Telugu maro konam - anilvaranasi/indianlanguages GitHub Wiki

అన్నవరం దేవేందర్‌ (ల (60 క ం ౧ 6౮) మీ లల | (౧6) నూ స్‌ -. న్‌. ల "| రే " ॥ న తోట్లు ఉల సాలా " ( ల. ఇ గ స వ టి శ [=]. గ్‌ - వ శమ త్రీ ౮ ప! ॥

(కాలమ్స్‌, సాపొత్వ, సామాజిక వ్వాసాలు/ అన్నవరం దేనేందర్‌ మూతన నాహెతి తి (స్టాపితం : 1985 రినెం. 5481/96) హునీష్షూర్‌ హుస్నాబాద్‌, జిల్టా కరీంనగర్‌.

ఖే న వ. | టు శం? ౮ గం భౌాల ఉట టి లాలయ సై లి న. శి లా నఖాటు [6 10.14 ( షు త టో యయ ॥ ల్ని హైదంా బా డోర్ట00 3 ౮0 గీగీఉీగిం స౦ంగ[మీగ (06013003, [8620 106 50021 క3ా 93019066 10 *1గ035 కషం్రై22006) ల్స న స తివి తివి? అ గం[0 లల0[[4000 110000 టగర!. 20014100 10. 5 కణ! ని2ర[ం1ం6. 0760060 2002 గ. క్షక్‌/ (పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్థిక సహాయంతో ముద్రించబడినది) (౧౮. గం *16 రిలైం:ం-ర్పు6ీ, క00006 234 503001 06 1 క0[06001ట : 17-40, మ20644 30110, 22య05% 6౮101,

10504040-505 467 0136 60000181 ఈలి 20. 08721-255433

  1. నెత్తురు కన్నీళ్ళ పరిమళం తెలంగాణా జ్ఞాపకం... ం ఎలయ లకే
  2. అధిపల్యాలను ధిక్కరిస్తూ విస్తరిస్తున్న అస్రిత్వ సాహిత్యం ... .......... ౨4ర్‌ 3, తెలంగాణాతనాన్ని పోగొట్టుకున్న తెలుగు... లయల జు కేకే
  3. కల్లోల నేలలో మానవతావాద సాహిత్యం... ౨౨ అం యలు కేక
  4. వెయ్యేండ్ల కరీంనగర్‌ సాహిత్య చరిత్ర... ౨౨౨ అల ఆలకేరీ
  5. కధా సాహిత్యాలకు కొత్త 'బడి' టం లం టం వలల ఆఆ ఆ టైరే
  6. మల్లేశం మరో (ప్రపంచ స్వాప్నికుడు... ౨౨ ౨౨౨౦౦౦౦౦ జలం ఆం 2తే
  7. సంస్కృతి పరాయీకరించబడుతన్నా మనకు సోయి లేదు... ! ......... 26 9, సాంస్కృతిక పరాయీకరణలో (శ్రామిక సంస్కృతి... ౨ 29 10 ఎవరిదీ ఎక్కువ కులం, ఎవరిదీ తక్కువ కులం ?........ ౨౨౨ ఎతె2
  8. సిద్దాంత రాహిత్యం ! భావజాల ప్రచార లోపం ౨౨౨౦౨౦ అ కిక్‌
  9. భారతీయ సంస్కృతి అంటే 9... టం ఆయు లుం టల ఆతెర్‌ 198 పలచనవుతున్న పాత్రికేయ వృత్తి. ల దంల ఆం ఆ డీకే ఏ 14. సమాన జీవన (స్రవంతిలో కలిసేవరకు రిజర్వేషన్లు కొనసాగించాలి .......... 44
  • 15, మాయదారి ఎన్నికల్లో ఓడిపోతున్న ఓటరు లం డీ? శ. 16 తుపాకుల కుతి తీరేదెప్పుడు ? పల్లెలు సల్లగుండేదెప్పుడు ?.............50 స్‌ 7 కరువు పర్యటన... బ్రిటానియా బిస్కట్టు....౨4 ౨౨౦ ఆఆ జారీకి 1/0 18. వైకుంరం ముచ్చట్లు. ం4ల0లర వ వ ప లతల అ వల టల 56 6 19. కరువు ప్రాంతంలో బతుకమ్మ పాటి 4 ంట4లల ఆంజ ఆ ఆర్‌రీ గ్ర 20. పైరవీ వ్యవస్థ... ముర్దాబాద్‌... లట అం లలల లయల ఆఆ ఆఆ రర
  1. ఈ అన్నాలపు సచ్చుడుకు పాపం ఎవలకు కొట్టాలి ?.........౨ 62
  2. ఓట్ల పండుగెల్లింది... ఇగ మాకైకిలి కూలి మేం జేసుకోవాలె...... ఎ. రడ 23, నైజాం కాలంల పుట్టనే లేదు ఫించన్‌ లిస్ట్‌ల పేరున్నది. .. ................... 66 24 నిండినోందే నిండుతుండె. . ఎండినోందె ఎండుతుండె.. ౨.౨౨౨ 68
  3. మేం ఓట్ట కాయలు కాసే చెట్టమా ?..౨౨౨౨ ౨౦౦౨ అలుల లం 0
  4. వ్యాపార కళగా (ప్రజా ప్రాతినిధ్యం వం లం అలం టంరరం ల పంటల ఆోటుంల ఆలం ఆం ల ఆం ఎం ౯8
  5. ధరల మీద ధరలిట్టా పెరగవట్టె నాగులో.. నొగన్నా...ఎ ఎల 76
  6. కళ ఎవరి కోస౦ ? ౦౦౦వ అ ంయంలు వర పటం అంట ఆ ఆయాలు అఆలు. కరీ
  7. (గ్రామీణ విలేకరి - సామాజిక బాధ్యత... ౨౨౨౨౦౨౨౦౨౨ రి0ి
  8. వాణిజ్య సామ్రాజ్యవాదం ఆయువుపై లాడెన్‌ దెబ్బ............... 83 ౩1 వాస్తులో వాస్తవమెంత, అవాస్తవమెంత ? ౨౨౦౦౦౦ ఎలి కిక్‌
  9. రికాం లేకుండ పనిచేస్తం గానీ పేరు మొగోల్లది ౨౨౨౨౦౨౨౨8౯
  10. “తొవ్వ” చిత్రాలు. ౨౦౨౦ల పటయయలటల లలల అలు అలకే

ము

ఉనా అఒక్క ముచ్చట 'జీపగడ్డ” దినప(త్రిక ఎంతోమంది జర్జులిన్ట్‌లకు జీవం పోపంది జర్జలిన్ట్‌గ్లా రచయితగా నా ప్రస్ట్రానం (7985) ఇక్కడి నుంచే.

॥ రే 7986 నుంచి 2002 వరకు పత్రికల్లో రాసీన వ్యాసాలు, శ్రర్షికలే

ష్ట్ర ఈ పుస్తకం. ముఖ్యంగా 'ప్రతివక్షం'లో ఇన్హర్‌ డా పేరుతో

ఖై మరో కోణం' శీర్ణిక నిర్దహించాను. జీవగడ్డలో బాతాఖాని?

ళా అన్నలో గిదేందన్నో: ఈ రాతల న్ధుందనతో మిత్రుల నుంచి

ళల ఎున్తకం వేయాలనే మూచన వల్చింది. ఈ కాలమ్స్స్‌కు తొడు

ల్‌ వార్త ఆంధ్రజ్యోతి" ఇతర పత్రికల్లో నంకలనాల్లో రాసిన రాతలల్టీ

కలిపి ఈ మరో కోణం” సామాబిక వ్యాసాలు, కరీంనగర్‌లో జీవగడ్ద' అంటే విలేకరుల విద్యాలయం,

న్‌ ప్‌ దీని వృచస్థావకులు బి: విజయ్‌కుమార్‌ గారికి వందనాలు,

నం. 'అన్సుకు వీ ర!

స న్‌ జ. అట్లాగే అయిలి రమేన్‌ 'అన్ఫు'కు, వట్టల రలీందల్‌ చర్చకు,

ప. నాలో మరో కోణం' వట్టుబట్టి రాయించిన

స [2 పాత్రికేయ మిత్రుడు వజుల్‌ రహమాన్‌కు

గే న ఫచ్లా | ను

టంంపే కృతజ్ఞతలు ఇంకా నన్ను ప్రోత్సహిస్తున్సు మిత్రులు, సాహిత్య, సామాబిక్త పాత్రికేయ రంగాల్లో ఎందలో ఉళ్లారు. అంతమంది వేడ్డు ఇక్కడ ఎలా రాయను. అందరికీ వృాదయవూర్తుక వందనాలు.

త్‌ | జనుల |. శ. జడా ఎ

ళు ర (1 డాక్‌ డే రో గ్ల య కయ్‌... స్‌ లే నెత్తురు కన్నీళ్ళ పరిమళం తెలంగాణా జ్ఞాపకం “చల్లబడదు చల్లబడదు తెలంగాణా విన్తవార్డి ళం ౮ ళా

మళ్ళీ చెలరేగుతుంది ఆగకుండ పోరుతుంది”

'తెలంగాణా' ఇది ప్రపంచ విష్ణవోద్యమ చరిత్రలో అత్యరెత చారిత్రక పదం. రష్యాలో వచ్చిన బొల్సివిక్‌ విప్లవ స్ఫూర్తి దీనికుంది. వియత్నాం, చైనా, క్యూబా లాంటి దేశాల్లో ప్రజలే ఆయుధాలు పట్టి ప్యూడల్‌ పాలకులపై తిరగబడ్డ చరిత్ర వలె ఇక్కడి తెలంగాణాకు అంతటి పోరాట చరిత్ర ఉంది. 1946-51 మధ్య సాగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ కమ్యూనిస్ట్‌ ఉద్యమ నేతలను ఆకర్షించింది. 'తరతరాల బూజు' నిజాం రాజును అతని కిరాయి సైన్యం ఖాసీం రజ్వీ రజాకర్లపై ఇక్కడి (గ్రామ (గ్రామాన తిరగబడ్డ చరిత్ర ఉన్నది. నిజాంను, అతని ప్యూడల్‌ దొరల, సామంతులపై కదనరంగంలో కలబడ్డ చరిత్రాత్మక గాధలు తెలంగాణా (గ్రామాల్లో ఉన్నాయి.

కాకపోతే తెలంగాణా సాయుధ పోరాట చరిత్ర చారిత్రాత్మకంగా రచింప బడలేదు. తెలంగాణా సాయుధ పోరాటంలో నాలుగువేల ఐదు వందల మంది అసువులు బాసారు. వేలాది మంది చిత్రహింనలకు గురయ్యారు. జైల్లల్లో

మరో కోణం

మగ్గారు. అయినా వీరి పేర్లని భారత స్వాతంత్ర్య సం(గ్రామ చరిత్రలో పొందు పరచలేదు. భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో తెలంగాణా సాయుధ పోరాట ఘట్టం లేనేలేదు. ఇక్కడ పోరాటంలో పాల్లొన్న రావి నారాయణరెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డిలాంటి వాల్లు రాసిన చారిత్రక ఆధారాలే తప్ప ఈనాటి యువతరంకు తెలియాల్సిన భారత జాతీయ చరిత్రలో లేదు. ప్రస్తుతం జరుగుతున్న నైజాం విమోచన ఉత్సవాల్లో తుపాకితో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన 'బందగీ' పేరుగాని, 'చాకలి అయిలమ్మ' కేరుగాని లేవు. 1945 సెష్టెంబర్‌ 17న నిజాం రాజు సర్జార్‌పటేల్‌కు లొంగిపోయిన మాట వాస్తవమే అయినా 1948కి ముందు చాలా సంవత్సరాలుగా నిజాం రజాకార్లతో తెలంగాణా (గ్రామాల్లో దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్ట్‌ కార్యకర్త లున్నారు. అసలు చిక్కల్హా సర్దార్‌పటేల్‌ నాయకత్వాన ఇండియన్‌ పోలీసుల ముందు నిజాం లొంగిపోవాలనుకోవడం యూనియన్‌ ససైన్యాలవల్ల భయంకాదు. తెలంగాణా కమ్యూనిస్ట్‌ రాజ్యంగా అవతరిస్తుందనే భయం. ఈ భయం ఇటు నిజాంలోను అటు పటేల్‌లోను ఉంది. కమ్యూనిస్ట్‌ దళాలపట్ట వివేచితుడై దళాలు నిజాం తాకిడికి తట్టుకోలేదు. తను లొంగిపోతే కమ్యూనిస్ట్‌లకు రాజ్యం వస్తుందని అందుకు సర్దార్‌ పటేల్‌ లొంగుబాటుకు అంగీకరించారు. తెలంగాణాలో కమ్యూనిస్ట్‌లు రాజ్యం ఏలడం సహజంగా పటేల్‌కు ఇష్టంలేదు. నిజాం హయాంలో తెలంగాణా సంస్కృతులు, తెలుగు భాష వికాసం అంతరించి పోతుంది. ఇస్లాం సంస్కృతికి పట్టంగట్టే స్థితి నాడుంది. ఇదే దళలో వల్లభాయ్‌పటేల్‌ జాతీయ భావాల రాజకీయాలతో కమ్యూనిస్ట్‌ను ఎదుర్కోవాలంటే నిజాంసైన్యం ఇండియన్‌ సైన్యం కలవాలని కలలుగన్నాడు. ఆ పర్యవసానమే లొంగుబాటు అప్పటికే కమ్యూనిస్ట్‌ (గ్రామాల్లో భూస్వాములను తరిమివేసి వాళ్ళ ఆధీనంలోని వేలాది ఎకరాలను (ప్రజల పరం చేసాయి. 'చుట్టుముట్టు నూర్చపేట, నట్ట నడుమ న్హిగొండు గోలకొండ కిలా కింద నీ గోరి కఢతం కోడ్రకో నైజాం నర్భలోడా' అన్న చందంగా నైజాంకు రాజ్యం పతనం అయ్యే స్టీతిలో కమ్యూనిస్ట్‌లు రాజ్యం చేసే వారు. భారత ఉపఖండంలో ఎర్రజెండా ఎగరడం ఇష్టంలేకనే సర్దార్‌ పటేల్‌, జవహర్‌లాల్‌ నెహ్రూలు కలగలిసీ నిజాంతో విలీనం అయ్యారు. అదివరకే రజాకార్డు వేలాది మంది రైతులను ఊచకోత కోస్తున్న ఘటనలకు నిజాం సంస్థానం, ఇండియన్‌ యూనియన్‌లో విలీనం అయినందున యూనియన్‌ క్రో అన్నవరం దేవేందర్‌

'సైన్యాలుసైతం రజాకార్లతో చేతులు కలిపాయి. ఇటు రజాకార్హు అటు ఇండియన్‌ 'సైన్యం హైదరాబాద్‌కు పారిపోయిన భూస్వాములు తిరిగి (గ్రామాలకు, గడీలకు వచ్చి కమ్యూనిస్ట్‌ దళాలను నిర్దాక్షిణ్యంగా ఏరిపారేశారు. ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్ట్‌ ఉద్యమం విఫలం అయి తుపాకీ దించే స్థితికి వచ్చింది. ఇలా కమ్యూనిస్ట్‌ కార్యకర్తలను 5 వేలమందిని అంతం చేశారు. చాలా ఉద్యమాల్లో ప్రజలు పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పోరాటానికి పరోక్ష సంఘీభావంగా ఉంటారు. కొని ఇక్కడ ప్రజలే వెట్టిచేసి బానిసలుగా బతికిన చరిత్ర ఉంది. వర్ణ వ్యవస్థ ఎర్చ్బరచిన పొపపంకిలం చుట్టూ అల్టుకొన్నందున అన్ని వర్ణాలవాళ్ళు ఈ పోరాటంలో పాల్గొన్నారు. కాని వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళు తీరలేదు. భారతదేశంలో తెలంగాణా విలీనం అవడంతోనే పోతాయనుకున్న బాధలు, కన్నీళ్ళు, సంకెళ్ళు అలాగే ఉండిపోయాయి. ఇలాంటి ఘనచరిత్రగల తెలంగాణా గడ్డమీద 1251లో ఆంధ్రప్రదేశ్‌ అవతరించి, ఆంధ్రరాజ్యం కొనసాగింది. ఆంధ్రపాలకుల వలస దమననీతికి వ్యతిరేకంగా తెలంగాణాలో 1969లో మరోసారి ఉద్యమం వచ్చింది. కాని అది రాజకీయంగా పదవుల పందేరంతో జతకట్టి చెన్నారెడ్డి నాయకత్వాన విఫలం అయ్యింది. ఈ ఉద్యమంలో తెలంగాణా యువకులు 395 మంది అమరులయ్యారు. మొదటిసారి తెలంగాణా సమసమాజస్ట్రాపనకు సోషలిస్ట్‌ రాజ్య ఆవతరణ కోసం జరిగిన పోరులో 4500 మందిపైగా అమరత్వం పొందగా, 1969 ప్రాంతంలో జరిగిన ప్రత్యేక తెలంగాణా పోరులో చెన్నారెడ్డి దాష్టీకంతో మరోసారి మోసపోయింది. ఆ తర్వాత ఫజుల్‌ అలీ కమీషన్‌ యస్‌ఆర్‌సే రిపోర్టులో కూడా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలని పలువురు పెద్దలు జవహర్‌లాల్‌ నెహ్రూతో సహా చెప్పినా 'పెద్దమునుషుల' ఒప్పందంతో సరిపుచ్చారు. దానికి సైతం తూట్లు పొడిచారు. తెలంగాణా సాయుధ పోరాటం వారసత్వంగా నక్సలైట్‌ ఉద్యమం తెలంగాణా జిల్లాల్లో 1979 నుంచి వేళ్లూనుకొని పోరాడుతోంది. గెరిల్లా జోన్‌ ఏర్పాటుతో ముందుగా చిన్నరాజ్య స్థాపనతో మిలటరీ జోన్‌కు పథకాలు సిద్ధం చేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. తెలంగాణాలో నక్సలైట్‌ ఉద్యమం వల్ల ఇప్పటికే 3000 మంది యువకులు ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. ఇలా 'తెలంగాణా' నేల ఉద్యమాల తో, త్యాగుల అమరత్వం నెత్తుటితో తడిసిపోతుంది. పాలకుల హైటెక్‌ ఎత్తులకు తట్టకొంటాననే ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు 1997 నుంచి ప్రత్యేక తెలంగాణా మరో కోణం

ఉద్యమం ఊపందుకుంది. 1946నాటి రాజరిక రాజ్యంకు, 1969 నాటి కాంగ్రైస్‌ రాజ్యంకు, 1998నాటి రాజ్యంకు తేడాఉంది. ఉద్యమకారులు గతపోరాట చరిత్రని మమేకం చేసికొని ప్రణాళికలు వేసుకున్నట్లే పాలకులు వేసుకుంటున్నారు. ఇది "హైటెక్‌ కుయుక్తులతో ప్రజాస్వామిక తెలంగాణాను అణిచేందుకు కుట్రలు పన్నుతుంది. ఇలా తెలంగాణా రాష్ట్రం పేర్ర రాజ్యం "పేర, గెరిల్డా జోన్‌ పేర ఇంకా ఎన్నివేల మంది నేలకొరగాలి ? ఎన్ని ఏళ్ళు పోరాటాలు జరపాలి ? అంతు చిక్కని (ప్రశ్నలుగానే ఉన్నాయి. ఆంధ్రలో కమ్మలు పెత్తందారీలో ఉన్నారు. తెలంగాణాలో రెడ్డు, వెలమలు పెత్తందారీలుగా ఉన్నారు. ఈ రెండు వ్యవస్థలను బ్రాహ్మణులు నియంత్రిస్తూ ఏ వ్యవస్థలోనైనా 'సుప్రీంగా ఉంటున్నారు. (ప్రత్యేక తెలంగాణొ వస్తే అందులో దళితుల (ప్రశ్నలకు జవాబులుంటాయా ? బహుజనుల వెతలకు పరిష్కారం ఉంటుందా ? ఇలాగే కార్మికులు, కూలీల, (స్త్రీలు, ఆదివాసీలు, మైనారిటీలకు స్వేచ్చా తెలంగాణా లభిస్తుందా ? ఇలా తమతమ రంగాల్టో తమ 'పైన ఉండే సకల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ఆయా వర్గాలు పోరాటం సాగిస్తు న్నారు. ఈ సాధించే తెలంగాణాలో దళితులు, (స్త్రీలు, బహుజనుల ఆత్మగౌరవం నిలబడుతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 'తెలంగాణా' "పేరిట వేలాదిమంది (ప్రాణ త్యాగం జరిగింది. త్యాగం అజరామరమైంది. అయినా మళ్ళీ ఈ తెలంగాణా 'సాయుధం' లేకుండా 'తిరుగుబాటు' లేకుండా ప్రజాస్వామికంగా వస్తుందా ? (ప్రస్తుతం నక్సలైట్‌ ఉద్యమాల్లో 20 శాఖలు 10 పాయలు దళిత బహుజన ఉద్యమాల్లో 10 పాయలు, తెలంగాణా ఉద్యమంలో సైతం 20 పాయలు ఇప్పటికే వేళ్ళూనుకొని ఉన్నాయి. ఈ వైఫల్యాల అనుభవాల నేపథ్యం నుంచే తెలంగాణా సాయుధ పోరాట స్వర్జోత్సవం న్ఫూర్తితో తెలంగాణా సాధనకు కృషి జరగాల్సి వుంది. 'వ్రతివక్షం' వక్తవ(్రిక 7-5 అక్టోబర్‌ 098 క్ష అన్నవరం దేవేందర్‌

డు బీ ఓ అధిపత్యాలను ధిక్కరిస్తూ విస్తరిస్తున్న అస్తిత్వ సాహిత్యం తెలుగు సాహిత్యం సమస్త సామాజిక అధిపత్యాలను ధిక్కరిస్తూ నిరంతరం కొత్త మెరుగులు దిద్దుకుంటున్నది. నాటి అభ్యుదయ సాహిత్యం నుంచి నేటి వరకు సొంత గొంతును వెతుక్కునే స్థానిక అస్తిత్వం వరకు అన్ని అణిచివేతలకు సాచివేతలకు వ్యతిరేకంగా నిలిచేవే. తెలుగు సాహిత్యంలో ఇప్పుడు వీస్తున్నది అస్తిత్వవాదం. తమ మూలాల్ని, తమ సంస్కృతిని, భాషను, యాసను పరాయీ కరించబడటంపట్ల కవి నేడు నిప్పులు కక్కుతున్నాడు. “నిలువు దోపిడీకి గుర్తులం మేము/వివ్షబారిన చిక్కిన శిధిలాలం మేము మా భాషల మన్ధువడింది/మా సాహిత్యం గంగల కలినీంది మా నంన్కృతి మనీబట్టుతోంది/అధికారం కోనం మీ ఆరాటం అోల్తం కోసం మా పోరాటం” (శ్రీదాస్యం లక్ష్మయ్య) అంటూ ఒంటి నిండా పరాయతనం నిండి, సొంత ఆత్మను గుప్పిట్ల పెట్టు కున్న వైనం నేడు ఎల్లెడలా కనిపిస్తుంది, 1995 నుంచే ఈ అస్తిత్వవాద సాహిత్యం ఊపు ఆందుకుంది. 1960 తర్వాత వచ్చిన అభ్యుదయ సాహిత్యపు కొనసొగింపు 1970వ దశకంలో వచ్చిన విష్ణవ సాహిత్యం అయ్యింది. ఇంకా అందులోని కనిపించని వివక్ష కోణాలను పట్టుకున్నదే 1980వ దశకంలో వచ్చిన (స్త్రీవాద సాహిత్యం, 1990లో వచ్చిన దళితవాద సాహిత్యం కూడా తమ మూలాల్ని తమ అస్తిత్వాల్ని తెలియచేసేవే. 1995 నుంచి వస్తున్న ప్రాంతీయ స్పృహ కూడా ఈ పరంపరనే. మరో కోణం

సాహిత్యం సామాజిక జీవితాలకు అవసరంగా నిరంతరం చలనశీలమై జ్వలిస్తుంది. మానవ జీవనయానానికి కొత్త కోణంలో నూతన పోకడలను ఆవిష్కరిస్తున్న విషయం ప్రపంచ సాహిత్యం నుంచి వస్తుంది. సకలదోపిడీ, అణచివేతలను ప్రళ్నించే దిశగా తెలుగు సాహిత్యం విస్తరిస్తుంది. భూస్వామ్య పీడనను, పెట్టుబడిదారుల దాష్టీకానికి వ్యతిరేకంగా రాజ్య అణిచి వేతకు వ్యతిరేకంగా విప్ణవ సాహిత్యం ఉద్భవించింది. ఆ తర్వాత పురుష అహంకారానికి, పితృస్వామ్య దృక్పధానికి ప్రతీకారంగా (స్రీవాద సాహిత్యం వచ్చంది. తర్వాత దళిత సాహిత్యం ఈ నేలపై కొత్త బాసలు చేసింది. ఇది (బ్రాహ్మణవాదంకు వ్యతరేకంగా ఎక్కుపెట్టిన బాణం. (బ్రాహ్మాణ అధిక్యం అంటే హిందూత్వ సిద్దాంతంను వ్యతిరేకిన్తు అ(గ్రవర్షవాదనను, దాని పెత్తందారీ విధానాలను దళితసాహిత్యం తన కాలిగోటితో తరిమికొట్టింది. “నా ఆశ్రీతాన్లి వేధించి నా బీవితాన్చి నిషేధించిన వచునంన్కృతి మీద చెండ్రకోలా రుళిపిస్తాను మూతికి ముంతగట్టి చెవిలో నీనం పోసిన గుంట నక్కల ముఖాల మీద యానిజ్‌ కుమ్మరిస్తాను ఇప్పుడు నేను మండుతున్లు గుండె డమ్దు మీద నినదించే నివ్టుల పాటను” (కోయీ కోటేశ్చరరావు) అంటూ అస్తిత్వ వేదన ప్రకటించింది ఇదే (క్రమంలో బహుజనుల తమ స్వంత గొంతును దళిత సాహిత్యంలోనే వెతుక్కున్నారు. “పంద వులుల మభ్వన మేకలా వేయిమంది అ(గకులన్తుల మధ్బ ఉక చాకలిగా/ఒక కుమ్మరీగా మంగలిగా బ్రతకడం ఎంత దుర్ధరం కుడితిలో పడ్డ ఈగలా/ఈ ఊర్లో వడి ఇరుక్కుపోయింది నా బతుకు రెడ్డి నరననజేరి నన్చేందుకు లేదు/మాదిగ నరసనజేరి వీడ్చేందుకు లేదు” (కోప) కక్ష అన్నవరం దేవేందర్‌

అయినా దళితవాదం వెనుకబడిన తరగతులను తనలో ఇముడ్చుకోలేదు లేదా బిసిలు దళితాన్ని స్వంతం చేసికోలేదు. ఫలితంగా వర్షవాదం తన పని తాను చేసూకుంటూ పోతుంది. దళిత దృక్పధం తెలుగు నేలపై సిద్దాంతీకరించి వారిలో ఒకరైన బి.ఎస్‌.రాములు, కంచ అయిలయ్య, ఊ. సాంబళివరావులు (ప్రభలంగా ఉన్నారు. వీరితోపాటు కె.జి.సత్యమూర్తి, కత్తి పద్మారావు, బొజ్జా తారకంలు దళిత దృక్పధాన్ని సాహిత్యంలో సానపట్టారు. అ(గ్రవర్షం ఈవల శూద్రుల జాబితాలో వున్న బహుజనులు

“దేవుడి గుడి గడప ఎక్కలేని వాడు

ఆంటరానివాడయినమ్హుడు

పూజారి ఇంటి గుమ్ముం లొక్కలేని నేను

అంటరాని వాన్టి ఎలాకాకుండా పోతాను” (కోప్రు

అంటూ దళితీకరణ పొందుతున్నారు. ఈ విధంగా విస్తరిస్తున్న దళితవాద కవిత్వపు ఉరుములకు విప్లవ కవిత్వంలో ఉన్న బ్రాహ్మణ, అగ్రవర్షవాదుల సైతం 1ంగవెర్రులెత్తిపోయారు. ఫలితంగా మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌ శిబిరాల్లో వర్గంతోపాటు కుల స్పృహ ప్రభలింది. ఈ దేశంలో వర్గమే కాదు, అంతకంటే కులంకూడా ఘముఖ్యమేనని ఆలోచనలో నేడు అన్ని నక్సలైట్‌ (గ్రూపుల్లో చర్చఅయి విధివాదనం అవుతుంది. దళితవాద సాహిత్యంను ఎదుర్కొనేందుకు సాం('ప్రదాయవాద ాహిత్యకారులు కొంతమంది మార్క్సిజంలో ఉన్న బ్రాహ్మణిస్ట్‌లు ఇందులో అంతా బూతు ఉన్నది అని అక్కసు వెల్లబోసుకున్నారు.

“కమలాకుచ చూచుకాల్లో

వేంకటపతికి అన్ఫుమయ్య వట్టించిన నుతారవు చమటల్లో

నీక్షు బూతు ఆగుపడదు” (ఫ్రైడి తేరేశ్‌బాబు) అంటూ దళితసాహిత్యకారులు త్రిప్పికొట్టారు. దీనికి కొనసాగింపుగానే దళిత సాహిత్య సంకలనాలు వెలవడ్డాయి.

“వీనుగ దేహంపై కప్పీన కండువా కట్టు నా దేహం చుట్టు

దింవుడుకల్లం కాడ నాలుగు దిక్కుల పోనిన బియ్యం గువ్పీటను

పొడె కదలగానే

నా గోచి కొంగులో మడికట్టే అంటరానోన్లి

వీండకూటి కోనం ఎదురుచూసే కాకిలో కాకనైంది/నేనయితే

మరో కోణం

శవం బుగ్గయ్యేదాక బొ్గయ్యింది నేనయితే

తద్ధినాల నాడొబ్చి పెద్ద గద్దలా అన్లి తన్గుక పోతావా ?

వుక్కిట వురాణాల రాతంతా రానీనోడా 7” (వేముల ఎల్లయ్య) అంటూ హిందూ బ్రాహ్మణీయ పురాణాల రంకుబంకను దళితసాహిత్య కారులు ఎండ కట్టారు. వీటన్నింటికి విరుగుడుగానే పురాణ ప్రతీకలతోనే జవాబు చెప్పుతున్నాడు కవి.

“ఇమ్టుడు నేను

రాముని బాణాన్లి విరచే ళంభూకున్ని

లక్ష్మణుని చెవులుకోసే ఖార్పునఖను

(దోణుని దోహాన్లి గుర్తించి

బాణం నంధించన వీకలవ్యున్లి

నేను - మాదిగ డప్తు చప్తుడును

మండుతున్లు కుమ్మరి కొలిమిని

గిరగిర తిరిగే కుమ్మురి సారెను

ధగధగ మెరున్తున్సు మంగలి కత్తిని

జాలరి వలను, సొలెల మగ్గాన్టి

నమస్త వత్తుల ఆత్మగౌరవాన్ని” (అన్నవరం దేవేందర్‌) అంటూ కులవృత్తుల ఆత్మగౌరవ ప్రకటనలు వెలువరిస్తున్నారు.

ఈ సిల్‌సేలా నుంచే మైనారిటీలు సైతం సొంత గొంతుక వెతుక్కున్నారు. 'జల్‌జలా' కవితా సంకలనం వెలువరించి ముస్లింవాదాన్ని వినిపించారు. ఇదంతా ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం వెలువడిన సాహిత్యమే. ఈ దిశలో యం, వెంకట్‌ చల్లపల్లి స్వరూపరాణి, నాగప్పగారి సుందరరాజు, మద్దూరి నగేశ్‌బాబు, వరదయ్య, దార్ల రామచంద్ర, కల్లెపల్లి రాంలక్ష్మణ్‌: ఎండ్లూరి సుధాకర్‌, జి.గౌతం, అన్వర్‌, అనిశెట్టి రజిత, పగడాల నాగేందర్‌, పైడి వీరేశ్‌ బాబు, కత్తి పద్మారావు జూలూరి గౌరిశంకర్‌, సతీష్‌ చందర్‌: శిఖామణిలు కవిత్వం వెలువరిస్తున్నారు.

ఈ అస్తిత్వ నేపధ్యం నుంచి వస్తున్నదే ప్రాంతీయ అస్తిత్సంను పదిలపరిచే కవిత్తం విసృతంగా వస్తున్నది. క్రై అన్నవరం దేవేందర్‌

“మవాబూబ్‌నగల్‌లో ఆకలి చావులు

ఆదిలాబాద్‌లో అత్వాచారాలు

కరీంనగర్‌లో చేనేత కార్మికుల వాత్వలు

వరంగలీలో పత్తిర్రైతుల ఆత్మహత్యలు

మెదక్‌లో ఎదురు కాల్పులు

నిజామాబాదీలో ఎన్‌కౌంటర్లు

నల్లగొండలో నరకటం, చంపటం

ఖమ్మంలో అరాచకం, అన్వాయం

రంగారెడ్డిలో లోకుల పోరాటాలు

హైదరాబాద్‌లో మతకలవోలు” (కందుకూరి శ్రీరాములు), ఇంకా ఈ కవి “వది జిల్లాల ఆగ్లివుల్లల పెట్టె/కదిలిస్తే కందిరీగల తుట్టె” అంటూ రాష్ట్రం అంతా ఒక్కతీరుగా లేనివైనాన్ని అందులోని వివక్ష కోణాన్ని ప్రశ్నిస్తున్నారు.

