Telugu mana bhasha - anilvaranasi/indianlanguages GitHub Wiki
ఖ్మన్నో పో! (షా షా గ్ లం ఉ శే స నంట నే | క్రై. ంలడ3 న. ళు (౨. య య. భ్చ్యాళ్తుల్లా..
మేన భాష్ డి.చంద్రశేఖర రెడ్డి | షా పైె01ంజుం03 ౨001
2120122012 (4ఉ001160[0000 65327501 10630010006 01 61480 1.జ8029ల) ౨ ౨.0123601036104212 6669 ి44/౮007 శ్ర జరాంం8: మంయిరిల్క2001 (గో గ 0 ఇంంళంం0ంంయంలు2003 ; య్ర్ న గి ౬ ర్ట న. ౮౪బారిబాప్రిగ. లో 6౬ స (9; 0౦40-5558 8819 స సంజ 2 ళో శే రిటం//7. కో రం బు బతు బో య్ (౨:040-24160318 1+ /. న! గ బ/7/24 వో 777/260/ ॥ హాడ గ ఉయికము౦ంకుంరుకు?లు ను పోటీ (:040-2766 4525 070074 అ 1064110406 220162141005 1-90-289/4, 3ల1040560%106 గర 2048220 చరం20864- 500 044. (౨:౦040-27607307. అ *1032212220(1171 9001110196 ఉీ11292200063 సగం: ఆ. 100
ద్య ీ'౧ంకీత (గి గ్రే లే ఖుణం తీర్చలేనిది, ప్రేమ మరువలేనివి టు. సు. యంతు. వి చ ను... న టు. న న మ న వ టే మం శీ శే॥ నాగారెడ్డి హరిశేషా రెడ్డి క్షీ శే। మెట్టు సుందరరామి రెడ్డి గారికీ గారికీ
-
ఇది వచనయుగం 13 | 24. పేర్లకు అనువాదాలా 59
-
రాతలో దొళ్లే పొరపాట్లు 15 25, పరాయి పేర్లు 81
-
బుబూలు 17 26. పరభాషలపై మోజు 4 అచ్చుతో ఎందుకు రాయాలి. 19 మాతృభాషకు చేటు 63
-
ఏది తెలుగు - ఏది 27. హలంతాలా? అజంతాలా? 65 సంస్కృతం 21 | 28. మరికొన్ని ఇంగ్లీషు మాటలు 67
-
విసర్గ ఎక్కడ వాడాలి 23 | 29. పదజాలం 69
-
సున్నా ఎక్కడ ల! 80. క్రియా? నామవాచకమా?-1 71
-
తద్భవాలా -తత్సమాలా 27 | 81 క్రియా? నామవాచకమా?-2 78
-
ఎక్కడ అల్ప్బప్రాణం - ఎక్కడ 82. క్రియా? నామవాచకమా?-3 75 మహా'ప్రాణం 29 | 38. క్రియా? నామవాచకమా?-4 77
-
'మహా(ప్రాణా'లు తారుమారు 84. క్రియా? నామవాచకమా?-5 79 చేయవద్దు 31 | 36. భావార్ధక నామాలు 81
-
టకాదుర 88 | 36. డు - ప్రత్యయం 88
-
'రికారం కాదు... 'టికారమే! 35 87. పు- ప్రత్యయం 85
-
అక్షరాలు తారుమారయితే. 87 | 38, త - ప్రత్యయం 87 14 శషలు తెలుగులో లేవు 39 | 39. ఇక - ప్రత్యయం 90
-
మన పేర్లు 41 | 40. క - ప్రత్యయం 992
-
తత్పమాలు ఏర్పడే పద్ధతి. 48 41. అ, అకం - ప్రత్యయాలు 94
-
పేరులోనే ఉంది పెన్నిధి 45 | 42 ఇ - ప్రత్యయం 96
-
పదాది సంయుక్తాలు 47 | 48. మాపకం - మారకం 98
-
రకారానికి లోపం ఎక్కడ 49 | 44 దిద్దుబాటు - మెచ్చుకోలు. 100
-
భాషల పరస్పర ప్రభావం 51 | 45. ఉంకువ - ఈవి - అరువు 102
-
ఇంగ్లీషు మాటలు-కొన్ని ' 46. మరికొన్ని కృత్త్రత్యయాలు 104 సంగతులు ర్కి 47. భిన్నప్రత్యయాలు - 22, ఇంగ్లీషు పేళ్లేనా ర్ర్ భిన్నార్ధాలు 106
-
కేర్లు - కధాకమామిషూ 67 48. తద్దితనామాలు 108 "మనభాషతి 5
-
త్వార్థ స్వార్ధ ప్రత్యయాలు 110 | 75. అనుక్షణం - అనూరాధ 162
-
మకుబర్ధక ప్రత్యయాలు _ 112 | 76 కవివతంసుడు -
-
అభావాది. అర్ధాలు శ! అవమానం 164
-
అరువు ప్రత్యయాలు 116 "7. నిరశనం - నిరసనం,
-
అపత్యార్థక ప్రత్యయాలు _ 118 నిర్దిష్టం - నిర్జుష్టం 166 54 శైవ వైష్ణవాదులు 120 | 78 దుర్యోధన - దుశ్భాసనులు 168
-
పాయసం - దేశీయం - 79. విచక్షణ - విచారణ 170 సనాశనం 122 | 80. వినియోగం - విమర్శ 172
-
దైనికం - ఐహికం 194 | 81. విగ్రహం - వివాహం క/5
-
మహిమ - రాజ్యం 126 | 82. ఆచంద్ర తారార్మం 177
-
జాడ్యాదులు 128 | 88. ఆశ్రమం - ఆగ్రహం 179
-
మమత - మమత్వం 130 | 84 నిపుణుడు - నిదానం 181
-
అహంకారం - అహంభావం 132 | 85. అధికారం - అధివ్థానం 154
-
స్నాతకం - శతకం 134 | 86. అతిక్రమం - అతిపరిచయం 186
-
ప్రాచీనం - వాజ్మయం 186 | 87. అతిరథుడు - అతివాదం 186 | 63. ద్వీపకల్పం - నామధేయం 138 | రి8. స్వాగతం - సురభి 19]
-
జాతీయాకరణం 140 | 89. ఉత్తరం - ఉదాసీనం 193
-
బుద్ధిమంతుడు 142 | 90. ఉత్కంఠ - ఉద్ధరణ 195
-
ధన్వి - రూపష్యం 144 91 ఉద్దేశం ఆ ఉద్దేశ్యం 197
-
తర తమ ప్రత్యయాలు _ 146 | 92. ఉత్పత్తి - ఉద్యోగం 199
-
సంస్కృత సంఖ్యా వాచకాలు 148 | 93. అభ్యాగతుడు - అభిసారిక 201
-
వింశతి నుండి మహాభూరి 94. అభిజ్ఞుడు - అభిజ్ఞానం 204 "దాకా 150 | 95. అభినవం - అభిమానం 206
-
సంకేతాలు 152 | 96. ప్రతిబింబం - ప్రత్యాహారం 209
-
ప్రీ ప్రత్యయాలు 154 | 97. ప్రతిషేధం - ప్రతికూలం 211 79, ఉపసర్గలు 156 | 98. ప్రతిధ్వని - ప్రతిభ 213 78, పరాకాష్ట - ఆపవాదం 168 | 99. పరిపాలన - పరిమళం £2్కేర్
-
సంకోచం - సంకలనం 160 | 100.ఉపాసన - ఉపేంద్రుడు 217 వా
పరిచయం
తేలుగు మన భాష. అది మన భాష కాబట్టి మనకు తెలిసే ఉంటుంది. బాగా తెలును కాబట్టి ఇంకా తెలుసుకోవలసిన పనిలేదు. మన భాషను గురించి పూర్తిగా విశదంగా తెలుసుకోవాలంటే సమగ్ర నిఘంటువులేదు. సువిస్తృత వ్యాకరణ గ్రంధం లేదు. వాటిని సిద్ధం చేసుకోవాలన్న ఆకాంక్ష అప్పుడప్పుడూ పుడుతుంది. కాని మన ఆరంభ శూరత్వంవల్ల ఆ భావం, శ్రద్దా ఎంతో కాలం నిలవవు. మనవి విశాలహృదయాలు. కాబట్టి మనవి కాని వాటిమీద మనకు భక్తి తాత్పర్యాలు హెచ్చు మనదే అయిన భాషమీద అతిపరిచయకారణంగా నిరాదరణ, అవజ్ఞ. తెలుగుజాతి భిన్నప్రాంతాల్లో, దేశాల్లో విభక్తమై ఉందికాబట్టి మనకు ఏకసూత్రత కుదరదు. అన్యభాషల వాళ్ళు మనల్ని అవమానిస్తున్నారనుకొన్నప్పుడు, మనమీద పెత్తనం చేస్తున్నారను కొన్నప్పుడు తెలుగుతేజం చూపాలనిపించి విశాలాంధ్ర, క్రాకపోయినా ఆంధ్రప్రదేశాన్ని సాధించాం. ఇంతటితో మన రాజకీయావసరాలు తీరాయి. ఈ కాలంలో మనిషి రాజకీయ పశువని ఇంగ్లీషువాడు చెప్పి, బోధపరిచి పోయాడు మనకామాట నచ్చింది కాబట్టి రాజకీయా లకు మాత్రం తెలుగును పరిమితంచేసి అప్పుడప్పుడు మనం తెలుగువాళ్ళమని చెప్పుకుంటూ తెలుగుభాషను, అది ప్రతిఫలించే, ప్రతిబింబించే తెలుగు సంస్కృతిని ఆదరించటానికి ఏదో కొన్ని పదవులు, కొందరికి ఉపాధి సౌకర్యాలూ కల్పించి చేతులు దులుపుకుంటాం లేదా కడుక్కొని తుడుచుకుంటా.. ఇదే తెలుగుదనం. ఇది మనజాతి సాధారణ లక్షణం.
