Telugu mruchakatikachata - anilvaranasi/indianlanguages GitHub Wiki

1 మచ కటీఠరవ( గ్ర. య నష్టాల ఉలష్యటు ల సంపాదకుడు వ. స ిదికు ॥పల్లెలశ్రీరామదంద్రుడు న్‌ మహామహోపాధ్యాయ [ న... ఆార్యడా పం క. పా శశ "ఎ, న ల్‌ ళ్‌ ౧. సహజకవిమలిమాం వ. |! భర ల. ఈపుస్తూన్నిసావత్యాణమాన కోసం మ | సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి _ మ వ. ఖతభాషా ప్రచార సమితి 1. 6. థా/రయిు ములలో ప్న లాభ శ్‌ న నిట...

రజతోత్సవగ్రంథమాల - పంచమకుసుమం మృచ్చకటికచ్చట ప్రాభృతకసౌరభం సంపాదకుడు దా॥ పుల్లెల శ్రీరామచంద్రుడు మహామహోపాధ్యాయ ఆచార్య దా॥। పుల్లెల శ్రీరామచంద్రుడు ్ర్రొ సంస్కృతభాషా ప్రచార సమితి హైదరాబాదు 2004

ర శ%గ్య-6 షచు ట జం... మృచ్చకటికచ్చ శీ ద్‌ ప్రాభృతకసౌరభం ప్రథమముద్రణ : 2004 వెల ; రూ. 25/- ప్రకాశకులు : క గదఠయ్య భంధొలల్యా సంస్కృతభాషా ప్రచార సమితి మ. 5-4-743,సి, శ రల మమ ౪ కా శద ల నాంపల్లి స్టేషన్‌ రోడ్‌, అబిడ్స్‌, ా సరా? హ్హ హైదరాబాద్‌ - 500 001. ననన న (60 (0 అక్షరాలకూర్చు : త్‌ే సమంత గ్రాఫిక్స్‌ బేగంపేట, హైదరాబాద్‌-500 016. ముద్రణ ;: శ్రీకళాంజలి గ్రాఫిక్స్‌ విఠల్‌వాడి, హైదరాబాదు - 500 029.

౩ శ్రీః తొలిపలుకు

వివిధవిద్యాసంస్థలను నెలకొల్పి నిర్వహిస్తూన్న జి.పుల్లారెడ్డి చారిటీస్‌ ట్రస్టుకు అనుబంధసంస్థగా సంస్కృతభాషాప్రచారసమితి హైదరాబాదు నగరంలో, 1978లో స్థాపించబడింది. నాటి నుండి ఈ సమితి ఆంధ్రప్రదేశంలో సంస్కృత భాషాప్రచారకార్యం అవిచ్చిన్నంగా సాగిస్తూన్నది. సమితి చేపట్టిన ప్రధాన కార్యక్రమం క్రమబద్ధరీతిలో రూపొందించిన ఏడు సంస్కృతపరీక్షలు నిర్వహించి తద్ద్వారా పాఠశాలా-కళాశాలా విద్యార్ధులకు, ఇతర సంస్కృతప్రియులకు సంస్కృతభాషను అభ్యసించడానికి తగిన అవకాశాన్ని కల్పించడం. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశం లోని వివిధవిద్యాస్థానాల్లో. ఉన్న దాదాపు 250 కేంద్రాల ద్వారా నిర్వహింప బడుచున్నది.

సమితి పరీక్షానిర్వహణకార్యక్రమానికి అనుబంధంగా గ్రంథప్రచురణ కార్యక్రమం కూడా చేపట్టి నిర్వహిస్తూన్నది. సంస్కృతభాషాసాహిత్యాలకు సంబంధించిన గ్రంథాలను తెలుగుభాషద్వారా తెలుగువారికి అందించడం దీని (ప్రధానలక్ష్యం. ఈ కార్యక్రమానికి సంస్కృతభాషాశ్రద్ధాలువులనుండి ప్రోత్సాహం లభించడం సమితికి ఆనందజనకం.

ఈ సంవత్సరంలో (2008-2004 రజతోత్సవం జరుపుకొంటూన్న సమితి సుప్రసిద్ధులైన సంస్కృతవిద్వద్విదుషేమణులచేత సంస్కృతసాహిత్యానికి సంబంధించిన, ఆ యా కవులను, వారి కావ్యాలను పరిచయం చేసే ఇరవైయైదు లఘు [గ్రంథాలను వ్రాయించి ప్రచురిస్తూన్నది. ఈ సాహిత్యయజ్ఞంలో ఆర్తిజ్యం వహించినవా రందరికీ మా కృతజ్ఞతలు.

ఈ రజతోత్సవగ్రంథమాలాపంచమకుసుమంగా వఏతద్వచనసంచేత రచించిన మృచ్చకటికచ్చటను - పద్మప్రాభృతసొౌరభమును ప్రచురిస్తున్నాము. దీనిని సంస్కృతాభి మానులందరు ఆదరించగల రని విశ్వసిస్తున్నాము. సంస్కృతభాషాప్రచారసమితి, పుల్లెల శ్రీరామచంద్రుడు హైదరాబాద్‌. కులపతి

జే సంస్కృతభాషా ప్రచారసమితి హైదరాబాదు కార్యనిర్వాహకసంఘసభ్యులు

1... శ్రీ జి. పుల్లారెడ్డిగారు, అధ్యక్షుడు ల మహామహోపాధ్యాయ

దా. పుల్లెల శ్రీరామచంద్రుడుగారు, కులపతి 8 డా. కే. రాజన్నశాప్రిగారు, ఉపకులపతి డ్తీ శ్రీ చలమచర్ల వేంకటశేషాచార్యులుగారు, కార్యదర్శి 5. శ్రీపి. రామకృష్ణగారు, సభ్యుడు 6. శ్రీ ఆర్‌.రామానుజాచారిగారు, సభ్యుడు // శ్రీ పి.వేంకటేశ్వర్లుగారు, సభ్యుడు 8& శ్రీ బి.యన్‌.రెడ్డిగారు, సభ్యుడు 9. శ్రీ ఆకెళ్ల సత్యనారాయణమూర్తిగారు, సభ్యుడు 10. శ్రీ ఆర్‌.వి. శేషాచార్యులుగారు, సభ్యుడు 11 శ్రీ వై నాగభూషణరెడ్డిగారు, సభ్యుడు 12 శ్రీ పి. సుబ్బారెడ్డిగారు, సభ్యుడు

మృచ్ళకటికచ్చట లక్షణ (గ్రంథాలలో పది రూపకాలూ పద్దెనిమిది ఉప రూపకాలూ చెప్పబడి ఉన్నాయి. నాటకము, ప్రకరణము, భాణము, ప్రహసనము, డిమము, వ్యాయోగము, సమవాకారము, వీథి, అంకము, ఈహామృగము అనేవి రూపక భేదాలు. నాటిక, త్రోటకము, గోష్టి సట్టకము, నాట్యరాసకము, ప్రస్థానము, ఉల్లాష్యము, కావ్యము, (ప్రేంఖణము, రాసకము, సంలాపకము, శ్రీగదితము, శిల్పకము, విలాసిక, దుర్శల్లిక, ప్రకరిణి, హల్లీశము, భాణిక అనేవి ఉపరూపకాలు, కథా వస్తువు, రసము, పరిమాణము వీటినిబట్టి ఈ విభాగం చేయబడినది. మృచ్చకటికం ప్రకరణమనే భేదానికి చెందినది. ప్రకరణానికి ఈ క్రింది లక్షణాలు చెప్పబడి ఉన్నాయి : 1 ప్రకరణంలోని ఇతివృత్తం పురాణేతిహాసాది ప్రసిద్ధమైనది కాక కవి కల్పితమై, లౌకికజనజీవన సంబద్ధమై ఉండాలి.

  1. నాయకుడు లౌకిక జీవనంతో సంబంధంగల బ్రాహ్మణుడు కాని, మంత్రి కాని, వర్తకుడు కాని అయి ఉండాలి. ఉదాత్త చరితుడై ఉండాలి. 10 ఉత్తమ వంశానికి చెందిన వనిత కాని, వారవనిత కాని నాయికగా ఉండవచ్చును. కొన్నింటిలో ఇద్దరూ ఉండవచ్చును. నాయిక కుల వధువు అయిన పక్షాన ఆ ప్రకరణం శుద్ధ ప్రకరణము, వేశ్య అయినచో 1౧) శృంగార రసం ప్రధానంగా ఉండి ఇతర రసాలన్నీ దానికి అంగాలుగా ఉండాలి, +) అంకాల సంఖ్య ఐదుకి తగ్గకుండాను, పదికి మించకుండాను ఉందాలి. 'ప్రకరణానికి ఉండవలసిన ఈ ప్రధాన లక్షణాలన్నీ మృచ్చకటికానికి చక్కగా సరిపోతాయి. కథ కల్పితమైనది. వణిగ్వృత్తిని చేపట్టిన బ్రాహ్మణుడు నాయకుడు. ధీరప్రశాంతుడు. నాయిక వేశ్య. దీనిలో పది అంకాలు ఉన్నాయి. ప్రధాన రసం శృంగారం. ఇతర రసాలు ఉన్నా అవన్నీ శృంగారానికి అంగములు. ఈ విధంగా

6 మృచ్చకటికచ్చట మృచ్చకటికం ప్రధానమైన శాస్త్రీయ నియమాలకి కట్టుబడి ఉన్న ప్రకరణమే అయినా దీనిలో శాస్త్ర నియమాలను ఉల్లంఘించిన స్థలాలు కూడా చాలా ఉన్నాయి. వాటిని తరువాత పరిశీలించెదము.

కవి-కాలము :- మృచ్చకటికం రచించిన కవి శూద్రకుడు. ఇతడు మహారాజు. శూద్రుకునిగూర్చి ప్రస్తావనలోనే విస్తృతంగా చెప్పబడి ఉన్నది.

“శ్తూద్రుక మహారాజు సుందరాకారుడు. గజగమనుడు. చకోరనేక్రుడు. చంద్రుని వంటి ముఖము కలవాడు. ద్విజ ్రేష్టులలోను, కవులోను అగ్రగణ్యుడు. బుగ్వేదము, సామవేదము, గణితము, (వేశ్యలకు సంబంధించిన) లలిత కళలు, గజశాస్త్రము-వీటిలో నిష్టాతుడు. ఏనుగులతో డీకొం యుద్ధము చేయగలిగిన మహా వీరుడు. ఈతడు శివుని ఆరాధించి నేత్ర లోగమును పోగొట్టుకొనెను. కుమారుని రాజ్యమునందు పట్టాభిషిక్తుని చేసి అశ్వమేధయాగము కూడా పూర్తిచేసికొని, నూరు సంవత్సరాల పది రోజుల దీర్చాయుర్దాయము ననుభవించి అగ్నిప్రవేశము చేసి తనువును చాలించెను”.

“ద్విరదేన్హగతిః చకోరనేత్రః పరిపూర్ణేన్దుముఖః సువిగ్రహశ్చ,

ద్విజముఖ్యతమః కవిర్చభూవ (్రథితః శూద్రక ఇత్యగాధసత్త్వః.

బుగ్వేదం సొమవేదం గణితమథ కలాం వైశికీం హస్తిశిక్షాం

జ్ఞాత్వా శర్వప్రసాదాద్వ్యపగతతిమిరే చక్షుషీ చోపలభ్య,

రాజానం వీక్ష్య పుత్రం పరమసముదయేనాశ్వమేధేన చేష్టా

లబ్బా చాయుః శతాబ్దం దశదినసహితం శూద్రకో£_గ్నిం ప్రవిష్టః

సమరవ్యసనీ ప్రమాదశూన్యః

కకుదం వేదవిదాం తపోధనశ్చ, పరవారణబాహుయుద్ధలుబ్ధిః క్షితిపాలః కిల శూద్రకో బభూవ. (మృ. 135 పై విషయాలన్నీ ప్రథమపురుషలో చెప్పబడి ఉన్నాయి. శూద్రకుడు అగ్ని ప్రవేశం చేసినట్లు కూడా చెప్పబడింది. దీనిని బట్టి ఈ మూడు శ్లోకాలూ శూద్రకునివి కావని స్పష్టం అవుతున్నది.

మృచ్చకటికచ్చట 7

ఈ శూద్రక మహాకవి చారిత్రవ్యక్తియా లేక ఇది ఒక కల్పితనామధేయమా అని పండితులలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇది కల్పితనామధేయమే అని కీథ్‌ పండితుని అభిప్రాయం. పిషేల్‌ మొదలైన కొందరు పండితులు ఈ మృచ్చకటికం భాసరచితమని అభిప్రాయపడ్డారు. ఇపు డుపలభ్యమానమైన భాసనాటకాలలో చారుడత్తము లేదా దరిద్రచారుదత్తము అనే నాలుగంకాల రూపకం ఒకటి ఉన్నది. దీనిలోని కథ, శ్లోకాలు, కొన్ని వాక్యాలు ఇవన్నీ కూడా మృచ్చకటికంలో ఉన్నవే. ఐతే మృచ్ళకటికంలో వసన్తసేనా చారుదత్తుల ప్రణయకథతోపాటు ఒక రాజును సింహాసన భ్రష్రణ్ణి చేసి మరియొకడు రాజ్యం ఆక్రమించడం అనే రెండవ కథ కూడా ముడిజేడి ఉన్నద్సి చారుదత్తంలో ఈ రెండవ కథ లేదు. అందుచేత మొదటిది ఈ పడి అంకాల ప్రకరణమనీ, దీనిని రంగోపయుక్తంగా కుదించి చారుదత్తం వ్రాయబడినదనీ ఈ పండితుల ఊహ.

కొంతకాలం తరువాత పిషేలీ పండితుడు తన పై అభిప్రాయాన్ని మార్చుకొని మృచ్చకటికం రచించినవాడు దండి అనే ఒక వాదాన్ని లేవదీసినాడు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. (1) రాజశేఖరుడు చెప్పినట్లుగా ఒక శోకం ప్రసిద్ధిలో ఉన్నది :

“త్రయో£ గ్నయస్త్రయో వేదాస్త్రయో దేవాస్త్రయో గుణాః,

త్రయో దండిప్రబంధాశ్చ క్రిషు లోకేషు విశ్రుతాః.”

“మూడు అగ్నులు, మూదు వేదాలు, ముగ్గురు దేవతలు, మూడు గుణాలు, దండి రచించిన మూడు (గ్రంథాలు - ఇవి మూడు లోకాలలోను ప్రసిద్ధమైనవి” అని దీని అర్ధం. దండిరచనలుగా చెప్పబడుతూన్న “దశకుమార చరితము” “కావ్యాదర్శము” అనే గ్రంథాలు ప్రసిద్ధంగా లోకంలో కనబడుతున్నాయి. ఇంక మూడవ (గ్రంథం ఏదో తెలుసుకోవలసి ఉన్నది. (2) దండి కావ్యాదర్శంలో

“లిమృతీవతమో౭_జ్ఞాని వర్షతీవాళ్వునం నభః,

అసత్పురుషసేవేవ దృష్టిర్విఫలతాం గతా”

(చీకటి శరీరాలకి అలుముతూన్నట్లుగాను, ఆకాశం కాటుకను వర్షిస్తున్నట్లుగాను ఉన్నది. చెడ్డవానికి చేసిన సేవ వలె చూపు విఫలమైనది).

8 మృచ్చకటికచ్చట ఇదే శ్లోకం మృచ్ళకటికంలోనూ, చారుదత్తంలోనూ కూడా ఉన్నది. అందుచేత దీనిని రచించినవాడు దండియే అని వీరి అభిప్రాయం. అయితే ఈ వాదాన్ని ఇప్పుడు ఎవ్వరూ అంగీకరించడం లేదు. చాలా మంది విమర్శకుల అభిప్రాయం ప్రకారం - భాసరచితమైన చారుదత్తం అనే రూపకాన్ని ఆధారంగా చేసుకొని కాలాంతరంలో మృచ్చకటికం రచింపబడినది కాని చారుదత్తం మృచ్చకటికానికి సంక్షిప్తరూపం కాదు. దండి కావ్యాదర్శంలో “వింపతీవ” అనే ప్రాచీన శ్లోకాన్ని తీసుకొని దానిలో ఉన్న అలంకారాలను గూర్చి విమర్శించినాడు కాని అది అతని శ్లోకం కాదనే విషయం ఆ ఘట్టాన్ని పరిశీలిస్తే స్పష్టం అవుతుంది. అందుచేత ఈ శ్లోకాన్ని పట్టి ఈ రూపకాన్ని దండికి ముడిపెట్టడం గాని, చారుదత్తం మృచ్చకటిక సంక్షిప్తరూపం అని చెప్పడం కాని యుక్తం కాదు. శూద్రక రాజకవి అనే నామధేయం కేవలం కాల్పనికం కాదనీ, ఇతడు చారిత్రిక వ్యక్తియే అనీ చెప్పడానికి అనేకమైన ఆధారాలు కనబడుతున్నాయి. స్మందపురాణము, కథాసరిత్సాగరము, వేతాల పంచవింశతి, కాందబరి, దశకుమార చరిత్ర, కావ్యమీమాంస, వామనుని కావ్యాలంకారసూ త్రవృత్తి, కల్చణుని రాజతరంగిణి మొదలైన ప్రాచీన గ్రంథాలలో శూద్రకుని నామధేయం పేర్మాన బడింది. శూద్రకుని కథను వస్తువుగా గ్రహించి రచించిన 'శూద్రకవధ' అనే కథ “విశ్రాంత శూద్రకం” అనే రూపకమూ ఉన్నాయి. 'వీరచరితం' అనే గ్రంథంలో శూద్రకుడు శాలివాహనుని మంత్రి అనీ, అతనినుండి అర్ధరాజ్యం పొందినాడనీ చెప్పబడింది. ఈ కథలలో ఏవి ఎంతవరకు సత్యములో చెప్పడానికి వీలులేకపోయినా శూద్రకుడు ఒక చారిత్రకవ్యక్తి అని చెప్పడానికి ఇవి ఉపకరిస్తాయి. పైన ఉదాహరించిన ప్రస్తావనలోని మూడు శ్లోకాలూ శూద్రకుని గూర్చి ప్రథమపురుషలోనే చెప్పుచున్నా ఆ విషయాల సత్యత్వాన్ని శంకించ వలసిన పని లేదు. మృచ్ళకటికాన్ని జాగర్తగా పఠించినవారికి తద్రయిచతలో ఉన్నట్లుగా వర్ణించిన ఈ గుణాలు సత్యదూరాలు కావని స్పష్టం అవుతుంది. శూద్రక నామధేయం కాల్పనికం కాదని చెప్పడానికి శాసనాది ప్రమాణాలు

మృచ్చకటికచ్చట 9 కూడా ఉన్నాయి. క్రీ.శ. 968 ప్రాంతంలో రాష్ట్రకూట చక్రవర్తియైన ఆకాలవర్షుని సామంతరాజు అయిన శూద్రకయ్య అనునతడు కడంబలిగె ప్రాంతాన్ని పరిపాలించి నట్లు శాసనాలు చెపుతున్నాయి. ఇతినికి “ఉజ్జయినీ భుజంగ” అనే బిరుదు ఉండేది. అట్లే శూద్రకుడనే మరొకరాజు క్రీ.శ. 1000 ప్రాంతంలో గయలో ఒక రాజవంశాన్ని నెలకొల్పినాడు. ఈ విధంగా శూద్రక నామధేయం గల రాజులు దక్షిణదేశంలోనూ, ఉత్తరదేశంలోనూ కూడా ఉందేవారు. ఐతే ఈ శూద్రకుడనే పేరు అసలుపేరు కాకుండా పెట్టుకున్న రెండవ పేరుగా కనబడుతుంది.

మృచ్చకటికం రచించిన శూద్రకుడు ఎవరై ఉండాలి అనేది ప్రశ్న శూద్రకుని పలువురు పలువిధాలుగా గుర్తించినారు. స్మందపురాణంలోని విషయాన్ని అంగీకరించి విల్సన్‌ పండితుడు మొదటి ఆంధ్రభృత్యరాజైన సిముకుడే శూద్రకుడని అభిప్రాయ పడినాడు. ఈ అభిప్రాయాన్ని అంగీకరించిన పక్షంలో శూద్రకుణ్ణి క్రీ.పూ. 200 ప్రాంతంవాడుగా చెప్పవలసి వస్తుంది. క్రీ.శ. 190 ప్రాంతంలో శూద్రకుడనే రాజు ఉన్నట్లుగా కూడ స్మందపురాణంవల్ల తెలుస్తూన్నది. అందుచేత సిముకునికి కూడా శూద్రుకడనే పేరు ఉన్నదా, లేదా ఈ శూద్రకుడు వేరా అనే విషయంలో సందేహం కలుగుతుంది. ఏమైనా ఆంతరంగిక ప్రమాణాలు, భాష మొదలైనవాటిని పట్టి మచ్చకటికానికి ఇంత ప్రాచీనత్వం అంగీకరించడానికి వీలు లేదని చాలామంది పండితుల అభిప్రాయము.

స్టెన్‌ కోనో అనే విమర్శకుని అభిప్రాయం ప్రకారం ఆభీరవంశీయుడైన శివదత్తుడే శూద్రకుడు. ఈతడో లేదా ఇతని కుమారుడైన ఈశ్వరసేనుడో ఆంధ్ర వంశీయుడైన చివరి రాజును ప్రదభ్రష్టుని చేసి క్రీ. 248-9 సంవత్సరంలో చేదిశకం స్థాపించి ఉన్నాడనీ, మృచ్చకటికంలో ఉన్న పాలకరాజ్యభ్రంశనవృత్తాంతం దీనినే సూచిస్తూన్నదనీ ఈతని అభిప్రాయం.

మృచ్చ్ళకటికంలో రాజ్యభ్రష్టుడు చేయబడిన పాలకుడుగాని, రాజ్యం ఆక్రమించిన ఆర్యకుడు కాని చారిత్రిక వ్యక్తులు కారనీ, ఇదంతా కాల్చనిక కథయే అనీ కీథ్‌ అభిప్రాయపడి ఉన్నాడు. ఇది అంత సమంజసం కాదు. ఉజ్జయినీ చక్రవర్తి యైన మహాసేనునికి గోపాలుడు, పాలకుడు అనే ఇద్దరు

10 మృచ్చకటికచ్చట కుమారు లున్నట్లుగా భాసుడు చెప్పి ఉన్నాడు. పెద్దవాదైన గోపాలునికి రావలసిన రాజ్యాన్ని పాలకుడు ఆక్రమించగా గోపాలకుని కుమారుడైన ఆర్యకుడు సమయంకోసం వేచి ఉండి పాలకునినుంచి రాజ్యం లాగికొని ఉంటాడనీ, అందుచేత ఇది చరిత్రకు సంబంధించిన విషయమే అనీ చాలామంది పండితుల అభిప్రాయము. మృచ్చకటికంలో మతము, సాంఫికాచార వ్యవహారాలు, నదీ - పర్వతాదులు, వీటి నిర్దేశాలు అనేకం ఉన్నాయి. వీటిని పట్టి ఏతద్రచయితయైన ఈమ దాక్షిణాత్యుడై ఉంటాడనీ, క్రీ.శ. 670 నుండి 725 వరకూ రాజ్యం పాలించిన గాంగవంశీయుడైన భూవిక్రముని తమ్ముడైన మొదటి శివమారుడే శూద్రకుడనీ కొందరు పండితులు సప్రమాణంగా నిరూపించియున్నారు. క్రీ.శ, 700 ప్రాంతం నాటి హెబ్బూరు తామశాసనంలో శివమారుణ్ణి గూర్చిన కొన్ని విశేషాలు వర్ణింపబడి ఉన్నాయి. అవి మృచ్చకటిక ప్రస్తావనలో ఉన్న శూద్రక వర్ణనకు సరిగా సరిపోతున్నని. ఈ విధంగా శూద్రకుని గూర్చి అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కాలము :- కవినిగూర్చి ఇన్ని అభిప్రాయభేదాలు ఉండడంచేత అతని కాలాన్ని పట్టి మృచ్ళకటికం కాలాన్ని నిర్ణయించడం అనేది సాధ్యం కాని పని. ఇంక కొన్ని ఇతరప్రమాణాలమీదనే ఆధారపడవలసి ఉన్నది. కొంతమంది ప్రాచీన రచయితల గ్రంథాలలో మృచ్ళకటికాన్ని పేర్కొనడం, దీనిలోని శ్లోకాలను కొన్నింటిని ఉద్ధరించడం జరిగింది. దీనిని పట్టి ఈ రూపకం ఎనిమిదవ శతాబ్దానికి పూర్వం రచింపబడినట్లు చెప్పవచ్చును. ఇది బాహ్యప్రమాణము. మనుస్మృతిలో చెప్పిన ఒకటి రెండు విషయాలు దీనిలో ఉన్నాయి. మనుస్కృతి క్రీ.పూ. 200 క్రీ.శకం. 200 మధ్య ప్రాంతానికి చెందినదని పండితుల అభిప్రాయం. అందుచేత ఈ రూపకం క్రీ.శ రెండవ శతాబ్దం తరవాతనే రచింపబడి ఉండాలి. ఇందులో గణికాకాముకులకు సకర్పూరమైన తాంబూలం ఇన్వబడుతున్నట్లు వర్ణింపబడినది. తాంబూలం విదేశాల నుంచి భారతదేశంలోకి గుప్తుల కాలంలో వచ్చినదని విమర్శకుల అభిప్రాయము. రామాయణ మహాభారతాలలో' తాంబూలచర్చ లేకఫోవడం గమనార్హము. దీనిని పట్టి ఈ రూపకం నాల్గవ శతాబ్దానికి పూర్వం

మృచ్చకటికచ్చట 11 రచించినది కాదని చెప్పవలసి ఉన్నది. ఈ బాహ్య ఆంతరంగిక ప్రమాణాలను పట్టి మృచ్చకటికం నాలుగు ఎనిమిది శతాబ్దాల మధ్య రచింపబడి ఉంగాలని విమర్శకుల ఊహ,

సంక్షిప్తకథ :- మృచ్చకటికం పది అంకాల బృహత్ర్రమాణం గల ప్రకరణము. ఇరవై ఎనమండుగురు పురుష పాత్రలు ఎనమందుగురు స్తీ పాత్రలు ఉన్నారు. రెండు ప్రణయ కథలు, ఒక రాజ్యోపప్లవ వృత్తాంతము వీటిని మూడింటిని మేళవించి కథావస్తువు చక్కగా కూర్చబడినది.

