Telugu podayindhi - anilvaranasi/indianlanguages GitHub Wiki
- | నాచు నాం జా నం వనన నాన న గం భత 0 ఇసు సన టం మ! .. శ్త్‌సన్తే నస క్రి న స స్య కం ఇష స చ క్ట సం ట్. గ
| సర ప స్. $.” (గ ఉంట... సశ...
ల న వా క ల +. సలలిత న క్రి న. యు గ్ , క. మ ను
మ. పు వాళ్ళి సళ ఫం “ పూ నై వంకా క గనే (0 ! క్ట న న టు. పం | మ య న పట్ట గా గ వయ న స; ళ్ లపై ని క్ కో / టి య. £ ల | న అటా నాన కక బా; మాడి ర హత చ్ యే _ వ. ల న య శ . న. ల ల ల టు , _ , న న వం టిం కట క అలి వం స నవల ఫీల్ ల య స. , కప ల ల " ర య న. మం వ సభనే య న వ. క. పం ల వ్ లేల వ - ట్ ఆ ల్ . న వ. ౮. | ॥ న త |. ఓని జిసేబీ శ / వ. మొద ఆ త . (స 1 స్. శ్ కా ళా . మటల నీ, , స వళ శే... స మ. న్ - గ ఢి గ్ న ౯4 స్త! " అట న య్ స / ( -్ జ. మహబూబ్ నగర్ న మ సం. య 1 న | చు | + | అ అఆ 0 | శీ " చ ఖు. కిట్. న ఆ ఈక ఆ్య బర్భుట్స ఇ ణ్ ల | య్ న నననననననననా ; |
మా అమ్మా నాన్నలు యారగడ్ల విరి రామనాథంల 60వ వివావా వార్షిక సవం ,.. వర్చంగా ఈ వ్వుక బపళాకంణ /7-0క-20 | 2! యార్లగడ్డ) నిర్భల. వై సుువారావ, వైమిథనిమి రాష్ట్ర శార్యదర్భవర్ద సధ్యులు), నై వి డా తెలంగాణ కవిత్వం సంపాదక వర్గం సంబరాజు రవిప్రకాష్ గుడిపల్లి నిరంజన్' వనపట్ల సుబ్బయ్య సిండదిడె తెలంగాణ రచయితల సంఘం
ఆ తోం (2724400427... లవఎ. 96160౧6౮౧6 - ంయళ1౧౪76గ 6/ గకంగిరంగ4!4 00913 3110! ం4టగ6414 క ఆ1140/ ఆో౦౧౪౮౧/ 2010 [౦1106౮10౧5 ; ఛే ( 9316౧061౧6 ?౦౪15 & 51౧౮౪౧ త గ =ర్ర న. , ల ఫో ౨ 56౧0061016 26౮౪] ?/6[౧0691 , దే శ) 5-189, ౪69౪ [౧||౦/౧౦౧౧౫. 11086041001-509 209. చ్ 0;:949]1376255 ౨ ౪౮61006117 [11006౧ శో4ీ-4, (౧0,జీ/1.] 96401001 (1/01.)1100010411౧000] - 609 235. ౪|;94933109076,
- ౪6౧0౧౮6116 86006161 600004 ౪౦|॥ 16. [1౦|6౮/61/ ౧ం౦ర, 1[00ం6గ6గ౦౦| - 5609 209. ౧౪|| : 9492765358. వెల రూ! 25/- 0 ప్రథమముద్రణ : జనవరి, 2010 (1 ప్రతులకు : సంబరాజు రవిప్రకాష్ (గ ఇ.నెం.15-189, వసు నిలయం, | నాగర్‌కర్టూల్-509209 9491376255, 9492765358, (_) 9493319878.
వ అన్నిప్రముఖ పుసక కేంద్రాలు గ్ ఇ పిస్తూ చీ స్మ : మల్లికార్జున గ్రాఫిక్స్, నాగర్‌కర్నూల్,
- (ఉ00%0 15 0./బి.. వర్య/ 9440589100, 9885259264
స్త
అంకితం... తమదైన రీతిలో నిరసనలై లేచి తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన సబ్బండ కులాలకు......... నాయకత్వం వహించిన ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్ధి, కార్మిక, మహిళా లోకానికి......... తెలంగాణ ఉద్యమ అమరవీరులకు........
కందనూలు క్రమం జనుంపల్లి సాయిశంకర్ నా మాట దా॥ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి కొంది అద్దమందు కొంచమై యుండదా మా మాట గీ పని ఎందుకంటే ! కపిలవాయి లింగమూర్తి పదార్వన్నెబాస 19 గోరటి వెంకన్న తల్లి కెలంగాణమా 20 'పెంటమరాజు నరసింగరావు జై తెలంగాణ! 23 ఇద్రీస్ యం.డి. నా తెలంగాణ 2ర్ ఉదయభాన్ చెట్టు 26 కల్వకోలు మద్దిలేటి ధన ధన దరువులతో 28 కలమంద చెన్నయ్య రావేందిరా పోదామురా 30 కాసీం.సి కన్నీటిగోస 82 గడ్డంపల్లి భూపాల్‌రెడ్డి ఎట్లొస్తదంటడురా తి గుడిపల్లి నిరంజన్ లందల్లో పొడిచిన పిడికిళ్లు 86 గుడిపల్లి రవి మేరా హైదరాబాద్ 88 చిక్కాండ్ర బచ్చన్న వడిసెల రవ్వలై త్తీత్రై జనజ్వాల తస్మాత్ జాగ్రత్త! శీర్ జహంగీర్ యం.డి. ఒరిగిందేముంది డీర్రి నాగవరం బాల్‌రాం జాన్తానై శేరి పరిమళ్ హైదరాబాదును అమలాపురం జేస్తుంద్రు. 49 ప్రతాప్ కౌటిళ్ళ తెలంగాణ అనివార్యం! ర్1 భాస్మర్ యలకంటి జయహో తెలంగాణ 52 మురళీధర్ రావు. జి పోరుపంజా రడ రేడియం ధూంధాం ర్‌న్ వనపట్ల సుబ్బయ్య తెలంగాణాకీ దోస్తరాదీన్ 56 సంబరాజు రవిప్రకాశ రావు ముద్దాడుదాం 5్8ి సోమశిల సురేష్‌బాబు గతం కాదు వర్తమానం 60 హెచ్. రమేష్‌బాబు పొద్దెంది 62
నామాట తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ తమ శక్తి కొలది ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కవుల కలాలు చిమ్మిన భావావేశ సిరాచుక్కలు తెలంగాణోద్యమ స్పూర్తికి తలమానికంగా నిలిచాయనుట నిర్వివాదాంశం. కందనూలు కవుల కవిత్వం తెలంగాణ రాష్ట ఆవిర్భావం ప్రజలలో ఎంతవరకు జీర్ణించుకు పోయిందో చెప్పడానికీ ఈ సంకలనమే ఓ నిదర్శనం. కందనూలు కవిత్వంలో మొదటి కవిత పాలమూరు పరిశోధనా పితామహులు శ్రీ కపిలవాయి లింగమూర్తి గారి కలం నుండి జాలువారి (గ్రంధ కుసుమానికి తావి నింపింది. పదార్వన్నెబాస, పరుగులు దీసిన వైనం ఉత్సాహాన్నందించింది. అదే విధంగా ప్రజా వాగ్గేయకారుడు శ్రీ గోరటి వెంకన్న గారి పాట కండ్రముందు తెలంగాణ చిత్రాన్ని ఆవిష్కరించింది. కష్టజీవుల పనిముట్లు జై తెలంగాణ నినాద్రాలు చేస్తున్నాయని పెంటమరాజు జై కొట్టారు. అలసిన వలస బతుకును ఆవిష్కరించిన “నా తెలంగాణ” కవిత ఇద్రీస్ కలం నుండి జారిపడిన 'అశ్రుకణం' తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి జరిగిన తీరును ఉదయభాను తన 'చెట్టు' కవితలో చెప్పిన తీరు అద్భుతం. హైదరాబాద్ మా గుండె అంటూ దాన్ని మా నుండి దూరం చేసే వాళ్ళంతా రండలేనని నిక్కచ్చిగా చెప్పిన కల్వకోలు మద్దిలేటి పాట మరో విద్యార్ధి గర్జనకు స్వాగతిస్తున్నట్లుంది. కన్నీటిగోస వినిపించిన కాసీం గారి కవిత కరువు జీవితాలకు భాష్యం చెప్పింది. ఫ్రీజోన్ అన్నోని ఇంట్ల పీన్లెలు లేవాలంతే అంటూ... గడ్డంపల్లి భూపాల్‌రెడ్డి తెలంగాణ వాదాన్ని నీరుగార్చేతనంపై కలమెక్కు పెట్టడం
యువకుల రక్తాన్ని మరిగిస్తుంది. ఆంధ్రుల దేగకళ్ళు నా నేలను వేటాడితే మండే నా డప్పు, గుద్దే నా గూటం అడ్డం పెడతానని గుడిపల్లి నిరంజన్ తేల్చిచెప్పిన మాట ప్రతి వ్యక్తిని ఉద్యమానికి పిలుస్తన్నట్లుంది. భాగ్యనగర గత వైభవాన్ని స్మరిస్తూ సాగిన పాట గుడిపల్లి రవి కలం నుండి జాలువారింది.
జాన్తానై అంటూ పిడికిలెత్తి “సంఘర్ష్ హమారా నారాహైో అంటూ నాగవరం బాల్‌రాం గర్జిస్తే హైదరాబాద్‌ను అమలాపురం జేస్తుండ్రు అన్న పరిమళ్ తన కవితలో ఇప్పుడు ఇద్దరి మధ్య భూమి పక్కున పగలాల్సిందే... అంటూ పొత్తు పొసగదని కుండ బద్దలు కొట్టినారు. 'తెలంగాణాకీ దోస్తరాదీన్” అని ఉద్యమానికి అలాయి-బలాయి ఇచ్చిన వనపట్ల సుబ్బయ్య. 'జాగో తెలంగాణ! భాగో దోపిడీవాలా' అని తెలంగాణను ముద్దాడారు సంబరాజు రవిప్రకాష్ సోమశిల సురేష్‌బాబు అభివృద్ధి శిలాఫలకాలు హెచ్చుతగ్గులైన చోట ఎప్పుడైనా ఎక్కడైనా.... పుడుతున్నదే కదా అంటూ ఉద్యమకారణాన్ని చిశ్రీకరించారు.
సుభిక్ష తెలంగాణ ఎలా ఉండాలో తన కలాన్ని కదిపి, గళమెత్తి వినిపించిన శ్రీ భాస్కర్ యలకంటి 'జయహో తెలంగాణ రావాలని ఆశిద్దాం.
ఇలా ఆద్యంతం తెలంగాణా భావోద్వేగాన్ని పాఠకుల హృదయాలకు అందజేసి ఉద్యమానికి ఊపునిచ్చిన పొద్దెంది “కందనూలు కవిత్వం” తెలంగాణ రాష్ట్ర సాధనకు తోద్బడుతుందని ఆశిస్తూ...