మన సంఖ్యాబలం తెగ పెరిగిపోతున్నది. ముక్కోటి ఆంధ్రులు, ఎనిమిదికోట్ల మందైనారు. ప్రభుత్వంవారి లెక్కల ప్రకారం మనలో సగం మందికి పైగా అక్షరాస్యులున్నారు. మనదేమో స్వర్దాంధ్రదేశం కాబోతూ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నది. మన సంగతి ఖండాంతరాల్లో మోగిపోతున్నది. అయినా అన్ని తెలుగు పత్రికలకూ కలిసి పది లక్షల మంది చందాదారులు లేరు. ఇది దినపత్రికల విషయం. తెలుగుభాషకంటూ ప్రత్యేక పత్రికలు లేవు. సాహిత్యాన్ని ప్రచారం చేసే పత్రికలు స్టాపిస్తుంటాం - సాధ్యమైనంత త్వరలో అవి మూతపదేందుకు తోడ దతాం. ఇలాంటి దేశంలో, కాలంలో, జాతిలో కొంతమంది అమాయకులు మన భాషను గురించి, సాహిత్యాన్ని గురించి తమకు తెలిసిన విషయాలనూ కనీసం యువతీ యువకులైనా తెలుసుకోవటం మంచిదనిపించిన విశేషాలనూ, పత్రికా ముఖంగానో, పుస్తక రూపంలోనో ప్రచురిస్తున్నారు- ఆత్మతృప్తికోసం, భాషాభిమానం చంపుకోలేక. అటువంటి మరో ప్రయత్నమే 'మన భాషు అనే శీర్షికతో వార్తాపత్రిక “వార్తలో ధారావాహికంగా దాక్టర్ డి.చంద్రశేఖరరెడ్డి రాసిన వ్యాసపరంపర, బహుకాలం అధ్యాపన వృత్తిలో ఉండడమేగాక పరిశోధన ప్రవృత్తిగా కూడా ఉన్న వాడు కాబట్టి మన భాషను గురించి మనవాళ్లకు సాధ్యమైనంత సూటిగా తెలియ జెప్పాలని ఆరాటపడ్డాడు - పడుతున్నాడు.
మనకు సాంప్రదాయకంగా అందుబాటులో ఉన్న వ్యాకరణ గ్రంథాలు సూత్ర పద్ధతిలో రాసినవి. ఆధునిక భాషాశాస్త్రజ్ఞులు రాసినవి బీజగణితంలో రేఖా గణితాదులు కలిపి రాసినవి. వాటిని చదివి మన భాషను గురించి దాని లక్షణాలను గురించి తెలుసుకోవాలంటే తరగతి
మనభాష 7
గదుల్లో కూర్చొని గురుముఖతః అధ్యయనం చెయ్యక తప్పదు. అందుకు కావలసిన విశ్రాంతి, అర్హత, వయోధర్మం వగైరాలు అందరికీ ఉండవు. మన నిఘంటువులు ఒక పట్టాన దొరకవు. దొరికే వాటిని కొనటానికి చాలామందికి (ఆర్థిక) శక్తి చాలదు. సాధ్యమైనంత ఎక్కువ మందికి అందుబాటులో ఉంచగలిగినవి వార్తాపత్రికల్లో ధారావాహికంగా వెలువరించగలవే. ఈ వాస్తవం తెలిసిన దాక్టర్ చంద్రశేఖరరెడ్డి ఆ విధంగా వెలువరించిన వ్యాసపరంపరకు ఈ విధంగా (గంధ రూపమిచ్చి భాషాభిమానమున్న కొద్దిమంది తెలుగువాళ్ళకైనా సేవచేసిన పుణ్యం పొందాలని తావత్రయపడుతున్నాడు. ఈ ప్రయత్నాన్ని అభినందించాలి. మన భాషను గురించి మనవాడు మనకు వివరించటం, మనం చదివి లాభపడటం రెండూ హర్షించవలసిన విషయాలే. తెలుగు రాయటంలో, ఉచ్చరించటంలో సాధారణంగా కనిపిస్తున్న లోపాలను పేర్కొని వాటిని సరిదిద్దబంతో రచన ఆరంభమవుతుంది. ఒత్తు లెక్కడున్నవో తేలక బాధపడే వాళ్ళు మనలో చాలామంద్ధి ఉన్నారు. సంధులెలా చేస్తే సరిగా ఉంటుందో తెలుసుకోవటం మంచిది. మన భాషమీద అన్యభాషల ప్రభావం ఏ మేరకు మార్పులు తెచ్చిందో తెలియటం మెరుగు. ఒకే పదం విశేష్యంగా 'క్రియగా విశేషణంగా ఉన్న సందర్భాలనేకం. అవేమిటో తెలియటం అవసరం. మాటలకున్న అర్థాల్లో ఎన్నో విధాల మార్పులు వస్తుంటాయి. స్ట్థూలంగానైనా వాటిని గమనించక తప్పదు. పర్యాయవదాలనిపించేవి కొన్ని అయితే నానార్ధాల్లో వినిపించేవి మరికొన్ని వాటిని గుర్తించటం అవసరం. ఇవన్నీ ఒక ఎత్తయితే సంస్కృతం నుంచి తెలుగులోకి పెద్ద మాళ్పు ల్లేకుందా వచ్చి చేరిన మాటల గురించి చేసిన విశ్లేషణ మరోఎత్తు. ఏ ఉపసర్గ చేరినప్పుడు ఏ ధాతురూపానికి ఏ అర్థవిశేషం వస్తుందో రచయిత చాలా విపులంగా వివరించాడు. సంస్కృత తద్ధిత (ప్రత్యయాలనూ, రూపాలనూ విశదీకరించాడు. ఈ వివరాలకోసం నిఘంటు వ్యాకరణాలను గాలించవలసివస్తుంది. పారకులకు ఆ (శ్రమ తప్పించటానికి చంద్రశేఖరరెడ్డిగారు తాము పరిశ్రమించారు. రచనా ధోరణి చూస్తుంటే కృత్చ్రత్యయాదులనూ, ఇతర వ్యాకరణాంశా లనూ విశదీకరిస్తూ మరో (గ్రంధం వెలువరించబోతున్నట్లుంది. అలాగే జరుగుగాక (గ్రంథంలోని అన్ని అంశాలనూ ప్రస్తావించటం వరిచయోదేశం కాదు. స్థాలీపులాకంగా వ 'ప్రయోజనాన్నీ ప్రస్తావించింది రచయిత పాండితీ పరిథమలను నందుని నో. ఇంత మంచి రచనను పరిచయం చేసే అవకాశం నాకు కల్చింగ్ (గ్రంధం త్వరలో వెలువడుతు. భంపరాను. మనభాష విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు ముర ఈ రచన చాలా ఉపకారకము ఆశిస్తూ, వెలువరించమని అర్ధిస్తూ, భాషాపరిజ్ఞాన సాధన ని పాఠకులకు తెలియబరుస్తున్నాను. భాషాభిమానులు ఈ (గ్రంథాన్ని సమాదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. -_బూదరాజు రాధాకృష్ణ 68. ఉమనభాష
ఇఖరంతర ప్రవాహం భాష
మౌనవ విజ్ఞానం బహుముఖంగా అనంతంగా విస్తరిస్తూ ఉంది. ఈ విజ్ఞాన విస్తరణకు వాహిక భాష. ఎంత సాంకేతికాభివృద్ధి జరిగినా, ఎన్ని యంత్రాలు వచ్చినా భాష ఉపయోగం పెరిగేదే కాని తరిగేది కాదు. భాషాభివృద్ధికి ఎటువంటి అడ్డంకులూ ఉండవు. భాష దినదిన (ప్రవర్ధమానం. భాషా స్వభావం గురించీ, భాషా నిర్మాణం గురించీ ఎంతో పరిశోధన జరిగింది. ప్రపంచంలో అనేక భాషలకు వ్యాకరణాలు వచ్చాయి. సంస్కృత భాషకు పొణిని రచించిన అష్టాధ్యాయి అన్న వ్యాకరణం అసమానమైనదిగా ప్రపంచ భాషా శాస్త్రవేత్తలు వేనోళ్ళ కొనియాడుతున్నారు. ఏ భాషకైనా సమగ్రమైన నిర్దుష్టమైన, నిర్దిష్టమైన వ్యాకరణ రచన ఒక ఆదర్శమే. భాష కాల పరిణామంలో పొందిన అభివృద్ధినీ, మార్పులనూ విశ్లేషిస్తూ నిరంతరంగా వ్యాకరణరచన కూడా కొనసాగుతూ ఉండాలి. వ్యాకరణం కంటే కూడా క్షణక్షణ పరిణామాలకు లోనయ్యేది నిఘంటువు. మన విజ్ఞానం పెరిగేకొద్దీ నిఘంటువులో కొత్త మాటలు వచ్చి చేరుతూ ఉంటాయి. మన భాషలో ఉన్న పదజాలంతోనే చిరుమార్చులతో కొత్త పదాలను సృష్టించుకోవచ్చు. పదాల కూర్చుతో, మార్పులతో కొత్త భావాలను ప్రకటించవచ్చు. అవసరమైనప్పుడు అరువు తెచ్చుకోవచ్చు. ప్రతిభాషలోనూ పెరుగుదలకు విస్తృతమైన అవకాశం ఉంటుంది.