ప్రథమాంకము :- చారుదత్తు డనే ఒక బ్రాహ్మణుడు వాణిజ్య వృత్తిని అవలంబించి చాలా ధనం సంపాదించినా దానధర్మాదులలో ఆ ధనాన్నంతా వెచ్చించి దరిద్రుడవుతాడు. ఐనా ఉజ్జయినిలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఆతని విషయంలో అపరిమితమైన ఆదరం కలిగి ఉంటారు. దారిద్య్యంతో బాధపడుతూన్న అతని సద్గుణాల చేత ఆకర్షింపబడిన వనస్తసేన అనే అతి లోకసుందరియైన ఒక వేశ్య ఆతనిని కామిస్తుంది. ఆమె ఎంత సౌందర్యవతియో అంత ఐశ్వర్యవంతురాలు. ఆ రాజ్యానికి రాజైన పాలకుని బావమరదియైన శకారుడనే దుష్టబుద్ధి ఆమెను కోరి ఆమెను లొంగ దీసుకోవాలని (ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకనాటి రాత్రి ఆమె రాజమార్గంలో సపరివారంగా వెడుతూండగా శకారుడూ, అతని మిత్రుడైన విటుడూ, చేటుడూ ఆమెను వెంబడిస్తారు. వాళ్లనుండి తప్పించుకోవాలనే ప్రయత్నంలో వసంతసేన తన అనుచరులనుంచి దూరం అవుతుంది. దైవవశంచేత చారుదత్తుని ఇంటిపక్క వాకిలి అప్పుడే తెరుస్తారు. ఆమె ఆత్మరక్షణం కోసం ఆ ఇంటిలో ప్రవేల్వింది. ఒకనాడు ఐశ్వర్యంతో కళకళలాడుతూ ఉండి ఈనాడు పాకుపడిపోయినట్లుగా ఉన్న చారుదత్తుని విశాల భవనంలో చారుదత్తుడు, సర్వకాలాలలోనూ అతనిని విడవకుండా ఉన్న విదూషకుడూ (పేరు మైత్రేయుడు), రదనిక అనే పరిచారికా, నాలుగైదు సంవత్సరాల వయస్సు గల రోహసేనుదనే చారుదత్తుని కుమారుడు, ధూత అనే పేరుగల చారుదత్తుని భార్య -వీరు మాత్రమే ఉన్నారు. అంతకు పూర్వమే కామదేవాయతనోద్యానంలో జరిగిన ఒక ఉత్సవంలో వసంతసేనా - చారుదత్తులు ఒకరినొకరు చూచుకోవడము జరిగింది.

12 మృచ్చ్భకటికచ్చట పరస్పరానురాగం కూడా కలిగింది. ఆర్థికంగా తనకూ ఆమెకూ ఉన్న అంతరాన్ని ఎరుగున్న వాడవడంచేత చారుదత్తుడు, ఆ అనురాగాన్ని మనస్సులోనే దాచుకున్నాడు. ఇపుడు దైవవశంచేత కలిగిన ఈ సమావేశంచేత ఆ ప్రణయవీజాలు అంకురించినాయి. రాత్రివేళ అన్ని అమూల్యాలంకారాలతో బయటకు వెళ్లడం మంచిది కాదనే అభిప్రాయంతో వసన్తసేన తన అలంకారాలన్నీ తీసి దాచ వలసిందిగా చారుదత్తునికి ఇచ్చింది. చారుదత్తుడు కూడా వెళ్లి ఆమెను ఇల్లు చేరుస్తాడు. ఆనాటి నుంచీ శకారుడు చారుదత్తుని మీద పగపట్టి ఉంటాడు. ద్వితీయాంకము :- చారుదత్తుడు ఐశ్వర్యాన్ని కోల్పోవడంతో అతనిని ఆశభ్రయించుకాని ఉన్నవాళ్లందరూ చెట్టుకొకరూ పుట్టకొకరూగా అయిపోతారు, అలాంటి వాళ్లలో సంవాహకుడు (ఒళ్లు పట్టేవాడు) ఒకడు. అతడు జూదం ఆడడం మరిగి పది సువర్జాలు ఓడిపోయి ద్యూతగ్భహంలోనుంచి పారిపోతూంటే సభికుడూ (ద్యూత గృవాధికారి), ద్యూతకారుడూ వెంబడిస్తారు. పాడుపడిపోయిన దేవాలయంలో దాక్కొని మూర్తిలాగ స్థిరంగా కూర్చుంటాడు. వాళ్లు అక్కడికి కూడా వచ్చి కొడుతూంటే పారిపోయి వసంతసేన ఇంట్లో ప్రవేశించి ఆమెను శరణు వేడుతాదు. అతడికీ చారుదత్తుడికీ ఉన్న పూర్వసంబంధం తెలియగానే ఆమె అతనికి చాలా మర్యాదచేసి సభికునికి ఆత డివ్వవలసిన పదిసువర్దాలు ఇచ్చి పంపివేస్తుంది. చివరికి ఈ సంవాహకుడు వైరాగ్యం చెంది బౌద్ధ బిక్షువు అయిపోతాడు. తృతీయాంకము :- వసంతసేన పరిచారిక మదనిక. ఆమె క్రీతదాసి. శర్విలకుడనే బ్రాహ్మ్గాణయువకుడు ఆమెను ప్రేమిస్తాడు. ఐతే వసంతసేనక్రు కొంతధనం ఇస్తేనేకాని ఆమెకు విడుదల లభించదు. అందుచేత అతడు చారుదత్తుని ఇంటికి కన్నంవేసి వసంతసేన న్యాసంగా ఉంచిన అలంకారాలన్నీ అపహరిస్తాడ్రు, అలంకారాలు దొంగలు అపహరించారని చెప్పినట్లయితే ఎవ్వరూ నమ్మరు; ఏమి చేయవలెనా అని చారుదత్తుడు విచారిస్తూండగా ఈ విషయం అతని భార్యక్షు తెలిసి స్త్రీధనాన్ని చారుదత్తుడు తీసుకోవడానికి నిరాకరిస్తాడనే ఉద్దేశంతో ఆమె తనవద్ద మిగిలిన అమూల్యమైన రత్నహారాన్ని మైత్రేయుడికి దానం చేస్తుంది.

మృచ్చకటికచ్చట 13 మైత్రేయుడు ఆ విషయం చారుదత్తునికి చెపుతాడు. “నీ అలంకారాలన్నింటినీ జూదంలో ఒడ్డి చారుదత్తుడు ఓడిపోయినాడుు వాటికి బదులుగా ఈ రత్నహారం పంపుతున్నాడు అని చెప్పి ఆ హారం వసంతసేనకు ఇవ్వవలసిందిగా చారుదత్తుడు మైత్రేయుణ్ణి ఆదేశిస్తాడు. అంత తక్కువ విలువగల అలంకారాలకోసం ఇంత విలువగల హారాన్ని ఇవ్వడమా అని విదూషకుడు మొదట అంగీకరించకపోయినా చివరకు ఒప్పుకొంటాడు.

చతుర్ధాంకము ;ఏ- తాను చారుదత్తుని ఇంటినుంచి అపహరించిన అలంకారాలను వసంతసేనకు ఇచ్చి మదనికను విడిపించుకోవాలనే అభిప్రాయంతో శర్విలకుడు వసంతసేన ఇంటికి వెడతాడు. ఆ అలంకారాలను మదనిక గుర్తు పదుతుంది. ఈ విషయం తెలియగానే ఏమి చేయాలో తెలియక శర్విలకుడు చారుదత్తుడే పంపినాదని చెప్పి వాటిని వసంతసేనకు ఇస్తాడు. మదనికా శర్విలకుల మధ్య జరిగిన, చాటునుండి విన్న సంభాషణను పట్టి అసలు విషయం తెలిసిన వసంతసేన ఆ అలంకారాలు తెచ్చి ఇచ్చినందుకు ప్రతిఫలంగా మదనికను దాసీత్వం నుంచి విముక్తురాలిని చేసి శర్విలకునికి భార్యగా చేసి పంపివేస్తుంది. శర్విలకుడు మదనికను తీసుకొని వెడుతూండగా “ఆర్యకుడనే గోపాలదారకుడు రాజు అవుతాడు అని ఒక సిద్ధుడు చెప్పడంచేత అర్యకుణ్ణి బంధించి పాలక మహారాజు కారాగారంలో ఉంచినాడు అని ఘోషణ వినబడింది. శర్విలకుని వంటి నవయువకులందరూ ఆ ఆర్యకుని మిత్రులు. తన మిత్రునికి కలిగిన ఆపదను గూర్చి వినగానే శర్విలకుడు భార్యను తన ఇంటికి పంపించేసి ఆర్యకుని విమోచనానికై మిత్రబలాన్నంతనీ సమీకరిం చడానికి వెళ్లిపోతాడు.

చారుదత్తుని ఆదేశం ప్రకారం మైత్రేయుడు వసంతసేన ఇంటికి వెళ్లి ఆమెకు ఆ రత్నహారాన్ని ఇస్తాడు. వసంతసేన తనలో తాను నవ్వుకొని ఆ రాత్రికే చారుదత్తుని ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకొంటుంది. ఆ విషయాన్ని మైక్రేయునిద్వారా చారు దత్తునికి కబురు పంపుతుంది.

పంచమాంకము ;- వసంతసేనా చారుదత్తులు కలుసుకుంటారు.

షష్టాంకము :- వసంతసేన మేల్కొన్న తరవాత ఆమెను ప్రవహణం

శత మృచ్చకటికచ్చట (కెట్టెబండి) మీద పుష్పకరండక జీర్టోద్యానానికి తీసుకొని రావలసిందిగా వర్థమానకు డనే సేవకుని ఆదేశించి చారుదత్తుడు ముందుగా అచటికి వెడతాడు. వసంతసేన ఉదయమే నిద్రనుంచి మేల్మొని ఆ రత్నహారాన్ని తీసుకోవలసినదిగా చేటిద్వారా చారుదత్తుని భార్యను ప్రార్థిస్తుంది. ఆమె నిరాకరిస్తుంది. ఇంతలో రోహసేనుణ్ణి ఒక చిన్న మట్టి బండితో ఆడించడం కోసం ప్రయత్నిస్తూ రదనిక అచటికి వస్తుంది. అంతక్రితం ఆ పిల్లవాడు ఇరుగు పొరుగు వారి పిల్లలతో వాళ్ల బంగారు బండితో ఆడుకొని ఉన్నాడు. తనకు ఆ బంగారు బండియే కావాలనీ, మట్టి బండి వద్దనీ ఆ పిల్లవాడు మారాం చేస్తూంటాడు. ఇదంతా చూస్తూన్న వసంతసేన కంట నీళ్లు పెట్టుకొని బంగారు బండి చేయించుకో నాయనా అని చెప్పి ఆ పిల్లవానిని బుజ్జగిస్తూ తన శరీరంమీద ఉన్న అలంకారాలన్నీ తీసి ఆ మట్టి బండిలో పెడుతుంది. ఇంతలో వర్ధమానకుడు ప్రవహణం తీసుకొని వచ్చి ద్వారానికి ఎదురుగా నిలుపుతాడు. “వసంతసేన అలంకరించుకొంటున్నది, కొంచెము సేపు ఆగు” అని రదనిక చెపుతుంది. వర్ధమానకుడు ఈలోగా తాను మరచివచ్చిన బండిలోని పరుపులు తీసుకొని రావడానికై బండితో సహా వెనుకకు వెడతాడు. ఇంతలో శకాగుని బండి తోలే స్థావరకుడు ఆ పుష్పకరండ జీర్టోద్యానంలోనే ఉన్న శకారుణ్ణి తీసుకొని రావడానికై ప్రవహణం తోలుకువెదుతూ ఉంటాడు. సరిగా చారుదత్తుని ఇంటి దగ్గరికి వచ్చే సరికి ఎదర బండ్లు అడ్డం రావడంతో తన ప్రవహణాన్ని ఆ ద్వారం ముందు నిలిపి, ఎదుట ఉన్న బండివానికి సహాయం చేయడం కోసం అటు వెడతాడు. ఇంతలో వసంతసేన వచ్చి ఆ బండిలో ఎక్కి కూర్చుంటుంది. స్థావరకుడు ఎదుట ఉన్న బండి తప్పించి, తన బండిని ఉద్యానానికి తోలుకొని పోతాడు. చారుదత్తుని చేటుదైన వర్ధమానకుడు మరిచిపోయిన పరుపులు తీసుకొని మరల బండిని ద్వారంముందు నిలుపుతాడు. ఇంతలో ' శర్విలకాది మిత్రుల సహాయంతో కారాగారంనుంచి తప్పించు కొని పారిపోతూన్న ఆర్యకుడు ఆ బండిలోనికి చూచి, ఎవరూ లేరని గ్రహించి దానిలో ఎక్కి కూర్చుంటాడు. అతని కాలిని ఇంకా ఒక సంకెల వ్రేలాడుతూ ఉంటుంది. ఆ చప్పుడు విని వసంత సేనయే బండి ఎక్కి ఉంటుందనే అభిప్రాయంతో వర్ధమానకుడు దానిని ఉద్యానానికి

మృచ్చకటికచ్చట 15 తోలుకొని పోతాడు. దారిలో జరిగిన కొన్ని సంఘటనలను పట్టి తానెక్కిన ప్రవహణం చారుదత్తుని దని ఆర్యకునికి తెలుస్తుంది.

సప్తమాంకము :- అక్కడ ఉద్యానవనంలో చారుదత్తుడూ విదూషకుడూ వసంతసేనకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో ప్రవహణం వస్తుంది. * ఆర్యకుడు చారుదత్తుని శరణు వేడుతాడు. చారుదత్తుడు ఆర్యకుని అభినందించి ప్రవహణం దిగకుండా దానిమీదనే వెళ్ళినట్లెతే రాజభటుల బారినుండి తప్పించుకోవచ్చునని చెపుతూ అతనిని ఆ విధంగా పంపివేస్తాడు.

అష్టమాంకము :- తన ప్రవహణం ఎక్కి వచ్చిన వసంతసేనను చూడగానే ఆమె పూర్వం తనను నిరాకరించినందుకు పశ్చాత్తాపపపడి ఇపుడు స్వయంగానే వచ్చినదని భావించి శకారుడు చాలా సంతోషిస్తాడు. అక్కడికి చేరిన తరవాతనే వసంతసేన తాను చేసిన పొరపాటు తెలుసుకొంటుంది. శకారుణ్ణి నిరాకరించడంతో అత డామెను కంఠం నొక్కి క్రిందపడ వేస్తాడు. అలంకారాలకోసం చారుదత్తుడే ఈ పని చేసినాడని చెప్పి ఈ నేరాన్ని అతని మీద మోవవచ్చునని నిశ్చయించుకుంటాడు. స్థావరకుడు ఈ రహస్యం ఎవరికీ చెప్పకుండా ఉండాలని అతనిని తన ఇంటి మేడమీద బంధిస్తాడు. ఐతే వసంతసేన స్పృహ తప్పి పడిపోయిందేకాని మరణించ లేదు. కొంతసేపటికి ఆమెకు స్పృహ వస్తుంది. బౌద్ధభిక్షువు ఐన సంవాహకుడు ఆ ప్రాంతానికి వచ్చి ఆమెను చూచి, చల్లటి నీళ్లు మొదలైన వాటితో సేద తీరుస్తాడు.

నవమాంకము :- అలంకారాల కోసం చారుదత్తుడు వసంతసేనను చంపి ' వేసినాడని శకారుడు న్యాయాలయంలో అభియోగం తీసుకొని వస్తాడు. న్యాయాధి కారులు వసంతసేన తల్లినీ, చారుదత్తునీ అధికరణానికి పిలిపిస్తారు. విచారణ జరుగుతూ ఉంటుంది. వసంతసేన రోహసేనుని మృచ్చకటికలో (మట్టిబండిలో) ఉంచి అతని కిచ్చిన అలంకారాలను తిరిగి ఆమె కిచ్చి వేయవలసిందిగా చారుదత్తుడు అంతకు ముందు చెప్పి ఉండడంచేత వాటితో వసంతసేన ఇంటికి వెడుళూన్న మైత్రేయునికి చారుదత్తుని మీద వచ్చిన ఈ అభియోగం విషయం తెలిసి అతడు వసంతసేన ఇంటికి వెళ్ళకుండగా న్యాయాధికరణానికి వెడతాడు,

16 మృచ్చకటికచ్చట శకారుడి మీద కలిగిన కోపం ఆపుకోలేక మైత్రేయుడు వానిని కొట్టడం కోసం చేసే సంభమంలో ఆ అలంకారాల మూట అతని చంకలోనుంచి క్రింద పడుతుంది. అప్పుడు శకారుడు చేసిన అభియోగం నిర్ధారిత మవడంతో చారుదత్తునికి మరణదండన విధింపబడుతుంది. దశమాంకము := చారుదత్తుని వధ్యస్థానానికి తీసుకొని వెడతారు. ఈ విషయం తెలిసి బౌద్ధభిక్షుని వెంబడి వసంతసేన అక్కడికి చేరడంతో చారుదత్తునిక్తి విమోచనం లభిస్తుంది. ఇంతలో పాలకుని సంహరించి ఆర్యకుడు రాజై నాదని చెపుతూ శర్విలకుడు చారుదత్తుణ్ణి విడిపించడానికై అచటికి వస్తాడు. చారుదత్తుని మాటమీద శకారుణ్ణి చంపకుందడగా విడిచిపెడతాడు. ఈ విధంగా అంతా సుఖాంతం అవుతుంది. మృచ్చకటికం వైశిష్ట్రము :- కథా సంవిధానంలో కాని, విభిన్నపాత్ర చిత్రణంలో కాని, పాత్రోచిత భాషోపయోగంలో కాని, సామాజిక విషయవర్ణనంలో కాని, చివరకు పేరు ఎన్నుకోవడంలో గాని మృచ్చకటికానికి సొటియైన మరొక రూపకం సంస్కృతభాషలో లేదని చెప్పడంలో సందేహం లేదు. సంస్కృతభాషలోనే కాదు - ప్రపంచంలోని ఏ భాషలోనైనా ఇలాంటి రూపకాలు చాలా అరుదుగానే ఉంటాయి. శూద్రకుడు కొంతవరకు శాస్త్ర నియమాలను అనుసరించినా చాలాచోట్ల వాటిని ఉల్లంఘించడం కూడా జరిగింది. దీనితో కథాసంవిధానంలో ఒక నూతనత్వం లభించినది. ఉదాహరణకి - ప్రతీఅంకంలోనూ నాయకుడు ఉండాలి. ఆ నియమాన్ని ఇతడు పాటించలేదు. రంగంమీద చూహానివిగా నిషేధించబడిన నాయికా నాయకుల ఆశ్లేషణాదికమూ, కొట్లాటలూ, నిద్రా, చోరాదుల రాత్రి విహారాలు, భయంకరమైన మారణదృశ్యమూ, నిరపరూధిని వధ్యస్థానానికి తీసుకొని వెళ్ళడమూ వంటి ఎన్నో విషయాలను రంగంమీద చూపించినాడు. సూత్రధారుడు సంస్కృతంలోనే మాటలాడాలి. వానిచేతకూడా ప్రాకృతంలో మాటలాడించినాడు. ప్రకరణాదులకు పెట్టిన పేరుకు నాయికా నాయకుల పేరుతో సంబంధం ఉండాలని నియమం. ఆ నియమాన్ని కూడా ఉల్లంఘించి ఎక్కడనో రూపకమధ్యంలో ఉన్న

మృచ్చకటికచ్చట 17 చిన్న సంఘటనను పట్టి రూపకానికి పేరు పెట్టినాడు. ఐతే ఈ చిన్న మట్టిబండీ, దానిమీద ఉంచిన ఆభరణాలూ ఎంత వ్యవహారం నడిపించినాయో మనకు తెలుసు. ఈ విధంగా తన రూపకానికి పేరు ఎన్నుకోవడంలో కూడా స్వాతంత్రాన్ని చూపించి నాడు. ఇలా చాలా విషయాలలో స్వాతంత్ర్యం అవలంబించడంచేతనే శూద్రకుడు ఇంత ఉత్కృష్టమైన ప్రకరణం మనకు అందజేయ కలిగినాదేమో. ఐతే వెనుక చెప్పిన ఈ విషయాలు ప్రకరణమనే రూపకభేదంలో నిషేధింపబడినాయి కాని, భాణ-ప్రహసన - సమవాకారాది రూపకఖేదాలలో వాటి ప్రయోగం శాస్తస్తంమతమే. అనగా వీటిని ప్రకరణంలో ప్రయోగించినంతవరకే శూద్రకుడు చూపిన స్వాతంత్ర్యం.

పాత్రోచిత భాషా ప్రయోగము :- సంస్కృత రూపకాలలో ఉత్తమ పాత్రలు సంస్కృత భాషలోనూ, నీచపాత్రలు ప్రాకృత భాషలోనూ మాటలాడతారు. ఉత్తమ పాత్రలలో కూడా స్త్రీలు ప్రాకృతమే మాటలాడుతారు. దీనికి కారణం అందరూ సంస్కృతభాష మాటలాడుకూడదు అనే నిషేధం ఉండడమే అని కొందరు ఆధునికుల ఆక్షేపము. ఇది అజ్ఞానవిలసితము. భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పినట్లుగా నాట్యంలో (రూపకాలలో) లోకచరిత్ర స్పష్టంగా ప్రతిఫలించాలి. అనగా రూపకాలు సమాజానికి దగ్గరగా ఉండాలి. పాణిని కాలంలో సర్వజన భాషగా ఉన్న సంస్కృతం మన కిపుడు లభించే రూపకాలు వచ్చే కాలానికి, భరతుని నాట్యశాస్త్ర కాలానికి, కేవలము విద్యావంతుల భాషగా ఉండి పోయినది. జనసామాన్య భాషగా అనేక ప్రాకృత భాషలు వచ్చినవి. ఈనాడు విద్యావంతుల భాషయైన ఆంగ్ల భాషలో నిరక్షరాస్యులు నిరర్ణళంగా మాటలాడుతున్నట్లు చూపడం ఎంత అసహజమో జనసామాన్యులు సంస్కృతంలో మాటలాడుతున్నట్లు చూపడం కూడా అంత అసహజమే. అందుచేత విద్యావంతులు కారనుకొన్నవారిచేత ప్రాకృతం మాటలాడించడం రూపకాలలో ఒక సంప్రదాయ మైనది.

