంత రాబట్టడానికో పదిమందితో కలిసి పన్నే వ్యూహం అక్కరలేదు ఎపుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. త్తే రాతి చిగుళ్ళు

ఏదో కావాలని ఎందుకనిపిస్తుందో తెలియదు. అందుకే అనిపిస్తుంది మనిషి జీవితం జ్ఞాపకాల స్వర్ణ శృంఖలం సృష్టిలో ఎన్ని మార్పులు జరుగుతున్నా కాలం బంధించి మాయమవుతూనే వుంటుంది నిత్యం మనల్ని ఆలోచింపజేస్తూనే వుంటుంది. శైలజామిత్ర + 5

ప్రార్ధనా గళంతో స్త్రి....! ణి రక్షణకై ప్రీ ప్రార్ధన రగులుతున్న గుండె నుండి పెదవుల గుండా జారి కన్నీటి క్షిపణిలో చేరి గగనానికి తారయ నిలిచింది.. చందమామ దర్చం ముందు సృష్టి తానున్న చోటనే! ఇక్కడ పురాణయుగం ఆటవిక యుగం ఛాయలు లేవు ఎవరికివారు భయభయంగా శాంతి ముద్రల్ని ఏరుకుంటూ వెన్నుతట్టివచ్చే జలసేచనాన్ని అందుకుంటూ వట్టి తాటాకు చప్పుళ్ళకే తడబడ్డారు. హృదయ పతంగం ఏ బతుకు కొమ్మకో చిక్కితే పర్వాలేదు కరెంటు స్థంభానికి తగులుకుంటే మాత్రం గిలగిల లాడి చినిగి తునాతునకలై వేళ్ళాడితే అదే సిసలైన పోరాటం కదాని నిప్పంటిన ఆశలతో దగ్ధమై ఎగసే ప్రీ జననం నిత్యం అనుమాన శిఖరంపై నిలబడి మృత్యుగీతం పాడుతూనే ఉంది! శీర ₹ రాతి చిగుళ్ళు

కన్నీళ్ళతో కనులు మసకబారితే గుడ్డిదని చిక్రీకరించినపుడు గుండె చిందించిన రక్తం ఎరుపు మొగ్గలై బుగ్గల్ని తడిమింది కానీ అది సిగ్గంటే మాత్రం పంచభూతాల్ని ఆశ్చర్య చకితం చేస్తుంది స్త్రీకి దుర్దశ వ్యవస్థ లో ఏనాడు తల దించబడిందో కానీ ఎత్తేందుకు వీల్లేనంతగా భూమిలోకి పాతుకుపోయింది! ఇనప పంజరంలో బంధించబదేది ఒక్క శరీరమే కానీ మనసుకాదు ఎన్నో ప్రశ్నలనుండి నడిరాత్రి విడిపడ్డ శరీరం ఉదయపు వెలుగులో సమాధానం తెలియని కట్టెలా నిలుచుండటం హాస్యాస్పదం! లోతుగా గాయపడ్డ గుండె ఏ చిలక జోస్యానికి బయటపడదు వంటింటి సింహాసనపు సోపానాలకు పోపుగింజలు సాలభంజికలయితే ఒక్కో గాధ చిటపటల మధ్య వేగుతూనే ఉంది! ఒక్క ప్రీ విస్పోటనంతో సముద్రం ఎగసిపడుతుంది ప్రయాణ తలం దిక్కులు మార్చుకుంటుంది కొం నిశా శకలమై కదిలిపోతుంది వేటకు నిత్యం అలవాటుపడ్డ సమాజపు ఆదర్శం విశ్వం వాకిలికి తాళమై సృష్టినే శాశ్వతంగా బంధిస్తుంది! శైలజామిత్ర + 4/7

లి మట్టిగిన్నెలో మనసు పాత్ర గౌటకం పూర్తయింది నటించడం మొదలయింది పాత్రధారులు సెలవు తీసుకుంటున్నారు పాత్రలు సిద్ధమవుతున్నాయి అక్కడ ఎవరి పాత్ర ఎవరి సొంతం కాదు ఒకే చోట పుట్టి పెరిగినా ఒకరి జీవితం మరాకరికి సంబంధించినది కాదు ఘనీభవించిన మంచుకొండ కరిగి నీటి ప్రవాహమవుతుంది గట్టిదయినా గుండె ఒక్కోరోజు జూరిపడిపోతుంది సీకాకోకచిలుక రెక్కలపై ఎగురుతున్న మనసు సమాజ ముళ్ళపొదల్ని ఆసరాగా తీసుకుని శాశ్వత అనుబంధానికై ఎగబాకుతోంది ఎర్రటి ఎండలో ఎప్పుడో ఒకప్పుడు మనం నిలబడ్డప్పుడు నీడనివ్వాలని తన ఒళ్లంతా కాల్చుకుంటున్న చెట్టు త్యాగం ప్రకృతి పరిరక్షణకై పాటుపడుతోంది గంగకు అభ్యంగన స్నానం చేయించినట్లు హిమాలయాలకు ఉన్నికోట్లు కప్పినట్లు సూర్యబింబానికి గొడుగు పట్టినట్లు 48 ఈ రాతి చిగుళ్ళు

ఒక (ప్రశాంత సమయం ఒంటరి చంద్రవింబం నా గదిలోకి తొంగిచూస్తూ ఏదో రహస్యం చెబుతున్నట్లు శీతాకాలపు రాత్రి గుండెలమీద భారంగా వుంటోంది నా నిట్టూర్పు (ప్రేమ తీర్పు. కొండను పిండిచేసేది ఆయుధాలే కావచ్చు గుండెను తట్టిలేపేది అనుభూతులే కావచ్చు దారిలో వెళుతున్న దృశ్యాలన్నీ కలియచూస్తున్న వ్యక్తి ప్రయాణం ఉన్నట్లుండి ఆగిపోతోంది చేతికున్న గడియారం తనపని తాను చేసుకుంటోంది తప్పదు నిన్న కడుపులో నేడు దావానలంలో రేపు దహనంలో నేలపై ధూళికమ్మిన ఈ క్షత శరీరం మట్టిలో విలువైన అమాయకత్వం జీవిత ఖైదులో రక్తసంబంధాలు అంతస్థుల తొారతమ్యంలో ప్రజాస్వామ్యం కబ్బాల భూకంపంలో నాయకత్వం నయవంచన నయగారాలలో ఒక్కో సమయం సొనుభూతి జాడలలో ఒక్కో సమయం నిరాశా నిసృహలలో ఈ అంతరంగ విరామ క్షణాలు మనకంటూ మిగిలిన అగ్నీకణాలు సరిహద్దులలో మొలకెత్తిన ప్రతి మొక్కకు గర్వంగా గర్జించడమే తెలుసు పారే నదులకు పరవళ్లకు బదులు పరాక్రమ నృత్యమే తెలుసు అచేతనంగా పడివున్న ప్రతి రాయికి దేశాన్ని కాపాడడమే తెలుసు జాతీయ పతాక రెపరెపల్లో శాంతికి నిర్వచనమే తెలుసు క్షణాల్లో (పేలుడు శబ్దం... అరక్షణంలో ఆర్తనాదం...!! వెంట వెంటనే ప్రశాంతం..., తెరచి వుంచిన శవపేటిక నేటి సగటు మానవుని జీవితం ఏ భాషకూ అందని భావం, ఏ కవీ రచించలేని కావ్యం, ఏ గాయకుని గళానికి అంతుచిక్కని గీతం నైలజామిత్ర శ 49

ఏ కులానికి, మతానికి చెందని మానవత్వం, అడుగడుగునా అడ్డుపడే సమస్యలతో యుద్ధం చేయకుండా రాజీపడకుండా.., ఆగిపోతోంది సందిగ్ధంగా... ఇపుడు.., దెబ్బతిన్న శిశువును భరిస్తున్న తల్లిలా వుంటోంది ఉదయం నిత్యం విషాదగాధలా మిగిలి ఉంటోంది సంధ్యాసమయం ఇలాంటి భారతావనిని చూడలేని స్కృతి చిహ్నాలు నిద్రిస్తున్న నీడలా ఒకరు, కొనప్రాణంతో కొట్టుకుంటూ ఒకరు, చిన్నాఖిన్నమయిన ప్రపంచ శాంతి మధ్య పొవుల్లా ప్రజలు అక్కడక్కడా మిణుకు మిణుకుమనిపించేలా ఆత్మీయులు చెల్లాచెదురైన ముత్యాల హారంలాంటి వివాహ వ్యవస్థ ముక్కలు ముక్కలవుతున్న మానవ సంబంధాలు ఏకాంతం నుండి మరో ఏకాంతంలోకి మనసు ప్రయాణం పేరుకు మాత్రం పేరు మిగులుతోంది కాలం ఒక్కరినే భరించగలుగుతోంది సూర్యచంద్రులు సంశయంతో సంచరిస్తున్నా... భూమి బంతిలా తిరుగుతోంది మనిషి మరబౌమ్మలా మసలుతున్నాడు స్వార్థం అసూయ తోబుట్టువులై కలిసి మెలసి వుంటున్నాయి. మట్టిగిన్నెల్లో దాచిన' మనసు పొత్రల్లా జీవితం జనన మరణాల కాల చక్రంతో భారంగా కదులుతూనే వుంది. 50 హీ రాతి చిగుళ్ళు

ఈ గుండె ఏ కాలానిది? దెశ మారుతున్న గాలి ప్రతి క్షణాన్ని లెక్కిస్తూ గడిపితే అవనిపై అశ్వంలాంటి మనిషి పరివర్తనం వర్తమానంతో ప్రయాణం చేస్తుంది ధ్వని మార్చుతున్న గుండె ప్రతి అంశాన్ని తట్టి పలకరిస్తుంటే ఆలోచనల అలలలాంటి జీవనయానం భవిష్యత్తులో న కదలలేక కదులుతుంది ద ల్ట (పేమ ప్రశ్చిస్తుంది థ్‌ నీదారి న? శ న్‌ బో బాధ్యత నిలదీస్తుంది మా న్‌ ఆ దారి నీదేనా అని.. ల ఎడాననల శాశ్వతమూ, వాస్తవమూ కాదు ఏదీ కానిదే జీవితమని.., ఎవరైనా ఎక్కడికని ప్రశ్చిస్తే మౌనాన్ని తోడుండమని..., మనిషి వెనుక మనసు మేఘంలా తేలిపోతూ మనల్ని వదిలి ఎటైనా మరలిపోవచ్చు భయముద్రలతో పారిపోవచ్చు నడిచినంతమేర నడిచి విసిగిపోవచ్చు శైలజామిత్ర + 51

అలజడికి గురికానంతవరకు అమ్మ ఒడిలో నిదురపోవచ్చు ఆటంకం రానంత వరకు ఆషామాషీగా ఆడుకోవచ్చు ఈ ప్రపంచం మేధావుల బొమ్మల కొలువు నయవంచన వీరి నెలవు పలకరింపుల మధ్య మాత్రమే పళ్లికిలించే స్వార్థపు దరువు ఊపిరితో వేసే చిత్రాలన్నీ... ఉవ్వెత్తున ఎగసే హాస్యభంగిమలైతే ఆయువు వివిధ ఆకృతులతో చేరి ప్రారబ్దం లేని ప్రయోగశాల అవుతుంది రాక రాక వచ్చే అతిధి ప్రశాంతత.. వద్దంటే వచ్చే ప్రతీది తీరని కోరిక... ఇది ప్రచారమూ కాదు. ప్రదర్శనా కాదు ఏది నిజమో తెలుసుకోలేని అనిశ్చితి... కనురెప్పలకు సైతం కనబదని రహస్యం ఈ కన్నుల కౌగిలింత... మనిషి క్రియా శక్తికి వ్యక్తిత్వం తోడయితే... అందులో కొలువుండటం భగీరధ ప్రయత్నమే... కలిసిరాని కాలంతోపాటు కదులుతున్న గుండె ఏ కాలానిది? ఆధునికత, నాగరికత దృశ్వాల నడుమ నేలపై నిలబడే మట్టికణాలది మొదలు, చివరలేని జ్ఞాపకాలతో తెరచివుంచిన కేతనం అది. ఏ కాలానికి చెందని రూపమిది. ఏ అనుభూతికి చెందని భాష ఇది.

52 ఛీ రాతి చిగుళ్ళు

చిరిగిపోతున్న చివరిపేజీ

యిన్ని రోజులు గడిచినా

ఎన్ని దశాబ్దాలు దాటిపోతున్నా,

జీవితంలో మొదటిపేజీ దొరకటం లేదు

ఈ మధ్యే చివరిపేజీ కూడా చిరిగిపోతోంది

దొరికినట్లే దొరికి ఒక పేజీ చిత్రం

పూర్తి కావడం లేదు

ఆవేదనతో ప్రయత్నించినా

ఆకారంలో స్పష్టత రావటం లేదు

అవగాహన కోల్పోయిన ఆ జ్ఞాపకంలో

అంతర్యం అంతుచిక్కటం లేదు.

అంతరాత్మ కూడా ఆలోచిస్తూ

నాకు దూరంగా జరిగిపోతోంది

భద్రత కోసమని కాస్త గట్టిగా బిగిస్తే

వృాదయ తంత్రులే తెగిపోయేటట్టున్నాయి

(పేమతో పూర్తిగా వదిలేస్తే

రాగాలు పలకటం లేదు

ఈ పోరాటం మనిషితో కాదు

గుందె గోడలతో..,

తప్పదు...

ఈ రోజు జన్నిస్తే

మరోరోజు మరణించకతప్పదు

ఈ అనంత కాల ప్రవాహంలో

అనురాగపు స్రవంతి అగుపించనీ శైలజామిత్ర + 53

ఆ సౌందర్యంతో పాటు శ్వాసను చిగురించనీ ., ఈ నిగూఢ చైతన్యానికి నడుమ ఊగిసలాడే ఆధారమే నమ్మకం మనిషి ఎపుడూ మాట దగ్గరే ఆగిపోడు మౌనంతో కూదా యానం చేస్తాడు సమయం సమస్య దగ్గరే ఆగిపోదు సామరస్యాన్ని కూడా పట్టుకొస్తుంది కటిక చీకట్లోనైనా.., జారుతున్న కన్నీటి బిందువుల్ని కడిగి చూడు కారుణ్యం స్వచ్చంగా కనిపిస్తుంది నిజమైన హృదయాన్ని పరచిచూడు నీవున్న స్థానాన్ని గుర్తుచేస్తుంది.

రీ స రాతి చిగుళ్ళు

(ప్రతివృష్టికై...

బక్కొక్క అడుగువేస్తూ పోయే జీవితంలో

ప్రతిదశ పగలూ రాత్రీ రక్షణకై వెదుక్కోవలసిందే...,

ప్రతి నిమిషం ఆయుధంతో ఆలోచించాల్సిందే

బాల్యం మట్టిలో రహస్యాల్ని వెదుకుతూంటే

వృద్ధాప్యం జీవిత రహస్యాల్ని మోసుకొస్తోంది

ఒకసారి ఎదురయే ఒకరూపం

మనసును అణచివేస్తే

మరొకటి గుండెలో విత్తనమై మొలకెత్తుతుంది

ప్రపంచం ఒక చీకటిగది

అందులో ఒకరికొకరు తోడురాకున్నా

మనకు మనమే పోతాం...

ఏ స్వార్ధానికో సన్నిహితంగా

మనకు మనమే వెదుక్కుంటాం

ఏ అక్యాశకో ఆహారంగా...

నిప్పుతోనూ, గాలితోనూ నిత్యం స్నేహం చేసే మనము

నీలిమబ్బుల తొలకరి చినుకుల్ని అర్ధం చేసుకోలేము

ఎడతెగని సమస్యలతో కాపురం చేసే మనము

ప్రకృతి వైపరీత్యాల్ని గమనించలేము.

రాత్రి ఎంత కరినమైనా

మన ఇంటి తలుపులకు బయటే నిద్రపోతుంది

మనలో స్వార్థం ఎంతగా మనల్ని అల్లుకున్నా

గుండె గోడల్ని తోసుకుని లోపలికి వెళ్ళేందుకు సాహసించదు

రాలుతున్న ఆకు మనకు మృత్యువును జ్ఞాపకం తెస్తుంది శైలజామిత్ర ఛ 55

కదులుతున్న కాలం మనకు వర్తమానాన్ని బోధిస్తుంది (గ్రీష్మం వస్తుంది వర్షం వస్తుంది జీవన పరిణామాన్ని తేటకెల్లపరిచే తరం వస్తుంది జీర్ణించుకోలేని నిజం బయటపడుతుంది ఇలా,..., మట్టి నుండి మొక్క మట్టినే నమ్ముకున్న మనిషి భయానికి దూరంగా తరతరాలకు భిన్నంగా ఎగురుతున్న హంసల్ని చూస్తూ జీవించాల్సిందే...., కనబడని కారుణ్యంకై తెరవలేని కళ్ళను తెరవాల్సిందే పడవ ఎంతగా నడిసముద్రంలో వున్నా తీరం చేరేవరకు వేచివుండాల్సిందే ప్రకృతి ఎంత శోభాయమానంగా వున్నా నిలకడలేని భూమిమీద నిలబడాల్సిందే. , మనిషి ఎంత వున్నత స్థానంలో వున్నా నిజమయిన ఆత్మీయతను సంపాదించుకోవడంలో కడు పేదవాడే.., ఎన్ని తెలుసుకున్నా అంటుకున్న నిప్పు పేదల గుడిసెల్ని కూల్చగలదే తప్ప వారి విలువైన గుందెల్ని కాదు.., అందమయిన ముఖాన్ని చక్కని కిటికీల (ఫ్రేమ్‌లో బిగించగలమే తప్ప అనురాగపు అలల మధ్య కాదు. బళుకు నాటకంలో రక్తి బావుంది కానీ..., నాటక రంగంలో గెలవాలనే యుక్తి లేదు తడిలేదు తపన లేదు వ్యక్తిలో శక్తి లేదు ర56 ళి రాతి చిగుళ్ళు

సూర్యుని వేళ్ళు తాకితే మౌనంగా కరిగిపోయే మంచు శరీరం నుండి తలను వేరుచేయగల నేర్పరి కూడా..., జీవితంలో ఇపుడున్న వర్ణం మరోక్షణంలో వుండదు.., ఒక్కసారిగా నిశ్శబ్దం శబ్దంగా వమారిపోతుంది..., ఇంత జరుగుతున్నా..., సృష్టి తన శ్వాసను వదిలి ప్రతిసృష్టికై ఎదురుచూస్తోంది....! శైలజుమిత్ర శ 57

లి గుండె పగిలిన దృశ్యం నన్న పలకరిస్తున్నాయి ఆ జ్ఞాపకాలు కాలం బరువై సున్నితంగా కదులుతోంది. ఆకలి కేకల్ని మంచినీళ్లలో బంధించి..., మసక వెలుతురులో నిలబడిన బిక్షువు బేలచూపులు హింసను తెల్లపావురం రెక్కల కింద దాచివుంచి కొత్తనోట్ల తళతళలమధ్య ఎటూ తేల్చుకోని మందహాసపు మధ్యతరగతి నిరాశాదృక్కులు..., నిలువ నీడలేక చెట్టు పిట్టలు ఆత్మీయులుగా గణిస్తూ అర్ధం కాని గ్రహాల ఆంతర్యాన్ని దశాంతర్జ్థాలతో చూపించ ప్రయత్నించే జ్యోతిష్కుల నిరంతర నిర్వేదాలు మూర్తీభవించిన వాస్తవ అవాస్తవాలు చీకటి ఆంతర్యం గ్రహించి సమాజం గుందెపై బండలా సూక్ష్మాతి సూక్ష్మమైన స్వార్ధపు పొగ కమ్మిన ఆనవాక్ళ వాకిళ్ళు.., ఎన్నీ ఏళ్ల ఎదురుచూపుల పచార్లకు బదులుగా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నవ్వుతూ ఎదురైన అనురాగపు ఆర్తి ఆలంబనలు వేదనా సంవేదనంలో వెచ్చని తోడై 55 శి రాతి చిగుళ్ళు

నిరాశా నిర్వేదంలో నిలువలేని నీడై జీవించి

నేడు గోడకు పూర్తిగా వ్రేల్లాడుతూ.. ,

నిస్సహాయ నయనాలతో కన్నతల్లి మౌనబాష్టాలు...

