Telugu pothana bhagavathamu 5 ( 10 saknadhamu uththara bhagamu, yekadasha, dawadasha sakndhamulu ) - anilvaranasi/indianlanguages GitHub Wiki

+! / , న. ఖు కా కసిగా, (౮ గ స | . .. తోతనఖారవతము .. (దశమ స్కంధము - ఉత్తర భాగం, పకాదశ, ద్వాదశ స్కంధములు) ఐదవ సంపు . . కా యమున) ట్‌ ఇ | . లా సభనే... ౨, ఎటో మా ఏ (సరం . నే | న... . కాం. వ తిరుమల తిరుపతి దేవస్థానములు 1 ల | =. శి... తిరపతి” . తననన యయ

( గ శ వే (జగ ర షయ” ఏ భు ల్‌. న. టై యట్‌ ట్‌ ఖ్‌ - నస | 18 ట్‌ ట్‌ న్ను ట్ర "జు టు న స [1 :6/స గి (లి వ నటు [ వ స న్నా స న న్‌ న ఈ 7. సా ఒక ౧. 1 న 40 1 ॥ మ్ల అ? ల్‌! షే స్‌ వ ప.1 స. (1 త... మ. న... ఖో ల్లో. ళ్‌ లో మ! +జ్ర్రై కో టె త్త వ గ శి ాాళ మ గ. న న క. శ స్ట స! స్‌ నం క న్‌ క కా క ఉప, మడక / హా మ. వరో నల 24 న. సహా తు మ. టే మ నీ: స. చేన్‌ కనని లట ను చ మహ న గ్‌ వ మ న వ. క త. న న న్నాను న. వ! శ స లే గ్‌! స్‌? వనీ న న! యో ల స మ త య! ల ర పం. పష న | “- న్నా మా | ం-ధాన్టే మా

(సరళ గద్వానువాద ససాతము,) ఐదవ సంపుటము దశమస్కంధము - ఉత్తర భాగము & 11,12 స్కంధములు అనునాదకులు డా| అమరేంద్ర శ్రీ డి. నాగసిద్ధారెడ్డి డా! ప్రీసాదరాయ కులప్‌తి శ్రీ టి. భాస్కర రావు (స్ఫూర్తిశ్రీ (ప్రధాన నంసొదకులు డా! జంధ్యాల పాపయ్యశాస్త్రి తశ - జ్లోరల్లు జయో (స్రచురణ కార్యనిర్వహణాధికారి తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 20109

వ౦శతు4 9646 మిల్‌, 106 [204164 9౯056 1 *0ంఘముుల- 560016 2బంంీ10% 5620602 ఖురే 11 & 124 51204023 ఉలిం! : 90102 1422ల లా మగడ దర చా 096 కలుడిలపళై: ౧౧కు. ముఖజంంరు& య వ పా ల్‌ ఏ౫ ౨. 1222516614 [ంగర/ వో 0౬ 22526 జురు కు[202%0 51]. 3129102140 (వంముగు! 51 విరయోంర సి? : ౨౯ ౮జురసు 212 ఖుజణ 525000 "జుం2 వగ" 4813200 టలా/04 0 షల క్రంటు క0ఠికంఉగం0 5కు సం. 639-292 శింటం4ం01 వ 1987 కెళలాంంట వ 19908, 2004, 2009, 2008 లగుంళ 94401 22010 ౮0914 : 10,000 వెళ కుంతి స్వ కరడ 220 9 1టీ.వ్‌., గా చనరయిర?6 0550ల గా ఎయు జగం రలు టట ల “ఖు + ౧ న్‌ ( వ్‌గ సగ 22 5 జుు “అంఅరు. జ లీ .గంంటమున్నా త్త ల1:08578-287526 లే సో సమో లి హైదరాబాద్‌: వా466ే 26 | (నోరు జ్విగగుక్యూ జు 0110.21/1, ఉ24020864 మటల న 27665420, 9490009065 క్‌ న మంలారంరు రలజు2ర- 500020. 0210.16,17, మతుంర లం యజ! 9 ర్రలకనో వ! వ; 0877-22710907 “601, 016; గాగ ళుజిజీయ.000

" ముందుమాట

బ్రహ్మదేవుని చతుర్ముఖాలనుండి పురాణాలు, తరువాత వేదాలు వినిస్పృతాలైనట్టు తెలుస్తుంది. కాగా పురాణాల అనాదిత్వం పావనత్వం విద్యోతిత మవుతుంది. ఏనాటినుంచో సజీవంగా వెలిగేదే పురాణమంటారు. 'పురాపి నవం పురాణం'- ఎంత పాతదైనా పురాణం సరికొత్తగానే ఉంటుందన్నమాట!

సర్గం, (ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం - అని పురాణాలు అయిదు లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ లక్షణాలతో కూడిన పురాణాలు పద్దెనిమిది. ఉపపురాణాల సంఖ్యకూడా అంతే. ఈ పురాణాలన్నీ వేదవ్యాస మహర్షి విరచితాలే అని ప్రతీతి. ఇవి భిన్న కర్ఫకాలు అనే ప్రవాదం కూడా ఉన్నది. ఏమైనా పురాణాలు ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు ఆదర్శం లాంటివే కాకుండా, పూర్వ రాజవంశాలను గురించికూడ తెలపడంవల్ల ఒక విధంగా చరి(త్ర([గ్రంథాలుగా కూడా ఉపకరిస్తాయి.

కథలద్వారా (ప్రజలకు నీతి ధర్మాలు ఉపదేశించడం వీటి పరమాశయంగా కనిపిస్తుంది. భాగవత రచనవల్ల వ్యాసభగవానుడికి మనశ్శాంతి చేకూరిందనడంలో పురాణ ప్రభావం ఏమిటో విదిత మవుతుంది.

అష్టాదశ పురాణాలలో ప్రశస్తి వహించిన శ్రీ మద్భాగవతాన్ని బమ్మెరపోతనామాత్యులు తెలుగులోనికి అనువదించి ఆం(ధ్రలోకానికి మహోపకారం చేశారు. పరమభాగవతోత్తముడైన పోతనగారు తన సహజ పాండిత్యముతో అనితరభక్తితో భాగవతాన్ని రచించారు. మహాతపస్వి పోతరాజుగారి లేఖిని నుండి జాలు వారిన కవితా (స్రవంతి ఆంధ్ర జనహృదయ కేదారాలను తడుపుతూ తాపదత్రయాన్ని హరిస్తున్నదనడం సత్యం. భాగవతంలోని ప్రతి పద్యం ఎంతో హృద్యం. తెలుగునాట పోతనగారి పద్యం నోటికి రాని పండితుడు గాని, పామరుడుగాని లేడంటే అతిశయోక్తి కాదు.

ఇలా తెలుగునాట ('ప్రముఖస్తానాన్ని అలంకరించిన ఆంధ్రమహాభాగవతం అక్షరాస్యులందరికీ సులభ (గ్రాహ్యం అయ్యేందుకు తి.తి.దేవస్తానంవారు (ప్రముఖ విద్యాంసులచేత సులభశైలిలో తాత్పర్యాలు వ్రాయించి, ముద్రించారు.

ప్రధాన సంపాదకులైన డా॥ జంధ్యాల పాపయ్యశాస్త్రి (కరుణశ్రీ) గారికి ఆయా సంపుటాల తాత్పర్య రచయితలకును మా అభినందనలు. తి.తి.దేవస్థానం వారు ప్రచురించిన పోతన భాగవత సంపుటాల ప్రతులన్నీ చెల్లిపోయినందున పాఠకుల సౌకర్యార్థమై పరిష్కరించి పునర్ముద్రించటం జరిగింది. పాఠకులు యథాపూర్వం ఆదరించగలరు.

శ్రీనివాసుని కృపతో తిరుమల తిరుపతి దేవస్టానంవారు చేస్తున్న ధార్మిక (గ్రంథ పప్రచురణలపట్ట తెలుగునాట బహుళామోదం లభిస్తున్నందుకు సంతోషం.

కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.

ం సంపాదక మండలి నానా క్‌: సప శి ప. డాష్టర్‌ జంధ్యాల పాపయ్యశాస్త్రి (ప్రుధాన సంపాదకుడు) గల డాష్టర్‌ విద్వాన్‌ విశ్వం డాస్టర్‌ ఎస్‌, ఇ. రషునాధాచార్య డాక్టర్‌ రావుల సూర్యనారాయణనూర్రి షె. శీత. సుట్లారా (ష్‌ జే మా హా ్త కా ఆ అనువాదకులు డా/ అనురేంద్రు - 10న స్పంధం - ఉత్రరబాగం (-535 వద్చదంలు " అడి వాగసడ్తారెడ్డి - 10 వవ్పందం - ఉత్రరభాగం (6536-1342 వద్చవంలు డా/స్రువాదరాయ కురివతి - (ఏకాదశ వృందనం) శీ టీ భాస్సర రావ (స్ఫూరి శ్ర). - (ద్వాదశ స్పంధవం)

గాక బె చ న నాన రును ఖా " అతెతతన ఖంగవచతచము స్‌ రమ్య గ | ర టక క బు అనువాదకులు స్కంధములు మొదటి సంపుటము 1 డా॥ జంధ్యాల పాపయ్య శాస్త్రీ న ప్రథమ స్కంధము 2 డా॥ సముద్రాల లక్ష్మణయ్య ఆలం ద్వితీయ స్కంధము ౩ డా॥ ఆశావాది ప్రకాశరావు లం తృతీయ స్కంధము రెండవ సంపుటము 4 శ్రీ శనగన నరసింహస్వామి ఆలం చతుర్ధ స్కంధము 5. డా సర్యోత్తమరావు జాలు సంచము స్కంధము 6 _ శ్రీ తలమర్ల కళానిధి ఆలా షష్ట స్కంధము మూడవ సంపుటము లా శ్రీ జంధ్యాల వేంకటేశ్వరశాస్త్రి ఎఎం సప్తమ స్కంధము రి. శ్రీజ, చెన్నయ్య జం అష్టమ స్కంధము 9 డాాబి. భాస్కర చౌదరి అజాం నవను స్కంధము , నాల్లవ సంపుటము 10. డా! ఎక్కిరాల కృష్ణమాచార్య ఆజా దశమ స్కంధము కష క (పూర్వభాగం శ1- 725 సద్యములు) (పూర్వభాగం 726 - 1761 పద్యములు) విదవ సంపుటము ం 12 డా। అమరేంద్ర , , --- దశమస్కంధము - ఉత్తరభాగము ర్త శ్రీడి. నాగసిద్ధారెడ్డి (1- 535 పద్యములు) పజల దశమస్కంధము - ఉత్తరభాగము ష్‌ 1౬ ప శం సై 1 ట్ర ఫాదరాయ కులపతి (536 - 1342 పద్యములు) న ఈగో భాస్కర ర్యా (స్ఫూర్తి) లాం ఎకౌదశ స్కంధము క్‌ లాం ద్వాదశ స్లంధము సే ష్‌. పూ వో స్య క్త కరీ చే. 9) వ ్లో 3

(2న సద్యం నుండీ 535 న పద్యం నరక ,/

అభిజ్ఞ రసజ్ఞులకు అభివాదాలు. ఇప్పుడు తమ చేతిలో ఉన్న గ్రంథం పోతన భాగవతం దశమస్కంధంలోని ఉత్తరభాగం.

గరుడ మహాపురాణంలో భాగవత ప్రశస్తి ఈవిధంగా పేర్కొన బడింది-

అర్జో9_యం బ్రహ్మసూత్రాణాం భారతార్హ వినిర్ణయః,

గాయత్రీ భాష్యరూపో౭_సౌ వేదార్థ పరిబ్బంహితః.

పురాణానాం సారరూప: సొక్షాదృగవదోదిత:

ద్వాదశ స్కంధ సంయుక్త: శతవిచ్చేద సంయుతః,

గ్రంథోఇష్టాదశ సాహస్రః శ్రీమద్భాగవతాభిధ:.

ఈ భాగవతం (బ్రహ్మసూత్రాల పరమార్థం. భారతార్జాన్ని నిర్ణయం చేసే గ్రంథం. గాయత్రీ మహామంత్రానికి ఇది భాష్యం. వేదార్థ పరిపోషకం. సమస్త పురాణాల సారం. సాక్షాత్‌ భగవత్వ్యరూపుడైన శుకమహర్షిదే (ప్రోక్తం. ఈ మహా(గ్రంథం ద్వాదశ స్కంధాలతో కూడింది. నూరు పరిచ్చేదాలు కలది. పద్దెనిమిది వేల శ్లోకాలతో నిండింది. ఈ మహాగ్రంథం పేరు శ్రీ మద్భాగవతం.

“రాగములు గూర్చె కాకర్ల త్యాగరాజు;

గుడులు కట్టీంచె కంచెర్ల గోపరాజు;

పుణ్యకృతి చెప్పె బమ్మెర పోతరాజు;

రాజు లీ మువ్వురును భక్తి రాజ్యమునకు”

అన్నట్లు పుణ్యపురుషుడైన పోతన్నగారు ఈ పుణ్యకృతిని తెనుగుచేశారు..

పోతన్నగారు ప్రారంభంలోనే “నా పూర్వపుణ్య వశంవల్ల నన్నయ తిక్కనాది మహాకవులు భాగవతాన్ని తెలుగు చేయకుండా నా కోసం వదలి పెట్టారు. ఈ మహా([గ్రంథాన్ని తెలుగుచేసి నా జన్మ సార్ధకం చేసుకుంటాను” అన్నారు. ఆయన పుణ్యం వల్ల మహాభాగవతం అయనకు చిక్కింది; మనపుణ్యం వల్ల

లా సోతన భాగవతం మనకు దక్కింది.

ఈ భాగంలో ప్రద్యుమ్నాభ్యుదయం, శ్యమంతకోపాఖ్యానం, సత్యభామాపరిణయం, నరకాసుర సంహారం, ఉషాకల్యాణం, బాణాసుర గర్వభంగం, నృగమహారాజ చరిత్రం, పౌం[డ్రక వాసుదేవ వధ అనే కథాఘట్టాలు ఉన్నాయి.

శంబరాసురుణ్మి సంహరించి రతి సహితుడై ద్వారకా నగరానికి చేరుకున్న (ప్రద్యుమ్నుణ్మి చూచి

ళం అంతఃపురకాంతలు పొందిన కలవర పాటును చిన్న పద్యంలో ఎంతో మిన్నగా వర్ణించారు పోతన్నగారు. చిత్తగించండి-

జ హరి యని వెనుచని పీదపన్‌ హరింబోలెడు వాండు గాని హరి గాండనుచున్‌ హరిమధ్య లల్లనల్లన హరి నందను డాయవచ్చి రాశ్చర్యమునన్‌. 10 ఉ.28 ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లవాడు పెరిగి పెద్దవాడై కంటబడితే కన్న తల్లి గుండెల్లో (ప్రేమానురాగాలు పెల్టుబుకుతాయి. తన “తొలుచూలి పాపనికి బోర్కాడించి చన్నిచ్చి” నిద్రపోతుంటే ఏ పాపాత్ముడో వచ్చి(శంబరాసురుడు) ఎత్తుకపోయాడు. ఆ బాలుడు ఇప్పటిదాకా బ్రతికి ఉంటే ఇంతవాడై ఉండేవాడు అనుకుంటుంది (ప్రద్యుమ్నుణ్ణి తిలకించిన రుకి శలీదేవి. ఇందాక నాండు బతికిన సందేహము లేదు; దేహ చాతుర్య వయ స్పొందర్యంబులు లోకులు నందింప(గ నితనియంతవాండగు జుమ్మీ! 10 ఉ. 33 కమనీయమైన కన్నతల్లి కామనకు కమ్మని ప్రతిబింబం ఈ పద్యం. ప్రతిభాషకీ కొన్ని ప్రత్యేకమైన భావ వ్యక్తీకరణ పద్దతులు ఉంటాయి. “మా తము 1కు” అనటానికి బదులుగా “మా వాడు” అని అనటం మన తెలుగువాళ్ల సంప్రదాయం. వేటకు వెళిన ప్రసేన జితు ఎంతకీ తిరిగి రానందుకు చింతిసూ స(త్రాజితు- “మణి కంఠంబున దాల్చి నేండడవిలో మావాయ నర్తింపంగా మేకై పట్టి వధించినాండు; హరికిన్‌ మర్యాద లేదు..........” 10 ఉ. 58 అని కృష్ణుణ్మి నిందిస్తాడు. పోతన్నగారి తెలుగు మర్యాదవిధానానికి సై పద్య పంక్తులలోని “మా వాండు” అన్నమాట ఉదాహరణం. సా స ను వాంచ లే 2 ఎలుకులకు స్పందించిన గోవిందుడు *ఏీ వ్రణమున్‌ నా యెడ లేదు; నింద గలిగెన్‌; 09 అలాగే వ అని అనుకోవటం కూడా తెలుగుదనాన్ని స్ఫురింప జేస్తుంది. ఎశ్చాత్తప్ర చిత్తుడైన సత్రాజిత్తు. మా చ అ అని ని ౧ గాధవు పదములు పట్టు కొంటి నేని ట్రతుకుగలదూ 104ఉ.79 శృయించుకోవటంలో సైతంతె ఒకే పదాన్ని భిన్నార్థాలత్రో ప పడే చం తీరు తియ్యాలు కనిపిస్తాయి ఇలిలే పదే పదే ప్రయోగించటం పోతన్న గారికి అభీషమైన విలక రాజునగరి యడబాలలు పకన ఎలక్షణ లక్షణం. రాజీవము కడుష్ప వచ్చి రాజనిభాసు వ్‌ రాజశిశువు గన చెప్పిరి 10 ఉ.7

ష్‌ అన్నప్పుడు- మణి యిచ్చినాండు వాసర మణి; నీకును మాకు6 గలవు మణులు; కుమారీ మణి చాలు నంచు కృష్ణుండు మణి సత్రాజిత్తునకును మరలంగ నిచ్చెన్‌. 10 ఉ. 82 అన్నప్పుడు-

నారి మొరయించె రిపు సే

నారింఖణ హేతువైన నాదము నిగుడన్‌

నారీనుణి బలసంప

న్నారీభాదికము మూర్చనంద నరేం(ద్రా! 10 ఉ. 176

అన్నప్తుడు-

నుగువ మగవారి ముందటు

మగతనములు సూప రణము మానుట నీకున్‌

నుగతనము గాదు; దనుజులు

మగువల దెసం జనరు మగల మగ అగుట హరీ! 10 ఉ. 189

అన్నప్పుడు ఈ విధమైన పదప్రయోగ నైపుణ్యం గోచరిస్తుంది.

పాత్రల స్వరూప స్వభావాలను చక్కగా ఆకళించుకొని చిక్కగా ప్రకటించటం పోతన్న గారి (ప్రత్యేకత. శ్రీ కృష్ణుడు ఇం(ద్రప్రస్థనగరానికి వచ్చి పాండవులను పలుకరించిన సందర్భం పరికించండి-

“వా రఖిలేశ్వరుండైన హరిం గౌంగిలించుకొని కృష్ణుని దివ్యదేహ సంగమంబున నిర్జూత కల్మషులై యనురాగహాస విభాసితంటైన ముకుంద ముఖారవిందంబు సందర్శించి యానందంబు నొందిరి. గోవిందుండును యుధిష్టిర భీమసేనుల చరణంబులకు నభివందనములు చేసి, యర్జును నాలింగనంబున సత్కరించి, నకుల సహదేవులు మొక్కిన గ్రుచ్చియెత్తి యుత్తమపీఠంబున నాసీనుండై యుండె” 10 ఉ1౦03

కృష్ణుడు తనకంటె పెద్దవాళ్లు కావటం వల్ల ధర్మరాజుకీ భీముడికి పాదనమస్కారం కావించాడు. తనతో సమాన వయస్కుడు కావటంవల్ల అర్జునుణ్హే ఆలింగనం చేసుకున్నాడు. తనకన్న చిన్నవాళ్ళు కనుక 'ప్రణమిల్లిన నకులుణ్ణీ సహదేవుణ్ణే ఆదరంతో లేవనెత్తాడు. అనంతరం క్రొత్త పెండ్లికూతురైన (ద్రౌపది కొంచెం సిగ్గ

"ఓ పడుతూ కృష్ణుడికి ('మొక్కిందట. ఆపైన కృష్ణుడు కుంతీదేవి వద్దకు వెళ్లి నమస్కరించి ఇలా అన్నాడు. అత్తా! కొడుకులు కోడలు

చిత్తానందముగ పనులు సేయంగ నాత్మా

యత్తానుగవై యాజ్జా

సత్తాదులు గలిగి నునుదె సమ్మోదమునన్‌? 10 ఉ. 106

॥

“అత్తయ్యా! నీ కొడుకులూ, కోడలూ, నీకు నచ్చిన విధంగా, నీవు మెచ్చిన విధంగా పనులు చేస్తున్నారా? చేయవలసిన పనులుచెబుతూ సంతోషంగా ఉంటున్నావు కదా! "అన్న మేనల్టుడి మాటలకు అ మేనత్త “పేమ విహ్యలత నందుచు గడ్గద భాషణంబులం గనుంగవ నశ్రుతోయములు ([గ్రమ్మగ"” సముచితంగా సంభాషించింది.

లోకకంటకుడైన నరకాసురుడిపైకి యుద్దానికి సిద్దమై వెళుతున్న శ్రీకృష్ణుణ్సె చేతులు మోడ్చి ఇలా వేడుకుంటుంది సత్యభామ.

దేవా! నీవు నిశాటసంఘముల నుద్దీపించి చెండాడ నీ

ప్రావీణ్యంబులు సూడ(గోరుదు గదా ప్రాణేశ! మన్నించి న

న్నీ వెంటం గొనిపొమ్ము, నేండు కరుణన్‌, నేజూచి యేతెంచి నీ జ

10 ఉ. దేవీసంహతి కెల్ల జెప్పుదు భవద్దీప్తప్రతాపోన్నతుల్‌.

భార్య సమరరంగానికి వస్తానంటే ఏ భర్తా నమ్మతింపడు. అందు వల్ల సంభాషణాచేయే తకాదు

ఒం ఉనాది. అం సత్యభామ “స్వామీ! సం(గ్రామసీమలో మీ వీరవిజ్బంభణాన్ని వీక్షించాలని కుతూహలంగా ( ను ర తిరిగి వచ్చిన తరువాత మీ ప్రతాప(ప్రాభవాన్ని నా సపత్ను లందరికీ వివరించి చెబుతాను” ర చ వీలులేని వఏీధంగా అడిగింది. అయితే అందుకు అంత అనాయాసంగా అంగీకరిస్తాడా ఆ సత్యభా గ అయన ఆమెను వద్దని ముద్దుముద్దుగా ఇలా వారించాడు.

సమద వుప్పంధయ రుంకారములు కావు

భ్‌షణ కుంభీం(ద్ర బృంహితములు; వాయు నిర్గత పద్మవన రేణువులు కావు తురగరింఖా ముఖోద్దూత రజను; లాకీర్ష జలతరంగాసారములు కావు శతు ధనుర్ముక్త సాయకములు; కలహంస సారస కాసారములు కావు దనుజేంద్ర సైన్య కదంబకములు; కమల కల్హార కుసువు సంఘములు కావు చటుల రిపు శూల ఖడ్డాది సాధనములు; కన్య! నీ వేడ! రణరంగ గమన మేడ? వత్తు వేగమ; నిలుపుము; వలదు వలదు. 10 ఉ. 153 సమానమైన సీసపద్యపాదాలలో సత్యభామప్రస్తుత పరిస్థితిన, సమర రంగపు భిషూస్టితిగతినీ సరిసమానంగా వర్షించి కళ్లకు కట్టించారు పోతన్నగారు. మొదటి పాదాలలో పరుషమైన సంస్కృత సమాసాలనీ (ప్రయోగించి రచనలోనే గొప్ప వైచిత్రం ప్రదర్శించారు. చిట్టచివరకు తేటతెలుగు పలుకులతో “త్వరగా

₹/ తిరిగి వస్తాను. ఆగిపో. రావద్దు' అని తేల్చి వేయటం ఆమెను బుజ్జగించే దోరణికి అనుకూలంగా ఉన్నది. కొందజకు తెనుగు గుణమగు కొందణకును సంస్కృతంబు గుణ మగు; రెండుం గొందణకు గుణము లగు; నే నందణ మెప్పింతు కృతుల నయ్యై యెడలన్‌. అన్న సహజపాండిత్యుని శపథం ఇక్కడ మనకు గుర్తుకు వస్తుంది. యుద్దభూమికి రాకుండా ఉద్యానభూమిలోనే ఉండమంటున్న కృష్ణుడితో సద్యస్ఫూర్తి గల సత్య- “దానవులైన నేమి! మణీ దైత్యసమూహములైన నేమి! నీ మానిత బాహుదుర్గముల మాటున నుండంగ నేమి శంక?............” 10 ఊఉ. 155 అని చేతులు జోడించింది. ఆ వీరనారిని అనురాగంతో అవలోకించి వెంట బెట్టుకొని గరుత్మంతుబ్లో అధిరోహించాడు శ్రీకృష్ణుడు. “శుంభద్రాజబింబోపరిస్టల శంపాన్విత మేఘమో![ - అన్నట్టు గరుడారూఢుడై సత్యభామతో సంభాషిస్తున్న శ్రీకృష్ణుడు ఉన్నాడట. ఎంత చక్కని ఉత్రేక్ష! భర్తతో యుద్దానికి సన్నద్దు డౌతున్న నరకాసురుణ్ణై చూచి ఏ మాత్రం కలవరపడకుండా కేశపాశం ముడివేసి, నడుం బిగించి లేచి నిలచిన వీరనారి సాత్రాజితిని పోతన్నగారు ఎలా దర్శించారో గమనించండి. వేణిన్‌ జొల్లెము వెట్టి సంఘటిత నీనీబంధయై భూషణ శ్రేణిం దాళ్ళి ముఖేందు నుండల మరీచీజాలముల్‌ పర్వంగా పాణిం బయ్యెద చక్కగా దుజీమి శుంభద్వీరసంరంభయై యేణీలోచన లేచి నిల్చె తన ప్రాణేశాగ్ర భాగంబునన్‌. 10 ఉ. 170 ఇందులో "పాణిం బయ్యెద చక్కగా తుజిమి” అన్న పదగుంఫన లోకపరిశీలనా దృష్టి ఎంత నిశిత మైనదో వ్యక్తం చేస్తుంది. సమర్హుడ్రైన వడ్డాది పాపయ్యగారివంటి చిత్రకారుడికి వెంటనే పని కల్పించే చలత్సౌందర్య చిత్రణం ఇది. ఈ సందర్భంలోనే పోతన్నగారి అమృత లేఖిని నుండి జాలువారిన మరొక అద్భుతమైన పద్యాన్ని అవలోకించండి- పరు జూచున్‌ వరు జూచు నొంప నలరింపన్‌ రోషరాగోదయా విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్‌ జరగం గన్నుల గెంపు సొంపు. బర(గం జండాస్తసందోహమున్‌ సరసాలోక సమూహమున్‌ నెజపుచుం జంద్రాస్య హేలాగతిన్‌. 10 ఉ. 178

ళ ఆమె నరుకుణ్ణి చూస్తున్నది. నాథుల్లో చూస్తున్నది. అయితే ఆ చూపుల్లో తేడా ఉన్నది. పరుణ్ణి చూచే చూపు సంతాపింప జేస్తున్నది. పరుడిపైన రోషం, విరత (భ్రూకుటి, వీరం, కెంపు చండాస్త్ర సందోహం (ప్రదర్శిస్తున్నది. వరుడి పైన రాగోదయం, మందహాసం, శృంగారం, సొంపు, సరసాలోక సమూహం (ప్రసరిస్తున్నది. పూర్తిగా పరస్పర విరుద్ధమైన అంశాలను మేళవించి రసికరసాయనంగా అందించారు పోతన్నగారు. ఈ పద్యం “అరిం జూచున్‌ హరింజూచు” అన్న నాచనసోమన్నగారి పద్యం కన్న ఎంతగానో అందగించింది. ఈ క్రింది పద్యంలోని రూపకాలంకాల సమలంకరణ సౌభాగ్యాన్ని సమీక్షించండి- జ్యావల్లీధ్వని గర్జనంబుగ, సురల్‌ సారంగ యూధంబుగా, నా విల్లింద్రశరాసనంబుగ, సరోజాన్షుండు మేఘంబుగా, తా విద్యుల్లత భంగి నింతి సురజిద్దావాన్ని మగ్నంబుగా, 0 182 ప్రావుట్కాలము సేసె బాణచయ మంభళశ్శీకరశ్రేణింగాన్‌. నారిధ్వని అను ఉరుముతోనూ, దేవతలు అనే చాతక నమూహంతోనూ, విజిత ం య తోనూ, సత౪భామ అనే మెజపుతీగతోనూ, రాక్షసులు అ ఇం(ద్రధనుస్సుతోనూ, కృష్ణుడు అనే నీలిమబ్బుతానూ, సత్య లంగా మరి వయిందట దావాగ్షితోనూ, శర పరంపర అనే వర్షధారతోనూ ఆ సమరసమయం వర్షాస సత్య వదనం హరికి రాకేందు బింబంగానూ, అరికి రవిబింబం గానూ కనపడింది. సత్య చేలాంచలం హరికి కందర్ప కేతువుగాన్తూ అరికి ఘన ధూమకేతువుగానూ దర్శన మిచ్చింది. సత్యధనుస్సు హరి భావజు పరిధిగానూ, అరికి ప్రళయార్కు పరిధిగానూ ప్రత్యక్షమైంది. సత్య సందర్శనం హరికి అ ప ప్రవాహంగానూ, అరికి అనల సందోహంగానూ అనిపించింది. సత్య బాణవృష్టి హరికి హరదాయిగా ా అరికి మహారోషదాయిగానూ సాక్షాత్కరించింది... శృంగార వీరరసాల సరస సమన్వయం ఈ రా సీసపద్యంలో చోటుచేసికొన్నది. ఆచార్య క్షేమేంద్రుడు చెప్పిన రస సంకరౌచిత్యానికి ఎత్తిన పతా పద్యం. ఇది అమూలకం. రాకేందు బింబమై రవిబింబమై యొప్పు నీరజాతేక్షణ నెమ్మొగంబు; కందర్ప కేతువై ఘనధూనుకేతువై యలరు పూంబోడి చేలాంచలంబు; భావజు పరిధిలై ప్రళయార్కు పరిధియై మెజయు నాకృష్ణమై మెలంతచాస; మమృత ప్రవాహమై యనల సందోహమై తనరారు నింతి సందర్భనంబు; హర్షదాయిలై మహారోషదాయియై పరగు ముద్దరాలి బాణవృష్టి;

త హరికి నరికి చూడ సందంద శృంగార వీరరసము లోలి విస్తరిల్ల. 10 ఉ. 183 మాటల్లో విరుపుపెట్టి మహార్దాన్ని సాధించటం మన మహాకవికి మంచినీళ్ల ప్రాయం. లేమా! దనుజుల గెలువంగ లేవూ? నీవేల కడగి లేచితి? విటురా లే! మాను! మానవేనిన్‌ లేమా! విల్లంది కొనుము లీలం గేలన్‌. 10 ఉ. 172 ఈ పద్యం వంపుసొంపులలో మొదటి పాదంలో పౌరుషం, రెండవ పాదంలో సందేహం. మూడవ పాదంలో నిషేధం, నాల్లవ పాదంలో అంగీకారం స్ఫురిస్తున్నాయి. ఇలాంటిదే ఇంకొక అందమైన కందం- కొమ్మా! దానవనాథుని కొమ్మాహనమునకు దొలలె, గురు విజయము గై కొమ్మా! మెచ్చితి నిచ్చెద కొమ్మాభరణములు నీవు కోరిన నెల్లన్‌. 10 ఉ. 187 ఇవే కాకుండా “బొమ్మ పెండ్రిండ్లకు పోనాల్ల నను బాల”, “వీణచక్కంగంబట్ట వెర వెజుంగని కొమ్మ “సౌవర్ణ కంకణ రుణ రుణ నినదంబు” - ఇవన్నీ మూలంలో లేని పోతన్న గారి సొంత పద్యాలే. ఇక శ్రీకృష్ణుని సందర్శించిన పాండవులు“ప్రాణంబుం గనిన యింద్రియముల భంగి” ఉన్నారన్నప్పుడు, నాన్షజితి స్తయంపర సందర్భంలో అడ్డు వచ్చిన శత్రువులను అర్జునుడు “శశకంబుల సింహము చంపు కైవడి” చంపినా డన్నప్పుడు, బాణాసురుడి బారి నుండి అనిరుద్దుణ్మి కాపాడటానికి యాదవసైన్యాలు కృష్ణుని వెంట “భగీరథు రథము వెనుక ననుగమించు వియన్నది ననుసరించి” వస్తున్నా యన్నప్పుడు, వాసుదేవుడి సుదర్శన చ(క్రంవల్ల పౌండ్రకుడు “కులిశాహతిన్నారగు శైలేంద్రాకృతిన్‌” నేలకూలాడన్నప్తుడు, ఉపమాలంకారం ఉప్పొంగి పోయింది. నరకాసురుడు చెరసాలలో చింతాక్రాంతలై కాలం గడుపుతున్న కాంతలు పదహారువేలమందీ తమను చెర విడిపించిన శ్రీకృష్ణుడి దివ్య మంగళ స్వరూపాన్ని తిలకించి ఇలా పులకించిపోయారట- వనజాక్షి! నేం గన్క వై జయంతిక నైన కదసి వ్రేలుదుగదా కంఠ మందు; బింబోప్టి! నేం గన్క పీత్రాంబరను నైన మెజసి యుండుదు గదా మేను నిండ; కన్నియ! నే( గన్క కౌస్తుభమణి నైన నొప్పు చూపుదుగదా యురము నందు;

బాలిక! నే( గన్క పాంచజన్యమ నైన మొనసి చొక్కుదు గదా మోనవిగ్రోలి; పద్మగంధి! నేను బర్హదామను నైన చిత్రరుచుల నుందు శిరము నందు; ననుచు సెక్కు గతుల నాడిరి కన్యలు గములు గట్టి గరుడగమను౬ జూచి. 10 ఉ. 212 జా(గ్రత్తగా పరిశీలిస్తే ఇవన్నీ పరవశించిన పోతన్న గారి భావాలే అనిపిస్తాయి. ఈ సందర్భంలోనే మనం రెండు విషయాలు గుర్తించాలి. ఒకటి లోకకంటకుడైనప్పుడు కన్నకొడుకునైనా సరే కనికరింపక సంహరిస్తాననే శ్రీకృష్ణుని భగవత్తత్త్యం. రెండవది నరకుడు చెరపట్టిన కన్య లందరినీ తాను వివాహమాడి సంఘంలో వారికి సమున్నతస్టానము కల్పించిన మాధవుడి మహోదార స్వభావం. ఇక పోతన్న గారికి ఎంతో ఇష్టమైన అంత్యానుప్రాసల విలాసం ఈ క్రింది పంక్తుల్లో లాస్యం చేస్తుంది. “ప్రభాత్త దిగంతము నా స్యమంతమున్‌.” “దుర్గన్‌ గృతకుశలమార్ల్గం దోషిత భర్గన్‌.” “భామామనోహారికిన్‌ దనుజాధీశ విదారికిన్‌ హరికిన్‌.” “చక్రముం బరిహతదైత్య చక్రము6 బ్రభాచయ మోదిత దేవశ[క్రమున్‌”. “హలిచే నాశ్రిత నిర్జర ఫలిచే (దైలోక్య వీరభటగణ బలిచేన్‌.” “తపనుని బాలికన్‌ మదన దర్చణ తుల్య కపోలపాలికన్‌.” “మిత్రవిందను నిత్యాపూరిత సుజనానందన్‌ చారుచికుర కాంతి విజిత షట్పదబ్బందన్‌. “వృషభంబులం బర్వత సన్నిభంబులన్‌.” “అరిగర్వ విమోచను6 బద్మలోచనున్‌.” “సమద మృగేక్షణన్‌ నయవిచక్షణ లక్షణం బుణ్యలక్షణన్‌.” “పాంచజన్యము విముక్త 'ప్రాణిచైతన్యమున్‌. *॥ “ధాత్రీజనమాన్యలన్‌ గుణవతి 'వ్రతధన్యల రాజకన్యలన్‌.” “చేతోధనచోరు రత్నమకుట స్ఫారున్‌ మనోహారునిన్‌.” “త్రిజగదభిరామ గుణధామ చారుసత్యభామ సత్యభామ.” “సద్దర్మచారిణి విశ్లేషిణి వీతతోషిణి పురంధ్రీగ్రామణిన్‌ రుక్కిణిన్‌.” “ఖగవాహున్‌ రుచిరదేహు' గలితోత్సాహున్‌.” “అతిమృదువాణికిం గిసలయారుణ పాణికి నీలవేణికిన్‌.” “జితారిన్‌ హారిన్‌ సన్నుతసూరిన్‌ సీరిన్‌ రైవత సుతాగర్ష చిత్త విహారిన్‌.” “సగణ స్టాణున్‌ నిర్దితాసమబాణున్‌ దాండవధురీణు భక్తత్రాణున్‌.”

న

“శిశిరకర చారు రుచిరేఖ చిత్రరేఖ.”

“వనధిగభీరు నుదారుని ననిరుద్దకుమారు విదళితాహితవీరున్‌.”

“కలిత పరిశుద్దు నఖిలలోకటప్రసిద్దు చతురు ననిరుద్దు నంగనాజన నిరుద్దు.”

“జనసంతాప నివారకన్‌ సుజనభాస్వత్తారకన్‌ ద్వారకన్‌.”

“నిన్ను. జూడగంటి నీ కృప కనుంగొంటి నఖిల సౌఖ్యపదవు లందంగంటి.”

కవి వ్యక్తిత్వ ముద్రను భద్రపరచుకొన్న ఈ క్రింది సూక్తుల సౌందర్యాన్ని సందర్భించండి-

“అన్యుల యాచింపరు రాజన్యులు.”'

“తరుణులు పెక్కండ్రయినను, పురుషుండు మనలేండు సవతిపోరాటమునన్‌.”

“ఎటుక వలదె! నిర్జరేంద్రత కాల్పనే!”

“సిరియును వంశము రూపము సరియైన వివాహ సఖ్యసంబంధంబుల్‌ జరుగును.”

“ఎద్దు కక్రొవ్వి పెలుచ న్నాబోతుపై అంకె వైచిన చందంబు.”

“పలుకుల తన్నుతా పొగడ పాతక మందురు.”

“గుణహీనజనుల తగునే తగులన్‌?”

“తల్లి వచనంబు కూంతున కభిమతంబు గాదె!”

“వనజాసను కృతము గడచువా రెవ్వ రిలన్‌?”

“విప్రతతి సొమ్ము కంటెను విషము మేలు.”

“మజపున ననలము ముట్టిన దరికొని వెసంగాల్పకున్నె తను వెరియంగన్‌.”

“తను నమ్మినవారి విడువందగునే హరికిన్‌?”

చదివిన కొలదీ చవులూరించే జాతీయాలు కుప్పలు తెప్పలుగా కనువిందు కావిస్తాయి ఈ సంపుటంలో. చిత్తగించండి. నోచికాంచిన తల్లి, చన్నులు సేపు, బోర్కాడించు, చన్నిచ్చి నిద్రించు, గుండెల్‌ జల్లను, ఈ దేహము గాల్పనే, పదివేలు వచ్చె, (గ్రుచ్చియెత్తి క్రొత్త పెండ్లి కూంతురు, కాలుద్రవ్వు, ముత్తునియలు, తిల లంతలు, బొమ్మపెండ్రిండ్లు, మగతనములు, పువ్వులు కురియు. గములు గట్టి, అడుగులొత్తు. దొడ్డుగ జూచు, చెక్కిట చెయ్యిచేర్చు, మోమరవాంచు, చిత్త మిగురొత్తు నవ్వులకు నాడిన మాటలు, కోరిక లీరిక లెత్తు, పిల్లచెజుకీనిన కైవడి, తామర తంపర, చూపోపక, ఎకసక్కెము, కికురించు, మొగమోటము, పెట పెట పండ్లు కొణుకు, కన్నుల నిప్పులుప్పతిల్లు చెవులకు ములుకులు, ముఖంబున (వ్రేలినయట్టు, కళవళమందు, సన్న లేంజెమట, తొంగలి టెప్పలు, కన్నీటి వద, నునుసిగ్గు, కన్నీరు మున్నీరు, గుజ గుజ వోవు, చిందజ వందజ, కాందిశీకులు, మయజుంగు సొచ్చు, ఎదురెదురే చూచు, అచ్చున నొత్తు; రింగులు వాజు; గుండె లవియు, మిణుమిట్టు గొలుపు, ఖణిల్లని అంకవైచు, పీనుంగు పెంటలు, నెత్తుటబొత్తిలు, చక్కాడు, అల్లననవ్వు, ఏ దిక్కుగానక, కోయని యార్చు. తనయీడు గోపకుమారులు, చే చజచు, ఒకానొక వేళ, సిగ్గువో దట్టు, పొరపొచ్చెము- ఇటువంటి తీయతీయని జాతీయాలు మన కవీంద్రుడి సహజపాండిత్యానికి నిదర్శనాలు.

న్‌

ఇక కొన్ని విచిత్రపదప్రయోగాలు కూడా మనకు ఈ సంపుటంలో కనిపిస్తాయి. ఉదాహరణకు కుసుమముల ముసురు, విలసించు, లోని మేడ, ఇచ్చయింతురు, ముష్టాముష్టి, రాజబుషుల్‌, కచాకరషణముల్‌, లజ్జించు, అనురాగిల్టు, కనుమాయ, కుమారిక, ద్రొబ్బించు మొదలైనవి.

ఇటువంటి పోతన భాగవతాన్ని భావార్థ సహితంగా ప్రకటించి ఆంధ్రులకు అందించాలని తిరుమల తిరుపతి దేవస్టానంవారు సంకల్పించటం సర్వధా ప్రశంసనీయం. ఈ ఉద్దేశంతోనే పోతన భాగవతం ప్రాజెక్టు (ప్రారంభ మయింది.

ఈ సందర్భంలో అనువాద భాగా లన్నింటినీ పరిష్కరించి ఏకసూత్రత కల్పించే బాధ్యత నా మీద ఉంచిన టి.టి.డి. కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. వి. ఎస్‌. (ప్రసాద్‌, ఐ.ఏ.ఎస్‌. గారికి, డాక్టర్‌ రావుల సూర్యనారాయణమూర్తి పి. ఆర్‌. ఓ గారికి, ఎడిటర్‌ శ్రీ కె. సుబ్బారావు గారికి నా ధన్యవాదాలు.

దశమస్కంధంలోని ఈ పద్యభాగాన్ని హృద్యమైన గద్యంలో అనువదించినవారు డాక్టర్‌ అమరేంద్రగారు. శ్రీ అమరేంద్ర అనేక కళాశాలల్లో ఆంగ్రశాఖాధిపతిగా, అధ్యక్షులుగా వ్యవహరించారు. వీరు ఆంగ్రభాషలోనూ, ఆం(ధ్రభాషలోనూ మధురాతి మధురంగా మాట్లాడ గలరు. “భావవీణ” వంటి వ్యాససంపుటులు, “చక్రవర్తి” వంటి నాటికా సంపుటులు, “ఇం(ద్రధనుస్సు” వంటి కథాసంపుటులు రచించారు. రవీంద్ర కవీంద్రుడి కమనీయ కవిత లెన్నింటినో ఆంధ్రీకరించారు. వీరి అనువాదం అన్యూనాతిరిక్తంగా, సహజసుందరంగా సాగిపోయింది,

క సవా'్రాక్షులై అక్షరదోషాలు దొర్లకుండా ఫ్రూపులు సరిచూచిన పూజ్యమిత్రులు మహాకవి శ్రీముదివర్తి ౦డమా: రామ చార్యులు గారికి నా అభివాదాలు. ముద్రణకు తగినట్టు (ప్రెస్‌కాపీ సిద్ధంచేసి ఇచ్చిన చి॥ కోరాడ ప ఎ నీ జర అరటి ఇచ్చి నన ఫిల్‌ కు ఆశీస్సులు. ఈ సంపుటాన్ని ఇంత నిర్దుష్టంగా, ఇంత ముచ్చటగా ముద్రించి నం ప్రెస్‌ ఒ దవస్థానం ప్రెస్‌ మేనేజర్‌ శ్రీ విజయకుమార్‌రెడ్డి గారికీ, వారి సిబ్బందికీ నా అభినందనలు. పోతన భాగవత సంప ఎొటాలను ఎంతో ఆదరాభిమా షు సాధువాదాలు. భిమానాలతో అందుకుంటున్న సహృదయులకు నా భవదీయుడు కళ్యాణ భారతి కరుణశ్రీ రవీం'ద్రనగర్‌: గుంటూరు 28-2-02 (ప్రధాన సంపాదకుడు పోతన భాగవతం ప్రాజెక్టు

ప్రవేశిక (536 న సద్యం నుండీ 1342 వ పద్యం నరకు , సహృదయులకు స్వాగతం. ఇప్పుడు మో కరకమలాలను అలంకరించింది పోతన భాగవతం దశమస్కంధంలోని ఉత్తరభాగం. - శ్రీమద్భాగవతంలో ఈ విధంగా చెప్పబడింది- రాజంతే తానదన్యాని పురాణాని సతాం గణే | యావద్భాగవతం నైన శూయతే౭_న్చృుతసాగరమ్‌ ॥ భాగవతం అమృతసముద్రం వంటిది. ఈ భాగవతసుధ కర్షగోచరం కానంతవరకే ఇతర పురాణాలు సత్పురుషుల లెక్కలోకి వస్తాయి. భాగవత విన్నాక తక్కిన పురాణాలపై మనస్సు పోదు. సర్వవేదాంతసారం హి శ్రీ భాగవత మిష్యతే | త(ద్రసొమృత తృప్తస్య నాన్యత్ర స్యాద్రతిః క్వచిత్‌ ॥ భాగవతం సర్వవేదాంతాల సారభూతం, ఈ భాగవత రసాస్వాదన చేసి సంతృప్పులైన వారికి అన్యత్ర ఆసక్తి ఏ మాత్రం ఉండదు. . నిమ్నుగానాం యథా గంగా దేవానా ముచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభు: పురాణానా మిదం తథా క్లేతాణాం చైవ పర్వేమిం యథా కాశీ హ్యనుత్తనూ తథా పురాణ వ్రాతానాం శ్రీమద్భాగవతం ద్విజాః ॥ నదులలో గంగానది, దేవతలలో శ్రీమహావిష్ణువు, వైష్ణవులలో పరమశివుడు (శ్రేష్టులైనట్లే సమస్త పురాణాలలో శ్రీమద్భాగవతం ఉత్తమమైనది. సమస్త క్షేత్రాలలో కాళీక్షేత్రం ఉత్తమోత్తమం. అదేవిధంగా పురాణాలలో శ్రీమద్భాగవతం సర్వోత్తమం. సూతులవారు భాగవత మహత్తాన్ని పై విధంగా శానకాది మహర్షులకు వెల్లడించారు. అటువంటి మహిమాన్వితమైన భాగవతాన్ని బమ్మెర పోతన్నగారు ప్రసన్న మధురమైన శైలిలో ఆంధ్రులకు అందించారు. ఈ భాగవత సంపుటంలో ద్వివిదవానర సంహారం, లక్షణా పరిణయం, శ్రీకృష్ణ దక్షిణనాయకత్వం, జరాసంధ వధ, శిశుపాల వధ, సా ల్వసంహారం, దంతవక్రదమనం, విదూరరథవధ, బలరామతీర్థయాత్ర, కుచేలోపాఖ్యానం, శ్రీకృష్ణార్జునుల (గ్రహణస్నానం, వసుదేవ యజ్ఞం, దేవకీ మృతపుత్ర ప్రదానం, సుభద్రా పరిణయం, (శ్రుతదేవ బహుళాశ్వచరి'త్రం, శ్రుతిగీతలు, వృకాసుర వధ, భృగుమహర్షి పరీక్ష విషప్రబాలక పునరుజ్లీవనం, యదువంశో వర్ణనం అనే ఘట్టాలు ఉన్నాయి. జు నరకాసురుడి స్నేహొతుజైన ద్వివిదుడనే వానరుడు కృష్ణుడు లేని సమయంలో ద్వారకానగరంలోకి (ప్రవేశించి నానా బీభత్సం చేయసాగాడు. ఇంతలో అతనికి 'లలితవినీలవస్తుడు” 'విలాసవతీయుతుడు",

త 1 షి క; సిత వారుణీ 'చంద్ర చంద్రికాకలిత మహోన్నతాంగుడు', 'మణికాంచన దివ్య విభూషణోన్నతుడు', 'విలసి సమద విహ్యల లోచనుడు' అయిన బలరాముడు కనిపించాడు. ఇంకేం! వాడిలోని సహజలక్షణం ఎలా విజృంభించిందో వీక్షించండి - కను(గొని తత్పురోగమ భూమిరుహశాఖ లెక్కి యూచుచు చాల వెక్కిరించు కికురించుచును బం డ్లి గెల్చి చూపుచు వెస కొమ్మకొమ్మకు నుణుకుచు నదల్బు దోంక నూరక మేను సోంకంగ నులివెట్టు వెడవెడ నాలుక వెళ్ళంబెట్టు బరుల నఖంబుల గిరగిర గోయచు. బొరిబొరి ఫలములు గఅచివైచు గోళ్ళు తెగగొర్కి యుమియును గుదము సూపు, బలసి మర్కటజాతి య ప్పగిదిం జూప. 10-ఉ.544 కోతి చేష్ట లంటామే- అవన్నీ అక్షరాలా వాడు బలరాముడి ముందు ప్రదర్శించాడు. కొమ్మ లెక్కి ఊగటం, వెక్కిరించటం, కవ్వించటం, ఇకిలించటం, దూకటం, తోక జాడించటం, నాలుక వెళ్ల బెట్టటం, గోళ్ళతో గీరటం, పండ్డు కొరికి విసరటం మొదలైన వికారాలన్నీ కళ్ళకు కట్టేలా వర్షించారు పోతన్నగారు. చివరకు ద్వివిదుడు తన చేతిలోని మధుపాత్రను విసురుగా లాక్కొని నేలకు విసరికొట్టటంతో పట్టరాని కోపం వచ్చింది బలరాముడికి. ఆయన వెంటనే తనముసలంతో వాణ్ణి గట్టిగా ఒక్క పెట్టు పెట్టాడు. బలరాముడి ముసలంపేరు మనకు ఎక్కడా కనపడదు. కాని ఇక్కడ పోతన్నగారు చెప్పారు దాని పేరు 'సునంద' అని. కొంతసేవు భీకర సమరం జరిగిన తరువాత బలరాముడు తనబలమైన చేతులతో ద్వివిదుడి మెడ బిగించి మట్టు పెట్టి ద్వారకా నగరవాసులను కాపాడాడు. సర్వలక్షణ లక్షిత అయిన ఆ అమ్మాయి పేరు లక్షణ. భానుమతి దుర్యోధనుల ('ప్రియపు(త్రిక. జాంబవతీ శ్రీకృష్ణుల ముద్దుల కుమారుడైన సాంబుడు హస్తినాపురం వచ్చి సాహసంతో లక్షణను ఎత్తుకొని రథం మీద తీసుకుపోసాగాడు. కర్ష శల్య భూరి(శ్రవస దుర్యోధనాది మహావీరులందరూ అతబణ్జి వెన్నంటి శరపరంపరలు కురిపించారు. చండకోదండ ముక్త నిశాత విశిఖ, జాల ముందంద వజపి యాభిలముగను నంద నందననందన స్యందనంబు, ముంచి రచలేంద్రమును ముంచు మంచు పగిది. 10-ఉ.562 వ ్రదనందనుడు శ్రీకృష్ణుడు. నందనందన నందనుడు సాంబుడు. అతని రథాన్ని పర్వతాన్ని మంచు ముం బనట్టు బాణపరంపరలతో కప్పివేశారట కురువీరులు. పర్వతం చుట్టూ మంచు ఏర్పడితే ఆ ప వతం! కంటికి కనిపించదు, అలాగే సాంబుడిరథం బాణసమూహంతో కప్పబడి పోయింది. ఇలా సరిగ్గా ణు 'పమాలంకారాన్ని, స నందన స్యందనంబు' ( ఇక్కడ నిపుణంగా ప్రయోగించారు పోతన్నగారు. అంతేకాదు. 'నందనందన అన్న శబసం4 ల తేటగీతిలోనే శబ్బాలంకారాన్ని ప్రంసుటిలని వృత్యను(ప్రాస సౌందర్యం అనుభవైకవేద్యం. ఈచిన్న అర్హా నై ఖింకారాన్ని ఒక దానికన్న ఒకటి మిన్నగా ప్రయోగించాడు మహాక్షవి.

ఎంత కష్టపడినా ఈ పూమాహేమీలు ఎవ్వరూ సాంబుణ్లీ ఎదుర్కొని “వ్రేలును వంపగలేకి సిగ్గుపడటం, చిట్టచివరకు అందరూ కలిసి ఒక్క మాటుగా చుట్టుముట్టి ఆ ఏ కైక వీరుణ్మి బంధించటం, బంధువులతో యుద్ధం భాన్యం కాదనే భావంతో బలరాముడు పరిమిత పరివారంతో వచ్చి సాంబుణ్ణి విడిచిపెట్టుమని దుర్యోధనుడికి బోధించటం, అందుకు దుర్యోధనుడు “చాలు వురే ఏమన గలదు కాలగతి! చక్కన కాలందొడుగు పాదుకలు తల కెక్కెన్‌ అని దుర్భాషలాడుతూ దిగ్గున లేచి నిజమందిరానికి పోవటం; ఆ మాటలకు అదరిపడిన బలరాముడు- '“తామ(ట తలపం దలలంట, తుమంట పాదుకల మంట గణింపంగ రాజ్య శ్రీ మదమున నిట్లాడిన యీ, మనుజాధముని మాట కేనునవచ్చున్‌' 10-ఊ.585 అని పరివారంతో పలికి ఆగ్రహోద'గ్రుడై గంగలో కలుపుతానని నాగలితో హస్తినాపురాన్ని పెకలించటం, అప్పుడు మహాజలమధ్య విలోలంబగు నావచందంబున న న్నగరంబు వడవడ' వణకటం, “కళవళంబున భయాకుల మానసులై అందరూ వచ్చి సాంబుణ్ణే లక్షణాసహితంగా సలక్షణంగా బలరాముడికి సమర్పించి సాష్టాంగ దండప్రణామాలు చేయటం, “రామ! సమంచిత ముక్తా దామ! యశుఃకామ! ఫఘునసుధాదామను రుచి స్తోను! జయసీము! జగదభి, రామ! గుణోడ్డాను! నిఖిలరాజలలామా! 10-ఉ.5869 అని చేతులు మోడ్చి (ప్రార్థించటం, 'ప్రముదితాత్మకు'డైన బలరాముడు 'ఇంక భయంబుదక్కి పాొం' డని వారిని క్షమించటం, కొడుకును గోడలిం దోడ్కొనుచు పరమానందంబు నొందుచు' దుర్యోధను డిచ్చిన అరణంతో బలరాముడు ద్యారకానగరానికి చేరటం- ఇవన్నీ సహజపాండిత్యుడి నాటకీయశిల్నానికి నాణ్యమైన తార్కాణాలు. భగవంతుడు కూడా మానవరూపం ధరించినప్పుడు మహర్షులకు సైతం నమస్కరించి మన్నించటమే మర్యాద. దేవర్షీ (బ్రహ్మర్షీ అయిన నారదుడు పదహారువేలమంది భార్యామణులతో సాగిస్తున్న జగన్నాథుడి సంసారాన్ని సందర్శించాలని ద్యారకానగరానికి చేరుకున్నాడు. షోడశ సహ(్రహర్మ్యాలు ఆయనకు కనువిందు చేశాయి. వెంటనే ఒక రాజభవనంలోకి (ప్రవేశించాడు. ఆ దివ్యమందిరంలో ఒక కాంతతో 'కాంచన సింహాసనాసీనుడైన పుండరీకాక్షుడు నారదుణ్లే చూచి 'ప్రత్యుత్హానం చేసి- మునివరు పాదాంబుజములు, తన చారుకిరీటమణివితానము సోన్‌ వినమితుండై నిజసింహా, సనమునం గూర్చుండంబెట్టి సద్వినయమునన్‌, 10-ఉ.606 తన పొదకమలతీర్థం,బున లోక్షములం బవిత్రముగః జేయు పురా తన మౌని లోకగురు( డ, మ్ముని పసదతీర్ధంబు మస్తమున ధరియించెన్‌. 10-ఉ.607 అంతే కాదు, 'ఏపని పంచిన జేయుదు తాపసవర!' అని కూడా అన్నాడు. ఆయనను అభినందించి నారదుడు మరొకయువతి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆమెతో పాచికలాడుతూ ప్రత్యక్షమైనాడు పద్మాక్షుడు.

ల ఈ విధంగా “ఇందు గలం డందు లేండని సందేహము వలదు” అన్నట్టుగా పదహారువేలమంది భార్యల సౌధాలలోనూ పరిపరివిధాలుగా నారదుడికి దర్శనమిచ్చాడు శ్రీకృష్ణుడు. నారదమహర్షి సందేహం పటాపంచలయింది. ఆయన 'హృషీకేశు యోగమాయాప్రభావా'నికి ఆశ్చర్యచకితుడై- “నీ మాయ దెలియువారలె, తామరసానన సురేంద్ర తాపసులైనన్‌ ధీమంతులు నీభక్తి సు, ధామాధుర్యమున( బొదలు ధన్యులు దక్కన్‌." 10-ఉ.631 అని స్తుతించి సెలవు తీసుకొన్నాడు. జరాసంధుడు బంధించిన ఇరవై వేలమంది రాజులు తమ కష్టాలు వినిపించటానికి శ్రీ కృష్ణుడి వద్దకు ఒక బ్రాహ్మణుణ్ణి పంపుతారు. ఆ బ్రాహ్మణుడు శ్రీ, కృష్ణుడిని దర్శించి వారి విషయాన్ని తెలిపి “నీ దయ వారి ప్రాప్తం” అంటాడు. అసలైన తెలుగుదనంతో చూడండి..- వారు పుత్తేర వచ్చినవాండ నేను; నరవరోత్తమ! నృపుల విన్నపము గాంగ విన్న వించెద నామాట; వినిన మీంద, ననఘ! నీదయ వారి భాగ్యంబు కొలంది. 10-ఉ.645 వారి (ప్రార్ధన మన్నించి భీముడిచేత జరాసంధవధ చేయించి బంధవిముక్తులను కావిస్తాడు శ్రీకృష్ణుడు. పాత్రల స్వభావాన్ని పోతన్నగారు ఎంతజా(గ్రత్తగా చిత్రిస్తారో చిత్తగించండి- రాజసూయమహాసభలో సహదేవుడి సలహాప్రకారం శ్రీకృష్ణుడికి అ(గ్రపూజ కావించిన ధర్మరాజు “ఆనందబావ్పజలబిందు కందళిత నయనారవిందం౦ంబుల గోవిందుని నుంందరాకారంబు దర్శింపజాలకుండె' అనటంవల్ల అతని అచంచల భక్తి విశ్వాసాలు ద్యోతక మైనాయి. శిశుపాలుడు శ్రీకృష్ణుడి వైభవం చూచి సహింపలేక కోపంతో “పీఠము డిగ్గి నిలిచి నిజహన్తము లెత్తి మనోభయంబు దక్కినవాడై' సభాసదులతో _ వ పురే! యహవాి! యీ కాలము గడవంగ దురవగాహంబగు; నీ లా తప్పెను నే6ఉ, బాలకు వచనములచేత 'ప్రాజ్ఞుల బుద్దుల్‌? 10-4ఉ.688 అని ఆక్షేపించటంలో అతని వ|క్రబుద్ది, అసూయ స్పష్టమైనాయి. అలాగే శిశుపాలుడి ల గైకొనని మగేం దురిత సరరతరమైన నిందావాక్యాలను పట్టించుకోకుండా 'విక్రుతాసేరవ రావమాత్మ కి వ ఆ ం0( శవహరించిన శ్రీకృష్ణుడి తీరు గాంభీర్యాన్నీ, ఉదాత్తతనీ వెల్లడిస్తున్నది. చక్కంబడుదురే", “ధార ఫ్‌ నః ర ఫ్యా! శీమదాంధులు సామంబుచేత

  • తె వదాను?ల ॥ 'ధర్మపాలనమునం గాక నిల్తునె కు ఫల రాని వదార్థ మొక్కటేనియుం గలదే? నే లంబు బలంబు చిరాయురున్స్నతుల్‌?*, దాన్యజన వర్యులకుం గలవే యసాధ్యములొో 'గురుభజ ల “= వనరుహనాభు సూక్తి సౌందర్యం స్మరింపదగింది. "గ ్జనంబు పరమధర్మంబు' అన్న పంక్తులలోని

స ఈ భాగంలో చివరిదైన కుచేలోపాఖ్యానం అసలు సిసలైన సఖ్యభక్తికి అపూర్వమైన ఉదాహరణం. ఈ ఉపాఖ్యానం (ప్రారంభంలోనే పరీక్షిత్‌ రాజేంద్రుడు శుకయోగీంద్రునితో ఇలా అంటాడు- హరి భజియించు హస్తములు హస్తము; లచ్యుతుంగోరి మొక్కు త స్త స్త ్య్‌ (| చ్చిరము శిరంబు; చక్రధరుః జేరిన చిత్తము చిత్త మిందిరా వరు గను దృష్టి దృష్టి; మురవైరి నుతించిన వాణి వాణి; య క్షరు కథ లాను కర్ణములు కర్షములై విలసిల్లుంబో భువిన్‌. 10-ఉ963 ఈ పద్యం సరిగ్గా సప్త్రమస్కంధంలో హిరణ్యకళిపునితో ప్రహ్లాదుడు పలికిన- “కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్షించు జిహ్వ జిహ్వ అన్న పద్యానికి ప్రతి ధ్వనిగా ఉన్నది. అంటే అది సీసం, ఇది చంపకం. దేని గొప్పతనం దానిదే. మానధనుడు, విజ్ఞాని, రాగొది విరహితస్వాంతుడు, శాంతుడు, ధర్మవత్సలుడు, ఘనుడు, విజితేంద్రియుడు, బ్రహ్మవేత్త అయిన కుచేలుడు 'లలిత పతివ్రతాతిలకమైన భార్య కోరికపై దుస్సహదరి[ద్ర పీడ వదిలించుకుందామని తన చిన్ననాటి చెలికాడైన శ్రీకృష్ణుడివద్దకు వెళ్ళాడు. ద్వారకానగరం చేరుకున్నాడు. రాజమారంలో పయనించి కక్ష్యాంతరాలు గడచి రుక్మిణీదేవి మందిరంలో హంసతూలికా తల్పంమీద ల 'మహితలావణ్య మన్మథ మన్మథు'డైన మాధవుణ్ణే దర్శించాడు. ఇక్కడ ఇరవైయేడు విశేషణాలతో ఆ స్వామిని మనముందు సాక్షాత్కరింపజేశారు. పోతన్నగొరు తారకాసంఖ్యతో ఎంత తన్మయత్వంతో వర్లించారో చిత్తగించండి- ఇందీవరశ్యాము వందితసు(త్రాము, కరుణాలవాలు భాసురకపోలు క్రాస్తభాలంకారు కామిత మందారు సురుచిరలానణ్యు సురశరణ్యు హర్యక్షనిభమధ్యు నఖిలలోకొరాధ్యు, ఘన చక్రహస్తు జగద్ర్రశస్తు ఖగకులాధిపయాను క్రాశేయవరిధాను, సన్నగశయను నబ్బాతనయను మకరకుండల సద్భూపు మంజుభౌసు, నిరుపమాకొరు దుగ్టసొగరవివారు భూరిగుణసాంద్రు యదుకులాంభోధిచందద్రు, విష్ణు రోజిష్టు జిష్ణు సహిష్టు కృష్ణు, 10-ఉ.979 జ్య క్‌ ఇంతటి భగవంతుడు కూడా ఆ శ్పేదవి(ప్రణ్లే అగ్రాంళ దారిద్ర్య పీడితుణ్ణి, కృశీభూతాంగుణ్ణి, హాస త్రరీయుణ్లో వ్‌ ం! శ్‌ జ్‌ కేజి | స్నేహితుణ్ణి అలంతదూరంలో చూచీ చూడగానే దళత్కంబాక్షు'డై, 'సంభ్రమవిలోలుం'డై తల్పం దిగి ళా ళం అటి ఇళ్ళ ట బెట్లుకొ ౨ వచాడు. హాంసతూలికాత ఖ్‌ ప్రేమతో ఎదురువెళ్ళి కాగిలించుకొని వెం ర న నాం ల్పంమీద అసనుణ్ణ గ లాడు. చేశాడు. కనకకలశజలంలో కొట్లే కడిగాడు. ఆ పోయే గ ఛవ్పంత తో వి ఏలో కుంకుమద్రవం , (శమ లాతాొ 0 సిరాడు. ' చందనం కలిపి మెల్ల మెల్లిగా అలదొడు. లల న్‌ సరలికు బంధురామోదకలిత ॥ అత = వ్రావాఆలించొటు., ౧బు న క భర ॥ ధూసంబు” లొసగొడు. మించు మణిదీపముల సుమమాలికలు', 'సిగముడిం

ణః దురిమాడు. 'కర్ఫూరమిళిత తాంబూల” మిచ్చాడు. 'ధేనువు నొసంగి" సాదరంగా స్వాగత మడిగాడు. రుక్మిణిదేవి వింజామరలు వీచింది. రంగధాముడు తనకు కావించిన రంగ రంగవైభోగానికి కుచేలుడు 'మేనం బులకాంకురంబు లంకురింప నానందబాప్పజలబిందు సందోహు' డైనాడు. భక్తుడికీ భగవంతుడికీ మధ్య ఉండే సంబంధం ఎంత సమున్నతమైందో, ఎంత 'ప్రగాఢమైందో, ఎంత అనిర్వచనీయమైందో ఈ సందర్భం మనకు బోధిస్తుంది. ఈ అద్భుత సన్నివేశాన్ని తిలకించి అంతఃపురకాంత లంతా- ఏమి తసంబు సేసెనొకొ! యీ ధరణీదివిజోత్తముండు తొల్‌ బామున యోగివిస్ఫుర దుపాస్యకుండై తనరారు నీజగత్‌ స్వామి రమాధినాధు నిజతల్పమునన్‌ వసియించి యున్న వాం డీ మహానీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్‌! 10-ఉ.985 అని తమలో తాము అనుకొన్నారట. అనంతరం మురారి కుచేలుడి 'కరము కరంబున దెమల్చి' చిన్నప్పటి సంగతులు ఎన్నెన్నో ముచ్చటించాడు. మాట్టాడటం మాధవుడి వంతు; మైమరచి వినటం కుచేలుడి వంతు అయింది. పదహారు గద్య పద్యాలలో మాధవుడి మధురాలాపాలు సాగితే కేవలం రెండు కంద పద్యాలు మాత్రం మన కుచేలుడు బదులు పలుకుగా పలికాడు. మౌనంగా మహాదానందాన్ని అనుభవించటమే అతని పని. చివరికి శ్రీకృష్ణుడు 'నా కోసం ఏం తీసుకువచ్చావయ్యా?' అని 'మందస్మిత వదనారవిందుడై' మి(త్రుణ్ణి (ప్రశ్నించాడు. పాపం 1 ఏం చెబుతాడు కుచేలుడు? అది గమనించిన కృష్ణుడు- దళమైైన పుష్పమైైనను, ఫలమ్రైనను సలిలమైన పాయని భక్తిం గొలిచిన జను లర్పించిన, నెలమిన్‌ రుచిరాన్నముగనె యేను భుజించున్‌. 10-ఉ.1010 అని అనునయంగా అన్నాడు. అప్పటికీ కుచేలుడు తన చినిగిన ఉత్తరీయపు చెంగున కట్టితెచ్చిన అటుకులను అర్పించలేక మొగమాటంతో ముఖం వంచుకున్నాడు. నవనీతచోరుడు ఊరకుంటాడా! చనువుగా కుచేలుడి చేలంలోని ముడి విప్పి అటుకులు చూచి 'ఇవియ సకలలోకంబులను నన్నును పరితృప్తిం బొందింపజాలు'నని పిడికెడు తీసుకొని ఆనందంతో ఆరగించాడు. అతనికి అక్టైశ్సర్యాలూ అను(గ్రహించాడు. మనోహరమైన మైత్రీ మాధుర్యానికి మరపురాని లక్ష్యలక్షణాలు కుచేలుడు శ్రీకృష్ణుడు. సఖ్యభక్తికి విఖ్యాతమైన సన్నివేశం కుచేలోపాఖ్యానం. బలరామకృష్ణులు బంధుసమేతంగా [గ్రహణస్నానం కోసం స్యమంత పంచకానికి విచ్చేసిన సందర్భంలో వారిని చూడటానికి యశోదానందులు గోపికలు, గోపకులు అందరూ (వ్రేపల్లైనుండి వచ్చారు. ఎప్పుడో కంససంహారంకోసం వెళ్ళిన తరువాత ఎంతో కాలానికి బలరామకృష్ణులను యశోదానందులు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సందర్శించటం సంభవించింది. ఈలోగా ఎన్నెన్నో ఘనకార్యాలూ, శుభకార్యాలూ కూడా

న జరిగిపోయాయి. వసుదేవుడు సముచిత మర్యాదలతో యశోదానందులను ఆదరించాడు. బలరామకృష్ణులు వినయంతో వారికి నమస్కరించారు. ఆనందం అర్హవమైనప్పుడు నోటి వెంట అసలు పలుకేరాదు. చూడండి, ఇక్కడ పోతన్న గారి వర్షన-

“అట్టు నమస్కృతులు సీని యాలింగనంబులు గావించి, నయనారవిందంబుల నానంద బాష్పంబులు దొరగ, నజలేని స్నేహంబులు చిత్తంబుల నత్తమిల్మ నేమియు బలుకకుండిరి.'

అప్పుడు యశోదాదేవి బలరాముళ్జో, కృష్ణుణ్మి దగ్గరకు తీసుకొంది. ఒడిలో కూర్చుండబెట్టుకుంది. చెక్కిళ్ళు ముద్దుపెట్టుకొంది. శిరస్సులు మూర్కొనింది. చిబుకాలు నిమిరింది. మళ్లీ మల్లీ కౌగిలించుకొని పరమానందభరితురా లయింది. ఆ పెంపుడు తల్లి (ప్రేమను కన్నతలి (ప్రేమకన్న మిన్నగా ఎంత సహజంగా వర్షించారో పోతన్న గారు!

అనంతరం వసుదేవుడి భార్యలైన దేవకీ రోహిణులు 'నందగోపసుందరి' అయిన యశోదతో ఇలా అన్నారు.-

వరుండును నీవు బంధుజన వత్సలతన్‌ మునుచేయు సత్క్యృతుల్‌

మణఅవ(గ వచ్చునే తల(ప మా కింక నెన్నటికిం దలోదరీ!

జననం బందుట మొదలుగ, ఘనమోహముతోడ( బెంచుకతమున దమకున్‌

జననీజనకులు వీరని, మనముల తలపోయలేరు నుము నీ తనయుల్‌.

అంటిన (డ్రేమను నీరిం, గంటికి తెప్పడ్డమైనగతి సంపంగ మా

కంటెన్‌ నెనరౌటను మీ, యింటన్‌ వసియించియుండి రిన్ని దినంబుల్‌.

'యశోదా! బంధుత్వాన్ని పాటించి మీరు చేసిన ఉపకారాలు ఎలా మరువగలం? పుట్టినప్పటినుండి మా బిడ్డలను మీ దంపతులు ఎంతో ప్రేమతో పెంచారు. కంటికి రెప్పలాగా చూచుకొన్నారు. అందువల్లనే అమ్మానాన్న అంటే వీళ్ళు మిమ్మల్నే అనుకొంటారు గాని మమ్మల్ని అనుకోరు.”

ఇక కృష్ణుడితోడిదే లోకంగా భావించిన గోపికలు ఆ కల్యాణమూర్తిని కనుగొని కనురెప్పలు కూడా మూయలేక పోతున్నారట. దివ్య మంగళ వి[గ్రహుడైన ఆ గోపాలుణ్లి తలచుకొంటూ పరబ్రహ్మాన్ని మనసులో నిలుపుకొని మైమరచే యోగులు లాగా ఉన్నారట.

నళినదళాక్షు. జూచి నయనంబులు మోడ్వంగం జాల కాత్మలన్‌

వలచి తదీయమూర్తి నిభనంబు దలంచుచు కాయగిలించుచుం

బులకలు మేన జాదుకొన పొల్తులు చొక్కిరి బ్రహ్మమున్‌ నునం

బులం గని చొక్కు యోగిజనమున్‌ బురుడింపంగ మానవేశ్వరా! 10. ఉ.1068

శ్రీకృష్ణుడి అష్టభార్యలలో చివరిదైన మద్రరాజకన్య లక్షణ (ద్రౌవదికి తన వివాహవృత్తాంతం చెప్పటం ఎంతో ఆసక్తి దాయకంగా ఉన్నది. మత్స్యయంత్రం భేదించిన వీరుడికి తన కొమార్తె నిచ్చి వివాహం

చేస్తానని చాటించాడు మద్రభూపతి, కొందరు ధనుస్సు పట్టుకోలేక పోయారు. కొందరు పట్టుకున్నా ఎత్తలేక పోయారు. కొందరు ఎత్తినా నారి బిగించలేకపోయారు. కొందరు బిగించినా ఎక్కుపెట్టలేక పోయారు. కొందరు ఎక్కుపెట్టినా ఆ యంత్రాన్ని బేదించలేకపోయారు. ఇలా అందరూ నానావిధాలుగా అవస్థలు పడుతూ చివరికి “ఇక్కడకు రావటం మనదే బుద్ది తక్కువ' అనుకొన్నారట. స్వాభావికమైన మానవ మనస్తత్ర్య చిత్రణకు ఉదాహరణం ఈ పద్యం. కొందణజు పూనలేక చన; కొందజు పూని కదల్బలేక పోం; గొంద ఉొకింతయెత్త నొకకొందలు మోపిడలేక దక్కగా! గొంద జొకింత యెొక్కిడుచు. గోరి నృపాలకు లిట్టు సిగ్గునుం జెంది తలంగి పోవుచును 'చీ యిట కేగుట నీతి త' ప్పనన్‌. 10-ఉ.1090 అప్పుడు- సరసిజప్యత్రలోచనుండు చాపము సజ్యముచేసి యుల్లస చ్చర మరింబోసి కార్ముకవిశారదుండై యలవోక వోలె భే చరమగు మీనముం దునిమె సత్వరతన్‌; సురసిద్ధ సాధ్య ఖే చర జయశబ్ద మొప్ప పెలుచం గురిసెన్‌ దివి పుష్ప వర్షముల్‌. 10-ఉ.1095 శ్రీకృష్ణుడు అఘటనఘటనా సమర్భు డనడానికి ఒక ఉజ్జ్వలమైన ఉదాహరణ దేవకీ మృతపుత్ర (ప్రదానం. దేవకీదేవి కంసుడి కరకుకత్తికి బలైపోయిన తన కన్నబిడ్డలు ఆరుగురినీ చూడా లనుకుంటుంది. కృష్ణుడికి తన కోరికను వెల్లడిస్తుంది. అప్పుడు కృష్ణుడు అమ్మకోరిక తీర్చటానికి అన్న బలరాముణ్జి వెంటబెట్టుకొని సుతలలోకానికి వెళ్తాడు. అక్కడ బలిచక్రవర్తికి రామకృష్ణులు ఎలా దర్శనమిచ్చారో చూడండి.- కనియెన్‌ దానవుం డింద్రసేనుండు దళత్కంజాక్షులన్‌ దక్షులన్‌ ఘనసారాంబుదవర్ద్హులన్‌ నిఖిలలోకైక ప్రభాపూర్జులం దనరారన్‌ హలచక్రపాణులను భక్తత్రాణులన్‌ నిత్య శో భన వర్ణిష్ణుల రామకృష్ణుల జయభ్రాజిష్టులన్‌ జిష్పులన్‌. 10-ఉ.1141 శాపవశాన తనకు పుట్టిగిట్టిన పుత్రులను ఆరుగురినీ అవలోకించి దేవకీదేవి- చన్నులు దిగ్గన చేపంగ, కన్నుల నానంద బాప్పకణములు దొరంగం (గ్రన్నన కౌగిట నిడి *ననుం గన్నన్నలు వచ్చి' రనుచు కౌతుక మొప్పన్‌. 10-ఉ.1161 పులకించిపోయిందట. అర్జునుణ్జై తిలకించిన 'ప్రకటసద్గుణభద్ర' అయిన సుభద్ర చూపుల్లో ముప్పిరిగొన్న మూడు భావాలనూ భ(ద్రంగా పరికించండి-

౫

ఆ తరుణీశిరోమణియు నర్జును నర్జునచారుకీర్తి వి

ఖ్యాతుని నింద్రనందను నకల్మషమానసు కామినీమనో

జాతుని చూచి పుష్పశరసాయకజర్దరితాంతరంగయై

భీతిలియుండె సిగ్గుమురిపెంబును మోహముదేరు చూపులన్‌. 10-ఉ.1171

(బ్రాహ్మణబాలకులను వెదకి తీసుకొని రావటానికి అర్జునుడితో కలిసి తన దివ్యరథాన్ని అధిరోహిస్తున్న శ్రీకృష్ణుడు ఉదయాద్రిపై కాలూనే సూర్యభగవానుడిలాగా ఉన్నాడట.

సుందరదివ్యరత్న రుచిశోభితమై తనరారు కాంచన

స్యందన మంబుజాప్తు. డుదయాచలమెక్కు విధంబు దోప పౌ

రందరి దాను నెక్కి తనురళ్ములు దిగ్వితతిన్‌ వెలుంగ గో

విందు. డుదారలీలం జనె విప్రతనూజ గవేషణార్థియె. 10-ఉ.1303

శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో పలుకుతున్నాడు. పరిశీలించండి -

హరినామాంకితమైన గీత మొకనూ టాలించి మూఢాత్ములున్‌

విరతిం బొందంగ6 జాలకుందురంట యా విశ్వాత్ము వీక్షించుచుం

బరిరంభించుచు నంటుచున్‌ నగుచు సంభాషించుచు న్నుండు సుం

దరు లానందనిమగ్నలౌట కిలం జోద్యంబేమి భూనల్లభా! 10-ఉ.1325

నిజమే. కృష్ణుడి పేరున్న పాట నొకదాన్ని వింటేనే ఎంత మూర్చులైనా ఆనందాన్ని పొందుతున్నప్పుడు ఆయనను ఆలింగనం చేస్తూ స్పృశిస్తూ హసిస్తూ భాషిస్తూ ఉండే కాంతలు ఆనందంలో మునిగిపోతారనటంలో సందేహం ఏముంది!

పోతన్నగారు దశమస్కంధాన్ని ముగిస్తూ ఇలా మంగళాశాసనం చేశారు.

మనుజేంద్రోత్తము! యేను నీకు త్రిజగన్మాంగల్యమై యొప్ప చె

ప్పిన యీ కృష్ణకథాసుధారసము సంప్రీతాత్ములై భక్తిం గ్లో

లిన పుణ్యాత్ములు గాంచు రిందు సుఖముల్‌ నిర్జూతసర్వాఘులై

యనయంబుం దుదిగాంతు రచ్యుత పదంబైనట్టి కైవల్యమున్‌. 10-ఉ-1336

కృష్ణకథాసుధారసాన్ని ఆస్వాదించినవారు లోకంలో సుఖాలు పొందటమే కాక పునరావృత్తి రహితమైన కైవల్యాన్ని కూడా అందుకుంటారట. (గ్రంథప్రారంభంలో “శ్రీ కైవల్యపదంబు చేరుటకునై' అని ప్రకటించిన ఆకాంక్షను మళ్లీ ఇక్కడ దశమస్కంధంలో మరచిపోకుండా పునరుద్దాటించారు పోతన్నగారు.

లలితస్కంధమై శ్రీకృష్ణమూలమై శుకాలాపాభిరామమై మంజులతా శోభితమై సువర్ష సుమన స్సుజ్జేయమై సుందరోజ్జ్వల వృత్తమై విమల వ్యాసాలవాలమై మహాఫలమైన శ్రీమద్భాగవత కల్పవృక్షాన్ని సహజ పాండిత్యుడైన పోతనామాత్యుడు ఆంధ్రుల ముంగిట్లో సంస్ట్రాపించారు.

2

భక్తి రససంభరితమూ, ప్రసన్నకవితాసంకలితమూ అయిన పోతన భాగవతం అందరికీ అందుబాటులో ఉండి అర్ధం కావాలనే ఆశయంతో తిరుమల తిరుపతి దేవస్టానంవారు ఈ మహా([గ్రంథాన్ని ప్రతిపద్యభావార్హ సహితంగా ప్రకటించాలని దృఢసంకల్పంతో ముందుకు రావటం ముదావహమైన విషయం. ఈ సందర్భంలో పోతన భాగవతం పన్నెండు స్కంధాలకు విద్వాంసులచేత సరళగద్యానువాదాలు (వ్రాయించారు. ఆ అనువాద భాగాలన్నింటినీ పరిశీలించి పరిష్కరించి వాటికి ఏక సూ(త్రత కల్పించే భారం నాకు అప్పగించారు. ఇందుకు కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి. ఎస్‌. ప్రసాద్‌. ఐ.ఏ.ఎస్‌. మహోదయులకూ, పౌరసంబంధాధికారి డాక్టర్‌ రావుల సూర్యనారాయణమూర్తి గారికీ, ఎడిటర్‌ శ్రీ కె. సుబ్బారావు, ఎం.ఎ. గారికీ అభినందనాలు.

ఈ సంపుటంలోని దశమస్కంధం శేషభాగాన్ని సరళగద్యంలో అనువదించినవారు శ్రీడి. నాగసిద్దారెడ్డిగారు. వీరు శ్రీ, వేంకటేశ్వర 'ప్రాచ్యకళాశాలలో ఆం(ధ్రోపన్యాసకులుగా, ఇన్‌చార్జి ప్రిన్సిపాలుగా ఉద్యోగించి పదవీవిరమణ చేసి ప్రస్తుతం టి.టి.డి. పుస్తక ప్రచురణ విభాగంలో సంపాదకులుగా ఉన్నారు.

శ్రీ డి. నాగసిద్దారెడ్డిగారి అనువాదం సరళమైన శిష్టవ్యావహారికంలో సహృదయ హృదయంగమంగా సాగింది.

ఈ సంపుటాన్ని ఇంతముచ్చటగా ముద్రించి ఇచ్చిన దేవస్తానం ్రెన్‌ మేనేజర్‌ శ్రీ ఎం. విజయకుమార్‌రెడ్డి గారికీ, వారి సిబ్బందీకి నా సాధువాదాలు.

అక్షరదోషాలు దొర్లకుండా సహసస్రాక్షులై ('ప్రూపులు సరిదిద్దిన పూజ్యమి(త్రులు శ్రీముదివర్తి కొండమాచార్వుల వారికి నా ధన్యవాదాలు

ముద్రణకు తగునట్టు స్పష్టంగా నిర్దుష్టంగా (ప్రెస్‌కాపీ సిద్ధం చేసి ఇచ్చిన చిరంజీవి కోరాడ రామకృష్ణ ఎం.ఎ. ఎం. ఫిల్‌, కు నా ఆశీర్వాదములు.