“మన నేల ఒకటే/యన జాలి ఒకటే అయితే

బతకు లొక్క తీర్గ ఎందుకు లెన్టురా అయ్య” (నందిని సిధారెడ్డి)

తెలుగు నేలంతా ఒక్కటే అన్నవాల్లను తన అఆస్తిత్వంతో ప్రశ్నిస్తున్నారు. దళిత వాదాన్ని ఆగ్రవర్షపు కళ్ళతో విమర్శించిన వారే స్త్రీవాదాన్ని మగ దృక్పథంతో వ్యతి రేకించినవారే నేడు స్టానికతా వాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. స్టానికతావాదం ఒక్కటే ప్రపంచీకరణకు వ్యతిరేకమని కె. శ్రీనివాస్‌ అన్నట్టు స్తానికీకరణ అమెరికీకరణను ప్రతిఘటించే స్థితిలో రావాల్సి ఉంది. ఈ దిశగా నేడు తెలంగాణాలో విసృతంగా కవితా సంకలనాలు వెలువడుతున్నాయి. మంజీర రచయితల 'ఏడ్రుపొయలు, అన్నవరం దేవేందర్‌ “తొవ్వ , హుస్నాబాద్‌ కవుల 'సీమాంట', నుంకిరెడ్డి నారాయణరెడ్డి 'దాలి', యెన్నం ఉపేందర్‌ 'కర్రుపుట్టుంది, గ్యార యాదయ్య 'ఎర్కోషి, నందిని సిధారెడ్డి 'ఒక బాధగాదు", శ్రీదాస్యం లక్ష్మయ్య “తండ్లాట, అనిశెట్టి రజిత 'ఓ లచ్చవ్వ'", వరుల శినకుమార్‌ 'పాలకంకుల కల, జూకంటి జగన్నాధం 'వాస్కోడిగామా డాట్‌ కామ్‌”, 'గంగడోలు* గోసంగె కవుల మేమే”, బహువచనం', దొడ్డి రామ్మూర్తి 'బొక్కెనలొల్టి, ఎం. వెంకట్‌ 'ఎన' స్కైబాబా 'జల్‌జలా* అన్వర్‌ 'తలవంచని అరణ్యం", నంకెపల్లి శివప్రసాద్‌ 'అష్టమ సము(ద్రం', దర్భశయనం శ్రీనివాసాచార్య 'ఆట', వెలువడుతున్నాయి. ఇవే కాకుండా 'ఇండియా టుడే", 'ప్రజాతం[త్ర'లాంటి ప్రతిష్టాత్మకమైన పత్రికలు

మరో కోణం క్లో

ప్రాంతీయ స్పృహతో (ప్రత్యేక సాహిత్య సంచికలు వెలువరిస్తూన్నాయి. ఇదే దిశగా కొలువ మల్లయ్య, బి.ఎస్‌.రాములు, పెద్దింటి అశోక్‌కుమార్‌, కె.వి.నరేందర్‌, కాసుల (ప్రతాపరెడ్డి, యశోదారెడ్డి, ముదుగంటి సుజాతారెడ్డి బోయ జంగయ్య, చంద్‌, కె.వి.నరేందర్‌లు అద్భుతమైన కధలు, కథాసంకలనాలు వెలవరిస్తున్నారు. సాంప్రదాయానికి, నడుస్తున్న దానికి భిన్నంగా రావాల్సిన చలనశీల మార్పులతో తెలుగు సాహిత్యంలో రావాల్సిన సాహిత్యం వస్తుంది. అభ్యుదయం, విస్లవం, దిగంబరం, దళిత, బహుజన, మైనారిటీ, (స్త్రీవాద, దళిత స్త్రీవాద, మానవతావాద, (ప్రాంతీయవాదం అదే తెలంగాణావాదంగా వస్తున్న సాహిత్యంను ఆహ్వానించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. “ఈ మబ్బులు తొలగిపోవాలి ఈ గోడలు కూలిపోవాలి ఈ మౌనం పగిలిపోవాలి ఈ బిగట ఎండిపోవాలి మనిషీ/నాకు నిజమైన పౌరసత్తుం కావాలి” విశాలాంధ్ర" దినపత్రిక నర్లోత్సువ (ప్రత్వేక నంచిక 22 జూన్‌ 2002 ల్లైగ్లై అన్నవరం దేవేందర్‌

తెలంగాణాతనాన్ని పోగొట్టుకున్న తెలుగు

భాషఅనేది భావాన్ని బయటపెట్టే ఒక మాద్యమం. భావాన్ని వ్యక్తీకరించేందుకు (ప్రాంతానికో భాష ఉంటుంది. కోస్తాకు ఒక భాష రాయలసీమకు మరొక భాష ఉన్నట్లే మన తెలంగాణాకు ఒక భాష ఉంది. మనదొక సొగసైన భాష యాస. మన జాతీయుల సామెతలు కలగలిపి మనదొక అందమైన అలంకారం. (ప్రాంతా లకు వేరువేరు భాషలున్నట్టు ఆయా (ప్రాంతాల్లోని కులాలకు వేర్వేరు భాష లున్నాయి. దళిత కులాల బహుజన శ్రామిక కులాల్లోని భాషలో స్వల్ప తేడా లుంటాయి. అలాగే దోపిడీ ఆలంబనగా ఉన్న పెద్ద కులాలకు మరొక భాష ఉంటుంది. ఖగోళశా(స్తానికి, అర్ధశాస్తానికి, తత్వశాస్తానికి ఆయా ఫీలాసఫిల్లోనే పారిభాషిక పదాలున్నట్టు, కులాలకు, కులవృత్తులకు ఉన్నాయి. మన తెలంగాణా తెలుగులో జీవం ఉంది. జీవితం ఉంది. అంత సొగసైన ఈ భాషను, యాసను మన౦ 'సూర్లచెక్కి పరాయిభాపను అడుక్కచ్చుకుంటున్నాము. మన తెలంగాణా తెలుగు నేడు తన తనువును పోగొట్టుకుంటున్నది. తన ఆత్మను మొత్తంగా తన తనాన్నే ఓడగొట్టుకుంటున్నది. ఇదెంత ఘోరం. మన తల్లిభాషు మన తాతభాష మన మ్యానమామ భాష మనకు రాకపోయేసరికి రేపటి మన ఆత్మలు ఎట్లా విల విలకొట్టుకోవాలె. మన భాషకు యానను కోస్తాంధ్ర పాలకులు, రచయితలు, ఉద్యోగులు, పత్రికలోల్లు మాయం చేసిండ్రు. ఇది మంచిది గాదంటుండడ్రు. మనది మోటుదని ఎక్కిరిస్తన్నరు. మన తెలంగాణా మేధావులు నొల్లు ఎల్లబెట్టి సరే మీదే అసలైంది అని పండ్హిగిలియ్యబట్టిరి. వాల్ల భాషలోనే రాయబట్టిరి. మరో కోణం

ఆంధ్రోల్టు వాల్ల భాషను మన మీద యాభై ఏండ్ల నుంచి రుద్దుతున్నారు. మన పాఠపుస్తకాల్లో, మనం చదివే పత్రికల్లో, మనం రోజు గుడ్గప్పగించి చేసే టీవీల్లో, సినిమాల్లో వాల్లదే భాష. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆ కోస్తాంధ్ర, కమ్మ బాపనోల్ల భాపనే ఉన్నది. ఇదే అసలైన భాషని అక్కడి రచయితలు మన మీద పడి చెవి నిండా జోరీగలాగ చేసిరి. అదే అసలైన భాష అని మనం భ్రమపడి ఏమండి, ఉన్హారండీ, వస్తున్నాము, వెళ్ళుచున్లాము అంటూ దీర్జాలు తీస్తుంటిమి. హిందీలో “ఆతా హుం అనేదానికి 'అత్తునాను' అనేది తెలంగాణా తెలుగు దీనికి కోస్తాంధ్ర లో 'వన్తున్నాను' అంటారు. 'అతా'కు అత్తున్న అనేది దగ్గరి సంబంధంతో కలుస్తుంది. ఇలా హిందీతో గొలుసులా కలిసిన అసలైన మన భాషను మనమే నాదాను” చేసుకుంటున్నాం. మనది మనం మాట్ట్లాకుంటే నామోషి లెక్క మిడిసి పడుతున్నాము. మన ఆత్మ, మెదడు, కలేజ పరాయికరించబడ్డది. మన భావం గాకుండ పోయింది. మల్ల మనం పోడగొట్టుకున్నది మన భాష చరిత్ర మీద మళ్ళీ తిరగ రాయాలి మన చరిత్రను మనం మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన భాషనేగాకుండా తెలంగాణా సంస్కృతి, పండుగలు, కట్టుబొట్టు, ఆచార వ్యవహారాలు కూడా పరాయికరంచబడుతున్నాయి. ఏదైనా ప్రాంతం మరొక్ష (ప్రాంతంమీద దోపిడి చేయాలనుకున్నప్పుడు ముందుగా వాల్లను సాంస్కృతికంగా దోపిడి చేస్తారు. భావాలను కంట్రోల్‌ చేస్తారు. భాషను కంట్రోల్‌ చేస్తారు. ఆ తర్వాత దోపిడికి దర్వాజలు తెరుస్తారు. బానిసలుగా చేసుకుంటారు. అట్లనే ఆంధ్రోల్టు మనల్ని చేసిండ్రు, తెలంగాణాలో బతకమ్మ పండుగ '్రాశస్తం విస్తరించిందా ? అది పత్రికల్లో ముందు పేజీల్లో బతకమ్మ పండగ ఎక్కలేదు కాని 'దేవి నవరాత్రులు" ప్రముఖవార్తలుగా అన్ని పత్రికలు వేసాయి. మన 'పోషమ్మ ఎల్లమ్మ పండుగ, బోనాల పండుగలు' కనపడకుండా అవుతున్నాయి, కాని వాల్ల 'దేవీ నవరాత్రులు" మనం కొత్తగా మొదలు పెట్టుకుంటున్నాం. మన బతకమ్మను ఎక్కడైనా కోస్తాంధ్రలో ఆడతారా ? ఎక్కడా ఆడరు. ఇవేగాక ఇంకా చాలావన్నట్లు ఉత్తర భారతదేశంలోని గణపతి ఉత్సవాలు మనం ఇక్కడ కోలాహాల౦ంగొ జరుపుకుంటున్నాం. మన 'పీర్లు పండుగ మునుప టంత ఘనంగా ఉంటుందా ? పీర్ల పండుగప్పుడు మలీల ముద్దలు, చిలకల పేరు తింటున్నామా ? ఏకుడు పాలాలముద్దలు, గడ్క, జొన్నరొట్టెలు చేసుకునుడుకూడా 'షాని' అయిపోయింది. లే అన్నవరం దేవేందర్‌

ఇప్పుడు మనం ఆరవవాని దోశలు, ఇజ్లీలు, ఊతప్పలు, రాజస్త్రాన్‌వారి జిలేబీలు, బాదూషాలు తింటున్నాం. నాగపూర్‌వారి సోన్‌పాపిడి తింటున్నాం. ఆంధ్ర భోజనం పేరుతో హోటల్‌ పెడ్తున్నాం. మరీ మన సర్వపిండి, ఉప్పుడుపిండి, ఏకుడు పాలాల ముద్దలు దేశంలో ఎక్కడైనా కొత్తగా తింటున్నారా ? లేదు ఎవరి సంస్కృతి వారే పదిలపరుచుకుంటున్నారు. మనమేమో మన వంటల సంస్కృతిని వదిలి వేరేవాల్లని ఆకర్షింపబడుతున్నాం. అయతే మనం ఇది ఎడ్జోల్లవలె చేస్తలేము మన పత్రికలు, టివి, సినిమా, కోస్తాంధ్ర వాల్లవి కనుక వాల్ల భాష సంస్కృతి, వంటలు అన్నీ వాల్లవే వస్తున్నాయి, తీసికుంటున్నాము. మన తెలంగాణా భాషను సినిమాల్లో విలన్లకు, గుండాల పాత్రదారులకు పెట్టి మనల్ని అపహాస్యం చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఇండ్ల అంత బూతుంటుందని అంటున్నారు. ఆసలు బూతును సంస్కృత సాహిత్యంలో ప్రవేశ పెట్టింది కోస్తాంద్ర బ్రాహ్మణులు, బూతును సాహిత్యంగా గౌరవించారు. సంస్కృతంలో 'భగం'అనే పదాన్ని తెలంగాణా భాషలోవాడితే గగ్గోలుపెట్టి అశ్రీలం అంటారు. ఇదే 'భగం' సంస్కృత సాహిత్యంలో వచ్చినా, ఇంగ్లీష్‌లో వచ్చినా అబ్బ గొప్ప సాహిత్యం అంటారు. ఇదెక్కడి నీతి ? ఇట్టాగే మన భాషను అపహాస్యం చేస్తూ మనల్ని మనలకాకుండా చేస్తున్నదాన్ని 'ఎదురుదొబ్బాల్సిన' అవసరంజింది. అందుకు కావాల్సిన పులుగు, కలేజ ఉన్న రచయితలు కాలువ మల్లయ్య అల్లం రాజయ్య, బి.యన్‌.రాములు, పెద్దింటి ఆశోక్‌కుమార్‌, ఉవ్చుల నరసింహం, తెలిదేవర భానుమూర్తి ఇంకా ఎంతో మంది ఉన్నారు. మన భాష సంస్కృతిని, భావాన్ని పదిలపర్చుకునేందుకు మనం నమాయత్తం కావాలి. ఇటీవలనే “తెలంగాణా జొతీయాలు' పేర వేముల పెరుమాళ్ళు ఒక పుస్తకం వేసి తెలంగాణా ఖ్యాతి చరిత్రలో ఉంచారు. ఇంత మంచి “తెలంగాణా తెలుగు భాషా సదస్సు”ను ఏర్పాటుచేసిన మలయశ్రీకి కృతజ్ఞతలు. కరీంనగర్‌లో నవ్వసాపొత్వ పరిషత్‌ వీర్పాటు చేసిన తెలంగాణా మాండలిక తెలుగు భాషా నదన్సు'లోని ప్రనంగ పొరం కలం వెలుగు" వారపత్రిక 3-9 నవంబర్‌ 2000 మరో కోణం

కల్లోల నేలలో నూననతొావాద సాహిత్యం

పోరాటశాస్త్రం పురుడు పోసుకుంటున్న కరీంనగర్‌ జిల్లాలో మానవతావాద సాహిత్యం వెల్లివిరుస్తున్నది. జిల్దాలో సాహిత్యసభలు, పుస్తకావిష్కరణలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా రచయితలకు పలు అవార్డుల పంటకూడా విస్తారంగానే ఉంది. జ్ఞానపీఠ పురస్కారం పొందిన “తెలుగుజాతి నిలువెత్తు నంతకం” సినారె, తెలుగునేలపై దళితవాద సాహిత్య సిద్దాంతాన్ని ఉద్దీపన చేసిన బి.ఎస్‌.రాములు, అన్నం మెతుకును ఆగర్భ శ్రీమంతుని మధ్య విభజనరేఖ గీసిన అలిశెట్టి ప్రభాకర్‌, విష్ణవ కథకుడు అల్లం రాజయ్య అవార్డు కథొ రారాజు కాలువ మల్లయ్య, బహు ముఖ పార్వాలుగల సాహిత్యకారులు మలయశ్రీలు ఈ జిల్లా వారే. కరీంనగర్‌ జిల్లాలో కధలు, కవిత్వం, పాటలు విసృతంగానే వెలువడుతున్నాయి.

జిల్లా కేంద్రంలో 'సాహితీ గౌతమి" ఏటా సినారె పురస్కారం రాష్ట్రస్తాయిలో అందిస్తుంది. ఈ ఏడు ఈ అవార్డు అఫ్సర్‌ “వలసోక్షు వచ్చింది. అలాగే సరిసిలి హుస్నాబాద్‌ గోదావరిఖని, జగిత్యాలలో సాహిత్య కార్యక్రమాలు జోరుగొనే సా తున్నాయి. కొత్తఢిల్లీలోని జాతీయ పుస్తక ప్రచురణ విభాగం (ప్రఖ్యాత కథా రచయిత కాలువ మల్లయ్య కథకు అవార్డు అందించింది. ఆ తర్యాత రచన పత్రిక నిర్వహించిన కథల పోటీకి 'మీలోంచి నేను అనే కథకు పురస్కారం అన్నవరం దేవేందర్‌

ప్రకటించారు. అంతకుముందు 'ఆట' బహుమతి వచ్చింది. బి.ఎస్‌.రాములుకు ఇటివల హర్యానాలోని పానిపట్‌లో జయ(ప్రకాశ్‌నారాయణ్‌ జయంతి ఉత్సవాల్లో జైమినీ పురస్కారం అందజేశారు. ఆయనకు అంతకు ముందు న్యూఢిల్లీలోని మహాత్మా జోతిరావు పూలే బహుమతి వచ్చింది. వర్తమాన కథారచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌ తెలంగాణ బహుజన జీవితాల్ని కథలుగా మలుస్తున్నాడు. గత ఏడాది ఆయనకు వట్టికోట అళ్యార్‌స్యామి పురస్కారం వచ్చింది. పలుపత్రికలు నిర్వహించే కథల పోటీల్లో బహుమతుల జాబితాలో అశోక్‌కుమార్‌ పేరు తప్ప కుండా వుంటుంది. సాహితీ గౌతమి కథాపురస్కారం కూడా అశోక్‌కుమార్‌తే వచ్చింది. వట్టికోట అళ్యార్‌స్యామి కథా పురస్కారం ఈ సంవత్సరం దామోదర్‌ రావుకు వచ్చింది. దామోదర్‌రావు తెలంగాణా మాండలికంలో కధలు రాయడం లో దిట్ట. దళిత కధల సంకలనంలో ఈయన కథలు చోటు చేసుకున్నాయి. కె.వి.నరేందర్‌ ఒక భావంతో రాసే కధల సంకలనంను సాహిత్య చరిత్రలోనే సంచలనం సృష్టిస్తున్నారు. ఇటీవల 'నాన్న' దృక్పథంలో రాసిన కథల సంపుటి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. నరేందర్‌ ఇటీవల తన చూపును సినిమాల వైపు చూపుతున్నారు.

ఇంకా గోదావరిఖనికి చెందిన అడెపు లక్ష్మిపతి, తుమ్మేటి రఘోత్తంరెడ్డి, అల్లం రాజయ్యలు, హుజురాబాద్‌కు చెందిన తాడిగిరి పోతరాజు ప్రఖ్యాతులుగా తమ స్థానాలు నిలుపుకున్నారు. ఇంకా పంజాల జగన్నాధం, దార్ల రామచంద్ర, బి.వియన్‌.స్వామి, జింబో, బెజ్బారపు వినోద్‌కుమార్‌, రవీందర్‌, జూకంటి జగన్నాధం, పి. చందు మంచి కథకులుగా గుర్తింపు పొందారు. వీరు రాసిన పలు కధలపై పారకుల స్పందన ఉత్తరాల ద్వారా కూడా వచ్చాయి. కవిత్వ సంకలనాలు కూడా జిల్హా నుంచి బాగానే వచ్చాయి. అన్నవరం దేవేందర్‌ “తొవ్వ, శ్రీదాస్యం లక్ష్మయ్య 'తండ్డాట', పత్తిపాక మోహన్‌ తెగినపోగు" గంగాధర నర్భయ్య “మానవత్వమే నా మతం', సంకెపల్లి శివప్రసాద్‌ 'అష్టమ సముద్రం", చమన్‌ 'సందిగ దృళ్యం', రంగు సత్యనారాయణ “దర్వాజ, కలువకు౦ట్ల రామకృష్ణ “అక్షరదీపాలు, ఎగ్రశ్రీ “'కన్నీటిగాధలు' అనే పుస్తకాలు వెలువడ్డాయి.

ఇప్పటికే ప్రఖ్యాత కవులుగా ఎదిగిన జూకంటి జగన్నాధం, అల్లం నారాయణ, వరుల శివకుమార్‌, జింబో, దర్భశయనం శ్రీనివాసాచార్య, టి. కృష్ణయాదవ్‌ తెలంగాణా ప్రాంతీయ సంస్కృతిపై కవిత్వం రాస్తున్నారు. జూకంటి జగన్నాధం

మరో కోణం

వాస్కోడిగామా డాట్‌ కాం, దర్భశయనం 'ఆట' (ప్రసిద్దిగాంచినవి. అట్టాగే సందినేని రవీందర్‌ 'కొత్తలోకం' సాహిత్య వ్యాసాల సంకలనం కరీంనగర్‌ సాహిత్యానికి అద్దంపట్టినట్టే ఉంది. హుస్నాబాద్‌ కవుల 'సిమాంట' పుస్తకం కూడా పేరుతోనే సంచలనం సృష్టించింది. జిల్లాలో దార్ల రామచంద్ర "కిర్రు చెప్పులు" బోయిన భాస్కర్‌ 'నా పల్లె తండ్డాడుతుంది, అన్నవరం దేవేందర్‌ 'బొడ్డుగురిగి, 'దీరకవిత్వం', 'మరో కోణం" సామాజక వ్యాసాలు విడుదలకు సిద్దపడుతున్నాయి. కరీంనగర్‌ జిల్లా 'కధాసరిత్సాగరం' "పేరిట నాలుగు దశాబ్దాలుగా వస్తున్న జిల్హా కథకుల కథల్ని బి.ఎస్‌.రాములు, వనమాల చంద్రశేఖర్‌లు సంపుటీకరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఒక సంపుటి వచ్చింది. మరో సంపుటి కొరకు (ప్రయత్నాలు సాగుతున్నాయి. జి.లక్ష్మణరావు, మనాశర్మ, స్వామి, ఆర్‌ క్యూబ్‌, జీగురు ఆయిలయ్య, ఏలేశ్చరం వెంకటేశ్వర్జు, కె.ఎస్‌.అనంతాచార్య, మాడిశెట్టి గోపాల్‌, విజయ నరసింహారావు, కాళిదాస్‌, డింగరి నరహరి ఆచార్య, చైతన్య ప్రకాశ్‌ సప్తగిరి, డాక్టర్‌ రాధాకృష్ణమాచార్య, సబ్బని లక్ష్మినారాయణ, రాకుమార, తైదల అంజయ్య, వేణుశ్రీ కలకోట కిషన్‌రావు, యస్‌.యస్‌.రాజు, శేషు సుప్రసన్నాచారి కవిత్వం రాస్తున్నారు. గడిపె బాలయ్య, మల్లేష్‌ రాంలక్ష్మణ్‌లు పాటలు రాస్తున్నారు. గుండేటి రమేష్‌ చలనచిత్రరంగంలో తనకో స్థానాన్ని కల్పించు కున్నారు. (ప్రస్తుతం “కరీంనగర్‌ జిల్లా వైభవం” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నలిమెల భాస్కర్‌ తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషల అనువాదంలో ప్రఖ్యాతుడు. ఇతర భాషా సాహిత్యాన్ని తెలుగీకరించి పుస్తకాలు వెలువరించారు. ఇలా తెలుగు సాహిత్య చరిత్రలో అన్నికోణాల్లో కరీంనగర్‌ అందె వేసిన చెయ్యి. ఇటీవల ప్రబలిన తెలంగాణా వాదంలోను జిల్లా కవులు ముందున్నారు. సకల అణచివేత లను, అమానవీయ ఆలోచనలను ్రటిఘటించే తాత్వికత తమ కలం నిండా నింపుకున్నవారు జిల్లాలో ఎందరో వున్నారు. ఇటీవలనే జిల్లాలో “తెలంగాణా రచయితల వేదిక ఆవిష్కరణ సభ జరిగింది, ఇటీవలనే వారాల ఆనంద్‌ 'సినీ సుమాలు” విడుదలైంది. ఆనంద్‌ రాష్ట్రంలోనే సినీ ్రిటిక్‌గా ప్రశంసలందు కుంటున్నారు. బోయినపల్లి వెంకటరామారావు సాహిత్య సర్యోదయ, గౌ ౦ధేయ వాదాల వ్యాప్తిలో ప్రసిద్ధుడు. సర్వోదయ మిత్రమండలి జిల్లా రచయితల సంఘం ఏర్పరచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గీట్ట జనార్ధన్‌రెడ్డి ఎప్పటినుంచో రాస్తున్న కవి, సామాబిక కార్యకర్త ఇటీవలనే రెండు సంపుటాలు వెలువరించారు. క్షష్త అన్నవరం దేవేందర్‌

జిల్లాలో ఇటీవలనే 'సాహితీ స్రవంతి" సంస్థ ఏర్పడింది. అంతకు ముందు నుంచే హుస్నాబాద్‌లో 'నూతన సాహితీ", కరీంనగర్‌లో 'వికాస సాహితీ? 'సమైక్య సాహితీ, 'సాహితీ గౌతమి'లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి. జిల్టా సాహిత్య సంస్థల సమాఖ్య 'సాహితీ గౌతమి" డొ; జి,లక్ష్మణరావు, డా గోపు లింగారెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. జగిత్యాలలో “విశాల సాహితీ" ప్రతి ఏటా రాష్ట్రస్థాయిలో లబ్ద్బప్రతిష్టులైన రచయితలకు అవార్డులు ఇస్తుంది. ఈ ఏడు కూడా అవార్డులకు ఎం(బ్రీలను అహ్వానిస్తున్నది. జిల్హాస్టాయిలో కథకులను కూడా ఎంపిక చేస్తామని నిర్యాహకులు సి.హెచ్‌. (మంటలు) (ప్రభాకర్‌రావు తెలిపారు. సిరిసిల్లలో మానేరు రచయితల సంఘం పనిచేస్తుంది. జిల్హాలో కవులు విస్తారంగా రాస్తున్నారు. ఏ పత్రిక సాహిత్య పేజీలో నైనా కరీంనగర్‌ కవి కనిపిస్తున్నాడు. జిల్లాలో సినారె. అలిశెట్టి, బాపురెడ్డి అల్లం నారాయణ, వడ్డేపల్లి కృష్ణు మలయశ్రీ, సాహు లాంటి వారి ప్రభావమేమో చాలామంది సాహిత్యంపట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. మానవ సంబంధాలు అమానవీయత చెందుతున్న తరుణంలో పలువురు కలం పట్టి కనిత్వం రాస్తున్నారు. కాని ఈ రంగంలో మొదటి నుంచి మహిళల న్థానం ఎందుకో తక్కువే. ఆంధ్రజ్యోతి” దినపత్రిక వును ప్రారంభ సంచికలో 25 అక్టోబరు, 2002 మరో కోణం

వెయ్యేండ్ల కరీంనగర్‌ సాహిత్య చరిత్ర కరీంనగర్‌ జిల్లా సాహిత్యంలోనూ, పోరాటంలోనూ ప్రతిష్టాత్మకమైంది. (ప్రాచీన సాహిత్య చరిత్రలోనూ, ఆధునిక దళిత తాత్వికవాదాల్లోనూ కరీంనగర్‌ (ప్రత్యేకత కరీంనగర్‌దే. కంద పద్యం పుట్టింది మన దగ్గరే. తాలి తెలుగు కంద పద్యం రాసింది వెయ్యేండ్హ క్రిందట ఇక్కడే. ఇది జినవల్లభుడు ఉల్లేఖించినట్టు కురిక్యాల శాసనంలో ఉందని డాక్టర్‌ మలయశ్రీ ప్రతిపాదించారు. కన్నడ ఆదికవి పంపకవికి సోదరుడే ఈ జినవల్లభుడు. కీ.శ. 950-1995 వరకు కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్రను పరిశోధించి 700 పేజీలతో ఒక ఉర్ధంధం ముద్రించారు. ఎన్నో వ్యయ ్రయాసలకోర్చి వెలువర్చిన ఈ (గ్రంథంలో జినవల్లభుని నుంచి నిన్నమొన్నటి వరకు సాహిత్యరంగంలో కాలిడిన అందరిపేర్లు ఉన్నాయి. ఇలాంటి చరిత్రతో వెయ్యేండ్డుగా క్ప్‌షి చేస్తున్న సాహిత్యకారుల వివరాలు ఉండటం ఈ జిల్లా గొప్పదనం. ఇలాంటి పుస్తకం రాష్ట్రంలో ఏ జిల్దాలో లేదు. కందం పుట్టింది కరీంనగర్‌లోనే : కీశ 946కు పూర్వం కంద పద్యం పుట్టలేదు. జినవల్లభుడు పంపకవి సోదరుడు. ఇది కురిక్యాలలో దొరుకగా శాసనంద్వారా పరిశోధించి తేల్చి చెప్పారు. తర్వాత 200 ఏండ్ల వరకు కన్నడ సంస్కృతి సాహిత్యం శాసనాల ద్వారా ఉల్లేఖించారు. తర్వాత 14 నుంచి 16వ శతాబ్దం వరకు 30 సంవత్సరాల కాలంలో రామగిరి మడికసింగన, వెలిగందుల కందనామాత్యుడు, వెలిగందుల నారయల చరికొండ ధర్మనలు జిల్చాలో తెలుగు కవులు. క్షల్లే అన్నవరం దేవేందర్‌

వేములవాడ భిమకవి మనవాడు కాదు :

ఇన్నాల్సు భీమకవి మన వేములవాడ వాడేనని అనుకున్నాం. కాని ఈయన గోదావరి జిల్లాకు చెందినవారని తేల్చి చెప్పారు మలయశ్రీ. 12వ శతాబ్దికి చెందిన భీమకవి తూర్పుగోదావరి జిల్లాలోని రామచం(ద్రాపురం తాలూకాలోని వేములవాడ వారు. 12వ శతాబ్దంలో మన ఇప్పటి వేములవాడను 'లేములవాడ' అనేవారు అంటూ భీమకవి కోస్తాజిల్లాల సంబంధంతో సాహిత్యం రాశారని నిరూపించారు.

17, 18వ శతాబ్దంలో ధర్మపురికి చెందిన శేషప్ప, మంథనికి చెందిన మద్దు బాలంభట్టు, ముల్కనూరుకు చెందిన కుందావజ్ఞల గోపాలకృష్ణ పరాంకుశం గోపాలకృష్ణయ్య, కోరుట్ట రాజలింగకవి, వేములవాడ సోమనాధకవి, కోడూరి వెంకటాచలపతి, అత్తలూరి పాపకవి, సముద్రాల రామానుజాచార్యులు, ప్రఖ్యాతి చెందిన తెలుగు కవులు. 19వ శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో గణనీయమైన కావ్యసృష్టి జరుగలేదని రాశారు. ఈ కాలం అంతా నిజాంపాలన క్రింద ఉండటం వల్ల అరబ్బీ, పార్శి భాషలు (ప్రాముఖ్యానికి వచ్చాయి. తొలి కవయిత్రి ఆనందమాంబ :

20వ శతాబ్దపు ప్రధమంలో 1934లో కొడివ్యూలకు చెందిన ఆనందమాంబ తన 14వ ఏట సతీలలామ అనే కావ్యాన్ని సృష్టించారు. ఈమె కరీంనగర్‌ జిల్దాకు చెందిన తొలి రచయిత్రి. 1901-50 మధ్యలో సిరశినహల్‌ కృష్ణమాచార్యులు, నెమలికొండ, పింగళి లింబా(ద్రిరెడ్డి, గుండారెడ్డిపల్లికి చెందిన అనంతవరపు సిద్దప్ప రామసింహకవి, వి. కేశవరావులు (ప్రముఖులని పేర్కొన్నారు.

గోలకొండ కవుల సంచికలో 354 కవుల వివరాలు 1934 దీపావళి ప్రత్యేక సంచికలో (ప్రచురిస్తే అందులో 40 మంది కరీంనగర్‌ జిల్లా వారే కావడం విశేషం, 1951-95 ఇరువయవ శతాబ్దపు ఉత్తరార్ధ సాహిత్యంలో విశిష్టత కల్లిన జ్ఞానపీఠ అవార్డ్‌ (గ్రహీత సి. నారాయణరెడ్డి యశోదారెడ్డి, జె.బాపురెడ్డి, ముద్దసాని రాంరెడ్డి తాడిగిరి పోతరాజు, మలయశ్రీ, సురమౌళి, కాల్వ రాజేంద్ర, సరిపల్లి కృష్ణారెడ్డి, సుద్దాల అశోక్స్‌, వడ్జెపల్లి కృష్ణు కాలువ మల్లయ్య, ఆడెపు లక్ష్మీపతి, బి.యన్‌. రాములు, జూకంటి జగన్నాధం వంటి లబ్ద్బప్రతిష్టులైన సాహిత్యకారుల విషయాలు ఎన్నో ఈ (గ్రంథంలో ఉన్నాయి. వివిధ సాహిత్య ప్రక్రియల్లో పూర్తిస్థాయి వివరాలు

మరో కోణం

ఇచ్చారు. ఇందులో పద్య సాహిత్యం, యక్ష గానం, హరికథలు, ' బుర్రకథలు, మధుర వేదాంత కవితలు, గేయ సాహిత్యం, నవలా కధాసాహిత్యం, నాటక సాహిత్యం, వచన సాహిత్యం పత్రికలు అన్ని విడివిడిగా అద్భుతమైన రీతిలో పొందుపరిచారు. చాలా మంది సాహిత్యకారుల ఫోటోలతో వారు (వ్రాసిన పుస్తక విశేషాలతో సహా ఇందులో పొందుపరచడం చాలా బాగుంది.

మలయశ్ర్రీకి ఉస్మానియా విశ్చవిద్యాలయం ఈ పరిశోధనకుగాను డాక్టరేట్‌ ఇచ్చింది. మలయశ్రీ ఈ వ్యాసకర్తతో మాట్లాడుతూ ఇది తన ఐదేండ్ల కృషి ఫలితం అన్నారు. 1971లో తాను కరీంనగర్‌ జిల్లా రచయిత చరిత్ర అనే చిరు పుస్తకం వేయగా ఇదే అంశంపై డాక్టరేట్‌ చేయాలని అనిపించిందని అన్నారు. ఇలా జిల్లా సాహత్య చరిత్రను రాయడం ఇదే మొదటిసారని అన్నారు.

ఈ పుస్తకం ముఖచి(త్రంపై పి.వి. నర్సింహారావు, సినారె, యశోదారెడ్డి, బోయినపల్లి వెంకటరామారావు, ముద్దసాని రాంరెడ్డి జువ్వాడి గౌతమరావు, సురమౌళి, జె. బాపురెడ్డి, కొండల్‌రావు, అలిశెట్టి ప్రభాకర్‌, కాలువ మల్లయ్య, బి.యస్‌. రాములు ఇలా పలు దృక్పధాల్లో లబ్దప్రతిష్టులైన వారి ఫోటోలున్నాయి. వెనుక వైపు సాహు, మేర మల్లేశం, వడ్డెపల్లి కృష్ణ తదితరుల చిత్రాలున్నాయి. “కరీంనగర్‌ జిల్లాలో ఇందరు ఉద్దండ రచయితలుండేవార్థా ఉన్టారా అని సాపొతీ (ప్రియులు నిష్పైరపడోంత వస్తు నిర్ధార పరిశోదన చేసిన మిత్రుడు మలయశ్రీ శతదా అభినందననీయుడని” రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ సి. నారాయణరెడ్డి తన అభినందన సందేశంలో పేర్కొన్నారు.

"హేతువాద నవ్య హేవాక్ష దీధితుల్‌ - కానుపించు అతని కనులలోన చిత్త చుద్ధియున్లు శ్రీ మలయశ్రీని అభినుతింతు నేను వార్థికముగ” అంటు డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు మలయశ్రీని అభినందించారు. దాదాపు 65 పుస్తకాలు వెలురించిన మలయశ్రీ ఈ పరిశోధన (గ్రంధం వెలుగులోకి తెచ్చి నందుకు మన జిల్లా ఆయనకు రుణపడి ఉన్నది. ఈ సిద్దాంత (గ్రంథం జిల్లాలో ప్రతి సాహిత్యకారుల వద్ద ఉండతగినది. దాదాపు 700 మంది రచయితల పరిచయం ఉంది. ఈ పుస్తకం (గ్రంథాలయాల్లో ప్రతి పాఠశాలల్లో కళాశాలల్లో పత్రికారచయితలవద్ద ఉండ తగిన (గ్రంథం.

