Telugu palle na thalli - anilvaranasi/indianlanguages GitHub Wiki
తనలా తతత యయాతిని, యును నావతంంలు. న అభ్టాల్యా కలల గాంఅలంన.. భా ం౪'! నయనం లా సస ర. 12శల! గ్ య శ 0. ఎను న గ్ . ా - ఇ నట గా స్ట్ - న. “శానా టు నన భ్ ళా షా న. ఆ యమో టి ల కర 21 ఫర న 3క్ అ | ఎ 2 వతరాా చపప. కు, శి లతో న్నా గళ 1న ల్ 2 | ఖ్ 15 న. గ | (1 గజ నా // నాకిక 1 గ ల్లో లి ॥ తా - ళో సత నే స శ్
తల్లా ౩ తత్తు (కథా సంపుటి)
ఐితా చంద్రుయ్యా
గ్లద్ధిపేట = 502109
వినికకన క ఈ శకక! 6, క వ క న! , వర్లై- 91001౧57. - ణి | ॥ ళ్ 8 భే బయు[ో 554560400౧ : 2017 నం ( 60౧165 ఫ్ 500 ల క 6560/60 ౪/0 16 2౮6001 ద/106 ; ౧౩. 150/= "116 ౧౬06 వ్ 5/1 ౧౭|౭9౭|1| “268016 600165 64౧ 06 [౧26 ౧౯౦౧౫ : శ్ర 17644 0/44010గష తష! 11.10. 4-4-11, 5[౧9[౧౧౪౧౫, 91606106- 502 103, 0156 1662 (612౧92౧౭) 06] ; 09391205299 2) 272 ౧౧౪14౧4 8001! 104586 4-1-435, 82౧1 57666 [1/66౧2026 - 500 001. 3) [127/062/23 800% [0456 4-5-317, 0౧౧. గ౧/2 52002), 561120 88280 ౧౫౪6౦62080. 0651901౧09 క 5॥ గ౭జగా౭! ౮౧౭౧౧1౦౩ 51661066 06॥ : 9885841905 1౧(86 ౬1 గంధ 6 [1౧ గింది అయ మా (గ (1 ఉర జ). న
కథా సిందులో నేనో బిందువును
ఈ రోజులల్ల తెలుగు కథ సమసమాజములోని మానవ జీవన సమస్యలను జీర్ణించుకుని, ఆధునికతను అద్దుకుని ముందుకు నడుస్తుంది. ఎందరో కొత్త కథా రచయితలు ఈ కథాక్షేత్రాన్ని సుసంపన్నం చేస్తున్నారు. మాండలిక భాషా పదాలు కథలకు సొబగులద్దుతున్నాయి. తెలంగాణ తెలుగు కథలు గూదా విశ్వవ్వాప్తమైనాయి. కథలో సామాజిక స్పృహ కొట్టొచ్చినట్టు కనబడుతుంది.
తెలంగాణ కథా మాగాణముల బందారు అచ్చమాంబ, సురవరం(ప్రతాపరెడ్డి, వెల్టుర్తి మాణిక్యరావు, పీ.వీ. నరసింహరావు. ఒద్దిరాజు సోదరులు, నెల్లూది కేశవరావు, మాడపాటి హన్మంతరావు, నందగిరి వెంకటరావు, హీరాలాల్స్ వట్టికోట ఆళ్వారు స్వామి, ఇల్లందల సరస్వతీ దేవి మొదలగు కథా దిగ్గజాలు అనాటి సామాజిక పరిస్థితుల్ని నిర్భయంగా కథలకు ఇతివృత్తాలుగా స్వీకరించారు. ఆనాటి ప్రభుత్వాలను హెచ్చరించారు.
నేడు కథకులు వర్గాలుగా చీలిపోయారు. దళితకథ, స్రీవాద కథ, దళిత స్రీకథ, మైనారిటీ కథ, బీ.సి. కథ మొదలైన వర్ణాల సమస్యలను స్వికరించి కథలో చూపిస్తున్నారు. అది తప్పు కాదు కాని అన్ని సమస్యలు కథలకు ఇతివృత్తాలవాలి. అ(గ్రవర్గాల వారి సమస్యలను, కాళ్ళీరీ మైనార్టీల సమస్యలను, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజా జీవనాన్ని, వ్యాపారుల సమస్యలను, గుమాస్తాల సమస్యలను కథలకు ఇతివృత్తాలుగా స్వీకరించడం లేదు. నూటికొక్కరో, ఇద్దరో స్వీకరించినా అది లెఖ్మల్లోకి రాదు. చారిత్రిక కథల్ని ఎవరూ రాయడం లేదు. కొందరు ప్రభుత్వ పథకాలను మాత్రమే కథలుగా రాస్తున్నారు. అది మంచిదే గాని సమాజాన్ని సమదృష్టితో చూడ్డం రచయితల పరిణతికి అడ్డం పడుతుంది. పై సమస్యల్ని నా కథలకు కొన్నింటికి ఇతి వృత్తాలుగా స్వీకరించి, కూర్చి రాయడం జరిగింది.
పల్లెజీవనాన్ని కథలకు స్వీకరించినా పట్టణీకరణను ్రోదిచేసుకుంటున్న కథలు గూడా “ఈ పల్లె నా తల్లి” సంపుటిలో వున్నై.
తెలుగు కథాంబరములో ధృవతార వాకాటి పాండురంగరావు కేంద్రసాపొత్య అకాడమి వారి “బంగారు కథలు” సంకలనానికి పీఠిక రాస్తూ “జీవితమంటే రూళ్లకర్రతో గీచిన చతురస్రమూకాదు. జీవితములో బంధాలు, అనుబంధాలు తియ్యగా, చేదుగా ఉంటాయి. కొన్ని తెగుతుంటాయి. ఈ మార్పులు మనసును గాయపరుస్తాయి. కొత్త కిటికీలు తెరుస్తాయి. వాటికి కుంగే వారు కొందరు, ఈ రాపిడి వలన మేలిమి మనుషులుగా తయారయే వారు కొందరు. ఈ వైవిద్యమే, ఈ క్రొత్తయే ప్రతి జీవితాన్ని ఒక ప్రత్యేకతతో నింపుతుంది.
దాని పునాదులలో కథలు, కావ్యాలు దాగిపుంటాయి.” అంటారు.
“కవిత స్వప్న సుందరి అయితే కథ సహధర్మ చారిణి. కవిత దూరాన మెరిసే అప్పరాంగన అయితే కథ చేరువుగా వున్న స్పేహితురాలు. ప్రతి జీవితానికి సన్నిహొతమైనది కథ. అందుకే కథా రచయితపై బాధ్యతల భార మెక్కువగా వుంది. ప్రతి జీవితానికి సన్నిహితమైనది కథ” అన్నారు తెలుగు కవి సామ్రాట్టు సి. నారాయణ రెడ్డి గారు.
ఇలాంటి మహనీయుల మహితోక్తులను సృజనాత్మక శక్తితో బేరీజు వేసుకుంటూ కథారచయత కలం శక్తిని చూపించాలి. ఆ ప్రయత్నంలో నేనెంత వరకు సఫలమయానో పాఠక దేవుళ్లే నిర్ణయించాలి.
ఈ కథాసంపుటిని డి.టి.పి. చేసిచ్చిన కమల్ గ్రాఫిక్స్ చి॥ రాజుకు ఆశీస్సులు. ముఖ చిత్రం గీసి యిచ్చిన మిత్రులు శ్రీ పర్మపల్లి యాదగిరికి, సూచనలిచ్చిన దా॥ పత్తిపాక మోహన్ గారలకు ధన్యవాదములు.
- ఐతా చంద్రయ్య
వరుస క్రమం... న ఖామానానా ఎటంం నే తి ఆశాజ్యోతి ఎలు 22 త అవక్తీర్తి లం 29 త్త ఆశల గుప్పిట్లో ఆరాటం లం 28 ల్ దుద్దుకర లుం తిం డ్ చెక్కు - కిక్ళు లుం తజ ణి వెద్ధదమననులు . త్త వ చొక్కారవిందం . త్తే 9 అంతా ఇంతే టం తీరి 10. యువలీల లం ర్శీ 11. ఆరని ఆశాజ్యోతి ఎలు ర్్రి 12. శాస్తి లం 64 18. మళ్లీ పెళ్లిచూపులు . 69 శ. సినిమా సంబరం ఉంటం 76 15. తీరము దూరము లం ౯77 16. కొత్త కోడలు అం వ! క, వసంతం లం 82 18. గాలిలో దీపము లం 88 19. సంకల్పం న. 89 20. పల్లెనా తల్లి టం రై 21. లింకు . 98 బల ఉగాది కట్నం . 99 23. సుడిగాలి న. 106 24 నవచేతన ంం 110 25. ఉభయ తారకము లం 116 26. ఆరాటం-పోరాటం పం 122 27. పండుగ పారిజాతం లాం 124 28, జీతగాళ్ళు న. 129 29, _ కట్టెలమ్మిన చోట పిడక ఎలు 180 80. రాధా మాధవీయం లుం 134 81. _ మబ్బుతెరలు ం 186
ఖామసాహి నునులేత సూర్య కిరణాలు ఆరావళి పర్వత శిఖరాలను ఆప్యాయంగా
నిమురుతున్నాయి. కుంభల్గడ్లో కొలువుదీరిన ఏకలింగేశ్వరాలయం మంటపం మీద స్వాభిమాన ధనులైన సేనానులు తమ నాయకుడి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్ని కష్టాలెదురైనా సరే మేవాడ్‌ను మొగలుల గుప్పింట్లోంచి తప్పించాలనే పట్టుదల నరనరాన జీర్ణించుకున్న రాణా ్రతాపుడు శివుడికి పూజచేసి, మంటపం దగ్గరికి అలసిపొయిన మదపుటేనుగులా వచ్చాడు.
రాజపుత్రల అనైక్యత ఆసరాగా స్థిరపడిన మొగలు సామ్రాజ్యాధిపతి అకరు దేశమంతటినీ తన అధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఈ ఆధిపత్యపోరులో మొగలుల ధాటికి తాళలేక, స్వతంత్రంగా మనుగడ సాగించాలనుకున్న రాణా ప్రతాపుడు కూడా మేవాడ్‌ను కోల్పోయాడు. రాజస్తాన్ కోటలన్నీ పాదుషా పాదాలకు నమస్కరించాయి. వేలసంఖ్యలో ఉన్న సేనలు వందల్లోకొచ్చాయి. అయినా, మొక్కవోని పట్టుదలతో అక్చర్తో పోరాడుతున్నాడు రాజా. శౌర్యం పురుషాకృతి దాల్చిన రాణాకు రణరంగంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది.
విశ్వాసపాత్రులైన సహచరులు కృష్టసింహుడు, అడవి బిడ్డలు, భిల్లుల నాయకుడైన భీమ్చంద్లాంటి వారితో, కుటుంబ సమేతంగా అడవుల్లో తలదాచుకున్నాడు రాణా. భార్య పాటేశ్వరీదేవి, కుమారుడు గడ్డి రొట్టెలు తింటూ కష్టాల కడలిని ఈదుతున్నా ఆయన చలించలేదు. సూర్యమహల్లో తలదాచుకున్నా భామ్గఢ్లో గడుపుతున్నాా కావాలో ఉన్నా, పర్వతాల మధ్య జావురా గనుల్లో అజ్ఞాతవాసం చేస్తున్నా గుహల్లో సంచరిస్తున్నా ఖాసింభాన్, మహబత్‌ఖాన్, ఫరిద్ఖాన్, అబ్బుల్లా తదితర అక్బరు ప్రతినిధులు ఆచూకి కనిపెట్టి మీదికి వచ్చిపడుతున్నారు. అసంఖ్యాక మొగల్ సేవల్ని ఎదుర్కోవదం అసాధ్యమై పోయింది. *నావల్ల ఎన్నో కుటుంబాలు కష్టాలను అనుభవిస్తున్నాయి. ఎంత పోరాడినా మొగలుల కుట్రలే ఫలిస్తున్నాయి. సైన్యాన్ని సమకూర్చుకోవాలంటే చేతినిండా ధనం ఉండాలి. ఏంచేయాలి?” అని ఆలోచిస్తున్న రాణా ప్రతాప్ స్ఫురద్రూపాన్ని నీలినీడలు కమ్ముకున్నట్టుంది. క నవల లోనా ల
విశ్వాసపాత్రుల ముందు మంటపం మధ్యలో నిలబడగానే అంతరంగంలోని అలజడి ఛాయలు గొంతు గోడలను దాటుతున్నాయి. “దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆత్మవిశ్వాసంతో అజేయులుగా మిగిలిన మిత్రులారా! ” రాణా కళ్లలో ముందటి గాంభీర్యం కరువైంది. “ఇరవై ఏళ్లుగా కష్టాలు అనుభవిస్తున్నాం. అక్బరు కొలువులోని పృథ్వీరాజు, అబ్బుల్ రహమాన్ లాంటివారు మన స్వతంత్ర వాంఛను పాదుషాకు చెప్పి ఒప్పించాలనుకున్నా, థీమ్చంద్, కృష్ణసింహ, భిల్లులు ఇన్ని కష్టాల్లోనూ ఆత్మవిశ్వాసం వీడకున్నా మనం మేవాడ్ రాజ్యాన్ని కోల్పోయి అడువుల పాలయ్యాం. మీ పట్టుదల, స్వాతంత్ర్య దీక్ష అనుపమానం. అయితే విధి బలీయమైంది. నాతోపాటు మిమ్మల్ని కూడా తిప్పుతూ, గడ్డిరొట్టెలు తినాల్సిన దుస్థితి కల్పించాను. ఇక కొత్త సేనలను సమీకరించుకునేందుకు మనదగ్గర ధనం లేదు. ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నా పగబట్టిన నాగుల్లా మొగల్ సేనలు మనల్ని తరుముతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం మన మాతృభూమిని వదిలి వెళ్లడం అనివార్యమైపోతోంది...” రాణా గొంతు బొంగురు పోయింది. సైనికులకు ఆ మాటలు కొత్తగా అనిపించాయి.
అందరూ విస్తుబోయి గుసగుసలాడ సాగారు. కృష్ణసింహుడు ధైర్యంగా నుంచుని గొంతు సవరించుకున్నాడు. “మహరాజా! స్వతంత్రకాంక్షలో, ధర్మ్శదీక్షలో, త్యాగంలో మీ పూర్వులకు మీరేమాత్రమూ తీసిపోరు. అలాంటిది మీనోట ఈ మాటలు అబ్బుర పరిచినా, అవి అబద్ధం మాత్రం కాదు. మీరు ఎటువెళ్లినా మీ వెంట మేముంటాం. మన ఆత్మవిశ్వాసమే మనకు శ్రీరామరక్ష అన్నాడు గంభీరంగా.
రాణా ప్రతాపుడి గుండె గట్టిపడింది. “నాతో రాదలచినవారు మూడు రోజుల్లో కుటుంబ సమేతంగా నా దగ్గరికి రావాలి” అనగానే గాలి బాధపడుతూ పలచబడింది. మూడోరోజు ఉదయమే సహచరులంతా తమతమ వస్తువులతో రాణా దగ్గరికి చేరుకున్నారు. రాణాలో కృతజ్ఞతాపూర్వకమైన దుఃఖఛాయలు కదిలాయి. అక్కడ చేరిన వారందరినీ కలియజూసి... “మిత్రులారా! జీవిత కురుక్షేత్రంలో అడుగు వెనక్కు పడబోతోంది. మేవాడ్ రాజ్యలక్ష్మీ ! మమ్మల్ని మన్నించు. నీకు దూరమైనా సరే స్వతంత్రంగా గడపాలని వెళ్లున్నాం గద్దదస్వరంతో మాట్లాడి పిడికెడు మట్టిని కళ్లకద్దుకున్నాడు. రాణా దోసెడు మట్టిని రుమాలులో మూట గట్లుకున్నాడు. అందరి గుండెలు కరిగి నీరై కళ్లల్లోకొచ్చాయి. అంతా బయలుదేరారు. పొలిమేరలు చేరువవుతూంటే మనసుల్లో నెలకొంటున్న విచిత్రమైన ఆందోళనును అదిమిపెట్టడం కష్టమైపోయింది వాళ్లకు.
అప్పుడే... అక్కడికి వృద్ధ సింహంలాంటి ఓ వ్యక్తి గుర్రంమీద ఎదురు వచ్చాడు. నుదుటి భస్మరేఖలమధ్య సిందూర తిలకం... కైలాసం నుంచి సాక్షాత్తూ ఈశ్వరుడే దిగివచ్చినట్లుంది. అందరికీ నమస్కరించి “అయ్యలారా! మీరెవరు? ఎక్కడికి వెళ్తున్నారు? మీరు మేవాడ్ సైనికులైతే రాణా ప్రతాపుల వారెక్క డున్నారో చెప్పి పుణ్యం కట్టుకోండి”
అడిగాడు. వీరులంతా మొహాలు చూసుకుని చూపులు రాజా మీద నిలిపారు. రాణా ఆయనకు నమస్కారం చెసి, “మహానుభావా! తమరెవరు? రాజ్యాన్ని పోగొట్టుకుని, నమ్ముకున్న వారిని కష్టాల కడలిలో ముంచుతూ మాతృభూమిని వదిలి మరోదేశానికి వెళ్తున్న దురదృష్టవంతుడు రాణా ప్రతాపసింహుజ్ని నేనే..” అంటూ గుర్రం దిగాడు. గంభీర వదనంలో దీనత్వ ఛాయలు గోచరించాయి.
అవతలి వ్యక్తి గుర్రం దిగి ఆశ్రంగా రాణా దగ్గరికి వచ్చాడు. “హరిహరి! ప్రతాపసింహులు తమరేనా! ఎందుకీ దీనస్థితి” అంటూ రాణాను గుండెలకు హత్తుకున్నాడు.
“మహానుభావా! నామీద ఇంత వాత్సల్యం కురిపిస్తున్నారు. తమరెవరు?” చీకట్లో వెలుగు రేఖలా వచ్చిన కొత్తవ్యక్తిని (ప్రశ్నించాడు రాణా. “నా పేరు భామాసాహి, వ్యాపారిని. మేవాడ్ నా పురిటిగడ్డ. మా తండ్రితాతలు మీ వంశీయుల దగ్గర మంత్రులుగా పనిచేశారు. నేను నలభయ్యేళ్ల కిందట పర్షియా వెళ్లాను. వ్యాపారంలో బాగా సంపాదించాను. మేవాడ్ దుస్థితి గురించి విని, నా జన్మభూమికి ఏదైనా చేయాలనుకున్నాను. ఆడబోయిన తీర్ధంలా సాక్షాత్తూ మీరే ఎదురుయ్యారు. ఇది నా భాగ్యం కానీ మాతృభూమి చరణారవిండాలనే నమ్ముకున్న మీరు ఎక్కడికి వెళ్లున్నారు?” అంటూ అక్కడే ఉన్న ఓ రాయిమీద కూర్చున్నాడు భామాసొహి. రాణా అనుచరులందరినీ పరిచయం చేసుకున్నాడు. రాణా కూడా భామాసాహికి ఎదురుగా మరో రాయిమీద కూర్చున్నాడు.
రాణా ప్రతాపుడు తన పోరాటం, స్వాతంత్రేచ్చ, నిస్సహాయత గురించి భామాసాహికి పొల్లుపోకుండా చెప్పాడు. చివరికి “మహాశయా! మీ గురించి చాలాసార్లు విన్నాను. రాజపుత్రులే పదవులకు ఆశపడి స్వాభిమానాన్ని వదులుకుని మరీ అక్బరు దర్చారులో మంత్రి పదవులు అలంకరించారు. మొగలులు నన్నూ (ప్రలోభపెట్టారు. అయిజే నేను స్వాతంత్రాన్ని వదులుకోనన్నాను. చివరికి ఇలా విధి వంచితుడ నయ్యాను. మేవాడ్ విడిచి అడవులపాలైనా మొగల్ సైన్యం వేట తప్పడం లేదు. అక్బరు మీద పోరాటం మొదలై ఇప్పటికి ఇరవయ్యేళ్లయి పోయింది. ఇప్పటికీ నా ప్రయత్నాలు ఫలించకపోవడం నా దౌర్భాగ్యం. అందుకే పర్షియాకు వచ్చి మిమ్మల్ని దర్శించుకోవాలనుకున్నాను. భగవంతుడి సన్నిధిలో ఆలస్యం ఉంటుంది, కానీ అంధకారం ఉండ దంటారు. మీరే ఎదురుపడ్డారు. మున్ముందు ఏం కానుందో?” నిర్వేదంతో రాణా ఒళ్లంతా వణికింది. చూపులు నేలమీదున్నాయి.
అంతా వింటున్న భామాసాహి నుదుటి రేఖలు కదుల్లూంటే చందన తిలకం ఉదాత్త భావాలను రేకెత్తిస్తోంది. “అరివీర భయంకరులైన మీ పరిస్థితే ఇతాగైతే నాలాంటివాళ్లు ఏమైపోవాలి మహారాజా? నేను పర్షియాలో ఉన్నప్పటికీ నా మనసంతా మేవాడ్ మీదే. మీకు నా చేతనైన సాయం చేయాలనుకుని ఇక్కడికి వచ్చాను. మహారాజా! కష్టసుఖాలు రాత్రింబవళ్లలా వచ్చిపోతుంటాయి. మీ నిస్సహాయిత నాకు అర్థమైంది. స్వతంత్రంగనే జీవించాలి.
పరమధార్మికులైన మేవాడ్ రాజపుత్రులను నడిపించిన మా పూర్వీకులను స్మరించుకోని రోజు లేదు. మేవాడ్ వదిలి మరెక్కడికి వెళ్లినా మీ ధైర్యం సదలదు. మీరిక్కడే ఉందండి...” అన్నాడు భామాసాహి.
ఆ మాటలు పూర్తవకముందే కృష్ణసింహుడి గుండెల్లో గూడుకట్టుకున్న దీనావస్థలో ఓ ఆశాకిరణం తళుక్కుమంది. “అయ్యా! మీ మాటలు మాకెంతో బలాన్నిచ్చాయి. కానీ, మరింత సైన్యం సమకూర్చుకోవాలంటే ధనం పెద్దమొత్తంలో కావాలి. అదిలేకనే ప్రభువులు ఈ నిర్ణయం తీసుకున్నారు” గుండెల్లోని అవేదన కరిగి కళ్లల్లో కొచ్చి గొంతుకు అడ్డుపడింది.
భామాసాహి చలింపోయాడు. ఊపిరి పీల్చుకొని... “కృష్ణసింవా! మా పూర్వులు మేవాడ్ మంట్రులుగా సేవలందించి కూడబెట్టిన ధనంతోనే నేను పర్షియాకు వెళ్లి వ్యాపారం చేశాను. కాలం కలిసొచ్చి, అపారమైన ధనం సంపాదించాను. మాతృభూమి సేవకు అక్కరకు రాని ధనమెందుకు? మీ పరిస్థితి నా మనసును కలచి వేస్తోంది. నా ధనమంతా ఇక్కడికి దగ్గర్లో ఉన్న బోయపల్లెకు తరలిస్తాను. మాతృభూమి విముక్తికోసం దాన్ని ఉపయోగించండి. భీమ్చంద్గారూ ! ఆ ధనంతో సైన్యం సమకూర్చుకోండి. మీ ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాల మీద నాకు నమ్మకం ఉంది” అంటూ భామాసాహి అక్కడ పోగైన వాళ్లలో దేశభక్తిని రంగరించి వెనుదిరిగాడు. రాజపుత్రులు, భిల్లులు రెట్టించిన ఉత్సాహంతో పున్నమి వెన్నెల్లో సముద్ర కెరటాల్లా అంతాకలిసి బోయపల్లెకు తరలి వెళ్లారు.
భీమ్‌చంద్ ముందుండి ఏర్పాట్లు చేశాడు. స్వాతంత్ర్య సంగ్రామం మలి దశకు చేరుకుందని, త్యాగాలకోర్చి ముందుకు రావాలని స్వేచ్భా ప్రియులైన రాజపుత్రులకు సందేశాలు వెళ్లాయి. భామాసొహి గుర్రాలు, ఏనుగుల మీద బస్తాలలో నింపి ధనరాశులను బోయపల్లెకు పంపించాడు. చివరికి తానూ వచ్చాడు. రాణాప్రతాప్లో ఆనంద తరంగాలు ఎగసిపడ్డాయి. మంత్రాంగంలోనూ, యంత్రాంగంలోనూ భామాసాహి పాలుపంచుకున్నాడు.
అడవి బిడ్డలైన భిల్లుల్ని ఏకం చేయడంలో భీమ్‌చంద్ ప్రముఖపాత్ర వహించాడు. నెలకు పదిహేను రూపాయల చొప్పున అయిదువేల మంది సేనకు పన్నేండేళ్లకు సరిపోయే ధనం సమకూరింది. కొత్త సైనికులకు రాత్రింబవళ్లూ శిక్షణ కొనసాగింది. మెరికల్లాంటి యువ సైనికులు ఉత్సాహంతో ముందుకొచ్చారు. ఆకాశంలో స్వతంత్ర్య భానుడు ఉదయించాడు. యుద్దానికి బయళట్టేరేందుకు అదే శుభ ముహూర్తం అన్నారు భీమ్‌చంద్, కృష్ణసింహులు. పాటేశ్వరీదేవి భర్తకు హరతి ఇచ్చింది. వీరతీలకం దిద్ది ఉత్సాహపరించింది. “విజయలక్ష్మి తమరిని వరించి తీరుతుంది ప్రభూ!” అని ప్రకటించింది. అది పరమేశ్వరి వాక్కులా అనిపించింది రాణా ప్రతాపుడికి.
అదేరోజు రాత్రి రాణా సేనలు సమరోత్సాహంతో దేవేరి దుర్గాన్ని చుట్టుముట్టాయి. నిరంతర రణయానంలో రాణా కాళ్లూ చేతులూ చప్పబడి పోయాయని యవనులు ఆ దుర్గంలో న ని నన
నిశ్చింతగా నిద్రిస్తున్నారు. రాజపుత్ర సేనలు వెంటనే దుర్గంలో చొరబడదాం అన్నాయి. మనం ధర్మ పథంలోనే నడుద్దాం అన్న రాణా ప్రతాపుడు శంఖధ్వనులతో శత్రు సేనలను మేల్కొలిపాడు. అప్పుడు జరిగిన భీకర యుద్ధంలో రాణా కుమారుడు అమరసింహుడు అపర అభిమన్యుడై పోయాడు. ఆ ధాటికి తట్టుకోలేకే యవనసేనలు తోకముడిచాయి. దుర్గం రాణా వశమైంది.
ఆ తర్వాత వంతు కుంభల్గఢ్ కోటది. వస్తు సరఫరా పరంగా ఢిల్లీకి కీలకమైంది కోట. రెట్టించిన ఉత్సాహంతో కదిలిన రాణాసేనలు దాన్ని చేజిక్కించుకున్నాయి. ఈ విజయం అందించిన స్ఫూర్తితో ప్రతాపుడి సైన్యం కదంతాక్కింది. ఫలితంగా ఆరావళి పర్వత ప్రాంతంలోని ముస్పైరెండు దుర్గాలు రాణా అధీనంలోకి వచ్చాయి. ఆగ్రాలో ఉన్న అక్సర్ కావార్తలన్నీ శరావూతాలవుతున్నాయి. తన సార్వభౌమత్వాన్ని రాణాతో కూడా అంగీకరింపదేయాలన్న ఆయన ఆశ క్రమంగా అంతరించి పోతోంది. ఇప్పటికే రాణాతో ఎన్నో యుద్దాలు జరిగాయి. ఫలితం ఎటూ తేలలేదు. అక్బరు కూడా ఆలసిపోయాడు. ఇంతలో చక్రవర్తికి నమ్మకస్థుడైన విజయసూరి వచ్చాడు. వెంటనే “జహాపనా! ఎవరో భామాసాహి అనే వ్యాపారి పర్షియాలో తాను సంపాదించిన ధనరాశులను రాణా ్రతాపుడికి అందడేసి, యుద్ధవ్యూహ రచనల్లో కీలకపాత్ర వహించాడని తెలిసింది” అన్నాడు.
పాదుషా నిట్టూర్చి, “మనకు ధనం, సేనలు అపారం. కానీ, ఏం లాభం! రాణా బలాన్ని బలగాలను తక్కువ అంచనా వేశాం” అంటూ పెదాలు చప్పరించాడు. అక్బరు తలలో నాలుకలాంటి అబ్బుల్ రహమాన్ రాణా బెన్నత్యాన్నిి భామాసాహి దేశభక్తిని, సహకారాన్ని వివరించాడు. విజయసూరి, సూరదాసు, పృథ్వీరాజు మొదలైన వీరులు దాన్ని బలపరిచారు. మాన్సింహుడు అది సహించలేకపోయాడు. రాజాను ఎలాగైన సరే గెలిచి తీరతామన్నాడు. అది అసాధ్యం అన్నారు మిగిలినవాళ్లు. మాన్సింహుడు అసహనంతో ఖడ్గం నేలకు విసిరేశాడు. మొగలు సామ్రాజ్య కీర్తి కిరీట కాంతుల్ని తేజోవంతం చేసిన అక్బరు పాదుషా “వేలమంది అక్బ్చరులున్నాా లక్షల సేనలున్నా రాణాను లొంగదీయడం అసాధ్యం. అతడ్ని కష్టాలపాలు చేశామనే అపకీర్తి నాకొద్దు. అతణ్ని నిరోధించడం మానుకుందాం” అన్నాడు అక్కడున్నవారితో ఆదేశిస్తున్నట్లు.
ఖు ఖ్లుగ స్లో మొగల్ సేనలు మేవాద్ను పదిలి వెళ్లాయి. చిత్తోడ్ మినహా, మిగిలిన ఎనఖ్రైమూడు రాజపుత్ర దుర్గాలు రాణా అధీనంలోకి వచ్చాయి. సరిహద్దు ఆవలున్న సుసంపన్నమైన మాల్పురాన్ని కూడా వశపరచుకున్నాడు. ఇసుకతిన్నెల మీద వెన్నెలలా మెరిసిపోతున్న కుంభల్గఢ్ పూర్వవైభవాన్ని సంతరించుకుంది. దాన్నే పాలనా కేంద్రంగా
ఎంచుకున్నాడు రాణా. కృష్ణసింహుడు నిర్ణయించిన ముహూర్తంలో భామాసాహి, భీమ్‌చంద్ ఇతర సేనా నాయకుల సమక్షంలో సామంతుల సాక్షిగా రాణా ప్రతాప్ పట్టాభిషిక్తుడయ్యాదు. మేవాడ్ ప్రజలంతా సంబరాల్లో మునిగిపోయారు. దీనికంతటికీ కారకుడైన భామాసాహిని, మరికొంతమందిని ఘనంగా సన్మానించనున్నట్టు ప్రకటించాడు రాజా. య సత్కారం చేయాల్సిన రోజు రానే వచ్చింది. రాణా ప్రతాప్ సతీ సమేతంగా సింహాసనాన్ని అలంకరించాడు. ముందుగా భీమ్‌చంద్, కృష్ణసింహులను సత్మరించాడు. “నా స్వాతంత్ర్యకాంక్ష కోసం తన సర్వస్వాన్ని సమర్చించిన గౌరవనీయులు భామాసాహి గారు సన్మానం అందుకోవాలి! రండి” అని (ప్రకటిస్తూ సభను కలియజూశాడు రాణా. భామాసాహి కనిపించలేదు. ఇంతలో ఓ భటుడు వచ్చి రాజాకు నమస్కరించి “మవారాజా! ఉదయాత్చూర్వమే మీకందజేయమని భామాసాహిగారీ లేఖను నా చేతుల్లో ఉంచి వెళ్లిపోయారు” అంటూ ఓ లేఖను అందించాడు. అందరిలో ఆతృత, అసక్తి...కృష్ణసింహుడు లేఖను చదవసాగాడు- “రాజాధిరాజ! మహారాజ! మేవాడ్ రాజ్యలక్ష్మి దాస్యశ్చంఖలాలు తెంచిన మహారాణా ప్రతాపసింహులకు నమస్కారం. నేను దేశభక్తుణ్ని మాతృభూమి స్వాతంత్ర్యమే నాకు ముఖ్యం. పరిషియాలో ఉంటున్నా ఈ మహత్మార్యంలో పాలుపంచుకోవాలనే ఆరాటంతో మీకు నాచేతనైన సహాయం చేశాను. నా ఆశయం నెరవేరింది. అంతకు మించిన తృప్తి నాకింకేదీ లేదు. మీ పాలనలో మేవార్ కీర్తిప్రతిష్టలు విశ్వవ్యాప్తం కావాలి. అదే నాకు గొప్ప సన్మానం.” ఇట్లు సదా మీ శ్రేయోభిలాషి మేవాడ్ వాసి, పర్షియా వ్యాపారి భామాసాహి. (తెలుగువెలుగు - సెప్టెంబరు 2016) లై ర. ప 1 4. ఇన వా నా.
ఆశాజ్యోతి
కేంద్రప్రభుత్వోద్యోగిని కాబట్టీ ఆలిండియా ఎల్టీసిని సార్ధకం చేసుకేనే దిశలో పదకొండు జ్యోతిర్లింగాలను దర్శించుకుని పరవశించాను. జీవనయానములోని సరిగమలను ఉద్యోగ ప్రస్థానములోని పదనిసలతో సమన్వయ పరుస్తూ కొడుకు, కూతురు పెళ్లిళ్లు చేసి బరువు బాధ్యతలు దించుకున్నాను. కొడుకు అల్లుడు హైద్రాబాదులో ఉన్నతోద్యోగులు. అన్నట్టూ నా భార్య పుట్టి పెరిగింది కూడా అదే హైద్రాబాదు మెగాసిటీలోనే.
అలవాటు ప్రకారం ఉదయం సోఫాలో ఒరిగి చాయానందముకు పత్రికా పఠనము జోడించాను. అర్ధాంగి మాధవి పక్కనే కూచుంది. నా చేతిలోంచి ఖాళీ కప్పు లాక్కుంటూ “సర్వీసులో ఉన్నప్పుడే ఆ చార్ధాం యాత్ర కెళ్లొస్తే ద్వాదశజ్యోతిర్లింగ దర్భనం పూర్తవుతుంది గదాగో పేపరు లాక్కుంటూ కాటుక కళ్లను కమ్మగా తిప్పింది. ఒంటిరాయి ముక్కుపుడక కళ్లల్లో మెరిసింది.
అంతరాళాల్లోంచి చిలిపిదనం దొర్లు కొచ్చింది. సరేనంటూ చెంపమీద చిటికేశాను. పదహారేళ్ల పడుచులా గలగలా నవ్వుతూ గిలిగింతలు పెట్టింది. సిగ్గుల బుగ్గల్ని కొనకొంగుతో అద్దుకుంటూ హైద్రాబాదులున్న వాళ్ల తమ్మునికి ఫోన్ చేసి చార్ధామ్ యాత్రకు రెండు టికెట్లు రిజర్వు చేయించింది. ఆయనో ట్రావెలర్స్ కంపెనీలో భాగస్వామి. ఉత్సాహంగా లీవు మంజూరు చేయించుకుని, ఎల్టీని అడ్వాన్స్ అందుకున్నాను. అర్ధాంగి ఆనందానికవధుల్లేవు.
హైద్రాబాదులో ఆత్మీయుల వీడ్కోలు అందుకుని బయలుదేరాము. పక్క పక్క సీట్లలో కూచున్నాం. ముచ్చట్లలో మూడురాత్రుల సరదాలు, పిల్లల చదువులు పెళ్లిళ్ల గురించి నెమరేసుకున్నాము. మధ్యలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ హిమాలయాల పాదపీఠము బుషీకేశ్ చేరుకున్నాము. చలిపులి దాడుల నెదిరించే స్వెట్టర్లు, వానదేవుడిని సవాలు చేసే రేన్‌కోట్లు కొనుక్కుని ప్రత్యేక బస్సులో పైకి బయలుదేరాయి. సెల్ఫోన్ల పుణ్యమాని రోజూ బంధువులతో మాట్లాడ్తున్నాము. బస్సు హిమాలయాల పైకి పాకుతుంటే... సన్నని రోడ్ల కొకవైపు లోతైన లోయల్లోంచి గంగా ప్రవాహ ధ్వనుల శ్రవణానందము, మరోవైపు ఎత్తెన హిమగిరుల శిఖరాల ఛాలెంజిలు, డైవర్ ఏమాత్రము ఏమరుపాటు వహించినా బస్సులోని తరాల న ల
ప్రాణాలన్నీ గాలిలో కలిసినట్టే, ఖుషీగా కిటికీలోంచి బయటకు చూస్తున్నాము. కొన్ని టన్నుల వెన్నముద్దలు ఒకదానిపైనాకటి పేర్చినట్టున్న హిమగిరులు, వాటి మధ్యలోంచి గంతులేస్తున్న కుందేళ్ల గుంపుల్లా లోయల్లోకి దూకుతున్న జలపాతాలు, తలుపుచాటు నుండి తొంగిచూస్తున్న జవరాళ్లలా మబ్బుల మాటునుంచి సూర్యకిరణాలు... మనోహర దృశ్యాలు. బస్సు పాములా పైకి పాకుతూంటే ప్రాణాలు అరచేతుల్లోకొస్తున్నాయి.
“ఇప్పుడు మనమేమన్నా అయితే ఎట్లా మాధవీ?” చెవిలో అడిగాను.
“విమైనా దేవుని దగ్గరికే గదా వెళ్లేది” అర్ధమీలితనేత్రాలతో అందరితోపాటు భగవన్నామస్మరణ అందుకుంది. కత్తిమీది సాములా ప్రయాణిస్తూ యమునోత్రి, గంగోత్రి దర్శించుకుని తాదాత్యం చెందాము. కేదారినాథ్ కోసం గౌరీకుండ్‌లో దిగాము. అక్కన్నుంచి పద్నాలుగు కిలోమిటర్లు కేదారినాథాలయము. అది మకీ సన్నని రోడ్డు... వాహనాలు వెళ్లవు. బస్సులో పరిచయమై ఆత్మీయుదైన వెంకట్రావుతో కలిసి ఓకే లాడ్జింగ్‌లో దిగాము. మొదటి అంతస్తు గదిలో అతడు, ఆపై అంతస్తు గదిలో మేము... సముద్ర మట్టానికి కొన్ని వందలకిలోమిటర్ల ఎత్తులో వున్నాము.
మర్షాడుదయం... సూర్యకిరణాలింకా భూమాతను చేరకముందే తయారై అద్దె గుర్రాల మీద కేదారినాథ్‌కు బయలుదేరాము. గుర్రము వెంటున్న మనిషితో హిందీలో కబుర్లు చెప్పుకుంటూ, సూదుల్లా గుచ్చుకుంటున్న చినుకుల్ని రెయిన్కోటుతో ఎదిరిస్తూ వడుకిలోమీటర్లు ప్రయాణించి రాంబాడలో దిగాము. అల్పాహారము, చాయసేవించి, ఒంటినొప్పుల్ని భరిస్తూ హిమకిరీటాల వెలుగుల్లో కేదారినాథ్ చేరుకున్నాము. గుడిదాకా వెళ్లాలంటే ఓ కిలోమీటరు నడవాలి. మందగమన అనుకున్న మందాకిని నది దర్భనముతో అవే గుర్రాలెక్కి జోరు వర్షములో గౌరీకుండ్ చేరుకున్నాము. ఒళ్లంతా పుండులాగైంది. గదుల్లోకి పేషెంట్లలా వెళ్లాము.
జోరువర్షం మరింత పుంజుకుంది. ఎముకలు కొరికేస్తున్న చలిజోరు తగ్గించేందుకు మంచమ్మీద చెరో రెండు పరువులు వేసి పడుకున్నాము. చెరో మూడు పరువుల్ని దుప్పట్లలా కప్పుకున్నాము. అయినా చలిపులి... మేకపిల్ల మాంసము రుచిమరిగిన తోడేలులా పరువుల్ని ఛేదించుకొచ్చి దాడి చేన్తూనే వుంది. అద్దాల కిటికీలోంచి బయటకు చూస్తే తెల్లవారినట్టనిపించింది. సూర్యుడు మబ్బులు జల్లెదబడుతున్న మంచువర్నంలో దాక్కున్నాడు. అక్కడదంతా మాములేనన్నారు. బస్సు (డైవర్ “రేప్పొద్దున త్వరగా తయారై బస్సు వద్దకు రావాలి” అన్న మాటలు గుర్తుకొచ్చాయి. బయటి వర్షం హోరు తగ్గకున్నా తయారయాము. నేను కింది అంతస్తులో వున్న వెంకట్రావు గదికెళ్లాను. వారు తయారై కూచున్నారు.
పదిహేనేళ్ల వెంకట్రావు కొడుకు రెయిన్కోటులో దూరి “బస్సు వద్ద (డైవరున్నాడో, లేడో చూసొస్తొనని బయలుదేరాడు. శ్రీమతి వెంకట్రావు నాతో “మీరు గది ఖాళీ చేసి నన్ ననన
ఇక్కడికి రందన్నయ్యా! కలిసివెల్దాం” అంటూంటే సౌందర్యలహరిలోని అమ్మవారిలా కన్పించింది. మా గదికి తిరిగొన్తూంటే బయట వర్షం హోరు యుద్ధంలా వినబడింది. హాహాకారాలు, ఆర్తనాదాలు గూడా వినబడుతున్నాయి. అప్పటికే సామానులన్నీ సర్ది మాధవిని వెంటబెట్టుకుని వస్తున్నాను. ముందు మాధవి, వెనక నేను మెట్లు దిగుతూంటే నీటిప్రవాహం కిందినుండి పైకొస్తోంది. ఆశ్చర్యం... అయోమయం... ఎవరివో సంచులు, సామానులు నీటిలో కొట్టుకుపొతున్నాయి. ఇది ప్రళయమా... యుగాంతమా... మొవోలు చూసుకున్నాము. నీరు మా పాదాలను దాటి పైపైకొస్తోంది. “అయ్యో... అదో... వెంకట్రావుగారి భార్యండీ. కొట్టుకుపోతుంది” అంటూ మాధవి వంగి ఆమెనందుకోబోయింది. కన్నుమూసి తెరచేలోగా మాధవిని వరదనీరు లాక్కెళ్లింది. “అయ్యో... మాధవీ!” అరుస్తూ వంగి ఆమె కాలందుకో బోయాను. కాలు అందలేదుగాని నా షర్టు జేబులున్న పర్పు, సెల్లు నీటిలో పడిపోయాయి. నీటిలో దూకబోయాను. వెనుకనుందో చెయ్యి నా భుజాన్ని పట్టి వెనక్కు లాగింది. “ఏయ్ భాయ్... జరా ఠహరో” అరిచింది. నా గుండెల్లో సునామి. “నా భార్యండీ... మేరీ పత్నీ” లబలబలాడాను. ఆ ఆడమనిషి మెత్తని చెయ్యి నా చెయ్యిని గట్టిగా పట్టి వెనక్కు లాక్షెళ్లింది. నాకు హిందీ వచ్చు కాబట్టి సమస్యలేదు. అప్పటికే మొదటి అంతస్తు వాళ్లంతా వరదల్లో కొట్టుకుపోయారు. ఆమె వాలకం గంభీరమైంది. “ఇది నిజంకాదు. కలగదా!”” అన్నాను. ఆమెగూడా అలాగే అంది. ఒకరినొకరం ఒళ్లు గిల్లుకుని అది నిజమే... జలప్రళయమేనని రూఢి చేసుకున్నాము. ఆమె అంతరాళాల్లో తుఫాను రేగినట్టుంది. ముంగురుల్ని నుదుటిమీంచి పైకి జరుపుకుంటూ “హే భగవాన్! నా భర్త కిందికెళ్లి తిరిగి రాలేదు. మీ భార్యగూడా అంతే” తల బాదుకుంటూ బోర్మని ఏడ్చింది. నా పొత్తికడుపు లోంచి దుఃఖం కట్టలు తెంచుకుని ఎగదన్నుకొస్తోంది. వాజావరణమంతా చీకటిగా మారింది. ఒకరి గుండెలమీద ఒకరం ఒరిగి తనివిదీరా రోదిస్తున్నాము. అలా ఎంతోసేపు గడిచింది. నీళ్లు మా కాళ్లను తాకాయి. ప్రాజాలరచేతిలో పెట్టుకుని పైకి దాబా మీదికెళ్లాము. కారుమబ్బులు, కటిక చీకటి, జోరు వర్షం, చలి హోరు... ఆకాశం కింద మేమిద్దరం. “కలియుగాంత మవుతున్నట్టుంది. పరమాత్ముడు మనల్నిగూడా తీసుకెల్తాడేమో!” అంటూ ఆమె అరచేతుల్ని నా చెంపల కద్దుకున్నాను. రాత్రయిందని అర్థమైంది. భగవన్నామస్మరణలో మునిగాం. మాటల మధ్యన ఆమె యమున అనీ, గుజరాతులోని అహ్మదాబాదు కళాశాలలో హిందీ లెక్చరర్‌గా పంజేస్తుందని చెప్పింది. నా విషయం నేను చెప్పాను. “ఇంకా ఈ లోకంలో నాకేముంది? దూకేస్తొనంది. అలాగ్రెతే నేను గుండెపగిలి చావడం ఖాయం. ఆపేశాను. “దేవుని దయవుంటే మనం
బతకొచ్చు. మనవారు దొరకొచ్చు” అన్నాను. ఆమె చీరకొంగు పిండుకుని తన ఒంటిని, నా ఒంటిని అద్దుతోంది. వర్షం జోరు, వరదహోరు తగ్గినట్టుంది. ఆకాశం తూర్పు భాగం తెల్లబడుతోంటే తెల్లవారిందనిపించింది. వర్షం తుంపరగా మారింది. ఒకరినొకరం తేరిపార చూసుకున్నాము. చేతిలో చెయ్యేసి మెట్లు దిగుతుంటే బురద మా కాళ్లను చుట్టేసింది. లాడ్జింగు స్మశానవాటికలా నిశ్శబ్దంగా, ఖాళీగా వుంది. బజారులో బురద పేరుకుపోయింది. ఇసుక మేటలు వేసింది. వాటికింద పశు కళేబరాలు, మనుషుల శవాలు... పీనుగుల పెంటలాగుంది. ఒకరికొకరం అసరాగా నడుస్తున్నాము. ఆమె చేతిబ్యాగు-పర్సు నా పర్సు ఎప్పుడో ప్రవావార్చణమైనాయి. ఒంటిమీది గుడ్డలు తప్ప మావద్ద ఏమీలేవు. ఆకాశంలో రాబందులు గుంపులుగా తిరుగుతూ అరుస్తున్నాయి. కొంతదూరం నడిచాక యమున ఠక్కున ఆగిపోయింది. “అయ్యో! అదో...నా భర్త శవం. అమ్మో! రాబందులు పొడుచుకు తింటున్నాయండీ!” పరుగెత్తికెళ్లి భర్తశవమ్మీద వాలింది. భుజాలు పట్టిలేపి, నేనే ధైర్యం చెబుతూ ముందుకు నడిపించాను. నా మాధవి ఏమైందో!? ఎగదన్నుకొస్తున్న వేదన నదిమిపెట్టాను. మేటలు, ముళ్ల కంపలు, దిగబడుతున్న బురదలోంచి నడుస్తున్నాము. మధ్యాహ్నమైంది. మరో ఇద్దరు నిరాశ్రయులు కలిశారు. విషాదగాధల్ని విప్పి చెప్పుకుంటూ బికారుల్లాగైనాము. అదేదో ఊరు... రోడ్డు మీద జనాలు అంగలార్చుతున్నారు. ముందుకెళ్తూ మళ్లీ ఇద్దరమే మిగిలాము. సాయంత్రమైంది. అక్కడ మరో ఊరు... అదే గందర గోళము. మళ్లీ చినుకులు. నూతిలోనున్న మనిషి మీద రాళ్లు పడ్డట్టు (ప్రకృతి ప్రకోపాన్నెదిరించలేక పోతున్నాము. ఊరి వాళ్లతో కలిసి మేమూ ఓ పాఠశాలలో దూరాము. బయట వర్షం... లోపల నిరాశ్రయుల నిట్టూర్పులు, ఏడ్పుల హోరు, ఊరివాళ్లు కొంపా, గూడు వరదల పాలైనాయని కన్నీరు మున్నీరవుతున్నారు. మా గోడు వినేవారెవరు? కాళరాత్రి హృదయ విదారకంగా గడిచింది. తెల్లారేసరికి వర్షం... మంచుతెరలుగా మారింది. మసక చీకట్లో బయలుదేరి మధ్యాహ్నానికాల్లా మరో ఊరు చేరుకున్నాము. అక్కడి జనాల గుంపులో చేరాము. మా కడుపులో దుఃఖముంది గాని కంటిలో నీరు కరువైంది. ఆకలి కేకలు... అల్లాడిపోతున్నాము. అందరి ఆశాపాశాలు హెలీకాష్టర్లనంటుకున్నాయి. ఆకాశమ్మీంచి పొట్లాలు రాలి పడ్డున్నాయి. కొన్ని లోయల్లో పడ్తున్నాయి. ఎంగిలి విస్తర్ల కోసం కుక్కల కొట్లాటలా మనుషులు గుంపుల్లో కీచులాడుకుంటున్నారు. నాకో నీళ్ల పాకెట్టు, యమునకో ఆహారం పాకెట్టు దొరికాయి. పాకెట్లో రెండు చపాతీలు... చెరోటి తిని నీళ్లు తాగాము. కాలే కడుపుకు మండే గంజిలాగ్రెంది. ఒళ్లు-కాళ్ళనొప్పుల్ని లెక్కచేయకుండా మళ్లీ బయలుదేరాము. “ఒక్కడివే... ఒక్కడివే ఒకడివె పదవోయ్” రవీంద్ర కవీంద్రుని గేయం గుర్తుకొచ్చి గుండెకు బలము చేకూర్చింది. చాలా కావా వో టాన్
దూరం నడిచాము. పక్కన లోయల్లో ఉగ్ర గంగా ప్రవాహధ్వనులు పగబట్టిన కోడెనాగుల బుసల్లా వినబడుతున్నాయి. ఓచోట చాలమందున్నారు. అక్కడ రోడ్డు తెగిపోయింది. లోయ బ్రహ్మరాక్షసిలా నోరు తెరుచుకునుంది. లోయకు రెండువైవుల రోడ్డుంది. ఎవరూ ముందుకెళ్లలేరు. అటుకొన్ని , ఇటుకొన్ని హెలీకాష్టర్లు దిగాయి. వాటిలోంచి దిగిన వీర జవానులు ఆహారపొట్లాలు, నీళ్ల పాకెట్లు పంచుతున్నారు. అంతేకాదు ఏవేవో ఏర్పాట్లు చేస్తున్నారు. అటూ, ఇటూ గుట్టలకు తాళ్లుకట్టారు. సైనికులు తాళ్లు పట్టుకుని, ధైర్యంగా వేళ్లాడుతూ అటువాళ్లిటు, ఇటువాళ్లటు చేరుకుంటున్నారు. పట్టుతప్పితే మనిషి లోయకు సమర్పయామి.
సైనికులు మాకు ధైర్యం నూరిపోస్తున్నారు. యువతీ యువకులను ప్రోత్సహించి తాళ్ల ద్వారా అటువైపు పంపించారు. పిల్లలు, వృద్ధులము మిగిలాము. సైనికులు గుమిగూడి ఏవో సంప్రదించుకున్నారు. ఎన్నడూ కని, విని ఎరగని సొహసాని కొడిగట్టారు. పొడుగు తాళ్లకు అడ్డంగా, హెలీకాష్టర్ల సాయంతో మరన్ని తాళ్లు కట్టారు. అదొక వలలా తయారైంది. దానిమీద ఇటునుండి అటుదాకా సైనికులు వెల్లకిలా వరుసగా పడుకున్నారు. వారి ఛాతీలమీద అడుగులేస్తూ మమ్ముల్ని అటు వెళ్ళమన్నారు. వాళ్ళ సాహసమే మాకు స్ఫూర్తిగా అటు చేరాము. అంతా కలిసి సైనికులకు జైకొట్టాము. దేశ సరిహద్దులతో పొటు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలు రక్షిస్తున్న వారి బుణామెలా తీరుతుంది?
ఎటువైపు వెదికినా అక్కడ యమున కనబడలేదు. గుజరాతు ప్రభుత్వం పంపిన హెలీకాష్టర్లో వెళ్లిపోయిందని తెలిసింది. ఘోరంగా గాయపడినవారు (ప్రాణాలొదుల్తున్నారు. శవాల కంపు వాసన. ఆరోజు అక్కడే గడిచింది. మూన్నాల్లు గంటలకోసారి హెలీకాష్టర్లు వచ్చి ఆహార పొట్లాలు జారవిడుస్తున్నాయి. తిరిగి వెళ్లేప్పుడు కొందరు మనుషుల్ని ఎక్కించుకుని వెళ్తున్నాయి. ఓ పెద్దమనిషికి నీళ్ల పాకెట్టు, నాకు ఆహార పొట్లం దొరికింది. ఇద్దరమూ పక్కకు వెళ్లి తిన్నాము. అప్పుడు గుర్తుకొచ్చింది అర్ధాంగి. “మాధవీ! ముప్పయ్యైదేళ్లు ఒకరికొకరిమయాము. ఇప్పుడెక్కడున్నావు? కేదారేశ్వరా! నా మాధవిని కాపాడు తండ్రీ!” గుండె కవాటాలు ఛేదించుకొచ్చిన దుఃఖాన్ని ఆపుకోలేక గోడుగోడుమన్నాను. గుండెలు బాదుకుంటూంటే అతడు ఆపేసి “అయ్యా! నావాళ్లు గూడా దొరకడం లేదు. ఇప్పుడిదంతా అరణ్యరోదన. మొదట మనింటికి మనం చేరుకోవాలి” ఊరడించాదు. అవును! ప్రకృతి పగబడితే మానవమాట్రులేం చేయగలరు?
నేలమీది వాహనాలేవీ రాలేవక్కడికి. వచ్చి తిరిగివెల్తున్న హెలీకాష్టర్లలో జబ్బ బలమున్నవారు ముందు వెల్తున్నారు. హెలీకాష్టర్లలో వస్తున్న పదార్థాలు వందల మందికి, ఎదురు చూసేవారు వేలల్లో సాహసం చేయాలని అంతరాత్మ ఆదేశం. గుంపును తోసుకుంటూ వెళ్లి హెలీకాష్టరెక్కాను. అది గాల్లోకెగిరి కొద్దిసేపట్లో కిందికి దిగింది. చకచకా దిగాను. అది
డెహ్రాడూన్ అని తెలిసింది. అక్కడ ఎన్నో వేలమంది అంగలార్చుతూ పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. రాష్ట్రాలవారీగా పునరావాస కేంద్రాలున్నా తెలుగు వారికి లేదు.
ఉత్తరప్రదేశ్ కేంద్రానికోసారి, గుజరాత్ కేంద్రానికోసారి వెళ్లి చపాతీలు, కూర సంపాదించి తినేసాను. ఆకలి తీరగానే ఇంటికి చేరుకోవాలనే ఆరాటం పెరిగింది. ఏదో స్వచ్చంద సంస్థ కొందరికి రైలు టికెట్లు కొనిచ్చి వాళ్లింటికి పంపిస్తోంది. టికెట్ కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. మరో రోజు అక్కడనే గడిచింది. దినదిన గండం నూరేళ్లాయుష్పులాగుంది. ఎన్నో రాష్ష్రాల ప్రభుత్వాలు తమ విమానాలను పంపి తమ వారిని తీసుకెల్తున్నాయి. తెలుగువారికా సదుపాయం లేదు. ఎనరినన్నా బతిమాలి సెల్‌ఫోన్ తీసుకొని బంధువులకు ఫోన్ చేద్దామన్నా ఎవరి ఫోన్‌నంబర్లు గూడా గుర్తుకు రావడం లేదు. ఆ రోజంతా ఓ పరిచయస్తుడితో గుజరాతు గుడారములో గడిపాను.
మర్నాడు తెలుగువారికోసం రెండు విమానాలొచ్చి వాలాయి. ఆరి పోతుందనుకున్న ఆశాజ్యోతి కాంతివంతమైంది. అటువైపు పరుగెత్తాను. “ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటుంది. ఉచిత ప్రయాణం... రండి.. రండి. తెలుగువారంతా రండి” అరుస్తున్నారో విమానం వారు.
“ఇది తెలుగుదేశం విమానం. తెలుగువారిని హైద్రాబాదులో దింపేస్తాం. అంతా ఉచితం. రండి... రండి” మరో విమానం వారి పిలుపు. వెళ్లి విమానంలో కూచున్నాను.
విమానం గాల్లో పరుగెడుతోంది. “జీవితంలో ఒక్కసారన్నా విమానప్రయాణం చెయ్యాలండీ!” మాధవి సరదాగా అన్నమాట గుర్తుకొచ్చి ఎదను కరిగించింది. “మాధవీ! నిన్నాదిలేసి ఒంటరిగా విమానప్రయాణం చేస్తున్నాను. నువ్వెక్కడున్నావో...”మనసు కరిగి కళ్లల్లో కొచ్చింది. విమానం హైద్రాబాదులో దిగింది.
విమానం దిగేప్పుడు తలా ఓ వందరూపాయలిచ్చారు బస్సుఛార్జీలకు. ఆ దయామయులకు మనసులోనే పాదాభివందనం చేశాను. లోకల్ బస్సులో అత్తారింటికెళ్లాను. ఇంటిముందు ఆగాను. ఇంట్లోంచి ఏడ్పులు వినబడుతున్నాయి. ఒంట్లో శక్తి లేదు.
“మా మాధవి ఏదీ?” అని వాళ్లడిగితే ఏం చెప్పాలి? మనో సాగరము అల్లకల్లోలమైంది. “మాధవీ!” బిగ్గరగా అరుస్తూ నేలతల్లి ఒడిలో పడిపోయాను.
“బావా! ఓ బావా!” మా బామ్మర్ది చెవిలో పిలిచాడు. కళ్లు తెరిచేసరికి మంచమ్మీదున్నాను. మంచం చుట్టూ బంధువులున్నారు. అందర్నీ చూపులతో తడుముతున్నాను. “ఎట్లా వుంది బావా?” బామ్మర్ది అడిగాడు. కూతురు గూడా అట్లానే అడిగింది. అంతరాళాల్లో సుడిగాలి...
“మ్మ...మ...మాధవి!?” మంచమ్మీదినుండి లేచి అంచుకు కూచుని గుండెలు బాదుకున్నాను. చూపులు నిలబడిపోయినై.
అమితాశ్చర్యం, ఆనందం, భావోద్వేగం కలెగలుపుకొచ్చాయి. కాని...గొంతు 'పెగలడం లేదు.
“ఏమండీ? మీకెలాగుంది?” గుంపులోంచి నా మాధవి వచ్చి పక్కన కూచుంది. చాలా బలహీనంగా వుంది. నా ఒడిలో గువ్వలా ఒదిగిపోతూ” అంతా...దేవుని దయండీ!” అంది. నవనాడులు సప్తస్వరాలు వినిపిస్తూంటే “నువ్వెట్లా బతికొచ్చినవు మాధవీ?” అడగ గలిగాను.
మాధవి లేచి నుంచుంది. కొంగుతో తన కళ్లు, నా కళ్లు అద్దింది. “ఇవ్వాళ్ల పొద్దున్నే రైలు దిగొచ్చాను. మన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం గానీ ముందు లేవండి. స్నానంచేసి భోంచెయ్యండి” నా చేతులు పట్టి నుంచోబెట్టింది.
అందరి కళ్లు ఆనంద జ్యోతిలైనాయి.
(నెలవంక నెమలీక” - జూలై 2015) ళా! ం ర! ( న రశ క్ ( క! సమో క్. ర. | న న ళు నాం లా, దం చతస సుమా శుజా స వనాని
అక అపకీర్తి కన్నోజు రాజప్రాసాదం పక్శనే ప్రవహిస్తున్న ప్రశాంత (్రోతస్విని, రసపుత్రవీరుల నెత్తుటి కత్తులను కడిగి పవిత్రమైన గంగానది పరిసర ప్రాంతాలను చల్లబరుస్తోంది. నలువైపుల నుంచి పక్షుల కిలకిలా రావాలు కమ్మగా వినిపిస్తున్నాయి. మంద పవన తరంగాలు పూలతోటలను, మామిడి, జామ తోటలను సుంగధ భరితం కావిస్తున్నాయి. అయినా... జయచంద్ర మహారాజు పగ, ప్రతీకర వాంఛ చల్లారడంలేదు. అంగలేస్తూ నదీ తీరానికి వెళ్లాడు. ఒంటిమీది పట్టు పుట్టాలను తడుముకుంటూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు. అక్కడ కాలు నిలువక పక్కనున్న సుందర ఉద్యానవనానికి వచ్చాడు. కాలు గాలిన పిల్లిలా పచార్లు చేస్తున్నాడు. అప్పుడే ఓ రాజభటుడు వచ్చి, అభివాదం చేశాడు. “మహారాజా! మహామాత్య శ్రీహర్నులవారు తమరి దర్శనార్థం వేంచేస్తున్నారు.” “శ్రీహర్నుల వారా!” జయచంద్రునికి ప్రాణం లేచొచ్చింది. “వారితో ప్రత్యేకంగా మాట్లాడాలి. ఇక్కడికే తోడ్మొనిరా!” “ఆజ్ఞ మహారాజా!” భటుడు వెనుదిరిగాడు. ఆజాను బాహువు శ్రీహర్చ్నుడు అంగలేస్తూ వస్తూంటే భుజాల మీద తలవెంట్రుకలు సయ్యాటలాడు కుంటున్నాయి. స్ఫురద్రూపం, ఎర్రని దేహఛాయ ... ఉదయ సూర్యునిలా వెలిగిపోతున్నాడు. మహారాజు ఆదేశ మేముంటుందో! ముందటి మాట మారిపోడు గదా! పృథ్వీరాజును సగౌరవంగా, అల్లునిగా తీసుకురమ్మంటాదేమో!? వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. కోయిలల కుహూకుహూలు గంగానది తరంగ ధ్వనులతో మమేక మవుతున్నాయి. మహారాజు పరువు ప్రతిష్టల గురించి ఆలోచిస్తూంటే, భారతఖండ సమగ్రత, ఉజ్వల భవిష్యత్తు ఆయనకు స్ఫురించనే లేదు. శ్రీహర్నులవారికి మహారాజు ఎదురొచ్చి మరీ స్వాగతం పలికాడు. “ప్రణామం మహారాజా!” భుజకీర్తులు తళుక్కుమన్నాయి. “మహామాత్యా! శ్రీహర్నా! మేం మీ కోసమే ఎదురు చూస్తున్నాం.” తాంబూలంగా పరిమళద్రవ్యాల సువాసనలు వెదజల్లుతున్న రెండు కిళ్లీలందించాడు. “చూశారా! ఆ... పృథ్వీరాజు నా కుమార్తెను, నన్ను ఎలా అవమానపరిచాడో!”
“ల్లీ ఆందోళన నాకర్థమైంది మహారాజా! తమరి ముద్దుల కుమార్తె మీద మత్తుజల్లి... ఏం చేశాడో! ఆమె స్వయంవరానికి ఏర్పాట్లు సరిగానే చేశారు. అయినా దారుణం జరిగిపోయింది. రాకుమారిని పృథ్వీరాజు ఎత్తుకెళ్లి పోయాడు.
పృథీరాజు మహావీరుడే, అజేయుడే... కానీ అతని శక్తి ముందు తమరు మోకరిల్లాలనే సలవాో నేనివ్వలేను. అతనో జగమొండి. మనం స్వయంవరానికి ఆహ్వానం పలకకున్నా సిగ్గుగ్గులు లేకుండా వచ్చి కన్యాపహరణం చెయ్యడం దారుణం! దాన్ని ఉ పేక్షిన్తామా? ఆ దుశ్చర్యను క్షమిస్తామా? తరైన్ రణరంగాన్ని నెత్తుటిమయం చెయ్యాలి, అపజయాలతో అట్టుడికిపోతున్న ఘోరీ మహామ్మదు ధైర్యం ఉడిగిపోయి ఉన్నాడు. పృథ్వీరాజుపై మనం ప్రతీకారం తీర్చుకోవాలంటే ఘోరీతో చేతులు కలిపి తీరాల్సిందే”. గాంభీర్యం వెనక స్వలాభం.
“మహామాత్యా! మా కుమార్తె సంయుక్తనే పృథ్వీరాజును ఎన్నుకొందనే అబద్ధపు (ప్రచారంతో రాజపుత్రులు గుడ్డివాళ్లయ్యారు. మనం అపజయం పాలైతే సంబరాల్లో తేలిపోతారు. కాబట్టి దేశం, గీశం ఏమీ లేవు. కీలెరిగి వాత పెట్టాలంటే ఇదే మంచి తరుణం.”
ఇద్దరి దృష్టి ప్రవాహం వైపు మళ్లింది. జలచరాలు ప్రవాహానికి ఎదురీదేందుకు నీళ్లలో నీళ్లతో యుద్ధం చేస్తున్నాయి. మహారాజు అంతరంగ తరంగాల్లో అంతకు ముందు సంగతి తేలి ఆడుతోంది.
ఏం
అందాల భరిణ, జయచంద్ర మహారాజు ముద్దుల కుమార్తి సంయుక్తకు స్వయంవరం ప్రకటించారు. చెలికత్తెలతో ఉద్యానవనంలో విహరిస్తున్న సంయుక్త మనోఫలకం మీద మహావీరుడు పృథ్వీరాజు ధీరొదాత్త రూపం గిలిగింతలు పెడుతోంది. కానీ అతనికి స్వయంవరం ఆహ్వానం పంపలేదు. అదంతా రాజకీయం. తన యవ్వనోత్సాహం ఈ వీరుని కౌగిలిలో సేదతీరాలని ఉవ్విళ్లూరుతోంది రాకుమారి. ప్రియసఖి పరుగెత్తుకొచ్చి లేఖ అందించింది, ఆత్రుతగా లేఖ విప్పింది.
“హృదయేశ్వరి... సంయుక్తా! మనసులు ఇచ్చి పుచ్చుకున్న మన (పేమ పెళ్లితో శాశ్వతం కావాలి. మీ స్వయంవరానికి నా కాహ్వానం అందలేదు. రసపుత్రులకు సదాచారము కాదది. మీరు ధైర్యశాలి అని తెలుసు.' రేపు సాయంత్రం మన మనసులు కలిసిన చోటిక్సి నేనొస్తాను. తమరక్కడ తయారుగా ఉండాలి. రుక్మిణీ-శ్రీకృష్ణులు ఆదర్భంగా మనం కన్నోజు బయటికొచ్చి రాక్షస వివాహం చేసుకుందాం. ఇది శాస్త్రీయమే. తర్వాత మీ నాన్న మనల్ని ఆశీర్వదించక తప్పదు.
