Telugu mavuri badi - anilvaranasi/indianlanguages GitHub Wiki
- 5 క్ ః | ఛీ + ” టే ॥ క శ. సహజ కవి మల్లెమాల జ “ గ న మనసుపడి మక్కువతో సేకరించిన ల |... ఈపుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం ఎ... సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి , స యు! ఆనందంతో బహూకరిస్తున్నాం. లు క్ష - మల్లెమాలకుటుంబం | | ళీ " క్ / నే. ॥ శ్లళ వ వ్ అన టల. జ్జ తు. “మధురకవి ట్ర. 1: “౯ దూడం నాంపల్లి సక. “తు రదు. |
వమా న్యాయం ట్ర ముష్లైమూల'నాలిల్ లా౨ వంద నవాబులు. గ రం [0-[2-౦ రం
ఏకాదశ ప్రసూనము నూవూరు బడి కథ రచన; దూడం నాంపల్ళి శ్రీనిలయం ప్రచురణలు, సిరిసిల్ల
న్ నాం ప మాపో దూడం నాంపల్లి మావూరు బడి (అధిక్షేప కథ) ప్రచురణ తేది : ర్ సెప్టెంబర్, 2005 (టీచర్స్ డే) ప్రచురణ సంఖ్య : 11 ప్రశులు ; 550 , 2182 ప్రతులకు : 6౫|| జా దూడం నాంపల్లి భచయ్యో చ + అక్కా 12-8-26, ప్రగతి నగర్, ల్ న గా (ఈఎ2మ జ; కరీంనగర్ గ కీ ఫోన్ : 08723-233770 చ వైవాయోడ ముద్రణ : లక్ష్మణ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ & గ్రాఫిక్స్ కోర్టు ప్రక్కన, సిరిసిల్ల - 505 301. ఫోన్: 233305 పత్తిపాక గ్రాఫిక్స్ & డిజిటల్ ఫోటోమిక్సింగ్, విమల్ టాకీస్ రోడ్, సిరిసిల్ల సెల్ : 944100 22075 వెల : రూ 30/-
స ప్రై న నన | మీ . సవ ల స్. న స టి న పని ఖు. న. ను మి ల. క. న. స 1] నటే. న ల ల న లనే. స. స. సలా వల గు ఘమ తఖ వ ప టప క్షి సవా.
శ
శీ
ర టె ౩వ 1 అర్ర! క్తి అద్రి + క 1 చఇ2డ్షీ మ చ్ స వ అ స్ట మం జ ,? హ్ ంఐ సతమ సవల న స డం. హా మా పం శ న్ ఇ చ్యూ నం మ ౨ స తు నట న తం. ఖే
వ జాం స్టతోలషన ప శం! వాం టయి నట బా న్య నం. నో లజ ఈ టి ళతకు గ. తస శ ల్ . లీ ఆయున ౪
శ్రే
కథాముఖం ఇది కథకాదు. కథకాని కథ. అంటే యథార్థ కథనం. ఒక విధంగా చెప్పాలంటే “బడిలోని బాగోతం”. మొదట దీనికి ఆ పేరే పెడదామనుకున్నాను. ఎందుకో నచ్చలేదు. నేనూ ఉపాధ్యాయున్నే ఏదో కొందరు అవలక్షణ లక్ష్మణులు తప్పుడు పనులు చేసినంత మాత్రాన గౌరవ ప్రదమయిన అధ్యాపకలోకాన్నే కించపరచినట్లు అవుతుందేమోనని, బాగుండదని, అసలు ఈ కథే రాయద్దని అనుకున్నాను. కానీ కొందరికైనా గుణపాఠంగా, కనువిప్టుగా పుంటుందన్న ఉద్దేశంతో రాయటం జరిగింది. ఎవరినీ కించ పరచటానిక్కాదు. బాధించటానిక్కాదు. బిళ్ళలో జరిగే ముఠాతగాదాలు, పక్షపాతధోరణులు, అన్యాయం, అక్రమాలు వీటి ఆధారంగా ఇది రాశాను. కొందరు పంతుళ్ళు బళ్లను తమ ఇళ్లుగా వాడుకుంటున్నారు. వస్తు సామగ్రిని 'స్వాహా చేస్తున్నారు. ఇంకొందరు అక్రమ ఫీజులు, డొనేషన్లు అధికంగాలాగి, విద్యాకమిటితో కుమ్మక్కయి 'బాసు'లు బాగోతమాడుతున్నారు. పై అధికారులైనా వచ్చి 'చెక్' చేస్తారేమోనని అనుకుంటే అదీలేదు. 'వంతుకు దాసరి కాలాడించినట్లు' 'డియివో- సియివో - పీయివో' ఎవరోఒకరు ఎప్పుడో ఓసారి రావటం, టీచర్స్ అటెండెన్స్ రిజిష్టర్ తెరవటం, అందులో సీన్” అని రాయటం. చికెన్ బిర్యాని తినటం వెళ్లిపోవటం. ఇటువంటి తరుణంలో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయంటే పడిపోవా మరి? కొన్ని స్కూళ్లలో రిజల్చు-జీరో శాతం వస్తుందంటే రాదామరి? భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు' భాసు (హెచ్.యం.) గారే భయం లేక నెలకు వారం రోజులు 'జడ్పీకి వెళ్ళివస్తూ సంతకాలు గుద్దేస్తుంటే మిగతా సిబ్బందికి భయం భక్తి ఎలా వుంటుంది? అటువంటప్పుడు ప్రగతి అధోగతే కదా! 'తినబోయే వారికి రుచులెందుకు చెప్పటం? చదువబోయే మికు ముందుగా ఈ సోదెందుకు? గురువుల మరుగులు తెలియా లంటే 'మావూరు బడి” గేటు తెరవండి! లోపలి కెళ్ళండి! పంతుళ్ల జాతకాలు చూడండి! తెలుస్తుంది. జై విద్యార్థి జై ఆచార్య! = రచయిత
కథలోని వ్యక్తులు 4 మట్టీపెల్ల మహేశం 44-.....మూడవ హెద్యాష్టర్ ర్, కర్ణుడు ంలలలస్మూల్ అసిస్టెంట్ 6 స్వామి ఎస్మూల్ అసిస్టెంట్ 7 సింగయ్య ంలలలస్మూల్ అసిస్టెంట్ &ఓ అభిరామయ్య ఉంలలస్మూల్ అసిస్టెంట్ 14. మదన్ మోహన్ ౨ సెంకడరీ గ్రేడ్ టీచర్ 15. ప్రభాకర్ రెడ్డి = నెంకడరీ గ్రేడ్ టీచర్ 21. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(0£0)............. జిల్లా పరిషత్ అధికారి 28. యుగంధర్ ౨ మండల విద్యాధికారి 120) విభ శ
మావూరు బడి
అనగనగా ఓ వూరు. అది మావూరు. మావూరంటే 'మా' వూరని కాదు. ఆ వూరిపేరే మావూరు. మావూరులో ఒక బడి వుంది. ఒకటేమిటి? చిన్నా పెద్దా అన్నీ కలిసిఇరవైకి పైనే వుంటాయి. అన్నింటిలోకి ఇది పెద్దబడి. కీర్తి ప్రతిష్టలు సమార్జించిన బిడి. అలాగని బాలికల బడి అసలే కాదండోయ్! అది బాలుర బడి. సరిగ్గా బోర్డు చూసి చెప్పాలంటే జిల్లా పరిషత్ బాలుర సెకండరీ పాఠశాల అని సాగదీసి చెప్పొచ్చు.
ఇక నైసర్గిక స్వరూపం వివరించాలంటే కొంత ఇబ్బంది కరంగానే వుంటుంది. నగరానికి నడిబొడ్డున వున్నందున బడిని ఆనుకొని రాజమార్గం (రహదారి) పోతూవుంటుంది. వచ్చిపోయే వాహన పిశాచాల రణగొణ ధ్వనులతో “శబ్దకాలుష్యం' అధ్యాపక అధ్యేతల పాఠన పఠనాలకు అనారోగ్యాన్ని ఆపాదిస్తూవుంటుంది. ఈ పాఠశాలకు ఎల్లలు ఈ విధంగా వుంటాయని చెప్పవచ్చు. తూర్పున తారు రోడ్డు. దాన్ని ఆనుకొని అవలివైపున 'దుఃభ్సాగర్' హోటలు, దాని పక్కనే మున్సిఫ్‌కోర్టు వుంటుంది. పశ్చిమాన జూనియర్ కాలేజి గదిగోడలు బడిని అనుకొనే వుంటాయి. దక్షిణాన నర్సింగ్ హోం ఒకటి త్రోవను ఆనుకొని వుంటుంది. అప్పుడప్పుడు అచట కడిగి పారబోసిన డెట్టాల్ దుర్గంధాలను గంధవహండు కిటికీల్లోంచి క్లాసు రూముల్లోకి మోసుకొస్తూ చదువరులను ముక్కులు మూసుకొనేలా చేస్తాడు. ఉత్తరాన కాలేజి ప్రహరీకుడ్యం బడిని ఆనుకొని వుంటుంది. ఇంకా బడిలోపల వేపచెట్లు రెండు పెద్దవి, ఐదారు యూరినల్స్, ఒక మరుగుదొడ్డి ఓమోస్తరుగావున్న రెండు నీళ్ల ట్యాంకులు, ఒక బోర్వెల్, దానికో కరంటు
2 మావూరు వదిలా మోటర్ -అది ప్రత్యేకంగా ఒక గదిలో అమర్చబడివుంది. స్కూల్లో నిర్వహింపబడుతున్న ఐదు తరగతులకు (6-10) ఒక్కొక్క తరగతి మూడు సెక్షన్లుగా మొత్తం 15 క్లాసులుంటాయి. అరకొర వసతులతో అన్ని తరగతులకు సరిపడా గదులు వన్నీ లెక్క ఉపాధ్యాయుల సంఖ్య కొస్తే - అరడజన్ ఆడవాళ్లు, డజన్నర మగవాళ్లు, నాన్ టీచింగ్- చెప్రాసీలతో కలిసి సిబ్బంది పాతిక పైచిలుకే వుంటారు. చదువరుల సంఖ్య సహస్రాధికం. వేసవిలో పిల్లలకు నీళ్ళు సరిపోవటం లేదని ఓ మాజీ హెచ్‌యం గారు రెండు సిమెంటుగోళాలు తెప్పించి, గేటు దగ్గరున్న వేపచెట్టు దగ్గర రెండు గద్దెలు కట్టించి, వాటిపై ఆరెండు గోళాలను ప్రతిష్టించాడు. ఇదండీ! ఈ బడికి చెందిన స్థిర చరాస్తులు- అధ్యాపక అధ్యాపకేతర అధ్యేతల వివరాలు. ఇక ఇక్కడి అధికారాన్ని హస్తగతం చేసుకొని హెడ్మాస్టర్కు హెడ్డు లేకుండాచేసి, అడ్డూ అదుపు లేకుండా అడ్డదిడ్డంగా అధికార చక్రం తిప్పుతున్న ముఠాచక్రం 'దుష్టషట్కం' గురించి తెలుసుకుందాం! ముందుగా చెప్పుకోదగినవాడు గురువీరుడు. పేరు మహావీరుడు. ఈ మహావీరుడు
చౌర్యంలో శౌర్యం కలవాడు. అడ్మిషన్ అండ్ రిమోవల్కి ఇతడు ఇన్చార్జి. టీసీలు ఇచ్చేటప్పుడు విద్యార్థుల వద్ద ముష్పయో నలభయో లంచంగా సొంతంగా పుచ్చుకొని కాలంపుచ్చే కౌటిల్య గుణధనుడు. ఈ లెక్సన ప్రతి సంవత్సరం పదవ తరగతి నుండి దాదాపు 200 పైనే విద్యార్థులు పాసవుతుంటారు. ధన సంగ్రహంలో ఈ మహావీరుడు ఎంతటి మహావీరుడో తెలియకనే తెలియుచున్నది. ఇంకా [10 ఏజెంట్లు ఇంకెవరెవరో బర్త్‌డే -స్టడీ సర్టిఫికేట్ల కోసం వస్తే-జన్మతేదీలు మార్చి డబ్బులుకూర్చి జీర్ణించుకునే వాతాపి జీర్ణ గర్భదౌర్భాగ్యుడు. సప్లమెంటరి ఆన్వెల్ ఎస్సెస్సి పరీక్షలప్పుడు పైరవీలు చేసి పబ్బం గడుపుకునే బడవ పంతులు. ఉపాధ్యాయు లెవరైనా బదిలీపై గాని, క్రొత్తగా నియామకం పై గాని ఈ బడికి వస్తే ఆనవాయితిగా దావత్‌కు డబ్బులిమ్మని పీడించి లాగించే పరపీడప పరాయణుడు. దురదృష్ట అదృష్టవంతులెవరైనా ఈ బడి నుండి పదవీవిరమణో బదిలో ఐతే, సహస్రమో సహస్రార్ధమో సుంకం ఈయందే సన్మానం చేయని చేయనియ్యని చవటసన్నాసి. ఈ ప్రబుద్ధలుబ్భన్ని శబ్దాలంకారం ఎలా అలంకరించిదో చూడండి!
“త్రాగుబోతు వీరుడు
లంచాల శూరుడు
పైరవీ దారుడు
మరో గ్రీకువీరుడు”
లా మానడ వది 3 మరో గురూత్తముడు కర్ణుడు. సిబ్బందిలో కొందరీతన్ని వాత్సల్యంగా అల్లారుముద్దుగా 'కర్ణాగ్ అని పిలుస్తుంటారు. కర్ణాకర్ణిగ అందరి కర్ణాలలో ఆకర్ణితమైన ఆ 'కర్ణ' నామమే అతనికి సార్ధక నామధేయమై కూచుంది. భారతంలోని ఆ కర్ణునికీ, ఐడిలోని ఈ కర్ణునికీ సంబంధంగాని, పోలికగాని ఏకోశానా లేదు. 'చానవీరశూర కర్ణుడు” ఆతరైతే, 'దీన హీన చోర కర్ణుడు ఈతడు, పులుగడిగిన ముత్యంలా అ కర్ణుని ముఖం వుంటే, పొటమరించిన పులిపిరితో ఈ కర్ణుని ముఖం వుంటుంది. ఆతనిది శిరస్రాణంతో కూడిన తల, ఈతనిది కేశలేశమైన బట్టతల. దుర్యోధన దత్తాధికారం ఆతనిది. దుర్యోగ పరిగ్రహాధికారం ఈతనిది. పోటు మగండుగా అ కర్ణుడు కనిపిస్తే - రౌదీషీటర్గా ఈ కర్ణుడు కనిపిస్తాడు. గుణంలో గమనంలో ఇద్దరికీ హస్తి మళకాంతరముంది.
ఇతడు పదవ తరగతి పరీక్షా విభాగానికి అధిపతి. మార్కుల పట్టిక లిచ్చునపుడు విద్యార్థుల వద్ద బీసోపచ్చీసో పట్టించే పైశాలీ గుణ దుర్గుణుడు. ఇంకా బడిలో పర్చేజ్ చేసిన వస్తువులకు బాసుతో కలిసి దొంగలిల్లులు పెట్టి దోపిడిచేసే దుష్టదుండగీడు. నిజానికి ఇతడు మ్యాస్ మాస్టర్. ఈ బడిలో సైన్సు మాస్టర్ బదిలీతో ఏర్పడ్డ ఖాళీలో పైరవీతో చక్కావచ్చి తిష్టవేసిన అక్రమ విక్రమార్క అగణిత గణితో పాధ్యాయుడు. అప్పటి నుండి అసలైన సైన్సుహ్యాండు లేకుండా పోయింది ఈ బడిలో.
స్కౌట్ మాస్టర్ అని మరొకాయన వున్నాడు. నిజానికి అతడు సెకండరీగ్రేడ్ టీచర్. పేరు యెలమంద. యెలమంద పుల్ల కందలాంటివాడు. పుల్ల కందలో పులుపులేకున్నా ఇతనిలో మాత్రం పులుపూ, కారం, వగరు, చేదు, అసూయ, ఈర్చా, ద్వేషం అన్నీవున్నాయి. లేటుగ రావటం, సంతకం చేయటం, ఇష్టమైనపుడు వెళ్ళటం, బాసును బెదిరించటం-అనేవి ఇతని డ్యూటికి అద్దం పడుతుంటాయి. ఇతనికి ముఠా సహచరులు సహకరించటం, ఇతని ఆటలు అకాశాన్నంటటం అంతా సాఫీగా సాగిపోతుంటాయి. కొందరు విద్యార్థులను హాస్టల్లో చేర్చిస్తానని బులిపించి వారి వద్ద పైసలు గుంజే ప్రలోభ ప్రవరాఖ్యుడు. తిరునాళ్ళకు, స్కౌటుగైడ్ క్యాంపులకు విద్యార్భల్ని తీసుకెళ్ళి, అచట గైర్ హాజర్ అవటమే గాక ఖర్చుల నిమిత్తం ఆ పిల్లల వద్దనే నలభయో యాభయోలాగి, మళ్ళీ హెచ్‌యం వద్దకూడా బడిఫండు నుండి వెయ్యో వెయ్యిన్నరో దండుకునే ఛండాల గుణమండనుడు. చెట్టు పేరుచెప్పీ కాయలమ్మినట్టి “అగ్రవాదు'ల పేరు చెప్పుకొని తోటి మిత్రుడైన మహావీరునికే డబ్బురూపంలో టోపీ వేయజూచిన మిత్రద్రోహి ఇతడు.
మరొక మాస్టర్ మదన్ మోహన్. ఏదో ప్రత్యేకమైన ట్రయినింగ్ వుందన్న నెపంతో
త మావూరు విది బదిలీ అన్న మాటే ఎరుగక ఏండ్లు పూండ్లుగా ఒకే చోట తిష్టవేసిన నీచ నికృష్ట కష్టముష్టింపచుడు. పిల్లల కోసం త్రాగునీటి కొరకు తెచ్చిపెట్టిన సిమెంటు గోళాలు రెండిట్లో ఒకటి ఎత్తు కెళ్ళి ఇంట్లో వుంచుకున్న తస్మర ముష్మరుడు. టెంపరరీ పీరియడ్ వేస్తే ఇన్సుపీరియారిటి' ఫీలయి, టెంపరేచర్ పెంచుకొని టెన్షన్ పడే తెంపరివెధవ. తొల్లి ఇతడు ఏడవ తరగతి పరీక్షావిభాగానికి అధిపతిగా వుండి పరీక్షాకేంద్రం ఈ బడే కాబిట్టీ ఇరుగు పొరుగు ప్రైవేటు పంతుళ్ళ దగ్గర నకల్ జరిపిస్తానని విరాళం హేరాళంగా లాగిన కరాళ కర్మష నిర్భయ హృదయుడు.
మరొక టీచర్ కలమంద. బోధించేది సైన్సు. మాట్లాడేది స్పోకెన్ ఇంగ్రీషు. ఎదుటి మనిషికి ఇంగ్లీషు వచ్చారాదా? అన్న సంగతే మరిచి స్పోకెన్‌గా స్పీకింగు చేస్తుటాడో- కాలేజీ స్టూడెంట్లకు ప్రైవేటుగా ట్యూషన్లు కూడా చెపుతుంటాడు. వాళ్ళంటారు. “స్పోకెన్ బాగుంటుంది కాని, టీచింగ్ బాగుండదు” అని. పెద్ద బాటను విడిచి పిల్లబాటను పట్టినట్టు. కన్నతల్లిని కాదని పిన్నతల్లిని కొలిచినట్టు. 'వడిగల గుర్రానికి తిరుగుడు రోగం” లాగా ఒక విషయం చెబుతూ మరో విషయంలోకి వెళ్ళి కాలవిలంబినం చేస్తాడు”అని. సహాధ్యాపకులు కొందరీతన్ని పరిహాసంగా 'బ్రోకెన్ ఇంగ్లీష్ అని నిక్‌నేమ్‌తో ఎద్దేవా చేస్తుంటారు. ఇతనికి ద్విచక్ర వాహనం ఒకటుంటుంది. దానితోడిదే లోకంగా అవక్రపరాక్రమ విక్రమంతో నిరాటంకంగా నిర్విరామంగా స్వారీ చేస్తుంటాడు. 'ఇందు గలడందు లేడను సందేహము వలదు, ఎందెందు వెదకిచూచిన అందందే కలడు కలమంద' అన్న చందంగా సర్వకాల సర్వావస్థల్లో, సర్వ స్థలాల్లో దర్శనమిస్తుంటాడు. వంద రూపాయల డిక్షనరిని తీసుకొచ్చి, 350 రూ1ల స్టిక్కర్ అంటించి లైబ్రరీలో చేర్చుకొమ్మని లైబ్రరీ ఇంచార్జిని సతాయించిన స్వార్ధపరాయణుడు.