ఆశయం అడుగంటిన ప్రపంచంలో అలరారే అవకాశాన్ని

బీజం నుండి శాఖోపశాఖలుగా శాసించే మొక్కల హావభావ ప్రదర్శనలు

ఉషోదయకిరణాలతో లోనికి ప్రవేశించిన పక్షి

పరవశంగా నా భుజాలమీదుగా ఎగిరి

నిలువుటద్దం ముందు మౌనంగా తన ముఖాన్ని

తానే చూసుకుంటూ ్రశ్నించుకుంటున్న దృశ్యాలు

నేను వుంటున్న ఇల్లూ, నేను నివసించిన గది

చుట్టూ కృత్రిమ బంధాలు

మాటల్లో మంచుముద్దలు...,

మనసుల్లో బొగ్గుముక్కలు..,

కళ్ళల్లో అంగారక కణాలతో

పూల మొక్కలను వెదుక్కుంటూ

ఈ ఒంటరి ఫోరాటం..,

సూర్యోదయం నుండి అస్తమయం వరకు

నా మనసు ఒక కోలాహలం

ఈ కలల దీపాల వఏకాంతవాసం

జీవించినంతకాలం మోయలేని ఈ ప్రశ్నల భారం

తృప్తిలేని సమాధానాల సంయమనం

వెనుక నుండి మాటాడలేని మాతృస్వరం

ఇంటిముందు ఎవరు నిలబడినా అనుమానం

కాలం కలుషితం అవుతోందని పెద్దల తర్మం

ఒక లక్ష్యం లేకుండా.., ఎవరు తనవారో తెలియకుండా

చేతిలో బరువు, చంకలో శిశువుతో ఒక స్త్రీ రూపం లాంటి దృశ్యాలతో శైలజామిత్ర ఉఊ 5

వీధిలోకి కాలు బయటపెడితే తిరాగి వచ్చేదాకా వీరోచితమే . కళ్ళముందుకు వచ్చినవాడు వున్నవాదైనా, లేనీవాదైనా అంతరంగం మాత్రం ఆలోచనల కపోతమే...

ఈ సమాజం అంతులేని సమస్యల కర్మాగారం మనిషి చీకటి తెరలపై నివసించే సూర్యగోళం ఉదయం మెరుస్తున్న ఒక మంచుబింబం గడియారం ముళ్ళ ఆవర్తనం ప్రతి సాయంత్రం కన్నీళ్ళు నిండిన కళ్ళతో చూస్తే

ఆలయం దీపం కూడా మసకగా కనిపిస్తుంది. భయం నిండిన గుండెతో వింటే

అర్చన కూడా అరుపుల్లానే అనిపిస్తుంది.

నిత్యం పొలం గట్లపై నిరీక్షించే కర్షకుని నిరాశను విపణి వీధిలో ఏ తూనిక రాళ్లు కొలవలేవు

వీధి దీపాల కాంతుల్లో కంటిచూపును వెదుక్కునే పేదరికపు నిర్దోషను

ఏ మానవత్వం విపులీకరించలేదు.

చరిత్ర ఎంత విశాలమైనా

సంకెళ్ళ ధ్వనిలో కలిసిపోవాల్సిందే...,

పూలు ఎంత సున్నితమయినా

ఆరు బయట నిద్రించాల్సిందే...,

జంతువు, పోఇ, పువ్వు, దేని ప్రత్యేకత దానిదే.., జీవన విధాన గమనంలో ఎవరి వ్యక్తిత్వం వారిదే రాత్రి నిశ్శబ్దంతో నిద్రరాదు

పగలు వెలుతురుతో ఆకలి తీరదు.

60 రాతి చిగుళ్ళు

ప్రతి హస్తం కింద కవిత్వం అనంతంగా అలంకృతం అయ్యే రోజులు పోయాయి. ఎదురుగా వున్న పాత్రల్ని గమనిస్తూ తమ పరిసరాల్ని మరచిపోయే దిశగా జ్ఞాపకాల రైలు మళ్ళీ పలకరించడం ప్రారంభించింది. శైలజామిత్ర శ 61

అగ 6, ఒడ ఆలీ

స్పష్బ రహస్యం

జీవితం కాలవేగ చలనంలో

అద్భష్ట సీమల్ని అతిక్రమిస్తూ..,

అసాధ్యమయిన అపాయాల్ని గుర్తిస్తూ..,

ఒకప్పుడు పక్షిలా.., మరొకప్పుడు జంతువులా పాములా.., విషకీటకంలా

విషాదం, ఆనందాల మధ్య సన్నివేశాన్నిబట్టి..,

మారడమే ప్రకృతి మాత అమృత తత్వం కరువుకాటకాలతో స్వేచ్చగా విహరించే భౌతిక పరావర్తనం ఎప్పటికప్పుడు చేపడుతున్న మనిషి సరికొత్త ప్రయాణం నిలువుటద్దంలో కనబడుతున్న సూర్యబింబ నివాస స్థలం చీకటి సమావేశంలో ఏకగ్రీవంగా ప్రకటిస్తున్న నిరసన పత్రం అరె! మళ్ళీ తెల్లవారింది ఆహ్హాదంగా సమయం

ఒకసారి వెన్నెల సంద్రంలా

ఒకమారు ప్రశాంత మంద్రంలా

కదిలిపోతున్న మేఘంలా,

జారిపోతున్న కాలంలా

నిద్రిస్తున్న ఆకాశంలా

ఒదిగిపోతున్న పాపాయిలా

జన్మిస్తున్నప్పటి నుండి ముఖంలో (ప్రతిబింబిస్తూ

ప్రతి నిమిషం సమయానికై ఎదురుచూస్తుంది భవిష్యత్తు క్షణక్షణం అంతమొందిస్తుంది వర్తమానం

దుఃఖత్రయంతో బంధింపబడివున్న ఈ గుండె

రెండు ముక్కలై, చెక్కలై

62 ఫీ రాతి చిగుళ్ళు

ఒకదాని ముఖం మరొకదానికి కనబడనీకుండా దిశదిశలా వాక్చిత్రం పొందేలోగా నిరాశగా మింగేస్తోంది మృత్యువు ఆది తుది ఎరుగని మహాకాంతి పుంజాలు ఈ మానవులు అహంకారం, అంధకారం తెలియని అంతఃకరణ ప్రతీక స్వరూపమే ఈ ప్రపంచం..., ఈ కాంతుల్ని పట్టుకోవడానికీ, ఈ రూపం మారిపోవడానికీ తిరిగి తిరిగి మరోరూపంలో ప్రత్యక్షం కావడమే ఎవరికీ అర్ధం కాని సృష్టి రహస్యం...! శైలజుమిత్ర + 63

గతించిన గతం... నౌ హృదయంలో... అనురాగ జ్వలిత కిరణాలు చిరుచీకట్ల సొగసులతో ఊసులాడుతున్నాయి. ఆ వదనంలో ప్రాతఃకాలపు పక్షుల పలకరింపులు కొత్త ఆశలకై స్వాగతిస్తున్నాయి గతం గతించినా ఆ తాలూకు నీడల దృశ్వాలు భవిష్యత్‌ బాటను అడ్డగిస్తున్నాయి కన్న పేగునుండే కన్నకలలు కన్నీళ్ళతో కొట్టుకుపోయి కనురెప్పలు మూతపడకుండా చేస్తున్నాయి. గుండె ఇరుకైనపుడు దాన్ని అరచేతిలో ఇముడ్చుకుని ఎంతగా గాలిని ఊదినా బతుకు ప్రయాణానికి ఒంటరితనాన్నే మోసుకొస్తుంది. ఎంతగా అలవాటు పడినా మొక్క నుండి రాలుతున్న పూరేకులా ముఖంపై వాలిన విషాదరేకలు నన్ను మృత్యువు గీతకు దగ్గరగా తీసుకెళుతున్నాయి మేఘాలు వర్సించకున్నా పర్వాలేదు నా రెప్పలు ఎప్పుడూ నిండు కుండలే... వృక్షాలు ఫలించకున్నా బాధలేదు రడీ ఛి రాతి చిగుళ్ళు

నీకోసం ఎదురుచూసే నా మనసులోగిలి నిత్యం ఫలించే ఉదయకిరణాలే.. అనుకోకుండా అందరూ నావాళ్ళవుతున్నా ఆనందం లేదు నుదిటిమీద మడతలు ముడతలు పడేలాంటి చేదునిజాలు ఎప్పటికీ జ్ఞాపకాల జ్ఞాపికలే... నాగరికత నామోషీల మధ్య ఇమడలేక నా మనోవృద్దాప్యం కూడా నడుస్తున్న ఒక సృష్టి సంకేతమే... ఆత్మ విమర్శను ఆమడదూరంలో వుంచినా అస్తమించే సమయం ఆసన్నమవుతుంది. రేపటి జీవిత పరిణామంలో ర్మెలు తెగిపడివున్న నా గుండె చిత్రానికి ఎన్ని రంగులు దిద్దినా సంపూర్ణత పొందదు. అయినా... ఎందుకీ విచారం ..? ఎవరిజీవితంలో వారు? ఎవరి ఊహల్లో వారు? ఎంతగా ప్రయాణించినా మనం అనుసరించే దారి పరిమితమే.. ఎంత దూరం ఆలోచించినా దాని పరిధి అంతంత మాత్రమే... వెలుగు తర్వాత చీకటి, చీకటిననుసరించి నీడలు సూర్యుని కిరణాలైనా తదేకంగా చూస్తే అంధత్వం వస్తుంది ఆత్మీయతను అమితంగా అందించినా అనుమానం చోటుచేసుకుంటుంది అణువణువు చలనం ఆరాటంతో జీవించినా పోరాటంతో విజయాలు సాధించినా చివరకు మట్టిలో పరవర్తన చెండాల్సిందే... అంతా శూన్యం...!! శైలజామిత్ర + రర5్‌

మీ ముకాలన్నీ పరిచయమే... మీ చర్యలన్నీ అవగతమే నిశ్శబ్దాన్ని శబ్దంలో ఇముడ్చుకున్నది కాలమే... నీలిగగన మైదానంలో పోరాదే శశి శిశువే అలిసిపోయాడు ఇక మనమెంత...? మనంలో ఒకరిగా మెదిలే నేనెంత..? 66 * రాతి చిగుళ్ళు

తప్పుదు...! నునం మళ్ళీ జన్మించాలి..!! తప్పదు...! మనం మళ్ళీ జన్మించాలి...!! కష్టాలను కనికరించి, దుఃఖాన్ని దూరంచేసి పతనంతో పోరాడి, మరణంతో మారాంచేసి తప్పదు.. మనం మళ్ళీ జన్మించాలి..!! ఒక్కోరోజు గడిస్తే చాలు... నూరేళ్ళు నిండినంత సంబరం ధనిక, పేదల మధ్య వారధిగా నిలబడి కుల, మత చక్రాల మధ్య నలుగుతూ క్తీర్తి బావుటాలు కొనుక్కొని భర్మహర్య్యాలు నీడలో భయపడుతూ, దాక్కుంటూ బతుకుతో బంతాట ఆడుతూ తప్పదు... మనం మళ్ళీ జన్నించాలి.. ఎన్నో వేల సంవత్సరాలనుండి నేటివరకూ మనిషి మనోభావ పరిస్థితులివే...!! ఒకవైపు ఘర్షణలు, ఘోరాలు మరోవైపు అట్టలు కట్టిన నెత్తుటి మరకలు..!! అదేభూమి... అదే ఆకాశం, అవే నక్షత్రాలు అదే గాలి, అదే నీరు, అదే వెలుగు, చీకటి ఇంద్రధనుసు లాంటి మనస్తత్వాలతో ఏదో ప్రాంతంలో పరుగులిడుతూ...

శైలజుమిత్ర + 67

బంధు భావ సంబంధాల్ని తెంచుకుంటూ తప్పదు... మనం మళ్ళీ జన్మించాలి...!! వింటానంటే చెప్పు... ఈ మానవారణ్యంలో చెప్పుకోవడానికి బోలెడు కథలున్నాయి... నేలపై నడిచే శవాలూ... నీటిపై తేలియాడే హృదయాలు రాతిబొమ్మల్లాంటి వీరులు, నాలుకే లేని మానవులు..... ఎన్నో... ఎన్నెన్నో...!! ఎడారిలో సెలయేళ్లలా గడుస్తున్నాయి రోజులు వడలిపోతున్న వర్షపుచినుకుల్లా నడుస్తున్నాయి జీవితాలు... శాంతి లేదు... స్థిమితం లేదు (ప్రపంచమంతా వ్యాపారంలో... ప్రాణాలన్నీ ప్రళయంలో... ఆచరణంతా చివరి మెట్టులో.... ఆలోచనంతా సృష్టిని ఆక్రమించాలనే ఆశతో... ఉదయం లేచి చూస్తే గుండె వేగం పెరుగుతోంది... సాయంత్రం తరచి చూస్తే మనసు వలసపోతోంది పులిచర్మంతో, జింకకొమ్ములతో.., పాము కోరలతో, తేలుకొంద్లతో సమాజం కళ కళలాడుతూనే వుంది అయినా తప్పదు... మనం మళ్ళీ జన్మించాలి... చెట్టు కొమ్మపై ఒదిగి కూర్చున్న పిచ్చుకకోసం... అప్పుడే పుట్టి గంతులేసే లేగదూడకోసం... రా రమ్మని పిలిచే సముద్రపు అలలకోసం... ఒంటరైన చందమామ కోసం వసంతబుతువు కోసం మీకోసం... మీలో కొలువైన ఒక మనసు కోసం... తప్పదు....! మనం మళ్ళీ జన్మించాలి...!! 68 శ రాతి చిగుళ్ళు

అ(న)౦త జీవితం మధ్య భూగోళం...!! అశాంతి రెక్కల కింద అర్ధరాత్రి నిద్రపోతోంది ప్రాణాలు అరచేతిలో వుంచుకుని పగలు పరుగులు పెడుతోంది ఒక్క వెలుగేమిటి? వెన్నెలేమిటి? పువ్వులేమిటి? పక్షులేమిటి? కదులుతున్న భయం తరంగాలపై నగరం సందిగ్ధమై నిలబడివుంది అద్దంలాంటి ఆదర్శానికి నిరంతరం తగిలేవి రాళ్ళే అయినా దిక్కుల్ని మోస్తున్న ముఖాల్ని క్షితిజం మౌనంగా భరిస్తోంది ఎగరలేక ఎగురుతున్న శాంతి పావురం కొన ఊపిరితో వుంది వెంటాడే జ్ఞాపకం నా కంటే ముందుగా వాకిట నిలబడివుంది అంగట్లో ఎన్ని వుంటే ఏమిలాభం? ముంగిట్లో లేకున్నప్పుడు. . అయితే మాత్రం ఏం? కన్నులు మాత్రం నిండుకుండలే అయినప్పుడు.. గుండె మోయలేనంత బాధల భారాన్ని మోస్తున్నా... ఆ రెక్కలు భరించలేనంత కష్టం చేస్తున్నా... నింగిలో చుక్కల్లా ధరలు మెరుస్తున్నాయి. ఏ ఏటికి కా ఏడు ఎండిపోతున్న నేలతల్లి బీడువారి ఆకలితో అలమటిస్తుంటే... ఏమీ చెయ్యలేని రైతు తనకు తానే బలిపశువుగా మారినా మొలకెత్తని వర్లగింజలు గొంతుకు అడ్డం పడుతున్నాయి. శైలజామిత్ర శ 6

ఇక్కడ అలజడి లేని వస్తువు ఒక్క కాలమే... పట్టు పరికిజీలాంటి పల్లె అంచులు వడలిపోయిన వర్చపు చినుకుల్లా పడివున్నాయి పరుగులు పెట్టే సెలయేరు వట్టిపోయిన ఇసుక తిన్నెల్ని గుర్తుచేస్తున్నాయి సమైక్యతను తలపించే ఆ హృదయాలు కనబడని బియ్యంలో బతుకు మెతుకు మెతుకు వెదుక్కుంటోంది కన్నీరు రాక గుండె బండగా మారుతోంది... పశ్చలే లేని జనారణ్యంలో సమాధానాలే మారణాయుధాలై నిలదీస్తున్నాయి నిలువ నీడలేని ప్రపంచంలో నిప్పుకణికలే రాజ్యమేలుతున్నాయి... ఇవి ఆవేదనల్ని తెలిపే క్షణాలు కావు ఆశలు తేర్చుకునే సమయమూ కాదు రోజు రోజును అలంకరించే క్షణం ఒకటుంది మట్టినుండి మనసు మాణిక్యం అయ్యే తరుణం వుంది ఈ జీవితాలు ఎన్నో సంధ్యా సమయాల్ని చూడాల్సి వుంది ప్రతి వృాదయం ఉదయకిరణంలా మెరవాల్సిన అవసరం వుంది... అందుకే... నేను నేనుగా నిలవాలని వుంది కులవివక్షలేకుండా జాతిని జాగ్భతం చేయాలని వుంది.. నిత్యం వసంతాన్నే చూడాలనివుంది... జీవితాలన్నింటిలో అనంత భూగోళం వుందని తెలపాలని వుంది...!!