జనుంపల్లి సాయిశంకర్ 9440445671
“కొండి అద్దమందు కొంచమై యుండదా ఇవాళ్ళి తెలంగాణ ఉద్యమం గుండెగుండెకూ, వల్లైపల్లెకూ పాకిందనదానికి ఈ సంకలనం నిలువెత్తు సాక్ష్యం. తెలంగాణ ఉద్యమం క్షేత్రస్థాయిలో లేదని, కొందరు రాజకీయ నిరుద్యోగులు చేస్తున్నదని ఒక కళ్ళున్న అంధుడు, కోరలు లేని 'టైగర్, నీతిలేని 'మాష్టారు' తెలంగాణ పైసలతోనే తెలంగాణ భూముల్ని ఆక్రమించి కులుకుతూ కారుకూతలు కూస్తున్నారు. ఒక్కసారి మా ఊర్లల్లకి అడుగుపెట్టు. 'జై తెలంగాణ” అనకుండా పల్లెదాటలేవు. కొత్త కొత్త నినాదాలు చెవులపడకుండా బయట పడలేవు. అదీ చేతకాకపోతే ఈ సంకలనం చదువు. ఉద్యమ విస్తృతి, తీవ్రత అర్థమవుతాయి. ఒకనొక సందర్భం వస్తుంది. ఆ సందర్భం సమాజమంతటా ఒక విద్యుత్తును ప్రసరిస్తుంది. అప్పుడు ఎక్కడ ముట్టుకున్నా కవిత్వమే తగులుతుంది. ఇప్పుడు తెలంగాణలో అటువంటి సందర్భం వచ్చింది. గ్రామ గ్రామాన విద్యుత్తు ప్రవహిస్తున్నది. డిసెంబర్-81 రాత్రి చూసిన వేరే సందర్భములోనైతే యువకులు పిచ్చి ప్రేలాపనలతో చిందులేస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేవాళ్ళు కాని డిసెంబర్ 81-2009 రాత్రి ప్రతి ఒక్కరూ జై తెలంగాణ నినాదాల హోరుతో కొత్త సంవత్సరానికి ఆవ్వానం పలికిన దృశ్యం కళ్ళముందు మెదులుతూనే ఉంది. అది ఆ విద్యుత్తు మహిమ. తెలంగాణ రక్తనాళాల నిండా తెలంగాణ విద్యుత్తు (వనరిన్తున్న నందర్భమిది. ఆదిగో దాని (ప్రతిఫలనమే ఈ సంకలనం. ఇంత ఉద్యమ ఉధృతి లేని కాలంలో మత్తడి, పొక్కిలి వచ్చినవి. అవి (ప్రస్తుత ఉద్యమ కవిత్వానికి పునాది నేర్చరిచిన సంకలనాలు. ఇటీవల “జాగో..జగావో” వచ్చింది. అది వర్తమాన ఉద్యమ తక్షణ ప్రతిఫలనం. ఈ సంకలనం కూడా తక్షణ ప్రతిఫలనమే. అయితే మొదటిది మొత్తం తెలంగాణ రాష్ట్రానికి చెందింది. ఇది మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్ పరిసరాలకు చెందినది. ఈ సంకలనం ఒక వైపు ఉద్యమ వ్యాప్తికీ, విస్తృతికీ సూచిక, కొలమానం. మరోవైపు తెలంగాణలోని అన్ని కార్చర్లలోని కవుల బాధ్యతాయుత, భావోద్వేగ స్పందనలకు నిదర్శనం. 500౧0/2060649 0౪6౭
110౪ 01 ౧౦౪౫6గ6| 1861౧09 అన్న కవిత్వ నిర్వచనానికి సరిగ్గా అతికే సంకలనమిది. ప్రస్తుత ఉద్యమంలో ఒక కార్నర్ పరిధిలో వచ్చిన మొదటి సంకలనమిది.
ఈ సంకలనంలో ఇప్పుడే కలం పట్టిన కవులు ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా రాస్తున్న వనపట్ల సుబ్బయ్య, సంబరాజు రవిప్రకాష్స్ గుడిపల్లి నిరంజన్, రవి, హెచ్,.రమేష్‌బాబు, సోమశిల మొదలైన కవులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కపిలవాయి లింగమూర్తి గోరటి వెంకన్న జనజ్వాల, కాసీంలు ఉండడం ఒక విశేషం. తాము మొదట ఈ ప్రాంతానికి చెందిన తర్వాతే తెలంగాణ మొత్తానికి చెందుతామనే గ్రహింపు ఉన్నందువల్లనే ఈ సంకలనంలో ఉండడానికి అంగీకరించి ఉండొచ్చు. అందుకు వారికి అభినందనలు, అభివందనాలు.
తెలంగాణ గర్వించదగిన పండిత పరిశోధకుల్లో అగ్రగణ్యులు కపిలవాయి లింగమూర్తి వారు ఇందులో ఉండడం తెలంగాణ కవిత్వానికి అదనపు ప్రతిష్ట ఈ వయసులో యువకవులతో కలిసి నడవడం గొప్ప విషయం. ఆయన తన పరిశోధనా సారాన్ని తన కవితలో గుదిగుచ్చినారు.
వాసి గన్న తెలంగాణ దేశానికే ఖజానా
బాసలోన తేనెలొలుక వాసించిన తొలిజాణ అంటూ తెలంగాణ గత వైభవాన్ని రంగరించినారు.
తెలంగాణకే కాదు, ఆంధ్రర్యాష్ట్రమే కాదు, మొత్తం భారతదేశమే గర్వించదగిన కవి గోరటి వెంకన్న.
ఎగిసేటి గోదారి ఎదపైని చంద్రహారం
నీలవేణి కృష్ణ నీ కాలి అందె రవళి
అని తెలంగాణ సరిహద్దులను అందంగా కవిత్వీకరించి
వేములవాడ రాజన్న మన వేల్చురోరన్న
కొమరెల్లి మల్లన్న మన కొలుపురోరన్న
జానుపాడు సైదన్న సూఫీల దీవెనన్న
సాకవోస్తె సాలు సమ్మక్క పూజమేలు
కావ్య జగతినేలే పోతన్నదీ నేలే కథలల్లిన గుణాఢ్యుడు ఈ కన్నతల్లి సుతుదే తెలంగాణ సుదూర గతం నుంచి సమీపగతం దాక తెలంగాణ గత వైభవాన్ని అద్భుతంగా గానం చేస్తాడు గోరటి వెంకన్న తెలంగాణ గత వైభవంలోని అన్ని పార్ధ్వాలను తొకడం వల్ల ఈ పాట తెలంగాణ సమగ్ర జాతీయ గీతంగా రూపొందింది. ఈ పాట ఈ సంకలనంలోనే మొదట రావడం వల్ల సంకలన ప్రతిష్ట ఇనుమడించింది. చూడటానికి చిన్న సంకలనంలాగా కనిపిస్తుంది. కాని తెలంగాణ ఉద్యమం చుట్టూ పెనవేసుకున్న అన్ని కోణాలను తడిమి ఒక పెద్ద సంకలనం నెరవేర్చే ప్రయోజనాన్ని సాధిస్తుంది. అట్లా కొండను మొత్తాన్ని అద్దంలో ప్రతిబింబించే పెద్ద పనిని నెరవేరుస్తుంది. ఈ పనిని ఎట్లా నెరివేర్చిందో కొన్ని ఉదాహరణల ద్వార చూడొచ్చు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కొన్ని వర్గాలకే పరిమితం. ఇప్పుడు అన్ని వృత్తులకు ఎట్లా విస్తరించిందో ప్రతీకాత్మకంగా చెప్పినాడు ఒక కవి. వరిసేల కలుపుదీసే భామల గళమై పాడిందినా తెలంగాణ మోటకాడ కష్టాలు మరిచిన గాసగాడి పాటే అయ్యింది నా తెలంగాణ (పెంటమరాజు నరసింగరావు) అన్ని వృత్తులకు ఉద్యమం వ్యాపించి ఆ వృత్తుల వారు ఎట్లా నిరసన వ్యక్తం చేస్తున్నారో ఇలా చెబుతున్నాడు ఇంకొక కవి. బాలపీర్ల తప్పెట్ల దరువాగింది చాకలి ఐలమ్మ దివిటీ కిందేసింది “మట్మీల్లి కు కుమ్మరి జంగయ్య కొత్త కుండలు చెయ్యలే బ్యాండ్ సన్నాయి సప్పుడు బంద్...... సబ్బండ కులాల నిరసన (వనపట్ల సుబ్బయ్య) తెలంగాణ ప్రజలు వలస వెళ్ళే దుస్థితిని చిత్రిస్తూ ఇద్రీస్ ఇలా అంటాడు.
“కన్నవారు ఉన్న ఊరు సొంతగూడు నొదిలేసి పక్షులోలె వలసెల్లే ఖర్మ మాకు పట్టినాది” అట్లాగే ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద మొదలై అన్ని ప్రాంతాలకు ఉద్యమం ఎట్లా విస్తరించిందో ఉదయభాను అద్భుతంగా కవిత్వీకరించినాడు. “ఆకుల సందున నిద్రిస్తున్న పిల్లగాలి పయనమై ఖమ్మం చెవిలో యుద్ధ వ్యూహం పంచి అదిలాబాదు గుండె తట్టి పాలమూరును లొద్దిమాను ఎక్కించి” నాగర్‌కర్నూల్‌లో తెలంగాణ ఉద్యమానికి దరువై నిలిచి, అందరినీ ఉత్తేజపరిచిన పాటను రాసిన కల్వకోలు మద్దిలేటి ఇలా అంటున్నాడు హైదరాబాదు మాదిరా మా ఎదలోని గుందెరా మా గుండె నదుగనీకె మీ కెన్ని గుందెలుండెరా ఇంకోకవి గుడిపల్లి రవి హైద్రాబాద్‌కు తెలంగాణ ప్రజలకు గల రక్త సంబంధాన్ని చక్కగా వర్ణిస్తాడు. హైద్రాబాద్ మాదే అని ఘర్రిసాడు. చూడండి, టా తల్లిపాల తీరుగ నీళ్లు పొంగిపార్లిన మూసిచూడు... తెలంగాణకు హైద్రాబాద్ పెద్దబతుకమ్మ అయ్యిందోయి కాసీం “కన్నీటిగోసు లో తెలంగాణ కరువుని రైతుల ఆత్మహత్యల పరంపరను చక్కగా కవిస్త్వీక్తర్రిస్తూ హృదయాన్ని ధ్రవీభవింపచేస్తాడు. ఒక కన్నీటి చుక్క వాకిట్లో నిలబడి ఎండిపోయిన మేఘానికి వ్రేలాడుతున్న రైళు శవాన్ని చూస్తుంది. కరువుకూ రైతుల హత్యలకు ఉన్న సంబంధాన్ని ఇంతకంటే
బలంగా ఎవరు చెప్పగలరు ?
సీమాంధ్ర రాజకీయ నాయకుల నిజ స్వరూపాన్ని బయటపేడుతూ భూపాల్‌రెడ్డి ఇట్లా స్పందించాడు.
లగడపాటి గాడేమో లబలబమని మొత్తుకుంటే
గాదెంకటరెడ్డి గాదు గాయిగాయి జేస్తుంటే
ఎంకటేసు కర్నూలుల లెంకగొట్ట జూస్తుంటె
ఈ ఉద్యమంలో దళితుల పాత్ర, విద్యార్థుల పాత్ర లాగా చాలా గొప్పది. వాళ్ళ భాగస్వామ్యం వల్ల ఉద్యమానికి మరింత ఓ661142౧౧45/ వచ్చింది. సామూహికత ఒక తెగ లక్షణం. చచ్చినా, బతికినా, పెండైనా, పేరంటమైనా, దెబ్బతిన్నా కొట్టినా ఏకతాటి మీద నిలవడం ఆ తెగ లక్షణం. ఒక ఆదిమ స్పృహ ఇంకా మిగిలి ఉండడం తెలంగాణ గర్వించదగిన లక్షణం, ఆ లక్షణాన్ని ఇప్పటికీ మిగుల్చుకున్న ఒకే ఒక కులం మాదిగకులం. దానిని గుడిపల్లి నిరంజన్ చాలా శక్తివంతంగా వ్యక్తీకరించినాడు
తెలంగాణ నేలను
లేళ్ళలా వేటాడుతుంటే
మండే నా డప్పు
గుద్దే నా గూటం అద్ద పెడుతా
ఇది చాలు తెలంగాణ ఉద్యమం ఎన్నాక్షేనా సజీవంగా
ఉండడానికి. గత చరిత్రను పురాణాల్ని వురాగాథల్ని వర్తమాన చరిత్రకనుగుణంగా వ్యాఖ్యానించుకోవడం తెలిసిన సంగతే. ఇది ప్రస్తుత ఉద్యమానికీ వర్తిసుంది. అట్లాంటి ఒక సముచిత పురా వ్యాఖ్యానం జనజ్వాల కవితలో ఉంది.