ఇక నాన్ టీచింగ్ విషయానికొస్తే - ముగ్గురు చెప్రానీలలో ఒకడు మిగతా యిద్ధరికంటె కొంచెం గొప్పగా చదువుకున్నాడు. పేరు గిడ్డు. నిజంగా గిడ్డే కాబట్టి ఇతన్ని అందరు గిడ్డూ! అని గోముగా ప్రేమగా పిలుస్తుంటారు. వీన్ని గిడ్డూ జిడ్డూ, దొంగ గొడ్డూ అని పిలిచినా తప్పులేదు. ఎందుకంటే వాడు చేసే పన్లన్ని 'యెడ్డె తెడ్డెంగా వుంటాయి. అందుకే వాన్ని అద్దదిద్దంగా పిలిచినా తప్పులేదు. వీడురెడ్డి బిడ్డ అవటం వల్లనేమో! మహావీరుడు వీన్ని పక్కనే బైఠాయింపజేసుకొని టీసీలు రాయిస్తుంటాడు. అద్మిషన్ రిజిస్టర్లో కూడ క్రొత్త విద్యార్థుల పేర్లనూ రాయిస్తుంటాడు. ఇలా భుజాలకు ఎక్కించుకున్నందుకే నేమో! “అటెండర్‌ను కాను, ఒక టీచర్‌ను” అన్న ఫీలింగుతో చెరలాడే
పతా నూనాడు బడీ 5" దర్జీఫెల్లో ఈ గిద్దుగాడు.
“అడ్మిషన్ రిజిష్టర్‌లో అటెండర్ రాయకూడదు. ఇంచార్జి వోన్ రైటింగ్ మాత్రమే వుండాలి. అలా చేయించటం పద్ధతి కాదు.” అని తెలిసికూడా మిగతా సిబ్బంది ఎవరూ పట్టించుకునేవారుకారు. బాసే పట్టించుకోంది పక్కవాళ్లేంజేస్తారు? కందకు లేని దురద కత్తి కెందుకుంటుంది? 'యథా హెడ్మాస్టర్ - తథాఅసిస్టెంట్ గా సాగుతోంది ఈ బడిలోని బాగోతం.
ఈ గిద్దుగాడు మహావీర కర్ణులకు కుడిభుజంలాంటివాడు. పరీక్షలప్పుడు పైరవీల్లో సగం సత్తా వీడిదే. ఎస్సెస్సి పరీక్షల్లో పైరవీ విద్యార్థులకు 'సీతారామయ్య చిట్టీలు' స్వయంగా సప్లయి చేస్తుంటాడు. కొంచెం భారీ పైరవీ ఐతే ఆఫీసు రూంలో ఓ పక్కన నక్కలా నక్కి తానే జవాబు పత్రాలు రాసి అన్సర్షీట్లకు జతచేసి, మూడు ముళ్ళేసి మురిసిపోయేవాడు. దావతంటే సంకలు ఎగరేసే రకం. సొల్లు వెధవ కల్లుతాగడు. మందైతే మజ్ఞారే! అంటాడు. 'వందేమాతరం' మరిచి 'మందే మాతరం” అనే మందబుద్ధి.
“చిప్ప తెచ్చుకోర శివ్వా! అంటే - అందుకుతయ్యారవ్యా” అనే లకీర్కా ఫకీర్లు ఒక రిద్ద రున్నారు. వాళ్లు అంతగా చెప్పుకోదగ్గవాళ్ళుకాదు. పాపం! కాల ప్రవాహానికిలోనై ముఠాలో పడి మూల్లుతున్న ముదనష్టపు వెధవలు. “అందరిది ఇంటిదారి దాసరిది తాళ్ళదారి' అన్నట్టుగా మెదులుతుంటారు. ఏ రోటికాడి పాట ఆరోటికాడ పాడి, ఏ యెండకు ఆ గొడుగు పట్టి పబ్బం గడుపు తుంటారు.
చివరగా చెప్పవలసింది బాసుగారి గురించి. వ్యాజస్తుతిలో చెప్పాలంటే - ఇచటి ప్రధానోపాధ్యాయులు మహామంచి “మర్యాదరామన్న గారు. 'అమాయక చక్రవర్తిలా కనిపిస్తారే కాని ఎక్కడ ఎప్పుడు ఎలా కీలొత్తాలో, ఎలా కేలొత్తాలో, వేలు వంకరపెట్లి వెన్న ఎలా తీయాలో? తెలిసిన అనుభవశాలి. మాపూరు బడికి రాకముందు పూర్వాశమంలో వారానికో మారు బడికెళ్ళి బల్ల గుద్దినట్టు సంతకాలు గుద్ది జీతం తీసుకొని జీవితంసాగించిన జీతంజీవుడు. వీరి అక్రమాల గురించి అక్కడి వారు కలెక్టర్‌కు కంప్లెంటుచేస్తే, అక్కడుంటే బాగుండదని తలచి, కావాలని ప్రయత్నించి బదిలీ చేయించుకొని మావూరు బడికి వచ్చి 'అంధేర్ నగరీ చౌపట్రాజా లాగ పరిపాలిస్తున్న అపర ఆంబికేయ అంధమహారాజు. అందుకే అందరు వ్యంగ్యంగా పిలిచే 'మర్యాదరామన్న' అన్న నామమే వీరికి శిరోనామమై పోయింది. అసలు పేరు గంగలో కలిసి పోయింది.
ళల మానడు విదిత
ఇలా అవ్యవహితంగా వ్యవహారం సాగుతున్న తరుణంలో మెరపులా ఏమూలనుంచో బదిలీపై వచ్చి ఈ బడిలో దిగబడ్డాడు-ఒక పండిత ప్రకాండుడు తెలుగు పండితుడు. పేరు పరాంకుశం. నిజంగా పలువలకు అంకుశం వంటి వాడే. అన్యాయం అధర్మం కళ్లదిడితే చాలు సహించే వాడు కాదు. విధిగా విద్యార్థులకు విద్యా బోధన చేసేవాడు. క్లాసులు ఎగ్గొట్టే రకం కాదు. 'యథార్థవాదీ లోకవిరోధి' అన్న సత్యం తెలిసినవాడు. అనవసరంగా ఎవరి జోలికి పోకుండా, ముఠా ముఖ్యులతో కూడా సఖ్యంగానే వుండేవాడు. దావతుల్లో కూడ పాల్గొనేవాడు. చికెన్ సిక్తీఫయివ్, మటన్తర్జీఫయివ్ లాగించే వాడుకాదు. పెగ్గులు వేసేవాడు కాదు గాని, ఎగ్గులు మేసే వాడు. 'మెజార్టీ ఈజ్లా'గా సొసైటీలో చరించేవాడు.
ఇలా నిరంతరాయంగా 'మూడు పైరవీలు ఆరులంచాలు'గా ఈ విద్యావ్యవస్థ అవస్థలో పడి సాగుతూవుంది. క్రొత్తగా వచ్చే టీచర్లు వస్తూనే వున్నారు. బదిలీపై వెళ్ళేవాళ్ళు. వెళ్తూనేవున్నారు. ఇక్కడ ఒక అచారం (అనాచారం) వుంది. ఇంక్రిమెంట్ మంజూరి వినా, ఏరియర్స్ వచ్చినా, ఎవరింట్లోనైన శుభకార్యం తాలూకు ఫంక్షన్ జరుగనున్నా నాందీ ప్రస్తావనగా ముందుగా తేనీటి విందు ఇవ్వాలి. తరువాత వాళ్లవాళ్ల ఇష్టానుసారం దావత్ ఇవ్వచ్చు. జబ్బిలు చరచుకోవచ్చు. ఖర్చెక్ళువైతే గుండెలు బాదుకోవచ్చు. ఖాళీఐతే జేబులు తడుముకోవచ్చు. ఇలా పాఠశాల పొగబిండి ఒడుదుడుకుల పట్టాలపై నల్లేరుపైబండిలా సాగిపోతూనేవుంది.
ఓ నాలుగేళ్ల తరువాత...
ప్రభాకర్‌రెడ్డి అనే ఉపాధ్యాయునికి బదిలీ జరిగింది. రిలీవు ఐపోతున్నాడు. అనవాయితీగా అతనికి వీడ్కోలు సన్మానం చేయాలి. దశాబ్దానికి పైగా తనసేవల్ని అందించాడు. పదవీవిరమణ చేసిన మాజీ బాసుగారికి సన్మానం చేయవద్దని ఏవో కదా! మాకు సన్మానం చెయ్యాలి కదా!” అని పండిత పరాంకుశం ప్రస్తావన తెచ్చినప్పుడు “మాజీ బాసుకే సన్మానం వద్దని వ్యతిరేకించినవాన్ని నాకెందుకు సన్మానం?”అని ప్రభాకర్‌రెడ్డి మాటవరసకన్నా కొందరి బలవంతంపై 'సెన్డ్ ఆఫ్ పార్టీకి ఒప్పుకున్నాడు. అసలు ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే! ప్రభాకర్ రెడ్డికి సాయంత్రం డిన్నర్ ఇస్తా మనగా- ఆరోజు ఉదయం ఒక సంఘటన జరిగింది. అదే అన్ని కలహాలకు మూలమై ఐడిలో బాగోతాన్ని సృష్టించింది.
తతతతతతతతతతతపతపతపత2పతపాడాామానవాడ నదీ 7
ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కర్ణుడు టీ,బిసృత్తులు తెప్పించాడు. క్లాసులు నడుస్తున్నాయి. అటెండర్ గిద్డ్దు ప్రతి క్లాసురూంకు వెళ్లి ప్రతి టీచర్‌కు బిస్కెట్లు, టీ ఇచ్చి వస్తున్నాడు. వాళ్ళు ఆరగిస్తన్నారు, సంబరంలో పడి పరాంకుశంకు ఇవ్వటం మరిచిపోయాడు గిడ్డు. టీ, బిస్కెట్ల సంగతి పరాంకుశంకు తెలియదు. పాఠం బోధించటంలో నిమగ్నమైనాడు. పిరియడ్ బెల్ కావడంతో స్టాఫ్ రూంలోకి వచ్చి చాక్పొడర్ అంటిన చేతిని కడుక్కొని, మరో క్లాసుకు వెళ్ళబోతూ, పక్కనే కిటికీలోంచి ఆఫీసు రూంలోకి తొంగిచూశాడు. అక్కడ టేబుల్‌ను ఆనుకొని గిద్దు, మహావీరుడు మరోటీచర్ కలిసి ఆరగిస్తున్నారు. అప్పుడప్పుడు బడిలోకి సొంతంగా తెప్పించుకొని తింటుంటారు. అలానే తెప్పించుకొని తింటున్నారని పరాంకుశం అనుకున్నాడు. అప్పుడు గిద్దుగాడే కల్పించుకొని “సార్ మికు చాయ్బిస్కట్లు వచ్చినయా?” అని పరాంకుశంను మందలించాడు. సప్లయి చేసేవాడు వాడే. తనకు ఇవ్వకపోగా పైగా వెటకారంగా అడుగుతున్నాదే? అని పండితుడు మండిపడి ఇలా అన్నాడు. “మిరు అంటెడర్లు కాదోయ్! సార్లయిపోయిండ్రు. సార్లకు అటెండర్లకు తేడా లేకుండపోయింది. మన బడిలో 'దొంగలు దొంగలు పంచుకతిన్నట్టుంది' లేగ” అంటూ క్లాసుకు వెళ్ళిపోయాడు. ఈ మాటలు ఆఫీసులోంచి బయటికి వస్తున్న బాసు మర్యాదరామన్నగారు విన్నారు. వినాలనే పరాంకుశం అలా గట్టిగా అన్నాడు. ఆ మాటలు మర్యాద రామన్నగారికి అమర్యాదకరంగా తోచాయేమో! మననులో పెట్టుకున్నాడు. వెంటనే కక్కేరకం కాదు. ఎక్కడో ఓ కాడ నొక్కేరకం. ఇంతకూ కర్ణుడు టీ బిస్కెట్లు ఎందుకు తెప్పించాడంటే? ఏదో యూనియన్‌కు తాను సెక్రటరిగా ఎన్నిక ఐన౦ందుకు ఆనవాయితీ ప్రకారం తెప్పించాడు.
క్లాసుకు వెళ్ళిన పరాంకుశం బోధనలో లీనమైపోయాడు. ఐదునిముషాల అనంతరం గిద్దుగాడు చాయ్బిస్కిట్లలో వచ్చి పరాంకుశంకు ఇస్తూ- “సార్! మిరు గంతగనం కోపానికస్తిర? ఎప్పుడన్నా నేను గిట్లడేసిన్నా?” అని అన్నాడు. పరాంకుశం చాయ్ బిస్కెట్లు తీసుకొని క్లాసులో పిల్లల ముందు తినడం బాగుండదని, పక్కనేవున్న పరీక్షావిభాగం గదిలోకి వెళ్లి కర్టునికి ఎదురుగా కుర్చీలో కూలబడ్డాడు. అతని వెంట గిడ్డూకూడ ప్రవేశించాడు. గిద్దుతో పరాంకుశం ఇలా అన్నాడు. “గిడ్డూ! నేనన్నదానికి బాధపడకు. మరచిపోకుండా అందరికిస్తే మంచిది. దీంతో కడుపునిండేది కాదు కాలునిండేది కాదు. కాని, అందనివాళ్ళు బాధపడతారు. ఓసారి మహావీరునికి, మరోసారి హిందీ పండితునికి, ఇంకోసారి ఇంకోసార్కు ఇలాగే జరిగిందట! క్లాసులోకి తెచ్చి యిచ్చేకంటే స్టాఫ్రూంలోకి పిలిచి అందరికివ్వు ఎవరికీ బాధకలుగదుకదా!” “సరేసార్! ఇకముందు అలాగే చేస్తాను.”
తీ మానవుడు వదిలావు
అని గిద్దు చేతులు కట్టుకొని అన్నాడు. ఇదంతా ్రత్యక్షసాక్షిగా వింటున్న కర్ణుడు కూడా “సోయని సర్టిఫికేట్ ఇచ్చేశాడు. ఈ లోపల పరాంకుశం చాయ్ బిస్కెట్లు ఆరగించాడు. భాళీగ్లాసుతో గిద్ద బయట పద్దాడు. అంతటితో ఆ సమస్య (ఇదో సమస్యా?) సద్దుమణిగినట్టే ఐంది. అ విషయాన్నే మరచిపోయి కలుపుగోలుగా వున్నాడు పరాంకుశం.
సాయంత్రం మూడు కావస్తున్నది. ప్రభాకర్‌రెడ్డికి డిన్నర్ ఇవ్వాలి కదా! డిన్నర్ జరిగేది బడిలోనే కాబట్టి శాకపాకాలకు కావలసిన కూరగాయలు, మటన్,చికెన్,ఎగ్సు మున్నగు సంబారువులను పట్టిక ప్రకారం సిద్దం చేసుకున్నాడు-మహావీరుడు. అటుపక్కగా వచ్చిన పరాంకుశంతో మహావీరుడు మంతనాలు మొదలెట్టాడు.
“పరాంకుశమన్నా! నీతో ఒక విషయం మాట్లాడాలె. నువ్వు ఏమనుకోనంటే చెప్తుతా!”
బెస్టు సందేహమెందుకు?” అన్నాడు పరాంకుశం.
“మ్రాక్తు డ్రింకులేకుంటే ధ్రిల్లేలేదు. నీవు ఏమనవద్దు. మేం కొంచెం పుచ్చుకుంటం”
“అయ్యో! డ్రింకుంటే లేడీస్ రామన్నారుగదా! మరివాళ్లే మనుకుంటారు?”
“వాళ్లు గట్లనే అంటరు. డిన్నర్లో కాదు. బయట బాసుగారింట్లో పానం చేసీ వస్తం,
కుతి కొట్టుకుంటుంది. మతిపోయినట్లుంది. న్లీజ్”
“అట్లయితే సరేగాని, సరిగ్గా ఆరుగంటలకు ఇక్కడ డిన్నర్లో వుండాలి. లేకపోతే మహిళా విభాగం మండిపడతారు. అదీగాక ఇదివానకాలం, 'వానరాకడ కరంటుపోకడ' తెలిసేది కాదు. అన్నట్లు పెట్రోమాక్కో,గ్యాసులైటో ఒకటి సిద్ధంగా వుంచుకోవాలి. తినంగ కరంటువోతి నోట్లై పురుగులు పడ్డట్టే”
“ఆ అలాగే” అంటూ బీరుదాగినంత బలంగా బీర్బల్‌గా మహావీరుడు యమ నంతోవంతో ని(వృమించాడు-ఏదో వన్తువు దేవులాడుతూ, ఎవర్నో
సాయంత్రం ఐదయింది. వంటావార్పు ఐపోయింది. వడ్డన మాత్రం మిగిలింది. అక్కడ త్రాగడానికి వెళ్లిన వాళ్లు ఇంకారాలేదు. ఇక్కడ మహిళా లోకం,మిగిలిన పురుష ప్రపంచం కాల విలంబినం సహించక ఆకలితో నకనకలాడుతూ, ఆవురావురుమంటూ భోజనం కోసం ఎదిరిచూస్తున్నారు ఆపిట్టకు పెట్టి ఎదిరిచూసినట్టు-వంట ఐనంక ముంగట పెట్టుకొని వాళ్లకోసం ఎదిరి చూసుడేంది? గప్పు డనంగ బోయినోళ్లు ఇంకా రావద్దా?
యతలామానాడు వడి 9 తాగుడు వద్దంటే మళ్లా తాగుడు పెట్టిండ్రు. అప్పులోంతోని, చెప్పులోంతోని, తాగినోంతోని పోవద్దంటరు. పోతే 'నువుగుళ్లే నేను సళ్ళె' అన్నట్టుంటది. రాత్రి గావట్టె యెట్లా?” అని మహిళలు తీగునాలు తీస్తున్నరు.
హిందీ పండితుడు ఒకాయన మంగళ్లపల్లి నుంచి రోజూ వస్తుంటాడు. ఆయనకు సోమవార వ్రతం వుంది. అంటే వారు ఆ రోజు ఒకపూట మాత్రమే అదీ సాయంత్రం పూట మాత్రమే భోంచేసి 'ఏకభుక్తం” అనిపించుకుంటాడు. అందుచేత ఆయన ఆరోజు సోమవారం కాబిట్టి ఉదయం టిఫిన్ మాత్రమే చేసి వచ్చినాడాయె. ఆకలిబాధ భరించలేక ఎడనెడ జలపానం చేస్తూ, చేతుల్లో పొట్టనదుముకుంటూ బాధ నివారించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. -.._అక్కడ మర్యాద రామన్న గారింట్లో మహావీరుడు, కర్ణుడు,యెలమంద, కలమంద, మదన్మోహన్, గిడ్డూ బాసుతోపాటు మధుసేవకు ఆసీనులైనారు. బ్రాందీలతో బాగోతమాడి, పుట్నాలతో పురాణం పఠించి ఫుల్లయి ్రిల్లయి “పొద్దులు వడ్డ మనిషొలాగ ఆపసోపాలు పడుతూ, రోజుతూ రొప్పుతూ ఆయాసంతో ఈడ్చుకుంటూ ఎనిమిదిన్నరకు బడిలోకి డిన్నర్‌కు వచ్చారు. వాళ్లు వచ్చే వరకు డైనింగు టేబుళ్లకు మల్లే బేంచీలు వేసి, వద్దనకు. ఆహారపదార్థాలు సిద్ధం చేయబడి వున్నాయి.
