Telugu naanna nenu - anilvaranasi/indianlanguages GitHub Wiki

అాాాాానాత జడా. లనానానిననినానా ననన ననన వ. లావాలా వా 1 ॥ కీ తా. య (టు యా అ =. త్‌ా |. లవ సన్లు న నట /

(1 “ఇ చత హం లే. . ఆల్‌ ఓ |. శం

న క శప) న క స క!

శ్‌ / పో లా ల్‌ టు.

న న

(ల ర గ? ॥ వే ల సె , ల్‌ టి ర ఆ “కల హు! న్‌ /" ర న మా

ప రం. ఖ్‌ ల పాం నరం (. డ్డ / / కస పన

సళ గ ॥ వ షు చ నా వం సం టు పం మ హహ హిం వే. - ను న

అటట నతి. సా... ( భా లో! ప. సా. న ప రు చయయ లు ట్య? ము నే నన న. న ఘు న న / టన నో న య శ న న సట న టి ననగ -, . ్‌్కం- [స ఇ. కం? స్థ! శళ ప స్తం ల (. న స పా ం కుక న? త్త 1 న చ్‌ సను నా హగ్‌ ల 7” స " వ క.

ఫీ మ. 1 |

2 య. ప్రా తు.

| శ క. క్త లా మా కే. ( " (| టే నా

న్‌ు

బుజూయి జ శ కళాతపస్వి క్రియేషన్స్‌ నో లలితా మహల్‌, 10/7ఎ, అన్నై సత్యనగర్‌ మెయిన్‌ రోడ్‌, రామాపురం, చెన్నై600 089, ఫోన్‌ : ౦044-22491939.

౨ నాన్ననేను (0144010244 [1౬010 ఓ 320 బుజ్ఞాయి న. అ ప్రచురణ: అక్టోబర్‌ 2010 ం నాగ ప్రతులు: 1000 ణ్శో ర్‌ (ర్రి సర్వ హక్కులు బుజ్ఞాయివి [౯-7 | అ రచయిత చిరునామా: నెం.23, జర్చలిస్టు కాలనీ, శ్రీనివాసపురం, తిరువాణ్మయూర్‌, చెన్నై-600 041 ఫోన్స్‌: 04&4-24512565, 09551280783 ఈ కవర్‌; కృష్ణశాస్రై ఫొటో - బుజ్జాయి బుజ్జాయి ఫొటో - శివశ్రీ అడిదెం కవర్‌ డిజైన్‌ : కృష్ణశాస్త్రి ఛూ గ్రందాలయ అ మూల్యం: దో న ర్యా రూ. 150/- జ సయిం.౨ 2525 * ౮:5. $ 10 (801020) ఉయట్‌ జ పో పొలి రసో 4 డిటిసి: కె.కె.రావు, చెన్నై అ పుస్తక రూపకల్పన : క్రియేటివ్‌ లింక్స్‌, 1-8-725/ఏ/1, 103 సి, బాలాజి భాగ్యనగర్‌ అపార్ట్‌మెంట్స్‌, నల్లకుంట, హైదరాబాద్‌-500 044. ఫోన్స్‌ : 98485 06964, 98480 65658. అ ప్రతులకు: [ కళాతపస్వి క్రియేషన్స్‌, చెన్నై క్రియేటివ్‌ లింక్స్‌ విశాలాంధ్ర ఆంధ్ర బాలానంద సంఘం, బర్మిట్‌ రోడ్‌, టి.నగర్‌, చెన్నై-17 మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

అంకితం

నాకు పదేళ్లు ఉన్నప్పుడు ఏవో పిచ్చి బొమ్మలు వేస్తూ ఉండేవాడిని. వాటిని చూసి అద్భుతంగా ఉన్నాయని చెప్పి, వాటికి కాష్షన్స్‌ ఏవో ఇచ్చి, పత్రికలకు పంపించేవాడు మా బావశ్రీ వింజమూరి ప్రభాకరం. నేను ఏ బొమ్మ వేసినా ప్రోత్సహించేవాడు. నాకు 15 ఏళ్లు వచ్చేసరికి మేము మద్రాసు మకాం మార్చాము. “టార్జాన్‌ బొమ్మల కథ పత్రికలలో చూశాను. ఏదో చెప్పలేని అనుభూతి కలిగింది. నువ్వుకూడా ఇటువంటి బొమ్మల కథ వెయ్యమని నన్ను ప్రోత్సహించిన మా మేనమామ బాబాజీ శ్రీ గాడేపల్లి సత్య శ్రీరామ్‌, తరువాత నా చేత ఎన్నో బొమ్మల కథలు వేయించాడు. చెప్పలేని ధైర్యం ఇచ్చాడు. ఇప్పుడు వారిద్దరూ స్వర్లీయులు. అడుగడుగునా నన్ను ప్రోత్సహించిన వీరిద్దరికీ నా పుస్తకాన్ని అంకితం చేస్తున్నాను.

  • బుజ్జాయి

కృతజ్ఞతలు

నేను ఈ పుస్తకం వ్రాయడానికి ముఖ్య కారణం నా కోడలు శ్రీమతి చిత్ర. ఇదివరలో నా జీవిత విషయాలు ఎప్పుడైనా నా పిల్లలకి చెబితే “అబ్బా ఆపు నీ 800 5100/ మాకు వినాలని లేదు” అనేవారు. అదే 800 510౧/ నా కోడలు విని, “చాలా ఆసక్తికరంగా ఉంది. మీరు ఇదంతా వ్రాయండి, వ్రాయడం మీకు కష్టం అయితే డిక్టాఫోన్‌ కొని ఇస్తాను, అందులో చెబుతూ పోంది” అని సలహా ఇచ్చింది. ఎదురుగా ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే, వారికి ఈ విషయం మీద ఆసక్తి ఉంటే చెప్పడం వేరు. ఎవరూ లేకుండా చెప్పుకు పోవడం చాలా కష్టం. అందుచేత వ్రాయడమే మంచిదని ఇది మొదలు పెట్టాను.

