Telugu prashninchu - anilvaranasi/indianlanguages GitHub Wiki

| = ం ” ” ఇ / " . / అ అ ల! కీ గో సా స్ట | . '...... అంఇంయానాతుల చదపహలప/.మయసనాల్ర. ౨ ౨ివిళత్త్వఫతియుల మ్‌వ్పిర్తి ౮8౦ ఈ _ వ ము వ్‌ గగ లి

. ీ స పశో శత ప్రశ్నోత్తర మాలిక

ప్రచురణ; తేది: !-12-1997 విజయనాడ్‌ రిన్యూమర్‌ అసిస్టెన్స్‌ సాప్టైటీ . _వియన్‌ఆర్‌. కాంప్లెక్స్‌, మహత్మాగాంథీ రోడ్డు

*' వఏిజయవాడ-520 ౦010. ఫోన్‌ : 474147

  • రగి/[0.. రచయిత : శ్రీపివివి, సత్యనారాయణ మూర్తి ల5లి ముఖ చిత్రకారుడు : బాలీ ల గ జ్జ | (త్రో ౧ డి.టి.పి. క విశ్చాటెప్‌ ఇనిస్సిట్యూట్‌ విజయవాడ-520 002 ౮ భా ఫోన్‌ 572795 (లీ న న. శిశ్న జా గ ళీ న్‌ ప్రధమముద్రణ : 1-12-1997 1. మో కాపీలు 4000 ముద్రణ : యుగంధర్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ గొంధీనగర్‌ విజయవాడ-520 003 ప్రతులకు : ౧0౧1౫౦ ౭౮8౬104110%5 ॥ 40౦9-89, ౧౦1 ౧౦0? 5901 0౮౦! '10ఉఉం(ఉ౦4-520 008

| ), (| తొలిపలుకు జక్రాఖా | అంబటి లక్ష్మణరావు య , మాజీ ప్రధాన న్యాయమూర్తి భం. 11) (4 అలహాబాద్‌ హైకోర్టు మం (1 తమ హక్కులు, బాధ్యతల అవగాహన పైన, వినియోగదారుల రక్షణ ఆధారపడి | . ఉంటుందనుటలో అతిశయోక్తి లేదు. దైనందిన జీవితములో అవసరమైన )] ( సేవలు, వస్తువుల సంఖ్య, వాటి ధరలు, నానాటికి పెరిగిపోతున్న ఈ రోజులలో (1 | వాటి నాణ్యత, అవసరాలను గుర్తించి సముచిత నిర్ణయము తీసుకొనుట, గ 1 వినియోగదారునికి ఒక సమన్యగా పరిణమించింది. తీరా, కొన్న తరువాత, !/ (4 వాటిలో ఏదైనా లోపము కనిపిస్తే, తను తీసుకొనవలసిన చర్యను గురించి తగిన (1 అవగాహన లేకపోవుట వలన, వినియోగదారుడు మరింత క్లిష్ట పరిస్థితిని ( ( ఎదుర్కొనవలసి వస్తుంది. ( [ ప్రతి వ్యక్తి వినియోగదారుడే. కొని వినియోగదారుల రక్షణ చట్టము చదువుకొని | ( అర్హము చేసుకొనగలిగినవారు బహు కొద్దిమంది మాత్రమే. అట్టి పరిస్థితిలో (( వినియోగదారులు తరచు ఎదుర్కొనే ముఖ్య సమస్యలను, ప్రశ్నల రూవంలో (| పొందుపరచి, ప్రతి ఒక్కరు సులభంగా అర్ధం చేస్తుకునే సరళమైన తెలుగు ( భాషలో, జవాబులు కూర్చిన తీరు వ్రశంననీయము. (1 1 వినియోగదారుల రక్షణ ముఖ్యోద్టేశంగా, న్యాయ మరియు సాంఘిక దృక్పథాలను (| క్తుణ్గంగా పరిశీలించి ఇచ్చిన జవాబులు, వినియోగదారుల సేవారంగంలో గ (| శ్రీ సత్యనారాయణమూర్తిగారి పరిజ్ఞానము, అనుభవము తేటకెల్లమవుతుంది. (| 1 సేవా దృక్పధంతో వారు చేసిన కృషి వినియోగదారులకు ఎంతగానో | | ఉపకరిస్తుందనుటలో ఎట్టి సందేహము లేదు. (1 (స్థలం : హైదరాబాదు )) గ 0) 1 తేది : 20-10-1997 - అంబటి లక్ష్మణరావు ) )+ శి న / సాళయషాడక్తాడక్త ళన ల్తైానిన్తామ్తాననాకక్వాన్నాకక్తా్షనా్షమన్నానానన్నకకరనననననానాణ

అడిగే వాడికి చెప్పేవాడు లోకువ, చెప్పేవాడికి వినేవాడు లోకువ అనేవి హాస్యంగా పలికే పలుకులే అయినప్పటికీ వినియోగ జీవనంలో అడగడం, వినడం చాలా ముఖ్యం. ప్రశ్నించడం ప్రారంభిస్తే గొని విషయాలు అవగాహన కావు. అలాగే చెప్పేది వినడానికి నిర్లక్షం చేస్తే చేతికందిన సమాచారాన్ని జారవిడుచుకున్నట్లవుతుంది. సమాచార వ్యవస్థలో వన్తున్న వివ్లవాత్మక సొంకేతిక పరిజ్జానంవల్ల (పపంచంలో ఏమూలనుండైనా సమాచారాన్ని అందుకోవడం చాలా సులభమైంది. సమాచారం జెలుసుకోవడమనేది ఒక ప్రాథమిక హక్కుగా ప్రపంచ దేశాలు గుర్తించాయి. వినియోగ ప్రపంచంలో సమౌచారం ప్రముఖ పాత్ర వహిస్తుంది. వినియోగదారుడు తనను తాను రక్షించుకోవడానికి సమాచారం ఒక ముఖ్య సొధనం. _ అక్షరాస్యులలో నిర్లక్ష్యం, నిరక్షరాస్యులలో అజ్ఞానం - వెరశి వినియోగ జీవనం కంటకం. చదువురాక కొంత మంది అవస్థలు పడుతుంటే చదువుకొని కూడా నిర్లక్ష్య ధోరణితో వెతలకు గురయ్యేవారు మరికొందరు. ఉత్పత్తి దారుడు ప్యాకేజొపై పొందుపరచిన నమాచారం చూడక కాలదోషం పట్టిన మందులు కొంటున్న విచిత్ర పరిస్థితి మనదేశంలో నెలకొని వుంది. అవగాహన లేకపోతే అక్షరాస్యులు కూడా చదువులేనివారితో సమానమే. జ్ఞానం వినియోగదారునికి శక్తిని ప్రసాదిస్తే అజ్ఞానం అశక్తుడ్ని చేస్తుంది. వినియోగదారుల రక్షణ చట్టం పరిధిని గురించి, న్యాయస్థానంలో వెలువడిన తీర్పుల గురించి సామాన్య వినియోగదారునిలో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ రచనను తలపెట్టాను. ఆకాశవాణిలో నిర్వహించిన 'ేదన - నివేదన' కార్యక్రమానికి వేలాది శ్రోతల నుండి వచ్చిన సందేహాలను, రాష్టంలో పలు ప్రదేశాలలో నిర్వహించిన వినియోగదారుల సదస్సులలో ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలను కూర్చి మొత్తం ఒక వంద సందేహాలకు సమాధానం ఇందులో సమకూర్చాను. న్యాయశాన్తం చదవనివారికి సైతం సులభంగా అర్థమయ్యేలా వ్రాయడానికి ప్రయత్నం చేసాను. ప్రాంతీయ భాషలో వినియోగదారుల విజ్ఞానానికి సంబంధించిన సమౌచారం అందడంలేదనే విమర్శను దృష్టిలో వుంచుకుని ఈ పుస్తకాన్ని తెలుగులో వ్రాసాను.

విజయవాడలో ఒక లా సెమినార్‌కు ముఖ్య అతిధిగా విచ్చేసిన సందర్భంలో జస్టిస్‌ లక్ష్మణరావుగారిని ఈ చిరుపొత్తానికి ముందుమాట వ్రాయమని కోరగా వెంటనే వారు అంగీకరించారు. ఇందులో పొందుపరచిన సమాచారం మరింత ప్రయోజనకరంగా వుండేందుకు సలహాలు యిమ్మని అర్ధించాను. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమీషన్‌ అధ్యక్షులుగా వినియోగదారుల ఉద్యమాన్ని పటిష్టం చేసిన జస్టిస్‌ లక్ష్మణరావుగారికి నా కృతజ్ఞతాభివందనాలు. సందేహాలకు సమాధానాలిచ్చే పద్ధతిలో ఎంతో విలువైన సమాచారాన్ని వినియోగదారులకు అందించవచ్చని సలహానిచ్చి, నాయీ రచకు ప్రోత్సాహాన్ని కలిగించినది శ్రీమతి బి. విజయలక్ష్మిగారు. విజయవాడ -వినియోగదారుల సహాయ సమితి కార్యదర్శిగా వినియోగదారులకు ఎనలేని సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆమెకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్నేహ పరిమళాలను గుబాఠించే శ్రీ అశోక్‌సేధీ సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే సహృదయుడు. నా ఈ రచన పుస్తకరూసం దాల్పడానికి యేరణ కూడా అతనే. శ్రీ అశోక్‌ సేధీకి నా కృతజ్ఞతాంజలి. నా ప్రాణ స్నేహితుడు, హితుడు, బాంధవుడు ఒక దురదృష్టకర సంఘటనలో నన్ను విడిచి అమరలోకాలకు వెళ్ళిపోయిన సర్గీయ శ్రీ గారపాటి గంగాధరరావుగారి స్పృత్యర్థం ప్రజలకు ఉపయోగపడే ఏదో ఒక కార్యక్రమం చేయాలని తలపెట్టాను. ఈ రచన ద్వారా నా నుంచి అందనంత దూరం వెళ్ళిన నా నేస్తానికి నివాళులు అర్పిస్తున్నాను. ఈ రచనప్తై తమ విలువైన అభిప్రాయాలను తెలియజేసిన విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌ శ్రీ రజత్‌భార్గవ, ఐ.ఎ.యస్‌. గారికి, ఇన్‌కంటాక్స్‌ అపలేట్‌ ట్రిబునల్‌ సభ్యునిగా సదవీ విరమణ చేసిన శ్రీ చేగొండి శ్రీ రామారావు గారికి, మిత్రుడు, కడప జిల్లా జడ్జీ శ్రీ వై. రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు. జీవన్నార్గాన్ని సమాజహితంగొా మలచిన నా జీవిత భాగస్వామి శ్రీమతి బృందాదేవికి కృతజ్ఞతలు. పివి,వి. సత్యనారాయణమూర్తి రచయిత

(4 6%. 8766 ౧1112 46, 94, 9. 51691110 2, గే.10.3-6-369/7 || || 119గ065, 1౧0016 (2 00611816 "106౧ (౧౪16) 19460104, గరం 2026-29 (, [1 016: 29.09.1997 ; || గనంింి2[014110% ( 4 500 ౪7౪.5. ౪10, 6 ఖఆథం/0[1019 000%, ౧6660 ౧౦ 1౧౪౦6౬౦10౧ 10 16 అం౧(6066 (4 0) 000116014000/8 ౧46691 గీ ౧18౧ ౧౧01116 ౧014౧20 2౧6 00౧౩౪౧౧9? 20/50 ౧9 19 & ౪6|| )) | క౧04౧ 0616 1౧ 19 500141, 041014 2౧6 ॥16/20/ 010163 01 ౪04%/804 1. న 1160126 101% 0116651003 206 ౧5/65, 413 00014065 1651200 0/46 100/5 ఓ (1 1౧00 51060 206 01010606 ౧0౪60606 01106 ౧6౪ 206 6౪/8100100 02064 014, 16. ఓ ఓం! (61400010 '00094%61 ౧1౩౧. ౪/1 ౧౩910౧40 2624] ఉ06 ఉ౪ం26103 90101 16 ట్ల ( 20006 10000 ౧13 ౧౪010410౧3 2౧6 041010810౧ 1౧ $90104, *౦గ6౧008 610 , ౧48 ( )) 099౧ 6౧664౪/0611౧0 (0 000016 '00౧96006? 2426౧655 20022 ౪0610656 64/5. ఓ || ౧06 4/6 (6116 & 164 00016 0౧ 16 12౪4 000౧9౪౧6 ౧౯౧౦160100 ౪౧౧6౧ 1౧ ౬€౧9||90 0౪ | (11 16921 10010[60. 86106 26 09401 ౧౭౧/ 10 6 06౧61 0 1604 02000౧69 2౧6 4 (1 1౧096 260101516/100 4144. 30 12 29 | 20 226, ఆఈ6 218 ౧౦ 000! 01 116 ౪06, (1 (1 1౧660 0 160004, ౧6౫౧110 0192 0005806 జ26౧609 2౧0 50926 1౧6 10౪16606 (1 (1 01 0009606? 124 2౧౦౧౦ 6 14/ "62404 000110 1/1160 1౧ 002916 2౧0 6604040 (1 12000209, 68310 ౪౧66310060 20/1610064 09900 118 0000041669 209463 10 80 (| (0 ౧020 (1౮651003 14104/6 0100066 60 1౧ 1౧66100 16 01014510౧5 01 6 00౧9౮౪౧6౯౮ (1 ౧౧060101 401 1960 2౧06 ౫1661840. 1140౪9 ౬1006 0110064000 886/4 0/9) 2/64 )) (1 2000116 56/6181| 4064015 1౧06100 106 ౧1౧౦090109 12/060110 20 (84/66 08 గం౧౦ (| (( ఇ212018 100160 6౧606124 4౧0 16 ౧066 01191 9౧01060606 ౪/16 2౧346103 06 గ! (1 ౧0651009 ౧0966, 116 20110118 01/6౧ [61619౧06 (0 116 (816౪601 6690191009, ! &౧౫/ 04 ఈ (16141004 0000165100, 5146 00111591005 0766110102 0000110166 ౪౧6౮6౧16 261 4 ,- ౭గ60804601007011015 466 0 0096౧163 60౧0141100 0 8000 01 840-9110620 ౧ [1 30060590! ౪౧09౧4619106001 66101606 0 60౧9616 361/0. (10 | [101 09100 00౧౪613201 + 116 ౪౭0౮65 2506015 01 113 ౧6౫ 008000 0184 ఖర 13 | గ్‌ ౧౮౧౦6౦5 2౧61౧11020169, | 166176[/ 1౮00 0616111646 0 001౧9 [003౧ 15 000% | ౧4/6 (1 (1 ౧0 60౪01 ౪041ఆ/6౧1౧4119 000% 2౧06 0491 000%: ౧౪01150606 0/16 20401111] 4 1003 [1 (4 10 ౧666 01 16 61004 30941100 ౧౪010 2౧06 116 02౧ 06 & ౪464019 460401 10 6 )

  1. 040110 10/2095 206 అంగి ౧౧౫౫౭16 101265 01 1694] ౧2010066, 1! 0000201216 6 ,) ) 20100 0౧ 1100100 0౪41 300% 6౫06601 ౧401044009 01 11116036 060611 10 16 (4 ఫ్‌ ౧00110. గ (1 - ౫౯40101 9[58 2144 ౧4౦ (1 నకజాహావావావానాణానానవావావనానావానవనాహాహవావానహానవాహానాహనానానాన। స్త అంక 4

సు బిల్లా జడ్జి, కడప న స న ర మిత్రులు శ్రీ సత్యనారాయణ మూర్తి గారికి, ఖీ లీ హ్‌ స వందనములు నా సా |. 111 నీ విరచితమైన వినియోగదారుల చట్టపరమైన “శత సమస్యల - నమాధానముల ప స. సంపుటి” అందినది. మీ సంపుటిని సంపూర్ణముగా పరిశీలించితిని. కళాశాల ౪ మరియు నిద్యాలయములో మా నాయకుడు, కళాకారుడు మరియు నా మిత్రుడు 1. 11 ఈనాడు సంఘ'సేవకై రచయిత కావడము నాకు చాలా సంతోషము కలుగచేసినది. 1. (న వినియోగదారుల చట్టము అమలులోనికి వచ్చినప్పుడు, కేసులు కోకొల్లలుగా దాఖలు కీ

  • సో అయి వినియోగదారుల సమస్యలు సత్వరం పరిష్కారమై, వాణిజ్యరంగములోను, ర్‌ వృత్తిపరమైన "సేవలు అందించడంలో మోసాలు, నిర్లక్యములు మటుమాయమై £ 1 క్రమశిక్షణ నెలకొల్పుతుందని ఆశించిన వారిలో నేనొకడను. దురదృష్టవశాత్తు 1 1 ఆశించినంతగా ఫలితములు సంఘమునకు అందలేదు. వినియోగదారుల హక్కులు న 15 - బాధ్యతలపై సరియైన అవగాహన మరియు విస్తృత వ్యాప్తి లోపించడమే ప్రధాన | కారణము. వినియోగదారులలో విఫ్లవ మనస్తత్వము లేనంతవరకుం ఎటువంటి క్షీ 14 చట్టమైన నిరుపయోగమవుతుంది. న్‌ గ్‌ సంఘ సంస్కర్తలు మరియు రచయితలే సంఘములోనున్న జాడ్యములను |. [1 పారద్రోలగలరని చరిత్ర చెప్పుతోంది. అటువంటి గురుతర బాధ్యతను చేపట్టిన మీరు ం న్‌ మిక్కిలి అభినందనీయులు. మీ “సమాధానాల సంపుటి” వినియోగదారులకు వారి ల్‌ : హక్కులు, బాధ్యతల పై మంచి అవగాహన కలుగచేస్తుంది అనుటలో నాకు ఎటువంటి |. 1 సందేహము లేదు. న మ మీరు వినియోగదారుల సమస్యలకు, సందేహములకు న్యాయపరంగా సముచితమైన [ 1 సమాధానములు ఇచ్చిరి, మీరు ఎన్నుకున్న పంథా నూతన ప్రక్రియ. సందేహములను న ర్ల వివిధ రంగములలో, వినిధ కోణముల నుంచి పరిశీలించి చక్కగా సమాధానములు | పొందుపరచిరి. మీ కృషి అభినందనీయము. 1 మీ సంపుటి ప్రజాదరణ పొంది, మీ కృషి సఫలీకృతము చేసి వినియోగదారులలో ఇ) విప్లవం పుట్టిస్తుందని అశిస్తూ మరియొకసారి మీకు హృదయపూర్వక అభినందనలు స
  1. అందజేస్తున్నాను. -వై, వి, రామకృష్ణ 1

. క32ఓ 802గ్ర22, 40 01 00/0:10౧ టీ స్‌ (౧0/౮౪/0600 1 వ్ర గ్గ క 0018: 07-11.1997 జ కీ ల గ్గ ఉరి9ిగ8 01411011 ॥ క ల కష చంగూలా౭” ౮62౫655 టి 8 106౮07 గ గ (| + ౦౧౨౮౫౬౭ ౯౦౭౦60౧.. తగ హి్రంగా౭6 గ్ర గ ఫే మ్య (00౧౩౬౫౭౦౬౧ 7౦౭౦ గహాబింట్ర లంట గ గ్ర (|. సై (సై డంం౭౧౧గ ౧౫౭౦౫౦౧ ౦ల౭గా. [26 ౧9౧0౪ ర్ల ్ష త్‌ బో న ం౦గాం1ల0 గాడాసంర ౦ €₹1౭ బ౧౬౭ల౫6 డడ ఫై ప గీ స సచ్ళీటా ఒ౮౦74 ౯౩ -ల|౧10గ గ్రంండ5 7౧౧౧౭ ట్రడంటల౭డే ర్ట గ నన. 04 06 170/4 4౭౭4౯00 546, ₹18 గ్‌ ను ౦0౧౨౬౪౮౧౬7 ౧౫ద ౯౧60655066 6౦౮1౦ గ బ౭గ్రలల ౧౭8౮4౧6 ట్ల న్‌ ₹ట్రంగాాడ6ంగ లత ౧51008 642500౧3 0౧ 64406, బ్రలోసా, ట్ల వ 5₹06౧66+ బగ౦౬౭ ఆ€౦. గం గ 6 400107 66 900%. గ ౨.101 546ఉ౧డ270బ్రడా4 (న ర గలాలగిట్రై ౧65 లంాజ్ర 66 [64 ల నింం! 25 న “౫4౨గాలగర. ం4౭5టంాం్ర ట్‌ కం౦గట్సి ౦౧౮ 60 66622 / గ క్యంగాాయగంగ. సగ లల ల గటా ౫56 లర్దుంగంగం6 బె /[ | ౧౦౧౨౭౬౮౫౯7” గాొంలంగ౭ంగల 669డ64 గాడూల్ర ఉ009ట 6 €₹1౭ (1 గ ౧౦౧౫౨౬౮౫౭౩ గ ర45 రంం/ల 1 ఉరిగంయ448 గబా ౧0/౧౯ ౫౬ (్‌ గ టాగ్‌ ౭41 ౧6 501.64 ౮7౧86 గాడాఆ్ర 7౧౦౫”౯ లిం0/0 00 07౭409 / గ 6౬౦౦౬౭౫౭55 ౧0 ౮16౭ ౧0౧౨౬౮౫౭౫౮. గ్గ షో (1

యజ్షయ్‌

  1. అందరూ వినియోగదారులే అయినప్పుడు “వినియోగదారుడు అంటే .. ఎవరు” అనే ప్రశ్న ఎందుకు ఉదృవిస్తోంది?

జ. “అందరూ వినియోగదారులే” అనే ప్రకటన ఎంత సత్యమా, సాంకేతికంగా వినియోగదారుడు అంటే ఎవరు అనే ప్రశ్న కూడా అంతే సమంజసం. సందర్భాన్నిబట్టి ఓ వ్యక్తి వ్యాపారస్తుడు కావచ్చు, అదే వ్యక్తి మరో సందర్భములో వినియోగదారుడు కావచ్చు. ఉదాహరణకు ఓ బట్టల వ్యాపారిని తీసుక్షొందాము. బట్టలు అమ్ముతున్న సందర్భములో అతను వ్యాపారిగా పరిగిణింపబడుతున్నప్పటికి నిత్య జీవితంలో తన అవసరాలకు, తన కుటుంబావసరాలకు ఎన్నో వస్తువులను కొనుగోలుబేయటం, సేవలను పొందడం జరుగుతుంది. మరి ఆ సందర్భములో అతను వినియోగదారుడే కదా! అందుకే “ప్రతి ఒక్కరూ వినియోగదారులే” అని అనటం సమంజసంగా కన్పిస్తుంది. కాని వినియోగదారుల రక్షణ చట్టం 1986లో సెక్షన్‌ 2(డి)లో వినియోగదారుడు అనే మాటకు యిచ్చిన నిర్వచనం వల్ల ప్రతిఒక్కరు వినియోగదారుడే అనటానికి అవకాశం కనిపించదు. మూల్యం చెల్లించి లేక తదుపరి చెల్లించే పద్ధతిలో వస్తువులను కొని, సేవలను కాని పొందే వ్యక్తి మాత్రమే వినియోగదారుడుగొ పరిగణించబడతాడు. అలా మూల్యం చెల్లించి వస్తువులను సేవలను పొందినవారి అనుమతితో వేరెవ్వరైనా వీటిని వినియోగిస్తుంటే వారుకూడా వినియోగదారులు అవుతారు.

  1. వినియోగదారుల న్యాయం కోసం ఏర్పరచిన న్యాయ వ్యవస్థ గురించి వివరించండి.

జ. వినియోగదారులకు న్యాయం అందించటం కోసం మూడంచెల న్యాయ వ్యవస్థను వినియోగదారుల రక్షణ చట్టంలోని సెక్షన్‌ 9 ప్రసాదించింది. జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు ఉన్నట్లుగానే వినియోగదారుల పరిరక్షణార్ధ్థం జిల్లా ఫోరంలు, రాష్ట్ర కమీషన్‌, జాతీయ 'కమీషన్‌ ఏర్పాటు చేయబడినాయి. అయిదు లక్షలలోపు నివాదాలన్నీ జిల్లా ఫోరం పరిధిలోనికి వస్తే, అయిదు లక్షలకు పైబడి ఇరవయి లక్షలలోపు వివాదాలు రాష్ట కమీషన్‌ పరిధిలోనికి

౬

వస్తాయి. 20 లక్షలకు పైబడిన వివాదాలు జాతీయ కమీషన్‌ మాత్రమే స్వీకరిస్తుంది. జిల్లా ఫోరంలు జిల్లా హెడ్‌ క్వార్టర్సులోను, రాష్ట్ర కమీషన్‌లు ,

రాష్ట రాజధానిలోను, జాతీయ కమీషన్‌ డిల్లీలోను నెలకొల్పబడి ఉన్నాయి.

ఈ కోర్పులలో న్యాయమూర్తులను అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఈ

అధ్యక్తులకు నహకరించటానికి మరో యిద్దరు సభ్యులుంటారు. అందులో

ఒకరు మహిళా సభ్యురాలై ఉండాలి.

  1. ఓ కొర్డు ముక్క వ్రాస్తే చాలు మీ ఫీర్యాదులు పరిష్కరించబడతాయి అని చెవులు చిల్లులు పడేలా ప్రకటనలు గుప్పించారు. తీరా నా సమస్యను ఓ _ కార్డుపై జిల్లా ఫోరంకు నివేదించి సంవత్సరము కావస్తున్నా ఎటువంటి చర్యా చేపట్టలేదు. నేనేం చేయాలి?

జ. బహుశా మీరు వ్రాసిన కార్డుపై మీ చిరునామా కాని లేక మీరు ఎవరిపై ఫిర్యాదు చేస్తున్నారో వారి చిరునామా కొని మరిచిపోయుంటారుి అద్‌ కాకపోతే మీ సమస్యను పూర్తిగా అర్ధం అయ్యే రీతిలో మీరు వివరించి ఉండకపోవచ్చును. అదీ కాకపోతే మీ కార్డు జిల్లా ఫోరంకు చేర ఉండకపోవచ్చును. నహజంగా పోను కార్డులో ఎన్ని వివరాలని పొందుపరచగలరు? అందుచేత మీరిచ్చే ఫిర్యాదు పూర్తి వివరాలతో ఉంటే జిల్లా ఫోరంవారు తప్పక దానిని పరిగణనలోనికి తీసుకుంటారు. అదీగాక జిల్లా ఫోరంకు ఫిర్యాదు చేయడానికి ఒక నిర్దీత ఫొరం వుంటుంది. దానిని ఉపయోగిస్తే ఇటువంటి ఇబ్బందులు కలగవు. వినియోగదారుల రక్షణ చట్టంలోని సెక్షన్‌ 12 ఈ విషయాలు తెలియజేస్తుంది.

ఏ ఏ వివరాలు పొందుపరచాలనే విషయం వినియోగదారునికి తెలియకపోవడం వలన కావలసిన సమాచారం అందించలేక తమ ఫిర్యాదులను బుట్టదాఖలు చేసే స్థితికి తీసుకు వస్తుంటారు.

  1. నాణ్య విహీనమైన ఓ వస్తువును అంటగట్టి ఒక వ్యాపార సంస్థవారు నన్ను మోసగించారు. జిల్లా ఫోరంకు ఎలా ఫిర్యాదు చేయాలో నాకు తెలియదు. దయచేసి వివరం తెలియజేయగోర్తాను.

జ, జిల్లా ఫోరంలో ఫిర్యాదు దాఖలు చేయటానికి ఈ క్రీంది సమాచారాన్ని తప్పనిసరిగా పొందుపరచవలసి ఉంటుంది. ౬2 స్ట

1). మీ పేరు, పూర్తి చిరునామా

  1. ప్రతివాది పేరు, పూర్తి చిరునామా

9). మీరు వస్తువు కొన్న తేదీ, బిల్లు నెం., ఇతర వ్రాతపూర్వకమైన సాక్షాలు

  1. _ వివాదం దేని గురించి?

  2. వివాదం యొక్క మొత్తం విలువ ఎంత?

  3. మీరు నష్టపోయిన తీరు, నష్టం విలువ

  4. ఎంత పరిహారం కోరుతున్నారు?

పై వివరాలన్నీ ఫిర్యాదులో వ్రాయాలి. ఒకవేళ మీరు ఏ సంస్థపై ఫిర్యాదు

చేస్తున్నారో ఆ సంస్థలోని భాగస్వాములందరి'సై ఫిర్యాదు చేయదల్బుకుంటే

వారిసేర్లు కూడ తెలియ జేయాలి. ఎంతమందిపై ఫిర్యాదు చేస్తున్నారో ఆ

సంఖ్యకు అదనంగా మరో రెండు కాపీలు జతచేసి ఫిర్యాదు కాపీలను జిల్లా

ఫోరంకు పంపించ వలసి ఉంటుంది. మీరు స్వయంగా గాని, పోస్టు ద్వారా

గాని ఫిర్యాదును జిల్లా ఫోరంకు అందించ “వచ్చును. పోస్తు ద్వారా

పంపించదలుచుకుంటే, రిజిస్టరు పోస్టులో తిరుగు రశీదుతో పంపించటం

మంచిది. ఫిర్యాదు తయారుచేసేటప్పుడు మీకేమయినా అనుమానాలోస్తే

మీ దగ్గరలోని వినియోగదారుల సంఘాన్ని సంప్రదించండి.

  1. వినియోగదారుల రక్షణ చట్టం కన్బ్యూమర్‌ కౌన్సిల్స్‌ను ఏర్పాటుచేయాలని నిర్దేశిస్తుందని, ఆ విధంగానే కన్బ్యూమర్‌ కౌన్సిల్స్‌ వలు ప్రాంతాల్లో స్థాపించబడినోయని అంటున్నారు. మా పట్టణంలోకూడ ఓ కన్స్యూమర్‌ కౌన్సిల్‌ ఉంది. అది కూడా ప్రభుత్వానికి సంబంధించినదేనా?

జ. వినియోగదారుల కౌన్సిల్‌ రాష్టస్తాయిలోను, జాతీయ స్థాయిలోను ఆయా ప్రభుత్వాలు ఏర్పాటుచేయాలని వినియోగదారుల రక్షణ చట్టంలోని సెక్షన్‌ 4 నిర్దేశిస్తుంది. పౌరసరఫరాల శాఖమంత్రి అధ్యక్షతన ఏర్పడే ఈ క్షౌన్సిళ్ళలో

సమాజంలోని వివిధ వ్యక్తులను, అధికారులను, వినియోగదారుల సంఘాల

నాయకులను నభ్యులుగా నియమించటం జరుగుతుంది. ఈ

వినియోగదారుల కౌన్సిల్స్‌ స్థాపనలోని ముఖ్యోద్దేశం వినియోగదారుల (౩

హక్కులను పరిరక్షించడం కోసం మాత్రమే. ఈ మండలులు కనీసం సంవత్సరములో రెండుసార్లు సమావేశమై వినియోగదారుల హక్కులను కాలరాచే పలు అంశాలు చర్చించి ప్రభుత్వాలకు తగు సూచనలు చేస్తుంటాయి. రాష్ట్రస్థాయిలోను, జాతీయ స్థాయిలోను ఏర్పాటు చేయబడిన ఈ మండలులు ఇప్పటికే అనేక అంశాల పై చర్చలు జరిపి వినియోగదారుల రక్షణ చట్టాన్ని రెండుసార్లు సవరణ చేయటం జరిగింది. కాని మీ పట్టణంలోని వినియోగదారుల కౌన్సిల్‌ కేవలం ఓ స్వచ్చంద సంస్థ. ఆ సంస్థ కూడ కన్ప్యూమర్‌ కౌన్సిల్‌ అని పేరు పెట్టుకోవడం వలన ప్రజలు దానిని ప్రభుత్వ సంస్థగా బావించే అవకాశం కలిగింది. కన్స్యూమర్‌ కౌన్సిల్‌, కన్స్యూమర్‌ ఫోరం అనే పేర్లతో న్వచృ్చంద నంన్గలు | ఆవిర్భవించకుండ నిషేధం విధించటం శ్రేయోదాయకం. అదే విధంగా రిజస్తార్లు ఈ 'పేర్లతోవున్న సంస్థలను రిజిస్టర్‌ చేయకుండా వుంటే బాగుంటుంది. 06. వినియోగదారుల హక్కుల గురించి తెలియజేస్తారా? జ. వినియోగదారుల రక్షణ చట్టంలోని సెక్షన్‌ 6 ద్వారా ఆరు హక్కులను చేకూర్చారు. (1) రక్షణ పొందే హక్కు (2) సమాచారం పొందే హక్కు (3) ఎంపిక చేసుకునే హక్కు (4) అభిప్రాయం తెలియచేసుకునే హక్కు (5) పరిహారం పొందే హక్కు (6) వినియోగదారుల విద్యను పొందే | హక్కు. అంటే ప్రాణానికి, ఆస్తికి ముప్పు. తెచ్చే వస్తువులను మార్కెట్టులోనికి రాకుండా, వచ్చినా వాటిని బహిష్కరించే హక్కు, తీసుకుంటున్న వస్తువ యొక్క _ పూర్తి సమాచారాన్ని తెలిసికొనే హక్కు, తనకు కావలసిన వస్తువును సరసమైన ధరలో నాణ్యతను పరిశీలించి ఎంపికచేసుకోవటానిక్షి రకరకాల ఉత్పత్తులు అందుబాటులో కలిగి ఉండే హక్కు, తన బాదను, ఇబ్బందిని సంబంధిత వేదికలకు నివేదించే హక్కు, వస్తువు కొనుగోలులో |' లేక వినియోగంలో నష్టపోతే పరిహారం పొందే హక్కు, వినియోగాంశాలకు నంబంధించిన విజ్ఞానాన్ని పొందే హక్కు వ్రసాదించటం ద్వారా | మొట్టమొదటిసారిగా వినియోగదారులకు రక్షణ కవచాన్ని ఈ చట్టంలో | ఏర్పాటుచేయడం జరిగింది. | ల్‌ |

  1. ఏదైనా నష్టానికి గురైతే జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయండి అని సలహా యిస్తారు కదా! అసలు ఫిర్యాదు నిర్వచనమేమిటి?

జ. ఫిర్యాదు చేసేవారు వ్రాత పూర్వకంగా చేసే ఈ క్రింది ఆరోపణలను ఫిర్యాదుగా అర్ధం చెప్పతోంది వినియోగదారుల రక్షణ చట్టంలోని సెక్షన్‌ 2(బి). (1) ఎవరైనా వ్యాపారి అనుచిత వ్యాపార పద్ధతులను లేక నిర్భంద వ్యాపార పద్ధతులను అవలంభిస్తున్నారని కాని (2) తాను కొన్న వస్తువులలో లోపముందని కొని, (3) తాను పొందుతున్న సేవలలో లోపం ఉందని కాని (4) వ్యాపారస్తుడు అధిక ధరలలో వస్తువును విక్రయించాడని కాని (5) ప్రాణానికి ముష్పువాటిల్లే వస్తువులను అమ్ముతున్నారని కాని ఆరోపణ చేస్తూ ఉపశమనాన్ని కోరేదే ఫిర్యాదు.

  1. నిర్పంధ వ్యాపారము అంటే ఏమిటో కెలియచేస్తారా?

జ. వినియోగదారుడు ఏదైనా ఒక వస్తువును కొనేముందు లేదా సేవలను పొందే ముందు వ్యాపారసంస్థవారు ఏమైనా ఆంక్షలు విధిస్తే అవి నిర్వంధ వ్యాపార విధానంగా సెక్షన్‌ 2(౧౧) వివరిస్తుంది. ఉదా: రేషన్‌ షాపువారు గోధుమలు కొంటేకాని పంచదార ఇవ్వనని లేదా 4 కేజీలు పనికిరాని బియ్యం కొంటే ఒక లీటర్‌ కిరోసిన్‌ విక్రయిస్తాననంటే అవి నిర్బంధ వ్యాపార విధానాలుగా ప్రకటించబడతాయి. గ్యాస్‌పోయ్యి కొనకపోతే గ్యాస్‌ కనక్షన్‌ యివ్వను అని గ్యాస్‌ డీలరు అంటే అదికూడ నిర్బంధ వ్యాపారమే. మా స్కూలులో చదివే విద్యార్థులు పుస్తకాలు మా స్కూల్లోనే కొనాలి అనేది కూడ నిర్బంధ వ్యాపార విధానమే అవ్సతుంది.

  1. అనుచిత వ్యాపార విధానమంటే ఏమిటి?

| జ. అమ్మకాలను 'పెంచుకోవటం కోసం అనుచిత, మోసపూరిత విధానాలను అవలంభించడాన్ని నిరోధించడానికి ఈ దిగువ నుదహరించిన వాటిని అనుచిత వ్యాపారంగా సెక్షన్‌ 2(ఆర్‌) గుర్తించటం జరిగింది.

1 _ విక్రయించే వస్తువుల ప్రమాణాన్ని, నాణ్యతను, పరిమాణాన్ని తదితర అంశాలను వున్నవి లేనట్లుగా, లేనివి వున్నట్లుగా ప్రకటించడం,

7 ఒక్‌

  1. అదే విధంగా సేవల యొక్క ప్రమాణాన్ని, నాణ్యతను అసత్యంగా ప్రకటించడం,

  2. _ పాత వస్తువులను, పునర్నిర్మాణం చేసిన వస్తువులను, కొత్త వస్తువులని అసత్య ప్రచారం చేయడం,

  3. ఈ వస్తువులు ఫలాన గొప్ప సంస్థ సాంకేతిక సహకారంతో “రూపొందించినట్లుగా లేదా ప్రభుత్వంచే గుర్తింపబడినట్లుగా అసత్య ప్రచారం చేయటం లేదా ఆ వస్తున్స సామర్థ్యం, గుణగణాలు, ఉపయోగం లేనివి ఉన్నట్లుగా అసత్య ప్రచారం చేయడం,

  4. లేని అనుమతి ఉన్నట్లుగా, లేని మద్ధతు ఉన్నట్లుగా అసత్య ప్రచారం చేయడం,

  5. కొనేవారు తపుదారి పట్టేలా ఓ వస్తువు ఉపయోగాన్ని, అవసరాన్ని అసత్య ప్రచారం చేయడం,

  6. నాణ్యత పరీక్షించకుండా, నాణ్యతగల వస్తువులుగా ప్రచారం చేసి, గ్యారంటీ యివ్వటం, అమలుపరచలేని గ్యారంటీలు యివ్వడం, అబద్దపు ధరలను అసలు ధరలుగా ప్రకటించటం.

పైన పేర్కొన్న విధానాలుఅనుచిత వ్యాపార విధానాలుగా గుర్తించబడి

నిరోధించబడినాయి.

  1. ఫిర్యాదు అందిన తర్వాత జిల్లా ఫోరం పరిశీలన ఎలా చేపడుతుంది?

జ. ఫిర్యాదు నకలును ప్రతివాదికి పంపిస్తూ నెల రోజులలో కాని భేదా గరిష్టంగా నెలాపదిహేను రోజులలో కొని తన సమాధానాన్ని పంపించవలసినదిగా ప్రతివాదిని ఆదేశిస్తుంది. ఈ వివరాలన్నీ సెక్షన్‌ 13లో వివరించబడినాయి. జిల్లాఫోరం ఆదేశించినట్లుగా ప్రతివాది సమాధానం యివ్యకపోయినా లేదా

సమాధానంలో తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించకపోయినా ఆ

ఫిర్యాదును పరిష్కరించడానికి. ఈ క్రింది పద్ధతిని అవలంభిస్తుంది.

ఎ) వస్తువు యొక్క నాణ్యతలో లోపసముందని వచ్చిన ఆరోపణలను పురస్కరించుకొని అఆ వస్తువును ఫిర్యాది నుండి సేకరించి

ప్రయోగశాలకు పంపిస్తుంది. ఆ ప్రయోగశాల 45 రోజుల్లో ఆ లోపాన్ని నిర్ధారించవలసి ఉంది.

బి) అలా ప్రయోగశాలకు పరీక్ష నిమిత్తం పంపే ముందు ఫిర్యాదు చేసిన వారి నుండీ చార్జీలకు డబ్బు వసూలు చేసి డిపాజిట్‌లో ఉంచుతుంది.

సి అలా సేకరించిన డిపాజిట్‌ను ప్రయోగశాలలో జమచేసి ప్రయోగశాల నివేదిక వచ్చాక ఆ నివేదిక కొపీని తన రిమార్కులతో ప్రతివాదికి పంపిస్తుంది.

వినియోగదారుడు కాని, ప్రతివాది కాని ప్రయోగశాల నివేదికను వ్యతిరేకిస్తే

వారి ఆక్షేసణను (వ్రాతపూర్వకంగా జిల్లా ఫోర- తీసుకుంటుంది. ఆ తర్వాత

వినియోగదారునికి, ప్రతివాదికి తమ తమ వాదనలు వినిసించుకోవడానికి

అవకాశం కల్పిస్తుంది. వాదనలు విన్నాక తన తీర్పుని ప్రకటిస్తుంది.

  1. జిల్లా ఫోరం తీర్పు ఏవిధంగా ఉంటుంది?

జ. వినియోగదారుడు చేసిన ఫిర్యాదు ప్రకారం వస్తువులోకాని, సేవలోకాని లోపమున్నట్లుగా నిర్ధారణ జరిగితే సెక్షన్‌ 14 ప్రకారం ప్రతివాదిని ఈ దిగువ సూచించిన విధంగా చేయమని ఆదేశిస్తుంది.

    • ప్రయోగశాలలో నిర్ధారించబడిన లోపాన్ని సవరించమతి,
  1. లోపాలతో కూడుకున్న వస్తువుకు బదులు లోపాలు లేని మరో క్రొత్త వస్తువుని ఇవ్వమని,

  2. చెల్లించిన ధరను వాపసు చేయమని,

  3. _ నష్టపరిహారమివ్వమని,

  4. సేవలలో లోపాన్ని సరిచేయమని,

  5. అనుచిత నిర్బంధ వ్యాపారాన్ని ఆసమని, తిరిగి అటువంటి విధానాలకు పాల్పడవద్దని,

7). ప్రమాదకర వస్తువులు విక్రయించవద్దని,

౬7

  1. _ విక్రయానికి పెట్టీన ప్రమాదకర వస్తువులు ఉపసంహరించుకోమని,
  2. _ వివాదానికి అయిన ఖర్చులు యివ్వమని ఆదేశించవచ్చును. సై అంశాలకు మించి తీర్పునిచ్చే పరిధి ఈ కోర్టులకు ఉండదు.
  1. జిల్లా ఫోరం తీర్పుతో ఏకీభవించలేకపోతే ఏం చేయాలి?

జ. జిల్లా ఫోరం తీర్పువల్ల నష్టపడిన వ్యక్తీ సెక్షన్‌ 15 ప్రకారం తీర్చు వెలువడిన 30 రోజుల లోపు రాష్ట్ర కమీషన్‌కు విజ్ఞప్తి చేసుకొనవచ్చును. ఏ కారణం చేతనైనా అప్పీలు చేసుకోవటానికి 30 రోజులు దాటిపోతే జాప్యానికి గల కారణాలను వివరిస్తూ రాష్ట్ర కమీషన్‌కు లేఖ వ్రాయాలి. వివరించిన కారణాలు సహేతుకంగా ఉంటే గడువు తీరిన అప్పీలును కూడ రాష్ట్ర కమీషన్‌ అంగీకరించవచ్చును. అప్పీలును నిర్దేశిత ఫారంలో చేసుకోవలసి ఉంటుంది. అప్పీలు చేసుకున్నవారు హాజరు కాలేదని రాష్ట్ర కమీషన్‌ అప్పీలును డిస్‌మిస్‌ చేయరాదని, అప్పీలు గుణగణాల్ని బట్టి పరిశీలించి తీర్పునివ్వవలసి ఉంటుందని 99౪౧౪౧౦! [4106౧౮౪౧ 16100౧ ౪46 ఎయ/0౧10101 16గ౧౧౦౧౦౧౮ ౪౦6౧౦౧! 1993 (1 ౮౧ 155 వివాదంలో తీర్పు వెలువడింది. అప్పీలు పరిష్కరించేటప్పుడు నష్టపరిహారం అతి ఎక్కువగా లేదా అతి తక్కువగా ఉంది అని భావించిన సందర్భంలో తప్ప నష్టపరిహారం విషయంలో పై కోర్టులు కలుగజేసుకోవు అని నర్మదా 146 సురేష్‌చంద్ర మిట్టల్‌ 1993 (0 4౧63] లో తీర్పు వెలువడింది.

  1. లేబరు కోర్టు కార్మికుల తరవున, వినియోగదారుల కోర్టు వినియోగదారుల తరపునే తీర్పునిస్తాయనే ఓ వాదన ఉంది నిజమా?