70 శ రాతి చిగుళ్ళు

పలకరిస్తున్న పరిశోధన చవి నిలయం యశస్సు కాదు బతకడం దినచర్య కాదు అయినా మానవత్వం రెంటిలోనూ ప్రత్యక్షం చం(ద్రుడంటే వునికి కాదు చీకటి నీడల వెనుక వెన్నెల కాదు అంతరంగంలో అంతర్జపు ఆంతర్యం ఈ నిమిషంలో కనుచూపుమేరలో కదిలివచ్చే నీలిమబ్బుల జాడలేదు కళ్ళిదురుగా ఒకరోజు గులాబిలా ఎదురైనా అరవిరిసిన అందం కానరాదు ఆలోచిస్తూ పసిమొగ్గల్ని చేతితో స్పృశిస్తూ వర్తమానాన్ని పల్లెవేస్తూ దానవత్వాన్ని వీక్షిస్తూ కదులుతున్న మానవాకృతి అసాధారణ వ్యక్తిత్వాన్ని వ్యక్త పరుస్తోంది మనసు మౌనంగా వుంది విశ్వాసం విశ్రాంతిలో వుంది సృష్టి అన్వేషణలో వుంది నా (ప్రశ్న సమాధానం రెండూ ఒకటిగా వుంది. ప్రపంచం పంజరాన్ని దాటి స్వేచ్చగా విహరిస్తోంది ఆకాశంలో నక్షత్రల పలకరింపు బావుంది శైలజామిత్ర శ 71

కారణం ఏదైనా

త్యాగం తెలిసిన మేఘం కోరకుండానే

కన్నీళ్ళు తుడుస్తుంది

కాంతినివ్వడం మాత్రం తెలిసిన దీపం

ఎదురుగా ఎవరున్నా వెలుగుతుంది

ప్రవహించడంలో ఆనందం చూపుతున్న నీరు

నేలపై వున్న మట్టికజాలను కూడా తీసుకెళ్తుంది.

దూరంగా వుండటమే తెలిసిన అనురాగం

మనసును సుదూరతీరాల్లోకి పయనింపజేస్తుంది.

అందనంత ఎత్తులో వుండే ఆలోచన

ఎవరూ అందుకోలేనంతగా ఎదిగిపోతుంది

ఇష్టం వున్నా లేకున్నా ప్రతిసారి

వాస్తవాల్ని భరించాల్సి వస్తుంది

అవేశం హక్కులకై పోరాడమంటుంది.

మిగిలిన శరీరం అస్థిపంజరమై

ముందు తరాలకు పరిశోధనకై ఉపకరిస్తుంది. 72 స రాతి చిగుళ్ళు

మహానగరపు నీడలలో మహానగరపు నీడలలో కక్షల కొండచిలువలు పట్టపగలే పచ్చిమాంసంతో కదుపు నింపుకుంటున్నాయి సమాజపు సమాధులపై మత్తుగా నిద్రించే మానవ మృగాలు నెత్తుటితో స్నానించి కూర్చున్న కొమ్మనే తెగనరుక్కుంటున్నాయి ఎసిగదులు, పట్టుపరుపులకు అలవాటుపడి అధునిక వేదికపై అత్యాశను తోడుగా తెచ్చుకుని సడివీధిలో రాక్షసన్ఫత్యం చేస్తున్నాయి ఒకవైపు నిలువ నీడలేక ఒక వారగా ఒదిగి కూర్చుంటున్న పేదరికం మరోవైపు ఊపిరాడని బూరుగుదూదిపై చలికాచుకుంటున్న డాంబికం అమానుషంగా అమాయకులపై పోరాడుతున్నాయి. వర్తమాన శిరస్సులో భవిష్యత్తుతో పనిలేక పాతాళాన్ని మాత్రమే ఆశ్రయించాల్సిన పాతకులు పరిపాలిస్తున్న పాపభూయిష్టమయిన నేల ఇది. పుట్టిన ప్రతి బిడ్డకు రక్తపు రంగు, రుచి పరిచయం చేయాల్సిన రోజులివి ఇపుడు బ్యాంకుల్లో దాచాల్సింది డబ్బు కాదు. కాస్త మనశ్శాంతి... మనిషికి కావాల్సింది తిండి కాదు మనసారా పలకరించే విశ్రాంతి...

నైలంజుమిత్ర + 73

చెదిరిన జీవితాల జూడలలోంచి అస్పష్టంగా వినబడే ఆక్రందనలు పైశాచిక వస్త్రాలను కప్పుకుని దిష్టిబొమ్మను దగ్ధం చేయటమే పనిగా బతుకు దారిలో పొందుతున్న స్వాతంన నేటి రాజకీయం. ఒకే ఒక్క కాన్వాసుపై రెండు కుంచెలతో పిచ్చిగీతలు గీస్తూ అదే ఆధునిక చిత్రంగా చూసి ఆనందించడం నేటి యువతరం. అశ, అత్యాశల మధ్య పోరాడుతూ రెంటికీ చెడ్డ రేవడిలా ఎందడమావులనే పండగ చేసుకుంటూ మధ్య తరగతి మందహాసం.. ఒకవైపు దేశ సరిహద్దులలో శతృవులపై శతృఘ్నుల్ని పేలుస్తుంటే మరోవైపు తనవారి రూపమేదో తెలియక రక్తపు ముద్దల్ని వాటేసుకుంటూ విధి చేస్తున్న వింతలు చరిత్ర పుటల్ని నింపుతున్నాయి. అందుకే అనిపిస్తుంది ఏ మిట్ణ మధ్యాహ్నం వేళో ఎండైనా నిలబడి శాంతి పావురాల జాడకోసం వెదికీ వెదికీ ఇక ప్రయోజనం లేదని గ్రహించుకున్నాక ఏ రక్తపాతమూ జరగని చోటును గ్రహించి నవ్వుతూ ఊపిరి తీసుకోవాలని...

74 ఛా రాతి చిగుళ్ళు

తాక ట్లో చంద్రబింబం నిజం వాకిటనుండి బయటపడిన తెల్లని సింహం తెప్పరిల్లిన కళ్లతో చీకటితోనిండిన ప్రపంచాన్ని చూసి ముఖం ముడుచుకుంది వెళ్ళాదే మబ్బుతెర వానచినకై నేలపై రాలినట్లు గాలికి కెరటం ఒక్క ఉదుటున అల్లంత దూరాన విసిరేసినట్లు ఎదురుచూడని ప్రేమ ఒక్కసారిగా ముంచెత్తినట్లు ప్రతి గుండెలో తెలియని ధ్వని... కాలం ఆగిపోతుందేమోనని ఎండనక, వాననక, చలిఅనక, నిశ్శబ్దంగా నిలుచున్న మనోరూపం ఉలిక్కిపడ్డ హృదయంతో మండుటెండలలో నిలబడ్డ పేదరికాన్ని చూస్తూ చేతులు ముడుచుకుంది కదిలే కాలం ఒక్కసారిగా ఆగి పలకరించినట్లు కనిపెంచే తల్లి కూడా కాకుండా పోయినట్లు కదలాడే కన్నీటిబిందువు కర్కశంగా మారిపోయినట్లు ప్రతి మనిషిలో తెలియని ఆశ... సర్వం తనదే అయిపోతుందని.. భయపడటం అజ్ఞానం... దాక్కోవడం పిరికితనం లేదనడం అవకాశం... కాదనడం తప్పించుకోవడం అమ్మవద్దని, తెలుగు భాష ఎందుకని నాన్నకు తెలివిలేదని, తోబుట్టువులు ఎంతవరకని అనుకుంటూనే ప్రాణం లేని వస్తువులు నావని శైలజామిత్ర శ 75

అందరూ నిలబడ్డ నేల ఆసాంతం సొంతం చేసుకోవాలని

అనుకోవడంలో నిజం నిర్వికారం...

బతికుంటే అరవై అడుగుల నేలలో నడిస్తే

మరణిస్తే ఆరడుగుల నేలలో ఇమిడిపోయే ఈ శరీరానికి

మిగిలేదేమిటో అని తెలుసుకోవడంలో వాస్తవం శూష్కం.. !

కత్తులకు బూజు పట్టిందని వత్తులను ఉపయోగిస్తామా. ?

మనసుకు మబ్బుపట్టిందని మాటల్ని మరచిపోతామా..?

ఏ నిముషం ఎలావున్నా

మండుతున్న అగ్నిలోసైతం నిజం లేకపోలేదు

తోసిపుచ్చుతున్నా మనిషిలో మనసు ఉండకపోదు

ఈ సృష్టి అందరిదీ...

స్వేచ్చగా కనబడుతున్న బందీ...

ఆశ ప్రహారీ గోడపై నుండి వీస్తున్న గాలిలాంటిది

గదిలో వీచేగాలి గదివరకే పరిమితమవుతుంది

అక్కడున్న వారినే పలకరిస్తుంది

అంతటితో ఊరుకోక మనిషి స్వరం చుట్టూ తిరిగి

నలువైపులా ప్రతిధ్వనించేలా బయటపడి

జనవనాల్లో తిరుగుతుంది...

అపకీర్తి శాలువా కప్పుకుని కటకటాల్లో నిలబడితే

పెరిగేది శాలువా విలువ మాత్రమే...

అవినీతి కెదురుగా వరండాలో పూలకుండీని వుంచితే

మిగిలేది పూలవాసన మాత్రమే

మట్టితో మనిషికి సంబంధం వుందన్నారని

మట్టి అంతా తనకే చెందుతుందనుకోవడం హాస్యాస్పదం

ఏనాటికైనా సంపద ప్రపంచమనే ఇనపపంజరంలోనిదే

ఎప్పటికైనా మనిషి శరీరం శ్మశానంలో గుప్పెడు బూడిదే... 765 *ీ రాతి చిగుళ్ళు

నింగికి నేలకు సరితూగక నాలుగు గోడల మధ్య ఇమడలేక ఇముడుతోంది మానవజీవితం మాయ ఎక్కడో లేదు మనం ఏమాత్రం తరచిచూడని రాత్రిలో వుంది మనల్ని భరించలేని దురాశలో వుంది మనని చూస్తూ మనల్ని అనుసరించని కాలంలో వుంది ఆకాశం అందరిదీ అయినా ఎగిరే పక్షి రెక్కలకిందే వుంటుంది వర్షం అందరిదీ అయినా కర్షకుని కళ్లలోనే మెరుస్తుంది నీటితోనే అందరికీ అవసరం వున్నా దాహం వేసే నోటిలోకే ప్రయాణిస్తుంది పరుగెడుతూంటే మనతో పాటు చెట్లే కాదు సూర్యకాంతి కూడా వస్తుంది చీకటిని క్యాండిల్‌తో తరిమేయచ్చు ఆవేశాన్ని ఆశయంతో వదిలేయచ్చు వన మార్గాన వున్న ఆకుల కింద రహస్యంగా గాజుముక్కలు దాక్కుని వున్నా అడుగులను రక్తసిక్తం చేస్తాయి అంతరాంతరాలలో మనకే తెలియకుండా ఎన్ని ఆశలున్నా మనసును మలినం చేస్తాయి దీపాలెన్ని వున్నా అవి వెలుగునివ్వడానికే రూపాలెన్ని వున్నా మనకు మనంగా గుర్తించడానికే... కొన్ని క్షణాలు అనుకోకుండా గుండెలో గూడుకట్టుకుంటాయి కొన్ని అకస్మాత్తుగా బాంబుల రూపంతోనో మరికొన్ని మందుపాత్ర మస్తిష్మంతోనో గురిపెట్టిన తుపాకీ గుండులానో బతుకులను నిర్దేశిస్తాయి ఫలితం పగిలిన గాజుముక్కలు చెదిరిన మానవ శరీరాల అవశేషాలు

శైలజామిత్ర శ 7/7

ఇపుడు జాతీయ చిహ్నం నెమలి కాదు నడిరోడ్డుపై తలలేని మొండిదేహం మనం నిలుచున్న చోటే ఒక స్మృతి చిహ్నం ప్రతి నగరం ఒకప్పటి స్వప్న దృశ్యం నల్లరాతి శిలలపై తెల్లని అక్షరరూపం ఇక భావి తరాలకు చరిత్ర రూపాన్ని తెలపకృర్తేదు కదిలే మారణ రణ జీవిత చిత్రాలు చూస్తే చాలు...తెలిసిపోతుంది రవిబింబాన్ని సైతం అమ్మకానికి పెట్టి చంద్రబింబాన్ని తాకట్టు పెట్టిన ఆనవాళ్ళు చాలు సర్వం అవగతం అవుతుంది...

785 ఈ రాతి చిగుళ్ళు

ఒకానొక బతికిన క్షణం గతమంతా ఒకసారి తరచి చూస్తే ఒకానొక బతికిన క్షణం నాకు నేనై నిలుపుకున్న గమ్యం కొద్దిపాటి కంటిచూపులో కనబడుతున్న దృశ్యాల తాలూకు అక్షరాల అల్లికల్ని అర్ధం చేసుకుంటూ భావాల ఒడిలో.., అనుభూతుల రెక్కల్ని రెప రెపలాడిస్తూ కాలం నాతో పరుగులు తీస్తోంది నా కన్నా ముందుకు వెళ్ళాలంటూ నేను వెళ్లేదారిలో అన్నీ ముళ్ళూ, కొండలూ నేను కదిలే మార్గం మొత్తం దుమ్మూ, రాళ్ళూ నా వెనుక వదలలేని నా వాళ్ళు నా ముందు చిరునవ్వు తెలియని అయినవాళ్ళు ఎక్కడుంది ఆనందం? అంతా దుఃఖ తరంగ నుయమే ఒక బాధ అంతమైతే మరో బాధ సారంగం ఒక అలంక్రియ పోతే మరొకటి ఒక భయం పోతే మరొకటి ఒక విధం పోతే మరొక విధం ఒక వీధి దాటితే మరో వీధి ఒక ఊరు దాటికే మరో ఊరు అన్నీ వదులుకుని బయటపడితే ఎదురయ్యేది అంతిమ గడియళకే..., కొన్ని కాదనుకుంటే అంతా శైలజామిత్ర + 79

పెంపుడు పక్షుల జ్ఞాపకాలే... చుట్టూ నాకు ఏమాత్రం తెలియని చుట్టాలే..,

' నిష్పల్ని నెత్తిన వేస్తూ గాలిని విసిరే పలకరింపులే. , నా నాలుకపై పడుతున్న వర్షపు చినుకులను సైతం దోసిలితో పట్టి దాచుకునేవారే..., నా ఇంటి తలుపు సందులో దాచుకున్న చీకటిని మాత్రమే చూస్తూ ఆరా తీసేవారే..., జారిపడుతున్న నా వెచ్చటి కన్నీటితో దాహం తీర్చుకునే వారే..., ఇలాంటి ఊపిరి సలపని అవమానానికీ, భయానికి దూరంగా వెన్నెల రెక్కలతో ఎగిరిపోకున్నా..., గుండె మంటలకు ఆహుతి కానంత దూరంలో సమయాన్ని బట్టి ప్రేమనో..., త్యాగాన్నో రాత్రయితే నిదుర తీరాన్ని పగలయితే మెలకువ మైదానాన్ని తోడుగా పెట్టుకుని మాసిన బట్టలతో, అలసిన ముఖంతో... కలల ప్రపంచంతో కలిసి వెళుతున్నా... గొంతును ఎండనీకుందా ఆశను పోనీయకుండా తడిపిన మేఘంతో కలిసి మెలసి కన్నీళ్ళని వెంట తీసుకుని స్నేహస్పర్భ వీడకుండా ఒకే దిశగా ప్రయాణిస్తూంటాను ఆశ్చర్యం...!!! దిశ ఏదయినా ఎంతటి శరీరాన్నైనా ఆయువున్నాా లేకున్నా మోస్తుంది సంకల్పం ఎంతటి జీవితాన్నైనా తన రెక్కలపై భరిస్తుంది.

80 ఫి రాతి చిగుళ్ళు

ప్రతిరోజు ఏదో ఒకరోజు (క్రతిరోజూ ఏదో ఒకరోజూ చేజారిపోయి మరోరోజు గుండెలో చేరుతుంది ప్రతి రాత్రి ఎన్నో రాత్రులు దాటిపోయి మరో రాత్రికై ఎదురుచూస్తుంది జీవితం ఒక మాయాలాంతరు అందుకు ఇంధనం విధిరాత మనిషి ఆశల బుతువు అయినా అకులు రాల్చేది మాత్రం అంతరాళ్మే.., (ప్రతీ ఉదయం ఆటుపోట్ల ముళ్ళమధ్య గులాబీలా నవ్వుకుంది అలుపెరగని సూర్య కిరణాల తాకిడికి పాయలుగా వీడిపోతోంది నిన్న పాత పలకరింపుల పల్లవి రేపు బరువైన గుండె సందడి. నేడు సజీవ దృశ్యాల తాకిడి వివరణలో తేడా వున్నా, నిన్న రేపు, నేడులో వైవిధ్యం లేదు ఒకదానికొకటి వివరించుకుంటూ హరివిల్లులా సాగిపోతూనే వుంటాయి ఆశ్చర్యం...!!! శైలజామిత్ర *ఊ 81

ఉదయం ఎంత స్వచ్చంగా వున్నా రాత్రికున్నంత స్వేచ్చలేదు. ఒకవైపు భయంగా వున్నా ఆ తొలగింపు నీలిమబ్బులు రెక్కలు విప్పినంత సహజంగా వుంది ఒకవైపు నిరాశగా వున్నా ఆ బాధ చీకటి ఆకాశంలో ఇంద్రధనుసు సోయగంలా వుంది జీవనా వర్తంలో పరిభ్రమిస్తూ బయటపడే దారికోసం వెదుకుతూన్నా మనం వెళ్ళేదారి నిర్ణయించేవుంటుంది బ్రతుకుతున్నంతకాలం భూమిపై పోరాటం సాగుతూనే వుంటుంది ఎన్ని పూలు కోసి ఒడి నింపుకుంటున్నా వాటి జీవితం ఒక్క రాతశ్రే.., ఎంత నిశ్శబ్దాన్ని మనం గుండెలో నింపుకుంటున్నా..., మనసు కల్లోలం చేసేది ఒక్క మనిషే. నాకింకా జ్ఞాపకం వుంది వరండాలో నాన్న.., వంటింట్లో అమ్మ..., ముందు గదిలో నేను.., భవిష్యత్తుకై కన్న కలలు ఇంకా సజీవంగానే వున్నాయి కాకుంటే ఒక్క చిన్న మార్పు కలలు మాత్రమే మిగిలి నేను నిర్జీవంగా మారానంతే.., అమ్మతో నేను, నాన్నతో నా మనసు నా జీవితం ఒక కలగానే మిగిలిపోయిందంతే.., ఒకప్పటి నాలోని మౌనం

82 ఈ రాతి చిగుళ్ళు

నేడు శబ్ద తరంగంలా మారిందంతే..

జీవన ప్రయాణం ఎందరో చేస్తున్నారు

అందరితో పాటూ నేనూ...

నాలో నేను లేకున్నా.., నాలో ఎన్నీ రూపాలు

ఎదురుగా భవిష్యత్తును చూపుతూ

భయపెడుతున్నాయి.

అరుపులు..!! మెరుపులు..!!!

అవమానాలు..!! బీభత్సాలు..!

విభిన్న మనస్తత్వాలు..!!

భిన్న తరాల స్వేచ్చా విహారాలు...!!

ఇన్నివున్నా..., నా కానందమే

ఇదే జీవిత పరమార్థం గోచరించే సమయం..!!

సమాజమనే చీకటి గదిని తరచి చూసే తరుణం...!

పోతే పోదాం...

పెద్దపులులు లేకుండా గమనించి అడవిలోకి

కొండబండలు అద్దురాకుండా మైదానంలోకి

అత్యాశకు అమ్ముడుపోకుండా అమ్మ కడుపులోకి...