వాళ్లు వచ్చీరాగానే, ఇక్కడి వాళ్లు ఆకలికాగలేక ఆదరబాదరా దబదబా బేంచీలపై ఆసీనులయ్యారు. కరంటు పోయింది కాబట్టి గ్యాస్ ల్యాంప్ వెలిగించి ఉంచబడింది. అది మధ్యలో ఒక స్టూలుపై ఉంచబడి 'జలజాంత: స్థిత కర్ణికన్ దిరిగిరా సంఘంబులైయున్న అన్న పద్యాన్ని తలపింపజేస్తూ, తామరలోని కర్ణికలా ఆ ల్యాంపు వెలుగుతూ వుంది. కర్ణిక చుట్టూ తామరరేకుల్లా, రౌండు టేబుల్ సమావేశంలో కూర్చున్న మంత్రుల్లా భోజనాసక్తులు ఆసీనులయ్యారు. పరాంకుశం పండితుడూ, మరో హిందీ పండితుడూ, మరో ఇద్దరు టీచర్లు పక్కపక్కనే కూర్చున్నారు. వీరి వెనకాల వడ్డించడానికి సిద్ధంగా సాంబారువులున్నవి. విస్తరాకులు వేయటానికి తీయటానికి, నీళ్లందించటానికి ఓ ముగ్గురు విద్యార్భల్ని వుంచేశారు. వాళ్లు వీళ్ల వెనకే నిల్పొని వున్నారు. ఆ విద్యార్థుల పక్కనే తాగివచ్చిన అటెండర్ గిడ్దుగాడు కొత్తఫోజులో నిల్పొని వున్నాడు. ఒక మౌల్వీసాయబు మరో ఇద్దరు టీచర్లు అన్న శాకాలు వడ్డిస్తున్నారు. పరాంకుశం పండితుడు చికెన్ మటన్ తినడు. (గ్రుడ్లు మాత్రం తింటాడు. అతనికి ఏక్దమ్ ఐదు గ్రుడ్లు విస్తట్లో వేశారు. * అరరే! ఇన్ని గుడ్డు వేశారేంటి? రెండు కంటే ఎక్కువ తినను గదా! శాకాహారమే నాకు ప్రీతికరం.
శ0 మావాడు నిదిలాాాలాాాాావవాడావవంయాయయాడాలం ఎన్నడు లేంది ఇవ్వాళ్ల వీళ్లకు ఇంత(ప్రేమ పుట్టుకొచ్చిందేంటి?” అని మనసులో అనుకుంటుండగానే వెనకనుంచి ఒక స్లోగన్ వినబడింది. “అరేయ్! లంజకొడుకా! తిన్రా” అని. అది తాగుబోతు అటెండర్ గిద్దుగాని బూతుమాట-రోతమాట, అందరూ విన్నారు. అ అపస్వరానికి మహిళలు ఒకరిమొగం ఒకరు చూచుకున్నారు. చిన్నబోయి మిన్నకున్నారు. తనవెనకే గిడ్డూ నిలబడి వున్నాడు-కాబట్టి పరాంకుశం వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఓక గిన్నెలో వుడకేసిన కోడిగుడ్లు తెల్లగా మెరుస్తూ విభూతి వుండల్లా నిగనిగలాడుతూ కన్పించాయి. కొన్ని స్ట తినమని విదార్థల సూ తాగిన టైకంలో అలా వాళి అన్నాడేమోనని సరిపెట్టుకొని,తిరిగి లీసమయ్యాడు పరాంకుశం పండితుడు. మరో ఐదు నిముషాలకు అదే కూత, అదేబూతు. “ఏమాయెరా? తిన్రా లంజకొడుకాగ్ పరాంకుశం పరధ్యానంగా మళ్లీ వెనక్కి చూశాడు. గిద్దుగాడు విద్యార్భల్ని అదలిస్తున్నట్టు కన్పించింది. “విద్యార్థుల్నే అంటున్నాడు కాబోలు! తాగుబోతు వెధవ”, అని సరిపుచ్చుకున్నాడు. మిగతా ఉపాధ్యాయుల వంక చూస్తే - కర్ణుడు, యెలమంద, కలమంద, మదన్మోహన్ మొగాలపై సంతోషవు చెంగలింవు తొంగలించినట్టు కనిపించింది. వెటకారపు నవ్వు నవ్వుతున్నారు. తలబద్దలు కొట్టుకున్నా పరాంకుశానికి అర్థం కాలేదు. అందరికంటే ముందే తొందరగా భోజనం ముగించి ఆ పక్కనే పదిపదిహేను అడుగుల దూరంలో వున్న జెండాగద్దెపై కూర్చున్నాడు - భుక్తాయాసం తీర్చుకుంటూ. మొదటి ఐంతిలేవగానే రెండవ బంతిలో డ్రింకర్స్ అందరు కూర్చున్నారు. గురువులతోపాటు 'గురువును దొబ్బే శిష్యుడు'లాగ గిడ్డూ హెద్దులా కూర్చున్నాడు. వానికి ఎదురుగా ల్యాంపు వుంది. ఫోకస్ ముఖాన పడటం వల్లనేమో! వానికి ఆవలివైపు గద్దెపై కూర్చున్న పరాంకుశంగాని, మరే వస్తువు గాని కనిపించటం లేదు. ఫంక్షన్ గాని, మీటింగుగాని, ఛుట్టీ అయినప్పుడు గాని వెంటనే ఇంటికి వెళ్లి పోవటం పరాంకుశంకు అలవాటు. మిగతా కొందరిలా కాలయాపన చేస్తూ చీకటి పడేదాక బడిలోనే వుందే రకం కాదు. ఆఫీసులో బాసుముందర కూచొని బాతఖానీ చేసేరకం కూడా కాదు. 'అలవాటు ప్రకారం ఇప్పుడు కూడా భోజనం ఐనవెంటనే పరాంకుశం ఇంటికే పోయినట్టున్నాడు' అని అనుకొని భోజనం చేస్తూనే గిద్దుగాడు తిట్ల పురాణం లంకించుకున్నాడు. మళ్లీ అదే బూతు, అదే కూత, “ఆఫ్టరాల్ నేనొక అటెండర్నయిన-దొంగలంజా కొడుకు నన్న అటెండర్ అంటాడా?” అని ఎలుగెత్తి వున్నోళ్లు లేనోళ్లు అందరూ వినేట్టుగా అరుస్తున్నాడు. ఆ మాట వినగానే పండిత పరాంకుశంకు సిట్యుయేషన్ పూర్తిగా అర్ధమై పోయింది.
ఎలా మానడు ఐడి 8! ఉదయం జరిగిన టీ -బిస్కిట్ల వివాదం రాకెట్లా స్మృతి పథంలోకి వచ్చేసింది పరాంకుశం గారికి. “మీరు అటెండర్లు కాదోయ్! సార్లయి పోయిండ్రోయ్!” అని అన్నది తానే. అంటే “ఉదయం జరిగిన విషయం ఇంకా మనసులో వుంచుకొని ఇందాక దూషించింది నన్నే అన్నమాట” అని పరాంకుశం పండితులవారు ఆగ్రహోదగ్రులై “ఇప్పుడు వాని భరతం పడదామా?” అని కూర్చున్న వాడు లేచి నిల్చున్నాడు. అది గమనించిన మరో టీచర్ 'స్వామి' గారు కోపంతో వుడికి పోతున్న పరాంకుశం చేతిని పట్టుకొని “సార్! మీరిప్పుడు తొందర పడకండి. వాడు తాగి వున్నడు. ఇప్పుడు ఏమన్న గాని పెద్దలొల్లి ఐతది. నామాట వినండి. తాగి తన్నుకున్నా రన్న అపప్రథ మనకూ మనబిడికీ వస్తది. మీరు ఇంటికి వెళ్లి పోండి. రేపు మాట్లాడుదాం!” అనిగేటుదాకా వెంట వెళ్లి గుడ్‌నైట్ చెప్పి సాగనంపాడు. తరువాత ఎవళ్ల ఇళ్లకు వాళ్లు వెళ్లి పోయారు.
రాత్రంతా పరాంకుశంకు కంటిమీద కునుకు లేదు. పొయ్యిమీది పెనంలా వృాదయం కాకతో తల్లడిల్లి పోయింది. రాత్రంతా శివరాత్రి అయ్యింది. ఎలాగో ఓలాగ తెల్లారనిచ్చి, స్నానాదులు కావించి, భోంచేసి యథావిధిగ తొమ్మిదిన్నరకు బడికి వచ్చేశాడు పరాంకుశం, ప్రార్ధన ఐన తర్వాత పరాంకుశం గేటు దగ్గరి వేపచెట్టు దగ్గరికి మహావీరున్ని పిల్చుకొని పోయి రాత్రి గిద్దుగాడు తిట్టిన విషయాన్ని జ్ఞాపకం చేశాడు. “నేనూ తాగినోన్నే నేను మరిచి పోయిన్నని యాదికి జేస్తున్నవా? నాకెరికే. మరచిపోలేదు. రాత్రి వాడు నిన్ను తిట్టింది నిజమే. పెద్దసారుతో చెప్పి వాన్ని క్షమాపణ కోరిపిస్తా! రాగ అంటూ మహావీరుడు పరాంకుశంను ఆఫీసురూంలోకి మర్యాద రామన్న దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ బాసుగారి కుడిప్రక్కన ఆరాంబేంచి మీద ఇద్దరూ ఆసీనులయ్యారు. వారి ప్రక్కనేమరో ఉపాధ్యాయుడు సింగయ్య కూర్చొని వున్నాడు. ప్రసంగం ఆరంభం అయ్యే సరిగి మరో అధ్యాపకుడు అభిరామయ్య వచ్చి డోర్‌ను ఆనుకొని నిలుచున్నాడు. బాసుగారికి అభిముఖంగా కుర్చీలో కర్ణుడు కూడా ఆసీనుడై వున్నాడు.
మహానీరుని సూచనతో పరాంకుశం ప్రసంగం ప్రారంభించాడు. “హెచ్‌యం గారూ! రాత్రి మన అటెండర్ గిడ్డు ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టిండు. అతన్ని నేను ఏమన్నానని? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? మీరు తీసుకునే చర్య ఏమిటి?” అని ప్రశ్నించాడు. “న్సవ్చ్వూ సార్లను దొంగలు అని అన్నావు కదా! దానికేం సమాధానం?” అని మర్యాద రామన్న ఎదురు ప్రశ్న వేశాడు. “అయ్యో'సార్! మన బళ్లె దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకొన్నట్టుంది” అని సామెతగా టీ-బిస్కెట్ల గురించి అన్నానే కాని, నేను
శ2 మావూరు విది ఏసారును పర్దికులర్గా అనలేదు.” అని పరాంకుశం ప్రత్యుత్తరం ఇచ్చాడు. “అట్లంటేంది? ఇట్లంటేంది? మీరన్న దానికి వాడు తిట్సిందానికి చెల్లు.” అని తీర్చు ఇచ్చేశాడు మర్యాదరామన్న మహావీరుడు వెంటనే “ఇకనుంచి ఎవరూ యెవరిజోలికి పోవద్దు. ఎవరి పనివాళ్లు చేసుకోవాలో” అంటూ ఆఫీసురూం నుంచి బయట పడ్డాడు. ఇంకా అక్కడే కూర్చొని వున్న కర్గునితో పరాంకుశం ఇలా అన్నాడు. “ఒక టీచర్ని అటెండర్ తిట్టటం మంచిదేనా? ఇది మీకు సమంజసంగా వుందా? మీరేం మాట్లాడరు?” అని అడిగాడు. “వాడు తిట్టిందానికి నేనేం జెయ్యాలె? ఏం మాట్లాడాలె?” అని నిర్లిప్త సమాధానంతో అక్కడి నుండి ఉడాయించాడు కర్ణుడు. మదన్మోహన్ను అడిగితే “వాడెవన్నో తిట్టుకున్నడు. నిన్నెందుకు తిట్టిండు?” అని జవాబిచ్చాడు. ఈ ముఠావాళ్లంతా ఒకటే. వీళ్లే కావాలని తాగించి బోధచేసి గిడ్డూతో తిట్టిపించినట్టున్నారు. అని పరాంకుశం మనుసులో అనుకొని, అక్కడి నుండి లేచి స్టాఫ్ రూం లోకి పోయి బరువెక్కిన హృదయంతో కూర్చుండి పోయాడు.
ఐదు నిముషాలయిందో లేదో అటెండర్ గిడ్డుగాడు ఏదో రిజిష్టర్ నిమిత్తం స్టాఫ్రూంలోకి వచ్చి అల్మారా సదురుతున్నాడు. గిడ్డూతో పరాంకుశం ఇలా అన్నాడు. “గిడ్దూ! ఎప్పుడైనా నీమీదికి నేను కోపానికి వచ్చిన్నా? నేను ఈ బడిలోకి వచ్చి ఐదారేళ్లు అవుతుంది. ఎప్పుడైనా నిన్ను గ్లాసుతో మంచినీళ్లమ్మని అడిగానా? లేదు. ఎందుకు? నీవురెడ్డి బిడ్డవని-నీఖదర్ నీకు వుంచిన. వేరేవాళ్లకు చెప్పి తెప్పించుకున్న లేదా నేనే తీసుకొని తాగిన. ఒక సోదరుని వతుగ నిన్ను చూసిన. గిడ్డూ! రెడ్డీ! అని ప్రేమగా పిలిచిన. అటువంటి వాన్ని నన్ను ఇవాళ్ల ఎలా తిట్టావు? నీకు మనస్సెలా వొప్పింది? రాత్రంతా నాకు నిద్రలేదు. చాలా బాధపడ్డాను. నాగోస నీకు నీ పిల్లలకూ తగుల్తదోయ్!” అని అన్నాడు. అందుకు గిద్దుగాడు కుయ్యిలేదు, కుట్కులేదు. 'బెల్లంగొట్టిన రాయిలా మిన్నకుండి నిరుత్తరం గానే రిజిష్టర్‌తో వెళ్లిపోయాడు. పండిత పరాంకుశంకు మనస్తాపం మరింత యెక్కువయ్యింది. అలా ప్రశ్నించినపుడు-“నేను నిన్నెందుకు తిట్టినసార్! తాగిన మైకంలో ఎవర్ని తిట్టిన్నో! ఏమో! మీకు నాకూ ఏం పగ సార్?” అని గిడ్డూ అని వుంటే పరాంకుశం కొంతశాంతించేవాడు. కాని అలా జరగలేదు. పరాంకుశం బాగా ఆలోచించాడు. “ఇలా ఎందుకు జరిగింది?” లోలోపలే ఆరాతీశాడు. ఈ ఘటనకు ముందు జరిగిన సంఘటన మరొకటి జ్ఞాపకం వచ్చింది. అదే కారణమై వుంటుందని ఊహించాడు.
ఒకసారి బాసు మర్యాదరామన్న గారు, రికార్డు అసిస్టెంట్ శ్యాంమోహన్ గారు
పలాాామానాడ బది 7 బడి డబ్బుల విషయమై తగవులాడుకున్నారు. అన్ని తరగతుల స్పెషల్ ఫీజున్నూ అడ్మిషన్స్ వల్ల వచ్చే డొనేషన్ డబ్బున్నూ వసూలు చేయుమని శ్యాంమోహన్కు బాసు అప్పగించాడు. శ్యాంమోహన్ అన్ని తరగతుల నుండి ఫీజు వసూలు చేశాడు. అవసరం వున్నప్పుడల్లా రామన్నగారు మోహన్ గారు ఇద్దరూ డబ్బు వాడుకున్నారు. లెక్కలు చూసుకునేటప్పుడు మాత్రం “నాకుమొత్తం డబ్బు ఇవ్వలేదు. ఇంకా నాల్గువందలు రావాలి” అని బాసుగారూ, “లేదులేదు మొత్తం మీకే అప్పజెప్పాను. లెక్క క్లోజ్ ఐపోయింది” అని రికార్డు అసిస్టెంట్ గారు వాదించుకున్నారు. “ఎవరూ గెలువరు ఎవరూ ఓడరు ఎడతెగదండీ ఈ యుద్ధం” అన్న చందంగా ఇద్దరూ పక్షం దాకా వాదోపవాదాలు చేసుకున్నారు. మాటల ఈటెల్ని విసురుకున్నారు. చిట్టచివరికి మర్యాదరామన్న గారే చాలించుకున్నారు. విద్యార్థుల పరీక్షల ఆన్సర్ షీట్లకు డబ్బుల్లేవు. ముఠాతో మంతనాలు సలిపి ప్రతిపిల్లవాని వద్ద పదిరూపాయల చొప్పున ఎక్స్ట్రా వసూలు చేశారు. దాదాపు వెయ్యిమంది విద్యార్థులకు 'శఠగోపం' పెట్టారు.
అయితే హైచ్యం గారు శ్యాంమోహన్గారు వాదించుకుంటున్న సమయంలో ఎందుకో అటుగా ఆఫీసురూంలోకి పరాంకుశం గారు వచ్చారు. ఆ వాదనలో తేలిందేమంటే లెక్కలు మళ్లీ చూసుకుందాం అని. అదే సమయంలో పరాంకుశం రావటం వల్ల బాసుగారు “సార్! మీరు కూడా రేపు రండి! కొంచెం లెక్కలు చూద్దాం. ఈయన నాకు మొత్తం ఇచ్చిన్నని బుకాయిస్తున్నాడు. కర్ణుడు, మహావీరుడు, స్వామి, అభిరామయ్య వీళ్లంతా వస్తారు” అని పరాంకుశం గారిని రిక్వెస్ట్ చేశారు. మర్యాదరామన్నగ్గారు సాధారణంగా దిడిలెక్కలకు ఎప్పుడు కూడా పరాంకుశంను పిలవరు. పిలిస్తే బోగస్ లెక్కల్ని పరాంకుశం సహించడు. '“లంగలెక్కలు దొంగ బిల్లులు' ఐతే ఎట్లా?” అని వ్యతిరేకిస్తాడు. అందుకని పిలువరు. మాట వరసకు రమ్మన్నాడు హైచ్యం. సరే! వస్తాను" అన్నాడు పరాంకుశం.