ఇట్లు పృథ్వీరాజు.”
లేఖను ఎవరూ చూడకుందా గుండెల్లో దాచుకుంది. పథకం ప్రకారం రాకుమారి సంయుక్త - పృథ్వీరాజులు చేతిలో చెయ్యేసుకుని గుర్రం మీద రాజ్య సరిహద్దులు దాటారు. చెలికత్తెల ద్వారా విషయం తెలిసిన జయచంద్ర మహారాజు గుండె భగ్గుమంది. న. నాకిష్టం లేదన్నా నా ముద్దులమూట సంయుక్తను ఎత్తుకెళ్లి అవమాన పరిచిన ఆ పృథ్వీరాజు అంతం చూసి తీరాలని నిర్ణయించుకున్నాడు జయచంద్రుడు. మహారాజు పరిస్థితి మహామాత్య శ్రీహర్నునికి అవగతమైంది. “మహారాజా! మీరు శాంతించండి. ఆహ్వానం పంపకున్నా తగుదునమ్మా అంటూ వచ్చి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం నేనూ సహించలేను. కానీ, ముందుతరం ఈ ఆకృత్యాన్ని దేశద్రోహంగా భావిస్తుందేమో! మన విజయం కలుషితమైపోతుంది. పృథ్వీరాజే కాదు, రసపుత్రులంతా కట్టకట్టుకుని వచ్చినా భయపడం. కానీ, సంయుక్త అవనూనం భారతదేశంలోని అందరి కూతుళ్ల అవమానం. పృథ్వీరాజు మొండిఘటం. కీలెరిగి వాతపెట్టాలి.” శ్రీహర్నుడు అంతటితో శాంతించలేదు. జయచంద్రుని చెవిలో గుసగుసలాడాడు. “మహారాజా! ఇంతకు ముందు యుద్ధ సమయంలో నేను మహ్మద్ ఘోరీ శిబిరానికి వెళ్లాను. పృథ్వీరాజు సంగతంతా నాకు తెలుసు. ఆ విషయం మీకు కూడా చెప్పాలనుకున్నాను. కానీ, చెప్పలేక పొయాను. పాపమా ఘోరీ ఒంటరి వాడయ్యాడు. మహారాజా! ఒకవేళ అతనికి మీ సహకారం అందితే పృథ్వీరాజును ఓడించవచ్చు.” జయచంద్రునికా వ్యూహం నచ్చింది. సరేనన్నాడు. “మహారాజా! ఘోరీకి ఓ సందేశం పంపిస్తాను” అన్నాడు శ్రీహర్నుడు. గుర్రాల చప్పుడు విని శ్రీహర్నుడు లేఖతో బయటికొచ్చాడు. నమ్మకస్తుడైన అనందచంద్రుని పిలిపించాడు. “ఆనందచంద్రా! ఆ లేఖను మహ్మద్ ఘోరీ పాదుషాకు అందించాలి. పని రహస్యంగా జరగాలి.” ఆనందచంద్రుడు లేఖను కళ్లకద్దుకుని గుర్రం మీదెక్కాడు. గుర్రం వేగంగా పరుగెడుతోంది. మెరుపులా షిహాబుద్దీన్ మహ్మద్ ఘోరీ రాజసభ దగ్గరికి చేరుకుంది. అక్కడున్న వాళ్లంతా నిరాశా నిస్పృహల్లో తేలిపోతున్నారు. సైనికుల మొహాల్లో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. గుర్రం దిగగానే ఆనందచంద్రుడికి లోపలికి వెళ్లేందుకు అనుమతి లభించింది. ఘోరీకి శ్రీహర్నుని వాగ్దానం గుర్తుకొచ్చి ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. ఆనందచంద్రుడు సభలో ్రవేశించగానే మొహం వెలిగిపోయింది. “పాదుషా వారికి ఆనందచంద్రుని సలామ్!” వంగి కుడిచేతిని కింది నుంచి మీద్దాకా రెండుసార్లు ఊపి అదాబ్ సమర్పించాడు. “ఆయియే ఆనందచంద్రజీ!” ఉత్సాహంతో ఉక్కిరి బిక్కిరపోయాడు ఘోరీ. “మేం మీకు గుర్తుకొచ్చాం. చాలా సంతోషం” సింహసనం మీదినుంచి లేచి నిల్పొని ఆనందచంద్రుడికి గ వ క్
తగిన ఆసనం చూపించాడు. కుశలప్రశ్నలు వేశాడు.
“త్తు లేఖను మా శ్రీహర్ష మహామాత్యులు పంపించారు. జహాపనా! నవ్వుతూ లేఖ అందించాడు.
“పాదుషా సుల్తాన్ ఘోరీ గారికి, సాదర సమస్సులు. మేం హిందుస్థానీయులం. దేశం కోసం ప్రాణాలిస్తాం. యుద్ధమంటే మాకో ఆట. విజయం, వీరస్వర్గం ఈ రెండూ మా కొక్కటే. కానీ, ఎవరన్నా మా పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తే వాళ్ల అంతు చూస్తాం. కర్రతో తయారైనా కామ లేకపోతే గొడ్డలి ఏమీ చేయలేదు. అదేకర్ర కర్రను నరికేందుకు సహకరిస్తుంది. ఇప్పుడు... పృథ్వీరాజు మా జయచంద్ర మహారాజు కుమార్తెను ఎత్తుకెళ్లి మవోరాజును అవమానవరిచాడు. మా మహారాజు పృథ్వీరాజు మీద (ప్రతీకారం తీర్చుకొవాలనుకుంటున్నారు.
మీరు గొడ్డలిగా మారితే మా మహారాజు జయచంద్రులవారు కామగా మారి మీకు అన్ని విధాలా సహకరిస్తారు. మీరు వెంటనే సైన్యాన్ని తీసుకుని మా హిందుస్థాన్ మీద మరోసారి దండయాత్ర చెయ్యండి. ఈ సారి మేం గొడ్డలికామలా ఉపయోడపడతాం. ప్రస్తుతం ఇంతకుమించి ఇంకేమీ చెప్పలేం. ఈ అవకాశాన్ని మీరు జార విడుచుకోరని విశ్వసిస్తున్నాం. మీరిక్కడికి రాగానే మా సేనలు మీ సేనలవుతాయి.
ఇట్లు మీ విశ్వాసపాత్రుడు శ్రీహర్నుడు” చారిత్రక ఘోరాన్ని భరించలేక భారత స్వాతంత్ర్య భానుడు అస్తమయం దిశగా పయనం ప్రారంభించాడు. ఇనుమడించిన ఉత్సాహంతో మహ్మద్ ఘోరీ రెండోసారి భారత దండయాత్రకు బయలుదేరాడు. మహారాజా జయచంద్రుని సేనలు తురుష్క సేనలతో కలిసి పృథ్వీరాజు సేనలతో తలపడ్డాయి. పృథ్వీరాజు వీరాఖిమన్ముడిలా పోరాడాడు. ఘోరీ అపార 'సేనావాహినితో కలిసి జయచంద్రుని సేనలు శత్రుపక్షంలో చేరి పోరు సాగించడంతో, పృథ్వీరాజు మనోవేదనతో ఓటమిపాలయ్యాడు. రసపుత్రరాజ్యం ఘోరీ వశమైంది. అభినందన అందించేందుకు ఘోరీ దగ్గరికి ఆగమేఘాలమమీద వచ్చాడు జయచంద్రుడు. ఘోరీ అతణ్ని స్వాగతించి పళ్లు నూరాడు. “నీ వాడితో రాజీ పడలేక పరాయివాడినైన నాతో చేతులు కలిపావు. రేపు నామీద కోపం వస్తే మరొకరితో చేతులు కలిపి నాకు ఎదురు తిరగవని నమ్మకం ఏంటి?” వికటాట్టహాసం చేస్తూ జయచంద్రుని తల నరికేశాడు... స్వాతంత్ర్యభానుడు తల దించుకున్నాడు. (తెలుగు వెలుగు” డిసెంబర్ 2014) నా లొ ల
ఆశల గుప్పిట్లో ఆరాటం
“వాయ్ బాబూ! గరం చాయ!”
“దినప్రతికలోకి దిగాను కమలాక్ష!”
“చాయానందం జత చేస్తే పత్రికానందం పల్లవిస్తుందండీ!”
సోఫాలో నాకు కుడిభుజంగా కూచుంది. “సరే... అర్ధాంగి ఆదేశం అనుల్లంఘ నీయం గదాగా
“రిటైరై వారం రోజులు కాలేదు. అప్పుడే టైంపాస్ సమస్యనా?” మూడు రాళ్ల ముక్కుపుడక మువ్వన్నెల జెండాలా మెరిసింది.
కమల కోమల హస్తం నుండి చాయ్ కప్పు అందుకుంటూంటే గాజులు గల గలలు గుండెల్లో గుసగుసలు రేపాయి. నా కళ్లు ఆమె నాసాంతం పరిశీలించ సాగాయి. నడివయసు దాటిన నుదుటి మీద సన్నని ముడతల ఛాయలు, వాటి మధ్య ఎర్రని కుంకుమబొట్టు ఉదయ సూర్యబింబములా కనబడింది. బొట్టు చుట్టూ ముంగురుల నాట్యం చూడముచ్చ టేసింది. కళ్లల్లో వాడిపోని చలాకితనం... ఫరవాలేదే! చిరునవ్వు పెదాలను వణికిం చింది.
ఉద్యోగ ప్రస్థానములో కష్టసుఖాల కావడి మోస్తూ పిల్లల్ని చదివించాను. కొదుకు... వాడు ఇష్టపడి చేసుకున్న కోడలు సాప్ట్వేర్ ఇంజనీరై కాలచక్రం గిర గిరల్లో అమెరికా చక్రంలో చేరిపోయారు. ఏకైక కుమార్తె అత్తారింట్లో వోయిగా వుంది. జీవితాశయం నెరవేరింది. విశ్రాంత జీవనసారాన్ని అర్థాంగితో కలిసి జుర్రుకుంటున్నాను.
“భారతమాతకు జేజేలు, బంగరు భూమికి జేజేలు...” నాకిష్టమైన పాటతో సెల్‌ఫోన్ గొంతు విప్పింది.
“హల్లో... యాదగిరి గారేనా?”
“ అవును... మీరెవరూ?”
“నేనన్నా! నవనీతాన్ని"
“నవనీతమా!” ఉలిక్కిపడ్డాను.
“అవునన్నా నీ బాల్య స్నేహితుణ్ని మా సత్తక్క తోడు” అదే హుందాతనం కాని... అడెట్లా? ర వ్ క
“చిక్కుల్లో చిక్కి జైల్లో ఉన్నావన్నారు. జైల్లో సెల్‌ఫోన్ సౌకర్యముందా నవనీతం?”
“హబ్బా! జైలు నుండి బయటపడ్డాను భయ్యా!” ఓ నిమిషం మాట్లాడి కట్ చేశాడు.
“అం...టే! తప్పించుకున్నాడా? కోట్ల రూపాయల గోల్మాల్...”
నా గొణుగుడును కమల కర్ణపిశాచం పట్టేసింది. “ఎవరూ! నవనీతమా?” కమల భృకుటి పీట ముడేసుకుంది. “జైల్లో ఉండాలి గదా!”
“అవును ఎలా ఊడిపడ్డాడో! బస్టాండు లో దిగాడటా. మనింటికే వస్తున్నాడటా?”
“అయ్యయ్యో! పోలీసులు మనింటి కొస్తారేమో!” ఖాళీ కప్పులందుకుని లేచింది. “ఎందుకైనా మంచిది, జాగ్రత్త గా ఉందాలండీ”
“అవన్నీ నాకు తెలుసు కమలా!” లోపలి విసుగును బయటకు రానివ్వ కుండా జాగ్రత్త పడ్డాను.
“ఎంతైనా అతడు నా బాల్యస్నేహితుడు గదా! భోజనానికేర్పాట్లు చెయ్” ఆదేశిం చాను.
నవనీతంది నవనీద హృదయము. చెరగని మందహాసం అతని సొంతం. ఎవ్వరనీ నొప్పించే వాడు కాదు. స్నేహ మంటే ప్రాణమిచ్చే వాడు.. కాని అదంతా ఆనాటి మాట.
గతం దృశ్యమాలిక మనసు తెరమీద తేటతెల్లమవుతోంది.
నవనీతం పుట్టి పారాడింది కరీంనగర్లో, తోడపుట్టి కూడి పెరిగిన వాళ్లక్క ఇంట్లో ఉండేవాడిక్కడ. వారిల్లు మా ఇల్లు కెదురుగా వుండేది. అప్పటికే పట్నంగా రూపుదిద్దుకున్న మా ఊరు నగరముగా ఎదగాలని ఉవ్విళ్లూరుతోంది.
సత్తవ్వ నవనీతం అక్క ఆమె భర్త మల్లేశం సాొత్వికుడు, భూస్వామి గూడా. వ్యవసాయం పనుల్లో ఆరితేరాడు. సత్తవ్వ-మళల్లేశం అన్యోన్యతకు గుర్తుగా పుత్రోదయ మైంది. ఆలుమొగల అన్యోన్యత గురించి స్వర్గవాసులకు పాఠాలు చెప్పించుకోవాలనుకున్నాడేమో, రోడ్డు ప్రమాదాన్ని సృష్టించి దేవుడతణ్ని తన లోకానికి రప్పించుకున్నాడు. పేగు తెంచుకు పుట్టిన పసివాడే సర్వస్వమనుకున్న సత్తవ్వ ఆస్తి పాస్తుల వ్యవహారాలు చూసేందుకు నవనీతాన్ని పెంచుకుంది.
నవనీతం నా క్లాసుమేటు. మా కంబైండ్ స్టడీ దివారాత్రాలనేకం చేసేది. వ్యవసాయములో నవనీతానికి ఓనమాలు కూడా తెలీవు. భూముల్ని కౌలుకిచ్చి తాను చదువు కునేవాడు. ఆ వ్యవహారానికి సంబంధించిన రాతకోతలు మానాన్న సహాయంతో మేమిద్దరము పూర్తి చేసేవారం. తన చదువుతో పాటు మేనల్లుడితో హోంనర్సు చేయించడం గూడా నవనీతం ద్యూటీయే. సెలవు రోజుల్లో మేమిద్దరము హైస్కూలు గ్రౌండ్లో మిత్రులతో కలసి క్రికెట్ ఆటలో మునిగి తేలేవాళ్లం.
కౌలుదార్ల కపట నాటకాలతో వ్యవసాయం కలిసి రాలేదు. వాళ్ల భూములు
హైద్రాబాదు, మెదక్ రోడ్డు నానుకుని ఉండేవి. ఆ భూముల్ని ప్లాట్లు గా చేసి అమ్మాలని మా నాన్న ఇచ్చిన ఐడియాను మా ద్వారా అమలు చేసింది సత్తవ్వ. ఆ పని చూస్తూనే ఇద్దరం కాలేజి స్టడీ కొనసాగాస్తూ స్నేహమనే పదానికి చెరో అక్షరమయాము. వయసులో నేను కొంచెం పెద్ద అయినా స్నేహంలో ఇద్దరమూ సమానమే. ఇంటర్లో నేను ఫస్ట్ క్లాసులో, నవనీతం సెకండు క్లాసులో గట్టెక్కాం. డిగ్రీలో చేరి ఒకే క్లాసులో కూచున్నాము. డిగ్రీ పూర్తికాకముందే ప్రభుత్యోద్యోగం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఉన్న ఊళ్లో ఉద్యోగం ఆదివారం సరదా ఆటలు యధాతథం.
కాలం వెంట యాంత్రికంగా పరుగెదుతున్నాము. వ్యవసాయ భూములు ఇళ్ల స్థలాలుగా మారాయి. హైద్రాబాదు రోడ్డు పక్క ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడైనాయి. మెదకు రోడ్ ప్లాట్ల అమ్మకం ప్రారంభమైంది.
సత్తక్క నన్ను సొంత తమ్ముడిగా చూసుకునేది. మాకు సొంతిల్లు లేదని బాధ పడిందేమో.. ఓసారి నవనీతం, నేను పిచ్చా పాటి మాట్లాడుకుంటూంటే మధ్యలో ఎంటరైంది.
“త్రమ్మీ యాద్దిరీ! నువు సర్కారు నౌకరి చేస్తున్నవు గదా! మెదకు రోడ్డు ప్లొట్లల్ల నీకిష్టమైంది తీసుకో. మూడ్రూపాయలకు గజం తీసుకో. మనిషికీ కూడు, గుద్ద, గూడు కనీస అవసరాలు గదా!” సొంత అక్కలా సలహా యిచ్చింది. నేను ఆశ్చర్యంగా నవనీతం మొహంలోకి చూశాను.
సైగలతో సత్తక్కృతో మాట్లాడాడు. * మూడొందల గజాల ప్లాటు మూడొంద లకు తీసుకో... నెలకు పది రూపాయల చొప్పున తీర్చెయ్” ప్రోత్సహించాడు.
నా అయోమయం కళ్లల్లో కొచ్చింది. సలవా బాగానే వుంది గానీ నాన్న ఏమంటాడో... ఆలోచించుకునే లోగా నవనీతం పరుగెత్తుకెళ్లి నాన్నను తీసుకొచ్చాడు. నాన్నను కూచోబెట్టి సత్తక్క “బాబాయ్! కిరాయి కొంపలో ఇంకా ఎన్నేంద్లుంటారు?” లాలనగా అడిగింది.
నాన్న మొహంలో రంగులు మారాయి. “నిజమేకానీ, నేనేమో మిల్లు గుమాస్తాను. సొంతిల్లుకు తాహతు లేదు. యాదగిరికి ఉద్యోగమొచ్చి సంవత్సర మైంది. వానికి, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చెయ్యాలి గదమ్మా..” అర్థిక పరిస్థితి ఏకరువు పెట్టాడు.
వ్లాటు ప్రతిపాదన నాన్న ముందుంచి సొంతిల్లు లాభాలను వివరించి ఒప్పించింది. అనుకోనిది సాధించినందుకు అమితానందములో ఓలలాడాను. ఆనందాన్ని పెదాలకు పరిమితం చేసి “అక్కా వాళ్లిష్ట మొచ్చిన ప్లాటు తీసుకుంటే ముందు రిజిష్టర్ చేసిద్దా”మని నవనీతం చొరవ తీసుకున్నాడు.
“నేను వద్దన్నానా తమ్మీ! నాకు నువ్వెంతో యాదగిరి కూడా అంతే” సత్తక్క ఆమోదముద్ర వేసింది. ప్లాటు సెలక్షన్, రిజిస్టేషన్ వెంట వెంటనే జరిగి పోయినై, ఆ తర్వాత ఇన్స్టాల్మెంటు చెల్లింపు ప్రారంభమైంది. డాటాతో
నవనీతం తల్లిదం[డ్రులు స్వర్గారోహణం చేశారు. అతనికి కరింనగర్లో ఎవరూ లేరు. డిగ్రీ పూర్తయింది. ఖాళీగా వున్నాడు.
వాళ్ల మేనల్లుడు ఇంటర్ కొచ్చాడు. భూములమ్మిన డబ్బుతో మూడంతస్తుల బంగళా నవనీతం పర్యవేక్షణలో కట్టించారు. ఇంటి కిరాయిలు, బాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీలు చేతికొస్తున్నాయి. బాంకు వ్యవహారాలు గూడా అతని మేనల్లుడే చూస్తున్నాడు. ఇహ నవనీతం అవసరం సత్తెక్కకు లేదనే సిగ్నల్స్ వచ్చాయి.
“జనారణ్యంలో నేనిప్పుడు ఒంటరి కాకినయానన్నా” లోపలి బాధను చిరు నవ్వుతో వెళ్లగక్కాడు.
“సీక్సు నేనున్నాను నవనీతం” భరోసా యిచ్చాను.
ఆశల ఆరాటంతో ఆశయాల పోరాటం మధ్య మూడో పురుషార్థం వెన్ను తట్టింది. నాకు పెళ్లి చెయ్యాలని అమ్మ పట్టుబట్టింది. పెళ్లి చూపుల నుండి రిసెప్షన్ దాకా... నా పెళ్లిలో అంతా తొనే అయాడు నవనీతం. స్నేహమంటే ఇలా గుండాలని బంధువులు చెవులు కొరుక్కున్నారు.
నేను జేస్తున్న డిపార్ట్మెంటులో కొత్త ఉద్యోగాలోచ్చినై. నవనీతంతో అప్లై చేయిం చాను. డైరెక్షన్ నాది, యాక్షన్ అతనిది. నా పలుకుబడికి పరీక్ష ఎదురైంది. ప్రయత్నం ఫలించింది. నవనీతానికి హైద్రాబాదులో పోస్టింగొచ్చింది. సంతోషంతో సంబరాలు చేసుకున్నాము. పోస్టింగార్డర్ను నా భార్యకు చూపిస్తూ నవనీతం “వదినా! నువు ఈ ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషమేమిటోగాని తాడూ బొంగరం లేని నా జీవితానికో దారి దొరికింది” మురిపాల మూట విప్పాడు. మా మనసులు ఆర్టమైనాయి.
నా భార్య కమల పిడికెడు పంచదార అతని నోట్లో పోస్తూ “అదేం లేదయ్యా మరిదీ! అంతా నీ అదృష్టం ఇహ పెళ్లి చేసుకో” మురిసిపోయింది.
ఆధునిక నాగరికత కాలవాలమైన హైద్రాబాదులో నవనీతం శారద మెడలో మూడు ముళ్లేశాడు. మేమే పెళ్లిపెద్దల మయాము. ఆ తర్వాత సంసారంలోని సరిగమలను ఉద్యోగంలోని పదనిసలతో సమన్వయ పరుస్తూ నేను హైద్రాబాదుకెళ్లి అతన్ని కలుస్తున్నాను. కాని అతడు రావడం లేదు. పెదాలకే పరిమితమైన మెగాసిటీ ప్రేమపరాగం ఒంట బట్టిందేమో ననుకుని సరిపెట్టుకున్నాను.
నాకు ట్రాన్స్ఫరైంది. ఎక్కడికి ట్రాన్సఫరైనా కొంతకాలం అక్కడ పంజేసి ఆ తర్వాత రిక్వెస్టు ట్రాన్సఫర్‌పై సొంతూరికి రావడం ఆనవాయితీగా మారింది.
ఎవరో బలవంతంగా లాక్కొచ్చినట్టు నవనీతం వాళ్ల మేనల్లుడి పెళ్లికి సతీసమేతంగా వచ్చి వెళ్లాడు. హైద్రాబాదులో కలిసినప్పుడల్లా అతని అనుభవాలు చెప్తుండేవాడు.
ఐదొందల సభ్యత్వంతో నడుస్తున్న డిపార్దమెంటల్ కోఆపరేటివ్ సొసైటీలో నవనీతం సభ్యుడిగా చేరి రెండేళ్లు గూడా కాలేదు. అంతకు ముందా సొసైటీకి ఎవరు కార్యదర్శిగా ఎన్నికైనా రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పంజెయ్యలేదు. నవ్వు మొహం, కలుపుగోలుతనం, మొహమాటంతో అందరినీ ఆకట్టుకునే నవనీతం ను కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇరవై రెండేళ్లుగా ఏకగ్రీవంగా ఎన్నికవూతూ కార్యదర్శిగా పంజేస్తున్నాడు. కార్యదర్శి జీతం డిపార్ట్మెంటు భరిస్తుంది. కాబట్టి సేవాభావమే ప్రదానమైంది.
మా పెద్దమ్మాయి పెళ్లికి ఒక్కడే ఇలా వచ్చి అలా వెనుదిరిగాడు. కొడుకు పెళ్లికి రాలేదు. అతని పిల్లల పెళ్లిల్లప్పుడైనాయో నాకు తెలీదు. కాని...సొంతిల్లు, బంజారాహిల్స్‌లో పెద్దకొడుకు పేర షాపింగ్ కాంప్లెక్స్, కోకాపేటలో భూములు సమకూర్చుకున్నాడని విన్నాను.
మొదట్లో నేను వెళ్లి కలిసినప్పుడు తన వాళ్లందరికీ నన్ను “ఇతను నా అన్న లాంటి గురువు, స్నేహితుడు” అని పరిచయం చేశాడు. అప్పుడు సొసైటీ పనులు పక్కన పెట్టి నాతో కులాసాగా మాట్లాడేవాడు. కాఫీ, కూల్‌డ్రింకులతో సత్మరించేనాడు. బెల్లం చట్టూ ఈగల్లా ఎప్పుడూ నవనీతం చుట్టూ పదిమంది మూగి ఉండేవారు. వాళ్లనలా పక్కన కూచోబెట్టి నాతో మాట్లాడేవాడు.
రానురాను పనిలో మునిగి నాతో లాంఛనప్రాయంగా మాట్లాడేవాడు. ఒక్కోసారి నోట్లకట్టలు లెక్కబెడుతూ నా ఉనికిని గమనించకుందా నబార్జినేట్సుకు వనులు పురమాయించేవాడు. నేను పలకరించ గానే మందహాసం చిందించేవాడు. కాని అతని కార్యకలాపాలు కొన్ని సొసైటీ స్టాపు ద్వారా తెలిసేవి. ఓసారి అతడే “మా సాసైటీ మెంబర్స్ సంఖ్యను వేలల్లోకి పెంచుతూ ఫిక్స్డ్ డిపాజిట్స్‌గా కోట్ల రూపాయలు సేకరించాను. సొసైటీ ఆదాయం, నా ఆదాయం కూడా పెరిగాయి” అన్నాడు.
“అట్టహాసం బాగానే వుంది గాని నీ ఆదాయమెట్లా పెరిగింది?” అనుమానాన్ని అర్ధవంతంగా వెలిబుచ్చాను.
“మా ఉద్యోగుల కవసరమైన టూ వీలర్ వెహికిల్స్, టీ.వి.లు మిక్సీలు, వాషింగ్ మెషిన్లు లాంటి గృహోపకరణాలు సోసైటీ లోన్స్‌తో ఇప్పిస్తాం. ఒకేసారి వందల్లో కొనిపిస్తాము కాబట్టి షోరూం వారు కొంత పర్సెంటీజి కమీషాన్ నాకు ముట్టజెప్తారు. అంతేకాదు... నేను చిట్టీలు కూడా నడిపిస్తున్నాను” విజయగర్వంతో మొహం వెలిగిపోయింది.
నవనీతంకు బోలెడంత తెగింపు, ధైర్యం సొంతమైనాయనీ, అందరితో తియ్యగా మాట్లాడ్లూ పై సంపాదనకు మరిగాదనీ, పైసలనే పరమాత్మగా భావిస్తున్నాడనీ హైద్రాబాదు మిత్రులు చెప్పిన మాటల్ని నేను పట్టించుకోలేదు. ఎందుకంటే సొసైటీ కార్యకలాపాలు, లావాదేవీలన్నీ దాని అధ్యక్షుడు, రైరెక్టరు, క్యాషియర్ల తీర్మానంతోనే నడుస్తాయి. అతని హయాములో సతాయింపులు లేవని, లోన్స్ సులువుగా మంజూరవున్నాయని విని తృప్తిగా
ఊపిరి పీల్చుకున్నాను.
గత పదేళ్ల నుండి నేనెప్పుడు పవనీతంను కలిసేందుకు సొసైటీ ఆఫీసుకెళ్లినా అతని ముందో సూటుబూటు జంటల్మెన్ కులాసొగా మాట్లాడ్ల్తూ కనబడేవాడు. అతని పేరు రంగారావని, ఆప్తమిత్రుడనీ, వాళ్లింటి పక్కనుంటాడని పరిచయం చేశాడు నవనీతం.
కాలగమనములో అనుభవాలు అనుభూతులుగా మారి మనస్సు పోరల్లో దాగుంటున్నాయి.
ఆ రోజు.. ఉదయం... గరం చాయ్ సేవిస్తూ టీ.వి. వార్తల్లో మునిగున్నాను. నవనీతం సొసైటీలో ఇరవయ్యైదు కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందనీ, నవనీతం డబ్బుతో పారిపోయాడనీ, అతని కోసం పోలీసులు వెతుకుతున్నారనీ.. ప్లాష్ న్యూస్ విన్నాను. టీ.వి. పక్కన పిడుగు పడ్డట్టనిపించింది. అదే వార్త దినపత్రికలో పెద్దక్షరాలతో కనబడేసరికి నిశ్చేష్టుడి నయాను.
అందరినీ మందహాసముతో పలుకరించే అమాయకుడు, మొహం చూస్తే చీమకు కూడా అపకారం తలపెట్టడనిపించే నవనీతం అంత పని చేశాడా? ఫోన్లో హైద్రాబాదు మిత్రుల్ని సంప్రదించాను. అదంతా నిజమేనన్నారు. ఆందోళన కడ్డు కట్టవేయలేక హైద్రాబాదు బస్సెక్కాను. సొసైటీ ఆఫీసుకు తాళమేసుంది. ముందు షామియానాలో సొసైటీ సభ్యులు, ఇంకెవరెవరో... నిరసన దీక్షలు, నినాదాలు... హంగామా. ఎవరినడిగినా సరిగా స్పందించడము లేదు. నన్ను గుర్తుబట్టే సొసైటీ అటెండరు జనారణ్యంలో సాధుజంతువు లా కన్పించాడు.
అతన్ని పక్కకు తీసుకెళ్లి, నేను విన్న దంతా నిజమేనా? అడిగాను.
“అంతా నిజమే సార్. నవనీతం సారు ఫరారైపోయిండు.”
“గోల్‌మాల్‌కు నవనీతమొక్కడే బాధ్యుడు కాదు గదా.. సొసైటీ కార్యవర్గ సభ్యులంతా కలిసి చేసిన తీర్మానాన్నే అతడు అమలు చేశాడు గదా! కాని... ఇరవట్యైదు కోట్ల రూపాయలతో ఎట్లా పరారయ్యాడు?”
“ఆ డబ్బు నవనీతం సారు తీస్కపోలేదు సార్. పాపం! సారు దేవుని లాంటి వాడు సార్” నెత్తి కొట్టుకున్నాడు.
0
“బాగున్నావా యాదగిరన్నా!”
పలుకరింపుతో ఈ లోకానికొచ్చాను. చిన్నపాటి ఉలికిపాటుకు లోనై కళ్లు నులుముకుని చూశాను. అతడు నవనీతమే.
“రా...కూచో... నవనీతం. నీ భార్యా పిల్లలంతా బాగున్నారా?”
“వాళ్లంతా బాగానే వున్నారు. నేనే పరేషాన్లో ఉన్నానన్నా!” ఒడిలో వాలిపోయాడు. అతని గుండె గుహలోంచి దుఃఖం తోసుకొస్తుందని అర్ధమైపోయింది. అయినా పెదాల
మీద అదే చిరునవ్వు
బాల్యస్నేహితుని పరివ్వంగం అలౌకికానందాన్నిచ్చింది. “కమలా! నవనీత మొచ్చిందు” కేకవేస్తూ నా పక్కన కూచోబెట్టుకున్నాను. కమల ట్రేతో వచ్చింది. “మా చెల్లి, పిల్లలు అంతా బాగున్నారా?” చాయ్ కప్పు చేతి కందించింది. ముగ్గురమూ చాయ(గ్రహణములో లీనమయాము.
“అంతా బాగున్నారు వదినా!” తానే నిశ్శబ్దాన్ని ఛేదించాడు. గొంతులో సన్నని వణుకు. ఖాళీ కప్పుల్లో కమల వంటింట్లో కెళ్లింది. అక్కడి నుంది బయటిదంతా కనబడుతుంది, వినబడుతుంది.
“అసలేం జరిగింది నవనీతం?” అడిగాను.
ఆత్మీయుని కంతా చెప్పుకోవాలనే భావం అతని కళ్లల్లా కనబడింది.
జ్చైయిల్ మీద బయటికొచ్చేసరికి పది లక్షలు ఖర్చయిందన్నా” విషయాన్ని కొచ్చాడు. ఇంకా ముసుగులో గుద్దులాటేందుకూ?
“అంత డబ్బు ఎలా గోల్‌మాలైంది? నీ జీతమెంత? కూడబెట్టిన ఆస్తి ఎంత?” నిర్మాహమాటంగా (్రశ్నాబాణం వదిలాను.
“సాస్టైటీ కోసం రాత్రింబవళ్లు శ్రమించి కోట్లాది రూపాయల ఫిక్సెడ్ డిపాజిట్టు సేకరించాను. సొసైటీ సభ్యత్వం, టర్వ్షీవర్ కొన్ని రెట్లు పెంచాను. ఎవరి మనసూ కష్టపెట్టలేదు. సాసైటీ కార్యవర్గానికి నా మీదున్న విశ్వాసం ఆసరాగా అడిగిన వాళ్లందరికీ అప్పులిచ్చాను. కొందరిని అప్పు పత్రాలడగలేదు. నా నెత్తి మీదికి శని వచ్చిందేమో నా సొంతానికి కూడా కొంత వాడుకున్నాను. ఆస్తులతో పాటు స్టేటస్ పెరిగిపోయింది. బయటి ప్రపంచానికి దూరంగా తేనె కుండలో ఈగలాగయాను. దురాశ దుఃఖానికి చేటన్నది నిజమైంది. పాప ప్రక్షాళన కోసం ధార్మిక సంస్థలకు తోచిన విరాళాలిచ్చాను” మొహం మబ్బులు కమ్మిన ఆకాశం లాగైంది.
“మరా... ఇరవయ్యెదు కోట్లు..?”
“అదే వినన్నా. పన్నెండేళ్ల క్రితం గుంటూరు మిత్రుడు రంగారావుతో సాన్నిపాత్యం పెరిగింది. అతడో కాంట్రాక్టరు. మాటల మాంత్రికుడు. మా ఇంటి పక్కనే ఉండేవాడు. రూల్స్ ప్రకారం సొసైటీలోన్ ప్రైవేటు వాళ్లకు అప్పులివ్వరాదని తెలుసు. అయినా అతని మాయమాటలు, అవసరాలను నమ్మి అప్పిచ్చాను. మొహమాటంతో పత్రాలడగలేదు. వేలు, లక్షలు తీసుకెళ్లి సిన్సియర్‌గా వడ్డీతో సహాతీర్చే వాడు. అతడిచ్చిన ఎక్కువ వడ్డీ నాకు సొంతమయేది. ఎవరూ ఏమీ అడ్డు చెప్ప లేదు. ఎందుకంటే కార్యవర్గ సభ్యులగ్గూడా పత్రాలు లేకుండా అప్పులిచ్చాను. నాలోని అవినీతి రాక్షసుడికి అప్పుల కుప్పల మీద ఆడుకోవడం అలవాటైంది.
రంగారావు కోసారి ఐదు కోట్లు అప్పిచ్చాను. ఏవో బిల్లులు ఆగిపోయాయని అప్పు, వడ్డీ మరింత లోను తీసుకుని పది కోట్లకు పెంచాడు. వాయిదా దాటినా తిరిగి కట్టలేదు. నా బుర్రను అనుమానం పురుగు తాలిచింది. ఓసారి కూచోబెట్టి బలవంతంగా తెల్లకాయితమ్మీద రాయించుకున్నాను. ఆ తర్వాత అతడు ఇల్లు ఖాళీ చేశాడు. మళ్లీ కనబడలేదు. సొసైటీలో నగదు నిల్వలు లేవు. సభ్యులకు లోన్స్, ఖీక్సెడ్ డిపాజిట్ దార్లకు తిరిగి సొమ్ము చెల్లించలేకపోయాను. ఆ విషయం కార్యవర్గానికి తెలుసు. అయినా బాధ్యతంతా నా మీదికి నెట్టేసి చేతులు దులుపుకున్నారు. ఎవరో పోలిసు రిపోర్టిచ్చారు. పూర్తి స్థాయి ఆడిట్‌తో నా బండారం బయట పడింది. వెంటనే అండర్గ్రౌంద్కెళ్లిపోయాను. సమస్యల వలయంలోంచి బయట పడేందుకో లీడింగ్ లాయర్‌ను సంప్రదించాను. అతని సలహాపై పోలిసులకు లొంగిపోయాను.
జీవితమంటే సుఖాల కోట కాదు, కష్టసుఖాల కావదని గుర్తొచ్చింది. దర్యాప్తు సొగింది. నేను యాఖై రోజులు జైలు ఊచలు లెకృబెట్టాను. దర్యాప్తులో కార్యవర్గ సభ్యులంతా బాధ్యులేనని తేల్చి వారినీ అరెస్టు చేశారు. నా ఆస్తుల్ని జప్తు చేసి పన్నెండు కోట్లు జమ చేసుకున్నారు. కాని గోల్మాల్ సొమ్మును కార్యవర్గ సభ్యులందరికీ పంచగా నా వంతుకు పదికోట్లు వచ్చింది. రంగారావు గూడా దొరికి పోయాడు. దర్యాప్త సమయంలో కొందరు నేను దేవుడిలాంటి వాణ్నని వాదించారట. లాయర్ వాదనలతో బెయిలు దొరికింది. డిపార్ట్మెంటు డ్యూటిలోకి తీసుకుంది. ఆరునెలల్లో రిటైర్మెంటుంది. కేసు పరిష్కారమయేదాకా పెన్షన్ మాత్రమే ఇచ్చి, మిగితా పెన్సనరీ బెనిఫిట్స్ ఆపేస్తారు..” కళ్లు ధారాపాతాలైనాయి. గబుక్కున ఒడిలోకి లాక్కున్నాను. నా గుండె కరిగింది.
కమల ఎప్పుడొచ్చి కూచుందో... “మరిప్పుడెట్లా?” అడిగింది.
“నా ఆశాసౌధం పేకమేడలా కూలిపోయింది వదినా. చిన్న కొడుకు ఉద్యోగి. మీ వదిన, నేను వానింట్లోనే అద్దె కొంపలో ఉంటున్నాము. పెద్దోడు వాని పేరు మీదున్న షాపింగ్ కాంప్లెక్సులో, కూతురు అత్తారింట్లో ఉంటున్నారు. ఒకవేళ కోర్టు తీర్చు నాకు వ్యతిరేకంగా వస్తే నేను జైలుకెల్తాను. అప్పుడు పెన్షన్ కూడా రాదు. నేనిప్పుడు తెగిన గాలిపటాన్ని వదినా...” తలబాదుకున్నాడు.
నాలోని అల్లకల్లోలాన్ని అణుచుకుని “కష్టాలు మనుషులక్కాక మానుకొస్తాయా” అంటూ ఊరడించాను. “ప్రస్తుతం నీ ఆలోచన ఏమిటి నవనీతం?” ఆప్యాయంగా అడిగాను. హైద్రాబాదులో మొహమెత్తుకు తిరగ లేను. నా భార్య నగలమ్మి ఓ ఇల్లు కొనుక్కుని ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. బాల్య స్నేహతుల మధ్య కష్టాలన్నీ మరిచి పోతాననిపిస్తుంది. ఒకవేళ నాకు శిక్ష పడితే నా భార్య ఆగమైపోతుంది. ఆమెకు మీ ఆసరా ఉంటుంది. చిన్నపిల్లాడిలా వెక్కుతున్నాడు.
“వీ కంటిలో సంతోషాన్నే కాని, కన్నీరు చూడలేదు.” తో ప్రాదంభించి కమలతో కలిసి ఊరడించాను. ధైర్యం చెప్పాము. “నాకో ఇల్లు చూసి పెట్టే బాధ్యత నీదేనన్నారి నా చేతులందుకుని కళ్లకద్దు కున్నాడు. పెదాల మీద చిరునవ్వు కదిలింది. “తప్పకుండా... నువ్వు రిటైరయే లోగా ఓ ఇల్లు చూసి పెట్టడం నా వంతు.. సరేనా!” భరోసా కల్పించాను. ఆప్తమిత్రుడు తృప్తిగా నిట్టూర్చాడు. (చేతన” నవంబరు-2014) పల్లే నా తల్లి [31] ఐతా చంద్రయ్య
దుడ్డుకర్ర
పచ్చని పంట చేనును చూస్తూ తనలోతానే నవ్వుకుంటున్న రైతులా ఉదయాకాశం రంగులు దిద్దుకుంటూ మురిసిపోతోంది. పట్టణ సరిహద్దులకు కూత వేటు దూరములోనున్న లింగారెడ్డివల్లి..వల్లెలు దేశానికి వట్టుగొమ్మలన్న మవోత్మాగాంధీ సందేశాన్ని నెమరేసుకుంటోంది.
మూడు పదుల వయసు దాటిన ముగ్గురు యువకులు ఊరు దాటి కాలినడకన పట్నానికెళ్లే తార్రోద్దు మీదికొచ్చారు. టక టక శబ్ధాలతో బూట్లు మాట్లాడుకుంటూంటే మాటామంతితో మార్చింగ్ వాక్ సొగిస్తున్నారు. ఆ ఊళ్లోనే పుట్టి, పెరిగిన వారికి మార్నింగ్ వాకింగులో తప్ప మరెక్కడికెళ్లాలన్నా బైకు సవారీయే. మాటామంతిలో ఊరి రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి.
ఆ ముగ్గురూ పట్నం కార్యాలయాల్లో (ప్రభుత్యోద్యోగులు హాపీగా నవ్వుకుంటూ వంద గజాల దాకా నడిచారు. అలసట ఆవహించింది. రోజుట్లాగే రోడ్డు పక్కన పల్లవిస్తున్న గుడిసె హోటల్లో వేడి చాయలు సేవించి వాడిగా నడక ప్రారంభించారు. బారెడు పొద్దెక్కింది. రోడ్డు మీద వాహనాల ఉనికి శ్రీకారం చుట్టుకుంది.
కుడిపక్కన అరవింద్, మధ్యనున్న రవిచంద్ర, అటువైపున నాగభూషణం వరుసల్లో నడుస్తున్నారు. రోజూ మార్షింగ్వాక్ తర్వాత తయారై పట్నంకెళ్లి రాత్రికల్లా ఇంటికి రావడం వారికలవాటైంది. వెనకటి రోజుల్లోని మనుషుల గట్టిదనం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆనాదు రసాయనిక ఎరువుల్లేని పంటలే ఆ గట్టితనానికి కారణమని తేల్చేశారు. చివరిక్షి “ఈ రోజుల్లో మనలాంటి యువకులు గూడా రోగాల పాలవుతున్నారు. మన ముగ్గురిలో ఒకరికి షుగర్ ఒకరికి బిపి, మరొకరికి అధిక బరువు” అన్నాడు రవిచంద్ర. ఆ మాటతో ఏకీభవించారు. వెనకనుండి కిర్రుచెప్పుల నడక జోరుగా వినబడింది.
వెనక్కు తిరిగి చూశారు. చేతిలో దుడ్డుకర్ర, మోకాలు దాకా మలిచిన దోవతి, నెత్తికి రుమాలుతో రంగరాజము వేగంగా నడిచి వస్తున్నాడు. మన వెనకెందు కౌస్తున్నట్టా? ముగ్గురిలో ఆందోళన, గత ఆదివారం కచేరి వద్ద జరిగిన పంచాయతీలో ముగ్గురూ రంగరాజముకు వ్యతిరేకంగా మాట్లాడారు. అందుకు పగదీర్చుకునేందుకే మన వెంట పడ్డట్టుంది. గుండెల్లో గుండ్రాయి దొర్లింది. ముగ్గురూ సైగలు చేసుకుని పరుగందుకున్నారు.
రంగరాజము దుద్దు కర్ర ఊపుతూ అంగలేస్తూ నడుస్తున్నాడు. కొద్ది సేపట్లోనే కిర్రు చెప్పుల నడక, రన్నింగ్ షూస్ పరుగు సమానమైనాయి. మూడు నిమిషాల పరుగు. అలవాటు లేని పరుగు... దమ్ముదీస్తున్నారు. “ఎరక్కపోయి ఇరుక్కున్నాం దోస్తొ నాగభూషణం పశ్చాత్తాపం. “ఆదివారమునాడు టీ.వి. చూస్తూ కూచుండక ఆ పంచాయతీకి పోయినంొ అరవింద్ గురగుర.
“అగో..ఆ కుడిపక్క బాటమీదికెల్దాం పదండి.” రవిచంద్ర సలవా ముగ్గుర్ని అటు మళ్లించింది. వెనక్కు తిరిగి చూసిండ్రు. రంగరాజము గూడా బాటమీదకొచ్చిందు. మరికొద్ది సేపు పరుగు... పిక్కలు పట్టేసినై. నాగభూషణం ఆగి, రెండు చేతులతో ఇద్దర్నీ ఆపేశాడు. “ఇహ పరుగెత్త లేము. అతన్నే క్షమించుమందాం” రొప్పుతూ సలహా విసిరాడు. ముగ్గురు ముక్కోణాకారములో బాట మీద కూచున్నారు. భారమంతా భగవంతుని కొదిలేసిండ్రు.
పక్సూరి కేదో పనిమీద వెళ్లి, రాత్రికి అక్కడే బస చేసి తిరిగి వస్తున్న ఆ ఊరి కానిస్టేబుల్ కనకయ్యను ఆశ్చర్యమావరించింది. ముక్కుమీద లాఠీ వేసుకుని “రాస్తారోకో చేస్తున్నారా (ఫైండ్స్?” వాళ్ల చుట్టూ తిరుగుతూ ఎగర్రటోపీ సవరించుకున్నాడు. వాళ్లకతడు క్లాసుమేటు, ఖాకీడైస్సు కనబడగానే ముగ్గురు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. “అటు చూదు కకకన్నా! రంగరాజము మా వెంటబడి తరుముకొస్తుండు. దొరికితే దుడ్దుకర్రతోని మా వీపులు సాపు జేస్తడు.” నాగభూషణం మూడు ముక్కల్లో విషయం చెప్పిండు. కనకయ్యకంతా అర్థమైంది.
గబగబా వస్తున్న రంగరాజమును లాఠీ అద్దుపెట్టి ఆపేసిందు. “ఆగు రంగరాజమన్నా! మనమంతా ఒక్క ఊరోళ్లము. అభిప్రాయబేధాలుంటే చర్చల ద్వారా సమన్యను పరిష్కరించుకోవాలె.” దుద్దు కర్ర లాక్కుని ముగ్గురికీ సైగచేశాడు. ముగ్గురూ లేచి రంగరాజము చేతులు పట్టుకుని “ఈసారి మమ్ముల్ని క్షమించు”మన్నారు. బతిమాలారు. కనకయ్య సపోర్టు చేసిండు.
రంగరాజము రుమాలు సర్దుకుని “అవన్నీ నాకు అర్థంగాలేదు కనకన్నా. నన్నెందుకు ఆపేసినవూ?” అసహనంగా అడిగిండు.
“చూడు రంగన్నా! వాళ్ల చదువుకు న్నోళ్లు..” కనకయ్య సముదాంచబోయాడు.
“అయితే నాకేంది? నన్నిడ్రువన్నా!” అరిచిండు.
“వాళ్లను కొడితే నీకేంలాభం?” కనకయ్య ప్రశ్న
“అహా, ఆదివారం నాడు పంచాయతీల వాళ్లు నీకు వ్యతిరేకంగా మాట్లాడిండ్రని పగబట్టినవట గదా!” కనకయ్య పక్కకు జరిగిండు.
రంగరాజము మీసాలు మెలేసిండు “ఆదివారం సంగతి ఆనాడే మరిచిపోయిన వాళ్లమీద నాకెందుకు పగా?”
“మరి వాళ్లవెంట ఎందుకు వస్తున్నావు?”
“షోద్దుగాల్ల పాలు పిండుదామని వాకిట్ల చూస్తే బరైలేదు. గుంజ ఖాళీగా వుంది. కట్టేసిన తాడు తెగి వుంది. అగో.. అక్కడ మా పొలము పక్కన పశువుల దొడ్డి ఉంది. బఐరై అటు పోయిందేమోనని వెతుక్కుంట వస్తున్న పక్కకు జరుగుండ్రి” ముగ్గుర్ని తోసుకుని ముందుకెళ్లిండు. కానిస్టేబుల్ కనకయ్య ఎర్ర టోపిని ఎదమచేతిలోకి తీసుకుని కుడిచేతి లారఠీతో నెత్తి గోక్కున్నాడు.
(మెరుపు - ఆంధ్రభూమి 28-11-2015) నక న నాన క్ న
చెక్కు - చిక్కు
అందాల భార్య పుట్టింటి కెళ్లిందంటే భర్త మహారాజుకు ఆడుకున్నంత ఆట, పొడుకున్నంత పాట అనుకుంటారు గాని నాకు మాత్రం నా బెటరాప్ అమరావతి అందుబాటులో లేకపోతే ప్రాణం ఆగమాగమైపోతుంది. వంటింట్లో అడుగు పెట్టాలంటే అనుమానాలు అలుముకుంటాయి. కాని అమరావతి పుట్టింటికెళ్లక తప్పలేదు. పాతికేళ్లు ఒంటరిగా ఉన్నవాడిని ఓ పది రోజులు జంట లేకుండా ఉండలేనా? అనుకుని అంతరంగ తరంగాలను అణిచి పేట్టేశాను. పట్టిన పట్టు సడలకుండా వంటింటి షెల్ఫులోని డబ్బాలన్న్నీ వెదికి, వేటాడి విజయం సాధించాను. ఇష్టపూర్తిగా కష్టపడి చాయ్ కాచుకుని కప్పులో పోసుకున్నాను. పిల్లాపీచు కూడా లేరాయె. టీ.వి. కెదరుగా సోఫాలో జేరగిలబడి గరం చాయ్ జుర్రుకుంటూ వార్తావాహిని చూస్తున్నాను. వార్తలు, విశేషాలు మాంచి రసపట్టులో వున్నాయి.
టీపాయ్ మీద హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న సెల్‌ఫోన్ గొల్లుగొల్లున నవ్వింది. అది నన్ను అపహాస్యం చేయడం లేదు గదా! టీ.వి. ఆపేసి సెల్‌ఫోన్ గొంతు నొక్కాను.
“ఆ... నేనే మాట్లాడ్తున్నానండీ!” అమరావతి గొంతు శృతి తప్పిన వీణా నాదములాగుంది. “మా తమ్ముని కివ్వాళ సాయంత్రం ఆపరేషనుంది. సాయంత్రం నాలుగు లోగా నలభైవేల రూపాయల అడ్వాన్సు కట్టుమన్నారు హాస్పిటల్ డాక్టర్లు. వాళ్ల దగ్గరో పద్ వేలున్నాయట. మిగతాది మనన్ని సర్దమన్నారు. మనకెన్నోసార్లు డబ్బు సాయం చేశారు గదా
“అయితే ఏందటా! అనలు విషయం చెప్పెయ్. నీ ఉపోద్దాతము బంగాళాఖాతమౌతుంది... అన్నట్టు నువ్వు త్వరగా వచ్చెయ్!”
“అదేం మాటండీ?” ఆవిడ గొంతులో అసహనం ఛాయలు. “పది రోజుల క్రితం ముష్ఫయ్యైదు వేల రూపాయల చెక్కు బ్యాంకులో వేశారు గదా! అదెప్పుడో క్షియరయ్యుంటుంద్ని _ ఓ ముప్ఫైవేలు డ్రా చేసి తీసుకొని వెంటనే రండి. అన్నట్టూ... పోస్టాఫీసు ఆర్డీ కట్టాలి. ఈ రోజు నెల చివరి తేది గదా! అర్జీ కూడా కట్టేసి వెంటనే రండి” నాన్‌స్టాప్‌గా చెప్పేసి ఫోన్ కట్ చేసింది. చఛా! వినోదంలో విషాదం! మళ్లీ నేనే రింగ్ చేశాను.
“నిన్న మీ తమ్మునికి ఆక్సిడెంటైందని ఫోన్ రాగానే వెళ్లావు గదా! పరిస్థితి ఆపరేషన్ దాకా వచ్చిందా లేక నన్ను పరేషాన్ చెయ్యాలనా? నిజం చెప్పు అమరా?”
“అబ్బా! అనుమానం ముందు పుట్టి ఆ తర్వాత మీరు పుట్టినట్టుంది. ఆపద సమయములో అన్ని అనుమానాలా? నేను చెప్పేది అక్షరాలా నిజం. ప్రాణాపాయం లేదట కానీ, వాని తుంటి ఎముక పగులు చూపిందంటా! ఆపరేషన్ చెయ్యకపోతే అపాయమటా! మీరు డబ్బుతో త్వరగా రండి" ఫోన్ కట్, ఆవిడ గొంతులో ఆందోళన... నిజమే అయ్యుంటుంది.
మాది మధ్యతరగతి మందహాసము. నేను సామాన్య ఉద్యోగిని. మా పెళ్లికాక ముందు అమరావతి నాన్న హైద్రాబాదులో పేరున్న కోటీశ్వరుడు. ఒక్కగానొక్క కూతరును నాకిచ్చి ఘనంగా పెళ్లిచేశాక వ్యాపారాల్లో నష్టాలు ముసురుకున్నాయట. అది తట్టుకోలేక మిగిలిన నామ మాత్రపు ఆస్తుల్ని అమరావతి తమ్మునికప్పగించి అత్తా మామలు వారం రోజుల తేడాతో గుండెపోటుకు గురై అమర లోకాలకెళ్లారు. అసామాన్యుడిగా పెరిగిన బామ్మద్ది రాంనారాయణ అతి సామాన్యుడయ్యాడు. అదంతా... వాళ్లింట్లో అదృష్ట దేవత లాగున్న అమరావతి బయటికొచ్చిన ఫలితమేనని మూధాచారాల మూర్చల వాదన. కానీ...నేను వాళ్లింట్లో అల్లుడిగా కాలుబెట్టిన నా ఐరన్‌లెగ్ మహత్డుమే కావచ్చని...ఇప్పటికీ నా అంతరాత్మ అఘోరిస్తుంది.
ఓ పత్రిక్కి సీరియల్ నవల రాసిన పారితోషకముగా ముష్ఫయ్యైదువేల రూపాయల చెక్కొచ్చింది. పదిహేను రోజుల క్రితమే దాన్ని బ్యాంకులో అప్పగించిన సంగతి అమరావతికి తెలుసు. ఈ రోజుల్లో ఏ బ్యాంకు చెక్షైనా ఆన్లైన్ సిస్టమ్‌లో త్వరగా క్షియరైపోతుంది.
అర్థాంగి ఆదేశం అనుల్లంఘనీయము గదా! ఆఫీసుకు సెలవు పంపించి ఏ.టి.ఎం. కార్డు, ఆర్డీ పాసుబుక్కు జేబులో వేసుకున్నాను. రిజిష్టర్ పోస్టులో చెన్నైకి పంపాల్సిన పుస్తకాలు పోద్దున్నే ప్యాక్‌చేసి వుంచాను. పుస్తకాల ప్యాకెట్ గూడా తీసుకొని బయలు దేరాను.
హోటల్లో ఇడ్లీవడకు కొనసాగింపుగా ఉప్మాపెసరట్టు లాగించి ఏ.టి.ఎం. సెంటర్‌కు బయలు దేరాను. డబ్బుపోతే పోయింది గాని, కొబ్బెరి చట్నీ సూపర్... సాంబార్ మరీ రుచిగా వుంది. ఆలోచనలతో అడుగులేస్తూ ఏ.టి,ఎం, మిషన్ ముందు లైన్లో నుంచున్నాను. నా వంతు రాక ముందే ఏ.టి.ఎం. మిషన్ చెడిపోయింది. జనాలంతా చెదిరిపోయారు. బ్యాంకుకు నడిచి వెళ్లాను. కాళ్లకు ఎక్సర్సైజ్ లేకపోతే మోకాళ్ల నొప్పులు పలుకరిస్తాయనే భయంతో బైకును బయటకు తీయలేదు. పదికి బ్యాంకు కౌంటర్లు తెరుచుకోవు. ఇంకా అరగంట టైముంది. కిలోమిటరు దూరం హాయిగా నడిచి హెడ్ పోస్టాఫీసు చేరుకున్నాను.
ఆరోజే కొత్తగా విడుదలైన సినిమా టికెట్ల క్యూలా కిటకిటలాడే కౌంటర్లు ఖాళీగా వున్నాయి. పోస్టాఫీసు దివాలా తీయలేదు గదా! అన్పించింది. గబగబా పోస్టు మాస్టర్ నన న
వద్దకెళ్లి అరువు చిరునవ్వుతో “ ఇవ్వాళ్ల సెలవా సార్?” అని అడిగాను. ఆయన నుదురు ముడిపడింది. అతడు కూడా కృత్రిమ చిరునవ్వు పులుముకుని “ఇది కంప్యూటరైజ్డ్ ఆఫీసు సార్! రోజూ ఉదయం పదినుండి పన్నెండుదాకా కరెంటు కట్టుగదా! కరెంటు ఉంటేనే కంప్యూటర్లు పంజేస్తాయి. ఇంకా పన్నెండు కాలేదు గదా! అప్పుడు కౌంటర్లు పంజేస్తాయి. సారీ ఫర్ది ట్రబుల్ అని తన పనిలో మునిగాడు.
“మ్సీ ఆఫీసులో జనరేటరుంది గదా సార్!”
“ఉంది, ఏనుగు దంతములాగా. అది చెడిపోయి పదిరోజులైంది. పై అధికారులకు, కంపెనీవాళ్లకు లెటర్లు రాశాము, ఫోన్లు చేశాము..” పెదాలు చప్పరించాడు.
“అయినా... ఇదంతా దున్నపోతుమీది వాన అయింది గదా సార్! మీ పై అధికారుల టెలీఫోన్ నెంబరిస్తారా? నేను వినియోగదారుల సంఘము కార్యదర్శిని.”
“అవన్నీ బయట బోర్జుమీదున్నాయి సారూ!”
దివాలా దీసిన కోటీశ్వరుడిలా నెమ్మదిగా బయటికొచ్చాను. బోర్ట్డు మీద నెంబర్లున్నాయి. సెల్‌ఫోన్ చేతిలోకొచ్చింది. ముందు పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్‌కు రింగ్ చేశాను. అసిస్టెంట్ సూపరింటెండెంట్ లైన్లోకొచ్చానన్నాడు. నా పరిచయము చెప్పి, జనరేటర్ సంగతడిగాను.
“స్పార్రీ సర్! సూపరింటెండెంట్ సారు క్యాంపుకెళ్లారు, వారి సెల్‌ఫోన్ నెంబరివ్వలేను.”
విషయమంతా చెప్పాను.
“అదా సంగతీ! దానికి మేజర్ రిపేర్ కావాలట. మా పై అధికారుల పర్మిషన్ కోసం రాశాము. వారు ఎస్సంటే వెంటనే జనరేటర్ రిపేర్ చేయించి మీ సేవలో ఉంచుతాము" ఫోన్ కట్.
అది జీర్ణించుకోలేక లోపలి నుండి అహం పొదుచుకొచ్చింది. పోస్టుమాస్టర్ జనరళీ ఆఫీసుకు రింగ్ చేశాను. పి.ఎ.లైన్లో కొచ్చాడు. “పోస్టు మాస్టర్ జనరల్ గారితో మాట్లాడాలి." నా పరిచయం గూడా చేసుకున్నాను. విషయం చెప్పాను. “మా పి.ఎం.జి. గారు చీ! పి.ఎం.జి. ఆఫీసు కెళ్లారు సార్. మీరు మా దైరెక్టర్గారితో మాట్టాడొచ్చుగదా!”
డైరెక్టరాఫీసు నెంబరు బోర్డు మీదుంది. రింగ్ చేశాను. మేడమ్ గొంతు వినబడింది సమస్య చెప్పి డైరెక్టర్ గారికి కనెక్షనివ్వమన్నాను. ఆవిడ “నేను పి.ఎ.ను గదా సార్! డైరెక్ట! గారేదో కాన్ఫరెన్స్‌కు ఢీల్లీ వెళ్లారు.” అంది. “వారి సెల్‌ఫోన్ నెంబరివ్వండి” అని అడిగాను
“ఆఫీసర్ మొబైల్ నెంబరిస్తే నాకు అక్షింతలు తప్పవు సార్” కిసుక్కున నవ్వి! శబ్ధం వినబడింది. పైగా అసిస్టెంటు డైరెక్టర్‌తో మాట్లాడమని ఉచిత సలహా పారేసి, ఆయః లాండ్‌ఫోన్ నెంబరిచ్చింది.
న వన న క్ న నన
రింగ్ చేశాను. ఏ.డి.గారు లైల్లో కొచ్చారు. సమస్య వివరించాను. “సార్ డైరెక్టర్‌గారు రాగానే గుర్తు చేస్తాను. నాకు పర్మిషనిచ్చే పవర్సు లేవు” ఫోన్‌కట్. కొరివితో తలగోక్కున్నట్టెంది.
కాలమైనా, కడలికెరటమైనా మనిషికొసం ఆగవు గదా! బుర్ర గిర్రుమంది. పరుగులాంటి నడకతో వెళ్లి బ్యాంక్ కౌంటర్ క్యూలో నిల్చున్నాను. ఎగదోసుకొస్తున్న ఆయాసాన్ని అదుపు చేసుకుంటూ అరగంట క్యూలో నడిచి కౌంటర్ ముందు కొచ్చాను. నా ఏ.టి.ఎం. కార్డు కౌంటర్ క్లర్ముకిచ్చి పిన్ నెంబరు చెప్పాను. ఆయన కంప్యూటర్లో నా ఎకౌంట్ నెంబర్లో చూసి “మీ బాలెన్స్ రెండు వేలుంది. ముప్ఫైవేలు ఇవ్వలేము గదా!” కార్డు వాపసిచ్చాడు.
“పదిహేను రోజుల క్రితం ముప్పయ్యైదువేల రూపాయల చెక్కు వేశాను సార్!” గొంతులో అసహనం.
“అదింకా క్లియర్ కానట్టుంది సార్” పెదాలమీద చిరునవ్వు, కళ్లల్లో చురకత్తుల మెరుపులు.
ట్రైం పన్నెండైంది. బ్యాంకు జనసంద్రమైంది. నా మనసులాగే వాతావరణం
' _ గందరగోళమైంది. బ్యాంకు మేనేజర్ చాంబర్లో చొరబడ్డాను. నా సమస్య విన్నవించి చిక్కుముడి విడదీసి సాయం చెయ్యాలని బతిమాలాను. ఆయన అదోలా చూస్తూ ఎకౌంటెంట్ నడుగమన్నాడు. లోపలి బుసబుసలు బయట పడకుండా జాగ్రత్త పడతూ ఎకౌంటెంట్ వద్దకెళ్లి గోడు వెళ్లబోసుకున్నాను. కౌంటర్ ఫాయిల్ తీసుకుని ఆయన కంప్యూటర్లో చూశారు. “సారీ సర్! మీరు ఆ చెక్కును డడ్రాపింగ్ బాక్స్‌లో వెయ్యడం మరిచుంటారు.” కాజువల్‌గా అన్నాడు.
తలలో జేజమ్మ చిర్రుబుర్రులాడింది. “డ్రాపింగ్ బాక్స్‌లో నా చేతితో నేనే ఆ రోజు వేశాను సార్.”
“ఆ రోజుగాని, మర్నాడు రోజుగాని డ్రాపింగ్ బాక్సు లోంచి తీసిన చెక్కుల లిస్టులో మీ చెక్కులేదు. పొరపాటున మరో బ్యాంకు డ్రాప్ బాక్కులో వేసుంటారు” బ్రహ్మ రహస్యంలా అన్నాడు.
గుండె గుభేల్ మంది. “అదన్యాయం సార్! ఈ బ్యాంక్ ద్రాప్ బాక్సులోనే వేశాను. నేను వినియోగదారుల సంఘం కార్యదర్శిని.”
“మా కందరూ ఒకటేసార్. ఎందుకైనా మంచిదొ ముసిముసిగా నవ్వాడు. ఆ నవ్వులు కాటువేసేందుకు పదగెత్తిన పాము కొరల్లా కన్పించాయి. “మీరు సాయంత్రం ఐదు తర్వాతోసారి రండి. సావకాశంగా చూద్దాం.”
" బ్యాంకు అధికారుల భరతం పట్టాలన్పించింది. కాని దాని వల్ల నష్టమేకాని లాభం లేదనించింది. అంగలేస్తూ పోస్టాఫీసుకెళ్లాను. కౌంటరు ముందు చాంతాడంత క్యూ వుంది. అరగంట క్యూలో నుంచుని కౌంటరు ముందు కొచ్చి ఊపిరి పీల్చుకున్నాను. మొహమ్మీద
గుద్దినట్టు కౌంటర్ మూనుకుపోయింది. అది లంచ్ టైమన్నారు. కుడితిలో పడ్డ ఎలుకలాగయ్యాను.
కడుపులోంచి ఆకలికేకలు... ఏ పాట తప్పినా సాపాటు తప్పదు గదా! హోటలీకెళ్లి భోంచేస్తున్నాను. జేబులో మొబైల్ ఫొన్ మొత్తుకుంది. తీసి చూశాను. అది అమరావతిది. “ఏమైందండీ? డబ్బుకోసం ఎదురుచూస్తున్నాం, (డ్రా చేసి తీసుకొస్తున్నారా? మా తమ్ముడు బాధపడ్డున్నాడు మహవానుభావాకా గొంతులో రవ్వంత వెటకారముంది.
నేను చెప్పనదంతా విని గొల్లున ఏడుపందుకుంది. “మరిప్పుడెలాగండీ? మీరు డబ్బు తెస్తున్నారని మా తమ్మునితో చెప్పాను.”
“నెలాఖరు గదా! అప్పు గూడా దొరకదు” తిండి సయించలేదు.
“ఏదన్నా ఉపాయం చెప్పండీ!”
“ఒకటే ఉపాయం. నీ మెడలో వున్న ఒంటిపేట గొలుసు అమ్యెయ్. మరెప్పుడన్నా చేయించుకోవచ్చు.”
“అయ్యయ్యో! అది మా అమ్మమ్మ చనిపోయే ముందు నా మెడలో వేసిందండీ” వెక్కుతోంది.
“ఆమె నీ తమ్మునిగ్గూడా అమ్మమ్మనే గదా!” ఫోన్‌కట్ చేశాను.
మళ్లీ పోస్టాఫీసుకు కాళ్లీడ్పుకుంటూ వెళ్లాను. అర్జీ పాసుబుక్కులో డబ్బులు కట్టేశాను. మనసంతా కొంగలు తొక్కిన మడుగులాగైంది. ఇంటికొచ్చి ఉసూరుమంటూ సోఫాకొరిగి కూచున్నాను. లోలోపల ఏదో కెలుకుతోంది - ఓ రోజు సెలవు గోవిందా! పెళ్ళాం మెడలోని బంగారు గొలుసు బలాదూర్... అలా కాసేపు గడిచాక నాలోని వినియోగదారుల సంఘం కార్యదర్శికి రోషం పొడుచుకొచ్చింది. పోస్టుమాస్టర్ జనరల్‌కు రింగ్ చేశాను. మళ్లీ పి.ఎ.నే లైనులో కొచ్చాడు. పి.ఎం.జి. ఏదో మీటింగ్‌లో ఉన్నాడట. తర్వాత రింగ్ చేయమన్నాడు.