జీర్ణ వర్ణాలకు లొంగిపోకుండా శూన్యంలోకి... శైలజామిత్ర ఉ* 83

ఇది అంతే... ఇక్కడేదో మురిగిన మనసుల తాలూకు వాననొస్తోంది వెంటనే తగలబెట్టండి...!!! వీరంతా నిన్నటి దాకా నావారే... ముత్యాల్లాంటి బిడ్డలు అనిపించినవారే..., నిత్యం వదోనన్ను, నా వృద్ధాప్యాన్ని 'పేమతో పలకరించిన వారే..., అయితే ఇక్కడో చిన్న మార్పు జరిగింది నా శరీరాన్ని వదిలి ప్రాణం ఒంటరిగా వెళ్లిపోయింది ఇప్పటికీ నాకేం తక్కువ లేదు తెలిసీ తెలియక పరిచయం వున్నా లేకున్నా అందరూ నన్ను పొగుడుతున్నవారే..., అయితే వారే మధ్య మధ్య వారే నా శరీరాన్ని ఎపుడు తగలేస్తారని అడుగుతున్నారంతే..., అయినా నాకేం తక్కున లేదు ఇంకా నాలో వున్న మనిషిని చూస్తున్నారు కొందరు నాలోని మాతృత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు కొందరు నే పంచిన ఆత్మీయతను తలుచుకుంటున్నారు నాతో వున్న వారి వారి జ్ఞాపకాలకు రంగుల్ని జతచేస్తూ పొగడ్తలతో నిందిస్తున్న వారే... అయినా నాకేం తక్కువ లేదు అయితే ఇక్కడో చిన్న మార్పు జరిగింది రికీ ఛి రాతి చిగుళ్ళు

నేను ఇక లేననుకుని పూర్తిగా తెలుసుకునే ఒంటరిగా మార్చురీలో వుంచారంతే ., తప్పదు చనిపోయింది మహాత్ముడైనా శవమే మరి ప్రాణం పోయింది రాజైనా ఇంట్లోకి రానివ్వరంతే అయినా అందరూ మంచివారే..., నాకోసం నలుగురు మోసే వాళ్ళు వుంటారో వుండరోనని నాల్గుకాళ్ల శకటాన్ని భారీ ఖర్చుతో తెచ్చారంతే..., కన్నతల్లిగా నేనంటే పంచప్రాణాలైనా నా నగల్ని మెల్లగా ఏడుస్తూనే తీసి దాచేస్తూ ఇది నాది, ఇది నాది అంటూనే నన్ను అమితంగా ఇష్టపడుతున్నారంతే..., అయినా ఇక్కడ అందరికే నేనంటే (సేమే.., ఉన్నంతకాలం ఎంతకాలం అమ్మ ఇలా ఉంటుందో అనుకున్నారంతే..., పాపం.., నా బిడ్డలు.., వారికి తెలియదు ఈ రోజు నేను పోయినా రేపు వారూ పోతారని.., ఈ రోజు నేను వారి జీవితాల్ని వాళ్లకు వదిలి వెళ్ళినంత మాత్రాన అంతా సద్ధుమణగదని.., జీవితం అపుదే మొదలవుతుందని.. ఇంతే ., ఇది ఇంతే.., మనిషిగా మనం ఎంత సంపాదించినా మనమింతే..., మనం మారమంతే...,

శైలజిమిత్ర శ 865

నర్లచిత్రాలు లం

మొన్నటి హింసాకాండ ఇంకా ఆరనేలేదు

నిన్నటి రక్తప్రాతమింకా ఆగలేదు

నేటి జీవన ప్రయాణపు బడలిక ఇంకా తీరలేదు

నిరుపేదల ఆకలికేకలకు సమాధానం లేదు

అత్యాశకు, అశాంతికి విరామం లేదు

విమానాల్ని కూల్చేస్తే దొరికేది వినోదం కాదు విషాదం

దిష్టిబొమ్మల్ని తగలేస్తే తొలగిసోయేది ప్రతీకారం కాదు ప్రతిబింబం.

హింసను ప్రోత్సహిస్తే ఆవిర్భవించేది అనాగరికతే

ఉద్యమాన్ని ఉత్సాహపరిస్తే మనకు మిగిలేది ఉరితాడే

నక్ష్మత్రాలన్నీ నవ్వులయితే నేలపై పండేవి ముత్యాలే...,

నింగికి, నేలకు మధ్య ఎంత దూరం వున్నా

దేని భావం దానిదే.. దేని ప్రత్యేకత దానిదే...,

మనిషికి, మనిషికి మధ్య ఎంత ఆత్మీయత వున్నా

ఎవరి జీవితం వారిదే...,

కదిలే ప్రతి అణువు సృష్టి సహజం

కదిలించే ప్రతి పిలుపు మానవ హృదయం

దోసిలిలో పట్టే ఏ నీటిచుక్క వాగుకాలేదు

ఇసకపై కుంభవృష్టి కురిసినా జీవనది కాలేదు.

ప్రవాహానికి ప్రపంచం రూపం మారుతున్నా

ప్రకృతిలో భాగం కాకపోదు

శిలలు నిద్రిస్తున్నా కొత్తతరపు చిహ్నాలు కాకపోవు... 86 ఛీ రాతి చిగుళ్ళు

ఈ నేలపై ఏ అణువుకు ఆపదలేదు మనసున్న ఏ మనిషికీ ఆరాటం లేదు కాలికి ముల్లు ఎపుడు గుచ్చుకున్నా దాని తాలూకు మచ్చ జీవితాంతం వుంటుంది చంపడం, చంపబదటం, లాంటివి కాలగర్భంలో మనసు మోస్తున్న వర్ణచిత్రాలు ఎపుడెపుడో జ్ఞాపకాలలో జారిపోతున్న మనుషులు విఫణి వీధిలో నిత్యావసర వస్తువుల్లా జీవితాలు ఇవి ఇంతే. ., ఎంత పిలిచినా పలకవు ఒకవేళ పలికినా కనిపించవు...

శైలజామీత్ర ఛి 87

గడచినంతవరకు...!

రాయి ఎవరు విసిరినా

అద్దం పగులుతుంది...

కన్నీళ్లతో ఏ ముఖాన్ని చూసినా

ఆవేదనే కనబడుతుంది..

“ఆకాశం' అందని 'తాయిలంి

దాచి ఉంచేందుకు ఏ గుండె సరిపోతుంది?

మనిషి మనిషికి మధ్య

మారణహోమానికి ప్రత్యేకత ఏముంది?

మనసుకు మనసుకు నడుమ

సృజన పంక్తి ఎక్కడుంటుంది?

“నిజం” నిఖార్సయిన 'వజంి

అందుకు నిరూపణ అవసరం ఏముంది?

ఆహారం అవసరమయితే

ఎందరున్నా పక్షి భయపడకుండా వాలుతుంది

కత్తుల తోరణాల నడుమ

మానవకీర్తి ఎంతకాలం నిలబడుతుంది?

“వ్యక్తిత్వం” విలువయిన 'సొందర్యం”

బెన్నత్యం కోల్పోయాక కిరీటం ఎంతసేపు మెరుస్తుంటుంది?

మనసుపై మబ్బులు ముసిరి

నీడలు వాలి, దూళిసోకి, నిశ మింగే దశలో

మనిషిలోని విషం మిషకు వదారి దొరుకుతుంది? 88 ఛీ రాతి చిగుళ్ళు

బహు ప్రశ్నల వాతావరణంలో

దేహ వర్ణం ఎంతకాలం నిలబడుతుంది?

ఎెన్నెల్‌ గగనానికి 'మణిహారం'

ధరించాలంటే హృదయం ఎంతటి భారం మోయాల్సివస్తుంది?

నిన్నటి మానవ సంకల్పం

నేడు విషాద భూయిష్టం

రేపటి మనోరూపం

ఒకనాటికి మిగిలే సవితృ బింబం!

“జీవం” జీవితానికి 'దీపం”

కొంతకాలమయినా ఉండాలంటే ఎంతటి కారుణ్యం ఉందాలి? శైలజుమిత్ర ఉ ఈ

నిజం చెబుతున్నాను...! నిజం చెబుతున్నాను ఒక్కసారి పగిలిన గుండె చిట్లిపోతూనే ఉంటుంది... అతకడం అతుకించడం ఒక వేషమే! బతుకు అతుకుల బొంతయినపుడు నివసించే ఇల్లు ఒక స్మశానం! నిద్రరాకశేజినురెప్పలు బరువయినపుడు పవళించే పరుపు ఒక సమాధి! ఒక్కో బాధకు భారమెంతో కదా! తగిలిన చోటే దెబ్బ తగులుతుంది పదే పదే! అద్దాల మేడలన్నీ చమురులేని వత్తుల్లా ఉన్నపుడు సమయాన్ని చుట్టి అటకమిదుంచితే మంచిదేమో! మనసులకు మరల్ని అమర్చడం అవసరమేమో! నడిచే కొద్దీ

60౮ రాతి చిగుళ్ళు

దూరం పెరుగుతుంది పరుగులు తీసిన కొద్దీ భారం పెరుగుతుంది బతుకు బావి ఎపుడూ ఎండదు కన్నీటితో పొర్లిపోతూనే ఉంటుంది తప్పదు ఇక అందరూ సంఘర్షణల ఘర్షణలకు స్వస్తి పలకాల్సిందే! మనో యంత్రాన్ని వాడి తీరాల్సిందే! చివరాఖరికి కొన్ని సమాధానాలు సంధులై సమాసాలై మనల్ని పట్టి పీడిస్తుంటాయి ఎన్నో యోజనాల దూరం ఉన్నా సరే! అస్తిత్వానికి మిగిలేది బూడిదే! వృద్ధాప్యం వీధి చివర అందుకునే ప్రతి చేయి కొత్త పదాలు నేర్చుకుంటుంది సరికొత్త అర్థాలు తెలుసుకునే లోగా వీధి మలుపు తిరిగిపోతుంది!! శైలజామిత్ర శ 91

చివరి వీడ్కోలు నీరంతరం నేను ఆలోచించేది మనసును పట్టించుకోని శరీరాన్ని గురించే... కాదని వెళ్ళిపోతున్న మనసుల్ని గురించే నన్నే అంటిపెట్టుకున్న అథువుల గురించే... నన్నడిగితే మృత్యువంత ఏకాంతం ఎక్కడుంది? సమాధంత సొందర్యం దేనికుంది? మృత్యువుకు జాతిలేదు... మతం లేదు ఎవరి వరమూ పనిచేయదు... వేరెవరి శాపమూ ఫలించదు... అయినా దానికెందుకింత ఆలోచన..? శరీరాన్ని విడిచివెళ్ళేందుకు ఎందరో ఆవేదన. ? ఏ అర్థరాత్రివేళ్లో ఎవరూ లేకుండా ఒంటరిగా కన్నీళ్ళతో తలగడను తడిపేస్తున్న మనిషికి ఏ వైద్యం పనిచేస్తుంది ఒక్క మృత్యువు తప్ప .? ఏ అస్థి ఆదరిస్తుంది ఒక్క మనసు తప్ప... !! మృత్యువు రూపం ఎలావుంటుందో ఎవరెవరిని ఎందుకు ఆక్రమిస్తుందో

౮2 ఫా రాత్రి చిగుళ్ళు

కొందరిని ఎందుకు తాత్కాలికంగా వదిలేస్తుందో... తెలియకున్నా... అందరి అలజడిని మాత్రం ఆపేస్తుందన్నది నిజం...!! మృత్యువుకు దారి ఒకటే అయినా ట్రాఫిక్‌ జామ్‌ వుండదు ఆత్మీయుల కన్నీళ్ళతో స్నానించిన ఆ ప్రయాణానికి అలుపు వుండదు అలసిపోయిన జీవితానికి దొరికిన ఒక మలుపు అర్ధంకాని హృదయాలకు ఒక మేలుకొలుపు .. బతికున్నంతకాలం మనిషి మృత్యువుకు కాటికాపరే... మనసున్నంతకాలం మృత్యువు మనిషికి కాపలాదారే... మృత్యువంటే శరీరానికి సంబంధించిది కాదు మనసు ముక్కలయినపుడే మృత్యువు మనల్ని చేరినట్లే శ్మృశానమంటే నిశ్శబ్దాన్ని అలుముకున్నది కాదు ఎవరూ లేరని తెలిసినపుడే శృశానంలో మనం వున్నట్లే... అందర్నీ ప్రశ్ళూంతంగా వుంచే ఈ మృత్యువుకు ఆదరణ లేదు .. భయం తప్ప... శరీరంలోంచి పోతున్న ఆ ప్రాణానికి రంగులేదు... ఒక్క కదలిక తప్ప.... జీవితంలో చివరి వీడ్కోలు అంటే అది ఎంతో విచిత్రంగా వుంటుంది. . పుట్టుకకే అర్ధంలేని సమయం వచ్చినపుడు బతికే కాలం మరింత బరువైనపుడు మంచితనం కూడా మంచులా కోస్తున్నపుడు (ప్రేమించే హృదయాన్నే (పేమను గూర్చి అడిగినపుడు జీవిత రహదారిలో గుండెను ముళ్ళతో నిరంతరం గుచ్చుతూ ఆఖరి క్షణాలవైపుకు మనిషిని నడిపిస్తాయి... శైలజామిత్ర + 93

మృత్యువు సమీపించినా, సమీపించకున్నా..., మనసును తెలుసుకోలేని మనిషి ఎపుడూ బతికున్న శవమే .. ఎవరినీ అర్ధం చేసుకోలేని మనసు ఎప్పటికీ ఆరని గాయమే... అయినా ఎవరికి తెలియదు ఈ మృత్యువు తీరు ఎవరికీ ఏమీ కాకున్నా అందర్నీ అక్కున చేర్చుకుంటుంది

9డ్తే ఛా రాతి చిగుళ్ళు

భవిష్యత్‌ దృశ్యాలు క్కడ చిరకాలపు స్నేహాల చిరునామాలు లేవు చిరుధరహాసపు పరిచయాలు కనబడవు ఉదయాన్నే పలకరించే పిట్టకూతలు వినబడవు మనసారా ఆదరించే కంఠస్వరాలు లేవు మనిషి ఆవేదనలను దాచుకుని కాపాడే గుండెలేదు పరుగులు తీసే సమాజ అసంగతాలు అనురాగాన్ని అమ్మకానికి పెడుతున్న అరచక పరాచికాలు గుండె బరువును మోయ వీలులేని విచిత్ర జీవన గతులూ చెత్తకుండీ చుట్టూ పడివున్న చెత్తలా చిందరవందరగా చెల్లాచెదరవుతున్నాయి మనిషి ఒక పగటి వేషగాడు నటనే తప్ప ఆ నోటినుండి కమ్మని పాట వినిపించదు నిలవడానికి నీడలేకున్నా అనంతాకాశంలో ఆచూకీ కోసం అయినవాళ్ళ ఆనవాళ్ళనే కోల్పోయి ఆదమరచి నిద్రిస్తున్న అనుబంధాలకు బాధ తెలియదు... ఎతైన కొండలలో వినిపించే ప్రతిధ్వనుల మధ్య కనబడని పక్షి గూళ్ళు... శైలజామిత్ర + 95

వినబడని కోయిల గానాలు ప్రత్యక్షమవుతాయి వినబడని హృదయఘోషల నడుమ కనిపించే సూర్యచంద్రులు వినిపించే గాలి అలలు అంతరించిపోతాయి దరికిరాని సూర్యోదయాన్ని తరచి చూడలేని చంద్రబింబాన్ని చేతికందని నక్షత్రాల్న అందుకోలేని అనురాగాన్ని కరుణించని మానవత్వాన్ని సృష్టి రహస్యాల్ని అన్నింటినీ మనిషే ఊహించగలడు .. నీజం కొంత, అబద్ధం మరింత నిరాశ కొంత, ఆశ మరింతతో నిరంతరం రెండు నాలుకల మధ్య ఊగిసలాడే హృదయం దేన్నీ గమనించకుండా గడచిపోయిన తేదీలను మాత్రమే గుర్తుచేసుకుంటూ, హింసించుకుంటూ తూలనాడుకుంటూ... ఎవరికంటే ఎవరు గొప్పని బేరీజు వేసుకుంటున్నా కనబడేది ఒకటే అదే మనల్ని మనమే నమ్మలేని తనం అందరికీ అందరూ కావలసిన వాళ్ళే... అంతులేని ఈ ప్రపంచంలో చదరంగపు పావులే.. మనిషికి, మనసుకు మధ్య మారిపోయేవి భవిష్యత్‌ దృశ్యాలే... అందుకే... సమాజంలో హాస్యం బతకకున్నా ఇతిహాసం జీవించే వుంటుంది శిధిలాలు కంటికింపు కల్లించకున్నా చరిత్రకోసం నిలిచే వుంటుంది 96 ఛి రాతి చిగుళ్ళు

బతికివున్న నురణం

నువ్వ నన్ను గుర్తించలేదు కానీ

నేనింకా బతికే వున్నాను

నువ్వ నన్ను పలకరించలేదు కానీ

నేనింకా మాట్లాడుతూనే వున్నాను

చనిపోయింది నేను కాదు నన్ను చంపినవాళ్ళు

నీలినీడగా మిగిలింది ఆ తాలూకు ముళ్ళు

నేను నేరపరిశోధకుడిని కాను

పోలీసులు పంపిన గూఢచారిని కాను

నీకునువ్వే నిప్పుపెట్టుకుంటే

నీ అతి తెలివికి సమ్మోహితుడ్ని కాలేను

నిత్యం నీరెండలో, వానలో, మంచులో

మానవారణ్యపు జాడలలో

తిరిగి తిరిగి అలసిపోయిన బాటసారిని కాను

ఒకప్పుడు అవేశంతో

సముద్రుడు కౌగలించుకున్న

మానవమృతదేహాల తాలూకు ఆనవాలును కాను

జాతీయ జెండాలో రంగులు వెలవెల పోయాయనో

రవిచంద్రుల ఆగమనంలో ఆలస్యం అవుతోందనో

ఏ కాలో చెయ్యో విరిగిందనో...