(వ్రతివక్షం' వక్షనత్రిక సమ్మీక్షో శీర్షిక 8-23 వీప్రీల్‌ 1989 అన్నవరం దేవేందర్‌

కథా సాహిత్యాలకు కొత్త “బడి తెలుగు సాహిత్యంలో కధలకు ఇప్పుడు సముచిత గౌరవం లభిస్తుంది. గతం లో సాహిత్యం అంటే కవిత్వమే అన్నంత రితిలో కవులకు (ప్రాధాన్యతా గౌరవం ఉండేది. కాని కథకులకు ఆ సాహిత్య గౌరవం ఇటీవల నుంచే దక్కుతుంది. అయితే కథ, కవితకన్నా పాట ఎక్కువగా జనంలోకి దూసుకుపోతుంది. దాని గౌరవం దానిదే. అయితే కథలో జీవితం, సమాజం ఉంటుంది. బాధ, ఆనందం, ఆకలి, ఆవేదన, అంతర్మథనం, ఆవేశం, మానవ సంబంధాలు, సమాజ చిత్రణ. సామాజిక మానసిక సంబంధాలు, అలజడి అన్ని కలగలిసి ఉంటాయి. దీంతో జీవితాలను అద్దంలో చూసుకున్నట్టు కన్పించే కథలు చదవాలన్న ఆసక్తి రాయాలన్న తపన ఇటీవల కథా ప్రియులకు విరివిగా వస్తుంది. ఇలా కథలకు మంచి రోజులు వస్తున్న ఈ నేపథ్యంలో కథలు రాయడం ఎలా ? అన్న (ప్రశ్నతో సతమత మయ్యేవాళ్ల కోసం బి.ఎస్‌. రాములు “కథల బడి' పుస్తకం రాశారు. ఈ కథలబడే కధాసాహిత్య అలంకారశాస్త్రం. చాలా మంచి పుస్తకం, ఈ పుస్తకం చదివితే కధలు రాయడం అంటే బుట్టలు అల్లడం, చెప్పులు కుట్టడం, బట్టలు నేయడం, కుండలు చేయడం అన్నంత సులభం చేశారు. మామూలుగానైతే కధలు రాయడం ఆంటే అదెంతో పెద్ద పండితుల విద్య అని చాలామంది దూరం ఉండేవారు కాని ఈ పుస్తకం చదివాక కథలు రాయడం అంటే మన కథ మనం రాయడం, మన బాల్యం, మన జీవితం, మన పరిసరాలు మనం రికార్డు చేసు కోవడం సులభమేనన్న ఆత్మవిశ్వాసం కల్గుతుంది. బాధల నుంచి మానసిక సంఘర్షణల నుంచి అనుభవించినవి రాయడం అనే దృక్పథంలో నేను సైతం కథలు రాస్తానని పెన్ను పట్టిస్తుంది. ఈ పుస్తకం. అయితే ఇదివరకే వచ్చిన వల్లంపాటి 'కథాశిల్పం'. శార్వరి 'కథలెలా రాయాలి ? “రచయితా శిల్పం'పేరుతో తెలుగులోకి అనువదించబడిన రష్యా సాహిత్య శిల్బం కథా రచయితలకు ఎంతో ఉదర లశ ంధాలం్య మరో కోణం ట్‌ కులం. ఖా ల సధ 0 1.884: లో న్న ో త షా వాయన

ఉపయోగపడుతున్నది. వీటన్నింటికితోడు బి.ఎస్‌. రాములు రాసిన కథాసాహిత్య అలంకారళశాస్త్రం ఇంకా ఎంతో ఉపయుక్తం అవుతుంది. కథారచయితలకు ఈ పుస్తకం దూరవిద్య లేదా కరస్పాండెన్స్‌ విద్యార్థలకు గైడ్‌లా ఉపయోగపడుతుంది. ఇందులో శిల్ప పరిచయం, జీవిత పరిశీలన, కథాచిత్రణ, కథల్లో రసం, కథల్లో చరిత్ర, సంస్కృతి దృక్పథం అన్న వివిధ పారాలున్నాయి. ఈ పాఠాల్లో ఇటీవల వస్తున్న కధల పరిచయపాదత్రల సంభాషణలాంటిది ఉదాహరణలతో ఉన్నాయి. కథాపారాల చివరన ప్రష్టలున్నాయి. పాఠకులు 'ప్రళ్ళలకు నోట్స్‌ రాసుకోవాల్సీ ఉంటుంది. బి.ఎస్‌.రాములు స్వయంగా దళిత తాత్విక సిద్ధాంతకర్త అయి' నందువల్ల దళిత బహుజన దృక్సథంతో కథలను ఎలా నడిపించాలో స్పష్టా స్పష్టం చేశారు. ఇది వరకు తెలుగు సాహిత్యం నిండా నిండిన వర్ధాధిక్యవాదులు కథలు పోను ఇంకా పీడిత కులాల కధలు రావాలని అంటారు. పీడిత కుల దృక్పథం బహుజన, స్త్రీవాద దృక్పథంతో కధలు రాయడం అలవర్భుకునేందుకు ఈ పుస్తకంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పటికే 50కి పైగా కథలు రాసి 150పైగా వివిధ సిద్దాంత వ్యాసాలు రాసిన బి.ఎస్‌. రాములు దళిత బహుజన నూతన రచయితలకు ఈ పుస్తకం ద్వారా ఎంతో మార్గదర్శకుడవుతున్నారు. ఈయనకు కథలు రాయడం ఎంతో రాయించడం కూడా అంతే యావ. ఇందు వల్లనే 1992లో హృస్నాబాద్‌లో రాష్ట్రస్థాయి కథారచయితల వర్క్‌షాప్‌ ఏర్పాటు చేశారు. అందులో నేర్చుకున్న 200 మంది నూతన కధకుల్లో నుంచి ఇప్పుడు 50 మంది కథలు రాస్తున్నారు. టో కథల బడిలోనే “చిల్లర విషయాలు" అనే చాస్టర్‌ ఉంది. ఇందులో కథలు రాస్త్ర ఎవరికి పంపాలి, ఎట్టా పంపాలి, అచ్చు వేస్తే ఎంత ఖర్చు అవుతుంది, 'ప్రంటింగ్‌, పేపర్‌ రేట్‌అన్ని కూలంకషంగా ఉన్నాయి. వీటితోపాటు ఆయన వివిధ పత్రికలకు రాసిన అలంకారశాస్తాన్ని చిత్రించే వ్యాసాలు పొందుపరిచారు. పాపులర్‌గా రాయడమెలా ? ప్రజారచయితల కర్తవ్యం, కథలో వాస్తవం ఎలా ప్రతి ఫలిస్తాయి. వస్తు పరిణామశీలత అనేవి ఇందులో ఉన్నాయి. సాహిత్యంపట్ట్ల కొంత స్పార్క్‌. ఉన్నవాళ్లు కథలు రాయాలన్న 'జిల' ఉన్నవాళ్లు ఈ పుస్తకం చదివితే సరి, ఆత్మవిశ్వాసంతో కథతోపాటు పరుగెడతారు. వార్త దినప(త్రిక శ్రుతి" ళీర్షిక ఆగస్టు, 2998 అన్నవరం దేవేందర్‌

గ్ర మల్లేశం మరో ప్రపంచ స్వాప్నికుడు

“ముంచోతిని ఖండించిన/నా విడికిట కత్తి వదల

పోరాటం నా డైరెక్షన్‌/పాట నాకు ఆక్సిజన్‌”

అన్న చెరబండరాజు వలె మేర మల్లేశం పోరాటాన్ని రగిలించడం కోసం- పాటను ఆక్సిజన్‌గా ఉపయోగించుకున్నాడు. ఆయన మరో ప్రపంచం కోసం కలలుగన్న స్వాప్నికుడు. తెలంగాణా విముక్తి పోరాటంలో భూస్వామ్య నైజాం వ్యతిరేక పోరాటం, ఆ తర్వాత దోపిడి పీడనలేని సమాజం కోసం తపన ఆయన సొమాజిక చింతనను తెలియచేస్తుంది. 1946-51ల మధ్య సాగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో అనేకమార్దు జైలుకెళ్లారు. చిత్రహింసలకు గురయ్యారు. తెలంగాణా ఇండియన్‌ యూనియన్‌లో విలీనం అయిన తర్వాత కరీంనగర్‌ జిల్దాలో కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకత్వంలో పని చేశారు. ఉమ్మడి కమ్యూనిస్ట్‌ పార్టీ విడిపోయాక జిల్లాలో అమృత్‌లాల్‌ శుక్లా, మేర మల్లేశం, జాప లక్ష్మారెడ్డిలు సిపిఐ నుంచి వేరయ్యారు. 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని ఆహ్వానించారు. 1980 తర్వాత 1990వరకు నక్సలైట్‌ ఉద్యమంపట్ల ఆశావాదంలో ఉన్నారు. మల్లేశంగారి ఇంటి పేరు గూడూరి, పీడిత దర్జీ కులంలో పుట్టినందున మేర మల్లేశంగా ఖ్యాతికెక్కారు. ఆనాటి పోరాటంలో ఆయన అరెస్ట్‌ అయినప్పుడు కూడా నీ పేరేంటని అగ్రవర్ణ స్వభావంగల రజాకార్‌ పోలీస్‌ అధికారులు అడిగితే 'మల్లేళం అని చెప్పగా షుళ్లేళం నంది ? మల్లయ్య అను అని మల్లయ్యగా నమోదు చేశారు. ఈనాడు ఆయనకు ఇచ్చిన స్వాతంత్ర్య సమరయోధుల తామ్రపత్రంలో మరో కోణం

మల్లయ్య అనే ఉంది. మల్లేశం పుట్టింది వరంగల్‌ జిల్లా ఎర్రగాల్లపహాడ్‌. వీరి తాత అక్కన్నపేటకు వచ్చారు. మల్లేశం తాత నర్భయ్యను అక్కన్నపేట భూస్వామి చొక్కారావు గౌడి దున్నపోతు పొడనగా చనిపోయాడు. దీంతో మల్లేశం తండ్రి వెంకయ్య చొక్కారావుతో తగాదాపడి తనను కూడా చంపిస్తారనే భయంతో షోలా పూర్‌, పూనా వెళ్ళిపోయారు. ఆ తర్వాత తిరిగి వచ్చారు. మల్లేశం హైద్రాబాద్‌కు బచతుకుతెరువుకోసం వెళ్లగా అక్కడే 1946లో ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర మహాసభతో పరిచయం ఏర్పడింది. అక్కడ ఒక సర్కన్‌ కంపెనీలో పనిచేశారు, అప్పటికే బుర్రకథలు చెప్పడం, వాక్సాతుర్యంతో పాటలు పాడడంలో (ప్రవేశం ఉన్నందున అంధ్ర మహాసభ కార్యకర్తలైన పండిత నరేందర్‌, జగన్‌, రాంమూర్తి లతో కల్సి పనిచేశారు. తర్వాత గుండి దామోదర్‌రావుతో కల్సి ఆర్గనైద్వన్ష్‌ చేశారు. ఆంధ్ర మహాసభ నుంచి తిరిగి వచ్చారు. కఠీంనగల్‌ జిల్లాలోని మల్గారంలో ఎల్మ లస్మయ్య చనిపోయాడు. ముత్తి లింగంకు ప్రజల్లో శిక్ష వేశారు. ఇక్కడి నుంచి మళల్లేశంను పార్టీ నాయకత్వం వరంగల్‌ జిల్లా జనగామ పాత్ర తాలూకాకు పంపించింది. చీటకోడూరు కేంద్రంగా నరహరి, కొత్త ముకుందరెడ్డి జనార్దన్‌రెడ్డిలతో దళంగా తయారై గ్రామ (గ్రామాన పోరాటాలు కొనసాగించారు. చీటకోడూరు, మార్గెడి, ఎర్రగొల్లపహాడ్‌, హన్మంతాపూూర్‌; తుకారం తండ, అడివి కేశ్వాపూర్స్‌ కన్నెబోయిన గూడెంలలో భూస్వాముల వద్దనున్న తుషాక్షృల్ప గుంజుకొని ఈ దళం సంచలనం సృష్టించింది. దీంతో ఇతన్ని పట్టుకునేందుకు నిజాం పోలీస్‌ దఫేవార్‌ మోత్మం ప్రయత్నిస్తున్నారు. వడ్డకొండకు చెంద్ర భూస్వామి లింగారెడ్డికి శిక్షగా ఆయన ముక్కు కోసిన చర్య జనగామ తాలూక్రాలో ఆ రోజుల్దో సంచలనం అయ్యింది. ఆ తర్వాత 1947లో వెల్లండిలో మళల్లేశంన్సు అరెస్ట్‌ చేసి చిత్రహింసలకు గురిచేశారు. దప్పిక అంటే మూత్రం పోయడం నుంచ్చి వేళ్ళల్లో సూదులు గుచ్చడం, విపరీతంగా కొట్టడం జరిగింది. మద్దూర్చు సలాకపురం, చేర్యాల, ఇటికాలపల్లి, ముస్త్య్యాల, బచ్చన్నపేట, కేశిరెడ్డపల్లి ఎంకిర్యాల, గొనుగుపహాడ్‌ [గ్రామాలన్ని తిప్పు కుంటూ కొట్టారు. జనగామ నిజాం సాహెబ్‌ అదాలత్‌ తీర్పు మేరకు 3 సంవత్సరాల 1 నెల జైలు శిక్ష పడింది. బౌరంగాబాద్‌, బాల్దా (హైదరాబాద్‌ చంచల్‌గూడ, జాల్నా కాన్సంట్రేషన్‌ క్యాంప్‌, బీడ్‌జైల్లలో ఆయన్ను నిర్బంధించారు. 1951లో విడుదలచేసి నజర్‌ బంద్‌ చేశారు ద్ర్వో అన్నవరం దేవేందర్‌

మల్లేశం రాసిన అన్ని పాటలు సేకరించే ప్రయత్నం చేశాము కాని ఎక్కువగా రాత ప్రతులు లేవు. అక్కడక్కడా జనం నోళ్లలోనే ఉన్నాయి. అన్ని పాటలను జ్ఞాపకంతో చెప్పేందుకు మల్లేశంగారి ఆరోగ్య పరిస్టితి సక్రమంగా లేదు. ఇది కాకుండా ఆయన రాసుకున్న 'ఆత్మకథ' రిపోర్ట్‌ కూడా ఉంది. దానిని ఇందులోకి రాని మరికొన్ని పాటలను కలిపి మరోసారి ము(ద్రించవచ్చు. వీరి పాటలు ఇదివరకే సంకలనంగా రావల్సి ఉండె. నేను అంతకపేట హైస్కూల్‌లో చదువుకున్న నాటి నుంచి మల్లేశంగారి పోరాట పటిమ గమనిస్తున్నాను. ఆ తర్వాత హుస్నాబార్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్న కాలంలో పలుమార్లు ఆయన ఇంటర్వ్యులు, రాజకీయ అభిప్రాయాలు, పాత స్మృతుల కోసం ఆయన్ను కదిలించేవాడిని. కోహెడ కోమురయ్యకు నాకు ఈ పాటలను సంకలనం చేయాలనే ఆలోచన వచ్చింది. ఇది వరకు తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్లొన్న అనభేరి (ప్రభాకర్‌రావు ఇతరులందరి చరిత్రలతో (గ్రంధం వేయాలనుకున్నాం. ఈ మేరకు అలాంటి పుస్తకం వచ్చింది. ఇందులోని పాటలు ఇప్పటి ఉద్యమాలలో ఉపయోగం ఉండక పోవచ్చు. ఆనాటి ఉద్యమ పాటలుగా చరిత్రలో రికార్డ్‌ చేసేందుకు ఈ పుస్తకం వెలువరించాము. 1969లో తెలంగాణా వెనుకబాటుతనాన్ని (ప్రళ్నిస్తు రాసిన

పాటలు ఇప్పుడొస్తున్న తెలంగాణా ఉద్యమానికి స్ఫూర్తిని కలుగజేస్తాయి. మర మల్లేశం పోరాట పాటలు" సంకలనంకు నా నంపాదకీయం జులై [97

(యళ్లేళం గారు పాటల వుస్తకం వెలువడగానే చూనీ అవిష్కరణ కాకముందే ఆగష్టు, 19 2927న ఆమరుడయ్యాడు. అనంతరం ఆయన నంస్మరణ నభ లోబ్‌ అంతకపేటలో అగమ్ట, 2% 2987న అవిష్కరించబడ్డది.)

మరో కోణం

సంస్కృతి పరాయీకరించబడుతున్నా

మనకు సోయి లేదు... |

“నా తెలంగాణా కోటి రతనాల వీణ” అన్న దాశరథి వాక్యానిక్షి కొనసాగింపు

“న తెలంగాణా శతకోటి పొంనలో కోన”లా అయ్యింది. హింస అంటే రాజ్య

హింసే అనండి, హింస హంసలా నడుస్తుంది. హింస అంటే మనిష్పిన్సి చంపడమ్సు

కొట్టడమే కాదు. మనల్ని మనం కాకుండా చేయడం హింస కాదూ 9] మన

మనస్సును -పరాయీకరించటం మన ఆత్మను వారు జేబుల్లో వేసుకోవడం మన

నాలుకలక్సు వాల్టు పగ్గాలుకట్టి ఆడిపించడం, మొత్తానికి మన తలకాయలక్షృ

వాల్టు రిమోట్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేసకున్నారు. మన తెలంగాణాది ఎంత 'పెజ్ర

చరిత్ర. సాహిత్య సాంస్కృతిక రాజకీయ ఆర్థిక సామాజక చరిత్రనంతా ిక్షాక్ట్‌

చేయకుండా చేసి తెలంగాణాస్టానే ఆంధ్రప్రదేశ్‌ చరిత్రను రకార్డ్‌ చేస్తున్నా ర

తద్వారా మన మూలాలు మనకు తెల్వకుండా పోతున్నాయి. మన' పదాల సె

ఇతర పదాలు వస్తున్నాయి. మన పండగలు మాయం అయి ఇతర ప్రాం అప్సి

పండుగలు వస్తున్నాయి. అట్లాగే భాష కూడా (భ్రష్టు పట్టిస్తున్నారు. ఇదంతా హింన్స

కాదా ! అసలు మనమెవరం, ఎట్లా ఉండాల్సినవాళ్లం, ఇట్టా ఎందుకున్నాం, ఇల

ఎందుకు మాట్టాడుతున్నాం అనే విషయాలను ఆకళింపు చేసికోవాల్సిన అవసర్ర నేడు ఎంతైనా ఉంది.

తెలంగాణాలో అతి పెద్దదైన బతకమ్మ పండుగ, ఈ పండుగక్తు ఊర్జోన్న

[హ్‌

ఆడబిడ్డలు అందరూ కల్సుకొని చెరువుకట్టకుపోయి. ఆడుకునే సామూహిక

పండగ అది. ఎందుకు అంతరిస్తుంది. దానిస్థ్రానే గణపతి నవరాత్రులు మ్య గక ఇన్నవరం దేవేందర్‌

తెలంగాణాకు ఎందుకు వస్తున్నాయి. అట్లా దేవీనవరాత్రులుకూడా మనం జరుపు కుంటున్నాం. గణపతి ఉత్సవాలు మరాఠి ప్రాంతం నుంచి, దేవీనవరాత్రులు ఆంధ్ర నుంచి దిగుమతి చేసుకున్న సంస్కృతి. మరి మన తెలంగాణా బతకమ్మ పండుగను ఇతర (ప్రాంతాల్లో ఎవరూ జరుపుకోవడం లేదు. ఇలాగే పీర్ల పండుగ (ప్రాశస్త్యం తగ్గిపోయింది. ఇవన్నీ మన సంస్కృతికి సంబంధించిన అంశాలు. అట్లాగే ఆహారపు అలవాట్టుకూడా పూర్తిగా మారిపోతున్నాయి. ఇంతవరకూ తెలంగాణా లో కుడుములు, సర్వపిండి, జొన్నరొట్టె, ఉవ్పుడుపిండి లాంటివి టిఫిన్స్‌గా చేసేవారు. వీటిస్టానంలో అరవవాళ్లు చేసుకునే దోసెలు, ఇడ్లీలు వచ్చి చేరాయి,

మన సంస్కృతీ మనకు 'మోటు' అనే ఆత్మన్యూనతలో ఉన్నాం. భాష విషయానికి వస్తే మన తెలంగాణా యాస సొగసును ఆంధ్రా వాళ్లు గుర్తించ నిరాకరిస్తున్నారు. అందుకే ఈనాడు మన సురవరం, కట్టమంచి రామ లింగారెడ్డి మన కాళోజీ, మన దాశరథిలకు ఒక గురజాడ, ఒక శ్రీశ్రీలా గౌరవింప బడలేదు. మొదట్లో పత్రికలు, రేడియో వారి చేతిలో ఉండటంవల్ల, వారి భాషనే మనకు భాషగా మారింది. ఆ తర్వాత అన్ని పాఠ్యపుస్తకాల్లో మన మాండలికం లేదు. దిన, వార, మాసపత్రికలు నడిపేవారు వాళ్లే అందుకే మన భాషను అప హాస్యం చేసే స్థాయిలో వాడుకున్నారు తప్ప దీనికి సాహిత్య గౌరవం ఇవ్వలేదు. ఇలా కుట్రతో మనల్ని దోపిడీ చేస్తున్న వారిని మనం గుర్తించలేదు. వారిదే అసలైన భాష అనుకొని మనం మన మూలాలను మరిచపోయాము. ముఖ్యంగా సినిమాల్లో తెలంగాణా భాషను అపహాస్యం చేసేందుకు ఒక విలన్‌ పాత్రలకు లేదా బపూన్ల పాత్రలు పెడుతున్నారు. ఆ పాత్రలనుచూసి మనమే ఎక్కువగా నవ్వుతూ నవ్వుల పాలవుతున్నాం. దినపత్రికల్లో కూడా భాషను ఖూనీ చేస్తున్నారో, అన్ని దినపత్రిక ల్లోని మఫిసిల్‌ డెస్క్‌ల్లో ఇన్‌ఛార్జిలుగా ఆంధ్ర వాల్లను వేయడం వల్ల మన జాతీయాలు, మన భాష వాల్లకు అర్ధంగాక అణచి వేస్తున్నారు. దాని స్టానంలో కొత్తగా వాల్ల జాతీయాన్ని ప్రయోగిస్తున్నారు. "కొండెక్కిన పథకం'అనే హెడ్డింగ్‌తో ఒక వార్త వస్తే 'ఏదో గుట్ట ఎక్కించే పథకం కావచ్చు" అని మనం అనుకుంటాం కాని కొండెక్కడం అంటే వాల్ల భాషలో చచ్చిపోవడం అని అర్ధం. ఇలాంటి పదాలు తెలంగాణా జిల్టాల్లోని పత్రికల్లో వస్తున్నాయి. దీన్ని చదివి మనం ఆంతా వీలైనట్లు ఖండించాల్సిన చోట 'కొండెక్కడమే' కరెక్టు కావచ్చునని మళ్ళీ మనం అదే వాడడం జరుగుతుంది. ఇలా మన భాషలో భావ వ్యక్తీకరణలో ఇలాంటి పదాలు మరో కోణం

కోకొల్లలుగా వస్తున్నాయ. వీటి నుంచి మనం రక్షించబడాలంటే కొంతలో కొంతైనా మన పదాలపై మనకు పట్టు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన కట్టుబొట్టు కూడా మారిపోయింది. మన దేశాన్ని బ్రిటీష్‌ వాళ్లు వందలాది సంవత్సరాలు ఏలినా మన తెలంగాణాపై ప్రత్యక్షంగా వాళ్ల ప్రభావం లేదు. మన తెలంగాణా వెలుగుపై నిజాం తురకల ప్రభావం ఉంది. మన భాషలో ఆ భావం జీర్షించుకుంది. నిజాం, భూస్వామ్య విధానంకు వ్యతిరేకంగా మన దగ్గర సొగిన తెలంగాణా సాయుధ పోరాటం (1946-51) భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర లో ఎక్కలేదు. మన పాఠ్యపుస్తకాల్లో కూడా లేదు. ఐదు సంవత్సరాలు ప్రజలే ఆయుధాలతో భూస్వామ్య విధానంకు, నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటంచేసి వేలాది మంది అసువులు బాసినా మన చరిత్రను లిఖించుకొలేని వాళ్లం అయ్యాము. దేశం అంతా జరిగిన బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాన్ని చదువు కుంటూ మన ఆంధ్ర మహాసభ, మన తెలంగాణా విముక్తి పోరాటాన్ని మన పిల్లలు ఎందుకు చదవడం లేదు ? ఇదేదో కాకతాళీయంగా జరిగే సంఘటనలు కావు, కావాలనే మన చరిత్రను, సంస్కృతిని, భాషను, యాసను దూరం చెయ్యడం జరుగుతాంది. ఇదే క్రమంలో మన పదాలు మనకు తెలయ కుండా పోతున్నాయి. కళ్ళె. ఇను(ర్రాయి, బొడ్డుగురిగి ళివాంట, బాలెంతృ దాల్తి చుల్ల కుదురు, సింగిడి ఇట్లా చాలా పదాలు ఇప్పుడు వచ్చే తరానికి పరిచయం లేక్సుండ్ల పోతున్నాయి. పైగా తెల్సినా ఇవి వాడటంకు నామోషిగా భావిస్తున్నాం, మన పదాల్లోని సొగసును గుర్తించి మనం పదిలపరచుకోవాల్సిన అవసరం నే తెలంగాణా విద్యావంతుల్లో ఉంది. అట్లాగే సంస్కృతి ఆచార వ్యవహారాడే పండుగలు పబ్బాలు ఇవన్నీ మనం మనవి చేసుకొందాం. పరాయివానిక్షి మనీ దాసోహం కావడం దేనికి ? " నై మన తెలుగు పలుకులో తెలంగాణాతనం పోతున్నది. మనం పరాయీక్రవ్ర్య బడుతున్న విషయం గుర్తించి జర సోయితో మెలగాల్సిన అవసరం నేడు ఉన్నన్ని “కళ్చెలో దాచుకున్లు కమ్ముని పాలగోకు/తంపిలో కాల్ఫుక్షున్చు ల్యాత్వుళ కంక్షి/కొల్తకొండ తీరంలో తిన్హు కొల్కల పేరు/దూపకు బుడ్జిలో జుర్రిన గడ్క నల ఎంత రామసక్కదన మసోంటి తెలంగాణా పోరల బాల్యం ఇట్టాంటి సంస్కత్తీన్స యాది మరిస్తే ఎట్లా ? స్ఫూర్తి అసోనియేషన్స్‌ - స్ఫూర్తి" ప్రత్వేళ నంచిక్త 2007 బ్లో అన్నవరం దేవేందర్‌

సాంస్కృతిక పరాయీకరణలో శ్రామిక సంస్కృతి మనిషి మానవత్వం నుంచి పరాయీకరణ చెందు తున్నాడు. (శ్రామిక సంస్కృతి నుంచి కూర్చుండి మేసే సంస్కృతికి పరాయీకరణ ఇటీవల ఇంకా ఎక్కువైంది. సమాజంలో వేళ్ళమీద లెక్కించే వర్గాలదే ఆసలైన సంస్కృతి అనే 'మాయి'లో పడి మారిపోతున్నారు. దీన్నే ఉన్నోని మెదడుతో లేనివాడు ఆలోచించడం లేదా పెట్టుబడిదొరులు, భూస్వాముల మనస్సుతోనే కార్మికులు రైతు కూలీలు ఆలోచించటం అన్నమాట ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అ(గ్రవర్షపు

మెదడుతో దళిత బహుజనులు ఆలోచించడం. రాష్ట్ర మంత్రివర్గంలో చిత్తూరుజిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిన్తున్న పౌరసరఫరాల మంత్రి పట్నం సుబ్బయ్య దళితుడు. ఆయన ఇంటిలో ఇటీవల జరిగిన వివాహపు విందులో అ(గ్రవర్జాలవారికి, దళితులకు వేరువేరుగా వడ్డించారు. స్వయంగా దళితుడైన పట్నం సుబ్బయ్య ఇలా వ్యవహరించడం వెనుక పరిస్థితులను పరిశీలిస్తే దళిత జీవన సంస్కృతికి దూరంగా వర్ణవాద సంస్కృతికి దగ్గర అవుతున్నారని అర్ధమవుతుంది. భూస్వామ్య చైతన్యం దళిత మంత్రి ఇంట్లో భోజనం చేసేందుకు పనికొచ్చింది కాని దళితత్వం దిగజారి అగ్ర మరో కోణం

వర్లీకరించబడింది. తను పరాయివాడయ్యాడు. దళిత బహుజన. ప్రజాస్వామిక (శ్రామిక సంస్కృతీకరణ చెందాల్సిన చైతన్యం విలోమమై హిందుత్వ చొతుర్వర్ల వ్యవస్థలో హైందవీకరింబడ్డది దీనినే పని సంస్కృతి నుంచి పనిలేక తిని తిరిగే సంస్కృతికి దిగజారిపోవడం అనవచ్చు. రిజర్వేషన్ల ద్వారాగాని ఇతరతత్రాగాని ఉన్నతంగా ఎదిగిన ఎందరో తమ మూలాలను మరచిపోతున్నారు. ఈ దేశంలో మూలవాసులు తమ తల్లివేర్లను మరచిపోతున్నారు. మరిచిపోవడం అంటే ఇది అల్బమైనదన్న అదే గొప్ప సంస్కృతి అని ఊహించుకోవడమే ఉదాహరణకు నేడు చిల్లర కులోలన్నీ తమ తమ కులదేవుల్లను ఆరాధించడం మానివేసాయి లేదా తగ్గించాయి. ప్రతి చిల్లర కులానికి కులదైవం ఉండేది. గత వందల ఏళ్లుగా వాల్టు ఆ దేవున్ని పూజించేవారు. నేడు ఆ దేవుల్ల ఆరాధన మాయమైపోయి ఆర్యుల దేవుల్లు వైదిక దేవుల్లను ఆరాధిస్తున్నారు. దైవఆరాధన దేవుడున్నాడా ? లేడా అనే చర్చ నేను ఇక్కడ చేయడం లేదు, ఇదివరకు వద్మశాలీలు మార్కండేయులను, కుమ్మురులు పోషమ్మకు, చాకలోల్ట్లు మడివేలును, మాదిగలు మూరెమ్మను, తెనుగోవాళ్ళు పెద్దమ్మను, గౌండ్జోల్టు ఎల్లవ్వ తల్లిని ఇలా దళిత బహుజన కులాలు 'శామిక దేవులను పూజించేవి, కట్టకింది మైనమ్మను, కాళమ్మను, కొత్తకొండ ఈరన్నను, కొమురవెల్లి మల్లన్నను, ఐలోని మల్లన్నను ఇలా ఎన్నో దేవుల్లను శ్రామికులు పూజించేవారు. ఈ సంస్కృతి (క్రమంగా పరాయీకరణ చెందుతుంది. ఇక్కడ దళిత బహుజనులు పూజించే దేవుల్లవద్ద పూజారులు ఉండరు. దేవునికి భక్తునికి మధ్య 'డైరెక్ట్‌ సంబంధం ఉంటుంది. వైదిక బ్రాహ్మణీయ దేవుల్లవద్ద ఇలా ఉండదు. మధ్యలో దేవునికి, భక్తునికీ మధ్యన “దళారి” ఉంటాడు. శ్రా వైదిక పూజలు నిర్వహించేవారు చిల్లర దేవుల్ల గుడిలోకి ప్రవేశించరు. చెరువు క్రిం మైసమ్మ ఊరవతల పోషమ్మ, గుడిలో (బ్రాహ్మాణులు పూజలు చేయగా ఎవర్ప చూసి ఉండరు. అలాగే చిల్లర దేవుల్ల దగ్గరికి భక్తులు వెళ్ళి కోడిపిల్లలను కోస్సుక్రి కల్టు తాగి హాయిగా 'పిళ్ళిక్‌' పోయినట్టు పోయి వస్తారు. అయితే వ౦ందలాద్రి సంవత్సరాలుగా ఉన్న ఈ ఆర్యేతర సంస్కృతి నేడు కనుమరుగవుత్రుంద్రి. పరాయీకరణంఅయి (బ్రాహ్మణీకం చెందుతుంది, దీన్నే చైతన్యం అనుకోవడంలో ఇదే మంచి సంస్కృతి అనుకొనే (భ్రమలో ఉండటంవల్ల ఇలా జరుగుతుంది. అన్నవరం దేవేందర్‌

పోషమ్ము, ఎల్లమ్మ, మైసమ్మ మడివేలు దైవాలను విడిచి చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మర్జ్హు లిరుపతికి ఎందుకు పోతున్నారు ? ఇంకా సాయిబాబా ఆయ్యప్పల పూజా సంస్కృతకి పరాయీకరణ జరుగుతుంది. ఈ కోణం నుంచే పట్నం సుబ్బయ్య అ(గ్రవర్దాల వారికి వేరే విందు ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాల్సి ఉంది. అదే నిజమైందని అనుకోవడంవల్లనైనా జరుగుతుంది లేదా అ(గ్రవర్ధాల వాల్ల వద్ద ఈయన ఆత్మ గౌరవం తాకట్టు పెట్టి వాల్లను (ప్రసన్నం చేసుకోవడం లోనైనా ఆలోచించాల్సి ఉంది. ఇలాగే గ్రామీణ సంస్కృతి, ఊరు సంస్కృతి, వాడ సంస్కృతి, రచ్చబండ పంచాయతీ సంస్కృతి మాయమైపోకుండా విలువలను మార్చాల్సి ఉంది. దళిత బహుజన (ప్రజాస్వామిక శ్రామిక సంస్కృతే నిజమైన సంస్కృతి అని చైతన్యం రావాల్సి ఉంది. అంటే దళిత బహుబనీకరణ జరగాలి. ఈ చైతన్యం లోపించి నప్పుడు పైన పేర్కొన్నట్టు అ(గ్రవర్గీకరణ లేదా హైందవీకరణ జరుగుతుంది. ఇప్పుడు దానిదే పై చేయిగా ఉంది. 'వ్రతివక్షం' వక్షవ(త్రికో నులో కోణం' శీర్షిక 16-37 డిసెంబర్‌ 2998 మరో కోణం

ఎవరిదీ ఎక్కువ కులం, ఎవరిదీ తక్కువ కులం ? నిచ్చిన మెట్టలాగా ఏర్భరచిన వర్ణవ్యవస్థలో కులం నరనరాల్లో ఇంకిపోయింది. ఈ కులవ్యవస్థలో మీది నుండి క్రిందికి (బ్రాహ్మణ, వెలమ, కమ్మ, రెడ్డి, కమ్మరి, కుమ్మరి, చాకలి, శాల కాపు, మాల, మాదిగ, దక్కలి, సిందు, గోస్క ఇలా ఒక కులం మరో తన కింది కులంపై ఆధిపత్య భావజాలం చూపిస్తుంది. మనుధర్మం ఏర్పరచిన కొన్ని వేల ఏళ్లుగా కులతత్వం ఆధిక్యతా తత్వం ఆంతర్బాగంగా పని చేస్తుంది. అయితే మీది కులాలను అ(గ్రకులాలని, మధ్యలోని బి.సి. కులాలను బహుజనులనీ, కింది యస్‌.సి. కులాలని దళితులని నేడు వ్యవహరించబడు తున్నాయి. దళిత, బహుజన శక్తుల ఐక్యత పెరిగిన కొద్దీ ఆ(గ్రకులాలని వ్యవహరించబడే వారి ఐక్యత మరొక రూపంలో కూడగట్టుకుంటుంది. ఈ కుల గజ్జి భౌతికవాద సిద్దాంత కర్తలైన కమ్యూనిస్ట్‌, నక్సలైట్‌ పార్టీలనీ కాకుండా సమస్త పార్టీలకు వ్యాపించింది. కుల గజ్జి అంటే నిచ్చెన మెట్ట వ్యవస్థలో పైనున్న ఆ(గ్రజుల మనుకునేవారు తమదే గొప్ప కులమనీ తమకే శాస్త్రాలు తెల్సనీ అనుకునే కులాల వారి గూర్చి వాడుతున్న పదం. అయితే 'పైవాల్ల అణిచివేతకు వ్యతిరేకంగా మధ్యే మార్గంలో ఉన్న కులాలు, క్రింది కులాల ఐక్యత కుల గజ్జి కిందికి రాదు. వీల్లకున్న సమస్యల్లా వేల ఏండ్లుగా పెద్ద కులాలకు చేసిన బాంచె సేవ, బానిస తత్వానిక్తి వ్యతిరేకంగా ఐక్యమై ఆత్మ గౌరవంగా నినాదం ఇవ్వటమే వీళ్ళు ఐక్యమవ్వుడం, కుల చైతన్యం. అన్నవరం దేవేందర్‌

ఇక్కడ అ(గ్రకులవాదులు అని మధ్యేవాద పార్టీలు, బహుజన సమాజ్‌ పార్టీలు విలువిస్తున్నాయి. వాల్లను అ(గ్రజులుగా గుర్తించడం దేనికి ? తరతరాలుగా శ్రమకు దూరమైన కులాలు అవి, సమాజానికి ఆ కులాల కంట్రిబ్యూషన్‌ ఏమి లేదు. ఉదాహరణకు మాదిగ కులం =ంది. ఇది అద్భుతమైన వృత్తి పశువుల చర్మం తీసి, చెప్పులు చేసి ప్రజలందరికి పంచి ఇచ్చిన కులం, పళథువుల చర్మం తీసి చెప్పులుగా మార్చే పరిశ్రమలో ఎంతో శా(స్త్రీయ జ్ఞానం ఉంది, ప్రతిభ ఉంది. చాకలి వృత్తి ఉంది కొన్ని సంవత్సరాలుగా ఎందరివో బట్టలను మళల్లెవువ్వుల వలె తెల్లగా ఉతికి, (ఫ్రెష్‌గా అందించి సమాజ సేవ చేశారు. అది గొప్ప కులం. అలాగే మంగలి వృత్తి పద్మశాలి వృత్తి కుమ్మరి వృత్తి ఇలా పలురకాల కులాల్లో విద్యకు దూరమైనా కళాత కంగా శాస్త్రీయంగా అద్భుతంగా ఆ వృత్తులను తరతరాలుగా నిర్వర్తించారు. ఆయా కులాల వారు ఆ కులంలో పుట్టినందుకు గర్వించాలి. శామిక కులంలో పుట్టాం, నేనొక చాకలిని, నేనాక మంగళిని, ఎంతో గొప్ప కులాలు మావి. నేనొక కుమ్మరిని, నేనొక మాదిగను, నేనొక నేతవాన్ని, ఎంతో కళాత్మకమైన పనులు మానవ నాగరిక సమాజానికి మా కులాల కంట్రిబ్యూషన్‌ ఎంతో ఉందని ఆత్మగౌరవంతో గర్వించాల్సి ఉంది.