ఈ వ్రాతప్రతిని మిత్రులు, ప్రఖ్యాత రచయిత శ్రీ గొల్లపూడి మారుతీరావు గారికి చదవమని ఇచ్చాను. వారు చదివి, చాలా బాగుంది, వెంటనే అచ్చు వేయించమని నాకు ధైర్యం చెప్పి, ప్రెస్‌ కాపీ చెయ్యడంలో ఎంతో సహాయపడి, అద్భుతమైన ముందు మాట కూడా వ్రాసి ఇచ్చారు. వారికి నా కృతజ్ఞతాభి వందనాలు.

సుమారు 20 ఏళ్ల క్రితం హైద్రాబాద్‌లో శ్రీమతి శారదా అశోకవర్ధన్‌ గారిని కలియడం జరిగింది. మాటల మధ్యలో నా చిన్నతనం, మా నాన్న గురించి, అప్పటి సభలు వీటి గురించి నేనేవో చెబుతుంటే 'వీటిని మీరు, వెంటనే వ్రాయాలి, అది పుస్తక రూపంలో రావాలి” అని మొదట నా మెదడులో ఈ బీజం నాటి అమూల్యమైన అభిప్రాయం వ్రాసి ఇచ్చిన శ్రీమతి శారదా అశోకవర్ధన్‌ గారికి, ఈ పుస్తక ముద్రణ బాధ్యత తీసుకొని చక్కగా నేను అనుకున్నట్టుగా అందించిన మిదత్రులు సూరిబాబు, శ్రీకాంత్‌ (క్రియేటివ్‌ లింక్స్‌) లకు, పుస్తకంలో తప్పులు లేకుండా జాగ్రత్తగా పరిశీలించిన సి.వెంకటేశ్వర్లు (రిటైర్డ్‌ తెలుగు లెక్చరర్‌) గారికి నా కృతజ్ఞతలు.

చివరికి ఇరవై ఏళ్ల తరవాత ఇది పుస్తకరూపంలో వస్తుందంటే దానికి ముఖ్యులు

ప్రియ మిత్రులు శ్రీ మల్లాది సచ్చిదానంద మూర్తిగారు. వీరితో నాకు స్నేహం ఆలస్యంగా జరిగింది. ఇది మా నాన్నగారు ఉండగానే జరిగి ఉంటే ఎంతో బావుందేదని అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాను. వారికి కృతజ్ఞతాభివందనాలు.

జా బుజ్ఞాయి

శ్రీగురుభ్యోనమః కృష్ణశాస్త్రీగారంటే చిన్నతనం నుంచీ నాకు ఆరాధన. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో పుట్టిన నేను తెనాలిలో హైస్కూల్‌ పూర్తిచేసి పై చదువులకు గుజరాత్‌ వెళ్ళి, మదరాసులో 1976లో స్థిరపడటానికి వచ్చేవరకు మన ప్రాంతాలకు రాలేదు. అంతవరకు తెలుగుమీద అభిమానం పుస్తకాలు చదవటం వరకే పరిమితమై ఉందేది. “మల్లీశ్వరి పాటల నుండి 'అడుగడుగున గుడి వుంది...” వరకు దేవులపల్లివారి పాటలన్నీ అధ్యయనం చేసి, దూరం వెళ్ళి తిరిగి వచ్చానన్నమాట. కృష్ణశాస్త్రిగారి పాటల్లో, భావప్రకటనలో ఎన్నో కమ్మని తెలుగు పదాలు ఆయనకే ప్రత్యేకమైనట్టు మచ్చికగా, అందంగా ఒదిగి యిమిడిపోవటం, సమకూడటం అద్భుతంగా ఉండేది. వారిని ఒకసారి కలవాలని, ఆయన గురించి వివరంగా తెలుసుకోవాలనే కోరిక నాకు బలంగా ఉండేది. 1976లో అనుకోకుండా అది నెరవేరింది. పెళ్ళైన కొత్తల్లో, అంబత్తూర్‌ నుంచి మార్షింగ్‌ షో ఉందంటే నేను, మా ఆవిడ పెద్ద ప్రయాణం చేసి కృష్ణవేణి థీయటర్‌లో “మల్లీశ్వరి చూడటానికి వచ్చాం. హాల్లో కొద్దిమంది వున్నారు. సినిమా నడుస్తోంది. మసక చీకట్లో ఊరు చేరాలి...) పాట వస్తున్నపుడు ముందు వరుసల్లో కృష్ణశాస్రిగారి వెండి జుట్టు మెరిసింది. ఇంకా బాగా కనబడేటట్టు సీటు మారి ఆయన్నే చూడసాగాను. ఆయన తన సృష్టిని తాపీగా, ఒక బుషిలా చూస్తూ ఉన్నారు. ఆయన అనుభూతి ఆ సమయంలో ఎలా ఉందో తెలుసుకోవాలని నాకు గొప్ప కుతూహలం. ఇంటర్‌వెల్‌లో అందరూ కనబడసాగారు. ఎంతోమంది మహనీయులు వచ్చారు. వీణ చిట్టిబాబుగారు యిదివరలో నాకు తెలుసు. ఆయన కూడా కనిపించారు. నా పరిస్టితి ఆయనతో ప్రస్తావించాను. ఆయన నన్ను చేయి పట్టుకుని కృష్ణశాప్రిగారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేశారు. వందనం చేసాను. గొప్ప సాక్షాత్కారం. చెరగని చిరునవ్వు, గొప్ప వర్చస్సు. తెల్లని బట్టలు, వాత్సల్యం, గంభీరతకల వారి చూపు నాలో ముద్రపడిపోయింది. క్రమంగా వారి రచనలతో అనుబంధం గట్టిపడసాగింది... తరువాత ఆయన వెళ్ళిపోయారు. ఆ రావి, ఆ బావి, ఆ స్వామి, వెన్నెల రాజా, సోగ కన్నులు, కర్పూరం, గోరింట పొదలు, కోయిలలు, గోరువంకలు, కలుములరాణి, ఏకాంతంలో ఏదో ఏదో... ప్రపంచం మాత్రం శాశ్వతంగా మన మధ్య నిలిచిపోయింది. ఎంతోకాలం తరువాత ఆయన శత సంవత్సర సభ. వేదిక మీద ఆరుద్రగారు, విశ్వనాథ్‌గారు, నేను, పప్పు వేణుగోపాల్‌రావుగారు. హాలంతా నిండిపోయింది.