ఏ మనసో నలిగిఫోయిందనో..., చెదిరిందనో

కలవరపడిపోతున్న మౌనాన్ని కాను

దెబ్బతింటున్న దేశపు ఛాతీనుండి వచ్చే రక్తం తాలూకు ప్రవాహాన్ని

అరికట్టాలని తెల్లని దారాన్ని తెచ్చే నాయకుడిని కాను శైలజామిత్ర + 97

మట్టినే నమ్ముకుని మట్టిలోనే పెరుగుతూ ఆ మట్టిలోనే సజీవ సమాధి అయిపోతున్న రైతును కాను నేను బతికి వున్నపుడు అందరూ బాగానే వున్నారు అందరూ నాలాగే ఆలోచిస్తున్నారనుకున్నాను ఇప్పుడు తెలిసింది ప్రతి మనిషి నడకవేరు.., నడతవేరు.., ఆలోచన వేరు.. ఆచరణ వేరు.... భుజానికి ఆనుకునివున్న మృత్యువు ధూళిపారల్ని తొలగించుకునే ప్రయత్నంలో బతికే విధానం వేర్వేరు క్షణాలు పూయడం లేదని చెట్లను నరికివేసే నవనాగరికపు నీలినీడను కాను పులిచర్మంపై చారలు వున్నాయని దాని చర్మం వొలిచి బట్టలు కుట్టించుకునేటంత ఆశావాదిని కాను... ఈ రోజులే వేరు... ముఖానికి మనసుకు వున్న రూపం వేరు క్షణక్షణంలో కనబడే దృశ్యాలు వేరు అప్పట్లో ఆకాశంలో నక్షత్రాలు నవ్వుతూ పలకరించేవి ప్రతి ఇంటిని ఆనుకుని అనుబంధాలుందేవి మూసిన తలుపుల్ని మొక్కలు కాపలాకాసేవి ఇప్పుడు ఎక్కడికక్కడ ఖండఖండాలుగా దేహాలొకచోట, దేశాలొకచోట మనసులొకచోట, మనుషులొకచోట, నగరమైనా, పళ్లెయినా మనుషులున్నా, నిర్మానుష్యంగా వున్నా ఆయుధాల ధ్వనితో కళకళలాడిపోవాల్సిందే శవాల గుట్టలు మరుభూమిని తలపించాల్సిందే ఎక్కడుంది సంపూర్ణత్వం..? అశాంతితో... అవిశ్రాంతితో కన్నీళ్లతో... కష్టాలతో పగలూ, రాత్రీ ఏదో సంఘర్షణతో

98 ఈ రాతి చిగుళ్ళు

ప్రతిరోజూ పలకరించే రక్తచిత్రాలతో నిండిన జనారణ్యపు కధ మరచిపోలేని వ్యధలా వుంది తెరచివుంచిన గుండెలన్నీ కలవరింతల గాధగ్గా మిగిలింది ఇప్పుడు తొడుగులేని ముఖంలేదు ముసుగులేని మనసులేదు ఆవేశంలేనిదే ఆశయం లేడు... ఇవన్నీ చూస్తున్న నేను పోగొట్టుకున్నది నా మనసును కాదు. నేను కాదంటున్నది మీ వునికిని కాదు ఒక సూర్యోదయాన్ని ఒక సూర్యాస్తమయాన్ని ఆశాంతం చూడలేని మీ అసక్తతకు జాలిపడుతున్నాను ఒక పుట్టుకను, ఒక చావును అర్థం చేసుకోలేని మీ అజ్ఞానానికి ఆవేదన చెందుతున్నాను ఇంటి ముందున్న పూలమొక్కల క్రమశిక్షణను (గ్రహించలేని మీ నిర్లక్ష్యానికి కన్నీళ్లు పెట్టుకుంటున్నాను నిత్యం సూర్యకిరణాల్ని తట్టిలేపే పక్షుల అరుపులతో ఉన్న సృష్టి రహస్యాన్ని పట్టించుకోలేని మీ సోమరితనానికి వెక్కివెక్కి ఏడుస్తున్నాను... అయినా నేను ఇంకా బతికే వున్నాను మీరు లేననుకున్న మీలోనే వున్నాను నేను లేకున్నా మీ అందరిలో మేల్మొనే వున్నాను కానీ... మీరందరూ వున్నా ఒక్కరిలో కూడా జీవించలేని మీ పిరికితనానికి జాలిపడుతున్నాను అయినా నా చేతికర్రతో హెచ్చరిస్తున్నాను అవసరమైతే సొమ్మసిల్లిపోయిన శాంతి పావురాన్ని లేపి మంచం పట్టిన అహింసను కూర్చోపెట్టి సాధించిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోకుంటే తెరచివుంచిన కిటికీ గుండా వచ్చే చల్లని గాలితో పాటు

శైలజామిత్ర శ 99

బతికివున్న ఒక మరణంలా మిగిలిపోయి స్మృతిలో మెదిలే గాంధీలా కాకుండా ఆధునిక చరిత్రలో ఎవరికీ అర్ధంకాని ఒక తాతలానే తొలిపోతాను....

100 + రాతి చిగుళ్ళు

చెబితే వినరు కానీ... చెవీతే వినరు కానీ. . తెలుగు ఎవ్వరూ మాట్లాడటం లేదిప్పుడు ఏదో ఒకరో ఇద్దరో అంటే వారు అంటరానివారే ఇప్పుడు తప్పలు తదకలైనా ఆంగ్రమే మాట్లాడాలెప్పుడు... బలవంతపు బానిసత్వం అంటే బహుశా ఇదేనేమో. . కులాలెన్నైనా, మతాలెన్నున్నా...., వాటికి కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు... పాపం...!! రెక్కాడితేగాని డొక్కాడని బతుకుల ఆకలికి ప్రత్యేకంగా భాషలేదు అందుకే మరి... సరికొత్త భాషగా మనిషే ఒక బాంబుగా మారుతున్నదే అరుదైన భాషగా మిగులుతోంది... మమ్మీగా అమ్మ మారినప్పుడు దాడీ డబ్బాలో నాన్న దాక్కున్నపుడు అంటీ.. అంకుల్‌ చట్రంలో మనకు సంబంధించని (ప్రతి పుట్టుక ఇరుక్కున్నపుడు అవి తప్ప చెప్పడానికి మా గురువులకే రానప్పుడు ఒకవైపు తెలుగు రాక, ఆంగ్లానికి అంతుచిక్కక ఏ భాష మాట్లాడాలో తెలియక...

శైలజామిత్ర శ 101

మూగ భాషే నయమనిపించే రోజు

రావడానికి పెద్దగా సమయమక్మ్తేదు మనకిప్పుడు...

చెబితే వినరు కానీ...

ఎంతగా కాదనుకున్నా కన్నతల్లి

బిడ్డలను (ప్రేమించే మంచుబొమ్మే...

అలాగే తాత్మాలికంగా ఎవ్వరు మాట్లాడకున్నా

అన్ని భాషలకు మాతృకయిన

తెలుగుతల్లి ఎప్పటికీ సజీవ శిల్పమే.. .

జనం పెరగటం మానలేదు

దేశంలో పచ్చదనం పోలేదు

పసితనపు రూపంలో మార్పులేదు...

వృద్ధాప్యంలో తేడాలేదు

శరీరాకృతుల్లో కొత్తదనం లేదు

సరస్సులు, నదులు, సముద్రాలు, ఎడారులు,

పొలిమేరలు, విభేదాలు, అంతరాలు,

అంతర్యాలలో ఏమాత్రం కదలిక లేదు

ఎంతటి శబ్బమయినా నిశ్శబ్దాన్ని ఛేదించలేదు

అయితే ఇందులో ప్రతి అంశం భాషతోనే ముడిపడివుంది

మనిషికి మనిషికి మధ్య భాషకు పరిమితులున్నా

మౌనానికి మాత్రం మాతృభాషే వుంటుంది...

చెబితే వినరు కానీ...

బుతువులు, మాసాలు, సంవత్సరాలు అన్నీ

ప్రకృతిలో వచ్చే సహజాకృతులే...

దేశాలు, దేహాలు, మనుషులు, మనసులు, అన్నీ

తెలుగు భాషతో ముడిపడిన బంధాలే...

కురిసే వాన చినుకులో ఎంతో స్వచ్భతవుందో...

సెలయేటి స్వరాలలో ఎంతటి మార్దవం వుందో 102 ఈ రాతి చిగుళ్ళు

జన్మనిచ్చిన తల్లి ఒడిలో ఎంతటి వెచ్చదనం వుందో తెలుగుభాషలో అంతటి తీయదనం వుంది... తెలుగు తల్లిలో అంతటి వెలుగు వుంది... “ఎవర్చున్వు' అని అడగగానే 'తెలుగువాడిని” అనే సమాధానంలోనే జీవితముంది...!! మనిషిగా మనకు మనుగడవుంది...!! శైలజామిత్ర శి 103

రాతి చిగుళ్ళు ఆదీ అంతం లేదు జీవన యాత్రకు. . ఇరుకు సందుల్లోంచి విస్తరిస్తూ పోతున్న మనుషులకు మంచు తెరలు కప్పిన మాయా ప్రపంచానికి అనుభవాలు చెప్పిన పాఠాలకు అర్ధం లేదు వానలు సరిగా లేవనో పంటలు ఈ ఏడు నాశనం అయ్యాయనో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనో చీకట్లో వెదుక్కుంటున్న తీరుతెన్నులకు అంచనా లేదు మనసులేని మనుషులతోనో కదలలేని వస్తువులతోనో చెప్పడం అనేది ఎప్పటికప్పుడు కొత్తే మాకన్నట్లు నిశ్చలంగా చేస్తున్న గోడగడియారం చప్పుళ్లలో మార్పులేదు ఇక్కడ వస్తువుంది... కదలిక కావాలి ఇక్కడ ప్రయశ్నం వుంది ఫలితం కావాలి అనే నినాదంలో వ్యతిరేకత లేదు నీకు నేనొక వింత సీవు నాకెపుడూ కొత్తే... నీవు కన్పించగానే నిన్నెక్కడో చూసినట్లున్న నా చూపులకు వర్షించడానికి సిద్ధమైన దిక్కులపై అనురాగం విరిసినట్లున్న దృశ్యాలకు ప్రణాళిక అవసరం లేదు నేను నిరంతరం రాత్రి తరగలపై ఒంటరి పడవనై పయనిస్తూనే వున్నా చీకటి చివర్లలో తెల్లగులాబీనై 104 శ రాతి చిగుళ్ళు

ఆక్రోశిస్తూనే వున్నా నన్ను మరణం ఆహ్వానించదు వేటగాడు పొంచి వుంటాడని గూటిలో గువ్వ దాక్కోదు ఎపుడో ఒకప్పుడు గొడ్డలివేటు పడుతుందని కొమ్మ ఎదగటం ఆపదు రహస్యాలన్నీ బయటపడతాయని సూర్యబింబం సముద్రంలో దాక్కోదు ప్రపంచపు ముఖంలో మార్చువచ్చిందని నింగినేలల మధ్య మాలిన్యం అంటదని మండుతున్న హృదయంలో (ప్రేమ వుండదని నిత్యం పఠించుకుంటూ ముసుగుదన్ని పడుకుంటే సామాన్యుల అసమానత్వం ఊరుకోదు ఎసి గదుల్లో అనురాగం నిద్రిస్తోందని కూలివాని కూరల్లో విటమిన్లు లేవని బిచ్చగతై నడకలో నిరాశమాత్రమే వుంటుందని మనకు మనమే నిర్ణయించుకుని అవే శాసనాలుగా పరిగణిస్తుంటే ఎవరిసొత్తు ఈ స్వాతంత్ర్యం? అనిపించకమానదు ఊపిరి ఆడనంతవరకు ఊహల్లో విహరిస్తానంటే చీకటి దిగేవరకు చందమామను దాచేస్తానంటే మనకు ఎదురయ్యే కర్మఫలం మనల్ని ప్రశ్నిస్తూనే వుంటుంది ఇది జనారణ్యం...!! మొదలుకు మోక్షంలేదు చివరకు చిరునామా లేదు వీచే గాలులలో మాత్రం కధా తరంగాలు వినిపిస్తాయి ముందుతరాల అనుభవాలు హెచ్చరిస్తాయి వయసు ఎంత పెరిగినా విజ్ఞానం ఎంతగా విస్తరించినా బాల్యానికి మించిన గ్రంథంలేదు వృద్ద్ధాప్యానికి మించిన వాస్తవం లేదు ఎక్కడచూసినా బద్దలయ్యే అగ్నిగోళం ప్రతి హృదయం ఉద్వేగభరితం వైలజుమిత్ర + 105

మమాసముద్రం మనిషి జీవితం అన్నింటిని దరికి చేర్చే ప్రేమ ఒక శూన్యం కులమతాలు దరిచేరడమనేది జాతీయవాదం ధనిక పేద ఒకటే అవడం రాజకీయ అద్వైతం ఆధునికతను అరికట్టడమనేది మనలోని సంశయం అయితే ఎందుకీ ఆగ్రహం..? ఎందుకీ అసంతృప్తి...? ఎక్కడివీ రక్త చిత్రాలు...? ఎంతదాకా ఈ కన్నీటి ప్రవావాలు...? చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యే మానవసంబంధాలు? కదిలే కాలాన్ని ఎవరూ ఆపలేరు ఎగసిపడే కెరటాన్ని అడ్డుకోలేరు వికసించిన పుష్పరిమళాన్ని దాయలేరు పోయిన ప్రాణాన్ని తేలేరు అలాంటపుడు ఎందుకీ సాంకేతిక విజ్ఞాన పరిశోధనలు..? ఆగని ఈ ప్రయాణంలో ఎప్పటికప్పుడు కొత్తరాగాలతో ఇంతవరకు వినిపించని సంగీతం వినిపిస్తోంది చూడని దృశ్యాల్ని చూపిస్తుంది దప్పికవేస్తే కళ్లలో నీరుంది ఆకలి వేస్తే లోలోన బాధ వుంది అపుడపుడు కోరితెచ్చుకుంటున్న ఆవేదన వుంది అందమైన గుడిసెల్లా ఎదగని ఆలోచన వుంది మేల్మొనలేని శక్తి కొండంత వుంది ఇంటి ముంగిట ఉదయకిరణం ఒకటుంది అదే ఎప్పటితో నాతోడుంటుందనే నమ్మకం వుంది రాతిచిగుళ్ళలాంటి మనుషులమధ్య అంతా మాయ అనే నిజం వుంది అయినా ఏదో పొందాలనే తాపత్రయం నేలపై చిందే రక్తపు బిందువులో మానవచరిత్రను నేల రాసే అగ్ని వుంది వీటన్నిటికీ నాంది భవిష్యత్తుపై ఆశ వుంది...!

106 శ రాతి చిగుళ్ళు

ఉరి మనసు మడిస్నానం చేసి చేసి రాత్రిని జోకొడుతోంది... నిద్ర శరీరంతో చుట్టి చుట్టి వేకువను మేల్కొలుపుతోంది నిశ్శబ్దపు నిశిలో చిక్కుకున్న పక్ష్మి.. తన కిల కిలా రావంతో సృష్టికి సంకేతాల్ని అందిస్తోంది. వెలుగుకూ, చీకటికీ మధ్య వున్న సన్నని తెర కాలంతో పాటు కన్నెసాగసులను కాపలా కాస్తోంది... అకాశం మాసినట్లు చేస్తున్న కాలుష్య భూతం మూడోకంటికి తెలియనీకుండా అధికారంతో శుభ్రం చేస్తోంది ఎపుడో వేయాలనుకునే రోడ్డుకు ముందుగానే దారికడ్డంగా పోసిన కంకర నడిచే కాళ్ళను రక్తంతో నిలదీస్తోంది దేవుడే దిక్కని గుడిముందు అడుక్కుంటున్న ముష్టివాడి జీవితం నాగరికత నడుమ కొత్త నోట్లలా తళతళలాడుతోంది తప్పతాగి తూలుతూ అర్ధరాత్రి ఇంటికొచ్చిన భర్త అకృత్యాల్ని తెల్లవారకుందానే తులసి కోటలో కన్నీటి దీపం వెలిగిస్తూ ఆనవాలు దొరకకుండా భార్య కడిగేస్తోంది. హైటెక్‌ సింధూరాన్ని నుదుట దిద్దుకుని నగరం మృత్యుమాతను పిలిచి అత్యాధునికంగా అలంకరిస్తోంది... అందమైన అనురాగానికి వికృతమైన ఆనందాన్ని పంచుతూ తాత్మాలిక సుఖాన్ని వెదికే గుండె అశ్రువుల్ని నింపుకుంటోంది కదలలేని కాలాన్ని సాగదీసి కృత్రిమమైన క్షణాల్ని సృష్టించి గారడీల మధ్య నివసించే ప్రాణాలు ఊపిరిలేకుండానే సేదదీరుతోంది... బతుకు భారాన్ని మోయలేక మోయలేక నడిరోడ్డు కూడలిలో నిలబడి వుండగానే మనసును ఒక ఒడంబడిగా చేసుకుని చెదిరిన స్వప్నపు సంచుల్ని సరిచూసుకుంటూ తెల్లని కాన్వాసుపై కనబడేలా నల్లని చిత్రాన్ని గీస్తూ కనబదని దారానికి... ఉరిపోసుకుని తెలియని ద్వారాల వెంట జీవం వెళ్ళిపోతోంది...

శైలజామిత్ర శ 107

క్యాలెండర్‌ మారిపోతోంది...

క్యాలెండర్‌ మారిపోతోంది...

సంవత్సరం గడిచిపోతోంది.

ముఖంలో కొత్తదనం లేదు

మనసుల్లో మార్పులేదు...

బతికే విధానంలో మాత్రం ఆ ఒక్కరోజూ

కోరితెచ్చుకున్న చిరునవ్వు వుంది...

ఏ మారుమూలకో విసిరివేయబడ్డ మనసు

ఒక విషాద గాథను చెబుతోంది...

ఏ గాలికో... ధూళికో కొట్టుకుపోతున్న శిరస్సు

కన్నీటి కధను మోసుకొస్తోంది

ఐదు నక్షత్రాల ఆశ్రమం అగ్నికి ఆహుతి అవుతోంది. .

ఎపుడేం జరుగుతుందో తెలియకున్నా

రేపు అనేది రక్తపాతమవుతోంది...

అరమోడ్చుకనులతో స్వచ్చమైన సూర్యబింబం

నుదుట సింధూరంలా కనబడుతోంది...

సాయంసంధ్యలో మాత్రం ఉదయంలానే

హృదయం కూడా ఉరికంబం ఎక్కుతోంది

తలుపుచాటున కన్నీటి చారికల మధ్య

జీవితం శిలా సదృశమై నిలిచిపోతోంది... 108 + రాతి చిగుళ్ళు

అడుగు తీసి అడుగు వేయడమే జీవితమనుకునే ఆధునికతకు దారే దూరమవుతోంది “హాపీ న్యూ యియర్‌ అనే ఆంగ్ల్రపాటతో తెలుగు తారీఖు తన ఉనికిని కోల్పోతోంది ఇపుడు స్వచ్చమయిన నవ్వు ఆకాశంలో నక్షత్రమైంది పరిమళించాల్సిన పువ్వు స్వల్ప విరామం తీసుకుంటోంది కృషత్రిమత్వాల మధ్య జీవితం బలవంతంగా కదులుతోంది... 'పేమకు అర్ధం తెలియని గుండె స్థానభ్రంశమవుతోంది... అయినా... క్యాలెండర్‌ మారిపోతోంది సంవత్సరం గడిచిపోతోంది....