మన భాషకు ఏడెనిమిది వందల సంవత్సరాల నుండి లిఖిత వ్యాకరణాలున్నాయి. గత శతాబ్దం వరకు కంఠస్థం చేయడానికి అనుగుణంగా పద్యాలలో వ్యాకరణాలను రచిస్తే గత శతాబ్దం నుండి వచనంలో సూత్ర వ్యాకరణాల రచన ప్రారంభమయింది. అయితే ఈ వ్యాకరణాలలో ఎక్కువ భాగం మన కాన్య భాషను వర్ణించేవి. వాడుక భాషను వర్జించేవి కావు. గత శతాబ్దం వరకు మన నిఘంటువులు కూడా పద్య రూపంలోనే ఉండేవి. ఇవి పర్యాయ పద నిఘంటువులు. అర్ధ వివరణ వీటిలో ఉండదు. ఈ నిఘంటువుల పరిమాణం కూడా పరిమిత మయిందే. గత శతాబ్దంలో అకారాది క్రమంతో అర్థ వివరణాత్మకమయిన వచన నిఘంటువులు ప్రారంభమయ్యాయి.
తెలుగు భాషకు అటు కావ్యభాషకు కాని, ఇటు వాడుక భాషకు గాని లిఖిత రూపంలో ఒక సమగ్ర వ్యాకరణం కాని, ఒక సమగ్ర నిఘంటువు కాని లేవు. కిందటి శతాబ్దం చివరి పాదంలో మహామహుల ఉద్యమాల ఫలితంగా వాడుకభాష రచనా
మనభాషల $
భాషగా రూపొందింది. ఆధునిక రచనాభాష/ ప్రమాణభాష రూపుదిద్దుకొంది. ఈ ఆధునిక రచనాభాషకు ఒక మంచి వ్యాకరణమూ, ఒక మంచి నిఘంటువూ రావల సిన అవసరం ఎంతో ఉంది. అట్లాగే భాషా పరిణామాన్ని నిరూపించే వ్యాకరణాలూ, నిఘంటువులూ రావాలి.
భాషా ప్రాధాన్యం మనకు తెలుసు. అయినా భాషా ప్రయోగంలో మనం తగినంత శ్రద్ధ చూపించడం లేదు. ఈ అ(శ్రద్ధ రాయడంలోనూ ఉంది. సలక్షణ మయిన భాషను నిరూపించడంలోనూ ఉంది. ఒక ఇంగ్లీషు మాటను రాసేటప్పుడు ఆ మాట వర్ణక్రమం (స్పెల్లింగు)లోనూ, బెచిత్యవంతమయిన ప్రయోగంలోనూ ఎరితో జాగ్రత్తగా ఉంటాం. సంస్కృతమయినా, హిందీ అయినా మరే ఇతర భాష అయినా అంతే. మాతృభాషను వాడడంలో మనకు కొంత నిర్లక్ష్యం ఉందనడంలో సందేహం లేదు. దుకాణాల పేర్ల బోర్డులు కానీ, గోడలమీద రాసిన నినాదాలు, అడ్వర్హయిజుమెంట్లుగాని, పోస్టర్లుకాని, కరపత్రాలు కాని చూసినప్పుడు ఈ విషయం అర్ధమవుతుంది. ఇప్పుడు కొంత మెరుగుదల కనిపిస్తున్నా ఇంకా ఎంతో మార్పు రావలసిన అవసరం ఉంది. ఇంతమంది తెలుగు వారిలో ఆధునిక రచనాభాషను సలక్షణంగా వాడగలిగిన వారి సంఖ్య పరిమితమే. మన ఉపన్యాసాలు కూడా అటు (గ్రాంథికమూ, ఇటు వ్యావహారికమూ కాని సంకర భాషలో ఉంటాయి. ప్రతి తెలుగు వాడూ చక్కని తెలుగు మాట్లాడగల, రాయగల సామర్థ్యాన్ని సాధించాలి. సర్వ సామర్భాలకూ మూలం భాషా సామర్థ్యం. మన పాఠశాలల్లోనూ, కళాశాలళ్లనూ భాషా బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ భాషను విషయంగా తీసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి అన్న దృష్టితో మనం వ్యవహరించడం దురదృష్టకరం. ఏ భాషను నేర్చుకోవడమూ దోషం కాదు. కాని మాతృభాషను వదిలిపెట్టడం సరికాదు.
పాఠశాలల్లో భాషా బోధనకు ఎక్కువ సమయం వినియోగించాలి. భాష బోధనలో అధ్యాపకులకు మంచి శిక్షణ ఇవ్వాలి, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో ఎ అధ్యాపకుడయినా భాషను బోధించవచ్చునన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలి. 'ప్రాథమిక పాఠశాలల్లోనే ఎక్కువ సామర్ధ్యం ఉన్న, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల అవసరం ఉంటుంది. ఈ ఉపాధ్యాయులను ప్రోత్సహించవలసిన అవసరం చాలా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భాషా బోధనలో జరుగుతున్న పరిశోధనల ఫలితాలను ఎప్పటికప్పుడు వీరికి అందించవలసిన అవసరం ఉంది. పత్రికలు సమాచారాన్ని అందించడమే కాక ప్రజల భాషా సామర్థ్యాలను పెంచగలవు కూడా. అందువల్ల
10 అమనభాష
పత్రికలు తాము అందించే భాష విషయంలో తగినంత జా(గ్రత్త వహించాలి.
“వార్తలో 'మన భాష శీర్షికను ప్రారంభించినప్పుడు మన మాటల వర్ణక్రమమూ, పదనిర్మాణమూ గురించి చెప్పాలనుకున్నాను. పద నిర్మాణంతో పాటు ఆ పదాల అర్ధచ్భాయలూ, వాడుకా కూడా కొంతవరకు తెలిపే ప్రయత్నం చేశాను. కొంత చమత్కారమూ, హాస్యమూ, కథన ధోరణీ ఉంటే తప్ప సామాన్య ఫాఠకులకు ఆకర్షణీయంగా ఉండదన్న అభిప్రాయం ఒకటి ఉంది. కాని వ్యక్తిగతంగానూ, పత్రికాముఖంగానూ ఉత్తరాలు రాసి చాలామంది పాఠకులు ప్రోత్సహించారు. భాషను గురించి ఎంతచెప్పినా తరిగేదికాదు. చదువుతున్న కొద్దీ, ఆలోచిస్తున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు స్ఫురిస్తుంటాయి. పాత విషయాలను మళ్ళీ గుర్తు చేసుకోవడం, కొత్త వాటిని గురించి ఆలోచించడం నిరంతరమూ జరగవలసిందే. మన అభిప్రాయాలను నలుగురితోనూ పంచుకోవడానికి పత్రికలు బాగా ఉపయోగ పడతాయి.