తెలంగాణ బాలవర్ధి సాహసి
రెక్కల గుర్రం మీద మళ్ళీ వస్తున్నాడహో
మంత్రాల కొడుకా! తన్మాత్ జాగ్రత్త తెలంగాణ భాషను, సంస్కృతిని సీమాంధ్రులు ఎక్కింరించడాన్ని
“ఎవడురా మమ్మల్ని ఎక్కింరించేది
ఎంతసొాహసంరా
ఎదురెదురు మాట్లాడుతున్నరు”
బాల్‌రాం నిష్కర్షగా ఖండించినాడు. ల | యన డమ యస చక్టూ పద్మమన్నార నడనరదావ విద్భుత్తుడూ విధిలేక అపుకున్నం మరొక ప్రతిభావంతమైన పాలమూరు కవి పరిమళ్ రాష్ట్ర విభజనను శక్తివంతంగా వ్యక్తీకరించినాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య భూమి పక్కున పగులాల్సిందే. ఇదే విషయాన్ని కౌటిల్య కూడ బాగా అభివ్యక్తం చేసినాడు, అధికారాన్ని/ధిక్కరించైనా/విభజన అనివార్యం “సాయుధ పోరు సలిపిన సత్తామనది ఆడోళ్ళంతా కలిసి అలుగులాగ ఉరకాలి” అని మురళీధర్ రావు చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని ధ్వనింపజేసినాడు. ఈ సంకలనంలో సంబరాజు రవిప్రకాష్ రాసిన “ముద్దాడుదాం'” మరొక గొప్ప కవిత. పోతిరెడ్డిపాడు మీద పొడుచుకొచ్చిన ప్రేమముందు శ్రీశైలం ముంపు నష్టపరిహారం నగుబాట్లవుతున్నది గొంగళి పురుగుతై మనం కాలం సాగదీస్తుంటే వారు సీతాకోకచిలుకలై విహరిస్తున్నారు బళుకు పోరాటంలో మనము ఉసిళ్ళలా రికృల్ని రాల్చుకుంటుంటే వాడు ఐదు నక్షత్రాల *'మెనూ' ని ట్రేవ్‌మని శ్రేన్చుతున్నాడు ఊరు మొత్తం మీదే గ్లాని బొద్రాయి మాదంటున్నారు ం తెలంగాణ, సీమాంధ్రల స్ధి తిగతుల్ని మంచి 60౧4486 తో 6౫0096 చేసినాడు. ”
అసువులు బాసిన వీరులంతా గొరుక్కొాయ్యలై మెరుస్తున్నారని,, మరణం తర్వాతే జీవితమైతే ఉరికొయ్యను ముద్దాడుతామని, మృత్యువునే కౌగిలించు కుంటామని హెచ్.రమేష్‌బాబు '“పొద్దెంది అనే కవితలో అద్భుతంగా ప్రకటించాడు. తెలంగాణ కాంక్ష నెరవేరుతుందని సృష్టం చేశాడు. వానలేని కాలంలో ఒక ఎ(ర్రమందారం మొక్క మొలిసింది నా కొక్కటే అర్ధమైంది మా తెలంగాణ వొచ్చే 'పొద్దెంద ని ఈ కవితా శీర్షికనే సంకలనానికి పేరుగా పెట్టడం సముచితం. ప్రసిద్ధ కవి రేడియం తెలంగాణ ప్రస్తుత పరిస్థితిని అద్భుతంగా చిత్రీకరించాడు. నేడు వట్టిపోయిన అవయ్యింది తెలంగాణ మట్టిని నమ్మిన రైతు కూలిగయ్యిందు రావేందిరా పోదామురా అన్నపాటతో కలమంద చెన్నయ్య ఉద్యమానికి ఊపునిచ్చిండు. పాటలై పారుదాము మాటబై పేలుదాం పాటలో మాటల్లో తరిమి తరిమి కొడదాం ఇట్లా చక్కని ప్రతీకలతో, మంచి ఉపమానములతో, తెలంగాణ నుడికారంతో అంతకంటే గొప్ప భావోద్వేగంతో నడిచిన ఈ సంకలనం తెలంగాణ ఉద్యమానికి కవిత్వానికి మంచి ం౦0౧౯|లటంగ౧ గా భావిస్తూ ఈ కవుల్ని ముఖ్యంగా ఈ పనిని మీదేసుకున్న సంబరాజు రవి(ప్రకాష్, వనపట్ల సుబ్బయ్య, గుడిపల్లి నిరంజన్‌లను మనసారా అభినందిస్తున్న.. దాః సుంకిరెడ్డి నారాయణ రెడ్డి 15-1-2010 సెల్ : 9885682572
గీ పని ఎందుకంటే! “ఆపలేరు ఆపలేరు ఇంక మీరు ఆపలేరు ఈ మట్టిని తొలుచుకోని విప్లవాలు లేస్తున్నై ఎరుపెక్కిన ఈ మట్టికి మా నెత్తుటి స్వాగతాలు మీ చీకటి కొట్టానికి నిప్పలంటుకుంటున్నై మా ఊపిరితిత్తులతో ఊది ఊది మండిస్తాం బంధనాలు తెంచుకొని పల్లెలు పడిలేస్తున్నై మేలుకొన్న నిరుపేదకు మా నెత్తుటి అభివాదం విముక్తికి శ్రమశక్తులు రక్తార్చణ జేస్తున్నై పోరాడే యోధులకు మా నెత్తుటి జేజేలు భూమి మీద తెలంగాణ బావుటలు లేస్తున్నై ఎదురు తిరుగు మానవుడికి మా నెత్తుటి సలామ్” చెరబండరాజు నెత్తుటి గీతం తెలంగాణను ఆపలేరు అని చాటింది. ఇప్పుడు తెలంగాణ కొలిమి అంటుకున్నది. నిప్పుల పిడికిళ్ళతోనే తెలంగాణ ఆవిష్మరించబడుతుంది. అందుకు ప్రతి తెలంగాణ పౌరుడు తన పెదవులపై నిప్పులు పూయించాల్సివుంది. “గురుకొయ్యలు పొడవంగ లేచి-అరకట్టెద్దుల మోటలు గట్టి తేనేలొలికె గొంతుల నెత్తి-జానపాటలు పాడుతుంటే పాటకు వెన్నెల పరవశించి-మోటదోనను ముద్దాడుతది సుట్టు ఆమడ దూరము దాక-సెట్టు సేమల్తు ఊగి ఆదుతవ్పి పక్షులు అడవి జీవరాశులు - పరుగులు పెడతవి పిలకబావికి ఆ ఊట బావి మోట గిలక ఏది - నా తెలంగాణలో ఆ దాపటి వొలపట్టెద్దుల తల్లేరేది - నా తెలంగాణ అని గోరటివెంకన్న పల్లె వల్లకాడవుతున్నాా ధ్వంసమవుతున్న తీరును మనకు కళ్లకు కట్టినట్లు చూయించడం జరిగింది. ఒకప్పుడు తెలంగాణ పల్లెలు ఏ గ్రామానికి ఆ (గ్రామం స్వయం పోషకత్వంతో ఉండేది. నేడు (గ్రామాలలోని వృత్తులన్ని
ఆంధ్ర పాలనలో ధ్వంసమైపోయి తెలంగాణ రైతులు వలస వెళ్ళి శవాలై తిరిగివస్తున్నారు.
తెలంగాణకు వలస ఆంధ్రనాయకులు ఎంత దోపిడి చేస్తున్నారో, అంతే తెలంగాణ నాయకులు కొందరు వాళ్ళకు వంత పాడుతున్నారు. ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగిన కొందరు తల్లి తెలంగాణకు వంచన చేయదలిస్తే ఈ మట్టిలోనే పాతరేస్తాం అన్న కవి కాళోజి మాటలను నిజం చేస్తాం అని “దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం దోస్తుగ ఉందే వారితొ మేమును దోస్తే చేస్తం - ప్రాణమిస్తం ఎంతకు అంత అన్న ధోరణితో చింతమాని బ్రతుకును సాగిస్తం తెలంగాణమిది-తెలంగాణమిది తీరానికి దూరాన వున్నది ముంచే యత్నం చేస్తే తీరం మునుగును తానే - మునుగును తప్పక” అని వేలాది పిడికిళ్లు పొడుచుకొస్తున్నాయ్.
కందనూల్ (నాగర్‌కర్నూల్) లో తెలంగాణ ఉద్యమ
కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన “కవిసమ్మేళనం” తర్వాత గాని మాకు గీ ఆలోచన రాలే. అందులో వినిపించిన కవితలు సెవులల్ల మార్మోగుతుంటే గీ పనికి పూనుకున్నం.
ఇది సెంటిమెంట్ గాదు. కమిట్‌మెంట్. తెలంగాణ కోసం గొంతెత్తిన సందర్భమిది. ఒకవైపు వలసపోయి శవాలుగా మారిన వారి కోసం ఎదురు సూపులతో మా పల్లెలుల్ల నొమూహిక శోకం ప్రతిధ్వనిస్తూనే వుంది. మా కొలువుల్ని గుంజుకొని మా సదువుకున్న పోరగాండ్ల జీవితాలల్ల కొలిమిల్ని పెట్టిండ్రు. ఇంకొక వైపు మంచితనంగా పంచన చేరినందుకు ఎంత వంచన!
తెలంగాణే మన ఆట, పాట. తెలంగాణే మన కవిత. ఇది సిగబట్టి అడుగుతున్న న్యాయం. ఇది ఉద్యమం ముందడుగు వేయడానికి రాసుకున్న రాతలు. పలుకుతున్న పలుకులు. కల్లంకాడ ఉన్న కుప్పల మాయగాళ్ళను పొలికట్టెలమై తరుముదాం. పోరాట పొద్దులై పొడిసినోళ్లం. ఎవరు నిలుస్తరో చూద్దాం. ది తెలంగాణ కవిత్వం రూపపరంగా వన్తుపరంగా బహుముఖాలుగా విస్తరిస్తున్నది. నేటివిటీని కవిత్వంలోకి తీసుకరావటం మంచి పరిణామం అన్న పెద్దల మాటలకు ఈ పుస్తకం మంచి ఉదాహరణ. తెలంగాణ ప్రజలు గురవుతున్న అనేక మోసాలకు నిలువుటద్దం ఈ కవిత్వం. మావి కన్నీళ్లు కావు ఆ కళ్ల నీళ్ళు నేలరాలితే జాలు పాట పరవశిస్తది... తుడుం మోత మోగుద్ది = మా బాధల్నిమేం యిస్సిరి కొడ్తే చాలు కవిత్వం కదం తొక్కుతది (జూలూరు గౌరీశంకర్) మా పరిమితులకు లోబడి ఉద్యమంతో మాకున్న సంబంధాల పరిమితులకు లోబడి మా శక్త్యానుసారం చేస్తున్న ప్రయత్నమే ఈ పొద్దెంది-తెలంగాణ కవిత్వం ఉద్యమ పోరాటానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తోద్బ్చడిన వారికి, అడిగిన వెంటనే కవితలు ఇచ్చిన కవులకు, ముందుమాట రాసిన సుంకిరెడ్డి నారాయణ రెడ్డికి, ఓపికతో మాకు అందంగా డి.టి.పి. చేసిన యం. ప్రవీణ్‌కుమార్‌క్తు, ఈ 'సంకలనంి ఇలా పుస్తక రూపంలో రావడానికి సహాయ, సహకారాలు అందించిన జనుంపల్లి సాయిశంకర్ కు, ఉద్యమాభివందనాలతో...