శైలజామిత్ర + 109

ఏ బొమ్మ గీసినా... ఏ బొమ్మ గీసినా అందులో మనిషి అంశే ఉంటుంది ఏ అక్షరాన్ని లిఖించినా దానిలో కవితాంశ దాగిఉంటుంది! వేగంగా నదించే జీవితం నుండే భావం బయటపడుతుంది అనుభవాల ఉలిరేఖల నుండే అనుభూతి చిత్రం వేల్లాడుతుంది! లోలోపల వేడి లేనిది దేహానికి అస్తిత్వం ఎక్కడిది? వ్యక్తిత్వపు ఆశల సాధనలో ప్రతి రోజూ శిల్పం అభినవంగా ఉదయిస్తుంది.. భయాన్ని దూరం చేసి, ధైర్యానికి తలుపులు తీసే అభియానం కవిత్వమై ఎదురుగా నిలుచుంటుంది..!! ఒకరితో ఒకరు మాట్లాడితేనే ఎవరో అర్ధమవుతుంది ఒకరితో ఒకరు కలిసి నడిస్తేనే తత్వం బోధపడుతుంది! క్షణాలన్నీ వృధా అయితేనే కాలం విలువ తెలుస్తుంది! పద పదాన్ని కలిపే గతం అక్షర జాలాన్ని వడబోసే భవిష్యత్తు కలగలిపితేనే చిక్కనైన కవిత్వం ఎదురవుతుంది! రేపు దొరకబోయే అమృతంకై మనిషి ఆరాటపడితే నిన్న నేడు, రేపు వాస్తవ స్వరూపం కవిత్వమవుతుంది! పచ్చదనం సృజనాత్మకతను జ్ఞాపకం చేస్తే సమాజ చలనం కవిత్వాన్ని వడబోస్తుంది! మనలో కవిత కనిపించని రోజు ఉండదు భావం రసవంతమై పలకరించని సమయం ఉండదు! (ప్రయాణంలో వెచ్చని సంకేతం కవి తత్వం! నిలకడలో సర్వదా సాధ్యం కవిత్వం!

110 + రాతి చిగుళ్ళు

ఏకాంతంగా నడుస్తుంటే

ఎవరైనా ఎక్కడికని ప్రశ్చిస్తే

అర్ధమవుతుంది!

కవి ఆ ఛాయలో కూడా లేదని!

ఏ దిశకు కూడా మానవతా ప్రకాశం లేదని!

కవితో పరిచయం,

కవిత్వంతో సహచర్యం

వివిధ క్షేత్రాలు దర్శించినంత శ్రేష్ట!

వర్ణం, జాతి, కులం, వర్గం లాంటివన్నీ

ఐక్యమై బలమై కవచమై, ఆకర్షణై నిలిస్తే

కవిత్వం ఒక్కటీ అమృతయానం చేస్తుంది!

దేహాన్ని దాటినా...

దేశాన్ని దాటి వెళ్ళినా

కవిత్వం ఉన్నంతవరకు

ఎవరి పాత్ర వారిదే!

ఏ ప్రమేయం లేకున్నా

ఆలోచనా సంస్కారంతో

కన్నీటి అగ్ని శిఖలతో

తరం తరం

సరికొత్త శక్తితో

కవిత్వం నవ్య సమాజాన్ని కోరుతుంది

కొత్త యుగానికి నాందీవాక్యం పలుకుతుంది! శైలజామిత్ర శ 111

ఒకచోట ఉండనే వుంది

ఇపుడు మనిషిలో మనిషి లేడు

మస్తిష్కంలో ప్రపంచం లేదు

మనసులో ఆలోచనలు లేవు

ఉన్నదల్లా ఒక్కటే...

ఏ నిమిషంలో ప్రాణం పోతుందోననే అవేదన..

ఇప్పుడు కులమతాలు లేవు

ఆశ, ఆశయాలు లేవు

ప్రయత్నం, మానవత్వం లేదు'

కనబడుతున్నదల్లా ఒక్కటే...

తుపాకులు మోసుకొచ్చే తీవ్రవాదులతో ఆందోళన...

ఇపుడు హృదయాలలో స్పందన లేదు

ఆర్జత, అనురాగం లేదు

అనుభూతి, ఆత్మీయత లేదు

ఎదురయ్యేదంతా ఒకటే..

జనారణ్యంలో మానవమృగాల సంవేదన....

గూడు, గుండె లేదు

మసీదు, మందిరం లేదు

ఖుదాలేడు.. భగవాన్‌ లేడు

వెంటాడుతున్నదంతా ఒక్కటే...

రక్తం రుచి మరిగిన రక్కసి మూకల తీరని తపన... 112 ఫీ రాతి చిగుళ్ళు

ప్రకృతి లేదు ప్రాణులు లేవు

పలకరింపు, పరామర్శ లేదు

గాలి, నీరు లేదు

మంచి, మమత లేదు

గుర్తువస్తున్నదంతా ఒక్కటే

బాంబుల దాడిలో ముక్కలైన మృతదేహాల వాసన...

అయినా

ఎక్కడో ఒకచోట వుంటుంది

ఒక పచ్చనిచెట్టు

పలచని నవ్వుతోనో... లేత కిరణంలానో

ఒక ఓదార్పు మెట్టు

ముగిసిపోయిన ప్రాణాలపై రాలే

ఒక కన్నీటి బొట్టు

ఒక సముద్రం... ఎగసిపడే కెరటం...

ఒక అరణ్యం... భయభయంగా తిరుగాదే సింయం...

శిలలో మార్దవం...

గ్రీష్టంలో చల్లదనం ..

నిదురప్తచ్చే హస్తం ..

అమ్మ ఒడిలో నిదురించేటంత వాస్తవం...!! శైలజామిత్ర ఉ+ఉ 113

నునసు ఒక మవూరణాయుధం సమయం మనిపికై నిరీక్షిస్తోందా మనిషే కాలం కోసం ఎదురుచూస్తున్నాడా అర్థం కాదు కానీ.... ఎప్పటికప్పుడు మనసు మాత్రం ఒక మారణాయుధంగా మారుతోంది నేలమీద నడిచే వాస్తవాన్ని కత్తుల బోనులోకి పంపి... అవాస్తవానికి కీర్తిశిఖరంపై అసనం కల్పించి పగలూ రాత్రి ప్రశ్చలవర్వం కురిపిస్తోంది ఆశయాల్ని ఆశలుగా చిత్రికరిస్తూ ఆనందానికి ఆవేదనకు ఒకే వేదిక కల్పిస్తూ అవ్యాజానురాగానికి అనుమానాన్ని జతచేస్తూ బతుకును రహస్య మార్గంలోకి పంపిస్తోంది పచ్చని గరికపై రాలిన మంచుబిందువుల్లా పగలబడినవ్వే పసిపాపలా పేదరికాన్ని పలకరిస్తున్న సూర్యకిరణంలా ఒకప్పుడు మనసు స్వచ్చంగా వుండేది ఇపుడు ఏమి జబ్బు చేసిందో ఏమో ఎపుడూ ఎదుటివారి తప్పులే చూస్తోంది అందుకు కారణం....

[1డీ ఫీ రాతి చిగుళ్ళు

మనసుకు వయసురాకపోవడమే అనిపిస్తోంది అయినా... మంచి మనసుకై కొత్తబాట మాయమౌవుతున్న మనిపికై వెదుకులాట అద్దుగా వున్న అసూయ, స్వార్ధపు ముళ్ళు తొలగించి స్తిమితంగా వుండాలనే (ప్రాకులాట వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలనుకుంటే ఆత్మవిమర్శ తప్పనిసరి... మనిషిని కాపాడుకోవాలనుకుంటే దూరంగా ఉండాలి ఆశల ఆకలి మనసు మల్లెలా వుండాలనుకుంటే తోడుగా వుండాలి నిజాయితి... అద్దం అంటే ముఖాన్ని చూపే గాజుముక్కక్షాదు అనురాగం అంటే అనుమానంపై వేసిన వంతెన కాదు అనుబంధం అంటే అందరూ కలిసి అన్నం తినడం కాదు ఆలోచన అంటే ఒంటరిగా కూర్చోవడం కాదు తరచిచూస్తే అన్నీ సమస్వలే... సమాజం మనం ఎలా చూస్తే అలా కనబడుతుంది... మనసుకూడా అంతే... బంధిస్తే తుపాకీగుళ్ళు కురిపిస్తుంది ప్రేమిస్తే పూలవర్షంలో ముంచేస్తుంది.....

శైలజామిత్ర ఈ 115

నేను నేనుగానే... ఆ దృశ్యాన్ని మనసు ముంగిలిలోనే వుంచదలిచాను ఏ కుంచె గీయలేని, గీయకూడని ఆ రక్తపాతాన్ని చూడనీయకుందా... నా బిడ్డను కడుపులోనే దాచివుంచాను . ఆ మారణహోమాన్ని .. గర్భశోకాన్ని చూడలేక వినలేక, మరచిపోలేక... మానవాకారాల వికృత చేష్టలు భరించలేక... నేను నేనుగానే వుండదలిచాను... బతుకు నడిబజారులో షోకేసు బొమ్మలా నిలబడి చాలీచాలని' బట్టలతో మెతుకుకై పోరాటం సాగించేకన్నా నేను అమ్మాయి పిలిపించుకోవాలనే ఆశను తుడిచివేసాను ఆరేళ్ళనుండి అరవై ఏళ్ళ వరకు ఒక ఆనందపు పావుగా బిక్కుబిక్కుమని బతికేకన్నా పిండ దశలోనే బ్రహ్మాండాన్ని కాదలిచాను (పేమ పేరుతో (ప్రేతాత్మలై వెంబడిస్తూ... పైశాచిక వృత్తులతో విగతజీవులయ్యేకన్నా (ప్రేమ పదాన్నే నా జీవితం నుండి తొలగించాలనుకుంటున్నాను పెళ్ళి పేరుతో తాకట్టుబొమ్మగా తలాడించేకన్నా కన్యగానే తలెత్తుకు తిరగాలనుకుంటున్నాను... సాఫ్ట్‌వేర్‌ భార్యగా ప్రింటింగ్‌ మెషీన్‌ అయ్యేకన్నా 116 ఛి రాతి చిగుళ్ళు

హార్డ్‌వేర్‌ గుండెతో బతికే విధానాన్నే ఎంచుకుంటున్నాను నిందల్నిమోస్తూ నివురుకప్పిన నిప్పులా బతికేకన్నా మండుతున్న కాగడానై ఆ వెలుతురులోనే జీవించాలనుకుంటున్నాను అనుమానపు చూపులమధ్య భార్యపదవి పొందేకన్నా ఆవమానాల మధ్య పుట్టింటిలోనే వుందాలనుకుంటున్నాను అవహేళనల మధ్య కోడలిగా మసిలేకన్నా అవరోధాల్ని జయించి అబలను కానని తెలపాలనుకుంటున్నాను అమ్మను అమ్మకానికి పెట్టేదశరాకుండా అమ్ములపొదినై దూసుకుపోవాలనుకుంటున్నాను అమ్మలో కూడా కల్తీ కనబడుతున్న ఈ రోజుల్లో ఆడజన్మనే తిరగరాయాలనుకుంటున్నాను....

శైలజామిత్ర ఉ 117

మనిషి - మనసు

మనుషుల్ని దాటుకుంటూ

అభిమానాన్ని చంపుకుంటూ

నవ్వుకుంటూ... నవ్వులపాలవుతూ

కనబడక... కనబడనీయక

కళ్ళుతుడుచుకుంటోంది ఈ సమాజంలో...

మనిషి

బాధల్ని దాచుకుంటూ

బరువుల్ని పంచుకుంటూ

బాల్యాన్ని తలుచుకుంటూ

నవ్వలేక... నవ్వించలేక

నిలవలేకపోతున్నాడు... ఈ సంసార సాగరంలో...

మనసుంటే మనిషి బతకలేదు

మనిషంటే మనసు భరించలేదు

ఉలిక్కిపడ్డ ఉల్కలా వుంది జీవితం...

వర్షపు చినుకు కోసం తపిస్తున్న చెట్టులా వుంది వాస్తవం

ఇప్పుడు నవ్వుకునేందుకు పలువరుస అక్కరలేదు

మనసారా ఏడ్చుకునేందుకు కళ్ళే అవసరంలేదు

ఎదుటివారిపై నిందలు మాపేందుకు ఆలోచనతో పనిలేదు

తనకుతానే మురిసిపోయేందుకు వయసుతో నిమిత్తంలేదు 118 శ రాతి చిగుళ్ళు

ఇవి మానవ స్వైర్య అనుభూతులు మనసును మట్టిముద్దను చేసే ఆటలు నిలబడవని తెలిసి సమయాన్ని నిర్దేశించే నిర్ణయాలు ఎప్పుడు నేల రాలిపోతామో తెలియని మడిమిడిజ్ఞానాలు పుట్టినపుడు ఒంటరితనమే గిట్టినపుడు ఒంటరితనమే అంటారు కానీ... మనిషి బతికినంతకాలం ఒంటరివాడే మనసున్నంతకాలం బాధాలోలుడే... శైలజామిత్ర స 119

మాటలు వినబడుతున్నాయి అన్యాయంలో అన్యాయంగా అవసరం నుండి అవసరం వరకు అనాలోచితంగా అనూహ్యంగా నిముష నిముషానికి, క్షణక్షణానికి అక్షరం అక్షరం ఆనవాలు లేకుండా వచ్చీరానీ మాటల్ని మూటలు కట్టుకుని కాసులతో తూకం వేస్తూన్నాయి ఆలోచనలలో డబ్బు చెట్టును నాటి దాన్ని పెంచడానికి నీటికి బదులు కన్నీటిని తాగుతూ ఆశల పడగలు సాచి సమయాన్ని చేతిసంచిలో దాచుకుని మేడలపై మేడలు కట్టి గుండెల్ని వేలంపాటపాడి... నకిలీ నగిషీలలో మాటల్ని దాచుకుంటున్నాయి అక్షరాల్ని అమ్ముకుంటూ మారణాయుధాల్ని మార్చిడిచేసుకుంటూ అసూయ మంటల్లో కలిసిపోతూ... మోసాలకి చేరువవుతూ పదాలు పలకలేని పసితనం నుండి... స్వరాలు వినబడని వృద్ధాప్యం వరకు ఉచ్చారణరాని ఆటవికుల్లా మాటలు ఈటెల్లా వాడబడుతున్నాయి. అణగారిన శక్తులన్నీ కలసి విభజించి పాలిస్తూ పాతబడిన రూపాల్ని ఎప్పటికప్పడు మార్చుకుంటూ స్వార్థం రెండంచుల మస్తకంతో ఆకాశానికి ఎగసిపడుతూ దిశదిశల్ని సంకుచిత పరుస్తూ మాటలు నిప్పులు కక్కుతున్నాయి కీర్తికిరటాలకు లొంగిపోయినవారున్నారు

120 శ రాతి చిగుళ్ళు

డబ్బుసంచులకోసం ఆత్మను అంతమొందించినవారున్నారు వాడిసూది మొనకోసం మానవత్వాన్ని మంటకలిపినవారున్నారు పలకరిస్తేచాలు (ప్రేమించానని మాటలతో మాయచేసినవారూ వున్నారు మాట మంత్రమౌవునోకాదో తెలియదు కానీ... మాట యం(త్రమన్నదిమాత్రం నిజం... మాట అవసరమో కాదో తెలియదు కానీ మాటకు మాట చేదు మాత్రన్నది నిజం .!! ఒక్కమాటతో మైమరిపించినవారున్నారు ఒక్కమాటతో మట్టిలో కలిసినవారున్నారు... అందుకే...! మనుషుల నాలుకను ఖాల్లీ విస్తరిని చేయక నీ మాట నువ్వు నిలబెట్టుకో... పదిమందిని ఆడిపోసుకోవడానికే కాకుందా ఒక్కరినైనా దీవించేలా చేసి పదికాలాలు ఏలుకో... శైలజుమిత్ర శ 121

ప్రీ ఏకాక్షరం కాదు ఉదయించిన సూర్యబింబం తూర్పు తరుణి నుదుట సింధూరమై కొండ కొనల నుండి తల్లి పిలుపు వినిపించినట్లు ఇసుక తిన్నెలనుండి (ఢేమ వెల్లువ ముంచెత్తినట్లు కంటికి మింటికి కనిపించని దారమంత అనుబంధంలా మనసుకు మనిషికి మధ్య అల్లినట్లుంది స్త్రీమనోరంజనం అనుగ్రహించిన అమ్మనుండి మొదలై అవహేళనలకు గురిఅవుతూ ఆవేదనల రెప్పల అంచులపై బరువుగా వాలిపోతూ అనంత విశ్వంలో అందని ఆలాపనై అడుగడుగునా వినిపించే అపనిందల చంద్రిక అయోమయంగా సుషుప్వ్యవస్థలో నడుస్తున్నట్లుంది ్రీజీవితం..!! బాల్యం, యౌవనం, ప్రాఢత్వం, వృద్ధాప్యం నాలుగు ధ్వజస్తంభాలై కాపలా కాస్తూ (ప్రతి అణువునూ పులకింపచేసే వెలుగువాకిళ్ళలో బారులు తీరిన పూలదండల మాలల్లా... దివ్యానుభూతిని అందిస్తున్న ఆకాశంలా సాలెగూడులో స్వప్నబంతిలా వుంది ప్రీతేజశ్చక్రం...!! కమ్మని నిదుర జారిపోయి మేలుకునే లోగా కళ్ళుతెరచి కపటాన్ని గుర్తించి మాట్లాగేలోగా

122 రాతి చిగుళ్ళు

ఆలోచనలు ఆవిర్భవించి అడుగుతీసి అడుగువేసేలోగా

పాదరసపు గుళికల్లా జారిపోతున్న (ప్రేమాంశలు

నిరాశామయమై జీవనవలయాన్ని అతిక్రమించేలోగా

కన్నకలల్ని కోల్పోయి కన్నీటికి ప్రతీకగా మారుతోంది స్రీవైశిష్టం...!

తల్లిపిలుపులో... తండ్రి పలుకులో

బిడ్డ నవ్వులో... ప్రియుని వలపులో

భక్తిలో, రక్తిలో, ఆశలో, ఆశయంలో

నిరంతర నామస్మరణలా సొగే నాదలహరిలా

అంతర్భాగాన జలధి తరంగాల్లా ఎగసి ఎగసి

సుఖ దుఃఖాత్మక సర్వస్వాన్ని బింబిస్తోంది ప్రీ బెన్నత్యం...!!

ఒకచోట మోసం... ఒకచోట దౌర్జన్యం...

ఒకచోట నమ్మకద్రోహం... ఒకచోట అన్యాయం...

కళ్లముందు సమాజం.. వెనుక అసహజం

వీటి మధ్య నిశ్శబ్దం సుకుమారం

అలజడి చెందుతున్న అతివలకు విశ్రాంతి ఒక పదం

సమాజాభ్యుదయానికి మొట్టమొదటి ఆశారూపం స్త్రీ జననం...!!

ఇంటికి ఇంతి కాంతి అయినా...

పుట్టింటిలో పూబంతిగా... మెట్టినింటిలో మైనపువత్తిలా

బాధల్ని ముడిచిన పొట్లమై గుండె అంచుల్ని మెలితిప్పుతూ

మొగలిరేకుల్ని మొహమాటంగా ధరిస్తూ...

నైరాశ్యంగా నీటిబిందువుల్ని నేలరాల్చుతూ

ప్లాస్టిక్‌ పలకరింపులతో సంధించిన ప్రశ్నలావుంది స్త్రీ స్వాతంత్ర్యం...!!

నదీజలాలు ఎంతటి గంభీరమైనా చేతనలో స్త్రీ ఆకారం.

అవని ఎంతటి సహనంగా వున్నా యోచనలో స్త్రీ నియమం

కన్నవారిని, బిడ్డల్ని అయిదవతనాన్ని ఒడిని నింపుకుని

చేస్తున్న ప్రీ ప్రయాణం ఒక ఫలాకృతం..!!