మరునాడు రెండవ శనివారం. పదిన్నర ప్రాంతంలో మర్యాదరామన్న గారు, పరాంకుశం పండితుల వారు, మహావీరుడు, కర్ణుడు, స్వామి హాజరయ్యారు. లెక్కలు చూశారు. అంతనా పొంతనా లేకుంటా వున్నాయి. వోచర్లు కొన్నింటికి లేవు. వున్న వోచర్లలో కొన్నిటికి ఒకటికి రెండింతలు రేట్లు వేసినవే. మొత్తం బోగసే. ఏదిఏమైనా అందరూ కలిని సమస్యను నద్దుమణిగించేశారు. ఆఖరున పరాంకుళం గారు మర్యాదరామన్నతో ఇలా అన్నాడు. “సార్ మన సిబ్బందిలో ఈ నెల నాలుగైదు శుభకార్యాలు పడ్దాయి కదా! ఒక్కొక్కరి శుభకార్యానికి రూ.516 చొప్పున కట్నం చెల్లించటానికి - ఈనెల జీతం నుండి ఒక్కొక్కరికి పెద్దమొత్తంలో కోత అవుతుంది. స్టాఫ్‌లో చాలామంది
శశ మానడు వడి బాధపడుతున్నారు. మరి మనమిత్రులు కొందరి వద్ద అన్యాక్రాంతపు డబ్బుందికదా! అది కట్నాలకు కట్టేస్తే ఎవరికీ బాధ వుండదు. అందరూ లాభపడినట్లు అవుతుంది కదా!” అని పొరపాటున సలహా ఇచ్చాడు. ఏమూడ్‌లో వున్నాడో కాని బాసుగారు ఒకే అన్నారు. మిత్రులు ముళాముఖ్యులు కూడా తలాడించారు. వెంటనే పరాంకుశం లిస్టు తయారు చేశాడు. కాగితాలు అమ్మిన బాపతు 400రూ॥ కర్ణుని వద్ద, 7వ తరగతి పరిక్షలప్పుడు నకల్ కొట్టించడానికి ప్రైవేటు స్మూళ్ల వద్ద వసూలు చేసిన డబ్బులో ఖర్చుకాగా మిగిలిన 500 రూ॥ మదన్మోహన్ వద్ద, అటెండర్ పదవీ విరమణ చేస్తే సన్మానానికని దాదాపు వెయ్యి మంది విద్యార్థుల వద్ద 5 రూ॥ చొప్పున వసూలు చేసిన డబ్బులో ఖర్చుచేయగా మిగిలిని 600 రూ॥ మర్యాదరామన్న వద్ద, బేంచీలు చేయించగా మిగిలిన 300 రూ॥ గిడ్డూ వద్ద వున్నట్లు లెక్కలు వేసి బయటకు లాగాడు పరాంకుశం. జీతాలప్పుడు కట్ చేయుమని ఆ లిస్టును క్లర్ముకు ఇచ్చాడు. అతడు మరుసటి నెల అక్షరాలా అలానే" చేశాడు. దాంతో అన్నంతపని చేశాడని పరాంకుశంపై మండిపడ్డారు ముఠాముఖ్యులు. “వీడు మనవద్ద డబ్బు వసూలు చేసే మొనగాడయిండా?” అని మాత్సర్యం పూని మనసులో పెట్టుకొని, ఆనాడు ప్రభాకర్‌రెడ్డికి ఇచ్చే పార్టీకి ముందు బాసుగారింట్లో వాళ్లంతా తాగుతూ, అటెండర్ గిద్దుగానికి బాగా తాగించి బూతుగీతోపం చేశారు. ఫుల్లుగా మందుకొట్టిన మైకంలో ఆ సొల్గువెధవ “పండితున్ని తిట్టాలా వద్దా”? అన్న విచక్షణా జ్ఞానం కోల్పోయి పొగడితే పొంగే పొంగువెధవ రెచ్చిపోయి డిన్నర్లో అలా పరాంకుశం గారిని తిట్లగీతాలతో కీర్తించాడు. పరాంకుశం మెదట్లో గతమంతా చక్రంలా గిర్రున తిరిగింది. అర్ధమైపోయింది. “పడ్డవాడు చెడ్డవాడు కాడు”లే! అన్న సామెతను జ్ఞప్తికి తెచ్చుకొన్నాడు. తనకుతానే కొంత సాంత్వన పద్దాడు. పండిత పరాంకుశం చాలా బాధపద్దాడు. “నేనెవరికీ ద్రోహం చేయలేదు. వారికి అనుకూలంగా వుండి ఎంతోసాయం చేశాను.” అవన్నీ మనసులో మననం చేసుకున్నాడు పరాంకుశం. ఒక్కొక్కటే మనోయవనికపై సినిమారీలులా ్రొజెక్షన్ కాసాగింది. ఒక మాజీ కౌన్సిలర్ కూతురుకు నకల్ చిట్టీలు అందించుమంటే అందించాడు. సిబ్బందిలోని ఒక టీచర్ కుమార్తెకు కూడా 'సీతారామయ్య చిట్టీలు సమకూర్చాడు. మరొక గ్రామపెద్ద బిడ్డకు కూడా సాయం చేశాడు. వాళ్లు బయట బయటనే దావతులు చేసుకున్నారు. దానికి పరాంకుశం ఆశపడలేదు. తాను “తినేవాడు తాగేవాడు'కాదు. వాళ్లు పాసైనందుకు ఏదో హెల్ప్ చేశాను అని తృప్తి పడేవాడు. అన్నిట్లో పాసై తెలుగులో
అాామానాడ బది (5 మాత్రం ఆరుసార్లు ఫెయిలైన ఒక అభ్యర్థికి చాలా సహాయం చేశాడు పరాంకుశం. అతడు చిరుద్యోగి కాబట్టి, పాసైతే ప్రమోషన్ వస్తుంది కాబట్టి, మిత్రుల ప్రోత్సాహంతో అలా చేయవలసి వచ్చింది. అతడు ఇచ్చిన 600 రూలు మహావీరుడూ గిడ్డూ ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకున్నారు. దానిక్కూడా పరాంకుశం ఆశించలేదు. పాసైతే అతనికి ప్రమోషన్ వస్తుంది కదా! అన్న ఉద్దేశంతో సహకరించిన తృప్తి పరాంకుళంకు మిగిలింది. ఇలా ఎన్నో సంఘటనలు సినిమా బొమ్మల్లా మనఃపటలంపై ప్రత్యక్షమయ్యాయి. తాను ఈ బడికి చిదిలీపై ఎప్పుడు వచ్చింది? వచ్చినప్పటి నుండి ఏం జరిగింది? అంతా బుగ్రలో గిర్రున తిరుగసాగింది. పరాంకుశం వచ్చిన మరునాడే హెచ్యంగా రోజారెడ్డి గారు కూడా ఇదే బడికి బదిలీపై వచ్చారు. వారు అందరితో అన్యోన్యంగా వుండేవారు. పక్షపాత వైఖరిలేని వారు. వీరి హయాంలో బడి అవసరాలు కొంతవరకు తీరాయి. విద్యార్థుల కోసం నీళ్ల టాకీ ఒకటి ఎక్స్ట్రా నిర్మించాడు. వేసవిలో అదనపు నీళ్లకోసం మరిరెండు సిమెంటు గోళాలు కూడా తెప్పించి పెట్టించాడు. సిబ్బందికి అందరికి కావలసిన సాయం చేసేవాడు. ముఖ్యంగా కర్ణునికి. ఎక్కడో మారుమూల గ్రామంలో పనిచేస్తున్నాడు కర్ణుడు, ఈ బడిలో బదిలీవల్ల సైన్సుసీటు (8.50. 8.2.0.) ఖాళీ ఏర్పడింది. కర్ణుడు మ్యాస్మాస్టర్. అయినా రెకమండ్ చేశారు కులాభిమానంతో రోజారెడ్డి గారు. దీనికి తోడు జెడ్.పి.లో పైరవీ చేసి ఈ బడిలో తిష్టవేశాడు కర్ణుడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ బడిలో సైన్సు హ్యాండ్ లేకుండా పోయింది. బడి తీరే మారిపోయింది. గ్యాంగిజం, ముఠాతత్వం ఏర్పడ్డం మొదలైంది. వచ్చిన రెండేళ్లకే రోజారెడ్డిగారు రిటైర్ అయ్యారు. కర్ణుడు, మదన్మోహన్, (ప్రభాకర్‌రెడ్డి మరో బుద్దిమంతుడు-దుష్టచతుష్టయం కలిసి రోజారెడ్డి గారికి వీడ్కోలు సన్మానం చేయవద్దని భీష్మించుక్కూర్చున్నారు. బాసుతో వాళ్లకు ఏం జరిగిందో ఏమోకాని, ససేమిరా సన్మానం చెయ్యద్ధంటారు. ముఠాతత్వం మూర్చులు గదా! మిగతాస్టాఫ్ అంతా చేయాలంటారు. అధ్యాపకునికి చివరి దశలో సంతోషం కలిగించేది, జ్ఞాపకం వుండేది సన్నానమే కదా! అందుకే పండిత పరాంకుశం పూనుకొని బ్రహ్మాండంగా సన్మాన కార్యక్రమం పూర్తి చేశాడు. అందరూ భేష్! అన్నారు. దుష్టభతుష్టయం దూరం గానే వున్నారు. కనీసం వీడ్యోలు విందుకైనా రాలేదు.
రోజారెడ్డి గారి స్థానం ఖాళీఅవటంతో పైరవీ చేసి, మర్యాదరామన్న గారు వచ్చి శనకపు సింహాసనమున..' అన్నట్లుగా లైఠాయించాడు. జల్సారాయుడు. దావతులంటే పడిచస్తాడు. నెలకోసారైనా కావాలి. ఇతడు వేరీ టీచర్చుకున్న చార్జీలను తొలగించి తన
₹ళ మావూరు విదా అనుయాయులకు కట్టబెట్టాడు. ముఖ్యంగా ఎస్సెస్సి ఎగ్జామినేషన్ ఇంచార్జిగా కర్ణున్ని అడ్మిషన్ అండ్ రిమోవల్ ఇన్చార్జిగా మహావీరున్ని 7వ తరగతి పరీక్ష విభాగాధిపతిగా మదన్మోహన్ను నియమించాడు. వీళ్లకు తోడుగా అన్ని వేళలా అన్ని విషయాల్లో సహాయకారిగా అటెండర్ గిడ్డూ తోడయ్యాడు. అప్పటి నుండి వాని తీరే మారిపోయింది. “వేను అటెండర్‌ను కాను, ఒక టీచర్‌ను” అన్న విధంగా ప్రవర్తించేవాడు.
మర్యాద రామన్న గారి పాలన '“మూడుసీసలు అరుగ్గాసులు'గా సాగుతోంది. యెలమంద, కలమంద బడికి ఎపుడు వస్తారో? ఎపుడుపోతారో? తెలియదు. “ఫ్రెంచి (కైంచి) లీవలకు ప్రఖ్యాతి కల్గించారు. బడిలో అక్రమ ఫీజుల వసూళ్లు ప్రారంభమయ్యాయి. మహావీరుడు టీసీకి ముష్పయో నలభయో వ్యక్తిని బట్టి వసూలు చేసి స్వంత సంపాదనగా చేసుకున్నాడు. ఆసెక్షన్ అతనికి కామధేనువై కూచుంది. ఎస్సెస్సి పరీక్ష విభాగ అధిపతి. కర్ణుడు కూడా అదనపు సంపాదనకు అలవాటు పడ్డాడు. ౪600120645 01 ౪186 కు పీల్లల వద్ద ఇరవై-ఇరవై యైదు దాకా లాగించేవాడు. అది అతనికి కల్పతరువై పోయింది. వీరిద్దరి మధ్యన 'కుంటెనకాడు' గిడ్డూ సహకరిస్తూ వాళ్లిచ్చింది పుచ్చుకొని 'మహాభాగ్యం' అనుకునేవాడు. మహావీరుడు మరియు మదన్మోహన్ బడిలోనే 7వ తరగతికి ట్యూషన్ చెప్పటం మొదలుపెట్టారు. ఉదయం 7గంటలకు మహావీరుడు ఇంగ్లీషు చెపుతాడు. సాయంకాలం ఛుట్టీ ఐన తదుపరి మదన్మోహన్ మ్యాస్ చెపుతాడు. వీరిద్దరూ ఏడవ తరగతి పిల్లల వద్ద సబ్టెకుకు 20 రూ చొప్పున వెరసి 40 రూ లాగేస్తారు. ట్యూషన్‌కి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని చేర్చుకునేవారు. ట్యూషన్‌కి రాని వాళ్లని కఠినంగా క్లాసులో శిక్షించేవారు. అడిగిందానికి ఆన్సర్ చెప్పనప్పుడో, హోం వర్కు చేసుకరానప్పుడో సాక్షుగా తీసుకొని పిల్లల్ని కాళ్లు రిల్లలు పట్టే విధంగా, తిమ్మిరెక్కేలా వంగో పెట్టేవారు. చెమటలు పుట్టేలా బస్కీలు తీయించేవారు. ఒక్కొక్కప్పుడు బెత్తానికి పనిచెబితే అదివాళ్ల మృదుశరీరాలపై తాండవం చేసి పాదముద్రల్ని మిగిల్బివచ్చేది. భయానికి బాలురు చేతులు కట్టుకొని “మేం ట్యూషన్‌కు వస్తం సార్! మా అవ్వ పొమ్మన్నది సార్! మా నాయిన పైసలు ఇస్తనన్నడుసార్” అని భయంతో బలవంతంగా ట్యూషన్లో చేరేవాళ్లు. పసిహృదయాలు ఎంతగా గాయపద్దాయో ఎవరు ఊహిస్తారు? ఇంటిలో తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు ఎలా వున్నాయో ఎవరు గమనిస్తారు? 'అతనికంటే ఘనుడు ఆ చంట మల్లన్న లాగా ఒకర్నిమించి ఒకరు ఇరువురూ ధనలంపటులై లాగటంలో “ఎవరికి వారే యమునాతీరే ఐపొయ్యారు. మరికొందరు క్లాస్ టీచర్లయితే క్రొత్తగా అడ్మిట్ ఐన విద్యార్థుల వద్ద తలా రెండు రూపాయలు చొప్పున వసూలు చేసి క్లాసులో చేర్చుకోవటం ప్రారంభించారు.
లాలా మావాడు బదీ 77 వేన్నీళ్లకు చన్నీళ్లు తోడైనట్లు వీళ్ల జీతానికి నాతం కూడా తోడైపోయింది.
ఎవరైనా టీచర్స్ క్రొత్తగా బడిలో జాయిన్ అయితే మూడొందలో, ఆరొందలో, వెయ్యో వాళ్ల తాహతునుబట్టి దావత్‌కు డబ్బులు ఇవ్వాలి. ఇది మర్యాదరామన్న గారి (అ)మర్యాదకర శాసనం. తు.చ. తప్పక శాసనం అమలు చేయటం మహావీరుని పని. పూర్వం రోజారెడ్డిగారు తెచ్చిపెట్టిన సిమెంటు గోళాలు రెండింటిలోంచి ఒకటి ఈ మర్యాదరామన్న గారున్ను, మరొకటి మదన్మోహన్ గారున్ను మర్యాదగా తీసుకెళ్లి ఇంట్లో భద్రపరచుకున్నారు. కిరీటంలేని రాజుల్లా గోళాలు లేక బోడుల్లా వుండి ఇప్పటికీ విద్యార్థల్ని వెక్కిరిస్తూనే వున్నాయి ఆ సిమెంటు గద్దెలు. బడిలో ఒక బోర్వెల్ వేశారు. ఒకటికి రెండింతలు ఖర్చు రాసేశారు. బోర్వెల్ వేసిన ఆనాటి రాశ్రే బడిలో బాగోతం జరిగింది. పాఠశాల పానశాలగా మారింది. మూడో నాల్లో ఫుల్ బాటిల్స్ ఖాళీ అయ్యాయి. ఒక ఇంజనీరుగారు బోర్వెల్కు హ్యాండిల్ ఫ్రీగా ఇస్తే దాన్ని ఖరీదు చేసినట్లు బోగస్ బిల్ పెట్టి తాగేశారు. ఎస్సెస్సి పరీక్షలు జరుగుతున్నప్పుడు కూడా పైరవీ డబ్బుల్తో ఆఫీసు రూంలోనో, ఎగ్జామినేషన్ రూంలోనో, స్టాఫ్రూంలోనో రాత్రుళ్లు బైలాయించి మధు సేవనం చేసేవారు. కొత్తబేంచీలు తుమ్మవి రాగానే, పాత బేంచీలు టేకువి మాయమతయ్యేవి. ముఠానాయకుల ఇళ్లల్లో కిటికీ రెక్కలు గానో, తలుపుచెక్కలుగానో, బల్లపీటలుగానో మారిపోయేవి. సోషల్ వెల్ఫేర్ పుస్తకాలకు విద్యార్థుల వద్ద తలకు రూపాయి(వెయ్యి మందిపైన) వసూలు చేసి జల్సా చేసేవారు. బోర్వెల్కోసం కరంటు మోటర్ ఒకటి కొన్నారు. దానికీ దొంగబిల్లు పెట్టి ముఠాతో మురిసిపొాయ్యాడు మర్యాదరామన్న సైన్సు సామగ్రిని ఐదువేలకు కొని పదివేలకు కొన్నట్లు వోచర్ సృష్టించారు. ఆ డబ్బుతో పక్షం రోజుల దాకా పార్టీలతో జోరుగా హుషారుగా జల్సా చేశారు. అకాడమిక్ ఇయర్లో వచ్చే డొనేషన్ డబ్బు దాదాపు అరవై వేలు 'హళ్లికి హళ్లి-సున్నకు సున్న ఐపోయేవి. అయా పైరవీదార్లకు సంబంధించిన ప్రైవేటు విద్యార్థుల పేర్లు అటెండెన్స్ రిజిష్టర్‌లో వుండవు. తరగతుల్లో మాత్రం వాళ్లు కూచుంటారు. శుల్కం చెల్లించకనే ఏడాది పొడుగునా యూనిట్, (త్రైమాసిక, షాణ్మాసిక ఇత్యాది పరీక్షలు రాస్తూనే వుంటారు. వరుసగా రానందున తొలగింపబడిన అసలు విద్యార్థులు కొందరు రీ అడ్మిషన్ కొరకు వస్తే నలభయో యాభయో పుచ్చుకొని అడ్మిట్ చేసుకునే మర్యాదస్థడు మన మర్యాదరామన్నగారు. ఒకసారి మన మర్యాదరామన్నగారు బడిలో జెండెగరేసి, చెప్రాసీతో సహా తన ఇంట్లో జల్సా చేస్తుంటే, ఆరు గంటలకు జండాను అవనతం చేయకపోతే, “సందట్లో సడేమియా'గా ఎవడో దొంగ
కత మావూరు విదా ఎత్తుకుపోతే, ఒకరినొకరు శాపనార్థాలు పెట్టుకొని ఇజ్జత్‌కు మూతులు మూసుకున్నారు. “ఇలా నిరాటంకంగా అక్రమాలు, అధర్మాలు ఎన్నో జరుగుతున్నా నేను ఎవరినీ ఏమనలేదే? నా మానాన నేను పోతున్నానే! అయినా ఎందుకిలా జరిగింది?” అని గత స్మృతుల్లోంచి తేరుకొని యథాస్థితికి వచ్చి, “దీనికి పరిష్కారం ఏమిటి?” అని తీవ్రంగా ఆలోచించసాగాడు పరాంకుశం పండితుడు. అసలు బాసే తిరస్మరించాడు. మహావీరుడు తప్పుకున్నాడు. కర్టుడు నేనేం చేయాలి?
అన్నాడు. ఈ సమస్య బడిలో పరిష్కారం కాదన్న అభిప్రాయానికి వచ్చాడు పరాంకుశం. సంఘం కుళ్లు కడిగేవాడు కవి. ప్రచారం ప్రబోధం వల్ల సంఘాన్ని కవి ఉత్తేజం చేయవచ్చు. మార్చవచ్చు. కవయః, నిరంకుశాః, సర్వపథీనా కవయః, కవిరేవ ప్రజాపతిః, కవిః క్రాంతదర్శీ-ఇత్యాదిగా అంటారు గదా! కవికి సాధ్యం కానిదంటూ లేదు. తాను కప: పైగా పండితుడు. అవార్డులు రివార్డులు పొందినవాడు. “ఇటువంటి నాకు పరిభవమా?” అని ఆవేశంతో ఉడికిపోయాడు. ప్రతీకారేచ్చతో వివేచన కోల్పోయాడు. పాటలు పద్యాలు రాసి ముఠాను ఎండగట్టాలనుకున్నాడు. పదేళ్ల క్రితం రాసిన 'ఐడిలోని బాగోతం' అనే కవితా హంసి తన మనస్సరసిలోకి ప్రవేశించింది. దాన్ని పూర్తిగా ఆవాహనం చేసీ మననం చేసుకున్నాడు. ఈ ఐడి విషయాలను జతచేసి జానపదంలోకి దిగాడు.
ఐడిలోపల జరుగుతున్న బాగోతం చెపుతున్నా
పంతుళ్ల జాతకాల పంచాంగం విపుతున్నా
వినరా! ఓ విద్యార్థి! కనరా! ఓ విద్యార్థి!
ఏమరకా అయ్యగార్ల ఇజం నిజం తెలుసుకో!