భోవదీయుడు కరుణశ్రీ 'ప్రధానసంపాదకుడు పోతనభాగవతం (ప్రాజెక్టు

19 వ స్కంధము - ఉత్తరభాగము (1వ పేజీ నుండి 290 వ పేజీ వరకు (ప్రద్యుమ్నకుమార చరిత్ర (ప్రారంభము క్ష శతధన్వుండు సత్రాజితునిం జంపి మణి నపహరించుట 17 శ్రీకృష్ణుం డిం(ద్రప్రస్తపురంబున కరుగుదెంచుట 21 శ్రీకృష్ణుండు కాళింది మి(త్రవింద నాన్షజితి భద్ర లక్షణ యను వారల6 బరిణయ మాడుట 26 శ్రీకృష్ణుడు సత్యభామతో. గూడ నరిగి నరకాసురుని వధించుట 31 సత్యభామ నరకాసురునితో యుద్ధంబు "సేయుట 35 భూదేవి శ్రీకృష్ణుని స్తుతించుట త్తం శ్రీకృష్ణుండు పదారువేల కన్నియల వరించి దేవలోకమునకు€ బోయి పారిజాతము. దెచ్చుట త్త శ్రీకృష్ణుండు కేళీగృహమునందు రుక్కిణీదేవితో విరసోక్తు లాడుట 48 రుక్మిణీదేవి శ్రీకృష్ణ లాలితలై యతని స్తుతించుట 53 కృష్ణుండు రుక్మిణీదేవి నూరడించుట 5్‌7 అనిరుద్దుని వివాహసమయమున బలరాముండు రుక్మి మొదలగు వారినిం జంపుట 61 బాణాసురుం డీశ్వర (ప్రసాదంబు నొందుట 66 బాణాసురుం డనిరుద్దుని నాగపాశబద్దుని6 జేయుట 80 నారదునివలన వృత్తాంతమును విని కృష్ణుండు బాణాసురునిపై దండెత్తుట 82 బాణాసురునికి సహాయభూతుండగు శివునకు కృష్ణునకు యుద్ద మగుట 85 బాణాసురుడు రెండవసారి యుద్దమునకు వచ్చుట 93 శివుండు బాణుని రక్షింప శ్రీకృష్ణుని స్తుతించుట 9 ఉషానిరుద్ద సహితుండై కృష్ణుండు ద్వారకాపురి కరుగుట 98 నృగమహారాజు చరి[తము 99 బలరాముండు సుహృదృంధుజన దర్శనార్ధమై (వ్రేపల్లైకుం బోవుట 106 కృష్ణుండు పౌం[డ్రకవాసుదేవునిపై దండెత్తిపోయి వాని. జంపుట 112

బలరాముండు ద్వివిదుండను వానరుని సంహరించుట 109 బలరాముండు హస్పినాపురమును గంగలోం ద్రోయ బూనుట 123 షోడశసహస్ర ప్రీ సంగతుండైన శ్రీకృష్ణుని మహిమ నారదుం డరయుట 131 నారదుండు శ్రీకృష్ణునితో ధర్మరాజు రాజసూయము నెరవేర్పుమని చెప్పుట 143 శ్రీకృష్ణుం డుద్దవుని యాలోచన చొప్పున ధర్మరాజు పాలికి6 బోవుట 146 పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొని తోడ్కొని పోవుట 149

ల ధర్మరాజా శ్రీకృష్ణు ననుమతంబున భీమాదుల దిగ్యిజయమునకు. బంపుట 152 శ్రీకృష్ణ భీమార్జునులు జరాసంధుని వధింప6 బోవుట 156 శ్రీకృష్ణ సహాయుండగు భీముండు జరాసంధునితో యుద్దము సేయుట 159 కారాగృహ విముక్తులగు రాజులు శ్రీకృష్ణుని స్తుతించుట 162 ధర్మరాజు చేసెడి రాజసూయమునందు శ్రీకృష్ణుండు శిశిపాలుని వధించుట 166 సాల్వుండు శివప్రసాదంబున సౌభకవిమానంబు వడసి ద్యారకాపురిపై దండెత్తుట 181 శ్రీకృష్ణుండు దంతవ॥క్రుని వధించుట 197 బలరాముండు తీర్ణయాత్రకు( జనుట 200 కుచేలోపాఖ్యానము 207 శ్రీ కృష్ణుండు సకుటుంబముగా (గ్రహణస్నామునకు6 బోవుట 221 లక్షణ యను శ్రీకృష్ణుని భార్య (ద్రౌపదిదేవికి. దన వివాహవృత్తాంతంబు దెలుపుట 230 నారదాది మహర్చులు శ్రీకృష్ణు దర్శనంబు సేసికొని వసుదేవునిచే.. (గ్రతువు సేయించుట 236 శ్రీకృష్ణ బలభద్రులు మృతులైన తమ సహోదరుల౦ దెచ్చి దేవకీ దేవికి. గనంబజచుట 241 సుభద్రా పరిణయము 247 శ్రీకృష్ణుండు బుషిసమేతుండయి మిథిలా నగరమునకు బోవుట 250 'శుతిగీతలు 256 పరీక్షిత్తునకు శుకయోగి విష్ణుసేవా (ప్రాశస్త్యంబు సెప్పుట 264 శివద్రోహంబు సేయం బూనిన వృకాసురుండు విష్ణుమాయచే మడియుట 266 భృగుమహర్షి త్రిమూర్తుల ్రాశస్యంబు శోధించుటకు. బోవుట 271 శ్రీకృష్ణుండు మృతులైన విప్రసుతుల. దెచ్చుట మ 274 పదునొకండవ స్కంధము (291 వ పేజీ నుండి ౩40 వ పేజీ వరకు

(ప్రవేశిక 293 పరిక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు (ప్రశ్న 295 ప 7

విశ్వామిత్ర వసిష్ట నారదాది మహర్షులు శ్రీ కృష్ణ సందర్శనంబునకు వచ్చుట 29 వసుదేవునకు నారదుండు పురాతనంబగు విదేహర్హభ సంవాదంబు దెలుపుట 301 (బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు బిలువ వచ్చుట 319 కృష్ణుండు దుర్నిమిత్తములం గని యాదవుల నెల్ల ద్వారక నుండి ప్రభాసతీర్థమునకుం బంపుట_ 320 కృష్ణుం డుద్ధవునకు బరమార్థోపదేశము సేయుట 321 ఆవధూత - యదు సంవాదము 323 శ్రీకృష్ణ బలరాములు వైకుంఠమున కరుగుట 336

పండ్రండవ స్కంధము (341 - 3౯6) (ప్రవేశిక 343 శుకయోగి పరీక్షిత్తునకు భావికాలగతులం జెప్పుట 346 యుగధర్మ ప్రాకృతాది ప్రళయ చతుష్టయ వివేచనము 354 పరీక్షిత్తు తక్షకునిచే దష్టుండై మృతినాంద నతని పుత్రుండు సర్ప్వయాగము సేయుట 359 త్రీ వేదవ్యాసుండు వేదములను, బురాణములను లోకమందు. (బ్రవర్తింపంజేయుట 361 మార్కండేయోపాఖ్యానము 366 చైత్రాదిమాసంబుల సంచరించెడు ద్వాదళశాదిత్యుల (క్రమంబును దెలుపుట 370

(| వోతన భాగవతము (0 గ్ర ఐదవసంవుటము _ (0

శ్రీరానముచంద్ర సరబవ్మాణే నమః (సరళ గద్వానునాద ననాతము, పదవ స్కంధము - ఉత్తరభాగము న్ధీ కర! పరిశోషిత ర, త్నాకర! కమనీయగుణగణాకర ! కారు (క్ర అ్యాకర! భికరశర ధా, రా కంపిత దానవేంద్ర! రామనరేంద్రా! క్షే

  • లక్ష్మీసమన్వితుడవు, సముద్రమును ఇంకింపజేసినవాడవు, మనోహరమైన గుణగణములకు నిలయుడవు, కరుణాసము[దద్రుడవు, భయంకరమైన బాణవర్షముచే దానవులను కంపింపజేసేవాడవు ఐన ఓ రామచంద్రా! అవధరించు. వ. మహనీయ గుణగరిష్టులగు న మ్మునిడ్రేష్టులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె, నట్టుప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు రుక్మిణీపరిణ యానంతరంబున నైన కథావృత్తాంతం బంతయు నినిపింపు మనిన శుకయోగీంద్రుం డిట్లనియె. 2
  • సద్గుణసంపన్నులైన ఆ మునీంద్రులతో సకలపురాణములకు వ్యాఖ్యాత అయిన సూతుడు భాగవతకథను ఇలా కొనసాగించాడు. ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షిన్మహారాజు రుక్మిణీ పరిణయం జరిగిన తర్వాత కథను వివరించమని అడుగగా శుకయోగి ఇలా చెప్పనారంభించాడు.
  • : ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభము :- ఉ. తామరసాన్షునంశమున దర్పకు( డీశ్వరు కంటిమంటలం దా మును దగ్దుండై పిదపం దత్పరమేశుని దేహలబ్దికై వేమటు నిష్టం జేసి హరివీర్యమునం బ్రభవించె రుక్మిణీ కామిని గర్భమం దసురఖండను నూజట మూర్తియో యనన్‌. 3
  • విష్ణుదేవుని కుమారుడైన మన్మథుడు పూర్వం పరమేశ్వరుని కంటిమంటలలో కాలిబూడిద అయిపోయిన తర్వాత ఈశ్వరుణ్ణి తన దేహంకోసం ప్రార్థించి రుక్మిణీకృష్ణులకు విష్ణుమూర్తి అపరావతారమో అనేటట్టు ఉద్భవించాడు. న. అంత నా డింభకుండు ప్రద్యుమ్నుండను పేర విఖ్యాతుండయ్యె, నా శిశువు సూతికాగృహంబున' దల్లి పొదింగిట నుండం దనకు శత్రుండని యెణింగి శంబరుండను రాక్షసుండు దనమాయా

2 పోతన భాగనతము బలంబునం గామరూసియై వచ్చి కొనిపోయి సముద్రంబులో వైచి తన గృహంబునకుం జనియె, నంత నా శాబకుండు జలధి జలంబునం దిగంబడ నొడిసి యొక మహామీనంబు (మింగె, నందు. కట బాలుడు (ప్రద్యుమ్నుడు అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు. ఆ శిశువు పురిటి గృహంలో తల్లి పొత్తిళ్ళలో ఉండగా శంబరు డనే రాక్షసుడు కామరూపంలో వచ్చి ఆ బాలుణ్ణి అపహరించుకొని వెళ్లి సముద్రంలో పారవేశాడు. ఆ బాలుడు తనకు శత్రువని (గ్రహించి శంబరుడు అలాచేశాడు. ఆ బాలుడు సము(ద్రజలాలలో పడి మునగగానే ఒక పెనుచేప అమాంతంగా అతజణ్జి (మంగివేసింది.

క. జాలి. బడి పాటు జలచర, జాలంబుల బోవనీక చని రోషాస్టి జ్వాలలు నిగుడ(గ నూరక, జాలంబులు వైచి సట్టు జాలరు అంతన్‌ క్‌

వ. సముద్రంబులోన నా మీనంబును దత్సహచరంబులైన మీనంబులనుం బట్టికొని తెచ్చి శంబరునకుం గానికంగా నిచ్చిన నతండు వండి తెండని మహానస గృహంబునకుం బంచిన. 6

  • జాలరులు వలలతో వెళ్ళి సముద్రంలోని జలచరాలను అటునిటు పారిపోనీయకుండా ప్రద్యుమ్నుని

(మింగిన పెనుచేపతోపాటు మరికొన్ని చేపలను గూడా పట్టుకొని శంబరునకు కానుకగా సమర్పించారు. శంబరుడు ఆ చేపలను వండితెమ్మని వంటశాలకు పంపించాడు.

క రాజునగరి యడబాలలు, రాజీనముకడుపు వ్రచ్చి రాజనిభాస్యున్‌ రాజశిశువు( గని చెప్పిరి, రాజీవదళాక్షియైన రతికి నరేంద్రా! 7

  • వంటవారు ఆ చేప కడుపు కోయగా చంద్రబింబంతో సమానమైన ముఖంతో విలసిల్లుతున్ను

బాలుడు కనిపించాడు. వారు ఈ విషయాన్ని రతిదేవికి విన్నవించారు.

న. అంత నారదుండు వచ్చి బాలకుని జన్మంబును శంబరోద్యోగంబును మీనోదరప్రవేశంబునుం జెప్పిన వినియా రతి మాయావతి యను పేర శంబరునియింట, బాతివ్రత్యంబు సలుపుచు దహనదగ్టం డయిన తన పెనిమిటి శరీరధారణంబు సేయుట కెదురు చూచుచున్న యది గొవునః న వలదు దర్చకుం డని తెలిసి మెల్లన పుత్రార్థినియెన తెణంగున శంబరుని యనునుళొ

ఎ సూపక్షారుల యొద్ద నున్న పాపనిం దెచ్చి పోషించుచుండె, నా కుమారుండును శీషఘ్రుకొలంబున నారూఢ యౌవనుండై, . 8 ఖః అంతకుముందే ప్న చేప మలల నే నారదమహర్షి రత్తిదేవికి ఆ బాలున్సి పుట్టుకనూ, శంబరుని ప్రయత్నాన్ని, బాలుణ్లే సాక్షాత్కరిస్తాడ్లా అస ఎదుటే న కంటిమంటల కాహుతియై పోయిన తన భర్త ఎప్పుడు సశరీరంగా వ్‌ చవి సూ ఛ్‌ ఆలి క్‌ వ! రతీదేవి ఆ బాలుడు మన్మథుడే అని తె టు ట్రైంల్‌ మాయావతి అనే పేరుతో నీతిగా జీవిస్తున్న లుస స వంటవారి దగ్గరనుండి త్రీస్పుక్ష్యా పోష్టింప సా న్నది, అ'త్రార్జిని వలె శంబరుని యనుమతితో ఆ బాలుని లు. (7 కస ౦ది. ఆ బాలుడు శీఘ్రకాలంలో యౌవనవంతు డయ్యాడు.

  • నుందర మగు త్రన రూపము సుందరు లొకమూ సౌందర్య మేమి చెప్పన? ౪ు దేటీ చూచినం జాలున్‌ షన బొందెద మని డాయుబుది( బుటి ఛ్‌ న్తంచు నృపా! 9

పదవ స్కంధము - ఉత్తరభాగము డ్రె

  • ఓపరీక్షిన్మహారాజ! ప్రద్యుమ్నుని చక్కదనం ఒక్కమాటు చూచిన సుందరీమణులకు అతనితో కామసౌఖ్యా లనుభవించాలనే కోరిక కలుగుతుంది. ఇక అతని సౌందర్యాన్ని వేరే వర్షించడ మెందుకు?

సీ చక్కని వారలు చక్కందనంబున కుపమింప నెవ్వండు యోగ్యుండయ్యె మిక్కిలి తపమున మెజయు నంబికకునై శంకరు నెవ్వండు సగము సేసె!

(బబ్రహ్మత్వమును బొంది పరంగు విధాతను వాణికై యెొవ్వండు నాని "సెజటీచె! నేయిడాంగులతోడి విబుధలోకేశుని మూర్తికి నెవ్వండు మూల మయ్యె!

తే. మునుల తాలిమి కెవ్వండు ముల్గుసూపు, మగల మగువల నెవ్వండు మరులుకొలుపు! గుసుమధనువున నెవ్వండు కొను విజయము, చిగురువాలున నెవ్వండు సిక్కువజుచు? 10

వ, అని తన్ను లోకులు వినుతించు ప్రభానంబులు గలిగి పద్మదళలోచనుండును, బ్రలంబబాహుండును, జగన్మోహనాకారుండును నైన సంచబాణునిం గని లజ్ఞాహాస గర్భితంబులైన చూపులం జూచుచు మాయానతి సురతభ్రాంతి జేసినం జూచి ప్రద్యుమ్నుం డిట్లనియె. క్ష

  • సాందర్యవంతుల అందచందాలను వర్షించేందుకు ఉపమానంగా చెప్పడానికి యోగ్యుడూ,

తపోనిష్టతో విరాజిల్టు పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి కోసం అర్హనారీశ్చరుణ్ణి చేసినవాడూ, (బ్రహ్మతేజస్సుతో విలసిల్లే బ్రహ్మదేవుణ్ణి సరస్వతీదేవికోసం వావివరుసలు మరచిపోయేటట్టు గావించినవాడూ, దేవేంద్రుని వేయికళ్ల వేల్పుగా నిలిపినవాడూ, మునీంద్రుల ధైర్యాన్ని సైతం చెదరగొట్టగలవాడూ, స్రీ పురుషుల కొకరిపై మరొకరికి (ప్రమభావం కల్గించేవాడూ, చెరకువింటితో ప్రపంచాన్ని జయించ గలిగినవాడూ, చిగురుటాకు అనేబాకుతో లోకులను చీకాకుపరచి చిక్కులపాలు గావించేవాడూ అని తనను జనులు స్తుతించేటంతటి ప్రభావం కలిగినవాడు ఆ ప్రద్యుమ్నుడు. తామరరేకుల వంటి నేత్రాలతో, ఆజానుబాహువులతో (ప్రపంచాన్ని సమ్మోహితం చేయగల ఆకారవిశేషంతో అలరారే మన్మథుణ్ణి మాయావతి సిగ్గుతో చిరునవ్వుతో గూడిన చూపులతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు ప్రద్యుమ్నుడు ఆమెతో ఇలా అన్నాడు.

నుత్త, 'నా తనూభవు డీత. డంచును నాన యించుక లేక యో

మాత నీ విదియేమి? నే డిటు మాత్సభావము మాని సం ప్రీతి. గామినిభంగి. జేసెదు పెక్కు నిభమముల్‌? మహా ఖ్యాతవృత్తికి నీకు ధర్మము గాదు మోహము సేయ/గాన్‌.' 12

  • ఒ తల్లీ! నేను నీ కుమారుడ ననే భావం లేక సిగ్గు వీడి కామిని ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నావు.

మాతృభావం వదిలివేశావు. నీ విట్లు నన్ను మోహించుట ధర్మబద్ధమైన కార్యము కాదు.

వ. అనిన రతి యిట్లనియె: “నీవు నారాయణ నందనుండవైన కందర్పుండవు, పూర్వకాలంబున నేను నీకు భార్యనైన రతిని. నీవు శిశువై యుండునెడ నిర్ణయుండై దొంగిలి తల్లిం దొజంగంేసి శంబరుండు కొనినచ్చి నిన్ను నీరధిలో వైచిన నొక్కమీనంబు (మ్రింగె; మీనోదరంబు వెడలితీవు, మీందటి కార్య మాకర్ణింపుము. 13

శ పోతన భాగవతము

  • జక విధంగా పలికిన ప్రద్యుమ్నునితో రతిదేవి ఇట్లన్నది. నీవు విష్ణుమూర్తి పుత్రుడవైన మన్మథుడవు. గతజన్మలో నేనునీ భార్యనైన రతిదేవిని. నీవు బాలుడవై యుండగా దయలేనివాడై శంబరుడు నిన్ను తల్లికి వేరుచేసి తెచ్చి సము(ద్రంలో పారవేశాడు. అప్పుడు నిన్నాక మీనం (మింగింది. ఆ చేప కడుపునుండి నీవు బయట పడ్డావు. తర్వాతి విషయం విను. క. మాయావి వీండు దుర్మతి, మాయండు సంగరములం దమర్వుల గెలుచున్‌ మాయికరణమున వీనిన్‌, మూయింపుము మోహనాది మాయలచేతన్‌. కడ
  • ఈ శంబరుడు మాయలమారి. దుర్మార్గుడు. యుద్దాలలో దేవతలను జయించాడు. ఇతబ్బే సమ్మోహనాది మాయలతో నీవు సంహరించు. మత్త. పాపకర్ముండు వీండు ని న్నింట బట్టి తెచ్చిన లేచి “నా పాపం డెక్కడం బోయెనో? సుతుం బాపితే విధి 'యంచు( దా గ్రేపు బాసిన గోవుభంగిని ఫిన్నటై పడి గాఢ సం గ తాపయై నిను నోంచి కాంచిన తల్లి కుయ్యిడ కుండునే? క నౌ
  • పాపాత్ముడైన శంబరుడు నిన్ను అపహరించి తెచ్చిన తర్వాత నీ తల్లి లేగను బాసిన గోవువలె ” కుమారు డే మయ్యాడో? దేవుడా? నన్ను నా కుమారుడికి దూరం చేశావా? అని ఎంతగానో దుఃఖిం౭ వుండదా? ల యిన మ. అని పలికి మాయావతి మహానుభావుండైన ప్రద్యుమ్నునికి సర్వశత్రుమూయావినాళి య న్‌ మహామాయావిద్య నుపదేశించె: ని వ్విధంబున- ఆల్‌ స ను
  • క్క విధంగా చెప్పి మాయావతి మహానుభావుడైన (ప్రద్యుమ్నునికి సర్వశత్రువుల మాయల మాయింపజేయ గల “మహామాయ”అనే విద్యను ఉపదేశించింది. మ. గురుమాయారణవేదియై, కవచియై, కోదండియై, బాణియై హరిజుం డోరి నిశాట! వైచితివి నాం డంభోనిధిన్‌ నన్ను ఘో ర రణాంభోనిధి వైతు నిన్ను నిదె వే రమ్ముంచు. జీరెన్‌ మనో హర దివ్యాంబరు నుల్లస ద్దనుజ సేనాడంబరున్‌ శంబరున్‌. క
  • ఈవిధంగా మాయాయుద్ద ప్రవీణుడైన ప్రద్యుమ్నుడు కవచమును ధరించి, ధనుర్బాణములను చేత దాల్చాడు. మనోహరమైన వ(స్తాలంకారాలతో దానవసేనా సమూహంతో విలసిల్దుతున్న శంబరుణ్జో ఓరీ! రాక్షసా! ఆ నాడు నన్ను సము(ద్రంలో పారవేశావు. ఈనాడు నిన్ను యుద్దసము(ద్రంలో పడవేస్తాను. వేగంగా రారా! అని పిలిచాడు. చ. అదలిచి యిట్టు కృష్ణసుతు. డాడిన నిష్టుర భాషణంబులం బదహతమై వడిం గవియు సన్నగరాజము( బోలి శంబరుం

పదవ స్కంధము - ఉత్తరభాగము 5 డదరుచు లేచి వచ్చి గద నచ్యుతనందను (్రేసె నుజ్వల ద్భిదురకఠోరఘోష సమభీషణనాదము చేసి యార్చుచున్‌. 18

  • జ్ర విధంగా తన్ను ప్రద్యుమ్నుడు దూషణవాక్యాలు పలుకగా తోకతొక్కిన సర్పంలాగా దర్పంతో

విజృంభించి శంబరుడు పిడుగుపడి నట్టు కఠోరంగా గర్జిస్తూ తన గదాదండంతో ప్రద్యుమ్నుణ్జో కొట్టాడు.

క, దనుదేంద్రుండు వేసిన గదం దన గదచే బాయ నడిచి దనుజులు బెదరన్‌ దనుజాంతకుని కుమారుడు, దనుజేశుని మీంద నార్చి తన గద వైచెన్‌. క్షం

  • ప్రద్యుమ్నుడు రాక్షసరాజు గదను తన గదతో భగ్నంచేసి రాక్షసులు భయం చెందేటట్టుగా తన

గదతో రాక్షసుణ్ణి మోదాడు.

న. అంత నారక్కసుండు వెక్కసంబగు రోసంబున దనకు దొల్లి మయుం డెణింగించిన దైతేయమాయ నాశ్రయించి మింటికి నెగసి పంచబాబణునిసై బాణవర్షంబు గురిసిన నమ్మహారథుండు నొచ్చియు సంచలింపక మచ్చరంబున సర్వమాయా వినాణిని లైన సాత్విక మాయం బ్రయోగించి దనుజుని బాణవృష్టి నివారించె. నుతీయు వాండు భుజగ గుహ్యక పిశాచ మాయలు పన్ని నొప్పించిన నన్నియుం దప్పించి. 20

  • అప్పుడు శంబరుడు మిక్కిలి రోషంతో తనకు పూర్వం మయుడు నేర్పిన రాక్షసమాయతో

ఆకాశంలోకి ఎగిరి ప్రద్యుమ్నునిపై బాణవర్షం కురిపించాడు. ప్రద్యుమ్నుడు బాణవర్ష బాధకు ఓర్చుకొని సర్వమాయలను నశింపజేయగల సాత్తికమాయ అనే విద్యను ప్రయోగించి శంబరుని శరవర్షాన్ని ఆపగలిగాడు. మళ్ళీ శంబరుడు ఎన్నో పిశాచమాయలను గుప్పించి నొప్పించాడు. ఆ మాయల నన్నిటినీ ప్రద్యుమ్నుడు తప్పించుకున్నాడు. క. దండధరమూర్తి గై కొని, యొండాడక చక్రిసూను. డుగ్రతరాసిన్‌ ఖండించె శంబరుని తలం గుండల కోటీరమణులు గుంభిని రాలన్‌. 21

  • స్ర్రికృష్తుని కుమారుడగు ప్రద్యుమ్నుడు యమధర్మరాజువలె భయంకరరూపము ధరించి పదునైన న్‌ వి తన ఖడ్గంతో శంబరుని శిరస్సు ఖండించాడు. కిరిటకుండలాలతో గూడిన ఆ శిరస్సు నేలరాలింది. క. చిగురాకడిదపు ధారను, జగముల బరవశము సేయు చలపాదికి దొ డ్డగు నుక్కడిదంబునం దన, పగతుం దెగవ్రేయు టెంత పని చింతింపన్‌? 22
  • బిగ్సరాకు కత్తితోనే ప్రపంచాన్ని జయింపగల సమర్భునికి ఉక్కుకత్తితో శత్రువు శిరస్సు ఖండించటం ఏమంత గొప్పపని? క. బెగడుచు నుండం శంబరుం దెగడుచు. బూవింటిజోదు ధీర గుణంబుల్‌ వొగడుచు గురిసీరి ముదమున, నెగడుచు( గుసుమముల ముసురు నిర్దరు లధిపా! 23
  • ద్రేవతలు శంబరుణ్ణీ నిందిస్తూ (ప్రద్యుమ్నుని ధైర్యాన్ని అభినందిస్తూ ఆనందంతో పూలవాన కురిపించారు.

6 పోతన భాగవతము వ. ఇట్లు శంబరుని వధియించి విలసిల్లుచున్న ఇంచువిలుకానిం గొంచు నాకాశచారిణిమైన యా రతీదేవి గగనపథంబు( బట్టి ద్వారకానగరోపరిభాగమునకుం జనుదెంచిన., డక

  • క్ష విధంగా శంబరుణ్ణి సంహరించి శోభిస్తున్న ప్రద్యుమ్నుణ్ణి తీసికొని రతిదేవి ఆకాశమార్షంగుండా ద్యారకానగరానికి వచ్చింది. ఆ. మెజు(గుందీగెతోడి మేఘంబుకై వడి, యువిదతోడ మింటి నుండి కదలి యరుగుదెంచె నుదను6 డంగనాజనములు, మెలంగుచున్న లోని మేడకడకు. 25 *ోరత్రిదేవితో కూడిన (ప్రద్యుమ్నుడు మెరపుతీగతో గూడిన మేఘంలా కోభించుతూ ఆకాశంలో నుండి దిగి స్త్రీలు నివసించే మేడదగ్గరకు చేరాడు. మ. జలదశ్యాము బ్రలంబబాహుయుగళుం జంద్రాననున్‌ నీల సం కులవక్రాలకు. బీతవాసు ఘనవక్షున్‌ సింహ మధ్యున్‌ మహో త్సల పత్రేక్షణు మందహాసలలితుం బంచాయుధున్‌ నీరజా క్షులు దా రేమలుపాటం జూచి హం యంచుం డాంగి రయ్యె యొడన్‌, 26 వం మేఘమువలె నీలవర్షం, ఆజానుబాహువులు, చంద్రునిబోలిన నెమ్మొగం, నల్లని ఉంగరాల ముంగురులు, పచ్చని వస్త్రం, విశాలవక్షః స్థలం, సన్నని నడుము, కలువరేకులవంటి కన్నులు, మృదువైన చిరునవ్వుగల (ప్రద్యుమ్నుని అచ్చటి ్రీలు ఏమరుపాటుగా చూచ్చి శ్రీకృష్ణుడని భ్రమించి అచ్చటచ్చట దాక్కున్నారు. న్డ్‌ క కొందలు హరి యగు నందురు, కొందలటు చిహ్నములు కొన్ని కొన్ని హరికి లే వందురు మెల్లనె తెలియుద, మందురు మరు జూచి కొంద అబలలు గుములె. 27 సంగం న 'లద్యుమ్నుని గాంచి కొందరు స్త్రీలు శ్రీ కృష్ణుడే అని అనగా మరికొందరు శ్రీకృష్తునిలో ఇతనిలోని కొన్ని లక్షణాలు లేవన్సి అన్నారు. ఇంకా కొందరు నెమ దిగా ఈవిషయం తె టీ " గ్ల ఎయం స పులు గుంపులుగా చేరారు. శ్ర లుసుకుందామని గుంపు హరన నుచని ప్లిద్రపన్స్‌, హరి( బోలెడ్రువాండ్రు గౌని హరి గాం డనుచున్‌ లల్లనల్లన, వ్ల జ్య జ గ్‌ ల్లి రినందను డాయ వచ్చి రాశ్చర్యమునన్‌, 28 కృష్ణుడే అన్సి కొంతద్రూర్రం వెళ్ళి స్రీ కృష్ణునిలా ఉన్సాడేగ్సా నీక స్త్రీలు శ్రీక్షష్తుని ం లు న్నాలగాని శ్రీళ్ష డు కొడని భావించి దారకానగర = భష్లని కుమారుడైన ప్రద్యుమ్నుని సమీపించారు, ల చ్బ ఉ. “అన్సుల్వు సేర వచి పనులే ఎ వరు నందలుం జౌొడంగం ద్రాన్స వచ్చి సం హరిపట్టపుద్వే విదర్భపుత్రి క్రి

పదవ స్కంధము - ఉత్తరభాగము 7 గన్నుల నా కుమారకుని క్రై వడి నేర్పడం జూచి బోటితో! జన్నులు సే(ప నిట్లనియె సంభ్రమదైన్యము లుల్లసిల్ల(గన్‌, 29

  • ప్రీలందరూ (ప్రద్యుమ్నుని చూడరాగా శ్రీకృష్ణుని పట్టపుదేవి, సుగుణాలదీవి అయిన రుక్మిణీదేవి శ్రీగంటితో ఆ కుమారుని రూపురేఖలను చూచి పాలిండ్టు చేపగా దైన్యసంభ్రమాలతో చెలికత్తెతో ఇలా అంది. శా. “ఈ కందేక్షణు! డీ కుమారతిలకుం డీ యిందుబింబాననుం డీ కంఠీరవమధ్యు( డిచ్చటికి శే. డెందుండి యేతెంచెనో యీ కల్యాణుని( గన్న భాగ్యవతి మున్నేనోములన్‌ నోంచెనో యే కాంతామణియందు వీని కనెనో యేకాంతు! డీకాంతునిన్‌. 30
  • వలీ! పద్మనేత్రుడు, చంద్రముఖుడు, సింహమధ్యుడు అయిన ఈ సుకుమారుడు ఇక్కడకు ఎక్కడినుండి వేంచేశాడో, ఈ బాలుని గన్లు భాగ్యవతి పూర్వజన్మలో ఏ నోములు నోచిందో? ఏ కాంతుడు ఏ కాంతామణియందు ఈ కాంతుని కాంచెనో! శా అళీ! నొ తొలుచూలి పొపనికి బోర్కాడించి నే సూతికా శాలా మధ్యవిశాల తల్పగతనై చన్నిచ్చి నిద్రింప నా బాలున్‌ నా చనుంబాలకుం జెటీచి యే పాపాత్ము లే త్రోవము న్నే లీలం గొనిపోయిరో? శిశువు దా నే తల్లి రక్షించెనో! 31
  • ల చెలీ! నా తొలిచూలుబాలునికి స్నానం చేయించి పురిటిగదిలో మంచంపై పరుండి చన్నిచ్చి నిద్రించే సమయంలో ఏ పాపాత్ములు నా పుత్రుని నా చనుబాలకు దూరంచేసి ఏ విధంగా దొంగిలించుకొని వెళ్ళారో? ఆ పిల్లవాణ్ణీ ఏ చల్లిని తల్లి రక్షించినదో? క కొడుకయడునా పాదిగింటిలోల జెడిపోయిన నాయ నుండి చెలియా! తెలియం బడ దే వార్తయు నతం డే, వడువున నె చోట నిలిచి వర్తించెడినో! 32 నా కుమారుడు నా పొత్తిళ్ళనుండి దూరమైన నాటినుండి ఏ వార్తయునూ తెలియలేదు. ఆనా బాలుడు ఏ విధంగా ఎక్కడ జీవిస్తున్నాడో గదా? కు ఇందాక వాండు బ్రదికిన, సందేహము లేదు దేహచాతుర్యవయ స్పౌందర్యంబుల లోకులు, వందింసంగ నితనియంతవా( డగు జుమ్మీ! 33
  • ఇప్పటిదాకా ఆ బాలుడు బ్రతికి ఉంటే వయోరూప రేఖావిలాసాలలో ఆ యువకు నంతటివాడై ఉండేవాడు సుమా! య్‌ ము. అతినా! సిద్దము నాటి బాలకున క్రీయాకార మీ వర్గ మీ గతి యీ హాసవిలోకనస్వరము లీ గాంభీర్య మీ కాంతి వీ6

/ పోతన భాగవతము డతండే కాందగు నున్నవారలకు నా యాత్మేశు సారూప్య సం గతి సిద్ధింపదు, వీనియందు మిగులం గౌతూహలం బయ్యెడిన్‌. వడ

  • అనాటి ఆ బాలుడికి ఈ రూపం, ఈ రంగు, ఈ నవ్వు, ఈ చూపులు, ఈ కంఠస్వరం, ఈ గాంభీర్యం, ఈ కాంతి ఉండేవి. ఇతడు నా పుత్రుడే కావచ్చు. కాకపోతే నా పతిభ్రైన శ్రీకృష్ణుని పోలికలు వీనిలో ఎందుకుంటాయి? ఇతనిపై నాకు ఎంతో అభిమానంకూడా కలుగుతున్నది. క. పాదలెడి ముదమున జిత్తము, గదలెడి నాయెడమమూయ, గన్నుల వెంటం బౌదలెడి నానందాశ్రులు, మెదలెడిం బాలిండ్ల( బాలు, మేలయ్యెడినో! తెక్‌ *ఆనందంతో నా హృదయం ఉప్పాంగుతున్నది. నా ఎడమ బుజం అదురుతున్నది. కండ్లనుండి ఆనందాశ్రువులు రాలుతున్నవి. పాలిండ్లలో పాలు జాలువారుతున్నవి. ఏం మేలు జరుగుతుందో! న. అని డోలాయనూన మానసై వితర్కించుచు. 36 *అని మనస్సు ముందువెనుకల కూగుతుండగా రుక్మిణీదేవి ఇలా వితర్కించింది - క తనయు డని నొడువ( దలంయను, దనయుండు గాకున్న మిగుల దతిగొని సవతుల్‌ దను నగియెద రని తలంచు న, తను సంశయ మలమికొన(గ6 దనుమధ్య మదిన్‌. 37 స ఇతడు నా కుమారుడే లన్సి చెప్పబోతుంది. కాని ఆతడు తన కుమారుడు కాకపోతే సమయం చిక్కిందని తన సవతులు తనను గేలి చేస్తారేమో అనే సంశయం కలిగింది. వ ఇట్లు రుక్మిణీదేవి విచారించుచుండ లోపలి నగరి కావలి నారి వలన విని కృష్ణుండు దేవకీ వసుదేవులం ళా దోడ్కొని చనుదెంచి సర్వజ్ఞుం డయ్యు నేమియు వివరింపక యూరకుండె, నంత నారదుండు సనుదెంచి శంబరుండు గుమారునిం గొనిపోవ్పుట మొదలైన వార్త లెజీంగించిన, 38 నే శ్ర కుది లేన ఆల్‌ చిస్తుండగా అంతఃపురము కావలి వారి వలన విషయం తెలుసుకొని ఈ సుదెవులను త్రిష కా వహించాడు అప్పుడు నారదమునీ! సో టకు వచ్చాడు. సర్వజ్ఞాడైకూడా ఏమీ మౌట్లాడకుండా మౌనం ్య 0(ద్రుడు వచి శంబరుడ్రు మ న నుండి జరిగిన కథనంతా వివరించాడ్తు, బ ఈ బాలుని ఆ వారించుకొని పోయినప్పటి క “చచ్చిన బాలుండు గమ)ఆ గ సచ్చరితు నేయ గటి వీ చ ల టోయ వచ్చె. బెక్కువర్షములకు నీ ఖ్‌ " ? అబ్బర మున్నెట్టి తప్పు సేయంబడెనో? 29 అపహ ౦పబడిన క్ర బాలుజి ఎ ఏ డ్లకు 'బ్రతికిరావటంలాంటిడే ఇది. ఈ బాలుని జ లి గరిగొము. రణించిన బాలుడు తిరిగి అ యంతఈపురకాంత్రల్నన్స, దేవకీ వసుదే ఫె దివ్యాంబరా, “నిలవ రామకృష్ణులున్స యథోచ (బరాభర జాలంకృతుల సత్కరించి సంతోసిం్చిి, ర్చ ణీ న నా దంపతుల " లన్మణిదేనియు నందనుం గౌంగిలించుకొని. 40

పదన స్కంధము - ఉత్తరభాగము ం్ర

  • అనుకుంటూ అంతఃపురకాంతలూ, దేవకీ వసుదేవులూ, బలరామకృష్ణులూ, రతీ (ప్రద్యుమ్నులను మంచి మంచి వస్త్రాభరణాలతో సత్కరించి సంతోషించారు. రుక్మిణీదేవి తన పుత్రుని కౌగిలించు కొన్నదై ఇలా అన్నాది ఆ శా. “అన్నా? నా చనుంబాపి నిన్ను దనుజుండంభోనిధిన్‌ వైచెనే యెొన్నే వర్షము లయ్యె( బాసి సుత! నీ వేరీతి జీవించి యే సన్నాహంబున శత్రు గెల్ఫితిన? యాళ్చర్యంబు సంధిల్రెడిన్‌ నిన్నుం గాంచితి నింతకొలమునకున్‌ నే ధన్యతం జెందితిన్‌. త్తే
  • బ్రాబూ! రాక్షసుడు నిన్ను నానుండి వేరుచేసి సముద్రంలో పడవేసి ఎన్నో సంవత్సరాలైంది. కుమారా! నీవు ఏరకంగా (బ్రదికి బయటపడి ఆ రాక్షసుణ్లి సంహరించావో చాలా ఆశ్చర్యంగా వుంది. ఇంతకాలానికి మళ్లీ నిన్నుచూచి నేను ధన్యురాలి నయ్యాను. వ. అని కొడుకుం జూచి సంతోషించి కోడలి గుణంబులు కైవారంబు సేసి, వినోదించుచుండె, నంత ద్యారకానగరంబు ప్రజలు విని హర్షించి, రందు. శై
  • ఇలా పలుకుతూ రుక్మిణీదేవి తన కుమారుణ్లీ చూచి ఆనందించింది. కోడలి సద్గుణాలను సంస్తుతించింది. ద్యారకానగరవాసు లందరూ ఈ వార్త విని ఎంతో సంతోషించారు. క్ష సిరిపెనిమిటి పుత్రకు. డగు, మరు గని హరిం జూచినట్ల మాతలు దమలో! గరంగుదు రట, పరకాంతలు, నురుంగని మోహాంధకొరనున్నలు గారే? ఢం
  • స్రకృష్ణుని పుత్రుడైన ప్రద్యుమ్నుని గాంచిన ప్రద్యుమ్నుని తల్లులు శ్రీకృష్ణుని గాంచినట్టే భావించి కరగిపోవుదు రట. ఇక పరకాంతలు ఈ మన్మథుని చూచి మోహాంధకారంలో మునిగిపోరా? వ. అని చెప్పి శుకుం డిట్టనియె శే అని చెప్పి శుకుడు ఇంకొ ఇలా పలికాడు. క్ష సత్రాజిత్తు నిశాచర, శమ్రనకుం గీడు సేసి సద్వినయముతో( బుత్రి స్యమంతకనుణియును, మైత్రిం గొని తెచ్చి యిచ్చె మనుజాధీశా! శక శ రాజా! సత్రాజిత్తు శ్రీకృష్ణునిపట్ట అపచారంచేసి తర్వాత పశ్చాత్తాపపడి స్యమంతకమణినీ, తన పుత్రికామణినీ మైత్రీభావంతో సమర్పించాడు. వ. అనిన విని రా జట్లనియె. ॥
  • అని శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు విని ఇలా అన్నాడు. అ. శౌరి కేమి తప్పు సత్రొజితుండు సేసెగ, గూంయ మణిని నేల కోరి యిచ్చె? నతని కెట్లు కలిగె నా స్యమంతకమణి, విప్రముఖ్య! నాకు విస్తరింపు. క

10 పోతన భాగవతను

  • ఓ మునీంద్రా! సత్రాజిత్తు శ్రీకృష్ణుని పట్ట ఏమి అపరాధం చేశాడు? స్యమంతకమణినీ, తన కుమారీమణినీ ఎందుకు కోరి కోరి ఇచ్చాడు? సత్రాజిత్తుకు ఆ స్యమంతకమణి ఎలా లభించింది? ఈ విశేషాలన్నీ నాకు తెలియ జెప్పండి.

వ అనిన విని శుకయోగివర్యుం డిట్లనియె. సత్రాజిత్తనువాండు సూర్యునకు భక్తుండై చెలిమి సేయ నతనివలన సంతసించి సూర్యుండు స్యమంతకమణి నిచ్చె, నా మణి కంఠమున ధరియించి సత్రాజిత్తు భాస్కరుని భంగి భాసమానుండై ద్వారకా నగరంబునక్షు వచ్చిన దూరంబున నతనిం జూచి జనులు మణిప్రభాపటల తేజోహృతదృష్టు లయి సూర్యుం డని శంకించి వచ్చి హరి కిట్లనిరి.48

  • రాజు ఇలా అడుగగా శుకయోగి ఆ కథ చెప్పనారంభించాడు. సత్రాజిత్తు సూర్యుని భక్తితో

ఆరాధించాడు. సూర్యుడు ఆతని భక్తికి సంతోషించి అతనికి స్యమంతకమణిని ఇచ్చాడు. ఆ మణిని కంఠంలో ధరించి సత్రాజిత్తు సూర్యునిలా వెలిగిపోత్తూ ద్వారకా నగరానికి వచ్చాడు, ద్యారకానగరవాసులు ఆ మణికాంతులకు కన్నులు మిరుమిట్లు గొనగా సూర్యుడని భ్రాంతిపడి శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి ఇలా విన్నవించారు ఆ

క. నారాయణ! దామోదర! నీరజదళనేత్ర? చక్రి! నిఖిలేశ! గదా ధారణ! గోవింద! నమస్కారము యదుపుత్త! నిత్యకల్యాణనిధీ! త్రి

నే

నారా, ప స యణా! దామోదరా! పుండరీకాక్షా! చక్రాయుధా! సర్వేశ్వరా! గదాధారీ! గోవిందా! యదునందనా! కల్యాణప్రదా! నీక్సు నమస్కారం.

మ. దివిజాధీశ్వరు లిచ్చగింతురు గదా దేవేశ! నిన్‌ జూడయా దవ వంశంబున గూఢమూర్తిని జగత్రాణుండవై యుండలా భవదీయాక్పతి, జూడ్ర నేంీదె రుచిప్రచ్చన్నదిగ్భాగుండై రవియో, నీర లో

ల జగర్భుండో యొకండు సరన్‌ వచ్చె మార్గంబునన్‌, 50

ఓ దేవదేవా! నీ దర్శనాన్సి దేవత్రల్తు ఇ లు సైత జగద్రక్షకుడవై ఉండగా దిక్కుల నడా కాంతులు వ ౮ రు. -వగనవంశంలో అవతరించి నివు డానికి వస్తున్నాడు, జల్బుచూ సూర్యుడో, బ్రహ్మదేవుడో నిన్ను దర్శించ ను అని యిట్లు పలికిన మూ స్ట ఢజనులం జబ్బ గోవిం. శ దు స గొని సూర్యుండు గాం డని ఫలిత, నంత సత్రాజ్రిత్చ్ర నగి నుణీసమేతుండైన సద్రాజితుండు గ్రహంబునకుం జని, మహీసురులచేత్ర నిజదే్య గ్రైయుతంబయి ఏంగళాచారంబైన త్‌న మంది జః

ఖః చె వదియును 'టితిదినంబు నెనిమిద్ద బారువ శ్‌ మనన మ్మణిశ్రేస్టంబు ప్రవేశంబు

అని తనతో ప్రల్రిక్ర్వ అమాయిక్తు ౯ సువర్గంబు గలిగించుచుండు. 51 అంతేగాన్సి సూర్యుడు కాడు అని అను చూచ్చి శ్రీకృష్ణుడు నవ్వి అతడ్రువ్చు అబ చెప్పాడు. అనంత్రర్ర సత్రాజిత్తు వ్ర ణేని ధరించిన సత్రాజిత్తు. ం దు ళా, జ్య చొర భాస్వంతమైన త్రన ఇంటికి

పదవ స్కంధము - ఉత్తరభాగము . 1 వెళ్ళి దేవతా మందిరంలో సత్యమంతకమణిని (బ్రాహ్మణులచేత ప్రవేశ పెట్టించాడు. ఆ మణి దినదినమూ ఎనిమిది బారువుల బంగారాన్ని ప్రసాదిస్తుంది.

క్ష ఏ రా జేలెడు వసుమతి, నా రత్నము పూజ్యమానమగు నక్కడ రో గారిష్ట సర్వమాయిక, మారీ దుర్చిక్షభయము నూను నరేంద్రా! కై

  • 2 ప్రరీక్షిన్మహారాజా! ఏ ప్రభువు పరిపాలించే దేశంలో ఆ రత్నం పూజింపబడుతుందో ఆ రాజ్యంలో రోగాలూ, అరిష్టాలూ, కరువు కాటకాలూ ఉండనే ఉండవు. క్షు ఆ మ్మణి యాదనవిభునకు, ని మ్మని హారి యడుగ నాతం డీక ధనేచ్చం బొమ్మని పలికెను జక్రికి, ని మ్ముణి యీకున్న మీ6ద నేమౌ ననుచున్‌, క్‌
  • స్యమంతకమణిని మహారాజైన ఉగ్రసేనునకు ఇమ్మని శ్రీకృష్ణుడు సత్రాజిత్తును అడిగాడు. స్వార్ధ [ర పరుడైన సత్రాజిత్తు “శ్రీకృష్ణునకు ఈ మణిని ఇయ్యకపోతే ఏమౌతుందిలే” అని నిరాకరించాడు. న. అంత, 5డీ చ. అదండు వేడ్క! గంఠమున న మ్మణి( దాళ్ళి ప్రసేనుం డొక్కనాః డడనికి ఘోరవన్యమృగయారతి నేగిన వానిం జంసి పై బడి మణి6 గొంచు నొక్క హరి పాజ(గ దాని వధించి డాసి యే ర్పడం గనె జాంబవంతు(డు ప్రభాత్తదిగంతము నా స్యమంతమున్‌. కక్‌
  • బ్రనంతరం సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఎంతో కుతూహలంతో స్యమంతకమణిని కంఠాన ధరించి క్రూరమృగాలను వేటాడే నిమిత్తం అరణ్యానికి వెళ్ళాడు.ఆ అరణ్యంలో ఒక సింహం ప్రసేనుని చంపి ఆ మణిని నోట కరుచుకొని వెళ్లుతుండగా జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి దిక్కులను వెలిగించే తేజస్సుతో గూడిన మణిని అందుకున్నాడు. క కని జాంబవంచతు( డొ మణి( గొనిపోయి సమీపశైలగుహం జొచ్చి ముదం బున దన కూరిమిసుతునకు, ఫఘనకేళీకందుకంబుగా జేసె నృపా! క్‌6
  • జాంబవంతుడు ఆ మణిని తీసుకొని దగ్గరలోనున్న కొండ గుహలోనికి వెళ్లి అక్కడ ఉన్న తన ప్రియ కుమారునికి ఆటబంతిగా ఉపయోగించుకొనడానికి ఆ మణిని ఆనందంతో ఇచ్చాడు. వ అంత సత్రాజితుండు తన సహోదరుండైన ప్రసేనునిం గానక దుఃఖించుచు. కౌ
  • ఇక్కడ సత్రాబిత్తు తన తమ్ముడైన ప్రసేనుడు వేటకుపోయి తిరిగి రానందుకు ఎంతగానో దుఃఖించాడు. మ. 'మణి కంఠంబున€ దాల్చి నే. డడవిలో మావాండు వర్తింప(గా మణికై పట్టి వధించినాండు హరికిన్‌ మరాద్య లే దంచు దూ షణముం జేయగ వానిదూషణము( గంసధ్వంసి యాలించి యే (వ్రణమున్‌ నా యెడ లేదు, నింద గలిగెన్‌ వారించు టే రీతియో?' క్రి

12 పోతన భాగవతము

  • నా తమ్ముడు స్యమంతకమణిని ధరించి అరణ్యానికి వెళ్లాడు. శ్రీకృష్ణుడు మణికోసం నా తమ్ముణ్ణే సంహరించాడు. హరికి ఏ మాత్రమూ మర్యాదలేదని దూషింపసాగాడు. ఆ దూషణవాక్యాలను శ్రీకృష్ణుడు విని “నాలో ఏ దోషమూ లేదు. ఈ నింద నాపై వచ్చింది. ఈ నింద ఎలా నేను తొలగించుకోవాలి!” అని ఆలోచించాడు. వ. అని వితర్కించి. 59 మ. తనవారెల్ల. బ్రసేనుజాడం దెలుపం దర్కించుచున్‌ వచ్చి త ద్వనవీథిం గనె నేలం గూలిన మహాశ్వంబుం బ్రసేనుం బ్రసే నుని హింసించిన సింహమున్‌ మృగపతిన్‌ నొప్పించి ఖండించి యేం గిన భల్లూకము సొచ్చి యున్న గుహయుం గృష్టుండు రోచిష్టుండై. 60
  • ఇలా ఆలోచించినవాడై తనవారు ప్రసేనుని జాడచెప్పగా వెదకుతూ వచ్చి అరణ్యంలో నేలగూలిన గుజ్టాన్నీ, ప్రసేనుణ్ణీ, ప్రసేనుణ్ణి సంహరించిన సింహాన్నీ, సింహాన్ని చంపి మణిని తీసుకొని ఎలుగుబంటి న! ప్‌. వెళ్ళిన గుహనూ కృష్ణుడు ఆసక్తితో చూచాడు. వు కని తనవెంట వచ్చిన ప్రజల నెల్ల గువాముఖంబున విడిచి, సాహసంబున మహానుభావుండైన హరి విరంతర నిబిడాంధకార బంధురంబయి, భయంకరంబై, నిశాలంబయిన గుహాంతరాళంబు సొచ్చి? చని యక్కడ నొక్క బాలున కెదురు దర్శనీయ కేళీకందుకంబుగా (్రేలం గట్టంబడిన యమ్మణి క శ్రేష్టంబు( గని హరింప నిశ్చయించిరి. 6 అల్ల ఆడాలి లా కి
  • తన వెంట వచ్చిన ప్రజల నందరినీ గుహాద్వారం దగ్గర వదలి శ్రీకృష్ణుడు సాహసంతో దట్టమైన చీకటితో నిండి భయంకరంగా వున్న విశాలమైన ఆ గుహలోపలకు వెళ్ళాడు. అక్కడ ఒక బాలునికి ఎదురుగా ఆటబంతిగా (వేలాడదీసిన స్యమంతకమణిని చూచాడు. దానిని తీసుకుందామని తలచాడు. క్క మెల్లన పదము లిడుచు యదు, వల్లభుం డా శిశువుకడకు వచ్చిన గుండెల్‌ జల్లనంగం జూచి కంపము, మొల్లంబుగ దానిదాది మొజపెట్టె నృపా! 62 ఒం స దాది ఓ రాజా! యదు ్రేష్టుడైన శ్రీకృష్ణుడు మెల్లమెల్లగా ఆడుగులు వేస్తూ ఆ శిశువు దగ్గరకు రాగా చూచి గుండెలు గుభిల్హుమనగా పెద్దకేక వేసింది. న. అంత నాధ్వని విని బలవంతుండైన జొంబనంతుండు వచ్చి తన స్వామి యని కృష్ణు నెణుంగక ప్రాకృత పురుషుం డని తలంచి కృష్ణునితో రణంబుచేసె నందు. 63
  • దాది వేసిన కేక విని బలవంతుడైన జాంబవంతుడు అక్కడకు వచ్చాడు. శ్రీకృష్ణుడు తన ప్రభువైన శ్రీరామచంద్రుడే అని (గ్రహించక సామాన్య మానవుడని భావించి కృష్ణునితో యుద్దం చేయటానికి తలపడ్డాడు.

సదన స్కంధము = ఉత్తరభాగనము 13

క, పలలమునకు బోరెడు డే, గలక్రియ శస్తములః దరులం గరముల విజయే చృల నిరువదియెనిమిది దిన, ములు వోరిరి నగచరీంద్రముఖ్యుండు హరియున్‌. 64

  • మ్రాంసంకోసం పోరాడే డేగలలాగా ఆ స్యమంతకంకోసం ఆయుధాలతో, చెట్లతో, చేతులతో

ఒకరినొకరు జయించాలనే ఉద్దేశంతో ఇరవై ఎనిమిదిరోజులు కృష్ణడాంబవంతులు పోరాడారు.

క, అడిదములు దరులు విటిగిన, బెడిదము లగు మగతనములు బిజుతివక నడిం చిడుగుల వడువునం బడియెడి, పిడికిటి పోటులను గలన బెరసి రిరువురున్‌. 65

  • కత్తులు, చెట్లు విరిగిపోయాయి. అప్పుడు ఒకరికొకరు వెనుకంజ వేయకుండా మిక్కిలి పౌరుషంతో

పిడుగులవంటి పిడికిలి పోట్టతో వారిరువురూ తారసిల్టారు.

శా స్పష్టాహంకృతు లుల్లసిల్ల హరియున్‌ భల్లూకలోకేశుండున్‌ ముష్టాముష్టి నహర్నిశంబు జయసమ్మోహంబునం బోరుచో. బుష్టిం బాసి ముకుంద ముష్టిహతులం బూర్లశ్రమోపేతుండై సీష్టాంగోరు శరీరుండై యతండు దా భీతాత్ముడై యిట్లనున్‌. 66

న్‌ కృష్ణజాంబవంతులు ఇలా విజయం పొందాలనే కోరికతో అహోరా(త్రాలు ముష్టాముప్టిగా పోరాడారు.

కొంతకాలానికి శ్రీకృష్ణుని పిడికిలిపోట్టకు జాంబవంతుని అవయవాలన్నీ పిండీ పిండి అయిపోయాయి. బలం తరిగిపోయింది. అలసట అధికమైంది. అప్పుడు జాంబవంతుడు భయకంపితుడై కృష్ణపరమాత్మునితో ఇలా అన్నాడు.

వ. 'దేవా! నిన్ను బురాణపురుషు నధీశ్వరు విష్ణుం బ్రభవిష్టు నెలుంగుదు! సర్వభూతంబులకుం బ్రాణప్రతాప ధైర్యబలంబులు నీవే, విశ్వంబునకు సర్గస్టితిలయంబు లెవ్వ రాచరింతురు, వారికి సరపీతిలయంబులః జేయు నీశ్వరుండవు నీవ, యాత్మవు నీవీయన మజీయును. 67

రా

  • బ్రవా! పురాణపురుషుడవు, జగన్నాయకుడవు, విష్ణుడవు, 'ప్రభవిష్ణుడవు నీవని నేను తెలుసుకున్నాను.

సర్వప్రాణులకూ ప్రాణము, ప్రతాపము, ధైర్యము, బలము నీవే. ఈ (ప్రపంచం సృష్టికీ స్థితికీ నాశనానికీ ఎవరు కారకులో వారి సృష్టి స్థితలయాలకు నీవు కారకుడవు. ఆత శై స్వరూపుడవు" - అని ఇంకా ఇలా స్తుతించాడు,

సీ, బాణాన్ని నెవడు పఅపి సయోరాశి, నింకించి బంధించి యేపు సూసె6 బరగ నెవ్వండు ప్రతాప ప్రభారాళిచే దొనవగర్వాంధతనుస మడంచె! గంజాతములు (బెంచు కరిభంగి నెవ్వండు దశకంఠు కంఠబృందములు దద్రుంచె నాచం(ద్రసూర్యమై యమరు లంకారాజ్యమునకు నెవ్వడు విభిషణుని నిలిపె

తే. నన్ను నేలిన లోకాధినాథు( డెవ్వ( డంచితోదార కరుణారసొబ్ది యెవ్వం డాతండవు నీవ కావె, మహాత్మ! నేండు, మాజుపడి యెగ్గు సేసితి మణవనలయు,. 68

కేక పోతన భాగవతము

  • బాణాన్దిచే సముద్రాన్ని ఇంకించి సేతువు కట్టిన వాడవు, రాక్షసుల గర్వమనే చీకటిని ప్రతాపమనే కాంతిరాశిచే అణచివేసినవాడవు, పద్మాలను త్రంచే ఏనుగులాగా రావణాసురుని శిరస్సులు త్రెంచినవాడవు ఆచంద్రార్భమైన లంకారాజ్యానికి విభీషణుని రాజుగా చేసినవాడవు, కరుణాసముద్రుడవు, నన్నలిన లోకనాథుడవు నీవే కదా! మహాత్మా! పొరబడి నీ కపచారం చేశాను. నన్ను మన్నించు.

వ. అని యిట్లు పరమభక్తుండైన జాంబవంతుండు వినుతించిన నతని శరీర నిగ్రహ నివారణంబుగా భక్తవత్సలుండైన హరి దన కరంబున నతని మేను నిమిరి గంభీరభాషణంబుల నిట్లనియె. 69

  • క్క (ప్రకారంగా పరమభక్తుడైన జాంబవంతుడు శ్రీకృష్ణుని వినుతించాడు. భక్తవత్సలుడైన

గోపాలుడు తన చేతితో జాంబవంతుని శరీరం నిమిరి యుద్దం వలన కలిగిన శ్రమను తొలగించి గంభీరమైన కంఠ స్వరంతో ఇలా అన్నాడు.

క. “ఈ మణి నూచేంబడె నని, తామసు లొనరించు నింద దప్పెడు కొజకై నీ మందిర మగు బిలమున, కే మరుదెంచితిమి భల్లుకేశ్వర! వింటే! 70

  • భల్లూకరాజా! ఈ స్యమంతకమణిని నే నపహరించానని అజ్ఞానులు నాపై వేసిన అపనిందను

తొలగించుకోడానికి నీ మందిరమైన ఈ గుహకు నేను వచ్చాను.

వ. అవిన విని సంతసించి జాంబవంతుండు మజీయునుం, దన కూతు జాంబవతి యును కన్యకాముణియునుం దెచ్చి హరికిం గానిక(గా సమర్సించె, నటమున్న హరివెంట వచ్చినవారలు బిలంబు వాకిటం బండ్రెండు దినంబులు హరిరాక కెదురుచూచి వేసరి వగచి పురంబునకుం బన, రంత దేవకీవసుదేవులును రుక్మిణియును మిత్ర బంధు జ్ఞాతి జనులును గుహ సొచ్చి కృష్ణం రాక చిక్కెనని శోకించి.

న

శే ల్రన్సి కృష్ణు డనగానే జాంబవంతుడు సంతోషించి స్యమంతకమణిని, ఆ మణితోపాటే త

య టు కుమార్తెయైన జాంబవతి అనే పేరుకల కన్యకామణిని తెచ్చి హరికి కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణునితోపా నొ వచ్చి గుహాద్వారం దగ్గర నిలిచిన వారందరూ పన్నెండు రోజలు శ్రీకృష్ణుని కోసం ఎదురుచూచి వేసారి దుకం ద్వారకకు తిరిగి వెళ్ళారు. దేవకీ వసుదేవులు, రుక్మిణి, తక్కిన బంధుమి(్రలు, దాయాదులు గుహ ప్రవేశించిన కృష్ణుడు తిరిగి రానందుకు శోకించారు.

కు. దుర్గను మగు బిలమున హరి, నిర్గతుండై చేరనలయు నేం డని పౌరుల్‌ వర్గములై సేవించిరి, దుర్గం గృతకుశలమార్గం దోషితభర్ల్గన్‌. 72

శ దుర్గమమైన బిలంలో ప్రవేశించిన శ్రీ కృష్ణుడు క్షేమంగా తిరిగి రావాలని పౌరులంతా దుర్గాదేవిని

(ప్రార్ధించారు.

క డోలాయిత నూనసులై, జాలింబడి జనులు గొలువ జండిక పలికెన్‌

బాలామణితో మణితో, హేలాగతి వచ్చు నంబుజేక్షణు౮ డనుచున్‌. ర

పదవ స్కంధము - ఉత్తరభాగము 15

  • ప్రజలు డోలాయమానమానసులై దీనంగా ప్రార్థించగా మణితో, బాలామణితో పద్మాక్షుడు

అనాయాసంగా తిరిగి వస్తాడని దుర్గాదేవి పలికింది.

క్ష యత్నము సఫలం బయిన స, పత్న సమూహములు బెగడ. బద్మాన్లుం డా రత్నముతో. గన్యాజన, రత్నముతో! బురికి వచ్చె రయమున నంతన్‌. గాడ

  • విరోధు లందరూ బెదరిపోయేటట్టు తన ప్రయత్నాన్ని సఫలం చేసుకొని మణితో, బాలామణితో

శ్రీకృష్ణుడు వేగంగా ద్వారకాపురం చేరాడు.

క. మృతు డైనవాండు పునరా, గతుండైన క్రియం దలంచి కన్యామణి సం యుతు,డై వచ్చిన హరిం గని, వితతోత్సవ కౌతుకముల వెలసిరి పొరుల్‌. 75

  • కన్యామణితో వచ్చిన శ్రీహరిని గాంచి మరణించిన వాడు తిరిగి వచ్చినట్టుగా ద్వారకాపుర

పౌరులు ఎంతో సంతోషించారు.

వ. ఇట్లు హరి దన పరాక్రముంబున జాంబవతీ దేవిం బరిగ్రహించి, రాజసభకు సత్రాజిత్తుం బిలిపించి తద్వృత్తాంతం బంతయు నెటింగించి సత్రాజిత్తునకు మణి నిచ్చె, నతండును సిగ్గువడీ మణిం బుచ్చుకొని పశ్చాత్తాపంబు నొందుచు బలవద్విరోధంబునకు వెజచుచు నింటికి. జని. 76

  • బట్టు శ్రీకృష్ణుడు తన పరాక్రమంతో జాంబవతీ దేవిని పరి[గ్రహించి రాజసభకు సదత్రాజిత్తును

రప్పించి జరిగిన విషయమంతా చెప్పి మణిని అతనికి అప్పగించాడు. సత్రాజిత్తు సిగ్గుపడీ మణిని తీసికొని పశ్చాత్తాపం పొందాడు. బలవంతునితో విరోధం వచ్చినందుకు భయపడుతూ ఇంటికి చేరాడు.

క. పాపాత్ముల సొపములం, బాపంగొ నోపునట్టి పద్మాన్షునిపై6 బాపము గల దని నొడివిన, పొపాత్ముని పాపమునకు. బారము గలదే? గ్గ

  • ప్పాప్రాత్ములైనవారి పాపాల నన్నిటినీ పోగొట్టగలిగిన పద్మాక్షునిపైన అపనింద వేశాసు. ఈ నా

పాపానికి అంతం ఉన్నదా?

ను. మితభాషిత్వము మాని యేల హరిపై మిథ్యాభియోగంబు స్సే సితిగ౧ బాపాత్ముండ నర్ధలోభుండను దుశ్చిత్తుండ మళత్తుండ దు ర్మతినీ దేహము. గాల్పనే? దురిత మే మార్గంబునం బాయు? నే గతిం గంసారి ప్రసన్ను(డై నునుచు నన్‌ గారుణ్య భావంబునన్‌? 78

  • మ్రతభాపషిగా ఉండక ఎందుకు నందనందనునిపై లేనిపోని నిందవేశాను? నేను పాపాత్ముడను.

ధనాశాపరుడును. దుష్టుడను, దుర్మతిని, మత్తుడను. నా ఈ శరీరం కాల్చ్బనా? నా పాపం ఏ విధంగా తాలగిపోతుంది? ఏ రీతిగా శ్రీకృష్ణుడు (ప్రసన్నుడై నన్ను కనికరంతో రక్షిస్తాడు?

ఆ. మణిని గూతు నిచ్చి మాధవుపదములు, పట్టుకొంటినేని బ్రదుకు గలదు సంతసించు నతడు సదుపాయమగు నిది, సత్య మితరవృత్తి. జక్కంబడదు. గాం

16 పోతన భాగవతము

ణః స్యమంతకమతణినీ, మణితోపాటు నా కూతురిని ఇచ్చి మాధవుని పాదాలు పట్టుకుంటాను. అప్పుడే

నాకు (బ్రతుకు. కృష్ణుడు సంతోషిస్తాడు. మరే విధంగానూ నా పాపం తొలగిపోదు. ఇది సత్యం.

మ. అని యిబ్భ్బంగి బహుప్రకారముల నేకాంతస్థుండై యింటిలో! దనబుద్దిం బరికించి నీతి గని సత్రాజిత్తు సంప్రొప్తి శో భనుండై యిచ్చె విపత్పయోధితరికిన్‌ భామూామనోహారికిన్‌ దనుజాధీశవిదారికిన్‌ హరికి. గాంతారత్నమున్‌ రత్నమున్‌. 80

ప అని అనేకరీతులుగా తన ఇంట్లో ఏకాంతంగా ఆలోచించి సత్రాజిత్తు ఆపదలనే సము(ద్రాలను

తరింపజేసేవాడూ, కాంతాహృదయాలను అపహరించేవాడూ, దానవులను సంహరించేవాడూ ఐన శ్రీకృష్ణునకు తన పుత్రికా రత్నాన్నీ, స్యమంతక రత్నాన్నీ సమర్పించాడు.

ఉ. తామర సాన్షు. డచ్యుతు( డుదార యశోనిధి పెండ్లి యాడె నా నా నునుజేంద్రనందిత గుణస్టితిలక్షణ సత్యభామ ను ద్దామ పతివ్రతాత్వ నయ ధర్మవిచక్షణతా దయా యశః కామను సత్యభామను నుఖద్యుతినిర్దితసోమ నయ్యెడన్‌. 81

క్‌ స్పద్ర ్రనేత్రుడు, అచ్యుతుడు, కీర్తిశాలి అయిన శ్రీకృష్ణుడు సకలరాజులచే సద్గుణవతిగా కీర్తింపబడి,

పాతివ్రత్యమూ, నీతీ, ధర ౩ విచక్షణత్త్సమూ, దయా, కీర్తికాంక్ష గల చంద్రముఖిమైన సత్యభామను పెండ్డాడాడు.

క “మణి యిచ్చినాండు వాసర, మణి, నీకును నూకు గలవు మణులు, కుమారీ మణి చాలు" నంచుం గృష్లుండు, మణి సత్రాజిత్తునకును మరలంగ నిచ్చెన్‌, 82

  • “ఈ స్యమంతకమణిని సూర్యభగవానుడు నీకు ప్రసాదించాడు. మాకు మణులకు కొదువలేదు.

ఈ కన్యామణి చాలు”అని శ్రీకృష్ణుడు స్యమంతకమణిని తిరిగి సత్రాజిత్తుకు ఇచ్చివేశాడు.

వ. అంత నక్కడం గుంతీసహితు లయిన పాండవులు లాక్షాగారంబున దగ్గ్జులైరని విని నిఖిలార్దదర్శ నుండయ్యును, గృష్పుండు బలభద్ర సహితుండై కరినగరంబునకుం జని కృప విదుర గాంధారీ భీష్మద్రోణులం గని దుఃఖోపశమనాలాపంబు లాడుచుండె! నయ్యెడ, 83

  • ఈ వృత్తాంతం ఇలా వుండగా పాండవులు కుంతీసహితంగా లక్కఇంటిలో దర్రమయ్యారని విన్నాడు

శ్రీ కృష్ణుడు. సర్వము నెరిగిన వాడై గూడా శ్రీకృష్ణుడు బలరామునితోపాటు హస్తినాపురానికి వెళ్లి కృపవిదుర గాంధారీ భీష్మ ద్రోణులను ఓదార్చాడు.

పదన స్కంధము - ఉత్తరభాగము 17

  • : శతధన్వు(డు సత్రాజితుని(. జంపి మణి నపహరించుట :-

స్స్‌ జగతీశ! వినవయ్య శతధన్వు. బొడగని యక్రూరకృతవర్మ లాప్తవృత్తి “మనకిత్తు ననుచు సమ్మతిం జేసి తన కూంతు. బద్మాక్షునకు నిచ్చి పాడి దప్పె ఖలుండు సత్రాజిత్తు, డలయ కేక్రియనైన మణిపుచ్చుకొనుము నీ మతము మెజసి' యని తన్ను బ్రేరేప నా శతధన్వుండు పశువుం గటికివాండు పట్టి చంపు

అ. కరణి నిదురవోవ( గడ(గి సత్రాజిత్తుం బట్టి చంపి, వాని భామలెల్ల మొఅలువెట్ట లోభమున జేసి మణిగొంచుం జనియె నొక్కనాండు జనవరేణ్య! 84

  • ప్పర్రీక్షిన్మహారాజా! అక్రూరుడూ, కృతవర్మా శతధన్వుణిచూచి “దుర్మార్లుడైన సత్రాజిత్తు సత్యభామను

మనకిస్తానని చెప్పి శ్రీకృష్ణుని కిచ్చి వివాహం చేసి మాటతప్పాడు. నీవు ఏదోవిధంగా స్యమంతక మణిని (గ్రహించు”అని ప్రేరేపించారు. శతధన్వుడు కసాయివాడు పశువును కట్టి చంపినట్టుగా నిద్రిస్తున్న స(త్రాజిత్తును బలవంతంగా చంపివేశాడు. సత్రాజిత్తు భార్యలు రోదిస్తుండగా లోభంతో మణిని తీసుకొని వెళ్ళాడు.

వ. ఇట్లు హతుండైన తండ్రిం గని శోకించి సత్యభామను యతనిం దైలద్రోణియందు. బెట్టించి హస్తేపురం బునకుం జని సర్వజ్ఞుండైన హరికి సత్రాజిత్తు మరణంబు విన్నవించిన హరియును బలభద్రుండు నీశ్వరు లయ్యును మనుష్య భావంబుల నిలపించి, రంత బలభద్ర సత్యభామా సమేతుండై హరి ద్వారకానగరంబునకు మరలి వచ్చి శతధన్వుం జంసెదనని తలంచిన నెజింగి శతధన్వుండు ప్రాణభయంబున గృతవర్ము నింటికిం జని తనకు సహాయుండవు గమ్ముని పలికినం గృతవర్మ యిట్లనియె. 85

  • సత్యభామ తండ్రిమరణానికి దుఃఖించి తండ్రి శరీరాన్ని నూనె తొట్టిలో పెట్టించి హస్తినాపురానికి

వెళ్ళి శ్రీకృష్ణునితో సత్రాజిత్తు మరణవార్త తెల్సింది. బలరామకృష్ణులు భగవంతులై కూడా, మనుష్య భావంతో దుఃఖించారు. సత్యభామా బలరాములతో ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు శతధన్వుని సంహరించడానికి నిళశ్చయించుకున్నాడు. శతధన్వుడు ప్రాణభయంతో కృతవర్మ ఇంటికి వెళ్లి తనకు సహాయపడమని కోరాడు. అప్పుడు శతధన్వునితో కృతవర్మ ఇలా అన్నాడు.

ఉ. 'అక్కట! రామకృష్ణులు మహాత్ములు వారల కెగ్గు సేయణా నిక్కడ నెవ్వ( డోపు? విను మేర్చడం గంసుండు బంధు యుక్తుండై చిక్కండె? మున్ను మాగధుండు శసేనలతో. బదియేడు తోయనుల్‌ దిక్కుల బాజుండే! మనకు దృష్టము, వారల లావు వింతయే? 86

18 పోతన భాగనతము

జ “అయ్యో! ఎంతపని చేశావు? బలరామకృష్ణులు మహానుభావులే! వారిని ఎదుర్కొనడానికి ఇక్కడ సమర్దు లెవ్వరు? కంసుడు బంధుమి(త్ర సమేతంగా నేల కూలలేదా! జరాసంధుడు పదిహేడు పర్యాయాలు పరాజితుడు కాలేదా! వారి పరాక్రమం మనకు తెలియనిది కాదు గదా!”

వ. అని యుత్తరంబు సెప్పిన విని శతధన్వుం డక్రూరుని యింటికిం జని హరితోడ పగకుం దోడు రమ్మని చీరిన నక్రూరుండు హరిబల పరాక్రమ ధైర్య స్టైర్యంబు లుగ్గడించి మజియు నిట్లనియె. 87

  • కృతవర్మ ఇలా పలుకగా విని శతధన్వుడు అ(క్రూరుని ఇంటికి వెళ్ళి శ్రీకృష్ణుని ఎదిరించడానికి

సహాయం చేయమని అర్థించాడు. అక్రూరుడు శ్రీకృష్ణుని బలపరాక్రమాలనూ, ధైర్యస్టైర్యాలనూ వెల్లడించి ఇంకా ఇలా చెప్పాడు.

సీ. “ఎవ్వండు విశ్వంబు నెల్ల సలీలుండై పుట్టించు రక్షించు. బొలియంజేయు, నెవ్వనిచేష్టల నెటు(గరు బ్రహ్మాదు, లెన్వనిమాయ మోహించు భువన, మే డేండ్లసాపండై యే నిభు. డొకచేత గోరక్షణమునకై కొండ నెత్తె నెవ్వడు కూటస్లు డీశ్వరు. డద్భుత కర్ము. డనంతుండు కర్మసాక్షి,

తే. యట్టి ఘనునకు శౌరికి ననవరతము, మైొక్కెదము గాక! విద్వేషమునకు నేము వెజతు మొల్లము నీ వొండు వెంటంబొమ్ము, చాలు పదివేలు వచ్చె నీ సఖ్యమునను, 88

  • ఏవడు ఈ (ప్రపంచాన్ని లీలామాత్రంగా పుట్టించి, రక్షించి, నశింపజేస్తాడో, ఎవని కృత్యాలు (బ్రహ్మాది

దేవతలుగూడా తెలియలేరో, ఎవరిమాయ -ఈ లోకాన్ని మోహింపజేస్తుందో, ఎవడు ఏడేండ్ల వయస్సులోనే గోవులను రక్షించడానికై పర్వతాన్ని ఒకచేత్తో పైకెత్తి పట్టాడో, ఎవడు కూటస్సుడో, పరమేశ్చరుడో, అద్భుతాలు సాధించగలవాడో, అనంతుడో, కర్మసాక్షియో అట్టి మహానుభావుడైన వాసుదేవునికి ఎల్లప్పుడు నమస్కరించే వారమేగాని వైరానికి రాము. నీవు మరోమార్గం ఆలోచించుకో. నీ స్నేహంవల్ల మాకింత జరిగింది చాలు.

వ. అని యిట్లక్రూరుం డుత్తరంబు పలికిన న మ్మహానుణి యక్రూరునియొద్ద నునిచి, వెజచి శత ధన్వుండు తురగారూఢుండై శతయోజనదూరంబు సనియె, గరుడ కేతనాలంకృతంబైన తేరెక్కి రామకృష్ణులు వెనుచని, రంత నతండును మిథిలా నగరంబు. జేరి తత్సమీపంబునందు. 89

  • ఈ విధంగా అక్రూరుడు అనగానే శతధన్వుడు శమంతకమణిని అక్రూరుని కిచ్చి, భయంతో

గుజ్జమెక్కి నూరుయోజనాల దూరం పారిపోయాడు. గరుడధ్వజం వెలుగొందే రథం ఎక్కి రామకృష్ణు లతనిని వెంటాడారు. శతధన్వుడు మిథిలానగర (ప్రాంతం చేరాడు.

చ. తురగము డిగ్గి తల్లడముతో శతధన్వుండు పాదచారియై పరువిడం “బోకు పోకుమని పద్మదళాక్షుండు గూడ బాటి భీ కరగతి వాని మస్తకము ఖండితమై పడ (వేసె. జక్రముం బరిహతదైత్యచక్రము(. బ్రభాచయ మోదితదేవశక్రమున్‌. 90

పదవ స్కంధము - ఉత్తరభాగము 19

  • అక్కడ శతధన్వుడు గుజ్జం దిగి తొందరగా పరుగెత్తుతుండగా శ్రీకృష్ణుడు పోకు పోకుమంటూ

అతనిని వెంటాడి దుష్టశిక్షణం, శిష్టరక్షణం చేసే చక్రాయుధాన్ని ప్రయోగించాడు. చ(క్రఘాతానికి శతధన్వుని శిరస్సు భయంకరంగా తెగి (కిందపడింది.

న. ఇట్టు హరి శతధన్వుని వధియించి వాని వస్త్రంబులందు మణి వెదకి లేకుండట దెలిసి

బలభద్రునికడకు వచ్చి శతధన్వుం డూరక హతుం డయ్యె, మణిలే'దనిన బలభద్రుం డిట్టనియె.91

  • స్హ్రకృష్ణుడు శతధన్వుని సంహరించి అతని దగ్గర వెతికాడు. కాని స్వమంతకమణి కన్పించలేదు.

అప్పుడు అతడు బలరాముని చెంతకు వచ్చి “శతధన్వుడు వ్యర్థంగా మరణించాడు. అతని దగ్గర మణి లే”దని చెప్పాడు. అప్పుడు బలరాముడిలా అన్నాడు.

ఫీ “ఆ మణి శతధన్వుః డపహరించుట నిక్క, మెవ్వరిచే దా(ప నిచ్చినాండా?

వేగమె నీ వేంగి వెదకుము పురిలోన, వైదేహు దర్భింప వాంఛ గలదు, పోయి వచ్చెద, నీవు పొమ్మని వీడ్కొని మెల్లన రానుండు మిథిల( జొచ్చి పోయిన జనకుండు పొడగని హర్షించి యెంతయు! బ్రియముతో నెదురు వచ్చి

తే, యర్వపాద్యాది కృత్యంబు లాచరించి, యిచ్చగించిన వస్తువు లెల్ల నిచ్చి “యుండు" మని భక్తిచేసిన నుండె ముసలి, కునలయేశ్వర, మిథిలలో. గొన్ని యేండ్డు. 92

  • స్యమంతకమణిని శతధన్వు డపహరించడం సత్యం. దాచిపెట్టమని ఎవరి కిచ్చాడో? నీవు వెంటనే

ద్వారకకు వెళ్ళి మణికోసం అన్వేషించు. నాకు జనకభూపాలుని చూడాలనే కోరిక కలిగింది. నేను మిథిలకు వెళ్లి వస్తాను. నీవు ద్వారకకు వెళ్ళు - అని శ్రీకృష్ణుని పంపించాడు. బలరామునికి జనకమహారాజు అర్హ్యపాద్యాది విధులతో సత్కారాలు చేసి, అభీష్టవస్తువుల నిచ్చి అక్కడ ఉండుమని (ప్రార్ధించాడు. బలరాముడు కొన్ని సంవత్సరాలు మిథిలానగరంలో ఉన్నాడు.

వ. అంత దుర్యోధనుండు మిథిలానగరంబునకుం జనుదెంచి జనకరాజుచేత సమ్మూనితుండై. 93

క చలమున గాంధారేయుండు, లలిత గదాయుద్ధకౌశలము నేర్చెల దగన్‌ హలిచే నాశ్రితనిర్ణర, ఫలిచే. దైలోక్య వీరభటగణబలిచేన్‌. ం్రక్ష

  • ఆ సమయంలో దుర్యోధనుడు మిథిలకు వెళ్లి జనకునిచేత గౌరవింపబడినవాడై ఆశ్రిత

పారిజాతమూ, (త్రిలోక వీరుడూ ఐన బలరాముని చెంత గదాయుద్ద కౌశలము నంతటినీ పట్టుదలతో నేర్చుకున్నాడు.

వ. అట గృష్పుండును ద్యారకానగరంబునకుం జని శతధన్వుని మరణంబును మణి లేకుండుటయును, సత్యభామకుం జెప్పి, సత్యభామా ప్రియకరుండు గావున సత్రాజిత్తునకు. బరలోక క్రియలు సేయించె, నక్రూరకృతవర్మలు శతధన్వు మరణంబు విని వెజచి ద్యారకా నగరంబు వెడలి బహుయోజన దూర భూమికిం జని, రమ్రూరుండు లేమింజేసి వానలు లేక మహోత్పాతంబులును, శరీరమానస తాపంబులును ద్వారకొవాసులకు సంభవించిన నందుల వృద్దజనులు బెగడి హరి కిట్టనిరి. 95

20 పోతన భాగవతము

  • శ్రీకృష్ణుడు ద్వారకానగరం చేరి సత్యభామతో శతధన్వుని సంహరించిన సంగతీ, వానిదగ్గర మణి కానరాని విషయమూ తెలిపి సత్రాజిత్తుకు పరలోక క్రియలు జరిపించాడు. శతధన్వుని మరణం విని అ(క్రూర కృతవర్మలు భయపడి ద్వారకానగరం విడిచి ఎన్నో యోజనాల దూరం వెళ్ళారు. అక్రూరుడు లేనందువలన ద్యారకానగరంలో అనేక ఉపద్రవాలు కలిగాయి. వర్షాలు కురియలేదు. మానవులకు శారీరక మానసిక తాపాలు సంభవించాయి. అప్పుడు ద్వారకానగరంలోని వయోవృద్దులు భయపడి శ్రీకృష్ణునితో ఇలా అన్నారు. సీ, “కమలాక్ష వినవయ్య! కాశీశు. డేలెడి కుంభిని వానలు గురియకున్న+ గోరి శ్వఫల్కుని. గొనిపోయి యతనికిం గాందిని యనియెడు కన్య నిచ్చి కాశీవిభుండు సత్కారంబు సేసిన వానలు గురిసె నా వసుధమీంద, నాతని పుత్రకు. డైన యకక్రూరుండు నంతటివాండు, మహాతపస్వి ఆ. మరలి వచ్చెనేని మూను నుత్సాతంబు, లెల్ల, వొన గురియు నీ స్థలమున, దేవీ యతని దోడి తెప్పింపు, మన్నింపు, మానవలయు! బీడ మానవులకు. 96
  • “కమలాక్షా! కాశీరాజు తన రాజ్యంలో వర్షాలు కురవనప్పుడు అక్రూరుని తండ్రి అయిన శ్చఫల్కుని తీసికొని వెళ్లి “కాందిని” అనే తన కన్యనిచ్చి వివాహం చేసి సత్కరించగా కాశీరాజ్యంలో వానలు కురిశాయి. శృఫల్కుని కుమారుడైన అక్రూరుడు కూడా అంతటివాడే. మహాతపస్వి. అతడు తిరిగివస్తే ఈ ఉపద్రవాలు తొలగిపోతాయి. వానలు కురుస్తాయి. అతనిని రప్పించండి. మన్నించండి. (ప్రజల పీడను తొలగించండి.” వ. అని పలుకు పెద్దల పలుకు లాకర్ణించి దూతలం బంపి కృష్ణుం డక్రూరుని రావించి పూజించి ప్రియకథలు కొన్ని సెప్పి సకల లోకజ్ఞుండు గావున మృదుమధుర భాషణంబుల నతని కిట్లనియె. 97
  • అని పలికిన పెద్దల మాటలను విని శ్రీకృష్ణుడు దూతలను పంపి ఆ(క్రూరుణ్ణి రప్పించాడు. అతనిని పూజించి, ప్రియమైన పలుకులు పలికి మృదుమధుర భాషణాలతో ఇలా అన్నారు. సీ “తా నేగుతటి శతధన్వుండు మణిం దెచ్చి నీ యింట బెట్టుట నిజము తెలిసి నాండ, సత్రాజిత్తునకు. బుత్రకులు లేమి నతనికిం గార్యంబు లాచరించి విత్తంబు బుణమును విభజించుకొనియెద రతని పుత్రికలెల్ల, నతడు పరుల చేత దుర్మరణంబుః జెందినాం డతనికై సత్కర్మములు మీంద జరుసనలయు, ఆ. మజి గ్రహింపు మీన, మా యన్న నను నమ్మ6 డెలమి బంధుజనుల కెల్ల( జూపు మయ్య! నీ గృహమున హాటక వేదికా, సహితమఖము లమరు సంతతమును”. 98
  • “ఇత్రధన్వుడు తాను వెళుతూ మీ ఇంటిలో మణిని దాచిపెట్టిన సంగతి తెలుసుకున్నాను. సత్రాజిత్తుకు కుమారులు లేరు. కనుక అతనికి పరలోక (క్రియలను ఆచరించి, ఆతని ఆస్తిని, అప్పును సత్రాజిత్తు కుమార్తెలు పంచుకుంటారు. అతడు పరులచేత దుర్మరణం చెందాడు. ఆతనిక్షై సత్కర్మలు జరగాలి.

పదవ స్కంధము - ఉత్తరభాగము 2 స్యమంతకమణిని నీవే (గ్రహించు. మా అన్న నన్ను నమ్మడు గనుక బంధువుల కందరకూ చూపించు. నీ గృహంలో ఎల్లప్పుడూ బంగారు వేదికలమీద యజ్ఞకార్యాలు కొనసాగుతాయి.”

న. అని యిట్లు సామవచనంబు హరి పలికిన నక్రూరుండు వస్త్రచృన్నంబైన మణిం దెచ్చి హరి కిచ్చిన.99

  • క్రూ విధంగా కృష్ణుడు సాంత్వనవాక్యాలు పలుకగా వస్త్రంలో దాచి తెచ్చిన స్యమంతకమణిని

అక్రూరుడు కృష్ణునికి సమర్పించాడు.

ఉ. సంతసమంది బంధుజనసన్నిధికిన్‌ హరి దెచ్చి చూపెన (శ్రాంతవిభాసమాన ఘృణిజాలసలాయిత భూనభోంతర ధ్వాంతము హేమభారచయ వర్షణవిస్మిత దేవన మానవ స్వాంతము గీర్తి పూరితదిశా నలయాంతము నా శ్యమంతమున్‌. 100

  • శ్రీకృష్ణుడు సంతోషంతో తనకాంతితో సర్వలోకాల చీకట్టు పోకార్భగలదీ, తానిచ్చే బంగారంతో

దేవ మానవుల కాశ్చర్యం కల్షించగలదీ, సమస్త దిశావలయంలో కీర్తి గాంచినదీ అయిన స్యమంతకమణిని తన బంధువుల కందరకూ చూపించాడు.

క చక్రాయుధు! డీ క్రియ దన, యక్రూరత్వంబు జనుల కందణకును ని ర్వ(క్రముగ దెలిసి క్రన్ముజ, నక్రూరుని కిచ్చె మణి( గృపాకలితుండై. 101

  • నక్రాయుధుడు తన నిష్కళంకత్వాన్ని సర్వజనులకూ తెలిపి స్యమంతకమణిని తిరిగి అక్రూరునికే

ఇచ్చివేశాడు.

కు ఫఘనుండు భగవంతు డీశ్వరుం డనఘుండు మఠ దెచ్చి యిచ్చినట్టి కథనమున్‌ వినిన బఠించినం దలంచిన, జనులకు దుర్యశము( బాపసంఘము దలంగున్‌. 102

  • ప్ప్పరహితుడు, ఐశ్చర్యవంతుడు, మహానుభావుడు, పరమేశ్వరుడు నైన శ్రీకృష్ణుడు స్యమంతకమణిని

తెచ్చిన కథను విన్నా, పఠించినా, తలచినా జనుల పాపాలు పటాపంచ లవుతాయి, అపకీర్తి తాలగిపోతుంది. -; శ్రీకృష్ణుం డింద్రప్రస్థపురంబున కరుగుదెంచుట :-

వ, అంత నొక్కనాండు పొండవులం జూడ నిశ్చయించి సాత్యకి ప్రముఖ యాదవులు గొలువ బురు షోత్తముం డింద్రవ్రస్థ పురంబునకుం జనినం బ్రాణంబులం గనిన యింద్రియంబుల భంగి వా రఖి లేశ్వరుం డైన హరిం గని కౌ(గిలించుకొని కృష్ణుని దివ్యదేహసంగమంబున నిర్జూతకల్మషులై యనురాగ హాస విభాసితంబైన ముకుంద ముఖారవిందంబు దర్శించి యానందంబు నొందిరి, గోవిందుండును యుధిస్టిర భిమసేనుల చరణంబులకు నభివందనంబులు సేసి యర్జును నాలింగనంబున సత్కరించి, నకుల సహదేవులు మొక్కిన గ్రుచ్చి యెత్తి యుత్తమపీఠంబున నాసీనుండై యుండె; నప్పుడు.103

22 పోతన భాగవతము

*ో ఒకనాడు పురుషోత్తముడు పాండవులను చూచి రావాలని సాత్యకి మొదలైన యాదవులతోగూడి ఇం(ద్రప్రస్థనగరానికి వెళ్లాడు. పాండునందనులు (ప్రాణాన్ని పొందిన ఇం(ద్రియాలలాగా సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కౌగిలించుకొన్నారు. విష్ణుదేవుని దివ్యశరీరాన్ని కౌగిలించుకోవడం వలన వారిపాపాలన్నీ పటాపంచ లయ్యాయి. అనురాగపూరితమైన చిరునవ్వుతో గూడిన శ్రీకృష్ణుని ముఖపద్మాన్ని దర్శించి వారు ఎంతో ఆనందించారు. శ్రీకృష్ణుడు ధర్మజభీమసేనుల పాదాలకు నమస్కరించాడు. అర్జ్హునుణ్మి ఆలింగనం చేసుకున్నాడు. తనకు నమస్కరించిన నకుల సహదేవులను ఆదరించి ఒక ఉన్నతపీఠంపైన ఆసీనుడయ్యాడు.

క చంచద్ద్ననకుచభారా, కుంచితయై క్రొత్త పెండ్లికూంయ రగుట నిం చించుక సిగ్గు జనింపంగం బాంచాలతనూజ మైొక్కె( బద్మాక్షునకున్‌. 104

  • స్తనభారంతో కొంచెం వంగి, క్రొత్త పెండ్రికూతురు కావడంచేత సిగ్గుపడుతూ పాంచాలరాజపుత్రి

ద్రౌపది పద్మాక్షునికి మొక్కింది.

వ. అంత సాత్యకి పాండువులచేతం బూజితుండై యొక్క పీఠంబున నాసీనుండై యుండెం దక్కిన యనుచరులును వారిచేతం బూజితులై కొలిచి యుండిరి, హరియుం గుంతీదేవి కడకుం జని నమస్కరించి యిట్లనియె. 105

  • సాత్యకి గూడా పాండవులచేత గౌరవింపబడి ఒక ఆసనాన్ని అలంకరించాడు. తక్కిన యాదవులను

గూడా పాండవులు మిక్కిలిగా సమ్మానించారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కుంతీదేవి చెంతకు వెళ్ళి నమస్కరించి ఇలా అన్నాడు.

