Telugu mana prakasham - anilvaranasi/indianlanguages GitHub Wiki
న న లంజా. స్త క్ష న ల హ్ న | | ఇ | ల . స | సహజ కవిళ్ళుల్లైెమాల . శ | మనసుపడి మక్కువత్తో సేకరించిన . సాల (నో క్ట ఈ పుస్తకాన్ని సాహిత్యాబ్రమానుల కోసం . స హో 1 న్ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి టం! ' కః... ఆనందంతో బహూకిర్సిస్తున్నాం. - శ | - మల్లెనూల్ళటుంబం 2 1 ం (1 న. ణే గ] / / | | / _ - ॥ | న. ల . జేలగ్. 5 పమీలాదేది.
నా! మన ప్రకాశం (టంగుటూరి ప్రకాశం పంతులుగారి జీవిత చరిత్ర) రచన్నః సాహిత్య రత్న డొ మంగళగిరి ప్రమలాదేవి ఎం.ఏ., ఎం.ఫిల్, పి. హెచ్.డి. ప్రకాశకులు: పద సాహిత్య పరిషతు (ర) మల్మాజిగిరి, హైదరాబాద్ - 47.
౨20 “422 లది ఎలా (ప్రమీలాక మన ప్రకాశం (కనడ! దిగిగిగడ5ిత[4) 6% ౨౧ సషసి64ఉ.గ61౧| నిగిగగ॥ణ౬౯౬4౦ంక౬౪! అ ౪/1 16 ౪౧18 గ్శ ర్ట ల | త్ [1/8 క86412100 బ్గ సు ఓఎధాలయ స్టా ర౭౦9౧౨9/2004 గ స్ట్ న ఖ్ 00౧199- 1000 గ్గ బోలో డ2ర.. వా త గ మ వ ఫ్ ష్ష్ శ్ వి106 : ద9.70/- మ ఉంచాము [0 ౧౦౧16౪6 : - ౪190212౧6402 94911931౧0 గేం౪99 4-10435, 84౧ ఏ1'66౪ ౪1002౧ 8%4జ౪2౧, గ/68౧2026 -3. నిషని1180664 0౪ ; వంగి కడగా ౧4౧1న? [౧/౮9/2026 - 500 047. స! 6౪ 1104120462, సీ222016, ౧/6 - 47. 0౪: 98487 65821. [౧ : 27055388. ₹146 69160664 5౫ : 5౧6612 ౪69214 1౧186 2; ర౬౯౯౧7౧|?౬౯౦౧[౧|౦౦౬౦| ౧౧11౬౯౧౩ ౮-15, 5412 "0౪/66, " 4౧౦%! 194 ౧౫/౮ - 80. ౯౧౧ : 27670357, 21557124.
అంకితం మో స న క స సీ ఎవ్వాడు ఎదురొడ్డి ఎద చూపి నిలుచుండి హూణులదరునట్లు హుంకరించే ఎవ్వాడు తనతల్లి కెదురైన ఇక్కట్లు బాపుటే వ్రతముగా (బ్రతుకు గడిపె వివ్వాని నిస్వార్ధ మేత్యాగ మేదాన గుణములు ప్రజలచే వినుతి నందే ఎవ్వాడు సమభావ మేతీరు ప్రకటించి హరి జనోద్ధరణ మాచరించె అట్టి దేశ దేవా పరాయణుడు ఘనుడు సర్వజన కోటి వినుతుడు సచ్చరితుడు . ఆంధ్రకేసరి భారతీ యాప్తుడతడు అతని కందింతు ఈ కృతి నందమేసగు
ముందుమాట
నేటి యువతీయువకులు స్వతంత్ర భారతదేశపు ముద్దుబిడ్డలు. ఈ జాతి కొన్ష్ని వందల సంవత్ళరాల పాటు విదేశీయుల పరిపాలనలో పడరాని పాట్లు. పడ్డది. ఈ పీడ కలలన్నీ కరిగిపోయి, ఇప్పుడిప్పుడే సుఖ సంతోషాలతో అభ్యుదయ పథం వెంట జాతి పరుగులెత్తుతున్లది. ఆగ్రరాజ్బాల సరసన నిలబడటానికి సిద్ధపడుతునస్తది. అయితే ఈ ఉత్సాహంలో గత చరిత్రను మనం మరచిపోకున్నామేమో! అనే నందేహం అవ్పడప్పుడు కలుగుత్నుది. ఎందరు నాయకుల త్యాగఫలమో ఈ స్వాతంత్ష్రం. ఎందరు మహనీయులు తమ ధనమాన ప్రాణాలొడ్డి విదేశీయులతో పొదాడారో! క్రమంగా ఆ చరిత్రలు మరుగున వడుతునవి. ఆ మహనీయులు నిత్యవ్యరజీయులు. నేటి యువతీ యునకులకు ఆ త్యాగధభనులను పరిచయం చేయవలసిన అవసరం ఎంతైనా వుంన్లదీ. ఆ వరుల చరిత్రలను ,వృరించడం వల్ల నేటి విద్యార్థినీ, విద్యార్గుల్లో భక్తి, కృతజ్ఞత మొదలై శుభలక్షణాలు వికసించడమే కాకుండ, ఆదర్శ భావి భారత పౌరులుగా ఎదగటానికి స్ఫూర్తి కూడా లభిస్తుంది.
మన ప్రకాశం స్వాతంత్ర సమరయోధుల్లో అగ్రగణ్యుడు. దేశభక్తి త్యాగము, వీరము ఆయనకు వెన్నతో పెట్టన విద్యలు, నిరుపేద కుటుంబంలో జన్నించి స్వయంక్యషితో ఆంధ్రకేసరిగా ఎదిగిన మహనీయుడతడు. తన నర్వస్వం దేశానికి అర్జించిన త్యాగధనుడు ప్రకాశం సంతులుగారు. వాది జీఐతం నుండి మనం నేర్చకోదగింది ఎంతైనా ఉన్సది. ఆ మహనీయుని జీవిత కథనం విద్యార్థులకు అందించాలనే తపన నా రచనకు ప్రేరణ. ప్రకాశం గారి బాల్బం - విద్యాఖ్యానం - రాజకీయ జీవితం - ఈ విధంగా 35 ప్రకరణాలతో ఈ కథ వివరింపబడింది. ఆంధ్రమాత గన్ష్న ముద్దు బిడ్డడు.
ఈ చారిత్రక కథలో అష్టటి సాంఘిక రాజకీయ పరిస్థితులు స్వాతంత్ర్యోద్యమ పరిస్థితి స్థాలిపులాకంగా కలిసి పోయాయి.
విద్యార్థులకు అందుబాటులో వుండే వ్యావవారిక భాషనే ఇందులో వాడటం జరిగింది. అక్కడక్కడ జాతీయతా సామెతలు కూడా తగులుతాయి. ఈ రచనలో ప్రకాశం పంతులుగారి జీవిత చరిత్ర నాకెంతగానో తోడ్డడింటి. చెప్పే విధానంలో ఏదైనా కొంత నూతనత్వం ఉన్నది కాని, కథలో కల్చనలు మాతం లేవు. చరిత్రకు అతి సన్నిహితమైన కథా కథనం ఇందులో గమనించవచ్చు. నా ఈ రచన విద్యార్థులలో యువలోకంలో ఏ మాత్రం ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని కలిగించినా సార్థకమైనట్లే. ఇక చదవటం మ్ వంతు.
డాక్టర్ మంగళగిరి ప్రమలా దేవి రచయిత్రి న!
ఈ గ్రంథాన్ని వ్రాయమని సూచించిన నాగార్జునా యూనివర్శిటీ ఐశ్రాంతాచార్ములు ఆచార గంగప్ట గారు - వారికీ
గ్రంధాన్ని పఠించి తమ ఆమోదాన్ని ఆశీసులను అందజేసిన ఆధ్యాత్మిక గురువులు, ఆచార్భ కందుకూరి శివానందమూర్తి గారికి,
ఆమూలా గ్రం, క్షుజ్ణంగా చదివి, ఆముఖాన్ని వ్రాసిఇచ్సిన ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకులు యాతరగిరి శ్రీరామ నరసింహారావు గారికి అభినందనని అందించింన స్వాతంత్ర సమర యోధులు, సుప్రసిద్ధ న్సాయ వాదులు శ్రీ యడవల్లి శివరామ శాస్త్రి గారికి ప్రచురణ సమయంలో అనేకసూచనలను అందజేసిన సుప్రసిద్ధ రచయిత శ్రీ రావనూతుల శ్రీరాములు గారికి,
&.టిపి. చేసిచ్చిన విజువల్ గ్రాఫిక్స్ డి. శ్రీనివాస్ గారికి, మందంగా ముద్రించిన టిప్తి టెక్తికలర్ ప్రింటర్స్వారికి
నా కృతజ్ఞత
తీ [2062720202 కం క[ా222964 )1ట0” 35ళళళంంగూాతాటిశ- 531163 ₹గంజటంం81020 06, 4.1, 2] :08933 -229505 అమోదం ఆంధ్రకేసరి, శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితచరిత్ర “మన ప్రకాశం” అనే పేరుతో సాహిత్మరత్స డా. మంగళగిరి ప్రమీలాదేవిగారు రచన చేశారు.
“నా జీవిత యాత్రా అనే పేరుతో శ్రి ప్రకాశం పంతులుగారు సుమారు 1914-42 సంవళ్సరాల కథవరకూ వ్రాసి వదిలి పెట్టగా, ఇతరులు వాల జీవత చరిత్రను వూర్తి చేశారు. అధి అనేక వివరాలతో కూడుకున్న స్తుదీర్భమైన గ్రంథం. ఈ చిన్షర్రంథం నేటి యువతరాన్ని దృష్టిలో పెట్టుక్రున్ని కొన్ని సంఘటనల వివరాలు పరిహరించి సంక్షిప్తముగా వ్రాయబడింట. శ్రీ ప్రకాశంగారి వృక్తిత్వం పూర్తిగా అవగాహన అయ్యే విధంగా యువతరాన్ని ఉత్తేజపరచి దేశభక్తి వైపు మళ్లించే ఈనంక్షిప్త గ్రంథం చాలా బాగున్షది, సాహిత్సరత్ష ప్రమీలుదేవి గారు చేసిన ఈప్రయక్షం తష్టక సఫలమువుతుందఖ గమ్మగలను.
చి॥ల|సౌ॥ ప్రమలాదేవికి మా ఆశీస్సులు ఖీమునిపట్లం 16-2-2004 కందుకూరి శిరానిందీ ష్రూర్తి
అముఖం
డా మంగళగిరి ప్రమలాదేవిగార్ని “మన ప్రకాశం” అను చక్కని గ్రంధాన్ని వ్రాసినందుకు హృదయపూర్వక నమస్సులు. పదసాహిత్స పరిషద్ అను సంస్థను స్థాపించి, ఎన్లో కృతులను వెలయించి నిరంతరం ప్రచారం చేస్తూనే వున్నారు. శ్రీనావిలాల వాసుదేవశాస్త్రి గారికి “నందక్ రాజ్బం” ను నరికొత్తగా లోకానికి చూపించారుమీరు.
ఎన్ని శతాబ్దాలు గడిచినా ప్రకాశం పంతులుగారొక్కరే ఆంధ్రులకు జ్ఞాపకముండే అసలుసిసలు నాయకుడు. ఆంధ్రకేసరి. ఆ మహనీయుని జీవితగాధ విద్కార్గుల వ్యదయాలకు హత్తుకునేవిధంగా సారింటీరచన కష్టపడి పైకివచ్చిన వ్యక్తి ఏవిధంగా వ్రజలను ప్రేమించింటీ చక్కగా వివరించారు రచయిత్రి. నాటికుటుంబ వృవన్థ ఏవిధంగా ఉండేదో ప్రకాశంగారి వుట్టువూర్వోతరాలేమిటో శోధించి పేర్కొనడం సముచితంగా వుంది. విద్చార్థులకు ఎంత అవసరమో చక్కగా గుర్తించి రచించడం బాగుంది.
భారతదేశ స్వాతంత్ర్రోదధృమంలో ప్రకాశం గారి ప్రాత్రను వివరించిన తీరు బాగుంది. నీటి సామాజక వృవన్ధ ఏవిధంగా ఉండేది అన్న విషయాన్ని తెల్టుకోవడానికి చరిత్ర గ్రంధాలు బాగా ఉపయోగపడతాయి. అప్పటి నాటకాలు, నంతాలు వట్టింవులు కళ్ళకి కట్టినట్లు కనబడుతోంది యీ రచనలో. డబ్బువచ్చేటవ్వడు ఎలావస్తుందో, అలాగే పోయేటప్పుడు కూడా అంటారు పంతులు గారు అదే కాలమవాోత్ళం. తనకి ధనం కావాలని ఎవర్షీ అర్ధించ లేదు, ప్రజలే ఆయన అవసరాన్ని చూశారు. ఈ గౌరనం దేశంలో మరే నాయకునికి దక్కలేదు. ప్రకాశం భోగి-త్సారి-యోరి.
పంతులుగారి జీవితచరిత్రను హ్వాద్యంగా వ్రాసిన ప్రమ్ళదేవి గారికి అభినందనలు.
యాతగిరి శ్రీరామ నరసింహారావు
ఆంధ్రకేసరి యువజన సమితి
వృవస్థాపకుడు, రాజమహేంద్రి 26-2-04
వ[016. 23224098 కంటడుకగాటగటిక4 వాం! నంంయలాణ 56010! షర౪008౭16 3-6-288/3, కృంయలర్రారం,
1662014 - 500 029.
అభినందన
మహాపురుషుల జీవిత విశేషాలు చరిత్రలో అంతర్లతమైన ఘట్టాలుగా నిలిచిపోతాయి. ఆ నంఘటలన్నీ ఆనాటి సాంఘిక ఆర్ధక రాజకీయ పరిస్థితులను తెలియచేస్తాయి. డాక్టరు మంగళగిరి ప్రమాలాదేవి రభించిన “మన ప్రకాశం” లో ఈకోవకు చెందిన ర్రంథం చారిత్రాత్మక పరిశోదనాత్మక్ల ద్యూఫ్టితో సేకరించిన టంగుటూరి ప్రకాశం పంతులుగారి జీవితం ఐినేషాలు రానున్న తరాలకు మాగ్రదర్శకాలుగా నిలచిపోతాయి. ఆత్మాబిమానం దేర్భ్శ సాహనాలకు ప్రతీక ప్రకాశం పంతులుగారు. వాల జీవిత చరిత్ర అందరిని ఉత్తేజపరున్తుంది. కార్యన్నుకులును చేన్తుంబ, ప్రకాశంగారి జీవితంలోని సూక్షతి వివరాలను సేకరించి తన పాండిత్యన్న త్రతిభను వేలవించి భావితరాలకు అందజేనిన డా॥ ప్రమోళదేఐ అభినందనీయులు.
ఇది దీనిలోనివరుస ముందుమాట కృతజ్ఞత అమోదం ఆఅముఖం అభినందన
-
ప్రస్తావన 1
-
వ్రకాశం తాత తండ్రులు ల! 3... బాల్యము - చదువు శీ
-
ఉన్నత విద్యాభ్యాసం 16
-
రాజమహేంద్రవర ప్రయాణం 19
-
ప్లీడరు చదువు 37 7, ప్లీడరు వృత్తి 38
-
పురపాలక సంఘ రాజకీయాలు 42
-
ఇంగ్లండ్ ప్రయాణం ర్ర్
-
బారిస్టరుగా ప్రకాశించిన ప్రకాశం 64
-
దేశ సేవ 77
-
స్వరాజ్య పత్రిక - పూర్వరంగం 81
-
స్వరాజ్య పత్రిక - స్థాపన 83
-
పన్నుల నిరాకరణోద్యమం 89
-
చీరాల, పేరాలపోరాటం 89
-
పెదనంది పొడు 93
-
పుల్లరి తశ
-
శౌర్య పటిమ 06
-
దక్షిణాది రాష్ట్రాలలో 97
-
ఊరేగింవుకు నాయకత్వం 100
-
అగంతుకులతో గడిపిన రాత్రి 105
-
దక్షిణాది రాష్ట్రాలలో ప్రకాశం కార్యక్రమాలు 109
-
పోలీసువారి జులూం 110
-
ఆంధ్రకేసరి 112
-
గుండెకు బారుచేసిన తుపాకీ 116
-
దక్షిణాదిన ఉప్పుసత్యాగ్రహం 119
-
సత్యాగ్రహ శంఖారావం 126
-
జైలు అనుభవాలు 127
-
ఆంధ్ర రాష్ట్ర సాధనలో ప్రకాశం కృషి 132 36, ఆంధ్ర జనోద్ధరణ 134
-
గ్రామీజాభ్యుదయ కార్యక్రమం 139
-
గ్రామాభ్యుదయ ప్రణాలికలు 139
-
ఖాదీ అభ్యుదయ ఉద్యమం 141
-
కుటుంబ జీవితం 141
-
ధన్వజీవి 146
మన ప్రకాశం = నో (టంగుటూరి ప్రకాశం పంతులుగారి జీవిత చరిత్ర)
మన ప్రకాశం ] ప్రస్తావన జనగణ మానసంబులను జాగృతపర్చుట; వారి వృద్దికై దిననిశ తారతమ్యములనెంచని ఆ మమతానురాగముల్; అనితర సాధ్యమైన విషయమ్ముల నెన్నియొచేసి చూపునా పని నిపుణంబు; ఇన్ని నిలుపంగ (ప్రకాశము లేక శూన్యమౌ (గ్రామ సీమను స్వారాజ్య భూమి చేసి పథకమున సహకారపు విధము తెలిపి జగతి తెలుగుల కీర్తిని చాటినట్టి ఆంధ్రకేసరి నిన్ను నేనభినుతింతు! జనతను జాగృత పరచి ఆంధ్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారిని స్మరించుకుంటూ ఈ రచయిత్రి అందించిన కవితా నీరాజనమిది. ఆం(ధ్రకేసరి పంతులుగారు ఒక వ్యక్తి కాదు. అర్థ శతాబ్దికి పైగా ఆంధ్ర రాజకీయ (ప్రజాహిత జీవన రాగంలో చైతన్య శంఖారావం పూరించిన ఒక మహాసంస్థ, మహామనీషి. నూటికి కోటికి ఒక్కరుగ జన్మించే మహాపురుషుల కోవలోని వారు. మహాపురుషులు తమ స్వలాభంతో సంతుష్టి చెందక ఇతరుల క్షేమాన్ని ఆకాంక్షిస్తారు. దేశ సేవకోసం నిజశక్తులను వినియోగిస్తారు. ఈ సేవ అనేక విధాల జరుగుతుంది. ఉత్తేజకరములైన ఉపన్యాసాల వల్లగానీ, ఉరుదాచరణ వల్లగానీ పురుషుడు
మన ప్రకాశం 2 కర్మవీరుడు కాగలుగుతాడు. ప్రకాశం గారు వీటన్నింటిలోనూ కృషి చేసి కలికాప్రాయంగా, అంతర్నిహితంగా గల దేశభక్తిని కమనీయమైన కుసుమంగా వికసంపచేసి దేశం కోసం తన సర్వ శక్తులను వినియోగించి కృషి చేసిన కర్మవీరుడు.
('ప్రజాహృదయ సా(ఘ్రాజ్యానికి పట్టాభిషిక్తుడు. ఆంధ్రత్వం ముమ్మూర్తులా మూర్తీభవించిన ఆంధ్రుల మురిపెంపు నాయకుడు. ఆయన ఒక వ్వక్తికాదు. ఒక సమ్మోహన శక్తి త్యాగ నిరతిలో ఆయనకు దీటురాగల నాయకులు భరతావనిలోనే అరుదు, తన జీవన సర్వసాన్ని మాతృదేశ సేవకు అర్పణ చేసిన త్యాగి. స్వాతంత్ర్య సమర యోధుడు. సూర్యుడు స్వయం (ప్రకాశితుడై ప్రపంచానికి వెలుగు నిచ్చినట్లే ప్రకాశం పంతులు కూడా స్వయం ప్రకాళితుడే. ఆయన తన అనంత (ప్రతిభతో ప్రకాశించాడు. తన జాతిని ప్రకాళింపచేశాడు. ఆయన అసమాన ధైర్యసాహసాలు, అశేష త్యాగనిరతి ఆంధ్ర (ప్రజలకు ఉత్తేజ పూరితమైన నాయకత్వాన్ని ప్రసాదించాయి. ప్రజలు ఎక్కడ కష్టాలలో చిక్కుకొంటారో ఆక్కడ వారిని ఆదుకోడానికి (ప్రత్యక్షమయ్యే వాడు ప్రకాశం! ఎక్కడ అధికారదౌష్ట్రం చెలరేగుతున్నదో, దాని నెదుర్కోడానికి అక్కడ అవతరించేవారు (ప్రకాశం పంతులుగారు. దేశంలోని పేదరికాన్ని శీఘ్రగతిని తొలగించడానికి, స్వశక్తిపై (ప్రజలు మనుగడ సాగించడానికి ఆయన రూపొందించిన పథకాలు (ప్రకాశం శ్షీర్తిని (ప్రత్యేకంగా చాటుతాయి.
ఆయన ఆంధ్రదేశంలో జన్మించడం ఆంధ్రుల అదృష్టం, ఆంధ్రులకొక్ష నూతన గౌరవాన్ని కల్పించి, ఆంధ్ర జాతికొక నూతన చరిత్రను సృష్టించడానికి అవతరించి వీర సింహమాయన. ఆచంచలమైన ఆత్మ విశ్వాసం, మొక్కవోని దృఢమైన పట్టుదల, లాభనష్టాలు గానీ, జయాపజయాలు గానీ గణించని ముందుచూపు, ప్రకాశం వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా పట్టి చూపిస్తాయి.
(ప్రకాశం మంచి వక్త. ఉత్సాహాం ఆయన ఊపిరి. ప్రజల మానసిక తత్త్యం
కనిపెట్టి వారిలో ఉత్సాహన్ని రేకెత్తించగల శక్తి ప్రకాశానికి పుట్టుకతో వచ్చిన లక్షణం, మాటలో మొరటుతనం కనిపించినా ఆయన ఉపన్యాసం సింహగర్దనా సదృళంగా ఉండేది.
మన ప్రకాశం 3 ఆయనవాక్కు ప్రజానీకానికి బ్రహ్మవాక్కు. ఆది అయస్కాంతం వలె సూటిగా ప్రజల హృదయాలను ఆకర్షించేది. వారి హృదయాలను స్పందింపచేసేది. ఆయన ఉపన్వాసాలు ఉరుములే. కాని ఆ ఉరుములతో పాటు వాటి వెంటే మెరుపులు కూడా మెరిసేవి. ఆ మెరుపుల వెలుగులో ఆయన అడుగుజాడలలో పురోగమించడానికి (ప్రజావాహిని ఉత్సహించేది. ఆకారంలో భీకరత్వమూ, మాటలలో గాంభీర్యమూ నడకలో రాజరీవి - వెరసి (ప్రకాశం పంతులు. ప్రకాశం మేరు నగధీరుడు. ఆంగ్ల ప్రభుత్వపు ముష్కరత్వాన్ని అచంచల ధైర్యంతో ఎదుర్కొన్న సాహసోపేతుడు. ఆయన వాణి ఆంధ్రులకు హృదయస్పందనాన్ని కలిగించింది. జాతిని మేల్కొలిపింది. ప్రజలను దేశభక్తి పూరితులుగా చేసింది. ఈ కర్మవీరుని జీవిత విశేషాలను ఒకసారి స్మరించుకుందాం. ప్రకాశం తాత తండ్రులు ప్రకాశం తాత ముత్తాతలు కరణీకములో కుదురుకుని వ్యవసాయం చూచుకుంటూ గడిపినవారు. ముత్తాత నరసరాజుగారు టంగుటూరు (గ్రామానికి కరణం. ఆస్తిపాస్తులు బాగానే జమకట్టారు. టంగుటూరు ఒంగోలు పట్టణానికి దగ్గరగా' గల (గ్రామం. ఆ టంగుటూరుకు ఆరుమైళ్ల దూరంలో వెంకటగిరి రాజాగారి ఎస్టేటులో గల వల్లూరు (గ్రామంలో యాబై ఎకరాల దాకా భూమిని సంపాదించారు. (ప్రకాశం తండ్రికి వెంకటగిరి చుట్టుపక్కల విశేషమైన పలుకుబడి ఉండేది. నరసరాజాగారికి ఇద్దరు పుత్రులు. పెద్దవాడు అప్పాస్వామి. రెండోవాడి పేరూ నరసరాజే. వంశపారంపర్యంగా వస్తున్న కరణీకాన్ని ఇద్దరు పుత్రులూ చేపట్టారు. అన్న అప్పాస్వామి టంగుటూరి కరణీకం చేపట్టగా, తమ్ముడు నరసరాజు వల్పూరు (గ్రామ పాలకత్వం స్వీకరించి వ్యవసాయమూ, అదీ చేసుకుంటూ కాలక్షేపం చేసేవాడు.
మన ప్రకాశం తీ
నరసరాజాగారికి నలుగురు కొడుకులూ, ఇద్దరు కూతుళ్ళూ సంతానం, నాలుగవ పుత్రుడు గోపాలకృష్ణయ్య. వ్యవసాయం చేసుకుంటూ వల్లూరులోనే స్థిరపడ్డారు. ఈ టంగుటూరి గోపాలకృష్ణయ్యగారికి ఇద్దరు సోదరీమణులన్నారు. వీరిలో సెద్దామె పార్వతమ్మ. ఈమె చిన్నతనంలోనే భర్తను పొగొట్టుకున్నారు. అందుకని ఆమె పుట్టినింట్టోనే అన్నలతో కలసి ఉండి అందరికీ సహాయపడుతూ తలలోనాలుకలా ఉండేవారు, వారి తాత తండ్రుల విషయాలన్నీ ఆమెకు తెలుసు. ఆమె చెప్పిన విషయాల వలననే ఆ కుటుంబ విషయాలు, వారి పూర్వీకుల విషయాలు వారి మేనల్టుళ్ళు తెలుసుకోవడానికీ తద్దారా మనం తెలుసుకోవడానికీ అవకాశం కలిగింది. గోపాలకృష్ణయ్య గారి రెండో సోదరి నరసమ్మగారు. -ఈళమె వివాహిత. అద్దంకికి దగ్గరలో గల కొరిసషాడు ఈమె అత్తవారి ఊరు. ఈమెకు ఇద్దరు కుమారులు, నరసయ్య మొదటి కుమారుడు కాగా, నారయ్య రెండవ కుమారుడు.
(ప్రకాశానికి అక్షరాభ్యాసం వల్లూరులో ఉండగా జరిగింది. ఓనమాలు నేర్పిన అది గురువు వెంకటప్పయ్య గారు. వీరి చదువు వెంకటప్పయ్య గారి దగ్గరనే అంటే వీధి బడిలోనే సాగింది. ఈయన దగ్గర నేర్చుకున్న చదువే ప్రకాశం చదువుక్సు మంచి పునాదిగా ఏర్పరచింది. అయితే బాల ప్రకాశాన్ని ఆయన చండామార్కుల వారి పద్ధతిలో చదివించేవారు. సరిగా చదవకపోయినా, ఏనాటి పాఠం ఆనాడు అప్పగించకపోయ్బిన్నా తొడపాశం పెట్టి మరీ చదినించేవారు. అదీ ఎలా? చర్మం ఊడి చేతుల్లోకి వచ్చేటట్టు పెట్టేవాడు. (ప్రకాశం చిన్నప్పటినుండి గడుసరే. చురుకైనవాడు. దానికి తోడు స్వేచ్చా (ప్రియంభావుకుడు. స్వేచ్చా ప్రియత్వము, చిలిపితనము పోతపోసుకున్న బాల ప్రకాశానికి చదువు చెప్పాలంటే నిజంగా గురువులకు మరి పరీక్షే!
(ప్రకాశం వల్లూరులోని వీధి బడిలో చదువుకుంటూ ఉండగా తండ్రి గోపాల కృష్ణయ్యగారు కుటుంబ పరిస్థితుల కారణంగా నెల్లూరు జిల్లాలోని నాయుడు పేటక్రు
మన ప్రకాశం వ్ దగ్గరగా గల మేనకూరులో సముద్దారుగా ఉద్యోగం సంపాదించుకున్నారు. అందువలన వల్లూరునుండి తమ కుటుంబాన్ని మేనకూరుకు తరలించారు. ఆ సందర్భంలో ప్రకాశం చదువు ఆగిపోకుండా ఉండేటందుకు గోపాలకృష్ణయ్యగారు (ప్రయత్నించారు. చురుకైనవాడు, గడుసరి అయిన ప్రకాశాన్ని ఇతరులు ఎవరైనా చదివించటం కష్టమే. అందుకే ప్రకాశానికి విద్యాబుద్దులు నేర్చేపని అద్దంకిలో ఉన్న పోరూరి నరసింహంగారికి అప్పజెప్పారు. ఈ పోరూరి నరసింహంగారు ఎవరో కాడు, (ప్రకాశానికి పెద్దక్కయ్య భర్త పెద్ద బావగారు. అద్దంకి నివాస. ఆయన ఆ (గ్రామంలో వీధి బడి నడుపుకొంటూ, గౌరవంగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. చిన్న తరగతి చదువు అడ్డంకిలో నరసింహరావుగారి దగ్గరే చదువుకొన్నాడు ప్రకాశం. నరసరాజాగారి నాలుగవ పుత్రుడైన టంగుటూరి గోపాలకృష్ణయ్యగారి తృతీయ సంతానమే మన కథానాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులుగారు. మళ్ళీ మనం కొంచెం వెనకకు వెళ్ళి ప్రకాశం పెద్దనాన్నలను గురించి తెలుసుకుందాం. ప్రకాశం తండ్రిగారి అన్నదమ్ములు నలుగురు. వీరిలో పెద్దవాడు రాఘవయ్య. వీరు భార్యాబిడ్డలతో సహా వల్లూరును విడిచి వెళ్ళి తిరుపతిలో స్థిరనివాస మేర్చరచుకున్నారు. రెండోవారు రామస్వామి. ఈ రామస్వామిగారు కళాకారులు. సంగీత సాహిత్యాలలో బాగా (ప్రవేశం కలవారు. ఏరి కళా సంస్కారాలే మన కథానాయకుడు (ప్రకాశానికి వచ్చాయి. మూడోవారు అప్పాస్వామి. వీరి తాతగారి తాలూక్తు కరణీకాన్ని చేపట్టి (గ్రామ పరిపాలనా కార్యకలాపాలలో పాలుపంచుకొనేవారు.. నాలుగవ వారు మన కథానాయకుడు ప్రకాశం పంతులుగారి తండ్రి టంగుటూరి గోపాలకృష్ణయ్య గారే. గోపాల కృష్ణయ్యగారికి ఆరుగురు సంతానం. తృతీయ సంతానమే మన (ప్రకాళం. ఆ విధంగా తాతతం'డ్రులు వల్లూరులో స్టిరపడినా ఇంటిపేరు టంగుటూరు గానే ఉండిపోయింది.
మన ప్రకాశం ర
(ప్రకాశం తండ్రిగారికి అన్నదమ్ముల పట్ట, అక్క చెల్లెళ్ళ పట్ల ఆప్యాయత ఎక్కువ
ఆనాటి కుటుంబాలలో (ప్రేమానురాగాలు, సమష్టిభావము ఎక్కువగా కనబడతాయి అదే గుణం మళ్ళీ (ప్రకాశానికి కూడా అలవడింది. జీవితావసరాలు కలసి పంచుకొన్ని ఆనుభవించే లక్షణం, ఆనాడు పవిత్రంగా ఎంచబడేది. ఆస్తులు వ్యష్టిగా అనుభవించినాఎ అనుబంధాలలో, అప్యాయతలలో సమష్టితత్వం పాదుకొని కుటుంబ జీవనం సుఖప్రదంగా భాసిల్లిన రోజులవి. అదే ప్రేమ. అలాంటి అప్యాయత తరువాత కాలంతో (ప్రకాశం ప్రజల పట్ట చూపించగలిగి, ఆపారమైన ఆదరాభిమానాలను పొందగలిగాడంట్నా ఆ కుటుంబ నేపథ్యమే కారణమని చెప్పక తప్పదు. (ప్రకాశం జన్మించిన రెండు మూడు సంవత్సరాలకు కరువు వచ్చింది. “ధాతకరువులో” దేశంలో దిక్కుతోచని సిఆ దాపురించింది. వల్టూరు భూములపై వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ దుర్చరం్న కావడంతో గోపాలకృష్ణయ్య గారికి ఉపజీవనం వెదుక్కునేందుకు వలస పోవడం్వ అనివార్యమయింది. ఆయన వెంకటగిరి సంస్థానంలో మేనకూరు సముద్దారుగ్మా యు
నియమింపబడ్డారు. ఈ మేనకూరు సువర్షముఖీ నది ఒడ్డున నాయుడు పేటక్రు దగ్గరగ్నా ఉంది. వీరి కుటుంబం నాయుడుపేట చేరింది.
(ప్రకాశం బాల్యమూ, విద్యాభ్యాసమూ విచిత్రమైన మలుపులతో గడిచింద్సి పసితనాన వల్లూరులో వెంకటప్పయ్య గారి వీధి బడిలో ఓనమాలు దిద్దుకాన్నది, మొదల్ను సీమలో బారిష్టరు పట్టా చేపట్టిన దాకా ఆయన జీవితంలో తిరిగిన మలుపులెన్నా!
ఇంగ్రీషు చదివిన వారికి మంచి ఉద్యోగాలు దొరుకుతాయనే అభిహ్రార్మ్య్న
ఆనాటికే దేశంలో ఆలముకున్నది. అందుకని గోపాలకృష్ణయ్యగారు (ప్రకాశాన్ని
తీసుకొనివెళ్ళి నాయుడుపేటలో ఉన్న గవర్నమెంటు స్కూల్లో ఇంగ్లీషు చదువుల్రన చేర్పించారు.
నాయుడుపేటలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండేది. అందులో ఫస్ట్
సెకండ్, థర్డ్ ఫోర్త్ అనే అయిదు క్టాసులుండేవి, అ (ప్రాథమిక పాఠశాలలో థర్జు రీడరు
మన ప్రకాశం 7 (కాసు) చదివే వరకూ కుటుంబం అంతా నాయుడుపేటలోనే ఉన్నది. ఆ సంవత్సరం గోపాలకృష్ణయ్య గారికి మేనకూరు నుండి మల్లాం పారుపత్యానికి.బదిలీ కావడంతో ఆ కుటుంబాన్ని మల్దాం తరలించవలసి వచ్చింది. మధ్యలో ప్రకాశం చదువు చెడగొట్టడం ఇష్టం లేక' ప్రకాశాన్ని నాయుడుపేటలోనే ఉంచారు. అక్కడ ఆయన ఒక్కడే ఉండి కన్నేపల్లి వెంకమ్మగారింట్లో భోజనం చేస్తూ ధర్జు కాసు చదువుతున్నాడు. వర్షాభావం వల్ల ఆంధ్రదేశంలో కరువు ఏర్పడింది. పంటలు పండలేదు. తినడానికి గింజకూడా పుట్టని స్థితి ఏర్పడింది. గోపాలకృష్ణగారి కుటుంబం పన్ను చెల్లించకపోవడంతో వారి ఆస్తులన్నీ జప్తు చేయబడ్డాయి. వల్లూరులోని ప్రకాశం పెదతం'డ్రుల స్థితి కూడా ఇలాగే పరిణమించింది. "సెరి తా పోయిన పోవును కరి (మింగిన వెలగపండు కరణినొ” అన్నట్టు గోపాలకృష్ణయ్యగారి కుటుంబాన్ని దరిద్రదేవత ఆవహించింది.
ఇంతలో ఆ కుటుంబానికి మరో ఘోర విపత్తు వచ్చిపడింది. 'మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు' ప్రకాశం జీవితంలో ఒక పెద్ద అఘాత్తం ఏర్పడింది. అది పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం. దీనిని ప్రకాశం జీవితంలో చీకటి తెచ్చిన సంవత్సరంగా వర్షించవచ్చు. అప్పటికి (ప్రకాశానికి పన్నెండేళ్ళు. మోడరన్ థర్డ్ రీడరు చదివే బాలుడతడు! మల్దాం అనే ఊళ్ళో తండ్రికి ఉద్యోగం. అతని చదువు నాయుడుపేటలో.
ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కుటుంబభారాన్ని మోసే యజమానిని మృత్యుదేవత ఆహ్వానించిన సమయమిది. అప్పుడప్పుడూ వచ్చి కొద్దిగా ఇబ్బంది పెట్టినా ఆ మందూ, ఈ మందూ వాడుతూ ఉంటే తగ్గిపోయే శూలనొప్పి ఈసారి గోపాలకృష్ణయ్యగారి పాలిట మృత్యుదేవత అయింది. ఆయన పరలోకగతులయ్యారు. గోపాలకృష్ణయ్యగారి పరిస్టితి విషమించిందన్న కబురు నాయుడుపేటలో పెద్ద కుమారుడు (ప్రకాశానికి వెళ్ళింది.
అక్కడ చదువుకొంటున్న ప్రకాశం అది తెలుసుకొని దిగ్ర్భాంతి చెందాడు. పెద్ద కుమారుడే కాని అప్పుడు పన్నెండు సంవత్సరాల పసిప్రాయమే అతనిది! ఆదరాబాదరా అక్కడికి వచ్చి వాలాడు. పట్టరాని దుఃఖంతో ఎలాగో మల్దాం చేరుకున్నాడు. అప్పటికే
మన ప్రకాశం జరగరానిది జరిగిపోయింది. ఆ కుటుంబానికి రాకూడని కష్టమే వచ్చింది. పసివాళ్సైన ఎనిమిది సంవత్సరాల తమ్ముడు శ్రీరాములు, నాలుగు సంవత్సరాల చెల్లెలు అన్నపూర్హ్హ పైగా తల్లి ఎనిమిది మాసాల చూలాలు! ఇది అప్పటి కుటుంబ పరిస్థితి. ఇప్పుడిక ఇంటికి పెద్ద పన్నెండేళ్ళ ప్రకాశమే అయ్యాడు. వయసు చూడబోఆ్తై తక్కువ, పోనీ పిత్రార్జితం ఏదైనా మిగిలి ఉన్నదా అంటే అదీ లేదు. విధి వక్రించిందా సుబ్బమ్మగారి మనసులో ఆలోచనలు ముసురుతున్నాయి. తాను ఒంటరిదై పోయింది పిల్లలా చిన్నవాళ్ళు. కుటుంబ భారమంతా తనమీదే పడింది. ఏమీ చేయడానిశ్తి పాలుపోవడం లేదు. దుఃఖం కలుగుతున్నది. దానికి అంచులేదు. కాని తాను దు ఖిస్తూ కూర్చుంటే పిల్లలు మరీ బెంబేలు పడతారు. పిల్లలను బెంబేలు పెట్టరాదన్నై ఇంగితం ఆమెకు కలిగింది. అందుకే దుఃఖం దిగమింగుకొని పిల్లలను ఓదార్చింద్నై (ప్రకాశం తల్లి సుబ్బమ్మగారు. ఒకనాటి ఉదయమది. సుమారు తొమ్మిది గంటల ముఫ్ఫై నిమిషాల సమయ్మ్న మవుతుంది. పిల్లల చద్ది అన్నాలను గురించి ఆలోచిస్తున్నది ఆమె. అప్పుడే ఒక వ్యక్తి అక్కడ దిగాడు. ఆ కుటుంబానికి వచ్చిన విపత్తును గురించి తెలుసుకొని అక్కడక్ష్మ వచ్చానని తెలియచేశాడు. సుబ్బమ్మగారి రూపు చూచి కలత చెందాడు. ఆ కుటుంబానిజ్మై వచ్చిన ఉపద్రవం తలుచుకొని ఆవేదనకు గురి అయ్యాడు. ఆయనెవరో కాద, కనపన్మ నుంచి వచ్చిన ప్రకాశం మేనమామ! ఆయనను చూసి దుఃఖం ఆపుకోలేకపోయా సుబ్బమ్మగారు. తల్లీ-పిల్లలను ఓదార్పాడు ఆయన,
“జాతస్య మరణం ధ్రువం” - అన్నది నీకు తెలిసిన సూక్తే కదా, చెల్లీ! పుట్టినవాల్వ గిట్టక మానడు' అని అందరూ అనేదే కదా! బావగారి ఆదర్శాలను, ఆశయాలను న్నీ పిల్లలలోనే చూచుకోవాలి తల్లీ. ముందు నీవు దుఃఖం దిగయమింగుకో చూడు, పీల్లల్న ఎలా దిగులు పడి ఉన్నారో!” అని ఓదారుస్తున్నాడు అన్నగారు!
“అమ్మా, కష్టాలు మనుషులకు రాకపోతే మానులకు వస్తాయా! భగవంతుడు బావగారి నుదుట ఆర్జ్హాయుస్సే వ్రాశాడు. ఏం చేస్తాం తల్లీ! చెప్పు! ఆర్జాయుష్పుతో బావగారు పోయారని పిల్లలు అర్జాకలితో ఉంటే చూస్తూ ఊరుకుంటామా! అమ్మా!”
చెల్లెలును పిల్లలను ఊరడించాడు అన్నగారు. కుటుంబాన్ని తనతో రమ్మనమని కోరాడు. “కాదనకు తల్లీ, ఆపద వచ్చినప్పుడే కదా, ఆత్మీయుల అభిమానం, అండదండలూ కావాలసింది”. మళ్ళీ నచ్చచెప్పాడు అన్నగారు. “అసలే గాయపడిన మనసు. ఆండలేని అబల, పిల్లలంతా కూనా, గుజ్ఞా! ఆ ఊళ్ళోనే ఉంటూ ఒంటరిగా ఉండాలి! పైగా అక్కడే ఉంటే తన భర్త తిరుగాడిన ఆ ప్రదేశంలోని జ్ఞాపకాలు తనను వేధిస్తాయి. తనకు ఆసరాగా నిలుస్తానన్నవాడు అన్నగారు!
ఆలోచించిన తరువాత సరేనన్నది ఆమె!
అందరూ కలిసి 'కనపర్తి' చేరుకున్నారు. ఒంగోలుకు దగ్గరగా ఉన్న (గ్రామమది. అక్కడ అన్నగారి కుటుంబంతో కలసి కొంతకాలం కాలక్షేపం జరిగింది. సుబ్బమ్మగారి జనక స్థానం వినోదరాయని పాఠెం. కొంతకాలం తరువాత వీరందరి మకాము వినోదరాయని పాలెంకు మారింది. ఈ వినోదరాయుని పాలెం కనపర్తికి దగ్గరగా గల ఒక చిన్న (గామం.
అన్నమాట (ప్రకారమే పుట్టినింటివారు సుబ్బమ్మగారిని బాగానే చూశారు. కంటికిరెప్పలా కాపాడారు అన్నగారు. తల్లికూడా. భర్త మరణించేసరికి ఎనిమిది నెలల గర్భవతిగా నున్న సుబ్బమ్మగారు (ప్రసవించారు. (ప్రకాశానికి మరో తమ్ముడు లభించాడు. అతనికి జానకి రామయ్య అని నానుకరణం చేశారు. జానకి రామయ్య జననం తరువాత సుబ్బమ్మగారికి తన కుటుంబ సంబంధమైన ఆలోచన అధికమయింది.
ఇక్కడ సుబ్బమ్మగారిని, ఆమె ఆలోచనా సరళిని ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంది! తన అన్నగారి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఆ కుటుంబం
మన ప్రకాశం 10 వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నది. వారికి గల భూ వసతి కూడా స్వల్బమయినదే. అటువంటి స్థితిలో ఒక కుటుంబము మీద మరో కుటుంబం వచ్చి పడింది ఆంటే మాటలా? ఆమె అయిదారు నెలల బాలెంతరాలు. నిజానికి అంత అధికంగా ఆలోచించడం ఆమె ఆరోగ్యానికి మంచిది కాదు. ఎదురుగా పాలకోసం ఏడ్చే పసివాడు. మరో ఇద్దరు కుమారులకు విద్యాబుద్దులు చెప్పించవలసి ఉన్నది. తండ్రి బ్రతికి ఉన్నప్పుడే ఇద్దరు అమ్మాయిలకు పెళ్లిళ్ళు ఆయిపోయినా మూడవ కుమార్తె అన్నపూర్ణకు వివాహం చేయాలి. పొత్తిళ్ళలో బిడ్డను పెంచి పోషించాలి. ప్రకాశం పేరుకు పెద్దకుమారుడే కాని అతని వయసెంత? కేవలం పన్నెండు వర్షాలు నిండినవేమో! (ప్రకాశాన్ని తలుచుకున్న ఆమె తల్లి మనసు విలవిలలాడిపోయింది. (ప్రకాశానికి మంచి చదువు చెప్పించాలి, అవును! అతని చురుకుదనానికి తగినట్టు ఉండాలి మరి, ఆ చదువు! ఆలోచనల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నది ఆమె. అప్పటికే ఇక్కడ ఇంగ్లీషు చదువులు (ప్రారంభమయినవి. కొంచెం ఇంగ్లీషు చదువు చదివిన వారంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందడం ప్రారంభమయింది. ఇంగ్లీషు చదువులు, పరీక్షలు ఇంటిపేర్చుగా నిలిచినవి. 'బి.ఏ. నారాయణస్వామి? ఎఫ్.ఏ. శేషగిరి అయ్యరు' అనే అన్బర్థనామాలు ప్రచారంలోకి వచ్చాయి. అందుకే తన భర్త గోపాలకృష్ణయ్యగారు పిల్లలను ఇంగ్లీషు చదువులు చదివించాలని త్లాషత్రయపడ్డారు. కళ్ళుమూసినా, తెరిచినా చురుకుగా చదువుకునే ప్రకాశం ముఖమే ఆమె కళ్ళముందు కనబడుతున్నది. పెద్ద పిల్లవాడు (ప్రకాశం లాయరు అయితే ఎలా ఉంటుంది? వాడి వ్యక్తిత్వానికి తగినట్టు గట్టిగా వాదించగలడు. సింహం లాంటి ధైర్యము, పొందికైన రూపము, చురుకైన కళ్ళు! ' నల్లకోటు ధరిస్తే పచ్చని శరీరం మరింత పచ్చగా కనబడుతుంటే... ఎంత సుందరమైన దృశ్యమది. అవును! వాడిని బాగా చదివించవలసిందే!
మన ప్రకాశం 11 ప్రకాశాన్ని లాయరు చేయవలసిందే. ఇందుకు తానేమి చేయవలసి వచ్చినా ముందంజ వేయవలసిందే. వెనుదిరగరాదు.
“అన్నదమ్ముల మీద ఆధారపడితే వారంంతవరకు చేయగలరు! వారు వాళ్ళ కుటుంబ బాధ్యతలతోనే మునిగి తేలడం తాను గమనిస్తూనే ఉన్నది కదా! తానే ఏదైనా చేయాలి! మనసుంటే మార్గముంటుంది అంటారు కదా! ఆలోచిస్తున్నది ఆమె. మనసులో ఒక ఆలోచన స్ఫురించింది. తన తల్లి సహాయం కూడా తీసుకోవాలని అనుకొన్నది. తనకెలాగో వంట బాగా వచ్చు. తన ఇంట్లో వారికి పదిమందికి ఎలాగూ వంట చేస్తున్నది కదా! ఆదే మరో పదిమందికి చేసి పెడితే! ఈ ఆలోచన తనకు బాగానే ఉన్నట్టు అనిపించింది. మళ్ళీ ఆలోచనలో పడింది. 'పూవులమ్మిన చోట కట్టెలమ్ముడ'మంటే ఇదే కాబోలు. సుబ్బమ్మగారి మనసంతా ఆవేదనతో నిండిపోయింది. తానేమి తప్పు పని చేయడం లేదు. తన కాళ్లమీద తాను నిలబడటానికి ప్రయత్నిస్తున్నది. అంతే కదా! అప్పుడున్న పరిస్థితుల్టో స్తయం పోషకంగా ఉండడానికీ, స్వ ఉదర పోషణార్థం ధనార్జన చేయడానికి అంతకంటే మరో మార్గం స్ఫురించలేదు. భోటలు నడిపితే ఏం?” తన మనసును సమాధానప్తరచుకొన్నది. ఆ ఆలోచన తల్లి కనపర్తి కామాక్షమ్మగారికి తెలియ జేసింది. ఆ ఆలోచన కామక్షమ్మగారికీ నచ్చింది. ఆత్మీయులనుకొన్న వారికి తన ఆలోచన తెలియచేసింది సుబ్బమ్మగారు.
హోటలు ఒంగోలులో (ప్రారంభిస్తే బాగుంటుందని అనుకొన్నది. ఈమె ఆలోచన బంధువర్గానికి తెలిసింది. "పూటకూళ్ళు పెడతావుటమ్మా, సుబ్బమ్మా! 'ఇరుగున ఉన్న ఒకామె ఆశ్చర్యం (ప్రకటించింది. పూటకూళ్ళు "పెట్టడమంటే డబ్బు తీసుకొని భోజనం పెట్టడమన్నమాట! అంటే భోజన హోటలు న్థడపడమన్న మాట.
ఆ రోజులలో హోటలు నడపడమంటే ఈ రోజులలో వలే గౌరవనీయమైన వ్యాపారంగా పరిగణించబడేది కాదు. ఇప్పుడు హోటలు యజమానికి సంఘంలో గౌరవ మర్యాదలున్నాయి. కాని ఆ రోజుల్లో హోటలు నడిపే వారిని సంఘంలో ఎంతో చులకనగా చూసేవారు. పూటకూళ్ళు పెడతావా! అని అడిగిన పక్కింటి పిన్నిగారి మాటలకు
మన ప్రకాశం 12 నిరుత్సాహపడలేదు. తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆర్థికంగా ఇతరులమీద ఆధారపడి వారికి బాధ కలిగించడం కన్నా స్వ ఉదర పోషణార్హం పదిమందికి ఇంత అన్నం పెట్టి తద్వారా వచ్చే ధనంతో తన బిడ్డలను పెద్దవారిని చేయడమే మంచిదని ఆమె దృఢంగా విశ్వసించింది. ఆ మాటే ఆమె 'పూటకూళ్లు పెడతావా! అని అడిగినవారికి సమాధానమిచ్చింది.
ఒంగోలులో ఇంగ్లీషు చదువులు ఉన్నాయి కనుక తాము ఒంగోలులోనే హోటలు ప్రారంభిస్తే ఆదాయమూ ఉంటుంది. పిల్లలు తన దగ్గరీ ఉండి చదువుకోవడానికి ఆవకాశమూ ఉండగలదని ఆమె ఆలోచన చేసింది.
గౌరవమో, ఆగౌరవమో కొంతకాలము పాటు ఏ చెట్టు నీడనో తలదాచుకొని కష్టపడితే తన పిల్లలు ప్రయోజకుల అవుతారు. తమ కష్టాలు గట్టెక్కగలవని ఆమె నమ్మకం. పువ్వులమ్మినచోటనే, కట్టెిలమ్మినట్టు ఒంగోలులోనే హోటలు పెట్టి జీవనం సాగించవలసి వచ్చింది. అక్కడ ఇంగ్లీషు చదువులు చదువుకునే అవకాశం ఉంది. హోటల్‌పై వచ్చే ఆదాయంతో పిల్లలను ఇంగ్లీషు చదువులు చదివించి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలన్నది ఆమె తాపత్రయం. అదీగాక గోపాలకృష్ణయ్య గారు తన పిల్లలను ఇంగ్లీషు చదువులు చదివించాలని కలలు కంటుండేవారు. అందుకే సుబ్బమ్మగారు, ఆయన కలలను పండించటానికి నిశ్చయించుకుంది.
ఆమె తన తల్లి కామాక్షమ్మను వెంటబెట్టుకొని ఒంగోలు చేరుకుంది. ఒంగోలులో అప్పటికే మునసబు కోర్టు ఉంది. ఆ కోర్టుకు ఎదురుగా హోటలు ప్రారంభించింది. సుబ్బమ్మగారు.
(ప్రకాశాన్ని ఆతని మేనమామ తీసుకొని వచ్చి గవర్నమెంటు నార్మల్ స్కూలులో లోవర్ ఫోర్త్టో (ప్రవేశపెట్టాడు. ఆనాడు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్టే లేవు. స్కూల్ అధికారులే పరీక్ష చేసి విద్యార్థి ఏ తరగతి చదవటానికి అర్హుడో నిర్ణయించేవారు. ఆ పద్దతి (ప్రకారమే (ప్రకాశానికి గవర్నమెంటు నార్మల్ స్కూలులో ప్రవేశం లభించింది. అది
మన ప్రకాశం 13 కూడా పద్దెనిమిది వందల ఎనబై నాలుగవ సంవత్సరంలోనే! ఒకే ఒక సంవత్సరంలో ఎంతమార్చు! ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చాలా మంచి వ్యక్తి ఆయన పేరు సుందర శివయ్య కొంచెం చదివితే పనికి వచ్చే పిల్లలను ఇంటికి పిలుచుకు వెళ్ళి వారికి (ప్రత్యేకంగా చదువు చెప్పేవాడు. అలా ఆయన ఇంటీ దగ్గర చదువుకొని వృద్ధిలోకి వచ్చిన వారిలో (ప్రకాశం కూడా ఒకడు. ఆ పాఠశాలలోనే మిడిల్ స్కూల్ పరీక్షకు కూడా హాజరై ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.
అప్పటిలో హైస్కూలు చదువు రెండు ఘట్టాలుగా ఉండేది. ఫస్ట్ సెంకడ్, ధర్డ్ లోవర్ ఫోర్త్ కాసులు మిడిల్ స్కూలు చదువు క్రిందకు వస్తాయి. మిడిల్ స్కూల్, ఫిఫ్త్ కాగానే మెట్రిక్యులేషను పరీక్షలు జరిగేవి. మెట్రిక్యులేషను పరీక్ష ఉత్తీర్ణులు కావడం కూడా అప్పటికి గొప్పగానే భావించబడేది.
పోకిరి స్నేహాలు, అల్లరిచేష్టలూ ప్రకాశం చదువును కుంటుపరచలేకపోయాయి. పైగా అవే అతనిని చైతన్యవంతునిగా, ధైర్యవంతునిగా చేసినాయేమోాననిపిస్తుంది.
(ప్రకాశం విద్యార్థిగా ఉన్నప్పుడు నాటకాలలో వేషం కట్టడానికి ఎంతో ఆసక్తిని 'ప్రదర్శించేవాడు. లోయర్ ఫోర్త్ తరగతి పూర్తియైన కాలంలో పూనా నుండి ఒక నాటకాల కంపెనీ ఒంగోలు వచ్చింది. వాళ్ళు ఉషా పరిణయము, కీచకవధ, పీష్వా నారాయణరావు వధ మొదలైన ఎన్నో నాటకాలను విజయవంతంగా ప్రదర్శించారు. ఆ నాటకాలను చూచిన తర్వాత ప్రకాశం '్రేరేపితుడయినాడు. తానూ నాటకాలాడలనే సంకల్పం మరింత బలపడింది. ప్రత్యేకించి ఆడవేషాలు కట్టడంలో (ప్రకాశం ప్రతిభ రాణింపునకొచ్చింది. అంతేకాక నారాయణరావు వధలో నారాయణరావు వంటి పురుష పాత్రలను కూడా అద్భుతంగా ప్రదర్శించేవాడు (ప్రకాశం. కొన్ని సందర్భాలలో ఒకే నాటకంలో విభిన్న ఘట్టాలు ప్రీ పురుషపాత్రలను ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలందుకున్న ఘనత ప్రకాశానికే దక్కుతుంది.
కొన్ని నాటకాలలో ఉర్జూలో సంభాషణలున్నప్పుడు తెలుగు లిపిలో ఉర్జూ సంభాషూలను న్రాసికొని కంఠస్థం చేసేవాడు ప్రకాశం. మిషన్ స్కూలులో ఉపాధ్యాయుడైన
మన ప్రకాశం కేశ ఇమ్మానేని హనుమంతరావు నాయుడుగారు (ప్రకాశాన్ని అన్నివిధాల (ప్రోత్సహించేవారు. నాటకాలు ఆడటం వల్ల మంచి పేరు వచ్చినా నాటకాలలో పడడం వలన (ప్రకాశం భవిష్యత్తు దెబ్బ తింటుందేమోనని ఆతని అమ్మ, అమ్మమ్మ ఎంతో భయపడేవారు. కాని బయట ఎన్ని వేషాలు వేసినా, ఎంత అల్లరిచేసినా స్కూల్లో చదువు విషయంలో ఏ లోపము లేకపోవడం వలన కొంతలో కొంత తృప్తి పడుతూ ఉండేవారు, అతని అమ్మ, అమ్మమ్మ.
ఒకసారి (ప్రకాశానికి మిడిల్ స్కూల్ పరీక్షకు ఫీజు కట్టేందుకు మూడు రూపాయలు అవసరమయినాయి. ఒంగోలుకు ఇరువది మైళ్ళదూరంలో గల తన బావగారింటికి కాలినడకన వెళ్ళి అక్కడ అక్క జానకమ్మకు, బావన నరసింహంగార్లకు విన్నవించాడు. కానీ ఫలితం లేకపోయింది. అప్పుడు ప్రకాశం తల్లిగారు తాను కట్టుకునే పట్టుబట్ట తాకట్టు పెట్టి, మూడు రూపాయలను తెచ్చి ఇచ్చింది. గండం గడిచింది. (ప్రకాశం మిడిల్ స్కూలు పరీక్ష పూర్తి అయింది. తల్లి ఎంతో సంతోషించింది.
