Telugu mukhouta - anilvaranasi/indianlanguages GitHub Wiki
ననన న ననన . | ల హనీఫ్ కవిత హనిఫ్ కవిత్వం లలో ళ్ జగ | . న ఫ్ రో / = శే క గ్ర] / ల్ల ం భ్ శో గ ॥ ్న ఎ స్ట _ నాం | గ దమం అలీ జో వ? పు , వ్ సీ" " || / క టి 1 | న. న శ షాక గ్రట..) రక ళో | జ. / ం వ 3 ఆ
ముఖాటో (కవితాసంకలనం) హనీఫ్ ఆసిఫ్ ప్రచురణలు కొస్తీసూడెం
ముఖౌటా (కవితా సంకలనం) 2% 4 ఇ టుటే ద్వితీయ ప్రచురణ ద్వ ట్ట ౯ ఆసిఫ్ ప్రచురణలు ణో (ప్రచురణకాలం జూన్ - 2002 ముఖచిత్రం అక్బర్ 50 ంా వెల గా రు.15-00 / ధ్రములకా న్ చనల వస హనీఫ్ వ్ కేరాఫ్, ఎస్‌శె. అబ్నాస్ విప ణా . డిసి వ్ న్ త42కే ర. +సి - 98,బాబూ క్యాంపు న. పోగ కొత్తగూడెం-507101 ( న ఖమ్మం. నీ వ్ల లో హార్తర్య ా *' మరియు న అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలలో.
. . సృజరాత్ ఎ... మృటం కోసం...
మరణాలు పొదిగిన అక్షరాలు అజీబ్ కుచ్ లుత్‌ఫ్ రఖ్‌తాహై షబ్-ఎ-వసల్ మే దిల్‌బర్ సుణ్ సవాల్ ఆహిస్తా ఆహిస్తా జవాబ్ అహిస్తా ఆహిస్తా + . ( ఏకాంత సమాగమపు రాత్రి ఎంత మధురం మెల్లమెల్లన అడగటం, అల్లనల్లన చెప్పడం) విరహసమాగమాల దాగుడుమూతలని,మత్తుకీ మెలకువకీ నడుము ప్రవాసాలని అద్భుతమైన గాఢతనుంచి సరళతనుంచి పలికించే ఉర్పూ కవితకు వలీ థఖనీ పితామహుడు. నిశ్చింత నిండిన ఒక రహస్యపురాత్రి ప్రేయసీప్రియుల మధ్య జరిగే ప్రణయపు ఖవ్వాలీని నాలుగు వందల ఏండ్ల కిందట అతను పై ద్విపదలో ఆలపించాడు. ఇప్పుడిక ఏ సవాళ్ళూ జవాబులూ మెల్లమెల్లన, అల్లనల్లన లేనే లేవు. ఒకరినొకరు నాప్పించ గూడని సన్నితత్వాల సంభాషణలు లేవు. అసలిప్పుడక్కడ వలీ దఖనీ లేడు. ఏ భావుకతా లేదు. ఉట్టి నెత్తురు, మనిషి మంసం కాలిన కమురు వాసన, మరణంలో అణగారిపోయిన ఆర్తనాదం,. భయం,బీభత్సం,విజయోత్సాహం...... స్మరించుకోవడానికి ఇష్టపడని దుఃఖం గుజరాత్, తలచుకోవడానికి భయంవేసే ఒక బీభత్సం గుజరాత్. చాటేసే ప్రతిబింబం గుజరాత్ ఎదుర్కొనలేని నేరం గుజరాత్, గుజరాతనుంచి, దాని సంపూర్ణ అర్భాలనుంచి ఇంకా అందరం దాక్కుంటూనే ఉన్నాము. దాని భీతావహం నుంచి అది వాగ్దానం చేస్తున్న సుదీర్ధ దుస్స్వప్పం నుంచి ఒకానాక ఆదిమ నిస్సహాయతలో కంపించి పోతున్నాము. ఇప్పుడిప్పుడే 'పెగులుతున్న గొంతుతో మృతుల కోసమో, జీవన్సతులకోసమో, శరణార్థుల కోసమో, చివరకు నేరస్థులకోసమో బలహీనంగావైనా రోదించడం తప్ప మరేమీ చేయలేకపోతున్నాము. మహానాయకుడిని క్షుద్రకావ్యంతో అవమానించలేనంటాడు మయ్‌కోవిస్కీ. బహుశా అతని దృష్టిలో కావ్యమే క్షుద్రమైనది. అనుక్షణం కోటానుకోట్ల ఇతివృత్తాలను రచించే కాలం ముందు, ఏకకాలంలో అనంతకోటి జననమరణాలను నిర్వహించే సృష్టిముందు, ఏకకాలంలో యుగాంతరాలను జీవించే మానవసమాజం ముందు కావ్యం క్షుద్రమైనది
కాకపోవచ్చు కానీ, కనీసం అల్పమైనది. కవిత్వం ఒక్కొక్కసారి ఎంతటి నిస్సహాయం అంటే- అల్పబుద్ది అయిన కుటిలుడి సృజనాత్మకశక్తి ముందు కవి" ఎందుకూ పనికిరాడు/రాదు. రాముడి పేరు ధరించిన కృపాణం గర్భస్థశిశువును ముద్దాడిన
జగదభిరామ దృశ్యానికి ఒక ఉపమను, ఒక్క రూపకాన్ని కనిపెట్టడం సాధ్యమా ?