క “అత్తా! కొడుకులు. గోడలు జిత్తానందముగ( బనులు సేయంగ నాత్మా

న స 6 యత్తానుగవై యాజ్ఞా, పత్తాదులు గలిగి మనుదె సమ్మోదమునన్‌? 10

  • “అత్తా! నీ కుమారులూ, ద్రౌపదీ నీ హృదయానికి ఆనందం కల్లిస్తుండగా సమ్మోదంతో జీవితం

గడుపుతున్నావా?”

చ. అనవుడు( బ్రేమవిహ్వలత నందుచు గద్గదభాషణంబులం గనుంగవ నశ్రతోయములు గ్రమ్మంగం గుంతి సుయోధనుండు సే సిన యపచారముం దలంచి చెందిన దుఃఖము లెల్లం జెప్పి యా దనుజవిరోధి కి ట్లవియె. దద్దయు. బెద్దణికంబు సేయుచున్‌. 107

  • ఈ విధంగా శ్రీకృష్ణుడు అడుగగా కుంతీదేవి ప్రేమ విహ్వ్యలతతో డగ్గుత్తికతో, కనుల నీరు

నిండగా దుర్యోధనుడు చేసిన అపకారాన్నీ, తాము పడ్డ కష్టాలనూ చెప్పి శ్రీకృష్ణునకు పెద్దరిక మిచ్చి ఇట్లన్నది.

సీ “అన్న! నీ చుట్టాల నరయుదు! నుజువవు, నీవు పుత్తెంచిన నెమ్మితోడ మూ యన్న యేతెంచి నుము( జూచి పోయెను, నిళ్ళి యున్నారము నీ బలమున,

పదవ స్కంధము - ఉత్తరభాగము 23 నా పిన్నవాండ్రకు నాకు దిక్కెవ్వరు నేం డాదిగా నింక నీవె కాక? యఖిల జంతువుల కీ నాత్మవు గావున బరులు నా వారని భ్రాంతి సేయ.

తే. వయ్య! నా భాగ్యమెట్టిదో? యనవరతము జిత్తమున నుండి కరుణ నూ చిక్కులెల్లం వాపుచుందువు గాదె! యో పసరమపుణ్య!, యదుకునూరవరేణ్య! బుధాగ్రగణ్య!. 108

  • కృృమ్ణా! నీవు నీ బంధువులను మరచిపోకుండా ఆదరిస్తావు. నీవు పంపగా అక్రూరుడు వచ్చి ఆదరంగా మమ్మల్ని చూచిపోయాడు. నీ అండవల్లనే మేము జీవించి ఉన్నాము. నాపిల్లలకు నాకు నీవు కాక మరెవరు దిక్కు? సర్వప్రాణలకు నీవే ఆత్మవు గనుక 'పరులు, నావారు' అని నీకు భేదం లేదు. ఓ పుణ్యాత్మా! మమ్మల్ని మరచిపోకుండా నీవు కరుణతో మా చిక్కుల నన్నిటినీ తాలగిస్తున్నావు. యదుకుల తిలకా! పురుషోత్తమా! ఇదంతా నా భాగ్యం గాక మరేమిటి! న. అనిన యుధిష్టిరుం డి ట్లనియె. 109 గః అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. ము. 'పట్టంగ లేరు నిన్ను. దమభావములందు సనందనాదు లే పట్టుననైన, నట్టి గుణభద్రచరిత్రుండ వీవు, నేయ మా చుట్టమ నంచు వచ్చెదవు, చూచెద నల్పులమైన మమ్ము; నే మెట్టి తసంబు చేసితి మధీశ్వర! పూర్వశరీర వేళలన్‌?” 110
  • సనందాది మహర్షులే ఎంతో ప్రయత్నించికూడా నిన్ను పట్టలేరు. అట్టి మహానుభావుడవు నీవు. ఈనాడు నీవు మా బంధు వయ్యావు. అల్పులమైన మమ్ములను చూడవచ్చావు. పూర్వజన్మలో మేము ఎంత తపస్సు చేశామో! వ. అని ధర్మజుండు దన్ను! బ్రార్జించిన నింద్రప్రస్థపురంబువారలకు నయనానందంబు సేయుచు హరి గొన్ని నెలలు వసియించి యుండె, నం దొక్కనాండు. 111
  • అని ధర్మరాజు శ్రీకృష్ణుని స్తుతించాడు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థంలోని ప్రజలకు నేత్రానందం కల్లిస్తూ అక్కడే కొన్ని నెలలపాటు ఉన్నాడు. మ. తురగశ్రేష్టము నెక్కి కంకటధనుస్తూణీశరో పేతుండై హరితోడన్‌ వనభూమి కేగి విజయుం డాసక్తుండై చంపె శం బర శార్తూల తరక్షు శల్య చమరీ భల్లూక గంధర్వ కా సర కంఠీరవ ఖడ్గ కోల హరిణీ సారంగముఖ్యంబులన్‌. 112
  • ఒకనాడు అర్జునుడు అశ్వారూఢుడై శ్రీకృష్ణునితో గూడి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ జింకలను, పెద్దపులులను, సివంగులను, ఏదుపందులను, చమరీమృగాలను, ఎలుగుబంట్లను, ఎనుబోతులను, సింహాలను, ఖడ్గమృగాలను, వనవరాహాలను, ఏనుగులను ఆసక్తితో వేటాడాడు.

24 పోతన భాగవతము క అచ్చోట6 బవిత్రములై, చచ్చిన మృగరాజి నెల్ల జననాథునకున్‌ దెచ్చి యొసంగిరి మెచ్చుగం జెచ్చెర నరు గొల్బియున్న సేవకు లధిపా! 113

  • “చనిపోయిన మృగాల నన్నింటినీ సేవకులు రాజుగారికి తెచ్చి యిచ్చారు. న. అంత నర్జునుండు నీరువట్టున డస్పిన యమునకుం జని యమ్మవారథులైన నరనరాయణు లందు వార్చి జలంబులు ద్రావి యొక పులినప్రదేశంబున నుండి. క్షత
  • అప్పుడు అర్జునునకు దాహంవేసింది. నరనారాయణు లిద్దరూ యమునానదికి వెళ్ళి దాహం తీర్చుకొని ఇసుక ప్రదేశంలో కూర్చున్నారు. ఉ. ఉపగతులైన యట్టి పురుషోత్తమ పార్టులు గాంచి రాపగా విపుల నిలోల నీలతర వీచికలందు శిరోజభార రు చ్యపహసితాళిమాలిక నుదంచిత బాలశశిప్రభాలికం దపనుని బాలికన్‌ మదనదర్పణతుల్య కపోలపాలికన్‌. 115 బాలచంద్రుని బోలిన నెన్నుదురుతో, అద్దాలవంటి చెక్కిళ్ళతో (ప్రకాశించే సూర్యుని కుమార్తెను చూచారు. వు కని యచ్యుతుండు పంచిన నిన్వచ్చుండు సని యా కన్యకిట్లనియె. 116
  • శ్రీకృష్ణుడు పంపగా అర్జునుడు ఆమె చెంతకు వెళ్లి ఇలా అన్నాడు. మ. 'సుదతీ! యెవ్వరిదాన? వేమికొణ కిచ్చోటం బ్రవర్తించె? దె య్యది నీ నామము? కోర్కి యెట్టిది? వివాహాకాంక్షతోంగూడి యీ నదికిన్‌ వచ్చిన జాడ గానంబడె? ధన్యం బయ్యె నీరాకు నీ యుదయాదిస్థితి నెల్లం జెప్పు మబలా! యుద్యత్కురంగేక్షణా! 117
  • ఓ అమ్మాయీ! నీ వెవ్రైవు? ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? నీ పేరేమిటి? నీ కోరిక ఏమిటి? వివాహ కాంక్షతో ఈ నదీ ప్రాంతానికి వచ్చినట్టున్నావు? నీ రాక ధన్యమైనది. నీ ప్రయత్నం నెరవేరుతుంది. ఓ లేడికన్నుల వన్నెలాడీ! నీ విశేషాల నన్నిటినీ చెప్పు. వ. అనిన నర్జునునకు( గాళింది యి ట్లనియె. 118 హ్‌ అప్పుడు అర్జునునితో ఆ అమ్మాయి ఇలా చెప్పింది. మ. 'నరవీరోత్తను! యేను సూర్యుని సుతన్‌, నాపేరు కాళింది, భా స్కర సంకల్పితగేహనుందు నదిలో. గంజాక్షు విష్ణుం బ్రభున్‌ వరుగా( గోరి తసంబు సేయుదు, నొరున్‌ వాంఛింసం గృష్టుండు న న్యరతిన్‌ వచ్చి వరించు నంచు బలికెన్‌ నా తండ్రి నాతోడుతన్‌.” 119

పదవ స్కంధము - ఉత్తరభాగము 25

  • 2 వీరాధివీరా! నేను సూర్యుని కుమార్తెను. నాపేరు కాళింది. ఈ నదిలో నా తండ్రి నా కోసం

ఏర్పాటు చేసిన గృహంలో పద్మాక్షుడైన శ్రీకృష్ణుని భర్తగా కోరి తపస్సు చేస్తున్నాను. ఇతరులను నేను కోరను, శ్రీకృష్ణుడు వేటకు వచ్చి నిన్ను వివాహ మాడగలడని నా తండ్రి నాకు తెలిపాడు.

వ. అనిన విన ధనంజయు డా నీలవేణి పలుకులు హరికిం జెప్పిన విని సర్వజ్ఞుండైన హరియు హరి మధ్యను రథంబుమీంద నిడుకొని ధర్మరాజు కడకుం జని వారలు గోరిన విశ్వకర్మను రావించి వారి పురం బతివిచిత్రంబు సేయించె. 120

  • క్ష విధంగా కాళింది చెప్పిన మాటలను అర్జునుడు శ్రీకృష్ణునకు విన్నవించాడు. సర్పజ్ఞుడైన హరి

సన్నని నడుము గల కాళిందిని రథ మెక్కించుకొని ధర్మరాజు దగ్గరకు వెళ్ళాడు. పాండవులు కోరగా విశ్వకర్మ వచ్చి ఇం(ద్రప్రస్థ పురాన్ని చిత్ర విచిత్రంగా అలంకరించి తీర్చిదిద్దాడు.

క. దేవేంద్రుని ఖాండవ మ, ప్పావకునకు నీ. దలంచి పార్టుని రథికుం గావించి సూతు డయ్యెను, గోవిందుండు మజందితోడం గూరిమి వెలయన్‌. క్ష21

  • ద్రేవేంద్రుని ఖాండవ వనాన్ని అగ్నిదేవుడికి ఆహారంగా అర్పించడానికి నిశ్చయించుకొని అర్జునుని

రథానికి శ్రీకృష్ణుడు తాను సారథి అయ్యాడు.

వ. ఇట్టు నరనారాయణులు సహాయులుగా దహనుండు ఖాండవ ననంబు దహించిన సంతసించి విజయునకు నక్షయతూణీరంబులు, నభేద్యకవచంబును, గాండీన మనియెడి బాణాసనంబును, దివ్యరథంబును, ధవళరథ్యంబులను నిచ్చె నందు. 122

  • నర నారాయణుల సహాయంతో అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించ సంతోషించి అర్జునునికి

అక్షయతూణీరాలు, భేదించడానికి వీలులేని కవచం, గాండీవమనే ధనుస్సు, దివ్య రథమూ, తెల్లగుజ్ఞాలూ సమర్పించాడు.

ఉ. వాసవసూనుచే. దనకు వహ్నిశిఖాజనితో(గ్రవేదనన్‌ వాసిన6 జేసి యొక్క సభ పొర్టున కిచ్చె మయుండు ప్రీతుండై యా సభలోన గాదె గమనాగమనంబులం గౌరవేంద్రు. డు ల్లాసము బాసి యుండుట జలస్టలనిర్ణయ బుద్ధిహీను(డై. 123

ము యి రూ

  • అగ్బిజ్యాలల బాధనుండి తప్పించి అర్జునుడు తనను రక్షించినందువలన మయుడు సంతోషంతో

ఒక మహాసభను నిర్మించి అర్జునునకు బహూకరించాడు. ఆ సభలోనే దుర్యోధనుడు సంచరిస్తూ భూమికీ, జలాశయానికీ తేడా తెలియక అవమానం పొందాడు.

26 పోతన భాగవతము -:శ్రీకృష్లుండు కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ యను వారలం బరిణయమాడుటి :- వ. అంత. గృప్పుండు ధర్మరాజ ప్రముఖుల వీడుకొని సాత్యకి ప్రముఖ సహచరులు గొలువ, మరలి తన పురంబునకుం జని బంధుజనంబులకు( బరమూనందంబు సేయుచు నొక్క పుణ్య దివసంబున శుభలగ్నంబునం గాళిందిం బెండ్లి యయ్యె, మజీయు ననంతిదేశాధీశ్వరు లయిన విందానువిందులు దుర్యోధనునక్షు వశులై హరికి మేనత్తయైన రాజాధిదేవి కూ6తురైన తమ చెలియలిని వివాహంబు సేయ నుద్యోగించి స్వయంవరంబు. జాటించిన. 112

  • స్రికృష్ణుడు ధర్మరాజాదులను వీడ్కొని సాత్యకి మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చాడు. బంధువు లందరూ ఆనందిస్తుండగా ఒక శుభముహూర్తంలో కాళిందిని పరిణయమాడాడు. అనంతరం సంగతి. అవంతీ పరిపాలకులైన విందానువిందులు దుర్యోధనునకు వశమయ్యారు. వారి తల్లియైన రాజాధిదేవి శ్రీకృష్ణునికి మేనత్త. వారు తమ చెల్లెలి పెండ్లికి స్వయంవరం చాటించారు. క్ష భూ రమణులు సూడంగ హరి, వీరతం జేకొనియె మిత్రవిందను నిత్యా పూరిత సుజనానందం, జారు చికురకాంతి విజిత షట్పదబ్బందన్‌. 125
  • రాజు లందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణుడు ఎదురులేని తన పరాక్రమం ప్రదర్శించి అలినీలవేణి, అందాలరాణి ఐన మిత్రవిందను చేకొన్నాడు. సీ. జననాథ! వినుము కోసలదేశ మేలెడి నగ్నజిత్తను నరనాథు( డొకండు సుమతి ధార్మికుండు దత్సుత నాగ్నజితి యను కన్యక గుణవతి గలదు దానిః బెండియాడుటకునై పృథినీశు లేతెంచి వాండికొమ్ముల గల వాని, వీర గంధంబు సోంకినం గాలు ద్రవ్వెడివాని, నతిమదమత్తంబులైన నాని తే, గోవృషంబుల నేడింటి. గూర్చి తిగిచి, బాహుబలమున నెన్వండు పట్టి కట్టు నతండు కన్యకు దగు వరుం డనిన వానిం బట్టంజాలక పోదురు ప్రజలు బెగడి. 126
  • ఓ పరీక్షిన్మహారాజా! కోసలదేశాన్ని సద్గుణుడు, ధర్మపరుడు నైన నగ్బజిత్తు అనేరాజు పరిపాలిస్తు న్నాడు. అతని కుమార్తె నాగ్నజితి. సద్దుణసంపన్న. వాడికొమ్ములు గలిగి, వీరగంధం సోకితే చాలు కాలు (ద్రవ్వుతూ మిక్కిలి మదించిన ఏడు ఆబోతులు ఆ రాజుదగ్గర ఉన్నాయి. ఆ వృషభాలను తన బాహుబలంతో ఎవడు కట్టివేస్తాడో అతడే నాగ్నజితికి భర్త అని ఆ రాజు నిర్ణయించాడు. ఎందరో రాజులు వచ్చి ఆ ఎద్దు లను పట్టి కట్టడానికి ప్రయత్నం చేశారు. కాని ఫలితం లేకపోయింది. వు ఇట్లు గోవృషంబుల జయించినవాండక్కన్యకు వరుండనిన భగవంతుండైన హరి విని సేనాపరివృతుండై కోసలపురంబునకుం జనినం గోసలాధీశ్వరుండును హరి నెదుర్కొని యర్ధ్య పాద్యాది విధులం బూజించి పీఠంబు సమర్పించి ప్రతివందితుండై యున్నయెడ. 127 న్‌ ల వృషభాలను జయించినవాడే ఆ కన్యకు భర్త అని శ్రీకృష్ణుడు విని "'సీనాసమేతంగా కోసలదేశానికి వెళ్ళాడు. కోసలరాజు శ్రీకృష్ణుని గొప్పగా గౌరవించాడు.

పదవ స్కంధము - ఉత్తరభాగనము 27 క. ఆ రాజకన్య ప్రియమున, నా రాజీవాక్షు మోహనాకారు. ద్రిలో కారాధితు మాధవు( దన, కారాధ్యుండైన నాథుండని కోరె నృపా! 128

  • రాజుకుమార్తె నాగ్నజితి మోహనాకారుడూ, పద్మనేత్రుడూ, త్రిలోకపూజితుడూ ఐన మాధవుళ్లో తనకు భర్తగా భావించింది. వ. మజియు న క్కన్యకారత్నంబు తన మనంబున. క్ష29
  • ఇంకా నాగ్నజితి ఇలా తలపోసింది. ఆ. విష్ణు. డవ్యయుండు విభుండు గావతె నని, నోంచినట్టి తొంటి నోముఫలము సిద్ద నుయ్యెనేని. జేకొనుంబో నన్ను జక్రధరు(డు వైరిచక్రహరుండు. 130
  • అచ్యుతుడు, శ్రీహరి నాకు భర్త కావాలని నేను పూర్వజన్మలో నోచిన నోము ఫలం సిద్దించింది. . శత్రురాజులను చెండాడే చక్రధరుడు నన్ను వివాహం చేసుకుంటాడు. ॥ మ. సిరియుం బద్మభవేశ దిక్పతులు మున్‌ సేవించి యెవ్వాని శ్రీ చరణాంభోజపరాగముల్‌ శిరములన్‌ సమ్యగ్గతిం దాల్తుం రీ ధరణీచక్రభరంబు వాపుటకు నుద్యత్కేళిమూర్తుల్‌ దయా పరుండై యెవ్వండు దాల్చు నట్టి హరి యెబ్బంగిం బ్రవర్తించునో! 31
  • లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, దిక్పాలకులు ఎవని పాదధూళిని శిరసా ధరించి సేవిస్తారో, భూభారాన్ని తగ్గించడానికి ఎవడు లీలావతారాలు ధరిస్తాడో ఆ శ్రీకృష్ణుడు ఇపు డెలా ప్రవర్తిస్తాడో? వ. అని యిట్లు నాగ్నజితి విచారించు నెడ( గృష్టుం డా రాజుం జూచి మేఘగంభీర నినదంబున నిట్టనియె.132
  • ఈ రకంగా నాగ్నజితి ఆలోచిస్తున్స సమయంలో కృష్ణుడు కోసలరాజును గాంచి మేఘగంభీరస్వరంతో ఇలా అన్నాడు. క అన్యుల యాచింపరు రా, జన్యులు సొజన్యకాంక్షం జనుదెంచితి నీ కన్యన్‌ చేండెద నిమ్మా! కన్యాశుల్కదుల మేము గాము నరేంద్రా! 133
  • రాజులు పరులను యాచింపరు. సౌజన్యంతో నేను వచ్చాను. నీ కుమార్తెను నేను కోరుకుంటున్నాను. మేము కన్యాశుల్కం ఇచ్చేవారము కాము. వ. అనిన రాజిట్లనియె. 134 ఖః కృష్ణుని మాటలు విని అప్పుడు రాజు ఈ విధంగా అన్నాడు. శా కన్యం జేకొన నిన్నిలోకముల నీకన్నన్‌ ఘనుండైన రా జన్యుం డెవ్వండు? నీ గుణంబులకు నాళ్చర్యంబునుం బొంది తా

28 పోతన భాగవతము నన్యారంభము మాని లక్ష్మి భవదీయాంగంబునన్‌ నిత్యయై ధన్యత్వంబును€ జెంది యున్నది గడా తాత్సర్యసంయుక్తమై. క్షే35

  • న్హా క్రుమార్తెను వివాహమాడడానికి ఈ లోకా లన్నిట్లో నీ కంటే తగిన వాడెవడు? నీ సద్గుణాలకు ఆశ్చర్యం చెంది లక్ష్మీదేవి ఇతరులను కాదని నీ వక్షస్థలంలో స్థానం సంపాదించుకొని ధన్యు రాలయింది. శా. చంచద్గోవృషసప్తకంబు( గడిమిన్‌ సైరించి యెవ్వాండు భం జించున్‌ వానికి. గూంతు నిత్తునని యేం జీరించినన్‌ వైభవో దంచ ద్గర్వులు వచ్చి రాజతనయుల్‌ తత్సాద శృంగాహతిం గించిత్యాలము నోర్వ కేగుదు రనిం గేడించి భిన్నాంగులై,. 136 శ్‌ ఏడ్స్స వృషభాలను బాహుబలంతో ఎదుర్కొని ఎవడు జయిస్తాడో అతనికి నా కుమార్తె నిచ్చి వివాహం జరుపుతానని చాటించాను. గర్విష్టులైన రాజు లెందరో వచ్చి ఆ ఆబోతుల గిట్టల దెబ్బలకు తట్టు కొనలేక భిన్నభిన్నాలైన శరీరాలతో రంగాన్నుంచి తప్పుకున్నారు. శా. ఉమ్ణాంశుండు తమంబు దోలు క్రియ నీవుగ్రాహవక్షోణిలో( గృష్షా! వైరుల( దోలినాండవు, రణ॥్రీడా విశేషంబులన్‌ నిష్ణాతుండవు, సప్తగోనృషములన్‌ నే డాజి భంజించి రో చిష్ణుత్వంబున వచ్చి చేకొనుము మా శీతాంశుబింబాననన్‌. క్ష37
  • శ్రీకృష్ణా! సూర్యుడు చీకటిని పారదోలునట్లు నీవు రణరంగంలో నీ శత్రువులను పారదోలావు. సంగర క్రీడలో నివు సర్వ సమర్భుడవు. ఏడు వృషభాలతో ఈ రోజు పోరాడి జయించి చంద్రముఖిమైన మా నాగ్నజితిని చేపట్టు. వ. అని నగ్నజిత్తు తన కూతు వినాహంబునకుం జేసిన సమయంబు సెప్పిన విని, 138
  • అని నగ్నజిత్తు తన కుమార్తె వివాహవిషయంలో చేసుకున్న నియమాన్ని చెప్పగా కృష్ణుడు విన్నాడు. చ. కనియె నఘారి వత్స బక కంస విదారి ఖలప్రహారి దా ఘనతర కిల్పిషంబుల నగణ్య భయంకర పొరుషంబులన్‌ సునిశిత శృంగ నిర్ణలితశూరసమూహ ముఖామిషంబులన్‌ హనన గుణోన్మిషంబుల మహాపరుషంబుల గోవృషంబులన్‌. 139
  • అఘాసుర వత్సాసుర బకాసుర కంసులను చీల్చిచెండాడిన కృష్ణభగవానుడు గొప్ప పౌరుషము గలవీ, తమ వాడి కొమ్ములతో ఎందరో వీరుల ముఖాలను క్రుమ్మి గాయపరచినవీ, రూపం ధరించిన పాపరాసులవలె అతిభయంకరమైనవీ అయిన ఆబోతులను ఆలోకించాడు. ఉ. చేలము చక్క గట్టుకొని చిత్రగతిన్‌ వడి నేడు మూర్తులై బాలు(డు దారురూసముల. బట్లెడు కైవడి€ బట్టి వీర శా

పదవ స్కంధము - ఉత్తరభాగము 29 ర్దూలుండు గ్రుద్ది నేలం బడంద్రోచి మహోద్దతి( గట్టి యీడ్చె భూ పాలకు లెల్ల మెచ్చ వృషభంబులః బర్వతసన్నిభంబులన్‌. 140

  • శ్రీకృష్ణుడు 'పై వ(స్తాన్ని నడుముకు బిగించి కట్టుకొని విచిత్ర రీతిలో ఏడుమూర్తులు ధరించి బాలుడు కొయ్యబొమ్మలను పట్టుకున్నట్టుగా పర్వతాలవంటి ఆ ఏడు వృషభాలను పట్టుకొని (గ్రుద్ది క్రుమ్మి అవలీలగా నేలపై కూల(ద్రోశాడు. అది చూచి అచ్చటి వారంతా మెచ్చుకున్నారు.

వ. ఇట్లు వృషభంబుల నన్నింటినిం గట్టి యీడ్చినం జూచి హరికి నగ్నజిత్తు నాగ్నజితి నిచ్చిన విధివత్రుకారంబునం బెండ్లి యయ్యె, నా రాజసుందరు లానందంబును బొంది, రా సమయంబున బ్రాహ్మ ణాశీర్వాదంబులును, గీత పటహ శంఖ కాహళ ఖేరీ మృదంగ నినదంబులును జెలంగె, నంత నా కోసలేంద్రుండు దంపతుల రథారోహణంబు శృయించి సదివేల దధేనువులును, విచిత్రాంబరాభరణ భూషితలైన యువతులు మూండువేలును, దొమ్మిదివేల గజంబులును, గజంబులకు శతగుణంబులైన రధంబులును, రథంబులకు శతగుణంబులైన హయంబులును, హయంబులకు శతగుణాధికంబైన భటసమూహంబును నిచ్చి పుత్తెంచిన వచ్చునప్పుడు. కక!

  • బ్ర విధంగా శ్రీకృష్ణుడు ఏడు వృషభాలను నేలగూల్చి ఈడ్వగా నగజిత్తు తన కుమార్తెను కృష్ణున

కిచ్చి వివాహం చేశాడు. ఆసమయంలో అంతపురకాంతలంతా ఎంతో సంతోషించారు. బ్రాహ్మణులు ఆశీర్వదించారు. మంగళగీతాలు భేరీమృదంగాది మంగళవాద్యధ్వనులు మిన్నుముట్టాయి. కోసలరాజు నూతన దంపతులను రథ మెక్కించి సాగనంపాడు. పదివేల గోవులను వ(స్రాభరణాలంకృతలైన మూడువేల మంది కన్యలను, తొమ్మిదివేల ఏనుగులను, అంతకు వందంట్టు రథాలను, అంతకు వందరెట్లు గుజ్జాలను, అంతకు వందరెట్టు సైనికులను కృష్ణునకు ఆ రాజు కానుకగా ఇచ్చాడు.

ఉ. భూతి యెలర్చం గోసలుని పుత్రికకై చనుదెంచి తొల్లి యాం బోతులచేత నోటువడి పోయిన భూపతులెల్ల మాధవుం డా తరుణిన్‌ నరించుట చరానలిచే విని త్రోవ సైన్య సం ఘాతముతోడం దాకి రరిగర్వవిమోచను( బద్మలోచనున్‌. గత2

  • ఇంతకు పూర్వం నాగ్గజితిని వివాహమాడడానికి వచ్చి ఆబోతుల నోడించలేక పరాజితులైన రాజులందరూ మాధవుడు ఆ కన్యను వివాహమాడిన విషయం గూఢచారుల వలన తెలుసుకొని శత్రుగర్వ భంజనుడైన శ్రీకృష్ణుని జయించడానికి సైన్యసమేతంగా వచ్చి మార్గ మధ్యంలో అడ్డగించారు.

ఉ. దండి నరాతు లెల్ల హరి( దాంకిన నడ్డము వచ్చి వీంకతో

భండనభూమియందు( దన బాంధవులెల్లను సన్నుతింపంగా గాండివచాపముక్త విశిఖంబుల వైరుల నెల్ల. జంపె నా ఖండల నందనుండు శశకంబుల సింహము చంపుకైనడిన్‌. 143

30 పోతన భాగవతము

  • రాజు లందరూ శ్రీకృష్ణునిపైకి రాగా అర్హునుడు పరాక్రమంతో వారి నెదుర్కొన్నాడు. గాండీవంనుండి వదలిన బాణాలతో సింహం కుందేళ్ళను సంహరించినట్టు శత్రువుల నందరినీ హతమార్చాడు. బంధువులంతా సంతోషించారు.

వ ఇట్టు హరి నాగ్నజితిం బెండ్లిటై యరణంబులు పుచ్చుకొని, ద్వారకానగరంబునకు వచ్చి సత్వ భామతోడం గ్రీడించుచుండె; మజియును. 1త్త4

  • ఇలా శ్రీకృష్ణుడు నాగ్నజితిని పెండ్దాడి మామగా రిచ్చిన కానుకలతో ద్వారకానగరానికి వచ్చి

నాగ్నజితీ సమేతుడై ఆనందించాడు.

మ. జనవంద్యన్‌ శ్రుతక్తీర్తి నంద్య( దరుణిన్‌ సందర్శనక్షోణి పా ద్యనుజన్‌ మేనమజందలిన్‌ విమలలోలాపాంగ6 గై కేయి ని ద్ధ నయోన్నిద్రం బ్రపూర్ణసద్దుణసముద్రన్‌ భద్ర నక్షుద్ర నా వనజాతాన్షుండు పెండ్తియాడె నహితవ్రాతంబు భీతిల్లంగన్‌. 145

  • కేకయదేశాధిపతియైన (శ్రుతకీర్తి కుమార్తె సందర్భనాదులకు సోదరి, సద్గుణవతి, తన మేనత్త

కూతురు అయిన భ(ద్రను శత్రువు లెల్లరూ తల్లడిల్లగా శ్రీకృష్ణుడు వివాహమాడాడు.

వను మజియును, 146

చ. అనురులం బాజ(దోలి భుజగాంతకుండైన ఖగేశ్వరుండు ము న్నన్చుతము. దెచ్చుకైవడి మదాంధుల రాజుల నుక్కడంచి యా కమలదళాయతేక్షణు(డు గైకొని తెచ్చెను మద్ర కన్వకన్‌ సమదవృగేక్షణన్‌ నయవిచక్షణ లక్షణ( బుణ్యలక్షణన్‌. 147

  • అంతేగాక పూర్వం గరుత్మంతుడు దేవతలను పారదోలి అమృతం తెచ్చిన విధంగా మదాంధులైన

రాజులను జయించి శ్రీకృష్ణుడు లేడికన్నులవంటి కన్నులుకలది, మద్రరాజ కుమార్తె శుభలక్షణ అయిన లక్షణను పరి([గ్రహించాడు.

వ ఇట్లు హరికి రుక్మిణియు, జాంబవతియు, సత్యభామయు+ గాళిందియు( మిత్రవిందయు, నాన్న జితియు, భద్రయు, మద్రరాజనందనయైన లక్షణయు. ననంగ నెనమండద్రు భార్యలైరి, మజియు నరకాసురుని వధియించి తన్నిరుద్ధకన్యల షోడశసహస్రకన్యల రోహిణి మొదలైన వారిం బరిగ్రహించెనని విని. 148

  • ఈ విధంగా శ్రీకృష్ణునికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర,

లక్షణ అనే వారు అష్టభార్య లయ్యారు. అంతేకాక నరకాసురుని సంహరించి అతని చెరలో నున్న రోహిణి మొదలైన పదహారువేలమంది కన్యకామణులను పరి([గ్రహించాడు అని చెప్పగా పరీక్షిత్తు విని ఇలా అన్నాడు.

క. ధరకుం బ్రియనందను(డగు, నరకుని హరి యేల చంపె? నరకాసురు డా వనరకుంతల లగు చామీ, కర కుంభస్తనుల నేల కారం బెట్టెన్‌? 149

సదన స్కంధము - ఉత్తరభాగము 31

  • భూదేవి ప్రియపుత్రుడైన నరకాసురుని శ్రీకృష్ణుడు ఎందుకు సంహరించాడు? నరకాసురుడు

నవయౌవనవతులైన సుందరీమణులను ఎందుకు చెరసాలలో బంధించాడు?

వ. అనిన నరేంద్రునకు మునీంద్రుం డిట్లనియె, నరకాసురుని చేత నదితి కర్ణకుండలంబులును, వరుణచ్చత్రంబును, మణి పర్వత మనియెడు నమరాద్రి స్థానంబును గోలుపడుటయు నింద్రుండు వచ్చి హరికి విన్నవించిన హరి నరకాసుర వధార్థంబు గరుడవాహనారూఢుండై చను సమయంబున హరికి సత్యభామ యిట్లనియె. 150

  • ఇలా ప్రశ్నించిన ఆ పరీక్షిన్నరేంద్రునితో శుకమునీం'ద్రు డిలా చెప్పాడు. నరకాసురుడు అదితిదేవి

కుండలాలనూ, వరుణదేవుని ఛత్రాన్నీ, దేవతల మణి పర్వతాన్నీ అపహరించాడు. దేవేంద్రుడు శ్రీకృష్ణునికి నరకుని అత్యాచారాలు విన్నవించాడు. శ్రీహరి నరకాసురుని సంహరించడానికి గరుడవాహనం ఎక్కి వెళ్ళ బోతున్న సమయంలో సత్యభామ ఆయనతో ఇలా అన్నది.

-: శ్రీకృష్ణు౦ండు సత్యభామతో.€ గూడ నరిగి నరకాసురుని వధించుటి :-

శా 'దేవా! నీవు నిశాటసంఘముల నుద్దీసించి చెండాడ నీ ప్రావీణ్యంబులు సూడంగోరుదు( గదా! ప్రాణేశ! మన్నించి న న్నీ వెంటం గొనిపామ్ము, నేడు కరుణన్‌ నేజూచి యేతెంచి నీ దేవీ సంహతి కెల్ల. జెప్పుదు భవద్దీప్త ప్రతాసోన్నతుల్‌,' 151

  • ప్రభూ! నీవు రణరంగంలో విజృంభించి రాక్షసుల సమూహాలను చెండాడుతుంటే నీ ప్రావీణ్యం

చూడాలని కోరికగా ఉంది. ప్రాణనాథా! నా మాట మన్నించి నన్ను దయతో నీ వెంట తీసుకొని పో. నేను అక్కడి నీ ప్రతాపాన్ని కనులారా చూచి వచ్చి ఇక్కడి రాణుల కందరకూ తెలియజేస్తాను.

వ. అనిన( బ్రాణవల్లభకు వల్లభుం డిట్లనియె. 152

సీ. 'సమద పుష్పంధయ ర్ఫుంకారములు గావు, భిషణకుంభింద్ర బృంహితములు నాయునిర్గత పద్మననరేణువులు గావు, తురగ రింభాముఖోద్దూతరజము లాకీర్ణజలతరం గాసారములు గావు, శత్రుధనుర్ముక్త సాయకములు గలహంససారస కాసారములు గావు, దనుజేంద్రసైన్య కదంబకములు

తే. కమలకహ్లార కుసుమసంఘములు గావు, చటుల రిపు శూల ఖడ్గాది సాధనములు కన్య! వీ వేడ? రణరంగ గమన మేడ?, వత్తు వేగము నిలువుము, వలదు వలదు." 153

  • ఈ విధంగా అడిగిన సత్యభామతో శ్రీకృష్ణు డిలా అన్నాడు. సత్యా! అబలవైన నీ వెక్కడ? రణరంగ

మెక్కడ? అక్కడ వినిపించేవి మదించిన తుమె శదల ర్వుంకారాలు కావు, భయంకరమైన ఏనుగుల ఘీంకారాలు. అక్కడ కనిపించేవి తామరవనం నుండి గాలికి రేగి వచ్చిన పరాగరేణువులు కాదు, గుజ్జపు గిట్టల చివరలనుండి లేచిన ధూళి దుమారాలు. అవి నీటికెరటాల తుంపురులుకావు, శత్రు ధనుస్సులనుండి వెడలిన శరపరంపరలు.

32 పోతన భాగవతము రాజహంసలతో నిండిన సరోవరాలు కావు, రాక్షససైన్య సమూహాలు. కమలాలు, కలువలు కనిపింపవు. అక్కడ కనపడేవి భయంకరమైన శత్రు శూలాలు, ఖడ్డాలు, ఆయుధాలు. ఇటువంటి యుద్దరంగానికి నీ వెందుకు? నేను త్వరగా తిరిగి వస్తాను. వద్దు. వద్దు. నీవు రావద్దు. జావ య గో యలు వ. అనిన బ్రియునకుం బ్రియంబు జనియింస డగ్గణి. 154

  • ఇలా పలుకుతున్న ప్రాణప్రియునకు దగ్గరకు వచ్చి ప్రియురాలు ప్రియం కలిగేటట్టు ఇలా అన్నది. ఉ. 'దానవులైన నేమి? మణి దైత్యసమూహము లైన నేమి? నీ మానితబాహు దుర్గముల నూటున నుండ6గ నేమి శంక? నీ తో నరుదెంతు' నంచు గరతోయజముల్‌ ముకుళించి మొక్క న మ్మానిని దన్ను భర్త బహుమాన పురస్సరదృష్టిః జూడంగన్‌. 155
  • నాధ్రా! నీ బాహువులు అనే దుర్గాల అండ నాకు ఉండగా వారు రాక్షస సమూహాలైతే మాత్రం నాకేం భయం? నేను నీతో వస్తాను అని అభిమానవతి అయిన సాత్రాజితి పద్మాలవంటి తన చేతులు జోడించి నమస్కరించింది. శ్రీకృష్ణుడు సత్యభామవంక మెచ్చుకోలుగా చూచాడు. వ. ఇట్లు తనకు మొక్కిన సత్యభామను గరకమలంబుల (గ్రుచ్చి యెత్తి తోడ్కొని గరుడారూఢుండై హరి గగనమార్గంబునం జని, గిరి శస్త్ర సలిల దహన సవన దుర్గమంబై మురాసురపాశ పరివృతం బయిన ప్రాగ్యోతిషపురంబు డగ్గణి, 156
  • త్రనకు నమస్కరించిన సత్యభామను వెంట పెట్టుకొని గరుత్మంతునిపై ఎక్కి ఆకాశమార్షాన (ప్రాగ్బోతిషనగరాన్ని చేరాడు. ఆ పట్టణం పర్వత దుర్గాలతో, శస్తదుర్గాలతో, వాయుదుర్గాలతో, జలదుర్గాలతో, అన్నిదుర్గాలతో కూడినట్టిది. మురాసురుని బాహుపాశాలతో చుట్టుకొనబడిన పురం అది. ను. గదచే. బర్వతదుర్గముల్‌ శకలముల్‌ గావించి సత్తేజిత ప్రదరశ్రేణుల శస్త్రదుర్గచయమున్‌ భంజించి చక్రాహతిం జెదరన్‌ వాయుజలాగ్ని దుర్గముల నిళ్ళేషంబులం జేసి భి ప్రదుండై వాలునం ద్రుంచెః గృష్లుండు ముర ప్రచ్చన్నపాశంబులన్‌. 157
  • స్రికృష్ణుడు తన గదాదండంతో పర్వత దుర్గాలను ముక్కలు చేశాడు. బాణ సమూహంతో శస్తదుర్గాల సమూహాన్ని ఛేదించి వేశాడు. వాయు, జల, అగ్ని దుర్గాలను చ|క్రపు దెబ్బలతో నాశనం చేశాడు. అరిభయం కరుడైన అరవిందాక్షుడు మురాసురుని పాశాలను ఖడ్గంతో ఖండించాడు. వ. మణీయును. 158 శా. ప్రొకారంబు గదాప్రహారముల నుత్సాటించి యంత్రంబులున్‌ నాకొారాతుల మానసంబులును భిన్నత్వంబు 'సెందంగన

పదవ స్కంధము - ఉత్తరభాగము 33 స్తోకాకారుండు శౌరి యొత్తె విలయోద్దూతాభ్ర నిర్వాత రే

.. ఖా కారిన్యముం బాంచజన్యము విముక్షప్రాణి చైతన్యమున్‌. 159

  • అంతేకాక గదాప్రహారాలతో (ప్రాకారాలను పడగొట్టి యంత్రాలను రాక్షసుల హృదయాలతో పాటు

భేదించాడు. మహానుభావుడైన వాసుదేవుడు ముల్లోకాలను మూర్చిల్ల జేయగలదీ, ప్రళయకాల మేఘ నిర్జాషంవలె కలోరధ్యానంతో కూడినదీ అయిన పాంచజన్యమనే శంఖాన్ని పూరించాడు.

న. అంత లయకాల కాలాభగర్జనంబు పగిది నొప్తునను శ్రహాధ్వని విని పంచశిరుండైన మురాసురుండు నిదుర సాలించి యావులించి నీల్లి లేచి జలంబులు వెడలి వచ్చి హరిం గని ప్రళయకాల కీలికైవడి మండుచు దుర్నిరీక్షుండై కరాళించుచుం దన పంచముఖంబులం బంచభూతమయం బయిన లోకంబుల [మింగ నప్పళించు చందంబునం గదిసి యాభీల కీలాజటాలం బగు శూలంబున గరుడుని వైచి భూనభోఇంతరంబులు నిండ నార్చ్బ్చుచు. 160

  • ప్రళయ కాలంనాటి కాలమేఘ గర్జ్దనవంటి ఆ పాంచజన్య ధ్వనిని విని అయిదుతలల మురాసురుడు

నిద్ర మేల్కొన్నాడు. ఆవులించి, లేచి, నీటినుండి బయటకు వచ్చాడు. శ్రీకృష్ణుని చూచాడు. ప్రళయకాలంనాటి అగ్నిజ్యాలలాగా మండుతూ చూడశక్యం కానివాడై పెడ బొబ్బలు పెడుతూ తన అయిదు నోళ్ళతో పంచ భూతాలతో గూడిన లోకాలను (మింగడానికి ప్రయత్నించినట్టు శ్రీకృష్ణుని సమీపించాడు మురాసురుడు. భయంకరమైన అగ్నిజ్యాలలవంటి జడలతో గూడిన తన శూలాన్ని గరుత్మంతునిపై (ప్రయోగించి భూమ్యాకాశాలు దద్దరిల్లేటట్టు గర్జించాడు.

క. దురదురం బరువిడి బిరుసున, 'హరి హరి! నిలునిలువు' మనుచు నసురయుః గదిసెన్‌ మురనుర దినిజల హృదయము, మెరమెర యిదె యడంగు ననుచు మజసేన్‌ హరియున్‌. 161

  • ముందుకు పరుగెత్తి గర్వంతో “నిలు, నిలు” అంటూ ఆ రాక్షసుడు కృష్ణుని సమీపించాడు.

శ్రీహరి గూడా దేవతల మనోవ్యథ ఈ నాటితో తీరుతుందని భావించాడు.

వ. అప్పుడు. 162

క. గరుడునిపై. బడ వచ్చిన, మురశూలము నడును నొడిసి ముత్తునియలుగా. గరముల విజిచి ముకుందుండు, మురముఖముల నిశితవిశిఖములు వడి€ జొనిపెన్‌, 163

  • ఆ సమయంలో గరుత్మంతునిపై మురాసురుడు ప్రయోగించిన శూలాన్ని శ్రీకృష్ణుడు మధ్యలోనే ఒడిసిపట్టుకుని మూడు ముక్కలుగా విరిచేశాడు. వాడిబాణాలను ఆ రాక్షసునిపై ప్రయోగించాడు.

మ. గద వ్రేసెన్‌ మురదానవుండు హరిపైణ గంసారియుం దద్గదన్‌ గదచే. ద్రుంచి సహహ్రభాగములుగా( గల్పించె, నాలోన వాం డెదురై హస్తము లెత్తికొంచు వడి రా నీక్షించి లీలాసమ

(గ దశన్‌ వాని శిరంబు లైదును వడిన్‌ ఖండించె. జక్రాహతిన్‌. 164

3డ్త పోతన భాగవతము

  • ఆ రాక్షసుడు విష్ణుమూర్తిపై తన గదను ప్రయోగించాడు. కంసారి ఆ గదను తన గదతో వేయిముక్కలు గావించాడు. అప్పుడు ఆ రాక్షసుడు చేతులు పై కెత్తుకొని వేగంతో తన మీదకు రావడం చూచి శ్రీకృష్ణుడు తన చక్రాయుధంతో ఆ రాక్షసుని అయిదు తలలనూ అవలీలగా ఖండించాడు.

వ. ఇట్టు శిరంబులు చక్రిచక్రధారాచ్చిన్నంబు లయిన వనజ్రివజ ధారాదళితశిఖరంబై కూలెడి శిఖరిచందంబున మురాసురుండు జలంబులందు( గూలిన, వాని సూనులు జనకవధజనిత శోకాతురులై జనార్హను మర్ధింతు మని రణకుర్దనంబునం దాముండు, నంతరిక్షుండు, (శ్రవణుండు, విభావసుండు, వసుండు, నభస్వంతుండు, నరుణుండు నన నేడ్వురు యోధులు నక్రోధులై కాలాంతక చోదితంబైన ప్రళభయపవన సప్తకంబు భంగి నరకాసుర (్రేరితులై రయంబున బీళుం డనియెడు దండనాథుం బురస్కరించుకొని, పజతెంచి హరిం దాణకి శర శక్తి గదా ఖడ్గ కరవాల శూలాది సాధనంబులు ప్రయోగించిన, 165

  • దేవంద్రుని వజ్రాయుధం దెబ్బకు శిఖరాలు తెగి కూలిన పర్వతంలాగా శ్రీకృష్ణుని చక్రాయుధం

దెబ్బకు శిరస్సులు తెగిన మురాసురుడు నీటిలో కూలిపోయాడు. తండ్రిమరణానికి దుఃఖించిన మురాసురుని ఏడుగురు కుమారులు కోధోద్రిక్తులై శ్రీకృష్ణుని సంహరిస్తామని యుద్దానికి బయలుదేరారు. కాలంతకునిచే పంపబడిన ప్రళయకాలంనాటి పవనసప్రకంలాగా నరకాసురునిచేత (ప్రేరేపింపబడిన తామ్రుడు, అంతరిక్షుడు, (శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు అనే ఆ ఏడుగురు యోధులు పీఠరుడనే సేనానాయకుని నాయకత్వంలో యుద్దానికి వచ్చి గద, ఖడ్గం, శూలం మొదలైన అనే కాయుధాలను కృష్ణునిపై (ప్రయోగించారు.

ఉ. ఆ దనుజేంద్రయోధ నివిధాయుధసంఘము నెల్ల నుగ్రతన్‌ మేదిని. గూలనేయుచు సమిద్దనిరర్గళ మార్గణాళిః (గ్ర వ్యాద కులాంతకుం డసురహస్త భుజానన కంఠ జాను జం ఘాదుల (ద్రుంచి వైచె. దిలలంతలు ఖండములై యిలం బడన్‌. 166

  • ఆ దానవ యోధులు ప్రయోగించే ఆయుధాల నన్నిటినీ పరాక్రమంతో నేలపై పడగొడుతూ

నిరాటంకంగా బాణాలను ప్రయోగించి ఆ రాక్షసుల చేతులు, కాళ్ళు, కంఠాలు మొదలైన అవయవాల నన్నింటినీ నవ్వుగింజలంత ముక్కలు చేసివేశాడు శ్రీకృష్ణుడు.

వ. మణీయు హరి శరజాలచ(క్రనిహతులయి తనవారలు నుడియుటకు వెజంగుపడి రోషించి గరుడగమనువి దూషించి తన్ను భూషించుకొని సరకుసేయక నరకుండు నరకుండల ప్రముఖా భరణభూషితుం డయి దానసలిల ధారాస్తిక్త గండంబులును, మహోద్దండశుండాదండంబులు వైన వేదండంబులు తండ తండంబులై నడువ వెడలి భండనంబునకుం జని. 167

  • తన పక్షం వారంతా శ్రీకృష్ణుని చక్రాయుధానికీ, భాణసమూహానికీ బలిఅయిపోయినందుకు

నరకాసురుడు ఆశ్చర్యపడి రోషంతో శ్రీహరిని దూషించాడు. తనను తాను స్తుతించుకున్నాడు. కుండలాలు మొదలైన అనేకాభరణాలు ధరించినవాడై దాన జలంతో తడిసిన గండ స్టలాలు, గొప్పతుండాలూ గల ఏనుగుల గుంపులతో యుద్ధరంగానికి బయలుదేరాడు.

పదవ స్కంధము - ఉత్తరభాగము 35 మ. బలవంతుండు ధరాసుతుండు గనె శుంభద్రాజ బింబోపరి స్టల శంసాన్విత మేఘమో యన ఖఇగేంద్రస్కంధపీఠంబుపై అలానారత్నము గూడి సంగరకథాలాపంబులం జేయు ను జ్వాలనీలాంగు6 గనన్నిషంగు గుహనాచంగున్‌ రణాభంగునిన్‌. 168 వ ఆగ ఆణి ఆడి నరకాసురుడు నీలవర్షంతో శోభిస్తున్న, రణకోవిదుడైన శ్రీకృష్ణుని చూచాడు. గరుత్మంతుని మూపుమీద సత్యభామతో ఆసీనుడై యున్న శ్రీకృష్ణుడు చంద్రబింబంపై మెజపుతీగెతోగూడిన మేఘంలా ప్రకాశిస్తున్నాడు. వీపున తూపులపొది తాల్చిన ఆ గోపాల కృష్ణుడు సాత్రాజితికి సంగ్రామ రహస్యాలను బోధిస్తున్నాడు. వ. కని కలహంబునకు నరకాసురుండు గమకింపం దమకింపక విలోకించి సంభమంబున, 16

  • క్ర్మవిధంగా ఉన్న శ్రీకృష్ణుని చూచి నరకాసురుడు యుద్దానికి సిద్ధం కావటం సత్యభామ చూచింది. ఆమె ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా తొందర తొందరగా ముందుకు వచ్చింది. శా. వేణిం జొల్లెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ (శ్రేణిం దాల్చి ముఖేందునుండల మరీచీజాలముల్‌ పర్వంగా( బాణిం బయ్యెద జక్కగా( దుణీమి శుంభద్వీరసంరంభయై యేణీలోచన లేచి నిల్ళె. దన ప్రాణేశాగ్రభాగంబునన్‌. 170
  • న్రాత్రాజితి వడి వడిగా వాలుజడ ముడివేసుకొన్నది. చీర ముడి బిగించింది. భూషణాలను సరిచేసి కొన్నది. పైట సవరించుకొన్నది. ముఖచంద్రుడు కాంతు లీనుతుండగా తనకాంతుడైన మురాంతకుని చెంత నిబ్బరంగా నిలిచింది ఆ లేడికన్నుల వన్నైలాడి. -: సత్యభామ నరకాసురునితో యుద్ధంబు సేయుట :- క, జన్యంబున దనుజుల దౌ, ర్లన్యము లుడుపంగ గోరి చనుదెంచిన సౌ జన్యవతిం జూచి యదురా, జన్యశ్రేష్టుండు సరససల్లాపములన్‌. 71
  • రళ్శరంగంలో రాక్షసుల జౌద్దత్యాన్ని అణచివేయడానికి సిద్ధమై వచ్చిన సత్యభామను చూచి యాదవ'శ్రేష్టుడైన మాధవుడు సరసంగా సంభాషించాడు. క్ష. లేమా. దనుజుల గెలువంగ, లేమా? నీ వేల కడంగి లేచితి? విటురా లే మాను మాన వేనిన్‌, లేమా విల్లందికొనుము లీలం గేలన్‌. 172
  • భామా! రాక్షసులను గెలువలేమా? నీవెందుకు యుద్దానికి సిద్దపడ్డావు? ఇలా రా! యుద్ద ప్రయత్నం మాను. మానదలుచుకోకపోతే విలాసంగా ఇదుగో ఈ విల్టు అందుకో, వ. అని సలికి. 173

36 పోతన భాగవతము క. హరిణాక్షికి హరి యిచ్చెను, సురనికరోల్లాసనమును శూరకఠోరా సురసైన్యత్రాసనమును, బలగర్వనిరాసనమును బాణాసనమున్‌. క్ష7డ్త

  • ఈ విధంగా పలికి శ్రీకృష్ణుడు దేవతలకు సంతోషాన్నీ, రాక్షసులకు సంతాపాన్నీ కలిగించుతూ, శత్రువుల గర్వాన్ని అణచివేసే ధనుస్సును సత్యభామ చేతి కిచ్చాడు. శా. ఆ విల్లంది బలంబు నొంది తదగణ్యానంత తేజోవిశే షావిర్భూత మహాప్రతాసమున వీరాలోక దుర్గోకయై తా వేగన్‌ సగుణంబు. జేసె ధనువుం దన్వంగి దైత్యాంగనా గ్రీవాసంఘము నిర్గుణంబుగ రణ్రీడా మహోత్కంఠతోన్‌, శ75
  • కృృష్ణభగవాను డిచ్చిన ఆ ధనుస్సు అందుకొన్నది సత్యభామా దేవి. అందువల్ల ఆమెకు ఎక్కడలేని శక్తి వచ్చింది. గొప్ప తేజో విశషంతో మహాప్రతాపంతో వీరలోకానికి తేరిచూడరాని రీతిలో సాత్రాజితి విల సిల్లింది. యుద్దోత్సాహంతో ఆ నారీమణి రాక్షసనారుల కంఠాలలో మంగళసూత్రాలు తెగేటట్లు నారి బిగించి ళా కం ౮ ధనుష్టంకారం చేసింది. క. నారి మొరయించె రిపు సే, నా రింఖణ హేతువైన నాదము నిగుడన్‌ నారీమణి బలసంప, న్నారీభాదికము మూర్భ్చనంద నరేంద్రా! 176
  • ఆ నారీమణి వైరిసేనల కదైర్యం కలిగేటట్టూ, శత్రువుల యేనుగులు మొదలైనవి మూర్చ పాొందేటట్లూ నారి సారించింది. సీ, పౌనర్ల కంకణ రుణరుణ నినదంబు శింజినీరవముతో( జెలిమిసేయ, దాటంక మణిగణ ధగధగ దీప్పులు గండమండల రుచి. గప్పికొనం। ధవళతరాపాంగ ధళధళరోచులు బాణజాల (ప్రభాపటలి నడం శరఘాత ఘునుఘుమశబ్దంబు పరిపంధి సైనిక కలకలస్వనము నుడుస తే. వీరశ్చంగార భయరౌద్ర విస్మయములు, గలసి భామిని యయ్యెనో కాక యనంగ నిషువు( దొడుగుట దివుచుట యేయు టెల్ల, నెలు(గ రాకుండ నని సేసె నిందువదన. 177 ౫ బంగారు కంకణాల రుణరుణ ధ్వనులు వింటినారిధ్వనితో కలిసిపోగా, చెవి కమ శలకు పొదిగిన మణుల ధగధగ కాంతులు చెక్కిళ్ళ కాంతులపై వ్యాపింపగా, అందమైన (క్రీగంటి చూపుల ధళధళకాంతులు బాణాల కాంతులను కప్పి వేయగా, శరములు ప్రయోగించుటవలన కలిగిన ఘుమ ఘుమ శబ్దం శత్రుసైన్యాల కలకలధ్వనులను అణచి వేయగా; వీరము, శృంగారము, భయము, రౌద్రము, విస్మయము అనే భావాలన్నీ కలిసి ఈ భామగా రూపొందాయా అన్నట్టుగా సత్యభామ బాణం తొడగడం, లాగడం, ప్రయోగించడం గూడా గుర్తించలేనంత వేగంగా యుద్ధం చేయసాగింది. మ. పరు జూచున్‌ వరు జూచు నొంప నలరింపన్‌, రోషరాగోదయా విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్‌

పదవ స్కంధము - ఉత్తరభాగము 37 జరగన్‌, గన్నుల గెంపు సాంపు( బర6గం జండాస్త సందోహమున్‌ సరసాలోక సమూహమనున్‌ నెజపుచుం జంద్రాస్య హేలాగతిన్‌. 178

  • వంద్రముఖియైన సత్యభామ కోపంతో కనుబొమలు ముడివేసి, వీరత్వం మూర్తిభవించినట్టు కను లెజ్జజేసి, వాడియైన బాణాలను (ప్రయోగిస్తూ శత్రువైన నరకాసురుణ్లో నొప్పిస్తున్నది. అదే సమయంలో అనురాగంతో మందహాసం చేస్తూ శృంగారం ఆకారం దాల్చినట్టు సొంపైన కన్నులతో సరసపు చూపులు ప్రసరింపజేస్తూ, ప్రియుడైన శ్రీకృష్ణుని మెప్పిస్తున్నది. మ. అలినీలాలక చూడ నొప్పెసగె. బ్రత్యాలీఢ పాదంబుతో నలికస్వేద వికీర్లకొలకలతో నాకర్లికానీత స ఖ్లలిత జ్యానఖపుంఖ దీధితులతో లక్ష్యావలోకంబుతో వలయాకార ధనుర్విముక్త విశిఖవ్రాతాహతారాతియై. క్ష79
  • సత్యభామ ఎడమపాదం ముందుకుపెట్టి, కుడికాలు వంచి, చెమటకు తడిసి ముఖాన వ్యాపించిన ముంగురులతో, చెవిదాకా లాగిన అల్లైత్రాటిని పట్టుకున్న చేతివేళ్ల గోళ్ల కాంతులతో, వైరి సమూహం వైపు గురి చూస్తూ గుండ్రని ధనుస్సు నుండి వదలుతున్న శరపరంపరలతో శత్రువులను సంహరిస్తూ శోభించింది. సీ “బొమ్మ సెండిండ్లకు( బోనొల్ల' నను బాల రణరంగమున కెట్టు రాం. దలంచె? మగవారి€ గనిన( దా మణు(గు జేరెడు నింతి పగవారి గెల్వ నే పగిది. జూచెంి బసి౦డియుయ్యెల లెక్క భయ మందు భీరువు ఖగపతి వృంధ మే కడింది నెక్కె? సఖుల కోలాహల స్వనము లోర్వనికన్య పటహభాంకృతుల కెబ్బంగి నోర్చె? ఆ. నీలకంఠములకు నృత్యంబు( గజపుచు( నలసి తలంగిపోవు నలరు6 బోండి యే విధమున నుండె నెలమి నాలీఢాది, మూనములను రిపులమాన మడంప? 180
  • బ్లామ్మల పెండ్లిండ్లకే వెళ్లలేని ముద్దరాలు యుద్ధరంగాని కెలా రావాలని భావించింది? మగవారిని చూడగానే చాటుకు వెళ్ళే లతాంగి పగవారిని గెలవాలని ఎలా అనుకున్నది? బంగారు ఉయ్యాలలు ఎక్కడానికి భయపడే పడతి గరుత్మంతుని వీపుపై ఎలా ఎక్కింది? చెలికత్తెల కోలాహలమే ఆలకింపలేని లీలావతి తప్పెట్ల ధ్వనులను ఎలా ఓర్చుకుంటున్నుది? నెమిళ్లకు నాట్యం నేర్పి అలసిపోయే అబల ఎడమపాదం ముదుకుంచి కుడిపొాదంవంచి సంగరరంగంలో శత్రువుల అభిమానాన్ని అంతం చేయడానికి ఎలా సిద్ధమైంది? ఎంత వింత! సీ వీజి. జక్కంగల బట్ట వెర వెణుంగని కొమ్మ బాణాసనం బెట్టు పట్ట నేర్చె? (మాయన దీణెం గూర్చంగ నేరని లేము గుణము నే క్రియ ధనుఃకోటి( గూర్చె? సరవి ముత్యము (గ్రువ్వం జాలని యబల యే నిపుణత నంధించె నిశితశరము? జిలుకకు( బద్యంబు సెప్పనేరని తన్వి యస్తమంత్రము లెన్న డభ్యసించెంి ఆ. బలుకు మనిన బెక్కు పలుకని ముగుద యే, గతి నొనర్చె సింహగర్జనములు? ననంగ మెజసె. ద్రిజగదభిరామ గుణధామ, చారుసత్యభామ సత్యభామ. 181

తెలి పోతన భాగవతము

  • విణను చక్కగా పట్టుకోలేని విరిబోణి విల్లు నెలా పట్టుకున్నదొ? (మ్రాకుకు తీగెను (ప్రాకించడం తెలియని బాల నారిని ధనుస్సుకు ఎట్టా తగిలిస్తున్నదో? దారానికి ముత్యాలు (గ్రుచ్చలేని కోమలి వాడీ బాణాలను ఏ విధంగా వింట సంధిస్తున్నదో? చిలుకకు పద్యాలు చెప్పలేని చెలువ అ(స్తమంత్రాల నెప్పుడు నేర్చుకున్నదో? ఎంతగా కోరినా ఎక్కువ మాట్టాడని ముగ్ద సింహనాదాలను ఏ విధంగా చేస్తున్నదో? అని అందరూ అనుకొనేటట్టుగా ముల్లోకాలు మెచ్చే సద్గుణాలు గల సత్యభామ సమరరంగంలో విలసిల్లింది. శా జ్యావల్లీధ్వని గర్జ్దనంబుగ, సురల్‌ సారంగ యూథంబుగాొ, నా విల్లింద్రశరాసనంబుగ, సరోజాన్షుండు మేఘంబుగాం దా విద్యుల్లతభంగి నింతి సురజిద్దావాన్ని మగ్నంబుగా( బ్రావృట్కాలము సేసె బాణచయ నుంభళ్ళీకరశ్రేణిగాన్‌. 182
  • వింటినారిధ్యని మేఘగర్జనంగా, దేవతలు చాతకపక్షులుగా, ధనుస్సు ఇంద్రచాపంగా, శ్రీకృష్ణుడు మేఘంగా, తాను మెరుపుతీగెగా, బాణసమూహమే వర్షప్రునీరుగా, రాక్షసులనే దావాన్షిని చల్చార్చడానికి సత్యభామాదేవి సం[గ్రామభూమిలో వర్దాక్రాలాన్ని సృష్టించింది. సీ. రాక్రేందుబింబమై రవిబింబమై యొప్పు నీరజాతేక్షణ నెమ్మొగంబు, కందర్పకేతువై ఘనధూమ కేతువై యలరు బూంబోండి చేలాంచలంబు, భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెజయు నాకృష్ణమై మెలంత చాప, మమృత ప్రవాహమైై యనలసందోహమై తనరారు నింతిసందర్భనంబు, తే హర్షదాయియై మహారోషదాయియై, పరంగు ముద్దరాలి బాణవృష్లి, హరికి నరికి. జూడ నందంద శృంగార, వీరరసము లోలి విస్తరిల్ల. 183
  • ఆ సంగర రంగంలో సత్యభామ ముద్దుల ముఖం నందనందనునికి చంద్రబింబంగానూ నర కాసురునికి సూర్యబింబంగానూ భాసించింది. ఆ నారీమణి చీర చెరగు మురారికి మన శథుని జెండాగానూ, సురారికి ధూమకేతువులాగానూ కన్పించింది. ఆ మానినీమణి మండలాకారమైన ధనుస్సు అచ్యుతునకు మన్మథపరివేషంగా. అసురునకు పప్రళయభాను పరివేషంగా విరాజిల్లింది. ఆ సుందరీమణి సందర్శనం హరికి అమృత ప్రవాహంగా అరికి అగ్నిజ్యాలగా తోచింది. ఆ అలివేణి బాణవృష్టి శౌరికి సంతోషం కల్షించింది. వైరికి రోషం కలిగించింది. శ్రీకృష్ణునిలో శృంగారరసం, నరకాసురునిలో వీరరసం విస్తరిల్లేటట్టుగా సత్యభామ సమరం సాగించింది. వ. ఇ వ్విధంబున. 1184 క. శంపాలతాభ బెడిదపు, టంపణుచే ఘోరదానవానీకంబుల్‌ పెంపణి సన్నాహంబుల, సొంపణి భూసుతుని వెనుక( జొచ్చెన్‌ విచ్చెన్‌, 185
  • ఈ విధంగా తటిల్లతవలె తళతళ మెరుస్తూ ఉన్న సత్యభామ ప్రయోగించే బాణాలవలన రాక్షససైన్యం శక్తి కోల్పోయింది. యుద్దంలో వెనుకంజవేసి నరకాసురుని మరుగు జొచ్చింది.

పదవ స్కంధము = ఉత్తరభాగము 39 వ. అ య్యవసరంబునం గంససంహారి మనోహారిణిం జూచి సంతోషకారియుం, గరుణారసావలోకన ప్రసారియు, మధుర వచన సుధారసవిసారియుం, దదీయ సమరసన్నాహ నివారియునై యిట్టనియె.186

  • జ సమయంలో కంససంహారి తన ప్రియురాలిని ఆనందాన్నీ 'అను(గ్రహాన్నీ ప్రదర్శించే చూపులతో అవలోకించి యుద్ధ ప్రయత్నం నుండి ఆమెను మరల్చడానికి మధురంగా సంభాషించటం ఆరంభించాడు. కు “కొమ్మా! దానననాథుని, కొవమ్మూహవమునకు+ దొలంగె గురువిజయము' గై కొమ్మా! మెచ్చితి నిచ్చెదణ గొమ్మాభరణములు నీవు గోరిన వెల్లన్‌.' 187
  • సత్యా! రాక్షససైన్యం యుద్ధరంగంనుండి పారిపోయింది. నిన్ను విజయలక్ష్మి వరించింది. నీ ధైర్యసాహసాలకు మెచ్చుకున్నాను. నీవు ఎన్ని ఆభరణాలు కోరుకుంటే అన్ని ఆభరణాలు ఇస్తాను. న. అని పలికి సమ్మానరూపంబులును, మోహనదీపంబులును, దూరీకృతచిత్తవిక్షేసంబులు నైన సల్గాపంబులం గళావతిం దద్దయు+ బెద్దటీకంబు సేసి, తత్కరకిసలయోల్లసిత బాణాసనంబు మరల నందుకొనియె, నప్పుడు సురవైరి మురవైరి కిట్లనియె. 188
  • అని మానసిక క్షేశం తొలగించేటట్టు, సమ్మాన ధోరణిలో సమ్మోహనంగా సముచిత సల్దాపాలతో పొగడి, చిగురుటాకువంటి ఆమె చేతినుండి ధనుస్సును తిరిగితీసుకొన్నాడు. అప్పుడు నరకాసురుడు శ్రీకృష్ణునితో ఇలా పలికాడు. క. మగువ నుగవారి ముందజ, నముగతనములు సూప రణము మానుట నీకున్‌ మగతనము గాదు; దనుజులు, మగువల దెసం జనరు మగలమగ లగుట హారీ! 189
  • కృష్ణా! పురుషులయెదుట ఒక స్త్రీ పారుషం ప్రదర్శిస్తుంటే యుద్దం మాని మౌనం ప్రదర్శించటం నీకు గొప్పకాదు. రాక్షసవీరులు వీరాధివీరులు కాబట్టి ఆడవారితో పోరాటానికి ఆరాటపడరు. వ. అనిన హరి యిట్లనియె. 190
  • నర్రక్రుని మాటలకు నందనందనుడు ఇలా అన్నాడు. క 'నరకా! ఖండించెద ను, తృరకాండాసనవిముక్త ఘనశరముల భి కరకాయు నిన్ను సుర కి, న్నరకాంతలు సూచి నేండు నందం బొందన్‌” 191
  • నర్రక్రాసురా! తొందరపడకు. నా చేతిలోని ధనుస్సు నుండి వెలువడే బాణపరంపరతో భయంకర స్వరూపుడనైన నిన్ను చించి చెండాడుతాను. ఇదిచూచి ఈనాడు దేవకాంతలు ఎంతో సంతోషిస్తారు. వ. అని పలికి హరి నరకాసుర యోధులమీంద శతఘ్ని యను దివ్యాస్తంబు ప్రయోగించిన నొక్క వరుసను వార లందజు నుహావ్యథం జెందిరి, నుజియును. 192

శ0 పోతన భాగవతము

  • అని పలికి శ్రీకృష్ణుడు నరకాసురుని సైన్యంపై శతఘ్ని అనే దివ్యాస్తాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఆ శతఘ్ని ధాటికి ఆ సైనికులంతా తీవ్రవేదనకు లోనయ్యారు. ము. శర విచ్చిన్న తురంగమై పటుగదాసంభిన్న మాతంగమైై, యురుచక్రాహతనీరమధ్య పదబాహుస్కంధ ముఖ్యాంగమై, నురభిత్సైన్యము దైన్యముం బొరయుచున్‌ శోషించి హైన్యంబుతో హరి మైోలన్‌ నిలువంగ లేక పజచెన్‌ హాహానినాదంబులన్‌. 193
  • అంతేకాదు. జనార్హనుడు ప్రయోగించిన శరసమూహాలకు గుజ్ఞులు కుప్పగూలాయి. గదాఘాతాలకు మదగజాలు నేలగరచాయి. చక్రాయుధ విజృంభణానికి సైనికుల కాళ్టు, చేతులూ, శిరస్పులూ తుత్తుమురై నాయి. ఈ విధంగా నరకాసురుని సైన్యం దైన్యంతో కృష్ణుని యెదుట నిలువలేక హాహాకారాలు చేస్తూ పారిపోయింది. వ అపుడు. 194 ఆ. మొనసి దనుజయోధముఖ్యులు నిగుడించు, శస్తసముదయముల జనవరేణ్య! మురహరుండు నరుస మూండేసి కోలలం, ఖండితంబు సేసె గగనమందు. 195 శ అప్పుడు దైత్యవీరులు దామోదరునిపై శస్తాస్తాలు ప్రయోగించారు. రాక్షసులు ప్రయోగించే అయుధా లన్నిటినీ మురారి మూడేసి బాణాలు ప్రయోగించి కదనరంగంలో ఖండించివేశాడు. క వెన్నుని సత్యను మోచుచు( బన్నుగ6 బదనఖర చంచుపక్షాహతులన్‌ భిన్నములు సేసె గరుడుండు, పన్నిన గజసముదయముల బౌరవముఖ్యా! 196 శ్‌ పరీక్షిన్మహారాజా! సత్యభామా శ్రీకృష్ణులను తనమూపున మోస్తున్న గరుత్మంతుడు తన కరకు గోళ్లతో, వాడి ముక్కుతో, రెక్కల దెబ్బలతో శత్రుసైన్యంలోని ఏనుగుల గుంపుల్ని ఛిన్నాభిన్నం చేశాడు. వన. నుణియును విహగరాజపక్ష విక్షేేణసంజాతవాతంబు సైరింపం జాలక హతశేషంబైన 'సైన్యంబు పురంబు సాచ్చుటం జూచి నరకాసురుండు మున్ను నజ్రాయుధంబుం దిరస్కరించిన తనచేతి శక్తిం గొని గరుడుని వైచె, నతండును విరుల దండ (వేటున( జలింపని మదోద్దండ వేదండంబునుంబోలె విలసిల్లె, న య్యనసరంబున గజారూఢుండై కలహరంగంబున. శ్షం7 కః గరుత్మంతుని రెక్కల విసురువలన పుట్టిన గాలివేగానికి నిలువలేక చావగా మిగిలిన నరకుని సైనికులు పట్టణంలోకి పారిపోయారు. అది చూచి నరకాసురుడు దేవేంద్రుని వజ్రాయుధాన్ని తిరస్కరించిన తన చేతిలోని శక్తి అనే ఆయుధాన్ని గరుత్మంతునిమీద ప్రయోగించాడు. పూలదండదెబ్బకు చలించని మదపుటేనుగులాగా గరుత్మంతుడు ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఆ సమయంలో మదగజారూఢుడైన నరకుడు యుద్ధ రంగంలో ముందుకు సాగాడు.

సదవ స్కంధము = ఉత్తరభాగము త్తే ను. సమదేభేంద్రము నెక్కి భూమిసుతు€ డా చక్రాయుధున్‌ వైన శూ లము చేంబట్టిన నంతలోన రుచిమూలాభిన్న ఘోరాసురో త్తమ చక్రంబగు చేతిచక్రమున దైత్యధ్వంసి ఖండించెర త్నమయోద(గ్ర వినూత్నకుండల సమేతంబైన తన్మూర్దమున్‌. 198

  • నర్రక్రాసురుడు మదగజాన్నెక్కి చక్రాయుధునిపై ప్రయోగించటానికి శూలాన్ని పట్టుకుని పైకెత్తే లోపుగానే శ్రీకృష్ణుడు ఎందరో రాక్షసవీరులను ఖండించిన తన చక్రాయుధాన్ని వానిమీద ప్రయోగించాడు. ఆచక్రం రత్నాలు పొదిగిన కుండలాలతోకూడిన నరకుని శిరస్సును తెగవేసింది.

శా “ఇల్లాలం గిటిలమైన కాలమున మున్నే నంచు ఘోషింతు వో తల్లీ! నిన్ను దలంచి లైన నిచటం దన్నుం గృపం గావండే! చెల్లంబో! తల ద్రుంచి నంచు నిల నాక్షేపించు చందంబునన్‌ (ద్రైత్లెం జప్త్పుడు గొంగ భూమిసుతు. డుద్దీప్తాహవక్షోణి పై. 199

  • “అమ్మా! వరాహావతారంలో నేను విష్ణుమూర్తి ఇల్దాలినని చాటి చెప్పావు. నిన్ను చూచి అయినా

నాపై దయచూపకుండా శ్రీకృష్ణుడు నా తల త్రుంచా”డని భూదేవిని అధిక్షేపిస్తున్నట్టుగా నరకాసురుడు యుద్ద రంగంలో నేలమీద కూలిపోయాడు.

క కంటిమి నరకుండు నడ(గా, మంటిమి నేండనుచు వెస నమర్వులు మునులున్‌ మింటం బువ్వులు గురియుచుం బంటింపక పొగడి రోలి€ బద్మదళాన్షున్‌. 20

  • “అమ్మయ్యా! నరకాసురుని చావు కనులారా చూశాము. ఇక మనం (బ్రతికాము”అని దేవతలూ,

మునీంద్రులూ మింటినుండి వెంటనే పూలవర్షం కురిపిస్తూ పద్మాక్షుని ప్రస్తుతించారు.

వ. అంత భూదేవి వాసుదేవుని డగ్గణ నేతెంచి జాంబూనదరళ్న మండితంబైన కుండలంబులును వైజయంతియును, వనమాలయును, వరుణదత్తంబైన సితచ్చ(త్రంబును, నొక్క మహారత్నంబును సమర్పించి మ్రొక్కి భక్తితాత్పర్యంబుల తోడం గరకమలంబులు ముకుళించి, విబుధవందితుండును విశ్వేశ్వరుండును వైన దేవదేవుని నిట్టని వినుతించె. న!

అప్పుడు భూదేవి వాసుదేవుని దగ్గరకు వచ్చి రత్నాలు పొదిగిన బంగారు కుండలాలనూ, వెజయంతి

అనే వనమ్రూలనూ, వరుణు డిచ్చిన వెల్లగొడుగునూ, ఒక గొప్పరత్నాన్నీ సమర్పించి నమస్కరించి భక్తి భావంతో ఆ దేవదేవుని ఈ విధంగా స్తుతించింది. ఆ

శ్త2 పోతన భాగవతము -ఫ భూదేవి శ్రీకృష్ణుని స్తుతించుట :-

సీ 'అంభోజనాభున కంభోజనేత్రున కంభోజమూలా సమన్వితునకు నంభోజపదున కనంతశక్తికి వాసుదేవునకును దేవదేవునకును భక్తులు గోరిన భంగి నే రూపైన( బొందువానికి నాదిపురుషునకును నఖిల నిదానమై యా పూర్ణవిజ్ఞాను. డైన వానికి. బరమాత్మునకును

ఆ. ధాత గన్న మేటితండ్రికి నజునికి, నీకు వందనంబు నే నొనర్హు నిఖిలభూతరూప! నిరుపమ! యీశ! ప, రాపరాత్మ మహిత! యమితచరిత! 202

  • ఓ పరమేశ్వరా! అనంతలీలావిలాసా! మహానుభావా! సాటిలేనివాడా! సమస్త భూతస్వరూపా! నీవు

పద్మనాభుడవు. పద్మనేత్రుడవు. పద్మమాలా విభూషితుడవు. అనంతశక్తిమంతుడవు. వసుదేవసుతుడవు. భక్తులు కోరిన రూపం ధరించ గలవాడవు. ఆదిపురుషుడవు. దేవదేవుడవు. సమస్త జగత్తుకు కారకుడవు. పరిపూర్ణవిజ్ఞాన వంతుడవు. పరమాత్ముడవు. పుట్టుక లేనివాడవు. బ్రహ్మపుట్టుటకు కారణ మైనవాడవు. అట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను.

వ. దేవా! నీవు లోకంబులు స్పజియించుటకు రజోగుణంబును, రక్షించుటకు సత్వ్వగుణంబును, సంహరించుటకు. దమో గుణంబును ధరియింతువు; కాలమూర్తివి. ప్రధానపూరుషుండవు పరుండవు, నీవ! నేనును, వారియు, వహ్నియు, ననిలుండు, నాకాశంబు, భూతతన్మాత్రలును, నింద్రియం బులును, దేవతలును, మనంబును, గర్తయును, మహత్తత్వంబును, జరాచరంబైన విశ్వంబును, నద్వితీయుండవైన నీయందు సంభనింతుము. “= 203

  • ఓ దేవా! నీవు (ప్రపంచాన్ని సృష్టించడానికి రజోగుణాన్నీ, రక్షించడానికి సత్త్యగుణాన్నీ,

నశింపజేయడానికి తమోగుణాన్నీ ధరిస్తావు. నీవు కాలమూర్తివి. (ప్రధానవ్యక్తివి. పరుడవు. నేను (భూమి), నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, శబ్ద స్పర్శ రూప రస గంధాలు, ఇం(ద్రియాలు, 'దేవతలు, మనస్సు, కర్త, మహత్తత్య్యం, ఈ చారచరమయమైన సమస్త ప్రపంచం అద్వితీయుడవైన నీయందే ఉద్భవిస్తాము.

చు దయ నిటు సూడుమా! నరకదైత్యుని బిడ్డండు వీండు, నీ దెసన్‌ భయమున నున్న వాండు, గడు బాలు6౦ డనన్యశరణ్యు.6 డార్తుం డా శ్రయరహితుండు, దండ్రిక్రియ శౌర్యము నేరండు, నీ పదాంబుజ ద్వయి( బొడ గాంచె భక్రపరతంత్ర సువీక్షణ! దీనరక్షణా! 204

  • భక్తమందారా! దీనరక్షణా! దయతో ఇటు చూడు. ఈ బాలుడు నరకుని కుమారుడు. నిన్ను

చూచి భయపడుతున్నాడు. వీడు వేరే దిక్కు లేనివాడు. ఆర్తి నొందినవాడు. ఆశ్రయం లేనివాడు. తండ్రిలాగా పరా(క్రమవంతుడు కాడు. నీ పాదాలనే ఆశ్రయించాడు.

పదవ స్కంధము - ఉత్తరభాగము శ్వ

వ. అని యిట్లు భూదేవి భక్తితోడ హరికిం బ్రణమిల్లి వాక్కుసుమంబులం బూజించిన నర్చితుండై

భక్తవత్సలుం డయిన పరమేశ్వరుండు నరకపుత్రుం డయిన భగదత్తున కభయం బెచ్చి, సర్వసంపద

లొనంగి నరకాసురగృహంబు ప్రవేశించి యందు. 205

  • బ్య విధంగా భూదేవి భక్తితో హరికి నమస్కరించి మాటలనే పూలతో పూజించగా భక్తవత్సలుడైన

శ్రీకృష్ణుడు నరకుని కుమారుడైన భగదత్తునికి అభయ మిచ్చి సర్ససంపదలనూ (ప్రసాదించాడు. అనంతరం నరకాసురుని సౌధంలోకి ప్రవేశించాడు.

శ్రీకృష్ణుండు పదాజువేల కన్నియల వరించి దేవలోకమునకు€ చోయి పారిజాతము. దెచ్చుట

ఉ. రాజకులావతంసుండు పరాజిత కంసుడు సొచ్చి కాంచె ఘో రాజుల రాజులం బటుశరాహతి నొంచి ధరాతనూజు. డు త్రేజితశక్తి. దొల్లి. జెజదెచ్చినవారి. బదాజు వేల ధా త్రీజన మాన్యలన్‌ గుణవతీ వ్రతధన్యల రాజకన్యలన్‌. 206

  • సంసారియైన యదుకులావతంసుడు ఆ రాజసౌధంలో నరకుడు 'ఘోరయుద్దాలలో రాజులను

శర పరంపరలతో ఓడించి చెరపట్టి తెచ్చిన మాననీయలూ, గుణవతులూ అయిన పదహారువేలమంది రాజకన్యలను చూచాడు.

మ. కని రా రాజకుమారికల్‌ పరిమళత్కాతూహలాక్రాంతలై దనుజాధీశ చమూవిదారు నతమందారున్‌ శుభాకారు నూ తన శృంగారు వికారదూరు సుగుణాధారున్‌ నృుగీలోచనా జన చేతోధనచోరు రత్నమకుటస్పారున్‌ మనోహారునిన్‌. 207

  • ఆ రాజపుత్రికలు రాక్షససైన్య సంహారుడూ, సుందరాకారుడూ, సుగుణాధారుడూ, మానినీ

మానసచోరుడూ, ఆశ్రితమందారుడూ, మనోహరుడూ, రత్నకిరీటధరుడూ ఐన శ్రీకృష్ణుని మిక్కిలి కుతూహలంతో చూశారు.

వ. కని యతని సౌందర్య గాంభీర్య చాతుర్యాది గుణంబులకు మోహించి, తమకంబులు జనియింప, ధైర్యంబులు సాలించి, సిగ్గులు వర్జించి, పంచశరసంచలిత హృదయలై, దైవయోగంబునం బరాయత్తం బులైన చిత్తంబుల నన్ముత్త కాశినులు దత్తరంబున మనోజుం డుత్తల పెట్ట నతండు దమకు( బాణ వల్లభుం డని వరియించి. 208

  • అలా చూచి శ్రీకృష్ణుని సౌందర్యం, చాతుర్యం, గాంభీర్యం, మొదలైన సుగుణాలకు ఆకర్షితలై

మోహించారు. వలపులు పొంగి, ధైర్యం కోల్పోయి, సిగ్గులు వదలి, శృంగార భంగిమలతో, సంచలించిన హృదయాలతో పంచబాణుడు తొందరపెట్టగా ఆ రాచకన్నెలు అతడే తమ (ప్రాణవల్లభుడని భావించారు.

ఉ. పాపపు రక్కసుండు సెజపట్టె నటంచు( దలంతు. మెప్పుడుం బాపుండె? వీని ధర్మమున( బద్మదళాక్షుని( గంటి మమ్మ! ము

పోతన భాగవతము ౯“: న్ని పురుషోత్తముం గదియ నేమి ప్రతంబులు సేసినారమో? క్‌ 209 యా పరమేస్థి పుణ్యుండు గదమ్మ! హరిన్‌ మము గూర్చి నిచ్చటన్‌, నపద్మాక్షుని స. (క్షు స ఇ ని లా ల “ పాపాత్ముడైన రాక్షసుడు మనల్ని చెరపట్టాడని ఎప్పుడూ భాం స్తుండేవాళ్లం ॥ వ కృష్ణునితో దర్శించాం. ఈ పురుషోత్తముని దగ్గర చేరడానికి మునం ొర్వజన్మలో ఏ వ్రతాలు చేశామో! శ్రీకృష్ణు మనలను జతక్తూర్చిన ఆ (బ్రహ్మదేవుడు ఎంత పుణ్యాత్ముడో.! క ఉన్నతి నీత్యడ్స గౌలిట, మన్నింప(గ నింక బ్రదుకు మానిని మనలో షం ము న్నేమి నోము నో(చెనా, సన్నుతమార్గముల విపిన జల దుర్గములన్‌, ల ఏ స్మ కమలాక్షుడు క్రనికర్రంత్రో కౌగిట చేర్చి గౌరవింపగా జీవించే సౌభాగ్యవతి పూర్వజన్మలో అరణ్యాలలో, ఏ జలదుర్గాలలో ఎంత్ర తపస్సు చేసిందో! క్త విన్నారమె యీ చెలువముంి, గన్నారమె యిట్టి శౌర్యగాంభీర్యంబుల్‌? మన్నార మింతకాలముం, గొన్నారమె యెన్నం డయిన గూరిమి చిక్కన్స్‌, 211

  • ఇటు వంటి సౌందర్యాన్ని గూర్చి ఎక్కడైనా విన్నావా? ఇంత్రట్రి శౌర్యాన్ని, గాంభీర్యాన్నీ ఎప్పుడైన కనుగొన్నామూ? ఇంతకాలం జీవించాంగాన్సి ఇంతటి అనురాగాన్ని అందుకున్నామా? ఫీ వనజాక్షి నే స్వ వైజయంతిక్ర నై గరి (వేలుదు గదా కంఠమందు బింబోస్టి నేం గన్క బేతాంబరము వైన మెట్స్సి యుండుద్దు గదా చమేన్స నిండ, బే “న్‌ గౌస్టుభన్సుడ్తి స్య నొప్పు సూపుద్రు గదా యురమునందు బౌలిక్త! వ్ల గన్క( బాంచజన్యమ్ను వైన మొన్సి చొక్కుదు, ॥ద్హా మోవి, (గ్రోలి ఆ. పద్మ - నవ రర నామము నైన జీత్రరుచ్చుల నుందు శిరమునందు / గ 6గతుల నాడ్తి కన్యల్కు గముల్సు గట్టీ గరుడగమ్మ్యం జూచ్చి, 212 ఓ పద్మాళ్ష నేన్స గనుక్ష వైజయంత్రి పః క నైనటైత్తే షీ నేమ గన్సుక్ర పట్టువాస్త్రాన్నై నటితే ఆక్క _ వ ఆతని మ్పెడ్షట్రో (వేలాడే దానిని గదా! ఓ బింబోస్టీ ఏికొచ్చిన్స ఆయినట్టయితే ఆ వక్షస్థలంపై మెరు! ఉ్త క వ. బాలా! నేను కౌస్తుభమణిని రా త్నెనట్టైతే అశ్రన్ని స్ప తాకి పర్వ న గని గరా 1 చన్యామబే! నేన్సు ప్రా ౦చజన్యా దా ర ఆయన శిరస్సుపై చిత్రమై కా ని గదా ఎద్మగంధ్ధి! స్వ నెమలి పింఛాన్నైనట్లెతే మైనే కొంత్రులత్రి విలస్సిల్ర దానిని ౫ యే కన్యలు గుంపులు క్రూ ఆ కృష్ణుణ్మ ఆలోక్ర్య చారు దా] అఅన్సి అనేకవిధ్రాల్పగ్గా ఆనుకుంటూ ఆ [న నా, షౌ థోత్త్వ। కన్యకశ్ర్‌ ర్య నంభోజ్ష్యాన 1 నవ్వెం దగ జూచ్చైర (తుండ్స న గ్‌జీచ్సె వర్గించెన్స్‌ న మ్మానించ్వ్యూ గరుణించ, జై గ ంచెస్స న్స (బె రది సన్మార్ర్వ నే చక్రిక దేవి నంచ్చ్యం దులో శ్ర సుత్తో బెండ్లి యా

పదవ స్కంధము - ఉత్తరభాగము శక

  • స్ర్రికృష్ణుడు నన్ను చూచే నవ్వాడు. నావైపే చూశాడు, నా చెంతకు వచ్చాడు, నన్నే వర్షించాడు, నన్నీ గౌరవించాడు, నన్నే కరుణించాడు, నా “పేరు అడిగాడు, నన్న పెంద్దాడుతాడు, నేనే శ్రీకృష్ణుని భార్య నౌతానని ఆ కన్యలందరూ తమలో తాము తలపోశారు. వు ఇట్టు బహువిధంబులం దము తను మన్ననలకు నువ్విళ్ళూరు కన్నియలం బదాజువేల ధవళాంబరాభరణ మాల్యానులేపనంబు లొసంగి, యందలంబుల నిడి, వారలను నరకాసుర భాండాగారంబులం గల నానానిధంబు లయిన మహాధనంబులను, రథంబులను, దురంగంబులను; ధవళంబులై, వేగవంతంబులై మైరావత కులసంభవంబులైన చతుర్హంత దంతావళంబులను, ద్వారకానగరంబునకుం బనిచి, దేవేంద్రుని పురంబునకుం జని యదితిదేవి నుందిరంబు సొచ్చి, యా పెద్దన్ముకు ముద్దు సూపి, మణికిరణపటల ఫరిభానిత భాను మండలంబులైన కుండలంబు లొసంగి, శచీసమేతుండైన మహేంద్రునిచేత సత్యభామతోడం బూజితుండైై పిదప సత్యభామ కోరిన నందనవనంబు సొచ్చి. 214
  • క్ర విధంగా తన ఆదరణకోసం ఉవ్విళ్ళూరుతున్న ఆ కన్యల కందరకూ తెల్లని చీరలను, ఆభరణాలను, పూమాలలను, సుగంధపు పూతలను శ్రీకృష్ణుడు పంపించాడు. నరకాసురుని కోశాగారంలో ఉన్న నానావిధాలైన ధనసంపదనూ, రథాలనూ, అశ్యాలనూ, అమితమైన వేగం గలిగిన ఐరావతకులంలో ఉద్భవించిన తెల్లని నాల్గుదంతాల ఏనుగులనూ ద్వారకానగరానికి పంపించాడు. ఈ పదారువేలమంది స్త్రీలను పల్లకీలలో ఎక్కించి ద్వారకకు సాగనంపాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు దేవేంద్రుని పట్టణమైన అమరావతికి వెళ్తాడు. దేవమాత అదితి అంతపురానికి వెళ్లి ఆమె (ప్రేమను చూరగొని తమ కాంతులతో లొ సూర్యమండలాన్ని తిరస్కరిస్తున్న మణికుండలాలను ఆమెకు సమర్పించాడు. సత్యభామతో కూడి తాను శలీసమేతుడైన దేవేంద్రుని పూజ లందుకొన్నాడు. తర్వాత సత్యభామ కోరికపై నందనవనంలో (ప్రవేశించాడు. మ. హరి కేలం బెకలించి తెచ్చి భుజగేంద్రారాతిపై! బెట్టె సుం దరగంధానుగత భ్రమ(ద్రృమర నాదవ్రాతముం బల్లనాం కుర శాఖాఫల పర్ణ పుష్పుకలికొ గుచ్చాది కోపేతమున్‌ గిరిభిత్రాతము! బారిజాతము+ ద్రిలోకీయాచకాఖ్యాతమున్‌. జం శ స్రీకృష్ణుడు కమ్మతావులకోసం క్రమ్ముకుంటున్న తుమ్మెదలతో నిండినదీ, చిగురుటాకులతో, లలి పూగుత్తులతో, ఫలాలతో గూడినదీ, ముల్లో కములందలి యాచకుల కోరికలను తీర్చుటలో (ప్రసిద్ది గాంచినదీ, ఇంద్రునిచే రక్షింపబడేదీ అయిన పారిజాతవృక్షాన్ని చేతితో పెకలించి గరుత్మంతునిపై పెట్టాడు. వు ఇట్లు పారిజాతంబును హరించి యదువల్లభుండు వల్లభయుం, దానును నిహగవల్ల భారూఢుండయి చనుచున్న సమయంబున. 6 ( పహరించి తన ప్రాణసతి అయిన సా ం వ్‌
  • స్రీకృష్ణుడు ఇలొ పారిజాతాన్ని ఆప (ర త్రాజితితో పాటు పక్షీంద్రునిపై నెక్కి ప్రయాణమైనాడు.