నెత్తికొట్టుకోవడం మినవో మరేమీ చెయ్యలేక పోయాను. ఓసారి మా వినియోగదారుల సంఘము ద్వారా బట్టలషాపతనిపై కన్ఫ్యూమార్స్ ఫోరంలో కేసు వేసి గెలిచి నష్టపరిహారం తీసుకున్న బాలయ్య నవ్వుతూ వచ్చాడు. కూచొమ్మన్నాను. పోస్టాఫీసు విషయంలో ఫోరంలో కేసు వేయాలని సలహా యిచ్చాడు.
“అదేదో మీరే వెయ్యవచ్చు గదా!” అని మొహంలోకి చూశాను. ఆయన మొహం పంచరంగుల చిత్రంలాగైంది.
“నాతో ఆ పని అవుద్దా?”
“ఎందుక్కాదు? పోస్టుమాస్టర్లో జనరేటర్ సంగతి రాత పూర్వకముగా రాబట్టాలి. అందుకోసం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చెయ్యాలి. దానికి పది రూపామళ ఫీజు ఉంటుంది. ఆయన నెలరోజుల్లోగా జవాబివ్వాలి. ఆ జవాబు మన కన్యాయమనిపిస్టే చాన్ కావో
అప్పుడే ఒక అఫిడవిట్ రాసి ఓ అడ్వకేట్ సంతకం తీసుకోవాలి. ఆ తర్వాత కన్ఫ్యూమర్ ఫోరంలో కేసు వెయ్యాలి. దానికి వంద రూపాయల ఫీజు కట్టాలి. ప్రతి హియరింగ్‌కు ఫోరం కోర్టుకు హాజరు కావాలి...” నేను చెప్పడం పూర్తి కాలేదింకా.
“అదంతా నా కేసు వేసినప్పుడు చూశాను గదా. అర్జెంటు పనుంది. వస్తా సార్...” అంటూ తల నేలకేసుకుని వెళ్లాడు. .
సాయంత్రం అయిదింటికి బ్యాంకుకెళ్లాను ఆశగా. బ్యాంకులో సెక్యూరిటీ గార్డు తప్ప ఎవరూ లేరు. సీట్లన్ని బోసిపోతున్నాయి. సెక్యూరిటీ గార్జునడిగాను. “ఎకౌంటెంట్ గారున్నారా?” అని. అతడు నన్నో పిచ్చివాడిలా కిందినుంచి మీద్దాకా చూసి “టైమైపోయింది. బ్యాంక్ బందయింది. అంతా వెళ్లి పోయారు సార్! ఇవాళ పని తొందరగానే అయిందటా.” గన్‌తో సహా గేటు వద్ద కూర్చీలో కూచున్నాడు.
బయటికొచ్చి అమరావతికి ఫోన్ చేశాను ఏమైందని “నా ఒంటిపేట గొలుసు అమ్మేసి డబ్బులు కట్టేశాను. తమ్మున్ని ఆపరేషన్ గదిలోకి తీసుకెళ్లారు. రేపోసారి మీరు వచ్చి పరామర్శిస్తే బాగుంటుంది గదా!” ఇంకేదేదో చెప్పింది. బుర్రలో అసహనం, అసహ్యం పోటీ పడుతున్నాయి.
రాత్రంతా నిద్ర సరిగా లేదు. ముష్ఫయ్యైదు వేల రూపాయల చెక్కు కలలో కొచ్చి కలవరపెట్టింది. ఎలాగోలా ఉదయం తయారై హోటల్లో టిఫిన్ ముగించాను. ఆఫీసుకెళ్లి సెలవు పొడిగించి బ్యాంకు కెళ్లాను.
రోషం రుసురుసలాడ్డూంటే చరచరా మేనేజర్ చాంబర్లోకి దూసుకెళ్లాను. “నా చెక్కు సంగతి ఏమైంది సార్. పదిహేను రోజులైంది గదా! ఇవేనా బ్యాంకు సేవలు?” నిలదీశాను. ఆయన కూచొమ్మని సైగ చేశాడు. “మీ కేసింకా సెటిల్ కాలేదా?” ఆశ్చర్యంగా అడిగాడు.
నా ముక్కుపుటాలెగసి పడ్తున్నాయి. “సెటిలైతే మళ్లీ మీ చుట్టూ తిరగాలని నాకు సరదానా సార్?” రోషం బయటి కొచ్చింది. ఆనాటి లిస్టులు అటెండర్లో తెప్పించుకొని కంప్యూటర్లో ఏదేదో చూసి పెదవి విరిచాడు... మీరు నిజంగానే డ్రాప్ బాక్సులో వేశారా?” ప్రశాంతంగా అడిగాడు. ఒళ్లు భగ్గుమంది. “నేను మీకు పసిపిల్లాడిలా కప్పిస్తున్నానా?” అడిగాను. ఆయన అకౌంటెంటును పిలిపించుకున్నారు. ఇద్దరూ కలిసి చూశారు కంప్యూటర్లో లేదన్నారు. “అయితే అంబుడ్స్‌మెన్‌కు రిపోర్టు చేసి తీరాల్సిందే” అన్నాను.
అకౌంటెంటు బుర్రలో బొంగురాలాడుకున్నా యేమో! “అంబద్స్మెన్కా? వాళ్ల తాతకు చేసుకోండి కంప్టెంటు. మిమ్ముల్ని తిప్పుకోవాలని మాకు సరదానా?” రుసురుసలాడాడు. మేనేజర్ పక్కన వినయముగా నిల్చున్న అటెండర్ అంతా వింటున్నాడు, చూస్తున్నాడు. బుర్రగోక్కుంటూ “సార్! ఆరోజు చెక్కుల కట్టలోని చెక్కుల లిస్టుచూస్తే...” అతని మాట
పూర్తి కాక ముందే “నువ్ నోరు ముస్తావా?” మేనేజర్ గుర్రుమన్నాడు. పాపం బ్యాంకు అటెండర్ నోర్మూసుకున్నాడు. నాలో ఆశాలేఖ తళుక్కుమంది.
“నిజమేసార్! ఆనాటి చెక్కులు గూడా తెప్పించి చూడండి” గట్టిగా అడిగాను. ఇహ తప్పదన్నట్టుగా అదే అంటెండర్‌తో ఆనాటి చెక్కుల బండిల్ తెప్పించాడు. బండిల్, లిస్తూ ముందుకు తోస్తూ “మీరు చూడండి, తృప్తిగా ఉంటుంది” అన్నాడు.
ఒక్కో చెక్కును చూస్తూ అది లిస్టులో ఉందాని చూస్తూ పోయాను. ఆశ్చర్యం... బండిల్లో నా చెక్కు సురక్షితంగా వుందిగాని అది లిస్టులో ఎంట్రీ కాలేదు. వాళ్లిద్దరికీ చూపించాను. వాళ్లిద్దరు మాడిపోయిన మొహాలు చూసుకున్నారు. మేనేజర్ చెక్కును వోచర్‌తో సహా బండిల్లోంచి తీశాడు. కంప్యూటర్లో ఏవేవో ఎంట్రీలు చేశాడు.
“సారీ సార్! ఇప్పుడు మీరు డబ్బు ముప్పైయ్యేడు వేల దాకా డ్రా చేసుకోవచ్చు” అన్నాడు.
“అసౌకర్యానికి చితిస్తున్నాం సార్” అంటూ అకౌంటెంట్ చిరునవ్వు సింగారించుకుని వెళ్లి పోయాడు. అటెండర్‌కు నవ్వాగ లేదేమో! చేతిగుడ్డను మూతికి అడ్డంగా పెట్టుకున్నాడు.
అప్పుడు గుర్తుకొచ్చింది. మొన్న రిజిష్టర్ పోస్టులో పంపాలని ప్యాక్ చేసిన పుస్తకాలు ఇంట్లోనే ఉండిపోయాయని.
(“జాగ్బ్భతి" | 6-7-2015) ముత్తాత
పెద్ద మనసులు
తూర్పు ఆకాశ మైదానములో వెలుగు రేఖలు విచ్చుకుని చాలాసేపైంది. వృద్దాశ్రమాన్ని జీవితములో చివరి మజిలీగా ఎంచుకున్న వృద్ధులు వేడి చాయ కోసం వాడిచూపులు విసుర్లూ ఎదిరి చూపుల్లో బేజారైపోతున్నారు. ఆ వృద్ధాశ్రమం వారి పాలిట నందన వనము. అరమరికలు లేకుందా హాయిగా గడుపుతున్న వారికి సూర్యోదయముతో పోటీ పడుతూ నిద్రలేవడం అలవాటు. భగవన్నామ స్మరణ చేస్తూ కాలకృత్యాలు తీర్చుకుంటారు. హుషారుగా వేడి చాయ సేవించి ఒకరివెనక ఒకరు గార్జెన్‌లో ప్రవేశిస్తారు. పచ్చని గార్డెన్ ఆశ్రమం మధ్యలో వుంది. గాలి తరంగాలకు సయ్యాటలాడ్డున్న చెట్ల రెమ్మలకు బంగారు రంగులద్దుతున్న సూర్య కిరణాలను పదవారేళ్ల పడుచులా నవ్వుతున్న పూబాలలను మనసారా చూసి ధ్యానంలో మునిగిపోతారు. చిన్న వ్యాయామాలు, (ప్రాణాయామం చేసుకుంటారు. స్నానాదులు ముగించి లోకాఖి రామాయణం ముచ్చట్లలో మునిగి తేలుతూ అల్ఫ్భాహారం సేవిస్తారు. మధ్యాహ్న భోజనం, సాయంత్రం పాలు, రాత్రికి అల్పాహారం చేసి మళ్లీ గార్డెన్లో కెల్తారు. వట్ట పరువులాగున్న గడ్డిమీద కూచున్న తర్వాత ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటించుకుంటారు. లైట్ల వెలుగులో గదుల్లోకి చేరుకుని నిద్రాదేవి ఒడిలో సేదదీరడం రోజువారీ దినచర్య,
రోజట్లాడా ఆరోజు ఉదయం చాయ అందలేదు. సీనియర్ సిటిజన్స్ ప్రాణాలు గిలగిలలాడ్డ్తున్నాయి. జీవన యానములో ఎన్నో అడ్డంకుల నధిగమించి, కన్నవారిని కనుపాపల్లా చూస్తూ భవిష్యత్తుకో బాట చూపించిన తర్వాత, ఇహ ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, ప్రశాంతంగా గడపాలకున్న సమయములో వింత అనుభవాల నెదుర్మున్నారు. కడుపున పుట్టి ప్రయెజకులైన వారి పాలిట పప్పుచారులో కరివేపాకులయారు. రోషానికి దిగితే
' _ తొడపాశమన్నట్టు పిల్లల నెదిరించలేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆశ్రమములో చేరిన
వారంతా ఒంటికాలుపై మానేజర్ను నిలదీస్తున్నారు.
“ఏం నాయనా! పోద్దున్నే వేడిచాయ చుక్క గొంతులో పడకపొతే ప్రాణం మన్నుదిన్న పాములాగుంటుంది. అసలీ రోజు చాయ ఉండదా?” సవినయముగా ప్రశ్నించాడో వృద్దుడు.
“ఈచాయ నెవడు సృష్టించాడో కాని పోద్దున్నే నాల్గుచుక్కలు గొంతుతడపకుంటే
పిచ్చెక్కినట్టు గుంటుంది గదా!” వృద్ధురాలోకామె ముక్కమీద మూడువేళ్లు వేసుకుంది.
“నిజమే తప్లో మానేజర్ మాహేశ్ పరిస్థితి గూడా అట్లానే వుంది. “మన ఆ(శ్రమానకి పాలుపోసే బాలయ్య పాలు తేలేదింకా. ఇంతకు ముందేనాడైనా రావడం పడకపోతే కొడుకుతో వంపేవాడు. ఏమైందో ఏమో...” అటువైవు చూశాడు. పాలబాలయ్య పాలుతీసుకొస్తున్నాడు..“అదిగో! బాలయ్య పాలు దెస్తున్నాడు గదా! కొద్దిసేవట్లో తయారువుతుంది చాయ” అన్నాడు. అందరి (ప్రాణాలు లేచొచ్చాయి.
గరంచాయ తయారైపోయింది. ఆవురావురు మంటూ అందుకున్నారు. నరాల్లోకి జారిన చాయోత్సాహం శాంతపరిచింది. బాలయ్యగూడా చాయతాగి తిరిగివెళ్లబోతుంటే మానేజర్ రమ్మన్నాడు. మెల్లిగా వెళ్లి అతని ముందు చేతులు కట్టుకుని నిల్చున్నాడు. భయం బాపతు వణుకు మోకాళ్లను కదిలిస్తోంది. మేనేజర్ సైగజేశాడు కూచోమ్మని. చిన్న స్టూలుమీద
మెల్లిగా కూచున్నాడు. ఇబ్బందిగా మొహం పెట్టాడు.
“బాలయ్య బాబూ! నీ గ్గూడా వయసు మీరింది గదా! నిజాయితీగా పాలమ్ముకుని బతుకుతున్నాను. మాకు పాలు తేవడం గింతగానం ఆలస్యమైతే ఇక్కడి ముసలి (ప్రాణాలు ఆవురావురు మంటయిగదా[ మర్యాదగా మందలించాడు మహేశ్.
బాలయ్య కుదుట బడ్డాడు. సర్దుక్కూచుని ఆలస్యానికి కారణం వివరించి చెప్పాడు. తన సొంత సమస్య తర్వాత ఊరి సమస్యను గూడా విప్పి చెబుతుంటే తననేదో సలహా అడుగుతున్నాడన్పించింది మహేశ్‌కు. “అప్పుడప్పుడు నీకొడుకును పంపిస్తుంటివి గదా! ఇయ్యాల్లేమైంది?” ఆసక్తిగా అడిగాడు. బాలయ్య ఎదపోదలో చెప్పాలా వద్దా అనే అనుమానం ఊగిసలాడ్దోంది. ఇయ్యాల్ల మన ఆశ్రమం టట్రస్టుబోర్డు సమావేశముంది. మద్యాహ్నం అంతా వస్తారు. ఆ విషయం వాళ్ల దృష్టికి పోతే బాగుండదు గదా! మహేశ్ మొహం ప్రశ్నార్థకమైంది.
లోపలి నుండి పొంగుకొస్తున్న ఆయాసాన్ని ప్రయత్నంతో అదిమి పెట్టిన బాలయ్య “నా కొడుక్కుపట్నంల ఓ పెద్దప్యాక్టరీల మంచి నౌకరి దొరికింది. వారం కిందట పెండ్లాముతో సహా వెళ్లిపోయిండయ్యా! నా భార్యగ్గూడ జొరమొచ్చిందయ్యా!” మొహంలో ఆందోళన తొణికిసలాడింది.
బాలయ్య నిజాయితీ పరుడని అందరికీ తెలుసు. “మీ ఊరి సమస్యను మీ సర్పంచ్ పట్టించుకోడా?” మహేశ్‌కు ఆశ్చర్యమేసింది.
“మా ఊరు పక్కూరి పంచాయితికి హామ్లెట్ ఊరయ్యా! సర్పంచ్ పట్నంలనే ఉంటడు. ఆయన పిల్లలు అక్కడనే చదువుకుంటున్నారు. అప్పుడప్పుడు పంచాయితి ఆఫీసుకొచ్చి పోతుంటడు.”
మహేళ్కేమనాలో తోచలేదు. “సరే...ఆ సమస్యకేదన్నా పరిష్కార ముందేమో ఆలోచాడ్దాం!! చెప్పి బాలయ్యను పంపించివేశాడు. ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నాడు.
నెలకోసారి ట్రస్టు బోర్టు మీటింగు జరుగుతుంది. ఆ మీటింగుకు ట్రస్టుబోర్డు సభ్యులు, పదాధికారులంతా వస్తారు. ఆ(శ్రమవాసులతో మాట్లాడ్దారు. సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తారు.
ఆరోజు మీటింగు చివరలో బాలయ్య ఊరి సమస్య ప్రస్తావించాడు మహేశ్, దానిమీద కాస్సేపు చర్చ జరిగింది. ఓ నిర్ణయం గూడా తీసుకున్నారు. నిర్ణయం ఆశ్రమవాసులకు చెప్పారు. వారంతా ఉత్సాహంగా ముందుకొచ్చారు. ట్రస్టు చైర్మన్ “చేతనైన వారు మాత్రమే రావాలె. ఇది పుణ్యం, పురుషార్ధం సుమండీ” నవ్వాడు.
ఓ వృద్ధ మహిళ “ముసలోల్లు మూలకు కూచోకుండా ఏదన్నా చెయ్యగలరని సమాజానికి చెప్పుదాం” బలపరిచింది.
అది ఆదివారం. ఉదయ సూర్యుడు తన లేత కిరణాలతో భూమాతకు స్నానం చేయిస్తున్నాడు. వృద్ధాశ్రమం ఉత్సాహం వులుముకుంది. తోటలోని చెట్లు, రెమ్మలు తలలూపుతూ సూర్య కిరణాలతో రంగులద్ద్భుకుంటున్నాయి. బాలయ్యతో సహా ఆశ్రమ వాసులంతా చాయదాగి బయలుదేరి బాలయ్య ఊరుచేరుకున్నారు.
ఊరి వీధుల నిండా చెత్తాచెదారం పేరుకుపోయింది. కొన్ని దశాబ్దాల క్రితం కట్టించిన బజారు మోరీలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. తాను మునిగిందే గంగ అనుకున్నాయేమో... పందులు మోరీల్లో ఊరుకులాడుతున్నాయి. అందరి ఇళ్లముందు దుమ్ము, ధూలి, ఎండిన ఆకులు గాలి తరంగాలతో అడుకుంటున్నాయి.
ఊరి ప్రజలు విచిత్రంగా ఇళ్లలోంచి బయటికొచ్చారు. గింతమంది మా ఊరి కెందుకొచ్చినట్టూ! గవర్నమెంటోళ్లు కావచ్చు అనుకుంటున్నారు. అంతా వారిని చుట్టు ముట్టారు. ఒకాయన ధైర్యంగా ముందుకొచ్చి “అయ్యాలారా! మీరు సర్మారోళ్లా? మాకేమన్నా వ్యవసాయానికో, చేతిఖర్చులకో అప్పులిస్తారా? అటెన్మ అప్పుల్నిమాఫీజేస్తరా?” ప్రశ్నల వర్షం కురిపించాడు.
ఓ నడివయసావిడ భుజాల నిండా కొంగు చుట్టుకుంది. “ఈ ఊరి గరీబుగాళ్లకు ఇండ్లు కట్టిస్తరా?” అందరి తరపున అడుగు తూంటే మూడురాళ్ల ముక్కపుడుక మీద సూర్యకిరణాలు పరావర్తనం చెంది మెరిసాయి.
ఓ యువ నాయకుడు తనకంతా అర్థమైందన్నట్టుగా “ఎహే! గసౌంటోల్లైతే చేతులల్ల గవ్వెందుకుంటై. ఇంటిపన్ను కట్టనోళ్ల ఇండ్లతలుపులు పీక్క పోతారేమో!” అనుమానం వెలిబుచ్చాడు. అతని దృష్టిలో వచ్చిన వారంతా యుద్దానికొచ్చిన సైనికుల్లా కనబడ్డారు, ఆశ్రమ వాసులు తమలో తాము నవ్వుకుని వాళ్లొచ్చిన పనుల్లోకి దిగారు. బాలయ్య సహకారముతో పని ఊరిమధ్య నుండి ప్రారంభమైంది బాలయ్య ఊరి పరిస్థితి అందరికి చెప్తూ తానూ పనిలోకి దిగాడు.
పల్లె నా తల్లి [13] చచ
ఒక్కోవీధికి ముగ్గురు చొప్పున చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న చీపుర్లతో వీధులు ఊడుస్తున్నారు. చెత్తను పారలతో తట్టల్లో కెత్తి ఒకచోట ఊరిబయట కుప్పగా పోస్తున్నారు. ఊరంతా ఆశ్రమవాసులతో నిండిపొయింది. బాలయ్య అంతటా తిరుగుతూ ఆశ్రమవాసులకు సూచనలిస్తున్నాడు. ఊరివాళ్లకు విషయం చెప్తున్నాడు. “మనూరి నిండా దుమ్ము, చెత్త-చెదారం జమ అయింది. మనము ఊడ్పుకుంటలేము. ఇల్లు ఊడద్చిన చెత్త నిండుకుని నీళ్లు పారుతలేవు. మోరీలు చాలా గలీజై పోయినై. దాంట్ల దోమలు చాలా వున్నాయి. పందులు ఆడుకుంటున్నాయి. దాంతోని మనూరోళ్లకు జ్వరాలొస్తున్నై మనూరికి వేరో ఊరోళ్లు రావాలంటే భయపడ్డున్నారు.” సముదాయిస్తున్నాడు. ట్రస్టు చేర్మెన్, మానేజరు అతని వెంటున్నారు. చేర్మెన్ ఉత్సాహంగా ఊరివాళ్లకు చెప్తన్నాడు. “మీ ఊరి వీధుల్ని ఇప్పుడు మేము శుభ్రంచేస్తున్నం. రేపట్నుంచి మీరే (శ్రుభం చేసుకోవాలె. గట్రైతేనే మోరీలు తట్టుకోవు, దోమలుండవు, పందుల ఉనికి ఉండదు. రోగాలు, రొచ్చులు రావు, ఇండ్లల్ల గూడా మూలలనుండి ఊడ్చి, గోడలు, పైకప్పులు దులిపి చెత్తను ఊరిబయట ఒకచోట పొయ్యాలె. మన ఊరి మోరీలను మనమే శుభ్రం చేసుకోవాతె. ఎవరో వచ్చి చేస్తరనుకోవద్దు”. అమ్మలక్కలు, మొగవారు, యువతీ-యువకులు గుంపులుగా అక్కడికొచ్చి అంతా వింటున్నారు, చూస్తున్నారు. “ఓర్నియవ్వా! పాపం! గా ముసలోల్లు అక్కన్నుంచి వచ్చి మన బుజార్లు పాఫ్జేస్తున్నరు. మోరీలు గూడా సాఫ్జేసి మోరీనీళ్లను ఊరవతల ఎండిపోయిన సర్కారు బోడ బాయిల పడగొడ్డున్నరు.” ముక్కుమీద వేలేసుకుని ఆశచ్యపోయిందో యవతి. ఆశ్చర్యలో రోషం తొంగి చూసింది. యువతి-యువకులు, ఊరివారంతా ఏదేదో మాట్లాడుకున్నారు. “మనూరోళ్లకు రేషం లేదా? పత్తాలేకుంట పోయిందా? చేతగాని ముసలి-ముతక వాళ్లొచ్చి ఊరంతా సాఫ్ చేస్తూంటే మనం తమాషా చూసుడు న్యాయమా?” గుమిగూడిన యువతీ-యువకుల్లో రోషం రుసరుసలాడింది. ఒకాయన “గా మూలకున్న ముసలోల్లు వచ్చి మనూర్లె తిప్పలు వడ్తూంటే మనం చూస్తన్నంగదా! మనకూ చీమూ-నెత్తురు లేదా? పదండ్రి, మనం గూడా వాళ్లతోని కలిసి పనిచేద్దాం.” ఆవేశం వెలిబుచ్చాడు. వయో భేదాలు లేకుండా ఊరివాళ్లంతా ఇండ్లల్లోకెళ్లి తట్టలు, చీపుర్లు, పాఠరలు తెచ్చి ఆశ్రమ వాసులతో కలిసి ఊడుస్తున్నారు. వారిలో హుషారు ఉప్పొంగి అన్ని సనులూ చేస్తున్నారు. మూన్నాల్లు గంటల్లో ఊరంతా శుభ్రమైంది. తట్టల్లల్ల కెత్తిన తడిచెత్త, పొడిచెత్తను వేర్వేరు కుప్పలు పోశారు. మోరీల మురికి నీరు ఊరిబయటున్న బాయిలపడినై. బజార్లలో వున్న గుంతల్ని మట్టితో నింపేశారు. మోరీలను ఫినాయిల్‌లో కడిగేశారు. ఆధ్రమవాసులు
పొడిచెత్తను కాల్చేశారు. అంతా కలిసి కచేరి వద్ద గుమిగూడారు. ఎలా తెలిసిందో గాని సర్బంచ్ గూడా బైక్ మీద దిగాడు. అంతా చూస్తుంటే ఆయనకు సిగ్గనిపించింది. గులేరు రాయి దెబ్బదిన్న పిట్ట పిల్లలాగైంది మనసు.
ట్రస్టు చేర్మన్ మాట్లాడ్తూ “ ఆరాగ్యమే మహాభాగ్యమన్నారు గదా పెద్దవారు. మన ఇండ్లు వీధులు, మోరీలను మనమే శభ్రంజేసుకోవాలె. అభ్రైతేనే జ్వరాలు రావు. అన్నింటికి ప్రభుత్వమ్మీదనే ఆధార పడితే ఏంలాభం? మన పని మనం జేసుకుంటే మనకే నయం గదా?” వివరించి చెబుతూంటే అందరూ (శ్రద్ధగా విన్నారు.
బాలయ్యలో ఉత్సాహం ఉరకలేసింది. తానూ ముందుకొచ్చాడు. “చూస్తిరిగదా! మనూత్లె జొరాలు, రోగాలు, దోమలు, పందులతోనే వస్తున్నై. నాగ్గూడా జొరమొచ్చింది. మా ఆశ్రయం మానేజర్ సారుకు మనూరి సంగతంతా జెప్పిన గందుకే గింత సాయం జేసిండ్రు. మొన్ననే ఓ చిన్నపిల్లగాడు బాగ బీమారైతే పట్నం దవాఖానకు దీస్మపోతే అకృ్కన్నే సచ్చిపాయె. ఆ పిల్లగానికి మెదడువాపు జ్వరమటా. అది పందుల వల్ల వస్తుందటా, గలీజు ఉన్న చోటికి పందలొస్తయి. మిగతా జ్వరాలు దోమల్లోటి వస్తాయటా. మన మోరీలల్ల మురికి నీల్లు నిల్చుండిపాయె. దోమలు జాబ్బుమనె. గందుకే మన ఊరు శుభ్రము గుంటే మన ఆరోగ్యం బాగుంటుంది” చెప్పేశాడు.
వృద్ధాశ్రమం మానేజర్, మరో ఇద్దరు వృద్దులు మాట్లాడారు.
అంతా చూస్తున్న వింటున్న సర్పంచ్ ఉత్సాహంగా ముందుకొచ్చారు. “గింత ఘోరం జరుగుతుందని నాగ్గూడా తెల్పదు. మన మండల సర్వసభ్య సమావేశముల చర్చించి ఈ ఊరికి సపాయోళ్ల పోస్టులు మంజూరు చేయిస్తా అంతవర దాకా నేను ప్రజలందరితోని కలిసి బజార్లు ఊడుస్తా. కొన్ని రోజులు మనూర్లెనే ఉంట. పెద్ద పెద్ద వయసోల్లు వచ్చి మనకండ్లు తెరిపించిండ్రు. పెద్దల మాట సద్దిమూటన్నరు గదా! గీ వృద్ధాశ్రమం ముసలోల్లు మనకు తల్లి దండ్రులను కుందాం” అని సవినయముగా సమస్మరించాడు.
ఊరు జనాల మనసుల్లో పేరుకుపోయిన మురికి కలిగి మాయమైంది. “మా పాల బాలన్న మా మంచి పంజేసిండు. పెద్ద మనుషుల్లోని మనూరికి సేవజేయించిండు. ఇంగ రోజూ మన ఊరి బజార్లను, మోరీలను మనమే సాఫ్ జేసుకుందాం” అన్నాడు వార్డు సభ్యుడు.
చెత్త చెత్తగున్న పల్లెటూరు శుభ్రమై కొత్తగా తయారైంది. ఊళ్లోని ప్రజలంతా అదో పండగ రోజు అనుకున్నారు. ఆశ్రమవాసులు, ట్రస్టు సభ్యులు తృప్తిగా వెనుదిరిగారు.
“శాలివాహన” మార్చి 2018)
చొక్కారవిందము
అష్టావక్రుని అన్నయ్య అనిపించుకుంటున్న లెక్చరర్ చొక్కారావుకు అందగా ఉంటాడనిపించుకోవాలని ఆరాటం. స్టాఫ్ రూంలో తోటి లెక్చరర్లు (బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరావు' అని గుప గుసలాడుతున్నారు. పెళ్లి చేసుకోవాలని తనకు ఉంది. కానీ తాను మెచ్చిన, తనను మెచ్చిన అమ్యాయి దొరికాలి గదా! ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయిలు మూతులు, ముక్కులు వంకరగా తిప్పేస్తున్నారు. ఎందుకైనా మంచిదని జీన్‌ప్యాంటు, చుక్కల చొక్కా ఇన్షర్ట్లోకి దిగాడు. కానీ... టూవీలర్ బైక్ డైవింగ్ నేర్చుకోలేదు.
ఓ రోజు అమ్మానాన్నలతో కలిసి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కూతురు అరవింద ఇంటికి పెళ్లి చూపులకెళ్లాడు. అరవిరిసిన మందారము లాగున్న అనవింద “స్కూటర్ గానీ, బైకు గానీ నడపడం వచ్చా?” అడిగింది.
“బైకు డైవింగ్ రాదుగానీ భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకోవడం వచ్చు”నన్నాడు. అమ్మాయివాళ్ల నాన్న చెవిలో ఏదో చెప్పింది. ఆయన “చొక్కారావు గారూ! ఒక నెల లోపల మీరు బైకు గైవింగ్ నేర్చుకుని వచ్చి మా అమ్మాయిని ఎక్కించుకుని తిరిగొస్తే ఈ పెళ్లి ఓకే” అని ప్రకటించాడు. దాన్ని ఛాలెంజిగా తీసుకుని తానూ ఓకే అన్నాడు.
కానీ బైకు కావాలి, దాన్ని నేర్చేవాడు కావాలి! రోజూ బైకు మీద రయూమ్మంటూ కాలేజికొస్తున్న అటెండర్ చలపతి గుర్తుకొచ్చాడు. అతన్ని గట్టిగా పట్టుకుని “నీ బైకు మీద (గ్రౌండుకు తీసుకెళ్లి నాకు డైవింగ్ నేర్చించు”మన్నాడు. చలపతి ముసిముసిగా నవ్వి “నా టైక్ కుదరదు గానీ ఓ కొత్త బైకు కొనెయ్యండి, నేర్పిస్తొనన్నాడు. అదే రోజు బ్యాంకు నుండి క్యాష్ డ్రా చేసి చలపతితో సహా షో రూంకెళ్లి కొత్త బైకు కొనేశాడు.
చలపతి చెవుల పిల్లిలా అటూఇటూ చూసి “సారూ! ఏదైనా నేర్చేవాడు గురువు. నేర్చుకునే వాడు శిష్యుడు. మీరు అడ్వాన్సుగా గురుకట్నం సమర్చించుకోండి” సవినయముగా మనవి చేసుకున్నాడు.
ఓ వెయ్యి రూపాయలకు రెక్కలొచ్చి చొక్కారావు జేబులోంచి ఎగిరి చలపతి చేతిలో వాలినై. చలపతి మొహం వికసించింది. మర్నాడు ఉదయం చలపతి ఇంటికొచ్చి బైకుతో సహా గ్రౌండుకు తీసుకెళ్లాడు.
మొదటి రోజు థియరీ క్లాసు..బైకునెలా స్టార్ట్ చెయ్యాలి? బ్రేకులెలా వెయ్యాలి? వగైరాలన్నీ బోధించాడు. కురుక్షేత్ర యుద్ధ రంగంలో శ్రీకృష్ణుని గీతాబోధ వింటున్న పొర్థడయ్యాడు. కాస్సేపు, రెండో రోజు... బైకు ముందు గురువు, వెనక శిష్యుడు... స్టార్టింగ్,
రన్నింగ్, బ్రేకు వెమ్యడం, గేర్లు మార్చడం... ప్రాక్టికల్ క్లాసు ఫర్వాలేదనిపించింది.
మూడోరోజు ముందు శిష్యుడు, వెనక గురువు. అభ్యాసం బాగానే సాగింది, కాని ఆఖరుకు ఎదురుగా వస్తున్న లర్నింగ్ బైకును గుద్దేసింది. బైకును ఆటోలో మోసుకెళ్లి రిపేరు చేయించాల్సి వచ్చింది. శిష్యుడికి చిన్నపాటి గాయాలైనాయి. మధ్యలో వారం రోజుల వైద్యం, విశ్రాంతి.
మరో ఐదొందలు గురుకట్నం తర్వాత బైకు కదిలింది.
“రేపు మీరు స్వయంగా బైకు నడుపుతారు సార్!” అన్నాడు చలపతి. చొక్కారావు ఊహల ఉయ్యాల లూగాడు.. అరవిందతో షికారుకెళ్లొచ్చినట్టు.. దివ్యానుభూతి. రెండ్రోజుల అభ్యాసమైంది.
కాస్సేపు (గ్రౌండు ప్రాక్టీసు తర్వాత ఆ రోజు శిష్యుడు ముందు, గురువు వెనక రోడ్డుమీదికొచ్చారు. బస్టాండు రోడ్డు మీదుగా క్షేమంగా ఇంటికొచ్చారు. మర్నాడు ఫైనల్... ఎలాంటి డైరెక్షన్ లేకుండా (డైవింగ్ వచ్చేసింది. వెయ్యి రూపాయల ఫైనల్ పేమెంటు గురువుకు ముట్టింది. అటెండర్ ద్వారా ఆ విషయం కాలేజిలో ప్రచారమైంది. స్వీటు, ఖారా, కాఫీలతో సరిపెట్టాడు.
రోజు బైకుమీద కాలేజి కెళ్లొచ్చాడు. ఛల్మోహనరంగా అనుకుని బైకుమీద అరవింద ఇంటికి బయలుదేరాడు. అంతకుముందే వర్షం పడింది. రోడ్లన్నీ చిత్తడై పోయినై.
చౌరస్తా దాటి చూశాడు. లారీ ఎదురగా వస్తోంది. గుండెల్లో డప్పులు కొట్టిన. బండి గడగడలాడి నీళ్ల గుంతలో పడేసింది. లారీ తన మానాన తాను వెళ్లిపోయింది. పోలీసులు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పరుగెత్తుకొచ్చారు. ఇన్స్పెక్టర్.. అరవింద తండ్రి. ఇద్దరు విద్యార్థు లొచ్చి బైకును, చొక్కారావును లేపారు. గాయాలేవీ లేవు గానీ, వేషం మారిపోయింది. “అయ్యో! మీరా సార్! కొరివి దెయ్యం లాగయ్యారు సార్!” నోర్లు తెరిచారు స్టూడెంట్స్. వాళ్లు చొక్కారావు శిష్యులు.
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కింది నుంచి మీద్దాకా చూసి, “అరెరే! చొక్కారావు గారా?” అన్నాడు. చొక్కారావు ఎదపొదలో ఆందోళన. తన ఆశలన్నీ అడియాశలైపోయాయిని మొహం కందగడ్డయింది. ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంలోంచి తేరుకుని “పద మన ఇంటికెళ్టాం” అన్నాడు. ముందు చొక్కారావు, వెనక ఇన్స్పెక్టర్ బైకుమీద వెళ్లారు. ఇన్స్పెక్టర్ లోపలికెళ్లి అరవిందను, ఆమె తల్లిని తీసుకొచ్చాడు. వాళ్ల ముందు పరువు పంచనామా ఐపోతుందనుకున్నాడు.
“అయ్యో! ఎట్లా పడ్డారండీ!” అంటూ అరవింద చొక్కారావును లోపలికి తీసుకెళ్లి ప్యాంటు, షర్టు బురద కడిగేసింది. ఇద్దరూ వసారాలోకొచ్చేసరికి గరం ఛాయ తయారుగా ఉంది. ఇన్స్పెక్టర్ పక్కన కూచోబెట్టుకుని, “వొక్కారావు గారూ! మీ పట్టుదల మా అమ్మాయికి బాగా నచ్చింది” అన్నాడు. అరవింద బుగ్గలు సిగ్గులు సంతరించుకున్నాయి.
(మెరుపు - ఆంధ్రభూమి” 27-6-2016)
అంతా ఇంతే...
“కల కానిదీ... విలువైనదీ.... కన్నీటి ధారలలోనే....”
పొద్దు పొడిచి బారెడెక్కిందో లేదో సెల్‌ఫోన్ పిలిచింది.
“హల్లో... నేనే భవానీశంకర్‌ను. ఏం సంగతి రామా! పొద్దున్నే సెల్లుల సొల్లు
కబుర్లా?” గోరెడంత అసహనం.
రామానందం, భవానీశంకర్ బాల్యస్నేహితులు. ఒకే క్లాసులో, ఒకే బెంచిమీద
చాక్లెట్లు చప్పరించి మాస్టారుతో అక్షింతలు వేయించుకున్నారు.
“కాదురా భవానీ! మా అ... మృ... చ... చచ్చిపోయిందిప్పుడే” పొంగుకొస్తున్న దుఃఖం రామానందం గొంతును అద్దుకుంది..నువ్ జబ్టి రారా!” ఫోన్ కట్.
అయ్యో పాపం! సుదీర్హ జీవనయానంలో ఆ తల్లి భర్తను పోగొట్టుకుని ఎన్నో కష్టాలనుభవించి రామానందంను పెంచింది. రామానందం మిల్లు గుమాస్తా. జీవితంతో కుస్తీ పడుతూ కన్నతల్లిని, భార్యాపిల్లల్ని సాకుతున్నాడు. ఆ తల్లి అనారోగ్యంతో మంచమెక్కి ఆర్నెల్లెంది. తిరిగి దిగలేదు. ఇప్పుడీ ఖర్చును వాడెట్లా భరిస్తాడు?
గరం చాయి గటగటా తాగేశాడు. మరి డబ్బులో! ఓ పెళ్లి కుదిర్చినందుకు నిన్న వచ్చిన బ్రోకరేజి డబ్బుల్లోంచి భార్యకిచ్చింది పోగా మిగిలినదాంట్లోంచి కొంత పర్సులో కుక్కకుని బైకు బయటకు తీస్తుంటే నారాయణరావు బుర్రలో గిర్రుమన్నాడు.
నారాయణరావు పుణ్యాత్ముడు. అతని కొడుక్కో చిన్న షాపుంది. అందులో గిరాకి లేక ఈగలు, దోమల్ని వేటాడినట్టే ఉంటుంది. అతడేమో సమాజ సేవలో బిజీ బిజీ,
“మా ఇంట్లో ఫలానావారు చనిపోయారు. వెంటనే రండి...” అని ఎవరు ఫోన్లో చెప్పినా లుంగీమీద షర్టు వేసుకుని చక్రాల్లో గాలి ఉందా? లేదా? అని గూడా చూడకుండా సైకిలెక్కి వచ్చి వాల్తాడు. ఆచారం ప్రకారం అంత్యక్రియలు చేయించి వెళ్తాడు. ఆ మహానుభావుడు కనబడితే ఎదలో భక్తిభావన పురివిప్పి నమస్కారం చేయిస్తుంది. తన కతడు పరిచయమే. వెంటనే సెల్ఫోన్లో సంప్రదించాడు.
రామానందం అడ్రసు, ఆనవాళ్లు చెప్పి బైకుమీద బయలుదేరాడు.
బండి దిగి లోవలికి పరుగెత్తాడు. రామానందం ఇంటినిండా విషాదం అలుముకునుంది. అతని భార్యా, పిల్లలు శవం పక్కన కూచుని ఏడుస్తున్నారు. అప్పుడే రామానందం తోటి గుమాస్తాలిద్దరు, ఇద్దరు మిల్లు కార్మికులంతా వచ్చారు. మిల్లు ఓనర్ గూడా వచ్చాడు. రామానందంకు భవానీశంకర్ కనబడగానే లేచొచ్చి, అతని గుండెలమీద
వాలి పచ్చికుండలా పగిలి రోదిస్తున్నాడు.
“రామా! నీ తల్లి ధన్యజీవి. పండిపోయిన ఆకు చెట్టుమీంచి రాలక తప్పదుగదా! పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదాయె” భవానీశంకర్ సముదాయించాడు. రామానందం కళ్లద్దుకున్నాడు.
“అది నిజమేరా! నా దరిద్రం నా వెంటే వుంది. ఇప్పుడు చేతిల చిల్లిగవ్వ లేదు. అమ్మ అంత్యక్రియలు....” వెక్కుతున్నాడు.
మిల్లు ఓనరుకు నమస్మరించాడు. భవానీశంకర్ గుండె కరిగి గొంతులో కొచ్చింది.
“అదంతా నేను చూసుకుంటానుగా" పోలిస్ తుపాకి మిస్ ఫైర్ అయినట్టుగా వచ్చిందామాట.
“అవును రామానందం! మేమంతా ఉన్నాం గదా!” మిల్లు ఓనరు (శ్రుతి కలిపాడు. రామానందం శవంవద్ద కెళ్లాడు.
“భవానీగారూ! ఆచారం '్రకారం కార్యక్రమాలు జరిపించేది మీరే కదా!” మిల్లు ఓనరు మూడు వేల రూపాయలు చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. మిల్లు గుమాస్తాలు, లేబర్లు తలా కొంత కలిపారు.
అప్పుడే సైకిల్ దిగి లోపలికొచ్చాడు నారాయణరావు. “నారాయణరావుగారూ! మా రామానందం పేదోడు. మిల్లు గుమాస్తా” మాట పూర్తి కాలేదు -
నారాయణ్‌రావు అందుకున్నాడు.....
“నాకంతా తెల్పు భవానీగారూ! సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో పద్ధతి ప్రకారం పనులు చేయిద్దాం. అదంతా నాకొదిలేయండి” ధైర్యం చెప్పాడు. నారాయణ్రావంటే నర రూంపలో ఉన్న నారాయణుడు. ఇంతకుముందు ఇలాంటివెన్నో చేయించాడు. అతడే దగ్గరుండి పనులు చేయిస్తున్నాడు. అవసరమైన సరుకులు కొనుక్కురమ్మని ఓ గుమాస్తాను పిలిచాడు. తనవైపు చూస్తూ “అంత్యక్రియల సరుకులకు మూడు వేల రూపాయలవుతాయి, కానీ ఓ రెందు వేలివ్వండితనికి” అన్నాడు.
ఇచ్చేశాడు. తేవాల్సిన సరుకుల జాబితా రాయించి గుమాస్తాకు దుకాణం అడ్రసు చెప్పి, అతనికి తన సైకిలిచ్చి పంపించాడు.
గుమాస్తా సామాగ్రి తెచ్చాడు. అవి భవానీశంకర్‌కు చూపిస్తూ “ఆ షాపు నారాయణ్‌రావు కొడుకుదే నటా” విప్పి చెప్పాడు. సముద్ర కెరటంలాగా మనిషి శవం ఇతరుల కోసం ఆగదని నారాయ(ణ్రావుకు బాగా తెలుసు. ఈలోగా నారాయణ్‌రావు సెల్ఫోన్లో కాటి కాపరికి, డప్పులవారికి, ఇంకెవరెవరికో చెప్పాడు. ఓ గంటలో అంతా దిగారు.
“కాష్టం తయారైందని కాటికాపరి ఫోన్ చేశాడు” అంటూ అందరినీ స్పందింపజేశాడు. వీధిజనాలు తలా ఓ చెయ్యేసి శవాన్ని పాడె మీదుంచారు. డప్పుల మోత “ఇహ పదండి" అంది.
రామానందం అంతరాళాల్లోంచి తోసుకొచ్చిన దుఃఖం ప్రవాహంలా కళ్లల్లో కొచ్చింది. అతడు భవానీశంకర్ గుండెలమీద ఒరిగి “మా అమ్మ......నన్ను కని, కష్టపడి పెంచిన అమ్మ మళ్లీ కనబడదు గదా!” వెక్కుతున్నాడు.
చిన్నప్పుడు ఆమె చేతి గోరుముద్దలు తిన్న భవానీశంకర్ గుండె చెరువైంది. కళ్లల్లోకి చిమ్ముకొచ్చిన నీరు బొట్లు బొట్లుగా రాలి రామానందం భుజాలను తడిపేసింది.
నారాయణ్‌రావు ఇద్దరినీ విడదీసి “మీరే ఇట్లా బాధపడితే ఎట్లా భవానీగారూ! మనం మాత్ర మీ లోకంలో ఎల్లకాలం ఉట్టి గట్టుకుని ఊరేగుతామా?” సముదాయించాడు.
“ర్రామానందం! నువు తడిబట్టలతో ఉన్నావు గదా నిప్పుల కంచుడు, అన్నం కుండ పట్టుకుని శవం ముందు నడువు” కార్యోన్ముఖుణ్ని చేశాడు.
“భవానీగారూ! మీ మిత్రునికి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా...” మందలించబోయాడు.
“కాదు నారాయణ్రావుగారూ! చిన్నప్పుడే మా అమ్మ చనిపొయింది. నేను ఈ తల్లి చేతుల్లో పెరిగాను...”
“మ్రాశారా! మీ అమ్మ ఎప్పుడో చనిపొయింది. ఇప్పుడీ తల్లి పొయింది. పైవాడి చేతిలో మానవ మాత్రులం, కీలు బొమ్మలం” వివరంగా సముదాయించాడు. మనసులోని అలజడి శాంతించింది.
మిల్లు లేబర్లిద్దరు, గుమాస్తాలిద్దరు గోవింద నామస్మరణతో పాడెను భుజాలమీది కెత్తుకున్నారు. అందుకే అంటారేమో.... మనిషి బతికినంత కాలం నలుగురితో కలిసి ఉండాలని. మానవమాత్రులెన్ని ఆస్తులు సంపాదించినా అన్నింటినీ వదిలిపోవాల్సిందే. ప్రపంచాన్ని జయిస్తానన్న అలెగ్జాండర్ ఖాళీ చేతుల్లో వెళ్తున్నానని చెప్పలేదా?
శవయాత్ర శృశానందాకా చేరుకుంది. రామానందం కన్నతల్లికి తల కొరివి పెట్టాడు. తనకు దుఃఖఖమాగలేదు. ఆ తల్లి పార్టివ దేహం అగ్నికీలల కాహుతి అవుతూంటే భరించలేకపొయాడు.
వీధివాళ్లు, బంధువులంతా చెప్పా పెట్టకుండా జారుకున్నారు. అది అచారమట! తనను, పనివాళ్లను చెట్టునీడలోకి తీసుకుపోయాడు నారాయణరావు. కొమ్మల మధ్యన రెమ్మల్ని ముద్దాడుతూ దూసుకొచ్చిన సూర్యకిరణాలు నేలమీద తచ్చాడుతున్నాయి.
“భవానీగారూ! పనివాళ్లందరికీ డబ్బులిచ్చి పంపించాలి నారాయణరావు సూచనలతో వాళ్లంతా హుషారైనారు.
“ఎవరికెంతివ్వాలో చెప్పండి” భవానీశంకర్ అందర్నీ కలియజూస్తూ “మా రామానందం పేదవాడు. విరాళాలతో ఈ కార్యక్రమం నడుస్తుంది” అందరికీ నమస్కరించాడు.
“నేనున్నానుగదా! నాకంతా తెలుస్త” నారాయణరావు అందుకున్నాడు. అతని మొహంలో రంగులు మారుతున్నాయి. ౨.
“నేను చెప్పినంత మాత్రమే ఇవ్వాలి” సూచించాడు. పనివాళ్లు మౌనముద్ర దాల్బారు. “కాటికాపరీ! నీ సంగతి చెప్పు” అన్నాడు, నారాయణరావు.
“మ్పీకంతా తెలుసు గదా! కట్టెల ఖరీదు, పనివాళ్ల కూలి అంతా కలిపి రెండు వేల
రూపాయలయ్యా!” వినయం ఒలకబోసాడు.
“ఏందిరా౯” నారాయణరావు గొంతులో అసహనం... “ఈ రామానందం కోటీశ్వరుడనుకున్నవా? కూటికి లేనోడు.”
“అయ్యా! మాకు కట్టెల ఖరీదు, కూలీలు తప్పవు గదా! మల్లా అస్తిక లేరిన తర్వాత వాటిని ముంతలో దాచిపెట్టి, అడిగినప్పుడివ్వాలె”
“నాకన్నీ తెలుసులేవోయ్! పదిహేనాందలివ్వండి”
పదిహేను వందలు తీసుకుని కళ్లకద్దుకుని పక్కకు జరిగాడు.
“డప్పులయ్యా! నీ సంగతి చెప్పు!” నారాయణరావు ఆదేశం.
“అయ్యా! మేమైదుగురం. అందరికీ కలిపి రెండున్నరవేలు”.
“ఓర్నియవ్వ! అది మామూలువాళ్లకు. రామానందం పేదోడురాగ”
“ఓ వంద తగ్గించుకోండయ్యా!”
“వల్రే బద్మాష్, పదిహేను వందలు తీస్మోని పో!”
“అమ్మో” భవానీశంకర్ గుండె అదిరింది. డబ్బులు తీసుకుని డప్పులాయన తప్పుకన్నాదు.
చాకలి, మంగలి మిగతా పరివారందరికీ కలిపి నాలుగు వేలు.
ఏడు వేల రూపాయలు, సరుకులకో రెండు వేలు-తొమ్మిది వేలు గాలిలో పేలాల్లా ఎగిరిపోయినై.
నారాయణరావు లేకపోతే వీళ్లంతా ముప్పతిప్పలు బెట్టి మూడు చెర్ల నీళ్లు తొగించేవారు. కార్యక్రమాలు దగ్గరుండి పద్ధతి ప్రకారం చేయించాడు గదా! అతనికి రుణపడి వుందాలి.”
“మరి మీ సంగతి?” నారాయణరావును అడిగాడు భవానీశంకర్.
“ఎంతమాట! భవానీగారూగ” అని మరోమాటకు... ఆస్మారమివ్వకుండా సైకిలెక్కి వెళ్లిపొయాడు. ఇది కలియుగమైనా ధర్మం ఒక కాలుతో నడుస్తోంది. ఆ ఒంటికాలు బాపతు ఈ నారాయణరావు. మనసులోనే నమస్కరించాడు. రామానందం కుటుంబంతో వాళ్లింటికెళ్లాడు. హోటల్ నుండి భోజనం పార్సల్ తెప్పించాడు. తల్లి లేని లోటు తీర్చిన ఆ తల్లిని తలుచుకుంటూ తానూ వాళ్లతో భోంచేశాడు. ఇంటికెళ్లేసరికి ఆకాశ మైదానంలో పరుగెత్తిన సూర్యుడు అలసిపోర్తుళప్మోమోర్భూడ్ర్యాట్టెనిత్షైడ్రు. నారాయణరావు సేవల్ని మరిచిపోలేక పోతున్నాడు. యా
పల్లె నా తల్లి 'ఆహయకొ్నాాా ఐతా చంద్రయ్య ఆ ఇలా అనా.
అది పెళ్లిళ్ల సీజన్ కాదు కాబట్టి తనకు ఒత్తిడి పనుల్లేవు. లేకపోతే మ్యారేజి బ్యూరో పనుల్లో టైం దొరికేది కాదు. సెల్‌ఫోన్ చెవివద్దనే ఉండేది. సమయం విలువ అప్పుడు తెలిసొచ్చేది.
మర్షాడుదయం నారాయణరావు మనసు తెరమీద ప్రత్యక్షమయ్యాడు. వాళ్లింటికెళ్లి అతనికి కృతజ్ఞతలు చెప్పాలనే ఆరాటం అల్లరి పెడుకొంది. గబగబా తయారై బైకుమీద బయలుదేరాడు.
ముందు రామానందం ఇంటికెళ్లి భొజనాలు వగైరాలకు కొంత డబ్బిచ్చి వైర్యం చెప్పాడు. ఆ తర్వాత బైకు ఎక్కి నారాయణరావు ఇంటిముందు దిగాడు,
ఆ ఇంటినెప్పుడూ పరీక్షగా చూడలేదుగానీ అది ఆధునిక హంగులు సంతరించుకున్న మేడనే. గేటు దాటి లోపలికి నడిచాడు. ఇంటి చుట్టూ వున్న ప్రహరీగోడ నానుకుని పూలమొక్కలు గాలికి తలలూపుతూ స్వాగతం పలుకుతున్నాయి. గుమ్మందాకా చేరుకున్నాడు. నగిష్షీలతో మెరుస్తున్న తలుపులు సగం మూసుకున్నాయి. లోపలి నుండి మాటలు వినబడుతున్నాయి. తలుపు సందులోంచి ఆసక్తిగా చూపులు సారించాడు. లోపల కాటికాపరి, డప్పుల లీడర్ ఇంకో ఇద్దరు కన్పించారు. అక్కడే ఆగిపోయాడు. వీళ్లిక్సడెందుకున్నారు? అనుమానం తొలిచింది.
ఇంకెవరో చనిపోయుంటారు... అందుకోనమైతే వీళ్లు నారాయణరావు ఇంటికెందుకొస్తారు? నేరుగా చనిపోయిన వారింటికే వెళ్తారు. బుర్రలో తర్జన భర్జనలు. గురువు చెబుతున్న పాఠాన్ని ద్ధగా వింటున్న శిష్యుడిలా అటువైపు చూస్తున్నాడు, అంతా వింటున్నాడు.
నారాయణరావు మోద్రన్ వీల్ చెయిర్లో కూచున్నాడు. మిగతావారు దేవుని ముందు భక్తుల్లా చేతులు కట్టుకుని నుంచున్నారు.
“అట్లా నిల్చున్నారేందీ? వచ్చిన పని కానివ్వండి” వురమాయించాడు, నారాయణరావు. వాళ్లు మొహాలు చూసుకున్నారు.
“అయ్యా! ఆ రామానందం తల్లి బాపతు నిన్నటి మా కమిషన్ ఎంతివ్వాలో చెప్పండి?” కాటికాపరి ముందుకు జరిగాడు.
నారాయణరావు సర్దుక్కూచున్నాడు.
“నీక్సు భవానీశంకరిచ్చింది పదిహేను వందలు గదా! సగమివ్వు కొత్త మనిషిలా అడుగుతావెందుకు?” గొంతులో గాంభీర్యం.
“దండం బెడ్తనయ్యా! కష్టం చేసింది నేను, నా కూలీలు, కట్టెల ఖరీదు...”
జగ్ ప్ర (/. 90 అంత ను
ఫ్ఫ్రలు.. స్తున్నాడూ గదా! వ్విట్లా మాట్లాడే స్మశాన నమన ననన క్ ననన
కమిటీ మీటింగుల మాట్లాడి నిన్ను పీకి పారేయిస్తా, ఆ కమిటీల నేనూ మెంబర్నే”
కాటికాపరి నోరు మూతపడింది. “ఇగోనయ్యా! సగం” నారాయణరావు చేతిలో డబ్బులుంచి అటుపక్క గుమ్మంలోంచి వెళ్లిపోయాడు.
దప్పుల లీడర్వైపు చూశాడు... “నీ సంగతేమిటన్నట్టు?”
“అయ్యా! మీరు నలుగుర్ని తీసుకుని రమ్మంటే వచ్చిన. కష్టం జేసింది మేం, నీకు కమిషన్ ఎందుకివ్వాలి?” అంటూ జేబులో చెయ్యుంచుకున్నాడు.
“అయ్యా! నువు కొత్త గదా! ఈ ఊర్లో వేరే డప్పులవాళ్ల టీంలున్నయి గదా!” గుడ్గురిమాడు. “డప్పుల లీడర్‌గా నువు కమిషన్ తినడం లేదా?”
“సరే! ఎంతియ్యాలే?”
“అక్కడ నీకిచ్చిన దాంట్లో సగం అంటే వదొందల యాఖై” మారు మాట్లాడకుండా సగమిచ్చి అట్నుంచటే వెళ్లిపోయాడు:
చాకలి ఓ వంద రూపాయలివ్వబోయాడు...
“గిదేందిరా? నేను బిచ్చగాన్ననుకున్నవా?”
“అయ్యా! సామానులు మీ కొడుకు దుకాణంలోనే తెప్పిస్తిరి. వాటి ఖరీదు వెయ్యి రూపాయలు కూడా ఉండదు. రెండు వేలిస్తిరి”
“అయితే.....? నీ సోమ్మేం పోయిందంటా?”
“నా దగ్గర కమిషన్ కొట్టకుంటే మీ ఆస్తులేమీ తరిగిపోవుగదా!”
“నువ్వెళ్లిపో”
ఇంకో పనివాడు మిగిలాడు.
భవానీశంకర్‌కు సీసప్పెంకులమీద నుంచున్నట్టుంది. తాను లోపలికెళ్లి ఇది అన్యాయమని నిలదీస్తే - “నువ్వు మాత్రం పెళ్లిళ్లు కుదిర్చి కమిషన్ తీసుకుంటలేవా?” అని సవాలు చేస్తడేమో! విచిత్రమైన అవస్థ. కుడితిలో పడ్డ ఎలుకలాగైంది.
ఇందుగల దందు లేదని
సందేహము లేదు బాబు! సర్వము తానై
ఎందెందు వెతికి చూసిన
అందందు గలదు కమిషన్ ఆనందముగా.
పద్యము గొణుక్కుంటూ వెనుదిరిగాడు.
(వార్త - ఆదివారం” 28-2-2016)
నవ న నన నామ క్ ననన ననా
యువలీల
వచ్చీపోయే జనాలతో ప్రయాణ ప్రాంగణము సమ్మక్క సారక్క జాతరలాగుంది. పని రాని గుమాస్తా మీద ఆఫీసర్లా మధ్యాహ్నంకాక ముందే ఎండ చిటపటలాడ్డుంది. అన్ని వసతుల నాకళింపు చేసుకున్న ఆధునిక ప్రయాణ ప్రాంగణము బయటిగేటు వద్ద గోపాల్, రాజేశం గుసగుసలాడుకుంటున్నారు. పైలా పచ్చీసు యువకులిద్దరూ చాకుల్లాగున్నారు. జీన్పాంటు, టీషర్టుల్ని సర్టుకుంటున్నారు.
ప్రయాణ (ప్రాంగణములోంచి ఓ ముసలమ్మ పెళ్లికూతురులా అడుగులేస్తూ బయటికొచ్చి అటూ ఇటూ చూస్తూ తళతళా మెరుస్తున్న మెడగొలుసును సవరించుకుంది. చేతిలో ఖాళీ సంచి వైపు చూసుకుని ముందు కడుగులు వేసింది. యువకిశోరాలు సైగలు చేసుకుని ఆమె వెంట నడుస్తున్నారు. ముసలమ్మ చౌరస్తాదాటి మెయిన్‌రోడ్డు మీదికొచ్చింది.
“పెద్దమ్మా!” ముసలమ్మ వెనకనుండి గోపాల్ ... గొంతులోని కమ్మదనం పనిచేయలేదు. ముసలమ్మ తన లోకములో తానుంది.
“నీయవ్వ! గట్ల చిలుక పలుకోలె మెల్లగ పిలిస్తే గా పల్లెటూరు ముసట్బానికి వినబడదురా” రాజేశం మండలింపు.
తానే దగ్గరికొచ్చి “పెద్దమ్మా! ఓ పెద్దమ్మా!” మర్యాద మేళవించి గట్టిగా పిలిచాడు. ముసలమ్మ పక్కకు నిల్చుంది. యువకులు ఆమె ముందుకెళ్లి నిల్చున్నారు.
“పెద్దమ్మా! పాపం! ఎర్రటెండల నడుస్తున్నవు, ఏ ఊరు?” గోపాల్ చేతులు కట్టుకుని టీచర్ముందు విద్యార్థిలా నిల్చున్నాడు.
ముసలమ్మ భయంగా కళ్లజోడు సవరించుకుని ఇద్దర్నీ కిందినుంచి మీద్దాకా తేరిపార చూసింది.
“నాది ఏ ఊరైజే మీకెందుకు నాయనా?” వణుకుడు గొంతుతో సణుగుతూ కొంచెం వెనక్కు జరిగింది.
“అయ్యే రామా! కోపమెందుకు పెద్దమ్మా? నీ కొడుకులమనుకో.” రాజేశం చేతులు జోడించాడు. “పాపం! ముసలమ్మవు గదా! ఏదన్నా సాయం చేద్దామని పిల్చినం గాని నీది ఏ ఊరైతే మాకెందుకూ?” గొంతులో అమాయకత్వం. ముసలమ్మ మొహం వెలిగింది. బంతిపూవోలె విచ్చుకుంది.
“గట్లనా! మీ పేళ్లేంది నాయానా?”
నోటికొచ్చిన పేర్లు చెప్పేశారు. “మేము కొత్తోల్లంగాదు పెద్దమ్మా! నిన్ను ఇదివరకు చూసినం, మాట్లాడినం. నువు మరచిపోయినవు మమ్ముల్ని, గీ పోరగాండ్లతోని నాకెందుకనుకుంటున్నవు గదా” రాజేశం అలక వాలకం.
“నీకు మా సాయం కావలా వద్దా?” గోపాల్ బింకము.
“అయ్యయ్యో! నా కొదుకులసొంటోల్లు బిడ్డా” మెడ గొలుసు మీద కొంగు కప్పుకుంది. ముసిముసిగా నవ్వబోయి మానుకుంది.
“గింత ఎండల నిల్చుంటే చక్కరొచ్చి పడ్తవే పెద్దమ్మా! గా నీడకు పొయ్యి కూసుంటే ఇష్టమొచ్చినంతసేపు ఉండొచ్చు గదా!” గోపాల్ ముసిముసినవ్వు ముసలమ్మ సరేనంటూ తలూపింది.
ఇద్దరూ కలిసి ముసలమ్మను సందులోకి తీసుకెళ్లారు. ఇంటి నీడున్న అరుగుమీద కూచోబెట్టారు. వాళ్లు నిల్చున్నారు.
“ఇప్పుడు చెప్పు పెద్దమ్మా, పాపం! ఒక్కదానివే మీ ఊరి నుంచి వచ్చినట్టున్నావ్. ఏ ఊరునుంచి వచ్చినవూ? ఎందు కొచ్చినవూ?”
ముసలమ్మ తృప్తిగా ఊపిరి పీల్చుకుంది. “మా ఊరు సీతారాం పల్లి నాయనా! పండుగొస్తుంది గదా! పండుగ సామాను కొనుక్కపోదామని వచ్చిన. నా దగ్గర పైసల్లేవు. గీ బంగారం గొలుసు అమ్మి పండుగ సామాను కొంటా. మిగితా పైసలు నా బిడ్డకిస్త నా కొడుకు నౌకరి చేస్తుండు కాని చాలా దూరములున్నడు. వాడు పైసలు పంపినంక బంగారం కొని గుండ్లు, గంటీలు చేయించుకుంట.*
“వామ్మో! పెద్దమ్మ ఉపాయం బాగానే వుంది” రాజేశం గోపాల్ కళ్లలోకి అర్థవంతంగా చూశాడు.
“మరినీ ఒక్కపానానికి, పండుగ సరుకులకు బంగారు గొలుసు అమ్ముడెందుకూ? బాగున్నది ఉంచుకో" గోపాల్ సలహా.
“నా ఒక్క పానం గాదు బిడ్డా! పండుక్కునా బిడ్డ తన పిల్లల్లోని వచ్చింది. పండుగ నాటికి అల్లుడొస్తడు. అల్లునికి మర్యాదలు చెయ్యాలె గద బిడ్డా!”
“అవునవును. మా బావకు మర్యాదులు చెయ్యకుంటే అలిగిపోతడు” గోపాల్ అందుకున్నడు. “కాని పెద్దమ్మా! గా బంగారం గొలుసు అమ్మితే ఎన్ని పైసలొస్తయి? సామానులెట్ల కొనుక్కుంటావు? మా చెల్లెకేమిస్తవు?”
“ఏం జెయ్యాలె బిడ్డా! దాన్ని అమ్మి వచ్చిన పైసలతోని అన్ని చెయ్యాలే. గరీబుదాన్ని గదా
“ఆ బంగారం గొలుసు ఎన్ని గ్రాములుంటది పెద్దమ్మా”
“గ్రాముల సంగతి తెల్వదిగాని... రెండు కొత్త తులాలుంటది బిడ్డా! కాని దీన్ని ఎక్కడమ్మాలెనో, ఎట్ల అమ్మాలెనో నాకు దెల్వదుబిడ్డా! తెల్వని దాన్ని పట్టుకొని ఎవలన్నా మోసం చేస్తే నా నోట్లే మన్ను వడ్తదని ఆలోచిస్తున నాయనా!”
యువకుల కళ్లు ఆశా జ్యోతితులైనాయి.
“అరేయ్! ఈ పెద్దమ్మకు సాయంచేస్తే దేవుడు మనకు సాయం జేస్తడు” గోపాల్ రాజేశం వైపు చూశాడు.
“అవునా!” రాజేశం పొంటు జేబులోంచి తళతళా మెరుస్తున్న కడ్డీ బయటికొచ్చింది. అటూ ఇటూ చూశాడు. “పెద్దమ్మా! నువు నీ గొలుసు అమ్మితే మార్వాడోల్లు నిన్ను బోల్చుక్క జేసి సగం బంగారానికే పైసలిస్తరు. గీ చొక్కం బంగారం కడ్డీ చూడు. “కడ్డీని అటూ, ఇటూ తిప్పి చూపించాడు. దానికి తాము సాక్ష్యమన్నట్టుగా సూర్యకిరణాలు కడ్డీ వెలుగుల్ని ముసలమ్మ కళ్లలోకి పంపించాయి.” ఇది చొక్కం రెండు తులాలుంటది. గా గొలుసు మాకిచ్చి ఇది తీసుకుని అమ్ముకో. గా మెయిన్ రోడ్ల కుడి దిక్కు మార్వాడి దుకాణముంది. అండ్ల అమ్ముకో. ఆ బంగారు గొలుసు మాకిచ్చెయ్. సరేనా?”
“ఊహు!” ముసలమ్మ గొలును సవరించుకుంది. “గీ గొలుసును మీకు ఎందుకియ్యాలె? ఆ కడ్డీని నేనెందుకు అమ్ముకోవాలె. నన్ను పోనియ్యిండ్రి” లేవబోయింది.