శూద్రకుడు ఉపయోగించినన్ని ప్రాక్సృతభాషలు ఏ కవీ తన రూపకంలో ఉపయోగించలేదు. సూత్రధారుడు, నటి, రదనిక, మదనిక, వసంతసేన, ఆమె తల్లి, ఆమె చేటి, కర్ణపూరకుడు, చారుదత్తుని భార్య, శోధనకుడు, గ్రేష్టి ఈ పదకొండుగురు పాత్రలు శౌరసేనీ ప్రాకృతంలో మాటలాడతారు. వీరక చంద్రకు

18 మృచ్చకటికచ్చట లనే రాజభటులు అవంతిభాషలోను, విదూషకుడు ప్రాచ్యభాషలోను, సంవాహకుడు, శకారవసంతసేనాచారుదత్తుల చేటులు (పరిచారకులు), భిక్షువూ, చారుదత్తుని కుమారుడు - ఈ ఆరుగురూ మాగధీ భాషలోనూ, శకారి అనే అపభ్రంశభాష లోనూ, చండాలులు చాండాలీ భాషలోనూ, సభికద్యూతకరులు ధక్క భాషలోనూ మాటలాడు తారు. ఈ విధంగా ఏడు ప్రాకృత భాషలు ప్రయోగింపబడినవి. ఒక విధంగా చూస్తే దీనిని సంస్కృత రూపకం అనడం కంటె ప్రాకృత రూపకం అనడమే న్యాయం అనిపిస్తుంది. పాత్ర చిత్రణము :- పాత్రచిత్రణం విషయంలో శూద్రుకునికి శూద్రకుడదే సాటి. ఏ రెండు పాత్రలూ ఒక్క విధంగా ఉండరు. ఎవరి ప్రాతిస్వికత (1001/166200 వారిది. అత్యుత్తమ చరిత్ర గలి చారుదత్తుడు, వేశ్య అయినా కులాంగనా జీవితాన్ని కోరే సుగుణవతి వసంతసేన, కష్టసమయాలలో కూడా మిత్రుని విడనాడని విదూషకుడు. అకారణ నైరదారుణుడు, ఎలాంటి పాపానికైనా వెనుదీయనివాడు అయిన శకారుడూ, జూదం ఆడి వీథిలో పడికొట్లాడుకునే జూదరులూ, చౌర్యవృత్తి అవలంబించిన (బ్రాహ్మణుడు శర్విలకుడూ, రాజ్యోపన్లవాన్ని తీసుకురాగలిగిన శర్విలకాదులూ - ఒకరేమిటి అనేక విధాలైన పాత్రలు సజీవంగా మనకు ప్రత్యక్షం అవుతారు. చారుదత్తుడు :- ఇతడు మవాధైర్యశాలి. తనకున్న అనంతైశ్వర్యాన్ని దానధర్మాలకే వ్యయించిన త్యాగమూర్తి. సద్దుణ సంపన్నుడు. అందుచేతనే ఉజ్జయినిలో ఉన్న ప్రతి వ్యక్తినుండీ, చివరికి శకారుని దగ్గరి అనుచరులనుండి కూడా మన్ననలను పొందినవాడు. తనకు కలిగిన ఈ దరిద్రావస్థను గూర్చి అతడు అనేక విధాల వాపోతూ ఉంటాడు. “సత్యంన మే విభవనాశకృతాస్తి చిన్తా భాగ్యక్రమేణ హి ధనాని భవన్తి యాన్సి, ఏతత్తు మాం దహతి నష్టధనాశ్రయస్య యత్సౌహృదాదపి జనాః శిథిలీభన్తి”. (1-13) “ఐశ్వర్యం పోయినందుకు నాకు విచారం లేదు. అది వస్తూ ఉంటుంది, పోతూ

మృచ్చకటికచ్చట 19 ఉంటుంది. ఐతే ఐశ్వర్యం పోవడంతోటే నా మిత్రులు కూడా నాకు దూరం అవుతున్నారు; ఇది దుర్భరంగా ఉన్నది.”

“దారి ద్యాత్చురుషస్య బానస్టవజనో వాక్యే న సంతిష్టతే

సుస్నిగ్ధా విముఖీభవన్సి సుహృదః స్ఫారీభవన్యాపద:.

సత్త్వం హ్రాసముపైతి శీలశశినః కాన్స్నిః పరిమ్గాయతే

పాపం కర్మ చ యత్సరైరపి కృతం తత్తస్య సంభావ్యతే”.

“దారిద్ర్యం రావడంతోటే బంధువులెవరూ చెప్పినమాట వినరు. స్నేహితులు వైముఖ్యం వహిస్తారు. ఆపదలు ఎక్కువ అవుతాయి. బలం క్షీణిస్తుంది. శీలమనే చంద్రుని కాంతి వాడిపోతుంది. ఇతరులు చేసిన పాపకార్యాన్ని ఇతని మీద ఆరోపిస్తారు”.

ఇంత మనస్తాపంతో బాధపడుతున్నా తనను చూచి తానే నవ్వుకునే శక్తికూడా ఇతనిలో ఉన్నది. దారిద్ర్యాన్ని సంబోధిస్తూ - “ఓ దారిద్యమా! ఇంత కాలంనుంచి నన్ను మిత్రుడులా ఆశ్రయించుకొని ఉన్నావు. నేను మరణిస్తే నీవు నిరాశయం అయిపోతావే అని నాకు చాలా విచారంగా ఉన్నది” అని అంటాడు.

“దారిద్ర శోచామి భవన్తమేవమస్మచ్చరీరే సుహృదిత్యుషిత్వా,

విపన్నదేహే మయి మన్దభాగ్యే మమేతి చిన్హా క్వ గమిష్యసి త్వమ్‌”. (1-36)

తన ఇంటికి ఎవరో దొంగ కన్నం వేసినాడని విదూషకుడు చెప్పగానే - “అయ్యో! పాపం! ఇల్లు చూసి మోసపోయి ఉంటాడు. ఇంట్లో ఏమీ దొరకక పోడంతోటే ఆ చోరుడు హతాశుడై తన మిత్రులతో నన్ను గూర్చి ఏమి చెప్పుకుంటాడో కదా” అని అంటాడు.

“పోయిన అలంకారాలకి బదులుగా ఇంత అమూల్యమైన రత్నహారాన్ని వసంతసేనకు ఇవ్వడమా” అని విదూషకుడు అన్నప్పుడు - “మనం విలవ కట్టవలసినది అలంకారాలకి కాదు; మన మీద ఎంత నమ్మకంమీద ఆమె ఆ అలంకారాలు మన వద్ద ఉంచినచో ఆ నమ్మకానికి విలువ కట్టాలి” అని అంటాడు-

“యం సమాలంబ్య విశ్వాసం న్యాపో౭ స్మాసు తయా కృతః,

తస్యైతన్మహతో మూల్యం ప్రత్యయస్యైవ దీయతే.” (1-29)

20 మృచ్చకటికచ్చట తనను వధ్యస్థానానికి తీసుకొని- వెడుతున్నపుడు - “నాకు మరణదండన విధిచింనందులకు ఏ మాత్రమూ విచారం లేరు. ఇలాంటి ఘోరనిందను మోపి నందులకే విచారం. నేను నిరపరాధి నని చెప్పి తరువాత నన్ను చంపినా అది నాకు పుత్రోత్సవంవంటిదే” - అని అంటాడు. ““న భీతో మరణాదస్మి కేవలం దూషితం యశః, విశుద్ధస్య హి మే మృత్యుః పుత్రజన్మసమో భవేత్‌”. ౧౧27 న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నపుడు విదూషకుడు వచ్చి “మిత్రమా! నిజం చెప్పవచ్చును కదా!” అని ప్రశ్నించినపుడు చారుదత్తుడు అంటాడు - “దుర్చలం నృపతేశ్చక్షుర్నైతత్తత్తం నిరీక్షతే, కేవలం వదతో దైన్యమశ్లాఘ్యం మరణం భవేత్‌”. ౮020-౩2 “ాజుల కళ్లు దుర్చలమైనవి. యథార్ధాన్ని చూడజాలవు. అటువంటప్పుడు ఏమి చెప్పినా దైన్యం ప్రకటించినట్లే అవుతుంది. తరవాత మరణ దండన విధిస్తే దానిని అనుభవించడం కూడా అశ్హాఘ్యమే అవుతుంది. అనగా అలాంటి దైన్యాన్ని చూపకుండా మరణించడంలోనే హుందాతనం ఉన్నది”. చివరికి తన కింత మహాపకారం చేసిన శకారుణ్ణి శిక్షించవలసినదిగా అటు ప్రజలూ, ఇటు రాజప్రతినిధిగా శర్విలకుడు కూడా కోరినా నిరాకరించి ఆతనికి ప్రాణభిక్ష ఇచ్చిన మహోదాత్త స్వభావుడు చారుదత్తుడు. శకారుడు :- ఈ పాత్రని అత్యద్భుతంగా చిత్రించినాడు శూద్రకుడు. శకారాలతో నిండిన ప్రాకృతభాష మాటలాడటంచేత ఈతని కాపేరు వచ్చింది. ఇతడు రాజుగారి బావమరిది. బహుశా ఉంపుడుకత్తెకు సోదరుడు. అలాంటి వానికి ఉండవలసిన దుష్ట లక్షణాలన్నీ ఉన్నాయి. నడివీథులలో ్రీలను బలాత్మరించడం, అధికారులమీద అధికారం చలాయించడం, అడ్డువచ్చినవాళ్ల నందరినీ ఏలాంటి పాపభీతీ సంకోచమూ లేకుండా పరిమార్చడమూ ఇవన్నీ ఇతని సహజ గుణాలు. ఇతని మాటలాడే పద్ధతీ, ఇతనికిగల పురాణేతిహాసాదుల జ్ఞానమూ హాస్యజనకంగా ఉంటాయి. అయితే ఇదంతా ఇతడు కావాలని చేస్తున్నట్లుగా కనబడుతుంది. ఎందుచేతనంటే చివరి చివరికి వసంతసేనను పీకి

మృచ్చకటికచ్చట 21 నులిమి చంపిన ఘట్టంలోనూ, న్యాయస్థానంలోనూ ఇతని వ్రపర్తనలో ఇలాంటి అసంబద్ధ వాక్యాలేవీ కనబడవు. ఒక దుర్మార్గుడు ఒక సద్ధతి ప్రకారంగా వలా ప్రవర్తిస్తాడో అదే కనడుతుంది.

ప్రథమాంకంలోనే శకారుడు వసంతసేనను వెంబడిస్తూ మనకు ప్రత్యక్షం అవుతాడు. తనను చూచి పారిపోతున్న వసంతసేనను ఉద్దేశించి -

“మమ మదనమనజ్ఞం మన్మథం వర్థయస్తీ

నిశి చ శయనకే మమ నిద్రామాక్షిపన్తీ,

'ప్రసరసి భయఖీతా ప్రస్థలస్తీ స్టలన్తీ

మమ వశమనుయాతా రావణస్యేవ కుస్తో.

“నాలో మన్మథుణ్ణి రేకెత్తిస్తూ, రాత్రి పడకమీద నాకు నిద్ర లేకుండా చేస్తూ భయపడి రావణాసురుని చూచి కుంతి పారిపోయినట్లు ఎందుకు పారిపోతావు?” అని అంటాడు. “మదనం, అనంగం, మన్మథం” “ప్రస్థలన్తీ - స్థలస్తో ఈ విధంగా ఒకే అర్ధంగల అనేక పదాలు వాడడమూ, “రావణస్యేవ కున్తో మొదలైన అసంబద్ధమైన ఉపమానాలు వాడడమూ ఇవి ఇతని మాటలలో అంతటా కనిపిస్తుంది. ఇలాంటి స్థలాలు దాదాపు పది-పదిహేను ఉంటాయి.

శకారుడు ఎంతటి ప్రగల్భాలరాయడో అంత షిరికిపంద. వీళ్లు వెంబడి స్తూన్నప్పుడు వసంతసేన “పల్లవక, పల్లవక”, “పరభృతికే, పరభృతికే” అంటూ తన పరిచారకులను పిలుస్తుంది. అది వినగానే శకారుడు భయపడుతూ పక్కనున్న విటునితో “భావ భావ! మనుష్యాః, మనుష్యాళి (ఎవరో మగవాళ్లు మగవాళ్లు) అన్‌ అంటాడు. పుష్పకరండకోద్యానంలో తనను నిరాకరించిన వసంతసేనను చంపబోయి నపుడు విటుడు అద్దుకుంటాడు. విటుడు కత్తి దాయవలసి వస్తుంది. దానితో భయపడి శకారుడు ఇదంతా నేను పరిహాసంకోసం చేస్తున్నాను అని విటునికి నచ్చచెప్పి అతనిని ఏదో మరొక పనిమీద పంపివేసి వసంతసేనను పీకి నులిపి క్రింద పడవేస్తాడు.

దుర్చలులనూ, నిస్సహాయులనూ నిర్ణయగా పీడించే స్వభావం కలవాడు, పుష్పకరండోద్యానంలోనికి ప్రవేశించిన బౌద్ధభిక్షువు ఇతని మాట వినగానే హడలి

22 మృచ్చకటికచ్చట పోతాడు. “అయ్యో! ఇతని కంట బడ్డానే! ఎవడైనా ఒక భిక్షువు అపరాధం చేసినా కనిపించిన భిక్షువు నల్లా ముక్కుకు తాడు వేసి ఎద్దులను లాగినట్లు లాగి పారవేస్తాడు” - “ఏకేన భిక్షుణా అపరాధే కృతే అన్యమపి యత్ర యత్ర భిక్షుం పశ్యతి తత్ర గామీవ నాసాం విద్ధాపవాహయతి” అని అనుకుంటాడు. అతడు భయపడినట్లుగానే శకారుడు అతనిని పట్టుకొని - “ఏమిరా! ఇది మా బావగారు నా కిచ్చిన ఉద్యానం. ఈ సరస్సులో కుక్కలూ, నక్కలూ నీళ్లు త్రాగాలే కాని వరమనుష్యుడను నేనుకూడా స్నానం చేయను, ఉలవగుగ్గిళ్ల కంపుకొట్టే నీ శాటి గుడ్డలను తడుపుతూన్నవా!” అని అంటూ చావమోదుతాడు. ఈతనితో స్నేహం చేస్తున్నా విటుడు చాలా మంచివాడు. ఆ భిక్షవుని విడిచి పెట్టమంటాడు. ఒక షరతుమీద విడిచి పెడతానంటాడు శకారుడు. అదేమిటనగా - ఆ భిక్షువు కొంత బురద తీసి నీటిలో వేయాలట, ఐతే నీరు బురద కాకూడదట. లేదా నీళ్లు ఉండచుట్టి బురదలో విసరాలట. చివరికి విటుడు కూడా విసుగు చెంది - స

“అహో మూర్ధకా!

విపర్యస్త మనళశ్చేషైః శిలాశకలవర్ష్మభిః,

మాంసవృక్షైరియం మూర్ధెః భారాక్రాంతా వసుంధరా.

“మూర్చులు మాంసమయ వృక్షాలు. మనస్సూ చేష్టలూ కూడా విపరీతంగా ఉంటాయి. శరీరాలు శిలాశకలాలవంటివి. వీళ్లందరూ భూభారభూతులు” అని అంటాడు.

దుర్మార్గులైన రాజబంధువుల ప్రవృత్తి ఏ విధంగా ఉంటుందో మనం ఈతని వ్యవహారాన్ని పట్టి తెలుసుకొనవచ్చును. న్యాయాలయం తెరిచి ఈ రోజున వ్యవహారం కోసం వచ్చిన వాళ్లెవరైనా ఉంటే రావచ్చు నని అంటూ శోధనకుడు పిలుస్తాడు. ఇదిగో నేను ఉన్నాను అని అంటూ శకారుడు ముందుకు వస్తాడు.

ఈ రోజున ఈతనితో బోణీయా అని భయపడి, నీ వ్యవహారం ఈ రోజున చూడము అని అధికరణికుడు (న్యాయాధిపతి) కబురు పంపుతాడు. దానితో శకారుడు ఉగ్రుదైపోయి- “అః కింన దృశ్యతే మమ వ్యవహారః యది న దృశ్యతే తదావుత్తం రాజానం పాలకం భగినీపతిం విజ్ఞాప్య భగినీం మాతరం చ విజ్ఞాప్య ఏతమధికరణికం దూరీకృత్య అన్యమధికరణికం న్థాపయిష్యామి” -

మృచ్చకటికచ్చట 23 “ఏమేమీ! నావ్యవహారం చూడరా! చూకడపోతే మా బావగారు, మా అక్మమొగుడు, పాలకరాజుతోటీ, మా అక్కతోటీ, మా అమ్మతోటీ చెప్పి ఈ న్యాయాధికారిని తీయించివేసి మరొకళణ్ణి వేయిస్తాను” అని అంటాడు. దానితో భయపడి అధికరణికుడు అతనిని లోనికి పిలిచి వ్యవహారం పరిశీలించడానికి అంగీకరిస్తాడు. లోనికి రాగానే తన వ్యవహారం ఏమో ముందుగా చెప్పకుండా తానెవరో చెప్పుకొంటాడు. అది కూడా ఆ అధికరణికుని చెవిలో -

“రాజశ్వశురో మమ పితా రాజా తాతస్య భవతి జామాతా,

రాజశ్యాలో£_హం మమాపి భగినీపతీ రాజా” “నేను ఎవరి ననుకున్నావు! మా నాన్నగారు రాజుగారికి మామగారు; రాజుగారు మా నాన్నగారికి అల్లుడు; నేను రాజుగారి బావమరిదిన్సి రాజుగారు మా అక్కగారి మగడు.

ఇదంతా విని అధికరణికుడు ఎంత భయపడినా - “అయ్యా! మా కన్ని విషయాలూ తెలుసును; కులాన్ని చెప్పుకొని ప్రయోజనం ఏమిటి? శీలం కావాలి కాని! సుక్షేత్రంలో ముళ్లచెట్లు బాగా బలంగా పెరుగుతాయి. అసలు విషయం ఏమిటో చెప్పు” అని అనకుండా ఉండలేక పోయినాడు.

“సర్వం జ్ఞాయతే వా

కిం కులేనోపదిష్టేన శీలమేవాత్ర కారణమ్‌,

భవన్తి నితరాం స్పీతాః సుక్షేతే కంటకిద్రుమా౯” (౧౬7)

తదుచ్యతాం కార్యమ్‌”

ఇది చూస్తే ఆనాటి నిరంకుశ ప్రభువు కింద పని చేసే అధికారికూడా చాలా ఆత్మశుద్ధి, ధైర్యమూ కలవాడని చెప్పాలి. సమయానుకూలంగా పన్నాగం పన్నే శక్తి కూడా శకారునిలో ఉన్నది. వసంతసేనను చంపుతూన్నప్రడు స్థావరకుడనే చేటుడు అక్కడ ఉన్నాడు. అతడు రహస్యం ఎక్కడ బైట పెడతాడో అని అతనిని శకారుడు మేడ గదిలో బంధించి పడవేస్తాడు. చారుదత్తుణ్ణి వధ్యస్థానానికి తీసుకొని పోతూన్న ప్పుడు ఆ చేటుడు ఉండబట్టలేక ఏలాగో బంధనాలు తెంపుకొని జనంలోనికి వచ్చి - వసంతసేనను చంపినది శకారుడే కాని చారుదత్తుడు

24 మృచ్చకటికచ్చట కాదని చెపుతాడు. ఇంతలో శకారుడు చూచి ఆతనిని బ్రతిమాలినా ఆతడు వెనుకకు వెళ్ళడు. జనం అంతా అతని మాట నమ్మే పరిస్థితిలో ఉంటారు. “బీడు బంగారం అపహరించినాడు. అందుచేత వీనిని కొట్టి బంధనంలో పడవేశాను. ఆ కోపంతో ఇలా చెపుతూన్నడు అని అంటూ చేటుడి దగ్గరికి వెళ్ళి రహస్యంగా బంగారు కడియం వాని చేతిలో పెట్టి - “ఇది తీసుకొని మరోవిధంగా చెప్పు” అని అంటాడు. వెంటనే ఆ చేటుడు - “అయ్యా! చూచినారా! ఇది నాకు లంచం ఇచ్చి మరో విధంగా చెప్పమంటున్నాడు అని ఆ కడియం చూపిస్తాడు. “ఆం ఈ కడియాన్ని గూర్చే వీనిని నేను బంధించాను” అని శకారు దనడంతో అక్కడి వాళ్లంతా అతని మాటలే నమ్ముతారు.

ఈ విధంగా శకారుడు శూద్రకునిచేత అతినైపుణ్యంతో సృష్టించబడిన పాత్ర, ఈతడు మూడు అంకాలలో మాత్రమే కనబడినా ఈతని ప్రభావం మాత్రం నాటకం అంతటి మీదా ప్రసరించి ఉన్నది.

శర్విలకుడు :- ఇత డొక బ్రాహ్మణ యువకుడు. వసంతసేన దగ్గర క్రీతదాసిగా ఉన్న మదనికను (ప్రేమించి ఉన్నాడు. వసంతసేనకు ఇవ్వవలసిన సొమ్ము చెల్లించి మదనికను దాస్యవిముక్తురాలిని చేసి ఆమెను వివాహమాడవలె

నని ప్రయత్నము. అందుకొరకై చారుదత్తుని ఇంటికి కన్నంవేసి అక్కడ వసంతసేన న్యాసంగా ఉంచిన అలంకారాలను అపహరిస్తాడు. అయితే ఇది ప్రథమచౌర్య ప్రయత్నం కాదు. ఇతడు ఈ కళతో ఆరితేరినవాడవడమే కాకుండా అశ్వత్థామాదులు అవలంబించిన పద్ధతి అవడంచేత అది ఏమీ తప్పులేని వృత్తి అంటాడు. కామం నీచ మిదం వదన్తు పురుషాః స్వప్నే చ యద్వర్ధతే విశ్వస్తేషు చ వంచనాపరిభవళశ్చార్యం న శౌర్యం హి తత్‌, స్వాధీనా వచనీయతాపి హి వరం బద్దో న సేవాంజలిః మార్గో హ్యేష నరేంద్రసౌప్తికవధే పూర్వం కృతో ద్రౌణినా. (౧-11) “క్క పౌర్యం అనేది అందరూ వళ్లు మరచి నిద్రపోతూన్న సమయంలో చేసే వంచన అవడంచేత ఇదేమీ శౌర్యంకాదు అని అందరూ అంటే అనవచ్చును. అందరూ నిందిస్తారు కూడా. ఏది ఏమైనా ఒకని దగ్గర నిలబడి 'దాసో౭౬ హమ్‌”

మృచ్చకటికచ్చట 25 అని దోసిలి ఒగ్గవలసిన పని ఉండదు. ఉపపాండవాదులను సంహరించినప్పుడు అశ్వత్థామ అవలంబించిన మార్గం ఇదే కదా?”

చౌర్యశాస్తం అంతా క్షుణ్ణంగా అభ్యసించి దానిని ప్రయోగాత్మకంగా అనేక పర్యాయాలు ఉపయోగించిన వ్యక్తి శర్విలకుడు. పండు ఇటుకల గోడ అయితే ఎలా కన్నం తవ్వాలి, పచ్చి ఇటుకలైతే ఎలా తవ్వాలి, మట్టి ముద్దల గోడ ఐతే ఎలా తవ్వాలి, కజ్జగోడ అయితే ఏమి చెయ్యాలి - వీటి కన్నింటికీ శాప్త్రీయ ఫక్కికలు తెలిసినవాడు. తవ్వే కన్నంలో కూడా కళాత్మకమైన ఆకారం, అందం ఉండాలట. తాను చేసే కన్నం వికసిస్తూన్న పద్మంవలె ఉండాలా, సూర్యబింబంవలె ఉండాలా, బాలచంద్రాకారంలో ఉండాలా, దిగుడు బావివఠె విస్తీర్ణంగా ఉండాలా, స్వస్తికాకారంలో ఉండాలా, పూర్ణ కుంభాకారంలో ఉండాలా అని కొంతే ఆలోచించుకుంటాడు. ఎందుచేతననగా మరునాడు తన శిల్పాన్ని చూచి పాగ ఆశ్చర్య చకితులు కావాలట.