మిడిల్ స్కూల్ పరీక్ష పూర్తి అయింది. అందులోనూ విజయం సాధించింది (ప్రధమశ్రేణిలో. బంధువులు, మిత్రులు, గురువులు ఆందరూ ఎంతో సంతోషించారు. బంధువులు ఒక్కొక్కరే వచ్చి అభినందిస్తున్నారు. “మిడిల్ స్కూలు చదువు అయిపోయిందటగా! అభినందనలురా అబ్బీ! అయితే ఇక ఉద్యోగస్టుడవవుతావన్నమాట!"
ఈ అభినందనలోనే ఇక చదువు ఆపి ఉద్యోగము చేయమనే సూచన ఉంది.
ఆ రోజులలో మిడిల్ స్కూల్ పరీక్ష మొదటి తరగతిలో ఉత్తీర్ణులవడమంటే మెట్రిక్యులేషన్ పాన్ అవడంతో సమానమే. అందుకే వాళ్ళు ఫ్రకాశానికి అటువంటి సలహా ఇచ్చారు.
“ప్రకాశం ఇక నీవు ఏదో ఒక ఉద్యోగం చేసి, మీ అమ్మ పడుతున్న కష్టాలను గట్టెక్కించాలిరా”
ఇది కొందరు పెద్దలు ప్రకాశానికి ఇచ్చిన సలహా!
మన ప్రకాశం [5
“ఒరే అబ్బీ! మీ అమ్మ పడుతున్న కష్టాలను గమనిస్తున్నావు కదా, ఇంటికి పెద్ద కుమారుడివి. ఆ సంసారాన్ని దరిచేర్చే బాధ్యత నీమీద ఉందిరా నాయనా! ఏదో ఒక చిన్న ఉద్యోగంలో కుదురుకుంటే మంచిదిరా నాన్నా!”
కుటుంబంతో చిరకాలంగా పరిచయమున్న ఒక వృద్దుని సలహా అది. కాని ప్రకాశానికి మాత్రం ఆ కొద్దిపాటి చదువుతో సంతృప్తి కలుగలేదు. లాంగ్ కోటు వేసుకొని త్వరత్వరగా నడుస్తూ ఠీవిగా కోర్టుకు వెళ్ళే న్యాయవాది రూపమే అతని కళ్ళముందు మెదలుతున్నది.
“తాను అలా నల్లకోటు వేసుకొని ఠీవిగా కోర్టుకు వెళ్ళాలి” అనుకున్నాడు. అలా జరగాలంటే తాను ఇంకా చదవాలి. (ప్రకాశం మనసు చదువు వైపే మొగ్గింది. ఎలా అయినా తాను పై చదువులు చదవాలనే నిశ్చయానికి వచ్చాడు. అసలు ప్లీడర్లందరిలా తను ఉండాలనే కోరికతోనే మిడిల్‌స్కూలు చదువు ఇంకా పూర్తి కాకుండానే ప్లీడర్లు ధరించే లాంగు కోటు కుట్టించుకుని దాచి పెట్టుకున్నాడు. మిడిలస్కూలు పరీక్షలో ఉత్తీర్ణుడవుతూనే ఒకసారి ఆ కోటు ధరించి తనను తాను చూచుకున్నాడు. ఎంతో ఆనందం కలిగింది. ప్లీడరు చదువు చదవాల్సిందేనని నిర్ణయానికి వచ్చాడు.
తల్లి సుబ్బమ్మగారు పట్టుదలకి, సాహసానికి మారుపేరు.
బంధువులందరూ కుటుంబానికి ఆమె చేసిన సేవను (ప్రస్తుతిస్తూనే ప్రకాశాన్ని పై చదువులు మాని ఉద్యోగం చేయమనడం ఆమెకు నచ్చలేదు. మనసులో చాలా బాధపడింది, మధన పడింది.
జౌను నిజమే తాము లేమితో బాధపడుతున్నదీ నిజమే. పై చదువులు చదివించే స్తోమతు కలలో కూడా కల్షిన వారు కాదన్నదీ నిజమే. కాని తన కొడుకు చదువుకు విఘ్నం కలుగకూడదు. ఇప్పుడే చదువు మాన్పించి ఉద్యోగం వెతుక్కోమంటే, అతడు చదివిన ఆ మిడిల్ స్కూలు చదువుకు ప్రకాశానికి ఏమంత పెద్ద ఉద్యోగం వస్తుంది? తాను ఎలాగో కష్టపడటానికి అలావాటు పడిన మనిషే కదా! ఇంకొక్క రెండేళ్ళు కష్టపడితే
మన ప్రకాశం 165 కుమారుని మెట్రిక్యులేషన్ చదువు పూర్తవుతుంది. ఆ తరువాత ఏ ప్లీడరో అవుతాడు (ప్రకాశం. అటు తిరిగి కుమారుని వైపు చూసింది ఆ మాతృమూర్తి, కుమారుని కళ్ళలోను అదే విధమైన అభ్యర్థన కనిపించింది. తల్లీ కుమారుల తలపులు ఒకటయినాయి. పట్టుదలకు, సోహసానికి ప్రతీక ఆయిన ఆ తల్లి ఏమయినా సరే ప్రకాశం చదువుకొనసాగించడానికే నిర్ణయం తీసుకున్నది. ప్రకాశాన్ని అభిమానించి అప్పుడప్పుడు పావలా అర్హ ఇచ్చి ఆర్థికంగా తోడ్పడే నాగరాజు సూర్యనారాయణ గారు కూడా ఇది విని ఆనందించారు. ఉన్నత విద్యాభ్యాసం ఉన్నత విద్యను అభ్యసించటానికి నిర్ష్ణయమైతే తీసుకున్నారు. కానీ మళ్ళీ నిత్యనూతనంగా ప్రత్యక్షమయింది సమస్యల తోరణం, అందులో (ప్రధమ మయింది నెల జీతం ఎలా చెల్లించాలి అనేసమస్యాత్మక హరిత పత్రం. “ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి” అని ఆలోచిస్తున్నాడు ప్రకాశం.
అసంకల్పితంగా కాళ్ళు ఇమ్మానేని హనుమంతరావుగారి ఇంటివైపు లాక్కొని
వెళ్ళాయి. వీమయ్యా! ప్రకాశం చదువు కొనసాగించటానికి నిర్ణయం తీసుకున్నావటగా, మంచిదయ్యా! మంచి నిర్ణయం తీసుకున్నావు. మళ్ళీ ఆయనే అన్నారు.
“ముందుగా మీ అమ్మగారిని అభినందించాలయ్యా” ఆత్మీయతను అభిమానంతో రంగరించి అభినందించారు ఇమ్మానేని హనుమంతరావు నాయుడు మాష్టారుగారు.
"జాను మాస్టరు గారు”
మన ప్రకాశం కే ఏదో ఒకటి మాట్టాడాలి కనుక మౌట్టాడాడు (ప్రకాశం.
(ప్రకాశం ఏ స్కూలులో చేరాలి అనే విషయాన్ని గురించి కట్టవలసిన జీతం గురించి హనుమంతరావు నాయుడు గారే ఆలోచిస్తున్నారు.
హనుమంతరావు నాయుడు గారు మిషన్ స్కూల్లో ఉపాధ్యాయుడు. ఉన్నతమయిన ఆదర్శాలు కలిగిన ఉత్తముడు. గణితాధ్యాపకుడు. ఇరువదిఐదు సంవత్సరాల యువకుడిగా ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉపాధ్యాయ వృత్తి ప్రారంభించాడు. గణితశాస్తాన్ని బోధించడంలో అందెవేసిన చెయ్యి. చాలా (ప్రతిభావంతుడు. ఆయన ఉత్తీర్ణుడయినది మెట్రిక్యులేషన్ పరీక్ష అయినా మెట్రిక్యులేషన్ క్లాసుకు కూడా గణితం బోధించేవారు. అంతేకాకుండా యఫ్.ఏ.బి.ఏ. చదివే విద్యార్దులు కూడా ఆయన దగ్గరకు వచ్చి లెక్కలు నేర్చుకునేవారట. గణితం మాత్రమే కాకుండా ఆంగ్లభాషా వ్యాకరణం బోధించడంలోను దిట్టమయినారు ఆయన. అప్పటికే ఆ ఊళ్ళో బి.ఏ. చదువుతున్న కొండా వెంకటప్పయ్య పంతులు, కొంపల్లి కోటిలింగం, మన్నారు కృష్ణయ్య మొదలైన (ప్రముఖులు హనుమంతరావు నాయుడుగారి దగ్గర విద్య నభ్యసించినవారే. ఆంధ్రదేశంలో గొప్ప గణిత శాస్త్రవేత్తగా ప్రసిద్ధి పొందిన పాంచాలవరపు సుబ్బారావు గారు కూడా ఇమ్మానేని నాయుడుగారి శిష్యులే!
ఇదివరకు మిడిల్ స్కూలు పరీక్షకు చదువుతున్న రోజులలోనే హనుమంతరావు నాయుడు గారు ప్రకాశానికి ఇంటిదగ్గర పాఠాలు చెబుతూ ఉండేవారు. (ప్రకాశం తెలివి తేటలు ఆయనను ఆకర్షించాయి. ఇంతేకాకుండా (ప్రకాశం అంటే మిక్కిలి అభిమానం కలగటానికి ఇంకో కారణముంది.
(ప్రకాశం ఒంగోలులో చదివే సమయంలో మహారాష్ట్రలోని పూనా నుండి ఒక నాటకాల కంపెనీ ఒంగోలుకు వచ్చింది. వాళ్ళు హిందీలో నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు. ప్రమీలా స్వయంవరము, పీష్వా నారాయణరావు వధ, ఉషాపరిణయము, కీచకవధ నాటకాలు వారు ప్రదర్శించే వాటిలో కొన్ని. ఇవి ఒంగోలు ప్రజలను చాలా ఆకర్షించాయి.
మన ప్రకాశం 18
ఈ నాటకాలు చూసిన తరువాత ప్రకాళానికి అతని మిషత్రబృందానికి తాము కూడా నాటకాలాడాలనే సంకల్పం కలిగింది. ఆ ఊర్జోనే ఉండదల్లీ సాహెబుగారని ఉర్దూ పండితుడుండేవారు. ఆయనకు నాటకాలంటే అమితమైన అభిమానం. అప్పటికే ఆ ఊర్జో మిషన్ హైస్కూలులో పనిచేస్తూ ఉండే ఇమ్మానేని హనుమంతరావు నాయుడుగారు కూడా నాటకాలంటే అభిమానంగా ఉండేవారు. (ప్రకాశం మనస్సులోని సంకల్పానికి తోడు ఉండదల్లీ సాహెబు, హనుమంతరావు నాయుడు గార్లకు నాటకాలపట్ట ఉన్న అభిమానము తోడ్పడింది.
ఇంకేముంది! ఒంగోలు వుర పౌరులకు కన్నుల పండుగ సాక్షాత్కరించింది. (ప్రకాశం పేష్వా నారాయణరావు" నాటకంలో పీష్వా నారాయణరావు పాత్ర, 'ప్రమీలా స్వయంవరంలో ప్రమీల పాత్ర ధరించి ఒంగోలు పట్టణంలో ఒకటి రెండుసార్లు నాటక (ప్రదర్శనలిచ్చాడు. పట్టణ (ప్రజలంతా ప్రకాశం నటనా నైపుణ్యం చూసి ఆనందించారు. అట్టివారిలో ఉండల్లీ సాహెబుగారు ముఖ్యులు.
హనుమంతరావు నాయుడుగారికైతే ప్రకాశమంటే అమితమైన (ప్రేమ కలిగింది. ఆయనకు ప్రకాశం కన్న కుమారుని కంటే మిన్న అయినాడు. ప్రకాశమాయనకు బహిః ప్రాణం అయినాడు.
అదిగో! ఆ అభిమానమే ఉన్నత విద్యను అభ్యసించనున్న ప్రకాశాన్ని గూర్చి హనుమంతరావు నాయుడుగారు ఆలోచించడానికి కారణమయింది.
ఒంగోలులో ఇదివరకు (ప్రకాశం చదివిన స్కూలుకాక మరొకస్కూలు కూడా ఉంది. అది (క్రైస్తవ మిషనరీలు నడుపుతున్న పాఠశాల. హనుమంతరావు నాయుడు గారు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నది ఈ మిషన్ స్కూలులోనే. దానికి 'మాన్లీ దొర' (ప్రధానోపాధ్యాయులుగా ఉండేవారు. చదువు కొనసాగించడంలో నమస్యల నెదుర్కొంటున్న ప్రకాశాన్ని గూర్చి ఆలోచించే సమయంలో హనుమంతరావు నాయుడు గారికి ఒక ఆలోచన కలిగింది. ఆయన ప్రకాశాన్ని మాన్లీ దొర దగ్గరకు తీసుకుని వెళ్ళారు.
మన ప్రకాశం 19
ఆ దొర కరుణామయుడు. ఇదివరకే తెలివి కలిగి, చదువుకునే స్తోమతలేని పలువురు విద్యార్థులకు వేతనాలు ఇప్పించి, ఆదుకొని, వారికి విద్యాభిక్ష పెట్టిన పుణ్యమూర్తి, అంతకుముందే ఆయన పలువురు విద్యార్థుల గౌరవాభిమానాలను పొందిన మహనీయుడు. ప్రకాశం విద్యాబుద్దులను తెలివితేటలను తెలిసికొని వెంటనే తమ పాఠశాలలో చేర్పించుకొనడానికి సమ్మతించారాయన.
అక్కడ ప్రకాశానికి ఉపకార వేతనం కూడా దొరికింది. ఇది (ప్రకాశం జీవితంలో ఒక పెద్ద మలుపు. మాన్లీదొరగారి పాఠశాలలో హనుమంతరావు నాయుడుగారి శిక్షణ కింద ఐదవఫారం అంటే మెట్రిక్యులేషన్ కింది తరగతిలో చేరాడు ప్రకాశం.
“కృషితో నాస్తి దుర్భిక్షం” అన్న సూక్తి ప్రకాశం విషయంలో నిజమయింది.
నాయుడుగారు రాత్రిళ్ళు ఇంటి వద్ద ప్రకాశానికి ప్రత్యేకంగా పాఠం చెప్పేవారు. స్వతహాగా చురుకైన వాడు ప్రకాశం. హనుమంతరావు నాయుడుగారి శిక్షణలో మరింత నిగ్గుతేలాడు.
రాజమహేంద్రవర ప్రయాణం
(ప్రకాశం ఉజ్జల భవిష్యత్తుకు రాజమహేం(ద్రవర పట్టణమే పునాది అయింది. ఒంగోలులో చదువుతున్న ప్రకాశానికి రాజమహేం[ద్రవరం వెళ్ళే అవకాశం వచ్చింది. ఈ విషయం కూడా చాలా కూతూహలం కలిగించేదిగా ఉంటుంది.
రాజమహేంద్రవరం చాలా ప్రాచీన కాలమునుండి తెలుగు సంస్కృతికి కాణాచిగా ఉంటున్నదని తెలుసుకున్నాడు. అది విద్యావెంతులకుని లయమని, మహాపండితులకు ఆస్టానమని, గోదావరి (బ్రహ్మాండమైన నది అని చెప్పుకుంటూ ఉండేవారు. ఇవి అన్నీ విన్నాడు. మరో విషయం కూడా ఆనాటి వారు చెప్పుకోగా విన్నాడు (ప్రకాశం. అక్కడికి వెళ్ళినవారంతా పండితులవుతారని స్నేహితులు చెప్పిన విషయం (ప్రకాశాన్ని ఆకర్షించింది. ఇది కూడా విచిత్రంగా జరిగిన సన్నివేశమే.
మన ప్రకాశం 20
ఒంగోలులో చదువుతున్న రోజులలో కలరా వ్యాపించింది. ప్రకాశం కుటుంబం ఉంటున్న చోట కలరా వ్యాధి సోకింది. ఇది వాళ్ళ 'అమ్మ, అమ్మమ్మ గారిలకు చాలా ఆందోళన కలిగించింది.
ఆ వీధిలో ఒకరికి కలరా సోకింది కనుక తన పిల్లల ఆరోగ్య విషయంలో ఆమె చాలా జాగ్రత్త వహించింది. ఆ ప్రాంతం నుండి తన పిల్లలను తప్పిస్తే అది తనవారికి సోకదని ఆమె భావించింది. వాళ్ళు బసను ఊళ్ళోని వివిధ ప్రదేశాలకు మారుస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. అలా వారు నిమ్మగడ్డ వారింట్లో ఉండటం తటస్థించింది. వారింట్లో కొందరు రాజమహేంద్రవరంలో చదువుకొని పండితులై వైదిక విద్యలో పేరు ప్రతిష్టలు సంపాదించారు.
వారి ద్వారా రాజమహేంద్రవర వైభవాన్ని, అక్కడి విశేషాలను గురించి ప్రకాశం తెలుసుకోగలిగాడు. అతనికి రాజమహేంద్రవరం చూడాలనే కోరిక కలిగింది. మిడిల్ స్కూల్ పరీక్షలో ఉత్తీర్ణుడయినాడు. ఆ స్థితిలో ఆయన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.
ప్రకాశం మిడిల్ స్కూల్ పరీక్షకు చదువుతున్న రోజులలోనే హనుమంతరావు నాయుడు గారు ప్రకాశం చదువు పట్ల ప్రత్యేకమైన శ్రద్ద చూపిస్తూ ఉండేవారు. (ప్రత్యేకంగా ఇంటి దగ్గర పాఠాలు చెపుతూ ఉండేవారు. (ప్రకాశమాయనక్రు బహిః[ప్రాణమే కదా!
అది వేసవి కాలం. ప్రకాశం మిషన్ స్కూలులో చేరి చదువుతుండగా అర్హ సంవత్సరం ముగిసిన సందర్భంలో ఇచ్చే వేసవి సెలవులు ప్రకటించడం జరిగింది.
ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా మనం గమనించవలసి ఉంది. ఆ రోజులలో విద్యా సంవత్సరం జనవరినుండి డిసెంబరు వరకు ఉండేది. ఇప్పటి వలె జూన్ నుండి మార్చి వరకు కాదు. డిసెంబరులో సంవత్సరాంతం పరీక్షలు జరిగేవి. వేసవి కాలంలో అర్ధం సంవత్సరం పరీక్షలనంతరం ఇచ్చే సెలవులు ప్రకటించేవారు. ఆ వేసవిలో ప్రకాశానికి లభించినటువంటివి అర్థ సంవత్సర సెలవులే.
మన ప్రకాశం 21
అప్పుడు ఒక విశేషం జరిగింది. ఎప్పటినుండో (ప్రకాశం మనుసులో పొటమరించి ఉన్న కోరిక తీరడానికి అది మార్షమేర్చరిచింది. భార్య లక్ష్మమ్మగారి కోరికమేరకు హనుమంతరావు నాయుడుగారి కుటుంబం రాజమహేంద్రవరం ప్రయాణం కట్టారు. లక్ష్మమ్మగారి వైపు బంధువులందరు రాజమహేం(ద్రవరంలో మంచి పదవులలో ఉన్నారు. హనుమంతరావు నాయుడుగారి భార్య లక్ష్మమ్మగారికి తన భర్త రాజమహేంద్రవరంలోనే ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలనీ, తమ కుటుంబమంతా అక్కడే ఉండాలనీ కోరిక ఉండేది.
రాజమహేం[ద్రవరం ఎప్పుడెప్పుడు చూద్దామా అని, తహతహలాడే (ప్రకాశానికి నాయుడుగారి సంకల్పం తెలిసింది.
"నేను కూడా రాజమహేంద్రవరానికి మీతో కలసి వస్తాను మాష్టారూ!"
మనసులోని కోరికను తెలియచేశాడు. ఏమి కావలసి వచ్చినా నాయుడు గారిని అడిగే చనువు ఉంది (ప్రకాశానికి.
“మీ వాళ్ళు అంతదూరం నాతో పంపడానికి ఇష్టపడరేమో ప్రకాశం! సెలవులు అయిన తరువాత నేను మళ్ళీ వచ్చేస్తాగా!” మెల్లగా నచ్చచెప్పే ధోరణిలో ఉంది. నాయుడుగారి పలుకు.
అక్కడి నుండి హడావిడిగా ఇంటికి పరుగెత్తాడు ప్రకాశం ! తల్లికీ, అమ్మమ్మకీ విషయం వివరించడం జరిగింది.
నాయుడుగారు అన్నంతపని జరిగింది. “అంతదూరం ఆయనతో వెళ్ళడం ఎందుకు?' వారించారు. అమ్మ, అమ్మమ్మ కూడా!
కానీ తనకు రాజమహేంద్రవరం చూడాలని ఉన్నదనీ, తప్పక వెళతాననీ మొండిపట్లు పట్టాడు ప్రకాశం. ప్రకాశం మొండిపట్టు ఇంట్లోవారికి తెలియంది కాదు.
[. లు ్! నాయుడుగారు (ప్రకాశం ఇంటికి వెళ్ళారు.
మన ప్రకాశం 22
ఆయనను చూస్తూనే ప్రకాశం అభివాదం చేశాడు. ఆయన కూడా (ప్రకాశం అమ్మకూ, అమ్మమ్మకూ అభివందనం చేశారు. వస్తూనే తిన్నగా విషయాన్ని ప్రస్తావించారు.
'రాజమహేం(ద్రవరం చూడాలని ప్రకాశానికి అంత పట్టుదల ఉన్నప్పుడు మీరైనా అతని మాటను ఆలకించవలసి ఉంటుంది. ఆతనిని నాతో పంపించండి. జూ(గ్రత్తగా తీసికొని వచ్చి మళ్ళీ మీకు అప్పగిస్తాను. అతనికేమీ లోటు రానివ్వను"
(ప్రకాశం పట్టుదలకు తోడు నాయుడుగారు ఇంటికివచ్చి నచ్చచెప్పడంతో వారికి (ప్రకాళాన్ని పంపించక తప్పలేదు.
ఆనాడు దూర ప్రయాణాలు చాలా కష్టంగా ఉండేవి. రైలు మార్గంలేని రోజులవి. ఆనాడు రాజమహేం(ద్రవరం వెళ్ళాలంటే అంచె బళ్ళమీద (ప్రయాణం చేయడమొక్కటే పద్ధతి. ఒంగోలుకా పట్టణం నూట ఎనభై మైళ్ళు దూరంలో ఉంది. ఒంగోలు నుండి బెజవాడ వరకు (గ్రాండ్ ట్రంకు రోడ్డు మీద తొంబది మైళ్ళు, బెజవాడ నుండి వియుశ్సరం తొంభై మైళ్ళు. ఒంగోలు నుండి బెజవాడ అప్పటిలో నాలుగు మకాములలో చేరేవాళ్ళు" రాత్రిళ్ళు ఇరవై మైళ్ళు (ప్రయాణం చేయడం, పగటి పూట సత్రాలున్న ప్రదేశాలలో మకాం చేయడం, అనేది ఒక (ప్రయాణ పద్ధతిగా ఉండేది. బెజవాడ వరకు అంచెబళ్ళు బాగా దొరికేవి గానీ, బెజవాడ నుండి రాజమహేంద్రవరం వరకు మాత్రం బళ్ళు అంత సులువుగా దొరికేవి కావు. దారికూడా చాలా భయంకరంగా ఉండేది. దారిపొడవు అంతా అరణ్యమార్గంలా కనపడేది. బెజవాడ" నుండి రాజమహేంద్రవరం చేరడానికి పదిరోజులు పట్టేది. ఒంగోలు నుండి బెజవాడ నాలుగు రోజులు మొత్తము ప్రయాణము చేసి రాజమహేంద్రవరము చేరుకోవడానికి పద్నాలుగు, పదిహేను రోజులు ఫట్టేది.
ఈ (ప్రయాణం మహా సరదా అనిపించింది ప్రకాశానికి. దారి పొడుగునా ఉన్న కొండలు, గుట్టలు దాటి బెజవాడ చేరుకున్నారు. నాయుడుగారు, ఆయన భార్య లక్ష్మమ్మగారు, వృద్దురాలైన ఆయన తల్లి, ప్రకాశం కలిసి ఈ ప్రయాణం సాగించారు.
మన ప్రకాశం 23 కృష్ణ సమీషించేసరికి పచ్చని నేల కనబడేది. దారిలో దొంగల భయం కూడా ఉండేది. అందుచేత బళ్ళు ఒంటరిగాక ఒకదానివెంట ఒకటి బయలుదేరేవి. బెజవాడ నుండి వీరి ప్రయాణం ఏలూరు మీదుగా సాగింది. మధ్యలో ఏలూరులో ఆగినపుడు రత్నకంబళ్ళు నేసే వారి ఇండ్లకు ప్రకాశాన్ని తీసుకొని వెళ్ళి, వాటిని నేసే విధానాన్ని చూపించారు నాయుడుగారు. దీనివల్ల ఏలూరు రత్నకంబళ్ళకు ప్రసిద్ధి అని అప్పుడే జా(గ్రఫీ పుస్తకంలో చదువుకున్న విషయాన్ని సోదాహరణంగా (గ్రహించాడు ప్రకాశం. వియుశ్వరం చేరి అక్కడనుండి వారు రాజమహేంద్రవరం వరకు గోదావరి నదిపై పడవ ప్రయాణం చేశారు. పడవ ప్రయాణం చేస్తున్నప్పుడే ప్రకాశం హృదయం ఉత్సాహంతో ఉప్పొంగింది. ఆ నది వైశాల్యమూ, గాంభీర్యమూ ప్రకాశాన్ని వివశుణ్ణి చేశాయి. రాజమహేంద్రవరంలో దిగుతూ ఉండగానే ఆ పట్టణపు ఐశ్చర్యాన్ని సూచిస్తూ అక్కడ ఉన్న కార్థానాలు, పడవల మీద నుండి దిగిన ధాన్యపు బస్తాల గుట్టలూ, అక్కడ కనిపించి అతనికి ఆనందాన్ని కలిగించాయి. అక్కడ కొత్త పడవల నిర్మాణం, పాత పడవల మరమ్మత్తు కూడా జరుగుతున్నది. రాజమహేం(ద్రవరంలో దిగి ఆ పట్టణ సౌందర్యం చూచి ముగ్దుడయినాడు. ఆ మరునాటి నుండి నాయుడుగారు ప్రకాశాన్ని వెంటదీసుకొని సారంగధరుని మెట్ట. దాని మీద కాళ్ళు నరకబడిన సారంగధుని శిల, చిత్రాంగిమేడు రత్నాంగిమేడ, పావురం వాలిన చోటు మొదలైనవన్నీ ఒక్కొక్కటిగా చూపించారు. కోటి లింగాల క్షేత్రం దగ్గరకు తీసుకొనివెళ్ళి ఆ లింగాలన్నీ చూపించారు. ప్రకాశం అవన్నీ లెక్కించాడు. “ఈ లింగాలు కోటి లేవండీ మాష్టారూ!” ప్రకాశం 'ప్రల్నించాడు. “అవన్నీ ఒకప్పుడు ఉండేవే (ప్రకాశం! కొని (క్రమంగా అవన్నీ నదీ గర్భంలో కలిసిపోయి ఉండవచ్చు”. శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశారు గురువుగారు.
మన ప్రకాశం 24 వేసవికాలం సెలవులు అయినపోయిన తరువాత ఒంగోలు వెళ్ళిపోవాలనే సంకల్పంతో ఉండడం వలన నాయుడుగారు శిష్యుని చేత ఆ పట్టణంలో గల ముఖ్యమైన (ప్రదేశాలన్నింటినీ దర్శింపచేశారు. వారు రాజమహేంద్రవరంలో చేరిన కొద్ది రోజులకే కాలువలు వదిలారు. గోదావరి నది పూర్వపు నిండుతనాన్ని సంతరించుకుంది. ఆ కాలువలు వదలడం వలన రహదారి పడవలు తిరగడం ప్రారంభమయింది. 'ఆ చుట్టు పక్కల గల ఊళ్ళు కూడా చూస్తే బాగుండును” అని అనిపించింది ప్రకాశానికి. ఆనాడు రాజమహేంద్రవరం ఎక్కువ విస్తరించిలేదు. ప్రస్తుతం ఉన్న పట్టణం మాత్రమే అప్పటి రాజమహేంద్రవరం. చిత్రాంగి, రత్నాంగుల మేడలే అప్పటి ముఖ్యమైన భవనాలు. రెండు మూడు ఇళ్ళు తప్ప ఆర్యాపురమంతా కలప అడితీలే, ఇన్నీసుపేట అప్పటిలో చాలా చిన్నది. ఐనా ఆ ఊర్గో అన్నింటికన్నా ఆ పేటే శుభ్రంగా ఉండేది. (ప్రకాశం రాజమహేంద్రవరం చేరిన నాటినుండి ఆ పట్టణంలోని వివిధ రంగాలలో గల ప్రసిద్దులైన వారిని గురించి తెలుసుకుంటూ ఉండేవాడు. వారిలో ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు పంతులు, మాకర్ష సుబ్బారావు నాయుడు బి.ఎ.బి.ఎల్ పాసై ప్లీడరు చేస్తున్నవారు. ఏలూరు లక్ష్మీనరసింహంగారు, నేతి సోమయాజులు గారు ప్లీడర్సు. గరిపల్లి సాంబశివరావు, గోపాల కృష్ణమ్మ, దామరాజు రామరాజు (ప్రభృతులు పట్టాలు పొందిన ప్లీడర్లు, సాహిత్యంలో కూడా పలువురు ప్రసిద్దులుండేవారు. వారిలో అనేక (గ్రంథాలు రాసి రచయితలుగా ప్రసిద్ది పొందిన వారు వీరేశలింగం పంతులుగారు. అంతేకాదు. ఆనాటికే ఆ పట్టణం నుండి 'వివేకవర్ధిని' అను పేరుగల పత్రికను స్టాపించి స్త్రీలలో భావవికాస్తానికి కృషి చేశారు. ఆయన గొప్ప సంఘసంస్కర్త కూడా, వడ్డాది సుబ్బరాయ కవి గొప్పకవి. 'వేణీ సంహారం" అనే నాటకాన్ని తెలుగులోకి అనువదించారు. 'భక్త చింతామణి" అనే శతకాన్ని కూడా రచించారు.
మన ప్రకాశం 25
వావిలాల వాసుదేవ శాస్త్రిగారు ఆనాటి మరొక ప్రసిద్ద కవి. కవులలో వీరికొక ప్రత్యేక స్టానముంది. వీరు ఆంగ్ల భాషా సాహిత్యంలో కూడా గొప్ప పండితులు. జూలియస్ సీజరు అనే షేక్స్పియర్ నాటకాన్ని మొదటిసారిగా తెనుగులోనికి అనువదించారు. ఆ తరువాత 'నందకరాజ్యం' అనే స్వతంత్ర సాంఘిక నాటకాన్ని రచించారు. "ఆది పద్దెనిమిది వందల ఎనభయ్యవ సంవత్సరంలో అచ్చు పడింది. " ఈ 'నందక రాజ్యం" పద్య నాటకం, అంటే ఆద్యంతమూ నాటకమంతా తేటగీతులనే పద్య చృందస్సులలో నడిచింది. ఇతివృత్తం సాంఘికం అందుకు వీరు తొలి తెలుగు పద్యనాటక కర్తగాను, తొలి తెలుగు సాంఘిక నాటక కర్తగానూ కూడా ప్రసిద్ది పొందారు. ఈ ముగ్గురు కవుల 'పేర్టు'ఆ (ప్రాంతమంతా మారు[మోగుతూ ఉండేవి. ఈ ముగ్గురు కవులను కలిపి 'నవకవిత్రయము' అని ఆనాటి వారు గౌరవించేవారు. సంస్కృత పండితులలో ఆనాడు బాగా కీర్తి కలవారు కల్లూరి వెంకట రామశాస్తులుగారు. కొక్కొండ వెంకట రత్నం పంతులుగారికి శుద్ద (గ్రాంధిక వాదులుగ్- ఆ నాటికి మంచి ప్రసిద్ది ఉండేది.
ఆనాటి కవులను గ్యురించి, ఇతర ప్రసిద్దులను గురించి (ప్రకాళానికి తెలియజేశారు, హానుమంతరావు నాయుడుగారు.
కాలం వేగంగా సడిచిపోతున్నది. శేసది సెలవులు ముగిశాయి పొఠశాలలు తెరిచారు.
హనుమంతరావు నాయుడుగారు అక్కడే కొత్తగా స్థాపించబడిన థీయస్టిక్ స్కూలులో గణితోపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరారు. ఈ స్కూలును ఏలూరు నరసింహంగారు స్థాపించారు. దానిని తెలుగులో ఆస్తిక పాఠశాల అనేవారు. హనుమంతరావు నాయుడుగారు రాజమహేంద్రవరంలో అలా ఉద్యోగంలో చేరడం, వాచి భార్య లక్ష్మమ్మగారికి పరమానందం కలిగించింది. ఆమెకు మొదటి నుండి తమ బంధువులకు సమీపంగా రాజమహేంద్రవరం లో ఉండాలనే కోరిక ఉండేది. ఆ సంకల్పం ఆనాటికి నెరవేరింది.
పాఠశాలలు తెరిచారు.. సెలవులు అయిపోయాయి. ఇంటికి తిరిగి వెళ్ళడానికి
మన ప్రకాశం 26 సెలవు తీసుకున్నాడు ప్రకాశం. ఆప్పటికి కాలువలు వదిలారు. ప్రయాణం కొంచెం సుకరంగా ఉంటుంది. రాజమహేం(ద్రవరం రేవులో పడవ ఎక్కితే బెజవాడ వరకు ఏలూరు కాలువ మీద, ఆ తరువాత బకింగుహామ్ కాలువమీద ప్రయాణం చేసి ఒంగోలు దగ్గరి కొత్తపట్నం వరకు వెళ్ళవచ్చని వివరాలు సేకరించి తాను అదే విధంగా ప్రయాణం చేసి ఒంగోలు వెళ్తానని నాయుడుగారితో చెప్పాడు ప్రకాశం. తానొక్కడే ప్రయాణం చేసి వెళ్ళగలననీ, వారేమి విచారింప పనిలేదని నాయుడుగారికి ధైర్యం చెప్పాడు. నాయుడుగారి ఇంట్లో వారందరి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. తనకున్న రెండు జతల బట్టలు మూటకట్టుకున్నాడు. ప్రకాశం లక్ష్మమ్మగారికి నమస్కరించాడు. నాయుడుగారు పాఠశాలకు వెళ్ళారు. తన బట్టలమూట తీసుకొని బయలుదేరాడు. (ప్రకాశం పడవల రేవు చేరాడు. బెజవాడ వైపు వెళ్లే పడవలు రేవు దాటి పోయాయి. (ప్రకాశం తన స్వగ్రామం వెళ్ళడానికి ఆవకాశం లేకపోయింది. ఏమిచేయాలో పాలుపోలేదు. మనసులో మధన చెందాడు. విషయం వివరించుదామని ఇంటికి బయలుదేరి వచ్చాడు (ప్రకాశం. ఆతను నాయుడి గారి ఇంటికి తిరిగి వచ్చేసరికి అక్కడి సన్నివేశం (ప్రకాశం మనసు కరిగించి వేసింది. అతను తిరిగి వచ్చేసరికి మధ్యాహ్న భోజన విరామ సమయంలో నాయుడుగారు ఇంటికి వచ్చి ఉన్నారు.
“ప్రకాళం వెళ్ళిపోయాడా?”
వస్తూనే నాయుడుగారు ప్రల్నించారు.
“ఆ ! వెళ్ళాడండీ”
భార్య సమాధానం చెప్పింది
“ ఇప్పుడే! ఒక పావుగంట అవుతుంది”.
భార్య చెప్పిన సమాధానం వింటూనే మళ్లీ అన్నారు.
“ ఒక్కడే వేళ్లగలడంటావా, లక్ష్మీ
మన ప్రకాశం 27 ఆమె సమాధానం చెప్పేలోగా మళ్లీ ఆయనే అన్నారు.
“ఫ్రకాశం వెళ్లి పోయాడంటావా?”
అంటూనే దిగాలు పడి కళ్ళ నీళ్ళు పెట్టుకొన్నారు నాయుడుగారు. ప్రక్కనే ఉన్న వారి బంధువు నాయుడు గారిని సమాధాన పరచడానికి ప్రయత్నిస్తున్నాడు.
“ఏదో మాట వరసకు నీతో వచ్చాడు. నాలుగు రోజులు సరదాగా కాలక్షేపం చేశాడు. వాళ్ల అమ్మనీ, అమ్మమ్మనీ అందరినీ వదిలి నీతో ఎల్లకాలం ఉంటాడటయ్యా!” (ప్రేమ పూర్వకంగా మందలించాడు నాయుడిగారిని. కానీ ప్రకాశం లేని ఇల్లు సందడి కోల్ఫోతూ ఆయనకు కాంతి హీనంగా కనిపించింది. శిష్యవాత్సల్యం పొంగి పారలింది. కళ్లవెంట ధారగా అశ్రు వర్ష కురుస్తోంది.
“క్షమించండి, మాస్టారు!” ఆ కంఠ స్వరం వింటూనే అటు తిరిగి చూశారు. ఆ కంఠ స్వరం ప్రకాశందే. ఆశ్చర్యపడి అటు తిరిగి చూచారు మాష్టారు.
“బెజవాడ వైపు వెళ్లే పడవ రేవుదాటి వెళ్లిపోయింది మాష్టారూ, మళ్లీ పడవ - రేపటి వరకూ లేదు కదా...... అని తిరిగి వచ్చాను మాష్టారూ”.
సంభాయిషీ ఇస్తున్నట్టు ఉన్నది (ప్రకాశం కంఠస్వరం. తన ఎదుట కనిపించేది (ప్రకాశమే. వినిపించేది (ప్రకాశం గళమే!
నాయుడు గారికి అమితమైన ఆనందం కలిగింది. (ప్రకాశంతో తనకు ఎంత ఆనుబంధమున్నదో, అతను లేకపోవడం తనకు ఎంత వెలితిగా ఉన్నదో, అప్పుడు అనుభవంలోకి వచ్చింది నాయుడిగారికి,
అంతేకాదు. రాజమహేంద్రవరంలో ఉంటే (ప్రకాశించగల (ప్రకాశం ఉజ్వల భవిష్యత్తు ఆయన కళ్లముందు దర్శనమిచ్చి ఉంటుంది. (ప్రకాశాన్ని దగ్గరకు తీసుకొన్నారు. భుజం మీద చేయి వేశారు.
మన ప్రకాశం 28 “ప్రకాశం, నీవు కూడా ఇక్కడే ఉండి చదువుకోరాదూ!” గురువుగారి అభ్యర్థన అది! (ప్రకాశం మనసులో ఎంతో ఆనందించాడు. అయితే వెంటనే ఒక చిన్న సందేహం కలిగింది. దానిని బయటకు ప్రకటించాడు. “మా వాళ్లంతా అక్కడ ఒంగోలులో ఉన్నారు కదా! ఇక్కడనన్ను ఎవరు చూస్తారు?” (ప్రకాశం మనసులో మెదిలిన సందేహం అది! “ప్రకాశం, నీకు ఆక్కడ మాత్రం ఎవరున్నారు? మీ అమ్మగారూ, అమ్మమ్మగారూ కష్టపడవలసిందే కదా! ఇక్కడే మాతో పాటే తంటాలు పడకూడదూ! ఆప్యాయంగా రాజమహేంద్రవరానికి ఆహ్వానించారు నాయుడుగారు, ఆ మాటలోని లాలన, (ప్రేమా ప్రకాశం హృదయాన్ని కరిగించాయి. అది ప్రకాశం జీవితంలో ఒక అద్భుతమైన ఘడియ. ఒక్క నిమిషం ఆలోచించాడు. 'మాస్టరుగారి మాట తన భవిష్యత్తుకు బంగారుబాట అవుతుందేమో”, “ఒక్క నిమిషంలో ఎంత మార్పు! ఈ ఘడియ ఎంత అపూర్వమయింది” ప్రకాళానికి ఉక్కిరి బిక్కిరిగా ఉంది అసలే రాజమహేంద్రవరంపై అభిమానం! దానికితోడు ప్రాణానికి ప్రాణమైన హనుమంతరావు నాయుడు మాస్టరుగారి ఆహ్వానం! “సరే, మీ అభిప్రాయం అలాగ ఉండి నన్ను ఇక్కడే ఉండమంటే, అదే నా అదృష్టంగా భావించి ఉండిపోతాను మాస్టారూ!” ఆ మాటలో సంతోషమూ, వినయమూ రెండూ మేళన మంది ఉన్నాయి. చేతిలో తన బట్టల మూటను అక్కడే పడేశాడు.
మన ప్రకాశం 29
ఆక్షణం నుండి రాజమహేం[ద్రవర పురవాసి అయ్యాడు (ప్రకాశం ,
నాయుడిగారి మనసంతా సంతోషంతో నిండి పోయింది. వెంటనే ప్రకాశం చదువుకు (ప్రయత్నం సాగించారాయన.. తాను పనిచేసే థీయిస్టిక్ స్కూలులోనే ఐదవఫారంలో రెండవ అర్హ సంవత్సరంలో (ప్రకాశాన్ని చేర్చారు నాయుడుగారు. ప్రకాశం చదువులో చూపిస్తున్న చురుకుదనము, అతని కుటుంబ పరిస్థితులు అన్నిటికంటే తనకు (ప్రకాశం ఎడగల వాత్సల్యాతిశయాన్ని పురస్కరించుకొని అతనికి విద్యార్థి వేతన మిప్పించాలని అనుకొన్నారు నాయుడుగారు.
ఆ స్కూలు స్టాపకులైన ఏలూరి లక్ష్మీ నరసింహంగారితో చెప్పి ప్రకాశానికి విద్యార్థి వేతన మిప్పించారు.
ఈ విషయం ఒంగోలులో ఉన్నవాళ్ళ అమ్మకు, అమ్మమ్మకు తెలియజేశాడు (ప్రకాశం. ఇది తెలిసి వాళ్ళు చాలా వ్యధ చెందారు. “అయితే ప్రకాశాన్ని అమితంగా అభిమానించే నాయుడిగారి పర్యవేక్షణలోనే ఉంటాడు గదా' ఆని మనసును కొంత వరకు సమాధాన పరచుకున్నారు.
(ప్రకాశానికి రాజమహేంద్రవరంలో చదువుకు అవకాశం లభించడం దైవికమే. ఆది ఆయన జీవితంలో ఒక అపూర్వమైన ఘడియ. అదే ఆయనజీవితం యావత్తూ ఒక పరిమాణం చెందడానికి మూలకారణమైన నిమిషం! జీవితమంతా 'ఆకస్మిక ఘటనావళి' అనే మాట ఈ సందర్భంలో ఎంతో అర్ధవంతంగా కనబడుతుంది.
(ప్రకాశానికి పడవే అంది, ఒంగోలు తిరిగి చేరితే, అతని జీవితం ఏమయి ఉండేదో! పడవదాటిపోయి ప్రకాశం వెనక్కి రావడమూ, నాయుడుగారికి మనస్తాపం కలిగి (ప్రకాశాన్ని తమ దగ్గరే ఉండమనడమూ రెండూ కూడా దైవ ఘటనలే!
పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ప్రకాశం థీయస్టిక్ హైస్కూల్లో ఫిప్స్ క్లాసులో రెండవ అర్హసంవత్సరం క్లాసులో చేరాడు. హనుమంతరావు నాయుడు గారు కూడా
మన ప్రకాశం 30 అదే స్కూల్లో పనిచేస్తున్నారు అని మనం తెలుసుకున్నాం గదా!
ఆ రోజులలో పాఠశాలలన్నింటికీ ఒకే పాఠ్య విధానముండేది. కనుకనే ప్రకాశం థీయిస్టు స్కూల్లో రెండవ అర్ధ సంవత్సరంలో చేరి చదువు కొనసాగించగలిగాడు. అప్పుడు ఆ స్కూలుకు ప్రధానోపాధ్యయుడు పి.వి. శివకుమార శాస్త్రిగారు. ఆ స్కూలులోనే మెట్రిక్యులేషన్ పరీక్షకు చదివాడు ప్రకాశం,
ఆ రోజులలో హనుమంతరావు నాయుడుగారు ప్రకాశం అంటీ ఎంతో అభిమానంగా ఉండేవారు. ఆయనకూ నాటకాలంటే ఒంగోలులో ఉన్నప్పటి నుండే అభిమానం ఉంది. ఈ గురు శిష్యులకు పిళ్ళారిసెట్టీ త్రయంబకరావు అనే కంటట్రాక్టరు తోడైనాడు. అతను ఆనాటి నాటకాలకు కావలసిన డబ్బూ, హంగూ అన్నీ సమకూర్చేవాడు.
సుప్రసిద్ధ కవిశేఖరులైన (బ్రహ్మశ్రీ, చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు నాటకాలు ద్రాసేవారు. ఆ నాటకాలను ప్రకాశం జట్టువారు ప్రదర్శిస్తూ ఉండేవారు. చిలకమర్తివారు (ప్రకాశం పంతులుగారి నటననూ, పాత్ర పోషణనూ దృష్టిలో పెట్టుకొని కొన్ని నాటకాలను (వ్రాశారని చెప్పవచ్చు.
(ప్రకాశం చిలకమర్తి గారి గయోపాఖ్యానం నాటకంలో గయుని భార్య అయిన చిత్రరేఖ వేషమూ, ఆ తరువాత వెంటనే అర్జునుని వేషమూ వేసేవారు. నాటకాలలో ఇతను ప్రదర్శించే అభినయం చూచి ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేసేవారు. "సంగీతము చేత బేరసారములుడిగెన్” అన్నట్టు ఈ నాటకాల గొడవలలో ప్రకాశం చదువు సరిగా సాగలేదు. సాగకపోవడమే కాదు! పద్దెనిమిదివందల ఎనభై ఏడవ సంవత్సరం డిసెంబరు నెలలో జరిగిన విశేషమేమిటంటే ఇతను వ్రాసిన మెట్రిక్యులేషన్ పరీక్ష కాస్తా పోయింది. పరీక్ష తప్పిపోయేసరికి ప్రకాశానికి జ్ఞానోదయం కలిగింది. తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. తాను రాజమహేంద్రవరం ఎందుకు వచ్చాడో ఆ విషయం జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. తన క్తర్తవ్యాన్ని మరిచిపోయినందులకు విచారించాడు. పట్టుదలతో,
మన ప్రకాశం 3] శ్రద్ధగా చదివి తరువాత సంవత్సరం మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయినాడు. ప్రకాశం మంచి ఈతగాడు. మిత్రులతో కలిసి పగలంతా గోదావరిలో ఈత గొట్టేవాడు. రాత్రిళ్ళు పడవలు తోసుకువెళ్ళి ఇసుక తిప్పలలో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. లాంతరు పట్టుకు పోయి గోదావరీ ఒడ్డున గల ఇసుక తిన్నెలమీద కూర్చుని అక్కడే చదువుకొనేవాడు, విద్యార్థి సంఘాలు స్టాపించి వాటిద్వారా ్రీడా కార్యక్రమాలు చేపట్టాడు. జట్టుతో కలిసి చెడుగుడు మొదలైన ఆటలను ఆడేవాడు. ప్రకాశం మంచి ఆటగాడి కిందే లెక్క. ఆ కాలంలో ప్రకాశానికి ఒక పెద్ద మృత్యు గండం తప్పింది. గోదావరి మంచి వరదలో ఉంది. ఆ ప్రవాహాన్ని చూచి పరవశించిపోయిన ప్రకాశానికీ, అతని స్నేహితులకీ కూడా ఆ వరద గోదావరిలో ఒకసారి షికారు చేయాలనే కోరిక కలిగింది. అక్కడే ఉన్న ఎవరిదో చిన్న పడవను (ప్రకాశమూ, ఆతని మితృ బృందమూ కలిసి ఏటిలోనికి త్రోసుకొని వెళ్ళారు. ఆ పడవకు తెడ్డు ఒక్కటే చుక్కాని. చుక్కాని దగ్గర ఉన్నాడు ప్రకాశం. పడవను కోటిలింగాల దాకా బాగా ఎగువకు పోనిచ్చి ఏటిలోనికి వాలుగా వదిలేశారు. నావ ప్రవాహంలో మంచి జోరుగా వస్తున్నది. (ప్రకాశం చేతిలోని చుక్కాని జారిపోయింది. దానికోసం అతను గభాలున ఏటిలోనికి దూకాడు. ఇది చూచి మిత్రులంతా భయపడ్డారు. సాహసి, మంచి ఈతగాడు అయిన ప్రకాశం ఏటిలోనికి జారిపోయిన తెడ్డును పట్టుకొని పడవ దగ్గటికి చేరాడు. కాని పడవనెక్కలేకపోయాడు. పడవలోని మిత్రబృందం కింకర్తవ్యతా మూఢులయినారు. ప్రకాశాన్ని చూచి కంగారుపడ్డారు. కాని తెడ్డు చేతికి అందించాలని వారెవ్వరికీ తోచలేదు. ఒకటి రెండుసార్లు అలాగే ఈదుకుంటూ ప్రకాశం పడవ దగ్గరకు వెళ్ళాడు. కాని పడవ ఎక్కలేకపోయాడు. పడవ నీటివాలులో పోతున్నది. అతను ఎక్కలేకపోతున్నాడు. ప్రకాశానికి తెడ్డు అందించాలని, అలా అందిస్తే సులువుగా పడవ ఎక్కగలడనే విషయం మిదత్రులెవ్వరికీ స్పురించలేదు. ఆతనినీ, అతని ఉనికిని గమనిస్తున్న స్నేహితులకు ప్రకాశం ప్రాణాల మీద ఆళపోయింది. చాలాసేపు ఆ
మన ప్రకాశం 32 మహానదిలో నీటి పోరాటం జరిపాడు ఆ యువకుడు. చివరకు ఆలా ఈదుకుంటూనే అతనే మిత్రులకు తెడ్డు అందించమని సూచించాడు. అప్పుడు పడవలోని వారికి నీటిలో ఈదుకొంటూ [ప్రాణాపాయంలో ఉన్న ఆతనికి తెడ్డు అందించాలనే స్ఫురణ కలిగింది. పడవలోని మిషత్రుడొకడు తెడ్డు ఆందించగా దానిని ఊతగా గొని పడవ మీదకు చేరుకున్నాడు ప్రకాశం. వెంట్రుకవాసిలో మృత్యువాతను తప్పించుకున్నాడు (ప్రకాశం.
ఇన్ని విశేషాలతో ఒడుదుడుకుల మధ్య రాజమహేంద్రవరంలో చదువు సాగించాడు (ప్రకాశం, అయితే భవిష్యత్తు (ప్రశ్నార్థకమయింది (ప్రకాశానికి, దగ్గరి బంధువులు, మిత్రులు సలహాల పగరంపరలను అందిస్తున్నారు. మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. మరి ముందు సంగతి ఏమిటి? అనే సంగతి మళ్ళీ చర్చా విషయమయింది. మెట్రిక్యులేషన్ అయింది. వివాహం చేసుకుని ఒక ఇంటివాడవు అయితే బాగుంటుంది. డబ్బుకోసం పెద్దవాళ్ళను ఇంకా ఎంత కాలం బాధపెడతావు? తగిన ఉద్యోగమేదైనా చూచుకో (ప్రకాశం! ఎంత.. కాలమని అటు అమ్మనీ, ఇటు హనుమంతరావు నాయుడుగారినీ ఇబ్బందిపెడతావు. ఏదో ఒక నొకరీలో చేరితే బాగుంటుంది. ఇదీ ఆనాటి ఆయన బంధువర్గ మిచ్చిన సలహా! ఇది ఒక విధంగా నిజమేననిపించింది (ప్రకాశానికి. ప్లీడర్ చదువు ఆయన జీవిత లక్ష్యమైనప్పటికీ నాయుడుగారిపై ఆధారపడుతూ ఆయనను ఇంకా ఇబ్బంది పెట్టడం సబబు కాదనిపించింది,
ఆనాటి వ్యవస్థలో గుమాస్తా పనిచేస్తూ కూడా (ప్రైవేటుగా ప్లీడరీకి చదివే అవకాశముంది. రాజమహేంద్రవరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో జూనియర్ గుమాస్తా పనికి ఖాళీ ఉన్నదని కూడా "స్నేహితులు తెలియజేశారు. ఆ పనికి నెలకు పధ్నాలుగు రూపాయల జీతం. అందుకని తనకు ఇష్టం లేకున్నా ఆ ఉద్యోగానికి దరఖాస్తు జేశాడు (ప్రకాశం. కానీ సబ్ రిజిస్ట్రార్ గారు దస్తూరీ చూడాలనీ, తెలివితేటలు పరీక్ష చేయాలనీ, . అందుకని ఒకసారి తనను చూడవలనీందనీ నోటిసు వంపించారు. కాని అభిమానధనుడైన ఆయనకు ఇది ఆత్మ గౌరవానికి భంగకరంగా' తోచింది.
మన ప్రకాశం 33
“మెట్రిక్యులేషను పరీక్ష ఉత్తీర్ణుడైనట్టు యోగ్యతా పత్రముండగా మళ్ళీ ఈ పరీక్ష ఏమిటి? మీరిచ్చే ఉద్యోగం నాకక్కరలేదు” అని దానిని తిరస్కరించాడు. అంతే! దానితో ఆ ఉద్యోగావకాశం పోయింది.
ఒక్కొక్కసారి స్వల్ప విషయాలలో జీవిత పంథా మారిపోతూ ఉంటుంది. ప్రకాశం జీవితంలోనూ ఇదే జరిగింది. బహుశ ఆనాడు రిజిష్ట్రార్ ఆఫీసులో చేరి ఉంటే భావి జీవితంలో (ప్రకాశం ఎలా ఉండేవాడో?
ఇంతలో ప్రకాశం కుటుంబానికి ఒక ఆపద వచ్చింది. అద్దంకిలో ఉండే వారి అక్కయ్య జానకమ్మ మరణించింది. అప్పటికి ఆమెకు ఒక కుమార్తె ఉంది. ఆమెపేరు హనుమాయమ్మ. జానకమ్మ చనిపోతూ తన కుమార్తెను తల్లిచేతిలో పెట్టింది. (ప్రకాశానికి ఇచ్చి వివాహం చేయమని కోరింది. ఆమె దగ్గర మాట తీసుకుంది. మాట ఇచ్చింది కనుక దానిని నిలుపుకోవాలని కోరుకుంది సుబ్బమ్మగారు.
(ప్రకాశం వివాహం అద్దంకిలో జరగాలని నిర్ణయించింది సుబ్బమ్మగారు. ముహూర్తం నిర్ణయించి కుమారునకు కబురు పెట్టిందామె. ప్రకాశం మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన సంవత్సరమే ఆయన వివాహం కూడా జరిగింది. అది పద్దెనిమిది వందల తొంభయ్యవ సంవత్సరం. వివాహం చేసుకుని అక్కడి నుండి మళ్ళీ రాజమహేంద్రవరం చేరుకున్నాడు ప్రకాశం.
వద్దెనివిది వందల తొంబ్లాయ్యవ నంవత్సరం, వి(బ్రవరి నెలలో రాజమహేంద్రవరం ఆర్జు కాలేజీలో ఎఫ్.ఏ. క్లాసులో చేరాడు (ప్రకాశం. ఆ కాలేజీలో చేరడానికి కారకులు మళ్ళీ హనుమంతరావు నాయుడుగారే.. కళాశాల ప్రిన్సిపాల్ ఎరల్పాల్మెట్కాఫ్ దొర] ఆయన మహా విద్యావేత్త! ఆయన విద్యార్థులను కన్నబిడ్డలవలె ఆప్యాయంగా చూచేవాడు. గణితం, ఇంగ్లీషు అద్భుతంగా బోధించేవాడు. ఆ రోజుల్లోనే మెట్కాఫ్ చూపించే చొరవతో వడ్రంగం మొదలైన చేతి పనులు కాలేజీలో అందరూ నేర్చుకొనే అవకాశం కలిగింది. జాతీయాభిమానం, సంప్రదాయం కలిగిన భావాలలో
మన ప్రకాశం వ్రత విద్యార్థులు ఉండాలి అన్నది ఆయన అభిమతం! ఆయన భారతదేశం రావడం రావడమే రాజమహేంద్రవరం వచ్చాడు. అక్కడే ఇరవై అయిదు సంవత్సరాలు కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేసి మళ్ళీ ఇంగ్లండు వెళ్లిపోయాడు. రాజమహేంద్రవరమంటే మెట్కాఫ్దొరకు చాలా అభిమానం! తెలుగు నేర్చుకొన్నాడా దొర! ఆయన అదర్శప్రాయుడైన ఉపాధ్యాయుడు. కాలేజీలో క్ఞాసు పని పూర్తి కాగానే విద్యార్థులతో కలిసి మెట్కాఫ్ దొర ఆటలాడేవాడు. చదువులో వెనుకబడి విద్యార్థులను తన యింటికి పిలిచి పాఠాలు చెప్పేవాడు. స్వయంకృషితో మనం ఎంత గొప్ప కార్యాన్నైనా సాధించవచ్చని విద్యార్థులకు చెబుతూ ఉండేవాడు. ఆయన కూడా ఆ సిద్దాంతాలను ఆచరించేవాడు. బొమ్మూరు మెట్టమీద ఆయన నివసించే భవనం ఉండేది. సమయం లభించినప్పుడల్లా ఒక్కొక్కరాయి పేర్చి ఆ గుట్ట మీదకు మంచి రోడ్డు వేస్తూ ఉండేవారు ఆ దొర! ఆనాటి విద్యార్థులాయనను దేవునికన్న మిన్నగా అనుకునేవారు. విద్యార్దులు తప్పుచేస్తే వారిని ఆయన శిక్షించే పద్ధతి ప్రత్యేకంగా ఉండేది, తప్పు చేసిన విద్యార్థిని సెలవు రోజున ఆయన తన ఇంటికి పిలిచి, వాడికి ఇంగ్లీష్టులెక్కలు బోధించేవాడు. ఈ మెట్కాఫ్ దొరకు (ప్రకాశం అభిమాన శిష్యుడు. (ప్రకాశాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు. ఒకసారి చింతలూరు కృష్ణారావనే విద్యార్థికీ, ప్రకాశానికి వివాదం వచ్చింది. ఈ కృష్ణారావు ప్రకాశం కంటే పెద్దవాడు. అతను ప్రకాశాన్ని కొట్టాడు. ప్రకాశం అతనిమీద పగ తీర్చుకున్నాడు. అదును చూచుకొని తన పక్షంగా ఒక జట్టు తయారు చేసుకొని అతనిని మళ్ళీ కొట్టాడు. కృష్ణారావు మెట్కాఫ్ దొరతో ఫిర్యాదు చేశాడు. మెట్కాఫ్ దొర (ప్రకాశం, కృష్ణారావుల నిద్దరినీ పిలిచి విచారించాడు. మూడు రోజులు తన యింటి దగ్గర పనిచేయడమనే ిక్షను విధించాడు. ఆ శిక్ష విద్యార్థులకు ఎంతో ఆనందదాయకంగా ఉండేది. పనిచేస్తూ ఉంటే విద్యార్థులకు ఆయన అనేకమైన మంచి విషయాలను బోధిస్తూ ఉండేవాడు కదా!