కృష్ణశాస్రిగారి భార్య, కుమారుడు కూడా వచ్చారని ఎవరో పరిచయం చేశారు. బుజ్జాయిగారిని ఆయన పేరు బుజ్జాయి అని తెలియకుందా అదే చూడటం. మితభాషి ఏదో జంకుగా, నమ్రతగా ఒదిగి కూర్చుని వున్నారు. ఆయన పాటలేవీ విన్న దాఖలా లేదు. “అంతేలే మహావృక్షం నీడలో ఎవరు రాణింపుకు రాగలరు, పాపం పండిత పుత్రుడు” అని నా భావన.

కొంతకాలం తరువాత ఆంధ్రా క్లబ్‌లో ఒక సభ జరిగింది. బుజ్ఞాయిగారు కూడా వచ్చారు. ఈసారి దేవులపల్లి కృష్ణశాప్రిగారి అబ్బాయి, ది ఫేమస్‌ చిత్రకారులు బుజ్ఞాయిగారు అని మాలతీ చందూర్‌గారు మమ్మల్ని కలిపారు. నాకు పెద్ద షాక్‌. చిన్నప్పటి నుంచీ నాకు డుంబు, ఖైరవ్‌, తాతయ్య, ఆయన బొమ్మల కథలు అంటే చాలా ఇష్టం. గుజరాత్‌లో వున్నపుడు కూడా ఇలఫ్టేటెడ్‌ వీక్లీలో పంచతంత్ర సీరియల్‌గా వస్తే విడవకుండా చదివేవాణ్ణి. ఆయన గురించి తెలియకుండానే అప్పటికి గొప్ప అభిమానిని. ఆయన బొంబాయిలో ఉంటారని అనుకునే వాడిని. అసలు విషయం తెలియగానే ఉబ్బి తబ్బిబ్సై. 'పంచతంత్ర అంతా పుస్తకంగా వచ్చిందా” అని అడిగాను. 'లేదు' అని వారంటే ఆ విషయం మాట్లాడదామని, ఆయన గురించీ, కృష్ణశాప్రిగారి గురించీ తెలుసుకోవాలనీ మా ఆఫీసుకు ఆహ్వానించాను. వచ్చారు. అప్పటినుంచి మా స్నేహం, అనుబంధం రోజు రోజుకూ బలపడుతూ నా జీవితంలో ఒక పది సంవత్సరాల గొప్ప అధ్యాయం అయి నడుస్తూవుంది. మాది మాటల్లో వ్యక్తపరచటానికి సాధ్యంకాని విలువైనటువంటి బంధం.

బుజ్ఞాయిగారు, నేనూ కలసి 'దేవమాల పబ్లికేషన్స్‌” స్థాపించి పిల్లలకోసం ఇంగ్లీషులో బొమ్మల పుస్తకాలు వెయ్యటం మొదలుపెట్టాము. “పంచతంత్ర” పుస్తకరూపంలో రిలీజ్‌ చేశాము. ఇంకా మన సంప్రదాయం తెలిసేలా యాఖై పైన టైటిల్స్‌ పిల్లలకోసం పుస్తకాలుగా పబ్లిష్‌ చేసాము. బుజ్ఞాయిగారి అబ్బాయి కృష్ణశాస్రి కూడా తనదైన శైలిగల గొప్ప ఆర్టిస్టు. కోడలు చిత్ర మహనీయుడు డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారి వంశంలో పుట్టి ఇంగ్లీషులో పి. హెచ్‌.డి చేసింది. మేమందరం కలసి పిల్లల పుస్తకాల కోసం పనిచేసే వాళ్ళం. కృష్ణశాప్రిగారి గురించి ఎన్నో వివరాలు నేను తెలుసుకోగలిగాను. బుజ్ఞాయిగారికి, తండ్రికి ఉన్న విడదీయలేని జీవితం నాకు అవగతం అయింది. వారి పాటలే కాక వ్యాసాలు, జీవన విధానం, వ్యక్తిత్వం, సంస్కారం, ఎందరో మహనీయులతో ఆయన స్నేహం వివరంగా తెలుసుకోగలిగాను. అంతా విన్న తర్వాత యివన్నీ పుస్తకరూపంలో వస్తే బాగుంటుందని అనిపించింది.