“వద్మవ్యాకోశం భాస్కరం బాఎచంద్రం

వాపీవిస్తీర్ణం స్వస్తికం పూర్ణకుంభమ్‌,

తత్మస్మిన్‌ దేశే దర్శ్భయామ్యాత్మశిల్పం

దృష్ట్వా శ్వోయం యద్విస్మయం యాన్తి పొరాః” 113)

చివరికి పండుటిటుకల గోడ మీద పూర్ణకుంభమే అందంగా ఉంటుందని నిర్ణయించుకొని చౌర్యాధిదేవతలూ చోరవిద్యాచార్యులూ అయిన కుమారకార్తికేయ

  • కనకతక్తి - దేవీవ్రత - భాస్మరనంద్యాదులకు నమస్కరించి, తన ్రత్యక్షాచార్యుడైన యోగాచార్యుని కూడా స్మరించి కన్నం తవ్వడం ప్రారంభిస్తాడు. అయ్యో ప్రమాణ సూత్రం (కొలుచుకొనే త్రాడు) మరిచితినే అని అనుకొని, పరవాలేదు; ఈ యజ్ఞోప వీతంతో పని జరుపుకోవచ్చును అని నిర్ణయించుకొని ఇలా అంటాడు :

“యజ్ఞోపవీతం హి నామ బ్రాహ్మణస్య మహదుపకరణద్రవ్యమ్‌; విశేషతో౭_ స్మద్విధస్య, కుతః -

“ఏతేన మాపయతి ఖిత్తిషు కర్మమ-,

మేతేన మోచయతి భూషణసంప్రయోగాన్‌.

26 మృచ్చకటికచ్చట ఉద్దాటకో భవతి యన్రదృథే కపాటే

దష్టస్య కీటభుజగైః పరివేష్టనం చ.” (౫-16)

“ఆహా! యజ్ఞోపవీతం అనేది బ్రాహ్మణునికి ఎంత ఉపకరిస్తూ ఉంటుంది! నా వంటి వానికి ఇంకాను, ఎందుచేతననగా -

“గోడకు కన్నం త్రవ్వేటప్పుడు దీనిచేత కన్నాన్ని కొలవ వచ్చును. అలంకారాల సంధులు వదలు చేయవచ్చును. తలుపు గడియ గట్టిగా ఉంటే దానిని ఊడదీయ

వచ్చును. తేలుకుట్టినా పాము కరచినా గట్టిగా బిగించి కట్టి ప్రథమ చికిత్స చేసుకోవచ్చును”.

ఇలా అనుకుంటూ కన్నం తవ్వుతూ ఉండగా పాము కరుస్తుంది. యజ్ఞోపవీతం పాము కరచిన వేలుకు బిగించి చికిత్స చేసుకొని లోన ప్రవేశిస్తాడు. విలువైనది ఏదీ కనబడదు. ఒక మూల వీణ, ఒక మూల మృదంగం ఇవన్నీ చూసి “అయ్యో! ఇదేదో నాట్యచార్యుని ఇల్లువలె ఉన్నది; ఇంటిని చూచి మోసపోతినే” అనుకుంటాడు. చివరికి విదూషకుడి చేతిలో ఆ అలంకారాలు దొరకడంతో వాటిని తీసుకొని వెళ్ళి మదనికను విడిపించుకొని, వసంతసేన ఇచ్చిన బండిమీద ఆమెను తీసుక్రాన్సి వెడతాడు.

ఐతే తన మిత్రుడైన ఆర్యకుణ్ణి పాలకుడు చెరసాలలో పెట్టినాడని వినగానే అంత శ్రమపడి, అంత సాహసంచేసి విడిపించుకున్న మదనికనుకూడా విడిచిపెట్టి, ఆమెను ఒంటరిగా ఒక మిత్రుని ఇంటికి పంపివేసి, ఆర్యకుని విడిపించటానిక్తె ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో తన సహచరులను కలుసుకోవడానికి వెళ్ళిపోత్రాడు.

“ద్వయమిదమతీవ లోకే ప్రియం నరాణామ్‌ సుహృచ్చ వనితా చ,

సంప్రతి తు సునరీణాం శతాదపి సుహృద్విశిష్టతమ:.”

(ఈ లోకంలో మానవులకి ఇష్టమైనవి రెండే - వనితా, మిత్రుడూను. ఇప్పుడు నాకు నూరుగురు సుందరుల కంటె కూడ మిత్రడే చాలా విశిష్టుడు) అని అంటాడు. చివరకు ఆర్యకుని విడిపించి రాజ్యాభిషిక్తుని చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తాడు. ఈ విధంగా శర్విలకుడు ప్రధానమైన వసంతసేనా చారుదత్తుల

మృచ్చకటికచ్చట 27 కథలోనూ, పాలకుని రాజ్యభ్రష్టుని చేడయం అనే ఉపకథలోనూ కూడా సమంగా ఉపయోగిస్తాడు. .

విదూషకుడు :- ఇతని పేరు మైత్రేయుడు. చారుదత్తుని మిత్రుడు. అతడు దారిద్యంతో బాధపడుతున్న సమయంలో కూడా అతనిని విడవనివాడు. అతడు ఐశ్వర్యంతో తులతూగుతున్నప్పుడు తాను ఏ విధంగా సమస్త సుఖాలూ అనుభవిస్తూ ఉండేవాడో స్మరించుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఆ కాలంలో చారుదత్తుని భవనంలో అనేక భక్ష్యాలు తీసుకొనివచ్చి తన ముందు ఉంచేవారట. చిత్ర పటం నిర్మించేవారు అనేకమైన రంగుల గిన్నెలలో వ్రేళ్లు ముంచినట్లుగా వ్రేళ్షశో మాత్రమే అలా-అలా భక్ష్యాలని స్పృశించి, తొలగించి వేసి, నగర చత్వరంలో (వౌరాస్తాలో) కూర్చొన్న వృషభంవలె నెమరవేస్తూ ఉండేవాడట. అలాంటి తనకు ఈనాడు పెంపుడు పావురం ఆహారం కోసం అటూ ఇటూ తిరిగి నివాసం కోసం ఇంటికి చేరినట్లుగా పగలంతా ఇటూ అటూ తిరిగి, సాయంకాలానికి చారుదత్తుని ఇంటికి చేరవలసిన చెడ్డ రోజులు వచ్చినాయట. ఈ విధంగా విచారిస్తున్నా ఆతనికి చారుదత్తుని మీద ఉండే (ప్రేమ వీసమంతైనా తగ్గలేదు.

ఐతే తెలితివక్కువతనం వల్ల, కొంతవరకూ, చారుదత్తుని కష్టాలకి ఇతడే కారకు డౌతాడు. వసంతసేన న్యాసంగా ఉంచిన అలంకారాలని రాత్రిపూట రక్షించ వలసిందిగా చెప్పి చారుదత్తుడు విదూషకునికి ఇస్తాడు. శర్విలకుడు తాను కన్నం తవ్వినది ఒక దరిద్రుని ఇంటికనే విషయం తెలుసుకొని వెళ్ళిపోబోతుండగా సగం నిద్రలో ఉన్న విదూషకుడు అతడు చారుదత్తుడని (భ్రాంతి చెంది - “మిత్రమా! ఈ అలంకారాలతో నాకు సరిగా నిద్రపట్టడం లేదు. నీ దగ్గరనే ఉంచుకో” అని అంటూ ఆ శర్విలకుని చేతిలో పెడతారు. అదే విధంగా న్యాయస్థానంలో శకారునితో కలహానికి దిగి ఆ అలంకారాల మూట క్రిందికి జారవిడవడంతో చారుదత్తునిపై మోపిన అభియోగం నిర్ధారితమై ఆతడు వధ్యన్థానానికి వెళ్ళవలసి వచ్చింది.

వసంతసేన :- ఈమె జన్మతః వేశ్వయే అయినా కులాంగనా జీవితాన్ని గడపాలనే తీవ్రవాంఛ గల ఉత్తమ వనిత. చతుర్ధాంకంలో వర్ణించిన

28 మృచ్చకటికచ్చట అష్టప్రాంగణాలతో కూడిన ఈమె భవనాన్ని పట్టి చూస్తే ఈమె రాజతుల్యైశ్వర్యవతిగా స్పష్టం అవుతుంది. అయినా ధనానికి ఏ మాత్రమూ ప్రాధాన్య మీయకుండా గుణాలను మాత్రమే పురస్కరించుకొని చారుదత్తుని వరించినది. అంత అధికారైశ్వర్యాదులు గల రాజశ్యాలకుడు స్వయంగా కోరినా, తల్లి కూడా అందుకు 'ప్రోత్సహించినా, అతనిని చీకొట్టినది. తనను చారుదత్తుని వంటి మహోదాత్త స్వభావునికి తగిన ఉత్తమ వనితగా బుజువు చేసికొనినది. భిక్షువు ; ఇతడు బౌద్ధసంన్యాసి అవడానికి ముందు సంవాహకుడుగా మనకు కనబడతాడు. సంవాహకుడు పాటలిపుత్రానికి చెందిన ఒక ధనికకుటుంబానికి చెందిన నాగరకుడు. ఇతరధనికులవలెనే ఇతడు కూడ అనేక కళలతో పాటు సంవాహనం (ఒళ్లు పట్టడం) అనే కళ కూడ నేర్చుకున్నవాదు, అయితే దురదృష్టవశం చేత ఐశ్వర్యం కోల్పోయి వృత్తికోసం అన్వేషించుకొంటూ ఉజ్జయినీనగరం చేరాడు. చారుదత్తుడు ఐశ్వర్యంతో తులతూగతూన్న రోజు లవి, అతడు సంవాహకుడుగా చారుదత్తుని దగ్గర చేరాడు. చారుదత్తుడు కూడ సంపద కోల్పోయి దారిద్రంతో బాధపడుతూండగా సంవాహకుడు జూదం ఆడడం జీవికగా చేసికొని ఆ నగరంలోనే నివసించాడు. అయితే అక్కడ కూడా ఆతనికి రోజులు కలిసి రాలేదు. ఒకనాడు అతడు జూదంలో పది సువర్జాలు ఓడిపోయాడు. సభికుదైన (ద్యూతశాలాధిపతి యైన) మాథురునికి ఈ పది సువర్లాలు చెల్లింపజాలక పారిపోవడంకోసం ప్రయత్నించాడు. మాథురుడూ ద్యూతక్రారుడ్డు (వానితో జూదం ఆడి వానిని ఓడించినవాదూ) వానిని తరుముకొంటూ వెడతారు. సంవాహాకుడు పరుగెత్తి వెళ్లి వసంతసేన ఇంట్లో దూరుతాడు. అతని పూర్వవృత్తాంతం అంతా విన్న వసంతసేన మాథురునికి పది సువర్ధాలూ ఇచ్చి సంవాక్షుణ్ణి బాధా విముక్తుణ్ణి చేస్తుంది. సంవాహకుడు గొప్ప ఆత్మవిశ్వాసం గల వ్యక్తి. ఆపతృమయంలో కూడ గైర్యం కోల్పోనివాడు. నా దేహాన్ని అమ్ముకొనియైనా జూదంలో ఓడిపోయిన సొమ్ము తీరుస్తా ని అంటాడు. జూదంలో ఓడిపోయి పారిపోయి వచ్చినట్లుగా వసంతసేన ముందు సశంం చెపుతాడు. ఈ విధంగా తన సత్యనిష్ట రుజువు చేసికొంటాడు. వసంతసేన పది సువర్జాలు ఇచ్చి తనను జూదరుల బారినుండి

మృచ్చకటికచ్చట 29 రక్షించినందుకు తన దగ్గర ఉన్న సంవాహన విద్యను వసంతసేన అనుచరులకు ఎవరికైనా నేర్పుతా నని అంటాడు.

సంవాహకుడు చివరికి వైరాగ్యం చెంది బౌద్ధభిక్షువుగా మారిపోవదానికి సంకల్పిస్తాడు. వసంతసేన ఎంత చెప్పినాకూడ అతడు తన సంకల్పం మార్చుకోలేదు. బౌద్ధభిక్షు వైన తరవాత ఆ సంప్రదాయంలో ఉన్న కఠోరనియమా లన్నీ తు,చ, తప్పకుండా పాలిస్తాడు. జీర్దోద్యానంలో శకారుడు ఆతనిని ఏ కారణమూ లేకుండా అవమానిస్తాడు. అయినా ఆతనిలో ఏ మాత్రం కోపం కనబడదు. శకారుడు పీకి నువిమి వేయిగా క్రింద పడి ఉన్న వసంతసేనను రక్షించినవాడు ఇతడే. భిక్షువులు ఎట్టి షరిస్థితిలోనూ కూడ ప్రీని సృశించకూడదు మెను రక్షించా లని ఎంత ఆత్రంతో ఉన్నా కూడ భిక్షువు ఆమెను స్పృశించలేదు; నేలమీదనుండి పైకి లేవదీయ లేదు. ప్రక్కనే ఉన్న ఒక తీగ క్రిందికి వంచి అది పట్టుకొని లేవవలసిందిగా సలహా ఇస్తాడు. ఈ విధంగా ఈ సంవాహక భిక్షువులో ఒక విశిష్టమైన వ్యక్తిత్వం గోచరిస్తుంది.

ధూత : ధూత చారుదత్తుని ధర్మపత్ని. ఈమె ఉత్తమగుణశీలవతి యైన భారతమహిలకు ప్రతీక. తన భర్తను గూర్చి గాని, ఆతని ప్రేమకు పాత్రమైన వేశ్యాస్తీని గూర్చి గాని పల్లెత్తు మాట కూడ పలకని పరమసాధ్వి ధూత. ఏ విధంగానైనా భర్తకు ఆనందం కలిగించడమే ఈమె జీవన ప్రధానలక్ష్యం. తన భర్తకు అపకీర్తి రాకుండా చూడడానికై ధూత అంతా పోగా తనకు మిగిలిన ఒకే ఒక అమూల్యవస్తువైన రత్నహారాన్ని తృణం వలె ఇచ్చివేస్తుంది. స్త్రీధనం తీసికొనడానికి తన భర్త అంగీకరించ డనే అభిప్రాయంతో ఆమె ఆ హారాన్ని మైశ్రేయునికి దానం చేస్తుంది. మైశ్రేయుని ద్వారా తన భర్తకు ఆ హారం అందుతుం దనీ దానిని ఆతడు పోయిన అలంకారాలకు బదులుగా వసంతసేనకు పంపుతా డనీ ఊహించి ఆమె అలా చేసింది. అలాగే జరిగింది కూడ. అలంకారాలను గూర్చిన రహస్యం అంతా బైట పడి నప్పుడు వసంతసేన ఆ హారాన్ని తీసికొనవలసిందిగా ఎంత బతిమాలినా ఆమె నిరాకరిస్తుంది. చారుదత్తునికి మరణదండం విధించా రని తెలియగానే ఆతడు మరణించడానికి ముందే తాను ప్రాణత్యాగం చెయ్యాలని నిర్ణయించుకొని ఆమె చితి ఏర్పాటుచేయించుకొంటుంది.

30 మృచ్చ్ళకటికచ్చట వసంతసేనను తన సోదరినిగా గౌరవిస్తుంది. ఈ విధంగా ధూతను మహాపతివ్రతా శిరోమణిగా కవి చక్కగా చిత్రించాడు. మదనిక ; మదనిక వసంతసేనకు క్రీతదాసి. ధనం ఇచ్చి కొన్న దాసి. అయితే ఆమె స్వభావము, ఆలోచనలు, చేసే పనులు కూడ ఉత్తమశ్రేణికి చెందిన స్త్రీకి ఉండవలసిన వవడంచేత ఆమెను వసంతసేన తన దాసినిగా గాక ప్రియసఖినిగా చూచుకొనేది. వేశ్యాగ్సృహంలో పరిచారికగా ఇన్నా కూడ ఆమె విశ్చంఖలమైన ప్రవృత్తి గల స్రీ కాదు. తన స్వామిని యైన వసంతసేవవలెనే ఈమె కూడ ఒకే ప్రియునియందు స్థిర మైన అనురాగంతో ఉంది. వసంతసేనక్షు ఆమె విషయంలో స్నేహభావం మాత్రమే కాకుండా మంచి విశ్వాసం కూడ ఉంది. చారుదత్తునిమీద తన కున్న ప్రేమను ఆమె మదనికకు నిస్సంకోచంగా చెపుతుంది. మదనిక కూడ ఈ ప్రణయవ్యవహారంలో యథాశక్తిగా సహాయం చేయడానికి సిద్ధం అవుతుంది. మదనిక శర్విలకుణ్ని (ప్రేమిస్తూన్నది. అయితే అతడు దరిద్రుడవడంచేత మదనిక వసంతసేనకు చెల్లించవలసిన ధనం చెల్లించి ఆమెను విడిపించుకునే శక్తి ఆతనికి లేదు. అందుచేత అతడు చారుదత్తుని ఇంటికి కన్నం వేసి అక్కడ వసంతసేన దాచుకొనిన అలంకారాలు అపహరించి వాటిని వసంతసేన కిచ్చి మదనికను విడిపించుకొనడానికి వస్తాడు. మదనిక ఆ అలంకారాలు వసంతసేన వని గుర్తు పడుతుంది. ఆమె ఆ విధంగా ఆ అలంకారాలచేత దాస్యవిముక్షురా లవదడానికి ఇష్టపడదు. వాటిని ఏదో నెపంతో వసంతసేనకు ఇవ్వవలసిందిగా ఆతనికి సలహా చెపుతుంది. అయితే మదనికాశర్విలకుల మధ్య జరిగిన సంభాషణ అంతా చాటునుండి విన్న వసంతసేన లోలోన ఆమెను ప్రశంసిస్తూ ఆ ఆభరణాలు తీసికొని మదనికను దాస్యవిముక్తురాలిని చేస్తుంది. మదనికను వెంట బెట్టుకాని వెడుతూన్న శర్విలకునికి తన మిత్రుదైన ఆర్యకుణ్ణి రాజైన పాలకుడు బంధించా దని తెలుస్తుంది. వెంటనే అతడు ఆతనిని విడిపించడానికి వెళ్లిపోతాడు. అప్పుడు కూడ ఆమె తనను విడిచి ఆతడు వెళ్లిపోతున్నా డనే కోపం ఏ మాత్రం లేకుండా ఆర్యకవిమోచనయత్నంలో జాగర్తగా వ్యవహరించవలనిందిగా ఆతనిని హెచ్చరిస్తుంది. ఈ విధంగా ఆమె ఉన్నతమైన ఆదర్శాలు, ఉదారస్వభావమూ గల భారతనారీమణిగా చిత్రింపబడింది.

ఎృచ్చకటికచ్చట 31

వాస్యరసము :- మృచ్ళకటికంలో ప్రధానరసం శృంగారము. ఇతర రసాలన్నీ దానికి అంగాలు. అయితే ప్రారంభంనుంచి చివరివరకూ ఈ రూపకంలో హాస్యరసం కూడా అనేక విధాలుగా పోషింపబడినది. ఇంత వాస్యరసపుష్టి మరియే నాటక ప్రకరణాలలోనూ లేదని చెప్పడంలో సందేహం లేదు. హాస్య ప్రధానాలైన ప్రహసనాదులలో హాస్యరసం పోషింపబడినదంటే అది వేరే విషయము.

శకారుడు దుష్టుడైన ప్రతినాయకుడైనా అతని పాత్ర హాస్యాలంబనంగా చిత్రింప బడినది. ఆతని మాటలే కాక చేష్టలు కూడా హాస్యజనకములు. తనను చూచి పారిపోతూన్న వసంతసేనను “నాణకమోషికా”, “మకశికా” మొదలైన అర్ధంలేని పది పేర్గుపెట్టి పిలిచి, “ఏమిటి బావా! ఈమెకు ఇలా పది పేర్లు పెట్టినాను, అయినా నా (ప్రేమను అంగీకరించ దేమిటి! అని అంటాడు విటునితో.

“ఏమా నాణక మోషకా మకశికా మత్సాశికా లాసికా

నిర్వాసా కులనాశికా అవశికా కామస్య మంజూషికా,

ఏషా వేశ వధూః సువేశనిలయా వేశాంగనా లేశికా

ఏతాన్యస్యా దశ నామకాని మయా కృతాన్యద్యాపి మాం నేచ్చతి”([1-23) “రాముణ్ణి చూచి భయపడి పారిపోతున్న ద్రౌపదివలె ఎందుకల్లా అలంకారాలు రుణర్వుణా ('మోగించుకొంటూ పరుగెత్తుతావు? హనుమంతుడు విశ్వావసుపు చెల్లెలైన సుభద్రను హరించినట్లుగా బలాత్కారంగా హరిస్తానూ” అని 'అంటాడు తన పురాణగ్గాథా పాండిత్యాన్ని ప్రకటిస్తూ -

“రుణజ్ఞణమితి బహుభూషణ శబ్బమిశ్రం

కిం ద్రౌపదీవ పలాయసే రామఖీతా,

ఏష హరామి సహసేతి యథా

హనూమాన్విశ్వాసోర్భగినీమివ తాం సుభద్రామ్‌.” (20

వసంతసేన చీకట్లో కనబడకుండా ఉండగా - “అయ్యో! బొగ్గుముక్క మినుగుల రాసిలో కలిసిపోయినట్లు ఈ వసంతసేన చూస్తూ ఉండగానే అంధకారంలో మాయమై పోయిందే” అంటాడు.

“వసంతసేన నీ ఇంట్లో ప్రవేశించింది. ఆమెను నీవు తీసుకొని వచ్చి

32 మృచ్చకటికచ్చట స్వయంగా వప్పచెప్పకపోతే నీకూ నాకూ ఆజన్మాంత వైరం ఏర్పడుతుంది” అని చారుదత్తునితో చెప్పవలసిందిగా విదూషకునికి చెప్పి - నేను చెప్పినది సరిగా చెప్పకపోతే తలుపు సందున పెట్టి వెలక్కాయ పటపటలాడించినట్లుగా నీ బుర్ర కటకటలాడించేస్తాను అని అంటాడు - “తదా కపాటతలప్రవిష్టం కపిళ్ధగులికమివ మస్తకం తే మడమడాయిష్యామి”. ఆ సందర్భంలో వాడిన ఈ ఉపమానం హాస్యజనకంగా ఉన్నది. శకారునికి సంబంధించిన విస్యం ఈ విధంగానే నడిచింది. విదూషకుని ద్వారా కూడా అనేక ప్రదేశాలలో హాస్యం పోషింపబడింది. ఉదాహరణకు రెండు మూడు స్థలాలు నః .వసంతసేన అలంకారాలు న్యాసంగా ఇచ్చినపుడు చారుదత్తుడు “మైక్రేయ్ల అవి తీసుకో” అంటాడు. విదూషకుడు అవి తీసుకొని “స్వస్తి భవత్యై” (నీక సుఖమగు గాక- మనం ఇపుడు “థాంక్స్‌” అన్నట్లు) అంటాడు. చారుదతు డప్పుడు “ధిక్‌ మూర్ధ! న్యాసః ఖల్వయమ్‌” - లబ్ధి మార్చుడా! ఇది న్యాసం కదా” (నీకు దానం చేయడం లేదు కదా అని భావం) అంటాడు. “అట్లెతే దీనిని దొంగలు ఎత్తుకొని పోవుదురుగాక” అని అంటాడు విదూషకుడు మెల్లిగా, వసంతసేనకి రత్నహారం ఇవ్వడానికై వెళ్ళినప్పుడు విదూషకుడు ఒక గదిలో ఆమె తల్లిని చూస్తాడు. ఆమె చాలా స్థూలకాయురాలుగా ఉంటుంది. అప్పుడు పక్కనున్న చేటితో ఇలా అంటాడు - “అహో అన్యాః కపర్దకడాకిన్యాః ఉదర. విస్తార, తత్మిమేతాం ప్రవేశ్య మహాదేవమివ ద్వారశోభా ఇహ గృహే నిర్మిత్రా౫ “జ ద్రాకిని ఉదరం ఎంత పెద్దదిగా ఉన్నది! ఈమెను ముందుగా ఈ గదిలో కూర్చుండబెట్టి తరవాత ద్వారం బిగించినారా?” తనను గూర్చి తానే పరిహసించుకోగలవాడు ఈ విదూషకుడు. “యథా సర్వనాగానాం మధ్యే డుండుభః తథా సర్వబ్రాహ్మణానాం మధ్యేఇహం బ్రాహ్మణః (సర్పాలలో బురదపాము ఎంతో బ్రాహ్మణులలో నేనూ అంతే) అంటాడు ఒక చోట. విదూషకుడు హారం ఇచ్చి తిరిగివచ్చిన తరువాత చారుదత్తుడు నీవు వెళ్ళిన పని ఏమైనది అని అడుగుతాడు. “తత్‌ ఖలు కార్యం వినష్టం” (ఆ పని చెడి

మృచ్చకటికచ్బట 33 పోయింది) అంటాడు విదూషకుడు. “ఐతే ఆమె ఆ రత్నావళిని తీసుకోలేదా?” అని ప్రశ్నిస్తాడు చారుదత్తుడు. “అయ్యో! మన కంత అదృష్టం కూడానా! దండంపెడుతూ తీసుకొన్నది” అంటాడు. చారుదత్తుడు - “ఐతే ఆ పని చెడిపోయిందని అంటావేమి?”. విదూషక్షుడు - “చెడిపోవడం కాకపోతే ఏమిటి? మనం తిన్నది కాదు, తాగినది కాదు; దొంగలు అపహరించిన ఆకొంచెం సువర్జభాందడానికి ఇంత అనర్థమైన రత్నమాలను తీసుకోవడమా!”. ఈ ఘట్టం అంతా హాస్యభరితమై ఉన్నది.