మన ప్రకాశం 35
(ప్రకాశం ఎఫ్.ఎ., చదువుతున్నప్పటి ఒక సంఘటనను గూర్చి తెలుసుకోవడం మనకు సరదాగా ఉంటుంది. ఇది (ప్రకాశం ఆత్మ గౌరవానికి సంబంధించింది.
అప్పుడు ప్రకాళం గారి ఆధ్యాపకులలో పురాణ పండ మల్లయ్యశా'స్రి గారు అనే ఒక ఉపాధ్యాయులుండేవాడు. ఆయన ఒక రోజు క్లాసులో తెలుగు పాఠం బోధిస్తున్నారు. ఈ మల్లయ్యశాస్రిగారు హాస్యప్రియులు. ఆయన క్లాసు చాలా సరదాగా ఉండేది. అందుచేత ఆ క్లాసులో ఆయన పారం అందరూ (శ్రద్దగా వినేవారు. ఆ క్రిందటి రాత్రి నాటకంలో వేషం వేశాడు ప్రకాశం. ఉదయమే క్లాసుకు రావలసి వచ్చింది. అలా హడావుడిగా రావటంలో రాత్రి వేసిన రంగు కొంచెం కొంచెం చెవుల దగ్గరా అక్కడా వుండిపోయింది. ఆ క్లాసులో మల్లంపల్లి వీరభద్రుడనే సహాధ్యాయి ఉండేవాడు. అఆ కుర్రాడు ప్రకాశం ముఖం మీద అక్కడక్కడా ఉన్న రంగును చూసి హ్తూళనగా ఏవేవో మాటలు మాట్టాడటం ఆరంభించాడు. అతను వేళాకోళం చేస్తున్నాడు. అతననే మాటలకి ప్రక్కన కూర్చున్న ఇతర విద్యార్థులు కూడా నవ్వుతున్నారు. ఇది చూశాడు (ప్రకాశం, కొంతవరకు సహించాడు. వీరభద్రుడు ఇంకా వేళాకోళం చేస్తూనే ఉన్నాడు. అతనదేపనిగా విసిగించడం చేత (ప్రకాశానికి బాగా చిరాకు కలిగింది. తెలుగుపాఠం చెప్పే శాస్త్రిగారు ఏదో (వ్రాసి చూపించటానికని బోర్జుకేసి తిరిగి వున్నారు. ఆదే అదననుకొని వెనక్కి తిరిగి తన వెనుక బెంచీలో కూర్చుని వేళాకోళం చేస్తున్న వీరభద్రుడి వైపు తిరిగి ఆతని చెంప ఛెళ్ళుమనిపించాడు ప్రకాశం. దాంతో క్రాసంతా గొల్టుమన్నారు. మల్లయ్య శాస్త్రి గౌరు ప్రకాశం కేసి తిరిగి విషయమంతా (గ్రహించి 'ఏమిరా ప్రకాశం! వీరభ(ద్రుడికి షేక్‌హాండ్ ఇచ్చావా ఏమిటి?” అన్నారు. దీనితో క్రాసులోని వారంతా మళ్ళీ గొల్లున నవ్వారు. ప్రకాశం చిన్నప్పటినుండి ఆత్మ గౌరవం కలవాడు. తన గౌరవానికి ఏమా(త్రం భంగం కలిగినా ఊరుకునేవాడు కాడు. దీనికి మరో సంఘటనను కూడా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
మన ప్రకాశం 36 ప్రకాశం ఏలూరు లక్ష్మీ నరసింహంగారి స్కూలులో చదువుతున్నప్పుడు నాటకాలలో వేషాలు వేస్తుండేవాడు. నాటకాలలో ఉత్త్రమమయిన అభినయం ప్రదర్శించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందేవాడు. ఈతని అభినయం చూసి (ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేసేవారు. అమలాపురంలో ఒకరోజు గయోపాఖ్యానం నాటకం ప్రదర్శిస్తున్నారు. అందులో ఈయన చేసేది ద్విపొత్రాఖినయం. హిందువులు ప్రదర్శించే నాటకాలను చూడాలనే కుతూహలంతో ఆ ప్రాంతంలో ఉండే ఇంగ్రీషు దొరలు కూడా వారివారి కుటుంబాలతో వచ్చి ఆ నాటకం చూశారు. ఆ నాటకం చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులుగారు రచించింది. ఆ నాటకాన్ని చూసి ఇంగ్లీషు దొరలు చాలా ఆనందం పొందారు. నాటకమయిపోయిన తర్వాత నిర్యాహకులకు ధన్యవాదాలు తెల్పి వారు వెళ్ళిపోయారు. ఆ మరుసటిరోజు ఉదయం ఎనిమిది గంటలకు తలా ఒక కమెరా తెచ్చుకొని ఆ ఇంగ్రీషు దొరలు అక్కడకు వచ్చారు. ఆ దొరలు ఈ నటులు మళ్ళీ వేషాలు ధరిస్తే ఆ వేషాలతో ఉన్న వారిని ఫొటోలు తీసుకుంటామని, ఆ అవకాశమివ్వమని కోరారు. దానికి తక్కిన పొత్రధారులంతా ఒప్పుకున్నారు. కాని (ప్రకాశం నిరాకరించాడు. 'పగటి వేషగాళ్ళలాగా కేవలం ఫొటో కోసం రంగు పూసుకోను" అని నిర్ష్యంద్వంగా తెలియజేశాడు. నాటక రచయిత చిలమర్తి లక్ష్మీ నరసింహం పంతులుగారు, (ప్రకాశం గారి గురువుగారైన హనుమంతరావు గారు కూడా చెప్పి చూశారు. ఎవరు చెప్పినా ప్రకాశం అంగీకరించలేదు. దీనికి కారణం ఆయన ఆత శై గౌరవమే కదా! ఆత్మ గౌరవం ఉండవలసిన సందర్భంలో ఆయన ఎవరినీ లెబ్జ చేసేవాడు కాదు.
మన ప్రకాశం 37 ప్లీడరు చదువు ఎఫ్.ఎ. క్లాసు అయిపోయిన తరువాత ఉడుకురక్తం కాస్త చల్గ్చారింది. నాటకాలాడినా, ఆటలాడినా తన జీవిత లక్ష్యాన్ని మాత్రం మరచిపోలేదు ప్రకాశం. జీవిత లక్ష్యం అంతా ప్లీడరీ మీదే వుండటం చేత చదువంటే బాగా శ్రద్ధ చూపాడు. ఒకవైపు నాటకాలు ఆడుతూనే వున్నాడు. పద్దెనిమిది వందల తాంఖభై ఒకటవ సంవత్సరంలో ఎఫ్.ఎ. పరీక్షకు హాజరై అందులో ఉత్తీర్ణుడయినాడు. అప్పటిలో ఎఫ్.ఎ. పరీక్షలో ఉత్తీర్ణుడయితే ఫస్టుగ్రేడు ప్లీడరీ పరీక్షకి ప్రైవేటుగా చదువవచ్చు. అలా చదువుదామని (ప్రకాశం ఆశించాడు. ఆ కాలంలో ప్లీడర్లకుండే ధనార్జనావకాశంతో షాటు వారికుండే హుందాతనం, స్వేచ్చ కారణాలుగా వీరి దృష్టి ప్లీడరీవైపుకు పోయింది. సెకండరీ (గ్రేడు ప్లీడరీ చదివి ఆ వృత్తిలో స్థిరపడదామని ఈయన ఉత్సాహపడ్డాడు. ఏలూరు లక్ష్మీనరసింహం పంతులు గారితో కలసి ఫస్టుగ్రేడు పరీక్షకు చదివాడు. తీరా చదువంతా పూర్తయిన తరువాత ఆ చదువుకు విఘ్నం వచ్చింది. ఇరవై సంవత్సరాల వయస్సు పూర్తి కాలేదు. కనుక ఆ పరీక్ష వ్రాయడానికి అవకాశం కుదరలేదు. దాంతో ప్రకాశం ఆశయానికి భంగం కలిగింది. ఒక సంవత్సర కాలం వృధా అయింది. ఫస్టుగ్రేడు పరీక్షకి పైవేటుగా వెళ్ళడానికి గల అవకాశాన్ని ఆ సంవత్సరంతో తీసేస్తారు. "అందుచేత పద్దెనిమిది వందల తొంభై రెండులో కాలేజీకి వెళ్ళి చదవడం తప్ప వేరే మార్గం కనబడలేదు. మదరాసులోని లా కాలేజీలో చదువంటే సామాన్యం కాదు. మళ్ళీ హనుమంతరావు నాయుడుగారికి ఒక సమస్య అవుతుంది. కానీ ఆయనను (శ్రమ పెట్టడానికి ప్రకాశం మొహమాటపడ్డాడు. కానీ ఆయనే 'ఎలాగో తంటాలు పడదాం సాహసించు' అని ప్రోత్సహించారు. (ప్రకాశం మదరాసులోని లా కాలేజీలో చేరాడు. అప్పుడు పెమ్మరాజు గు(ర్రాజా,
మన ప్రకాశం 38 సారంగు భీమ శంకరం, వరాహగిరి జోగయ్య, వేమలూరి వెంకట్రాయుడు, (ప్రకాశం కలిసి నల్లతంబి వీధిలో ఒక చిన్న భోజనవసతి ఏర్పాటు చేసుకొని చదువుకునేవారు. అప్పుడు వారు చదువుకొనే కాలేజీకి నెల్సన్ ప్రిన్సిపాల్‌గా వుండేవారు. నెల్సన్ పీనల్కోడొను చెప్పటంలో దిట్ట. అతని వ్యాఖ్యానమే ప్రమాణంగా ఉండేది. కృష్ణస్వామి ఆయ్యరుగారు, టివి. శేషగిరియ్యంగారు, హెచ్. రంగప్పగారు మొదలయినవారు అధ్యాపకులుగా ఉండేవారు. ఈ అధ్యాపకులంతా చాలా పేరు (ప్రఖ్యాతులు గలవారు. ప్రకాశం 'లా' కాలేజీలో చదివిన సంవత్సరం పాటు చాలా (శ్రద్ధగా చదివాడు. ఇండియన్ లా ఆంతా త్రుఖ్మంగా చదివాడు. (ప్రకాశం మొదటి తరగతిలో వస్తాడని మిత్రులంతా అనుకున్నారు. అతను "క్రిమినల్ ప్రాసీజర్ కోడ్ పేపరు అతిగా చదవడం వల్ల సరిగా రాయలేకపోయాడు. దానితో రెండవ తరగతిలో వచ్చాడు. సెకండరీ (గ్రేడు పట్టా మాత్రమే లభించింది. ప్లీడరీ పరీక్ష ఉత్తీర్ణుడవడంతోనే సొంత ఊరైన ఒంగోలు వచ్చాడు. అక్కడ ఐదారు (క్రిమినల్ కేసులు వాదించి గెలిపించాడు. దానితో ఆయన పేరు గొప్పగా వినబడింది. చుట్టుపక్కల ఊళ్ళలో కూడా (ప్రకాశం పేరు మారుమోగింది. బంధుమి(త్రులంతా ఒంగోలులోనే (ప్రాక్టీసు పెట్టుకొ మ్మని బలవంతం చేసినప్పటికీ ప్రకాశం మాత్రం రాజమహేందద్రవరంలోనే ప్రాక్టీసు పెట్టుకొనడానికి నిశ్చయించుకున్నాడు. ప్లీడరు వృత్తి పద్దెనిమిదివందల తొంభై నాలుగవ సంవత్సరంలో, రాజమహేం[ద్రవరంలో (ప్రాక్టీసు ప్రారంభించాడు ప్రకాశం. అప్పటికి రాజమహేంద్రవరంలో (ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులు బి.ఎల్, ప్లీడరు, ఫష్టుగ్రేడు స్లీడర్లు, సెకండ్ గ్రేడు ప్లీడర్లు వాలస్ పట్టాదార్డు అని నాలుగు విధాలుగా ఉండేవారు. న్యాయవాదులకు సంఘంలొ ప్రముఖ స్టానం లభించేది. నాయకులుగా కూడా వారే ఎన్నిక కాబడేవారు. మేధావి వర్గంలో కూడా
మన ప్రకాశం ఏం న్యాయవాదులకు మంచి గుర్తింపు ఉండేది. అనాటి వృత్తి స్థితి అది. వయసులోనూ, అనుభవంలోనూ, విద్యలోనూ తనకంటే పెద్దలైన న్యాయవాదులు చాలామంది ఉన్నప్పటికీ ఆత్మ విశ్వాసంతో కూడిన చురుకైన అతని వాదనే 'ప్రతికేసులోనూ, (ప్రకాశాన్ని గెలిపించేటట్టు చేసేది. ఎప్పుడూ, ఎంతో ధైర్యంగా మాట్టాడేవాడు. ఆయన మాట్లాడుతుంటే వినేవారందరికీ కుతూహలమూ, ఉత్సాహమూ కలిగేవి. త్వరలోనే పెద్ద ప్లీడర్ల జాబితాలో ప్రకాశం కూడా చేరిపోయాడు. రాజమండ్రి కోర్టులలోనేకాక, వీలూరు మొదలైన ఇతర ప్రదేశాలలో కూడా ఆయన కీర్తి ప్రతిష్టలు విస్తరించాయి. ఆయన ఇతర సీనియర్ న్యాయవాదులకన్నా అధికంగా ఫీజు వసూలు చేసినప్పటికీ, కక్షీదారులు ఆయన వద్దకే వచ్చేవారు. కారణం, ఆయన కేసును క్షుణంగా పరిశిలించి, పూర్తి న్యాయం చేకూర్చేలాగా వాదిస్తాడనే నమ్మకం ఉండటమే. (ప్రకారం గారికి పట్టుదల చాలా ఎక్కువ. అందుకే, క్రింది కోర్టులలో ఒక వేళ తీర్పు అనుకూలంగా రాకపోతే, హైకోర్టుకు అప్పీల్ చేసి, తన కేసులను హైకోర్టు వకీళ్ళద్వారా వాదించేటట్టు చేసి గెలిపించేవారు.
రాజమండ్రిలో (ప్రాక్టీసు పెట్టిన ఆరు మాసాలకే (ప్రకాశం పేరు (ప్రతినోటా వినబడింది. ఆ రోజుల్లో (క్రిమినల్ కేసులలో మేజి(స్టేటు ధాటికి నిలబడే ప్లీడర్లకు "ఫైలు బాగా ఉండేది. కేసులలో బలం లేదని ఇతర ప్లీడర్హు వదులుకున్న కేసులను ప్రకాశం పట్టుబట్టి, చేపట్టి విజయం సాధించేవాడు. ఒకప్పుడు ఇద్దరు కుర్రవాళ్ళ మీద రైల్వే పార్ళిల్లో నుండి వెండి పాళీలు తస్కరించారని కేసు వచ్చింది. పోలీసులు, రాజమండ్రిలో, సారంగధరుడి మెట్టవద్ద దాచి పెట్టబడిన వెండిపాళీలు చూపించారు. ఇద్దరు కు(ర్రవాళ్ళలో ఒక కుర్రవాడి తండ్రి ప్రకాశం వద్ద పనిచేస్తూ ఉండేవారు. అందువల్ల, ప్రకాశం (శ్రద్ధ తీసుకొని ఆ కేసు చేపట్టాడు. చోరీ అస్తి చూపించినంత మౌత్రాన నేరం బుజువు కాదని గట్టిగా వాదించాడు. మేజి'స్ట్రేటు విచారణ చేసి, కేసును సెషన్సుకు పంపించాడు. ఒక ముద్దాయి నేరం ఒప్పుకొన్నందువల్లను, సెషన్సు జడ్జి ఒక అభిప్రాయానికి ముందే రావడం వల్లనూ నేరం ధృవీకరిస్తూ తీర్పు వచ్చింది. నేరం ఒప్పుకొన్నవాడికి ఒక సంవత్సరం శిక్ష
మన ప్రకాశం 40 ఒప్పుకోనివాడికి ఐదేళ్ళ శిక్షా విధించారు. పట్టుదల హెచ్చి, ప్రకాశం ఆ కేసును హైకోర్టుకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఆడమ్స్ అనే లాయరును పెట్టి కేసును నడిపించాడు. న్యాయశా(స్త (గ్రంథాలన్నీ క్షుణ్మంగా పరిశీలించి ఒక తీర్పును పట్టుకున్నాడు. చోరీ ఆస్తిని గురించిన ఆచూకీ ఇచ్చినంత మాత్రాన, ఆ నేరం బుజువు కాబోదని అందులో స్పష్టంగా ఉంది. ఆ తీర్చు చూపించడంతో, హైకోర్టు న్యాయమూర్తులు, శిక్షను కొట్టివేసి ముద్దాయిలను విడుదల చేశారు. దీనితో (ప్రకాశానికి మరింత పేరు వచ్చింది. ప్రకాశం పంతులు జీవితంలో అప్పటివరకూ పట్టి పల్హార్భిన దారిద్ర్యం (క్రమేపీ దూరమై పోయింది. (ప్రముఖ న్యాయవాదిగా పేరు గణించడమే కాక్క అత్యధిక ఫీజులను వసూలు చేసే న్యాయవాదిగా కూడా గుర్తింపు పొందాడు. ధనార్జన బాగా పెరిగింది. జీవితంలో అడుగడుగునా ఆదుకొన్న తన (శ్రేయోభిలాషి హనుమంతరావు నాయుడుగారి కుటుంబభారం కూడా కొంతవరకు భరించడంలో తన విధిని పరిమితంగానైనా నిర్వర్తించగలిగాడు (ప్రకాశం. ఛనార్జన పెరగడంతో పాటుగానే, ఖర్చుకూడా పెరిగింది. ఆ మధ్యకాలంలో మునసబు కోర్టులో రంగమన్నారు అనే ఆయన మునసబుగా పండేవారు. ఆయన మొదట కోర్టులో గుమాస్తాగా ఉండి (క్రమంగా సైకొచ్చినవాడు. చాలా తెలివిగలిగిన వ్యక్తి అయితే ఆయన లంచగాండి అని, పక్షపాతియని అపవాదు ఉండేది. ఎందుచేతనో కారణం తెలియదు గాని ప్రకాశం యెడల ఆయన కొంచెం సుహృద్భావంతో ఉండేవారు. (ప్రకాశం ఎప్పుడూ ఆయనను ఆశ్రయించలేదు. కానీ ఆయన ప్రకాశానికి సహాయం చేస్తుండేవారు. దానివల్ల కూడా ప్రకాశానికి ఫైలు పెరిగింది. ఈ విధంగా కొంతకాలం గడచిన తరువాత ఈ రంగమన్నార్కీ ప్రకాశానికి తగాదా వచ్చింది. దాంతో స్థానికంగా (ప్రకాశానికీ సివిల్ (ప్రాక్టీస్ తగ్గింది. కానీ [క్రిమినల్ ప్రాక్టీస్ బాగానే నడచింది.
మన ప్రకాశం 4]
ప్రకాశం ప్రాక్టీసు రాజమహేంద్రవరంలోనే కాకుండా జిల్దాలోను, పక్కనున్న ఏలూరు వగైరా పట్టణాలలోను కూడా బాగానే ఉండేది. డబ్బు కూడా దానికి తగ్గినట్టుగానే వస్తూండేది. ప్లీడరు వృత్తిలోని సంపాదనలో ప్లీడరైనవాడు తన విలువ తానే నిర్ణయించు క్షోవాలి. ప్రకాశం తన విలువ చాలా హెచ్చుగానే ఉంచాడని చెప్పవచ్చు. ప్రకాశం తోటి ప్లీడర్లు, అందులోను బి.ఎ.బి.ఎల్.లు కూడా ఇరవై ఐదు రూపాయలు పుచ్చుకునే కేసులో (ప్రకాశం నిర్మొహమాటంగా వందరూపాయలు పుచ్చుకునేవాడు. వేరే (గ్రామం వెళ్ళాలంటే పల్లకీ వగైరా వాహనాలలో వెళ్ళేవాడు.
ఒక కేసులో పోలవరం, జంగారెడ్డి గూడెం మొదలైన ప్రదేశాలకు వెళ్ళినందుకు పల్లకీ మొదలైన ఖర్చులు గాక రోజుకు నూరు రూపాయలు ఫీజుగా పుచ్చుకున్నాడు. డబ్బనేది పోయే సమయంలో ఎలా చేతులూ కాళ్ళూ వచ్చి పోతుందో అలా గే వస్తుంది కూడా. డబ్బు వస్తున్నట్టుగానే ప్రకాశం సంసార ఖర్చుకూడా బాగానే పెరిగింది. మొదటిరోజులలో కోర్టుకు వెళ్ళటానికి ప్రకాశం ఒక ఒంటెద్దు బండిని పెట్టుకున్నాడు. దానికి చక్కగా రంగులు వేయించి ప్రత్యేకంగా ఉండేటట్టు చేశాడు. తర్వాత క్షొంతకాలానికి ఒక డాకార్జు, చక్కని పోనీ (గుజ్జము) కొన్నాడు. ఆ తర్వాత కొంతకాలం గుజ్జాలన్లు కొనడం, వాటిని పెంచడమూ కాలక్షేపంగా ఉండేది. అప్పటికి డాకార్డు పెద్ద ప్లీడైన నేతి సోమయాజులు గారికొక్కరికే ఉండేది. అప్పట్లో ఆయనతో పాటు (ప్రకాశానికి కూడా ఒక డాకార్డు ఉండాలని సరదా పడ్డాడు. అది కూడా తీరింది.
(ప్రాక్టీసు ప్రారంభించిన కొంద్ది రోజులలోనే అతను పట్టిన కేసులలో ముఖ్యంగా చెప్పుకోవలసింది మాగంటి లక్ష్మణదాసు కేసు. దాని కర్ణణా కేసని పేరు. లక్ష్మణ దాసు ఏలూరు దగ్గర ఉండే చాటప(ర్రు (గ్రామనివాసి. కమ్మ కులస్టుడు. మంచి పలుకుబడి కలవాడు, అతనొకసారి టోలుగేటు ఫీజు ఇవ్వకుండా పోయి, కాంట్రాక్టరు మీద జబర్దస్తీ చేసాడని కేసు. ఆ టోలుగేటు ఫీజు అర్హణా. ముందు బెంచి కోర్టులో కేసు పెట్టారు.
మన ప్రకాశం తం కానీ ఎప్పుడైతే పట్టుదల కొద్దీ వాదించదలుచుకున్నాడో, అప్పుడు పోఠీసులు దాన్ని పెద్దకేసుగా మార్చి, ఏలూరు సబ్ కలెక్టర్ దగ్గర పెట్టారు. సబ్ కలెక్టర్ కెర్లాప్ అనే పార్ళీ. అతను ఐ.సి.ఎస్. ఉద్యోగి. ఆతను మొదటి నుండి ముద్దాయికి వ్యతిరేకమైన రిమార్కులు ప్యాస్ చేస్తుండటం వల్ల అతను కేసు విచారణ చేయకూడదని, ఇంకొక మేజి(స్టేటు దగ్గరకు కేసు మార్చాలని హైకోర్టుకు పిటీషను పెట్టాడు ప్రకాశం, కానీ అతడు ఈ పిటీషన్‌ను లక్ష్యం చేయకుండానే కేసు విచారించి ఐదు వందల రూపాయలు జరిమానా విధించేట్టు కనపడ్డాడు. అతని ధోరణి చూస్తే శిక్ష కూడా విధించేటట్టు కనబడింది. అందుచేత రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో అప్పీలు చేయించాడు. (ప్రకాశం అక్కడ మరో సీనియర్ ప్లీడర్ను ఏర్పాటు చేసి కేసు నడిపించాడు. కానీ అక్కడ కేసు గెలవలేదు. కింది కోర్టు తీర్పే ఖాయపడింది. అందుకని ఆ తర్వాత హైకోర్టుకు అప్పీలు చేయించి ఆ అప్పీలు విషయంలో స్వయంగా కృషి చేసి కేసును గెలిపించాడు. దానితో ప్రకాశం పేరు ఆ ప్రాంతమంతా విస్తరించింది.
న్యాయవాది వృత్తిలో రెండుచేతులా సంపాదిస్తున్న సమయంలో ప్రకాశం రాజమహేం(ద్రవరం మునిసిపల్ రాజకీయాలలో జోక్యం చేసుకోవడమూ జరిగింది.
పురవాలక సంఘ రాజకీయాలు
స్వతంత్రంగా ప్లీడరీ వృత్తి చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు ప్రకాశం, రెండు చేతులా సంపాదించుకుంటున్నాడు కూడా. అప్పుడు రాజమహేంద్రవరం మునిసిపల్ రాజకీయాలు (ప్రకాశాన్ని ఆకర్షించాయి. రాజమహేం[ద్రవరం పురపాలక సంఘం ఆం(ధ్రదేశంలోని అన్ని పురపాలక సంఘాలకంటీ అతి పురాతనమయింది. దీనికి ఆ నాటికే 'సుమారు యాభై, అరవై వేల ఆదాయం ఉండేది. (ప్రకాశం చదువుకోసం రాజమహేంద్రవరం వచ్చేనాటికే అక్కడి మునిసిపల్ రాజకీయాలు జోరుగా ఉండేవి.
మన ప్రకాశం 43 అప్పటిలో ఉద్యోగస్తులు అంటే ప్రొఫెసర్డు, రెవెన్యూ ఉద్యోగస్తులు పురపాలక సంఘాధ్యక్షులుగా ఉంటూ ఉండేవారు. ఈ ఆనవాయితీని తప్పించి ఏలూరి లక్ష్మీ నరసింహం గారు ఉద్యోగస్తులు కాకపోయినా రాజమహేంద్రవరానికి పురపాలక సంఘాధ్యక్షులు అయినారు. ఈ ఏలూరు లక్ష్మీ నరసింహంగారు ఆనాటి పురపాలక సంఘ కార్యక్రమాలలో మకుటం లేని మహారాజులాగా చెలామణీ అయినారు. న్యాపతి సుబ్బారావు పంతులు గారు, ములుకుట్ల అచ్యుతరామయ్య గారు, నేతి సోమయాజులు గారలు ఆనాడు రాజమహేంద్రవరంలో పురప్రముఖులై విరాజిల్లుతూ ఉండేవారు. వీరు లక్ష్మీ నరసింహం గారిని ఓడించడానికి అవకాశమొచ్చి నప్పుడల్హా ఏదో విధంగా ప్రయత్నిస్తూ ఉండేవారు. ఆయనమీద ఏవో రకరకాల పన్నాగాలు పన్నేవారు. రాజకీయాలలో దెబ్బతీయటానికి, ఆయనను అప్రతిష్టపాలు చేయడానికి ఎవరు ఎన్ని విధాల (ప్రయత్నించినా ఏలూరు లక్ష్మీ నరసింహంగారు మాత్రం లొంగేవారు కాదు. ఆయన ప్రజల సొమ్ము కైంకర్యం చేసే మనిషి కాడు. నరసింహంగారిని ప్రత్వక్షంగా దెబ్బతీయలేమని తలచిన విపక్షీయులు ఆయన మీద వ్యక్తిగతమైన నిందలు మోపడం ప్రారంభించారు. ఈ (ప్రచారానికి స్టానిక పత్రికలు కూడొ సహాయపడ్డాయి. చిత్రమైన, వ్యంగ్యమైన అనేక కథలు ఏలూరి లక్ష్మీ నరసింహంగారి మీద ఆనాటి ఒక (ప్రముఖమైన పత్రికలో వస్తూ ఉండేవి. ఈ అల్లరి నరసింహంగారిలో బాగా నిస్పృహ కలిగించింది. తన స్టానంలో నిడమర్తి దుర్గయ్యగారిని పురపాలక సంఘాధ్యక్షుణ్మి చేసి ఆయన ఆ పదవి నుండి తప్పుకున్నారు.
దుర్గయ్యగారు చాలాకాలం ఛైర్నున్గా ఉన్నారు. ఆ రోజులలో రాజకీయంలో బాగా అనుభవం గల వాడని అందరిచేత ప్రశంసలు పొందిన వ్యక్తి రాయపూడి సుబ్బారాయుడు, ఆయన ఎక్కువగా చదువుకొన్నవాడు కాదు. ఐతేనేం? చాలా ప్రతిభావంతుడు. పురపాలక సంఘపరమైైన వ్యవహారాలు నడపడంలో అందెవేసిన చేయి. ఎవరు మున్సిపల్ కౌన్సిలర్ కావాలనుకొన్నా, చైర్మన్ కావాలనుకొన్నా ఆయన సహాయం కావలసిందే. లేకపోతే ఆది అసంభవమే. ఆ దుర్గయ్యగారు ఈ సుబ్బారాయుడి
మన ప్రకాశం తీ గారి సహాయంతోనే చాలా కాలం పురపాలక సంఘాధ్యక్షునిగా పనిచేశారు. దుర్గయ్యగారికి ఆ స్టానంలో ఆయనను నిలిపిన ఏలూరి లక్ష్మీనరసింహంగారి అండదండలూ వున్నాయి. నేతి సోమయాజులుగారూ, మొదలైన వారు కౌన్సిలులోనికి రావడానికి ప్రయత్నించారు. కాని సఫలురు కాలేకపోయారు. చివరికి (ప్రభుత్వంలో వారికున్న పలుకుబడి నాధారం చేసుకొని నామినేటెడ్ సభ్యులుగా ప్రవేశించారు. కాని దుర్లయ్యగారికి ఉన్న పలుకుబడి వలన వారి మాట సాగేది కాదు. వారు విసిగి వేసారి చివరకు కౌన్సిల్‌కు రాజీనామా ఇచ్చివేశారు.
ఈ వ్యవహారాలన్నింటిలో రాయపూడి సుబ్బారాయుడి గారి హస్తముంది. ఈయన తలుచుకొంటే సింహాసనం ఎక్కించగలడు. కాదంటే దింపి వేయనూ గలడు. అంత ప్రతిభాశాలి కనుకనే ఆయన గూర్చి ఇక్కడ (ప్రస్తావించడం జరిగింది.
ఈ రాయపూడి సుబ్బారాయుడు గారికి కోర్టులో కూడా చాలా దావాలు ఉండేవి, రంగమన్నారుగారు పదవిలో ఉండే సమయంలో లాయర్‌గా అప్పటికే పేరు ప్రఖ్యాతులు గడించిన (ప్రకాశానికి 'క్షయింటు" అయినాడు. అప్పటికే ఈ సుబ్బారాయుడి గారికీ, పురపాలక సంఘాధ్యక్షులయిన దుర్గయ్యగారికి ఆంతళ్ళీతలాలు బయలుదేరాయి, బయలుదేరడంలో ఆశ్చర్యమేమీ లేదు. దుర్గయ్య గారు చైర్మన్ పదవిని అధిస్టించడానికి తాను సహాయం చేశాడు. కనుక పరిపాలనలో తన హస్తముండాలని అనుకొనేవాడు. వ్యవహారాలలో లోతుగా జోక్యం కలుగచేసుక్సొనేవాడు.
ఛైర్మన్ పదవిలో నున్న దుర్గయ్యగారు స్వతంత్రమైన ప్రవృత్తిగలవాడు. పురపాలక సంఘ వ్యవహారాలలో సుబ్బారాయుడు గారు జోక్యం కలుగజేసుకొనడానికి దుగ్లయ్యగారు అంగీకరించలేదు. ఇంకేం? తగవులు 'ప్రారంభమయినాయి.
సుబ్బారాయుడి గారి ఆలోచన ప్రత్యేకమైన మార్గంలో ప్రయాణించింది. తనని గుర్తించని, తన సహాయాన్ని మరిచిపోయిన దుర్గయ్యగారిని ఛైర్మన్ పదవినుండి తప్పిస్తే?...
మన ప్రకాశం శ్శీ5్
ఆలోచన సాగిపోతున్నది. దుర్లయ్యగారికి గట్టి పోటీ నివ్వగల వ్యక్తిని గురించి ఆలోచిస్తున్నాడు. వెంటనే ఆయన స్మృతిపధంలో మెదిలిన వ్యక్తి ప్రకాశం. సింహంతో సమానమైన ధైర్యం గలవాడు. ప్లీడరు వృత్తిలో రెండు చేతులా ఆర్టిస్తున్నవాడు; ఊళ్ళో అప్పటికే పదిమందిలో పలుకుబడి సంపాదించుకొన్నవాడు ప్రకాశం.
ప్రకాశం పేరు ఆయన స్మృతిపథంలో తళుక్కుమని మెరవగానే తన ఆలోచనను కార్యరూపంలో ఉంచడానికి ఉద్యుక్తులయినారు. ఆయన తిన్నగా (ప్రకాశం గారి ఇంటికి వచ్చి, ఉపోద్దాతమేదీ లేకుండానే విషయాన్ని ప్రస్తావించారు.
గడిచిన కొన్ని రోజులుగా రాజమహేంద్రవరంలో జరిగే కొన్ని దుస్సంఘటనలు ప్రకాశం గారి దృష్టిలో పడుతూ వచ్చాయి. తాను పురపాలక సంఘ రాజకీయాలలో ప్రవేశిస్తే పురజనులకు కొంత సేవచేయవచ్చు.
ఇప్పుడేమో అవకొశం వెదుక్కుంటూ వచ్చింది. వీరి కోరిక నంగీకరిస్తే! రాజకీయాలలో ప్రవేశిస్తే...
ఆలోచిస్తున్నాడు ప్రకాశం తనేమనుకొన్నాడు!
ఇప్పటి వరకూ తను సెకండ్ క్లాస్ ప్లీడరే కదా! బి.ఏ. పూర్తి చేయాలి! ఫస్ట్ గ్రేడ్ ప్లీడర్ కావాలి! తనని ఇంతవాడిని చేసిన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారి సలహా అది! ఆ సలహాను శిరోధార్యమని భావించాడు. బి.ఏ, పరీక్ష ఒక్కొక్క భాగంగా (బ్రాయాలనే సంకల్పం కూడా కలిగింది! ముందుగా తెలుగు పరీక్షకు హాజరు కావడం జరిగింది. అందులో ఉత్తీర్ణుడవడం కూడా జరిగింది...
“ప్లీడరు ప్రకాశం గారూ! ఏమిటండీ ఆలోచిస్తున్నారు. మీరు పురపాలక సంఘ రాజకీయాలలో ప్రవేశిస్తే, పట్టణం సురోభివృద్ది సాధిస్తుంది. మీకు వ్యక్తిగతంగా కొంత నష్టమేననుకోండి! మీరు మీ వృత్తికి అంకితం చేసే సమయంలో కొంత సమయాన్ని, మి ఆలోచనలలో కొంత భాగాన్ని రాజకీయాలకు కేటాయించవలసి ఉంటుంది. మీ విద్యాభివృద్ధికి అఆటంకవే ! కాని ప్రజల (శ్రేయస్సు కోసం మీరామాత్రం త్యాగం చేయవలసిందేనండి!
మన ప్రకాశం 46 నచ్చచెపుతున్నట్టుంది సుబ్బారాయుడి గారి ధోరణి! ఆలోచిస్తున్న ప్రకాశం మనసు రాజకీయాలలో (ప్రవేశించడం వైపు మొగ్గు చూపింది. తానే పనిమీద అక్కడకు వచ్చాడో, ఆ వనిని సారధించగలిగాడు సుబ్బారాయడుగారు! (ప్రకాశం రాజకీయాలలో ప్రవేశించాడు, ఆ కాలంలో పురపాలక సంఘాలకు ప్రతి సంవత్సరమూ ఎన్నికలు జరుగుతూ ఉండేవి. పట్టణమంతా వార్డులుగా విభజించబడేవి. వార్డులోని ప్రజలు కౌన్సిలర్‌ను ఎన్నుకొనేవారు. ఆ కౌన్సిలర్లు చైర్మన్‌ని ఎన్నుకొనేవారు. చైర్మన్ ఎన్నిక పరోక్ష పద్దతిలో జరిగేదన్నమాట! మొదట రాజకీయాలలో ఓటమే ఎదురయింది. ఎన్నికలలో ఓడిపోయినా ఆయన ధైర్యం చెక్కు చెదరలేదు, తన (ప్రతిపక్షంలో ఉన్న మంచిని, చైతన్యాన్ని కూడా (ప్రకాశం గుర్తించే వాడంటే ఆయన వ్యక్తిత్వం ఎంత ఘనమైందో మనకు తెలుస్తుంది. పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో నాలుగవ వార్డుకు ఆయన కౌన్సిలర్‌గా ఎన్నికయినాడు. సుబ్బారాయుడు గారు ప్రభృతుల ప్రోత్సాహంతో ప్రకాశం ఎన్నికలకు నిలిచినపుడు, అప్పటి ఛైర్మన్ దుర్గయ్యగారు ఈయనను ఎన్నికకాకుండా చేయడానికి (ప్రయత్నించేవారు. శ్రమపడి ఎన్నికలలో విజయం సాధించడానికి ఎన్నో ఏర్పాట్టు చేసుకొనేవాడు. దుర్గయ్యగారు నూత్రం ఆఖరు రోజు రాత్రి తన ఛైర్మన్ పలుకుబడి ఆంతా ఉపయోగించి ఓటర్లను తనవైపు తిప్పుకొనేవాడు, ఆయనమీద ఎన్నికల పిటీషన్దు పెడుతూ ఉండేవాడు (ప్రకాశం. వాటి నన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉండేవారు దుర్గయ్యగారు. దుర్గయ్యగారు ఛైర్మన్ పదవిలో ఉన్నా, (ప్రతికక్షులుగా ఉన్నా ఆయన ధైర్యాన్ని, సామర్థ్యాన్ని మెచ్చుకొనేవాడు ప్రకాశం. “ప్రతిభావంతులు”, 'మేధావులు', 'సర్వస్వతం(త్రులు”, నైతికబలం కలవారు, పరిపాలనా దక్షులు' అని ప్రతిపక్షంలోని వారి గొప్పదనాన్ని మెచ్చుకొన్న బుజువర్తనుడు (ప్రకాశం. దుర్గయ్యగారు మునిసిపల్ రాజకీయాలలో ప్రతిపక్షి అయినా ఆయన దైర్యము, సుగుణాలు గమనించిన ప్రకాశానికి ఆయన యందు అభిమానమే ఉండేది.
మన ప్రకాశం 47
పద్దెనిమిది వందల తొంబై ఎనిమిదవ సంవత్సరంలో కాబోలు మండవల్లి సుబ్బారావుగారి మీద సోటీ చేసి ఓడిపోయాడు (ప్రకాశం. అప్పుడు ఆనాటి అక్కడి సజ్కలెక్టర్కు పిటీషన్ పెట్టాడు. చైర్మన్ పదవిలో ఉన్న దుర్గయ్యగారు ఆయనకున్న పలుకుబడి అంతా ఉపయోగించి, తనను ఎన్నికకాకుండా చేశారని అందులో దుర్గయ్యగారి మిద అభియోగం మోపబడింది. వోటర్లను తిప్పివేసి తానుఎన్నిక కావడానికి అవరోధం కల్సించారనీ, కనుక ఆ ఎన్నిక రద్దు చేయవలసిందిగా కూడా అందులో కోరడం జరిగింది. త పిటీషన్‌ను ఆధారం చేసుకొని సబ్ కలెక్టర్ దుర్గయ్యగారికి నోటీసు పంపించి, కోర్టుకి రప్పించారు. కూర్చోండని ఆహ్వానించి, కూర్చీ చూపించారు. చైర్మన్ దుర్గయ్యగారు కూర్చున్నారు. పిటీషనర్ అయిన ప్రకాశం అక్కడకు వచ్చాడు.
“ఏమండీ, సబ్ కలెక్టరు గారూ, నేను ఆ పెద్దమనిషి మీద నేరారోపణ చేస్పే మీరు ఆయనకు కుర్చీ ఇచ్చి కూర్చుండబెట్టి, నన్ను దోషారోపణ చేయమంటున్నారు. ఇది ఏమైనా సబబుగా ఉన్నదా?” అని అడిగాడు (ప్రకాశం.
సబ్ కలెక్టరు చైర్మన్ దుర్గయ్యగారికి వైపుకు తిరిగి “ప్పెజ్రీషనర్ ఏమటున్నారో విన్నారు కదా! మీ మీద వచ్చిన పిటీషన్‌కు మీరేమంటారు?” అన్నాడు. ఇది విన్నారు దుర్గయ్యగారు.
“అయ్యా సబ్ కలెక్టరు గారూ! ఎన్నికల సమయంలో నేను కాన్వాసు చేసిన మాట నిజమే, ఆ పెద్దమనిషి మునిసిపల్ కౌన్సిలర్ 'పదవిలోనికి రావాలని ఎంత 'ప్రయత్నం చేస్తున్నాడో, రాకుండా చేయడానికి వోటర్ని అయిన నాకూ అంతే హక్కున్నది” అని తన
వాదాన్ని వినిపించారు. ఆవేశంలో అప్పటికేదో ఆయనతో ప్రతివాదన చేసినా ఆయన చెప్పిన పద్దతికి, సాహసానికి ప్రకాశం చాలా సంతోషించాడు.
దుర్షయ్యగారి తరువాత మోచర్ల రామచం[ద్రరావు పంతులు గారు రాజమహేంద్రవరం పురపాలక సంఘాధ్యక్షులయినారు. ఆయన మరి రెండు సంవత్సరాలు ఆ పదవిలో నున్నారు.
మన ప్రకాశం శ్రి ఆ తరువాత ఆత్యధిక సంఖ్యాకులైన కౌన్సిలర్లనే ఎన్నుకొనబడి (ప్రకాశం రాజమహేంద్రవరం పురపాలక సంఘహాధ్యక్షుడయినాడు, ఆయన ప్రత్యక అయిన అత్యుత రామయ్యకు రెండోమూడో ఓట్టు వచ్చినాయి. పద్దెనిమిది వందల తాంఖైఆరులో రాజకీయాలలో (ప్రవేశించిన (ప్రకాశం పందొమ్మిది వందల నాటికి పురపాలక ఒకనాడు చూద్దామని కేవలం రెండు జతల బట్టలతో రాజముహేం(ద్రవరానికి వచ్చిన (ప్రకాశం, అక్కడే ఉండిపోయి విద్య నభ్యసించి, ప్లీడర్ వృత్తిలో ప్రవేశించి, దానిలో ఉన్నత శిఖరాల నదిస్టించడమే కాక ప్రజా జీవనంలో (ప్రవేశించి, పురపాలక సంఘాధ్యళ్షుడై ఆ పురానికి ప్రథమ పౌరుడు కాగలగడం నిజంగా ఎంత గొప్పు విషయం! అప్పటికి ఆయన వయను కేవలం ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే! ఎన్నిక అయిన తరువాత ఓడిపోయిన హెర్టీకి చెందినవారు ప్రకాశానికి అనేకమైన నష్టాలను కలిగించడం (ప్రారంభించారు. కాని మున్సిపల్ వ్యవహారంలో మాత్రము (ప్రకాశం జోలికి రాలేకపోయేవారు. (ప్రకాశం పురపాలక సంఘ వ్యవహారాలను శక్తి వంచనలేకుండా, చా(గ్రత్తగా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేవాడు. ఉదయం ఆరు గంటలకు గుణ్ణం మీద బయలు దేరేవాడు. ఊరు నాలుగు మూలలా షర్యటించేవాడు, రాజమహేంద్రవరం అప్పటికి ఇప్పుడున్నంత పెద్దది కాదు. ఉద్యోగస్టులు కూడా ఎక్కువ మంది ఉండేవారు కారు, అప్పటికి గోదావరినదికి కట్టలేదు, ఎక్కువ సంఖ్యలో జనం స్నానాల రేవులలో స్నానాలు చేస్తూండేవారు. ఆ రేవులు జనం మురికి చేయకుండా చూసేందుకు కొంతకాలం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయించడం జరిగింది. గోదావరి నదికి కట్టకడితే ఉపయోగకరంగా ఉంటుందనీ, ప్రమాదాలు సంభవించకుండా ఉంటాయనే ఒక్ష భావాన్ని ప్రచారం చేశాడు, పురపాలక సంఘాధ్యక్షుడుగా ప్రకాశం గోదావరికి గట్టు నిర్మించాలి. దానిని సొగసుగా ఉంచాలి అనే అభిప్రాయాన్ని సూత్రప్రాయంగా ఆయన అందరిచేత ఆంగీకరింపచేశాడు.
మన ప్రకాశం ఉం
పురపాలక సంఘానికి చెందిన పాలనా కార్యక్రమాలు కొంతకాలం చక్కగా పేచీలు లేకుండా సమర్దవంతంగా సాగాయి. మొదటి సంవత్సరం పాలన సంతృప్తికరంగానే సాగింది. ఈ యోగ్యతా పత్రం ఎవరిదో కాదు. రాజమహేంద్రవరం పురపాలక సంఘ కార్య(క్రమాలన్నింటినీ పరిశీలించి ఆనాటి ప్రభుత్వం సాధికారకంగా ప్రకటించిన విషయం ఇది.
పరిపాలన సజావుగా సాగుతున్నది. ప్రభుత్వం అక్కడ జరుగుతున్న పనిని గురించి సంతృప్రిపడింది. కాని ప్రతికక్షులకు మాత్రం ఈ వాతావరణం పూర్తిగా నచ్చలేదు. తమను అధికారంలోకి రానీయకుండా ప్రకాశం పదవిలోనికి వచ్చాడు. పైగా పరిపాలన సజావుగా సాగుతున్నది. (ప్రకాశం గారి రాజకీయ ప్రతికక్షులకు ఇది చాలదా! ఈర్చ్యా ద్వేషాలతో వారి హృదయాలు భగ్గుమంటున్నాయి. ఎలాగో అలా (ప్రకాశం మీద కక్ష సాధించాలి.
ఆయన సింహమే! ఆయన మీద కక్ష సాధించడమెలా! పురపాలక సంఘాధ్యక్ష పదవికి ఎన్నిక జరిగిన సందర్భంలో ఆయనకు సహాయపడిన వారిని ఇబ్బంది పెడితే సరి! వారిమీద ఏదో ఒక తంటా తెచ్చి కక్ష సాధించడానికి పూనుకున్నారు. అదిగో! ఆ ఉద్దేశ్యంతోనే ప్రకాశానికి పార్టీ పరంగా బాగా సహాయంగా ఉండే 'ఆరాముదయ్యం' గారి మీద ఒక కేసు మోపారు. ఆ కేసు ఏమిటంటే ఆరాముదయ్యంగారు, ఆలపాటి భాస్కర రామయ్య గారితో కలిసి వ్యాపారం చేసేవారు. కారణాలంతరాల వల్ల వారిరువురు విడిపోయారు. విడిపోయే సమయంలో ఇరువురు సామానులు పంచుకున్నారు. తన వంతు వచ్చే ఆ వస్తువులతో పాటు రెండు లోహపు తీగలకట్టలు కూడా తీసుకొని వెళ్ళాడు ఆరాముదయ్యంగారు.. ఈ కారణముతో ఆయనమీద దొంగతనం నేరం ఆరోపించారు. ఆ కేసులో ఫిర్యాదీ తరపున ఆచ్యుత రామయ్య గారు, ముద్దాయి తరపున ప్రకాశం వాదించారు. జిలెళ్ళ కృష్ణారావు గారు అనే ఆయన అప్పుడు మేజి(స్టేట్‌గా ఉండేవార్డు. ఈ కేసును షుమారు అయిదారు నెలలు విచారించారు. అప్పటి పరిస్టితి చూస్తే (ప్రకాశం గారి క్షయింటు ఆరాముదంఅయ్యంగారికి శిక్ష పడేటట్లే
మన ప్రకాశం 50 ఉంది. చివరికి అనుకొన్నంత అయింది. ఒకనాటి మధ్యాహ్నం పదకొండు గంటల సమయంలో ఆరునెలల శిక్ష విధిస్తూ తీర్పు వచ్చింది. అయితే లాయర్ ప్రకాశం చాకచక్యంగా తన పలుకుబడిని ఉపయోగించి, తీర్పు వెంటనే ఆమలు కాకుండా, తన క్రయింటు, ఆప్పుడు అయిన ఆరాముదం అయ్యంగారు వెంటనే జైలు ముఖం చూడనవసరం లేకుండా చేయగలిగాడు.
ఆరాముద౦ం అయ్యంగారిని జైలు ముఖం చూడకుండా చేయడంలో ఆయన
అనుసరించిన ప్రణాళిక ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. మేజిస్ట్రేటు తీర్పును వెంటనే కోర్టులో చదవమని అభ్యర్థించాడు. మేజి(్ట్రేటు తీర్చు చదువుతూ ఉండగా దానిని గురించిన నోట్స్ వ్రాసుకొనమని, ఒక జూనియర్లాయర్క్తు పురమాయించి, ఆమితమైన వేగంతో సబ్ కలెక్టర్ 'విస్' గారి దగ్గరకు వెళ్ళాడు. ఈ కేసు విషయం అంతా ఆయనకు వివరిస్తూ పురపాలక సంఘాధ్యక్షుని ఎన్నికలలోను, ఇతర విషయాలల్లోను ఈ అయ్యంగారు ప్రభృతులు తనకు సహాయకారులుగా ఉంటున్నారని తనకు సహాయం చేసిన వారి మీద కక్ష సాధించడంకోసం, విపక్షం వారు ఈ కేసు పెట్టించారని చెప్పారు. అప్పీలు దాఖలు చేసి బెయిలు కోరారు (ప్రకాశం, “బెయిలు పొందాలంటే జడ్జిమెంటు కాపీలు మొదలైన వాటితో దాఖలు చేయాలి కదా!”
ఆయన సంకోచం వెలిబుచ్చాడు. కాదండీ", ఆయ్యంగారి వ్యవహారంలో ఉండే తీవ్రతను వివరించి నచ్చచెప్పాడు ప్రకాశం.
“సరేలెండి ప్రకాశంగారు! మీరు అడుగుతున్నారు కదా! మా గుమాస్తా చేతికిచ్చి పంపిస్తాను ఆ అధికారి హామీ ఇచ్చాడు.. అలాకాదండీ, బెయిల్ ఆర్డర్ స్సయంగా తీసుకొని వెళ్ళడానికే నేను వచ్చాను.
(ప్రకాశం మాటలు ఆంగ్లేయుడైన 'విస్'ను (ప్రభావితం చేసాయి.
వెంటనే గుమాస్తాని పిలిచాడు ఆంగ్రేయుడైన ఆ అధికారి బెయిలు ఆర్జరు (వ్రాయించి (ప్రకాశానికి ఇచ్చాడు. కృతజ్ఞతలు తెలియజేసి వెంటనే రెండు దొడుల్లో
యు స మన ప్రకాశం ల్ న వ్ తా [కా ా క్రయ కోర్టులోనికి ప్రవేశించాడు. ఆయన కోర్టులో ప్రవేశించేసరికి మేజిస్ట్రేట్ తన తీర్పును ఇంకా చదువుతూనే ఉన్నాడు! ప్రతికక్షులు అందరూ అక్కడే ఉన్నారు. తమ ప్రతికక్షి అయినవాడికి జైలు శిక్ష పడుతున్నది కదా! ప్రతికక్షులందరూ మవా ఉత్సాహంగా ఉన్నారు. ఆనందంతో కేరింతలు కొడుతున్నారు." తీర్పు చదవడం పూర్తి అయింది. ఇంతలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. మేజిస్ట్రేట్ ఎదుట (ప్రకాశం తాను తెచ్చిన కాగితాలు ఉంచాడు.
“ఏమిటీ! ప్రకాశంగారూ! ఆరాముదయ్యంగారికి బెయిల్ తెచ్చారా! నిజంగా మీరు అభినందనీయులండీ” అన్నాడు మేజిఫ్ట్రేటు. ప్లీడర్లు, కుతూహలంతో వచ్చిన ప్రజలు అక్కడ ఉన్నవారంతా చేష్టలుడిగి చూస్తున్నారు. స్రబ్లులై ఉన్నారు. ముందుగా తేరుకున్న మేజిస్ట్రేట్ కృష్ణారావు గారి అభినందన అది.
తనను అనుసరిస్తున్న తనను నమ్ముకొన్న అయ్యంగారు జైలు ముఖం చూడకుండా తప్పించగలిగాడు ప్రకాశం. అందరూ జీజీలు పలికారు. ఆయన పక్షం వారందరికీ అది ఆనందదాయకమయింది.. ప్రకాశం గొప్ప పట్టుదల గలవాడు. వృత్తిలోను అంతే ఈ అయ్యంగారి కేసు వృత్తిపరంగాను, వ్యక్తిగతంగానూ కూడా (ప్రతిష్పాత్మకమే.
ఈ విషయంలో ఆయన విశ్రమించలేదు. కాకినాడ కోర్టులో అప్పీలు చేశాడు. శేసు కాకినాడలో ెయిలయింది. వాద ప్రతివాదాలు ప్రారంభమయినాయి. ఆరాముదయ్యంగారి పక్షాన వాదించేది ప్లీడరు ప్రకాశం. ఎదుటపక్షం వారివైపు వాదించేది బారిష్టర్ రాఘవయ్యగారు.
ఆ కోర్టులోని జడ్డి చాలా తెలివైన వాడు. సూక్ష్మగ్రాహి. కేసు చూస్తూనే అది పార్టీ కక్షల కారణంగా వచ్చిన వ్యవహారమని (గ్రహించాడు.
అప్పీలు చేసుకొన్న వారి తరపు వారి లాయర్ కోర్టులో ముందుగా మాట్లాడడం సంప్రదాయం. కాని ప్రకాశం గారు మాట్లాడకుండానే విపక్షీయుల తరపున హాజరైన
మన ప్రకాశం 52 బారిష్టర్ రాఘవయ్యగారిని మాట్టాడమన్నారు జడ్జి. ఆ బారిష్టర్ గారు విషయం వివరించడం ప్రారంభించారు.
“ఇకచాలు. సరేకాని క్రింది కోర్టు తీర్పు ఎందుకు రద్దు చేయకూడదో వివరించ వలసిందిగా కోర్టువారు బారిష్టరు రాఘవయ్య గాని కోరుతున్నాం. అది జడ్జిగారి కంఠం. బారిష్టరు రాఘవయ్యగారు ఆయన వాదం వినిపించారు.
కాని ఆయన బారిష్టర్ రాఘవయ్యగారి అభిప్రాయంతో ఏకీభవించలేదు. క్రింది కోర్టు తీర్పు రద్దు చేశాడు.
ఆరాముదయ్యం గారి జైలుళిక్ష రద్దయింది. ఆరాముదయ్యంగారు, వారి (శ్రేయోభిలాషుల ఆనందానికి ఆవధిలేదు.
ప్రకాశానికి జేజేలు పలికారు. తనను నమ్మినవారిని, తన మూలంగా జైలు పాలు కాకుండా రక్షించుకోగలిగాడు ప్రకాశం. అది ఆయనకు గర్వకారణము ఆనందదాయకవమూ అయింది.
ఆ సంఘటన తరువాత ప్రతికూల పక్షంవారు తమ అస్త్రాలను తిన్నగా (ప్రకాశం
మీదే ప్రత్యక్షంగా ప్రయోగించడానికి పూనుకున్నారు. ఒకటోరెండో కేసులలో పురపాలక సంఘాధ్యక్షుడైన (ప్రకాశాన్ని ప్రత్యక్షంగానే ఇరికించారు. అయితేనేం, తన వాదనా పటిమచేత, ధైర్యసాహసాల వలన, ప్రతికక్షులు పన్నిన ఉచ్చుల నుండి తప్పించుకో గలిగాడు ప్రకాశం. ఆ మధ్య కాలంలో మునసబు కోర్టులో రంగమన్నారు అనే ఆయన మునసబుగా ఉండేవారు. ఆయన మొదట కోర్టులో గుమాస్తాగా ఉండి క్రమంగా పైకొచ్చినవాడు. చాలా తెలివిగలిగన వ్యక్తి ఆయితే ఆయన లంచగొండి అని, పక్షపాతియని అపవాదు ఉండేది. ఎందుచేతనో కారణం తెలియదు కాని ప్రకాశం యెడల ఆయన కొంచెం సుహృద్భావంతో ఉండేవారు. ప్రకాశం ఎప్పుడూ ఆయనను ఆశ్రయించలేదు. కానీ ఆయన ప్రకాశానికి సహాయం చేస్తుండేవారు. దానివల్ల కూడా ప్రకాశానికి "పైలు' పెరిగింది. ఈ విధంగా కొంతకాలం గడిచిన తరువాత ఈ రంగమన్నార్కే ప్రకాశానికి తగాదా వచ్చింది. దాంతో స్థానికంగా ప్రకాశానికి సివిల్ ప్రాక్టీస్ తగ్గింది. కానీ క్రిమినల్ ప్రాక్టీసు బాగానే నడిచింది,
మన ప్రకాశం 53 రాజకీయమైన ఈ విషయాలన్ని ఎలా ఉన్నా పురపాలక సంఘ పరిపాలన
మాత్రం అభ్యుదయ పంథాలో సాగుతూనే ఉంది. (ప్రధమ సంవత్సరం పూర్తి అయిన తరువాత ప్రభుత్వము వారు వారి పాలనా నివేదికలో పురపాలక సంఘ పరిపాలన సంతృప్తికరంగా సాగిందని నివేదిక కూడా అందించారు. ఇది ప్రకాశం పరిపాలనా సామర్థ్యానికి గీటురాయిగా పేర్కొనవచ్చు.