బుజ్ఞాయిగారిని ఆత్మకథ వ్రాయమని ప్రోత్సహించాను. చాలాసార్లు గుర్తుచేస్తుండేవాడిని. నా కంటే ఎక్కువ ఆయన కోడలు చిత్ర, యింకా ఎంతోమంది కృష్ణశాస్రిగారి అభిమానులు, బుజ్ఞాయిగారి అభిమానులు బలవంతం చేయగా ఆయన 'ఆత్మకథి మొదలుపెట్టారు. అలా నెమ్మదిగా 'నాన్న-నేను పూర్తై మా “కళాతపస్వి క్రియేషన్స్‌ పబ్లికేషన్‌'గా యిప్పుడు ప్రచురణలోకి వచ్చింది.

బుజ్ఞాయిగారిది సున్నితమైన మనస్సు. సాత్వికులు. స్వచ్చమైన మేథస్సు, తనదైన బాణి. బొమ్మలు, కథలు. నచ్చనిది చేయని స్వాతంత్రం. రోజూ ఏదో ఒక బొమ్మన్నా వేయకుండా ఆయనకు కుదరదు. మంచి క్రమశిక్షణ, మంచి మనిషి సంస్కారి. వారి నాన్నగారు బడిచదువులకు పంపకుండా వాత్సల్యంగా, తన సహచారిగా పెంచి ఆయనకూ, మనకూ మహోపకారం చేశారు. కృష్ణశాస్త్రిగారి రచనలు, వారి జీవితంలో తారసపడ్డ ఎందరో మహానుబావులు, వారితో సాన్నిహిత్యం బుజ్ఞుయిగారికి జీవితంలో విలువైన చదువు నేర్చినై. కవిత్వం యిష్టమైనా అది తండ్రికి సొంతం చేసి తన ప్రజ్ఞను వేరే రంగాలలో పండించి ఉన్నత స్థాయికి ఎదిగారు. స్వతహాగా బుజ్ఞాయిగారికి ఫొటోగ్రఫి, పాత ఇంగ్రీషు సినిమాలు, స్నేహం, బొమ్మల కథలు చాలా యిష్టం, ఆయనతో కూర్చుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. అలా వారు జీవితాన్ని సార్ధకం చేసుకున్నారు.

దేవులపల్లివారి సాహితీ సంసారం పెద్దది. వారి సంసారమూ పెద్దదే. ఎందరో కళాకారులూ, లబ్బప్రతిష్టులూ వున్నారు. బతికినంత కాలం శాస్రిగారి యిల్లు ఓ సాపొతీనభను తలవించేది. అందులో కాటూరి వెంకటేశ్వరరావుగారూ, ముద్నకృషన్ణగారూ, సీత, అననూయు, విశ్వనాథ, శ్రీశ్రీ యిలా ఎందరో. సాహిత్యాభిమానులకు ఈ పుస్తకం వడ్డించిన విస్తరి. బుజ్జాయి ముక్తసరి మనిషి కనుక ఈ పుస్తకాన్ని క్లుప్తంగా ముగించారుకాని, ముందుమాట వ్రాసిన గొల్లపూడివారి చేతుల్లో పెడితే గుబాళింపుగా తిరగమాత వేసి- మరింత రుచిని మప్పేవారు. అయినా యీ కథనంలో రుచి, విలువా ఏమీ తగ్గలేదు. బుజ్ఞాయిగారు మాత్రమే వ్రాయగలిగిన, వ్రాయవలసిన రచనయిది. ఇందులో ప్రత్యేకంగా మా కళాతపస్వి ప్రచురణలకు, పరోక్షంగా నాకు వాటావున్నందుకు గర్వపడుతున్నాను. 14 10.2010 మల్తాది సచ్చిదానందమూర్తి

ముందుమాట బుజ్ఞాయిగారి 'నాన్న-నేను” చదువుతున్నపుడు ఒక పక్క ఆశ్చర్యమూ, మరొక పక్క ఈర్వ్యా కలుగుతుంది నాలాంటివాళ్లకి. అప్పటికే మా తరం కలలుగంటున్న మహానుభావుల మధ్య ఆయన జీవితం గడిచింది. ఆయన నవ్య సాహిత్య వైతాళికుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారబ్బాయి. మహాకవి, చిత్రకారుడు ఆడవి బాపిరాజుగారి ఒళ్లో ఆదుకున్నాడు. ఆధునిక కవితా వైతాళికుడు శ్రీశ్రీ ఆయన్ని ఎత్తుకు తిప్పి, బుజ్జగించి, బిస్కట్లు తినిపించాడు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌గారి కాళ్లమీద తలపెట్టి సామర్లకోట స్టేషన్‌లో అభివందనం చేశారు. విశ్వనాథ చేత తిట్లు తిన్నాడు. కాటూరి వారు పెళ్లి సంబంధం కుదిర్చారు. తెలుగు సాహిత్యంలో మొదటి సంకలనం “వైతాళికులు సృష్టించిన ముద్దుకృష్ణ, శ్రీరంగం నారాయణబాబులతో సంవత్సరాల తరబడి ఒకే యింట్లో కలిసి జీవించారు. అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన రచయిత పాలగుమ్మి పద్మరాజుగారితో కలిసి కోకొల్లలుగా ఇంగ్లీషు చిత్రాలు చూశారు. ఆయన చేత ఒకే ఒక్క డిటెక్టివ్‌ నవల రాయించారు. బి.యన్‌.రెడ్డిగారు ఆయన్ని సినీమాల్లో ఆర్ట్‌ డైరెక్టర్‌ని చేయాలని ప్రయత్నాలు చేశారు. పేజీలు తిప్పుతుంటే అస్మదాదులకు ఒళ్లు పులకరించే సందర్భాలివన్నీ, ఇది ఒక పారం. ఇక మరో పారం. బుజ్ఞాయికి ఏనాడూ అక్షరాభ్యాసం జరగలేదు. నవ్య సాహిత్యానికి తొలి మెరుగులు దిద్దిన మహాకవి తన కొడుకు చేత ఏనాడూ ఓనమాలు రాయించలేదు. బడి ఎలా వుంటుందో ఆయనకి తెలియదు. పెద్దవాడయ్యాక సినిమా పోస్టర్లు చూసి తనంతట తాను అక్షరాలు నేర్చుకున్నాడు. అడివి బాపిరాజుగారు ఒళ్లో కూర్చోబెట్టుకుని బొమ్మలు వేస్తుంటే ఆయనకి 'రేభాభ్యాసం' జరిగింది. వల్లూరి జగన్నాథరావు అనే వాగ్గేయకారుడు- ఇంట్లో నేల మీద దేవుడి బొమ్మలు సుద్దతో వేస్తూ ఆయన ఆకలిని రెచ్చగొట్టారు. చిన్ననాటనే కాకినాడలో నడిపిన “ఆశ అనే లిఖిత పత్రికలో విశ్వనాథ, అడివి బాపిరాజు, మల్లవరపు విశ్వేశ్చరరావు, తల్లావరుల శివశంకరశాస్త్రి బుజ్జాయిమీద పద్యాలు రాశారు.