దీన్నే మరో కోణం నుంచి నిచ్చెన మెట్ట వ్యవస్థలోని మీది కులాలను తీసు కుంటే బ్రాహ్మణుని కంట్రిబ్యూషన్‌ ఈ సమాజానికి ఏమైనా ఉందా ? ఏమి లేదు, ఏమి ఉండదు. ఏమైనా ఉంటే శ్రామిక కులాలను కర్మ సిద్దాంతం పేరుతో 'మాయ' చేసి, పూజలు చేసి ఉన్నవన్ని ఎత్తుకు పోవడం తప్ప వాల్లు సమాజానికి చేసింది ఏమి లేదు, అలాగే కమ ఫ్రై రెడ్డి, వెలమ కులాలు కూడా సమాజానికి (శ్రమ ద్వారా కంట్రిబ్యూషన్‌ పెద్దగా లేదనే చెప్పవచ్చు. రెడ్డలో (శ్రామికులున్నారు, అలాగే శ్రమకు దూరంగా పనులు చేయించే వారున్నారు. వీది వీమైనా ఈ మూడు కులాలు వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా సామిజిక సేవలో ఉన్నారు. అయితే సమాజానికి వేల ఏళ్ళుగా సేవలు చేసిన కులాలు గొప్పవా ? ఏ సేవలు అందించ కుండా కూర్చుని మేసిన కులాలు గొప్పవా ? అన్నది తేల్చుకోవాల్సిన అంశం. దళితుల, బహుజనుల ఆత్మగౌరవ నినాదంలో భాగంగా మేం పని చేస్తున్నాం. మేం చదువుకున్నాం. మాకు ప్రతిభ మీకన్న ఎక్కువ ఉందని నినదిస్తున్న ఈ రోజుల్లో కింది కులాలనుంచి ఉన్నతస్థితికి వచ్చిన వర్గాలు కొంత అత్మనూన్యత లో పడుతున్నాయి. మాదే గొప్పకులం అని తలెత్తుకు తిరగడం లేదు.

మరో కోణం

పచ్చ సిరాతో సంతకాలు చేసే చాకలి, మంగళి, కుమ్మరి, ఎరుకల, మేదరి, తెనుగులాంటి కులాల ఉద్యోగులు తమ కుల సమావేశాలకు వేళ్ళేందుకు నిరాక రిస్తుంటారు. తమ కులం తక్కువదని తెలిస్తే బాగుండదని ఆత్మనూన్యతలో ఉంటున్నారు. “మా కులమే గొప్పది" అనే ఆత్మగౌరవం. తన కుల చారిత్రక సత్యాలను ప్రచారం చేసుకున్న నాడే, వర్షవాద వ్యవస్థలో ఇప్పటివరకు లాభం చేకూరిన కులాలకు (ప్రత్యామ్నాయం కల్పించినట్టు అవుతుంది. అయితే మాదిగ హక్కుల దండోరా ఉద్యమం వచ్చిన తర్వాత మాదిగల ఆత్మగౌరవం ఇనుమ డించింది. నేడు మాదిగ అని చెప్పుకోవడానికి గర్విస్తున్నారు. మాదిగ అని పేరు చివర భూషణంగా అలంకరించుకుంటున్నారు. దళిత బహుజనులకు పేర్ల చివర్ల భూషణాలుగా తమ (శ్రామికుల చైతన్యంకు దీటుగా ఆత్మగౌరవంగానే వుంటాయి. అయితే నిచ్చెన మెట్ల వ్యవస్తలో పైనున్న కులాల వారి పేర్ల చివర అహంకార భూషణంగా వేల ఏళ్ళుగా అణచివేతకు, (శ్రమకు దూరంగా ఉన్న ప్రతీకలుగా కన్పిస్తున్నాయి. మాదిగల ఆత్మగౌరవం కోసం ఉద్యమాలు వస్తున్నట్టే బహుజన కులాల ఆత్మ గౌరవం కోసం ఉద్యమస్తాయిలో ఇనుమడించాలి. అంటే పెద్ద కులాలని చెప్ప బడేవారికి దీటుగా ఇవే గొప్పవని ఇవే సిసలైన ప్రజాస్వామిక కులాలని భావ ప్రచారం ముమ్మరంగా సాగాల్సిన అవసరం ఉంది. ఇలా ఎవరి కులాల (ప్రచారం, గుర్తింపు, భావజాలం, సెంపొందించుకుంటూ పోతే కుల వ్యవస్త పెరిగిపోతుంది కదా ? అనే ప్రశ్న రావచ్చు అయితే శ్రామిక కులాల ఐక్యత ద్వారానే ప్రతిఘటన సాధ్యమవుతుంది. ఐక్యతతోనే కులనిర్మూలన సాధ్యమవుతుంది. శ్రామిక కులాల చైతన్యం ద్వారా కుల నిర్మూలన తీసుకరావచ్చు. (శ్రామిక దళిత బహుజన కులాల్లో 'వియ్యం' అందుకోవడం ద్వారానే కుల నిర్మూలన సాధ్యమవుతుంది. అంతవరకు క్రింది కులాలవాళ్ళు అబ్బ మాదెంత గొప్ప (శ్రామిక కులం, మాదెంత్ర ప్రజా సంస్కృతిగల కులం, మా కులం ద్వారా కంట్రిబ్యూషన్‌ సమాజానికి ఎంత్ర ఇచ్చాం అని గర్వపడాలి. ప్రతివక్షం" ప్ష్రవ(త్రిక్ష మరో కోణం” శీర్టిక్ర తల నవంబల్‌ 21998 బ్రో అన్నవరం దేవేందర్‌

సిద్దాంత రాహిత్యం ! భావజాల ప్రచార లోపం కమ్యూనిస్ట్‌లు, సోషలిస్ట్‌లు, నక్సలైట్లు, దళితులు, బహుజనులు, ్రీవాదులు చార్యోక నాస్తిక హేతువాదులు తమ తమ భావజాల (ప్రచార రంగాల్లో తీవ్ర వైఫల్యం చెందారు. పైన పేర్కొన్న ఆయా రంగాల్లోని శిబిరాల ద్వారా భౌతికవాద ప్రాపంచిక ధృక్సధం విస్తారం కాకుండా ఉండడం వల్లనే నేడు హిందుత్వం" విసృత రూపం దాల్చింది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌కు దేశంలో వందలాది అనుబంధ సంఘాలున్నాయి. కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని శిభిరాల నుంచి తమ హిందుత్వవాదాన్ని విపులీకరించి సనాతన సంస్కృతిని ప్రాచీన సంస్కృతిగా (ప్రచారం చేస్తున్నారు. ఇదీగాకుండా దేశంనిండా సరస్వతీ శిశు మందిరాలలో కూడా 'హిందుత్వం' ప్రచారం నిర్వహించడం వెనుక

ఆర్‌.యస్‌.యస్‌. ముందు చూపుతో వ్యవహరిస్తుంది. మరి దేశంలోకి ప్రవేశించిన కమ్యూనిస్ట్‌ పార్టీలుగాని, మార్క్సిస్ట్‌ శిబిరాలుగొని, సోషలిస్ట్‌ నేతలుగాని తమతమ భౌతికవాద (ప్రాపంచిక ధృక్సదాన్ని నేర్చే పాఠశాల లు నిర్వహించారా? నక్సలైట్టు, ఇతరులు తమ రాజకీయ అవగాహనగొని, మార్క్సిస్ట్‌ సిద్దాంత ఆవళ్యకతగాని తెలిపేందుకు పాఠశాలలున్నాయా? హేతు వాదులు నాస్తేకులుకూడా చార్వాకుల కాలం నుంచి దేవుల్లకు (ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణంలో పాటుపడుతున్నారుగాని ఆయారంగాల్లో ప్రచారం, మరో కోణం

నిర్వహణ, పాఠశాలల విస్తరణలో లోపం ఉంది. ఇదే లోపాన్ని నేడు (స్త్రీవాద శిబిరాలు, దళిత బహుజన రాజకీయ పునరేకీకరణ వాదులు కూడా చేస్తున్నారు. హిందూమతంకు ఆద్యమైన ఉపనిషత్తులు, వేదాలు నేడు అధికారంలోఉన్న బిజెపీ సర్కార్‌ పుస్తకాంశంగా పెట్టనుంది. అలాగే సరస్వతీ (ప్రార్ధనను కూడా వ్యతిరేకించిన వారిని వ్యతిరేకిస్తుంది. సరస్వతీ ప్రార్థన లౌకికరాజ్యంలో సరే అనే స్థితిలో తమ భావజాలం (ప్రచారం నిర్మాణం అయి ఉంది. దేశంలో దళితులు బహుజనుల సంస్కృతి, పెండ్హి పండుగలు, కట్టుబాట్లు, ఆచారం, వ్యవహారం, నిత్యం జీవనవిధానం, ఆహారపు అలవాట్టు అన్ని వేరుగా ఉంటాయి. వీల్ల దేవుల్లు సైతం వేరే ఉంటారు. వారిని క్షుద్ర దేవతలు అంటారు. అయితే హిందూత్వ ప్రచారం తీవ్రస్థాయిలో ఉండి మనమంతా హిందువులమే అనే నేడు దళిత బహుజన (ప్రజానీకం పరాయికరణం చెందారు. దళితులు హిందువులు కారు, హిందువులంటే (బ్రాహ్మణులు, (బ్రాహ్మణత్వ సంప్రదాయం, సంస్కృతి మిగతావారికి లేదంటే సైతం ఆశ్చర్యాన్ని కలిగే స్థితి నేడు లేదు. అలాగే హిందుత్వవాదులు ఆదివాసులను కూడా కలుపుకుంటు వీరూ హిందువులనే అంటున్నారు. ఇవన్నీ వీల్లు ఎలా చెప్పగలుగుతున్నారంటే హిందుత్వ భావజాలం పారశాలల నుండి ప్రచారం అయింది. ఆర్‌.'యస్‌.యస్‌.కు దేశం నిండా వేలాది శాఖలున్నాయి. ఆ శాఖల ద్యారా ప్రచారం విస్పృతం అవుతున్నది, మరి హిందూ మతం పేర జరిగే (ప్రచారంను ప్రతిఘటించే శక్తులున్నాయా ? లేదా దానికి (ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మించే వారున్నారా ? అంటే అదీ లేదు. కమ్యూనిస్ట్‌ మార్క్సిస్ట్‌లు సిద్ధాంత రాజకీయాలు మినహ భావజాలం ప్రచారంలో విఫలం ఆయ్యారు. నేటి సి.పిఐ., సిపియం. పార్టీలకైతే వాటి కమ్యూనిస్ట్‌ ఐడియాలజీ బొత్తిగా లేకుండా పోయింది. ఎగర్రజెండాకే కొబ్బరికాయలు కొట్టి, కమ్యూనిస్ట్‌ నాయకులు తిరుపతికి పోయి గుండు కొట్టించుకునే స్థితిలో ఉన్నారు. అలాగ నక్సలైట్లు కూడా ఇంతే. చైనాలో విప్లవం సాంస్కృతిక ఉద్యమాల ద్వారా మేళవిం్చ వచ్చింది. ఇందులో ఎన్నో వైరుధ్యాలున్నాయి. భావజాల ప్రచారం మాట అటుంచి నేటి నక్సలైట్టలో సిద్దాంతం తక్కువై తుపాకి ప్రాబల్యం ఎక్కునైంది. తుషాక్తి టెర్రర్‌వల్ల మేధావివర్గానికి గౌరవం తగ్గినట్టు ప్రచారం జరుగుతుంది. దశాబ్ద కాలంగా తెలుగు నేలపై విస్తరిస్తున్న దళిత బహుజన (స్రీవాదుల్లో ఇదే లోపం అన్నవరం దేవేందర్‌

కన్పిస్తుంది. తమ సిద్దాంతాల ప్రాబల్యమైన అంబేద్కరిజం, బుద్దిజం, పెరియార్‌ తత్వాన్ని జనంలో సరస్వతీ శిశు మందిర్‌లలాగా (ప్రచార వైఫల్యం స్పష్టంగా ఉంది. దేవుడు లేడు అనే వాదంతోపాటు, కుల నిర్మూలనవాదులు, శాస్త్రీయ ఆలోచనను (ప్రవేశపెట్టిన చార్వాకులు, లోకాయుతులు, హేతువాదులు, నాస్తికులు కూడా తమ స్థాయిలో దేశవ్యాప్తంగా తమ శాఖలను విసృతపరచాలి. ఆయా ఆలోచనలను వేగిర పరచకపోవడంవల్ల ఇబ్బంది తీవ్రతరమౌతుంది. హిందుత్వమునకు ప్రత్యామ్నాయంగా దళిత బహుజన భౌతికవాద సంస్కృతి అన్ని శిబిరాల్లో పునర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆర్‌యస్‌.యన్‌. బి.జె.పి.లు హిందూత్వ దేశంగా తీర్చిదిద్దేందుకు జరుపుతున్న కృషి కొన్ని సంవత్సరాలుగా ఉంది. ఆ స్థాయిలో మిగతా భౌతికవాద సంస్థలు, రాజకీయ పక్షాలు నిర్వహిస్తున్నాయా ? లేదా ? ఎందుకని ? 'ప్రతివక్షం” వ్యవత్రిక ములో కోణం” ళీర్లిక 1-5 నవంబథ్‌ 2298 మరో కోణం

భారతీయ సంస్కృతి అంటే ? శివ సైనికులు 'ఫైరో సినిమాపై దాడి చేసినప్పుడు ఇది భారతీయ సంస్కృతికి విరుద్దంగా ఉందని ప్రకటించారు. ఫైర్‌ సినిమా ప్రదర్శనపై దాడి కానీ, ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ చిత్రాలను ధ్వంసం చేసేప్పుడుగానీ తరచుగా ఈ భారతీయ సంస్కృతి అనే పదం వాడుతున్నారు. సినిమా ఒక భాన ప్రకటన, ప్రచార మాధ్యమం. ఆ సినిమాలో ఉన్న 'లెస్పియనిజం' మన దేశంలో లేదా ? ఉండటం శివ సైనికులకు ఇష్టం లేదు కాబట్టి భారతీయ సంస్కృతికి విరుద్దమనడమూ ? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అసలు భారతీయ సంస్కృతి అంటే ఏమిటి ? అసలు భారతదేశం అంతటికీ ఒకే సర్కతి ఉందా ? కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరక్రు గుజరాత్‌ నుంచి బెంగాల్‌ వరకు ఎన్నో సంన్కృతులు ఉన్నాయి. బెంగాల్‌ సంస్కృతి వేరు, మరాఠీ, మళయాళీ, తమిళ, తెలుగు, బీహార్‌ సంస్కృతులు వేర ఇలా అన్ని రాష్ట్రాల సంస్కృతులు వేరు వేరుగా ఉంటాయి. అన్ని ర్యొష్ట్రాల్ప ఎందుకు మన ఆంధ్రప్రదేశ్‌నే తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతి అం్యా ఒక్కటే కాదు రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణా సంస్కృతులు వేరువేరుగా ఉంటాయి. ఈ ప్రాంతాల పండుగలు వేరుగానే కట్టుబొట్టు, వంటలు, వివాహపు పద్దతులు సైతం వేరుగానే ఉంటాయి. అందరు మాట్టాడేది తెలుగే అయినా మాండలికంలో మళ్ళీ తేడాలు ఉంటాయి. అదిలాబాద్‌ జిల్లాలోని గోండుల సంస్కృతీ, కొలముల సంస్కృతి ఇంకా వేరుగా ఉంటాయి. లంబాడీల సంస్కృతి ధ్ర అన్నవరం దేవేందర్‌

చాలా వేరుగా ఉంటుంది. వీరందరి మాటలో,ఆటలో, పాటలో, పెండ్రిలో, వంటల్లో అన్నింటా వేరుగా ఉన్నప్పుడు ఒక్క రాష్ట్రంలోనే ఇన్ని సంస్కృతులున్నపుడు దేశం అంతా కలిపి భారతీయ సంస్కృతి ఎట్టా అయ్యింది. ఇందాక నేను చర్చించింది ప్రాంతాల వారీగా మారిన సంస్కృతి ఇంకా లోతుల్లోకి వెళ్ళితే కులాలపర౦ంగా కూడా వేరు వేరు సంస్కృతులు ఉంటాయి. వేరువేరు పద్దతులుంటాయి. ఒక కులంలో పునర్వివాహం నిషిద్దం అయితే మరో కులంలో పునర్వివాహం చేసు కోవచ్చు. గురజాడ కన్యాశుల్కం రాసే కాలంలో (బ్రాహ్మణ (స్రీలకు భర్త చనిపోతే పెళ్ళి అయ్యేదికాదు. అదే కాలంలో, ఇప్పుడూ దళితుల్లో అలా లేదు. ఇలాగే కులాలపరంగా, భాషాపరంగా, ప్రాంతాలవారిగా, రా(ష్ట్రాలవారిగా సంస్కృతి వేరు వేరుగా ఉంది. ఆచార వ్యవహారాలు వేరువేరుగా ఉంటాయి. వియ్యం అందుకునే విధానం వేరువేరుగానే ఉంటుంది. తెలంగాణాలో మేనమామ బిడ్డను పెళ్ళి చేసుకుంటే, ఆంధ్రాలో అక్క కూతురిని వివాహం చేసుకుంటారు. అక్కకూతురు ఇక్కడ మేనకోడలు అవుతుంది. ఇలా అన్నింటా వేరువేరుగొనే ఉన్నా సంస్కృతి సంప్రదాయం భారతీయ సంస్కృతి ఎలా అయ్యిందనేదే ప్రళ్షీ ?

“దీనికి భిన్నత్వంలో ఏకత్వం' అనే పేరుతో మళ్ళీ పాలిష్‌ చేసి వాడతారు. విదేశాలకు వెళ్ళి వచ్చిన మనవాల్లుగానీ, విదేశాల్లో ఉన్న మనవాళ్ళుగానీ తరచూ వాల్లి ఇంటర్వ్యూల్లో మన భాగతీయ సంస్కృతిని విదేశీయులు మెచ్చు కుంటూ ఉన్నారు, మన సంస్కృతిపట్ట వాళ్ళు అభినందిస్తున్నారు అని అంటారు అంటే పైన పేర్కొన్న ఏ,సంస్ట్యృతిని వారు భారతీయ సంస్కృతి అని అభినందిస్తున్నారో తెలియ రాదు. సహజంగా విదేశీయుల్లో విళ్శంఖల లైంగికత్వం, విస్మృత విడాకుల పద్ధతులు ఎక్కువగా ఉంటాయనే అపోహలో ఇక్కడి ఆలోచనా విధానం ఉంటుంది. మన ప్రాచీనపురాణాల్లోని వివాహ పద్ధతులు, వివాహవరసలు ఇప్పుడు మనమే ఆచరించలేము. అయితే ఇన్ని రకాల సంస్కృతులు కలగలిసి ఉన్న మన దేశంలో భారతీయ సంస్కృతి అంటే చెప్పేవాళ్ల దృక్చధాన్నిబట్టి అర్థం చేసు కోవాల్సిన పరిస్థితి ఉంది. శివసైనికులు ఫైర్‌ సినిమా ప్రదర్శనను నిలిపివేసేందుకు భౌతికంగా దాడిచేస్తూ, వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళ తాత్విక చింతనకు అందులో వ్యతిరేకంగా? ఏదో ఉన్నదని అర్థం. ఫైర్‌ సినిమాలో ఉన్నది ఇద్దరు తోటికోడల్లు భర్తల నిరాదరణకుగురై స్వలింగ సంపర్కానికి అలవాటుపడి, అందులోనే ఆనందం చెందటం, ఇక మాకు మగవాళ్ళు అక్కరలేదనే భావనతోనే ఉండటం.

మరో కోణం

దీన్నే శివసైనికులు వ్యతిరేకిస్తున్నారు. శివుడు, కేశవుల స్వలింగ సంపర్కంవల్లనే కదా మన అయ్యప్ప పుట్టింది. ఇదీ మన ప్రాచీన సంస్కృతే కదా? ఇక్కడ పురుషులైతే, అక్కడ (స్త్రీలు అంతే తేడా.

(స్రీలు, పురుషుల ఆధిపత్యం నుంచి స్వతంత్ర ప్రతిపత్తికి వస్తున్న క్రమంలోనే దీన్ని వ్యతిరేకించడం (స్త్రీలను ఆదిమ కాలం నుంచి పురాణాలలో కూడా అబల అని అణిచివేసిన వర్గాలే నేడు నిరసిస్తున్నాయి. (స్త్రీలను ఆటబొమ్మలుగా అబలలు గా చూసిన వర్గాలు ఇప్పుడు ఉన్న స్త్రీపురుష లైంగిక సంబంధం కాకుండా స్తీ స్రీ తోనే సంబంధం పెట్టుకుందని చూపిన సినిమాను వ్యతిరేకిస్తున్నట్టు అర్ధం చేసు కోవాల్పి ఉంది. అయితే స్రీలు 'స్త్రీలతోనే లైంగిక సంబంధం పెట్టుకోవడం సరియైందా, (ప్రకృతి నియమాలకు వ్యతిరేకం కదా ? అనే చర్చలోకి నేను రావడం లేదు. పురుషుని అణిచివేత, సాచివేత నుండి సంకెళ్ళు తెంచుకున్న ఒక చింతన ఊహాలోకంలోని మరో మార్పుగా మాత్రమే అర్థం చేసుకోవాల్సి ఉంది. అయితే శివసైనికుల హిందుత్వం ఇది భారతీయ సంస్కృతికి విరుద్దం అంటుంది అంటే భారతదేశంలో అందరికీ వ్యతిరేకమైన సంస్కృతిగా ప్రచారం కాబడుతుంది. శివ సైనికుల సంస్కృతే భారతీయ సంస్కృతిగా ప్రబలే (ప్రమాదాన్ని వ్యతిరేకించాల్సి ఉంది. భారతదేశంలో విభిన్షసంస్కృతులున్నాయి వాటినన్నింటిని గౌరవించాల్సిన

బాధ్యత మనమీదుంది.

ప్రతిపక్షం" ప

4530 జస్వావ్ర ఇ నికే

కల్ల అన్నవరం దేవేందర్‌

అలీ

సలచనవుతున్న పాత్రికేయ వృత్తి స్వాతంత్ర్య ఉద్యమకాలంలో ఆ తర్వాత కూడా పాత్రికేయ వృత్తి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉండేది, ఒక సామాజిక నిబద్దతో ఉండేది. పత్రికల వ్యవస్థాపకులు కూడొ ఆ లక్ష్యాలకు కట్టుబడి ఉండేవారు. (క్రమంగా స్వాతంత్రానంతరం వ్యాపారులు పత్రికా రంగాన్ని చేజిక్కించుకున్న తర్వాత దాని విలువలు పతనావస్థకు చేరువ అయ్యాయి. పెద్ద పెద్ద కంపెనీలె పత్రికల నిర్వహణ చేపట్టడం జరిగిన తర్వాత వారికి సామాజిక నిబద్దతతో పని లేకుండా పోయింది. వారి వ్యాపార నిబద్దత పాలకులతో సహకార సంబంధాలు మెరుగుపర్చుకోవడ౦ం జరుగుతుంది. ఇట్టాగే పత్రికలు (ప్రభుత్వాల్ని శాసించేస్థాయి, మార్చేస్థాయి నరకు వెళ్ళాయి, ఇంకా దిగజారి ఆయా పార్టీల కరపత్రికల్లా కనబడటం చూస్తున్నాం, యాజమాన్యాలే “ఇలా ఉంటే అందులో పనిచేసే పాత్రికేయులెలా ఉంటారు ? వారు సైతం ఏదో ఎప్పుడో ఎక్కడో 'మ్యానుస్టేషనోకు గురవుతారు. ఇందువల్ల సత్యం బయటకు రాదు. ప్రజలు పక్షపాతంగా సమాచారం ఆందించడం, ధర్మ బద్దంగా వార్తలు రాయడం పాత్రికేయుల సామాజిక కర్తవ్యం. అక్కడక్కడ ఆణి ముత్యాల్దాంటి పాత్రికేయులుండడంవల్ల మనకు చాలా తక్కువగానైన మంచి

సమాచారం వస్తుంది. ఇకపోతే (గ్రామీణ ప్రాంత విలేఖరుల పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. మండల కేంద్రాల్లో పనిచేసే పాత్రికేయుల వృత్తిని ఒక 'షోకొగా తీసుకుంటున్నారు. వీ పత్రికా (ప్రస్తుతం ఒక కుటుంబం ఏమోగాని ఒక వ్యక్తి జీవించేందుకు సరిపడా మరో కోణం

జీతాలు ఇవ్వడం లేదు. రాసిన వార్తలను ఇంచులు, సెంటిమీటర్ల పొడవులతో కొలిచి ఇంతని లెక్కేస్తున్నారు. అది అంతా కలిపితే ౩ నుంచి 4 వందలకు దాటదు. పెద్ద సెంటర్లో అయితే వెయ్యి వరకు వస్తుంది. అదీ టెలిఫోన్‌ ఖర్చులు పెట్రోల్‌ ఖర్చులకే సరిపడుతుంటే ఈ వృత్తి ఎలా చేస్తున్నారు ? దీన్నెవరూ ఆలోచించరు. తక్కువ జీతంతో ఎక్కువ పనిచేయించుకునే వృత్తి బహుశా ఇదే అయినా ఈ వృత్తిపట్ల మండల కేంద్రాల్లో పోటీ తీవ్రంగానే ఉంది. మండలస్థాయి లో పాత్రికేయుడంటే ఒక మోస్తరుగా 'అన్నీ' చలాయించవచ్చుననే ఇప్పుడు ఈ వృత్తిలోకి వచ్చేవారు 'తమ పనులన్నీ" సజావుగా చేసుకోవచ్చు తమవాల్ల పనులన్నీ చేసి పెట్టవచ్చునన్న రీతిలో ఎక్కువగా ఉన్నారు. అంతేగానీ సామాజిక చిత్రణచేసే చరిత్రకారునిగా రకరకాల సామాజిక రుగ్మతలను పసిగట్టి ప్రపంచానికి తెలియ చెప్పే సోషల్‌ సైంటిస్ట్‌గా మెలిగేవాల్లెందరు ? అలా ఉందామనుకున్నవాల్ల వార్తలు అచ్చయ్యేదెక్కడ ? సమాజంలో నైతిక విలువలు పతనం అవుతున్నాయి. పతన మవుతున్న నైతిక విలువలను పట్టుకొని ఇదిగో సమాజాన్ని పట్టిపీడిస్తున్నవని చూపి ఏకే జర్నలిస్ట్‌లు కావాలి” నీ నైతిక విలువలతోపాటు తాను పతనమవుతున్న దృశ్యాదృశ్యాలు కోకొల్లలుగా కన్పిస్తున్నాయి. నేటి సమాజంలో పత్రికలన్నా పాత్రికేయ వృత్తి కర్తలన్నా గౌరవం, అభిమానం

ఇంపుగానే ఉందిగాని గత పదేళ్ళుగా ఆది రూపాయి విలువ పడిపోయినట్టుగా పడిపోతుంది. నేడది క్షీణదళకు చేరుకోకముందే నసీనియల్‌ నీన్సియరల్‌ పాత్రికేయులు సమాజంపట్ట సోయితో ఉండే జర్నలిస్ట్‌లు కర్తవ్యం స్పృహతో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే పోలీసు వ్యవస్థకు ఏర్పడ్డ (ప్రజా వ్యతిరేకత పాత్రికేయ వృత్తిపట్ల వస్తుంది. పదేళ్ళక్రితం పోలీసులంటే (ప్రజావ్యతిరేకులని, పీడించేవారని, కొట్టేవారని అనుమానం ప్రజల్లో ఉండేది. దొన్నుంచి వాల్లు చాలా కష్టంగానైనా బయటపడుతున్నారు. ప్రజాసంబంధాలు మెరుగుపర్సు చుక్సునే కార్యక్రమాలు ఏన్నో చేస్తున్నారు. అట్లాగే విలేకరులంటే ఇదివరకున్న గౌర్వం

(ప్రేమ భావన ప్రజలకు ఇది వరకున్నంత పరిపుష్టిగా ఇప్పుడు లేదు. తగ్గిష్మ్యాం ది అది 'జీరో' స్టేజీ వరకు రాకముందే మేల్కోవల్సిన అవసరం ఉంది.