గుళ్ళవంటి ఐళ్ళలోపల । అవినీతి ।
కుళ్లికంపు కొడుతోందిరా! 1ఐ॥
మరియాదా రామన్న మనకు పెద్దసారైతే
అస్మదీయ తస్మదీయ అన్నభానమే వుంటే
చెప్పరాని ఇబ్బందులు సిబ్బందికి కల్గుతాయి
పాఠశాల పొగబండీ పట్టాలు తప్పుతాది
అదుపు అజ్ఞ వుండబోదురా! । పీల్లలంత |
అగమాగమవుతారురా! 1ఐ1)
చార్జీలు వున్నవాళ్ల సంపాదనలే వేరు మావాడు ఐడీ (9 టీసీకి ముష్పయంట, మెమోకేమొ ఇరవయంట ఉచిత పుస్తకాలకైతె వూరుకోక పీల్లల కడ జుట్టుకొక్క రూపాయి జుట్టువట్టీ వసూల్ జేసి వందల్లో కూర్చుటామెరా! | జల్సాగా | మందులతో విందులాయెరా! ॥ఐ||
క్లాసులు ఎగ్గొట్టుటాయె, ట్యూషన్లూ చెప్పుటాయె నలఖై రూపాలు నెలకు నడ్డి విరిచి లాగుటాయె ఏడాదీ పరీక్షలో ఏడో తరగతి వాళ్లకు
నకల్ జెప్పి పొల్లగాండ్ల అకల్ పాడు జేసుటాయె బుద్ధిమాలి 'స్పాటు' లోపలా । పైరవీల। దిద్దులాట గుద్దులాటరా! ॥1ఐ॥1
కుర్చీని ఒకడు నీళ్ల కుండీని ఇంకొకడు ఫ్యానూ మరివొకడు గడ్డపారనొకడు కొట్టేస్తడు నిచ్చెన గిచ్చెన బేంచీ చెక్కల్ ముక్కల్ అన్నీ ఇళ్లకు వెళ్తాయి వాళ్ల ఇల్లు గూల ముల్లెగాల అబ్బిందీ దొబ్బుడాయెరా! | అపైన। అబ్బబ్బో! నీతులాయెరా! 114
పద్ధతిగా నడవాలని ఐందోబస్తు విధించి హద్దుపద్దులన్ని మరిచి పెద్దసారె నడుస్తాడు పేరుకు లీవ్‌లెటర్ ఇచ్చి, ఊరికేగి తిరిగి వచ్చి చీటి చింపి సంతకము చేస్తాడింకొకసారు బలం వున్నవాంది ఐడితెరా! | విద్యార్థి | ఐడితె వున్నవాంది ఐగ్రైరా! 1 ఐ॥
చెప్రానీ గిడ్డుగాడు చిన్నపెద్ద యెరుగడాయె సారులాగ ఫోజులాయె, పైరవీల మోజులాయె దావతంటె పడిచస్తడు, తొగుడంటె పడిలేస్తడు తాగుతాడు వాగుతాడు తందనాన లొడుతాడు
28 మావూరు ఐడి తిండికేమొ తిమ్మరాజురా! | నాయాల్ని। పనికేమో ఐండరాజురా! 11బ|॥ అన్ని బళ్లు ఇలా జరుగుతున్న వనగ లేముగాని కొన్ని బళ్లలో ఈ బాగోతం జరుగుతువుంది మేకవన్నె పులులున్నయ్! ఆకలాక లంటున్నయ్! తోకలు అడిస్తున్నయ్! తస్మాత్ జాగ్రత్త! మరీ అదమరచి నిదురపోకురా! | విద్యార్థి 1 అయ్యగార్ల అంతు చూడరా! (ఐడి! పదుగురెదుట పాడి ప్రతీకారం తీర్చుకోవటానికి సమయం కోసం వేచి చూస్తున్నాడ్ము పరాంకుశం పండితుడు. అది ఆగష్టు నాల్గవ తేది. ఒక మహానుభావుని వర్ధంతి సభ ఆనాడు జరుగుతుంది. ఆహ్వానంపై పరాంకుశం ఆసభకు వెళ్లాడు. సాంస్కృతిక కార్యక్రమాలకు రానున్న దూరపు కళాకారులు అనివార్య కారణాల వల్ల సమయానికి రాలేకపోయారు. రారని వర్తమానం కూడా వచ్చింది. సభ రసాభాసం అయ్యేట్టుగా వుంది. అందుకని స్థానిక కళాకారులను నాటక ప్రదర్శన కోసం సమాయత్తం చేశారు. వేషధారణ జరుగుతోంది. కాలవిలంబనం అవుతున్నది. ప్రేక్షకులకు సహనం నశిస్తున్నది. అందుచేత టైంపాస్‌గా ఎవరైనా సరే గాయకులు స్టేజి పైకి వచ్చి పాదాల్సిందిగా నిర్వాహకులు కోరారు. ఒకరిద్దరు పాటలు పద్యాలు చదివారు. తరువాత పరాంకుశం స్టేజీపైకి వెళ్లాడు. గళం బలంతో 'బడిలోని బాగోతం' చదివాడు. అందరూ నిర్జాంతపోయారు. ఆడియన్స్‌లో టీచర్సు వున్నారు. గ్రామ ప్రముఖులూ వున్నారు. ఉద్యోగాధికారులూ వున్నారు. ఆచటి 'యం యీవో' యుగంధర్ కూడా వున్నాడు. అంతా విన్నారు. నాటకానంతరం సభ ముగియడంతో ఎవరి యిళ్లకు వాళ్లు వెళ్లి పోయారు. మరునాడు పరాంకుశం పనిచేసే పాఠశాలకు యంయీవో యుగంధర్ వెళ్లాడు. అదీ సాయంత్రం ఛుట్టీ ఐన తర్వాత. అలవాటుగా ఆరోజు కూడా మర్యాదరామన్న మహావీరుడు, కర్ణుడు, మదన్మోహన్ బడివిడిచిన తర్వాత పిచ్చాపాటితో కూర్చొనే వున్నారు. ఇంకా ఇళ్లకు వెళ్లలేదు. చీకటి పడేదాక వుండి స్వకార్యాలేవో బడిలోనే పూర్తి చేసుకొని చీకట్లో ఇంటికి చేరుకుంటారు. యంయీవో వచ్చీరావటంతోనే “అన్నా! మర్యాదరామన్నా! అంతా నీ గురించే వుందే- మహావీరా! నీ వీరత్వం గురించి కూడా వుంది. బడి గురించి
పపతతతతతతతతతతతతాంవాలడలాయ మావూరు ఐదీ 21 బడిలోని బాగోతం గురించి మొత్తం 'లెల్లెపాట' పాడిండు పరాంకుశం పండితుడు. ఏదన్నవుంటె బడిలోనే పరిష్కారం చేసుకోవాలేగాని బజారుకెక్కితే బాగుండదు. బడి ప్రతిష్ట ఏంగాను? వంతుళ్ల (అభి;మానం ఏంగాను?” అని భంగమానమైనంతగా ఫీలయి(మానభంగం అంటే బాగుండదని) విన్నదానికి కన్నదానికి ఇబ్బిడి ముబ్బడిగా ఎక్వాలు చెప్పి లాంఛనంగా లంచంగా లోగడ రావలసిన డబ్బును వారివద్ద నుండి కష్టనష్టాలకు గురిచేసిన దుష్టజాతకుడు. పుట్టింది అగ్ర కులమేయైన అన్నీ మూర్ధపు భుద్భలే. సంస్కారభ్రష్టు. “మకారత్రయ ఇప్టరు. ఖాబ్భాతా-ఖాల్పేతా. అమ్మాయిల్ని వేధించిన ఒకానొక ఉపాధ్యాయుని విషయంలో లంచం పరిగ్రహించి, పరిరక్షించబోయి సస్పెండ్ ఐన చవట విద్యాధికారి. ఒకసారి లైబ్రరీ పుస్తకాల విషయంలో అనవసరంగా అనధికారికంగా జోక్యం చేసుకొని “జీతంల కోత కొయ్యిండ్రి”” అని పరాంకుశం పట్ల ప్రలాపించిన అవివేకపుటనధికారి. పేరుకు యుగంధరుడు-కాని కుయుక్తి ధురంధరుడు.
మరునాడు ఈవినింగ్ సెషన్.సమయం సుమారు నాల్గు గంటలు, పరాంకుశం స్టాఫ్రూంలో ఏకాంతంగా కూర్చొని ఏదో చదువుకుంటున్నాడు. ఆ టైంలో మర్యాదరామన్న, మహావీరుడు, మదన్మోహన్ ముగ్గురూ పరాంకుశం వద్దికి పరుగెత్తుకు వచ్చారు. పరాంకుశానికి అభిముఖంగా ఆసీనులైనారు. వాళ్లను చూస్తుంటే-తోక తొక్కిన త్రాచులా, కాలుగాలిన పిల్లిలా,కల్లుతాగిన కోతిలా ముగ్గురూ మూడు రకాలుగా కన్పించారు. మర్యాదరామన్న బాసు కాబట్టీ వారే ప్రసంగాన్ని మొదట ప్రారంభించారు.
“పండితుల వారూ! మీరేదో పాట రాసిండ్రట కదా!”
“జెను రాశాను.”
“ఏం పాట రాసిండ్రు?”
“ఎన్నో పాటలు రాసిన, మీరు ఏపొట గురించి అంటున్నారు?”
“ఏదో... ఐడి మీద రాసిండ్రట కదా!”
“బిడ్రిమ్సీద్రా?... ఏ బడిమీద?”
“మన బడిమీద, మనసార్ల గురించి...” మకరతయంం వధవ వసం వగవ నప నమ నతన.
22 మావూడు బది
“మనబడి గురించి ఏంటండి? 'ఐడిలోని బాగోతం” అని కవిత ఎప్పుడో పదేళ్ల క్రితం రాశాను. అప్పుడది ఓ పత్రికలో కూడ అచ్చయింది. ఇంకా తోచింది రాస్తూనే వున్నాను...”
మధ్యలో మహావీరుడు కల్పించుకొని-
“మర్యాదరామన్న అని రాసినవట కదా!”
“ఆం రాశాను. రాస్తే ఏంటి?”
“మన పెద్దసారు గురించేనా?”
“మన పెద్దసారు మర్యాద రామన్ననా?” ఎవరినైనా గుణగణాల గురించి వర్ణించినపుడు సత్యానికి హరిశ్చం[ద్రుడనీ, ధర్మానికి ధర్మరాజు అనీ, దానానికి కర్ణుడా అనీ, మర్యాదకు మర్యాదరామన్న అని పోలుస్తుంటారు. నేను రాసిన పాటలో అమర్యాదకర కార్యాలు చేసిన పెద్దసారుకు “మర్యాదరామన్న! అని వ్యంగ్యంగా నామకరణం చేశాను అంతే. అది మన పెద్దసార్ గురించే అని ఎందుకనుకుంటారు? మనం సినిమా చూస్తుంటాం. అందులోని ఒకో దృశ్యం ఒకో సంఘటన ఒక్కొక్కసారి మన గురించే వున్నట్లు వుంటుంది. అంతమాత్రాన అది మన గురించే రాశారు-సినిమాగా తీశారు అని మనం అనుకోవచ్చా? చెప్పండి?” అని అన్నాడు పరాంకుశం.
“మరి టీసీలకు, ఉచిత పుస్తకాలకు డబ్బులు తీసుకుంటున్నారని రాసినవట కదా!”
“జెన్స రాశాను.”
“అయితే నేనే కదా! టీసీలకు పైసల్ తీసుకున్నది. మన బడిలోనే కదా! ఉచిత పుస్తకాలకు పైసల్ వసూలు చేసింది. గిట్ల రాస్త్రవా?”
“మన బఐడి' అని ఎందుకనుకుంటావు మహావీరా! టీసీలకు తీసుకున్నది నువ్వేనని ఎందుకనుకుంటావ్? గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుంది నీ వరస. ఈ తతంగం చాలా బళ్లలో జరుగుతంది. అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కవిగా నా కర్తవ్యం నేను చేశాను.”
“ఆం అంతే! నేను టీసీలకు పైసల్ తీసుకున్న ముప్పై తీసుకున్న నలపై తీసుకున్న తీసుకొని వుచ్చదాగిన. నావుచ్చ నేనే దాగిన-ఏమంటవ్?” అని తీవ్రస్థాయికి వచ్చాడు మహావీరుడు.
లతతాామానారు డీ 2
“నీ వచ్చే తాగు, మంది వుచ్చేతాగు. ఎవరి వుచ్చ వాళ్లకు ఆరోగ్యానికి మంచిదట! మొరార్జీ దేశాయి కూడా అలాగే తాగేవాడట! గట్లనే తాగు, పైకివస్తవ్!” అని పరాంకుశం మంద్రగంభీరంగా సమాధానం ఇచ్చాడు. మళ్లీ మహావీరుడే అందుకొని ఇలా అన్నాడు.
“మొన్న యంయీవో వచ్చిరి. ఏమన్న పైనలుంటి ఇయ్యిమని అడిగిరి. మూడువందలు కావాలన్నడు. లేవు. ఉన్న కాడికి ఇన్నూర్రూపాయలు ఇచ్చినం. ఆఫీసరాయె, ఇయ్యాలె గదా! ఎక్కన్నుంచి తెచ్చియ్యిమంటవ్? ఆ పైసలు ఈ పైసలు వసూలు చేసినవి ఉంటే గిట్లా ఇచ్చుడు జరుగుద్ది”
“ఆయనకు ఎందుకివ్వాలి? పిల్లల్ని బాధించి ఎందుకు వసూలు చేయాలి? కాబిల్‌ని కొట్టి గద్దలకేసినట్లు ఈ లండు వ్యవహారం యేంది?” అని పరాంకుశం గారి ప్రతిప్రశ్న
ఇంతలో మదన్మోహన్ కల్పించుకొని
“మా అందరి గురించి గిట్లరాస్తె మాకెంత బాధైద్దో అలోచించినవా? పరాంకుశం!”
“ట్లెన్సు ఎక్కన్నో పాట పాడితే,ఎవరో వచ్చిమీకు చెప్తే ఇంత బాధ కల్గుతుందే? మరినేను వింటుండగా ప్రత్యక్షంగా గిడ్డుగాడు “లంజకొడుకా! అని తిట్టాడే - మరి నాకెంత బాధకలుగాలి?” అని పరాంకుశం మదన్మోహన్ని ఎదురు ప్రశ్న వేశాడు.
“వాడు ఎవన్నో తిట్టకున్నడు. నిన్నెందుకు తిట్టిండు. నీ ఊరా? పేరా?”
“నేన్తు ఎవరి గురించో రాశాను, పాడాను, మీ ఊరా? పేరా? మీకెందుకు బాధ?” ఇంతలో ఛుట్టీ అయింది. పొలోమంటు పిల్లలు క్లాసుల్లోంచి బయటపడి ఇళ్లకు వెళ్తున్నారు. పరాంకుశం పండితుడూ, మహావీరుడు, మదన్మోహన్, మర్యాదరామన్న ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.
మరుసటి మాసం ఆగష్టులో మర్యాదరామన్న పదవీ విరమణ చేయనున్నాడు. అతనికి వీడ్కోలు సన్మానం ఘనంగా చేయాలని ముఠాదార్లు ముచ్చట పడుతున్నారు. ఇంతలో ఒక ఘోరం జరిగిపోయింది. మదన్మోహన్ గారి వృద్ధమాత స్వర్గస్థరాలైంది. ఆవిడ పెద్దకర్శ అయ్యేలోపే కూతురు కూడా తీవ్ర అనారోగ్యంతో పరమపదించింది. పులిమీద పుట్రలాగ, గోరుచుట్టుపై రోకటి పోటులాగ, మూలిగే నక్కపై తాటిపండులా కష్టంమీద కష్టం వచ్చి ఎంతో వ్యధా భరిత హృదయుడయ్యాడు మదన్మోహన్. సిబ్బంది అందరూ విచారం వ్యక్తం చేశారు. సానుభూతి తెలిపారు. అందరితోపాటు పరాంకుశం
న
24 మావూరు వదిలా కూడా మదన్ గారింటికి చిన్నమానాల (గ్రామానికి వెళ్లి మందలించాడు. ఓదార్చాడు. అతనితోపాటు ఏడ్చాడు కూడ. మదన్మోహన్ దాదాపు ఇరవై రోజుల దాకా బడికి రాలేదు. ఆగష్టు ముప్పై తారీఖు రానే వచ్చింది. ఆరోజు శనివారం. మర్యాదరామన్నక్తు వీడ్కోలు సన్మానం ఘనంగా జరిగింది. మరునాడు ఆదివారం మధ్యాహ్నం బడిలోనే విందు ఎరేంజ్ చేశారు. అ విందుకు పరాంకుశం రాలేదు. రాడు కూడా. ఇకపై దావతులకు పోవద్దని భీష్మించుకున్నాడు. మర్యాదరామన్నగారు వదవి నుంచి దిగిపోతే మదన్మోహన్గారి సంగతేంటని ముఠామిత్రులు మంత్రాంగం జరిపారు, పోయే ముందు మర్యాదగా ఒక మంచి పని చేసి పోదామని మర్యాదరామన్న అనుకున్నాడేమో! సై అన్నాడు. వెంటనే కరటకదమనకుల్లా కర్ణయెలమందలు టీచర్స్ అటెండెన్స్ రిజిష్టర్‌ను చంకలో ఇరికించుకొని, ద్విచక్రవాహనంపై ఆఘమేఘాలతో చిన్నమానాలలో వన్న మదన్మోహన్ ఇంట్లో వాలారు. పేదకు పెన్నిధి దొరికినంత సంతోషంగా మదన్మోహన్ మిత్రద్వయాన్ని ఆప్యాయంగా ఆహ్వానించాడు. మిత్రులిద్దరూ మదన్మోహన్ చేత మొత్తం సంతకాలు గుద్దించి గుట్టుచప్పుడు కాకుండా తిరుగు ప్రయాణం పట్టారు. హనుమంతుడు సంజీవి తెచ్చినంత సంబిరంగా, సూదిని దూలాన గుచ్చుకొని పరమానందయ్య శిష్యులు తెచ్చినంత మురిపెంగా-తీసుకొచ్చి బాసుచేతిలో అటెండెన్స్ రిజిష్టర్ పెట్టేశారు. చేసిన మంచిపనికి మించిన ఆనందంతో వెయ్యి వోల్టేజీల బల్బులా వెలిగిపోయింది బాసుగారి మొహం. తర్వాత మందూ మార్చలంతో విందూ వినోదం ముగిసిపోయింది. గతంలో మదన్మోహన్ కూతురు పెళ్లి సమయంలో ఐదు రోజులు సంతకాలు చేసుకున్నాడు. అదే కూతురు పరమపదిస్తే ఇప్పుడు మొత్తం రోజులు సంతకాలు పెట్టుకున్నాడు. “ఇలా యెందుకు చేస్తున్నారు? మెడికల్ లీవుకాని, మరేదైనా లీవుకాని తీసుకోవచ్చుగదా!” అని పరాంకుశం అంటే “ఆపత్సమయంలో ఆదుకోవటం మానవధర్శం-మన ధర్మం కూడా” అని ముఠాముఖ్యులు అన్నారు. “నేనూ మానవున్నే నాకూ మానవత్వముంది. ఆపదలో ఆదుకోవాలి. కాదనను. ఇలాగ ఆదుకోవటం అనేది సిబ్బందిలో కొందరికా? అందరికా? అలా అందరికీ ఐతే బెల్లంపాట్ల నుంచి వచ్చే హిందీ పండితుని తల్లి చనిపోయినప్పుడు ఆయనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? మంగళ్లపల్లి నుండి వచ్చే మరో హిందీ పండితుడు తనసోదరి గతిస్తే సోలాపురం వెళ్లాడు. అచట అతడు మలేరియా జ్వరపీడితుడై 15 రోజుల దాకా రాలేదు. మరి అతనికి ఎందుకు సాయం చేయలేదు? జీతం కోతాయ్ ఎందుకు కోశారు? అవసరాన్ని బట్టి అవకాశం
అలలా మానడు ఐడి 25 అందరికీ ఇవ్వాలి. అందరూ ప్రయోజనం పొందాలి. కొందరు మాత్రమే కాదు.” అని పరాంకుశం సమత్వం కోసం న్యాయం కోసం వాదించాడు. ఐనా అతనివాదన అరణ్యరోదన అయ్యింది.
మర్యాదరామన్న గారి తర్వాత మరో ప్రధానోపాధ్యాయులు వచ్చారు. పేరు భగవాన్. నిజంగా వారు భగవదంశ గలవారే! ఎందుకంటే పక్షప్రాత వైఖరి లేనివారు. అందరిని ఒకేలా చూసేవారు. సౌమ్యమనస్కులు. ఎవరికి బాధ కలిగినా తనబాధగా భావించి సహకరించేవారు. వీరి హయాంలో ఒక చిరు సంఘటన జరిగింది.