ఆ తర్వాత భారతదేశమంతా విస్తుపోయి, తన్మయంతో చదివేలాగ ప్రతిదినం, ప్రతివారం లక్షల కార్టూన్లు, బొమ్మలు దేశీయ స్థాయి పత్రికలలో దశాబ్దాల తరబడి వేశారు. జాతీయ స్థాయిలో బహుమతులందుకున్నారు. కొన్ని సినీమాలకూ పబ్లిసిటీ చిత్రాలూ, కథా పుస్తకాలూ వేశారు. అందులో ఆనాటి పాపులర్‌ సినీమా-నేను రాసిన 'పాపం పసివాడు కూడదా ఉంది. మర్రిచెట్టు నీడలో మరో చెట్టు పెరగదంటారు. వటవృక్షం వంటి తండ్రిగారి కీర్రచ్భాయల్లో మరుగున పడి నలిగిపోక, మరుగుజ్జుకాక-తనదైన కళను సాధించి క్షీర్తి శిఖరాలను అధిరోహించారు.

బళ్లారి రాఘవ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, టంగుటూరి, పొకాల వెంకట రాజమన్నారు, కె. ఏ.అబ్బాస్‌, గిడుగు సీత్రాపతి, ద్వారం వెంకట స్వామినాయుడు వంటి మహానుభావుల రేఖా చిత్రాలను సునాయాసంగా వేసి మెప్పించారు. పసివాడిగా వేసిన తన చిత్రాన్ని బళ్లారి రాఘవ తన యింటి ప్రాంగణంలో పటం కట్టి అలంకరించుకున్నారు. ఎప్పుడో అసంకల్పితంగా వేసిన తన రేఖా చిత్రాన్ని చూసి రాధాకృష్ణన్‌గారు అబ్బురపడి మెచ్చుకున్నారు. మరో 50 సంవత్సరాల తర్వాత ఆయన మనుమరాలి కూతురు బుజ్ఞాయిగారి కోడలవుతుందని యిద్దరూ ఆనాడు ఊహించి వుండరు. జీవితం రచించే ప్కీన్‌ప్లే మెలికలు ఏ ఊహకీ అందవు.

చాప్లిన్‌ ఆత్మకథ ఓ హాస్య నటుడు, ఓ మేధావి, కన్నీళ్లకి భాష్యం చెప్పిన ఓ తాత్వికుడి జీవితాన్ని అవిష్కరిస్తుంది. శ్రీపాదవారు ప్రాచీన ఆధునిక సాహిత్యాల సంధికాలపు సంఘర్నణకి అద్దం పడతారు తన “అనుభవాలూ- జ్ఞాపకాలూ'లో. అలాగే తెలుగులో మొట్ట మొదటి ఆత్మకథ- ఆదిభట్ల నారాయణ దాసుగారి “నా యెజుకి ఒక బాల మేధావి తొలినాటి కళా వైదుష్యాన్ని వింగడిస్తుంది. అలాగే బుజ్జాయి జీవితంలో ఎందరో కవిపుంగవుల జీవన ప్రస్థానాల చరిత్ర తొంగిచూస్తుంది.

బుజ్ఞాయి మన అదృష్టవశాత్తూ కవికాడు. రచయిత అంతకన్నాకాడు. అందుకనే ఆయన కథనం-వాయిగా, సూటిగా, నేలబారుగా, సంసార పక్షంగా-మనతో మాట్లాడుతున్నట్టు సాగిపోతుంది. దేవులపల్లి కృష్ణశాస్రిగారితో

నాకూ సహచర్యం దక్కింది- ఓ దశలో. వారు కేవలం కవీ, స్వాప్నికుడు మాత్రమే కాదు. తన తరం కవుల సాహితీ సౌరభాన్ని వాడవాడలా గానం చేసి, పదిమందికీ ఆ అమృతాన్ని పంచిన రాయబారి. అపూర్వమయిన వక్ష, తరతమ భేదం లేకుండా 'మంచి' ని జీవితంలోకి ఆహ్వానించి వెదజల్లిన డెమోక్రాట్‌. బంధువులతో, స్నేహితులతో, కవులతో, పరిచయస్తులతో తీర్చిన పెద్ద సభ ఆయన జీవితం. అందరి సహృదయుల, మిత్రుల, పరిచయస్తుల సామూహిక క్షేత్రం- ఆయన ఇల్లు. వీటన్నిటినీ స్థాలీపులాక న్యాయంగా విప్పిన (గ్రంథం యిది. బుజ్జాయి అదృష్టవశాత్తూ కవి కాడన్నాను. కాని అయివుంటే- ఈ చిన్ని పుస్తకం ఓ గొప్ప తరానికి అద్దం పట్టే బృహద్ధంథం అయివుందేది. ఓ గొప్ప జీవితాన్ని పడుగు పేకల్లో మన్నికగా అల్లే 'జవుళి నేత అయేది.