పోతన భాగవతము 46

పీ. నరకాసురుని బాధ నలం గోవిందుని కడ కేగి తత్చాదకమలములకు( దన కిరీటము సో దండప్రణామముల్‌ గావింప నా చక్రి కరుణ సేసి చనుదెంచి భూసుతు సమయించి తనవారి, దన్ను రక్షించుట దల నుజచి యింద్రుండు బృందారకేంద్రత్వ నుదమున బద్మలోచన! పోకు పారిజాత

ఆ. తరువు విడువు' నునుచ్చుం దాణా నడ్డము వచ్చి, తణిమి స్పరలు నట్టు దాంకి రకట! క యెజుక వలదె నిర్దరేంద్రత కొల్పనే?, సురల తామసమును జూడ నరిది,

, వాకాని

  • దేవేంద్రుడు త్రిలోకాధిపతిననే గర్వంతో “ఓ శ్రీకృష్ణా! దొంగతనంగా పారిజాత ఏక్‌. స

అపహరించ్రుక్రాన్సి వెళ్ళవద్దు, విడు విడువు' అని శత్రోోక్స అడ్డం వచ్చి శ్రీకృష్ణుణ్ణి ఎదిరించాడు, దేవై పైగ న్‌ ్రీకృష్ణునిపై యుద్దానికి చచ్చింది. నరకాసురుడు పెట్టే బాధలకు ఓర్చుకోలేక దేవేంద్రుడు తాను ననున దగ్గరకు వెళ్లి, సాష్టాంగనమస్కారం చేస్తే కృష్ణుడు దయతల్ప్చి నరకాసురుని సంహరించి దేవతల

(7 09 రక్షించిన సంగతి మరచిపోయ్రాడ్హ ఆమాత్రం జ్ఞానం లేన్సి దేవేంద్రపదవి ఎందుకు? దేవతల అహంకార చాలా ఆశ్చర్యకరంగా ఉంది.

న ఇట్టు దనకు నొద్దారిద్స ఆపడ్దంబు వచ్చిన నిర్దరేంద్రాన్వ్య నెర్జించి తన పురంబునకుం జని, నిరంతర సురభి కృష మకరంద మ్రాధ్ధ్య విశేషంబులక్రృం జొక్కి చిక్కక నాకలోక్రంబ్పన నుండి వెంట నరుగుదెంచ్చ శుమ్మెదలక్ష నెమ్మి దలంచ్చు చున్న పార్రిజ్ష్య్య్వ్వ్వా నాశ్రితపారిజాత్రుం డయిన హరి నుహా శ్ర న్న ఈ నాట ని

(టుమాభిర్వా యగ్గు బత్యభామ్రత్ర (గ్రీడించు మహోద్యా్వ్బ్య్వ సంసాపిం చి, నరకాసురు రా యింటం దెచ్చి రాజకన్యక్ర లెందణందణక్తు నన్ని నివాసంబుల్సు గల్పి ంచ్చి గృహోపకరణంబులు సమర్పించ్చి బం లే తనను ఎదిర్రచ్చ్వి దేవేంద్రాదులన్సు ఓడి 0చి ఆ ( ని భూలోకానికి త్రి స్య దే శ్రీతపారిజాబ్ష్వా శ్రీకృష్ణుడు పారిజాతవృక్షాన్ని బై సత్యభామ వ ఉద్యాన్వ్య్య్యః నొటించ్రార్త ష్య! పషోల మకరంద్ర మాధుర్యాన్ని వదలలేక దేవలోక్రంన శి డు. సువాస్త్వ్వల్టు విరజిమ్మే పారిజాతపుష్పా వచ్చార, శ్రీకృష్ణుడ్తు నరక్షాస్పుక్ష పొరిన్సుండ్తి స్యా ఎమ్మెదలు తం షారిజ్రాత్ర వ్శక్షా న్ని అనుసలం్య పాటు వేరువేర్స సౌధాలన్స ఏర్పాటు చేయ థ్‌ తెచ్చి రాజక్రన్యక్ర లందరక్రూ గృహోపకరణాల 9చ్రా 4

చ అమితనిప్ర్య్య్య డీశ్వరుం డనంత్రుండ్వు దా నొక్తనా గ్న్‌మునం పదాట్సు స్టే భననంబులత్ర్యో (డు మంచి్య సముల బదాబ్యన్ల్య నాక ( పెదాల్బన్ట్యే రూ

ఎసబాలల్య బీతి.బ

చు యధ్ధాి్యః వర్త ఖు మహాన్త్రభ్య్యజ్మ్యా [| యించై భూ] 219

ల సనృష్టుడు ఒక పదహా భం, క రువేలమ్స రౌజకన్యల్వ్వ్న పదప్తుర్చ వే ముహూర్త ఈ పదహూార్రువ్చం భవనాలలో ఉన్న చ హమాడ్రాడ్త, ాపాలత్రం పదహర్చ్య సోక్తంగా ల రీత్రులత్రో శోభిస్తూ శాస్త్రోక్త

పదన స్కంధము - ఉత్తరభాగము క్షా ఉ. దానములందు సన్ముదవిధానములం దవలోక భాషణా హ్వానములందు నొక్కక్రియ నా లలితాంగుల కన్నిమూర్తులై తా ననిశంబు గానంబడి తక్కువ యెక్కువ లేక యుత్తమ జ్ఞాన గృహస్థధర్మమున జక్రి రమించె( బ్రపూర్ణకాముండై. 220 ణ్‌ క చ సంబాప ష్‌ (ప్రేమ నిండిన చూపులలో, సంభాషణలలో, ఆహ్యానాలలో, దానాది (క్రియలలో శ్రీకృష్ణుడు ఎక్కువ తక్కువలు లేకుండా ఈ బాలామణుల కందరకూ అన్ని విధాలుగా కన్పించి ఉత్తమమైన గృహస్ట్ర ధర్మాన్ని పాటిస్తూ ఆనందించాడు. క్ష తరుణులు బెక్కం డ్రయినను, బురుషుండు మనలేండు సవతి పోరాటమునన్‌ హరి యా పదాజువేవురు, తరుణులతో సమత మనియె దక్షత్వమునన్‌. 221

  • ఎక్కువమంది భార్యలున్నప్పుడు పురుషుడు సవతిపోరాటంతో సతమతమై జీవించలేడు. కాని శ్రీకృష్ణుడు పదహారువేలమంది తరుణుల పట్ట సమానభావాన్ని (ప్రదర్శించడంలో తన సామర్దాన్ని చూపించాడు. శా, ఎన్నేభంగుల యోగమార్గముల (బ్రహ్మేంద్రాదు లీక్షించుచున్‌ ము న్నేదేవుని. జూడ గానక తుదిన్‌ మోహింతు, రా మేటి కే నిన్నాణంబుననో సతుల్‌ గృహిణులై విఖ్యాతి సేవించి ర చ్చిన్నాలోకన హాస భాషణ రతిశ్లేషానురాగంబులన్‌, 222
  • బ్రహ్మ, దేవేంద్రుడు మొదలైనవారు యోగమార్ల్గంలో విష్ణుమూర్తిని దర్శించాలని ఎన్నోరీతులుగా ప్రయత్నించి సాధ్యం కాక చివరకు మాయామోహితు లౌతారో; ఆ మహాత్మునికి ఎంతో నేర్పుతో ఈ స్త్రీలు ఇల్లాం(డై నిరంతరం వలపుచూపులతోనూ, చిరునవ్వులతోనూ, సరససంభాషణలతోనూ, బిగి కాగలింతలతోనూ, కౌతుకంతో కూడిన కలయికలతోనూ సేవించారు. ఫీ ఇంటికి నచ్చిన నెదురేగుదెంచుచు నానీత వస్తువు లందుకొనుచు సానరమణిమయాసనములు వెట్టుచు( బదములు గడుగుచు భక్తితోడ లా సంవొసిత స్నానజలము లందించుచు సద్గంధవ(స్త్రభూషణము లొసంగి యిషపదార్హంబు లిడుచు( దాంబూలాదు లొసయుచు విసరుచు నోజ మెజసి లు ళ తే. శిరము దువ్వుచు శయ్యపై! జెలువు మిగుల, నడుగు లొత్తుచు దాసీసహస్రయుక్త లయ్యు( గొలిచిరి దొసులై హరి నుదారు6€ దొరకాధిప వదనలు దారు దగిలి. 223
  • బ్లంటికీ రాగొనే ఎదురు వెళ్ళి తెచ్చిన వస్తువు లందుకుంటారు. మణులతో పొదిగిన బంగారు ఆసనాలు వేస్తారు. భక్తితో పాదాలు కడుగుతారు. స్నానానికి సుగంధంతో గూడిన నీళ్లను అందిస్తారు. సుగంధాలు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పించుతారు. ఇష్టమైన పదార్దాలు వడ్డిస్తారు. తాంబూలం అందిస్తూ,

శర పోతన భాగవతము విసురుతూ, తలదువ్వుతూ; పాదాలు పడుతూ వేలకొలది దాసీలు ఉన్నాకూడా ఆ చంద్రముఖులు స్వయంగా వాసుదేవుని సేవించారు.

శా, “నన్నే పాయండు, రాత్రులన్‌ దినములన్‌ నన్నే కృపం జెందెడిన్‌, నన్నే దొడ్డగం జూచు వల్లభలలో, నాధుండు నా యింటనే యున్నా” డంచు4 బదాయు వేలు( దమలో నూహించి సేవించిరా యన్నుల్‌ గాఢపతివ్రతాత్వ పరిచర్యా భక్తి యోగంబులన్‌. 224

  • ఆ పదహారువేలమంది పడతులుగూడా పాతి(వ్రత్యంతో, భక్తితో శ్రీకృష్ణుడు రాత్రింబవళ్ళు నా

చెంతనే వుంటూ నన్నే (ప్రేమిస్తున్నాడని తమలో తాము సంబరపడుతూ యదువల్లభుని ఆదరాభిమానాలతో ఆరాధించారు.

క ఆ రామలతో నెప్పుడుం బోరాములు సాల నెజపి పురుషోత్తముండున్‌ గారామున దిరిగెను సొ, ధారామ లతాసరోవిహారనుల నృపా! 225

  • ల రాజా! ఆ పురుషోత్తముడు ఆస్రీలపట్ట స్నేహం ప్రదర్శిస్తూ భవనాలలో, ఉద్యానవనాలలో,

సరోవరాలలో స్వేచ్చగా విహరించాడు.

క. ఏ దేవుండు జగముల, ను త్సాదించును మనుచు! జేజుచు( బ్రాభవమున మ . ర్యాదా రక్షణమునకై, యా దేవుం డట్లు మెజటసె యాదవులందున్‌. 226

జ (ప్రపంచాన్ని తన (ప్రభావంతో సృష్టించి, పోషించి, అంతంచేసే ఆ పరమాత్ముడు జగ(ద్రక్షకుడై

యాదవులలో శ్రీకృష్ణుడుగా అవతరించి ఆ విధంగా (ప్రవర్తించాడు. -: శ్రీకృష్ణుండు కేళగృహమునందు రుక్కిణీదేవితో విరసోక్తు లాడుట :-

వ. అంత నొక్కనాండు రుక్మిణీదేవి లోగిట మహేంద్రనీల మరకతాది మణ్తిస్తంభ వలభి విటంకపటల దేహళీకవాట విరాజమానంబును, శాంతకుంభ కుడ్య గనాక్ష వేదికా సోసానంబును, విలంబమాన ముక్తాఫలదామ నిచిత్ర కౌశేయవితానంబును, వివిధ మణిదీపికొ విసర విభ్రాజమానంబును, మధుకరకుల కలిత మల్లికాకుసుము మాలికాభిరామంబును, జాలకరంధ్ర వినిర్ణత కర్పూరాగరుధూస ధూమంబును, వాతాయన విప్రకీర్ణ శిశిరకర కిరణస్తోమంబును, బారిజాతప్రసవామోద పరినుళిత పవన సుందరంబు నయిన లోపలి మందిరంబున శరచ్చం[ద్రచం(ద్రికా ధవళపర్యంక మధ్యంబున, జగదీశ్వరుం డయిన హరి సుఖాసీనుండై యుండ, సభీజనంబులుం దానును డగ్గణీ కొలిచి యుండి. 227

  • ఒకనాడు రుక్మిణీదేవి అంతఃపురంలో శరత్కాలపు వెన్నెలవలె తెల్లనైన పాన్పుపై జగదీశ్వరుడైన

శ్రీకృష్ణుడు సుఖాసీనుడై ఉన్నాడు. ఆ అంతఃపురం నవరత్నాలు పొదిగిన స్తంభాలతో ఇం(ద్రనీల మణులు పొదిగిన చంద్రశాలలతో నిండినట్టిది, ఆ చంద్రశాలలోని ద్వారబంధాలు, గడపలు, మండపాలు, తలుపులు, గోడలు, కిటికీలు, అరుగులు, మెట్టు అన్నీ సువర్షకాంతులు విరజిమ్ముతున్నవి. ఆ అంతఃపురం (వ్రేలాడుతున్న

పదవ స్కంధము = ఉత్తరభాగము త్తం ముత్యాలసరాలతో నిండిన విచిత్రమైన పట్టువస్తాల చాందినీలతో వెలుగుతున్నది. అనేక మణిదీపాలతో (ప్రకాశిస్తున్నది. అక్కడ వున్న మల్లెపూల దండలపై తుమ్మెదలు మూగివున్నాయి. కర్పూరం, అగరు మొదలైన సుగంధ(ద్రవ్యాల పొగలు ఆ అంతఃపురపు కిటికీల గుండా బయటకు వ్యాపిస్తున్నవి. గవాక్షాలగుండా చల్లని తెల్లని కిరణాలు ప్రసరిస్తున్నాయి. ఉద్యానవనంనుంచి పారిజాత సుగంధపవనాలు వీస్తున్నాయి. అటువంటి అంతఃపురంలో సుఖాసీనుడై వున్న శ్రీహరినీ రుక్మిణీదేవి, ఆమె సఖులూ సేవిస్తున్నారు. సీ కుచకుంభములమీ(ది కుంకునుతో రాయు హారంబు లరుణంబు లగుచు మెజియ' గరపలబ్లవము సాంచి కదలింప నంగుళీయక కంకణప్రభ లావరింప( గదలిన బహురత్న కలిత నూపురముల గంభీర నినదంబు గడలు కొనంగం గాంచన మణికర్ణికా మయూఖంబులు గండపాలికలపై గంతు లిడ6ంగ6 తే. గురులు నర్రింపం బయ్యెదకొంగు దూగ, బోటి చేనున్న చామరం బుచ్చుకొనుచు జీవితేశ్వరు రుక్మిణి సేర నరిగి, వేడ్క లిగురొత్త మెల్లన వీవందొాడల. 228

  • ఆ సమయంలో వక్షస్థలంమీది కుంకుమ అంటుకొని హారాలు ఎజ్జని కాంతితో మెరుస్తుండగా, చిగురుటాకువంటి చేతిని కదలించినప్పుడు కదలిన కంకణాలు, ఉంగరాల కాంతులు 'ప్రసరిస్తుండగా, రత్నాల అందెలు గంభీరమైన ధ్వని చేస్తుండగా, చెవులకు ధరించిన బంగారు కమ్మల ధగధగలు గండస్ట్రలాల పై వ్యాపిస్తుండగా, ముఖంమీద ముంగురులు కదలాడుతుండగా, పైటకొంగు తూగాడుచుండగా చెలికత్తె చేతిలోని వింజామరను తీసికొని రుక్మిణీదేవి తన జీవితేశ్వరుడైన శ్రీకృష్ణునికి మెల్లగా విసరడం (ప్రారంభించింది. వ. అప్పుడు. 229 మ. పతి యే రూపము దాల్చినం దదనురూపంబైన రూపంబుతో సతి దా నుండెడు నట్టి రూసనతి నా చంద్రాస్య నా లక్ష్మినా సుతనున్‌ రుక్ష్మిణి నా యనన్యమతి నా శుద్దాంతరంగం గళా చతురత్వంబున శౌరి యిట్లనియె. జంచన్మందహాసంబుతోన్‌. 230
  • ర్రుక్మిణి రూపవతి. తన పతికి అనురూపమైన రూపంతో ప్రవర్తించే వివేకవతీ, సౌందర్యవతీ, సౌభాగ్యవతీ, సద్గుణవతీ, తన ప్రియసతీ ఐన ఆ రుక్కిణీదేవిని చూచి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ చమత్కారంగా ఇలా అన్నాడు. మ. బలశౌర్యంబుల భోగమూర్తి కుల రూప త్యాగ సంపద్గుణం బుల దిక్సాలురకంటె( జైద్యముఖరుల్‌ పూర్ణుల్‌ ఘనుల్‌, వారికిన్‌ నెలంతా! తల్లియు( దండ్రియున్‌ సహజుండున్‌ ని న్నిచ్చినం బోక యీ బలవద్బీరుల వార్థిలీనుల మముం బాటింప నీ కేటికిన్‌? 231

క్‌0 పోతన భాగవతము

  • బలంలో, శార్యంలో, భోగంలో, కులంలో, రూపంలో, త్యాగంలో, సంపదలో, సద్గుణంలో దిక్పాలురకంటె చైద్యుడు మొదలైన వారు ఘనులు, పరిపూర్ణులు. అటువంటి శిశుపాలునికి నీ తల్లీ, తండ్రీ, సోదరుడూ నిన్నిచ్చి వివాహం చేద్దామనుకుంటే ఒప్పుకోక సముద్రగర్భంలో తలదాచుకున్న పిరికివాడను నన్నెందుకు నీవు వివాహమాడావు? ప్నీ లోకుల నడవడిలోని వారము గాము, పరులకు మా జాడ బయలు పడదు, బలమదోసేతులు పగగొండ్రు మా తోడ, రాజపీఠములకు రాము తజచు, శరణంబు మాకు నీ జలరాశి సతతంబు నిష్కించనుల మేము, నిధులు లేవు, కలవారు చుట్టాలు గారు, నిష్కించన జనబంధులము ముక్తసం[గ్రహులను, ఆ. గూఢవర్తనులము, గుణహీనులము, భిక్షు, లైన వారి గాని నాశయింప, మిందుముఖులు దగుల, రిటువంటి మముబోంటి, వారి నేల దగుల వారిజాక్షి! 232
  • పద్మాక్షీ! లోకులకు భిన్నమైన నడవడి గలిగినవారము. ఇతరులు మాజాడ తెలుసుకోలేరు. బలవంతులతోనే శత్రుత్వం పాటిస్తాము. రాజసింహాసనాల కోసం ఆశపడం. సము(ద్రమే ఎల్లవేళలా మాకు ఆ|శ్రయస్థానం. మేము దరిద్రులం, ధనహీనులం, గుణహీనులం, పేదలతోనే తప్ప ధనవంతులతో బంధుత్వం చేయం. రహస్యవర్తనులం. భిక్షుకులనే ఆశ్రయిస్తాము. ఇటువంటి వారిని స్రీలు వరిస్తారా? ఈ గుణాలున్న నన్ను నీ వెందుకు వలచావు? క. సిరియును వంశము రూపును సరియైన నినాహసఖ్య సంబంధంబుల్‌ జరుగును, సరి గాకున్నను, జరగవు, లోలాక్షి! యెట్టి సంసారులకున్‌. 233
  • సంపద, సౌందర్యం, వంశం సమానంగా వున్నప్పుడే వియ్యం, నెయ్యం శోభిస్తుంది. ఓ లో లాక్షీ! లోకంలో ఎటువంటి వారికైనా ఇవి సమానంగా లేకపోతే సంబంధాలు సమకూరవు. కు. తగ దని యెజు(గవు మమ్ముం, దగిలితివి మృగాక్షి! దీనం ద ప్పగు, నీకుం దగిన ననుజేంద్రు నొక్కనిం దగులుము, గుణహీనజనులం దగునే తగులన్‌? 234
  • హరిణాక్షీ! నా సంబంధం తగినది కాదని (గ్రహించలేకపోయావు. తెలియక నన్ను వివాహమాడావు. చాలా పొరపాటు చేశావు. నీకు తగిన రాజేంద్రుణ్ణి మరెవరినైనా వివహమాడు. గుణహీనులైన వారితో సంబంధం దగదుగదా! సీ సాల్వ జరాసంధ చైద్యాది రాజులు చెల€గి నన్‌ వీక్షించి మలయుచుండ నది గాక రుక్మి నీ యన్నయు గర్వించి వీర్యమదాంధుండై వెలయుచున్న వారి గర్వంబులు వారింపంగా( గోరి చెలువ. నిన్నాడిచి తెచ్చితిమి, గాని కాంతా తనూజార్థ కాముకులము గాము, కానముమోహాదుల. (గ్రందుకొనము.

పదవ స్కంధము - ఉత్తరభాగము క్‌1ే తే. విను, ముదాసీనులము, క్రియావిరహితులము, పూర్ణులము మేము, నిత్యాత్మ బుద్దితోడ వెలుంగుచుందుము గృహదీపనిధము మెజసి, నవలతాతన్వి! మాతోడ నవయ వలదు. 235

  • సాల్యభూపతి, జరాసంధుడు, శిశుపాలుడు మొదలైన రాజులు నన్ను ద్వేషంతో చూస్తున్నారు. నీ సోదరుడైన రుక్మి బలగర్వంతో మిడిసి పడుతున్నాడు. వారి అహంకారాన్ని అణచడానికి మాత్రమే ఆనాడు నిన్ను బలవంతంగా తీసుకొని వచ్చాను. అంతేకాని కాంతలపట్ట, సంతానంపట్టు ఐశ్యర్యంపట్ల ళా వ! ళా ఆసక్తి కలిగి కాదు. కామమోహములకు మేము లోనుగాము. ఉదాసీనులము, (క్రియారహితులము, పరిపూర్చులము. నాలుగు గోడలమధ్య వున్న దీపంలాగా నిత్యాత గైబుద్దితో వెలుగుతుంటాము. అటువంటి మమ్ములను కట్టుకొని ఓ లతాంగీ! ఎందుకు బాధపడతావు? వ. అని యిట్లు భగవంతుండైన హరి దన్నుంబాయక సేవించుటం బ్రియురాలను, పట్టంపుదేవి ననియెడి రుక్మిణి దర్చంబు నేర్పున నుపసంహరించి యూరకుండిన నమ్మానవతి యప్రియంబులు నపూర్వంబులునైన మనోవల్లభు మాటలు విని దురంతంబైన చింతాభరంబున సంతాసంబు నొందుచు. 236
  • క్క విధంగా భగవంతుడైన శ్రీ కృష్ణుడు ప్రతినిత్యం తన్ను సేవిస్తూ పట్టపురాణి ననే గర్వంతో ఉన్న రుక్మిణీదేవి అత్మాభిమానం అంతరించే విధంగా పలికాడు. ఆ మానవతి ఇంతకు ముందెన్నడు తన ప్రాణప్రియుని నోట వినని ఆప్రియమైన మాటలు విని అంతులేని ఆవేదనతో బాధపడుతుంది. ఫీ. కాటుక నెజయంగం గన్నీరు నరదలై కుంచకుంభయుగళ కుంకుమము దడియ విడువక వెడలెడు వేండినిట్టూర్పుల, లాలితాధర కిసలయము గంద+ జెలువంబు నెటీదప్పి చిన్ననోవుచు నున్న వదనారవిందంబు వాడు దో(ప నూరుతావాతి. దూలు మహిత కల్పకవల్లి వడువున మేన్‌ వడనడ వడంక6 తే. జిత్త మెజీయంగ! జెక్కిటం జెయ్యి సేర్చి, కౌతుకం బేది సదతలా(గ్రమున నేల వ్రాసి పెంపుచు మో మరవాంచి వగలం బొందె మవ్వంబు గందిన పువ్వుంబోలె. 237
  • కాటుకతో నిండిన కన్నీటి ధారలు కుచకుంభముల మీది కుంకుమను తడిపి వేశాయి. ఆగకుండా వెల్వడుతున్న వేడి నిట్టూర్పుల వలన చిగురుటాకు వంటి అందమైన పెదవి కందిపోయింది. ముఖపద్మం చెలువం కోల్పోయి వాడిపోయింది. గాలితాకిడికి తూలిపోతున్న కల్పవల్లి విధంగా నెమ్మేను కంపించింది. ఈ విధంగా రుక్మిణి మనస్సు బాధపడి చెక్కిలిపై చెయ్యి చేర్చి దినదీనంగా కాలితో నేలను రాస్తూ ముఖం వంచుకొని సౌకుమార్యం కోల్పోయిన పూవులాగా ఆకులపాటు చెందింది. చ. అలికుల వేణి తన్ను బబ్రియు( డాడిన యప్రియభాష లిమ్మెయిన్‌ సాలవక కర్షరంధ్రముల సూదులు చొచ్చిన రీతిగాంగ బె బ్బులి రొద విన్న లేడి క్రియ బొల్పణి చేష్టలు దక్కి నేలపై వలని వ్రాలె. గీ లెడలి వ్రాలిన పుత్తడిబొమ్మ కైవడిన్‌. 236 న ద్రాలిన అత్తను ఆ దరయ్యు గంధాలు (ఇ (1౦.౫౦.2422. క ఖు ర గ్‌ //

చన నసనావాతలాాచనడ

5్‌2 పోతన భాగవతము

  • తన ప్రియుడు తనతో పలికిన అప్రియమైన వాక్యాలు చెవులలో సూదులు పెట్టి పొడిచినట్టు ఆమెకు బాధ కలిగించాయి. పెద్దపులి గాండ్రింపు విన్న లేడిలాగా, కీలు తప్పి క్రిందపడిపోయిన బంగారు బొమ్మలాగా నిశ్చేష్టురాలై నేలపై వాలిపోయింది. వ. ఇట్టు వాలిన, 239 మ. ప్రణతామ్నూయుండు కృష్ణు డంత గదిసెన్‌ బాష్పావరుద్దారుణే క్షణ విప్రస్త వినూత్నభూషణ దురుక్త క్రూర నారాచ శో షణ నాలింగితధారుణిన్‌ నిజకులాచారైక సద్దర్మ చా రిణి విశ్లేషిణి వీతతోషిణి. బురంధధ్రీగ్రానుణిన్‌ రుక్మిణిన్‌. 260
  • ఈ విధంగా ఆమె క్రింద పడిపోగా వేదవేద్యుడైన శ్రీకృష్ణుడు కన్నీటితో నిండి ఎర్రబడిన నేత్రాలతో, చెదరిన భూషణాలతో, కఠలోరములైన పలుకుల ములుకులవలన కలిగిన అలజడితో, నేలపై పడివున్న రుక్మిణిని పట్టుకున్నాడు. సద్వంశ సంభూతురాలూ, శోకసంతప్తురాలూ, సహధర్మచారిణీ, సాధ్వీశిరోమణీ అయిన రుక్మిణిని లేవనెత్తాడు. సీ. కని సంభ్రమంబునం దనువునం దనువుగా ననువునం జందనం బల్ల నలంది కన్నీరు పన్నీటం గడిగి కర్బూరంపు. బలుకులు సెవులలో( బాణ నూంది కరమొప్ప ముత్యాలసరుల చిక్కెడలించి యురమున6 బొందుగా నిరవు కొలిపి తిలకంబు నునుఫాల ఫలకంబుపై6 దీర్చి వదలిన భూషణావళుల. దొడిగి తే. కసములదళ చారు తాలవృంతమున విసరి, పొలుచు పయ్యెదం గుచములం బొందు పజిచి చిత్త మిగురొత్త నాయ్యన సేదందీర్చి బిగియ గౌంగిటం జేర్చి నెమ్మొగము నిమిరి. 21
  • శ్రీకృష్ణుడు సంభ్రమంతో ఆమె దేహానికి బాగా మంచిగంధం పూశాడు. పన్నీటితో కన్నీటిని కడిగాడు. కర్పూరపు పలుకుల్ని చెవులలో ఊదాడు. ముత్యాలమాలల చిక్కుతీసి వక్షస్థలంపై చక్కదిద్దాడు. ముఖాన తిలకం సరిదిద్దాడు. జారిపోయిన భూషణాల నన్నిటినీ అలంకరించాడు. తామరరేకుల విసనకజ్జుతో విసిరాడు. పైటను సరిచేశాడు. ముఖం నిమిరాడు. గట్టిగా కౌగిలించుకొని సేదదేర్చి హృదయానందం కలిగించాడు. _ తే. నెరులు గల నురునీలంపు టురుల సిరుల, నరులుగొనం జాలి నరులను మరులు కొలుపు నిరుల గెలిచిన తుమ్మెద గణుల దెగడు, కురుల నులిదీర్చి విరు లిడి కొప్పునెట్టి. 242
  • త్వమ్మెద రెక్కలను మించి మానవుల్ని మరులు గొలిపే వినీల కుంతలాలను చక్కగా దువ్వి, కొప్పుతీర్చి, పూలతో అలంకరించాడు. క్త మురసంహర్తు _డ్రిందిందిర, గరుదనిలచలత్రృసూనకలికాంచిత సుం =. దఠశయ్య జేల్చే భిష్మక, వరపుత్రిన్‌ నుతచరి(త్ర వారిజనేత్రన్‌. 243

పదవ స్కంధము - ఉత్తరభాగము 53

  • స్రీ కృష్ణుడు శీలవతీ, కమలలోచన అయిన రుక్మిణీదేవిని తుమ్మెదల రెక్కల గాలికి కదలుతున్న పూలతో గూడిన అందమైన పాన్సుపైకి చేర్చాడు. వ. ఇట్టు పానుపునం జేర్చి మృదుమధుర భాషణంబుల ననునయించిన. 24 క. పురుషోత్తము ముఖకోమల, సరసిజ మ య్యిందువదన సవ్రీడా హా స రుచి స్నిగ్దాపొంగు స్ఫుర దనలోకననము లొలయ జూ చిట్లనియెన్‌. 245
  • క్ర విధంగా పానుపై చేర్చి మనోహరమైన మధురవాక్కులతో ఊరడించాడు. రుక్మిణీదేవి పురుషోత్తముని అందమైన ముఖారవిందాన్ని సిగ్గుతో గూడిన స్నిగ్రమైన చూపులతో చూస్తూ ఇలా అన్నది. -:రుక్షిణిదేవి శ్రీకృష్ణ లాలితయై యతనిని స్తుతించుట :- క. మురహర! దివసాగమ దళ, దరవిందదళాక్ష! తలంప నది యట్టిదగున్‌ నిరవధిక నిమలతేజో, వరమూర్తివి, భక్తలోకవత్సల! యెందున్‌. 2డేర
  • 2 మురాంతకా! ఉదయాన వికసించుతున్న తామరరేకులను బోలిన నేత్రములతో శోభించువాడా! భక్తలోకమును వాత్సల్యముతో రక్షించు దేవా! నీవు అనంత తేజోమూర్తివి. నీవన్నమాట వాస్తవం, తే. సంచిత జ్ఞాన సుఖ బలైశ్వర్య శక్తు లాదిగా. గల సుగుణంబు లమరు నీకు, నేను దగుదునె? సర్వలోకేశ్వరేశ!, లీిలమై సచ్చిదానందశాలి వనఘ! 2క7
  • జ్ఞానము, సుఖము, బలము, ఐశ్చర్యము మొదలైన సద్గుణాలన్నీ నీలో నెలకొన్నాయి. ఓ సర్వలోకేశ్చరా! సచ్చిదానందమూర్తి! పుణ్యపురుషా! నీకు నేను తగినదానను కాను. సీ రూఢిమై( బ్రకృతి పూరుష కాలములకు నీశ్వరుండవై భవదీయ చారుదివ్య లలితకళా కౌశలమున నభిరతుండై కడంగు నీ రూప మెక్కడ మహాత్మ! సత్త్వాది గుణ సముచ్చయయుక్త మూఢాత్మ నయిన నే నెక్కడ? ననఘచరిత! కోరి నీ మంగళ గుణభూతి దానంబు సేయంగంబడు నని చెందు భీతి తే. నంబునిధి మధ్యభాగముం దన్ఫుతఫేన పటల పాండుర నిభమూర్తి! పన్నగేంద్ర భోగశయ్యను బవ్వళింపుచును దనరు, నట్టి యున్నతలీల దివ్యంబు దలంప. 248
  • ఓ మహాత్మా! నీవు ప్రకృతి పురుషులకూ, కాలానికీ, ఈశ్చరుడవు. కళాకౌశలంతో శోభించే నీ మనోహరమైన రూప మెక్కడ? త్రిగుణాలతో గూడిన మూఢురాలను నే నెక్కడ? నీ సద్గుణ సంపదదానం చేయబడుతుందనే భయంతో నేమో ఎవరికీ అందకుండా పాలసము(ద్రంలో శేషతల్పంపై పవ్వళిస్తున్నావు. ఇట్టి నీ లీలలు దివ్యమైనవి. వ. శబ్ద స్పర్శ రూప రస గంధంబు లనియెడు గుణంబులచేత( బరి[గ్రహింస(బడిన మంగళ సుందర విగ్రహుండవై, యజ్ఞానాంధకార నివారకంబైన రూపంబు గైకొని, భవదీయులైన సేవకులకు

కక పోతన భాగవతము ననుభావ్యుండ వైతి, భవత్సాదారవింద నుకరంద రసాస్వాద లోలాత్ములైన యోగీంద్రులకైనను భవన్మార్గంబు స్ఫుటంబు గా, ద ట్లగుటం జేసి యీ మనుజ పశువులకు దుర్విభావ్యం బగుట యేమి సెప్ప? నిట్టి యాశ్వరుండవైన నీకు నిచ్చ స్వతం(త్రంబు గావున నదియును నా కభిమతంబు గావున నిన్ను నే ననుసరింతు, దేవా! నీ వకించనుండ వైతేని బలిభోక్త లయిన బ్రహ్మేంధద్రాదు లెవ్వని కొకు బలి సమర్పణంబు సేసిరి? నీవు సమస్త పురుషారరముయుండ వనియును, ఫలస్వరూపి వనియును నీ యందలి డ్రేమాతిశయంబులం జేసి విజ్ఞానదీపాంకురంబున నిరస్త సమస్త దోషాంధకారులై యిహసౌఖ్యంబులు విడిచి సుముతులు భవదీయదాస సంగంబు గోరుచుండుదు; రట్లు సేయనేరక నిజాధికారాంధకారమగ్నులైన నారు భవత్ర్తత్వ్వంబు దెలిసి బలిప్రక్షేషణంబులు సేయంజాలక మూఢులై సంసారచక్రంబునం బరిభ్రమింతు రదియునుం గాక, 249

  • జ్జమ్ము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే గుణాలచేత పరిగ్రహింపబడిన మంగళాకారుడవు నీవు. అజ్జానాంధకారాన్ని తొలగించే రూపాన్ని పొంది నీ భక్తులచే సేవింపబడుతున్నావు. నీ పాదపద్మ మకరంద రసాన్ని ఆస్వాదించే యోగీంద్రులకు గూడా నీ మార్గం స్పష్టం కాదు. ఇక ఈ మనుష్య పశువులకు ఊహింపరానిది కావడంలో ఆశ్ళర్యం ఏముంది? ఇట్టి పరమేశ్వరుడైన నీవు స్వతంటత్రుడవు. నిన్ను నేను అనుసరిస్తున్నాను. దేవా! నీవు దరిద్రుడవైతే పూజా (ద్రవ్యాలను స్వీకరించే బ్రహ్మేంద్రాది దేవతలు పూజాద్రవ్యాలను ఎవరికి సమర్పిస్తున్నారు? నీవు సమస్త పురుషార్ధమయుడవనీ, ఫలస్వరూపివనీ భావించి నీ మీది ప్రేమచేత సమస్తదోషాలనే అంధకారాన్ని విజ్ఞానమనే దీపంతో అణచివేసి, ఇహలోక సౌఖ్యాలను వదలివేసి, సత్పురుషులు నీ సన్నిధిని కోరుతున్నారు. అధికారమనే అంధకారంలో మునిగి నీ తత్త్వం తెలుసుకోలేక, నిన్ను పూజింపక కొందరు సంసారచ(క్రంలో పరి(భ్రమిస్తుంటారు. ఆ. వరమునీంద్ర యోగివర సురకోటిచే, వర్ణిత ప్రభావ వైభనంబు గలిగి యఖిల చేతనులకు విజ్ఞాన ప్ర, దుండ వగుదు వభవ! దురితదూర! 250
  • ఓ జన్మరహితా! పాపరహితా! మునీంద్రులచే, యోగివరులచే, దేవతలచే వర్షితమైన ప్రభావం గల నీవు అఖిల జీవులకు విజ్ఞానదాయకుడవైన వాడవు. వ. దేవా! భవదీయ కుటిలభ్రూవిక్షేపోదీరిత కాలవేగంబుచేత విధ్వస్త మంగళులగు కమలభవ భన సాకశాసనాదులం దిరస్కరించినట్టి మదీయ చిత్తంబున. 251
  • ఓ దేవా! నీ కనుబొమలు ముడిపడినంత మాత్రాన సిరులు గోల్పోయి చెదరి బెదరిపోయే (బ్రహ్మ, ఈశ్వరుడు, దేవేంద్రుడు మొదలైనవారి నందరినీ నా హృదయం తిరస్కరించింది. చ. విను వరియించినం బెలుచ నీరజలోచన! శార్‌జ్లసాయ కా సన నినదంబులన్‌ సకల శతుధరాపతులన్‌ జయించి బో రన పశుకోటిందోలు నృుగరాజు నిజాంశము భూరిశక్తి గై కొనిన విధంబునన్‌ నను నకుంఠిత శూరత. దెచ్చి తీశ్వరా! 252

పదవ స్కంధము - ఉత్తరభాగము 5్‌5్‌

  • నా మనస్సు నిన్ను వరించింది. ఆ సమయంలో ఓ నీరజలోచనా! నీ ధనుష్టంకారముతో సమస్త

శత్రురాజులను జయించి మృగరాజు మృగాలను పారద్రోలి తన భాగాన్ని (గ్రహించినట్టు శూరత్వంతో నీదాననైన నన్ను పరి[గ్రహించావు.

ఉ. అట్టి నృపాల కీటముల నాజి నెదుర్చంగ లేనివాని య ట్లొట్టిన భీతిమై నిటు సయోధిశరణ్యుండ వైతి వింతయున్‌ నెట్టన మాయ గాక యివి నిక్కములే? భవదీయ భక్తులై నట్టి నరేంద్రమౌళిమణు లంచిత రాజబుషుల్‌ ముదంబునన్‌. 253

ఆ. వితత రాజ్యగరిమ విడిచి కాననముల, నాత్మలందు మీ పదాబ్బ్దయుగము వలతతి గాంగ నిలిపి వాతాంబు పర్ణాశ, నోగ్రనియతు లగుచు నుందు రభన! 254

  • అటువంటి రాచపురుగులను రణరంగంలో ఎదిరించలేక భయపడినట్టు నీవు సముద్ర మధ్యంలో

నివాసం ఏర్పాటు చేసుకున్నావు. ఇది నీ మాయ కాక వాస్తవమా? నీ భక్తులైన రాజాధిరాజులు, రాజర్హులు సంతోషంతో సమస్త రాజ్యసంపదలను వదలి, అరణ్యాలకు వెళ్ళి నీ పాదాబ్దాలనే ధ్యానిస్తూ నీటిని, గాలిని, ఆకులను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉగ్రమైన నియమాలను పాటిస్తూ తపస్సు చేస్తున్నారు.

మ. విమలజ్ఞాననిరూఢులైన జనముల్‌ వీక్షింప మీపాదకం జ మరంద స్పుట దివ్యసారభము నాస్వాదించి నిర్వాణ రూ పము సత్సూరుష వాగుదీరితము శోభాశ్రీనివాసంబు నౌ మిము సేవింపక మానవాధముని దుర్మేధాత్ము సేవింతునే? 255

  • నిర్మలజ్ఞానధనులైన జనులు వీక్షిస్తుండగా మీ పాదపద్మ మకరంద మాధుర్య సౌరభాలనూ

ఆస్వాదించుతూ మోక్షదాయకమూ సత్పురుషుల స్తుతికి పాత్రమూ, శుభావహమూ అయిన మీ మూర్తిని 'సేవించక దుర్మేధాత్ముడైన మానవాధముణ్లీ ఎవరు "సేవిస్తారు?

న. మజియును దేవా! భూలోకంబునందును, నిత్యనివాసంబునందును, సకలప్రదేశంబులందును జగదీశ్వరుండ నయిన నిన్ను నభిమతంబు లయిన కామరూపంబులు గైకొని నవరియింతు, భవదీయ చరణారవింద మకరందాస్వాదన చాతుర్య ధుర్యభృంగియైన కామిని యతిహేయంబైన త్వక్‌ శ్మశు రోమ నఖ కేశంబులచేత( గప్పంబడి యంతర్గతం బయిన మాంసాస్టి రక్త క్రిమి విట్కఫ పిత్త వాతంబులం గల జీవచ్చవం బయిన నరాధముని మూఢాత్మయై కామించునే? యదియునుం గాక, 256

  • అంతేకాక ఓ దేవా! సకల చరాచర (ప్రపంచానికి అధీశ్వరుడవైన నిన్ను భూలోకమందునూ,

వైకుంఠంలోనూ, అన్ని ప్రదేశాలలోనూ, నేను అభిమతాలైన కామరూపాలతో సేవిస్తాను. నీ పాదపద్మ మకరందాన్ని ఆనందంగా ఆస్వాదించే నేర్చుగల తుమ్మెద వంటి వాల్గంటి ఎముకలతో, మాంసంతో, చర్మాదులతో కప్పబడి జీవచ్చవంలా ఉండే నరాధముణ్ణి ఎలా కామిస్తుంది? అంత తెలివితక్కువది ఎక్కడైనా ఉంటుందా?

56 పోతన భాగవతము సీ, నీరదాగమమేఘనిర్యత్సయ: పాన చాతకం బేగునే చౌటి పడెకు/? బరిపక్వ మాకంద ఫలరసంబులు గ్రోలు కీరంబు సనునె దుత్తూరములకు? ఘనరవాకర్ణనోత్కలిక మయూరము గోరునే కఠిన యిల్లీరవంబు(? గరికుంభ సిశిత సద్రాస మోదిత సింహ మరుగునే శునక మాంసాభిలాషం తే. బ్రవిమలాకార! భవదీయ పాదపద్మ, యుగ సనూశ్రయ నైపుణోద్యోగచిత్త మన్యు. జేరునె తన కుపాస్యంబు గాంగ? భక్రమందార! దుర్భర భవవిదూర! 257

  • వర్షాకాలంలో మేఘం నుండి వెలువడే జలబిందువులను ఆస్వాదించే చాతకపక్షి చవిటిగుంటలోని నీటికోసం వెళుతుందా? పండిన మామిడి పండ్ల రసాన్ని (గగ్రోలే చిలుక ఉమ్మెత్తలను ఆశ్రయిస్తుందా? నీలమేఘ గర్జనాన్ని విని ఆనందించే నెమలి ఈలపురుగు ధ్వనిని కోరుకుంటుందా? ఏనుగు కుంభస్థలంలోని మాంసాన్ని భుజించి తృప్తి చెందే సింహం కుక్కమాంసం కోసం కక్కుర్తి పడుతుందా? ఓ శుభాకారా! నీ పాదపద్మద్వయాన్ని కోరి ఆశ్రయించి ఆనందించే హృదయం ఓ భక్తమందారా! భవవిదూరా! మరాకదానిని ఎందుకు అభిలషిస్తుంది.? క, వాసనవందిత ! భవ కమ, లాసన దివ్యప్రభా సభావలి కెపుడున్‌ నీ సమధిక చారిత్ర క, థా సురుచిరగాన మవితథం బయి చెల్లున్‌. 258
  • ద్రివేంద్రునిచే స్తుతింపబడు ఓ దేవాదిదేవా! కైలాసంలోనూ, సత్యలోకంలోనూ, ఎప్పుడూ నీ దివ్యగాథలే కమ్మగా గానం చేయబడుతుంటాయి. క. ధరణీనాథులు దమతమ, వరవనితామందిరముల వసియించుచు గో ఖర మార్దాలంబుల గతి, ప్టిరబద్దు లగుదురు నిన్ను( దెలియని కతనన్‌. 259
  • నిథిలేశ్చరుని నిన్ను గుర్తింపలేని రాజులు తమ (ప్రేయసీ మందిరాలలో నివసిస్తూ పశువులలాగా స్థిరంగా బంధింపబడుతుంటారు. ఆ. జలజనాభ! సకల జగదంతరాత్మవై, నట్టి దేవ! నీ పదారవింద యుగళి సొనురాగయుక్తమై నా మది6 గలుగునట్టు గాంగం దలు మనఘ! -260
  • ఒ పద్మనాభా! సకల జగదంతర్యామివి నీవు. అటువంటి నీ పాదపద్మాల మీద నా బుద్ది అనురాగంతో ప్రసరించేటట్టు అనుగ్రహించు. ఆ. పృథు రజోగుణ ప్రవృద్ధ మైనట్టి నీ, దృష్టిచేత నన్ను. దేరుకొనంగం జూచు టెల్ల పద్మలోచన! నా మీంద, ఘనదయార్హ దృష్టిగా. దలంతు. 261
  • రాజీవలోచనా! రాజసంతో విరాజిల్లే నీ దృష్టితో నన్ను తేరుకొనేటట్టు చూడడం నన్ను దయా।ర్ట దృష్టితో చూడడంగానే భావిస్తాను.

పదవ స్కంధము - ఉత్తరభాగము 5్‌7 వ. అదియునుం గాక, మధుసూదనా! నీ వాక్యంబులు మిథ్యలు గావు, తల్లి వచనంబు కూంతున కభిమతంబు గాదె” యౌవనారూఢ మదంబున స్వైరిణీ యగు కామిని పురుషాంత రాసక్త యగుట విచారించి పరిజ్ఞాని ైనవాండు నిడుచు, నవివేకి యయిన పురుషుం డింద్రియలోలుండై రతిందగిలి దాని విడువనేరక పరిగ్రహించి యుభయ లోకచ్యుతుండగు, నట్టు గావున నీ యెజుంగని యర్థంబు గలదే? యని విన్నవించిన రుక్ష్మిణీదేవి వచనంబులకు( గృష్లుండు సంతసిల్లి యిట్లనియె. 262

  • ఓ మధుసూదనా! నీ వాక్యాలు అసత్యాలు కావు. కన్నతల్లిమాట గారాబు కుమార్తెకు అభిమతమే గదా! యౌవనమదంతో స్వైరిణిమైన కామిని అన్యపురుషాసక్త అయితే జ్ఞానవంతు డైనవాడు ఆమెను పరిత్యజిస్తాడు. అవివేకియైన పురుషుడు ఇం(ద్రియలోలత్వంతో ఆ స్త్రీని విడువలేక ఉభయలోకాలకు భ్రష్టుడౌతాడు. అందువలన నీకు తెలియని ధర్మం లేదు- అని రుక్మిణి విన్నవించింది. అప్పుడు కృష్ణుడు మిక్కిలి సంతోషంతో ఇలా అన్నాడు. -: కృష్ణుండు రుక్షిణీదేవి నూరడించుట :- చ. '“అలికులవేణి! నవ్వులకు నాడిన మాటల కింత నీ మదిం గలంగంగ నేల? వేలను గయ్యములన్‌ రతులందు నొన్వంగాః బలికిన నూట లెగ్గు లని పట్టుదురే? భవదీయ చిత్తముం దెలియంగ6 గోరి యేం బలికితిన్‌ మదిలో నిటు గుంద నేంటికిన్‌? 263
  • అలివేణీ! రుక్మిణీ! నేను నవ్వులాటకన్న మాటలకు నీ వెందుకు ఇంత బాధపడుతున్నావు? వేటలో, రణరంగంలో, రతి సమయంలో సూటి పోటుమాటలు మాట్లాడినా తప్పుగా భావించకూడదు. నీ మనస్సు తెలుసుకోవడంకోసం ఇలా అన్నాను. ఈ భాగ్యానికి నీవు బాధ చెందవద్దు, వ. ఆదియునుం గాక. 26 ఊఉ. కింకలు ముద్దుబల్కులును గెంపుంగనుంగవ తియ్యమోవియున్‌ జంకెలు తేణీచూపు లెకసక్కెములున్‌ నెలవంక బొమ్మలుం గొంకక వీడనాడుటలు. గూరిమియుం గల కాంత. గూడుటల్‌ అంకిలిలేక జన్మఫల మబ్బుట గాదె కురంగలోచనా!' 265
  • అదీగాక హరిణలోచనా! పొాలయలుక, మురిపెపు మాటలు, బెదరింపు చూపులు, తియ్యని కెమ్మోవి, ఎకసెక్కాలు, నెలవంకలు కనుబొమలు, విదిలింపులు, అదలింపులు, వలపులు గల చెలువలతో సమాగమం లభిస్తే జన్మ సఫలమైనట్లే గదా! వ. అని మజియు నిట్లనియె. 266 ఉ. 'నీవు పతిప్రతామణివి నిర్మల ధర్మనివేక శీల స ద్భావవు నీ మనోగతులం బాయక యెప్పుడు నస్మదీయ సం

58 పోతన భాగవతము 'సేవయ కాని యన్యము భజింసవు, పుట్టిన నాంట నుండి నీ భావ మెతీంగి యుండియును బల్కిన తప్పు సహింపు మానినీ!" 267

  • అని కృష్ణుడు మరల ఇలా పలికాడు. దేవీ! నీవు మహా పతివ్రతవు, సౌశీల్యవతివి. నాసేవ తప్ప నీకు బాల్యంనుండి అన్యచింత లేనేలేదు. ఇదంతా తెలిసికూడా నేను నిన్నలా బాధపెట్టినందుకు నన్ను మన్నించు. వ. అని వెండియు నిట్లనియె, “నీ వాక్యంబులు శ్రనణసుఖంబు గావించె, నీవు వివిధంబులైన కామంబులు గోరితివేని, నవియన్నియు నా యంద యుండుటం జేసి యేకాంతసేవా చతురవైన నీకు నవి యన్నియు నిత్యంబులై యుండు. నీ పాతివ్రత్యంబును, నా యందలిస్నేహంబు నతివిశదంబు అయ్యె, నా వాక్యములచేత భవదీయ చిత్తంబు చంచలంబు గాక నా యందలి బుద్ది దృఢం బగుం గావున సకల సంపద్విలసితంబైన ద్వారకానగర దివ్యమందిరంబులందు నీదు భాగ్యంబునం జేసి సంసారి కైవడి నీ యందు బద్దానురాగుండనై వర్తింతుం దక్కిన ప్రాణేంద్రియ పరవశత్వంబున వికృత శరీరధారిణియైన సతి నన్నుం జెందుట దుష్కరం; బదియునుం గాక 'మోక్షప్రదుండనైన నన్న గామాతురలైన యల్పమతులు వ్రత తసపోమహిమలచేత దాంపత్య యోగంబుకై సేవింతు, రదియంతయు నా మాయావిజ్బంభితంబు, దానంజేసి వారు మందభాగ్యలై నిరయంబు నొందుదు; రట్టు గావున నీ సమానమైన కాంత యే కాంతలందైన గలదె? నీ వివాహకాలంబున ననేక రాజన్యవర్యులం గైకొనక భవదీయ మధురాలాప శ్రనణాత్మకుండ నయిన నా సన్నిధికి నా శరీరం బితర యోగ్యంబు గాదు, నీకు శేషంబునయి యున్నదాన'నని యేకాంతంబునం బ్రాహ్మణుం బుత్తెంచిన నేనును జనుదెంచి నీ పరిణయ సమయంబున భవత్సవోదరుం బట్టి విరూపుం గావించిన నది గనుంగొనియును నా యందలి విప్రయోగ భయంబున నూరకుండితి; ' వది గావున బహు ప్రకారంబులై వర్తించు నీ సద్దుణంబులకు సంతసింతు! నని యి వ్విధంబున దేవకీసుతుండు నరలోక విడంబనంబుగ గృహస్థుని భంగి నిజగృహకృత్యంబు లాచరించు చుండెనని శుకుండు మజియు ని ట్లనియె. 268
  • నీ మాటలు నాకు శ్రవణానందాన్ని కల్గించాయి. నీవు కోరిన వన్నీ నాయందే ఉన్నవి గనుక ఏకాంతసేవా చతురవైన నీకు అవన్నీ లభిస్తాయి. నీ పాతివ్రత్యమూ, నామీది (ప్రేమా స్పష్టమయ్యాయి. నామాటలచేత నీ మనస్సు సంచలించకుండా నామీది నీ అనురాగం ఇంకా దృఢమవుతుంది. కాబట్టి సమస్త భోగభాగ్యాలతో నిండిన ఈ ద్వారకానగర దివ్యమందిరాలలో కేవలం ఒక గృహస్టులాగా నీపై బద్దానురాగంతో ప్రవర్తిస్తాను. ఇదంతా నీ అదృష్టం. ఇం(ద్రియలోలురాలైన వికృతస్వరూపిణి అయిన స్త్రీ నన్ను పొందడం దుష్కరం.అంతేకాదు. మోక్షదాయకుడనైన నన్ను కామాతురలైన అల్పబుద్దులు (వ్రతాలతో తపస్సుతో దాంపత్య జీవితంకోసం సేవిస్తుంటారు. ఆ భావం నామాయవలన విబ్బంభించిందే. అందువలన వారు భాగ్యవిహీనలై నరకాన్ని పొందుతారు. నీతో సమానమైన స్త్రీ ఈ లోకంలో లేదు. నీవు వివాహకాలంలో ఎందరినో గొప్ప గొప్ప రాజన్యులను తిరస్కరించావు. నేను నీ దానను. ఈ నా దేహంమీద అన్యులెవ్వరికీ అధికారం లేదు అంటూ బ్రాహ్మణుని నా చెంతకు పంపించావు. నేను నీ ఆహ్వానాన్ని మన్నించి వచ్చి నిన్ను వివాహమాడే సందర్భంలో నీ సోదరుణ్ణి వికారస్వరూపుణ్ణి గావించాను. అది చూచి కూడా నా వియోగాన్ని

పదవ స్కంధము - ఉత్తరభాగము క్‌ సహింపలేక ఊరకున్నావు. ఇటువంటి నీ సద్దుణాలకు ఎంతో సంతోషించాను” అని ఈ విధంగా పలికి దేవకీ తనయుడు మానవలోక ధర్మా న్ననుసరించి గృహస్టువలెనే తన గృహకృత్యాలను ఆచరిస్తున్నాడని శుకుడు తెలిపి పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు. క. అని యిట్లు కృష్ణు. డాడిన, వినయ నివేకానులాస నితతామృత సే చన, ముదితహృదయయై య, వ్వనితామణి వికచ వదన ననరుహ యగుచున్‌. 269

  • స్ర్రీకృష్ణుడు ఇలా ఇంపుగా, ఊరడింపుగా, వినసొంపుగా పలికాడు. ఆ వాగమృత ధారలకు రుక్మిణీదేవి ముఖారవిందం సంతోషంతో వికసించింది. క. నగ వామతించు చూపులు, నగధరు మోమునను నిలిపి నయమున6 గరముల్‌ మొగిచి వినుతించెం గృష్లున్‌, ఖగవాహున్‌ రుచిరదేహు( గలితోత్సాహున్‌. 270
  • అప్పుడు రుక్మిణి చిరునవ్వుతో నిండిన చూపులతో శ్రీకృష్ణుని వైపు చూచి చేతులు జోడించి ఖగవాహనుడైన ఆ జగన్మోహనుని, ఆ దేవ దేవుని స్తుతించింది. చ. అతుల విరాజమానముఖుందై వివిధాంబర చారుభూషణ ప్రతతులతోడ గోరిన వరంబులు దద్దయు నిచ్చె గృష్టు.డు న్నతశుభమూర్తి దేవగణ నందితక్షీర్తి దయానునర్తియె యతిమృదువాణికిం గిసలయారుణపాణికి నీల వేణికిన్‌. రగ
  • దేవత్రాగణాల స్తోత్రాలకు పాత్రుడైన శ్రీకృష్ణుడు సంతోషంతో (ప్రకాశించే ముఖం కలవాడై, చిగురువలె ఎజ్జని హస్తములూ, నల్లనైన కురులూ, మృదుమధురములైన మాటలూ గల రుక్మిణీదేవికి అనేక విధాలైన ఆభరణాలనూ, వ(స్రాలనూ బహూకరించాడు. కోరిన కోరికలు తీర్చాడు. న. ఇట్లు సన్మూనించి కృష్ణుండు రుక్క్మిణియుం దానును దదనంతరంబ. 272 చ. ఎలమి ఘటింప(గా. గలసి యీడెల నీడల మల్లికా లతా వలిం గరవీరజాతి విరవాదుల నీథులం గమ్మ దెమ్మెరల్‌ వొలయు నవీనవాసముల. బొన్నలం దిన్నెల! బచ్చరచ్చలన్‌ గొలయుల లేశెలంకులను గోరిక లీరిక లొత్తం గ్రొత్తలై. 273
  • క్ర ప్రకారంగా రుక్మిణిని సమ్మానించిన అనంతరం ఆ దంపతు లిరువురూ మల్లెపాదలలో, విరాజాజి నికుంజాలలో, చిరుగాలులకు పులకరించే చంద్రకాంత శిలా వేదికలపైనా, మరకత మణిసౌధాలలో, సరోవరతీరాలలో తనివితీరా విహరించారు, క. ఆరామభూములందు వి, హారామల సొఖ్యలీల నతిమోదముతో . నా రామానుజు. డుండెను, నా రామానుణియు. దాను నభిరామముగన్‌. 2744

60 పోతన భాగవతము

  • శ్రీకృష్ణుడు రమణీయాలైన ఉద్యానవనాలలో రమణీమణి అయిన రుక్కిణితో గూడి విహరించి

ఆనందించాడు.

న. మజీయు ననేకవిధ మణివితానాభిశోభిత ప్రాసాదోపరిభాగంబులను, లాలిత నీలకంఠ కలకంఠ కలవింక శుక కలాపకలిత తీరంబులను, నముకరందపాన మదవదిందిందిర రుంకార సంకుల కమల కహ్లార సుధాసార నీవారపూరిత కాసారంబులను, ధాతునిర్షర రంజిత సానుదేశగిరి కుంజ పుంజంబులను, గృతకశ్రైలంబులను, గ్రీడాగృహంబులనుం జెలంగి నందనందనుండు విదర్భరాజనం దనం దగిలి కందర్చకేళీ లోలాత్ముండయ్యె, ననంతరం బా సుందరీలాలామంబు వలన (బద్యు మ్నుండు, చారుధేష్టుండు, చారుదేవుండు, సుధేష్లుండు, సుచారువు, చారుగుప్తుండు, భద్రచారువు, చారుభద్రుండు, విచారువు, చారువు ననియెడు పదుగురు తనయులం బడసె, నట్టు సత్యభామాజాం బవతీ నాగ్నజితీ కాళిందీ మాద్రి మిత్రవిందా భద్రలకు వేటు వేణ పదుగురేసి భద్రమూర్తులైన కుమారు లుదయించి రవ్విధంబున మణియును. 275

ణః నానావిధాలైన విచిత్రమణులతో శోభించే చాందినీలతో విలసిల్లే 'ప్రాసాదాలలోనూ, పెంపుడు

నెమిళ్లతో, కోకిలలతో, గోరువంకలతో, చిలుకలతో నిండి మకరందపానము చేసి మదించిన తుమె శ్రదల రుంకారములతో, చల్లని తెల్లని మధురజలాలతో కూడిన కమనీయ కమల సరోవరతీరాలలో, జల్రవాహాలతో ఎజ్జనైన కొండచరియల పొదరిండ్లలో, లీలాపర్వతాలలో, [క్రీడాగ్భహాలలో శ్రీ కృష్ణుడు రుక్మిణీదేవితో కలిసి మన్మథవిలాసాలలో మునిగితేలాడు.

రుక్కిణీదేవివలన శ్రీకృష్ణునకు ప్రద్యుమ్నుడు, చారుధేష్టుడు, చారుదేవుడు, సుధేష్టుడు, సుచారువు,

చారుగుప్పుడు, భద్రచారువు, చారుభద్రుడు, విచారువు, చారువు అనే పదిమంది పుత్రులు కలిగారు. సత్యభామ, జాంబవతి, నాస్ట్రజితి, కాళింది, మాద్రి, మిత్రవింద, భద్రలకు కూడా ఒక్కొక్కరికి పదిమంది అందమైన కుమారులు ఉదయించారు. చ అనఘ! పదాజువేల సతులందు జనించిరి వేలు వేణ నం దన దశకంబు తత్సుతనితానము గాంచి రనేక సూనుల న్నె నయఃగ నిట్లు పిల్లచెణ కీనిన కైవడి. బుత్రపొత్ర న ర్ధనమున నొప్పె. గృష్పుండు ముదంబున( దామరతంపరై భువిన్‌, 276

  • పదహారువేలమంది భార్యలలో ఒక్కొక్కరికి పదిమంది పుత్రులు శ్రీ, కృష్ణునికి ఉద్భవించారు. ఆ పుత్రులందరికి మళ్ళీ కుమారులు కలిగారు. ఈ విధంగా పిల్ల చెణకుకు పిలకలు పుట్టినట్టు తామరతంపరగా విలసిల్లిన పుత్రపొత్రులతో శ్రీకృష్ణుడు శోభించాడు. తే. అట్లు యదు వృష్టి భోజుంధకాది వివిధ, నామధేయాంతరముల నెన్నంగ నూట యొక్కటై చాల వర్దిల్లై న క్కులంబు, నృపకుమారులః జదివించు నేర్పు గలుగు. 277

పదవ స్కంధము - ఉత్తరభాగము 61 తే. గురుజనంబులు విను మూండు కోట్ట్లమీంద, నెనుబ దెనిమిదివేలపై నెసంగ నూర్వు రన్న దద్బాలకావలి నెన్న 6దరమె, శూలికైనను దామరచూలికైన? 278

  • క్క విధంగా యాదవ, వృష్టి భోజ, అంధక మొదలైన నూట ఒక్క పేర్లతో ఆకులం వర్రిల్లింది. ఆ రాజకుమారులకు విద్యనేర్ప్చే గురువర్యులు మూడుకోట్ట ఎనభైవేల ఒక్క వందమంది ఉన్నారంటే ఇక ఆ రాజకుమారుల వైభవం వర్షించడానికి బ్రహ్మకైనా, పరమేశ్వరుని కైనా సాధ్యమౌతుందా? వ. అందు గోవిందనందనుండైన ప్రద్యుమ్నునకు రుక్మి కూంతువలన ననిరుద్దుండు సంభవించె ననిన మునివరునకు భూవరుం డిట్లనియె. 279
  • అందులో గోవిందుని నందనుడైన (ప్రద్యుమ్నునికి రుక్మి కుమార్తివలన అనిరుద్దుడు ఉద్భవించాడు అని చెప్పగా రాజేంద్రుడు మునీంద్రునితో ఇలా అన్నాడు. -: అనిరుద్దుని వివాహ సమయమున బలరాముండు రుక్కి మొదలగు వారినిం జంపుట :- క్ష బవరమున గృప్లుచే ము, న్ననమానము నొంది రుక్మి యచ్యుతు గెలువం దివురుచు. దన సుత నరిసం, భవునకు నెట్టిచ్చె? నెలుంగం బలుకు మునీంద్రా! 280
  • ఒ శుకయోగీంద్రా! అలనాడు శ్రీకృష్ణునితో జరిగిన యుద్ధంలో రుక్మి కృష్ణునిచేత అవమానం పొంది ఏలాగైనా శ్రీకృష్ణునిపై పగదీర్చుకోవాలని చూస్తున్నాడు గదా; అటువంటివాడు తన శత్రువు కుమారుడికి తనకూతురు నిచ్చి ఎలా వివాహం చేశాడు? ఈ సంగతి నాకు తెలియజేయండి. సీ నావుడు శుకయోగి 'నరనాయకోత్తమ! నీవు చెప్పిన యట్ల నెమ్మునమున( బద్మాయతాన్షుచే. బడిన బన్నమునకు€ గనలుచు నుండియు ననుజతోడి నెయ్యంబునను భాగినేయున కిచ్చెను గూంతు నంచితపుప్ప కోమలాంగి6 దనపూన్కి దస్పినం దగ విదర్భేశుండు విను మెటింగింతు న వ్విధము దెలియ! తే. బరంగ 'రుక్మవతీ స్వయంవరమున కొగి, నరుగుదెండని భీష్మభూవరసుతుండు నరుస రప్పించె రాజన్యవర కుమార, వరుల ననువార్త కలరి యా హరిసుతుండు. 281
  • ష్పర్రీక్షిత్తు మాటలు విన్న శుకయోగీంద్రుడు ఆ మహారాజుతో ఇలా చెప్పనారంభించాడు. ఓ రాజేంద్రా! నీవు అన్నట్టుగానే రుక్మి శ్రీకృష్ణుని వలన పొందిన అవమానానికి మనసులో బాధపడుతూనే వున్నాడు. అయినా తాను చేసిన ప్రయత్నం ఫలించకపోగా ఆ విదర్భరాజు తన చెల్లెలిపైగల అభిమానంతో తన మేనల్టునికి కుసుమ కోమలియైన తన కుమార్తె నిచ్చాడు. ఆ విషయం తెలియజేస్తాను. విను. రుక్మి తన కుమార్తెలైన రుక్కవతీ స్వయంవరానికి రాజకుమారుల నందరినీ ఆహ్వానించాడు. ఆ వార్త విని ప్రద్యుమ్నుడు సంతోషించాడు. .

62 పోతన భాగవతము చ. వరనుణిభూషణ ప్రభలవర్గ మనర్గళభంగి. బర్వం (బ్ర

  • స్ఫురిత రథాధిరోహణవిభూతి దలిర్ప మునోహరైక సు స్థిరశుభలిల నేగె యదుసింహకిశోరము రాజకన్యకా పరిణయవైభవాగత నృపాలక కోటికి రుక్కివీటికిన్‌. 282
  • మహోజ్జలాలైన మణిభూషణాల కాంతులతో శోభిస్తూ రమణీయమైన రథాన్ని అధిరోహించి మనోహరమైన సౌందర్య విలాసంతో యదుకుల సింహకిశోరమైన ప్రద్యుమ్నుడు రుక్కవతిని వివాహ మాడాలనే కోరికతో మేనమామ పట్టణానికి వెళ్లాడు. అప్పటికే స్వయంవరానికి రాజకుమారులందరూ విచ్చేశారు. చు. చని పురిం జొచ్చి వృష్ణికులసత్తము. డచ్చట మూంగియున్న య మ్మనుజవరేణ్యనందనులు నూనము దూలి భయాకులాత్ములై చన(గ ననేక చండతర సాయకసంపద. జూపి రుక్మి నం దన గొనివచ్చి వేడ్క నిజధామము సొచ్చె నవార్యశార్యుండై. 283 స అలా వెళ్లి పట్టణంలో ప్రవేశించి (ప్రద్యుమ్నుడు అచ్చట చేరిన రాజకుమారులపై తీవ్రమైన బాణసమూహాన్ని ప్రయోగించి తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఆ రాకుమారులు ధైర్యం కోల్పోయి భయంతో పారిపోగా రుక్కవతిని తన నగరానికి తీసికొని వచ్చాడు ప్రద్యుమ్నుడు. వ. ఇట్లు తెచ్చి ప్రద్యుమ్నుండు హరిణనయనం బరిణయంబంది నిఖిల సుఖంబు లనుభవింపుచుండె. ననంతరంబ. 284
  • ఈ విధంగా రుక్కవతిని తన నగరానికి తెచ్చి ప్రద్యుమ్నుడు ఆ హరిణాక్షిని పరిణయమాడాడు. సకలసౌఖ్యాలను అనుభవిస్తూ ఉన్నాడు. క 'ధీరుండు కృతవర్ముని సుకు, మారుండు వరియించె రుచిరమండనయుత నం భోరుహముఖి రుక్మిసుతం, జారుమతీకన్య( బ్రకట సజ్జనమాన్యన్‌. 285
  • ధీరుడైన కృతవర్మ కుమారుడు పద్మముఖి సజ్జనసమ్మాన్యయైన చారుమతిని వివాహమాడాడు. చారుమతికూడా రుక్మి కుమార్తెయే. తే. ప్రకటచరితుండు భీష్మభూపాలసుతుండు,నునము మోదింప( దన కూర్మిమనుమరాలి రుక్కలోచన నసమాన రుక్మకాంతిం జెలిమి ననిరుద్దునకు బెండ్లి సేయు నపుడు. 286
  • సుప్రసిద్దుడైన రుక్మి బంగారు కాంతులతో శోభిస్తున్న తన మనుమరాలైన రుక్మలోచనను అనిరుద్దున కిచ్చి వివాహం చేయించాడు. క. పాలుపుగ రత్నవిభూష్ణో, జ్ఞ్యలుండయి శుభవేళ న వ్వివాహార్దము ని ర్మల బహువైభవ శోభన, కలితవిదర్భాననీశ కటకంబునకున్‌. 287

పదన స్కంధము - ఉత్తరభాగము 63 చ. వరియును రుక్మిణీసతియు నా బలభద్రుండు శంబరారియున్‌ నరిమదభఖేది సొంబుండును నాదిగ రాజకుమారకోటి సిం ధుర రథవాజి సదృటులతో. జని యందు సను[గ్రవైభనా చరిత వివాహయుక్త దివసంబులు వేడుకం బుచ్చి యంతటన్‌. 288

  • ఆ వివాహ శుభ సందర్భంలో రత్న ఖచిత భూషణాలు అలంకరించుకొని రుక్మిణీ కృష్ణులు, బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, సాంబుడు మున్నగు వారంతా విదర్భరాజధానికి వచ్చారు. వివాహం జరిగినన్ని రోజులూ అందరూ ఆనందంగా కాలం గడిపారు. క ఒకనాండు యదుకుమారకు, లకలంక సమగ్ర వైభవాటోస మహో త్సుకులై యుండంగం జూపో, పక యెకసెక్కెమున నవని పాలురు నరుసన్‌. 289
  • ఒకరోజున యాదవులంతా మహావైభవంతో ఉత్సాహపూరితులై ఉండగా కొందరు భూపాలురు అది చూచి ఓర్వలేకపోయారు. ఉ. ఎచ్చరికం గళింగధరణీశుండు రుక్మిమొగంబు సూచి నీ యొచ్చెము దీర్చికో నిదియ యొప్పుగు వేళ బలుండు జూదమం దిచ్చ గలండు, గాని పాలు పెక్కిన నేర్పరి గాండు, గాన నీ కిచ్చు నవశ్యమున్‌ జయము నీ6ంగుము తొల్లిటయిడ్డ బన్నముల్‌. 290
  • జబింగాధీశుడు రుక్క్మిని చూచి ఇలా అన్నాడు! నీ కింతకుముందు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొనడానికి ఇదే తగిన సమయం. బలరామునికి జూదంపై ఎక్కువ ఇష్టం. కాని ఆటలో నేర్పరి కాదు. అందువలన నీకే విజయం లభిస్తుంది. ఇంతకు ముందు పొందిన అవమానాన్ని ఇప్పుడు ఈ విధంగా తాలగించుకో! క అని పురికొల్పిన రుక్మియుం దన చేటు దలంపలేక తాలాంకుని తో డన జూదమాడ. దివిరెను, వనజాసను కృతము గడచు వా రెవ్వ రిలన్‌? 291
  • కలింగదేశాధీశుడు ఈ విధంగా పురికొల్పగా రుక్మి తనకు కలిగే నష్టాన్ని గమనించకుండా బలరామునితో జూదమాడడానికి సిద్దమయ్యాడు. (బ్రహ్మవ్రాత తప్పించుకోటం ఎవరికీ శక్యం కాదు. వ. అంత 2092 కు కోరి విదర్భుండు కుటిల వి, హారుండై పిలిచె జూదమాడ జితారిన్‌ | హారిన్‌ సన్నుతసూరిన్‌, సీరిన్‌ రైవతసుతాగర్ద చిత్తనిహారిన్‌. 293
  • అటుపిమ్మట రుక్మి కుటిల స్వభావంతో శత్రుసంహారకుడు, సజ్జన సేవితుడు, రేవతీ వల్లభుడూ, హలాయుధుడూ అయిన బలరాముణ్ణి జూాదమాడటానికి రమ్మని ఆహ్వానించాడు. ఆ. 'పూని మనము గొంత (ప్రొద్దువోకకు రాము!, నెత్త మాడ నీవు నేర్పు ననంగ విందు, మిపుడు గొంత వెల యొడ్డి యాడుది మనిన బలుండు లెస్స యని చెలంగె, 29

పోతన భాగవతము రక ని వినాను. ఇపుడు సమర్ష్హుడవ * నం “బలరామా! మనం కాలక్షేపానికి జూదమాడుదాం. జూదంలో నీవు సమ థ్‌ దుకు కం చాడు. ఆళ్ళ క్రి ఆ డు అ౦ పందెం పెట్టుకొని జాదమాడుదాం. సరేనా అని రుక్మి ఆహ్వానించగా బలరాము క. మదిలోని చలము డింపక, పది యిరువది నూలు వేయి పదివే లిద ప 295 న్నిద మని యొడ్డుచు నాడిరి, మదమున నిద్దణును దురభిమానము పేర్మిన్‌. నవల ప /

  • మనస్సులోని పట్టుదలలు ఏ మాత్రం సడలించుకోకుండా పది, ఇరవై, నూరు, వేయి అంటూ పందేలు పెట్టుకొని దురభిమానంతో వారిద్దరూ జూదమాడ్రారు. ఉ. ఆడిన యాటలెల్లను హలాయుదు. డోడిన రుక్మి గెల్చుడున్‌ దోడి సృపాలకోటి పరితోషము( జెందం గళింగభూనిభుం 'డోడె బలుండటంచు( (బ్రహసోక్షుల వెంతయు రాము జుల్కంగా చం వాడెను దంతపంక్తి వెల్రి మై కనుపట్టంగ( జాల నవ్వుచున్‌, రూ సే ఆడిన 'ప్రతిఆటలో బలరామ్రుడ్తు ఓడిపోయాడు. రుక్మి జయించాడు. అచ్చటి రా బలందిలూ ఆనందించేటట్లు కళింగరాజ్రు బలరాముడు ఓడిపోయ్రాడ్రన్సి ఎగతాళిచేస్తూ పండ్డు బయటపడేటట్టు ఇకిలించాడా. తే బలుండు కోపించి యొక లక్ష పణము సేస్తి యూ ప్రకటంబుగా జూద మప్పుడు గెల్ఫె, 7 గెల్చినను రుక్మి “యిది యేను గెల్చియుండ, గెలుపు నీ దన్ని కికురింప నలవి యగునె? 29 షు 0 బలరాముడ్డిక్షి క్రో వచ్చింది, అప్పుడు ఒకలక్ష పందెం క్షా బలరాముడు రుక్మిపై విజయ సాధించాడ్తు, బలరామ్సుడ్హు గెలిచినప్పటిక్తి రుక్మి ఆ గెలుపును అంగీకరింప్రక్ష విజయం నాదైతే నీదని చెబ్ప మోసగిస్తున్నావా ఆని ఎదురు తిరిగాడ్ర తే. అనప్పడ్తు హూ ం క అధరు, డచ్చట్రి జనపాలక్షస్తుత్తులం జూచ్చి సత్యము పలుక్షుం యడిగ్వ వారలు ర్చ, కుని హితులై పలుకర్రర్ర మొ గమోటమునన్‌ 2౮8 వ లా * అప్పుడు బిలరామ్సుడ్తు బ్రక్ర రు సకేమిది పక్షపాతంతో ఏమీ ఇష రన్‌ రొజుల నందరిని చూ నిజం చెప్పండని అడిగాడు. వా చ చెప్పకుండ్రా మౌన్వ వహించ్రార్చ్మ దీ. అప్పట్రి యట్ల యొడ్డి ముసలాయ్వ్సధ్ధ్యం దేప్పున నాడి జూద జొప్పడ్ర గెల్చి య్రా గెలుష్ప సూడగ వాదియ్వై ముం దప్పక చ వాని దో జనతా ప డన్న విదితధ్యన్నిః నశరీరవ్హాష్ష తా నిప్పటియ్యా రామం జయించె విల్వ ః॥ ర్భుండె మ్య నావ్ఫద్వున్‌ 299 బలరామ్సడ్హ్ర మళ్లీ మరో ఆ్క్వ ఆడి శ్రా 7 చెప్పండి” అన్సి అక్కడి జ్య తిరిగ ప్రల్నిం చాడు గెల్బాడ్డు “ఇప్పట్రి విజయం నాదా? లేక ఇతనర్యా గెల్బాడు, రుక్ష్మి డి - ఆ సమరయ్వంల్రః ఆశక్రి ము 09 క ర్‌ 44 6అరా, శ్రదీడిపోయార్స అని స్పష్టంగా త్రి ంది. వాణి “.ఈ ఆటలో బ

వ అనిన విని సకలజనంబులు నద్భుతానంద నిమగ్న మానసులైరి. కుటిల స్వభావు లయిన భూవరులు రుక్మిం గ్రైకొల్పిన నతండు తన తొల్లింటి పరాభవము దలంచి యెదిరిం దన్ను నెటుంగక బలాబల నివేకంబు సేయనేరక నిధినశానుగతుండై చలంబున బలునిం గని “యిప్పటి యాటయు నేన గెల్బియుండ వృథా జల్పకల్పనుండవయి 'గెల్బితి” నని పల్కెద, వక్షవిద్యానైపుణ్యంబు గల భూసకునూరులతో బసులకాపరు లెత్తువత్తురి యని క్రొవ్వున నవ్వుచుం బలికిన న ప్పలుకులు సెవులకు ములుకుల క్రియం దాంకినం గోపోద్దీసిత మానసుండై సెట పెటం బండ్లు గొలుకుచుం గన్నుల నిప్పు లుప్పతిల్లం గినుకం దోంకత్రొక్కిన మహోరగంబు నోజ రో(జుచు దండతాడితం బయిన పుండరీకంబు లీల హుమ్మని మైయుచు. బ్రచండ బాహుదండంబులు సాంచి పరిఘం బందుకొని సరిసంథియైన రుక్మిని నతని కనుకూలం బయిన రాజలోకంబును బడలుపడ నడిచె, న య్యవసరంబున. 300

  • ఆ మాటలు విని అక్కడి జనులంతా ఆనందించారు. కానీ దుష్టస్త్వభావులైన కొందరు రాజులు (ప్రేరేపించగా రుక్మి పూర్వం జరిగిన పరాభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని, బలాబలాలు తెలుసుకోలేక విధివశాన బలరాముని చూచి “ఈ ఆటగూడా నేనే గెల్బాను. వ్యర్థప్రలాపాలతో నేనే గెల్బానని చెప్పుకుంటున్నావు. జూదంలో ప్రావీణ్యం గల రాకుమారులతో పసులకాపరులు జూదమాడి గెలువగలరా?” అని అహంకారంతో ఆవహేళనగా నవ్వుతూ అన్నాడు, ఈ పలుకులు బలరాముని చెవులకు ములుకు లయ్యాయి. అపుడు ఆయన కోపంతో పండ్డు పట పట కొరకుతూ తోకత్రొక్కిన (త్రాచులాగా బుసలు కొడుతూ క(ర్రదెబ్బ తగిలిన పెద్దపులివలె గాండ్రించి తన బాహుదండం చాచి ఒక ఇనుప గుదియను (గ్రహించి రుక్క్మినీ, అతని పక్షంవారయిన రాజలోకాన్ని చావ చితకబాదాడు.

క. మును దంతపంక్తి వెలిగాం దను నవ్విన య క్కళింగు. దల వట్టి రయం బునం బడ(దిగిచి వదన మే, పున బెడచే వ్రేసి దంతములు వెస డులిచెన్‌. 301

  • ఇంతకుముందు తనను చూసి పండ్లికిలించి నవ్విన కలింగుణ్మి తలపట్టుకొని క్రిందపడద్రోసి ఎడమచేతితో నోటిమీద గుద్ది పండ్ట్లూడగొట్టాడు. క అంతం బోనక రుక్మిని, దంతంబులు మున్ను డులిచి తను వగలింపన్‌ అంతకుపురి కేగెను వాణ డెంతయు భయ మంది రాజు లెల్లం గలంగన్‌, 302
  • బలభద్రుడు అంతటితో ఊరుకోక రుక్కిని పట్టుకొని పండ్డు రాలగొట్టి, రాజులంతా భయపడేటట్టు వాడిని యమలోకానికి పంపించాడు. వ. అట్లుచేసి య య్యాదవసింహం బసహ్యనవిక్రమంబునం జెలంగె నంత, 303 స క విధంగా యదుసింహమైన ఆ బలరాముడు భయంకరమైన పరాక్రమంతో ప్రకాళించాడు. కు భూవర పద్మాన్షుండు దన, బాన హతుం డగుట గనియు. బలుకక యుండెన్‌ భావమును రుక్మిణీ బల, దేవుల కే నున(గ నెగ్గు దేరునొ? యనుచున్‌. 304

656 పోతన భాగవతము

  • పర్రక్షిన్మహారాజా! ఇదంతా శ్రీకృష్ణుడు చూస్తూనే ఉన్నాడు. తన బావమరది మరణాన్ని చూచి గూడా ఏ మాటంటే రుక్మిణీ, బలరాములు ఏమనుకుంటారో నని మౌనం వహించాడు. వ. అంతనా విదర్భానగరంబు నిర్గమించి. 305 క, పరమానురాగరస సం, భరితాంతఃకరణు లగుచు( బాటించి వధూ వరులను రథమం దిడి హల, ధర హరి రుక్మిణుల. గొల్చి తగ యదునీరుల్‌. 306
  • యదువీరులు విదర్భానగరం వదలి పెట్టారు. యాదవవీరులు అనురాగమయ హృదయులై వధూవరులను రథం ఎక్కించుకొని రుకి శీ బలరామకృష్ణులతో పాటు తమ రాజ్యానికి బయలుదేరారు. ఉ. మంగళతూర్యఘోషము లనుందగతిం జెలంగంగ మత్త మా తంగ తురంగ సద్భట కదంబముతో. జని కాంచి రంత నా రంగ అనంగ లుంగ విచరన్మదభృంగ సురంగనాద స త్సృంగ తరంగిణీకలిత సంతతనిర్మల నా కుశస్థలిన్‌. 307
  • మంగళవాద్య ధ్వనులు మైోగుతుండగా, చతురంగ బలాలతో బయలుదేరి వికసించిన నానావిధ వృక్షాలతో, రయుంకారం చేసే తుమ్మెదలతో, స్వచ్చమైన తరంగాలతో పొంగి ప్రవహించే నదులతో కూడిన కుశస్థలిని చేరారు. వ. ఇట్లు పురోప వనోసకంఠంబునకుం జని. 308 క. అందు వసించిరి నందిత, చందన మందార కుంద చంద్ర అసన్న్మా కందముల నీడ హృదయా, నందము సంధిల్ల నందనందనముఖ్యుల్‌. 309
  • అలా వెళ్లి చందనవృక్షాలు, మందారాలు, మంచిమామిళ్లు మొదలైన అనేక వృక్షాలతో శోభిస్తున్న ఆ పట్టణసమీపంలోని ఉద్యానవనం చేరారు. అక్కడ ఆ యాదవులు చందన మందారాది ఉద్యానవన వృక్షాల నీడలలో ఆనందంతో వి(శ్రమించారు. న. తదనంతరంబ పురప్రవేశంబు సేసి రని చెప్పి శుక యోగీంద్రుండు పరీక్షి న్నరేంద్రున కిట్లనియె.310
  • ఆ తరువాత యాదవ వీరులు పురప్రవేశం చేశారని చెప్పి శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు. -: బాణాసురుం డీశ్వర ప్రసాదంబు నొందుట :- తే. అనఘ! బలినందనులు నూర్వు రందులోన, న(గ్రజాతుండు బాణు( డత్యు[గ్రమూర్తి చిర యళోహారి విహితపూజిత పురారి, యహిత తిమిరోష్ణకరుండు సహస్రకరుండు. 311
  • అనఘా! బలిచక్రవర్తికి నూర్లురు కుమారులు. వారిలో పెద్దవాడు బాణుడు. అతడు కీర్రిమంతుడు. శత్రు భయంకరుడు. అతనికి వేయి చేతులు. శివపూజాధురంధరుడు.