“అరెరే! కూచో పెద్దమ్మా” గోపాల్ బతిమాలాడు. “పెద్దమ్మా! రేపు మా చెల్లె పెండ్లి. పెండ్లిల బంగారం గొలుసు ఎయ్యకుంటే కలువదని పిల్లగానోల్లు పట్టు వట్టిందధ్రు. గా దుకాణంల ఇంతకు ముందే కొన్నం, కాని... పెండ్లి రేపే పొద్దుగాల్ల నాయె. ఇప్పటికిప్పుడు గొలుసు ఎవ్వరు చేసిస్తరు? దానికి మూన్నాల్లు రోజులు కావాలె గదా! అందుకే ఆ గొలుసు నాకిస్తే మా చెల్లె మెడలేస్త. ఇది నువ్వు అమ్ముకుంటే మొత్తం పైసలొస్తయి. మాకు కూలీ తప్పుతది, నీకు తరుగు తప్పుతది. ఇద్దరికీ లాభమే గదా!” కడ్డీ రాజేశం చేతికిచ్చాడు.
ముసలమ్మ ఆలోచించింది. ఓ నిమిషం శూన్యంలోకి చూసింది. “ఏమో బిడ్డా!” ముక్కుమీద వేలేసుకుంది. “ఆ కడ్డీ కల్తీదో, మంచిదో...నాకేం దెల్సు?”
“అయ్య ల్లా! అమ్మవారి లెక్కున్నవ్”
“అమ్మమ్మా! మా అమ్మ లెక్కున్నవ్. నిన్ను మోసం చేస్తే నరకానికి పోతం పెద్దమ్మా!” పాపభీతి మొహమ్మీద తచ్చాడుతున్నట్టుంది. రాజేశం మొహం ప్రశ్నార్ధకమైంది.
క్స్తర్రే బిడ్డా” ముసలమ్మ ముంగురులను మునివేళ్లతో సవరించుకుంది. “నాకు ఆ కడ్డీ యిస్తే గొలుసు ఇస్తా గొని, దాంతోని నేను గుండ్లు, గంటీలు చేయించుకుంట. పండుగ సామానుకు ఓ రెండు వంతలరూపాయలియ్యిండ్రి. మీకు పుణ్యముంటుంది.”
“అయ్యో పాపం, పెద్దమ్మ!” గోపాల్ మాటల్లో జాలి జాలువారింది. “ఆ కడ్డీ ఇచ్చెయ్యిరా” అంటు జేబులోంచి రెండు వంద రూపాయల నోట్లు తీసిచ్చాడు. కడ్డీ, డబ్బుల్ని
కళ్లకద్దుకుని గొలుసు తీసిచ్చింది ముసలమ్మ.
“పెద్దమ్మా! జాగ్రత్త! ఈ పట్నంల బోలెడంత మంది దొంగలున్నారు గోపాల్ హెచ్చరిక ముసలమ్మను మురిపించింది. వయసు పిల్లలా అంగలేస్తూ రోడ్డు మీది కొచ్చింది.
రాజేశం, గోపాల్ మొహాలు చూసుకుంటూ విజయగర్వంతో నవ్వుకున్నారు.” అది వెండి కడ్డీకి బంగారు పూత అని ఆ పల్లెటూరు ముసలవ్వకు దెల్వదిగదా!” గొలుసును కళ్లకద్దుకున్నాడు గోపాల్. “ఏమైనా... గీ పల్లెటూరోల్లను బుట్టలవేయడం సులువురా!”
“గిసొంటి ముసలోల్లను బొల్బుక్క జేసుడు, బండిమీద పోయేప్పుడు మెడల గొలుసులు గుంజుక పోవుడు మనకేమన్నా కొత్తనా? ముసల్ది తానే హుషారుగున్న ననుకున్నదిరా!”
“అవున్రా! ఇగ పదా! మార్వాడీకి అమ్మి పైసలు పంచుకుందాం పదా!”
చేతిల చెయ్యేసుకుని మార్వాడిషాపు చేరుకున్నారు.
గొలుసు మార్వాడీ చేతికొచ్చింది. మార్వాడి సేటు యువ కుమారుడు పక్షనే కూచున్నాడు. వారిద్దరి ముందు వీరిద్దరు. మార్వాడీ సేటు గొలుసును జరిపిడి రాయికి రుద్ది చూసి, తన కొడుక్కు గూడా చూపించాడు. తూకం వేశాడు.
“ఎన్ని రూపాయల విలువుంది సేటూ?” గోపాల్ ఆసక్తి,
“గట్ల తొందర పడితే ఎట్లా లెక్కజేసి డబ్బులు లోపలి నుండి తేవాలె గదా!” యువ మార్వాడి తండ్రికి సైగ చేశాడు. మార్వాడి లేచి “మీరు కూచోండ్రి. నేను లోపలి నుంచి డబ్బులు తేస్తా” నని గొలుసుతో సహా లోపలికెళ్లాడు.
“ఈయన మనకు కొత్త కాబట్టీ సరిగ్గా పైసలిస్తడు రా!” గోపాల్ గుసగుస. “అవున్రా! పాత మార్వాడి బోలెడంత తగ్గించె టోడు.”
యువ మార్వాాడి వాళ్లిద్దర్నీ మాటల్లోకి దింపాడు. ఆరోజు పత్రిక వార్తలమీద చర్చ జరుగుతోంది. అందులో దేశ, కాల పరిస్థితులు చోటు చేసుకుంటున్నై,
ఓవైపు షాపు అందాలను ఆస్వాదిస్తూ మరోవైపు యువ మారాడీతో మాట్లాడ్తున్నారు.
అలవోకగా అరగంట కాలగర్భంలో కలిసిపోయింది.
మార్వాడి లోపలినుండి బయటి కొచ్చాడు. కాయితమ్మీద ఏవో లెక్కలేశాడు. లోపలినుండి తెచ్చిన నల్లని బ్యాగులోంచి డబ్బుల కట్టలు బయటకు తీశాడు. గొలుసును కొడుకు చేతికిచ్చి డబ్బులు లెక్కబెడ్డున్నాడు.
బయట జీబు ఆగిన శబ్దం. ఏవో బూట్ల టకటకలు. గోపాల, రాజేశం దిగ్గున లేచి నిల్చున్నరు. “సేటూ! ఆ డబ్బులు జెల్టి ఇవ్వు. మాకు అర్జంటు పని వుంది.”
“జార్రాగవయ్యా! మా షాపు మీద పోలీసోల్లు దాడి చేస్తుండ్రో ఏమో!” మార్వాడి డబ్బుల్ని బ్యాగులో కుక్కి కొడుకు చేతికిచ్చి, గొలుసు తన చేతిలోకి తీసుకున్నాడు. కొడుగు బ్యాగును లోపల పెట్టేసి క్షణంలో తిరిగొచ్చాడు. ఈలోగా పోలీసు గుంపు లోపలి కొచ్చేసింది.
“మీరు వెతుకుతున్న గొలుసు దొంగలు వీళ్లే మేడమ్!” మార్వాడి గొలుసు చూపిస్తూ పోలీసులకు చెప్తున్నాడు. “గిల్టు గొలుసు దెచ్చి బంగారుదని అమ్మేందు కొచ్చిండ్రు మేడమ్!”
“వీళ్లను తప్పించుకోనివ్వద్దు సి.ఐ. మేడమ్” యువమార్వాడి రిక్వెస్టు. లేడీ సీ,ఐ.గోపాల్, రాజేశంల గల్లా లందుకుంది, ముందుకు లాగింది. వాళ్లిద్దరు బోర్లాపడి లేచి నిల్చున్నారు. "
“ఏంరా బద్మాష్లూ!” సీఐ వాళ్లిద్దర్నీ కానిస్టేబుళ్ల కందించింది. “సిటీల గొలుసు దొంగల బెడద బాగా పెరిగింది. మీ అసొంటోల్లు మమ్మల్ని ముష్పుతిప్పులు పెట్టి మూడు చెర్ల నీళ్లు తాగిస్తున్నరు గదరా! బైకు మీద ఉరుక్కుంట ఆడోళ్ల మెదల గొలుసులు, పుస్తెల తాళ్లు తెంపుక పోతుంది మీరేగదా!”
గోపాల్స్ రాజేశం కానిస్టేబుళ్ల చేతుల్లో గింజుకుంటున్నారు. “అరేయ్! నిజం చెప్పుండ్రిరా! లేకపోతే మీ బొక్కలు సున్నమైపోతై” కానిస్టేబుల్ లాఠీ గాల్లోకి లేచింది.
“ఇస్తాం! మేమే సార్!” గోపాల్ సిఐని ఎగాదిగా చూస్తున్నాడు.
“గిది గిల్టు గొలుసని మాకు దెల్వదు మేడం. నన్ను కొట్టద్దు మేడం...” రాజేశం
చేతులు జోడించాడు.
“గా పల్లెటూరు ముసలమ్మ ఎవరో తెల్సునా?” సి.ఐ. మేడం ఇద్దరి నడిగింది.
ఇద్దరి ఆశ్చర్యాని కవధుల్లేవు.
“అయ్యో! గా ముసలమ్మ మీరేకదా మేడం?” గోపాల్లో వణుకు. అప్పుడు నెత్తిమీద విగ్గు ఉంది గదా!” నోరెల్ల బెట్టాడు.
“ఓర్నియవ్వ! బంగారం గొలుసని మననే టోకరా కొట్టి గిల్టు గొలుసిచ్చింది మీరేనా? పల్లెటూరు ముసల్దాని ఏషం బాగనే ఏసింద్రు మేడం” రాజేశం నెత్తికొట్టుకున్నాడు.
“ఆహా! బాగనే గుర్తువట్టింద్రురా!” లాఠీతో చెరొకటి అంటించింది సీ.ఐ. మేడం. జేబులోంచి కడ్డీ తీసి చూపించింది. మార్వాడి సేటు నుండి గొలుసు తీసుకుంది...
యువకుల మొహాలు మాడిపోయిన మక్కరొట్టె లైపోయినై. ముఖాలకు చేతులు అడ్డం పెట్టుకోబోయారు. కానిస్టేబుళ్లు లాక్కెళ్లి జీబు ఎక్కించారు.
“థ్యాంక్యూ సేట్జీగొ సీ.ఐ. మేడం మార్వాడీ నభినందించింది. “గొలుసు దొంగల్ని పట్టుకుంట లేరని మాకు పైనుంచి మెమోలొస్తున్నై. వీళ్ల ద్వారా ఇంకెందరున్నరో తెలుసుకుంటాం”
“నెలవంక నెమలీక” మార్చి 2016)
ఆరని ఆశాజ్యోతి
సుమారు సంవత్సర కాలం నుండి నిశ్చల జలధిగా ప్రశాంతంగా వున్న వినోద మనసీరోజు కొంగలు దొక్కిన మడుగులాగైంది. ఆపద్బాంధవిలా అక్కున చేర్చుకున్న వృద్ధాశ్రమం తనను వెంటాడుతున్న బాధలు, బాదర బందీలను దూరం చేయగలిగింది. తల్లి ఒడిలాంటి ఆశ్రమ వాతావరణం భూలోకములో నందన వనము లాగుంది. కాని ఇప్పుడేం చెయ్యాలి? ముందుకొచ్చిన సమస్యనెలా అధిగమించాలి?... ఆలోచన మనసును మెలి పెడుతోంది.
“ఒకరికి ఒకరమై, ఒకరిలో ఒకరమై జీవితాంతం కలిసుందాం వినోదా!”... మాటలతో వెన్నుపూసకు వెన్నపూస రాసిన భర్త అనురాగం గుర్తుకొస్తోంది. ఆయన మహానుభావుడు, పేరు నాగభూషణమైనా మనసు అమృతం, మృదుస్వభావం, మనోహర రూపం.
సుతి, గతి లేని పుట్టింటి నొదిలి, నాగభూషణంతో మూడు ముళ్లేయించుకుని మెట్టింట్లో అడుగు పెట్టింది. నాగభూషణానికి పెద్దలిచ్చిన ఆస్తిపాస్తులేవీ లేవు. కాని స్వయం కృషితో సాధించిన టీచరుద్యోగముంది. అత్తా, మామలు లేరు. సోంతిల్లు లేకపోతేనేం? ఉన్నతాదర్భాలున్నాయి. చల్లని మనసుంది. అన్యోన్యత కానవాలుగా అద్దెఇంట్లో సంసారసాగరాన్ని కలిసి ఈదుతూంటే...అదే అమరలోక నివాసమన్సించింది.
సంతానం కోసం పరితపిస్తూంటే, ఐదారేళ్లు పూజలు, (వ్రతాలతో గడిచాయి. ఆ తర్వాత పుత్రోదయమైంది. కన్నుల్లో వెన్నెల పరిచిన కొడుకు శేషగిరి బోసి నవ్వుల్లో మురిసిపోతూంటే నేనున్నానని జన్మించింది సుకుమారి. పిల్లలిద్దర్నీ బాగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదదిద్దాలనే పట్టుదల నూతనోత్సాహాన్నిచ్చింది. సొంత సుఖాలకంటే పిల్లల భవిష్యత్తే ప్రాధాన్యత సంతరించుకుంది. పిల్లలిద్దరూ పోటీలు పడుతూ చదువుకునే వారు,
శేషగిరి వకసంథాగ్రాహి. ఏదైనా ఒకసారి విన్నా చదివినా మరిచిపోడు. అందుకే గవర్నమెంటు సీటుతో యం.బి.బి.యస్. పూర్తిచేసి యం.యస్.(సర్జరిలో ప్రావీణ్యత సంపాదించాడు. కాలేజీ ఫీజులు, హస్టల్ ఫీజులు భరిచండం కష్టమైనా ఇష్టమన్సించింది. ఒక్కగానొక్క కొడుకు సముద్రాలు దాటి అమెరికా వెళ్లి బోలెడంత సంపాదనతో తిరిగి రావాలనే ఆరాటం బలపడింది. అమెరికా వెళ్లాలనే ఆశయం నెరవేరింది. సంపాదన బాగానే వుందని తెలిసింది. కాని విత్తనాల గింజలని నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు... శేషగిరి తిరిగి రాలేదు.
కనిపెంచిన తల్లిదండ్రుల ఆప్యాయతలు, మెడిసిన్ చదువుకోసం లక్షల రూపాయలు వెచ్చించిన దేశ[్రేమ... ఏవీ గుర్తుకు రాలేదు. అక్కడి అమ్మాయినే పెళ్లాడాడు. పెళ్లికి రమ్మని ఫోన్ చేశాడు కాని పాస్‌పోర్టు, వీసాలేనిదే అమెరికా కెలావెళ్లేది? ఆ తర్వాత ఫోన్ రాలేదు. ఫోన్ నెంబరు మారిపోయిందని తెలిసింది.
సుకుమారి డిగ్రీ ఫస్టుక్లాసులో పాసై, (పేమించి పెళ్లిచేసుకుంది. భర్తతో ఆ(స్టేలియాకు ఎగిరిపొయింది. స్వేచ్చా విహంగాల్లాంటి. పిల్లల స్వేచ్చకు తామెప్పుడూ అడ్డుకాలేదు. సెల్ఫోన్లో మాట్లాడుతుండేది కూతురు.
అస్తమానం పిల్లల ఆరోగ్యం గురించే ఆలోచించే నాగభూషణం తన ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. రిటైరయాక గ్యాట్యుటీ, కమ్యుటేషన్ డబ్బుల్తో సొంతిల్లు సౌభాగ్యం కల్చించుకున్నారు. కొత్త ఇల్లు చిన్నదైనా వసతులన్నీ వున్నాయి. శేషగిరి గుర్తుకొచ్చినప్పుడు కడుపులో కలకలం బయలుదేరుతుంది. చిన్నప్పుడు మాటమాటికి అలక మంచమెక్కి అనుకున్నది సాధించుకున్న పుత్రుడు శత్రువెలాగయాడు? అతని భార్యాపిల్లల్ని కళ్లారా చూసి ఆనందించాలనే ఆశ తప్ప తమకింకేమీ లేదు. మనోవెదన మెదడు పొరల్ని తొలిచేసింది.
నాగభూషణం రిటైర్డ్ ప్రభుత్వోద్యోగుల పెన్షనర్ల సంఘములో కీలకపాత్ర వహించేవాడు. అహరహం శ్రమించి సేవలందించే వాడు. సంఘ సభ్యుల విశ్వాసాన్ని ఆప్యాయతలను మూటగట్టుకున్నాడు.
మే మాసము, ఎండలు మండిపొతున్నాయి. అంతకుముందే అనారోగ్యముతో సతమతమవుతున్న నాగభూషణంకు వడదెబ్బ బ్రహ్మాస్తంలా తాకింది. మంచమ్మీద పడిపోయి తిరిగి కొలుకోలేదు. ముక్కతూ, మూల్లుకే ప్రాణాలొదిలాడు. నడినెత్తిమీద పిడుగు పడ్డట్టు తనకీ లోకము చీకటి గుయ్యారంలా కనబడింది. ఎంత ఏడ్చినా ఏం లాభం? విషయం తెలుసుకున్న పెన్షనర్ల సంఘ సభ్యులు వచ్చి కంటతడి పెట్టారు. సుకుమారికి ఫోన్ చెయ్యాలన్నారు. పోత్తి కడుపులోంచి పొంగుకొస్తున్న దుఃఖాన్నాపుకుని సెల్ఫోనందుకుంది. సుకుమారి భర్త తీశాడు ఫోను. చావువార్త చెప్పినా సుకుమారితో మాట్టాడించలేదు. “సుకుమారి నిండు చూలాలు ఆరోగ్యం బాలేదు. ఇప్పుడా వార్త వింటే ఏమైపోతుందో. ఈ విషయం తెలియనివ్వను. మీరుగూడా మళ్లీ ప్రమత్నించకండి” అని కట్ చేశాడు. కనీసం సానుభూతి గూడా వ్యక్తంచెయ్యలేదు.
సంఘ సభ్యులే ముందుండి అంత్యక్రియలు జరిపించారు. ఒకరి కొకర మన్న భర్తమాటలు గుర్తుకొచ్చి తానే దహన సంస్కారానికి పూనుకుంది. స్మశానంలో జనాలు “పుట్టినప్పుడే పుత్రుడు, పెరిగాక శత్రువు” అనో “ అడ్డాలనాడే బిడ్డలు గాని గెడ్డాలనాడు కాదన్నది నిజమే” అనో అంటూంటే మరింత బాధ పడ్డం తప్ప మరేం చేయలేకపోయింది. సుకుమారి సెల్ నెంబరు మారిందని ఆ తర్వాత తెలిసింది. నన లాల
సంఘ సభ్యుల సహాకారముతో ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటోంది. కడుపున పుట్టిన వారు కానరానంత దూరమయారు. ఆరోప్రాణంగా చూసుకున్న భర్త అనంతలోకాల కెళ్లిపోయాడు. ఒంటరిగా ఇంట్లో ఉంటూంటే కడుపులో చల్లజేసినట్టవుతోంది. భర్త జ్ఞాపకాలు, పిల్లల విషయాలు గుర్తుకొచ్చి వేధిస్తున్నాయి. అదే సంగతి సంఘ కార్యదర్శితో చెప్పింది. సంఘము వారే సంప్రదింపులుజరిపి వృద్ధాశ్రమములో చేర్చించారు.
విశాలమైన స్థలములో అందమైన ఆ్యశ్రమభవనము. అన్ని గదుల్లో అన్ని వసతులున్నాయి. చుట్టూ పూలమొక్కలు, నేల మీద పచ్చని గడ్డితో ఖాళీ స్థలం...అనందనిలయ మనే పేరు సార్థకమైంది. తనకంటే పెద్దవయసు వాళ్లెందరో ఆనందంగా ఉంటున్నారు. వేళకు తిండి, వైద్యసేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు... మనశ్శాంతి నిస్తున్నాయి. సంపదలున్నా సంతానం లేని వారు, కోటీశ్వరులైనా కొడుకుల నిరాదరణకు లోనైన వారున్నారు. ఓ సంవత్సరం ప్రశాంతంగాగడిచింది.
ఈ రోజుదయం టిఫిన్ చేసి గదికొచ్చింది. ఆనాటినుండి ఫోన్లో గూడా పలుకరించని సుకుమారి హైద్రాబాదు చేరుకున్ననని ఫోన్ చేసింది.ఆ(స్టేలియాలో భర్త వేధింపులు భరించలేక వచ్చేసిందటా. “నాకు, నాబాబు కిపుడు నువ్వే దిక్కమ్మా! ఆయన విడాకులిచ్చారు. మనింటి కొస్తున్నానమ్మా” ఏడుస్తూ చెప్పింది. తాను తన విషయమంతా చెప్పేసింది. “అయితే నేరుగా వృద్ధాశ్రమానికే వస్తున్నానమ్మా” బతిమాలింది.
అయ్యయ్యో! కడుపులోని చల్ల కదలకుండా పెరిగిన సుకుమారి కీగతి పట్టిందా?... కన్నపేగు కలుక్కుమంది. ఊపిరి బిగపట్టుకుని విషయమంతా ఆశ్రమ అధికారుల్లో చెప్పింది. మానేజర్ పెన్ననర్స్ సంఘానికి ఫోన్ చేసి అధ్యక్ష కార్యదర్భులను రమ్మన్నాడు...
వినోద గదిముందు వరండాలో నుంచుండి చూస్తోంది.గేటుకు రెండుపక్కలా కాపలాదారుల్లాగున్న చెట్లు తలలాడిస్తూ భయపడాల్సిందేమీ లేదని భరోసా యిస్తున్నాయి.
ఆశ్రమం ముందు ఆటో దిగి లోపలికొచ్చింది సుకుమారి. కొంచెం ఒళ్లు చేసింది. బాబు ఎర్రగా, బొద్దుగా, ముద్దుగా వున్నాడు. తల్లి కడుపు తీపి కరిగి కళ్లల్లోకొచ్చింది. కూతుర్ని గుండెలకు హత్తుకుంది. బాబునందుకుని ఆబగా ముద్దాడింది.
“నువు బాగా చిక్కిపోయావమ్మా!” తల్లిని పరీక్షగా చూసింది సుకుమారి.
“సరేగాని... నీ సంగతులు చెప్పు” తల్లి ఆదుర్దా.
సుకుమారి మొహంలో రంగులు మారాయి. “మీ అల్లుడు అంత దుర్శార్గుడనుకో లేదమ్మా. నాన్న చనిపోయిన సంగతి నెలరోజుల తర్వాత చెప్పాడమ్మా! అప్పటికే వీడు పుట్టాడు. ఆయన ఎవత్తోనో తిరుగుతున్నాడు. నేనక్కడ లేకపోతే ఏమవుతుందోనని భయమేసింది. క్షమించరాని తప్పుచేశానమ్మా!” ఉచ్చ్వాస నిశ్వాసల్ని బిగపట్టి ఏడుస్తోంది. పగిలిన గుండె ముక్కల్ని తల్లి అందించిన మనోబలముతో అతికించుకుంటూ గదిలోకి తీసుకెళ్లింది.
స్నానం వగైరాలు పూర్తయాక ఫ్లాస్కులోని చాయ తాగి స్తిమితానికొచ్చారు. “నాన్న చనిపోగానే నువు ఫోన్ చేశావటా.” సుకుమారి ఆగలేకపోయింది. “అప్పుడు నేను బాత్రూంలో ఉన్నానమ్మా ఆ వన్నెల విసనకర్రతో తిరుగుతూంటే ఆయనో గోముఖ వ్యాఘ్రమని అర్థమైందమ్మా...” గొంతు గురగురలాడింది. విడిపోయిందనుకున్న పేగుబంధం కొత్త ముడులేసుకుంటుందను కుంది వినోద. విషయాలన్నీ మనసులు విప్పి మాట్లాడుకున్నారు. మద్యాహ్న భోజనంచేసొచ్చారు.
ఆఫీసు గదిలో పెన్ననర్స్ సంఘప్రతినిధులతో సహా అంతా కూచున్నారు. సుకుమారి ఎదపోద లోని కదలికలన్నీ ఏకరువు పెట్టి “అన్నయ్య బాధ్యతారాహిత్యం అంతపని చేయించింది. నా దౌర్భాగ్యం ఇంతవరకొచ్చింది. నా తప్పు క్షమించరానిది. అమ్మానాన్న ఆమోదం లేకుండా ఆ దుర్శార్ధుణ్ని పెళ్ళాడినందుకు తగిన శిక్ష పడింది. కాని... అమాయికురాలు... అమ్మ పరిస్థితి అగాధ మవుతుందనుకొలేదు.” వెక్కిళ్ల నాపుకుని కోంగుతో కళ్లద్దుకుంది.
ఆశ్రమం మానేజర్, సంఘటప్రతినిధుల కంతా అర్ధమైంది. సంఘ కార్యదర్శి నిర్మోహమాటంగా స్పందించాడు. “తమ బాగోగుల్ని త్యాగం చేసి మీ బాగోగులకే ప్రాధాన్యత నిచ్చిన తల్లిదండ్రుల కీగతి పట్టించారు. తల్లిదండ్రిమీద దయలేని పుత్రుడు, పుట్టనేమి నాడు గిట్టనేమి? అన్నారందుకే మీ అన్నయ్య ఆచూకీ తెలియదు, నువ్వొచ్చి నెత్తిమీద కూచున్నావు. అమ్మనేం చెయ్యమంటావు?” సూటిగా అడిగాడు. “నువు మళ్లీ నీ భర్త దగ్గరికెళ్లే అవకాశముందా?” అనిగూడా అడిగాడు.
“లేదంకుల్” సుకుమారి గుండెరాయి చేనుకుంది. “నాకు కొంత దబ్బు ఇప్పించిందక్కడి కోర్టు. అమ్మకు ఫ్యామిలీ పెన్ననాస్తుంది గదా! మేము కలిసుంటాము...”
“అంటే... ఇద్దరు ఇక్కడే ఉంటారా?” ఆశ్రమ మానేజర్ కల్పించుకున్నాడు. “ఇక్కడ వృద్ధులు మాత్రమే ఉండాలమ్మా!” గుర్తుచేశాడు.
“కాదంకుల్ వెళ్లి మా ఇంట్లో ఉంటాము. అది మా నాన్న దేవాలయం. రోజూ నాన్న ఫోటోకు నమస్కరిస్తూ ఆశీర్వాదాలందుకుంటాం,. మేమిద్దరం నా బాబు కోసం బతుకుతాం.” తన ఆలోచన చెప్పేసింది సుకుమారి.
సంఘాధ్యక్షుడికి ఆమెమీద నమ్మకం కుదరలేదు. “ఐతే మళ్లీ మీ అమ్మ మనవడి కోసం తన బాగోగుల్ని ఫణంగా పెట్టాలన్న మాట.” కుండబద్దలు కొట్టేశాడు సంఘ కార్యదర్శి “పాపం! మీ అమ్మ ఆశ్రమంలో ప్రశాంతంగా వుంది. అలాగే ఉండనీ. కావాలంటే నువ్వే బాబుతో మీ ఇంట్లో ఉండొచ్చుగదా!” అంటూ వినోదవైపు చూశాడు.
వినోద అంతరాళాల్లోని అనిశ్చితి తొలిగిపోయింది. ఏదో మాట్లాడాలనుకుంది. ఇప్పుడేమీ మాట్టాడొద్దని కార్యదర్శి సైగ చేశాడు. ఒడిలో నిద్రబోతున్న బాబు మొహంలోకి దీనంగా చూసింది సుకుమారి. “అంకుల్ నేనింతవరకు అబల లాగున్నాను. ఇప్పుడు సబలనని
నిరూపించుకుంటాను. అమ్మ నా వెంట ఉంటే నాకు కొందంత అండ. నాకు సలవిలిస్తుంటే చాలు. నేనేదన్నా ఉద్యోగం చేస్తాను.” ధైర్యంగా చెప్పింది.
మానేజర్ అందుకుని “అమ్మా! వయసులో ఉన్న యువతివి. నువు మళ్లీ పెళ్లిచేసుకుని వేళ్లిపోతే మీ అమ్మ గతేమిటి?” నిలదీశాడు.
“అది అసంభవం” సుకుమారి కళ్లల్లో పట్టుదల కనబడింది. “ప్రేమా-దోమ అని ఇప్పటికే ఓసారి మోసపోయాను. రెండో పెళ్లిపేర మరోసారి మోసపోదల్పుకోలేదు. నాక్కావాల్సింది మా అమ్మ క్షేమం, నా కొడుకు భవిష్యత్తు. వాణ్ని హాస్టల్లో చేర్చించను. హాస్టల్లో పెరిగిన వారికి అమ్మానాన్నల (ప్రేమానురాగాలు అర్థం కావు. దానికి మా అన్నయ్యనే ఉదాహరణ. నా బాబు మాతోనే వుండి చదువుకుంటాడు. మా పర్యవేక్షణలో ప్రయోజకుడవాలి. తల్లిదండ్రులు దైవ స్వ్పరూపులని ప్రాక్టికల్‌గా తెలిసింది. ఈ విషయం నా బాబుకు అర్థమయేలా మా అమ్మకు సేవలందిస్తాను. నన్ను నమ్మంది. ఇప్పుడీ లోకములో నాకు మా అమ్మ తప్ప మరెవ్వరూ లేరు...” పక్కనున్న తల్లి భుజమ్మీద ఒరిగిపోయింది.
“ఇప్పుడు చెప్పమ్మా నీ అభిప్రాయం” సంఘ కార్యదర్శి వినోదనడిగాడు.
“కన్న కూతురు కష్టాల్లో వుంటే నేను భరించలేనన్నయ్యా.” వాత్సల్యం పొంగి తల్లి కళ్లను తడిచేసింది. “నా కూతురు సుఖమే నా సుఖము. మా ఆయన జ్ఞాపకాలను ఇంట్లో నెమరేసుకుంటూ మనవని కోసం బతకాలనుందన్నయ్యా! మీరు నన్ను సోంత చెల్లిలా ఆదరిస్తున్నారు. ఇకముందు గూడా ఆదరిస్తారనుకుంటున్నాను.” చేతులెత్తి అందరికి నమస్కరించింది. అందరి తరపున ప్రతి నమస్మారం చేసిన ఆశ్రమం మానేజరు “ప్రపంచమెంత మారినా, సాంకేతిక పరిజ్ఞానం ఆకాశన్నంటినా మన భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మ యైన కన్నకడుపు తీపిలో కల్తీ చోటు చేసుకోలేదు. అందుకే మన కుటుంబ వ్యవస్థ ప్రపంచాని కాదర్శమైంది.” అందరి అభిప్రాయాన్ని చదివి చెప్పేశాడు.
తల్లీకూతుళ్ల అభిప్రాయానికి ఆమోదముద్ర పడింది. అందరి కళ్లల్లో ఆశాజ్యోతులు వెలిగాయి.
“వేత్రనో - ఏప్రిల్ 2015
౯ శాస్తి
“వమయ్యోయ్! వంట గ్యాస్ బుడ్డీ రెండో ది గూడా ఖాళీ అయిపోయింది. పిల్లలకు బన్ను పాలతో సరిపెట్టి బడికి పంపించాను. పాలుగూడా ఎలక్ట్రిక్ స్టావ్ మీద వేడి చేశాను. పొద్దున చాయ్ గూడా అదే పొయ్యి మీద చేశాను. ఇప్పుడు వంటెట్లా చెయ్యాలి మహానుభావా?”
స్నానాదులు ముగించి టిఫిన్ కోసం తయారై డైనింగ్ టేబుల్ ముందు కూర్వోబోతుంటే సువర్చల.. ముక్కుపుటాలను ఎగుర వేస్తూ సవాలు విసిరింది. మాకు నెలకో గ్యాస్ బుడ్డి అవసరం, గ్యాస్ బుక్క్ తీసి చూశాను. “బుక్ చేసి నలఖై రోజులు దాటింది. ఆ గ్యాస్ బుడ్డి ఇంకా రాలేదా?” శ్రీమతి ప్రశ్నకు నా ప్రశ్న జవాబైంది. ఆవిడ మూతులు తిప్పుతూంటే ముచ్చటేసింది.
“బుక్ చేశాక ప్రతిసారి గ్యాసు ఆఫీసుకెళ్లి మూన్నాల్లు సార్లు అడిగితేనే గదా గ్యాస్ వస్తుండేది. మీరెళ్లి అడిగారా!” నిలదీసి నన్ను దోషిగా నిలబెట్టింది. “అది చెడ్డ అలవాటు సువర్చలా! నిబంధనల (ప్రకారము మనం బుక్ చేసిన వారం లోగా గ్యాస్ బుడ్డి ఇంటికి తెచ్చి సప్టై చేయాలి. బుక్ చేసిన తర్వాత వాళ్లాఫీసు కెళ్లాల్సిన అవసరం లేదు.” చిఛీ... అదే పొరపాటు అలవాటైంది. అయితే ఏం చెయ్యాలి?
“రూల్స్, నిబంధనలు సరిగా పాటించినప్పుడది సాధ్యము. టిఫిన్, భోజనం గూడా ఎలక్ట్రిక్ పొయ్యి మీద తయారు చేస్తే కరెంట్ బిల్లు తడిసి మోపెడు అవుతుంది.” ముక్కు పుడక ముచ్చటగా మెరిసింది. నా బుర్రలో సమస్య గిర్రు గిర్రుమంటోంది. మరిప్పుడు మరో ఉపాయం లేదు గదా! ఎలక్ట్రిక్ స్టా వాడక తప్పదు. డ్యూటీకి బ్రైమవుతోంది. ముందు టిఫిన్ తయారు చేయ్. వార్తా పత్రిక అందుకుని అందులో దూరాను. మనసంతా గుడ్డెద్దు మేతకోసం బీడుభూమి లోన తిరుగుతున్నట్టుంది.
సరే... ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు గదా! సువర్చల చేతులు తిప్పుతున్నా అందంగానే ఉంది.
ఆఫీసులో అటెండర్ నుంచి ఆఫీసర్ దాకా ప్రశాంతంగా పని జేస్తున్నారు. కాసేపు బయటి విషయాలన్నీ మరిచి అర్జంట్ ఫైల్స్ చూశాను. పుల్ల గీయగానే గంధకం బగర్రున మండించినట్టు వెంటనే వంట గ్యాస్ విషయం బుర్రలో భగ్గుమంది. ఆఫీసర్ పర్మిషన్ తీసుకుని
నేరుగా గ్యాసాఫీసుకెళ్ళి రోషంగా అడిగాను. జేబు నుంచి గ్యాస్ బుక్ తీసి, బుక్ చేసిన తేదీ చూపించాను. అప్పటికే ఆ క్లర్క్ చుట్టూ తేనెతుట్ట చుట్టూ తేనెటీగల్లా చాలా మంది వినియోగదారులు చేరి బతిమాలుతున్నారు. అరగంట సేపు మోచేతి పొడుపులు, నిట్టూర్పులు భరించి అతని దాకా వెళ్లగలిగాను. మొదట అతదు నా మాట నిననట్లే నటించాడు. తర్వాత గొంతు పెంచి అడిగాను. అతడు మోహం చిట్లించుకుని “నేను చెవిటి వాడిని కాదు. ఆటోల షార్దేజి. గ్యాస్ షార్టేజీతో పై నుంచి సప్లై కావడం లేదు.” కసురుకున్నాడు.
మొన్న ఓ కోవర్మర్ ఆఫీసులో వంట గ్యాస్ బాగోతం గురించి చెప్పాడు. “నేను గ్యాస్ బుడ్డి కోసం బుక్ చేసి నెల దాటింది. గ్యాస్ రాలేదు. తెల్లవారక ముందే నాలుగు గంటలకెళ్లి గ్యాస్ గోదాం వద్ద ఖాళీ బుడ్డితో క్యూలో నిల్చున్నాను. ఆరింటికి గ్యాస్ లారీ వచ్చింది. అందులోంచి సగానికి సైగా బుడ్లు లోపల పెట్టించుకున్నారు. మిగతావి లైన్లో నిల్చున్నవారి కిచ్చారు. నాకు బుడ్డి దొరికింది. గాని వెనక ఉన్న వారికి దొరక లేదు. విసుక్కుంటూ ఖాళీ బుడ్లను తిరిగి తీసుకెళ్లారు. కొందరు ఖాళీ బుద్లు లైనులో పెట్టి పాసుకెళ్లి వచ్చే సరికి ఖాళీ బుడు మాయమైనాయి. మరి కొందరు నిండు బుడ్డీ తీసుకొని పక్కనపెట్టి బైక్ తీసుకొచ్చే సరికి నిండు బుడ్డీ మాయమ్తైందటా. ఇదంతా దొంగలు ఊళ్లు . పంచుకున్నట్టుంది.” అన్న సంగతి గుర్తుకొచ్చింది. “ఇప్పుడు నాకు గ్యాస్ బుడ్డి ఇస్తారా, ఇవ్వరా?” బాధ, రోవషముంతా బయటికొచ్చింది. “నాకు తెల్వదు. మా ఓనర్ నడుగుపోొఅనేశాడు. నాకెక్కడో మండింది.
చరచరా వెళ్లి ఓనరు చాంబర్లో చొరబడి గ్యాస్ బుక్కు చూపించి విషయమంతా చెప్పాను. అతడదో మామూలు విషయమన్నట్టుగా నవ్వేసి “గ్యాస్ షార్టేజి విషయం చెప్పారు గదా! ఇంకా వెయిట్ చెయ్యండి.” అని కుర్చీ వెనక్కు దర్జాగా జేరగిలబడ్డాడు. “అదేమిటీ బుక్ చేసిన వారం లోగా మా ఇంటికి బుడ్డి తెచ్చివ్వాలి గదా గుర్రుగా గుర్తు చేశాను. అతడు నన్ను వదిలేసి నా పక్కవాడితో మాట్లాడుతున్నాడు. “ఇంతకూ నాకిప్పుడు గ్యాస్ బుడ్డి ఇస్తారా లేదా?” ఆవేశంగా అడిగాను.
అతడిక్కోప మొచ్చినట్లుంది. “ఇది గోదాము కాదు. గ్యాస్ అయిపోయింది. అందరి లాగే నువు కూడా రెప్పొద్దున్నే వచ్చి గోదాం నుంచి తీసుకెళ్లొచ్చు.” అని ప్రతి వాడూ బెదిరించడమే నని గొణుకున్నాడు.
“సగానికి పైగా గ్యాస్ బుద్లు బ్లాకులో అమ్ముకుంటున్నారు గదా?” కుండబద్దలు కొట్టినట్టు లోపలి రోషం బయటికొచ్చింది. అతడు శివమెత్తినట్టు ఊగిపోతూ “నువు మా కంపెనీ అధికారివా లేదా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్వా? మా టైం వేస్ట్ చేయ్యకు.” అరిచాడు. “నేను వినియోగదారుల సంఘం కార్యదర్శిని.” నిజం చెప్పేశాను. “ఐతే ఏంటంటా?” రుసరునసలాడాదు. నేను వారం క్రితమే వినియోదారుల నంథుం కార్యదర్శినయ్యాను.
“కన్గూమర్స్ ఫోరంలో కేసు వేస్తా
“ఫోరంలో కేసా?” గ్యాస్ బుడ్డి పేలినట్టు భళ్ళున నవ్వాడు.” ఫోరం కాదు గదా దానమ్మనడుగు ఫో” గంజిలో ఈగలా తీసిపారెశాడు. మొన్నమొన్ననే వినియోగదారుల రక్షణ చట్టం 1986 బుక్ చదివాను.
ఆ రోజు సాయంత్రం మా సంఘం అధ్యక్షునితో చెప్పాను. అతని వాలకం గంభీరంగా మారింది. “చూడు సోదరా! ఇది వరకు ఇదే గ్యాస్ గురించి మన టౌన్లో నలుగురితో శ్రోరంలో కేసు వేయించాము. ఓనరుకు నోటీసు రాగానే దరఖాస్తు దారులను అదిరించో - బెదిరించో కేసులు విజ్డ్రా చేయించాడు. ఆ మహాత్ముడు బ్లాక్ మార్కెట్లో అరితేరాడు.” అని కుర్చీలో నుండి ముందుకు వంగాడు. “ఇప్పుడు నువ్వు కేసు ఫోరంలో వేస్తే వేయ్ గాని నీ పని గూడా అంతే అవుతుంది. మన సంఘము ఇది వరకే అభాసుపాలైంది. ఓనర్‌కు అంగబలముంది. అర్ధబలముంది.”
“అతడెలా అదిరించినా, బెదిరించినా నేను లొంగను. కేసు వేద్దామని పట్టుబట్టాను. మా అధ్యక్షుడు “మాట మీద నిలబడాలి సుమా!” అని హెచ్చరించాడు. అప్లికేషన్, అఫిడవిట్ రాయించాడు. మర్చాడు వంద రూపాయల పోస్టలార్డర్ దానికి జత చేసి, గ్యాస్ బుక్ జిరాక్స్ కాపీలు కూడా జత చేసి ఫోరం అడ్రస్‌కు రిజిష్టర్ పోస్టులో పంపాను. మా పట్నం నుంచి
జిల్లా కేంద్రం ఫోరం కెళ్లాలంటే నూటయాఖై కిలోమిటర్లు ప్రయాణించాలి. వెళ్లి రావాలంటే ఓ రోజు లీవు, బస్సు ఛార్జీలు చాలా అవుతాయి.
ఇల్లాలి ధుమధుమలు, ఇరుగు పొరుగుల ఎకసక్కాలు భరిస్తూంటే ఓ నెల గడిచింది. ఓ రోజు ఉడయమే గ్యాస్ సప్లై కంపెనీ ఆఫీస్ మేనేజర్ స్వయంగా మా ఇంటికొచ్చాడు. వెంట రెండు నిండు గ్యాస్ బుడ్లు పట్టించుకొచ్చాడు. వాటిని మా ఇంట్ల ఉంచి “నమస్కారం సారొ అన్నాడు. ఇది కలనా, నిజమా! ఒళ్ళు గిల్లుకున్నాను. నిజమే. (ప్రతి నమస్మారం చేశాను.
“ఏం సంగతీ? అవి ఎవరికోసం?”
“ఎవరికో అయితే ఇక్కడికెందుకు తెస్తాను సార్, మీ కోసమే.”
“అంటే ఫోరం నుంచి ఏమన్నా వచ్చిందా? మరోటి ఎవరికీ?”
అతన్ని కూచొమ్మని సైగ చేస్తూ నేను కూర్చున్నాను. “అది గూడా మీ కోసమే సార్! మీది డబుల్ సిలెండర్లది గదా!” ఇదేదో విచిత్రంగా ఉంది. అతడే చిరునవ్వు చిందిస్తూ “వీటికి గూడా మీరు డబ్బులివాల్సిన అవసరం లేదు. మీ గ్యాస్ బుక్ ఇవ్వండి. ఒక సిలిండర్ నెల క్రితమిచ్చినట్టు మరోటి వారం క్రితం ఇచ్చినట్టు రాస్తానందులో.” సౌమ్యంగా మాట్లాడుతున్నాడు. “ఫోరం నుంచి మీకేమన్నా వచ్చిందా?” మళ్లీ అడిగాను.
“నోట్రిసు వచ్చింది. మీ కంప్టైంటు కాపీ గూడా వచ్చింది. వెంటనే గ్యాస్ సపై చేసి కా వ క న
మూడు రోజుల్లో జవాబు ఇవ్వమన్నారు. ఇది తీసుకుని మీరు కేసు విత్‌డ్రా చేసుకుంటే
సమస్య తీరిపోతుంది.” మాటల్లో బుజ్జగింపు. నాపక్కనున్న భార్య గూడా విషయమర్ధమైందేమో! “ఇంకేమండీ! ఖాళీ సిలిండర్లు తెచ్చివ్వాల్నా?” ఆవిడ మొవాం. వెలిగిపోతుంది. సముద్రగర్భంలోంచి బడ బానలంలా నా కడుపు లోంచి ఎసరు పొంగుకొచ్చింది. “అవసరం లేదు. ఒక సిలిండరివ్వండి. డబ్బులిస్తాను. ఆ రోజు డెలివరీ దేటు బుక్కిలో రాయండి.” అంటూంటే గొంతులోని ఆవేశం ఆగనంటోంది.
“ఒకటే తీసుకోండి కాని బుక్‌ల మాత్రం...” “ఒకటే ఈ రోజు తేది వేయ్యాల్సిందే.” జేబులోంచి డబ్బు తీసిచ్చాను. పులి లాగొచ్చిన మేనేజర్ పిల్లిలాగ చూస్తూ “ప్లీజ్ సార్! ఇక ముందు ఇలా జరగదు. మమ్ముల్ని క్షమించండి” చేతులు జోడించాడు. నేను రాజీపడలేదు. “వినియోగదారులంటే మీకు వెర్రివెంగళప్పల్లా కన్పిస్తున్నారా?” కోపం ఆగలేదు. ఒక సిలిండర్ ఇచ్చి అదే రోజు డేటు వేశాడు. ఖాలీ బుడ్డి తీసుకున్నాడు. అంతటితో ఆగలేదు. “సార్ ఇంతకు ముందు గూడా ఫారం కేసులు వచ్చినై. వాటిని ఇట్లనే విత్ డ్రా చేయించాం. దీని వల్ల మీకే నష్టం.” అంటూ వెళ్లిపోయాడు.
ఫోరం కేసు ఫలానా నాడు వాయిదా ఉందని నాకు సమాచారమొస్తూనే ఉంది. నేను వెళ్లడం లేదు. నష్టపరిహారము ఖర్చులు గూడా ఇప్పించాలని పిటిషన్లోనే రాశాను గదా! ..
మూడు నాలుగు రోజుల తర్వాత ఓ రోజు ఉదయం గ్యాస్ సప్లై ఓనరు మా ఇంటికొచ్చి “సార్ మీ సాహసం, పట్టుదల తెలీక మా వాళ్లు పొరపాటు చేశారు సార్. నేను గూడా మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను. మమ్ముల్ని క్షమించి దయచేసి కేసు విత్ (డ్రా చేసుకోండి సార్” గదవ పట్టుకుని బతి మాలాడు. “మీకో సిలిండర్ ఫ్రీగా ఇస్తాను. ఓ వెయ్యి రూపాయాలిస్తాను” ఆశ చూపాడు.
“ఏది ఏమైనా కేసు విత్‌డ్రా చేసుకోను.” తేల్చి గట్టిగా చెప్పేశాను. అరగంట సేపు తనకు గల పలుకుబడి గురించి చెప్పి భయపెట్టాడు. నేను రాజీ పడలేదు. చివరగా...“సార్ మీరు వారం రోజుల్లో కేసు విత్ద్రా చేసుకోకపోతే తగిన శాస్తి జరుగుతుంది. నేను మొన్ననే ఈ కేసుకు అటెండై వచ్చాను. పది రోజుల్లో మళ్లీ వెళ్లాలి. నేనిలా అవస్తలు పడుతుంటే మీకేం లాభం?” అస్త్రం పదిలాడు.
“నాక్షాదు. గ్యాస్ వినియోగదారులందరికీ. మీ వల్ల కొన్ని వందల వినియోగదారులు అవస్త పడుతున్నారు, మీ వాళ్ళు ఎంత హంగామా చేస్తున్నారో గుర్తు చేసుకొండి.” అన్నాను. లేచి వెళ్లిపోయాడు. అయినా అతడు ప్రయత్నాలు మానలేదు. మా వినియోగదారుల సంఘం అధ్యక్షుని ఇంటికెళ్లి నాకేసు విత్‌డ్రా చేయిస్తే మా సంఘానికి రెండు వేల రూపాయాల విరాళమిచ్చి మాకు చెరో గ్యాస్ బుడ్డి ఫ్రీగా ఇస్తానన్నాడట. అతడు నొప్పించక, తానొవ్వక
తప్పించుకుని పంపించానని చెప్పాడు. అంతే కాదు. “ఈ దశలో మనం వెనకడుగు వేస్తే బజార్లో ముఖమెత్తుకుని తిరగలేము.” అని హెచ్చరించాడు. నేను వాయిదాలకు వెళ్లడం లేదు. ఓనరు అడ్వకేట్ ద్వారా వాదిస్తున్నాడు. రెండు నెలలు గడిచాయి.
రిజిష్టర్ పోస్టులో నాకో లెటర్ వచ్చింది. ఫ్రం అడ్రస్ వినియోగదారుల ఫోరముది. నన్ను గూడా ఫోరం కేసు వాయిదా నాడు రమ్మని సమన్లు సంపారేమో! అనుకుంటూ విప్పి చదివాను. సూర్యున్ని కమ్మిన మబ్బులు మాయమైనట్టెంది మనసు.
“న్పివ్లిట్రో అయ్యగారి మొహం అలా వెలిగి పోశుందేమిటో!” సువర్చల లెటర్ తీసుకుని చదివేసింది. “సక్సెస్...మన ఫోరం కేసు గ్రాండ్ సక్సెస్. ఇది జడ్జిమెంట్ కాపీ.” మొహం ఎర్రమందారంలా విచ్చుకుంది. “మీరు కేసు గెలిచారు.” లెటర్‌ను కళ్లకద్దుకుంది. “అవును సవర్చల గారూ గ్యాస్ సపై వారి సేవల్లో లోపముందని రూఢి అయింది. కాబట్టి మనకు ఐదు వేల రూపాయాలు నష్టపరిహారముగా, ఐదు వందల రూపాయలు ఖర్చులుగా ఇప్పిస్తున్నారు ఫోరం వారు.” సంతోషాన్ని ఆపుకోలేక ఆవిడ చెంపలందుకోబోయాను. ఆవిడ ముసి ముసిగా నవ్వింది. బాగానే ఉంది సంబరం. అంటూ దూరం జరిగింది. వెంటనే మా వినియోగదారుల సంఘము అధ్యక్షునికి ఆ వార్తను ఫోన్ ద్వారా చేరవేశాను. “చాలా సంతోషం ఇది మన సంఘ చరిత్రలో గొప్ప విజయం.” అభినందనలు తెలిపాడు.
సాయంత్రం సంఘ కార్యవర్గ సమావేశమైంది. ముందు నన్ను ప్రసంశల్లో ముంచెత్తారు. ఆ తర్వాత మరో రెండు కేసులో ఇదే గ్యాస్ కంపెనీపై, మరో రెండు కేసులు ఇంకో గ్యాస్ కంపెనీపై వేయాలని తీర్మానించాము.
ఆరు నెలల్లో అన్ని కేసులు గెలిచాము. ఓనర్ ఒకాయన రాష్ట్ర ఫోరంకు అప్పీలు కెళ్లినా అడ్వకేటు ఖర్చులు, కోర్టు ఖర్చులైనా అదంతా అరణ్య రోదనమైంది. అన్నట్టూ అప్పట్నుంచి మా పట్టణములో వంట గ్యాస్ సపై ఏజెన్సీలు నిబంధనల ప్రకారం సప్లై చేస్తున్నారండోయ్. (తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం-వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌరసరఫరాల శాఖ వారి “వినియోగం-వికాసం కోసం” సంకలనం 2015) న.
మళ్లీ పెళ్లిచూపులు! ఆమె కలహంసలా వయ్యారంగా అడుగులేస్తూ యం.డి. చాంబర్లోకెల్తోంది. ఆనాడు బంగారు పంజరములో రెక్కలాడించ లేక అల్లాడిన చిలకనేనా ఆమె! అవును... ఆమె... కంపెనీ బాసు చాంబర్లో...!? డ్యూటీ టైంకు తన సీటు వద్దకొస్తున్న నరేష్ నవనాడుల్లో అయోమయం అంగలేసింది. ఆఫీసు ఎప్పట్లాగే వుంది. అంతపెద్ద కంపెనీ ఆఫీసులో అతడో సాప్టువేరు ఇంజనీరు. సీటు మీద కూచుండి కంప్యూటర్ (ప్రోగ్రాంలో కెళ్లాలనుకున్నాడు. జ్ఞాపకాల వ్యాపకాల్లో దాగున్న పాసువర్డు గుర్తుకు రాలేదు. ప్పి... కంపెనీ ఉద్యోగములో ఉరుకులాడుతున్నా తనది తాడూ-బొంగరంలేని పరిస్థితి. పక్కసీటు పారిజాతం ఎర్రని లిప్‌స్టిక్ పెదాలమీద తెల్లని చిరునవ్వు చిందులేస్తుంటే వచ్చి భుజమ్మీద చెయ్యేసింది. చటుక్కున తొలగించాడు. ఆమె మొహం అరవిరిసిన పారిజాతమైంది. “మిస్టర్ నరేష్! క్యాంటీన్లో గరంచాయ తాగొద్దామా?” కళ్లను కమ్మగా తిప్పింది. అప్పుడు గుర్తుకొచ్చింది పాసువర్డు. వేళ్లు డాన్స్ చేస్తూంటే ప్రోగ్రాంలో కెళ్లిపోతూ “తర్వాత వెల్దాంలే!” పనిలో లీన మవాలనుకున్నాడు. మళ్లీ ఆలోచన... ఆమె... కొంపదీసి బాసు ముందు తన బండారం బద్దలు కొట్టదుగదా!” ఆఫీసర్ క్యాబిన్‌వైపు చూశాడు. అది అద్దాల గది. అందులోంచి బయటికొస్తున్న ఆమెను చూపిస్తూ ' పారిజతం “ఆమె ఈరోజే కొత్తగా డ్యూటీలో జాయినైంది. పేరు శార్వాణి” అంటూ వెళ్లి తన ,. సీట్లో కూచుంది. వేళ్లు కీబోర్డు మీద ఆడుతూ ఆగిపోయినై. మనసు కంప్యూటర్ గతంలోకి లాగాన్ అయింది... అనాడు... నరేష్‌కు నా అన్న వారెవ్వరూ లేరు. స్నేహం నీడనిచ్చే చెట్టులాంటి దన్నట్టుగా ఆప్తమి(త్రుడు సురేష్ చేరదీశాడు. వాళ్లింట్లోనే భోజన, వసతి సౌకర్యం. ఇంజనీరింగ్ అడ్మిషన్ ఫీజు అతడే కట్టాడు. అతడు కోటీశ్వరుడే కాని చిన్నప్పుడే పోలియోతో కుడికాలు చప్పబడింది. అప్పటికే తల్లిదండ్రులు స్వర్గవాసాని కెళ్లారు. కట్నం లేకున్నా సరే ఓ అందాల “బొమ్మను పెళ్లాడాలనుకున్నాడు. చదువు సాగించలేక వ్యాపారాలు చూసుకుంటున్నాడు. తాను ఇంజనీరింగ్ సగం దాకా ఈదుకొచ్చాడు.
ఓరోజు తాను కాలేజి నుండి రాగానే తన గదిలోకొచ్చాడు. చంక కర్రలు పక్కనబెట్టి కుర్చీలో కూచుంటూ “నాకో సమస్యరా నరేషూ! దాన్ని అధిగమించాలంటే నీ సాయం కావాలొ అడిగాడు ఆశగా.
అతనికి సహాయం చేసే అవకాశం దొరకడం తన అదృష్టం. అలాంటి అవకాశం... రావాలని ఎదిరి చూస్తున్నాడు.
మారు మాట్లాడకుండా సరేనన్నాడు.
“నేన్స గ్రోజ పెళ్లిచూపుల్లో చూడబోయే అమ్మాయి నింతకు ముందే చూశాను. కుందనబొమ్మలాగుంటుందిరా!
“కంగ్రాట్స్! మరింక సమ్యస ఏముందిరా?”
“ఆమె అరవిరిసిన మందారము. నేను అవిటివాన్ని, నన్ను నచ్చక పోవచ్చు. అందుకే ఒక ఉపాయం, దాన్ని నువ్వు అమలుచెమ్యాలి.”
“అబద్ధమాడాలా?”
“అబద్ధమేమీ కాదు. అంతకంటే గొప్పదేరా నరేష్. పెళ్లిచూపులకు నువ్వు నా పేరుతో వెళ్లాలి. నువ్వందగాడివి. తప్పకుండా నచ్చుతుంది. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా.”
ఒప్పుకోక తప్పలేదు. పథకములో పాత్రధారి అయాడు.
పథకము విజయవంతంగా అమలైంది. వ్యవహారం పెళ్లిపీటల దాకా వచ్చింది. రకరకాల పూలదండలతో అలంకరించబడిన పెళ్లి పందిట్లోకి నరేష్ చంక కర్రలతో రాగానే అమ్మాయికి, ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం అర్థమైంది.
వాళ్లది పేద కుంటుంబము. పరువు ప్రతిష్టలే ఆస్తిపొస్తులుగా జీవిస్తున్న ఆమె తల్లిదండ్రులు మొహాలు చూసుకుని అయోమయంలో పడిపోయారు. నరేష్‌ను కాదని తననే పెళ్లిచేసుకొమ్మని కాళ్లు పట్టుకొని బతిమాలారు. “నాకు అర్జంటు పని ఉంది” అంటూ తాను బయటికి నడిచాడు. బయట కిటికీలోంచి అంతా చూస్తున్నాడు. అమ్మాయి కాస్సేపు చీదరించుకుంది.
పీటల మీది పెళ్లాగిపోతే ఆ అమ్మాయికి పెళ్లవుతుందా? కాలమెంత మారినా మహిళా చైతన్యం ఎంత పుంజుకున్నా ఆ పరిస్టితిలో ఎవరూ ఏమీ చేయలేక పోయారు. భీత హరిజేక్షలాగున్న శార్వాణి, పేదింటి పిల్ల: తలవంచక తప్పలేదు. శార్వాణి-సురేష్‌ల పెళ్లి శాస్రోక్తంగా జరిగిపోయింది.
అ షాక్ నుండి తేరుకోలేక శార్వాణి తండ్రి మర్నాడే గుండెపోటుతో మరణించాడు.
తన మనసు అల్లకల్లోలమైనా, ప్రాణమిత్రుని పట్ల కృతజ్ఞతాభావం ఉపశమనం కలిగింది. అందాల శార్వాణి అవిటివానికి ఇల్లాలైపోయింది. తల్లి మనోవేదనతో తల్లడిల్లిపోయింది.
తాను అదే ఇంట్లో ఉంటున్నాడు. సురేష్ చెడు అలవాట్లు మానలేదు. శార్వాణి అతిపెద్ద బంగారు పంజరములో చిన్న చిలుకలాగైపోయింది. కాని మధ్యలో వదిలేసిన బి.ఏ.ను పూర్తి చేస్తోంది (ప్రైవేటుగా.
తన చదువైపోయింది. ఇంజనీరయాడు. ఉద్యోగాన్వేషణ బలం పుంజుకుంది. ఆమె కనబడినప్పుడల్లా తన ఎదపొదలో ఆందోళన. భోజనం వగైరాలన్నీ పనిమనిషి ద్వారా తన గదిలోకొచ్చేవి. వసారాలో జరుగుతున్నదంతా తన గదిలోకి కనబడేది, వినబడేది. ఆమె అప్పుడప్పుడు వసారాలో టీ.వి.ముందు కనబదేది. తనవైపు కన్నెత్తి గూడా చూసేది కాదు. తన గదిలో మాత్రం పుస్తకాలు ముందేసుకుని కూచునేది. బహుశః విసుగొచ్చినప్పుడే టీ.వి. ముందుకొస్తుందేమో. ఒక్కోసారి ఆమె సిత ప్రజ్ఞతకు మనసులోనే జోహార్లర్చించేవాడు.
తామే ముందుండి సురేష్ పెళ్లి జరిపించిన దాయాదులకు అతని బలహీనతలు బాగా అర్ధమైనాయి. సురేష్ ఆస్తులు తమకే చెందాలని అంతకుముందే వేసిన కోర్టుకేసు గెలుపుకోసం గట్టి ప్రయత్నాలు ప్రారంభించారు. కేసులో సురేష్ తరపున వాదించేందుకో లాయర్‌ను మాట్లాడ్డాం తన వంతైంది. కోర్టు వ్యవహారాలన్నీ లాయర్‌కు వదిలేసి సురేష్ క్లబ్ కెళ్లేవాడు. వ్యాపారాలవైపు వెళ్లడం మానేశాడు. మస్తుగా తాగి సుస్తుగా ఏ రాత్రికో ఇంటి కొచ్చేవాడు.
చంక కర్రల్ని పక్కన పదేసి సోఫాలో ఒరిగిపోయేవాడు. అతన్ని గదిలోకి తీసుకెళ్లడం, అన్నం తినిపిస్తూ తిట్లు తినడం శార్వాణికి నిత్యకృత్యమైంది. సురేష్ పెళ్లెం తర్వాత బాగు పద్దాడనుకున్న తన అంచనాలు వంచన చేశాయి. దోరమాగిన మామిడిపండు అందుబాటులో ఉన్నా అనుభవించలేని దౌర్భాగ్యుడవుతా డనుకోలేదు. ఏది ఏమైనా తొను మాత్రం అమెను వదినా అని పిలిచేవాడు.
పాపభీతి గుండెల్ని గీకుతూంటే ఓ రోజు తాను చదవడం పూర్తిచేసి అటువైపు చూశాడు. అప్పటికే రాత్రి పదకొండు దాటింది. ఆమె వసారాలో వుంది. సురేష్ ఎప్పట్లాగే తాగి, ఊగుతూ వచ్చాడు. అతన్ని మంచి మాటలతో కూచోబెట్టి “మీరీ దురలవాట్లు మానుకుని వ్యాపారాలు చూసుకుంటే మంచిది. నేను మీకు తోడున్నాను గదా!” అనునయంగా సముదాయించింది.
సురేష్ రోషంతో రెచ్చిపోయాడు. “పెళ్లానికి చనువిచ్చి నెత్తిమీద కూచోబెట్టుకుంటే పెనిమిటి పరువు పచ్చిపులుసై పోతుంది. నీ చదువు నువు చదువుకో . నా స్వేచ్చను అరికట్టాద్దు”
ఆమె ఇంకేదో అనబోయింది. చెంపలు చెళ్లు మనిపించాడు.
ఆమె పట్టువదలలేదు. చెంపలు పుణుక్కుంటూ “మీరు మారి తీరాల్సిందే. అవిటివారైనా మనసు వెన్న అనుకున్నాను...”
అతనికి పిచ్చెక్కినట్టుంది. బల్లమీదున్న పెళ్లి ఫోటోను నేలకు విసిరి కొట్టాడు. శార్వాణి మనసులా అది ముక్కలైంది. రోజులు భారంగా గడుస్తున్నాయి. సురేష్ ఆమెను హింసిస్తూనే వున్నాడు. బి.ఏ. రిజల్టు వచ్చాయి. సెకండ్ క్లాసులో పాసైంది.
ఆ రోజు రాత్రి పనిమనిషి ఇంటికెళ్లిపోయింది. శార్వణి టీ.వి. చూస్తోంది. తాను భయంభయంగా అమె వద్దకెళ్లాడు. టీ.వీ. ఆఫ్ చేసి “అభినందనలు వదినా! బి.ఏ. మంచి మార్కులతో పాసయ్యావు గదా!” ఆనందం వెలిబుచ్చాడు.
బెదిరిన లేడిపిల్లలా దిగ్గున లేచి నుంచుంది. “థాంక్స్. ఈ రాత్రి ఇటెందుకొచ్చావు? సరే.. ఇక వెళ్ల గుర్రుగా చూసింది.
“నీలాంటి అందాల బొమ్మకు సురేష్ అన్యాయం చేస్తున్నాడు.”
“అందులో తమరి పాత్ర అమోఘం”
“త్రాగుడు తందనానలు మానుకోమని నేను వానికెన్నోసార్లు చెప్పాను.”
“ఎంత ప్రయత్నించినా కుక్కతోక వంకరనే గదా! నువ్వెళ్లు”
“నీకు న్యాయం చెయ్యాలనుంది”
“సిగ్గులేదూ! నలుగురిముందు నా చెయ్యందుకుంటానని కుంటి కులాసాన్ని నాకంటగట్టావు. అంతకంటే మించి నువ్వేమీ చెయ్యలేవు. వెళ్లు” ఆడపులిలా ఉరిమింది.
తాను గాలిదీసిన ట్యూబులా వెనుదిరిగాడు.
కాలం ఉక్కుకెౌగిట్లో బిగించింది. తనకు ఉద్యోగం దొరికింది. వెంటనే బెంగుళూరు వెళ్లి జాయిన్ అయ్యాడు. బతుకుబాట కనబడింది.
రోజూ అక్కడి మిత్రులు ఫోన్ చేస్తున్నారు. వారి ద్వారానే సురేష్ కోర్టు కేసులో చిత్తుగా ఓడిపోయాడనీ, దాయాదులు కోర్టు ద్వారా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారనీ, అది భరించలేక సురేష్ గుండె శాశ్వతంగా ఆగిపోయిందని తెలిసింది...
“ఏమయ్యా నరోత్తమా! మైగాడ్! ఊహల ఊయ్యాలలో ఊరేగుతున్నారా?” పారిజాతం భుజం పట్టి కుదిపి వాస్తవ లోకానికి తీసుకొచ్చింది. చెయ్యి పట్టి క్యాంటీన్‌కు లాక్షాల్లింది.
ఆదివారం... హాలీడే... ఉద్యోగులందరికీ జాలీడే.
కాల సముద్రం కెరటాలను తట్టుకుని జీవన నౌక మునగ కుండా జా(గ్రత్తపడిన శార్వాణి అద్దెంట్లా, అమ్మతో వుంది. ఉద్యోగం ఊరట నిచ్చింది. అంతకుముందే కంప్యూటర్ నేర్చుకోవడం మంచిదైంది.
తలంటు స్నానంచేసి, వదలు జడ వేసుకుంది. అమ్మచేతి గరం చాయ్ సేవించి వసారాలోకొచ్చింది. గుండె గుబగుబలాడింది. కుర్చీలో నరేష్... కరిమబ్బు లాగున్న మొహం...
బలవంతపు చిరునవ్వు. కోట్ల రూపాయల వ్యాపారములో దివాలదీసిన వాడిలాగున్నాడు. పెళ్లి చేసుకుని పిల్లా-పాపలతో ఉండుంటాడు.
“అంతా బాగేనా?” అడుగుతూ లేవబోయాడు. కూచోమ్మని సైగ చేసింది.” నా బాగోగులు నీకు తెల్పుగాని నీ బగోగులే నాకు తెలీవు. పెళ్లాం-పిల్లలు అంతా బాగున్నారా నరేష్” తానూ కూచుంది.
“నా బాగోగులా?” ఆశ్చర్యంగా కళ్లలోకి చూశాడు. “నాకింకా పెళ్లి కాలేదు. సురేష్ విషయమంతా తెలిసింది. ఆ తర్వాత సంగతులు తెలియలేదు. అమ్మా, మీరంతా బాగేనా?”
గతమంతా ఇద్దరి కళ్లల్లో రంగరించుకుంది.
“నా బాగోగులతో నీకేంపని?” అసహనాన్ని పంటి బిగువున ఆపుకుని సర్జుక్కూచుంది.