ఆ ఇంట్లో పుట్టిన ఓ అదృష్టవంతుడు, విలక్షణమయిన జీవితాన్ని గడిపిన ఓ చిత్రకారుడు, సిగ్గుతో తనలోకి తాను ముడుచుకుని జీవించే ఓ మామూలు మనిషి-అవును - బుజ్ఞాయి తన మాటల్లో తన కథని విప్పితే అది కవిత్వమవుతుంది. చరిత్ర అవుతుంది. అన్నిటికీ మించి అపూర్వమయిన సుతి చిత్రమవుతుంది.

అదీ ఈ పుస్తకం. రోజులు గదుస్తున్న కొద్దీ బంగారం విలువలాగా, ఈ పేజీల విలువా పెరుగుతూ పోతుంది. సందేహం లేదు. మరో పదేళ్లకి ఈ పుస్తకం అందమయిన వాట్‌లలో భద్రపరచిన సాహిత్యం మార్కు మధుశాల అవుతుంది. శ్రీరాముని సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ త్యాగరాజస్వామి “రుచి'నే ఆ(శ్రయించాడు+కనకనరుచి నీ రూపము” అంటూ. ఈ జ్ఞాపకాల విలువని చెప్పడానికి నాకూ మరో మార్గం కనిపించలేదు-రుచి' తప్ప. చెన్నై-17 -_ గొల్లపూడి మారుతిరావు 80-08-09

ప్రతి మనిషి జీవితంలోనూ మనసుపొరల్లో నిక్షిప్తమై వున్న జ్ఞాపకాలు దొంతరలుగా ఉంటాయి. అయితే అన్ని జ్ఞాపకాలూ అందరికీ ఉపయోగపడవు. కొందరి జ్ఞాపకాలు, అవి వారి ఆత్మకథ రూపంలో కావొచ్చు, స్వీయ చరిత్రగా కావొచ్చు, కొందరికైనా ఉపయోగపడతాయి. ఆ కోవకు చెందిన గ్రంథమే ఈ నాన్న నేను” బుజ్ఞాయిగారి రచన.

ఇందులో ప్రతి వారినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, మహాకవి, పండితుడు అయిన దేవులపల్లి కృష్ణశాస్రిగారు, తన కుమారుడ్ని బడికి పంపకపోవడం. పిచ్చిగా ్రేమించే పుత్రుడు క్షణం తన దగ్గర లేకపోతే ఉండలేని మమకారం, అతణ్ని అలా చేసింది. పైపెచ్చు, తన కూడా ఉండటమే గొప్ప విద్య అనుకున్నారేమో! ఏదయితేనేం? బుజ్జాయి కృష్ణశాస్త్రి గారి కళ్లూ, కాళ్లూ, చేతులూ, ప్రాణం. ఈ బంధం వర్ణనాతీతం. అసలు చదువంటే? ఉపాధి కోసం బళ్లో చేరి, కాలేజీలకెళ్లి డిగ్రీలు తెచ్చుకోవడమేనా? అవి ఉపాధి కోసం పనికొస్తాయి. లోకజ్ఞానాన్ని సంతరించుకోవడం కోసం మాత్రం కాదు. “ప్రార్ధించే పెదవుల కన్నా సేవలు చేసే చేతులు మిన్న అని వివేకానందుల వారన్నట్లు ఎందరో నిష్టాతులైన వారి సాన్నిధ్యం, సహవాసం ఎన్ని డిగ్రీలకు సమానం? సరిగ్గా అదే బుజ్ఞాయి జీవితం. అటు తండ్రిని సంతోషపెడుతూనే, అప్పుడప్పుడు అందరిలాగా తనూ బడికి వెళ్లలేక పోతున్నానే అని బాధ పడ్డా, తన ఇష్టమేమిటో తానే తెలుసుకుని తన మార్దాన్ని తానే నిర్మించుకుని, ఆ మార్గంలో కష్ట నష్టాల కోర్చి ప్రయాణం చేసి, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు గడించారు బుజ్ఞాయిగారు. ప్రభుత్వం బాలభవన్‌ తరఫున ఇచ్చే బాలబంధు అవార్డుల జాబితాలో ముగ్గురు లబ్ధ ప్రతిష్టల పేర్లు లేకపోవడం బాధేసి, బహుశా, ఆ అదృష్టం నా కోసమే వేచి వుందేమో ననుకుని, నేను, ఆ ముగ్గురు ముళ్లపూడి వెంకట రమణ, బాపు, బుజ్ఞాయి గార్ల పేర్లను ప్రభుత్వానికి పంపడం, ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ విజయభాస్కర రెడ్డిగారి చేత, ఆ కార్యక్రమం నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే బుజ్ఞాయి గారి పుస్తకం 'పిల్లలు - పువ్వులు అనుకుంటా, మా బాలభవన్‌ తరపున ప్రచురించిన గౌరవం నాకు లభించింది. మరో ప్రాజెక్టుతో బుజ్ఞాయిగారు నన్ను కలుసుకున్నప్పుడు, మాకు

నిధులు లేక అది నేను చెయ్యలేకపోయాను కానీ, ఆ నాటి సంభాషణల్లో దొర్లిన విషయాలతో “మీరు, మా నాన్న - నేను అని పుస్తకం ఎందుకు రాయకూడదూ? మీ అనుభవాలు వేరు, ఇతరులు వారి గురించి విన్న విషయాలు వేరు” అని అన్నపుడు బుజ్జాయి మెదడులో ఆ బీజం పడింది. కానీ కోడలు చిత్ర బలవంతం ఎక్కువయ్యేదాకా అది కార్యరూపం దాల్చలేదు. దాదాపు ఒకటిన్నర దశాబ్దం తరువాత అది వెలుగు చూస్తోంది.