అందానికో, ఆరాధనకో, ఆహారానికో, ఆహార్యానికో ఎక్కడికైతేనేం?

మనోస్పర్శలోనే మౌనంగా వుండిపోతోంది స్త్రీ శాంతం... శైలజామిత్ర శ 123

అందుకే...

స్త్రీ ఏకాక్షరం కాదు

సకలచరాచర సృష్టికి కరతలామలకం

కదిలే జనప్రవావినికి సాక్షీభూతం

అగ్నికి ఆహుతిచేసినా... నెత్తుటితో స్నానం చేయించినా

కోటి కాంతి వత్సరాలలో దొరకని నీ ఉనికికి (ప్రతిబింబం...!! 124 ధి రాతి చిగుళ్ళు

నిశ్ళబ్దం

(వా నేను మాట్లాడలేని నా జీవితంలో ఒక మనసు విరామం...! నేను చూడలేని ఈ సమయంలో నేనే ఒక నిశ్శబ్దం...!! ఒక గుండె తన స్పందనల మధ్య ఆశ్చర్యం...! ఒక స్వరం తన పాటను తానే కోల్పోయినంత విషాదం...!! మనం అనుకున్నదే ఎదురైనపుడు కలిగే భావఠీవ్రత భాషాతీతం...! అవసరం లేదని నిర్ణయించుకున్నప్పుడు పలకరించే నవ్వు ప్రశ్నార్థకం....!! నీ కోసం అనేవారు దూరం అవుతున్నపుడు కలిగే ఆవేదన వర్ణనాతీతం... నాకోసం ఎవరు అనే వెదుకులాటలో మనిషి ఒక నిలువుటద్దం...!! అయినా ఏది నిజం...? ఏది అబద్ధం...? తెలియకనే జీవితం సమాప్తం...!!

శైలజామిత్ర శ 125

అక్షరం

చ్‌

(మ రెండక్షరాలే.. కానీ...

అవి రాస్తాయి జీవితమనే (గ్రంధాన్ని...

పెళ్ళీ రెందక్షరాలే.. కానీ

అవి నిర్ణయిస్తాయి ఆయుఃప్రమాణాన్ని...

మనిషి మూడక్షరాలే.. కానీ

అవి చూపుతాయి మారణహోమాన్ని...

మనసు మూడక్షరాలే.. కానీ

అవి తెలుపుతాయి మమతల సుగంధాల్ని

మానవత్వం నాలుగక్షరాలే... కానీ

అవి వెతుకుతుంటాయి తన స్థానాన్ని...

దానవత్వం నాలుగక్షరాలే.. కానీ

అవి ఆక్రమించుకున్నాయి ప్రపంచాన్ని...

అక్షరానికి ఆదిగురువు అమ్మయితే

అదే అక్షరానికి మలుపు అనురాగం

అక్షరానికి ఆలంబన భాషయిజే

అదే అక్షరానికి పిలుపు భావం...

పక్షులకు అక్షరాలు తెలియకున్నా

జంతువులకు పదబంధం లేకున్నా... 126 శి రాతి చిగుళ్ళు

వాటిని గమనించే మన కళ్ళలో అక్షరాలున్నాయి వాటిని తెలుసుకునే మన హృదయంలో అక్షర లక్షలున్నాయి అందుకే... మనం అక్షరాన్ని అలంకరిద్దాం... తెలుగుదనానికి కోయిల గానంతో స్వాగతించి వసంతబుతువును పల్లకిని చేసి తెలుగుతల్లిని పూజించుకుందాం... తెలుగుభాషను గౌరవించుకుందాం..!! శైలజామిత్ర ఈ 127

నా ఉనికి ఈ ప్రపంచానికి సున్న... రౌత్రి వేళ సూర్యునిలా ఇపుడు నా ఉనికి ప్రపంచానికి సున్న, రోజుకొక్క ఆశ్యర్యాల కనురెప్పల్లో మెరిసే చమక్కుల షామియానాలో ఇపుడు నేను ఉన్నా స్వాతంత్ర్యం హిమఘనమయి శాంతి కిరనం కనుమరుగయినప్పటి నుండి నాకోసం “నేను అనే పరదాని కప్పుకునే తిరుగుతున్నా అన్నం తింటే చందమామ వస్తాడని అమ్మ చెప్పినప్పటి నుండి దశదిశలూ హక్కుల్ని పొంది మరీ హామీల పత్రాన్ని చదువుతూనే ఉన్నా పెద్దతలల ఆశీస్సులను ఆశయాల్లా భావిస్తూనే ఉన్నా ఇది సంచలనాల నుండి సమస్యలను వెదుక్కునే సమయం కాదు పరివర్తన ఉన్మత్త శరీరంతో బతికి ఉందనే వాస్తవం లేదు... ఇపుడు కొమ్మకొమ్మకూ వేరు చేసే గాలి తత్వమే రాజనీతి పువ్వు నుండి పరిమళాన్ని దూరం చేసేదే సయోధ్యరీతి! ఎక్కడో గులాబీ కనిపిస్తుంది పక్కనే ఆశల ముళ్ళు తలెత్తుతుంది వేరెక్కడో అమృతభాండం అగుపిస్తుంది దానిననుసరించే అమ్ముల పొది కాపుకాస్తుంది పేదరికం అంటుంది. దారిద్య్రం అంటుంది దాక్షిణ్యం అంటుంది. కారుణ్యం అంటుంది 128 ఈ రాతి చిగుళ్ళు

పేటపేట తిరుగుతూ మూన్నాళ్ళ ముప్పేటల గొలుసు చూసినవారందరికీ ఒపికగా చూపుతుంటుంది నేడు ఏ స్థితీ సుషిప్తావస్థలో మలచబడ్డ స్వప్నం కాదు రైలు పట్టాలపై విసిరివేయబడ్డ ధూళిపొట్లపు దుమారం కాదు ! ఎక్కడా జడత్వానికి, ప్రాణతత్వానికి మధ్య తేడాలేదు ! అరచేతిలోనే అదృష్టానికై అర్రులు చాచుతూ అడుగులతో దారుల్ని కొలతలు వేస్తూ నడిస్తే మనం కేవలం మానవ యంత్రాలం ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నిలదీస్తేనే కొత్తగతి, సరికొత్త రుచిగా మారి అవుతాము యుక్తిశక్తులం !! మనకంటే వీధి దీపాలు, దారిపక్కన చెట్లే నయం (ప్రశ్న ఏదయినా ఒక్క '(శమి మాత్రమే వాటి సమాధానం నేడు చీకటి కంటకాలపైనే మానవతా పతంగం అస్త్రం, శస్త్రం, స్వయం, స్వార్థం పదార్ధం రేఖలపై భయాన్ని భ్రాంతిని నెత్తుటి బొట్లుగా మార్చుతూ కాలం చెల్లిన, సకాలం మూడిన ఇనపరేకులను బంగారంగా నమ్మించి కుర్చీలకై పొంచిఉన్న నక్కలకు ఓటు హక్కును మాంసం ముక్కలకై అమ్ముకుంటున్న వైనం మూలం కాదా ? ఒక్కపూట పానీయం కోసం పాపాలు చేస్తున్న పాట్లు మనవి కావా ? ఇప్పటికే మన కళ్ళు ఆకాశంలో ఎండిన బావులయ్యాయి అడపాదడపా బాంబులు, దాడులు వర్వం కురుస్తున్నా వెంబడే శిలాప్రతిష్ట చేసి కన్నీటి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి భీతిలేని ఎదలో అహింస చరణం నిలవలేదు రాజకీయపు నీతిలో కళ్యాణం జరగబోదు అయితేనేం? అనుకోకుండానో, కడుపుమంటతోనో కదనవీరులై కదులుతున్నారు ఆకలితో వీరులు !

శైలజామిత్ర +ఊ 129

అడవిలో ఖీతి చెందిన లేళ్లలా నడుస్తున్నాయి రోజులు ! అయినా నిర్మాణదశ మొదటి వరుసలో విలయస్థితి చివరి మెట్టుపై కాపలాకాస్తున్నాయి... నీ వైరం నింగినుండి, నా యుద్దం నేల నుండి ఏ యుద్దంలో గెలిచినా, ఏ వైరంలో వేరుపడినా అవకాశాలు శూన్యమయిన అంతరాలలో స్వతంత్రంగా బతికేది మనమే ! బతుకును బండలుగా మార్చుకుని సమాధులు కట్టుకుంటున్నదీ మనమే ! నీతిలేదు, నియమంలేదు అంతా వ్యాపారమే ! స్థిమితం లేదు. భద్రత లేదు మిగిలేది ఒక ప్రళయమే |! మన పిచ్చికాకపోతే..!! తలలన్నీ రోటిలో పెట్టాక ఎంత పెద్ద తలైనా పోయేది ప్రాణమే !! 130 + రాతి చిగుళ్ళు

ఇపుడిపుడే నాకు అరం అవుతున్నావు! య

గాన్నా!

సగానికి పైగా జీవితం గడిచాక

ఇపుడిపుడే నాకు అర్ధం అవుతున్నావు

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి

కలిస్తేనే ఒకరోజవుతుందని

స్వార్ధం, అసూయ, కపటం, అబద్దం

కలిగలిపితేనే నేడొక మనిషని

నిత్యం నువ్వు చెప్పినవి ఒక్కొక్కటి గుర్తొచ్చి

ఇపుడిపుడే నాకు అర్ధం అవుతున్నావు

ప్రశ్చలన్నయినా

సమాధానం ఒకటే ఉంటుందని

ఆత్మీయుల్లా ఎందరు కనిపించినా

అనురాగం ఒకటే మిగిలి ఉంటుందని

ప్రతి పలకరింపుకు అర్ధం

పల్లకీలో ఊరేగించడమేనని తెలుసుకున్నాక

ఇపుడిపుడే నాకు అర్ధం అవుతున్నావు.

నువ్వు అంటేనే ఆశీర్వాదం,

నేను అంటే శాపమయి,

ఏ ఎండకా గొడుగు పట్టడమే జీవితమన్నవారి

ఉనికినే ఊరవతల వదిలేసి

ఆశల పందిరికి చిల్లులు పడినా ఆశయాలవైపే నడవాలని

శైలజామిత్ర శ 131

నా ఆకలిని మరొకరికి అవకాశంగా ఇవ్వకూడదని

సగానికి పైగా జీవితం గడిచాక

ఇపుడిపుడే నాకు అర్ధం అవుతున్నావు

నా గుండెలో నిన్నటివరకు

నాకోసమే నేనున్నానని అనుకున్నాను

బతుకు సాయంత్రపు గూటిలో

కొడికట్టేదీపం తాలూకు నుసిని గుర్తించి

ఆ నుసి గతంలో వెలిగిన దీపం తాలూకేనని

ఇపుడిపుడే నాకు అర్ధం అవుతున్నావు !

ఎన్నో ఉదయాలు

ఎన్నెన్నో సాయం సంధ్యలు

మరెన్నో ఒంటరి రాత్రులు

పరిచయంలేని నడిరాత్రులు

కన్నీట మునిగినపుడు అర్ధం చేసుకున్నాను

నీకు నామీద (ప్రేమ నీడలా ఉందేదని..

ఇపుడిపుడే అర్ధం అవుతున్నావు !

ఈ జీవితానికి ఎందుకో

సరికొత్త పేజీలా ఉందీ పూట

తరచి చూస్తే నా పుటలన్నింటిలో

నీ ఆచ్భాదనలే ఉన్నాయి.

నిజం 1 నాన్నా!

నువ్వు ఏనాడైతే నన్ను వదిలి సుదూర తీరంలోకి పయనించి

నా కన్నీటి బిందువుగా మారావో

ఆరోజు నుంచే ఎవరికీ ఎవరూ ఏమీ కానట్లు

సాగిపోతోంది మనదైన ఇంటి నావ..!

నావ కదలాలంటే నవ్వులక్కరలేదు !

చేతిలో నువ్వలుంటేచాలని

జీవితం సగానికి పైగా గడిచిన తర్వాతే

ఇపుడిపుడే నాకు పూర్తిగా అర్ధం అవుతున్నావు ! 132 ఛీ రాతి చిగుళ్ళు

చిన్నప్పుడు నా పుస్తకాలలో నెమలీకలు పిల్లలు పెట్టాయంటే నువ్వు నమ్మలేదు ఇప్పడు చూడు నా బతుకు పుస్తకం మీద రంగురంగుల రెక్కలు రోజుకో అవతారంతో నాకు ఏమాత్రం సంబంధంలేని పిల్లల్ని తెచ్చి ఎలా పెడుతున్నాయో.! అయినా ఆనందమే నాన్నా! ఇప్పటికైనా నిన్ను అర్ధం చేసుకున్న నన్ను నాకే ఉంచి వెళ్ళావు !! శైలజామిత్ర శ 133

ఇంకా మెలకువగానే ఉంది గతం || గడిచిన గతుకుల రోడ్ల మీద శయనించిన నా తనువు మనసు ఇంకా సేదతీరనే లేదు.. అణువణువున ఆవేదన, నిలదీసిన నిరాదరణల మధ్య చేసిన గుండెవేగం ఇంకా ఆగనే లేదు... ఆవేశం, అనాలోచిత చర్యల మధ్య పోరాడి సాధించిన ఓటమి తాలూకు ఆనవాళ్లకు చిహ్నంగా తడిసిన రెప్పల్ని తుడిచిన చేతి రుమాలు ఇంకా తదారనేలేదు.. సమ సమాజ సమూహం ఎలుగెత్తి పాడిన అపనిందల గీతాలు నా వీనులను ఇంకా వదలనే లేదు... భారంగా గడిచిన రోజులు భయభయంగా నడిచిన క్షణాలు సందిగ్ధంలో సర్భుకున్న తలపుల ్రీనీడల్ని అనుసరించిన నిరాశ, నిస్ప్రహల నిగ్గులు ఇంకా తేలనే లేదు.. రక్తంతో తడిసిన 'పగిలు

134 థి రాతి చిగుళ్ళు

సగం కాలిన రాత్రుల ఛాయలు నన్ను ఇంకా వీడనే లేదు.. గత వర్షపు నిర్వీర్యమయన ముఖం నా వాడిలో తలపెట్టి పడుకున్న ఆ బంధం నా తలపై వేసిన ఆ చేతి వెచ్చదనం బరువైన శ్వాసతో, అదిరే చుబుకంతో వదలలేక వదిలి అశక్తత మంద్ర స్వరంతో పూర్తిగా వ్యక్త పరిచిందో లేదో.. అపుడే.. కొత్త మాయా క్యాలండర్‌ తేదీల తుంపర్లు కాలం కంపల్ని దాటుకుంటూ ఒకవైపు చలి, మరోవైపు ఆకలి ఆలోచనలతో లేమితనపు లిపిని గుర్తించేలోగా కొలమానం లేని చెర్రి సాయంతో కళ్ళముందుకొచ్చింది.. మనసున్న ఆపిల్‌ మాంత్రికుల నుండి మనిషి తత్వమే లేని నియంతృత్వం వరకు ఎందరో ఆత్మీయుల్ని ఆవేదనల్ని పోగొట్టుకుని ఇంకా మెలకువగానే ఉంది గతం ! అంతస్తుల ఆభరణాల్ని ధరించినా నల్లని పరదాల చాటున దాగిఉండి కళ్ళు తెరిచే ఉంది స్వప్నం !! అందుకే... భూకంపాలతో మేను ముడుచుకున్నప్పటి నుండి బాంబుల శబ్దంతో కళ్లు మూసుకున్నంత వరకు జ్ఞాపకాల ప్రాతిపదికపై భవిష్యత్‌ తెరిచి ఉంచిన గ్రంథంలా కనిపిస్తోంది స్పందించలేని సుగంథ రహిత సుమాలను ధరించి వర్తమాన వాకిళ్లకు కాపలా కాస్తూ

శైలజామిత్ర శ 135

పైరవీల సరిగంచుల్నిను కళ్ళకద్దుకోవడానికి మంచు ప్రమిదల్లో ఆశల దీపాల్ని మళ్ళీ మళ్ళీ వెలిగిస్తోంది...!! మానవ జీవితం మరో అంకెల అంకంతో చమక్కుల చుక్కలతో... మొగ్గుల ముగ్గుల్ని వేస్తూనే ఉంది ! జరిగిన విషయం విషాదమయినా వదిలి వెళ్లేందుకు విలవిల లాడుతుంది జరగబోయేది ప్రళయమయినా, నిజమయినా, అబద్దమయినా అంగీకరించేందుకు అలసత్వం అడ్జొస్తోంది ! ప్రపంచం తల్లక్రిందులయినా ఒక నర్గీస్‌, ఒక లైలా ఒక తానే లఅకంటే ముంచేసే మజ్నూ ఎదురయినా నిమ్మకు నీరెత్తనట్లున్న నైజం మన నైసర్గిక స్వరూపాలకు ఒక నిదర్భనం ! పరికించి చూస్తే... పరివర్తన ఒక్కటే ప్రపంచ నియమం !! అదే యుగాంతం !!

136 4 రాతి చిగుళ్ళు

జననమంటే !

యిన్నోసార్లు మరణించాక

ఇక కోలుకోవడానికేం మిగిలింది ?

ఇంకెన్నోసొర్లు తిరస్మరించాక

ఇక (ప్రేమనే పదానికి పుట్టుకేముంది ?

జననాలన్నీ చెత్తల్లో చీమలకు

మరణాలన్నీ మురుగు కాలువలకు

గుత్తాగా రాసిచ్చాక

ఇంక మహిళలకు ఉత్సవం ఎక్కడుంది ళై

గర్భగుడిలోనే ఛిద్రమయ్యాక

ప్రీ రూపానికి తావేముంది ?

కాపలా కుక్క కూడా

మగ పుట్టుకే కావాలనుకునే ధూర్తులలో

మార్చు వస్తుందనే నమ్మకం ఏముంది [7

బాల్యం, యౌవనం, పౌధఢత్వం, వృద్ధాప్యం

ఏ దశ అయినా, ఏ దిశ అయినా

అర్ధరాత్రి మాట దేవుడెరుగు

పట్టపగలైనా రక్షణేముంది ?

చెబితే వినిపించుకునే దిక్కేముంది ?