ఆమెనాపాదమస్తకం చూపులతో తడిమాడు. శార్వాణి అందాలేమీ తగ్గలేదు కాని బోలెడంత అనుభవసారం జీర్చించుకున్నట్టుంది. ఆమె చూపులోని చురుకుదనం... అదోలాగన్పించింది. “మా ఆఫీసులో ఉద్యోగం చేస్తావనుకోలేదు. చాలా సంతోషం”
పార్వతమ్మ వచ్చి కూతురు పక్క కుర్చీలో కూచుంది. “ఈ అబ్బాయి నెక్కడో చూసినట్టుంది శార్వాణీ!” ముడతల నుదుటి మీది ముంగురులను మునివేళ్లతో సర్దుకుంది.
“నిజమే... పెళ్లిలో చూశావమ్మా!” శార్వాణిలో ఏదో ఆవేశం.
పార్వతమ్మకంతా గుర్తుకొచ్చింది. “నా కూతురు బతుకును బండలపాలు చేసింది నువ్వే కదా నాయనా!” గొంతులో వెటకారం. అతడు తాబేలులా కాళ్లు కుర్చీలోకి ముడుచుక్కూచున్నాడు.
“నువు బెంగుళూర్లో ఉద్యోగం చేస్తుంటివి గదా!” శార్వాణి అవేశాన్ని అణిచి పెట్టింది. “నేను బియ్యే పాసయాక, నువు బెంగుళూరు వెళ్లాక కంప్యూటర్ నేర్చుకున్నా ఉద్యోగంలో కొత్తగా జాయినయ్యాను.”
“అలాగా నాకు మొదట బెంగుళూరుకు పోస్టింగొచ్చింది. అక్కడ పనిచేస్తున్నప్పుడే ఇక్కడికి ట్రాన్స్ఫరైంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పంజేస్తున్నా సంతోషం కరువైంది.”
“సరే... ఇప్పుడెందుకొచ్చినట్టూ?” శార్వాణి గాంభీర్యం.
“ఇప్పుడు సురేష్ లేడు గదా! చేసిన తప్పు దిద్దుకావాలనుకుంటున్నాను. నువు సరేనంటే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. మీ అమ్మను మా అమ్మలా చూసుకుంటాను.”
“మిస్టర్ నరేష్” దిగ్గున లేచి నుంచుంది. రోషంతో మొహం వివర్షమైంది. గుందెలెగసి పడ్తున్నాయి. “అయితే... మళ్లీ పెళ్లిచూపుల కొచ్చావన్న మాటా! నీ నటనా చాతుర్యం అమోఘం. ఈ సారి నన్ను ఎవరి కప్పగిస్తావో!?” కింది పెదవి మునిపళ్ల మధ్యకొచ్చింది.
“ఆ తప్పు మళ్లీ చెయ్యను” లేచి నుంచున్నాడు.
“నేను గూడా ఆ తప్పు మళ్లీ చెయ్యను. కసాయివని తెలిసి నిన్ను నమ్మేందుకు
నేను గొర్రెను కాదు.”
అతని చూపులు నువ్వన్నా చెప్పమ్మా అన్నట్టుగా పార్వతమ్మ వైపు మళ్లాయి. పార్వతమ్మ అయోమయంగా లోపలి కెళ్లి పోయింది.
“అయ్యా, నరేష్‌గారూ! నేను మనసున్న మనిషిని. తమరిక వెళ్లవచ్చు” శార్వాణీ గిరుక్కున తిరిగి లోపలికెళ్లిపోయింది.
నెలరోజుల్లో శార్వాణికి ఉద్యోగ బాధ్యతలన్నీ కరతలామలకములైనాయి. మొదట్లో కొత్తకుండలో ఈగలా గన్ఫించినా యం.డి. గారి ప్రోత్సాహముతో ఆత్మవిశ్వాసం కలిగింది.
డ్యూటీ కెళ్లొచ్చి యధావిధిగా అమ్మచేతి గరంచాయ్ కావాలంటూ కుర్చీలో కూచుంది.
“డ్యూటీ ఎట్లనిపిస్తుంది శార్వాణిగారూ?” ఇంటి ఓనరు, కళాశాల లెక్సరర్ శాంతకుమార్ వచ్చి పలుకరించాడు. పలుకరింపులోని ఆత్మీయత పులకింతలు వడ్డించింది.
“బాగానే వుంది సార్!” ఎదుటి కుర్చీని కళ్లతో చూపించింది కూచొమ్మని. ఎతైన గుండెల మీద పొడగాటి జడ నల్లనాగులా మెలికలు తిరిగింది. “మీలాంటి యువ కిశోరమే ఆ యం.డిగారు. ఆయన మీ మిత్రుడు కాబట్టి తన చాంబర్లోలే డ్యూటీ యిచ్చాడు. మీరాయనకు నా గురించి చెప్పడం మంచిదైంది.” నుదుటి కనుబొమలతో సయ్యాటలాడుతున్న ఉంగరాల ముంగురుల్ని నాజూగ్గా సవరించుకుంది. ఇద్దరూ కూచున్నారు. పార్వతమ్మ చాయగ్గాసులలో వచ్చి తలా ఒకటి అందించింది.
జరజరా నరాల్లోకి ప్రవహించిన చాయ ఉత్తేజాన్నిచ్చింది. అద్దె ఇంటిలో చేరేముందు శాంతకుమార్‌కు, ఆయన శల్లికి తన పరిస్థితిని, జీవితములోని సంఘటనలన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది. తల్లి, కొడుకుల అంతరాళాల్లో జాలి జాలువారింది. శార్వాణి అందచందాలు అతన్ని ఆకట్టుకున్నాయి.
“ఇలాంటి నుందరాంగి నాతో జీవితాన్ని పంచుకుంటే ఎంతో బాగుందేది” అనుకుంటున్నాడు.
“మా అమ్మ ఒంటరిగా ఉంటుంది" శాంతకుమార్ చూపులు శార్వాణి నాపాద మస్తకం తడుముతున్నాయి. “మీరు, మీ అమ్మగారు తోడుగా ఉంటున్నారు. మీ స్వభావాలు మా అమ్మకు బాగా నచ్చినై, పార్వతమ్మవైపు చూశాడు. ఆమె గూడా కూతురు పక్క కుర్చీలో కూచుంది. ఆ ఇంటికి, శాంతకుమారింటికి గోడనే అడ్డము.
“అన్నట్టూ!” పార్వతమ్మలో సంతోషం. “మీకు పెళ్లెతే మీ అమ్మగారికి విశ్రాంతి. పెళ్లెప్పుడు చేసుకుంటారూ?”
“నాకు నచ్చిన, నన్ను మెచ్చిన శార్వాణిలాంటి వినయ, విధేయతలున్న అమ్మాయి దొరికితే వెంటనే చేసుకుంటా” అతని చూపులు అర్ధవంతంగా ఉన్నాయని తల్లీకూతుళ్ల కర్థమైంది.
“అంతా దైవేచ్చ బాబూ! మా శార్వాణికి మళ్లీ పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది. ఇంతకు ముందే మీ అమ్మగారాొచ్చి వెళ్లారు. చాలాసేపు మాట్లాడ్తూ కూచున్నాం” పార్వతమ్మ లేవబాయింది. అప్పుడే శాంతకుమార్ తల్లి వచ్చి కొడుకు పక్క కుర్చీలో కూచుంది.
“శాంతమ్మగారూ! నేనో మాటడుగనా!” శాంతకుమార్ తల్లి ఆశగా చూసినది. ఆమె వాలకాన్ని చూసి శార్వాణి, శాంతకుమార్‌లు నవ్వుకున్నారు. 1]
“అయ్యో! నేనేమీ అనుకోను అడగండి” శాంతమ్మలో కాసింత అయోమయం. కొంపదీసి ఇల్లు ఖాళీ చేయాలనదు గదా!
“మా శాంతకుమార్‌ను పెళ్లి చేసుకొమ్మంటే ఒప్పుకోలేదు. మీ శార్వాణి అందాలు, గుణగణాలు, జీవితములో దెబ్బదిన్న సంఘటలన్నీ అవగాహన చేసుకున్నాదు. శార్చాణినైతే పెళ్లి చేసుకుంటనంటున్నాదు. మీ అభిప్రాయం చెప్పండి.”
శార్వాణి, శాంతమ్మ మొహాలు చూసుకుని నవ్వుకున్నారు.
“గత సంవత్సరమే మా నాన్నగారు ఆక్సిదెంటులో చనిపోయారు” శాంతకుమార్ అందుకున్నాడు. “మా అమ్మను కన్నతల్లిలా చూసుకునే గుణవంతురాలినే పెళ్లాడాలనుకున్నాను. శార్వాణి నాకు బాగా నచ్చింది. మీ అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పండి.”
“మీ అభిప్రాయమే మా అభిప్రాయం బాబూ!” కూతురును కనుసైగలతో సంప్రదించి చెప్పేసింది శాంతమ్మ,
శార్వాణి బుగ్గలనిండా సిగ్గుల భారము. ముసిముసిగా నవ్వుతూ లేచి గదిలోకి తుర్రుమంది. ఆనందం అర్జవమైంది.
శాంతకుమార్ ఉత్సాహం అమెను వెంబడించింది.
(నెలవంక - నెమలీక” నవంబర్ 2016)
సినిమా సంబరం
“సిన్మా జబర్దస్తుగుంది గదా శిరిషా!” సతీసమేతంగా సిన్మా చూసొచ్చి తాళం తీస్తూ భార్యను ఓర కంటితో చూశాడు రవీంద్ర. మ్యాట్నీ సినిమా మసొలాను నెమరేసుకుంట *స్తూప్రరండీ” కనుబొమలెగరేసింది శిరీష గడప దాటి కాళ్ళకింది కొస్తున్న సీళ్ళను గమనించేట్టు లేరు. మూన్నెళ్ళ క్రితమే ముత్యాల పందిట్లో మూడు ముళ్ళ బంధముతో ఒకటైన దంపతులేదో లోకంలో వున్నారు.
తలుపులు తీస్తూ “వామ్మో... నీళ్ళు” అదిరి పడ్డాడు.
“బంగారం లాంటి ఇల్లు చెరువు లాగైందండీ!” గుండెల మీద చెయ్యేసుకుంది. నీటి ప్రవాహం గడపను లంఘించి వస్తూ పాదాలను, చెప్పులను తడిపేసింది. “మనం వెళ్లేప్పుడు నీళ్ళులేవుగదా! వర్షం పడినా లీకేజీలు లేనిల్లు గదా” లోపలి కెళ్ళింది. రవీంద్ర అనుస రించాడు. వంటింట్లో నేల మీదుంచిన భాళీ గిన్నెలు నీళ్ళ మీద తేలి ఆడుకుంటున్నాయి. సినిమా చూడగానే హోటల్లో టిఫిన్ చేసొచ్చారు. అంతా అయోమాయంగా వుంది. మొహాలు చూసుకుంటూ తలలు కొట్టుకున్నారు. ఏడుపొస్తున్నట్టుంది.
ఏదో శబ్దం వినబడుతోంది. “అయ్యయ్యో! బోరు మోటరు వేసుందండి!” తడిసిన కుచ్చెళ్లను పైకి లాక్కుంటూ వెళ్ళి బోరుమోటారు స్విచ్ నొక్కేసింది. “అరెరే పైన టాంకు నిండి మెట్ల మీంచి నీళ్ళు ఇంట్లోకొచ్చాయి శిరీషా!”
“అవ్పనండీ! మనం భోం చేస్తున్నప్పుడు బోరు మోటారు వేసుంది. కరెంటు పోయింది. భోం చేశాక స్విచాఫ్ చెయ్యడం మరిచిపోయామండీ!”
“అవును అంతే! మనం వెళ్ళగానే కరెంటు వచ్చింది. బోరు నీళ్ళు టాంకు నిండి కిందికొస్తున్నై”
“అవునండీ! సిన్నాకెళ్ళాలనే సంబరములో బోరు, టీ.వి. స్విచ్‌లు ఆఫ్ చెయ్యడం మరిచాము” నెత్తి కొట్టు కుంటుంటే మూడు రాళ్ళ ముక్కుపుడక మెరిసింది.
“బ్రరెర్రే! నిన్న తెప్పించి పెట్టిన బియ్యం బస్తాలు గూడా తడిచి పోయినై శిరీషా! సంబరం జాస్తి అయితే... మరి ఇంతే...”
“అయ్యో! మన మతిమండా! కరెంటు పోగానే వేసున్న స్విద్లు బంద్ చెయ్యాలని మరిచిపోయాం. ఇల్లు చెరువైపోయింది.” సినిమా సంబరం హుష్టాకై పోయింది. చెరో చీపురందుకుని పనిలోకి దిగారు. (“ప్రసారికి జూలై 2015)
తీరము దూరము
ఆశల ఆరాటంతో ఆశయాల పోరాటంలో నెల రోజులు ముభావంగా గడిచాయి. ఆరోజు... సూర్యకాంతి ఆఫీసు నుండి రాగానే వేడిచాయ సేవించారు. మంచమ్మీద కూచున్నారు.
సూర్యకాంతి వైదేహి భుజమ్మీద చేయ్యేసింది. “వైదేహీ! ఇవ్వాళ్ల మనోరహన్నయ్య మా కాలేజాఫీసుకొచ్చిండు. మీరు జంటగా రామప్ప వెళ్లివచ్చిన తర్వాత నువ్వతనకి కనబడలేదటా. ఫోన్ చేసినా తియ్యడం లేదటా, ఎందుకు తప్పించుకు తిరుగుతున్నావు? టూర్లో ఏమన్నా అసభ్యంగా ప్రవర్తించాడా?”
“ఛ ఛ... అలాంటి వాడు కాదతడు. ఆ సంగతి నొదిలెయ్ కాంతీ!”
“ఎందుకొదిలెయ్యాలి?” భుజమ్మీంచి చెయ్యితీసి సవాలు విసిరింది. “అతడేమో నీ మెడలో మూడుముళ్లు వెయ్యాలని ఆరాటపడ్డుంటే నువు అట్లా ఎందుకుంటున్నావు? అతడంటే ఇష్టం లేదా?” రోషం.
“ఇష్టంలేక కాదుగానీ, మా(్రేమ పెళ్లిదాకా రాదని.” నిరాశ.
“ఏం? ఎందుకట్లా అన్బించింది?” జరిగి దగ్గరి కొచ్చింది. వైదేపా మొహంలో రంగులు మారినై. చూపులు శూన్యంలో కెల్తున్నై “రామప్ప నుండి ఆదివారం రాత్రి తిరిగొచ్చాం గదా! అతని చిలిపి చేష్టలు గుర్తుకొచ్చి గిలిగింతలు పెట్టినై. మర్నాడు ఉదయం నువు డ్యూటీ కెళ్లాక నేను నేరుగా మనోహరింటి కెళ్లాను. ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా గాయత్రిమాత ఆయిల్ పెయింట్ స్వాగతించింది. లోపలినుండి ఓ పెద్దావిడ బయటికొచ్చి “నేను మనోహర్ తల్లిని, ఎవరు కావాలమ్మా?” అడిగి కూచోబెట్టింది. అమ్మ వారిలాగున్న ఆమె నుదుట రూపాయి బిళ్లంత కుంకుమ బొట్టు, పాపిటలో సిందూరం ఉదాత్తంగా ఉన్నాయి. ఇంటి వాతావరణం పవిత్రంగా, ఆమహ్హాదంగా వుంది.”
“అయితే ఏందటా?” అసహనం.
“వేప్పేది విను కాంతీ! అప్పుడే ఓ యువతి వచ్చి వైదేహి అంటే మీరేనా? అని అడిగింది. అవునన్నాను. మీ గురించి మా అన్నయ్య చెప్పిండు. మనోహరన్నయ్య వాళ్ల కాలేజి స్టూడెంట్సుతో విద్యావిహార యాత్రకెళ్లాడు. వారం రోజుల టూరటా. కదనాన్నా!” అటే వచ్చిన పెద్దాయిన వైపు చూసింది. పెద్దాయన అవునన్నట్టుగా తలూపాడు. పట్టు పంచ, ఒంటినిండా విభూతి రేఖలు, మెడలో తులసి మాలతో పరమ శివుడలాగున్నాడాయన. అప్పుడే పూజాగదిలోంచి వచ్చినట్టుంది. లేచి నమస్కరించిన.
“సుఖీభవ”, కూచోమ్మా, అన్నాడాయన. కూచున్నాను. తానూ ఎదురు సోఫాలో కూచున్నాడు. ఏదన్నా పౌరోహిత్య కార్యక్రమమా! లేదా మనోహర్షోనే మాట్లాడాలా? “మర్యాదగా
అడిగాడు. వాళ్లు సదాబ్మాణులని అర్ధమైపోయింది. మారు మాట్లాడకుండా బయటి కొచ్చేసిన. బయటి గోడకు నెల్లుట్ల వాడుదేవశర్మ, పురోహితులు, సైనుబోర్జ్డువేసుంది.
మేముహరిజనులమని మనోహర్ గారికి తెలియదు. నేనసలు అతడుగూడా హరిజనుడనుకున్నాను. అందని ద్రాక్షపళ్ల కాశపడడం వివేకం కాదుగాదా!” విషాదఛాయలతో మొహం ఇంద్రధనుస్సులా కనబడింది. సూర్యకాంతి నిట్టూర్చింది.
ఆరోజు సెలవు దినము, ఇద్దరి స్నానాలవీ పూర్తయినాయి.
“వైదేహీ! ఇవ్వాళ్ల మా ట్రిన్స్పాల్ గారింట్లో పార్టీ వుందటా. నిన్నుగూడా తీసుకుని తప్పక రమ్మన్నారు.” తయారై బొట్టు పెట్టుకుంటుంది.
“నాగ్గూడా ఫోన్లో చెప్పారు కాని వాళ్లు బ్రాహ్మలు గదా కాంతీ! మనం అబ్రాహ్మలం” ఎట్లా వెల్దామన్నట్టుగా కనుబొమలెగిరి పడినై.
“మా ప్రిన్స్‌పాల్ గారి కలాంటి చాదస్తం లేదు. ఆయన సంస్కరణ వాది. ఆయన భార్య నన్నోసారి వారి వంటింట్లోకి తీసుకెళ్లి ఆత్మీయంగా మాట్లాడింది.”
“అట్లానా? అయితే పోదాం పదా!” గబగబా తయారైంది. ఇద్దరూ వొస్టల్ బయటి కొచ్చి అటోలో కూచున్నారు. ఆటో నున్నని రోడ్డుమీద వేగంగా పరుగులు తీస్తుంటే వైదేహి వారపత్రిక పేజీలు తిరగేస్తూంది. సూర్యకాంతి మనసు తెరమీద అంతకు ముందు రోజు సంఘటన దృశ్యాలు తిరుగుతున్నాయి.
మనోహర్ ఇంట్లో...తమ కాలేజి ప్రిన్స్‌పాల్ నాగఫణి శర్మ కూచున్నాడు. వాసుదేవ శర్మ దంపతుల కంతా చెప్పాడట. ఒప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అంతకు ముందు మూన్నాల్గు రోజుల ముందే నాగఘణిశర్మ మనోహర్ ద్వారా విషయమంతా విన్నాడట.
సంభాషణలన్నీ తనముందే జరిగాయి. అంతావిన్న వాసుదేవశర్మ “ఛఛ... చచ్చినా సరే ఇలాంటి వర్ణ సంకరానికి నేనొప్పుకోను.” భీష్మించుక్కూచున్నాడు. అతడు నాగఫణి శర్మకు స్వయానా మామ అన్న సంగతి అక్కడే తెలిసింది. అయితే...నాగఫణి శర్మ భార్య వేదవతి కాయన తండ్రి.
“ఇది వర్మ నంకరం కాదువూవయ్యా!” నాగవణిళర్మ వాలకం శుభ్రజ్యోత్న లాగుంది “మనోహర్ భవిష్యత్తు. ఇది కంప్యూటర్ యుగం. పనిని బట్టి కులం వచ్చింది కాబట్టి మీరు విభేదించడం అధర్మం.”
“అల్లుడు గారూ! మీరు వారి బుట్టలో పడిపోయారు.”
“బుట్టలో కాదు మావయ్యా! నిజం చెప్తున్నాను. భగవద్దీతలో పరమాత్ముడు చాతుర్వర్హం మయా సృష్టి అన్నది పనినిబట్టే కాని పుట్టుక బట్టి కాదు. వర్ణమనేది పుట్టుకతో రాదుగదా! వేదాల్లో కులము, మతము గురించి ఏమన్నా వుందా! ఇవన్నీ మధ్యకాలములో కల్పించిన అమర్యాదలు. వశిష్టమహర్షి బ్రాహ్మణుడు. హరిజన కన్య అరుంధతిని
పెళ్లాడాడుగదా! శ్రీకృష్ణుడు యాదవుడు క్షత్రియ కన్యను పెళ్లాడ లేదా?”
“అయితే ఏమంటావయ్యా?” వాసుదేవ శర్మ చల్లబడలేదు. “మీ అల్లుడు గారేమంటారు నాన్నా?” వేదవతి అందుకుంది. “కాల ప్రవాహములో నాగరికత మెరుగులు దిద్దుకుంది. కులము అనేది కుళ్లిపోయిన మామిడి పండు. కులంపేర సాటి మనిషిని కాదనడం న్యాయమా? ఆది శంకరాచార్య ఓ ఛండాలుడికి పాదాభివందనం చేయలేదా? ఆ అమ్మాయికి మంచి సంస్మారముంది” ముక్కుపుడక తళుక్కుమంది.
“పిల్లల మాటలు వినాలి గదండీ!” శ్రీమతి వాసుదేవ శర్మ కొడుకు వైపు జాలిగా చూసింది-భర్తను చూసే ధైర్యం లేక.
వాసుదేవ శర్మ బుర్రలో ఏం జరుగుతుందో కాని కిమ్మనలేదు.
“మావయ్యా! మీకు కులం కావాలో, మీ కొడుకు కావాలో తేల్చుకోండి, నేనైతే వైదేపా తండ్రికి ఫాన్ చేసి చెప్పాను. ఆయన తన భార్యతో సవీ రేపు మా ఇంటి కొస్తున్నాడు.మీరు గూడా పోద్దున్నే రావాలొ నాగఫణి శర్మ లేచాడు. వేదవతి గూడా లేచి భర్తవెంట నడిచింది. తానుగూడా బయటి కొచ్చింది...
వైదేహి, సూర్యకాంతి ఆటోదిగి ఇంట్లో కొస్తూంటే నాగఫణిశర్మ ఎదురొచ్చి స్వాగతం పలికాడు. సోఫాలో కూచోబెట్టి లోపలి కెళ్లిపోయాడు. వోల్లో ఎవరూ లేరు.
“ఇంతకా పార్టీ ఎందుకట కాంతీ?” వైదేహి కనుబొమలు వంకర్లు తిరిగాయి.
“మా ప్రిన్స్‌పాల్ గారే చెప్తారు. నువు కూచో” అని సూర్యవాంతి గూడా లోపలికెళ్లింది.
వైదేహి ఒంటరిగా కూచుంది. మనో యువనిక మీద అనుమానాలు కదుల్తున్నాయి. బయటివైపు చూసింది. ఇంటి ముందు వేప చెట్టు కొమ్మలు-రెమ్మలు గాలి తరంగాలతో సయ్యాటలాడ్డున్నాయి. ఎడమ భుజమ్మీద... వెనకనుండి ఏదో బరువు పడ్డట్టుంది. గిరుక్కున అటు తిరిగింది. ఆశ్చర్యం... అనూహ్యం... అద్భుతం... అది మనోహర్ చెయ్యి, కలల విహంగము ఎగిరొచ్చి తన చేతుల్లో వాలినట్టనిపించింది. దిగ్గునలేచింది.
“మనోహర్!” అతని చెయ్యందుకుంది ఆబగా.
“నేనే వైదేహీ! నాగఫణి శర్మ మాబావగారు. మా అక్క వేదవతి భర్త. సూర్యకాంతి పంజేస్తుంది మా బావ కాలేజాఫీసులేనే.”
అనుమానం అయోమయుంగా మారింది. అటూ, ఇటూ చూసింది. తన తల్లిదండ్రులు (ప్రత్యక్షమయారు. “నాన్నా!” ఆశ్చర్యం. “అమ్మాగా.
ఇద్దరినీ కూచోబెట్టి తానూ కూచుంటూ “ఇదంతా ఏమిటి నాన్నా? తండ్రి నడుగుతూ మనోహర్ వైపు చూసింది. మనోహర్‌లో ఆశాకిరణం” నాధర్మ సందేహాలకు సరియైన
. _ సమాధానాలిచ్చినపు గదా! శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు ఐపోయిన వెందుకూ?” నాగఫణి శర్మ వచ్చి కూచుని వైదేహి అమ్మా నాన్నల్ని పలుకరించాదు. అప్పుడే వాసుదేవ
శర్మ దంపతులు లోపలినుండి వచ్చి ఎదురు సోఫాలో కూచున్నారు. నాగఫణి శర్మ వాళ్లకు వైదేహి తల్లిదండ్రులను పరిచయం చేశాడు.
చూడబోతే ఇప్పటిదాకా లోపల వాదోపవాదాలు జరిగినట్టనిపించింది వైదేహికి, వేదవతి, సూర్యకాంతి చేతులమీదుగా అందరికీ వేడి చాయలందాయి. వేదవతి భర్త పక్కన కూచుంది. సూర్యకాంతి వైదేహి పక్కన కూచుంది. వైదేహి తల్లిదండ్రులకు నాగఫణి శర్మ విషయమంతా ఫోన్లో చెప్పాడు కాబట్టి వాళ్లు గమ్మున కూచున్నారు.
విషయమంతా వైదేహికి వివరించి చెప్పింది సూర్యకాంతి. చివరికి “కోరుకున్న వాడితో కొంగులు ముడేసుకుంటున్నావు. నువ్వ్చదృష్టవంతురాలివి వైదేహీ!” అని బుగ్గ గిల్లింది.
వైదేహి అంతరంగ తరంగాల్లోని అయోమయం ఆనందముగా రూపాంతరం చెందింది. సిగ్గులతో బుగ్గలు ఎర్రమందారాలైనాయి. “మీ పెళ్లికి లైను క్షియరైంది.” వేదవతి లేచొచ్చి వైదేహి పక్కన కూచుంది. సున్నితంగా జడలాగి “ఇవ్వాళ్ల మంచిరోజు. మా తమ్ముడు-వైదేహి గారల పెళ్లి నిశ్చితార్థం.” భుజం గిల్లింది.
నిజమా... ఆశ్చర్యానందాల కళ్లతో తల్లిదండద్రులవైపు చూసింది వైదేహి. వాళ్లు ముసిముసిగా నవ్వుతూ నిజమేనని తలలూపారు. ఆనందం అర్జవమైంది.
“నిజమే మరదలా!” వేదవతి చెంప గిల్లింది. నా మాంటంటే మా అమ్మా, నాన్నలకు, తమ్మునికి వేదవాక్కు సుమా!”
సూర్యకాంతి అటువైపు బుగ్గగిల్లి “ఇదేం పార్టీయో అర్ధమైందా?” గలగలా నవ్వింది. అందరి నవ్వులతో ఇంటి నిండా నవ్వుల పువ్వుల వానకురిసింది.
అంతాకలిసి బంతిభోజనాలు చేశారు.
(“శాలివాహన” - ఏప్రిల్ 2016) (2018 జాషువా జయంతి సందర్భముగా తెలుగు అకాడమీ వారు నిర్వహించిన పోటీల్లో బహుమతి అందుకున్న కథ)
కొత్త కోడలు
ప్రశాంతి ప్రశాంతముగా ఇల్లంతా తిరిగి చూసింది.
“ఇది చాలా ఓల్డ్మోడల్ బిల్టింగు. ఏ.సి. లేదు. అదే మా కెనడాలో అయితేనా ఇలాంటి ఇళ్ళల్లో పని మనుషులు గూడా ఉందరు.” మూతలు మూడు వంకర్లు తిప్పింది.
పది రోజులు క్రితమే కాపురాని కొచ్చిన కొత్త కోడలు వాలకం గమనించిన భర్త, అత్త-మామలు మొహాలు చూసుకుని తమలో తాము నవ్వుకున్నారు.
పెళ్ళికి ముందు (ప్రశాంతి వాళ్ళమ్మా - నాన్నలతో కెనడాలో వుండి వచ్చింది. కాపురాని కొచ్చిన నాటి నుండి రోజూ ఇల్లంతా తిరిగి చూసి *ఈ ఇంట్లో కిచెన్ స్టోర్ రూం లాగుంది” అన్నది. “ఇంట్లో ఫర్నిచర్ క్రీస్తు పూర్వము నాటిది లాగుంది.” లాంటి మాటలతో తన పుట్టింటి గొప్పదనాన్ని దర్జాను చాటుకుంటోంది.
భర్త జనార్ధన్ “మనం మధ్య తరగతి వాళ్ళం శాంతీ”! గుర్తు చేస్తున్నాడు. కాని ప్రశాంతి దర్జా ఒలకబోస్తూనే ఉంది. ఇంట్లో తానొక్కతే ఇంగ్లీషులో మాట్లాడగలననే అహం అడుగుడుగునా ద్యోతకమవుతోంది.
అదే రోజు ఆమె అత్త వినోదిని గారి స్నేహితురాలు వచ్చింది. ఆమె పేరు రోజీ. రోజీకి తెలుగురాదు. ఆమె తెలుగామేనే కాని విదేశాల్లో పెరిగింది. తెలుగు నేర్చుకోలేదు.
రోజీ - వినోదిని ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడుకుంటున్నారు. ప్రశాంతిని, జనార్థన్‌ను, మావయ్యను రోజీకి ఇంగ్లీషులోనే పరిచయం చేసింది.
ప్రశాంతి కరెంటు షాక్ కొట్టినట్టు బేజారైంది.
“జిన్నూ” భర్త ముందుకొచ్చి “అదెట్లా? ఆంటీ, రోజీ గారు ఇంగ్లీషులో టాకింగ్ చేస్తున్నారు. అదెలా పాజిబులైంది?” “ముక్కు మీద వేలేసుకుంది.” బుర్ర గిర్రుమంటూనే వుంది.
“ప్రశాంతీ! మనం తెలుగు వాళ్ళం. తెలుగు వచ్చినా ఏదో ప్యాషననుకొని ఇంగ్లీషులో ఎందుకు మాట్లాడాలి? నన్ను జనార్ధన్ అని పిలవొచ్చుగదా!” గొంతులో సన్నని అసహనం.
“అద్సరే...గాని...”
“మా అమ్మా నాన్నలు చాలా సంవత్సరాల క్రితం ఉద్యోగరీత్యా అమెరికాలో ఐదు సంవత్సరాలుండి వచ్చారు. నేనక్కడనే పుట్టానట. అమ్మా నాన్న లిద్దరూ బాగా చదువుకున్నవాళ్లే, ఇహ నేను ఇంజనీర్‌ను. అయినా ఇంట్లో తెలుగులో మాట్లాడుకుంటాము. మహాకవి కాళోజీ నారాయణరావు, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంటు, సకిలించు ఆంధ్రుడా, చావవెందుకురా అన్నాడు తెలుసా?” అప్పట్నుంచి ప్రశాంతి భర్త అత్తమామలతో తెలుగులోనే మాట్లాడ్దోంది. భర్తను “ఏమండీ!” అంటోంది. వంకలు మానేసింది.
(*ప్రసారిక” - వీద్రిల్ 2016) పల్లి నా తల్లి [81] వతా చంద్రయ్య
వసంతం
“మ్యారేజి బ్యూరో పేరు వసంతం. అందుకేనేమో మూడు పూవులారు కాయలైంది. ఓనరు మీరేనాండి”
“అవును నేనే కూచోండి?”
“మీరు ఆసీనులైన కుర్చీ చాలా బాగుందండీ!”
“అం...టే! నేను బాగా లేనా?”
“మీకేమండీ! సొమ నలుపైనా కుందనబ్బొమ్మలాగున్నారు”
“థ్యాంక్యూ, మీరలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది”
“సరే గాని... నలభయ్యేళ్ళ వయసున్న రెండో పెళ్ళి వధువుకు కులం పట్టింపులేని వరుడు కావాలని పత్రికలో ప్రకటన ఇచ్చారు గదా! నా పేరు శ్రీధర్, స్కూలు టీచర్ని వయసు నలభయ్యెదు. నా బయోడేటా ముందే పంపాను.”
“అది చూసే గదా! ఈ రోజు రమ్మని ఫోన్ చేశాము. చాకు లాగున్నారు. మీ బయోడేటా, వధువు బయోడేటా పరిశీలించాము. మ్యాచు కుదిరింది. మీకు పిల్లలెందరో తెలియదు. తెలియగానే పెళ్లి చూపులికృడే...”
“పిల్లలు లేరండీ. నా భార్య కడుపునో కాయ కాయాలని కలసి కార్గో వేములవాడ కెళ్తున్నాము. నా భార్యకు గుండె పోటోచ్చి మార్గమధ్యములోనే చనిపోయింది. అవును గాని వధువు గ్గూడా పిల్లలు లేరన్నారు గదా!”
“అవును ఆమె భర్త అక్సిడెంటులో స్వర్గస్తుడైనాడు. రెండో పెళ్ళి గదాని కులం పట్టింపు లేదన్నాము.”
“నాగ్గూడా కులం పట్టింపు లేదు. ఆబ్బో! మీ చిరునవ్వు ముత్యాల జల్లులా గుందండీ!
“ఆహా! మీ మాటలు ఆవు పాలకోవాలాగున్నాయి.”
“సర్సరే. వధువును చూపిస్తారా!”
“వధువును మీరు చూశారు. వధువు మిమ్మల్ని చూసింది. వధువుకు మీకు నచ్చారు.”
“నేను చూశానా? ఎవరా వధువు?”
“నేనేనండీ! నా పేరు వసంత.”
(“ప్రసారికొ - ఫిబ్రవరి 2017
గాలిలో దీపము
“రాజీ! నువు దేవకన్యోలెవున్నవే! * భార్య చెంపగిల్లాడు.
గోదకొరిగి బీడీలు చేస్తూ కూచున్న రాజవ్వ చటుక్కున తలెత్తి భర్త మొహంలోకి చూసింది. బీడీలు చేస్తున్న చేతులాగిపోయినై. చెంపలమీద సిగ్గుల ఛాయలు తచ్చాడినై. బీడి ఆకు, పొగాకు పొడి చేటను పక్కనబెట్టి లేచి నిల్చుంది. “సగమీడు తిరుగుతూంటే మా రంగయ్య బావ పూలరంగడై పోతుండా?” బుగ్గన వేలేసుకుంది. “తయారైనవు గదా, ద్యూటికి పోవా?” మొహం విచ్చుకుంది.
“ఐదు నిమిషాలాగి పోతలే” చేతులు చాచాడు.
“చాల్లే సంబడం!” మూతి తిప్పింది, రంగయ్య భుజాలు పట్టి వెనక్కు తిప్పింది. మళ్లీ వెనక్కు తిరిగాడు.
నలభయ్యేదేళ్ల రంగయ్య హుషారుగున్నాడు.
సంతానం కోసం సవాలక్ష దేవుళ్ళకు మొక్కుకున్నారు, చివరికి వేములవాడ రాజేశ్వరస్వామికి ముడుపు కట్టాక రాజేళ్ పుట్టాడు. ఏడాదిలోగా రాజేశ్వర స్వామికి ముడుపు చెల్లించుకున్నారు. కొడుకు బాగా చదివి కలెక్టర్ కావాలని కలలు కంటున్నారు. నాలుగేంద్లు నిండకముందే పక్కూరి ఇంగ్లీషు మీడియం స్కూల్లో చేర్చించారు. ఫీజు ఎక్కువే. రోజూ స్కూలు బస్సు వచ్చి పిల్లల్ని తీసుకెళ్తుంది. సాయంత్రం దించిపోతుంది. రాజేశ్‌ను స్కూల్లో చేర్చించి సంవత్సరం కాలే దింకా. వాడు ముద్దుగా ఇంగ్లీషు రైమ్స్ పాడుతుంటే మురిసిపోతున్నారు. ఆకాశంలో తేలిపోతున్నారు.
ఓసారి రంగయ్య తండ్రి వచ్చి “లేకలేక లోకాయ పుడితే లోకం కండ్లు లొట్టవోయిన యన్నట్టు గంత చిన్న పోరన్ని గా ఊరికి తోలిచ్చు డెందుకూ? ఈ ఊర్ల తెలుగు మీడియం బడి ఉంది గదా! మధ్యాహ్నం బువ్వ గూడా బడిలనే పెడ్తరు. ఊర్ల ఉన్న బడికే తోలియ్యిండ్రి” ఉచిత సలహా ఇచ్చాడు.
రంగయ్య కది నచ్చలేదు. “జమాన మారింది నాయినా! గిప్పట్నుంచే ఇంగ్లీషు బడిల చదివిస్తే పోరగాంద్లు బాగా హుషారైతరట” జవాబిచ్చాడు.
ఓసారి ఆ ఊరి హెద్మాస్టరు రంగయ్య గుమాస్తాగా పంజేస్తున్న దుకాణానికి సరుకుల కోసం వచ్చి “రంగయ్యా!” గంత బుడ్డపోరన్ని ఇంగ్లీషు బడికి బస్సుల దోలియ్యవడ్డివి. మాతృభాష తెలుగుల చదివిస్తేనే జ్ఞానమొస్తుంది” అన్నాడు. రంగయ్య ఏమీ ఆలోచించలేదు.
రోజూ తూర్చు ఆకాశం వెలుగులు సంతరించుకోక ముందే నిద్రలేవడం అలవాటైంది. వంట పూర్తిచేసి రాజేశ్‌కు తినిపించడం, క్యారేజి గిన్నెల్లో కొంత చింత కాయ తొక్కు అన్నం, మరికొంత పెరుగన్నం కలిపి పెట్టి రాజేశ్కివ్వడం, అతన్ని తయారుచేసి పంపడం, సాయంత్రం రాజేశ్ బస్సు దిగగానే ఇంటికి తోలుకొచ్చు కోవడం రాజవ్వ కలవాటైంది. పొద్దున తయారైన కొడుకును కచేరి దాకా తీసుకెళ్లి స్కూలు బస్సు ఎక్కించడం రంగయ్య కలవాటైంది. మిగిలిన సమయంలో బీడీలు చెయ్యడం రాజవ్వకు రోజువారి డ్యూటీ అయింది.
ఆ రోజు కొడుకును బస్సెక్కించి వచ్చి భోంచేశాడు రంగయ్య. షాపు కెళ్లబోతుంటే తలస్నానం చేసి కురులారబెట్టుకుని బీడీలు చేస్తున్న రాజవ్వ కనబడింది. ఎద పొదలో ఏదో చిలిపిదనం చిందులేసింది. "
“న్సీక్సు షాపుకు ట్రైమైందన్నానుగదా!” ఆప్యాయంగా మళ్ళీ భుజాలు పట్టుకుని వెనక్కు తిప్పింది రాజవ్వ, ఒంటిరాయి ముక్కుపుడక చమక్కుమంది. “అవును, నిజమే అంటూ చెప్పులేసుకున్నాడు. అప్పుడే గ్రామసేవకుడు ఇస్తారి పరుగెత్తుకొచ్చి “రంగన్నా! మీ పిల్లగాడెక్కిన బడి బస్సు టేషన్ల రైలు పట్టాలమీద రైలుకు గుద్దిందటా” చెప్పి రివ్వున వెళ్ళిపోయాడు.రాజవ్వ-రంగయ్య గుండెల్లో రైలు పరుగెత్తినట్టనిపించింది. ఓ క్షణం స్థాణువులయ్యారు. ఆ తర్వాత గుండెలు బాదుకుంటూ పరుగందుకున్నారు.
ఎందరో తమలాగే స్టేషన్‌వైపు పరుగెడుతున్నారు. రాజవ్వ ప్రాణాలు అరచేతుల కొచ్చిన. “ఏములాడ రాజన్నా! నా పిల్లగాన్ని కాపాడు” మని మనసులో మొక్కుకుంటూ శక్తినంతా ప్రయోగించి పరుగెడుతున్నారు. గేటులేని రైలు పట్టాల దాకా చేరుకున్నారు. అక్కడేమీ లేదు. కొందరితోపాటు పట్టాల పక్కన పరుగెడుతున్నరు. స్టేషన్‌కు కొద్దిదూరం నుండి పెడబొబ్బలు కేకలు వినబడుతున్నాయి, వేగం పెంచారు. దృశ్యం భయంకరంగా
ఉంది. వక్కృముక్కలైన బడి బస్సు సగం కాలిపోయి పట్టాలమీద పడుంది. రైలు హైదరాబాద్ వైపు మొహం పెట్టి ఆగి ఉంది. విరిగిన పిల్లల కాళ్లు, చేతులు చెల్లా దచెదురుగా పడున్నాయి.
కొందరు తమ పిల్లల కోసం వెతుకుతున్నారు. పట్టాలకు రెండు వైపులా పడున్న అవయవాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పట్టాలు, పక్కనున్న చెట్ల ఆకులు, కొమ్మలు రక్తంతో తడిసి మోదుగు పూలు అలంకరించుకున్నట్టున్నాయి. కొందరికి తమ పిల్లల మొండాలు. మరి కొందరికి శరీరంగాలు దొరుకుతున్నై. కొన్ని మొండాలు కొట్టుకుంటున్నాయి. ఏడ్చులు
- శోకరాగాలు ఆకాశాన్నంటుతున్నై
రాజవ్వ-రంగయ్య ఆగమాగంగా అటూ-ఇటూ తిరిగారు. రాజేశ్ ఆచూకీ లేదు. కొంత దూరం నుండి రాజేశ్ కేకలు వినబడుతున్నై అటు పరుగెత్తారు. రైలు కట్ట ప్రక్కన చెట్ల పొదల వద్ద... వాడే... రాజేశ్. ఓ కాలు విరిగిందేమో వంకర తిరిగుంది. నుదురు. మొహం నిండా గాయాలు, ముక్కులోంచి రక్తం కారుతోంది. న్ యాన
రాజవ్వ దుఃఖం కట్టలు తెంచుకుంది. “కొడుకా! బంగారు కొడుకా!” బోర్మని ఏడుస్తూ కొంగుతో ముఖం అద్దింది. రంగయ్య తల బాదుకుని వంకర కాలును సరిజేశాడు. బాధ ఎగదన్నుకొస్తుంది.
ఏం జెయ్యాలే దేవుడా! ఇప్పుడేం జెయ్యాలే? లోకమంతా గందరగోళంగా కనబడింది. రాజవ్వ లబలబలాడి సృృహతప్పి పడిపోయింది. రాజేశ్ మొత్తుకుంటున్నాడు. రంగయ్య రైలుస్టేషన్కుపోయి నీళ్ళబాటిల్ తెచ్చాడు. శవాలైన పిల్లల తల్లిదండ్రుల పెడబొబ్బల్ని వింటూ రాజవ్వ మొహమ్మీద నీళ్లు చల్లాడు. రాజవ్వ సృృహలో కొచ్చి ఏడుపందుకుంది. రాజేశ్ మొహమ్మీది రక్తాన్ని తడి తుండుగుడ్డతో తుడిచాడు. తుండుగుడ్డ గోగుపూవులాగైంది. రాజేశ్ ముక్కునుండి రక్తం కారుతూనే ఉంది. కదలిక మాయమై కాళ్లూ చేతులు పడున్నై, కొద్దిసేపట్లో చాలామంది గుమిగూడారు. చేతనైన సహాయం చేస్తున్నారు. పక్కవూరి నుండి గ్రామవైద్యులు వచ్చి బతికున్న పిల్లలకు ప్రథమ చికిత్స చేస్తున్నారు. రంగయ్య పరుగెళ్తుకెళ్లి ఓ వైద్యుడిని లాక్కొచ్చాడు. అతడు రాజేశ్‌ను స్టెతష్మోప్తో పరీక్షచేసి “పిల్లగాని పానం బోలేదు, కాలు
. విరిగింది. అంటూ మొహమ్మీద నీళ్లు జిలకరించాడు. రాజేశ్‌కు స్పృహ రాలేదు. “పట్నం ' దవాఖానకు దీస్కోపోవాలె” అని వెళ్ళిపోయాడు.
ఉగాది సూర్యుడు అప్పుడే తన ప్రతాపం చూపిస్తూ రక్తం మడుగుల్లో స్నానం చేస్తున్నాడు. ఎవరెవరో ఏదేదో మాట్లాడుకుంటున్నారు. పత్రికలవారు, టీ.వీ. ఛానల్స్‌వారు ఫోటోలు దీస్తున్నారు. దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. అక్కడి నుండి హైద్రాబాద్ సుమారు ముప్పై కిలోమీటర్లు ఉంటుందని అందరికీ తెలుసు.
“అయ్యమ్యో! ఇంత ప్రమాదమెప్పుడూ చూల్లేదు”
“అయ్యో! స్కూలు బస్సు [డైవర్ గూడా చచ్చిపోయిండు”
“చీభీ. బుడ్డ పోరగాండ్లు నడువ నేర్వంగనే తల్లిదండ్రులకు ఇంగ్లీషు మీడియం బడి గుర్తుకొస్తుంది,”
“అవును. పిల్లల్లోని మమ్మీ, డాడీ అని పిలిపించుకుంటున్నారు.”
“నీ ఇంగ్లీషు మీడియంకు ఇంగులం బెట్టా... అదేమి మోజో...”
జనాలు ముచ్చట్ల మీదున్నారు. రాష్ట్ర మంత్రితో పోలీసులు వచ్చారు. పిల్లల మృతదేహాలను, ఊడిపోయిన కాళ్ళూ చేతుల్ని మాంసం బుద్దల్సి చెల్లాచెదురైన పుస్తకాలను చూస్తుంటే మంత్రి గుండె గుబగుబలాడింది. ఎటెటో ఫోన్లు జేస్తున్నాడు. ప్రభుత్వాదేశంతో అధికారులు, డాక్టర్లు దిగారు. పిల్లల బంధువులు గుండెలు బాదుకుంటున్నారు. డాక్టర్హు నర్సులు తమ పనిమీదున్నారు. అప్పుడే అంబులెన్స్ నుండి దిగిన డాక్టర్‌ను బతిమాలి రంగయ్య తీసుకొచ్చాడు. దాక్టర్ ఏవేవో పరీక్షలు జేసి “పిల్లగాడు ఐతికున్నడు” అంటూ అంబులెన్స్‌లోకి తరలించాడు. రంగయ్య దంపతుల్లో ఆశాజ్యోతి రెపరెపలాడింది. మరికొందరు పిల్లలు,
వాళ్ళ బంధువులతో అంబులెన్స్ బయలుదేరింది. పైకి ఏడ్వవద్దన్నారు నర్సులు. బందువులు, తల్లిదండ్రులు లోలోపల కుమిలిపోతున్నారు.
ఆ ప్రదేశమంతా శోకసముద్రమైంది. రైలు పాసింజర్లను బస్సుల్లో తరలించారు. ఢిల్లీ ప్రభుత్వాదేశాలననుసరించి రైల్వే అధికారులు దిగారు. గడ్డకట్టిన రక్తం మడుగుల్ని చూశారు. బతికున్న పిల్లల తల్లిదండ్రులను ఏదేదో అడిగి రాసుకున్నరు. మీడియా వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు.
రాజవ్వ-రంగయ్యలు హైదరాబాద్ పెద్దాసుపత్రిలో రాజేశం మంచం వద్దున్నారు. వోస్పిటల్ సిబ్బంది హడావుడిగా సేవలందిస్తున్నారు. చిన్నారి రాజేశ్‌ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. రాజవ్వ ప్రాణాలు అరచేతిలోకొచ్చినై. ఆపరేషన్ థియేటర్లోంచి బయటకొచ్చిన నర్సు ముందుకెళ్ళి “నీ బాంచెనమ్మా! నా కొడుకును బతికించడమ్మా!” కాళ్లు అందుకో బోయింది. నర్సు వారించోఆ దేవునికి మొక్కాలె” అంటూ వెళ్లింది. రంగయ్య గొల్లుమని ఏడుపందుకున్నాడు. డాక్టర్ అతన్నూరడించి లోపలికెళ్లాడు. తనలాగే చాలామంది ఆగమైపోతున్నారని అర్ధమైంది. ఏడుస్తున్న బంధువుల్ని నర్సులు ముందు మర్యాదగా, తర్వాత బెదిరించి ఊరడిస్తున్నారు. రాజవ్వ-రంగయ్యలకు క్షణమొక యుగంలా గడుస్తోంది.
దూరం నుండి వినబడిన శోకరాగాలు దగ్గరి కొచ్చినై. గుంపులుగా నలుగురైదుగురు ఓ పాపను తీసుకెళ్తున్నారు. ఆ పాప ఆపరేషన్ థియేటర్ల చచ్చిపోయిందని చెప్పింది నర్సు. రాజవ్వ ఆ పాపను మరోసారి చూసి “అయ్యో! మనూరి పాపయ్య బిద్దనేనయ్యా!” అంటూంటే దుఃఖం అంతరాళను ఛేదించుకుంటోంది. కొనకొంగును నోట్లపెట్టుకుని ఆపుకుంది. “అవును రాజీ” అంటూ రంగయ్య తుండుగుడ్డ మడిచి నోట్లో కుక్కుకున్నదడు.
ఆనుపథ్రికొచ్చిన మంటత్రులు, నాయకుల వెంట డాక్టర్లున్నారు. అందులో ఆరోగ్యశాఖామాత్యులున్నారు. రాజవ్వ-రంగయ్యలును చూసి “వీళ్ళెందుకున్నారిక్కడ?” అడిగాడు. ఓ దాక్టరు ముందుకొచ్చి “వీళ్ళ కొడుక్కు ఆపరేషనైంది. ఆ బస్సులనే కాలు విరిగింది. ఇప్పుడు ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో ఉంచినం సార్!” చెప్పిండు. రంగయ్య దంపతులకు భయమేసింది.
“మరి... ఆ బాబు పరిస్థితి ఏమిటి?” మంట్రి అడిగాడు.
“ఆబ్దర్వేషన్ల ఉంచినం సార్. ఇరవై నాల్గు గంటలు గడిస్తే పరిస్థితి అర్ధమవుతుంది. ప్రస్తుతం స్పృహలో లేడు” పెద్ద డాక్టర్ జవాబు.
“వైద్యంలో ఏ మాత్రం అశ్రద్ధ జరిగినా సహించేది లేదు. ఖర్చులన్నీ గవర్నమెంటే భరిస్తుంది. వీళ్ళనేమీ అడుగొద్దు” డాక్టర్ల నాదేశించాడు.
“ఓ,కే.సార్! మా శాయక్తులా బ్రీట్మెంటిస్తం!” హామీ.
వాళ్ళంతా పకృకెళ్ళారు. రాజవ్వ చేతులు పైకెత్తి “దేవుడా! నా కొడుకు బాగై మాతోని రావాలె” దేవునికి మొక్కుకుంది.
రాశత్రయింది. ఆస్పత్రి సిబ్బంది ఒక పేషెంటుతో ఒకరినే ఉంచి మిగతావారిని బయటికి పంపిస్తున్నారు. “మీ వోడు ఐ.సీ.యూ.ల ఉన్నడు గదా! బయట వరండాలుండుండ్రి” ఇద్దర్నీ బయటికి పంపించాడు అటెండరు. “మావోన్ని ఆక్కడెక్కడుంచిండ్రు సారూ? నాకు మనసుకు వడ్తలేదు” రంగయ్య అడిగాడు... “మీవోన్ని అర్జంటుగ వైద్యం జేసే దాంట్ల వుంచిండ్రి పొద్దుగాల్ల సూడుండ్రి” అన్నాడతడు. మనోవేదన, పుత్రవాత్సల్యం. ఇద్దరినీ తికమక పెడ్తుంది. కడుపుల పాతాళగరిగె తిరుగుతున్నట్టెతున్నది.
తూర్పు ఆకాశము వెలుగులు సంతరించుకుంటూంటే ఇద్దరూ ఆస్పత్రి నల్లావద్ద ముఖాలు కడుక్కున్నారు. రాత్రి బయటికి పంపించిన అటెండరు డ్యూటీ దిగిపోతుంటే కనబడ్డాడు, ఆగాడు... “తెల్లందాక నిద్రవోనట్టుంది గదా! ఏదన్నా తిని చాయదాగుం్రి..” సలవో ఇచ్చాడు. అప్పుడు గుర్తుకొచ్చింది రాజవ్వకు - నిన్న పొద్దుగాల్ల తాగిన చాయ తప్ప కడుపులకేమీ పోలేదని. రంగయ్య దండం బెట్టి “మా కొడుకెట్లున్నడో ఏమోనన్నా!” బేలగా ముఖం పెట్టి గొల్లుమన్నాడు. అటెండర్లో జాలి జాలువారింది. “అరెరే! గట్ల పచ్చికుండలెక్క పగులు డెందుకన్నా? ఏమన్నా అయితే మీకు జెప్తరు గదా! మంచిగనే ఉంటడు. ఫికర్ చెయ్యకు” సముదాయించి వెళ్ళిపోయాడు.
ఆస్సత్రి బయటి గేటు పక్కనున్న డబ్బా హోటల్లో కూచుండి చాయ తెప్పించుకున్నారు రంగయ్య, రాజవ్వ. చాయ గ్లాసుల రాజేశ్ కనిపించాడు. మిగితా సగం ఛాయ తాగబుద్ధి గాలేదు రాజవ్వకు. భర్త వెంట నడిచింది. మంచమ్మీద ఇంకో పేషెంటున్నాడు. గుండె రుల్లుమన్నది రంగయ్యకు. డ్యూటీ నర్సు వద్దకెళ్లి “అమ్మా! గా మంచమ్మీద మా పిల్లగాడు లేడు. నిన్న దానిమీదనే వుండె” చేతులు కట్టుకుని అడిగాడు.
“మీ పిల్లగాని పేరేంది?” అడిగింది. వణుకుతూ చెప్పాడు.
“ఓ రాజేశా! ఇంకా ఐ.సీ.యూ.లనే ఉన్నడు గదా! పెద్ద డాక్టరొచ్చి చూసినంక ఏం జేయాల్నోో ఏ మంచమియ్యాల్నో చెప్తడు. మీరు నాస్తా చేసి రా పోండ్రి” నర్సు మాటలు వినడంతోటే మండే ఎండల్లో చల్లని చెట్టుమీద దొరికినట్టనిపించింది. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ వరండాలోకొచ్చారు. స్కూలు బస్సు ప్రమాదం బారినపడ్డ పిల్లల బంధువుల్ని తప్ప మరెవ్వరినీ లోపలికెళ్లనివ్వడంలేదు. ఎరగని ఊరిలో మొరగలేని కుక్కల్లా నుంచుండి వచ్చీపోయే వారిని చూస్తూంటే తమలాంటి వారెందరో ఉన్నారనిపించింది. లేత ఎండ పొడలు పొడలుగా వరండా మీది కొస్తోంది.
“రాజేశ్ పేషెంటుకు సంబధించిన వారెవరూ?” ఆస్పత్రి అటెండర్ లోపలి నుంచి వచ్చి పిలిచాడు. అప్పటికే చాలాసేపు నుంచున్నారు.
“శ్పేమేనయ్యా!” రంగయ్య వెంట రాజవ్వ ముందు కొచ్చింది.
“పిల్లగాన్ని బయటికి దెచ్చిండ్రు. వచ్చి చూసుకోండ్రి”
హమ్మయ్య అనుకుంటూ వార్జులోకొచ్చారు. ఆత్రంగా ఉంది. మరో మంచమ్మీద రాజేశ్... చుట్టూ డాక్టర్లు, నర్సులున్నారు. గుండెల్లో గుండ్రాయి దొర్లింది.
“నా కొడుక్మేమైంది సారూ!” రాజవ్వ ఊపిరి బిగపట్టుకుంది.
“చూడుండ్రి మీ కొడుకును” ఓ నర్సు పక్కకు జరిగింది.
మంచమ్మీద చిన్నారి రాజేశ్ పడుకున్నాడు. కాలుకు పెద్ద పట్టీ వేసుంది. అటూ, ఇటూ చూస్తున్నాడు. “అమ్మా! నాయినా!” రాజేశ్ గొంతులో పిలుపు పరవశింపజేసింది. ఒక నర్సు తప్ప మిగతా వారంతా వెళ్ళిపోయారు.
“కొడుకా!... నా బంగారి కొందాగ” వాడిపోయిన రాజవ్వ మొహం పున్నమి కలువలా విచ్చుకొంది. రంగయ్య గుండెదడ తగ్గింది. నరాల్లో హుషారు పొంగుకొచ్చింది. ఆత్రంగా రాజేశ్‌ను ముద్దాడారు తల్లిదండ్రులిద్దరూ.
“ఇంగ మీ కొడుక్కు ప్రాణభయం లేదు. వారం రోజులైనంక ఇంటికి దీస్మపోవచ్చు” నర్సుమాట మురిపాల మూటలాగుంది. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతుంటే ఎవరో వచ్చి ఒడ్డుకు చేర్చినట్లెంది.
“డాక్టర్లకు, మీకు వెయ్యి దండాలమ్మాగ” రంగయ్య సంతోషంగా చేతులు జోడించాడు. “మీరదృష్టవంతులు” నర్సు చిరునవ్వుతో పక్కకుపోయింది.
కొద్దిసేపు కొడుకుతో తృప్తిగా మాట్లాడారు. అప్పుడు గుర్తుకొచ్చింది, తామిద్దరూ నిన్నటి నుండి ఏమీ తినలేదని... కడుపులో ఎలుకలు ఉరుకులాడుతున్నట్టు ఆకలైతుంది.
“రాజీ! నిన్న ఇయ్యాల్ల నువ్వేమీ తినలేదు గదా! ఆకలిగా లేదా?”
రంగయ్య ప్రశ్నా బాణం రాజవ్వలో ఆకలికేకల్ని రేపింది.
“అద్సరేగాని మనోన్ని ఇంటికి తోల్మపోయినంక మనూరి తెలుగు మీడియం బడికే తోలిద్దాము, సరేనా?” ప్రతిపాదించింది రాజవ్వ,
“అవునవును. వాడు పెద్దోడయ్యేంతదాకా మనూరు తెలుగు బడికే తోలిద్దాము” బలపరిచాడు రంగయ్య. ఏ (| న స
లో ('జాగ్భతి” 12-10-2015)
సంకల్పం
“వజమ్మా! నేవు దేవకన్యోలున్నావే!” అంటూ నాగ లింగం గోడకొరిగి బీడీలు చేస్తున్న వజవ్వ చెంపగిల్లాడు.
నిండు గర్బవతి వజవ్వ చెంపలు సిగ్గుతో కెంపులైనాయి. “అబ్బా! లోపల మా అమ్మ ఉన్నదని తెలుసుగదా! నీకు డ్యూటీ టైమంది పోరాదూ! కాటుక కళ్లు కమ్మగా తిప్పింది. ఆమె మొదటిసారి గర్భవతైనప్పుడు తల్లిగారి పల్లెటూళ్లో కాన్స్నయింది. కానీ పుట్టిన పసికూన ప్రాణాలొదిలింది. ఈసారి ఆసుపత్రిలో కాన్చు చేయించాలని వాళ్లమ్మ సారవ్వ వచ్చింది.
నాగలింగం “డ్యూటికెళ్తొనని వెనక్కు తిరగ్గానే వజ్రవ్వ మొహం మబ్బులు కమ్మిన చందమామ లాగైంది. “హమ్మో..నొప్పే అమ్మా!” బీడీల చాట పక్కన పెట్టింది. “ఏమైంది బిడ్డా!” అంటూ సారవ్వ అంగలేస్తూ వచ్చి కూతర్ని ఎగాదిగా చూసింది.
“అల్లుదా! ఇవి ప్రసూతి నొప్పులు. వేంటనే దవాఖానాకు పోదాం” అంది. నాగలింగం ఆటోను తీసుకొచ్చాడు. ఇంట్లో ఉన్న ఐదొందల రూపాయలు జేబులో పెట్టుకున్నాడు. ముగ్గురూ కలిసి ఆటోలో పక్కూరి పైమరీ హెల్త్ సెంటర్కెళ్లారు. వజ్రవ్వను ఆసుప్రతి లోపలికి తీసుకెళ్లారు. నర్సు ఆదేశంతో మంచమ్మీద పడుకోబెట్టారు. నర్సు వచ్చి చూసి వెళ్లిపోయింది. వజ్రవ్వకు నొప్పు లాగిపోయినై. నర్ఫును వెతకసాగాడు.
ఆ (ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇద్దరే డాక్టర్లు లేడీ డాక్టరు ట్రాన్సఫరైపోయింది. ఉన్నాక్క డాక్టరుకు పట్నంటో (పైవేటు ప్రాక్టీసుంది. ఆ నర్భు ఒక్కతే అన్నీ చూసుకుంటుంది.
నాగలింగం వెళ్లి “నా భార్యకు నొప్పు లాగిపోయినై” అని బతిమాలాడు. నర్సు వచ్చి ఇంజక్షనిచ్చింది. మళ్లీ నొప్పులొచ్చినై వజ్రవ్వ అరుపులు విని నర్సు లేబర్ రూంలోకి తీసుకెళ్లి పరీక్ష చేసింది. బయటికొచ్చి నాగలింగముతో “ఈమెకు కడుపుల పిండం తిరిగింది. ఆపరేషన్ చెయ్యాలె. మా దగ్గర డాక్టర్లు లేరు. పట్నం పెద్దాసుపత్రికి పోండ్రి” అంది. సారవ్వ గుండెలు బాదుకొంది. నాగలింగం వెళ్లి ఆటో తీసుకొచ్చాడు. అంతా కలిసి పట్నంలోని (ప్రైవేటు దవాఖానకెళ్లారు. వజవ్వను పరీక్షించిన లేడీ డాక్టరు “ఈమెకు వెంటనే ఆపరేషన్ చెయ్యాలి. లేకపోతే ఆపాయం. పది వేల రూపాయాలు కట్టండి” కడుపులో చల్ల కదలకుండా చెప్పింది.
నాగలింగం నోరెల్లబెట్టాడు. “ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు దాక్టర్, ముందు ఆపరేషన్ చెయ్యండి. తరువాత తెచ్చి కడ్తాొనన్నాడు. దాక్టర్కు కోపమొచ్చింది. “పైసలు
లేకపొతే (ఫైవేటు దవాఖాన్లకు రావద్దు” గదమాయించింది. “నా దగ్గర బంగారం గూడా లేదమ్మా!” అన్నాడు. డాక్టర్ తిరిగి వెళ్లిపోయింది. నాగలింగం నెత్తి కొట్టుకున్నాడు. “క ద్రవాఖానకు పెద్ద ఎవరమ్మా!” నర్సునడిగాడు. “ఇప్పుడు చూసిన లేడీ డాక్టరుదే ఈ దవాఖాన. ఆమెనే పెద్ద” అని “నీ పెండ్లాం మెడల పుస్తెలతాడు బంగారందే గదా!” గుర్తు చేసింది. “అయ్యో రామా! పుస్తెలతాడు తియ్యొద్ద* నర్ఫవ్వ గొల్లుమంది. “నీకు పుస్తెల తాదెక్కువనా, నీ బిడ్డ ఎక్కువనా?” నర్సు నిలదీసింది. “అత్తా! ముందు నీ బిడ్డ ప్రాణాలు కాపాడు కొందాంలే” అని “ఈ పుస్తెల తాడునెవరు కొంటరమ్మా?” నర్సు నడిగిండు. “అగ్గో ఎదురంగ మార్వాడి దుకాణముంది. ఆయన బంగారం కొంటడు, అమ్ముతడు” అంది. వజ్రవ్వ నొప్పి భరించలేక తోక కోసిన మేకలా అరుస్తూ అవస్థ పదుతోంది. నాగలింగం బయటి కెళ్లి కిరాణా షాపులో దారం, పసుపుకొమ్ము తెచ్చాడు. దారానికి పసుపుకొమ్ము కట్టి తెచ్చి భార్య మెడలో వేసిండు. పుస్తెలతాడు తీసుకెళ్లి మార్వాడి దుకాణంలో అమ్మేసిందు. పదిహేను వేల రూపాయలొచ్చినై. పదివేలు ఆసుప్రతి కౌంటర్లో కట్టేసిండు. రసీదు లేడీ డాక్టరుకు చూపించిండు. వెంటనే వజ్రవ్వకు ఆపరేషనైంది. ఆడపిల్ల పుట్టింది. నర్సు బయటికొచ్చి “మీకు లక్ష్మి పుట్టింది. తల్లి-పిల్ల క్షేమం” తీపి కబురు చెప్పింది. నాగలింగం సంతోషానికి హద్దులు లేవు. (మెరుపు-ఆంధ్రభూమి” య 4-9-2016) ల ని! టు ర. పల్లెనా తల్లి [90] ఐతా చంద్రయ్య
పల్లె నా తల్లి
పుట్లి పెరిగిన ఊరు చూడాలని ఎన్నాళ్లనుంచో వుంది. “అమ్మా! సిందూర పెళ్లికి చింతమడకకు నేను పోతానె!”
ప్రయోజకుదైన కొడుకు పసిపిల్లాడిలా అడిగాడు. భారతమ్మ మొహం బంతిపూవూలా విచ్చుకుంది. మనసులో మలయ మారుతం వీచింది. తెల్లదనం రంగరించుకుంటున్న ముంగురుల్ని నుదురు మీంచి పైకి సర్టుకుంటూ “చింతమదక అంటే చికాగో సిటీ కాదురా వివేకా!” గుర్తుచేసింది “నీకింకా పల్లెటూరు మీది మమకారం పోలేదా!”
“పుట్టి పెరిగిన ఊరును, కనిపెంచిన తల్లిదండ్రుల్ని మరువలేం గదమ్మా! సిందూరను, నా బాల్య స్నేహితులను చూసి ఓ దశాబ్దం గడిచిపోయింది.” అంటూ పక్షవాతముతో ముంచమ్మీదున్న తండ్రిని చూశాడు వివేకానంద.
“వోనివ్వు భారతీ! నీకు మోకాళ్ల నొప్పులు, నాకు మంచమే లోకము. కోడలు పల్లెటూర్లు చూడలేదటా. సిందూర నా తమ్ముని కూతురేనాయె”. ఆనందయ్య పక్షవాతం కాలును కదిపేప్రయత్నం చేశాడు. “వివేక్‌కు చెల్లండ్లు లేరాయె. నా తమ్ముడు-మరదలు వీళ్లను చూసి మురిసిపోతరు.”
“వాని ఉద్యోగం అమెరికాల నాయె. వచ్చినంక పది రోజులు దోస్తుల ఇండ్లల్లనే గడిపె. ఒక్క నెల లీవుల మిగిలిందెంత? రాకరాక కోడలు, పిల్లల్లోని వచ్చె “అంటూంటే కొడుకు మొహంలో నిరాశ ఛాయలు కనబడినై. మనసు మార్చుకుంది.” సరే..పొయ్యి రానీ!” రాజీకొచ్చింది.