ఈ పుస్తకం నిండా, ఆనాటి వ్యక్తులూ, వ్యక్తిత్వాలూ, బంధాలూ నిండి వుంటాయి. మానవత్వం కనుమరుగైపోతున్న ఈ తరుణంలో ఈ రకమైన గ్రంథం 'ప్రతివ్యక్తినీ ఆలోచింప జేస్తుంది.

కృష్ణశాస్త్రిగారి ఇల్లు ఒక మాట్లాడే గ్రంథాలయం, ఒక చర్చా వేదిక. మా మామగారు కీ॥శే॥ గాడేపల్లి జగన్నాథంగారూ, కృష్ణశాస్త్రిగారు దగ్గర బంధువులే. స్పేహితుల్లా ఉండేవారు. మావారు అశోకవర్ధన్‌ గారూ బుజ్ఞాయీ స్నేహితులు. ఆ యింటి వాతావరణం, స్నేహమయం. అల్లసాని పెద్దన గారన్నట్లు, ఇచట పూచిన చివురు కొమ్మైన చేవ అని, కృష్ణ శాస్రి గారింట్లో కొన్ని గంటలు గడిపితే, అది సంగీత, సాహిత్య, చిత్రకళా మాలిక. అందుకే బుజ్ఞాయిగారికి ఏ ఐడీ అవసరం లేకపోయింది. తండ్రి సాంగత్యం, సహచర్యమే విద్య. ఇల్లీ విద్యాలయం. ఆ తీపి గుర్తుల నన్నింటినీ, మన కందిస్తూ, అంతరంగ ఆవిష్కరణ చేసిన బుజ్ఞాయిగారిని అభినందిస్తూ, నాకీ అమూల్య అవకాశాన్నిచ్చి గౌరవించిన వారికి ధన్యవాదాలర్చిస్తున్నాను. బూ నాద - శారదా అశోకవర్ధన్‌

నా మాట

నేను ఈ పుస్తకం (నా జ్ఞాపకాలు) వ్రాయడానికి ముఖ్య కారణం నా కోడలు చిత్ర అని ముందే వ్రాశాను. మరి కొంత మంది కూడా దీనికి కారకులని చెప్పాలి. 1992 లో నేను, లక్ష్మీ హైద్రాబాద్‌ వెళ్లాము. అప్పుడు శ్రీమతి శారదా అశోక్‌ వర్ధన్‌ని కలియడం జరిగింది. ఏవో పిచ్చాపాటీ మాట్లాడి మధ్యలో మా నాన్నగారూ, ఆయన సభలూ అని చెప్తుంటే “అవన్నీ మీరు తప్పకుండా వ్రాయాలి. 'నాన్న-నేను” అని వ్రాయండి. ఆ పుస్తకం మా బాలల అకాడమీ తరపున పబ్లిష్‌ చేస్తాము” అన్నారు. మరొకరు శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు. ఆయన కూడా ఇలా నేను ఏవో కబుర్లు చెపుతుంటే “ఇవన్నీ నువ్వు తప్పకుండా వ్రాయాలోయి, ఆ రోజులు, ఆ సభలు నువ్వు కలిసిన వ్యక్తులు ఇప్పటి వాళ్లకి తెలియాలి, వ్రాయి” అన్నారు.

మరొకరు శ్రీ డి.వి.నరసరాజు గారు. 2008లో ఎందుకో హైద్రాబాద్‌ వెళ్లాను. వారిని చూడ్డానికి జూన్లీ హిల్స్‌కి వారింటికి వెళ్లాను. వీరు మా నాన్నకి చాలా ఆప్తలు. నాకూ బాగా దగ్గిర వారు. మాటల మధ్యలో బుజ్ఞాయీ “నేను నా స్వీయ చరిత్ర వాస్తున్నాను” అని చెప్పారు. చాలా సంతోషం అన్నాను. నేనూ అటువంటిదేదో వ్రాస్తున్నాను. అది కూడా మా కోడలు చిత్ర (ప్రేరణ వల్ల అని చెప్పాను. “నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. తప్పకుండా తొందరగా పూర్తి చెయ్యి. నువ్వు నాన్నగారితో ఆయన వేలు పట్టుకు తిరిగావు. చాలా చాలా గొప్ప వ్యక్తులని ఎంతమందినో కలిసి ఉంటావు. వ్రాయి” అని వారు కూడా ధైర్యం చెప్పారు.

మరొకరు శ్రీ ఎం.యస్‌. మూర్తి గారు. వీరూ అదే అన్నారు. మీరు చెప్తున్న పద్ధతిలోనే వ్రాయండి. చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది అని ఒక షరతు పెట్టారు. అదేమిటంటే తాను పబ్లిష్‌ చెయ్యాలి అన్నారు. ఇంత మంది మిత్రులు వ్రాయమంటున్నారు అని ధైర్యం తెచ్చుకొని ఈ పనికి పూనుకున్నాను.