మావూరు బడిలోని విద్యా కమిటి మెంబర్లలో షెకలక భోజయ్య అనే అతడు కూడా ఒక మెంబరు. ఖచ్చితమైన మనిషి పక్షానికొకమారైన బడికి వచ్చి అందర్ని దర్శించుకొని సలాం కొట్టి పోయేవాడు. “ఐడి ఎలా నడుస్తున్నది? పంతుళ్లు అందరు సరిగా వస్తున్నారా లేదా? వస్తే క్లాసుకు పోతున్నారా లేదా? లేక జేబుల్లో చేతుల జొనిపి చెట్ల కింద బాతఖాని కొడుతూ క్లాసులు ఎగ్గొడుతున్నారా?” అని ఆరా తీసేవాడు. అలా చేయటం అనేది తనకు సంబంధించిందో కాదో తెలియదు కాని మంచి కోసం పాకులాడే పాటుపడే మంచిమనిషి “డియీవో, పియీవోలాగ వీడు పదేపదే వచ్చి మమ్మల్ని 'చెకిన్' చేస్తున్నాడు అని ఆగ్రహోదగ్రులై మహావీరుడూ కర్ణుడూ కూడబలుక్కొని బాసు భగవాన్ గారిని కలిసి జులుం చేస్తున్నాడని అతనిపై ఒక “అభియోగపత్రం విడుదల చేశారు. అందులో “శ్రీషెకలక భోజయ్య గారు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన నుండి తరచుగా పాఠశాలకు వచ్చి, తరగతులకు వెళ్లి విద్యార్భలను ప్రోత్సహించుతూ, ఉపాధ్యాయులను హెచ్చరించుతూ బోధనకు ఆటంకం కలుగజేస్తున్నాడు. నేను విద్యా కమిటి మెంబర్‌ను నా సంగతి మీకు తెలువదా?' అని అనుచితంగా ప్రవర్తించుతూ పాఠశాల కార్యక్రమాలకు భంగం కలిగించుచున్నాడు” అని అందులో మెన్నన్ చేశారు.
బాసు భగవాన్ గారి సంతకంతో కూడిన ఆ పత్రాన్ని అందులోనే చదువుతున్న భోజయ్య కుమారుని చేతనే అతనికి అందించారు. అది చదువుకున్న భోజయ్య నిశ్చేష్ప్ణడయ్యాడు. “నేను బడికి వెళ్లేది నా కుమారుల (ఇద్దరు) చదువు సంధ్యలు, బాగోగులు తెలుసుకొనుట గురించే కాని పంతుళ్లపై పెత్తనం చెలాయించటానిక్కాదు గదా! ఐనా ఆఫీసర్నా? ప్రాఫెసర్నా? వాళ్లను బెదిరించటానికి. వీళ్ల దూకుడుకు కళ్లెం వేయాలి” అని
1 అభియోగ పత్రం అనుబంధంలో చూడండి.
2ఠ మూవరు వదిలా అనుకొని 'దీనికి తగిన సలహా ఇవ్వగల సమర్భడు ఒక పండిత పరాంకుశం గారే'నని నిశ్చయించుకొని ఇద్దరు గ్రామ ప్రముఖులతో పరాంకుశం వద్దకు వెళ్లి సర్వవిషయం విడమరచి చెప్పాడు. అదివిన్న పరాంకుశం 'కాదు-కూడదు' అని చెప్పినా వినక భోజయ్య మొండిపట్టు పట్టడంతో తర్జనభర్జన తర్వాత పరాంకుశం సరే అని ప్రత్యుత్తరం తయారు చేసి ఇచ్చాడు.”
అందులో- “నా కొడుకులు ఇదే పాఠశాలలో చదువుచున్నందున వారి బాగోగుల గురించి తెలిసి కొనటానికి బడికి వచ్చానే కాని, అధ్యాపకులపై నియంతృత్వం భయంతో నన్ను బడిలోకి రానివ్వదన్న ఉద్దేశంతో ఉన్నవిలేనివి కల్పించిమీకు ఫిర్యాదు చేశారు. ఇనా క్రొత్తగా వచ్చిన మీరు ఐడిలో జరుగుతున్న అవకతవకల్ని గమనించండి!
- విద్యార్థుల వద్ద ఉచిత పుస్తకాలకు డబ్బులు వసూలు చేసి తామే
వాడుకుంటున్నారు. 2 టి.సి. ఒక్కంటికి 20/80 రూ1లు వసూలు చేస్తూ సొంతానికి వాడుకుంటున్నారు. బిడిలెక్కల్లో జమకావటం లేదు.
& ఇటీవలే కొన్న సీలింగ్ ఫ్యాన్ సీలు విప్పకుండానే మాయమైంది.
4 కొందరు పంతుళ్లు సి.ఎల్. చెరపివేసి సంతకాలు చేస్తున్నారు. ఆ విషయం అటెండెన్స్ రిజిష్టర్‌లో ఆగష్టు మాసం పరిశీలించినచో తెలియగలదు.
పై విషయాలన్ని పరిశీలించి, మీకిష్టమైనచో యథేచ్చగా నన్ను కార్యవర్గం నుండి తొలగింపవచ్చును- అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను” అని భోజయ్య రాసినట్లుంది.
రెండు రోజుల తర్వాత ఆ పత్రం బాసుగారికి అందింది. అది చదివి ముఠాదార్లు ఖంగుతిన్నారు. ఒకరినొకరు చెవులు కొరుకున్నారు. రుసరుసలాడారు. పిసపిసలు పోయారు. అసలు దీనివెనక ఎవరి హస్తం వుంది?అని ఉంకించి తలపంకించి ఆలోచించి ఆరాతీని చివరకు పరాంకుశం పండితులవారిదే నని నిర్ణయానికొచ్చారు.
ఒకనాడు స్టాఫ్ మీటింగ్ జరిగింది. స్కూలు విషయాల చర్చ అయింతర్వాత
2-ప్రత్యుత్తరం అనుదింధంలో చూడండి. వు పన త లతననన
చలా మునాడ బడీ 27 యెలమంద భోజయ్య గారి పత్రం సంగతి లేవనెత్తాడు. అనుమానం వున్నవాళ్లు నేరుగా పరాంకుశంను అడిగినా బాగుండేది. “ఈ పత్రం విషయంలో మీ పాత్ర వున్నట్లు అనిపిస్తుంది అని అనుమానం వెలిబుచ్చినా పరాంకుశం వివరంగా వివరించే వాడేమో! అలా జరగలేదు. కర్టుడు దూషణకుదిగాడు. “ఎవడో గాడిదకొడుకు మన బళ్లోదే ఇదిచేసిండు.” అని మీటింగులోనే ధూర్తుడై దుర్వాక్కులు కక్కాడు. ముఠామూర్భుల్లో కొందరు అది కావాలని తొను చేసింది కాదు గదా! ఐనా అలా తిట్టటం సభ్యత కాదుగదా! అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. సమయం కోసం వేచి చూస్తున్నాడు పరాంకుశం.
సింగయ్య, గురునాథం అనే ఇద్దరు టీచర్లు ఒకేసారి రిటైర్ అవుతున్నారు. వాళ్లిద్దరికి బడి తరఫున వీడ్కోలు సన్మానం చేయాల్సి వుంది. ఓ రోజున వీడ్కోలు సన్నాన సభ ప్రారంభం అయింది. దీనికి మాజీబాను మర్యాదరామన్నను ముఠా నాయకులు ఆహ్వానించారు. ప్రతీ ఫంక్షన్‌కి అతన్ని పిలవటం ఆనవాయితీ ఐపోయింది. ఈవిషయమై స్టాఫ్‌లో కొందరు నొచ్చుకున్నారు. పీలువవద్దన్నారు. మూర్చులు వినరు-'చెప్పెడువారు చెప్పినన్ వినియెడువారికించుక వివేకము పుట్టదె?' అన్న సూక్తి వుండనే వుంది. మర్యాదరామన్నను అతిథిగా స్టేజీపైకి పిలిచారు. వచ్చి కూర్చున్నాడు. పరాంకుశం తాను రాసిన సన్మాన పత్రాలు ఇద్దరివీ చదివేశాడు. ఉపన్యాసాలివ్వటం పెద్దలవంత్రైంది. మర్యాదరామన్న లేచాడు. తన ఉపన్యాసంలో పరాంకుశంను అన్యాపదేశంగా పెట్టకొని ఏవో అవాకులు చవాకులు (ప్రేలాడు. “ప్రపంచంలో మనుషులు ఉత్తములు, మధ్యములు, అధములు అని మూడు రకాలుగా వుంటారు. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే మరచిపోయేవాడు ఉత్తముడు. మనస్సులోంచి మెల్లిగా తొలగించుకునేవాడు మధ్యముడు. అ విషయం అలాగే మననులో వుంచుకొని మరచిపోకుండా వుండేవాడు అధముడు-అధమాధముడు.” అని పరోక్షంగా పండిత పరాంకుశంను దుయ్యబట్టాడు. కుశాగ్రబుద్ధియైన పరాంకుశం పండితుడు వెంటనే గ్రహించాడు. 'శఠేశార్యం” అన్నట్లు కీలెరిగి వాతపెట్టాలనుకున్నాడు. ఇదే మంచి సమయం. మంచి సమయం మించిన దొరకదు-అనుకున్నాడు. స్టేజీ పైకి ఎక్కాడు. బాసులు ఎందరు ఎన్ని రకాలుగా వుంటారో వివరించాడు. బాసుకు చెంచాగిరి చేసే బాకారాయుళ్లు, కాకారాయుళ్లు, కరటకదమనకుల
- సారళ్యం సరళే కుర్యాత్, శరేశాళ్యం సమాచరేత్.
2త మావూరు వదిలా గురించివిశదీకరించాడు. తమకు తోచింది తు.చ. తప్పక చెడును చేసే దరిద్రుల్ని గురించి చెప్పాడు. “ఇంకా ప్రబుద్భలు ఎలా వుంటారంటే అటెండెన్స్ రిజిష్టర్ చంకలో ఇరికించుకొనిపోయి. ముఠామిత్రునితో సంతకాలు గుద్దించుకొని వచ్చే సన్నాసులూ చవటలూ వుంటారు” అని అన్నాడు. “ఇలా మధ్యవర్తిత్వం చేసే కుంటెనగాళ్లను పూర్వం తెనాలి రామకృష్ణుడు-
“గంజాయి (త్రాగి తురకల
సంజాతముచేత కల్లు చవిగొన్నావా?
లంజలకొడుకా! ఎక్కడ?
కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్. అని తిట్టాడని చెబుతూ “అటువంటి మూర్చులకు పనిష్మెంట్ అంతకంటే ఇంకేం కావాలి?” అన్నాడు. వాక్యం పూర్తి అయిందో లేదో ఇటునుంచి మహావీరుడు, అటునుంచి కరుడు, మరోవైపు నుంచి యెలమంద “ఓ పరాంకుశం! ఇది కవి సమ్మేళనం అనుకున్నావా? పండిత గోష్టి అనుకున్నావా?” అని విరుచుకపద్డారు. ఎవరికీ భయపడని పరాంకుశం పట్టువదలని విక్రమార్కుడిలా ఉడుంపట్టులా ప్రసంగం పూర్తి అయ్యేదాకా గట్టిగానే మాట్లాడాడు. దీంతో సభ కొంచెం రసాభాసం కాక తప్పలేదు. సభానంతరం తేనీటి సేవనంతో ఎక్కడివాళ్లక్కడ ఇళ్లకు వెళ్లిపోయారు.
“అటెండర్ గిద్దుగానితో తిట్టించినందుకు, కర్ణుడు మీటింగ్‌లో 'గాడిదకొడుకు' అని దూషించినందుకు సరియైన సమయానికి స్టేజీమీద ప్రతీకారం సరిగ్గా తీర్చుకున్నాను. దానికి పూనకం కీలకం మర్యాదరామన్నే. 'కుక్కకాటుకు చెప్పుదెబ్బ'లా బాగానే జరిగింది. మళ్లీ బడిలోకి ఫంక్షన్‌కి రాకుండా అయ్యింది” అని పండిత పరాంకుశం గారు మనసు చల్లార్చుకొని శాంతించారు. వారం రోజుల తర్వాత జరిగిన స్టాఫ్ మీటింగ్‌లో - ఇకనుంచి అందరూ కలుపుగోలుగా వుండాలన్న వుద్దేశంతో, శాంతింపజేసే యత్నంతో అటెండర్ గిడ్డూను రప్పించి అందరి సమక్షంలో క్షమాపణ చెప్పించారు ఆనాటి బాసు భగవాన్ గారు. దాంతో “ఇకనైనా శాంతించడి! అందరం కలిసిమెలిసి వుందాం! గతమంతా పీడకలగా మరచిపోండిగ” అని పరాంకుశంను తోడిమిత్రులు కొందరు సాంత్వన పరిచారు&.
నాలుగైదు మాసాలయిందో లేదో భగవాన్ బానుగారికి బదిలీ జరిగింది.
త ఇచట సాంత్వనగీతం రాయబడింది. అనుబంధంలో చూడండి.
లా మావారు బది 29 వారిస్థానంలో మరొకరు హెద్డుగా వచ్చారు. వచ్చిన వారు హిందీ పండితునిగా వుండి (వ్రవోవన్ పై వధానోపాధ్యాయునిగా వచ్చారు. అంటే వారు వండిత ప్రధానోపాధ్యాయులన్నమాట. పేరు మహేశం. ఇంటిపేరు మట్టిపెల్ల. మట్టి పెల్ల మహేశం అంటాడు గదా!” “నేను గతంలో హిందీ పండితున్ని కాబట్టి ప్రస్తుతం హిందే బోధిస్తాను. నేను యమ్మే బియీడి ఐనంతమాత్రాన ఇంగ్లీషే చెప్పాలని లేదు కదా! నేను క్లాసులో కూసేదీ రాసేదీ హిందీ బాసే” అని ఘోషిస్తాడు. మహేశం వచ్చిన తొలిరోజుల్లోనే పండిత పరాంకుశం గారు వారికి ఒక సూచన చేశారు. “ఇక్కడ ఒక ముఠా వుంది. మీరెలా నెగులుతారో యేమో? జరభద్రంసార్” అంటూ కొన్ని విషయాలు జరిగిన సంఘటనలు చెప్పాడు. అందుకు మట్టిపెల్ల మహేశం గారు “అవన్నీ నా దగ్గర నడవవు. టీచర్‌గా చాలా అనుభవం వున్నవాన్ని డబ్బుకు కక్కుర్తి పడేవాన్ని కాదు. స్టిక్ట్ ఫెల్లోను. ముఠాతత్వం నా దగ్గర సాగదు. ఐనా మీరు లేరా సార్?” అని సమాధానమిచ్చాడు. త్వరలోనే కరటక దమనకుల ముఠాదార్ల మాటలు వినీవినీ (భ్రమరకీటన్యాయం'లా సరెండరై పోయి, తానే. అఆ ముఠాకు ముఖ్యుడయ్యాడు. వారే వీరు వీరేవారు అన్నంతగా మమేకమై వారిచేతుల్లో కీలు బొమ్మైపోయాడు. రబ్బురుస్టాంపులా మారిపోయాడు. స్వయం ఆలోచనా ప్రతిపత్తి లేకుండా పోయింది. ప్రతిదానికి ముఠాముఖ్యులపై ఆధారపడవలసి వచ్చింది. తొలినాళ్లలో పలికిన పలుకులు చిలుక పలుకులుగా, మాటలు నీటి మూటలుగా, ఆశయాలు ఎండిన జలాశయాలుగా అయ్యాయి. మట్టిపెల్ల మహేశంగారి మట్టిబుద్ధి మాత్రం నివురుగప్పిన నిప్పులా కొందర్ని ఉండికిస్తోంది. కొందర్ని మిడికిస్తోంది. మొత్తం మీద ఐడి అంతా పక్షపాతంగా పక్షవాతంగా మారిపోయింది.
ఇతడు భూతకాలంలో 'లీరెల అంచు” గ్రామంలో సీనియర్ హిందీ పండితుడుగా పనిచేశాడు. అచటి హెడ్మాస్టర్ బదిలీపై వెళ్లగా, ఆ సీటులో మోస్టు సీనియర్ అందునా యమ్మే బియీడి కాబట్టి ఇతడే ఇన్చార్జి హెడ్మాస్టర్గా నియమితుడయ్యాడు. 'పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తినేనీనట్ట 'ఏక్‌దిన్‌కా రాజా'గా వుండి ఈ వండిత ప్రధానోపాధ్యాయుడు గుడినీ లింగాన్ని మింగే ఘరానా దొంగలాగ బిడినీ బడిలోని డబ్బుల్ని (ఫీజుల్ని) మింగేసిన కాలభైరవుడు. ఎందుకో ఏమోగాని అక్కడి ఆటల మాస్టర్‌తో చెప్పుదెబ్బలు తన్నులు తిన్నాడీ తలకుమాసిన వెధవ. (దూసినా మాసినట్టే వుంటుంది నెరిసినతల) ఆవూరి నుంచి 'మావూరు'కు రిలీవై వస్తున్నప్పుడు ౬.20. పైన అక్కడి పెద్దసారు సంతకం చేయలేదట. సంతకం లేందే ఇక్కడ 'బిల్' చేయరాదు. చేసినా మంజూరి కాదు. అందుకని కర్టున్ని రెండు మూడు సార్లు తీసికొని పోయి మింగిన డబ్బుకక్కి ఏదో
౩ మావాడు ది తప్పా చేయించుకొని సంతకంతో తిరిగి వచ్చాడట! అలాంటి గోముఖ వ్యాశ్రం, మేకవన్నెపులి, పయోముఖ విషకుంభం పండితంమన్యుడు మట్టిపెల్ల మహేశం గారు. అనుయాయులు ప్యాంటు జేబుల్లో చేతులు దూర్చి చెట్లకింద పిచ్చాపాటి చేసినా, ఆఫీసురూంలో తనముందు కూర్చొని బాతాలుకొట్టినా ఏమీ అనే వాడు కాదు. సరిగా పనిచేసే వాళ్లు ఓ నిముషం బడికి లేటుగా వచ్చినా, అరనిముషం క్లాసుకు ఆలస్యంగా వెళ్లినా చిందులు తొక్కేవాడు. వనిదొంగల్ని విడిచి వనిమంతుల్ని వట్టకొని మిట్టపెత్తనం(8ఇ0 5621 ఆగ/౧) చేసేవాడు మట్టిపెల్త మహేశం. “ఎవరైనా నడిచే ఎద్దునే కదా పొడిచేది' అదీ మట్టిపెల్ల మహేశంగారి మెట్టవేదాంతం, మట్టి మెంటాలిటి. మట్టిపెల్ల మహేశం ఎంత కమినా ఆద్మో చూడండి! బడిలో దావత్ జరిగితే వంటచేసుకోవటం ఎందుకని, మెస్ నుండి బిర్యాని పొట్లాలు తెప్పిస్తే మహేశం స్టాఫ్‌తో కూర్చుండి తినేవాడు కాదు. తనవంతు పొట్లం తనకు ఇమ్మని ఇంటికి తీసుకెళ్ళేవాడు. అంతేకాదు ఇంటివద్ద మేం ఇద్దరమే కదా భార్యాభర్తలం వున్నది, ఆమె ఒకరై కోసం ఆమె వంటేంజేసుకుంటది? ఆమెక్కూడ ఒకపొట్లం ఇమ్మొంటూ రెండడిగి మూడు ప్యాకెట్లు నొక్కేసి చక్కాచెక్కేసేవాడు. కూల్‌డ్రింక్స్ ఏమైనా వగల! సీసాతో సహా-ఖాళీసీసాలైనాసరే “కుక్కకు చెప్పేలాభం' అన్నట్లు బ్యాగులో భద్ర పరచుకొని బయల్దేర్తాడు. ఇల్లందుల నుంలి మావూరు బడికి రోజూ బస్సు (ప్రయాణంతో వస్తూంటాడు పోతుంటాడు మహేశం గారు. ఇతని హయాంలో ఇతని అసమర్ధతవల్ల పరాంకుశం గారికి కొంత పరాభవం జరిగింది. యెలమంద, కలమంద, మదన్మోహన్, మహావీరుడు, కర్ణుడు, లే కూడబల్ఫొని ఎలాగైనా సరే పరాంకుశంను పరాభవించాలని ప్లాన్ వేసుకున్నారు. క్లాస పాఠం చెబుతూ సందర్భం వచ్చి మతసామరస్యం గురించి మాట్లాడుతూ “ఒకే జాతికి చెందిన వాళ్లం మనమే మాలమహానాడు, మాదిగ దండోరా,తుడుందెబ్బ అనీ సంఘాలుగా విడిపోయి ద్వేషాలు పెంచుకొని ఆవేశకావేషాలతో మనలో మనమే దళితుల౦ కలహించుకోవటం మంచిదంటారా?” అని విద్యార్థులతో పాఠానుగతంగా మాట్లాడిన విషయాన్ని పురస్కరించుకొని దాన్ని వక్రీకరించి, పరాంకుశం లీవుపై వెళ్లినపుడు అవకాశం కోసం పొంచివున్న దుష్టషట్కం 'మాలోళ్లు మాదిగోళ్లు అని తిట్టినట్టు హరిజన విద్యార్థుల చేత బలవంతంగా అస్తీకేషన్ రాయించి హైచ్యం గారికి ఫీర్యాదు చేశారు. వాళ్లకు తోడుగా కేసు బలంగా వుండాలని ఒక మాదిగ సాబో కత్తుల రత్తయ్యను సహాయకారిగా
- ఓసారి మాటల సందర్భంలో దళితకవి శ్రీలి.యస్. రాములుగారు ఎల్లారెడ్డి ఎల్లారావు, పుల్లారెడ్డి పుల్లారావు అని రెడ్డిరావుల్ని పిల్చినట్లే ఎల్లయ్యమాదిగ, పుల్లయ్యమాదిగ అని పిలవాలనీ, రెడ్డిసాబ్ రావుసాబ్ అని సంబోధించినట్లే మాదిగ సాల్ అని పిలవాలని; వచించారు. వారితో ఏకీభవిస్తున్నాను -రచయిత
తతా మావాడు ఐడీ 1 తీసుకున్నారు. ఈ విషయాన్ని కొందరు విద్యార్థులు పరాంకుశం ఇంటికిపోయి పూసగుచ్చినట్లు చెప్పేశారు. మరునాడు పరాంకుశం బడికి రాగానే మట్టిపెల్ల మహేశం ఆ పత్రం చూపించాడు. అది చూసిన పరాంకుశం మహేశంతో ఇలా అన్నాడు. “సార్ నాకు దళితులంటే ద్వేషం లేదు. ప్రేమే. ప్రతి సంవత్సరం నా డ్రెస్సులు ఒకరిద్దరికి ఉదారంగా నేనిస్తున్నాను కూడ. కవిగా దళితుల సాధకబాధకాల గురించే కవిత్వం రాస్తున్నాను. అటువంటి నేను వాళ్లను తిడతానా సార్? ఐనా 'మాలమాదిగ' అని తిట్టవలసిన అవసరం నాకేముంది?” అనగానే మట్టి పెల్ల మహేశం అందుకొని “అదంతా నాకు తెలియదు. దళిత పెద్దలు కూడా వచ్చి నిర్ణయం తీసుకున్నారు. మీరు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి.” అని అన్నాడు. “అలా ఐతే పిల్లల్ని పిలిచి అడగండి! వాళ్లు నిజమే అంటే తప్పక క్షమాపణ కోరుతాను.” అని పరాంకుశం అనగానే “అదంతా ఏమీలేదు. పిల్లల్ని అడిగిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చారు. మీరు క్షమాపణ చెప్పాల్సిందే” అని మట్టిపెల మహేశం పట్టుబట్టాడు. అందుకు పరాంకుశం “ఐతే సరే! వారం రోజుల తర్వాత ఫలానా నాడు పంచాయితి పెట్టుకుందాం! నేను కూడ కొందరి పెద్దల్ని తీసుకువస్తాను.” అని చెప్పి ఆఫీస్ రూం నుంచి బయట పడి క్లాస్‌రూంకి వెళ్లిపోయాడు.