వివేకానంద చింతమడకలోనే ఏడో తరగతి దాకా చదివాడు. అప్పుడే అనందయ్యకు హైద్రాబాదు ఫ్యాక్టరీల ఉద్యోగం దొరికింది. భార్య, ఇద్దరు పిల్లల్తోని హైద్రాబాదు కొచ్చిండు, కూతురుకు హైద్రాబాదు అబ్బాయితోనే పెండ్లయింది. వివేకానంద సర్మారు స్కాలర్‌షిప్‌తో ఇంజినీరింగ్‌ల మంచి మార్కులతోని పాసైండు. క్యాంపస్ సెలక్షన్ల అగ్ర రాజ్యము అమెరికా ఉద్యోగము ఆహ్వానించింది. అమెరికాలున్నప్పుడే స్వరూపతో పెళ్లెంది. ఒక పాప, ఒక బాబుకు జన్మ నిచ్చిండు. తండ్రికి పక్షవాతమని సమాచార మందగానే ఓ నెల లీవు మంజూరు చేయంచుకుని భార్య, పిల్లల్లో హైద్రాబాదు కొచ్చిండు. మంచి వైద్యం ఫలితంగా చంక కర్రలతో నడవ గల్గుతున్నడు.
అమెరికాలో యాంత్రిక జీవితం అలవాటైంది. చింతమడక వాతావరణం మనసులో మెదలగానే నరాల స్వరాల్లో మధుర రాగం వినబడుతుంది. తెలిసీ తెలియని వయసులో పచ్చని పొలాలగట్టు మీద పదిలంగా నడవడం, చెరువులో స్నానాలు, దేవుని గుడిల ఆటలు, ఆ ఊరిని చూడాలనే ఆరాటం మనసుల మేస్తూంది. ఆ రోజుల్లో వర్షాలు పుష్కలంగా పడేవి. వాన వరద నీటికి మొదట దమ్మచెరువు నిండి మత్తడి దుంకేది. ఆ నీరు డంగుచింత చెట్టుకింద నుంచి కాలువగా వచ్చి సింగ చెరువును నింపేది. ఆ తర్వాత పెద్ద చెరువును నింపేది. మత్తడి నీటి జల్లు ముత్యాల్లా కన్పించేది. బతుకమ్మ పండగప్పుడు పెద్దచెరువు మత్తడి నీటిలో గంతులేయడమో సరదా. చెరువుల బతుకమ్మలు తేలి అలల మీద నాట్యం చేస్తుంటే రంగుల సినిమా లెక్క కనబడేది.
చెరువు కట్ట కింది పొలాల గళాలను ఆ నీరు తడిపేస్తూ ముందుకు సాగేది. సంక్రాంతి పండగప్పుడు ప్రతి వ్యవసాయదారుని ఇంట్లో ధాన్యలక్ష్మి సోయగాలు కనబడేవి. అవన్నీ గుర్తుకొచ్చినై. పిల్లల్ని అమ్మా నాన్నల వద్ద ఉంచి భార్యతో కలిసి బస్సెక్కాడు. సిద్ధిపేటలో ఎక్స్‌ప్రెస్ బస్సుదిగి, పల్లెవెలుగు బస్సెక్కి చింతమడకలో దిగారు. పాత అనుభూతుల పునాదుల మీద కొత్త తాదాత్మ్యం.
స్వరూప ఆదిలాబాదు అమ్మాయైనా అమెరికాలో విద్యాబుద్దులు నేర్చుకుంటూ పెరిగింది. కుందనబ్బామ్మ లాగుంటుంది. అటూ ఇటూ చూస్తూ ఊళ్లోకి తాబేళ్లలా నడుస్తున్నారు. వివేకానందకు కొత్త భవనాలు ఆహ్వానిస్తూంటే (ధ్రిల్లింగా వుంది. ఓ పెద్ద చింతచెట్టు... అదే డంగుచింత... దాని కింది నుండి చిన్నాన్న రాజయ్యి ఇంటికెల్తున్నారు. “స్వరూపా! ఈ డంగుచింత చెట్టు నీడ ఒడిలో చిన్నప్పుడు చిగర్రాగోనె, కబడ్డీ ఆడుకునే వాళ్లం. ఈ చింత చెట్టుసీడలనే యక్షగ్రానాలాడేవారు. అన్నట్టూ యక్షగానాలంటే పాటలు, పద్యాలు, నటన వేషాలతో కూడుకున్న (డ్రామాలు. పిల్లలమంతా ఈ చెట్టు కిందనే కూచుని రాత్రి నుండి తెల్లారే దాకా ఎంజాయ్ చేసేవాళ్లం” మాటల్లోని భావోద్వేగం పులకింప జేసింది.
చిన్నాన్న ఇంటిగడప దాటగానే ఇంటిల్లిపాది ఎదురొచ్చి మురుస్తూ స్వాగతం చెప్పారు. అమెరికా మనుషులు పల్లెకొచ్చారని ఆశ్చర్యానందాలు వ్యక్తం చేశారు. సిందూర లేడిపిల్లలా పరుగెత్తుకొచ్చి “వావ్! వివేకన్నా!” గుండెల మీద వాలి పోయింది. స్వరూప చెయ్యందుకుని కళ్లకద్దుకుంటూ “వదినా, వదినా-వంకాయ తొడియా” మురిపాల మూట విప్పింది. స్వరూప గలగలా నవ్వింది. ఆ నవ్వు ప్రాణహిత నదీ తరంగ ధ్వనిలాగుంది. సిందూర చెంపల్ని ఆప్యాయంగా నిమురుతూ “మా బంగారు మరదల్ని పెళ్లికూతురుగా సింగారిస్తే...” ఒడిలోకి లాక్కుంది. హబ్బా! వదిన ఒడిలో ఎంతి తియ్యదనముందో!
పెళ్లికింకా రెండ్రోజుల టైముంది. ఆ రోజంతా తమ పిల్లల్ని అందరూ హత్తుకుని ఆశీర్వాదాలు కుమ్మరించారు. అమెరికా వింతలు-విశేషాలు అడిగి తెలుసుకున్నారు.
మర్నాడుదయం తయారై వివేకానంద కచేరీ వద్దకొచ్చాదు. పాత జ్ఞాపకాలు ముసురుకున్నాయి. ఆ రోజుల్లో తన తోటి వారలకు చిన్నా-పెద్దలకు ఎవరి కెప్పుడు టైం దొరికినా వచ్చి కచేరి గద్దెమీద కూచునేవారు. ఊరి గల్లీనుండి, ఢీల్లీ రాజకీయాల దాకా.. ఎన్నెన్నో విషయాలో ముచ్చట్లలో ప్రస్తావన కొచ్చేవి. అది ఊరి నడిబొద్దున ఉంది కాబట్టి అట్నుంచి వచ్చి, పొయేవాళ్లు కచేరి గుండెలమీద కాస్సేపు సేదదీరి వెళ్లేవారు. ఇప్పుడది నిర్మానుష్యంగా వుంది. కచేరీ గద్దె పగులు జూపింది. కొన్ని తరాల వ్యక్తుల వ్వక్తిత్వాల పరిశీలనకది సాక్షి రజాకార్ల వ్యతిరేకోద్యమాన్ని గుండెల్లో దాచుకుంది.
కచేరి దగ్గర హన్నాంధ్లగుడి, గుడిముందు కొమ్మలు-రెమ్మలతో విస్తరించిన రావిచెట్టు అలాగేవున్నాయి. దసరానాడు సంబరాలలో మునిగితేలుతున్న వారంతా రావిచెట్టుకింద గుమిగూడే వారు. బాజా బజంత్రీలతో జంబికి వెళ్లి, పాలపిట్టను చూసి వచ్చి అక్కడే ఊరి మంచి-చెడు గురించి మాట్లాడేవారు. తరతమ భేదాలు లేకుండా ఉల్లాసంగా గడిచి పోయేది.
ముసురుకుంటున్న జ్ఞాపకాలను ఛేదిస్తూ చిన్నప్పటి జిగ్రీదోస్ సుభాష్ కన్పించాడు. పాంటు, ఇన్షర్టులో ఎటో వెల్తున్నాడు. కచేరీ వైపు చూడలేదు. “సుభాషూ!” తానే పిలిచాడు. సుభాష్ సంగడి బొంగురమోలె ఇటు తిరిగిండు. బక్కపల్చగా, పొడుగ్గా అట్లానే ఉన్నాడు గాని వస్త్రధారణలో చిన్నపాటి మార్పు వుంది. అప్పుడు టక్ చేసేవాడు కాదు. కిందినుంచి మీద్దాకా చూపులతో తడిమి “అరే! నువ్వేనా వివేకా!” దగ్గరికొచ్చి చేతులు చాచాడు.
కచేరి మీంచి లేచి “నేనేరా! అమెరికాలో జాబ్ చేస్తున్నా. కొద్దిరోజుల క్రితమే హైద్రాబాదొచ్చిన” అంటూకౌగిట్లో బంధించాడు. “చిన్నప్పుడు స్యూళ్లో ఒకే క్లాసుల, ఒకే బెంచిమీద కూచుండి మన మాస్టారు బరిగెదెబ్బలు తిన్నంగదా!” గుర్తుజేశాడు. ' ఇద్దరూ కూచున్నారు. “చాలా సంతోషంరా! నువ్వీ ఊరికి రాక చాలాకాలమైందిరా!” నుభాష్ అంతరాళాల్లోని ఆనందం మాటల్లో కొచ్చింది. తన విషయాలన్నీ చెప్పి “నువ్వేం జేస్తున్నవురా? పిల్లలెందరూ? ఏం జేస్తున్నరు?” (ప్రశ్నల వర్షం కురిపించాడు వివేకానంద.
“నేను పక్కూరు అంకంపేటల స్కూలు అసిస్టెంటు టీచర్‌గా పంజేస్తున్న ఇద్దరు పీల్లలు, బడికి పోతున్నారు. ఇప్పుడు సెలవులు” ఇద్దరి గుండెలు కాస్సేపు గుసగుస లాడుకున్నాయి.
“మానూరికి రాంగనే నా జ్ఞాపకాలకు రెక్కలొచ్చినయి సుభాషూ! నాకు చాలా సంతోషంగా వుంది. పుట్టిన ఊరు కన్నతల్లి గదా! కన్న తల్లిని మరిచి పోలేముగదా!”
“ఇప్పుడన్నా వచ్చినవ్ సంతోషం. నువ్వీ ఊరునుంచి వెళ్ళి మువ్చయేండ్లు దాటిందిగదా!”
“అవున్రా! మన ఊరి దమ్మవచెరువు, సింగచెరువు, పెద్దచెరువు చూడాలన్పిస్తుందిరా! ఆ చెరువు కట్టల మీద మన ఆటలు గుర్తుకొస్తే చక్కిలిగింతలు పెట్టినట్టవుతుంది” అంటూ జేబులోంచి అమెరికా చాక్లెట్ తీసిచ్చిండు.
“ఓర్నియవ్వ!” సుభాష్‌కు ఏనుగెక్కినంత సంతోషమైైంది. “మనమింకా చిన్న పోరగాండ్లమా చాక్లెటు తినేందుకు?” హుషారుగా చాక్లెట్ విప్పినోట్లో వేసుకుని చప్పరిస్తూ “అమ్మో! చిన్నప్పుడు ఇటువంటి చాక్లెట్టు మనకు దొరకలేదు గదా!” హర్షం వెలిబుచ్చాడు.
“పొయిన బాల్యం తిరిగిరాదు గాని మల్లా మనమిప్పుడు చిన్నప్పటోలె సరదాగా తిరుగుదామురా!” లేచి నిల్చున్నడు. సుభాష్ గూడా ఠక్కున నిల్చున్నడు.
“ముందు దమ్మచెరువును కళ్లారా చూద్దామురా!” సుభాష్ భుజమ్మీద చెయ్యేశాడు.
“సరేపదా!” బయలుదేరారు. “వివేకా! నువు బాగా చదువుకుని అమెరికా పోతవని అనుకోలేదురా!”
పెదాల మీదో చిరునవ్వు మెరిసి మాయమైంది.
కలిసి సమాంతరముగా నడుస్తున్నారు. గుర్తుబట్టిన ఊరివారలు పలుకరిస్తూ వెల్తున్నారు. చిన్ననాటి ఆటల గురించి, క్లానుల గురించి, తమరి గురించి నెమరేసుకుంటున్నారు. తోవ కటూ, ఇటూ పెరిగిన చెట్లు తలలూపుతూ స్వాగతం చెస్తన్నాయి. కొత్త రొడ్డు, కొత్త బంగళాలను వింతగా చూస్తూ “మన ఊరు చాలా మారిపోయిందిరా!” ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. “పల్లెటూరు పట్టణ వాతావరణాన్ని సంతరించుకుంటుందిరా!” ఎత్తెన మూడంతస్తుల భవనాన్ని చూస్తుంటే హైద్రాబాదు గుర్తుకొచ్చింది.
..... “అవునా వివేకా” సుభాష్ ఆగిపోయాడు. ఎడమచెయ్యిని మిత్రుని భుజమ్మదేసి కుడిచేతిని గాల్లోకి లేపుతూ “ఇదో! ఇదంతా దమ్మ చెరువేరా!” ప్రకటించాడు. వివేకానందలో అయోమయం. ఆశ్చర్యంగా అటూ ఇటూ దృక్కులు సారిస్తూంటే మాజిక్షో చూస్తున్నట్టని పించింది. “చెరువైతే నీళ్లుండాలి, చెరువు కట్ట ఉండాలి. జోక్ చేస్తున్నావురా! చిన్ననాటి చిలిపిదనమా?” కనుబొమలు పైకిలేచినై.
“కాదు వివేక్ బాబూ! బీర పువ్వోలె బీరిపోయిన వేందిరో” “చెరువెక్కడుందిరా! నాకైతే కనబడ్త లేదురా!” “మనం నిల్చున్నది దమ్మచెరువేరా!” సుభాష్ నవ్వాడు.
మయసభలో దుర్యోదనుడిలాగయాడు. “మరైతే చెరువుకట్ట ఏదిరా? కట్టమీదికి పోదాం పదాగో కట్టకు అటుపక్క నీరు ఉందనుకున్నాడు “మజాక్ చెయ్యకురా!”
“మజాక్ కాదురా వివేక్, మన ఊరి వాతావరణం మజాగా మారిందిరా” సుభాష్ వాలకం గంభీరమైంది. “ఊర్లె కుంటుంబాలు చానా పెరిగినై, వానల్లేక దమ్మచెరువు పూర్తిగా ఎండిపోయింది. చెరువు కట్టను కూలగొట్టి ఇండ్లు కట్టిండ్రు. ఈ వరియా పేరు ఇప్పటికీ దమ్మచెరువే. అగో! అటుచూడు. పొడుగ్గా, ఎత్తుగా బిల్డింగ్ కనబడుకుందిగదా! అది ఎత్తు మీది తోట, ఎత్తుమీది తోటలనే స్కూలు బిల్టింగ్ కట్టిందడ్రు. ఇప్పుడక్కడ తోటలేదురా బాబూ!”
“సరే,. అయితే సింగచెరువుకు పోదాం పా!” ఇద్దరూ చేతిలో చెయ్యెసి నడుస్తున్నారు. వివేకానందకు వేపకాయ కొరికినట్ట
నిపిన్తుంది. “దమ్మ చెరువు ఊరైంది. ఎత్తు మీది తోట మాయమైంది. ఇంగ సింగ చెరువెట్లుందో?”
“తినబోతూ రుచి అడగడమెందుకూ? అటే పోతున్నంగదా!”
చిన్నప్పటి క్లాసుమేట్సు గురించి, టీచర్ల గురించి, ఎత్తుమీది తోటల కోతి కొమ్మాట గురించి మాట్లాడ్తుంటే మరో లోకములో విహరించినట్టుంది.
మాటల మధ్యన సింగచెరువు దాకా వచ్చారు. “ఇగో! గిదే సింగ చెరువు. చిన్నప్పుడు మనమీ చెరువు కట్టమీద కోకో ఆడుకున్నం గదా!” సుభాష్ ఆనందం.
శిథిలమైన గుడి కోనేరులా సింగచెరువు కట్టవుంది గాని చెరువులో నీటి చుక్కలేదు. ఆ రోజుల్లో సింగచెరువు నిండా నీరుందేది. నీటి మీద తేలుతున్న కమలం పూలు చెరువుతల్లి సిగలో పూవుల్లాగుండేవి. ఇప్పుడంతా పూడిక నిండిపోయి పర్రైలు నోర్లు దెరిచాయి. ఏదో పోగొట్టుకున్నవాడిలా సుభాష్‌తో కట్టమీద నడుస్తున్నాడు. అటూ-ఇటూ చూస్తుంటే అదో ఎడారిలా కనబడింది. కట్టకింద ఆనాటి పొలాల పచ్చదనం లేదు గాని పిచ్చిచెట్లు మాత్రమున్నాయి. “వాతావరణం చాలా మారిపోయిందిరా సుభాషూ!”
“మన ప్రాంతముల వానల జాడలేదు. ఎండలు దంచి కొడుతున్నై. పంటల్లేవు, తిండిగింజల్లేవు. కరువు కాటకాలొచ్చినా గవర్నమెంటు వాళ్లెవ్వరూ ఇటొచ్చి చూడలేదు. చాలా మంది యువకులు పొట్టచేతపట్టుకుని బొంబాయి, దుబాయ్ పోయిండ్రురా!”
ఇహ చూడలేక పోయాడు. “ఇక్కడ చూసింది చాలు గాని పెద్దచెరువు చూద్దాం పదరా!” వెనుదిరిగారు.
నుభాష్ ఆనక్తి నణుచుకోలేక అమెరికా వింతలు, వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు. సింగచెరువు కట్టదిగుతూంటే కట్టచివర కుడిపక్కన పచ్చని వరిపొలం కన్పించింది. ప్రాణం లేచొచ్చింది. “ఈ పొలానికి నీళ్లెక్కడి నుంచి వచ్నియిరా సుభాషూ?”
“వాళ్లు పైసలున్న మారాజులు, పొలముల బోరుబావులు తవ్వించి కరంటు మోటర్లు పెట్టుకున్నారు. పండిన పంట పెట్టుబడి లెక్కలేస్తే ఖర్చులకు సరిపోతుంది. మహా అయితే తినేందుకు వాళ్ల కుటుంబానికి సరిపోతుండొచ్చు. పాపం! కొందరి పొలాలల్ల ఎంతలోతు బోర్లు వేసినా నీటి జాడలేదు. అప్పులోల్ల బాధలు పడలేక పట్నాలకు ఐతుక వోయిండద్రు. పుట్టి పెరిగిన ఊరును వదిలి వెల్లూంటే వాళ్ల బాధ అంతా-ఇంతా కాదురా! గొంతు వణికింది. వివేకానంద ఎదపొదలోని అలజడి కళ్లల్లోకొచ్చింది.
పెద్దచెరువు కనిపించింది. తోవ పక్కనే కట్టిన మత్తడి రాళ్లు అట్లానే వున్నై మత్తడి దాటి చెరువు కట్టమీద నడుస్తున్నారు. ఆ రోజుల్లో నిండు కుండలాగున్న పెద్దచెరువు కట్టకింద చాకలి వాళ్లు బట్టలుతుకుతూ పొడిన పాట గుర్తుకొచ్చింది...
“ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్కజాములాయె చందమామా!
మొదటి జామునందు చందమామ, శివుని పూజలాయె చందమామాగొ
అలా...అందిరనోటా పాటల రాగాలు ప్రవహించేవి.
కట్ట కిటుపక్క చెట్లమీద-నేలమీద ఆరేసిన రంగు రంగుల బట్టలు ఇంద్ర ధనుస్సుల్లాగా కనబదేవి. ఇప్పుడంతా నిర్మానుష్యంగా వుంది. “చిన్నప్పుడు మనమిక్కడ కబడ్డీ ఆడుకునే వాళ్లంగదా!” గుర్తుజేసిండు.
“అవున్రా వివేకా! అప్పుడీ కట్ట వెడల్పుగా ఉండేది. బతుకమ్మల్ని ఈ చెరువులనే నిమజ్జనం చేసేవారు. కట్టకింద పొలాలవారు పొలాల ఏరియాను పెంచుకునేందుకు తలాకొంత కట్టను తవ్విండ్రు. అందుకే సన్నబడ్డదో. మాటల కోటలుదాటుతూ కట్ట చివరకు చేరుకున్నారు.
వివేకానంద విహంగవీక్షణం చెరువు మధ్య వాలింది. అక్కడ లోతుగానే వుంది. “సుభాషూ! చెరువు నీళ్లు లేకున్నా లోతు ఎక్కువైందిరా!” ఆశ్చర్యం వెలిబుచ్చాడు.
“ఈ మధ్య గవర్నమెంటు మిషన్ కాకతీయ ్రోగ్రామొచ్చింది. దాని పుణ్యమాని ఈ చెరువు పూడిక తీయించిండ్రు. ప్రాణహిత -చేవేళ్ల ప్రోగ్రాంల ఈ చెరువులకు నీళ్లుదెచ్చి నింపుతరట. ఇంకోసంగళతి... ఇంటింటికి నల్లాలిచ్చి తాగేనీళ్లు సప్లై చేస్తరటా! అప్పుడు మనూరి పిల్లలు మనం చిన్నప్పుడు అడుకున్నట్టు ఈ చెరువు నీళ్లల్ల దాగుడు మూతాలాడుకుంటారు.”
వివేకానంద మొహంలో రంగులు మారినై. కళ్లు ఆశాజ్యోతులైనాయి. మూగబోయిన మనసు ఉల్లాసాన్ని సంతరించుకుంది. “మనూర్లె పచ్చని పంటల్ని వైసులున్న ఆడ పిల్లలు బిందెలతోని చెరువుకు రావడం, మత్తడి ప్రవాహంలాంటి కన్నెపిల్లల నవ్వుల్ని చూశాము. అవన్నీ గుర్తుకొచ్చి నాకు ఏడుపొచ్చినంత పనైందిరా!”
“ఇప్పుడంత బాధ పడాల్సిన అవసరం లేదురా. రెండు, మూదేళ్లలోగా మన చెరువులు నీళ్లతోని కళకళలాడుతై. ఇంటింటికి తాగునీరొచ్చి తీరుతుంది. ఇప్పటికే మనూర్లై కొందరిండ్లల్ల టీ.వీ.లున్నై. కొందరికి సెల్ఫోన్లున్నై ముందుముందు అందరిళ్లల్ల టీ. వీ. ఒక్కాక్కరికాక్కో సెల్ఫోనుంటుందిరా!”
“వెప్తే ఏం చేస్తావురా? విని తృస్తిపడతా వంతేకదా!”
“అంతే కాదురా, నాకు జన్మనిచ్చిన ఊరును, పెంచి విద్యాబుద్ధులు నేర్చిన దేశాన్ని మరిచి పోనురా. మనూరి డెవలప్మెంటు కోసం చేతనైంత సాయం చేస్తారాగొ మాటల్లో ఉద్వేగం, కన్న ఊరికోసం ఏదన్నా చెయ్యాలనే తపన.
“మ్మనూర్లై గ్రంథాలయం లేదురా. దానికోసం ఏమన్నా చేస్తే బాగుంటిది గదరా! దవాఖాన సాంక్షనైందటా!”
“అవున్రా! గ్రంథాలయం కోసం నీపేరు మీద చెక్కు పంపిస్తాను. మిగితా పనంతా చూసే బాధ్యత నీదేరా!”
“అంతే కాదురా, (గ్రంథాలయం ప్రారంభోత్సవానికి నువు తప్పక రావాలె.
(గ్రంథాలయం కట్టించడం, పుస్తకాలు కొని పెట్టడం నావంతు. రోజూ పత్రికలందులోనే చదవొచ్చు. దుబాయ్, బొంబాయికి వోయిన యువకులప్పటి వరకు తిరిగి రావడం ఖాయంరా!”
సుభాష్ మాటల మకరందముతో కళ్లల్లోని ఆశాజ్యోతులు మరిన్ని వెలుగులు సంతరించుకున్నై అమెరికా వెళ్లగానే సుభాష్ పేర చెక్కు పంపించాలనే నిర్ణయం స్థిరపడింది.
ఇద్దరూ వెనక్కు తిరిగొస్తున్నారు.
వివేకానంద జేబులోని సెల్‌ఫోన్ “జహ డాలుడాల్ పర్ సోనేకీ చిడియా కర్తేహై బసేరా. వో భారతదేశ్ హై..మేరా...” పాటతో పిలిచింది. స్పరూప ఫోన్ చేసింది.
“చెప్పు స్వరూపా!”
“మీరెక్కడి కెళ్లినట్టూ?”
“ఇదో.. చిన్ననాటి స్నేహితునితో తిరుగుతున్నా!”
“సరేగాని... పెండ్లి పిల్లను చేస్తరటా ఇప్పుడే. మీరు వెంటనే రావాలి. వచ్చి మీ చెల్లిను ఆశీర్వదించాలె.”
“సర్సరే...!”
“మరోమాట”.
“ఏందదీ?”
“సాయంత్రం నన్ను బయటకు తీసుకెళ్లి ఊరంతా చూపించాలి. ప్రత్యేకించి మీరు ఆడుకున్న గుడి, చదువుకున్న బడి.”
“శాలివాహన” ఆగష్టు & సెప్టెంబర్ 2016)
లింకు హైద్రాబాద్ మహానగరములో ఆరంతస్తుల మేడ, మూడో అంతస్తులో ముచ్చటైన పోర్షను. ఒంటరిగా ఉన్న ఆడ, మగను జంటగా మార్చే మ్యారేజి బ్యూరో అది. పేరు “లింకు మ్యారేజి బ్యూరో!” ఎప్పట్లాగే అప్పుడుగూడా ఉదయమే రెక్కలు విప్పుకుంది. వసంతములో పూలజాడలో వెల్తున్న తుమ్మెదలా వసంతరావు ఠీవిగా వచ్చి వల్లో సోఫా నాక్రమించాడు. అప్పుడే మయూర గతిలో వయ్యారంగా వచ్చిన కల్యాణి అతని కెదురు సోఫాలో కూచుంది. బ్యూరో నిర్వాహకులెవ్వరూ రాలేదింకా. స్వీపర్ కం అటెండర్ ఊడ్చి బయటి కెళ్ళాడప్పటికే. నిర్వాహకుడు రావడం ఆ రోజే ఆలస్యమైంది. ఇద్దరూ పైన కాలచక్రములా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్‌ను చూస్తున్నారు. టైం పడకొండైంది. ఇద్దరి దృష్టి ఒకేసారి గోడలకు వెళ్లాడ్తున్న కాలెండర్ల మీదికి మళ్ళింది. క్షాలెండర్లో ఓ వయ్యారి భామ వగలమారి పురుష పుంగవుని కౌగిట్లో సిగ్గుల బుగ్గలతో చిరునవ్వులు చిందిస్తోంది. కాస్సేపు చూశాక ఒకరి దృష్టి ఒకరి మీద వాలింది. టైం పాసు కావాలి గదా! వసంతరావు ఆమె కళ్లలోకి చూస్తూ “నా పేరు వసంతరావు. భార్య చనిపోయింది. నలభయ్యేళ్ళ వయస్సులో ఒంటరినైనాను. రెండో సంబంధం పెళ్ళి... అమ్మాయి కావాలని వచ్చాను. నాకు పిల్లలు లేరండీ! మరి మీరు?” కలుపుగోలుగా నవ్వాడు. అత న్నా పాదమస్తకం పరిశీలిస్తూ “నా పేరు కల్యాణి భర్త చనిపోయిండు. పిల్లలు లేరు. పెళ్ళి నంబంధం... అబ్బాయి కావాలని వచ్చాను” మునీ మునిగా నవ్వింది... అర్ధవంతంగా నవ్వింది. ఒకరి బయోడేటాలొకరు తీసుకుని చదువుకున్నారు. ఇద్దరి మొహలు సూర్యరశ్మి సోకిన కమలం పూవుల్లా విచ్చుకున్నాయి. వసంతరావు లేచి వెళ్ళి ఆమె పక్కన కూచున్నాడు. గుండెల గుస గుసలు చాలవని నేరుగా మాట్లాడుకున్నారు. చేతిలో చెయ్యేసి జంటగా లేచారు. బ్యూరో నిర్వాహకుడొచ్చాడు. “రండి లోపలికి మీ బయోదేటాలు ఫోటోలు తెచ్చారు గదా!” ఇద్దర్నీ చూస్తూ అడిగాడు. “లింకులు కుదర్చడంలో మాకు బోలెడంత అనుభవముంది. రండ” అంటూ చాంబర్లో కెల్తున్నాడు. “మీకా శ్రమ వద్దులెండి. మాకు మీతో పనిలేదు.” అంది కల్యాణి, “థాంక్యూ... మళ్ళీ రామండీ” వసంతరావు మందహాసం. ఒంటరిగా వచ్చినవారు జంటగా వెళ్ళారు. గపసారికొ మే 2016)
ఉగాది కట్నం
“ఇదేదో ముఖ్యమైన లెటరయ్యుంటుంది. యమర్దంటు ఫైలుకు స్టిక్కర్ లెక్క అంటుకపోయింది సారో” యువాఫీసర్ ఆనందరావుకు పంచరంగుల కాయిత మందించి పళ్లికిలించిండు గుమాస్తా. కాయితమందుకుని, ఇహ నువు వెళ్లొచ్చు అన్నట్టుగా చీమకళ్ళతో సైగచేసిండు ఆనందరావు. అప్పటికే కాలేజిలో సైగలు చెయ్యాడంలో ఫెయిలై ఆడపిల్లల లెంపకాయలు తిన్న అనుభవము గుండెల్లో గూడుకట్టుకుంది. కిసుక్కున నవ్వుతూ, వెనక్కి తిరిగి చూస్తూ మందగమనముతో వెళ్లిపోతున్న గుమాస్తాను కన్నెత్తి చూడలేదు. నిజానికి రాజకీయాల్లో కొచ్చి ఎన్ని రంగులైనా మార్చి హంగామా చేయాలనుకున్నాడు. కాని డిగ్రీ పాసు కాగానే ఆ ప్రాంతము ఎమ్మెల్యే ముందు జాగ్రత్త చర్యగా “నువు గ్రూప్‌వన్ పరీక్షలు రాయి. చాకులాంటి వైసు పిల్లగానివి. తప్పకుండా పాసవుతవు. అప్పటికి నేను మళ్లీ ఎమ్మెల్లేనై మంత్రినైపోతా. నిన్ను నాపేశీలో వేసుకుంటా”నని తిరుగులేని వాగ్దానం చేసిండు. ఆనందరావు బాగా ప్రిపేరై గ్రూప్‌వన్ ఆఫీసర్‌గా సెలెక్టయిండు కాని ఎమ్మెల్లే ఎలక్షన్ల ఓడిపోయిండు. స్టార్ట్ చేయగానే స్పీడందుకున్న ఎలక్ట్రిక్ బైకులా అతని కళ్లు ఉత్తరములోని అక్షరాల వెంట పరుగెత్తినై.
“శ్రీవారు శ్రీమాన్ ఆనందరావుగార్మి గుండెగుసగుసలతో-
మూడుముళ్ల బంధముతో మన మనసులొకటై మూన్నెళ్లు అయిందిగదా! అప్పుడే ఫోన్ స్విదాఫ్లో పెట్టిన రెందుకూ? ఆఫీసు పనా? అదెప్పుడూ ఉండేదే గదా! నేనిక్కడ మూడ్‌లో కొచ్చి ఒంటరిగా ఉందలేకపోతున్నా. తమరి పరిస్థితి సేమ్‌టు సేమ్ గదా! ఉగాది పండగకని నేనేమో వారం రోజులముందే పుట్టింటికొస్తి. మీరు మాత్రం వెంటనే రెక్కలు కట్టుకుని వచ్చి నా పక్కన వాలాలె...మా ఊళ్లో, ప్రకృతి ఒడిలో ఓలలాడుదాం...ఇట్టు, మీ మనో విహారి-కస్తూరి.”
అర్ధాంగి (ప్రేమ పరాగాన్నంతా రంగరించి రాసిన మలి(్రేమలేఖ అది. నిన్న అది చేతికి రాగానే విప్పి ఆఫీసు రోటీన్ పని ప్రకారం చదవకుండానే “తగుచర్యకోసం” అని ఎండార్స్ చేసి ఫైల్లోపెట్టిన సంగతి బుర్రలో బురిడీలు కొట్టింది. చఛా...అలవాటులో గగ్రహపాటు.! నెత్తిమీదో మొట్టికాయిచ్చుకున్నాడు. ఉత్తరం మడిచి పాంటుజేబులో దోబుకున్నాడు.
ఎల్లుండే ఉగాది, నూతన సంవత్సరారంభం, ఫోనుగూడా చెయ్యకుండా వెళ్లి కస్తూరిని ఆశ్చర్యంలో ముంచెయ్యాలె! గమ్మత్తుగుంటుంది.
సందట్ల సదేమియా, బజార్ల బడేమియా అన్నట్టు ఆఫీసు సెల్‌ఫోను కవ్వింపుగా నవ్వింది. అది హెడ్డాథీసు నుండి అయుంటుంది. “వాల్లో...నమస్కారం సార్!” అతివినయముగా ముడుచుకుపోయాడు.
“ఛీ..పాడు నాకు నమస్మ్కారమేమిటయ్యా మొగుడా? నేను...కస్తూరిని డియర్! సొంతఫోన్ స్విచాఫ్ పెట్టారందుకూ?...” రెండు నిమిషాలు సాధికారికంగా మందలించి “నా ఉత్తరం అందిందా లేదా? నాకో ఫోన్ చెయ్యాలని గూడా అన్పించలేదా?” ఉతికి పారేసింది.
“అందింది కస్తూరీ! సొంతఫోన్ చెడిపోయింది. ఇదాఫీసు ఫోను.”
“అయితే...మరిచారు నన్ను. మీ గుండెగూటిలో పక్షినని, పచ్చడనీ ఏవో కోతలు కోశారు గదా!”
“అయితే నా పాత మాటలన్నీ కోతలే అంటున్నావా డియర్?” ఆఫీసు ఫైళ్లల్లో మునిగి తేలుతున్నాను. తెల్పా..?”
“అంతా తెల్సుగానీ ఉగాది పండుగ ఎల్లుందేగదా! తుపాకి రామన్న డైలాగులొదిలేసి మీరు రేసీపాటికి ఇక్కడుండాలి. లేకపోతే నేనేంజేస్తానో నాకే తెల్వదు” టీ.వీ.సీరియల్ డైలాగొదిలేసింది. “నేవ్వేంజేస్తావో నాకు మాత్రం తెలిసి ఛస్తుందా డియర్?”
“బావా! బందరులడ్డూ! ముల్మనూరు పాలకోవా! రేపు తమరిక్కడ ఉండకపోతే సాయంత్రానికల్లా మా అమ్మా-నాన్నలతో సవా మా కుటుంబమంతా అక్కడికొచ్చి మనింట్లో ఉంటాము. పండగ ఖర్చంతా తమరిదే!” వార్నింగ్ వడ్డించింది.
“మా అక్క మాటల్ని నేను త్రికరణశుద్ధిగా బలపరుస్తున్నాను బావాజీ! బామ్మర్షి ఫోన్ కట్ చేశాడు.
మర్నాడు సుప్రభాత సమయాన మార్షింగ్ వాక్‌ను త్యాగం చేసి పల్లెవెలుగు బస్సెక్కాడు, సీటు దొరకలేదు. నేనేమన్నా ముసలి ముండావాన్నా? తనను తాను ఛాలెంజి చేసుకొని నుంచున్నాడు. కంకరరోడ్డు మీద రెండు గంటలు ప్రయాణము. ప్రతి నిమిషం పర్సును తడుముకుంటూంటే తృప్తిగా వుంది. అయినా ఒళ్లంతా పుంటికూర పచ్చడి లెక్షైపోయింది. ఆపసోపాలు పడుతూ బస్సు దిగి నడుస్తూంటే తాత, ముత్తాతలు కండ్లల్ల కొచ్చి “అరేయ్ బద్మాషానందూ! మేము కలలో కనబడి చెప్పినంతా పెదచెవిన పెట్టి పల్లెటూరమ్మాయి నెత్తిమీద జిలకర బెల్లంపెట్టినావు గదరా! అనుభవించూ!” కసిగా ఆశీర్వదించారు.
“కళ్ళు చెదిరే కట్నమిస్తే కట్టుకోక ఛస్తారా?” గొణుక్కున్నాడు. అతి కష్టమ్మీద అత్తారింటి గేటు దాటాడు. తులసికోటలో నీళ్లు పోస్తోంది కస్తూరి!...పక్కన ఎవరూ లేరు. సూటుకేసును పదిలంగా నేలమీదుంచి, వెనకనుంచి వెళ్లి కౌగిట్ల బంధించాడు. కెవ్వు...కేక.
“ఎవర్రా దొంగ బాడ్మావ్?” చెంప చెళ్లు మన్చించి ఎగాదిగా చూసింది. “అయ్మయ్యో! మీరా అల్లుడుగారూ!” అత్తగారు. ..దూరం జరిగింది. నాలిక్కరుచుకున్నాడు. అప్పటికే తలలో జేజమ్మ దిగొచ్చింది. “అయ్యో! మీరా అత్తగారూ? ఆ చీర కస్తూరిది గదా[గ” చెంప పుణుక్కుకుంటూ పశ్చాత్తాపం ప్రకటించిండు.
“చీర కస్తూరిదే బాబూ! సరదాగా కట్టుకున్నాను. పొరపాటైంది” ఖాళీ చెంబుతో బుగ్గలు నొక్కుకుని, భుజాల నిండా కొంగు కప్పుకుని, కస్తూరిని కేకేసింది. “ఏందమ్మా?” అంటూ గజ్జెల గుర్రంలా పరుగెత్తుకొచ్చింది.
మురిసిపోతూ సూటుకేసందుకుంది.
ఆందోళన నదిమిపెట్టి “బాగున్నావా కస్తూరీ?” అంటూ చేతులందుకోబోయాడు. కరింట్షాక్ కొట్టినట్టు చేతులు వెనక్కు లాక్కున్నాడు. వచ్చింది కస్తూరికాదు, మరదలు మాణిక్యం. బామ్మర్ధి బైరాగి రామబాణంలా దూసుకొచ్చాడు. “బావా! ఎప్పుడు వచ్చినావు..” పద్యం గుర్తుకు రాక నెత్తి గోక్కాని “వెల్కం బావాజీ!” లోపలికి తీసుకెళ్లి కుర్చీ చూపించిండు. ఆఫీసర్ దర్జా ఒలకబోస్తూ ఠీవిగా కూచున్నాడు. కుర్చీతో సహా ఫదేల్మని పడిపోయిండు. దానిక్నుది మూదేకాళ్లు. అది బైరాగి బాగోతమని అర్థమైంది.
“అహ్హా హ్హా మా బావ పడిపోయిండు. నా ప్లాను సక్సెస్ చప్పట్టు కొట్టిండు బైరాగి. అది విని ఆదిలక్ష్మిలా నడిచొచ్చింది కస్తూరి. “మీ బావనా? ఎక్కడ పడిపోయిండురా? బొక్కలేమన్నా విరిగినయా?” గుండెలు బాదుకుంది. అంతా చూడగానే సీను అర్థమైంది. “ఓరి సన్నాసీ! బావను పడగొట్టినవా?” ముసిముసిగా నవ్వుతూ భర్తను లేవనెత్తి సోఫాలో కూచోబెట్టింది. పక్కన తాను కూచిని భర్త ఒళ్లు నిమిరింది. ఆహా...ఎంత హాయిగుందో!
జిడ్డు మొహంతో ఓ బక్కపల్చని పెద్దమనిషి ఇంట్లోకొచ్చాడు. ఆకారం... పిట్టల్ని వేటాడే వాడిలాగుంది. “బాగున్నావా బాబూ!” భుజమ్మీది తువ్వాలు దులుపుకుంటూ అడిగిండు. నడుము పుణక్కుంటున్న ఆనందరావుకు అరికాలు తిక్కమెదడు కంటింది. “న్సవ్వెవడివిరా?” గుడ్లు దెరచి గుర్రుమన్నాడు.
“ఏమ్మా కస్తూరీ! అల్లునికేమైంది? ఆరోగ్యం బాలేదా?” తువ్వాలుతో మొహం అద్దుకున్నాడు పెద్దమనిషి. అరెరే! ఈ అవతారం..మామగారు గదా! ఆనందరావు ఎద స్పందించింది. “సారీ మామయ్యా!” నెత్తిమీద ఒక్కటిచ్చుకున్నాడు. అవతారం నవ్వింది.
“పళ్లేదు బాబూ! పొలం నుండి తిరిగొచ్చిన. అప్పుడే ఎండలు మండిపోతున్నై గదా!” మామగారు కూచుంటూ “అరేయ్ బైరాగీ! అప్పటికి బావను తొల్మపోయ్యి మన పొలాలు, తోటలు చూపించు"మన్నాడు.
చల్లని సాయంకాలం గరంచాయ తాగి పికిక్కు వెల్తున్నట్టుగా బయలుదేరారు. రాజు వెడలె రవి తేజము లలరగ...అన్నట్టుగా బైరాగి ముందు నడుస్తున్నాడు. కుడిఎడమల మాణిక్యం, కస్తూరిలు నడుస్తున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, కోయిల పాటల నాస్వాదిస్తూ పొలాల హద్దులు చూశారు. ఆఖరున మామిడితోటలో ప్రవేశించారు. మామిడి పిందెలు కొమ్మలకు ఉయ్యాల లూగుతున్నాయి. తుమ్మెదలు సంగీత కచేరి చేస్తున్నాయి.
యమస్పీడు బైకుకు బ్రేకులు వేసినట్టు పెద్దమామిడి చెట్టుకింద సడన్‌గా ఆగిండు
పల్లె నా తల్లి [101] వితా చంద్రయ్య
ఆనందరావు. మాణిక్యం, కస్తూరిలు పైచూపులతో ముందుకెళ్లి పోతున్నారు. అనందరావు ఆశ్చర్యంలో మునిగిండు. మామిడి కొమ్మకు నల్లబెల్లం ముద్ద అతుక్కునుంది. సరదాగా రాయి అందుకుని దానిమీదకి సూటిగా విసిరిండు. అది కదుల్లూంటే సంతోషంగా కేరింతలు పెట్టిండు. బామ్మర్ది-మరదలు వెనక్కు తిరిగి ఆ దృశ్యాన్ని కళ్లారా చూశారు.
“అయ్యయ్యో! అది తేనెతుట్ట బావా!” బైరాగి పరుగు లంకించుకున్నాడు. కస్తూరి బైరాగిని అనుసరించింది. నేనేం తక్కువ తిన్నానా అనుకుని తానూ పరుగెత్తిండు ఆనందరావు. నేలమీద పరుచుకున్న తీగలు కాళ్లకు చుట్టుకుని బొక్కబోర్లా పడ్డాడు. ముక్కు పచ్చిపులుసైంది. మూతి పళ్లల్లాంచి రక్తం కారుతూంటే తడిమి చూసుకున్నాడు. ఆలోగా తుట్టమీంచి చెదిరిన తేనెటీగలు మూకుమ్మడిగా దాడి చేసి, ప్రతీకారంగా ప్రతి అవయవాన్ని కసిగా కరుస్తున్నాయి. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా “వామ్మో!” గట్టిగా అరిచిండు. భయంకరమైన అరుపుకు రుడుసుకుని తేనెటీగలు పారిపోయినై. గబగబా కాళ్లతీగలు తొలగించి కాళ్లకు బుద్ధి చెప్పిండు. బామర్ది, మరదలు కనబడలేదు.
మంట...ఒళ్లంతా మంట! తేనె టీగల తడాకా మంట భరించలేక, పడుతూ, లేస్తూ ఉరికొచ్చి ఇంట్లో చొరబడ్డాడు. అల్లుడి దీనావస్తకు తట్టుకొలేక అత్తా-మామలు గుండెలు బాదుకుంటున్నారు. బైరాగి డాక్టర్‌ను తోలుకొచ్చిండు. ఆనందరావు అవస్తలో అయోమయం. వచ్చిన డాక్టరు అతని లంగోటీ దోస్త్... పిచ్చాసుపత్రిల పంజేసి ఈ మధ్యనే ట్రాన్స్ఫరై వచ్చిండు. ఆనందరావును ఎగాదిగా చూస్తూ పరీక్షించి “నువు ఆనందరావు గదూ! ఇక్కడికెందుకొచ్చినవ్? వచ్చినవు పో మామిడి తోట్లకెందుకు పోయినవ్? పోయినవు పో... మెంటల్ పేషెంట్స్ గుంపులాంటి తేనెటీగలనెందుకు కొట్టినవు?...” సాగదీస్తున్నడు. ఆనందరావుకు పిచ్చెక్కినట్టెంది. దాక్టర్ గొంతు అందుకోబోయిండు. దాక్టర్ అతన్ని మంచమ్మీదకి తోసేసి, “బైరాగి బాబూ! బావయ్యను గట్టిగా పట్టుకోండ్రి” అంటూ మెడిసిన్స్ కిట్టు తెరిచిందు. కస్తూరి, బైరాగి, మాణిక్యం, వాళ్ల తండ్రి పేషెంట్ లబోదిబల్ని పట్టించుకోకుండా కాళ్ళూ, చేతులు గట్టిగా పట్టుకున్నారు. డాక్టరు గలగలా నవ్వుతూ పెద్ద సిరంజి నిండా మందు నింపి ఇంజక్షన్ చేసి, ఊపిరి పీల్చుకున్నాడు. బరబరా మందులు రాసిచ్చి వెళ్లిపోయిండు, “అమ్మో! అంత దగ్గరి దోస్త్ గంతపెద్ద ఇంజక్షనిస్తాడా?” నెత్తికొట్టుకున్నాడు ఆనందరావు. అర్ధరాత్రి దాకా కంటిమీద కునుకులేదు. గదిలో కస్తూరి ఒడిలో అల్లాడిపోతున్నాడు. కస్తూరి తల్లి వచ్చింది వేడినీటితో. “వీటితో కాపడం పెట్టు కస్తూరీ! ఆ నొప్పుల రోగం ఠక్కున కుదురుతుంది” అంటూ వెళ్లింది. సలహా యమర్జంటుగా అమలైంది. మాత్రలు వేసుకుని నిద్రాదేవి కౌగిట్లోకి జారుకున్నాడు.
ఉదయం పదింటికి లేచి (ఫెష్‌గా తయారైండు. పూజా గదిలోకెల్లిండు. అప్పటికే పూజ పూర్తయింది. వెండి గ్లాసులో పచ్చడిపోసి బావకందించిండు బైరాగి. అందరూ లొట్టలేస్తూ
పచ్చడి సేవిస్తున్నారు. ఆనందరావుకు పచ్చడిలో తెనెటీగలు కనబడ్డాయి. భయం భయంగా భార్యకు చూపించి చెవిలో చెప్పిండు. కస్తూరి చెరువు మత్తడి దుంకినట్టు గలగలా నవ్వింది. “అవి తేనెటీగలు కావు మహాశయా! నల్లమామిడికాయ ముక్కలండీ!” అంటూ తానే నోరు తెరిపించి తాగించింది. బుట్టబొమ్మలా తయారైన మాజిక్యంకు అంతా అర్ధమైంది. కలువకళ్లను కమ్మగా తిప్పుతూ “పచ్చడి తాగితే మత్తెక్కిందా బావయ్యా?” అడుగుతూంటే కనుబొమ్మలు తేనెటీగల్లా కనబడినై. నీళ్లు నమిలిండు.
కస్తూరికళ్లు అల్బ్చిప్పల్లాగున్నయి. వాటిలోకి బెరుగ్గా చూస్తూ బాధనంతా మరిచిపోయిండు. కొత్తకుండలో ఈగలెక్క సంతోషం రెక్కలు విప్పింది. అంతా కలిసి దైనింగ్ టేబుల్ చుట్టూ కూచున్నారు. ఘుమఘుమ వాసనలతో ముక్కుపుటాలు ఎగిరిపడుతున్నై చక్కెర పొంగిళి, పులిహోర, పుంటికూర, ఆనెపుకాయ అంటుపులుసు, గడ్డపెరుగు, భక్ష్యాలు నోరూరించినయి. ఆలస్యం అమృతం విషం సామెత గుర్తుకొచ్చింది. అటు వడ్డించ గానే ఇటు ఐటమ్స్ అన్నీ లాగించిండు. చివరాఖరి ఐటం భక్ష్యాలు...కమ్మని వాసనల నేతిలో నంజుకుంటూ రెండు లాగించిందు. కడుపు వర్షాకాలం చిన్న చెరువులా నిండిపోయింది. లేచి చేయి కడుక్కోవాలనుకున్నాడు. కొంటె మరదలు మాణిక్యం తుంటరి చూపులతో “మా బావ మామంచి బావ. నాచేతి భక్ష్యం కాదనడు” అంటూ నేతిలో భక్ష్యం ముంచి తీసి తినిపించసాగింది. సగం భక్ష్యం తినేసరికి కడుపు పూర్ణకుంభమైంది. అతిప్రయత్నమ్మీద మిగితా సగం మొహమాటంతో తినేసరికి తాతలు దిగి వచ్చింద్రు. “ఇదిగో అల్లుడు బాబూ! ఇవి మీ మావయ్య, నేను కలిసి వడ్డిస్తున్నవి. గబగబా తినెయ్యాలె. లేకపోతే మామీద ఒట్టే” పెద్ద సైజు భక్ష్యాలు రెండు వడ్డించింది... అత్తగారు. కస్తూరి మొవాం చూశాడు. సైగలతో...తప్పవన్నది. “ఇహ నాతో కావు కస్తూరీ!” చెవిలో చెప్పాడు. కస్తూరి మొహంలో గాంభీర్యం. “అట్లంటే ఎట్లా? అత్తామామల కట్నాలు బాగుంటాయి గాని భక్ష్యాలు భాగుండయా?” నిలదీసింది. ఆ భక్ష్యాలు కుక్షిలో కెళ్లేసరికి ముల్లోకాలు కళ్లల్లో గిరుమన్నాయి. కడుపు బిర్రబిగుసుకుపోయింది.
“ఇక ఇప్పుడు నావంతు బావాగ” అంటూ బైరాగి లేచి, భక్ష్యం అందుకునేలోగా శక్తినంతా కూడదీసుకుని ప్లేట్లో చేతులు కడుక్కుని లేచి నుంచున్నాడు. భుక్తాయాసం మితిమీరింది. మత్తగజములా అడుగులేస్తూ గదిలోకెళ్లి మంచమ్మీద ఒరిగిండు. “నేనీ అవస్త భరించలేను కస్తూరీ!” మెలికలు తిరిగిపోతున్నడు. కస్తూరి భయపడి తండ్రిని తీసుకొచ్చింది. ఆయన అదంతా చూసి నవ్వుకుని “అష్టరాల్ ఐదారు భక్ష్యాలకే బెటైతే ఎట్లా బాబూ? నేను నీలాగే కొత్తల్లుడిలా ఉగాదికి మా అత్తగారింటికి పోయినప్పుడు పది నేతి భక్ష్యాలు కుక్షిల పడేసి హాయిగా త్రేన్సిన” మీసాలు మెలేసిండు. అల్లుడు కెవ్వుమన్నడు. మామ ఆలోచన యూటర్న్ తీసుకుంది. ఆలోచిస్తున్నాడు.
ద కాం
“మరిప్పుడెట్లా నాయినా?” కస్తూరి కళ్లల్లోంచి నీటి బొట్లురాలి పడ్డాయి. “చెప్తా! అల్లుడయ్యను బయటకు తోలుకొచ్చి నులకమంచమ్మీద బోర్లా పడుకో బెట్టండి” సలహా పడేస్తూ బయటికెళ్లిందు. సలహా అప్పటికప్పుడే అమలైంది. తండ్రి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు.
కుంపటి నిండా కణకణ మండుతున్న నిప్పులు తయారు చేశాడు బైరాగి. “నువ్వేమీ భయపడకమ్మా!” కస్తూరికి ధైర్యం చెబుతూ తల్లి కుంపటిని నులకమంచం కిందికి చేర్చింది. దాన్ని ఆనందరావు కదుపు కిందుంచాడు బైరాగి. నిప్పుల జ్వాలలు కడుపుకు తాకుతా మంటున్నాయి.
“ఇదేమిటి కస్తూరీ? నన్ను కాల్బేన్తారా?” ఆనందరావు అరుపు.
“అయ్యయ్యో! ఆయన కడుపు నాన్నా?” కస్తూరి గొడవ.
“మరేం భయం లేదమ్మా!” తండ్రి సముదాయింపుకు దిగాడు.
“ఆ నిప్పుల వేడితో అల్లుదయ్య కడుపులున్న నెయ్యి కరిగిపోతుంది. ఆయాసం నిక్షేపంగా మాయమవుతుంది.”
పొత్తి కడుపులో భక్ష్యాల ఆయాసం, కింది నుండి చండ్రనిప్పుల ప్రతాపం...బోరుమని ఏడ్వాలనిపించింది ఆనందరావుకు. అప్పటికే బైరాగి, మాణిక్యం చెరో కాలు, రెండు చేతుల్ని మామగారు గట్టిగా పట్టుకున్నారు-కదలొద్దని. “వామ్మో వామ్మో!” అరుపుతో పరువు పంచనామా అవుతుందనే భయంతో గొంతులో ఆగిపోయినై.
అరగంట ఆరు యుగ్గాల్లా నడిచింది ఆనందరావుకు. కుడుపులోని ఆయాసం మాయమైంది. కాళ్లూ, చేతులు విడిపించుకుని హుషారుగా లేచి కూచున్నాడు.
పంచాంగ శ్రవణానికి గుడికెళ్లాలని తయారయారు. కృత్రిమ హుందాతనాన్ని కూడగట్టుకుని గుడికెళ్లాడు. మనిషిగా పంచాంగ శ్రవణం చేస్తున్నా పంచప్రాణాలు పారిపోతే బాగుండునంటున్నాయి. గుడినుంచి వచ్చి అందరూ వసారాలో కూచున్నారు.
“ఏం బావా! ముంగిలా ఉంటే ఎట్లా? ఏదన్నా మాట్లాడాలే గదా!” మాణిక్యం కదిలించింది. అటూ ఇటూ చూశాడు.
“టీ.వీ. చూస్తున్నాంగదా!” టీ.వీ,వైపు చూపులు తిప్పాడు. టీ.వీ.లో సినిమా ఐపోయింది. ఆనందరావుకు అయాసం భయం ఇంకా పోలేదు.
అత్తగారు నవ్వుకొని “రాత్రి భోజనానికి వయే ఐటమ్స్ చెయ్యాలి కస్తూరీ?” కూతురు నడిగింది. కస్తూరి పక్కనున్న భర్త వైపు చూసి చెప్పుమని కళ్లతో సైగ చేసింది. మౌనముద్ర దాల్చాడు.
“రాత్రికాగ” పక్క సోఫాలో బైరాగిలో ఉత్సాహం బుసబుసా పొంగుకొచ్చింది. కోవా రెడీగా వుంది గదా, కోవా గరిజలు కావాలి. నేతిగారెలు, మిరపకాయ బజ్జీలు...” లిస్ట్ పెరిగిపోతుంది. ఆనందరావు మనసు ఆగమై సుడిగాలిలో చిక్కుకున్నట్టుంది. హన్నా! మరో
ప్రమాదం ముంచుకొస్తుందన్న మాటా! మధ్యాహ్నం నిప్పుల వేడితో సరిపోయింది. రాత్రికి మంటల్లో మాడాల్సి వస్తుందేమో!.. గుండె జారి స్కూటర్ క్లచ్ వైరులా తెగి చేతిలో పడింది. బాత్రూం కెళ్లాలన్నట్టు భారంగా లేచి గదిలో కెళ్లాడు. సూటుకేసు సర్జుకున్నాడు. వసారాలోని వారంతా టీ.వీ. ప్రోగ్రాంలో మునిగి ఎంజాయ్ చేస్తున్నారు. ఆనందరావు పిల్లిలా అడుగులేస్తూ సూటుకేసుతో సహా బయటికొచ్చాడు. ఎవరో తరుముత్నుట్టు బస్టాండుకు పరుగెత్తి కదిలే బస్సు... ఎర్రబస్సు ఎక్కేశాడు. (“నెలవంక నెమలీక” మే 20156) క్ 4న; న గ్ గే పా ళా డవ మ్)... శా. యై "జీ శ ఇద్ద 11 ్నా పల్లె నా తల్లి [105] వితా చంద్రయ్య
సుడిగాలి
ఆధునిక హాంగులన్నీ ఉన్న సీతారామ్ నర్సింగ్ హోం
జాతరలా పేషంట్స్‌తో కిటకాటలాడుతుంది. దాక్టర్ పూలేరావు రౌండ్స్ పూర్తి చేసి కన్సల్టింగ్ రూంలో కూచున్నాడు. తల్లిదండ్రుల పేరుమీద ఉన్న ఆ నర్సింగ్ హోం ఓనరతడు. కష్ట సాధ్యమైన ఆపరేషన్‌ను ఇష్టపూర్తిగా విజయవంతం చేయగల దక్షుడు. చదినిన చదువుకు సార్ధకత చేకూర్చుకున్నాడు.
పోద్దుట్నుంచి రోగుల పరీక్షలు, ఆపరేషన్లతో తీరికలేకుండా ఉన్న పూలేరావుకు ఆకలి ఆవురావురు మంటోంది. లంచ్ వేళ అయింది. వెళ్ళామనుకునే సమయంలో (స్రెచర్ మీద ఓ పేషెంట్‌ను తీసుకొచ్చాడు. కడుపునొప్పి భరించలేక రోగి తల్లడిల్లుతున్నాడు. ఆ పేషెంటును తేరిపార చేశాడు.
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
తన తల్లిదండ్రుల మరణానికి కారకుడు...తన బాల్యాన్ని చిదిమేసిన కర్కోటకుడు... తన ఊరి దొర వీరభద్రయ్మ ఆవేశం, ఆక్రోశం తన్నుకొచ్చింది. వెంటనే కర్తవ్యం కూడా గుర్తుకొచ్చింది.
ఇంతలో వీరభద్రయ్య కొడుకు కమలేశ్వర్ వణికే గొంతుతో చెప్పిందంతా విన్నాడు. వారు తనను గుర్తుపట్టలేదని తెలిసిపోయింది
పరీక్షలు వగైరా పూర్తి చేసి “ఇది అపెండిసైటిస్, వెంటనే ఆపరేషన్ చెయ్యాలి” తాఫీగా చెప్పేశాడు. పేషెంట్ ఆయాసం ఆరుపులలాగే వున్నాయి.
కమలేశ్వర్ గుండెలు బాదుకుని “మా నాయన్ని ఎలాగైనా కాపాడండి దాక్టర్” కన్నీళ్లతో చేతులు జోడించాడు.
భావోద్వేగాలను అదిమిపెట్టి పేషెంట్‌ను ఐసియుకు తరలించి, భోజనానికి ఇంటికి వెళ్లిపోయాడు.
అన్యమనస్కంగా అదోలా ఉన్న పూలేరావును నిశితంగా గమనించింది భార్య నళిని. భోజనం చేసేటప్పుడు మాటామంతీ లేదు. అలాగే ఇద్దరూ భోజనం ముగించారు.
“ఏమైంది? అలా ఉన్నారేమిటి? ఒంట్లో బాగోలేదా” అంటూ నుదుటిమీద చెయి వేసి చూసింది.
ఆమె లాలనకు అతడి హృదయం తెరుచుకుంది. ఆవేదన అంతా ఒక్కసారిగా బయటికొచ్చింది.
“ఏం లేదు నళినీ, నా బాల్యం గుర్తుకొచ్చింది. అందుకు కారకుడైన వాడు తారసపడటంతో ఆ జ్ఞాపకాలు గుండెల్లో మండుతున్నాయి”
“ఇన్నేళ్ల దాంపత్యంలో నాకు ఏనాడూ చెప్పలేదు. ఇప్పటికైనా చెప్పండి. మనసులోని బాధ మరొకరికి చెప్తే ఉపశమనం కలుగుతుంది” అంటూ పక్కన కూర్చుంది.
భార్య అనునయానికి పూలేరావును గతం సుడిగాలిలా చుట్టుముట్టింది.
“నా బాల్యం భయంకరం. ఆ జ్ఞాపకాలు అప్పుడప్పుడు నా గుండెల మీదాడుకుంటుంటాయి. మా తాతల కాలం నుండి చెప్పులు కుట్టి అమ్మే కుటుంబం మాది. ప్రపంచీకరణ, కొత్త ఫ్యాషన్ల పుణ్యామా అని నాటు చెప్పుల అమ్మకం చాలా తగ్గిపోయింది. దీంతో పోట్టకూటికి పాములు ఆడించినట్లు మా నాన్న తుపాకి రాముని వేషమేసి ఊరూరా తిరుగుతూ, ప్రదర్శనలిస్తూ మమ్ముల్ని పోషించే వాడు. తుపాకి రాముని వేషం గమ్మత్తుగా ఉంటుంది. లూజు పాత పాంటు మీద పాత కోటు, కోటుకింద చిల్లుల బనీను తొడుక్కునేవాడు. పాంటు ఎడమకాలు భాగాన్ని పిక్కలదాకా మడిచేవాడు. నెత్తిమీద ఇంగ్రీషు దొర టోపీ, భుజంమీద తుపాకి ఆకారంలో దుద్దుకర్ర ఉండేవి. ధనవంతుల ఇల్లిల్లూ తిరుగుతూ నటిస్తూ డైలాగులు చెప్తండేవాడు. చేతిలో కర్ర తుపాకి ఆకారం లాంటిది ఉండేది.
కర్రతుపాకితో విన్యాసాలు చేస్తూ చెప్తంటే చాలామంది జనాలు చుట్టూ మాగేవారు. డైలాగులు చాలా విచిత్రంగా ఉండి అందర్నీ ఆకట్టుకునేవి. దాంతో మా ప్రాంతమంతా మ నాయిన పేరు మశూరైంది. అంతకుముందు మా ఊరు గడీలున్న దొరను అందరూ గుర్తుజేసేటోల్లు. కొంతకాలం గడిచేసరికి అందరూ దొర పేరెత్తకుండా మా నాయినను పొగిడేటోల్లు. ఆ సంగతీ అది మా ఊరి గడీల దొర, జమీందారుకు అసలే నచ్చలేదు. ఆయన మా నాయిన కంటే చిన్నోడే కాని కోటీశ్వరుడు. ఓసారి మా నాయినను గడీలకు పిలుపించు కున్నడు. ఆయనంటే మా ఊరోళ్లందరికి హడల్, మా నాయిన మీదికి కోపానికొచ్చి “నువు తుపాకి రాముని వేషం బంద్ చెయ”మన్నడట. “మరి నేనెట్ల బతకాలె దొరా” అని అడిగిందట. దొరకు ఇంకింత కోపమొచ్చిందట! “గవన్ని నేను జెప్పాలెరా బాడ్మావ్. బతక కుంటే చావు” అన్నదట. “గట్టంటే ఎట్ల దొరా? నా పెండ్లాం పిల్లగాడేం గావాలే?” అని అడిగిండట మా నాయిన. “నా లెక్క నువ్వుగూడా తుపాకి పట్టుకుంటావురా బేకార్ లబ్టీక్తే!” అని తిట్టిండట. నాయిన బతిమాలిండట. దొరేమో “నువ్వుండే గుడిసె జాగ నీదికాదు, సర్మారుది. దాన్ని ఖాళీ జీసి ఊర్నుంచి వెళ్లిపో” అన్నడట. నాయిన జవాబియ్యలేదట. పంద్లు పటపట కొరక్కుంటూ దొర చేతులున్న తుపాకి మడిమెతో నెత్తిమీద కొట్టిండట. నాయన కింద పడగానే తలకాయ రాయికి తలిగిందట. తల వగిలిందట. అప్పుడు నాకు నాలుగైదేండ్లుంటయి. మసూరి వచ్చి చెప్పంగనే మా అమ్మ నన్నెత్తుకొచ్చిందట గడీలకు.
లబలబ మొత్తుకుందట. నాయన కాళ్లు చేతులు కొట్టుకుని ప్రాణాలిడిచిండట. మా అమ్మ గుండెలు గుద్దుకుంటూ గోదకు తలకాయ గుద్దుకుందట. అమ్మకూడా అక్కడనే చనిపోయ్యింది. నేను ఏడ్చుకుంట అమ్మ, నాన్నల శవాల నడుమ పడిపోయిన. మా అమ్మనాన్నల్ని ఒకటే బజొందలో పెట్టిండ్రు. మా ఊర్ల ఒకాయన నన్ను పట్నం తోలుకపోయి ఆనాథ శరాణాలయంలో జేర్చించిండు. అష్టకష్టాలు పడి చదువుకున్న. శరాజణాలయం దాతల సాయంతో మెడిసిన్, పీజి చదివిన సంగతి నీకు తెల్సు. నర్సింగ్‌హోం ప్రారంభించిన. గప్పుడే గదా మన 'పెండ్రయింది. నువ్వుగూడా అనాథశరణాలయంలనే ఉంటివికదా! ఆ గడీల దొరగాదు...ఆ రాక్షసుడు...”మొహం రంగు మారి మంకెన పూవులాగైంది.
నళిని గట్టిగా ఊపిరి వీల్చుకుని నిట్టూర్చింది. “మనిదడరం ఒకటే ఆనాధశరణాలయంల ఉన్నా మీ చిన్నప్పటి సంగతి తెల్వదు. ఇంతకు ఆ దొర ఇంకా బతికున్నడా[”
“బతికున్నడు నళినీ. ఇంతకుముందే మన దవాఖానలో జాయినైండు. అపెండిసైటీస్, కడుపునొప్పితో తోక కోసిన మేక లెక్క అరుస్తున్నడు. ఐసీయూలో ఉంచిన. వెంటనే ఆపరేషన్ చేయ్యకపోతే గట్లనే మొత్తుకుంటూ ఛస్తడు ఆ వీరభద్రయ్య దొర పీడా వదిలిపోతుంది!” గదిలోకెళ్లి మంచమ్మీద ఒరిగాడు.
నళిని ఆలోచనలో పడింది. ఒకవైపు సానుభూతి, మరోవైపు మానవత్వం... ఈయన కావాలనే ఆపరేషన్ చేయ్యలేదన్న మాట. అపకారికి అపకారం చేస్తే ప్రతీకారం. ఉపకారం చేస్తే క్షమాగుణం. అదే అసలైన మానవత్వము, వృత్తికి న్యాయం.
ఓ నిర్ణయానికి వచ్చిన నళిని వెళ్లి భర్త పక్కన కూర్చుంది. ఆప్యాయంగా నుదురు నిమురుతూ... “మానవత్వం గురించి శరణాలయములో ఓ స్వామీజీ చెప్పింది గుర్తుచేసుకోండా అని హితబోధ చేసింది.