- కందనూలు కవులు నాగర్‌కర్నూల్ లాలా పాద్దింది-తెలంగాణ కవిత్వం
కపిలవాయి లింగమూర్తి పదార్వన్నె బాస వాసిగన్న తెలంగాణ దేశానికే ఖజానా బాసలోన తేనెలొలుక వాసించిన తాలిజాణ ॥వాసిగన్నుః యక్షులు నాగులు సవరలు జైనులు బౌద్దులు శకులు కుల మత ఖేదాలు విడిచి కూడి మాడి యున్న నేల ॥వాసిగన్నుః శాతవాహనులు విష్ణుకుండులు చాళుక్యులు వరువలు పురుడు పోసుకున్న శాల పూతమైన పుణ్యశీల 1॥వాసిగన్న॥ బాసరలో గోదావరి వాసరమ్మ నెత్తుకోగ తుంగాభీమల నిచ్చట గుస్తరించె కృష్ణవేణి 1వాసిగన్ను॥ అయోధ్యకు ఉజ్జయినికి కాశీకి తక్షశిలకు బదులుగా విద్యాపీరాల్ పరిఢవిల్లినట్టి చోటు ॥వాసిగన్చుః భారత భాగవతాలకు నన్నయ్య పోతన్నలు ఎన్నుకొనినదీ బాస పొన్ను పదార్వన్నె బాస వాసిగన్న॥ గోరటి వెంకన్న జనులు గోరేటి వెంకన్న బాస దాని యాస దాని హేష వినగ సొంపు సెబాసు ॥వాసిగన్న॥ కందనూలు కవులు లాలా కీ = కపిలవాయి లింగమూర్తి, 08540-226497
గోరటి ఎంకన్న తల్లీ తెలంగాణమా తల్లీ తెలంగాణమా తనువెల్ల మాగాణమా వీర తెలంగాణమా విప్లవ మాగాణమా గర్భాన సింగరేణి గళమున మధురవాణి తరుల పూలతోని కురులల్లుకున్న రాణి సిరుల గిరులతోని విరజిల్లె మేటి ధరణి వీర తెలంగాణమా విష్లవ మాగాణమా గానమా మా ప్రాణమా తెలంగాణమా ఎగిసేటి గోదారి ఎదపైని చంద్రహారం నీలవేణి కృష్ణ నీ కాలి అందె రవళి పెనుగంగ ప్రాణహిత కిన్నెరసాని మోత ఆ సిలకవాగు సిందు జంపన్న కనువిందు 2 పొద్దెంది-తెలంగాణ కనిత్వం
జలతారు అలల కొండలు మెరిసేటి మెడన దండలు 1వీర॥ గిరుల మీద గిరులు ఆ భువనయాదగిరులు కోటలొరుస కోట భలే వర్ధమానకోట బండమీద కొండ భలె భలే గోలుకొండ అందంగ ఇసుకమేట అంచుత సిరులపేట పేరైన ఓరుగల్లు సుట్టూత రాతిగుళ్ళు గుడిపల్లి ఊరుగట్టు వనపట్ల మేటిపట్టు శిధిలాపు ప్రాకారాలు శిలుపాల గోపురాలు గతచరిత వైభవాలు ఘనమైన ఆనవాల్లు 1వీర॥ వేములాడ రాజన్న మనవేల్చురోరన్న కామరెల్లి మల్లన్న మన కొలువు రోరన్న జానుపాడు సైదన్న సూఫీల దీవెనన్న సాకవోస్తే సాలు సమ్మక్కపూజ మేలు పానుగంటి బాలపీరు ఫాత్యాల (ప్రభలతేరు పిలిసితే నడిసి వచ్చే నాయీనిపల్లి మశమ్మ తలిసితే తలుపుతట్టే ఉద్దాలమూర్తి పెట్టె ఆపదలకొండ గట్టు అంజన్నకైవరు బెట్టు మేటైన ధర్మపూరి తీర్ధంపు పుణ్యదారి చాటింది స్థలపురాణం మావిళ్ళపల్లిగానం భద్రాద్రి రామగిరి భక్తుల పాలదారి దోసిట్లో ఒలికె తీర్థం బాసర పుణ్యక్షేత్రం దీనుల పాలి దీపం ఆ మెదక్ చర్చి రూపం వీర కావ్యజగతి నేలె పోతన్నదీ నేలే కధలల్లిన గుణాఢ్యుడు ఈ కన్నతల్లి సుతుడే పాటైన ద్విపద పరుగు మన పాలకుర్తినురుగు బుద్దన్న ఖ్యాతి నిలిపె-కవిభువనమై వెలిసె అలరించె చాటువులతో అప్పయ్య కీర్తి నిలిసె కందనూలు కవులు లా 21
రంగైన పద్యరాగం అలసింగ భూపాలం
శతకాల పత్ర శకటం శేషప్ప కొప్పె మకుటం
బాగయ్య పాట దరువు ఎల్లమ్మ కాలి అడుగు
అలరించె భాగవతుల కన్నట్టి వెన్నచర్ల
మళయాల తోర మావిడి కవి తోరణాల నాడి 1॥వీర॥। రాకామచర్ల బాణి వేపూరి కాల జ్ఞాని
జగమొప్పిన శతపత్రం గడియారం గుడిదస్తం
కాళోజి దాశరథులు ఈ ధరణి కావ్య బుషులు
గుమ్మాడి విరల్ రాగం ఈ నేల గుండె తాళం
కవి పాలమూరు కీర్తి చాటిండు లింగమూర్తి
పద్యాలబాట పోంటి పయనించె వేముగంటి
జానపదుల జ్ఞానరాజు ఆ బిరుదు రామరాజు
ఇమ్మడిజెట్టి కవనం తలవొంచెనెల్ల భువనం
కవిత్వ మర్మయోగి గుండూరి హనుమశర్మ
చరిత్ర సారమెల్ల సురవరమె చాటెనెల్ల
బాటల్ల తోటలల్ల బంతైన ఆటలల్ల
అణువణువు మీటెనల్ల తనువెల్ల రాగమల్ల
పదునెక్కి పాటలల్ల పెరిగిండ్రు పిల్లలల్ల వీరః బరిసేల మెరుపులేగన్ నైజాము మూకలేగన్
వడిసేల మెరుపురావి బరిగీసి నిలిసె “జీవి!
వెయ్యేనుగుల బలం బి.ఎన్. జన్మస్థలం
కన్నీటి పలైెరాగం-సుద్దాల కదనయాగం
నిర్వికారి త్యాగి ఆ రామనాధమోయి
మట్టిచేత దీపం *మారోజు' పోరు రూపం
తిరుగబడ్డ వీణ ఐలమ్మ పోరుసేన వీరుల గిరుల కోన ఇది వీర తెలంగాణ 11వీర।
22__-పాదెంది-తెలంగాణ కవిత్వం లా గోరటో ఎంకన్న 9441366515
'పెంటమరాజు నరసింగరావు జై తెలంగాణా! రుుణక్ రుణక్ జజ్జనమంటూ జై యంటు పాడింది నా తెలంగాణా, నా తెలంగాణా, జై తెలంగాణా, జై తెలంగాణా జైయంటు సైయంటు కొమరం భీము గొంతైపాడింది నా తెలంగాణా, నా తెలంగాణా జై తెలంగాణా, జై తెలంగాణా లేత మావిడి సివురులు దింటు సెట్టుమీది కోయిలమ్మయి పాడింది నా తెలంగాణా, నా తెలంగాణా పించెము విప్పి నాట్యమాడె నెమలి కూకై పాడింది నా తెలంగాణా, నా తెంంగాణా కందనూలు కవులు లాలా 23
వరిసేల కలపుదీసే భామల
గళమై పాడింది నా తెలంగాణా, నా తెలంగాణా
తలంరూమున కొట్టమెక్కి
కోడిపుంజై పాడింది నా తెలంగాణా, నా తెలంగాణా
పుడమితల్లి దద్దరిల్లగ
కోలాట పాటల సల్లాపమయ్యింది నా తెలంగాణా నా తెలంగాణా
ఉవిదల నోటిలో (ఉయ్యాలపాటై) బొడ్డెమ్మ పాటై
ఉరకలు వేసింది నా తెలంగాణా, నా తెలంగాణా
మోటకాడ కష్టాలు మరిచిన
గాసగాడి పాటే అయ్యింది నా తెలంగాణా, నా తెలంగాణా,
పరుగులు తీసే బాల బాలికలకు
బడిగంటయి పాడింది నా తెలంగాణ, నా తెలంగాణా
గిరగిర దిరిగే కుమ్మరి చక్రం
మోతై పాడింది నా తెలంగాణా, నా తెలంగాణా
సలసలకాగే కమ్మరికొలిమి
తిత్తై పాడింది నా తెలంగాణా, నా తెలంగాణా
కష్టజీవుల సేతిలోని
గొడ్డలి రంపం కొడవలి నాగలి సుత్తెపాడింది
నా తెలంగాణా, నా తెలంగాణా
తెలంగాణ సాధనలో కాలేజి బిద్దల గర్జనై పాడింది
నా కెలంగాణా, నా తెలంగాణా 1॥రుుణక్!॥
24--ాలాాాపాద్ధెంది -తెలంగాణ కవిత్వం
= పెంటమరాజు నరసింగరావు, 9247490965
ఇద్రీస్.యం.డి. నా తెలంగాణ పచ్చని పల్లెనాది పల్లెలోన చెరువునాది పల్లెలన్ని చిన్నబోయె చెరువులేమో వాడిపాయె నా పల్లె జనం గుండె పగిలి వలసెల్లి బోయిరి! నను ఒంటరో్డి జేసిరి!! ఏమి ఖర్మ వచ్చినాది ఎంత కరువు వచ్చినాది చినుకు చినుకు రాలుతుంటే తడవలేక నేలతల్లి అలసివున్న పేదవాడి గుండె దిగులు పెంచేమళ్ళీ కన్నవారు ఉన్న ఊరు సొంతగూడు నొదిలేసి కడుపుమాడి పేగువాడి పక్షులోలె వలసెల్లే ఖర్మ మాకు పట్టినాది గోదావరి, కృష్ణమ మంజీర తల్లులారా నమ్ముకున్న మీ బిడ్డల గోడుచూడుమోసారి ప్రభుత్వాలు మారాయి పాలనా మారింది మార్పులేదు ఇక మార్పురాదు మనం మనం కలవాలి కదంతాక్కి నడవాలి ఎదిరించి పోరాడి ప్రతిఫలం పొందాలి దగాపడ్డ తెలంగాణ కావాలి స్వర్గసీమ జై తెలంగాణ జైజై తెలంగాణా కందనూలు కవులు ఎలా 25 = ఇద్రీస్..యం.డి. 9490146557
ఉదయబాను.డి చెట్టు చిందిన రక్తపు చుక్కలు మట్టీ గుండెలో లిఖించిన చరిత్ర సలసల కాగి కాగి ఆర్ట్స్ కాలేజి ముందు చెట్టై పుష్పించింది ఉరేసుకున్న దేహాలను భారంగా మోసిన కొమ్మలకు పిడికిళ్ల పూత... సూరీళ్ల కాత .... ఒక్కసారి... చెట్టుకొమ్మలూగితే ఆకుల సందున నిద్రిస్తున్న పిల్లగాలి పయనమై ఖమ్మం చెవిలో యుద్ధ వ్యూహం పంచి ఆదిలాబాదు గుండె తట్టి పాలమూరును లొద్దిమాను ఎక్కించి చెట్టు పాదాలవద్దకు ప్రతిధ్వనిలు తిరిగివస్తాంది! 2ల లాాాాపాద్దెంది -తెలంగాణ' కవిత్వం
కొమురం భీం
బాబేరురిపై నిలబడి
మీసం దిప్పినట్టుంది చెట్టు
ఇది చెట్టు కాదు....కన్నీటి చెరువు గట్టు
ఇవ్వాల...
చెట్టు కింద ఎన్ని ముచ్చట్లు
చెట్టు గురించి ఎన్ని ఆశలు
ఎనిమిది కోట్ల కళ్ల చూపులు
చెట్టు మొదలుకు కట్టేసి ఉన్నాయి
అన్ని పక్షులు చెట్టు మీదనే వాలుతున్నాయి
వేల కిలకిలలు....