మునిసిపాలిటీకి ప్రతి సంవత్సరం ఎన్నికలు జరిగేవి. కొందరు పెద్దల ప్రోత్సాహంతో 1896నాటి మునిసిపల్ ఎన్నికలలో (ప్రకాశం కూడ కౌన్సిలర్ పదవికి పోటీ చేయడం జరిగింది. కానీ ఆ ఎన్నికలలో ఆయనకు విజయం లభించలేదు. 1897, 98 మునిసిపల్ ఎన్నికలలో కూడా ప్రకాశం నిలబడినా అదే ఫలితం వచ్చింది. ఐనా నిరుత్సాహపడకుండా 1899 ఎన్నికలలో మళ్ళీ పోటీచేసి విజయం సాధించాడు (ప్రకాశం. రాజమహేంద్రవరం మునిసిపాలిటీలోని నాలుగవ వార్డుకు కౌన్సిలర్ అయినాడు ప్రకాశం. అక్కడ నుండీ క్రియాశీల రాజకీయాలలో చురుకుగా పాల్గొని ఛైర్మన్ పదవికి జరిగిన ఎన్నికలలో ముఖ్యపాత్ర వహించాడు (ప్రకాశం.
పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన మునిసిపల్ ఎన్నికలలో ఛైర్మన్ పదవి (ప్రకాశాన్ని వరించింది.
ఛైర్మన్‌గా పుర ప్రజలకు ఎనలేని సేవ చేసి, ఎంతో కీర్తిని ఆర్జించారు. ప్రకాశం
పంతులుగారు ప్రతిరోజు ఉదయం ఆరుగంటలకు గుజ్జం మీద బయలుదేరి ఊరు నాలుగు మూలలూ చుట్టి వచ్చేవారు. మధ్య మధ్యలో ఆగి ప్రజల సమస్యలు స్వయంగా అడగ శెలుసుకొనేవారు. కొన్ని కొన్ని సమస్యలకు అక్కడే పరిష్కారాన్ని నిర్ణయించేవారు. ఆయన సమర్థవంతమైన పరిపాలనలో రాజమండ్రి ఎంతగానో అభివృద్ధి చెందింది. స్టానిక రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూనే, న్యాయవాద వృత్తిని కూడా విజయవంతంగా నిర్వహిస్తూ వచ్చినారు (ప్రకాశం.
మన ప్రకాశం రడీ ఏలూరు లక్ష్మీనరసింహంగారిపై ఒక కేసు వచ్చింది. ఆయన ప్రమాదకరమైన ఒక అభియోగంలో చిక్కుకున్నారు. అది ఒక దొంగతనం కేసు. ఆ రోజుల్లో రాగిని బంగారం చేస్తామనే మంత్రగాళ్ళు ఉండేవారు. వాళ్ళ మాయల్లో పడే అమాయకులూ ఉండేవారు. రాజమహేంద్రవరంలోని శనివారం పేట ఎస్టేటులోకి ఇలాంటి మంత్రగాడొకడు వచ్చి రాగిని బంగారం చేయడానికి పూనుకున్నాడు. ఒక గదిలో దేవతని పెట్టి ఇంట్లో ఉండే బంగారమూ, జవాహరీ అంతా ఆ దేవతకి అలంకరించి పూజ చేయాలని చెప్పాడు. బంగారం ఆంతా సేకరించాడు. జపం చేస్తున్నానని చెప్పి నాలుగురోజులు ఆయిన తరువాత ఆ బంగారం అంతా మూట కట్టుకొని రాత్రికి రాత్రి మాయమైపోయాడు. ఆ బంగారంలోని కొన్ని వస్తువులు ఏలూరు లక్ష్మీ నరసింహంగారి ఇంటి దగ్గరగా నున్న ఆతని స్నేహితుని దగ్గరకు చేరినవి, ఆ స్నేహితుడు బజారులో ఆ జవహరీ అమ్మ జూసగా షరాబులు కొనడానికి నిరాకరించారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. లక్ష్మీ నగసింహగారి స్నేహితుణ్ణి పోలీసులు పట్టుకొన్నారు. అది పోలీసు కేసు ఆయింది. లక్ష్మీ నరసింహంగారు ఆ జవహరీ ఆంతా తన స్నేహితుడైన మహ్మదీయునిదే నని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే ఆయన చేసిన నేరం. అయితే దొంగతనం జరిగినట్టు పోలీసులు బుజువు చేసారు. దొంగసొమ్ము పట్టుకున్నారు. ఆ కేసులో నరసింహం గారికి కూడా శిక్షపడే పరిస్థితులు ఏర్పడినాయి. ఈయన ఎవరో కాదు. ప్రకాశం రాజమహేం(ద్రవరంలో చదువు నిమ్సిం వచ్చినప్పుడు ఆయనకు విద్యార్ధి వేతనం కూడా ఇప్పించి, తన ఆధ్వర్యంలో నడిచే ఆస్తిక పాఠశాలలో చేర్చుకొని ఆయన విద్యా వ్యాసంగానికి కారకులైన ఏలూరు లక్ష్మీ నరసింహం పంతులుగారే. అంతేకాదు, ఆయన ప్రకాశానికి ఆస్తీక పాఠశాలలో కొంత కాలం పారం చెప్పినవారు, ప్లీడరు పరీక్షకు (ప్రైవేటుగా చదివే సమయంలో ప్రకాశంతో కలిసి చదివినవాడు. (ప్రకాశం పంతులుగారు నరసింహం గారి తరపున న్యాయవాదిగా ఉండి ఆయనకు శిక్ష పడకుండా చేయాలని (ప్రయత్నించారు.
మన ప్రకాశం క్వ్
కేసు సబ్ కలెక్టరు ఎదుట విచారణకు వచ్చింది. నరసింహంగారు స్థానికంగా చాలా ప్రముఖులనీ, మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఏర్పడిన కక్షలు తీర్చుకొనడం కోనం ఆయన (వ్రత్యర్జులు ఈ కేను బనాయించారనీ, కనుక ఈ కేను రాజమహేం(ద్రవరంలో విచారించకూడదనీ, హైకోర్టుకు పిటీషన్ పెట్టారు. హైకోర్టులో వాదించడానికి డాక్టర్ స్వామినాథన్ గారనే బారిష్టరును ఏర్పాటు చేశారు. ఈ స్వామినాథన్ గారు ఇంగ్లాండు వెళ్లి బారిష్టరు చదివి వచ్చి అప్పటికి మదరాసులో (ప్రాక్టీసు పెట్టినవారు.
ఈ కేసు న్యాయస్ట్రానంలో విచారణకు వచ్చింది. బారిష్టరు స్వామినాథన్‌గారు కేసును గురించి నోరు విప్పనైనా విప్పకముందే, అప్పీలులో బలం లేదని జడ్డి డేవిస్గారు ఆ కేసును కొట్టివేశారు.
ఇంగ్లండు ప్రయాణం
(ప్రకాశం జీవితంలో అనేక సంవధుటనలు విచిత్రమైన పరిస్పితులలో రూపొందినట్టివే. అలాంటిదే వీరు ఇంగ్లండ్ ప్రయాణించడానికి, బారిష్టరు చదువు చదవడానికి దారితీసిన సంఘటన కూడా. బారిష్టర్ స్వామినాథన్ గారిని ఒక కేసు గురించి హైకోర్టులో ట్రాన్స్ఫర్ చేయించడానికి ఆర్ఫ్యూ చేయడానికి ప్రకాశం గారిని ఎన్నుకున్నారు. ఇది (ప్రకాశానికి చాలా చిరాకు కలిగించింది. స్వామినాథన్గారి మీద చాలా కోపం వచ్చింది. ఆయన సహజమైన శైలిలో “ఇదేమి బారిష్టరీ అండీ, ఆర్ముమెంట్ చెప్పకుండానే కేసు డిస్మస్ చేస్తే మాట్టాడకుండా ఊరుకున్నారు మీరు?” అంటూ స్వామినాథన్ గారి మీద కేకలు వేశారు. దీనికి స్వామినాథన్‌కు కోపం రాలేదు సరికదా, ఆయన మరో కోణం నుంచి ఆలోచించారు. ప్రకాశం గారి చుజుకుదనమూ, ధైర్యమూ, నిర్భయంగా ఎవరితోనైనా ఏమైనా అనగల చొరవా చూచిన స్వామినాథన్గారి మనస్సులో ఒక ఆలోచన మెరిసింది. వెంటనే ఆయన '*ప్రకాశం గారూ, రాత్రికి మా యింటికి భోజనానికి రండి, మీతో మాట్లాడాలి" అని భోజనానికి ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని పురస్కరించుకొని ప్రకాశం ఆ రాత్రి స్వామినాథన్ గారింటికి భోజనానికి వెళ్లాడు. ఆయన
మన ప్రకాశం 56 ఇల్లూ, నివసించే పద్దతి చూడగానే స్వామినాథన్గారి వ్యక్తిత్వాన్ని అంచనా వేశాడు (ప్రకాశం. “ఆయన చాలా జాగ్రత్తగల మనిషి ఎంతో పొదుపుగా ఉంటూ డబ్బు కూడ బెట్టేవాడు”. అనే వ్యక్తిత్వపు లక్షణాలను ప్రకాశం గమనించాడు. స్వామినాథన్ ఆయనను ఎంతో అభిమానంగా ఆదరించారు. *ప్రకాశంగారూ, మీలో మంచి చురుకుదనమూ, ధైర్యమూ కనిపిస్తున్నాయి. మీరు ఎందుకు ఇంగ్రండుపోయి బారిష్టరు చదువుకోకూడదూ'” అని తన మనసులోని మాటను బయటపెట్టారు స్వామినాథన్‌గారు.
(ప్రకాశం ఆశ్చర్యపడ్డాడు. “నేను సెకండ్ గ్రేడ్ ప్లీడరును. బీదవాణ్ణి. నాకేమిటి? వేలకు వేలు ఖర్భయ్యే బారిష్టరీ చదువేమిటి! ఇంగ్లండు (ప్రయాణమేమిటి? ఇది ఎలా సాధ్యమవుతుంది?” తన మనసులో ఉన్న సందేహాన్ని బయటపెట్టాడు (ప్రకాశం.
“వేలకు వేలు ధనమేమీ ఆవసరం లేదు (ప్రకాశం గారూ! బారిష్టరు చదవడానికి, నేను బారిష్టరు చదివింది మీకు తెలుసు కదా! కేవలం నెలకు ఆరు పౌనుల ఖర్చుతో కాలక్షేపం చేశాను. ఆరువేల రూపాయల ఖర్చుతో బారిష్టరు కోర్సు అంతా పూర్తి చేయవచ్చు.” అని తన అనుభవాన్ని జోడించి చెప్పారు స్వామినాథన్‌గారు. స్వామినాథన్గారితో జరిగిన ఈ సంభాషణ ప్రకాశం జీవితాన్ని ముందుకు నడిపించింది. బారిష్టరు చదవాలనే నిర్ణయాన్ని అప్పటికప్పుడే తీసుకున్నాడు. ఆ ఆలోచన కార్యరూపం ధరించడానికి కావలసిన ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆయనగారి అప్తమి(త్రుడు కంచుమర్తి రామచం(ద్రరావు, చాటప(ర్రు వాస్తవ్యుడైన మరో మిత్రుడు మాగంటి లక్ష్మణదాసు గారు కూడా (ప్రకాశం బారిష్టరు చదవడానికి ప్రోత్సహించారు. ఇద్దరూ చెరి మూడువేల రూపాయలూ (ప్రకాశానికి ఇచ్చారు. బారిష్టరు చదువుకు గల ఆర్థిక సమస్య అయితే తొలిగిపోయింది. కాని అసలు సమస్య - సాంఘిక సమస్య ఉండనే ఉంది.
అనాటి సంఘంలో సముద్ర ప్రయాణం నిషిద్ధం. సముద్రపు యానం అంటే కులం పోయినట్టుగానే భావించేవారు. (ప్రకాశం కుటుంబంలోని వారికి అతని ఇంగ్లండు
మన ప్రకాశం ర్ 'ప్రయాణం ఆందోళన కలిగించింది. మరీ ఎక్కువ ఆందోళన పడినవారు ప్రకాశం తల్లి సుబ్బమ్మగారు.
ఆనాటికి ఆంధ్రదేశంలో బారిష్టరు చదువుకోసం ఇంగ్లండుపోయిన వారు ఎక్కువ మంది లేరు. దాక్షిణాత్యులైన అయ్యంగారొకరు ఇంగ్లండులో బారిష్టరు చేసి వచ్చి రాజమహేంద్రవరంలో (ప్రాక్టీసు చేస్తున్నారు. ఇంగ్లండు వెళ్ళిరావడం మూలంగా ఆయనకు తాగుడు అలవాటయింది. ఆయన ఇంగ్లాండు నుండి వచ్చిన తరువాత ఆయన భార్య ఆయనతో కాపురం చేయడానికి నిరాకరించింది. ఆయన రాజమహేంద్రవరంలో ఒక ఆంగ్లో ఇండియన్ స్రీని వివాహమాడి జీవితం గడుపుతూ ఉండేవాడు.
ఇంగ్లాండు వెళ్లిన వారు అంటే ఇలాగే తయారవుతారు అనేది అప్పటి వారి అభిప్రాయం. దీనికి తోడు రేకపల్లి పిచ్చయ్యగారు. ప్రకాశం గారి కుటుంబంలోని వారికి, అందునా ముఖ్యంగా వారి తల్లి సుబ్బమ్మ గారికి సముద్రయానం చేసి ఇంగ్లండుపోయి వచ్చినవారు కులభ్రష్టులవడం వంటి విషయాలను మరింత వివరంగా సోదాహరణంగా వివరించి అమెకు ఆందోళన కలిగించారు. ఈ రేకపల్లి పిచ్చయ్యగారు వారి ఇంటి పురోహితుడు. నానా కష్టాలు పడి చదివించి పిల్లలను వృద్ధిలోనికి తెచ్చి, అళలన్నీ వారి పైననే పెట్టుకొని (బ్రతుకుతున్నారు (ప్రకాశం తల్లి సుబ్బమ్మగారు. ప్రయోజకుడై, సంఘంలో కీర్తిప్రతిష్టల నార్జించిన పెద్ద కుమారుడు సముద్రప్రయాణం చేసి, ఇంగ్లాండు వెళతానంటే ఆమెకు ఎంతో ఆందోళన కలిగింది. (ప్రకాశానికి తల్లి మనసు తెలుసు, ఏదైనా విషయాన్ని వివరించి నచ్చవచెబితే ఆమె అర్ధం చేసుకోగలదన్న విషయమూ తెలుసు. ఆయనే ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు.
“అమ్మా నీవీ విషయంలో ఏమీ భయపడనవసరం లేదు. చదువంతా రెండు మూడు 'టెరము'లలోనే పూర్తిచేస్తాను. చదువయిపోగానే వెంటనే వచ్చేస్తానమ్మా, నీవీ విషయంలో ఏమీ అనుమానం పెట్టుకోవద్దు”
మన ప్రకాశం వ్కి
“సరే, ప్రకాశం...” తల్లి ధోరణి చూస్తే కొంచెం ధైర్యం కలిగింది. సమస్యను అర్థం చేసుకొనడానికి ఆమె ప్రయత్నిస్తున్నది. అందుకే మళ్ళీ ప్రకాశమే అన్నాడు,
“అమ్మా ఇంగ్లాడు వెళ్ళి భ్రష్టుడనవుతాను అని అనుకోవద్దు. నీకు మాట ఇస్తున్నానమ్మా. మత్స్యమాంసాలు ముట్టుకోను. మనకు విరుద్దమైన పనులేవీ చేయను". ఈ మాటలు విన్న ఆమె ముఖం వికసించింది. మొదటి నుండీ ధైర్యానికి ఆమె పెట్టింది పేరు. ప్రకాశం మీద అమితమైన విశ్వాసం ఉన్నది. అంతేకాదు తన కుమారుని అభివృద్ధి కోసం ఆమెలో ఎంతో ఆరాటం ఉన్నది.
కుమారుని ఇంగ్భాండు వ్రయాణానికి బారిష్టరు చదువుకు ఆమె అంగీకరించింది.
భార్య హనుమాయమ్మను కూడా ఒప్పించాడు ప్రకాశం, తాను లేని కాలంలో ఆమె తన పినతల్లి గారింట్లో అంటే ప్రకాశం చిన్నక్కయ్య ఇంట్లో ఉండడానికి, తన దగ్గర ఉన్న తల్లిని తమ్ముడు శ్రీరాములు దగ్గర ఉండటానికి ఏర్పాట్టు చేశాడు. సంసారంలోని సర్దుబాట్టు అన్నీ అయిపోయాయి. అక్టోబరు మొదటివారంలో లండన్ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఈ ప్రయాణంలో ఆయనకు పలువు మిత్రులు తోడ్పడ్డారు. లండన్ ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్టు అంటే స్టీమరుకు టికెట్ బుకింగూ, మొదలైన విషయాలలో డాక్టర్ స్వామినాథన్ బాగా తోడ్పడ్డారు. అంతవరకూ తాను నిర్వహిస్తున్న రాజమహేంద్రవరం మున్సిపల్ చైర్మన్ పదవిని నారాయణరావుగారనే వారికి డెలిగేట్ చేశాడు. రాజమహేంద్రవరం నుండి మద్రాసు చేరాడు. అక్కడ వీరు రెంటాల వెంకట సుబ్బారావు గారింట్లో దిగారు. (ప్రకాశం చేస్తున్న ఈ (ప్రయత్నాన్ని సుబ్బారావుగారు మెచ్చుకున్నారు. అంతేకాదు తెలుగువారు బాగా అభిమానించే ఆవకాయ, గోంగూరలు లండన్‌లో దొరకవు కనుక వీటిని జాడీలలో నింపి చక్కగా మూటలు కట్టించి ఇచ్చారు. మద్రాసు నుండి ఆయన ప్రయాణం బొంబాయికి సాగింది.
మన ప్రకాశం 59 ఆనాటికింకా విమాన ప్రయాణం ఉపయోగంలో లేదు. ప్రకాశం లండన్ వరకూ చేసిన ('ప్రయాణమంతా జలమార్లాల ద్వారానే జరిగింది.
బొంబాయిలో గొల్లపూడి నరసింహం గారింట్టో రెండు రోజులున్నారు. ఈయన ప్రకాశానికి క్రయింటూ, శ్రీమంతుడూ కూడా. అక్కడి నుండి మెయిల్ బోట్ మీద ఇంగ్లాండుకి బయలుదేరాడు. మిత్రుల ఇండ్ల దగ్గర ఉన్నా, లండన్ ప్రయాణపు హడావిడిలో ఉన్నా ఆయన మనసులో మాత్రం తన తల్లి సుబ్బమ్మగారు మెదులుతూనే ఉంది. “ఇంగ్రండులో మన శాకాహార భోజనం లభిస్తుందో లేదో! అక్కడ అందరూ మాంసాహారమే తింటారని విన్నాడు. తన తల్లికిచ్చిన మాట మనసులో మెదులుతూనే ఉంది. తాను మత్స్య మాంసాదులు ముట్టనని తల్లికి మాట ఇచ్చాడు. మరి ఈ స్థితిలో ఆరోగ్యం కాపొడుకోవడమెలా?” పండ్లరసం శరీరానికి చాలా మంచిదని తలచాడు, బత్తాయి పండ్డు చాలాకాలం నిలవ వుంటాయి, ఆ పండ్లరసం ఆరోగ్యానికి మంచిది. ఈ ఆలోచన ఆయన మనసులోనికి వచ్చింది. రెండు బస్తాలలో బత్తాయి పండ్షను ఓడలో వేయించి తనతో తీసుకొని వెళ్ళాడు.
ఆనాటి ఇంగ్లాండు (ప్రయాణమంతా ఓడమీదే జరిగేదని తెలుసుకొన్నాం కదా! ఓడ ఎక్కిన మరునాడే ఈయనకు సీ సిక్నెస్ వచ్చింది. ఓడ ప్రయాణపు మొదటి రోజున తోటి (ప్రయాణీ కులందరితో డైనింగ్ హాలుకు వెళ్ళాడు. అక్కడ మత్స్యమాంసాదులు వండుతున్నారు. ఆ వాసన ఆయన భరించలేకపోయాడు. వాంతి చేసుకున్నాడు. శరీరమంతా ఆతలాకుతల మయింది. తన గదిలోకి పోయాడు. దీనికి తోడు సీ సిక్నెస్ ఒకటి. ఆలాగే ఆయన రెండు రోజులు బాధపడ్డాడు. ఐదు రోజులు (ప్రయాణించి ఆ ఓడ ఏడెన్ చేరింది. మరి మూడు రోజులకు ప్రకాశం 'పోర్టు సెడ్' అనే పట్టణం చేరాడు. ఇంగ్లండులోని 'మార్చియల్సు" రేవు పట్టణం చేరడానికి మొత్తం మీద పన్నెండు రోజులు పట్టింది,
మన ప్రకాశం 60
బొంబాయి నుండి బయలుదేరేటప్పుడే చెంగల్రావు నాయుడుగారు అనే ఒకాయన ప్రకాశంతో పాటు ఓడలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఆయన అంతకుముందు ఒకసారి లండన్ వెళ్ళివున్నారు. ఒక 'టరమ్” బారిష్టర్ చదువు కూడా పూర్తి చేసుకొని వచ్చారు. ఆ కారణంగా లండన్‌లోని పరిస్థితులు, వసతులు, అక్కడి వాతావరణము అన్నీ ఆయనకు తెలుసు. ఆయన ప్రకాశానికి చాలా సహాయకారిగా ఉన్నారు. యూరొప్‌లో చెంగల్రావు నాయుడుగారు 'ఛెస్వాటర్ అనే పట్టణం చేరుకున్నారు. అక్కడ నాయుడుగారి పక్కనే వున్న సామాన్య గృహస్టు ఇంట్లో వసతి, భోజనము దొరికాయి. ఒక పెద్ద స్టౌ కొనుక్కొని ఒక గదిలో (ప్రత్యేకంగా కూరగాయలు, పప్పులు పచనం చేసుకొని భోజనం చేస్తూండేవాడు. చంగల్రావునాయుడు గారు గ్రేయిన్ మెంబర్. బార్-ఎట్లా చదువుతూ ఉండేవారు. ఈ ఇన్లంటే, ఇంగ్లండ్‌లో న్యాయశాస్త్రం అభ్యసించటానికి నాలుగు కేంద్రాలుండేవి. వాటిని 'ఇనోలు అనేవారు. ఇన్ అంటే అప్పటి పద్దతి (ప్రకారము హాస్టల్ సదుపాయము గల విద్యా కేంద్రాలు అన్నమాట.
ఆ దేశంలో ఒక న్యాయశాస్త్ర పండితుల సంఘం ఈ కేంద్రాన్ని నిర్వహించేది. ఈ సంఘాన్ని 'కౌన్సిల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్” అంటారు. ఈ సంఘం వారే ఈ కేంద్రాలలో మంచి (గ్రంథాలయాలు, భోజన వసతి ఏర్పాటు చేసి న్యాయశా/స్తం బోధించేవారు. ఈ న్యాయశా(స్తం చదువుకొని ఉత్తీర్ణులైన వారే బారిష్టర్సు అన్నమాట. ఈ చదువంతా పూర్తి చేయడానికి రెండు టేర్మ్లు పట్టేది. టర్మ్‌కు ఇన్ని డిన్నర్గు అని పరిమితి ఉండేది. అక్కడ న్యాయస్ట్రానం చదువుకునే విద్యార్ధి ఈ 'ఇనొలో ఉండి వారేర్సాటు చేసే డిన్నర్హుకు హాజరు కావాలి. మన కళాశాలలో ఎటెండెన్స్ ఎంత ముఖ్యమో ఈ ఇనోలలోని డిన్నర్లకు ఎటెండ్ కావడం కూడా అంతముఖ్యం. ఆ విందులే కాకుండా కాన్సిల్ ఆఫ్ లీగల్ఎడ్యుకేషన్ వారు న్యాయవిద్యకు సంబంధించిన గొప్ప ఉపన్యాసాలు ఏర్పాటు చేసేవారు. వాటికి హాజరై ఆ లెక్చర్లు విని, (గ్రంథాలయాలలో కూర్చుని శ్రద్దగా చదువుకొని మిగిలిన కాలంలో అక్కడకు దగ్గరగా ఉండే ఇంగ్లీషు కోర్టులకు వెళ్ళి, అక్కడి
మన ప్రకాశం 61 విచారణా పద్దతులను ఆకళింపు చేసుకొని, బారిష్టరు చదువు పూర్తి చేయవలసి ఉండేది.
అక్కడ ఆనాడు ఒక వింత ఆచారం ఉండేది. ఈ కోర్సు చదివే సమయంలో విద్యార్దుల 'డిన్నర్ ఏర్పాట్టు జరిగినప్పుడు విందు పూర్తయిన తర్వాత విద్యార్థులలో అందరికన్నా చిన్నవారు లేచి, ఆ 'ఇన్ను నిర్వహించే (ప్రధాన అధ్యాపకుల వారినుండి అనుమతి పొంది, సిగరెట్‌ను కాల్చాలి. ఆ తర్వాత ఒక చిన్న ఉపన్యాసం చెప్పాలి. ఈ ఆచారం అక్కడ ఎంతో కాలం నుండి ఉంది.
ఒకసారి ఇలాంటి వంతు (ప్రకాశానికి వచ్చింది. ఆ విందులో జూనియర్ విద్యార్థులు, సీనియర్ విద్యార్థులు, ఆ ఇన్ను నిర్వహించే మాస్టారు కూడా ఉన్నారు. (ప్రకాశం లేచి నిలబడి తనకు సిగరెట్ కాల్చడం ఇష్టంలేదని ఇష్టం లేని పనిని తాను చేయనని తనకాపాటి స్వాతంత్ర్యం ఉన్నదని, కనుక సిగరెట్ తాగుతూ చెప్పవలసిన ఉపన్యాసం తాను చెప్పనని ఘంటాపథంగా స్పష్టం చేశాడు. ఆ విందుకు హాజరైన వారంతా ఆ మాటలు విని ఆశ్ళర్యపడినారు. ఆ సంప్రదాయం ఎప్పటినుండో
- సాగుతున్నది. కనుక దీనిని ఇప్పుడు కొత్తగా వచ్చిన విద్యార్థి ఆయిన (ప్రకాశం
ధిక్కరించరాదని ఆచారం పాటించవలసిందేనని విద్యార్థులంతా నొక్కి వక్కాణించారు. ప్రకాశం చేసిన పనిని గర్హించారు. కాని దాని కతనేమీ బెంబేలు పడలేదు. అప్పుడు అక్కడి ఇన్ మాస్టరు సర్ ఆర్ధర్కాలిన్స్ ఈయన మదరాసు హైకోర్టులో ప్రథమ న్యాయమూర్తిగా పని చేశారు. గొప్ప ఖ్యాతి గడించినవారు. పదవీ విరమణ చేసిన తర్వాత ఇంగ్లండ్‌లోని ఈ న్యాయ కళాశాల కేంద్రానికి ప్రధానాచార్యులుగా ఉన్నారు. స్వాతంత్ర్య భావాలు గలవారిని అభినందించే స్వభావము కలవారాయన. అతనిని ఇన్ మాస్టర్ అయిన సర్ ఆర్హర్కాలిన్స్ దగ్గరకు తీసుకొని వెళ్ళారు. “న్యాయశాస్త్ర విద్యార్థులు పాటించవలసిన ఆనవాయితీని నీవు ఎందుకు పాటించలేదు” అని అడిగారాయన ఆ విద్యార్థిని. దానికాతడు “నాకిష్టం లేని పని చేయకపోవటానికి నాకు స్వాతంత్ర్యం లేదా?”
మన ప్రకాశం 62 ఇన్మాస్టర్ అడిగిన ప్రశ్నకు ఆ విద్యార్థి అడిగిన ప్రశ్నే జవాబయినది. దానికి సర్ ఆర్ధర్ కాలిన్గారు నవ్వారు. ఆ విద్యార్థితో “బల్ల దగ్గరికి వెళ్ళు అన్నారు. ఈ స్వాతంత్రపిపాసి ఎవరో కాదు. ఆ యువకుడు ప్రకాశమే. ఇతను బారిష్టర్ చదువుపట్ల చాలా శ్రద్ధ చూపించాడు. చిన్ననాటి నుండి ఆయనకు ఈ వకీలు వృత్తిమీద ఆసక్తి మెండు. అందుకని ఈ విద్యమీద బాగా లక్ష్యం ఉంచి చదివాడు. లాకౌన్సిల్ ఉపన్యాసా లన్నీ శ్రద్దతో సం(గ్రహంగా రాసుకునేవాడు. పాఠ్యగ్రంథాలు జా(గ్రత్తగా చదువుతూ అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడ ఇంగ్లండులోని కోర్టులకు హాజరవుతూ, ఆ కోర్టులలోని పద్దతులు, పెద్ద పెద్ద బారిష్టర్సు వాదించే రీతులు గమనిస్తూ ఉండేవాడు. అందుకే (ప్రకాశం బారిష్టరు పరీక్షలో నూటికి డెబ్బెఐదు మార్కుల పైన తెచ్చుకొని ప్రథమశ్రేణిలో ఆనర్ ఆఫ్ మెరిట్‌తో ఉత్తీర్ణుడైనాడు. ఆ పరీక్షలో ఒక పేపర్లో అక్కడ చదివే అందరి విద్యార్థులకన్నా అత్యధిక మార్కులు సంపాదించాడు. ఆ పేపరు దిద్దిన ప్రాఫెసర్ న్యాయశాస్త్రంలో దిట్ట. ప్రొఫెసర్ 'స్త్రాస్ ఇంకో విద్యార్థితో మాటల సందర్భంలో తన 'పేషరులో ప్రకాశానికి ఫస్టు మార్కులు వచ్చాయని మెచ్చుకున్నాడు. అధి విన్న సహాధ్యాయి ద్వారా ప్రకాశానికి ఈ విషయం తెలిసింది. ఇది తెలిసిన ప్రకాశం చాలా సంతోషించాడు. ఈ రోజో రేపో ప్రొఫెసర్ స్ట్రాస్ గారిని సందర్శించి కృతజ్ఞతలు తెలుపుకుందామని అనుకుంటూ ఉండగానే ప్రొఫెసర్ గారే ప్రకాశం గదిలోనికి వచ్చి షేక్‌హ్యాండ్ ఇచ్చి, ప్రకాశం గారిని అభినందించారు. బారిష్టర్ కోర్సులో ఆయనకు డిస్టింక్షన్ వచ్చింది.
న్యాయకళాళశాల వారు ఆయనను సత్కరించి యాఖై పొనుల బహుమానం ఇచ్చారు, మొదటి టరమ్ ఎనిమిది మాసాలూ పూర్తి చేసుకొని రాజమహేం[ద్రవరం తిరిగి వచ్చాడు ప్రకాశం. ఆతని రాకతో బంధుమి(త్రులంతా ఎంతో సంతోషించారు. అయితే సముద్ర ప్రయాణం చేసి వచ్చాడు కనుక, (ప్రాయళ్చిత్తం చేసుకుంటే కాని ఇంట్లో కలవడానికి వీల్లేదన్నారు. (ప్రకాశం గట్టిగా ప్రతిఘటించాడు. తలాతోక లేనీ మూఢ విశ్వాసాలంటే (ప్రకాశానికి విపరీతమైన అసహ్యం. ఈ విషయమై సనాతన వాదులతో
మన ప్రకాశం 653 ఆయన ఒక పోరాటమే చేయవలసి వచ్చింది. ఇదిలా ఉండగా, రెండవ 'టరంి చదువుకోసం రాజమహేం(ద్రవరం నుండి బయలుదేరి మళ్ళీ లండన్ చేరుకున్నాడు ప్రకాశం. చదువులో పడిపోయాడు. చదువుకుంటూనే నీలు చిక్కినప్పుడల్లా ఒక్కొక్క దేశం పర్యటిస్తూ అక్కడ ఉన్న ముఖ్య పట్టణాలూ, పారిశ్రామిక కేంద్రాలూ తిలకిస్తూ కాలం గడిపేవాడు. రాకపోకల్లో పారిస్ పట్టణంలోని జన జీవనాన్ని ఆసక్తిగా గమనించేవాడు. ఇంకా
హాలెండు, డెన్మార్క్, స్విట్టర్లాండు, స్వీడన్, ఇటలీ,గ్రీసు జర్మనీ మొదలైన దేశాలన్నీ చుట్టి వచ్చాడు. డెన్మార్క్‌లోని వ్యవసాయ పద్దతులు ఆయనను అమితంగా ఆకర్షించాయి. ఇటలీలో పొంగుతూ ఉన్న 'వెసూరియస్' అన్ని పర్వతాన్ని చూశాడు. నేపిల్స్, పైసాటరు, ధర్మాపోలిస్ కనుము మొదలైనవన్నీ దర్శించాడు. జర్మనీ వెళ్ళినప్పుడు అక్కడ సైనిక స్వామ్యవ్యవస్థ ఆయనను కదిలించివేసింది. అక్కడ 'భూగర్భంలో మిలటరీ కోర్టులున్నా యని, ఒకసారి వాటిలోనికి వెళ్ళినవారెవరైనా తిరిగి రావడమనేది సందేహమే” నని ప్రజలు భయంకరంగా చెప్పుకోవటం విని చలించిపోయాడు. జనర్మనీలోని అన్య దేశీ జనాదరణ (ప్రకాశానికి ముచ్చట గొలిపింది. ప్రజల భోజన ప్రియత్వం ఆయనకు బాగా నచ్చింది. జర్మన్ విశ్శవిద్యాలయాలలోని విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలను కూడా ప్రకాశం దర్శించాడు. ఈ విధంగా చేసిన విళ్స దర్శనం, గడించిన అపార విజ్ఞానం తరువాతి కాలంలో ప్రకాశం సెజపిన ప్రజా నేతృత్వానికి దోహదకారులుగా పరిణమించాయని చెప్పటంలో సందేహం లేదు. ఆ కాలంలోనే సి.ఆర్‌రెడ్డి, గోపాలకృష్ణ గోఖలే వంటి ఉద్దండులను కలుసుకోవటం జరిగింది. మొత్తానికి శ్రద్ధగా చదివి బారెట్టా ఫైనల్ పరీక్షకు హాజరయినాడు (ప్రకాశం. ఆ పరీక్షలో ఆయన డిస్టింక్షన్‌తో ఉత్తీర్ణుడైనాడు. ఆ విధంగా (ప్రకాశం, బారిష్టర్ ప్రకాశంగా భారతదేశం తిరిగి వచ్చాడు. జీవిత లక్ష్యంపై స్థిరమైన చిత్తాన్ని నిలిపి విజయం సాధించి కృతకృత్యుడైనాడు (ప్రకాశం,
మన ప్రకాశం 64 బారిష్టరుగా ప్రకాశించిన ప్రకాశం
ఈయన లండన్‌లో ఉండగా (వ్రథమంగా ఇద్దరు భారతీయులు పరిచయమయినారు. ఆ పరిచయస్టులు ఎవరంటే సొలిసిటర్ అయిన డెల్లాడో అనే ఆయన పార్సీ జాతికి చెందిన బారిష్టర్ చదివిన పరేషూ. వీరిరువురిలో పరేష్ అనే ఆయన భారతీయుడైనప్పటికీ ఆంగ్ర మహిళను వివాహం చేసుకొని బారిష్టర్‌గా ప్రాక్టీసు చేస్తూ లండన్‌లోనే ఉండేవారు.
ఆ రోజులలో లండన్ నగరంలో విలసిల్లిన 'అండన్ ఇండియన్ సొసైటీ" అనే సంస్థ చాలా ప్రసిద్ది పొందింది.
(ప్రకాశం జీవితంలో రాజకీయం ప్రధానమైన స్థానం ఆ(క్రమించుకుంటున్న రోజులవి. భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించాలనీ, దానికి తాను సమిధగా ఉపయోగపడాలనే (ప్రగాఢమైన వాంఛ ఆయన యువ హృదయంలో మొలకెత్తిన సమయమది.
ఇంగ్లీషువారు పుణ్యభూమితైన భారతదేశాన్ని ఆక్రమంగా ఆ(క్రమించుకొన్నారని ఆవేశంతో, ఆవేదన చెందుతున్నాడు (ప్రకాశం. జన్మభూమి భరతావనిని పారతంత్ర్య శృంఖలాల నుండి తప్పించడానికి (ప్రయత్నాలు జరుగుతున్న విషయం (ప్రకాశం ఆకళింపు చేసుకున్నాడు. స్వాతంత్ర్యం కోసం మన రాష్ట్రం లోవి సాహసవంతులైన యువకులు కొందరు ప్రయత్నాలు (ప్రారంభించిన విషయము ఈయనకు తెలుసు, ఈ యోధుల కథలన్నీ ఆయన మనసులో మెదిలి ఆయనను ప్రభావితం చేశాయి.
పశ్చిమ భారతంలో స్వాతంత్ర్య సంపాదనకు విస్తృతమైన కృషి జరిపి బాల గంగాధర తిలక్ లోకమాన్యుడయినాడు. పంజాబ్‌లో లాలాలజపతిరాయ్ విష్ణవశంఖం పూరించాడు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి అప్పటికి 17 సంవత్సరాలు అయింది. దేశాభ్యుదయం కోసం ఆ సంస్థ పాటు పడుతున్నది.
మన ప్రకాశం 65
(ప్రకాశం ఆలోచనలన్నీ మన మాతృదేశాభివృద్రి చుట్టూ తిరుగుతున్నవి. ఈ దేశం ఎప్పుడు స్వాతంత్ర్యం పాందుతుందా, అది ఐక్యమత్యంతో అభివృద్దిని, (ప్రపంచదేశాలలో (ప్రత్యేకమైన గుర్రింపును పొందుతుందా' అని ఎదురు చూచే రోజులవి. 'తన జీవితకాలములో స్వతంత్ర భారతాన్ని, సుసంపన్నమైన భారతాన్ని, సుస్థిరమైన భారతదేశాన్ని చూడగలనా' ఆని ఆయన ఆవేదన చెందుతున్న రోజులవి.
ఆయన మనసంతా భారతదేశాన్ని గురించిన ఆలోచనలతో నిండి ఉన్న ఆ సమయంలో అప్పుడే పరిచయమైన బారిష్టర్ ప్రోత్సాహంతో ప్రకాశం లండన్‌లోని ఇండియన్ సొసైటీ మెంబరుగా చేరాడు.
(ప్రముఖ స్వాతంత్ర్య యోధుడైన దాదాబాయి నౌరోజీ అప్పటికే ఆ సంస్థలో సభ్యుడు. అప్పటికాయన (వ్రాసిన 'ఇండియన్ పావర్టీ అనే గ్రంథం (ప్రసిద్ది పొందింది. (ప్రకాశం ఆ (గ్రంథాన్ని చదివాడు. భారతదేశంలోని దరిద్ర నారాయణుల స్వరూపం (ప్రకాళం కళ్ళముందు దర్శనమిచ్చింది.
-ఈ ఇండియన్ సొసైటీలో జాతీయ భావాలు కలవారు పలువురు సభ్యులుగా నున్నారు. జాతీయ కాంగ్రెస్ స్థాపకులలో ఒకడు, దేశాన్ని ఒకే త్రాటిపై నడిపించాలని కృషి చేశాడు. దాదాభాయ్ నౌరోజీ దీనిలో సభ్యుడు. ఇంగ్లీషు ప్రజలకు ఆనాటి భారతదేశ పరిస్థితులు తెలియజేయడానికి ఆయన లండన్ చేరుకొన్నాడు. అక్కడ తన అభిప్రాయాలను (ప్రచారం చేసాడు. మంచి గుర్తింపును పొందాడు. నాటి పార్లమెంటులో సభ్యత్వాన్ని కూడా పొందగలిగాడు, ఈయన ఇండియన్ సొసైటీలో సభ్యుడు. చాలాకాలం బెంగాల్లో ఉండి, అక్కడి పౌరసత్వాన్ని పొందిన విదేశీయుడు సర్ హెన్రీ కాటన్, భారతీయుల కష్టనీష్టూరాలు బాగా తెలిసిన ఈ ఇంగ్లీషు దొర భారత జాతీయ కాం(గైసు స్టాపకులలో నొకరు. భారతీయుల సమస్యలను అర్ధంచేసుకొన్న మరొక ఆంగ్రేయుడు “సర్ విలియమ్ వెడర్ బరన్ ఈయన బొంబాయిలో చాలాకాలముండి నగర పౌరసత్వాన్ని పొందినవాడు. జాతీయ కాం(గైసు సంస్థాపకులలో ఒకడు. ఈ వెడర్ బరన్, సరొహెన్రి
మన ప్రకాశం 66 కాటన్లు కూడా ఈ లండన్‌లోని ఇండియన్ సొసైటీలో సభ్యులై ప్రధాన భూమికను నిర్వహించేవారు.
ఐ.సి.ఎన్.గా ఉన్నతమైన ఉద్యోగంచేసి (ప్రసిద్ధుడైన భారతీయులు రమేశ్ చం(ద్రదత్తు, ఇకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, అనే (గ్రథాన్ని రచించిన రచయిత. ఈ రమేష్ చంద్ర దత్తు జాతీయ కాంగ్రెసుకు (ప్రథమాథ్యక్షుడైన డబ్లియు సి బెనర్జీ కూడా “లండన్ ఇండియన్ సొసైటీ” లో సభ్యులు మాత్రమే కాక ప్రధాన కార్యకర్తలుగా కూడా ఉండేవారు.
రమేష్ చంద్ర దత్తు రచించిన “ఇకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా” అనే గ్రంధాన్ని 'ప్రకాశు చదవడం జరిగింది. ఈ (గ్రంధం ఆయన మీద ప్రభావాన్ని ప్రసరించింది. దాంతో ఆయనకు ఆంగ్లేయుల పరిపాలనా విధానం మీద విముఖత, భారత స్వాతంత్ర్య సముపార్దన మీద ఆకాంక్ష పెచ్చరిల్లినవి.
ఈ లండన్ ఇండియన్ అసోసియేషన్ లో మంచి (గ్రంథాలయం ఉండేది. దీనిలో (ప్రొన్సు, ఇంగ్లండు, అమెరికా మొదలైన వివిధ దేశాలలో ప్రజా స్వామ్యం కోసం, ప్రజల స్వాతంత్రం కోసం జరిగిన సమరగాధలను తెలియజేసే (గ్రంథాలెన్నో ఉండేవి, ఆ గ్రంథాలు చదవడానికి ప్రకాశానికి అవకాశం లభించింది. ఈ సంఘ ముఖ్యోద్దేశం కూడా అదే. విద్యాభిలాషులై ఆదేశం వచ్చిన భారతీయులకు తమ దేశం తిరిగి వెళ్లిన తరువాత దేశసేవలో నిమగ్నులు కావడానికి తగిన విద్య వివేకాలను కలిగించడమే లండన్‌లో ఇండియన్ సొసైటీ ఆదర్శం. అంతేకాకుండా, హిందూదేశపు ఐశ్చర్యం తాము అనుభవిస్తూ ఆ దేశం ఎక్కడ ఉన్నదో ఎంత విశాలమైన దేశమో తెలియకుండా కాలక్షేపం చేసే ఆంగ్ల ప్రజలకు కనువిప్పు కలిగించడం కూడా ఈ సంఘం యొక్క మరో ఆదర్శం.
ఆ సంఘం తరపున తరుచుగా సభలు జరుపుతూ ఉండేవారు.
ఆ రోజులలో లండన్ ఇండియన్ సొసైటీ తరపున 'ఇండియా' అనే వారపత్రిక కాడా 'ప్రచురింపబడుతూ ఉండేది. ఈ సంఘం వారు (ప్రముఖులైన భారతీయులను
మన ప్రకాశం 6౮7 ఆహ్వనించేవారు. వారితో భారతదేశసమస్యల మీద ఉపన్యాసాలు ఇప్పీంచేవారు. గోపాలకృష్ణగోఖలే, లాలాలజపతిరాయ్ వంటి ప్రముఖులు ఈ సంస్థలో ఉండే వారి ఆహ్వానం పై ఉపన్యసించారు.
'. లాలాలజపతిరాయ్ లండన్వచ్చినపుడు, ఆయనను ప్రకాశం శ్యాంజీ కృష్ణ వర్మ ఇంట్లో కలుసుకొన్నారు. ప్రథమదర్భ్శనం లోనే ప్రకాశానికి ఆయనంటే అభిమానం, గౌరవం కలిగినాయి. లజపతిరాయ్‌గారి దేశభక్తి ఆవేశము ఆయన మాట్లాడే (ప్రతిమాటలో (ప్రస్ఫుటమయ్యేవి. సంపూర్ష స్వాతంత్ర్య విష్టవవాది. (బ్రిటిష్ వారి పాలనను అమితంగా ద్వేషించేవాడు. హిందూదేశంలో సాయుధ విష్ణవం తీసుకురావాలనే అభిప్రాయం కలవాడు. చాలా ధనంతుడు, “ఇండియన్ సోషియాలజిష్టు' అనే పత్రికను నడుపుతూ ఉండేవాడు. లండన్‌లో చదువుకొనే భారతీయ విద్యార్థులకు విద్యారివేతనా లిచ్చేవాడు.
ఆయనకు దేశమంటే చాలా అభిమానం, దేశంకోసం ఏదో చేయాలని, అమితంగా తాపదత్రయపడేవాడు. అందుకని తన విద్యార్థి వేతనాలు అందుకొన్న విద్యార్థి తన రాజకీయాలలో పని చేయాలని బాండు వ్రాయించుకొనేవాడు. వారి సేవలను దేశమాతకు వినియోగించాలన్నది ఆయన కోరిక
లజపతిరాయ్ భారత స్వాతంత్ర్యంకోసం అనుక్షణము ఉద్యమించాడు. ఆయన యువకులతోకలిసి మాట్టాడే సమయంలో ఈ స్వాతం[్య కాంక్ష తీవ్రంగా (ప్రకటితమయ్యేది. * ఎన్నాళ్లు మనదేశం ఈ విధంగా దాస్యశ్చంఖాలలో చిక్కుకొని ఉండాలని ఆవేశంతో తన ఆవేదన ప్రకటించేవారు.
శ్యాంజీ కృష్ణవర్మ లండన్‌లో ఉన్న ప్రసిద్ధమైన భారతీయుడు. ఈయన దేశభక్తి అపారమయినది. తన సంపదలోను, సంపాదనలోను చాలా భాగం దేశాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల నిర్వహణకుఖర్చుచేసిన వాడీయన.
“ఇండియన్ స్కాలర్పేప్' అను పేరుతో ఒక ఉపకార వేతనాన్ని ఈ కృష్ణవర్మ ఏర్పాటు చేశారు. సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు సావర్కారు, వి.వి.ఎస్ అయ్యరు, మదన్‌లాల్ డిం(గ్రా ప్రభృతులు ఈయన దగ్గర ఆ(శ్రయాన్ని పొందారు.
మన ప్రకాశం 658 భారత స్వాతం(త్ర్యంకోసం పాటుపడే మనుష్యులతోను, సంస్థలతోను ప్రకాశానికి పరిచమమేర్పడింది. ఆయనలో గల స్వాతం త్ర్యసముపార్దనాకాంక్షను ప్రబుద్ధంచేడానికి, ఆయన ఆ తరువాత (క్రియాశీలక రాజకీయాలలో ప్రవేశించడానికి ఇది దోహదపడింది. గాంధీజీ ఇంగ్రండు వచ్చినప్పుడు లండన్‌లో ఇండియన్ అసోసియేషన్ వారు ఆయన గౌరవార్థం ఒక సభ ఏర్పాటు చేశారు. అది లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ ఫాలెస్ హోటలులోని క్రింది అంతస్తులో జరిగింది. లండన్‌లో బారిష్టర్ చదివిన రోజుల నుండి ఆ ఆసోసియేషన్‌తో ప్రకాశానికి సంబంధమున్నది. ఆసోసియేసన్కు సభ్యులుగా కూడ ఉండేవారు. అందుచేత ఆ విందుకు (ప్రకాశంగారు కూడా హాజరు అయినారు. అప్పట్టో గాంధీజీ, ('ప్రకాశంగారూ కూడా పోటీ పెట్టుకొని, బూట్స్ వేసుకొని, టై కట్టుకొని అచ్చంగా దొరల వేషభాషలనే అనుకరించేవారు, ఆ తరువాత కాలంలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ స్వాతంత్రోద్యమ నాయకుడయినాడు. మహాత్మ గాంధీగా ప్రజల గౌరవాభిమానాలను అందుకొన్నాడు. దక్షిణ భారతదేశంలో అనేకమైన సత్యా[గ్రహోద్యమాలు నడిపించే నిరుపమాన నాయకుడై ఆంధ్రకేసరి అనే బిరుదును పాంరి ఉజ్వలంగా ప్రకాశించాడు ప్రకాశం. 1907 వ సంవత్సరంలో మద్రాసు హైకోర్టులో బారిష్టర్‌గా (ప్రాక్టీసు పెట్టిన నాటినుండి 1921వ సంవత్సరంలో సత్యాగ్రహోద్యమంలో దూకి న్యాయవాద వృత్తిని విసర్జించే వరకు ప్రతిభావంతుడైన న్యాయవాదిగా ఖ్యాతి గడించాడు (ప్రకాశంగారు. (ప్రకాశం పేరు పప్రాచుర్యంలోనికి రానారంభించింది. పది. సంవత్సరాల క్రింద కోర్టులలోని (ప్రాక్టీసు తాలూకు అనుభవమూ, యావదాంధ్రదేశంలోని పరిచితులూ, అభిమానులూ అత్యధిక సంఖ్యలో ఏర్పడడం ఇందుకు మరింత తోడ్పడినాయి. 1907వ సంవత్సరంలో బారిస్టరు వృత్తిని మద్రాసులో
మన ప్రకాశం 69 ప్రారంభించి 1921వ సంవత్సరంలో మానివేసే వరకు (ప్రకాశం బారిస్టర్లతో పోటీలో నిలట్రొక్కుకొని వారిని అధిగమించి రాణించటం, (ప్రకాశానికి గల అగణిత 'ప్రతిభాపాటవాలను ప్రస్ఫుటం చేస్తున్నది.
బారిస్టరుగా, స్వతంత్రంగా పనిచేసిన మొదటి (క్రిమినల్ కేసు- అతి పెద్ద కేసు ఆష్ హత్యకేసు. తిరునల్వేలి కలెక్టరు అయిన 'అష్' ను గుర్తు తెలియని వ్యక్తులెవరో తుపాకితో కాల్ఫి చంపారు. వందేమాతరం ఉద్యమం ముమ్మరంగా నడుస్తున్న రోజులవి.
స్వాతంత్ర్యం కోసం ఎందరో యువకులు ఆత్మార్పణకు సిద్దపడి, వీరకిశోరులై పని చేస్తున్న రోజులవి. తిరునల్వేలిలో చిదంబరం పిళ్ళై అనే దేశ భక్తుడు ఉండేవాడు. ఆయన తెల్లవారి కుటిల రాజనీతిని ధైర్యంగాఎదుర్కొనేవాడు. చిదంబరం స్వదేశీ నావిగేషన్ కంపెనీ స్థాపించాడు. అప్పట్లో ఓడల వ్యాపారం పై గుత్తాధిపత్యం కలిగి వున్న ఇంగ్లీషు వాళ్ళకిది కడుపుమంట అయింది. ప్రభుత్వ విద్రోహ నేగారోపణపై చిదంబరానికి ద్వీపాంతరవాస శిక్ష విధించారు.
చిదంబరం పిళ్ళైను కారాగారానికి తరలిస్తున్నపుడు అశేష ప్రజానీకం గుమికూడింది. ఆ దృశ్యం వారిని కలచి వేసింది. నిరాయుధులైన ప్రజలపై కలెక్టరు నిష్కారణంగా కాల్పులు జరిపించాడు. ముగ్గురు అమాయకులు నేల కొరిగారు. కలెక్టరు దుందుడుకు చర్యలపై నిరసన వ్యక్తం చేయటం కూడా రాజ(ద్రోహమైపోయింది. విమర్శించిన వారిని జైళ్లలో క్రుక్కి హింసించింది ప్రభుత్వం. అదీకాక వందేమాతరం ఉద్యమంతో దేశమంతటా ఆవేశపూరితమైన వాతావరణం నెలకొన్నది.
కర్ణన్ వంగ శేశ విభజన భారతీయుల క్రోధానికి కారణమయింది. ఆ సమయంలోనే, తిరునల్వేలిలో కలెక్టరు ఆష్ కాల్పులు జరిపించటమూ, అమాయకులు (ప్రాణాలు కోల్పోవడమూ జరిగింది. స్వాతం(త్రోద్యమకారులు, ఇందుకు ప్రతిచర్యగా ఆయనను కాల్చి చంపారు. ప్రభుత్వం ఇది అవమానకరంగా భావించింది. ఇద్దరు
యువకులను అనుమానించి, ఆనాటి ప్రభుత్వం వారిపై కేసులు పెట్టింది. కేసు విచారణ మద్రాసులో జరగాలని నిర్ణయించింది. ఆ కేసును మద్రాసు "హైకోర్టు పుల్ బెంచి విచారణకు స్వీకరించింది. ఐదుగురు న్యాయమూర్తులు ఈ కేసును విచారణ చేశారు. 'ప్రభుత్సంచే ముద్దాయిగా ఆరోపించబడిన ఇద్దరు యువకులలో ఒకడైన శంకర్ కృష్ణన్ అనే యువకుని తరపున (ప్రకాశం న్యాయవాదిగా పని చేసాడు. నేరం బుజువైతే, ఏ ద్వీిపాంతర శిక్షో, ఉరి శిక్షో విధించబడుతుంది. ఆందుచేత ్రకాశంగారు పట్టుదలతో, నేర్పుతో పనిచేసి, ప్రభుత్వాధికారులు ఆ కేసులో చేసిన అభూతకల్పనలు బయట పెట్టగలిగాడు. సమర్రమైన వాదనాపటిమతో ప్రభుత్వన్యాయవాదిని చిత్తు చేశాడు. దానితో శంకర్ కృష్ణన్ కు రెండేళ్ళకారాగార శిక్ష మాత్రమే విధించబడింది.
ఈ కేసుతో మద్రాసు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన ప్రకాశం పేరు వినబడింది. అప్పటి నుంచి ప్రకాశం తిరుగులేని న్యాయవాదిగా రూపొందాడు. అంతటితో, ప్రకాశం అభివృద్దై ఆగలేదు. ఆనాడు భారతదేశంలో న్యాయ సంబంధమైన వ్యవహారాలను విచారించే సర్యోన్నతమైన న్యాయస్థానం లండన్‌లో ఉండేది. దాని పేరు ప్రీవీ కౌన్సిల్, భారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాల తీర్పులపై అప్పీళ్లను స్వీకరించే న్యాయస్థానం అది. కక్షిదారులు మనదేశంలో తమ కేసుల పరిష్కారం సరిగా కాలేదనుకుంటే ప్రీవీ కౌన్సిల్‌కు వెళ్ళవచ్చును. ్రీవీ కౌన్సిల్ తీర్పు తుది తీర్పు అవుతుంది.
ఒకటి రెండు కేసులలో ట్రీవీ కౌన్సిల్ దాకావెళ్ళి వాదించి, విజయం సాధించాడు (ప్రకాశం. న్యాయమూర్తులకు మాటలలో కాని చేతలలో కాని నచ్చనివాడు (ప్రక్తాళం, ఒకసారి, శంకరన్ ఆయ్యర్ అనే జడ్జిముందు ఒక లిమిటేషన్ కేసు అప్పీలులో వాద (ప్రతివాదాలు జోరుగా పాగాతున్నాయి. ప్రకాశం చెప్పేది అంతా వినకుండానే అలాంటి కేసులో ఇది వరకు చాలా పర్యాయాలు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందని జడ్జిగారు అడ్డుతగిలారు. వెంటనే (ప్రకాశం దానిని నిర్ష్యందంగా ఖండించారు.