జర్జలిస్ట్‌ల నైతిక పతనం చాలా రకాలుగా ఉంటుంది, అవి ఏ (ప్రలోభాలకు

ఎలా పడిపోతారో నేను ఈ కాలంలో చర్చించదలచుకోలేదు. కాని దాన్సిక్త పత్రికల

యాజమాన్యాల పాత్ర బహుపసందుగా ఉంది. అన్నవరం దేవేందర్‌

పత్రికలకు ఆహారం లాంటి వ్యాపార ప్రకటనలు తెప్పించేందుకు ఇప్పుడు పాత్రికేయులనే వాడుకుంటున్నారు. ఇంతవరకు ప్రకటనలు సేకరించేందుకు విభాగం ఉండేది కాని అది అంతంత మాత్రం పనిచేయడంవల్ల (గ్రామీణ విలేకరులనే ఈ పనికి పురమాయిస్తున్నారు. పైగా ప్రకటనలకు వేతనాలకు లింకు పెట్టుతున్నారు. దీంతో విలేకరులు వార్తల సేకరణ అనే ప్రాథమిక వృత్తి నుంచి ప్రకటనల సేకరణ అనే స్టాయికి పడిపోతున్నారు. దీంతో పాత్రికేయులు, రాజకీయ నాయకులు వ్యాపార సంస్థల చుట్టు తిరిగి లోకువ అయపోతున్నారు. వృత్తి సామర్హ్యంతో ఎదుగుతున్న పాత్రికేయులకు తెలంగాణా జిల్లాలో పరిస్థితి కత్తి మీద సాములానే తయారైంది. సంఘవి[ద్రోహుల నుంచి గిట్టనివారి నుంచి వ్యతిరేకత ఎదురవుతూ పనిచేయడం కష్టంగానే ఉంది. ఇంతటి కష్ట నష్టాల్లోఉన్న (గ్రామీణ పాత్రికేయుల నుంచి రాజకీయ దురందుల తోలు వలిచి నట్టు కుంభకోణాలు వెలికితీసే చిత్రా సుబ్రహ్మణ్యంలు ఆణగారిణ వర్గాల దారిద్ర్యాన్ని, వారిపై జరిగే దౌష్టీకాన్ని అద్భుతంగా చిత్రీకరించే పి. సాయినాథ్‌ల ఆదర్శాలతో ముందుకు పోవాల్సి ఉంది. అయితే తులసి వనంలో గంజాయి మొక్కల్ని వెలికి తీయంది ఇది కుదరదు. 'వతివక్షం' వక్షవ(తిక మరో కోణం” శీర్తిక 26237 డిసెంబర్‌ 998 మరో కోణం

సమాన జీవన ప్రవంతిలో కలిసినరకు

రిజర్వేషన్లు కొనసాగించాలి

అగ్రకుల పాలకవర్గాలు “రిజర్వేషన్‌ అనే బిక్షపెట్టి దళిత బహుజనులను దగా చేస్తున్నాయని అందుకనే రిజర్వేషన్లను మౌళికంగా వ్యతిరేకించాలని బహుజన సమాజ్‌ పార్టీకి చెందిన నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఇటీవల హుస్నాబాద్‌లో రుద్రవరం ఎల్లయ్య 'ఆక్షరశక్తి పుస్తకావిష్కరణ సభలో ఆయన వ్యక్తపరచిన రిజర్వేషన్‌ వ్యాఖ్యలు సభలో కలకలం సృష్టించాయి. రిజర్వేషన్ను పోరాడి సాధించుకున్న హక్కని, సాంఘిక, రాజకీయ, ఆర్థిక అసమానతలున్నంత వరకు రిజర్వేషన్‌లు కొనసాగాలని మరో వక్త ఖండిస్తూ నూట్టాడారు. సహజంగానే అక్కడున్న అ(గ్రకుల స్వభావులు రిజర్వేషన్‌ వ్యతిరేక భావనకు మద్దతు కొన సాగించారు. బహుజన సమాజ్‌ పార్టీ మౌళికంగా అగ్రకుల మనుధర్మ వర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ. అంబేద్కర్‌, పూలే ఆశయాల తో ఉద్భవించిన ఈ పార్టీ (ప్రతినిధి రిజర్వేషన్‌ను వ్యతిరేకించడం అందరినీ ఆశ్చర్త పరిచింది. చట్టసభల్లో, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ ఉండటంవల్లనే క్రద్రా కీ మాత్రం దళితులు ఐ.ఏ.యస్‌. (గ్రూవ్‌ వన్‌ అధికారులు అయ్యేవారా ? క్షాద్చు. దేశంలో సాంఘిక, ఆర్థిక అసమానతలు అన్నిచోట్టా ఉన్నాయి. అవి ఉన్నంత మేరకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. అక్కడ మాట్టాడిన బహుజన సమాజ్‌ పార్టీ నేత మనోగతం ఇంకా ఈ విధంగా ఉంది. నూటికి 85 శాతంమంది దళిత, బహుజన

అన్నవరం దేవేందర్‌

జనాభా ఉండగా మనమే అధికారంలోకి వచ్చి అగ్ర కులాలకు రిజర్వేషన్‌ ఇవ్వాలంటాడు. ఆయన రిజర్వేషన్‌ ద్వారా వచ్చిన ఉద్యోగంపట్లగానీ, రిజర్వేషన్‌ ద్వారా పొందిన ప్రజా ప్రాతినిధ్యంపట్లగానీ ఆత్మన్యూనతలో ఉన్నారు, అగ్రకుల కుటుంబాలకు చదువు కోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి దండిగా డబ్బు, ఆస్తి అన్నీ ఉంటాయి. పైగా బంధువర్గాల సహకారం ఉంది దీంతో వాల్టు ముందుకు పోతున్నారు. రిజర్వేషన్‌ లేకుంటే విద్యాలయాల్లో దళిత బహుజనులకు సీట్టెలా దొరుకుతాయి. ఉద్యోగాలెలా వస్తాయి, బహుళా బహుజన నమాజ్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రకులాలకు రిజర్వేషన్‌ ఇచ్చే విషయంపట్ల

అవగాహనకు వస్తుందేమో. పైన పేర్కొన్న రిజర్వేషన్లకు దూరంగా ఉండటమో, రిజర్వేషన్‌ను 'ఊతం' అనుకొని, 'బిక్షు అనుకొని పట్టనట్టుండటం నిరాశా భవిష్యత్‌ను సూచిస్తుంది. ఇది వరకు నక్సలైట్లకు, కమ్యూనిస్ట్‌లకు కులంపట్ట సరిగా ఇలాంటి అంటీ ముట్టని దృక్పథమే ఉండేది. నక్సలైట్లు అయితే కులం గూర్చి మాట్లాడితే, ప్రీ సమస్య గూర్చి మాట్లాడితే వ్యతిరేకించేవారు. కులతత్సవాది అనే ముద్రవేసారు. విప్లవం వచ్చిన తర్వాత కులం అదే పోతుంది అనే వారు. ఇప్పుడు (క్రమంగా మార్చు వచ్చింది. చైనాలో, రష్యాలో కులం లేదు కావచ్చు కాని భారతదేశంలో కులం ఉంది (అందుకే ఇన్నేల్ల ప్రయోగం తర్వాత కూడా విష్టవం వచ్చి సోషలిస్ట్‌ వ్యవస్థ ఏర్పడలేదు). ఈ మహమ్మారిని నిర్మూలించకుండా మన లక్ష్యాలను చేధించ లేము అనుకొని కుల నిర్మూలనపై దృష్టి కేంద్రీకరించారు. అలాగే సి.పి.ఐ, సి.పి.యం. పార్టీలు కూడా ఇటీవలనే కళ్ళు తెరిచాయి. సిపియం, దీనికొక ప్రత్యేక కార్యక్రమమే తీసుకొని కుల నిర్మూలనా సదస్సులు ఏర్పాటు చేస్తున్నది. సి.పి.ఐ. ఇంకా ఈ దిశకు చేరువ కాలేదు. ఇలా కమ్యూనిస్ట్‌లు నక్సలైట్టతో సహా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా కుల సమస్యను పట్టించుకొని దాన్ని నిర్మూలించక పోవడం చారిత్రక తప్పిదమే అయ్యింది. ఇలా వీల్లు 'కులం' ఆంటే కులపిచ్చి అన్నట్టుగానే బహుజన సమాజ్‌ పార్టీ రిజర్వేషన్లను పట్టించుకోకపోవడం కూడా దీనితోనే పోల్చవచ్చు. అయితే సి.పి.ఐ. సి.పియం., నక్సలైట్లు కుల నిర్మూలన దృక్చధంవైపుకు వెళ్ళకపోవడం కాకతాళీయం కాదు ఆయా పార్టీలకు నాయకత్వం వహిస్తున్నది కూడా ఆగ్రకులం వాల్సు కావడం వల్లనే ఇలా జరిగింది. భారతదేశంలోకి కమ్యూనిస్ట్‌ పార్టీని తెచ్చిన శ్రీపాద డొంగే మొదలుకొని జ్యోతిబసు, నంబూద్రి ప్రసాద్‌ అంతా (బ్రాహ్మలే. నక్సలైట్ల పార్టీలో ఉన్నది కూడా మరో కోణం

(బ్రాహ్మలు, రెడ్డ మరి వాల్లకు కుల అణిచివేత ఎలా అర్హం అవుతుంది. అణిచివేత అనుభవం లేదు పైగా తమ అగ్రకుల అస్టిత్వంకు వ్యతిరేకంగా ఆలోచించక పోవడంవల్ల పైన పేర్కొన్న పార్టీలు కుల నిర్మూలనా చైతన్యం వైపు ఆలోచించడం లేదు. తర్వాత బాబ్రిమసీదు, విధ్యంసం, కారంచేడు, నీరుకొండ ఘటనల తర్వాత సోషలిస్ట్‌ ధృక్పథం, సామాజిక ఆలోచనగల శక్తులు బలపడుతూ వామపక్షాలు బలహీనపడుతున్న (క్రమంలో మళ్ళీ ఈ పార్టీలు కులనిర్మూలనకు పాటుపడు తున్నాయి. అయితే సోషలిస్ట్‌, వామపక్ష శక్తులు బలహీనపడుతున్న కొద్దీ దేశంలో మతతత్వ శక్తులు తమ శక్తియుక్తులను విపరీతంగా పెంచుకుంటున్నాయి. నేడు ఆ మత శక్తులకు ఎదురులేకుండా పోయింది. దేశంలో వర్గపోరాటం, మార్క్సిజంతోపాటు కుల పోరాట ధృక్పథం నేర్పిన అంబేద్కరిజంలను అన్వయించిన నాడే అట్టడుగున ఉన్న అణిచివేతకు గురయ్యే వర్గాలు సమాన జీవన (స్రవంతిలో కలుస్తాయి. ఇలా అణిచివేత కులాలు సమాన జీవన స్రవంతిలో కలిసేవరక్షు దేశంలో అన్నింటా కులాలపరంగా విద్యా ఉద్యోగరంగల్లో రిజర్వేషన్‌ కల్పించాలి. కులాల పరంగా అందులో మళ్ళీ స్రీలకు వారివారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్‌ కల్పించాలి. సమాన జనాభాకు సమాన వాటా కల్పించి 1క్రిమీ లేయర్‌ను తీసి వేయాలి. ఉదాహరణకు ఒక దళిత కుటుంబం నుంచి ఐ.ఎ.యస్‌. లేదా ఏడైనా ఉన్నతాధికారిగా ఎవరైనా ఎదిగినట్టయితే ఆ కుటుంబానికి మరోసారి రిజర్వేషన్‌ కల్పించకూడదు. అతను మేయిన్‌ స్రీమ్‌లో కలిసాడని అర్థం. రిజర్వేషన్‌ను ఒకసారి లేదా రెండుసార్జు లబ్ది పొందిన వారు తిరిగి వాల్టుగాని, వాల్ల పిల్లలుగ్గాని క్లెయిమ్‌ చేసుకోకుండా చేసినప్పుడే ఈ అవకాశం మరొక్రరిక్తి ఉపయోగ పడుతుంది. ప్రతిపక్షం" వ్మ్షవ్యత్రల మరో కోలం” ర్డీ 25-29 ఫిబ్ర్వర్రి 299 భోగీ అన్నవరం దేవేందర్‌

నూయదారి ఎన్నికల్లో ఓడిపోతున్న ఓటరు

మాయదారి ఎన్నికల్లో మరోసారి ప్రజలు ఓడిపోనున్నారు. ప్రతీ ఎన్నికల్లో లీడర్దు గెలవడం, ఓటర్జు ఓడిపోవడం నిరాటంకంగా కొనసాగుతున్నది. ప్రజాసేవ చేస్తామనే పేరిట లక్షలాది రూపాయలు "పెట్టుబడులు" పెడుతున్న రాజకీయ వ్యాపారులు ఓటర్లను వినియోగదారులుగా చూస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల జాతరలో పెట్టిన లక్షలాది రూపాయలతో వచ్చే పదేండ్లలో మరిన్ని లక్షలు సంపాదిస్తారు. స్వాతంత్రానంతరం పోటీచేసి గెలిచిన ఒక్కో ఎమ్మెల్యే, మంత్రి పోటీచేసేనాటికి వున్న ఆస్తికి తరువాత పదవీకాలంలో వున్న ఆస్తికి పోల్చిచూస్తే ఊహకందదు. మళ్ళీ ఆ ఆస్తిని నిలబెట్టుకునేందుకు రంగంమీదికి ఏ పార్టీ టికెట్టు దొరికితే ఆ సార్టీకి 'జంప్‌'కావడం జరుగుతుంది. కాని ఇదంతా ఏమి పట్టనట్లు ఓటర్లను “గొర్రెలను చేస్తూ నాయకులు పబ్బం గడుపుకొంటున్నారు. ఇట్టాంటి లక్షలాది రూపాయల ధనార్జన అధికారం, గౌరవం పొందేందుకు జరిగే ఎన్నికల

ప్రక్రియ ఇప్పుడు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది.

ఎన్నికల్లో (శాసనసభకు) ఖర్చు పెట్టేందుకు ఎన్నికల కమీషన్‌ నియమావళి ప్రకారం 6 లక్షల రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేయాలి. కాని ఒక్కో అభ్యర్హి ప్రధాన పార్టీలవారు 60 లక్షలకుపైనే ఖర్చు చేస్తారనేది జగమెరిగిన సత్యం. ఒక్కో ఎమె శల్యేకు ఎన్నికైతే జీతభత్యాలు కలిపి 20వేల వరకు మాత్రమే వస్తాయి. 5 ఏళ్ళలో వారికి మొత్తం 12 లక్షలకు మించి ఆదాయం జీతభత్యాల రూపేణా మరో కోణం

రాదు. మరి ఇప్పుడు హంగామా ఏమిటి ? ఒక్కొక్కరు ఎన్ని వాహనాలు ? ఎన్ని పోస్టర్లు ? ఎన్ని మైకులు, ఎంత మంది కార్యకర్తలు. ఇవేవిగాకుండా ధనప్రవాహం ఎంత ? మందు సరఫరా ఎంత ? ఇవన్ని ఆ అభ్యర్థి నిజంగానే మనకు సేవ చేసేందుకు ఖర్చు చేస్తున్నారా ? ప్రజలకు సేవచేసే తపన ఉంటే ఇలా ఎమె శల్యేగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేదు కదా ? అనే ప్రశ్శసైతం ఉదయిస్తుంది. గాంధీ ఎన్నికల్టో నిలబడలేదు కదా, లోక్‌నాయక్‌ జయ్రకాక్‌నారాయణ, అన్నా, హజారే ఇలా ఎంతోమంది సంఘ సేవకులు తమ రంగాలను ఎన్నుకుని ప్రజాసేవ చేస్తున్నారు. ఈ పోటీలో ఉండి ఖర్చు చేసే అభ్యర్థులు ప్రజలకు సేవ చేయాలనే యావ ఉంటే ఇదివరకెందుకు చేయలేదో (ప్రజలు గమనించాలి. ఈ రోజు (ప్రజల్ని ఎవరు ఎక్కువ భ్రమల్లో ఉంచగలుగుతారో, (ప్రజల్ని ఎవరు సునాయాసంగా మోసం చేయగలుగుతారో, ప్రజల్ని కులం, మతపరంగా ఎవరు విభజన చేసి, ఎన్నికల 'బూతు'లోకి లాగుతారో వారే విజయం సాధిస్తున్నారు. చివరకు (ప్రజలు మౌత్రం ఓడిపోతున్నారు. ఇది వరకు గెలిచిన అభ్యర్థులైతే మీకు మేం ఈ రోడ్డు వేయించాం, ఈ బడి కట్టించాం, ఇది చేశాం అది చేశాం అని గొప్పలు చెప్పడం ద్వారా ప్రజల్లో (భ్రమలు కల్పిస్తున్నారు. అవి ఏవివాల్టు చేసినవి కావు, వాళ్ళ జేబు లోంచి ఖర్చు చేస్తున్నారా ? వాల్ల ఆస్తులను అమ్మి రోడ్డు వేయిస్తున్నారా ఖ్థి (ప్రభుత్వ ధనంతో చేస్తున్నారు. ప్రభుత డబ్బు అంటే (ప్రజలు తాము పన్నుల ద్వారా చెల్లించిన డబ్బును మళ్ళీ వినియోగిస్తున్నారు. దీనికి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులంతా ఇవి మేమే చేయించాం అని ప్రగల్భాలు 'కొట్లు కుంటున్నారు. ఆయితే మీరు ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత మీకు పెరిగిన ఆస్తి ఎంత? మీ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఎలా సెరిగింది, మీ బంధువుల ఎంత సంపాదించి పెట్టారు ? అని నేడు ప్రజలు చర్చించుకుంటున్నారు. మళ్ళీ వచ్చిన శ్ర మాయదారి ఎన్నికల్లో పాల్గొనవద్దు అని పీపుల్స్‌వార్‌ నక్సలైట్టు పిలుపిచ్చినా ఎన్నికలు ఆగడం లేదు. మినహా బహిష్కరించిన వారి ఓట్టు ఎవరో ఒకరు వేస గెలున్తున్నారు. బహిష్కరణ నినాదం వ్యతిరేకించే హక్కును వినియోగియ్వ కోవడమే కాని అది దుర్వినియోగమై 'ఖల్‌ నాయకుల పాలిట కల్పతరువు అవు తుంది. ఇటీవల 'లోక్‌సత్తా' ప్రచారం చేస్తున్నట్టు బ్యాలెట్‌ పేపర్‌పై "ఇం! గురు వేసి ఏ అభ్యర్థి నచ్చడం లేదని ప్రకటించమని (ప్రచారం చేస్తున్నారు. అయితే దీనికి ఇప్పటికీ చట్టబద్దత రాలేదు. నచ్చని అభ్యర్థికి ఓట్టు ఎక్కువ వేస్తే మొత్తం ఆ ఎన్నికను రద్దు చేసి మళ్ళీ కొత్త అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియ మన రాజ్యాంగంలో ట్రే అన్నవరం దేవేందర్‌

ఉండాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. రానున్న రోజుల్లో ఈ అవకాశం వస్తుందేమో చూడాల్సింది. నేరస్తులు, నేరచరిత్రగల వారిని ఎన్నికల్లోకి రాకుండా చేయాలనే నిబంధన సైతం ఈ ఎన్నికల్లో తీవ్రంగానే ఉంది. అసలు నేరచరిత్ర, నేర మనస్తత్వం లేని వారెవ్వరు అన్ని పార్టీలు నేరమయ రాజకీయాలను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. పైగా ఎవరు నేరస్తులు, ఎవరు కాదు అనేది కోర్టులు మాత్రమే నిర్ణయిస్తే తేలే అంశం కాదు. డబ్బు, అధికారం, కులం, బలం ఉన్నవాడెవడు తన కేసును పోలీస్‌ రికార్డ్‌ల్లోకి రాకుండా చూస్తాడు. ఒకవేల వచ్చినా న్యాయస్థానాల్లో సైతం 'మెస్మరిజం'చేసి తప్పించుకుంటాడు. అలాగాకుండా శిక్షపడితే మళ్ళీ ప్రభుత్వంచే దాన్ని ఉపసంహరించుకుంటాడు. ఇలా న్యాయస్థానంలో రుజువుకొని వారంతా నేరస్తులు కాదనే వాదన ఎట్టా సబబైైంది. నేరాలు చేసిన బలహీనులు మౌత్రమే రికార్డుల్లోకి ఎక్కుతారు. బలవంతులెప్పుడు ఎక్కరు. ఒకవేళ ఎక్కినా జైలుకు పోయి వచ్చినగానీ జైలు సంస్కరణ నిలయాలు అంటున్నాం కదా మళ్ళీ మంచి వాల్టుగా మారవచ్చు. ఒకసారి నేరం చేసిన వాడు మళ్ళీ నేరం చేయకపోవచ్చుననే వాదన సైతం ఉంది. అయితే నేరస్తులు ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హులని (ప్రచారం జరిగితే కొన్ని నేరాలైన జరగకపోవచ్చు. “లోక్‌సత్తా కారుబీకటిలో కాంతి రేఖలా కొంతలో కొంత మార్చు కోసం ఆలోచనను రేకెత్తిస్తుంది. అభ్యర్థులు తాము నామినేషన్‌ వేసిన రెండు రోజులకొకసారి ఖర్చులను రిటర్నింగ్‌ అధికారులకు దాఖలు చేయాలి. కాని చేయడం లేదు. చివరకు లెక్కలు రాసి 6 లక్షలలోపు అప్పగిస్తారు. అసలు చట్టబద్దంగా ఎన్నిక అయి చట్టు తయారు చేయాల్సిన నాయకులు నామినేషన్‌ వేసినప్పటి నుంచి చట్టాల లః తుంగలో తొక్కుతున్నారు. మరి వాల్లెలా మన కోసం మంచి చట్టాలు చేస్తా మన కోసం వాల్లెందుకు తల్రడిల్తుతారు. ల లగా (ప్రతివక్షం' పక్షపత్రిక మరో కోణం' శీర్షిక 16-20 సెప్టెంబర్‌ 2229 మరో కోణం ర!

తుపాకుల కుతి తీరేదెప్పుడు ? పలైలు యం ఒకి ఇగ్జీ సల్లగుండేదెప్పుడు 7 ఉద్యమంలో ఆందుకున్న తుపాకీగాని, ఉద్యోగపరంగా ఎత్తిన తుపాక్షీగాని నేడు ధర్మబద్దంగా లేవు. రెండు చోట్లా తుపాకుల 'ప్రాబల్యమే కన్పిస్తుంది. ప్రజా చైతన్యాన్ని పెంపొందించే (క్రమంలో నూతన ఆవిష్కరణకు ఉపయోగించాల్సిన మొదటి తుపాకిగానీ, ప్రజాసేవకు రక్షణగా ఉండి 'ప్రజాపీడకులను పట్టి కోర్సుక్రీడ (క్రమంలో ఆత్మరక్షణలోసం ఉంచుకోవాల్సిన రెండవ తుషాక్రీగాని రెండూ గనే తప్పాయి, తప్పుతున్నాయి. ఉద్యమ తుపాకీలో, ఉద్యోగ తుపాకీలో టెర్రర్‌ కన్పిస్తుంది లేదా ఒకరికొకరు వ్యక్తిగత శత్రువులనే భావించుకొంటున్నారు. 'ఫజల కోసం' పట్టిన ఈ తుపాకుల నీడలో 'అన్నెం పున్నెం ఎరుగని" వారు నేలరాలు తున్నారు. తుపాకుల గురి తప్పింది, తూటా పడాల్సినచోట పడటం లేద్రు తుపాకికి కావాల్సింది ఆహారం. తుపాకి కుతి తీర్చడం కోసం ట్రిగ్గర్‌ వ దారుణంగా కదలాడుతున్నాయి. శస మనిషి ప్రాణం ఎంతో విలువైనది, ('ప్రేమైనది. అలాంటి ప్రాణం తీయడం నేడు 'సస్తా' అయ్యింది. మనిషితో మనిషి కరచాలనం చేసినంత సులువుగా (ప్రాణాలు తీస్తున్నారు. మనిషి ప్రాణం ఇంత సులువా ? ఉ్తిఫిం ఆగిపోయిన తర్వాత 'సారీ అంటే ఎంత నిర్లక్ష్యం లేదా, ఎలాగోలాగ పొయ్యింది ఊపిరి కాబటి త్ర క్లో అన్నవరం దేవేందర్‌

పాపాలేమైనా ఉంటే ఇందుకు తగిలిస్తే సరిపోతుందన్నది ఆ తుపాకి దొరల సారాంశం కావచ్చు. ఉద్యోగ తుపాకులు ఇలాగే గాడి తప్పిపోతున్నాయి. తుపాకి సంస్కృతికి తుపాకే మందు కాదు, దాంతో అది దావాలనంగా జ్బలిస్తుందనేది తెల్సుకోవాల్సిన అవసరం ఉంది. నక్సలైట్‌ ఉద్యమాన్ని ఆణచివేయాలనుకుంటే ఆది దావానలంలా అంటు కుంటుంది, దానికి ఎదురు కాల్పులే జవాబనుకుంటే ఇరవై ఏళ్ళ వరకు ఆ ఉద్యమం జీవించి ఉండేది కాదు. ఎంతమందిని హతంచేస్తే అంతమంది పుడు తున్నారు. అయితే నక్సలైట్‌ ఉద్యమ నేపథ్యం ఆ ఉద్యమ లక్ష్యాలను సామాజిక, ఆర్థిక కోణాల నుంచి పరిశీలించాల్సి ఉంది. భూసంస్కరణల చట్టం వచ్చి 30 ఏళ్లయినా ఇంకా పంచాల్సిన మిగులు భూములు లక్షలాది ఎకరాలు ఎలా మిగిలి ఉన్నాయనేది ప్రశ్న. పేదలు భూమి సమస్య గురించి, దోపిడీ, పీడన గురించి, ఆత్మగౌరవం గురించి అగ్రవర్ష అణచివేత గురించి, తినేతిండి గురించి, కట్టుకునే గుడ్డ గురించి, ఇల్టు గురించి ఎంతగా పరితపిస్తున్నారో ఆ 'పరితపన'ను నక్సలైట్‌ ఉద్యమాలు అక్కున చేర్చుకున్నాయి. అయితే ప్రజాస్వామిక (ప్రభుత్వాలకు పైన పేర్కొన్న ప్రజల సామాజిక అవసరాలను చిత్తశుద్దితో తీర్చాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే ప్రజలు ప్రభుత్వం వెంట ఉంటారు. ఇవాల అదిలాబాద్‌ జిల్దాలో రెండు వేలమంది గిరిజనులు కేవలం రక్షిత మంచినీరు లేక మలేరియా, అతిసొర వ్యాధి సోకి మరణించారంటే మన పాలకులకు (ప్రజలమీద ఏపాటి '(ప్రేమ' ఉందో తహించవచ్చు. మంచినీళ్ళు ఆందివ్వని సర్కారుకన్న మరింకొకలంటే ఆ గరీబులు ఆదరించే 1ప్రమాదం' ఎందుకు లేదు ? ఇలాంటి (ప్రజల మౌళిక సమస్యల పరిష్కారం కోసం కాకుండా వాల్లకు అండగా ఉన్నవాళ్లను హతమార్చే దిశలో ప్రభుత్వ ఆలోచనలు ఉంటే అది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. 'ఉరి కొయ్యలు, చెరసాలలు విష్ణవాన్ని ఆపలేవు'అని వాల్డు అందుకే ఆంటారు, అయితే ఇది గత కొన్నేళ్లుగా ఉన్న సామాజిక సమస్య, దీని పరిష్కారంగాని లోతుగా పరి శీలించి తేల్చిచెప్పిన వారు లేకపోలేదు. నక్సలైట్‌ సమస్య పునాదిని పరిశీలించ కుండా ఉపరితలంను పరిశీలించి చికిత్స చేస్తే కొత్తకొత్త పునాదులతో ఫైకి లేస్తుంది. ఇలాగే నక్సలైట్‌ సిద్దాంతం దారితప్పి తపాకి ప్రాబల్యం కోసంకూడా చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. ఇదంతా టెర్రర్‌లా ఎగువ మధ్యతరగతివర్గం భ్ధందరదః రొదాలఖ ప. మరో కోణం క గం పళ్ళ మో జ రట. శ షా. స్స వలు

భావిస్తుంది. కమిట్‌మెంట్‌ లేని వాళ్లు సిద్దాంత అవగాహనలేని వాల్లు సమాజంపట్ట అచంచల (ప్రేమ ఉన్నవాల్టు కోరవడటం వల్లనే ఈ తుపాకులకు ఎదురులేకుండా పోయింది. కాకతీయ ఎక్స్‌(ఫ్రెన్‌లో ప్రయాణీ కుల్ని తగులబెట్టడంగానీ, పెద్దమల్డాపురం గిరిజనుల్ని చంవడంగాని, మల్హార్‌రావు, జాన్‌విల్సన్‌, శ్రీపాదరావుల హతం వెనుక వీరు చెప్పే ఏ కారణాలు ఎవరు ఆమోదించేటట్టుగా లేవు. ఉద్యమంపట్ట ప్రజల్లో వ్యతిరేకత పెల్టుబుకింది. శ్రీపాదరావు సంఘటన పరిశీలిస్తే 1994లో జరిగిన ఎన్‌ కౌంటర్లకు ఆయన ఒక్కడే బాధ్యుడు ఎలా అవుతారు ? రాజ్యం (స్టేట్స్‌ దానికిగాని ఏ నంఫుటనలకుగాని బాధ్యత వహించాల్సి ఉంది. ఆ మాటకొస్తే ఎన్‌కౌంటర్లకు పోలీసులు కూడా బాధ్యులు కాదు, స్టేట్‌ వాల్లతో చేయిస్తుంది. ఇది ఉద్యోగ ధర్మం, డ్యూటీ అని చెప్పి వాల్లను వాడుకొంటుంది. ప్రజల సానుభూతి కొల్పోయిన (క్రమం నక్సలైట్‌లలో పెరుగు తుంది. అందుకే ఉద్యమకారుల, ఉద్యోగుల రెండు తుపాకులను ఒకేగాటకట్టాల్సి వచ్చింది. వేలాది మంది ఎన్‌ కౌంటర్ల పేర, వందలాది మంది ఇన్‌ఫార్మర్ల, ఉద్యమ వ్యతిరేకులపేర ఇలా హతమవడం మానవత్వవాదులను, (ప్రజాస్వామికవాదులను కలపరపరుస్తుంది. , వప వర్గాల పోరు నువ్వా ? నేనా ? అన్నరీతిలో కలబడుతుంటే "పైనున్న వాళ్ళు'చూస్తు ఆనందపడుతున్నారు. తెలంగాణా పల్తెలు కల నా (ప్రశాంతత కరువైంది, నేడు తెేణాడాన్లై గుండె వయ్యవళలం నాడు. వీల్ల తుపాకుల 'కుతి' తీరేదెపుడు ? ఇక ని పల్లెలు సల్లగుండేదప్పుడు. పారా 2 ఇక్కడ సళ్ళబ్దం ఆశహంచేదెప్పుడు, ప్రతిపక్షం ప్య్య్య్య మరో క్రోం ఛీర్షిక సొమ్మే 2900 అన్నవరం దేవేందర్‌

కరువు పర్యటన... బ్రిటానియా బిస్కట్లు సాయంత్రం అలా ఆలోచించుకుంటూ ఊరకనే నడుస్తున్నా 'నమస్తే' అన్నాడు వైకుంఠం. తలెత్తిచూసిన మావాడు నిల్బోని ఉన్నాడు. సర్లీ అని ఇద్దరం నడ్భుకుంటూ వెళ్లి నీళ్ళులేని చెరువు కట్టమీద ఎండిపోయిన చేండ్ల దిక్కు చూసుకుంటూ కూచున్నం,. మావాడు వైకుంఠం మహాఘటికుడు, చూస్తే బక్కగా మాసిన బట్టలతో, కొంచెం పెరిగిన పిల్లిగడ్డంలో ఉంటాడుగాని, వాళ్ల అన్న నీలకంఠం నుంచి రాజకీయాలు నేర్చుకున్నాడేమో ఈ మధ్య అన్నీ ప్రశ్నించడం, అన్నింటికి కొత్త కొత్తగ వివరించడం నేర్చుకున్నాడు. సార్‌ ! మీరు తిరగడానికి ఉచిత 'బస్‌పొస్‌'లు ఇస్తారట మన అన్నగారు నిజమేనా ? ఉరుములేని పిడుగులా (ప్రశ్నోకటి అడిగి అన్నకు జర్నలిస్టులంటే మంచి గౌరవమేనని కామెంటొహటి పారేశాడు. కనుగుడ్డు పైకెగరేస్తూ, బొమ్మలు ముడిచి, ఆ6 అవును మేం వార్తలు సేకరించాలిగదా ? తిరగాలిగడా ! అని అన్నాన్నేను. మీమీద గౌరవముందా ? చూడు సార్‌ ఈ నెల 15న జరిగిన అసెంబ్లీ సెషన్స్‌ లో ప్రెస్‌ బిల్లు తేబోతున్నాడు. ఇంతకు ముందు బీహార్‌ అన్న జగన్నాధ్‌మి్రా తెచ్చిన సంగతి తెలుసుగదా అన్నాడు. మరో కోణం

అరె వైకుంఠం ఎప్పుడూ పక్కదార్హ ఊహాగానాలే చేస్తడు అనుకున్న, ఊ6అన్న.

మీకు బస్‌పాస్‌లు ఇచ్చేది మిమ శల్లు మచ్చిక చేసుకోవడానికి, మీకు సౌకర్యాలు కలుగజేసేది మీరు యాంటీ గవర్నమెంట్‌ వార్తలు రాయకుండా ఉండడానికే ! మీరు ఆగష్టు, 1984లో అన్ననెంత కాపాడారు, మరి జస్ట్‌ లైక్‌ కుక్కలకు బిస్కట్లు వేసినట్టు అనుకో ! లెక్చర్‌ మొదలుపెట్టాడు వైకుంఠం.

చెప్పొద్దూ... ఈ కుక్కలూ, బిస్కట్టు పోలికలు మరీ ఎబ్బెట్టుగా అన్పించి ఇబ్బందిగా కదిలినా...

'వైకుంరం వాట్‌ ఆర్‌ యూ టాకింగ్‌ కుక్కలేంటివి, బిస్కట్టేంటివి' అని కోపం గా అన్నాను.

“నిజం నిప్పులాంటిది సార్‌ మీకు మింగుడు పడదు” మళ్లీ ఢంకా భజా యించిండు వైకుంఠం. 'మన మంత్రులు, ఆధికారులు ఈ మధ్యనొచ్చిన ఉన్నతా ధికారి ఉన్నారు చూడు, వాళ్ళు కరువో కరువనుకుంట తిరిగారు, కరువును మా కండ్లతో చూసి అన్న రామారావుకు నివేదిస్తామన్నారు' ఏదో చేయకుండా ఎలా ఉంటారని' నేను ప్రశ్నించాను.