లక్ష కోకువలు
రా(శ్రి అలావు ఆడుతుంది
పగలు పాట పాడుతుంది
మండుతున్న నెగళ్లవైపు తిరిగి
మూతి తిప్పుకుంది చలి
తోక ముడుచుకుంది పులి
ఇప్పుడు
చెట్టు రూపు మార్చుకొంటుంది
జిల్లాల తనువెల్ల ప్రవహించాలని బయలుదేరుతోంది
నవలాంగ్ మార్చ్
నిన్నటి విజయాన్నిక్కడ ప్రతిక్షేపిస్తే
ఎంతబాగుండు
తాతా తండ్రికి దక్కలేదు
నేనైన కాసేపు ఆ నీడలో కునుకు తీస్తుంటి. కందనూలు కవులు లాం 27
- ఉదయబాను.డి, 9966989083
కల్వకోలు మద్దిలేటి కక న ననన హన ధన ధన దరువులతో ధన ధన దరువులతో - వెయ్యర దరువెయ్యి వెయ్యర దరువెయ్యి - తెలంగాణ దరువెయ్యి 1ధన॥ హైదరబాదు మాదిరా మా ఎదలొదిగిన గుందెరా మా గుండె నడుగరా మీకెన్ని గుండెలుందెరా గుండె నడిగె టోళ్ళంతా మొండి జాతి రొండలే రొండలను తరుముదాము -రాండిక పోదామురా 1ధన॥ మాటచెప్పి సీటు ఎక్కి మాట తప్పె జూట ఎవరు ఊసరవిల్లుల లాగ రంగులెవరు మార్చిరి వాడు ఎవడు వీడు ఎవడు తెలంగాణకు అడ్డు ఎవడు అద్జొచ్చినోన్ని మనం - నడ్డిరిగ తన్నుదాము 1ధన]॥। 26 ఆాాాాాాపాద్ధెంది -తెలంగాణ కనిత్వం
ఆంధ్ర అంటే ఆగడం
సీమ అంటే మోసము
వాళ్ళు వీళ్ళు కలుసుకొని
నీళ్ళు దోచుకున్నారు
నీళ్ళు వాళ్ళు దోచుకొని
కన్నీళ్ళు మనకుంచిరి
కన్నీళ్ళు మనకెట్టినోన్ని-మన్నులోన కలుపుదాము ॥ధన॥
రజాకారు గుండాలను
రాల్చినేల కూల్చినం
నైజూం నవాబోన్ని
పైజామూడ గొట్టినం
త్యాగ వీరుల బాటలలో
భాగమై నడిసినం
మా బాటకు అడ్డొస్తే
కాటిలోన కలుపుతాం ॥ధనః॥
అరవై ఏండ్ల పోరులోన
అమరత్వము వుందిరా
ఆకలి శోకాలతోని
ఏకమైన ఉద్యమం _
అమరులని మదిలో తలచి
అడుగుముందుకేద్దాము ॥ధన॥
అలుపులేని గెలుపుకొరకు-వెయ్యరదరువెయ్యి
తెలంగాణ నచ్చుదాక-వెయ్యరదర్శువెయ్యి 1ధన॥ కందనూలు కవులు లాలా 2
- కల్వకోలు మద్దిలేటి, 9441590989.
కలమంద చెన్నయ్య రావేందిరా పోదామురా
రావేందిరా పోదామురా
తెలంగాణ పోరుజెయ్య పోదామురా
తిరుగుబడ్డా తెలంగాణ
తెగువ జూపె తెలంగాణ! ॥1రావేందిరా॥!
కలసి కలసి ఉందమని
ఒగలబడి పోతున్నవ్
సమైక్యాంధ్రాంటునే
సంపదంతదోచిండ్రు 11రావేందిరా॥
లగడపాటికేమో
నన్నపనేని ముద్దులిచ్చె
-ముద్దు మీద ముద్దుపెట్టి
పాత(పప్రేమ ఒలకటబోసె 1॥రావేందిరా॥ వ౨ా(ీ లా పొద్దెంది-తెలంగాణ కవిత్వం
పాటలై పారుదాము
మాటలై పేలుదాం
పాటల్లో మాటల్తో
తరిమి తరిమి కొడదాం ॥రావేందిరా॥
సకల సంపదలు గల
తెలంగాణ మాగాణం
గొల్కొండ చార్మినార్
కట్టింది ఎవడురా ॥1రావేందిరా॥!
ఉద్యమాల ఉస్మానియ
సాలార్‌జంగ్ మ్యూజియం జై
తెలంగాణ రక్తం
'సెమట సుక్కలాయెరా 11రావేందిరా॥
ఆనాడే చెప్పెను
భారతరత్న అంబేద్కర్
చిన్నరా[్ట్రాలుగా
విడగొట్టమన్నాడు రావేందిరా
బలిదానాలొద్దురా
పోరాటాలు జెయ్యరా
తెలంగాణ విద్యార్థులు
ఏకమై కదిలినారు 11రావేందిరా॥
కందనూలు కవులు లాలా తైల
- కలమంద చెన్నయ్య, 9440588271
కాసీం.సి కన్నీటి గోస! ఒక కన్నీటి చుక్క వాకిట్లో నిలబడి ఎండిపోయిన మేఘానికి వ్రేలాడుతున్న రైతు శవాన్ని చూస్తుంది! లేగదూడ గిట్టలు గోధూళిలో కాలుతున్న చప్పుడు విని ఒక కంట్లో నీరు ఇంకో కంట్లో కారుతున్నది! వెన్నెలను తాగి పెనవేసుకున్న యవ్వన స్వప్నాలు తై ాపిద్దింది-తెలంగాణ కవిత్వం
ఉదయించకముందే అస్తమించినందుకు ఒంటరి కన్నీరు ఉరిపోసుకుంది! వలసపోయిన నెత్తురు వంటి మేడ రంగైనందుకు చెట్టెక్కిన కాకి శోకం చెప్పలేని చావు కబురే! నొసటి మీన ప్రసవించిన కృష్ణమ్మ ఎండిన పాలిండ్లతో బిడ్డకోసం వెతుకులాట తప్పిపోయిన కన్నీటి గోస! ('ప్రసవించాక గర్భ(స్రావం ఇదేం వింతో! బాసరలో గడ్డకట్టిన గోదావరి రక్తమాంసాలు రాజమండ్రిలోనే ద్రవిస్తాయట! కన్నీళ్లే లేనిచోట దుఃఖానికి బదులు కళ్ళపై రెండు ప్రశ్నలుపుడుతాయి! కందనూలు కవులు ఆాాలాలాలాలాాాాాాానాా తం
- కాసీం.సి, 9290745490
గడ్డంపల్లి భూపాల్ రెడ్డి స లా ఎట్లొస్త దంటడు ఎట్లొస్త దంటడుదా తెలంగాణము ఇస్తామురా తల్లి కోరకు మూ ప్రాణము ఇసురిటరమ్మంటే ఇల్లంతా నాదంటదు బతుకుదెరువు జూపిస్తే బస్తిని కబ్దాత్లేస్తడు ఊరు ఇడిసీ పొమ్మంటె సూరు బట్టుకొని ఉంటడు . హైదరబాదుల వాని అయ్యసొమ్ము ఉందంటడు ॥ఎట్లొస్త! పెద్దమనుషులొప్పందం రద్దుకింద రాసిండు ముల్మీరూల్సని అంటె ముసిముసి నవ్విండు సల్లగ మా కొలువులల్ల నల్లిల్యాక జొచ్చిండు సెకెటేరియటుల జేరి నఖురాలను జేస్తున్నడు 1 ఎట్లొస్తో ఫజులాలీ ఆనాడే పద్ధతిగా జెప్పిండు చెహుబాబు గూడ మీకు నచ్చకుంటె సరెనన్నడు మీకు మాకు కుడరదంటి మా జాగను వదలమంటె తెలంగాణ అదుగుతుంట తెల్లమొఖం జెడుతున్నడు . ॥ఎట్లోస! రాజోలిబండకాడ రాళ్ళ తోటిగొట్టినోన్ని నీ స్ట యు ళను రానీయకుండ తూములు మూసినోన్ని ఎంకట్రతు బైరెడ్డి ఎవ్వడైనా అడ్డమెస్తె సుంకేసుల లేష్యత్మ్వన్ని లెంకగొట్టి చెప్పతున్నం /ఎట్లొస్తో! నల్లగొండ మా తమ్మ నడుముళొంగిపోత్రుంటె ప్రరకొదులదివివిద లాగమాగ వృన్చృత్ష్యంబ్రై స ంట్రె హోశ్రనేక్స వాడు సీళ్ళునములుతూ ఉన్నాడు స శ ట్రమౌలి వొల్చినోడు దయ్యమోలె బట్టిందు ఎట్లో
వాళత్తేరు ఉక్కులోన వాటా మాకేదంటే
ఆంధ్రల నౌఖర్లు జేసె అవకాశమె లేదంటే
గిరుగ్లాని సాబుగూడ గీ సంగతె జెప్పినంటె
ఫ్రీజోనన్నోని ఇండ్ల పీన్లెలు లేవాలంతె ॥ ఎట్లొస్త॥ అంజయ్యను బాసపేర అపహాస్యం జేసినోన్ని
పీ.వి.నర్సన్న సస్తె పీన్లె మురుగ బెట్టినోన్ని
ఆరొందల పదిజీవో ఆగం జేసినవాన్ని
సమైక్యాంధ్రమనెటోన్ని సడుగులిరుగ దంతమంతె _ ॥ఎట్లొస్త॥ లగడపాటి గాదెమో లబలబమని మొత్తుకుంటె
గాదెంకటరెడ్డి గాడు గాయి గాయి జేస్తుంటె
ఎంకటేశు కర్నూలుల లెంకగొట్ట జూస్తుంటె
సిరంజీవిగాడేమొ సిటికెలేసి ఎగురుతుంటె
పట్నంలో భాగమంటె పండ్లు రాలగొడతమంతె 1 ఎట్లొస్తః యాభఖై ఏండ్ల నుండి వాల్లె యవ్యారం జేసింద్రు
మన భూములు గుంజుకొని మనల మాయజేసిండ్రు
తెలంగాణ అన్నోళ్ళను తెరమరుగుకు జేసేందుకు
చెంద్రబాబు రోషయ్య చేయి చేయి గలువుతుండ్రు. 1 ఎట్లొస్త। బాపట్లకు కోరుట్లకు బంధుత్వం యాడున్నది
సూర్యపేటకు బందరుకు సుట్టరికం యాడున్నది
ఉయ్య్యూరుకు నిర్మలుకు వియ్యమందుటేడున్నది
ఇజ్జతు ఉన్నోళ్ళయితే-ఈ జాగను ఇదువాలె
జ బళ సాపసంకబెట్టుకొని బాపట్లకు నడువాలె 1 ఎట్లొస్త॥ తొడగొట్టిన ఆ కొడుకుల తోవలోనె పట్టాలె
పోతిరెడ్డిపాడంటె మూతిమీద గొట్టాలె తెలంగాణ దాటెదాంక తరిమి తరిమి కొట్టాలే సమైక్యాంధ్ర అనేటోన్ని సదుగులిరగతన్నాలి 1 ఎట్లొస్త! లు కనులు _ గడ్తంపల్లి భూపాల్ రెడ్డి, 08540-200565
గే లా
గుడిపల్లి నిరంజన్ లందల్లో పొడిచిన పిడికిళ్ళు
చిర్రాచిటికెన పుల్లతో
తెలంగాణ జీవన సౌందర్యాన్ని దరువేస్తూ
ఆంధ్ర గుండెల్లో
తెలంగాణ ఆ(గ్రహాల
మా లౌకిక భూమ్‌ని
నీ దోపిడి చూపులు తాకితే
డప్పులు ఉప్పెనలై
నిన్ను తరిమే నిప్పుకణాలై
సీలుగుర్రం దరువై పలుకుతయి!
ఓరీ సీమాంధ్ర వలసోడా
తెలంగాణ కన్నీళ్లన్నీ
పేలిన అగ్నిపర్వతం లోని
లావాలా పొంగితే
దోపిడి దుర్గాలు భగ్గుమంటవి
తెలంగాణకు “టోపి” పెట్టితే
తప్పెట పాటల తూట్లతో తరిమేస్తం!