వసంతసేన చేటుని వెంటబెట్టుకొని చారుదత్తుని ఇంటికి వస్తుంది. చేటుడు ముందుగా లోనికివచ్చి విదూషకునితో పరిహాసం ప్రారంభిస్తాడు. వసంతసేన వచ్చనదని నేరుగా చెప్పకుండా “నీకొక ప్రశ్న (పొడుపుకథ) వేస్తాను; చెప్పుకో” అంటాడు. విదూషకుడు అడగ మంటాడు. చేటుడు - చూతవృక్షాలు ఎప్పుడు మొగ్గ తొడుగుతాయి? విదూషకుడు - గ్రీష్మంలో. చేటుడు - (నవ్వి) అరే కాదు; కాదు. విదూషకుడు (తనలో) “మన మిత్రుణ్ణి అడిగి చెపుదాం”. చారుదత్తుని దగ్గరికివెళ్ళి - “కస్మిన్‌ కాలే చూతాః ముకులితా భవన్తి?” అని అడుగుతాడు. చారుదత్తుడు “మూర! వసన్సే” విదూషకుడు చేటునికి ఆ మాటలే చెపుతాడు. “మూర్థ! వసస్తే. చేటుడు - మరొక ప్రశ్న వేస్తాను చెప్పు. సుసమృద్ధములైన (గగ్రామాలకి రక్ష చేసేది ఏది? విదూషకుడు - వీథి. చేటుడు - (నవ్వుతూ) కాదు కాదు. విదూషకుడు మళ్ళీ చారుదత్తుని అడుగుతాడు. చారుదత్తుడు - “వయస్య! సేనా.” విదూషకుడు - “అరే! దాస్యాపుత్ర! సేనా”. చేటుడు - ఈరెండూ కలిపి చెప్పు. విదూషకుడు - సేనావసన్తే. చేటుడు - తిప్పి చెప్పు. విదూషకుడు. (శరీరంతిప్పి) సేనావసన్తే. చేటుడు - మూర్చుడా! పదాలు తిప్పు. విదూషకురు

  • (పాదాలు ఇటు అటు తిప్పి) సేనావసన్సే. చేటుడు - మూర్త్చా! (పాదాలు కాము) “అక్షరాలున్న పదాలు తిప్పి చెప్పు”. అప్పుడు విదూషకుడు “వసన్తేసేనా” అని అంటాడు. ఈ ఘట్టం హాస్యభరితమైనది.

చారుదత్తుని బండి ఎక్కి ఆర్యకుడు పుష్పకరందోద్యానానికి వెడతాడు. వసంతసేన కోసం ఎదురుచూస్తున్న చారుదత్తుడు బండి అక్కడికి చేరగానే. “వసన్తసేన వచ్చింది; ఆమెను దింపుము" అని విదూషకుని ఆదేశిస్తాడు. అతడు బండిలోనికి

3 మృచ్చకటికచ్చట చూడగానే ఆర్యకు కనిపిస్తాడు. వెంటనే అతడు - “భోః న వసన్తసేనా; వసన్త్నసేనః ఖల్వేషః” (చసంతసేన కాదు, వసంతసేనుడు వచ్చినాడు) అని అంటాడు. ఈ విధంగా విదూషకపాత్ర కూడా శూద్రకునిచేత హాస్యరస పరిపోషకంగా తీర్చిదిద్దబడినది. జూదరుల కలహాన్ని వర్ణించే రెండవ అంకం హాస్యరసభరితమైనది. సంవాహకుడు జూదంలో పది సువర్దాలు ఓడిపోయి, సభికుడేవో లెక్కలు వేసుకుంటూ ఉండగా పారిపోయి వస్తాడు. అతని తరుముకుంటూ, కేకలు వేసుకుంటూ మాథురుడూ (సభికుడు) రెండవ,ద్యూతకరుడూ వస్తారు. ఇంతలో ఆ సంవావాకుడు విపరీతమైన (దేవాలయాభిముఖం కాకుండా వీధికి అభిముఖంగా ఉన్ను పాదాలతో నడిచి వెళ్ళి పాడుదేవాలయంలో ప్రవేశించి దేవీ విగహంవత కదలకుండా కూర్చుం టాడు. అతడు చేసిన వంచన కనిపెట్టి మాథుర ద్యూతకరులు కూడా ఆ దేవాలయం లోనికి ప్రవేశిస్తారు. సంవాహకుని గుర్తించనట్లు అభినయిస్తూ దేవీప్రతిమవలె కూర్చున్న ఆ సంవాహకుని ఎదట ద్యూతం ఆడడం ప్రారంభిస్తారు. ఆ పాచికల చప్పుడు వింటూంటే సంవాహకుని ఒళ్ళు పరవశం చెందుతూ ఉంటుంది. ఇలా అనుకుంటాడు - “అరే కత్తాశబ్లో నిర్నాణకస్య హరతి హృదయం మనుష్యస్య, ధక్కాశబ్ద ఇవ నరాధిపస్య ప్రభ్రష్టరాజ్యస్య”. (0౨) (ధక్కాశబ్దం రాజ్యభ్రష్టుడైన రాజుయొక్క మనస్సును కలవరపెట్టినట్లు కత్తా (గవ్వలవంటి ద్యూతోపకరణాలు) శబ్దం నాణకాలు లేనివాని మనస్సును కలవర పెడుతుంది). “జ్ఞానామి న ్రీడిష్యామి సుమేరుశిఖరపతనసన్నిభం ద్యూతమ్‌, తథాపి ఖలు కోకిలమధురః కత్తాశబ్టో మనో హరతి”. (69 (జూదం అంటే మేరుపర్వత శిఖరంనుంచి క్రిందపడడం వంటిది. అది ఆడకూడదని నిశ్చయించుకున్నాను. అయినా కోకిలధ్వనివలె మధురమైన ఈ కత్తా శబ్దం మనస్సును ఆకర్షించేస్తూన్నది!). ఇంతట్లో ఆ మాథురుడూ ద్యూతకరుడూ కూడా *నా పందెం” అంటే “నా పందెం” అని అంటూ ఉంటారు. సంవాహకుడు

మృచ్చకటికచ్చట 35 ఉండబట్టలేక “నా పందెం నా పందెం” అంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. దొరికాడురా దొంగ అని వాళ్ళు అతని బాగా మర్దిస్తారు.

ఇంతలో దర్జ్చురకుడనే మరొక ద్యూతకరుడు ప్రవేశిస్తాడు. “ద్యూతం గొ నామ పురుషస్యాసింహాసనం రాజ్యమ్‌” (జూదం అంటే సింహాసనం లేని రాజ్యం) అని ఈతని సిద్ధాంతం. ఇందుకు కారణం ఏమిటనగా -

“న గణయతి పరాభవం కుతళ్చి

ద్ధరతి దదాతి చ నిత్యమర్థ్ధజాతమ్‌,

నృపతిరివ నికామమాయదర్శీ

విభవవతా సముపాస్యతే జనేన.” (0-7

“జూదరి అవమానం జరిగినా లెక్కచేయడు. ఎల్లప్పుడూ ధనం తీసుకుంటూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఆయం మీదనే దృష్టి. రాజును సేవించినట్లుగా ఐశ్వర్యవంతు లందరూ ఇతన్ని సేవిస్తూ ఉంటారు.”

(ద్రవ్యం సంపాదించినా, భార్యా మిత్రాదులను పొందినా, తాను తిన్నా, ఇతరులకు పెట్టినా ద్యూతంవల్లనే జరగాలట. సర్వస్వమూ కోల్పోయినా ద్యూతంవల్లనే జరగాలట:

“ద్రవ్యం లబ్ధం ద్యూతేనైవ దారామిత్రం ద్యూతేనైవ,

దత్తం భుక్తం ద్యూతేనైవ సర్వం నష్టం ద్యూతేనైవ.” (౧-8

ఇలా ఇనుకుంటూ వస్తుండగా దూరంలో పూర్వ పరిచితుడైన ఆ మాథురుడు కనబడతాడు. దర్హురకుడు ఉత్తరీయంతో ముఖం కప్పుకొని అతనికి కనబడకుండా వెళ్లిపోవాలని అనుకుంటాడు కాని అది అందుకు అనుకూలంగా లేదు. దానిని ఈ విధంగా వర్ణిస్తాడు;

“అయం పటః సూత్రదరిద్రతాం గతో

హ్యయం పటః ఛిద్రశతైరలంకృతః,

అయం పటః ప్రావరితుంన శక్యతే

హ్యయం పటః సంవృత ఏవ శోభతే”, (౧1-10

36 మృచ్చకటికచ్చట (ఈ బట్టకి దారాల దారిద్ర్యం ఏర్పడింది. ఈ బట్టకి వందలకొలదీ రంధ్రాలు ఉన్నాయి. ఈ బట్ట కప్పుకోవడానికి వీలుగా లేదు. ఈ బట్ట మడతమీద ఉంటేనే బాగుంటుంది). సరే వీడికి కనబడితే మాత్రం ఏమవుతుంది అని అనుకుంటూ ముందుకు వస్తాడు. అభివాదన ప్రత్యభివాదనలు అయిన తరవాత “ఎందుకు ఇతనిని ఇలా పీడిస్తున్నావు?” అని మాథురుని ప్రశ్నిస్తాడు. మాథురుడు :- మాకు పది సువర్దాలు బాకీ ఉన్నాడు. దర్దురకుడు :- ఓస్‌! పది సువర్ధాలా! (ఇది కల్యవర్తం అంత) పొద్దుట చేసే అల్పాహారం అంత లేదు. మాథురుడు :- (ఆతని చంకలో నుంచి చిరిగిన బట్ట పైకి లాగి) అయ్యా చూడండి చూడండి! ఈ చింకిరి బట్టలవానికి పది సువర్ధాలు కల్యవర్త మట. దర్దురుకుడు :- డబ్బు ఉన్నవాడు ఒళ్లో పెట్టుకొని తిరుగుతాడా! ఇలా మాటకి మాటా పెరుగుతుంది. చివరికి ప్రహారాలలోనిక్తి దిగుతుంది. దర్దురకుడు :- ఇప్పుడు నన్ను మార్గమధ్యలో కొట్టినావు కదా! కానీ, రేపు రాజ కులంలోనికి రా, వమవుతుందో చూస్తావు. మాథురుడు :- ఆహా! చూస్తాను. దర్దురకుడు :- ఎలా చూస్తావు? మాథురుడు :- ఇదిగో ఇలా చూస్తాను అని అంటూ కంధ్లు పెద్దవిగా చాపుతాడు. దర్దురకుడు గుప్పెడు ఇసక అతని కండ్లలోనికి పోసి, అక్కడి నుంచి పారిపోవలసినదిగా సంవాహకునికి సంజ్ఞ చేస్తాడు. ఈ విధంగా ఈ ఘట్టం అంతా హాస్య రసభరితమై శీఘాభినయభూయిష్టంగా (౯౮|| 0(4010%) ఉంటుంది. ఇంతవరకూ పరిశీలించిన పద్ధతిలో శూద్రకుని మృచ్చకటికం కథా

మృచ్చకటికచ్చట 3/7 సంవిధానంలో కాని, పాత్ర చిత్రణలోకాని, రస పరిపోషణలో కాని, అన్నింటికి మించి సమసామయిక సమాజ సందర్శనంలో కాని నిరుపమానమైనది. ॥ మృచ్చకటికంలో వర్ణించిన సామాజికరాజకీయపరిస్థితులు : మృచ్చకటికం ఒక ప్రకరణం. ప్రకరణంలో కథావస్తువు లోకంనుండి గ్రహించబడుతుంది. అందుచేత ఈ ప్రకరణంలో సమాజంలో ఉండే అనేకవిధా లైన వ్యక్తులు కనబడతారు. దీనిలో మధ్యతరగతికి చెందిన పాత్రలు క్రింది తరగతికి చెందిన పాత్రలు, నీచపాత్రలు అన్ని రకాల పాత్రలూ కూడ కనబడతారు. యథార్థమైన ఆనాటి సమాజాన్ని మన కళ్ల ఎదుట నిలబెట్టడంలో కవి ఎంతో సాఫల్యం సాధించాడు. రాజైన పాలకుడు ఎక్కడా కూడ రంగస్థలంమీద కనబడడు. అయితే అత డొక నిరంకుశప్రభువుగా పాలించి నట్లు కథాసంనివేశాదులను పట్టి తెలుస్తుంది. రాజు ఈ విధంగా నిరంకుశు డైనప్పుడు ప్రజలు ఆతని పాలనతో పూర్తిగా విసిగిపోయి ఆతనిని పదవీచ్యుతుణ్ని చేయడానికి తగిన అవకాశంకోసం ఎదురుచూస్తుండడం సహజమే. అదే ఈ రాజు విషయంలో జరిగింది.

ఆ నాటి సమాజంలో రాజు సర్వాధికారి. కొంతమంది మంత్రుల సలహాలతో రాజ్యపాలనం చేసేవాడు. 'ప్రధానసైన్యాధికారి కూడ రాజే. రాజ్యపాలనకి అవసరమైన భూమి పన్నులు వసూలు చేసే శాఖ, రక్షక్షభటశాఖ, న్యాయశాఖ మొదలైన అనేక శాఖలు ఉండేవి. ఈ ప్రకరణంలోని తొమ్మిదవ అంకంలో న్యాయశాఖకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. న్యాయాధికారికి ఇద్దరు న్యాయవేత్తలు న్యాయనిర్ణయంలో సహాయకులుగా ఉండేవారు. న్యాయనిర్ణయం అతిశీఘ్రంగాను నిష్పాక్షికంగాను జరుగుతూండేది. సాక్షులను పరీక్షించడంలోనూ, తగిన ప్రమాణాలను సేకరించి వాటిని ఒక క్రమబద్ధమైవ రీతిలో కూర్చుకొనడంలోను న్యాయాధికారి ఒక నిర్ణీతమైన పద్ధతిని అనుసరించవలసి ఉంటుంది. అయితే అతడు తన నిర్ణయాన్ని ఒక అభిప్రాయంగా మాత్రమే రాజుకు తెలుపవలసి ఉంటుంది. చివరి నిర్ణయం తీసికొనవలసినవాడు రాజు. సాక్ష్యాధారాలు సరిగా లేనప్పుడు దివ్యపరీక్షలు చేసి వాటి ద్వారా ఒకడు అపరాధియా కూడా అని నిర్ణయించేవారు. (కాన్ని పూజాదులు చేసి ఎట్జిగా

38 మృచ్చకటికచ్చట కాలిన ఇనుపగుండు అపరాధిగా శంకింపబడినవాని చేతిలో కొన్ని నిమిషాలు ఉంచగా ఆతని చేయి కాలకపోతే అతడు నిర్దోషి కాలితే దోషి ఇలాంటివే మరికొన్ని పరీక్షలు ఉందేవి). అపరాధం రుజువైన తరవాత అపరాధి తన అపరాధాన్ని ఒప్పుకోవాలి. తరవాతనే శిక్ష విధించబడుతుంది. మరణదండం విధించిన అహూధిని కూడ అతడు తగిన రుసుము చెల్లించినా, ఏదైనా ఆశ్చర్యకర మైన సంఘటన జరిగినా విడిచి వేయవచ్చును. అపంధి అని చెప్పబడేవాడు అపరాధి కాడని తేలుతే అతనిని విడిచివేయడానికీ, అసలు అపరాధి దొరికితే వానిని శిక్షించడానికీ “కూడ వమరణదండం జరిపేవాళ్లకి కొంత స్వయంనిర్ణయాధికారం ఉంది. బాకీ ఉన్నవానిమీద అప్పిచ్చినవానికి సర్వాధికారాలూ ఉంటాయి. అతడు వానికి శారీరకమైన దండం విధించవచ్చు. తనకు ఇవ్వవలసిన సొమ్ము రాబట్టుకొనడానికి వానిని అమ్మి వేయవచ్చును. ఆ రోజులలో వర్ణవిభాగం స్లిరంగా ఏర్పడిఉంది. బ్రాహ్మణులకు గౌరం ఉండేది. వాళ్లకు మరణశిక్ష విధించేవారు కారు. శర్విలకుడు యజ్ఞంకోసం సమకూర్చుకొన్న బ్రాహ్మణుని సొమ్ము అపహరించడు. బ్రాహ్మణులు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి ధనికు లయేవారు. చారుదత్తుని పూర్వికులు కూడ వ్యాపారం ద్వారా గొప్ప ధనం కూడబెట్లడంచేత సార్ధవాహు లయ్యారు. ఇతరవర్జాలలో కాయస్థులను గూర్చి జనంలో సదభిప్రాయం ఉండేది కాదు. వాళ్లు వ్రాతలలో మోసం చేసి పీడిస్తా రని ప్రసిద్ధి. రాజభటు లైన వీరకుడు చందనకుడు అనేవాళ్లు వర్ణం పేరిట ఒకరి నొకరు తిట్లుకొనే ప్రదత్తి చూస్తే ఈ వర్ణవిభేదం ఎంత లోతుగా నాటుకొని పోయిందో తెలుస్తుంది. అయితే

  • ఒక మనిషి మంచితనాన్ని గుర్తించడానికి సాధనం వాని జాతి కాదు, వాని గుణాలే అని అందరూ అంగీకరించిన విషయం. ఇది చాండాలుల మాటలవల తెలుస్తుంది. (చూ.శ్లో. 26) క్‌ బౌద్ధమతం క్షీణదశలో ఉన్నా ఇంకా రాజులూ, కొందరు ధనికులూ దానిని పోషిస్తూండేవారు. భిక్షువులను సామాన్యజనులు గౌరవభావంతో చూచేవారు. అయితే కొందరికి వాళ్లని చూడడమే అపశకునం అనే .భావం ఉండేది. ఇతరదేశాలతో కూడ వర్తకం బాగా జరుగుతూందేది. భారతీయనౌకలు భూమి

మృచ్చకటికచ్చట 39 అంచులకు కూడ వెడుతూండేవి. బహుశా దీనివల్ల దేశం ఐశ్వర్య సమృద్ధమై ఉండేది. చారుదత్తుడు ఇచ్చిన దానాలను పట్టి చూస్తే వర్తకులు అపారమైన ఐశ్వర్యంతో తులతూగుతుండేవా రన్నట్లు కనబడుతుంది. ఈ సొమ్ములో చాల వరకు వేశ్యల చేతులలోకి వెడుతూండేది. వసంతసేన భవనం కుబేరుని భవనంతో పోటీ పడేదిగా ఉందట. ఇంత ఐశ్వర్యం ఉందంటే ఇది భోగలాలసత్వానికీ, జూదం, మద్యపానం, వేశ్యావృత్తి మొదలైన చెడ్డ అలవాట్లకీ దారి తీయడం సహజమే. వర్తకులు తమ పిల్లలకి ఆడుకోవడానికి బంగారు బళ్లు ఇస్తే వేశ్యలు మందించిన ఏనుగులను పెంచేవారు. వేశ్యయైన వసంతసేనకు చివరికి చారుదత్తుని భార్యగా (వధూ) గుర్తింపు ఇవ్వబడడాన్నిబట్టి చూస్తే ఆ రోజులలో వర్జాంతరవివాహాలు ప్రచారంలో ఉండే వని తోస్తుంది.

ఉజ్జయిని రాజధాని. రాజధానిలో కూడ రాత్రి అయేసరికి విటులు మొదలైన వాళ్లు స్వేచ్చగా తిరుగుతూ అల్లర్లు సృష్టిస్తుండేవారు. ముఖ్యంగా అధికారులకు దగ్గర బంధువులైనవాళ్లు, నేటి అధికారంలో ఉన్నవాళ్ల దగ్గర బంధువులవలె, నిర్భయంగా ప్రజలను పీడిస్తూందేవారు. ఉదాహరణ శకారుడు. ఇతడు రాజుకు బావమరది. బహుశా ఉంపుడుకత్తె తమ్ముడై ఉంటాడు. ఇతడు అన్ని భోగాలూ అనుభవిస్తూ కనబడిన సుందరప్రీని పీడిస్తూందేవాడు. నా కేసు ముందు విచారణకు తీసికొనకపోతే నా బావగారితో చెప్పి నీ ఉద్యోగం ఊడదీయిస్తా నని న్యాయాధికారిని నలుగురిలోనూ భయపెడతాడు. అయితే ఇలాంటివాళ్లు అధికంగా ఉండేవారని చెప్పడానికి వీలులేదు. అధికారులకు దగ్గరగా ఉందే ఏ కొద్దిమందో మాత్రమే ఇలా ప్రవర్తించా రని అనుకొనడానికి అవకాశం ఉంది. జూదరులు మొదలైనవాళ్లు వీథులలో పడి కొట్టుకొంటూందేవారు. అయినా సామాన్యజనులలో ధర్మబుద్ధీ మంచితనమూ కనబడతాయి. ఇందుకు నగరంలోని వాళ్లందరూ చారుదత్తునిమీద చూపే గౌరవభావం నిదర్శనం. మరణదండన విధించినవాళ్లని వధించే చండాలులలో కూడ కొంత నియమబద్ధత కనబడుతుంది.

దాసత్వం బహుళప్రచారంలో ఉండేది. ఒక దాసుణ్ణి లేదా దాసీని డబ్బిచ్చి కొనవచ్చు. అమ్మవచ్చు లేదా డబ్బు తీసికొని విడిచిపెట్టవచ్చు. జూదం న్యాయసంమత మైన ఆటగా ఉండేది. దీనికి సంబంధించి కొన్ని నియిమాలు

40 మృచ్చకటికచ్చట అమలులో ఉండేవి. సభికుడు ఆ నియమాలను తు,చ, తప్పకుండా అమలు పరుస్తూండేవాడు. సాంఘికమైన అలవాట్లు మతసంబంధమైన నమ్మకాలు ఈ నాడు హిందూసమాజంలో ఎలా ఉన్నాయో ఆ నాడు కూడా అలాగే ఉండేవి. బలులు ఇవ్వడం, జ్యోతిషంమీద శకునాలమీద నమ్మకాలు ఇప్పు డున్నట్లే ఉండేవి, లలితకళల ప్రచారం అత్యధికంగా ఉండేది. సంగితకచేరీలు జరుగుతూండేవి. చిత్రలేఖనాదులు బహుళప్రచారంలో ఉండేవి. ధనసమృద్ధమైన సమాజంలో ఇవన్నీ ఉండడం సహజమే. మొత్తంమీద సమాజంలోని వాళ్లందరూ ధనానికి లోటు లేకుండా సుఖంగానే జీవిక గడిపేవా రన్నట్లు కనబడుతుంది. మృచ్చ్ళకటి కంలోని కొన్ని సూక్తులు

  1. సుఖం హి దుఃఖాన్యనుభూయ శోభతే ఘనాంధకారేప్వివ దీపదర్శనమ్‌, సుఖాత్తు యో యాతి నరో దరిద్రతాం ధృతః శరీరేణ మృతః స జీవతి. (10 దుఃఖాలు అనుభవించిన తరవాత వచ్చిన సుఖం చీకటి తరవాత వచ్చిన వెలుగువంటిది. సుఖం అనుభవించి దరిద్రుదైనవాడు జీవన్మ అతుడే. 2 _ దారిద్ర్యాన్మరణద్వా మరణం మమ రోచతే న దారిద్రమ్‌ అల్పక్షేశం మరణం దారిద్యమనన్తకం దుఃఖమ్‌. (౧-10 దారిద్ర్యం కంటె మరణమే మేలు. మరణం వల్ల కలిగే క్లేశం అత్యల్పమైనది. దారిద్రమో! - అది అనంతదుఃఖము. 3 తపసా మనసా వాగ్భిః పూజితా బలికర్మ్శభిః, తుష్యన్తి శమినాం నిత్యం దేవతాః కిం విచారితైః (16) తపస్సు, మనస్సు, వాక్కు బలికర్మలు (బలి అనగా పూజ) వీటిచేత అర్చింపబడిన దేవతలు తప్పక అనుగ్రహిస్తారు, సందేహింప వలసిన పని లేదు. 4 సజ్ఞంనై వ హి కళ్చిదస్య కురుతే సంభాషతే నాదరాత్‌ సంప్రాప్తో గృహముత్సవేషు ధనినాం సావజ్ఞమాలోకృతే,

మృచ్చకటికచ్చట 4 దూరాదేవ మహాజనస్య విహరత్యల్పచ్చదో లజ్జయా

మనే నిర్ధనతా ప్రకామమపరం షష్టం మహాపాతకమ్‌. (౧37)

దరిద్రునితో ఎవరూ స్నేహం చెయ్యరు. ఆదరంగా మాలటాడరు. ఉత్సవ సమయాలతో ధనికుల ఇండ్లకి వెళ్ళినపుడు ఆతనిని అనాదరంగా చూస్తారు. సామాన్యమైన వస్తైలు ధరించి ఉండడంచేత సిగ్గుతో ధనికులకి దూరదూరంగానే తిరుగుతూ ఉంటాడు. దారిద్ర మనేది ఆరవ మహాపాపము.