“వార్తలో 'మనభాషుకు స్థానం కల్పించి నూరు వారాలపాటు కొనసాగించిన “'వార్త యాజమాన్నానికీ, సంపాదకులు శ్రీ కె.రామచంద్రమూర్తి గారికీ కృతజ్ఞతలు. బద్ధకించకుండా ప్రోత్సహించిన కృష్ణకూ, గుడిపాటికీ కృతజ్ఞతలు చెప్పాలి.
'మనభాషు పుస్తకం రూపంలో రావాలని మిత్రులూ, విద్యార్థులూ, ముఖ్యంగా అధ్యాపకులు చాలామంది కోరిక వెలిబుచ్చారు. మీడియాహౌస్ పబ్లికేషన్స్ ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ డా॥ గోవిందరాజు చక్రధర్ దీనికి పుస్తకరూపం ఇచ్చారు. భాషా సాహిత్యవేత్త, గురుతుల్యులు డా॥ బూదరాజు రాధాకృష్ణగారు అభిమానంతో 'పరిచయం'” అందించారు. వారికి నా హార్దిక కృతజ్ఞతలు.
నా రచనావ్యాసంగానికి నిరంతరం ప్రోత్సాహం ఇచ్చే మిత్రులు డా॥ కాకాని చక్రపాణిగారు, ఆచార్య ఏ.ఉషాాదేవిగారు, డా॥ కె.లక్ష్మీనారాయణశర్మగారు, నా అర్థాంగి డా॥ రాజ్యలక్ష్మి, పిల్లలు హిమ, పావన్లు.
“వార్తలో ధారావాహికంగా వస్తున్నప్పుడు ప్రోత్సహించిన అసంఖ్యాక విద్యార్థి మిత్రులూ, అధ్యాపక మిత్రులూ, సహృదయ పాఠకులూ అందరికీ కృతజ్ఞతలు. భాషాజ్ఞానానికి ఈ రచన ఏమాత్రం తోడ్చడినా కృతార్థుణ్ణి.
-డి.చంద్రశేఖర రెడ్ది మనభాషతి 11
జట్ కే ల | మీడియా హౌస్ పబ్లికేషన్స్ పుస్తకాలు మ
- నవతరంగం వల్లూరి రాఘవరావు 75 2 మీరు సామాన్యులు కారు ఆకెళ్ళ రాఘవేంద్ర 75, ఇ మీ గురించి మీకు తెలుసా? డాక్టర్ పి.ఎస్.గోపాలకృష్ణ 75; త్త ఫన్ దేహాలు హాస్యబ్రహ్మ శంకర నారాయణ 100 ఈ “పన్ొపరాగ్ హాస్యబ్రహ్మ శంకర నారాయణ ర్0 6 శంకర నారాయణ హాస్యబ్రహ్మ శంకర నారాయణ 100 అప్రస్తుత ప్రసంగాలు 7 జయదేవ్ కార్టూన్లు జయదేవ్ 100 ఓ నిజాం-భబ్రిటీష్ సంబంధాలు సరోజినీ రేగాని 150 9 జర్నలిస్టులకోసం దాక్టర్ గోవిందరాజు చక్రధర్ 70
- అనువదించడం ఎలా?" డాక్టర్ గోవిందరాజు చక్రధర్ రిం 11 ప్రచారం పొందడంఎటా? దాక్టర్ గోవిందరాజు చక్రధర్ 70 12 వ్యాసప్రభ దాక్టర్ పొత్తూరి వెంకటేశ్వర రావు 150 13 చింతన డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వర రావు ర0 14 చిరస్మరణీయులు డాక్టర్ పొత్తూరి వేంకటేశ్వర రావు 50 కళ. విన్నంత కన్నంత బూదరాజు రాధాకృష్ణ 100, 16 మంచిజర్నలిస్టు కావాలంటే బూదరాజు రాధాకృష్ణ 75 17 అనువాద పాఠాలు. బూదరాజు రాధాకృష్ణ 60
- తెలుగు సంగతులు బూదరాజు రాధాకృష్ణ 75 19 సొంత కథ రాంభట్ల కృష్ణమూర్తి 80
- మన భాష డాక్టర్ డి.చంద్రశేఖర రెడ్డి 100
- సంహిత (సాహిత్య వ్యాసాలు) _ డాక్టర్ డి.చంద్రశేఖర రెడ్డి 100
- బబవంతులు(అనువాద కవితలు) దాక్టర్ డి.చంద్రశేఖర రెడ్డి తెరి | 28. పతిత పావని, థ్రిల్లింత కాకాని చక్రపాణి (ఒక్కో సంపుటి) 60 కథల సంకలనాలు 24 నివురు కాకాని చక్రపాణి కథలు 60 25, ది ఘోస్ట్ (నవల) కాకాని చక్రపాణి, గోవిందరాజు చక్రధర్ 669 26 గోరంతదీపం (నవల) కాకాని చక్రపాణి, గోవిందరాజు చక్రధర్ 36
- 100064౧201 520202 286 ౧ లట ౨6౫2 గఖ30 450 ప్రతులకు [6612 0456 2401624015 1-9-289/4, 860౧1౧6 ౧౦౩01109, *౪1ర/2౧2921 662026 - 500044, (€; 2760 7307
ఇది వచనయుగం
యాతృభొష మాట్లాడడంలో ఎవరికీ కష్టం ఉండదు. ప్రతి వ్యక్తీ తన సామాజిక పరిధిలో భాషను తన అవసరాలకు అనుగుణంగా ఉపయోగించగలడు. కాని కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భాషను అందరూ ఒకేవిధంగా ప్రయోగించలేరు. మామూలుగా బాగా మాట్లాడే వ్యక్తి వేదికనెక్కి మాట్లాడ వలసివస్తే నోటమాటరాకపోవచ్చు. ఇటువంటి పరిస్థితికి సభాకంపం ఒక కారణమయితే, తను సరిగా మాట్లాడుతున్నాడో లేదోనన్న అనుమానం మరో కారణం. మాట్లాడడంలో ఏ సమస్యా లేనివారికి రాసేటప్పుడు సమస్యలు వస్తాయి. రాసేభాషకూ మాట్లాడే భాషకూ తేడా ఉండడమే దీనికి కారణం. ప్రతిభాషలోనూ ఈ తేడా ఉంటుంది. '
తల్లిదం[డ్రులనుండీ, పరిసరాలనుండీ పిల్లలు 'భాష మాట్లాడడం సహజంగా నేర్చుకుంటారు. రాయడం ఇలా అప్రయత్నంగా వచ్చేది కాదు. ప్రయత్నించి నేర్చుకోవాలి. ప్రయత్నించి నేర్చుకొనే ఏ విషయనయినా ఎంతి నేర్చుకుంటామన్నది నేర్చుకొనే వ్యక్తి అవస రాన్నిబట్టి, సామర్థ్యాన్నిబట్టి ఉంటుంది. పూర్వం చదువుకున్న వాళ్ళు అంటే గురువుద్వారా ఏదో ఒక శాస్రాన్ని అధ్యయనం చేసినవాళ్ళు. వాళ్ళకు రాయడమూ, చదవడమూ రాకపోయినా పండితులే. కాని ఇప్పుడు చదువుకున్నవాళ్ళు అంటే రాయడమూ, చదవడమూ వచ్చినవాళ్ళని అర్ధం సంతకం పెట్టడం వస్తే అక్షరాస్యులయిపోయే కాలంకదా ఇది. అందువల్ల రాతకు చాలా ప్రాధాన్యం ఉంది.
ప్రాచీన కాలంలో విద్యాభ్యాసం అంతా మౌఖికంగా జరిగేది. శాస్త్రం తేలికగా కంరస్థం కావాలంటే పద్యరూపంలో ఉండాలి. అందువల్ల శాస్తరచన కూడా పద్యంలోనే జరిగేది. బహుశా ఆ రోజుల్లో పత్రికలుండి ఉంటే అవికూడా పద్యరూపంలో వచ్చి ఉండేవేమో. శాస్త్రవేత్తలు కూడా ఛందస్సు నేర్చుకుని ఛందోబద్ధంగా శాస్తరచనలు చేశారు. ముద్రణ లేదు కాబట్టి పుస్తకాలు అందుబాటులో ఉందేవికాదు. చదువుకొనేవాళ్ళ సంఖ్య కూడా చాలా పరిమితంగా ఉందేది. ఇప్పుడట్లాకాదు కదా. ఇది సార్వజనీన విద్య, అందరూ చదువుకోవాలి. వివిధ భాషల్లో కోట్ల (గ్రంథాలు ప్రచురితమై ప్రపంచమంతటా వ్యాప్తిలో ఉన్నాయి రకరకాల గ్రంధాలతోపాటు అసం ఖ్యాకంగా పత్రికలూ వ్యాప్తిలో ఉన్నాయి. చదివే విషయ బాహుళ్యం వల్ల చదివిందంతా కంరస్థం చేయడం సాధ్యంకాదు. అందువల్ల పద్యంలోనే రచన చేయవలసిన అవసరం పోయింది.
ఆనాడు చదువుకున్న ప్రతి వ్యక్తికీ పద్యరచన తెలుసుకాబట్టి కవిత్వంతో పాటు అన్ని విషయాలు పద్యంలో ఉండేవి. గద్యం కూడా ఒక సాహిత్య ప్రక్రియగానే ప్రధానంగా వాడుకలో ఉంది. తెలుగుకవులు పద్యరచనలో ఎన్నో నియమాలు పెట్టుకున్నారు, పద్యం ఎంతక్షిష్టంగా ఉంటే అంత గొప్ప. కందం రాసినవాడే కవి అన్న నానుడి అందుకే ఏర్పడింది. కంద పద్యానికి నియమాలు ఎక్కువ. కవులు భాషతో అటలాడుకున్నారు. పద్యంలో కవిత్వం ఉన్నాలేకపోయినా అందులో ఉండే లయవల్ల అందంగా ఉంటుంది. వినేవాడికి అందులో ఏదో గుణం కనిపించక పోదు. వచనం అట్లాకాదు. వచనం రాసి మెప్పించడం కష్టం. అందుకే 'గద్యం కవీనాం నికషం వదంతి' అనే నానుడి ఏర్పడింది.
ఇది వచన యుగం. పద్యం కవిత్వానికే పరిమితమయింది. కవిత్వం కూడా ఛందోనియ
మనభాషతి 13
మాల్ని విడిచిపెట్టి వచన రూపం తీసుకున్న కాలం. అందువల్ల నేటి అవసరం వచనరచన పుస్తకాలూ, పత్రికలూ విస్తారంగా పెరిగాయి. కాబట్టీ రాయవలసిన అవసరమూ, రాసెవాళ్ళ అవసరమూ కూడా పెరిగింది. తెలుగులో వెయ్యేళ్ళ లిఖిత సాహిత్యం ఉంది. వెయ్యేళ్ళ కింద స్థిరపడిన రచనాభాష ఎటువంటి అవాంతరాలూ లేకుండా ఈ శతాబ్దం 'ప్రారంభందాకా కొనసాగింది. ఛందోబద్ధమైన పద్యరచన నేటికీ కొనసాగుతూనే ఉంది ఈ శైలి ఆధునిక అవసరాలకు సరిపోదనే అభిప్రాయం తో గత శతాబ్దాంతంలో వ్యావహారిక భాషోద్యమం (ప్రారంభమయింది ప్రస్తుతం (గ్రాంధికభాషలో వచన రచన చేసేవాళ్ళను వేళ్ళమీద లెక్కించవచ్చు. ఆధునిక రచనాభాష ఈ వందేళ్ళలోనూ అభివృద్ధి చెందింది. పూర్వం సంస్కృతం విద్యామాధ్యమంగా ఉండడంవల్లా, తెలుగులో సాహిత్యరచన చాలా వరకు సంస్కృత సాహిత్యం మీద ఆధారపడడంవల్లా వేలకొద్దీ సంస్కృత పదాలు తెలుగులోకి వచ్చి చేరాయి. పూర్వం దక్షిణాపథం అంతా ఒకేపాలనలో ఉండడంవల్ల కొన్ని ప్రాకృత పదాలు వచ్చిచేరాయి. మధ్యయుగాలలో కొన్ని తమిళ కన్నడ పదాలు చేరాయి. వదమూడో శతాబ్దిం నుండి ఉర్దూ, ఆరబిక్, పర్షియన్ వదాలూ డచ్చి, పోర్చుగీసు, ఫ్రెంచి, ఇంగ్లీషు పదాలు చేరాయి. ఈ ఆధునిక కాలంలో శాస్త్రరచనలో పరిభాషను కల్పించుకోవడంలో మనం ఇంకా సంస్కృతం మీదే ఆధారపడి ఉన్నాం. అట్లాగే ఇంగ్లీషు నుండి కూడా యధేచ్చగా పదాలు అరువుతెచ్చు కుంటున్నాం, ఇప్పుడు తెలుగులో రాస్తున్న వాళ్ళు చాలామంది ముఖ్యంగా పత్రికారచయితలు కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నది. గత వెయ్యేళ్ళ గ్రాంధిక భాషా ప్రభావం నుండి బయట వడడం ఒక సమస్య. ఇతర భాషల నుండి అరువుతెచ్చుకున్న, తెచ్చుకుంటున్న మాటల్ని తెలుగు లో రాసేపద్ధతి రెండో సమస్య. అవసరమయిన కొత్త పదాల్ని కల్పించుకోవడం ఎలా అన్నది మూడో సమస్య తెలుగు రచయితలకు తెలుగుభాషా సంప్రదాయంతోపాటు, కొంత సంస్కృత భాషా సంప్రదాయం కూడా తెలిసి ఉండాలి. సంస్కృత పదాలు, పదబంధాలు విస్తృతంగా వాడతారు కాబట్టి సంస్కృత పదనిర్మాణం, సంధి, సమాస నిర్మాణాలకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానం తెలుగురచయితకు అదనపు భారం. దీనితోపాటు ఆధునిక రచనాభాషా సంప్రదా యాన్ని తెలుసుకోవడానికి అవసరమయిన సామగ్రి కూడా అంతంతమాత్రమే. వాళ్ళు ఎక్కువగా తొము చదివిన జ్ఞాపకంమీద తమ వివేచనాశక్తి మీదే ఆధారపడవలసి వస్తుంది. పొరపాట్లూ దొర్లుతూ ఉంటాయి. అందువల్ల ఆధునిక రచనాభాషకు ఒక నిర్దుష్ట సంప్రదాయం ఏర్పడ వలసిన అవసరం ఉంది. బ్ 14 అమనభాష
రాతలో దోర్లీ పొరపాట్లు
చదవడమూ, రాయడమూ చదువుకున్నవాళ్ళ పని. మాట్లాడేటవూడు ఎదుటివాళ్ళకు అర్థ మయితే చాలు కాబట్టీ అంతవరకూ జాగ్రత్తపడతాం. మనం మాట్లాడిన విషయంలో కొంచెం అటూఇటూ అయినా ఎదుటివాడు అర్ధం చేసుకోగలుగుతాడు. మరీ అపార్థం కలిగేటట్లుంటే వెంటనే మనమే సరిచేసుకుంటాం. కానీ రాసేటప్పుడు అటువంటి అవకాశం ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాం. అయితే మాట్లాడేటప్పుడు లేని సమస్యలు కొన్ని రాసేటప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. మనం సరిగ్గానే రాస్తున్నామా అని చాలాసార్లు అనుమవూనం వస్తూ ఉంటుంది. ఈ అనుమానంవల్ల పొరపాట్లు కూడా దొర్లుతూ ఉంటాయి.
“బూ, “'బూలు తెలుగు మాటల్లో ఉండవు. వీటి ఉచ్చారణ “6% ట్రీ “రు ఈూ'లతో సమానంగా ఉంటుంది. అందువల్ల సంస్కృత పదాలను ఉచ్చరించేటప్పుడు ఈ రెండు రకాల ఉచ్చారణా కనిపిస్తుంది. ఉదాహరణకు 'కృష్ణును కొంత మంది 'క్రిష్ణు అనీ, కొంతమంది 'క్రుష్ట అనీ ఉచ్చరిస్తారు. 'బుతో మొదలయ్యే మాటలను 'రుూతో రాయడం సంప్రదాయంగా కూడా మారిపోయింది 'బుణం', 'బుతువు'లను 'రుణం), “రుతువు” అని రాస్తున్నారు. తెలుగులో 'బూ లేదు కాబట్టి పరవాలేదు మార్చుకున్నాం అనుకోవచ్చు. తెలుగు మాటల్లో 'బు* రాసినవ్చుడే సమస్య వస్తుంది.