తరాల నుండి మా పూర్వీకులు
ఎద్దుకొమ్ముల్లోని “మిగ్గులా
తెలంగాణ ఖనిజాలు భద్రపరిస్తే
కన్నేసిన ఆంధ్ర డేగ కళ్లను
పొలిమేర దాకా తరుముతం
తెలంగాణ నేలను
లేళ్లలా వేటాడుతుంటే 3ర___-----పొద్దెంది-తెలంగాణ కవిత్వం
మండె నాడప్పు గుద్దె నా గూటం అడ్డంపెడత! _ మూలవాసులు ఆగ్రహిస్తే వేడినీటి బుగ్గలు ఊటల్లా ఊరి ఓట్ల వర్షమే కాదు ఆం(ధ్ర పెట్టుబడి వలసలపై చెప్పుల వర్షం కురిపిస్తరు! ఆర్థికంగా దోపిడికి గురై రాజకీయ అణిచివేతకు బలై సాంస్కృతికంగా తుడిచివేతకు లోనై తెలంగాణోడి బరువైన గుండె శోకంలో దరువైంది ప్రకృతి వనరుల మళ్లింపుకు ఆర్ధిక వనరుల తరలింపుకు ఈ గడ్డ మీద నీ గుడ్డి పాలనకు వ్యతిరేకంగా ఎన్నెన్నో డప్పు స్వరాలు ఎగిరి ఎగిరి పడుతున్నవి! ఆంధ్ర పెట్టుబడిదారులను పారిపొమ్మంటు “రంపెో పోరుపాటై “గూటం” గుండె జలపాతమై “ఆరి తెలంగాణ కరదీపికలై డప్పు పోరుదరువుల ప్రతినిధి గొడ్ల పొట్టలు కోసే కత్తి వలస దోపిడి పొట్టలు కోస్తది వేలాదిగా... తెలంగాణకై లందలో పొడిచిన పిడికిళ్లు కందనూలు కవులు తయా త్ర
- గుడిపల్లి నిరంజన్, 9493319878
గుడిపల్లి రవి మేరా హైదరాబాద్ దేఖో దేఖో భాయి మేరా హైదరాబాద్ రోయి జెర దేకో సునో భాయి తుమ్ హైదర బాద్ రోయి భాగమతి పేరున కట్టిన భాగ్య నగరం దేఖో ప్రేమికుల గలుపనీకే వాలెంటైన్స్ ప్రాణమిచ్చె షాజహన్ (ప్రేమ కొరకు తాజ్‌మహల్ బంగ్ల గట్టే దునియాల లేనే లేదు (పేమ కొరకు గట్టిన నగరం 11దేభో॥ కాకతీయ శాతవాహన మొగలాయి చాళుక్యులు రాష్ట్ర కూటుల వంశజులు సర్వాయి పాపన్నలు నిజాం నవాబులు బ్రిటీష్ లేలిన నగరం 1దేభో॥ గోలుకొండ మహానగరం నిర్మించెను గణపతి వజ్రాలు రాసులు పోసి అమ్మినా జలదుర్గం నేడు శిథిలమైపోయే దాని రూపురేఖలు వాయే దేఖో! మీర్ ఉస్మానాలీఖాన్ కట్టించిన టాంక్ బండు తతొ లాలా పొద్దెంది-జెలంగాణ కవిత్వం
పచ్చి జీవరాసికి కొలను
ప్రజలాకు జీవజలము
ఉస్పేన్‌సాగర్ చెరువు
నేడు కుళ్లిపోయిన శవము దేఖో!
జెర రొఖో రొభఖో భాయి
నాలుగొందల ఏండ్ల దోయి
ప్లేగ్ వ్యాధితో సచ్చినొల్లకు
చార్‌మినార్ చిహ్న మోయి
(పేమపెండ్లిళ్లు ఫేల్యురైతే
సావనీకే తావై పాయే దేఖో!
తల్లి పాల తీరుగ నీళ్ళు
పొంగిపొర్లిన మూసి జూడు
దూపైతే గొంతు దడిపి
సేద దీర్చెను అమ్మ తీరు
మురికి నీళ్లతో పెంటకుప్పగా
కంపు గొట్టి కన్పీరెట్టె దేఖో!
సంపంగి పూల వాసన
గతమంతా పట్టన మోయి
కారు మబ్బులు గమ్మనట్టు
కాలుష్యపు పొగలు జిమ్మీ
అరే కాటి తీరుగ నగరం
కౌంరాసన గొడ్డుందోయి దేఖో
ఉద్యమాల పోరుగడ్డ
ఉస్మానియా క్యాంపస్ బిడ్డ
మూడు వందల అరవై మంది
తెలంగాణకు ప్రాణమిస్తే
ప్రత్యేక రాష్ట్రం గాలే
నిరుద్యోగులడ్డాయే దేఖో! కందనూలు కవులు ఎలా తక
నంగార మోగిన కొండలు నాట్య మాడెను పూల జంగల్ నాటి లంబడొల్ల గుట్టలు నేటి బంజారహిల్స్ బిడ్డా బలిసినోళ్ల కంద్లువడి కరిగినాయి కొండలన్ని దేఖో! నిజాము కాలం నాటి నూటొక చెరువు వాయే అడవులన్ని ఆగమాయే అగ్గిలాగ పట్టణ మాయే పాతాళం బోరు యేసిన గంగమ్మ గానరాలే దేఖో! నవాబుల పాలనలోన అద్దరూపాయి గజం భూమి కబ్దదారులే పాలకులయ్యి లక్షలల్లో పెంచిరయ్యో అద్దెలల్లో మగ్గెటోళ్ళకు సొంత ఇల్లు కలగ మారే దేఖో! దున్న పోతుల ఆట ఆడూ మొహరానికి దూల దుంకు బతుకమ్మ పూలపేర్చ్సుడు బోనాలకు బొట్లను జూడు పోతురాజుల యేషం జూడు పొట్టకూటికి దెబ్బలు జూడు దేఖో! దగదగల నగల తీరు సిరునవ్వులు సిలుకుతారు ఏడ్సుకొరలో సికుక్షాని నక్షీసు రోడు మెడక్షు 0 పాట్టెంది-తెలంగాణ కవిత్వం
ఉరితాదుగ వేసుకుండ్రు (దేఖో! రైయి నురుకు రైలు కూతా క్లాకీటవర్ ముల్గు జూడు సాలర్జంగ్ మ్యూజియం బొమ్మ జూపార్క్శ్‌లో జంతుల జూడు ఏకశిల బుద్దుని జూడు ఏలెటొల్ల బుద్ధులు గనుకొ దేఖో! తల్లిదండ్రుల కోసం బుట్టి తనువంత పేదల జుట్టి భూమి భుక్తి పోరాటాలు కులపోరుతో జతకట్టి కమ్యూనిజం దెస్తానన్న మారోజును మింగిన నగరం దేఖో! మురికి గుంటలా పేదల గుడిసెలు పక్కా ఇండ్లకు పైసలు లేవు బంజార హిల్స్, జూబ్లిహిల్స్ బడాబాబుల కార్ల జల్సకు ఫైవోవర్లు గట్టినారు కష్టజీవుల తరిమినారు దేఖో! తల దువ్వినట్టు పిల్లకు అద్దమోలే రోడ్లు ఊర్సి తెల్లారు నిదుర వోక పట్నమంతా శుద్దిజేస్తే పైయంత నొప్పులాయే పైసలేక జచ్చుడాయే దేఖో! వృద్ధాప్యం శాపమైతే కోటితలోన యాచనంట సంసారం గడవనీకే కందనూలు కవులు ఎ త!
సన్న విల్లల సర్మాసంట
మంది కంతా తమాషాయే
లీగజారుతే తనువు అగే దేఖో!
ఎడ్లబండ్లు గుర్రపు బగ్గీలు
దౌడు దీసిన రస్తాలండి
ఇరుకిరుకు రోడ్లమీద
కారు బస్సుల జాము లాయే
అంబులెన్స్ ట్రాఫిక్ లోన
పేద ప్రాణం గాలిలోన దేఖో!
ఎన్నికలొస్తే సాలు
చాణుక్యుల వాగ్దానాలు
సీపులిక్కరు సీరాడబ్బు
ఓటు ఓటుకు గుప్పిస్తారు
గెలిసినంక యెతలు జెప్పి
బాధలన్నీ దీర్చమంటే
బషీర్ బాగ్‌లోన కాల్చి
నట్టు సంపుతంటరు దేఖో!
నిజాం కాలంలోన
అభివృద్ది జెందిన నగరం
అరె పూలే, అంబేద్మరులు
సూసి మెచ్చిన సుందర నగరం
నేటి పాలక దోపిడి కుట్రలో
కొడి గట్టెను (ప్రేమ దీపం దేఖో!
సబండా వర్దాలన్ని తీరాక పువ్వులోయి
సకల సంస్కృతులన్ని రంగురంగుల సింగిడిలోయి
తెలంగాణకు హైదరాబాదు
పెద్ద బతుకమ్మ అయిందోయి 1దేభో॥ 22 ----పాద్దెంది-తెలంగాణ కవిత్వం
_ గుడ్‌పల్లి రవి 9848490915
చిక్కాండ్ర బచ్చన్న వడిసెల రవ్వలై జీవితమే ఉద్యమముగా తెలంగాణంత యుద్ధమై పల్లెలంతా పిక్కటిల్లేలా తెలంగాణ వీణా రావాలు ప్రతి ఇంటా వినిపించాలి చిన్నారులు, యువకిశోరాలు రువ్విన వడిసెల రవ్వలై ఉద్యమంలో పేలుతు తెలంగాణ నెలవంక పొడిచేలా చేతల చేతులన్నీ తెలంగాణ ఆవిష్కరించేదాక వదలని పిడికిళ్లవ్వాలి కదలని జనసంద్రమవ్వాలి! నిబ్బరమనస్తత్త్వమై కందనూలు కవులు ఆ 43
ఉవ్వెత్తున ఉద్యమంలో
శామిక కులాలు
మునుముందుకు దూకాలి!
కసితో ఆంధ్రాదోపిడి
గుండెలు కూల్చేందుకు
ఎత్తిన గళాలు దించొద్దు!