జ. నిజం కొదు. వినియోగదారుని రక్షణ చట్టంలో సెక్షన్‌ 26 ఈ విషయాన్ని

| తేటతెల్లం చేస్తుంది. ఫిర్యాది అతి స్వల్పమైన విషయాన్ని పురస్కరించుకొని ప్రతివాదిని క్షోభ పెట్టడంకోసం వినియోగదారుల కోర్టులలో ఫిర్యాడు చేసినట్టయితే అటువంటి ఫిర్యాదుని కొట్టివేస్తు ప్రతివాదికి ఖర్చుల నిమిత్తము రూ.10,000లకు మించకుండా యివ్వమని ఫిర్యాదీని ఆదేశించవచ్చును. ఇదే విషయాన్ని 1 ౮౦/౦౫౦౧౧౦6౧ ౪5 1౧9 ౧౦౦౧౦ 11090110! ర్‌ 760606[00 08౧16 199404) 0౧౧ 23 లో తీర్పునివ్వడం జరిగింది. వినియోగదారుల కోర్టులో ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం ౬8

ఉండదు కనుక ఇటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరుస్తు తస్పుడు పిర్యాదులు రావడానికి అవకాశం ఉన్నందున అటువంటి ధోరణిని నిరుత్సాహపరచవలసిన అవసరం ఉందని చెప్పి 0|:0 ౮6౦1106016 0॥ ౧౦౧౫౧1౪౫ ర. ౪5 510619 01 0గ936 1909460 ౧౧౧ ౩32లో తీర్పు ప్రకటించడమైనది. అంటే వినియోగదారుడు కూడ అపమార్గాన్ని అనుసరిస్తే అపరాధం చెల్లించవలసి ఉంటుందిసుమా! అని ఈ తీర్చు హెచ్చరిక చేస్తుంది.

  1. జిల్లా ఫోరం తీర్పుని కొంతమంది ఖాతరు చేయటంలేదని అంటున్నారు. అంటే ఇది పెద్ద మనుషుల ఒప్పందంలానే ఉంటుందా?

జ. జిల్లాఫోరం తీర్పుని జాతరు చేయకపోతే చిక్కుల్లో పడతారు. వినియోగదారుని రక్షణ చట్టంలోని సెక్షన్‌ 27ని పరిశీలించినట్లయితే ఈ విషయం విశదం అవుతుంది. ఎవరిపైనయితే పిర్యాదు చేయబడిందో వారు జిల్లా పోరం, రాష్ట్ర, జాతీయ కమీషన్‌ తీర్పులను అలక్ష్యం చేస్తే అటువంటివారికి నెల నుండి మూడు సంవత్సరములు శిక్ష 2 వేలు నుండి 10 చేలు జరిమానా లేదా ఈ రెండు శిక్షలు విధించడం జరుగుతుంది. కారణాలనుబట్టి కనీస శిక్రకన్నా తక్కువ శిక్ష విధించే అధికారం వినియోగదారుల కోర్డులకుంది.

  1. సరుకులు, సేవలు, కొనుగోలులో కలిగే నష్టాలకు వినియోగదారుల రక్షణ చట్టం పరిహారం యిప్పిస్తుందని విన్నాను. ఈ పరిధిలోకి రాకుండా ఏమైనా సరుకులు, సేవలకు మినహాయింవు ఉందా?

జ. సెక్షన్‌ 2(డ)(1) పరిశీలిస్తే సరుకుల అమ్మకం చట్టంలోని 'సరుకుల' (ఆ౦౦ర9) నిర్వచనమే వినియోగదారుల రక్షణ చట్టంలో యివ్వబడిందని అర్ధమవుతుంది. ఈ నిర్వచనం ప్రకారం స్థిరాస్తులు సరుకుల క్రిందకు రావు. అంటే భూములు, భవంతులు, సరుకులుగా పరిగణింపబడవు. కనుక వాటిని మినహాయించినట్లుగానే భావించవలసివుంది. అంటే స్థిరాస్తులు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి రావు. కాని నగరాలలో, పట్టణాలలో అపార్దుమెంటు సంస్కృతి అంచనాలకు మించి పెరిగిపోవడంతోను, తద్వారా కలుగుతున్న వివాదాలలో వినియోగదారులు నష్టపోకుండా ఉండటం కోసం వినియోగదారుల రక్షణ చట్టానికి సవరణ తీసుకువచ్చి భవన నిర్మాణ కార్యక్రమాలను రక్షణ చట్టం పరిధిలోనికి

మా

తీసుకురావటం జరిగింది. అదేవిధంగా వాణిజ్యం కోసం కొనుగోలుచేసిన వస్తువులు కూడా ఈ చట్ట పరిధిలోనికి రావు. సెక్షన్‌ 2(0) సేవల విషయంలో కూడా రెండు మినహాయింపులు యివ్వటం జరిగింది. ఉచితంగా సమకూర్చబడిన సేవలు కాని, వ్యక్తిగత సేవల ఒప్పందం కాని వినియోగదారుల రక్షణ చట్టం పరిదిలోనికి రావు.

  1. అబద్ధపు వార్తలు ప్రచురించే వార్తాపత్రికలు, ప్రజలను తప్పుదారి పట్టించే విశ్లేషణలతోకూడిన వార్తలు, 'వార' పత్రికలు ప్రచురించే అశ్లీల సాహిత్యం వినియోగదారుల చట్టం పరిధిలోనికి వస్తాయా?

జ. వినియోగదారుల రక్షణ చట్టంలోని సెక్షన్‌ 2 అనేక పదాలకు నిచ్వచనాలను అందబేసుంది. సెక్షన్‌ 2(0) పరిశీలిస్తే సేవ అనే పదానికి నిర్వచనం లభిస్తుంది. ఈ నిర్వచనంలో వార్తలను సమకూర్చడం కూడ సేవ క్రిందికే వస్తుంది. కాబట్టి. అబద్దపు వార్తలను, పారకులను తప్పుదారి పట్టించే వార్తలను ప్రశ్నించి పరిహారం పొందే హక్కు వినియోగదారునికి ఉంటుంది. భావ స్వాతంత్రాన్ని దుర్వినియోగ పరచకుండా ఉండటానికి ప్రైస్‌ కాన్సిల్‌ పనిచేస్తున్నప్పటికి మూల్యాన్ని చెల్లించి వార్తలను కొనుక్కునే [| వినియోగదారునికి న్యాయం చేకూర్చడం కోసం 'వార్తలను సమకూర్పటం' | సీవగ్గా గుర్తించి వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి తీసుకు | రాబడింది. తప్పుడు వార్తవలన తాను నష్టపోయిన విదానాన్ని, తద్వారా కలిగిన మానసీక క్షోభని నిరూపించుకోవలసిన అవసరం వినియోగదారుని

మీదనే ఉంది.

  1. నేను విజయవాడలో ఓ స్టార్‌ హోటల్‌లో బస చేశాను. రూములో పెట్టిననా సూటుకేసు నుంచి రూ.76,000 లు దొంగతనం జరిగింది. జిల్లా ఫోరంలో ఫిర్యాదుచేసి హోటల్‌ యాజమాన్యం నుండి పరిహారం పొందవచ్చునా? | ప్రస్తావించబడింది. లాడ్డిలు, భోజన హోటళ్ళు వినియోగదారుల రక్షణ ' చట్టం పరిధిలోనికే వస్తాయి. అందుచేత వీటివల్ల కలిగే అసౌకర్యానికి, నప్పానికి చట్టం పరిహారాన్ని యిప్పిస్తుంది. కొని మీకు ఎదురైన సంఘటనలలో కొన్ని విషయాలు మీకు అనుకూలంగా కన్పించటం లేదు. లాడ్డీలలో ఉండే సందర్భాలలో నగదు ఎక్కువగా ఉన్నప్పుడు హోటల్‌ క్యొషియర్‌ దగ్గర

౬10 క్ష

డిపాజిట్‌చేసి రశీదు పొందటం వివేకం. కాని మీరలా చేయకపోవటం వలన మీరు ఎంత డబ్బు పెట్టెలో పెట్టారో ఎంత తస్కరించబడిందో నిరూపించటం కష్టతరం. పోలీసు కంప్లయింట్‌ యిచ్చి తదుపరి పోలీసు విచారణలో మీరు పోగొట్టుకున్న డబ్బుకు ఆధారాలు లభిస్తేకాని మీరు పోగొట్టుకున్న డబ్బు ఎంతో నిర్దారణ కాదు. ఏది ఏమైనా మీరు నివసిస్తున్న రూముకు రక్షణ కల్పించవలసిన బాధ్యత హోటల్‌ యజమాన్యంపై ఉంటుంది. అదేవిధంగా లాడ్జిలో నివసించే సమయంలో మీకు భౌతిక రక్షణ కల్పించవలసిన బాధ్యత కూడా హోటల్‌ యాజమాన్యంపై ఉంది.

  1. ఈ మధ్య ఓ ఎ.సి. థియేటర్‌లో సినిమా చూశాను. ఎ.సి. మధ్యలో ఆపేశారు. దీనికి పరిహారం పొందగలమా?

జ. కోటానుకోట్ల (ప్రేక్షకుల సాక్షిగా, జిల్లా అధికార యంత్రాంగం సాక్షిగా, సినిమాటోగ్రఫీ రూల్సు సాక్షిగా, వినియోగదారుల రక్షణ చట్టం సాక్షిగా ఏవో అసంబద్ద కారణాలు చూపి ఎసి. నిలిపివయటమన్నది సినిమాహాలు యాజమాన్యం నిర్లజ్జగా పాల్పడుతున్న ఘాతుకమే. దీనికి బాధ్యత పూర్తిగా ప్రేక్షకులదే అని చెప్పవచ్చును. ఎదిరించలేని [్రేక్షకుల బలహీనతే యాజమాన్యం పెట్టుబడిగా పెట్టుకొని ఈ అనుచిత వ్యాపార విధానానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎ.సి. ఎందుకు ఆపారు? అని అడిగితే సమాధానం చెప్పడానికి బాధ్యతగలవారెవరూ ఆ చుట్టు ప్రక్కల కనుపించరు. ఈలోగా కొంత సినిమా పోతుందేమోనని (గ్రేక్షకుడి భయం. గ్రేుక్షకులలో పట్టుదల ఉంటే పరిహారం పొందడమనేది కష్టమైన పనేమీ కాదు. సినిమా టికెట్టు ముక్కను భద్రపరచుకొని జిల్లా ఫోరంకు ఫిర్యాదుచేసి పరిహారం పొందిన సంఘటనలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా జరిగిన విషయం జిల్లా జాయింటు కలెక్టరుకు ఫిర్యాదు చేస్తే ఆ సినిమాహాలుపై చర్య కూడా తీసుకుంటారు. ఇంతేకాకుండా కొన్ని సినిమాహాలు సీట్లలో నల్లులు, ఇతర కీటకాలు చేరి (ప్రేక్షకులను హింసిస్తాయి. వినోదం కోసం వెళ్ళిన గ్రేక్షకునికి విషాదమే మిగులుతుంది. ఇక టాయిలెట్స్‌ దుర్గంధ భూయిష్టమై ఉపయోగించిన అరగంట వరకు వికారాన్ని కలిగిస్తాయి. గ్రుక్షకులు సంఘటితంగా ఉంటే ఈ రుగ్మతలన్నీ మబ్బుతెరల్లా విడిపోతాయి. వినోదం కూడ వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికే వస్తుందనే విషయాన్ని మరిచిపోకండి. సర్కస్‌, ఎమ్యూజొమెంటు పార్కు, సంగీత విభావరి ఇలా

1]

మూల్యం చెల్లించి వినోదం కోసం వెళ్ళే ప్రతి సందర్భంలోను మీలో నిద్రాణంగా ఉన్న వినియోగదారుణ్లి లేపండి.

  1. వినియోగదారుల రక్షణ చట్టం గురించి తెగ ప్రచారం చేస్తున్నారు. ఏమిటి ఈ చట్టం యొక్క గొప్పదనం?

జ. ప్రజా సంక్షేమ చట్టాలలో వినియోగదారుల చట్టాన్ని వినూత్న చట్టంగాను, అంతకు మించి శక్తివంతమైనదిగాను బావించవచ్చును. కేవలం 31 "సెక్షన్లతో అతి క్లుప్తంగా తయారుచేయబడినప్పటికి శక్తివంతంగానే రూపొందించబడింది. ఆరు హక్కులు కల్పించి అ హక్కుల పరిరక్షణార్ధం న్యాయ వ్యవస్థను ఏర్పరచి సులభరీతిలో, అతి తక్కువ ఖర్చుతో, సత్వర న్యాయాన్ని పొందేలా రూపొందించబడిన ఈ చట్టం సంక్షేమ చట్టాలకే తలమానికంగా చెప్పుకోవచ్చును. గతంలో వినియోగదారుల రక్షణార్దం సుమారు 25 చట్టాలు చేయబడినప్పటికి అమలులో అవి ఆశించిన రీతిలో వినియోగదారులకు రక్షణ కల్పించలేకపోయినాయి. పైగా ఆ చట్టాలలో నషపోయినవాడికి పరిహారం లేదు. నేరము చేసిన వాడికి శిక్ష మాత్రమే ఉంది. వినియోగదారునికి నష్టపరిహారం యిప్పించే ఏకైక చట్టం యిది. కనుకనే వినియోగదారుల రక్షణ చట్టం అంటే అందరూ గొప్పగా చెప్పుకోవటం జరుగుతుంది.

  1. నేను ఒక యల్‌.ఐ.సి. ఏజంటుని. నేనొక వినియోగదారుల సంషాన్ని స్థాపించాలని ఈ ఉద్యమంలో పనిచేసే వ్యక్తిని సలహా అడిగితే (వతివాడు వినియోగదారుల సంఘాన్ని స్థాపించడమేనా?' అని ఎద్దేవా చేశాడు. వినియోగదారుల సంఘాన్ని స్థాపించడానికి ఎవరు అర్హులు?

జ. “ఎవరుపడితే వాళ్ళు వినియోగదారుల సంఘాన్ని స్థాపించడమేనా?” అని అన్నవ్యక్తి మానసిక దుర్భలత దీనివల్ల స్పష్టమవుతుంది. వృత్తులలో వ్యాపారాలలో ఉన్నవారు వినియోగదారుల సంఘాలను స్థాపించ కూడదు అని ఎవరైనా చెప్పబోతే పనిలేనివాళ్ళే వినియోగదారుల సంఘాన్ని స్థాపించేది కాబోలు అనే అర్ధం వస్తుంది. ప్రభుత్వోద్యోగులు వినియోగదారుల సంఘం స్థాపించకూడదనే మరో అపోహ ఉంది. ప్రతి వ్యక్తి సందర్భాన్నిబట్టి వినియోగదారుడే అవుతాడు. కనుక తనకు తాను ఇతరుల మోసాలబారి

నుండి రక్షించుకోవడానికి ఈ ఉద్యమంలో ప్రవేశించటం అవసరం. ఓ 7 12

ప్రక్క నుంచి వినియోగదారుల ఐక్యత నేటి అవసరం అని నినదిస్తూనే మరో ప్రక్క ఈ ఉద్యమానికి నీవు పనికిరావు అని చెప్పటం హాస్యాస్పదం. ఆ మధ్య కేంద్ర వినియోగదారుల మండలి ఈ విషయంపై కొన్ని నిబందనలను ఏర్పరచాలని అ నిబంధనలు ఏ విధంగా ఉంటే బావుంటుందో సూచించమని ఓ కమిటిని ఏర్పటుచేసింది. ఆ కమిటి రూపొందించిన నియమావళి కూడా హాస్యాస్పదంగానే ఉంది. మరే యితర సంఘాలు పార్టీలలో కార్యవర్గ బాధ్యత నిర్వహిస్తున్న ఏ ఒక్కరూ వినియోగదారుల సంఘం నాయకులుగా ఉండరాదు అనే ఒక సూత్రం ప్రతిపాదించారు. ఇద్‌ బహుశా రాజ్యాంగ ప్రాధమిక సూత్రాలకే విరుద్దంగా ఉందేమో. ఈ ఉద్యమానికి వీళ్ళు పనికిరారు, వాళ్ళు పనికి వస్తారు అనే ఆలోచనే సరియైనది కాదు. దీనివలన రాజకీయ పార్టీలవారిని, వ్యాపారస్తులను, డాక్టర్లవంటి వృత్తులలో ఉన్నవారిని దూరంచేసుకోవడమే అవుతుంది. వర్గ పోరాటానికి అంకురార్పణ జరుగుతుంది. పసి వయస్సులోవున్న ఉద్యమానికి ఇది విఘాతం కలిగిస్తుంది. ఓ ప్రక్క దేశ జనాబాలో సగభాగమైన మహిళలు ఆసక్తికరంగా ఉద్యమంలో పని చేయలేకపోవడం, మరో ప్రక్క వృత్తులలో, వ్యాపారాలలో, రాజకీయాలలో ఉన్నవారు పనికిరారని చెప్పటం ఈ ఉద్యమాన్ని అధోగతికి తీసుకుపోతుంది నిస్వార్ధంగా పనిచేసే ప్రతి వ్యక్తి ఈ ఉద్యమానికి అవసరం. చదవగలిగి, వ్రాయగలిగి, అర్థం చేసుకోగలిగిన ప్రతి వ్యక్తి వినియోగదారుల సంఘం స్థాపించటానికి ముమ్మాటికి అర్హు డే.

  1. మీరేమో బిల్లు తప్పనిసరి అంటారు, షాపువారేమో ఇవ్వనంటారు, మా పరిస్థితేమో అడకత్తెరలో పోకచెక్క చందాన వుంది. ఏం చేయాలో చెప్పండి?

జ. వినియోగదారుల బలహీనత వల్లనే వ్యాపారస్తులు బిల్లు యివ్వకుండా తప్పుకుంటున్నారు. బిల్లు తీసుకుంటే అదనంగా టాక్సు కట్టవలసి వస్తుందేమోనని వినియోగదారుల భయం. అన్నింటికి చిల్లునిస్తే తన టర్నోవరు వాణిజ్యశోఖకు తెలిసిపోతుందేమోనని వ్యాపారస్తుడి భయం. ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు ఆ బిల్లుకు దూరంగానే ఉంటున్నారు. బిల్లు తీసుకున్నా తీసుకోకపోయినా పన్నులు కలిపే వస్తువును విక్రయిస్తారు అనే విషయాన్ని వినియోగదారుడు అర్ధంచేసుకుంటే బిల్లువల్ల తనకు అదనంగా నష్టం రాదు అనేది గమనిస్తాడు. అయినా బిల్లు అడిగిన

కలా

కారణంగా వ్యాపారస్తుడు పన్ను రూపేణా అధికంగా వసూలుచేయడానికి ప్రయత్నిస్తే అధిక ధరను తీసుకున్నందుకు సంబంధిత అధికారులకు వరా దు చేయవచ్చు. బిల్లు తీసుకుంటే పన్నుబాధ _ఉన్నప్పటికి బిల్లు రరీతే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని వినియోగాదారులు గమనించాలి. అడగకుండానే న్యాపారస్తుడు బిల్లు యివ్వాలి. అడిగితే రూ.10/-లకు తక్కువైనాసరే బిల్లు యివ్వాలి. బిల్లు యివ్వడానికి ఏ వారపారసుడెనా మొరాయిస్తే సంబంధిత వాణిజ్య సన్నుల అధికారికి ఫిర్యాదు “చేయవలసి ఉంటుంది. బిల్లే సౌఖ్యమనే భావన రానీవోయి లేకుంటే అన్నీ కష్టాలేనోయి. 22. ఎప్పుడూ వినియోగదారుల హక్కుల గురించే మాట్లాడుకుంటున్నాం. మరి జ. హక్కులతోపాటు బాధ్యతలు కూడా నిక్షిప్తమై ఉంటాయి. బాధ్యత నిర్వర్తించకుండా హక్కులనే కలిగిఉండాలనుకోవటంశోచనీయం. ఆ బాధ్యతలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

  • తమ ఫిర్యాదుని వినిపించేటప్పుడు ఆవేశాలకు లోనుకాకుండా మర్యాదపూర్వకంగా ఎదుటివారికి చెప్పాలి,
  1. ఫిర్యాదుచేసేముందు అమ్మేవారు చేప్పేది అర్ధంచేసుకోవటాన్సిక్షి ప్రయత్నం చేయాలి.
  2. _ కొన్న ప్రతి 'వస్తువుకు బిల్లు అడిగి తీసుకోవాలి.
  3. _ వ్యక్తిగత కక్షలతో న్యాయసమ్మతం కాని ఫిర్యాదు చేయరాదు.
  1. తమ హక్కుల గురించి పోరాడే సమయములో ఎదుటివారి హక్కులకు భంగం కలగకుండా చూడాలి.
  1. _ తమకు జరిగిన అన్యాయాన్ని లేదా మోసాన్ని తోటి వినియోగదారునికి తెలియజేయాలి.

  2. పర్యావరణ వరిరక్షణకు అనుకూలంగాలేని ప్యాకింగులను ప్రోత్సహించరాదు.

  3. లంచం యివ్వకూడదు, తీసుకోకూడదు. ౬14

  4. _ కొరత కాలంలో దొరకవేమోనన్న భయంతో వస్తువులు అవసరానికి మించి కొని దాచిపెట్టకూడదు. స్మగుల్డ్‌ వస్తువులు కొనరాదు.

  1. వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి డాక్టర్లు వస్తారా?

జ. మూల్యం తీసుకొని సేవలు అందించే వృత్తులలో ఉన్నవారు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి వస్తారు. వారు అందించే సేవలలో లోపాలు ఉన్సవ్వుడు, దానివల్ల వినియోగదారులు నవృ్చపోయినవుడు వినియోగదారులు పరిహారం పొందవచ్చును. ప్రత్యక్షంగా వైద్యుడు అనే పదం వినియోగదారుల రక్షణ చట్టంలో లేనప్పటికి సేవ అనే పదానికిచ్చిన నిర్వచనం వల్ల డాక్టర్లు, లాయర్హు, ఆడిటర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, కన్సల్దెంట్సు మొదలగువారు ఈ పరిధిలోనికి వస్తారు. కేరళ రాష్ట్ర కమీషన్‌ ఇచ్చిన తీర్పులో డాక్టర్లు ఈ చట్టపరిధిలోనికి వస్తారు అని తీర్పు చెప్పటం, దానిని జాతీయ కమీషన్‌ సమర్ధించటం వల్ల వైద్యులు ఆ తీర్పు చెల్లదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు డాక్టర్లు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వస్తారని నిర్వ్వందంగా ప్రకటించింది. పని పైకూడా వైద్య సంఘాలు అప్పీలు చేసుకున్నాయి. తీర్పు రావలసి వుంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల జరగకూడనిది ఏదైనా జరిగితే దానిని ప్రశ్నించడానికి ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఉండగా వైద్యులును వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి తీసుకురావటంలో అర్దం లేదని వారి వాదన. ఏది ఏమైనా డాక్టర్లు ఈ చట్టపరిధిలోనికి వస్తారు.

  1. ఆమధ్య కలకత్తా హైకోర్టు వినియోగదారుల రక్షణ చట్టం చెల్లదని తీర్పు యిచ్చిందట. దాని వివరాలు అందజేస్తారా?

జ. ఒక వినియోగదారుడు పీర్‌లెస్‌ కంసెనీపై పశ్చిమ బెంగాలులోని పురూలియా జిల్లా ఫోరంలో ఫిర్యాదు చే స్తే జిల్లాఫోరం వినియోగదారులకి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పువలన భంగపడిన పీర్‌లెస్‌ కంపెనీ తమ కేసుని చేపట్టడానికి ఆ జిల్లా ఫోరంకి అధికారం లేదని కలకత్తా హైకోర్టుకి అప్పీలు చేసింది. వాద ప్రతివాదనలు విన్నాక హైకోర్టు తీర్పు చెప్పుతూ వినియోగదారుల రక్షణ చట్టం ఓ సమాంతర న్యాయ వ్యవన్థను ప్రోత్సహిస్తోంది. కనుక ఇది రాజ్యాంగ విరుద్దం. ఈ చట్టం చెల్లదని 29.2.1996న తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం డివిజన్‌

౬కు

బెంచ్‌కు అప్పీలు చేసింది. క్రింది బెంచి యిచ్చిన తీర్పుని అమలు కాకుండా చేస్తు డివిజన్‌ బెంచ్‌ స్టే యిచ్చింది. ఈ విషయముపై ఇంకా తీర్పు రావలసి వుంది.

  1. ఏదైనా వస్తువు కొనేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించండి.

జ. నష్టపోయిన తర్వాత వాపోయేకంటే నష్టపోకుండా చూసుకోవడమే శ్రేయోదాయకం. యాంత్రికంగా వస్తువులను కొనే అలవాటు నుండి ప్రతివారు బయటపడాలి. నాకు అంత తీరిక లేదు అని భావించేవారు మార్కెట్‌కు వెళ్ళకుండా ఉండటమే ఉత్తమం. ఇక వస్తువు కొనేముందు తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ విధంగా ఉంటాయి.

[0 ఈ వస్తువు నా అవసరానికి ఉపయోగపడుతుందా?

  1. ఇది సరసమైన ధరలలో లఖిస్తోందా, లేక వేరేదైన కంసెనీవారు మరింత తక్కువ ధరకు ఇస్తున్నారా?

  2. _ వ్యాపార ప్రకటనలవల్ల ప్రభావితమై నేను ఈ వస్తువును కొంటున్నానా?

  3. ఈ వస్తువును తయారుచేయడానికి ఉపయోగించిన పదార్దాలు ఏమిటి? అవి వ్రమాదకరమైనవా?

  4. _ ప్యాకింగుపై ఉత్పత్తిదారుడు సమకూర్చిన సమాచారం ఏమిటి?

  5. ఈ వస్తువు పాడైతే బాగుచేయడానికి గల వసతులు దగ్గరలో ఉన్నాయా?

"పైన చెప్పిన ఈ అంశాలతో వినియోగదారుడు తన ఆలోచనలను ప్రభావితం

చేస్తే నష్టాల బారి నుండి, మోసాల బారి నుండి తప్పించుకోవడానికి

అవకాశం ఉంటుంది.

  1. రైతులు తాము పండించిన పంటను అమ్ముతారు కనుక అది వ్యాపారం కిందికి వన్తుందా? మరి అటువంటి సందర్భములో అతనికి కలిగే కష్టనష్టాలను వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేయవచ్చునా?

జ. రైతులు వ్యవసాయం చేయడానికి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, (ట్రాక్టర్లు వంటి అనేకానేక వస్తువులు ఉపయోగించవలసి ఉంటుంది. ఆ

  • షక

సందర్భములో వ్యవసాయ సామగ్రిని అద్దెకు తెచ్చుకోవటం కాని, కొనుక్కోవటం కాని జరుగుతుంది. మూల్యం చెల్లించి ఈ వస్తువులను కొని వినియోగించటం జరుగుతుంది. కనుక రైతులు కూడ వినియోగదారులే. పండిన పంటను అమ్ముతారు కనుక రైతు వ్యాపారస్తుడు అనే మీమాంస అనవసరం. ప్రతి రైతు తన జీవనభృతికోసం వ్యవసాయంపైన అధారపడతాడుకనుక ఇది స్వయం ఉపాధిగా పరిగణించవలసి ఉంటుంది. పెద్ద పెద్ద వాణిజ్య అంశాలు గాని, అధిక లాభాలులేని వ్యవసాయ

ఉత్పత్తుల విక్రయం గాని వాణిజ్యంగా సరిగణించటం తగదు. ముఖ్యంగా

పల్లెల్లో అమాయకంగా జీవనం సాగించే రైతులకు వినియోగదారుల రక్షణ

చట్టం ఓ వరంలాంటిది. ఈ మాత్రం రక్షణ కూడ కొరవడితే రైతుల పరిస్థితి

మరింత దయనీయంగా ఉంటుంది. కొన్ని జిల్లాఫోరం తీర్పులు కూడ

రైతులు వినియోగదారులే అని స్పష్టం చేశాయి. కాని పంటలను అమ్ముకొనే

సందర్భంలో రైతుకు, బ్రోకర్లకు మధ్యలో వివాదాలు కొని, వ్యవసాయ

ఉత్పత్తులు కొనేవారి మధ్య వివాదం కాని వినియోగదాలుల రక్షణ చట్టం

పరిధిలోనికి రావు.

  1. ఒక క్రొత్తకారు కొని అద్దెకు త్రిప్తుకొంటున్నాను. ఆ కారులో లోపాలు ఉండటం వలన వినియోగదారుల కోర్టుకెళ్ళి పరిహారం పొందాలనుకుంటే ఆ కారును టాక్సీగా త్రిప్పి వ్యాపారం చేస్తున్నావు కనుక నీవు వినియోగదారుడివి కాదు అన్నారు. ఇది ఎంతవరకు సమంజసం?

జ. వినియోగదారుల రక్షణ చట్టం సెక్షన్‌-2 (డి) (0లో వినియోగదారుని నిర్వచనం క్రింద ఎవరు 'వినియోగదారుడు' అనే అంశం స్పష్టం చేయబడింది. తిరిగి అమ్మకానికి వస్తువులు కొన్నవారు కాని, వాణిజ్యం నిమిత్తం వస్తువులు కొన్నవారు కాని, వినియోగదారులు కారు. గతంలో జిల్లా ఫోరంలు వ్యాపారం కోసం వస్తువులు కొన్నవారు వినియోగదారులు కాదు అని తమ తీర్పులో స్పష్టం చేశాయి. ఫోటోస్టాట్‌ కాపీ మిషను కొని చిన్న వ్యాపారం చేసుకుంటున్న ఓ వ్యక్తి ఆ ఫోటోస్పాట్‌ కాపీ మిషన్‌ తయారుచేసిన కంపెనీ యొక్క నిర్లక్ష్య భావంతో నష్టపడి జిల్లా ఫోరంకు ఫిర్యాదు చేస్తే నీవు వినియోగదారుడివి కావు, అందుచేత ఈ కేసు కొట్టివేస్తున్నాం అని జిల్లా ఫోరం తీర్చు చెప్పడం జరిగింది. ఇలా అనేకానేక కేసుల్లో తీర్పులు వినియోగదారులకు వ్యతిరేకంగా వెలువడినాయి. చివరకు

జాతీయ కమీషన్‌లో ఇటువంటి సిర్యాదులు పరిష్కరించే సందర్భములో బ్రతుకుతెరువుకోసం చిన్ని చిన్ని వ్యాపారాలు చేసుకొనే వ్యక్తులు వస్తున్సలను కొన్నప్పుడు అవి వాణిజ్యం కోసం కొన్నట్ట్లుగా భావించరాదు అని తీర్పునివృుడంతో స్వయం ఉపాది పధకాలు చేపట్టినవారు-వినియోగదారులుగా గుర్రించబడ్డారు. ఈ విషయంలో మరి ఎటువంటి సందిగ్గానికి తావులేకుండా 1993లో వాణిజ్య ప్రయోజనం అనే మాటకు చట్టాన్ని సవరించడం ద్వారా ఒక వివరణను చేకూర్చారు. ఈ వివరణ ప్రకారం కేవలం జీవన భృతిని సంపొదించటంకోసం ఎవరైనా వస్తువును కొనుగోలుచేసినప్ప్తుడు అది వాణిజ్య ప్రయోజనంకోసం కాదు, స్వయం ఉపాధికోసం అని బావించాలి. అందుచేత కారు కొనుక్కొని టాక్సీగా త్రిప్తుకొంటు జీవనభృతిని సంపాదిస్తున్న మీరు కూడ వినియోగదారులే. ఆ కారులో లోపాలవల్ల మీకు నష్టం కలిగితే జిల్లా ఫోరంకు పిర్యాదు చేయవచ్చును. 28. సినీ నిర్మాణ సంస్థలు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి వస్తాయా? జ. గేేుక్షకులు సినిమాకు ఎందుకు వెళతారు? సినిమాలు కేవలం వినోదం కోసమే కనుక వినోదం అందించటం అనేది వినియోగదారుల రక్షణ చట్టంలోని సెక్షన్‌-2 (0లో సేవ అనే పదానికిచ్చిన నిర్వచనంలో భాగంగా ఉంది. అందుచేత మూల్యాన్ని చెల్లించి వినోదాన్ని పొందే సందర్భంలో కలిగే మానసిక క్షోభకు, అసౌకర్యానికి పరిహారం పొందడానికి అవకొశం ఉంది. ఈ మధ్యన మనం చూస్తున్నాం- అశ్లీల పదజాలంతో చూడటానికి ఇబ్బందికర సన్నివేశాలతో వచ్చేసినిమాలను. ఇటువంటివాటిని వినియోగదారుల రక్షణ చట్టం క్రీంద ప్రశ్నించే అవకాశం ఉంది. నేరస్తులను మహా నాయకులుగా చూపిస్తూ నేర ప్రవృత్తిని ప్రోత్సహించేవిధంగా ఉండే సినిమాలు సమాజానికి చేటుని తెస్తాయి. కనుక వ్యక్తిగత ప్రాణాలకు, ఆస్థికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కనుక వినియోగదారుల రక్షణ చట్టం పొందుపరచిన 'మొదటి హక్కును వినియోగించుకొని అటువంటి చిత్ర ప్రదర్శనను ఆపడానికి కూడ అవకాశం ఉంది. సెన్సార్‌ బోర్డువారు సర్టిఫికెట్‌ ఇచ్చినంత మాత్రాన వినియోగదారుల రక్షణ చట్టం ఏమీ వేయలేదని భావించడం తప్పు. అందుచేత సినీ నిర్మాతలు కూడ వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి వస్తారనేది నిర్వినాదాంశం. 18 ఎ

  1. విద్యాసంస్థలు వినియోగదారుల రక్షణ చట్టం పరిదిలోనికి రావని తీర్పు వెలువడిన మాట నిజమా?

జ. అవును. వినియోగదారుల రక్షణ చట్టం వచ్చిన ఆరంభదశలో కొన్ని జిల్లా ఫోరం తీర్పులు ఆ విధంగానే ఉన్నాయి. మార్కులు వేయడంలో ఒక విశ్వ విద్యాలయంలో జరిగిన అవకతవకలను జిల్లాఫోరం ముందు పెడితే ఆ జిల్లా ఫోరం “విద్య” ఈ చట్ట పరిధిలోనికి రాదు అని తీర్పునిచ్చింది. మరొక జిల్లా ఫోరం విద్యార్థి వినియోగదారుడా కాదా అనే అంశంపై తీర్పునిస్తూ పరీక్ష ఫీజు కట్టి పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థి వినియోగదారుడే అని తీర్చు చెప్పింది. తర్వాత మరో రాష్ట్ర కమీషన్‌ విద్యాలయాలు కూడ ఈ చట్ట పరిదిలోనికి వస్తాయని తీర్పుబెస్పింది. కాని ఈ విషయంలో పలు జిల్లా ఫోరంల మధ్య ఏకీభావం ఉన్నట్లుగా కన్పించదు. జిల్లా ఫోరంలు ఆవిర్భవించిన క్రొత్తలో ప్రతి ఫిర్యాదుని చేపట్టి తీర్చునివ్వడం జరిగేది. తరువాత కొలరలో జిల్లా పోరంలో ఫిర్యాదులు పసెరిగిపోయినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఈ చట్ట పరిధి లోనికి రావంటూ తిరస్కరించడం జరిగింది. ఏది ఏమైనా పూర్వకాలంలో అందించిన విద్యకు నేడు అందిస్తున్న విద్యకు హస్తి మశకాంతరం తేడా ఉంది. ఆనాటి విద్యలో వాణిజ్య విశేషాలు కానరావు. కాని నేటి విద్య అమ్మకానికి సిద్దంగా ఉంది. విద్యాలయాలు వ్యాపార సంస్థలై క్లాసులో కూర్చోవడానికి ఫీజు, క్లాసు బయటకెళలితే సఫైను, సీటు కోసం డొనేషను, ఇక్కడే పుస్తకాలు కొనాలన్న నిర్పంధం, బయట నుండి చదువుతానంటే నిర్లక్ష్యం, హాస్టళ్ళలో చేరితే ఆప్యాయం, అడుగడుక్కి ఖరీదు కట్టే సంస్కారంలో నేటి విద్యా బోధన తాండవం చేస్తోంది. చదువుకుంటున్న పాపానికి ఇంత భారీ మూల్యం చెల్లించి విద్యార్థులు

వినియోగదారుల నిర్వచనం కిందికి వస్తున్నారు. పారిశ్రామిక ఉత్పత్తులు గ్యారంటీ యిచ్చినట్లే పాసు గ్యారంటీ, సీటు గ్యారంటీ ఇవేవి కాకపోతే ఫీజు వాపసు గ్యారంటీ. వాణిజ్యపరంగా విద్యాలయాల్లో చోటుచేసుకుంటున్న అనారోగ్య వాతావరణమిది. అందుచేత “ధనం మూలం ఇదం జగత్‌” అనే సంస్కృతిలో నిర్వహించబడుతున్న ఈ విద్యాలయాలు ముమ్మాటికి వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి రావలసిందే. ఈ విషయంలో జిల్లా ఫోరంల మధ్య అలోచనా వైవిధ్యమున్నట్లయితే చట్టాన్ని సవరించి విద్యాలయాలను ఈ చట్టపరిధిలోనికి తీసుకురావలసి ఉంటుంది.

మూ, ఆ

  1. అసలు ధర తెలుసుకోవాలంటే వీలుపడటం లేదు. వీనికేమైన మార్గాలుంటే శలవిస్తారా?

జ. వ్యవసాయోత్పత్తులకు అసలు ధర అనేది మార్కెట్టుపై ఆధారపడి ఉంటుంది. సరుకు ఎక్కువగా లభ్యమయిజే ధర తక్కువవుతుంది. సరుకు కొరతగా ఉంటే (వర్నాలు, తుఫానులు, పంట నష్టాలు, బందులు, రవాణ యిబ్బందుల మూలంగా) ధరలు పెరిగిపోతాయి. సరుకు - గిరాకీ అనే ఈ వలయంలో వినియోగదారులే ప్రముఖ పాత్ర వహించవలసి ఉంటుంది. కాని ఎపుడూ వినియోగదారుడు అలసత్వంపదర్శిస్తున్నాడు కనుకనే ధరల సుడిగాలిలో అతను కొట్టుకుపోతున్నాడు. అదే పారిశ్రామిక ఉత్పత్తులలో అయితే ఉత్పత్తిదారుడు ప్రకటించిన ధరల పట్టికగాని, లేదా ప్యాకేజిపై ముద్రించిన ధరను గాని తెలుసుకోవచ్చును. ధరను తెలుసుకోవాలనే ఉద్దేశ్యము వినియోగదారునికుంటే తెలుసుకోవడానికి చాలా మార్గాలుంటాయి. కాని సరసమైన ధర ఏది అని తెలుకోవటానికి వినియోగదారుడు కొంచెం శ్రమించవలసి ఉంటుంది. తాను కొందామనుకునే వస్తువు ఎక్కడ లభ్యమవుతుందో తెలుసుకోగలగాలి. నలుగురు విక్రేతల నుండీ ధర ఆరాతియ్యాలి. వారు చెప్పే ధరకు, అమ్మే వస్తువు నాణ్యతకు మధ్య సంబంధాన్ని చూడాలి. అప్పుడే సరసమైన ధర నిర్ణయించడం వీలుపడుతుంది. మనం వెచ్చించే సొమ్ముకు తగిన విలువగల వస్తువును కొనగలిగినప్తుడు లబ్ది పొందగలం. కొన్ని కొన్ని వ్యాపార సంస్థలవారు అసలు ధరకు మించి పెట్టెల మీద ధరలు వేస్తుంటారు. లేదా ధరలు పెరిగినాయి అనే ఉద్దేశ్యంతో కొత్త ధరను స్ఫిక్కర్‌పై వ్రాసి అంటిస్తుంటారు. చిల్లర వర్తకులు కాని, హోల్‌సేల్‌ వ్యాపారస్తులు కాని ఈ విధంగా స్టిక్కర్‌ అంటించకూడదు. ధర పెరిగిన సందర్భములో ఉత్పత్తిదారుడు మాత్రమే సెట్టెలపై ధరను మార్చడానికి అనుమతి వుంది. అలాగే వస్త్రాలపై కూడా తాను లోని గుడ్డ మొదటి భాగంలో కంసెనీవారే ధరను ముద్రిస్తారు. అసలు ధర ఎంత అని తెలుసుకోవటం కంటే మనం కొన్న వస్తువు మనం చెల్లించే మూలానికి తగినంత నాణ్యత కలిగి ఉండి మన ఉపయోగాలను తీర్చగలదా అని ఆలోచించటం ముఖ్యం.

క్‌గా

  1. మా పెళ్ళైన కొత్తలో మావారు ఓ గ్యొస్‌ డీలర్‌ దగ్గర క్రొత్త గ్యాస్‌ కనక్షన్‌ కోసం బుక్‌చేశారు. ఇప్పటికి అయిదేళ్ళయింది. యింతవరకు గ్యాస్‌ కనెక్షన్‌ రాలేదు. గ్యాస్‌ డీలర్‌ నుండి సరైన సమాధానం రాదు. ఇటువంటి పరిస్థితిలో జిల్లాఫోరంను ఆశ్రయించవచ్చా?

జ. గ్యాస్‌ కనెక్షన్‌ కోసం బుక్‌చేసేటప్పుడు ఎటువంటి చెల్లింపులు ఉండవు కనుక మూల్యం చెల్లించకుండా వినియోగదారుడు అనే నిర్వచనంలోకి రారు కనుక వినియోగదారుల రక్షణ చట్టం వర్తించదు అనే ఆలోచన ఉండేది. కాని వినియోగదారుల కోర్టులలో వస్తున్న తీర్పుల పరంపరలో ఒక తీర్చు ఈ ఆలోచన సరియైనది కాదు అని స్పష్టం చేస్తుంది. గ్యాస్‌ బుక్‌ చేసేటప్పుడు ఎటువంటి చెల్లింపులు చేయకపోయినప్పటికి భవిష్యత్తులో గ్యాస్‌ కనెక్షన్‌ ఎలాట్‌మెంట్‌ జరిగిన తరువాత డబ్బు చెల్లించాళ్సి ఉంటుంది కనుక గ్యాన్‌ బుకొచేసుకున్నవారు కూడ వినియోగదారులే అని ఆ తీర్పు సారాంశం. ఇక మీరు జిల్లా ఫోరంలో గ్యాస్‌ కనక్షన్‌లో జరుగుతున్న జాప్యాన్ని గురించి ఫిర్యాదు చేయటానికి ముందు గ్యాస్‌ డీలరు యొక్క లోపాన్ని గుర్తించండి. మీ తర్వాత బుక్‌ చేసినవారికి గ్యాస్‌ కనక్షన్‌ ఇచ్చి మీకు యివ్వకపోయిన సందర్భంలోకాని లేదా దొంగపేర్లతో బుక్‌చేసిన సందర్భములోకాని లేదా బ్లాక్‌ మార్కెట్‌లో బుక్‌చేయని వారికి గ్యాస్‌ కనక్షన్‌ ఇస్తున్న సందర్భంలో లేదా ముందు గ్యాస్‌ స్టాన్‌ కొంటేనే గాని మీకు కొత్త గ్యాస్‌ కనక్షన్‌ ఇవ్వనని గ్యాస్‌ డీలర్లు బెదిరించిన సందర్భములో మీరు జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయటానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ విధానాన్ని అనుసరించి కొత్త గ్యాస్‌ కనక్షన్‌ యివ్వటంలో జరుగుతున్న జాప్యాన్ని ఆధారంగా తీసుకుని గ్యాస్‌ డీలర్‌పై ఫిర్యాదు చేయటానికి అవకాశం ఉండదు. .

  1. ప్రపంచం కల్తీలమయం. కాదేదీ కల్తీల కనర్హం అని పొడుకుంటున్న ఈ రోజుల్లో సామాన్యుడికి రక్షణ ఏది? "

జ. బహుశా మీ ఉద్దేశ్యంలో సామాన్యుడు అంటే బ్రతుకు భారాన్ని ఈడ్చలేక బజారులో దొరికే చవకబారు వస్తువులను కొని, తిని తన ఆరోగ్యాన్ని భగవతార్పణ చేసే వినియోగదారుడే కాబోలు. చాలా మంది వినియోగదారులకు కల్తీ అనే పదానికి సరైన అర్ధం తెలియక తాము

2

ఊహించినదే కల్తీ అని భావిస్తున్నారు. పాలల్లో నీళ్ళు కలిపితే సర్జుకుపోతున్నవారు 99 శాతం మనకు కన్పిస్తారు. ఒక నూనెలో మరో నూనె కలిపి కల్తీ కాదని దబాయించేవారు, ఆ దబాయింప్తుకు వత్తాసు పలికేవారు ఎందరో కన్ప్సిస్తుంటారు. ఇటువంటి పరిస్థితులలో ముందుగా కల్తీ అనే పదానికి అర్ధం తెలుసుకోగలగాలి. కల్తీ నిరోధక చట్టం ప్రకారం కల్తీ అంటే ఏదైనా ఓ పదార్ధంలోని సహజ లక్షణాలను తీసివేసినప్పుడుకాని లేదా కొన్ని కొత్త లక్షణాలను చేర్ప్చినప్పుడు కాని కల్తీ అవుతుంది. అంటే ఒకదానికి మరొకటి కలిపినప్పుడే కాకుండా ఒకదానిలో నుండి మరొకటి తీసివేసినా కల్తిగానే పరిగణించాలి. గతంలోనయితే కల్తీని గుర్తించిన తర్వాత పుడ్‌ ఇనస్పెక్టర్‌కు పిర్యాదు చేసి ఆయన కేసు పెట్టేవరకు కళ్ళప్పగించి చూడాల్సి వచ్చేది. కాని ఇప్పుడు చట్టాన్ని సవరించినతర్వాత వినియోగదారులు నేరుగా కేసు పెట్టే అధికారాన్ని పొందారు. కేసు పెట్టే అధికారమయితే పొందగలిగారు కాని ఆచరణలో ఏం చేయాలి అనేది శిక్షణ లేక పోవడం వల్ల మళ్ళీ అ పుడ్‌ ఇనస్సెక్టరు మీదే ఆధారపడవలసి వస్తుంది. అందుచేత ప్రతిఒక్క వినియోగదారుడు, వినియోగదారుల సంఘం నిర్వహించే శిక్షణా శిబిరాలలో పాల్గొంటే తప్ప ఇటువంటి విషయాలలో సామర్ధ్యత పెరగదు. కల్తీల విషయంలో పరిస్థితి ఇంకా నిరాశ జనకంగానే ఉంది. ప్రస్తుతం న్యాయమూర్తులు, కలెక్టర్లు, మునిసిపల్‌ కమీషనర్లు, ముఖ్యమంత్రి, మంత్రులు, వినియోగదారుల ఉద్యము నాయకులు కల్తీపాలు తాగుతున్నారనేది అక్షర సత్యం.