కట్టకట్టి మనుషులను నిప్పులో ముంచిన అసాంఘిక పరివారానికి సరితూగగలిగిన
విశేషణాన్ని కల్పించగలమా? ఇక్కడ కావ్యం విఫలమే కావాలి, అక్షరం అల్లుకుపోయి
కన్నీరే మిగలాలి. హనీఫ్ అక్షరాలా మొదలుపెట్టిన ఈ గుజరాత్ కావ్యం చివరకు
నెత్తుటిమడుగుగా హహాకారాల సంపుటిగా, ఒక అథ్రుఘోషగా పరిఐమించడం అందువల్లనే
అనుకుంటాను.
హనీఫ్ పేరు. తెలుసును కానీ అతనితో నాకు పరిచయంలేదు. సరికొత్త గొంతుగా,
మంచి కలంగా అతని గురించి ఆరేడేళ్ళ కిందట విన్నాను. విప్లవాభిమానం, దళిత
స్పృహ, మైనారిటీవాద ఆలోచనలు కలగలసిన మంచి కవితలు అతని మొదటి సంపుటం
'ఇక ఊరు నిద్ర పోదు' (1995)లో కనిపిస్తాయి. బాబ్రీ విధ్వంసం అస్తిత్వమూలాల
మీద వేసిన దెబ్బ గుండెను మెలిపెడుతున్నా, దళితవాద ఉద్యమం చేస్తున్న ఒక
కొత్తవాగ్హానం, మత-కులతత్వ శక్తులకు ఎదురుగా ఒక సువిశాల ప్రజాఐక్యసంఘటన
సాధ్యమన్న స్వప్పం హనీఫ్‌నే కాదు, అతని పూర్వపు సమకాలికపు ముస్లిం కవులందరినీ
ఎంతో కొంత ఓదార్చింది. అంతకు మించి, అంతిమవిజయం ప్రజాశ్రేణులదే అంటూ
విప్ణవరాజకీయాలు అందించే భరోసా కూడా తోడయి హనీఫ్ కవిత్వం ఎంతో స్టైర్యాన్ని
ప్రకటించింది. ఇన్ని సంవత్సరాల తరువాత అతను ప్రచురిస్తున్న ఈ కవితా సంకలనంలో
ఆ స్థైర్యం లేదు అనిపిస్తున్నదంటే- అది హనీఫ్ కవిత్వంలో కలిగిన లోటుకాదు. హనీఫ్
దగ్గరినుంచి, అతను పొదుగుతున్న స్వప్నాలను పంచుకుంటున్న వారందరి దగ్గరినుంచి
ఆ స్థైర్యాన్ని కొల్లగొట్టారు. హనీఫ్‌కు ధైర్యం ఇవ్వడానికి అసలు ఇప్పుడెవ్వరిదగ్గరా ధైర్యమే
లేదు. ఇది నిరాశను పలకడం కాదు, ఆత్మవంచన లేని ఎరుక. ఈ చీకటిలోనుంచి ఎలాగో ఈదుకునిపోతాము, కానీ, ఈ మనుగడ పోరాటంలో ఏదో వాగ్దానం లోపించింది. అ లోపాన్ని ఆ స్టైర్యరాహిత్యాన్ని ఆ చేలతనాన్ని ప్రతిబింబించినందుకు హనీఫ్‌ను అభినందించాలి.
ఈ కవిత్వ సంపుటికి హనీఫ్ ' ముఖౌటా అనిపేరు పెట్టాడు. చిరిగిపోయింది కేవలం వాజ్‌పాయి ముఖకవచం మాత్రమే అని హనీఫ్ భావిస్తున్నాడనుకోను. వాజ్‌పాయిది
మోసపు ముసుగు అయితే, సెక్యులర్; ఫెడరల్, ప్రాంతీయ రాజకీయశక్తుల స్వభావాలు కప్పుకుని ఉన్న విలువల ముసుగు, దళిత-సామాజిక న్యాయ రాజకీయాలు కప్పుకుని ఉన్న సంఘీభావాల ముసుగు, కమ్యూనిస్టులు కప్పుకుని ఉన్న ప్రత్యామ్నాయాల ముసుగు- అన్నిటినీ త్రిశూలపాణులు చీల్చిపారేశారు. ఒకేఒక్క చిరుగుల ఆశల దుప్పటికింద దాక్కున్న మియా-బీబీలను మృగం కనిపెట్టేసింది. దీపం ఆరిపోబోతున్నట్టుంది చుట్టూ నా శరీరపుదళ్ళమధ్య కొన ఊపిరితో 'లౌకికత్వం' ( మూడు సంద్రాలు ) ఇప్పుడు కావలసింది ముస్లిములకు ఒక సాంత రాజకీయపార్టీ అన్న అభిప్రాయం గుజరాత్ హింస ్రారంభమైన తరువాత పదేపదే వినిపిస్తున్నది. “భరోసాలు కర్పూరంలా హరించుకుపోతు” న్నప్పుడు జరుగుతున్న కొత్త వెదుకులాట అది. ముస్లిం మనస్థితిమీద గుజరాత్ వేసిన ముద్రలన్నిటినీ హనీఫ్ కనిపెట్టగలిగాడు, కానీ, అతను నా వంటి ముస్టిమేతర పరిశీలకుడు కాకపోవడం వల్ల, అతను గుజరాత్‌లోనుంచి తప్ప మాట్లాడలేకపోవడం వల్ల- హింసాబీభత్సాలు కల్పించిన కంపంనుంచి, భయాందోళనల నుంచి, దీనత్వంనుంచి తన గొంతును వినిపిస్తున్నాడు. గుజరాత్ హింస అంతా ప్రతీకారమూ ్రతిక్రియే అన్న వాదానికి చాలా గౌరవమిచ్చి, ఆ ప్రతీకారంలోని నిర్విచక్షణను, తీవ్రతను కవి చాలాచోట్ల ఖండిస్తాడు. ఎవడికో మతిచెడింది ఇంటిని పొక్కిలి చీశారు గునపాలతో ఆలోచించి గోరీలను తవ్వుకుంటున్నారు ఒక అల్లరిమూకకు పశుత్వం ఆవహించి నన్ను సజీవదహనం చేస్తున్నారు ! నా పోలికలతోటి వాడి దేహం కవురు వాసన వేస్తున్నది (సహదహనం )
గోధ్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ తగులబెట్టిన సంఘటన తీవ్రంగా ఖండించదగ్గదే. ఈ అతిపెద్ద రాజకీయ సమరంలో గోధ్రామృతులు అనాధలు కావలసిన అవసరమేమీ లేదు. అయితే, ఆనాటి సంఘటన జరిగిన తీరుతెన్నుల గురించి పూర్తి వాస్తవాలు ఇంకా బయటపడనే లేదు. కరసేవకులకు, ప్లాట్‌ఫాం మీద చిల్లరవ్యాపారం చేసే ముస్లిం వెండర్లకు మధ్య జరిగిన వాగ్వాదం, ఘర్షణ చిలికిచిలికి ఆ దుర్శటనకు దారితీసిందని అందరూ ఒప్పుకుంటున్న ఒక కథనం. అయోధ్యలోని పరిణామాల వల్ల కలవరం చెందుతున్న ఆవేశపరులైన మిలిటెంట్ ముస్లింలు ఆ సంఘటనలో పాల్గొని ఉండవచ్చు. అయినప్పటిక్సీ- గోద్రా ముందుగా పథకం వేసుకుని జరిపిన హత్యాకాండ కాదని అంతర్జాతీయ పరిశీలన బృందాలు కూడా నిర్ధారించాయి. గోధ్రా జరగకున్నా మరేదో సాకు పెట్టుకుని కూడా హిందుత్వ టెర్రరిస్టులు ఇటువంటి దారుణాలకు పాల్పడి ఉండేవారని 'హ్యూమన్‌రైట్స్‌వాచ్' అభిప్రాయపడింది.
గోధ్రా అనంతర హింసాకాండకు గోధ్రాయే కారణమని భావిస్తే- ఫాసిస్టు శక్తులు విజయం సాధించినట్టే. సబర్మతి దహనకాండ జరిగిన తరువాత పన్నెండుగంటల వ్యవధిలోనే దుకొణాల సముదాయాలు, వ్యాపారాల జాబితాను మతాలవారీగా కంప్యూటర్ ప్రింట్ అవుట్‌లు సిద్ధమయి దాడులు ప్రారంభమయ్యాయి. వేలాది గ్యాస్ సిలిండెర్లు, లక్షలాది లీటర్ల కిరోసిన్ దుండగులకు అందుబాటులోకి వచ్చాయి. సెల్‌ఫోన్‌ల సహాయంతో వివిధ ప్రాంతాలలోని దొడులను సమన్వయపరుస్తూ, తగిన ఆదేశాలు ఇస్తూ టెర్రరిస్టు నాయకత్వం నరమేధాన్ని కొనసాగించింది.
ఒక ఛిద్రమైన దృశ్యాన్ని
పటంకట్టి మెడలో వేలాడేశావు
ఛిద్రదృశ్యాన్ని అడ్డు పేట్టుకొని
మా శరీరాల మీద
వేనవేల గోరీలను తవ్విపాతేస్తున్నావు ( ముఖౌటా )