బౌనౌను మహా చక్కగా చెప్పారు సార్‌ 1 ఇక రిపోర్టు కూడా అదేరాసారను కుంటా ! నేననేది అదే సార్‌ నిజమేమిటి, కలెక్టర్‌ జీపు, ఆర్జివో జ్ర, వలీ, ఎంపి., సమితి అధ్యక్షులు ఇంకా అధికార ప్రతినిధుల బృందం తిరిగింది కక! కాని కార్లలో, జీపుల్లో కాలు కిందపెట్టకుండా తిరగితే కరువు కన్నడదా ం చి గాని, తారు రోడ్లమీద తిరుగుతూ, రోడ్ల పక్కనున్న బావులను, పా ” పోల

క లు + ఆ లౌలన్సు క్రార్ర అద్దాలలోనుంచి చూస్తే అయిపోతుందా | వాళ్ళు ఎంతమంది తుల విచారించారు. కనీసం రైతుల్లో మాట్లాడటానికి, వాళ్ళు తెచ్చిన ఎండని లను శాంపిల్స్‌ చూడటానికి కూడా కార్టు, జీపులు దిగలేదు కదా! మం కంక సంగతెలా తెలుస్తుంది ? వు

గెస్ట్‌ హౌజుల్టో బ్రిటానియా బిస్కట్లు తిని, నెస్‌కాఫీలు తాగితే తిండిలేనివాన్సి గొడవ ఎలా తెలుస్తుంది ? గంజి గడ్క లేనివాళ్ల మధ్య వాళ్ళ రెక్కలుముకు లు జేసుకొని, సాలుపొడుగునా శ్రమించి, వానదేవున్ని నమ్ముకొని చివరకు వాన

న! సభ సరీ క్‌

కూడా పడక దగాపడిన రైతుల మధ్య, మేతబాట పక్కకుపెట్టి తాగడానికి నీళ్లు క్రో అన్నవరం దేవేందర్‌

లేని మూగజీవాల పశువులు బిక్కుబిక్కు చూపుల మధ్య ఎలా తాగుతున్నారు ? ఎలా తింటున్నారు ? ఎవరు అడిగినారు ? చివరగా ఆ వచ్చిన ఉన్నతాధికారిగారు మెట్టప్రాంతాల్లో కరువులేదని, రైతులు బాగా బలిసి పచ్చగా ఉన్నారని, ఆయన పచ్చని కండ్లతోటి చూసి రిపోర్టు రాసి పోయినాడా ప్రాజెక్టు కాలువలు మంత్రులున్న పల్లపు (ప్రాంతాలేమొ తీవ్రంగా అనావృష్టి ఉన్నదని తేల్చిపారేసినాడా ఈ సంగతులు నేను కాదు మొన్న జరిగిన సమితి సమావేశంలోనే సర్పంచులు మొత్తుకున్నారా ? అది సార్‌ కథ. బడితె ఉన్నోనిదే రాజ్యం. కరువుతో రాజకీయాలు, శవాల కుప్పల మీద రాజకీయాలు ఎవరు సార్‌ ! ఎవరు మాత్రం కరువు నివారించి రైతులనాదు కుంటారు. గంభిరంగా, 'ప్రవాహంలాగా అలుపూ సొలుపూ లేకుండా మౌట్టాడిన వైకుంఠం దమ్ము తీసుకున్నాడు. మనిషి చిత్రంగా జ్బలిస్తున్నట్టుగా కాస్త ఎదిగి నట్టుగొ కన్పిస్తున్నాడు. నాకెందుకో ఏమీ మాట్టాడాలని అన్పించలేదు. ఎంత తప్పించుకుందామన్నా నిజాలు మాకు తప్పలే ఎవరికి మూత్రం తెలుస్తాయి అయినా... మౌనం తప్ప ననేమి మాట్లాడలేదు. పోతున్నా సార్‌ మరేమనుకోవద్దు అంటూ సమాధానానికి ఆగకుండా చీకట్లో కలిసిపోయిండు వైకుంఠం. చటుక్కున నా పత్రికా తెలివీ ప్రభుత్వం తెలివీ గుర్తొచ్చినయ్‌, పత్రికా భాషలో వైకుంరాలు టెగర్రరిస్ట్‌లు అవుతారు. 'బీవగడ్డ” దినవ(్రిక బాతాఖాని” ళీర్షిక 20 అక్టోబరు 2985 మరో కోణం

గ వైకుంఠం ముచ్చట్లు ఇటీవల పత్రికల్లో వచ్చిన గిరిజనుల చీకటి జీవితాల కథలు చదివి మిత్రునితో కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళుతున్నాను. రోడ్డు ప్రక్కన బోరింగ్‌ వద్ద నిల్చున్న వైకుంఠం 'హలో సార్‌ అన్నాడు. ఈ మధ్య హైదరాబాద్‌ వెళ్ళినట్టున్నది. చాలా రోజుల తర్వాత కల్పాడు. ఉదయం పదకొండు దాటింది. ఇంకా నో ట్లో బ్రష్‌ తీయలేదు. లుంగీ మీదికి కట్టి నీటికోసం పడిగాడ్పులుగొాస్తున్నాడు. అదే గడ్డం, లోపలికి పోయిన కడుపు చూస్తేనే నాకు ఇదైపోతుంది, హలో అన్నాను. ఎప్పుడొచ్చావు, బాగున్నావా వైకుంఠం 'అంటే' 'ఆ ఏమున్నది ఇక్కడ దొరలు దోచుకున్నట్లే పట్నంల, ఖార్ధానాలల్ల పన్ఫేయించుకొనే సేట్టు గట్టనే సేత్తండ్రు, అక్కడ బతుకుడు జరకష్టంగ ఉందని ఇక్కడికే వచ్చినఅన్నాడు. మంచినీళ్ళ కోసం ఏడు గంటల నుంచి చూస్తున్నా, నా వంతు ఇంకెప్పుడొస్తుందో అని అనబోతుండగానే ప్రక్కన కుండలు పగిలిన శబ్దం, అక్కడి జనం కొట్టాటకు సిద్ధమవుతున్నట్టుంది, బోరింగ్‌ నుండి ఒక్కో చుక్కగా నీళ్ళు పడుతున్నాయి. 'మన దేశంలో (బ్రతకడం అంటే వట్టిదే అనుకున్నావా ! కష్టపడాలి. (గ్రామాల్లో కూలీలకు, కంపెనీలలో పనిచేసేవారికి కనీస వేతనాలున్నాయి కదా బ్రతకొచ్చు' అన్నాను. 'మీరు అట్లనే అంటరు సార్‌, తెలిసో తెల్వకో కొని గా సర్కారోల్టు నిర్మ యించిన కనీస వేతనాలు ఇవ్వమని కూలీవాల్లంతా ఒక్కటై అడుగుతేనె గదా గ్రోఅన్నవరం దేవేందర్‌

సర్కారోల్డు తీస్కపోయి లోపలేసిరి' అంటూ ఏకధాటిగా చెప్పేస్తున్నాడు. నేను

మి(త్రుడు వింటున్నాం. 'కార్ధానాల్లో కూడా వానికి చంచాగిరి చేసినోన్కి జీతాలు,

అదెట్టా అన్నోనికి డిస్మిస్‌ చేసుడాయే' అని బాధాతప్తంగా మాట్లాడేస్తున్నాడు. నేను దానికి ఏం సమాధానం చెప్పలేదు, వాస్తవమే మరి |

'జర్నలిస్ట్‌లంతా కల్సి మహదేవ్‌పూర్‌ అడివిలోకి వెళ్ళారట కదా సార్‌ ! మొన్న కాటారం వెళ్ళితే అక్కడి (బ్రాండీషాప్‌ అతను చెప్పాడు” అన్నాడు.

కందమూలాలు తినడం, వేట, పోడు వ్యవసాయం తప్ప వారికి ఈ దేశం, స్వాతంత్ర్యం, ఓట్టు, రాజకీయంగూర్చి ఇంకా ఏమితెలియవు'అని చెప్పుతున్నాడు.

వైకుంఠం నీలంపెల్లి, కాటారం ఆ (గ్రామాలల్టో కొన్ని రోజులు ఉన్నట్టున్నాడు.

'వాల్లకి పోలీసులు, రెవెన్యూ వాల్లే సర్కారు అనుకొంటారు. తప్ప రామారావు, రాజీవ్‌గాంధీల గురించి తెలియదు. మీరు చాలా మరచిపోయినట్టుంది, వాల్ల గురించి బాగా పేపర్లల్ల రాస్తున్నపుడు కూడ వాల్ల ఫోటోలు తీసువేసుకుంటే ఉపేపర్టు ఇంకా అమ్ముడు పోతాయి కదా సార్‌ అన్నాడు.

ప్రక్కనున్న మిత్రుడు కూడా ఆ విలేకరుల బృందంలో ఇచ్చంపల్లి తదితర గిరిజన ప్రాంతాల పర్యటనలో వెళ్ళాడు.

'వొట్‌ ఈజ్‌ హి టాకింగ్‌. పత్రికల్లో గిరిజనుల రాసేది అమ్ముకోడానికే అన్నట్టు మాట్టాడుతున్నాడు' అని మిత్రుడు కోపం ప్రదర్శించాడు. వైకుంఠం బోరింగ్‌ వంక 'బాధ్యతగల పత్రికలు, జర్నలిస్ట్‌ల ఉద్దేశ్యం ఆది కాదు కదా !

వైకుంఠం వంతు వచ్చినట్టుంది బోరింగ్‌ కింద కుండ ఉంచాడు. హాండిల్‌ మీద ఒక్క చేయి వేశాడు. చుక్క అందులో పడుతున్నది,

మిత్రుడు, నేను కల్సి ఆఫీసుకు వెళ్ళాం. వైకుంఠం ఏదో ఆలోచిస్తూ కుండ వంకే చూస్తున్నాడు.

'జీవగడ్త' దినప(త్రిక బాతాఖాని” శీర్షిక మరో కోణం

$ కరువు ప్రాంతంలో బతుకమ్మ పాట బతుకమ్మ పండుగనాడు 'ఉత్సవాలు' చూద్దామని బయటికెళ్ళాను. అనుకో కుండా వైకుంఠం కలిశాడు. వైకుంఠం పక్కన నడుస్తుంటే నాకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అంతసేపు రంగురంగులతో కనిపించిన బతుకమ్మ దృశ్యం ఎందుకో వెలితిగా కనిపించింది. ఎక్కడా ఉత్సాహం లేదు. అంతా మొక్కుబడికి చేస్తున్నట్టుంది. కరువుకోరల్లో నఎగిపోయిన ప్రాంతం కదా... బతుకమ్మ పాటల్టో గ్రామీణ ఉత్సాహం లేదు. (స్త్రీలంతా పాటలు పాడుతుంటే అనిపించింది. వీళ్ళు బతుకమ్మను ఎక్కడ వేస్తారు ? ఎక్కడా నీళ్ళు లేవే. కరువుతో బరువెక్కిన ప్రజల కళ్ళు కన్నీటి కాసారాల్లో ఉన్నాయి. అందులో వేస్తారు కావచ్చు ! ఈ ఊహ వచ్చే సరికి... ఈ ఊహ నాదేనా అనిపించింది. కొంపదీసి వైకుంఠంలో దూరలేదు కదా ? నేను వైకుంఠం వైపు తెరిపార చూశాను. అతను అటుగా వస్తున్న ఆడపడుచు లను చూస్తున్నాడు. ఆ కళ్లలో ఎంతో జాలి, ఆడవాళ్ళ చేతుల్లో పూలకుప్పలు, కొప్పులో పూలదండలు, పీతాంబరాలతో నడుస్తున్నారు. ఉన్నట్టుండి వైకుంఠం నోరు విప్పాడు, అడ్వోర్‌టైజ్‌మెంట్టతో సినిమాల్లో వెకిలి డ్యాన్సులతో అర్ధనగ్నంగా స్త్రీని అవమానిస్తూ... వరకట్నం కోసం కిరసనాయిల్‌తో దగ్రం చేస్తూ... ఆడపడుచుల ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నారు" అన్నాడు. గట్టిగా తనలో తాను మాట్లాడుతున్నట్టు. ఇప్పుడు ఈ మాటలు ఎందుకన్నాడబ్బా అని నేను ఆలోచించేలోగా మళ్ళీ వైకుంఠమే కంటిన్యూ చేశాడు. అడది అబలగా మారిన మన దేశంలో పిల్లల్నికని, భర్తకు సేవలుచేసి, యంత్ర స్టితికివచ్చి సాంఘికంగా హీనమైైపోతున్న తరుణంలో ఇంత మంది స్త్రీలు క్రో అన్నవరం దేవేందర్‌

అందంగా అలంకరించుకొని మన ముందు బతుకమ్మ ఆడుతున్నారు. వీళ్ళ ఆత్మగౌరవాన్ని ఎలా వెతకాలి అని వైకుంఠం ్రశ్న్శవేసాడు. సాధారణంగా వైకుంఠం వేసే ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలుండవు. ఆ మాటకు వస్తే ఎవ్వరి దగ్గరా వుండవు. ఆ ప్రశ్న మహిళా సంఘాల వారి నడగాలి ౯ అన్నాన్నేను. (ప్రస్తుతానికి తప్పించుకున్నాను అని అనుకున్నాను.

'ఛ | అవి కుట్టు. అల్లికలు, వంటలు నేర్పే సంస్థలు. అక్కడ ఆత్మాభిమానాన్ని _ నేర్చడమా, లాభం లేదు” అని చప్పరించాడు. ఒక నిమిషంసేవు మౌనం వహించారు. ఆ మౌనంలో నేను ఊపిరి తీసుకున్నాను. మరేం చేయాలి ? ఎవరు (స్త్రీలను కాపాడాలి ? యంత్రస్టితి నుంచి మానవత్వస్థాయికి ఎవరు తెస్తారు ?

ఇంతలో ముందుగా కొంచెం అల్లరి చెలరేగింది. జనం గుమిగూడారు. జనాన్ని తోసుకొని వైకుంరం గుంపులోకి వెళ్లిపోయాడు. నేను వెళ్లడం చాతగొక అక్కడే ఆగాను. నా చేయిపట్టి లాగాడు. దబాల్న వెళ్లి అతసమీద పడ్డా నేను, అంతమంది

చ్‌ ళా జనంల్‌ నాకు నడవడం, నిలబడడం ఇష్టం ఉండదు. ఐనా వైకుంఠం ఆసరాతో దూరాను. లై

అక్కడ దృశ్యం చూసి అచ్చెరువొందాను. ఒక మగాబ్ని పట్టుకుని ఒకావిడ బాదుతోంది, నెత్తెంటికలు అమె చేతిలో ఉన్నాయి. వంగబెట్టి వీపుమీద గుడ్డు తుంది. ఆ మగవాడు ఎలాగో తప్పించుకుని ఆమె కొప్పు పట్టుకున్నాడు. వాలి నేలరాలాయి, అతను ఆమె మీదికి చేయెత్తాడు, ఆమె దొదొపు కోవం ఊగిపోతూ అరిచింది, గుంపులో జనం చూస్తున్నారే తప్ప ఎవరూ కలుగబేను కోవడం లేదు.

వైకుంరం మధ్యలోకి దూకాడు. ఆమె పైకి ఆ మగాడెత్తిన చేయిని పట్టుకుని బలంగా వెనక్కితోశాడు. వాడు దబేల్న కింద పడిపోయాడు.

వైకుంరం ఆమెను అడిగాడు 'ఏంటి విషయమని, ఆమె చెప్పింది వగరుస్తు-

“అన్నా ఈ లంజకొడుకు శానాసేపటినుంచి నాయెంట వడ్డడు. మంగలి నడుస్తాంటే నా జడపట్టి గుంజిండు, నకురాల్‌ జేస్తుండు' బుసకొడుతూ చెప్పింది,

అందరికి సరిచెప్పి, వైకుంఠం ఆ మగాడిని నాలుగు తన్ని పంపించాడు.

అప్పుడు నాకు అర్ధమయింది 'ఏం చేయాల్నో. 'జీవగడ్డ' దినవ(త్రికో బాలాఖాని' శీర్షిక ఆాక్టోబరు గర మరో కోణం 50

'పైరనీ వ్యవస్థ... ముర్దాబాద్‌ ర్‌ూ ఇ యె రామగుండం వెళ్చామని బస్‌స్టాండ్‌లో బస్‌ కొరకు ఎదురుచూస్తున్నాను. బోర్డు మీది టైం, ఎంక్వయిరీలో విసుక్కుంటూ చెప్పే టైంకు పొంతన లేకపోవడం అటుంచి ఎప్పుడొస్తుంది అని ఎదురుచూడటంలో “ఆజాద్‌ అనే ఫ్రెండ్‌ చెప్పిన జోక్‌ ఒకటి జ్ఞాపకం వచ్చింది. 1.1.0. అంటే గ-రాదు, తెలియదు, €- చెప్పలేం” అని నవ్వుకుంటున్నాను. అంతలోనే వైకుంఠం విష్‌ చేసుకుంటూ వచ్చాడు. ఈసారి ఏమి లెక్సరిస్తాడో 1 అని భయంవేస్తూనే ఉంది. అయినా వినాలనే ఇంట్రస్ట్ర ఉంది. వాళ్ళ అన్నయ్య నీలకంరంను తీసికొని వచ్చాడు. ఇతను నీలకంఠరమని మా .... అని పరిచయం చేయబోయాడు. అర్థమైంది, తెలుసు అన్నాను. నన్ను ఆయనకు పరిచయం చేశాడు. స్వచ్చమైన మంచు బిందువు లాంటి, కుటిలత్వంలేని చిరునవ్వు నవ్వాడు నీలకంఠం. ఎర్రబన్‌ ఎప్పుడత్తదో ఎందో అవ్వి గీ ఊర్లల్లకు ఏపియ్యనీకి పైరోవిలేనాయే అనుకుంటు, జర్ర పైలం తమ్మీ బస్సు రాంగనే సీటి ఆగబట్టుకో, వాల్ల వీల్ల జోలికి పోకు. దినం మంచిగ లేదు అనుకుంటు సెండ్ష్‌ ఆఫ్‌ చేసి వెళ్ళిపోయాడు నీలకంరం. వైకుంఠం నేను ఆ రెండో ఫ్లాట్‌ఫాం దగ్గర బెంచిపైన కూర్చున్నాము. ఉద్యోగానికి ఎలాగు ఏజ్‌ బార్‌ అయిపోయింది అందుకని ఏదైనా అప్పు తీసుకుందామని 'గ్రామోదయ' స్కీంకు అప్లయ్‌ చేశాను సారు అన్నాడు. వెరీగుడ్‌ ఏదైన మంచి ప్రాజెక్టు ఆలోచించుకో, దీంతో నిరుద్యోగ సమస్య తీరిపోతుంది కదా అన్నాను. ఇది రెండవసారి అప్లయి చేయడం సైరవీలేక్షన అప్పుడు ఆగిపోయింది. అదీ ఎలాగు ఇప్పుడు లేదు కాబట్టి. అన్నాడు. స్వచమైన పాలన అందిస్తానన్నాడు మన ముఖ్యమంత్రిగారు. అవినీతిని అంతం చేస్తున్నాం కదా | మొన్నటికి మొన్న రాయికల్‌ ఎం.ఆర్‌.ఓ.ను ఎసిబి. వాల్టు పట్టేశారు కదా అనుకుంటు దీనికి మేం కూడా సహకరిస్తున్నాం, పత్రికల్లో గ్షో అన్నవరం దేవేందర్‌

వేస్తున్నాం కదా ! అన్నాను. ఎన్ని జరుగుతే ఎన్ని పత్రికల్లో వస్తున్నాయి, ఎన్ని మీ దృష్టిలోకి వచ్చేస్తున్నాయి. ఎన్నిటికి సాక్ష్యం మీకు దొరుకుతుంది, మీరు రాయణానికి ? పైరవీ లేనిదే పైసా పని జరగటం లేదు. కరెంటు ఆఫీసులో మీటర్‌ డి,డి. కట్టినాటి నుంచి మొదలుపెడితే కరెంట్‌ కనెక్షన్‌ వచ్చే వరకు 'పైరవీ, పైరవీ కార్లకు కరెంటు బోర్డు పెట్టింది "పేరు. దేళంలో పైరవీ అనేది వృత్తిగా మారిపోయింది. కొందరు కేవలం ఇదే వృత్తిలో ఉన్నారు. నాకు తెల్సినాయన మన్కట్‌ ఊస్రైరవీ నుంచి మొదలుపెడితే కాలేజీలో సీటు వరకు పైరవీలు చేస్తుంటాడు. మస్కట్‌, దుబాయి పోవడానికి పైరవీలే, వీసా తీయడానికి పైరవీ, అక్కడ పనిదొరకడానికి 'పైరవీ, ఉద్యోగాలకు పైరవీలే, బ్యాంకుల్లో అప్పులు తీసు కునే వద్ద పైరవీలే, ఎంప్లాయిమెంట్‌ ఆఫీసుల్లో కాల్‌కు పైరవీలే. తహసీలు ఆఫీసు లో ప్టైరవిలే, (ట్రాన్స్‌ఫర్‌ చేయించుకోవడానికి సైరవీలే, మానేరులో ఊరు ముంపుకుగురైతే నష్టపరిహారం వచ్చే పైసలకు పైరవే. టెలిఫోన్‌ కావాలంటే పైరవే, కాలేజీలో, స్కూల్‌లో సీటు దొరకాలంటే పైరవే. చివరకు సినిమాకు టిక్కెట్టు దొరకాలంటే పైరవే, ఏరియర్స్‌ తీసుకోవాలంటే పైరవే అంటూ పైరవీల చిట్టా అంతా చెప్పుకుంటూ వచ్చాడు. చివరకు పోలీసు స్టేషన్లలో, కోర్టుల్లో కూడా పైరవీ లున్నాయి అంటూ ఏకధాటిగా (ప్రసంగించి లెక్సర్‌ ఆపాడు నిజంగా సపైరవీలేని ప్రభుత్వాఫీసు కాని, అందులో పనిచేసే ఉద్యోగికాని లేడంటే లేడనే నాకు అన్పించింది. ఊల అంటు వింటున్నాను. ఇంతెందుకు సార్‌ మంత్రి పదవులప్పుడు కూడా సపైరవీలే. ఇక ఈ సపైరవీలను ఆపేదెనరు ? కోర్టులు, పోలీసులు, నాయకులు, అధికారులు అంతా 'పైరవీలతో వచ్చినవారే కదా | అన్నాను. నేను మౌనం వహించాను తప్ప ఏం మాట్లాడలేదు. వస్తాను అను కుంటు లేచాను, రామగుండం బన్‌ వచ్చింది. పైరవీ వ్యవస్థ ముర్దాబాద్‌ అని మనస్సులో అనుకుంటు ముందుకు సాగాను. వైకుంఠం అక్కడే జనంలో కల్పి పోయాడు. 'జీవగడ్డ' దినవత్రిక బాతాఖాని" ళీల్షిక 20 అక్టోబడు 985 మరో కోణం

ఈ అన్నాలపు సచ్చుడుకు పాపం ఎవలకు కొట్టాలె ? ఊరంతా తకపెకలాడుతుంది. ఒకటే శాపనార్దాలు, ఒక్కటే లొల్లి. అంత ఆగం ఆగం కనబడుతంది. చింతకింది సత్రయ్య మందు తాగి పీడాత సచ్చిండు. పాపం సత్తయ్య శీమకన్న అపకారం శెయ్యనోడు. ఇద్దరు ఆడపిల్లలు, నెప్పుడు ఆయన పెండ్లం వట్టి మనిషి కాదు. సత్తయ్య మందు తాగి సత్తె పోరగాం, లై ఏంగాను ? కన్నుమిన్నగానకుంట ఒక్కటే ఏడుపు. పత్తిచేను అలికిండు, గ పత్తిత్తులు ఎక్కువ పండుతయని తెచ్చిండట. వాటిని ఏశి పత్తి పెంచిండు. తీర మొగ్గ పెట్టిందో లేదో పురుగులు తలుగుడు. పురుగుల ఇంట్ల పీనుగెల్ల యాట ఇరాం లేకుంట పడుతనే వుంటయి గని ఇయ్యడు ఏం మందు కొట్టినా ఆవ్వి సత్త లేవు. కర్షాగురం పోయి సత్తెయ్య కొంతమందిని ఇశారించి మందుల మీన మందులు గొట్టిండు. ఇగ సత్తయా అని సూశేటాల్లకు సచ్చుడేమోగాని కొత్తయి పుట్టుడు, పత్తి మొగ్గలనే నాశనం అయ్యింది. సావుకారి దగ్గర బాకీ ఎక్కువైంది. యాట ఇరవై వేల పెట్బబడితోనే నడిచేది ఇయ్యడు లచ్చరూపాయలు దాటింది. ఇంకేంది దానికి మిత్తి పెరుగుడు, దీనితో ఎట్ట కట్టాలనే తలకాయ తిరిగిందట సత్తెయ్యకు, ఒగనాడు రాత్రి కొంరెల్లి మల్లన్నకు మొక్కుకున్నడు పాలగాండ్లను మంచిగ ఉం౦డాలెననె కొత్తక్రుండ్ర ఈరన్నకు, ఎములాడ రాజన్నకు మొక్కుకున్నడు. పెండ్లం నిద్రపోయింది. సత్తియ్యకు కడుపుల దుక్కం దేవుకత్తంది. వజ్రమ్మ మొకంల మొగం పెట్టిండు, లేశి నిబాయించుకుని ఇద్దరు బిడ్డల దగ్గరికి పోయి గ్రక్తీఆన్నవరం దేవేందర్‌

నిద్రపోయినాల్ల కాల్లకు దండం పెట్టి ఎక్కక్కిపడి ఏడుత్తండు. బిడ్డలాల నేను లచ్చ రూపాయల అప్పులతోని ఉన్న. మన ఎకరంన్నర అమ్మినా అన్ని పైసలు రావు. బాకీలు తీరయి, నేనెల్లి పోతన్న అవ్వలాల అంటూ పొంగివత్తన్న దుక్కాన్ని ఆపుకున్నడు. గడ్డల్ల నీళ్లు తిరుగుతున్నయి. కర్నాగురంకు చందుర బాబు అచ్చినపుడు యవసొయశాకోల్లు ఇచ్చిన మందుల డబ్బ దూగుట్ల కెల్లి శతులకు తీసికున్నడు. సర్కారోల్టు ఇచ్చిన మందులాయె. గీటికి పురుగులు సత్తాయి. అని అప్పుడు దుగుట్ల దాపెట్టిండు, మందు డబ్బ తీస్కొని అదే రాత్రి పత్తి శేను ఏళిని బాయి కాడికి పోయిండు. శేనుకాడ మైసమ్మకు మొక్కుకున్నప్పుడు, బాయిసుట్టు తిరిగిండు, చింతచెట్టు కిందకు పోయిండు. రాత్రి మూలసుక్క పొడిసింది. నూటొక్క దేవుల్లకు సత్తెయ్య మొక్కి శెద్దరిల పట్టుకచ్చిన పురుగుల మందు గుటగుట తాగిండు. తాగుతుంటె నోరంత కటిక శేదు. ఒగరాగరు తాగు తుంటినే కడుపుల పేగులు బయటికి ఆత్తయా అన్నట్టు మొకం పెట్టిండు. అక్కన్నే గడ్డమీద పడ్డడు. కడుపు నులిపెట్టుడు. నొప్పి బాధకు కొట్టుకొని కొట్టుకొని ఎగిలివారాంగనే పానం ఇడిశిండు. తెల్లిరింది. సత్తయ్య మీద శీమలు పారుతున్నయి. గుడ్డు తేలేసి నిర్ర తొక్కెపన్నట్టు పడ్డడు. ఊరంత తెల్సింది. సత్తెయ్య సావు అందరికి అయ్యో పాపం అనిపించింది. 'నీ సర్కారు ఇంట్ల మన్నువడ, వాని ఇంట్ల దుందుమ పడ, వాని గుల్లే మన్నుబోత్త' అంటూ నా సుట్టాలు ఏడుత్తున్నరు. కడుపుతోనున్న భార్య వజ్రమ్మ నెత్తి అంత కొట్టుకుంటంది. బిడ్డలు 'ఓనాయినో నాయినా'అంట ఏడుతున్నరు. వీల్ల ఏడుపు లను ఆపేటాల్టు ఎవలు. ఇసోంటి సత్తెయ్యలు రోజురోజు సత్తండ్రు. మందు లాగి సత్తాంటె ఎవనికి పట్టలేదు. ఊర్లలంతా ఆగం ఆగం అయితంది. వరంగల్‌పల్లి, పర్కాల మొకాలన యాడబడితే అన్నే యవుసం శేసుకునేటాల్లు సత్తండ్రు, వీల్ల సావులను ఎవలాపు శెయ్యాలె, అన్లు' ష్ట్రపత్ర ౫దోందన్లో' శీర్షిక వీవ్రిల్‌ 2290 మరో కోణం

ఓట్ల పసండుగెల్సింది... య న్‌ ఇగ మాకైెకిలి కూలి నేం జేసుకోవాలె ఓట్ట పండుగ కిందికి మీదికి నెల దినాలు కైకిలి పడ్డది. ఎట్ల జేశి జర మంచి గనే గుమాయించుడైంది. పార్టీలోల్లు వచ్చిరి మంచిగ జీపులల్ల కూకోబెట్టుకుని తిస్పింద్రు జైజై అని పార్టీకి నిలబడ్డ పెద్దమనిషికి జయికొట్టమన్నరు. ఓకాడ రోజు కూలి లెక్క యాభై రూపాయలుపడ్డయి. కొంచమంత నోరున్నోల్లకైతే ఊరు మొత్తం పైసలలెక్క అప్పజెప్పిండ్రు అందులకెల్లి కుడ్క అదనంగ దొబ్బుడేనాయె. న వొగ పార్టోల్లు అయితే రైక కనుమలు, తువ్వాలలు పెట్టిండ్రు. ఇంకొగలు హ్‌ కుల్ల పెట్టడు అంటే టోపి పెట్టుడు. ఓరైక్క... గీ టోపి పెట్టుడంటే మందికి ॥ పీ ఓట్టు దొబ్బుక పోవుడే కదా అని మనసులనే గునాయించుకున్న. గని మై త్తం మనుసులమే అల్లకు కిరాయికి పోతిమి తాగిచ్చుడు తినిపిచ్చుడు టర్లల్ల తిరుగుడు సంబరం అయ్యిందనుకో జెయి కొట్టుకుంట తిరిగినోల్లకు పెద్ద పెద్ద పా ర్టీలల్ల వంద వంద కూడ ఇచ్చిండ్రట ఏదన్నా నశివ రాత తీరుగ ఉంటున్నది, అద్రుట్టం అందరికుంటాది. ఆడాల్లకు కూడా పాఠీలఎ్ల కూలిగట్టి ఇచ్చి తీసిక పోయిండ్రు ఆల్లకు మంచిగనే పడ్డయి. అల్లక్షైత బతుకమ్మ పండుగంత సంబం అయ్యింది. అయితే మానేగాని పదిహేను ఇరువైరోజుల నుంచి ఊర్లల్ల పనులే బందు అయినయి యవుసం పని బంద్‌ అయింది కూలి కైకిలి బాయిలు తోడుడు అన్నీ కై అన్నవరం దేవేందర్‌

బందయి ఓట్ల పండుగ మొదలైంది. రేషన్‌ కారెట్టు ఇప్పిత్తం అని ఒగడు గుంజుక పాయె. 'ఇల్సు కట్టిత్తం అని ఇంకొకాయన తీసికపాయె నీకు సి,ఐ. బాయిపిత్తనని ఇంకో పెద్గమనిషి ఎంబడి ఏసకపాయె ఎవలెన్క పోకుంటే ఎమిటికి ముప్పు అత్తదో ౬ ఊర్లల్ల నడీడు పోరగాల్సు అంతా మనిషో పార్టీల పోయిండ్రు. ఓట్లు అయిపోల::నయి. సంక్రాంతి పండుగ ఎల్లినంక సకినాలు పది దినాలదాక ఉంటయి గని ఇగ ఓట్టు ఏళినంక ఏలుమరుకలు చూసి ఎల్లగొట్టుడు.

ఓ దినంనాడు పక్కపాంటి ఊరికి జీబుల పోంగ ఒక ఇగురం అచ్చింది. ఓట్లల్ల నిలబడ్డోల్లకు ఏం లాభం లేందే గింతెందుకు ఖర్చు పెడుతున్నరు ఎయ్యిల ఊర్లకు జెండలు, మైకులు ఊరికిన్న పైకం పంపుతున్నారు. గింత పెట్టుబడి పెడితే అల్లకు ఎంతో లాభం ఉండదా ? లేందెందుకుజేత్తరు ? పార్టీలోల్లకు అసలే లుక్సాన్‌ ఉండది. సేవ జేత్రం సేవ జేత్తం అంటండ్రుగాని మాకే సైనలిచ్చి ఓట్టేయించుకొని మాకే సేవ చేసుడెందుకు ఇట్లనే సేయరాదా ? మరి గీల్టు మాకు పైసలు ఖర్చుపెట్టుడెందుకు మల్ల నంపాయించె తందుకుగనీ అని మేం సోంచాయించుకున్నాం మనం ఏం చేత్తం నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడ' మనసోంటి ఒక్కల్లు పేదసాదోల్లు ఏం చేయత్తది పిర్రలున్లోల్లకు వీటలెత్తరు. కర్ర ఉన్టోందే బ(రై' అన్నట్టు మా మాట నడుత్తాది.

ఇగ ఓట్ల పండుగయిపోయింది. మా కైకిలి కూలీ బాయిలు తవ్వడం, తట్టి మోసుడు, (ట్రాక్టర్‌ పనికి పోవుడు, మొరం పోసుడు హమాలి పనిశేషుడు తప్పుద్దా ఇగ నుంచి మా రెక్కల కస్టం మాకే...