  1. తూకాలలో, కొలతలలో మోసాలు ఎలా జరుగుతాయి? వాటిని అరికట్టడంలో

| వినియోగదారుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జ. మన కళ్ళెదురుగా తూకం వేస్తూనే ఐంద్రజాలికుల్లాగా భ్రమింపజేసి మనల్ని మోసంచేసే చోరులు ప్రతినిత్యం మనకు కన్పిస్తూనే ఉంటారు. చూడటానికి తెలివైనవారుగా కూడ కన్పించరు. బ్రతుకు తెరువుకోసం పాటుపడుతున్న అమాయకుల్లాగానే కన్పిస్తారు. కాని తమ హస్తలాఘవంతో ఒక కేజిలో మూడవ వంతు కాజేయగల శక్తి వారిరుంటుంది. దీనికి వీరు ఉపయోగించే పద్ధతులు మూడు రకాలుగా ఉంటాయి. మొదటిది తక్కెడ పుల్లలతో తయారుచేసిన త్రాసులో తూకం వేయడం. ఈ త్రాసుకు మధ్య భాగములో కట్టిన తాడు చూడటానికి మధ్య భాగములో ఉన్నట్లు కన్పించినా

622

ఆ రంధ్రం ఏటవాలుగా ఉండి క్రింది భాగములో ఓ ప్రక్కకుపోయి ఉంటుంది. దానివలన రెండు వైపుల సమతుల్యం ఉండదు. త్రక్కెడ ఓ వైపుకు వాలిపోతూ ఉంటుంది. ఆ వాలిపోతున్నవైపు మనం కొనే పదార్థాలను పెట్టి రెండవ వైపు తూకపు రాళ్ళు పెడతారు. దొనివలన పూర్తిగా కేజి పదార్ధం వేయకపోయిన కేజీలా కన్పిస్తుంది. మరో పద్ధతిలో తూకం రాళ్ళు అడుగుభాగాన అరగతీసి ప్రభుత్వంవారి సీలు సీలుగా ఉండగానే ఆ సీలు సాక్షిగా 200 గ్రాముల వరకు ఎదుటివారి అమాయకత్వం బట్టి 1/2 కేజి వరకు మోసం జరుగవచ్చును. ఇక మూడవ విధానంలో తక్కెడ పల్లాలకు వేల్లాడుతున్న గొలుసులను మెలిపెట్టి తక్కువ పదార్ధం ఎక్కువ తూగేలా భ్రమింపజేస్తారు. అదేవిధంగా కొలతల్లో కేన్‌ అడుగు భాగాన మరొ రేకు అతికించటం వల్ల ఆ పాత్రలో తక్కువ ద్రవం పట్టి కొనేవారికి నష్టాన్ని కలుగజేస్తుంది. చాలా నిశితంగా గమనిస్తేనేగాని 10159 8ంగంగ ఉన్నట్లు తెలియదు. అలాగే కొలగారాల సైఒ* " తేడా ఉండటం కూడ వినియోగదారులకు నష్టం కలుగజేస్తుంది. బట్టల కొలతల్లో కూడ గజం బద్దకు, మీటరు బద్దకు తేడా తెలియని వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తప్పుడు కొలబద్దలతో మోసంజేయటం ఒక విధానమైతే తమ హస్తలాఘవంతో రెండు బద్దలు కొలిచినట్లు కన్పించినప్పటికి ఒకటిన్నర బద్దల కొలతతో మోసంచేసే అవకాశం ఉంది. ఇక పల్లెల్లోనయితే కొలిచి ఇవ్వవలసినవాటిని తూచి, తూచివ్వవలసినవి కొలిచి గందరగోళం సృష్టిన్తుంటారు. ఉదా: ద్రవ పదార్థమైన నూనె లీటరు లెక్కన గాక కేజీ లెక్కన యివ్వాలి. కాని అది ద్రవ పదార్ధం అవటం వలన కొలవడమే సరైన పద్ధతి అనే నిర్ణయానికి వచ్చేస్తుంటాము. ఈ కొలతలు, తూకాల్లో మోసాలు ఈ విధంగా ఉండగా మరొరకం మోసం ప్రజలు అంతగా పట్టించుకోవటం లేదు. 50 పుల్లలు ఉండాల్సిన అగ్గిపెట్టెలో కేవలం 35 పుల్లలే వెక్కిరిస్తున్న నంఘటనలు అనేకం. కనీసం వినియోగదారులకు ఈ విధంగా మోసపోయామన్న విషయం కూడ తెలియదు. ఈ విధంగా భారతదేశంలోని వినియోగదారులు ప్రతియేటా 1200 కోట్ల రూ॥లు నష్టపోతున్నారంటే వారి అమాయకత్వప్పు లోతులు ఎంతటి అగాధంలో వున్నాయో అర్ధం చేసుకోవచ్చును. మనం మోసానికి గురవుతామేమో అనే తలంపుతో పైన చెప్పిన మోసాలను నిశితంగా పరిశీలిస్తే వినియోగదారులు మోసానికి గురికాకుండా ఉంటారు. ఇళ్ళ వద్ద అమ్మకొనికి వచ్చిన కూరగాయలు, (23

చింతపండు, బియ్యం, పాలు వంటి అనేకానేక పదార్థాలను మనం ఇంటి దగ్గరే తూచుకోగలిగితే చాలావరకు ఇలాంటి మోసాలను అరికట్ట వచ్చును. ఇక మోసానికి గురైన సందర్భములో అలసత్వం ప్రదర్శించకుండా చట్టం తనకిచ్చిన హక్కును వినియోగించుకొని తప్పుడు తూకాలు కొలతలకు పాల్పడేవారిపై కేసుపెట్టాలి. దీనికోసం కొలతలు, తూకాల శాబవారికోసం ఎదురుచూడనక్కర్లేదు. నేరుగా వినియోగదారుడే కేసుపెట్టడానికి అధికారముంది.

  1. గ|1.౧27.9 ౧౦గాగా!జ!0గ౧ ఎక్కడ వుంది? అది వినియోగదారునికి ఏవిధంగా ఉపయోగపడుతుంది? అసలు [4.౧27.౧.0 అనగా ఏమి?

జ. [40౧0౧౧1165 & ౧6511400౪6 1066 ౧/6౦11065 కమీషన్‌ను క్లుప్తంగా 14.౧ 7.0 0అంటారు. ఇది ఢిల్లీలో ఉంది. వినియోగదారుల రక్షణ చట్టానికి పూర్వమే నిర్భంద వ్యాపార విధానాలను, అనుచిత వ్యాపార పద్ధతులను, గుత్తాధిపత్యాన్ని అరికట్టడంకోనం ఈ చట్టాన్ని భారతప్రభుత్వం తయారుచేసింది. కాని అమలులో ఈ చట్టం ఘోర వైఫల్యాన్ని చవిచూడటంతో నిన్నమొన్నటి వరకు [14.27.౧2 తన ఉనికినే కోల్పోయిందని చెప్పవచ్చును, కాని వినియోగదారుల రక్షణ చట్టం వచ్చిన తర్వాత 11/౧7 చట్టంలో కూడ సవరణలు చేయడం ద్వారా ఈ చట్టానికి కొంచెం పదును సెట్టడం జరిగింది. అంతకు పూర్వం ప్రభుత్వ ఆధిపత్యంలో ఉన్న సంస్థలను ప్రశ్నించే అధికొరం ఈ కమీషన్‌కి లేదు. సవరణల ద్వారా ప్రభుత్వరంగ

| సంస్థలను కూడ ఈ చట్ట పరిధి లోనికి తీసుకురావడం వలన ఈ మధ్యకాలంలో 14.౧27 ౧.6 వినియోగదారుల రక్షణలో చురుకైన పాత్ర నిర్వహిస్తోంది. ఏదైనా ఓ సంస్థ వినియోగదారులకు నష్టం కలిగించే విధంగా నిర్బంధ వ్యాపార విధానాలను అవలంభిస్తున్నా, వినియోగదారులను ప్రక్కదారి పట్టించే ప్రకటనలు గుస్పిన్తున్నా , 11౧7 ౧.0 కి ఫిర్యాదుచేసిన యడల అటువంటి సంస్థలపై విచారణ జరిపి ఆ నిచారణలో నేరం బుజువైతే తగిన జరిమానా విధిస్తుంది. కొని ఈ చట్టం ద్వారా వినియోగదారుడు నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉండదు. గుత్తాధిసత్యం అరికట్టే వ్యవహారంలో !1/1.౧.7౧,0 అనుకున్న ప్రగతిని సాధించలేదేమోననిపిస్తుంది. ఈ మధ్య శీతలపానీయాలు, సబ్బుల తయారీలో కొన్ని అంతర్జాతీయ సంస్థల గుత్తాధిసత్యానికి అవకాశం కలిగిస్తున్నా

ఇ ర!

[4 ౧౫ ౧.౧అశక్తంగా ఉండిపోయింది. 41.27.౧.0చిరునామా: 1/0౧౦౧౦|॥|8౩ & 65గ01/9 [066 ౧౦౦11068 ౦౧౫౧౧౩౦౧. 1/6/0౧౦౦|౪9 [0౮6 0311గ0౧0 6౮౧౮౧1౧౫౦౩. 1౯౫/ ద౬.

  1. బ్యాంకులవల్ల మానసిక క్రోభకు గురైతే, నష్టం వాటిల్లితే జిల్లా ఫోరంకు ఫిర్యాదుచేయవచ్చా? నష్టపరిహారం పొందవచ్చా?

జ) వినియోగదారుల రక్షణ చట్టంలో సెక్షన్‌ 2 (0౧) లో ఇచ్చిన నిర్వచనాన్ని, బట్టి బ్యాంకులు కూడ ఈ చట్ట పరిధిలోనికి వస్తాయి. బ్యాంకులే కాక మిగిలిన ఆర్ధిక సంస్థలు కూడా ఈ నిర్వచనంలోనికే వస్తాయి. అంటే మూల్యం తీసుకొని సేవలందించే అన్ని కార్యకలాపాలు ఈ కోవకు చెందినవే. ఒకానొక కేసులో ఒక డిపాజిటర్‌కి కలిగిన అసౌకర్యాన్ని జిల్లా పోరంకి నివేదించిన సందర్భములో ఆ బ్యాంకువారు వినిపించిన వాదనలు ఆలోచనలు రేకెత్తించేలా వున్నాయి. “ఖాతాదారుణ్లించి అకౌంటు ఓపెన్‌ చేసే సందర్భంలో మేమేమీ చార్జీలు తీసుకోలేదు కనుక మావి ఉచిత సేవలు క్రిందకు వస్తాయి. ఇటువంటి సేవలు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి రావు. అందుచేత ఫోరంకు ఈ కేసును పరిశీలించే పరిధిలేదు” అని బ్యాంకు వాదించింది. కాని జిల్లా ఫోరం ఈ వాదనను అంగీకరించక ఖాతాదారుని డబ్బుతో బ్యాంకులు వ్యాపారం చేసి లాభాలు ఆర్జిస్తున్నాయి. ఖాతాదారులకు చెల్లిస్తున్న వడ్డీకి, వారిచ్చే బుణాల మీద సేకరిస్తున్న వడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని వినియోగదారుని దగ్గర తీసుకున్న మూల్యంగా పరిగణించవచ్చును. అందుచేత బ్యాంకులు వినియోగదారుల రక్షణ చట్ట పరిధిలోనికి ముమ్మాటికి వస్తాయి. కాని బుణం కోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి మాత్రం వినియోగదారుడు కాడు. బుణం యివ్వాలా లేదా అనే విషయం బ్యాంకు మేనేజర్‌ అధికారానికి పరిమితమయినది. కనుక బుణం = యివ్వలేదని జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయడంవల్ల ఉపయోగముండదు. బుణం యివ్వలేదు కనుక మానసిక క్షోభకు గురవ్వడం సహజమే అయినప్పటికి దీని కారణంగా పరిహారం పొందటం మాత్రం వీలుకాదు. కాని బ్యాంకు కస్టమర్‌గా సేవల్లో లోపం కనిపిస్తే దానికి పరిహారం పొందవచ్చును.

25

  1. ప్రభుత్య ఆసుపత్రులు వినియోగదారుల రక్షణ చట్టం పరిదిలోనికి రావట. డైవేట్‌ ఆసుపత్రులకు వీటికి తేడా ఏమిటి?

జ. ప్రభుత్వాసుపత్రులు ప్రభుత్వంచే నిర్వహించబడుతున్నాయి కనుక వీటికి వినియోగదారుల రక్షణ చట్టం నుంచి మినహాయింపు లభించిందనే అపోహ ఉంది. కాని ఇది నిజం కాదు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేస్తారు. ఉచిత సేవలు వినియోగదారుల రక్షణ చట్టం క్రిందికి రావు గనుకనే ప్రబుత్వ ఆసుపత్రులకు మినహాయింపు లభించింది ఇలా మినహాయింప్తు యివ్యటం వల్లనే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారనే అబిప్రాయం కూడా ఉంది ఈ అభిప్రాయం కూడా సరికాదు. వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి రానంతమాత్రాన నిర్లక్ష్యం వహిస్తే అటువంటి డాక్టర్లను శిక్షించటానికి ఇతర చట్టాలున్నాయి. | లా ఆఫ్‌ టార్ట్‌లో లేదా ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌లో నిర్లక్ష్యంగా ప్రవర్తించే వైద్యుడిపై చర్య తీసుకోవటానికి అవకాశం ఉంది ప్రబుత్వ ఆసుపత్రి డాక్టర్లు మినహాయింపు పొందటం వల్ల పైవేటు డాక్టర్లు కూడ తమకు మినహాయింపు కొవాలనుకుంటున్నారు. పైగా వారికో న్యాయం, మాకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ప్రబుత్వ ఆసుపత్రులలో కూడ ఛార్జీలు వసూలుచేయడానికి నిర్ణయించారు. కాబట్టి రానున్న కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులపై కూడా జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చును.

  1. “ఐ.యస్‌.ఐ.” ముద్రగల వస్తువులను కొనండి నిశ్చింతగా ఉండండి అని ప్రకటలు గుప్పిస్తున్నారు కదా! ఐ.యస్‌.ఐ. ముద్ర వల్ల వినియోగదారునికి. | అంతహామీ వృంటుందా?

జ. భారత ప్రమాణాల చట్టం ప్రకారం వస్తువుల నాణ్యత నిరారించబడి ఉంటుంది. అఆ ప్రమాణాలతో తయారుచేయబడిన ప్రతి వస్తువు నాణ్యత కలిగి ఉంటుంది. తయారీలో లోపాలు లేకుండా నాణ్యమైన సరుకులు తయారుచేసే సంస్థల ఉత్పత్తులకు మాత్రమే ఐ.యస్‌.ఐ. ముద్ర వేయటం జరుగుతుంది. అందుచేత ఐ.యస్‌.ఐ. ముద్ర ఉంటే నాణ్యతకు చిహ్నంగా భావిస్తాము. ఐ.యస్‌.ఐ. ముద్రగలవాటికి లోపాలుండవా అని ప్రశ్నిస్తే వీటిల్లో కూడా లోపాలు ఉన్న సంఘటనలు కొన్ని వెలుగులోనికి వచ్చాయి. పరిశ్రమలలో తయారయిన ప్రతి వస్తువును పరిశీలించటం సాధ్యం కాదు

626

కనుక అక్కడక్కడా కొన్ని వస్తువులు పరీక్షించి నాణ్యత నిర్ధారించవలసి ఉంటుంది. దానివలన అవుడవుడు నాణ్యతలోని లోపాలు వెలుగుచూస్తున్నాయి. ఇక ఐ.యస్‌.ఐ. ముద్రవలన వినియోగదారునకు లాబం ఏమిటీ అంటే ఏ వస్తువు కొనాలో, ఎది నాణ్యమైనదో తెలుసుకోలేని సందిగ్ధంలో ఐ.యస్‌.ఐ. ముద్ర వినియోగదారులకు మార్గదర్శకముగా ఉంటుంది. నాణ్యత లేక నష్టపోయిన సందర్భములో ఐ.యస్‌.ఐ ముద్ర ఉన్నా లేకపోయినా పరిహారం కోసం జిల్లా ఫోరంకు వెళ్ళాల్సిందే. ఐ.యస్‌.ఐ ముద్రవలన ఎక్కువ పరిహారం ఏమీ రాదు. అలాగే ఉం్ర౧౧౦గంఉత్పత్తులు కూడ నాణ్యతను సూచిస్తాయేకాని వినియోగదారులకు ఎటువంటి హామీలు యివ్వవు. ఇదే విధంగా ఈ మధ్య 600౧00॥కలిగిన వస్తువులు వస్తున్నాయి. అవి పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించవన్న హామి ఈ [00౧౦ వల్ల తెలుస్తుంది. వినియోగదారుడు £00౧౧౦|౫ఉన్న ఉత్పత్తులు వాడటం తన బాధ్యతగా బావించాలి.

  1. గృహ నిర్మాణ సంస్థ వారు నిర్మించి కేటాయించిన గృహాలు నాణ్య విహీనంగా ఉన్నాయి. సిమెంటు పెచ్చులు, పెచ్చులుగా ఉడిపోతుంది. అమ్మేద్దామనుకున్నా ఎవరూ కొనడం లేదు. అమ్మబోతే అడివి కొనబోతే కొరివిలా ఉంది మా పరిస్థితి. ఏం చెయ్యలో పాలుపోవటం లేదు.

జ. గృహ నిర్మాణ సంస్థప్రజలకు తక్కువ ఖర్చుతో ఇళ్ళను నిర్మించి యివ్వాలనే సదాశయంతో స్థాపించినప్పటికీ అన్ని ప్రభుత్వ రంగసంస్థల మాదిరిగానే గృషా నిర్మాణ సంస్థ కూడా కొన్ని అవలక్షణాలు సంతరించుకుంది. తక్కువ ఖరీదు ఇళ్ళు నిర్మించడం మాట అటుంచితే గృహ నిర్మాణ సంస్థ నిర్మించిన గృహాలను శాశ్వత గృహాలుగా వరిగణించవచ్చునా అనే సందేహం కలుగుతుంది. రాష్ట వ్యాప్తంగా గృహ నిర్మాణ సంస్థ పై వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తే ఈ గృహాలలోని నాణ్యతాలోపం సుస్పష్టమవుతుంది. వట్టణ పరిసరాలలో స్థలం కొని ఇళ్ళు కట్టుకోలేని కుటుంబాలవారికి గృహ నిర్మాణ సంస్థ వరప్రసాదమని తొలుత భావించినప్పటికి ఇళ్ళు కొన్నవారు దీనిని శాపంగానే భావిస్తున్నారు. ముఖ్యంగా పునాదులు సరిగాలేవని, సిమెంట్‌లో ఎక్కువపాలు ఇసుక కలిపారని, గుమ్మాలు, కిటికీలు నాసిరకం కర్రతో చేయించారని, సిమెంట్‌తో చేయబడ్డ గచ్చు గోతులు పడుతోందని, కరెంటు వైరింగ్‌ గందరగోళంగా చేయబడిందని అనేకానేక ఫిర్యాదులు

౬27-

అందుతున్నాయి. ఇదీ చాలదన్నట్లు అమ్మిన గృహాలకు ఖచ్చితమైన ధరను నిర్ణయించడంలో బోర్డు విఫలమయ్యింది. భూమిని సేకరించే సందర్భములో ఎదురౌతున్న కోర్టు వివాదాలు పరిష్కారమయ్యేంత వరకు ధరను నిర్ణయించడం సాధ్యమయ్యే పని కాదని గృహ నిర్మాణ సంస్థ వారు వాదిస్తే 15 సంవత్సరముల తర్వాత గుండెపోటు వచ్చేంత బకాయి కట్టమని నోటీసులిస్తారేమోనని వినియోగదారులు భయపడుతున్నారు. గత 15 సం॥లుగా ధర నిర్ణయం కాని ఒక అయోమయావస్థలో ఈ గృహ నిర్మాణ సంస్థ వినియోగదారులకు ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తుందో అర్ధం చేసుకుంటే ఈ గృహనిర్మాణ సంస్థ ప్రజల పాలిట వరమో, శాపమో అర్ధం చేసుకోవచ్చును. 1993వ సంవత్సరములో వినియోగదారుల రక్షణ చట్టంలో తీసుకొచ్చిన సవరణల ద్వారా భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా వినియోగదారుల కోర్టుల పరిధిలోనికి వస్తాయి. అందుచేత గృహ నిర్మాణ సంస్థ నుండి ఇళ్ళను కొన్నవారు తమకు కలిగిన నష్టాలకు వినియోగదారుల కోర్టుల ద్వారా పరిహారం పొందగలరు.

  1. అయోడిన్‌ కలిపిన ఉప్పును మాత్రమే అమ్మాలని మన రొష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి తాత్కాలికంగా ఆ జి.ఓ. ఆపినట్లుగా విన్నాము. ఇది కేవలం కొన్ని పరిశ్రమలను ప్రోత్సహించడానికే ఉద్దేశించబడినదని అంటున్నారు. అసలు అయోడిన్‌ వ్యవహారం గురించి వివరంగా తెలియజేస్తారా?

జ. మీరు వ్యక్తీకరించిన భావమే అందరిలోను ఉంది. ఎక్కడో కొండల్లో కోనల్లో నివసించేవారికి మాత్రమే ఈ లోపం ఉంటుందని, సారవంతమైన ప్రదేశాలలో నివసించే ప్రజలలో అయోడిన్‌ లోపం ఉండదనే అపోహ కూడ ఉంది. బహుశా అవగాహన లోపం వల్లనే ఇటువంటి భావన కలుగుతుందని అనుకోవాలి. అడవులు నరికివనేయడంవల్ల సారవంతమైన నేల కొట్టుకుపోవటం, మంచు, వర్వాలు, వరదల వలన భూమిలోని సారం నదుల ద్వారా సముద్రం పొలవడం అయోడిన్‌ లోపానికి కారణాలుగా చెప్పవచ్చును. దీనివలన ఆహారంలో అయోడిన్‌ సమకూరకపోవడం జరుగుతుంది. అయోడిన్‌ లోపం ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కొకుండా అన్ని రాష్ట్రాలలోను ఈ అయోడిన్‌ లోపం ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్న విషయం సుస్పష్టం. ప్రతి మనిషికి ప్రతిరోజు 150 నుండి 200

౬28

మైక్రో గ్రాములు (మైక్రోగ్రాము అంటే గ్రాములో 1000 వంతు) అయోడిన్‌ అవసరమవుతుంది. అంటే జీవితకాలంలో ఒక మనిషికి కావలసినది 1 టీ స్ఫూన్‌ అయోడిన్‌ మాత్రమే. కాని ఇంత చిన్న పరిమాణంలో కావలసిన అయోడిన్‌ లోపం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరము 30 వేల మృత శిశువులు జన్మిస్తున్నారంటే అయోడిన్‌ లోపం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక మనదేశ పరిస్థితి చూస్తే ప్రతి గంటకు అయోడిన్‌ లోపంతో పది మంది పిల్లలు పుడుతున్నారు. ఈ కారణంగా భారత ప్రభుత్వం అయోడిన్‌ లోపంవల్ల వచ్చే రుగ్మతలను నివారించడానికి 1992 సం॥లో ఓ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయోడిన్‌ ఏవిధంగా మానవ ఆహారంలోనికి పంపించాలని యోచించి ప్రతి ఒక్కరు ఆహారంలో ఉప్పును ఉపయోగిస్తారు కనుక అయోడిన్‌ కలిపిన ఉప్పు ద్వారా ఈ సమస్యను తీర్పవచ్చని ప్రభుత్వం ఖావించింది. కేంద్రవ్రభుత్వం సూచనమేరకు అన్ని రాష్ట్రప్రభుత్వాలు అయోడిన్‌ కలిసిన ఉప్పును మాత్రమే తయారుచేయాలని సంబంధిత పరిశ్రులకు ఆదేశాలు జారీచేశాయి. ఇది ప్రజారోగ్యంకోసం తీసుకున్న చర్య కనుక దీనిపై అపోహలు సృష్టించటం కూడని పని. ఉప్పులో కూడ ఇది అతి తక్కువ స్థాయిలో కలుపబడుతుంది. ఉప్పు తయారుచేస్తున్నప్పుడు 30 ౧౧|| (పార్దికల్ప్‌పర్‌ మిలియన్‌) అయోడిన్‌ కలిపితే అది వినియోగదారునికి చేరేటప్పటికి 15౧౧0 అయోడిన్‌ మాత్రమే ఉంటుందని అది మనిషి ఆరోగ్యావసరాలకు సరిపోతుందని శాస్రజ్ఞాలు తెలియచేస్తున్నారు. వినియోగదారుడు 30 ౧|| అయోడిన్‌ తీసుకున్నప్పటికి కూడా దానివల్ల ఎటువంటి విష ప్రభావం ఉండబోదని శాస్త్రజ్ఞులు అంటున్నారు. గర్బంలో పిండం చోటుచేసుకున్న క్షణం నుండి అయోడిన్‌ అవసరమవుతుంది. అయోడిన్‌ లోపం వల్ల పిల్లల్లో తెలివితేటలు లేకపోవటం, పాఠాలు నేర్చుకోలేకపోవడం ఎదుగుదల లేకపోవటం, శక్తి లేకపోవడం, బుద్ది మాంద్యం, కండరాల లోపం, పక్షవాతం వంటి రుగ్మతలు చోటుచేసుకోవచ్చు. గర్భందాల్చిన మూడవ నెల నుండి పిల్లలకు రెండు సంవత్సరముల వయస్సు వచ్చేవరకు మెదడు అభివృద్ధి చెందుతుంటుంది. ఈ సమయంలో కనుక అయోడిన్‌ లోపం ఉన్నట్లయితే అది వారిలో బుద్దిమాంద్యం కలిగిస్తుంది. ఇక గర్భిణీ ప్రీలలో అయోడిన్‌ లోపం వల్ల గర్భవిచ్చిత్తి కలుగవచ్చును. మృత శిశువులను ప్రసవించే +వ్రమాదం వుంది. పుట్టిన వెంటనే మరణించ వచ్చును. గర్భస్థ శిశువులోనే బుద్ధిమాంద్యం ౬22

చోటుచేసుకోవచ్చును. లేదా పుట్టుకతోనే అయోడిన్‌ లోపంతో బాధ పడవచ్చును. ఇక అయోడిన్‌ లోపం వున్న పెప్ప్దలకు నిస్సత్తువ, అలసట, ఉత్సాదకశక్తి కోల్పోవడం వంటివి కలుగవచ్చును. అయోడిన్‌ లోపం వలన ధైరాయిడ్‌ గ్రంధిలో లోపాలు వచ్చి అనేకానేక రుగ్మతలకు గురికావడం జరుగుతుంది. అయోడిన్‌ లోపం వల్లనే గొంతు వాపు వ్యాధి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షా ఇరవై వేల పిల్లలు మానసిక, శారీరక ఎదుగుదల లేకుండా పుట్టినా, 90,000 మృత శిశువులు ఉద్భవిస్తున్న దానికి కారణం అయోడిన్‌ లోపం మాత్రమే. అందుచేత అయోడిన్‌ అనేది మన, మన పిల్లల ఆరోగ్యావసరంగా గుర్తించాలి.

  1. సింధటిక్‌ మిల్క్‌ మార్కెట్టులో ప్రవేశించిందని అది త్రాగకూడదని చెప్పుతున్నారు అసలు సిందటిక్‌ మిల్క్‌ అంటే ఏమిటి? దానిని తెలుసుకోవడం ఎలా? అది త్రాగితే ఏమవుతుంది?

జ. కొన్ని రసాయనాల మిశ్రమమే సింధటిక్‌ మిల్క్‌గా పిలువబడుతోంది. ఈ రసాయన మిశ్రమంలో అవు, గేదే పాలు ఏమాత్రం లేనప్పటికి చూడటానికి అన్ని విధాలుగా పాలవలె భ్రమను కల్పించడం వల్ల ఈ రసాయన మిశ్రమాన్ని కృత్రిమ పాలగా వ్యవహరించడం జరుగుతుంది ఇలా సహజమైన పాలను, కృత్రిమ పాలను ఒకేవిధంగా భావించే ప్రమాదం వుంది. అందుచేత మరింత జుగుప్సాకరమైన 'పేరు ఈ రసాయన మిశ్రమానికి పెట్టడం సముచితంగా ఉంటుంది. యూరియా, బట్టలుతికే పౌడర్‌, వనస్పతి, బట్టల సోడ, వంటసోడా, శాక్రిన్‌ వంటి పదార్థాలతో పాలకు ప్రతిరూపంగా , తయారుచేయబడిన మిశ్రమమే ఈ మృత్యుపాలు. ఇవి అమ్మకానికి | సరాసరి మీ యింటికి రాకపోనచ్చును. మీరు బయట త్రాగే కాఫీలలోనో, | మరేయితర ఆహార పానీయాలలోనో నిగూఢంగా ఉండి ఉండవచ్చును. వీటిని సేవించటం వలన కాలేయ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, చర్మ వ్యాధులతోపాటు మానసిక రుగ్మతలు కూడ చోటుచేసుకోవచ్చును. ఇవి సెద్దవాళ్ళకంటే పిల్లలకు మరింత వ్రమాదకరం. అందుచేత వినియోగదారుడు ముఖ్యంగా పాలను కొనేటప్పుడు నమ్మకమైన వ్యక్తి నుండి తీసుకోవాలి. పాల వాసన కాక మరేయితర వాసన వచ్చినా అటువంటి వాటిని సేవించకూడదు. పెద్దవాళ్ళు రుచిచూసాక మాత్రమే | పిల్లలకు పాలు పట్టించడం శ్రేయస్కరం. పొత్తిళ్ళలో పసివారికి తల్లిపాలు |

(౩౦

ఇవ్వడంకంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు. సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ వినియోగదారుల నఖ కేవలం చనుబాలు ప్రోత్సృహించడంకోసమే జరిగిందంటే దాని ప్రాముఖ్యం ఎటువంటిదో తల్లులు అర్ధంచేసుకోవచ్చు. ఇక ఈ రాక్షస పాలను కనుగొనడానికి తాత్కాలికంగా రెండు పరీక్షలు సూచింపబడినాయి. సాధారణంగా పాలు ఆమ్లగుణం కలవి కనుక నీలి లిట్మసును ఎర్రగొ మారుస్తాయి. కృత్రిమపాలు కారగుణం కలవి కనుక ఎజ్జి లిట్మసును నీలి లిట్మసుగా మారుస్తాయి. మరో పరీక్ష- నిమ్మరసం కలిపితే మంచి పాలు విరిగిపోతాయి, దుష్టపాలలో మార్పు కనుపించదు. నిమ్మరసం పిండినా చెక్కు చెదరకపోతే వాటిని ప్రమాదకరమైన పాలుగా భావించాలి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉండనే ఉంటాయి. ఇంట్లో చేసుకొనే ఈ పరీక్షలకు కూడా అందకుండా శాస్త్రీయ పరిజ్ఞానం అభివృద్ధి చెందవచ్చును. ప్రస్తుతం దేశంలోని ఆహార పరిశోధనా ప్రయోగశాలల్లో సులభంగా కృత్రిమ పాలను గుర్తించడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. అంతవరకు పైన చెప్పిన రెండు పరీక్షలు తాత్కాలికంగా మాత్రమే భావించవలసి ఉంటుంది.

  1. సరియైన రోడ్లు లేక మురుగునీరు పోయే సౌకర్యం లేక ప్రతి "పేట దోమల పెంపక కేంద్రంగా మారి ప్రజలు ఎన్నో అవస్థలకు గురి అవుతున్నారు. వీటిని గురించి శ్రద్ద వహించవలసిన మునిసిపాలిటీలు శ్రద్ద వహించడం లేదు. వీటిపై వినియోగదారుల కోర్టులలో ఫిర్యాదు చేయవచ్చా?

జ. మునిసిపాలిటీలను ప్రజారోగ్య సంస్థలుగానే భావించవలసి ఉంటుంది. ఆరోగ్యశాఖ వేరుగా ఉన్నప్పటికి మునిసిపాలిటి చేపట్టవలసిన ప్రాధమిక కార్యక్రమాలన్ని ప్రజారోగ్యానికే ముడిపడి ఉంటాయి. వీధులను శుభ్రం చేయటం, అంటు వ్యాధులు ప్రబలకుండా చూడటం, ఆరోగ్యకర పద్దతులలో ఇళ్ళను నిర్మించుకునేలా చూడటం, త్రాగే నీరు సదుపాయం చేయడం, గ్రంధాలయాలను స్థాపించడం, రోడ్లను నిర్మించడం వంటి నిర్దుష్టమైన కార్యక్రమాలను చేపట్టడం కోసమే ఈ స్థానిక సంస్థలను నెలకోల్పడం జరిగిందని మునిసిపల్‌ చట్టం తెలియజేస్తుంది. నిధుల కొరత వలన మునిసిపాలిటీలు ఈ పనులన్నీ చేయలేకపోతున్నాయి. నిధుల విషయంలో స్వయం సమృద్ది సౌధించలేకపోవటం వలన రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడుతున్నాయి. మునిసిపాలిటీలకు ప్రజావసర ప్రాతిపదిక పై కాకుండా

1

రాష్ట్రప్రభుత్వం చాలా కారణాలతో నిధులు కేటాయించడం జరుగుతుంది. మునిసిపాలిటీలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించటం లేదన్న అంశంపై సుప్రీంకోర్టుకు నివేదించినప్పుడు జస్టిస్‌ కృష్ణయ్యర్‌ ఓ సంచలనాత్మకమైన తీర్పునిచ్చారు. ఏ ఆశయంతో మునిసిపల్‌ చట్టాన్ని తీసుకొచ్చారో ఆ ఆశయం నెరచేరనప్పుడు ఆ చట్టాన్ని రద్దుచేయటం సముచితంగా ఉంటుంది అని జస్టిస్‌ కృష్ణయ్యర్‌ వ్యాజ్యానించారు ఆ వ్యాఖ్య మునిసిపాలిటీల తీరుతెన్నులు చెప్పకనే చెప్పుతుంది. ప్రతి పౌరునికి మునిసిపాలిటీలపై కోర్టుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. కాని మునిసిపల్‌ 'సీవలలోని లోపాలను ప్రశ్నించటానికి వినియోగదారుల కోర్టులు అవకాశం కల్పిస్తాయా అనేదే ప్రస్తుత సందిగ్రం. గతంలో ఒక పౌరుడు డైనేజి సరిగా లేనందున అది మునిసిపల్‌ సేవలలో లోపంగా భావించి జిల్లా ఫోరంకు ఫిర్యాదు చేసినప్పుడు ఆ జిల్లా పోరం యిచ్చిన తీర్పు వినియోగదారుల ఉద్యమానికి ప్రతికూలంగా ఉంది. మునిసిపాలిటీలకు చెల్లించే పన్నులు, సేవలనిమిత్తం బెల్లించే మూల్యంగా భావించకూడదని, ప్రభుత్వానికి పన్నులు కట్టవలసిన బాధ్యత పౌరులపై ఉంటుందని అందుచేత పన్ను చెల్లింపుదారుడు వినియోదారుడు అనటానికి వీలులేదని ఆ జిల్లా ఫోరం తీర్పు సారాంశం. కాని అప్పుడప్పుడు కొన్ని జిల్లా పోరం అధ్యక్షులు మునిసిపాలిటీలను మందలిస్తున్న తీరును గమనిస్తే వినియోగదారులలో / కొద్దిగా ఆసక్తీ కలుగుతుంది. అనంతపురం జిల్లా ఫోరం యిచ్చిన తీర్పు పురపాలక సంఘాలకు కనువిప్పు కావాలి. తన యింటి ముందు నీరు ప్రవహిస్తున్నదని ఆ ప్రాంతమంతా దుర్గంధ భూయిష్టమవుతోందని అనంతప్పురం నివాసి జిల్లా ఫోరంలో ఫిర్యాదుచేస్తే “వినియోగదారులు | వురపాలక నంఘానికి పన్ను కడుతున్నందుకు కనీస సౌకర్యాలు కల్పించాలని, మురికి నీటి ప్రవాహాన్ని అరిక ట్టేందుకు చర్యలు తీసుకోవాలని మునిసిపల్‌ కమీషనర్‌ను ఆదేశించింది. ఈ తీర్సుపై మునిసిపాలిటి రాష్ట కమీషన్‌కు అప్పీలుచేస్తే రాష్ట్ర కమీషన్‌ కూడా మునిసిపాలిటీపై అక్షింతలు | చల్లింది. పురపాలక సంఘాలు ప్రజాసేవకు ఎర్పాటు అయినవి కాబట్టి అవి ఫోరం పరిధిలోనికి వస్తాయని రాష్ట్ర కమీషన్‌ తీర్పు యిచ్చింది. ఈ , తీర్పు ద్వారా కనీసం మన రాష్ట్రస్థాయిలో మునిసిపాలిటీ సేవాలోపాలపై వినియోగదారుల కోర్టులకు ఫిర్యాదు చేయవచ్చును. ౩2

  1. ఈ మధ్య ఓ వినియోగదారుల సదస్సుకు వెళ్ళాను. అందులో మాట్లాడినవారు డిస్కౌంట్లవలన నష్టపోతారు అన్నారు. డిస్కొౌంటువలన తక్కువ ధరకు మనకు వస్తువు లభిస్తుంటే నష్టమని చెప్పడంలో అర్హమేమిటి? దీనిపై మీ అభిప్రాయమేమిటి?

జ. డిస్కౌంట్‌ అనేది వినియోగదారులకు చాలా శ్రావ్యంగా విన్పిస్తుంది. అందుకే డిస్కౌంట్‌ అనగానే నాదస్వరం విన్న పాములాగా నాట్యంచేస్తారు. వ్యాపారస్తుడు తన అక్రమ వ్యాపారం కోసం మోగిస్తున్న అ నాదస్వరంతో తన్మయులై దానికనుగుణంగా నాట్యం చేస్తున్న వినియోగదారులు కోకొల్లలు. తమ లాభాల్లోంచి ఓ పది శాతాన్ని తగ్గించుకొని ఆ మేరకు ధర తగ్గిస్తున్నారంటే నమ్మవచ్చు. ఎక్కువ కాలం స్టాకు ఉండిపోవటం వల్ల పదిశాతం నష్టపోయినా తక్కువ ధరకు అమ్ముతున్నారంటే విశ్వసించవచ్చును. కాని 50 శాతం డిస్కౌంటు ఇస్తున్నారంటే అది వ్యాపార దుర్నీతి కాక మరొకటి ఎలా అవుతుంది. అసలు ధర వెయ్యి రూపాయలు, తగ్గించిన ధర రూ.400లు మాత్రమే అంటే అదేమీ ప్రజా సంక్షేమ కార్యక్రమం కాదు. వినియోగదారులు అసలు ధర చూసించు అని నిర్బంధించినప్పుడే అసలు రంగు బయటపడటానికి అవకాశం ఉంది. కొన్న ధరలకే అమ్మడం వ్యాపారం కాదు. లాభనష్టాలులేని విధంగా వ్యాపారం ఏ వ్యాపారస్తుడు చేయలేడు. సాధారణంగా ఇలాంటి డిస్కౌంట్‌ సేల్ప్‌లో అసలు ధరను అధికంగా చూపించి ఆ మేరకు డిస్కౌంటు ఇవ్వటం ఈ వ్యాపార రహస్యం. కొన్ని సందర్భాలలో లోపాలు కలిగిన వస్తువులు తక్కువ ధరలలో అమ్మి వినియోగదారులను ఆకర్షించుకోవడం అనేది చూస్తుంటాము. సూటుకేసులు తయారుచేసేవారు, బట్టలు తయారుచేసేవారు నాణ్యత లోసించిన వాటిని ఈ విధంగా డిస్కౌంట్‌ సేల్స్‌లో అమ్మడం జరుగుతుంది. వస్త్రాల మిల్లుల నుంచి తూకంతో వస్త్రాలను కొని, కొలతతీ అమ్మే సందర్భంలో ఆ బిట్స్‌ పై డిస్కౌంట్‌ యివ్వడం జరుగుతుంది. చాలా కాలం నిల్వ ఉన్న కొరణంగా పాడైపోయే స్థితికి చేరుకుంటున్న వస్తువులను కూడా ఈ డిస్కౌంట్‌ స్కీముల్లో అమ్మడం జరుగుతుంది. గుజరాత్‌లో నిన్నటిదాకా కోట్ల వ్యాపారంచేసిన వ్యక్తి నష్టాలకు గురై అతిన్వల్ప ధరల్లో మీ నగరంలో అమ్ముతున్నారు, కేవలం పదిరోజులు మాత్రమే అంటూ మభ్యపెట్టే ప్రకటనలతో వినియోగదారులను ఆకర్షిస్తూ, నాణ్యవిహీనమైన వస్తువులను

యూ

అంటగడుతున్న సంస్థలు వినియోగదారుల అనూయకత్వంవల్ల లక్షలాది రూపాయల లాభాన్ని గడిస్తున్నాయి. మిల్లు రేట్లకే వస్త్రాలను యిస్తున్నామని ఏ వ్యాపారైనా మిమ్మల్ని ప్రలోభసెట్టబోతే మరి నీవెలా బ్రతుకుతావు అని ఓ చిన్న ప్రశ్న వేయండి. ముమ్మాటికి డిస్కౌంట్లు వినియోగదారులకు నష్టాన్ని మిగులుస్తాయి. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు లబ్ది పొందితే అది కేవలం యాధృచ్చికంగా భావించాలి.

  1. ఒక్కసారిగా మా టెలిఫోన్‌ బిల్లు రెండు రెట్లు అధికంగా వచ్చింది. ఇదేమిటి అని గోలచేస్తే బిల్లు కట్టి మాట్లాడమంటున్నారు టెలిఫోనువారు. వినియోగదారులకు రక్షణ ఎలా చేకూరుతుంది?