హనీఫ్ సరిగానే గుర్తించినట్టు, “ఛిద్రదృశ్యం' ఒక నెపం మాత్రమే. గుజరాత్‌లో సంఘపరివారం నిర్వహించదలచిన ఒక ప్రయోగానికి ఆలంబన మాత్రమే. అయినా కవి ఇక్కడ టెర్రరిస్టుల హింసాకాండను తక్కువ పోలికలతో తూస్తున్నా డనిపిస్తుంది. " “ చీమకుట్టిందని చీమలపుట్టని ధ్వంసించాలని పిల్లల మనస్తత్వం అని సరిపెట్టుకోలేకపోతున్నాను ” తెలిసీతలియని వయసులో పిల్లలు చీమలను నలిపిచంపడం వంటిది కాదు గుజరాత్ హింస. “తాము కాని ఇతరులను" శిక్షించడానికి, అణచివుంచడానికి, లొంగదీసుకోవడానికి ఫొసిస్పలు ఉద్దేశ్యపూర్వకంగా పథకం ప్రకారం అనుసరించిన మారణకాండ. అంతేకాదు, ఒక అల్పసంఖ్యాకవర్గాన్ని మెజారిటీ ప్రజలకు శత్రువుగా నిర్ధారించి, తిరుగులేని అధికారాన్ని చెలాయించడానికి పాలకులు అనుసరించిన ఎత్తుగడ. మొత్తం సమాజాన్ని అమానవీకరించి, తాము అమోదించని పద్ధతిలో జీవించని 'ఇతరులు” అందరినీ శిక్షించడానికి ఒక ఆమోదనీయతను సాధించుకునే కుతంత్రం, ఇది కేవలం రాముడి వ్యవహారం కాదు. “ అందరిల్హానే తల్లి కడుపునుంచే 'పెనుగులాడి పుట్టకొచ్చాను నా జన్మభూమిని తాకిచూడు ఉమ్మతడి ఇంకిన ఆనవాళ్ళు లభిస్తాయ్ " (పెనుగులాట ) అంటూ దేశభక్తిని నిరూపించుకునే ప్రయత్నాల వల్ల ప్రయోజనమేమీ లేదు. ఇప్పుడు బాబ్రీమసీదు సమస్యలో పూర్తిగా లొంగుబాటు ప్రదర్శించి, రాముడిగుడికి సమ్మతించినా ముస్లిముల మీద జరిగే పీడన ఆగిపోదు. సమస్యలు,వివాదాలు, ఆరోపణలు, ఆపాదనలు
అన్నీ నిమిత్తమాత్రం. మిశ్రమ ప్రభుత్వాల ముఖౌటా వెనుక ఈ పథకాలన్నీ ఎప్పుడో రూపకల్పన పొందాయి. బోస్నియా, చెచెన్యా, ఇజ్రాయిల్, కాశ్మీర్‌లో ప్రభుత్వ సైన్యాలు, ప్రభుత్వం లైసెన్సు ఇచ్చిన కిరాయిమూకలు ఇచ్చిన పేరణతో తొగాడియా అండ్ కంపెనీ మియాల “ముడ్గలో కొరకంచులు పెట్టడానికి, బీవీల జననాంగాలను వదులుచేయడానికి” పెద్దపన్నాగమే వేసింది. హిందువులలో కలుపుకుంటామని దళితులను, ఆదివాసులను ప్రలోభపరిచి, అయిదువందల రూపాయలకో హత్యను సిద్ధం చేసింది. నేటి గుజరాతే రేపటి భారత్. ముస్లిములను, పాకిస్తాన్‌ను బూచివలె, ఆగక్రమణదారులవలె చూపించి, దేశాన్ని మొత్తం అమెరికాకు తెగనమ్మడానికి ఫాసిస్టులు పన్నుతున్న కుట్ర. ద్వేషాన్ని మరెవరిమీదకో రీడైరెక్ట్ చేయకపోతే మనుగడ సాగించలేనంత దివాళాకోరు స్థితిలో ఈ నాయకుల పలుకుబడి ఉన్నది. షాయరీలు చదువుతూ, తన గేయాలను ఎంటీవీ దృశ్యాలుగా మలున్తున్న ఈ దేశప్రధాని 'అత్యాచారాలన్నీ అతిశయోక్తులు” అనేసి తన గొంతులో దాచుకున్న త్రిశూలాన్ని బహిరంగపరిచాడు. ఇక అతనిని 'కాకులగూట్లో పాదగబడ్డా కోకిల” అని ఎలా అనుకోగలం?
సెప్టెంబర్-11 తరువాత ముస్లింవేదన నిజమైన అర్థంలో గ్లోబలైజ్ అయింది. ప్రపంచ మంతటా ఇప్పుడు ముస్లింకు ఒకే అర్ధం. ఈ అర్థం నుంచి విముక్తి కావాలంటే రాజకీయ మార్గాలు కొత్తవి అవతరించవలసిందే. వైఫల్యాలకు ఒక ఎలిజీ రాసుకుని, కొత్త తెగింపులను స్వాగతించవలసిందే. అవకాశవాద అశ్వాలు పూన్చిన సెక్యులరిజం రథం ముస్లింలనే కాదు, 'స్వేచ్భను కోరే ఏ ప్రజాశ్రేణ్‌నీ దరిచేర్చదు.
కొత్తగూడెంలో, కోయలనుంచి రామదాసులు అపహరించిన రామభద్రుడి గుడికి అతి దగ్గరలో హనీఫ్ ఉంటున్నాడు. ఇంకా తన సాత్వికతనుంచి, సవాళ్లూ జవాబులూ “అహిస్తా అహిస్తా' శ్రైలినుంచి మాట్లాడుతున్నాడు.