అనుకున్న రోజు రానే వచ్చింది. పరాంకుశం మహేశంతో “సార్! ఇవ్వాళ్ల పంచాయితి కదా! సాయంత్రం ఛుట్టీ అయిం తర్వాత పెట్టుకుందాం” అని అన్నాడు. అందుకు సమాధానంగా మట్టిపెల్ల మహేశం-“ఏదీ? యెలమంద, కలమంద ఎవ్వరు కూడా ఏమంటలేరు. చప్పుడు చేస్తలేరు. పంచాయతీ గించాయతీ ఏంలేదు. పోండి!” అని అన్నాడు. అది నిజమే అనుకొని ఆ విషయమే మరచిపోయి అరమరికల్లేక అందరితో కలిసి మెలిసి మసలుతున్నాడు పరాంకుశం,
పక్షవాతంతో మంచాన పడివున్న పరాంకుశం గారి తల్లి వచ్చేపోయే ప్రాణాలతో వుంది. మూన్నాల్లు రోజుల్లో దీపావళి పర్వదినం. కేదారేశ్వర నోముంది. ఇంటికి సున్నం వేయాలా వద్దా? ఇదే సమయంలో పరాంకుశం మనుమడు తలకు దెబ్బ తగిలి యశోదా హాస్పిటల్లో కోమాలో వున్నాడు. అయోమయ స్థితిలో వున్న పరాంకుశంను గమనిరిచి మట్టిపెల్ల మహేశంతో సహా దుష్టషట్కం పన్నాగం పన్ని హఠాత్తుగా పంచాయితి పెట్టారు. స్టాఫ్ మీటింగ్ పేరుతో నోటీస్ పంపీ సాయంత్రం ఛుట్టీ ఐన తర్వాత కేవలం పదవ తరగతి విద్యార్థుల్ని మాత్రమే వుంచి, విద్యా కమిటి అధ్యక్షుడు బిత్తిరి సత్తయ్యను, దళిత
చాలా నాయకుడు కత్తుల రత్తయ్యను రప్పించి, స్టాఫ్‌ను కూచోబెట్టి విద్యార్థుల సమక్షంలో పరాంకుశంను క్షమాపణ చెప్పుమన్నాడు మట్టిపెల్ల మహేశం. పరాంకుశం వెంటనే లేచి ఆవేశంతో మహేశంతో ఇలా అన్నాడు. “సార్! ఆనాడు పంచాయితి లేదు గించాయితి లేదన్నారు. ఈనాడు ఇదేం పంచాయితి మళ్లీ హఠాత్తుగా? ముందే చెబితే నేను కూడా నా పక్షంగా కొందరు పెద్దల్ని తీసుకవచ్చే వాన్ని కదా! అంటే “అదంతా ఏంలేదు. ఈ వచ్చిన పెద్దలు చాలు. మీరు క్షమాపణ చెబితే సరిపోతుంది” అని ముక్తసరిగా సమాధానమిచ్చాడు మట్టీపెల్ల మహేశం.
'తల్లి-మనవడు-దీపావళ్లొ అనే సమస్యలతో సతమతమవుతున్న పరాంకుశం “ఇగ్షంత్రా గూడుపుఠాని” అని గ్రహించి క్షమాపణ చెప్పడానికే నిశ్చయించుకొని విధిలేక లేచినిలబడి విద్యార్థుల వంక చూస్తూ- “విద్యార్థులారా! ఎప్పుడైనా మిమ్మల్ని నేను 'మాలమాదిగ' అని తిట్టానా? తిడితే చెప్పండి! సత్యపూర్వకంగా మీరు నిజమే అంటే తప్పక క్షమాపణ చెపుతాను.” అని అన్నాడు. ఏ ఒక్క విద్యార్థి నుండి కూడా సమాధానం రాలేదు. రెండు నిముషాలు నిశ్శబ్ద వాతావరణం చోటు చేసుకుంది. హరిజన బాలురతో సహా అవనతవదనులై మౌనంగా వుండిపోయారు. దీంతో “మనం ఇ నా. అని అనుకొని మాదిగసాబ్ ఐన కత్తుల రత్తయ్య లేచి “ఓ సార్! పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. బేషరతుగా క్షమాపణ చెప్పాలి! విద్యార్భల్ని అడుగవలసిన అవసరం లేదు” ఆని ఉక్రోశంతో ఆక్రోశించాడు. క్షమాపణ చెప్పటానికే నిర్ణయించుకున్న పండిత పరాంకుశం కూడా “ఇంటి సమస్యలతో వేగుతున్న నాకు ఈ రగడా పట్టి యెందుకు? క్షమాపణ చెప్పినంత మాత్రాన జరిగే నష్టం ఏం లేదు. నా నిజాయితి పిల్లలకు తెలుసు” అని అనుకొని “విద్యార్థులారా! మిమ్మల్ని నేనెపుడూ తిట్టలేదు. ఐనా క్షమాపణ చెప్పుమంటున్నారు కాబట్టి చెబుతున్నాను.” అని మౌనంగా కూర్చుండి పోయాడు. నిజానిజాలు తెలిసిన కొందరుపాధ్యాయులు, మహిళా టీచర్స్ ఏమీ అనలేని చేయలేని పరిస్థితిలో వుండి “పాపం! పరాంకుశం బలి పశువు అయ్యాడే!” అని బాధపడ్డారు.
విద్యా కమిటి అధ్యక్షుడు బిత్తిరి సత్తయ్య పరాంకుశంను దోషిగా భావించి “సిగ్గు శరమున్నోడు బడి విషయాలు బయటపెట్టడు. ఎవడన్నా బడిని సార్లను గురించి పాటల్రాసి సభల్లో జదువుతదా?” అని బాహాటంగా పరుషంగా పలికాడు. పరాంకుశం ఏమీ అనలేదు. “సిగ్గుశరం వున్నోళ్లు సీసలు తెచ్చుకొని బడిలో తాగుతారా? బడి వస్తువులు దొంగిలిస్తారా? బడిసొమ్ము కాజేస్తారా? ఇది సిగ్గుశరం వున్న బిత్తిరి సత్రయ్యకే తెలియాలి” అని స్వగతంగా
ాలలాలామానాడ లది 3 పరాంకుశం అనుకున్నాడ్రు, “తనను బిత్తిరి సత్తయ్య ఇలా ఎందుకన్నాడు? అసలు తన గురించి ఆయనకేం తెలుసని? నేను దొంగనా? లంగనా? ఇపుడు జరిగిన దాంట్లో నిజమెంతో అబద్ధమెంతో తెలుసునా? ఇలా ఎందుకన్నాడు?” అని పరాంకుశం సత్తయ్య గురించి ఆలోచించి ఆరాతీయటం మొదలుపెట్టాడు. అతని దుర్గుణాలన్ని ఒక్కొక్కటే బియటపడసాగాయి. అతడు 'పులితోలు తొడుక్కున్న గాడిద' అని తెలిసిపోయింది.
మావూరు వూళ్లో అతను ఒకానొక వార్డుకు మెంబర్. ఆవార్డులో ఎవరైన జాగలు అమ్మినా కొన్నా, అమ్మినవాళ్ళు కొన్నవాళ్ళు కొంత పర్సెంటేజ్ తనకు అప్పనంగా అప్పగించాలి. లేనిచో అమ్మడం కొనడం ఆగిపోతాయి. గైనేజీల గురించి కూడా ఇరుగుపొరుగు వాళ్లకు పరస్ఫరం కలహాలు కల్గించి లంచాలు పుచ్చుకొని పంచాయితీలు చేసే కొంచెపు కొండీడు. భర్తలు చచ్చిన భార్యలకు మున్సిపాలిటీవాళ్లు వితంతు పెన్షన్లు మంజూరి చేస్తే- “అది నాప్రయత్నంతోనే మంజూరి అయిందని, మికు డబ్బులు వచ్చాయని” ముండల దగ్గర ముడుపులు గుంజే ముక్కిడి వెధవ. 'విధవల దగ్గర పైసలు గుండే వెధవలు ఎవరన్న వున్నారా?” అని అంటే ఈ వెధవని దృష్టాంతంగా చెప్పుకుంటారు ఆవార్డులోని జనాలు. ఇతడు 'అగ్రవాదు'ల పార్టికి చెందినవాడని కూడా ప్రచారం. ఓనాడు అతడు అనుకోకుండా ఆ పార్టీనుంచి బహిష్మరింపబడ్దాడు. కారణం? 'సిగ్గు శరం లేని పనులు చేయడం వల్లనే' అని తెలియవచ్చింది. ఇలా సవాలక్ష అవలక్షణాలున్న బిత్తిరి సత్తయ్య విద్యాకమిటి అధ్యక్షుడైతే అధిక్షేపానికి చేటేమున్నది? కుక్షింభరిత్వానికి లోటేమున్నది? బడిలోని వేపచెట్టు మండనుకొట్టించి అమ్మితే-ఐదు వందల రూపాయలు వస్తే-పాఠశాల అవసరాలకు వాటిని వినియోగించక మారంపెల్లికి వెళ్లి తాళ్లల్ల దుష్టషట్కంతో కూడి కల్లుగుడాలు చికెన్ ముక్కలు మెక్కిన కక్కుర్తి మనిషి ఈ బిత్తిరి సత్తయ్య.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. “సిగ్గుళశరం వున్నోడు ఐడి విషయాలు బియటచెప్పడు” అని అన్నాడు. అసలు బడిలో ఏం జరిగింది? పరాంకుశం బిడి విషయాలు బయట ఎందుకు పెట్టాడు? అని పూర్వపరాలు అలోచించాడా అంటే అదీలేదు. బియ్యం కోసం వునుకను దంచినట్టు, నేల విడిచి సాముచేసినట్టు అన్యాయపు పంచాయతీలు చేసే ఆప్రాచ్యపు వెధవని తెలిసిపోయింది.
ఇక మట్టిపెల్ల మహేశం గారి పరిపాలన అస్తవ్యస్తంగా తయారయింది. అతనిలో స్వార్థం కరుడు గట్టింది. బడి ధనానికి గండికొట్టాడు. అక్రమ కార్యక్రమాలకు పాల్పడ్డాడు. లా
తశ విట బాకా హన కాలేజీలో 50౬06 పరీక్ష రాస్తున్న తన కొడుక్కు నకలు అందించటానికి సన్నిహితుడైన ఒక అసిస్టెంటును ఇక్కడ అటెండెన్స్ రిజిష్టర్‌లో సంతకాలు పెట్టించి, అక్కడ డ్యూటీ చేయించిన దుష్ట ధృతరాష్రడు.
హాజరు శాతం తగ్గిన పదవ తరగతి విద్యార్థులకు మెడికల్ సర్టిఫికేట్లకు బదులు డబ్బులు వందల్లో నగదు వసూలు చేసి దుష్టషట్కంతో జల్సాగా 'ఎస్సోయ్దూల' ఆడిన పిస్సపెద్దసారు. నైట్క్లాసుల తంతుతో బడి ఫండును కొల్లగొట్టిన ఆషాఢభూతి. సెలవు రోజుల్లో బడిలో సంవత్సరానికి పది పన్నెండు పెళ్లిళ్లు జరుగుతాయి. ఒక్కో పెళ్లికి వెయ్యో వెయ్యిన్నరో వసూలు చేస్తారు. ఆ డబ్బులు కూడ బడిలెక్కల్లోకి రావు. 'హుష్‌కాకి'లా సైకెగిరిపోతాయి. అబ్బిన కాడికి దొబ్బుతూ గప్‌చుప్‌గా వుండిపోతాడు మట్టిపెల్ల మహేశం దుష్టషట్కంతో. ఇదంతా చూస్తుంటే మతిపోయినంత పనైంది పరాంకుశంకు.
జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్షలకు ప్రతి సంవత్సరం ఈ బడి నుండి ఏడెనిమిది మందైనా ఇన్విజిలేషన్ డ్యూటీకి వెళ్తారు. ఎప్పటిలా ఇంటర్ పరీక్షలు మార్చి ఏప్రిల్‌లో కాక ఓ సంవత్సరం 'మే' సెలవుల్లో జరిగాయి. అప్పుడు స్థానికంగా వుంటున్న ఏడుగురు అధ్యాపకులు మాత్రమే ఈ బిడి నుండి వెళ్లి డ్యూటీ చేశారు. సెలవుల్లో పనిచేసినందుకు గాను వాళ్లకు 'జీవో ప్రకారం 17 రోజులు లీవు ప్రిజర్వు చేయబడింది. అది మట్టి పెల్ల మహేశం హయాంలోనే-వారు జారీ చేసిన అనుమతి పత్రంతోనేశీ.
పై విషయాన్ని ఆసరాచేసికొని అక్రమవిక్రమార్శులైన దుష్టషట్కం కూడా కాలేజీ లోని రికార్డు అసిస్టెంట్‌ను లోబరుచుకొని,వ్యక్తి ఒక్కంటికి 500 రూ॥ల చొప్పున పారితోషికం చెల్లించి,కళాశాల ముద్ర-ప్రిన్సిపాల్ ముద్ర వేయబడిన 'బ్లాంక్ డ్యూటి సర్టిఫికేటొలను పొందారు. ఇక్కడ హైచ్యం మహేశం గారిక్మూడ ఐదైదువందలు సమర్పణ చేసి 17 రోజులు మర్యు చేయించుకున్నారు. వీళ్లను చూసి ఇచటి నుండి బదిలీ ఐపోయిన మరో ఇద్దరు టీచర్లు డ్యూటి చేయకున్నను అ సమయంలో ఇదే బడిలో వున్నారు కాబట్టి వాళ్లు కూడా అదే పద్దతిలో లంచం లాంఛనాలతో కృతకృత్యులయ్యారు. బ్లాంక్ సర్టిఫికేట్లను పూరించి, మహావీరుడు గ్రీన్ ఇంకుతో ప్రిన్సిపాల్లాగా ఫోర్జరీ సంతకం చేసేవాడు. ఇలా అందరూ కలిసి బోగస్ సర్టిఫికేట్లతో ప్రభుత్వ భాండాగారానికి గండి ఘనంగానే వేశారు.
వీరి ఆగడాలను అన్యాయాలను సహించని మరొక హిందీ పండితుడు సలక్షణ శ అనుమతి పత్రం అనుబంధంలో చూడండి.
అలా వూన్తూర్తు ఐడీ 35 లక్షణాంకుడు 'లక్ష్మణాఖ్యుడు' ఆకాశరామన్న పేరుతో జీల్లా కంప్లైంట్ చేశాడుక్. వారం రోజుల తర్వాత కలెక్టర్ ఆదేశంతో డియీవో యా బోగన్ సర్టిఫికేట్ల తతంగం గురించి లెటర్ వచ్చింది. వచ్చిన లెటర్స్‌ను రిసీవ్ చేసుకొనేది అచట రికార్డు అసిస్టెంటే. వచ్చిన అ వుత్తరాన్ని చదివి అతడు మూడోకంటికి తెలియకుండ చించిపారేశాడు. పైగా ఈ విషయాన్ని రహస్యంగా మహావీరుని చెవిలో వేశాడు. దీంతో దుష్టషట్కంలో అలజడి బయలుదేరింది. ఎక్కడ బయటపడుద్దో? ఏమవుద్ధో? అని భయపడ్డారు. మట్టిపెల్ల మహేశం మాత్రం నిర్భయంగా వున్నాడు. ఎందుకంటే డ్యూటీ సర్టిఫికేట్ల ఆధారంగా ట్రిజర్వు చేశానన్న ధీమాతో.
మూన్నెళ్లు గడిచిన తర్వాత లాభంలేదని మళ్లీ కంప్లెంటు చేయడానికి సిద్ధపడి, లక్ష్మణాఖ్యుడు ఈసారి ౧౬-10౬ పంపించాడు.అదీ మొదటి దానిలాగే మారుపేరుతో, దాంతో జిల్లా పరిషత్ నుంచి తప్పని సరియై సీయీవో గారు మావూరు బడికి తనిఖీకి వచ్చారు. వారితోపాటు వారి పియ్యే అనందం కూడ వెంటవచ్చాడు.
దుష్టషట్మం దుష్టపన్నాగంతో, మట్టిపెల్ల మహేశం గట్టి ఆలోచనతో, వచ్చిన సియీవోను మభ్యపెట్టి మంతనాల్లోకిదించి, “మా బడిలో అలాంటిదేం లేదుసార్ మా బిడి చాలా బాగా నడుస్తుంది. ఎవరో కిట్టని వాళ్లు అలా మీకు కంప్లెంటు చేసి వుంటారు.” అని మృదుమధుర మాయమాటలతో, అతిమధుర ఆతిథ్యంతో నీయీవోగారిని చల్లదిరిచారు. పులిలా గాండ్రించిన నీయీవో గారు మేకలా మే అంటూ తోక ముడుచుకున్నాడు.
సీయీవో గారి వీఎ మాత్రం వదేపదే గుచ్చిగుచ్చి అడిగి ఆరా తీయటం మొదలుపెట్టాడు. అతన్ని కూడ మభ్యపెట్టి ఏకాంతంగా ఓనాడు ఇంటికి రప్పించుకొని మందువిందుతో అతన్ని మందమతిని చేశాడు మహావీరుడు. తాగిన తమాషాలో ఆపియ్యే గారు 'మీ మావూరు చేనేతకు ప్రసిద్ధి కదా! ఇక్కడ దైయింగ్ కేస్మిట్ వ్యాపారం జోరుగా సాగుతుంది కదా! కలర్ గుడ్డలు ఏమైన దొరుకుతాయా?” అని మహావీరునితో మత్తుమత్తుగా మధుర భాషణ మొదలెట్టాడు.