జ. భారతదేశపు టెలిఫోన్‌ వ్యవస్థలో వినియోగదారులకి లభిస్తున్న గౌరవం అతిస్వల్పం. ఈ టెలిఫోన్‌ వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వలన, “మీకు టెలిఫోన్‌ సౌకర్యాన్ని కలుగజేశాము ఆనందించండి” అనే దర్పాన్ని టెలిఫోన్‌ అధికారులు ప్రదర్శించడం అడుగడుగునా కన్పిస్తుంది. టెలిపోన్‌ కనక్షన్‌ కోసం ఏళ్ళ తరబడి వేచిఉండాల్సి వస్తోంది. గ్రామ ప్రాంతాల్లో టెలిఫోన్‌ వ్యవస్థను విసృతపరిచినా, సేవలు లోప భూయిష్టంగా ఉన్నాయి. వీటికితోడు టెలిఫోన్‌ డిపార్దుమెంటులో అవినీతి విలయతాండవం చేస్తూ వినియోగదారులకు తగని అసౌకర్యాన్ని కలిగిస్తోంది రోజులతరబడి మూగబోతున్న ఫోనులు, రాంగ్‌ కాల్చు, చేయని కాల్చుకు అదిక మొత్తంలో బిల్లులు, వెరశి టెలిపోన్‌ వినియోగదారుల జీవితం అస్తవ్యస్తం. అదికార

| దర్పాన్ని వదిలి వినియోగదారులతో చక్కటి సంబంధ బాంధవ్యాలు | పెంపొందించుకుంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ వ్యవస్థ మనుగడ సాగించగలుగుతుంది. లేకుంటే వ్యాపార దక్షతతో వినియోగదారుల బెన్నత్యాన్ని గుర్తించి సేవలందించగలిగే గైవేటు సంస్థల అఆధీనంలోనికి టెలిఫోన్స్‌ జారుకుంటాయి. ఇక ఎక్కువ బిల్లు వచ్చింది అనే మీ సమస్యకు జిల్లా ఫోరంలో సరైన పరిష్కారం లభించకపోవచ్చును. టెలికమ్యూనికేషన్‌ సేవలు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి వచ్చినా అధిక మొత్తాలకు వచ్చే బిల్లులు పరిష్కరించటంలో అవలంభించవలసిన పద్దతి గురించి కొన్ని సంశయాలు ఉన్నాయి. దీనికి తోడు వినియోగదారుల జాతీయ కమీషన్‌ అధిక మొత్తాలలో వచ్చిన టెలిఫోన్‌ బిల్లులపై తీర్పునిస్తూ గతంలో చెల్లించిన బిల్లుల సగటు ప్రాతిపదికగా వివాదంలో ఉన్న బిల్లును ౬4

పరిష్కరించగూడదు అని వక్కొణించింది. ఈ తీర్చు వెలువడిన తర్వాత జిల్లా ఫోరంలన్నీ మధ్యవర్తిత్వం ద్వారా వరివ్కరించుకోవాలని సూచిస్తున్నాయి. టెలిగ్రాఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 7 క్రింద వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవలసి ఉంటుంది. అందుచేత బిల్లుల వివాదం విషయంలో జిల్లా ఫోరంలో ఫిర్యాదుచేసేకంటే నేరుగా టెలిఫోన్‌ డిపార్దుమెంటువారికే మధ్యవర్తిద్వారా పరిష్కరించుకోవాలనే మీ ఆసక్తిని తెలియజేస్తే వివాదం త్వరగా పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిష్కారాలను తిరిగి కోర్టులో ప్రశ్నించడానికి తావులేదు. మధ్యవర్తిత్వం మీకు సమ్మతం కాకపోతే ఇక మిగిలిన మార్గం సివిల్‌కోర్టులో టెలిఫోన్‌ డిపార్దుమెంటుపై దానా వేయటం ఒక్కటే. ఈ పద్ధతిలో వివాదం పరిష్కారం కావడానికి చాలా సమయం పడుతుంది. టెలిఫోన్‌ డిపార్దుమంట్‌ ద్వారా కలిగే మరే ఇతర అసౌకర్యాలకై నా జిల్లా ఫోరంను ఆశ్రయించవచ్చును. 7 రోజులు మించి టెలిఫోన్‌ పనిచేయని పక్షంలో టెలిఫోన్‌ డిపార్టుమెంట్‌ నుండి రిబేట్‌ కోరవచ్చును. ఏదైనా సాకుతో వినియోగదారుడికి సరియైన ,, నోటీసు యివ్వకుండా టెలిఫోన్‌ డిస్‌కనక్ట్‌ చేస్తే నష్టపరిహారం కూడా పొందవచ్చును. అదేవిధంగా మీ యింట్లో మీ బంధువులపేర ఉన్న మరో టెలిఫోన్‌ బిల్లులు బకాయి పడినా మీ టెలిఫోన్‌ డిస్‌కనక్ట్‌ చేయకూడదు. ఇటువంటి విషయాలలో జిల్లా ఫోరంకు వెళ్ళిన వినియోగదారులకు నష్టపరిహారంతోపాటు కోర్టు ఖర్చులు కూడా జిల్లా ఫోరం ఇప్పించటం జరిగింది.

  1. ఇన్సూరెన్స్‌ కంపెనీవారు పాలసీ తీనుకొనే ముందు తీయటి కబుర్లు చెప్పుతూ తీరా తీసుకున్న తర్వాత ప్రమాదం జరిగితే డబ్బు ఇవ్వటానికి చాలా ఇబ్బందులకు గురిజేస్తుంటారు. ఈ వివాదాలు వినియోగదారుల రక్షణ చట్టం క్రిందికి రావా?

జ. వినియోగదారుల రక్షణ చట్టంలో సెక్షన్‌-2 ())లో నిర్వచించబడిన

" “సేవలు' అనే పదంలో ఇన్సూరెన్సు కూడా చేర్చబడింది. ముమ్మాటికి | ఇన్సూరెన్స్‌ సమస్యలు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి వస్తాయి. ఇన్సూరెన్స్‌ కంపెనీతో ఎక్కువగా వచ్చే వివాదాలు అవగాహన లోపం వల్లనే జరుగుతాయి. ఏ రిస్కు కవర్‌చేనుకోవటానికి ఇన్సూరెన్స్‌ చేసుకుంటున్నాం, ప్రమాదం జరిగిన సందర్భములో విమేరకు పరిహారం

టక

ఇస్తారు అనే విషయాలను వినియోగదారులు పాలసీ తీసుకోకముందే తెలుసుకోవడం మంచిది. “ఆ రిస్కు కూడా కవర్‌ అవుతుందనుకొన్నాను, జరిగిన నష్టం పూర్తిగా యిస్తారనుకొన్నాను” అని జరిగిపోయిన తర్వాత విచారించటం వల్ల ప్రయోజనం శూన్యం. కొన్ని కొన్ని సందర్బాలలో ఇన్సూరెన్స్‌ కంపెనీలు నిబంధనలను తమకు తోచినరీతిలో అర్ధం చెప్పటం వలన వినియోగదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఇటువంటి ఒక కేసులోనే కర్ణాటక స్టేట్‌ కమీషన్‌ యిచ్చిన తీర్పు ఆసక్తికరంగా ఉంది. ఒక ఓనరు తన లారీని ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఇన్సూర్‌ చేశాడు. ఆ తర్వాత కొద్దికాలానికి ఆ లారీ ఓ ప్రమాదంలో దెబ్బతింది. ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం లారీ ఓనరు చెప్పులు అరిగేలా ఆ కంపెనీల చుట్టు తిరగనారంభించాడు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో పరిమితికి మించి ప్రయాణీకులు ఉన్నారు కనుక ఇన్సూరెన్స్‌ డబ్బు ససేమిరా ఇచ్చేది లేదంటూ ఇన్సూరెన్స్‌ కంపెనీ మొండికేసింది. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర కమీషన్‌కు 'ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుని పరిష్కరిస్తూ పరిమితికి మించి లారీలో ప్రయాణీకులు ఉన్నారనే సాకుతో ఇన్సూరెన్స్‌ డబ్బు ఇవ్వకపోవడం న్యాయసమ్మతం కాదు. కేవలం కొద్దిమంది ప్రయాణీకులు ఎక్కువగా ఉండటం వలన ఈ ప్రమాదం జరిగిందని చెప్పటానికి అవకాశాలు లేవు. ఎదురుగా వచ్చిన లారీని గుద్దుకోవటంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరగటానికి లారీలోవారు బాధ్యులు కారు కనుక ఆ నెపంతో పరిహారం చెల్లించకపోవటం న్యాయసమ్మతం కాదు అని చెప్పింది. ఈ తీర్పుతో ఆందోళన చెందిన ఇన్సూరెన్స్‌ కంపెనీ జాతీయ కమీషన్‌కు వెళితే కర్ణాటక రాష్ట్ర కమీషన్‌ తీర్పు చెల్లదంటూ జాతీయ కమీషన్‌ తీర్చునిచ్చింది. జాతీయ కమీషన్‌ తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు అని తెలుసుకున్న వినియోగదారుడు సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు. “9 మంది ప్రయాణీకులను లారీలో తీసుకువెళ్ళడం సక్రమం కొకపోయినా ఆ ప్రయాణీకులు వల్ల ప్రమాదం జరుగలేదు కనుక పరిహారం ఇవ్వవలసిందేనని సుప్రీం కోర్డు తీర్పునిచ్చింది.

ఈ కేసు ఈ విధంగా ఉంటే మరో కేసులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమీషన్‌ ఇచ్చిన తీర్పు వినియోగదారులలో ఓ చక్కటి అవగాహన కలిగిస్తుంది. న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీకి, మహదేవ టైర్‌ ఇండస్ట్రీస్‌ కం పెనీవారికి

నూ

వచ్చిన వివాదంలో నష్టాన్ని అంచనావేయడంలో నర్వేయరు పొరపాటుచేసినట్లుగొ ఆరోసించటం జరిగింది. ఆ వాదన విన్న గుంటూరు జిల్లా ఫోరం సర్వేయరు సూచించిన మొత్తంతోపొటు మరో రూ.3,000లు_ అదనంగా పరిహారం చెల్లించమని ఇన్సూరెన్స్‌ కంపెనీని ఆదేశించింది. ఇన్సూరెన్స్‌ కంపెనీ రాష్ట్ర కమీషన్‌కు నివేదించగా ఆ కేసుని పరిశీలిస్తు సర్వేయరు అంచనాలు సరిగా లేవు అని ఆరోపించినప్పుడు అనలు జరిగిన నష్టం ఎంతో వినియోగదారుడే బుజువు చేయగలగాలి. అలా బుజువు చేయలేని పక్షంలో సర్వేయరు చేసిన అంచనాలను సరియైనవిగా భావించవలసి ఉంటుంది. అందుచేత జిల్లా ఫోరం అదనంగా ఇవ్వమన్న రూ.3,000లు పరిహారం ఇన్సూరెన్స్‌ కంసెనీ ఇవ్వనవసరం లేదని తీర్పునిచ్చింది. అందుచే వినియోగదారుడు తనకు జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా బుజువుచేయగలిగినప్పుడు సర్వేయరు అంచనాలను సవాలు చేయడానికి ఉంటుంది.

  1. ఈ మధ్య టి.వి.లలో అనేకానేక వ్యాపార వ్రకటనలు వినియోగదారునికి చిత్తచాంచల్యం కలిగించే రీతిలో ప్రసారమవుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేదెలా?

జ. కోట్లాది రూపాయలు విలువ కలిగిన అడ్వర్హయిజుమెంటు రంగం చలనచిత్ర రంగంతో పోటీపడుతోందంటే అతిశయోక్తి కాదు. చలనచిత్ర రంగం మాదిరిగానే ఈ రంగంలో కూడ నటులు, దర్శకులు, వురస్కారాలు అన్నీ ఉన్నాయి. ఏ వ్యాపార ప్రకటనకైనా ధ్యేయం వినియోగదారులను ఆకర్షించడమే. ఈ ఆకర్షణ మరింత ఎక్కువ పాళ్ళల్లో జోడిస్తే మీరన్నట్లు చిత్తచాంచల్యానికి గురికావలసి వస్తుంది. వ్యాపార ప్రకటనలు ఆకర్షణీయంగా ఉండటంలో తప్పులేదు కాని వినియోగదారులను తప్పుదారి పట్టించేవిగా ఉండకూడదు. లేని నాణ్యత ఉన్నట్లుగా భ్రమ పెట్టినా, ధరల విషయంలో మభ్యపెట్టటానికి ప్రయత్నం చేసినా, అటువంటి వ్యాపార ప్రకటనలపై చర్యలు తీసుకోవచ్చు. ఈ వ్యాపార ప్రకటనల వలన మోజుపడి వస్తువులను వాడాలని బ్రమవడేవారుంటారు. ఉదావారణకు టూత్‌పేన్సు | అడ్వర్జ్హయిజుమెంటు తీసుకుంటే బ్రష్‌ ఈ చివర నుండి అ చివర వరకు "పేస్టు పెట్టే తీరును పదే పదే చూడటం వలన అంత పేస్టు వాడితేనే కాని పళ్ళు శుభ్రం కావేమోనన్న అనుమానంతో 200 గ్రాముల పేస్టు సైతం 20

37-

రోజుల్లోనే నైవేద్యం చేసే అలవాట్లు చేసుకుంటున్నాము. వినియోగదారుల బలహీనతను ఆసరాగా తీసుకొని వారిపై ప్రకటనల ప్రభావాన్ని గుప్పించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన నేడు ప్రస్ఫుటంగా కన్పిస్తోంది. కొంతకాలం క్రితం ఆరోగ్యానికి హానికలిగిస్తుంది జ్ఞానే అనుమానంతో ఒక కంపెనీ తయారుచేసిన నూడుల్స్‌ ప్రకటనను దూరదర్శన్‌లో ప్రసారం చేయకుండా అడ్డుకోవటం జరిగింది. మరొక సందర్భంలో వనమూలికలతో తయారుచేయబడిన టూత్‌ పేస్టులో లేనివి ఉన్నట్లుగా అబద్దపు ప్రచారం చేసినందుకు గాను. 14 ౧7౯ 6౦౧౧౧౧|$౩౦౧ నోటీసు యివ్వడం జరిగింది. మోసపూరిత ప్రకటనల విషయంలో వినియోగదారుడు అడ్వర్దయిజింగ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు పిర్యాదు చేయవచ్చును.

  1. ఆర్‌.టి.సి. వారు అతి ఘనంగా ప్రచారం చేసుకుంటున్న హె-టెక్‌ బస్సులో ప్రయాణం చేసి నడుము నొప్పి తెచ్చుకున్నాను. ఆర్‌.టి.సి. నుండి నష్టపరిహారం పొందవచ్చునా? బస్సు తప్రుకాదు మీ నడుంలో లోపమంటారా?

జ. ప్రజాసేవయే మా కర్తవ్యం అంటూ జోరుగా ప్రచారంచేసుకుంటున్న “అర్‌.టి.సి.' చార్జీలు తీసుకొని సేవలు అందిస్తుంది కనుక అటువంటి "సేవలలో లోపం ఉంటే తప్పకుండా పరిహారం పొందగలరు. ఏవి లోపాలుగా పరిగణించాలి అనే విషయం పైనే ఫిర్యాదుకు బలంచేకూరుతుంది. ఆర్‌.టి.సి. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో ట్రాఫిక్‌ జామ్‌వల్ల బస్సుకొన్ని గంటలపాటు ఆగిపోవలసివస్తే అది సేవలలో లోపమని భావించటం సరికొదు. కాని అటువంటి సందర్భాలలో మరోదారిలో సురక్షితంగా తీసుకెళ్ళగలిగే అవకాశం ఉండి అలా తీనుకువెళ్ళనప్పుడు అది సేవలలో | లోవంగా భావించవచ్చునని ఒక కోర్టు తీర్పు స్పష్టం చేసింది. అదేవిధంగా గతుకుల రోడ్లలో బస్సు సర్వీసులు నడుపుతూ వినియోగదారులకు భౌతికంగా, మానసికంగా వ్యధను కలిగిస్తే ఆర్‌.టి.సి. నష్టపరిహారం | చెల్లించాల్సి ఉంటుందని మరో తీర్పు స్పష్టం చేస్తోంది. ఎక్స్‌పెస్‌ చార్జీలు తీసుకుంటూ స్టాప్‌ లేని ఊళ్ళలో సైతం బస్సు ఆప్పుతూ గమ్యానికి ఆలస్యంగా చేర్చిన సందర్పాలలోకూడ వినియోగదారులు నష్టపరిహారం పొందగలిగారు. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు కూర్చున్నసీటు అసౌకర్యంగావున్నా | లేక బస్సు అద్దాల చప్పుళ్ళకు బెవులు చిల్లులుపడినా, అజాగ్రత్తగా డైవ్‌

ఆల

చేస్తే మీ మూతి పగిలినా ఆర్‌.టి.సి. నుండి నష్టపరిహారం పొందవచ్చును. ఒక రాష్ట్ర రోడ్డు రనాణాసంస్థ బస్‌ రాత్రివేళ ప్రయాణంచేస్తున్న సందర్భంలో దొంగలు ఆ బస్సు ప్రయాణీకుల నుండి నగలు, నగదు దోచుకోవడం జరిగింది. దానిపై ఓ ప్రయాణీకుడు వినియోగదారుల కోర్టును పరిహారం యిప్పించమని అర్ధించినప్పుడు ప్రయాణీకులకు అన్ని విధాలైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆర్‌.టి.సి.పైన ఉందని తీర్పునిచ్చింది. ప్రయాణీకుల ప్రాణానికి ఆస్తికి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఆర్‌.టి.సి.పై ఉంది. కేవలం ఆర్‌.టి.సి. బస్సులు మాత్రమేకాకుండా (డ్రైవేటు_బస్సులు కూడా వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి వస్తాయి. చార్జి వస్తూలుచేసి బస్సులో సీటులేదనడం, డబ్బు చెల్లించినప్పుడు ముందు సీటు కేటాయించి తీరా ఎక్కేటప్పుడు వెనక సీటు కేటాయించడం, మార్గం మధ్యలో బస్సు ఆగిపోతే వెంటనే మరో బస్సు ఏర్పాటుచే” లేకపోవటం. టి.వి. సౌకర్యం కలదంటూ (ప్రయాణీకుల నిద్రను చెడగొట్టడం, స్పీకర్లు బ్రద్దలయేలా పాటలను వినిపించి ప్రయాణీకులకు తీవ్ర అసౌకర్యం కలిగించడం, అతివేగంగా బస్సును నడిపి బ్రతుకు జీవుడా అని వాపోయేటట్లు చేయడం, _ వెంటనే బయలుదేరుతుందని మభ్యపెట్టి కొన్ని గంటలపాటు ఆలస్యం చేయటం వంటి అనేకానేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఇవన్నీ కూడ ప్రయాణీకులు పరిహారం పొందగలిగే గ్రైవేటు బస్సుల తప్పిదాలే. బస్సులో కూర్చున్నంత సేపు ఆవేదన అనుభవించి బస్సు దిగగానే, హమ్మయ్య అనుకునే ప్రయాణీకుల్లో మార్పు రానంతవరకు ఈ సేవలలో మార్పులు రావు. వినియోగదారులు పొందవలసిన గౌరవం కూడా వారికి లభించదు.

  1. రైలులో ప్రయాణంచేసేవారు తమ కూడా ఒక్కొక్క టిక్కెట్టుపై 30 కేజీల సామాన్లు ఉచితంగా తీసుకువెళ్ళవచ్చు అని చదివాను. కౌని ఈ మధ్య రైల్లో వాషింగ్‌మెషిన్‌ తీసుకెళితే స్టేషనులో ఆపి చార్జీలు వసూలుచేశారు. దీనిపైన జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చునా?

జ. సెకండు క్లాసులో ప్రయాణంచేసే ప్రతి ఒక్క ప్రయాణీకుడు తనతోపాటు ఉచితంగా 30 కేజీల లగేజి తీసుకువెళ్ళవచ్చు అనేది నిజమే. కాని ఎటువంటి వన్తువులను తీనుకువెళ్ళవచ్చు అనే విషయం పైననే ప్రయాణీకుడికి అవగాహన ఉండదు. నిరక్షరాస్యత వలన నియమాలు నిబంధనలు తెలియక అనందంగా జీవితం గడిపేస్తున్న ప్రయాణీకులు

ఏం

కొందరైతే, నిర్లక్ష్యంవల్ల అవగాహన పెంపొందించుకోలేక అవమానం పాలవుతున్న విద్యాధికులు కొందరు. రైల్వే టైంటేబులులో ఒక సేజీలో రహస్యంగా నిక్షిప్తంకాబడిన సమాచారంలో ఎటువంటి వస్తువులు ప్రయాణీకుడు తనతో రైలులో ఉచితంగా తీసుకువెళ్ళవచ్చుననే విషయం వ్రాయబడి ఉంటుంది, అక్కడ తప్ప ఎక్కడా ఈ వివధ్తాలు లేవుసుమా! సమాచారాన్ని పొందే హక్కు కలిగిఉండటమంటే ఇదేనేమో: ప్రకటనలకోసం వికృతంగా రైల్వే కంపార్దుమెంటులను వినియోగిస్తున్న రైల్వేశాఖవారు ప్రయాణీకుడు తన కూడా ఎటువంటి లగేజి తీసుకువెళ్ళవచ్చు అనే విషయం కూడా కంపార్దుమెంటులోనే సూచిస్తే బాగుండును. లేదా టిక్కెట్టు వెనకైనా వ్రాయవచ్చును. రైలులో ప్రయాణం చేసి గమ్యం చేరగానే ఉపయోగపడే వస్తువులు, ప్రయాణంలో ఉపయోగపడే వస్తువులు 30 కేజీల వరకు ఉచితంగా తీసుకువెళ్ళవచ్చును అనేది నిబంధన. ఈ విధంగా చూస్తే వాషింగ్‌ మెషీన్‌ ప్రయాణావసరాలను తీర్చే వస్తువు కాదు కనుక దాని బరువు 30 కేజీలలోపు ఉన్నప్పటికి ఉచితంగా తీసుకువెళ్ళడానికి అనుమతించరు. అంతేకాకుండా అటువంటి పెద్ద వస్తువులును తమ కూడా తీసుకు వెళ్ళితే తోటి ప్రయాణీకులకు అసౌకర్యంగా ఉంటుంది కనుక ఇటువంటి సామానులను లగేజి క్యారియర్‌లో వేయించాలొ అలా వేయిస్తే ఆ వాషింగ్‌ మెషీన్‌ షేపు మారిపోతుందేమోనన్న భయం కూడా లేకపోలేదు. అందుచేత కొంచెం కష్టమెన్తప్పటికి రోడ్డు ద్వారా రవాణా చేయించడం మంచిది. మొదటి తరగతిలో 70 కేజీలు మొదటి తరగతి లేక గ౦ 519609? లో 50 కేజీలు &.0. 0౧౦౦౦౯ లో 40 కేజీలు &.0. 11౫౪లో 40 కేజీలు రెండవ తరగతిలో 30 కేజీలు ఉచితంగా తీసుకెళ్ళవచ్చును. ఖీదేవిధంగా ఏదైనా ఓ సంగీత వాయిద్యం కాని, టి.వి. సెట్‌ గొని పిల్లల వహీడు చక్రాల సైకిల్‌ కాని వైద్యరీత్యా ఓ ఆక్సిజన్‌ సిలిండర్‌ గాని, ఉచిత లగేజిగా తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. కూడా తీసుకెళ్ళే పెట్టెల విషయంలో | కూడ కొన్ని నిబంధనలున్నాయి. 100 సెం.మీ. పొడవు 60 సెం.మీ వెడల్సు 25 సెం.మీ. ఎత్తు మించి ఈ పెట్టెలు ఉండరాధు. అదే ౧.0 ॥ 116౯లో అయితే పెట్టె సైజు 55 సెం.మీ. - 45 సెం.మీ. - 25 సెం.మీ. లోపు ఉండాలి. వ్యాపార నిమిత్తం తీసుకువెళ్ళే అన్ని సరుకులు కూడా 6౫౦

పార్సిల్‌ ద్వారా బుక్‌ చేయవలసి ఉంటుంది. 1మీ. -1మీ. - 1.7 మీటర్లు ఎత్తు ఉన్నవాటిని పెద్ద పరిమాణం కల వస్తువులుగా భావించి వాటి బరువు 100 కేజీల లోపు ఉన్నానరే రెట్టింవు చార్జీలు వనూలుచేస్తారు. ద్విచక్రవాహనమును (స్కూటర్‌, మోపెడ్‌, మోటారు సైకిల్‌) లగేజి క్రింద బుక్‌ చేసుకోవచ్చును.

  1. రైలులో అనేకానేకాలుగా అసౌకర్యాలకు గురి అవుతుంటాము. అసౌకర్యానికి గురి అయితే ఫిర్యాదు చేయమని నొక్కి నొక్కి చెపుతున్నారు. పరుగెడుతున్న రైలులో ఎవరికి చెప్పాలో తెలియదు. ఆగిన రైలు స్టేషనులో ఫిర్యాదు చేసివచ్చేవరకు ఆగి ఉంటుందో లేదో తెలియదు. చివరకు మన బాధలు “రైలు రోదన”గా మిగిలిపోతున్నాయి. పరిష్కారం సూచిస్తారా?

జ. సాదారణంగా రైలు ప్రయాణము చేస్తున్నప్పుడు ప్రయాణీకులకు ఎదురయ్యే ఇబ్బందులు ఈ విధంగా ఉంటాయి. మీరెక్కవలసిన రైలు రావలసిన సమయానికి రాదు. అదెప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో వెంటనే తెలపడానికి రైల్వేశాఖవారు ఆసక్తి చూపరు. తీరా టికెట్టు రిజర్వు చేసుకున్నాక మనకు అలాట్‌ చేసిన బెర్త్‌ మరొకరికి అలాట్‌ చేయబడి ఉంటుంది. మరో సందర్భంలో మనకు అలాట్‌ చేసిన బెర్త్‌ అంపశయ్యలా గుచ్చుకుంటుంది. అదీకాకుంటే ప్రయాణం చేస్తున్న కంపార్దుమెంటులో చెత్తా చెదారం . కురుకుపోయి కాలు కిందికి మోవడానికి అనప్యాంచుకునే పరిస్పితులుంటాయి. బాత్‌రూములు ఉవనయోగించుకుందామంటే జుగుప్సాకరంగా ఉంటాయి. అయినా తప్పనిసరి పరిస్థితులలో రణరంగంలోకి దూకినట్లుగా లోనికి దూకితే నీళ్ళురాకపోవచ్చు. అదృష్టవశాత్తు ఇవన్నీ సవ్యంగా ఉంటే కిటికీ వద్ద కూర్చొని బయటకు చూస్తుంటే అకస్మాత్తుగా తలుపుజారి మన చేతికి గాయం చేయవచ్చును. ఫ్యాను తిరగకపోవచ్చు., లైటు ఆరకపోవచ్చు. స్విచ్‌ కోసం వెదికితే భయంకరంగా తీగ తగలవచ్చు. ఇవన్నీ రైల్వేశాఖవారి నిర్లక్ష్యం వలన కలిగే ఇబ్బందులు. ఇక తోటి ప్రయాణీకుల వలన కూడా పలురకాల అసౌకర్యాలు చోటుచేసుకుంటాయి.

ఓ పొట్లం వేరు శనక్కాయలు కొనుక్కొని గింజలు తన నోట్లోను తొక్కలు ప్రక్కవారి ఒళ్ళోను పోసే సంస్కారం కొందరిదయితే టికెట్‌ లేకుండా కంపొర్దుమెంటులో చొరబడి ధనదర్పంతో కంపార్దుమెంటులో కొంచెం నేలను కొనుక్కొని ఓ మూల సేపరు పరుచుకొని తోటి ప్రయాణీకుల కాళ్ళకు 6కి ం

బంధంలా తగులుకొనే ప్రబుద్దులు మరికొందరు. ఈ మధ్య బీహార్‌లో ఓ ప్రయాణీకుడు తన గుర్రంతోసహా కంపార్ణుమెంటులోకి ఎక్కి ఆ గుర్రం మీద తాను కూర్చొని తన మత ఛాందసాొన్ని చాటిచెప్పాడట. అంటే దేశంలో కొన్ని రాష్రాలలో డబ్బు చెల్లించి ప్రయాణంచేసే ప్రయాణీకుల అగచాట్లు ఎంత దుర్భరంగా ఉన్నాయో పై సంఘటన తెలియజేస్తుంది. మరికొందరు , ప్రయాణీకులు కుర్చీలు, బల్లలు, కుక్కలు కంపార్దుమెంటులోకి తరలించి తోటివారిని ఇబ్బందిపెడుతుంటారు. ఇక ధూమపొన ప్రియులు తమ దురలవాట్లతో ప్రక్కవారి ఆరోగ్యాలను నాశనంచేస్తుంటారు. తోటి ప్రయాణీకులు అబ్యంతరం తెలిపితే “పొగత్రాగరాదు” అనే నిషేధం వుంది. ఆ నిషేధం ఉల్లంఘించిన వారికి రూ.100లు జుర్మానా కూడ విధించబడుతుంది. రైల్వే కంపార్దుమెంటులో తాగడం కాని, తోటి ప్రయాణీకులకు చికాకు కలిగించడం కాని చేయరాదు. అటువంటివారిని శెలు నుంచి దింపినేయడమేకాక ఆరు నెలల జైలుశిక్ష రూ.500లు జుర్మానా విధించడానికి అవకాశం ఉంది. ఇబ్బంది కలిగించే మరొక విషయం ఏమిటంటే ప్రయాణీకుడు నిద్రకుపక్రమించే ముందు టికెట్‌ చెక్‌ చేయకుండ అర్ధరాత్రి నిద్ర లేసి టికెట్‌ చెక్‌చేస్తున్న యోగ్యులను ప్రయాణీకులు తమ అనుభవంలో చూస్తూనే ఉంటారు. ఇటువంటి ఇబ్బందులకు గురయిన సందర్భంలో ప్రయాణీకులు తమ టికెట్‌ను తమ వద్ద భద్రపరుచుకోవాలి. తోటి ప్రయాణీకులను సాక్షులుగా ఉంచుకోవాలి. గమ్యం చేరగానే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయాలి. ప్రయాణ సమయంలో పరిష్కరించుకోవలసిన సమస్యలను టి.టటి.ఇకి గాని, గార్జుకి గాని నివేదిస్తే ఆ సమస్యలు పరిష్కారమవుతాయి. రైల్వే అధికారులు సమస్యను సవ్యంగా పరిష్కరించలేకపోతే జిల్లా ఫోరంలో ఫిర్యాదుచేసి పరిహారం పొందవచ్చును. కంపార్టుమెంటులో ప్రయాణీకులు నిద్రపోతున్నారనే జ్ఞానం లేకుండా అదేపనిగా కేకలువేస్తు తమ పదార్థాలను అమ్ముకోజూసే హాకర్చ్‌ను రైల్వేలు అదుపుచేయలేకపోతున్నాయి. రాత్రి 10 గం॥ల నుండి ఉదయం 6 గం॥ల వరకు ఈ అరుపులను ఆపాలనే ఆలోచన రైల్వేశాఖవారికి లేకపోవటం శోచనీయం. అది వారి నిర్లక్ష్యానికి తార్కాణం. ఇటువంటి అసొకర్యాల'పై గూడా జల్లా ఫోరంకు ఫిర్యాదు చేయవచ్చు. జీ2

  1. వస్త్రాలుకొనే సందర్భంలో నాణ్యత తెలియక, ధర తెలియక మోస పోవడం జరుగుతుంది. వస్త్రాల: నాణ్యత తెలుసుకోవడానికి మీరేమైనా సూచనలు చేస్తారా?

జ. సాధారణంగా వస్త్రాల నాణ్యత అనుభవం వల్లనే తెలుస్తుంది. అందుచేత ' వస్త్రాలు కొనటానికి వెళ్ళేటప్పుడు ఆ రంగంలో అనుభవజ్ఞాలను వెంట తీసుకెళ్ళటం మంచిది. లేదా మీ టైలర్‌ సహాయం తీసుకోండి. వస్త్రం చాలా పలుచగా ఉందా, దొనికి నలిగే గుణం ఉందా, పోగుల మధ్య ఖాళీలున్నాయా,

ం ప్రింట్‌ అపసవ్యంగా ఉందా, ' ఉతికితే పాడయిపోయే అలంకారలేమైనా ఉన్నాయా అనే విషయాలు గమనిస్తే కన్సించకపోవు. మరొక గందరగోళ పరిస్థితి ఏమిటంటే దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాల కాంతిలో కళావిహీనంగా ఉన్న వస్త్రాలను సహితం అందంగా కన్పించేలా భ్రమ "పెడుతున్నారు. ఇక పట్టు వస్తాలజోలికిపోతే పిండి జరీ అని, నెపోలియన్‌ జరీ అని చెప్ప్తతూ సింథటిక్‌ జరీతో నేసిన వీస్తాలను ఎక్కువ ఖరీదుకు అమ్మటం జరుగుతోంది. కంచి, పోచంపల్లి, గద్యాల, వెంకటగిరి, ధర్మవరంలలో వస్త్రాలు నేస్తారు కనుక అక్కడే కొంటే తక్కువ ధరలలో లభ్యమవుతాయనీ వెళ్ళి చేతులు కాల్చుకొన్న వ్యక్తులు ఎందరో, వారి అందరి అనుభవాలను వినండి. పట్టుచీరలు ఎక్కువ కాలం నిలవ ఉంటే నాణ్యత కోల్పోతాయి. చీరల మడతలు దగ్గర ఆ చీరల వయస్సును తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇక ధరల విషయం చూస్తే అది ఒక పెద్ద గందరగోళం. 50 శాతము డిస్కౌంటు ఇవ్వడానికి ముందుకు వచ్చే వస్త్ర వ్యాపారులు సైతం బేరం అడ్రితే 10 శాతము కూడా తగ్గించరు. అంటే “వ్యాపారులందు డిస్కౌంటు వ్యాపారులు వేరయా” అని మనం భావించవలసి ఉంటుంది. నైలాను చీరలు తయారయిన ఆరంభ దశలో అసలు ఈ చీర తయారుకావడానికి ఎంత ఖర్చు అవుతుంది, దానిని మార్కెట్టులో ఎంతకు అమ్ముతున్నారనే విశ్లేషణ జరిగింది. ఆ విశ్లేషణ ఫలితాలు వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టించేలా ఉన్నాయి. ఆరుగజాల నైలాను చీర తయారుచేయడానికి అప్పట్లో అయిన ఖర్చు కేవలం రూ.8లు. అదే చీరను షోరూంలలో రూ.80లకు అమ్మటం జరిగింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు వస్త్రాల ధరలు ఉహించని రీతిలో ఎలా పెంచుతారో తెలియటానికి. ధరలపట్సిక ఒక్కటే ఆధారం. ప్రతి తానుకు ప్రారంభంలో ధర ముద్రించి

టీ

ఉంటుంది. కాని మీరు కొనే సమయానికి ధర ముద్రించబడి ఉన్న ముక్క " అమ్ముడయిపోవడం వల్ల మీకు కావలసిన సమాచారం తెలియదు. అందుచేత షాప్పువారిని ధరలపట్టిక అడిగి తెలుసుకోవడం ఒక్కటే సరైన మార్గం. “50. అఆ మధ్య ఒక వారపత్రికలో గళ్ళలో అంకెలు నింపి బహుమతులను ' గెలుచుకోండి అనే ప్రకటనను చూశాము. అడ్డుగా, నిలువుగా కూడినా ఒకే ; అంకె రావాలి అనేది షరతు. ఆవిధంగానే నింపి పంపిస్తే ననుబహుమతి గెలుచుకున్నట్లుగా వారి నుండి సమాధానం వచ్చింది. రూ.150లు కడితే టి.వి. పంపిస్తామని వ్రాసారు. రూ.150లు పంపాను. టి.వి. రాలేదు కాని '

గడ్డి నింపిన పార్శిల్‌ వచ్చింది ఏం చేయమంటారు?

జ. ఆ పజిల్స్‌ నింపేటపుడు ప్రకటనకర్తలు దేని నిమిత్తము ఇటువంటి షోట్రి | ఏర్పాటు చేశారో ఒక్క క్షణమైనా ఆలోచించారా? అది వ్యాపారాన్ని బజంపొందించటాన్నికి గాని, (వ్రజల్లోని వతిఖాపాటవాలను "పెంపొందించటానికి గాని నిర్జేశించబడిందా అనే విషయంపై దృష్టి , సారించి ఉంటే మీకు సంగతి కొంతవరకు అర్ధమయి ఉండేది. గళ్ళు నింపాలి అనే కోరికతో విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని మీరుపూర్తిచేసి ఆ విషయాన్ని సగర్వంగా ప్రకటనకర్తలకు తెలియజేసినా వారు రూ.150లకు ఓ టి.వి. పంపీస్తామంటే ఎలా నమ్మగలిగారు. ఒకవేళ గళ్ళు నింపటం వలన బహుమతి గెలుచుకుంటే ఎటువంటి డబ్బు కట్టకుండానే అదిమీకు చేరుతుంది. అత్యాశ అనే మన బలహీనతను తమ పెట్టుబడిగా ఉపయోగించుకొని అక్రమార్జన చేయాలనే దుర్నీతి కలవారు చాలామంది ,

| మనకు తారసపడతారు. ప్రకటనకర్త తెలియజేసిన తన చిరునామాను ఒకసారి మీరు చూసుంటే అతను నివసించే ఇంటి నంబరు కాని, వీధి పేరుకొని లేకుండా కేవలం ఊరుసేరు, పిన్‌కోడ్‌, తమ బోగస్‌ సంస్థ పేరు మాత్రమే వ్రాసి ఉంటాయి. అంటే భవిష్యత్తులో తాము చేసిన మోసం బయటపడి విచారణకు అంతుచిక్కని చిరునామా అన్నమాట అది. . స్థానికంగా ఉన్న పోస్ట్‌మాన్‌తో సంబంధాలు పెట్టుకొని దేశవ్యాప్తంగా ప్రజల్ని దోచుకుతింటున్న ఘరానా వ్యాపారమిది. రూ.150లు పెట్టి గుప్పెడు గడ్డి కొనుక్కున్నామనే తీరని ఆవేదన వినియోగదారునికి మిగులుతుంది. ఇటువంటి కోవలోనిదే అద్భుత ఉంగరం. అది ధరిస్తే చాలు “మీరు ప్రేమించిన అమ్మాయి సినిమాల్లో చూస్తున్నట్లుగా ఒళ్ళో

64

వాలుతుంది. ఈ ఉంగరం మీరు కోరిన కోరికలు తీరుస్తుంది", మరి ఇలాంటి ప్రకటన బలహీనులైన వినియోగదారులలో చిత్తచాంచల్యం కలిగించి తీరుతుంది. ఇటువంటి మోసొలలో పడకుండా రక్షించుకోవాలంటే అత్యాశను అదుపులో పెట్టుకోవాలి. ఎక్కువగా ఇటువంటి కార్యకలాపాలు “కత్రిసరాయి; గయా” అన్న చిరునామా నుండి జరుగుతున్నట్లుగా ఫిర్యాదులందుతున్నాయి. వినియోగదారులను మోసపుచ్చి నష్టాలకు గురిచేస్తున్న అట్లాంటి కార్యకలాపాలను అరికట్టాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కనుక వాటిని అరికట్టమని జిల్లా ఫోరం ద్వారా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయించవచ్చును. ఇదే విషయాన్ని వినియోగదారుల రక్షణ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదుచేస్తే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో విచారణ జరపటానికి అవకాశం ఉంది.

  1. బిగ్‌బుల్స్‌ కుమ్ములాటలో లేగదూడల కాళ్ళు విరిగినట్లు షేర్ల ప్రపంచంలో అక్రమాల పరాకాష్టగా మార్కెట్టు పతనమయిపోయింది. అప్పట్లో ప్రీమియంలో కొన్న ఎన్నో షేర్లు పూర్వ వైభవాన్ని సంతరించుకోలేక షేర్‌ హోల్డర్సుకు నష్టాల వర్వాలు కురిపించాయి. షేర్స్‌ కొనుగోలులో నష్టాలు సంభవిస్తే వినియోగదారుల కోర్టును ఆశ్రయించి పరిహారాన్ని పొందవచ్చునా?

జ. సేర్‌ మార్కెట్టు పతనమయ్యింది కదా అని చెప్పి దానికి ఎవరినో బాధ్యులను చేసి పరిహారం పొందటానికి వీలుపడదు. ఫలానా బ్రాండు మార్కెట్టులో ప్రాచుర్యం పొందలేదు కనుక నా వ్యాపారానికి నష్టం వచ్చింది. ఉత్పత్తిదారుల నుంచి లేదా డిస్టిబ్యూటర్‌ల నుండి నాకు నష్టపరిహారం చెల్లించండి అని ఒక వ్యాపారస్తుడు మొరపెట్టుకొంటే ఎలా వుంటుందో ఇదీ అంతే కనుక వినియోగదారుల కోర్టులు ఇటువంటి ఫిర్యాదులు స్వీకరించవు. షేర్లు కొనుగోలుచేసేవారు అన్ని సందర్భాలలోను 'వినియోగదారులు' అనే నిర్వచనం క్రిందకు రారు. జాతీయ కమీషన్‌ ఇచ్చిన ఒక తీర్పు ఏం చెబుతుందంటే “షేర్‌ అప్లికేషన్‌ పెట్టుకున్నవారిని వినియోగదారుడుగా పరిగణించలేము. పేర్లు అలాట్‌ చేయకపోవటం వలన తనకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించమంటే చెల్లించడానికి వీలుండదు. షేర్‌ అలాట్‌మెంటు అయ్యాక మాత్రమే సదరు వ్యక్తిని వినియోగదారుడుగా భావించడానికి అవకాశం కలుగుతుంది. దీనిని బట్టీ సందర్భోచితంగా మాత్రమే ఒక వ్యక్తి వినియోగదారుడా కాదా అనే విషయము స్పష్టమవుతుంది.

(౫౪క

షేర్‌ బ్రోకర్‌ ఫలాన కంపెనీ షేర్లు కొనిస్తానంటూ డబ్బు తీసుకొని షేర్లు ే కొనివ్వడంలో విఫలమయితే అది సేర్‌ బ్రోకర్‌ సేవలలో లోపంగా భావించి అతనికి డబ్బు యిచ్చిన వ్యక్తిని వినియోగదారుడుగా గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా నేను షేర్‌ హోల్డర్‌ని కదా గత సంవత్సరము ఈ కంపెనీవారు 15 శాతము డివిడెండు చెల్లించారు. చాలా బాగుంది అని । నేను షేర్లు కొంటే ఈ సం॥ డివిడెండ్‌ లేదు పామ్మంటున్నారు. 15 శాతము డివిడెండు యిప్పించండి అని ఓ షేర్‌హోల్డర్‌ ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉండదు. ఏదైనా ఒకవేళ కంపెనీ డివిడెండ్‌ డిక్లేర్‌చేసి షేర్‌ హోల్డర్‌కి ఆ సొమ్ము యివ్వని పక్షంలోకాని, తాము మరొకరి దగ్గర్నుంచి ఆ కంపెనీ షేర్లు కొన్నప్పుడు అవి తమ పేర ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి | అకారణంగా జాప్యం చేస్తున్నప్పుడు కాని, ౧0౧౪౭౧౦౦16 6609౧199 |. శ్నర్రగా ౦౦౧౪౪౫ చేయడానికి కంపపనీవారు యిబ్బందులు కలుగజేస్తునప్తుడుగాని, షేర్లు అలాట్‌చేయని పక్షంలో దరఖాస్తుతో కట్టిన సొమ్మును తిరిగి యివ్వకుండా ఆ కంపెనీ నాటకాలాడుతున్నప్పుడు గాని | వినియోగదారుడు కోర్టునాశ్రయించి తగిన పరిహారం పొందడానికి అవకాశం ఉంది. అంతేగాని షేర్లు అలాట్‌ చేయించుకునే విషయంలో వినియోగదారుల కోర్డునుపయోగించు కోవాలనుకుంటే కుదరదు.

  1. అందని ఫలంలా ఆకాశాని కెగిరి కూర్చున్న పట్టణాలలోని ఇళ్ళ స్థలాలు కొనడం సామాన్యులకు దుర్లభం. స్వంత యిల్లు సుందర స్వపష్నంగా మిగిలిపోగా అపార్జుమెంటుతో సర్దుకుపోవాలి గదా! మరి ఈ అపార్జుమెంటు కొనుగోలుచేసే సందర్భములో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?