మాసిన గడ్డం
చిరుగులు పట్టిన
లాల్చీ పైజామా
కుచేలుణ్లి.... తాను అనీ, ఈద్‌నాడు కృష్ణుడిలా తన ఇంటికి రమ్మని అసమానమైనదే అయినా గాఢమయిన ఒక స్నేహాన్ని గుర్తుచేస్తున్నాడు.“పీర్ణపండుగలో పీరీనెత్తుకుని
తూగుతూ వరా లిచ్చినొ లింగయ్యనూ, దీపావళి టపాకాయలకు గాయపడ్డ తననూ పక్క పక్కన నెలబెట్టి ఒక సామరస్య సహజీవనాన్ని స్ఫురింపజేస్తున్నాడు. ఇవన్నీ విఫలమైన మానవత్వాలు కావా హనీఫ్, మెచ్చుకోలేనప్పటికీ, హనీఫ్‌లో నచ్చే అంశమే అది. ఓడిపోయినప్పటికీ, పాతబడినప్పటిక్తీ, ఎంతో అనమర్ధంగా కనిపిస్తున్నప్పటికీ ప్రాచీనమైన మానవీయ అంశను అతను వదులుకోవడానికి సిద్ధంగా లేడు. మనిషిమీద నమ్మకాన్ని అతను కాదనుకోలేక పోతున్నాడు. “తల్లిదండ్రుల్ని అల్లుకొనిపోయి నిద్రపోయే లక్షణాన్ని బిడ్డల్నుంచి ఏ ఫాసిజం మాన్పించ గలదు” అని సహజాత, మానవీయ అనుబంధాలలో రక్షణను భావిస్తున్నాడు. తల్లిదండ్రులనీ పిల్లలనీ తాళ్ళతో కట్టకట్టి సజీవదహనం చేసిన దృశ్యాలు గుజరాత్‌లో ఎన్నో ప్రతిహింసాకాంక్షను, కసినీ కార్చణ్యాన్నీ రేకెత్తించడం ఎంతసేపు? వాటిని సంఘపరివార్‌శక్తులే రేపటి ముస్లింతరంలో రగిలించాయి, కానీ మానవత్వం మీద హనీఫ్ మిగుల్చుకుంటున్న విశ్వాసం ఎంతో విలువైనది, ఆ విశ్వాసం వల్ల హనీఫ్‌లు అనేకమార్లు భంగపడవలసి వచ్చినా సరే. హనీఫ్ కవిత్వంలోని విశేషాల గురించి ఏమీ రాయడంలేదు. గుజరాత్ గురించిన కవిత్వం అన్న ఆలోచనే ఎందుకో మనసులో పలుగురాయివలే తగులుతున్నది. గుజరాత్ తన గుండెకు చేసిన గాయంమీద పద్యాలు రాయడం మొదలుపెట్టిన హనీఫ్ వాటిని పూర్తిచేసి పుస్తకం వేసిన తరువాత కూడా ఇంకా ఇతివృత్తం రుగులుతూనే ఉండడం విషాదం. గుజరాత్‌లోని “రాతొకు ఉన్న శ్లేష ఫలించడం కోసం కడవళ్లకొద్దీ నెత్తురు ఖర్చయింది. అంత ఖరీదైన కవిత్వం ఏ దేశానికీ ఏ జాతికీ, ఏ మతానికీ వద్దు. హనీఫ్‌ది కవిత్వం కాదు. కన్నీరు. ఎర్రగా ప్రవహిస్తున్న కన్నీరు. “క్షణక్షణం చావుని గుండెలకత్తుకుంటున్నాం అప్పల గుర్తుగా ఎన్ని తాజ్‌ుమహళ్ళు వంటినిండా చెక్కుకోను” ( హల్లా...! )
| - కె.శ్రీనివాస్, హైదరాబాద్. ది.05-06-2002
బాధలు పూసేచెట్టు
ఎవరికి వారు
మౌనం వహిస్తున్న రాజమార్గం కాదు నా కాలిబాట
క్షణం ముందు నేను నడిచి వెళ్ళిన దారినిండా
అడుగుల ఆనవాళ్ళు కొత్తబాధను ప్రకటిస్తూ పోతున్నాయి క్షతగాత్రుణ్ణి కాబట్టి
కుంటుకుంటూనో డేక్కుంటూనో వెళ్ళిపోతాను
నగరాల వీధులనిండా
గ్రామాల ఎడ్డబండ్ల బాటలనిండా
రక్తపు ఆనవాళ్ళు చిత్రపటాలు జారవిడుచుకుంటూ వెళ్ళిపోతాను కళ్ళు చమర్చకపోయినా
తీరిక వేళల్లో ఎప్పుడైనా
ఖబరస్తాన్ వైపు వచ్చినపుడు
మౌనం మూట గట్టుకొని తేబోకు
నా జ్ఞాపకాల్ని కరచాలనాలని కొన్నింటిని
కన్నీటి పాదులుపెట్ట
నీ మౌనాన్ని పారదోలి అవైనా పుప్పిస్తాయి
జ ఖా జ
ఎవరికి వారు
మౌనం వీడి మాట్లాడండి
మహల్లాలు మన వాడలేనని శత్రుమూకల చేత కొందరు చనిపోయినా నాలో చెలరేగిన వ్యధ అసంఖ్యాక భారతీయ ముస్లింలను జన్మనిస్తుంది
నా కాం
లౌకిక రాజ్యం
చేతులకు చూపుడు వేలుందని
కాళ్ళకుదాటే గుణముందని బంధించావు
నవరంధ్రాల్ని మూసివేసిన