ఏకకాలంలో వినిపించుకునే స్వరాలయినా

అంతరాంతరాలలో నమ్మే మనసెక్కడుంది ? శైలజుమిత్ర శ 137

సతీసావిత్రి భర్తను కాపాడుకున్నా, సీత్ర భర్తను అనుసరిస్తూ అడవులకు వెళ్ళినా భర్త వచ్చేదాకా ఊర్మిళ నిద్రించినా తరతరాల కథలుగా ఆదర్భం అయ్యారే కానీ ఆధునికంలో స్త్రీ అర్ధంకాని ఒక గాధగానే మిగిలిపోయింది. ప్రీ కాలు కదిపితే కందిపోతుందనే మాట కవిత్వమయిందే కానీ కాళ్ళరిగేలా పనిచేయడమే నేడు జీవన విధానమయింది. కన్నతల్లయినా, చెల్లయినా, భార్యయినా, బిడ్డయినా కొమాంధుల కడుపులకు విందుభోజనంగానే మిగిలిపోయింది ఇక ప్రీ జనోద్దరణకు వ పాత్ర మిగిలింది ? మనం అనుకుంటాం కానీ ప్రతి జననమొక పూర్వ జన్మసుకృతమేనని నేడు స్తీకి జననమే ఒక మరణమయింది వంటింటి కుందేలు కాకున్నా వందేళ్ళ బానిసగానే మిగిలింది. పొద్దుపొడుస్తుంది. గాలి వీస్తుంది పువ్వుపూస్తుంది. పిట్టపాడుతుంది ఇవన్నీ వాటి స్వ లక్షణాలే అయినా సలక్షణమయిన జీతం లేని ప్రీ జీవితం మాత్రం అరణ్యరోదనగానే మిగిలింది కొత్త జననం కోసమే ప్రతి జీవి పరుగులు తీస్తుంది. సరికొత్త అడుగులు వేస్తుంది పిండదశలోనే పిండిపిండి చెయ్యబడేదే నేడు ప్రీరూపమయ్యింది. 138 రాతి చిగుళ్ళు

ఒక చల్లని సాయంవేళ

సముద్రపు అలల మీద పారాడే గడ్డిపువ్వును చూసినా

వెల్లకిలా పడిన ఆకును చూసినా

ప్రీ దృశ్యమే కదానిపిస్తుంది.

తెలుసుకుని తరచి చూస్తే

నీకు తెరచి ఉంచిన జీవిత గ్రంథమవుతుంది.

జననమంటే జనవాసం కోసం కాదు

జయించడం కోసం కూడా !

అందుకే నిత్యం జయించాననుకునే పురుషుని పేరు

జనాభాలెక్కల్లో మిగిలిపోయింది !

తరతరాలకు విజయబావుటా రెపరెపల్లో

భరతమాతగా ప్రీ జనుల గుండెల్లో నిండిపోయింది..! శైలజుమిత్ర + 139

జీవితం ఒకటే !!

వీథలన్నీ ఒకటే !

అన్యాయాల స్వావలంబనలో

అడుగడుగుకు అడ్డమొస్తున్న అనాఘ్రాణిత శిల్పాలెన్నో

బారులు తీరి అధికారిక నృత్యం చేస్తున్నాయి

అహింసకు దారికాస్తూ, హింసకు కాపలాకాస్తూ

అబద్దాల సొరంగం తవ్వుకుంటున్నాయి.

పోస్టరు పదవులయితేనేమి ? పెదవులయితేనేమి ?

ఆవు ఆకలి తీర్చుకుంటూ చక్కని అంచనా వేస్తోంది !

నాటకం ఒకటే !

ఎన్నిల్లీక అంతర్యుద్ధంలో పాత్రలు ఎన్నో !

అందని అందలానికై అర్రులుచాచే రహస్యాలు ఎన్నెన్నో !

ఒకరి విజయం మరొకరి పాలతలంపై నిలిచే రేఖలైతే

సుడిగాలి అయితేనేమి ? తుఫాను అయితేనేమి ?

నేలపై నినాదాల ప్రమాదాలను సృష్టి శిఖ శుభం చేస్తోంది !

విజయం ఒకటే !

జన్మనుండి మరోజన్మకు చేసే ప్రయాణం మధ్యలో

ఒక మనిషి పోషించేది ఒకటి కాదు పాత్రలెన్నో !

పాత్ర నుంది మరోపాత్రకు నడిచే మంచె పైకి అవలీలగా

కదలిఏ ఉద్విగ్నభంగిమల్లో ఎగసిపడేవి నిప్పురవ్వలయితే

రాత్రయికేనేమి ? పగలయితేనేమి ?

మరకలు పడిన మానవ హక్కులు మోదుగ పూలను తలపిస్తోంది ! 140 + రాతి చిగుళ్ళు

జీవితం ఒకటే !

శవం కూడా మరొకరికి తివాచీలు పరచాలనుకుంటే

భూమ్‌ కుచించుకుపోతోంది !

బతికుండగానే స్మారక శిలలకోసం భూమిని తవ్వుకుంటుంటే

ఆకాశమే సిగ్గుతో తలదించుకుంటోంది !

భమలయితేనేమి? సందేహాలయితేనేమి?

శతాబ్దాలు గడిచినా ..

రాజకీయపు ఎదారి నాలుకకు ప్రతి దిశ ప్రవాహమవుతుంది ! శైలజామిత్ర ఈ 14

వసంతంతో మానవత్వం

ఉదయిస్తున్న సూర్యబింబం ప్రశ్నిస్తున్న ప్రజలా వుంది

పొద్దువాలే సరికి మెరుస్తున్న నక్షత్రాలు

తీరని సామాన్యుల సమస్యల్లా వున్నాయి

రంగురంగులుగా స్వేచ్చగా ఎగిరే విహంగాలు

అధికారం కోసం నాయకుల వాగ్గానాల్లా ప్రతిధ్వనిస్తున్నాయి...

పగలైతే ప్రగల్భాలు, రాత్రయితే వినాశాలు,

కూలిపడే నిర్మానాలు, వికటిస్తున్న మరణహోమాల మధ్య

మనిషి జీవితం అనునిత్యం విషమక్షణాల్లో విభిన్న దృశ్యం

నేడు అలజడితో అశాంతితో పరుగులు తీస్తున్న అత్యాశల మధ్య

అద్దాల బీరువాలో దాక్కున్న ఉగాది ఒక అందమైన చిత్రం...

ఇప్పుడు కోయిల ఎప్పుడైనా పాడగలదు వసంతంలోనే కాదు

ఇప్పుడు మనిషి ఏదైనా మాట్లాడగలదు ఎవరూ లేనపుడే కాదు

ఇప్పుడు ఉగాది ఒక సందర్భం కాదు... ముహూర్తం మాత్రమే

ఇప్పుడు మనది ప్రజాస్వామ్యం కాదు... దౌర్దన్యం మాత్రమే...

నిన్నటి విషాదాన్ని తుడిచేందుకు నేడు ఉగాది వచ్చింది

నిన్న ధూళిలో కలిసిన అశాంతి నిద్రలేచింది

ఉగాది ఊహల్లో ఉగ్రవాదం ఉట్టికెగసిపడుతుంది

అశాంతి రెక్కలకింద దేశం ఒంటరిగా మిగిలిపోతోంది

రోజుకొక్కరు పదవికోసం తన రంగులు మార్చుకుంటున్నా కేడ్త2 ఛి రాతి చిగుళ్ళు

ఏదాదికొక్కమారు ఎదురయ్యే ఉగాది తన ఉనికిని మార్చుకోదు

ఐదేళ్ళకొకమారు కుర్చీఖాలీ అవుతున్నా

హైందవ సాంప్రదాయానికి ఏనాడూ ఉగాది లోటురానీయదు...

జీవితం అంటే నాటకం అవునో కాదో తెలియదుకానీ

మనిషి మాత్రం మారణాయుధం అనేది అర్ధమవుతోంది

జీవికకై ఆరాటం, వీథుల్లో పోరాటం, కత్తులతో సహవాసం,

కక్షలతో కాపురం అనేదే మానవనైజంగా మారిపోయింది

కుంటివాడైనా, గుడ్డివాడైనా, చెవిటివాడైనా, చెడ్డవాదైనా

కాలం ఎప్పడూ ఎవర్నీ గుర్తించకుండానే వెళ్ళిపోతుంది...

మనిషి పుట్టింది సమాజంలో చెట్టులా నిలబడిపోవడానికి కాదు

రాయిలా మౌనంగ వుండేందుకు కాదు

ఆవేదనలు అవమానాలు అవహేళనలు భరిస్తూ విచారించడానికి కాదు

సంస్కృతి శిఖరంపై నుండి దూకి ఆత్మాహుతి చేసుకోవడానికి కాదు...

ఎవరో శూన్యానికి వస్తురూపం తెస్తారని

వేరెవరో దారిద్ర్యాన్ని సుఖమయంగా మారుస్తారని

కులమత వివక్షలను తుడిచివేస్తారని...

కలలు కంటూ పాటలు పాడుకుంటూ

కనికట్టును, కల్లబొల్లిమాటలను వింటూ కడతేర్చుతారనుకోవడం

మండుతున్న సూర్యునికింద నిలబడి సీరు తాగడం లాంటిది

ఎందుకంటే ఆలోచనలేనిదే ఆచరణలేదు

అనుభవంలేనిదే జీవితంలేదు

ఆనందంలేనిదే ఆత్మీయత వుండదు

అందుకే లేవండి...!!

హృదయ కవాటాల్ని తెరచి

మీ కళ్ళతో చూస్తే కణకణలాదే నిజం మీకు కనబడుతుంది

రాజకీయమంటే రక్తసంబంధాల కూటమికాదని తెలుస్తుంది

అరుపుల చరుపుల సవాళ్ళ మధ్య నిరూపించుకునే నాయకలక్షణం శైలజామిత్ర శ 143

కాదు

వసంతం రాకుంటే ఉగాది రాదు

మానవత్వం లేకుంటే మనిషే కాడు

సమానత్వం మాటల్లో పనికిరాదు

మనిషితత్వం మరిచిపోజే మనుగడేలేదు... [44 సి రాతి చిగుళ్ళు

రి బ్నగ్జత్వం గుండె తలుపులపై నిదురిస్తున్న ఆ తలపు ఎప్పటికీ.., జీవితాన్ని చేరదనే చేదునిజం తలగదడకు తెలిసినంతగా నా మనసుకు తెలియకపోవడం నన్ననుసరించే ఆలోచనే.., కటికనేలపై కొంగు పరుచుకుని నిదురిస్తున్నా కన్నీళ్ళుసైతం నన్ను నిత్యం అంటిపెట్టుకోవనే కఠోరసత్యం కన్నబిడ్డకు తెలిసినంతగా కంటిపాప గుర్తించకపోవడం నన్ను మెలిపెట్టే ఆవేదనే... చేతుల్లో అర్థంలేని వింతగీతల్ని చూస్తూ గాఢంగా నిదురపోలేనన్న వాస్తవాన్ని నా చేతలకు తెలిసినంతగా నుదుటి రాతలకు కూడా అందకపోవడం నన్ను నిలవనీయని భావనే... అవతలి రోడ్డుకు దాటాలని ప్రయత్నించే ప్రతిసారి తోడుగా వున్నారనుకున్న వారందరూ మనకేమీ కారనే అనుకుంటూంటే

శైలజామిత్ర ఉస 145

ఇంటికి దూరంగా వుంటున్నా చలి మనల్ని ముడుచుకనేలా చేసి ఆ బంధాన్ని గుర్తుచేస్తుంది కళ్ళముందు ఎన్ని రంగులున్నా కరన్నీ రంగు అందర్నీ ఆకర్షిస్తున్నట్లు బరువైన భావానికి ఎన్ని హంగులున్నా కదులుతున్న జీవితం మనల్ని కట్టిపడేస్తుంది ఇది కూడా ఒక కదలికే.., దీనికి అర్ధం వుండదు.., కానీ... ఆంతర్యం వుంటుంది.., మగత నిద్దరలో మనల్ని తట్టిలేపి గుర్తుచేస్తున్న సత్యం... అనురాగం అంటూ నిలదీసే హృదయతత్వం ఇలా గుర్తుకు తెచ్చుకుంటే ఒక రూపం నిలుస్తోంది అదే నన్ను నన్నుగా నిలబెట్టే మానవత్వం అదోరకమయిన స్నిగ్ధత్వం...,

146 ఫీ రాతి చిగుళ్ళు

ఇదో భారతీయ చిహ్నం... ఇదో భారతీయ చిహ్నం ప్రపంచపటం నిండా రక్తపుచారికలు నిత్యం చూస్తున్న మనవి నిర్భాగ్యపు జీవితాలు న్యాయానికి ఎపుడూ నల్లటి ముసుగే..., మానవత్వానికి మిగిలింది మాయని మచ్చే.., ఓ మనిష్కీ., నీ తత్వం నిత్యం నీలి నీడల దృశ్యం.., మనచుట్టూ అల్లుకుంటున్నది మనలోని స్వార్ధం మనకోసమే మిగిలింది దైన్యం... డాలర్ల డైనమేట్స్‌ మన నాయకుల బింబం అమెరికన్ల అనుచరులు నేటి యువతరం వరల్డ్‌బ్యాంక్‌ లోంచి అప్పు లోనే అమ్మ (ప్రతిరూపం వడ్డీలు వసూలు చేయడంలోనే వందేమాతరం ఎక్కడో సుదూరతీరాన కాపలాదారులు..., అక్కడ దేశానికై పోరాటం... ఇక్కడ దేహాన్ని కాపాడుకోవాలనే ఆరాటం భారతీయం స్విస్‌బ్యాంక్‌ లాకర్షో భద్రం. క్రికెట్‌ మైదానంలో బంతిలా రాపిడికి తలవొంచుతున్న స్వాతంత్ర్యం మెదడు పదునెక్కినకొద్దీ మాటలు తూటాలై ప్రజల గుండెల్లో సాంత్వనం మవాత్ముని ఆనవాళ్ళలో నాటి నియంతృత్వం రాతిగోడలు నిలువెత్తు సాక్ష్యాలలో నేటి నిరంకుశత్వం

శైలజామిత్ర శ 14/7

ఉ([గ్రవాద హింసకు ముక్కలైన ఆదర్శం మాయమైన ఆనందం వినిపిస్తున్న మానవ హాహాకారం తీరని దారిద్ర్యం కొత్తదారులతో ప్రజాస్వామ్యం కొత్త సమస్యలతో ప్రజల గమ్యం నిర్దేశమయినా సమయాన్ని బట్టి గుండెపై ఏ నిప్పుల కుంపటో సందర్భాన్ని బట్టి బతుకుపై ఏ మబ్బుల దుష్పటో నిర్జీవమైన శరీరంపై ఏ పుష్పగుచ్చమో..., నిత్యం ఓ ముళ్ళ కిరీటమో... ధరింపజేస్తున్నా నీటిలో బుడగలా.., వెలుగులో వెతుకులాటలా ఒంటరి పొాదముద్రలతో ఎవరికీ ఎవరూ లేరనే తాత్విక చింతనంతో ప్రతి ఒక్కరి జీవితం....!

1ే4రి ఈ రాతి చిగుళ్ళు

శూన్యం యలా వర్ణించనీ మానవజీవితాలు? ఏవో ఒకటీ అరా పరిచయాలు నాలుగైదు చోట్ల ఉనికిని చాటే చిరునామాలు ఎందుకూ పనికిరాని పచ్చనోట్లూ తప్పదనిపించే పరామర్శలూ లాభం కోసమే చూసే పరిచయ స్పర్శలూ చచ్చిపోతే ఒక్క కన్నీటిచుక్కకయినా నోచుకోని శరీరాలు.., మనిషే లేంది ప్రపంచమెక్కడిది? మనసే లేంది మానవత ఎక్కడిది? (ప్రేమంటే అర్థంకాని నీ అనుభవమేపాటిది? ఒంటరి శకలాన్ని నేనెలా చెప్పగలను? నిజాన్ని నిజంలానే ఒప్పుకోలేక నిప్పై కరిగిపోతూ అబద్ధపు ఆత్మీయతలతో నిత్యం నటిస్తూ నిజంగా మనం బతికే వున్నామా? బతికే వున్నామంటూ రెండు కాళ్ళతో కదిలేస్తున్నామా? ఎవరి ప్రపంచం వారిది ఎవరి ఊహ వారిది ఏ ఒక్కరి ప్రయాణం వృథా కాదు ఏ ఒక్క మజిలీ ఒంటరిది కాదు అలాగని ఒకరికొకరం అంటే అంతా శూన్యమే.., అయినా.., చెట్టుకింద గోడపై నేను కూర్చున్న సమయంలో క్రాలుజారుతానేమోనని ఒక పక్షి హెచ్చరించింది నాకంటూ మిగిలింది ఆ క్షణమో.., స్వల్పమయినా అది నాకు జీవితమే... శైలజామిత్ర + 149

హితీ పయా శెలజామిత్ర సాహిత ప్రయాణం స. రావా న్యూ] ల ట్ర ఆ ల నీ వ. వ 4 మ యక్‌! (0 క. క త ప. బో క లంగన వేళ. శ్‌ నం ము ఈ న న ల న గ్‌ మట || ప టు హు /] శా వ ర న. ర. " ఎలా. స. ర్చ స హ్‌ (యా ల శ్‌. వం స యం న్‌ గ, య స సు. సస టర న్‌ [ స సం. గ్ల . ౬ (4 (వ! .. న పో ల . న న. | జ | స ర్‌ | (న (జ మ | లలల టర తా టాయ్‌... 150 ₹ రాతి చిగుళ్ళు

10 టు స. న్‌ న (1. . 1 స్‌ | షో పం | యు కా 1. త్‌ 1 . స్‌ చ. న్‌ | న్న్న 1౪9 లం నలు హతే న 10% 1614886 న్‌. ఏతి టో భి. స్మి ద+అిటే + న య నం. | త స షరా ల న్న! త్‌ న. ర! ల... గప (న మ్‌ (న శ. గ వచనా గ ర. స ల (గ / హా న. నం / శెలజామి! గూ త భే

జావకామన్ను సం నె జ స హహ నో విస్టా హో

1 ౮1 ఉం . గ4ష||౦|116౮౬౬0౮ | 1 (2/4022 52/7)00 . _ 5411212 [110072 ” | 111 / శ న ౨. 1. /.. జీవితాన్ని సృజనాత్మకంగా మలుచుకోవడం . .. . ఓ కళ. ఇది తెలిసిన వారి రచనా . నో న. న గ్‌ వ్యాసంగంలో సున్నితత్వం వుంటుంది. కవిత్వాన్ని సృజించడంలో సౌందర్యం నో న. ఉట్టిపడుతుంది. ఇలాంటి సౌందర్యాత్మకత . .. 1. శైలజామిత్ర కవిత్వంలో చూస్తాం. విభిన్న . | ప్రక్రియల్లో రచనలు చేస్తున్న శైలజామిత్ర సె చ . 6

  • న. ౪ కవిత్వంలో వైవిధ్యం వుంది. వస్తువు ఎదైనా న. | / దానిని వ్యక్తీకరించడంలో ప్రతిభావంతమైన [నేర్పు కనిపిస్తుంది. సమకాలీన జీవితంలోని , |. .. | ౨ విభిన్న ధోరణులు ఆమెను స్పందింపజేస్తూ |. స వచ్చాయి. తన భావనా పరంపరని 1... కళాల్మకంగా వ్యక్తీకరించడానికి .. . ప్రయత్నించారు. దీనిని ఆమె. కవితా స సై ఖండికల్లో చూస్తాం. తన లోపలి స్పందనల్ని జో . “ఒక పద్ధతిగా, పాఠకునిలో చలనం శ్వ . తీసుకొచ్చేలా సృజించడం ఆమె కవితా , . . నీ కౌశలం... షథఇంధాలు; శువఖితాలు, జఫ స్తు టట చ పు. సాగుడిపాటి . ల. న. శ కం యన... ము నరస | త య ల ,