జ. అపార్జుమెంటు కొనేముందు ముఖ్యంగా మీరు దృష్టిలో సెట్టుకోవలసినది మీ అవసరాలు, ఎన్ని బెడ్‌ రూములు ఉండాలి, బెడ్‌ రూములు ఎంత విశాలంగా ఉండాలి, హాలు ఎంత విశాలంగా ఉండాలి. మీకు మోటారు వాహనములుంటే అవి పార్కు చేసుకోవటానికి తగిన వసతి ఉండాలి, మీ ఆఫీసుకు, పిల్లల స్కూళ్ళకు, మార్కెట్టుకు సులభంగా చేరే ప్రదేశంలో ఉండాలి అనే విషయాలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయి. తర్వాత ఆర్థికపరమైన పరిమితులు దృష్టిలో ఉంచుకోవాలి. నగరం నడిబొడ్డులో నిర్మించిన అపార్జుమెంటులకు, నగరశివార్లులో నిర్మించిన అపార్దుమెంట్లకు ధరలలో ఎంతో వ్యత్యాసముంటుంది. అంతేకాకుండ అపషార్దుమెంటు

బీద

కొన్నతరువాత అలంకరణకోసం . మరికొంత ఖర్చుపెట్టవలసి వస్తుంది. ఆర్దిక పరిమితులు, అవసరాలు ప్రాతిపదికపై ఓ నిర్ణయం చేసిన తర్వాత అపార్జుమెంటు కొనేముందు మరిన్ని విషయాలు పరిశీలించాలి. ఆ అపార్జుమెంట్స్‌ కడుతున్న స్థలం తాలూకు దస్తావేజులపై ఎటువంటి వివాదాలు లేకుండ ఉండాలి. ఆ స్థలం అంతకు పూర్వం వ్యవసాయ భూమైనా కావచ్చు, వ్యవసాయేతర భూమైనా కావచ్చు. ఆ భూమిపై | ఎటువంటి పన్నులబకాయి ఉండరాదు. నిర్మాణ సంస్థ లేక ప్రమోటర్స్‌ విడుదలచేసిన కరపత్రాన్ని జాగ్రత్తగా చదివి అర్ధంచేసుకోవాలి. టేకు కర్ర ఉపయోగిస్తామని, లిప్ట్‌ పెడతామని, మొజాయిక్‌ ఫ్లోరింగ్‌ చేస్తామని, , బాతీరూముల్లో ౧౦0|:౧6౦|116: వేస్తామని, ౩౧౧౦౫౩౩ కరెంటు యిప్పిస్తామని, ఇంకా ఇటువంటి వాగ్దానాలు నిర్మాణ నంస్థవారు మొదటి కరపత్రంలో | వాగ్జానం చేస్తారు. ఆ కరపత్రం చదివాక ఆకర్షితులయి మీరు అపార్డుమెంటు కొనవచ్చు. తరువాత కరపత్రం చెప్పినదానికి భిన్నంగా వారు నిర్మాణం చేపడితే అ కరసత్రమే సాక్ష్యంగా మిగులుతుంది. ఇక బిల్దర్స్‌ కట్టబోయే , లేక కట్టిన అపార్జుమెంట్సు తాలూకు ప్లాన్‌ జాగ్రత్తగా పరిశీలించాలి. అంతేకాకుండా 4౧. అపార్దమెంట్సు చట్టం నిబంధనల ప్రకారం నీటిసదుపాయ, అగ్నిమాపక పరికరాలు నమకూర్చబడినవో లేవో తెలుసుకోవాలి. బిల్డర్‌ చేసిన తప్పులకు అపార్జుమంటు కొనుక్కున్నవారు శిక్షింపబడే అవకాశాలున్నాయి. నీరు, డైనేజి వంటి ఉమ్మడి సదుపాయాల విషయంలో అప్రమత్తులై ఉండాలి. ఆ బిల్దంగ్‌లో అపార్జుమెంట్స్‌ కొన్నవారి జాబితా బిల్డర్‌ నుండి పొందాలి. ముఖ్యంగా విద్యుత్‌ సరఫరా విషయంలో -అపార్జుమెంట్సు కొనేవారు కొన్ని సందర్భాలలో ఇబ్బందికి గురికావచ్చు. ఎందుచేతనంటే కరెంటు కనక్షన్‌ బాధ్యత కూడా బిల్డర్‌ వహించి దాని నిమిత్తం మీ దగ్గర నుంచి డబ్బు వసూలుచేస్తారు. త్రీరా మీరు అపార్గుమెంటులోకి చేరిన తరువాత తాత్కాలిక కనక్షన్‌ ఉండటమో లేదా 5౧౮6౧౧౫౪ చాలనుకుంటే ॥ ౧౦:6 కనక్షన్‌ పొందటం వంటి అసౌకర్యాలు తలెత్తటం జరగవచ్చును. హైర్‌పర్పేజ్‌లో కొన్న అపార్జుమెంట్సుకు _ ప్రతి సంవత్సరము పెరిగిపోతున్న రిజిష్ట్రేషన్‌ ఫీజులవల్ల రిజిస్టేషన్‌ చార్జీలు చెల్లించడం, ఆడపిల్ల సెళ్ళి ఖర్చు అంత ఉండవచ్చును. 647

  1. ఈ మధ్య 96౧5౧695 అని టేకు మొక్కల పెంపకదారులు పలురకాలైన | ఆకర్షణీయమైన ప్రకటనలతో వినియోగదారులకు భ్రమలు కొల్పుతున్నారు. , వాటిలో పెట్టుబడి అంత లాభదాయకంగా ఉంటుందా?

జ. ఆకర్షణీయమైన ప్రకటనలే వినియోగదారులను వలలో పడవేసే సాధనాలు. కేవలం ఈ రోజు రూ.3,000/-లు, పెట్టుబడి పెడితే 20 సం॥ఃల అనంతరం | లక్ష రూపాయలు మించి ఆదాయము వస్తుంది అని నమ్మబలికితే ఎవరికి , మాత్రం ఆశగా ఉండదు. వినియోగదారుల బలహీనతను గుర్తించినవారు కనుకనే టేకు చెట్లు అని ఒకరంటే, మంచి గంధం వృక్తాలని మరొకరంటు | చక్కగా పెరిగిన అడవులను ఫోటో తీస్తు అది మా నిర్వాకమే అని చాటుకుంటుంటే అసలే బలహీనంగా కనిపించే వినియోగదారుడు ఆ ప్రకటనల. సౌందర్యం చూసి స్పృహ కోల్పోతున్నాడు. 20 సం॥లలో ఎరువులు పోసి పెంచిన టేకు మొక్కైనాసరే కోతకు రాదు అనేది వృక్షశాస్తవేత్తల నిశ్చితాభిప్రాయం. ఈ ప్రకటనదారులు టేకు మొక్కలు పెంచడానికి భూమి కొనడం నిజం కావచ్చు. కొన్న భూమిలో టేకు మొక్కలు నాటడం నిజం కావచ్చు. నాటిన మొక్కలను పదిలంగా పసిపాపలాగా పెంచడం నిజం కావచ్చును. బలవర్ధకాహారాలు వేసి ముద్దుగా, బొద్దుగా సెరిగేలా తాాత్రయపడనూవచ్చును. అంతమాత్రం చేత 20 సం॥లలో టేకు మొక్క వాణిజ్యపరంగా ఆలోచించేటంత పరిపూర్ణత సంపాదించుకోలేదు. ఇదే తరహాలో గొట్టైల పెంపక కేంద్రాలు కూడా దూసుకువస్తున్నాయి. గొట్టిల జాతి, వాటి సంతానోత్పత్తి శక్తి, వాటి ఉన్నిమీద వచ్చే లాభాలు, వాటిని విక్రయించగా వచ్చే సంపద అన్ని

ం ఆకర్షణీయంగానే ఉంటాయి. కాని పెట్టుబడిదారుడు 20 సం॥లలోపే ఆశించని విధంగా శూన్య హస్తం లభిస్తుంది. ఇటువంటి సంస్థలు చాలావరకు మూతపడిపోతున్నట్లుగా వింటున్నాము. 20 సం॥ల తర్వాత లక్ష రూపాయల మాట ఎలావున్నా మొదటికే మోసం వచ్చే పధకాలలో పెట్టుబడి పెట్టడం శ్రేయోదాయకం కాదు. ఇదే రూ.3000/-లు సొమ్ము జాతీయ పొదుపు పధకాలు, ఇందిరా వికాస పత్రాలు వంటి వాటిల్లో పెడితే రూ.100,000/-లు కాకపోయినా కనీస హమీగా రూ.50,000/=లు వస్తాయి.

క్‌

  1. షేర్లు కొనుగోలు చేసే సందర్భంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలియజేయండి.

జ. ఈమధ్యకాలంలో * షేర్లు కొనుగోలు చేయడంలో ఎక్కువ మంది వినియోగదారులు నష్టపోతున్నట్టుగానే అన్సిస్తుంది. ఏ కంపెనీ షేర్లను కొంటే లాభదాయకంగా ఉంటుంది, ఏ కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి అనేది జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నష్పాలబారి నుంచి తప్పించుకోవచ్చు. షేరు మార్కెట్టు. ఎందుకు పతనమవ్పతుందో ఎప్పుడు ఉన్నత దశకు వెళుతుందో ఊహించడం కష్టమే. అమెరికన్‌ డ్రైసీడెంట్‌ పై హత్యాయత్నం గావించిన రోజున బంగారం ధర పడిపోవటానికి, సార్వత్రిక ఎన్నికల్లో కాం[గైసు ఓటమి చవిచూసిన తర్వాత పేర్‌ మార్కెట్‌ పతనమయి పోవటానికి కారణాలు సామాన్యుడు అర్ధం చేసుకోలేడు. అందుచేత తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించాలనే ప్రాతిపదికగా "స్పెక్యులేషన్‌ మార్కెట్‌లో ప్రవేశిస్తే నష్టం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అన్ని విషయాలను జాగ్రత్తగా అధ్యయనం చేసి షేర్లలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు రాకపోయినా పెట్టుబడిమీద మంచి ప్రతిఫలమే ముడుతుంది. క్రొత్తగా ప్రకటించబడిన ఇష్యూస్‌ విషయంలో చాలా ఆప్రమత్తంగా ఉండాలి. ఇష్యూస్‌ అన్నింటిలోను గుడ్డిగా పెట్టుబడి పెట్టడం లాభదాయకం కాదు. అ కంపెనీ తయారుచేసే ఉత్పత్తులు, ఆ కంపెనీ ప్రమోట్‌ చేసిన వ్యక్తులు, వ్యాపార రంగంలో వారి అనుభవం పరిశీలించాలి. స్పెక్యులేషన్‌ వ్యాపారం వల్ల తలవని తలంపుగా లాభాలు వచ్చినా చివరకు మిగిలేవి రైటు ఇష్యూలో పెట్టుబడి పెట్టేటప్పుడు గత సం॥ కాలంలో అ కంపెనీ షేర్లు మార్కెట్‌లో ఎంతవరకూ పెరిగాయి, ఎంత తగ్గాయి అనే వివరాలు గమనించాలి. షేరు విలువ కంటే మార్కెట్‌ విలువ అధికంగా ఉండి కంపెనీ మంచి లాభాలను ఆర్డిస్తుంటే అటువంటి షేర్లు కొనడం లాభదాయకంగా వుంటుంది. పర్‌ అప్లీకేషన్‌ని నింపేటప్పుడు అన్ని కాలమ్స్‌ పూర్తిగా నింపాలి. అక్షరాలు స్పష్టంగా వ్రాయలి. ఎక్కడా సందిగ్ధత ఉండకూడదు. అలా వుంటే అప్లికేషన్‌ తిరస్కరించబడుతుంది.

4

రూ.50,000/-లు మించిన కొనుగోళ్ళకు ఇన్‌కంటాక్స్‌ పర్మనెంట్‌ అసెస్‌మెంట్‌ నెంబరు విధిగా వ్రాయాలి. | వెయ్యి షేర్లకు మించకుండా దరఖాస్తు చేస్తే ఎలాట్‌మెంటుకు ఎక్కువ | అవకొశాలు ఉంటాయి. ఎందుచేతనంటే చిన్న పెట్టుబడులు పెట్టేవారికి 50 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. 1000 షేర్లకు మించకుండా అపై చేసుకుంటే చిన్న ఇన్‌వెస్టర్లుగా పరిగణించబడతారు. దరఖాస్తుతోపాటు చెక్‌గాని, స్టాక్‌ ఇన్‌వెస్ట్‌గాని జతపరచటం షురిచిపోకూడదు. వాటి ఫొటోస్తాట్‌ కాపీలు పదిలపరచుకోవాలి. చెక్‌ వెనుక మీ షేర్‌ అప్లికేషన్‌ నెంబరు వ్రాయటం వలన ఆచెక్‌ ఏ అస్లికేషన్‌కి సంబంధించినదో తేలికగా | గుర్తించడానికి అనుకూలంగా ఉంటుంది. కంపెనీవారు ప్రకటించిన వివరాలు, బ్యాంక్‌ దరఖాస్తు ఫారం జాగ్రత్తపరచండి. ముఖ్యంగా కన్వర్దబుల్‌ొ డిబెంచర్స్‌ విషయంలో వీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్‌ ఇష్యూ ముగిసిన 70 రోజులలోగా పేర్ల కేటాయింపు పూర్తవుతుంది. రైట్స్‌. ఇష్యూలో 42 రోజులు పడుతుంది. ఒకవేళ ఇంతకు మించి ఆలస్యమైతే ఇష్యూ రిజిస్త్ట్రార్‌కి తెలియపరచాలి. రిజిస్ట్రార్‌కు వ్రాసే లెటర్‌లో అప్లికేషన్‌ నెంబరు, ఎన్ని షేర్లకు అస్తై చేసింది, అప్లికేషన్‌ ఎక్కడ ఇచ్చింది, మీ "పేరు, చిరునామా మొదలగునవి వ్రాయాలి. ఈ లెటర్‌ మూడు నెలల తర్వాత పంపించాలి. అయినా సమాధానం రాకపోతే మరో 15 రోజులలో రిమైండర్‌ పంపించాలి. రెండవ లెటర్‌కి కూడ సమాధానం రాకపోతే సెబీకి ఫిర్యాదు చేయాలి. ఇక సెకండరీ మార్కెట్‌లో తీసుకోవలసిన జాగ్రత్తలు " వేరుగా ఉంటాయి. సాధ్యమైనంతవరకు గుర్తింపువున్న స్టాక్‌ ఎక్సేంజ్‌లోనే లావాదేవీలు జరపండి. అది సాధ్యం కానప్పుడు మాత్రమే సెబీలో రిజిస్టర్‌ కాబడిన సబ్‌ బ్రోకర్‌ను సంప్రదించండి. మీకు కానలసిన షేర్లు ఏ కంపెనీవి, ఎన్ని, రేటు ఎంత, అనే విషయాలు పూర్తిగా తెలిసి ఆర్డరివ్యండి. మీ యిష్టం వచ్చిన కంపెనీవి, మీ యిష్టం వచ్చిన రేటులో కొనమని స్టాక్‌ బోకర్‌కు సలహా యివ్వకండి. దీనివల్లనే చాలామంది మోసపోతున్నారు. మీరిచ్చే అర్జర్లు శాశ్వత ప్రాతిపదికపై కాకుండా ఎప్పటికప్పుడు ఇవ్వండి. ఆర్డర్‌ కన్‌ఫర్‌మేషన్‌ వెంటనే తీసుకోండి. బ్రోకర్‌ ఆర్జరు తప్పుగా వ్రాస్తే వెంటనే కరెక్టు

ల శ ళో అయ్య గంగాం

త తం 64125 [| చేయించండి. మీరు ఇల్తలీష శ్లైరఖామ్లోకు-వెంటనే రశీదు తీసుకోండి. ఒకవేళ బ్రోకర్‌తో మీకు రెగ్యులర్‌ అకౌంట్‌ వుంటే క్రమబద్దంగా అకౌంట్‌ కాపీలు అడిగి తీసుకోండి. సాధ్యమైనంత వరకు లావాదేవీలన్నీ అకౌంటు "పేయీ బెక్‌ ద్వారా జరపడం ఉత్తమం. నగదు వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మీరు కొన్న షేర్లు మీ పేర ట్రాన్స్‌ఫర్‌ కాకుండా తిరిగి వచ్చినట్లయితే వెంటనే వాటి ఫొటోకాపీలు తీసుకుని మీ దగ్గర భద్రపరచుకొన్న తరువాత ఒరిజనల్స్‌ మీ బ్రోకర్‌కు అందజేయండి. అలా ఇచ్చేటప్పుడు ఒక కవరింగ్‌ లెటర్‌ వ్రాసి దానిలో డివిడెండ్‌, బోనస్‌, పోస్టేజి తదితర పరిహారాలను కోరండి. బ్రోకర్‌ నుండి వీటికి రశీదు పొందండి. బ్రోకర్‌ మీతో సరిగా సహకరించకపాోతే స్టాక్‌ ఎక్స్సేంజ్‌కు ఫిర్యాదు చేయండి.

  1. ఉత్పత్తిదారులు తాము తయారుచేసిన వస్తువులపై గ్యారంటీలు యిస్తుంటారు. దీనివలన వినియోగదారునికి ఎటువంటి లాభమైైన ఉంటుందా? ఈ గ్యారంటీలవల్ల నష్టపోతే తీసుకోవలసిన చర్యలు ఏమిటి?

జ. తాము తయారుచేసే వస్తువుల నాణ్యతను గ్యారంటీల ద్వారా గొప్పలు చెప్పుకునే పరిశ్రమలు మనకు చాలా కన్పిస్తుంటాయి. కొన్ని వస్తువులకు ముచ్చటగా మూడు నెలలే గ్యారంటీ ఉంటే మరికొన్ని వస్తువులకు అత్యధికంగా 7 సంవత్సరాల గ్యారంటీ లభిస్తుంది. మరికొంతమంది మరో అడుగు ముందుకు వేసి జీవితకాలపు గ్యారంటీలు ఇవ్వడం కూడా చూస్తున్నాము. పోటీలుపడి నాణ్యతలను పెంచి చిరకాలం మన్నే వస్తువులను తయారుచేస్తు వినియోగదారులకు మేలు చేకూరుస్తున్నారనుకుంటే అది పొరపాటే. ఈ గ్యారంటీల్లో కూడ చాలా మతలబులు, గ్యారంటీ కాలంలో లుకలుకలుంటాయి. 1౧840009 ౧౦|॥౦౪/ తీసుకున్నవారు గంం౦166౧+ అయిన తర్వాత పరిహారాన్ని పొందటానికి ఎన్ని చికాకులు కలుగుతాయో ఈ గ్యారంటీలు వలన కూడ అంతే కలుగుతాయి. కొన్ని సంపూర్ణ గ్యారంటీలయితే కొన్ని 60౦౧౧౦1%0౧౮| గ్యారంటీలు, మీరు మా వస్తువుని ఈ విధంగా రోజుకు ఇన్నిసార్లు మాత్రమే వాడితే ఇంత కాలం గ్యారంటీ ఇస్తాం అనేది కండిషనల్‌ గ్యారంటీ. ఉదా:రిఫ్రిజరేటర్‌ కొంటే 7 సం॥లు గ్యారంటీ లభించవచ్చును. కొని అది కేవలం కండ్రైసర్‌కే అంటే మిగిలిన భాగాలకు గ్యారంటీ ఎమిటి? డబుల్‌ బాల్‌ బేరింగులతో ఫ్యానుకు 7 సం॥ల గ్యారంటీ ఇస్తుంటే ఆ గ్యారంటి ఫ్యాన్‌ బేరింగులకా, ఫ్యాను రెక్కలకా లేదా

651

అదిజారి నెత్తిమీద పడకుండా ఉండటానికా? కార్ల విషయంలో కూడ ఇలా ॥ తమాషా గ్యారంటీలుంటాయి. కారు మూన్యువలొలో ఉదహరించినట్లుగా ,, ఎప్పటికప్పుడు అధీకృత డీలర్లు దగ్గర మాత్రమే సర్వీసింగు చేయించుకుంటూ పాడైన భాగాన్ని ఊడదీయకుండా కారును తోసుకుంటు కంపెనీ డీలరు వద్దకు తీసుకువస్తే అప్పుడు గ్యారంటీ నిబంధన ప్రకారం కంపెనీ వాగ్గానం అమలుపరుస్తారు. వినియోగదారుడు ముఖ్యంగా చూసుకోవలసినదేమిటంటే కం పెనీవారిచ్చిన గ్యారంటీలు అమలుచేసే అవకాశం ఉంటుందా, లేదా? ఒకవేళ వినియోగదారుడు ఉంటున్న ప్రదేశంలో రిపేరు చేసే అవకాశం లేకపోతే | గ్యారంటీ ఉండి లాభమేముంటుంది? మరికొన్ని సందర్భాల్లో పాడైన వస్తువును కంపెనీకి పంపించాలని కూడ అనటం జరుగుతుంది. అది కంపెనీ నుండి తిరిగి వచ్చేసరికి నెలల కాలం పడుతుంది. దీనివల్ల ఏ , అవసరానికి వస్తువు కొంటున్నామో ఆ అవసరం తీరదు. అందుచేత | గ్యారంటీ నిబంధన జాగ్రత్తగా చదివితే అది నిజం గ్యారంటీనో, బూటకపు , గ్యారంటీనో జేలిపోతుంది. స్టైబిలైజరు లేదు కాబట్టీ మీ టి.వి. కాలిపోయింది. | గోతులు రోడ్డులో వెళ్ళారు కాబట్టి మీ టైరులు పాడయినాయి. ఎక్కువ లోడు వేశారు కాబట్టి మోటరు కాలిపోయింది అనే వంకలు చూసే , ఉత్పత్తిదారుల గ్యారంటీలు ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే. ఇక గ్యారంటీ "కాలములో వస్తువు పాడయినప్పుడు అమ్మినవారు కాని, | ఉత్తుత్తిదారుడు కాని గ్యారంటీని అమలుపరచలేకపోతే జిల్లా ఫోరంకు ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చును.

  1. హైబ్రీడ్‌ విత్తనాలని మోసం చేసి నాసిరకం విత్తనాలు అంటగట్టారు. దీనివల్ల పంట నష్టపోయి ఆర్ధికపరమైన ఇబ్బందులకు గురయ్యాము. మేము ఏమి చెయ్యాలి?

జ. రైతులు తొము పండించిన పంటను అమ్ముకుంటారు కనుక వారు వ్యాపారస్తులు అనే వాదన కొంతమంది చేస్తున్నారు. కేవలం అది స్వార్ధచింతనతో రైతులు తమమీద వినియోగదారుల చట్టాన్ని నినియోగించుకొని కేసులు పెడతారనే భయంతో కొందరు సృష్టించిన అపోహలే అవి. రైతులు నూటికి నూరుపాళ్ళు వినియోగదారులే. ఎరువులు,

ర్‌లి

వురుగు మందులు ఇతర వ్యవసాయ సంబంధమైన పరికరాలు విత్తనాలు మొదలగువి కొనుగోలు చేసే సందర్భములో రైతులు వినియోగదారులుగానే పరిగణించబడతారు. అందుచేత కొనుగోళ్ళ సందర్భములో వారు ఎటువంటి

కష్టనష్టాలకు గురైనా వినియోగదారుల చట్టాన్ని ఉపయోగించుకోవడానికి

అవకాశం ఉంటుంది. నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసిన సందర్భములో

తమకు కలిగిన నష్టానికి రైతులు పరిహారం పొందవచ్చును. కాని రైతులు

తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అమ్మక కేంద్రాలలో

విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. ఒకవేళ విత్తనాలు

కంపెనీ ప్యాకింగ్‌లో బ్రాండ్‌ నేమ్‌తో తయారయితే ఆ సంచిని కూడ

భద్రపరచుకోవటం మంచిది. ఏ తేదీన విత్తులు నాటారు, ఎంత శాతం

మొలకెత్తింది, ఎప్పుడు తిరగనాటారు అనే విషయాలను జాగ్రత్తగా వ్రాసి

పెట్టుకోవాలి. ఎందుచేతనంటే విత్తనాలు కొన్న తరువాత కొన్ని నెలలకు

గాని ఫలసాయం ఏ మేరకు లభించేది తెలియదు సాధారణంగా నాసిరకం

నిత్తనాల వలన పంట అధికభాగం దిగుబడి తగ్గుతుంది. లేదా అసలు

మొలకలే రావు. ఇలా అనుమాన మొచ్చిన సందర్భములో స్థానిక

వ్యవసాయాధికారికి విషయాన్ని ముందుగానే వివరించి చెప్పడం మంచిది.

పంటను నష్టపోయిన తరువాత ఏ మేరకు నష్టపోయింది అంచనా వేసి

వ్యవసాయాధికారి సర్దిఫికెట్‌ ఇస్తారు. దాని ఆధారంగా జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేసినట్లయితే నష్టపరిహారం లభిస్తుంది. పంట ఏ మేరకు నష్టపోయింది వివరించలేకపోతే పరిహారం నిర్ణయించే విషయంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. అందుచేత హైబ్రీడు విత్తనాలను కొన్నప్పుడు అవి ఎకరానికి ఎంత ఫలసాయాన్ని ఇవ్వాలి? ఆ ఫల సాయం మార్కెట్‌ విలువ ఎంత ఉంటుంది? అనే విషయాలు ఫిర్యాదులో వివరంగా చెప్పాల్సి ఉంటుంది. విత్తనాలే కాకుండా మరే యితర వస్తువులు కొన్న సందర్భములోనైనా నష్టానికి గురయినప్పుడు 'పై విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

  1. తపాలా శాఖకు ప్రత్యామ్నాయంగా ఈమధ్య కాలంలో కొరియర్‌ సర్వీసులు నడుస్తున్నాయి. తపాలా రేట్ల కంటే తక్కువగా, త్వరితంగా వీరు ఉత్తరాలను బట్వాడా చేయడం జరుగుతుంది. మరి ఈ సేవలు ప్రభుత్వం గుర్తించలేదు కనుక లేక అనధికారికంగా జరుగుతున్నాయి కనుక వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి వస్తాయా?

కలా

జ. పోస్టల్‌ డిపార్దుమెంటులో నెలకొనివున్న ఉదాశీనతవల్ల ్రైవేటు సంస్థలు స్థాపించిన కొరియర్‌ సర్వీసులు చక్కగా ఉన్నట్లు అనిపించడం సహజమే. కాని పేటకో కొరియర్‌ సర్వీసులు ఉద్భవిస్తున్న ఈ రోజుల్లో ఆ నిర్వాహకుల యొక్క శక్తి సామర్థ్యాలు నిజాయితీ తెలుసుకోవడం మంచిది. అసమర్థుల నిర్వహణలో ఉన్న కొరియర్‌ సర్వీసులు సరైన సేవలు అందించలేక పోవచ్చు. అడ్రస్సు సరిగా లేదనో మరే యితర కారణాల వల్లనో పంపించిన కవరును భద్రంగా తిరిగి మీకే యిచ్చేస్తే సమయానికి ఆ కవరు అందవలసీన వారికి అందకపోతే కలిగే నష్టం కొన్ని సందర్భాలలో వెలకట్టలేని నష్టాన్ని కలుగజేస్తుంది. ఈమధ్య కాలంలో మనం పంపించే కవర్లు ఒపెన్‌ చేసి డ్రాఫ్ట్‌, చెక్‌, నగదు లాంటి అతివిలువైన వాటిని తస్కరించి కవర్లు డెలివర్‌ చేస్తున్నారు అనే ఫిర్యాదులు వస్తున్నాయి. కొరియర్‌ సర్వీసులు వినియోగించుకొనగోరువారు ముఖ్యంగా తెలుసుకోవలసినదేంటంటే కవర్లలో డబ్బు పెట్టి పంపిస్తే ఆ డబ్బు గమ్యం చేరదని. ఇక ప్రభుత్వం గుర్తించినా, గుర్తించకపోయినా కొరియర్‌ సేవలలో నష్టం జరిగినట్లయితే వినియోగదారుల రక్షణ చట్టం ద్వారా పరిహారం పొందవచ్చును. కొరియర్‌ సర్వీసు వారిచ్చిన రశీదు జాగ్రత్తపరుచుకోవాలి. కవర్లో మీరు పెట్టిన అమ్యూల్యమైన పత్రాల తాలూకు సాక్ష్యమేదీ ఉండదు కనుక కొరియర్‌ సర్వీసు ప్రతినిధి సమక్షంలో కవర్గో కాగితాలు సెట్టి అంటించినట్లయితే కనీసం అతనైనా సాక్షిగా ఉండటానికి అవకొశం ఉంది. ఏమవుతుందిలే అని కరెన్సీ నోట్లు పెట్టారో..... హుష్‌కొకి ..... అంతే సంగతులు.

  1. మనకు డబ్బు యివ్యవలసినవారు చెక్కు రూపేణా చెల్లింపు చేస్తే తీరా బ్యాంకువారు అకౌంటులో డబ్బులు లేవని చెక్కు తిప్పి పంపిస్తే ఏం

, చేయాలి? ఈ మధ్య చట్టాన్ని సవరించి చెల్లని చెక్కులు ఇచ్చేవారిని శిక్షించేలా అవకాశం కల్పించారట. ఆ వివరాలు కాస్త తెలియజేయండి.

జ. ఇవ్వవలసిన బకాయిల నిమిత్తం మీకు చెక్కు ఇచ్చి ఆ చెక్కు బ్యాంకులో తిరస్కరించబడినట్లయితే నెగోషియబుల్‌ ఇన్‌స్తుమెంట్సు చట్టం ప్రకారం బెక్‌ ఇచ్చినవారిపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకొనవచ్చును. 1.4.1989వ తేదీ నుండి అమలులోనికి వచ్చిన సవరణల ద్వారా ఇషామాషీగా చెక్కులు ఇచ్చే సంస్కృతికి అడ్డుకట్టవేయడం జరిగింది. ఈ సవరణలు రాకపూర్వం

" చెక్‌ నిరాకరణకు గురైన నందర్భంలో 6 శాతం జుర్నాన విధించేవారు. మనకూ

సవరణల అనంతరం దీనిని 18 శాతానికి పెంచారు. అంతకు మించి క్రిమినల్‌ చర్యలు తీసుకోడానికి ఇంతకు పూర్వం అవకాశం ఉండేది కొదు. కాని సవరణల అనంతరం చెక్‌ ఇచ్చేవారిపై మరింత బాధ్యతలు పెంచడం జరిగింది. -బాధ్యతారహితంగా లేక మోసపూరితంగా బెక్‌లు ఇవ్వడం శిక్షార్ల ంగా చేయడం జరిగింది. నెగోషియబుల్‌ ఇన్స్స్‌మెంట్సొ్‌ చట్టంలోని 138వ సెక్షన్‌ ప్రకారం ఎకౌంట్‌లో డబ్బు లేకుండా చెక్‌ ఇచ్చేవారు ఒక సంవత్సరం కారాగార శిక్షగాని, చెక్‌ విలువకు రెట్టింపు జుర్మానా గాని లేక రెండు శిక్షలు గాని అనుభవించాల్సి వుంటుంది. చెక్‌ తీసుకుని దగాపడ్డవారు విధిగా ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవలసి వుంటుంది.

1... చెక్కును ఆరు నెలలలోప్త గాని లేక చెక్కు వేలిడ్‌గా వున్నలోవు గాని బ్యాంక్‌కు సమర్పించాలి.

  1. చెక్కు నిరాకరించిన రోజు నుండి 15 రోజుల లోవు పెక్కు ఇచ్చిన వారికి నోటీసు ఇచ్చి డబ్బు చెల్లించమని అడగాలి.

  2. అలా నోటీసు అందిన 15 రోజులలోపు చెక్కు ఇచ్చినవారు చెల్లింపు చేయకుండా వున్నట్లయితే నెల రోజులలోగా మెట్రోపాలిటన్‌ మేజిప్టేట్‌ ముందుగాని లేదా ఫస్ట్‌క్లాస్‌ జుడీషియల్‌ మేజిగ్లేట్‌ ముందుగాని కేసు దాఖలు చేయాలి. చెక్కు విలువ రూ.2,500/-లు మించి వున్నట్లయితే చీఫ్‌ మెట్రోపోలిటన్‌ మేజిగ్లేట్‌ ముందు గాని, చీఫ్‌ జుడీషియల్‌ మేజిధ్రేట్‌ ముందు గాని దాఖలు చేయవలసి ఉంటుంది.

చెక్కునిరాకరించబడిన పక్షంలో చెక్‌ ఇచ్చినవారు భారత శిక్షాస్పృతిలోని

417 సెక్షన్‌ క్రింద శిక్షింపబడటానికి అవకొశాలు వున్నాయి. బ్యాంక్‌

ఖాతాలో సొమ్ము లేకుండా చెక్కు ఇచ్చి మోసం చేసాడు అని

చెప్పదలచుకుంటే చెక్కు ఇచ్చినవారి మనోభావాలు ఆవిధంగా వున్నాయని నిరూపించగలిగినప్పుడే 420 సెక్షన్‌ క్రింద శిక్త్రపడే అవకాశం వుంటుంది. ' బ్యాంక్‌వారు తప్పుగా చెక్కు నిరాకరించినట్లయితే నష్టపరిహారం బ్యాంక్‌ చెల్లించవలసి వుంటుంది.

(క్తక్తం

  1. విద్యుత్‌ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఉంది కనుక జిల్లా పోరంళలో ఈ శాఖపై ఫిర్యాదులు దాఖలు చేయవచ్చా? చేస్తే ఎటువంటి విషయాలు రక్షణ చట్టం పరిదిలోనికి వస్తాయి?

జ. వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి ప్రబుత్వ, ప్రభుత్వేతర సంస్థలన్ని : వస్తాయి. విద్యుత్‌ శాఖ గుత్తాధిపత్యం కలిగిన సంస్థ కనుక ఇది చేసే నిర్ణయాలన్నీ ఏకపక్షంగానే ఉంటున్నాయన్న విమర్శ సర్వత్రా వినవస్తున్నది. ఉదా: క్రొత్తగా సర్వీసు కనక్షన్‌ రావాలనుకుంటే విద్యుత్‌శాఖవారి అగ్రిమెంటులోని నిబంధనలను పరిశీలిస్తే అవన్నీ కూడ ఏకపక్షంగానే ఉంటాయి. అంతేకాకుండ విద్యుత్‌ శాఖ ప్రబుత్వ ఆధీనంలో ఉండటం వల్ల రాజకీయ నాయకుల సంగీతానికి వంతపాడే దురవస్థ కూడ ఈ సంస్థకు దాపురించింది. జనాకర్షణ పధకాల పేరిట లోస బూయిష్టమైన విధానాలను అవలంభించి వినియోగదారులకు కష్టాలు దాపురించేలా చేశారు. సామర్థ్యాన్ని మించి కనెక్షన్‌లు యివ్వటం వలన, విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టలేకపోనటం వలన ఉత్పత్తిని మించి వినియోగం, తతృలితంగా విద్యుత్‌ సరఫరా నిలువుదల, ఓల్దేజిలో విపరీతమైన హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. విద్యుత్‌ సరఫరా చట్టం ప్రకారం ఓల్టేజ్‌లోని హెచ్చుతగ్గులు 6 శాతానికి మించకూడదనే నిబంధన ఉంది.

కాని ఈ రోజు 160 ఓల్టుల నుండి 280 ఓల్టుల వరకు హెచ్చు తగ్గులు

కనిపిస్తున్నాయంటే విద్యుత్‌ పరికరాలు ఏ మేరకు నష్టపోతున్నాయో దీని

ద్వారా వినియోగదారులకు యే మేరకు నష్టాలు సంభవిస్తున్నాయో తెలుసుకోవచ్చును. ఇదీ చాలదన్నట్లు ఈ మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన విద్యుత్‌ రేట్ల బిల్లింగ్‌ విధానం మరింత అస్తవ్యస్తంగా ఉంది. తక్కువ కాల్చుకునే వాళ్ళకు తక్కువ రేటు, ఎక్కువ కాల్పుకునే వాళ్ళకు ఎక్కువ రేటు అనే దుష్ట వ్యాపార విధానం ఈ సంస్థలో కూడా మనం చూస్తాము. గిరాకి ఎక్కువగా ఉండి ఉత్పత్తి తక్కువగా ఉండటం వలన ఇటువంటి విధానాలు చెల్లుబడి అవుతున్నాయి. ఉత్పత్తి ఎక్కువగా ఉంటే ఇటువంటి ఆటలు సాగవు. బహుశా గుత్తాధిపత్యం వలన వినియోగదారులకు కలిగే నష్టం ఎక్కువగానే వుంటుంది. ఓల్లేజి హెచ్చు తగ్గుల వలన తమ విద్యుత్‌ పరికరాలకు నష్టం వాటిల్లిన సందర్భాలలోకాని, వినియోగదారులకు అందించే సేవలలో ఎటువంటి

686

లోపం ఉన్నాకాని, వినియోగదారుల రక్షణ చట్టం వినియోగించుకొని విద్యుత్‌ శాబ నుండి పరిహారం పొందవచ్చును.

  1. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రభుత్వ కనికరం మీదే ఆధారపడి ఉంటుంది కాని, వినియోగదారుల రక్షణకు ఉపయుక్తంగా లేదేమోనని అనిపిసుంది. అసలు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలను వినియోగదారుల రక్షణ చట్టం ద్వారా ప్రశ్నించవచ్చా? క

జ. వినియోగదారులకు మెరుగైన రక్షణ కల్పించాలనే ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాము అని ప్రభుత్వం పదే పదే చెప్పడాన్ని బట్టి చూస్తే ఈ వ్యవస్థ వినియోగదారుల రక్షణ కోసమే అనిపిస్తుంది. నిత్యావసర వస్తువులను సరసమైన ధరలలో ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం నిర్మించిన ఈ వ్యవస్థ రాను రాను అల్పాదాయ వర్గాలవారికి వస్తువులను అందించే సబ్సిడీ వ్యవస్థగా మారింది. అంటే సగానికి పైగా వినియోగదారులను ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి తొలగించడం జరిగింది. ప్రస్తుతం ప్రజా పొలకుల అలోచన ప్రకారం పేదల కోసమే ప్రజా పంపిజీ వ్యవస్థ అన్నట్లుగా ఉంది. ఈ 'పేదల నిర్వచనం మరింత సంక్షిష్టమయినది. అలా అని పేదవారందరికి రేషన్‌ కార్డులిస్తున్నారా అంటే అదీ లేదు. గణాంకాల సేకరణలో కొంత కాలం, బోగస్‌ కార్డుల ఏరివేతలో కొంత కాలం, సబ్సిడీల విషయంలో కేంద్ర రాష్ట్రాల ఎడమొహం, పెడమొహంలలో మరికొంత కాలం, విషయాన్ని నానుస్తూ చివరికి క్రొత్త రేషన్‌ కార్డులు అందని ద్రొక్షపళ్ళలా తయారయినాయి. ఇక రేషన్‌ కార్డులు ఉన్నవాళ్ళ సంగతి పరిశీలిస్తే ఈ ప్రజా పంపీజీ వ్యవస్థ ద్వారా వారికి లభించేవి కేవలం ఐదు సరుకులు (బియ్యం, గోధుమలు, పంచదార, వంటనూనె, కిరసనాయులు). ఈ రేషన్‌ షాపుల్లో లభించే సరుకులకు నాణ్యత లేదని, తూకాలు'సరిగా ఉండటం లేదని, అసలు సరుకులే దొరకటం లేదని ఇలా, ఇలా ఎన్నో రకాలైన అసౌకర్యాలు వినియోగదారులు చవి చూస్తున్నారు. రేషన్‌ కార్డు లభించడానికి వినియోగదారుల రక్షణ చట్టం ఉపయోగపడకపోవచ్చేమో కాని తూకాలు, కొలతలు సంబంధించి కాని, నాణ్యతకు సంబంధించి కాని వినియోగదారుడు నష్టపోతే జిల్లా ఫోరంకు ఫిర్యాదు చేసి పరిహారం పొందవచ్చును. ఇక రేషన్‌లు తెచ్చుకొని ప్రజలకు ఇవ్వకుండా నల్ల

57-

బజారులకు తరలించే వారిపై మండల లెవెన్యూ అధికారికి గాని విజిలెన్స్‌ అధికారులకు గాని ఫిర్యాదు చేయవచ్చును. | 61. మా ఊరిలో వినియోగదారుల సంఘం లేదు. ఏమైనా సమస్యలు వస్తే , పట్టణాలకు పరుగెత్తి అక్కడున్న వినియోగదా.ఎల నంవధూలకు | మొరపెట్టుకోవలసి వస్తోంది. గ్రామాల్లో వినియోగదారుల సంషూలు |) స్థాపించాలంటే ఏం చేయాలి? | జ. వినియోగదారుల ఉద్యమానికి ముఖ్యమైన రెండు ప్రతిబంధకాలున్నాయి. మొదటిది ఈ ఉద్యమంలో స్రీలు చురుకైన పాత్ర పోషించకపోవటమైతే, రెండవది గ్రామాలకు ఈ ఉద్యమం విస్తరించకపోవటం. రాష్ట్రంలో సుమారు 400 వినియోగదారుల సంపూలున్నా వాటిలో కేవలం 20 శాతం మాత్రమే గ్రామాల్లో ఉన్నాయన్నప్పుడు ఆశ్చర్యం కలుగక మానదు. 75 శాతం జనాభా గ్రామాల్లోను 80 శాతము వినియోగదారుల సంఘాలు పట్టణాలలోను ఉండటం ఈ ఉద్యమంలోని లోపంగా అనుకోవచ్చును మరింత లోతుగా ఈ సమస్య గురించి ఆలోచిస్తే గ్రామాలలో ఉన్నవారు ఒక సంఘంగా ఏర్పడాలనే ఉత్సాహాన్ని చూపించకపోవడమే ప్రధానమైన కారణం కావచ్చు. అవగాహన లోపం, నిరక్షరాస్యత, అలసత్వం చోటుచేసుకోవటం వల్ల గ్రామాల్లో వినియోగదారుల ఉద్యమం బలపడటం లేదు. నష్టపోయామని కూడ తెలునుకోలేని అమాయకత్వంలో (గ్రామీణులు జీవితాన్ని వెళ్ళబుచ్చుతుంటే ఇక వినియోగదారుల సంఘాల అవశ్యకత ఎలా తెలుస్తుంది? పైగా వినియోగదారుల సంఘాలంటే గొడవలు తీర్చే సంఘాలుగా ఓ దురభిప్రాయం ఉంది. ఏమైనా గొడవలొస్తే పెద్దలు తీరుస్తారుకదా మళ్ళీ దానికో నంధుం ఎందుకనే ఉదాశీనత వినియోగదారులను సంఘటితం చేయలేకపోతుంది. వినియోగదారుల సంఘం యొక్క గురుతరమైన బాధ్యత ఏమిటంటే వినియోగరంగంలో నెలకొని వున్న రుగ్మతలపై ప్రజలకు అవగాహన కలిగించటం, దానివలన వారు చక్కటి వినియోగదారునిగా తయారై మోసాలకు గురికాకుండా నష్టాల బారిన పడకుండా మెరుగైన వినియోగ జీవనం గడిపేలా తయారు చేయడం. వినియోగదారులకు హాని కలిగించే విషయాలపై పోరాటం జరపడం కూడా ఈ వినియోగదారుల సంఘాలు చేపట్టాలి. వఖియోగదారుల అవసరాలు గుర్తించి వారి అవసరాలు తీరే విధంగా చర్యలు చేపట్టడం క8

వినియోగదారుల సంఘాల విధి. ఇక వినియోగదారుల సంఘాన్ని స్థాపించటానికి కేవలం ఏడుగురు సభ్యులుంటే చాలు. ప్రెసిడెంటు, సెక్రటరీ, కోశాధికారి వంటి పదవులకు ఎన్నికలు జరిపి, అసోసియేషన్‌ బైలాస్‌ తయారుచేసుకొని, రిజసష్ర్రార్‌ ఆఫీసులో రిజస్టర్‌ చేయవలెను. గ్రామాల్లో సహకార సంస్థలుంటాయి. కనుక బైలాస్‌ తెలుసుకోవచ్చును. ముఖ్యంగా స్రీలతో, ఉపాధ్యాయులతో, చట్టాలు తెలిసిన వ్యక్తులతో, చదువుకున్న యువకులతో వినియోగదారుల సంఘాలు పరిపుష్టమవుతాయి. ఎంత మంది ఎక్కువ సభ్యులను చేర్పిస్తే సంఘం అంత బలిష్టంగా ఉంటుంది.

  1. చీటీలు, చిట్‌ఫండ్‌లు, ఏమయితేనేం, ఇవన్నీ దాచుకున్న ప్రజల డబ్బుల్ని 'హాం ఫట్‌ చేసే సంస్థలు వీటివల్ల నష్టపోయినవారు వినియోగదారుల చట్టం ద్వారా పరిహారం పొందలేరని తెలిసింది. నిజమా?