౫దేందన్లో' శీర్షిక ౩1 మాద్ది, 2240 మరో కోణం

నైజాం కాలంల పుట్టనే లేదు ఫీంచన్‌ లిస్ట్‌ల పేరున్నది చెరినుక దొయ్యలల్ల నాలుగు వరికర్రలు కోసి పడుగు తొక్కిచ్చెతందుకు టాక్టర్‌ కోసం ఊల్లెకచ్చిన. పెద్ద పటేండ్ల ఇంటిముంగట యాపశెట్టు కాడ శాన మంది జమైండ్రు. ఏందిర గింతమంది ఉన్నరని నేను సూత్తన్న. ఎంకట రామయ్య, మల్లయ్యకు బర్జుగాసే సారయ్యకు, దళాలి బ్యారం చేసే ఈరన్నకు సాసంత్ర ఫించిని వచ్చిందని అందరు ముచ్చట శెప్పుకుంటన్నరు. ససంత్రం అచ్చి నప్పుడు పుట్టనోనికి కూడా ఫించిని అత్తందంటె గమ్మతి అనిపిత్తంది. వారవారం అంగట్ల ఎడ్డ బ్యారం శేసె ఈరన్నకు ఎప్పుడు నైజాంతోని కొట్టాడిండు తెల్వదు, పోని గాంధీ, నెహ్రూలతో పోయిండా జేల్ల పడ్డరా అంటే అదీ తెల్వదు. నైజాం రజాకార్లతో పోగ్రాం శెయ్యనే లేదు. ఫించినులు మంజురైతన్నయి. సర్కారు కతలు గమ్మతున్నయి. పక్కూరు కమినిట్టు పార్టోల్లు సమరయోధుల సైల్టు 'సైరోవి భాగశేత్తండ్రట, ఎంకటరామయ్య పట్వారీ అయితే నైజాం రజాకర్ణు ఊల్లెకు అత్తె వాల్లనే ఇంట్ల దాసిపెట్టిండు. రజాకర్లకు ఎదురుగ కొట్టాడెటోల్లను పట్టిచ్చిండు. రజాకర్తకే మద్దతు ఇచ్చిన ఆయనకు కూడా ఫించన్‌ మంజరి అయిందట. ఇగ మిగిలినోల్లు రజాకర్లప్పుడు పుట్టనేలేదు. దాడి అప్పుడు లేనేలేరు. అల్లందరికి ఫించను అత్తందంట. చిత్రం ఉంది. బర్జుగాసే సారయ్య నా ఎరుకల పోరనప్పడి నుంచి బర్ల కాడేకే పోతన్నడు. వాల్ల నాయన మొదటి పెండ్డానికి పుట్టినోడు. సారయ్యను రెండో పెండ్లాం అచ్చినంక బల్లెకు పంపలేదు. శిన్నపోరని క్షి అన్నవరం దేవేందర్‌

అప్పటి నుంచి గెదే బర్జ్హు కాసుడు. సారయ్య మంచోడే ఊర బర్లన్ని కొట్టుక లు పోతడు. మల్ల పొద్దీకజాముల కోట్టుకత్తడు. అయితే గాయినెకు గుడ్క ఫించను అచ్చినయిన అంటండ్రు. అంతా సైరవీతోని నడుత్తంది. దేశంమీద గింత అన్నాలం జరుగుతుంది మరి కలీగం ఎట్ట బాగుంటది. గందుకే వానలు పడుతలేవు. ఆనకాలం అసలు కొట్టుతలేవు. సలికాలం సలి పెడత లేదు. ఇయ్యెడైతే మామిడిపూత లేదు. కఠిగంల గింత అన్యలం జరుగు తాంటె ఎట్లంటది. ఎవో అప్పుడు కొట్టాడుతె నాలుగు పైసలత్తి ఎవ్వనికేం అని పియ్యదుగని సాసంత్రం అప్పుడు పుట్టనేలేదు. వాల్ల ఫించనని ఇస్తంటె సర్కారు గుడ్డిదా ? ఎడ్జిదా ? ఏమో నాకేంది గని అనుకుంట నేను ఇంటి మొకంబట్టిన. నా పెనిమిటి ఇంకా వత్తలేడని మా ఓల్టు రానేవత్తండ్రు. సావుకారి టాక్టర్‌ ఖరాబు అయ్యిందట. ఎలుమోల్ల టాక్టర్‌ అత్తదన్నరు వాల్ల (డైవర్‌ కల్సిండని చెప్పకుంట ఆమె పొలంకాడికు పోయింది. గింతాంత ఎవుసం ఉన్నాగాని పంజకొట్టుడే లేదు. పంజ కొట్టినంక పడుగుపెట్టీ వడ్డతోని బంతి కొట్టిచ్చేది ఇప్పుడు ఊల్లల్ల ఎడ్లెక్కడివి, పసురాలెక్కడివి మొన్న అఖరుకు బండి కమ్మి కట్టిత్తామని కమ్మ రోల్లింటికి పోతె కమ్మురియన పిడికెలు ఏరుక రమ్మనడు. పిడికలకని మోత్కుల్ల ల్లకు పోతి ఎంత చూసినా పిడికల జాడ లేదు. పెంట లేదు. ఎద్దు లేదు. ఎవుసం లేదు. అంతా నాశనం అయిపోతంది. యవుసం జేసుకొనేటోని బతుకులు గిట్ట ఉంటే సమరయోధులని నకిలీలు పుటుకత్తందడ్రు ఎట్టనో సమజ్‌ అయిత లేదు. (నిజమైన స్వాతం(త్ర్ర్య నమర యోధులకు న్లమాపణలలో...) 'అన్హు' వక్షవ(త్రిక గదోందన్లో' శీత్తికో త్‌మే 2838 మరో కోణం

నిండినోందే నిండుతుండె... ఎండినోందె ఎండుతుండె... ఊర్జు ఊర్లన్ని అతలా కుతలం అయితన్నయి పల్లెలన్ని తక్కెపెక్కెలాడు తున్నయి. పల్లెముచ్చట పెట్టుకుంటె కడుపుల తెడ్డుపెట్టి దేవినట్టు అయితది. యాడసూసనా కొట్లాటలు, లడాయిలు తిన్నది అరుగక కావురాలు పట్టి కొందరు, తిండికిలేక ఆకలికి కొందరు లడాయి జేసుడు. ఒ దిక్కు కరువు, మరో ఊర్జో పెడబొబ్బలు, ఏడ్పుమొకాలు గుడ్డనిండ నీళ్ళు తిరుగుడు, కాల్పులు గిట్టున్నది పల్లెల సంగతి, పల్లెల గుండెలు ఎట్టున్టయంటె నల్ల సరపు రౌతుతోని పాలరౌతు పలగకొట్టితె ఎట్ట పరంపర అయితదో గట్టున్నయి. ఏమున్నది అందరు తిని సాకల్లోల్ల అక్క ఊరు తిరిగి పోయినంక కన్నంటుకుంటదో లేదో తుట్క్‌... తుట్మ్‌...మని సప్పుల్టు నాలుగు పొనాదిలకాడికపోయి. సూత్తేమున్నది నెత్తుటి మడుగుల ఊరి పెద్దమనిషి అయ్యెయ్యె అని అందరు కండ్లనీళ్ళు పెట్టుకొంగనే ఇన్‌ఫార్మర్‌ అని సంపినం అని “శిట్టి" రాసిపెట్టిరి. ఇగ ఆవూరుకి నిద్రెక్కడిది అంత ఆగమాగం అన్నాలం గాలిపోను వీల్ల చేతులకు జెట్టలు పుట్ట... వీల్లింట్ల మనువడ... ఏడుపులు బియ్యం ఇచ్చుడు కానే లేదు... మల్ల రాత్రి పెద్ద ఎగిలి వారంగ దెబ్బలు ఢాం ఢాం అని. పొద్దు పొడవంగనే ఊరినిండ పోలీసులు ఇద్దరు శ్ష్వై అన్నవరం దేవేందర్‌

ఊల్లై పోరగాండ్లు ఖతం. మందలకేలి తోడేలు జీవాన్ని ఎత్తుక పోయినట్టే పోరలు నిన్న మొన్న ఊల్లే తిరిగిరి ఇయ్యాల సచ్చిరి. మల్ల ఊర్లన్ని ఆగమాగం అపుడు తెలందాక వాల్లు పొద్దుదాంక వీల్లు, ఊర్తిల ఉండనీకి ఇదే లేదు.

ళా న! ఛా లాణ

మల్లో ఊర్లకు పొంగనే పెద్దదొర ఇంట్ల వద్డు, బియ్యం అన్ని ఎత్తుకపోవుడు ఇల్లు కాలపెట్టుడు. ఇదేందంటే కరువు దాడి, వడ్డు బియ్యం బట్టలు అన్ని పట్కపోవుడు అగమాగం అంగడి అంగడి అయితన్నయి.

పత్తి శేన్లు ఏసుకున్న కర్మానికి యవుసం శేసిటోల్టు మందు దాగి సావ వట్టిరి, ఇప్పటికి ఇరువై మంది పత్తి శెట్టుకు కొట్టే మందు తాగి సచ్చిరి,

వాని పత్తి ఇత్తునంల మన్నువడ, వాని పత్తి పైసలు కాలబెట్ట, దొంగలంజ కొడుకులు అన్నెపున్నైెం ఎర్కలేని రైతులను నమ్మిచ్చి దగా చేసిరి. పత్తికి పురుగు తాకిందని మందు కొడితే అవి సావకపాయె. పంట నాశనమాయె, వచ్చిన పంటకు రేటు దిగె. అప్పుల తోని బతుకక ఇంత మందు తాగి సావ వట్టీరి. పల్లెటూర్లల్ల రైతుల మొకం మీద నెత్తురు సుక్కలేదు.

ఓ పక్క కాల్పులు ఓ పక్కకన్నట్టు మరోపక్క కరువు. కరెంటు రాదాయె నీళ్ళు పారయాయె బాయిలల్ల నీళ్ళు పాతాళ లోకంలకు పాయె. భూములన్నీ నెగ్రెలిడిసీ పాయె, గొడ్డు ఆగమాయె, పోరగాండ్లు ఆగమాయె, గోదలు ఆగమాయె.

“యాడ జూసీనా నిండినోంది నిండపట్టె ఎండినోందె ఎండవట్టె” పీతాంటబ్రం ఉన్నోల్లకు పీటెయ్యబట్టిరి, బక్కోని పని ఉత్తదేనాయె. గుండెలన్ని తూట్లు పడపట్టే ఊర్లన్నీ నాశనం కాబట్టై.

అన్లు' పక్షవత్రిక దేందట్లో' శీర్షిక 1-5 విట్రవరి 128 మరో కోణం క్త

మేం ఓట్ట కాయలు కాసే చెట్లనూ ? _ “దేశానికి సొసంత్రం తెచ్చిన పార్టీ మాదే, తెల్లోల్లని ఎల్లగొట్టి పేదసాదోల్లను మీదికి తెచ్చిన పార్టీ మాదే... ససం[త్రం కోసం బలిదానమైన మారాజులు మా పార్టీలకెళ్లే ఉన్నరు. మీ ఓట్లు మాకే ఎయ్యిండ్రి. ఇంకో పార్టీ వాళ్ళు అచ్చి కల్లబొల్లి మాయముచ్చట్టు చెప్పుతరు వాల్లను ఆర్కీసు నమ్మకుం'[డ్రి జర దండం పెడుతం మీ ఓటు మాకే ఎయిండ్రి. నాలుగు బాటలకాడ గిట్లనే లీడర్లు మైకులు పెట్టి దినాం ఊదరగొడుతుండ్రు. బుయ్యమని జీపుల నుండి వచ్చుడు గివ్వే మాటలు చెప్పుడు సోవుడు వారం రోజుల నుంచి ఇరాం లేదు. ఇది ఇని సోంచాయించగనే ఇంకో జీబుల కొందరచ్చి మేము జనం కోసం జన్మభూమి పెట్టిచ్చినం. మీ ఊల్లకి సర్కార్‌ నౌకరిగాల్టు అత్తన్నరు. సైల్టు కిలియర్‌ శేసినం, రోడ్డూడిపిచ్చినం, బడి పొరగాల్లతోని సున్నాలు ఏపిచ్చినం, సంటర్ల ఏ మచ్చలేని రాజ్యం తెచ్చినం, అంత లోనే మమ్మళల్ళి కాంగిరేసోల్లు కూలగొట్టిండ్రు మమ్మల్ని అన్నాలం చేసి అగమాగం చేయకుండ్రి మీ ఓట్టు మాకే ఎయ్యిండ్డి... ఇదో తీర్గ చెవుల జీవిల్రి బయడపడేటట్టు ఇనపడతంది. ఈ జీబుల మంది పొంగనే మల్ల కార్లమీద కార్డు సవ్వడిగా వత్తన్నవి. జీబులు, కార్డు ఆపి దండాలు బెట్టిండ్రు రెండు చేతుల శెనార్సి అనుకుంట అచ్చి మేం గెలిత్తే, జైలే అన్నవరం దేవేందర్‌

రాముని గుడి కట్టిత్తం, మీరు ఓట్టన్ని మాకెయ్యాలి అన్నరు. ఇన్ని రోజులు ఎవలెవలికో ఓట్టేత్తిరి వాల్లంత దోసుక తినిరి కాగులోలే కడుపులు బెంచిరి. వాళ్ళ దాంట్ల వాల్లకే కొట్లాటలు వచ్చి పదానమంతిరి ఎక్కుడు దిగుడే సరిపోతంది. మాకైతే ఒక్కసారి ఎక్కినమోంటే దిగుడే లేదు. ఆతుకుల పార్టీలకు ఓట్టేత్తరా. మాకే ఒక్కసారి శాన్సు ఇప్పియిండ్రి. జర ఇది వరకు ఎవలెవలకో ఓట్టేసిండ్రు గీ ఒక్కసారన్న మాకు సీటు మీద గూసునేట్టు శేయిండ్రి. అనుకుంట ఈ పార్టోల్టు గులగవట్టిండ్రు. ఏం మచ్చలేని పార్టీ మాదే, మీ ఓటు మాకే అనవట్టింద్రు.

ఆ జీబులు ఎనుకకు మగర్రినయో లేదో మైకుల లొల్లి ఊరు దాటంగనే ఒక్కటే చిన్న జీబు అచ్చింది. అండ్లకెల్లి దిగినోల్లు మైకుగైకు లేకనే కింది చిల్లర మల్లర కులాలన్ని ఒక్కటి, పెద్దకులాలు ఒక్కటి. తక్కువ కులాలున్నోల్లు మనల్ని ఏలుతండ్రు, ఇది సక్కంగ లేదు. మన రాజ్యం మనం ఏలుకోవాలే, మనం మనం ఒక్కటి అన వట్టిండ్రు. మీరంత మాకు ఓట్టు ఏయిండ్లి అనుకుంట ఆ ఉన్నాక్క జీబు ఎల్లి పేయింది.

నాలుగు పార్టీ జీబుల మంది అచ్చి మాకు ఓట్టు ఏయిండ్రి మాకు ఓట్లు ఏయిండ్రి అని లగాంచి శెప్పవట్టిరి. “పెట్టి పాయ్యకున్లు పెయ్యంత వునికిందట” ఎనకట ఓ ముసలమ్మ అన్నట్టు ఈ పార్టీలోల్లంత అచ్చి ఓట్ట పండుగ అస్తే సాలు జీబుల మీద జీబులు దిగుడు నా పజలారా అన్నలారా అక్కల్లారా అంట వరుస కలుపబట్టిరి.

నాలుగు పార్టీల్లో ఊరంత తిరిగి గోడలు మైకులు ఖరాబు చేసినంక రాత్రి పూట 'వాల్టు' అచ్చిరి చీకట్టనే అచ్చిరి. ఆడోల్డే మొగోల్ల బట్టలేసుకున్నరు తుపాకులు సంకలేసుకుని ఓట్టు లేవు గీట్టులేవు, దొంగ ఓట్ల రాజ్జం బూటకపు ఓట్లను బహిష్కరించుండ్రి పజలారా అంటూ వాల్లు చెప్పవట్టిరి. ఓట్లు ఏస్తే చేతులు ఇరగ్గొట్టుతం. ఓట్లల్ల పచారంకు తిరుగుతే కూడా మంచిగు౦డది. తుపాకి గొట్టంకేలి అధికారం అత్తది. దున్నేవానికి భూమి కావాలి, ఓట్టు ఎవ్వలకు ఎయ్యకుండ్రి...

మనం ఓట్లు ఏత్తే వాల్డు సంపయించుకుంటండ్రు, మన కట్టాలు తీరాల్నంటే మనం బందూకులు పట్టి రణం చేయాలి.

మరో కోణం-కీజీ

అన్నలచ్చి ఓట్టద్దని శెప్పి పోయిన తెల్లారి ఊర్పెకు పోలీసోల్లచ్చిరి. మనది ప్రజా సామ్యదేశం, ఓట్టమీదనే మనకు రాజ్ఞం అత్తది, ఓట్లు ఎయ్యకుంటే నక్సలైట్‌ అని కేసులు పెడ్తం అని పోలీసులు శెస్పవట్టిరి ఊరంత ఒక్క దగ్గరికి తెచ్చి టొంభై శాతం ఓట్టు పడాలే, లేకుంటే అందరి మీద కేసులు పెట్టిత్తనని హుకుం జారి శెయ్యబట్టిరి. మీ ఇట్టం అచ్చినోల్లకు ఓట్టేయండ్రి. గిదంతా గమ్మతున్నదన్నా.... కాంగిరేసోలచ్చి శెయ్యి గుర్తుకు ఓటేయ్యమని మనూరి కర్షపాయనతోని శెన్నిచ్చిరి, పెడ్డ పటేల్‌తో సైకిల్‌ గుర్తుకు ఓటేయ్యండ్రని ఎయ్యకుంటే బియ్యం, శక్కరి గాంచునూనె బందు పెడ్తరటననిరి. ఇ్రోజులు ఎవనెవనికో ఎయ్యవట్టిరి, గీ ఒక్క మల్క పూవు గుర్తుకు ఎయ్యిండ్రని పోరగాల్లచ్చి శెప్పవట్టిరి. మరి ఇంక మనం మనం ఒక్కటని ఏనుగు గుర్తోలచ్చి శాన ఇగురం ముచ్చటశెప్పిరి. దేనికయ్యాలని సోంచాయించటాల్లకే రాత్రిపూట ఓట్టేత్తే మంచిగుండదనుడు, తెల్దారే పోలీసులు ఓట్టు ఏయకపోతే శాన మంచి గుండదనుడు, ఇదంతా మాకు తిప్పల అచ్చింది. ఓట్లు ఎయ్యాల్నా వద్దా, ఏత్తే ఎవల్లకు ఎయ్యాలేే ఏ4 ఏశి ముసలోల్లమైతిమి తాపకు ఓట్టు రాంగనే గిదే తిప్ప రాయె నీ ఓట్టింట్ణ మనువడ, పని మనుసెక్కకుంట మాకు తిప్పల పెట్టవట్టే ఓట్టంటే అల్లకు పండుగేమోకాని మాకు దండగాయె దేనికో మా ఏత్తం కని. మేం ఓట్లను కాశే శెట్టమా మా ఎంట పడ్డరు ఈల్లు.... థూ... 'అన్లు” ష్షవ(్రిక గదోందన్లో" శీర్షిక _ 46-28 ఫిసబ్రవర్శి 2998 అన్నవరం దేవేందర్‌

న్యాపార కళగా ప్రజా ప్రాతినిధ్యం

ప్రజా సేవకుని విలువలు పూర్తిగా పతనమవుతున్నాయి. ప్రజాప్రాతినిధ్యం ద్వారా సేవ చేయాలనే తలంపు ఒక నిజమైన సొమాజిక సేవకులకు ఇది వరకు ఉండేది. (ప్రస్తుతం అది వ్యాపార కళ అయ్యింది. వ్యాపారమన్నాక పెట్టుబడి లాభ నష్టాలు బేరీజువేసికోవడం ఎలాగూ ఉంటుంది. ఎంత చిన్న సేవ చేసే పదవికైనా “పెట్టబడులు పెట్టి మరీ 'సేవి చేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీరాజ్‌ ఎన్నికలను పరిశీలిస్తే ప్రజాస్వామిక వాదులకవరికైనా ఎన్నికలపట్ల విశ్వాసం సన్న గిల్లకమానదు. వార్డ్‌ సభ్యుడు, సర్బంచ్‌, మండల పరిషత్‌ సభ్యుడు, జిల్లా పరిషత్‌ సభ్యుడు ఇలా ఎవరికైనా సరే పెట్టుబడులు పెట్టి పోటీచేసి మరీ గెలుస్తున్నారు. వేలాది రూపాయల నోట్లు పంచడం, మందు సీసొలు పంచడంలాంటి అనైతిక అ(క్రమపద్దతులు పూర్తిగా చేసి గెలుస్తున్నారు. ప్రజలను కూడా మత్తుకు, డబ్బుకు అలవాటు చేస్తున్నారు. ఒక దశలో జనమే అంటే ఓటర్ల సమూహం లేదా కులం గుంపు అంతా కల్సి ఇన్ని డబ్బులివ్వు అని డిమాండ్‌ చేస్తున్నారు. మందుసీసాలు సరఫరా కూడా సునాయాసంగా అన్ని పార్టీలు అందిస్తున్న విషయం అందరికీ తెల్సిందే. గడచిన రెండు మూడు దశాబ్దాలక్రితం ఇలాంటి వ్యాపకం లేదు. డబ్బు. మందు ప్రవాహం చాటుమాటుగా జరిగేవి, ఇప్పుడు చాలా బాహటంగా జరుగు తున్నాయి. పేదరికం నుంచి ప్రజాసేవ చేస్తామని రంగంలో దిగే ఎవరికైనా ఇంతే సంగతులు ఓడిపోవడం ఖాయం. ఇంతెందుకు రాజ్‌ఘాట్‌ నుంచి గాంధీ లేచివచ్చి మరో కోణం

కరీంనగర్‌ జిల్లాలో జడ్‌పేటిసిగా లేదా సర్పంచిగా పోటీ చేస్తే ఆయనకు డిపాజిట్‌ రావడం కలలోని మాటే. ఎన్నికలంటే ఒక వ్యాపారంగా మారుతున్నాయి. నేడు వ్యాపారం కానిదేది ? మంచినీళ్ళు కూడా వ్యాపార సరుకు అయ్యింది. అట్ట్లొగి (ప్రజాసేవచేసే పోస్ట్‌ల్లో ఇన్నేసి పైసలు పెట్టి గెలిచినవారు ఊరికే చేతులు ముడుచు కొని గోల్టు గిల్లుకొని కూర్చుంటారా ? లేదు తిమ్మిని బమ్మిని చేసైనా లక్షలకు లక్షలు సంపాదిస్తారు. అయినా దేశంలో రాజకీయ నాయకులకు బ్యూరోక్రాట్టు తోడై లక్షలాది కుంభకోణాలకు పాల్పడుతున్నారు. కమీషన్లు వేస్తున్నారుగాని ఫలితమేది. స్వాతంత్ర్య భారత చరిత్రలో డబ్బులు తిన్న రాజకీయ నాయకులు (ప్రజాప్రతినిధులు ఇంతవరకై జైలుకెల్లలేదు. లాలుప్రసాద్‌ యాదవ్‌ జయలలిత, పి.వి.నరసింహారావులు కేసులు నడుస్తుండగా అండర్‌ ట్రయల్స్‌గా జైల్లో ఉన్నవారే గొని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఫలితంగా శిక్షలెవరికి పడలేదు. “రాను రాను అనినీతి నీతిగా మారుతుంది. పైనలు తీనుకోవడం ఇవ్వడం అనేది ఎవడూ నీగ్గుపఢదం లేదని” _క స్వాతంత్ర్య సమరయోధుడు ఈ వ్యాసకర్తతో మౌట్టాడుతూ ఆవేదన చెందారు.

(ప్రజలకు సేవచేయాలంటే ఒక సర్సంచ్‌ పదవికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఒక వార్డ్‌మెంబర్‌ 40 వేలకు పైగా ఖర్చుచేస్తున్నారు. మరి ఇవన్నీ ఎలా సంపాదిస్తారు. ఓటర్టు తమ ఓట్లను బాహాటంగా అమ్ముకోవడం ద్వారానే అవినీతి రాజ్యమేలుతుంది. చాలా గ్రామాల్లో ఓటర్లు అందరి దగ్గర డబ్బులు తీను కుంటున్నారు. కొందరు ఓటర్లు అయితే డబ్బులకోసం అభ్యర్థినే డిమాండ్‌ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ స్థితిలో అనివార్యంగా రాజకీయ ప్రతినిధులు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఓట్లను అమ్మకూడదు, సారా, బ్రాందీలకు అమ్ముడు పోరాదని ప్రచారం ఎంత చేసినా ఆ ప్రచారం చేరాల్సిన చోటుకి పోవడం లేదు. దీంతో ప్రజాసేవ అతి ఖరీదైపోయింది.

నిజమైన సేవా తృష్టవారికెవరిక్షైనా ఉన్నా అతను గెలవలేని స్ట్రితి ఉంది. ముందుగా ఇది ఆయా రాజకీయ పార్టీల నుంచే మొదలవుతుంది. రాజకీయ పార్టీలవారు టిక్కెట్టు ఇవ్వాలంటే 'మంచివారు" రాజకీయాలకు రావాలనే తపన కొక పెట్టుబడి పెట్టేందుకు డబ్బు ఉన్నదా అనేదే చూస్తున్నారు. అందుకే ఒక క్రై అన్నవరం దేవేందర్‌

సారాయి సా(మ్రాట్టు మొన్న ఒక జిల్దా పరిషత్‌కు చైర్మన్‌ కాగలిగారు. అలా లక్షలాది రూపాయలు కుమ్మరించి క్యాంపులు పెట్టి కిడ్నాపులు చేసి బలవంతంగా ఓట్టేయించుకున్న పార్టీలు, నాయకులు రేపు స్థానిక సంస్థలను ఏం చేస్తారు. ఖాళీ చేస్తారు, సుష్టుగా భోంచేస్తారు. ఇదేమని అడిగేవారు లేరు. ఆయన్ను చైర్మన్‌ చేసిన సభ్యులు ఆయన మోచేతి!క్రింది నీళ్లు తాగినవారే, వాళ్ళకు ఓట్టేసిన ప్రజలూ తృణమో ప్రణమో స్వీకరించిన వారే. ఇలా నోట్లకు ఓట్టేసినందువల్లే అవినీతి కాస్తా నీతివంతం అయిపోతుంది. రానురానూ ఇదొక వ్యాసారకళగా అవతరించనున్నది. ఇది వరకు ప్రజాసేవ చేసేందుకు సామాజిక దృక్సధంగలవారు వచ్చేవారు. కానీ నేడు అన్ని ఎన్నికల్లో, అన్ని రాజకీయపార్టీల్లో వ్యాపారులు, నేరగాళ్ళు, దళారీలు వచ్చి చేరుతున్నారు. లోక్‌సత్తాలాంటి సంస్తలు ఎంత ప్రచారం చేసినా 'అవినీతి' అనే వైరస్‌ విజ్బంభిస్తూనే ఉంది. రాజకీయ ప్రజాప్రతినిధులకు కళ్ళెం వేయగలవారేరి ? అక్క డక్కడా నిఘా సంస్టలున్నా అవీ నిర్వీర్యం అవుతున్నాయి. ఇకపోతే న్యాయవ్యవస్థ అదీ ఈ నేరాలను అరికట్టే స్టితిలో, తీరికలో ఎక్కడ ఉంది. దీన్ని ప్రజల్లోకి తీసి కెళ్ళాల్సిన ప్రసార సాధనాలు అవి కూడా నేడు వ్యాపారులు, బడాపెట్టుబడిదార్ల చేతిలో ఉన్న సంగతి మనందరికి తెల్సిందే. 'అన్ను' వక్షప(్రిక ౫దేందన్నో' శీర్షిక 6-80 సెప్టెంబల్‌ 2202 మరో కోణం

ధరల మీద ధరలిట్లా సెరగవట్టె నాగులో... నాగన్నా...

"ఉల్లి గడ్డ ధర నూత్రె నాగులో నాగన్లా

ఉరిమి ఉరిమి మండుతుండె నాగులో నాగన్దా

కందిపప్పు ధర నూడు నాగులో నాగన్నా

కనికరమేలేదాయె నాగులో నాగన్హా

మంచినూనె ధర నూడు నాగులో నాగన్దా

ఢిల్లీలోనంట ఉన్హు ధర నూడు నాగులో నాగన్దా

గమ్టు గమ్మున పెరిగెనంట నాగులో నాగన్లా”

గిట్ట ధరలు భగ్గు భగ్గున మండుతుంటె ఊర్లర్ల కొననీకి వణకుతండ్రు ఒరైక్క గా గిప్పుడు లగాంచి పెరిగినాయి. వీటిని ఎవ్వడు పెంచుతాడు. వానికి రికామె లేదా ? ధరలకు రెక్కలచ్చి మొగులు మీదికి ఎక్కుటే, కూలినాలి చేసికునోటోని సంగతేంగావాలె. ఉప్పు, మిరపకాయతోటి అరోక్కటి పెరగవట్టి, కూరగాయల ధరలు సూడు గవ్విగూడ లగాంచి పెరిగినాయి. రాకడ తక్కువైంది, ఖర్చ్భులెక్కువైయినాయి. మరి మందుల ధరలో ముత్తాంత దెబ్బ తగులుతె దవఖానకు పోతె ఇన్నూరు రూపాయల మందులు రాసిండు. ఎనుకట ఇంత నల్దారం పసరు, శెన్నంగెఆకు పసరు పెడితె దెబ్బలు గిబ్బలు అన్నిపోయేది. గీ మందులకు గీ పైసలా. ఢిల్లీల ఉప్పు ధరగూడ పెరిగిందట. ఉప్పు ధర పెరిగిన సంగతి గాంధీ మహాత్మునికి తెలిత్తై ఎంత మొత్తుకునునో, ఆగమాగమై పోవును గొవచ్చు. తెల్లోడు పుణ్యానికి వచ్చిన ఉప్పు మీద పన్ను అంటే మనోల్టు సత్యా (గ్రహం చేసేందుకు వందల వేలమంది ఉప్పు సత్యాగ్రహం చేసి మా ఉప్పుకు కలే అన్నవరం దేవేందర్‌

మీరు పన్నేసుడేంది అని లొల్లి పెట్టిండ్రు. దండి దగ్గర లొల్లిచేసి మా ఉప్పు మేం తెచ్చుకుంటం అన్నారు. అయితే ఇది తెల్టోనికాలంల, మరె మన సర్కార్‌ కాలంల ఏం జరుగుతుంది. ఉప్పు మీద పన్ను, పన్ను మీద పన్ను ఏసి మన 'పైసలన్నీ గుంజుతున్నారు. ఉప్పుల అయిడిన్‌ లేదు. మనకు అక్కరలేని అయిడిన్‌ కథ చెప్పి దొడ్డుప్తు బందు వెట్రండు. దొడ్డుప్పే దేశం లచ్చల మంది కూరల్లల ఏను కుంటుం'డ్రు. దొడ్డుప్పు పావులకు కిల దొరుకుతది. సన్నపు ఉప్పు ప్యాకెటల్ల పెట్టి అమ్ముతున్నారు. అది టాటా కంపెనీ ఇంక పెద్దపెద్ద కంపెనీల ఉప్పును ఆరు ఏడు రూపాయలకు కిలో చొప్పున అమ్ముక దొబ్బుతున్నారు. ఉప్పుల అయిడిన్‌ కొండలల్ల ఉండేటోల్లకు అక్కెర. కడుమవాల్లకూ ఏ ఉప్పు అయినా ఏం లేదు. తాంభై కోట్లమందికి రోజు ఉప్పు అక్కెరే అని కోట్టల్లో వ్యాపారం చేత్తమని గ్‌ ఉప్పు కూడ బ్బాక్‌ చేస్తన్నారు. తెల్గోడు బ్లాక్‌ చేస్తే లొల్లి పెడితిమి. దండి సత్యా (గ్రహం అంటూ నడిపితిమి. మనోడు మనకు బ్బాక్‌చేసి రేట్టు పెంచితే పన్ను లేత్తె కిక్కురు మనకుంటూ కూకుండుడేనాయే. సము(ద్రంలో నీళ్ళ తడలు ఇటువచ్చి ఆటు పోంగనే మడులల్ల నీళ్ళు నిలిచి ఎండుతాయి, గదే ఉప్పు మన దగ్గరికి తీసు కచ్చిన చార్జిలే తప్ప దానికి ఖర్చు లేదు. మరి దీనిమీద పెద్దపెద్ద కంపెనీలొల్టు కండ్లేసిండ్రు సర్కారోల్టు కండ్డు మూస్కుండ్రు. మీది కంటివాల్టు వీల్లు ఒక్కటే కదా మనల్ని దోస్కోనెతందుకే పుట్టే. పుణ్యానికి వచ్చిన ఉప్పు మీరు పిరం చేసుడెందుకు ఆలుగడ్డలు పెంచిండ్రు, కందిపప్పు శేటు పెంచిందడ్రు, అల్లం ఎల్లిగడ్డ శాపత్త రేటు గూడ పెంచవట్టిరి. అన్ని రేట్లు అదరగొట్టి, మళ్ళి అయ్యో గిట్లరేట్లు పెరుగుతున్నయి అని సక్కన పూసల లెక్క ఇశారం శేత్తందడ్రు. “నీ ధరలింట్ల వీనుగెల్ల నాగులో నాగన్నా ధరలిట్లా మండవట్టె నాగులో నాగన్లా ధరలు పెంచెటోని ఇంట్ల అగ్గిపడ నాగులో నాగన్న్లా ధరలు పెంచెటోడు కూలిపోను నాగులో నాగన్దా* 'అన్ష" వక్షప(త్రిక ఏన్లిల కోనల్లో శళ్లిక 26-37 మార్టి, హ99 మరో కోణం

కళ ఎవరి కోసం ?

కళ కళ కోసమా ? సామాజిక ప్రయోజనం కోసమా ? అనే మోమాంస నేడు అక్కరలేదు, ఖచ్చితంగా కళ సమాజం కోసమే. “జన జీవితాని (వతిబింబించేదే” కళ, ఒక వ్యక్తి కోసమో, కొద్ది మంది కోసమో సంతోషబెట్టే 'కళ కళ కాదు.

(ప్రజాబాహుళ్యంలో మమేకమైతే తప్ప కళారూపం సజీవంగా ఉండదు. ప్రజల సుసంపన్నమైన, సజీవమైన భాషతో పరిచయం లేకపోవడం, (ప్రజాబాహుళ్ళ్యానికి దూరంగా ఉండటంవల్ల కళాప్రక్రియలు, ప్రజల భాష ఆలోచన, భావాలతో ఏకరూపం సాధించ లేకపోతున్నాయి. కళాకారులు సమాజాన్ని సమగ్రంగా అధ్యయనంచేయడం అవసరం. సమాజంలో మెజారిటీ భాగమైన కార్మిక, కర్షకుల జీవితాన్ని (ప్రతిబింబించడం కళాప్రక్రియల కనీస బాధ్యత. శ్రామికులు పురోగమిస్తున్న దిశగా కళల ప్రమాణాలను, స్టాయినిపెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ళా నృష్టికి మూలపదార్థం (ప్రజాబీవితం, నిర్ధిష్ట సామాజిక జీవనం మనిషి మెదడులో ప్రతిఫలించిన కారణంగా ఉత్పనమైనవే కళలు” కళల ముడిసరుకు లను పరిశీలించి, ఆధ్యయనంచేసి, అనుభవాల్ని పొందాలి. తద్వారా జీవన ఏధానాన్ని విశ్లేషించినప్పుడే సృజనాత్మకమైన కళారూపాలను సృష్టించడానికి వీలవుతుంది, కళలు (ప్రజల్నుంచి, వాస్తవం నుంచి దూరం కాకుండా సజీవంగా ఉన్నంత వ్రర్రక్త (ప్రజాదరణ పొంది, జనబాహుళ్యానికి చేరతాయి. వేల కొలది సంవత్సరాల క్రితం నాటి రాచరిక వ్యవస్థలో దేవదాసీలతో, వేశ్వలతో నాట్యాలు చేయించి నాటి పాలకవర్గాలు ఆనందాన్ని పొందేవి.

జన జీవితాన్ని ప్రతిబింబించే అనేక జానపద కళారూపాలు మనకు ఉన్నా, వేల కొలది సంవత్సరాలనాటి క్షీణసంస్కృతిని పునరుద్దరిస్తూ నేడు కొన్ని సంస్థలు కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, ఆంధ్ర నాట్య తదితర నాటకరీతులను (ప్రవేశ పెట్టి ఆ ప్రదర్శనలను "ఫాషన్‌"గా భావించే ధనికవరాలకు అందుబాటులో ఉండే ఏర్పాటు చేస్తున్నాయి. స్ట కలై అన్నవరం బేవేందర్‌

“ఆధునికత' పేరులో వెర్రితలలు వేస్తున్న సాంస్కృతిక కార్యకలాపాలు మానసిక వికాసానికి బదులు, మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. వెర్రి తలలు వేస్తున్న నాగరికతవల్ల సజీవమైన, ఆరోగ్యప్రదమైన జనపద కళారూపాలు అంతరించిపోయే ప్రమాదం లేకపోలేదు.

ధనకాంక్ష, కీర్తి 'కుతి' తీర్చుకోవడానికి తప్ప, జన ప్రయోజనం లేకుండా పుట్టుకొస్తున్న సంస్టలు, వ్యక్తులు “కళాదళారులు”గా మారి, అనతికాలంలోనే నామరూపాల్లేకుండా పోవడం మనకందరికీ తెలుసు. సంఘ వ్యతిరేకులపట్ల కళా కారులు కర్తవ్యంగా పెట్టుకోవలసింది, వారి వంచనను, క్బూరత్వాన్ని బహిర్గతం చేయడం, చేస్తూనే సమాజ వ్యతిరేక శక్తుల పతనం అనినార్యంగా చిత్రించడం అత్యంతావశ్యకం. జాతిని జాగృతం చేస్తూ ఐక్యతకు, జాతిసమ(గ్రతకు దోహద పడటం కళల కనీస ధర్మం. (ప్రతి కళాకారుడూ సుశిక్షితుడైన సైనికుడే. సమాజం లోని వైరుధ్యాలను తొలగించడానికి, అవినీతిని బట్టబయలు చేయడానికి, కళా ప్రక్రియలను ఆయుధాలుగా ఉపయోగించాలి. సంఘప్రయోజనాన్ని గాలికొదిలేసి, వ్యక్తి ప్రయోజనాలకోసం ఈనాడు అనేక సంస్థలు అవిర్భవిస్తున్నాయి. కేవలం ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న యీ సంస్థలవల్ల జనం కొరిగేదేమో లేకపోగా యువతరం వీరి ప్రదర్శనలవల్ల చైతన్యరహితులయ్యే ప్రమాదం ఉంది.