జీవచ్చవ చిత్రాన్ని
నిబ్బరంగా బతుకేస్తున్నాడని
కాషాయ పతాకాన్ని
సమాధులపై రెపరెపలాడిస్తున్నావు
ఇంకేం మిగిలిందని
నాశరీరాన్ని సోదా పేరుతో
పారదర్శక తవ్వకాలు మొదలు పెట్టావు
నా విశ్వాసాలని నాలోనే గోరీ తవ్వుకొని
మురిగ్గుంటలా బతికేయమని
మెజార్టీపాదాలు నా నోరు తోక్కేస్తున్నాయ్
నవ్వమ్మన్నపుడు నవ్వాలి ,
ఏడ్పుని గోప్యంగానే ప్రకటించాలి
సబర్మతి ఆశ్రమంచుట్టూ కాస్త నీడకోసం
హా..హా కారాలు చేస్తూ పిల్లలు ప్రీలు,వృద్ధులు
భయకంపితులై తీసిన పరుగులు
ప్రాణం కంటే మానరక్షణకై పెనుగులాట దృశ్యం
నీ శిలాహృదయం ద్రవించలేదు
'సేపర్‌లా పొట్టను చింపి
కర్ప్చూజా ముక్కల్లా తెగ్గొట్టిన పసికందు శరీరం
నీ చేతుల నిండా లేత రక్తజలపాతం
అపర కీచకుల్లా స్వైరవిహారాలు యు
నేనెట్లా మర్చిపోతాను
లౌకిక రాజ్యాంగం శరీరం నిండా
నానెళ్తుటి రంగు పులముకుండా
నేను నశించిపోతే
నీలోని మృగం మళ్ళీ మనిషిరూపం దాలిస్తే . మానవతకెంత నష్టం
ఉన్మాదులు ఈ రోజుకు ఈరోజే ఇరువురు ఉన్మాదులు కాలేదు ఉపేక్ష ఎంత చెడ్డది ఇంటిముందు చెట్టుని నాటుకుంటాం నియంత్రించకుంటే ఇంటినే కబళించేస్తుంది ప్రజాస్వామ్యం ముసుగులో బ్రహ్మజెముళ్ళకు పాలిచ్చి పోషిస్తున్నారు మళతం చెదలు వంటిది తల నేలపై తెగిపడినా మనిషిని కాటేయకమానదు | 14 ముఖౌటా |
దోస్తానా
పీర్ల పండుగలో
పీఠీ నెత్తుకొని
తూగుతూ వరాలిచ్చిన
మా లింగయ్య
అలావా అలికి
సున్నం పిడికిళ్ళద్దిన
దోస్తానా కనుమరుగౌతుంది
షర్బత్ కుండలు
దాహార్తుల కోసం
మునుపట్టాగే
తొణికిసలాడుతున్నాయి
హృదయాలకు
హత్తుకొని
ఈద్ ముబారక్‌ల నడుమ
హరివిల్లులా ఉండేవాళ్ళం
నా రూమీటోపీని చూపి
కూడికలు తీసివేతలు
ప్రయత్నపూర్వకంగా
అల్లికల కథలు విన్చిస్తున్నాయ్ హనీఫ్ కవిత్వం 5]
మానవ జాతంతటికి
చల్లని వెన్నెలనిచ్చేది చంద్రుడే _
నేరపు మచ్చలు ఆపొదించకండి దీపావళి పండుగ సంబరాల్లో చిన్నప్పుడు నేనెన్నిసార్లు
వళ్ళు కాల్చుకున్నాను
ఆ బర్రల ఆనవాళ్ళ
తీపి జ్ఞాపకాలు
నే కడతేరి పోతేగాని మాసిపోవు
మాసిన గడ్డం
చిరుగులు పట్టిన
లాల్చీ పైజామా
కుచేలుణ్ణి తలపించడంలా ఈద్ నాడు
కృష్ణుడువై
మా ఇంటికొచ్చిపో
మానవ హక్కులు దుఃఖం కళ్ళు పెళ్ళగించుకొని రావడం లేదు కళ్ళు గాజు శిలలు కన్నీళ్ళు తగలబడుతున్న సంచభూతాల్లో "కలిసిపోయాయి ॥ కత్తులు,కరవాలాల నినాదాల హోరులో మనిషి ఏకొకిలా కాలిపోతున్నాడు వాకిళ్ళనిండా కుటుంబాల రక్తపుమడుగులు అస్తికల ముగ్గును చల్లారు మృగం అడుగు జాడల్ని వాకిలి ముద్రించి పట్టేసుకుంది భరోసాలు కర్పూరంలా హరించుకుపోతున్నాయి
దోషులు శిక్షించబడాలి గాయం ఎందువల్లనైతేనేం రక్తం ఒడుస్తున్నది నాశరీరమే అపరాధం చేసినందుకు కాదు మనిషి రూపం దాల్చినందుకీ శిక్ష పసికందైనా ముసలైనా మృగం ముందు మాంసమే గాయం రక్తం ఒడుస్తున్నది . భవిత బెదురుచూపులు లంకించుకున్నది నగరాల నుంచి గ్రామాల వరకు మానవ శరీరాల కవురు వాసన వేస్తున్నది గోద్రా సంఘటనలో దోషుల్ని మేం విడిచిపెట్టం' రాజ్యం రంకెలు వేస్తున్నది ఇంతకీ దోషులెవరు ?! భయం బండకింద కూరుకుపోతున్న ఆర్తనాదం ఎవరిది?