  1. “చారిత్రేణ విహీనః ఆధ్యోఇ_పి చ దుర్గతో భవతి.” (43) సచ్చరిత్ర లేనివాడు ధనవంతుడైనా దరిద్రుడే.
  2. ఆలానే గృహ్యతే హస్తీ వాజీ వల్గ్లాసు గృహ్యతే,

హృదయే గృహ్యతే నారీ యదీదం నాస్తి గమ్యతామ్‌. (50)

ఏనుగును లొంగదీయాలంటే కట్టే స్తంభం కావాలి. గుజ్టాన్ని కళ్లెంతో లొంగ దీసుకోవాలి. స్త్రీని హృదయంతో లొంగదీసుకోవాలి. అది లేని పక్షంలో దూరంగా వెళ్లడం మంచిది.

  1. “*దరిద్రపురుషసంక్రాన్తమనాః ఖలు గణికా లోకే అవచనీయా భవతి”. దరద్రుని కామించిన వారవనితను లోకు తెవరూ దూషించరు. 8& య ఆత్మబలం జ్ఞాత్వా భారం తులితం వహతి మనుష్యః,

తస్య స్థలనం న జాయతే న చ కాన్హారగతో విపద్యతే, (1-15)

తన బలం తెలుసుకొని భారం మోసేవానికి తొట్రుపాటు ఉండదు. (వైరాగ్యంతో) అరణ్యంలో ఉన్నవాడు ఆపద చెందదు.

  1. “కలేతి శిక్షితా? ఆజీవికా ఇదానీం సంవృత్తా”.

(సంవాహనం, అనగా ఒళ్లుపట్టడం) కళ కదా అని నేర్చుకున్నాను; కాని అదే ఇప్పుడు నాకు జీవనోపాధి అయినది. ఇది సంవాహకుడు అన్న మాట. 10. “దుర్లభా గుణా విభవాశ్చ, అపేయేషు తడాగేషు బహుతరముదకం భవతి”

గుణాలూ ఐశ్వర్యమూ ఒకచోట ఉండవు. తాగరాని చెరువులలో నీరు నిండుగా ఉంటుంది.

42 మృచ్చకటికచ్చట 11. సుజనః ఖలు భృత్యానుకంపకః స్వామీ నిర్ధనకో౬.పి శోభతే, పిశునః పునర్ధవ్యగర్వితో దుష్మరః ఖలు పరిణామదారుణః. (111 భృత్యుల విషయంలో జాలి కల సత్పురుషుడైన ప్రభువు ధనం లేకపోయినా శోభిస్తాడు. ధనగర్వం గల చెడ్డవాదైతే చివరికి కష్టాలు కలిగిస్తాడు. 12. సస్యలంపటబలీవర్షో న శక్యో వారయితుమ్‌ అన్యప్రసక్తకలత్రం న శక్యం వారయితుమ్‌, ద్యూతప్రసక్తమనుష్యో న శక్యో వారయితుమ్‌ యోపి స్వాభావికదోషో న శక్యో వారయితుమ్‌. [య చేనుమీద పడి సస్యం తినడానికి అలవాటుపడిన ఎద్దును నివారించడం కష్టమైన పని. పరాయి మొగవానిని మరిగిన స్త్రీని వారించడం అశక్యం. జూదం ఆదేవానిని నివారించడం అశక్యం. స్వభావసిద్ధంగా వచ్చిన దోషాన్ని తొలగించడం అసాధ్యం. 13. “వీణా హి నామ అసముద్రోత్థితం రత్నమ్‌” వీణ అనేది సముద్రంనుంచి పుట్టని రత్నము. 14 ఉత్కంఠితస్య హృదయానుగుణా వయస్యా సంకేతకే చిరయతి ప్రవరో వినోద, సంస్థాపనా ప్రియతమా విరహాతురాణాం రక్తస్య రాగపరివృద్ధికరః ప్రమోదః. (03) (వీణ) బెంగగొన్న వానికి హృదయానుకూలురాలైన స్నేహితురాలు. సంకేతం ఇచ్చిన ప్రియుడు ఆలస్యం చేసినప్పుడు ఉత్తమమైన వినోదకర వస్తువు. విరహంతో బాధపడే వారి మనస్సును కుదుటపరచే ప్రియతమ. అనురాగవంతుని అనురాగాన్ని పెంచే ఆనందస్థానము. 15. “మమ తావద్‌ ద్వ్యాభ్యామేవ హాస్యం జాయతే - ప్రియా సంస్కృతం

మృచ్చకటికచ్చట 4 పఠనా మనుప్యేణ చ కాకలీం గాయతా. స్త్రీ తావత్‌ సంస్కృతం పఠస్తీ దత్తనవనస్యేవ గృష్టిః అధికం సూసూశబ్దం కరోతి. మనుష్యోపి కాకలీం గాయన్‌ శుష్మసుమనోదామవేష్టితో వృద్ధపురోహిత ఇవ మన్షం జపన్‌ దృఢం మే న రోచతే”, (తృ.అం.) (ఇవి విదూషకుని మాటలు) సంస్కృతం చదువుతున్న ప్రీని, సంగీతం

పాడుతున్న పురుషుణ్డీ, వీరిద్దరినీ చూస్తే నాకు నవ్వు వస్తుంది. సంస్కృతం చదివే

ప్రీ కొత్తగా ముక్కుతాడు వేసిన తొలిచూలు ఆవువలె “సుసూ” అంటూ అధికంగా శబ్దం చేస్తుంది. సంగీతం పాడే పురుషుడు కూడా వాడీ పోయిన పూవుల దండలు మెడలో వేసికొని ఏవేవో మంత్రాలు గొణిగే వృద్ధ పురోహితుడువలె నాకు నచ్చడు.

  1. ఇయం'హి నిద్రా నయనావలంబినీ

లలొటదేశాదుపసర్పతీవ మామ్‌, అద్భృశ్యరూపా చపలా జరేవ యా మనుష్యసత్త్వం పరిభూయ వర్ధతే. (౧-9 కండ్లను పట్టుకొని వ్రేలాడుతూ ఈ నిద్ర లలాటం మీదనుంచి వస్తూన్నట్లు ఉన్నది. ఇది ముసలితనంవలె కనబడకుండానే ప్రవేశించి మానవుల బలం తగ్గించి వృద్ధి చెందుతుంది.

  1. “ఇదానీం విక్రీతపణ్య ఇవ వణిక్‌ అహం సుఖం స్వప్పామి.” ఇంక ఇప్పుడు సరుకులన్నీ అమ్ముడైన వర్తకునివలె హాయిగా నిద్రపోతాను.

(అలంకారభాండం చారుదత్తు దనే భ్రాంతితో శర్విలకుని చేతిలో పెట్టిన తరవాత

విదూషకు డన్న మాటలివి).

  1. శంకనీయా హి లోకే2_స్మిన్‌ నిష్రభావా దరిద్రతా ౧-24 ఈ లోకంలో శక్తిని క్రుంగదీసే దారిద్ర్యం ఉన్న వానిని అందరూ శంకిస్తారు.

  2. స్వైర్లోషైః భవతి హి శంకితో మనుష్యః. (2 తప్పుచేసిన మానవుడు ఎల్లపుడూ ఉలికిపడుతూ ఉంటాడు.

  3. స్రియో హి నామ ఖల్వేతా నిసర్గాదేవ పండితాః, పురుషాణాంతు పాండిత్యం శాసైరేవోపదిశ్యతే. గా19)

తత మృచ్చకటికచ్చట పురుషులకి పాండిత్యం శాస్త్రం చదువుకుంటే కలగాలి కాని స్త్రీకి మాత్రం

సహజంగానే పాండిత్యం ఉంటుంది.

  1. “న చన్హాదాతపో భవతి”. చంద్రునినుంచి ఎండ వస్తుందా?

  2. “గణికా హి నామ పాదుకాన్తర ప్రవిష్టేవ లేష్టుకా దుఃేన పునర్నిరాక్రియతే” చెప్పులో జాయిదూరితే తీసివేయడం ఎంత కష్టమో గణికను వదల్పు

కోవడం కూడా అంత కష్టం.

  1. జానామి చారుదత్తం వసన్తసేనాం చ సుష్టు జానామి, ప్రాప్తే చ రాజకార్యే పితరమప్యహం న జానామి. (౧-16) నాకు చారుదత్తుడూ తెలుసు, వసంతసేనా తెలుసు. అయితే రాజకార్యం

వచ్చిన దంటే నాకు తండ్రియైనా లెక్కలేదు.

24 ఈదృతైః శ్వేతకాకీయై రాజ్ఞః శాసనదూష్రెః, అపాపానాం సహస్రాణి హన్యస్తే చ హతాని చ. 643 రాజశాసనాన్ని దూషించే ఇలాంటి తెల్లకాకులు (బహుశా ఆ రోజులలో

న్యాయ స్థానాలలో పనిచేసే వారు తెల్లటి బట్ట ధరించేవారు కాబోలు) ఎంతోమంది

నిరపరాధులను చంపి ఉంటాతు; చంపుతున్నారు కూడా.

  1. సర్వః ఖలు భవతి లోకే లోకః సుఖసంస్థితానాం చిన్తాయుక్తః, వినిపతితానాం నరాణాం ప్రియకారీ దుర్లభో భవతి. (౧౯16) అందరూ సుఖంగా ఉన్నవాళ్ళ విషయం పట్టించుకునే వాళ్ళే కష్టాలలో

ఉన్న వాళ్ల సంగతి ఎవరూ పట్టించుకొనరు.

  1. న ఖలు వయం చాండాలాశ్చాండాలకులే జాతపూర్వా అపి, యే£.భిభవన్సి సాధుం తే పొపాస్తే చ చాండాలాః. ౧2౩ (చారుదత్తుని వధ్యస్థానానికి తీసుకొని వెడుతూన్న చాండాలులు అన్న

మాటలివి). మేము చండాలుల కులంలో పుట్టినా చండాలులం కాము.

సత్పురుషులను పీడించే పాపాత్మురే చండాలులు.

మృచ్చకటికచ్చట 4ీర్‌ 2. “యో౬పి కిల శత్రుం వ్యాపాద్యమానం పశ్యతి

తస్యాన్యస్మిన్‌ జన్మాంతే అక్షిరోగో న భవతిొ.

“చంపబడుతున్న శత్రువును చూచిన వానికి జన్మాంతరంలో నేత్రరోగం ఉండదు” (ఇది శకారుని శాస్త్రం). 286. శాస్త్రజ్ఞః కపటానుసారకుశలో వక్తా న చ క్రోధనః

తుల్యో మిత్రపరస్వకేషు చరితం దృష్టైవ దత్తోతరః,

క్లీబాన్‌ పాలయితా శాన్‌ వ్యథయితా ధర్మో న లోభాన్వితో

ద్వార్భావే పరతత్త్వ బద్ధ హృదయో రాజ్ఞశ్చ కోపాపహః. (5)

“న్యాయాధికారి శాస్త్రజ్ఞుడై ఉండాలి. మోసం కనిపెట్టకలగాలి. వక్త కావాలి. కోప స్వభావవంతుడు కాకూడదు. మిత్రులు, శత్రువులు, తనవారు అందరినీ సమంగా చూడాలి. విషయం తెలిసిన తరవాతనే జవాబు ఇవ్వాలి. దుర్చలులను రక్షించాలి. దుష్టులను శిక్షించాలి. ధర్మబుద్ధి కలిగి ఉండాలి. లోభం ఉండకూడదు. పక్షప్రాతం లేకుండా నిజాన్ని కనిపెట్టే దృష్టి కలవాడై ఉండాలి. రాజుకు కోపం కలిగించకూడదు”. 29. నివాసశ్చిన్నాయాః పరపరిభవో వైరమపరం

జుగుష్పా మిత్రాణాం స్వజనజనవిద్వేషకరణమ్‌,

వనం గన్తుం బుద్ధిర్భవతి చ కలత్రాత్‌ పరిభవో

హృదిస్థః శోకాగ్నిర్న చ దహతి సంతాపయతి చ. (౧-15)

మనిషికి దారిద్ర్యం అంటే - చింతకు నివాసస్థానం. ఇతరులనుండి తిరస్కారం. గొప్ప వైరం. మిత్రుల ఏవగింపు. తనవాళ్లకీ ఇతరులకీ కూడ ద్వేషం కలగడానికి కారణం. అడవికి వెళ్లిపోవా లని అనిపిస్తూంటుంది. భార్యనుండి కూడ అవమానం కలుగుతూంటుంది. హృదయంలో ఉన్న దుఃఖాగ్ని గొప్ప తాపం కలిగిస్తూంటుంది కాని పూర్తిగా కాల్చివేయదు. 30. వాష్యాం స్నాతి విచక్షణో ద్విజవరో మూర్చో౭_పి వర్ణాధమః

పుల్లాం నామ్యతి వాయసో౬పి హి లతాం యా నామితా బర్హిణా,

జం మృచ్చకటికచ్చట

బ్రహ్మక్ష్మత్రవిశస్తరన్తి చ యయా నావా తయైవేతరే

త్వం వాపీవ లతేవ నౌరిన జనం వేశ్వాసి సర్వం భజ. (౧-౩2)

ఉజ్జయినీనగరవీథిలో పరివారంతో వెడుతూన్న వసంతసేనను శకారుడు వాని మిత్రుడు విటుడు వెంబడిస్తాడు. శకారుని (ప్రేమను నిరాకరించిన వసంతసేనతో విటుడు అంటున్నాడు - “దిగుడుబావిలో విద్వాంసు డైన 'బ్రాహ్మణుడూ స్నానం చేస్తాడు మూర్చుడైన అధమవర్ణంవాడూ స్నానం చేస్తాడు. నెమలి వంచిన, పుష్పాలతో నిండి ఉన్న లతను కాకి కూడ వంచుతుంది. ఏ నావమీద ఎక్కి బ్రాహ్మణక్ష్మత్రియ వైశ్యులు దాటతారో ఆ నావమీదనే ఇతరులు కూడ దాటతారు. నువ్వు వేశ్యవు. దిగుడు బావివంటిదానవు. లతవంటి దానవు; నావవంటి దానవు. అందరినీ సేవించాలి. ఎవరినీ కాదనకూడదు”. 31. ఆలోకవిశాలా మే సహసా తిమిరప్రవేశవిచ్చిన్నా

ఉన్నీలితాపి దృష్టిర్నిమీలితేవాన్థకారేణ. (33)

నా కళ్లు వెలుతురులో ఉన్నప్పుడు స్పష్టంగా చూడకలిగాయి. చీకట్లోనికి రాగానే కనబడడం మానేసింది. కళ్లు తెరిచి ఉన్నా కూడ ఈ అంధకారంచేత కళ్లు మూసికొన్నట్లే ఉంది. (ఇవి విటుని మాటలు). 82. కామం ప్రదోషతిమిరేణ న దృశ్యసే త్వం

సౌదామినీవ జలదోదరసంధిలీనా,

త్వొం సూచయిష్యతి తు మాల్యముద్భవో౭_ యం

గన్ఫశ్చ భీరు! ముఖరాణి చ నూపురాణి. (1-35)

శకారునికి వసంతసేన పట్టుబడకూడదనే విటుని కోరిక. చీకట్లో ఆమెను శకారునితో పాటు వెంబడిస్తూ ఆమెకు విటుడు రహస్యంగా చేస్తున్న హెచ్చరిక

  • “ఓ భయస్వభావంగలదానా! మేఘాల మడతలలో దాగి ఉన్న మెరుపు వలె నువ్వు ఈ సాయంకాలపు చీకట్లో కనబడకపోవచ్చు. కాని నీ పుష్పమాలల సుగంధమూ, అందెళ్ల చప్పుళ్లూ నువ్వెక్కడ ఉన్నావో సూచిస్తున్నాయి”.
  1. అస్థస్య దృష్టిరివ పుష్టివాతురస్య

మూర్ధస్య బుద్ధిరివ సిద్ధిరివాలసస్య,

మృచ్చకటికచ్చట త

అల్బస్మృతేర్వ్యసనినః పరమేవ విద్యా

త్వాం ప్రాప్య సా రతిరివారిజనే ప్రనమ్హా. (49)

వసంతసేన హటాత్తుగా చారుదత్తుని ఇంట్లోకి వెళ్లిపోయింది. ఆమె కోసం వెదుకుతూన్న శకారునితో విటు డంటున్నాడు - “గ్రుడ్డివాని చూపు వలె, రోగి శరీరపుష్టి వలె, మూర్చుని బుద్ధి వలె, సోమరియొక్క కార్యసిద్ధి వలె, వ్యసనాలకు అలవాటుపడిన, అల్పమైన స్మరణశక్తికలవాని ఉత్తమవిద్య వలె, శత్రువుమీద ప్రేమ వలె ఆమె నీకు కనబడకుండా పోయింది”. 84 ఉదయతి హి శశాజ్యః కామినీగణ్జపాణ్డుః

(గ్రహగణపరివారో రాజమార్గప్రదీపః,

తిమిరనికరమధ్యే రశ్ళయో యస్య గౌరాః

సృతజల ఇవ పజ్చే క్షీరధారాః పతన్తి, (57)

యువతి చెక్కిలివలె చంద్రుడు గ్రహాలసముదాయం అనే పరివారంతో ఉదయిస్తున్నాడు. ఇతడు రాజమార్దానికి పెద్ద దీపంలా ఉన్నాడు. చీకటి మధ్య ప్రసరిస్తూన్న ఈ చంద్రుని కిరణాలు కొంచెం నీళ్లు ఊరుతున్న బురదమీద పడ్డ పాల ధారలవలె ప్రకాశిస్తున్నాయి. 85. యః స్తబ్ధం దివసాన్తమానతశిరా నాస్తే సముల్లమ్బితో

యస్యోద్ధర్షణలోష్టకైరపి సదా పృష్టే న జాతః కిణః,

యస్యైతచ్చ న కుక్కురైరహరహర్దజ్ఞాన్తరం చర్వ్యతే

తస్వాతాః:శుకకోమలస్య సతతం ద్యూతప్రసజ్లేన కిమ్‌. (112)

"పన దేనికైనా కట్టి వ్రేళ్లాడదీసినప్పుడు తల వంచుకొని సాయంకాలంవరకూ ఎవడు కదలకుండా ఉండజాలడో, నేలమీద ఈడ్చి నప్పుడు, ఎవని వీపుకు రాళ్లు (గుచ్చుకొని అక్కడ కాయలు కాయలేదో, కుక్కలు ప్రతీరోజూ ఎవన్ని పిక్కలమీద పట్టుకొని పీకవో, అలాంటి అతిసుకుమారునికి జూదంతో ఏం పని!” ఎవడైనా జూదరి జూదంలో ఓడిపోయి తా నివ్వవలసిన సొమ్ము ఇవ్వజాల నప్పుడు సభికుడు వానికి వేసే శిక్షలు ఇవన్నీ జూదం ఆడదానికి వచ్చేవాడు వీటి కన్నింటికీ సిద్ధపడి రావాలి అని అర్థం.

48 మృచ్చకటికచ్చట 86. రక్తం చ నామ మధురంచ సమం స్ఫుటం చ భావాన్వితం చ లలితం చ మనోహరం చ, కిం వా ప్రశస్తవచనైర్చహుభిర్మదుక్తెః అన్తర్షితా యది భవేద్వనితేతి మన్యే. (14 చారుదత్తుడు రేభిలకుని పాట మెచ్చుకొంటున్నాడు - “ఈ పాట రంజకంగా, మధురంగా, సమంగా (ఎగుడు దిగుళ్లు లేకుండా), స్పష్టంగా, భావస్ఫోరకంగా, లలితంగా, మనోహరంగా ఉంది. నేను ప్రశంసావచనాలు ఎక్కువగా చెప్పి ఏం ప్రయోజనం? (ఒక్క మాటలో చెప్పాలంటే) ఈతని వెనుక ఒక ప్రీ ఎవరో దాగి ఉండి పాడుతుందా అన్నట్లు నాకు అనిపిస్తూన్నది”. ౩7. నిఃశ్వాసో౨_స్య న శంజ్కితః సువిశదస్తుల్యాన్తరం వర్తతే దృష్టిర్గాఢనిమీలితా న వికలా నాభ్యన్తరే చబ్బులా, గాత్రం స్రస్తశరీరసన్థి శిథిలం శయ్యాప్రమాణాధికం దీపంచాపిన మర్షయేదభిముఖం స్యాల్లక్ష్యసుప్తం యది. (౧-19) కన్నం వేసి చారుదత్తుని ఇంట్లో ప్రవేశించిన శర్విలకుడు నిద్రపోతూన్న ఆ ఇద్దఠినీ చూచి వీళ్లు నిజంగా నిద్రపోతున్నారా లేక నిద్రపోతూన్నట్లు అభినయిస్తున్నారా అని సందేహించి అనుకొంటూన్న మాటలు - *శ్ర పురుషద్వంద్వంయొక్క నిఃశ్వాసం, శ్వాసపీల్చుకోవడం, ఏ శంకా లేకుండా, సాఫీగా, సమానమైన వ్యవధానంతో నడుస్తూన్నది. చూపు బాగా మూసికొని ఉంది. మధ్యలో (గ్రుడ్డు కదలికచేత) కదలడంలేదు; కంగారుగా ఉన్నట్లు లేదు. శరీరం పూరిగా పట్లు తప్పి శిధిలంగా పక్క ప్రమాణాన్ని మించి ఉంది. నిద్రపోతున్నట్లు అభినయిసే ఎదురుగా ఉన్న దీపాన్ని కూడ సహించజాలదు కదా?” క్‌ 38. ఆత్మభాగ్యక్షతద్రవ్యః స్రీద్రవ్యేణానుకమ్సితః, అర్థతః పురుషో నారీ యా నారీ సా౭ర్థతః పుమాన్‌. (28) “దుళదృష్టవశంచేత ద్రవ్యం కోల్పోయి స్త్రీద్రవ్యంచేత అనుగ్రహించబడ్డ పురుషుడు నిజానికి ప్రీయే. అలా సహాయం చేసిన ప్రీయే పురుషుడు”.