పదవ స్కంధము - ఉత్తరభాగము 67 క బాణు(డు విక్రమజిత గీ, ర్యాణుండు సని కాంచె భక్తివశుండై నగణ స్టాణున్‌ నిర్దళితా సను, బాణుం దాండవధురీణు భక్త త్రాణున్‌. 312

  • త్రన పరాక్రమంతో దేవతల నోడించిన బాణాసురుడు భక్తి భావంతో భక్తవశంకరుడు, నటరాజు, కామారి యగు పరమేశ్వరుని చెంతకు వెళ్లి ఆ దేవదేవుని దర్శించాడు. క. కని యనురాగ వికొసము, దన మనమున గడలుకొనంగ ధర జాంగిళలి వం దన మాచరించి మోదను, దనరంగం దాండవము నలుపు తటి న య్యభవున్‌. 313 న్య పరమేశ్వరుని గాంచి అధికమైన భక్తి భావంతో శంకరుడు నాట్యం చేసే సమయంలో సాష్టాంగ నమస్కారం గావించాడు. ఉ. సంచిత భూరిబాహుబలసంపద సపెంపున నారజంబు నా యించి యనేకభంగుల సుమేశు. ద్రిలోకళశరణ్యు నాత్మ మె చ్చించి ప్రమోదియై నిజవశీకృత నిశ్చలితాంతరంగు. గా వించి తదాననాంబురుహ వీక్షణుండై తగ (మొక్కి యిట్లనున్‌. 3ెక్షత్త
  • త్రన బాహుబలంకొద్దీ డమరుకం వాయించి ఆ త్రిలోక శరణ్యుడైన పరమేశ్వరుని మెప్పించి ఆనందపరవశుడైన ఆ దేవుని ముఖపద్మం వైపు దృష్టి బరపి ఇలా స్తుతించాడు. ఉ. శంకర ! భక్త్రమానసవశంకర! దుష్టమదాసురేంద్ర నా శంకర! పొండునీలరుచి శంకరవర్ల నిజాంగ! భోగి రా ట్కంకణ! పార్వతీహృదయ కైరవ కైరనమి(త్ర! యోగి హృ తృంకణజ పంకజాప్త! నిజతాండవఖేలన! భక్త పాలనా! 315
  • శంకరా! భక్తవశంకరా! నీవు మదోన్మత్తులైన రాక్షసులను నశింపజేయగల వాడవు. ధవళాంగుడవు. సర్ప్వభూషణుడవు, పార్వతీ 'ప్రాణవల్లభుడవు, యోగిజనుల హృదయ పంకజాలకు సూర్యునివంటి వాడవు. తాండవప్రియుడవు, భక్తపరిపాలకుడవు. వ. అని వినుతించి. 316 ఉ. దేవ! మదీయ వాంఛితము తేటపడ న్నిటు విన్నవించెదన్‌ నీవును నద్రినందనయు నెమ్మిని నా పురి కోటవాకిటం గావలియుండి నన్ను గృపం గావుము భక్తఫల ప్రదాత! యో భావభవారి! నీ చరణపద్మము లెప్పుడు నాశ్రయించెదన్‌, 317
  • లని స్తుతించి ఇంకా ఇలా అన్నాడు. ఓ దేవా! నా కోరిక విన్నవిస్తాను. విను. నీవు పార్వతీసహితంగా నాకోట వాకిటికి రక్షకుడవై యుండి నన్ను రక్షించు. మదనాంతకా! నా మనోవాంఛ ఇదే. నీ పాద పద్మాల నాశశ్రయించిన నన్ను దయజాడు.

68 పోతన భాగవతము శ తక వ. అని యభ్యర్థించినం బ్రసన్నుం డై భక్తవత్సలుం డగు పురాంతకుండు గౌరీసమేతుండై తారకాంతం గజాననాది భూతగణంబులతో బాణనివాసం బగు శోణపురంబు వాకిటం గా పుండెల బదంవే 8 యొక్కనా డబ్బలినందనుండు. తే

  • బాణాసురుడు ఇలా ప్రార్థించగా ఉక్తవత్సలుడైన పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై బాణుని పట్టణమైన శోణపురం చేరాడు. భూతగణాలతో వేంచేసి శంకరుడు కోటద్యారం చెంత కాపలా వున్నాడు. తే. దర్పమున( బొంగి రుచిర మార్తాండ దీప, మండలముతోడ మార్చడు నుహితశోణ నుణికిరీటము త్రిపుర సంహరుని పాద, వనజములు సోంక మొక్కి యిట్లని నుతించె. 319 సే ళకనాడ్లు బాణాసురుడు అహంకారంతో భుజాలు పొంగగా సూర్యకాంతిని ధిక్కరించే మణికిరీటం (త్రిపురసంహరుడైన హరుని పాదపద్మాలకు సోకేటట్టు నమస్కరించి ఇలా స్తుతించాడు. సీ “దేవ! జగన్నాథ! దేనేంద్రవందిత! నితతచారిత్ర! సంతత పని! హాలాహాలాహార! యహిరాజకేయూర! బాలేందుభూష! సదృ్భక్తపోష।! సర్వలోకాతీత! సద్గుణసంఘాత! పార్వతీహృదయేశ ! భవవినాశ! రజతాచలస్లాన! గజచర్మపరిధాన! సురవైరివిధ్వస్త! శూలహన్హ। తే. లోకవాయక్ష! సద్భక్తలోకవరద!, సురుచిరాక్రార! మునిజనస్తుతవిహార! భక్త జనమందిరాంగణ పారిజాత, నిన్ను నెవ్వడు నుతిసేయ నేర్చు నభవ! 3260 నే ఓ దేవా! నీ జగన్నాథుడవు. దేవేంద్ర వందితుడవు. పరిశుద్ద చరిత్రుడవు. పరమపవిత్రుడవు. హాలాష న పంట భక్షకుడవు. నాగభూషలుడవు, చంద్రశేఖరుడవు, భక్త సంరక్షకుడవు. సర్వలోకేశ్వరుడవు. పతివి. కైలాసవాన్స ఆప్‌ తిలాసవాసివి. గజచర్మధారివి, రాక్షసాంతకుడవు. డ్రిశూల ధారివి. భక్తజనుల ముంగిటిలోని జాతానివి, అట్టి నిన్నెవ్వరు స్తుతింపగలరు? న్‌ అనిష్ప అల స్తుతియించి, 321 మ్‌, అనిలో నన్ను వెదిర్చి బాహుబలశౌర్యస్పూర్తిం బోరాడం జా లిన వీరుం డొకండైన బందెమునక్తున్‌ లేండయె వన $ భూమండలి ఇనయంబున్‌ భవదగ్రదత్తకరసాహ్ఞస్టంబ్ప కండూతి వా యు నుపాయంబున్సు లేద శ ఇలా స్తతర్టై యూ భరము నెట్టోర్లు న్నుమానాయక్షా! 322 తెంచి బాణుడు ఈ విధంగా ఆ డు, ప చాహుబలాన్ని ప్రదర్శింపడాలిన వీరాధి వీరుడ్లాక్షకా శ భూ పతి! పంల న్నాదిరించి తన నా వేయ్చిచేత్రల్ట రణకండూత్రి కలిగి వున్నాయి ఈ క్ష ఎండలంలో కన్పించడం లేదు, నీవు ప్రసాదించిన స్స హుంకార కంక్ష్రబ్ర 'క్రేంకార 2 నీ ండూత్తిన ఎలా తీర్చుక్రోవాల్రి? రజిని ట్రంక్షార న్లిరర్నం చండ దోర్దండ్ర భాస్వన్మండలా[॥ ల ఇఖరికులం్బ ఈ ప్రకాండ ఖిండిత్ర రాజమంగలంబ్ప

పదవ స్కంధము - ఉత్తరభాగము 6కి శూలాహత క్షతోద్వేల కీలాల కల్లోలకేళీ సమాలోకనంబు శుంభ దున్మద కుంభి కుంభస్టలధ్వంస సంభూత శౌర్య విజ్బృంభణంబు తే. గలుగు నుద్దామ భీమ సంగ్రామ కేళి, ఘన పరాక్రమ విక్రమక్రమము గాంగ జరపలేనట్టి కరములు కరము దుఃఖ, కరము లగుంగాక సంతోషకరము లగునె? 323

  • దిక్కులు దద్దరిల్లే హుంకారాలతో ధనుష్టంకారాలతో నిండినదీ, చండ ప్రచండ బాహుదండాలతో (ప్రకాశించే ఖడ్డాలతో ఖండింపబడిన శత్రురాజుల శిరస్సులతో గూడినదీ, శూలపు పోట్టకు శరీరాలనుండి జలజల ప్రవహించే రక్తధారలతో భయంకరమైనదీ, మదించిన ఏనుగుల కుంభస్టలాలను బద్దలుకొట్టే వ్‌ లు వీరవిబ్బంభణం కలదీ ఐన భీకర యుద్ధరంగంలో పరాక్రమాన్ని ప్రదర్శించలేనట్టి వట్టి చేతులవలన ఉపయోగ శుముంది? ఆ కరాలు నావంటి వీరులకు దుఃఖకరాలే గాని సంతోష కరాలు కాదు గదా స్వామీ? జ. కాన మదీయ చండభుజగర్వ పరాక్రమ కేళికిన్‌ సముం డీ నిఖిలాననిం గలండె యిందుకళాధర! నీవు దక్కనా; నా నిటలాంబకుండు దనుజాధిపు మాటకు. జాల రోసి లో నూనిన రోషవార్డి గడ లొత్తంగ నిట్లని పల్కె భూవరా! 324
  • ర్మ చంద్రధరా! నా ప్రచండ బాహుదండాల పరాక్రమకేళిని ఎదిరించగల వీరుడు ఈ విశాల ప్రపంచంలో నీవు తప్ప మరెవ్వరూ లేరు." ఇలా పలుకుతున్న బాణుని ప్రగల్భాలకు ఫాలనేత్రుడు అసహ్వించుకొని రోషం పొంగిపొరలగా ఆ దోషాచరునితో ఇలా అన్నాడు. క “విను మూధఢహృదయ! నీ క్షే తన మెప్పు డకారణంబ ధారుణిపైం గూ లును నపుడు నీ భుజావలి, దునియంగ నా యంతవానితో నని గల్లున్‌. 325
  • క మూఢహృదయా! శ్రాందరపడకు, నీ కేతనం అకారణంగా ఎప్పుడు భూమిపై కూలిపోతుందో అప్పుడు నాయంత వానితో నీకు యుద్ధం జరుగుతుంది. నీ భుజాలతీట తీరుతుంది. న. అని సలికిన నట్టు సం(్రొప్త మనోరథుండై నిజభుజవినాళ కార్య ధురీణుండగు బాణుండు సంతుష్టాం తరంగుం డగుచు నిజనివాసంబునకుం జని, తన ప్రాణవల్లభల యుల్లంబులు పల్లవింప( జేయుచు నిజధ్వజ నిపొతంబు నిరీక్షించుచుండె, తదనంతరంబ. 326
  • ప్పర్రమేశ్వరుని పలుకులు విని బాణాసురుడు తన కోరిక తీరబోతున్నందుకు చాలా సంతోషించి తన సౌధానికి వెళ్లిపోయాడు. తన ప్రియురాం(డ్రతో కూడి అనందడోలికలలో తూగుతూ “ఎప్పుడు తన ౮ రథకేతనం నేల కూలుతుందా!" అని ఎదురు చూస్తున్నాడు. ఫీ ఆ దొనవేశ్వరు ననుంగు( గుమారి యుషాకన్య నిమల సొజన్యధన్య రూపవిభ్రను కళారుచిర కోమలదేహ యతను నాణవబాణ మన(గం బరంగు

70 పోతన భాగవతము సుందరీరత్నంబు నిందునిభానన యలినీల వేణి పద్మాయతాక్షి యొకనాండు రుచిరసాధోపరి వేదికా స్థలమున నృదుశయ్య నెలమిం గూర్కి తే. మున్ను దన దౌల నెన్నండు విన్న యతడు గన్నులారంగం దా బొడగన్న యతండు( గాని యసమాన రూపరేఖావిలాస, కలితు ననిరుద్దు నర్మిలి గవిసినటులు, 327

  • దానవేశ్చరుడైన బాణాసురునికి ఒక ముద్దుల కూతురు ఉంది. ఆమె పేరు ఉషాకన్య. ఆమె సౌందర్యవతి. సద్గుణవతి,. చంద్రముఖి. నీలవేణి. పద నేత. మన్మథుని ఆరవబాణం. ఇటువంటి ఉషాబాల ఒకనాడు తన సౌధంలో మెత్తని పాన్సుపై నిద్రిస్తున్నది. అసమాన సౌందర్యవంతుడైన అనిరుద్దునితో సుఖించునట్లు ఆమెకు ఒక కల వచ్చింది. ఆ సుందరాంగుని ఉష ఇంతకుముందు వినలేదు. కనలేదు. చ. కల గని యంత మేలుకని కన్నుల బాప్పకణంబు లొల్కగా6 గలవలె గాక నిశ్చయముగా6 గమనీయ విలాస విభ్రమా కలిత తదీయరూపము ముఖంబున వ్రేలిన యట్ల దోంచినం గళవళ నుందుచున్‌ బిగియం గౌంగిటిచే బయ లప్పళించుచున్‌ 328 ఖా గన్న ఉషా కన్య మేలుకొన్నది. ఆమె కన్నుల వెంట బాప్పకణాలు జాలువారుతున్నాయి. అది కల కాక వాస్తవ మేమో అనే (భ్రాంతి కలిగింది. ఆ సౌందర్యవంతుని అందమైన ఆకారం కన్నులయెదుట కన్పిస్తున్నట్లే వుంది. ఉషాబాల కళవళ పడింది. వట్టి బయలును కౌగిలించుకుంటున్నది. వ. మణీయును. 329 చ. సరసమృదూక్తులుం గసుమసాయక కేళియు శాటికా కచా కరషణముల్‌ నఖిక్రియలు( గమకపోల లలాట మేఖలా కర కుచ బాహుమూలములు. గైకొని యుండుట లాదిగా. దలో దరి మది గాఢమై తగిలె దర్శకుం డచ్చున నొత్తినట్లయై. 330
  • మరియు సరససంభాషణలూ, మన్మథలీలలూ, వ'స్త్రకచాకర్షణలూ, కపోల లలాట బాహుమూల కుచాదులపై గోటి గుర్తులూ, అన్నీ ఆమె మనస్సులో గాఢముద్ర వేశాయి. ఆ యువకుడు అచ్చంగా పచ్చవిల్తునిలాగా ఆమెను (గ్రుచ్చి కౌగిలించినట్లే ఆమెకు అనిపించింది. సీ. కలికిచేష్టలు భావగర్భంబు లైనను బ్రియుమీ(ది కూరిమి బయలుపణుపం బిదపిదనై లజ్జ ముది. బద నిచ్చినం జెలి మేన బులకలు చెక్కు లొత్త నుదనాగ్ని నంతప్తమానస యగుటకు గురుకుచహారవల్లరులు గంద జిత్తంబు నాయకాయత్తమై యుంటకు మజుమాట లాడంగ మఅపు గదుర తే. నతిన మనమున సిగ్గు మోహంబు భయము బొడమ నునుమంచు నెత్తమ్మిం బొదుపు మాడ్కి! (బ్రథమచింతాభరంబున(. బద్మనయన, కోరి తలచీర వాటింప నేరదయ్యె. 331

పదవ స్కంధము - ఉత్తరభాగము గ్గ

  • ఉఉష్రాబాలచేష్టలు ఎంత భావగర్భితాలైనా ప్రియునిపై ప్రేమ వ్యక్తమౌతూనే వుంది, మనస్సులోపల లజ్జ పొడముతున్నా శరీరంపైన పులకాంకురాలు మొలకలెత్తాయి. మదనాన్నికి ఆమె హృదయం తపించి నందుకు గుర్తుగా వక్షస్ట్రలంపై నున్న హారాలు కందిపోయాయి. హృదయం నాయకాధీనమై పోయిందనటానికి సూచనగా నెచ్చెలులతో బదులుపల్కడం మరచిపోయింది. ఆ ఉషాకన్య హృదయంలో మోహం, సిగ్గు, భయం ఉద్భవించాయి. అందువల్ల ఆమె మంచు [క్రమ్మిన పద్మంలాగా శోభించింది. ప్రియుని గూర్చిన శృంగారచేష్టలలో మొదటి దైన చింతతో ఆ బాల మేలి ముసుగుకూడా ధరించలేదు. వ. ఇట్లు విరహవేదనా దూయనూన మానసయై యుండె, నంత నెచ్చెలులు డాయం జనుదెంచినం దన మనంబునం బొడము మనోజవికారంబు మలు వెట్టుచు నప్పుడు. 332
  • బలా ఉషాబాల విరహవేదనతో బాధపడుతున్నది. చెలికత్తెలు ఆమె చెంతకు రాగా తన మనోవికారాన్ని వాళ్ళకు తెలియకుండా మరుగు పరచింది. చ. పారింబొరిం బుచ్చు నూర్పుగమిం బుక్కిటనుంచి కుచాగ్రసీమపై బెరసిన సన్న లే/(జైమట బిందువు లొయ్యన నార్భు౯ గన్నులం దొరంగెడు బాప్పపూరములు దొంగలిజెప్పల నాని చుక్కలం దరుణులు రండు చూత మని తా మొగ మెత్తును గూఢరాగయై. 333
  • నిట్టూర్పులను అణచుకున్నది. వక్షోజాలపై పొడసూపిన చిరుచెమటను తుడిచివేసింది. నేత్రాల నుండి జారనున్న కన్నీటిని రెప్పల నిమిడించి నక్షత్రాలను చూద్దాం రండని స్నేహితురాండ్రను పిలిచి ఆ వంకతో ముఖం పైకెత్తింది. ఇలా తన అనురాగం బయలుపడకుండా దొచుకున్నది. న. ఇ వ్విధంబునం జరియించుచుండె నట్టియెడ. 334 తే. అంతకంతకు సంతాప మతిశయించి, వలు(ద చన్నులు గన్నీటి వజద౯ దడియ6 జెలులదెసం జూడ జాల లజ్జించి మొగము, వాంచి పలుకక యుండెన వ్వనరుహాక్షి, 335
  • క్క విధంగా ఉషాకన్య సంచరిస్తున్నది. అంతకంతకూ సంతాపం అధికమై వక్షోజాలపై కన్నీరు కాల్వలు కట్టగా చెలికత్తెల వైపు కన్నెత్తి చూడటానికి సిగ్గుపడి ముఖం వంచుకొని మౌనం వహించింది. వ. అంత. 336 తే. బలితనూభవుమంత్రి కుంభాండుతనయ, తన బహిఃప్రాణ మిది యన దనరునట్టి కామినీనుణి ముఖపద్మకాంతి విజిత, శిశిరకర చారు రుచిరేఖ చిత్రరేఖ. 337 వ. కదియవచ్చి య బ్బాల నుపలక్షించి. 338
  • అప్పుడు చంద్రరేఖను మించిన సొందర్యవతియైన చిత్రరేఖ ఇదంతా గమనించింది. ఆమె ఉషాకన్యకు బహిః[ప్రాణం. ఈ చంద్రరేఖ బాణాసురుని మంత్రియైన కుంభాండకుని కుమార్తె. చం(ద్రరేఖవంటి చిత్రరేఖ ఉషాబాల దగ్గరకు వచ్చింది. ఆమెను పరికించి చూచి ఇలా అన్నది.

72 పోతన భాగవతము తే. భామినీమణి సాబగుని బయల వెదకు, విధమునను నాత్మవిభు. బాసి విహ్వలించు వగను జేతికి లోనైనవానిం బాసి, భ్రాంతి. బొందిన భావంబు ప్రకట నుయ్యె. 339

  • ఓ సీ! నీ ప్రవర్తన చూస్తుంటే ప్రియుని వెదకుతున్న ధోరణీ, ప్రాణేశ్వరునికి దూరమై బాధ చెందుతున్న రీతీ, చేతికి చిక్కిన వానిని కోల్పోయి భ్రాంతితో మునిగిన పద్దతీ ప్రకట మవుతున్నాయి. తే. వనిత నాకన్న నెనరైనవారు నీకు. గలుగ నేర్తురె! నీ కోర్కి. దెలియ జెప్ప కున్న మీ యన్నతో డన్న గన్నుంగవను, నలరు నునుసిగ్గుతో నగ వామతింప. 3డ0 వ. ఇ వ్విధంబున జిత్రరీఖం గనుంగొని యిట్లనియె. తక్షక
  • నెచ్చెలీ! నా కన్నా నీకు దగ్గరవా రింకెవరైనా ఉన్నారా? నాకు నీ మనసు తెలియజేయకపోతే ఒట్టు' అని చిత్రరీఖ పలుకగా ఉషాసుందరి కళ్లలో సిగ్గు దోబూచు లాడింది! అప్పుడు ఉష చిత్రరేఖతో ఇలా పలికింది. చ. “చెలి కలలోన నొక్క సరపీరుహనేత్రుండు రత్నహార కుం డల కటకాంగుళలీయక రణ న్మణినూపురభూషణుండు ని ర్మల కనకాంబరుండు సుకుమారతనుండు వినీలదేహు. డు జ్ఞలరుచి నూతనప్రసవసాయకు. డున్నతవక్షు. డెంతయున్‌, 3డ్ష2
  • సళ్ళ! నా కొక కల వచ్చింది. ఆ కలలో హారకేయూరాది వివిధాలంకార కోభితుడూ, పద్మనేత్రుడూ, కనకాంబరధారీ, సుకుమార శరీరుడూ, నీలవర్షుడూ, ఉన్నతవక్షుడూ, అభినవ మన్మథుడూ అయిన ఒక నవయౌవనుడు కన్పించాడు. చ. నను బిగియార. గౌంగిట మనం బలరారంగ6 జేర్చి మోదముం దనుకంగ నంచితాధర సుధారస మిచ్చి మనోజ కేళికిం బనుపడ€ జేసి మంజునృుదుభాషలం దేలిచి యంతలోననే చనియెను దుఃఖవార్థి. బెలుచన్‌ నను( ద్రోచి సరోరుహాననా! 343
  • చైల్రీ! ఆ వన్నెకాడు నన్ను గాఢంగా కౌగిలించుకున్నాడు. అధరామృతం అందించాడు. మృదువుగా సంభాషించాడు. మన్మథ విలాసంలో ముంచి తేల్చి ఆనందం కలిగించి అంతలోనే నన్ను దుఃఖసాగరంలో ముంచి మాయ మయ్యాడు. వ. అనుచు న మ్మత్తక్షాశిని చిత్తంబు చిత్తజాయత్తం బయి తత్తరంబున విరహానలం బుత్తలపెట్ట+ గన్నీరు మున్నీరుగా నగచుచు విన్ననయిన వనదనారనిందంబు వాంచి యూరకున్నః జిత్రరేఖ దన మనంబున నయ్యింతి సంతాపంబు చింతించి యిట్లనియె. పెడ్తశ్త

పదవ స్కంధము - ఉత్తరభాగము 73

  • జలా చెప్పి ఉషాసుందరి తన మనస్సు మన్మథవేదనకు లోనై విరహానలం అధికం కాగా కన్నీరు

మున్నీరుగా విలపిస్తూ తలవంచుకొని ఊరకున్నది. చిత్రరేఖ ఉషాకుమారి సంతాపాన్ని గ్రహించి ఇలాపలికింది.

చ. 'సరసిజనేత్ర! యేటికి విచారము? నా కుశలత్వ మేర్చడన్‌ నర సుర యక్ష కింపురుష నాగ నభళశ్ళర సిద్ద సాధ్య కి న్నరవర ముఖ్యులం బటమునన్‌ లిఖియించినం జూచి నీ మనో హరు గని 'నీడె పో మ్మనిన నప్పుడె వానిని నీకు. దెచ్చెదన్‌. 3డ్త5్‌

  • ఓ పద్మాక్షీ! ఎందుకు నీవు విచారిస్తావు? నా నేర్చరితనంతో దేవ మానవ యక్ష కిన్నర సిద్ధ సాధ్య

(శ్రేష్టుల చిత్రపటాలను వ్రాసి నీకు చూపిస్తాను. అందులో నీ మనోహరు డెవరో నీవు గుర్తిస్తే ఆ క్షణంలోనే వానిని నీ చెంతకు తీసికొని వస్తాను.

వ. అని యొడంబజీచి మిలమిలని మంచుతోడం బురుడించు ధళ ధళ మను మెజుంగులు దుణం గలిగొను పటంబు నావటంబుసేసి, వనజంబున మేదించి, పంచనన్నియలు వేలు వనేణ కనక రజత పాత్రంబుల నించి కేలం దూలిక ధరించి యొక్క విజన స్టలంబునకుం జని ముల్గోకంబులం బేరు గలిగి నయో రూప సంపన్ను లయిన పురుష ముఖ్యుల నన్వయ గోత్రనామధేయంబులతోడ వ్రాసి, యాయితంబయిన య ప్పటంబు దన ముందటః దెచ్చి పెట్టి య స్పటంబునం దగులని వారు లేరు, వారిం జెప్పెద, సావధానంబుగ నాకర్లింపు" మని యిట్లనియె. 346

  • జ విధంగా చిత్రరేఖ ఉషాకన్యను సమ్మతింపజేసింది. మంచువలె కాంతిమంతమైన పటాన్ని

సొందుపరచింది. ఐదురంగులను బంగారు వెండి పాత్రలలో నింపుకొన్నది. కుంచెను చేతదాల్చి యేకాంత ప్రదేశానికి వెళ్లి ముల్లోకాలలో ప్రసిద్ధిగాంచిన సౌందర్యవంతుల చిత్రాలను వారి వారి గోత్రనామాలతో పాటు సిద్ధంచేసింది. ఆ పటాన్ని ఉషాకన్య చెంతకు తెచ్చి చూపించి ఈ చిత్రపటంలో లేనివాడు ఈ లోకంలో లేడు, వీరినిగూర్చి వివరిస్తాను విను”అని చిత్రరేఖ చెప్ప నారంభించింది.

ఫీ కమనీయ సంగీత కలిత కోవిదులు కింపురుష గంధర్వ కిన్నరులు వీరె సతత యౌవన యదృచ్చావిహారులు సిద్ద సాధ్య చారణ నభశ్చరులు వీరె ప్రవిమల సాంఖ్య సంపద్వైభవులు సుధాశనమరుద్యక్ష రాక్షసులు వీరె నిరుపను రుచికళాన్విత కామరూపులై పాగడొందునట్టి పన్నగులు వీరె

తే. చూడు'మని నేర్పు. దీపింపం జూపుటయును, జిత్తము నిజమనోరథసిద్ది వడయ' జాలకుండిన మధ్యమ క్షాతలాధి, పతుల6 జూపుచు వచ్చె నప్పద్మనయన. 37

  • కల్యాణీ! వీరు కమనీయ గానవిద్యా విశారదులైన గంధర్వకిన్నర కింపురుషులు. వీరు నిత్య

యౌవనులూ, స్వేచ్చా విహారులూ అయిన సిద్ధసాధ్య చారణులు. ఇరుగో వీరు అమితమైన సౌఖ్యాలలో తేలియాడే అమరులు, యక్షులు, రాక్షసులు. వీరు కామరూపులై గణుతిగాంచిన కళానిధులు, నాగకుమారులు.

ర్త పోతన భాగవతము వీరిని చూడు! నీ ప్రియుని గుర్తించు" అని చిత్రరేఖ చెప్పగా ఉషాకన్యకు వారిలో ఆమె ప్రియుడు కన్పించలేదు. అప్పుడు చిత్రరేఖ భూలోకవాసులైన రాజకుమారులను చూపించ నారంభించింది. ఉ. మాళవ కొంకణ ద్రవిడ మత్స్య పుళింద కళింగ భోజ నే పాళ విదేహ పాండ్య కురు బర్భర సింధు యుగంధ రాంధ్ర బం గాళ కరూశ టేంకణ త్రిగర్వ సుధేష్ణ మరాట లాట పాం చాల నిషాద ఘూర్ణరక సాళ్వ మహీశులు వీరె కోమలీ! 3డ8ి

  • ఒ కోమలీ! ఇరుగో వీరిని చూడు. మాళవ, కొంకణ, (ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బ్చర, సింధు, ఆం(ధ్ర, బంగాళ, కరూశు టేంకణ, (త్రిగర్త సుధేష్ట మరాట, లాట, పాంచాల, నిషాద, ఘూర్జర, సాళ్ళదేశాధీశ్యరులు వీరు. ఉ. సింధురవైరి విక్రముండు శీతమాయూఖ మరాళికా పయ స్సింధు పటీర నిర్మలవిశేష యశోవిభవుండు శౌర్య ద ర్వాంధ రిపుక్షితీశ నికరాంధతనుః పుటలార్కు. డీ జరా పంధునిం జూడు మాగధుని సద్పహదశ్వసుతుం గృశోదరిీ! 349
  • ఇదుగో! ఇతడు బృహదళశ్వుని పుత్రుడు, మగధరాజైన జరాసంధుడు. ఈ జరాసంధుడు సింహపరా(క్రముడు. నిర్మల క్షీర్తిమంతుడు. శత్రుభయంకరుడు. మ. సకలోర్వితలనాథ సన్నుతుండు శశ్వద్భూరి బాహాబలా ధికుం డుగ్రాహవకోవిదుండు త్రిజగద్విఖ్యాత చారిత్రకుం డకలం కోజ్జ్వల దిన్యభూషుండు విదర్భాధీశ్వరుండైన భీ ష్మక భూపాలకుమారు. జూడు మితనిన్‌ మత్తద్విరేఫాలకా! 350
  • ఒ నీలవేణీ! ఇతడు భీష్మక మహారాజు కుమారుడు రుక్మి. ఈ విదర్భరాజు సమస్త రాజలోక సన్నుతుడు. భుజబల సంపన్నుడు. రణకోవిదుడు. ప్రఖ్యాత చరిత్రుడు. దివ్యాలంకార భూషితుడు. ఉ. సంగరరంగ నిర్హలిత చండవిరోధి వరూధినీశ మా తుంగ తురంగ సద్భట రథప్రకరైక భుజావిజంభణా భంగ పరాక్రమ ప్రకట భవ్యయశోమహనీయమూర్తి కా లింగుండు వీండె చూడు తరళీకృత చారుకురంగలోచనా! 3511
  • క్సురంగ లోచనా! ఇడుగో ఇతడు కళింగ భూపాలుడు. సంగర రంగంలో శత్రువులను చించి చెండాడేవాడు. వైరి సేనాపతుల చతురంగబలాలను తన అవ(క్ర పరాక్రమంతో పరాజితులను గావించి అఖండ మైన కీర్తిగాంచిన వీరాధి వీరుడు.

పదవ స్కంధము - ఉత్తరభాగము ౯75 మ. సుగుణాంభోనిధి ఫాలలోచను నుమేశు న్నాత్మ మెప్పించి శ క్తి గరిష్టంబగు శూలముం బడసె నక్షీణప్రతాపోన్నతిన్‌ జగతిన్‌ మిక్కిలి మేటివీరుండు రణోత్సాహుండు భూపౌత్రుం డీ భగదత్తుం గనుంగొంటె! పంకజముఖీ! ప్రాగ్యోతిషాధీశ్వరున్‌. 352

  • ఓ పద్మముఖీ! ఈతడు ప్రాగ్బ్యోతిషాధీశ్చరుడు. భగదత్తుడు. ఫాలలోచనుడైన పరమేశ్వరుణ్ణై మెప్పించి శక్తిమంతమైన శూలాన్ని ఆయుధంగా పొందాడు. యుద్దోత్సాహం గల సాటిలేని మేటి వీరుడు. మ. వికచాంభోరుహ పత్రనేత్రు. డగు గోవిందుండు దాం బూను నం దక చక్రాబ్ద గదాదిచిహ్నములచేతన్‌ వాసుదేవాఖ్య ను త్సుకుండై యెప్పుడు మచ్చరించు మది గృష్లుం డన్న నేమేటి పొం డ్రకు గాశీశసభుం గనుంగొనుము వేడ్కం జంద్రబింబాననా! 353
  • ఓ చంద్రముఖి! ఇతడు పౌం(డ్రకుడు. పద్మాక్షుడైన గోవిందుడు ధరించే నందక మనే ఖడ్గమూ, సుదర్శనమనే చక్రమూ, పాంచజన్యమనే శంఖమూ, కౌమోదకి అనే గదా మొదలైన వానిని ధరించి వాసు దేవుడనే పేరు పెట్టుకొని శ్రీకృష్ణునిపై మాత్సర్యం పెంపొందించుకున్నాడు. కాళీ రాజుకు ఆప్తమిత్రుడు. ము. ద్విజశుశ్రూషయు సూన్ఫతవ్రతము నుద్వృత్తిన్‌ భుజాగర్వమున్‌ విజయాటోపము. జాస నైపుణియు ధథీవిస్పూర్తియుం గల్లు నీ రజనీనాథకుల ప్రదీపకుల( బాజుం జూడు పద్మాక్షి! ధ ర్మజ భీమార్జున మాద్రినందనుల సంగ్రామైకపారీణులన్‌. 354
  • సృక్ట! చంద్రవంశ ్రదీపకులైన పంచపాండవులు వీరు. ఇతడు ధర్మరాజు, ఇతడు భీముడు, ఇతడు అర్జునుడు, వీరిద్దరు నకుల సహదేవులు. ఈ పాండవులు (బ్రాహ్మాణ భక్తిపరులు. సత్యవ్రతులు భుజబల సంపన్నులు. విజయశీలురు. బుద్ధిమంతులు, యుద్ధరంగంలో ఆరి తేరిన వీరశిరోమణులు. మ. బలిమిన్‌ సర్వనృపాలుర న్నదిమి కప్పంబుల్‌ దగం గొంచు ను జ్వల తేజో విభవాతిలేకమున భాస్వత్కీర్తి శోభిల్ల(గా( బొలుపొందం దను రాజరా జన మహాభూరి ప్రతాసంబులుం గల దుర్యోధను. జూడు సోదరయుతుం గంజాతప శ్రేక్షణా! 355
  • క్రన్సులాక్షీ! ఇతడు సోదర సమేతుడైన సుయోధనుడు. గొప్ప పరాక్రమవంతుడు. తేజోనిధి. రారాజను ప్రశస్తి గాంచినవాడు. తన మహాశౌర్యంతో సమస్తరాజుల నోడించి వారిచే కప్పములను గైకొనుచున్నాడు. అఖండ కీర్తి మంతుడు. వ. అని యిట్లు సకలదేశాధీశ్వరులగు రాజనరుల నెల్లం జూపుచు యదువంశ సంభవులైన శూరసేన వసుదేవోద్దవాదులం జూపి మణీయును. 356

గగ పోతన భాగవతము

  • ఈ విధంగా చిత్రరేఖ సమస్త రాజులను ఉషాకన్యకు చూపిస్తూ యాదవ వంశస్టులైన శూరసేనుడు, వసుదేవుడు, ఉద్ధవుడు మొదలైన వారినికూడా చూపించింది. ఉ. శారద నీరదాబ్ద్బ ఘనసార సుధాకర కాశ చంద్రికా సార పటీరవర్లు యదుసత్తము నుత్తమనాయకుం బ్రమ త్తారి నృపాల కానన హూతాశనమూర్తి. బ్రలంబదైత్య సం హారుని. గామపాలుని హలాయుధు( జూడును దైత్యనందనా! 357
  • 2 దనుజేంద్రనందనా! శరత్కాల మేఘం, శంఖం, ఘనసారం, చంద్రుడు, చందనంవంటి వర్షంతో శోభిస్తున్న ఈ వీరుడు బలరాముడు. ఇతడు ఉత్తమ నాయకుడు. ప్రమత్తులైన శత్రురాజులు అనే అరణ్యాలకు అగ్ని దేవుని వంటివాడు. ప్రలంబుడనే దైత్యుని సంహరించిన మహావీరుడు. యదువంశశేఖరుడు. సీ. కమనీయ శుభగాత్రు. గంజాత దళనేతు( వసుధాకళత్రు( బావనచరిత్రు నత్యసంకల్పు నిశాచరోగ్రవికల్పు నతపన్నగాకల్పు నాగతల్పు( గౌస్తుభమణిభూషు గంభీరమృదుభాషు శ్రితజనపోషు నంచితవిశేషు నీలనీరదకాయు నిర్దితదైతేయు, ధృతపీతకౌశేయు నతవిధేయు తే. నఘమహాగదవైద్యు వేదాంత వేద్యు, దివ్యముని సన్నుతామోదుం దీర్ధపాదు జిప్తు వర సద్గుణాలంకరిష్టుం గృప్లుం జూడు దైతేయకులబాల! సుభగలిల! 358
  • ఓ సుందరీ! ఇటుచూడు! ఇతడు శ్రీకృష్ణుడు. మనోహర గాత్రుడు. పద్మనేత్రుడు. పావనచరిత్రుడు. సత్యసంకల్పుడు. దుష్టరాక్షస విరోధి. శివునికిసైతం ఆరాధ్యుడు. శేషళయనుడు. కౌస్తుభమణిధారి. గంభీరభాషణుడు. ఆశ్రితజనపోషణుడు. నీలమేఘశ్యాముడు. పీతాంబరుడు. వేదవేద్యుడు. సుజన విధేయుడు. జయశీలుడు. సుగుణాలవాలుడు చ. స్పుర దళి శింజినీరవ విభూషిత పుష్పధనుర్విముక్త భా స్వర నవచూతకోరక నిశాత శిలిముఖ సొతభీత పం క రుహభవాది చేతన నికాయు మనోజనిజాంశు రుక్మిణీ వరసుతు రాజకీరపరివారుని మారుని. జూడు కోమలీ! 359
  • క్రోమలీ! ఇతడు రుక్మిణీ సుతుడు. ప్రద్యుమ్నుడు. తన తుమ్మెదల నారి సారించి వదలిన పుష్పబాణాల దెబ్బతో బ్రహ్మాదిదేవతలనే భయపెట్ట గలిగిన మన్మథుని అవతారమే ఈ ప్రద్యుమ్నుడు. వ. ఇ వ్విధంబునం జూపిన, 360 మ. వనితారత్నము కృష్ణనందనుని భావసప్రొఢి. దాం జూచి గ్ర ద్దన( ద న్నర్థి వరించి చన్న సుగుణోత్తంసంబ కా నాత్మలో ననుమానించి యనంతరంబ యనిరుద్దాఖ్యున్‌ సరోజాక్షు నూ తన చేతోభవమూర్తి( జూచి మది సంతాసించుచు న్నిట్లనున్‌. య!

పదన స్కంధము - ఉత్తరభాగము లౌ

  • క్క విధంగా చిత్రరేఖ యాదవవీరులను చూపించే సమయంలో ఆ బాలామణి కృష్ణుని కుమారుడైన

ప్రద్యుమ్నుని గాంచి తనకు కలలో కన్పించిన వాడితడే యని అనుమానించింది. అటుపిమ్మట చిత్రరేఖ చూపించిన అపరమన్మథుడూ, పద్మనేత్రుడూ ఐన అనిరుద్దుణ్మి చూచి సంతోషంతో ఇలా పలికింది.

ఉ. ఇంతి మదీయ మానధన మెల్ల హరించిన (ముచ్చు ని మ్మెయిం బంత మెలర్ప వ్రాసి పటభాగనిరూపితు. జేసినట్టి నీ యంతటి పుణ్యమూర్తి గొని యాడ(గ నేర్తునె? నీ చరిత్రముల్‌ వింతలె నాకు? నీ మహిత వీరుకులంబు బలంబు. జెప్త్పువూ! 362

  • సథీ నా మానధనాన్ని కొల్లగొట్టిన దొంగను ఈ విధంగా చిత్రపటంలో చూపించిన పుణ్యమూర్తివి

నీవు. నిన్నేమని పొగడగలను చెలీ! ఈ వీరాధివీరుని విశేషాలు వివరించు.

చ. అనవుడు. జిత్రరేఖ జలజాక్షికి నిట్లను “నీ కుమారకుం డనఘు(డు యాదవాన్వయ సుధాంబుధి పూర్ణసుధాకరుండు నాం దనరిన కృష్ణపొత్రకు. డుదారచరిత్రండు భూరిసింహ సం హననుం డరాతిసైన్య తిమిరార్కుండు, పే రనిరుద్దు. డంగనా! 363

  • అని ఉషాసుందరి చిత్రరేఖను అడిగింది. ఆమె ఉషాసుందరికి ఆ సుకుమారుని వివరాలు ఇలా

తెల్పింది. నెచ్చెలీ! ఇతడు యాదవవంశ చం(ద్రుడు శ్రీకృష్ణులవారి మనుమడు. ఉదారచరిత్రుడు. శత్రు భయంకరుడు. సింహ పరా[క్రముడు. ఇతని పేరు అనిరుద్దుడు.

వ. అని చెప్పి యే నతిత్వరితగతిం జని య క్కుమారరత్నంబు. దొడ్కొనివచ్చు నంతకు సంతాపింపకుండు మని యా క్షణంబ వియద్గమనంబునం జని ముందట. 364

  • బ్వత్రరేఖ ఈ విధంగా పలికి “నేను శీఘ్రంగా వెళ్లి ఈ కుమార రత్నాన్ని తీసికొని వస్తాను.

అంతవరకూ నీవు విచారం మాని ఉండు” అని ఆక్షణంలోనే ఆకాశమార్గాన బయలుదేరింది.

క్క సరసిజముఖి గనుంగొనె శుభ, భరిత విలోకన విధూత భవ వేదనమున్‌ బరసాధనమును సుకృత, స్ఫురణాపాదనముం గృష్లు పుటభేదనమున్‌. 365

  • ఆ చ్రిత్రరేఖ అలా వెళ్లి ఇహలోక దుఃఖాన్ని పోగొట్టగలిగినదీ, పరలోకాన్ని సాధించడానికి తోడ్పడగలదీ,

పుణ్యాలపుట్ట అయిన శ్రీకృష్ణుని పట్టణాన్ని దర్శించింది.

వ. కని డాయం జని తదీయ సుషమానిశేషంబులకుం బరితోషంబు నొందుచుం గామినీచరణ రణిత మణిమూపుర రుణంరుణధ్వనిత మణిగోపురంబును, నతి విభవ విజిత గోపురంబును నగు ద్వారకాపురంబు నిశాస్షమయంబునం బ్రచ్చన్న వేషంబునం జొచ్చి కనక కుంభ కలిత సౌధా[గ్రంబున మణీదీపనిచయంబు ప్రకాశింప జం(ద్రకాంత శిలాభవనంబున సుధాధామ రుచిరరుచి చయంబు నపహసించు హంసతూలికాతల్పంబున నిజాంగనా రతిశ్రమంబున నిద్రాసక్తుండై యున్న యనిరుద్దుం

న్‌!

78 పోతన భాగవతము జేరి తన యోగవిద్యా మహత్వ్వంబున నతని నెత్తుకొని మనోవేగంబున శోణపురంబునకుం జని బాణాసురనందన యగు నుషాసుందరీ తల్పంబునం దునిచి యిట్లనియె. 366 స చిత్రరేఖ ఆ పట్టణ సౌందర్యానికి సంతోషించింది. నిశాస్షమయంలో మారువేషంలో ద్వారకలో ప్రవేశించింది. మానినీమణుల మణిమంజీరాలతో మారుమోగే సౌధాలతో స్వర్గాన్ని తిరస్కరించే ఆ ద్యారకా పట్టణంలో బంగారు కుంభాలతో గూడిన రాజప్రాసాదం మీద, మణిదీపాలతో ప్రకాశిస్తున్న చంద్రకాంత శిలాభవనంలో, చంద్రకాంతిని ధిక్కరించే హంసతూలికా తల్పంపై, సురతశ్రమవలన నిద్రిస్తున్న అనిరుద్దుని చెంతకు చేరింది. తన యోగవిద్యానైపుణ్యంతో అతని నెత్తుకొని మనోవేగంతో శోణపురం చేరింది. ఉషాసుందరి పొన్పుపై అనిరుద్దుణ్ణి పరుండబెట్టింది. అలా చేసి ఉషాబాలతో చి(త్రరేఖ ఇలా పలికింది. క, “వనజాక్షి! చూడు నీ విభు, ననిమిషనగధీరు శూరు నభినవమారున్‌ వనధి గభిరు నుదారుని, ననిరుద్దకుమారు విదళితాహితవీరున్‌. 367

  • ఓ సారసాక్ష! మేరునగధీరుడూ, రణశూరుడూ, నవమన్మథాకారుడూ, సము(ద్రగంభీరుడూ, ఉదారుడూ, శత్రుసంహారుడూ, అయిన నీ హృదయచోరుని అనిరుద్దకుమారుని దర్శించు. క అనిన నుషాపతి దన మన, మున ననురాగిల్లి మేన బులకాంకురముల్‌ మొనయంగ నానందాశ్రులు, గను(వ జడి గురియ ముఖవికాస మెలర్పన్‌. 368
  • క మాటలు వినగానే అనురాగంతో ఉషాబాల తనువు పులకించింది. ఆనందా(శువులు జాలువారాయి. ముఖకమలం వికసించింది. వ ఇట్టు మనంబున నుత్సహించి చిత్రరేఖం గనుంగొని య య్యింతి యిట్లనియె. 369
  • క్క విధంగా అంతరంగంలో ఆనందం పొంగిపొారలగా ఉషాకుమారి చిత్రరేఖతో ఇలా అన్నది. సీ. “అతివ! వీ సాంగత్య మను భానురుచి నాకు గలుగుటం గామాంధకొర మడలంౌం దరలాక్షి! నీ సఖిత్వం బను నానచేం గడి(ది వియోగాబ్ధి. గడవం గంటి నబల! నీ యనుబంధ నును సుధావృష్టిచే నంగజ సంతాప మార్చ గంటి వనిత! నీ చెలితనం బను రసాంజనముచే నా మనోహర నిధానంబు. గంటి. తే. గలలం దోంచిన రూప గ్రక్కన లిఖించు, వారు 'నౌనన్నం దోడ్పెచ్చు వారు గలరె? నీటిలో జాడం బుట్టించు నేర్పు నీక, కాక గల్లునె మూండు లోకములయందు? 370
  • ైల్రీ! నీ సాంగత్యమనే సూర్యకాంతి లభించటం వలన నా కామాంధకారం పటాపంచలై పోయింది. తరళాక్తీ! నీ స్నేహమనే నావవలన వియోగసాగరాన్ని దాట గలిగాను. అతివా! నీ అనుబంధమనే అమృతవర్షంతో మన్మథతాపం చల్చారిపోయింది. మగువా! నీ మైత్రి అనే అంజనంతో మనోహరుడనే నిధిని కనుక్కున్నాను. కలలో కన్పించిన ఆకారాన్ని చిత్రపటంలో చిత్రించే వారు ఉండవచ్చునేమో గాని అవును అనగానే అతనిని తీసుకొని వచ్చేవారెవరైనా ఉంటారా? నీటిలో జాడలు తీయగల నేర్పుగల దానివి నీవు. ఈ ముల్లోకాలలో నిన్ను మించే వారు లేరు”.

పదన స్కంధము - ఉత్తరభాగము 79

వ. అని వినుతించి చిత్రరేఖను నిజమందిరంబునకుం బోనం బనిచినం జనియె, ననంతరంబ వింత జనుల కెవ్వరికిం బ్రవేశింప రాని యంతఃపుర సౌధాంతరంబున ననిరుద్దుండు మేల్కని య య్యింతిం గనుంకొని యప్పుడు. 371

  • అని ఉషాబాల చిత్రరేఖను కొనియాడి సాగనంపింది. పరపురుషులు ప్రవేశింపరాని ఆ అంతః

పురంలో అనిరుద్దుడు నిద్రమేల్కొని ఆ రమణీమణిని కనుగొన్నాడు.

క. సురుచిర మృదుతల్పంబునం బరిరంభణ సరసవచన భానకళా చా తురి మెణయ రాకుమూరు(డు, తరుణీనుణి. బొందె మదనతంత్రజ్ఞుండై. 372

  • అందమైన ఆ మృదుతల్పంపైన అనిరుద్దుడు కౌగిలింతలతో, సరససల్దాపాలతో ఉషాసుందరిని

ఉత్సాహపరుస్తూ శృంగార లీలావిలాసాలలో ఓలలాడాడు.

వ. ఇ వ్విధంబున నతిమనోహర విభవాభిరానుంబులగు దివ్యాంబరాభరణ మాల్యానులేసనంబులను, గర్బూర తాంబూలంబులను, వివిధాన్నపానంబులను, సురుచిర మణిదీప నీరాజనంబులను, సుగంధ బంధురాగరు ధూపంబులను, నాటపాటల వీణా వినోదంబులను, బరితుష్టిం బొంది కన్వ్యాకుమారకు లానంద సొగరాంతర్నిమన్న మానసులై యుదయాస్తమయ నిరూపణంబు సేయనేరక, ప్రాణంబు లొక్కటియైన తలంపులం గదిసి యిష్ణోపభోగంబుల సుఖియించుచుండి, రంత. 373

  • క్కు విధంగా అత్యంత మనోహరాలైన వస్త్రాలు, ఆభరణాలు, పూలదండలు, మైపూతలు,

కర్పూరతాంబూలాలు, షడ్రసోపేతభోజనాలు, ఆటపాటలు, అగరుధూపాలు, మణిదీపాలు, వీణావాదనలు మొదలైన సౌఖ్యాలతో ఉషానిరుద్దులు ఆనందసాగరంలో మునిగితేలారు. వారికి సూర్యోదయాస్తమయాలు తెలియడం లేదు. శరీరాలు వేరైనా ప్రాణం ఒకటిగా ఇప్టోపభోగాలతో సుఖించారు.

క ఆలోనన యతిచర మగు, కొలను సుఖలీల జరుగంగా వరుస నుషా బాలాలలామ కొయ్యనం జూ లేర్చడి గర్భ మొదనె సురుచిరభంగిన్‌. 37

  • ఇలా కొంతకాలం వారు ఎంతో సంతోషంతో గడిపారు. తర్వాత కొన్నాళ్ళకు ఉషాబాల గర్భం

దాల్చింది.

కు ఆ చిన్నె లంగజాలలు, సూచి భయాకులత నొంది స్రుక్కుచు. దనులో నో చెల్ల! యెట్టులో? యీ, రా చూలికి. జూలు నిలిచెరా! యి బృంగిన్‌" 375

  • ఆ బాల గర్భచిహ్నలను అంతఃపుర కంచుకులు చూచి భయపడ్డారు. మన రాచూలికి చూలు నిలిచింది. ఇక ఇప్పుడు ఏం చేయాలని లోలోపల మథనపడ్డారు.

క అని గుజగుజ వోవుచు “ని, ప్పని దప్పక దనుజలోక పాలునితోడన్‌ వినిపింపవలయూు” నని వే, చని బాణుని జేరి మొక్కి సద్వినయమునన్‌. 376

80 పోతన భాగవతము శే ఇలా గుసగుసలాడుకొని ఈ విషయం తప్పక బాణాసురుల వారికి చెప్పవలసిందే నని నిశ్చయించుకున్నారు. శీఘ్రంగా దానవేశ్చరుని దగ్గరకు వెళ్లి వినయంతో నీ విధంగా విన్నవించుకున్నారు. క. మంతనమున దేవర! క, న్యాంతఃపుర మేము గాచి యరయుచు నుండన్‌ వింతజనములకు( జొర(గ దు, రంతము విను పోతుటీంగకైన సురారీ! 377

  • ఓ ద్రానవేంద్రా! దాసులమైన మేము దేవరవారి అంతఃపురాన్ని జాగరూకతతో కావలికాసే వాళ్లం. పోతుటీగకైనా మమ్మల్ని కాదని లోనికి వెళ్లడం అసాధ్యం. రా లా తే. ఇట్టీచో. గానలున్న మే మెవ్వరమును, నేమి కనుమాయయో కాని యెజుంగ మధిష! నీ కుమారిక గర్భంబు నివ్వటిల్ల, యున్నదన్నను విని రోషయుక్తు( డగుచు. 378
  • ప్రభూ! ఈ పరిస్థితిలో అదేమి మాయయో మాకు తెలియదు. మేము కావలి కాస్తూనే ఉన్నాం. నీ కుమార్తె గర్భం ధరించింది అని చెప్పగానే విని అసురేంద్రుడు ఆ(గ్రహోద(గ్రుడైనాడు. వ. అట్టియెడ దాననేంద్రుండు రోషభీషణాకారుండై, కటము అదర, బొములు ముడివడం, గనుంగవల ననలకణంబు లుస్పతిల్ల, సటలు వెజికినం జటుల గతి నెగయు సింగంబు విధంబున అంఘించుచు, భీకర కరవాలంబు గేలం దాల్చి సముద్దండ గతిం గన్యాసొాధాంతరంబునకుం జని. 79
  • రోషభీషణాకారుడైన రాక్షసీంద్రుని చెక్కిళ్ళు అదిరాయి. కమబొమలు ముడివడ్డాయి. కళ్లవెంట నిప్పులు రాలాయి. జూలుబట్టి లాగగా విజ్బంభించిన సింహంలాగా ముందుకు లంఘించి భయంకరమైన కరవాలాన్ని ధరించి ఆ(గ్రహావేశంతో అంతఃపురానికి వెళ్ళాడు. -:బాణాసురుం డనిరుద్దుని నాగపాశబద్దుని6 జేయుట :- పీ, కవియె శుభోపేతు( గందర్పసంజాతు నూనితదేహు నాజానుబాహు మకరకుండలకర్ణు మహితప్రభాపూర్ణు. జిరయశోల్దాసు. గౌశేయవాసు. గస్తూరికాలిప్తు ఘనకాంతికుముదాస్తు హారశోభితవక్షు నంబుజాక్షు యదువంశతిలకు మత్తాలినీలాలకు నవపుష్పచాపు! బూర్లప్రతాపు తే. నభినవాకారు నక్షవిద్యావిహారు, నుహితగుణవృద్దు మన్మథమం(త్రసిద్దు( గలితపరిశుద్దు నఖిలలోక ప్రసిద్దుం జతురు ననిరుద్ధు నంగనాజననిరుద్దు. 380
  • అచ్చట బాణాసురుడు ఆజానుబాహువులతో, శుభాకారంతో, మణిమయ మకరకుండలాలతో, పట్టుపీతాంబరంతో, రాజీవనేత్రాలతో, సుకుమార రత్నహారాలతో, వినీలకేశాలతో, కమ్మ కస్తూరి మైపూతతో, అభినవ మన్మథునివలె అలరారే అఖిలలోక ప్రసిద్ధుడైన అనిరుద్దుణ్మి అలోకించాడు. చ. కని కన లగ్గలింప సురకంటకు( డుద్ధతి సద్భటావళిం గను(గొని 'యీ నరాధముని+ గట్టుండు, పట్టుండు, కొట్టుండన్న వా

పదవ స్కంధము - ఉత్తరభాగము 81 రనుపమ హేతిదీధితు లహర్పతితేజము మాయ జేయ డా సిన నృపశేఖరుండు ముది జేవయు లావును నేర్పు దర్పమున్‌, త8ి1

  • ఆ రాక్షసరాజు అనిరుద్దుని చూచి అత్యంత కోపంతో మండిపడుతూ భటులను గౌంచి “ఈమానవా ధముని బంధించండి” అని ఆజ్ఞాపించాడు. ఆ రాక్షసభటులు సూర్యకాంతిని ధిక్కరించే ఆయుధాల కాంతు లతో శోభిస్తూ అనిరుద్దుని బంధించడానికి వెళ్ళారు. చ కలిగి మహో గ్రవృత్తిం బరిఘంబు గరంబున లీల దాల్భి దో ర్భల ఘనవిక్రమప్రళభయఖైరవు భంగివిబ్బంభణ క్రియా కలన నెదిర్చె దానవ నికాయముతో దలపాటు బోటునుం జలము బలంబు దైర్యమును శౌర్యము వ్రేటును వాటు( జూపుచున్‌. 382
  • అప్పుడు అనిరుద్దుడు అనివార్య శౌర్యసాహసాలతో ఇనుపకట్ల గుదియను చేతదాల్చి ప్రళయకాల భైరవునివలె మహోగ్రంగా విజృంభించి దానవసేనను ఎదిరించాడు. తనశక్తియుక్తుర్నీ శౌర్యధైర్యాలనూ (ప్రదర్శించాడు.

చ. పదములు బాహులుం దలలు (ప్రక్కలు చెక్కులు జామయుగ్మముల్‌ రదములు గర్లముల్‌ మెడ లురంబులు మూంపులు వీ(పు లూరువుల్‌ చిదురుపలై ధరం దొజగ6 జిందణవందణ సేయ 'సైనికుల్‌ కదన పరాజ్ముఖక్రమము గైకొని పొటిరి కాందిశీకులై. 383

  • అనిరుద్దుని యుద్ధకౌశలానికి దానవసైనికులు పాదాలు, చేతులు, తలలు, మోకాళ్లు, పండ్డు

చెవులు, మెడలు, తొడలు, వీపులు, మూపులు చిన్న చిన్న ముక్కలుగా భూమి నిండా చిందరవందరగా పడ్డాయి. అనిరుద్దునితో యుద్దం చేయలేక రాక్షస సైనికులు రణరంగంనుండి పారిపోయారు.

వ. ఇవ్విధంబున సైన్యంబు దైన్యంబు నొంది వెటచియుం, బజుచియు; విచ్చియుం, జచ్చియు; గలంగియు, నలంగియు; విజిగియు, సురి(గియుం జెదరియు, బెదరియు( జేవదటణింగి నులుములై తన మజు(గు సొచ్చిన బాణుండు శార్యధురీణుండును, గోపోద్దీపిత మానసుండునై కదిసి యేసియు, వ్రేసియు? బొడిచియు, నడిచియు. బెనంగి. 384

% క్ర విధంగా దానవ సైన్యం చేవచచ్చి, బాధతో భయంతో బెదరి చెదరి వచ్చి బాణాసురుని

మరుగు చొచ్చింది. బాణాసురుడు శౌర్య క్రోధాలతో అనిరుద్దునిపై దూకి భీకర యుద్దం చేశాడు.

క కక్రుద్దుండైై యహిసాశ ని, బద్దుం గావించె నసురపాలుండు రణస న్నద్దున్‌ శరవిద్దు న్నని, రుద్దున్‌ మహిత్రబుద్దు రూపసమృద్దున్‌. 385

  • క్ర విధంగా విజృంభించి బాణాసురుడు రూపసమృద్దుడూ, రణసన్నద్దుడూ అయిన అనిరుద్దుణ్ణి ర 6 లాం నాగపాశంతో బంధించాడు.

82 పోతన భాగవతము

న. ఇట్లు కట్టి త్రోచిన నుషాసతి శోకవ్యాకులితచిత్తయై యుండె నంత. 386

  • తన తండ్రి తనప్రియుడైన అనిరుద్దుణ్మి ఈ విధంగా బంధించటం చూచి ఉషాకాంత శోక

సంతప్త హృదయురాలయింది,

క. నీలపటాంచితమై సువి, శాలంబై వాయునిహతి( జండధ్వని నా భీలనుగు నతని కేతన, మూలోన నకారణంబ యవనిం గూలెన్‌. 387

  • సరిగా అదే సమయంలో సుడిగాలి వీచింది. ఆ గాలి దెబ్బకు నీలవస్తంతో విశాలమైన బాణాసురుని

జెండా భయంకరధ్వని చేస్తూ నేలగూలింది.

క అది చూచి దనుజపాలుండు, మదనాంతకు( డాడినట్టి నూట నిజముగా గదనంబు గలుగు ననుచును, నెదురెదురే చూచుచుండె నెంతయు బ్రీతిన్‌. 388

  • ఈ కేతనపతనాన్ని చూచిన దానవరాజు సంతోషపడ్డాడు. పరమేశ్వరుడు పలికిన విధంగా తనకు

తగిన వానితో సమరం సం్రాప్తమౌతుందని భావించి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు.

న. అంత నక్కడ, 389

క ద్వారకలో ననిరుద్ధ కు, మారుని పోకకును యదుసమాజము వగలం గూరుచు నొకవార్తయు విన , నేరక చింతింప నాల్లునెల అరిగె నృపా! 390

స్‌ అక్కడ ద్వారకా నగరంలో అనిరుద్దుడు అంతర్జాన మైనందుకు యాదవులంతా విచారించారు.

నాలుగ నెలల వరకు అనిరుద్దుని గూర్చిన వార్తే వారికి తెలియలేదు.

-2నారదుని వలన వృత్తాంతమును విని కృష్ణు(డు బాణాసురునిపై దండెత్తుట :-

వ. అ య్యవసరంబున. ౩91

క శారద నిర్మల నీరద, పారద రుచిదేహు( డతుల భాగ్యోదయు డా నారదముని యేతెంచె న, పార దయామతి మురారిభజన ప్రీతిన్‌, 3౩92

  • అసమయంలో శరత్కాల మేఘంవటి దేహంతో కూడిన నారద మునీంద్రుండు దయాసాగరుడైన

శ్రీకృష్ణుని పూజించే కుతూహలంతో ద్వారకకు వచ్చాడు.

వ. ఇట్లు సమదెంచిన య ద్దివ్యమునికి నిర్మల ముణినినిర్మిత సుధర్మాభ్యంతరంబున యదు వృష్టి భోజాంధకవీరులు గొలునం గొలువున్న గములలోచనుండు ప్రత్యుత్దానంబు చేసి, యర్ధ్య పాద్యాది విధులం బూజించి, సముచిత కనకాసనాసీనుం జేసిన నత్తాపసోత్తముండు పురుష్ణోత్తము నుదాత్త తేజోనిధిం బొగడి, యనిరుద్దు వృత్తాంతం బంతయు. దేటపడ నెణింగించి, యప్తుండరికాన్షునిచేత నామం(త్రణంబు వడసి, యంతర్జానంబు నొందెం దదనంతరంబ కృష్ణుండు శుభముహూర్తంబున దండయాత్రాభిముఖుండై ప్రయాణభేరి వేయించి, బలంబుల వెడలింప (బ్రద్దలవారిం బనిచి, తానును గట్టాయితం బయ్యె, నంత. 393

పదవ స్కంధము - ఉత్తరభాగము 83

  • ద్వారకకు విచ్చేసిన నారదమునీంద్రునకు యదువృష్టి భోజాంధక వీరులతో శ్రీకృష్ణుడు ఎదురు వెళ్లి అర్జ్యృపాద్యాదులతో పూజించి బంగారు ఆసనంపై ఆసీనుణ్ణి చేశాడు. తర్వాత నారదమునీంద్రుడు పురుషోత్తముని స్తుతించి అనిరుద్దుని వృత్తాంతం అంతా వివరించాడు. అనంతరం పుండరీకాన్షుని చెంత సెలవుతీసికొని వెళ్లిపాయ్యాడు. అటు పిమ్మట శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో బాణాసురునిపై దండయాత్ర చేయటానికి ప్రయాణఖభేరి వేయించాడు. సైన్యాన్ని సర్ససన్నద్దం చేయించాడు. తాను చతురంగబలాలతో యుద్దరంగానికి వెళ్లడానికి సిద్దమయ్యాడు. ఫ్హీ హార కిరీట కేయూర కంకణ కట కాంగులీయక నూపురాది వివిధ భూషణప్రతతిచే. బొలుపారి కరముల ఘనగదా శంఖ చక్రములు దనర సురభి చందన లిప్త సురుచి రోరస్ట్రలి. బ్రవిమల కౌస్తుభ ప్రభలు నిగుడం జెలువారు పీత కౌశేయచేలము కాసె వలనుగా రింగులు వాజుం గట్టి తే శ్రైబ్య సుగ్రీవ మేఘ పుష్పక నలాహ, కములం బూన్చిన తే రాయితముగ జేసి దారుకుండు దేర నెక్కె మోదం బెలర్బ, భాను. డుదయాచలం బెక్కు పగిది మెజసి. 39
  • స్మ్రీకృష్ణుడు హారములు, కిరీటము, కేయూరములు, కంకణములు, అంగుళీయకములు, నూపురములు మొదలైన ఆభరణాలను ధరించినాడు. శంఖ చక్ర గదాయుధాలను దాల్పాడు. చందనం అలదిన వక్షస్ట్రలంపై కౌస్తుభ రత్నకాంతులు ప్రసరించుతుండగా పీతాంబరాన్ని రింగులు వారగట్టాడు. శ్రైబ్యము, సుగ్రీవము, మేఘపుప్పకము, వలాహకము అనే గుజ్టాలను కట్టిన రథాన్ని సిద్ధం చేసి దారుకుడు తీసుకొని రాగా శ్రీకృష్ణుడు సూర్యుడు ఉదయపర్వతాన్ని ఆరోహించినట్టు ఆ రథాన్ని అధిరోహించాడు. వ. ఇట్టు రథారోహణంబు సేసి, భూసురాశీర్వచనపూతుండును, మహితదూర్వాంకు రాలంకృతుండును, లలితపుణ్యాంగనా కరకిసలయ కలిత శుభాక్షత విన్యాసభాసుర మస్తకుండును, మాగధ మంజుల గానానుమోదితుండును, వందిజనసంక్తీర్త్వూ నందితుండును, బాఠక పఠనరవ వికాసిత హృదయుండును నయి వెడలు ననసరంబున. 395
  • శ్రీ కృష్ణుడు రథాన్ని అధిరోహించగా (బ్రాహ్మణులు ఆశీర్వదించారు. పుణ్యాంగనలు శిరస్సుపై శుభాక్షతలు చల్చారు. వందిమాగధులు క్రైవారాలు చేశారు. స్నోత్ర పాఠకులు స్తుతించారు. ఈ విధంగా ముకుందుడు ఆనందంతో ముందుకు సాగాడు. ఫీ బలభద్ర సాత్యకి ప్రద్యుమ్ను ముఖ యదు వృష్టి భోజుంధక వీరవరులు దుర్వార పరిపంధథి గర్వభేదన కళా చతురబాహాబలోత్సాహలీల వారణ స్యందన వాజి సందోహంబు సవరణ సేయించి సంభ్రమమున సముచిత ప్రస్థాన చటుల భేరీ భూరి, ఘోష నుంభోనిధి ఘోష మండంప

84 పోతన భాగవతము తే. ద్వాదశాక్షాహిణి బలోత్కరము లోలి, నడచె గృష్టుని రథము వెన్నంటి చెలంగి పృథులగతి మున్‌ భగీరథు రథము వెనుక, ననుగమించు నియన్నది ననుకరించి. 396

  • అప్పుడు బలరాముడు సాత్యకి ప్రద్యుమ్నుడు మొదలైన యదువీరులు మదోన్మత్తులయిన శత్రు వీరులను అణచి వేయాలనే అఖండ బలోత్సాహాలతో చతురంగబలాలను సమకూర్చుకొని ప్రస్పానభేరి (మోగించాడు. ఆ భేరీధ్వని సము[ద్ర ఘోషను మించి పోయింది. శ్రీకృష్ణుని రథం వెంట బయలుదేరిన పన్నెండు అక్షౌహిణుల సైన్యం భగీరథుని వెంట బయలుదేరిన ఆకాశ గంగావాహినిలా తోచింది. వ. ఇ వ్విధంబునం గదలి కతిపయ ప్రయాణంబుల శోణపురంబు సేరం జని వేలాలంఘనంబు సేసి యదువీరు లంత. 397
  • ఈ ప్రకారంగా బయలు దేరిన యదువీరులు కొన్నాళ్లకు శోణపురం సమీపించి పాలిమేర దాటారు. మ. సరి దారామ సరోవరోపసవన యజ్ఞస్థానముల్‌ మాసి వే పరిఖల్‌ పూడిచి యం(త్రముల్‌ దునిమి వప్రవ్రాతముల్‌ ద్రొబ్బి గో పురముల్‌ గూలంగగద్రోచి సొధభవనంబుల్‌ నూకి ప్రాకారముల్‌ ధరణిం గూల్చి కవాటముల్‌ విణిచి రుద్దండక్రియాలోలు రై. 398
  • యాదవ వీరులు ఉద్దండులై శోణపుర ప్రాంతంలోని నదులను, సరోవరాలను, ఉద్యానవనాలను, యజ్ఞవాటికలను చిందరవందర చేశారు. అగడ్తలను పూచ్చివేశారు. యంత్రాలను చెడగొట్టారు. కోటలను పడగోట్టారు. గోపురాలను కూలద్రోశారు. సౌధాలను, ప్రాకారాలను నేలగూల్చారు! కవాటాలు విరగగొట్టారు.
  • వ, ఇట్లనేకప్రకారంబులు గాసి చేసి, పురంబు నిరోధించి పేర్చి యార్చినం జూచి యాగ్రహ సమగ్రోగ్రమూర్తియె బాణుండు సమర సన్నాహ సంరంభ విజ్బంభమాణుండై సంగరభఖేిరి వేయించిన. 299
  • ఈ రీతిగా యాదవవీరులు శోణపురాన్ని చుట్టుముట్టి విజ్బంభించారు. అప్పుడు బాణుడు మిక్కిలి ఆ(గ్రహంతో సమరసన్నాహం చేసి యుద్దభేరి వేయించాడు. సీ, ఆచక్రవాళాచలాచక్ర మంతయు బలసి కుమ్మరిసారె పగిది దిరిగి ఘన ఘోణి ఖుర కోటిఘట్టిత నదముల కరణి నంభోనిధుల్‌ గలంగ పారలెం గొాలరుద్రాభీల కర శూలహతి రాలు పిడుగుల గతి రాలె నుడుగణంబు చటులానిలోద్దూత శాల్మలీతూలంబు చాడ్పున మేఘముల్‌ చదల. దూఠె తే. గిరులు వడణాడె దిని పెల్లగిల్లై సురల, గుండె లవిసె రసాతలక్షోభ మొదనవె దిక్కు లదరె విమానముల్‌ తెరలి చెదరె గల (గ్రహరాజ చంద్రుల గతులు దప్పె. 400
  • ఈ యుద్ధ 'ప్రారంభసమయాన ధరణీచక్రమంతా కుమ్మరి సారెలాగా తిరిగింది. ఆదివరాహపు గిట్టల తాకిడి తగిలిన నదాలలాగా సముద్రాలు కలగిపోయాయి. కాలరు'ద్రుని శూలపు దెబ్బలకు రాలిన

పదవ స్కంధము - ఉత్తరభాగము 85 పిడుగులలాగా చుక్కలు విచ్చిన్నమై నేలరాలాయి. భయంకరమైన గాలికి ఎగిరిన బూరుగదూది పింజలవలె మేఘాలు తూలిపోయాయి. పర్వతాలు వణకిపోయాయి. దివి పెల్లగిల్లింది. దేవతల గుండెలు అవిసిపోయాయి. పాతాళం క్షోభించింది. దిక్కులు సంచలించాయి. విమానాలు చెల్లాచెద రయ్యాయి. సూర్యచంద్రులు గతులు తప్పారు, వ. అట్టి సమర సన్నాహంబునకు6 గట్టాయితంబై, మణీఖచితభర్మ నర్మ నిర్మలాంశు జాలంబులును, శిరస్తాణ కిరిట కోటి ఘటిత వినూత్నరత్న ప్రభాపటలంబులును, గనక కుండల (గ్రైవేయ హార కంకణ తులాకోటి వివిధ భూషణ(న్రాత రుచినిచయంబులును, బ్రచండ బాహుదండ సహస్రంబున వెలుంగుచు శరశరాసన శక్తి ప్రాస తోనుర గదా కుంత ముసల ముద్గర భిందినాల కరనాల పట్టిస శూల క్షురికా పరశు పరిఘాది నిశాత హేతివ్రాత దీధితులును, వియచ్చరకోటి నేత్రంబులకు మిజుమిట్టు గొలుపం గనకాచల శృంగ సముత్తుంగం బగు రథం బెక్కి యరాతివాహినీ సందోహంబునకుం దుల్యంబైన నిజ సేనాసమూహంబు లిరుగడల నడవ బాణుం డక్షీణప్రతాపంబు దీపీంప ననికి వెడలె, న య్యవసరంబున. 401

  • యుద్ధానికి సిద్ధపడి బాణాసురుడు మేరుపర్వత శిఖరంవలె ఉన్నతమైన రథాన్ని అధిరోహించాడు. మణులు పొదిగిన బంగారు కవచాన్ని ధరించాడు. రత్నకాంతులతో అతని కిరీటం శోభించింది. కుండలాలు, హారాలు, కంకణాలు మొదలైన బంగారు ఆభరణాల కాంతులు అంతటా వ్యాపించాయి. బాణ కుంత తోమర ముసల గదా కరవాలాది ఆయుధాలతో అతని వేయి చేతులు వెలిగిపోతూ దేవతల నేత్రాలకు మిరుమిట్టు గొల్పాయి. ఈ విధంగా అమిత పరాక్రమంతో ఆ రాక్షసరాజు శత్రుసైన్యంతో సమానమైన "సైన్యం ఇరుదిక్కులా నడవగా యుద్ద రంగానికి బయలుదేరాడు.

_: బాణాసురునికి సహాయభూతుండగు శివునకు కృష్ణునకు యుధ్ధ మగుట ;-

చ. వరదు. డుదార భక్తజనవత్సలు(డైన హరుండు బాణునిం గర మనురక్తి నాత్మజులకంటె దయామతి( జూచు గానం దా దుర మొనరించు వేడ్క బ్రమథుల్‌ గుహుండున్‌ నిజభూతకోటియున్‌ సరస భజింప నుజ్వుల నిశాతభయంకరశూలహస్తు.డై. తీ౦౮2

  • వరదుడు, ఉదారుడు, భక్తజన వత్పలుడైన పరమేశ్వరుడు బాణాసురుని తన కన్న కొడుకులకన్న అధికంగా అభిమానిస్తాడు. కనుక బాణుని పక్షాన యుద్ధం చేయాలనే కోరికతో 'ప్రమథులు వెంటరాగా భయంకరమైన శూలాన్ని ధరించి బయలుదేరాడు.

ఫీ ఖరపుటాహతి రేంగు ధరణీపరాగంబు పంకేరుహాప్త బింబంబు( బొదువ నిపులవాలాటోప విక్షేపజాత వాతాహతి వారివాహములు విరియ గుణుచ తిన్నని వాండికొమ్ముల( జిమ్మిన బ్రహ్మాండభాండ కర్పరము వగుల నలవోక ఖణి ఖణిల్లని అంకె నైచిన రోదసీకుహరంబు భేదిలంగ

86 పోతన భాగనతము

తే. గళ చలద్భర్మఘంటికా ఘుణఘణ ప్ర, ఘోషమున దిక్రటంబు లాకులత నొంద లీల నడతెంచు కలధౌతశైల నునంగ, నుక్కు మిగిలిన వృషభేంద్రు నెక్కి వెడలె. 403

  • విలాసంగా కదలివస్తున్న కైలాస పర్వతంలాగా మహోన్నతమైన నందీశ్వరునిపై ఎక్కి శంకరుడు

యుద్ధరంగానికి వచ్చాడు. నందీశ్చరుని కాలిగిట్టల తాకిడికి పైకి లేచిన దుము శ] సూర్యబింబాన్ని (క్రమి శవేసింది. తోక కదలికవలన పుట్టిన గాలిదెబ్బకు మేఘాలు చెదరిపోయాయి. వాడికొమ్ముల ధాటికి బ్రహ్మాండభాండం 'బ్రద్దలయింది. ఖణిల్లని విలాసంగా వేసిన రంకెకు రోదసీకుహరం దద్దరిల్లింది. మెడలోని గంటల గణగణ ధ్వనులకు దిక్తటాలు పెటపెటలాడాయి.

వ. ఇట్టు వెడలి సమరసన్నాహ సముల్లాసంబు మొగంబులకు వికాసంబు సంపాదింసం బ్రతిపక్ష బలం బులతోడం దలపడిన ద్వంద్వయుద్దం బయ్యె, నప్పు డ ప్పురాతన యోధుల యా యోధనంబు! జూచు వేడ్కం జనుదెంచిన, నరసిజసంభన శక్ర సుర యక్ష సిద్ద సాధ్య చారణ గంధర్వ కిన్నర కిం పురుష గరుడోరగాదులు నిజవిమానారూధులై వియత్తలంబున నిలిచి రట్టి యెడం గృష్షుండును హరుండును, మారుండును గుమారుండును, గూప కర్ణ కుంభాండులును, గామపాలుండును బాణుపుత్రుండగు బలుండును, సాంబుండును; సాత్యకియును బాణుండును, రథికులు రథికు లును, నాశ్వికులు నాశ్వికులును, గజారోహకులు గజారోహకులును, బదాతులు పదాతులునుం దలపడి యితరేతర హేతిసంఘట్టనంబుల మిణుంగుజులు సెదరం బరస్పరాహ్వాన బిరుదాంకిత సింహనాద హుంకార శింజినీటంకార వారణఘీంకార వాజిహీషారనంబులను, బటహ కాహళ భేరీ మృదంగ శంఖ తూర్యఘోషంబులను 'బ్రహ్మాండకోటరంబు పరిస్పోటితంబయ్యె, న య్యవసరంబున.

శ04

  • పరమేశ్వరు డిలా బయలుదేరి యుద్దోత్సాహంతో ప్రతిపక్షంతో తలపడ్డాడు. అప్పుడు ఇరుపక్షాల

వారికి ద్వంద్వయుద్దం జరిగింది. ఆ పురాతన యోధుల యుద్దాన్ని చూడడానికి (బ్రహ్మాది దేవతలు, మునీం(ద్రులు, యక్షరాక్షస సిద్ధ చారణ గంధర్వ కిన్నరాదులు తమ తమ విమానాల నెక్కి ఆకాశంలో గుమికూడారు. అట్టి సమయంలో శివకేశవులూ, కుమార (ప్రద్యుమ్నులూ, కూపకర్ష కుంభాండులూ బలరాముడూ, సాంబుడూ బాణనందనుడు బలుడూ, బాణ సాత్యకులూ ఒండొరులతో తలపడ్డారు. రథికులు రథికులతోను, ఆశ్వికులు ఆశ్వికులతోను, గజారోహకులు గజారోహకులతోను, పదాతులు పదాతులతోను

  • గుల్టా ; , భరి, ్క ృదంగము, శంఖము మొదలైన వాని సంకుల ధ్వనులతో బ్రహ్మాండం దద్దరిల్లిపోయింది.

చ. జలరుహనాభు. డార్చి నిజ శార్‌జ్ఞ శరాసన ముక్త సాయ కొ వలి నిగుడించి నొంచె. బురవైరి పురోగములన్‌ రణ(క్రియా కలితుల గుహ్యక ప్రమథ కర్చుర భూత పిశాచ డాకినీ బలవ దరాతియోధులను బమ్మెరపోయి కలంగి పాజంగన్‌. 405

పదవ స్కంధము - ఉత్తరభాగము 87

  • స్రీ కృష్ణుడు సింహనాదం చేసి శార్‌జ్లమనే తన ధనుస్సును ఎక్కు పెట్టి బాణవర్నాన్ని కురిపించాడు. యుద్ద విశారదులైన (ప్రమథగణాలనూ, భూత పిశాచ డాకినీ వీరులను ది(గ్రృమ చెంది పారిపోయేటట్టు చేశాడు. వ. ఇ ట్లేసి యార్చిన కుంభినీధరు భూజావిజ్బంభణ సంరంభంబునకు సహింపక, నిటలాంబకుం డనలకణంబు లుమియు నిశితాంబకంబులం బీతాంబరుని నేసిన, వాని నన్నింటి నడుమన ప్రతి బాణంబు లేసి చూర్లంబు సేసినం గనుంగొని మజియును. 406
  • ఇలా బాణప్రయోగం చేసి శ్రీకృష్ణుడు విజ్బంభించటాన్ని సహించలేక పరమేశ్చరుడు నిప్పులు కక్కే శరపరంపరలను పీతాంబరునిపై ప్రయోగించాడు. ఆ బాణాల నన్నిటినీ నడుమనే శ్రీకృష్ణుడు చూర్షం చేశాడు. ను. అనలాక్షుండు (త్రిలోకపూజ్యమగు బ్రహ్మాస్త్రం బరింబోసి యా ననజాతేక్షణు మీద (గ్రోధమహినువ్యాకీర్ణుండై యేసె, నే సిన దద్దివ్యశరంబుచేతనె మజల్చెం గృష్లు. డత్యుద్ధతిన్‌ జనితాశ్చర్య రసాబ్ధిమగ్ను లగుచున్‌ శక్రాదు లగ్గింప(గన్‌. 407
  • స్టాలలోచనుడు పరిస్థితిని గమనించాడు. త్రిలోకపూజ్యమైన బ్రహ్మా(స్రాన్ని నిటలాక్షుడు కమలాన్షునిపై ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు ఆ అస్తాన్ని అవలీలగా చేతితోనే మరలించాడు. ఇది చూచి దేవేంద్రాది దేవతలు ఆశ్చర్యచకితులై శ్రీకృష్ణుని స్తుతించారు. శా వాయవ్యాస్త ముపేంద్రుపై నలిగి దుర్వారోద్దతి న్నేయ దై తేయధ్వంసియు. బార్వతాశుగముచేం ద్రెంచెం, (గ్రతుధ్వంసి యా గ్నేయాస్తం బడరించె నుగ్రగతి లక్ష్మీనాథుపై, దాని వే మాయం జేసెను నైంద్రబాణమునం బద్మాక్షుండు లీలాగతిన్‌. 408
  • అప్పుడు ఉమాపతి ఉపేంద్రునిపై వాయవ్యాస్తాన్ని ప్రయోగించాడు. దైత్యారి ఆ అస్త్రాన్ని పార్వతా(స్తంతో నివారించాడు. ఉగ్రుడు మహో[గ్రుడై అన్నేయా'స్తాన్ని ప్రయోగించగా పద్మాక్షుడు ఐంద్రబాణంతో దానిని అణచివేశాడు. వ. మజీయును. 409 ఉ. పాయని కిన్మతో హరుండు పాశుసతాస్త్రము నారి బోసినన్‌ దోయరుహాయతాక్షుండును దోడన లోకభయంకరో!(గ్ర నా రాయణబాణరాజము రయంబున నేసి మరల్ఫె దాని. జ క్రాయుధు€ డిత్తెజంగున బురారి శరావలి రూపుమాపినన్‌. 410

88 పోతన భాగవతము

  • “అనంతరం మిక్కిలి కోపంతో పరమేశ్వరుడు పాశుపతా'స్తాన్ని వింట సంధించాడు. చక్రాయుధుడు లోక భయంకరమైన నారాయణాసస్తాన్ని ప్రయోగించి పాశుపతాన్లి మరలించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు పరమశివుని అ'స్త్రాలన్నిటినీ శాంతింపజేశాడు.

క. ఊహ కలంగియు విగతో, తృాహుండగు హరునిమీంద జలజాన్షుండు స మ్మోహన శిలీముఖం బ, వ్యాహత జయశాలి యగుచు నడరించె నృషా! త్త్ష్షే

  • ఆప్పుడు పరమేశ్వరుడు నిరుత్సాహం చెందాడు. ఆ సమయం కనిపెట్టి జయశాలియైన శ్రీకృష్ణుడు

సమో శ్రహనాఫస్తం (ప్రయోగించాడు.

వ. అట్టేసీన. త్త2

క జృంభణశరపాతముచే, శంభుడు నిజతనువు పరవశం బయి సోలన్‌ జృంభితుండై ఘననిద్రా, రంభత వృషభేంద్రు మూంపురముపై వ్రాలెన్‌, శ13

  • ఆ సమ్మోహనాస్త్ర ప్రభావం వలన శరీరం సాధనం తపి) శంకరుడు నందీశరుని మూపురంపై

శ్రహనాస్త్ర ప్ర స్వ ్స్‌ శ్చ వ్రాలిపోయాడు.

వ. ఇట్టు వ్రాలినం జక్రపాణి పరబలంబుల నిశితబాణ పరంసరలం దునిమియు, నొక్కయెడం గృపాణంబులం గణికలు సేసియు, నొక్కచో గదాహతులం దుత్తుమురుగా మొత్తియు ని వ్విధంబున బీనుంగు సెంటలం గావించె, నంత. త్తశేడే

  • ఫైలపాణి స్పృహ తప్పుట చూచి చక్రపాణి శత్రుసైన్యాన్ని శరపరంపరలతో చిందరవందర

చేశాడు. కొందరిని కత్తిదెబ్బలతో ముక్కలుచెక్కలు చేశాడు. కొందరిని గదాఘాతాలతో తుత్తుమురు గావించాడు. ఈ విధంగా శత్రుసైన్యాన్ని హతమార్చాడు.

చ. తజణీమి మురాంతకాత్మజు. డుదాత్తబలంబున బాహులేయుపై+ గణకరి( దాంకి తీవ్రశితకాండ పరంపర లేసి నాంసంగా నెణంకులు గాండి సైందొరంగు వెత్తుట జొత్తిలి వైరు లార్వం గాం బణిచె మయూరవాహనము. బైకొని తోలుచు నాజిభీతుందై. డేర్‌

  • ఆ సమయంలో ప్రద్యుమ్నుడు అనివార్యమైన శౌర్యంతో కుమారస్వామిని ఎదుర్కొన్నాడు.

పట్టుదలతో తీవ్రమైన బాణాలను ప్రయోగించాడు. అప్పడు నెత్తురుముద్దగా మారిన కుమారస్వామి శత్రువులు సింహనాదాలు చేస్తుండగా నెమలివాహనంపై యుద్ధరంగం నుండి పరాజితుడైనాడు.

ఉ. పంబి రణక్షీతిన్‌ శరవిపాటిత శాత్రవనీరుండైన యా సాంబుండు హేమపుంఖశిత సాయకజాలము లేర్చి భూరి కో పంబున నేసివన్‌ బెదరి బాణతనూభవు( డోడి పాటె శౌ ర్యంబును బీరముం దగవు నాజడినోవ బలంబు లార్వంగన్‌. శీడేర

పదవ స్కంధము - ఉత్తరభాగము 89

  • |త్రుభయంకరుడైన సాంబుడు విజృంభించి తీవ్రక్రోధంతో వాడిబాణాలను ప్రయోగించగా బాణుని

పుత్రుడు బెదరి శౌర్యం కోల్పోయి శత్రువీరులు హేళన చేస్తుండగా పలాయనం చిత్తగించాడు.

మ. వరబాహాబలశాలి యా హలి రణావష్టంభ సంరంభ వి స్ఫురదుగ్రాశనితుల్యమైన ముసలంబుం బూని వ్రేసెన్‌ బొరిం బొరి. గుంభాండక కూపకర్ణులు శిరంబుల్‌ వ్ర్‌స్పి మేదయబు నె త్తురు గర్హంబుల వాతనుం దొరంగ సంధుల్‌ న్రీలి వే చాన(గన్‌. శే?

  • పరాక్రమశాలి మైన బలరాముడు వజ్రాయుధంతో సమానమైన తన రోకలిని చేతదాల్చి కుంభాండక

కూపకర్ణులను ఎదుర్కొన్నాడు. ఆ ముసలాయుధపు దెబ్బలకు వారిద్దరూ నెత్తురు కక్కుకొని అసువులు వీడారు.