విషసంస్కృతిని ప్రతిబింబిస్తున్న కళారూపాలు సమాజూనికే హాని కలిగిస్తాయి అనేది నిర్వివాదాంశం, వాస్తవ జీవితాన్ని, సామాజిక ధృక్పధాన్ని ప్రతిబింబించ కుండా, స్వాప్నిక జగత్తులో విహరించే కళాప్రక్రియలు ఎంత వేగంగా వస్తాయో,

అంతే వేగంగా అంతర్జానమవుతాయి. తరతరాలుగా పేరుకుపోయిన ప్రజలకు

హాని కలిగించే మూఢాచారాల నిర్మూలనలో కళా రూపాలు ప్రధాన పొత్ర

వహిస్తున్నాయి. 'జరుగుతున్న చరిత్రకు అద్దంపట్టని కళారూపాలను 'ీకొట్టి జన

సంక్షేమానికి పాటుపడే కళాకారులకు, సాహిత్య, కళాసంస్థలకు కరీంనగర్‌ ప్రోలు

ఎప్పుడూ పట్టం కడతారు, వ్యాపార సంస్కృతితో కళారంగాన్ని కలుషితం చేస్తున్న పెద్ద మనుషులపట్ల కళాప్రియులంతా అప్రమత్తంగా ఉండాలి.

పై నేపధ్యంలో “కళ' ప్రజల కోసం కాదు, కళ కళ కోసమే అని ఎవరైనా అం

వారు ఖచ్చితంగా “కళా దళారి” అని చెప్పవచ్చును.

భాతవాహన కళా గ్రవంతి' వారి

ప్రత్యేక సంచికలో 29059

మరో కోణం

గ్రామీణ విలేకరి - సామాజిక బాధ్యత “అక్షరాన్హి అణచివేయ్‌/అది అనలమై మండుతుంది ం సత్వాణ్చేషికి నంకాయ్‌/అది అగ్జివర్దతమై పేలుతుంది ప్ర మాజిక (ప్రస్తుత సమాజంలో అక్షరాలను నమ్ముకున్న వార్తాహరులు రల జీవనంలో, సమస్యల్లో వారి చైతన్యంలో భాగమై ఉన్నారు. వార జ విలేకరి ప్రజల జీవనంలో నేడు మిలితమైపోయింది. దాంతోపాటు (గ్ర న చరిత ఉవ్వెత్తున ఉబుకుతున్న ఉద్యమాల దిక్సూచిగా వర్ష సంఘ రూ మ (స్‌ క్రమాన్ని రికార్డ్‌ చేసే చరిత్రకారుడుగా మెలగాల్సిన ఆవశ్యకత న్‌ త్త ట్య విలేకరి పత్రికా ఉద్యోగిగా కాకుండా బాధ్యతగల సామాజిక క్‌ ణా బాధ తగల (ప్రఖ్యాత జర్నలిస్ట్‌ యం. చలపతిరావు చెప్పినట్లు (ప్రతి పొత్రి యా ల లే అధికారిగా ప్రభుత్వం-ప్రజలకి మధ్య సంధానకర్తగా వ్యవహా రించాల దం, 'వ్రస్తుతం వరకట్నం, సాంఘిక దురాచారాలు, కులతత్వం, మలోనా ద పేద ధనిక వైరుధ్యాలు లాంటి ఆనేక సమస్యలను సమాజం ఎదు ై క్‌ న జాతీయోద్యమం రోజుల్లో పత్రికలు బహు ఆరుదుగా ఉండేవి. జర్నలిస్టులు అంతగా ఉండేవారు కాదు.

(ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లాలోనే 200 మందికిపైగా పా (కీయ వృత్తిలో ఉన్నారు. ఆ రోజుల్లో పత్రికల్గో కేవలం రాజకీయపరమైన వార్తలు, సా ధతి సంబంధించిన వార్తలే వచ్చేవి. కాని ఇప్పుడు (గ్రామీణ జీవితాన్నీ సమస్యర్ని బింబించే వార్తలు (ప్రచురిస్తున్నారు. గ్లో అన్నవరం దేవేందర్‌

పత్రికాధిపతులు, పాలకులు, పెట్టుబడిదారులు ఒకే వర్గానికి, ఒకే రాజకీయ కూటమికి చెందినవారుగనుక రాజకీయాలలో అశక్రమాలు అంతగా బయట పడవు. ప్రస్తుతం పత్రికాధిపతులైన పెట్టుబడిదారులకీ, పాలకులకీ మధ్యనున్న వైరుధ్యాల మూలంగా “బోఫోర్సు' కుంభకోణంలాంటివి నేడు బయటపడ్డాయనే విషయం తెల్పిందే. ఈ రోజు దినపత్రికల్లో వస్తున్న పోలీసు అత్యాచారాలు కాని, రాజకీయ నాయకుల, 'ప్రభుత్వాధికారుల అక్రమాలు వెలుగుచూస్తున్నాయంటే నేడు పత్రికా యాజమాన్యాలు పాలకుల మధ్యనున్న విభేదాలే కారణం. దీనికి తోడు ప(త్రికారంగంలో పేరుకున్న పోటీవల్ల నేడు అన్ని యాజమాన్యాలు జిల్టాలకు ప్రత్యేక సంచికలు ముద్రిస్తున్నాయి.

(గ్రామీణ (ప్రాంతాల్లో ఇంకా భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు అంతరించలేదు. వీటి నిర్మూలనకు జరిగే పోరాటాలకు చారిత్రిక రూపుఇవ్వడం అవసరం, అయితే ఈ సత్యాన్వేషణలోనూ వాస్తవాలను బహిర్గతం చేయడం లోనూ సరియైన వారధిగా పత్రికా విలేకరి ఉండాలి. ఒక్కోసారి దుష్టరాజకీయ నాయకులు తమపై వస్తున్న విమర్శలు ఎదుర్కునేందుకు తమ అనలు న్వరూపం బయటపడు తుందనే భయంతో గామీణ విలేకరులపై దాడులకు వూనుకుంటారు. ప్రజాస్వామ్యానికి మూలస్టంభాలైన ఎగ్జిక్యూటివ్‌, లేజొస్లేచర్‌: జుడిషియరీల తర్వాతి స్థానం పెత్రికలది. ఈ సమతా స్థితిని ఎవరూ చెదరగొట్ట లేరు.

అయితే పాలకులు మాత్రం తమ నియంతృత్వాలతో, తమ అక్రమ రాజకీ యాలతో రాజీలేని పోరాటం సాగిస్తున్న ప(త్రికల్ని సహించలేరు.

బహుశ ఈ (ప్రమాదాన్ని దూరదృష్టితో చూసిన మన రాజ్యాంగ నిర్మాతలు, రా జ్యాంగంలో పత్రికా స్వేచ్చను పొందుపరచలేదు. (ప్రజలకుఉన్న ఆర్టికల్‌ 19లోని క్‌ చ్చనే పత్రికలు ఉపయోగించుకుంటున్నాయి. కాగా మన రాజ్యాంగంలో అధికార రహస్యాల చట్టం పత్రికలకు గొడ్డలిపెట్టుగా ఉంది. అలాగే పాత్రికేయుల పీకనొక్కే క్రిమినల్‌ ్రోసిజర్‌ కోడ్‌ సెక్షన్‌ 160ని పోలీసులు తరచు ఉపయోగిస్తు న్నారు. ఈ సెక్షన్‌ ప్రకారం పాత్రికేయునికి సమన్గు జారీచేసే అధికారం మాములు పోలీస్‌ ఆఫీసర్‌కు ఉంటుంది.

(గ్రామీణ ప్రాంతాల్లో విలేకరులు అనధికార ప్రజాప్రతినిధులుగా, అవినీతికి వ్యతరేకంగా, ప్రజా సమస్యలతో మమేకమై పనిచేస్తున్నారు.

మరో కోణం

ప్రభుత్వ కార్యక్రమాలకు, అవినీతి రాజకీయ నాయకులకు నేడు గ్రామీణ విలేకరి 'కావలికుక్క'గా పనిచేస్తున్నాడు. దురదృష్టవశాత్తూ అక్కడక్కడ పాత్రికేయ వృత్తిలోనూ అవినీతి ఉండవచ్చు. పత్రికలను స్వార్థప్రయోజనాలకు ఉపయోగించకుండా కనిపెట్టవలసిన బాధ్యత ప్రజలదే | “ద్రతి కళాకారుడు నుళ్లోతుడైన సైనికుడే” అని మావో జెడాంగ్‌ అన్నట్టు, “ప్రతి పాత్రికేయుడు నుట్షితుడైన సైనికుడుగా అన్వయించుకోవాలి" పాత్రి కేయులు సంఘంపట్ట బాధ్యతగా వ్యవహరించాలి. ఈ కోవలోనే చింతామణి, కోలవెన్ను, రామకోటేశ్చరరావు, ఖాసా సుబ్బారావు, నార్ల వెంకటేశ్ళ్యరరావు దురన్యాయాలపై నిప్పు కణికలు వెదజల్లారు. ఈ అగ్నిరగిలిస్తూనే వృత్తి ధర్మానికి కళంకం లేకుండా పని చేసారు. కాని 'మంది ఎక్కు అయితే మజ్జిగ పల్బనైనట్టు' రోజు రోజుకు పెరుగు తున్న పత్రికలు, పాత్రికేయులపట్ల ప్రజల్లో వ్యతిరేక భావం అక్కడక్కడా కనిపిస్తున్నది. శీనాట11/౮/ అధికార వ(త్రిక్ష ప్రతిన్సుందన' మానవద్రిక్ర వవ్రీల్‌ 1990 క్రో అన్నవరం దేవేందర్‌

శ్ర(0 జా వాణిజ్య సామ్రాజ్యవాదం ఆయువుపై లాడెన్‌ దెబ్బ కరెంటు స్విచ్‌ ఆపేయ్‌... బిల్లు బాగా పెరిగిందని గద్రిస్తాన్‌ ! మన సుద్ద మట్టితో తయారైనా టూత్‌పేస్ట్‌ వంద (గ్రాములు 50 రూపాయలు. అదిరిపోతాన్‌ ! రెండు రూపాయల కొక్కకోలాకు పన్నెండు రూపాయలు చెల్లిస్తాన్‌, వీటన్నింటి వనుక ఉన్నది అమెరికా ! అమెరికా మన సకల కష్టాన్ని మనకు తెల్వకుంట దోచు కుంటున్నది. ఆమెరికా మన ఆరాటాలు పోరాటాలపై నీళ్ళు కుమ్మరించింది. అమెరికా ! ఇంతెందుకు బషీర్‌బాగ్‌ పోలీస్‌ కాల్పుల వెనుక ట్రిగ్గర్‌ నొక్కింది అప్పటి బిల్‌క్షింటన్‌.

అజంజాహి మిల్టు, హెచ్‌యం.టి,, అల్విన్‌ కార్మికులు పొట్టచేత పట్టుకొని వచ్చింది అమెరికా సా(మ్రాజ్యవాదంవల్లె. మన మేధావులను మనకు కాకుండా

ఐ.టి. లేబర్‌గా మార్చుకొని కూలికైకిలిచ్చి చేపిచ్చేది అమెరికా 1 ఇంతకాదు ఆమెరికా మన జీవితంలో పెనువేసుకుపోయింది. టీవి ఆన్‌ చేస్తే చాలు స్టార్‌: సియన్‌యన్‌ టీవిల్లో కోడైకూస్తుంది. మన కళలు, సంస్కృతి, భాష అన్ని అమెరికాకు పరాయికరించుకున్నాం. ఇంతకూ మనం ఏం చేస్తాం? ఏం లేదు ! అమెరికాకు ఆత్మను అమ్ముకున్నాం. అమెరికా ముందు నూటొక్క దేశాల్లో 'జీహుజూరో అంటూ నిలబడాల్సిందే, ఆ దేశం సైన్యం, నిఘావ్యవస్థలు ఆత్యంత పవర్‌పుల్‌ రష్యాను కూల్చింది. చైనాను వ్యాపారమయం చేసింది. మరో కోణం

క్యూబాలో చిచ్చు పెట్టింది. సూడాన్‌లో బాంబులు వేసింది. వియత్నాంతో యుద్దం చేసింది. లిబియాపై దాడి చేసింది అమెరికానే. ప్రపంచం అనే గ్రామంలో ఒక పెద్ద కరడుగట్టిన పెద్దకుల భూస్వామి అమెరికా. అయితే ఆ దేళాన్ని దెబ్బతీసే ఏ శక్తి నేడు లేదు, అమెరికా అనే మట్టికాళ్ళ మహారాక్షసిని పట్టుకోగలిగాడు బిన్‌లాడెన్‌, అమెరికా ఆయువుపట్టును దొరికించుకున్నాడు, కాని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో వేలాది అమాయక (ప్రాణాలుపోయాయి. వాల్లందరికీ కన్నీళ్ళు రాలున్తాం. అమాయకులపై హత్యాకాండను అందరం ఖండిన్తాం. ఉ(గ్రవాదాన్ని ఖండిస్తాం. బిన్‌లాడెన్‌ ఇస్లామిక్‌ ఫండమెంటలిజంను వ్యతిరేకిస్తాం. కాని అమెరికా పొగరు వంచిండు కదా ! ఎంత బావుంది, అమెరికాపైనే దాడి. ఆ దాడిని అమెరికానే తనపై యుద్దం అని ప్రకటించుకొంది. లాడెన్‌ నీవు నిజంగా (గ్రేట్‌ బుష్‌ మెడలు వంచావు. కానీ నీలోఉన్న మత తీవ్రవాదం (ప్రమాదం. సా(మ్రాజ్యవాదాన్ని, ప్రపంచ పోలీన్‌ను ఆయ మెరిగి గాయం చేస్తున్నా నీలో ఉన్మాదం ఉంది. ఏదీ ఏమైనా బిన్‌లాడెన్‌ వారెవ్వా | సంబుగన్నైతుంది. నరళీకృత ఆర్జిక విధానాలపేరిట, నూతన పారిశ్రామిక విధానం పెరి మూడో ప్రపంచ దేశాల్లో ప్రవేశించి (ప్రజలను పీల్చి పిప్పిచేస్తూ ఆయా దేశాల నేతలను ఆర్థికంగా ఆయుధాలిచ్చి లొంగదీసు కోవడం, ఆ తర్వాత ఆడించటం ఎంత గుండా గిరి ? అన్నిదేశాల్లో మార్కెట్‌ పేరిట సామ్రాజ్యవాదం పేరిట అన్నిరంగాల్లో ప్రవేశించి ఆ దేశ అర్జిక, సామాజికరంగాల్లో సాంస్కృతిక రంగాల్లో నేడు అమెరికా (ప్రవేశిస్తుంది. దాన్ని ఎదిరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వియత్నాం ఎంత చిన్న దేశం, అమెరికాను ఓడించలేదా ! ఇరాన్‌ ఎంత ? అమెరికా సైనికులను బంధించ లేదా | ఇట్లా వాణిజ్య సామ్రాజ్యవాదంకు వ్యతిరేకంగా ఒక్క బాణం ఆయినా ఎక్కుపెట్టాలిప్పుడు. అది అమెరికన్‌ స్కడ్‌ క్రిపణికంటే విలువైనది. భూమిక వ్షవ(త్రిక 16-30 సెప్టెంబర్‌ 2007 క్రో అన్నవరం దేవేందర్‌

ప్రా

నాస్తులో వాస్తవమెంత, అవాస్తవమెంత ?

'వాస్తు' ఇప్పుడు అందరిని ఆలోచింప చేస్తున్న పదం. వాస్తులో వాస్తవమెంత,

అవాస్తవమెంత ? అనే బేరీజుకన్నా నేడు వాస్తు వాస్తంటూ (ప్రచారం ముమ్మరం అవుతుంది. శాస్త్ర సమ్ముతం కాని, 'హేతుధృక్పథం లేని 'వాస్తు' వాస్తుశాస్త్రంగా చలామణి అవుతుంది. మధ్య తరగతి బలహీనతలు, భయం బతుకులు అభద్రతా భావం పునాదిపై ఇది గత దశాబ్దంగా తీవ్రంగా వేళ్లూనుకొని ఉంది. వాస్తు విరుద్దంగా ఇండ్టున్నాయని లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన గృహాలను నేలమట్టం చేస్తున్నారు. వాస్తు పేరుతో మధ్య తరగతి ప్రజలు అప్పుల పాలవుతున్నారు. వాస్తుదోషం ఉందని వేల వేల రూపాయలు స్వాహాచేస్తు ఇదొక శాస్ర్రంలని నమ్మించి ప్రజలను అభద్రతకు గురి చేస్తున్నారు. వాస్తుశాస్త్రం పురాణాల్లో ఉందని, వేదాల్లో ఉందని నమ్మబలికి ఒక దళలో' వాస్తు అబద్దం అంటే కనీసం నిజమౌ, అబద్ధమౌ అనే ఆలోచన సైతం చేయడం లేదు. వాస్తుదోషాలవల్ల ఈ ఇంటి యాజమానికి ప్రాణభయం ఉందని చెప్పగానే అఆభద్రతతో వాస్తును నము తున్నారు. అయితే పురాణాల్లో, వేదాల్లో ఆయాకాలాల్లో వాటికి అనుగుణం గా ఈశాన్యంకే బావి తవ్వించాలని ఈశాన్యం మూల పెరగాలనీ, ఉత్తరంకు బరువు, ఎత్తు పెరగరాదని ఉండవచ్చు. వాటినే ఏ శాస్త్రీయత ఆధారం లేకుండా ఇప్పుడు ఉపయోగించడం అశాస్త్రీయమే అవుతుంది. బావి ఇంటికి ఈశాన్యమే ఉండాలంటే అదే బావి (ప్రక్కింటికి ఆగ్నేయం అవుతుంది. దిశలక్రైతే ఇంటి హద్దులు తెలయవు కదా ! బావి ఒక ఇంటిలో తవ్వితే ఇంకో ఇంటికి కూడా ఇంకో మరో కోణం జీకే

దిశగా ఆ బావి ఉంటుంది కదా మరి అప్పుడు ఏం కాదా ? అంటే వాస్తు శాస్త్రజ్డులు జవాబు చెప్పరు. అలాగే ఈశాన్యం మూలపెరగాలనేది ఎందుకు పనికి రానివాదన. ఇలా భయభ్రాంతులకు గురిచేస్తూ కట్టిన ఇండ్లను కూల్చివేయడం, నిర్మాణంలో ఇండ్లకు వాస్తుపేర ఆటంకాలే ఎదురవుతున్నాయి. (ప్రతి ఇంటిలో సమస్యలు ఉంటాయి. (ప్రతి ఇంటిలో అనారోగ్యం ఏదో ఒకటి ఉంటుంది. ఇది వాస్తునుబట్టే అయ్యిందంటే మేధావులైనవారు కూడా పరిశీలన లేకుండా నమ్ముతున్నారు. వాస్తులు, దిశలు ఇలాంటివి ప్రపంచంలో అగ్ర రాజ్యాలైన అమెరికాలో పాటించడం లేదు. (ప్రపంచాన్నే గడగడలాడిస్తూ తమ ఆధిపత్యంలో ఉంచుకుంటున్న బిల్‌క్రింటన్‌ వైట్‌హౌజ్‌ ఏ దిశలో ఉందో వాస్తు వాదులు చూడాల్సి ఉంది. ఏ దేశంలో కూడా ఇలాగే ఉండాలనే అశాస్త్రీయమైన ధృక్పథం లేదు. మతం, దేవుడు ఎవరి విశ్యాసాలు వారివే అయినా 'వాస్త'ఇటీవలనే విసృతంగా వ్యాపించింది. ఒకవేళ వాస్తు నిజమే అయితే ఇటీవల రాష్ట్రంలో రోడ్ల వెడల్పు చేస్తూ వేలాది ఇండ్లను కూల్చివేశారు. అవన్నీ వాస్తువిరుద్దంగా ఉన్నాయా? లేదా ? వాస్తు అనుకూలంగా నిర్మించిన గృహస్తులకు సమన్య లేదా ? ఇవన్నీ హతుబద్దంగా పరిశీలించాల్సి ఉంది. వాస్తుశాస్త్ర సమ్మతమేనని ఇంజనీరింగ్‌ సిలబస్‌లో ఎక్కడా లేదు. ఇలా శాస్త్ర సమ్మతం కాని అవాస్తవమైన 'వాస్తుతో (ప్రజలను మూఢులను చేస్తున్నారు. సమ్మతంగాని అశా(స్తీయ అవగాహనపట్ల హేతువాదులు ప్రచారం చేయాల్సి ఉంది. 'ప్రతిష్త్రం' వక్హవ(్రిక్ష ల్‌ అన్నవరం దేవేందర్‌

అలీ బీ ఐపీ

రికాం లేకుండ పసనిచేస్తం గానీ పేరు మొగోల్లది

మా వనికి రికాం ఉంటదా ఎగిలివారంగ లేచి పని మొదలుపెడితే రాత్రి అందరు తిని పండుకునే వరకు తీరిక లేదు. అలుపు సొలుపు లేదు. ఆడ పుట్టుకే అగ్గి పుట్టుక గిప్పుడు ఇంకేం పని చేస్తున్నరు గని ఆడోల్టు ఎనుకటనైతే గొడ్డోలే

లు జె

జసుడే. మౌ అత్త నన్ను అరిగోస పెట్టుకున్నది. పెద్ద ఎగిలివారంగ లేచి ఇంటి ముందటికి ఇంటి వెనుకకు నీళ్లు చేదించేది. సచ్చిన, చెర్వంత వాకిలి ఊడ్చి పెండ తెచ్చి సల్ల అంట్లు తోమి గడ్కపోసి, తొక్కునూరి ఇండ్లు ఊడ్చి గొర్ల కొట్టుకొని సిక ముడుసుకొని సద్దులు కట్టుకొని ఉరుకుడేనాయె. ఆడికి పోయినంక నారుపీకి నారు పంచేసుడు మోటగొట్టుడు ఎడ్లకాడికి పోవుడు మక్కజొన్న కావలపోవుడు నలి ఏరపోవుడు ఓ అరగోస పడ్డం. ఇవి రెక్కలు కాదనుకో... పనిల ఏమన్న కింది మీద్దైతే అత్త గునిపిచ్చి పెట్టుడు. ఆయనే ఉరిమి ఉరిమి చూసుడేనాయె ఆడిబిడ్డలు కూడా చిన్నోళ్ళా అబ్బో వాళ్లకు సాలెనుక సాలు వచ్చిందిగని ఇరాం లేకుండ పని చేయించుకున్నారు. మా తొలుసూరోడు కడుపుల పడ్డంక కూడా శెలక పని తప్పలేదు. గిప్పటోళ్లకు నెలతప్పంగనే బెడ్‌రెస్ట్‌ అని అంటు౦డ్రు మరో కోణం

మేమైతే పొట్టతోనే ఉండగ ఎనిమిది నెల్లప్పుడు మక్క గొయ్యపోయిన మా యారాల్లైతే పొద్దులప్పుడు కూడా కంకి తీయబోయింది. ఇప్పటి కోడండ్లకు బిడ్డలైతే సుకమే ఉన్నది. ఎనుకట మంచినీళ్లకు చెర్వెనుకకు పోయి మాడంత పోంగ్‌ నీళ్ళు బిందెల కామానంగ తెచ్చేది. ఉప్పునీళ్లు బాయిలోపలికెళ్లి గోలాలనిండ చేదిపోశేది. సలికాల మైతే శాంతాడుపడుతె ఏళ్లు గుంజేది.

మా అప్పుడు గిర్జిలున్నాయా ? ఏంది వడ్డు దంచుడు కుందన్ల వడ్డు పోళి దంచితే బియ్యమయ్యేది. అవ్వగారింటికి సద్ది కట్టు కొనిపోవడ మా అన్నచ్చి తోలుకపోయేది. కోడిగూచేపొద్దుకు బైలెల్లితీ పాలి యాల్లకు చేరేది. ఎనుకట ఉన్నన్ని కష్టాలు ఇప్పుడున్నయా కాని ఆడోల్ల కష్టం ఎప్పుడు గింతే. నేను మొగోన్ని అని తిరుగుడేగొని ఇంటిపని బయటిపనితో మా కష్టాలు ఎడున్నయి గాన్న ఉన్నయి. అప్పుడు ఇంక ఆడోళ్ళు మొగోళ్ళు కల్సి దోరోని పనికి ఎట్టికిపోయేది చిల్లరోల్లంత కల్పి కట్టడమే వాల్ల ఇండ్డు, గడీలు, గడీలల్ల ఎంతమంది రెక్కలు ముక్కలు చేసుకున్నరు ఆ పాపంవట్టిగ పోతదా ఇప్పుడు వాట్టల్ల కుక్కలు తిరుగుతున్నయి. ఎనుకట దొరోనిగడి అంటే ఉచ్చ పడేది, ఇప్పుడు అండ్లనే ఉచ్చ పోతున్నరు. ఇంట్లపనికి కష్టం చేసినం, బయట పనికి ఎట్టి పనికి కూడా గోస పడ్డం. అయితే గప్పటికి ఇప్పటికి ఊర్హే మారిపోయినయి. మొగోళ్లకు అడోళ్లకు సంగాలు వచ్చీనయి, సదువు, కరెంటు వచ్చింది. బస్సులు వచ్చినయి కొంత మారిపోయింది. ఊరుకు సర్పంచ్‌ దొరోడో, పటేలో ఉండేది. ఇప్పుడు కొంత మారిపోయి అక్కడక్కడ మన చిల్లరోళ్ళు మన్నైెపోల్టు సర్పంచ్‌లు అయితన్నరు. ఆడోల్టు కూడా కుర్చీమీద కూకుంటున్నరు. రాత్రి బల్లల్ల కొంత కొంత సంతకం చేత్తన్నరు. ఆఅడోల్లంత మహిళా సంఘంపెట్టి కొంత కొంత నెల నెలకు దాసు కుంటున్నరు. ఎవల కాల్లమీద వాల్టు బతికేతందుకు పైసలు శెయ్యి తిరిగేటట్టుగా ఉన్నయి. ఏమన్న ఆడోల్ల మీద అయితే సంఘపోల్టు అందరు బజారుకువచ్చి గల్లపట్టి అడిగేతంద్కున్నరు.

ఎనుకటకాలం ఎడ్జికాలం గుడ్డికాలం అయినాగాని కట్నంకోసం బిడ్డలను సంపుకోలేదు. వాల్ల ఇండ్లల్ల పీనుగెల్ల కట్నం ఎక్కువ కావాలని కోడండ్లను గ్యాసునూనె పోసి కాలపెడుతుండ్రట, అత్తకూడ కల్సి కొడుక్కు ఎగేత్త్రందట, దాని బిడ్డకు ఆ సాలు రాదా. ఎనుకట మేం శేను పనికిపోయి వచ్చినంక తిని కాసేపు గ్లో అన్నవరం దేవేందర్‌

ఆడుతున్నరంటే సూడపోయేది. ఊల్లైకు కథలు చెప్పటోల్లు వచ్చేది భాగోతం, ఒగ్గు కతలు, బు(ర్ర కతలు, శారద కతలు సెప్పటోల్లు ఇప్పుడైతే ఎవ్వలు వస్తలేరు టివీ లేనాయె. ఇంటింటికి టివీ వచ్చినంక ఇంత తిని కూసుంటే అండ్లనే సిన్మాలు వస్తున్నయి. టివి ముంగల కూసుంటే ఇంటి కెవ్సలు వచ్చినా వాల్ల మొకం సూత్తలేరు. అండ్లనే తలకాయపెట్టి సూసుడు నాకైతే మంచిగనిపియ్యదు. మూడు బజార్లకాడ కత చెప్పుతున్నంటే వాడ కట్టోల్లంత కలసిపోయేది, కలసి నూసేది మంచిగనిపించేది. మా కాలం కష్టమయిన మనునులల్ల నీతి ఉండేది. ఇప్పుటోల్లంతా నీలుగుడెక్కువ, ఇప్పటోల్ల తిండి ఎట్టున్నది, రోగాలెట్టున్నయి. ఇరువై ముప్పయి ఏండ్ల పోరగాండ్లకు పుట్టెడు రోగాలు వస్తాండే. తెల్లకోడిలెక్క పెరుగుతున్నరు. ఆంత కష్టం చేసినం కాబట్టి గట్టి బొక్క మాది ఇప్పటికి ఏ రోగం లేదు. ఇంత కష్టం చేసినా మాకు మా పేరు లేదు గాయన భార్య ఈయన భార్య అంటూ పిలుస్తున్నగని మొగోల్లను ఈమె భర్త ఆమె భర్త అంటలేరు ఎందుకు మరి? బల్టు” దీినవ(త్రిక 8 మార్టి, 2002 కదరయ్ళి టంధాలం్య ఖ్‌ ఫాం లాగా కస గ అ(ట 0 గంటి || ర రో సళ నక ॥ మరో కోణం రం

క. మాలి నిం నం న ల... న శా య క హు యమాయ టి న. మం అ మంట ము న.

సెట్టటున టో టీ ॥ వ ను టాం ల

డిసెంబర్‌ 6, 2001న కొత్తడిల్లీలో భారతీయ దళిత సాహిత్య అకాడమీ 17వ జాతీయ

మహాసభలో అన్నవరం దేవేందర్‌కు “మహాత్మా జోతిరావు పూలే ఫెలోషిప్‌” పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న ఆకాడమో అధ్యక్షులు డా సుమనాక్షర్‌. ఫోటో: గప్పి వాన్మకొండ క్రో అన్నవరం దేవేందర్‌

యా తనల క రం గం స ఇ గు ప స్‌ ాంంుననుు న. ర నే శిలా! 10. నక. ₹ న ట్‌ చ్‌. క్ష సస తే. ఖ లి కా? యళ న! ఉం మా న క. శ. వ. చ డిసెంబర్‌ 6, 2001న కొత్తఢిల్లీలో భారతీయ దళిత సాహిత్య అకాడమి 17వ జాతీయ సభల్లో "తావ్వ” కవితా సంకలనాన్ని ఆవిష్కరిస్తున్న అకాడమి అధ్యక్షులు డాః సుమనాక్షర్‌. వేదికపైన బి.యస్‌.రాములు, అన్నవరం దేవేందర్‌, గిరిరాజ్‌ కిషోర్‌:

  • స్ట్‌ న ల. 1 1 ॥ | [4 లగ మే స్ట గ్త్‌ - వు స గో ఎ సె ద త జ న పా ళా | స్‌ . శ బ్‌ రచన భ్‌ స్ట న. భక? చా -,. . చ్‌ ల స సల చ్‌ న! షా న శే (| ఇఖైత్తాల క్ష్‌ న్న లు పా పాం యు వ లో చ మ న! , న; నట న ఫిబ్రవరి, 2002 హన్మకొండలో ప్రవావ నాళేజీకి తొవ్వ" అందిస్తున్న అన్నవరం దేవేందర్‌ (ప్రక్క నుంచి డా నందిని సిధారెడ్డి, దార్ల రామచంద్ర డా నాళేశ్చరం శంకరం, స కందుకూరి శ్రీరాములు అనిశెట్టి రజిత, పొట్టపెల్లి శ్రీనివాసరావు, డా నలిమెల భాస్కర్‌ మరో కోణం

దనం ఎ డిందు పాతాల వ “కమ సాహెతీ గౌతమి-కరీంనగక్‌ గ్గ స నషి మో | సషంంల ల ఫే 7 మం! ఛ్తగే సట స] ః సనన ష్య (క శీ న్న హో (ఈశ బ్‌ ల! స్త ౬ ._ అస్య తావ్వ స ్‌ సన సస భయ కార్మస్రమ నా. ళా ల ప్‌ [్‌ చోర వాంయాయ లా చం సం శ (స ల; డం నాం యో న హ్‌ వే. వ ప్‌ మాటే స్ట నయ మం! . ఇ + ల ప వశే రం ప్ర వ స స న న. శ నా. 11 క న ఎ సు (. టు. న 7 రి | ఎం “మవ “త్తటత్యు /? ఫిబ్రవరి 2, 2002న కరీంనగర్‌లో 'సాహితీ గౌతమి ఆధ్వర్యంలో “తొవ్వ పరిచయ కార్యక్రమంలో మాట్లాడుతున్న వరుల శివకుమార్‌ ప్రక్కన అన్నవరం చ*శందర్‌, డా బి. లక్ష్మణరావు, డా మలయశ్రీ రద కక్తూ ప... షా + నీ ఖు పమ ల్‌ లాట మ “చీవలినాం్యు ( న షు చో తం మ్మ. స్ట వ ౧. న న ణే యం సంక వ్‌ న న, మనలా. ౧ తం. ! చయయ న త కర తనన యమం యన్‌ సూ... స! ట్‌ న న యు స్ట కన స సం]! ఫిబ్రవరి 23 2002న హుస్నాబాద్‌లో నూతన సాహితి ఆధ్యర్యంలో “తొవ్వ పరిచయ సభ వరుసగా అన్నవరం దేవేందర్‌, వడ్డేపల్లి మల్లేశం డా నందిని సిధారెడ్డి దర్భశయనం శ్రీనివాసాచార్య, మాట్లాడుతున్నది జూకంటి జగన్నాధం, క్లో అన్నవరం దేవేందర్‌ దర యశ 6గం ధాల్వ్యు జ్‌ న సల. ఖా ల ఇ. బ్‌ ౯ లగే (0 ౧ండీ!డీట ఖీ ట్ట

॥ 14100 స౦ంసషగీ/1

ర్టుట య యాతు) ట్రా మైనను నా టాం ల శ

నం న 500232 270రూంంగ క55308.. "

. (| క్‌ స కా లీ నె

  1. =. హా శీ తీ గగ౧౭౪౮8గ౧౩౭గ౧ 06౪6౧6౮6

జ్‌ | ల చ న లు |

పంల

[న .. స వ్‌ అంతల వరు

స్త సళ |

సు యం పన న

న నెల 2 టి ||

స్తు (5 టో స

న

/ స ల ర శ్‌ | టా...

  • టు హర. సతీ ॥

సు |

రుం.

స

  • లి _ య నో న్‌ ంా ష్‌! మీ స. త! స్‌ మ

సనా న్‌ నళ స్ట త న ట్ల చ. సు స్‌ స పట!

టం మం ఇ మస ఛి