'మంత్రి పదవి పోవడంతో ఆయన ఎంతో కృంగిపోయారు' - వంటి వాక్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 'భూమిలోకి కృంగిపోయింది', 'కృంగి, కృశించిపోయారు' వంటివీ కనిపిస్తాయి. “కృశించిలోని 'బు' ప్రభావమేమో కృంగదానికి. *క్రుంగు” అనేది తెలుగుమాట. తెలుగు మాటల్లో “బు” ఉండకూడదు కదా. 'క్రుంగు'లో రకారంపోయి 'కుంగు” అవుతుంది. “కుంగింది”, “కుంగి పోయారు అని రాయవచ్చు. 'కుంగడంి తప్పనుకొని దాన్ని “కృంగడం” చేశారు. ఈ పద్ధతే కొన సాగితే తుంచడం), “తృంచడం'” కావచ్చు 'కుక్కడం), “కృళ్మడం” కావచ్చు. “కుళ్ళిపడు”, “తృళ్ళి పదు' కావచ్చు.
తెలుగు మాటల్లోనూ సంస్కృతపదాల్లోనూ “బు “రూలను ఒకదాని బదులు ఒకటి రాయడం అలవాటయిపోతూ ఉంది. “తృటిలో తప్పిపోయిన రైలు ప్రమాదం' అని రాస్తున్నారు. “త్రుటి అన్నది సరయిన మాట. తామర రేకులో తీక్షణమయిన సూది దిగదానికి పట్టేకాలం అని అర్థం. ఒక లఘువును ఉచ్చరించడానికి వట్టే కాలంలో నాలుగోవంతు కాలం అని కూడా అంటారు. కనురెప్పపాటు, కన్నుమూసి తెరిచేంత తక్కువ సమయంలో అన్న అర్ధంలో ఈ మాటను వాడుతున్నాం. ఇది తెలుగుమాట కాదు. అందుకే 'రికారంపోయి “తుటి” అని కాదు, “త్రుటి అనే ఉంటుంది.
రాజకీయ నాయకులు పదవులకోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు” వంటి వాక్యాలూ కనబడతాయి. ఆత్రం అంటే “తొందర, 'త్వర' అనీ, “విపత్తు అనీ అర్ధం. 'అఆత్రపడు” అంటే 'త్వరపడు, 'కళవళపడు' అని అర్ధం. 'ఆతురపడు” అన్నా అదే అర్థం. సంస్కృతంలో “ఆతురమ్', 'విద్యాతురాణాం న సుఖం న నిద్రా అంటారు. 'ఆతురుడు' అంటే తొందరపడేవాడు. 'వ్యాధి (గ్రస్తుడు,, 'పీడితుడు' అని కూడా అర్ధాలున్నాయి. ఆతురత, ఆత్రుత అని రాయవచ్చు. ఆతృత
మనభాషతి 15
సరయిందికాదు. సర్టిఫికెట్ అన్న మాటకు సమానార్థంలో “ధృవపత్రం, “ధృవీకరణ వత్రం అని వాడు తున్నారు. ఈ వార్తను “ధృవీకరించారు అని రాస్తున్నారు. (ధ్రువం అంటే కదలనిది, శాశ్వత మైనది, 'నిశ్చితమయినది' అని అర్ధం. ధ్రువ నక్షత్రం ఉంది. ఉత్తర (ధ్రువం, దక్షిణ (ధ్రువం ఉన్నాయి. సంగీతంలో పధ్నాలుగక్షరాల కాలం కలిగిన తాళం ద్రువతాళం. ఈ అన్ని సందర్భాల లోనూ "ధ్రువం అన్నదే సరయిన మాట, 'ధృవం'కాదు. కొంతమంది “శతృవు అనీ, శళ్ళ స్థావరం” అనీ రాస్తుంటారు. శత్రువు, శత్రుస్థావరం సరయిన రూపాలు. ఉచ్చారణలో భేదం లేకపోవడంవల్ల రాతలో ఇటువంటి పొరపొట్లు దొర్హుతుంటాయి. దీనివల్ల పెద్ద నష్టమేమీ లేకపోయినా ఆ మాటలకు అర్థాలు తెలియనప్పుడు నిఘంటువులో వెతుక్కుంటే దొరకకపోవడం ఒక కష్టం. ఈ మాటలు తెలిసిన వారికి తవ్పు రూపాలు వికారంగా కనిపిస్తాయి. తెలియని పారకులు ఇవే సరయిన మాటలనుకొని వీటికి మరింత ప్రచారం కలిగిస్తారు. అందువల్ల సరయిన రూపం తెలుసుకొని వాడడం మంచిది చ 16 తఅమనభాష
బు బుంంలు
సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన పదాల్లో బు, బూ, %, శా అనే అచ్చులు ఉన్నాయి. వీటిలో శాతో వచ్చే మాటలు సంస్కృతంలోనే వాడుకలో లేవు. ౭ తో వచ్చే మాట "కస్తం మాత్రమే తెలుగులో వాడుకలో ఉంది. దీన్ని “క్లుప్తం” అని రాస్తున్నాం. అందువల్ల ౫ ాలతో సమస్యలేదు. బు, బూలలో కూడా బూతో వచ్చే మాటలు లేవు. క్రూర, (భ్రూ, భ్రూకుటి, భ్రూణ వంటి మాటలు ఎట్లా రాయాలన్న సందేహం అవసరంలేదు. వీటిలో బూ లేదు కాబట్టీ రకారం తోనే రాయాలి.
బు కారంతో ఉండే మాటలు తెలుగులో గణనీయంగానే వచ్చి చేరాయి. తెలుగువారి ఉచ్చారణలో బు కారానికి రి, రు అనే ఉచ్చారణలుంటాయి. అందుకే తెలుగు ఛందస్సులలో బు కారానికి రిరీ రెరేలతో యతి చెల్లుతుంది. బు-రులకు యతిని లాక్షణికులు అంగీకరించక పోయినా కొందరు కవులు మాత్రం ప్రయోగించారు. 'బుకి ర కారంతో ప్రాస చెల్లుతుంది. దీనికి కారణం ఉచ్చారణలో సామ్యమే. బుకారంతో ఉండే మాటలను బు కారంతోనే రాయాలా రకారంతో కూడా రాయవచ్చా అన్న అనుమానం వస్తుంది. బు కారానికి రకార లక్షణం కూడా ఉంది. సంస్కృతంలో యణాదేశ సంధిలోనూ, మరికొన్ని చోట్లా బు కారం రకారంగా మారుతుంది ఈ కారణాలవల్ల 'యూను “రగా రాస్తే తప్పేముంది అన్న భావన కలుగుతుంది.
ఒక్కొక్క భాషకు ఒక్కొక్క ధ్వని వ్యవస్థ ఉంటుంది. పరాయి భాషల నుండి మాటలను అరువుతెచ్చుకొనేటప్పుడు ఆవి మన భాషా ధ్వని వ్యవస్థలో ఇమిడితే మంచిదే. అట్లా ఇమడ నప్పుడు ఏం చేస్తాం? మన భాషలోని ధ్వనులకు అనుగుణంగా మార్చుకుంటాం౦. ఏవో కొన్ని మాటలే అయితే సాధారణంగా ఈ మార్పు జరుగుతుంది. చదువుకున్నవాళ్ళు అన్యభాషా పదాలను ఆ భాషలోని ఉచ్చారణతోనే పలకడానికి ప్రయత్నిస్తారు. సామాన్యులు తమ భాషా ధ్వనులకు అనుగుణంగా ఉచ్చరిస్తారు. ఈ అన్యభాషతో పరిచయం ఎక్కువయితే అఆ భాషా పదాలతోపాటు వాటి ఉచ్చారణను కూడా తీసుకుంటాం. సంస్కృత పదాలు మన భాషలోకి ఈ రెండు విధాలుగానూ వచ్చినా ఆధునిక కాలంలో మార్కు లేకుండా తెచ్చుకోవడానికే ప్రయత్ని స్తున్నాం. ఇంగ్లీషు మాటల విషయంలోనూ అదేవిధంగా జరుగుతోంది. ఉదాహరణకు వాస్పిటల్ అన్న ఇంగ్లీషు మాట తెలుగువారి ఉచ్చారణలో ఆసుపత్రిగా మారింది. కాని ఇప్పుడు. చాలా మంది వోస్పిటల్ అనే అంటున్నారు. కొంతకాలంపోతే ఆసుపత్రి వ్యవహారంలో తగ్గిపోయి హాస్పిటల్ సాధారణమైపోతుంది. “
సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన మాటల్లో పూర్వమే వచ్చినవి మార్పులు పొందకుండానూ వచ్చాయి, మార్పులు పొందీ వచ్చాయి. ఇప్పుడు వచ్చి చేరుతున్న మాటలు మార్పు చెందకుండానే వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో చేరుతున్న సంస్కృతపదాలు రెండు రకాలు, ఒకటి, సాధారణ భాషలో వాడుకలోకి వచ్చేవి. రెండు, వివిధ శాస్త్రాలలో పరిభాషగా వచ్చేవి. ప(త్రికాభాషలో కూడా ఇంగ్లీషు మాటల్ని అనువాదం చేసుకోవడంలో ఎన్నో సంస్కృత పదాలు, పదబంధాలు తెలుగులో ఏర్పడుతున్నాయి. ఇంత విసృతమయిన పదజాలం సంస్కృతం నుండి తెలుగులోకి వస్తూ ఉంది కాబట్టీ రాతలో నిర్జష్టతను అవలంబించాల్సిన అవసరం ఉంది.