వ. అట్టియెడ సైన్యంబు దైన్యంబు నాంది యనాథం బయి చెడి, విజీగి పాణీనం గని బాణుండు సాత్యకిం గేడించి ప్రళభయాగ్నియుం బోలె విజృంభించి చెయి వీచి బలంబుల మరలం బురికొల్సి తానును ముంగలియై నడచె, నప్పు డుభయ సైన్యంబు లన్యోన్యజయకాంక్షం దలపడు దక్షిణోత్తర సము(ద్రంబుల రౌద్రంబున వీంకం దాంకినం బోరు ఘఫోరంబయ్యె, నట్టియెడ గదల నడిచియు6 గుఠారంబుల బొడిచియు; సురియలం (గ్రుమ్మియు, శూలంబులం జీమ్మియు; శక్తుల నొంచియు( జక్రంబులం (ద్రుంచియు; ముసలంబుల మొత్తియు, ముద్గరంబుల నొత్తియు( గుంతంబుల (గ్రుచ్చియు6 బంతంబు లిచ్చియుం బరిఘంబుల నొంచియు. బట్టీసంబులం ద్రుంచియు; శరంబుల నేసియు గరవాలంబుల (వ్రేసియు; సత్రాసులై పాసియు, విత్రాసులై డాసియు6 బెనంగినం దునిసిన శిరంబులును, దునుకలైన కరంబులును, దెగిన కాళ్ళును, ద్రైెస్సిన వ్రేళ్ళును; దుమురులైన యెముకలును, (బోవులైన (్రేవులును; నులిసిన మేనులును, నలిసిన జానువులును; నొగిలిన వర శంబులును, బగిలిన చర్మంబులును, వికలంబు లయిన సకలావయవనంబులును,వికీర్ణంబు లయిన కర్ణంబులును; విచ్చిన్నంబులైన నయనంబులును, వెడలు రుధిరంబులును; బడలుపడు బలంబులును, గొండలవడువునం బడు మాంసఖండంబులును; వాచజచు కొజప్రాణంబులును, వ్రాలిన తేరులును; గూలిన కరులును, నొజగిన గుజ్ణంబులును; దెరలిన కాలుబలంబులును గలిగి, పలలఖాదన కుతూహలజనిత మదాంధీభూత పిశాచ డాకినీ భూత బేతాళ సమాలోల కోలాహల భయంకరారావ బధిరీకృత సకలదిశావకాశంబయి సంగరాంగణంబు భీషణం బయ్యె, న య్యవసరంబున. 418

  • ఆ సమయాన బాణుని సైన్యం దీనత్వంతో అనాథయై పారిపోవ నారంభించింది. అదిచూచి

బాణాసురుడు సాత్యకిని అలక్ష్యంచేసి ప్రళయాన్నివలె విజృంభించి తనసైన్యాన్ని పురికొల్పి తాను సేనకు అ(గ్రభాగాన నడిచాడు. అప్పుడు ఉభయసైన్యాలూ అన్యోన్యజయకాంక్షతో తలపడిన ఉత్తర దక్షిణ సము(ద్రాలవలె విజృంభించి యుద్దానికి సిద్ద పడ్డాయి. సంకుల యుద్దం సాగింది. గదలు, ఖడ్గాలు, సురియలు, శూలాలు, చక్రాలు, శక్తులు, బల్లెములు, పట్టిసములు మున్నగు ఆయుధాలతో ఇరుపక్షాల సైనికులు యుద్దం చేశారు. కొందరు భయంతో పారిపోయారు. కొందరు దైర్యంతో ఎదిరించారు. కాళ్ళు, వ్రేళ్లు,

90 పోతన భాగవతము తలలు, చేతులు తెగిపోయాయి. ఎముకలు ముక్కలయ్యాయి. (ప్రేగులు కుప్పలు పడ్డాయి. చెవులు తెగిపోయాయి. కళ్ళు విచ్చిన్నమైనాయి. మాంసఖండాలు కొండలవలె యుద్ధరంగంలో పడ్డాయి. రథాలు కుప్పగూలాయి. గజాలు నేలవ్రాలాయి. గుర్రాలు కూలబడ్డాయి. కాల్బలం మట్టికరచింది. యుద్ధరంగంలో పడిన ఈ శవాల మాంసాన్ని భక్షించడానికి గుమికూడిన భూతపిశాచ బేతాళుల భయంకర ధ్వనులతో సకలదిశలు మార్మోగాయి. సంగరాంగణం ఈ తీరున మహాభీషణమై ఘోరాతిఘోరంగా మారిపోయింది. చ. శరకుముదంబు లుల్లసితచామర ఫేనము లాతపత్ర భా సుర నవపుండరీకములు శోణితతోయము లస్లి సైకతో త్కరము భుజాభుజంగమనికాయము కేశకలాప శైనల స్ఫురణ రణాంగణం బమరెం బూరిత శోణనదంబు సోలికన్‌. త్తం శ అమ్ములు కలువపూలుగా, చామరాలు నురుగు తెట్టెలుగా, ఆతపత్రాలే తెల్లదామరలుగా, రక్తమే నీరంగా, ఎముకలు ఇసుక తిన్నెలుగా, భుజాలే సర్పాలుగా, కేశాలే నాచుగా, రణరంగం ఒక రక్త సరస్సుగా ఆ సమయంలో భాసించింది. వ అట్టి యెడ బాణుండు గట్టలుకం గృప్పునిపై. దన రథంబు( బజపించి, యఖర్వబాహా సహస్ర దుర్వారగర్వాటోప ప్రదీప్తుండై కదిసి. 420

  • అప్పుడు బాణాసురుడు మిక్కిలి కోపంతో తన రథాన్ని ముందుకు నడిపించి, సహ(స్ర బాహువు లున్నవనే అహంకారంతో శ్రీకృష్ణుని మార్కొన్నాడు. మ. ఒక యే నూజు కరంబులన్‌ ధనువు లళత్యుగ్రాకృతిం దాల్చి త క్కక యొక్కొక్కట సాయకద్వయము వీంకం బూన్ఫు నాలోన నం దకహస్తుండు తదు[గ్రచాపచయ విధ్వంసంబు గావించి కొం కి చక తత్సారథి గూల నేసి రథముం జక్కాడి శౌర్యోద్ధతిన్‌. త్త్త2కే
  • బాణాసురుడు అయిదువందల చేతులతో ధనుస్సులను ధరించి తక్కిన ఐదువందల హస్తాలతో రెండేసి చొప్పున బాణాలను సంధించే సమయంలోనే శ్రీ కృష్ణుడు అవక్రవిక్రమంతో విజృంభించి ఆ ధనుస్సులను ధ్వంసం చేసి సంకోచించకుండా సారథిని సంహరించి బాణుని రథాన్ని నుగ్గు గావించాడు. ॥ "మ తే. ప్రళయ జీమూత సంఘాత భయద భూరి, భైరనారానముగ నొత్తె బాంచజన్య మఖిలజనులు భయభ్రాంతులయి చలింప( గడంగి నిర్భిన్న రాక్షసీగర్భముగను. డ్త2:2
  • అలాచేసి శ్రీకృష్ణుడు ప్రళయకాలంనాటి మేఘగర్జనంతో కూడిన తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శంఖారావం ధ్వని విని సమస్తజనులు భయభ్రాంతు లయ్యారు. రాక్షస స్త్రీల గర్భనిర్భేదక మైంది. న. అట్టి యవక్ర విక్రమ పరాక్రమంబునకు నెగడుపడి బాణుండు లేటమొగంబు నడి చేయునది లేక విన్ననయి యున్నయెడ. త23

పదవ స్కంధము - ఉత్తరభాగము 9

  • స్హ్రికృష్ణుని భయంకర పరా(క్రమానికి వెరగుపడి బాణాసురుడు ఏమీచేయలేక నిశ్ళేష్టుడయ్యాడు. సీ, అత్తజిం గోటర యను బాణజనయిత్రి సుతు గాచు నుతము సన్మతి. దలంచి వీడి శిరోజముల్‌ వ్రేలంగ నిర్ముక్త పరిధానయై మురాసురవిభేది యెదుర నిల్చిన జూడ మది జూల రోసి పరాజ్ముఖుండై యున్న ననువు వేచి తల్లడించుచు బాణు! డుల్లంబు గలగంగ6 దలచీర వీడ యాదవులు నవ్వ తే. నవ్యకాంచనమణి భూషణములు రాల(, బాదహతి నేల గంసింపం బాణీ యాత్మ పురము వడిం జొచ్చె నప్పుడు భూతగణము, లాకులతతోడ నెక్కడే నరుగుటయును. 424
  • ఆ సమయంలో బాణాసురుని తల్లి అయిన "కోటర” తన కుమారుని రక్షించుకో దలచి వీడినజుట్టుతో, వివస్తయై శ్రీకృష్ణుని యెదుట నిలిచింది. అమెను చూడటానికి అసహ్యించుకొని మాధవుడు మారుమొగం పెట్టాడు. ఆసమయంలో బాణాసురుడు తలపాగ వీడిపోగా, భూషణాలు రాలిపోగా యాదవులు పరిహసిస్తుండగా తన పట్టణానికి పారిపోయాడు. అప్పుడు భూతగణాలు గూడా యుద్ధరంగం వీడి పోయాయి. క. శిరములు మూండును ఘన భీ, కరపదములు మూండు! గలిగి కనలి మహేశ జ్వర మురు ఘోరాకృతితో, నరుదేరంగం జూచి కృష్ణు. డల్లన నగుచున్‌. డ25 చ. పరువడి వైష్ణవజ్వరము( బంచిన న య్యుభయజ్వరంబులున్‌ వెరవును లావు6 జేనయును వీరము బీరము గల్లి ఘోర సం గర మొనరింప నందు గరకంఠకృతజ్వర ముగ్రవైష్ణన జ్వరమున కోడి పాజె ననివారణ వైష్ణవి వెంట నంట'గన్‌, డ26్ర
  • దే సమయంలో మూడు శిరస్సులతో మూడుపాదాలతో తీవ్ర క్రోధంతో శివజ్వరం భయంకరా కారంతో అరుదెంచింది. అదిచూచి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి వైష్ణవ జ్వరాన్ని (ప్రయోగించాడు. ఆ శైవ వైష్ణవ జ్వరాలు తమ తమ శక్తి సామర్థ్యాలతో ఘోరంగా పోరాడాయి. ఆ సంగ్రామంలో శివజ్వరం వైప్ణవజ్వరానికి ఓడిపోయి పారిపోయింది. అప్పుడు వైష్ణవజ్వరం వెన్నంటి తరిమింది. తే, పాణి యే దిక్కు. గానక ప్రాణభీతి, నెనసి యేడ్చుచు నా హృషీకేశు పాద కంజముల బడి 'నను€ గొవు కావు మనుచు, నిటలతట ఘటితాంజలిపుటయు నగుచు. 427
  • ఇ్ఞివజ్వరానికి ఎటు పారిపోవడానికి దిక్కుతోచక దుఃఖిస్తూ పంకజాక్షుని పాదాలపై పడి ప్రణామం చేసి నెన్నుదుట చేతులు జోడించి రక్షించుమని (ప్రార్హించింది. న. ఇట్టు వినుతించె. శ్ష28్ర సీ అవ్యయు ననఘు ననంతశక్తిని బరు లై నట్టి బ్రహ్మ రుద్రామరేంద్ర వరుల కీశ్వరు డైనవాని సర్వాత్మకు జ్ఞానస్వరూపు సమానరహితు

2 పోతన భాగవతము వరదుని జగదుద్భవ స్టితి సంహార హేతుభూతుని హృషీకేశు నభవు (బ్రహ్మచిహ్నంబులై పరంగు సుజ్ఞాన శ క్య్యాదుల నొప్పు బ్రహ్మంబు నీశు ఆ. నజు షడూర్మిరహితు నిజయోగమాయా వి, మోహితాఖిలాత్ము ముఖ్యచరితు మహితతేజు నాదిమధ్యాంతహీనునిం జిన్మయాత్ము నిను భజింతు గృష్ల! డ్త2ం్ర తః శివజ్వరం శ్రీకృష్ణుని ఇలా స్తుతించింది. 'అవ్యయుడవు, అనంత శక్తియుక్తుడవు, బ్రహ్మాది దేవతలకే అధీశ్వరుడవు, సర్వాత్మకుడవు, జ్ఞాన స్వరూపుడవు, అనుపమానుడవు, వరదుడవు, సృష్టి స్టితి లయకారకుడవు, హృషీకేశుడవు, అభవుడవు, పరబ్రహ్మస్వరూపుడవు, యోగమాయచేత సర్వజగత్తును సమ్మోహపరచువాడవు, మహనీయతేజుడవు, ఆదిమధ్యాంత రహితుడవు, చిన్మయాత్స్ముడవు అయిన ఓ శ్రీకృష్ణా! నిన్ను ప్రార్థిస్తున్నాను. వ. అదియునుం గాక లోకంబున దైనం బనేక ప్రకారంబులై యుండు, నది యెట్టి దనినం గలాకాష్టాముహూర్తం బులనం గల కాలంబును, సుకృత దుష్ఫుతానుభవ రూపంబులైన జీవకర్మంబులును; స్వభావంబును, సత్ర రజ స్తమోగుణాత్మకంబైన ప్రకృతియును, సుఖదుఃఖాశ్రయంబైన శరీరంబును, జగజ్జ్ఞంతు నిర్వాహకం బైన ప్రాణంబును, సకలపదార్ధ పరిజ్ఞాన కారణంబైన యంతఃకరణంబును, ముహదహంకార శబ్ద స్పర్భ రూస రస గంధ తన్మాత్ర తత్కార్యభూత గగన పవనానలసలిల ధరాది సంచభూతంబు లాదిగా( గల ప్రకృతి వికారంబులును, నన్నింటి సంఘాతంబును, బీజాంకుర న్యాయంబునం గార్యకారణ రూప 'ప్రవాహంబునునై జగత్కారణశంకితంబై యుండు, నది యంతయు భవదీయ నూయా విడంబనంబుగాని యున్నయది కాదు, తదీయ నూయానినర్తకుండవైన నీవు నానావిధ దివ్యావతారాది లీలలం జేసి దేవగణంబులను, సత్పురుషులను, లోకనిర్మాణచణులైన బ్రహ్మాదులను బరిరక్షించుచు లోకహింసా ప్రనర్తకులైన దుష్టమార్గగతులం [గ్రూరాత్ముల హింసించుచుందువు, విశ్వ విశ్వంభరాభార నివారణంబు సేయుటకు గదా భవదీయ దివ్యావతార ప్రయోజనంబు, గావున నిన్ను శరణంబు వేయెద. 430

  • జీవా! లోకంలో దైవం అనేక రీతులలో గోచరిస్తాడు, కాలం, ప్రకృతి, శరీరం, ప్రాణం, అంతః కరణం, పంచభూతాలు- ఈ అన్నింటి సంఘాతం బీజాంకురన్యాయంతో కార్యకారణరూపమైన ప్రవాహమై ఈ జగత్తుకు కారణమేమో అని సందేహం కలిగిస్తుంది. ఇది అంతా నీ మాయయే గాని వాస్తవం కాదు. ఆ మాయను నివారించగల నీవు అనేకమైన దివ్యావతారాలను ధరించి లోకనిర్మాణ చణులైన బ్రహ్మాది దేవతలనూ, పుణ్యపురుషులనూ, దేవగణాలనూ రక్షిస్తూ హింసారూపమైన చెడ్డమార్గాన్ననుసరించే దుష్టాత్ములను శిక్షిస్తుంటావు. ఈ భూభారాన్ని తొలగించడమే గదా నీ దివ్యావతారాల ప్రయోజనం? అందువలన నిన్ను శరణు కోరుతున్నాను. సీ. శాంతమై మహితతీక్ష సుదుస్సహంబై యుదారమై వెలుగొందు తానకీన భూరిభాస్వత్తేజమున దాస మొందితి6 గడు! గృళించితి, నన్ను గరుణ6 జూడు మితరదేవోపాస్తిరతి మాని మీ పాద కమలముల్‌ సేవించు విమలబుద్ది యెందాక మది దో6(ప దందాంకనే కదా ప్రాణులు నిఖిలతాపముల. బడుట?

పదవ స్కంధము - ఉత్తరభాగము 9

తే. యవిరళానన్యగతికుల నరసి ప్రోచు, బిరుదు గల నీకు నను గాచు టరుదె? దేవ! (ప్రవిమలాకార! సంసారభయవిదూర! భక్త జనపోషపరితోష! పరమపురుష! డ్తక్షే హో ఓ పరమపురుషా! భక్తజనానందదాయకా! సంసార భయనివారకా! దివ్వాకారా! శాంతమూ, తీక్ష్‌ణమూ, దుస్సహమూ, ఉదారమూ అయి వెలుగొందుతున్న నీ మహత్తర తేజస్సుచే తాపం పొందాను. కృశించిపోయాను. నన్ను రక్షించు. ఇతరదైవాలను సేవించడం మాని నీ పాదపద్మాలను సేవించాలనే బుద్ది ఉదయించేటంత వరకే అన్ని తాపాలు. అనాథరక్షకుడనే బిరుదుగల నీకు నన్ను రక్షించటం ఏ మంత

గొప్ప విషయం!"

చ. అనిన బ్రసన్ను(డై హరి యనంతుడు దైత్యవిభేది దాని కి ట్లనియె 'మదీయ సొధన మనన్యనివారణమౌట నీ మదిం గని నను నార్తి. జొచ్చితివి గావున మజ్వుర తీవ్రదాహ వే దన నిను. బొంద దింక( బరితాపము దక్కుము నీ మనంబునన్‌. శ32

  • అని స్తుతించగా దానవాంతకుడైన అనంతుడు శివజ్వరంతో ఇలా అన్నాడు. 'నా పరాశ్రమం

అనన్య నివారణమని గమనించి నీవు ఆర్తితో నా శరణం కోరావు గనుక నా జ్వరం నిన్ను బాధింపదు. నీ మనస్సులో పరితాపం మాను".

న. అని మఠీయు న ప్పుండరీకొక్షుం డిట్లను, 'నెవ్వరేనియు నీ యుభయజ్వర వివాదంబును, నీవు ముత్ర పత్తిం జొచ్చుటయును. జిత్తంబులం దలంతు రట్టిపుణ్యాత్ములు శీతోస్ణజ్వరాది తాపంబుల బొారయ' రని యానతిచ్చిన న మ్మహేశ్వర జ్వరంబు పరమానందభరిత హృదయంబై యా రథాంగ పాణికి సాష్టాంగ దండప్రణామం బాచరించి నిజేచ్చం జనియె, నంత బాణాసురుండు నక్కడ. జీ3

  • అని ఇంకా ఇలా అన్నాడు. ఈ శైవ వైష్ణవ జ్వరాల వివాద వృత్తాంతాన్నీ, నీవు నన్ను శరణుకోరిన

విధానాన్నీ, ఎవ్వరు మనస్సులో తలచు కుంటారో అటువంటి పుణ్యాత్ములకు శీతోష్ట జ్వరాది తాపాలు

కలుగవు అని అనగా మహేశ్వర జ్వరం మిక్కిలి సంతోషించి శ్రీ కృష్ణునకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్లి

సోయింది. ఇది ఇలా ఉండగా అక్కడ బలికుమారుడైన బాణాసురుడు మళ్లీ యుద్దసన్నద్దుడై బయలుదేరాడు. -:బాణాసురుండు రెండవసారి యుద్ధమునకు వచ్చుట :-

ఫీ క్రమనీయ కింకిణీఘంటికా సాహస్ర ఘణఘణధ్వనిచేత గగన మ గల " నన్యజనాలోక నాభీలతరళో[గ్ర కాంచనధ్వజపతాకలు వెలుంగ6 బృథునేమి ఘట్టన( బృథివి కంసింపంగ వలనొప్పు పటుజవాశ్వములం బూన్ని

'ఒణ్ళి ఒబ్శి కి, నట్టి యున్నత రథం బత్యుగ్రగతి నెక్కి కరసహస్రమున భీకరతరాసి

తే, శర శరాననముఖ దివ్యసాధనములు, దనర జలమును బలము నుత్కటము గాగ హర్ష మిగురొత్తం. గయ్యంపు టాయితమున( బురను నెలువడె బలిపుత్తు(. డురుజవమున. 434

9 పోతన భాగవతము

  • ఆకాశాన్ని బ్రద్దలు చేస్తున్న అసంఖ్యాకమైన చిరుగంటల ధ్వనితో కూడినదీ, శత్రువులకు తేరిచూడరానంత భయంకరమైన బంగారు ధ్వజపతాకలతో ప్రకాశించేదీ, చక్రాల తాకిడితో భూమిని కంపింప జేస్తున్నదీ, వేగవంతములైన అశ్వాలను కూర్చినదీ ఐన ఒక ఉన్నత రథాన్ని అధిరోహించి అమితో త్సాహంతో బాణాసురుడు యుద్ధరంగానికి వచ్చాడు. అతని వేయిచేతులలో ధనుర్పాణాలూ, భయంకరమైన ఖడ్లాది ఆయుధాలూ ప్రకాశిస్తున్నాయి.

క చని రణభూమిని మధ్యం, దిన మార్తాండ ప్రచండ దీస్తాక్కృతితో( దనరుచు. బరిసంథిబలేం, ధన దవశిఖిదైన కృష్ణు. దాణెం బెలుచన్‌. ఢీ3ెర్‌

  • బాణాసురుడు ఈ విధంగా కదలి కదన రంగంలో మధ్యాహ్న మార్తాండునివలె ప్రకాశిస్తూ

శత్రువులనే ఇంధనాలకు అగ్నిజ్యాలవలె విరాజిల్లే శ్రీకృష్ణుని ఎదుర్కొన్నాడు.

ఉ. తాంకి భుజావిబంభణము దర్శము నేర్పును నేర్పడంగ నొ క్యూ(కున వేయిచేతుల మహో(గ్రశరానళి పింజ పింజతో! దాక(గ నేసినన్‌ మురవిదారుండు తోడన తచ్చరావళి న్నాంక గొనంగ6 ద్రుంచె నిశితార్హశశాంక శిలిముఖంబులన్‌. 436

  • బల్రిపుత్రుడు తన భుజబలం ద్యోతకమౌతుండగా ఒకేసారి వేయి చేతులతో శ్రీకృష్ణునిపై

గ | వ్‌ వాడిబాణాలను ప్రయోగించాడు. మురాంతకుడు ఆ బాణవర్షాన్ని లెక్కచేయకుండా మార్గమధ్యంలోనే తన అర్హచంద్రబాణాలతో వాటిని త్రుంచివేశాడు.

వ. అంత. డ్త్ర7

చ. నుతనవ పుండరీకనయనుం డన నొప్పు మురారి రోష ఘూ ర్లిత మహితారుణాబ్దదళ నేత్రుండు దా నటు పంచె దైత్యుపై దితిసుత కాననప్రవర దీపితశుక్రము రక్షితాంచితా శ్రితజన చక్రమున్‌ సతతసేవితశక్రము దివ్యచక్రమున్‌. 438

  • అప్పుడు తెల్లదామరరేకుల వంటి శ్రీకృష్ణుని నేత్రాలు రోషంతో ఎర్రదామరకేకులుగా

మారిపోయాయి. రాక్షసులనే అరణ్యాలను అ్నివలె కాల్చివేసేది, ఆశ్రితజన రక్షణ గావించేదీ, దేవేంద్రాది దేవతలచే సేవింప బడేదీ అయిన సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుండు బాణాసురునిపై ప్రయోగించాడు.

వ. అదియునుం బ్రచండమార్తాండమండల ప్రభానిడంబితంబును, భీషణ శతసహస్రకోటి దంభోళి నిష్టుర నిబిడ నిశిత ధారాసహస్ర ప్రభూత జ్వలన జ్వాలికాపాస్త సమస్తకుటిల పరిపంథి దుర్యార బాహాఖర్వ గర్వాంధకొారంబును, సకల దిక్సాల దేవతాగణ జేగీయమానంబును, సమదదానవజన శోకకారణ భయంకర దర్భ్శనంబును, సమంచిత సజ్జనలోక ప్రియంకర స్పర్భనంబును నగు సుదర్శనం బసురాంతక ప్రేరితంబై చని, యారాముకారుండు కదళికా కాండంబుల నేర్చు చందంబునం బేర్చి

పదవ స్కంధము = ఉత్తరభాగము 95 సమద వేదండశుండా దండంబుల విడంబించుచు( గనకమణివలయ క్రేయూరకంకణాలంకృతంబు నగు తదీయ బాహాసహ(్రంబు( గరచతుష్టయావశిషస్టంబుగా. దునుము నవసరంబున. శం

  • ప్రచండ సూర్యమండలంలా శోభిస్తూ, పదివేలకోట్ల వజ్రాయుధాల జృలన జ్వాలలతో శత్రువుల గర్యాంధకారాన్ని నివారిస్తూ సమస్త దేవతల స్తుతుల నందుకుంటూ, తన దర్శనంతో దానవులకు శోకం కలిగించేదీ, తన సంస్పర్శనంతో సజ్జనులకు ఆనందం కలిగించేదీ అయిన సుదర్శన చక్రం దానవాంతకునిచే 'ప్రయోగింపబడి రత్నఖచితాలైన ఆభరణాలతో శోభిస్తూ మదగజం తుండాల లాగా వెలుగొందుతున్న బాణాసురుని వేయిచేతులలో నాల్గింటిని మాత్రం వదలి తక్కిన వానిని తోటమాలి అరటిస్తంభాలను నరకివేసినట్టు ధ్వంసం చేసింది.

-; శివుండు బాణుని రక్షింప శ్రీకృష్ణుని స్తుతించుట :-

తే. కాలకంఠుండు బాణుపైం గరుణ గలండు, గాన నభిలాండపతి గృష్టు. గదియ వచ్చి

పురుషసూక్తంబు సదివి సంపుటకరాబ్టుం డగుచు! బద్మాయతాన్షు నిట్లని స్తుతించె. త్తత్ష౦0

  • పరమేశ్వరునికి బాణాసురుండటే ఎంతో దయ. అందువల్ల ఆయన అతనిని రక్షించడానికి లోకనాయకుడైన శ్రీకృష్ణుని చెంతకు వచ్చి నమస్కరించి పురుషసూక్తం పఠించి పద్మనేత్రుని ఇలా స్తుతించాడు.

వ. 'దేవా! నీవు బ్రహ్మరూపంబగు జ్యోతిర్మయుండవు, నిఖిల వేద వేదాంత నిగూఢుండవు, నిర్మలుండవు,

సమానాధిక రహితుండవు, సర్వవ్యాపకుండవైన నిన్ను నిర్మలాంచ:కరణులైనవార లాకొశంబు పగిది నవలోకింతు, రదియునుం గాక పంచోపనిషన్మయం బయివ భవదీయ దివ్యమంగళ మహావిగ్రహ పరిగ్రహంబు సేయు నెడ నాభియం దాకాశంబును, ముఖంబునం గృశానుండును, శిరంబున స్వర్గంబును, శోత్రంబుల దిశలును, నేత్రంబుల సూర్యుండును, మనంబున. జంద్రుండును, బాదంబుల నసుంధరయు, నాత్మయం దహంకారంబును, జఠరంబున జలధులును, రేతంబున నంబువులును, భుజంబుల నింద్రుండును, రోముంబుల మహీరుహొషధీవ్రాతంబును, శిరోజంబుల బ్రహ్మలును, జ్ఞానంబున సృష్టియు నవాంతర ప్రజాపతులును, హృదయంబున ధర్మంబును గలిగి మహాపురుషుండవై లోకకల్పనంబు కొజకు నీ యకుంఠిత తేజంబు గుప్పంబు సేసి జగదుదృనంబు కొణకు6 గైకొన్న భవదీయ దివ్యావతారవైభనం బెజణింగి నుతింప నెంతవారము; నీవు సకల చేతనాచేతన నిచయంబులకు నాద్యుండవు, అద్వితీయుండవు, పురాణపురుషుండవు, సకలస్పష్టి హేతుభూతుండవు, ఈశ్వరుండవు, దినకరుండు కాదంబినీ కదంబావృతుం డగుచు భిన్నరూపుండై బహువిధచ్చాయలం దోంయయ విధంబున నీ యఘటితఘటనా నిర్వాహకంబైన సంకల్పంబున (దిగుణాతీతుండ నయ్యును సత్తాదిగుణ వ్యవధానంబుల ననేక రూపుండవై గుణవంతులైన సత్స్పురుషులకు౬ దమోనివారకంబైన దీపంబు రూపంబునం బ్రకాశించుచుందువు, భవదీయనూయా విమోహితు లయిన జీవులు పుత్ర దార గృహ క్షేత్రాది సంసారరూపకంబైన పాప పారావారమహావర్త గర్తంబుల మునుంగుచుం దేలుచుందురు, దేవా! భవదీయ దివ్యరూపానుభవంబు

గ్ర పోతన భాగవతము సేయంజాలక యింద్రియపరతండత్రుండై భవత్సాద సరసీరుహంబుల! జేర నెజుంగని మూఢాత్ముం డాత్మవంచకుం డనంబడు, విపరీతబుద్దిం జేసి ప్రియుండవైన నిన్ను నొల్లక యింద్రియార్జానుభవంబు పేయుట యమృతంబు మాని హాలాహలంబు సేవించుట గాదె? జగదుదయపాలన లయ లీలాహేతుండవై శాంచుండవయి సుహృజ్జన భాగధేయుండవై సనూనాధిక వస్తుళూన్యుండవైన నిన్ను నేనును బ్రహ్మయుం బరిణతాంతఃకరణులైన మునిగణంబులును భజియించుచుందునము, మజీయును. శతక

  • దేవా! నీవు బ్రహ్మస్వరూపుడవు. జ్యోతిర్మయుడవు. సమస్త వేదవేదాన్త నిగూఢుడవు. నిర్మలుడవు. నీతోసమానుడు అధికుడు మరొకడు లేడు. సర్వవ్యాపకుడవైన నిన్ను నిర్మల స్వభావులు ఆకాశం లాగా దర్శిస్తారు. నీవు పంచోపనిషన్మయం బయిన నీ దివ్యమంగళ వి(గ్రహాన్ని పరి[గ్రహించునప్పుడు నాభియందు ఆకాళాన్నీ, ముఖంలో అన్నినీ, శిరస్సున స్వర్లాన్నీ, చెవులలో దిక్కులనూ, నేత్రాలలో సూర్యుణ్లీ, మనస్సులో చంద్రుణ్జీ పాదాలలో భూమినీ, ఆత్మలో అహంకారాన్నీ, కడుపులో సము(ద్రాలనూ, రేతస్సులో నీటినీ, భుజాలలో దేవేంద్రుణ్ణీ వెండ్రుకలలో వృక్షాషధీవిశేషాలనూ, శిరోజాలలో (బ్రహ్మలనూ, జ్ఞానంలో సృష్టినీ 'ప్రజాపతులనూ, హృదయంలో ధర్మాన్నీ వహించిన మహాపురుషుడవు. అయితే లోకంకోసం నీ తేజాన్ని దాచి జగత్కల్యాణం నిమిత్తం అవతారం దాల్బావు. అటువంటి నీ దివ్యావతార వైభవాన్ని స్తుతించడం ఎవరికి సాధ్యమౌవుతుంది? నీవు సమస్తసృష్టికి మూలకారకుడవు, అద్వితీయుడవు, పురాణపురుషుడవు. సూర్యుడు మేఘమాలచే కప్పబడి భిన్నరూపాలతో కన్పించే విధంగా అఘటితఘటనా సమర్థమైన సంకల్పంతో త్రిగుణాతీతుడవై గూడా అనేకరూపాలతో గోచరిస్తుంటావు. సత్సురుషులకు అంధకారం తొలగించే దీపంలా ప్రకాశిస్తుంటావు. నీ మాయకు లోనైన జీవులు సంసారమనే సము(ద్రపు సుడిగుండంలో మునిగి తేలుతుంటారు. నీ దివ్యరూపాన్ని దర్శించకుండా, నీ పాదకమలపూజ చేయకుండా ఇం(ద్రియలోలుడైన మూఢుడు ఆత్మవంచకు డనబడతాడు. నిన్ను ధ్యానించకుండా విపరీతబుద్దితో ఇం(ద్రియలోలుడు కావటం అమృతాన్ని వదలి హాలాహలం సేవించడం. సృష్టి స్థితి లయకారకుడవై, శాంతుడవై, సజ్జనభాగధేయుడవై అనుపమానుడవైన నిన్ను బ్రహ్మాది దేవతలూ, మహా మునీంద్రులూ, నేనూ భజిస్తుంటాము. తే. అవ్యయుండ, వనంతుండ, వచ్యుతుండ, వాదిమధ్యాంత శూన్యుండ, వఖిలధృతివి విఖిలమం దెల్ల నర్తింతు నీవు దగిలి, నిఖిలమెల్లను నీయంద నెగడు. గృష్ట! డడ2
  • వాసుదేవా! నీవు అవ్యయుడవు. అనంతుడవు. అచ్యుతుడవు. ఆదిమధ్యాంత శూన్యుడవు. విశ్చంభరుడవు. నీవు సమస్త జగత్తులో సంచరిస్తుంటావు. సమస్త జగత్తు నీలో లీనమై ఉంటుంది. సీ, అని సన్నుతించిన హరి యాత్మ మోదించి మొగమున జిజునవ్వు మొలకలెత్త లలిత బాలేందు కళానౌళి కిట్లను శంకర! నీ మాట సత్య మరయ నేది నీకిష్టమై యెసలెడు దానిన వేండుము, నీ కిత్తు వీ. డవధ్యుం డిది యెట్టి దనిన( బ్రహ్లాదుండు మద్భక్తు డతనికి వరము నీ యన్వయమున

పదన స్కంధము - ఉత్తరభాగము 97 తే. జనన మందిన వారల జంపి ననుచు6 గడంక మన్నించితిని యది కారణమున విశ్వవిశ్వంభరాభార విపులభూరి, బలభుజాగర్వ మడ(పంగ వలయు. గాన, త్తీడ్ష్ర

  • అని స్తుతించగా శ్రీ కృష్ణుడు సంతోషించి చిరునవ్వు నవ్వుతూ చంద్రశేఖరునితో ఇలా సంభాషించాడు.

శంకరా! నీ ఇష్టమైన కోరిక కోరుకో. తీరుస్తాను. ఈ బాణాసురుడు చంపదగినవాడు కాదు. ఎందుకంటే నా భక్తుడైన (ప్రహ్లాదుని వంశంవాడు. “నీ వంశస్థులను సంహరించ”నని ప్రహ్హాదునికి నేను వరం ఇచ్చాను. అందువలన ఇతడు అవధ్యుడు. అందువలన ఇతనిని క్షమించాను. కాని సమస్త భూభారాన్ని మోస్తున్నానని అహంకరించే వీని భుజబలగర్యాన్ని అణచివేయక తప్పదు.

కు కరములు నాలుగు సిక్కం, బరిమార్చితి, వీండు నీదు భక్తుల కగ్రే సరుంై సాగణొంది జరా, మరణాది భయంబు దక్కి మను నిట మీందన్‌. డడ్తేడ

  • అందుకనే నాలుగుచేతులు తప్ప తక్కిన హస్తాలను ఛేదించాను. ఈ బాణాసురుడు నీ భక్తులలో

అగ్రేసరుడుగా స్తుతింంబడుతూ జరామరణాది భయాలు లేకుండా జీవిస్తాడు.

వ. అని యాన తిచ్చిన నంబికావరుండు సంతుష్టాంతరంగుం డయ్యె, న బృ్బలినందనుం గట్లు రణరంగవేదిం గృష్టదేవతా నన్నిధిం బ్రజ్వలిత చక్రకృశాను శిఖభాజాలంబులందు నిజబాహాసహాస్ర శాఖా సమిత్ర్ర చయంబును, దత్‌క్షతోద్వేలకీలాల మహితాజ్యధారాశతంబును, బరభయంకర వీరహుంకార మంత్రం బులతోడ వేల్చి పరిశుద్దిం బొంది విజ్ఞానదీపొంకురంబున భుజాఖర్వ గర్వాంధకారంబు నివారించి నవా(డై యనవరత పూజిత స్టాణుండగు న బ్బాణుండు భుజనన విచ్చేదజనిత విరూపితస్టాణుండయ్యును దదీయనరదాన కలితానంద హృదయారవిందుం డగుచు గోవింద చరణారనిందంబులకు( బ్రణామంబు లాచరించి యనంతరంబ. జర్‌

  • జ్య విధంగా శ్రీకృష్ణుడు అనుగ్రహించగా పరమేశ్వరుడు పరమానందం పొందాడు. బాణాసురుడు

రణరంగమనే యజ్ఞవేదికపై కృష్ణుడనే దేవుని సన్నిధిలో భగభగమండుతున్న చశ్రాయుధ జ్వాలలతో తన హస్తాలనే సమిధలను, రక్తధారలనే ఆజ్యధారలతో, హుంకారాలనే మంత్రాలతో వేల్ళి పరిశుద్దుడయ్యాడు. విజ్ఞానదీపం ఆవిర్భవించడం వలన భుజగర్వమనే అంధకారం తొలగిపోయింది. నిరంతర పరమేశ్చరధ్యానాను రక్తుడైన బాణుడు శ్రీకృష్ణు డిచ్చిన వరదానంతో ఆనందకందళిత హృదయారవిందుడై గోవిందుని పాదారవిందాలకు అభివందనం చేశాడు.

-; ఉషానిరుద్ధ సహితుండై కృష్ణుండు ద్వారకాపురి కరుగుట :-

క. పురమున కేగి యుషా సుం, దరికిని ననిరుద్దునకు ముదంబున భూషాం బర దాసదాసీకాజన, నరనస్తువితాన మొస(గి వారని భక్తిన్‌, శీడ్తగ్ర

98 పోతన భాగవతము క. కనకరథంబున నిడుకొని, ఘనవైభవ మొప్ప( గన్యకా యుక్తముగా ననిరుద్దుని గోవిందుం, డనుమోదింపంగ' దెచ్చి యర్సించె నృపా! శీత?

  • అనంతరం బాణుడు తన నగరానికి వెళ్లి ఉషానిరుద్దులకు సంతోషంతో వ(స్తాభరణాదుల నిచ్చి, దాసీజనులను తోడిచ్చి బంగారు రథంపై ఎక్కించి మిక్కిలి వైభవంతో తీసికొని వచ్చి కన్యతో పాటుగా అనిరుద్దుని గోవిందునకు అప్పగించాడు. శ్రీకృష్ణుడు సంతోషించాడు.

ఉ. అంత మురాంతకుండు త్రిపురాంతకు వీడ్కొని బాణు నిల్పి య త్యంత విభూతిమై నిజబలావలితో( జనుదేర నా యుషా కొంతుండు మున్నుగా. బటహ కాహళ తూర్యనినాద పూరితా శాంతరుండై వెసం జనియె నాత్మపురీముఖుండై ముదంబునన్‌. క్కర

  • తర్వాత మురాంతకుడు త్రిపురాంతకుని చెంత సెలవుతీసుకొని బాణాసురుని అచటనే నిలిపి

అత్యంతవైభవోపేతంగా పరివారసమేతు డై అనిరుద్దుని ముందిడుకొని పహ కాహళ తూర్యాదుల ధ్వనులు దిక్కులు పిక్కటిల్ల జేస్తుండగా ద్యారకానగరానికి బయలుదేరాడు.

మ. కనియెన్‌ గోపకుమారశేఖరుండు రంగత్పుల్లరాజీవ కో కనదోత్తుంగ తరంగసంగత లసత్కాసారకన్‌ భూరి శో భన నిత్యోన్నత సౌఖ్యభారక నుదంచద్వైభవోదారకన్‌ జనసంతాప నివారకన్‌ సుజనభాన్వత్తారకన్‌ ద్వారకన్‌. డడం

  • శ్రీకృష్ణుడు వికసించిన కమలోత్పలాలతో, ఉత్తుంగతరంగాలతో శోభిస్తున్న సరోవరాలతో నిండినదీ,

అనునిత్యమూ సుఖ వైభవాలకూ భోగభాగ్యాలకూ దాపురమైనదీ, సుజనులకు కాపురమైనదీ అయిన ద్వారకా పురాన్ని దర్శించాడు.

న. కని డాయం జనం బురలక్ష్మి కృష్ణసందర్శన కుతూహలయై చేసన్నలం జీరు చందంబున నందంబు నొందు నుద్దూతతరళ విచిత్ర కేతుసతాకాభిశోభితంబును, మహనీయ మరకత తోరణ మండితంబును, గనకమణి వినిర్మిత గోపురసాధ ప్రాసాద వీథికావిలసితంబును, మౌక్తిక వితాన విరచిత మంగళ రంగవల్లీ నిరాజితంబును, శోభనాకలిత విన్యస్త కదళికాస్తంభ సురభి కుసుమమాలి కాక్షతాలంకృతంబును, గుంకును సలిల సిక్త విపణినూర్గంబును, శంఖ దుందుభి భేరీ మృదంగ సటహకాహళ మృదంగాది నుంగళారావకలితంబును, నందిమాగధ సంగీత ప్రసంగంబునునై యతిమనోహర విభవాభిరామంబైన య ప్త్పురవరంబు సచివ పురోహిత సుహృద్చాంధవ నముఖ్యులెదురుకొన భూసురాశీర్వాదంబులను బుణ్యాంగనా కరకలిత లలితాక్షతలను గైకొనుచుం గామినీమణులు గర్బూరనీరాజనంబులు నివాళింప నిజమందిరంబుం బ్రవేశించి య ప్పుండరీకాక్షుండు పరమానందంబున సుఖం బుండె, నంత. 450

  • ద్వారకానగరంలోని కేతనాలు శ్రీకృష్ణుని రమ్మని నగరలక్ష్మి చేసన్న చేస్తున్నట్లున్నాయి. మరకతాల

తోరణాలతో, మణులు పొదిగిన బంగారు భవనాలతో ఆ నగరం విలసిల్లుతున్నది. ఆ పట్టణంలో ముత్యాల

పదన స్కంధము - ఉత్తరభాగము ంం రంగవల్టులు తీర్చబడ్డాయి. అరటి స్తంభాలకు సువాసనతో నిండిన పుష్పమాలలు అలంకరించారు. ఆ పట్టణ విపణిమార్గం కుంకుమనీటితో తడిసిపోయింది. శంఖ దుందుభి భేరీ మృదంగాది మంగళ వాద్యాలు (మోగుతున్నాయి. వంది మాగధుల సంగీతప్రసంగాలు అతిశయించాయి. ఇంతటి వైభవంతో విలసిల్లుతున్న ద్యారకాపట్టణం లోనికి శ్రీకృష్ణుడు (ప్రవేశించాడు. పురోహిత బంధుమిత్రులు స్వాగతం పలికారు. బ్రాహ్మణులు ఆశీర్వదించారు. పుణ్యస్రీలు అక్షతలు చల్లారు. కామినీ మణులు కర్పూరహారతు లిచ్చారు. గోవిందుడు తన మందిరంలో ప్రవేశించి ఆనందడోలికలలో తేలియాడాడు. క. శ్రీకృష్ణుని విజయం బగు, నీ కథం బఠియించువార లెప్పుడు జయముం గై కొని యిహపరసొఖ్యము, లాకల్పోన్నతి వహింతు రవనీనాథా! 451

  • 2 ప్పర్రీక్షిన్మహారాజా! ఈ శ్రీకృష్ణ విజయగాథను పఠించిన వారికి ఎల్లప్పుడూ విజయాలు చేకూరుతాయి. ఇహపర సౌఖ్యాలు శాశ్ళతంగా లభిస్తాయి. క. అని చెప్పిన శుకయోగికి, జననాయకు( డనియెం 'గృష్టచరితము విన నా మన మెపుడు. దనియ దింకను, విన వలతుం గరుణ జెప్పవే మునినాథా!' శ్త52
  • అని పరీక్షిత్తుతో శుకయోగీంద్రుడు చెప్పగా పరీక్షిత్తు ఆ మునీంద్రునితో కృష్ణుని చరిత్ర వినడానికి మనస్సు ఇంకా ఉవ్విళ్లూరు తున్నది. సంతృప్తి కలుగుట లేదు. కరుణతో ఆ కథలను ఇంకా చెప్పమని (ప్రార్థించాడు. న. అనిన బరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లవియె. శ్తీ5ప్ర
  • క్ర విధంగా తనను కోరిన పరీక్షిన్నరేంద్రునితో శుకమునీం(ద్రుడు ఇలా చెప్పసాగాడు. -: నృగమహారాజు చరిత్రము:- ఫీ. ధరణీశ! యొకనాండు హరితనూజులు రతీశ్వర సాంబ సారణ చారుభాను లాదిగా యదుకుమారావలి యుద్యాన ననమున కతివైభనమున నేగి వల నొప్పు నిచ్చానువర్తులై సుఖలీల6 జరియించి ఘనపిపాసలను జెంది నెజి దప్పి సలిల మన్వేషించుచును వేగ వచ్చుచో నొకచోట వారిరహిత తే. కూపమును నందులో నొక కొండవోలె, విపుల మగుమేని యూసరవెల్లిం గాంచి చిత్తముల నిస్మయం బంది తత్తజమున, దాని వెడలించు వేడుక దగులుటయును. డీక్‌డ్తీ
  • ఓ పరీక్షిన్మహారాజా! ఒకనాడు శ్రీకృష్ణుని పుత్రులైన ప్రద్యుమ్నుడు, సాంబుడు, సారణుడు, చారుభానుడు మొదలైన యాదవకుమారులు మిక్కిలి వైభవంగా ఉద్యానవనానికి వెళ్ళారు. స్వేచ్చగా ఆ ఉద్యానవనంలో విహరించి అలసిపోయారు. దప్పిక తీర్చుకోడానికి నీటికోసం వెదికారు. ఒకచోట వారికి ఒక నీరులేని పాడుబడ్డ బావి కన్పించింది. అందులో పెద్దకొండను బోలిన ఊసరవెల్లి ఉన్నది. దానిని చూచి వారందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ ఊసరవెల్లిని బావిలో నుంచి బయటకు తీయాలనుకున్నారు.

100 పోతన భాగవతము చ. పరువిడి పోయి తెచ్చి ఘనపాశచయలంబుల నంటంగట్టి య గ్లురుభుజు లందజుం గదిసి కోయని యార్భుచు దాని నెమ్మెయిం దరలంగ6 దీయలేక దగ దట్టముగా మది దుట్టగిల్ల నాం డొరు గడవంగ వే చని పయోరుహనాభున కంత జెప్పినన్‌. క్ష5్‌5

  • వారంతా పరుగు పరుగున వెళ్లి పెద్దతాళ్లు తెచ్చారు. ఆ శౌర్యవంతు లందరూ ఆ ఊసరవెల్లిని బయటకు తీయడానికి ప్రయత్నించారు. కాని లాభం లేకపోయింది. వారు వేగంగా వెళ్లి శ్రీకృష్ణునితో ఈ విషయం విన్నవించారు. ఉ. విని నరసీరువాక్షు. డతివిస్మితుండై జలశూన్యకూప మ బ్లన కదియంగ వేంగి కృకలాసము నొక్కతృణంబు బోలె గొ బ్బున చెడలించె వాముకర పద్మమున న్నది యంతలోన. గాం చనరుచి మేనం గల్లు పురుషత్వముతోం బొడసూపి నిల్చినన్‌. 456
  • పద్మాక్షుడు ఈ విషయం విని ఆశ్చర్యపడి ఆ నీరులేని బావిచెంతకు వచ్చాడు. తన ఎడమచేతితో ఆ తొండను ఒక గడ్డిపరకను తీసినట్టు అవలీలగా బయటకు తీశాడు. అంతలో ఆ ఊసరవెల్లి బంగారు రంగుతో శోభిల్లుతూ పురుషరూపాన్ని పొందింది. వ. చూచి కృష్ణుం డతని వృత్తాంతం బంతయు నెణీంగియు నక్కడి జనంబులుం గుమారవర్గంబును దెలియుకొణకు నతని చేతః దద్వత్తాంతం బంతయు నెణీంగించువాండై యిట్లనియె. నే
  • అతనిని చూచి శ్రీకృష్ణుడు ఆతని వృత్తాంతం తనకు తెలిసినా గూడా తన కుమారులకూ, తక్కిన జనసమూహానికి తెలియడం కోసం అతని చేతనే అతని కథను చెప్పించాలని భావించి ఇలా అన్నాడు. చు కనదురు రత్నభూషణ నికాయుండవై మహనీయ మూర్తివై యనుపమకీర్తి శోభితుండవై విలసీల్లుచు ధాత్రిమీందం బెం షానరిన నీకు నేమి గతి నూసరనెల్లితనంబు చొప్పడెన్‌ విన నిది చోద్యమయ్యె సువివేకచరిత్ర! యెజుంగం జెప్పునూ!' శ58ి
  • 2 విచిత్ర చరిత్రుడా! రత్చభూషణాలను ధరించి, అసమానమైన కీర్తిని గడించి మహనీయమూర్తివై భూలోకంలో విలసిల్లిన నీకు ఈ ఊసరవెల్లి రూపం ఎలా కలిగింది? ఇది చాలా విచిత్రంగా ఉంది. మాకు నీ వృత్తాంతం వివరంగా చెప్పు, క, అని యడిగిన మురరిపు సద, వనజంబుల దన కిరీటవరనుణు లొౌరయన్‌ వినయమున (మొక్కి యిట్లను, ఘనమోదముతోడ నిటల ఘటితాంజలియె. త్తం
  • అని శ్రీకృష్ణుడు అడుగగా ఆ పురుషుడు మురారి చరణసరోజాలకు తన కిరిటమణులు సోకునట్టుగా నమస్కరించి తన నుదుట చేతులు మోడ్చి ఆనందంతో ఇలా విన్నవించాడు.

పదవ స్కంధము - ఉత్తరభాగము 101 తే, విశ్వసంవేద్య! మహిత! యీ విశ్వనుందు( బ్రకటముగ నీ వెటుంగని దొకటి గలదె మైన నాచేత విన నిష్ట మయ్యెనేని, నవధరింపుము వినిపింతు నంబుజాక్ష! 460

  • ౬ విశ్చవేద్యా! నీవు సర్సజ్ఞాడవు. ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయం లేదు. అయినా నా చేత

చెప్పించుకోవాలని భావించావు గనుక వినిపిస్తాను.

శా. ఏ నిక్వాకుతనూజుండన్‌ నృగుండు నా నేపారు భూపాలుండన్‌ దీనవ్రాతము నర్ధి. బ్రోచుచు ధరిత్రీనాయకుల్‌ గొల్చి స మ్మానింపం జతురంచ భూభరణసామర్జ్యుండనై సంతత శ్రీ నిండారిన వాండ నుల్లసిత కీర్తిస్సూర్తి శోభిల్లంగన్‌. 461

  • నేను ఇక్ష్యాకుని పుత్రుడను. నాపేరు నృగుడు. నేను అనేకులైన భూపాలురు నన్ను సేవిస్తూండగా

రాజ్యపాలన సాగించాను. దీనజనులను పోషించాను. పెంపొందిన కీర్తి సంపదలతో శోభించాను.

చ. పలుకుల. దన్ను( దా బొగడ. బాతకమందు ర టుండె. దారకా వలి సికతావ్రజంబు హిమవారికణంబులు లెక్క పెట్టంగా నలవడుం గాని యేను వసుధామర కోటికి దాన మిచ్చు గో వుల గణుతింప ధాతయును నోపండు మాధవ! యేమి సెప్తుదున్‌? 462

  • త్రన్ను తాను పొగడుకోవడం పాతకమని పెద్దలంటారు. తారలను, ఇసుకరేణువులను,

మంచుబిందువులను లెక్కించవచ్చు. కాని నేను బ్రాహ్మణ(్రేష్టుల కిచ్చిన గోవులను లెక్కించడానికి బ్రహ్మకు గూడా శక్తిచాలదు. మాధవా! ఏమి చెప్పేది!

వ. అదియునుం గాక 463

చు పొలుచు సువర్ణశ్చంగఖురముల్‌ దనరం దొలిచూలులై సువ త్సలు గల పొండియావుల నుదాత్త తపోవ్రత వేదపాఠముల్‌ గలిగి కుటుంబులై విహితకర్మములం జరియించు వేద ని " ప్రులకు సదక్షిణంబుగ విభూతి దలిర్స్బంగ నిత్తు నచ్యుతా! 464

  • అదీ గాక అచ్యుతా! తపోనిధులై వేదపండితులై విహితకర్మల నాచరించే బ్రాహ్మణులకు

బంగారుకొమ్ములు గిట్టలు కలిగి తొలుచూలు దూడలు గల పొడియావులను దక్షిణతోపాటు ఘనంగా దానం చేశాను.

వ. మజియును న్యాయసముపార్దిత విత్తమ్ములగు గో భూ హిరణ్య రత్న నివాస రథ హస్తి వాజి కన్యా సరస్వతీ వస్త తిల కాంచన రజత శయ్యాది బహువిధ దానంబు లనూనంబులుగా ననేకంబులు సేసితిల బంచమహాయజ్ఞంబు లొనరించితి, వాపీ కూప తటాక వన నిర్మాణంబులు సేయించితి, ని వ్విధంబునం జేయుచో నొక్కనాండు. &ీ65

102 పోతన భాగవతము

  • అంతేకాదు. న్యాయసముపార్దితమైన ధనంతో నేను గోదానం, భూదానం, బంగారుదానం, రత్నదానం, గృహదానం, రథదానం, గజదానం, అశ్చదానం, సరస్వతీదానం, వస్త్రదానం, తిలదానం, కన్వాదానం మొదలైన దానాలను ఎన్నిటినో చేశాను. పంచ మహాయజ్ఞాలు నెరవేర్పాను. బావులను దిగుడు బావులను, చెలువులను, వనాలను నిర్మింప జేశాను. ఈ విధంగా దానధర్మాలు చేస్తుండగా ఒక రోజున ఒక విశేషం జరిగింది. క. అనఘా! మునుపడ గళ్యపు( డను విప్రున కే నకల్మషాత్ముండనై యి చ్చిన గోవు దప్పి నా మం, దను గలసినం దెలియలేక తగ నా గోవున్‌. కేరర క. ఒండొక భూమీసురకుల, నుండనునకు దాన మీయ మసలక యావి ప్రుం డా గోవుం గొని చను, చుండన్‌ మును ధారగొన్న యుర్విసురుండున్‌. 467
  • ఓ పుణ్యాత్ముడా! అంతకుముందు నేను కళ్యపుడనే విష్రునికి పవిత్రహృదయంతో దానమిచ్చిన గోవు తప్పిపోయి తిరిగి వచ్చి ఆలమందలో కలిసిపోయింది. నాకు అది తెలియక ఆ గోవును ఇంకొక 'బ్రాహ్మణోత్తమునికి దాన మిచ్చాను. ఆ (బ్రాహ్మణుడు ఆ ఆవును తోలుకొని వెళుతున్నాడు. ఇంతకుముందు నాచే దానం పొందిన కళ్యపుడు ఆ గోవును చూచాడు. క. మది రోష మొదవ దోవతి, వదలిన బిగియించుకొనుచు వడి. గది 'సిది నా మొదవు, నడినీథి దొంగిలి, వదలక కొనిపోయె, దిట్టివారుం గలరే? 46రి
  • అలా చూచిన కశ్యపుడు అతిశయించిన రోషంతో ఊడిపోతున్న దోవతి బిగించి వేగంగా ఆవును తోలుకొని వెళ్లే బ్రాహ్మణుని దగ్గరకు వెళ్లి 'ఇది నా ఆవు. దీనిని దొంగిలించి నడివీథిలో తోలుకొని పోతున్నావు. ఇటువంటివారు ఎక్కడైనా ఉంటారా?” అన్నాడు. చ. అనవుడు నాత6 డిట్లనియె నాతనితో “*నిపు డేను దీని నీ జనపతిచేత ధారగొని సాధుగతిం జన నీది యంట యొ ట్లనిన నతండు 'నేనును ధరాధిపుచే మును ధారగొన్న యా వని వినిపింప నిద్దణకు నయ్యె నపార వివాద మచ్చటన్‌. శర్ర9
  • ఆ మాటలు విని గోవును తోలుకొని వెళుతున్న (బ్రాహ్మణుడు కశ్యపునితో 'ఈ ఆవును నేను రాజుగారి దగ్గర దానంగా స్వీకరించాను. ఈ గోవు నీది అంటున్నావు. ఇదేమిటి?” అన్నాడు. అప్పుడు కళ్యపుడు 'నేను గూడా ఈ ఆవును రాజుగారి దగ్గరే దానంగా (గ్రహించా' నని అన్నాడు. ఈ విధంగా ఇద్దరు (బ్రాహ్మణులకూ అక్కడ పెద్ద వివాదం జరిగింది. వ. ఇట్లు విష్రు లిద్దణుం దమలో నంతకంతకు మచ్చరంబు పెచ్చు పెరింగి కలహించి నా యున్న యెడకుం జనుదెంచిరి, మున్ను నాచేత గోదానంబు గొన్న బ్రాహ్మణుం డిట్లనియె. ఉ70

పదవ స్కంధము - ఉత్తరభాగము 103

  • ఆ బ్రాహ్మణు లిద్దరూ అంతకంతకూ అసూయతో బాగా కలహించుకొని నా దగ్గరకు వచ్చారు. అప్పుడు కశ్యపుడనే భూసురుడు నాతో ఇలా అన్నాడు. సీ, 'మనుజేంద్ర! ప్రజ లధర్మ ప్రవర్తనముల నడవకుండంగ నాజ్జ నడపు నీవు మనమున నే ధర్మ నుని యాచరించితి? మును నాకు నిచ్చిన మొదవు దప్పి వచ్చి నీ మందలో. జొచ్చిన నిప్పు డీ భూసురునకు ధార వోసి యిచ్చి తగవు మాలితివి, దాతవు నపహర్తవు నైన నిన్నేమందు? నవనినాథ!

తే. యనిన మాటలు సెవులు సోంకినం గలంగి, భూసురోత్తమ! యజ్ఞానపూర్వకముగ నిట్టి పాపంబు దొరసె నే నెటింగి సేయం గొనుము నీ కిత్తు నొక లక్ష గోధనంబు.' త్తే

  • , రాజేంద్రా! నీవు ప్రజలను అధర్మమార్గంలో నడవకుండా ఆజ్ఞాపించవలసిన వాడవు. నీవు ఏ

విధంగా అధర్మమైన ఈ పనిచేశావు? ఇంతకుముందు నాకు దానమిచ్చిన ఈ గోవు తప్పిపోయి నీ మందలో కలిసిపోయింది. దీనిని ఇప్పుడు ఈ (బ్రాహ్మణునికి దానం ఇచ్చావు. ధర్మం తప్పావు. దానకర్తవు, అపహర్తవు రెండూ నీవే అయ్యావు. నిన్నేమనగలము?” అన్నాడు. ఈ మాటలకు నేను బాధపడి ఓ బ్రాహ్మణోత్తమా! అజ్ఞానంవలన ఈ పొరపాటు జరిగింది. ఇది నేను తెలిసి చేసిన తప్పు కాదు. ఇందుకు బదులుగా నీకు లక్షగోవులను సమర్పిస్తాను. స్వీకరించు" అన్నాను.

క. అని మజీయును న వ్విఫ్రుని, సునయోక్తుల ననునయింపుచును నిట్లంటిన్‌ నను గావు, నరకకూసం, బునం బడంా జాలం విప్రపుంగవ!" యనుచున్‌. డ్త72

  • ఇంకా ఆ బ్రాహ్మణుని అనేక రీతులుగా బతిమాలి ప్రాధేయపడి “మహాత్మా! నన్ను నరకకూపంనుండి

రక్షించండి' అని (ప్రార్హించాను.

తే. ఎంత వేండిన మచ్చరం బంత సెరింగి, మొదల నా కిచ్చినట్టీ యీ మొదవె కాని యెనయ నీ రాజ్యమంతయు నిచ్చితేని, నొల్ల' నని విప్రః డచ్చట నుండ కరిగె, &73

  • శ్లన్సు ఏంత వేడుకుంటే అతనిలో మచ్చరం అంత పెచ్చు పెరిగింది. మొదట నీవు నా కిచ్చిన

గోవును తప్ప నీవు నీ రాజ్యమంతా ఇచ్చినా నేను అంగీకరించను" అని చెప్పి అక్కడనుంచి విసవిస వెల్లి పోయాడు.

న. అ ట్లతం డరిగిన నా రెండవ బ్రాహ్మణునిం బ్రార్థించిన నతండును జలంబు డింసక పదివే లేజీ కోరిన పాండి మొదవుల నిచ్చిన నైనను “దీనిన కాని యొల్లి నని నిలువక చనియె, నంత గాలపరిపక్వంబైన నన్ను దండధర కింకరులు గొనిపోయి వైవస్వతు ముందటం బెట్టిన నతండు నన్ను నుద్దేశించి యిట్లనియె. డ్త్గౌత్త

  • ఆ బ్రాహ్మణుడు వెళ్లిన తర్వాత రెండవ (బ్రాహ్మణుని ఆ గోవు నిమ్మని ప్రార్ధించాను. అతడు

గూడా పట్టుదలతో నివు పదివేల గోవులను ఇచ్చినా నాకు అవసరం లేదు. నాకు ఈ గీోవే కావాలి” అని

104 . పోతన భాగవతము అచ్చట నిలబడకుండా వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాలం పరిపూర్తి కాగా నన్ను యమభటులు తీసికొని వెళ్లి యమధర్మరాజు ముందు నిలిపారు. యమధర్మరాజు నాతో ఇలా అన్నాడు. మ. మనుజేంద్రోత్తను! వంశపావన! జగన్మాన్యక్రియాచార! నీ ఘనదాన క్రతుధర్మముల్‌ (త్రిభువన ఖ్యాతంబులై చెల్లెడిన్‌, మును దుష్కర్మఫలంబు నొంది పిదపం బుణ్యానుబంధంబులై చను సొఖ్యంబులం బొందు, పద్మజుని యాజ్ఞం (ద్రోవ(గా వచ్చునే? శ్త75

  • శ మహారాజా! నీ దానక్రియలు, యజ్ఞకార్యాలు ముల్లోకాలలో (ప్రఖ్యాతి గాంచాయి. నీ పాపఫలాన్ని మొదట అనుభవించి అటుపిమ్మట స్వర్గసాఖ్యాలను అనుభవించు. (బ్రహ్మదేవుని ఆజ్ఞ దాటరానిది కదా!" వన. అని వేగంబున ద్రొబ్బించిన నేను బుడమిం బడునపుడ యీ నికృష్ణంబయిన యూసరవెల్లి రూపంబు( గైకొంటి. నింత కాలంబు దద్దోషనిమిత్తంబున నిద్దురనస్థం బొందనలసె౮ బ్రాణులకు. బుణ్యపాపంబు లఅనుభావ్యంబులు గాని యూరక పోనేరవు, నేండు సమస్త దురితనిస్తారకం బయిన భవదీయ పాదారవింద సందర్భనంబునం జేసి యా ఘోరదుర్హశలం బాసి నిర్మలాత్మకుండ నైతి నని పునఃపునః ప్రణామంబు లాచరించి మజీయు నిట్లనియె. డర

  • బలా పలికి యముడు నన్ను అచ్చటినుండి త్రోసివేయించాడు. నేను భూమిపై పడేటప్పుడే ఈ

ఊసరవెల్లి రూపం సంభవించింది. ఇంత కాలము ఆ దోషం పోవడానికే ఈ దురవస్థ పొందవలసి వచ్చింది. ప్రాణులు తమ తమ పుణ్యపాప ఫలాలను రెంటినీ అనుభవించ వలసిందే. అవి ఊరకపోవు. ఈ నాడు సమస్తపాపాలను పోగొట్టగల నీ పాదపద్మాలను దర్శించి ఘోర దుర్షశనుండి బయటపడి నిర్మల హృదయుడ నయ్యాను” అని నమస్కరించి ఇంకా ఇలా ప్రార్ధించాడు.

క. కృష్ణః వాసుదేవ! కేశవ! పరమాత్మ, యప్రమేయ! వరద! హరి! ముకుంద! నిన్ను జూడ గంటి, నీ కృపం గనుగొంటి, నఖిలసాఖ్యసదవు అంద. గంటి. త్త

  • ఒ శ్రీకృష్ణా! వాసుదేవా! కేశవా! పరమాత్మా! అ్రమేయా! వరదా! హరీ! ముకుందా! నిన్ను

చూడగలిగాను. నీ కృపను పొంద గలిగాను. సమస్త సౌఖ్యపదవులను అందుకో గలిగాను.

వ, అని యనేకభంగులం గొనియాడి గోవిందుని పదంబులు దన కిరీటంబు సోకం బ్రణమిల్లి “దేవా! భవదీయ పొదారవిందంబులు నా సృదయారనిందంబును బాయకుండునట్టుగా( బ్రసాదింపవే?” యని తదనుజ్ఞాతుండై యచ్చటి జనంబులు సూచి యద్భుతానందంబులం బొంద నతుల తేజోవిరాజిత దివ్యవిమానారూఢుండై దివంబున కరిగె, నంత న మ్మూధవుండు నచ్చట నున్న పార్టివోత్తములకు ధర్మబోధంబుగా నిట్లనియె. శ్‌78

  • అని అనేకవిధాలుగా స్తుతించి ఆ నృగుడు గోవిందుని చరణారవిందాలకు నమస్కరించాడు.

దేవా! నీ పాదపద్మాలకు నా హృదయపద్మం స్థానమయేటట్టు అను[గ్రహింపుమని (ప్రార్ధించాడు. శ్రీకృష్ణుని

పదవ స్కంధము - ఉత్తరభాగము 105 అనుజ్ఞ గైకొని అచ్చట చేరిన సకలజనులు ఆశ్చ్ళర్యానందాలు పొందుతుండగా నృగమహారాజు ఒక దివ్యవిమానాన్ని ఎక్కి స్వర్గానికి వెళ్లాడు. శ్రీకృష్ణుడు అచ్చట గల రాజేంద్రులకు ఇలా ధర్మబోధ గావించాడు.

ఫీ, నరనాథకుల కాననము దహించుటకును నవనీసురుల విత్త మగ్గి కీల, జననాయకుల నిజైశ్వర్యాబ్ది నింకింప బ్రాహ్మణక్షేత్రంబు బాడబంబు, పార్టినోత్తముల సంపచ్చెలముల గూల్చ భూసురధనము దంభోళిధార, జగతీవరుల కీర్తి చంద్రిక నూప విష్రోత్తము ధనము సూర్యోదయంబు,

తే. విప్రతతి సొమ్ముకంటెను విషము మేలు, గరళమునకును బ్రతికృతి గలదు గాని దాని మాన్సంగ భువి నౌషధములు లేవు, గాన బ్రహ్మస్వములు గొంట గాదు పతికి. త్తం

  • రాజకులం అనే అరణ్యాన్ని దహించే అన్నిజ్యాల బ్రాహ్మాణధనం, నరనాథుల ఐళ్చర్యం అనే

సముద్రాన్ని ఇంకించే బడబానలం (బ్రాహ శణక్షేత్రం. భూమిపతుల సంపద అనే శైలాలకు భూసురుల ధనం వజ్రాయుధం. జగతీపతుల కీర్తి అనే వెన్నెలను తొలగించే సూర్యోదయం విప్రుల సంపద. బ్రాహ్మణుల ధనం కంటె విషం మేలు. విషానికి విరుగుడు ఉన్నది. కాని బ్రాహ్మణ ధనాపహరణం వల్ల ప్రాప్తించే పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అందువలన భూపతులు బ్రాహ్మణుల ధనాన్ని అపహరించడం మంచిదికాదు.

కు ఎజుంగమి నైనను భూసుర, నరుల ధనం బపహరింప నలవదు పతికిన్‌, మణపున ననలము ముట్టిన, దరికొని వెసం గాల్బకున్నె తను వెరియంగన్‌? 480

ల అజ్ఞానం చేతనైనా సరే బ్రాహ్మణుల ధనాన్ని రాజు అపహరించ గూడదు. తెలియక అగ్నిని

ముట్టుకుంటే శరీరం బొబ్బలెక్కి బాధ చెందేటట్టు ఆ అన్ని దహించకుండా ఉంటుందా?

వ. మజియును దన ధనంబు పరులచేతః గోల్పడిన విప్రుండు దుఃఖమున రోదనంబుసేయ రాలిన యశ్రుకణంబుల నవని రేణువు లెన్ని తడియు నన్ని వేలేండ్లు తదుపేక్షాసరుండైన పతి దారుణవేదనలు గల కుంభీసొక నరకంబు నొందు, మణియు నతనితోడ6 ([గ్రిందటః బదితరంబుల వారును, ముందట బదితరంబులవారును నుహానరక వేదనలం బొందుదురు. స్వదత్తంబైన నర్దలోభంబునం జేసి దుళ్ళిలుండై యెవ్వండు (బ్రాహ్మణక్షేత సంభూత ధాన్యధనాదికంబు భుజించు నప్పాపాత్ముం డయువదినేల సంనత్సరంబులు నులకూసంబునం గ్రిమిరూపంబున వర్తించు, నట్లగుట యెజింగి విపు డెంత తప్పు చేసిన నెన్ని గొట్టిన, నెన్ని దిట్టిన నతని కెదురు పలుకక వినయంబున వందనం బాచరించు పుణ్యాత్ములు నాదు పాలింటివా, రదియునుం గాక యేనును బ్రతిదినంబును భూసురుల నతి వినయంబునం బూజింతు, నిట్లు సేయక విపరీత వర్తనులైన తానుసుల నేను వెదకి దండింతు, నది గావున మీరలును బ్రాహ్మణ జనంబుల వలనం బరమజభక్తి గలిగి మెలంగుం డని యావతిచ్చి యాదవప్రకరంబులు సేవింప నఖిలలోక శరణ్యుండైన యప్పుండరీకాక్షుండు నిజ నివాసంబునకుం జనియె' నని చెప్పి శుకుం డిట్లనియె. 81

106 పోతన. భాగవతము

  • పరుల వలన తన ధనాన్ని కోల్పోయిన బ్రాహ్మణుడు దుఃఖించి నపుడు స్రవించిన కన్నీటి ధారలవలన భూమిమీద ఎన్నిరేణువులు తడుస్తాయో అన్నివేల సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పాలించేరాజు కుంభీపాక నరకంలో బాధల ననుభవిస్తాడు. అంతేకాదు అతనికి పది తరాల పూర్వులూ, తర్వాత పదితరాలవారూ నరకవేదనలను పొందుతారు. స్వదత్త మైనదైనా, పరదత్త మైనదైనా బ్రాహ శ౯ భూములనుండి వచ్చిన ధనధాన్యాలను రాజు దుళ్ళీలుడై ఆశించగూడదు. అట్టాశించిన పాపాత్ముడు అరవైవేల సంవత్సరాలు మలకూపంలో పురుగై బ్రతుకుతాడు. అందువలన ఈ విశేషాలు (గ్రహించి (బ్రాహ్మణుడు ఎంత తప్పు చేసినా ఎన్నికొట్టినా ఎన్ని తిట్టినా అతనికి ఎదురు చెప్పకుండా వినయంతో నమస్కరించాలి. అటువంటివారే పుణ్యాత్ములు. అటువంటివారే నా అను(గ్రహానికి పాత్రులౌతారు. అంతేకాదు. నేనుగూడా ప్రతిరోజూ (బ్రాహ్మణులను మిక్కిలి వినయంతో పూజిస్తాను. ఇలా కాక విపరీతంగా ప్రవర్తించే తామసులను నేను వెదకి దండిస్తాను. అందుచేత మీరు బ్రాహ్మణులపట్ట్ల మిక్కిలి భక్తిపరులై ప్రవర్తించండి అని శ్రీకృష్ణుడు ఆనతిచ్చాడు. ఇలా ధర్మబోధను చేసి యాదవులు సేవిస్తుండగా శ్రీకృష్ణుడు తనమందిరం చేరాడు. ఇలా చెప్పి అనంతరం శుకమహర్షి ఇలా అన్నాడు. క. ఈ కథః జదివిన వారలు( గైకొని వినువారు విగత కలుషాత్మకులై లౌకికసొఖ్యము నొందుదు, రా కైవల్యంబు. గరతలామలక మగున్‌. శృ82
  • క్ర కథ చదివినవారికీ, విన్నవారికీ, సర్వపాపాలు తొలగిపోతాయి. ఇహలోకంలో సౌఖ్యం ప్రాప్తిస్తుంది. పరలోకంలో సులభంగా మోక్షం లభిస్తుంది. -: బలరాముండు సుహృద్బ్భంధుజన దర్శనార్ధమై వ్రపల్లెకు.బోవుట. :- సీ, నరనాథ! విను మొకనాండు తాలాంకుండు చుట్టాల బంధులం జూచు వేడ్క సుందర కాంచన స్యందనారూఢుండై భాసిల్లుచున్న వ్రేపల్లె కరిగి చిరకాల సంగత స్నేహులై గోప గోపాంగనా నికర మాలింగనములు సముచిత సత్కృతుల్‌ సలుపం గైకొని మహోత్సుకలీల నందయశోదలకును “తే. వందనం బాచరించిన వారు మోద, మంది బిగియారం గౌంగిళ్ల నాందం జేర్చి సమత దీవించి యంకపీఠమునం జేర్చి, శిరము మూర్కొని చుబుకంబుం గరము పుణికి. 483 న. మజీయు నానందబాప్పుధారాస్తిక్త కపోలయుగళంబులతోడం గుశల ప్రశ్శంబుగా నిట్లవి రన్నా! నీవును నీ చిన్నతమ్ముండగు వెన్నుండును లెస్సయున్నవారె? మమ్మెప్తుడు నరసి రక్షింపనలయు, మాకు నేడుగడయ మీరు కాక యొరులు గలరే” మని సముచిత సంభాషణంబులం (బొద్దుపుచ్చు చుండి రంత. 484
  • మహారాజా! ఒకనాడు బలరాముడు తన బంధుమి(త్రుల్ని చూచి రావడానికి సుందరమైన బంగారురథం ఎక్కి ్రేపల్లెకు వెళ్ళాడు. ఎంతో కాలంగా స్నేహసాంగత్యాలు కలిగి ఉండడం వలన గోపికలు, గోపాలురు అతనిని ఆలింగనం చేసుకొని తగిన మర్యాదలు చేశారు. ఆ గౌరవాలను అందుకొని బలరాముడు

పదవ స్కంధము - ఉత్తరభాగము 107 యశోదా నందులకు నమస్కరించాడు. వారు సంతోషించి కౌగిలించుకొని, దీవించి, దగ్గరకు తీసుకొని, ఒళ్ళంతా తడివి చూచి ఆనందబాష్పాలు జాలువారుతుండగా కుశల ప్రశ్నలు వేశారు. “బలరామా! నీవూ, నీ ముద్దుల తమ్ముడు కృష్ణుడూ క్షేమంగా ఉన్నారా? మమ్ములను మీరే రక్షించాలి. మాకు ఆధారం మీరు కాక మరెవ రున్నారు” అని సంతోషంతో చక్కగా సంభాషించారు.

క. గోపాలవరులు ప్రమదం, బాపోవని మది నినర్తి తాఖిల గేహ వ్యాపారు లగుచు హలధరు, శ్రీపాదంబులకు నతులు సేసిరి నరుసన్‌. శీ85

  • అక్కడి గోపాలురు తమ గృహకృత్యాలు కూడా మరచి ఆనందంతో నిండిన హృదయాలతో బలరామునకు పాదనమస్కారాలు చేశారు. క. సీరియు వారికి. గరుణో, దారుండై నడపె సముచితక్రియ లంతం గోరి తనయీడు గోప కు, మారులం జే చజణచి బలుండు మందస్మితుండై. శీ86
  • హల్రాయుధుడు వారందరినీ యథోచితంగా గౌరవించాడు. అ తర్వాత తన యీడువారైన కొందరు గోపాలురను స్నేహపూర్వకంగా చేతితో చరచి చిరునవ్వు నవ్వాడు. క, నిజసుందర దేహద్యుతి, రజతాచలరుచుల దెగడ రాముండు వారల్‌ భజియింప నేగి యొకచో, విజనస్థలమున వసించి విలసిల్లు నెడన్‌. శ8్ర7
  • బలభద్రుడు వెండికొండ కాంతులతో నిండిన శరీరద్యుతులు శోభిస్తూ ఉండగా గోపాలురతో కూడి ఒక ఏకాంతస్ట్రలానికి వెళ్టాడు. కవిరాజ విరాజితము : చరణములం గనక స్పుటనూపురజాలము గల్లనుచుం జెలంగం గరముల గంకణముల్‌ మొరయన్‌ నలికౌ నసియాడం గుచాగ్రములన్‌ సరులు నటింప గురుల్‌ గునియన్‌ విలసన్మణి కుండలకాంతులు వి స్ఫురిత కపోలములన్‌ బెరయన్‌ వ్రజసుందరు లంద అమందగతిన్‌, !
  • ఆ సమయంలో కాళ్ల బంగారుపట్టాలు ఘల్టుఘల్లని శబ్దం చేస్తుండగా, చేతి కంకణాలు గణగణ ధ్వనిస్తుండగా, నడుము వణుకుతుండగా, వక్షస్ట్రలంపై తారహారాలు నటిస్తుండగా, మణికుండలాల కాంతులు కపోలాలపై వ్యాపిస్తుండగా గొల్లభామలు అక్కడకు వచ్చారు. కవిరాజవిరాజితము : చని బలభద్రుని శౌర్య సముద్రుని సంచితపుణ్యు నగణ్యుని( జం దన ఘనసార పటీర తుషార సుధారుచికాయు విధేయు సుధా

108 పోతన భాగవతము శనరిపుఖండను సన్మణిమండను సారవినేకు నశోకు మహా త్మువి. గని గోపిక లోపిక లేక యదుప్రభు ని ట్లని రుత్కలికన్‌. శీ89

  • అలా వచ్చిన శౌర్యసముదద్రుడూ, చందనంవలె, కర్పూరంవలె, మంచువలె, అమృతంవలె, తెల్లని కాంతితో విలసిల్టుతున్నవాడూ, రాక్షసాంతకుడూ, వివేకవంతుడూ అయిన ఆ యాదవశ్రేష్టుని అవలోకించి ఆపుకోలేని అనురాగంతో ఇలా అన్నారు. చ. 'హలధర! నీ సహోదరు. డుదంచితకంజ విలోచనుండు స ల్లలిత పురాంగనా జనవిలాస విహార సమగ్ర సౌఖ్యముల్‌ గలిగి సుఖించునే? మము నొకానొక వేళన యేని బుద్ధిలో దలయనా? నూతన ప్రియల దార్కొని యేమియు. బల్కకుండునో? శం0
  • ఒ హలాయుధా! నీ సోదరుడైన పద్మాక్షుడు అంతఃపుర కాంతలతో విహరిస్తూ ఆనందిస్తున్నాడా? మమ్ములను ఎప్పుడైనా తలచుకుంటున్నాడా? క్రొత్త కాంతలవలన కలిగిన ఆనందంలో మైమరచి మమ్మల్ని గూర్చి మాట్టాడటమే మానివేశాడా? క జననీ జనకుల ననుజులం దనుజుల బంధువుల మి(త్రతతుల విడిచె నె మ్మనమున నొండు దలంపక, తను నమ్మినవారి విడువ(దగునే హరికిన్‌? నం!
  • తలిదండ్రులనూ, సోదరులనూ, పుత్రులమా, బంధువులనూ, మి(త్రులనూ, అందరినీ విడిచి మనస్సులో ఏ మాత్రం సంకోచించకుండా తననే నమ్ముకున్న మమ్మలిని విడిచి వెళ్లటం శ్రీకృష్ణునకు ఏమైనా న్యాయమా? పీ. సలలిత యామునపైకత స్థలమున నుండ మ మ్మేమని యూజడించె విమల బృందావనవీథి మా చుబుకముల్‌ పుణుకుచు నే నుని బుజ్జగించె బుష్పవాటికలలో. బొలుచు మా కుచయుగ్మ మంటుచు నే నుని యాదరించె గాసారముల పొంత గౌంగిట మము జేర్చి నయమొప్ప నే మని నమ్మం బలికె తే. నన్నియు మణచెం గొంబోలు వెన్ను. డాత్మ, గోరి తా. జాయలున్నైన వారి విడుచు నట్టి కృష్ణుండు దము అట్టు వెట్టు ననక, యేల నమ్మిరి పురసతుల్‌ బేల లగుచు.' శ్తం2
  • బలదేవా! యమునానది ఇసుక తిన్నెలపైన మమ్ములను ఏమో చెప్పి ఎంత ఊరడించాడు? బృందావనంలో మా గడ్డాలు పట్టుకొని ఎంతగా బుజ్జగించాడు? పూలతోటలలో మా వక్షస్త్రలాన్ని తాకుతూ ఎలా ఆదరించాడు? సరోవర [ప్రాంతాలలో మమ్ములను కౌగిలించుకొని ఎంతో విశ్వాసంగా మాట్టాడాడు? ఈ విషయాల నన్నిటినీ మరచిపోయాడు కాబోలు! శ్రీకృష్ణుడు తన్ను కోరి వలచి వచ్చిన భార్యనైనా విడువ గల్గినవాడు. అటువంటి వానిని పురకాంతలు బేలలై ఎందుకు నమ్మారో!

పదవ స్కంధము - ఉత్తరభాగము 109

మ. అని యిబ్బంగి సరోజలోచనుని నర్మాలాపముల్‌ నవ్వులు న్ననుబంధుల్‌ పరిరంభణంబులు రతి న్యాసంగముల్‌ భావముల్‌ వినయంబుల్‌ సరసోక్తులుం దలంచి యువ్విళ్ళూరు చిత్తంబులన్‌ జనితానంగశరాగ్ని చేత దురవస్థం బొంది శోకీంచినన్‌. శ్తం3

  • జ విధంగా శ్రీకృష్ణుని ఛలోక్తులనూ, నవ్వులనూ, అనురాగాలనూ, కౌగిలింతలనూ, రతికార్యాలనూ,

వినయాలనూ, సరసాలాపాలన్తూ, తలచుకొని ఉవ్విళ్లూరుతూ, 'ప్రియవియోగబాధతో దుర్హశలపాలై ఆ గోపికలు వాపోయారు.

వ. అంత బలభద్రుండు నొారల మనంబుల సంతాపంబులు వారింప నుపాయంబు లగు సరస చతుర వచనంబులం గృష్టుని సందేశంబులు సెప్పి విగతఖేదలం జేసి యచ్చట మాసద్వయంబు నిలిచి వసంతవాపరంబులు గడపుచు. గాళిందీ తీరంబున, ర్తంత్త

అప్పుడు బలరాముడు వారి సంతాపం తొలగిపోయేటట్టు మంచి మాటలు చెప్పి, శ్రీకృష్ణుని సందేశం

వినిపించి వారు దుఃఖాన్ని మరచి పోయేటట్టు చేశాడు. ద్రేపల్లెలో రెండు నెలలుపాటు ఉన్నాడు. ఒకనాడు కాళింది తీరానికి వెళ్చాడు.

ఫీ, మాకంద జంబీర మందార ఖర్జూర ఘనసార శోభిత ననములందు నేలాలతా లోల నూఅతీ మల్లికా వల్రీమళల్లికా వాటికలను దరళ తరంగ శీకర సాధు శీతల సైకతవేదికా స్థలములందు మకరంద రసపాన మదన దిందిందిర పుంజ రంజిత నుంజుకుంజములను

తే, విమలరుచి గల్లు సొనుదేశములయందు, లలిత శశికాంత ఘనశిలాతలములందు లీల నిచ్చావిహారవిలోలు( డగుచు, సుందరీజనములు గొల్వం జూడ నొప్పె. శక్‌

య మామిళ్ళ్లూ, నిమ్మలూ, మందారాలూ, ఇర్జూరాలూ, కర్పూరపు అరటిచెట్లూ శోభించే ఉద్యానవనాల

లోనూ; ఏలకి, మాలతి, మలై, మొదలైన తీగె పొదరిండ్లలోనూ, తరంగాల తుంపురులచేత మిక్కిలి చల్లనైన ఇసుక తిన్నెలపైననూ, మధుపానంతో మత్తిల్లిన గండు తుమె శదలతో నిండిన నికుంజాల లోనూ, తళతళ మెరిసే కొండచరియల యందూ, చంద్రకాంత శిలావేదికల పైననూ సుందరీమణులతో బలరాముడు స్వేచ్చగా సంచరించాడు.

తే. అట్టు విహరింప వరుణుని యాజ్ఞం జేసి, వారుణీదేవి మద్యభావంబు నొంది నిఖిల తరుకోటరములందు నిర్గమించి, మించు వాసనచేత వాసించె వనము. శ్వీ9ద్ర

  • అప్పుడు వరుణుని ఆజ్ఞవలన వారుణీదేవి మద్యభావాన్ని పొంది సమస్తమైన తరుకోటరాలలో

(ప్రవేశించింది. అప్పుడు ఆ వనమంతా మంచి మదనవాసనలతో శోభించింది. వ. అట్టియెడ. త్తం

110 పోతన భాగవతము

మ. కర మొప్పారు నవీనవాసనల నాఘ్రాణించి గోపాల సుం దరులుం దానును డాయనేగి యతిమోదం బొప్ప సేనించి యా తరళాన్షుల్‌ మణిహేమ కంకణరుణత్కారానుకారంబులై కరతాళంబులు మైయం బాడుచును నేడ్కన్నాడుచున్‌ సోలుచున్‌. త్తం8ి

  • ఆ సమయంలో ఆ క్రొత్త సువాసనలు ఆఘ్రాణించి గోపాలకకాంతలూ, తానూ వెళ్లి సంతోషంతో

ఆ మద్యాన్ని సేవించాడు. అప్పుడు ఆ తరళాక్షులు బంగారు కంకణాల రుణరుణ ధ్వనులతో తాళం వేస్తూ ఆనందంతో ఆడిపాడి సోలిపోయారు.

సీ తనమీ(ది బిరుదాంకితములైన గీతముల్‌ వాడుచు రా బలభద్రు( డంత మహిత కాదంబరీ మధుపానమదవిహ్య లాక్షుండు లలితనీలాలకుండు నాలోల నవపుష్పమాలికోరస్ట్రలు( డనుపమ నుణికుండలాంచితుండు ప్రాలేయ సంయుక్త పద్మంబుగతి నొప్పు సలలితానన ఘర్మజలకణుండ

తే. నగుచు ననమధ్యమున సలిలావగాహ, శీలు(డై జలకేళికిం జేరి యమున నిందు రమ్మని సిలువ( గాళింది యతని, మత్తుండని సడ్డసేయక మసలుటయును. శ్తంం

  • వారు బలరామునిపై బిరుదగీతాలు పాడుతూ అతనిచెంతకు వచ్చారు. అప్పుడు మద్యపానం

వలన విహ్యలమైన నేత్రాలతో, వినీల కేశాలతో, వక్షస్ట్రలంపై (వ్రేలాడుతున్న పుష్పమాలతో, చెవులయందలి మణికుండలాలతో, చెమట బిందువులతో నిండిన ముఖారవిందంతో శోభిస్తున్న బలరామునకు జలక్రీడ గావించాలని అనిపించింది. జలకేళికోసం యమునానదిని “ఇటురా'అని పిలిచాడు. కాళింది “త్రాగుబోతు'అని బలరాముని మాటలను లక్ష్యపెట్టలేదు.

చ. ఘనకుపితాత్ముండై యమున గవ్లొని రాముడు వల్కె(. డాయ జీ రినం జనుదేక తక్కితి పురే! విను నిందజు( జూడ మద్భుజా సునిశిత లాంగలాగ్రమున సాంపణ నిప్పుడు నూజు (త్రోవలై చన వెసన6 జించివైతు నని చండపరాక్రమ మొప్ప నుగ్రుంటై. 500

  • అప్పుడు బలరాముడు కోపించి యమునానదితో ఇలా అన్నాడు. 'దగ్గరకు రమ్మని పిలిస్తే నీవు

రాలేదు. ఇప్పుడు ఇక్కడివారంతా చూస్తుండగా నా నాగలితో నిన్ను నూరుత్రోవలై ప్రవహించేటట్టు చీల్ళివేస్తాను" అని ఉ(గ్రుడై పరా([క్రమించాడు.