ఇంతవరకూ నేను ఎవరినీ దేనికోసం అర్థించలేదు. నా తండ్రి కానీ, నా పిల్లలు కానీ నాకు ఏదైనా చేసి పెట్టవలసి వస్తే ఒకసారి అడిగేవాణ్ణి. వాళ్లు చెయ్యకపోతే రెండోసారి జ్ఞాపకం చెయ్యను. కారణం వాళ్లకి ఇబ్బంది లేకపోతే వెంటనే చేసి ఉందురు. ఒకవేళ మరిచిపోతే నా మాట మీద వాళ్లకి ఎంత విలువుందో తెలుస్తుంది. ఇలాగే 79 విళ్లు ఎలానో లాగేశాను. 06 [౧9 0660 ౪౭౧/ 1౧6 10 ౧౧6. నేను రచయితను కాను. నా బొమ్మల కథలకి ఏదో వ్రాసుకోడం తప్ప పుస్తకాలు వ్రాయలేదు. నాకు పన్నేండేళ్ల వరకు జరిగిన సంఘటనలు స్ఫుటంగా జ్ఞాపకం ఉన్నాయి. సంవత్సరాలు ముందుది వెనకా-వెనకది ముందూ వ్రాసి ఉండవచ్చు. ఇవన్నీ నా జ్ఞాపకాలు, నా కథ. అందుచేత దీనిలో ఏమైనా తప్పులు ఉంటే మన్నిస్తారని తలుస్తాను. జా బుజ్జాయి

మా పూర్వీకులు

మా తాతలు ఇద్దరు అన్నదమ్ములు. పెద్దాయన పేరు దేవులపల్లి సుబ్బరాయ శాప్రి. రెండో ఆయన పేరు కృష్ణశాస్త్రి (తమ్మన్నశాప్రి; అని కూడా పిలిచేవారు. వీరిద్దరూ పిఠాపురం ఆస్థాన కవులు. వీరిద్దరిపైనా పిఠాపురం రాజాగారికి చెప్పలేని గౌరవమూ అభిమానము. వీరిద్దరూ ఇంటి దగ్గిర పూజచేసి, తీసుకుని వెళ్లి అక్షతలు వారిమీద వేసేవరకూ వారు బైటకు వచ్చేవారు కాదని చెప్పేవారు.

సుబ్బరాయశాప్రి గారికి (భార్య పేరు నాకు గుర్తు లేదు) అయిదుగురు కూతుళ్లు, తమ్మన్న శాస్త్రిగారికి ఇద్దరు కూతుళ్లు-వెంకట రమణమ్మ, వెంకట రత్నమ్మ. ఒక కొడుకు, ఆయన పేరు కృష్ణశాస్త్రి (మానాన్న. వీరిది ఉమ్మడి కుటుంబం. మా నాన్నకి ఆరుగురు అక్కలు, ఒక చెల్లెలు అన్నమాట. మా నాయనమ్మ పిఠాపురం దివాన్‌గారి ఏకైక కుమార్తె. చాలా అస్పిపరులూ, మోతుబరులు. ఆమె నిద్ర లేచేటప్పటికి తలకింద ఒక బంగారపు కాసు వాళ్ల తండ్రిగారు రోజూ పెట్టేవారట. మా నాయనమ్మ చెబుతూ ఉండేది. ఆమె పేరు సీతమ్మ.

మా తాతలకి రాజాగారు, ఆ రోజుల్లో 200 ఎకరాల పొలం ఇచ్చారట. ఏడుగురు కూళుళ్లకీ వివాహాలు చేశారు. వందెకరాల పొలం అమ్మేశారు. మా నాన్న అంటే అక్కలందరికీ చెప్పలేని ప్రేమ. తమ్ముడు- తమ్ముడని ఎంతో గారం చేసేవారట. ఇంక వారి పెద్ద నాన్నగారికి చెప్పక్కరలేదు. చెప్పలేని (ప్రేమ. మా నాన్నగారిని బొజ్జమీద కూచో బెట్టుకుని “అమరకోశం”, ఇతర కావ్యాలు చెప్పేవారట. “పెద్దయ్యాక నీకు పెళ్లి అయి, కొడుకు పుడితే ఎవరి పేరు పెడతావురా?” అని మా నాన్నగారిని ఆయన అడిగేవారట. “మీ పేరే” అని మా నాన్న అనేవారట. అందుకే నాకు “సుబ్బరాయ శాస్తి' అని పేరు పెట్టారు.

ఈ ఉమ్మడి కుటుంబంలోకి అల్లుళ్లు రావడంతో గొడవలు (ప్రారంభం అయ్యాయి. పెద్దాయన అల్లుళ్లలో ఒకాయన పెద్ద “పొలిటీషియన్‌”. ఆస్తి పంచాలనే గొడవలు తెచ్చిపెట్టాడు. దీనితో రామ లక్ష్మణుల్లాగ ఉంటున్న మా తాతలకి ఏం చెయ్యాలో తెలియలేదు. మా పెద్ద తాతగారికి గుండెపోటు వచ్చింది. ఆయన చేత ఏవో సంతకాలు పెట్టించేశారు. మరి కొద్ది రోజులకి ఆయన మరణించారు. అన్నగారు చనిపోగానే బెంగ పెట్టుకుని మా తాతగారు కూడా సంవత్సరం తిరగకుందా మరణించారు. అప్పుడు మా నాన్నకి 12 ఏళ్లు. పిఠాపురం రాజాగారికి మా తాతలు పంచుకున్నారని తెలిసి ముందు చాలా కోపం వచ్చిందట. కాన్సీ,

19

టీ దేవులపల్లి నెశిదర కవులు న. జ పిఠాపురం ఆస్థాన పండితులు “యయ. న. ఫా. .! | న [. లీ న ॥. మూ న తో ల క | ్టే న్నే ను. న. 11 టు వ్‌ ః ను న! 5. కట సు 1౯ టి మళ. | స స టి 1... ం స్ట వర కీ 1 0! ట్‌ యట ( | 2 నన ర. శే న. స్థ మము 401 శ! శ్రీ దేవులపల్లి సుబ్టరాయ శాస్త్రిగారు