“మరిప్పుడు నర్సింగ్ హోంకెళ్లరా?”
“వెళ్తా...కాని వీరభద్రయ్య చచ్చాడని తెలిసిన తర్వాత”
“కొంచెం శాంతించండి, ఆవేశాన్ని అణిచిపెట్టండి...” అంది వీపు నిమురుతూ. “వైద్యుడు దేవుడంటారు. మీరు వీరభద్రయ్యను మాములు పేషెంటుగా భావించి దైవత్వం నిరూపించుకోండి" అంది.
చివ్వున లేచి బయటికొచ్చి సోఫాలో కూచున్నాడు. నళిని కూడా వచ్చి పక్షనే కూచుంది....
“ప్లీజ్..బాగా ఆలోచించండి. కష్టాలంటే ఏమిటో ఆనాథశరణాలయంలో పెరిగిన మనకు బాగా తెలుసు. క్షమా గుణంలో దైవత్వముంది. మా ఆయన దేవుడే కాని దెయ్యము కాదు” అంటూ గూటిలో గువ్వలా ఒడిలో ఒదిగి మెల్లగా చెప్పింది.
ఈ మాటలతో కర్తవ్యం బోధపడింది. భగభగ మండుతున్న వెన్నుపూసకు వెన్న రాసినట్లయింది డాక్టర్ పూలేరావుకు.
“నళినీ, మా అమ్మా నాన్నలు అమాయకులు... వాళ్లను రాక్షసంగా చంపేసింది ఈ రాక్షసుదే..” అంటున్న భర్త కళ్లల్లో నీళ్ళుబికినయి.
కొంగుతో భర్త కళ్లను తుడుస్తూ - “దయచేసి ఆలస్యం వద్దు. పదండి... ఆపరేషన్ చేసి పుణ్యం కట్టుకోండి...” అంటూ బతిమాలింది. మెడిసన్ చదివేటప్పుడు ప్రోఫెసర్లు చెప్పిన మాటలు కూడా పూలేరావుకు అదే సమయంలో గుర్తుకొచ్చినై.
వెంటనే లేచి గబగబ (డ్రస్సు వేసుకుని నర్సింగ్ హోం కొచ్చి వీరభద్రయ్యకు ఆపరేషన్ చేశాడు. వారం రోజుల్లో వీరభద్రయ్య కోలుకున్నాడు. పదవ రోజు డిశ్చార్జి సమయంలో వీరభద్రయ్య కృతజ్ఞతగా దాక్టర్ పూలేరావు కాళ్లకు నమస్మరించి.. “మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు డాక్టర్!” అంటూ చేతులు జోడించాడు.
పూలేరావు గుండెల్లో సంయమనం తాణకిసలాడింది.
“నేనెవరినో కాదు దొరా! మీ ఊరి తుపాకి రాముడు గుర్తన్నాడా? ఆయన కొడుకు పుల్లయ్యను. ఆనాటి పోరడు పుల్లిగాడే ఈ డాక్టర్ పూలేరావు,
ఈ మాటలు వినగానే వీరభద్రయ్య న్థాణువైపోయాడు. మాట్లాడేందుకు కూడా శక్తి లేనివాడయ్యాడు. పశ్చాత్తాపం అతని మొహంలో కనిపిస్తుంటే... పూలేరావుకు తల్లిదండ్రులు కళ్లముందు కదలాదారు.
(మెరుపు”-ఆంధ్రభూమి | శో 17-8-2015) వు.
నవ చేతన
మా తాత, తండ్రుల లెక్క నాది గూడా జీతగాని బతుకాయె. రెక్కలు వక్కలు జేసుకుని పొద్దుందాకా, తెల్లారదాక కష్టంజేసినా కడుపు సరిగా నిండకపాయె. పార్వతి బీడీలు జేసినా చిల్లెర ఖర్చులకు సరిపోవాయె. నా కొడుకైతే బడికి వోతుండుగాని...నాలెక్క వాని చదువు గూడా నడిగండ్లె నాగలిడిచినట్టు కావద్దు. కాని...వాని బతుకింతేనా? నా బిడ్డకు రెండేండ్లు వడ్డయి. దాన్నెట్లా సదివియ్యాలె? లగ్గమెట్లా జెయ్యాలె?... వెల్లకిలా పడుకుని ఆకాశాన్ని చూస్కుంట కుప్పకాడ కావలిగాస్తున్న రంగయ్య ఆలోచనల్ల (ప్రశ్నాబాణాలు దిగవడుతున్నె
ఆకాశమ్మీద లెక్కలేనన్ని చుక్కలు ఆర వోసిన ముత్యాల లెక్క మెరుస్తున్నై తనబతుకు లెక్కనే చుట్టూరా అమావాస్య చీకటి అలుముకునుంది. ఆ చుక్కలన్నీ తెల్లారివరకు మాయమైపోతై. మాబతుకులూ గంతే.
“నాయినా... ఓ నాయినా!” నిశ్శబ్ధాన్నిదీల్చుకుని దూరం నుండి పిలుపు వినబడింది. తన కొడుకు రాజేశం...గింత రాత్రి ఎందుకొస్తున్నాడో! దిగ్గున లేచి కూచున్నడు.
రాజేశం చెరువుకట్ట మీద, తనున్నది కట్టకింద. తన ముందర వరి కోసిన కర్రల కుప్ప వున్నది.
“ఏంది బిడ్డా? కుడిదిక్కు కట్టదిగి పిల్ల తొవ్వ లరా!”
చుక్కల వెలుతురు గుడ్డిదీపం లెక్కుంది. పదేళ్ల రాజేశం పరుగెత్తుకొచ్చిండు. దమ్ము ఎగవోస్తున్నడు. “నాయినా! చెల్లెకు బాగా జెరమొచ్చింది. కాళ్లూ, చేతులు వంకర్లు వోతున్నై ఏడుస్తుంది. అమ్మ భయపడ్డుంది” గొంతులో వణుకు.
కడుపుల పేగు కలుక్కుమంది. “అయ్యో! నేను వచ్చేటప్పుడు నిద్రపోతుంది గదా!” అనుకుంటూ ఆగమాగాన గొంగడి భుజమ్మీదేసుకున్నాడు. దుద్దుకర్ర చేతిల పట్టుకున్నాడు.
నేరుగా ఊరి వైద్యుడు నారాయణ ఇంటికి వొయ్యి నిద్రలేపి చెప్పిండు. అతడు మెడికల్ కిట్టుతో తండ్రి-కొడుకుల వెంట నడిచిండు. రంగయ్య భార్య పార్వతి ఎదురొచ్చి “జెర్జి జూడు నారన్నా! నా కాళ్లు జేతులు కడుపుల జొచ్చినై” అంటూ పాప దగ్గరికి తీసుకెళ్లింది. రంగయ్య ఆగమాగమైపోతూ “లచ్చిమీ...ఆదిలచ్చిమీ...!” పిలిచిండు కూతుర్ను. పిడికిళ్లు గట్టిగా పట్టి ఏడుస్తుంది పాప.
నారాయణ పాపనాడి చూసిండు. ధర్మామీటర్లో జ్వరం చూసిందు. ఏదో ఇంజిక్న నిచ్చిండు. ఐదారు నిమిషాలు చూసి పెదవి విరిచిండు. “రంగన్నా! పిల్లను జల్లి పట్నం దవాఖానాకు దీస్మపోవాలె. లేకపోతే కష్టం...”
“అయ్యో బిడ్డా!” గుండెలు బాదుకుని పార్వతి శోకాలు దీస్తుంది.
“అయ్యల్లా, ఇప్పుడెట్లా? గింతరాత్రి ఎట్ల వోవాలె?” రంగయ్య గుండెల్ల దప్పులు గొట్టినై. నెత్తి కొట్టుకున్నడు.
“నిజమే!” నారాయణకు జాలేసింది. “నాబండి మీద వోదాం. మిమ్ముల్ని పట్నం సర్మారు దవాఖానల ఇడిచి పెట్టొస్తా ఉండండ్రి. బండిదెస్తొనని పోయిండు. ఐదు నిమిషాలల్ల పాత స్మూటర్తోని వచ్చిండు. నారాయణ స్కూటర్ వెనక పాపను ఎత్తుకుని కూచున్నడు రంగయ్య. గంట లోపల పట్నం సర్మారు దవాఖానాకు చేరుకున్నారు.
పాప జ్వరం గురించి, తానిచ్చిన ఇంజెక్షను గురించి నారాయణ డ్యూటీ డాక్టరుకు చెప్పిండు. వెంటనే దవాఖానల చేర్చుకున్నాడు. డాక్టరు పరీక్ష జేసి మందులు రాసిండు. నారాయణ వెనుదిరిగిండు.
“నేవ్వేం భయపడకు, నీ బిడ్డకేమీ కాదు” ఇంజెక్టనిస్తూ నర్సు అన్నది నారాయణతో. కొద్దిగా ధైర్యమొచ్చినా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మంచం పక్కన కూచున్నాడు. దేవునికి మనసులనే మొక్కుకున్నడు. పాపతోని ఏవేవో సిరప్లు మింగిస్తుంది నర్సు.
తెల్లారేసరికల్లా పాప పరిస్థితి మెరుగైంది. తొమ్మిదింటికి డాక్టరొచ్చి పాపను పరీక్షించి చూసిండు. “పాప రోగం చాలా తక్షువైంది. ఇంగ ఇంటికి దీస్మపోవచ్చు. మందులు రాసిస్తా. వాటిని ఇంటి దగ్గర చాలా జాగ్రత్తగా వాదాల చిరునవ్వుతో చెప్పిండు. డిస్పార్చి గూడా రాసిండు.
పాపకు మందులు తీసుకుని బస్సుల ఇంటికొచ్చే సరికి పన్నెండైంది. పార్వతి ఎదురొచ్చి పాపను అందుకుని ఆబగా గుండెలకు హత్తుకుంది. అసలు లోకం అప్పుడు కనబడింది రంగయ్యకు. పాప జ్వరం పరేషాన్‌ను తట్టుకోలేక బుర్రలోంచి ఎగిరిపోయిన వరికుప్ప సంగతి అప్పుడు యాదికొచ్చింది. “అయ్యల్ల! వరికుప్ప ఎట్లుందో ఏమో” భార్యతో అంటూ నాలిక్కరుచుకున్నాడు.
“పాపకు మందులు నేను వేస్త, నువు జల్టిన తయారై కుప్పకాడికి వోవయ్యా!” అన్నది పార్వతి. పొయ్యి మీద బియ్యం బెట్టింది. స్నానాదులు ముగించుకుని, నాలుగు మెతుకులు గబగబా గతికిండు. కుప్పకాడికి పోవాలని గొంగడి, దుడ్డుకర్ర అందుకున్నాడు.
ఎన్నడూ లేనిది ఇంట్లకు పోలీసులొచ్చిండ్రు. భార్యా-భార్తలు అయోమయంగా మొకాలు చూసుకున్నారు. వెన్ను పూసల్లోంచి సన్నని వణుకు పుట్టుకొచ్చింది.
“రంగయ్య నువ్వేనా?” హెడ్ కానిస్టేబుల్ గంభీరంగ అడిగిండు.
“నేనే దొరా?” గొంతులో తదారిపోతుంది.
“అయితే నిన్ను అరెస్టు చేస్తున్నం. పదా జీబు ఎక్కు రంగయ్య అయోమయాన్ని భయం అలుముకుంది. నోటి నుండి మాట రాలేదు. గొంగడి, దుడ్డుకర్ర నేలకు జారినై. పార్వతిలో రోషం పొడసూపింది.
చాను నాకో
“ఎందుకు సారూ? ఆయనేం తప్పు చేసిండటా?” పొంగుతున్న వణుకులోంచి కుంగుతున్న ధైర్యం అడిగింది.
“రాత్రికి మురళీధర్ వరికుప్పకు కావలి కాయమంటే రాత్రికి రాత్రి సగం కుప్పను ఎవలకో అమ్ముకున్నడట. మిగిలిన కుప్ప నిడిచి పెట్టి ఇంట్ల పన్నడటగదా?”
“కృష్పను మీరు చూసిండ్రా సారూ?” వినయంగా అడిగింది పార్వతి.
“అది కాద్దొరా! నాబిడ్డ...” అసలు విషయం చెప్పబోయిండు రంగయ్య
“థూత్తెరి బద్మాష్” హెడద్డు అగ్గిమీద గుగ్గిలమైందు. “నీ కట్టు కథలన్ని పోలీస్ స్టేషన్ల మా యస్పై సారుకు చెప్పుకో. కోర్టుల వాదించుకో. పదా! మురళీధర్ దొర నీ మీద ఫిర్యాదు చేసిండు” మెడ మీద చెయ్యేసిండు. ఇద్దరు కానిస్టేబుళ్లు చెరోచెయ్యి బట్టి లాక్షెళ్లి జీబు ఎక్కించిందడ్రు. జీబు బుర్రున ఉరికిపోయింది. పార్వతి మనసుల రైళ్లు పరుగెత్తినై.
“ఎట్లా దేవుడా? ఇప్పుడేం జెయ్యాలె?” నెత్తి కొట్టుకుంది. కొడుకును కూతురు దగ్గరుంచి ఉరుక్కుంట మురళీధర్ ఇంటికెళ్లింది. జరిగినదంతా చెప్పింది. “దొరా! మా ఆయనను పోలీసోల్లు పట్టుక పోయిండద్రు. మీరే కేసు వెట్టింద్రట గదా! నీ బాంచెను దొరా! ఎట్లనన్న జేసి మీ జీతగాన్ని ఇడిపించుండ్రి దొరా!” పొత్తికడుపు పేగుల్ని చీల్చుకుని వస్తున్న దుఃఖాన్ని భయం అదిమిపెట్టింది.
మురళీధర్ కళ్లల్లో విజయానందం. భల్లున నవ్విండు. “వారెవ్వా! నాటకం బాగానే ఆడుతున్నరే పార్వతీ. తెల్లందాక మొగన్ని ఇంట్ల పండబెట్టుకుని ఇప్పుడు గీ చిత్రకథ జెస్తున్నావా? ఏమో పొనీ గరీబోడు అని ఏంజేసినా ఊకుంటే రంగడు రెచ్చిపోతున్నాడు. వాని సంగతి గా పోలీసోల్లు, కోర్టు చూసుకుంటదిలే.” పడక్కుర్చీ వెనక్కు ఒరిగిండు.
వెంటనే అతని కాళ్లు పట్టుకుని దీనంగా బతిమాలింది. రాతి గుండెలో తేమ పుట్టలేదు. “ఇంతవరకు మనూల్లె జీతగాడెవడన్నా దొంగతనం చేసి తప్పించుకున్నడా” గుద్గురిమిండు.
“అయ్యో దొరా! మా ఆయన అసొంటోడు గాదు దొరా! జెరంత దయ జెయ్యిండ్రి దొరా! * క్రాళ్ల మీద తలానించింది. కాళ్లు గట్టిగా రమూడించిండు. ఆ ఊపుకు పార్వతి వెల్లకిలా పడిపోయింది. ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చింది.
అప్పటి వరకే ఆ ఊరిలో వ్యవసాయ జీతగాళ్లు నర్సయ్య, అంబటయ్య, ఇంకో ఇద్దరు గిట్లనే పరేషానైండ్రు.
చకచకా నారాయణ ఇంటికెళ్లి విషయమంతా చెప్పి “జెరనువ్వన్నా దొరతోని చెప్పి మా ఆయనను ఇడిపించు అన్నా! రాత్రికేమైందో నీకు దెల్సుగదా!” బతిమాలింది.
దొర కావాలనే పోలీసుల కిచ్చిండని నారాయణ కర్థమైంది. కాని మురళీధర్ దొర ఎదుట నిలబడి ఏంజెప్పినా వినడు. పైగా తన మీద పగ బట్టవచ్చు. “ఇప్పుడు నేనా హాదా నా ననా
దొరతోని ఏంజెప్పినా, రంగయ్యా నేనూ కలిసి గూడుపుఠాణి చేసినమని నన్ను గూడా పోలీసుల కిస్తదు. ఏదో గరీబోన్ని. ఊరోళ్లకు తోచిన వైద్యం జేసి బతుకుతున్న. వైద్యం జేసెతందుకు నాకు లైసెన్సు గూడా లేదు గదా!” జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలా బాధపడుతూ నిస్సహాయత వెలిబుచ్చిండు.
. గటట
పోలీస్ లాకప్ రూంలో రంగయ్య మనసుల సంగడి బొంగురాలు తిరుగుతున్సై రాత్రికి పోలీసులు వరికుప్ప ఎవరికి అమ్మినవో చెప్పుమని లాఠీలతో మోకాళ్లు, మోచేతులు సొపు జేసిండ్రు. నేలమీద గోడకొరిగి మోకాళ్ల మధ్య తలానించి కూచుండి ఆలోచిస్తున్నాడు.
ఈ నొప్పులకేడ్వాలెనా, పెండ్లాంపిల్లల కోసం ఏడ్వాలెనా? అంగట్ల అవ్వా అంటే ఎవనికి పుట్టినవో బిడ్డా అన్నట్టుంది పరిస్థితి.
“రంగన్నా” లాకప్ రూం తలుపు అవతలి నుండి పిలుపు. తలెత్తి అటు చూసిండు. అతడు నర్సయ్య, తనలాగేనే ఓ భూస్వామి దగ్గర జీతంజేసి తన్నులుదిని పట్నమొచ్చిండు. అతని చిన్నాన్న తన దగ్గరుంచుకుని ప్రైవేటుగా ట్యూషన్ చెప్పించి చదివించిండు. మంచిగ చదువుకుని ఏదో నౌకరి జేస్తున్నడు. పోతున్న ప్రాణం లేచాచ్చింది. గబుక్కున లేవబొయిండు కాని నొప్పులతోని కుదరలేదు. మెల్లగా లేచి తలుపు దగ్గరి కొచ్చిందు.
“నర్సన్నా! నాగతి గిట్లయిందని నీకెట్లా తెల్సిందే?” కళ్ళ నీళ్లు అరచేతుత్తో తుడుచుకుని తన సంగతంతా చెప్పిండు.
“మనూరి వైద్యుడు నారాయణ వచ్చి చెప్పిండు. జీతగాళ్లను యజమానులు మనుషుల లెక్క చూస్తలేరు. నాగతి గూడా గట్టెతెనే ఇక్కడొచ్చి వున్న గదా! గా అంబటయ్య యజమాని పెట్టిన బాధలు పడలేక పురుగుల మందు దాగి చచ్చిపాయె. వాని పెండ్లాం తల్లి గారింట్ల ఎన్ని తిప్పలు పడుతుందో ఏమో!”
“మరి గిట్టయితే ఎట్లనర్సన్నా" నరాల్లోంచి ఎగదన్నుకొస్తున్న బాధను పంటి బిగువుతోని ఆపుకున్నాడు. “నువు ఈ పట్నమొచ్చి సదువుకున్నావు. నన్ను నువ్వే కాపొడాలె నర్సన్నా!” చేతులెత్తి దండం బెట్టిండు.
“అయ్యో! దండమెందుకన్నా? మన ప్రయత్నం మనం చేద్దాం రంగన్నా, గీ బెయిల్ కాయిదాల మీద సంతకం బెట్టివ్వు” కటకటాల్లోంచి కాయితాలు, కలము అందించిండు. రంగయ్య సంతకాలు చేసి యిచ్చిండు.
రంగయ్యకు బెయిల్ దొరికింది. నర్సయ్య వెంటవెళ్లి హోటల్ల భోంచేసిండు. అటెన్మ యూనియనాఫీసుకు వోయిండ్రు.
యూనియన్ నాయకుడు ఆత్మీయంగా పలుకరించి, నర్స్భయ్యతో పాటు తనను గూడా కుర్పీలో కూచోబెట్టిండు. అంతకు ముందే నాయకునికి నర్సయ్య అంతా చెప్పిండటా.
పల్లనా తల్లి గ్ ో వఐతా చంద్రయ్య
“రంగన్నా! ఊర్లె భూస్వాములు దగ్గరున్న జీతగాళ్ల పరిస్థితి దారుణంగా వుంది గదా! దీని కోసం ఏమన్నా చెయ్యాలనిసిస్తలేదా?” అనునయంగా అడిగిండు నాయకుడు. రంగయ్యకేదో అర్ధమయి కానట్టుంది. నర్సయ్య వైపు చూసిండు. “నర్సన్నా! నాపెయ్యి పిండిపిండై పోయింది. నువు ఏం చేద్దామంటే గదే చేద్దాం. ముందుగాల నేను నా భార్యా పిల్లల్ని చూడాలె. ఉడుకునీళ్లతోని నొప్పులు కాపుకోవాలె” యూనియన్ నాయకుని వైపు చూసిండు నర్చయ్య ఏం జెయ్యాల్నో చెప్పుమన్నుట్టు. నాయకుడు తెప్పించిన వేడిచాయ అందరూ తాగుతున్నారు. “ముందుగాల నువు మీ ఊరికివో రంగన్నా!?” నాయకుడు ముందుకు వంగిండు.
- నీ భార్యా పిల్లల సంగతి చూస్మో మోకాళ్లు మోచేతులు గరంనీళ్లతోని కాపుకో. అటెన్కమీ ఊరై నీ లెక్కవున్న జీతగాళ్లను కలువు” “వేరే జీతగాళ్లను కలుసుదెందుకు సారూ” రంగయ్య అదిగిండు. “నర్పయ్యా! నువ్వు గూడా పోవాలె. మీరిద్దరు కలిసి మిగితా వాళ్ళకు సమ్రబూయించాలె. ఇదంతా వాళ్ల కోసమే గదా!” నాయకుని సలహా. అది బాగనిపించింది. “సరే రంగన్నా నువ్విప్పుడు మనూరికి వో” నర్సయ్య అందుకున్నడు “రేపాదివారం గదా! పోద్దగాల్ల నేనోస్తా. మనిద్దరం కలసి వాళ్లకు నీ సంగతంతా చెప్పాం. మీ అందర్ని ఏకం చెయ్యాలె గదా! నీకేసు గురించి బాధ పడకు, నీకేమి కాదు. అందరం కలిసి పనిచేద్దాం. భూస్వాముల సంగతి చూద్దాం సముదాయించిందు. న ఫోన్లో పట్నం మనిషితో మాట్లాడి పరేషానై పోతున్నడు మురళీధర్. బంగళాల ఆగమాగంగ అటూ - ఇటూ తిరుగుతున్నడు. చేతులు పిసుక్కుంటున్నడు. తన మనసు లాగా బంగళా గూడా ఊగుతున్నట్టునిపిస్తుంది. ...అరే! ఆఫ్ట్రాల్ జీతగాడు రంగయ్యను పోలీసులకు పట్టిస్తే ఎవడో యూనయన్ లీడరు వాయ్యి డీయస్పీతో చెప్తడా! ఓ.యస్పీ డీయస్సీ సొడ్ల వెట్టుడేందీ? ఎప్పుడూ జీహుజూర్ అనే యస్స్పై తనను దొబ్బులపెట్టుడెందీ? నేనిచ్చిన మామూలు సంగతి మరిచిపోయిండా? అసలూ...వరికుప్ప బాగానే వున్నా నగం అమ్ముకున్నడని, రంగయ్య దొంగ అని చెప్పడం తప్పయిందా? వేరే ఇంకేదన్నా దొంగతనం చేసిండని చెప్తే బాగుండునేమో!... బుర్రల అయోమయం గుర్రాలు ఉరుకులాడుకున్నై “దొరా...దొరా[ గ్రామసేవకుడు పరుగెత్తుకొచ్చి, బర్భికర్ర నేలమీదుంచి చేతులు కట్టుకుని పిలిచిండు. అయోమయంలోంచి మురళీధర్ దృష్టి అటు మళ్లింది. “ఏందిరా? ఏదో కొంపలు మునిగిమునిగిపోయినట్టు ఉరికొచ్చిన వేందిరా? దమ్ముదీస్తున్నావా?” “అవును దొరా! అప్పుడు ఇద్దరు పోలీసోల్లు కచేరిదగ్గరికి సైకిల్ మోటర్ మీద
వచ్చిండ్రు. మీ వరికుప్ప చూపించుమన్నరు. తోల్మపాయ్య చూపించిన. వాళ్లు వరికుప్ప బాగనే ఉందిగదా, రంగయ్య మీద జులుం జెయ్యాలని రిపోర్టిచ్చిండ్రు అని మాట్లాడుకున్నారు. ఏదో రాసుకుని పోయిండద్రు. వాళ్లు అటు వోంగనే నేను ఇటు ఉరికొచ్చిన దొరా!” చెప్పి వెళ్లిపోయిండు. రంగయ్య-నర్సయ్య కలిసి ఊర్లె తిరిగి, జీతగాళ్లను కలిసి మాట్లాడిండ్రు. ఒకచోట సమావేశమై కూచున్నరు. “మన రంగన్న నేం జేసింద్రో తెలుసుగదాగ” అడిగిండు నర్సయ్య. తెలుసునన్నట్టుగా అందరి తలకాయలు తాటికాయల్లెక్క ఊగినై. “ఇంతకు ముందు గూడా భూస్వాములు జీతగాల్లను గిట్లనే పరేషాన్ జేసిన సంగతి తెలుసుగదా!” తెలుసునన్నారు. “నన్ను గూడా పరేషాన్ జేసిన సంగతి గూడా మీకు తెలుసు. గిట్ల ఇంక ఎంతకాలం బానిసల్లెక్క బతుకుతరు? దీనికేదన్నా ఉపాయం చేద్దామా? వద్దా? ఏదన్నా చేద్దాం” అందరూ సరేనని ఏం చేద్దామని అడిగిండ్రు. నర్సయ్య ఊపిరి పీల్చుకున్నాడు. “మన బతుకులు బాగు పడాలంటే మన వ్యవసాయ కార్మికులమంతా ఒక్కటై, వ్యవసాయ కార్మికుల సంఘాన్ని పెట్టుకోవాలె. ఒకరికొకరు మద్దతియ్యాలె. ఒకరికి అన్యాయం జరిగినా అందరు ఒకటై అడగాలె. గిసొంటి సంఘాలు కొన్ని ఊర్లల్ల షురువైనాయి. మనమంతా ఒకటైతే మనకెవరికీ అన్వాయం జరగదు...” అంటూ సంఘము గురించి చాలా వివరాలు చెప్పిండు. హక్కులు, బాధ్యతల గురించి చెప్పిండు. పట్నంల యూనియన్ లీడర్ల గురించి చెప్పి “ఇప్పుడు మన యూనియన్ నాయకుడు కల్పించుకున్నడు కాబట్టే మన రంగయ్య బయటి కొచ్చిండు. మురళీధర్ దొర బండారం బయట వడ్డది. మన వాక్కుల్ని సాధించుకుందాం. మన వెనక మన యూనియన్ లీడర్లున్నారు”. మరి కొన్ని నంధుటనలు గూడా చెప్పి వ్యవసాయకార్శికుల సంథుము ప్రారంభమైందన్నాడు. అందరి విడికిళ్లు బిగుసుకున్నై నరాలలో కొత్త ఉత్తేజం నిండింది. ఏకతా స్వరాలనాలాపించిండ్రు. “దొరల జులుం - నశించాలి” “వ్యవసాయ కార్మికుల సంఘం - జిందాబాద్” “కార్మికుల ఐక్యత - వర్ధిల్లాలి” నినాదాలు ఆశాశం అంచుల్ని తాకినై (“సోపతి 25-6-2015) (నవతెలంగాణ పత్రిక వారి వట్టికోట ఆళ్వారు స్వామి స్మారక కథల పోటీల్లో ప్రత్యేక బహుమతి పొందిన కథ) న నానన
ఉభయ తారకము
మా అసాధారణ స్నేహరథాని కతడు సారధి. పసిడి ప్రాయములో బడిలో చదివేప్పుడు, గుడిలో ఆడుకునేప్పుడు జిగ్రీ దోస్తులు చాలా ఉండేవారు. ఆశలరెక్కలు కట్టుకుని హైస్కూల్లో వాలే సరికి మండుటెండల్లో బావి నీరులా దోస్తుల సంఖ్య తగ్గిపోయింది. ఇంటర్లో ఎంటరయేసరికి ఇంకా కుంచించుకు పోయింది. ఇంటర్లో గూడా నేను, సారధి ఒకే క్లాసులో పక్కపక్కన కూచుండి లెక్ఫరర్ చెప్పిన పాఠాల లోతుల్లోకి తొంగి చూసి కొంటె ప్రశ్నల్లో ఆటపట్టించే వాళ్లం. తినేందుకు చేతిలో కొచ్చిన లడ్డూ మూతిలో కెళ్లనట్టుగా ఇంటర్ ఫైనల్ పరీక్షలకు ముందు సారధి తండ్రి ఆక్సిడెంటులో హరీ అన్నాడు. పరీక్షలు రాయలేక పరితాపం చెందాడు సారధి. అతని తండ్రి గవర్నమెంటాఫీసులో అటెండర్‌గా పంజెస్తూ గుట్టుగా సంసార సాగరాన్నీదేవాడు. పై అధికారుల గుండెల్లో జాలువారిన జాలి తండ్రి స్థానములో తనయుడికి అటెండర్ కొలువిప్పించింది. సారధి చదువు చంకలో పడింది. మిగిలిన నలుగురు "స్నేహితులం డిగ్రీ పూర్తి చేయకముందే సారధి చెల్లె పెళ్లి చేసి తల్లి ఆరాటానికి పుల్‌స్టాఫ్ పెట్టేశాడు. ఆఫీసు స్టాపు అందరకీ తలలో నాలుకయాడు.
తాతల నాటి పెంకుటిల్లే సారధి పాలిట రాజభవనమైంది. అందులోనే పెళ్లిచేసుకుని శారదతో ఉంటున్నాడు. కార్గిల్ యుద్ధములో ప్రాణాలర్పించిన సైనికుని కూతురు శారద, కానీ కట్నం లేకుందా అత్తారింటికొచ్చింది. అంతటితో తన బాధ్యత తీరిపోయిందనుకుందేమో సారధి తల్లి భర్త జాడల్ని వెతుక్కుంటూ పైలోకాలకు పయనమైంది. డీగ్రీలో ధక్మామొక్కీలు తిన్న నలుగురు స్నేహితులం పాసయామనృంచుకున్నాము. నలుగురిలో ముగ్గురికి ఉద్యోగాలు దొరికాయి. దాంతో పిస్టల్పేలిన మోత విన్న చెట్టుమీది పక్షుల్లా స్నేహితులం చెల్లాచెదరై, వేర్వేరు డిపార్ట్మెంటులో వేర్వేరు ఊళ్లలో వాలాము. నాకుమాత్రం మా ఊళ్లోనే పోస్టింగిచ్చారు. వేణు వ్యాపారములో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. అప్పట్నుంటి నేను, సారధి, వేణు రోజూ సాయంత్రం కలిసి పార్కులో కూచునే వాళ్లం. పిచ్చాపాటి ముచ్చట్లతో మెత్తని గడ్డి పరుపుమీద ఒరిగి పూల పరిమళాల నాఘ్రాణిస్తుండే వాళ్లం. సంసారంలోని సరిగమలను, లోకం పోకడ పదనిసలతో మేళవించి సరదాగా గడిపేవాళ్లం. జోకులు పేల్చడములో సారధి ముందుండేవాడు. మాగ్గూడా పెళ్లిళ్లైనాయి. మాంచి కట్నమొచ్చింది. నేను చదువులోగ్యాప్ రాకుండా పట్టుబట్టి ఎమ్మేచదివి ప్రైవేటుగా పరీక్షలు రాసి పాసయ్యాను. చిరుద్యోగ మొదిలేసి మాఊరి గవర్నమెంటు జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా చేరాను. సారధి ప్రమోషన్ సాధించి రికార్డ్ అసిస్టెంటుగా మా కాలేజికొచ్చాడు.
సినిమాలకు షికార్లకు కలసితిరిగే వాళ్లంగదా, రోడ్డు మీద అరటితొక్కనో, ఇటుక ముక్కనో కనబడితే సారధి దాన్ని తీసి జాగ్రత్తగా చెత్తకుండీలో వేసేవాడు. అదక్కునే వాళ్లెవరు చేయి చాచినా దానం చేస్తుంటే అందులో కొంత అపాత్రు దానమపుతుందిగదా! “అడుక్కునే వాళ్లల్లో గూడా డబ్బుల్ని వడ్డీలకిచ్చేవారున్నారు తెలుసా? మన కంటే వాళ్లే ధనవంతులురా!” అన్నాడోసారి వేణు. దానికతడో చిరునవ్వు రువ్వి ఊరుకున్నాడు. ఓసారి ముగ్గురం కలిసి సినిమా కెల్తున్నాము. ఓ ముసలాడు నడీరోద్దుపక్కన వణుకుతూ కూచున్నాడు. అది చలికాలం. సారధి కేమని పించిందో గాని “మీరుండండి. నేనిప్పుడే వస్తానని చెప్పి ఓ కొత్త గుడ్డకొనుక్కొచ్చి ముసలాయనకు కప్పాడు. సినిమా ప్రోగ్రాం క్యాన్సలైంది. మేమిద్దరం నిరాశలో మునిగాము. దీపావళి, బతుకమ్మ పండగలప్పుడు పేదలకు వస్త్రదానం చేసేవాడు. తాను మాత్రం పాయిజామా, లాల్చీ వేసుకుని సాధారణంగా ఉండేవాడు. ముచ్చట్ల మధ్య ఎవరన్నా ఉండబట్టలేక “ముసలివాడిలా ఎప్పుడూ అదే (డైస్సువేసుకుంటా వెందుకో? ఓ మాంఛి్రెస్సు కొనుక్కోవచ్చుగదా!” అని పాయింటాఫ్ ఆర్టర్ లేవద్స్తే చిన్నగా నవ్వేసి “దేశంలో ఎందరో మాన సంరక్షణ కోసం గుడ్డల్లేకుండా వున్నారు. మనం కాస్టిలీ (డ్రెస్సు వేసుకుని ఊరేగితే బాగుంటుందా? ఆ ధరలో రెందు సాధారణ ద్రెస్సులొస్తాయి. ఒకటి నేను వాడుకుని మరొకటి పేదలకు దానం చేస్తే తృప్తిగా ఉంటుంది బాఖూ!” అని పాయింటాఫ్ ఆర్జర్ను పటాపంచలు చేసేవాడు. ఆఫీసులో ఎప్పుడూ పనిచేస్తూ స్టేటుమెంట్స్, బిల్లులు తయారు చెయ్యడములో కార్మికులకు కుడిభుజ మవుతాడు. కడలి కెరటాలు, కాలగమనం మనషికోసం ఆగవు గదా! సారధి ఓపెన్ యూనివర్సిటీ క్లాసుల కెళ్లి బియ్యే పాసయ్యాడు. మా కాలేజిలోనే ప్రమోషన్ మెట్టెక్కి క్లర్కు అయ్యాడు. అయినా (్రెస్సుగాని, స్టైలుగాని ఏమాత్రం మారలేదు. ఆరోజుల్లోనే ఇద్దరు పేదలకు కొత్త గుడ్డలు కొనిచ్చాడు. ఆవార్త లీకై కాలేజాఫీసుకు చేరుకుంది. ఓ లెక్బరరు “ప్రమోషనొచ్చింది గదా! పార్టీ ఇవ్వలేదింకా!” గుర్తు చేశాడు. సారధి హుషారుగా భుజాలెగరేసి “ప్రమోషనొచ్చింది పార్టీకోసం కాద్సార్. దిక్కులేని వాళ్లకు ఎక్కువ సాయం చేసేందుకు దొరికిన అవకాశం. మనము చాయతో సరిపెట్టుకుందా"మని దానికి కొనసాగింపుగా ఓ జోక్ పేల్చి-అందరినీ నవ్వించాడు. ఓసారి పంద్రాగస్టు నాడు హాస్పిటల్ రోగులకు వళ్లు, జైలు ఖైదీలకు స్వీట్సు పంచాడు. “ఆ డబ్బులతో మనం మందుపార్టీ చేసుకుంటే బాగుండేది గదా సారధీ” అన్నాడు కామర్స్ లెక్బరర్. “సార్! మనదేశంలో తినేందుకు తిండి లేనోళ్లెందరో పండుగలు చేసుకోవడం లేదు. మన లెవల్లో మనం వాళ్లకు పండగను చేతల్లో గుర్తుచేస్తే ఆనందంగా ఉంటుంది సార్” అన్నాడు.
అంతా కలిసి అతన్నో అమాయక చక్రవర్తిలా గుర్తించారు. “ఆహా ఊడిపడ్డాడబ్బా దేశభక్తుడు.”
“ప్రమోషనొచ్చింతర్వాత గూడా తానో మంచిడద్రెస్సు వేసుకోలేని పిచ్చి మారాజు”
“కొందరికి కొత్తగుడ్డలు కొనిస్తే కొందరికి స్వీట్సు, పళ్లు పంచితే దేశంలోని దరిద్రమంతా కొట్టుకు పోతుందా?”
“ఇవన్నీ షోపుటప్ లే”
రకరకాల వ్యాఖ్యానాలు అల్లుకు పోయినై. అయినా సారధి స్పందించలేదు. బాల్య "స్నేహితుడు మాటల తూటాలకు బలైపోతుంటే నాలో రోషం పొడుచు కొచ్చింది. వెధవ సారధి! అందరి లాగా తానూ ఉండి ఏడ్పొచ్చుగదా! అనుకున్నాను గాని అంతరాత్మ “మనకంటే అతడెంతో నయంగదా!” రోషాన్ని కోసేసింది. ఎప్పట్లాగే సాయంత్రం పార్కులో కూచుండ. పచ్చగడ్డిని తడుముతున్నాము. కాలేజి లోని వార్తా వాహినిని వేణు చెవిదాకా తీసుకెళ్లాను. వేణు ఊరుకుంటాడా? “ఎందుకురా సారధీ! నువ్వొక్కడివే ఈ దేశం కుళ్లునంతా కడిగెయ్యగలవా? దరిద్రాన్ని తరిమెయ్య గలవా?” నిలదీశాడు. సారధి మా ఇద్దర్నీ మార్చి మార్చి చూస్తూ గమ్మత్తుగా నవ్వబోయి. ఆపుకున్నాడు. “దేశములో, సమాజములో ప్రతి వాడూ నేనొక్కడినే ఏమీ చెయ్యలేనని చేతులు ముడుచుక్కూచుంటే ఎట్లా? దేశ సరిహద్దుల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన వీర జవానులు ఎవరికి వారు నేనొక్కడిని యుద్ధం చెయ్యకుంటే ఏమవుతుందనుకుంటే మన దేశం గతి ఏమతుందో తెలుసా? అందరూ ఈ దేశ పురోగతికి తలా ఓ చెయ్యి వేస్తే దేన్నైనా సాధించగలం గదా!” మనసు గాయపడినట్టుగా జవాబిచ్చాడు. “చాల్లేరా నీ సుమతి శతకం నీతులు” అనీ గిలిగింతలు పెట్టాను. ముగ్గురమూ నవ్వుకున్నాము.
వేణుకు, నాకు ఇద్దరేసి సంతానం...బడికెల్తున్నారు. సారధి ఇంకా తండ్రికాలేదు. ఓసారి. “ఓరే సొరధీ! ఏ వయసులో జరగాల్సిన అచ్చటాముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం చందం.” ప్రస్తావిస్తూ వేణు నావైపు అర్ధవంతంగా చూశాడు. “నిజమేరా!” నేనందుకున్నా. “ఎవరన్నా స్పెషలిస్టు డాక్టర్‌ను సంప్రదించి సంతాన సాఫల్యం పొందండిరా. కావాలంటే నేనూ మీ వెంట వస్తాను.” పప్పులో ఉప్పులా '్రోత్సహించాను. మా పక్కనున్న పార్కు పూలమొక్కల రెక్కలు గాలతో సయ్యాటలాడుకుంటున్నాయి. సారధి వాటినే చూస్తూ “ఆహా! ఆ రెమ్మలు, పూలు ఎంత ముచ్చట గున్నాయో చూడండి” అన్నాడు.
నాకదేమీ నచ్చలేదు. “అల్వాల దారి ఎటు అని అడిగితే ఉలువల ధర గురించి చెప్పి నట్టుందిరా. మీ ఇల్లుగూడా పిల్లా పాపతో కళకళలాడాలని మా ఆరాటంరా!” అసహనంగా చూపాను.
“నువ్వన్నది కరెక్ట్‌రా!”
సారధి ఒప్పుకోవడమో వింత. ఇంకేమంటాడోనని చూస్తున్నాము ఆసక్తిగా. “నా ఇల్లు గూడా పిల్లాపాపతో కళకళలాడి తీరుతుంది. పైవాడి పంచలో ఆలస్యము ఉండొచ్చుగాని అంధకారం లేదుగదా!”
“అయితే డాక్టర్‌ను సంప్రదిస్త వన్నమాట.”
మర్నాడు సారధి కాలేజికి రాలేదు. రెండోరోజు, మూడోరోజు గూడా రాలేదు. కాలేజి ఆఫీసులో కనుక్కున్నాను. వారం రోజులు సెలవు పెట్టాడని తెలిసింది. వేణుతో చెప్పాను.
“ఎందుకంటా? వారం రోజులు హనీమూన్ కెళ్లాడా?” వేణు భార్య అడిగింది గమ్మత్తుగా.
“వారం రోజుల హనీమూన్తో సంతానం కలుగుతుందా?” వేణు కొట్టిపారేశాడు. “మనమే వాళ్లింటి కెళ్ళాం పదా!” బయలుదేరదీశాడు.
మాటల మూటల్ని మోస్తూ వాళ్లింటి కెళ్లాము.
ఇంటి వాతావరణం క్లీన్ అండ్ గ్రీన్‌కు ఉదాహరణగా వుంది. ఐదేళ్ల ఆడపిల్ల వసారాలో అడుకుంటోంది. మమ్ముల్ని చూసి లేడిపిల్లలా లోపలికి పరుగెత్తింది. సారధి భార్య శారద వేలుబట్టుకుని తీసుకొచ్చింది.
“క్తూచోండన్నయ్యా!” కుర్చీలు చూపించింది శారద. కుందనబ్బొమ్మలాగుంది. సారధి కోసం అటూ, ఇటూ చూస్తూ కూచున్నాము.
“నారధి సెలవెందుకు పెట్టాడమ్మా?” ఆతృతగా అడిగాను.
అది విననట్లే వంటింట్లో కెళ్లి గరం చాయలతో తిరిగి వచ్చింది. చెరో చాయకప్పు అందిస్తూంటే మేము పాపనే చూస్తున్నాము అయోమయంగా *ఈ పాప మా అమ్మాయే అన్నయ్యా!” అంటూంటే ముంగురులు ముచ్చటగా కదుల్తున్నాయి. వేణు, నేను షాక్ తగిలినట్టు మొహాలు చూసుకున్నాము.
“మీకు సంతానమ్రైందని మాకు తెలీదమ్మా. నంతానం కోనం దాక్టర్ను సంప్రదించేందు కెళ్లారనుకున్నాం.” గరంచాయ నరాలను కదిలిస్తూంటే నెత్తిగోక్కున్నాను.
“సంతానం కాలేదన్నయ్యా!” సూటిగా చూస్తుంటే ఒంటిరాయి ముక్కుపుడుక తళు కులీనుతోంది. “మొన్ననే అనాధ శరణాలయం నుండి పాపను తెచ్చి పెంచుకుంటున్నాము.”
“అంటే డాక్టర్లు మీకు సంతానం కాదన్నారా?”
“డాక్టర్‌ను సంప్రదించినంకనే అనాధ శరణాలయంకెళ్లొచ్చినం.” పాప నుదురు ముద్దాడింది. ఖాళీ కప్పులు తీస్తూ “ఆయనకు జ్వరమొచ్చిందన్నయ్యా!” అంది ఖాళీకప్పులు వంటింట్లొ పెట్టొచ్చి. గదిలో కెళ్లి సారధిని తీసుకొచ్చింది. అతడు మా ఎదురు కుర్చీల్లో కూచున్నాడు. బలహీనంగా ఉన్నట్టనిపించింది.
“ఏరా సారధీ? ఏమైంది?” ఠపీన అడిగాడు వేణు. “ఏమీ కాలేదు మిత్రమా! మూడ్రోజుల క్రితం హైద్రాబాదు కెళ్లి డాక్టర్‌ను సంప్రదించాము. శారదకూ, నాకు వాళ్లెన్నో పరీక్షలు చేసి శారదకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు. అందుకే అనాథాశమం కెళ్లి వచ్చాము. అలసిపోయాను గదా, చిన్నగా జ్వరం తగిలింది. మాత్ర లేసుకుంటున్నాను తగ్గుతోంది. మాపాప ఆణిముత్యంలాగుంది గదా!”
వేణులో అసమ్మతి అంగలేసినట్టుంది “* నీకేమన్నా పిచ్చా? ఎవరో కనిపడేసిన పాపను తెచ్చి పెంచుకోవడ మేమిటీ? శారదను ఒప్పించి మరోపెళ్లి చేసుకుంటే సరిపోయేది గదా!”
“అది గూడా ఆడపిల్లను తెచ్చి పెంచుకోవడమా?” ముక్కు మీద వేలేసుకున్నాను.
“ఆయన మరో పెళ్లిచేసుకుంటే ఆవిడగూడా నాలానే ఉంటే మూడో పెళ్లి చేసుకోవాలా వేణన్నయ్యా?” శారద సవాలు విసిరింది.
“నిజమేకాని ఒక బాబును తెచ్చుకుంటే బాగుండేది.” మాట మార్చాడు వేణు. మేము ఒకరి మనసులో ఒకరం గూడుకట్టుకున్నాము.
సారధి మొహం వికసించింది. “ఓ మగపిల్లాన్ని గూడా తెచ్చుకున్నామురా. శారదా! మన అవినాశ్‌ను గూడా తెచ్చి చూపించు” భుజాలెగరేశాడు. శారద గదిలోకెల్లి చిట్టిబాబును తెచ్చి చూపించింది. “ఎంత ముద్దొస్తున్నాడో చూండండన్నయ్యలూ!” మురిసిపోయింది.
“మా తమ్ములు మంచి గున్నలు...” పాప బాబు చెంపలు నిమిరింది. బాబు బోసి నవ్వులు ముద్దొస్తున్నాయి. సారధి సంతోషంగా బాబునందుకుంటూ “మీలాగా మాగ్గూడా ఇద్దరు పిల్లలు. ఈ బాబు మున్సిపాల్టీ చెత్త కుండీలో దొరికితే ఎవరో తెచ్చి అనాధ శరణాలయంలో చేర్చారట. వీడే మావంశోద్దారకుడు!” శారదను కూచోమ్మని ఖాలీకుర్చీని కళ్లతో చూపించాడు. నాకు పార్థసారధిలా కన్పించాడు.
“కాని సారథీ!” వేణు ఎదపొదలోని అలజడి తగ్గిట్టుంది” ఎవరో కనిపడేసిన అనాధ పిల్లల్ని అక్కున చేర్చుకున్నావంటే...నువు చాలా గొప్పోడివిరా! ఇన్ని రోజులు నిన్ను తప్పుగా అర్ధంచేసుకున్నానురా!” గొంతు గద్గదమైంది.
“నిజంగా నువు సంఘ సంస్కర్తవు. దేశభక్తుడివిరా!” నా మాటలు ఆపుకోలేక పోయాను.
సారధి గాల్లోకి చేతులెత్తి నమస్కరించాడు. “అంతా పైవాడి దయ. నేను సంఘ సంస్కర్తను కాను గాని దేశపొరుడిగా నాబాధ్యతలు నిర్వర్తించాలిగదా! ఈ దేశం మనది. ఈ సమాజం మనది. దీని శ్రేయస్సు కోసం ఎవరికి చేతనైనంత వారు పాటుపడాలిగదా! మనదేశ స్వాతంత్ర్య కోసం ప్రాణాలిచ్చిన మహనీయులు కేవలం తమగురించే ఆలోచిస్తే మనకు స్వాతంత్ర్య మొచ్చేదా? ఇలా స్వేచ్చగా బతికే వాళ్లమా?”
నా బుర్రలో ఏదో తళుక్కుమంది. దేశంకోసం, సమాజం కోసం ఏదన్నా చెయ్యాలనే ఆరాటం పురుడుపోసుకుంది. వేణు పరిస్థితిగూడా అలాగే ఉన్నట్టుంది. మేమిద్దరం పాప చెంపల్ని బాబు బుగ్గల్ని ఆప్యాయంగా నిమిరాము. అదొక దివ్యానుభూతి. “అయితే భార్యాభర్తలు కూడబలుక్కుని ఈ వనిచేశారన్నమాట!” ఆలోచనాలోచనాల్లోంచి అడిగాను. శారద పాపను ఎత్తుకుంటూ * అవునన్నయ్యా! ఇది ఉభయతారకం గదా!” అంటూంటే నుదుటి కుంకుమబొట్టు ఉదయసూర్యునిలా మెరిసి నా బుర్రలోని బూజు దులిపేసింది. ఆ క్షణంలో శారదలో నాకు భారతమాత కన్పించింది చంకలోని పాప భారత జనావళికి (ప్రతిరూపముగా తోచింది. “శాలివాహన” జనవరి-2015) ఇ న ననన
ఆరాటం - పోరాటం
“అమ్మా! నేనీ గుమాస్తా ఉద్యోగం మానేస్తానేగ” కుర్చీలో కూచున్న గోపాల్ గొంతులో నిరాశ.
“తాసిల్దారాఫీసులో బంగారం లాంటి ఉద్యోగం గదరా!”
“నేనందులో ఇమడలేనమ్మా. తానీల్టారే మామూళ్ళు వనూలు చేసి తనకిమ్మంటున్నాడు. నాగ్గూదా కొంత ఇస్తాడట. అసలు లంచమెందుకు తీసుకోవాలమ్మా?” గోపాల్లో ఆవేశం అంగలేసింది.
దేహం కన్న దేశం మిన్న అతని నాన్న కార్గిల్ యుద్ధములో కన్ను మూశాడు. కష్టపడి చదివిన గోపాల్కా ఉద్యోగం దొరికింది. పెళ్ళెంది, భార్య రభూన్సీలక్ష్మి గుణవతి, రూపవతి, ఆతడాఫీసు నుండి వచ్చేసరికి అత్తాకోడళ్ళు సోఫాలో కూచుండి టీ. వీ.చూస్తున్నారు. అప్పటికే గోపాల్ సివల్ ప్రిలిమ్స్ పాసై మెయిన్స్ ప్రిపేరవుతున్నాడు.
“నిజమే కాని...” రూన్సీ! లక్ష్మి ఏదో అనబోయింది.
“కానీ, అణా... ఏమీలేదు రూన్సీ! గూడులేని పేదలకు ఉచితముగా పంచి పెట్టాల్సిన ఇళ్ళ జాగాలను శ్రీమంతులకు కేటాయిస్తూ నోటు రాసి పెట్టాలట. పాపం! బీదల వద్ద డబ్బులు వసూలు చెయ్యలేమని వాళ్ళ దగ్గర వసూలు చేయమంటున్నాడు.”
“నువ్వుద్యోగం చెయ్యకపోతే నా పెన్ష్నన్తో ఇల్లెట్లా గడుస్తుందిరా. పైగా రయూన్సీ గర్భవతి. కొద్ది రోజుల్లో తం(డ్రివవుతున్నావు.”
“స్పివ్రల్స్ మెయిన్స్ బాగా చేసి ఐ.ఏ.యస్.కు ఎంపికవుతా! అప్పుడు అవినీతికి పాల్పడుమనే వారుందరు. చదువుకునేందుకు టైం గూడా దొరుకుతుంది గదమ్మా!”
తల్లికి నవ్వొచ్చింది. “పిచ్చి నాగన్నా! చదువుకునేందుకైతే లీవు పెట్టు. నువు ఐ.ఏ.యస్.వైనా పై అధికారులు, రాజకీయ నాయకులు పై లెవల్లో పైరవీలు చేసి అవినీతి ఊబిలోకి దింపుతారు. అప్పుడేం చేస్తావురా?”
గోపాల్‌ను అయోమయం ఆవరించింది.
“జవాబివ్వండి” రయూన్సీ కళ్ళు కమ్మగా తిరిగినై “అవినీతికి వేలుబెట్టే అవకాశమిస్తే కాలు బెడుతుంది. దాన్ని మొదట్లోనే తరిమేస్తే బాగుంటుంది గదా! మీరు ఐ.ఏ.యస్, కు గ్యారంటీగా ఎంపికవుతారా? ఏ అవినీతి పరులో కొట్టుకుపోవుచ్చు ఆ ఉద్యోగాలను “మూడు రాళ్ళ ముక్కుపుడక జాతీయ జందాలా మెరిసింది.
తల్లి వాలకం గంభీరమైంది. “నాన్నా! అవినీతిని తరిమెయ్యాలంటే ఐ.ఏ.యస్సే కానక్కర లేదురా! ఆ అవినీతి పని చెయ్యనని తాసీల్దారుతో ఖచ్చితంగా చెప్పెయ్. ఏం జేస్తాడు! మహా అంటే ట్రాన్స్ఫర్ చేయిస్తాడు. ఉద్యోగం ఏ ఊళ్లోనైనా చెయ్యాల్సిందే గదా! నిజాయితీగా పోరాటం చెయ్. ధర్మమే జయిస్తుంది రా!” ధైర్యం నూరిపోసింది. గోపాల్ నరాల్లో ధైర్యం స్వరాలు, తృప్తిగా లేచాయి. అమ్మ చెప్పింది కరక్టే... మనసు గట్టిపడింది. (ప్రసారిక” జూలై-2016)
పండగ పారిజాతము
మోడ్రన్ సెల్‌ఫోన్ రింగ్టోన్లాగా వాకిట్లోంచి మూల్గులు వెలువడుతున్నాయి. అవి వాకిట్లోని ముగ్గుల్ని పలుకరిస్తున్నట్టుంది. కాని ఇంట్లోకి వెళ్లలేక పోతున్నాయి.
మూన్నెళ్ల క్రితం మెడలో మూడు ముళ్లు వేయించుకున్న అందాల భరిణ విశాలక్షి పుట్టింటి గదిలో ఒరిగింది. మంచమ్మీంచి ఊహల పల్లకి నెక్కింది. పల్లకిలో మురిపాల మూట విప్పింది. “ఏ జన్మ పుణ్యఫలమో అతిలోక సుందరిలాంటి విశాలాక్షికి జగదేక వీరుడిలాంటి భర్త దొరికాడు. అదృష్టవంతురాలే” అంటూ ఆకాశానికెత్తేసిన ఇరుగుపొరుగు అమ్మలక్కల అభినందనలను హాయిగా నెమరేసుకుంటోంది. పోం బెడ్డు పరుపుమీద దిండు... దిండుమీద తలానించి బోర్లా పడుకుంది. పట్టాగాలుసుల కాళ్లు లయబద్ధంగా కదుల్తూంటే భర్త కౌగిట్లో బందీయైన దృశ్యాలు గిలిగింతలు పెద్తున్నాయి.
పదిరోజుల క్రితం జగదేకవీరుడు ఆఫీసునుండి రాగానే గజ్జెల గుర్రంలా ఎదురెళ్లి గుండెలమీద ఒరిగిపోయింది. విరహంతో వేగిపోతున్న భర్త చెవులకు పెదాలానించి “అయ్యగారు పండక్కి కనీసం మూడ్రోజుల ముందన్నా అత్తారింటికి రావాలి. మనిద్దరం చేతిలో చెయ్యేసుకుని జంట పక్షుల్లా పొలాల గట్టుమీద, మావిచెట్టు కింద కులాసొగా ఊసులాడుకోవచ్చు. మావి తోటలో దాగుడుమూతలాడుకోవచ్చు” గుసగుసలు చెప్హూ నాజూగ్గా చెవికొరికి సరేనన్చించుకుంది. పండగకు వారం రోజుల ముందు పుట్టింటికొచ్చింది. రోజూ సెల్ఫోన్లో ముద్దూ ముచ్చట్లు వడ్డించి “పండక్కి మూడ్రోజుల ముందన్నా రావాలి” అని గుర్తుచేస్తోంది. మొన్ననేమో అంతావిని “ఆఫీసులో ఎమర్జంటు ఫైళ్లు ఏడినిమిది నెలల నుండి పెండింగులో పడున్నాయి. పైన హెడ్డాఫీసు వారు ఫైరైపోతున్నారు. వాటిని వెంటనే క్లియర్ చెయ్యాలనే అస్త్రం వదిలారు. పండక్కి రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను” చాపకింద నీరు చల్లగా తాకినట్టు గారాబంగా చెప్పేశాడు.
సెల్‌ఫోన్‌ను నేలకేసి కొట్టాలన్నంత కోపమొచ్చింది. ఆరాటం, ఆవేశం చెట్టాపట్టాలేసుకుని గొంతు దాటాయి “బజారుకెళ్లి కూరగాయలు తెమ్మంటే పుచ్చు వంకాయలు తెచ్చినట్టు కాదీ వ్యవహారము” చిటపట లాడింది. ఎందుకైనా మంచిదని గొంతు తగ్గించి
' “నా స్పేహితురాళ్లంతా మొగుళ్లతో మొన్ననే దిగారు. నీ మొగుదేడీ అని నన్ను ఆట పట్టిస్తున్నారు.
ఆఫీసు ఫైళ్లన్నీ కట్టగట్టి అంగట్లో చిత్తుకాయితాలుగా అమ్మేసినా సరే. మీరు వెంటనే బయలుదేరి రావాలి. అలాగైతేనే నా ఫ్రెండ్సు కళ్లల్లో కారం చల్లినట్టవుతుంది. నాకు గర్వంగా ఉంటుంది. మీరు రాకపోతే శిక్ష తప్పదు. మూన్నెళ్లు మంచమెక్కను. తస్మాత్ జాగ్రత్త” మాటల తూటాలు
సంధించి బ్రమ్మాస్తం వదిలింది. మళ్లీ రింగిచ్చినా ఫోన్ తియ్యడం లేదు. ఆ అస్త్రం అయ్యగారి మనసు మార్చిందా లేక దున్నపోతు మీద వానలెక్క జారిపోయిందా?... ఆలోచనల్లో మునిగింది.
వాకిట్లో మూల్గుల సౌండు పెరిగింది. అయినా విశాలాక్షికి వినబడలేదు. కాని... ఖాళీబిందె అడుగును తబలా వాయిస్తూ వాకిట్లోంచి పక్కనున్న పశువుల దొడ్లో కెల్తున్న పనిమనిషి పారిజాతము చెవులకు సోకింది. గదిదాకా పరుగెత్తుకొచ్చి “విశాలమ్మా! వాకిట్లో ముష్టోడు అపసోపాలు పద్దున్నాదమ్మా!” చెప్పేసి ఇంటివెనక పెరట్లోంచి పక్కనున్న పశువుల దొడ్లోకి తుర్రుమంది.
విశాలాక్షికి సుర్రుమంది. “నా మొగుడింకా రాలేదని నేను ఆగమాగమైతుంటే... ముష్టివెధవ... వీడొకడు” గొణుక్కుంటూ వయ్యారంగా లేచి నుంచుంది. ముక్కుమీదో ఈగవాలింది. అగ్గిమీద గుగ్గిలమైంది. ఈగను కసిదీరా గుద్దేసింది. ఈగ ఎగిరిపోయింది. ముక్కు బెదిరిపోయింది. అంగలేస్తూ గుమ్మందాటి అరుగుమీదికొచ్చింది. మూల్గుల మనిషి 'ప్రత్యక్షమయాడు. వీడెవడో తుపాకి రాముడులాగేన్నాదే! జీన్పొంటు, వదలు షర్టు ఇన్షర్బు. షర్టు మీదేవో మరకలు. మొహం బురదలో ముంచి తీసినట్టుంది. టోటల్‌గా మనిషి బురదలో పరుగెత్తిన దున్నపోతులాగున్నాడు.
“ఎవర్రా బోడి వెధవా! అడుక్కునేందుకు వేళాపాళా లేదా? దొరబాబులా చేతిలో సూటుకేసు గూడానా? అసలూ నువు పగటి వేషగాడివా? వెళ్లిఫోగో మందలిస్తూ వీపుమీది జదను గుండెల మీదికి లాక్కొంది. మళ్లీ మొగుడి గురించి ఆలోచన...
“హయ్యో! నేను విశాలాక్షీ! నేనే..” మూల్గ్లావతారం గోడు.
“వారి భడవా! నాపేరు నీకెలా తెల్సురా?” రోషంతో ఎగసిపడుతున్న గుండెలమీద నల్లనిజడ నాగుపాములా కదుల్తుంది. అప్పుడే అమె తమ్ముడు నాగరాజు... పదో తరగతి ఐదుసార్లు ఫెయిలై ఆరోసారి కోచింగ్ కెళ్లొచ్చిన యువకిశోరం ఇంట్లోకెళ్ళబోతున్నాడు. విశాలాక్షి ఆపేసి విషయమంతా చెప్పేసింది. నాగరాజు ఎదలోంచి కోపం బుసబుస పొంగుకొచ్చింది. కుబుసం విడిచిన తాచు పాములా హముషారయాడు. “ఎవర్రానువు? పెళ్లైన మా అక్కను పేరుబెట్టి పిలుస్తావురా వెధవాయ?” రోషం బుసలుకొట్టింది. “పగటి వేషాలు సంక్రాతికి గదా! అప్పుదే రాపో!”
సరిగ్గా అదే సమయములో పొలం నుండి వచ్చిన విశాలాక్షి తండ్రి ప్రాణనాథం వాకిట్లోనే ఆగిపోయాడు. కూతురు, కొడుకు చెప్పింది విని కొయ్యబారి పోయాడు. పంచ కట్టును మోకాళ్లదాకా మలుచుకుని ముష్టి ముఖారవిందాన్ని చూపులతో గీకుతున్నాడు. ఆ ధాటికి తట్టుకోలేక ముష్టోడిచేతులున్న సూటుకేసు జారి కిందపడింది. ప్రాణనాథం బుర్రలో ఏదో గిర్రుమంది.” ఆ సూటుకేసు ఎక్కడ కొట్టుకొచ్చావురా ముష్టినా కొడకా? “చేతులున్న దుద్దు కర్రను పైకి లేపాడు. నాగరాజు కనుసైగతో ఆగిపోయాడు. నాగరాజు సూటుకేసు నా పాదమస్తకం పరిశీలించాడు.
“అక్కా” కెవ్వున కేకేశాడు. “మీఅత్తారింటి పేరు పొట్ల గిత్తవారు గదా!”
“అవును. అయితే ఏంటటా?”
“భావపేరు కమలాకర్
“అవును! ఐతే ఏంటటా?”
“స్తూటుకేసు మీద ఇంగ్లీషు పొడి అక్షరాలు పి.3. ఉన్నై?”
“రామాయణంలో పిడుకల వేటలా ఇప్పుడవన్నీ ఎందుకురా? ముందా ముష్పోడి పీడా వదిలించు రా!” అంటూ వెళ్లి తమ్ముని జబ్బబట్టి లాగింది. వాడి, వేడి చూపులతో ముష్టోన్ని కిందినుంచి మీద్దాకా తడిమింది. గుండెలు బాదుకుంది. “అయ్యయ్యో! మీరాండీ? ఏమిటీ అవతారం? ఎందుకీ విచిత్ర వేషధారణ?” సూటుకేసందుకొబోతూ “అరేయ్ తమ్ముడూ, ఈయన ముష్పోడు కాదురా, మా ఆయనరా! నీ బావ గారురా!” నెత్తికొట్టుకుంది.
కమలాకర్ కోపం నషాలానికంటింది. “నీయవ్వ! నన్ను ముష్పోడంటారా? ఫోన్ మీద ఫోన్‌కొట్టి యమర్దంటుగా రప్పించుకుని... మీరంతా ఇంటల్లుడికిచ్చే మర్యాద లివేనా?” పొంగుకొస్తున్న ఎతను తట్టుకోలేక సూటుకేసు పైకెత్తి నేలకు కొట్టాడు. “ధాం థాం... ఢాం... ధాం ఢాం” బాంబులమోత, సూటుకేసు పగుళ్లు చూసింది. గుండెజారిన విశాలక్షి గబుక్కున భర్తను వాటేసుకుంది. ఆమె తల్లి హడలిపోయి ప్రాణనాథం మ్మీద వాలిపోయింది.
అయోమయంలోంచి తేరుకూంటూ నాగరాజు ధైర్యం పుంజుకున్నాడు. “బంగారం లాంటి ఉద్యోగం మానేసి బాంబుల వ్యాపారం చేస్తున్నావా బావా?”
బొక్కలో వేలుబెడితే కప్పతేలు కరిచినట్లెంది కమలాకర్‌కు. ఏడుపు ఎగదన్ను కొస్తోంది . “అంత సీన్లేదు బామ్మర్లీ! దీపావళి పండక్కి నాలుగైదు దీపావళి బాంబులు సూటుకేసులో వేసుకొచ్చిన”.
బిలబిలమంటూ గల్లీ జనాలు మూగారు. వారందర్నీ ఆందోళనగా చూస్తూ అక్క భుజాలు పట్టి పక్కకు జరిపాడు నాగరాజు. విశాలాక్షి తమ్మున్ని కొరకొర చూస్తూ “అరేయ్ నాగూ! అత్తారింటికి వచ్చిన కొత్తల్లున్ని గౌరవించే దిలాగేనా? బిస్కిట్ బంగారం లాంటి బావను బజార్లో నిలబెట్టి పరువు పంచనామా చేస్తారా?” రోషంలో ఏడుపు మిళితమైంది. అతడా ఇంటల్లుడని అందరీకి అర్ధమైంది. అంతా మొహాలు చూసుకున్నారు. పశువుల దొద్గొంచి పారిజాతం బయటికొచ్చింది.
కకృసే పారిజాతం! ఈ ముష్టోడు నా మొగుడే. ఈ సూటుకేసు తీస్కూళ్లు ఆదేశించింది
“అంటే...” పారిజాతం మొహమ్మీద అసహ్యం పేరుకుపోయింది. “మీరు పెళ్లాడింది ముష్టోన్నా అమ్మగారూ!” నోరెల్లబెట్టింది.
“చఛా నాలిక్కరుచుకుంది విశాలాక్షి “ఆయన పెద్దాఫీసరే. ఈగతి పట్టిందే.” నుదురు
కొట్టుకుంది. పగుళ్ల సూటుకేసును పదిలంగా తీసుకెళ్లి లోపలుంచింది పారిజాతం. బయటికొచ్చి కమలాకర్‌ను ఆదోలా చూస్తూ “అయ్యా! మీరు విశాలమ్మగారి పెనిమిటని తెల్వదయ్యా!” బుగ్గమీద వేలేసుకుంది. అంతా ఇంట్లో కెల్తున్నారు. పారిజాతం ముసిముసిగా నవ్వుతూ పశువుల దొడ్లో కెళ్లింది. విశాలాక్షి అవమానాన్ని అదిమిపెట్టి భర్తను బాత్రూంలోకి తీసుకెళ్లి స్నానం చేయించుకొచ్చింది.