మనభాషతి 17
ఇక బు కారంతో తెలుగులోకి వచ్చిన మాటల విషయానికి వద్దాం. 'బూతో మొదలయ్యే మాటల్లో ముఖ్యమైనవి - బుతువు, బుణం, బుష్‌కి బుత్విక్కు బుజువు (చకృ్కనిది. ఈ మాటల్ని ఇలాగే రాయడం మంచిదే. రుతువు, రుణం, రుషి రుత్విక్కు రుజువు అని రాయడం కూడా పరిపొటీ అయింది. అర్ధ ఖేదమేమీ లేదు కాబిట్టి ఇట్లా రాయడంలో నష్టంలేదు. "కృష్ణు అనే వదం కొంతమంది పేర్లలో 'క్రిష్ణగా మారింది. దీనికి ఉచ్చారణ ఒక కారణమయితే ఇంగ్లీషు వర్ణక్రమం మరొక కారణం. అయితే అన్ని మాటలూ ఇట్లా వూరలేదు. మనం (ప్రస్తుతం వాడుకున్న కొన్ని మాటలు చూడండి. కృతం అంటే చేయబడినది. రామాయణం వాల్మీకి కృతం' అంటాం. కృతి అంటే కావ్యం, రచన. కృప అంటే దయ, కరుణ, జాలి. కృపాణం అంటే కత్తి కృశ అంటే సన్నబడడం, చిక్కి పోవడం. కృషి అంటే వ్యవసాయం. గృధ్రం అంటే గద్ద. గృహం అంటే ఇల్లు. జృంభణం అంటే శరీరానికి సంకోచ వికాసాదులను పొందించేది. దీన్ని “వి అనే ఉపసర్గ చేర్చి విజృంభణ, విజ్బం భించు అని వాడుతున్నాం. తృణం అంటే గడ్డి, తృతీయ అంటే మూడవ. తృప్తి అంటే తనివి. తృష్ణ అంటే దప్పిక, కోరిక, దృధం అంటీ బలమైనది. దృశ్యం అంటే కనిపించేది. దృష్టి అంటే చూపు. ధృతి అంటే ధరించడం, ధైర్యం. నృ అంటే మనిషి, దీనినుండే నరుడు. అంత్రపాలజీని నృశాస్త్రం అని కూడా అంటారు. నృత్యం అంటే నర్తనం. నృపుడు అంటే రాజు. పృథక్ అంటే వేరవడం. వృధ్వి అంటే భూమి. పృధు అంటే విశాలమైన. భృతి అంటే భరణం, కూలి. భృత్యుడు అంటే పోషింపదగిన వాడు, సేవకుడు. మృగం అంటే జింక, వేటగాళ్ళు వెదికేది, జంతువు అనే సామాన్యార్థం కూదా ఏర్పడింది. మృగమదం అంటే కస్తూరి. మృగతృష్ణ అంటే ఎండమావి. మృగయా అంటే వేట, మృణాలం అంటే తామరతూడు. మృత్ అంటే మట్టి, మృతి అంటే చావు. మృత్యువు అన్నా చావే. మృదంగం అంటే మద్దెల. మృదు అంటీ మెత్తని, కోమలం. మృదులం అన్నా అదే అర్థం. మృష అంటే అసత్యం. మృష్టం అంటే శుద్ధమైనది. వృకం అంటే తోడేలు. వృక్షం అంటే చెట్టు, వృత్తం అంటే గుంద్రనిది, వార్త, జన[్రుతి. వృత్తాంతం అంటే జరిగినది. వృత్తి అంటే జీవనోపాయం. వృధా అంటే వ్యర్థం. వృద్ధత్వం అంటే ముసలితనం. వృంతం అంటే తొడిమ. వృశ్చికం అంటే తేలు. వృషభం అంటే ఎద్దు. వృష్టి అంటీ వర్షం, వాన. శృంఖల అంటే మొలనూలు, గొలుసు, సంకెల, శృంగం అంటే శిఖరం, కొమ్ము, కొన. శృంగారం ఒక రసం అలంకరణ అన్న అర్ధంలో కూడా వాడుతున్నాం. సృష్టి అంటే సృజింపబడేది. హృదయం అంటే గుండెకాయ. హృద్యం అంటే హృదయానికి ప్రియమైనది. ఈ అన్ని మాటలతోనూ మరెన్నో మాటలు తయారవుతాయి. వ్యాకరణ నియమాలననుసరించి కొన్నిచోట్ల 'బు”కారం ఉంటుంది. మరికొన్ని చోట్ల 'రకారం ఉంటుంది. పైవన్నీ మనం సాధారణంగా తెలుగులో వాడే మాటలే. వీటన్నింటినీ బు కారంతోనే రాయాలి. కొన్ని మాటల వాడుక విచిత్రంగా ఉంటుంది. బుతం అంటే నిజం. ఈ మాటకు తెలుగులో వాడుక తక్కువ. కాని దీని వ్యతిరేకార్ధక పదం అన్ఫతం వాడుకలో విస్సృతంగానే ఉంది. ఉపసర్గలు వాడి ఈ మాటలతో మరెన్నో మాటలను తయారు చేసుకోవచ్చు. (ప్రకృతి, వికృతి, అనుకృతి: (ప్రవృత్తి నివృత్తి ఆవృత్తి మొదలయిన విధంగా చాలా పదాలు ఏర్పడతాయి. శృతి, అపళ్ళతి అని తెలుగులో వాడుకలో కనిపిస్తుంది. కాని శ్రుతి, అనుశుతం, అపశ్రుతి అన్నవి సరయిన రూపాలు. ఎక్కడ బు కారమో, ఎక్కడ ర కారమో గుర్తించి రాయాలి. బి 18 అ మనభాష
అచ్చుతో ఎందుకు రాయాలి
మన భాష అజంత భాష అంటే పదాలన్నీ అజంతంగా ఉంటాయని అర్ధం. పదం చివర అచ్చు ఉంటుంది, హల్లు ఉండదు. అయితే ఆధునిక భాషలో పూర్ణబిందువుతో అంతమయ్యే మాటలెన్నో వాడుతున్నాం. ముఖ్యంగా 'మూతో అంతమయ్యే తత్సమ పదాలన్నింటినీ బిందువుతోనే ఉచ్చ రిస్తున్నాం, రాస్తున్నాం పుస్తకం, అంతం, వనం, బలం మొదలయినవి ఇటువంటివి. తెలుగు మాటల్లో మనం, మేం అనే సర్వనామాలను మాత్రం బిందువుతో రాస్తున్నాం. ఏం అన్న ప్రశ్నార్ధక సర్వనామాన్నీ బిందువుతో రాస్తున్నాం. 'మూతో అంతమయ్యే సార్వనామిక విశేష్యాలు అంద రము, చేసేవాళ్ళము మొదలయినవీ, 'ము'తో అంతమయ్యే క్రియలనూ బిందువుతో రాస్తున్నాం. ఉదాహరణకు వచ్చాం, తిన్నాం మొదలయినవి. ఈ మాటల్లో 'ము” పురుషబోధక ప్రత్యయం. ఈ మాటలన్నింటినీ హలంత వదాలు అనవచ్చు. ఇవికాక ఇంగ్లీషు, ఉర్జూ భాషల నుండి అరువు తెచ్చుకున్న మాటలెన్నింటినో ప్రస్తుతం హలంతాలుగా రాస్తున్నారు. ఈ మాటల్ని విడిచిపెడితే అధికశాతం మాటలు అజంతకాలే.