పెనుగులాట శరీరం తడి ఇంకిపోయి కత్తిలా మారిపోతోంది గాలితాకినా కరచాలనం ఏదో వెంటాడుతున్నట్లు కవాటాల నిండా (ప్రేమకాదు కషాయం నింపుకోక తప్పదు చీమకుట్టిందని చీమలపుట్టని ధ్వంసించాలని పిల్లల మనస్తత్వం అని సరిపెట్టకోలేకపోతున్నాం ప్రయత్నిస్తేనే కదా పరామర్శించేది కరిగిపోతేనే గదా కావులించుకునేది చీమకుట్టడంలోనూ కుట్ర దాగుందనిపిస్తుంది రెండు చేతులు కలిస్తేనే శబ్దం ఓ బూటకం చెంప కదలకపోయినా చెళ్ళుమనే శబ్దం మారుమోగుతున్న కాలం అందరిలాగే తల్లి కడుపు నుంచే పెనుగులాడి పుట్టుకొచ్చాను తల్లి రక్తం నేల తడిసింతరువాతే కెవ్వుమన్నాను జన్మస్థలం ఎవరోపడేసిన భిక్షకాదు నా జన్మభూమిని తాకిచూడు ఉమ్మతడి ఇంకిన ఆనవాళ్ళు లభిస్తాయ్
సహదహనం ఎవడికో మతిచెడింది ఇంటిని పొక్కిలి చేశారు గునపాలతో ఆలోచించి గోరీలను తవ్వుకుంటున్నారు ఒక అల్లరిమూకకు పశుత్వం ఆవహించి నన్ను సజీవదహనం చేస్తున్నారు / నా పోలికలతోటి వాడిదేహం కవురు వాసన వేస్తున్నది చేతులను నరికేస్తున్నారు అన్నం ఆనవాలుని తుడిచేయ చూస్తున్నారు
ముఖౌటా ఇష్టమైన దానిమోద ఒక కాకి వాలితే కాకి జాతినంతటినీ శపించే పురాణ కథల నడుమ పెరిగిన బాల్యం పిచుక గూళ్ళను కూల్చేయకుండా ఉండగలదా ? ణ్ య జ్జ ఒక ఛిద్రమైన దృశ్యాన్ని పటం కట్టీ మెడలో వేలాడేశావు దృశ్యానికి ముందు గాలి నిండా ఆవరించిన అవమానాలు,అవహేళనలు చెరచబడ్డ చెల్లెలి ఆర్తనాదాలు ఏవీ అమానవీయ చిత్రాలుగా మిగలవు రగిలిన ఆత్మలు ఏమి మాట్టాడగూడదు ఛిద్ర దృశ్యాన్ని అడ్డు పెట్టకొని మా శరీరాల మోద వేనవేల గోరీలను తవ్వి పాతేస్తున్నావు ఐదు వందలకో ఖూనీఖోర్ దొరికినపుడు దుకాణాలు భవనాలు మానాలు కూల్చబడకుండా ఎలా నిల్చుంటాయ్ ఇక్కడ పోట్టాడడానికి,చావడానికి నేనే వీధొక్కాలి బంధీనైనా మనవ బాంబు నైనా “అరాఫత్ లానే సిద్దపడాలి
ఏముఖొటాలు తోడంప్ర ణి న్నే ణ్ కాకుల గూట్లో పాదగపడ్డా అది కోకిలా అని బ్రమించాం గొంతు అరువుతెచ్చుకుందని ఇప్పటిగ్గాని బయట సడలేదు మావిచిగురు కాదు మానవ కసరు దాని ఆహారం [2 ముఖౌటా !
ఊర్గో ఓమూల
టోపీ పైజమా లాల్చీ దుస్తులు
తొడుక్కున్న నాదేహం కాలి బూడిదౌతున్నది ఆర్బేందుకో
ఆలస్యంగానైనా పోయి
అస్తికలు ఖననం చేసేందుకో
నా మహల్లా కళ్ళు తెరిస్తే
మతోన్మాదం మూగిందంటావేంటి
గాలి వీచినపుడు
ఎండిన అకులు శబ్దం చేస్తూనే
నేల రాల్తాయి
దాన్ని 'హల్లా” క్యాష్టన్ తగిలించకు
నువు లక్ష ఆరోపణలు చేయి
నానెత్తిన టోపి తీసి ఎందుకు దాచుకోవాలి ? జమా మసీదుల నిండా
ఏం ఆశించి పావురాల గుంపులు వాల్తాయో మరి క్షణ క్షణం చావుని గుండెలకత్తుకుంటున్నాం ఆప్తల గుర్తుగా
ఎన్ని తాజ్‌మహళ్ళు వంటినిండా చెక్కుకోను
కూపస్ట మండూకాలు కాలిన,కూలిన మొండిగోడలు శిధిలావస్థలో మానవత్వపు నీడలు బొబ్బలెక్కిన శరీరానికి ఏదో మలాం పూస్తావు బెదిరిన పసిచూపులకు తుపాకులు ధైర్యం ఇవ్వగలవా? నమ్మకాలు మనుషులను కాల్చి బూడిదను చేస్తున్నాయ్ ముక్తి ఎక్కడుందో కాని ఇలను నరకకూపం నెలవు చేస్తున్నారు [2 ముఖౌటా |
మీసాలపిల్లి గా మాతృభూమిని “బసంతి' పండుగల్ని కాలదన్ని ఇల్లు మారి వచ్చినదానివి దొంగపాల రుచుల్ని మరిగిన మీసాలసిల్లికి పేగుబంధాల మమకారాలు ఎలా అర్ధ్థమౌతాయి పసికందుల నాడే ఇల్లు ఇల్లు మార్చి మార్చి పుట్టిన గడ్డ అనవాళ్ళను తుడిచేస్తుంది పెరిగి పెద్దదై జంగపిల్లిలా బలిసిపోయింది వెంబడించడం వేటాడటం తప్ప ఊరు జనాల బాధలెలా తెలుస్తాయి