మన ప్రకాశం 7
అలాంటి కేసుపై మునుపెన్నడూ హైకోర్టు తీర్పు ఇవ్వలేదని ఆ జడ్జిగారు ఆ తీర్పు అసలే చెప్పలేదనీ ధైర్యంగా పలికాడు ప్రకాశం. దానితో జడ్జి తాను అనుకున్న కేసు ప్రకాశం వాదిస్తున్న కేసుకి సంబంధం లేదని (గ్రహించి చల్లబడినాడు. మరొక సారి నేపియర్ అనే జడ్డిముందు ఒక క్రిమినల్ కేసు విచారణకు వచ్చింది. ఆయన చురుకైన వాడేకాని శాంతగుణంలేదు. పది నిమిషాలలో కేసు అంతా తేల్చి చెప్పాలని జడ్జిగారు అన్నారు. అది సాధ్యపడే విషయం కాదని అన్నాడు ప్రకాశం. జడ్డి గౌరిచ్చిన సమయం కేసులోని ముఖ్య విషయం చెప్పేందుకు కూడా సరిపోదని నిజ్ఞచ్చిగా పలికాడు.
జడ్జిగారికి కోపం ముంచుకొచ్చింది. చాలు సోదికట్టిపెట్టండి అన్నారు! వెంటనే ప్రకాశం కాగితాల కట్టబల్ల మీద కొట్టి జడ్జిగారు చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్య ఉపసంహరించుకునేదాకా వాదన చేయబోనని చెప్పి నిరసన ప్రకటించాడు. అంతేకాదు బారిస్టర్ల సంఘం నేపియర్ అగౌరకరమైన చర్యకు తీవమైన అసమ్మతిని తెలియచేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించి పంపింది కూడా. చివరకు జడ్జిగారు క్షమాపణ చెప్పక తప్పలేదు.
వృత్తిలోను, ప్రవృత్తిలోను ఆత్మ గౌరవానికి స్వాతంత్ర్యానికి ఏమాత్రం భంగం కలగకుండా జీవనాన్ని గడిపిన ధీరుడు ప్రకాశం.
లౌకికదృష్టితో చూస్తే ప్రకాశం జీవితం భోగభాగ్యాలతో తులతూగే కాలమది. ఆయన మద్రాసు చేరి ప్రాక్టీసు ప్రారంభించే నాటికి ఇంగ్లాండు ప్రయాణం కోసం ఖర్చు చేసిన ఎనిమిదివేల రూపాయలు, పుస్తకాలు కొనడం కోసం ఖర్చుచేసిన పన్నెండు వేలు మొత్తం ఇరవై వేలరూపాయల అప్పు ఉంది. ఆ అప్పుతోనే ఆయన మదరాసులో బారిష్టరు వృత్తి (ప్రారంభించాడు. అయితే కొద్ది రోజులలోనే ఆ అప్పును తీర్చివేయగలిగాడు. దీన్ని బట్టి మదరాసులో ఆయన (ప్రాక్టీసు ఎంత బాగా వున్నదో మనకు తెలుసుంది. సంపాదనకు కావలసిన పేరు సంపాదించుకోడానికి ఆయన చాలా
మన ప్రకాశం (బి (శ్రమ చేశాడు. మదరాసులో (ప్రాక్టీసు ప్రారంభించడమంటే కొత్త (ప్రదేశంలో (ప్రవేశించడమేగా. పైగా ఆంతకు ముందు పదిమంది స్నేహితులు ఆయనను అక్కడ (ప్రాక్టీసు చేయడం మంచిది కాదని, అంతకుముందే అక్కడ స్థిరపడిన బారిష్టర్ల ధాటికి తట్టుకోలేడని నిరుతృాహపరిచారు. "
(ప్రకాశం మదరాసు చేరి ప్రాక్టీసు ప్రారంభించేసరికి భారతీయులైన బారిష్టర్లు మాధవన్ నాయరు, డాక్టర్ స్వామినాథన్, కె.పి.ఎస్ మూస్ గారలు మంచి ప్రాక్టీసుతో ఉండేవారు. సర్వాలస్ అడ్వకేటు జనరల్‌గా ఉండేవాడు.
ఈ వాలస్ ఒక సందర్భంలో ప్రకాశానికి మదరాసులో ఉన్న పెద్ద పెద్ద ప్లీడర్ల ధాటికి తట్టుకొనడం కష్టమనీ, జిల్లా కేంద్రంలో ఎక్కడైనా ప్రాక్టీసు చేసుకొమ్మని సలహా ఇచ్చి ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ప్రాక్టీసు ప్రారంభించి, దానిని వృద్ది చేసుకుంటూ ముందుకు సాగాడు బారిష్టర్ ప్రకాశం. ఆయన మదరాసు చేరిన కొద్ది కాలానికి కాకినాడలో వకీలుగా ఉన్న పేరి నారాయణ మూర్తిగారు మద్రాసు చేరారు. ఆయన కూడా ప్రకాశానికి స్నేహమయ్యాడు. ఈయన మదరాసు నుంచి వచ్చిన తరువాత తెలుగు ప్రాంతంలో ఉండే ఫైలులో తొంబై శాతం కేసులు వీరి దగ్గరికే వస్తూ ఉండేవి,
(ప్రకాశం చిన్నవాడనీ, జూనియర్ అనీ, అప్పుడే మద్రాసు ప్రవేశించినవాడని, అప్పటికి అక్కడ ఉన్న స్లీడర్లకు కాస్త చిన్న చూపు ఉండేది. ఈ సంఘటనను గురించి మనం తెలుసుకుంటే సీనియారిటీని గురించి నాటి ప్లీడర్లు ఎంతగా పట్టించుకునేవారో తెలుస్తుంది,
(ప్రకాశం బారిష్టరుగా మద్రాసు వచ్చిన కొద్ది రోజులకే ఒక సివిల్ అప్పీలు కేసులో టి.వి. శేషగిరి ఆయ్యంగారు అనే ప్లీడరుతో కలిసి పని చేయవలసి వచ్చింది. అయితే ఆయన ఫస్ట్ గ్రేడ్ ప్లీడరీ చదివినవాడు. ఈ శేషగిరి అయ్యరు వయసులోనూ, (ప్రాక్టీసులోను ప్రకాశం కంటే సీనియరు, అయినా బారిష్టరు చదివిన వాడు కావడం మూలంగా ప్రకాశానికి సీనియారిటీ వచ్చిరది. అందుకనే ఇద్దరూ కలిసి పనిచేయడానికి
మన ప్రకాశం 73 అవకాశం కలిగింది. కాని ఆ శేషిగిరి అయ్యరు, నిన్నకాక మొన్న మద్రాసు వచ్చి, వయసులోనూ, అనుభవంలోను తక్కువవాడయిన (ప్రకాశంతో కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదు. ఆ కేసులో పనిచేయడం విరమించుకున్నాడు. అయితే ప్రకాశం మాత్రం కేసు ఆర్యుమెంట్ చెప్పాడు. "
ఆ తరువాత మరో నందర్భంలో కూడా ఇలాంటి విషయువేం పునరావృతమయింది. దీనిలోను శేషగిరి అయ్యరుగారి పాత్ర ప్రాధాన్యత సంతరించుకున్నది. ఆర్.కుప్పుస్వామి అయ్యంగార్ అనే ప్రసిద్ధ న్యాయవాది, ప్రకాశం ఒక కేసులో కలిసి పనిచేయవలసి వచ్చింది. ఈ కుప్పుస్వామి ప్రకాశానికి చిరకాల మిత్రుడు. బి.ఎ. పరిక్షలో ఫస్ట్‌క్లాస్‌లో ఫస్ట్‌గా ఉత్తీర్ణుడయినవాడు. మద్రాసులో లాయర్లలో అప్పటికే మంచి గుర్తింపు పొందాడు. ఈయనకు గూడా శేషగిరి అయ్యరు చిన్నవాడయిన ప్రకాశంతో కలిసి పనిచేయడం చిన్నతనమనీ, ఆ కేసునుండి తప్పుకొనమని సలహా ఇచ్చాడు. కాని ఆ సలహా కుప్పుస్వామిగారిని ప్రభావితం చేయలేదు. ఆ కేసు ముగిసే వరకు ప్రకాశంతో కలిసి పని చేశాడు,
బారిష్టరుగా మదరాసుకు వచ్చిన ప్రారంభంలో కోర్టులో ప్రకాశం వాదిస్తున్నాడు. సర్ సుబ్రహ్మణ్యం ఆయ్యంగారు జడ్జిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన కోర్టులో కూర్చుని ఉన్న ఆర్. వెంకట్రామశాస్త్రి గారిని పిలిచి దానికి సంబంధించిన కేసు ఏదో ఉండాలి, వెదికి తీయమన్నారు. వకీలు పనిచేసేవారికి అది అంత గౌరవకరమైన విషయం కాదు. కాదంటే జడ్డిగారికి కోపమొస్తుందేమో! అవునంటే ఆయన వ్యక్తిత్వానికి భంగకరం. మింగలేక కక్కలేక వెంకట్రామళా'స్తిగారు బాధపడుతున్నారు అప్పుడు ప్రకాశం లేచి “అయ్యా, నేను నా మిత్రులూ ఇందుకు సంబంధించిన కేసులన్నీ వెదికాము. ఎక్కడా తీర్పుకి వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదు” అని గట్టిగా పలికాడు. ఆయేన పని జరిగింది కదా! జడ్జిగారు శాంతించారు.
మన ప్రకాశం 76 మొత్తం మీద మద్రాసు బారు మొదట్లో ప్రకాశానికి అంతగా స్వాగతం పలకలేదు. సరికదా, బారిష్టరుగా నిలద్రాక్కుకొనడానికి కూడా అడుగడుగునా అడ్డంకులను కలిగించింది. అయితే ్రకాశానికికున్న ఆత్మ విశ్వాసమే ఆయనను ముందుకు నడిపింది. ఏ వృత్తిలోనయినా ఆత్మ విశ్వాసం అవసరం. అందులో లాయరు వృత్తికి అది మరీ అవసరం. జడ్జీలని ఆశ్రయించి వారి దయవల్ల వృద్ధిలోకి రావడం అనేది ఎక్కడో కాని జరిగే పని కాదు. ఒకవేళ జరిగినా అది పద్దతి కాదు. సిద్దాంతం అసలే కాదు. వృత్తిలో విజయం సాధించాలంటే ఆత్మ విశ్వాసం, దానితో పాటు కృషీ ఉండాలి. కేసులు వచ్చినప్పుడు ప్రకాశం వాటివి క్షుజ్మంగా చదివేవాడు. అంతేకాదు. కౌత్తగా వచ్చిన 'లా” (గ్రంథాలు తీర్పుల సంకలనాలు కూడా శ్రద్దగా చదివేవాడు. ప్రకాశం లండన్‌లో బారిష్టరు చదినే సమయంలో అక్కడి ప్రసిద్దులయిన బారిష్టర్టు అర్ధరాత్రి సమయంలో రెండు, మూడు గంటలవరకు దీక్షగా చదివి, కేసుల విషయంలో గట్టి కృషి చేయడం గమనించాడు. అదే విధంగా తానూ గట్టి కృషి సలిపితే రాణించగలననుకొన్నాడు. కృషితో ప్తి దుర్భిక్షమ్' అనే సూక్తివి ఆయన విశ్వసించాడు. గట్టి కృషి సలహాలని నిశ్ళ్భయించుకొన్నాడు. కేసులు వచ్చినపుడు చాలా క్షుణ్మంగా చదివేవాడు. ఆత్మ విశ్వాసము, నిర్భీతి, దుస్తరమైన కృషి ఇవి ఆయన విజయానికి సోపానాలుగా విశ్వసించిన త్రిరత్నాలు. ఈ మూడింటి నమన్వయం వలన మదరాసు బారులో (వ్రకాశం నమున్నతమైన స్థానం ఆ'క్రమించగలిగాడు. ఆయన క్షయింట్లకు ప్రకాశమంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉండేది. తమ కేసులు బారిష్టరు ప్రకాశానికి అప్పుగిప్తే పట్టుదలతో పనిచేసి కేసు గెలిపిస్తాడనే ఖ్యాతిని సంపాదించుకున్నాడు. ప్రకాశం పట్ట ఆయన క్రయింట్లకుండే విశ్వాసమే ఆ వృత్తిలో ఆయనకు విజయాన్ని సాధించిపెట్టింది. ఈ సందర్భంలో మరో విషయాన్ని కూడా మనం గుర్తించాలి. జడ్డీలతో ప్రవర్తించే సమయంలో లాయర్లకు ధైర్యం కూడా వృత్తిలో విజయం పొందడానికి గొప్ప సహాయకారి అవుతుంది. జడ్డీలను ఎదుర్కొనే లాయర్లకు మంచి పేరు వస్తుంది.
చును ప్రకాశం 75 దానివలన అలాంటి కేసులున్న వారు అలాంటి సందర్భాలు అవసరమై, వారు తమ కేసులు తీసుకొని వెతుక్కుంటూ వస్తారు. బారిష్టరు ప్రకాశం పట్ట కూడా ఇదే విషయం నిరూపీతమయింది.
కొద్దికాలంలోనే మద్రాసు హైకోర్టులో అప్పిలెట్కేసులలోను, సివిల్లోను, (క్రిమినలులోను మంచి ప్రాక్టీసును సంపాదించాడు బారిష్టరు ప్రకాశం. నగరంలోని పెద్ద బారిష్టర్లు అంతా ఆశ్చర్యపడ్డారు. సమర్భులైన బారిష్టర్టున్న మద్రాసులో రాణించలేడనీ, అందుచేత ఏ జిల్లాకయినా వెళ్ళి, ఆ జిల్లా కేంద్రంలో ప్రాక్తీసు పెట్టుకుంటే మంచిదని సలహా నిచ్చిన సర్జాన్ వాలెస్. చీఫ్ జస్టిస్ ఆర్జాల్డు వైటూ (ప్రభృతులు మరింత ఆశ్చర్యపడ్డారు. బారిష్టరు (ప్రకాశం (ప్రాక్టీసు మదరాసులో "పెరుగుతూనే ఉన్నది. బారిష్టరుగా ఆయనకు గొప్ప ప్రసిద్ది వచ్చింది. |
అప్పుడు మదరాసు హైకోర్టులో నేపియర్ జడ్జిగా ఉండేవారు. బారిష్టరు (ప్రకాశం వృత్తిలో సాధించిన ఘనతను గమనించిన జస్టిస్ నేపియర్ ప్రకాశాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
ఆయన ప్రకాశాన్ని “హిందూ లాని గురించి (గ్రంథాన్ని వ్రాసిన ప్రసిద్ధులైన జాన్ డి.మెయిన్ తరువాత మీకున్నంత సివిల్ ప్రాక్టీసు మద్రాసు బారిష్టర్లలో మరింకెవరికీ”లేదు” అని ప్రశంసించారు. ప్రకాశం ప్రాక్టీసు కోసం ఎప్పుడూ బాధపడలేదు. (ప్రాక్టీసు బాగా ఉండేది.
ఆ'సమయంలో ప్రకాశానికి సహాయం చేయడానికి ఒక జూనియర్ లాయర్ అవసరమయినాడు. ఆయన పేరు వెంకటరమణరావుగారు; అప్పటికే వెంకటరమణ రావు గారు బి.ఎల్. పరీక్షలో ఉత్తీర్ణులయినారు. చురుకైనవాడు. బుద్ధిశాలి. మంచి జ్ఞాపకశక్తి గలవాడు. కేసును బాగా అధ్యయనం చేసి, అందులో ఉండే లా పాయింటు ఆలోచించి, వాటిని విపులంగా జడ్జి ఎదుట పెట్టేవాడు. బారిష్టరు (ప్రకాశం కేసులలో విజయం సాధించడానికి ఎంతగానో తోడ్పడేది. కొదమసింహం లాంటి దైర్యము, పౌరుషము గల బారిష్టరు (ప్రకాశం యొక్క శక్తి సామర్జ్యాలకు
మన ప్రకాశం 76 ఈ వెంకటరమణారావు గారి ప్రతిభ, చురుకుదనము తోడ్పడ్డాయి. ఇంకేముంది. (ప్రకాశం ప్రాక్టీసు మూడు పూవులు, ఆరుకాయలుగా వృద్దిపొందింది. ఈ విధంగా పధ్నాలుగు సంవత్సరాలు జడ్డీలతో హోరాహోరీగా పోరాడుతూ, ఆత్మ గౌరవానికీ, వృత్తి స్వాతంత్ర్యానికి భంగం వాటిల్లకుండా బారిష్టరీ నడిపించాడు. పని (ప్రారంభించిన కొద్ది కాలానికి ప్రకాశానికి ఒక ఆలోచన వచ్చింది. జడ్డీలను సరియైన పద్దతిలో నడిపించడానికి వృత్తిపరమైన పత్రికనొకటి ప్రచురిస్తే బాగుంటుంది. (ప్రముఖులైన లాయర్లతోను, పుర (ప్రముఖులతోను సంప్రదించాడు. అందరూ ఆలోచన బాగానే ఉందన్నారు. ప్రకాశం ఆ ఏర్పాట్లలో ఉన్నాడు.
ఆ పత్రికకు 'లా టైమ్స్” అని 'పేరుంచారు. దానికి (ప్రధాన సంపాదకులు (ప్రకాశమే. బారిష్టరు దేవదాసు, మాధావన్నాయరు మొదలయిన వారు సహాయ సంపాదకులు, ఆ పత్రికలో జడ్జీలను గురించి, వారి ప్రవర్తనా సరళిని గురించి నిర్భయంగా (వ్రాస్తూ ఉండేవారు. ఈ లాటైమ్స్, పత్రిక నడచినన్నాళ్లు జడ్జీలకు, ప్లీడర్లకు కొరడాలాగా ఉండేది.
(ప్రకాశం ప్రాక్టీసు మద్రాసులోని హైకోర్టుకు మాత్రమే పరిమితమయింది కాదు. దక్షిణా పథములో కూడా వ్యాపించి ఉండేది. విశాఖపట్టణం మొదలు తిరుచిరాపల్లి వరకూ గల జిల్లా కోర్టులన్నిటిలో న్యాయవాదిగా హాజరు అయినారు. ఒకసారి తిరుచురాపల్లిలో సివిల్ కేసులో వాదిస్తూ మూడు నెలలు ఉన్నారు. ఆ కేసుకు వేలకువేలు ఫీజుగా పుచ్చుకొన్నారు. కొన్ని కేసులలో రోజుకు ఐదువందలు, వెయ్యి రూపాయలు కూడా ఫీజుగా పుచ్చుకొనేవారు. తిరుచిరాపల్లిలో గెలిచిన కేసుకి లభించిన ధనంతో ఊటీలో బంగళా కొన్నారు. ఆ బంగళాకి 'గోదావరి' అని పేరు పెట్టుకొ న్నారు.
1919 లో రాజమహేంద్రవరంలో సత్యవోలు గున్నేశ్చరరావు (ప్రభృతులపైన వచ్చిన 'పోర్టరీ కరెన్సీ నోట్లు కేసు మొదటి నుంచీ ప్రకాశమే నడిపించాడు. నిడదవోలు వారికి సంబంధించి, పార్టిషన్ కేసు, కృష్ణాజిల్దా జమీందారీ కేసులు, ధనం పుష్కలంగా వచ్చే కేసులు అన్నీ ప్రకాశం దగ్గణకే వచ్చాయి. పానగల్లు రాజాగారు చిత్తూరు కోర్టులో కాళహస్తి జమీందారు గారి మీద తెచ్చిన సవిల్ లిటిగేషన్ కేసులో చాలాకాలం ఈయన
మన ప్రకాశం 77 పనిచేశాడట. ఈ విధంగా (ప్రాక్టీసు బాగా వచ్చింది. (ప్రాక్టీసు బాగా రావడం వలన (ప్రకాశం చాలా ధనమార్చించాడు. రెండు మూడు అక్షల రూపాయలు కూడబెట్టాడు, మద్రాసులో ఒక ఇల్లూ, ఊటీలో ఒక బంగళా, ఒంగోలులో రాజమహేంద్రవరంలోను ఒక్కొక్క ఇల్లూ ఇంకా రెండు లక్షల రూపాయలు విలువగల స్టిరాస్ట్రి కూడా సంపాదించగలిగాడు. పెద్దవాడయిన తరువాత ప్లీడర్ వృత్తినుండి విశ్రాంతి తీసుకొన్న తరువాత ఊటీలోనూ, రాజమహేం[ద్రవరంలోను ఒక్కొక్క ఊరి లోనూ మూడేసి మాసాల చొప్పున ఉండి వైవిధ్య భరితమైన జీవితం గడపాలని (ప్రకాశానికి ఉండేది.
ఆకాలంలోనే రెండు కేసులలో ్రీవీ కౌన్సిలు ఎదుట వాదించడానికి రెండుసార్డు ఇంగ్లండు వెళ్ళారు. ఒక్కొక్కసారి మూడు మాసాలకి తక్కువ కాకుండా ఉన్నారు, అలాంటి సందర్భంలో అక్కడ లండన్‌లో వెస్ట్ మినిష్టర్ పాలెస్ హోటల్లో ఉండేవాడు. అప్పటికే దక్షిణాఫ్రికా జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం జరుపుతున్న బారిష్టర్ మోహన్‌దాస్ కరంచంద్ గాంధీజీని ప్రథమంగా దర్శించాడు.
దేశసీవ
(ప్రకాశం పంతులుగారు ఆంధ్రావని నుండి ఉద్భవించిన అనర్హరత్నం. రాజమహేంద్రవరంలో సెకండ్ (గ్రేడ్ ప్లీడర్‌గా చేస్తూనే పురపాలకసంఘ ఛైర్మన్‌గా రాజమహేంద్రవర ప్రజలను కన్న బిడ్డలవలె చూశాడు. జన్మతః అలవడిన ధైర్య శార్యసాహసగుణాలు ప్రజాసేవ చేయడంలో ఆయనకు ప్రయోజనకరాలయినాయి. పంతొమ్మిదవ దశాబ్దపు చివరినాటికి పద్దెనిమిది వందల యాబైఏడవ సంవత్సరము నాటి స్వాతంత్ర్య యుద్ధగాధలు 'ప్రచారంలోనే ఉన్నవి. ఆ గాధలు ప్రకాశానికి ఉత్తేజం కలిగించినవి. పద్దెనిమిది వందల తొంబై మూడవ సంవత్సరములో ప్రకాశం మద్రాసు లా కాలేజీలో చదువుకునే రోజులలో ఆయనతో చాలాసేపు చర్చచేయటం జరిగినది. ఉద్వేగభరితమైన ఉత్సాహజనకమైన ఆయన వాగ్బ రికి పులకించి పోయినాడు ప్రకాశం.మనసులో స్వేచ్చా భారతం పట్ట తీవ్రమైన దేశ సేవ పట్ట తపనకు అప్పుడే
నును సకాజం గప అంకురం పడింది. సానునుంతరావుగారి బోభనజతో చిన్నప్పుడే మాతృభూమి పట్ల మవకారాన్ని పెంచుకున్న ప్రకాశం ఎదుగుతున్న కొలది ఎదలో స్వాతంత్ర్య కాంక్ష కూడా (ప్రబలం కాజొచ్చింది. బారిస్టరు కోర్సు చదవడానికి ఇంగ్లండు వెళ్ళినప్పుడు గోపాలకృష్ణ గోఖలే, మోహన్‌దాస్ కరంచంద్ గాంధీజీ నంటి మహానాయకు ల సాన్నిహిత్యం లభించే అదృష్టం కలిగింది
ఇంగ్లండులో చదివే రోజులలో లండన్ ఇండియన్ ఎసోఎసియేషన్లో సభ్యునిగా చేరాడు. రమేష్ చంద్రదత్, ఉమేష్ చంద్ర బెనర్జీ, దాదాభాయ్ నౌరోజీ శ్యాంజీ కృష్ణ వర్మ, మదన్ లాల్ డిం'ఘ్రా, వినాయక దామోదర సావర్కార్, మొదలైన భారతీయ ప్రముఖులు లండన్‌లో ఉండేవారు. భారతదేశంలో బ్రిటీష్‌పాలనలో జరుగుతున్న అన్యాయాలపై సమరం సాగించాటానికి వారు కృషి చేస్తున్నారు.
లాలాలజపతిరాయ్, బాలగంగాధర తిలక్ వంటి దేశ భక్తులు భారతదేశ పరిస్తితులను గురించి బ్రిటీష్ అధికారులకు ఇంగ్లీషు ప్రజలకు తెలియచెప్పేవారు. బారిస్టరు చదువు సాగిస్తున్నా మాతృ భూమిలోని రాజకీయ ఆందోళనలను దేశభక్తుల త్యాగనిరతిని ప్రభుత్వం అవలంభిస్తున్న దమన నీతిని గమనిస్తూనే ఉన్నాడు ప్రకాశం. లాలాలజపతిరాయ్ ఇంగ్రండు వెళ్లినప్పుడు (ప్రకాశం ఆతనిని కలసి స్వాతంత్రోద్యమ పరిస్థిని గురించిచర్చించటం జరిగింది. భారతదేశంలో (బ్రిటీష్ వారి క్రూరమైన పాలనను, వారు దేశ భక్తులను పెట్టే చిత్రహింసలను గూర్చి విన్నప్పుడు దాదాబాయ్ నౌరోజీ ఎంతో బాధపడేవారు. ఆ రోజులలోనే నారోజీని చాలాసార్లు కలుసుకున్నాడు ప్రకాశం. నౌరోజీ వ్రాసిన పావర్టీ అనే (గ్రంధం (బ్రిటీష్ వారి దోపిడీ విధానాలను ఆర్హం చేసుకొనడానికి ప్రకాశానికి ఎంతగానో ఉపయోగపడింది.
రమేష్ చంద్ర దత్తు ఐ.సి.ఎస్ పరీక్షలో కృతార్చుడై కలెక్టరుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి భారతదేశ చరిత్ర, భారతీయుల ఆర్థిక పరిస్థితులను గురించి గొప్ప (గ్రంథాలను వ్రాశాడు, ఉద్యోగ విరమణ అనంతరం ఆయన ఇంగ్లండులో కొంతకాలం ఉన్నప్పుడు లండన్‌లో ప్రకాశం ఆతనిని కలిశాడు. 'భారతదేశపు ఆర్థిక పరిస్థితులు"
దున ప్రకాశం అనే దత్తుగారి గ్రంథాన్ని (ప్రకాశం చాలా (శ్రద్ధగా చదివి అనేక విషయాలను (గ్రహించాడు. ఇలాగ ఎందరో మహనీయుల సాన్నిహిత్యంతో (ప్రకాశంలోని దేశభక్తి భావాలు నానాటికీ ప్రబఅం కాజొచ్చినవి. వందేమాతరం ఉద్యమ రోజులలో బిసిన్ చంద్రపాల్ రాజముండ్రి వచ్చాడు. రాజమహేం[ద్రవరంలో ఆయన చేసిన ప్రసంగం ప్రజలను. ఉర్రూతలూగించింది. పెద్ద పెద్ద నగరాలలో సభలలో తన ఉపన్యాసాలతో ప్రజలలో చైతన్యం కళ్ళించటానికి స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించటానికి ప్రయత్నించిన మహనీయ మూర్తి బిపిన్ చంద్రపాల్. రాజమండ్రిలో ఉసన్యాసాలు కాగానే మద్రాసు వెళ్లారు బిపిన్ చం(ద్రపాల్ మద్రాసులో ఆయన ఉపన్యసించే సభలకు అధ్యక్షులుగా ఉండడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రకాశం పంతులుగారు అప్పుడే బారిష్టర్ పట్టా పుచ్చుకొని మద్రాసులో ప్రాక్టీసు (ప్రారంభించారు. పాల్ గారి సభలకు ఎధ్యక్షత వహించనలసిందిగా (ప్రకాశాన్ని అందరూ కోరడంతో, ప్రకాశం అందుకు అంగీకరించాడు. అప్పుడే బారిష్టరు పట్టాపొంది, ఎంతో భవిష్యత్ ఉండగా తమ ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాల జోలికెందుకు వెళ్లడమని కొందరు సలహా చెప్పినా వినిపించుకోలేదు ప్రకాశం. బిపిన్ చంద్రపాల్ సభలకు దక్షత కలిగిన అధ్యక్షునిగా, అసభకును విజయవంతమొనర్భారు. జిశభక్తి ముందు తన జీవితమూ, భద్రత ఎంత మాత్రమూ లెక్కలోనికి రాలేదు ప్రకాశానికి. పందొమ్మిది వందల ఏడవ సంవత్సరములో సూరత్‌లో జరిగిన జాతీయ కాం(గైస్ మహాసభలకు ప్రకాశం హాజరైనాడు, అప్పట్టో, మితవాదులూ, అతివాదులూ అని రాజకీయ వేత్తల్లో ఏర్పడిన వీలికలు సూరత్ సనూవేశంలో తీవ్రమైన సంఘర్షణలు వచ్చి తవేరయిపోయాయి. దేశంలోని ఆతివాదులకు లాలాలజపతిరాయ్, బాలగంగాధర తిలక్ బిపిన్ చంద్రపాల్ నాయకులు. వరిని "లాల్, బాల్, పొల్ొ' అని పొట్టి "పేర్లతో పలిచేవారు. మితవాదులకు సర్ ఫిరోజ్‌షా మెహతా, గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ ప్రభృతులు నాయకులు. ప్రకాశం పంతులు అతివాదుల ఆదర్శాల పట్టే ఆకర్షితుడయ్యాడు.
మన ప్రకాశం 80
వందామ్మిది వందల సద్నాలుగవ సంవత్సరం వరకు భారతదేశ స్వాతంత్రోద్యమంలో మితవాదులది పై చేయిగా ఉండేది. పందొమ్మిది వందల పదహేడవ సంవత్సరం కలకత్తాలో కాం(గ్రేస్ మహాసభ జరిగింది. అనీబిసెంట్ ఆ మహాసభకు అధ్యక్షురాలు. అప్పటి నుండి (ప్రకాశం స్వాతంత్రోద్యమ రాజకీయాలలో మరింత చురుకుగా పాల్ల్న్నారు.
పందొమ్మిది వందల పందొమ్మిదిలో లక్నోలో జరిగిన కాం(గైస్ మహాసభలో అప్పటి వరకు వేరుగా ఉన్న ఆతివాదులూ మితవాదులూ తిరిగి ఐక్యమైనారు. కాంగగైసు చరిత్రలో అది ఒక మహాఘట్టం.
ఇంగ్లండులో బారిస్టరు పరీక్షకు చదువుకొంటున్న రోజులోనే విద్యాభ్యాసంతోపాటు పాశ్చాత్య దేశాల స్థితిగతులను క్షుణ్మంగా అధ్యయనం చేశాడు (ప్రకాశం. భారతదేశాంలో ఉన్న పరాయి ప్రభుత్వానికి (ప్రజల సౌఖ్యం గురించి పట్టదు. ఇంగ్లీషు వాళ్ల పాలనలో మనమెంతో నష్టపోయాం. ఆర్టికంగా సామాజికంగా, నైతికంగా, అన్ని విధాల మనలను నాశనం చేసి, పబ్బంగడుపుకొన్నారు తెల్లదొరలు, మన జీవన విధానం పట్ట వారి కెంతో తేలిక భావం ఉండేది. స్వదేశ్ పరిశ్రమలు ధ్వంసమైనాయి. విదేశీ వస్తు వ్యామోహం ప్రజలలో కలిగించారు. ఇంగ్రీషు వాళ్లు మనదేశం నుండి తీసుకొనివెళ్లిన ముడిసరుకుతో తయారు చేసిన వస్తువులను మనకు అమ్మి విపరీతమైన లాభాలను ఆర్జించేవారు.
అలాంటి సమయంలో, గాంధి మహాత్ముని సత్యాగ్రహ పోరాటపు పిలుపును దేశమంతా అందుకొన్నది. ప్రధమ (ప్రపంచ యుద్ధంలో భారతీయులు ధన వస్తు సేవ రూపంలో తెల్లవారెకెన్ని విధాల సాయపడినా, యుద్దానంతరం (బ్రిటీష్ వారు ఏపాటి కృతజ్ఞత కనపరచకపోగా, ఆంక్షలను మరింత జటిలం చేశారు. పందొమ్మిది వందల పందొమ్మిదిలో జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతం పదహారు వందల నిండు ప్రాణాలను బలి తీసుకొన్నది. పరాయి పాలనపట్ట వైముఖ్యం మిక్కుటమయింది.
మన ప్రకాశం 81 భారత ధాత్రీ బంధనవిమోచనానికై పరితపించి తన సర్వస్వము సమర్పించిన ఆ కళంక దేశభక్తుడు తిలక్ మహాశయుడు పందొమ్మిది వందల పందొమ్మిది జులై ముప్పై ఒకటవ తేదీన పరమపదించాడు. ఆయన మరణవార్త విని యావద్పారతం విలపించింది. దేశంలో స్వాతంత్రోద్యమం మరింత దీస్తిమంతం కావడానికి ఇది తోడ్చడింది కూడా. తిలక్ పేరిట “స్వరాజ్యనిధి” ఏర్పరచబడింది. ప్రకాశం పంతులుగారు కూడా దేశ సేవా కార్య(క్రమాలలో పూర్తిగా నిమగ్నమైనారు. అది నందొమ్మిది వందల ఇరచన్హై ఒకటవ నంవత్సరం. గాందీజీ స్వాతంత్రోద్యమానికి తిరుగులేని నాయకుడైనాడు, గాంధీజీ ఇచ్చిన పిలుపు నందుకొని ప్రకాశం తన న్యాయవాద వృత్తిని విసర్డించారు. నెలకు ఆకరేడువేల ఆర్జనం చేస్తూ, లెక్కకందని ఆస్తిపాస్తులను కూడబెట్ట గలిగిన న్యాయవాద వృత్తిని, స్వరాజ్య సమరం కోసం వదిలివేశాడు. స్వరాజ్య పత్రిక - పూర్వరంగం స్వరాజ్యపత్రిక పందొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో అక్టోబరు 29వ తేదీన ప్రారంభించబడింది. ఆనాటి భారతదేశ పరిస్థితులను ఒక్కసారి మనం గమనించడం అప్రస్తుతం కాదు. అప్పుడే నాగపూరు కాం(గైెసు తీర్మానం వచ్చింది. సహాయ నిరాకదణోద్యమం రూపొందింది. ఈ ఉద్యమాన్ని అనుసరించి, కోర్టులు, పాఠశాలలు, శాసన సభలు, బహిష్కరించవలసినది అని నిర్మాణ కార్యక్రమం పూర్తిగా ఒక సంవత్సరము సాగించి, జయప్రదము చేయవలెనని ఈ తీర్మానము పిలుపునిచ్చింది. అంతేకాక స్వరాజ్యనిధి
మన ప్రకాశం 82 "పేరుతో ఆ సంవత్సరంలోపు కోటి రూపాయలు వసూలు. చేయవలసింది అన్నది ఆ తీర్మానములోని మరో విషయం. దేశమంతటా నూలు వడికేటట్టు చేయవలసింది అని దానికి గాను దేశంలో ఇరవైలక్షల రాట్నాలు ప్రవేశపెట్టవలసింది అని ఆ తీర్మానంలో ఉన్నది. నిర్మాణ కార్యశ్రమంలో జాతీయ పాఠశాలలను ఏర్పరచటం, ఎక్కడితగవులను అక్కడే పంచాయితీ కోర్టుల ద్యారా పరిష్కారం చేయడానికి అనువైన ఏర్పాట్లను చేయడం మొదలైనవి ఉన్నాయి. పందొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరము లోనే బెజవాడలో జరిగిన అఖిల భారత కాం(గైసు సమావేశంలో (త్రివిధ బహిష్కారాలను గూర్చిన తీర్మానాలు వచ్చాయి. పందొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో నాగపూరులో జరిగిన కాంగ్రెసు సభలో దేశమంతా భాషా రాష్ట్రాల క్రింద విభజింపవలసిన విషయాన్ని నొక్కి చెప్పింది.ఈ భాషా రాష్ట్రాలు ఇరవై ఒకటిగా అయినప్పటికి మదరాసు నగరం తెలుగు నగరం. పూర్వం ఇది చంద్రగిరి రాజుల పరిపాలనలో ఉండేది. ఆ చరద్రగిరి రాజే ఈ నగరాన్ని (బ్రిటీషు వారికి స్వాధీనం చేశాడు. బ్రిటీష్ వారికి స్వాధీనమైనప్పుడు తెలుగు జిల్బాలలో ఉండే చాలా మంది వర్తకులు చెన్నపట్నానికి వచ్చిఅక్కడనే వ్యాపారంచేసుకొంటూండేవారు. అందుచేత ఇది అప్పటికి ఆం(ధ్రుల నగరమే అని చెప్పవచ్చు. అప్పటిలో మద్రాసులో హైకోర్టు ఉండేది. అందువలన అన్ని భాషలకు చెందిన లాయర్హు, అన్ని భాషా రాష్ట్రాల నుంచి చెన్టపట్నానికి వచ్చి ప్రాక్టీసు చేసుకొంటూఉండేవారు. . (ప్రకాశం గారు కూడా చిన్నతనంలో మద్రాసు లా కాలేజీలో చదివారు. అక్కడనే ప్లీడరు పరీక్షలో ఉత్తీర్ణులయినారు. ప్లీడరు చదువయిన తరువాత తొమ్మిది, పది సంవత్సరాలు రాజమండ్రిలో ప్రాక్టీసు చేసినా ఇంగ్లాండు వెళ్ళి బారిష్టరు చదివి, ఉత్తీర్ణులయి వచ్చినా పందొమ్మిది వందల ఏడవ సంవత్సరం మొదలుకొని పందొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం వరకు హైకోర్టులోను, జిల్దాకోర్టులలోను, ప్రకాశానికి ఎక్కువ ప్రాక్టీసు వుండేది. ఆయన న్యాయవాద వృత్తిలో ఎక్కువ డబ్బు సఆపొదించి విజయవంతంగా న్యాయవాద వృత్తిని నడిపిస్తూ నెలకి 6,7 వేల రూపాయలు ఆర్జన చేస్తూ ఉండేవాడు.
మన ప్రకాశం 8 అలాంటి న్యాయవాద వృత్తిని (ప్రకాశం పందొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరములో వదిలివేశారు. ఇందుకు ఆయనకు గల జాతియాభిమానమే కారణం. నుదరాసు నగరంలో ఉండే న్యాయవాదులలో న్యాయవాద వృత్టిని వదిలిన మొదటి న్యాయవాది ప్రకాశం. స్వరాణ్య పత్రిక స్థాపన పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో ప్రకాశం పంతులు న్యాయవాద వృత్తిని వదిలి వేసే నాటికి దేశంలో మంచి పత్రికలు లేవు. భారతదేశ స్వాతం త్రోద్యమానికి గాంధీజీ ప్రబోధిస్తున్న నిర్మాణాత్మక కార్యక్రమానికి ఇంకా ప్రచారం జరుగవలసి ఉంది. ఉన్నతమైన విలువలతో ఉండే పత్రికలైతే ఆ పనిని చక్కగా నిర్వహించగలవు. గాంధీజీ స్వయంగా ఒక పత్రిక నడిపేవారు. కానీ, అది వార పత్రిక. మరికొన్ని పత్రికలుండేవి కాని అవి పూర్తిగా బ్యాతంత్ర్యోద్యమానికి అంకితమైనవి కోవు- అందువలన భారతీయుల ఆశయాలు, ప్రతిబింబించే పత్రిక ఒకటి ఉంటే బాగుటుందని (ప్రకాశం భావించాడు. అలా ఉంటే విద్యావంతులకు ఉద్యమ అవసరాన్ని అది వారికి తెలియచేయగలదనీ, వారిని ఉద్యమంలోనికి ఆకర్షించగలదన్, ఆ విధంగా ముందుగా ఉద్యమంలోనికి వచ్చిన వారు తరువాత, వారి చుట్టు ప్రక్కల గల జన సందోహాన్ని నడిపించగలరవీ ప్రకాశం ఆళించాడు. ఆనాటికి మదరాసులో ఉన్న పత్రికలన్నీ ఆనాటి ప్రభుత్వాన్ని బలపరుస్తూ ఉండేవి. అంతేకాక ప్రజాస్వ్యాంతంత్ర్యం. జాతీయత, త్యాగం మొదలైన వాటిని గురించి (వ్రాయడానికి ఆనాటి పత్రికలు వెనకడుగువేసేవి. మదరాసు బీచిలో జరిగిన పెద్ద బహిరంగ సభలో త్రివిధ బహిష్కార ఉద్యమంలో భాగంగా (ప్రకాశం న్యాయవాద వృత్తి వదిలివేసినట్టు చేసిన ప్రకటనకు ఆనాటి పత్రికలు (ప్రాముఖ్యత నివ్వలేదు. ఎక్కడో మారుమూలగా చిన్న అక్షరాలలో ఆ ప్రకటనను అచ్చువేశారు. దీనికి కారణం అలాంటి సంగతులకు
మన ప్రకాశం 84 (ప్రాముఖ్యమిస్తే ఆనాటి ప్రభుత్వం శిక్ష వేస్తుందేమోనన్న భయమే. అందుచేత ఈ చిన్న వ్యవహారంలో ఈ పత్రికలకు ఇంత భయముంటే స్వాతం త్ర్యోద్యమానికి సంబంధించిన పెద్ద ఉద్యమాలను గూర్చి, ప్రకటించడానికీ, ప్రజలకు తెలియ చెప్పడానికీ వాటికి ఏ విధమైన సాహసముండదని తేట తెల్లమయింది. పత్రిక సహాయం లేనిదే జాతీయోద్యమాన్ని రాష్ట రాజధాని అంతటా నడిపించడం చాలా కష్టమనే అభిప్రాయం కలిగింది. అందువలన ఒక దిన పత్రికను స్టాపిస్తే తప్ప ఈ లోటు పూర్తి కాదని, స్వాంతం త్ర్యోద్యమ కార్య'మ్రాలు నడపడం సాధ్యం కాదు. అనే ఆలోచన కలిగింది. రాజగోపాలచారి గారు, డి.వి, వెంకట రామయ్యగారు, వావిళ్ల వెంకటేత్సర శాస్రిగారలకు కూడా ఈ ఆలోచన నచ్చింది. వారు కూడా ఈ ఆలోచనను బలపరిచారు. కాశీనాధుని నాగేళ్ళ్చరరావు గారు దీనిని ఎక్కువగా (ప్రోత్సహించారు.
ఈ పత్రికను ముందు ఇంగ్షీషులోను, ఆ తరువాత (క్రమ(క్రమేణా తెలుగు,తమిళం మొదలైన భాషలలోను ప్రచురించడానికి నిశ్చయించారు. దీని ప్రచురణ కోసం ఒక లిమిటెడ్ కంపెనీ స్థాపించడానికి నిర్ణయం జరిగింది. ప్రకాశం లాయరుగా హైకోర్టు లో పదిహేను సంవత్సరాలు ఉండడచేత ఆయనకు మదరాసు నగరంలో చాలా పలుకుబడి ఉంది. అందుచేత ఆయనకు మదరాసు వరకు ప్రముఖులయిన హిందువులు, మహమ్మదీయులు కూడా ఈ లిమిటెడ్ కంపెనీలో చేరి సహాయం అందించారు ఇంతమంది (ప్రోత్సాహంతో సంస్థ ప్రారంభమయింది. ఈ సంస్థ స్టాపించబోయే పత్రికలు,
అని చేసే కృషిని విశేషంగా మెమోరాండంలో వివరిస్తూ దీనిని రిజిష్టరు చేయించారు. ఆ రోజులలో ప్రజలకి, నాయకులలో ముఖ్యులు అయిన వారికి కూడా ఉద్యమం యొక్క ఆశయాలు, అవి ప్రకటించే కార్యక్రమాలు బాగా తెలియడానికి దిని అవసరం ఎంతైనా ఉన్నదని భావించడం జరిగింది. అందుచేత నగరాలలోను, (గ్రామాలలోను ఉండే నాయకులు, ధనవంతులు ఆంతా కూడా ఈ పత్రిక నడపవలసిన అవసరాన్ని గుర్తించి, దీని నిర్వహణకు తగినంత సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
మన ప్రకాశం 85 అంతేకాక (ప్రకాశం (ప్రాక్టీసు బాగా చేస్తూ ఎక్కువగా ధనం ఆర్జించే కాలంలో పట్టాభిసీతారామయ్య గారు, ముట్నూరి కృష్ణారావు గారు మదరాసు వచ్చి ఆయనను కలుసుకొని సంభాషించే సమయంలో పత్రికా స్టాపన గురించి ప్రస్తావన వచ్చింది. “మీరు ఎంతోకాలం నుండి మదరాసులో న్యాయవాద వృతిని కొనసాగించి ధనమారిస్తున్నారు కదా! ఒక్క చిన్న నాలుగు పేజీల పత్రికైనా మీరు ఇంగ్లీషులో అచ్చు వేయించరాదూ! అంతశక్తి లేదా మీకు అని అడిగారు”. నిరాకరణ ఉద్యమ ప్రారంభ కాలంలోనే వారు (ప్రకాశానికి ఈ సలహా ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన మనసులో అదే ఉండిపోయింది. స్నేహితుల నుండి కూడా అమితమైన ప్రోత్సాహం లభించింది. ఈ నేపథ్యంలో ప్రకాశం పత్రికను స్థాపించడానికి దృఢమైన నిర్హయాన్ని తీసుకొన్నాడు. ఎలాంటి కష్టం లేకుడానే సంస్థ ప్రారంభించడం జరిగింది. మూలధనం అంతా వసూలు కాకముందే ఈ పత్రిక ముదణకు కావలసిన సామగ్రిని సేకరించడం ప్రారంభ మయింది. ఈ ప(త్రిక నిర్వహణకు మూడు లక్షల రూపాయలు అఆవసరమవుతాయని అంచనా వేయడం జరిగినది. ఈ మూడు లక్షల రూపాయలు వసూలు చేయడంలో ఏ విధమైన కష్టముండదని విశ్శసించాడు ప్రకాశం. దీని మూలధనాన్ని సమకూర్చే బాధ్యతను తన మీదే వేసుకున్నాడు (ప్రకాశం. అప్పుడు బ్యాంకులో ఆయన పేరిట కరెంటు ఎకౌంటులో డబ్బు లేదు. అయితేనేం ప్రభుత్వం వారి ప్రొవెన్షియలు నోట్టు మొదలైనవి ఆయన దగ్గర ఉన్నాయి. వాటిని హామీగా ఉంచడం చేత ఆయనకు అప్పు పుట్టడానికి ఇబ్బంది లేకపోయింది. ఆ కారణం చేత కంపెనీకి కావలసిన మూలధనం మూడు లక్షలు వసూలు అయ్యేంతవరకు ఎదురుచూస్తూ ఉండలేదు ప్రకాశం. టి.వి. వెంకట్రామయ్య గారు కలసి ఒక ప్రామిసరీ నోటు వ్రాసి ఇండియన్ బాంకు నుండి 30,000రూ1లు పుచ్చుకొని ముద్రణాయంత్ర స్థాపనకు కావలసిన సొమ(గ్రి అంతా సమకూర్చుకున్నారు.
మన ప్రకాశం 86
ఆ సమయంలోనే కాశీనాధుని నాగేశ్చరరావు పంతులుగారు ఇరవై అయిదువేల రూపాయలు పెట్టి ఇంగ్లాండు నుండి ఒక ముద్రణాయం[త్రం తెప్పించారు. అది యింకా ఓడలో వుండగానే నాగేశ్చరరావు పంతులు గారిని కలుసుకొని తమ దగ్గర ఆ ముద్రణ యంత్రపు ఖరీదు అయిన ఇరవై ఆయిదువేల రూపాయలు పుచ్చుకొని, ఆ యంటత్రం తమకు ఇప్పించవలిందిగా (ప్రకాశం పంతులు కోరాడు. నాగేశ్వరరావు పంతులుగారు వెంటనే ఆ మిషను వారికి అప్పచెప్పారు పత్రిక త్వరగా ప్రారంభించడానికి నాగేశ్చరరావు పంతులుగారు కొారణభూతులయ్యారు. పద్దెనిమిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం (ప్రారంభంలోనే సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా (ప్రకాశం గారు న్యాయవాద వృత్తిని వదిలి వేశారు. దానితో ఈ పత్రిక నిర్వహణకు కావలసినంత వెసులుబాటు ఏర్పడింది. ముద్రణాలయాన్ని స్థాపించి పత్రిక మొదటి ప్రతిని అక్టోబరు ఇరవయ్యవ తేదీన విడుదల చేశారు.
ఈ పత్రికకు 'స్వరాజ్య' అని నామకరణము చేశారు. దీనిని ప్రకాశం గారు “స్వరాజ్యము” అని వుంటే బాగుంటుందని సూచించినారు. అయితే “స్వరాజ్యము” అనే పేరులో “ము” అనే అక్షరం తొలగించి “స్వరాజ్య” అని ఉంటే బాగుంటుంది అని సూచించినవారు రాజగోపాలచార్యులుగారు.
ఈ పత్రికకు దేశమంతా (ప్రాచుర్యం లభించింది. పత్రిక ప్రచురణ అయిన మొదటి మాసంలోనే అయిదువేల ప్రతులు అమ్ముడు పోయాయి. రెండవ మాసంలో ఎనిమిదివేలకు పైగా ప్రతులు అమ్ముడు పోయాయి. పత్రిక స్టాపించడంలో (ప్రకాశం గారి ఆలోచన, దేశభక్తి గాంధీగారికి కూడా సంతోషం కల్షించాయి. ఆయన (ప్రకాశం గారిని అభినందించారు. ఈ పత్రిక మూలంగా గాంధీ గారి దగ్గరి స్నేహితులలో ఒకరయ్యారు ప్రకాశం, భారతదేశం మొత్తము మీద సహాయ నిరాకరణ ఉద్యమం
నడిపించడంలోను, ఆ ఉద్యమ ఆశయాలు పప్రబోధించడంలోను 'స్వరాజ్య' పత్రిక అంత దృఢంగా నిలబడిన పత్రిక మరేదీ లేదు. అంతేకాక గాంధీగారి ఉద్యమ (ప్రచారానికి అప్పుడు వార్తపత్రికలు తప్ప దినపత్రికలు లేవు, అటువంటి సమయములో ఈ పత్రిక
మన ప్రకాశం 87/ విజ్బంభించి పనిచేయడం ఆనాటి ఉద్యమకారులకు సంతోషం కలిగించింది. మొదట ఇంగ్రీషులో స్వరాజ్యపత్రిక ప్రారంభించబడింది. ఈ తరువాత కొంతకాలానికి రాజగోపాలాచారి గారి (ప్రోత్సాహంతో తమిళంలో కూడా స్వరాజ్య దిన పత్రిక వెలువడింది. అలాగే తెలుగులో కూడా స్వరాజ్య పత్రిక వెలువడడం ఆరంభమయింది.
స్వరాజ్య పత్రిక దేశమంతటా ప్రాచుర్యం పొందింది. ఈ పత్రిక జాతీయ నినాదాలతో దేశం నలుమూలలా మారు (మోగింది. పత్రికలు నిజాయితీగా నడపాలని తలచిన వారికి ఆదర్శ'ప్రాయమైైంది. అలాంటి వారికి నిర్భీతిని కలిగించింది. అపమార్గంలో నడిచేవారికి వారు ఎంత గొప్ప వారైనా సరే వారి పాలిటి యమదండంగా పరిణమించింది. ఆనాటి జాతీయోద్యమ వీరుల భావాలను (ప్రచురించడానికి ఇతర పత్రికలుండేవి. కాని 'స్వరాజ్య' పత్రిక జంకులేంకుడా ఆనాటి ఉద్యమ విశేషాలను ప్రకటించేది. ఈ సందర్భంగా ప(త్రికకున్న సెక్యూరిటీ డిపాజిట్టు ఎన్నిసార్లు పోయినా స్వరాజ్య పత్రిక వెనుకకు తగ్గేది కాదు. ఈ పత్రిక భారతదేశంలో మాత్రమే కాక, బర్మా మలయా దేశాలలో ఉన్న ప్రవాస భారతీయులను కూడా ఆకట్టుకుంది. (ప్రవాస భారతీయులు కూడా లక్షలాది రూపాయల ధనం ఈ పత్రికా నిర్వహణకు అభిమానంతో విరాళంగా అందించారు.
దేశాభిమానులైన మహామహులెందరో స్వరాజ్య పత్రిక సంపాదక వర్గంలో నుండి పనిచేశారు. వీరిలో కె.ఆర్: ఫణిక్కర్, పోతన్ జోసెఫ్, కోటంరాజు రామారావు, కెసంతానం, కోలవెన్ను రామకోటేశ్వరరావు, జి.వి. కృపానిధి, ఖాసా సుబ్బారావు గారలు స్వరాజ్య పత్రిక ఆగిపోయేవరకు అందులోనే పనిచేశారు. వారికి జీతాలు అందినా అందకపోయినా దేశంపట్ట గల అభిమానం చేత, (ప్రకాశంగారి మీదనున్న గురుభావం చేత, స్వరాజ్యపత్రికను చివరి వరకు అంటిపెట్టుకొని వున్నారు.
భారతీయ పత్రికా నిర్వహణలో ఉన్నతోన్నతమైన (ప్రమాణాలను నెలకొల్పింది 'స్వరాజ్య' పత్రిక,
మన ప్రకాశం 88
అనేక సంవత్సరాలు సేవ చేసిన ఈ న్వరాజ్య వ(త్రిక ఆర్జికమైన ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి వచ్చింది. అయితే ప్రకాశం పంతులుగారికి గల ఆస్తుల వలననూ, (ప్రజలనుంచి ఆయనకు లభిస్తూ వచ్చిన సహకారం వలననూ ఆయన కొంత సర్దుకోగలిగారు. +" స్వరాజ్య పత్రిక చేస్తున్న సేవలను చూసిన ప్రభుత్వానికి కన్నెజగా ఉండేది. పత్రికా నిర్వహణ ఆగిపోయేలా చూసేందుకు అది చేయని కుట్ర అంటూ లేదు.
పురాణగాధలలో ప్రహ్హాదుని హింసించిన హిరణ్య కశిపునివలె నిర్వాహకులకు నిత్య నూతనమైన సమస్యలను కలిగించేది ఆనాటి ప్రభుత్వం. జరిమానాలు విధించింది. ప(త్రిక ఆస్తులను జప్తు చేయడానికి కూడా (ప్రయత్నించింది. కానీ అశేష జనాదరణ కలిగిన స్వరాజ్య పత్రికను అది ఏమీ చేయలేకపోయింది.
మొక్కవోని ధైర్యంతో (ప్రకాశంగారు ఆ పత్రికను నడిపిన తీరు అనన్య
సామాన్యం. అందుకోసం ఆయనకున్న ఆస్తులన్నింటినీ అమ్ముకొనవలసి వచ్చినా ఆయన వెనుకాడలేదు,
విరాళాలు సేకరించి, విదేశాలనుండి పెట్టుబడులు సంపాదించి ఎలాగో పత్రికను నిర్బహించుకుంటూ వచ్చారు. ఆ రోజులలో పత్రికా నిర్వాహకులు పత్రికను నిర్వహించే సమయంలో కొంత మొత్తం హామీ ఉంచవలసిన నియమం ఒకటి ఉండేది. ఇలాగా పెట్టిన హామీ మొత్తాలను కావాలని అధికం చేస్తూ ఇబ్బందుల పాలు చేసినా తన దీక్షను విరమించక ఒక తపస్సులా ఆ పత్రికను నిరాటంకంగా నడిపిన ఘనత (ప్రకాశానికి దక్కింది. ఆయితే ఈ పత్రికా నిర్వహణ యజ్ఞంలో (ప్రకాశం గారు ఆకర్టించినదంతా ఆహుతి అయిపోయింది. ఇంతకన్నా మహాత్యాగం మరొకటేముంటుంది.?
“స్వరాజ్య పత్రిక స్వాతంత్ర్య పోరాటానికి (ప్రకాశం నిర్మించుకున్న ఒక కోట. నాటి ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా పధ్నాలుగు సంవత్సరాలు జాతీయతా భావవ్యాప్తికి అనన్యమైన (ప్రచారం చేసి జాతిని ఉత్తేజపరిచింది. పత్రికా రచనకు (ప్రకాశం చేసిన సేవ అమోఘం. “దక్షిణ దేశంలోని పత్రికలకు వెలుగును విరజిమ్మారు'. అని (ప్రముఖ రచయిత శ్రీ కుందురి ఈశ్చరదళత్తు వీరిని గూర్చి చేసిన ప్రశంస మనం స్వీకరించదగింది.
మన ప్రకాశం 89 పన్నుల నిరాకరణోద్యమం
పందొమ్మిది వందల ఇరవయ్యవ నంవత్సరము చారిత్రాత్మక్షమైనది. నాగపూరులో అఖిల భారత కాంగ(గైస్ మహాసభ జరిగింది. భాషా విషయ రాష్ట్రాలుగా గుర్తించి, ఆ రాష్ట్రానికి ఒక కాంగ్రెసుల సభ ఉండాలని అందులో నిర్ణయించడం జరిగింది. అంతకు ముందునుంచే ఆంధ్రులకొక ప్రత్యేక రాష్ట్రం కావాలని నాయకులు ఉద్యమం లేవదీశారు. నాగపూర్ కాంగ్రెస్‌లో అది ద్విగుణీకృతమయింది. ఈ ప్రదేశ్ కాంగ్రెస్ సంస్థకు టంగుటురి ప్రకాశం అధ్యక్షుడయినాడు. ఈ ప్రదేశ్ కాంగైసు ఏర్పడిన నాటినుంచీ గొల్లపూడి సీతారామశాస్త్రి కార్యదర్శిగా పనిచేశాడు.
సహాయ నిరాకరణోద్యమం (ప్రారంభమయింది. అంటే (ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను చెల్లించక పోవడం. ఆ విధంగా ప్రభుత్వాధికారాన్ని స్థంభింప జేయడం. చీరాల - పేరాల పోరాటం
దేశంలో సహాయ నిరాకరణోద్యమం సాగిన కాలంలో పందొమ్మిది వందల ఇరవై ఒకటి, ఇరవై రెండు సంవత్సరాలలో ఆంధ్రదేశం భారతదేశంలోని మిగతా రాష్ట్రాల కంటె ముందంజ వేసింది. ఘనత వహించింది.