జ. నేడు గ్రామాల నుండి మహా నగరాల వరకు భారతదేశం నిండా లక్షలాది చిట్‌ఫండ్‌ కంపెనీలు ఆవిర్భవించి ఉన్నాయి. పేద ప్రజల నుండి కోటీశ్వరుల వరకు ఈ చిట్‌ వండ్‌ కంపెనీలతో లావాదేవీలు పెంచుకుంటున్నారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజల కష్టార్దితాన్ని ఈ చిట్‌ఫండ్‌ కంపెనీలు ఆకర్షిస్తూ, వారిని దగాచేస్తూ రోజుకొక చిట్‌ఫండ్‌ కంపెనీ మూతపడుతోందంటే అతిశయోక్తి కాదు. కొన్ని చిట్‌ఫండ్‌ కంపెనీలు న్యాయసమ్మతంగా పెట్టుబడిదారులకు హాని కలుగకుండ నిర్వహించబడుతుంటే మరికొన్ని చిట్‌ఫండ్‌ కంపెనీలు నిర్వహణా సామర్థ్యము లేక పెట్టుబడిదారుల నెత్తిమీద టోపీ పెడుతూ అంతర్జ్థానమవుతున్నాయి. మరి వీటిని అదుప్పులో పెట్టడానికి చిట్‌ఫండ్‌ చట్టం కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. కాని ఈ చట్టంలోని లొసుగుల వలన దానిని అమలుపరిచే విధానంలో నిజాయితీ లోపించడం వలన వేలాదిమంది పెట్టుబడిదారులు మోసపోతున్నారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా చిట్‌పండ్‌ సంస్థను స్థాపించి నిధులను సేకరించవచ్చును. చేయవలసినదల్లా చిట్‌ రిజిస్త్రార్‌ దగ్గర నమోదుచేసుకొని అది లక్ష రూపాయల చిట్‌ అయితే ఆ లక్ష రూపాయలను నిర్వాహకుడు అంటే ఈ చట్టం భాషలో 'ఫోర్‌మాన్‌' చిట్‌ రిజిస్టార్‌ వద్ద డిపాజిట్‌ చేయవలసి ఉంటుంది. ఆ గ్రూపులో 25 మంది సభ్యులుంటే ఆ చిట్‌ మీద

(కా

25,00,000 వ్యవహారం నడుస్తుంది. ఈ 25 లక్షలకు గాను హామీగా "పెట్టిన సొమ్ము కేవలం లక్ష రూపాయలే కనుక అవకతవకలు జరిగిన సందర్పములో అటు చిట్‌ రిజిస్టార్‌ గాని ఇటు న్యాయస్థానాలు కాని సంపూర్ణ భద్రతను చేకూర్చలేకపోతున్నాయి. అందుచేత చిట్‌లలో పెట్టుబడి పెట్టే వినియోగదారులు ముందుగా చిట్‌ నిర్వాహకుని జాతకం తెలుసుకొని ఆ చిట్‌లో పాల్గొంటున్న మిగతా సభ్యుల వివరాలు సేకరించి తనకు నమ్మకం కుదిరితేనే గాని ఈ చిట్‌లలో డబ్బు పొదుపు చేయకూడదు. అవసరానికి ఆదుకుంటుందని కంగారుపడి పెట్టుబడి పెడితే మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని వినియోగదారులు గ్రహించాలి. కూతురు పెళ్ళి నాటికి అంది వస్తుందని, చెమటోడ్చి సంపాదించిన సొమ్మును చీటిలలో మదుపుపెట్టీ నిర్వాహకులు ఉడాయించగా దిక్కుతోచని స్థితిలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వినియోగదారులకు కనువిప్పు కావాలి. చీటీల వ్యాపారం చేసే ప్రబద్దులు ఈనాడు వీదికి ఒక్కరున్నారు. అమాయక పేద ప్రజలను నమ్మబలికి చట్ట వ్యతిరేకంగా ఈ చీటీల కార్యక్రమాన్ని నిరాటంకంగా సాగిస్తున్నారు. ఇటువంటివారు ప్రారంభంలో రెండు మూడు సంవత్సరాలు ప్రజలలో నమ్మకం కలిగించేలా నిర్వహిస్తు ఎక్కువ సొమ్ము చేతికి రాగానే ఆ డబ్బుతో పారిపోతున్నారు. అనధికారంగా జరుగుతున్న చీటీపాటలలో పాల్గొన్న ప్రతివారు నష్టపోయే ప్రమాదముంది. భాగస్తులు నిర్వహించే చిట్‌ఫండ్‌ సంస్థలలో పెట్టుబడి పెట్టేవారు ఆర్థికపరమైన నపష్పాలను చవిచూసినప్పుడు ఆ సంస్థలోని భాగస్థుల ఇతర అస్తుల నుండి తమ డబ్బును కోర్టుల ద్వారా వసూలుచేసుకోవటానికి అవకాశముంటుంది. భాగస్వామ్య సంస్థ కాక అది ఒక లిమిటెడ్‌ కంపెనీ అయితే ఆ కంపెనీ ప్రమోటర్‌ల యొక్క స్వంత ఆస్తులపై తమకు రావలసిన డబ్బును రాబట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందుల వలన మధ్యలో ఇన్‌స్టాల్‌మెంట్స్‌ కట్టకపోతే అంతవరకు కట్టినది తిరిగిరాదు అనే అపోహ చాలామందిలో ఉంది. చిట్‌ గడువు పూర్తయిన తర్వాత ఫోర్‌ మాన్‌ తన కమీషన్‌ మినహాయించుకొని మిగతా డబ్బు వాపసు చేయవలసి ఉంటుంది. చిట్‌ఫండ్‌ వ్యవహారాలలో సభ్యులు ఎటువంటి కష్టనష్టాలకు గురయినా చిట్‌ రిజిష్ట్రార్‌కు ఫిర్యాదు చేయవచ్చును. ఈ సమస్యలు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి రావు అనే ఆలోచన ఈ మధ్యకొలంలోనే రూపుదిద్దుకొంటుంది. ఎందుచేతనంటే ఆ

వినియోగదారుల చట్టం ఇతర చట్టాలతోపాటు అమలుపరచవలసినదే కాని ఇతర చట్టాలలోని అంశాలను హరించేలా ఉండరాదు అనేది వినియోగదారుల రక్షణ చట్టం లోనే వ్రాయబడింది. అందువలన చిట్‌ఫండ్‌ చట్టపరిధిలోనికి వచ్చే అంశాలను వినియోగదారుల రక్షణ చట్టం ద్వారా ప్రశ్నించకూడదనేది ఈ వాదనలోని ఉద్దేశ్యం. సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పునిస్తే తప్ప ఈ వాదానికి బలం చేకూరదు. అంతవరకు నష్టపోయిన వారు వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఆశ్రయించవచ్చును.

  1. పలు సందర్భాలలో వినియోగదారులు డిపాజిట్‌ చెల్లించాల్సి వన్తుంది. ఈ డిపాజిట్ల వ్యవహారాన్ని క్రమబద్దీకరించడానికి ఏదైనా చట్టం ఉందా? లేకుంటే డిపాజిట్ల విషయంలో తెలునుకోవలసీన సమాచారాన్ని అందించండి

జ. ఆర్ధిక సంస్థలలో పెట్టుబడిగా పెట్టే డిపాజిట్లకు రిజర్వు బ్యాంకు రూల్సు వర్తిస్తాయి. అటువంటి డిపాజిట్లు పై వడ్డీ ఎంత యివ్వాలి, డిపాజిట్లును సేకరించే ఆర్దిక సంస్థ ఎటువంటి హామీలను చేకూర్చాలి అనేది రిజర్వు బ్యాంకు సూచిస్తుంది. అలాగే బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన సొమ్ముకు బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్షు నిబంధనలను సూచిస్తుంది. ఈ విధంగా 'పైనాన్స్‌ కంపెనీల్లో డిపాజిట్లకు ఆయా చట్టాలు రక్షణ కల్పిస్తాయి. కాని వ్యాపార లావాదేవీల నిమిత్తం చెల్లించిన డిపాజిట్లు ఉభయ పార్టీల అంగీకారం మేరకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయి. మోటారు వాహనాలను బుక్‌చేసే సందర్భాలలో, టెలిఫోన్‌ కనక్షన్‌ కొరకు అపై చేసే సందర్భంలో విద్యుత్‌ శాఖవారికి చెల్లించిన డిపాజిట్లు, హొసింగ్‌బోర్డు వారికి చెల్లించిన డిపాజిట్లు విషయాలలో సంధిగ్ధత ఉంది. హౌసింగ్‌ బోర్జువారు డిపాజిట్‌ మీద ఎటువంటి వడ్డీ ఉండదని ప్రకటించడం, విద్యుత్‌ శాఖ వారు వినియోగ డిపాజిట్ల మీద వడ్డీ యివ్వకపోవడం అదేవిధంగా టెలిఫోన్‌ డిపాజిట్ల మీద వడ్డీ చెల్లించకపోవటం ఎంతవరకు న్యాయ సమ్మతం అనేది ఈ మధ్యకాలంలో చర్చనీయాంశం అయ్యింది. వినియోగదారుల కోర్టుల ద్వారా ఇటీవల వెలువడుతున్న తీర్చులను పరిశీలిస్తే "పైన చెప్పిన డిపాజిట్లుపై వడ్డీ ఇచ్చి తీరాల్సిందే అని అన్నిస్తుంది. టెలిఫోన్స్‌ డిపార్డుమెంటువారు వినియోగదారుడు చెల్లించవలసిన దానికంటే ఎక్కువ వసూలుచేసిన ఒక కేసులో తీర్చునిస్తు తరువాత బిల్లులో సరిపెడతామనటం

జాయ

సరికాదు. అదనంగా వసూలుచేసిన డబ్బుకు వడ్డీ బెల్లించాల్సిందే అని నిర్వ్యంద్యంగా ప్రకటించింది. అంటే కారణమేదయినా వినియోగదారుని నుండి తీసుకున్న డిపాజిట్లకు వడ్డీ చెల్లించే తీరాలి అనేది స్పష్టమవుతుంది. 64. వినియోగదారుల నమాచారాన్ని తెలియజేసే పుస్తకాలు ఏమైనా 'ప్రచురితమవుతున్నాయా? ఉంటే వాటి చిరునామా తెలియజేయండి? | జ. దురదృష్టావశాత్తు తెలుగులో క్రమబద్దంగా సమాచారాన్ని అందించే ప్రత్రికలు | , ప్రభుత్వపరంగా కాని, వినియోగదారుల సంఘాల నుండి కాని ప్రస్తుతం ' లేవు. రెండు నెలలకు, మూడు నెలలకు వినియోగదారుల సమాచారాన్ని ఇతర భాషలలో ప్రచురించటం జరుగుతుంది. కేంద్ర పౌరసరపరాల శాఖవారు “ఉపభోక్త జాగరణ” సేరిట ఓ సమాచార పత్రికను ప్రచురిస్తూ గుర్తింపు కలిగిన వినియోగదారుల సంఘాలకు పంపిస్తున్నారు. అదేవిధంగా అహ్మదాబాదులోని వినియోగదారుల విద్యా పరిశోధనా సంస్థవారు కన్బ్యూమర్‌ కన్‌ఫ్రంటేషన్‌ పత్రికను ఆంగ్లంలో ప్రచురిస్తున్నారు. అదేవిధంగా కలకత్తాలోని 0౮13 అనే సంస్థ వినియోగదారుల సమాచారాన్ని అందిస్తున్నారు. చెన్నై నుండి వినియోగదారుల కార్యాచరణ బృందం వారు “కాగ్‌” సేరిట పత్రిక చెలువరిస్తున్నారు. వీటి చిరునామాలు ఈ దిగువ పొందపరుస్తున్నాము.

  1. _ అంగ౧౫౮గ౧6| [606006100౧ & ౧6౩౪౧6౦౧ 0౪౧18 11001606 8౧0| 0650! 5%0/01 9౧6౮౪౦౧ [160 [0/ ౪౦౧౫6౯౧ 61115 8గ0౮0౮6. గ౧9౧౧౮౦౦౮౦౫౦6౮౮-380 006 2 0406, 6-11౧0 008 51661 0[0000గ౫ 9౦|౫౯౧:౩ తీరయం/౦ం!/ 0౧౪౧౧౦|-6౦౦ 020 3 0ంగంం౧౧9! ౮౧|/ & 115 500161/ 36, ౧౦౧౦౦౦ 51661 6౮|౦౪౧౦౮-700 016 4 _ 09౧౦౮౧౧౪౧1 ౦1 ౦౧౩౦౮౧౧౪ ఉగం15 16184 8౧0౪0౧ '16౪/ 091౧). ౬62

" 65. “వినియోగదారుడే రాజు” అనే స్లోగన్‌ వినియోగదారులు తమకు తామే ఆపొదించుకున్నారా! లేక ప్రభుత్వపరంగా వచ్చిన ప్రచారమా? ప్రభుత్వం ఎక్కడా వినియోగదారునికి అంతటి గౌరవం ఇస్తున్నట్లు కన్పించదు. వినియోగదారుడు రాజు కావాలంటే మీరిచ్చే సలహా ఏమిటి?

జ. వినియోగదారుని రాజుగా అభివర్ణించింది వివేకానందుడు. 20వ శతాబ్దం ఆరంభంలోనే వివేకానందుడు వినయోగదారునికి అంతటి ప్రతిష్ట కలుగజేసినప్పటికి 21వ శతాబ్దం వన్తున్నా ఈ “రాజుకు కిరీటధారణ జరుగలేదు. సింహాసనం లేదు. రక్షణ అంతకంటే లేదు. అడుగడుగునా అవమానాలు, అప్పుడప్పుడు బెదిరింపులు, మరీ అలుసుగా కనిపిస్తే కల్తీల విష ప్రయోగం. పేరుకు మాత్రమే రాజు వినియోగ జీవనంలో ఖైదీ. వివేకొనందుని తరువాత మహత్మ్నాగాంధి వినియోగదారుని ప్రాముఖ్యత తెలియజేశారు. వ్యాపారానికి అతడిని కేంద్రచిందువు చేసి అతను లేకుండా వ్యాపారం జరగదు అని హెచ్చరిక చేశారు. వినియోగదారుడు అతి ముఖ్యమైన వ్యక్తి అనే గాంధీగారి సూక్తిని ప్రముఖంగా తమ కార్యాలయాల్లో తగిలించుకుంటూ బ్యాంకులు ఇతర సంస్థలు వినియోగదారునికి కనీస మర్యాద కూడ యివ్వని దుర్శర స్థితి నేడు నెలకొని ఉంది. మరి ఈ స్థితికి కారణం వినియోగదారుడే అని చెప్పవలసి ఉంటుంది. సంఖ్యాపరంగా యావత్తు ప్రపంచం వినియోగదారుల మయం అయినప్పుడు తాను ఒంటరివాడిననే ఆలోచన వినియోగదారునిలో అభద్రతా భావాన్ని పెంచుతుంది. తను కొంటేనే ఉత్పత్తి జరుగుతుంది అనే అంశాన్ని మరిచి ఉత్పత్తి లేకపోతే నా సంగతి ఏమిటి అని చింతాక్రాంతుడవుతున్నాడు.. చింత శాసించే దర్పాన్ని అణిచిచేస్తుంది. ఉత్పత్తిదారులను తన అవసరాలకు వినియోగించుకొనే సైన్యంగా మలుచుకోవటం పోయి, 'సెనిక పాటవం కోసం తాను ఎదురుచూస్తున్నాడు. మరి ఇటువంటి రాజుకు భద్రత ఎక్కడ నుంచి వస్తుంది? గౌరనం ఏ విదంగా లభిస్తుంది? తన హక్కులను, బాధ్యతలను క్షుణంగా తెలిసి, తన అవసరాలకు ఉపయోగపడని వాటిని తిరస్కరిస్తు, తనమీద దాడి చేస్తున్నవాటిని ప్రతిఘటిస్తు, రాజులా తాను బ్రతకగలిగినపుడే వివేకానందుని మాట నిజవవృతుంది. తోటి వినియోగదారులను సంఘటితపరచి వినియోగజీవనంలో ఎదురవుతున్న శత్రు మూకలను తరిమి తన వినియోగ రాజ్యాన్ని పదిలం చేసుకోగల్లినప్పుడే వినియోగదారుడు రాజు లేకుంటే ఖైదీ.

మలా

  1. మెరిసేదంతా బంగారం కాదు అనేచెప్పారుకాని మరి ఏది బంగారమో తెలిసేదెలా - కనీసంఏవైనా జాగ్రత్తలు చెప్పండి.

జ) బంగారమంటే విపరీతమైన మోజుపెంచుకున్నాము కనుక పసిడిరంగులో కనిపించే ప్రతిలోహాన్ని బంగారంగా భ్రమించి నష్టపోకండి సుమా అంటూ మనతరాన్ని హెచ్చరించిన నానుడి 'మెరిసేదంతా బంగారంకాదు". శాస్త్రవిజ్ఞానం అబివృద్ధి చెందుతున్న దశలో లోహలక్షణాలకు మార్పులుచేర్పులు కూర్చి అసలు బంగొరం కంటే నకిలీ బంగారమే ఘనంగొకన్పించేలా చేసే ప్రక్రియను ఎన్నింటినో కనుగొన్నారు. శుద్దమైన ' బంగౌరవు లోవాం వెొత్తగా ఉంటుంది కనుక వన్తువులను తయారుచేయించుకోవడానికి ఉపయోగపడేలా రాగిలోహం కలిపి గట్టితనాన్ని కలుగజేస్తారు. ఈవిధంగా రూపాంతరం చెందుతున్న బంగారాన్ని కేరట్ల రూపంలో నాణ్యత చెప్పడం జరుగుతుంది. బంగారంపట్ల మన బలహీనత తెలుసుకున్న మోసగాళ్లు ఇతర లోహాలసై బంగారపు పూత పూసి అదే నిజమైన బంగారంగా నమ్మించి మోసం చేస్తుంటారు. అందుచేత అపరిచితుల దగ్గర బంగారం కొనకుండా ఉంటే మేలు. నీతి, నిజాయితీతో వ్యాపారం చేసుకునే బంగారపు వర్తకుల వద్ద మాత్రమే బంగారం కొనుగోలు చేస్తే కొంతవరకు భద్రత లభిస్తుంది. బంగారం కొనడానికి వెళ్ళేముందు అనుభవజ్ఞులను మీతోపాటు తీసుకువెళితే మోసాలకు గురికాకుండా ఉంటారు. ఇదేవిధంగా బంగారపు వస్తువులను చేయించుకొనేటప్పుడు మరికొన్ని జాగ్రత్తలు పాటించాలి. బాగా తెలిసిన వారి దగ్గరే నగలు చేయించాలి. అలా ఎవ్వరూ తెలియని పక్షంలో బంగారపు కొట్టువారిద్వారా వస్తువులను తయారు చేయించుకొంటే తర్వాత రంగు తగ్గినా, తూకం తగ్గినా మరేదైనా మోసంజరిగినా పరిహారం పొందటానికి అవకాశం ఉంటుంది. నెక్లెసులు, దుద్దులు, వడ్డాణములు, అరవంకీలు, పాపిడిబిళ్లలు ఇతర శేశాలంకారాలు ఒకటేమిటి ఇలా ఎన్నోరకొలైన వస్తువులు రాళ్లను పొదిగి చేయించు కోవటం జరుగుతుంది. మన పవిత్ర భారతదేశంలో ఆనవాయితీగా వస్తున్న, ఆత్యహత్యా సదృశ్యమైన విషయం ఏమిటంటే వస్తువులు తయారు చేసిన తర్వాత రాళ్ల బరువుతో కలిసి మనమిచ్చిన బంగారానికి లెక్క చెప్పడం. ఒక్క గ్రాము బంగారం రూ. 500/- ధర పలుకుతున్నప్పుడు 4గ్రాములు బరువుగల రాళ్ళుపొదిగి ఆ మేరకు

(ర న్‌

బంగారం తూకంలో జరిగే నవన్ఫ్చం ఒక్కసారి ఊపహించుకొంటే ఆనవాయితీ పేరిట జరుగుతున్నమోసం విలువ ఎంతో తెలుస్తుంది. పాత వస్తువులు ఇచ్చి కొత్త వస్తువులు తయారు చేయించుకొనే సందర్భములో తరుగు పోయిందంటూ తస్కరించే బంగారంతో న్వర్ణ దేవాలయాలు నిర్మించవచ్చు. అనాగరికంగా గురువింద గింజలతో బంగారాన్ని తూకంవేసే స్థితి ఇంకా నెలకొని ఉందంటే వినియోగదారులు ఎంతటి నిర్లక్ష్య భావాన్ని కలిగి వున్నారో తెలుస్తుంది. ఎలక్షానిక్‌ యంత్రాల వల్ల తూకం సరిగా వస్తుందని భ్రమ పడకండి. మీ పరోక్షంలో ధర్మకాటా వేసాం అంటే మీ బంగారాన్నితూకం వేయడానికి అనుమతిస్తూ నష్టాలను కొని తెచ్చుకోకండి. లింకులు ఉండే వస్తువులను ఆర్జరివ్వకండ్‌. ఎందుకంటే జాయింట్లు అతికేటప్పుడు టంకంతో అతుకుతారు. ఈ టంకం బరువు బంగారం

బరువుకంటే అధికంగా ఉంటుంది. దానివలన రాళ్ళ వస్తువుల్లో బంగారాన్ని నష్టపోయినట్లే లింకు వస్తువులలో కూడా బంగారాన్ని నష్టపోవలసి వస్తుంది.

బంగారం కొనే సందర్భంలో బిల్లు తీసుకోవడం వస్తువులు చేయడానికి

ఇచ్చిన సందర్భంలో రశీదు తీసుకోవటం చాలా ముఖ్యం. కనీసం ఈపాొటి

జాగ్రత్తలు పాటిస్తే మీరు ఉత్తమ వినియోగదారులవుతారు.

  1. ఉవ్పులేనికూర టి.వి. లేనిఇల్లు ఊహించటం కష్టం. వరదల్లో కొట్టుకుపోతున్నట్లుగా లేదా బాంబే ఎలక్ట్రిక్‌ ట్రైన్‌లో మన ప్రమేయం లేకుండా ప్లాట్‌ఫారం మీదకి తోసివేయబడినట్లుగా, కేబుల్‌ కనెక్షన్‌లు మన ఇళ్ళలోనికి వచ్చిపడుతున్నాయి తీరా కేబుల్‌కనెక్షన్‌ వచ్చాక ఇంట్లో ఛానల్‌వార్‌ ప్రారంభం అవుతుంది. దీని నిమిత్తం తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేయండి.

జ. కేబుల్‌ టి.వి.లను క్రమ బద్దం చేసే సమగ్రమైన చట్టం లేకపోవడం వల్ల కేబుల్‌ టి.వి. వారు పాల్పడే అక్రమాలను ఎవరికి ఫిర్యాదు చేయాలి అనేది ఇెలియటం లేదు. కేబుల్‌ టి.వి.ల వల్ల ఇళ్ళల్లో అనారోగ్యకరమైన వాతావరణం ఎర్సడుతుందని భావించవలసి వస్తుంది. దాదాప్ప ఇరవై చానల్స్‌లలో వివిధ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నయి. అశ్లీల చిత్రాలు 'కూడ ఎటువంటి అదుపు లేకుండా ప్రసారం కావడం కుటుంబ సభ్యులకు ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ కార్యక్ర మాలన్నింటిని తిలకించి ప్రసారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవటానికి సరైన యంత్రాగం లేదు. అందుచేత

ఢీర్‌

ప్రసారం కాబడుతున్న కార్యక్రమాల పట్ల ఎవరికి ఫిర్యాదు చేయాలనే సందిగ్ధం ఉంది. ఇక కేబుల్‌ ఆపరేటర్లు డిపాజిట్‌ రూకేుణా కొంత మొత్తాన్ని వినియోగదారుల నుండి సేకరించి వాటికి తగిన రశిదులు ఇవ్వడం "లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. కొంతమంది కేబుల్‌ ఆపరేటర్లు వినియోగదారులపై జూలుం చేస్తు అకారణంగా కేబుల్‌ కనెక్షన్లు తీసివేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. కేబుల్‌ కనక్షన్‌ ఇచ్చినవారివల్ల ఏదైనా అసౌకర్యం కలిగితే జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చును. అదేవిధంగా ఎటువంటి జులుం ప్రదర్శించినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

  1. విశ్వ విద్యాలయాల వారు ఇతర ప్రయివేటు సంస్థలవారు కరస్పాండెన్స్‌ కోర్సులు నిర్వహిస్తు పూర్తిగా డబ్బు చెల్లించినాగాని కోర్సు మెటీరియల్‌ పంపించడం లేదు. దానికి ఏవిధంగా పరిష్కారం పొందవచ్చు? అసలు కరస్పాండెన్స్‌ కోర్సులలో చేరేముందు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?

జ. విశ్వవిద్యాలయాలవారు అందజేస్తున్న కరస్పాండెన్స్‌ కోర్సుల విషయంలో మోసాలకు తావృండదు. కనుక వీటికోసం తీసుకునే ప్రత్యేక జాగ్రత్త అంటూ ఏమి ఉండదు. కాని ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఎటువంటి గుర్తింపు లేని ఎన్నో విశ్వ విద్యాలయాలు చలామణిలో ఉన్నాయి. ఈ మధ్యనే ప్రభుత్వం వారు ఇటువంటి 28 విశ్వవిద్యాలయాలకు ఎటువంటి గుర్తింపులేదని ప్రకటించియున్నారు. విశ్వవిద్యాలయం మీద ఎటువంటి అనుమానం కలిగినా కేంద్రప్రభుత్వానికి వ్రాసి వివరణ పొందవచ్చును. విశ్వవిద్యాలయాలవారు నిర్వహిస్తున్న కరస్పొండెన్స్‌ కోర్సులలో కూడ కొన్ని అవకతవకలు చోటుచేసుకొంటున్నాయి. ఆలస్యంగా కోర్సు మెటీరియల్‌ సంసించడం వల్ల విద్యార్థులు పరీక్షలు సరిగా వట్రాయకపోవడం వంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. కరస్పాండెన్స్‌ కోర్సులో కోర్సు మెటీరియల్‌ సమయానికి అందటం, పరీక్ష ఫీజులు సమయానికి కట్టడం, హాలు టికెట్లు సమయానికి రావడం ముఖ్యం. పైవేటు విద్యాసంస్థల కోర్సుల గురించి ఆలోచించినట్టయితే ఇంగ్లీషు స్పీకింగ్‌ కోర్సులని, బొమ్మల గీయటం కోర్సులని ఇలా ఎన్నోరకాల కరస్పాండెన్స్‌ కోర్సులు అమ్మకానికున్నాయి. వారిచ్చే సర్జిఫికెట్లకు విలువ ఉండదు. ఆ కోర్సుల వల్ల మనం సముపార్ణించుకునే జ్ఞానం కూడ

౬క6ు

అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ సంస్థల ద్వారా చదివిన పూర్వప్పు విద్యార్థుల నుండి కావలసిన సమాచారం పొందనిదే ఇటువంటి కోర్సులలో చేరడం ఉపయుక్తం కాదు. ఇక డబ్బు అందుకుని కోర్సు మెటీరియల్‌ పంపించకపోయినా లేదా కోర్సు మెటీరియల్‌ చాలా ఆలస్యంగా పంసించినా లేదా వారు పంపించిన కోర్సు మెటీరియల్‌ వ్రాసే పరీక్షలకు ఏ విధంగాను ఉపయోగం లేకపోయినా జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చును.

  1. హౌసింగ్‌ సొసైటీలు నెలకొల్పి, అందులో సభ్యులను చేర్చి, ఇళ్ళ స్థలాలకు డబ్బు కట్టించుకొని తీరా స్థలం రిజిగ్ర్రేషన్‌ చేయించుకునే సమయంలో ఇబ్బందులకు గురిచేస్తున్న సొసైటీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు?

జ. పలు ప్రభుత్వ, ప్రయివేటు శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఘాలవారు సహకార హౌసింగ్‌ సొసైటీని స్థాపించి ఇళ్ళ స్థలాలను కేటాయించడం జరుగుతుంది. ఈ కేటాయింప్పలలో అనేక అవకతవకలు జరుగుతున్నట్లుగా పలు వివాదాలు రచ్చకెక్కాయి. ఇళ్ళ స్థలాల కోసం ఇటువంటి సొసైటీలలో సభ్యులు కొబోయేవారు ముందుగా సొసైటీ అధ్యక్ష కార్యదర్శుల యొక్క కార్యదక్షత విశ్వసనీయత తెలుసుకోవాలి. తరువాత ఆ సొసైటీ రిజిస్టరు కాబడిందా లేదా అని నిర్ధారించుకోవాలి. ఆ సొసైటీవారు సేకరించిన స్థలం ఎటువంటి వివాదాలకు అవకాశం లేకుండా ఉండాలి. వ్యక్తిగతంగా మీకు కేటాయిస్తామన్న స్థలం మీకు అనుకూలంగా ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడే అందులో మీరు సభ్యులుగా చేరాలా వద్దా అనే విషయం స్పష్టమవుతుంది. తీరా సభ్యులుగా చేరిన తర్వాత అది ఒక సహకార వ్యవస్థ కనుక అందులో మీరూ భాగస్వాములే కనుక సొసైటీలో జరుగుతున్న అక్రమాలకు మీరూ బాధ్యత వహించవలసి ఉంటుంది. కనుక విషయాలన్ని క్షుణ్ణంగా పరిశీలించడం అలవాటు చేసుకోవాలి. ఏమైనా అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయని మీరు భావిస్తే సహకార సంఘాల రిజస్త్రారు వారికి ఫిర్యాదు చేయాలి. సాధారణంగా ఇటువంటి హౌసింగ్‌ సొస్టైటీతో వచ్చే ఇబ్బందులు ఈ క్రింది విధంగా ఉంటాయి. (1) ముందు మనకు అలాట్‌ చేసిన నెంబరు కాక తర్వాత మరో నెంబరు ప్లాట్‌ అలాట్‌ చేయడం. (2) మనకు అమ్మిన ప్లాట్‌లే మరొకరికి అమ్మటం.

(3) ముందుగా నిర్ణయించిన రేట్టకంటే అధిక రేట్లను వసూలుచేయటం. (4) కోర్టు వివాదాల్లోకి భాగటం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా విషయాలను అర్ధంచేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులకు గురికాకుండా ఉంటారు. సొసైటీలో సభ్యులుగా ఉంటూ అదే సొసైటీసపై మీరు ఫిర్యాదు చేయదలిస్తే ఆ ఫిర్యాదును జిల్లా ఫోరం స్వీకరించకపోవచ్చును.

  1. ఈ మధ్య ఊరూరా (౧10110౧8 నెలకొల్పుతూ అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో లబ్ది పొందే వారి కంటే నష్టపోయేవారే ఎక్కువని మా ఉద్దేశం. వీటిపై మీ సలహా ఏమిటి?

జ. కాలక్షేపం కోసం ఎగ్జిబిషనుకు వెళితే కలిగే నష్టం ఏమి ఉండదు కాని మనం వస్తువులు కొనుగోలు చేయడానికి అదొక మహదావకాశంగా భావిస్తే కష్టాలను కొని తెచ్చుకొన్నట్లే. వ్యవసాయ పారిశ్రామిక ప్రదర్శనలు అనే "పేరుతో జోరుగా హుషారుగా సాగే ఈ మేళాలు నిర్వాహకులకు సిరుల పంటలు పండిస్తే వినియోగదార్లకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఎగ్జిబిషన్లలో ఎంత వెదికినా వ్యవసాయ ఉత్పత్తులు కనిపించవు. పారిశ్రామిక ప్రగతి అగమ్యగోచరం. కుటీర, చిన్న, మధ్య, భారీ పరిశ్రమల ఉత్పత్తులు వుండవలసిన ఈ ప్రదర్శనలలో కేవలం బట్టల దుకాణాలు, చెప్పుల దుకాణాలు,' ప్రీల అలంకరణ సామాగ్రి, తినుబండారాలు తప్ప అటు వ్యవసాయ ఉత్పత్తులు గాని, ఇటు పారిశ్రామిక ప్రగతిగాని కనుపించదు. పిల్లలు ఆడుకునే పలు అంశాలు ఈ ప్రదర్శనలలో చోటుచేసుకోవడం వలన ఎగ్జివిషనుకు వెళదామని పిల్లలు మారాము చేయడం, వారితో తప్పనిసరిగా పెద్దలు బయలుదేరడం జరుగుతుంటుంది. అంటే యావన్మందీ కాలక్షేపానికి ఎగ్జిబిషన్‌కు బయలుదేరతారు. తీరా ఎగ్జివిషనులో అడుగుపెట్టాక పలు రాష్ట్రాలవారు ప్రదర్శిస్తున్న దుస్తులు, చెప్పులు వరైరా వస్తువులపట్ల ఆకర్షితులై ధర అడగటంతో వేట ప్రారంభమవుతుంది. ఎలాగు బేరం అడతారు కనుక ముందుగానే రెట్టింపు ధర చెప్పి చివరకు సగం ధరకే అమ్ముతారు. అంత తక్కువకు యిస్తారనేసరికి ఉచితానుచిత విచక్షణా జ్ఞానం కోల్పోయి కొనడం జరుగుతుంది. తరువాత ఎగ్జిబిషన్‌కు వెళ్ళి వచ్చిన మరో వనిత ఆ వస్తువు ఇంకా తక్కువకు తీసుకున్నామని చెప్పినప్పుడుకాని తెలిసిరాదు మనం ఏ మేరకు నష్టపోయామో. నాణ్యతలోనూ లోపాలుంటాయి. కొని అది మనం గ్రహించే లోవున ఎగ్జిబిషను

668

మూతపడుతుందీ. ఇవన్నీ ఆలోచిస్తే వినియోగదారుడు నష్టపోవటం తధ్యం కనుక ఎగ్జిబిషనులను కొనుగోలు అవకాశంగా కాక కాలక్షేపంగా మాత్రమే తీసుకుంటే లాభదాయకం.

71 ఈ మధ్య రోటరీ క్లబ్బువారు ఓ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి మందులు, వైద్యము ఉచితంగా అందజేశారు, ఇటువంటి వైద్య శిబిరాలు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి వస్తాయా?

జ. ఈ మధ్య కాలంలో పలు స్వచ్చంద సేవా సంస్థలు 'పేదవారికోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించటం జరుగుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి అపశృతులు వినిపిస్తుంటాయి. ఒక దశాబ్దం క్రీతం మహారాష్ట్రలోని ఓ స్వచృంద సేవా సంస్థ ఉచిత నేత్ర చికిత్సా శిబిరాన్ని నిర్వహించినప్పుడు 80 మంది నేత్ర రోగులు తమ చూపు కోల్పోయారు. దానికి కారణం విశ్లేషిస్తే వారి కళ్ళల్లో పోసిన మందు కలుషితం కావడం వల్ల ఈ దుర్హటన జరిగినట్లు వైద్య పత్రాలు వెల్లడి చేశాయి. మందు తయారుచేయడంలో అశ్రద్ధ వహించిన ఆ కంపెనీవారు బాధ్యతల నుండి తప్పించుకోజాలరు కనుక భారీగానే పరిహారం చెల్లించవలసి వచ్చింది. ఉచిత సేవలు పొందేనారు వినియోగదారులు కారు కనుక వీటికి సంబంధించిన ఫిర్యాదులు

| వినియోగదారుల జిల్లా ఫోరం పరిధిలోనికి రావు. అయినప్పటికీ వైద్యుల నిర్ణక్ష్యం వల్లనో, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనో జరుగకూడనిది ఏదైనా జరిగినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించినవారు పరిహారం చెల్లించవలసి రావచ్చు. ముఖ్యంగా లా ఆఫ్‌ టార్ట్‌ చట్టం నుండి తప్పించుకోవడం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎవరికీ సాధ్యం కాదు. ఆ విధంగా ఉచిత సేవా శిబిరాలు కూడ నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించుకూడదన్నది స్పష్టమవుతుంది.

  1. మోటారు వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరిస్తూ అసలు ఎటువంటి మోసాలు జరిగే అవకొశం ఉందో తెలియజేయండి.

జ. కొత్త మోటారు వాహనాలు కొనే సందర్భములో కేవలం మీ సోషల్‌ స్టేటస్‌కు, వాహనం ఖరీదుకు ముడిసెట్టకుండా అది ఎంతవరకు మీకుపయోగపడుతుంది అనే విషయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోండి. మీరు నివసించే చోట లేదా ఆ వాహనాన్ని మీరు ఎక్కువగొ ఉపయోగించే

మూ

చోట రిపేరు చేయడానికి సదుపాయాలు లేకపోతే అప్పుడు మీ పరిస్టితి ఎలా ఉంటుందో ఊహించగలరు. క్రొత్త వాహనాన్ని కొనేటప్పుడు పైనాన్స్‌ కంపెనీల నుండి బుణం తీసుకునేటప్పుడు మొత్తం వడ్డీ రూపేణా వాళ్ళకు ఎంత కట్టవలసి వస్తుందనేది లెక్కకట్టండి. కారు పాడైన పక్షంలో విడిభాగాలు ఎక్కడ పడితే అక్కడ లబ్యమవుతున్నాయా లేదా అనేది ఆలోచించండి. నకిలి విడిభాగాలకు ప్రసిద్ది చెందింది ఆటోమొబైల్‌ రంగం నకిలీ భాగాలు వల్ల నష్టం కూడా అధికంగా ఉంటుంది. ఇక పాత వాహనాలను కొనేటప్పుడు సి” బుక్‌ ఒరిజనల్లా కాదా అనేది పరీక్షించండి తర్వాత టైర్లు, బ్యాటరీల యొక్క పరిస్థితి గమనించండి. ఇన్సూరెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి కనుక దాని విషయం కూడ గమనించండి. ఒక లీటరు పెట్రోలుతో మీరు కొనబోయే వాహనం ఎన్ని కి.మీ. నడుస్తుంది అనేది తెలుసుకోండి. ఎక్కువ మైలేజి రాకపోతే ఎక్కువగా నష్ట పోతారు.

  1. స్థానిక పన్నులు అదనం అని చెప్తూ వినియోగదారులను అనేకమంది మోసం చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో బిల్లు అడిగితే సన్ను అదనం అంటారు. ఈ అమ్మకం పన్నుల మతలబులు వివరిస్తారా?

జ. అమ్మకం పన్ను దేశం అంతా ఒకే మాదరిగా ఉండాలని, ముద్రించిన రేట్లు అమ్మకం పన్నుతో సహా ముద్రించాలని వినియోగదారుల ఉద్యమకారులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఏ వస్తువు మీద ఎంత పన్ను విధిస్తారో సామాన్యులకు తెలియక సాధారణంగా అమ్మకపు పన్ను విషయంలో మోసానికి గురవుతూ ఉంటారు. ఉదాహరణకు రకరకాల నుందుల'పై రకరకాల పన్నులు విధించి, వినియోగదారులను గందరగోళపరిచే పరిసితి ప్రభుత్వమే కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో కొన్ని వస్తువులపై అమ్మిన ప్రతి సందర్భములోనూ, పన్నుల మోత ఉండేది. ఈ మద్యకాలంలో మల్టిపుల్‌ టాక్స్‌ విధానాన్ని మార్చి ఏ వస్తువుకైనా మొదటిసారి అమ్మకం లోచే అమ్మకపు పన్ను వసూలు చేయాలని చట్నాన్ని మార్పడం జరిగింది. దీనివలన రెండవ అమ్మకందారు పన్ను వసూలు చేయాల్సిన అవసరం లేదు. అంటే ఉత్పత్తిదారులు నిర్ణయించిన ధర మీద ఒక్కసారి పన్ను కడితే సరిపోతుంది. కాని ఇటీవల మధ్యపాన నిషేధం అంటూ టర్నోవర్‌ టాక్సు విధించి ప్రభుత్వాదాయాన్ని పెంచుకునే ఒక దుష్ట ప్రయత్నంలో వినియోగదారుల పై శాశ్వతంగా భారం పడింది. దీనివలన అమ్మిన ప్రతీచోట

70

ధర ఒకశాతం పెరుగుతూ ఉంటుంది. ఇక బిల్లు అడిగితే పన్ను అదనంగా చెల్లించాల్సి వస్తుంది అని ఎవరైనా వ్యాపారస్తుడు చెబితే అటువంటి వారిపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. బిల్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా పన్నులు ఎలాగైనా వసూలు చేస్తారు కనుక కొన్న ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవడమే శ్రేయస్కరం. బిల్లు లేకుండ కొనుగోలు చేస్తే నష్టపోయేది వినియోగదారుడే. జాతీయ స్థాయిలో పంపిణీ అవుతున్న ప్రతి వస్తువుకు గరిష్ట అమ్మకపు ధర నిర్ణయించబడి ఉంటుంది. అంటే పన్నులతో సహా గరిష్ట ధర ఎంత ఉండాలో యం.ఆర్‌.పి. తెలియజేస్తుంది.

  1. ఆ మద్య ఓ వినియోగదారుల పత్రికలో పిల్లల ఆటవస్తువులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చదివాను. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తారా?

జ. పిల్లల కోసం ఆటవస్తువులు కొనే సందర్భములో పలు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుచేతనంటే రెండు మూడు సం॥లోపు వయస్సుకల పిల్లలు ఏ వస్తువు వారి చేతికిచ్చినా ముందుగా నోట్లో పెట్టుకోవాలనుకుంటారు. అందుచేత పదును తేలిన రేకు ముక్కలతో తయారుచేయబడిన వస్తువులు వారి నోటిని గాయం చేయడానికి అవకాశం ఉంది. కళ్ళలో గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది. చేతికి గాయం కావచ్చు. అదేవిధంగా అధిక శబ్దాలు చేసే బొమ్మలను కూడ పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. ఈ అధిక శబ్దాల వలన వారి వినికిడి శక్తికి లోపం కలుగవచ్చును. సాధారణంగా సాఫ్ట్‌ టాయిస్‌ అంటే మెత్తగా ఉండే బొమ్మలు పిల్లలకు ఎటువంటి హాని కలుగజేయవు అనుకుంటూ ఉంటారు. కాని వీటికి అలంకార ప్రాయంగా తగిలించిన బటన్లు, పూసలు లూజుగా ఉండి పిల్లలు నోట్లో పెట్టగానే గొంతులోనికి పోయే ప్రమాదముంది. అది శ్యాసనాళానికి అడ్డుపడితే ప్రాణానికే ముప్పురావచ్చు. నేలమీద. దొర్లించే

బంతులు వంటివి పిల్లలు నోట్లో పెట్టుకుంటే వీటిద్వారా అంటు రోగాలు

సోకే ప్రమాదముంది. పిల్లల చేతి కందిన ప్రతి వస్తువు నేలకేసి

బాదుతుంటారు. కనుక ప్లాస్టిక్‌ వస్తువులు ఎంతోకాలం మన్నవు. ఒకవేళ

ఏదైనా ప్లాస్టిక్‌ ముక్క పగిలి ఉంటే అది కాస్తా తీసుకొని వారు నోట్లో ౬2

పెట్టుకుంటారు. అలా పగలకుండా ఉండే ప్లాస్టిక్‌ వస్తువులను మాత్రమే ప్లిలలకు ఇవ్వటం మంచిది.

  1. ఓ..0పాలసీలో నామినీ వినియోగదారుడవుతాడా?

జ. లైఫ్‌ ఇన్‌స్యూరెన్స్‌ కార్పోరేషన్‌ వారు పాలసీ తీసుకునే ముందు వినియోగదారులను ఎన్నివిధాలుగా ఆకర్షించడానికి ప్రయత్నిస్తారో చివరకు జరగకూడనిది ఏదైనాజరిగినప్పుడు పరిహారం చెల్లించడానికి అన్నిబాధలు పెడతారని సర్వత్రా వినిపిస్తున్న విమర్శ. ఈ సంస్థ ప్రభుత్వఆధీనంలో ఉండి, పోటీ లేకపోవటం వలన గుత్తాధివత్యం వ్రవర్థమానమై వినియోగదారులను లక్ష్య పెట్టని స్థితికి ఈ కార్పోరేషన్‌ చేరుకుందంటే అతిశయోక్తికాదు. కొన్నికొన్ని సందర్భాలలో పాలసీ యివ్వటానికే [.॥.0 వారు చాలా బాధలు పెడుతున్నారని వింటున్నాము. ఇదే పోటీవాతావరణం ఉండి ఉంటే పరిస్థితి మరోమాదిరిగా ఉండిఉండేది. 1991లో గుజరాత్‌ స్టేట్‌ కమీషన్‌ దాఖలైన అప్పీల్‌ నెం.24ని పరిశీలిస్తే ఈవిషయం ప్రస్పుటమౌతుంది. సౌజని అనే ఒక ఉద్యోగస్థుడు ఒక లక్షరూపాయలు పాలసీ తీసుకున్నాడు. 28.3.89న ప్రపోజల్‌ పంపిస్తే 3.9.89న ఆ ప్రపోజల్‌ 1 |.0అంగీకరించింది. ఆ తర్వాత 12రోజులలో ఓ రోడ్డుప్రమాదంలో సౌజని మరణించడం జరిగినది. సౌజని భార్య జిల్లా ఫోరంలో ఫిర్యాదుచేసింది. జిల్లాఫోరంలో తీర్పువ్యతిరేకంగా రావడంతో స్టేట్‌కమీషన్‌కి అప్పీలుచేసింది. స్టేట్‌కమీషన్‌ తనతీర్పులో 96,808/- పరిహారంచెల్లించాలని 15% వడ్డీ యివ్వాలని అదీకాక 1000/- ఖర్చులకింద యివ్వాలని తీర్పునిచ్చింది. ప్రపోజల్‌అంగీకరించడానికి [౬.1.0 కనుక ఎక్కువ సమయం తీసుకుంటే అదిసేవలలో లోపంగా పరిగణించాల్సి ఉంటుందని తెలియజేసింది. ఇక పాలసీతీసుకున్న వారు మరణిస్తే నామినీని వినియోగదారునిగా గుర్తిస్తారు. ఇదేవిషయాన్ని జాతీయకమీషన్‌ ఉమాదేవి 1.1.0 పై వేసినకేసులో తీర్పునిస్తు పేర్కొంది. అందుచేత నామినీ వినియోగదారుల రక్షణ చట్టాన్ని వినియోగించుకొని [౬1.0 నుండి లబ్దిపొందవచ్చును.

  1. సంక్షేమ పధకాలు వినియోగదారుల రక్షణ చట్ట పరిధిలోనికి వస్తాయా?

జ. సంక్షేమ పథకాలలో ఉంటే సబ్బిడీలే ఉంటాయి తప్ప లాభాలంటూ ఏమి ఉండవు. కనుక సంక్షేమ పథకాలు వినియోగదారుల రక్షణ చట్టం

పరిధిలోనికి రావు. ఈ అభిప్రాయానికి ఊోతమిస్తు ఢిల్లీ స్టేట్‌ కమీషన్‌ తీర్చు కూడా వెలువడింది. ఎయిర్‌ఫోర్సులో రిటైర్‌ అయిన కెప్టెన్‌ బాహాన్‌ తాను 2,24,655/- కొన్న ఇంటి స్తాబుకు పగుళ్ళు వచ్చిన కారణంగా ఆ యిల్లు తనకు అలాట్‌ చేసిన వైమానిక, నావికాదళ హౌసింగ్‌బోర్డు రూ.2,20,000/-లు పరిహారం చెల్లించాలని ఢిల్లీ స్టేట్‌ కమీషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశాడు. లాభనష్టాలు లేని ప్రాతిపదికపై నావికా, వైమానిక దళాల ఉద్యోగస్థులకు, రిటైరయిన ఉద్యోగస్థులకు ఇళ్ళు సముకూర్చాలన్న సంక్షేమ పధకం క్రింద ఇళ్ళు కేటాయించబడినాయి కనుక వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి ఈ వ్యవహారం రాదని హౌసింగ్‌బోర్డు వాదించింది. ,ప్రభుత్వం నుండి భూమి సేకరించి వైమాదిక, నావికాదళ ఉద్యోగులకు ఇళ్ళు కట్టుకోవడానికి హొసింగుబోర్డు అవకాశం కల్పిస్తుంది. ఇది కేవలం ఉద్యోగుల సంక్షేమ పధకం కనుక లాభం నష్టం లేకుండ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని హౌసింగ్‌బోర్డు స్టేట్‌ కమీషన్‌కు తెలియజేసింది. విషయాలు పరిశీలించిన పిమ్మట సంక్షేమ పధకాలు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలో,-కి రావని ఢిల్లీ స్టేట్‌ కమీషన్‌ తీర్పునిచ్చింది.