“ఎందుకు సార మహావీరుని ప్రశ్న
“అం ఏంలేదు. మా ఆవిడ లంగాలు కుట్టిషాపులకు సప్లయి చేస్తది, ఇక్కడ ఏమైన ర్-కంస్లైంట్ పత్రం అనుబంధంలో చూడండి. 6-రిమైండర్ అనుబంధంలో చూడండి.
౩ఠ మావూరు ఐదిలాాూూాాాాాాాలాాలాా దొరికితే తీసుకపోదామని...” పియ్యేగారి సమాధానం. అందుకు మహావీరుడు సంకలమంటి సంబ్రంతో, బొండిగెమంటి దుఃఖంతో- “నేన్స పంపుతా సార్! మీకెందుకు చింత. నిశ్చింతగా వెళ్లిరండిమీరు” అని పియ్యే ఆనందం గారిని అనందంగా సాగనంపాడు మహావీరుడు. మరునాడు రంగుల లంగాల బట్టల వేటలో పడ్డాడు మహావీరుడు. దోమీటర్, అడేమీటర్ ముక్కలను సేకరించి, మూటగట్టి స్వయంగా పీయ్యే గారింటికేగి సమర్పించి వచ్చాడు. తిరుపతి దేవునికి నిలువుదోపిడి ఇచ్చినంత సంతోషంతో-పుణ్యం దక్కిన పురుషార్థంతో, అంతటితో ఆ సమస్య సమసిపోయినట్లే అయింది. ఇంతలో తీవ్ర అనారోగ్యంతో అనుకోకుండా అకాల మరణం చెందాడు హిందీపండితుడు లక్ష్మణాఖ్యుడు. మరో హిందీ పండితుడు, మరో సెకండరీ గ్రేడు టీచర్ పదవీ విరమణ చేశారు. మరి కొన్నాళ్లకు పండిత పరాంకుశం కూడ ఉద్యోగ విరమణ చేశాడు. దుష్టషట్కంలో కూడ కొందరు బదిలీపై, మరికొందరు ప్రమోషన్లపై దూరదూర తీరాలకు చేరివోయారు. మరి కొన్నాళ్లకు పండిత ప్రధానోపాధ్యాయులు మట్టి పెల్ల మహేశం కూడ రిటైర్ కావడంతో 'మావూరు బడి పూర్తిగా ప్రక్షాళన ఐనట్లయింది. క్రొత్త స్టాఫ్‌తో కొత్త సొగసుతో మూడు పువ్వులారు కాయలుగా నల్లేరుపై బండిలా సజావుగా సాగిపోతోంది మావూరు ఐడి. గురుభ్యోనమః
నాధా ధారా లకక 1 అనుబంధము 1 అభియోగపత్రం జిల్లా పరిషత్ బాలుర సెకండరీ పాఠశాల, మావూరు, "లేఖ సంఖ్య 4/97 తేది: 6-12-199? శ్రీయుత గౌ అధ్యక్షులు ఉపాధ్యాయ = పోషక సంఘం జీ.ప.(బాలుర) సెపా. మావూరు గార్కి ఆర్యా! విషయము: కార్యవర్గ సభ్యులు శ్రీ షెకలక భోజయ్య గారి అనుచిత ప్రవర్తనపై-ఫిర్యాదు గురించి.
పై విషయమును పురస్కరించుకొని తమరికి కెలియచేయునది ఏమనగా శ్రీ షెకలక భోజయ్యగారు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన నుండి తరచుగా పాఠశాలకు వచ్చి తరగతులకు వెళ్ళి విద్యార్థులను ప్రోత్సహించుతూ, ఉపాధ్యాయులను హెచ్చరించుతూ బోధనకు ఆటంకం కలుగజేస్తున్నాడు. “నేను విద్యా కమిటి మెంబర్‌ను నా సంగతి మోకు తెలియదా?” అని హెచ్చరించుతూ, నేను వచ్చిన, అని ప్రధానోపాధ్యాయులను తరగతి గది నుండి బయటకు వీలిచి, పాఠశాలలో నియంతృత్వ ధోరణితో ప్రవర్తించుచున్నాడు. గతంలో వీరు ఒక విద్యార్థి(ఫేలయిన విద్యార్థికి పాసయిన సర్టిఫికేట్ ఇవ్వుమని అడిగీతె మేము నిరాకరించాము. దీనిని దృష్టిలో పెట్టకొని పాఠశాలకు వచ్చి విద్యాధికారుల్లా మాపై అనుచితంగా ప్రవర్తించుతూ పాఠశాల కార్యక్రమాలకు భంగం కలిగించుచున్నాడు. కావున మా విజ్ఞప్తిని మన్నించి ఆయనను తక్షణమే కార్యవర్గం నుండి తొలిగించ గలరని మనవి చేయుచున్నాము.
సం. కార్యదర్శి
దీని ప్రతి:- తేది: 6-12-199?
| గారి ఉపాధ్యాయ పోషక సంఘం,
న ప్ త్త నలో విద్యాధికారిగార్కి జి. (బాలురు) సె.పా. మావూరు.
లా
త్తి లతా 2 ప్రత్యుత్తరం తేది 10-12-109? శ్రీయుత గౌరవ అధ్యక్షులు ఉపాధ్యాయ - పోషక సంఘము జీల్లా పరిషత్ బాలుర పాఠశాల మావూరుగారికి అయ్యా విషయము: కార్యదర్శిగారు నా మీద ఇచ్చిన ఫిర్యాదు అనుచితమైంది అభూతకల్పన అని తెలుపుట గురించి - వారి లేఖ సంఖ్య: 4/97 తేది: 6-12-1997. పై విషయమును పురస్కరించుకొని తమకు మనవి చేయునది ఏమనగా-నేను తరగతులకు వెళ్ళి విద్యార్థులను ఎప్పుడూ కూడా చెడుగా ప్రోత్సపొంచలేదు. ఉపాధ్యాయులను కూడా నేనేమి హెచ్చరించలేదు. నా కొడుకులు ఇదే పాఠశాలలో చదువుచున్నందున వారి బాగోగుల గురించి బడికి వచ్చానే కాని ఉపాధ్యాయులపై నియంతృత్వము చెలాయించుటకు కాదు. నియంతృత్వము అంటే ఏమిటో నాకు తెలియదు. నమస్కార పూర్వకంగా ప్రధానోపాధ్యాయుల గారిని వారి దగ్గరికెళ్ళి దర్శించుకున్నానేగాని కావాలని వారిని పీలువలేదు, బయటికి రప్పించలేదు. గతములో నేను ఫెయిల్ అయిన విద్యార్థికి పాసయినట్లు సర్టిఫికేట్ ఇవ్వుమన్నట్లు నాపై నేరారోపణ చేశారు. నేనెన్నడూ అలా కోరలేదు. అలా కోరిన వాన్నే అయితే నన్ను కార్యవర్గ సభ్యునిగా ఎలా ఎన్నుకుంటారు? ఉపాధ్యాయులు ఎలా ఒప్పుకుంటారు? గమనించండి. బడిలో జరుగుచున్న అవకతవకలు బయట పడుతాయన్న భయంతో - బడిలోకి నన్ను రానివ్వ కూడదన్న ఉద్దేశంతో లేని పోని విషయాలను కల్పించి మీకు ఫిర్యాదు చేశారు. అంతేకాని అందులో ఎంత మాత్రము నిజము లేదు. విడీలో జరుగుతున్న అవకతవకలు గమనించండి: 2) టీ.ని. ఒక్కంటికి ఇరవై/ముప్పై రూపాయలు వనూలు చేన్తూ సొంతానికి వాడుకుంటున్నారు. 3) ఇటీవలే ఖరీదు చేసిన “సీలింగు ఫ్యాను” కొత్తది సీలు విప్పకుండానే మాయమయింది.
ననన.
- కొందరు పంతుళ్ళు సీీయల్. చెరిపివేసి సంతకాలు చేసినట్లు తెలియుచున్నది. అటెండన్స్ రిజిష్టర్ ఆగస్టుమాసం పరిశీలించినచో తెలియగలదు.
క) కొందరు ఉపాధ్యాయులు ?వ తరగతి విద్యార్థులకు ఉదయము, సాయంత్రము దిడిలోనే ట్యూషన్లు చెపుతూ ఒక్కొక్టరి వద్ద 40/-రూపాయల చొప్పున వసూలు చేసుకుంటున్నారు.
- ముఖాన పులిపిరి, కొంచెము బట్టతల ఉన్న టీచరుగారిని మీ పేరేంటని అడిగితే “మదన్ అని మారుపేరు చెప్పారు. అసలు వారిపేరు “కర్ణుడు” అని తరువాత తెలిసింది. మారు పేర్లు చెప్పి కార్యవర్గ సభ్యుల్నే మోసము చేయటము మన పంతుళ్ళకే చెల్లిందని మనవి చేస్తున్నాను.
పై విషయాలన్ని పరిశీలించి, మా కిస్టమయినచో యథేచ్చగా నన్ను కార్యవర్గము నుండి తొలగింపవచ్చునని సవినయంగా విన్నవించుకుంటున్నాను. ఇట్లు
శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి / లి
శ్రీయుత జిల్లా విద్యాధికారి గారికి ఉపో-సం కార్యవర్గ సభ్యులు
శ్రీయుత పరిషత్ విద్యాధికారి గారికి వూరు.
శ్రీయుత ప్రధానోపాధ్యాయులు గారికి
గ్ అలాల భ లొతులను నానా నాలులు & సాంత్వన గీతం ఎందుకు ఈ జగడం? పదియవ తరగతి పరీక్షలప్పుడు ఓ పండిత పరాంకుశం! పైరవీలు చేపట్టిన యప్పుడు గడ్డి గాలికీ పోతేయేంది? అటెండరే ఆఫీసురూములో వడ్లు వాగులా పోతేయేంది? జవాబుపత్రాల్ చాటుకురాసి నీ జీతం నీకొస్తే చాలదా? 1 కుడికేయేంది? కడితే యేంది? లపోటోళ్లతో లపడా యేంది? ॥ఎ॥ టీసికి ఇరవై ముప్పై అంటు మెమోకు పది పదిహేనూ అంటు చెల్చీస్ జనవరి పండుగనాడు తీసుకుంటె నీకెందుకు మంట? జెండెగరేసి జల్బాచేస్తే దోసుకుంటే నీకేమిటి తంట? ॥ఏ॥ | సిక్కోళ్లాక్కూ దించకపోతే ఎవడోదొంగా ఎత్తుకుపోతే సహక ప్రస్తూాంకు ఎందుకుబాధ? నీకిదివాదా? జరిగే నష్టం ఏమిటి నీకు? అగ్రహించుటా వృధాన్యధా తుగ్లకు పాలన వినలేదా? ఎ కలిగే కష్టం ఏమిటీ నీకు? ఎ “ల 'బోరువెల్లనీ బడిలోవేస్తే అక్రమఫీజులు వసూలు చేసి 'బారాహజారు' ఖరే, ఐతే వందల్లో చందాలను కూర్చి క్ ఏ పదారువేలా వోచరుపెట్లి తప్పుడు తడకల బిల్లులు పెట్టి వ్ ల దిడీ ధనానికే గండీ కొడితే, మందులతో బల్విందులుచేస్తి ఎందుకు మంట? ఏమిటి తంట? ఎందుకు నీకా 'మందుల' ధ్యాస? నీ ముల్లేమిటి పోయిందంట? కా ఎదిరించుటయే వృధా ప్రయాస. ఎ క ్ష
అలా శ! డ్తీ ప్రిజర్వులీవు మంజూరి పత్రం ప్రధానోపాధ్యాయులు జీప.సె.పా. (బాలురు) మావూరు గారి కార్యనిర్వహణ పత్రము సమర్శణ: శ్రీ మటిపెల్ల మహేశం యం.ఏ. బి.యిడి. లేఖ సంఖ్య: 46/98-99 తేది: 21-08-1998 విషయము: విద్య-వ్యవస్థావన 1998-99, మే1999 మానములో జరిగిన ఇంటర్మిడియెట్ పబ్లిక్ పరీక్షల్లో వేసవి సెలవులు ఉపయోగించుకొనక పనిచేసిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవు భద్రపరచుట గురించి. సూచిక: 1. సంచాలకులు పాఠశాలల విద్య ఆం.ప్ర. -హైదరాబాద్గారి ఉత్తర్వు సంఖ్య 2348/సి2-3-/97. తేది: 15-11-1997 ఓ ప్రభుత్వ ఉత్తర్వు నెం. 85. తేది: 16-1-1981. త. సంబంధిత ఉపాధ్యాయుల 80 ౮౯౪0216 మరియు వినతి పత్రముల ఆధారంగా ఉత్తర్వులు: పై విషయమును పురస్కరించుకొని పై సూచికలను అనుసరించి 1996-97 విగ సంవత్సరమునకు సంబంధించి మే 1997సం॥లో జరిగిన ఇంటర్ మిడియట్ పబ్లిక్ పరీక్షల్లో పని చేసిన ఉపాధ్యాయులు వేసవి సెలవులు అనుభవించక నష్ట పోయినందుకు దిగువ పేర్ళొనిన ఉపాధ్యాయులకు 6.0. 13. 10.35. తేది:16-1-1981 మరియు ఆం.ప్ర. సెలవు నియమావళి 1998 ననుసరించి సంబంధితసిలవు భద్రపరచుచు ఉత్తర్వులు జారీ చేయనైనది. సర్వశ్రీ
- పరాంకుశం 791 17 దినములు
- రామదబ్రహ్మాచారి 11 ॥1 17 దినములు
- మహావీరుడు 3087 17 దినములు
- సి.హెచ్. హనుమంతు $09” 17 దినములు
- యం.డి మౌలానాసాబ్ 1 17 దినములు
- శ్రీమతి రాజమణి 5037 17 దినములు
- కలమంద 50987 17 దినములు సం, మట్టిపెల్ల మహేశం ప్రధానోపాధ్యాయులు జి.ప, సె.పా.(బాలురు) మావూరు.
త లతలా 6 కంప్పెంట్ లెటర్ ల 87 ౧౬౦0, ౧౦51 114ఉ4ఉ/00౧౮ 04196: 30-12-1998. 0 "06 00116640? & 0151. ౪4015416, గింం060166 51 540: 2253 604. ౧19౧ 806100! (80౧), 144౧00౧ 0144 0 6౧01500601 6౧౦1౮౧౧9౧5 ఈ 9076౧06 164 0/ ౧060640100 00003 2160౧02006 06102163 - [౧6౧14631 0! 6౧6041౧/ -౧౮.
6 10400 ఈ 1౧93 జం 301166 103౧౪ 1076 ౧౦09 2౧6 3౪11209 20000 1౧ 6 ౧4161.
115 300గ1166 141 8 *14గ82064 2006 ఫోడ604౧గ౧౦౧2౧ ౦ &/9 *0౧100 428 5687 351 194006౧5 1౧ 253 604. ౫19౧ 500001 (80/3), స22/004 ౧4 6౧019060 17 64/5 0 68౧60 1624 1౧ 1106౧౫ 1997 0/ ౧0600100 00005 గీగంగి 64౧06 06౧1104169 ౪0) 10/090/ 90041416 ౦ 6 ౧౧౦౧4, 1604, ౮౮౧10 001606, 12800౧ $14800 41 6/ ౧4౭4 2160066 116 660 10 1౧19౧6౦116 ల4౧1౧440౧౩ ౧616 1౧ *ఖ, 1997. 601169 ౪99 జీ30 ౧౧౫66 10 115 61601 10 16 56౧0/08 80016 01 16 [19906014 1౧00౪/00- జం. శీ 61501616 6౧0410/ *| 6462 6 ఓయి 1౧ 6 ౧416౧
1113 16191019 ౧900651606 10 4౮696 0 6౧601/ 1౧10 16 గొణం! 206 10146 61501011020/ 20100 2041౧91 6 2004 140 620095 10 161 ౧౧౦4 1౧0 6640/ [6006౧౧౦ 9 2000౮౧1
11206400 ౧0౪ 91 009 1010410 (౧ ౪0461౧1) 0009 940౧011186 10 6 0151. ౬000200024 0%091 ౪101 & 5014 ౧6066351 ఘన 1 తతత వడా.
అనా తనానికి తొతొత నాలకను నకునన ననున నాక. న్! 6 రిమైండర్ లెటర్ 8౬-౪10 14ఉఉష/00గ౮
04166: 31-03-199. 0 7౧6 0౧16 ద60ఈ 0%08 ₹||& ౧౭౧9046, 51
50: 00గ౧|4|౧|- 4౦41091 6 2౧4 *అంగం126 16 1401 = గం౧౮651606 -౧604/6100.
గీ5 10 ౧9 42004 900165, |! 2౧) ౧660 1౧0/౫ ౪౦౪ 144 ఉ|౧/6 11 | ౧44 069౧ ౧గ౧౧|4౧66. 8641 ౧౦1 41860 &౧౫/ 2040౧ 90 18!
06 00% 1940063 “1404064 406 ౪14640గ౦౧&౧ ౦1 2.55. 80% సీషష/00!/4 16 ౧౦ *౦౧4(66 [౧౫౦11400 640 41 60౪4. ౮౧10 001160, 11280010 1౧ 16 ౪64 ౧౪ 1997, 10 1౧19066146 ౬4౧1౧400౧9. 6 004001 640 ౧10816 *0) 1006౧/ 30214/63 ౦ 6 ౧౧౧౮౧౫.
తీ౧ర ౧6 16 2466 176/3 ౬2066 ఓ6ఖ465 2౧౮ 96/90౧06196 41 2.0 96000640/ 500001, స14ఉ2/0014 1౧ [106౧౦ 1998.
శీరు&|౫/ 0౧|/ 7 1980066 4/6 60౧6 540% 60/ 2006 1460 17 64 ౬1/66 [64/63 2౧౮6 3476౧౮6660 1౧ 0010061, 1990.
70 6౧011 ౪౧% 6 0౮0 ఆగ॥[0416 41 604. ౮4౧10 0011996, సీ22/00గ) 206 1126 ౧౦౦9౩52/ 20000.
)జకంం్ర 304 88 05 12011 (౧.౪04061) స!22/0014. 000/10 4.068. 0902గ6౧1 3 జ
న! ముద్రిత రచనలు 1 శిష్యద్విశతి (కందాలు) 1982 2 జీమూతవాహనుడు (పద్యకావ్యం) 1986, 1995 (జాతీయ సాహిత్య పరిషత్ అవార్డు పొందినది) 3. శకుంతల (హరికథా ప్రబంధం) 1988 తేది 11-9-1995 రాత్రి గం. 9-80 ని॥లకు ఆకాశవాణి కడప కేంద్రం నుండి ప్రసారమైంది. కథకులు: తాటికొండ గణేశభాగవతార్, విజయపురి. 4. పాండవ జననం (హరికథ) 1991 (ప్రొ.శ్రీ. తెలుగు యూనివర్సిటి అవార్డు పొందినది) 5, ద్వయీ నాదం (ఖండకావ్యం) 1993 6. పాండవ అజ్ఞాతవాసం (వీధినాకటం) 1994 7. పంచామృతం (సాహిత్య వ్యాసాలు) 199? 8. అభినందన చందనం (గేయకృతి) 2000 (పొ.శ్రీ. తెలుగు యూనివర్సిటి అవార్డు పొందినది) 9. పాటల పల్లకి (గేయాలు) 2003 10. సాహితీ సమదర్శనం (షష్టిపూర్తీ సంచిక) 2004... 11. మావూరు ఐడి (అధిక్షేపకథ) 206షళఊళట్యు 0 వాలబు _ [| స్తన
- ౫ళ). 04 త అ |! తో ణీ 0.9. అధివళం క4 68640. ఖో కాం
గ4ఉ*/అంంణిఓట 84ల। / [( | ౧౧౦౩6 - | , ః మ నడుస్తాడు. ॥ (| న న జ, ॥ నా. హాజిరగును ఒక పంతులు. ం | (గ సట! శి ॥ - ఇ శు. స 2 _ యొన్మిాంలవం / న్ 1 మిగిలిన ఆ సగం నూనె నస.” "వాల | . సా. | న. [హం శి