వ్యాధిగ్రస్తులు ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏం చేస్తావు దుఃఖం సరే పురుగులు పట్టనిస్తావా నీ మమకారానికి గోపురాలు కూలిపోతాయి శిధిలాల్లో శిధిలమైపోకు పిరికిమందు కాదు పట్టుకొని వేలాడటం పౌరుషం కాదు కలరా వ్యాధి రాకుండా మనసుని ఒంటిని శుభ్రం చేయి
మురికికూపం మర్రిచెట్టు నీడలో వనాలు విస్తరిస్తాయని ప్రజాస్వామ్యం కీర్తిస్తున్నది దుఃఖపు ఊడలు దిగి మర్రి మహావృక్షమౌతున్నది తన నీడన కునారిల్లుతున్న బలహీనులను ఇదే లౌకికం అని శాసిస్తున్నది మహావృక్షాలకు ఎగపాకే లతల ఆనవాళ్ళను గునపాలతో తవ్వి హృదయాల వారధులను కూలుస్తున్నారు మనిషి మహావృక్షం |! మనిషి మహామురికి కూపం ॥
శాంతి గీతం నా జీవచ్చవానికి ఖనన దహనాలు చేయకండి ఏ ఒక సమాజంపై నమ్మకం లేదు సిగ్గు విడిచిన వ్యవస్థ గుమ్మం ముఖం ముందు వేలాడగట్టండి రాక్షస రాజ్యాలు ఎక్కడోలేవు ఈకాలపు సత్యకాముడి మీ దాహానికి సరయూ రక్త ప్రవాహం చాలకపోతే దేశంలోని నదులనిండా మాకుత్తుకలు తెగనరుక్కొని నిమజ్ఞనిస్తాం ప్రజాస్వామ్యమా శాంతి...శాంతి....శాంతి
మూడు సంద్రాలు దీపం ఆరిపోబోతున్నట్టుంది చుట్టూ నాశరీరపుదళ్ళ మధ్య కొన ఊపిరితో “లౌకికత్వం” 2 చుట్టూ బాధల సందర్భాలు దేశం నలుచెరుగులా తోడిన చెలిమల నిండా మా కొత్త దుఖఃపు కన్నీళ్ళే వూరుతాయి ఏ ఎన్నికల జాతర్లు వచ్చినప్పుడల్లా ఓట్ల రాశులు పండించేందుకు మా శరీరాల ప్రమిదలు రాజేస్తున్నారు దేవుళ్ళ పేర సీట్లు సంపాదించుకుంటున్నారు తీ ముస్లీం వాడలు కన్నీటి వాకిళ్ళు మూడు సముద్రాలు
ప్రజాస్వామ్యం ప్రసవించి ఇప్పుడే తల్లిగా మారింది ఇల్లు తగులబడుతోంది పిల్లిలా ఇల్లు మారాలా పిల్లవాడి పేరు మార్చాలా దుఃఖంలో మునిగిపోయి పాలిండ్లు రక్తం ఒడుస్తున్నవి
వలీ గుజరాతీ తల్లిదండ్రుల్ని అల్లుకొని పోయి నిద్రపోయే లక్షణాన్ని బిడ్డల్నుంచి ఏ ఫాసిజం మాన్పించగలదు లక్షలసార్లు మా ఉనికిని ఏద్దేవా చేస్తున్నాడు మేం కోట్లాది స్వప్పిస్తున్నాం నిజాన్ని అబద్దం చేయలేడు వలి సమాధిని తవ్విపడేసి మంచిపనే చేళాడు ఏ ప్రచారం లేని భారతీయ ఉర్హూకవిని ప్రజల హృదయాల వరకు చేర్చగలిగాడు వాడి చెర్చేసే గుణం చెరగని పరిచయాన్ని ముద్రించింది దాగున్న నిజమంటే మతానికెంత భయం ఫాసిజం ఏ అవలక్షణాన్ని వదులుకోదు ఏ మానవీయ సంబంధాన్ని అనుమతించదు శరీరం మీద మొలిచిన అనవసర అంగంలా చిత్రిస్తున్నాడు _ రసికారుతున్న వ్రణం తొలగింపులో భాగంలా వాడి చర్యల్ని సమర్థించుకుంటున్నాడు
కపట కన్నీళ్ళు పారినంత మేర స్మళానాలు వెలుస్తున్నాయ్ పాసిజాలు హింసించగలవు తల్లీ కొడుకులు అనుబంధాన్ని తుడిచేయలేవు ళ్ నాం. సన నాం నా క న.
. ము ర్త న గ్ న నట ల్ సకస ర! న త లం (న. 1 + || నను ్టటుర గ ఖ్ + స్టో న ఖై వం య. న మ / హి రీ 5 న న. జ్, గా ష్ ॥ [న | శనం స. న |
కమ గ జే, త. (లాట ః | టీ అతా కాలవ న్నా శ /
" 6౧౪౮1౮906661౧ 112566౯646610 " " ॥ 016465 107 ౧61౧ 6౮4౧1౧8 గ౦(3 ం 1౧ షిగిగింర 202061 - - ం ౯ " _ ల | . - మతం చెదలువంటిది ష్ తలనేలపై తెగిపడినా
- , మనిషిని కొాటేయక మానదు . ం? ..
ల / చి
౧౭౧6౪ ౧౦6€/ 0౧ 8౯641226 [౧౦౪5 |