  1. ఒక వివాదంలో జిల్లా ఫోరం వినియోగదారునికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అవతల పక్షం వారు కోర్టు ఉత్తర్వు ఖాతరు చేయనందున వారికి జైలు శిక్ష విధించారు. ఈ తీర్చుస్తై వారు అప్పీలు చేసుకోవచ్చునా?

౭ _ జిల్లాఫోరం లేక రాష్ట్ర జాతియ కమీషన్‌ ఇచ్చిన తీర్పు అమలుచేయకపోతే సెక్షన్‌ 27 ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించుకొని జైలు శిక్త, జుర్మానా విధించ వచ్చును. తీర్పులపై అప్పీలు ఉంటుంది కాని సెక్షన్‌ 27 క్రింద విధించిన శిక్షకు అప్పీలు ఉండదు. ఇదే విషయాన్ని రాజస్లాన్‌ స్టేట్‌ కమీషన్‌ 25-7-1992న ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. ఈ కేసులో జగదీష్‌ ప్రసాద్‌ వ్యాస్‌ అనే వినియోగదారుడు అగర్వాల్‌ సేల్స్‌ కార్పోరేషన్‌ నుండి రూ.135/-లకు ఓ టైర్‌ కొన్నారు. ఆ టైర్‌ లోపభూయిష్టంగా ఉండటం వలన జగదీష్‌ ప్రసాద్‌ వ్యాస్‌ జిల్లా ఫోరంని ఆశ్రయించటం జరిగింది. జిల్లా ఫోరం తీర్చునిస్తు లోపాలతో ఉన్న టైర్‌ స్థానంలో మరో టైర్‌ యివ్వటం కొని లేదా వినియోగదారుడు చెల్లించిన రూ.135/-లు తిరిగి యిచ్చివేయాలని అగర్వాల్‌ సేల్స్‌ కార్పోరేషన్‌ని ఆదేశించింది. జిల్లా ఫోరం తీర్పుని ఖాతరు చేయని అగర్వాల్‌ సేల్స్‌ కార్పోరేషన్‌ యజమానికి

"సెక్షన్‌ 27 క్రింద మూడు నెలల జైలు శిక్ష విధించడం జరిగింది. అగర్వాల్‌ సేల్స్‌ కార్పోరేషన్‌ వారు తీర్పుపై అప్పీలు చేయకుండా జైలు శిక్షపై అప్పీలు చేశారు. సెక్షన్‌ 27 క్రింద విధించిన శిక్షలకు అప్పీలు లేదని రాజస్థాన్‌ స్టేట్‌ కమీషన్‌ తీర్పునిచ్చింది. జిల్లా ఫోరం ఈ సెక్షన్‌ ఉపయోగించుకొని శిక్షలు విధించేటప్పుడు శిక్షపడినవారు ప్రతివాదన చేసుకోడానికి అవకాశాం ఇవ్వలేదు కనుక 3 నెలల జైలు శిక్షను రద్దుచేస్తు రూ.2,000/-లు జుర్మానా మాత్రం విధించడం జరిగింది.

  1. ఇన్సూరెన్సు కంపెనీలు ఏ విధంగా కైయిములు ఎగ్గొట్టాలా అని ప్రయత్నిస్తున్నప్పుడు కంపెనీ సర్వేయరు రిపోర్టుని చాలెంజ్‌ చేస్తూ ఎక్కువ క్షయిము సెడితే ఇన్సూరెన్స్‌ కంసెనీకి తగిన బుద్ధి చెప్పినట్లవుతుందికదా! మీరేమంటారు?

జ. ఇన్సూరెన్స్‌ కంపెనీ క్షయిములు ఎగ్గొట్టానికి ప్రయత్నం చేస్తే బుద్దిచెప్పడానికి చాలా మార్గాలున్నాయి. కేవలం బిల్లులు పెంచి సమర్పించినంతమాత్రన వాటి ఆధారంగా పరిహారం చెల్లించడానికి వినియోగదారుల కోర్టులు అనుమతించవు. 11-11-1992న నేషనల్‌ కమీషన్‌ 22వ నెంబరు అప్పీలులో తీర్పును పరిశీలిస్తే ఈ విషయము స్పష్టమవుతుంది. 60౧౪౧ ౧6115 అనే కంపెనీలో అగ్ని ప్రమాదాల బారి నుంచి తమ నిల్వలను రక్షించుకోవడం కోసం న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీతో భీమా చేసింది. అగ్ని ప్రమాదం జరగనే జరిగింది. జరిగిన నష్టానికి లక్షా అరవై వేల రూపాయలు పరిహారం ఇప్పించమని రాజస్థాన్‌ స్టేట్‌ కమీషన్‌లో ఫిర్యాదు దాఖలు అయ్యింది. న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీవారు నష్టాన్ని అంచనా వేయమని గుల్లన్‌ అండ్‌ కంపెనీవారిని కోరడం వారు మొత్తం నష్టాన్ని రూ.6,466/-గా అంచనా వేయడం జరిగింది. వారివద్ద ఆ మేరకు స్టాకు ఉన్నట్లుగా గాని లేదా వారి అమ్మకాలు అ మేరకు ఉన్నట్లుగాగాని ౪౦౧95౧ ౧61 వారు బుజువు చేసుకోలేక పోయారు. అందుచేత రాజస్థాన్‌ స్టేట్‌ కమీషన్‌ రూ.6,466/-లు పరిహారం మాత్రమే బెల్లించవలసినదిగా న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీని ఆదేశించింది. దీనితో సంతృప్తి చెందని వినియోగదారుడు నేషనల్‌ కమీషన్‌కు అప్పీలు చేయగా కేసు పూర్వాపరాలని పరిశీలించిన కమీషన్‌ కంసెనీ అమ్మకాలు కొన్ని నెలల్లో పూర్తిగా లేకుండటం గమనించింది. తర్వాత ఇన్సూలెన్స్‌ కంపెనీ జరిపిన

4

"రెండు సర్వేలల్లోను నష్టం అంచనా వేసినదానికంటే ఎక్కువ లేనట్లుగా రుజువు అయింది.దానితో జాతీయ కమీషన్‌ రాజస్థాన్‌ రాష్ట్ర కమీషన్‌ ఇచ్చిన తీర్పును ఖాయం చేస్తు అనవసరంగా అప్పీలు చేసినందుకుగాను ఇన్సూరెన్స్‌ కంపెనీకి రూ.4,000/-లు కట్టమని [/1/3. 6౦౧౪౪ ౧61ని ఆదేశించింది. అందుచేత బిల్లులు పెంచి ఎక్కువ లచ్చి పొందాలనుకునేవారికి ఇటువంటి ఎదురు దెబ్బలు కూడ తగలవచ్చు. వినియోగదారుల రక్షణ చట్టాన్ని, న్యాయ వ్యవస్థనూ దుర్వినియోగం చేయడానికి తలసెట్టేవారిని ఈ విధంగా అదువు చేయడం జరుగుతుంది. 79. మా ఊరొక చిన్న పల్లెటూరు. కాని వాతావరణ కాలుష్యంలో పట్టణాలకు ఏమీ తీసిపోదు. ఉదయాన్నే గుళ్ళో స్పీకర్ల సందడి. సాయంకాలం సినిమా హాలు సాటల గోల, కిరసనాయిలు జనరేటర్ల వలన వాయు కొలుష్యం. కొలువలో నీరు పరమ కాలుష్యం. వెరసి ఇదీ పల్లె ప్రజల బ్రతుకు. వినియోగదారుల రక్షణ చట్టం ద్వారా దీనికి పరిష్కారం దొరుకుతుందా? జ. జల, వాయు, శబ్ద కాలుష్యాలు నేటి సమాజంలో నగరాలకే పరిమితం కాకుండా కాలుష్య భూతం సర్వాంతర్యామిగా విశ్చంఖల నృత్యం చేస్తూ ప్రజల ఆరోగ్యాలకు బెడదగా పరిణమించింది. అడవులను నరికివేయడం, వన్యమృగాలను సంరక్షించటం పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించడం వంటి పెద పెద్ద విషయాలపై ప్రభుత్వం ఇంకా చర్చలు కొనసాగిన్తుంటే ప్రార్ధనల పేరిట మైకులు రొద, కరంటు కోతల పేరిట జనరేటర్ల ఘీంకారం, సర్వరోగ కారక కాలుష్య జలాన్ని కాలువల్లో కలిపి ప్రజల ఆరోగ్యానికి విఘాతం కలిగిస్తున్న ఎందరో మహానుబావులు. ఇవన్నీ పట్టించుకోవడానికి రాజకీయ దురంధరులైన ప్రభుత్వాధినేతలకు తీరిక చిక్కదు. అధికార గణానికి ఆసక్తి ఉండదు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి కాలుష్య నివారణ చట్టం తయారుచేయడం జరిగింది. దీనిని సమర్ధవంతంగా అమలుపరచటానికి కావలసిన యంత్రాంగం అంతకు మించి చిత్తపుద్ధి కొరవడినాయి. ఒక ప్రత్యేక న్యాయ వ్యవస్థ ధీనికోసం ఏర్పాటయినా కొనట్లుగానే ఉంది. మీ ఊరిలో జరుగుతున్న అన్ని కాలుష్యాలకు పరిష్కారం అ న్యాయస్గానాల్లో మౌత్రమే లభ్యమవుతుంది. ఈ కాలుష్యాలకు మనమంతా బాధ్యులమే, మన హక్కును కాపొడుకుంటూ ఎదుటివారి హక్కును హరించే సంస్కారం మనం నరిదిద్దుకోనంత కాలం 78

చట్టాలో, న్యాయస్థానాలలో పరిష్కారం చూపుతాయి అనుకోవటం అవివేకమవుతుంది. వినియోగదారుల రక్షణ చట్టం ద్వారా ఈ కాలుష్య సమస్యలకు పరిహారం లేదు. ఎందుచేతనంటే మీరు సొమ్ము చెల్లించి ఈ కాలుష్యాన్ని కొనుక్కోవటం లేదు కనుక మీరు వినియోగదారులు కాదు. గాలిని వినియోగిస్తున్నాం, నీటిని వినియోగిస్తున్నాం, కనుక మేము వినియోగదారులవే అనే అభిప్రాంఎం మీలో ఉండవచ్చును. వినియోగదారుల రక్షణ చట్టంలోని నిర్వచనం ప్రకారం మీరు వినియోగదారులు కాదు. కనుక ఈ సమస్య వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి రాదు. పెట్రోల్లో ఉన్న సీసం వలన, కిరోసిన్‌తో నడిపే జనరేటర్‌ వలన, పరిశ్రమల ద్వారా విడుదలవుతున్న భయంకర కాలుష్యాల వలన లక్షలాది ప్రజలు రోగ గ్రస్తులవుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉండగలుగుతున్న సామర్థ్యము మన అధికార గణానికి మాత్రమే ఉంది. కోర్టులను ఆశ్రయించి పరిష్కారం పొందటం ఒక మార్గమయితే, కాలుష్యానికి పాల్పడేవారిపై పోరాటం జరిపి పరిష్కారం పొందటం మరో మార్గం. మీకేది అవకాశం ఉందో ఆలోచించండి.

  1. మా ఊళ్లో గ్రంధాలయం పన్ను వసూలు చేస్తున్నారు. కాని ఇంతవరకు గ్రంధొాలయం స్థాపించలేదు. ఈ విషయంపై ఎవరికి బెస్పినా పని జరగటం లేదు. వినియోగదారుల కోర్టుకు వెళ్ళవచ్చా?

జ. ప్రభుత్వం పన్నుల రూపేణా వసూలుచేసే సోమ్మును ఎలా ఖర్చు చేస్తున్నారు అని అడిగేఅధికారం సామాన్యపౌరులకి లేదు. పోనీ ప్రజా ప్రతినిధులకు ఉందా అనుకుంటే లేదనే చెపవలసివస్తుంది. అధికారపార్టీ వారు తయారు చేసిన బడ్జెట్‌ను యదాతధంగా ఆమోదించడం మనం గమనిస్తూనే ఉంటాం. రోడ్డు టాక్సు రూపేణా కొట్లాది రూపాయలు వసూలుచేస్తున్న ప్రభుత్వం మరి ఆ సొమ్మును రోడ్ల అభివృద్ధికి ఎందుకు ఖర్చు పెట్టడం లేదు అని అడిగితే దేని నిమిత్తం వసూలుచేసిన పన్నును దానికే ఖర్చుపెడితే ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది అనే ప్రశ్న ఎదురవుతుంది. అమెరికా వంటి దేశాలలో రోడ్డు పన్నుగా వసూలుచేసిన మొత్తం 98 శాతం రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేస్తుంటే, జపాన్‌లో వసూలుచేసిన దానికన్నా మరో 5 శాతం అధికంగా రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేస్తుంటారు. ఫలాన పని నిమిత్తం ఈ సొమ్మును మీ

౬26

దగ్గర పన్ను రూపేణా వసూలుచేస్తున్నామని ప్రభుత్వాధినేతలు నొక్కి వక్కొణిన్తుంటే అది నిజమే అని ప్రజలు భావిస్తారు. అలా వనూలుచేసిన సొమ్మును మరో కార్యక్రమానికి మరలించటం ఎంతవరకు భావ్యమో అడినేతలు ఆలోచించేవరకు ఇటువంటి తవ్వులు పునరావృతమవుతుంటాయి. ఉదా: ఇంటి పన్ను వసూలుచేస్తే దానితో పారిశుద్ధ్యం, రోడ్డు తదితర వసతులు కల్పిస్తారేమోనని ఆశగా మునిసిపాలిటిల వైపు చూస్తుంటాం. కాని వసూలుచేసిన పన్నంతా మునిసిపల్‌ ఉద్యోగులు జీతభత్యాలకు పోగా ప్రజారోగ్య కార్యక్రమాలకు డబ్బు మిగలటం లేదనే

సత్యం మనందరకు 'తెలిసినదే. నీటి పన్ను మునిసిపాలిటీలు వేర్తుగా

వసూలుచేయటం జరుగుతుంది.అటువంటి సందర్భములో మంచినీటిని

క్రమబద్దంగా సరఫరా చేయలేని పరిస్థితి ఎదురై నప్పుడు వినియోగదారులు

జిల్లా ఫోరంను ఆశ్రయించి తగిన పరిష్కారం పొదగలరనేది ఈ మధ్యనే

వెలువడిన తీర్పు స్పష్టం చేస్తోంది. 'కేవలం నీటిని సదుపాయం చేయటం

కోసమే అ డబ్బుని వినియోగదారుల వద్ద నుంచి పన్ను రూపంలో

వసూలుచేస్తున్నారు కనుక ఆ బాధ్యతను నెరవేర్పవలసిన అవసరం స్థానిక

సంస్థలకుంది' అనేది ఆ తీర్పు సారాంశం ఆవిధంగా చూసుకొన్నప్పుడు

గ్రధాలయం పన్ను కూడ గ్రంధాలయ సౌకర్యం కల్పించడం కోసం

వసూలుచేసిందే. కనుక జిల్లా ఫోరంకు ఫిర్యాదు చేయవచ్చును.

  1. ఏవో పాత బిల్లులు కట్టలేదనే వివాదంతో మా టెలిఫోన్‌ డిస్కనెక్ట్‌ చేస్తామని డిపార్దుమెంట్‌వారు బెదిరిస్తున్నారు. జిల్లా ఫోరంకు ఫిర్యాదుచేసి టెలిఫోన్‌ కట్‌ చేయకుండా మధ్యంతర ఆర్హరు పొందవచ్చునా?

జ. గుజరాళ్‌కి చెందిన శ్రీమతి చంపాలక్ష్మి ఎక్కువగా వచ్చిన టెలిఫోన్‌ బిల్లు వలన మనస్థాపం చెంది టెలిఫోన్స్‌ జనరల్‌ మేనేజర్‌పై జిల్లా ఫోరంకు ఫిర్యాదు చేశారు. సాధారణంగా 400 నుండి 500 రూపాయలు వచ్చే బిల్లు ఆ నెల రూ.740/-లు బిల్లు రావడంతో ఈ వివాదం తలెత్తింది. డిస్ట్రిక్ట్‌ ఫోరం అధ్యక్షులు రూ.400/-లు కట్టించుకొని వారం రోజుల లోప్పగా డిస్కనెక్ట్‌ చేసిన ఫోన్‌ రీకనక్ట్‌ చేయమని అదేశించారు. టెలిఫోన్స్‌ జనరల్‌ మేనేజర్‌ డిస్టిక్ట్‌ ఫోరం తీర్పుపై గజరాత్‌ స్టేట్‌ కమీషన్‌లో అప్పీలు చేశారు. వినియోగదారుల రక్షణ చట్టం క్రింద మధ్యంతర ఆర్గర్లు ఇచ్చే అధికారం వినియోగదారుల కోర్టులకు కలదా అనే అంశం ప్రముఖంగా ప్రస్తావనకు

౬77

వచ్చింది. వినియోగదారుల రళ్లణ చట్టంలో సెక్షన్‌ 14(1)లో వినియోగదారులకు ఎటువంటి రిలీఫ్‌ యివ్యాలనేది ప్రస్తావించబడింది. దీనిలో మధ్యంతర ఆర్డర్‌ ఇచ్చే ప్రస్తావన లేదు. 90 రోజులలో మొత్తం వివాదం పరిష్కరించవలసి ఉంటుంది. కనుక మద్యంతర ఆర్డర్‌ వలన పెద్దగా ఉపయోగం ఉండదని చట్ట సభ భావించి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న చట్టాలకు అదనంగా వినియోగదారుల చట్టం చేయబడింది కాబట్టి వినియోగదారుల రక్షణ చట్టం మరి ఏ చట్టాలతోను మర్షణ కలిగె |/ ఉండకూడదు. సివిల్‌ కోర్టుల ద్యారా మధ్యంతర ఆర్డర్లు తెచ్చుకునే ," అవకాశం ఎలాగూ ఉంది కనుక వినియోగదారుల రక్షణ చట్టంలో ఈ అంశాన్ని చేర్చలేదని భావించవలసి ఉంటుంది. అందుచేత రూ.400/-లు కట్టించుకొని టెలిపోన్‌ తిరిగి కనక్ట్‌ చేయమని మధ్యంతర ఆర్డర్‌ ఇవ్వడం జిల్లా ఫోరం తన పరిధిని దాటటమే అని స్టేట్‌ కమీషన్‌ భావించింది. ఇటువంటి సందర్శములోనే నేషనల్‌ డైరీ డెవలప్‌మెంట్‌ బోర్డు, వినియోగదారుల సంఘం వివాదంలో జాతీయ కమీషన్‌ ఇదే రకమైన తీర్పునిచ్చింది.

  1. ఈ మధ్య నేను ఒక కారు కొన్నాను. తయారీలో లోపం వల కాబోలు స్తానిక డీలర్‌ సర్వీస్‌ స్టేషన్‌వారు ఆ లోపాన్ని సరిచేయలేకపోతున్నారు. కారు వల్ల ఇబ్బందులకు గురికావలసి వస్తుంది. ఏం చేయాలి?

జ. మీ కారులో తలెత్తిన లోపం సరిదిద్దగలిగినదైతే స్థానిక డీలర్‌ దానిలోని లోపాలను సవరించగలిగేవారు. కాని తయారీలో లోపం సరిదిదడం వారికి సాధ్యం కాకపోవచ్చు. అందుచేత కారు తయారుచేసిన కంపెనీవారే బాధ్యత వహించవలసి వుంటుంది. మనం కొన్న వస్తువులో సరిదిద్ద శక్యం ,. కాని లోసాలు తలెత్తినపుడు అ వస్తువును రిపేర్‌ చేయడం సాధ్యం కాదు. కనుక ఆ వస్తువు స్థానంలో మరో క్రొత్తది ఇవ్వవలసి ఉంటులది. లేదా వస్తువు తిరిగి తీసుకుని మీ సొమ్ము మీకు వాపసు చేయాల కేరళ స్టేట్‌ కమీషన్‌ యిచ్చిన తీర్పు ఈ సంగతి విశదపరుస్తుంది. అహమ్మద్‌ అనే వినియోగదారుడు 'మోంటనా” డిజల్‌ కారు గురించిన ఆకరణీయమెన ప్రకటనలు చూసి, పదివేల రూపాయలతో ఒక క్రారు బుక్‌ చేశాడు. తీరొ కొరు డెలివరీ తీసుకున్న తరువాత లీటర్‌ డ్రిజల్రా ం ము నడుస్తుంది. కంపెనీవారు 29 కమ వాణి త్‌20 కి.మీ. మాత్ర

క్‌ “ఆ. వాగ్గొనం చేఫార్సు అంతేకాకుండొ (28౨)

కారులో క్లచ్‌, ట్రేక్‌ సిస్టమ్‌ పొడవటం వల్ల కారు నిరుపయోగమైంది. స్టేట్‌ కమీషన్‌ తీర్పునిస్తూ కంపెనీవారు కారు తిరిగి తీసుకుని వినియోగదారుడు చెల్లించిన సొమ్ము వాపసు జేయమని ఆదేశించింది. అంటే రిపేర్‌ చేయజాలని లోపాలు తలెత్తినపుడు అమ్మిన వస్తువును తిరిగి తీసుకుని లోపంలేని మరో వస్తువు ఇవ్వడంగాని, సొమ్ము వాపసు చేయడం గాని ఉత్పత్తిదారులు చేయాల్సి వుంటుంది అందుచేత మీరు జిల్లా పోరంకు

_.. ఫిర్యాదుచేసి తగిన పరిష్కారం పొందవచ్చు.

  1. కొంతకాలం క్రితం మేము ఒక కంప్యూటర్‌ దానికి సంబందించి ఇతర పరికరాలు కొన్నాం. అమ్మినవారే వచ్చి కంప్యూటర్‌ను బిగించి వెళ్లారు. కాని కొంతకాలం తరువాత నోల్టేజ్‌లో హెచ్చు తగ్గులనల్ల కంప్యూటర్‌ పొడైంది. కంప్యూటర్‌ సఫై చేసినవారు ఎటువంటి జాగ్రత్తలూ చెప్పలేదు. మేము నష్టపోవలసిందేన?

జ. మీరు నష్టపోవలసిన అవసరం లేదు. జిల్లా ఫోరంకు ఫిర్యాదుచేసి తగిన పరిహరం పొందవచ్చు సరిగ్గొ మీరు ఎదుర్కొన్న సమస్య లాంటిదే మద్రాసులోని ఒక విద్యా సంస్థకు అనుభవమైంది దానితో వారు మద్రాస్‌ స్టేట్‌ కమీషన్‌కు పిర్యాదు చేశారు. వాదోపవాదాలు విన్న తరువాత స్టేట్‌ కమీషన్‌ కంప్యూటర్‌ సపై కంపెనీవారిదే లోపంగా గుర్తించింది. కంప్యూటర్స్‌ వినియోగదారుని ప్రాంగణంలో నెలకొల్పేటప్పుడే తగిన జాగ్రత్తలు సూచించవలసి వుంది ఓల్డేజిలోని హెచ్చు తగ్గుల వల్ల కంప్యూటర్లు పాడవృతాయని తెలిసినపుడు ఆ విషయాన్ని వీనియోగదారునికి తెలియజేసి కంప్యూటర్లను ఓల్దేజి హెచ్చు తగ్గుల నుండి కాపొడటానికి పరికరాలను అమర్చుకోవాలని సలహా ఇవ్వాలి. అ విధంగా వేయలేదు కనుక ఇది సేవలలో లోపంగా గుర్తించవలసివుంది. అందుచేత పొడైన కంప్యూటర్లను బాగుచేసి ఇవ్వాలని స్టేట్‌ కమీషన్‌ ప్రగతి కంప్యూటర్స్‌ వారిని ఆదేశించింది. ఈ కంప్యూటర్లను బాగుచేయడానికి సుమారు 60 చేల రూపాయలు అవుతుందని కంప్యూటర్లు ఇెడిపోవడానికి మేము కారణం కాదంటూ ప్రగతి కంప్యూటర్స్‌ జాతీయ కమీషన్‌కు అప్పీలు చేశారు. కాని జాతీయ కమీషన్‌ స్టేట్‌ కమీషన్‌ తీర్పులో ఏకీభవించింది.

(౮

  1. నేను డిగ్రీ పాసై 8 సం॥ములు కావస్తున్నది. ఇంతవరకు నాడిగ్రీ నాచేతికి అందలేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా యూనివర్శిటీవారు కనికరించడం లేదు. నా డిగ్రీ సర్టిఫికెట్‌ నాకు వెంటనే వచ్చే మార్గం సూచించండి?

జ. యూనివర్శిటీవారిని కనికరించమని మీరు ప్రాధేయ పడవలసిన అవసరం లేదు. వినియోగదారుల రక్షణ చట్టాన్ని ప్రయోగించండి. నిద్రలో జోగుతున్న,/ అధికారులు ఒక్కసారిగా మేలుకుంటారు. మురుగేశన్‌ అనే విద్యార్థికి మద్రాసులో మీకు కలిగిన చేదు అనుభవమే కలిగింది. 1979లో అర్థిక శాస్త్రంలో డిగ్రీ పొసైన ఈ విద్యార్ధికి 1991 నాటికి కూడా డిగ్రీ సర్టిఫికెట్‌ అందలేను. 1982లో చెల్లించవలసిన ఫీజు చెల్లించి డిగ్రీ సర్టిఫికెట్‌ ఇప్పించవలసినదిగా మద్రాస్‌ యూనివర్శిటీని కోరడం జరిగింది. కాని 1991 వరకు యూనివర్శిటీవారు డిగ్రీ సర్టిఫికెట్‌ పంపించలేదు. దానితో విసుగుబెందిన మురుగేశన్‌ 16-12-1991న తంజావూరు జిల్లా ఫోరంను ఆశ్రయించి తనకు న్యాయం ప్రసొదించమని కోరాడు. జిల్లా ఫోరంకు ఫిర్యాదు చేయగానే యూనివర్శిటీ అధికార యంత్రాంగం మేలుకొంది. 20-1-1992 అనగా పది సంవత్సరాల తరువాత మద్రాస్‌ యూనివర్శిటీవారు డిగ్రీ సర్దిఫికెట్‌ యిచ్చారన్నమాట. మద్రాస్‌ యూనివర్శిటీ సేవలలోని లోపాలు గుర్తించిన తంజావూరు జిల్లా ఫోరం విద్యార్ధికి రూ.5,000/-లు పరిహారంగాను, మరో రూ.250/-లు ఖర్చుల నిమిత్తం ఇవ్వమని యూనివర్శిటీని ఆదేశించింది. తంజావురు ఫోరం తక్కువ పరిహారం ఇవ్వడం వల్ల మురుగేశన్‌ మద్రాస్‌ స్టేట్‌ కమీషన్‌కు అప్పీలు చేయగా ఆ పరిహారాన్ని పదివేల రూపాయలకు పెంచి ఇవ్వవలసిందిగా స్టేట్‌ కమీషన్‌ ఆదేశించింది. ఇదే విధంగా మీరు కూడా జిల్లా ఫోరం ద్వారా న్యాయం పొందగలిగితే మీ డిగ్రీ సర్దిఫికెట్‌ దానితోపాటు పరిహారం పొందగలరు.

  1. మా అపార్ట్‌మెంటుకు కరెంట్‌ కనెక్షన్‌ కోసం అప్లై చేసి ఒక సంవత్సరం దాటింది. ఇంతవరకు కనెక్షన్‌ ఇవ్వలేదు. వినియోగదారుల రక్షణ చట్టం వల్ల మాకు మేలుకలుగుతుందా?

జ. మీకు వచ్చిన సమస్య వంటిదే 'అలాక్రిటీ ఫొండేషన్‌' అనే గృహ నిర్మాణ సంస్థకు వచ్చింది. టీ నగర్‌లో ఈ సంస్థ నిర్మించిన అతీంద్ర భవన ౬89

సముదాయం జనవరి 91లోనే పూర్తయినా కరెంటు కనెక్షన్‌ లేకపోవడం వల్ల నవంబరు 91 వరకు యజమానులకు అప్పగించలేక పోయింది. దానివల్ల అ సంస్థకు చాలా నష్టం సంభవించింది. తమిళనాడు విద్యుత్‌ శాఖ వద్ద కొంత సామాగ్రి స్టాకు లేకపోవడం వల్ల కరెంటు కనెక్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని గ్రహించిన గృహ నిర్మాణ సంస్థ 55 వేల రూపాయల సామాగ్రిని సదుపాయం చేయడమేకాక డిస్ట్రిబ్యూషన్‌

. ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టడానికి ఉచితంగా స్థలం కూడా యిచ్చింది. ఇవన్నీ సమకూర్చిన విద్యుత్‌ శాఖకు తరువాత కూడా విద్యుత్‌ సంస్థకు కనెక్షన్లు ఇవ్వడానికి ఒక నంవత్సరం 6 మాసాలు పట్టింది. 3.4.1990న కరెంటు కోసం దరఖాస్తు చేస్తే 18.10.1990 వరకు రిజిస్టర్‌ చేసుకోలేదు. రిజిఫర్‌ చేసుకున్నతరువాత ఎస్టిమేట్‌ చేయడానికి రెండు నెలలు ఎస్టిమేటొచేసీన తరువాత పని ప్రారంభించడానికి మరో రెండు నెలలు. ఇలా ప్రతి స్టేజ్‌లోనూ చాలా ఆలస్యం జరిగింది. అందుచేత 9 నెలల కాలం కరెంటు లేక ఆ సముదాయం ఖాళీగా పడివుండటం వల్ల అద్దెల రూపంలో చాలా నష్టం వచ్చినందుకు గొను 10 లక్షలు తమిళనాడు విద్యుత్‌ సంస్థ నుండి ఇప్పించాలని, అలా క్రిటీ ఫొండేషన్‌ సంస్థ మద్రాస్‌ స్టేట్‌ కమీషన్‌ను కోరింది. వాదోపవాదాలు విన్న తరువాత స్టేట్‌ కమీషన్‌ జరిగిన జాప్యానికి విద్యుత్‌ శాఖను తప్పుపట్టింది. కరెంట్‌ కనెక్షన్‌ ఇవ్వడానికి పట్టిన 17 నెలల కాలంలో 10 నెలల జాప్యాన్ని నివారించవచ్చు. కాని విద్యుత్‌ శాఖ ఆ జాప్యాన్ని నివారించలేకపోయింది. కనుక దాని సేవలలో లోపం వుంది అని స్టేట్‌ కమీషన్‌ అభిప్రాయపడింది. గృహ నిర్మాణ సంస్థకు పదివేల _ రూపాయలు పరిహారం మాత్రమే ఇవ్వమని అదేశించింది. అందుచేత సరిమ్రైన కారణం లేకుండా కరెంటు కనెక్షన్‌ ఇవ్వడానికి జాప్యం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థపై కూడా మీరు జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేసి తగిన పరిహారం పొందవచ్చు.

  1. మెకానిక్‌ సెడ్‌లో రిపేర్ల నిమిత్తం వుంచినప్పుడు మా కారులోని టేప్‌ రికార్డర్‌, ఇతర సొమగ్రి దొంగిలించబడీనాయి. షెడ్‌వారు మాకేమి సంబంధం లేదంటున్నారు. మరి మాకు న్యాయం జరిగేదెలా?

జ. కారు పెడ్‌లో వున్న కాలంలో మీ కారు నుండి వస్తువులు దొంగిలించబడితే దానికి గ్యారేజ్‌ యజమానులు బాధ్యత వహించవలసి వుంటుంది. సషెడ్‌లో

చమూ ం

వున్నంతకాలం ఆ కారు, ఆ కారులోని సామానులను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత వారిదే అయినపప్పటికి గ్యారేజ్‌లో పెద్ద పెద్ద అక్షరాలతో వాహన యజమానులదే బాధ్యత అని వ్రాస్తుంటారు అటువంటి వ్రాతలు ఎన్ని వ్రాసినా గ్యారేజ్‌ యజమానులు తమ బాధ్యతల నుండి తప్పించుకోలేరు. జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేసి మీకు జరిగిన నష్టానికి పరిహారం పొందవచ్చు. మద్రాసు స్టేట్‌ కమీషన్‌లో సరిగ్గా ఇటువంటి వివాదంపైనే మెయప్పన్‌ అనే వాహన యజమాని యూనియన్‌ మోటర్‌ _ కంసెనీపై ఫిర్యాదు దాఖలు చేశాడు. సేలం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో విపరీతంగా దెబ్బతిన్న తన వాహనాన్ని యూనియన్‌ మోటార్‌ గ్యారేజ్‌లో రిపేర్స్‌ నిమిత్తం వుంచాడు. అక్కడవుండగా గేర్‌బాక్స్‌ వంటి కొన్ని బాగాలు దొంగిలించబడినాయి. దొంగిలించబడ్డ వన్తువుల ఖరీదు సుమారు రూ.1,43,000/-లు విలువ చేస్తాయి. మద్రాస్‌ స్టేట్‌ కమీషన్‌ ఆ సోమ్మును మెయప్పున్‌కు చెల్లించమని ఆదేశించింది. అంటే గ్యారేజ్‌ యజమానులు ఎన్ని వాదనలు చేసినా చివరికి వారి బాధ్యతల నుండి తప్పించుకోలేరనే విషయం దీనివల్ల తెలుస్తుంది. మీరుకూడా వెంటనే జిల్లా ఫోరంకు పిర్యాదు చేయండి.

  1. ఎన్‌కంబరెన్స్‌ నర్జిపికెట్‌ కోసం రిజిస్టేషన్‌ అధికారులకు దరజాస్తు చేస్తే వారు సిర్టిఫికెట్‌ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. జిల్లా ఫోరంకు నివేదించి వెంటనే సర్టిఫికెట్‌ పొందగలనా?

జ. నిర్ణీత రుసుము చెల్లించి రిజిడ్టేషన్‌ డిపార్ట్‌మెంటుకు ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారు వినియోగదారుల నిర్వచనం క్రిందకు వస్తారు. ఎందుచేతనంటే ప్రతిఫలం చెల్లించి రిజిప్టేషన్‌ అధికారుల నుండీ సేవలు పొందుతున్నారు కనుక ఈ సేవలు వినియోగదారుల రక్షణ చట్ట పరిధిలోనికి వస్తాయని మద్రాస్‌ స్టేట్‌ కమీషన్‌ తీర్పునిచ్చింది. బ్రహ్మానందరావు అనే వినియోగదారుడు నురో వ్యక్తి నుండి స్థలం కొనుగోలుచేసే సందర్భంలో రిజిస్టేషన్‌ డిపార్ట్‌మెంటువారు యిచ్చిన ఎన్‌కంబరెన్స్‌ సర్జిఫికెట్లు ఆధారంగా స్థలాన్ని కొనడం జరిగింది. దరిమిలా ఆ స్థలం మరొకరికి అమ్మినట్ట్లుగా బ్రహ్మానందరావుకు తెలిసింది. అంటే రిజిస్టేషన్‌ డిపార్ట్‌మెంటువారు యిచ్చిన సర్టిఫికెట్లు వాస్తవ పరిస్థితులకు దూరంగా వున్నాయని రుజువైనది. రిజిడ్ర్రేషన్‌ డిపార్ట్‌మెంటు వల్ల ఈ

82

విధంగా భంగపడిన వినియోగదారుడు తనకు కలిగిన నష్టానికి పరిహారం యిస్పించవలసీనదిగా మద్రాస్‌ స్టేట్‌ కమీషన్‌ను ఆశ్రయించాడు. రిజిస్టేషన్‌ డిసార్ట్‌మెంటువారు స్టేట్‌ కమీషన్‌ ముందు వాదిస్తూ తమది ప్రభుత్వ శాఖ అని, సర్జిఫికెట్‌ యిచ్చినవారు ప్రభుత్వ ఉద్యోగులని, అందుచేత వినియోగదారుల కోర్టులకు ఈ ప్రభుత్వ శాఖలపై పరిధి లేదని తెలియజేసింది. ఈ వాదనపై స్టేట్‌ కమీషన్‌ స్పందిస్తూ వినియోగ్రదారుల రక్షణ చట్టానికి ప్రభుత్య, ప్రభుత్వేతర తారతమ్యాలు వుండవు. ప్రతిఫలం తీసుకుని సేవలు అందించేవారు ఎవరైనాసరే ఈ చట్ట పరిధిలోనికి వస్తారు. బ్రహ్మానందరావుకు తప్పుడు సర్టిఫికెట్లు యిచ్చి నష్టపోయేటట్లు చేశారు కనుక రూ.356,000/-లు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. " ఇదే నిధంగా మీకు సర్టిఫికెట్‌ ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు కనుక రిజిగ్హేషన్‌ డిపార్ట్‌మెంటొపై జిల్లా ఫోరానికి ఫిర్యాదు చేసి మీరు తగిన న్యాయం పొందవచ్చు.

  1. నేను ఒక కంపెనీ తయారుచేసిన సింమెంటు వల్ల చాలా నష్టపోయాను. నాణ్యతలేని సిమెంటుతో వేసిన శ్లాబు కూలిపోయింది. సిమెంటు కంపెనీ నుండి పరిహారము పోందవచ్చునా?

జ. నాణ్యవిహీనమైన సిమెంటు తయారుచేసిన కంపెనీ, అమ్మిన డీలరు వినియోగదారునికి జరిగిన నష్టానికి బాధ్యులవుతారు. కాని వినియోగదారునికి ఏవిధంగా ఫిర్యాదు చేయాలో దుష్టవ్యాపార సంస్కృతి నెలకొనిఉన్న సందర్పాలలో ఎలా తెలివిగా మసలు కోవాలో తెలియకపోవటం వలన తన నమన్యకు సరియైన పరిష్కారం కనుగొనలేకపోతున్నాడు. కేరళ స్పేటొకమీషన్‌లో బాలకృష్ణన్‌ చేసిన ఫిర్యాదు వరిశీలిస్తే సిమెంట్‌ ఉత్పత్తిదారులు, డీలర్లు ఎంత తెలివిగా తమబాధ్యతలనుంచి తప్పించుకోవటానికి ప్రయత్నంచేస్తారో విదితమవుతుంది. కర్ణాటక మినరల్స్‌ అనే కంపెనీ 'గోకుల్‌' బ్రాండ్‌తో 13! ముద్రవేసుకొని మరీ సిమెంటు విక్రయం చేస్తుంది. ఆ కంపెనీకి 'మహే' అనే పట్టణంలో సీమెంట్‌ఇండియా | అనే ఓ డీలర్‌ ఉన్నాడు. బాలకృష్ణన్‌ తన మూడంతస్తుల భవంతికి ఆ డీలరు దగ్గర్నుండి 400 గోకుల్‌ సిమెంట్‌ బస్తాలు తీసుకొని స్తంభాలు వేశాడు. సిమెంట్‌ సరిగా స్థిరపడక పోవడం వలన అనుమానమొచ్చి డీలర్‌ను సంప్రదించగా కంపెనీవారిని సంప్రదించమని సలహాయిచ్చాడు.

౬౧కి స్ట

డీలరు సలహా మేరకు బాలకృష్ణన్‌ బెంగుళూరు వెళ్ళి కర్ణాటక మినరల్‌ అధ్యక్షుడు మీనన్‌ను కలసి విషయం వివరించాడు. మీనన్‌ తాము తయారు చేసిన సిమెంటు నాణ్యత లోపాన్ని అంగీకరించి 400 బస్తాల ధర వాపసు చేస్తామని వాగ్దానం చేశారు. 1988లో మీనన్‌ డబ్బు వాపసు యిస్తామని ఉత్తరం వ్రాసినప్పటికీ 4సం॥ వరకు డీలరుకొని, కంపెనీవారు కాని డబ్బు వాపసు యివ్వలేదు. దానితో మనస్తాపం చెందిన బాలకృష్ణన్‌ కేరళస్టేట్‌ కమీషన్‌కు ఫిర్యాదు చేయగా సిమెంట్‌ ఉత్పత్తిదారు, డీలరు తమవాదనలను వక్రీకరించటం మొదలుపెట్టారు. కర్ణాటక మినరల్స్‌ వారి వాదమేమిటంటే కంపెనీ రిప్రజంటేటివ్‌ భవన నిర్మాణ స్థలాన్ని తనిఖీ చేసినప్పుడు అన్ని సవ్యంగానే ఉన్నాయి, సిమెంట్‌ నాణ్యత బాగానేఉంది అని స్టేట్‌కమీషన్‌కి తెలియచేశారు. డీలర్‌ కేవలం కేంద్రపాలిత ప్రాంతంలోనే అమ్మాల్పి ఉండగా వినియోగదారుడు ముల్గ్లూర్‌ టౌన్‌షిప్‌ నుండి పరిహారము అడగటానికి అవకాశంలేదంటూ మరో వితండ వాదం చేశారు. కాలికట్‌ ఇంజనీరింగ్‌ వారిచ్చిన టెస్ట్‌ రిపోర్ట్‌లో గోకుల్‌ సిమెంట్‌నే పరిక్షించామని వ్రాయలేదు కనుక అ టెస్ట్‌రిపోర్ట్‌ చెల్లదు అనేది మరోవాదన. డీలరుకూడా కంపెనీవారికి వత్తాసు పలకాలి కనుక అసలు వినియోగదారుడు గోకుల్‌ సిమెంట్‌నే ఆ భవన నిర్మాణానికి ఉపయోగించాడనటానికి సాక్ష్యమేమిటని ప్రశ్నవేశాడు. వినియోగదారుడు తానంతట తొనే పలురకాల సిమెంట్‌ ఉండగా గోకుల్‌ సిమెంట్‌ని ఎంపికచేసుకున్నాడు కనుక తన బాధ్యత లేదనివాదించాడు. వాద ప్రతివాదనలు విన్నస్టేట్‌కమీషన్‌ 400 బస్తాల సిమెంటొధర వాపసు చేయడమేకాకుండ సరిహారంగా రూ.41,000/- ఖర్చులకు మరోక రూ.2,500/- నెల రోజులలోప్ప చెల్లించాలని అలా చెల్లించని పక్షంలో జైలు శిక్షకు సిద్ధం కావాలని ఆదేశించింది. అందుచేత వినియోగదారుడు నాణ్యతలేని సిమెంటుక-ఉత్పత్తి దారులనుండిి పరిహారం పొందగలడు. కాని అమ్మినవారి వితండ వాదాలకు సరియైన సాక్ష్యాధారాలు కూడా సేకరించి సిద్దంగా ఉండాలి.

  1. కోర్టు. ఫీజు కట్టి కోర్డుసేవలు వినియోగించుకుంటున్నప్పుడు మరి న్యాయాన్ని అందించడానికి ఎంతో జాప్యం జరుగుతుంది కదా! ఇది సేవలలో లోపంగా వరిగణీంచి వినియోగదారుల రక్షణ చట్టాన్ని వినియోగించుకోవచ్చా?

౬కు

జ. అఖిల భారతీయ గ్రాహక్‌ పంచాయతీ అనే వినియోగ దారుల సంఘం సరిగ్గా ఇదే విషయంపై వదోద్రా జిల్లా ఫోరంలో ఒక ఫిర్యాదు వేసింది. బొంబాయి. ఫీజుల చట్ట ప్రకారం ఫీజులు వసూలు చేస్తున్నపుడు కావలసినన్ని కోర్టులు ఏర్పాటు చేసి సత్వర న్యాయం అందించాలన్ని గ్రాహక్‌ పంచాయతీవాదం. ఈ వివాదం జిల్లా ఫోరం పరిధిలోనికి వస్తుందా అనే విషయం ముందుగా వదోద్రా జిల్లా ఫోరం పరిశీలించింది. ఇటువంటి ఫిర్యాదును జిల్లాఫోరంలో చేయడానికి ఫిర్యాదీకి వున్నహక్కు నిర్వివాదాంశం

(. కనుక జిల్లా ఫోరం ఫిర్యాదును స్వీకరించింది. సివిల్‌కోర్టులలో ఫీజులు చెల్లించిన తరువాత మాత్రమే కేసులు అనుమతిస్తారు. కనుక కక్షిదారు వినియోగదారుడని, సివిల్‌కోర్టులలో విపరీతమైన జాప్యం జరుగుతుండటం వల్ల అది సేవలలోని లోపంగా పరిగణించాలని గ్రాహక్‌ పంచాయత్‌ వాదించింది. వదోద్రా జిల్లాఫోరం గ్రాహక్‌పంచాయత్‌ వాదనను అంగీకరించి జిల్లాఫోరం ఈ ఫిర్యాదు స్వీకరించవచ్చుననే తీర్పు నిన్వడంవల్ల గుజరాత్‌ ప్రభుత్వం స్టేట్‌ కమీషన్‌కు అప్పీల్‌చేసింది. అప్పీల్‌లో ప్రముఖంగా నాలుగు విషయాలు ప్రభుత్వం ప్రస్తావించింది.