సహాయ నిరాకరణోద్యమ కార్యక్రమంలో భాగంగా మునిసిపాలిటీల బహిష్కరణ పేరుతో చీరాల - పేరాల పోరాటం జరిగింది.
ఆ సంఘటన వివరంగా తెలుసుకుందాం. పాత చీరాల,పేరాల, జాండ్రపేట, వీర రాఘవపేట అనే నాలుగు గ్రామాలు చీరాల యూనియన్ పాలనలో ఉండేవి. అప్పుడు ఆ యూనియన్ సాలీనా ఆదాయం నాలుగు వేల రూపాయలుండేది.
మన ప్రకాశం 90 అయితే పందొమ్మిది వందల పందొామ్మిదిలో చీరాల పేరాల (గ్రామాలను కలిపి ప్రత్యేక మునిసిపాలిటీగా చేయాలని అప్పటి (ప్రభుత్వం నిర్హయించింది. (ప్రభుత్వం చేసిన ఈ నిక్షయాన్ని ఆ గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. యధాపూర్వ స్థితిని కొనసాగించాలని (ప్రభుత్వానికి వారు వినతిపత్రాన్ని సమర్ప్చించుకొన్నారు. కాని ప్రజల కోర్కెను ప్రభుత్వం తిరస్కరించింది. అంతేకాదు. క్రొత్తగా ఏర్పాటయిన చీరాల - పేరాల మునిసిపాలిటీ ఆదాయం ముఫ్ఫైవేలకు పెంచింది. (ప్రజలపై విపరీతమైన పన్నుల భారం విధించింది. చీరాల - "పేరాల (గ్రామాల జనాభా పదివేలు మాత్రమే. ఇక్కడ (ప్రజలలో అత్యధికులు చేనేత కార్మికులు. అప్పటిలో చేనేత కార్మికుని రోజువారీ ఆదాయం పావలా అయిదణాలకు మించేది కాదు. అలాంటి ప్రజలపై ప్రభుత్వం విధించిన పన్నులు తలకు మించిన భారంగా పరిణమించాయి. తమ (గ్రామాలను సందర్శించిన గవర్నరుకు కూడా చీరాల-పేరాల ప్రజలు తమ గోడు విన్నవించుకొన్నారు. అయినా ప్రయోజనం లేకపోయింది. పందొమ్మిది వందల ఇరవై జనవరి పన్నెండవతేదీ చీరాల - పేరాల (గ్రామాలను మునిసిపాలిటీ చేస్తే ప్రజల దగ్గరనుంచి పన్నులను అధికంగా వసూలు చేయవచ్చనే ప్రభుత్వం ఆలోచన స్పష్టమైన రూపం దాల్చింది. చీరాల కొత్త మున్సిపాలిటీగా ఏర్పడింది. పదకొండు మంది కౌన్సిలర్హు ఉండే మునిసిపాలిటీకి రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు చైర్మన్‌గా నియమింపబడ్డారు. మునిసిపల్ కౌన్సిలర్లు కొందరు పౌరులను విపరీతంగా పీడించారు. పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పూర్తిగా అలక్ష్యం చేశారు. ఇక లాభం లేదనుకున్న ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. మునిసిపాలిటీని బహిష్కరించాలన్న నిర్షయానికి వచ్చారు. పరిస్టితిని గమనించిన కౌన్సిలర్టు వారే పదవులకు సామూహికంగా రాజీనామా చేశారు. వారెందుకు రాజీనామా చేయవలసి వచ్చిందో తెలుసుకోనడానికి కలెక్టర్ వచ్చాడు. పౌరులు జిల్లా కలెక్టరుకు వినతిపత్రం సమర్పించుకున్నారు.
మన ప్రకాశం 9]
పదే పదే ప్రజలు చేసిన విన్నపాలను ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. అందేకాదు. చీరాలకు రైల్వేస్టేషను, పోస్టాఫీసు, ఆసుప(త్రి వంటి సౌకర్యాలు లేకుండా చేస్తామని బెదిరించారు. ఇంకా అవసరమైతే ప్రత్యేక పోలీసుదళాలను దింపి చీరాలలో విడిది చేయిస్తామని కూడా బెదిరించారు. దానితో ప్రజలు మరింత ఉగ్రులైపోయారు. ఈ దళలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రంగప్రవేశం చేశాడు. చీరాల-పేరాల ప్రజల పోరాటానికి సారధ్యం వహించాడు, పన్నులు చెల్లించవడ్డని ప్రజలకు ఉద్భోదించాడు. యోధానుయోధుడు స్ఫురద్రూపి. సత్యసంధుడు, విద్వాంసుడు కూడా. ఎడింబరో వెళ్ళి అక్కడ విశ్చవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఎకనామిక్స్ సబ్బక్టులో ఎమ్.ఏ. ఆనర్సు పట్టాన్ని పొంది భారతదేశానికి తిరిగి వచ్చాడు. కొంతకాలం రాజమహేంద్రవరం లోని ట్రైనింగ్ కాలేజీలో ఆచార్యుడుగా ఉండేవాడు. ఈయన చాలా స్వతంత్ర భావాలు గల వ్యక్తి. అక్కడ ప్రిన్సిపల్ ఆర్.డబ్బ్యు.రాస్ దొరగారు ప్రదర్శించిన నిరంకుశత్వానికి నిరసనగా తన ఆచార్య పదవికి స్వస్తి చెప్పి బందరు జాతీయ కళాశాలలో కొంతకాలం అధ్యాపకులుగా పనిచేశాడు. దేశమాత పిలుపును ఆయన అందుకొని ఆమె సేవలో నిమగ్నుడయినాడు.
చీరాల - పేరాల ఉద్యమవాసులకు వెన్నుదన్నుగా నిలిచాడు.
“రామదండు” పేరిట యువకులను సమీకరించి ప్రజలలో చైతన్యాన్ని కలిగించాడు. 'ఆంధ్రరత్న' అని అందరిచేత క్తీర్తింపబడ్డాడు. ఆయన ప్రజలందరినీ కూడ గట్టుకొని చీరాల ప్రాంతాన్ని మునిసిపాలిటీగా రూపొందిస్తే ఆ (గ్రామాన్ని పూర్తిగా వదిలివేసి వేరే తావులకు వలస వెళ్లిపోతామని ప్రభుత్వానికి తెలియచేశాడు. ఇది నిజంగా (బ్రహ్మాండమయిన (ప్రయత్నం.
చీరాల పేరాల ప్రజలు పదిహేడు వేలకి మందికిపైగా ఉన్నారు. వాళ్ళనందరినీ ఒకే త్రాటిమీద నిలబెట్టి, వారు తరతరాలుగా ఉంటూ ఉన్న ఇళ్ళని వాకిళ్లని విడిచిపెట్టించి
మన ప్రకాశం ర్త వారిని మరోచోటికి తీసుకొని వెళ్ళడం అంటే మాటలా! పన్నులు చెల్లెంచవద్దని ఆయన ప్రజలకు ఉద్భోదించాడు. పన్నుల వసూలుకు అధికారులు (ప్రజల ఆస్తులు స్వాధీనం చేసుకొని వాటిని వేలం పెట్టారు. కాని ఆ వేలం పాటలో ఎవరూ పాల్తొనలేదు. పన్నులు చెల్లించని కారణంగా పన్నెండు మందిని అరెస్టు చేశారు. అప్పుడు అరెస్టు అయిన వారిలో ఒక మహిళ కూడా ఉంది. చీరాల పేరాల పౌరులపై దమనాకాండ రోజురోజుకీ పెరిగిపోతున్నది. కాని ప్రజలు ఆంధ్రరత్న మాటను అందిపుచ్చుకున్నారు. పందొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం, ఏప్రిల్ నెల ఇరవై ఐదవ తేదీ అర్హరాత్రి తమ ఇళ్ళను ఖాళీ చేయడం ప్రారంభించారు. పెట్టెబేడా సర్దుకున్నారు, కొందరు సామాను తలపై ఎత్తుకొని నడుస్తూ ఉండగా మరికొందరు తమ సామానులను ఎడ్డబండి మీద వేసుకొని తరలివెళ్ళారు. వీరందరు మునిసిపాలిటీ పరిధికి ఆవలి పాలిమేరలలో పాకలు చేసుకొని జీవించడానిక్రి తరలివెళ్లారు. ఈ విధంగా ప్రవాసోద్యమంలో స్వచ్చందంగా పాల్గొనడం నిజంగా చరిత్రలోనే ఆపూర్చం. చీరాల వాసులతోను, 'ఆం(ధ్రరల్న'తోను ప్రకాశానికి మంచి 'స్నేహభావముంది. చీరాల 'పేరాలలు కలిసి పురపాలక ప్రాంతంగా మార్చబడితే (గ్రామీణులకు గోరంతలాభం చేకూరక్తపోగా పన్నుల రూపేణా కొండంత భారం నెత్తిన పడడం మాత్రం గాయం అని (ప్రకాశం భావించాడు. వారి కోరిక న్యాయమైనదేనని దానిని బలపరిచాడాయన, ఆటుపంటి క్రిష్ణ సమయంలో చీరాల - పేరాలవాసులకూ, వారి సారధి గో పాలకృష్ణయ్యకూ అందించ కలిగినంత చేయూత నందించాడు. అప్పటి కాయనకు బాంకులో చాలా ధనముంది. ఉద్యమ విజయానికి ప్రకాశం చాలా విరివిగా విరాళమిచ్చాడు.
మన ప్రకాశం 03 పెదనందిపాడు గాంధీజీ నేతృత్వంలో విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో భాగంగా పన్నుల నిరాకరణోద్యమం చెలరేగింది. (ప్రభుత్వం ఉనికి (ప్రశ్నార్థకమయిన పరిస్టితి నెలకొన్నది. పదనందిపాడు ఫిర్కాలో రైతులెవరూ పన్నులు చెల్లించలేదు. పెదనందిపాడులో చెల్లని దొరతనాన్ని గురించి ప్రపంచమంతా చెప్పుకొంది. ఈ ఉద్యమాన్ని కొండా వెంకటప్పయ్య పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, పర్వతనేని వీరయ్య, గొల్లపూడి సీతారామశాస్త్రి వంటి మహనీయులెందరో ఉద్యమించి ప్రజలను ముందుకు నడిపించారు. నాటి ప్రభుత్వం (ప్రజలను నానా విధాలుగా హింసించింది. కరకు సైనికులచే కవాతులు చేయించింది. పోలీసులచే దౌర్జన్యాన్ని చేయించింది. రైతుల ఆస్తులను వేలం వేయించింది. అయినా రైతులు చెక్కుచెదరలేదు. వేలం వేసిన సామాను కొనేందుకు పల్లెలో ఎవరూ ముందుకు రాలేదు. వచ్చిన అధికారులకు పచ్చిమంచినీళ్ళు కూడా పుట్టలేదు. స్థానిక (గ్రామాధికార్డు కూడా సహకరించలేదు. రైతు చెల్లించవలసిన పన్ను ఎంతో చెప్పేవాడు లేడు. ఏది ఎవరి పొలమో చూపించేవాడు లేడు. తుదకు ఆంగ్రసైనికులను కూడా ఆ ప్రాంతంలో దింపి (ప్రభుత్వం తన దమన నీతి ప్రదర్శించింది. ఎన్ని విధాల హింసించినా ఏ మాత్రం చలించలేదు. (బ్రిటిష్ ప్రభుత్వం పునాదులను పెదనందిపాడు కదిలించిందని తెల్లదొరలే చెప్పుకున్నారు.
మన ప్రకాశం రగ ఉర్ ఏుల్లరి సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఆంధ్రదేశంలో అటవీ నిబంధనల ఉల్లంఘనోద్యమాలు కూడా సాగాయి. వీటిలో గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాలో కన్నెగంటి హనుమంతు నాయకత్వంలో జరిగిన పుల్లరి సత్యాగ్రహం చరిత్ర ప్రసిద్ది చెందింది. గుంటూరులోని పల్నాడు మండలం ఆర్జికంగా వెనుకబడిన (ప్రాంతం. పందొమ్మిది వందల ఇరవై, ఇరవై ఒకటవ సంవత్సరాలలో వర్షాలు లేని గడ్డు పరిస్థితి ఏర్పడింది. దేశంలోని అటవీ సంపదను కొల్లగొట్టటానికి అలవాటుపడిన (బ్రిటీషు ప్రభుత్వం అటవీ నిబంధనలు పెట్టి అటవీ సంపదను ప్రజలు అనుభవించడానికి వీలులేకుండా చేసింది. అడవిలో పశువులు మేత కొనడానకి పుల్లరి" విధించింది ప్రభుత్వం. పుల్లరి అంటే పశువులు మేసే గడ్డిపైన ప్రభుత్వం వసూలుచేసే పన్ను. అడవులలో పశువులను మేపుకొనడానికి వీలులేదు. అక్కడి నిటి వనరులను వినియోగించుకోవడానికి వీలులేదు. ఈరకమైన ఆంక్షలతో (ప్రజలు విసుగెత్తిపోయారు. యం! పొందాలి. అదికూడా ప్రత్యేకమైన ఒక ఆటవీ ప్రాంతానికి మాత్రమే చెల్లుతుంది. స్
మన ప్రకాశం ధక మరొక ప్రాంతంలో ఆవును మేపుకోవాలంటే, మరో పన్నెండు అణాల రుసుమును చెల్లించి మరో పర్మిటును పొందాలి. ఈ నిబంధనలు సడలించాలని కోరుకున్నారు అక్కడి (ప్రజలు. ఒక పశువును మేపుకొనడానికి ఒక అణామాత్రమే పుల్లరిగా వసూలు చేయాలని, ఒకే పర్మిటుతో జిల్లాలోని ఏ ప్రాంతపు అడవిలోనైనా పశువులను మేపుకొనడానికి అనుమతించాలనీ పల్నాటిసీమలో రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం రైతుల కోర్కెలను పెడచెవిని పెట్టింది. ప్రజలకు ఫారెస్టు గొర్జులకు మధ్య సంఘర్షణలు అధికమయినాయి. ఆ ప్రాంతంలో అదనపు పోలీసు బలగాలు దిగాయి. మందలపాడు సమీపంలోని అడవిలో మేస్తున్న గొడ్డమందలను సాయుధ పోలీసుల సహాయంతో ఫారెస్టు ఉద్యోగులు బందెలదొడ్లకు తోలుకుపోతూ ఉంటే కన్నెగంటి హనుమంతు నాయకత్వంలో రెండు మూడు వందల మంది ప్రజలు (ప్రతిఘటించారు. సాయుధ పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో కన్నెగంటి హనుమంతును, మరి ముగ్గురు రైతులను కాల్చి చంపింది అనాటి బ్రిటీష్ ప్రభుత్వం. ఈ సంఘటన ప్రకాశంలోని వేదనను పెంచింది. ఆయన కర్త్యోన్నుఖుడయినాడు.
మన ప్రకాశం 96 శౌర్య పటిమ
ధైర్యానికి, సాహసానికి పర్యాయపదంగా గణుతికి ఎక్కాడు ప్రకాశం. ఎంతటి శ్రీష్ట పరిస్టితులనయినా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో, ధైర్యంతో ఎదుర్కొని విజయం సాధించడం ఆయన జీవితమంతా జరిగిన సంఘటనలలో స్పష్టంగా కనిపిస్తుంది. నిర్భీకత, నిశ్చయాత్మకత, (ప్రకాశానికి పుట్టుకతో అబ్బిన లక్షణాలు. ఆయన చిన్నప్పుడు రాజమహేం[ద్రవరంలో చదువుకొనే రోజులలో ఆ ధైర్య గుణం చేతనే పెద్ద గండం గడిచింది. అది గోదావరీ నది వరదలో వున్నప్పుడు ప్రకాశం అతని "స్నేహితులు కలసి ఒక పడవను ఏటిలోనికి త్రోసికాని వెళ్ళినప్పటి సంఘటన. ఆక్కడ (ప్రస్తావించడం జరిగింది.
ఆ రోజులలో సాముగడీలలో శిక్షణ ఇచ్చే వస్తాదులు ప్రతి ఊరిలోను వుండేవారు. ప్రతి ఊరిలోను తాలింఖానాలు ఉండేవి. ఈ వస్తాదుల పట్ట ఊరి వాళ్ళకు వినయ విధేయతలు, భయము కూడా ఉండేవి. (క్రొత్తవాళ్ళు ఎవరైనా వచ్చి ఆ ఊర్గో సభలు, నాటక ప్రదర్శనాదులు ప్రదర్శిచాలంటే ముందుగా ఉళ్ళో వస్తాదులను సంప్రదించేవారు.
కాకినాడలో నాటకమాడటానికి వచ్చిన హనుమంతరావు నాయుడు గారి నాటక సమాజంలో ప్రకాశం కూడా సభ్యుడు. ఆ సమాజం వాళ్ళు ఆ ఊళ్ళో 'ప్రసిద్దుడైన వస్తాదు సంగీతం అబ్బాయి ప్రమేయము లేకుండానే నాటకాలు ఆడటానికి పూనుకున్నారు. సమాజం సభ్యులు సంబరం చూచేందుకు, బజారుకు వెడుతున్నప్పుడు అదను చూచుకొని తన మనుష్యులతో సంగీతం అబ్బాయి దాడి చేశాడు. ఆ దాడిలో ప్రకాశానికి బాగానే గాయాలయ్యాయి. దానికి ప్రతిచర్యగా అబ్బాయి మనిషి ఒకడు రాజమండ్రి వచ్చినప్పుడు అతనిని పట్టుకొని దేహశుద్ది చేశాడు ప్రకాశం. అది పోలీసు కేసు అయింది. (ప్రకాశము ఎలాగో బయట పడగలిగాడు. పోకిరిపోకడల్లో సహితం ముందుండే ప్రకాశం ఇంతింతై వటుడింతైనట్టు, ఆంచెలంచెలుగా చదివి బారిష్టరు కూడా కాగలిగాడు. ఆయన జీవితం ధైర్య సాహసాలకు తార్కాణంగా చెప్పుకోవచ్చు.
ముగ ప్రకాశం 97 దక్షిణాది రాష్ర్రాలలో కేరళలోని మలబారు బిల్దాలో బ్రిటీషు ప్రభుత్వంపై మాష్టాల తిరుగుబాటు జరిగింది. ఆనాటి ప్రభుత్వం ఆత్యంత పాశవికంగా ఆ తిరుగుబాటును అణిచివేయ బూనుకొన్నది. ఎంతోమంది అమాయకులు (ప్రభుత్వం చేతిలో హతమైనారు. ఈ విషయం (ప్రకాశాన్ని ఎంతగానో కదిలించి వేసింది. వంటనే మలబారుకు ప్రయాణమయ్యాడు. ప్రమాదకరమైన ఈ ప్రయాణాన్ని ఇతర నాయకులు కూడా వద్దని వారించారు. అయినా సాహసమూర్తి ప్రకాశం సాగించకుండా ఉంటాడా (ప్రయాణం! కేరళలో అల్లరులు ప్రారంభంకాగానే సైనిక శాసనం విధించింది ప్రభుత్వము. ఇంకొక మి(త్రుని వెంట బెట్టుకొని బయలుదేరాడు (ప్రకాశం. షోరనూరు రైల్వేస్టేషనులో దిగారు ఇద్దరూ అక్కడ కనీసం బస చేయడానికి కూడా (ప్రభుత్వాధికారులు అంగీకరించలేదు. అల్లర్జు జరిగిన (ప్రాంతం చేరాలంటే ఇంకా అరవై మైళ్ళ దూగం ఉన్నది. నడచి అక్కడికి చేరుకోవడానికి నిశ్చయించుకున్నాడు (ప్రకాశం. అల్లర్జు, సైనికుల హెచ్చరికలూ, ఇలా భయంకరమైన వాతావరణంలో ధైర్యంగా ముందుకు నడిచాడు. దారిలోచేర్చల్బెరీ అనే (గ్రామంలో మిత్రుడు ఆగిపోయినా, ఒంటరిగా ముందుకు వెళ్ళి అల్లర్జు చెలరేగిన (ప్రాంతాలను కలియతిరిగి పరిస్థితులను అధ్యయనం చేశాడు. ఈ సాహసయాత్రను మరింత విపులంగా తెలుసుకొందాం దక్షిణ భారతదేశంలో పడమటి సముద్ర తీరప్రాంతంలో ఉంది మలబార్. మాప్లాలు ఇక్కడి వారు, వీరిని గురించి సంక్షిప్తంగా చెప్పవలసి ఉంది. అరేబియా దేశంనుంచి మలబారుకు వర్తకానికి వచ్చిన అరబ్బులు స్టానికంగా. ఉన్న మలబారు వనితలను వివాహం చేసుకొని స్థిరపడి పోయారు. వారి సంతతి వారే మాష్టాలు. “మా' అనగా తల్లి అని 'ష్లా అనగా రక్షించేవారని ఈ పదానికి అర్ధం,
మన ప్రకాశం 08 వరికి తమ భూములంటే అమితమైన (ప్రేమ. మతరీత్యా మహమ్మదీయులు వీరు, అప్పటికి మలబారులోని జనాభా దాదాపు ముప్ఫై ఒక్క లక్షల మంది. మాష్టాలు పది లక్షల మంది ఉండేవారు. ఎక్కడ ఆపదవస్తే అక్కడ ఆం(ద్రకేసరి వాలవలసిందే, పందొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో మాష్లాలు ఆనాటి (బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. వీరిని అణిచి వేయడానికి పాశవికంగా ప్రయత్నించింది (ప్రభుత్వం, వీరిలో ఒక వందమందిని అరెస్టు చేసి వారికి జైలుశిక్ష వేసింది. ఈ శిక్షను మాష్టాలు బళ్ళారి జైలులో అనుభవించాలని ఆదేశించింది. వీరిని బళ్ళారి జైలుకు తరలించింది. ఈ వందమందిని గూడు వేగనులో వేసి పంపింది. ఈ (ప్రయాణంలో ఊపిరి సలుపక డెబ్బయి తొమ్మిది మంది మాప్పా తిరుగుబాటు దార్జు మరణించారు. దీనితో భారతదేశమంతా గగ్గోలు పడింది. భయంకర పరిస్టితులలో అక్కడ ఆ భీతావహులకు అభయమిచ్చి, ఆదుకోడానికి కాంగ్రెసు వర్కింగ్ కమిటీకి వారి సమస్యపై నివేదికను తయారు చేస సమర్పించే కృషిలో భాగంగా ధీరోదాత్తుడయిన ప్రకాశం అక్కడకు బయలుదేరి వెళ్ళాడు. కొన్ని ప్రాంతాలలో మాష్టాల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది, మాష్టాలలో ఎక్కువమంది బీదరైతులు. చిన్నచిన్నవర్తకాలు చేసుకునే వారూ కొందరున్నారు. ఆతి తక్కువగా కలప వర్తకులున్నారు.
మాష్టాలలో అధికభాగం బీదవాళ్ళు, ఆదాయం తక్కువ, అజ్ఞానం, అవేశం (ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించే ఉద్రేకమూ వీరి లక్షణాలు.
తెల్లదొరలు ప్రవేశపెట్టిన శాసనాలు గానీ, వాళ్ళ దమనశక్తి గానీ సామాన్యుడైన మలబారు రైతుకు తెలియవు, (ప్రభుత్వ ఉద్యోగులు, జమీందార్డు (జక్నీలు) వారి ఏజంట్లు సాగించే క్రూరకృత్యాలను వీరు ఒంటరిగా ఎదిరించేవారు. వారు సంఘటితమవలేదు. రైతు సంఘాలు ఏర్పడలేదు, ఆందుచేత తమకు శత్రువు అక్కడ అమలులోనున్న జమిందారీ పద్ధతి అనిగానీ, బ్రిటీష్ నిరంకుళ ప్రభుత్వమని గానీ మాష్టాలు (గ్రహించలేకపోయారు.
మన ప్రకాశం 99 అయితే మాప్పారైతు క్పీడించేవారికి దాసోహమనే తత్త్వం కలవాడు కాదు. అందుకే అనేకమైన వ్యక్తిగత ప్రతిఘటనలు సాగించేవాడు. అదిగో అలాంటి ఉద్వేగపూరితమైనదే పైన పర్కొన్న పందొమ్మిదిపందల ఇరవై ఒకటవ సంవత్సరంలో జరిగింది, ప్రకాశం గోరు మలబారు పయనం కట్టడానికి కారణమైనదీ అయిన సంఘటన! కొన్ని సంవత్సరాలనుండి రాజ్యసభ సభ్యుడుగా ఉంటున్న సయ్యద్ ముర్తా జీ నాహైబుగారు అనాటి సభలో ప్రకాశం గారితో పాటు ఉన్నారు. ఆయన నివాసం తిరుచ్చి. దెబ్బలు తిని అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న ఆ మాష్టా ఛాతీమీద కూర్చుని శాంతివచనాలు పలకడం (ప్రారంభించాడు. నాగపూర్ కాం(గైసులో ఆమోదం పొందిన అహింసా విధానాన్ని గురించి బోధించారు. ఎలాగయితేనేమి మొత్తం మీద ఆయన్ని శాంత పరిచారు. పీరుగాక ఆనాడు అనవసరంగా పోఠీసుల చేతులలో దెబ్బలు తిన్నవారు ఇంకా ఉన్నారు. వారు కూడా కాన్ఫరెన్స్లోనికి పరుగు పరుగున వచ్చారు. సంగతి సందర్భాలు తెలియచేసుకున్నారు. కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు తెలియవచ్చిన ఈ సంఘటనలు సమావేశంలో పాల్గొంటూ ఉన్న చాలామంది స్త్రీ పురుషులను ఉత్తేజ పరిచాయి. నిశితంగా అలోచిస్తే ఈ గల్లంతు కంతటికీ కారణం తోస్తుంది. ఆనాటి సాయంత్రం ఆ సభ ముగిసే లోపల ఎలాగయినా అల్లరిపెట్టి ఆఖరి నిమిషంలోనైనా సమావేశం గగ్గోలు పరచి సాగకుండా చేయాలన్న పోలీసు కుతంత్రమే ఆనాటి సంఘటనకు కారణమని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి వారంతా ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలుంచుకున్నారు.
మన ప్రకాశం 100 ఊరేదింపుకు నాయకత్వం ఈ వీరసింహం ఆం(ధ్ర ప్రాంతంలోనే కాక దక్షిణాది రా[ష్ట్రాలలో కూడా పర్యటించి శాంతి నెలకొల్పటానికి కృషి చేశాడు. కేరళ కాం(గ్రెసు ప్రథమ సమావేశానికి అధ్యక్షత వహించాడు. సభాస్థలిలో ఉద్రేకం పెచ్చరిల్లింది. ఆ ఉద్రేకాన్ని తొలగించి అక్కడ ఉన్న షౌరులను సురక్షితంగా బయటకు పంపించడమెలాగా అని నాయకులు ఆలోచన చేస్తున్నారు. మరోచోట తనకున్న పనిని పూర్తి చేసుకొని (ప్రకాశం గారి మిత్రులు కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జి జోసఫ్ అప్పుడే అక్కడకు వచ్చారు. పరిస్టితిని గమనించాడు. అక్కడ సమానేశమయిన స్రీ పురుషులందరిని చిన్న చిన్న జట్టుగా దొడ్డి గుమ్మం ద్వారా బయటకు పంపడం మంచిదని అన్నారు. ఇలా దొడ్డిదారిన (ప్రజలను పంపించడం సింహంలాంటి ప్రకాశానికి నచ్చలేదు, సభ సాంతమయ్యే వరకు సభ్యులను శాంతంగాను, నిర్భయంగాను ఉండవలసిందిగా కోరుతూ కొంతసేపు తానే ఉపన్యసించాడు.అంచేకాదు సమావేశానంతరం ఆయా సంఘటనలు జరిగిన ముఖ్యవీధులగుండా ఊరేగింపు వెళ్ళాలని సూచించాడు. సభను శాంతంగా తుది వరకు సాగించమనీ, ఆంతవరకు ఎవరినీ అక్కడనుంచి ఎవరూ కదలరాదని కోరాడు. సభానంతరం ప్రకాశం స్వయంగా ముందుండి నాయకత్వం వహిన్తూ నభలోని ముఖ్యులందరిని ఊరేగింవుగా ఒట్టపాలెియం ముఖ్య వీధులన్నింటిలోను నడిపించాడు. ప్రజలలో నాటుకొన్న విశ్వాసాన్ని, ఆత్మశక్తినీ అణగద్రొక్కలేరని పోలీసు వారు (గ్రహించేటట్టు చేయడంలో సఫలీకృతుడయ్యాడు. సమావేశం సాంతం అయ్యేలోపల పోలీసుల కారణంగా జరిగిన అల్లర్లును విచారించడానికి గాను ఒక ఉపసంఘాన్ని నియమించారు. ఆ ఉపసంఘానికి ప్రకాశమే
మన ప్రకాశం 101 అధ్యక్షుడు. కొంతమంది ఇతర (ప్రముఖులతో పాటు ఎల్.వి.సుబ్బరామయ్య అనే పాల్ఘాటు న్యాయవాది కూడా ఈ ఉపసంఘ సభ్యుడుగా ఎన్నుకోబడినాడు. ఆంధధ్రకేసరి తన ధైర్య, ప్రతాపాలను దక్షిణ భారతమంతా ప్రదర్శించాడు. కేరళీయుల మీదకూడా తన స్పూర్తిని ('ప్రసరించగలిగాడు మన (ప్రకాశం.
మన వారికి సంబంధించిన ఒక ముఖ్యమైన సంఘటన యిక్కడ ప్రస్తావిస్తాను. అది పందొమ్మిది వందల ఇరనై ఒకటి నుండి మాష్పా తిరుగుబాటు. మాష్టా అంటే కేరళలో స్థిరపడిన పరాను జాతికి చెందిన ముస్లిమ్‌లు అన్న సంగతి యింతకుముందే తెలుసుకున్నాం కదా, నిజానికి, ఒట్టపాలియమ్ సమావేళం జరిగిన రోజులలోనే మాష్టా తిరుగుబాటు జరిగి ఉండవలసింది. కాని అప్పట్లో ప్రకాశం, ఇతర నాయకులు కలసి తీసుకున్న ఆవశ్వక చర్యలు, జాగ్రత్తలు మున్నగునవి ఆనాటి వాతావరణాన్ని ప్రశాంతంగా వుంచడానికి తోడ్పడినాయి.
(ప్రకాశం మలబారు ప్రాంతంతో ఉన్నతమైన సంబంధం కలవాడు. అందుకే కేరళ కాంగైసు మొదటి మహాసభకి అధ్యక్షత వహించి అందరి మన్ననలను పొందగలిగాడు. మలబారులో ఈయన అనేక ప్రదేశాలలో సభలలో పాల్తొని ఉపన్యసించారు. ఆ సమావేశాలలో వేలాదిగా మాష్టాలు పాల్గొన్నారు. ఇది మాష్టాలకు (ప్రకాశం మీద వున్న గౌరవాన్ని తెలియజేస్తుంది.
మళయాళ రాష్ట్రంతోను, ఆ రాష్టీయులతోను, ప్రకాశానికి మొదటి నుంచీ సన్నిహిత సంబంధం వున్నది అన్న విషయం తెలిసిందే. అక్కడ, మాష్లాల తిరుగుబాటు జరిగింది. హిచ్‌కాక్ అనే ఆంగ్లజాతికి చెందిన పోలీసు అధికారి, అక్కడి శాంతిభద్రతలను చూస్తున్నాడు. ఏమైనా సరే మేము మీతో వచ్చి తీరుతానని అనిన నలుగురు మాత్రం
(ప్రకాశంతోనున్నారు. వారితో ఆయన చేర్చల్ చేరి (గ్రామంనుండి కాలికట్టుకు బయలుదేరాడు. రెండవరోజు సాయంత్రానికి యింకో 20 మైళ్ళు నడవగలిగారు.
మన ప్రకాశం 102 మూడవనాటి సాయంత్రానికి గాని కాళికట్టు చేరలేకపోయారు. ఒట్టపాలియం నుండి కాళికట్టు వరకు ఆరవైమైళ్ళ దూరం వారు ప్రయాణం చేయడానికి మూడు రోజులు పట్టిందన్నమాట. కాలికట్టు ప్రాంతమంతా ఉద్రేకపూరితమైన పరిస్టితులో ఉన్నది, అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, (ప్రకాశాన్ని ఆహ్వానించారు. అనాటి పరిస్థితులు చాలా భయోత్పాతంగా ఉన్నాయి. విప్లవ ప్రాంతంలోని ముఖ్య కాంగ్రెస్ నాయకులందరినీ పోలీసువారు అరెస్టు చేశారు. విప్లవ ప్రాంతంలో పర్యటించిన కె.వి.కేశవమోనన్ అప్పుడే తిరగి వచ్చారు. ఒక ప్రక్క మాష్టాలు, రెండవపక్క పోలీసు మిలటరి అధికార్లు కలుగచేస్తున్న భయోత్పాతం గురించి వివరించారు. ఆసలు విష్ణవం చాలా స్వల్ప కారణం మీదనే (ప్రారంభమయిందనీ, ప్రారంభంలో ఆంత ఉద్రిక్తంగా లేకపోయినా వారం రోజులలోగా మాష్లాలు ఇంగ్లీషువారిని, కాంగ్రెసు వారిని కూడా తమ శత్రువులుగా భావించడంతో విస్ణవం తారాస్థాయిని అందుకొన్నదని తెలియవచ్చింది. ఆ (ప్రాంతమంతా మార్షల్ లా అమలు పరచబడింది. వెనువెంటనే మార్షల్ లా ప్రకటించబడినప్పటికీ బ్రిటీష్ ఆఫీసర్లు వారి కుటుంబాలు ఏ క్షణాన ఎటువంటి ఇక్కట్లకు లోనవుతామేమోనని భితితోనే ప్రాణాలు బిగపట్టుకొని క్షణమొక యుగంగా గడుపుకొనే పరిస్థితిలో ఉన్నారు. ఎవరయినా ఎదురైతే ఇంగ్లీషువారు వెంటనే వారిని చంపివేసేవారు. ఒకప్పుడు మాష్ట్పా యువకులు చేసే చర్యలు చాలా క్రూరంగాను అమానుషంగాను వుండేవి. ఈ ఆమాయక (ప్రజలను రక్షించాలని నారాయణ మీనన్, కేశవమీనన్ ఎంతో (ప్రయత్నించారు. చాలామంది కాం(గ్రెస్ వారు ఒక ప్రక్క మాష్టాల చేతులలోను, ఇంకొక ప్రక్క మిటిటరీవారి చేతుల్లోను ఎన్నో ఇక్కట్లకు లోనయ్యారు. కాంగైన్తో సంబంధం వున్నా లేకపోయినా పలువురు హిందూ కుటుంబాల వారు ఆ విష్ణవ (ప్రాంతం నుంచి ప్రాణాలకు తెగించి పలాయనం చిత్తగించారు.
మన ప్రకాశం 103 ఇలాంటి పరిస్టితులలోను కొన్ని వింత సంవుటనలు కూడా మనకు తెలియవస్తాయి. ఒక హిందువు మాష్టా వేషం వేసికొని తన ప్రాణాలను కాపాడుకొన గలిగాడు. ఆయన ఒక లక్షాధికారి. ఒక మాష్టా గుంపు ఆయన ఇంటిమీద దాడి చేసింది. ఆ యింటి యజమాని మాష్టా వేషం ధరించి, తాను ఆ ఇంటి నౌకరుననీ, యజమాని పారిపోయాడనీ, దాడి చేయడానికి వచ్చిన ఆ గుంపుతో విన్నవించుకొని (ప్రాణాలు దక్కించుకున్నాడు. మాపష్టా తిరుగుబాటు విషయం (ప్రకాశానికి తెలిసింది. ఏ విధంగానై సరే దీనిని సరిదిద్దాలి ఆని ఆయన ఆకాంక్షించారు. ముందుగా ఈ మాపష్పా తిరుగుబాటుకు సంబంధించిన కారణాలను సమగ్రంగా పరిశీలించాలనే ఉద్దేశంతో ఆయన మలబారు (ప్రాంతమంతా పర్యటించారు. ఈ మాప్పా తిరుగుబాటు ఆరంభమైనదనే తొలి వార్త అందగానే ఆయనకు తిన్నగా కాళీకట్ పట్టణానికి వెళ్ళాలనే ఉద్దేశం కలిగింది. స్వరాజ్య పత్రిక స్థాపనలో (ప్రకాశానికి చాలా సన్నిహితంగా ఉన్న టి.వి. వెంకట్రామయ్యర్ కూడా (ప్రకాశంతో పాటు పర్యటించాలనే కోరిక చేత ఆయనను అనునరించారు. వెంకట్రామయ్యర్ గారు, ప్రకాశం తిన్నగా ఆ ఊరు వెళ్ళి ఆ పరిస్థితులు అన్నీ తెలిసికొన్నారు. ఆనాడు మలబారులో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. అక్కడ మార్షల్‌లా అమలులో ఉంది. అంటే సైనిక శాసనం అమలులో ఉన్నది. సైనిక శాసనం ఉన్న (ప్రాంతం ఎలా ఉంటుందో కూడా ఈ బృందానికి తెలియదు. సైనిక శాసనం అమలులో ఉన్న ప్రాంతం ఎలా ఉంటుందో ఊహించడానికైనా ప్రకాశానికి పూర్వానుభవం లేదు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దాలనే కోరిక, సాహసం మాత్రమే ఆయనలో తీవ్రంగా ఉంది. ఆంబావూరు నుండి తిన్నగా టిక్కెట్టు తీసుకున్నారు. షోరనూరు అనే ప్రాంతం చేరే వరకు ఈ సాహసికునకు ఏ విధమైన అడ్డంకులు కలుగలేదు. (ప్రయాణం చాలా సాఫీగా జరిగింది. అయితే, ప్రకాశం బృందం, వెంకట్రామయ్యర్ గారు ఇద్దరే కదా
మన ప్రకాశం 104 (ప్రయాణిస్తుంది. వీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులని, ఆకాంణంగా ఆ ప్రాంతంలో అడుగుపెట్టటానికి వీలులేదని, ఆదేశిస్తూ ఒక మిలిటరీ అధికారి ఆజ్ఞాసించాడు. వెంటనే వెనక్కి వెళ్ళవలసిందిగా అధికాలంతో హుంకరించాడు. వారి కష్టాలకు అది నాంది అయింది.
షోరనూరు స్టేషనులో మొదటి తరగతి విశ్రాంతి గదిలో కూడా వీరిని కూర్చోనిప్వులేదు. అక్కడి మంత్రులు కొందరు వీరికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రకాశం, ఆయన అనుయాయి, స్టేషన్ ఆవరణ దాటి ఊర్గో ఉన్న ఒక సత్రంలో ప్రవేశించారు. ఆ రాత్రికి అక్కడ ఉండి పరిస్థితులు గమనించి అవలంబించాల్సిన విధానం నిర్ణయించుకోవాలని వారి కోరిక. కానీ ఆధికారులు వారిని వెన్నంటే వున్నారు. ప్రకాశం బృందం ఒక సత్రంలో మకాం చేశారన్న సంగతి (గ్రహించారు. వారు ఆ సత్రం అధికారుల దగ్గరకు వెళ్ళి ఆ సత్రపు పరిసరాలలో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉండటానికి వీలు లేదని, వెంటనే ఖాళీ చేసే బయటకు వెళ్ళిపోవాలని వారికి తెల్పి, పంపించవలసిందిగా ఆ సత్రపు అధికారులను ఆదేశించారు. ఆ ఊళ్ళో ప్రకాశానికి తెలిసినవారు, మిత్రులు ఉన్నప్పటికి అక్కడ మార్షల్‌లా అమలు జరుగుతున్నది గనుక అక్కడ అమలు జరుగుతున్న దమననీతికి జడిసి ప్రకాశానికి నీడ నివ్వడానికి నిరాకరించారు.
షోరనూరులో కాంగ్రెస్ వారికి స్టావరమనేది ఏదీ లేదు. అక్కడకు కొంచెం దగ్గరలో ఉన్న ఒట్టిపాలియంలో మాత్రం తమ కార్యక్రమములు సాగించడానికి కాంగ్రెస్ వారి ఆధీనంలో ఒక ఇల్లు ఉంది. (శ్రమపడి కొందరు పరిచయం ఉన్నవారి సహాయంతో ప్రకాశం ఆయన అనుయాయి ఒట్టిపాలీయం చేరి అక్కడ ఉన్న కాంగ్రెస్ హౌస్‌లో విశ్రమించారు.
మన ప్రకాశం 105 ఆగంతకునితో గడిపిన రాత్రి
ఈ సంఘటన ప్రకాశం హృదయాన్ని పట్టియిస్తున్నది. మానవతకు ఆయన పట్టిన మహత్తరమైన నివాళిని తెలియచేస్తుంది.
వీరు కాంగ్రెస్ హౌస్‌లో వున్న సమయంలో ఒక యువకుడు ఎలాగోలాగా కష్టపడి ఒట్టిపాలియంలోని ఆ ప్రాంతానికి రాగలిగాడు. ఒట్టిపాలీయం సైనిక శాసనం అమలులో ఉన్న ప్రాంతంగా నిర్ణయింపబడకపోయినా, ఆనాటి పోలీసు అధికారులు కాంగ్రెస్ వారిని అనేక బాధలకు గురి చేశారు. ఆ వచ్చిన యువకుడు పోలీసు వారి చేతిలో బాగా దెబ్బలు తిని ఎలాగో తప్పించుకుని వచ్చి ఆత్మరక్షణకోసం ఈ కాంగగైస్ హౌస్‌లో దూరాడు. అతడు తన పేరు గుడిమెట్ల ఆచారి అనీ, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం దగరలో నున్న మత్స్యపురి (గ్రామం తన నివాసమని వీరికి తెలియజేశాడు. కాని అనాటి పరిస్థితుల దృష్ట్యా ప్రకాశం ఇంకా అక్కడ చేరిన ఇతర కాం(గైస్వారు కూడా ఆ యువకుని మాటలను విశ్చసించలేదు. ఆతను సి.ఐ.డి. విభాగంలో ఒక పెద్ద ఉద్యోగియై ఉండవచ్చునని, పోలీస్‌వారు చితకగొట్టారు అనే సాకుతో కాం(గ్రెస్ భవనంలోకి చేరాడని అనుమానించారు. చిత్రమేమిటంటే వీరు ఆ యువకుని అనుమానిస్తే, అతడు వీరిని నమ్మించాలని అధికంగా (ప్రయత్నించాడు. కాని ఆతని పలుకులు (ప్రకాశం విశ్చ్శసించలేక పోయాడు. ఆలా అని అతనిని అక్కడనుండి వెళ్ళగొట్టలేకపోయారు. అదేరోజున మిలటరీ వారు (ప్రకాశం బృందాన్ని తీవ్రంగా హింసించడం ఆ బృందానికింకా జ్ఞాపకముంది. ఆ చేదు అనుభవం దృష్ట్యా సి.ఐ.డి. అధికారి అని అనుమానం ఉన్నా అతనిని వెళ్ళగొట్టలేక పోయారు. ఒకవేళ అతను సి.ఐ.డి. కాకపోతే, ఆ మిలిటరీ అధికారిచే హింసపడవలసిందే కదా!
ఆ రాత్రి అతను అక్కడే పడుకుంటానని కోరితే కాదనలేకపోయారు. ఇకముందు అవలంబించ దగ్గ విధానానికి ఆ రాత్రి ఒక పథకం వేసుకోవాలని (ప్రకాశం,
మన ప్రకాశం 106 ఆయన అనుయాయి అనుకున్నారు. కాని ఒకవేళ సి.ఐ.డి. అయితే ఎలా అనే అనుమానంతో వీరు బహిరంగంగా మాట్లాడడం మానేశారు. సంప్రదించవలసిన చర్చలు మరునాటి ఉదయానికి వాయిదా వేసుకున్నారు. ఇంతలో ఒక విశేషం జరిగింది. వాళ్ళు ఒట్టిపాలియం చేరుకునే సరికి వెంకట్రామయ్యర్ గారి భార్య దగ్గరనుండి, కుమారుని దగ్గరనుండి రెండు టెలిగ్రాములు వరుసగా వచ్చినాయి. ఆయనను వెంటనే పట్నం తిరిగి రావలసిందిగా ఆందులో ఆయన భార్య కుమారులు కోరారు. కాని తాను కొంతకాలం ఉండి ప్రకాశం చేస్తున్న కృషికి సహకరిస్తానని వెంకట్రామయ్యర్ చెప్పారు. తిరుగుబాటు పరిస్థితిని, మిలటరీ చర్యలను ఆ ప్రాంతం వారు బాగా ఆకళించుకున్నారు. అందుకని మోటార్లు మొదలగునవి రోడ్లమీద నడవడానికి వీలులేని పరిస్థితిని కలుగజేశారు. ఈ పరిస్థితిని (గ్రహించి ప్రకాశం వారి అనుయాయులు, ఒట్టిపాలీయం నుండి కాళికట్టుకు కాలి నడకనే చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ రోడ్డు దారిని, కాళికట్టు ఒట్టిపాలియం (గామాల మధ్య దూరముంది. (ప్రకాశం, వెంకట్రామయ్యర్' ఉభయులు కలిసి ఉదయాన్నే ఒట్టిపాలీయం నుండి బయలుదేరారు. కాని వారికి అక్కడి పరిస్థితులు తెలియవు. కాలి నడకన అరువది మెళ్ళ ప్రయాణం చేయాలంటే కలిగే ఇబ్బందులు, ఆటంకాలు ఏవి తెలియవు. అలా బయలుదేరి, ఒక ఐదుమైళ్ళ దూరం వెళ్ళారు. అప్పుడు ఆ దారిన నడిచి వెళ్ళడం ఎంత కష్టమైన విషయమో వారికి తెలిసి వచ్చింది. మాష్టాలలో చాలామంది మిలటరీలో పని చేసి రిటైరయిన వారు. లోగడ యుద్ధాల్లో విదేశాల్లో కోడా పనిచేసినవారు. అందుకని వారికి మిలటరీ విధులు బాగా తెలుసు. మిలటరీ వారు, వారి (గ్రామంవైపు యధేచ్చగా రాక్రుండా అడ్డుకున్నారు. రోడ్డు కిరువైపుల ఉండే బాగా ఎదిగిన చెట్లన్నింటిని అక్కడే నరికి దారికి అడ్డదిడ్డంగా పడవేశారు. అరవైమైళ్ళ పొడవునా అడ్డదిడ్డంగా చెట్టు పడవేయబడే వున్నాయి. ఆ దార్లన్నీ ఏ 'విధమైన బళ్ళు నడవడానికి వీలులేని పరిస్థితుల్లో వున్నాయి. అట్టి పరిస్థితుల్లో సాయంత్రం దాకా నడచినా వారు ఇరవై మైళ్ళ కంటే దూరం వెళ్ళలేకపోయారు. అక్కడి ప్రజల కేదో మేలు చేయాలనే ఉద్దేశంతో సాహసించి చేర్చల్నేరి నడుస్తూనే ఉన్నారు.
మన ప్రకాశం 107 సూర్యాస్తుయం సమయానికి వారు చెర్పల్టేరి (గ్రామం చేరారు. వారు కాంగ్రెస్ వారు కనుక ఇద్దరు దుస్తులలోనే వున్నారు. దారిలో తటస్టపడిన లేదో పరిచయస్టులు వారిని రాత్రి అయింది కనుక ఇంకా ముందుకు వెళ్ళవద్దని అలా వెళ్ళినట్లయిన (ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకోమని సలహా యిచ్చారు. అక్కడ సైనిక శాసనం అమలులో ఉంది కదా! మిలటరీ గస్తీ ఉంది. ఆ మిలటరీ బ్రిటీష్ ప్రభుత్వానిది. నీరేమో స్వాంతత్ర్యకాంక్షగల భారతీయులు. అందులో కాం(గైస్ వారు. అప్పటి ప్రభుత్వానికి విపక్షంలో నున్నవారు. అందుకని గస్తీలో ఉన్న మిలకీ వారికి ప్రకాశం గారికి సంఘర్షణ కలుగవచ్చని, ప్రమాదం కూడా రావచ్చని, అందుకని ముందుకు వెళ్ళవద్దని వారు సలహా యిచ్చారు. వెళితే ప్రమాదం అని కూడా హెచ్చరించారు. ఆ చెర్చల్ చెరీ (గ్రామం మెయిన్‌రోడ్డు మీద గాక ప్రక్కగా ఫర్జాంగు దూరంలో ఉంది. నిజంగా అక్కడకు చేరడం వారి అదృష్టమే. ఆ మార్గం వదలి బండి బాట వెంట వారు నడక ప్రారంభించారు. కొద్దిసేపట్టోనే మిలటరీ వారు గుజ్రాల మీద వచ్చి ఆ ప్రాంతమంతా. గాలించారట! కాంగ్రెస్ వారే కనుక, ఖద్దరు దుస్తులతో నిజంగా వారి కంట పడి వుంటే తక్షణమే వాళ్ళని కాల్చేసి ఉండేవారట ! ఈ మాటలు (ప్రకాశం గారికి తరువాత ఆ (గ్రామానికి వచ్చిన పల్లీయులు చెప్పారు. ఆ రాత్రికి వారు చెర్చల్చెరీలోనే విశ్రమించారు. తెల్లవారింది. ఉదయాన్నే వెంకట్రామయ్యర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపించారు. (ప్రకాశం దగ్గరకు వచ్చి, “ప్రకాశం గారూ నేనిక మీతో ముందుకు సొగలేనండి. ఈ సైనిక శాసనం పరిస్థితిలో దారిలో ఏర్పడిన అడ్డంకులను నేను అధిగమించలేను. నేను మీ కంటే వయసులో పెద్దవాడిని. ఈ వయస్సులో యింత కఠినమైనటువంటి (ప్రయాణాలను నేను చేయలేను. నేను మద్రాస్ వెళ్ళిపోవడానికి నిశ్చయించుకొన్నా” అని తన నిర్ణయాన్ని తెలియజేళాడు. దానికి ప్రకాశం అంగీకరించాడు. తిరిగి వెళ్ళడానికి వెంకట్రామయ్యర్ ఇద్దరు మిత్రుల సాయంతో ఆ సాయంత్రానికి ఒట్టిపాలియం చేరుకుని ఆ రాత్రి బండికి వెళ్ళిపోయారు.
మన ప్రకాశం 108 తనతో వచ్చిన వెంకట్రామయ్యర్ అలా ఆర్జాంతరంగా వెళ్ళిపోయినా ప్రకాశం సంకల్పంలో ఏవిధమైన మార్పు కలుగలేదు. మాష్టా గుంపు దాడిచేస్తే ఆయన అక్కడికక్కడే మరణించేవాడు. అతనిని చూచి అతను మాపష్టానేఅని భావించి దండయాత్రకు వచ్చినవారు అతనిని చంపకుండా వదలివేసి వెళ్ళారు. అతని (ప్రాణాలు దక్కించుకున్నాడు. కాని మిలటరీ కోర్టు వారు అతనిని పట్టుకొని ప్రల్షించారు. ఆయన తను మాష్టా అని మిలటరీ వాళ్ళకు కూడా చెప్పాడు. ఆయనను మాష్లాఅనుకొని భయపెట్టడం రెట్టింపు చేశారు. అలాగే కోర్టులో విచారించారు. మాష్టాఅని ఆయనకి మరణశిక్ష విధించారు. శిక్ష విధింపబడిన వెంటనే అతను అసలు విషయం తెలియజేశారు. తాను మౌప్టా కాదని 'ప్రాణరక్షణార్హం మాప్టా వేషం వేసుకొన్నానని గట్టిగా అరిచాడు. ఆ విషయం తెలిసికొని జడ్డీ ఆశ్చర్య చకితుదయ్యాడు. వెంటనే అమలు జరుపవలసిన మరణశిక్షను ఆపించేశారు. అతను నిజంగా హిందువా కాదా అని విచారణ (ప్రారంభించారు. నిజం బయటపడిన తరువాత ఆతడు హిందువేనని తెలిసింది. తరువాత మరణశిక్షను రద్దుచేసి ఆయనను విడుదల చేశారు. ఇది ఒక అపూర్వమైన సంఘటన. మార్షల్‌లా ప్రాంతంలో ధనానికి ప్రాణానికి ఎంత (ప్రమాదం ఉంటుందో, వాటిని కాపాడుకోవడం ఎంత కష్టమో ఈ సంఘటనను బట్టి అర్థమవుతుంది. సైన్యం పైర్వ విహారం చేసిన గడ్డుదినాలు. దీనికి కారణం చాలా చిన్నది. (ప్రకాశం చేసిన విచారణలో ఒక విషయం తెలిసింది. హిందూ జమిందార్హుకు మాష్టా రైతాంగానికి మధ్య కొన్ని తగాదాలు ఉత్పన్నమయ్యాయి. మాష్టాల జీవనోపాధి వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది. నిలంబూరు ఎస్టేటు (ప్రాంతంలో ఒక మాష్లా యువకుడు ఒక ఇంటిలో పాలేరుగా పనిచేస్తున్నాడు. అతను దొంగతనం చేశాడనే అనుమానంపై శిక్షింపబడ్డాడు. ఆ మారుమూల (గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఇంతింతై వటుడింతై అన్నట్టు పందామ్మిడి వందల ఇరవై ఒకటి నాటికి మాష్టా తిరుగుబాటుకు కారణమయిందని కొందరు ఊహిస్తున్నారు.
మన ప్రకాశం 109 దక్షిణాది రాష్ట్రాలలో ప్రకాశం కార్యక్రమాలు నాగపూర్ కాం(గైన్లో రాష్ట్రీయ కాం(గ్రెసు సంపూర్ణంగా ఆవిర్భవించడానికి . ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి. దానిలో ఆమోదించబడిన (ప్రతిపాదనల కారణంగా రాష్ట్ర కాంగ్రెసు సంఘాలు అవిర్భవించడానికి అవకాశం కలిగింది. ఆ కొంగ్రెసుచే ఆమోదింపబడిన మొదటి కాం(గైసు సంఘం ఆం(ధ్రరాష్ట్రానికి సంబంధించినదే. కేరళ రాష్ట్రీయ ప్రథమ కాంగ్రెసు సమావేశం ఒట్టిపాలియంలో జరిగింది. మలయాళ మిత్రులు ప్రకాశం గారిని ఆ సమావేశానికి అధ్యక్షత వహించమని కోరారు.
అప్పటికి మళయాళ రాష్టం కూడా చాలా ఉత్తేజకరంగానే తయారయింది. గాంధీగారి ప్రేరణతో కేరళ రాష్ట్రీయ నాయకుల, సేవకుల శక్తి చాలా పుంజుకున్నది. ఆ రోజులలో హిందూ మహమ్మదీయుల మైత్రి తారాస్థాయి నందుకొన్నది. మళయూళ రాష్ట్రపు అన్ని ప్రాంతాలనుండి ఆ సమావేళానికి ప్రతినిధులు వచ్చారు.
ఈ రాజకీయ సమరంలో మళయాళ స్రీలు బాగా ముందంజ వేశారు. ఏ దృక్పథంతో చూచినా ఈ సమావేశం విజయవంతమయిందనే చెప్పాలి. హిందూ మహమ్మదీయ ఐక్యతా ప్రయత్నాలు ఫలించాయి.
అప్పుడు హిచ్‌కాక్ అనే ఆయన అక్కడి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌గా ఉండేవారు. స్వాతంత్ర్యము, స్వేచ్చ అనేమాటలు ఆయన తానెప్పుడూ వినగూడదని అనుకుని ఉంటాడని అక్కడి ప్రజలు ఆయనను గురించి సరదాగా చెప్పుకుంటూ ఉంటారు. తాను ఆ జిల్లాలో సూపరింటెండెంట్ పదవిలో ఉన్నంతకాలమూ, అక్కడ రాజకీయ చైతన్యం తలెత్తకూడదనే అభిప్రాయం కలవాడు. మాష్టాల సరిస్టితి కదిపితే ఒక్కసారిగా అంటుకొని భగ్గుమనే రీతిలో నున్నది. ఇది కూడా హిచ్‌కాక్ అంత భీకరంగా (ప్రవర్తించడానికి హేతువయింది.
మన ప్రకాశం 110
ఆయన ఆంగ్లేయుడు, ప్రభుత్వాధికారి. ఆంగ్ల ప్రభుత్వానికి ఆయన విధేయుడు. మలబారు జిల్దాలో జరిగిన మొట్టమొదటి రాష్ట కాంగ్రెసు సమావేశం విజయవంతం కావడం ఆయన సహించలేకపోయాడు.
(ప్రకాశం గారు కూడా హిచ్‌కాక్‌ను బాగా అర్థం చేసుకున్నవారే. కేరళ కాంగ్రెస్ సభకు అధ్యక్షత వహించడానికి ఒట్టిపాలియం చేరకుండా నిరోధించడానికి, ఆ కాంగ్రెస్ సమావేశం జరగకుండా ఆపడానికి ఏదో విధంగా పోలీసులు (ప్రయత్నిస్తారని ఆయన అనుకొన్నారు. కానీ అటువంటిదేమీ జరుగలేదు. అయితే సమావేశం ముగిసేలోపల ఏదో విధంగా శాంతి భగ్నం చేయడానికి కొందరు వ్యక్తులు నియక్తులయ్యారు. కాని ఆ సమావేశం ముగిసేలోపల ఏ దుర్హటనా జరుగలేదు. అది వారందరికీ ఆనంద 'హేతువయింది.