మృచ్చకటికచ్చట 49 39. నో ముష్టామ్యబలాం విభూషణవతీం ఫుల్లామివాహం లతాం విప్రస్వం న హరామి కాఇ్బనమథో యజ్ఞార్థమభ్యుద్ధతమ్‌, ధాత్రుత్సజ్లగతం హరామి న తథా బాలం ధనార్ధీ క్వచిత్‌ కార్యాకార్యవిచారిణీ మమ మతిశ్చౌర్యే౭_పి నిత్యం స్థితా (176) “పూవులతో నిండిన లతనుండి పూవులు ్రుంచివేసి నట్లు అలంకారాలు ధరించిన ఏ స్తీనీ నేను దోచుకొనను. యజ్ఞంకోసం జాగర్తచేసికాన్న బ్రాహ్మణుని సొమ్ము అపహరించను. డబ్బుకోస మని పెంపుడతల్లి ఒడిలో ఉన్న శిశువును ఎన్నడూ హరించను. చౌర్యం చేస్తున్నాకూడ నా బుద్ధి మంచిచెడ్డలను ఆలోచిస్తూనే ఉంటుంది. (ఇది ఆ రోజులలో దొంగలు కూడ పాటించే నీతి), 40. ఏతా హసన్తి చ రుదన్తి చ విత్తహేతో ర్విశ్వాసయన్లి పురుషం న తు విశ్వసన్తి, తస్మాన్నరేణ కులశీలసమన్వితేన వేశ్యా శృశానసుమనా ఇవ వర్జనీయాః, గం1ఖ ఈ వేశ్యలు డబ్బుకోసం ఒక మాటు నవ్వుతారు, మరొకప్పుడు ఏడుస్తారు. పురుషనికి విశ్వాసం కలిగిస్తారు తాముమాత్రం విశ్వసించరు. అందుచేత కులమూ శీలమూ ఉన్న పురుషుడు వేశ్యలను శ్మశానంలో ఉన్న పుష్పాలను పరిహరించి నట్లు పరిహరించాలి. 41. న సర్వతాగ్రే నలినీ ప్రరోహతి న గర్థభా వాజిధురం వహ్తి, యవాః ప్రకీర్ణా న భవన్తి శాలయో న వేశజాతాః శుచయస్తథాబ్దనాః, (17) కొండమీద పద్మం మొలవదు. గాడిదలు గుజ్జం మోసే బరువు మోయజులవు. యవలు చల్లితే వరి కావు. వేశ్యల ఇళ్లల్లో పుట్టిన స్రీలు సచ్చీలం ఉన్నవాళ్లు కాజాలరు. 42, గుణేష్వేవ హి కర్తవ్యః ప్రయత్నః పురుషైః సదా, గుణయుక్తో దరిద్రో౭_ పి నేశ్వరైరగుణైః సమః (22) మనిషి ఎల్లప్పుడూ సద్గుణాలు పెంపొందించుకొనడానికి ప్రయత్నించాలి. దరిద్రుడు సద్దుణవంతు డైనా వానికీ గుణవిహీను డైన ధనవంతునికీ పోలికలేదు.

50 మృచ్చకటికచ్చట

  1. గుణేషు యత్నః పురుషేణ కార్యో న కించిదప్రొప్వతమం గుణానామ్‌, గుణప్రకర్షాదుడుపేన శమ్మోరలజ్బ్యృముల్లజ్ఞితముత్తమాబ్గమ్‌. (1-23) మనిషి సద్దుణాలకోసం ప్రయత్నం చెయ్యాలి. గుణాలకు లభించనిది ఏదీ

లేదు. మంచి గుణా లుండడంచేతనే చంద్రుడు ఎవరూ ఎక్కలేని శివుని శిరస్సుమీదికి

ఎక్కాడు.

44 ఉదయన్తు నామ మేఘాః భవతు నిశా వర్షమవిరతం పతత్సు, గణయామి నైవ సర్వం దయితాభిముఖేన హృదయేన. (బ్ర చారుదత్తుని ఇంటికి అభిసారికగా వెడుతూన్న వసంతసేన మాటలు _

౨వ్పేఘాలు కమ్ముకొంటే కమ్ముకోనీ; రాత్రి రానీ; ధారాపాతంగా వర్షం పడితే

పడనీ; ప్రియునిమీద హృదయం నిలచిన నేను దానిని దేనినీ లెక్కచేయను”,

  1. మేఘా వర్పన్తు గర్జన్తు ముబ్బన్వ్వశనిమేవ వా, గణయన్తి న శీతోష్ణం రమణాభిముఖాః ప్రియః, (16) శ్వేఘ్టాలు వర్షించుగాక! గర్జించు గాక! పిడుగులు కురిపించుగాక! ప్రియుని

దగ్గరికి వెళ్లే స్రీలు శీతాన్ని కాని ఉష్ణాన్ని కాని లెక్కచేయరు.

  1. ఉన్నమతి నమతి వర్షతి గర్జతి మేఘః కరోతి తిమిరౌఘమ్‌, ప్రథమశ్రీరివ పురుషః కరోతి రూపాణ్యనేకాని, (1౧26) మేఘం పైకి లేస్తూంది; క్రిందికి దిగుతూంది; వాన కురుస్తూంది. గర్జిస్తూంది;

చీకటి పుట్టిస్తూంది. క్రొత్తగా ఐశ్వర్యం లభించిన మనిషి లాగ ఎన్నెన్నో రూపాలు

(చేష్టలు) చేస్తూంది.

47 గర్జ వా వర్షవా శక్ర ముజ్బు వా శతశో. శనిమ్‌,

న శక్యా హి ప్రియో రోద్డుం ప్రస్థితా దయితం ప్రతి. ౧౩1)

“ఇంద్రుడా నువ్వ గర్జించు; వర్షించు లేదా వందలకొలది పిడుగులు కురిపించు; ఏం చేసినా ప్రియుని దగ్గరికి బయలుదేరి వెడుతూన్న ప్రీలను ఎవరూ ఆపలేరు”.

48 యది గర్హతి వారిధరో గర్దతు యన్నామ నిష్టురాః పురుషాః అయి విద్యుత్‌! ప్రమదానాం త్వమపి చ దుఃఖం న జానాసి. (1౧౩2)

మృచ్చకటికచ్చట జ్య వ్‌ మరాచ నల 51 “మేఘుడు గర్జిస్తే గర్జించవచ్చును. మగవాళ్లు ఎలాగైనా కటికవాళ్లే! ఓ మెరుపా! నువ్వు కూడా ఆడవాళ్ల దుఃఖం తెలుసుకోవాగ” “వారిధరఃి - పుంలింగశబ్దం.

“విద్యుత్‌” 'ప్రీలింగశబ్దం.

  1. ధనైర్వియుక్తస్య నరస్య లోకే కిం జీవితేనాదిత ఏవ తావత్‌, యస్య ప్రతీకారనిరర్థకత్వాత్‌ కోపప్రసాదా విఫలీభవన్తి, (౬40) “ధనం లేని మనిషి ఈ లోకంలో అసలు జీవించడమే అనవసరం, ఎందువల్ల

నంటే వాడు ఎలాంటి ప్రతిక్రియా చేయజాలకపోవడంచేత వానికి కోపం వచ్చినా,

అనుగ్రహం కలిగినా రెండూ వ్యర్థమే”.

  1. పక్షవికలశ్చ్ళ పక్షీ శుష్కశ్చ తరుః సరశ్చ జలహీనమ్‌, సర్పశ్చోద్ధుతదం(ప్టస్తుల్యం లోకే దరిద్రశ్చ. (౧41) రెక్కలు లేని పక్షీ ఎండిపోయిన చెట్టూ, నీళ్లు లేని చెరువు, కోరలు పీకివేసిన

పామూ, బీదవాడూ - ఈ లోకంలో వీళ్లందరూ సమానం.

  1. తాలీషు తారం విటపేషు మన్దం శిలాసు రూక్షం సలిలేషు చణ్జమ్‌, సజ్జీతవీణా ఇవ తాద్యమానాస్తాలానుసారేణ పతన్తి ధారాః (౬౩) “వీ తీగలు మోగిస్తే వేరు వేరు విధాలుగా [మోగి నట్లు వర్షధారలు

తాటిచెట్ల ఆకులమీద గట్టిగాను, కొమ్మలమీద గుల్లగాను, రాళ్లమీద పరుషంగాను,

నీళ్లమీద తీవ్రంగాను పడుతున్నాయి.

  1. వణిజ ఇవ భాన్సి తరవః పణ్యానీవ స్థితాని కుసుమాని, శుల్మమివ సాధయన్లో మధుకరపురుషాః ప్రవిచరన్తి. (1గ-1)

ఈ ఉద్యానంలో చెట్లు వర్తకుల వలె ఉన్నాయి. పుష్పాలు, అమ్మ జూపిన వస్తువుల వలె ఉన్నాయి. తుమ్మెద లనే పురుషులు పన్ను వసూలు చేసికొంటున్నట్లు తిరుగు తున్నాయి.

  1. సంయచ్చత నిజోదరం నిత్యం జాగృత ధ్యానపటహేన, విషమా ఇన్టియచౌరా హరన్తి చిరసంచితం ధర్మమ్‌. (౧1) “పొట్టలు కట్టుకొనండి. ధ్యానం అనే పటహంచేత ఎల్లప్పుడు జాగరూకులై

52 మృచ్చకటికచ్చట ఉండండి. చెడ్డవాళ్లైన ఇంద్రియా లనే దొంగలు చాలా కాలంనుంచి ప్రోగుచేసుకొన్న ధర్మాన్ని హరిస్తారు.

  1. పళ్చుజనా యేన మారితాః ప్రియం మారయిత్వా గ్రామో రక్షితః, అబలశ్చ చణ్జాలో మారితః అవశ్యమపి స నరః స్వర్గం గాహతే.(/-21) “ఎవడు ఐదుగురిని చంపాడో, స్త్రీని చంపి గ్రామాన్ని రక్షించాడో, దుర్చలు

డైన చండాలుణ్ణి చంపివేశాడో అతడు తప్పక స్వర్గానికి వెడతాడు”. ఇదుగురు

జనులు అనగా పంచజ్ఞానేంద్రియాలు. స్త్రీ అనగా భోగాలమీద ఆసక్తి కలిగించే మాయ. [గ్రామం అనగా శరీరం. మాయను తొలగించుకొని శరీరాన్ని రక్షించుకొన్నవాడు అని అర్ధం. అపుడు దుర్భలుడుగా అయిపోయిన చండాలు దనగా - అహంకారం లేదా కామం. 55. శిరో ముణ్జితం తుణ్జం ముణ్జితం చిత్తం న ముణ్జితం కిమర్థం ముణ్జితమ్‌, యస్య పునశ్చ చిత్తం ముణ్జితం సాధు సుష్టు శిరస్తస్య ముణ్జితమ్‌, (1.1) “త్రల గొరిగించుకొన్నాడు; ముఖం గొరిగించుకొన్నాడు; మనస్సు మాత్రం గొరిగించుకోలేదు; తలా ముఖమూ ఎందుకు గొరిగించుకొన్నట్లు! ఎవడు చితం గొరిగించుకొంటాడో వాడే తల బాగా గొరిగించుకొన్నవా డవుతాడు, న్‌ ఈ మూడు శ్లోకాలూ కొత్తగా బౌద్ధభిక్షు వైన సంవాహకుని ఉపదేశాలు. 56. వస్త్వన్తరాణి సదృశాని భవన్తి నూనం రూపస్య భూషణగుణస్య చ కృత్రిమస్య, దృష్ట్వా క్రియామనుకరోతి హి శిల్పివర్గః సాదృశ్యమేవ కృతహస్తతయా చ దృష్టమ్‌. (ఏ4 మానవుడు తయారుచేసిన ఒక ఆకారానికైనా, అలంకారాల గుణాలకైనా పోలిన ఇతర వస్తువులు తప్పకుందా ఉంటాయి. ఎందువల్ల ననగా శిల్పులు మంచి నేర్పు కలవారవడంచేత ఒక పని చూచి పూర్తిగా అదే విధంగా ఉన్న మరొక వస్తువు తయారుచేస్తూంటారు. 57. అరే! భణితో౭ స్మి ప్రితా స్వర్గం గచ్చతా - “యథా పుత్ర! వీరక! యది తవ వధ్యపాలీ భవతి మా సహసా వ్యాపాదయసి వధ్యమ్‌ ... కదాపి కోపి

మృచ్చకటికచ్చట హ్‌ సాధుః అర్ధం దత్త్వా వధ్యం మోచయతి. కదాపి రాజ్ఞః పుత్రో భవతి, తేన వృద్ధిమహోత్సవేన సర్వవధ్యానాం మోక్షో భవతి. కదాపి హస్తీ బన్ధం ఖజ్జయతి, తేన సంభ్రమేణ వధ్యో ముక్తో భవతి. కదాపి రాజపరివర్తో భవతి, తేన సర్వవధ్యానాం మోక్షో భవతి. (1౬౩౩ శ్లోకం తరువాత). మా తండ్రి స్వర్గానికి వెడుతూ నాకు ఇలా చెప్పాడు. “పుత్రా! వీరకా! వధ్యుణ్ణి చంపవలసిన వంతు నీ కెప్పుడైనా వస్తే వానిని వెంటనే చంపివేయవద్దు .... ఎవడైనా సత్పురుషుడు ధనం ఇచ్చి ఆ వధ్యుణ్ణి విడిపించవచ్చు. రాజుకు పుత్రుడు కలగవచ్చు. అప్పుడు వధ్యు లందరికీ విడుదల కలుగుతుంది. ఏనుగు బంధం టత్రెంచుకోవచ్చు. ఆ కోలాహలంలో వధ్యునికి విడుదల లభించవచ్చు. రాజు మారిపోవచ్చు. అప్పుడు వధ్యు లందరికీ విడుదల కలుగుతుంది”. చారుదత్తుణ్ణి వధస్థానానికి తీసికొని వచ్చిన తరవాత అక్కడ ఉన్న ఇద్దరు చండాలులు మాటలాడుకొనే సందర్భంలో వీరకు డనేవాడు రెండోవానితో అన్నమాటలివి. వధదండ విధించినవానికి కూడ ఏ విధంగా విడుదలకు అవకాశం ఉండేదో దీనిని పట్టి తెలుస్తూన్నది. ఇక్కడ “కదాపి రాజపరివర్తో భవతి” అని వీరకు డన్న మాటలు వినగానే అక్కడనే ఉన్న శకారుడు ఉలిక్కిపడి “కిం కిం రాజపరివర్లో భవతి” (ఏమి టేమిటీ! రాజు మారిపోతున్నాడా?) అని అంటాడు. చివరికి అదే జరిగింది. 58. శత్రుః కృతాపరాధః శరణముపేత్య పాదయోః పతితః శస్తేణ న హన్తవ్యః ఉపకారహతస్తు కర్తవ్యః. (౮65) “అపరాధం చేసిన శత్రువు శరణువేడి పాదాలమీద పడి నప్పుడు వానిని ఆయుధంతో చంపకూడదు. ఉపకారంచేత చంపాలి”. 59. కాంళ్చిత్తుచ్చయతి ప్రపూరయతి వా కాంశ్చిన్నయత్యున్నతిం కాంశ్చిత్పాతవిధౌ కరోతి చ పునః కాంశ్చిన్నయత్యాకులాన్‌, అన్యోన్యం ప్రతిపక్షసంహతిమిమాం లోకస్థితిం బోధయన్‌ ఏష క్రీడతి కూపయన్తఘటికాన్యాయప్రసక్తో విధిః (59)

54 మృచ్చకటికచ్చట లోకంలోని స్థితి పరస్పరం విరుద్ధాలైన విషయాల సంఘాతం. ఈ విషయాన్ని బోధిస్తూ, నూతిలోని ఘటీయంత్రం వంటి దైవం కొంతమందిని ఏమీ లేనివాళ్లనుగా చేస్తుంది. కొంతమందిని ఐశ్వర్యంతో ముంచెత్తుతుంది. కొంతమందిని పైకి లేపుతుంది; కొంతమందిని క్రింద పడవేస్తుంది. కొంతమందిని ఏమీ తోచని పరిస్థితుల్లో పడేస్తుంది. ఒక పెద్ద చక్రానికి చుట్టూ కొన్ని కుండలు కడతారు. దానికి ఘటీయంత్రం అని పేరు. దానిని ఒక విశాలమైన నూతిలోనికి అమరుస్తారు. చక్రాన్ని మెల్లగా తిప్పుతూన్నప్పుడు-ఆ చక్రానికి కట్టిన ప్రతీ ఘటమూ నీటిదాకా వెళ్లి నీరు నింపుకాని పైకి వస్తుంది. ఆ ఘటంలోని నీళ్లు బైట పడిపోతాయి. మళ్లీ క్రిందికి వెళ్లి నీళ్లు నింపుకొని పైకి వచ్చి ఆ నీళ్లు బైట పారబోస్తుంది. అన్ని ఘటాలూ ఇలాగే చేస్తాయి. ఇదే ఘటీయంత్రం అనగా. 60. క్షీరిణ్యః సన్తు గావో, భవతు వసుమతీ సర్వసంపన్నసస్యా, పర్జన్యః కాలవర్షీ సకలజనమనోనన్దినో వాన్తు వాతాః, మోదన్తాం జన్మభాజు, సతతమభిమతాః బ్రాహ్మణాః, సన్తు సన్తః శ్రీమన్తః, పాన్తు పృథ్వీం ప్రశమితరిపవో ధర్మనిష్థాశ్చ భూపాః ౧౬61) ఇది భరతవాక్యం. “ఆవులు సమృద్ధిగా పాలు ఇచ్చుగాక, భూమి = సమస్తసస్యాలతో నిండి ఉండుగాక, మేఘుడు సరియైన కాలంలో వర్షించుగాక. గాలులు సమస్తమైన జనుల మనస్సులను ఆనందింపచేస్తూ వీచుగాక. ప్రా లందరూ ఆనందంతో ఉందురు గాక, బ్రాహ్మణులు ఎల్లప్పుడు గౌరవపాత్రులుగా ఉందురుగాక. సత్పురుషులు శ్రీమంతు లగుదురుగాక, రాజులు శత్రువులను శమింపచేసి ధర్మనిష్టులై భూమిని పాలింతురుగాక. 61. అకన్షసముత్ధితా పద్మినీ, అవబ్బకః వణిక్‌, అచౌరః సువర్ణకారః, అకలహః గ్రామసమాగమః, అలుబ్దా గణికేతి దుష్కరమేతే సంభావ్యన్తే. (పంచమాంకం). దుంప లేకుండా మొలచిన పద్మలత, మోసం చేయని వర్తకుడు, దొంగిలించని కంసాలి, కలహం లేని గ్రామజనసమావేశము, దురాశ లేని వేశ్య - ఇవి ఉండడం అసంభావ్యం.

మృచ్చకటికచ్చట 55 62. గణికా, హస్సీ, కాయస్థః, భిక్షు; చాటః, రాసభశ్చ యతైతే నివసన్సి తత్ర దుష్టా అపి న జాయన్తే (పంచమాంకం)

వేశ్య, ఏనుగు, కాయస్థుడు, బౌద్ధభిక్షువు, గూఢచారి, గాడిద - ఇవి ఉన్న చోట దుర్మార్డుడు కూడ సుఖంగా ఉండలేడు. 63. దుష్కరం విషమౌషధీకర్తుమ్‌ (అష్టమాంకం)

విషాన్ని జెషధంగా చేయడం చాల కష్ట మైన పని. 64 మూలే చ్చిన్నే కుతః పాదపస్య పాలనమ్‌ (నవమాంకం)

మొదలు నరికివేసిన తరవాత చెట్టును ఎలాగ కాపాడడం? 65. లోకే కో౭_ప్యుద్ధితః పతతి కోపి పతితో౭_ ప్యుత్తిష్టతి.

లోకంలో ఒకడు పైకి లేచినా పడిపోతాడు, ఒకడు పడిపోయినా లేస్తాడు. 66. స్వకే గేహే కుక్కురో౭పి తావచ్చణ్లో భవతి (ప్రథమాంకం)

తన ఇంట్లో కుక్క కూడ తీవ్రం అయిపోతుంది. 67. సర్వత్రార్ణవం శోభతే (దశమాంకం)

బుజుత్వం (కుటిలత్వం లేకపోవడం) అంతటా శోఖిస్తుంది.

ఆజా ఆజా ఆజా

56 పద్మప్రాభృతక సౌరభం శూద్రకుడు పద్మప్రాభృతకం అనే ఒక భాణం కూడ రచించి నట్లు ప్రసిద్ధి. ప్రాచీన గ్రంథాల అన్నింటి కర్త్షృత్వాదుల విషయంలో వలెనే దీని కర్తృత్వం విషయంలో కూడ అభిప్రాయభేదాలు ఉన్నాయి. వమైనా శూద్రకుని పేరుతో ఇది ప్రచురితమై ఉంది. ఇది చాల రసభరిత మైన భాణం. అడుగడుగునా ప్రధానంగా శృంగారరసం, హాస్యరసమూ కూడ ఆస్వాద్యములై ఉన్నాయి. ప్రధానమైన రూపకాలలో భాణం ఒకటి. ఇది సమాజంతో ఘనిష్టమైన సంబంధం ఉన్న సమాజంలో ఉన్న అన్ని అలవాట్లనూ ఆచారాలనూ చెప్పే, రూపక విశేషం. భాణంలో ప్రధానంగా సమాజంలో ఉన్న కొన్ని దురాచారాలను ఎత్తి చూపడం జరుగుతుంది. సంస్కృతంలో ఉన్న దృశ్యకావ్యాలలో సామాజికవిషయాల కంతగా ప్రాధాన్యం ఉండదు; రాజాదుల చరిత్రవర్ణనయే వాటిలో కనబడుతుంది అని కొంద రంటూంటారు. కేవలం అభిజ్ఞానశకుంతల వంటి రెండు మూడు దృశ్యకావ్యాలనే చూడడంచేత, భాణం మొదలైన ఇతరరూపకాలు రెండుమూడు శతాబ్దాలుగా ప్రచారంలో లేకపోవడంచేత ఈ భ్రాంతి కొందరు ఆధునికవిద్యా వంతులలో కూడ స్థిరంగా ఉండి పోయింది. నాట్యశాస్త్రంలో పది రూపకాలు చెప్పబడ్డాయి. అవి కాక పది ఉపరూపక్షాల చర్చ ఇతర(గ్రంథాలలో ఉంది. నాటకం, ప్రకరణం మొదలైన కొన్ని రూపకభఖేదాలలోనే ఉదాత్తమైన వస్తువును గ్రహించాలి అనే నియమం ఉంది. మిగిలిన రూపకా లన్నింటిలోనూ ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సమాజంతో సంబంధం ఉన్న కథావస్తువే ఉంటుంది. భాణంలో మొదటినుండి చివరిదాకా విటు డనే ఒకే ఒక పాత్ర రంగస్థలంమీద కనబడతాడు. విటుడు ఆకాశభాషితాలతో (తన ఎదుట ఎవరో ఒక వ్యక్తి ఉన్నట్లు చెపుతూ ఆతనితో సంభాషణ సాగించడం “ఆకాశభాషితం”) తానే అనుభవించిన లేదా ఇతరులు అనుభవించిన ధూర్తచరితాన్ని చమత్మారంగా వర్ణిస్తూంటాడు. అతని ఎదుట ఎవరో ఒక వ్యక్తి ఉన్నట్లూ వానితో అతడు మాటలాడుతున్నట్లూ సామాజకు లూహించుకొని విషయం అద్ధం చేసికొంటారు. ఇదంతా ఏకపాత్రాఖినయం.

పద్మప్రాభృతక సౌరభం 5/7

“భాణస్తు ధూర్తచరితం స్వానుభూతం పరేణ వా,

యత్రోపవర్ణయేదేకో నిపుణః పణ్జితో విట౯ (దశరూ: 1-49)

“సమాధనోక్తి ప్రత్యుక్తీ కుర్యాదాకాశభాషితై:

సూచయేద్వీరశ్ళజ్లారౌ శార్యసాభాగ్యసంస్తవైవొ

పద్మప్రాభృతకంలోని ప్రధానేతివృత్తం మూలదేవు డనేవానికీ దేవసేన అనే వేశ్యకూ మధ్య ప్రణయప్రారంభం. మూలదేవునికి కర్టీసుతుడని (కర్ణీపుత్రుడనీ) మరొక పేరు. వాని మిత్రుడైన విటుని పేరు శశుడు. మూలదేవుడు ధూర్తులకు చోరులకు నాయకు దని వర్ణించబడ్డాడు. బాణుడు కాదంబరిలో కర్ణీసుతుణ్ణి గూర్చి, శశుణ్జి గూర్చి నిర్దేశిస్తాడు - “కర్ణీసుతకథేవ సన్నిహితవిపులాచలా శశోపగణతా చ”. దశకుమారచరిత్రలోని అపహారవర్శచరిత్రలో, కూడ చౌర్యాన్ని గూర్చిన గ్రంథాన్ని రచించినట్లుగా కర్టీసుతుని నిర్దేశం ఉంది. “కర్తీసుతో మూలదేవో మూలభద్రః కలాబ్బ్కురఃి అని హారావలి, “కర్ణీసుతః కరటకః స్తేయశాస్త్రస్య కారకళొ అని వైజయంతీనిఘంటువు చెపుతున్నాయి.

కొంత కాలం క్రితమే తన మనస్సును ఆకర్షించిన దేవసేనకు కలిగిన అనారోగ్య మేమో తెలుసుకొని రావలసిందిగా కర్ణీసుతుడు శశుణ్ణి పంపుతాడు. ఆ పనిమీద వెడుతూ శశుడు దారిలో చాలా రకాల మనుషులను కలుస్తాడు. ప్రతీవానితోను ఏవో ముచ్చట్లాడుతూ ముందుకు సాగుతాడు. వాళ్లందరూ వేశ్యాలంపటులు లేదా వేశ్యలు.