వ. అట్టు కట్టలుక రాము డుద్దాముంబగు బాహుబలంబున హలంబు పాచి య మ్మహా వాహినిం దగిల్చి పెకలిరా. దిగిచిన న న్నది భయభ్రాంతయై సుందరీరూపంబు గైకొని యతిరయంబునం జనుదెంచి, య య్యదువంశ తిలకుండగు హలధరుని పాదారవిందంబులకు నందనం బాచరించి యి ట్లనియె. 501

పదవ స్కంధము - ఉత్తరభాగము 121

  • హలాయుధుడు తనహలాయుధాన్ని తీసికొని ఆ నదిని పెకల్చి తనవైపుకు వచ్చేటట్టు లాగాడు. అప్పుడు ఆ నది భయపడి స్త్రీ రూపాన్ని ధరించి, వేగంగా బలరాముని చెంతకు వచ్చి, అతని పాద పద్మాలకు నమస్కరించి ఇలా విన్నవించుకొన్నది. మ. 'బలరామా! ఘనబాహ! నీ యతుల శుంభద్విక్రమం బంగనల్‌ దెలియం జాలెడివార? యీ యఖిలధాత్రీభారధారేయ ని . శృల సత్త్యుండగు కుండలీశ్వరుండునుం జర్చింప నీ సత్కళా కలితాంశ ప్రభవుండు! నీ గురుభుజా గర్వంబు సామాన్యమే? 502
  • బ్రాహుబల పరాశక్రమా! నీ విక్రమం అంగనలు తెలియ జాలుదురా? తన శక్తి సామర్థ్యాలతో ఈ భూభారాన్ని భరిస్తున్న ఆదిశేషుడు గూడా నీ అంశకు చెందినవాడే. నీ భుజబలం అసామానృమైనది. చ. అని వినుతించి 'యేను భవదంఘ్రి సరోజము లాశ్రయించెదన్‌ నను€ గరుణింపు' మన్న యదునందను( డన్నదిః “బూర్వమార్లవై చను' మని కామినీనికర సంగతుండై జలకేళి సల్పె నిం 'పెనయ గరేణుకాయుత మదేభము చాడ్పున న న్ముహానదిన్‌. 503
  • బలా స్తుతించి 'నీ పాదపద్మాల నాశ్రయించిన నన్ను కరుణించు'అని కాళింది బలరాముని వేడుకున్నది. అప్పుడు ఆ యాదవ వీరుడైన బలభద్రుడు పూర్వమార్గంలోనే పయనించుమని పలికి ఆ యమునా నదిలో గోపాంగనామణులతో కూడి కరిణీసహితుడైన గజరాజులాగా జలకేళి గావించాడు. తే. అంత జలకేళి సాలించి సంతసంబు, నందుచుండ వినీలవస్త్రాదిరత్న __ మండనంబులు. గౌంచనమాలికయును, దెచ్చి హరి కిచ్చి చనెనా నదీలలామ. 504
  • జలకేళి ముగించి బలరాముడు ఆనందిస్తున్న సమయంలో కొళిందీనది నీలవ(స్తాలూ, రత్నాలంకారాలూ, బంగారుహారం కానుకగా తెచ్చి ఆయనకు సమర్పించింది. క. అవి యెల్లం దాళ్చి హలధరు6 డవిరళగతి నొప్పి వల్లవాంగనలును దా దివిజేంద్రు బోలి మహితో, తృవమున వర్తించుచుండె సౌఖ్యోన్నతుందై. 505
  • వాని నన్నిటినీ ధరించి గోపాంగనలతో గూడిన బలరాముడు దేవేంద్రునివలె సౌఖ్యాలలో మునిగి తేలుతూ ఆనందంతో విహరించాడు. క్ష అవనీశ! యిట్లు హలమునం దివిచినం గాళింది వ్రయ్య దెలియంగ నేండున్‌ భువి నుతి కెక్కెను రాముని, ప్రవిమలతరమైన బాహుబలసూచకమై. 506
  • ఓ రాజా! ఈ విధంగా బలరాముని హలంతో ఏర్పడిన కాళిందీ నది చీలిక ఈ నాటికి గూడా బలరాముని బాహుబలానికి ప్రతీకగా నిలిచి ప్రఖ్యాతి గాంచినది.

112 పోతన భాగవతము వ. అంత బలభద్రుండు వ్రజసుందరీ సమేతుండై నందఘోషంబునం బరితోషంబు నొందుచుండె, నంత వక్కడ గరూశాధిపతియైన పౌండ్రకుండు తన దూతం బిలిచి యిట్లనియె. 507

  • బలరాముడు ఈ విధంగా గోపాంగనలతో ఆనందిస్తుండగా కరూశదేశపు రాజయిన పౌండ్రకుడు తన దూతను పిలిచి ఇలా పలికాడు. -: కృష్ణుండు పొండ్రకవాసుదేవునిమీ(ద దండెత్తిపోయి వానిం జంపుట :- సీ. మమజేశ! బలగర్వమున మదోన్మత్తుండై 'యవనిపై వాసుదేవాఖ్యు( డనంగ నే నొక్కరుండ గాక యితరుల కీ నామ మలవడునే?” యని యదటు మిగిలి తెగి “హరి దా వాసుదేవుండ ననుకొను నంట! పోయి వలిదను మనుచు దూత బద్మాయతాన్షుని పాలికి. బొమ్మన నరిగి వా డంబుజోదరుండు సెద్ద తే. కొలువు( గైకొని యుండ సంకోచపడక్క “వినుము మా రాజుమూటగా వనజనాభ! యవని రక్షింప వాసుదేవాఖ్య నొంది, నట్టి యే నుండ సిగ్గు వో 6దట్టి నీవు. 508
  • (భూలోకంలో వాసుదేవు డనుపేరు నా కొక్కడికే చెల్లుతుంది. ఇతరులకు ఏ మాత్రం చెల్లదు. కృష్ణుడు పొగరెక్కి వాసుదేవుడని అనుకుంటున్నాడట! పోయి వద్దని చెప్పు'అని బలగర్వంతో మదోన్మత్తుడై పద్మాక్షుని చెంతకు పౌండ్రకుడు తన దూతను పంపించినాడు. వాడు వెళ్ళి శ్రీ కృష్ణుడు సభతీర్చియుండగా సంకోచపడకుండా ఇలా అన్నాడు. 'ఓ శ్రీకృష్ణా! మారాజు చెప్పిన మాటలు విను. భూమిని రక్షించడానికి 'వాసు దేవు'డనే పేరు నాకుండగా నీవు సిగ్గు విడిచి ఆ పేరు పెట్టుకున్నావు. క నా పేరును నా చిహ్నము, లేపున ధరియించి తిరిగె దిది పంతమె? యిం తే సో! మది బరికించిన, నే పంత మెలుంగు గొల్లం డే మిట నైనన్‌? 509
  • నా పేరూ, నా చిహ్నాలూ ధరించి సంచరిస్తున్నావు. ఇది నీ పంతమా! ఐనా గోపాలుడికి పంత మేమిటి? ఆ. ఇంతనుండి యైన నెదిరి. ద న్నెణింగి నా, చిన్నె లెల్ల విడిచి చేరి కొలిచి బ్రదుకు నునుము కాక పంతంబు లాడెనా, యెదురు నునుము ఘోరకదనమునను, 510
  • ఇకనుంచి అయినా నీ శక్తి ఎదుటివారి శక్తీ తెలుసుకొని నా చిహ్నాల నన్నిటినీ వదలిపెట్టి నాకు 'సేవకుడవై (బ్రదుకు. కాక పంతమాడ దల్ఫుకుంటే యుద్దానికి సిద్దపడు." క. అను దుర్భాషలు సభ్యులు, విని యొండొరు మొగము సూచి విస్మితు లగుచున్‌ “జనులార! యెట్టి క్రొత్తలు, వినంబడియెడు నిచట? లెస్స వింటిర” యనంన్‌. య!
  • దూత పలికిన దుర్భాషలను సభ్యులంతా విని ఒకరి మొగం మరొకరు చూచుకున్నారు. ఆశ్చర్యపోయారు. “ఈరోజు ఎటువంటి |క్రొత్తమాటలు విన్నాము”అని అనుకున్నారు. న. అట్టీయెడ కృష్ణుండు వాని కిట్లనియె. 512

పదన స్కంధము - ఉత్తరభాగము 113

  • ఆ సమయాన శ్రీకృష్ణుడు పౌండ్రకుని దూతతో ఇట్టా అన్నాడు.

ము. “వినరా! మీ నృపు. డన్న చిహ్నములు నే వే వచ్చి ఘోరాజిలో దనమీ(దన్‌ వెస వైవ6 గంకముఖగృద్రవ్రాతముల్‌ మూంగంగా, ననిలో దర్పము దూలి కూలి వికలంబై సారమేయాళికి న్ననయంబున్‌ నళనంబ నయ్యె' దను మే నన్నట్టుగా వానితోన్‌. 513

  • రీ! మీ రాజు ఏ చిహ్నాలను ధరించానని నన్ను గురించి చెప్పాడో ఆ చిహ్నాలను రేపు నేను వచ్చి

ఘోరయుద్ధంలో మీ ప్రభువు పైన ప్రయోగిస్తాను. యుద్ధంలో శక్తి కోలుపోయి కూలిపోయిన నిన్ను (గ్రద్దలూ, రాబందులూ, చుట్టుముట్టుతాయనీ, కుక్కల గుంపులు నిన్ను చీల్చుకొని తింటాయనీ నేను చెప్పినట్టుగా అతనికి చెప్పు.

క అని యుద్రేకముగా నా, డిన మాటల కులికి వాండు డెందము గలంగం జని తన యేలిక కంతయు, వినిపించెను నతని మదికి విరసము గదురన్‌, 5్‌కేడ

  • క్క విధంగా శ్రీకృష్ణుడు ఉద్రేకంగా పలికిన పలుకులకు వాడు ఉలికిపడి, గుండె జారిపోయి, తన

ప్రభువు దగ్గరకు వెళ్లి జరిగిందంతా అతని మనస్సుకు ఆందోళన కలిగేటట్టు విన్నవించాడు,

వ. అంత గృప్లుండు దండయాత్రోత్సుకుండై వివిధాయుధ కలితంబును, విచిత్రకాంచన పతాకాకేతు విలసితంబునగు సుందరస్యందనంబు. బటు జవతురంగంబులం బూని దారుకుండు తెచ్చిన నెక్కి యతిత్వరితగతిం గాశికానగరంబున కరిగినం బౌండ్రకుండును రణోత్సాహంబు దీసింప నక్షాహిణీద్వితయంబుతోడం బురంబు వెడలె, నప్పు డతని మి(త్రుండైన కొశీపతియును మూ డక్షౌాహిణులతోడం దోడుపడువాండై వెడలె, ని ట్లాప్రయుతుండై వచ్చువాని. 515

  • అనంతరం శ్రీకృష్ణుడు పొండ్రుకునిపై దండయాత్రకు ఉత్సహించి దారుకుడు తెచ్చిన రథాన్ని

అధిరోహించాడు. ఆ రథంలో వివిధములైన ఆయుధాలున్నాయి. బంగారుజెండా ఆ రథంపై విలసిల్లుతున్నది. వేగవంతాలైన గుజ్ఞాలు కట్టిన ఆ రథంపై ఎక్కి శ్రీకృష్ణుడు కాశీనగరానికి వెళ్లాడు. పౌండడ్రకుడు గూడా అతిశయించిన రణోత్సాహంతో, రెండక్షాహాణుల సైన్యంతో పట్టణం బయటకు వచ్చాడు. అతని స్నేహితుడైన కాశీరాజు గూడ మూడక్షాహిణుల సైన్యంతో పౌండ్రకునికి సహాయంగా వచ్చాడు. ఈ విధంగా మిత్రసహితుడై యుద్దరంగానికి వస్తున్న పౌండ్రకుని శ్రీకృష్ణుడు చూచాడు.

సీ. చక్ర గదా శంఖ శార్జాది సాధను6 గృత్రిమ గౌస్తుభ శ్రీవిలాసు మకరకుండల హార మంజీర కంకణ మణిముద్రికా వననమాలికాంకు( దరళ విచిత్ర పతంగ వుంగవకేతు జెలువొందు పీతకౌశేయవాసు జవనాశ్వకలిత కాంచన రథారూఢుని రణకుతూహలు లసన్మణికిరీటు

తే. నాత్మసమవేషు రంగవిహారకలిత, నటసమానుని. బౌండ్రభూనాథు గాంచి హర్ష మిగురొత్త నవ్వె! బద్మాయతాన్షు( డంత వాండును నుద్వృత్తు( డగుచు నడరి. 516

114 పోతన భాగవతము

  • పొండ్రకుడు శంఖం, చక్రం, గద, శార్‌జ్ఞం మొదలైన ఆయుధాలను ధరించాడు. కృత్రిమమైన కౌస్తుభమణి వక్షాన తగిలించుకున్నాడు. మకరకుండలాలు, హారాలు, కంకణాలు దాల్చాడు. కంఠంలో వనమాల వేసుకున్నాడు. గరుడ కేతనాన్ని చేకూర్చుకున్నాడు. పీతాంబరాన్ని కట్టాడు. వడిగల గుజ్ఞాలతో గూడిన బంగారు రథాన్ని అధిరోహించాడు. కాంతిమంతమైన కిరీటాన్ని తలపై అలంకరించుకొని యుద్దానికి కుతూహలపడుతున్నాడు. ఇలా తన వేషాన్ని ధరించిన పౌండ్రకుని చూచి రంగస్థలనటునిగా భావించి శ్రీకృష్ణుడు పకపక నవ్వాడు. ఆ పరిహాసానికి పౌండ్రకుడు మండిపడ్డాడు.

క్క పరిఘ శరాసన పట్టీస, శర ముద్గర ముసల కుంత చక్ర గదాతో మర భిందిపాల శక్తి మ్షురికాసి ప్రాస పరశు శూలముల వెసన్‌. 517

చ. పరువడి వైచినన్‌ దనుజభంజను( డంత యుగాంత కాల భీ కరమహితో(గ్ర పావకుని కైవడి నేచి విరోధి సాధనో త్కరముల నొక్కటన్‌ శరనికాయములన్‌ నిగిడించి త్రుంచి భా స్వరగతి నొత్తై పంచలితశాత్రవసైన్యము( బాంచజన్యమున్‌. 518

  • పరిఘ, పట్టిసం, ముసలం, సమ్మెట, ఈటె, చక్రం, గద, చిల్లకోల, బాకు, శక్తి చురకత్తి గొడ్డలి,

శూలం మొదలైన ఆయుధాలను శ్రీకృష్ణునిపై మిక్కిలి వేగంగా ప్రయోగించాడు. విల్లైక్కువెట్టి శరవర్షం

న్‌ కురిపించాడు. దానవాంతకుడు భయంకర 'ప్రళయాన్షివలె విజ్భంభించి విరోధి ప్రయోగించిన ఆయుధాల నన్నిటినీ తన బాణసమూహంతో త్రుంచి వేశాడు. శత్రుసైన్యాలకు సంచలనం కల్గించే తన పాంచజన్యశంఖాన్ని పూరించాడు.

ఉ. వారని యల్కతో గినిసి వారిజనాభుండు వారి సైన్యముల్‌ మారి మసంగినట్టు నుణుమాడిన( బీనుంగుంెంటలై వెసం దేరులు వ్రాలె, నశ్వములు (దైళ్ళ, గజంబులు మొగ్గె సద్భటుల్‌ ధారుణి. గూలి, రిట్లు నెణీ దప్పి చనెన్‌ హతశేషపైన్యముల్‌, 519

  • అమితమైన ఆగ్రహంతో సరోజనాభుడు విరోధిసైన్యాలను నాశనం చేశాడు. రథాలు విరిగిపోయాయి. అశ్వాలు కూలాయి. ఏనుగులు [వ్రాలాయి. కాల్బలం గడ్డిగరచింది. ఈ విధంగా రణరంగమంతా పీనుగు పెంటలై పోయింది. మరణించకుండా మిగిలిన సైన్యం పరాక్రమాన్ని వదలి పారిపోయింది.

వ. అట్టియెడ రుధిర ప్రవాహంబులును, మేదోమాంసపంకంబును నై సంగరాంగణంబు ఘోరభంగి యయ్యె, న య్యనసరంబునం గయ్యంబునకుం గాలు ద్రవ్వున ప్వౌం(డ్రకునిం గనుంగొని హరి సంబోధించి యి ట్లనియె. 520

  • నెత్తుటి ప్రవాహంతో, మాంసపు బురదతో సంగరాంగణం భయంకరమైపోయింది. ఆ సమయంలో

తనపై కాలు (ద్రవ్వుతున్న పౌండ్రకుణ్ణి చూచి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

పదన స్కంధము - ఉత్తరభాగము 115 మ. 'మనుజేంద్రాధము! పొండ్రభూపసుత! నీ మానంబు బీరంబు నే డనిలో మాపుదు, నెద్దు కక్రొవ్వి పెలుచ న్నాంబోతుపై అంకె వై చిన చందంబున దూతచేత నను నాక్షేపించి వల్దన్న పే రును జిహ్నంబులు నీ పయిన్‌ విడుతు నర్చ్భుల్‌ పర్వ నే. డాజిలోన్‌. 521

  • ర రాజాధమా! పౌండ్రకా! ఈ రోజు యుద్దంలో నీ మానం మంటగలుపుతాను. నీ పౌరుషం పటాపంచలు చేస్తాను. ఎద్దు క్రొవ్వి ఆబోతుపై రంకెవేసినట్టు నీవు నా చెంతకు దూతను పంపి నన్నాక్షేపించావు. నీవు నన్ను వదలివేయుమన్న చక్రాది చిహ్నాలనే నిప్పులు చెలరేగేటట్టు నీపై యుద్దంలో ప్రయోగిస్తాను. క అది గాక నీదు శరణము, పదపడి యే జొత్తు నీవు బలవిక్రను సం పద గల పోటరి వేనిం, గదలక నిలు 'మనుచు నిశితకాండము లంతన్‌, 522
  • అలా చేయలేకపోతే నిన్ను శరణు వేడుతాను. నీవు బలపరాక్రమాలు గల ఏీరాధివీరుడవే అయితే యుద్ధరంగంలో నిశ్చలంగా నిలబడు. అంటూనే శ్రీకృష్ణుడు వాడి బాణాలను వాడిపై (ప్రయోగించాడు. ము. చల మొప్పన్‌ నిగుడించి వాని రథముం జక్కాడి తత్సారథిం దల నే త్రుంచి హయంబులన్‌ నరికి యుద్దండప్రతాపక్రియం బ్రలయార్క'ప్రతిమాన చక్రమున నప్పౌండ్రున్‌ వెసం ద్రుంప వా డిలం గూలెం గులిశాహతి న్నారగు శైలేంద్రాక్సతిన్‌ భూవరా! 523
  • ఇలా పట్టుదలతో బాణాలు ప్రయోగించి వాని రథాన్ని కూల్చివేసి, సారథిని సంహరించి, గుజ్హ్రాలను నరికి, ఉద్దండప్రతాపంతో ప్రళయకాల సూర్యునితో సమానమైన తన చక్రాయుధాన్ని ప్రయోగించి పౌండడ్రకుని శిరస్సును ఖండించాడు. వజ్రాయుధపు దెబ్బతో కూలిన పర్షతంలా పౌం[డ్రకుడు నేలకూలాడు. చ. మడవక కాళికావిభుని నుస్తక ముద్దతి. ద్రుంచి బంతి కై వడి నది పింజ సింజ గజవన్‌ విశిఖాళి నిగుడ్చి వాని యే లెడి పురిలోన వైచె నవలీల మురాంతకుం డిట్లు వైరులన్‌ గడంగి జయించి చిత్తమున గౌతుకముం జిగురొత్త న త్తణిన్‌. 524
  • అనంతరం కాశీరాజు శిరస్సును గూడా శ్రీకృష్ణుడు ఖండించి బంతిలాగా ఆ శిరస్సును బాణాలతో పై పైకి ఎగురగొడుతూ అతని పట్టణంలో పడేటట్టు చేశాడు. ఈ విధంగా మురాంతకుడు శత్రువులను జయించి మనస్సులో ఎంతో ఆనందించాడు. క. సుర గంధర్వ నభశ్చర, గరుడోరగ సిద్ధ పాధ్యగణము నుతింపన్‌ మరలి చనుదెంచి హరి నిజ, పురమున సుఖముండె నతివిభూతి దలిర్సన్‌, 525
  • ద్రవ గంధర్వ సిద్ద సాధ్య గరు డోరగ గణాలన్నీ స్తుతిస్తుండగా, శ్రీకృష్ణుడు మిక్కిలి వైభవంతో తన నగరానికి తిరిగివచ్చి సుఖంగా కాలం గడుపుతున్నాడు.

116 పోతన భాగవతము క. వనజోదరు చిహ్నంబులు, గొనకొని ధరియించి సౌండ్రకుండు మచ్చరియై యనవరతము హరి దన తలం పున దగులుట జేసి ముక్తిం బొందె నరేంద్రా! 526

  • 2 పరీక్షిన్నరేంద్రా! వనజనాభుని చిహ్నాల నన్నిటినీ పట్టుదలతో ధరించి అసూయాపరుడై, నిరంతరం తన మనస్సులో శ్రీకృష్ణుల్లే ధ్యానించడం వలన పౌండ్రకుడు మోక్షాన్ని పొందాడు. సీ అక్కడ గాశిలో నా రాజు మందిరాంగణమున( గుండల కలిత మగుచుం బడి యున్న తలం జూచి పొరజనంబులు దమ రాజు తలయకా దగ నెటింగి చెప్పిన నా నృపు జీవితేశ్వరులును సుతులు బంధువులును హితులు గూడి మొనసి హాహాకారమున నేద్చి, రత్తజిం దత్తనూభవుండు సుదక్షిణుండు తే. నెలయః దండ్రికి. బరలోకవిధు లొనర్చి, జనకు ననిలో వధించిన చక్రపాణి నడరి మర్దింప€ దగు మపాయంబు దలంచి, చతురుం డగునట్టి తన పురోహితునింబిలిచి. 527
  • ఇక అక్కడ కాశీపట్టణంలో ఆ రాజుమందిరంలో కుండలసహితమైన శిరస్సు పడగానే పురజను లందరూ అది తమ రాజు శిరస్పని గుర్తించారు. ఆరాజుభార్యలు, పుత్రులు, మి(త్రులు, బంధువులు హాహాకారాలు చేసి దుఃఖించారు. కాశీరాజు కుమారుడైన సుదక్షిణుడు తండ్రికి పరలోకక్రియలు నిర్వర్తించాడు. తన తండ్రిని యుద్దంలో సంహరించిన శ్రీకృష్ణుని సంహరించడానికి ఉపాయం ఆలోచించాడు. చతురుడైన తన పురోహితుణ్ణి పీలిపించాడు. క అతడుం దానును జని పశు, సతిపద సరసిజములకును బ్రమదముతో నా నతు(డై య ద్దేవుని బహు, గతులం బూజింప నతండు కరుణాన్వితు(డై. 528
  • స్పరోహితుడూ, తానూ వెళ్లి పరమేశ్వరుని పాదాలకు ప్రణామం చేసి బహువిధాలుగా పూజలు చేశారు. పరమశివుడు కరుణామయుడై ప్రత్యక్ష మయ్యాడు. కు. 'మెచ్చితి నే వర మైనను నిచ్చెద నను వేండు' మనిన 'నీశ్వర 1 నన్నున్‌ మచ్చిక రక్షింతువు పొర, పొచ్చెము సేయక మహేశ! పురహర! యభవా! 529 క, దేవా! మ జనకుని వసు, దేవాత్మజు. డాజిలో వధించెను, నే నా గోవిందుని ననిలోపల, నే విధమున గెలుతు నానతీవె సురారి! 530
  • నీ భక్తికి మెచ్చాను. నీ వేవరం కోరుకున్నా ఇస్తానని పలికాడు. అప్పుడు సుదక్షిణుడు పరమేశ్వరా! నీవు నిన్ను నమ్మినవారిని తప్పక రక్షిస్తావు. దేవా! నా తండ్రిని యుద్ధంలో వాసుదేవుడు సంహరించాడు. ఆ గోవిందుని నేను యుద్ధంలో గెలిచే ఉపాయం తెలియజేయి అని ప్రార్ధించాడు. తే. అనిన శంకరు( డతనికి ననియె ననఘ॥!, నీవు బుత్విజులును భూసురానళియును బ్రతి నభిచార మొనరింప భూతయుక్తుం డగుచు ననలుండు దీర్చు నీ యభివముతంబు" 531

పదవ స్కంధము - ఉత్తరభాగము 117

  • అప్పుడు శంకరుడు అతనితో ఇలా అన్నాడు - అనఘా! నీవూ, బుత్విజులూ, బ్రాహ్మణ (శ్రేష్టులూ

ప్రీతితో అభిచారహోమం చేస్తే అగ్ని దేవుడు నీ కోరిక నెరవేరుస్తాడు.

తే. అనిన నా చంద్రమౌళి వాక్యముల భంగి, భూరినియమముతో నభిచారహోమ మొనర గానింస నన్ని యథోచితముగం జెలంగ దక్షిణవలమాన శిఖల వెలింె. 532

  • జ విధంగా శంకరుడు చెప్పగా పరమేశ్వరుని వాక్యానుసారం సుదక్షిణుడు గొప్పనియమాలతో

అభిచారహోమం చేశాడు. అగ్నిదేవుడు దక్షిణదిశ వైపు వ్యాపిస్తున్న జ్యాలలతో వెలిగాడు.

న. అందు. దామశ్మశ్రుకేశకలాపంబును, నశనిసంకాశంబు లైన నిడుదకోణలును, నిప్పులుప్పతిల్లు చూడ్కులును, ముడివడిన బొమలును, జేవురించిన మొగంబును గలిగి కృత్య యతి రౌద్రాకారంబున బ్రజ్వరిల్లుచు. గుండంబు వెలువడి యనుదిన నిహన్యనూన ప్రాణిరక్తారుణ మృత్యుకరవాలంబు లీలం జూపట్టు నాలుకను సెలవుల నాకికొనుచు నగ్ని కీలాభీలంబగు శూలంబు గేలం దాల్చి భువన కోలాహలంబుగా నార్బ్చుచు, నుత్తాల తాలప్రమాణ పాదద్వయహతులం దూలు పెంధూళి నింగిమ్రింగ, భూతంబులు సేవింప, నగ్నవేషయె, నిజవిలోచన సంజాత సముద్దూత నిఖిల భయంకరజ్యాలికా జాలంబున దిశాజాలంబు లోలిం బ్రేల్చుచు, నుద్వేగగమనంబున నగధరు నగరంబున కరుగుదేరం బౌరజనంబులు భయాకులమానసులై దానదహనునిం గని పణచు వననృగంబుల చాడ్పునం బజచి, సుధర్మాభ్యంత రంబున జూదంబాడు దామోదరునిం గని “రక్షర క్షేతి రనంబుల నార్తులయి కృష్ణు కృష్ణు పెనుమంటల బురంబు గాల్పం బ్రళయాల్ని సనుదెంచె' నన వారిం జూచి “'యోడకోడకు౮ డని భయంబు నివారించి, సర్వరక్షకుండైన పుండరీకాక్షుండు జగదంతరాత్ముండు గావునం దద్వృత్తాంతం బంతయు దన దివ్య చిత్తంబున నెజింగి కాశీరాజపుత్ర (ఫేరితయైన య మ్మహాకృత్యను నిగ్రహింపం దలంచి నిజసార్వ్వవర్తియై యున్న య ద్దిన్య సాధనంబు గనుంగొని యప్పుడు. 533

ష్‌ అగ్నిజ్యాలల నుండి ఎజ్జని జుట్టూ, పిడుగుల వంటి కోరలూ, నిప్పులు 'క్రక్కే చూపులూ, ముడివడిన కనుబొమలూ, జేవురించిన మొగంతో 'కృత్య' అతి భయంకరాకారంతో హోమకుండం నుంచి వెలువడింది. ఆ కృత్య మృత్యుదేవత కరవాలంలాగా కనిపిస్తున్న నాలుకతో పెదవులు తడుపుకుంటూ, అన్నిజ్యాలలవంటి శూలాన్ని కేలదాల్ళి, లోకం దద్దరిల్లేటట్టు బొబ్బలు పెడుతూ, తాటిచెట్టవంటి పాదాల తాకిడికి లేచిన దుమ్ము నింగినిండా వ్యాపించగా, భూతాలు 'సీవిస్తుండగా, దిగంబరంగా కళ్లనుంచి రాలే నిప్పులతో దిక్కులను కాల్ఫివేస్తూ అతివేగంగా శ్రీకృష్ణుని నగరానికి వచ్చింది. ద్యారకానగర వాసులంతా కృత్యను చూచి దావానలాన్ని చూచి పారిపోయే అరణ్య జంతువులలాగా పారిపోయి అంతఃపురంలో జూదమాడుతున్న శ్రీకృష్ణునితో ఈ విషయం వివరించారు. మన పట్టణాన్ని దహించడానికి ప్రళయకాలాన్షి వచ్చింది. మమ్మల్ని రక్షించు రక్షించు అని ప్రార్ధించారు. పుండరీకాక్షుడు వారిని భయపడవద్దని చెప్పి, జరిగిన సంగతినంతా మనస్సులో భావించి, కాశీరాజు పంపించిన కృత్యను సంహరించాలని భావించి తన చక్రాయుధాన్ని పరికించాడు.

118 పోతన భాగవచము

సీ. భీమమై బహుతీవ్రధామమై హతరిపు స్తోమమై సుమహితోద్దాము మగుచు( జండమై విజితమార్తాండమైై సాలితాజుండమై విజయప్రకాండ మగుచు దివ్యమై నిఖిలగంతవ్యమై సుజన సంభావ్యమై సద్భక్త సేవ్య మగుచు నిత్యమై నిగముసంస్తుత్యమై వినమితాదిత్యమై నిర్దితదైత్య మగుచు

తే. విలయసమయ సముద్భూత విపులభాస్వు దళికలోచన లోచనానల సహస్ర ఘటిత పటుసటాజ్వాలికా చటుల సత్వ, భయదచక్రంబు కృత్యపై. బంపె శౌరి, 53క్త

  • భయంకరమైనదీ, శత్రువులను హతం గావించేదీ, సూర్యకాంతిని ధిక్కరించే కాంతి గలిగినదీ,

అన్నివైపులా పయనించ గలిగినదీ, సుజనులచే స్తుతింపబడేదీ, భక్తులచే సేవించబడేదీ, దేవతలచే నమస్కరింప బడేదీ, దానవులను సంహరించేదీ, ప్రళయకాలంలోని పరమేశ్చరుని ఫాలనేత్రం నుంచి వెలువడిన జృలనజ్యాలా మాలికవలె భయంకరమైనదీ అయిన తన చక్రాయుధాన్ని శ్రీకృష్ణుడు కృత్యపై ప్రయోగించాడు.

వ. ఆదియును (బ్రళయ వేళాసంభూత జీమూతసంఘాతప్రభూత ఘుమఘుమాటోప నినదాధరీకృత మహాదున్సహ కహకహ నిబిడనిన్వన నిర్నోషపరిపూరిత బ్రహ్మాండకుహరంబును, నభ్రంలిహ కీలాసముత్కట పటు చిటపట స్ఫుట ద్విస్ఫులింగచ్చటాభీలంబును, సకలదేవతాగణ జయ జయ శబ్దకలితంబును, ననంచతేజో విరాజితంబును నగుచుం గదిసినం బంటింపక కంటగించు కృత్యను గెంటి వెంట నంటిన నది తన తొంటి రౌద్రంబు విడిచి మరలి కాశీపురంబు సొచ్చి పొరలోకంబు భయాకులతం బొంది వాపోవ, రోషభీషణాకారంబుతో నప్పుడు బుత్విజ్నికాయ యుతంబుగ సుదక్షిణుని దహించ్చె నత్తజీ. జక్రంబును దన్నగరంబు పౌధప్రాకార గోపురాట్టాలకాది వివిధవస్తువాహన నికరంబుతో భస్మంబు గావించి మరలి యమురులు వెజంగందం గనులలోచన షార్చ్వవర్తిభై నిజ ప్రభాపుంజంబు వెలు. గొంద( గొల్బియుండె నని చెప్పి మజీయు నిట్లనియె. 535

  • ఆ చక్రాయుధం ప్రళభయకాలంనాటి మేఘాలనుంచి పుట్టిన ధ్వనివంటి భయంకర ధ్వనితో,

ఆకాశాన్నంటుతున్న అగ్నిజ్యాలలతో, సకల దేవతలు జయ జయధ్య్వానాలు చేస్తుండగా, అమిత తేజస్సుతో వెలుగొందుతూ కృత్యను సమీపించింది. తనను చూచి తడబడకుండా కంటిగించుకుంటున్న కృత్యను గెంటివేసి వెంటబడింది. అప్పుడు కృత్య తన పూర్వపు రౌద్రరూపాన్ని వదలి తిరిగి కాశిపురం వచ్చింది. మరలి వచ్చిన కృత్యను చూచి పౌరులంతా భయపడి శోకిస్తుండగా ఆ కృత్య రోషభీషణమైన ఆకారంతో బుత్విజులతోపాటు సుదక్షిణుని దహించివేసింది. అప్పుడు శ్రీ కృష్ణుని చక్రాయుధం సౌధగోపుర ప్రాకారాలతో పాటు ఆ నగరాన్ని భస్మీపటలం చేసింది. దేవతలంతా ఆశ్చర్యపడేటట్టు శ్రీకృష్ణుని చెంతకు చేరింది అని శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుతో చెప్పి కృష్ణ గాథను ఇంకా కొనసాగించాడు.

పదవ స్కంధము - ఉత్తరభాగము కం క. మురరిపు విజయాంకితమగు, చరితము సద్బక్తి. దగిలి చదివిన నినినన్‌ దురితముల బాసి జను లిహ పర సౌఖ్యము అతనిచేత. బడయుదు రధిపా! 536

  • ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని విజయాలతో కూడిన కథను భక్తితో చదివినా వినినా, జనులు పాపరహితులై ఆ దేవుని దయచేత ఇహపరసౌఖ్యాలను పొందుతారు. న. అనిన శుకయోగికి రాజయోగి యిట్లనియె. క్‌37
  • ఈ విధంగా చెప్పిన శుకయోగితో రాజయోగి ఐన పరీక్షిత్తు ఇలా అన్నాడు. -; బలరాముండు ద్వివిదు(డను వానరుని సంహరించుట :- క. బలభద్రు. డప్రమేయుం, డలఘు€ డనంతుండు నతని యద్భుతకర్మం బులు వినియు, దనియ దింకను, దెలియఃగ నా కానతిమ్ము దివ్యమునీంద్రా! 538
  • ఓ మునీంద్రా! బలరాముడు మహాత్ముడు. ఆయన కావించిన ఆశ్చర్యకరమైన పనులను గూర్చి విని కూడ నాకు తృప్తి కలగటం లేదు. ఇంకా వివరంగా ఆయనను గూర్చి నాకు చెప్పండి. వ. అనిన రాజునకు శుకుం డిట్లనియె. 539 ౫ అనగా రాజుతో శుకమహర్షి ఇలా అన్నాడు. క. జననాయక! విను సుగీ, వుని సచివుండు మైందునకు సహోదరు డనగా వినుతికి నెక్కిన ద్వివిదుం, డను ప్రవగుండు నరకసభఖ్యు( డతిదర్పితు(డై. 5్‌త0 ౪౫ ఓ రాజా! విను. సుగ్రీవునికి మంత్రి మైందుడు. వాని తమ్ముడు ద్వివిదుడనే పేరుగల వానరు డొకడున్నాడు. వాడు నరకాసురునికి చెలికాడు. మహాగర్విష్టి అ సీ చెలికానిపగ దీర్చ దలంచి కృష్ణుం డేలు పురములు జనపదంబులు దహించి సరి దుపవన సరోవరములు గోరాడి మందల గొందలమంద+ జేసి (ప్రాసాదములు దద్రొబ్బి పరిఖలు మాయించి చతురంగ బలముల సమయ జీ పురుషుల సతులను భూధరగుహలలో. బెట్టి వాకిలి గట్టి బిట్టు నాంచి తే. ఫలిత తరువులం ద్రుంచి సాధుల నలంచి, కోట లగలించి పడుచుల నీట ముంచి ధరణి నిబ్బంగి( బెక్కుబాధల( జలంబు, పరంగంయేయుచు నొకనాండు ప్రవగవరుండు. 5్‌డ1ే ౪ ఆ వానరుడు తన మిత్రుడైన నరకుని పగను తీర్చదలచి శ్రీకృష్ణుడు పరిపాలించే పట్టణాలనీ, పల్లైలనీ తగల పెట్టటం; వనాలనీ, సరోవరాలనీ నాశనం చేయటం, ఆవులమందలను బెదరించటం, సౌధాలను పడద్రోయటం, అగడ్తలను పూడ్చివేయటం, చతురంగ బలాలను సంహరించటం, స్త్రీ పురుషులను కొండగుహల్లో బంధించి బాధించటం, పండినచెట్లను విరిచివేయటం, కోటలను పడగొట్టటం, యువతులను నీళ్లలో ముంచటం మొదలైన పనులతో ఆందరినీ బాధిస్తూ ఉండేవాడు.

120 పోతన భాగవతము క. చతుర న్చుదు గీతరవము, న్నతి వీతెంచినం జెలంగి నగచరు(డారై వతగిరి కందరమున కా, యతిగతి( జని యందు నెత్త మాడెడు వానిన్‌. ర5్‌డ్ష2

  • ఒకనా డా ద్వివిదుడు తనకు మనోహరమైన సంగీతం వినబడగా రైవతపర్వతం గుహకు వచ్చి అక్కడ జూదమాడుతూ ఉన్న బలరాముణ్ణీ చూచాడు. చ అలితవినీలవస్తుని విలాసగవతీయుతు. జంద్రచంద్రికా కలిత మహోన్నతాంగు మణికాంచన దివ్యవిభూషణోన్నతున్‌ విలసితవారుణీ సమదవిహ్వల లోచనుం గాంచె సీర ని ర్లళిత రిపుక్షితీశ నిజధాముని రాముని కామపాలునిన్‌. 543
  • నల్లనివ(స్త్రం ధరించినవాడూ, యువతులమధ్యలో ఉన్నవాడూ, పండువెన్నెలలాగా చల్లని తెల్లని ఉన్నతమైన అవయవాలు కలిగినవాడూ, మణిమయాలైన దివ్యాభరణాలను ధరించినవాడూ, మత్తుపానీయం త్రాగిన మైకంలో చంచలమైన కన్నులు గలవాడూ, శత్రురాజుల పట్టణాలను ధ్వంసం చేసినవాడూ, కామపాలుడూ అయిన బలరాముణ్లీ అక్కడ ఆ ద్వివిదుడు చూచాడు. పీ. కనుగొని తత్పురోగమ భూమిరుహశాఖ, లెక్కి యూయచుః జాల వెక్కిరించుం గికురించుచును బండ్షిగిళ్ళి చూపుచు వెసం గొమ్మకొమ్మకు నుజుకుచు నదల్బు; దోంక నూరక మేను సోంకంగ నులివెట్టు; వెడవెడ నాలుక వెడల బెట్టు; బరుల నఖంబుల గిరగిర గోయచు. బొరిం బొరి ఫలములు గటిచివైచు; తే గోళ్ళు తెగ గొర్కి యుమియును; గుదము సూపు; బలసి మర్కటజాతి యి ప్పగిది. జేయ6 గోపమున హలధరు డొక గుండు వైవ, దానిం దప్పించుకొని ప్రల్లదమున నతని. 5్‌డడ్త
  • అలా చూచినవాడై ఆ వానరుడు బలరామునికి ముందుభాగంలో ఉన్న చెట్టకొమ్మలను ఊపుతూ, వెక్కిరిస్తూ తప్పించుకుంటూ, ఒకకొమ్మపై నుంచి మరొక కొమ్మపైకి దుముకుతూ, తన తోకను బలరామునికి తాకిస్తూ నాలుక వెళ్ళబెడతూ, గోళ్ళతో గోకుతూ, పండినపండ్లను కొరికి పారవేస్తూ- ఇంకా అనేకవిధాలుగా ఏవేవో వెకిలిచేష్టలు చేస్తూ ఉన్నాడు. అవి చూచి బలరాముడికి కోపం వచ్చి వాణ్ళి ఒక రాతితో కొట్టాడు. క. నగి యాసవకలశము. గొని, జగతీరుహశాఖ యెక్కి చాపలమున న జ్ఞగతిపయి వైచె దద్బట, మగలగం నది చూచి కోప మగ్గల మొదవన్‌. 545
  • వా డా రాతిదెబ్బను తప్పించుకుని నవ్వుతూ బలరామునికి సమిపంలో ఉన్న కల్టుపాత్రను తీసుకపోయి చెట్టుకొమ్మపై కెక్కి దాన్ని నేలమోద విసరికొట్టాడు. అది పగిలిపోయింది. ఆ కోతి చేష్టలు చూచి బలరాముడికి చాలా కోపం వచ్చింది. వ మజియును. 546

పదవ స్కంధము- ఉత్తరభాగము 121 క. సీరిని. దన మనమున నొక, చీరికి. గైకొనక కదిసి చీరలు చింసన్‌ వారక దా భువిజనములం గారించుట మాన్ప( దలంచి ఘనకుసితుండై. క్‌డ7

  • బలరాముళ్ణో లక్ష్య పెట్టకుండా ఆ వానరుడు అతని పరివారాన్ని సమిపించి వారి వ(స్తాలను చించివేశాడు. అపుడు బలరాముడు కోపంతో, ఆ వానరుడు ప్రజలను బాధించటం మాన్పించాలనే నిశ్చయానికి వచ్చాడు, వ, ఇట్లు కోపోద్దీపిత మానసుండై కనుంగొని హలొయుధుం డప్పుడు. 548
  • హలాయుధుడు ఆ(గ్రహోద(గ్రుడైనాడు. చ. ముసలము. దీవ్రశాతహలమున్‌ ధరియించి సమస్తచేతన (గగ్రసనమునాండు పొంగు లయకాలునిభంగి నదల్ఫి నిల్వ; నా డసదృశవిక్రమడక్రమ విహార మెలర్చ సమీపభూజమున్‌ వెసం బెకలించి మస్తకము వ్రేసె. జలంబు బలంబు చొప్పడన్‌. 5్‌డ్త9
  • ముసలాయుధాన్ని ధరించి ప్రళయకాలంనాడు విజ్బంభించే కాలయముడిలాగా బలరాముడు ద్వివిదుణ్లి ఆదలించి నిలబడ్డాడు. వానరుడు కూడా మహాపరాక్రమంతో సమీపంలో ఉన్న చెట్టును పెకలించి బలరాముని తలపైన బలంగా కొట్టాడు. వ. ఇట్టు వ్రేయ బలుం డప్పుడు, 550 చ. ఉరవడి దండతాడిత మహోరగుభంగి. గడంగి వీర సా గరమన నేంచి హేమకటకంబుల నొప్పు సునందనామ భీ కర ముసలంబునన్‌ ద్వివిదుకంఠము (వేసిన బొల్బె వాండు జే గురు గల కొండచందమున( గోయని యార్చి సురల్‌ నుతింపల్‌న్‌. 551 జ ఇలా ద్వివిదునిచేత దెబ్బతిన్న బలరాముడు కజ్టుదెబ్బతిన్న కాలసర్పంలాగా చెలరేగినవాడై బంగారుకట్టు వేసిన 'సునంద'* అనే పేరుగల తన రోకలితో ద్వివిదుణ్మి కొట్టాడు. బలరాముడు కొట్టిన దెబ్బకు వానరుని శరీరంనుంచి రక్తం చిమ్మింది. దాని కారణంగా వాడు ఎర్రని కొండవలె కన్పడ్డాడు. ఇది చూచి దేవతలు ఎంతో సంతోషించారు. మత్త అంత వాండొకయింత మూర్చిలి యంతలో దెలివొంది దు ర్హాంతభూరి భుజావిబ్బంభణుండై మహీజము పూన్చి దై త్యాంతకాగ్రజు వ్రేపె; వ్రేసిన నాగ్రహంబున దాని నిం తింతలై ధర రాల జేసె నహీనవిక్రమశాలియె. క్‌క2

122 పోతన భాగవతము

  • బలరాముడు కొట్టిన దెబ్బకు వాడు క్షణకాలం మూర్చపోయి, కొంతసేపటిలో తేరుకొన్నవాడై అతిశయించిన భుజబలంతో ఒక పెద్లచెట్టు పెరికి దానితో బలరాముజబ్జో కొట్టాడు. బలరాము డావృక్షాన్ని మొక్కవోని పరాక్రమంతో ముక్కలు ముక్కలు చేశాడు. క. మణీయును జల ముడుగక వెసం దరుచరు. డొకతరువు వేయం దాలాంకు. డనా దరమున దునిమిన వెండియు. దొరఃగించెం గుజంబు లతండు దోడ్డో. దునుమన్‌. 553
  • వానరుడు పట్టువిడువకుండా చెట్లను పెళ్ళగించి బలరామునిమోద వేశాడు. వాడు వేసే వృక్షాల నన్నిటినీ బలరాముడు నడుమలోనే నరికివేశాడు. క. ఆ చందంబున ననచరుం డేచి మహీరుహచయంబు లెల్లను హలిపై వైచి యవి శూన్య మగుటయు( జూచి శిలావృష్టి. గురిసె సుర లగ్గింపన్‌. 554
  • ఆ విధంగా ద్వివిదుడు సమిపంలో ఉన్న చెట్లన్నీ పెరికి బలరామునిమోద వేశాడు. అవన్నీ వృథా అయిపోగా రాళ్ళవర్షం కురిపించాడు. క బలుం డపుడు జాలు తుమురై, యిల రాలంగ6 జేసి యార్వ నే పుడుగక యా వలిముఖుండు తాలసన్నిభ, ము లయిన నిజబాహుదండముల నుగ్రుండై. 555 ౫ వాడువేసే రాళ్ళనన్నిటినీ బలరాముడు పొడిపొడి చేశాడు. దానితో ద్వివిదుడు తాటి చెట్లవంటి యలు తన బాహువులతో బలరామునితో ముష్టియుద్దానికి తలపడ్డాడు. క. వడిం బిడుగు. బోని పిడికిట( బొడిచిన వడి సెడక బలుండు ముసలము హలమున్‌ విడిచి ప్లవంగుని మెడం గడు, వెడవెడ బిగియించె గ్రుడ్డు వెలి కుజుకంగన్‌. 556
  • ద్వివిదుడు బలరాముజ్జో పిడుగులాంటి పిడికిటితో పొడిచాడు. అప్పుడు బలరాముడు తన చేతిలోని రోకలినీ, నాగలినీ ప్రక్కన పెట్టి కను(గ్రుడ్డు బయటికి వచ్చేటట్టు రెండు చేతులతో ద్వివిదుని మెడ గట్టిగా బిగించాడు. క. వదనమున. జెవుల రుధిరము, మెదడును దొరంగంగ వాండు మేదిని మీ(దం జదికిల( బడి యొక యింతయు, మెదలక మిడుకంగలేక మృతిం బొందె నృపా! 557
  • ఓ రాజా! బలరాము డావిధంగా ద్వివిదుని గొంతు నులుమగా, వాని ముఖంలో నుంచి, చెవుల్లో లా నుంచీ రక్తం ్రవించింది. మెదడు చెదరిపడింది. వాడు దభీలుమని భూమిమీద పడి చలనం మాని ప్రాణాలు విడిచాడు. . తే. వానిపొటున కప్పుడు వనసమేత, మగుచు నా శ్రైలరాజ మల్లల్ల నాడె; సురగణంబులు రాముపై సురభి కుసుము, వృష్టి గురియించి రతుల సంతుష్టి మెజసి. 558
  • ద్వివిదుని శరీరపాతానికి రైవతపర్వతం వణికిపోయింది. దేవతలు ఆనందంతో బలరామునిమీద పుష్పవర్షం కురిపించారు.

పదవ స్కంధము- ఉత్తరభాగము 123

వ. ఇవ్విధంబున భువనకంటకుండైన దుష్టశాఖామృగేంద్రుని వసుంధరకుం బలిచేసి సకల జనంబులు'

బరమానంద కందళిత హృదయారవిందులై తన్ను నందింప న య్యదునందనుండు నిజనగరంబున

కరుదెంచె; నని శుకుండు వెండియు న మ్మనుజపతి కిట్టనియె. 559

౪ ఈ విధంగా లోకకంటకుడైన ఆ వానరుణ్లై సంహరించి సమస్త ప్రజలూ ఆనందంలో తన్ను

పొగడుతూ ఉండగా బలరాముడు తన నగరానికి విచ్చేశాడు అని చెప్పి శుకుడు తిరిగి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు.

-;బలరాముండు హస్తినావురమును గంగలో ద్రోయ6 బూనుట :-

సీ. కోరి సుయోధను కూతురు సర్వలక్షణములు గల్లి లక్షణ యనంగ మహినొప్పు కన్యకామణి వివాహంబున( జక్రహస్తుని తమూజాతుండైన సాంబుండు బలసాహసమున నెత్తుక పోవం గౌరవు లీక్షించి కడంగి క్రొన్వి “'సడచువా డొక6 డదె బాలికం గొనిపోవు చున్నాండు గై కొన కుక్కు మిగిలి

తే, యిట్టి దుర్మదు( గయిముట్టి పట్టి తెచ్చి, జనులు వెజుం గందం బెజపట్టి యునుతుమేని యదువులు మనల నేమి సేయంగ6 గలరొ, యనుచు గురువృద్ధజనముల యనుమతమున.560

  • రాజా! దుర్యోధనుని కుమార్తె పేరు లక్షణ, ఆమె సమస్త శుభలక్షణాలు కలిగిన కన్య. శ్రీకృష్ణుని

కుమారుడైన సాంబుడు వివాహ సమయంలో ఆమెను ధైర్యసాహసాలతో ఎత్తుకుపోయాడు. అదిచూచి కౌరవులు 'కు(ర్రవా డొకడు మన అమ్మాయిని దౌర్జన్యంగా తీసుకుపోతున్నాడు. ఆ పొాగరుబోతును బంధించి తెచ్చి చెరసాలలో వేద్దాము. యాదవులు మనలను ఏమిచేస్తారో చూడ్దాం' అని పెద్దలైన భీష్మాదుల అనుమతిని పొందారు.

వ. ఇట్లు గడంగి యుద్ధసన్నద్దులై బలశౌర్యోపేతులగు కర్ణ శల్య భూరిశ్రవో యజ్ఞకేతు సుయోధనాదులు సమున్నతరథారూఢులై కూడ నరిగిన వారల గనుంగొని జాంబవతీనందనుండు మందస్మిత వద నారవిందుం డగుచు సింగంబు భంగి గర్జించుచు మణిదీస్తం బైన చాపంబు6 బూని నిళ్చిన వారును సాంబు నదల్చి నిలునిలు మనవి పలికి. 561

  • మహాపరాక్రమోపేతులైన కర్ణ శల్య భూరిశ్రవ యజ్ఞకేతు దుర్యోధనాదులు యుద్దసన్నద్దులై చెలరేగి

రథాలెక్కి సాంబుణ్ణి వెంబడించారు. సాంబుడు వారిని చూచి చిరునవ్వులు చిందులాడే ముఖారవిందంతో సింహంలాగా గర్జిస్తూ ధనుర్జారియై ఎదురొడ్డి నిలబడ్డాడు. కౌరవులు సాంబుని పైకి తారసిల్టారు.

తే. చండకోదండ ముక్త నిశాత విశిఖ, జాల నుందంద వణప యాభీలముగను నందనందన నందన స్యందనంబు, ముంచి రచలేంద్రమును ముంచు మంచు పగిది. 562

  • కౌరవులు ధనుస్సులు ఎక్కుపెట్టి సాంబునిమోద వాడియైన బాణాలను (ప్రయోగించి 'మంచు మహాపర్వతాన్ని ముంచి వేసిన విధంగా" అతడి రథాన్ని కప్పివేశారు.

12త పోతన భాగవతము వ. మజియును. 563 శా, శౌర్యాటోప విజ్బంభణంబుల సరోజాతాక్షసూనున్‌ సురా హార్యసైర్యుని మీంద నేయ నతండుద్యద్భూరి బాహాబలా వార్యుండై శితసాయకాలి నవి మాయం జేసినన్‌ దేవతా తూర్యంబుల్‌ దివి మైసె0 నంత నత డస్తోకప్రతాపోన్నతిన్‌. 564

  • ఈ విధంగా మేరుపర్పతంతో సమానమైన ధైర్యంగల సాంబునిమిద కౌరవులు పరాక్రమాతిశయంతో బాణాలను ప్రయోగించారు. అతడు భుజబల సంపద మెరయగా, ఆకసంలో దేవదుందుభులు [మోగగా కౌరవులు తనపై వేసిన బాణా లన్నింటినీ ధ్వంసం చేశాడు.

వ ఇట్టు గడంగి బాణజాలంబులు పరణించి యందజ కన్నిరూపులై రథ సూత ధ్వజ పతాకాతపత్రంబులు చూర్ణంబులు గావించి విరథులం జేసి వారల మెయిమజవు లణువుళ్ళు గానించి యొక్కొక్కని. బెక్కు బాణంబుల నుచ్చిపో నేసిన వారలు శోణిత దిగ్హాంగులై కుసుమిత కింశుకంబులం బోలియుండిరంత,565

  • అపారపరాక్రమంతో సాంబుడు కౌరవుల మోద బాణసమూహాన్ని ప్రయోగించి అందరకూ అన్ని

రూపాలతో కనపడతూ వారి రథాలనూ, గుర్రాలనూ, సూతులనూ, కేతనాలనూ పొడిపొడి చేసి వారు

ధరించిన కవచాలను సైతం ఛేదించి, వారిశరీరాలలో దూసుకుపోయేటటు శరపరంపర (ప్రయోగించాడు. యల

సాంబుని శరజాలంవల్ల కలిగిన గాయాలనుంచి కారిన రక్తం కారణంగా కౌరవులు పుప్పించిన కింశుక

వృక్షాల్లాగా కనబడ్డారు.

ఉ. వార లనేకులయ్యు బలవంతులు నయ్యు మహోగసంగ రో " దార పరాక్రమ ప్రకటదక్షులు నయ్యు( గుమారకున్‌ జగ ద్వీరుని నొక్కనిం జెనకి వ్రేలును వంపంగలేక సిగ్గునం గూరిన చింత నాండొరుల. గూడుచు విచ్చుచు వెచ్చనూర్చుచున్‌. 566

  • కౌరవులలో బలవంతులూ యుద్ధవిశారదులూ పెక్కుమంది ఉండికూడా ఒక్క సాంబునితో

తలపడి వాని (వ్రేలు కూడా వంచలేక పోయారు. అందుచేత వారు సిగ్గుపడి అవమానభారంతో చాలా బాధపడ్డారు. నిట్టూర్పులు నిగుడించారు.

వ. మగిడి సమరసన్నద్దులై సంరంభించి. గ్‌67

' * కౌరవులు తిరిగి యుద్దానికి సిద్ధమై సాంబుణ్ణి ఎదుర్కొన్నారు.

ఉ. అందలు నొక్కపెట్ట దనుజాంతకనందను. జుట్టు ముట్టి యం దంద నిశాత సాయక చయంబుల ముంచి రథంబు నుగ ఠీ లం దునుమాడి చాపము చలంబున. ద్రుంచి హయాలి6 జంపి సూ తుం దెగటార్భి యంత విరథుం డగుడున్‌ వెసం జొచ్చి పట్టినన్‌. 568

పదవ స్కంధము- ఉత్తరభాగము 125

  • అందరూ ఒక్క మారుగా సాంబుణ్ణీ ముట్టడించి పదునైన బాణాలను ప్రయోగించారు. అతడి

రథాన్ని ధనుస్సునీ విరగగొట్టారు. గుర్రాలనూ, సూతుబ్బో చంపి విరథుణ్ణి చేసి బంధించారు.

తే. బాలకుండు చేయునది లేక పట్టువడీయెం గౌరవులు దను మునముల( గౌతుకంబు లొలయ సాంబుని. గన్యకాయుక్తముగను, బురమునకు. దెచ్చి రచులవిభూతి మెజసి, 569

  • బాలకుడైన సాంబుడు కౌరవులకు పట్టుబడ్డాడు. వారు సంతోషంతో గంతులు వేస్తూ సాంబుణ్ణి

కన్యకాసహితంగా పట్టణానికి తీసుకుని వచ్చారు.

న. అంత ద్వారకానగరంబున. 570

ఉ. జాంబవతేయు వార్త యదుజాతులు నారదయోగిచే సమ స్తంబును విన్నవా రగుచు సంగరకొతుక ముపష్పతిల్ల జి త్తంబుల6 గౌరవాన్వయకదంబము నొక్కట నుక్కడంచు కో పంబున నుగ్రసేనజనపాలు ననుజ్జ ననూన సైన్యముల్‌. 571

  • ఇక్కడ ద్వారకానగరంలో నారదమహర్షి వల్ల సాంబుడు పట్టుబడ్డాడనే వార్తను యాదవవీరులు

విన్నారు. యుద్దోత్సాహం అతిశయించగా కౌరవవంశాన్ని నాశంచేయడానికి సిద్ధమై మహారాజైన ఉగ్రసేనుడి అనుమతిని పొంది సర్వసైన్యసమేతంగా కదిలారు.

తే. కూడి నడవంగః గని వారితోడ బలుండు, ధార్తరాఘ్త్రులు మనకు నెంతయును డాసి నట్టి బంధులు; వారిపై నిట్టి యలుక, నెత్తి చనుచుంట యిది నీతియే తలంస? 572

౫ అప్పుడు బలరాముడు యాదవవీరులతో ఇలా అన్నాడు- కౌరవులు మనకు దగ్గర చుట్టాలు,

వారి మదికి యుద్దానికి వెళ్ళడం నీతి కాదు.

వ. అని వారల వారించి తత్‌క్షణంబ బంధు ప్రియుండైన బలరాముం డనలార్క సంకాశంబగు కాంచనరథం బెక్కి యనురక్తులైన భూసురులును, నుద్ధవాదులగు కులవృద్దులును సేవింపం గరిపురంబునకుం జని తత్పురోపకంఠవనంబున సురభికుసుము ఫలభరిత తరుచ్చాయా విరచిత చంద్రకాంత శిలాతలంబునందు వసియించి, మహిత(గ్రహ మధ్యగతుండైన పూర్ణచంద్రు ననుకరించి యుండి; నంత గార్యబోధనంబు సేయుటకై కౌరవులకడకు. బ్రబుద్దుండైన యుద్ధవునిం బనిచినం జని యతం డాంబికేయునకు ధనురాచార్యాపగాతనూభన సుయోధనులకుం బ్రణమిల్లి వారిచేత నభినందితుండై యిట్లనియె. 573

  • బంధుట్రీతి గల బలరాముడు యాదవసైన్యాన్ని నిలువరించి బంగారుమయమైన రథాన్ని

అధిరోహించి ఆనుఠాగయుక్తులైన వి(ప్రులతోనూ, కులవృద్దులతోనూ కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ పట్టణానికి సమిపంలో ఉన్న వనంలో సుగంధసుమాలతో కూడిన చెట్లనీడలో ఉన్న చంద్రకాంత శిలావేదికమోద, (గ్రహాల నడుమ చంద్రుని లాగా ప్రకాశిస్తూ కూర్చున్నాడు. అనంతరం కర్తవ్యం బోధించటానికై

126 పోతన భాగవతము కౌరవుల దగ్గరకు ఉద్దవుణి పంపించాడు. ఉద్ధవుడు కౌరవుల కొలువుకూటానికి వెళ్లి ధృతరాష్ట్ర భీష్మ ద్రోణ సుయోధనులకు నమస్కారం చేసి, వారి ప్రశంసలు అందుకొని వారితో ఇలా అన్నాడు. కీ *“భూరియశోధనులార! తాలాంకుండు చనుదెంచి నగనరోపవనమునందు నున్నవా౮డనిన వా రుత్చాహమున బలు బొడగను వేడుక బుద్ధి. దోంపం దనరారు కానికల్‌ గొని చని యర్శ్యపాద్యాది సత్యతులు నెయ్యమునఈ జేసి ధేనువు నిచ్చి సమ్మానించి యందటు నందంద వందనం బాచరించి తే. యుచితభంగిని నచట గూర్చున్న యెడను, “గుశలమే మీకు? నూకును గుశలి మనుచు బలికి రాముడు కురునరపాలు. జూచి, యచటి జనములు విన(గ నిట్లనియె. దెలియ. 574

  • 'ఓ మహాశయులారా! బలరాముడు వచ్చి పట్టణానికి సమీపంలో ఉన్న ఉపవనంలో విడిదిచేశాడు.' ఉద్ధవుడు ఇలా చెప్పగానే కౌరవులు సంతోషంతో బయలుదేరి బలరాముడికి అర్హ్యపాద్యాదు లర్పించి కానుక లిచ్చి గౌరవించారు. బలరాముడు తనచుట్టూ కూర్చున్నవారి నందరిని కుశలప్రశ్చలతో సంభావించి, అందరూ వినేటట్టుగా దుర్యోధనునితో ఇలా అన్నాడు. ఉ. “మా నరనాథునాజ్ఞ నిజమస్తములన్‌ ధరియించి కౌరవుల్‌ నూనుగం జేయు టొప్పగు( గుమారకు నొక్కనిం బెక్కు యూథపుల్‌ పూనిన లావుమై నెదిరి పోర జయించుట మీది తప్పు; త ప్పైనను గాచె బాంధనహితాత్మకుండై మనుజాధినాథుండున్‌. 575
  • మా రాజైన ఉ(గ్రసేనుని ఆజ్ఞను మీరు మన్నించక తప్పదు. ఇంతమంది సేనాధిపతులు ఒక్కటై బాలకుణ్హి ఒక్కణ్ణి బంధించటం తప్పు. ఐనా, మారాజు బంధువుల క్షేమం కోరి మీరు చేసిన తప్పును మన్నించాడు. క అను మాటలు విని కౌరవ, జననాయకుండాత్మ నలిగి *చాలుం బురే? యే మన గలదు కాలగతి? చ, క్కనం గాలం దొడుగు పాదుకలు దల కెక్కెన్‌. 576
  • బలరాముడి మాటలు దుర్యోధనునికి చాలా కోపం తెప్పించాయి. “చాలు చాలు! కాలవైపరీత్యం! కాళ్ళకు తొడిగే చెప్పులు తలమోదికి ఎక్కాయి!" " ఆ. మనము బంధువరుస మన్నించు మన్ననం గాదె రాజ్యభోగగరిమం బొదలి వసుధం బేరు గలిగి వాసికి నెక్కుటం దమకు ననుభవింసం దగని యట్టి. 577
  • బంధువులు కదా అని గౌరవించటం చేతనే యాదవులు పేరు (ప్రఖ్యాతులను గడించి తమకు యోగ్యంకాని ఛత్రచామరాలను ధరిస్తూ ఉన్నారు. న. సితచ్చత్ర చానుర శంఖ కిరీట చిత్రశయ్యాసౌధ సింహాసనంబులు గైకొనుట మన మందెమేలంబునం గాదె? యిట్టిచో సరివారునుం బోలె నూరక గర్వించు యదుకులులతోడి సంబంధసఖ్యంబులు సాలు

పదవ స్కంధము- ఉత్తరభాగము క్ష27 బాములకు. బాలు వోసి పెంచిన విషంబు దప్పునే? మమ్ముం దమ పంపుసేయు మనుట సిగ్గులేకుంటం గొదె! యదియునుంగాక దివ్యాస్త కోవిదులైన గంగానందన గురు కృషాశ్వత్తామ కర్గాది యోధవీరులకున్‌ లోంబడ్డవానిని మహేంద్రునకైనను విడిసింసం వచ్చునే? యహహ! వృథాజల్పంబుల కేమిసని* యని దుర్భాష లాడుచు దిగ్గున లేచి నిజమందిరంబునకుం జనియె; నప్పుడు హలాయుధుం డమ్మాటల కదిరిపడి. 578

  • ప్రోనీలెమ్మని మనం '' ఉపేక్ష వహించడంచేత యాదవులు శంఖ కిరీట సింహాసనాది భోగాలను అనుభవిస్తూ ఉన్నారు. మనతో సమానుల్లాగా విర్రవీగే యాదవులతో స్నేహసంబంధాలు చాలు. పాములకు పాలుపోసి పెంచిన మాత్రం చేత విషం తగ్గుతుందా? తమమాట వినవలసిందిగా మమ్ము ఆజ్ఞాపించటం సిగ్గులేని తనం కాదా? అంతేకాకుండా భీష్మ ద్రోణ కర్ణాది యోధవర్లానికి చిక్కి లోబడిన వాణ్ణి విడిపించటం దేవేంద్రుని కైనా సాధ్యమా? నిరుపయోగమైన మాటలతో పని యేముంది? అని పరుషంగా మాట్లాడుతూ దిగ్గున లేచి తన సౌధానికి వెళ్ళాడు. దుర్యోధనుని పరుషవాక్కులకు బలరాముడికి చాలా ఆగ్రహం వచ్చింది. ఉ. కౌరవు. డాడి పోయిన యగొరవభాషల కాత్మ గిన్క దై వాజుంగ నుల్ల సదత్ర్రశ యభానుని క్రై వడి మండి చండ రో . షారుణితాంబకుం డగుచు యాదవవృద్దుల. జూచి పల్కె( “బెం పారిన రాజ్యవైభన మదాంధుల మాటలు మీరు వింటిరే? 579
  • దుర్యోధనుడు పల్కిన గౌరవహీనమైన మాటలకు బలరాముని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ప్రళయకాలంనాటి ప్రచండ భాస్కరునిలాగా మండిపడ్డాడు. తన సమిపంలో ఉన్న యాదవ వృద్దులను చూచి ఇలా అన్నాడు; రాజ్యవైభవంవల్ల కలిగిన మదంతో కళ్ళు మూసుకుపోయిన దుర్యోధనుడి మాటలు విన్నారు. కదా! తే. శ్రీమదాంధులు సొముంబుచేతం జక్క6 బడుదురే యెందు? బోయండు ససులం దోలు పగిది నుగ్రభుజా విజృంభణ సమగ్ర, సుమహితాటోప మనిలోన6 జూపకున్న. 580
  • బోయవాడు పశువులను తోలేవిధంగా యుద్ధరంగంలో భుజబల పరాక్రమం చూపకపోయినట్టయితే ఐశ్వర్యగర్వంతో గుడ్డివారైన కారవులు మంచిమాటలతో చక్కబడరు. క. కౌరవుల సమయంశేయ ను, దారత యదువీరవరులు దామోదరుండున్‌ రారావల దని యచ్చట, వారించితిం గాదె బంధునత్సల యుక్షిన్‌. 581
  • కౌరవులను నాశనం చేయటానికి యాదవవీరులూ, శ్రీకృష్ణుడు వస్తూ ఉండగా రా నక్కరలేదని బంధుట్రీతితో నేను వారిని వారించాను కదా! వ. అదియునుం గొక 582

128 పోతన భాగవతము సీ, ఏ దేవు భృత్యులై యింద్రాది దిక్సాల వరులు భజింతురు వరుసతోడ నే దేవు మందిరం బేపారు దేవతా తరుసభావిభవసుందరత. జెంది యే దేవు పదయుగం బేప్రాద్దు సేవించు నఖిల జగన్మాతయైన లక్ష్మి యే దేవు చారుసమిద్దకళాంశ సంభవులము పద్మజభవులు నేను తే. నట్టి దేవుండు దుష్టసంహారకుండు, హరి ముకుందుండు పంపుసేయంగ నొప్పు నుగ్రసేనుని రాజ్యసమ(గ్రగరిమ, యంతయును దార యిచ్చిన దంట! తలంప. 583

  • అంతేకాదు. ఏ దేవునికి సేవకులై యింధద్రాది దిక్సాలురు బారులుదీరి భజిస్తారో, ఏ దేవుని మందిరం కల్పవృక్షాది దేవతాతరువులతో అతిశయిస్తూ ఉంటుందో, ఏ దేవుని పాదపదా శలను జగన్మాతయైన లక్ష్మీదేవి సేవిస్తూ ఉంటుందో, నేనూ బ్రహ్మా ఇద్దరమూ ఏ దేవుని అంశవల్ల జన్మించామో- అటువంటి దుష్ట సంహారకుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞతో ఉ(గ్రసేనుని రాజ్యసంపద విలసిల్దుతూ ఉంది. దానిని ఈ కౌరవులు తామే ఇచ్చారట; విన్నారా! చ. అదియును గాక యెన్వని సదాంబుజ చారురజోవితాన మా త్రిదిన నరాది దిక్పతి కిరీటములందు నలంకరించు; భూ విదితపు! దీర్ధముం గడు బవిత్రము సేయును; నట్టి కృష్ణుచేం బొదలిన రాజ్యచిహ్నముల( బొందంగ రా దట యేమిచోద్యమో! 584
  • అంతే కాకుండా ఎవని పాదపద్మపరాగం దేవతల, మానవుల, దిక్పాలుర కిరీటాలను అలంకరిస్తూందో, పవిత్రతీర్దాలను సైతం పునీతం చేస్తూందో, అలాంటి కృష్ణునిచేత ఇవ్వబడ్డ రాజ్యచిహ్నాలను ధరించటానికి మేము అర్హులం కాదట. ఇదేమి ఆశ్చర్యం! క. తాను(ట తలంపం దల లంట, యేను పాదుకల మంట గణింపల రాజ్య శ్రీమదమున ని ట్లాడిన, యీ మనుజాధముని మాట కేమన వచ్చున్‌? 585 ౫ తాము శిరస్సు లట, మేము చెప్పుల మట. రాజ్యమదంతో ఇలా వాగిన యీ నీచుణ్ణి గూర్చి యే మనాలి? వమ అని సక్రోధమానసుండై యప్పుడు, 586 క ధారుణి నిటమీ(దట ని, ష్కారవముగ6 జేయకున్న( గా దని యుగ్రా కారుండై బలభద్రుండు, సీరము వెసంబూన్ని లావు. జేవయు నెసంగన్‌. 587
  • ఇలా అంటూ బలరాముడు మహాక్రోధాన్ని ప్రదర్శించాడు ఈ భూమిమీద కౌరవవంశాన్నే లేకుండా చేయక తప్పదు. ఇంకో మార్గం లేదు" అని బలరాముడు ఆ(గ్రహోద[గ్రస్వరూపంతో పరాక్రమం ప్రదర్శించుతూ తన నాగలిని ఎత్తి పట్టుకొన్నాడు. వ. ఇట్లు పూని కౌరవరాజధానియైన కరినగరంబు కడతల హలాగ్రంబును జొనిపి య ప్పుటభేదన విస్తారంబగు గడ్డ భుజాగర్వ దుర్వారుండై పెకలించి తిగిచి గంగాప్రవాహంబునం గడగద్రోయ

పదవ స్కంధము- ఉత్తరభాగము 129 గమకించిన నప్పుడు మహాజలనుధ్య విలోలంబగు నావ చందంబున నన్నగరంబు వడవడ వడంకుచు గోపుర వప్ర ప్రాకార సౌధాట్టాలక తోరణ ధ్వజ ద్వార కవాట కుడ్య వీథీ యుతంబుగా నొడ్డగెడవైన( బౌరజనంబులు పుడమి నడుగు లిడంగ రాక తడంబడుచు, నార్హులై కుయ్యిడుచుండి; రట్టియెడన మ్మహోత్పాతంబులు గనుంగొని తాలాంకుండు గినుక వొడమి కావించిన యుపద్రనంబుగా నెజింగి దానికి బ్రతీకారంబు లేమిని గళవళంబున భయాకుల నూనసులై పుత్ర మిత్ర కళత్ర బంధు భృత్య పౌరజన సమేతంబుగా భీష్మదుర్యోధనాది కౌరవులు వేగంబున నతని చరణంబుల శరణంబులుగా( దలంచి, సాంబుని. గన్యకాయుక్తంబుగా ననేక మణిమయ భూషణాంబర జాలంబుతో. గొనివచ్చి దండప్రణామంబు లాచరించి కరకమలంబులు మొగిడ్బీ యిట్లనిరి. 5855

  • ఈ విధంగా బలరాముడు తన హలాన్ని పైకెత్తి కౌరవ రాజధాని అయిన హస్తినాపురం చిట్టచివరి భాగంలో నాగలిచివరి భాగాన్నిచొప్పించి ఆ పట్టణాన్ని మొత్తం పెకలించి గంగలో కలపటానికి ఉద్యుక్తుడైనాడు. ఆ సమయంలో హస్తినాపురం సముద్ర జలాల్లో తిరుగపడ్డ పడవలాగా అయింది. ఆ పట్టణం గోపురప్రాకారసౌధాలతో సహ ఒకవైపుకు ఒరిగింది. పౌరులు హాహాకారాలు చేశారు. ఈ మహోప(ద్రవానికి భయపడినవారై బలభద్రుని రౌద్రావేశం తగ్గించటానికి మరో మార్గంలేక భష్మ దుర్యోధనాదు లందరూ పరుగెత్తుకొని వచ్చి బలరాముణ్ణి శరణు వేడారు. కన్యకతో సహ సాంబుణ్ణి సమర్పించారు. అనేక మణిమయ భూషణాదులు కానుక లిచ్చి కరకమలాలు మోడ్చి ఇలా ప్రార్థించారు.

క. “రామ! సమంచితముక్తా, దాను! యశఃకాను! ఘనసుధాధాము!రుచి

స్తోమ! జయసీను! జగదభి, రామ! గుణోద్దామ! నిఖిలరాజలలామా! 589

  • బలరామా! జగదభిరామా! రాజలలామా! ముత్యాలహారం ధరించినవాడా! కీర్తి కాముకుడా! మనోహరమైన ఆకారం కలవాడా! మమ్ము రక్షించు. నీవు జయశీలివి. సుగుణళాలివి.

క. నీ మహిమ యొటింగి పొగడంగం నే మెంతటివార? మఖిలనేతవు; త్రిజగత్‌

క్లేమంకరుండవు; సుమతిని, తానుసులము మమ్ము గావం దగు హలపాణీ! 590

  • ఓ హలాయుధా! నీ మహిమ తెలిసి పొగడటానికి మే మెంతవారం? సర్వానికీ నాయకుడవు. ముజ్జగాలకూ క్షేమం కలిగించే వాడవు. బుద్దిమంతుడవు. మేము అహంకారులం. మమ్ము కాపాడు.

క. భూచక్ర మెల్లం దాల్చిన, యా చక్రీశ్వరుండు దానకాంశుండు బలదే

వా! చక్రికి నగ్రజాండవు, నీచక్రియ లుడుప జెల్లు నీకు జితారీ! 591

  • ఈ సమస్త ప్రపంచాన్నీ భరించిన శ్రీకృష్ణుడు నీ అంశం. నీవు ఆ చక్రాయుధునికి అన్నవు. నీచకార్యాలకు పాల్పడిన మమ్ము రక్షించు. క. రక్షింపుము రక్షింపు ము, పేక్షింపక నమిత నిఖిలబ్బందారక! ఘో ర క్షణదాచరవిషనిట, లాక్ష! భయాతురుల నుమ్ము నరయు మనంతా! 592

130 పోతన భాగవతము

  • సమస్త దేవతలచేతా నమస్కరింపబడే ఓ మహానుభావా! బలదేవా! మమ్ము ఉపేక్షించక రక్షించు. హరుడు హలాన్ని (మింగిన విధంగా (క్రూరరాక్షసులను (మ్రింగివేసిన అనంతుడవు నీవు. భయార్తులమైన మమ్ము రక్షించు.

వ. మజటియును దేవా! యీ సచరాచరంబు జగంబుల నీ లీలావినోదంబులం జేసి దుష్టజన మర్దనంబును, శిష్ణజన రక్షణంబునుం జేయుచు, జగదుత్పత్తి స్థితి లయహేతువైన నీకు సమస్కరింతు' మని వెండియు నిట్లనిరి. 593

  • ఈ సచరాచర ప్రపంచాన్నీ లీలావినోదంగా నడిపిస్తూ దుష్టశిక్షణం, శిష్టరక్షణం చేస్తూ సృష్టి స్థితి

లయాదులకు కారణమైన దేవా! నీకు నమస్కరిస్తున్నాము.

తే. “అవ్యయుండవు; సర్వభూతాత్మకుండవు;, సర్వశక్తి ధరుండవు; శాశ్వతుండవు విశ్వకరుండవు గురుండవు విమలమూర్తి వైన నిన్ను నుతింప బ్రహ్మకును దరమె?” 59క్తీ

  • నాశంలేని వాడవూ, సర్వప్రాణి స్వరూపుడవూ, సర్వశక్తులనూ ధరించినవాడవూ, శాశ్వతుడవూ,

జగద్గురుడవూ, స్పష్టికర్తవూ, నిర్మలమైన ఆకారం గలవాడవూ ఐన నిన్ను పొగడటం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు.

చ అని వినుతించినం బ్రముదితాత్మకుండై హలపాణి వారలం గనుంగొని 'యోడ కోడకుండు కార్యగతిం దగి లిట్లు మీరు సే సిన యవినీతిచేత నిటు చేసితి; నింక భయంబు దక్కి పాం" డనిన సుయోధనుండు వినయంబున నలుని. గూంతునుం దగన్‌. 595

  • ఈవిధంగా కౌరవులు స్తుతించగా బలరాముడు సంతోషించి 'మోరు చేసిన అవినీతివల్ల ఇలా

చేశాను. భయపడవద్దు. వెళ్ళండి' అన్నారు. అప్పుడు దుర్యోధనుడు వినయంతో అల్లుణ్లి, కూతురినీ ళాల సాగనంపాడు.

క అనుపుచు నరణము దాసీ, జవముల వేయింటి లక్షసైంధవముల. దా నినుమడి యేనుంగులం గాం, చన రథముల నాజువేల సమ్మతి నిచ్చెన్‌. 596

  • దర్యోధనుడు కూతురికీ, అల్టుడికి ఆరణంగా వేయిమంది దాసీలనూ, లక్ష గుర్రాలనూ, రెండు

లక్షల ఏనుగులనూ, ఆరువేల రథాలనూ ఆనందంగా ఇచ్చాడు.

న, ఇట్టిచ్చి యనిచిన భద్రుండు గొడుకునుం గోడలిం దోడ్కొనుచు. బరమానందంబు నొందుచు, నక్కడక్కడి జనంబులు పది వేల విధంబులం బొగడ, నిజపురంబున కరిగి యచ్చట యాదవులతోడ€ దా గరిపురంబునకుం బోయిన విధంబును, వారలాడిన దురాలాపంబులును, దా నందులకై యొనర్చిన ప్రతీకారంబును నెజింగించి సుఖంబుండె; వారణపురంబు నేండును దక్షిణం బెగసి యుత్తరభాగం బొకించుక గంగకై క్రుంగి బలభద్రుని మాహాత్మ్యంబు. దెలుపుచున్న' దని య మహాత్ముని భుజవీర్యం బవార్యంబని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె. 597

పదన స్కంధము- ఉత్తరభాగము 131

  • ఇలా దుర్యోధనుడు అల్టుణ్మీ కూతురినీ సాగనంపగా బలరాముడు వారిని వెంటబెట్టుకొని ప్రజల (ప్రణామాలు అందుకొంటూ ఆనందంగా ద్యారకానగరానికి వెళ్ళాడు. అక్కడ తన వారితో తాను హస్తినాపురానికి ఏ విధంగా వెళ్ళిందీ, దుర్యోధనాదులు ఏమి మాట్టాడిందీ, దానికి ప్రతీకారంగా తా నేమి చేసిందీ, వివరంగా చెప్పి వారిని సంతోషపరిచాడు. హస్తినాపురం ఈనాడు కూడా దక్షిణం వైపు లేచి, ఉత్తరం గంగానదివైపు కొంచెం (క్రుంగి, బలరాముడి మాహాత్మ్యాన్ని చాటుతూ ఉంది- అని ఈ రీతిగా శుకమహర్షి బలరాముడి భుజబలం సామాన్యమైనది కాదని చెప్పి పరీక్షిత్తుతో ఇంకా యిలా అన్నాడు. -: షోడశసహస్ర స్రీ సంగతుండైన శ్రీకృష్ణుని మహిమ నారదుం డరయుట :- చ. “నరవర! యొక్కనాండు విని నారదసంయమి మాధవుండు దా నరకుని. ద్రుంచి వాని భవనంబున నున్న పదాజువేల సుం దరులను నొక్కమాటు ప్రమదంబున నందణ కన్ని రూపులై పరిణయ మయ్యె' నా విని శుభస్థితి. దద్విభనంబు( జూడంగన్‌. 598
  • ఓ రాజేంద్రా! విను. కృష్ణుడు నరకాసురుణ్ణి చంపి వాని మందిరంలో ఉన్న పదారువేల అందగత్తెలనూ వరించి, ఒక్కమారుగా అందరికీ అన్ని రూపాలతో కనపడి వివాహం చేసుకొన్నాడనే వార్త నారదుడు విని, అతని వైభవాన్ని దర్శించాలనే కాంక్షతో ఒకనాడు ద్వారకకు వచ్చాడు. వ. ఇట్టు దలంచి కృష్ణపాలితం బయిన ద్యారకానగరంబు డాయంజని ముందట. 599 సీ శుక శారికా శిఖి పీక కూజితప్రసవాంచితోద్యాన వనాఘములను గలహంస సారస క్రైరవ కమల కహ్లార శోభిత కమలాకరముల+ గలమాది సస్య సంకులవరేక్షుక్షేత్ర భూరి లసన్నదీ తీరములను గిరిసాను పతిత నిర్హ్యరకణ సందోహ సంతత హేమంత సమయములను తే. గమలసంభవకాంచనకార రచిత, చిరతరైశ్వర్య నగరలక్ష్మీకరాబ్ద ఘటిత నవరత్నమయ హేమకటక మనంగ సాబగు మీజీన కోటయు. జూచె మౌని. 600
  • నారదుడు ద్వారకలో ప్రవేశించాడు. చిలుకలూ, గోరువంకలూ, నెమళ్ళూ, కోయిలలూ ఆనందంతో కలకలారావాలు చేస్తూ ఉన్న ఉద్యానవనాలను చూచాడు. హంసలతోనూ, బెగ్గురు పక్షులతోనూ, పద్మాలతోనూ, కలువలతోనూ శోభిస్తూ ఉన్న సరోవరాలను సందర్శించాడు. వరిపంటలతో కలకలలాడే క్షేత్రాలతోనూ, చెరకు తోటలతోనూ కనువిందు చేసే నదీతీరాలను తిలకించాడు. కొండచరియలనుంచి ఎల్లప్పుడూ జల్టులుగా పడుతున్న సెలయేటి నీటి తుంపరలవల్ల సదా హేమంత బుతువుగా అలరారుతున్న ్రదేశాలనూ కనుగొన్నాడు. బ్రహ్మతో సమానులైన స్వర్షకారులచేత తయారుచేయబడి, భోగభాగ్యాలతో తులతూగే నగరలక్ష్మి తనచేతికి ధరించిన నవరత్న ఖచితమైన బంగారు కంకణంలాగా ప్రకాశిస్తున్న కోటను వీక్షించాడు.

2 పోతన భాగవతము

వ. మజియును సముత్తుంగ ముణిసొధ గవాక్షరంధ్ర నిర్ల్గత నీరంధ్రవున సార చందనాగరు ధూపధూమపటల వితోకన సంజనితపయోధరాభి శంకాం గీక్సృత తాండవకేళీవిలోల పురకామినీ జనోపలాలిత నీలకంఠ సముదయంబును, జంద్రకాంత మణిసృటికస్తంభ సంభృతమరకత పద్మరాగఘటిత నవరత్న కాంచన ప్రాసాదశిఖరాగ్ర విన్యస్త బహుసూర్య విభ్రమకృదంచిత శాతకుంభ కుంభనిచయంబును, సమస్త వస్తు విస్తార సమర్పిత వైశ్యాగారవీథీ వేదికాకలితంబును, మహితాతప నివారణ తరళనిచిత్ర కేతనాబద్ద మయూరశింజినీ నినదపూరితాశాంతరిక్షంబును, సరోజనాభ పూతనా చేతనాపహారాది నూతన విజయసందేశలిఖిత స్వర్ణనర్ధావలీ విభాసిత గోపురమణి నిటంకప్రదేశంబును, యాదవేంద్ర దర్శనోత్సవాహూాయమాన సమాగత నానాదేశాధీశ భూరివారణదానజల ప్రభూతపంక నిరసనైకగతాగత జనసమ్మర్ద కరకంకణకషణ వికీర్యమాణరజః పుంజంబును; వినూత్న రత్నమయ మంగళ రత్నవల్లీ విరాజిత ప్రతిగృహప్రాంగణంబును, గుంకుమసలిలసిక్త నిపణిమార్గంబును, వంది మాగధసంగీత మంగళారావ విలసితంబును, భేరీమృదంగకాహళ శంఖతూర్య రవాధరీకృత సాగర ఛరోషంబునునై, యమరావతీ వృరంబునుం బోలె వనందేవనందననివానంబై, యనల పుటభేదనంబునుం బోలె. గృష్టమార్గ సంచారభూతంబై, సంయమనీనాము నగరంబునుం బోలె హరి తనూభవాభిరానుంబై, నైర్భృతినిలయంబునుం బోలె. బుణ్యజనాకీర్లంబై, వరుణనివాసంబునుం బోలె గోత్రరక్షణ భువన ప్రశస్తంబై, ప్రభంజన పట్టణంబునుం బోలె మహాబలసమృద్దంబై, యలకాపురంబునుం బోలె ముకుంద వర శంఖనుకరాంక కలితంబై, రజతాచలంబునుం బోలె ను(గ్రసేనాధిపార్యాలంకృతంబయి, నిగమంబునుం బోలె నివిధవర్ష్హ క్రమవిధ్యుక్త సంచారంబయి, (గ్రహమండలంబునుం బోలె గురుబుధ విరాజమిదత్ర విరాజితంబయి, సంతత కల్యాణ వేదియుం బోలె వైవాహికోసేతంబయి, బలిదానవ కరతలంబునుంబోలె సంతతదానవారియుక్తంబయి, యొప్తు నప్పురంబు ప్రవేశించి, యందు విశ్వకర్మ నిర్మితంబైన యంతఃపురంబున నుండు షోడశసవాస్ర హర్మ్యంబులందు. 601

  • ఆ ద్వారకానగరంలో మిక్కిలి ఎత్తయిన మేడలున్నాయి. ఆ సౌధాల గవాక్షాలలో నుంచి అగరుధూపధూమాలు వెలువడు తున్నాయి. ఆ నల్లని పొగగుంపులను మేఘాలని (భ్రమించి తాండవం చేస్తున్న నెమళ్ళను అచ్చటి కాంతామణులు ఎంతో అనురాగంతో లాలిస్తున్నారు. ఆ పట్టణంలో చంద్రకాంతమణులు చెక్కిన స్ఫటిక స్తంభాలతో కూడిన నవరత్న(ప్రాసాదాలున్నాయి. ఆ ప్రాసాద శిఖరాలపైన బంగారు కలశాలు అమర్చారు. ఆ కలశాలమీద (ప్రసరించిన సూర్యకిరణాలు వేలకొలది సూర్యబింబాలను సృష్టిస్తున్నాయి. ఆ పట్టణంలో సమస్త వస్తువులతో నిండిన విపణివీథు లున్నాయి. ఆ పట్టణంలో ఆకాశాన్ని అంటుతూ ఎగురుతున్న చిత్ర విచిత్రమైన జెండా గుడ్డలు ఎండతగులకుండా అడ్డుపడుతున్నాయి. బాలగోపాలుడు చేసిన 'పూతనసంహారం” మొదలైన వీరగాథలు బంగారు అక్షరాలతో చెక్కిన ఫలకాలు

గోపురాలపై విరాజిల్లుతున్నాయి.