వంచకులు మనపాలు వదిలేంతవరకు
ఢిల్లిలో తెలంగాణ
గంట (మోగే వరకు
విప్పరా నీ గళమిప్పు
ఢిల్లీ కోట ఫీట్లు కదిలేలా
పాలకుల దిమ్మ తిరిగేలా
పాలి సోదరులు పొలిమేర దాటేలా
గుండెలన్నీ ప్రతిధ్వనించేలా
తెలంగాణ నా జన్మహక్మని
చాటరా మరి మరి చాటరా! _ పొద్దెంది-తెలంగాణ కవిత్వం
-చిక్కాండ్ర ఐచ్చన్న 9441611601
జనజ్వాల తన్మాత్ జాగ్రత్త! అదో ఏ దేశమేగినా..., రాయప్రోలు అన్నది బాగ్గానే వుంది..., బందిపోటు టక్కరి దొంగల కబంధ హస్తాలలో.... చెల్లి తెలంగాణా కన్నీటి పిట్టయ్యింది. పిట్టమ్మా... ఏడవకు... ఏదవకు ఏదడ్చేముక్కులు..., తూర్పు దిక్కున ఏకమై సింధూర మందారం వికసిస్తుంది... అలల రెక్కలతో ఎగిరి నిన్ను కాపాడుతుంది దుఃఖ విముక్తి చేసి... తల్లి బుణం తీర్చేందుకు... తెలంగాణా బాలవర్ధి సాహసి రెక్కల గుర్రం మీద, మళ్ళీ వస్తున్నాడహో మంత్రాల కొడకా....తస్మాత్ జాగ్రత్త! కందనూలు కవులు లాలా 4వ
- జనజ్వాల,9949163770
జహంగీర్ యం.డి. ఒరిగిందేముంది? సీ; తెలంగాణ వారంత - కెలివిదప్పిన గొత్టె లంచునెంచి మనల - నణగద్రాక్కి తెలివిగా నటియించి - జలవనరులనెల్ల తమ లాభానికే = తరలజేసి ఉన్నత పదవుల - ఉద్యోగముల నెల్ల వంచన తోడుత - పంచుకొనిరి మంచి భూముల నెల్ల - కొంచెపు బుద్ధితో దొరికిన కాడికి - దోచుకొనిరి గీ : దొరలుగామనపైననే - ఉరులుపన్ని బాంచలను గాగ మార్చియు - పదవులందు భిక్షమెత్తగ తరిమిరి - బుద్ధిమంతు లాంధ్రుల తెలివిట్టిదియని - అరయుడయ్య సీ: ఏబది మూడేండ్లు - ఏకముగానున్న ఒరిగిన దేముంది - ఉత్తదేను అన్ని రంగాలలో - అన్యాయమే గాని నిక్కంగ దేనిలో - చక్కగుంది శే లా పాద్దెంది-తెలంగాణ కవిత్వం
బలవంతపు బ్రతుకు భరియించజాలము మా బతుకేమిటో మాకు దెలుసు ఆనాటి పెద్దల - ఆలోచనలనెల్ల తుంగలో (ద్రొక్కేసి - తూట్లుగొట్టి గీ : ఇంతకాలము కలిసున్న - వింతగాదె అడుగడుగునను దోపిడి - లనుభవించి బండబారెను (బ్రతుకులు - ఉండలేము విడిగనుండిననే మాకు - విలువగలదు. సీ: ఆంధ్రుల మోసాల - కాద్యంతమునులేదు ఎల్లకాలంబును - చెల్లుచుండు పుట్టుకతో వచ్చె - పుచ్చిన బుద్ధులు పుడకల తోడనే - పోవుచుండు నిలువెల్ల స్వార్ధంబు - నిగనిగలాడను పైకియేమెరుగని - పగిదినుండు చెప్పెదుదానికి - చేసెడు దానికి పొంతనలేకుండ - పోవుచుండు గీ: ప్రజల యందున ఓపిక - పాలిపోయే ఉమ్మడిగ నుండు కోరిక - ఒప్పదాయె పల్లె పల్లెను ఉప్పెన - పగిదిజనులు సొంతగూటిని గాపాడ - చింతబుట్టై కం ; తెలంగాణ వాదులందరు అలుపెరుగక ఉద్యమంబు - నడుపగవలయున్ కులమతజాతులనెంచక కలయికగా కలిసినేడు - కదలగవలయున్ కం : పదవుల ఆశలవీడియు కుదురుగ సామాన్య జనుల - కూడియు దీక్షన్ పదుగురి దొక్కటె మాటగ వదలక మన రాష్టకాంక్ష - వర్ధిల్లవలెన్ శే కందనూలు కవులు =జహంగీర్ యం.డి., 9708232378
నాగవరం బాల్‌రాం జానానె! అణవర్తువాల ఎవడురా మమ్ము ఎక్కిరించేది ఎంత సాహసం రా ఎదురెదురు మాట్లాడుతున్నారు లష్కర్ లడాయిలో ఓడినా గెలిచినా హర్‌జోర్ జులుంకీ టక్కర్‌మే సంఘర్న్ హమారా నారాహై జులాయి మాటల్లో హవాలా చేష్టల్తో దివాలా తీసే బోడి రామలింగాల జోలెందుకు ? రాసుకున్న రక్షణలే రాక్షసంగా అణచివేస్తే చేసుకున్న ఒప్పందాలన్నీ చేజారితే అది 69 కావొచ్చు 2009 లోకి రావచ్చు మొగలాయి తనంతో నైజాంకే ఎదురు నడిచినోళ్ళం! అధికారం ఆసరగా వంచనా క్రార్యాల జబర్ధస్తీ జాన్తానై! 4 -_పాద్దెంది-తెలంగాణ కవిత్వం =నాగవరం బాల్‌రాం 9440678603
- పరిమళ్ హైదరాబాదును అమలాపురం జేస్తుండ్రు అవి చెరువుగట్టమీనికొస్తె కన్నీట్ల కనుగుడ్లు మునుగుతై కార్తులన్నీ గుంజుకున్నాక దుఃఖం గీసిన చిత్రాల్లా పల్లెలు ముద్దకోసం దేశదేశాల్ రెక్కలతో వెలిగిస్తున్నం ముంద్లమధ్యన మెరుస్తున్న రేగుపండ్లం ఇంద్లకాడపిల్లలు మన్నుమోస్తున్నట్లు కూలికివోయినట్లు ఆడుకుంటున్నరు కందనూలు కవులు లాలా 49
పలుగురాళ్ళమీన నడ్సుకుంట సెమటంత అఆవిర్దేసిన నెత్తిమీదింత నీడలేకపాయె మా నీళ్లమీన ఆడుకుంటున్నోడు వాని పాటనే పచ్చగపాడుకుంటున్నడు ఈడి పొలాలల్ల కాల్‌వెట్టి పాగ గొట్టాలతో మన కడుపులమీన ఉమ్మిస్తున్నడు నీల్లను నోట్లవట్టినోడే భూమిని పిడికిట్లవడ్తున్నడు హైదరాబాద్‌ను అమలాపురం జేస్తుండు తైదంబలి బతుకుల మీన పచ్చళ్ళబూజు పరుచుకుంటున్నది జొన్నరొట్టె బతుకుల మీన ఎడారిమచ్చ పాకుతున్నది ఇపుడు ఇద్దరి మధ్య భూమి పక్కున పగలాల్సిందే. ర పదెందితెలంగాణ కవిత్వం = పదిమళ్ 9441081842
ప్రతాప్ కౌటిళ్య తెలంగాణ అనివార్యం విభజన అనివార్యం వర్గీకరణ లేని జాతి లేదూ - నీతీ లేదూ - సిస్టం - రాజ్యాంగ మైనప్పుడు అవ్యాజ్యమైన (ప్రేమ - మానవత్వం కూడా రాజకీయం కాక మానదు శాస్తం రాజకీయం ప్రజలను మించిన అస్త్ర శస్త్రాలేమి కావూ - 1? భౌతికంగా జి.డి.పి.లు బిలో పావర్టీ లైన్లే కాదూ - భౌగోళిక-జనాభా-విభజన కూడా ఉంది మానసికంగా ఆలోచనలు మనవి. అమలు కానప్పుడు అధికారాన్నీ ధిక్కరించైనా యయరరాలమ్య్య్న విభజన-అనివార్యం (ఛి రూ కందనూలు కవులు రా కా! 5! వ్ స్రైదరాబాద్ ప్ర
భాస్మర్ యలకంటి జయహో తెలంగాణ! బీళ్ళతో నోళ్ళు తెరిచిన మా పొలాల్లో నీళ్ళు పారాలని తెల్ల బంగారపు ॥ నల్లప్రాలాలు మాకు దక్కాలని సింగరేణి సిరుల దోపిడి ఆగిపోవాలని రామగుండం వెలుగు మా ఐత్మ్కుల్లో నవకాంతి నింపాలని నిజాం షుగరు తియ్యదనం రుచి చూడాలని ర్2ై లా పాద్దెంది -తెలంగాణ కవిత్వం
ఊడిగం చేసేమా పిల్లలు ఉద్యోగాల్లో చేరాలని చిరుద్యోగులు పెద్ద అధికారులుగా అవతారం ఎత్తాలని
వలస కూలీల బస్సులు
ఇక ఆగిపోవాలని
చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఇక మాసిపోవాలని
మా భాషలోని యాస రక్షించబదాలని
మా కార్మికుల కష్టాలు కడతేర్చబడాలని
అవమానపు కాలుములు ఆరిపోవాలని
అభిమానపు జ్వాలలు వెలుగొందాలని
సీటిమాటల వాగ్ధానాలు
ఇక చెల్లవని
'పేకమేడల గాలిగోపురాలు మాకొద్దని
స్వావలంబన, స్వరాజ్యం
మాకు కావాలని
ముక్త కంఠంతో సింహనాదంలా గర్జించాలి తెలంగాణకు జయని
న! నం
మురళీధర్ రావు.జి పోరుపంజా తెలంగాణ తెలంగాణ తెలంగాణ ఎన్నాళ్లీ సమైక్యాంధ్ర గానా భజానా ఆంధ్రోడే ఆంగ్రేయుడై అణగదొక్క నేర్చినాడు తెలుగోడే ఆనాటి తెల్లోన్ని మించినాడు ఆంధ్రోళ్లవి వడ్డించిన ఇస్తరు బతుకులు ఆగమైన మనకు మిగిలెను ఎంగిలి మెతుకులు అమాయకపు తెలంగాణను మాయచేసి దోస్తుండ్రు దోసిలిపట్టి అడిగితే “దోషి అని తోస్తుండ్రు కనిపెట్టి పిడికిలెత్తి కలిసి ఉద్యమించరా పసిపాపలా నిర్మలమైన తెలంగాణ మనదిరా పార్టీలకతీతంగా ఊరు, గేరి కదలాలి పరిహసించేవారికి పోరుపంజా రుచిచూపాలి ఉద్యమాల తోటలో రాలిన పూలెన్నో ఉత్తుత్తి జోలిచెప్పి జోలెపట్టినోళ్లెందరో ఉగ్గుపాలనాడే నిగ్గదీసిన వీరులెందరో ఉరకలేసిన పోరల ఊహ నిజం కానుంది పొరలమాటున దాగిన తెలంగాణ రానుంది నిజాములను తరిమిన నైజం మనలో ఉంది సాయుధపోరు సలిపిన సత్తా మనది ఆడోళ్లంతా కలిసి అలుగులాగ ఎల్లాలె తెలంగాణ తెగువసూప చైతన్యపతాకం ఎగరాలి. ల! లాటా పొద్దంది-తెలంగాణ కవిత్వం -మురళీధర్ రావు.జి, 9441541955
రేడియం ధూం. ఈళి ధాం. ఉళి ఈయాల ఎందుకో పొద్దుమూగుతలేదు రేపు ఊర్లో తెలంగాణ ధూంధాం పోరల్ల సేతుల్లో జండాలు సేనులోని తెల్లజొన్న కంకుల్లా ఊగుతున్నాయి కొందరు బెదిరిన పస్రంలా జూస్తుండ్రు కొందరు కొత్త నీటికి ఎదురీదే 'సీప పిల్లలా రుసురుస పోతుండ్రు పిల్లల్ని ధూంధాం సేయందడ్రని గదమాయిస్తుండ్రు ఆనాడు నిజాంకు బాంచెన్ కాల్న్మొక్తనని ఊడిగం జేసిండ్రు ఈనాడు దేశాల బట్టుక బతకవలస పోతుండు తెలంగాణ కోసం కొందరు బిడ్డలు పానాలిడిసిండ్రు నేడు వట్టిపోయిన ఆవయ్యింది తెలంగాణ మట్టిని నమ్మిన రైతు కూలి గయ్యిండు ఎక్కడ జూసిన ఇదే ముచ్చట తెలంగాణంతట ఇదే గలాట దూలాడుతుంద్రు బొడ్జెమ్మలేస్తుండ్రు ధూంధాం జేస్తుందడ్రు అయితదంటావా! అని సోంచాయిస్తుంద్రు అట్లెట్ల కాదని మీసాలు మెలివేస్తుండ్రు రాను రాను లడాయి మోపైతది తెలంగాణ బిద్దడు అల్లిండంటే (0 ధర్మరాజు అల్లినట్లే కందనూలు కవులు ఎటట వ్