  1. సివిల్‌ కేసుల పరిష్కారంలో రాష్ట్రప్రభుత్వం తనసర్వసత్తాక కర్తవ్యాన్ని న్యాయమూర్తుల ద్వారా నిర్వహిస్తుంది కనుక దీనిని ప్రతిఫలం తీసుకుని అందించే సేవలుగా పరిగణించకూడదు.

  2. సర్వసత్తాక కర్తవ్యాన్ని నిర్వహించడాన్ని వాణిజ్య వ్యవహారంగా పరిగణించరాదు.

  3. న్నాయాన్ని అందించడమనేది వినియోగదారుల రక్షణ చట్టంలోని సేవలు అందించడంగా తీసుకోరాదు.

  4. సివిల్‌కోర్టులలోని కార్యకలాపాలను శక్రమబద్దీకరించడానికి ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. క్రిమినల్‌ వ్యవహారాలలో ఎటువంటి ఫీజువసూలు చేయడంలేదు. డబ్బు చెల్లించలేని పాపర్గుకూడా సివిల్‌ కోర్టులలో ఫీజులు కట్టనవసరంలేదు. కోర్టులలో వసూలుబేసే | ఫీజులు కోర్టుల నిర్వహణకోసం వ్రభుత్వం విధించిన పన్నుగా భావించ వలసివుంటుంది.

౬85

వాదప్రతివాదనలు విన్న గుజరాత్‌ స్టేట్‌కమీషన్‌ జిల్లాఫోరం తీర్పు సరికాదని న్యాయవ్యవస్థ అందించే సేవలతో గ్రాహక్‌ పంచాయత్‌ సంతృప్తి చెందకపోతే సంబంధిత కోర్టుల ద్వారా పరిహారం పోందవచ్చు కొని వినియోగదారుల కోర్డుల ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదని అభిప్రాయపడింది. ఫిర్యాదులోని యోగ్యతాయోగ్యతలను పరిశీలించడానికి స్టేట్‌కమీషన్‌ అనక్తిని చూపించలేదు. అందుచేత కోర్టు ఫ్‌జులు చెల్లించేవారు వినియోగదారులు

1 కారు. కోర్టులు అందించే న్యాయం ప్రతిఫలానికి సమకూర్చిన సేవలుకొవు.

కనుక మీరు సివిల్‌కోర్డులో జరుగుతున్న జాప్యాన్ని జిల్లాఫోరంకు 1" ఫిర్యాదుచేయడానికి అవకాశం లేదు.

  1. పూర్తిగా డబ్బుకడితే కారు త్వరగా వస్తుందని కారు ధర పూర్తిగా తీసుకుని "తీరా కారు డెలివరీ యిచ్చేసమయానికి ధరలుపెరిగాయని మరో 12వేలు కట్టించుకున్నారు. బుక్‌ చేసుకునే సమయంలో డెలివరీ యిచ్చేరోజున ఏ ధర వుంటుందో ఆ ధర చెల్లిస్తానని సంతకం చేయించుకున్నారు. ఇది అన్యాయంకాదా? దీనిపై జిల్లాఫోరంకు ఫిర్యాదు చేయవచ్చా?

జ. డెలివరీ తీసుకునే నాటికి ఏధర వుంటుందో ఆధర చెల్లిస్తానని మీరు వ్రాతపూర్వకంగా యిచ్చారుకనుక డీలర్‌ మీ అంగీకారాన్ని కోర్డు ముందు వుంచి లాభం పొందుతాడు. మీరు ప్రత్యేకంగా అటువంటి అంగీకార పత్రం ఇవ్వక పోయినా డీలర్‌ కోటేషన్‌లో 'పెరగబోయే రేటు గురించి హెచ్చరిక వుంటుంది. అందుచేత పూర్తి సొమ్ము ముందుగా కట్టించుకున్నా డెలివరీ సమయానికి ధర పెరిగితే ఆ ధర కూడా గుంజే దుష్ట సంప్రదాయమే ఇంకా వినియోగ ప్రపంచంలో కొనసాగుతూవుంది. వినియోగదారుల నుండి ప్రతిఘటన ఎదురైతే తప్ప ఈ దుర్నీతికి అంతంవుండదు. వస్తువుల

అమ్మకపు చట్టంప్రకారం వస్తువుయొక్క పూర్తిధర బెల్లిస్తే అమ్మకం పూర్తయినట్టే. ధర తరువాత పెరిగినా ముందుగానే ఆ డబ్బు చెల్లించబడినది

కనుక పాత ధరలోనే వస్తువును ఇవ్వవలసి వుంటుంది. ఆ మేరకు గతంలో

" సివల్‌ కోర్టులు తీర్పుకూడా చెప్పాయి. కాని ఇప్పుడు కొత్తపద్దతులు

| అటోమొబైల్‌రంగంలో ప్రవేశించడం వల్ల న్యాయపరమైన ఇబ్బందులను | వ్యాపారులు అవలీలగా తొలగించుకుంటున్నారు. కారు బుక్‌ ] 'చేసినప్పటీనుండి డెలివరీ యిచ్చేవరకూ కట్టిన సొమ్ముపై నామమాత్రపు వడ్డీని చెల్లిస్తున్నారు కనుక కారు ధరను ముందుగా చెల్లించారనే అంశం

రర

మరుగున పడిపోతుంది. అందుచేత అమ్మకం పూర్తయిందనే వాదన చెల్లకుండా పోతుంది. కిషోరీశ్యామ్‌గుప్తా ఆల్ఫాఆటోమొబైల్‌ పై రాజన్గాన్‌ స్టేట్‌ కమీషన్‌లో చేసిన ఫిర్యాదు వివరాలను పరిశీలిస్తే చట్టం ప్రకారం తీర్చు ఎలావుంటుందో విశదమవుతుంది. కిషోర్‌శ్యామ్‌గుప్తా మారుతీ వేన్‌ కోసం 8.8.1989లో ఆనాటిపూర్తి ధర 98,185/-రూపాయలు చెల్లించి వేన్‌ బుక్‌చేసుకున్నాడు. తీరా డెలివరీ తీసుకునే సమయానికి 7000/- రూపాయలు ధర పెరిగింది. పెరిగిన ధర చెల్లించడం వల్ల మనస్తాపం కలిగిన శ్యావుగుప్తా డగ్పేట్‌కమీవనొకు విర్యాదు చేసాడు.. పూర్తిపరిశీలనానంతరం స్టేట్‌కమీషన్‌ ఫిర్యాదు కొట్టివేస్తూ మారుతీడీలర్‌కు, 'మారుతీకంపెనీకి ఖర్చులనిమిత్తం వెయ్యిరూపాయలు వినియోగదారుడు చెల్లించాలని ఆదేశించింది.

  1. నేను అపార్జిమెంట్‌ కోసం బిల్డర్‌కు పూర్తి సోమ్ము చెల్లించినా వాగ్ధానం చేసిన తేదీకి అపార్ట్‌మెంట్‌ స్వాధీన పరచలేరు. జిల్లాఫోరంకు పిర్యాదు చేయవచ్చా?

జ. అపార్ట్‌మెంట్‌ స్థిరాస్థి కనుక భూమి, భవనాలకు సంబంధించిన వివాదాలు వినియోగదారుల రక్షణ చట్టపరిధి క్రిందకు రావు కనుక మీ సమస్యను జిల్లాఫోరంకు నివేదించవచ్చునా అనే ప్రశ్న మీకు కలగడం సమంజసమే. 1986లో చట్టం చేసిన తరువాత మూడు సార్లు వినియోగదారుల రక్షణ చట్టానికి సవరణలు చేయడం జరిగింది. 1993లో చేసిన సవరణల ద్వారా గృహ నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈ చట్టపరిధి లోనికి తేవడం జరిగింది. బిల్హర్‌ మీవద్ద సొమ్ముతీసుకుని అపార్ట్‌మెంట్‌ కట్టిస్తున్నాడు కనుక ప్రతిఫలం తీసుకుని తనసేవలను అందిస్తున్నాడు. అ సేవలలో లోపం వున్నపుడు వినియోగదారుల రక్షణచట్టాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇదే విషయాన్ని కర్ణాటక స్టేట్‌కమీషన్‌ తీర్చు ధృవీకరిస్తుంది. గ్రుమ్‌ సజనాని అనే విదేశాలలో నివశిస్తున్న భారతీయుడు బెంగళూరులో సిరపడాలని రెంకాడెవలపర్స్‌ అనే గృహ నిర్మాణ సంస్థతో ఒక అపార్ట్‌మెంట్‌ కొనుక్కోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. 5,60,000రూపాయలు ఖరీదు చేసే ఆ అపార్ట్‌మెంట్‌ నిర్ణయించిన సమయానికి ఇవ్వకపోవడం వల్ల ఆ సొమ్ముపై అపార్డ్‌మెంట్‌ స్వాధీనపరిచే వరకూ 18%వడ్డీ ఇవ్వాలని స్టేట్‌కమీషన్‌ ఆదేశించింది.

ర్రి7

  1. వాడినదానికంటే అధికంగా టెలిఫోన్‌ బిల్‌వచ్చిందని డిపొర్ట్‌మెంటుకు "ఎన్నిసార్లు తెలియజేసినా సమాధానం వ్రాయకపోగా బిల్లు కట్టలేదని టెలిఫోన్‌ కటొ చేసారు. నేనేంచేయాలో తెలియజేయండి.

జ. అధికమొత్తంలో వచ్చిన టెలిఫోన్‌ బిల్‌ గురించి వినియోగదారుడు ఫిర్యాదు చేసినా ఆ ఫిర్యాదు పట్టించుకోకుండా టెలిఫోన్‌ డిస్కనెక్ట్‌ చేస్తే అది న్యాయసమ్మతం కాదని సంతోష్‌సింగ్‌ కేసులో షిల్లాంగ్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇదే విధంగా ఢీల్లీ్‌హైకోర్డులో వి.పి. మెహతా మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ పై కేసువేసినప్పుడు నోటీసు ఇవ్వకుండా టెలిఫోన్‌ డిస్కనెక్ట్‌ చేయడం సబబుకాదని తీర్పునిచ్చింది. టెలిఫోన్‌ బిల్లు బకాయి పడితే ముందుగా 443 నిబంధన ప్రకారం వినియోగదారునికి నోటీసు ఇవ్వాలి.

  • టెలిగ్రాఫ్‌ చట్టం సెక్షన్‌ 7 పరిధి లోనికి వచ్చే మీటర్‌ రీడింగ్‌ అధికంగా వచ్చే బిల్లుల విషయం 'పై కూడా వినియోగదారుల కోర్టులకు అధికారంవుంటుందని జాతీయకమీషన్‌, రాష్ట్రకమీషన్‌లు చాలా సందర్భాలలో తీర్పునిచ్చాయి. శ్రీమతి జసోనా దేవి లకోటియా తన టెలిఫోన్‌కు వాడకానికి మించి బిల్లులు వస్తున్నాయని టెలిఫోన్స్‌ డివిజినల్‌ ఇంజనీరుకు లెటర్స్‌ వ్రాసింది. ఎప్పుడూ రూ.600/-కు మించకుండా వచ్చేబిల్లులు జూన్‌ 1991లో రూ.5073/- అక్టోబర్‌లో రూ.14,671/-, నవంబర్‌లో రూ.10,216/-, డిశంబర్‌లో రూ. 2382/- లకు బిల్లులు రావడంతో కంగారుపడిన శ్రీమతి లకోటియా ఎన్నో లెటర్స్‌ వ్రాసినా ప్రయోజనం కనిపించలేదు. డిశంబరులో ఆమె లెటర్చ్‌కు ఏ సమాధానం వ్రాయకుండానే టెలిఫోన్‌ డిస్‌కనెక్ట్‌ చేసారు. అదీ చాలదన్నట్లు టెలిఫోన్‌ కట్‌చేసిన తరువాత కూడా రూ.50,000/- బిల్లు పంపించారు. శ్రీమతి లకోటియా కలకత్తా జిల్లా ఫోరంలో ఫిర్యాదుచేస్తే తగాదాలో వున్న అన్నివిల్లులు రూ.600/- కు మించకుండా తయారు చేసి వారం రోజులలో వినియోగదారురాలికి పంపించాలని, అబిల్లులు వినియోగదారురాలు వారం రోజులలో బెల్లించాలని తీర్పునిచ్చింది. ఆతీర్పును టెలిఫోన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అమలు పరచకపోవడంతో డివిజనల్‌ ఇంజనీరును వ్యక్తిగతంగా జిల్లాఫోరం ముందు హాజరుకావాలని ఆదేశించింది. జిల్లాడివిజనల్‌ ఇంజనీరు ఫోరం ముందు హాజరుకాకుండా పశ్చిమబెంగాల్‌ స్టేట్‌ కమీషన్‌కు అప్పీల్‌చేసాడు. స్టేట్‌ కమీషన్‌ కేసు విచారించి టెలిఫోన్‌ డిపార్ట్‌మెంట్‌ ఏక పక్షంగా వ్యవహరించిందని,

సమాజ న్యాయ సూత్రాలకు భిన్నంగా వ్యవహరించి, చట్ట వ్యతిరేకంగా విధులు నిర్వహించారని విమర్శించింది. ఎక్కువగొ వచ్చిన 5 బిల్లులు ఒక్కొక్కటి 600 రూపాయలకు మాత్రమే తయారుచేయాలని, వెంటనే టెలిఫోన్‌ కనెక్ట్‌ చేయాలని వినియోగదారురాలు వారం రోజులలో బిల్స్‌ చెల్లించాలని ఆదేశించింది.

  1. వ్యక్తిగతమైన కక్షవల్ల నా వవర్‌ కనెక్షన్‌ ఏదోకుంటి సాకుచూపి ఎలక్టిసిటీబోర్డులో పనిచేస్తున్న ఒక ఇంజనీరు కటొచేయించాడు. ఆ ఇంజనీరు నాకు నష్టపరిహారము చెల్లించేలా జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చా? ఈ వ్యవహారంలో ఎలక్టిసిటీబోర్డు తప్పులేదు?

జ. సాధారణంగా ఏ సంస్థవల్లనైతే వినియోగదారుడు నష్టపోతాడో ఆ సంస్థనే ప్రతివాదిగా ఫిర్యాదులో సేర్కొనవలసి వస్తుంది. లేకుంటే తీర్పునిచ్చేటప్పుడు లేదా తీర్చు అమలు పరుస్తున్నప్పుడు సాంకేతిక కారణాలవల్ల సంబంధం | లేని వ్యక్తులను ప్రతివాదులుగా ఫిర్యాదులో పేర్కొంటే కొన్ని సమస్యలు తలెత్తుతాయి. కరెంట్‌ కనెక్షన్‌ విషయంలో వినియోగదారునిక్షీ ఎలక్ట్రిసిట

*బ్చోర్దుతో ఒప్పందం వుంటుంది కొని దాని ఉద్యోగులతో వుండదు కదా. అందుచేత నంన్గ్ధనే వతివాదిగా (00001519 ౧2గ్భ0) పేర్కొంటే వినియోగదారునికి సులభతరంగా వివాదం పరిష్కారమవుతుంది. ఇటువంటి వివాదమే మధ్యప్రదేశ్‌ స్టేట్‌ కమీషన్‌లో విచారణ జరిగింది. రాజ్‌కుమార్‌ అనే వినియోగదారుడు 1980లో తన'పేర అద్దె యింటిలో కరెంటు కనెక్షన్‌ పొందాడు. దరిమిలా ఆయింటికి తానే స్వంతదారుడైనాడు. కాని అతని ప్రక్కయింట్లో నివసిస్తున్న మనోజ్‌కుమార్‌తో ఇతనికి సత్సంబంధాలు లేకపోవడంవలన ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంజనీర్లుతో కుమ్మక్కయి రాజ్‌కుమార్‌ కరెంటు కనెక్షన్‌ తీసివేయించాడు. మనోజ్‌కుమార్‌నుండి సమ్మతిపత్రం తీసుకొని పంపించకపోతే కరంటు సప్లయి నిలిపివేస్తామని ఎలక్ట్రిసిటీ బోర్డు హెచ్చరించింది. మనోజ్‌కుమార్‌కు, తన యింటి కనెక్షన్‌ కు ఏమాత్రం సంబంధం లేదని రాజ్‌కుమార్‌ మొత్తుకున్నా కరెంటు తీసివేశారు. దీనితో మనస్తాపం చెందిన రాజ్‌కుమార్‌ సాగర్‌ జిల్లా ఫోరం లో ఫిర్యాదు చేస్తూ కనెక్షన్‌ తొలగించటానికీ బాధ్యులయిన ఇంజనీర్లను మాత్రమే ప్రతివాదులుగా చేర్చాడు. జిల్లా ఫోరం తీర్పునిస్తు ఈ అక్ర డిస్కనెక్షన్‌కు కిషన్‌లాల్‌ గుప్తా అనే ఇంజనీర్‌ బాధ్యుడు కనుక కరెంటు సరఫరా తొలగించిన రోజు

రి

నుండి పునరుద్దరించే వరకు వినియోగదారునికి రోజుకు రూ.100/- పరిహారంగా చెల్లించమని ఆదేశించింది. అంతేకాకుండా ఖర్చుల నిమిత్తం వినియోగదారునికి రూ.500/- ఎలక్ట్రిసిటీ బోర్డుకు రూ.500/- చెల్లించాలని ఆదేశించింది. జిల్లా ఫోరం తీర్పుపై కిషన్‌లాల్‌గుప్తా మధ్యప్రదేశ్‌ స్టేట్‌ కమీషన్‌కు అప్పీలు చేశాడు. వాదోపవాదాలు విన్నస్టేట్‌ కమీషన్‌ వినియోగదారునికి ఎలక్టిసిటీ బోర్డునే ప్రతివాదిగా వినియోగదారుడు పేర్కొనటం సమంజసంగా ఉంటుంది. అంతేకాని ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగస్తుల పై ఫిర్యాదు చేయటానికి అవకాశం ఉండదు అని తీర్పునిచ్చింది. - వినియోగదారుని విద్యుత్‌ సరఫరా అక్రమంగా నిలిపివేసినందుకు రూ.500/ పరిహారం చెల్లిస్తే చాలునని ఆదేశించింది. ఈ వివాదంలో ఈ కోర్టుతీర్చు ఈ విధంగాఉండగా మరో వివాదంలో ఉద్యోగస్తులను వివాదంలో చేర్చనప్పటికి ఉద్యోగస్తుల నిర్లక్ష్యం వల్లనే ఇటు సంస్థకు అటు వినియోగదారునికి నష్టం వచ్చింది కనుక ఆ ఉద్యోగస్తులే వ్యక్తిగతంగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని మరో సంచలనాత్మక తీర్చు కూడ వెలువడింది. ఫిర్యాదు చేసేటప్పుడు ఆ ఫిర్యాదులోని అంశాల బలాన్ని బట్టి వ్యక్తిగతంగా ఉద్యోగస్తులను బాధ్యులను చేయవచ్చా లేదా అనేది తెలుస్తుంది.

  1. జిల్లాఫోరం తీర్పుపై స్టేట్‌ కమీషన్‌కు అప్పీలు చేస్తూ జిల్లా ఫోరం తీర్పు ఫోటోస్తాట్‌ కాపీ జతపరిచాము కాని సర్దిసైడ్‌ కాపీనే జతపరచాలని అంటున్నారు ఇప్పుడు మా అప్పీలు ఏమవుతుంది?

జ. వినియోగదారుల రక్షణ చట్టంలో 15వ సెక్షన్‌ క్రింద అప్పీలు చేసుకున్నప్పుడు ప్రతి మెమొరాండంకు జిల్లా ఫోరం తీర్పు సర్దిసైడ్‌ కాపీని జత పరచ వలసి ఉంటుంది. ఢిల్లీ వినియోగదారుల రక్షణ నిబంధనలోని 8 (3) నిబంధన ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. అందుచేత ఫోటోస్టాట్‌ కాపీ జతపరిస్తే ఆ అప్పీలు చెల్లదు. అందుచేత మీరు వెంటనే స్టేటొకమీషన్‌కు ఈ విషయాన్ని తెలియజేసి జిల్లా ఫోరం తీర్చు సర్టిఫైడ్‌ కాపీని పంపించటానికి అనుమతి తీసుకోండి. నరేంద్రకుమార్‌ అనే వినియోగదారుడు మునిసిపల్‌ కార్పోరేషన్‌ సప్లయి చేన్తున్న అపరిశుభ్ర నీటివలన తన కుంటుంబ సభ్యులు అనారోగ్యానికి గురి అయినారని వైద్యం నిమిత్తం రూ.3,000/- ఖర్చు అయినదని తనకు నష్టపరిహారం ఇప్పించమని ఢిల్లీ జిల్లా ఫోరంను

౬౭౦

అర్ధించాడు. మురికిగా ఉన్న ఆ నీటిని చూసి జిల్లా ఫోరం వినియోగదారునికి నష్టపరిహారం మునిసిపల్‌కార్పోరేషన్‌ చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఢిల్లీ స్టేట్‌ కమీషన్‌కు అపీలు చేసుకుంది. మెమొరాండంతో పాటు జిల్లా ఫోరం తీర్పు ఫొటోస్టాట్‌ కాపీ జత పరచటం వలన ఈ పరిస్థితి ఉత్పన్నమయింది. సర్టిఫైడ్‌ కాప్‌ జతపరచకపోతే ఆ అపీలు సరియైనదిగా పరిగణించలేము కనుక అపీలుని కొట్టివేస్తున్నామని తీర్పు నిచ్చింది. రూ.1000/- పరిహారం చెల్లించాలని జిల్లా ఫోరం ఇచ్చిన . తీర్పు సరియైనదేనంటూ ఖర్చుల క్రింద ఢిల్లీ మునిసిపల్‌ కార్పోరేషన్‌ మరో రూ.500/- వినియోగదారునికి చెల్లించాలని స్టేట్‌కమిషన్‌ ఆదేశించింది. 95. వినియోగదారుని కిచ్చే సరిహారం ఎంత తగ్గించాలా అనే దుష్ట ఆలోచన చేసే ఇన్సూరెన్స్‌ కంపెనీపై విసుగుచెంది ముందుగా వారిచ్చింది తీ సేసుకొని తరువాత దావా వేద్దామనే ఉద్దేశ్యంతో డబ్బు పూర్తిగా ముట్టినట్లు వ్రాసిచ్చాను. హీనపక్షంగా ఎంత రావాలో అంత మాత్రమే యిచ్చి నాకు ఇన్సూరెన్స్‌ కంపెనీ అన్యాయం చేసింది కనుక జిల్లా ఫోరంకు ఫిర్యాదుచేయవచ్చా? జ. విజయవాడలోని “కర్ణాటకస్తోర్స్‌” అనే వస్త్రవ్యాపారి 1988లో జరిగిన అల్లర్లలో సర్వం కోల్పోయి ఇన్సూరెన్స్‌ కంపెనీకి పరిహారం కోసం దరఖాస్తు చేసిన సందర్భంలో మీకు కలిగిన అనుభవమే వారికి కలిగింది. నష్టపోయిన అస్తి విలువ అంచనా వేయడానికి నియమించబడిన మొదటి సర్యేయరు రూ.9,68,000/-గా అంచనా వేస్తే రెండవ సర్వేయరు రూ.6,00,000/-గా అంచనా వేయడం జరిగింది. మూడవ సర్వేయరు రిపోర్టులో రూ.4,80,000/- గా నిర్ణయించడమైనది. యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ కర్ణాటక స్టోర్స్‌కు చివరి సర్వేయరు రిపోర్టు ప్రకారం పరిహారం చెల్లించింది. మొదటి సర్వేకు చివరి సర్వేకు నష్టం అంచనా వేయడంలో సగానికి సగం తేడా ఉండటంతో కర్ణాటకస్లోర్స్‌ వారు అంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కమీషన్‌ను మరో రూ.4,77,000/- పరిహారంగా కోరారు. ఈ సందర్భంలో జాతీయ కమీషన్‌లో పరిశీలనకు వచ్చిన 0..1[0.44/89 వివాదాన్ని ప్రస్తావన చేయటం జరిగింది. ఫిర్యాదీ స్వదస్తూరీతో తనకు రావలసిన సొమ్ము పూర్తిగా ముట్టిందని, వివాదం పరిష్కారం అయిందని వాసి యిచ్చినప్పుడు తిరిగి అదేవ్యక్తి వివాదం లేవదీయటం సబబుకాదు. ఒకవేళ ఇన్సూరెన్స్‌ కంపెనీ వాళ్ళు బలవంతం చేయటం వల్లనో మరే ర]

విధంగాననై ఒత్తిడి చేయటం వల్లనో ఫిర్యాదీని అంగీకరించేటట్లు చేస్తే అది సేవలలోని లోపం మాత్రమేకాకుండా ఆ ఇన్సూరెన్స్‌ కంపెనీ మోసానికి కూడా పాల్పడినట్లు భావించాల్సి ఉంటుంది. అందుచేత వినియోగదారుల కోర్టులో కాకుండా సంబంధిత కోర్టులో ఈ విషయము పరిష్కరించుకోవలసి ఉంటుంది అని జాతీయ కమీషన్‌ తీర్పునిచ్చింది. ఆ తీర్సు ననుసరించి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కమీషన్‌ కర్ణాటక స్టోర్స్‌ ఫిర్యాదు కొట్టివేస్తు ఫిర్యాదీ ఇన్సూరెన్స్‌ కంపెనీతో తన వివాదం సమసిపోలేదని భావిస్తే సివిల్‌ కోర్టుల ద్వారా వివాదొన్ని పరిష్కరించు కోవచ్చునని సూచించింది. అందుచేత ఇన్సూరెన్స్‌ వారిచ్చే పరిహారం మీకు ఆమోదయోగ్యం కాకపోతే సాటిస్‌ పేక్షన్‌ ఓచరు కాని, పూర్తి పరిష్కార పత్రం కాని సంతకం చేయకూడదు. అలాచేస్తే మీ అంతట మీరే అంగీకారానికి వచ్చినట్లు కోర్టులు భావిస్తాయి.

  1. ఓ హౌసింగ్‌ పైనాన్స్‌ కార్సోరేషన్‌లో కొంత సొమ్ము డిపాజిట్‌ చేసాం. అలా చేస్తే ఇల్లు కట్టుకోవడానికి ఫైనాన్స్‌ ఇస్తామన్నారు. తీరా కట్టవలసిన డబ్బు కట్టిన తరువాత ఫైనాన్స్‌ ఇవ్వడానికి చాలా షరతులు పెడుతున్నారు. జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చునా?

జ. ఏదైనాట సంస్థలో ఎవరైనా డబ్బు చెల్లించినప్పుడు వారిద్దరి మధ్య ఏర్పడే సంబధం ఎటువంటిది డబ్బు చెల్లించేవారు వినియోగదారులు అవుతారా అనే విషయాలపసైనే వివాదం చెలరేగితే వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోనికి వస్తుందా, రాదా అనే విషయం నిర్ణారణ జరుగుతుంది. ఉదా: 'షేర్గలో డబ్బు పెట్టినవారు వినియోగదార్లయితే డిబెంచర్ల రూపేణా పెట్టిన వారు బుణదాతలవుతారు. వ్యవహారాన్ని బట్టి వినియోగదారుడు అనే నిర్వచనం క్రిందకు ఫిర్యాదీ వస్తాడా అనేది విశదమవృతుంది. ఒక ప్రత్యేకమైన ఒప్పందం వలన ఒక సంస్థలో మీరు డబ్బు డిపాజిట్‌చేసి అలా డిపాజిట్‌ చేసినందుకు ప్రతిఫలంగా వారినుండి ఏదైనా సహాయం

ఆశిస్తే ఆ సందర్భాన్నిబట్ట్‌ మీరు వినియోగదారులు కాదు. జగదీష్‌ వెవాతా అనేవ్యక్తి “104% గ౦౮౩11౮ ౦౯/౯౬౦౧1౬1౫7 0౦౦గ౧౯౦|41101వారి పై రాజస్థాన్‌ స్టేట్‌కమీషన్‌లో దాఖలుచేసిన ఫిర్యాదు మీరు చెప్పినటువంటి వివాదానికి సంబంధించినటువంటిదే. మా సంస్థలో (9౭2

డబ్బు పెట్టుబడి సెట్టీన వారికి బుణాలిస్తామని పై సంస్థ ప్రచారం చేయడంతో జగదీష్‌ మెహతా రూ.1,65,000/- డిపాజిట్‌ చేసారు. అయిదులక్షలు బుణమివ్వడానికి ఆ సంస్థవారు అంగీకరించారు. ప్రొసెసింగ్‌ చార్జెస్‌గా రూ.4,000/- అడ్మినిధ్టేటివ్‌ ఫీజుగా రూ.5,000/- వసూలు చేసి బుణాన్ని యివ్వలేదు. దానితో మనస్తాపం చెందిన జగదీప్‌మెహతా ఐదు లక్షల బుణమైనా ఇప్పించండి లేదా నేను కట్టిన డబ్బును వడ్డీతో సహా యిప్పించి రూ.50,000/- నష్టపరిహారం క్రింద రూ.10,000/- ఖర్చులక్రింద ” ఇప్పించమని ప్రార్ధించాడు. నిషయాలు పరిశీలించిన తర్వాత ఫిర్యాది వినియోగదారుడు కాదని ఫిర్యాదీకి, ప్రతివాదికీ మధ్య బుణదాత, బుణగ్రస్థుల సంబంధమే ఉంది కనుక ఇది వినియోగదారుల రక్షణ చట్ట పరిధిలోనికి రాదని రాష్ట్ర కమీషన్‌ స్పష్టము చేసింది. ఫిర్యాదీ కోరినట్టుగా బుణాన్ని యివ్వమని ఆ సంస్థని ఆదేశించే అవకాశం వినియోగదారుల రక్షణ చట్టం సెక్షన్‌14(1) లేదని రాష్ట్రకమీషన్‌ స్పష్టం చేసింది. అందుచేత మీరు మీ వివాదాన్ని సివిల్‌కోర్డు ద్వారా పరిష్కరించు కోవలసి ఉంటుంది.

  1. మేము డిపొజిట్‌లు కట్టిన కంపెనీని చట్టప్రకారం ఖాయిలా పరిశ్రమగా డిక్లేర్‌ చేసారు. మరి మాకు తిరిగి రావలసిన డిపాజిట్ల విషయంలో జిల్లా ఫోరం నుండి న్యాయం పొందవచ్చునా?

జ. స్టాండర్డ్‌ 20 వ్యాన్‌ కొనాలనే ఉద్దేశ్యంలో 'అతిధన్‌ అనే వ్యక్తి లక్ష్మీవిలాస్‌ బ్యాంకు నుంచి లోను తీసుకుని స్టాండర్దు మోటార్స్‌ వారికి రూ.1,46,580/- చెల్లించాడు. ఎంతకూ వ్యాన్‌ డెలివరీ అవకపోవటం వలన వినియోగదారుడు కంపెనీకి లెటరు వ్రాస్తే ఆ కంపెనీ మూత పడిందని సమాధానం వచ్చింది. మద్రాసు స్టేట్‌ కమీషన్‌లో తానుకట్టిన డబ్బు వాపను యిప్పించవలసిందిగా మరియు రూ.20,000/- నష్టపరిహారంగా ఇప్పించవలసినదిగా అతిధన్‌ అర్ధించాడు. రాష్ట్ర కమీషన్‌ పూర్తి విచారణ జరిపిన పిమ్మట ఫిర్యాదును కొట్టివేసింది. అయినప్పటికి తన తీర్పులో స్టాండర్డ్‌ మోటార్స్‌ ఖాయిలా పరిశ్రమగా ప్రకటించారు గనుక ఆ గడువు పూర్తయిన సిమ్మట వినియోగదారుడు చెల్లించిన సొమ్మును వాపసు చేయాలని ఆదేశించింది. జాతీయకమీషన్‌ ఈ తీర్చుతో ఏకీభవించక ఖాయిలా పరిశ్రమల చట్టం 1985 సెక్షన్‌ 22(3)(0) ప్రకారం హక్కులు, విశేషాధికారాలు, బాధ్యతలు, బుణాలు ఏవైనా ఖాయిలా పరిశ్రమగా

9

ప్రకటించిన తరువాత గడువు తీరే వరకు వ్యవహారాలేమీ జరగవు. ఆవిధంగా స్టాండర్డ్‌ మోటార్స్‌ కంపెనీ వినియోగదారుని వద్ద తీసుకున్న అడ్వాన్సు తిరిగి చెల్లించటానికి అవకాశం ఉండదు. అందుచేత వ్యాపార దక్షత లేని పరిశ్రమలలో సెట్టుబడి పెట్టినా, అడ్వాన్స్‌లిచ్చినా అవి ఖాయిలా పరిశ్రమగా గుర్తించబడితే వినియోగదారునికి కష్టాలు ప్రాంభమయినట్లే.

  1. నా పట్టుచీర రూ.10,000/- ఖరీదు చేసేది లాండ్రీకి వేసాను. అది. లాండ్రీలో పోయినది. చీరైనా యివ్వండి లేదా చీర ఖరీదైనా ఇవ్వండి అని అడిగితే మా రూల్స్‌ ప్రకారం బిల్లులో ఉదహరించిన మొత్తంపై పదిరెట్లు మాత్రమే ఇస్తామంటున్నారు. బిల్లులో వారు చీర డైక్లీనింగ్‌కు 10రూ॥లు మాత్రమే వ్రాశారు. అంటేనాకు వందరూపాయలు ఇస్తారన్నమాట. ఇదెక్కడి న్యాయం ఇప్పుడు నేనేమి చేయాలి?

జ. మీ పట్టుచీర ఖరీదుతో నిమిత్తము లేకుండ తన బిల్లులో చూపిన సొమ్ముకు పది రెట్లు యిస్తానని ఏక పక్షంగా లాండ్రీ వారు నిర్ణయించడం సబబు కాదు. జిల్లా ఫోరంలో జరిగిన నష్టానికి పరిహారం యిస్తారు కాని వ్యాపారస్తుడు బిల్లులో వ్రాసిన నిబంధనలకు ప్రాముఖ్యత ఉండదు. ఆ నిబంధనలకే ప్రాముఖ్యత యిస్తే చట్టం వినియోగదారుణ్ణి రక్షించలేదు. ఏకపక్షంగా వ్రాయబడిన ఈ నిబంధనలు ఎలా వుంటాయంటే ఒకసారి అమ్మిన వస్తువులు తిరిగి తీసుకొనబడవు, బిల్లులో తప్పులు దొర్లినయెడల “తూచ్చి!

ఫలానాకోర్టులోనే చూసుకుందాము, మా గ్యారేజిలో వాహనాన్ని మీ భాద్యతపై పెడుతున్నారు, తుది నిర్ణయం మాదే వంటి ఎన్నో అసంబద్ద నిబంధనలు ఏక పక్షంగా బిల్లులో చోటు చేసుకుంటాయి. పట్టుచీర ఉతకడానికి మహా అయితే రూ.10/- చార్జీ చేస్తారు కాబట్టి లాండ్రీవాళ్ళు రూ.10/- లకు బిల్లు వ్రాస్తారు. ఒకవేళ ఆ పట్టుచీర పోతే ఆ బిల్లులో సూచించినట్లుగా పదిరెట్లు అంటే కేవలం రూ.100/- మీ పదివేలకు పరిహారంగా చెల్లించి చేతులు దులిపేసుకుంటారన్నమాట. ఇటువంటి నిబంధనను బట్టీ వ్యాపారస్తుడి ఆలోచనాసరళిని వినియోగదారుడు (గ్రహించగలిగినప్పుడు మరింత సుఖవంతమైన వినియోగ జీవనం గడపగలడు. మీరు వెంటనే జిల్లా ఫోరంకు ఫిర్యాదు చేసి లాండ్రీవారు మీకు కలిగించిన నష్టానికి తగిన పరిహారం పొందండి.

94

  1. ఫిర్యాదీ పొరపాటు కూడా ఉంటే జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చా?

“జ. తప్పు తన దగ్గర పెట్టుకొని కోర్టుల్లో ప్రతీకారం తీర్చుకొందామని ఆలోచిస్తే

అది మంచి పద్ధతి కాదు. " మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్లు'గా , ఉంటుంది. రాష్ట్ర కమీషన్‌ వెలువరించిన కొన్నితీర్సుల్లో ఈ విషయం ప్రముఖంగా ప్రస్తావించబడింది. వినియోగదారుడు సత్యవర్తనతో జిల్లా ఫోరం ముందుకు రావలసి ఉంటుంది అనేది[,ఆ తీర్పుల సారాంశం.

అమిక్‌సింగ్‌ అనే ఓ మినీ లారీ ఓనరు యునైటెడీ, ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ పై పంజాబు స్టేట్‌ కమీషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదు లో ఈ విషయం స్పష్టమయ్యింది. ప్రమాదానికి గురయిన తన లారీని గుట్టు చప్పుడు కాకుండా రిపేరు చేయించి రూ.135,000/- రిపేర్ల నిమిత్తం, మరో రూ.1,20,000/- పరిహారం నిమిత్తం యిప్తించవలసిందిగా కోరాడు. అతి ముఖ్యమైన విషయాలను రాష్ట్రకమీషన్‌ దృష్టికీ రాకుండా దాచిపెట్టాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ మినీ లారీలో 30నుండి35 మంది ప్రయాణీకులున్న విషయం రాష్ట్ర కమీషన్‌ ముందు దాచిపెట్టడంతో విషయాలను తన నుంచి దాచిపెట్టినందంకు | తప్పు వడుతూ వినియాగదారుడు తనలోపం లేకుండా నిజాయితీతో వ్యవహరించాలని హెచ్చరించింది.

  1. జిల్లా ఫోరం తీర్పుపై హైకోర్టుకు అపీలు చేయవచ్చా?

జ. అనంతపురం జిల్లా ఫోరంలో "0౬21461 6౧౩౩. ౪0" పై వి.వి. చౌదరి చేసిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. చౌదరి రూ.29,000/- అడ్వాన్సు డి.డి. రూపంలో పంపించి వారిని మెషీన్స్‌ సప్తై చేయమని కోరాడు. ఇంజనీరింగ్‌ వర్క్‌ వారు యంత్రాలను నస్పైచేయటంలో విఫలమయినందుకు జిల్లా ఫోరంలో ఫిర్యాదు దాఖలయ్యింది. జిల్లాఫోరం తీర్చునిస్తూ వడ్డీతో వినియోగదారుడు కట్టిన డబ్బు వాపను చేయటం కాని లేదా పాత రేట్లలో యంత్రాలను సప్పై చేయటం కాని చేయమని అదేశించింది. 'పైగారూ.10,000/- పరిహారం కూడా ఇవ్వమని తీర్పునిచ్చింది. జిల్లాఫోరం తీర్చుపై ఇంజనీరింగ్‌ వర్క్స్‌ వారు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో రివిజన్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం చౌదరి మరియు ఇంజనీరింగ్‌ వర్క్స్‌ వారి మధ్య కుదిరిన ఒప్పందం ఉల్లంఘించడం వల్ల

కసా

తలెత్తిన వివాదం కనుక ఇది సివిల్‌ కోర్టులలో పరిష్కరించు కోవలసిన విషయం అని సపయర్సు హైకోర్టులో వాదించారు. రివిజన్‌ పిటీషన్‌ "'హైకోర్డు ఆమోదించ వచ్చునా, అనే అంశంపై పరిశీలన జరిపి భారతరాజ్యాంగంలో 227 అధికారం ప్రకారం ట్రిబ్యునల్‌ తీర్పుపై హైకోర్టు పరిశీలన జరుపవచ్చును. జిల్లాఫోరంలు ట్రిబ్యునల్స్‌ కనుక, వాటి తీర్పును పునఃపరిశీలించే అధికారం 'హైకోర్ట్డుకుంటుంది అని తీర్పునిచ్చింది. దీనిని బట్టీ జిల్లాఫోరం తీర్పుపై రాష్ట్రకమీషన్‌కే కాకుండా హైకోర్టుకు కూడా వెళ్ళవచ్చును. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం జిల్లాఫోరం తీర్పుపై “| రాస్త్రకమీషన్‌కే అపీలు చేసుకోవాలి. కొని జిల్లాఫోరం తీర్పుపై రివిజన్‌పిటీషన్‌ హ్రాకోర్డులో దాఖలు చేసుకోటానికి ఈ తీర్పు అవకాశం ఇస్తుంది. జిల్లా ఫోరంలలో రివిజన్‌ పిటీషన్‌ వేసుకోవటానికి అవకాశం ఉండదు. చసత పాలాలంు శ గ (1 1కి వా క జబ ళా జ (్ర్ర స్టో సైపాల అాబగాబార్‌ 59 ౭6

య్‌ ఫి సా టం! ల | అంకితం . సహనానికి, సేవాభావానికి ప్రతీక నా సోదరుడు | వెంకట మహేశ్వర రామ జోగయ్య, వృత్తిరీత్యా _ "ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ శాఖలో ఇంజనీరు. | ప్రవృత్తిరీత్యామానవ సంబంధాలుపెంపొందించు 1 .! కోవాలనే తపన కలవాడు. అతనిలా నేనూ వుంటే గే బాగుండును అని అనిపించేటంతసహృదయుడు. తమ్ముడు కనుక ఇంతకంటే ఎక్కున పొగడ్తలు ్ర చేయలేక ప్రేమానురాగాలతో ఈ రచనను అతనికి శ న! | ఆలి స ' _ అంకితం యిస్తున్నాను. | బళంకరయయడుంకంరండండుడంకడనంు కుడు కాండే మం నుం

| , ళ్‌ || యజ్షైయే క్‌ . . జ. శే 1% అందమైన వినియోగ జీవనం కోసం ప్రతి వినియోగదారుడు సమాచారాన్ని ౧ (అందుకోవడం, వినియోగ విషయాలపై విజ్ఞానాన్ని సంపాదించుకోవడం తప్పనిసరి. || 1 అవగాహన లేకపోవడం వల్ల మోసాలకు, నపష్పాలకు గురికావలసి వస్తుంది. || “వినియోగదారుడు రాజు” కావాలంటే శక్తివంతంగా వుండాలి. విజ్ఞానం వల్లనే శక్తి [1 1 కలుగుతుంది. అటువంటి విజ్ఞానాన్ని సమకూర్చే ప్రయత్నమే ఈ రచన. | ప్రశ్నించడం అలవాటు చేసుకున్నప్పుడే అవగాహన చేకూరుతుంది. ఇందులో... |) | | ))] (1... 1 "వినియోగదారుల రక్షణచట్ట పరంగా వచ్చే పలు సందేహాలు - అంటే గ్ల . వినియోగదారుడంటే ఎవరు, అతనికి గల హక్కులేమిటి, నిర్వర్తించవలసిన | 1 బాధ్యతలు, హక్కుల పరిరక్షణార్ధం నెలకొల్పబడిన న్యాయ వ్యవస్థ - దాని ))) || పనితీరు, ఫిర్యాదు ఎలా చేయాలి, అప్పీలు ఎలే చేయాలి అనే పలు సందేహాలకు [1 1, సమాధానాలు లభిస్తాయి. ))) 1 ))| 1 అంతేకాదు... | గ. 1 1. ॥ (॥ ప్రజా పంప్తిణీ వ్యవస్థ, గ్యాస్‌, జీవిత భీమ, రైళ్ళు, రోడ్డు రవాణా సంస్థ, ( (4 మున్సిపాలిటీలు, విద్యుత్‌ శాఖ, హౌసింగ్‌ బోర్డ్‌, తూకాలు-కొలతలు, టెలిఫోన్ల ))| (1 వంటి ప్రభుత్వరంగ సంస్థల సేవలలో ఎదురయ్యే సమస్యలతోపాటు, హోటళ్ళు, | | సినిమా హాళ్ళు, వాహనాల బుకింగ్‌, డిస్కౌంట్లు, షేర్లు, గ్యారంటీలు, చీటీలు - ॥ 16 చిట్‌ఫండ్‌లు, కేబుల్‌ కనెక్షన్లు, బంగారం, అపార్ట్‌మెంట్లు, వ్యాపార ప్రకటనలు గ్ల: | వంటి పలు విషయాలపై ఆసక్తికరమైన సమాచారం అందించబడింది. || | కుటుంబంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో పొందుపరచబడిన | ఈ పృస్తకం మీకెంతో ఉపయుక్తంగా వుంటుంది. ఈనాడే దీనిని మీ స్వంతం ( (11 చేసుకోండి. స ॥) ॥ / | పూబలలననానానానినానానాననానానానానానానానానానానానాననాడ ॥॥ |