పోలీసు వారి జులుం
కొని సాయంత్రం సమావేశం ముగిసేలోపల చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. ఆ (గ్రామంలో సంచరిస్తున్న కాంగ్రెసు పార్టీ అనుయాయులైన కొందరు హిందువులను, ముస్లిములను కొందరు దుండగులు అల్లరి పెట్టడం, మరి కొందరు కొట్టడమూ జరిగింది.
కాన్ఫరెన్స్ కాలంలో శాంతిని కాపాడడం కోసమని మల్గాపురం నుంచి పోలీసు బలగం ఒట్టిపాలియంకు పిలిపింపబడింది. (గ్రాడ్యుయేట్, లా కాలేజీ లెకరరు పి. గోవింద మీనన్ మేనల్టుడు, పెద్ద మనిషి అయిన మీనన్ అనే ఆయన ఆ సమయంలో మెయిన్ రోడ్డు మీదుగా హమీద్‌ఖాన్‌తో కలిసి వెళ్తున్నాడు. కొందరు వ్యక్తులు హమీద్ ఖాన్‌ను ఆపుచేసి, అడ్డదిడ్డపు అసభ్య ప్రట్లీలు వేశారు. అబ్బుల్ హమీద్ ఖాన్ తాత్ష్యికుడు. గొప్పు తత్చ్వ చింతన గలవాడు. రామున్నీ మీనన్ సజ్జనుడు. సాధుస్వభావం గలవాడు. పోలీసు వారు కొన్ని ప్రళ్ళీలడిగి రామున్నీ మీనన్ రెండు దవడల మీద లెంపకాయలు వేశారు. హమీద్‌ఖాన్ దెబ్బలు తినకుండా తప్పించుకొన్నాడు. రామున్నీ మీనన్ ఒక
మన ప్రకాశం 111 చెంపమీద కొడితే రెండవ చెంప చూపించే తత్వం. కాన్ఫరెన్స్ ముగిసే లోపలనే వారిద్దరు తిరిగి వచ్చి జరిగిన ఉదంతం అంతా సభలో నివేదించారు. జరిగిన ఉదంతాన్ని రామున్షీ మీనన్ చెపుతూ ఉంటే సభలోని వారికి ఉద్రేకం జనించింది.
అదే సమయంలో కొన్ని వీధులలో పోలీసులు మాష్లాల మీద చేయిచేసు కొన్నారు. పోలీసుల చేతులలో దెబ్బలు తిన్న మాష్టాని కొందరు మిత్రులు సమావేశానికి తీసుకొని వచ్చారు. అతను బాగా ఒడ్డూ పొడుగూ కలిగిన మంచి బలశాలి. ఆరుగురు జనం మూకుమ్మడిగా ఒకేసారి ఆయన మీద విరుచుకు పడినా తట్టుకోగల బలం ఆయనకున్నది. పైగా ఆయన బెల్టులో కైజారు ఉంది. అదృష్టవశాత్తు ఆయన ఆ కైజారుని పోలీసువారిపై ప్రయోగించలేదు. ఆ గలాటాని అపు చేయగలిగిన కొందరు వ్యక్తులు ఆయన్ని కాన్ఫరెన్స్ హాలులోనికి తీసుకొని వచ్చారు. ఆయన చాలా ఉద్రేకంగా ఉన్నాడు. ఓక్క ఉదుటున వెనక్కి వెళ్ళి కక్ష సాధిద్దాం అనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. కాని కొందరు మిత్రులు ఆయనను బలవంతంగా నిరోధించార్ము ఒక్క ఉదుటున బయటకు పోవాలని ఆయన తలచినప్పుడు వారంతా కలిసి బలవంతంగా ఆయనను పడుకోబెట్టారు. కొన్ని సంవత్సరాల నుండీ రాజ్యసభ సభ్యులుగా వుంటున్న సయ్యద్ మూర్తజా సాహెబ్ గారు కూడా అనాటి సభలో ఉన్నారు. ఆయన తిరుచునాపల్లి నివాసి. బలవంతంగా పడుకోబెట్టబడిన ఆ ఆసామీ ఛాతిమీద మూర్తజా కూర్చొని శాంతి వచనాలు పలికి ఆ యువకుని శాంతింప చేశాడు. ఆనాటి సమావేశం ముగిసేలోపల ఎలాగైనా అల్లరిపెట్టి ఆఖరు నిమిషంలోనైనా సమావేశం సాగకుండా చేయాలి అన్న పోలీసువారి కుతంత్రమే ఇటువంటి సంఘటనలకు కారణమని భారతీయులకు తేటతెల్లమయింది. ఇక్కడ పోలీసు వారి కుతంత్రం సాగలేదు. పందొమి శది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలోనే ముల్తాన్ మత కహాలు ఏర్పడినప్పుడు, తాను స్వయంగా వెళ్ళి అక్కడి (ప్రజల యొక్క కష్టనష్టాలను తెలిసికొని నివేదిక తయారు చేశాడు ప్రకాశం. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో కల్టోలం ఏర్పడినప్పుడు కూడా తాను వెళ్ళి, అక్కడి ప్రజలతో విషయం చర్చించి అక్కడ శాంతి స్టాపన చేసిన ఘనుడాయన. నాగపూర్ కాం(గైన్ ఆమోదాన్ని పొందిన అహింసా విధానాన్ని ఇక్కడ స్మరించుకోవాలి.
మన ప్రకాశం 112 ఆంధ్రకేసరి
స్వాతంత్రోద్యమ చరిత్రలో తెలుగుజాతి శౌర్యప్రతాపాలను ఇనుమడింప చేసిన అద్భుత సంఘటన అది!
'సైమను కమీషనును వెనక్కు మళ్ళమంటూ ప్రకాశం నేతృత్వంలో పౌరులు చేసిన గర్జన అది! తుపాకీ తూటా గురిపెట్టిన తెల్లవాడికి గుండె చూపి పారుషముంటే కాల్బమని పలుక కలిగిన ప్రకాశం అసమాన ధైర్య సాహసాలను చూచి ప్రపంచమంతా వేనోళ్ళ కొనియాడిన సంఘటన అది!
(ప్రకాశం పంతులు గారి జీవితంలోనే కాక ఆంధ్రుల చరిత్రలోనే నిలిచిపోయే మహత్రర ఘట్టమది! తెలుగువారి కీర్తి పతాకను దేశమంతటా రెపరెపలాడించిన ఘట్టమది!
(బ్రిటీషు వారు భారతదేశంలో చేసే పరిపాలనను నిక్దేశించేదీ, ఆధిపత్యం వహించేదీ, ఇంగ్రండులోని (బైటీషు పార్లమెంటు! ఇక్కడ పరిపాలన అంతా వారికి అధికారానికి లోబడి జరుగుతుండేది. భారతదేశంలో ఎప్రవేశపెట్టవలసిన పరిపాలనా సంస్కరణల గురించి, భారత ప్రజలకు తెలియచెప్పవలసిన విషయాలను గురించి బ్రిటీషు పార్లమెంటు నిర్ణయాలు చేస్తూ ఉండేది. భారతీయులకు ఇవ్వవలసిన హామీలను గురించి
కూడా బ్రిటీష్ పార్లమెంటే నిర్ణయించేది. వీటిని ప్రచారం చేయడానికి, భారత ప్రజలకు నచ్చచెప్పడానికే ఒక సంఘాన్ని నియమించడం కూడా జరిగింది.
పందొమ్మిది వందల పదిలోను, పందొమ్మిది వందల ఇరవైలోనూ కూడా ఇటువంటి సంఘాలను ఏర్పరచినది (బ్రిటీషు (ప్రభుత్వం. ఈ సంఘాల వలన భారతదేశానికి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు.
పందొమ్మిది వందల ఇరవై ఆరులో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో కాం(గైసు సాధించిన విజయాలను బ్రిటీషు వారు గమనించారు. ఎనిమిది సంవత్సరాల పాటు కాం(గైనులోని న్వరాజ్యపార్టీ వారిని ఆళశాబద్దుల్ని చేని విడిగా ఆడించినా,
మన ప్రకాశం 113 ఉభయపక్షాలవారూ సన్నిహితులై అంగ్ల పరిపాలన మీద విరుచుకు పడబోతున్నారన్న సంగతి (గ్రహించారు. స్వరాజ్యపార్టీవారు ద్వంద్వ (ప్రభుత్వ విధానంలోని అంతర్గత బలహీనతను వెల్లడించారు. వీరు అవలంబించిన అవకతవక విధానం, ఎత్తుగడల వలన అప్పటి ప్రభుత్వం అపఖ్యాతి పాలయింది. ఆ సమయంలో కాం(గ్రెస్వారు చూపిస్తున్న రాజకీయ తంత్రజ్ఞత, వారు అవలంబిస్తున్న విధానము గమనించి వారు సందిగ్రస్థితిలో పడ్డారు. ఒక పెద్ద గండాన్ని ఎదుర్కొనక తప్పదు అని (గ్రహించారు. పందొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఇంగ్లండులో ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పుడు జరగబోయే ఎన్నికలలో లేబర్ పార్టీ విజయాన్ని సాధించి, అధికారాన్ని చేపట్ట గలిగితే భారతదేశానికి ఏదైనా ఇచ్చిపోతారేమోనన్న బాధ అప్పటీ (బ్రిటీషు ప్రభుత్వానికి కలిగింది. ఆందుకని జరుగబోయే మేలును నివారించడం కోసం ఒక అద్దుపుల్లను వేయదలచారు. ఆ కార్యక్రమంలో భాగంగా బ్రిటీషువారు సైమన్ కమీషన్‌ను ఏర్పాటు చేశారు.
కమీషన్ ఏర్పాటు చేసే సమయంలో ఇవ్వవలసిన న్యాయమయిన గడువును, సమయాన్నీ భారతీయులకు ఇవ్వలేదు.
భారతదేశములోని అన్ని వర్గాలవారూ ఈ సైమన్ కమీషన్‌ను బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు.
(బ్రిటీషు ప్రభుత్వం దమననీతిని అనుసరిస్తూ వచ్చింది. అంతేకాదు. (ప్రజలకు అవసరమైన చైతన్యం కలుగలేదనీ, నిర్మాణ కార్య'క్రమాలేవీ సరిగా అమలు జరగడం లేదని ఈ పరిస్థితులలో "సైమన్ కమీషన్ బాయ్‌కాట్ అన్న భారతీయుల విధానం విఫలమవుతుందని వారు భావించారు.
ఇక్కడి ప్రజలు అక్షరాస్యులు కారనీ, అంతకుముందు తాము (డయ్యరు) జరిపించిన దారుణ కాండలన్నీ భారత ప్రజలు అప్పుడే మరచిపోరనీ, ఆ భయోత్సాతం ఇంకా అలానే ఉంటుందని బ్రిటీషు వారు అనుకున్నారు. నిజమే. నిర్మాణ కార్యక్రమాలేవీ
మన ప్రకాశం 114 కొనసాగని పరిస్థితులలో ప్రభుత్వం వారు ఆలా అనుకొనడంలో ఆశ్చర్యం లేదు. కాని వారికి భారత పౌరుల అపారమైన శక్తి వారి నరనరాలలో నాటుకుపోయిన అహింసాతత్వము, అహింసా మార్గము వలననే దేనినయినా సాధించగలమనే వారి అచంచల విశ్వాసము అర్ధమయి ఉండదు. ఏది ఏమయినా కమీషను వారు దేశములో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచీ అవసరమైన త్యాగాలన్నింటికి భారతీయులు సంసిద్దులయ్యే ఉన్నారు. అందుకు వారి నిరక్షరాస్యతగాని, శిక్షణా లోపముగాని అడ్డురాలేదు.
'స్రైెమన్ కమీషన్ పందొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవచ్చరం ఫిబ్రవరి మూడవ తేదీన బొంబాయి వచ్చింది. బొంబాయిలో కమీషన్ దిగిన నాడే దేశంలోని ఇతర (ప్రాంతాలతోపాటు మద్రాసులో అల్లర్లు జరిగాయి. “సైమన్ గో బాక్ అనే నినాదంతో పెద్ద ఊరేగింపు బయలుదేరింది. ఈ ఊరేగింపు మద్రానులోని జార్జి టవున్లో బయలుదేరింది. అక్కడినుంచి మౌంట్‌రోడ్డు నుండి మెరీనాబీచ్‌కు చేరింది. బ్రిటీషు పార్షమెంట్ సభ్యుడు సర్జాన్ సైమన్ ఈ సంఘానికి అధ్యక్షత వహించడం వలన దీనికి సైమన్ కమీషన్ అనుపేరు వచ్చింది. ఈ సంఘంలో అధ్యక్షుడైన సైమన్కాక మరి ఏడుగురు సభ్యులున్నారు. వీరందరూ బ్రిటీషు వారే. ఆకమీషన్లో భారతీయులెవ్వరికీ స్థానమొసగలేదు. అంతకుముందు ఎవరు, ఎప్పుడు చూడనంత అపురూపంగా రూపొందింది ఈ ఊరేగింపు.
"సెమన్ కమీషన్ మదరాసు నగరానికి వచ్చినప్పుడు బహిరంగసభలు, నిరసన (ప్రదర్శనలు చేయరాదని పోలీసు కమీషనర్ ఉత్తర్వు జారీ చేశాడు. నగరంలో 144వ "సెక్షను విధించబడింది. అయినా ఆ ఉత్తరువు ఖాతరు చేయకుండా “స్టైెమన్ గో బాకో అనే నినాదంతో (బ్రహ్మాండమైన ఊరేగింపు జరిగింది.
అప్పుడు అక్కడ పి.జె. కన్నింగ్హోమ్ పోలీస్ కమీషనర్‌గా ఉన్నాడు. ఆయన
మన ప్రకాశం [15 తన పోలీసు బలగంతో ప్రకాశం గౌరితో కదులుతున్న ఊరేగింపును ఆటకాయించాడు. ఆ అటకాయింపు అయిన తరువాత సముద్ర తీరానికి చేరారు. (ప్రకాశం గారూ అనుయాయులూ అందరూ, అక్కడ ఇసుకలో సావకాశంగా మీటింగు పెట్టుకున్నారు. ఆ సభలో కొన్ని ముఖ్య విషయాలు ప్రకటించడం జరిగింది.
సోలీసువారు ఉరేగింపును నడిరోడ్డు మీద ఆపుచేయడం అన్యాయమనీ, ఇంకోసారి ఎప్పుడైనా అలా జరిగితే పోలీస్‌వారి (కార్టర్) ఆజ్ఞను కాదని ముందుకు నడుస్తాం' అని ప్రకాశం పంతులు గారు (ప్రకటించారు. అక్కడ వెయ్యి మందికి పైగా ఉద్యమకర్తలు అరెస్టుకు సిద్ధంగానే ఉన్నారు.
సైమన్ కమీషన్ పట్టణంలో మొదటిసారిగా అడుగుపెట్టిన నాడు జరిగిన బహిష్కరణ జయప్రదమయింది, పట్టణంలో హర్తాలు జరిగింది. ఇది సంపూర్ణంగానూ, సమఃగ్రంగానూ జరిగింది. కమీషన్ వారు ఎక్కడికి వెళ్ళినా నల్లజెండాలు ఎదురైనాయి. ఉద్రేకం ఎక్కువగా గల కొందరు యువకులు నల్లజెండాలను కదులుతున్న సర్జాన్ సైమన్ గారి కారులోకి విసిరేశారు. (ప్రకాశంగారి పిలుపు ననుసరించి మదరాసు పౌరులు జరిపిన (బ్రహ్మాండమయిన ఊరేగింపు విజయవంతమయింది. కులమత భేదాలను విడనాడి, మదరాసు పౌరులందరూ తమ తమ వ్యాపారాలను బంద్ చేసి చెన్న పట్టణపు పుర వీధులలోకి వచ్చినారు. నాడు సుమారు పదిమైళ్ళ వెడల్పు గల పట్టణ వీధులన్నీ జన ప్రవాహంతో నిండిపోయి కోలాహలంగా ఉన్నాయి. ఈ కోలాహలమిలా ఉంటే (ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణచివేయడం కోసం పోలీస్ బలగాన్ని సిద్దం చేసింది. ఈ పోలీసు బలగానికి తోడుగా సైన్యం సిద్దమయింది. అణిచివేతకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగాయి.
(బ్రాడ్వేలోను, హైకోర్టు దగ్గణ కాల్పులు జరపడానికి ఆనాటి ఛీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ పండాలే గారు ఉత్తర్వు జారీ చేశారు.
మన ప్రకాశం 116 గుండెకు బారు చేసిన తుపాకీ - ఆంధ్రకేసరి బిరుదు ప్రదానము ఆరోజు మధ్యాహ్నం 11 గం॥ల ప్రాంతంలో ఉద్యమం ఎలా సాగుతున్నదీ చూడడానికి పోలీసులు పట్టణ వీధులలో పర్యటిస్తున్నారు. అప్పుడు పోలీసులు (ప్రజలపై కాల్పులు జరిపారనీ, 'పారసారధి' తీనే యువకుడు ఆ కాల్పులలో మరణించాడనీ (ప్రకాశం గారికి తెలిసింది. ఆ వార్త అందగానే ఆ వీరుని చూడాలని అతివేగంగా అక్కడకు చేరారు. ఆ కూడలి దగ్గర బీచ్‌కు వెళ్ళే ఆ మార్గమూ, కస్టమ్స్ హౌసుకు వెళ్ళేదారి, హైకోర్టుకు వెళ్ళీ మార్గము అన్నీ పోలీసు బలగంతో నిండిపోయాయి, అక్కడ ఉద్రిక్తత నెలకొని వున్నది. పోలీసు బలగంతో పాటు సైనిక దళం కూడా అక్కడ మోహరించి ఉన్నది. సాయుధులై సైనికులు వలయంగా చేరి పహారా కాస్తున్నారు. సైనికులు కవాతును చేస్తున్నారు. అక్కడి వాతావరణమంతా భీతావహంగా ఉంది. ఇంతలో ఆఘమేఘాల మీద ఆక్కడకు చేరాడు (ప్రకాశం. ' స్వాతంత్ర యజ్ఞంలో అసువులు అర్చించిన వారి మృతకళేబరాలను తాను చూడాలని కోరుకున్నాడు ప్రకాశం. అందుకే ఆ మృతవీరుడు పడున్నచోటుకి చేరాలని అటువైపుగా నడుస్తున్నాడు (ప్రకాశం, పోలీసులు, సైనికులు అడ్డగించారు ఆయనను. అప్పుడాతని వెంట ముస్తిం యువకుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. సైనికులు ఆయన చుట్టూ వలయంగా చేరి అడ్డగించారు. అశ్వారూఢుడై "సైనికాధికారి కూడా అక్కడకు చేరుకున్నాడు. “ఉద్యమం కోసం అసువులు బాసిన మా ఉద్యమకారుణ్లి చూడాలి. ఆవేదనతోను, ఆవేశంతోనూ పలికాడు సైనికాదికారితో (ప్రకాశం. “వీల్లే దు” మిలిటరీ అధికారి నిరాకరించాడు.
మన ప్రకాశం 117
“ఎప్పకుండా చూడవలసిందే”
“అంతగా చూడాలంటే పారిస్ కార్నర్ వైపుగా నడుస్తూ దూరంగా చూస్తూ వెళ్లిపోండి” మిలిటరీ అధికారి కంఠమది.
“దూర్ంగా కాదు. నేను దగ్గరగా ఉండి చూడవలసిందే”.
ప్రకాశం పట్టుపట్టాడు. అధికారి మాటను ఖాతరు చేయలేదు. ముందుకు నడుస్తున్నాడు ప్రకాశం, సాగిపోతున్నాడు.
సైనికులు తుపాకులు ఆయన వైపు గురిపెట్టారు. “అడుగు ముందుకు వేయవద్దు” హెచ్చరించాడు మిలిటరీ అధికారి. (ప్రకాశం ముందుకు వెళ్తూనే ఉన్నాడు.
"ప్పురు ఇంకొక్క అడుగు ముందుకు వేస్తే తుపాకీ గుండుకు సిద్ధపడవలసి ఉంటుంది” మిలిటరీ అధికారి ఆజ్జు దానిని ధిక్కరించాడు కనుక ప్రకాశాన్ని కాల్బమనే ఆజ్ఞ వెలువడనున్నది. కొన్ని క్షణాలలో తుపాకీ గుండ్లు తనను దూసుకుపోతాయనే భయంకంటే దేశసేవలో మరణించి, దిక్కుమొక్కూ లేకుండా పడున్న మృతకళేబరాన్ని చూడాలనే ఆకాంక్ష ఆయనలో బలీయంగా ఉన్నది. ఆ ఆకాంక్షతోనే ఆయన ముందడుగు వేస్తున్నాడు.
“ఊ! షూట్ చేయవలసి వస్తుంది” అధికారి ఉరిమాడు. సైనికులు ముందుకు వచ్చి తుపాకులు గురిపెట్టారు.
ఆ దృశ్యం ఎంతో భీతావహంగా ఉన్నది.
చుట్టుప్రక్కల కొంతదూరంలో ఉన్న ప్రజలు ఏమి జరుగనున్నదో అని భయపడుతున్నారు. (ప్రకాశం పక్కనే ఉన్న యువకుడు “ధైర్యం ఉంటే కాల్చు మేమూ సిద్ధంగానే
ఉన్నాం, ఆయనెవరో నీకు తెలియనట్టుంది" మళ్లీ ఆరిచాడా విప్లవ యువకుడు.
(ప్రకాశం పంతులుగారు ఆ రొమ్ము ఎదురొడ్డి ఆడుగు ముందుకువేశారు. అంతే
- సైనికుల తుపాకులు మూగవోయాయి.
“మా నాయకుడు ప్రకాశం వర్దిల్లాలి” అని అక్కడ చేరిన అభిండ జన సందోహం
మన ప్రకాశం 118 గర్జించింది. ఆ దృశ్యాన్ని చూచిన ఆ మిలిటరీ అధికారి నివ్వరబోయాడు. పరిస్టితి ఆయనకు అవగతమయింది. “వెళ్ళండి” మిలటరీ అధికారి ప్రకాశం గారికి ముందుకు వెళ్ళడానికి అనుమతి నిచ్చాడు. గురి చేసిన తుపాకులు దిగిపోయినాయి. ముందుకు వెళ్ళాడు (ప్రకాశం. యువకుడైన పార్థసారథి మృతుడై పడి ఉన్న చోటకి వెళ్ళాడు. (శ్రద్దాంజలి ఘటించాడు. ఈ సంఘటన ఆంధధ్రదేశాన్నంతటినీ ఉర్రూతలూగించింది. 'ఎవ్వాడు ఎదురొడ్డి ఎద చూపి నిలుచుండి హూణులదరునట్టు హూంకరించె ఎవ్వాడు తన తల్లి కెదురైన ఇక్కట్లు బాపుటే (వ్రతముగా (బ్రతుకు గడిపె ఎవ్వాని నిస్వార్థమే త్యాగమే దాన గుణములు (ప్రజలచే వినుతినందె ఎవ్వాడు సమభావమేతీరు ప్రకటించి హరిజనోద్ధరణ మాచరించె అట్టి దేశసేవా పరాయణుడు ఘనుడు సర్వజనకోటి వినుతుడు సచ్చరితుడు మానవత్వ సమత్వ విధానకర్త ఆంధ్రకేసరి భారతీ యాస్తడతడు"”
మన ప్రకాశం 119 అంటూ దేశభక్తులందరూ (ప్రకాశం ధైర్యాన్ని వేనోళ్ళ కొనియాడారు. మదరాసు నగరంలో ఆంధ్రుల కీర్తి పతాకం ఎగురవేసిన ధీశాలి ప్రకాశం గారికి ప్రజలు (బ్రహ్మరథం పట్టారు. దేశప్రజలు జీజీలు పలికారు. ఆం(ధ్రుల అభిమాన పత్రిక అయిన కృష్ణా పత్రికలో ముట్నూరి కృష్ణారావుగారి సంపాదకీయం వెలువడింది. సైమన్ కమీషన్ రాకకు నిరసనగా సైనికులు త్రుపాకులకు ఉమ్మెదురొడ్డిన ప్రకాశం గారిని ఆంధ్రకేసరి అని ఆ సంపాదకీయంలో ముట్నూరి కృష్ణారావు గారు ప్రశంసించారు. 'ఆంధ్రకేసరి' యని ప్రకాశం గారికి బిరుదు ప్రదానం చేసిన ఘనత ముట్నూరి కృష్ణారావుగారికీ, వారి ఆధ్వర్యంలో వెలువడే కృష్ణా పత్రికకూ దక్కింది. జ జ ల ఈటీ దక్షిణాదిన ఉప్ప సత్యాగ్రహం - ప్రకాశం నాయకత్వం
గాందీజీ పిలుపుకు భారతదేశమంతా స్పందించింది. దక్షిణాదిన ఉప్పు సత్యాగ్రహోద్యమాన్ని జయప్రదం చేసే బాధ్యత టంగుటూరు (ప్రకాశం స్వీకరించాడు.
భారతదేశమంతటిలోను నడచిన ఉప్పుసత్యాగ్రహ ఉద్యమ చరిత్ర ప్రపంచ చరి(త్రకే తలమానికమయింది! ఈ ఉద్యమ యజ్ఞంలో భారతదేశంలోని అన్ని (ప్రాంతాలవారు పాల్గొని సమిధలైనారు.
దక్షిణాదిన ఈ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం ఉజకలు వేసింది. ఈ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందున్న పరిస్థితులు మాత్రం అంతగా అనుకూలంగా లేవు. దక్షిణాదిన మదరాసు వాతావరణ పరిస్థితులు ఉద్యమానికి అనుకూలంగా లేవని తోచినట్టున్నది. ఆ పురవాసులు చాలామంది అదే అభిప్రాయంతో ఉన్నారు. మదరాసు మ్ దురు సత్యాగ్రహం పట్ల వ్యతిరేకంగా ఉన్నాడు. పరిస్టితులలా ఉన్నా ప్రకాశానికి మాత్రం ఉద్యమానికి మంచి ప్రోత్సాహం లభిస్తుందని, అది విజయవంతం అవుతుందని, ఎందుకో నమ్మకం కలిగింది. ఆ తర్వాత జరిగిన విశేషాలు ఇది నిజమని నిరూపించాయి. ప్రకాశం అధ్వర్యంలో నడచే స్వరాజ్య పత్రిక కాంగ్రెసు విధానాలను ప్రచారం చేసింది.
మన ప్రకాశం 120 మదరాసు ప్రజానీకాన్ని, వారి హృదయాన్ని ప్రకాశం కేవలం ఒక రాజకీయ వేత్తగా మాత్రమే (గ్రహించలేదు. పంతొమ్మిది వందల ఏడు నుండి న్యాయవాదిగా అక్కడ ఉండటం మూలంగా కూడా (ప్రకాశానికి దక్షిణ భారత నాయక అ(గ్రగణ్యుల శక్తి సామర్థ్యాలు తెలుసు. సత్యాగ్రహ కార్యకలాపాలలో శిక్షణ నివ్వటానికి ఒక శిబిరం నిర్వహించాలని నిశ్చయించు కున్నాడు. ఒక సువిశాలమైన భవనం కోసం మదరాసులోని 'పేటలన్నీ గాలించాడు. అది ప్రభుత్వ వ్యతిరేక చర్య గనుక ఈ శిబిర నిర్వహణకు అవసరమైన భవనాన్ని ఇవ్వటానికి చాలామంది భయపడ్డారు. అయితే ఈ భవనాన్వేషణలో కూడా ప్రకాశం విజయం సాధించాడు. మైలాపూర్‌లో ఉన్న 'ఉదయవనం బిల్డింగ్స్” అనే ఒక విశాల భవనం ఖాళీగా ఉన్న సంగతి తెలుసుకొని, ఆ భవన యజమానికి కలుసుకోవడానికి ప్రకాశం బయల్లేరాడు. ఇంటాయనకి ఏవేవో భయాలు, సంకోచాలూ ఉన్నా, నెలకి రెండువందల అద్దె యిస్తానని అనటంతో కొంచెం మెత్తబడ్డాడు. బ్రాతమూలకమైన ఆ(గ్రిమెంట్టయిన తర్వాత ఆ బిల్లింగ్‌ను స్వాధీనం చేసుకుగ్నాడు (ప్రకాశం. అది బాగా విశాలమైన భవంతి కాకపోయినా, దానికి మూడంతస్తులున్నాయి. ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీజాగా వాలంటీర్లకి ట్రయినింగ్ ఇవ్వటానికి సరిపోతుంది.
వాలంటీర్లకోసం ఒక విజ్ఞప్తి చేశాడు (ప్రకాశం. శ్రీమతి దుర్గాబాయి ఆధీనంలో ఒక సంస్థ నడపదలిచాడు. పట్నంలో పబ్లిక్ మీటింగ్ పెట్టే లోపల, జిల్లాల వారీగా జరుగుతున్న ఏర్పాట్టు చూడటానికి బయల్దేరాడు.
ఆంధ్రరాష్ట్రంలో ప్రతిజిల్లాలోనూ లీడర్లకూ, వర్కర్లకూ ఎప్పుడూ లోటు లేదు. సహకార నిరాకరణ ఉద్యమం ఆరంభించిన నాటినుండి ఆంధ్ర రాష్ట్రంలో నాయకులకి ఎప్పుడూ కొరత రాలేదు. అప్పటికప్పుడే గడిచిన, ఏడు సంవత్సరాలుగా (ప్రకాశం దూకమంటే వారంతా నీళ్ళలోకయినా, నిప్పులోకయినా సరే దూకటానికి సిద్దమయ్యే ఉన్నారు. కాం(గైన్ కమిటీలుగాని, కాం(గ్రైసు వర్కర్లు గాని సవ్యంగా పనిచేస్తున్నారా లేదా ఆన్న విచారం ప్రకాశానికెపుడూ లేదు.
మన ప్రకాశం 121
తగిన సమయంలేని కారణంగా, జిల్బాలకు ఉరకల మీద వెళ్తూ, (ప్రజలలోని ఉత్సాహాన్ని: వారికి ఉన్న పట్టుదలనీ (గ్రహించగలిగాడు ప్రకాశం. నిమిషాల మీద అన్ని జిల్లాలవారు, పథకాలు వేసుకొని, ఈ ఉప్పు సత్యాగ్రహానికి సన్నద్దులవటం (ప్రకాశం గమనించాడు.
అనాటి ఉప్పు సత్యాగ్రహ సమర సంరంభంలో బందరుకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానముంది. అనాడు వాలంటీర్లు తయారు చేసిన చిన్న చిన్న ఉప్పు పొట్లాలు బహిరంగ సభలలో అమ్మడం జరిగింది. (ప్రకాశం కొంతమంది మిత్రులతో కలసి కారులో ఉప్పు తయారు చేసే ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ స్వభావసిద్ధంగా తయారవుతున్న ఉప్పు గల్లులను భారీ ఎత్తున పోగు చేశాడు. ఆనాడు ఆయనతో ఉన్న వాళ్ళల్లో ప్రముఖ పత్రికా సంపాదకుడు భాసా సుబ్బారావు కూడా ఉన్నాడు. ఆయన అప్పుడు “బాంబే క్రానికల్ పత్రికలో పనిచేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ప్రకాశం బందరు నుండి తెచ్చిన ఉప్పును ఊళ్ళో కొందరికి పంచి పెట్టాడు.
అక్కడ్నించి గుంటూరు వెళ్ళాడు. అక్కడి మిత్రులతో ఆయన బందరులో చేసిన ఉప్పు సత్యాగ్రహ విశేషాలను వివరించి చెప్పాడు. దేవరంపాడు (గ్రామంలో ఉప్పు పండించమని వారిని ప్రభోధించాడు. దేవరంపాడులో తనకున్న భూమిని వాలంటీర్జు క్యాంపు నిర్వహించుకోవటానికి ఇచ్చాడు. అక్కడికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న కనపర్తి (గ్రామంలో ఉన్న ప్రభుత్వ గిడ్డంగిలపై దాడి చేయమని సలహా ఇచ్చాడు. అక్కడ ఉప్పు సత్యాగ్రహం ఉధృతంగా జరటానికి మూల విరాట్టయ్యాడు. ఉప్పుసత్యాగ్రహ ఉద్యమంలో ఉదయవనం శిబిరాన్ని ప్రముఖంగా చెప్పుకోవలసి ఉంటుంది. ఉదయపనంలో మంచి ఉపన్యాసం ఇచ్చి ప్రజలను చైతన్యవంతులుగా చేశాడు. ఈ ప్రధమ బహిరంగ సభలో చేసిన విన్నపాలే (ప్రజల్ని అత్యంత చైతన్యవంతుల్ని చేశాయి. ఈ విన్నపాలు వారి హృదయాలలో సుస్థిరంగా నాటుకున్నాయి.
మన ప్రకాశం 122 ఈ క్యాంపులో ఆయన ప్రజలనుండి ఉధృతమైన సహకారాన్ని పొందాడు. (ప్రకాశం ప్రజలలో చాలా చైతన్యం కలిగించాడనీ, ఆయన నాయకత్వం క్రింద మొదటి జట్టు పని చేయబోతున్నదన్న వార్త పత్రికల్లో వచ్చింది. ఇది విన్న నాగేశ్చరరావు పంతులుగారు తాను కూడా మొదటి జట్టులోనే సత్యాగ్రహం చేస్తానని వచ్చి చేరాడు. ఈ సత్యాగ్రహంలో పాల్లొనే కార్యకర్తలు ప్రకాశం పంతులు నాగేళ్ళరరావు పంతులుగార్ల ఆధ్వర్యంలో రోజూ పురవీథుల గుండా ఊరేగుతూ ఉండేవారు. ఆనాటి వారి కార్యకలాపాలు అందరినీ ఆకర్షించేవి. వారు వీధులలో నడిచే (క్రమం (క్రమశిక్షణతో కూడిన సైనికులు చేసే కవాతు వలె ఉండేది. వాళ్ళు మార్చింగ్ సాంగ్స్ పాడుతూ ఉండేవారు. ఆ పాటలలోని సాహిత్యం ప్రజలను వైతన్యవంతులుగా చేసేలాగా ఉండేది. వాటి ద్వారా (ప్రభుత్వాన్ని సవాలు చేసేవారు. “ఉప్పు చట్టానికి కూడా ఎదురు నిలిచాం. కాబట్టి మీరు చేయగలిగింది ఏమన్నా ఉంటే చేసుకోండి” హెచ్చరికను ఆ పాటలు చేస్తుండేవి. ఈ ఉప్పు సత్యాగ్రహ కార్యక్రమం చాలా మందిని చైతన్యవంతులుగా చేసింది. ఆ తర్వాత ట్రిప్లికేన్ బీచ్‌లోను ఇతర చోట్ట కూడా సభలు జరిగాయి. ఈ ఉద్యమంలో (స్రీలు కూడా ప్రముఖపాత్ర వహించారు. వారిలో దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ను ప్రముఖంగా పేర్కొనవలసి వుంటుంది. తాను ఉద్యమంలో పాల్గొని అరెస్టు కావటానికి ఐచ్చికంగా ముందుకు వచ్చింది. ఆనాడు మదరాసులో జరిగే ఉప్పు సత్యాగ్రహ సంబంధమైన సభను చెదరగొట్ట టానికి అనాటి (బ్రిటీష్ ప్రభుత్వం చేసిన (ప్రయత్నం మనకు చాలా విచారం కలిగిస్తుంది. ఆనాడు (ప్రకాశం. ఉపన్యాసమిస్తున్నాడు. అదే మదరాసులో జరిగిన రెండవ మహాసభ. ఆయన చెప్పింది ప్రజలు జా(గ్రత్తగా వింటున్నారు. హఠాత్తుగా కొంతమంది గుర్రపు రౌతులు అక్కడికి వచ్చి బోరుగా స్వారీ చేసుకుంటూ వెళుతున్నారు. ఆ గుజ్ఞాలు జనం మీదగా వెళ్ళినపుడు ప్రజలు భయభ్రాంతులై చెల్లాచెదురయ్యారు.
మన ప్రకాశం 123
ప్రకాశం దృష్టి ఆ రౌతుల వైపు మళ్ళింది. ఆ గుజ్జపు దాట్ల మధ్య (ప్రజలు ఇరుక్కుని గాయపడ్డారు. అలాంటి వ్యక్తిని ఒకరిని ఉపన్యాసవేదిక వద్దకు మోసుకుని వచ్చారు. ఆ సమయంలో ప్రకాశం తనదైన పద్దతిలో ప్రజలను పరుగులెత్తవద్దని కోరాడు. ప్రజలు నిశ్చలంగాను, శాంతియుతంగాను కూర్చుంటే మీ దగ్గరకు రావటానికి ఆ అశ్విక దళాలవారికి దమ్ములుండవని చెప్పారు. ఆ తర్వాత ఆ ఆశ్వికులను హెచ్చరించాడు. నిజంగా మీకు అలజడి కలిగించి అల్లరి చేసి సభను చెదరగొట్టాలని వుంటే నిశితంగా కూర్చొని ఉన్న ఆ ప్రజానీకం మధ్యనుంచి కాక తిన్నగా "మా అందరిపైనుంచీ పోనీయండి” అని పలికాడు. అది వింటూనే వాళ్ళంతా ఇంకే విధమైన అల్లరి చేయకుండా రోడ్డు మీదకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సభ ప్రశాంతంగాను, విజయవంతంగాను నడిచిందని వేరే చెప్పనవసరం లేదు కదా! ఆ సంఘటన (ప్రభుత్వ నిరంకుశ కిరాతక, పాశవిక చర్యలకు ఉదాహరణ అయింది,
ఉప్పుసత్యా'గ్రహం కార్యక్రమంలో భాగంగా ఉపన్యసిస్తూ ఉన్నప్పుడు తన రెండవ కుమారుడు మరణించాడనే మరణవార్త ఎవరో మోసుకొచ్చారు. అ వార్త తెలిసిన (ప్రకాశం తన కుమారుడు చనిపోతే ఆ సమరంలో మున్ముందుగా ప్రాణాలు కోల్పోయింది వాడే అవుతాడని చెప్పి మామూలుగానే ఆ సభను నడిపాడు.
ఈ నంఘుటన ఆయన యొక్క కార్యదక్షతను, మానసిక స్టైర్యాన్ని తెలియచేస్తుంది. ఉప్పు సత్యాగ్రహం అంటే...
శాసనోల్లంఘనలో భాగంగా మహాత్మాగాంధీజీ ఉప్పు సత్యా'గ్రహాన్ని తలపెట్టారు. ఇది చదువుతున్నప్పుడు “గాంధీజీ ఉప్పు శాసనాన్నే ఉల్లంఘించాలని ఎందుకనుకొన్నాడు?" అనే అనుమానం వస్తుంది. "ఉప్పు బీదలందరికీ సంబంధించిన సమస్య కనుక!”
మన ప్రకాశం 124 ఈ సమస్యతో ప్రజలందరి దృష్టినీ ఆకర్షించవచ్చు అనుకొన్నాడు గాంధీజీ. బ్రిటన్‌లో తయారైన ఉప్పు అధిక ధర వెచ్చించి కొని భారతీయులు వాడు
కొనవలసి ఉన్నది. అప్పటి పరిస్టితి అదే! ఐతే గంజిలోకి ఉప్పు కూడా కొనలేని ప్రజలు
ఈ దేశంలో లక్షలాది మంది ఉన్నారు. వారందరికీ ఈ బ్రిటీష్ ఉప్పు కొనుక్కోవడం
సమస్యే మరి! మనదేశంలో సము(ద్రతీరం చాలా ఉంది. సముద్రపు ఆటుపోటులకు తీర
(ప్రాంతంలోని పల్లపు ప్రదేశాలలోను, గుంటలలోను సముద్రజలం చేరుతుంది. ఎండకు
ఆ నీరు ఉప్పుగా మారుతుంది. కాని ఈ ఉప్పును (ప్రభుత్వమే తీసుకొని ప్రజలకు
అమ్ముతోంది. ప్రకృతి పరంగా లభించిన ఈ ఉప్పును ప్రజలు తీసుకొనడానికి వీలులేదు.
భారతదేశంలో ఉప్పు తయారు చేయడానికి విస్తారమైన అవకాశాలున్నాయి. ఐనా బ్రిటీష్ వర్తకులు ఇంగ్లాండ్ నుండి ఉప్పును మన దేశానికి ఓడలలో తెచ్చేవారు. ఈ సందర్భంలో మన దేశానికి ఇంగ్లీషు వారి ఉప్పును ఎలా దిగుమతి అవుతున్నదో తెలుసుకోవడం కూడా అవసరమే. బ్రిటీష్ వారు ఉప్పు విషయాలను గూర్చి ఆలోచించడానికి ఒక కమీషన్ వేశారు. దానిపేరు సాల్టు కమీషన్. అది సమావేశమై భారతదేశంలో తయారయే ఉప్పు మీద పన్ను విధించాలని తీర్మానించింది. ఇలా పన్ను విధిస్తే ఇంగ్లాండ్ నుండి వచ్చే ఉప్పును భారతదేశంలో అమ్మడం సులువు ఆపుతుంది. “అసలు ఇంగ్లండ్ నుండి ఉప్పు ఎందుకు వస్తుందట!” తెలుసుకుందాం. పెద్ద పెద్ద సముద్రాలలో ప్రయాణం చేసే ఓడలు బరువు లేకుండా రావడం క్షేమం కాదు. అందుకని ఖాళీ ఓడలలో ఏదో ఒకటి బరువు కోసం వేసుకుని రావాలి.
మగ ప్రకాశం న! అందుకని ఖాళీ ఓడలలో ఉప్పు వేసుకొని వస్తూ ఉండేవి. ఓథలలో వేసే సరుకులలో మన దేశం నుండి ఎగుమతి అయ్యేవి ఎక్కువ. అందుకని ఓడలు ఎగుమతి సరుకులలో నిండుగా వెళ్ళేవి. నౌకా వ్యాపారం సాగించే ఓడలలో ఎక్కువ భాగం బ్రిటీష్ వారివే. ఆందువలన తమ పడవలు ఖాళీగా రాకుండా ఇంగ్లాండులోని షిపైర్లో తయారైన ఉప్పును ఈ పడవలలో వేసేవారు. ఈ ఉప్పును భారతీయులకు అంటకట్టేవారు. ఈ విధంగా ఇంగ్లీషు వాళ్ళ ఉప్పు భారతీయులకు ముప్పుగా తయారయింది. భారతీయులు తమ హక్కుకు సంబంధించిన విషయంగా దీనిని భావించారు. అందుకని గాంధీజీ ఈ సమస్యను గురించి సత్యాగ్రహం (ప్రారంభించాడు.
'దండి'లో ఈ ఉప్పును తయారుచేసి సత్యా(గ్రహాన్ని ప్రారంభించాలని నిర్ణయించాడు గాంధీజీ. ఈ 'దండి' అరేబియా సముద్రతీరంలోనిది. సూరత్ జిల్లాకు చెందిన (గ్రామం. సబర్మతీ ఆశ్రమానికి దండికీ మధ్య రెండు వందల మైళ్ళదూరం ఉంది. ఈ విషయం వినగానే ఇంగ్లీషు వారి తాబేదార్లయిన ఆఫీసర్లు రకరకాలుగా అపహాస్యం చేశారు,
“ఉప్పు సత్యాగ్రహమా? ఇది మరొక స్టంట్ చేయనీయండి చూద్దాం!” అన్నాడు ఒక ప్రభుత్యోద్యోగి.
“దండిలోని చిత్తడి నేలకు వెళ్ళి ఓ గుప్పెడు ఉప్పు తయారు చేయడం వలన ఈ ముసలాడికి ఒరిగేదేమిటి?” అన్నాడు మరొకడు.
డెబ్బె ఎనిమిది మంది సత్యాాగ్రహులు గాంధీజీ నాయకత్వంలో సబర్మతి ఆశ్రమం నుండి దండికి బయలుదేరారు.
“దండి యాత్ర లంకకు రామచంద్రుని యాత్ర వంటి చారిత్రాత్మక యాత్ర”
చున ప్రకాశం 126 అని రామాయణ గాథను జ్ఞప్తికి తెచ్చుకొన్నారు నాటి ప్రజలు, "మోసెస్ నాయకత్వాన ఇజ్రాయిలు జరిపిన యాత్ర” అని ్రపుల్ల చంద్రరాయ్ అనే ప్రముఖుడు బైబులు కథను గుర్తుకు తెచ్చాడు.
“ఉప్పు పన్నుపై ఇది యుద్ధం” అని స్వయంగా అన్నాడు గాంధీజీ.
గాంధీ ప్రకటనకు భారతదేశం స్పందించింది.
సత్యాగ్రహ శంఖారావం
ఎవరీమనుకొన్నా దృఢమైన అభిప్రాయం గల గాంధీజీ కార్యోన్ముఖుడయ్యాడు.
గాంధీగారు దండికి వెళ్ళే మార్గంలో ఉన్నారు. ఆయన ఆశ్రమ వాసులతో స్త్రీ పురుషులతో కలిసి సత్యాగ్రహ సమరం ఆరంభించడానికి 'సబర్మతీ' ఆశ్రమం నుండి 'దండి' ప్రాంతానికి కాలినడకను వెళ్ళుతున్నారన్నమాట! 'సబర్మతీ" ఆశ్రమం నుండి, “దండి'కి చేరాలంటే ఇరవై ఒక్క రోజులు (ప్రయాణం చేయవలసి ఉంటుంది. అక్కడికి చేరి అక్కడి సము(ద్రపు ఒడ్డున ఉప్పు గల్టులు ఏరుకోవాలి!
ఆ సమయంలో మరికొన్ని విచిత్రమైన విమర్శలు వచ్చేవి. అనాటి విశేషాలు వార్తాపత్రికల ద్వారా తెలుస్తూ ఉండేవి, అంతేకాదు. కొంతమంది పత్రికలలో అచ్చుపడిన వార్తలతో పాటు రకరకాల విమర్శలూ, చిత్రవిచిత్రమైన అభిప్రాయాలు కూడా వెల్లడించేవారు. ఇలాంటి పత్రికలలో కొన్ని ఆంగ్రేయులచేత, మరికొన్ని ఆంగ్లో ఇండియన్ల చేత నిర్వహింపబడేవి. వాటిలో ఉప్పు సత్యా'గ్రహోద్యమాన్ని వేళాకోళం చేసేవారు.
“భారతదేశంలాంటి ఒక పెద్ద దేశం స్వాతంత్ర్యం సంపాదించుకోవడానికి ఆ దేశపు ప్రజలు సము(ద్రపు ఒడ్డును ఉప్పుగల్టులు ఏరుతారట!” ఆంటూ ఎగతాళి చేశారు కొందరు. గాంధీగారనే చిట్టెలుక తనకున్న ఆ కొద్దిపాటి మీసాలతో తోక ఆడించుకుంటూ, ఉప్పు
మన ప్రకాశం 127 గల్టులు ఏరడానికి, తద్వారా దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికి (ప్రయత్నిస్తున్నది” ఈ భావంతో వేళాకోళం చేస్తూ కొన్ని పత్రికలలో కార్టూను వచ్చేవి. జెయిలు అనుభవాలు (ప్రకాశం పంతులు త్యాగానికీ, కృషికీ పేరెన్నిక కన్నారు. ఏదైనా చేయవలసి వస్తే ముందుగా తానే చేసి, ప్రజలకు ఆదర్భవంతులుగా నుండేవారు. స్వాతంత్రోద్యమం (ప్రారంభమయిన నాటినుంచి ఆయన సత్యాగ్రహ శిబిరాలలో పాల్గొంటూనే ఉన్నారు. దానికి ప్రతిఫలంగా అనేకసార్హు, అనేకమైన జైళ్ళకు వెళ్లి, శిక్షను అనుభవించవలసి వచ్చింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం పదిహేను రోజులపొటు విధీ విరామం లేకుండా కాలినడకన మదరాసు నగర వీధులన్నింటినీ చుట్టి రావలసి వచ్చేది. ఆ సత్యాగ్రహ సందర్భంలో ఉప్పు తయారుచేసే ప్రతివాడూ, ఆ సముద్రతీరానికి చేరుకోవడానికి ఎన్నో మైళ్ళు నడవవలసి ఉండేది. అడయారు, మైలాపూరులోని ఇనస్పెక్టర్ జనరల్ ఆఫీసు ఎదుటనున్న ఇసుక ప్రదేశంలో, తిరువళిక్కేళి బీచ్‌లోను, హైకోర్టు బీచ్‌లోను, రాయపురంలోను - అలా రోజూ ఒక కొత్త చోటుకు చేరి సత్యాగ్రహోద్యమంగూర్చి ఉపన్యసించేవాడు, ముఖ్యంగా పందొమ్మిది వందల ముస్నై-ముస్పైఒకటి కాలంలో ప్రకాశం గారిని పలు తావులలోని బైళ్ళకు మార్చారు, ఆనాటి జెయిళ్ళ పరిస్థితి, ఖైదీల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండేది. రాజకీయ ఖైదీలను (ప్రత్యేకంగా చూచే పరిస్థితి ఆనాడు లేదు. ఆహారం విషయం గమనిస్తే రాజకీయ ఖైదీగా ఉన్న ప్రకాశం పంతులుగారి కిచ్చే ఆహారానికి, మామూలు 'సె'క్సాసు ఖైదీకి ఇచ్చే ఆహారానికి వ్యత్యాసం లేదు. మామూలు సి” క్లాసు నేరస్టులకిచ్చే ఆహారమే. అదే వంటశాలలో తయారుచేసి రాజకీయ ఖైదీలకు కూడా వడ్డన చేయించేవారు.
మన ప్రకాశం 125 మొదటిసారి (ప్రకాశంగాలిని అరెస్ట్ చేసేనపుడు మదరాసు పెనిటెంషరీలో నర్భందించారు. అప్పుడు ఆయన ఆరోగ్యం బాగుండలేదు. ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ వ్యత్యాసం లేకుండా దేశమంతటా తిరుగుతూ ఉద్యమాలలో పనిచేస్తూ ఆయన తన ఆరోగ్యాన్ని గురించి పట్టించుకొనక పోవడం మూలంగా ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. శరీరానికి జైలులో కాస్త విశ్రాంతి లభించేసరికి లోపల ఉన్న వేడి పైకి వచ్చి కురుపులు, సెగ్గడ్డలు వచ్చాయి. శరీరం మీద ఆంటే కాళ్ళు చేతులూ మీద మాత్రమే కాక తలమీద కూడా లేచాయి. మశూచి వస్తే ఎంత బాధ కలుగుతుందో ఆ కురుపుల వలన ఆయనకు అంత బాధ కలిగింది. ఇదివరకు ఆయన ముస్పైెలయిదు సంవత్సరాలుగా తొట్టి స్నానపు వైద్య పద్రతిని అనుసరిస్తూ ఉండేవారు. ఆ పద్ధతి కురుపులు తగ్గడానికి కూడా ఉపకరించి ఉండేది. కాని ఆ పద్ధతిని అనుసరించడానికి, అనారోగ్యం వలన కలిగిన ఆ బాధ నుండి ఉపశమనం పొందడానికీ అక్కడ ఆయనకు అవకాశం లభించలేదు. అప్పుడు ఆ జెయిలుకు అధికారిగా 'మిస్టర్ హో' అనే ఆంగ దేశస్థుడు ఉండేవాడు. ఆయనను గురించి ప్రత్యేకంగా చెప్పవలసి ఉంది. ఎందుకంటే యయన 'సమదర్శి'. ఖైదీలను అమానుషంగా చూడడమూ, వారిని రకరకాల బాధలకు లోను చేయడమూ ఆయనకు సరదా. ఒకరోజు ఆయన (ప్రకాశం తన గదిలో అడ్డదిడ్డంగా పడుకొని ఇన్నప్పుడు గదికి వచ్చి ఆయన మంచం పక్క నిలబడి ఉన్నాడు. తాను వస్తున్నట్టు సూచననైనా చేయకుండా మిస్టర్ 'హో' ఆలా రావడం ప్రకాశానికి నచ్చలేదు. పైపెచ్చు కోపం కూడా వచ్చింది. (ప్రకాశం లేచి ఆ అధికారికి గుడ్మాణింగ్ చెప్పలేదు. సలాము చేయలేదు. దీనితో ఆ అధికారి అహం దెబ్బతిన్నది. "పెద్దగా అరవడానికి అది సరిల్లైన స్థలం కాదని అనుకొన్నాడేమో చాలా మెల్లిగా అన్నాడు. ఇక్కడ కొన్ని నిమిషాలనుండీ నెను ఉన్నాను. నీవు చూడలేదా”.
మన ప్రకాశం 12౪ ఆయన మెల్లిగానే అన్నా ఆ మాటలలో అధికార దర్చం గోచరిస్తూనే ఉంది. (ప్రకాశం భయపడలేదు సరికదా చిరునవ్వుతో ఆయనను చూస్తున్నాడు. నేను జెయిలు సూపరింటెండెంట్ నన్న సంగతి తెలియదా! కనీసం లేచి మర్యాద చూపించాలన్న జ్ఞానమైనా లేదా? ఆ అధికార దర్శంతో కూడిన ఆ కంఠం మళ్ళీ హుంకరించింది. చిరునవ్వు చిందించాడు ప్రకాశం! "మీరు జైలు సూపరింటెండెంట్ కదా! జైల్ సూపరింటెండెంట్ అన్నవాడికి అధికారం, హోదాతో పాటు ఖైదీల పట్ల, అందులోను రోగంతో తీసుకొంటున్న వారి పట్ట బాధ్యత అనేది కూడా ఉండాలి కదా! మరి ఆ జైలు అధికారి మిస్టర్ హో గారికి తన బాధ్యతలను గుర్తుకు చేశాడు ప్రకాశం. ఆ పలుకులు ములుకులులాగా తగిలాయి 'మిస్టర్ హో'కు. అంతగా తన బాధ్యతను గుర్తు చేసిన (ప్రకాశాన్ని మరేమీ అనలేక, అక్కడే నిలబడ్డాడు. అందుకే మాట్టాడకుండా ఉన్న మిస్టర్ హోతో ప్రకాశమే మళ్ళి అన్నాడు. “మీరు ఎంత సూపరింటెండెంట్ అయినా, రోగంతో తీసుకుంటున్న ఒక ఖైదీ గదిలోనికి, ఒంటిమీద సరిగా బట్ట అయినా లేని స్థితిలో ఏ విధమైన హెచ్చరికా లేకుండా చొచ్చుకొని రావడం మర్యాద కాదు. “మళ్ళీ రాదలచుకుంటే మీరు వస్తున్నట్టు ముందు సూచించి దయచేయండి.” తన మనసులోని భావాన్ని నిర్భయంగా స్పష్టంగా చెప్పాడు ప్రకాశం, ఆయన ఏమనుకొన్నాడో ఏమో కాని, కాస్త తమాయించుకున్నాడు. శ్రమాపణ చెప్పుకొని మెల్లిగా గదినుండి బయటకు నడిచాడు మిస్టర్ 'హో, (ప్రకాశం వ్యక్తిత్వం చాలా దృఢమైంది. ఆయనకే అక్కడ ఏమీ లేకపోతే సాధారణ
మన ప్రకాశం 130 ఖైదీ సంగతి ఇంకా ఘోరంగా ఉంటుంది కదా.
ఆ తరువాత కొన్ని రోజులకు ప్రకాశం సంకల్పబలం వల్లనే స్వస్తత చేకూరింది.
ఆరోగ్యం బాగయింది కనుక ఆయనను ఆస్పత్రి నుండి జెయిలు లోనికి మార్చారు.
ఆ గది ఒక మూలగా ఉంది. దుమ్ముధూళితో నిండి ఉంది. ఆ గదికి స్నానాల గది వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు.
ఇక్కడ ఇచ్చే ఆహారం కూడా బాగుండేది కాదు. పోనీ, వారికి కావలసిన ఆహారం బయట కొనుక్కొని తెచ్చుకోడానికి కూడా ఆవకాశం లభించలేదు. వాళ్ళను సాయంత్రం ఆరు గంటలకు లాకప్పులో పెట్టి ఉదయం ఆరుగంటలకు బయటకు రానిచ్చేవారు.
అలా గుహవంటి ఆ గదిలో మూడు వారాలున్నాడు.
ఆ తరువాత (ప్రకాశం వారిని తిరుచునాపల్లి జెయిలుకు మార్చారు.
ఆది సత్యాగ్రహ సమర శంఖారావం భారతదేశమంతటా ప్రతిద్వనిస్తున్న కాలం.
ప్రకాశం తిరుచునాపల్లి జైలుకు వెళ్ళే సరికి అక్కడ పలువురు సత్యా(గ్రహులు ఖైదీలుగా నున్నారు. వీరిలో చెన్నపట్టణానికి చెందిన వారు మాత్రమే కాక భారతదేశంలోని అనేక (ప్రాంతాల నుండి వచ్చిన సత్యాగ్రహులు ఉన్నారు.
అయిగర్హైండ్ దేశానికి చెందిన మిన్సర్ కాల్నిమ్ అక్కడి జెయిల్ సూపరింటెండెంట్‌గా ఉండేవాడు, ఈ తిరుచునాపల్లి జెయిలు పరిస్టితి మదరాసు జెయిలుకన్నా ఘోరంగా ఉంది.
అక్కడ వార్హన్హు మామూలు ఖైదీలను వారి ఇష్టం వచ్చినట్టు బాదేవారు. తప్పు ఉన్నా, లేకపోయినా ఖైదీలను బాదడం అనేది అక్కడి వార్డన్తకు ఆలవాటయి పోయింది.
మన ప్రకాశం 13] ఒకనాడు (ప్రకాశం ఇతర ఖైదీలతో కలసి ఒక వరుసలో నిలుచొని ఉన్నాడు.