- రేడియం, 9291527757
వనపట్ల సుబ్బయ్య | తెలంగాణకి దోస్తరాదీన్
ఊద్దాన్‌లో ఊదేసిన జాంగీర్ తెలంగాణ ఫాతెహాలు పెద్ద షర్‌గతిరోజు ఐదు వరుసల అలాయిదూలా అసోన్ హుస్సేన్ బతుకమ్మ ధూంధాంలు నెమలి కట్టలతో జయ జయహో! తెలంగాణ పీర్లన్ని అగ్నిగుండంల నిప్పులపై నడుస్తూ జై తెలంగాణకి దోస్తరాదీన్ అలావా మంటలు ఆకాశానికి! తెలంగాణ మంటలు పార్టీలకు ధర్మంకోసం నెత్తురోడిన ఇమాంహుస్సేన్ ఆత్మగౌరవం కోసం మంటల్లో తెలంగాణ బిడ్డలు న్యాయం, ఆకలి పోరాటాలకు ప్రతిరూపాలు తెలంగాణ కర్చలా కన్నీటి గాథలు! బాలపీర్ల తప్పెట్ల దరువాగింది చాకలి ఐలమ్మ దివిటి కిందేసింది “'మట్మీల్లుకు కుమ్మరి జంగయ్య కొత్తకుండలు చెయ్యలే లంబాడి, గొల్ల, గౌండ్ల, పకీరు వషాలు ఎయ్యలే ఏబుజ్జి తలకాయ కొట్టనన్న పాష
ర పాద్దెంది-కెలంగాన కవిత్వం
బ్యాండ్ సన్నాయి సప్పుడు బంద్ అలాయి మంటల్లో మసైతున్న దోపిడిగాల్ల దిష్టిబొమ్మలు సబ్బండ కులాల నిరసన! బీఖీ ఫాతుమ్మ, భారిమామ్ ఇమాం ఖాసీం, మొగులాల్ అలియేక్‌బార్, లాల్‌సాబ్స్ అస్సేన్, హుస్సేన్ ఇంటికొచ్చిన పీర్లకు నిండు బిందెలతో నీళ్ళు తెలంగాణ మొక్కులు మా తెలంగాణ మాకొచ్చేదాక మాలీదలు, మట్మీలు, బెండు బత్తీసలు లేవు కుడుకలు దట్టి కొంగున గట్టి లాదెలతో తెలంగాణ ముడుపులు తడిబట్టలతో తానాలు మా తెలంగాణ మాకైతే అలాయి చుట్టు గులాబి పూలు రంగు రంగుల ఆకుపచ్చ చెమ్మీ దట్టీలు మల్లెపూల సేరాలు
- ఎండివి గొడుగులు, కంటెలు, తొట్లెలు కొమ్ములు తిరిగిన యాటలతో ఇంటికో కందూరు ఊద్దాన్‌లో ఊదేసిన జాంగీర్ తెలంగాణా ఫాతెహాలు! పదొద్దుల పిర్లు బాయికోతలేవు బందగీ సాక్షిగా తెలంగాణ జంగ్ తెలంగాణకి దోస్తరాదీన్! తెలంగాణకి దోస్తరాదీన్!! కందనూలు కవులు లావాలా వ్
- వనపట్ల సుబ్బయ్య 9492765858
సంబరాజు రవిప్రకాశ రావు ముదాడుదాం ౧ పోతిరెడ్డిపాడు మీద పొడుచుకొచ్చిన పేమ ముందు “శ్రీశైలం ముంపు నష్టపరిహారం నగుబాట్లవుతున్నది నదులు పారాడుతున్న నేలలో గుక్కెడు నీటికే మొఖమెత్తిపోతే దోసుకున్నోడు టి.యం.సీ.లతో తానమాడుతున్నడు సాగర్ పంపకాలలో మనకు జరగాల్సిన న్యాయాన్ని కిలోమీటర్ల లోపలికి బొంద పెట్టిండ్రు 610 ని బొటికెనేలును జేసి మన కంట్లోనే గుచ్చిండ్రు గొంగళి పురుగులై మనం కాలం సాగదీస్తుంటే వారు సీతాకోక చిలుకలై విహరిస్తున్నరు వక్రభాష్యాలై కొలువుల్ని గద్దల్లా తన్నుకుపోతున్నరు బతుకు పోరాటంలో మనము ఉసిళ్లలా రెక్కల్ని రాల్చుకుంటుంటే వాడు ఐదు నక్షత్రాల మెనూ ని టేవ్‌మని తేన్చుతున్నాడు సామూహికంగా దోపిడీరాగాన్ని ఆలపిస్తున్నడు పదహారు కళలతో భాసిల్లాల్సిన చంద్రుడిని వత్ లాాాాాావిొద్దెంది -తెలంగాణ కవిత్వం
మింగుతున్న రాహుకేతువులు విషపు ఒత్తుల హారతులతో అభివృద్ధి గీతాల ఆలాపన ఊరు మొత్తం మీదే గాని బొడ్రాయి మాదంటున్నరు ఒకడిది రెఫరెండం మాట మరొకడిది ప్యాకేజీల పాట వేరూరోడు మనూరికి దోరణం కడుతున్నడు ఇపుడు నా కెలంగాణ గాలితాకిడికి చెల్లాచెదురైన మేఘశకలం మన్నుగొట్కసోయిన బంగారురేఖ శరీరం నిండా మానని గాయాల గుర్తులు కన్నీరు మున్నీరవుతున్న గద్దద కంఠం చర్చలు, వకాభిప్రాయాలు, శ్వేతపత్రాలు వంటింట్లో మొగున్ని గొట్టి బజారుకెక్కి ఏడుస్తున్న ఏడ్పులు సమైక్య దోపిడీకి నుదుటిమీద ముద్దులు మట్టిపెళ్లల కింద మన బతుకుల సమాధులు బిగించిన పిడికిలితో మహోద్యమంలోకి దూసుకుపోదాం తెలంగాణాను ముద్దాడుదాం విశాలాంధ్రా కంచుఢక్కాను ముక్కలు చేద్దాం జాగో తెలంగాణా! భాగో దోపిడీవాలా! కందనూలు కవులు లీ = సంబరాజు రవి(ప్రకాశ రావు, 9491376255
సోమశిల సురేష్ బాబు గతంకాదు... వర్తమానం ఇళ్లపక్క నీళ్లన్ని వారగా పారుతుంటె కళ్లల్లో అశ్రవుల్ని చెలిమెలుగా తోడుకున్న దృశ్యాలం ఇప్పుడు సం(ధ్రాలైన సెలిమెలకు కాటన్‌దొరల కరకట్టలాగవు ఒండ్రు మట్టి వీళ్లు ఎక్కిరిస్తుంటె ఆకలి నిండిన పొట్టల్ని అదిమిపెట్టుకున్న సాక్ష్యాలం వాడి వేలం పాటల్లో మా మేధావుల కొలువులన్ని గుండుగుత్తలైనప్పుడు గుండె మయోకార్దియల్ సంచుల్లో సహనాల్ని గుట్టలుగా పోగేసుకున్నం అసహనాల గునపాల్ని అరచేతితో అడ్డగించడం అహంకారంగాక మరేంటి ? తల్లిపాల యాసనంతా చిత్ర హింసజేసినపుడు రఢీ లాాాాాాాాాావాద్ధెంది -తెలంగాణ కవిత్వం
నరనరాన విద్యుత్తును
విధిలేక ఆపుకున్న
సూర్యకిరణ తాపాక్తో
స్విచ్‌డాఫ్ చేయడమంటె
భస్మాసురహస్తాన్ని నెత్తిమీద మోస్తునట్టే
పల్లెలోని చదువంతా
కార్వోరేటు బెతుంటె
ఆస్తులన్ని పస్తులతో
ముడుపుగట్టి ఇస్తున్నం
కదనమై సాగుతున్న
అస్తిత్వపు తరగలకు వారధుల్ని పేనడం
అత్యంత అమాయకత్వం
ఇక్కడి
అసహాయతమీద, ఆత్మన్యూనతల మీద
ఎన్ని దశాబ్దాలు జాలిచూపులు విసిరి వేసారాయో!
ముష్మాలు చచ్చిన నాయకగణం
అమాత్యుల అవతారమెత్తినన్నాళ్లూ
పగలు జెండాలు రాత్రి ఎజెండాలు
మీసం లేని కపట నినాదాలపై
ఎన్ని బుతువులు తుపుక్కున ఉమ్మేయలేదు ?
అది గతం -
నేడు ఒక ఉరుము... ఉప్పెన... ఉత్పాతం
అభివృద్ది శిలాఫలకాలు హెచ్చుతగ్గులైనచోట
ఎప్పుడైనా.... ఎక్కడైనా ...పుడుతున్నదే కదా సునామి!
మన వాదం, నినాదం
శబ్ధం, యుద్ధం
స్వార్ధపు నాలుకల్ని కుతంత్రాల కుత్తుకల్ని చీరే
రసవత్తర పతాక సన్నివేశ దృశ్యమాలిక వర్తమానం
తెలంగాణం... తెలంగాణం... తెలంగాణం కందనూలు కవులు యయ 60
- సోమశిల సురేష్ బాబు, 9885561732
ల కా ష్టోమినుా 17 న శ. ఎ వివాహ . హెచ్.రమేష్‌బాబు చలం తాబ,లలంబాబు ఫౌంటేకైన్ య్యుర్బ /. వైమిటిిమి ర శార్యరరవర్గసం,.. ౧ +న్యషి /7- ౦౯ 20 ఏ. వొద్దెంది క మూలగ్గూసున్న ముసలవ్వ ఒక్కసారిగ లేచి గుడ్లురిమి గుర్రున చూస్తోంది మా పోరలంతా నడిబజార్లో నిలబడి నిప్పుకణికల్లా మండుతున్నరు మా చెలుకలున్న పల్లేరుకాయలు మన్నుల కలిసి పోతున్నయి ఆశయంకోసం అసువులు బాసిన మా వీరులంతా ఆకాశంలో గొరుకొయ్యలై మెరుస్తున్నరు తల్లి తెలంగాణ లేదన్నా కాదన్నా వద్దన్నా ౮2 లాాాాాాపాద్దెంది -తెలంగాణ కవిత్వం
చెప్పుల వర్షం గురిపించి మాడలు పగులగొడ్డున్నరు బ్రతుకు పరాధీనమా పోరాటమా అన్నప్పుడు పోరాటమే జీవితమవుతుంది మరణం తరువాతే జీవితమన్నప్పుడు ఉరికొయ్యను ముద్దాడుతాం అగ్నికీలలమై నింగికెగుస్తాం మృత్యువునే కౌగలించుకుంటాం నే లే ఖ్ నీ ముద్దులు, మురిపాలు అన్నీ సమైక్య సన్నాసులకే కదా! ఆత్మవంచన, ద్రోహం, అన్యాయం నీ ఇంటి పేర్లు నీ గుమ్మంముందు క పరాయి చెప్పులు చూసి వెనక్కు మళ్ళి నీ లజ్జలేని తనం తెలియనిదెవరికి ఆ ఒక్క కుర్చీ కోసం నీవు తార్చనిదెవ్వరినని ఇ నీకు మోసం ఒక్కటే తెలుసు మాకు రోషం తెలుసు గీత గీయడం తెలుసు నోరెత్తితే నాలుకలు తెగ్లోయడమూ తెలుసు నిన్నటి దాకా ముడుచుకున్న మా చేతులిప్పుడు కరవాలాలై మీ కుత్తుకలు తెంపేందుకు సిద్దపడుతున్నై నే శె నే బీటలు వారిన మా పొలంలో ఇప్పుడు ఈ కాలం కాని కాలంలో వానలేని కాలంలో ఒక ఎ(ర్రమందారం మొక్క మొలిసింది నా కొక్కటే అర్ధమైంది. _ మా తెలంగాణ వొచ్చె పొడ్దెందని దయ్యు స లాలయ ఉనన... 63 కందనూలు కవులు ంంరాం లా హెచ్ రమేస్ట్ పాతు 9440925814 స్టా హైదణబాడ్ వా బర్
య్ ఫీ? | వ్ 1 సప ? న! ట్ “ ప న స గ అ స్ 1 (| ." న జా వ. | యు క! గ , . క్ తర ాయసంా ల ప? ప ఉన. ప్ సెళ్లాల నవ మ. ఇ. ల్లీ” శ్ ం గో గ ర] క (4 ళ్ ( | | (టీ ఇ ల్ శ క్ష 7 | టం క యనం శ సట య. శ న వ క శే న్న! . ట్లో, | షే. గ సై అజయ ౬ లా ల స్ వ. లలి (| | (| (త స ॥ / . జుం మంపమాయి | ః