శశునకు ముందుగా కనబడినవాడు కాత్యాయనగోత్రుదైన సారస్వతభద్రు డనే కవి. అత డేదో పద్యం వ్రాయడంకోసం ఆలోచిస్తూ ఇంటి ముందు కూర్చున్నాడు. శశుడు ఆతని దగ్గరికి వెళ్లి - “సఖే! కాత్యాయన! కిమిదమాకాశ రోమన్థనం క్రియతే?” (ఏమిటిది, ఏదో ఆకాశం నెమరువేస్తున్న ట్లున్నావు?) అని పలకరిస్తాడు. “అదేనయ్యా ఆ కావ్యపిశాచం ఆవహించి పీడిస్తూన్నది” అని అతడు సమాధానం చెప్పినట్లు అంటూ - “పురాణకావ్యపదచ్చేదగ్రథనచర్శకారా! (పాత కావ్యాలలోని పదాలు ముక్కలుచేసి వాటిని అల్లే చర్మకారుడ్యా) శ్లోకం ఏ వస్తువును తీసికొని వ్రాశావు?” అని ప్రశ్నిస్తాడు. ప్రస్తుతం వచ్చి ఉన్న వసంతబుతువును గూర్చి వ్రాశాను” అని అత డంటాడు. “ఏది; చూపించు”

58 పద్మప్రాభృతక సౌరభం అని శశుడనగా “అదిగో గోడమీద వ్రాసి ఉంది చూడు అని అత డంటాడు. శశుడు శ్లోకం చదివి చాలా అద్భుతంగా ఉంది అని అంటూ “వాక్పురోభాగానామ భాగీ భవ” - “మా లో తప్పులు పట్టేవాళ్ల బారిని పడకుందువుగాక” అని ఆశీర్వదిస్తాడు. అక్కడనే ఉన్న దర్దురకు డనే పీఠమర్దుడు (పీఠమర్జ్చుడు' కూడ విటుల కోవకి చెందినవాడే) ఇంత ప్రసిద్ధుడైన కవికి నీ ఆశీర్వాదం ఎందుకు అన్నట్లు - “సముద్రాభ్యుక్షణం క్రియతే యద్వాగీశ్వరం వాగ్భిరర్ప్వయసి” (నువ్వు వాగీశ్వరునికి వాక్కుతో చేసే అర్చనం సముద్రంమీద నీళ్లు చల్లినట్లుంది) అంటూ నవ్వుతాడు. దానికి శశుడు “నాయనా! నీ పీఠమర్దస్వభావం చూపించుకొన్నావు. “స్తూర్యం యజన్తి దీపైః సముద్రమద్శిః వసన్తమపి పుష్పైః, అర్బామో భగవన్తం వయమపి వాగీశ్వరం వాగ్భిఃొ “స్రూర్యుణ్ణి దీపాలు చూపించి పూజిస్తుంటారు; సముద్రాన్ని నీళ్లతో పూజిస్తారు; వసంతాన్ని పువ్వులతో పూజిస్తారు; మేం కూడా వాగీశ్వరుణ్ణి వాక్కులతో పూజిస్తాం” అంటాడు. న్‌ ఇంతలో విపుల అనే వేశ్యతో సంబంధం .ఉన్న ఒక ప్రాకృతభాషాకవి కనబడతాడు. ఆ విపుల కర్టీసుతునితో సంబంధం పెట్టుకొని తనను అవమానించ డంతో అతడు కొంత ఖిన్నుడై ఉన్నాడు. వాని యోగక్షేమాలు తెలుసుకొని శశ్రుడు ముందుకు సాగాడు. ఇంతలో పాణినీయంలో పండితుడు, దందశూకుని పుత్రుడూ అయిన దత్తకలశి అనే వైయాకరణుడు ఎదు రయ్యాడు. వానిని చూడగానే శశ్రుడు - “అయ్యో! ఇతడు ఎదు రయ్యాఢడే! వీని వాగ్వాగురనుండి (మాటల పాశంనుండి) ఎలా తప్పించుకోవాలి! ఇత డెందుచేతనో దిగులుగా ఉన్నట్లు కనబడుతున్నాడు. ఎక్కడో వాదంలో దెబ్బ తిని ఉంటాడు. కలహం అంటే వీనికి దురద కదా. అలాంటి వీని వాక్కుకొంచెం తట్టినా దేవాలయంలో ఘంట వలె మారుమోగుతూనే ఉంటుంది! నూపురసేన కూతురు రశనావతి అంటే వీనికి చాలా మోజట. అయ్యో పాపం! ఆ రశనావతిని చూస్తే గాడిద మెడకు కట్టిన వీణ చూచి నట్లు జాలివేస్తుంది, అనుకొంటాడు. ఇదిగో ఇతడు చెయ్యి ఎత్తి నన్నేదో పలకరిస్తూనే ఉన్నాడు”. " “ఏ మంటున్నావు? “అవి సుఖమశయిష్థాః (సుఖంగా

పద్మప్రాభృతక సౌరభం 59్రి శయనించావా) అంటున్నావా? వీనిని తప్పించుకొనే మార్గం లేదు. “అక్షర కోష్టాగారానికి - (పదాల గోడౌన్‌కు) స్వాగతం (స్వాగతమక్షరకోష్టాగారాయ)”. “మిత్రమా! దత్తకలశా! నువ్వేదో విచారంలో ఉన్నట్లున్నావు!” అంటాడు. “కాంతంత్ర వ్యాకరణంవాళ్లు నన్ను కాకు లల్లా మీదపడి పొడిచారు” అని అత డంటాడు. “ఇంకనేం; కాకోలూకం (కాకులకీ గుద్లగూబలకీ మధ్య యుద్దం) జరిగిం దన్నమాట? మిత్రమా! అదృష్టవశంచేత నీ రెక్కలు రాలి పోని స్థితిలో నిన్ను చూడకలుగుతున్నాను అంటాడు శశకుడు. “ఆ! దుష్టవైయాకరణులు కాతంత్రికు లంటే నాకో లెక్కా” అంటాడు అతడు. “సరే! నేను వెళ్లివస్తాన” అంటాడు శశకుడు. అప్పుడు దత్తకలశి కఠినమైన సన్నంతపదాలు ప్రయోగిస్తూ - “క్వ సంచిచీర్ను; తిష్ట తావత్‌; కిమసి దుద్రూషువొ (ఎక్కడికి వెళ్లా లనుకుంటున్నావు? ఆగు. ఎందుకు అలా పరుగెత్తా లనుకొంటున్నావు) అంటాడు. అప్పుడు శశుడు

  • “నాయనా! అనుగ్రహించు. కర్ర దెబ్బల వలె నిష్టరము లైన మాటల పిడుగులతో (వవంవిధైః కాస్ట్రప్రహారనిష్టరైః వాగశనిఖిః) నన్ను కొట్టవద్దు. వ్యావహారికభాషతో కొంచెం మధురంగా మాట్లాడు (సాధు వ్యావహారికయా వాచా వద). ఒంటె త్రేన్పు (లేదా అపానవాయు విసర్జనం) వలె దుర్భర మైనవి, చెవులలో విషం నింపడం వంటివీ అయిన వైయాకరణుల వాగ్వ్య్యసనాలకు నన్ను లక్ష్యం చేయకు
  • (అభాజనం పా వయమీదృశానాం కరభోద్గారదుర్భ గానాం శ్రోత్రవిషనిషేకభూతానాం వైయాకరణవాగ్వ్యసనానామ్‌) అంటాడు. అప్పుడు దత్తకలశి - “దుర్వాదాలు చేసే ఎంతోమంది ప్రతివాదు లనే ఎద్దులతో పోట్లాడి సంపాదించుకొన్నది, అనేకమైన ధాతుశతఘ్ను లున్నదీ అయిన వాక్కును విడిచిపెట్టి స్తీశరీరం వలె మాధుర్యంతో కోమలమైనదానినిగా ఎలా చేస్తా ననుకొంటున్నావు?” అంటాడు,

అప్పుడు శశుడు - “ఏమైనా నీ పద్ధతి బాగులేదు. ఎందువల్ల నంటే -

స్వైరలాపే ప్రీవయస్యోపచారే

కార్యా(వ్యా) రమ్మే లోకవాదాశ్రయే చ,

కః సంశ్లేషః కష్టశబ్దాక్షరాణాం

పుష్పాపీడే కబ్బకానాం యథైవ.

60 పద్మప్రాభృతక సౌరభం

“స్వేచ్చగా మాట్లాడుకొంటున్నప్పుడూ (కబుర్లూ-చిప్పుకొంటూన్నప్పుడు) స్త్రీ వయస్య (91116౧6) తో ముచ్చటించేటప్పుడు, కావ్యాలలోనూ, లౌకికవిషయాలు మాట్లాడుకొనే టప్పుడు పరుషాక్షరా లున్న శబ్దాలకి చోటెక్కడ. అలాంటి పదాలు ఉపయోగించడం, తలలో ధరించడానికి తయారుచేసే పూవుల దండలో ముళ్లు చేర్చి కట్టిన ట్లుంటుంది” అంటాడు. “అందుచేతనే ఏమో నా ప్రియురాలికి నా మీద కోపం వచ్చింది” అంటాడు దత్తకలశి. “ఏమైంది? చెప్పు; విందాం” అంటాడు శశుడు. “నిన్న పర్వకాలంలో నేను హోమం చేయడానికి కూర్చున్నప్పుడు ఆమె వచ్చి మీద పడబోయింది (సా పుంశ్చలీ పూర్వేద్యుః పర్వకాలే వేశకోష్టకముపేత్య రిరంసయా మాం హవిర్హుహూషన్తం జిఘృక్షతీవ ఉపాసీదత్‌). అప్పుడు నేను - “వృషలి! మాం హవిర్దుహూషన్తం మా మా 'స్రాక్షీ” (ఓసి అపవిత్రురాలా! హవిస్సు హోమం చేయదలచుతూన్న నన్ను ముట్టుకోకు) అన్నాను. దానితో దానికి కోపం వచ్చింది” అనీ దత్తకలశి జరిగిన విషయం చెపుతాడు. అప్పుడు

శశుడు నవ్వుతూ - “ఏమి లోకజ్ఞానం రా నీది! వలచి వచ్చిన దానిని వ్యాకరణంలోని బొగ్గునిప్పుముక్కల వంటి (వ్యాకరణవిష్ళులిజ్ఞాభిః వాగ్చి పదాలు ప్రయోగించి అలా హడలుకొట్టడం ఏమంత బాగుంది? ఈ మాత్రం కూడ

నువ్వు విని ఉండలేదా!

“రత్యర్థినీం రహసి యః సుకుమారచిత్తాం

కాన్తాం స్వభావమధురాక్షరలాలనీయామ్‌,

వాగర్చిషా స్పృశతి కర్ణవిరేచనేన

రక్తాం స వాదయతి వల్లకిముల్ముకేన”.

“రతిని కోరి రహస్యస్థానంలో దగ్గరికి చేరిన సుకుమారచిత్త యైన కాంతను మధురమైన మాటలతో లాలించడానికి బదులు చెవులను దొలిచివేసే శబ్దాగ్నితో స్పృశించేవాడు నిజంగా వీణను కొరవితో వాయించేవాడే!” “సరే: చెవికి రసాయనం వంటి మాటలు వినిపించావు!! వెళ్లి వస్తాను” అంటూ ముందుకు సాగుతాడు.

కొంచెం దూరంలో వేశ్యాసంబంధం ఉన్న ఒక పవిత్రకు డనే బ్రాహ్మణుడు స్నానం చేసి, తడిబట్ట చేతిలో పట్టుకొని మార్గంలో ఇతరులు ఎక్కడ ముట్టు కుంటారో అని ఒదిగి ఒదిగి నడుస్తూ వస్తుంటాడు. వానిని చూచి శశుడు -

పద్మప్రాభృతక సౌరభం 61 “పవిత్రకా! నీ సంగతి అందరికీ తెలిసిందే. ఎందు కీ మడీ దడీని. ఈ డాంబికా లన్నీ కట్టబెట్టి హాయిగా ఉండు” అని ఉపదేశిస్తాడు. అతడు ఆ మాటలు విని “సరే! ఈ రోజు నుండి నేను నీ శిష్యుణ్ణి అంటాడు.

పూవుల అంగడి దాటి శశుడు కొంచెం ముందుకి వెళ్లగానే మవృృదంగవాసులకు దనే ఒక ముసలి విటుడు కనబడతాడు. పూర్వం అతడు నాటకాలలో విటుడుగా అభినయించేవాడు. ప్రస్తుతం అతనికి వేశ్య లందరూ పెట్టిన పేరు 'భావజరద్గవ' (ముసలి ఆబోతు బావ) జుట్టుకీ, శరరానికీ ఏవేవో రంగులు పూసికొని ముసలితనాన్ని కప్పుకోవడానికి (జరాకౌపీనప్రచ్భాదనం) నానా విధాల బాధపడుతున్నాడు. “నీవు పడే బాధ అంతా పాత ఇంటికి రంగు వేసి క్రొత్త దానినిగా చేయడానికి ప్రయత్నించిన ట్లుంది”. (“లేపేనేవ పురాణజర్జరగృహ స్యాయోజితం యెవనమ్‌”) అని పరిహసించి శశుడు ముందుకు సాగుతాడు.

దారిలో శశ కునికి వేశ్యాలంపటుడు, బౌద్ధభిక్షుకీసంబంధం ఉన్నవాడు, జూదరీ అయిన ఒక బ్రాహ్మణయువకుడు కనబడతాడు. వానితో కొన్ని పరియాచకా లాడి ముందుకు సాగుతాడు. వేశ్యాగృహంనుంచి బైటకు వస్తూన్న బౌద్ధభిక్షు వొకడు కనబడతాడు. “ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా” అని ప్రశ్నిస్తాడు. “ఇప్పుడే విహారం నుంచి వస్తున్నాను అంటాడు - ఆ బౌద్ధభిక్షువు. “బెను! నిజమే! విహారంనుంచే వస్తున్నావు” అంటాడు నవ్వుతూ శశుడు. “అది కాదయ్యా! తల్లి మరణానికి దుఃఖిస్తున్న సంఘదాసికను (మా బౌద్ధసంఘానికి శిష్యురాలైన వేశ్యను) బుద్ధుని మాటలు చెప్పి ఓదార్చడానికి ఇక్కడికి వచ్చాను” అంటాడు భిక్షువు. (మాతృవ్యాపత్తిదుఃఖితాం సంఘదాసికాం బుద్ధవచనైః వ్యపస్థాపయితుమాగతో౭_ స్మి. అప్పుడు శశుడు “నీ నోటినుండి బుద్ధవచనాలు రావడం మద్యం మత్తులో ఉన్నవాడు ఆచమనం చేయడవంటిది - భోః కష్టమ్‌!

“వేశ్యాబ్బణం ్రవిష్టో మోహాద్భిక్షుర్యదృచ్చయా వాపి,

న భ్రాజతే ప్రయుక్తో దతకసూ్రేష్వివోంకారళో

“అయ్యో! ఎంత దుర్భరమైన విషయం! తెలిసి కాని తెలియక కాని ఒక బౌద్ధ భిక్షువు వేశ్యావాటికలో ప్రవేశించడం దత్తకసూత్రంలో (కామసూత్రంలో) ఓంకారం వలె చూడడానికి ఏమీ బాగుండదు” అని అంటూ ముందుకు

62 పద్మప్రాభృతక సౌరభం సాగిపోతాడు. దారిలో కనబడిన ఐదారుగురు వేశ్యాయువతులను వాళ్ల ప్రియుల్నీ పలకరిస్తూ చివరికి దేవసేన ఇంటికి చేరుతాడు.

దేవసేన ఎవరో కాదు. కర్టీపుత్రుని (ప్రేయసి అయిన దేవదత్త చెల్లెలు. నవోద్దతయౌవన యైన ఈమెను ఎక్కడనో చూడడం తటస్థించి నప్పుడు ఈమె కర్టీపుత్రుని మనస్సు ఆకర్షించింది. ఈమెకు కూడ వానిపై అభిలాష కలిగింది కాని అక్కగారి ముఖం చూసి సందిగ్ధావస్థలో పడి ఉంది. శశుడు ఈమె మనస్సులోని భావం తెలుసుకొని ఆమె కర్ణీపుత్రుణ్జి చేరడంలో తప్పేమీ లేదని సషప్రమాణంగా ఆమెకు నచ్చచెపుతాడు-

“*దక్షాత్మజాః సున్దరి యోగతారాః కిం నైకజాతాః శశినం భజన్తే, ఆరుహ్యతే వా సహకరావృక్షః

కిం నైకమూలేన లతాద్వయేన”.

(ఒకే దక్షప్రజాపతి పుత్రికలైన అశ్విన్యాదితార లన్నీ ఒక్క చంద్రుణ్ణి ఆథ్రయించ లేదా? ఒకే మూలంలోనుండి బయలుదేరిన రెండు లతలు ఒక సహకారవృక్షానికి అల్లుకోవా?)

ఈ విధంగా ఆమెకు కర్ణిపుత్రునిమీద అనురాగం దృఢం అయేటట్లు చేసి అనురాగానికి చిహ్నంగా ఏదైనా అతనికి ఇమ్మంటాడు. అప్పుడామె తన చేత్రిలో విలాసార్థం ధరించి ఉన్న పద్మం ఆతనికి తననుండి ప్రాభృతంగా (కానుకగా) ఇమ్మని వాని కిస్తుంది. ఇదే ఈ భాణానికి పద్మప్రాభృతం అనే పేరు పెట్టడానికి కారణం.

ఈ భాణంలో కవి ఆ నాడు సమాజంలో ఉన్న కొన్ని అలవాట్లనూ, దురాచారా లనూ, వైదిక-బౌద్ధమతాదులలో ఉన్న కొన్ని దాంభికాచారాలనూ చక్కగా చిత్రించాడు. ఆ నాటికి పాణినీయవ్యాకరణానికి పూర్తి ప్రామాణ్యం అంగీకరించబడలేదు. ఈ వ్యాకరణం చదువుకొన్నవాళ్లకీ, ఇతరవ్యాకరణపండితులకీ వాదాలు జరుగు తుందేవి. వేశ్యావృత్తి, జూదం, మద్యపానం మొదలైనవి సమాజంలో అత్యధికంగా ఉండేవి. ధర్మాత్ములూ, స్వస్వధర్మాలను బాగా

పద్మప్రాభృతక సౌరభం !

అనుష్టించేవారూ లేరని అర్ధం కాదు. వాళ్లతో పాటు ఇతరులు కూడ అధికసంఖ్యలో

ఉండేవారు. శూద్రకుడు మృచ్చకటింలోను, ఈ పద్మప్రాభృతకంలోనూ చిత్రించిన

సమాజాన్ని చూస్తే ఈనాటి సమాజాన్నే చిత్రిస్తున్నాడా అనిపిస్తుంది. పేర్లలో

మాత్రమే భేదం. శూద్రకుడు ఈ భాణ-ప్రకరణాలు ఈ రోజుల్లో వ్రాసి ఉంటే

బ్రాహ్మణులో, వేశ్యావృత్తిలో ఉన్నవాళ్లో, బౌద్భులో క్షబ్బుల మెంబర్లో కోర్టులో

కేసు పెట్టి ఉందేవారు. లేదా “ఆజీవమరణశిక్షొ విధించి ఉండేవారు. పద్మప్రాభృతకం ప్రమాణంచేత చిన్నదే అయినా దానిలో ఎన్నో చక్కని

వర్ణనలూ, నూతనశబ్దప్రయోగాలూ కనబడతాయి. కొన్ని పదబంధాలు -

  1. దివా దీపప్రజ్వాలనమ్‌ : పగలు దీపం వెలిగించడం (వ్యర్థమైన పని)

  2. _ కావ్యవ్యసనీ : ఏదో కావ్యం వ్రాయాలనే తపనా అత్యాసక్తీ గల కవి.

  3. _ అకాశరోమననమ్‌ : ఆకాశం నెమరువేయడం (ఏదో ఆలోచిస్తూ కూర్చొనడం ౪00! ర206గ౧౦)

*ఓ _ సుహృత్ముముదాననవబోధయన్‌ దివాచన్దలీలయా౬. తిక్రామసి : పగటి చంద్రుడు వలె మిత్రు లనే కలవలను వికసింపచేయకుండా వెళ్లిపోతున్నావు.

  1. _గర్వైకవ్రతశాలినీ : ఒక్క గర్వం అనే వ్రతంమాత్రమే పట్టినది.

  2. క్షిప్తః కదర్ధయిత్వా హేమన్తే తాలవృన్త ఇవ : హేమంతంలో విసనక(ర్రను దూరంగా పారవేసి నట్లు తిట్టి దూరంగా పంపివేయబడినవాడు.

  3. _ సర్వమచిరాదత్యాయతం ఛిద్యతే : గట్టిగా లాగితే ఏదైనా తెగిపోతుంది.

8 _ ఉష్పస్థలీకూర్మలీలా : వేడెక్కిన చోట తాబేలు ఉన్నట్లు,

  1. _గోపొలకులే తక్రవిక్రయః : గొల్లపల్లెలో మజ్జిగ అమ్మడం (వ్యర్థమైన పని).

  2. న సూర్యః దీపేన అన్థకారం ప్రవిశతి : సూర్యుడు దీపం వెలిగించుకొని (గదిలో ప్రవేశించినట్లు) అంధకారంలో '్రవేశించడు.

  3. సందంశేన నవమాలికామపచినోషి : పట్టకారుతో నవమాలికాపుష్పాలు కోస్తున్నావు.

న పద్మప్రాభృతక సౌరభం 12. పాయసోపవాసః ; పాయసం తిని ఉపవాసం ఉండడం. 13. జరాకౌపీనప్రచ్భాదనమ్‌ : ముసలితనాన్ని కౌపీనంతో కప్పుకొనడం. లేదా జర అనే కౌపీనం కప్పుకొనడం. 14 మదనీయం ఖలు పురాణమధు : పాత మద్యం బాగా మత్తెక్కిస్తుంది. 15. అనాగతసుఖాశయా ప్రత్యుపస్థితసుఖత్యాగో న పురుషార్ధం : ఎపుడో సుఖం వస్తుం దనే ఆశచేత వచ్చిన సుఖాన్ని విడవడం పురుషార్ధం (తెలివైన పన కాదు. 16 న దీపేన అగ్నిమార్గణం క్రియతే : దీపంతో అగ్నిని వెదకరు. 17న వాయసోచ్చిష్టతీర్థజలముపహతమ్‌ 2 కాకి ఎంగిలికి తీరజలం అపవిత్రం కాదు. | 1& ఇదం ఖలు వర్షర్తుజ్యోత్సాదర్భనమ్‌ : (ఏడుస్తూ చిరునవ్వు నవ్వడం) వర్షర్తువులో వెన్నెల కనబడడం. 19. దీర్హసూత్రతా నామ కార్యాన్తరముత్సాదయతి : ఒక పని చేయడంలో

  • తెగని ఆలోచన చేస్తే కొత్తపనులు చేయవలసి వస్తుంది.
  1. మేఘావగూధమపి చన్దమసం కుముద్వతీప్రబోధః.సూచయతి : మేఘాలు కప్పి ఉన్నా చంద్రు డుదయించి నట్లు కలవల వికాసం సూచిస్తుంది.
  2. లజ్ఞా నామ విలాసయొతకం ప్రమదాజనస్య ; లజ్జ అనేది స్త్రీల విలాసరూప మైన సొత్తు. (యౌతకమ్‌ = ౧౭90౧౬! న|౬౦౪గ౧. యత్కృపాలేశసంసర్థాద్ధన్టోణ యం రచితో మయా, తస్యైవ జానకీజానేః పదయోరయమర్చ్యతే దేవతానుగ్రహః పెత్రోస్తపశ్చాచార్యసత్కృపా, కర్తాస్మద్‌[గ్రస్థజాతస్య కరణం కేవలం వయమ్‌. యా 15. 11.2003 హయ్య ్రంరాంచ్నో సా న్‌. శ్రీ శ్రీః శ్రీః / ళీ రి గ సాల నా నయల న్‌ా.

నహ వనమా నన ర క న న సరన ర ర టా ర టర న పం వ నో లట న ల సే ద య ్‌ ర్‌ వా ల ల న న నరాల చ్‌ టే నర లర వా!