(ప్రకాశం నిలుచున్న చోటుకు కొంచెం దూరంగా మామూలు ఖైదీ ఎవరో ఉన్నాడు." ఆ
కప
ఖైదీని తన తోలు బెల్టుతో ఒక వార్డను అదే పనిగాబాదుతూ ఉన్నాడు. పాపం ఆ ఖైదీ
నోరు మూసుకొని దెబ్బలకు ఓర్చుకుంటున్నాడు. బాధ తీవ్రమయినప్పుడు ఏడుస్తున్నాడు.
ఎంత సేపయినా, ఆ ఖైదీ ఎంత ఏడుస్తున్న ఆ వార్లను అతనిని బాదడం మానలేదు.
అది ప్రకాశం కంటబడింది. ఆ అమానుష దృశ్యం ప్రకాశం హృదయాన్ని కరిగించింది. వెంటనే అటుగా వచ్చాడు;
'ఆపు' అని కేక వేశాడు.
అంతే! ఆ వార్లను ఆ బెల్టు అక్కడ పారేసి పారిపోయాడు. అప్పుడు అక్కడ జైలు అధికారిగా కారనిష్ వచ్చి ప్రకాశాన్ని, ఇతరులను పిలిచి వార్డన్హు చేసిన దౌర్జన్యాన్ని గురించి అడిగి జరిగిన సంగతి వివరంగా తెలుసుకున్నాడు. ఆయనే స్వయంగా ఆ వ్యవహారాన్ని పరిష్కరించాడు.
ఆ తరువాత (ప్రకాశం వెల్టూరు జెయిలులో కొంతకాలం ఉండడం తటస్థించింది. అక్కడి మేజర్ ఖాన్ సూపరింటెండెంట్‌గా ఉండేనాడు. రూల్స్‌కు భిన్నంగాని పరిస్టితులన్నింటి లోను ఆయన సత్యా!గ్రహ ఖైదీల గోడు వినేవాడు. ప్రకాశంతో పాటు వెల్లూరు జెయిలులో దేశోద్దారక కాశీనాధుని నాగేశ్చరరావు పంతులుగారు, బులుసు సాంబమూర్తి. డాక్టరు భోగరాజు పట్టాభి సీతారామయ్య, చక్రవర్తుల రాజగోపాలాచారి అయ్యదేవర కాళేశ్వర రావు మొదలైన స్వాతంత్ర్య యోధులుండేవారు. వెల్లూరు జెయిలులో ఉండగానే ప్రకాశం 'ప్రపంచ ఆర్థిక విధానము([40౧6420/ 5౪8161) ౦1 (౧6 ౪౦గ6)”, “భారతీయ ఆర్థిక విధానము (1౧612౧ 40౧980 5౪518౧౫)” అనే (గ్రంధాలు ఆంగ్షభాషలో వ్రాశాడు.
ప్రకాశం ఎక్కడ ఉన్నా తేజోరూపమే. జెయిలులో నిర్బంధంలో ఉన్న కాలాన్ని
మన ప్రకాశం [32 కూడా సగ్వినియెగ: చేసుకున మంచి మనిషి ఆయన. ఆంధ్ర రాష్ట్ర సాధనలో ప్రకాశం కృషి ఆం్రి ర్యాష్ట్ర సాధన కోసం ప్రకాశం పంతులు గారు చేసిన కృషి ప్రశంసనీయం, స్వాతంత్రోధ్యమంలో నిమగ్నమయి ఉండి కూడా ఆంధ్రుల ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన కృషిచేశారు. తెలుగు వార్డు సర్షతోముఖంగా వృద్ది పందాలని ఆయన ఆళించారు. అందుకు తగిన కృషిచేశారు కూడా ఆనాటి పరిస్థితులను మనదేళానిక్షి స్వాతంత్ర్యం రాకముందు ఉమ్మడి మద్రాసు ర్యాష్టానికి 1946వ సంవత్సరం ఏట్రిలు 30వ తేదీన ముఖ్య మంత్రిగా పదవిచేపట్టారు. ఆతరువాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత 1953వ సంవత్సరం అక్టోబరు 1వ తేదీన ముఖ్యమంత్రెగా పవవీ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేస తొలిముఖ్యమంత్రిగా చరిత్రలో ఖ్యాతివహించారు. ఆంధ్రోధ్యమం నాటి రాజకీయ పరిస్థితులను స్టాలిపులాక న్యాయంగా చెప్పుకోవాలి, అది 1913వ సంవత్సరం. ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లాలో గల 'బాపట్లలో మొట్ట మొదటిసారిగా ఆం(్రమహాసభ జరిగింది. అంతకుముందు దేశస్వాతంత్ర్యమే తమకు ముఖ్యమని అనుకొన్న తెలుగు వారు మొట్టమొదటి సారిగా తమకు (ప్రత్యేక ర్యాష్టం కావాలని నాటి సభలో ఎలుగెత్తి పకటించారు, అప్పటి నుండే తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతూ ప్రతి సంవత్సరమూ ఆం(్రమహాసభలు జరుప్తు కొంటున్నారు. 1938 సంవత్సరం ఏప్రిల్‌లో ఉన్ముడిమ(ద్రాసు ర్యాష్ట శాసనసభలో దేశ భక్త కొండా వేంకటప్పయ్య ప్రత్యేకంగా ఒక తీర్మానాన్ని (ప్రతిపాదించాడు.
యన ప్రకాశం 133 మ(బ్రాసు రాజధానిగా (ప్రత్యేక ఆం(ధ్రర్మాష్ట్రం ఏర్పాటు చేయాలి అనేది ఈతీర్మాన సారాంశం.
ఆనాడు రెవెన్యూ మంత్రిగా నున్న (ప్రకాశం దానిని బలపరిచాడు. శాసనసభ దానిని ఏకగ్రీవంగా ఆమోదించింది. కాని (బ్రిటిష్ ప్రభుత్వం దీనిని అంగీకరించలేదు.
మద్రాసు కేంద్రంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే మద్రాసులో రక్తపుటేరులు పారుతాయని లండనుకు “బురందడమే బ్రిటిష్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించడానికి కారణం.
1941 డిసెంబరు 21న జరిగిన ఆంధ్రమహాసభ ప్రకాశం పట్ట సంపూర్ణ విశ్వాసం ప్రకటించింది. రాజ్యాంగ సభలో కూడా ప్రకాశం ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి కృషిచేశారు. కోని అది సఫలంకాలేదు.
ఆంధ్రర్యాష్టం ఏర్పాటు, మద్రాసు నగర భవిష్యత్తులను గురించి ప్రజలలో చైతన్యాన్ని కలిగించే ఆశయంతో పొట్టిశ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నారు. ఆయన గాంధేయవాది.
1952 అక్టోబరు 19వ తేదీన ఆయన మహర్షి బులుసు సాంబమూర్తి గారి నివాసంలో నిరాహారదీక్ష (ప్రారంభమయింది. ఈ ఆమరణ నిరాహార దీక్ష 58 రోజులు నడిచింది. ఈ తరువాత డిసెంబరు 15వ తేదీన “పొట్టిశ్రీరాములు గారి ఆత్మబలిదానంతో అది ముగిసింది.
శ్రీరాములు గారు అమరులయినారు, ఆనాడు ఆంధ్ర దేశమంతా తీవ్రమైన దు:ఃఖంలోముణిగిపోయింది.
మన ప్రకాశం 134
ఆనాటి నభీలో (వ్రకాళం వంతులు ఉఎన్యనీన్తూ ఆం(ధ్రజాతికి క్షర్తవ్యముపదేశించాడు. పొట్టిశ్రీరాములు గారి అడుగు జాడలలోనడిచి ఆంధ్రరాష్ట్ర సాధనకు కృషిచేయాలని ఉద్బోధించారు.
ప్రభుత్వవైఖరికి నిరసనగా శాసన సభ్యులు రాజీనామా చేశారు. ఇంతటి త్యాగపరంపర తరువాత వివాదంలేని ప్రాంతాలతో 1952 డిసెంబరు 19న ఆంధ్రరాష్ట్రం ఏర్పడన్నుదని భారత (ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ ప్రకటించారు.
1953 అక్టొబరు ఒకటవ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. (ప్రకాశం పంతులుగారు తొలి తెలుగు ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రజనోద్ధరణ
యావద్భారత దేశంలోను ఆఖండమైన కీర్తి ప్రతిష్టల నార్జించిన ఆం(ధ్ర యశోమూర్తి ప్రకాశం. గాంధీజీ నేతృత్వంలో భారత స్వాతంత్రోద్యమం తీవ్ర తరమైన రోజులలో ప్రకాశం ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించాడు. అసమాన థైర్య సాహసాలతో కూడిన ఆయన వ్యక్తిత్వం ఆంధ్ర ప్రజలకు తిరుగులేని నాయకత్వం నెజపడానికి కారణమయింది. లాలాలజపతిరాయ్, బాలగంగాధర తిలక్ వంటి 'ప్రసిద్దులతో సమానమైన కీర్తి ప్రకాశానికి దక్కుతుంది. ఇంగ్లీషు వారు భారతదేశ స్వాతంత్ర్యాన్ని వారించి ఈ దేశపు రూపురేఖలనే మార్చి వేశారు.
భారతదేశం నుండి ముడిసరుకును తరలించుకుపోయి ఇంగ్లాండులో ఈ దేశపు ధనంతోనే స్థాపించిన పరిశ్రమలో వాడుకొని ఉత్పత్తి చేసిన సరుకులను అధిక ధరలకు తిరిగి భారతదేశానికే అమ్మిన 'పరాన్న భుక్కులు" ఇంగ్లీషువారు.
మన ప్రకాశం 13వ
ఈ దేశపు పాలకులు ఇంగ్లీషు వారే కాబట్టి పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఇంగ్రీషువారు మాత్రమే నియమింపబడేవారు సైన్యములో సివిల్ ఉద్యోగాలలోనూ అ(గ్రశ్రేణి అధికారులంతా వారే. భారతీయ యువకులను నిర్బంధంగా సిపాయిలుగా చేర్చుకొనేవారు. ౯” ” “అన ఇంగ్లీషు వారు తమ స్వప్రయోజనాలకు చేసే యుద్దాలలో ఈ సైన్యం కూడా పాల్గ్న్నప్పుడు అధిక సంఖ్యలో భారతీయులే మంణించేవారు. పైగా ఇంగ్లండుకు పరాయి దేశాలతో వచ్చిన యుద్దాలకు ఖర్చులో చాల భాగం భారతీయులే భరించవలసి వచ్చింది. ఎడతెరిపిలేని తెల్లవారి ఆగడాలకు భారతీయులు పూర్తిగా విసుగు చెందారు.
పద్దెనిమిది వందల యాభ్జై ఏడవ సంవత్పరంలో రూన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్ తాంతియోతోపే వంటి వీరులెందరో తిరుగుబాటులను జరిపి, తెల్లవారిని. పారద్రోలే ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నం సఫలం కాలేదు. కానీ, ఆ తిరుగుబాటు భారతీయుల స్వాతం(త్ర్యాకాంక్షను 'ప్రదర్శింపచేసినట్టయిరది. ఆ తరువాత, ఈ స్వాతంత్ర్య భావన మరింత బలపడుతూ వచ్చింది.
తమకు ప్రజలనుండి రానున్న ముప్పును ప్రభుత్యం కూడా గుర్తించింది. దమన నీతితో కఠినంగా అణచివేయడానికి నిశ్చయించింది. భారతీయులు బానిసలుగా 'బ్రతుకవలసి వచ్చింది.
పెను చీకటిలో (మ్రగ్గుతున్న పరతం[త్ర భారతావనికి పందొమ్మిదవ శతాబ్దం ఆశల తొలి్రొద్దు పొడిచిన కాలం. ఈ శతాబ్దంలో, ఎందరో మహానుభావులు ఉదయించారు. అన్ని రంగాలలోనూ అగణిత ప్రతిభా పాటవాలను చూపదగిన మహనీయులు, ఈ దేశంలో పుట్టి, భారతీయులలో నవ జీవం నింపారు.
తెలుగునేల కూడా ఎందరో వరపుత్రులను ఈ శతాబ్దంలో కన్నది. నవయుగ వైతాళికులూ, క్రాంత దర్భులూ ఈ నేలపై ప్రభవించి తమ దేశ సేవతో వినుతికెక్కారు. పట్టాభి సీతారామయ్య, అల్లూరి అలా చెప్పుకుంటూ పోతే, ఎందరో ప్రసిద్దులు ఈ
మనవ్ర 136 తెలుగునాట పుట్టి భరతమాతకు సేవచేసిన వారున్నారు. ఈ వరుసలో అ(గ్రస్థానంలో నిలబడగలిగిన వారు (ప్రకాశం గారు. దేశంకోసం ఉన్నదంతా ఊడ్చి ఇచ్చివేసిన త్యాగమూ, ప్రజలకోసం ప్రాణమైనా సరే, అర్పించడానికి సిద్ధపడిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆంధ్ర కోసం ఆయన చేసిన సేవ బహు దా ది. ఒకవైపు సేచా వలి బ్వచ్చా భారతానికై జరిగే స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొంటూనే, మరో ప్రక్క తెలుగువారి సంపూర్ణ వికాసానిక్రై సర్వతోముఖాభివృద్దికై ఎనలేని కృషి సలిపినాడు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆయన ముఖ్యమంత్రి పదవిని నిర్వహించినారు. తెలుగువారి తాలిముఖ్యమంత్రి ప్రకాశమే. ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసికొనగలిగారు. (ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా, దానికోసం ఎన్ని అవరోధాలనైనా ఎదుర్కొని సాధించి తీరాలనే పట్టుదల ఆయనకుండేది. మదరాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాక పూర్వం రెవెన్యూ మంత్రిగా కూడా రెండేళ్ళపాటు పనిచేశారు. “జమిందారీ వ్యవస్థ రద్దు” రెవిన్యూ మంత్రిగా ఆయన తీసికొన్న నిరయాలలో న బై సర్ల ముఖ్యమయినది. ఆనాడు, రాష్టంలో జమిందారీలు చాలా ఉండేవి. వ్యవసాయ భూములపై [ఒల్నీ ు లో ణ్శి 6 శిస్తు వసూళ్ళు చే ల హక్కు ఈ జమిందారులకుండేది. పైగా ఆ శిస్తుకు ఒక క్రమ పద్దతి అంటూ ఏదీలేద్సు ఎండనక, వాననక చెమటోడ్చి పండించే పంటలను అనుభవించేది ఈ జమింద్రార్రుత్ర. ఒకవేళ, ప్రకృతి అనుకూలించక పంటలు పండకప్పునా రైతులు శిస్తును చెల్లించవలసినదే. ప సూళి త్రప 4 = స్ న కి వసూళ్ళే తప్పు, పండించే రైతుల సమస్యలు వాళ్ళకు పట్టేవే కొ, ల ఫి . ట్ కొకడిది” అన్నట్టు, రైతు పాలంలో కష్టపడి పండిస్తే వీళ్ళు పెద్ద పెద్ద పట్టణాలలో విలాస జీవిత్రం అనుభవించేవారు. ఇది ప్రకాశం హృదయాన్ని కలిచివేసింది. రెవిన్యూ మంత్రి అయిన (ప్రకాశం
" గారు “జమిందారీ వ్యవస్థ రద్దు జీయడానకి పూనుకౌన్నారు. జమిందారీ వ్యవస్థను గూర్చిన సమాచారం సేకరించి, సరియైన నిర్ణయం తీసికొనేందుకు ఆయన అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో కూడిన సంఘం ఏర్పాటయింది. ఈ బృందం జమిందారీల సమ([గ్రమైన అధ్యయనం చేసి ఒక 'రిపోర్టు' ను సమర్పించింది. దీనికి (ప్రకాశం రిపోర్టు అని పేరు. ఈ నివేదిక తదుపరి చర్యగా, జమిందారీ రద్దు చట్టం వచ్చింది.
సామాన్య కర్షకుల బాధలు తాలగిపోయాయి. రైతులు దీర్హ కాలంగా తాము సాగు చేసుకొన్న భూములపై హక్కులు కల్పిస్తూ ఒక చట్టం కల్పించడంతో, రైతులంతా ప్రకాళాన్ని వేనోల్బ కొనియాడారు. ₹వెన్యూ మంత్రిగా పేరు
జేశానికి వెన్నెముక అనదగిన రైతన్న అంటే (ప్రకాశానికి ప్రత్యేకాభిమానం ఉండేది. గ్రామీణులు తమ కష్ట సుఖాలను చెప్పుకోవడానికి వస్తే వారితో ఏ సమయంలోనైనా . మాట్లాడడానికి తన ఇంటి ద్వారాలను తెరచి ఉంచేవాడు:; అలాగే ఏ మాత్రం సమయం దొరికినా సందర్భం కలిసి వచ్చినా, తానే స్వయంగా మారుమూల (గ్రామాలకు సైతం వెళ్ళి, అక్కడి ట్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకొని, తన చేతనైనంత సాయం చేసెవాడు. రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలోనే, మద్యపాన నిషేధచట్టం, హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించే చట్టం వంటివి తీసుకొని రావడానికి తనవంతు కృషి చేశాడు (ప్రకాశం.
రెండేళ్ళపాటు రెవెన్యూ మం'త్రిత్వం నెజపిన పిదప, రెండవ (ప్రపంచ యుద్దం రావడంతో, ఆ సమయంలో, భారతదేశ రాష్ర్టాల మంత్రి వర్గాలతో సం(ప్రదించకుండానే, భారతదేశం కూడా యుద్ధంలో పాల్లొనవలసి వచ్చే విధంగా (బ్రిటీష్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు నిరసనగా మంత్రి వర్గాలు రాజీనామా చేశాయి. ఈ రాజీనామాల పరంపరలో భాగంగా మద్రాసు రాష్ట్ర మంత్రివర్గం కూడా చేసిన రాజీనామాల వలన, ప్రకాశం కూడా
మన ప్రకాశం 138 తన మంత్రి పదవికి రాజీనామా చేసి, తిరిగి ప్రజల మధ్యకు వచ్చాడు.
రెండవ (ప్రపంచ యుద్దం జరుగుతున్న సమయంలోనే గాంధీజీ నాయకత్వంలో వ్యక్తి సత్యాగ్రహం” (ప్రారంభమయింది. ఆ సమయంలో ప్రకాశం రాష్ట్రమంతటా విసృతంగా పర్యటించి ప్రజలలో చైతన్యం తీసుకొని వచ్చాడు. ఈ సత్యాగ్రహంలో పాల్గొని, మొదట జైలుకు వెళ్ళింది ప్రకాశం పంతులే. ఈ వ్యక్తి సత్యాగ్రహంలో అసంఖ్యాకంగా (ప్రజానీకం పాల్గొని జైళ్ళ పాలయ్యారు.
భారతదేశం నుండి బ్రిటీష్ వారిని వైదొలగవలసిందిగా పందొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా "క్విట్ ఇండియా" ఉద్యమం (ప్రారంభమయింది. గాంద్ిజీ నేతృత్వంలో (ప్రారంభమైన ఈ ఉద్యమానికి యావదాంధ్ర దేశమూ తన సంపూర్ణ విళ్ళాసాన్ని ప్రకటించింది. అప్పుడు ఆంధ్ర కాంగైసు అధ్యక్షులు (ప్రకాశం పంతులుగారే, క్ర ఉద్యమం సందర్భంగా దేశవ్యాప్తంగా నాయకుల నెందరినో 'ఫభుత్వం నిర్భందించింది. (ప్రకాశం గారు కూడా అరెస్టయి మూడేళ్ళపాటు, అంటే ఎందొమ్మిది వందల నలభై ఐదవ సం వరకు కారాగార వాసం చేయవలసి వచ్చింది.
పందొమ్మిది వందల నలబై ఆరవ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితి దొపురించింది. అప్పుడు ప్రజలకు ఆహార ధాన్యాలు సమకూర్చడంలో (ప్రకాశం చేసిన కృపి అపూర్వం,
ఆ సంవత్సరంలో జర్రిగ్వ రాష్ట్ర శాసనసభ ఎన్నికల తరువాత, (ప్రకాశం మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినారు, మద్యపాన నిషేధం అమలు వంటి విషయాలపై ఆయన ప్రత్యేక ఆ్రద్ధ కనబరచారు.
(గ్రామీణ పరిశ్రమలను ('ప్రోత్సహించడానికై ఎన్నో పథకాలను రచించిన ఘనత కూడా (ప్రకాశం గారికే దక్కుతుంది,
మన ప్రకాశం 139 గ్రామణాభ్యుదయ కార్యక్రమం
(గ్రామాలను స్వయం పోషకంగా అభివృద్ధి చేయడం అనేది (ప్రకాశం గారి ఒనసులోని గాడమైన లక్ష్యాలు. పందొమ్మిది వందల ముఫ్పై ఏడులో రెవెన్యూ మంత్రిగా ఉన్న రోజులలో కొన్ని (గ్రామాల అభివృద్ది ఆనాడు ప్రణాళికను తయారు చేశారు. ప్రకాశం మంత్రివర్గం రాజీనామా చేసిన తర్వాత పశ్చిమగోదావరి జిల్హాలోని జోగన్నపాలెం అను గ్రామం ఆదర్శ[గ్రామం అనే లక్ష్యంతో నిర్వహణా కార్యక్రమం (ప్రారంభించారు.
అక్కడే (గ్రామీణ విద్యా కేంద్రం అనే సంస్థను స్టాపించి డా బాబూ రాజేంద్రప్రసాద్ గారిని కులపతిగా ఏర్పరిచారు. ప్రకాశంగారు దానికి ఉప కులపతిగా పనిచేశారు. గాంధీగారు చెప్పిన నిర్మాణ కార్యక్రమం, చేనేత, (గ్రామ, కుటీర, పరిశ్రమలు మొదలైన వాటినికూడా ఏర్పాటు చేశారు.
గ్రామాభ్యుదయ ప్రణా౭కలు
పందొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో (ప్రకాశం ముఖ్యమంత్రి అయిన తరువాత (గ్రామ సౌభాగ్యాన్ని పెంచడంకోసం అమలు పరచిన ప్రణాళికలలో ఒకటి 'గోపన్నపాలెం' (గ్రామానికి దక్కింది. దానిపేరు 1(గ్రామసేవకుల శిక్షణా శిబిరం. ఈ శిక్షణా కేంద్రంలో ఖద్దరు ఉత్పత్తులు పెంచడం, హరిజనోదర్హరణ, (గ్రామాలకు మంచినీటి సౌకర్యం ఏర్పరచడం, (గ్రామీణుల ఆరోగ్య సంరక్షణ మొదలైన వాటిని గూర్చి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు జరిగాయి.
ఇది ఉత్తరజిల్లాలలో ఏర్పాటుచేసిన కేంద్రం ఇదే విధంగా దక్షిణ ఆంధ్ర జిల్హాలలో “టీ కల్టుప్పటి'లో ఇటువంటి కేంద్రం ఏర్పాటయింది.
ఈ కేంద్రంలో దాదాపు వేయిమంది కార్యకర్తలు శిక్షణ పొందారు. ఒకేసారి | సంవత్సరం శిక్షణపొంది కార్యరంగంలోకి ప్రవేశించడం అనే పద్ధతి కాక మొదటి మూడు
మన ప్రకాశం 140 నెలలు శిక్షణ పొంది ఆ తరువాత కార్యక్షేత్రంలో పనిచేయడమనే పద్రతి ఉండేది. పనిచేసి వచ్చిన తెరిగి రెండోమారు పాందే శిక్షణ మొదటిసారి కన్నా హెచ్చుగా ఉండేది.
కూరగాయలు, ఆహారపు దినుసులు పండించేవారు. ఒక (క్రమ పద్దతిలో వారిలో వారే కార్యక్రమాన్ని చర్చించుకొని, ఒకరి నుంచి యొకరు తెలుసుకొని కార్యక్రమాలు చక్కచేసుకొనేవారు. రాత్రివేళల్లో వయోజన పారశాలలు నడిపేవారు. ఈ విధంగా గోపన్నపాలెంలోనే గాక చుట్టుప్రక్కల (గ్రామాలలోను ఒక నూతన చైతన్యం, స్వయం పోషకమైన (గ్రామజీవనం ఏర్పాటు చేయడానికి ప్రాతిపదికలు వేశారు.
ఈ కాంపులో హెచ్చు జీతాలిచ్చి ప్రాఫెసర్లను నియమించలేదు. కానీ తమ రక్తనాళాలలో దేశభక్తి ప్రజాసేవ జీర్లించి వున్న మహనీయులు వచ్చి వారి ప్రత్యేకాభిమాన విషయాలపై ప్రసంగాలు చేశారు. గాడిచర్హ హరిసర్యోత్తమరావు గారు పుస్తక భాండాగార ఉద్యమాలే కాక తదను బంధములైన ఉద్యమాలను గురించి కూడా శిక్షణ నిచ్చేవారు. గొల్లపూడి సీతారామ శాస్త్రిగారు గాంధీతత్వం గురించి, డానిపై ఆధారపడిన (గ్రామ వునర్నిర్మాణ౦ గురించి చెప్పేవారు. అమరజీవి పొట్టి శ్రీరాములుగారు హరిజనాభ్యుదయం గురించి ఉపన్యసించేవారు. వీరుగాక, తల్దాప్రగడ ప్రకాశరాయుడు, వేగిరాజు కృష్ణంరాజు, లింగంరాజా గోపాలరావు, మల్లిమడుగుల కోదండరామస్వామిగారలు
- గాంధీజీవనం, 'ప్రకృతివైద్యం, బేసిక్ ఎడ్యుకేషన్ (మౌలిక విద్యావిధానం), ఖాదీ ఉత్పత్తి ఆర్థిక సంపద మొదలైన విషయాలను గూర్చి ఈ కేంద్రంలో బోధించేవారు. (గ్రామాభ్యుదయానికి అవసరమైన రవాణా సౌకర్యాలు, మంచినీటి సౌకర్యాలు మొదలైన
పెద్ద పెద్ద పనులను క్రూడ్రా (గ్రామీణుల సహాయంతో తక్కువ వ్యయంతో చేయించేవారు. ముఖ్యంగా, హరిజన వాడల అభ్యుదయానికై గట్టి యత్నం చేశారు.
(గ్రామాభ్యుదయం (ప్రక్రియాత్మకంగా జరిగితే తప్ప సార్వజనకమైన అంగీకారం పొందటం కష్టమని ప్రకాాం భావించారు. (గ్రామాభ్యుదయాన్ని సాధించడం కోసం ఇ శ ఫెర్కా వ్యవస్థను రూపొందించారు. ఈ ఫిర్కా వ్యవస్థే తర్వాత సమితులతో కూడిన బ్ఞాకులు- స్థానిక వ్యవస్థగా రూపొందిందని చెప్పవచ్చును.
మన ప్రొశం 141 ఖాదీ అభ్యుదయ ఉద్యమం
రాష్ట్రంలో ఇద్దరు ఉత్పత్తి చేసే కొన్ని కేంద్రాలలో ప్రత్యేకంగా, ఇద్దరు వ్యాప్తి కావడానికి అనువయిన ఒక స్కీమును (ప్రకాశం గారు ప్రతిపాదించారు. ఈ ప్రణాళిక (క్రింద (వ్రత్యేకింవ బడిన కేంద్రాలలో నంపూర్ణంగా ఖడ్డరే ఉత్పత్తి అయి వినియోగమయేటట్టు చేయబడింది.
ఇందుకు అనుబంధంగా మరొక పని కూడా చేయవలసి వచ్చింది. ప్రకాశం గారి మంత్రివర్గం ఏర్పాటు కావటానికి ముందే మిల్లు వస్త్రం అధికంగా ఉత్పత్తి జయడానికి కేంద్రం ప్రభుత్వం కొన్నివేల మరకదుళ్ళను కేటాయించింది.
ఆ విధంగా మిల్టులను విసృత పరచడం ఖద్దరు ఉద్యమానికి విరుద్ద కార్యక్రమం కనుక మరకదుళ్ళు అక్కరలేదని ప్రకాశం గారు పైకి వ్రాసేసారు.
ఖాదీ ఉద్యమ వ్యాప్తికి విసృతంగా కృషి చేశారు.
కుటుంబ జీవితం
(ప్రకాశం పంతులు పూర్మ పురుషుడు. ఎనభై అయిదు సంవత్సరాల నిండు జీవితం గడిపారు.
తననంతటి వాజ్జో చేసిన తల్లి అంటే ఆయనకు అపరిమితమైన గౌరవం. తల్లి
ల
ఆదేశానుసారం మేనకోడలు హనుమాయమ్మను వివాహమాడాడు. ఆమె పతిభక్తి పరాయణురాలు. భర్త మాట జవదాటని ఉత్తమ ఇల్టాలు.
ఆ కాలంలో ఆమె చాలా సంప్రదాయ సిద్ధంగా ఉండేది. ఆనాటి సంప్రదాయాను సారం ముఖానికి, కాళ్లకు పసుపు రాసుకొనేది. ముఖాన గల పెద్దబొట్టు ఆమెను నలుగురిలో ప్రత్యేకంగా గుర్తింపును కలుగజేసేది. పాత కాలపు హిందూ కుటుంబాలలోని వారికి
మన ప్రకాశం 142 వలెనే ఆమె కట్టు బొట్టూ ఉండేది. ప్రకాశం తను బాగా అర్జనాపరుడైన తరువాత తన తమ్ముళ్ళ పిల్లలను, అక్కగారి పిల్లలను తన దగ్గరే ఉంచుకొని చదువులు చెప్పించీ, పెళ్ళీ* (| చేసి వారి కుటుంబభారాన్ని పూర్తిగా వహించాడు. ఆయన ఇల్టు ఎప్పుడూ చుట్టపక్కాలతో కోలాహలంగా ఉండేది. వచ్చీపోయే బంధువులతో, స్నేహితులతో కళకళాడుతూ ఉండేది,
కొత్తపట్నం ఇచ్చిన (ప్రకాశం గారి రెండో అక్కయ్య పిల్లలు నరసింహమూ, నారాయణ వాళ్ళు కూడా మద్రాసులో మేనమామ దగ్గర ఉండే చదువుకొనేవాళ్లు తాను ప్రయోజకుడైన తరువాత తన తమ్ముళ్ళు ఇద్దరినీ ఆయన చదివించారు. వారిని పైకి తెచ్చాడు. ఇంగ్భాండుకు చిన్న తమ్ముణ్మే పంపించి వైద్యవిద్యను చదివించాడు. జానకిరామయ్యను, శ్రీరాములును ప్లీడర్ చదివించాడు. శ్రీ రాములుగారి కుమార్తె టంగుటూరి సూర్యకుమూరిని క్ర పదనాన్న (ప్రకాశం పంతులు బాగా అభిమావించాడు. ఆమె ఉత్తనుమైన కళాకారిణి. చిన్నప్పటి నుండి కళలంటే అభిమానం కలది.
రైతుబిడ్డ వంటి సినిమాలలో బాల కళాకారిణిగా పాత్రను ధరించింది. ఉత్తమ స్టాయికి చెందిన గాయిని. అమ దేశభక్తి పరాయణురాలు. ఆనాటి దేశభక్తి యుత కార్యక్రమాలలో తనవంత్తు పాత్రను నిర్వహించింది.
“మాదీ స్వతంత్ర దేశం
భారతీదేనన్చే షొ దేశం అని ఆంధ్ర ప్రజల సీం విందొనర్చిన గీతాన్ని పాడిన సుమధుర గాయిని సూర్యకుమౌరే. '౨మెక్రూ పెద్దనాన్న ప్రకాశమంటే అభిమానమే.
చిన్నతనంలోక్ర తండ్రి చనిపోయిన పిల్లల్ని కష్టపడి పేంచి విద్యాబుద్దులు
మన ప్రకాశం 143 చెప్పించినదని వారి మాతృమూర్తి 'సుబ్బమ్మ గారంటే (ప్రకాశం పంతులుగారికి వల్లమాలిన (ప్రేమ, గౌరవమూ ఉండేవి. కుమారుడు బారిష్టరుగా మద్రాసులో ప్రకాశిస్తూ ఉంటే రెండు చేతులా ఆర్టిస్తూ ఉంటే చూచిన ఆమెకు తన కష్టం ఫలించింది కదా, కుమారుడు ఉన్నతిని పొందాడు కదా, అన్న సంతృప్తి కలిగాయి. ఆ సంతృప్తితోనే ఆమె కన్ను మూసింది.
తల్లి మరణించిన తరువాతే ప్రకాశం గారికి సంతానం కలిగింది. ముగ్గురూ పుతులే. ఆయనకు ఆడపిల్లలు లేరు. పెద్దపిల్లవాడికి తన తండ్రి గారి పేరే పెట్టారు. గోపాలం అని ముద్దుగా పిలుచుకొనేవారు. రెండవ పిల్లవానికి తన తల్లితండ్రి అయిన నరసింహంగారి పేరు పెట్టుకొన్నారు. తృతీయ కుమారునకు తనను చిన్నప్పటినుంచీ ఎంతో ఆదరించి, వృద్రిలోనికి తెచ్చిన హనుమంతరావు నాయుడిగారి పేరు పెట్టుకున్నారు.
అయితే పెద్ద పిల్లవాడు చాలా చిన్నతనంలోనే చనిపోయాడు. అందువలన ఆయనకు ఇద్దరే కుమారులని చెప్పాలి.
“ తన పిల్లలకు, తన యింట్లో చదువుకొనే మేనళ్ళుళ్ళకు అందరకూ వేళకు కావలసిన వన్నీ అమర్చి, వారు చదువుకొనే పాఠశాలకు పంపించడం, సరిగా చదువుకొనేటట్టు చూడడం హనుమాయమ్ముగారి దినచర్యలలో ఒకటి.
సాయంకాలం పిల్లలందరూ పారశాలనుంచి ఇంటికి తిరిగి రాగానే వారికి ఫలహారం పెట్టి, వారు ఆటల సందడిలో ఉండగా ఆమె మదరాసులోని హైకోర్టుకు బయలుదేరి వెళ్ళేది. భర్తను చక్కగా అర్ధం చేసుకున్న ఉత్తమ ఇల్లాలు ఆమె. భర్త అలవాట్లు, అభిరుచులూ ఆమెకు తెలుసు. ప్రతి సాయంకాలం నాలుగు, ఐదు గంటల మధ్య హైకోర్టు ఆవరణలో ఆమె భర్తకోసం ఎదురు చూచేది. భర్త రాగానే వారిద్దరూ కలిసి హైకోర్టు బీచిలో చాలా దూరం నడిచేవాళ్ళు. ప్రతిరోజూ రెండు మూడు గంటలైనా నడవడం (ప్రకాశం పంతులుగారికి దినచర్య.
ప్రకాశం గొప్పదాత. (గ్రంథాలయ స్థాపన చేస్తున్నామనీ, కళా ప్రదర్శనలతో సభలు నిర్వహిస్తున్నామని, వాటి నిర్వహణకు ఆర్థిక సహాం.... కావాలనీ, నిత్వమూ
మన ప్రకాశం 144 ధనార్జులు వస్తూ ఉండేవారు. వాళ్ళందరినీ వట్టి చేతులతో పంపేవారు కారు ప్రకాశం గారు. అప్పుడు ఆయన దగ్గం లేకపోతే ఇంటి ఇర్చులకని భార్య దగ్గర ఉంచిన డబ్బు నుంచి ఐనా తీసుకొని వొగిష్రిఇచ్చి పంపేవారు. అడ్డు చెప్పేది కాదు ఆ ఉత్తమ ఇల్లాలు. ఆయనకు పిల్లలంటే చాల ఇష్టం. వాళ్ళతో ఛలోక్తులాడుతూ ఉండేవారు. హాస్యకథలు చెప్పి వారిని నవ్విస్తూ ఉండేవారు. (ప్రకాశం గారు భోజన ప్రియులు. ఆయన పదహారణాల ఆంధ్రుడు. ఆవకాయంటే అమితమైన ఇష్టం. గడ్డపెరుగు వీరి భోజనంలో రోజూ ఉండాల్సిందే. పాయసమంటే పరమప్రీతి. తోటకూర కాడలు, ములక్కాడ కూర అంటే ఆయనకు ఎంతొ ఇష్టం, తన పిల్లలనూ, తన ప్రోబలో నున్న పిల్లలను ఎంతో (ప్రేమగా చూచే వారు ప్రకాశం. వారి ఎల్లల్లిదరూ నరసింహమూ, హనుమంతరావూ సూ టూ, బూటూ వేసుకొని లె కట్టుకొని జోడు గుజ్జాల బండిలో కాన్వెంటుకు వెళ్ళేవాళ్ళు. నాలుగు గంటలకల్లా మళ్ళీ వచ్చేవారు. పెద్ద అబ్బాయికి పదకొండు సంవత్సరాలు, చిన్నవాడికి తొమ్మిది. గ్ా, జ్య హిషారించడమే (ప్రకాశం. (పభుత్యోద్యోగాలను, పాఠశాలలను, కోర్టులను చ్ స్ ర ఆ కార్యక్రమం. ఈ సందర్భంగా పందొమ్మిది వందల ఇరవై ఒకటిన ప్ ఆ చూ వస స్తున్నట్లు పక (బ్రహ్మాండమైన బహిరంగసభలో తాను న్యాయవాద వృత్తిని మై: న పనై ర్ ఇచ చారు. స్వాతంత్రోద్యమంలో దక్షిణ భారత దేశంలో న్యాయవాద గ్ా! వీ ను ఊక (ప్రకాశమే ప్రధముడు. త్రివిధ బహిష్కారాలను ఆయన ల్ ఉపయో చాడు. తానూ, తన కుటుంబమూ ఎప్పుడూ స్వదేశ 'అడు' మ్ వా వార్చు, తన మాన్సించాడు. ఎల్లల చేత కూడా కాన్వెంటు చదువులు దేశ రాజకీయా పరిత్వజించారు అమన రిగిన పది సంవత్సరాలలోనే తమ సంపదనంతా వెళ్ళినప్పుడు ఇంట్టో జరుగుబాటు కూడా కష్టమయింది.
మున ప్రకాశం 14వ ఆయన బారిష్టరుగా పనిచేసే సమయంలో సూటూ, బూటూ. హాటు ధరించేవారు. స్వాతంత్రోద్యమంలో ప్రవేశించిన తరువాత ఖద్దరు వస్తాలే ధరించేవాడు. ఆయన జెయిలులో ఉన్నప్పుడు కుండతో తన అన్నం తానే వండుకొనేవాడు. తొట్టి స్నానంతో ఆరోగ్యం చక్కబడుతుందని ఆయనకు నమ్మకం. విద్యుత్ చికిత్సు అన్నా తొట్టిస్నానమన్నా ఆయనకు ఇష్టం. జైలు అధికారులు అనుమతిస్తే ఆయన జైలులో కూడా ఈ రెండు రకాల ఆరోగ్య సూత్రాలూ పాటించేవాడు. భార్య చనిపోయిన తరువాత (ప్రకాశం పాతిక సంవత్సరాలు జీవించాడు. తన ఉన్నతికోసం కష్టపడినవారిని - తండ్రి, తల్లి. అమ్మమ్మ, హనుమంతరావు నాయుడు గారు, తన భార్య హనుమవూయమ్మా - తన కోసం ఎంతో కష్టపడ్డారని నాళ్ళ ప్రమను గుర్తు చేసుకొనేవాడు ప్రకాశం. భార్య హనుమాయమ్మ ఉత్తమ ఇల్లాలు. పిల్లలను కాన్వెంటు మాన్పించినప్పుడు కానీ, స్వాతంత్రోద్యమం కోసం లక్షలు ఆర్టించే బారిష్టరు వృత్తిని త్యజించినప్పుడు కానీ, ఉద్యమంలో జేరి ఆస్థి పాస్తులన్నింటిని వదులుకొన్నప్పుడు కానీ తన ఇల్టాలు హనుమాయమ్మ తన మాటకు అడ్డుచెప్పలేదని ఆమెను ఉలచుకొనేవాడు (ప్రకాశం. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగినది పదినెలల పాటు మాత్రమే అయినప్పటికీ ఆ స్వల్బ్పవ్యవధిలోనే ఎన్నో 'ప్రజోపయోగకరమైన పనులను చేపట్టి, ఉత్తమ (ప్రజా పరిపొలకునిగా (ప్రజల మన్నన లందినాడు (ప్రకాశం. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్చణతో పందొమ్మిదివందల యాభై మూడవ సంవత్సరంలో ఆంధ్రరాష్ట్రం అవతరించింది. దాదాపు నాలుగు దశాబ్దాల తరబడి ఆం(ధ్రులు కన్న కలలు సఫలమయినాయి. అక్టోబర్ ఒకటవ తేదీన ఏర్పడిన ఆం(ధ్రరాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా కర్నూలు నగరాన్ని ఎంచుకున్నారు. ఎనిమిది పదుల వయసులో పరిణతి చెందిన పాలనా నైపుణ్యంతో ఆయన జనరంజకంగా ఆ పదవిని నిర్వహించారు.
మన ప్రకాశరా 146 ప్రజాబాహుళ్ళం అభీష్టం మేరకు ప్రకాశం పంతులుగారు రా నికి తాలి ్యం అభీష్ట (్ర ం
ముఖ్యమంత్రి అయినారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికై ఆయన ఎంతగానో పాటు
పడ్డారు.
ఆ సమయంలోనే రాయలసీమలో విద్యావకాశాలను విస్తరింపచేయాలనే సదుద్దేశంతో తిరుపతిలో శ్రీ వేంకటేశ్యర విశ్శవిద్యాలయాన్ని స్టాపించారు,
అంతేకాదు, నేతమగ్గాలపై పన్ను రద్దు, రెండెడ్డ బండ్రపై వేసిన పన్ను రద్దు వంటి సాహసోపేతమైన, ఆర్థికపరమైన నిర్ణయాలను కూడా (ప్రక్థాం మంత్రి వర్షం తీసుకోగలిగింది.
రాష్టం అప్పుడే ఏర్పడిన స్టితిలో ఉండే ఆర్థిక పరమైన ఇబ్బందులను కూడ సరియైన ప్రత్యామ్నాయాలతో సమర్దవంతంగా ఎదుర్కోగలిగింది (ప్రకాశం (ప్రభుత్వం.
కొద్దికాలమే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ప్రకాశం పంతులుగారు, వైతన్యవంత మైన ప్రభుత్వాన్ని అందించగలిగారు. ఆం(ధధ్రులకోసం ప్రకాశం చేసిన సేవ అపారం. అందుకే అంధధ్రుడన్న (ప్రతివాడికీ ఆయన పట్ల (ప్రేమ అపరిమితం. ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికై చేసిన ఆయన నిరంతర యత్నం ఫలించి, ఆంధ్రరాష్ట్రం ఏర్పడడం, దానికి తాలి ముఖ్యమంత్రి ఆయనే కావడం నిజంగా ఆంధ్రుల అదృష్టం
ధన్యజీవి
(ప్రకాశం పంతులుగారు జీవితకాలంలో విశ్రాంతి అనే మూట వినడానికి కూడా సహించని కర్మవీరుడు. ప్రగతిపధంలో పయనించి (ప్రజల యోగ క్షేమాలను నితయు విచారిస్తూ ముందుకు పయనించే ప్రకాశం పంతులుగారు అడుగు ఆపడము త్వా ది
ఎరుగరు. ఎనుబది ఐదు సంవత్సరాలు ప్రజాసేవలో గడిపిన పుణ్యపురుషుడు న
గానీ, వానను గానీ లెక్క చేసే వ్యక్తి కాదు. ఎక్కడ అవసరమ్సుంట్రె అక్కడ ప్రత్యక్షమయే
ఆపద్భాంధవుడాయన. పందొమ్మిది వందల యెనబద్రి ఏడవ సంవత్సరం మే సంలో న్చవి. అంత
ఎండలు మెండుగా ఉన్నవి. అంత ఎండలలోనూ ఒంగొల్సు (ప్రాంతమంతా పర్యటించాడు.
మన ప్రకాశం [47 మండుటెండ తన ఆధిక్యతను ప్రకటించుకొన్నది ప్రకాశం సంతులుగారు వడదెబ్బకు గురి అయినారు. ఆ ఎండదెబ్బే ప్రకాశం గారిని బలితీసుకొన్నది. సందొమ్మెది వందల యాబది ఏడవ సంవత్సరం మే మాసం ఇరువదవ రోజున పంతులుగారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసి పోయాయి. జీవితకాలంలో వి(శ్రాంతి అనే మాట వినడానికి కూడా సహించని నాయకమణి, సుదీర్హ విశ్రాంతి తీసుకొంటున్నట్టుగా ఉన్నారు ప్రకాశం పంతులుగారు.
వడదెబ్బను తట్టుకొనలేక ఆసుపత్రిని చేరిన ఆ దేహం అతి శీతలమైన మంచు ఫలకల మధ్య ఆ వడదెబ్బను పొగొట్టుకొన్నది.
అప్పటికి యాభైఆరు సంవత్సరాల క్రిందట స్వాతంత్రోద్యమంలో చేరిన నాడు ఆయనను విడిచిపోయిన చందనాది పరిమళద్రవ్యాలు, సుగంధ కదంబ పుష్పమాలికలు, ఆయన ముఖం తప్ప మిగిలిన శరీర భాగాలన్నింటినీ ప్రీతితో తమలో ఇముచ్చుకొన్నవి. పలువురు పెద్దలు ప్రకాశం పంతులుగారి నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు. ఆయన జీవితం సార్హకమయినదని సన్నుతి చేశారు. ప్రకాశం పంతులుగారి వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్య నిర్వహణాద్యక్షులు ఇహలోకంలో అవతరించడం 'నభూతో నభవిష్యతి" అని పలువిధాలుగా ఆయనను ప్రశంసించారు. వారి ప్రశంసా వాక్య సందేశాన్ని స్వర్గసీమకు తీసుకొని పోతున్నయ్యా అన్నట్టు చితిపై అగ్ని జ్వాలలు ఆకాశమార్లానికి ఎగిసి వెళ్ళాయి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి ఆత్మజ్యోతి నిశ్శజ్యోతిలో కలిసిపోయింది
ఆంధ్రజనుల హృదయాలలో చీకటి సుడులు తిరిగింది.
(ప్రకాశం పంతులు నూతన ఆంధ్రదేశ నిర్మాత, దైర్య సాహసాలకు పెట్టింది పేరు నిర్మాణ కార్యప్రతిపాదనాత్మకమైన అఖిజ్జ్ఞత ఆయన కుండేది జీపితంలోని ప్రతిక్షణం, ఆయన మేధలోని ఊహా వైళిష్యం, దేహమందు గల శక్తి భారతదేశ సేవకూ ముఖ్యంగా ఆంధ్ర (ప్రజాభ్యుదయానిః వినియోగించారు.
మన ప్రకాశం [4 “త్యాగిదీక్ష కార్యదక్షత నల మహవ్వ్య్ము. ౮౮ ఎందిబ బఎహెరలాల్ చేత సన్నుతింపబడిన మహా నునీషి ప్రకాశం పంతులు. “ఒక శక్తి నిస్సందేహంగా ఆయనలో ఉండేది. ఆయన ఆం(ధ్రదేశ నిర్మాత మాత్రమే కాదు. భారత రాజకీయ రంగమందంతటా ఆయన ('ప్రభావముండేది” అని పలువురు పెద్దల చేత ప్రశంసలు పొందిన ఘనుడు, ప్రకాశం గారిని ప్రశంసించడం అందరికి సంతోషకరమవుతుంది. ఆయనకు గల దృడ నిశ్చయం కార్యదీక్ష అనుపమానమైనవి. సైమన్ క్షమ్సీష్షన్ను బాయ్‌కాట్ చేసిన సమయంలో ముందుకు వచ్చి, మిలిటరీ పోలీసులు ప్రజావాహినిని అడ్డుకొనబోయి నపుడు చొక్కా విప్పి తనపై తుపాకీ గుండును పేల్చుకొనవచ్చునని గుండె చూపిన సాహసి ఆయన, ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికికై ఆయన చేసిన కృషి ఆంధ్రులు మరువలేనిది. ప్రజాసేవకు త్యాగనిరతికి ప్రకాశం గారు పేట్టింది పేరు... నిజంగా ఆయన మన (ప్రకాశమే. ప్రకాశం పంతులుగారు అతి దూరదృష్టి గల మహామానవుడ్తు, (ప్రజా రక్షకుడు. ఉన్నతమైన ప్రమాణాలతో తన జీవితాన్ని, వృత్తిని నడిపించుకొన్నవాడ్తు, 'ప్రజాసమూహాన్ని కూడగట్టుకొని, కదిలించి, నడిపించగల శక్తిమంతుడు. జనాకర్షకమ్రైన గుల్మ వైశిష్ట్యం అయనది. నిరుపమానమైన త్యాగశీలత ఆయన ముఖ్య గుణం. న హరిజనాభ్యుదయం, చర్థా పరిశ్రమ విస్తరణ, ఉత్పత్తి వినియోగద్రాగ్ర సంఘోద్యమం, ఫిర్కా అభ్యుదయ ఉద్యమాలు తాను ముఖ్యమంత్రిగా కండగా స్తాపించి 'ప్రజల మన్ననలను పొందినవారు సై స్వాతంత్ర్య జ్యోతిని 'సాహసంతో వెలిగించిన దేశభక్షాగ్రశ్రేణికి చెందినవారు. ముందు వెనుకలు చూడని ధైర్యం, దాతృత్వగుణం వలన ఆయన క్ష పురాణ పురుబుడయినాడు. ఆయన ప్రబోధము వలన ప్రజలు జాగృతి చెందారు. వందలాది మంది అనుయాయులు దేశ స్వాతంత్ర్యం కోసం త్యొగౌల్లు చేశారు
మన ప్రకాశం 149 నవ్యాంధ్ర జనకుడాయన. భారత జాతీయోద్యమ నాయకులలో ఆ(గ్రశ్రేణికి చెందిన నాయకుడు ప్రకాశం పంతులుగారు ఆయన వ్యక్తిత్వం అనుపమానం.
ఆం(ధ్రప్రాంతంలో పుట్టిన భారతజాతి రత్నం ప్రకాశం పంతులుగారనీ, మహా మనీషి ఆయన అనీ లోక్‌సభ జోహార్డు అర్పించింది. వీరిది దేశసేవకే అంకితమైన జీవితం. స్వాతంత్ర్య సమరంలో ఆయన ప్రముఖమైన పాత్ర వహించారు. త్యాగాలు చేశారు. కష్టాలు పడినారు. సమరవాహినిలో ఎప్పుడూ ముందుగానే నడిచేవారు.
"పట్టుదలతో ఉత్సాహంతో ఇన్ని ఏళ్ళుగా సేవ చేసిన వ్యక్తి చరిత్రలో లేడు. ఆయనకు చేయెత్తి నమస్కరించుట మనవిధి.”
ఈ (వకాళశం వంతులుగారిని గూర్చిన ఈ వలుకులు జాతీయోధ్యమంలో కృషిచేసి ఖ్యాతిగాంచిన డా॥ భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు పలికినవి.
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒక వ్యక్తి కాదు. అర్హశతాబ్దికి పైగా ఆం(ధ్ర రాజకీయ ప్రజాహిత జీవితంలో ఆయన ఒక మహా సంస్థ ఆయన వ్యక్తిత్వం మహాగోపుర శిఖరోన్నతం. ఆయన జీవితగాధ బహుముఖ (ప్రకాశం గలది. బహురస సంపన్నమైనది.” ఎ యయాంహలాప (బం. దా 1? నా మ నారీ హైదం ల్ నాన
: గ్రీగీటడ కిషన (నం లై అననన చర నిలాాననచవాననకునే కట? నానా . “లీ ల... సకర్ మంగళం ప్రమ లోన ఆయు భాషోటాత్యలే |. | పరే. గ వః ఆం(ధ్రాయ్లూనివర్సిట్సీ చండి ఖైల్..ఎ. న. సు కష... 2లుగతో పాటు, హిందీ, 'సేరీస్టృత భోషాధ్యయ (కూడా (| "చెశారు. గురుముఖలిగా శాస్రీయు, స్రగీతాన్ని అధ్యయ్టునం చేసన శ, ఖచ రాఘ. వీరు సంగీత శాస్త 'పట్టభ(ద్రుట్టుగవద్ద సంగీత యా.
సవ లా టతతరాల! సుస్వరూపం. తెలిసిన, విదుషీమజ్ క. మ్ వ
_ _ చిరంళర పరిశోధసాశీలి డాక్టర్ ప్రమీలాదేవి. వీరు రచించిన “తేలుగ్లుల్లో పద్యగేయ:నాటికలు” అనే .'.” విమర్శనాత్మక గ్రంధ్రర జ ప్రక్రియా గ్రంధాలలో వెలువడిన మొదటి" ట్రేర్లథ్ధర్ష ఇది 1971-1972 . గ్ సంవత్సరానికి ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చారి ఉత్తమ గ్రంథ. పురస్మారాన్న్య ప్లోందింది. | 1 వీ6 “డాక్టర్ జి. వళృష్ణురావు నాటికాసాహీత్య సమాలోచనం' అనే లఘు సిద్దాంత గ్రాంథానికి నాగార్జునా _ ౧ యానివర్సిటీ వారి ఎమ్స్ఫిల్ డిగ్రీ, 'అన్నమాచార్లుల, సంకీర్తనలలోని జానపద సంగీత ఛ్లర్ధిదోరీతులు గ. అనే సిద్ధాంత్లు గ్రంధానికి 1988లో పి, హెద్ద్ది. డిగ్రీకి లభించింది. . న. / తెనాలి జే.ఎమ్.జ్లె కళాశాలలో 1974నుండి 76 వర్తక్తు మీరీ పట్నంలోని హిర్రద్యూ, కళుశాలలో (76 నుండ్కి2006 వరకు ఆంధ్ర భాషోపన్యాసకులుగా పనీచేసిన వీరు 200% సంవళ్తుగంలో ఆంధ్ర... -.. ప్రదేశ్ ప్రభుత్వం నుండి బెస్ట్ లెక్సరర్స్ అవార్డును అందుకొన్నారు, 1 వ ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్, కడప -+క్సేంద్రాలనుండీ 'వీరు చేసిన్నప్రసంగాలు, కవితలు
' _. పసారిశాలై శ్రోతల ప్రశంసలను పొందాయి. వీర రచించిన లలితగేయాలు, పదసంకీర్తనలు సభలలో. .
,! గ్రానం చేస్తున్నారు, ఆకాశవాణిలో ప్రసారతమవుతున్నాయి.( | వ. చిరు రబించిన సంగీత రూపకాలు సంక్రాంతి సఖి కివే వేయను మ్మాస్రాన సమ్మ్యుర్టల్థత్ల తరం +." పెళ్ళీకి మూడు ముళ్లు అనే వచన గేయ నాటికలు, ఆకాశవాణి వబ దాద కేందతం 'ప్రసారితమై *... భ్రచారం పొంద్రాయి. 'ఆకొశవాణి, విజయవాడ కేంద్రం వారి లోకల్ ఆడిషన్ టీ ర్లు మెంబరుగా
' పని చేశారు. పదసాహిత్య పరిషత్ స్థాపక అధ్యక్షులుగా ఉంటూ మరుగున పడిన పీదకర్తల సంగీత
-
- సాహిత్యాలను మళ్ళీ ప్రజలకందించడంలో విశేషమైన కృషిచేస్తున్నారు. రోటరీక్షబ్ ఆహ్ 'ఇంటక్షైషనల్, 4--- (ఇిన్సర్ల్ వీల్ క్లబీఅకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గాను, అధ్యక్షులుగాను పండి అనేక శేషా క్తార్యక్రమాలను ”, నిర్వయించారు. ప్రస్తుతం వైజ్ మెన్ క్లబ్ ఆఫ్ ఇంటర్ఫేషనల్ డిస్టిక్ట్-| కు. గసర్దగ్రుగ్గా ఉన్నోళ్తు, “చా! ప్రమీలాదేవి మరీచి కవయిత్రి. వీరు ప్రచురించి 'నేను' అనే కవితా సంకలనం ఈ విషయానికి. _ సాక్షి వీరు ర్వించ్న క్షేతయ్య తెలుగు. విశ్వ విద్యాలయం వారి ప్రచురణ, కవిత భారతీ కళా ల్ ? సెాతరంగణ్ = సంగీత సాహిత్య సంబంధమైన వ్యాసాల సంకలనం. - మన ప్రకాశం, ఆంధ్రకేసరి . . "జీవిత చరిత్ర, సారంగపాణీకా పద సాహిత్య - హిందీ గ్రంథం - లు, ప్రమీలాదేవికి, ఆమె, జ్ఞ 7 రచనలో కీర్తి తెచ్చిన 'వాటీల్లో కొస్ప్మ సంపాదిత (గ్రఆథాలలో నందకరాజ్యం - తొలి, కైలుగు సోంఘకో, న్! నాటకం - సుభద్రాపరిణయం, బొమ్మరాజు సీతా రామదాసు కీర్తనలు, బొమ్మర్గాపీ సీతారామదాసు వ స్థగీతోత్సవ సంచికాలు వీరికి కీర్తి ప్రోదిచేసిపెట్టిన వాటిలో కొన్ని. నిరంతర్గాధ్యయ ఫల్లిత్తంగ్యాలా రూపొందుతున్న మహిళా వాగ్గేయ కా(రిణుల)రుల చరిత్ర ప్రచురిత ముయితే పదసాహిత్య పర్శిళథనా |. ]
7] నెహ్టిత్యానికి పుష్టిన్ తుస్టని కలిగించగలదు. న
. , - డా ఎన్. శ్రీలక్ష్మి క్ష.