పదవ స్కంధము- ఉత్తరభాగము 133 నందనందనుని సందర్శనంకోసం విచ్చేసిన నానాదేశాల రాజులు కానుకలుగా తెచ్చిన ఏనుగుల మదధారలచే తడిసిన ప్రదేశాలను వచ్చేపొయ్యేవారి కరకంకణాల ఒరిపిడివల్ల రాలిపడిన బంగారుపొడులు పొడిపొడిగా మారుస్తున్నాయి. ప్రతి ఇంటిముందూ కొంగ్రొత్త రత్నాలతో ముద్దు ముద్దుగా తీర్చిదిద్దిన ముత్యాలముగ్గులు అలరారుతున్నాయి, ఆ పట్టణం పన్నీరు చల్లిన వీథులతోనూ, వందిమాగధుల సంగీత మంగళారావాలతోనూ, సము[ద్రఘోషాన్ని సైతం (క్రిందుపరచే భేరీమృదంగ కాహళాది తూర్యధ్వనులతోనూ నిండి ఉన్నది.

అష్టదిక్సాలుర పట్టణాలను తలపించే ఆ ద్యారకాపట్టణాన్ని నారదుడు ప్రవేశించి, అక్కడ విశ్చకర గచేత నిర్మింపబడ్డ అంతఃపురంలోని పదహారువేల సౌధాలలోనూ శ్రీకృష్ణుణ్హి చూచాడు.

సీ ప్రటికంపు( గంబముల్‌ సవడంపు. బట్టెలు మరకతరచితముల్‌ మదురు అమర వై డూర్యనుణీగణవలభుల బద్మరాగంబుల మొగడుల కాంతు లొలయ సజ్ఞాతినజ్ర లసజ్జ్ఞాల రుచులతో భాసిల్లు నీలసోపానములును గరుడపచ్చల విటంకములును ఘనరుచి వెలసిన శశికాంత వేదికలును

తే. వజణలు మౌక్తికఘటిత కవాటములును, బ్రవినుల స్వర్ణ్వమయ సాలభంజికలును మించు కలరన మెసంగ6 గ్రీడించు మిథున, లీల నొప్పు కపోతపాలికలు. గలిగి. 602

  • స్పటికపు కంబాలూ, పగడాల పట్టెలూ, మరకతమణుల కప్పులూ శోభిల్లగా, వైడూర్యాల ముంజూ

రులు, వజ్రాల కిటికీలూ కాంతులీనగా, పద్మరాగాల నడికొప్పులూ నీలాల సోపానాలు విలసిల్లగా, చంద్రకాంత వేదికలూ గరుడపచ్చల గువ్వగూండ్లూ (ప్రకాశింపగా, ఆణిముత్యాలు కూర్చిన తలుపులూ, సువర్షమయ సాలభంబికలూ, పావురాల జంటల కువకువలతో కూడిన గూళ్ళూ కలిగిన ద్వారకానగరాన్ని నారదుడు దర్శించాడు.

తే. చేటికానీకపద తులాకోటిమధుర, నినదభరితమై రుచిరమాణిక్య దీప మాలికయు గల్లి చూపట్టం గ్రాలు నొక్క, జలజలోచన నిజసొధతలమునందు. 603

తే. కనక కంకణ రుణరుణత్కార కలిత, చంద్రబింబాననా హస్తజలక ఘటిత చామరోద్దూత మారుత చలిత చికుర, పల్లవుని. గృష్టు వల్లవీ పల్లవునిని, 60%

  • చెలికత్తెల కాలిఅందెల సుందరనినాదాలతో నిండి మంజుల మణిదీప మాలికలతో వెలుగొందే ఒక

అందకత్తె సౌధంలో బంగారు కంకణాలు గలగలలాడగా కంజాతలోచనలు వీస్తున్న వింజామరలు గాలికి కదులుతున్న ముంగురులు గల గోపికావల్లభుడైన నల్లనయ్యను నారదుడు చూచాడు.

వ. మటియు హాటకనిష్కంబు లజ్టలందు వెలుగొంద. గంచుకంబులు శిరోవేష్టనంబులు( గనక కుండలంబులు ధరించి, సంచరించు కంచుకులును, సమాన వయోరూసగుణ నిలాసవిభమ కలితలయిన విలాసినీ సహస్రంబులును గొలువం గొలువున్న య ప్పద్మలోచనుం గాంచన సింహాసనాసీనుం గాంచె; న ప్తుండరీకాక్షుండును నారదుం జూచి ప్రత్యుత్హానంబు స్సేి యప్పుడు. 605

134 పోతన భాగవతము

  • బంగారుపథకాలు మెడలలో (్రకాశించగా కంచుకాలూ, తలపాగాలూ, కుండలాలూ ధరించి సంచరించే కంచుకిజనమూ, సమానమైన వయోరూపగుణాలతో విలసిల్లే వేలాది లీలావతులు సేవిస్తూ ఉండగా, బంగారు సింహాసనం మోద కొలువుతీరి కూర్చున్న గోపాల కృష్ణుణ్మి ఆ మహర్షి అవలోకించాడు. తన్ను సమోపిస్తున్న నారద మునీ౦ద్రుణ్మి చూచి కృష్ణుడు ఎదురువచ్చాడు. క్ష మునివరు పాదాంబుజములు, దన చారుకిరీటమణి వితానము సోంకన్‌ వినమితుండై నిజసింహా, సనమున గూర్చుండంభెట్టి సద్వినయమునన్‌. 606
  • శ్రీకృష్ణుడు తనకిరీటంలోని మణులసమూహం తాకేటట్టు ముని శ్రేష్పుడైన నారదుని పాదపద్మాలకు నమస్కారం చేసి తన సింహాసనం మోద కూర్చోబెట్టాడు. క తన పాదకమలతిర్ధం, బున లోకములం బవిత్రముగం జేయు పురా తనమౌని లోకగురు. డ, మ్ముని పదతీర్థంబు మస్తమున ధరియించెన్‌. 607
  • తన చరణకమల తీర్థంచేత సర్వలోకాలనూ పవిత్రంచేసే ప్రాచీనమునీ, లోకగురుడూ ఐన శ్రీకృష్ణుడు నారదుని పాదతీర్థం తన తలపై చల్టుకున్నాడు. వమ ఇట్లు బ్రహ్మణ్యదేవుండును నరసఖుండు నై న నారాయణుం డశేష తీర్గోపమానంబయిన మునీంద్రపొద తీర్ధంబు ధరించిన వాం డయి' సుధాసారంబులైన మితభాషణంబుల నారదున కిట్లనియె. 608
  • ఈ విధంగా దేవదేవుడూ, నరునికి చెలికాడూ అయిన నారాయణుడు సమస్త పుణ్యతీర్థాలకూ సమానమైన నారదమునీంద్రుని పాదజలాన్ని తలపై ధరించినవాడై అమృతం చిలికే పలుకులతో ఇలా అన్నాడు. కు “ఏ పని పంచిన. జేయుదు( దాపసవర! యనుడు నతడు *'దామోదర'! చి (ద్రూపక! భవదవతార, వ్యాపారము దుష్టనిగ్రహార్ధము గాదే! 609
  • 'ఓ తాపసవరేణ్యా! మరు ఏ పని చేయవలసిందని ఆజ్ఞాపిస్తే ఆ పని చేస్తాను. సెలవీయండి”. ఇలా పలికిన కృష్ణునితో నారదుడు ఇలా అన్నాడు. 'స్వామా! దామోదరా! మారు అవతరించటం దుర్మార్గులను సంహరించటానికే కదా! తే. అభిలలోకైకపతివి దయార్థమతివి, విశ్వసంరక్షకుండవు శాశ్వతుండవు వెలయ నే పనియైన గావింతు ననుట, యార్తబంధుండ విది నీకు నద్భుతంబె! 610
  • నీవు సమస్తలోకాలకూ యజమానివి. దయగలవాడవు. ప్రపంచాన్ని రక్షించేవాడవు. ఆర్తులకు బాంధవుడవైన నీవు ఏ పని అయినా చేస్తానని చెప్పడం ఆశ్చర్యం కాదు. తే. అబ్బసంభవ హరదేవతార్చనీయ, భూరిసంసార సాగరోత్తారణంబు నన్య యానంద మోక్షదాయకము నైన, నీ పదధ్యాన మాత్మలో నిలువ నీవె 611

పదవ స్కంధము- ఉత్తరభాగము 135

౪ బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైన దేవతలచేత పూజింపబడే ఓ స్వామా! సంసారసాగరాన్ని దాటడానికి

సాధనమైనదీ, మోక్షాన్ని ప్రసాదించేదీ ఐన నీ పదధ్యానం నా ఆత్మలో నిలిచేటట్టు అనుగ్రహించు.

వ. అని యభ్యర్థించి య ద్దేవునివలనం బ్రసన్నత వడసి, తన్మందిరంబు వెడలి మునివరుం డ మ్మహాత్ముని యోగమాయాప్రభానంబు దెలియంగోరి, వేతొక చంద్రబింబాననా గేహంబునకుం జని యందు నెత్తమాడుచున్న పురుషోత్తము నుద్ధ్రవయుతుం గని యద్భుతంబు నొందుచు నతనిచేత సత్కుతుండై యచ్చోట వాసి చని. 612

౪* ఈ విధంగా ప్రార్ధించి నారదుడు శ్రీకృష్ణుని అను(గ్రహం పొంది ఆ మందిరంనుంచి వెలుపలికి

వచ్చాడు. ఆ దేవర్షి వాసుదేవుని యోగమాయాప్రభావం తెలుసుకోదలచినవాడై వేరొక వాల్గంటి యింటికి వెళ్ళాడు. అచ్చట ఉద్ధవునితో కలిసి జూదమాడుతూ ఉన్న శ్రీకృష్ణుణ్మి ఆలోకించి ఆశ్చర్యచకితుడైనాడు. అచ్చట కృష్ణునిచే పూజింపబడినవాడై ఆ భవనం వదలి వెళ్ళాడు.

క. మునివరుండు కాంచె నొండొక, వనజాయతనేత్ర నిజనివాసంబున నం దనయుతు జిష్టు సహిష్టున్‌, వినుత గుణాలంకరిష్టు విష్ణున్‌ గృష్లున్‌. 613

  • నారదుడు మరొక సుందరీమణి మందిరానికి వెళ్ళాడు. అక్కడ నందనులతో కలిసి ఆనందిస్తున్న నందనందనుళ్ణై సందర్శించాడు.

క. నారదుండట చని కనె నొక, వారిజముఖియింట నున్న వాని మురారిన్‌ హారిన్‌ దానవకుల సం, హారిన్‌ గమలామనోవిహోరిన్‌ శౌరిన్‌, 614

౫ నారదుడు వేరొక నారీమణి మందిరానికి వెళ్లి అక్కడ ఉన్న దానవాంతకుడైన కృష్ణుణ్ణి దర్శించాడు. వ. ఇట్టు కనుంగొనుచుం జనుచుండ నొక్క యెడ న మ్మునీంద్రునకు ముకుందుండు ప్రత్యుత్దానంబు చేసి “మునీంద్రా! సంపూర్ణకాము లయిన మిమ్ము నపూర్ణకాములమైన మే మేమిటం బరితృప్తి నొంద( జేయంగలవారము? భవదీయదర్శనంబున నిఖిలశోభనంబుల నందెదమని ప్రేయపూర్వ కంబుగా. బలికిన నా నందనందను మాటలకు నానందకందళిత హృదయార విందుండును, మందస్మిత సుందర వదనారవిందుండును నగుచు నారదుండు వెండియు! జని చని. 615

  • ఈ విధంగా వాసుదేవుని కనుగొంటూ వెళుతూ ఉన్న నారదుణ్ణి కృష్ణుడొక యింటిలో గౌరవించి “మునీంద్రా! ఏ కోరికలూ లేని మిమ్ములను కోరికలు గల మేము ఏ విధంగా సంతృప్తి పరచగలం? మో దర్శనంతో సమస్త శుభాలనూ పొందుతాము' అని ప్రీతిపూర్వకంగా పలికాడు. కృష్ణుని మాటలకు సంతోషించిన మనస్సు కలవాడై చిరునవ్వు నవ్వుతూ నారదుడు ముందుకు సాగిపోయాడు. క. అనఘాత్ముండు గనుంగొనె నొక వవితామణి మందిరమున వనకేళీ సం జనితానందుని ననిమిష, వినమిత చరణారుణారనిందు ముకుందున్‌. 6516

136 పోతన భాగవతము

  • పుణ్యాత్ముడైన నారదుడు ఒక వనిత ఇంటిలో జలకేళి సలుపుతూ ఆనందిస్తున్న సురవందిత చరణారవిందుడైన ముకుందుణ్ణై చూచాడు. క. పరమేప్టిసుతుండు గనె నొక, తరుణీభననంబునందు. దను దాన మనో£.౦ బురుహమున6 దలంచుచుండెడి, నరకాసుర దమనశూరు నందకుమారున్‌. 617
  • నారదుడు మరొక తరుణీమణి యింటిలో తనలో తనను చూచుకొంటూ యోగనిష్టలో ఉన్న నరకాసురాంతకుడైన శ్రీకృష్ణుణ్మి దర్శించాడు. వ. మజీయుం జని చని. 618
  • ఇలా చూస్తూ నారదుడు మరీ ముందుకు వెళ్ళాడు. సీ. ఒకచోట నుచితసంధ్యోపాసనాసక్తు నొకచోటం బౌరాణికోక్తి కలితు నొకచోటం బంచయజ్ఞోచితకర్ముని నొకచోట నమృతోపయోగలోలు నొకచోట మజ్జనోద్యోగానుషక్తుని నొకచోట దివ్యభూషోజ్జులాంగు నొకచోట ధేనుదానోత్క లితాత్ముని నొకచోట నిజసుత ప్రకరయుక్తు తే. నొక్క చోటను సంగీతయుక్త చిత్తు నొక్కచోటను జలక్రేళియుతవిహారు వొక్కచోటను సన్మంచకోపయుక్తు నొక్కచోటను బలభద్రయుక్తచరితు. 619
  • ఒక గృహంలో సంధ్యావందనం చేస్తూ ఉన్న వాళ్డో, మరొక గృహంలో పురాణశ్రవణం చేస్తూ ఉన్న వాణ్ణీ ఒక తావున పంచయజ్ఞాలు ఆచరిస్తున్న వాణ్ణీ మరొకచోట యోగసమాధి నిమగ్నుడై ఉన్నవాణ్ణో, ఒకస్టలంలో స్నానార్హం సిద్ధమవుతూ ఉన్నవాణ్ణీ, ఇంకొకస్టలంలో ప్రశస్తభూషణాలతో (ప్రకాశిస్తూ ఉన్నవాణ్ణీ, ఒక ప్రదేశంలో గోదానం చేయాలని కుతూహలపడుతున్న వాణ్ణీ, మరొక ప్రదేశంలో తనకుమారులతో ఆడుకుంటూ ఉన్నవాణ్ణీ ఒకచోట సంగీతంపై ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉన్నవాణీ ఒకచోట జలకేళిలో మునిగి తేలుతున్న వాణ్ణీ, ఇంకొకచోట మంచం మీద కూర్చొన్న వాణ్ణీ, మరొకచోట బలరామ సహితుడై ఉన్నవాణ్ణో- శ్రీకృష్ణ్పురమాత్మను నారదమహర్షి దర్శించాడు. వన. మజణియును. 620 సీ, సకలార్థసంవేది యొక యింటిలోపల జెలితోడ ముచ్చటల్‌ సెప్ప్తుచుండు విపులయశోనిధి వేజొకయింటిలో సరసిజాననం గూడి సరసమాడుః బుండరీకదళాక్షుండొండొకయింటిలో. దరుణికి హారవల్లరులు (గుచ్చు గరుణాపయోనిధి మజియొక యింటిలో. జెలి. గూడి విడియము సేయుచుండు ఆ. వికచకమలనయను. డొకయింటిలో నవ్వు, బ్రవిమలాత్ముండొకట. బాడుచుండు యోగిజనవిధేయు. డొకయింట సుఖగోష్టి సలుపు ననఘుండొకటం జెలంగుచుండు. 621
  • అంతేకాదు. శ్రీకృష్ణుడు ఒక ఇంటిలో తన ముద్దులసఖితో ముచ్చటించుతున్నాడు. మరో ఇంటిలో మరొక యువతితో సరసమాడుతున్నాడు. ఇంకో యింటిలో ఒక నారీలలామకు హారాలు కూరుస్తున్నాడు.

పదవ స్కంధము- ఉత్తరభాగము 137 ఒక యింటిలో తన ప్రేయసితో కూడి తాంబూలం సేవిస్తున్నాడు. ఒక యింటిలో నవ్వుతున్నాడు. ఒక యింటిలో పాడుతున్నాడు. ఒక యింటిలో సుఖగోష్టి చేస్తున్నాడు. ఒక యింటిలో ఆనందిస్తున్నాడు. ఈ విధంగా అనేక రూపాలతో కనబడుతూ ఉన్న ఆ సకలార్ధసందేదిని, ఆ విపులయశోనిధిని, ఆ పుండరీకదళాక్తుని, ఆ కరుణాపయోనిధిని, ఆ వికచకమల నయనుని, ఆ విమలాత్ముని, ఆ యోగిజన విధేయుని, ఆ శ్రీకృష్ణభగవానుణ్జి దర్శిస్తూ నారదుడు ముందుకు సాగిపోయాడు.

వ. ఇట్టు సూచుచుం జని చని. 622 క, చతురానన నందను డం, చితముతి( జని కాంచె నొక్క చెలిగహిమునన్‌ (గ్రతుకర్మాచరణుని నా, శ్రితభయహరణున్‌ సురేంద్రసేవితచరణున్‌. 623

  • ఇలా సాగిపోయి యజ్ఞకర్మల్ని చేసేవాడూ, ఆశ్రితుల భయాన్ని పోగొట్టేవాడూ, దేవేంద్రునిచేత పూజింపబడే పాదాలు కలవాడూ అయిన శ్రీకృష్ణుణ్హి నారదుడు ఒక యువతి యింటిలో చూచాడు. క. వృటత్రారినుతుని. బరమ, పవిత్రుని నారదుండు గాంచె వేశాక యింటం బుత్రక పొత్రక దుహిత్స క, ళత్రసమేతుని ననంతు లక్షణనంతున్‌. 624
  • దేవేంద్రుని చేత పాగడబడేవాడూ; పరమపవిత్రుడూ; కొడకులూ, మనుమళ్ళూ కూతుళ్లూ భార్యలూ వీరందరితో కలిసి ఉన్నవాడూ అయిన నందతనయుణ్లే నారదుడు మరో మందిరంలో దర్శించాడు. క. సుందరమగు నొకసుందరి, మందిరమున. బద్మభవకుమారుండు గాంచెన్‌ నందితనందున్‌ సుజనా, నందున్‌ గోవిందు నతసనందు ముకుందున్‌. 625
  • ఒక సుందరాంగి ఇంటిలో సజ్జనులచేత కీర్తించబడేవాడూ, సనక సనందనాదుల వందనాలు అందుకునేవాడూ అయిన గోవిందుణ్ణి నారదుడు చూచాడు. క జలజభవసుతుండు గనె నొక, నలినాక్షినివాసమందు నతభద్రేభున్‌ జలదాభున్‌ గతలోభు, న్నలకాళిజితద్విరేపు నంబుజనాభున్‌. 626
  • ఒక పద్మనేత్ర యింటిలో గజహంతకుడు, నీలమేఘశ్యాముడు, లోభరహితుడు, నల్లనిముంగురులు కలవాడు, పద్మనాభుడైన శ్రీకృష్ణుణ్మి నారదుడు తిలకించాడు. మ. ఒకయింటం గజవాజిరోహకుండునై యొక్కింట భుంజానుండై సకలాత్ముండు పరుండు షోడశసహస్ర ప్రీనివాసంబులం దొక బోటింటను దప్పకుండ నిజమాయోత్సాహు(డై యుండ న య్యకలంకున్‌ వరదున్‌ మహాపురుషు బ్రహ్మణ్యున్‌ నతాబ్దాసనున్‌. (627
  • ఒక యింటిలో ఏనుగులపై, గుర్రాలపై స్వారి చేస్తూ ఉన్న మురారిని చూచాడు. ఒక యింటిలో భోజనం చేస్తూ ఉన్న పురుషోత్తముణ్మి కాంచాడు. ఒక యింటిలో నిద్రిస్తూ ఉన్న నీరజాక్షుణి విలోకించాడు.

138 పోతన భాగవతము ఇలా పదహారు వేల స్త్రీల నివాసాలలోనూ, ఏ స్రీ యిల్లు తప్పిపోకుండా తన మాయా (ప్రభావంతో ఉన్న మహాపురుషుడైన శ్రీకృష్ణుణ్లి నారదుడు దర్శించాడు. క. అస్తోకచరితు నమిత స, మస్తసుధాహారు వేదమస్తకతల వి న్యస్తపదాంబుజయుగళు న, పొస్తథ్రితనిఖిల పొపు. బరము ననంతున్‌, 628

  • ఉదాత్తమైన చరిత్ర కలవాడూ, ఉపనిషత్తుల యందుంచబడిన పాదపద్మాలు కలవాడూ, సమస్త దేవతలకు ఆరాధ్యు డైనవాడూ, ఆశ్రితుల పాపాలను పోగొట్టేవాడూ, అనంతుడూ అయిన శ్రీకృష్ణుణ్ణి నారదుడు చూచాడు. ఆ. పరనుభాగవతుండు పరమేష్టి తనయుండు, మనుజలిల. జెంది మహితసౌఖ్య చిత్తుండైన యా హృషీకేశు యోగ మా, యాషఫ్రభావమునకు నాత్మ నలరి. 629
  • మనుష్యభావంతో మహానందాన్ని అనుభవిస్తున్న శ్రీకృష్ణుని యోగమాయా (ప్రభావాన్ని పరీక్షించి చూచి పరమభాగవతుడైన (బబ్రహ్మమానసపుత్రుడు నారదుడు చాలా సంతోషించాడు. క. మాయురె? హరిహరి వరద! య, మేయగుణా! యనుచు నాత్మ మెచ్చి మునీంద్రుం డాయదు నాయకు సుజన వి, ధేయుని కిట్టనియె “దేవ! త్రిజగములందున్‌. 630
  • 'ఆహాహా! హరి హరీ! సుప్రసన్నా! ఉన్నత గుణసంపన్నా!' అని మెచ్చుకొంటూ నారదుడు కృష్ణునితో ఇలాఅన్నాడు. _ క, నీ మాయః దెలియువారలె, తామరసాొసన సురేంద్రతాపసు ఖైనన్‌ ధీమంతులు నీభక్తిసు, ధా మాధుర్యమున( బొదలు ధన్యులు దక్కన్‌. 631
  • ఓ దేవా! ముల్గోకాల్లో బ్రహ్మేంద్రాది దేవతలూ, మహార్డులు కూడా నీ మాయను తెలుసుకోలేరు. నీ భక్తి అనే అమృతంలోని తీయదనాన్ని రుచిచూచిన పుణ్యాత్ములు మాత్రమే నీ తత్తాన్నీ తెలసుకోగలరు. క అని హర్షించుచు “నిత నేం బవవినియెద నిఖిలలోక పాననమును స జ్ఞైనహితమునైన నీకీ, ర్తన మభిలజగంబులందు( దగ నెణింగెంచున్‌, 632
  • ఈ విధంగా పలికి నారదమహర్షి హర్షాతిశయంతో 'ఇక నేను సెలవు తీసుకుంటాను. పవిత్రమైనదీ, సజ్జనులకు హితమైనదీ అయిన నీ నామసంక్షీర్తనం సమస్తలోకాల్లోను ప్రకటిస్తాను' అని అన్నాడు. క. అని తద్వచనసుధాసే, చనమున ముదితాత్ము( డగుచు సరయమి చిత్తం బునం దన్మూర్తిం దగ నిడు, కొని చనియెను హరినుతైక కోవిదు. డగుచున్‌. 633
  • ఇలా పలికి వాసుదేవుని వాగమృతధారలో మునిగిన వాడై సంతుష్టాంతరంగుడైన నారదుడు తన మనస్సులో మాధవుని మంగళమయ స్వరూపాన్ని నిలువుకొని వెళ్ళిపోయాడు. క ఈ పగిది లోకహితమతి, నా పరమేశ్వరుండు నూనవాకృతి! ద్రిజగ ద్దీసీత చారిత్రుండు బహు, రూపములం బొందె సుందరుల నరనాథా! 634

సదవ స్కంధము- ఉత్తరభాగము 139

  • ఓ రాజా! ఈ విధంగా లోకానికి మేలు చేకూర్చాలనే మనస్సుతో ఆ శ్రీకృష్ణుడు మానవాకారాన్ని

ధరించి ఆ సుందరాంగుల నందరినీ అనేక రూపాలతో ఆనందింపచేశాడు.

చ. అని హరి యిట్టు షోడశసహస్ర వధూమణులం బ్రియంబునన్‌ మనసిజకేళి. దేల్చిన యమానుషలీల సమగ్ర భక్తితో వినిన. బఠించినం గలుగు విష్ణుపదాంబుజ భక్తియున్‌ మహా ధన పశు పుత్రమిత్ర వనితాముఖ సౌఖ్యములున్‌ నరేశ్వరా! 635

౪ శ్రీకృష్ణుడు పదహారు వేల (్రీలను ఆదరించిన కథను విన్నా చదివినా విష్ణుదేవుని పాదాలపై భక్తి

ప్రాప్తించటమే కాకుండా ధన, పశు, పుత్ర, మిత్ర, కళతాద్రి సౌఖ్యాలు సైతం లభిస్తాయి.

వ. అని చెస్పయ స్పారాశర్యనందనుం డభిమన్యు నందనున కిట్టనియె. “నా నిశావసానంబున( బద్మబాంధవాగమనంబును గమలినీ లోకంబునకు మునుకలుగ నెజింగించు చందంబునం గలహంస సారసరథాంగముఖ జలనిహంగంబుల రవనంబులు సెలంగ నరుణోదయంబున మంగళసాఠకసంగీత మృదుమధుర గాన నినదంబును లలితనృుదంగ వీణావేణునినాదంబును ఏతేర మేలుకని తనచిత్తంబున జిదానందమయుం బరమాత్ము నవ్యయు ననవికారు నద్వితీయు నజితు ననంతు నచ్యుతు నమేయు నాఢ్యు నాద్యంత విహీను. బరమబ్రహ్మంబు నైన తన్నుం దా నొక్కింత చింతించి యనంతరంబ విరోధిరాజన్య నయన కల్హారంబులు ముకుళింప భక్తజన నయన కమలంబులు వికసింప నిరస్త నిఖిలదోషాంధకారుం డైన గోవిందుండు మొగిచిన లోచన సరోజంబులు వికసింప జేయుచు. దల్పంబు డిగ్గి చనుదెంచి యంత 636

౫ ఈ విధంగా చెప్పి శుకయోగి పరీక్షిత్తుతో మళ్ళా ఇలా అన్నాడు. పద్మాప్తుడైన సూర్యుని రాకను

పది శనీలతకు ముందుగా తెలుపుతున్న వేమో అన్నట్టు రాజహంసలు, సారసపక్షులు, చ(క్రవాకాలు చేస్తున్న కలధ్వనులనూ, మృదుమధురాలైన మంగళపాఠకుల సంగీతనాదాలనూ, మనోహరమైన మృదంగ వేణు వీణా గానరవాలనూ ఆలకించుతూ అరుణోదయ సమయాననే శ్రీకృష్ణుడు వేలుకొన్నాడు. పరబ్రహ్మస్వరూపమైన తన్ను తానే ధ్యానించుకుంటూ కన్నులు తెరచి శయ్యను దిగాడు. ఆయన కన్ను తెరవగానే పగవారి కనుగలువలు ముకుళించాయి. దురితాంధకారాలు దూరమైనాయి.

సీ మలయజ కర్పూర నుహిత వాసితహేమ కలశోదకంబుల జలకమాడి నవ్యలసన్కృదు దివ్యవస్తంబులు వలనొప్ప రింగులు వాజ గట్టీ మకరకుండలహార మంజీర కేయూర వలయాది భూషణావలులు దాల్చి ఘనసార కస్తూరికా హరిచందన మిళితపంకము మేన నలర నలఈది

తే. మహితసౌరభ నవకుసుమములు దుజిమి, పొసంగ రూపైన శృంగార రస మనంగ మూర్తి. గైకొన్న కరుణాసముద్ర మన(॥, రమణ నొప్పుచు లలితదర్పణము చూచి. 637

140 పోతన భాగవతము ౫ అనంతరం ఆ నందనందనుడు చందనకర్పూరాల పరిమళాలతో గుమగుమలాడే కాంచన కలశజలాలతో స్నానం చేశాడు. సన్నని మృదువైన దుస్తులు ధరించాడు. మకరకుండల హారకేయూరాది భూషణాలను అలంకరించుకున్నాడు. పచ్చకర్పూరం, కస్తూరి, మంచిగంధం కలిపిన మైపూతను స్వీకరించాడు. సువాసనలు వెదజల్లే సుమమాలికలు కైసేసి రూపం దాల్చిన శృంగారరస మనేటట్టుగా , ఆకారం ధరించిన అనురాగ సముద్రం అనేటట్టుగా అలరారుతున్న శ్రీకృష్ణుడు తన అందాన్ని అద్దంలో చూచుకున్నాడు. తే. కడంగి సారథి తెచ్చిన కనకరథము, సాత్యకి హితప్రియోద్దవ సహితుం డగుచు నెక్కి నిజకాంతి దిక్కుల( బిక్కటిల్లం బూర్వగిరి. దోయ భానునిం బోలి వెలిలె. 638

  • సాత్యకితోనూ, మిత్రుడైన ఉద్దవునితోనూ కలిసి సారథి తెచ్చిన బంగారురథాన్ని అధిరోహించినవాడై శ్రీకృష్ణుడు వెలుగులు వెదజల్లుతూ ప్రాగ్టిశలో ప్రకాశించే సూర్యునిలా శోభించాడు. సీ. అభినవనిజమూర్తి యంతఃపురాంగనా నయనాబ్దములకు నానంద మొసంగ సలలిత ముఖచంద్ర చంద్రికాతతి పొరజనచకోరముల కుత్సవము సేయ మహనీయకాంచన మణిమయభూషణ దీస్త్పులు దిక్కుల దేజరిల్ల నల్ల నల్లన వచ్చి యరదంబు వెస డిగ్గి హల కులిశాంకుశ జలజ కలశ తే. లలిత రేఖలు ధరణి నలంకరింప, నుద్ధవుని కరతల మూని యొయ్య నడచి మహితగతి దేవతాసభానుధ్యమునను, రుచిర సింహాసనమున గూర్చుండే నెలమి. 639
  • శ్రీకృష్ణుడు తన నవమోహనాకారం అంతఃపుర్రీల కన్నులకు ఆనందాన్ని అందింపగా అందాలు చిందే తన ముఖచంద్రుని వెన్నెల వెలుగులు పురజనుల నేత్రచకోరాలకు పండుగ చేయగా, తానలంకరించుకొన్న మణిమయాలైన ఆభరణాల కాంతులు నలు దిక్కుల ప్రసరింపగా, మెల్లమెల్లగా వచ్చి, రథం దిగి, హలకులిశాది రేఖలతో శుభంకరాలయిన తన పాదముద్రలు భూమిని అలంకరించగా ఉద్దవుని చేతిని ఊతగా (గ్రహించి గంభీరంగా నడుస్తూ మహాసభామధ్య మందున్న మణిమయ సింహాసనం మోద ఆసీనుడైనాడు. చ. అతివిభవంబునం దనరి యాత్మతనుద్యుతి తేజరిల్లంగా హితులు పురోహితుల్‌ నసుమతీశులు మిత్రులు బాంధవుల్‌ బుధుల్‌ సుతులును మాగధుల్‌ కవులు సూతులు మంత్రులు భృత్యులున్‌ శుభ స్థితి. గొలువంగం నొప్పె నుడుసేవితుండైన సుధాంశుండో యనన్‌. 640
  • శ్రీకృష్ణుడు మహావైభవంతో తన శరీరకాంతులు నలుగడలా (ప్రసరింపగా హితులూ, పురోహితులూ, రాజులూ, మిత్రులూ, చుట్టాలూ, పెద్దలూ, కుమారులూ, స్తుతిపాఠకులూ, కవులూ, మంత్రులూ, సేవకులూ అందరూ తన్ను సేవిస్తూ ఉండగా నక్షత్రాల నడుమ విరాజిల్లే చంద్రునిలా ప్రకాశించాడు. క. కరుణా'నదష్టి- బ్రజలం, బరిరక్షించుచు వివేకభావకళా చా తురి మెజసీ యిష్టగోష్టిం బరమానందమున రాజ్యభారకు( డగుచున్‌. 641

సదవ స్కంధము- ఉత్తరభాగము కైడ1

  • శ్రీకృష్ణుడు దయతో నిండిన చూపులతో ప్రజలను పరిపాలించుతూ విద్యావివేక విజ్ఞానచతురుడై

ఆత్మీయులతో అభిభాషిస్తూ ఆనందంగా రాజ్యభారాన్ని వహించాడు.

న. ఇ వ్విధంబునం బ్రతిదినసంబును నుండు నవసరంబున నొక్క నాండపూర్వ దర్భనుండైన భూసురుం డొక్కరుండు సనుదెంచి సభా మధ్యంబునం గొలువున్న ముకుందునిం బొడగని దండప్రణామం బాచరించి వినయంబునం గరంబులు మొగిచి యిట్లనియె. 6క2

  • వాసుదేవుడు ఈ విధంగా తన నిత్యకార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉండగా ఒకనాడు (క్రొత్తవాడైన

బ్రాహ్మణ డొకడు వచ్చి సభామధ్యంలో కొలువుతీరి ఉన్న శ్రీ కృష్ణుణ్ణి దర్శించి నమస్కారం చేసి వినయంతో చేతులు జోడించి యిలా అన్నాడు.

క. కంజవిలోచన! దానవ, భంజన! యోగీంద్రవిమల భావలసద్బో ధాంజన! దీప్తి నిదర్శన!, రంజితశుభమూర్తి! కృష్ణ! రాజీవాక్షా! 643

౪ రాజీవలోచనా! రాక్షసభంజనా! యోగీశ్చరహృదయ రంజనా! తేజోనిధీ! దివ్యమంగళవి[గ్రహా!

అను[గ్రహించు.

తే. అవధరింపు జరాసంధు. డతులబలుండు, దనకు మొక్కని ధారుణీధవుల నెల్ల వెదకి తెప్పించి యిరువదివేల నా(కం బెట్టినాండు గిరివ్రజపట్టణమున. 64క

  • మిక్కిలి బలవంతుడైన జరాసంధుడు తనకు నమస్కరించని రాజుల నందరినీ వెదకి వెదకి

తెప్పించి తన రాజధానిమైన గిరివ్రజపురంలోని కారాగారాలలో బంధించాడు. అటువంటివారు ఇప్పటికి ఇరవైవేల వరకూ ఉన్నారు.

తే. వారు పుత్తేర వచ్చినవాండ నేను, నరవరోత్తమ! నృపుల విన్నపము గాంగ విన్నవించెద నామాట వినిన మీంద, ననఘ! నీ దయ! వీరి భాగ్యంబు కొలంది. 6క5్‌

  • ఓ పురుష్తోత్తనూ! వారు పంపించగా నే నిపుడు వచ్చాను. వారి మాటగా నీ కిప్పుడు మనవిచేస్తున్నాను. ఆ పైన మొోదయ, వారి అదృష్టం.

వ. అని ధరాధిపుల విన్నపంబుగా నిట్లనియె. 646

  • ఇలా పలికి ఆబ్రాహ్మణుడు రాజుల విన్నపంగా కృష్ణునితో ఈ విధంగా అన్నాడు.

ఉ. వారిజనాభ! భక్త జనవత్సల! దుష్టమదాసురేంద్ర సం హార! సరోరుహాసనపురారి ముఖామరవంద్య పాద పం కేరుహ! సర్వలోకపరిక్తీర్తిత దివ్యమహాప్రభావ! సం సారవిదూర! నందతనుజాత! రమాహృదయేశ! నూధవా! 647

క్ష42 పోతన భాగవతము

  • కృష్ణా! నీవు దుష్టరాక్షస సంహారకుడవు! భక్తజన వత్సలుడవు! (బ్రహ్మ, ఈశ్వరుడు, దేవేంద్రుడు మొదలైన దేవతలచేత నమస్కరింపబడే పాదపద్మాలు కలవాడవు! సమస్తలోకాలచేత పాగడబడుతున్న మహా్రభావం కలిగినవాడవు! సంసారవిదూరా! నందకుమారా! లక్ష్మీనాథా! మాధవా! అవధరించు. ఆ. ఆర్హజనుల మమ్ము నరసి రక్షింపు మ, హాత్మ! భక్త జనభయాపహరణ! నిన్ను మది నుతించి నీకు మొైక్కెదము నీ, చరణయుగము మాకు శరణ నునఘ! 648
  • ఓ మహాత్మా! ఆర్తజనులమైన మము కటాక్షించి రక్షించు. భక్తుల భయాన్ని పోగొట్టే నిన్ను మా మనస్సులలో ధ్యానించి నీకు నమస్కారం చేస్తున్నాము. నీ పాదాలే మాకు దిక్కు. క బలియుర దండింసంగ దు, రృలులను రక్షింప జగతిపై నిజలీలా కలితుండవై యుగయుగమున, నలవడ నుదయించు కాదె యభవ[ీయనంతా! 6క్త9
  • ఓ అనంతా! బలవంతులైన దుర్మార్లులను శిక్షించటానికీ, బలహీనులైన సన్మార్గులను రక్షించటానికీ నీవు ప్రతియుగంలోనూ భూమి మోద అవతరిస్తూ ఉంటావు కదా! క. నీమదిం దోంపని యర్థం, బీ మేదిని యందు గలదె యీశ్వర! భక్త స్తోమసురభూజ! త్రిజగత్‌, క్షేమంకర ! దీనరక్షసీయు మురారి! 650
  • ఓ కృష్ణా! నీ మనస్సుకు తోచని అర్ధం ఈ ప్రపంచంలో లేదు. ముల్లోకాలకూ క్షేమాన్ని కోరే భక్త జనమందారమా! దీనులైన మమ్ము కాపాడు. కు నీ పంపు సేయకుండంగ, నా పద్మభవాదిసురులకైనను వశమే? శ్రీపతి శరణాగతులం, జేపట్టి నిరోధ ముడుగ6 జేయుము కృష్ణా! 651.
  • (బ్రహ్మాది దేవతలకు సైతం నీ ఆజ్ఞ ఉల్లంఘించటం సాధ్యం కాదు. ఓ కృష్ణా! శరణాగతులమైన మమ్ము చేపట్టి మాకీ నిర్బంధాన్ని తొలగించు. క అభవుండ వయ్యును జగతిం, బ్రభవించుట లీల గాక భవమందుటయే 'ప్రభువులకుం బ్రభుండవు నుము, సభయాత్ముల నరసి కావ€ జను నార్తిహరా! 652
  • దుఃఖనాశకుడా! నీవు పుట్టుక లేనివాడివి. ఐనా పుట్టావు. ఇదంతా నీ లీలావిలాసమే కదా! ప్రభువులకు (ప్రభువైన నీవు భయపీడితులమైన మమ్ము రక్షించు. క్ష కదనమున నీ భుజావలి, కెదిరింప(గ లేక పాణం డే విక్రమ సం పద సెడంగ జరాసంధుడు, పదునెనిమిదిసార్లు ధరణిపాలురు నవ్వన్‌. 653
  • కదనరంగంలో నిన్నెదిరించలేక ఆ జరాసంధుడు రాజులంతా నవ్వుతూ ఉండగా పదునెనిమిదిసార్లు పారిపోయాడు కదా!

సదవ స్కంధము- ఉత్తరభాగము 143 వ. ఇట్టు తనపడిన బన్నములం దలంపక సింహంబు సమద దంతావళంబుల నరికట్టి కానరించు చందంబున మమ్ముం జెజపట్టి బాధించుచున్న య ప్పాపొత్ముని మర్దించి కారాగృహబద్దుల నుగు మా నిర్భంధంబులు వాపీ, సుతదారమి(త్ర నర్గంబులం గూర్చి యనన్య శరణ్యులమైన మన్ను రక్షింపు' మని విన్నవించి రని బ్రాహ్మణుండు వనిన్నపంబు సేయు సమయంబున, 65్‌క్ష

  • అయినా వాడు తాను పడిన కష్టాలను నష్టాలను గుర్తుచేసుకోకుండా మదపుటేనుగులను సింహం అరికట్టి విర్రవీగునట్టుగా మమ్ములను చెరపట్టి మిడిసిపడుతున్నాడు. వాణ్ణి శిక్షించి చెరసాలలో మ్రగ్గుతున్న మా నిర్బంధాలను తొలగించు. మా భార్యాపుత్రులను కలుసుకొనేటట్టు చేసి, దిక్కులేని మమ్ములను కాపాడు- అని ఆ రాజులందరూ విన్నవించారని బ్రాహ్మణుడు మనవి చేస్తున్న సమయంలో విజ్ఞానవిశారదుడైన నారదుడు అచ్చటికి విచ్చేశాడు. _: నారదుండు శ్రీకృష్ణునితో ధర్మజు రాజసూయము నెరవేర్చుమని చెప్పట :- సీ. శారదచంద్రికా సారంగరుచితోడ జడముడికెంపు చేంజజచి నవ్వ శరదంబుదావృత సొదామనీలతా శోభం గాంచనకటి సూత్ర మలర లలితపూర్లేందునుండల కలంకము గతి మృదుమృగాజినరుచి మించు. జూప గల్పశాఖాగ్రసంగత పుష్పుగుచ్చంబు లీల గేలను నక్షమాల యమర తే. భూరిపుణ్యనదీతోయపూరణమునం దగు కమండలు వొక్క హస్తమునః దనర వెల్ల జన్నిద మటుత శోభిల్ల వచ్చె, నారదుండు వివేక నిశారదుండు. 655
  • శరచ్చంద్ర చం(ద్రికలాంటి శరీరకాంతులతో జడల కెంపుకాంతులు పంతమాడుతుండగా, శరత్కాలవేవుంపైన వెరపుతీగలాగా తెల్లనిదేహంపైన బంగారు మొలత్రాడు (ప్రకాశింపగా, నిండుచంద్రునిలోని మచ్చలాగా నెమ్మేన జింకచర్మం విలసిల్లగా, కల్పవృక్షశాఖ యందున్న పుష్పగుచ్చాన్ని తలపిస్తూ చేతిలో జపమాల అలరారగా, పుణ్యనదీజలాలతో నిండిన కమండలం మరొక కరాన విరాజిల్లగా, తెల్లనిజందెం మెడలో మెరుస్తుండగా నారదుడు నందనందనుని కడకు వచ్చాడు. కు చనుదెంచె నట్టు ముని నిజ, తనుకాంతుల నఖిలదిగ్వితానము వెలు(గన్‌ వనజాస్తుంబోలి య య్యదు, జనములు గృష్టుండు లేచి సంప్రీతిమెయిన్‌. 656
  • ఈ విధంగా నారదుడు తన దేహకాంతులతో దిక్కులను వెలిగిస్తూ దివినుండి దిగివచ్చిన సూర్యునిలా వచ్చాడు. కృష్ణుడూ, తక్కిన యాదవులూ సాదరంగా లేచి నిలబడ్డారు. క. వినయమున మొక్కి కనకా, సనమున! గూర్చుండంెట్టి సముచిత వివిధా రృనములః దనిపి మురాంతకు( డనియెన్‌ వినయంబు దో(ప న మ్మునితోడన్‌. 657
  • శ్రీకృష్ణుడు నారదునికి వినయంగా నమస్కారం చేసి, బంగారుసింహాసనం మోద కూచోపెట్టి తగిన గౌరవ మర్యాదలతో పూజించి ఇలా అన్నాడు.

కేడడ పోతన భాగవతము తే. ఇప్పుడెందుండి వచ్చితి విందులకును?, నఖిలలోకైక సంచారి వగుటం జేసి నీ యెజుంగని యర్జంబు నిఖిలమందు, నరయ లేదండ్రు; మి మ్మొకం డడుగవలయు. 656

  • మునీం(ద్రా! ఎచ్చటనుండి ఇచ్చటికి విచ్చేశారు? సమస్త లోకాలూ సంచరించే మోకు తెలియని విషయమంటూ ఏదీ ఉండదు. మిమ్ములను ఒక సంగతి అడగాలి. తే. పాండునందను లిప్పు దేపగిది నెచట, నున్నవారలొ యెజింగింపు మన్న మౌని కరసరోజుతములు మోడ్చి కడంకతోడం బలికెం గమలాక్షు. జూచి సద్భక్తి మెజసి. 659
  • అదేమంటే- పాండవు లిప్పుడు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో తెల్పండి అని శ్రీకృష్ణుడు పలుకగా నారదుడు చేతులు జోడించి భక్తితో ఇలా విన్నవించాడు. వు దేవా! విశ్వనిర్మాణకర్తవై మూయివై సకల కార్యోత్సాదనాదిశక్తి యుక్తుండవై పొవకుండు దారువులందు నంతర్జిత ప్రకాశుండై యున్న చందంబున వర్తించుచున్న నీదు దురత్యయంబయిన మాయాశతంబులః బెక్కు మాజులు పొడగంటి నిదియు నాకు నద్భుతంబుగా; దదియునుం గాక నీ సంకల్పంబున జగంబుద్భవనంబై భనత్సరతం[త్రంబు నగు; నట్టి నీ కీష్టంబైవ వస్తువు సాధుతరంబుగా. దెలియ నెవ్వండు సమర్హుం? డే పదార్హంబు ప్రనూణ మూలంబునం దోయ నదియును లోకవిచక్షణుండవైన నీదు రూపంబు; నుజీయును ముక్తి మార్గంబు నెటుంగక సంసారపరవళులైన జీవుల నూయాంధకారంబు నివర్తింపయేయ సమర్థంబగు; నీ దివ్యలీలావతారంబులం గలుగు క్తీర్తి యను ప్రదీపంబు ప్రజ్వలింపః జేసి కృపసేయు దట్టి నీకు నమస్కరించెద; నది గావున నీ ప్రపంచంబున నీ యెజుంగని యర్ధంబు గలదె? యని కృష్ణునకు నారదుం డిట్లనియె. 660
  • దేవా! నీవు ప్రపంచాన్ని సృష్టించేవాడవు. మాయా మయుడవై సర్వకార్యాలూ నిర్వర్తించే శక్తి సంపన్నుడవుకూడా నీవే! అరణికర్రలో అన్ని అంతర్లర్భంగా ఉన్న రీతి నీవు (ప్రవర్తిస్తుంటావు. గుర్తింప సౌధ్యంకాని నీ అశేషమాయావిశేషాలను ఎన్నోమార్లు కనుగొన్నాను. నీ సంకల్పంతో ఈ ప్రపంచం పుట్టుతుంది. నీకు లోబడి ఉంటుంది. ఈ లోకంలో నీకిష్టమైన వస్తువేదో తెలుసుకోవటం ఎవరికీ సాధ్యం గాదు. 'ప్రమాణమూలంగా తోచే పదార్థాలన్నీ నీరూపాలే, ముక్తి సాధనరహస్యం తెలుసుకోలేక సంసారంలో పడి మయాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారిని సముద్దరించటానికి దివ్యలీలావతారాల క్షీర్తిదీసమైన నీ రూపం సమర్థ, అలాంటి నీకు నమస్కారం. ఈ ప్రపంచంలో నీకు తెలియనివిషయం లేదు అని నారదుడు తిరిగి యిలా అన్నాడు. సీ “అయినను వినిపింతు వవధరింపుము దేవ! పాండుతనూజుండు పారమేస్ట్య కామూనుమోదిమ్టైు. కావింస నున్నాండు రాజసూయనుహాధ్వరంబు నిష్ట ఠవణింప లోక విడంబనాద్ధము గాక, పరికింప( దన కాత్మబంధువుండవు భక్తవత్సలుండవు పరమపూరుషుండవు యజ్ఞరక్షకుండవు యజ్ఞభోక్త

పదన స్కంధము- ఉత్తరభాగము 145 తే. వగు భగవత్సేన చాలదే సుగతి నడయ?, నైన నీ మేనబాన ధర్మాత్మజుండు అతని యజ్ఞంబు రక్షింప నంబుజాక్ష! వలయు నిచ్చేయు మచటికి నలను మెజసి. 661

  • ఓ కృష్ణా! ధర్మరాజు సా(మ్రాజ్యవాంఛతో రాజసూయయాగం చేయాలనే సంకల్పం కలిగి ఉన్నాడు. ఆలోచించి చూస్తే భక్తవత్సలుడవూ, పరమపురుషుడవూ, రక్షకుడవూ, యజ్ఞభోక్తవూ, ఫల'్రదాతవూ, ఆత్మ బంధుడవూ అయిన నీ సేవ చాలదా సమస్త సౌభాగ్యాలు పొందటానికి? అయినా అతడు యజ్ఞం చేయాలని అనుకోవడం లోకాన్ని అనుకరించటమే అవుతుంది. నీ మేనబావ ధర్మజుడు. ఆయన చేయబోయే యజ్ఞాన్ని రక్షించడానికి నీవు అక్కడికి రాక తప్పుదు. క్ష నీ పేరు వినిన నొడివినం బాపంబులు దూలిపోవు పద్మాక్ష జగ ద్దీపక! నీ దర్శనమున, నేపారవనె భక్తజనుల కిహపరసుఖముల్‌. 662
  • ఓ పద్మాక్షా! నీ నామస్మరణం చేసినా, విన్నా పాపాలు తొలగిపోతాయి. విశ్వజ్యోతీ! నీ దర్శనమాత్రంతో భక్తజనులకు ఇహపరసౌఖ్యాలు సిద్ధిస్తాయి. మ. భవదీయోజ్వ్వులకీర్తి దిగ్వితతులన్‌ భాసిల్లు యుస్మత్సదో ద్భవ నైర్మల్యజలంబు లుత్కలిక6 బాతాళంబునం బాటు భో గవతీ నామమునం దనర్చి ధరణిం గంగానదీపూరమై దివి మందాకినియై జగత్రయమునం దీపించుం గాదే? హరీ! 663 ౪ ఓ కృష్ణా! నీక్సీర్తి దిగంతాలను ప్రకాశింపచేస్తుంది. నీ పాదాలనుండి ప్రభవించిన పవిత్రజలం పాతాళంలో భోగవతి అనే పేరుతోనూ, భూలోకంలో గంగానదీ రూపంతోనూ, స్వర్గంలో మందాకినీ నామం తోనూ ప్రవహిస్తూ ముల్లోకాల్లోనూ వెలుగుతుంటుంది. క ఆ మఖవేళ సనుస్తధ, రామండలి6 గల్లు మేటిరాజులు మౌని స్తోమంబును భవదీయ ము, హామహిమము జూచి సత్భృతార్థతం బొందన్‌. 664 క. కలిరని చెప్పినన మ్ముని, సలుకులకు నుదంబు నొంది పంకజనాభుం డెలనవ్వు మొగమునకు€ జెలు, నొలయ/గ6 బాటించి యుద్ధవున కిట్టనియెన్‌. 665
  • ధర్మజుడు కావించే యజ్ఞసందర్భంగా మహీమండలం మీద ఉన్న మహారాజులూ, మునీశ్శరులూ అందరూ నీ మహామహిమను చూచి ధన్యులౌతారు. ఇలా పలికిన నారదుని మాటలు విని శ్రీకృష్ణుడు సంతోషించి చిరునవ్వుతో ఉద్దవుణ్ణి చూచి ఇలా అన్నాడు.

146 పోతన భాగవతము -: శ్రీకృష్ణు.డుద్ధవుని యాలోచన చొప్పన ధర్మరాజు పాలికి( బోవుట :- క. “ఉద్దన! మహిత వివేక స, మిద్ధ్దవచోవిభవ! కార్య మేగతి నడచున్‌ వృద్దవరానుముతంబుగ, బోద్దవ్యము గాంగ జెప్పు పురుషనిధానా! 666

  • వివేకంతో కూడిన వాక్సాతుర్యం గల ఉద్ధవా! పెద్దవారి బుద్ధి కెక్కునట్టుగా ఆలోచించి (ప్రస్తుత

కర్తవ్యం ఏమిటో వివరించు.

తే. అనఘచారిత్ర ! నీవు మా యక్షియుగము, వంటివాఃడవు మనకు నవశ్య మగుచు జేయ దగినట్టి కార్యంబు. జెప్పు నీవు, ఏమి పంచిన గావింతు నిద్దచరిత!' 667

  • ఓ పుణ్యాత్ముడా! నీవు మాకు కన్నులవంటి వాడవు. ఇప్పుడు మనకు తప్పనిసరిగా చేయ తగిన

కార్యాన్ని వెల్లడించు, నీవు ఏ విధంగా చెప్పితే నేను ఆ విధంగా చేస్తాను.

వ. అని సర్వజ్ఞుండైన హరి యజ్ఞుండపోలెం దన్ను నడిగిన బురుషోత్తముని భాషణంబులకు మనంబున సంతసిల్లి, యతని పాదంబులు దన మనంబున నిడికొని, “వృద్దానుమతంబుగా నా యెణింగిన తెణంగు విన్నవించెద నవధరింపుము; దేవా! దేవముని చెప్పినట్టు భవదీయ భక్తుండైన యుధిష్టిరు యాగపాలనంబు సేయం గైకొనుట కార్యం; బదియునుం గాక నిఖిల దిగ్విజయ మూలంబగు రాజసూయ కృత్యంబునందు జరాసంధమర్హనంబును, నతనిచే బద్దులైన రాజులం గారాగృవా విముక్తులం గావించుటయుం జేకూరు; నదియునుం గాక నాగాయుత సత్తుండును, శతాక్షాహిణీ బలాన్వితుండును నగు మాగధుని వధియింప నున ప్రభంజననందనుండు గాని యొండొరులు సమర్థలుగా; రట్టగుట నతండు భూసురులేమి గోరిన, నయ్యర్థంబు వృథసేయక యిచ్చుం; గసట విష్రవేషంబునం జని యాజరాసంధుని నాహవభిక్ష వేండి, భవత్సన్నిధానంబున న స్పవమానతనయుం డతని వధియించునట్టీ కార్యంబు సేంత బహుళార్థసాధనం బగు" నని పలికిన నారదుండును యాదన జనంబులును సభ్యులునుం బొగడి; రంత. 668

  • అని సర్వజ్ఞాడైన కృష్ణుడు అమాయకునిలా ఉద్ధవుణ్మి ప్రశ్నించాడు. అందుకు ఉద్దవుడు ఎంతో

సంతోషించి. శ్రీకృష్ణుని పాదాలను మనసులో ధ్యానించుకొని ఇలా అన్నాడు. "పెద్దలు సమ్మతించేటట్టు నాకు తెలిసిన విధానాన్ని వివరిస్తాను. దేవా! చిత్తగించండి. నారదుడు చెప్పినట్లుగా నీ భక్తుడైన ధర్మరాజు చేయబోయే యజ్ఞాన్ని రక్షించటం అవశ్యకర్తవ్యం. సమస్త దిక్కులనూ జయించటానికి మూలమైన రాజసూయయాగ సందర్భంలో జరాసంధుణ్ణి సంహరించటం, వానిచేత బంధించబడ్డ రాజులను చెరనుండి విముక్తులను కావించటం కూడా సిద్ధిస్తాయి. అంతేకాకుండా పదివేల ఏనుగుల బలం కలిగినవాడూ, నూరు అక్షాహిణుల సైన్యంతో కూడినవాడూ అయిన జరాసంధుణ్ణి చంపటానికి మన భీమసేనుడు తప్ప మరింకెవరూ సమర్భులు కారు. (బ్రాహ్మణులు ఏమికోరినా జరాసంధుడు కాదనకుండా యిస్తాడు. కాబట్టి కపట (బ్రాహ్మణవేషంతో వెళ్లి ఆ జరాసంధుణ్ణి యుద్దభిక్షను యాచించి మన భీమసేనుని ద్వారా వాణ్ణి చంపించటం జరిగితే సకల ప్రయోజనాలను సాధించినట్లవుతుంది' అని పలికిన ఉద్ధవుని మాటలు విని నారదుడూ, యాదవులూ అందరూ సంతోషించారు. ఉద్దవుణ్ణి ఎంతో పొగడారు.

పదవ స్కంధము- ఉత్తరభాగము 7 ఫీ. తరల విచిత్రక స్టగిత ప్రభావలిం దనరారు గరుడకేతనము వెలుంగ6 గాంచన చక్ర సంఘటిత ఘంటా ఘణ ఘణ నినాదముల దిక్కరులు వెదర సలలిత మేఘపుప్పక వలావాక శ్రైబ్య సుగ్రీవ తురగవిస్ఫురణ దనర బాలసూర్యప్రభా భాసమానద్యుతి దిగ్వితానం బెల్ల దీటుకొనంగ తే. బ్రకటరుచి నొప్పు తేరు దారుకుండు దేర, నెక్కి వెడలెడు నపుడు సెంపెనయ. జెలలె శంఖ కాహళ పటహ నిస్పాణ డిండి, మాది రనములు భరితదిగంతములుగ. 669

  • తళతళ కాంతులతో ప్రకాశించే గరుడద్వజంతోనూ, దిగ్గజాలను సైతం బెగ్గడిల్లచేసే బంగారుచక్రాలకు కట్టిన గంటల గణగణ శబ్దాలతోనూ, వేగవంతాలయిన మేఘపుష్పం, వలాహకం, శ్రైబ్యం, సుగ్రీవం అనే గుర్రాలతోనూ, ఉదయ సూర్యుని కాంతిని ధిక్కరించే దిగంతవి(శ్రాంత కాంతులతోనూ, విలసిల్లే రథాన్ని దారుకుడు తెచ్చాడు. కృష్ణుడు ఆ రథాన్ని అధిరోహించి బయలు దేరాడు. ఆ సమయంలో శంఖ కాహళాది వాద్యాల శబ్దాలు నలుదెసలా నిండాయి. క్ష మను జేశ్వరునకు( దాలాం, కునకును గురువృద్ధజనులకును జెప్పి ప్రియం బున ననుపం గాంచన స్యం, దన సామజ వాజి భటకదంబము గొలువన్‌. 670 ౪ ఉ(గ్రసేనుడికి, బలరాముడికి, గురువులకూ, పెద్దలైన వారందరికీ చెప్పి ఆదరంతో వారు తన్ను సాగనంపగా, చతురంగబల సమేతుడై శ్రీకృష్ణుడు ప్రయాణ మయ్యాడు. తే. వంది మాగధ సూత కైవారరవము, నసుమతీ సురకోటి దీవననల మంత లనుగమింపంగ సతులు సొధాగ్రశిఖర, సీములందుండి ముత్యాల సేస లొలుక. 671
  • వంధిమాగధుల పొగడ్తలూ, బ్రాహ్మణుల ఆశీర్యాదాలూ అతిశయించుతుండగా, పురస్త్రీలు మేడలమోద నుంచి ముత్యాల అక్షతలు చల్దుతుండగా శ్రీకృష్ణుడు ముందుకు సాగాడు. కు లీలం జని కృష్ణుండు వా, హ్యోలిన్‌ నవకుసును ఫలభరానత శాఖా లోల ఘనసారసాల ర, సాల వనస్థలములందు( జతురత విడిసెన్‌. 672
  • ఆ విధంగా శ్రీకృష్ణుడు బయలుదేరి ఫలపుష్పభరితమైన తీయని మామిడి చెట్లూ, మద్దిచెట్టూ, మంచిగంధపుచెట్టూ కలిగిన ఉద్యానవనంలో విడిదిచేశాడు. వ. అట్టి యెడ సరోజనాభు శుద్దాంతంబున. 673 ఫీ. వికచమరంద నవీన సౌరభ అస న్మందార కుసునుదామములు దుటీమి చారు సుగంధ కస్తూరికా ఘనసార మిళిత చందనపంక మెలమి నలంది కనక కుండల రణత్యంకణ నూపుర ముద్రికా భూషణంబులు ధరించి యంచిత ముక్తాఫలాంచల మృదుల దివ్యాంబరమ్ములు సెలువార€ గట్టి

148 పోతన భాగవతము తే. యర్దచంద్రుని నెకసక్కె మాడునట్టీ, యలికఫలకల6 దిలకము లలర దీర్చి =ెంపు పీఏింప నుడురాజ బింబముఖులు, నవచతుర్విధ శృంగార నువధరించి. 674 తే. జలజలోచను కడకు నుత్కలికతోడం దనరు శిబికల నెక్కి నందనులు. దాము గనం నేతేరం బ్రతిహారజనులు వేత్ర, కలితులై పౌరులను నెడగలుగ జడియ, 675

  • ఆ సమయంలో కృష్ణుని అంతఃపురకాంతలు మకరందాలు చిందుతూ సుగంధాలు వెదజల్లే వికసించిన మందారపుష్పాలహారాలు ధరించి, పరిమళభరితమైన కస్తూరి పచ్చకర్పూరంతో మేళవించిన మంచిగంధం మై పూతలు పూసుకొని, కంకణాలూ కడియాలూ ఉంగరాలూ కుండలాలూ మొదలైన బంగారు ఆభరణాలు దాల్చి, అంచుల్లో ముత్యాలు చెక్కిన మెత్తని పట్టుచీరలు కట్టుకొని అరచందమామ వంటి అలికఫలకాన తిలకం పెట్టుకొని నానావిధాలైన అలంకారాలతో నళినలోచనుని సమిపానికి వచ్చారు. ఈ విధంగా అంతఃపురకాంతలు పల్లకీల నెక్కి తమ సంతానంతో రాగా, కావలివారు పౌరులను ్రక్కలను ఒత్తిగంచారు. క. అసమాస్తుండు పులు గడిగిన, కుసుమాస్తములను హసించు కోమలతనువుల్‌ మిసమిస మెఅనంగ వేశ్యా, విసరము దాపీజనంబు విభన మెలర్పన్‌. 676 2 పూవిల్తుని పులుగడిగిన పూలబాణాలవంటి మిసమిసలాడే మెత్తని మేనులతో ఆటవెలదులూ, దాసీసహ(స్రాలూ, గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలపై ఎక్కి రాగా. ఆ. హరుల వేసడములః గరులను నెక్కి తో, నరుగుదేర బహువిధాయుధములు దాల్చి సుభటకోటి దగిలి రా నంతఃపు, రాంగనలు సితాంబుజాక్షు కడకు. 677 ౫ అనేక విధాలైన ఆయుధాలను ధరించిన భటులు తమ వెంట రాగా, అతపురసుందరులు గోవిందుని కడకు వచ్చారు. వ. వచ్చి రంత. 678 క. నారదుని, మాధవుండు స, త్కారంబున వీడుకొలుప నతండును హృదయాం భోరుహమున గృష్లునకును, వారక మొైక్కుచును వెస దివంబున కరిగెన్‌, 679
  • అప్పుడు శ్రీకృష్ణుడు నారదుణ్ణి గౌరవించి సాగనంపాడు. ఆ మహర్షి మనస్సులో మాధవునకు మాటిమాటికి నమస్కారం చేస్తూ స్వర్గలోకం వైపు వెళ్ళిపోయాడు. కు నరవరుల దూతయును ముర, హరుచే నభయ (ప్రదాన నుంది ధరిత్రి వరుల కడకేగి పద్మో, దరు వచనము సెప్పి సమ్మదంబునం దేల్చెన్‌. 680
  • దూతగా వచ్చిన బ్రాహ్మణుడు కూడా కృష్ణునిచే అభయ ప్రదానం అందుకొని, రాజుల కడకేగి వాసుదేవుని వచనాలను వారికి వినిపించి వారిని సంతోషింపచేశాడు.

పదవ స్కంధము- ఉత్తరభాగము 149 న. అంత గృప్పుండు నిజకాంతాతనయ బంధు సుహ్పజ్జన సమేతుండై కదలి చనునెడ. 681 చ. కటపటరత్న కంబళ నికాయ కుటీరము లుల్లసిల్ల ను తృట పటుచామరధ్వజ పతాక కిరీట సితాతపత్ర వి స్ఫుట ఘనహేతిదీధితి నభోమణిం గప్పంగ దూర్యఘోషముల్‌ చటుల తిమింగి లోర్మిరవ సాగరఘోషము నాక్రమింప(గన్‌. 682 ౫ అనంతరం కృష్ణుడు తన భార్యాపుత్రులతో బంధుమిత్రులతో కలసి ఇంద్రప్రస్థ నగరానికి బయలు దేరాడు. ఆ సమయంలో మార్గమంతటా రత్నకంబళ్ళతో నిండిన పటకుటీరాలు వెలిశాయి వింజా మరలూ, విజయధ్యజాలూ విలసిల్లే కిరీటాల నిగనిగలూ, వెల్లగొడుగుల ధగధగలూ, ఆయుధాల తళతళలూ సూర్యుణ్ణో కప్పివేశాయి. భేరీకాహళాది వాద్యధ్వనులు సముద్రఘోషాన్ని అధిగమించాయి. క. కరిహరిరథసుభట సము, త్కరములు సేవింప మురవిదారుండు గడచెన్‌ సరి దుపవన దుర్గ సరో, వర జనపద పురపుళింద వన గోష్టములన్‌. 683

  • ఈ విధంగా మధుసూదనుడు రథ గజ తురంగ పదాతి సేనాసమూహాలు సేవిస్తూ ఉండగా నదులనూ, వనాలనూ, దుర్గాలనూ, జలాశయాలనూ, (గ్రామాలనూ, పట్టణాలనూ, భిల్లపల్లెలనూ గోష్టాలనూ దాటి వెళ్ళాడు. వ. ఇట్లు గడచి చనుచు నానర్తక సౌవీర మరుదేశంబులు దాటి ఇందుమతిని దర్శించి, దృషద్వతి నుత్తరించి, సరస్వతీనది దాంటి మత్స్యవిషయంబులు లోనుగా. గడచి యింద్రప్రస్థ వగరంబు డాయం జని, తత్పురోపకంఠననంబున విడిసిన. 684 ౪ ఇలా కృష్ణుడు ప్రయాణం చేస్తూ సౌవీరాది దేశాలను అతిక్రమించి, ఇందుమతినదిని దర్శించి, దృషద్వతీ సరస్వతీ నదులను దాటి, పాంచాల మత్స్యదేశాలను గడచి, ఇం(ద్రప్రస్థనగరాన్ని చేరి పట్టణానికి సమిపంలో ఉన్న ఉపవనంలో విడిది చేశాడు. -: పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొని తోడ్కొనిపోవుట :- క హరిరాక యెజింగి ధర్మజు డబలేని ముదంబుతోడ ననుజులు బంధుల్‌ గురుజన సచివ పురోహిత, పరిచారక కరి రథాశ్వ భటయుతు. డగుచున్‌, 685
  • శ్రీకృష్ణుని ఆగమనం తెలుసుకొని ధర్మరాజు అంతులేని సంతోషంతో సోదరులూ, బంధువులూ, గురుజనులూ, మంత్రులూ, పురోహితులూ, సృవకులూ, చతురంగబలాలూ వెంటరాగా బయలు దేరాడు. క, చిందములు మొరయ గాయక, బృందంబుల నుతులు సెవుల బెరయంగ భక్తిన్‌ డెందము దగుల(6 బరమా, నందంబున హరి నెదుర్కొనం జనుదెంచెన్‌. 686
  • శంఖాలు ధ్వనిస్తుండగా, గాయకుల పొగడ్తలు వీనుల విందు చేస్తూ ఉండగా ధర్మజుడు అతిశయించిన భక్తితో, అనురక్తితో కృష్ణునికి స్వాగతం చెప్పటానికి వచ్చాడు.

150 పోతన భాగవతము వ. ఇట్టు చనుదెంచి ధర్మనందనుండు సమాగతుండైన సరోజనాభునిం బెద్దతడవు గాఢాలింగనంబు చేసి రోమాంచకంచుకిత శరీరుండై యానందబాప్పధారాసిక్త కపోలుండై నిర్భరానంద కందళిత హృదయుండై బాహ్యంబు మజచియుండె; నప్పుడు హరిని వాయునందన వాసవతనూభవులు గౌ గిటం జేర్చి సమ్మదంబు నొందిరి; మాద్రేయులు దండప్రణామంబు లాచరించి; రంత. బుండరీకాన్షుండు విప్రవృద్దజనంబులకు నమస్కారంబు చేసి, వారలు గావించు వినిధార్భనలం బరితుష్టుండై కేకయ సృంజయాది భూవిభుల మన్నించి సూత మాగధాదుల కనేక పదార్హంబు లొసంగి, చతురంగ బలసమేతుండై వివిధ ముణితోరణాది విచిత్రాలంకృతంబు నతివైభవోతంబునైన పురంబు ప్రవేశించి రాజమార్గంబునం జనుచుండ. బౌరకామిను లట్టి యెడ. 687

  • ఇలా ధర్మరాజా వచ్చి శ్రీకృష్ణుడి దర్శించి గట్టిగా కౌగిలించుకొని, పులకితశరీరుడై ఆనందబాష్పాలు చెక్కిళ్ళను తడుపుతుండగా ఆ సంతోషపారవశ్యంతో ప్రపంచాన్నే మరచిపోయాడు. భీమార్జునులు వనమాలిని ఆలింగనం చేసుకొని ఆనందించారు. నకులసహాదేవులు నళిననాభునికి నమస్కారం చేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకూ, పెద్దలకూ వందనం చేసి వారు కావించిన పూజలకు సంతోషించాడు. కేకయ సృంజయాది రాజులను మన్నించాడు. వందిమాగధులకు అనేక బహుమానా లిచ్చాడు. అనంతరం చతురంగ బలసమేతుడై మణితోరణాలతో అలంకృతమై అత్యంత వైభవోపేతమైన ఇంద్రప్రస్థ పట్టణంలోనికి (ప్రవేశించాడు. సీ. కొణనెలపైం దోచు నిరులునాం జెలువొంది నొసలి పైం గురులు తుంపెసలు గునియ హాటకమణిమయ తాటంకరోచులు గండభాగంబుల గంతులిడం స్ఫురిత విద్రుమనిభాధర బింబరుచితోడ దరహాసచంద్రిక సరసమాడ నొండొంటితో రాయు నుత్తంగ కుచకుంభములు మొగంబులకును బుటము లెగయ తే. బడుగునడుములు వడంకంగ నడుగు లిడం, రవళిమెట్టెలు మణినూప్తురములు మొరయ' బొలుచు కచబంధములు భుజంబుల నటింపం బయ్యెదలు వీడి యాడ సంభ్రమముతోడ, 688 వ. ఇట్లు కృష్ణసందర్భన కుతూహల పరస్పరాహూయనూనలై గురుపతి సుత బంధు జనంబులు వారింప నతిక్రమించి సమున్నత భర్మ హర్మ్య శిఖరాగ్రంబు లెక్కి కృష్ణుం జూచి తమలో నిట్లనిరి. 689
  • ఆ సమయంలో పురస్త్రీలు పురుషోత్తముణ్ణ్మి దర్శించటానికి మేడలపై గుమికూడారు. అర్జచం(ద్రునిమోద మబ్బులు (క్రమ్ముకొన్నాయా అన్నట్టు నెన్నుదుటిమీద ముంగురులు మూగుతున్నాయి. బంగారు కమ్మల కాంతులు చెక్కిళ్ళమీద గంతులు వేస్తున్నాయి. పవడపుకాంతిని తిరస్కరించే అధరకాంతితో చిరునవ్వు వెన్నెలలు సరసమాడుతున్నాయి. ఒకదాని నొకటి ఒరుసుకొనే ఉన్నతమైన స్తనాలు ఉత్సాహంతో పైకుబుకు తున్నాయి. సన్నని నడుములు వణకుతున్నాయి. నడచేటప్పుడు మెట్టెలూ, అందెలూ గల్టుగల్దున (మోగుతున్నాయి. జుట్టుముడులు వీడి భుజాలపై నాట్యంచేస్తూ వున్నాయి. పైటలు జారిపోతున్నాయి. ఈ విధంగా పౌరకాంతలు గబగబ నడుస్తూ శ్రీకృష్ణుణ్లి చూడటానికి వచ్చారు.

పదవ స్కంధము- ఉత్తరభాగము 151 పౌరకాంతలు కృష్ణుణ్ణి దర్శించాలనే కుతూహలంతో ఒకరి నొకరు పిలుచుకుంటూ పెద్దవారు వద్దంటున్నా వినకుండా ఎత్తైన మేడలమోది కెక్కి ముకుందుని సందర్శించి తమలో తాము ఇలా అనుకున్నారు. సీ, విశ్వగర్భుండునా వెలయు వే ల్సిల యశోదానందులకు( బ్రియసూనుండయ్యె; (బ్రహ్మాది సురులకు భావింప(గా రాని బ్రహ్మంబు గోపాలబాలు. డయ్యె; వేదశాస్త్రంబులు వెదకి కానంగలేని గట్టి వ్రేతల తోలం గట్టుపడియె; దివిజుల కమృుతంబు దవిలి యిచ్చిన భక్త సులభుండు నవనీత చోరుండయ్యె తే. నెనయం గమలాపతికిం జిత్తమీని వేల్పు, గొల్లయిల్లాండ్ర యుల్లముల్‌ పల్లవింపం జేసె నని కామినులు సొధశిఖరములను, గూడి తమలోన ముచ్చటలాడి రధిప! 690 ౪ ప్రపంచాన్నే కడుపులో ఉంచుకొన్న ఈ దేవుడు యశోదానందులకు ముద్దులతనయు డయ్యాడు. (బ్రహ్మాదిదేవతలకు రూడా భావింప సాధ్యంకాని పరబ్రహ్మస్వరూపం గోపాలబాలు డయ్యాడు. వేదళశా[స్తాలు వెదకినా కనపడని ఘనుడు గ్రేపల్లెలో రోటికి కట్టుపడ్డాడు. వేల్పులకు అమృతం పంచి ఇచ్చిన భక్తసులభుడు వెన్న దొంగ అయ్యాడు. లక్ష్మీదేవికిసైతం మనసివ్వని దేవర గొల్ల పడుచుల హృదయాలను కొల్లగొన్నాడు' - అంటూ పురస్త్రీలు మేడలపై గుంపులుగూడి కృష్ణునిగూర్చి పరస్పరం ముచ్చటించుకొన్నారు. వ. మటియును. 691 ఫీ గోపాలబాలురల గూడి యాడెడి వాండు గ్రేపల్లె లోపల నేపు రే6గి చల్ల లమ్మగ బోవు సతుల కొంగులు పట్టి మెజు6గు! బెక్కిళ్ళను మీటి మీటి కలికియై ముద్దాడి గౌంగిట జేర్చిన పూంబోండి కుచములు పుణికి పుణికి పాయని యనురక్తి డాయ జీరిన యింతి యధరసుధారసం బాని యాని తే. యురుసమాధిపరాష్ట్రాంగ యోగయుక్తు లైన యోగీశ్వరులు గాననట్టి జెట్టి వల్లవీజన వన కల్పవల్లి యయ్యె, ననుచు బొగడిరి కృష్ణు న య్యబ్దముఖులు. 692 ౫ 'గోపాలబాలకులతో కలిసి గొల్లపల్లెలో ఆడుకొన్నాడు. చల్ల లమ్ముకో టానికి వెళ్ళే పల్లవపాణులతో సరసాలాడాడు. ముద్దు పెట్టుకోవాలని కౌగిట్లో చేర్చిన ముద్దుగుమ్మల రొమ్ములు స్పృశించాడు. ప్రేమతో దగ్గరకు రమ్మని పిల్చిన వధూమణుల అధరామృత పానం చేశాడు. సమాధినిష్టలో మునిగి అష్టాంగయోగంలో వున్న యోగీశ్వరులకు కూడా కన్పడని వేలుపు గొల్లకన్నెలపాలిటి కల్పవల్లి అయ్యాడు.'- అంటూ వాల్గంటులు కృష్ణుణ్లో పరిపరివిధాల ప్రస్తుతించారు. మ. అని యబ్భంగి సరోజలోచనలు సౌధాగ్రంబులందుండి య వ్వనజాతాక్షుని దివ్యమూర్తి. దమభావం బందు గీలించి సం

152 పోతన భాగవతము జనితానంద రసాబ్దినుగ్న లగుచున్‌ సంప్రీతిం దద్భవ్య క్రీ ర్తనలై చల్లిరి నవ్యలాజములు మందార ప్రసూనావలుల్‌. 693

  • ఈ విధంగా పొగడుతూ ఆ పురకాంతలు మేడలమోద నిలుచుండి శ్రీకృష్ణుని దివ్యమంగళ

వి(గ్రహాన్నే మనస్సులో నిలుపుకొని ఆనందంతో అతనిపై మందారపుష్పాలూ, లాజలూ చల్లారు.

వ. తదనంతరంబ శోభనపదార్థంబులు కొనివచ్చి ధరామర ధరావర వణి క్పుంగవులు దామోదరునకు కానుక లిచ్చిరి. పుణ్యాంగనా జనంబులు పసిండిపళ్లెరంబుల. గర్పూర నీరాజనంబులు నివాళింప నంతణ్పురంబు సాత్తెంచె; నంతం గుంతిభోజ నందనయుం గృష్టునిం గని పర్యంకంబు డిగ్గి కౌంగిలింస నా యదువల్లభుండు మేనత్తకుం బ్రణామం బాచరించె/ బాంచాలియు ముకుందునకు నభివందనం బొనరించి కుంతిపంపున గోవిందు భామినులగు రుక్మిణి మొదలగువారికి గంధాక్షత కుసును తాంబూలంబు లిడి లలిత దుకూల మణిభూషణంబులం బూజించె; యుధిస్టిరుండును గముల నయనుని వధూజనుల ననుగత బంధు మిత్ర పుత్ర సచివ పురోహిత పరిచారక సముదయంబుల నుచితంబులగు స్థలంబుల విడియింప నియమించి దినదినంబును నభినవంబులగు వివిధోపచారంబులు గావించుచుండె. 69క్త

  • ఆ తరువాత (బ్రాహ్మణ క్షత్రియ విష్యలు మంగళ పదార్థాలు కానుక లిస్తుండగా ముత్తైదువలు బంగరుపళ్ళిరాలతో కర్పూర హారతు లెత్తుతుండగా కృష్ణుడు అంతఃపురం ప్రవేశించాడు. కుంతీదేవి కృష్ణుబ్హే చూచి పాన్పు దిగి కౌగిలించుకోగా కృష్ణుడామెకు వందనం చేశాడు. ద్రౌపది కూడ కృష్ణునికి నమస్కారం చేసి కుంతీ దేవి ఆజ్ఞప్రకారం కృష్ణుని భార్యలైన రుక్మిణి మున్నగువారికి గంధాక్షతలూ, పువ్వులూ, తాంబూలాలూ, పట్టుబీరలూ, మణిభూషణాలు ఇచ్చి పూజించింది. ధర్మరాజు కృష్ణుని అంతఃపురకాంతలకూ, ఆయన పరివారానికి వారి వారి యోగ్యతలకు అనుకూలమైన స్థలాళ్లో విడుదులు ఏర్పాటు చేయించి సకల సౌకర్యాలూ సమకూర్చాడు.

క్ష హరియు యుధిస్టిరు సముచిత, పరిచర్యల కాత్మ నలరి పార్గుండు దానున్‌ సరస విహారక్రియలను, సురుచిరగతిల గొన్ని నెలలు సుఖముండె నృపా! 695

  • ఓ రాజా! కృష్ణుడు కూడా ధర్మరాజు కావించిన సముచిత మర్యాదలకు సంతోషించి అర్జునునితో

కలిసి సరస వినోద విహార కార్యక్రమాలతో కొన్ని నెలలు కాలం గడిపాడు,

న. అంత 696

-: ధర్మరాజు శ్రీకృష్ణు ననుమతంబున భీమాదుల దిగ్విజయమునకు€ బంపుట :-

సీ ధరణీశ! యొకనాండు ధర్మతనూజుండు (ప్రవిమల నిజసభాభవనమందు హితులు మిత్రులు పురోహితులును సుతులును మిత్రులు బంధువుల్‌ క్ష్వత్రవరులు బరిచారకులు సూత పాఠక కవి బుధ వరులును మునులును వరుస గొలువ జిరలీల ననరత్న సింహాసస్టుండై గొలువుండి వినతుండై నలిననాభు

తే, భువనరక్షణదన్షు నద్భుతచరిత్రు, యదుకులేశ్వరు మురదైత్యమదవిభేది నాప్తు నయవేది జతురుపాయప్రనీణులం జూచి యిట్లని పలికె నస్తోకచరిత! 697

పదవ స్కంధము- ఉత్తరభాగము 153

  • ఇలా ఉండగా ఓ రాజా! ఒకనాడు ధర్మరాజు తన సభాభవనంలో హితులూ, పురోహితులూ, పుత్రులూ, మిత్రులూ, సామంతులూ, చుట్టాలూ, సోదరుల్లూ, స్తుతిపాఠకులూ, మునీశ్చరులూ పరివేష్టించి వుండగా నిండుకొలువుండి ఆత్మీయుడై, యదుకులేశ్వరుడై సామదాన భేద దండోపాయాలలో సమర్హుడై లోకరక్షకుడైన శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. తే. అనఘచారిత్ర! రాజసూయాధ్వరంబుం నెమ్మిః గావించు వేడుక నెమ్మునమున నెనయుచున్నది యది నిర్వహింప నీవ, కాక నా కాత్మబంధువుల్‌ గలరె యొరులు? 698
  • ఓ పుణ్యచరితా! రాజసూయ యాగం చేయాలని నా హృదయం ఉవ్విళ్ళూరుతూ వుంది. దాన్ని నిర్వహించడానికి నీవు తప్ప నాకు వేరే ఆత్మబంధువు లెవ రున్నారు? ఉ. ఎవ్వరు నీ పదాంబుజము లెప్పుడు. గొల్తురు భక్తి నిష్ణులై యెవ్వరు నిన్ను! బ్రేమ నుతియింతురు భూరివివేకశాలురై య వ్విమలాత్ము లందుదు రుదంచితశోభన నిత్యసొఖ్యముల్‌ నివ్వటిలంగ6 గృష్ల! నిను నేర్చి భజించిన రిత్తవోవునే! 699
  • ఓ కృష్ణా! ఎవరు భక్తితో నీ పాదపద్మాలను ధ్యానిస్తారో, ఎవరు బుద్ధిమంతులై నిన్ను (ప్రేమతో సన్నుతిస్తారో, వారు సదా సుఖసంతోషాలను పొందుతారు. నిన్ను చక్కగ తెలిసి పూజించటం వ్యర్థం కాదు గదా! వ. అనిన గృష్పుండు ధర్మనందనున కిట్టనియె 700 ౫ ఆ మాటలు విని కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. చ. నయగుణశాలి! పాండునృపనందన! నీ తలం పొప్పు నీ క్రతు క్రియ మునిదేవతాపిత్చ సుకృత్యమునై నిభిలోగ్రశాత్రవ క్షయమును బాంధవ ప్రియము సంచితపుణ్యము నిత్యక్షీర్తియున్‌ జయము నొసంగు దీని గురుసత్తమ! వేగ యుపక్రమింపనే? 701
  • ఓ ధర్మరాజా! పాండురాజు కుమారుడవు! రాజనీతి విశారదుడవు! నీ ఆలోచన సమంజసంగా వుంది. ఈ రాజసూయ'ప్రక్రియ మునులకూ, దేవతలకూ, పితృదేవతలకూ అభీష్టమయింది. ఇది సమస్త శత్రుక్షయాన్నీ, సకల బాంధవ ప్రియాన్నీ, సమధికమైన పుణ్యాన్నీ శాశ్వతమైన క్రీర్తిన, విజయాన్నీ సిద్ధింప చేస్తుంది కాబట్టి వెంటనే యీ యాగాన్ని (ప్రారంభించు. కు. మనుచరిత! నీ సహోదరు, లనుసమ దివ్యాస్తవేదు లాహనభూమిం జెనకిన వై రినృపాలురం దునుమ(గ( జాలుదురు శౌర్యదుర్దను భంగిన్‌. 702
  • ఓ ధర్మరాజా! నీ తమ్ముళ్ళు సాటిలేని అ'స్త్రవిద్యా విశారదులు. యుద్ధభూమిలో తమ్మెదిరించిన శత్రురాజులను సంహరించటానికి తగిన సామర్థ్యం కలవారు.

15 పోతన భాగవతము క, గెలువుము విమతన్ఫపాలుర, వెలయుము బుధవినుతమైన వి(శ్రుతకీర్తిన్‌ నిలుపుము నిఖిలధరా మం, డలిని భవచ్చాసనము దృఢంబుగ జెల్లన్‌. 703

  • నీ శత్రురాజులను జయించు, శాశ్యతమైన యశస్సుతో (ప్రకాశించు. సమస్త భూమండలంలో నీ శాసనం చెలేటట్లు స్షిరంగా స్తాపించు. ష్‌! షు ఠా క. నీ పంచుకార్య మొరులం, జూపక యే జేయ నిన్ను జుట్టన వ్రేలం జూపంగ వచ్చునె! సకల ధ, రాపతులకు నీకు. జేయరానిది గలదే! 704 ౫ నీవు ఆజ్ఞాపించిన కార్యాన్ని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక నిన్ను చూపటానికి ఈ లోకంలో రాజు లెవ్వరికీ సాధ్యం కాదు. నీకు అసాధ్యమైన కార్యంలేదు. వ. కావున, 705 క విమలమతి నిట్టి మఖ రా, జమునకు€ దెప్పింపవనలయు సంభారంబుల్‌ సమకూర్పుము; నీ యనుజుల, సమదగతిం బంపు నిఖిలశత్రుల గెల్వన్‌, 706
  • ధర్మజా! యజ్ఞాలలో శ్రేష్టమైన ఈ రాజసూయ యాగానికి అవసరమైన సామగ్రిని సమకూర్చు. శత్రువులను జయించటానికి నీ సహోదరులను పంపించు. కు అను మాటలు విని కుంతీ, తనయుడు మోదమున. బొంగి తామరసాక్షున్‌ వినుతించి శౌర్యకలితుల, ననుజుల దెసం జూచి పలికె హర్షముతోడన్‌. 707
  • ఈ విధంగా పలికిన శ్రీకృష్ణుని మాటలు విని ధర్మరాజు ఎంతో సంతోషించి చక్రహస్తుని ప్రస్తు తించాడు. మహాపరాక్రమ వంతులైన సహోదరుల వైపు చూచి ఉత్సాహంతో ఇలా అన్నాడు. క. సృంజయభూపాలకులును, గుంజర రథ వాజి సుభటకోటులు నినుం గొ ల్వం జను మని సహదేవుని, నంజక పొమ్మనియె దక్షిణాశ జయింపన్‌. 708
  • సహదేవా! “నీవు సృంజయరాజులూ, చతురంగబలాలూ నిన్ను అనుసరించి రాగా దక్షిణదిక్కును జయించి రమ్ము' అని సహదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. . క. ప్రకటచతుర్విధ సేనా, ప్రకరంబులు గొలువం బంచె. బడమటిదిశక్సున్‌ నకులున్‌ విదళిత రిపు భూ, ప కులున్‌ శౌర్యంబు మెజసి పార్ధివముఖ్యా! 709
  • రథ గజ తురగ పదాతు లనబడే నాలుగు విధాల సైన్యంతో పడమటిదిక్కును జయించి రమ శని నకులుళ్లో పంపించాడు. క. దుర్దనభంజను శౌర్యో, పార్దితవిజయప్రకాండు నాహవనిపుణు న్నర్హునమహితయశోనిధి, నర్జును నుత్తరపు దిశకు ననిచె నరేంద్రా! 710