వసారాలో సోఫాలనాక్రమించారంతా. చాయసేవించిన తర్వాత వాతావరణం తేలికైంది. ఒంపులు, సొంపులు ఒలకబోస్తూ పారిజాతం ఖాళీ బిందెతో వచ్చింది. ఇంటివెనకున్న ద్వారం ద్వారా పశువుల దొడ్లోకి దారి వుంది.
“మళ్లీ ఖాళీ బిందెతో ఎక్కడికెల్తున్నావు? ఇంకా పశువులకు కుడితి తేలేదా?” నాగరాజు గుర్రుమన్నాడు. బయటికి పరుగెడుదామనుకున్న పారిజాతం కాళ్లకు (బ్రేకులు పడినై. “అప్పుడు తెస్తున్నాను కాని అది ఇక్కడిదాకా రాలేదు” మూతి వంకర్లు తిప్పింది.
పారిజాతం వాళ్ల ఇల్లు ఊరిబయట రైల్వేస్టేషన్ వెనక వుంది. వాళ్లింట్లో రోజూ కుడితి తయారుచేసి అమ్ముతారు. చాలామంది కొనుక్కెల్తారు. పారిజాతం రోజూ బిందెనిండా కుడితి తెచ్చి పశువులకు తాగిపిస్తుంది.
“అయితే ఇప్పుడు మీ ఇంటికెళ్లి మళ్లీ తెస్తావా? అప్పటి కుడితి ఇంటిదాకా ఎందుకు రాలేదూ?” రుసరుస లాడాడు.
“దాంతో మీ ఆయన స్నానం చేశాడు” పుసుక్కున నవ్వింది.
“మా అల్లుడు ముందే మీ ఇంటికొచ్చాడా?” బుగ్గలు నొక్కుకుంది విశాలాక్షి తల్లి. “అయినా కుడితి స్నానం లేటెస్ట్ ఫ్యాష్నా?”
“నాకేందెలుసమ్మా. ముష్టి అల్లుడినడగండి” బిందె బోర్లించి దానిమీద కూచుంది.
“అసలేమైందో సరిగ్గా చెప్పాచ్చుగదాగొ నాగరాజు విసుకున్నాడు.
“నేను చెప్తే బాగా ఉండదండీ!” సిగ్గుతో ముడుచుకుపోయింది.
“అసలేం జరిగిందండీ అల్లుడుగారూ?” ప్రాణనాథం కండువా సర్దుకుని కాళ్లు సోఫాలోకి మలుచుక్కూచున్నాడు. కమలాకర్ మొహం వికారంగా తయారైంది. “ఏంలేదు విశాలా! వచ్చేప్పుడు రైల్లో సీటుదొరకలేదు” భార్యవైపు చూశాడు.
విశాలాక్షికి ఒళ్లు మండింది. “సీటు దొరక్కపోతే కుడితి స్నానం చేస్తారా? ఇంతకూ టిక్కెట్టన్నా దారికిందా లేదా?”
“అది గూడా దొరకలేదు. స్టేషన్కొచ్చేసరికి రైలు కదుల్తోంది. టిక్కెటుకొనే టైం లేదు. గబుక్కున ఎక్కేశాను. రైల్లో నిల్చుందేందుగూడా జాగాలేదు. జనాలు ఒంటికాలు మీద వేళ్లాడ్తూ వచ్చాను. ఒళ్లంతా హూనమై చెమట పట్టేసింది. ఎలాగోలా స్టేషన్లో రైలుదిగి ఇంటికొస్తున్నారు. ఒళ్లంతా చిరాగ్గా వుంది. వెంటనే స్నానం చెయ్యాలన్పించింది అప్పుడే
నువు నెత్తిమీద బిందెతో నా ముందు నడుస్తున్నావు. బిందెలో నీళ్లుంటాయి గదా! ప్రాణం లేచొచ్చింది.”
“నేనూ... న్నే.నేనా?” రునరున లాడింది రోషంగా. “అబద్ధమాడినా అతికినట్టుండాలెగదా! నేనీరోజు ఇంటినుండి బయటికే రాలేదు, బజార్లో నడవలేదు తెల్పా? కుతకుతలాడింది.
పారిజాతముకు నవ్వాగక వగలబడి నవ్వుతూంటే ఒంపుసోంవులు వాయ్యారాలొలికించినై “వీ వారి ముందు నడుస్తుంది మీరు కాదమ్మ గారూ. మీ చీరకట్టుకున్న నేను. నా నెత్తిమీదున్నది కుడిది బిందె. వెనకనుండి చూశారు గదా! మీరనుకున్నారు.”
“నాకేందెల్సూ?” కమలాకర్ మొకం కలెగూర గంపలాగ్రెంది. “ముందు నిన్ను సర్పైజు చేసి ఆ తర్వాత స్నానం చెయ్యాలనుకున్నాను. అందుకే వెనకనుండి వెళ్లి కౌగిట్లో బంధించాను. ఆమె కెవ్వున కేకేసి వెనక్కు తిరిగింది. కోపంతో విందెలోది నామీద కుమ్మరించింది. అప్పుడు తెలిసింది ఆ శాల్తీ నువ్వు కాదని, బిందెలో వున్నది కుడితి అని. అమాయకుణ్ణి కుడితి స్నానమైందని హడలిపోయి నోరెల్లబెట్టాను. కుడితి కొంత నోట్లోంచి కడుపులోకెళ్లింది. ఆ వాసన, అదీ భరించలేక వాంతి చేసుకున్నాను. పారిజాత మేమో “ఎవర్రా బాడ్యావ్?” అంటూ నా గూబలు గుయమన్సించింది. కళ్లు తిరిగి కిందపడి పోయాను. తేరుకునేలోగా పారిజాతము భాళీ బిందెతో ఫరారైంది. అపసౌపాలు పడుతూ ఇంటిదాకా వచ్చాను. వాకిట్ల నుంచుండి మూల్దితే మీరంతా బయటకు పరుగెత్తుకొస్తారను కున్నాను. విశాలా!” రెండు చేతుల్లో కసిగా జుట్టు పీక్కున్నాడు.
“అంతగట్టిగా పీక్కుంటే జుట్టు ఊడి చేతిలోకొస్తుంది ఆగండి” విశాలాక్షి వెళ్లి పక్కన కూచుని చేతులు దొరకబట్టింది.
సోఫాలో బొమ్మల్లా కూచున్న వారికి నవ్వాలో, బాధపడాలో అర్ధంగాక అయోమయంలో కొట్టుకుపోతున్నారు.
పారిజాతం గబుక్కున లేచింది. బిందెను తబలాలా వాయిస్తూ, గంతులేస్తూ వెళ్లిపోయింది.
(“నెలవంక నెమలీక” జనవరి 2015)
జీతగాళ్ళు ల ఆ రోజు మా పోస్టాఫీసు కౌంటర్ల ముందు జనాలు బారులుదీరి నుంచున్నారు. అన్ని కౌంటర్ల జనాలను కలిపి చూస్తే అదో జాతర లాగుంది. కౌంటరు క్లర్ములు కుర్చీల కతుక్కుపోయి మెషన్లలా పంజేస్తూ వినియోగదారులను తృప్తి పరిచి పంపిస్తున్నారు. ఒంటి గంటకు జనాలు పలుచబడ్దారు. ఎప్పట్లాగే నియమానుసారము రెండు గంటలకు క్యాష్ కౌంటర్లు రెక్కలు మూసుకున్నాయి. కౌంటర్లలో వచ్చిన డబ్బంతా లెకృబెట్టి, కట్టలు కట్టి బ్యాంకుకు పంపించి ఊపిరి పీల్చుకున్నాము. పోస్ట్‌మాస్టర్ సీట్లో కూచున్నాను. ఒకాయనెవరో కౌంటర్ క్ల్షర్ముతో వాదులాడుతున్నాడు. కౌంటర్లలో జరుగుతున్నదంతా నాకు కనబడుతుంది, వినబడుతుంది. క్లర్ము, ఆ వియోగదారుడు గట్టిగా మాట్లాడుకున్నారు. చివరికి క్లర్కు , “కావాలంటే మా పోస్టుమాస్టర్ నడగండి” అని తన పనిలో లీనమయ్యాడు. నేను అటెండర్‌కు సైగ చేసి వియోగదారున్ని నా వద్దకు రప్పించుకున్నాను. నా ముందున్న కుర్చీలో కూర్చోబెట్టాను. “మీ సమస్య ఏమిటీ!” చిరునవ్వుతో అడిగాను. ఆయన ఎలుకను పిల్లి చూస్తున్నట్టు గుర్రుమన్నాడు “సార్! నా కొడుక్కు అర్జంటుగా డబ్బు పంపాలి. ఆ మనియార్డర్ తీసుకొమ్మంటే ఆయన టైం అయిపోయింది. తీసుకోనంటున్నాడు” అన్నాడు. “నిజమే క్యాషు బ్యాంకు కెళ్ళిపాయింది రేపు రండి.” అతని మొహం పంచ రంగుల చిత్రమైంది. “అసలూ మీలాంటి ప్రభుత్వోద్యోగులు ప్రజాసేవకులు” నిద్రలేచిన పులిలా లేచి నుంచున్నాడు. “అయితే ఏమిటటా?” అడిగాను. ఈ లోగా మా ఆఫీసు సిబ్బంది మరికొందరు వినియోగదారులు మా చుట్టూ మూగారు. “ప్రజాసేవకులంటే మా జీతగాళ్ళు. నాలాంటి వాళ్ళు చెప్పిన పని చెయ్యాల్సిందే” లాపాయింట్ లాగి కొట్టినట్టు ఫోజిచ్చాడు. నాకు నవ్వాచ్చింది. “మీ జీతగాళ్ళకు మీరు ఫస్ట్ తారీకు నాడు జీతాలివ్వాలి గదా! వచ్చే ఫస్టు నాడు మీరు మాకు జీతాలివ్వకండి. మేము మిమ్మల్ని అడగము గూడా!” నేనూ లేచి నిల్చున్నాను. అందరూ గొల్లున నవ్వారు. అతని నోరు ఆఫీసు గేటులా తెరుచుకుంది. “మీరిక వెళ్లొచ్చు” మర్యాదగా చెప్పాను. పాపం! పులిలా వచ్చినవాడు పిల్లిలా బయటికెళ్ళిపోయాడు. “ప్రసారికొ - జనవరి 2016)
కట్టెలమ్మిన చోట... పిడక
మాకు కట్టెల మండీ ఉండేది. బడికెళ్ళి ఇంటికొచ్చాక కాసేపు కట్టెలు తూచే తక్కెడ మీద కూచుని ఉయ్యాలలూగుతూ అమ్మ చేతి గోరుముద్దలు తినడం గుర్తుంది. ముని రాజు మామ ఏవో శ్లోకాలు చెస్తంటే వాటిని వల్లె చేయడం కూడా అంతే ఇష్టం. నేను తక్కెట్లో ఆడుకుంటుంటే నాయన నీరెండలొ కుర్చీ వేసుకుని నిద్రాదేవి వడిలో ఆడుకుంటూ వ్యాపారం చేసేవాడు. పనివాళ్ళిద్దరూ గిరాకీ ఎప్పుడొచ్చినా నన్ను కాటా నించి కిందకి దింపి కట్టెలు తూకం వేసి ఇచ్చేవారు. డబ్బులు మాత్రం నీరెండలో కూర్చున్న నాయనకిమ్మని చెప్పేవారు. వర్షాకాలంలో కట్టెలన్నీ వెనక ఉన్న షెద్దులోకి వెళ్లేవి. ఇల్లు ఇరుకయ్యి ఉండేది దానివల్ల. మళ్ళీ సంకురాత్రి వస్తుందనగా ఇంటి ముందు పేరుకునేవి. ప్రతి ఇంటిలోను కట్టెలు లేకుండా పొయ్యిలోంచి పిల్ల లేవదు కాబట్టి నాయన వ్యాపారం దినదినాభివృద్ధి అయ్యింది.
ఏదో చదువుకోవాలని నాయన వత్తిడి తెచ్చాడు గనక 10 పాస్ అయినా నాకు పెద్దగా చదువు మీద శ్రద్ధ లేదు. “బంగారం లాంటి వ్యాపారాన్ని వదులుకుని చదువుకోవడం అవసరమా అని అందరూ అనడమే కాకుండా నాకూ అనిపించేది. మా ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఒక్కడివే మగ పిల్లవాడివి. “బిడ్డా ఏదన్నా ఉద్యోగం చూసుకొమ్మ”ని నాయన, చిన్నాయనలు చెప్పినా నేను పెద్దగా వినలేదు. ఇల్లంతా ఆడపిల్లలు, నేనంటే అందరికీ ముద్దు మరి!
ముగ్గురమ్మల ఆడపిల్లల మధ్య అపురూపంగా పెరిగాను. అప్పుడప్పుడే కొద్ది మంది మిలిటరీలో రిటైర్ అయినవారు కంపెనీ ఉద్యోగాలకని మా ఊరొచ్చి కిరనాయిల్ స్ట్వ్వులు తెచ్చుకున్నా, నీళ్ళు కాచడానికి మాత్రం కట్టెలు కొనుక్కెళ్ళేవారు.
నేను 10 పాస్ అయిన కొద్ది రోజులకి ఏదో కొత్తరకం స్టవ్వొచ్చింది. గ్యాస్ స్టవ్వంట. మా వాళ్ళందరూ కొంచెం వింతగా చూసారు. ఒకామె కొననే కొంది గానీ ఆమె స్టవ్వ ఎందుకో పేలి మంటల్లో ఆమే కాలి చనిపోయాక మళ్ళీ ఆ స్టవ్వు పెరెత్తితే ఒట్టు. గ్యాసు కంపెనీ ఒకటి మా మయిను రోడ్డమీద వెలిసింది. కంపెనీ ఉద్యోగులు ఇటువైపు రావడం మానేసారు. అలా అలా అమ్మ కూదా “గ్యాస్ స్టవ్వు కొనుక్కుందాం ఊదీ ఊదీ నా పేగులెండిపోతున్నాయ్” అనే వరకూ వచ్చింది.
కలప మీద ఎక్కువ దృష్టి పెట్టాడు నాయన. అది కొద్ది రోజులు బాగానే నడిచింది కానీ మిషన్లు ఎక్కువ ఇష్టపడుతున్నారంటూ వడ్గోల్లు పని మానేసి ఫ్యాక్టరీల దారి పట్టారు. ఎటు చూసినా ఫర్నిచరు దుకాణాలు వెలిసాయి. పీటలు, బల్లలు చేయించుకోవాడానికెవరికీ ఇష్టం కానీ, తీరిక కానీ లేవు. ఇలా వెళ్ళి అలా కొనుక్కొచ్చుకుంటున్నారు. దర్వాజాలు, ద్వారబంధాలు కూడా అంగడిలో అన్ని డిజైన్లల్లో దొరుకుతున్నాయి. పెద్దక్క పెళ్ళి కుదిరింది. బావకి ఎవరూ లేరంట మా ఇంటి దగ్గరే కంపెనీ కొలువు. వాళ్ళు బయట ఉండడమెందుకని వెనక షెడ్డు కొంచెం తగ్గించి ఇంకో గది వేసేటప్పుడు గదికి కావలసిన కిటికీలు, గుమ్మాలు బజారులోనే కొనాల్సి వచ్చింది. నెమ్మదిగా మా అమ్మకాలు తగ్గిపోయాయి. మరో ఏడు మా చిన్నక్క అంటే నడిపి చిన్నాయన కూతురికి సంబంధం వచ్చింది. నాయన చీటీలు పాడి, కొంత అప్పు తెచ్చి పెళ్ళి చేసాడు. అది పూర్తిగా అయ్యిందో లేదో నాయనకి పక్షవాతం వచ్చింది. మా నడిపి చిన్నమ్మకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరు. మామగారు చనిపోయారని మా చిన్నాయనకి కబురొచ్చింది. అక్కడ ఉండిపొమ్మని అడిగారు ఆయనని. “ఇక్కడ ఎలాగూ వ్యాపారం నడవట్లేదు వెళ్ళు” అన్నాడు మా నాయన. మళ్ళీ కనబడలేదు మా చిన్నాయన. కట్టెల దగ్గర నేనే కూచుంటున్నా అప్పుడప్పుడు జరిగే అమ్మకాలతో రోజులు కష్టంగానే దొర్లుతున్నాయి. కుటుంబాన్ని చూసి నాయనకి దిగులుగా ఉందేమో “ఇంక నేనెన్ని రోజులో! ఈ కుటుంబమెట్ల బిడ్డా” అన్నాడు. “లేదు నాయనా మన వ్యాపారం మంచిగుంది. నువ్వేమీ బాధపడకు” అన్నాను. నిరాశగా చూసాడు. ముని రాజును పంపి దగ్గరలో ఉన్న ఫర్నిచర్ షాప్‌కి వదో ఒక ధరకి ఉన్న కలపంతా అమ్మేసాడు నాయన. దాంతో మా రెండో అక్క పెళ్ళికి ఎలాగోలా అయిందనిపించాడు. రెండేళ్ళ తర్వాత జరిగిన ఆ పెళ్ళికి మా నడిపి చిన్నాయన, చిన్నమ్మ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. పిల్ల పెళ్ళికి ఏమైనా సర్జాడా అని అందరూ అడుగుతుంటే ఏమీ లేదని చెప్పడం నాయనకి ఇబ్బందిగా ఉండేది. “ఆయన బిడ్డ పెండ్లి ఉమ్మడిలో ఉండంగ అయిపోయింది ఆయనకేమి పట్టింది ఇప్పుడొచ్చి ఇయ్యనీకి” అంటాడు మా ముని రాజు మామ. "పోనీలేరా వాడు చల్లగా ఉంటే చాలు” అంటాడు మా నాయన. మా అక్క పెళ్ళిలోనే నాకూ పిల్లని చూసారు. ఉన్న ఒక్కడి పెళ్ళి చూడకుండా పోతానేమో అని నాయన హడావిడిగా నా పెళ్ళి కూదా చేసాడు. నాయన కాలం చేసాడు. మిగిలింది నేను, ఆఖరు చిన్నాయన. ఇద్దరాడ పిల్లలాయనకి. ఇంతమంది బాధ్యత ఉన్నా పెద్దగా వ్యాపార విషయాలు కానీ సంపాదించే తెలివి తేటలు కానీ లేవాయనకి. “ఏందిరా ఇప్పుడేం చేద్దాం” అంటాడు. వ్యాపారం ఇంక జరగదని తెలుసు. దగ్గరలో ఉన్న ఒక కంపెనీలో మాట్లాడి వచ్చా. ఎగా దిగా చూసి నాకూ మా చిన్నాయనకు బరువులు మోసే పనులు ఇచ్చారు. చిన్న జీతాలు, బరువు పనులు. ఇంత బతుకూ బతికి ఇంటి వెనక చచ్చినట్టుంది. అందరూ
అయ్యో అన్నట్టు చూస్తున్న చూపులకి తట్టుకోడం కష్టమే. రెండు రోజుల్లోనే చిన్నాయన నడుము నెప్పికి తట్టుకోలేకపొయాడు. “ఇంక చాలులే కట్టెల దగ్గర కూచో. అక్కడెవరన్నా కొనడానికొస్తే ఎవరన్నా చూస్తారని చెప్పాను. అనుకోకుండా ఒక కబురొచ్చింది. స్మశానానికి అటువైపు ఉన్న కట్టెల మండి వాళ్ళకేమయ్యిందో కుటుంబమంతా రాత్రికి రాత్రి ఊరొదిలి వెళ్ళిపోయారు. దాంతో గిరాకీ అంతా మా దగ్గరకొచ్చింది. మా వైపు 6, 7 ఊళ్ళకి ఒక్కటే స్మశానవాటిక. దాంతో మళ్ళీ కట్టెల వ్యాపారం ఊపందుకుంది. ఇద్దరం పని మానేసి వ్యాపారంలో పడ్డాము. ప్రతిరోజు కుటుంబం తిండికి సరిపదా అమ్మకాలు ఉండేవి... ఎప్పుడైనా అమ్మకాలు లేకపోతే ముని రాజు మామ స్మశానం దాక వెళ్ళి చూసొచ్చేవాడు. ఆయన చిన్నప్పటి నుంచీ మా ఇంట్లో కట్టెల షెద్దు పక్కన కలపతో చేసిన చిన్న గుడిసెలాంటి దాంట్లో ఉండేవాడు. పనులేమీ చెయ్యడు. పద్యాలు తత్వాలూ పాడుకుంటుంటే ఊళ్ళో వాళ్ళు వాళ్ళకి తోచింది ఇచ్చిపోతుంటారు. నాయన ఎప్పుడూ అద్దె అడగటం కానీ విసుక్కోవడం గానీ నేనుచూల్లేదు. కట్టెల లోడ్ వచ్చినప్పుడూ, కట్టెలు కొనడానికి ఆడవాళ్లో, పిల్లలో వచ్చినప్పుడూ ముని రాజు బాగా సహాయపడేవాడు. షెడ్దులోంచి మార్చాల్సి వచ్చినప్పుడు కూడా ముని రాజు లేకుందా జరుగదు. అతను మాకొక శ్రేయోభిలాషి.” బిడ్డా పుట్టినోడు గిట్టక మానడు గదా, అ గిట్టేటోడు రొజుకొకడు గిడితే మనకి బువ్వెల్లిపోద్ది కదా...ఏందో ఈనాడెవడూ గిట్టలే” అంటాడు. “పోనీతియ్ మామా మన కోసం ఎవళ్ళని చావుమంటావూ?” అని పెద్దక్క విసుక్కునేది. తిండెల్లితే చాలు అన్నట్టు జరుగుతోంది వ్యాపారం. ఒక సంవత్సరం ఆ దేవుని దయ వల్ల ఊర్లో ఏదో వ్యాధి వచ్చి చాలా మంది మరణించారు. జనాలు మరణించడమనేది మాకు చాలా మామూలు విషయమై పోయింది. ఎలా అయితేనేం ఈ వ్యాధి పుణ్యమాని ఇల్లు గడుపుతూ ఇంకో చెల్లి పెళ్ళి చేసాము. ఇంకొక్క ఇద్దరివి చేసేస్తే నాయన బాధ్యత తీర్చినోణ్ణవుతావని చుట్టాలందరూ అంటారు. చూద్దాం. ఈ లెక్కన దేవుడు చల్లగా చూస్తే, ఇంకో రెండెళ్ళలో ఇద్దరు చెల్లెళ్ళు పెళ్ళీ ఒకేసారి చేసేద్దామని అన్నా చిన్నాయనతో. కళ్ళు తుడుచుకుంటాడు తప్ప ఏ మాటా అనడు. ముని రాజు మామ మాత్రం “దేవుడు నిన్ను చల్లగా చూడాలె బిడ్డా” అంటాడు. సినెమా ధియేటరు ఎందుకో కూలగొడుతున్నారని తెలిసి అటు వెళ్ళా. “ఇకృడెందుకో సినెమాలు ఆడుతలేవురా...లాస్ వస్తాంది. అమ్మేసి అపార్జమెంటోల్లకిచ్చేస్తన్నా.. ఒక పోర్షనిచ్చి రెండు లక్షలిస్తరంట” అన్నాడు. ఒక యాడాదిలో అపార్టుమెంటు పూర్తయ్యింది. దాని ఎదురుగా ఉన్న రెండు పెద్ద ఇళ్ళవాళ్ళు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. అలా అలా శ్మశాన వాటిక కొద్దికొద్దిగా అటు జరిగింది. ఈలోపు ఎలెక్టిక్ శృశాన వాటిక వచ్చి పడింది. ఏ ఇబ్బందీ లేకుండా నిమిషంలో బూడిద చేస్తుందట ఆ మిషను. ఇంక ఆ కట్టెలూ కాల్పులూ ఎవ్వరూ
పెట్టుకోవట్లేదు. అందరూ అక్కడికే పోతున్నారు. నెమ్మదిగా ఒకవైవు ఇళ్ళు కట్టడం ప్రారంభించగానే, ఇంకో పక్క ఫ్లాట్లు వేస్తున్నారు. మాకు గిరాకీ తగ్గి, రాను రాను పూర్తిగా పోయింది. “మనం కూడా అపార్చుమెంటుకిచ్చేదాం చిన్నయనా” అన్నా “నీ ఇష్టం బిడ్డా” అన్నాడు. ఒక వాటా, రెండు లక్షలు వచ్చాయి. నడిపి చిన్నాయనొచ్చి “ఈ పొర్షను నాలుగు లక్షలు చేస్తుంది. అందులో నేను వాటాకొస్తే మీరందరూ ఎక్కడుంటారు' పాపంగ” అని జాలిపడుతూ తన వాటాగా రెండు లక్షలు తీసుకెళ్ళాడు. కొద్ది రోజులవ్వగానే మా ఇల్లు కుదువకు పెట్టి పెండ్లిళ్ళు చేసాం. దగ్గర్లోనే చిన్న రెండు గదుల ఇల్లు అద్దెకు తీసుకుని చిన్నాయన కుటుంబం, నా కుటుంబం సర్జుకుంటున్నాము. మొత్తం మీద మా కట్టెల మండి కూలిస్తే పది వాటాల పెద్ద ఇల్లయ్యింది గానీ మా ఇల్లు మాత్రం ఇరుకయ్యింది. ముని రాజు ఇప్పుడు మా అపార్టుమెంట్ వాళ్ళకీ చిన్న చిన్న పనులు చేసి పెడుతూ పార్కింగ్ స్థలంలో పడుకుంటాడు. కాపలా ఉంటాదనేమో ఎవ్వరూ ఏమనరు.
కంపెనీ ఉద్యోగానికెళుతున్నా గానీ అవి తిండికి కూడా సరిపోదు. ఇంటి కుదువ మీద వడ్డీ, అద్దె ఎక్కడినించి తేవాలో ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు. అటు తండ్రి లాంటి అమాయకపు చిన్నాన్న ఇటు ఆయనకి తగ్గ చిన్నమ్మ, అటు వయసు మీదపడ్డనా తల్లి, ఇటు చంటిపిల్ల తల్లి నా భార్య, ఎవరినేమనను? కంటికి నిద్ర లేకుండానే తెల్లవారుతుంది చాలా రాత్రిళ్ళు. నాయన చెప్పినట్టు చదవక పోతినని ఇప్పుడనిపించినా ఏం లాభం! జీవితమెటు పోతుందో తెలవట్లేదు. చిన్న దానికి మూసిన కన్ను తెరవకుండా ఒకటే జ్వరం. ఆస్పత్రికి తీసుకెళ్ళాం. గుండెలో చిల్లుందిట. నా గుండెకి అంతకన్నా పెద్ద చిల్లు పడింది. ఊళ్ళో వాళ్ళ దుఃఖమంతా మా ఇంటికొచ్చినట్టనిపించింది. ఎవరో ఒకరు చనిపోవాలని కోరుకున్నాం ఇన్నాళ్ళు, చీ పాడు బతుకు... ఆ శాపమే తగిలుంటుందని పదే పదే అనిపిస్తోంది. ఒకందుకు నయమే. ఈ మధ్య జనాలు చనిపోవాలని ఇంట్లో ఎవ్వరూ కోరుకోవట్లేదు. కానీ మా ఇంట్లో ఎవ్వరిని కదిలించినా... “చీపాడు బతుకు చచ్చిపోవాలని ఉంది” అంటున్నారు.
ఆ మాటా ఈ మాటా ద్వారా సత్యసాయి సన్నిధిలో గుండె ఆపరేషన్లు ఉచితంగా చేస్తారని విని నా భార్య మంగళసూత్రాలు, మా అమ్మ వెండి గాజు అమ్మిన డబ్బులు తీసుకుని అక్కడికెళ్ళాము. దేవుడి దయ వలన ఆపరేషన్ జరిగింది. అదృష్టం కొద్దీ పాపకి సంబంధించి ఒక్క రూపాయి గూడా ఖర్చు కాలేదు, అంతా ఉచితమే. ఇంటికి తీసుకెళ్ళి పది రోజుల తర్వాత తీసుకొచ్చి డాక్టరుకి చూపించమన్నారు. ఇంటికి బయల్దేరాము.
న. పల్ల నా తల్లి [33] వితా చంద్రయ్య
రాధా మాధవీయం
కొడుక్కు తానే పెళ్లి సంబంధాలు వెతకాల్సి వస్తుందని కొండలరావు కలలో కూడా ఊహించలేదు. ఐదారేళ్ల క్రితం కూతురు పెళ్లికి సంబధాలు చూసి చివరికి అబ్బాయి అమ్మానాన్నల్ని బతిమాలి పెళ్లి చేశాడు. కాలం మారుతోంది. కొడుక్కు పిల్లనిస్తామని అమ్మాయిల తండ్రులు క్యూలో వస్తారనుకున్నాడు. బ్రోకర్‌కు అడ్వాస్సు కమీషన్ అప్పజేప్పినా అమ్మాయి దొరకలేదు. భార్య విశాలాక్షికి అనారోగ్యం. కోడలొస్తే విశ్రాంతి దొరికి తీరుతుందనుకున్నాడు. తనకు సంపదలున్నాయి. కొడుక్కు చదువుంది. అయినా సమస్య ఎక్కడేసిన గొంగళి అక్కడే లాగుంది. తన సమస్య గురించి బాల్య స్నేహితుడు రఘుపతి సలహా అడిగాడు. అతడు “ఇప్పుడు అమ్మాయిల సంఖ్య తగ్గిపోయిందిరా కొండలూ! మగపిల్లగానికి మంచి అమ్మాయి దొరకాలంటే కాలికి బలపం కట్టుకుని తిరగాలి హితోపదేశం చేశాడు.
ఆ తరువాత అతడే తనకు దూరబ్బంధువులైన సూర్యాపేట అమ్మాయి జొడ చెప్పాడు. ఆ అమ్మాయి హైదరాబాద్‌లో చదివింది. అడిగి చూస్తానన్నాడు. “నా కొడుగ్గూడా హైదరాబాద్‌లో ఎం.కాం. చదివిండుగదా. ఈ సంబంధం అతికేట్టు చూడు”మని బతిమాలాడు. రఘుపతి వెంటనే సెల్ఫోన్లో సంప్రదించాడు. వాళ్లు అబ్బాయి ఇంటికి పెళ్లి చూపుల కొన్తామన్నారు. “అదెట్లా మేమే వచ్చి అమ్మాయిని చూసుకోవా”లంటే, “పెళ్లయ్యాక మా అమ్మాయి వాళ్లింట్లో ఉండాలి గదా!” అన్నాడు అమ్మాయి తండ్రి. అమ్మాయి పేరు మాధవి. బాగానే వుందని ఒప్పుకున్నాడు.
పెళ్లికూతురు తల్లిదండ్రులతో పెళ్లి చూపులకొచ్చింది. రాధాకృష్ణ-మాధవి గదిలోకెళ్లి మాట్లాడుకున్నారు. అబ్బాయి-అమ్మాయి ఒకరికొకరు నచ్చారని చెప్పారు. ఆ తరువాత ఆడపిల్ల వారు ఇల్లంతా, ఇంటి చుట్టుపక్కల పరిశీలించి చూశారు. కొండథల్రావుకు కొండెక్కినంత సంతోషమైంది. “సూర్యాపేట కెళ్లాక ఫోన్ చేస్తామని రఘుపతికి చెప్పి వెళ్లిపోయారు. పది రోజులు గడిచినా సూర్యాపేట నుండి ఫోన్ రాలేదు. చంద్రుని కోసం చకోర పక్షిలా ఎదిరి చూసినా లాభం లేదు.
రాధాకృష్ణ తండ్రితో సహా రఘుపతి వద్దకెళ్లి సంప్రదించారు. కొండల్రావు జ్వరంతో బాధపడుతున్నా “సూర్యాపేటకు ఫోన్ చెయ్” మని అడిగాడు. “సరే గానీ నీ ఇంటి చుట్టూ మురికినీరుంది. చెట్లు లేవు, దోమలు జొయ్యిమంటున్నాయి వాటివల్లనే ఈ జ్వరాలు” అన్నాడు రఘుపతి. “నేను కూడా అదే అన్నాను మావయ్యా, ఇంటి చుట్టూ గుంతలు మూయించి చెట్లు పెంచుదాము, ఇంటి మురికి నీరును పైపుల ద్వారా బజారు (దైనేజికి విడుద్దామంటే నాన్న అంత ఖర్చు అంటున్నాడు బాధపడ్డాదు రాధాకృష్ణ.
లోపలి నుండి రఘుపతి కుమారుడు శశికాంత్ వచ్చి “బాగున్నావా మావయ్యా” అని కూచున్నాడు. అతడు డాక్టరు. డ్యూటికెళ్లాలని తయారైనాడు. రఘుపతి అందుకుని. “ముందు మావయ్య జ్వరం సంగతి చూడు శశీ” అన్నాడు. శశికాంత్ పరీక్ష చేసి మందులు రాసిచ్చి “మీ ఇంటికి వద్దామంటే భయం ఇంటి చుట్టూ గలీజు దోమలు, దోమలతోనే మలేరియా, డెంగ్యూ జ్వరాలొస్తాయి” అని వెళ్లిపోయాడు.. కొండల్రావు ఆలోచనలో పడిపోయాడు. రఘుపతి సెల్ఫోనందుకుని స్పీకర్ ఆన్ చేసి మాటాడ్డా పెళ్లికూతురు తండ్రి “సంబంధం మాకందరికీ ఓకే కానీ అబ్బాయి వాళ్లింటి వాతావరణం చాలా గలీజుగా వుంది. మురికి నీరు, గుంతల నిండా దోమలు...వాటికి తోడు పందులు. వారం రోజుల్లో ఇంటి వాతావరణాన్ని శుభ్రపరిస్తే ఓకే” అన్నాడు. కొండల్రావు ఫోన్ లాక్కొని “హల్లో బావగారూ! మీరన్నట్టుగా వారం రోజుల్లో మా ఇంటి చుట్టూ వున్న మురికి గుంతలు మూసేసి మొక్కలు నాటుతాం. మురికి నీటిని పైపుల ద్వారా బజారు మోరీకి పంపిస్తాం” చకచకా చెప్పేశాడు. వారం రోజుల్లో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించాడు కొండల్రావు. మళ్ళీ రఘుపతి ద్వారానే ఫోన్లో చెప్పించాడు. కొత్త రక్తమెక్కించినట్టు హుషారైనాడు. ఫోన్లో తానే మాట్లాడ్తున్నాడు. మాధవి తండ్రి మహదానందం వ్యక్తం చేస్తూ “వెరీగుడ్ బావ గారూ! రేపే మీరు సకుటుంబ సమేతముగా మా ఇంటికొచ్చి, ఇక్కదే పెళ్లి ముహూర్తాలు పెట్టించండి. రఘుపతిని వెంట తీసుకురావాలి సుమా హర్షం వెలిబుచ్చాడు. రాధాకృష్ణ పక్కకు వెళ్లి మాధవికి ఫోన్ చేసి, శుభవార్త అందజేసి “ఇదంతా నీ ప్లానే మాధనీ! నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను” ముద్దుగా చెప్పేశాడు. మాధవి ఒళ్లు పులకించింది “నేను గూడా డిటో!” అని గలా గలా నవ్వింది. ఆ నవ్వులో మంజీరా తరంగాల ధ్వని వుంది. తిరిగి వచ్చి రాధాకృష్ణ తండ్రి పక్కన కూచుని రఘుపతికి సైగచేశాడు. అప్పటిదాకా కక్కలేక, మింగలేక నిజాన్ని అంతరాళాల్లో అదిమిపెట్టిన రఘుపతి మొహం వికసించింది. “ఒరేయ్! కోండల్రావు! నీకు తెలీదు గానీ మన రాధాకృష్ణ, మాధవి హైదరాబాద్‌లో చదువుకునేప్పుడే (ప్రేమించుకున్నారట్రా! నువు కాదన్నా ఈ పెండ్లి జరిగేది. కానీ నీ బుర్ర బూజు దులిపేందుకు, ఇంటి వాతావరణాన్ని నీతోనే బాగు చేయించేందుకు ఇదంతా చెయ్యాల్సి వచ్చిందిరా!” ఆనందంగా చెప్పాడు. కొండల్రావు కొడుకునూ, రఘుపతిలను తేరిపార జూచి “ఏదైతేనేం...మా ఇల్లు బాగైంది. నా కొడుక్కు పెళ్లవుతోంది” అంటూ మురిసిపోయాడు. (మెరుపు - ఆంధ్రభూమి, 31-1-2016) క నన్ కానా
మబ్బుతెరలు
జాహ్నావి.... పేరు చాలా బాగుంది. వరంగల్ చారిత్రాత్మకం. వరంగల్ నుండి మా ఆయనకు ఉత్తరాలు రాస్తున్నామె ఎర్రగా, బుర్రగా గజ్జెల గులజ్దిం లాగుందొచ్చు, అప్పుడప్పుడీయన ఏదో పనంటూ వరంగల్ వెళ్ళి రావడమెందుకూ?
సుధీర్ పేరున వచ్చిన ఉత్తరం (ఫ్రం అడ్రస్ చూస్తుంటే నళిని మెదడు పొరల్లో అనుమానం జోరీగ సవ్వడి షురువైంది. సుధీర్ మాజీ సైనికాధికారి. కార్గిల్ యుద్ధంలో కాలు ఫ్రాక్ళరై వంకరైంది. దేశరక్షా కంకణధారియని ప్రభుత్వం మాజీ సైనికుల కోటాలో లెక్చరర్ ఉద్యోగమిచ్చింది. పిల్లలిద్దరు బడి నుండి రాలేదింకా....
ఇతరుల ఉత్తరాలు చదవడం మర్యాద కాదు. కాని అంతరంగ సముద్ర తరంగాల్లోని అనుమానం పడవకు మోక్షమేదీ? నడుస్తున్న టీ.వి. గొంతును రిమోట్‌తో నొక్కేసింది. వణికే చేతుల్లో కవరు పంజరంలోంచి ఉత్తరం పక్షిని బయటకు తీసి రెక్కలు విప్పింది.
“గా శ్రీ సుధీర్ గార్కి - నమస్సుమాంజలి.
మీరు పంపిన డబ్బు ఈ రోజే అందింది. మీరు వరంగల్ కెప్పుడొస్తున్నారు? ఫోన్ చెయ్యొచ్చు గదా! మిమ్మల్ని నా గుండె గూటిలో ప్రతిష్టించుకున్నాను గదా! మీరు తప్ప నాకింకెవరూ లేరు. త్వరలో వస్తారు గదూ. మీ కోసం ఎదురు చూస్తుంటానూ.
మీ జాహ్నవి”
అనుమానం జోరీగ సవ్వడి జోరై నరాల్లోకి చొచ్చుకుపోయింది. పిల్లలు స్కూలు నుండి వచ్చి గదిలో హోంవర్కు చేసుకుంటున్నారు. కాలేజీ నుండి వచ్చిన సుధీర్ స్కూటర్ దిగి వంకర కాలుతో చకచకా ఇంట్లోకొచ్చాడు. అటూ, ఇటూ చూశాడు.
రోజూ కొత్తపెళ్ళి కూతురులా గరం ఛాయ కప్పుతో ఎదురొచ్చే నళిని, సోఫాలో తాబేలులా ముడుచుక్కూచుంది.
“గట్లున్నవేందీ? పిల్లలొచ్చిండ్రా?” భుజమ్మీద చెయ్యేశాడు.
“హోంవర్కు చేసుకుంటుంద్రూ” మూతి మూడు వంకర్లు తిప్పి విప్పిన ఉత్తరాన్ని చేతికిచ్చింది. ఆబగా చదివాడు సుధీర్
“ఈ ఉత్తరం చదివి అలక పాన్సెక్కినవా?”
“చూడండి మహానుభావా! భారత స్త్రీ దేన్నైనా సహిస్తుందిగానీ, భర్తకు మరో స్త్రీతో సాంగత్యాన్ని భరించలేదు”
“అది కాదు నళీని!...”
“ఏది కాదండీ? మీ మగ జాతే అంత” గుండెలు ఎగిరి పడుతున్నై.
“అయ్యో! నేను చెప్పేది విను నళినీ!” అన్నాడు. “మీరేదో కట్టుకథ చెప్తారు. అది వింటూ నేను బలివేది మీది గొరైలా తలూపాలి” రోషంతో వంటింట్లో కెళ్తుంటే కాలి పట్టగొలుసుల సవ్వడిలో వీర రసం తొంగి చూసింది. పటట అది సెలవు రోజు, టిఫిన్లు ముగిశాయి. పిల్లలిద్దరూ పుస్తకాలు పట్టుక్కూచున్నారు. సుధీర్ దినప్రతికలో లీనమయ్యాడు. నళిని వంటింట్లో సామానులు సర్దుతుంది.
“నమస్కారమండి!” అంటూ ఓ యువతి హంస నడకతో ఇంట్లోకొచ్చింది. సుధీర్
అటు చూశాదు.
“నమస్కారం రా కూచో!” సాదరంగా స్వాగతించి కూచోబెట్టాడు. పిల్లలు పుస్తకాలు పక్కన పెట్టి విచిత్రంగా చూస్తున్నారు.
“వీళ్ళిద్దరు నా పిల్లలు. పెద్దవాడు సుభాష్ చిన్నోడు సువాస్” పరిచయం చేశాడు.
“ఆహా! లవకుశుల్లాగున్నారు సుమాగొ అన్నది ఆ యువతి.
యువతి మాటలు బాలబ్రహ్మల నలరించాయి. సుధీర్ వాళ్ళనే గమనిస్తూ “నాన్నా సుభాషూ! అమ్మను చాయ తెమ్మను” ఆదేశించాడు. తండ్రి ఆనతి తలదాల్చి సుభాష్ వంటింట్లోకెళ్తుంటే సుహాస్ అన్న వెంట పరుగెత్తాడు.
“అమ్మా! ఎవరో ఆడమనిషాచ్చిందే” అన్నకంటే ముందు పరుగెత్తి చెప్పి దమ్ముతీస్తున్నాడు సుహాస్.
“నాన్న ఛాయ తెమ్మన్నాడమ్మా” సుభాష్ చెప్పాడు. పిల్లలిద్దరూ తిరిగి పరుగెత్తుకొచ్చి
. సోఫానాక్రమించారు.
“ఆడమనిషా” ఆశ్చర్యంగా గడపదాకా వచ్చి చూసింది నళిని.
ఎవరో యువతి పంజాబీ ద్రెస్సులో మెరుపు తీగలాగుంది. పాతికేళ్ళపైనే ఉండొచ్చు. మా ఆయన శ్రీరాముడనుకున్నానే! వరంగల్‌లో జాహ్నని..., ఈవిడెవరో కొంపమీదికొచ్చింది... రుసరుసలాడ్డూ వేడిచాయ కప్పుల్ని ట్రేలో ఉంచి తీసుకొచ్చింది.
. “ఈవిడ నా భార్య... నళిని యువతికి పరిచయం చేశాడు.
“నమస్కారమండీగొ చేతులు జోడించింది యువతి. ప్రతి నమస్మారం చెబుతూ యువతికి, భర్తకు ఛాయ కప్పులందించి, తానో చాయకప్పుతో భర్త పక్కన అంటీ ముట్టనట్టు కూచుంది.
“నళినీ! ఈవిడ జాహ్నవి...వరంగల్!” అంటూ సుధీర్ చిరునవ్వు నవ్వాడు. అయితే వరంగల్ గజ్జెల గుర్రం నేరుగా ఇంటిమీదికొచ్చిందన్న మాట అనుకుంటూ...చాయ చప్పరిస్తూ జాహ్నవిని కిందనుంచి తీక్షణ దృక్కులతో తడిమింది నళిని. అబ్బో! అందగత్తేనే! కానీ... ఈవిడకీయనే దొరికాడా? అనుకుంది లోపలి ఎసరు బయటికి పోంగకుండా జాగ్రత్త పద్దూ...
“మీకు పరిచయమెట్లెంది?” అంటూ ఖాళీ కప్పు టీపాయ్ మీది ట్రేలో ఉంచింది. జాహ్నవి గూడా ఖాళీ కప్పును ట్రే కప్పగిస్తూ అదోలా చూసింది. సుధీర్గూడా అదే పంజేస్తూ “నేను చెప్తా నళినీ” అంటూ సోఫాకొరిగాడు.
సుధీర్ అంతర్నేత్రాలు గతంలోకి చూస్తున్నాయి.
“నల్సినీ! మన పెళ్ళాయ్యాక కాళ్ళపారాణి ఆరకముందే నాకు పై అధికారులనుండి పిలుపొచ్చింది గదా! వెంటనే యుద్ధరంగానికి అంటే కార్గిల్ ప్రాంతానికి చేరుకున్నాను. మళ్లీ సైనిక దుస్తులు వేసుకోగానే నా నరాల స్వరాలు “వతన్ కిరావామే వతన్ కె నౌ జవాన్ షహీద్ హో, షహీద్ తేరి అత్మాహి ఇస్ వతన్ కి జిందగీ...
పాట వినిపించింది. భారతమాత సహస్ర ప్రహరణ ధారిణిగా మనసులో మెదిలి ఆశీర్వదించింది, దేశసరిహద్దు హిమాలయాల్లోని చలిపులిని ఆత్మ విశ్వాసంతో ఎదిరిస్తూ తోటి సైనికులతో కుప్వారా స్టాపరము చేరుకున్నాను. పాకిస్తాన్ ఆక్రమించిన మన టైగర్ హిల్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే సూచన ఏనుగెక్కినంత సంతోషాన్నిచ్చింది.
కార్గిల్ కనుమల్లో నాల్, (ద్రాల్ నబ్ సెక్టార్లు మంచు లోయలమయమైన మృత్యుకూపాలు, శత్రుదేశము వద్ద చిమ్మచీకట్లో వెలుగులు పరిచే పరికరాలు, మంచుకొండల్లో సజావుగా నడిచే వాహనాలు, రాకెట్ (గ్రనేద్సు అస్తశస్తాలను గుర్తించే రాడార్లున్నాయి. అవి మన దేశానికి లేవు. ఆ దేశము ముందు పథకముతో హంగులన్నీ సమకూర్చుకొని దురాక్రమణకు సొహసించింది. అయినా మొక్కవోని మా పట్టుదల ఆలంబనగా 140 బోఫర్స్ శతఘ్నులను యుక్తిగా ప్రమోగిస్తూ ఆపరేషన్ విజయ్‌లో పాల్గోన్నాము. భారత్‌మాతాకీ జై, నందేమాతరం నినాదాలు మా ఆత్మబలానికి శక్తినిచ్చినై మన వైమానిక దాడులు పాకిస్తాన్ సేనల్ని ఊపిరిపీల్చుకోనివ్వలేదు. వాళ్ళ దొంగ దెబ్బలతో మన మిగ్-21, మిగ్-17 హెలీక్యాస్టర్లు పిట్టల్లా రాలిపోతుంటే యుద్ధ వ్యూవాలకు పదును పెట్టాము. తీరిక సమయాల్లో నీ ఫోటో చూస్తూ తృప్తి చెందేవాడిని,
మేమున్న గుడారానికి సమీపములోనున్న గ్రామంలో ఓ తెలుగు కుటుంబంతో పరిచయమైంది. ఆ కుటుంబం వ్యాపారం కోసం కొద్దిరోజుల క్రితమే అక్కడికొచ్చిందంటా. అక్కడుండి వ్యాపారం చెయ్యడమంటే చావును కొని తెచ్చుకున్నట్టే.
వాళ్లమ్మాయే ఈ జాహ్నవి. అప్పుడీమె వయసు వదేళ్ళు కావచ్చు. జీహాద్ రాక్షసమూకలు ఆమె తాతను, తండ్రిని పొట్టన పెట్టుకున్నాయట. ఓసారి అట్నుంచి వెళు
_౦టే జాహ్నవి వాళ్ళింటిముందు ఏడుస్తూ కనబడింది. బొద్దుగా, ముద్దగా ఉంది. అటు వెళ్ళి “ఎందుకేడుస్తున్నావు?” అని హిందీలో అడిగాను. ఈమె “మా నాన్న గుర్తు కొచ్చిండూ” అని తెలుగులో చెప్పింది. తన పేరడిగితే చెప్పింది. తెలుగు మాటలు వినగానే నాకు పుట్టతేనె
చప్పరించినట్టెంది. ఈమెతో ఇంట్లోకెళ్ళాను. వాళ్ళమ్మను తెలుగులో పలుకరించాను.
ఆమె మంచమ్మీంచి లేచి కూచుని “ఇక్కడ తెలుగోళ్లు ఎవ్వరూ లేరు బాబూ!” అని తమ కథంతా చెప్పింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కళ్లు చిప్పిల్లాయి. నేనే డాక్టరుకు చూపించి మందులు కొనిచ్చాను. ఈ అమ్మాయికి ఆపిల్ పళ్ళు కొనిచ్చాను. అప్పుడీమె కళ్లు ఆనందజ్యోతులైనాయి. వీలున్నప్పుడల్లా వెళ్ళి చూసి వచ్చేవాడిని.
మా క్యాంపు మరో చోటికి మారింది. నిరంతరం తుపాకుల మోతలు, యుద్ధవిమానాల శబ్దాలు, విపరీతమైన చలిని తట్టుకొని పోరాదుతున్నాము. 5 వేల మీటర్ల ఎత్తులోనున్న ఆ శిఖరాన్ని శత్రువుల గుప్పిట్లోంచి విడిపించాలనుకున్నాము.
యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనడం నాకది మొదటిసారి. అక్కడ రేడియో (ప్రసారం “జహ డాలుడాలు పర్ సోనేకీ చిడియా కర్తేహై బసేరా, వో భారతదేశ హై మేరా...” లాంటి పాటలు ఉత్తేజాన్నిచ్చేవి. దేహం కంటే దేశం మిన్న అనుకున్నాము.
అప్పటికే హంప్ పర్వతాన్ని 45690 స్థావరాన్ని వశపరుచుకుని 5140 పాయింటు వద్ద విరోచితంగా త్రివర్ణ పతాకాన్నెగరేశాము. నేన్నీకు ఉత్తరాల్లో రాసినవి కొన్ని విషయాలు మాత్రమే. రేడియోలో “మేరె దేశ్‌కీ థర్‌తీ సోనా ఉగలే, ఉగలే, హీరే మోతీ” లాంటి పాటలు వినేవాళ్ళం. నా తోటి సైనికులు కొందరు వీరమరణం చెందుతుంటే మా గుండెబలం మరింత పుంజుకునేది. భారతమాత పాదాల చెంత ప్రాణాలర్పించిన వారు వీరస్వర్గంలో మురుస్తున్నారు.
భయంకరమైన వాతావరణములో దేశరక్షణ ఉచ్చ్వాసగా స్వాభిమానం నిశ్వాసగా చల్లని మంచు కొండల్లో అగ్ని శిఖల్లా ముందుకెళ్ళి కీలకమైన టైగర్ పాల్‌ను స్వాధీనపరుచుకున్నాము. టోలోలింగ్తో సహా శత్రువులు ఆక్రమించిన స్థావరాలన్నింటిని వశపరుచుకున్నాము.
ఆ యుద్ధ క్షేత్రములోనే ఒకచోట జంప్ చేస్తుంటే శత్రువుల తూటా కాలికి తగిలి ఓ బండమీద పడ్డాను. నాలో పౌరుషం రెట్టింపైంది. దాంతో శత్రు సేనల మీద విరుచుకుపడి వీరవిహారం చేశాను. .
అక్కడ్నుంచి నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు. బుల్లెట్ తొలగించారు. కాలి ఎముక అతుక్కుంది కానీ కాలు వంకరైంది. భారత్ విజయం సాధించింది. మా అందరి హృదయాల్లో త్రివర్ణపతాకం సగర్వంగా రెపరెపలాడింది.
నన్ను డిస్పార్టి చేసి రిటైర్మెంటిచ్చారు. తిరిగి వచ్చే ముందు జాహ్నవి ఇంటికెళ్ళాను. వాళ్ళమ్మ మంచమ్మీంచి కిందపడి చనిపోయిందని తెలిసింది. జాహ్నవి బిక్కుబిక్కుమంటూ పక్కింట్లో ఉంది. నన్ను చూడగానే పరుగెత్తుకొచ్చింది. నా గుండెలమీద పడి వెక్కి వెక్కి ఏద్చింది. “వరంగల్లుల మా అమ్మమ్మ ఉంది” అని వాళ్ళమ్మ ఆమెకిచ్చిన అడ్రసు చూపించింది.
నా వెంట వరంగల్ దాకా తీసుకొచ్చి వాళ్ళ అమ్మమ్మకప్పగించాను. సర్వం పోగొట్టుకున్న ఆమె శోకదేవత అయింది...
“బాబూ! నీ సాయాన్ని మరువలేము. కానీ ఈ పిల్ల గతేందో తెల్వదు. నాకు సొంతిల్లులేదు. నాలుగిళ్లల్ల పాచిపని చేసి బతుకుతున్నా” అని కన్నీరు మున్నీరైంది.
నాకు పొత్తికడుపులో చెయ్యిపెట్టి దేవినట్లెంది. నా దగ్గరున్న కొన్ని డబ్బులిచ్చి “అమ్మా! నేను జాహ్నవి పేర నెలనెలా డబ్బు పంపిస్తాను. ఆమె చదువు ముందుకు సాగనీ” అని సముదాయించి ధైర్యం చెప్పాను. వాళ్ళ అడ్రసు రాసుకున్నాను. అప్పట్నుంచి నెలనెలా డబ్బు పంపిస్తున్నాను. అప్పుడప్పుడెళ్లి చూసొస్తున్నాను. జాహ్నవి అమ్మమ్మకు వృద్దాప్య పింఛను వస్తుందటా. పాచిపని మానేసిందట. ప్రభుత్వం ఇల్లు కట్టించిందట” సుధీర్ గొంతు గోడలకేదో పాకుతున్నట్లెంది.
నళిని హృదయ కేదారములో గర్వాన్ని రంగరించుకున్న బాధాయమైన ఆనంద తరంగాలు ఎగిసి పడుతున్నాయి. సోఫా వెనక్కొరిగిన జాహ్నవి కలువ కళ్ళను కమ్మిన మంచు తెరల్ని చున్నీతో అద్దుకుంటూ లేచింది. సుధీర్, నళినీలకు పాదాభివందనం చేసింది. “అన్నయ్యా! మీ ఆదరణ అందకపోతే నా గతి ఏమయ్యేదో! మీ డబ్బుతోనే చదువుకున్నాను. నాకు ఉద్యోగం దొరికింది. మొన్ననే ఆర్జర్స్ వచ్చాయి. మీరు కూడా రమ్మని ఫోన్ చేశారు. ఈ ఉద్యోగంలో చేరే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని వచ్చాను. ఇక నుండి నాకు డబ్బు పంపాల్సిన అవసరంలేదు” అంటూ...
వినయంగా నళిని చెయ్యందుకుని, చెంపలకద్దుకుని “వదినా! మా అన్నయ్య భార్యను చూడాలని ఎప్పట్నుంచో ఆరాటపడ్డాను. ఇప్పుడిట్లా కుదిరింది. పార్వతీ పరమేశ్వరుల్లాగున్న మీరే నాకు దైవసమానులుూ అంది. నళిని బుర్ర గిర్రుమంది.
“అయితే వీళ్ళది సాన్నిహిత్యమే కాని సాంగత్యం కాదు... ఛీళీ... బంగారం లాంటి భర్తను అనుమానించాను. అందుకే అంటారేమో అసూయ ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టిందని” ఆమె మనసు నాక్రమించిన మలినం మాయమైంది. “జాహ్నవీ! ఇదంతా
..... వినకముందు, నిన్ను చూడకముందు దేవుడిలాంటి మా ఆయనను అనుమానించాను” అంటూ చెంపలేసుకుని కొనకొంగుతో కళ్ళద్దుకుంది.
“వదినా! నాకిప్పుడు మీరే తల్లిదండ్రులు” చేళులు జోడించింది జాహ్నవి. అంటూంటే చెవి రింగులు గమ్మత్తుగా కదిలాయి. సుధీర్ గట్టిగా, తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు.
“పిల్లలూ! ఈవిడ మీకు అత్తమ్మ అవుతుంది” అన్నాడు. పిల్లలు జాహ్నవికి చెరో పక్క కూర్చున్నారు. అదే రోజున దేశమంతా కార్గిల్ విజయోత్సవాలు జరుగుతున్నాయి. టీవీ ఆన్ చేశాడు. టీవీలో “కర్ చలే జాను, తన్ దాన్ హమ్, అబ్ తుష్టూరే హవాలే వతన్ సాథియో” సినిమా పాట ప్రసారమవుతోంది. నళిని అంతరాళాల్లో ఆనందం ఉరకలేసింది.
“జాహ్నవీ! నీకు పెళ్ళి చేసే బాధ్యత మాదే కాని అమ్మమ్మను విడిచి పెట్టద్దు సుమా! మేము వరంగల్ కొస్తాంలే!?? అంటూ గుండెలకు హత్తుకుంది.
“అంతా బాగానే ఉందిగానీ కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. జాహ్నవీ! నువ్వు గూడా వంటలో వదినకు సాయం చేయ్! అన్నాడు సుధీర్. జాహ్నవి, నళిని చిరునవ్వులు చిందిస్తూ, చేతిలో చెయ్యేసుకుని వంటింట్లోకి హంసద్వయంలా నడిచారు.
జాగృతి”
ఏప్రిల్-2016) ' వెరి గల మ ఇ య స లు. - లే ష్ (|
ఖా కా గ్గ. (3 / జో 1 4 క థా [సీ (| గా ర న్ / న గ. | (గ యో ఈ కల్లా ాాాాాాాాాాావాికనో
కథా సంపుటాలు
-
వర విక్రయం 2. ఊహల ఊయల 3. కథా మంజూష
-
ఐదు నిమిషాలు 5. కుంకుమరేఖ 6. భారతాంబ ఫూజాఫుష్పాలు
-
చిలకపచ్చ చీర 8. సౌందర్యలహరి 9. స్వేచ్భా జీవులు
-
సిద్ధిపురి కథలు 11. ఏడువారాల నగలు 12. నిశ్చితార్థం
-
ఆనంద నందనము 14. అంకితం 15. నీడల జాడలు
-
ఇంగితం 17. ప్రజ్ఞాపూర్ చౌరస్తా _ 18. పొద్దు తిరిగింది
-
అంతర్నేత్రం 20. పల్లె నా తల్లి
కవితా కావ్యాలు ::
-
జాతీయ విప్లవ జ్యోతి (వీరసావర్మర్ - గేయ కథ) 2. సంక్రాంతి
-
చందమామ పదాలు 4. లక్షణరేఖక్. శ్రీ వేంకటేశ్వర తారహారము (పద్యాలు)
-
ప్రణవనాదము 7. త్రిశూలం 8. శ్రీగిరీశ శతకము (పద్యాలు)
-
భద్రగిరి నివాస శతకము (పద్యాలు) 10. గంగోత్రి
-
గుండెచప్పుళ్లు నానీలు 12. మానస సరోవరము
-
మూలస్వరాలు 14. పేరడీల గారడి 15. తెలంగాణ పదాలు నవలలు ::
-
ఆసుకగోడలు 2. ఆడపిల్ల ౩. తల్లి భారతి
4౨. సత్తికొండ 5. శ్రీవాసవాంబ 6. పడమటి సూర్యోదయం 7. సంధ్యావందనము 8. త్రిభుజి 9. కర్మభూమి
రంగస్థల నాటికలు ::
- రోజులు మారాయి. 2. బుద్ధొచ్చింది 3. తిక్కకుదిరింది
4, పెద్దమ్మ పేచీ 5. హరిశ్చంద్రుడు 6. చతుర్ముఖ (4 నాటికలు) రేడియో నాటికలు ::
-
అనంత సత్యం 2. తేనె కుండలో ఈగ 3. సౌందర్యలహరి
-
అగ్నిపూలు 5. అంకితం 6. బాబోయ్ బాల్యం
-
నాకూ మనసుంది 8. సమరం 9. మహిషాసుర మర్ధిని
-
బయాన 11. శుభోదయం 12. కలికి గాంధారి
ఏకపాత్ర సంపుటాలు ::
-
మూడు ఏకపాత్రలు 2. నాలుగు ఏకపాత్రలు 3. త్రిమూర్తులు
-
నాలుగు స్తంభాలు 5. భారవేలుతో నాలుగు 6. పది ఏకపాత్రలు బాల సాహిత్యము ::
-
పొట్టి శ్రీరామలు 2. వీరేశలింగము 3. ప్రకాశం పంతులు
-
బ్రహ్మనాయుడు 5. అన్నమయ్య 6. రాణి రుద్రమదేవి
-
తేనెచుక్కలు (బాలగేయాలు) 8౭. కుందేలు తెలివి (బాల కథాసంపుటి
-
వెన్నెలకెరటాలు (బాలగేయ సంపుటి 10. నటశేఖర పైడిజయరాజు
-
సంస్కర్త సాలార్జంగ్ 12. ఇబ్రాహీం కులీకుతుషషా
-
రాజబహదూర్ కోత్వాలు వెంకటరాంరెడ్డి 14. స్వామి రామానంద తీర్థ "
-
పఠాన్ తుగ్రేబాజుఖాన్ 16. పవార్ నారాయణరావు 17. షోయబుల్లాఖాన్
-
వందేమాతరం రామచంద్రరావు 19. బద్దం ఎల్లారెడ్డి
-
జమలాఫురం కేశవరావు 221. వీరనారి-రుద్రమదేవి
-
సురవరం ప్రతాపరెడ్డి 23. రావి నారాయణరెడ్డి
-
కాళోజి నారాయణరావు 225. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
-
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 227. పాల్కురికి సోమనాథుడు అనువాదములు ::
-
అల్లూరి సీతారామరాజు 2. లాచిత్ బడ్ ఫుకాన్ 3. రాజేంద్రప్రసాద్
-
బంకించంద్ర చటర్జి 5. బసవేశ్వరుడు 6. మహాత్మాగాంధీ
-
నందలాల్బోసు 8. సతీసక్కుబాయి 9. గురునానక్
-
హోమీబాబా 11. అద్భుత సాహసం 12. నవోదయం
-
హిమజిందువు 14. కళ్ళతో చూసింది 15. గోలూ డప్పు
-
డోబూ - రాజకుమారుడు 17. దిలీపుడు 18. యథిష్టరుడు
-
హంధీకథా సంగ్రహము 220. భారతీయ సౌందర్యావగాహన - తులసీదాసు
-
యాజ్ఞవల్క్యుడు
ఇతరములు ::
- గోత్రదర్శిని 2. కథాకమామీషు (కథ రాయడమేలా?
౩. తెలంగాణ మహిళామణులు 4. తెలంగాణ వముక్తి పోరాటీము ,
- భారత స్వాతంత్ర సమయములో తెలంగాణయోధులు
- తెలంగాణ చారిత్రక కట్టడాలు 7. తెలంగాణ గుహలు-జలపాతాలు
ఉ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2004 ధర్మనిధి పురస్కారము. అ 2010 తెలుగు విశ్వవిద్యాలయం ్రతిభాపురస్కారము. అ 1988 వేముగంటి సాహితీ పురస్కారం (జాతీయ విప్లవ జ్యోతి కావ్యానికి), అ 1995 సోమేశ్వర సాహితీ పురస్కారం (విశాఖపట్నం, ఆడపిల్ల నవలకు), అ 1998 విశ్వసాహితీ (హైద్రాబాద్) పురస్కారం అ 2001 గరిశ కుర్తి సాహితీ పురస్కారము (కామారెడ్డి), అ 2005 ఆంధ్ర సారస్వత సమితి (మచిలీపట్నం) కథాసాహితీ పురస్కారం అ 2009 స్వర్ణ కంకణ పురస్మారము (వాసవి క్లబ్ వారిచే) అ 2010 నోముల కథా సాహితీ పురస్కారము (నల్లగొండ) అ 2010 (ఉగాది) శోభానాత్ సింగ్ (నిజామాబాద్) స్మారక సాహితీ పురస్కారము అ 2011 విశాల సాహిత్య అకాడమి (హైద్రాబాద్) జీవిత కాల పురస్కారము అ 2011 రాష్ట్ర కవి డా॥ ఓగేటి అచ్యుత రామ శాస్త్రి సాహితీ పురస్కారం (వికారాబాదు) అ 2013 వాసాల నర్సయ్య బాలసాహితీ పురస్కారము (మెట్పల్లి) అ 2014 సాహితీ గౌతమి - కరీంనగర్ వారి బొందుగుల పాటి సాహితీ పురస్కారం (పడమటి సూర్యోదయం-నవలకు) అ 2014 శాతవాహన విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం. ఈ 2014 సర్వవైదిక సంస్థాన్ (వరంగల్) బెజ్జంకి లక్ష్మణరావు స్మారక సాహితీ పురస్కారం. అ 2015 తేజ ఆర్ట్ క్రియేషన్స్ (ఆలేరు) వారి సాహితీ పురస్కారం. 2015 తెలంగాణ ఆవిర్భావోత్సవాల్లో (తెలంగాణ రాష్ట్ర జిల్లాస్థాయి) సాహితీ పురస్కారము ఈ 2017 గురజాడ ఫౌండేషన్స్ (అమెరికా) వారి జాతీయ విశిష్ట సాహితీ పురస్కారం. ళా - ం హో గ్ / జ ఉంజబ్మా) స్మా ష్
. ఎల్! నగ1[[._6౬ 4 ౧4౬౬! (60015069) లో | 0/ 1104 0౧4౧౮61410 శ శ ( (|
- ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కథలపై పి.హెచ్.డి, పరిశోధన పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో “స్వేచ్చా జీవులు” కథా సంపుటిపై యం.ఫిల్ పరిశోధన. ఛ+ కాకతీయ విశ్వవిద్యాలయంలో సమగ్ర సాహిత్యం (2005 నుండి 2014 వరకు) +, పిహెచ్.డి. పరిశోధన. - ఛ+ అంకితం కథా సంపుటి ఇంగ్లీష్ లోకి “డెడికేషన్” పేర అనువాదం.
- పడమటి సూర్యోదయం నవల హిందీ లోకి “పశ్చిమ్ మే ఉగ్తాసూర్య"పేర | అనువాదం.
- కథలు హిందీ, ఇంగ్లీష్, మళయాలం, మరారఠి, కన్నడ, రియా, దోరగ్రీ భూషల్లోకి అనువాదం,
- ఇంగ్లీష్‌లోకి కవితలు అనువాదం, |
- కథాశేల్చి కథాకళానిధి కవిశేఖర 1