అచ్చుతో అంతమయ్యే మాటలు ఎక్కువగా ఉండడం వల్ల ఒకమాట తర్వాత మరోమాట వచ్చినప్పుడు ఆ మాట అచ్చుతో మొదలయిన మాట అయినప్పుడు రెండు అచ్చులు వరుసగా వస్తాయి. ఇటువంటి సందర్భంలో సంధి జరుగుతుంది. తెలుగులో సంధి జరగదం అంటే మొదటి పదం చివరి అచ్చు లోపించడం అన్నమాట. సంధి జరగకపోతే ఈ రెండు అచ్చుల మధ్యా ఒక హల్లు చేరుతుంది. ఆ హల్లు 'య' అని వ్యాకర్తలు చెప్పారు. (ప్రాచీన సాహిత్యంలో యడాగమమే కనిపిస్తుంది. అయితే ఉచ్చారణలో 'వి కూడా వినిపిస్తుంది. మా ఊరును కావ్య భాషలో మాయూరు అంటే వాడుకభాషలో మావూరు అంటారు. “మా” ఊరు” అనే రెండు మాటల మధ్య 'వి ఉచ్చారణలో వినిపిస్తుందన్నమాట. అట్లాగే "పెద్ద ఎత్తుని అన్నప్పుడు 'పెద్ద, - “ఎత్తుని మధ్య 'య' వినిపిస్తుంది. పెద్దయెత్తున అని. |
పదాలమధ్య వినిపించే ఈ య, వల వల్ల తెలుగులో ఒక ప్రశ్న తలెత్తింది. ౪, ఈ, ఎ, ఏ లనుయి, యీ, యె, యే అనీ, ఉ, ఊ, ఒ, ఓలను వు, వూ, వొ, వో లనీ ఎందుకు రాయకూడదూ అన్నది ఈ (ప్రశ్న. కొంత మంది ఇల్లును యిల్లు అనీ, ఈతను యీత అనీ, ఎవరును యెవరు, యవరు అనీ, ఏదిని యేది అనీ రాయడమూ, ఉట్టిని వుట్టి అనీ, ఊరును వూరు అన, ఒకటిని వొకటి, వకటి అనీ, ఓటమిని వోటమి అనీ రాయడమూ కనిపిస్తుంది. ఒకప్పుడు ఇట్లా రాయడమే వ్యావహారిక భాషా లక్షణమని కూడా కొందరు భావించారు. అయితే అజాది పదాలను అంటే అచ్చుతో మొదలయ్యే మాటలను హల్లుతో రాయడం వల్ల చేకూరే ప్రయోజన మేమిటి? సృజనాత్మక సాహిత్యంలో పాత్రోచితంగా ఉచ్చాలణకు అనుగుణంగ్లా రాయాలను కున్నప్పుడు రాయవచ్చు. మాండలిక భాషలో రచనలు చేసేటప్పుడు ఆ మాండలికంలో ఆ విధమైన ఉచ్చారణ ఉంటే రాతలో కూడా సూచించవచ్చు. కాని ఆధునిక ప్రమాణ భాషలో ఈ విధంగా రాయడం అవసరమా? అంటే అవసరం లేదనే చెప్పవచ్చు.
యకారం, వువూ ఎవౌవోలు తెలుగు మాటలకు ముందు లేవు. అంటే యకారంతో మొద లయ్యే మాటలు తెలుగు మాటలు కావు. అట్లాగే వువూ వొవోలతో మొదలయ్యే మాటలు కూడా
మనభాషతి 13
తెలుగు మాటలు కావు. యమున, యతి, యజ్ఞం వంటి మాటలు సంస్కృతం. వాక్యాదిలో అచ్చుతో మొదలయ్యే వదాన్ని హల్గుతో రాయడం వల్ల కలిగే ప్రయోజనమేమీ లేదు కాబట్టి దాన్ని అచ్చుతో రాయడమే మంచిది. వాక్యం మధ్యలో సంగతేమిటి? సమాసంలో రూఢమయిన రూపా లను యధాతథంగా వాడక తప్పదు. పేదరాలు పేదరాలే. వేపాకు వేపాకే. మేనత్తకు కావ్య భాషలో మేనయత్త అనికూడా రూపం. ఆధునిక భాషలో మేనయత్త అని రాయవలసిన అవసరం లేదు. వెలయాలు మొదలయినవి అట్లాగే వాడాలి. సమాసంలో కాకుండా విడిగా ఉన్నప్పుడు సంధి చేయవలసిన చోట సంధి చేయాలి. సంధి చేయడానికి వీలు లేనవ్చుడు అజాదిగానే రాయవచ్చు. యడాగమం చేయవలసిన పనిలేదు. ఉదాహరణకు మనిషి ఉన్నాడు అనే రాయ వచ్చు, మనిషి యున్నాడు అని రాయవలసిన అవసరంలేదు. మనిషి వున్నాడు అనీ రాయవచ్చు. సంప్రదాయ పద్ధతిలో చేసే పద్య రచనలో యడాగమం అవసరం కావచ్చు. ఆధునిక ప్రమాణ భాషలో, వచనంలో దాని అవసరంలేదు. అట్లాగే వడాగమం కూడా, అందువల్ల అజూది వదాలను హలాదులుగా రాయకపోవడం మంచిది. హలాదులుగా రాసినట్లయితే వదం సహజ స్వరూవం తెలియకుండా పోతుంది. అనుద్దిషుయిన రూపాలు ఏర్పడతాయి. ఒక (క్రమబిద్ధత లేకపోవడం వల్ల హల్లు రాయవలసిన చోట అచ్చూ, అచ్చు రాయవలసిన చో+ హల్లూ రాయడం జరుగుతుంది. వడ్డీ అనడానికి ఒడ్డీ, వంతెన అనడానికి ఒంతెన, వద్దు అనడానికి ఒద్దు, వగరు అనడానికి ఒగరు అని రాయడం ప్రామాణికం కాదు. అట్లాగే “ఒడలుకు “వడలు, “ఒడికి 'వడి “ఒంటరి'కి వంటరి, 'ఒకుకు “వకు, 'ఒప్పుకొనుకు “వప్పుకొను”, 'ఒప్పగించు'కు 'వప్పగించు? “జత్తిడికి, “వత్తిడి, “ఒడ్డుకు 'వద్దు, 'ఒడ్డాణం'కు 'వద్దాణం', “ఒడిసెలికు “వడిసెలి రాయడం సరికాదు. ఒగరు - వగరు, ఒడి - వడి, ఒక్క - వక్క ఒండు - వండు, ఒత్తి - వత్తి, ఒదలు - వదలు, ఒనరు - వనరు, ఒమ్ము - వమ్ము మొదలయిన మాటలకు అర్థభేదం ఉంది. అందువల్ల వీటిని ఒకదానికి బదులు ఒకటి వాడకూడదు. అజాది శబ్దాన్ని అజాదిగా, హలాది శబ్దాన్ని
హలాదిగా రాయడం వల్ల పదాల లేఖనంలో ద్వైరూపకతను కూడా తొలగించవచ్చు. ల్
20 అమనభాష
ఏది తెలుగు - ఏది సంస్కృతం
సంస్కృతంలో ఎ, ఒలు లేవు. మనం తెలుగులో వాడే సంస్కృత పదాలలో కూడా ఎ, ఒలు ఉండవు. ఎ, ఒలు ఉన్న మాటలన్నీ తెలుగు దేశ్య శబ్దాలు కాని, అన్య దేశ్యాలు కాని అయి ఉంటాయి. ఇంగ్లీషు, ఉర్జూ, తమిళం, కన్నడం నుంచి అరువు తెచ్చుకున్న మాటల్లో ఇవి ఉంటాయి. ఎ, ఒలు వచ్చే మాటలకు సంస్కృత వ్యాకరణ పద్ధతిలో సంధి చేయకూడదు. అంటే ఈ పదాలకు సవర్ణ దీర్హసంధి, గుణ సంధి వంటివి రావు. తెలుగు వ్యాకరణాలలో ఒక వింత సంప్రదాయం కనిపిస్తుంది. మొదలైన అన్న అర్ధంలో ఆది అనే మాటతో సంస్కృత సంధి చేసి ప్రయోగిస్తారు. ఉదాహరణకు పడు మొదలయిన అనడానికి పడ్వాదులు (పడు + ఆదులు) అని వాడుక ఉంది. వ్యాకరణ శాస్త్రంలో వ్యాకర్తలు పాటించిన ఒక సంప్రదాయంగానే దీన్ని గుర్తిం చాలి తప్ప సాధారణీకరించి అన్ని చోట్లా వాడకూడదు. పెను, వెల, వెలి, చెల్లు ఎండ వంటి మాటలు సంస్కృతం కావని తెలిస్తే వాటికి సంస్కృత సంధి చేయకుండా ఉండవచ్చు. పదంలోని ఎ, ఒలు ఆ పదం సంస్కృతం కాదని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.
తెలుగులో ఐ, బెలు ప్రత్యేక వర్జాలు కావు. అంటే వీటిని అయ్, అవ్ అని కూడా రాయ వచ్చు. ఐదును అయిదు అని రాయవచ్చు. ఐదువ - అయిదువ; ఐరేని - అయిరేని; ఐపు - అయిపు; తెలుగులో “అగూ ధాతువు నుండి వచ్చిన మాటలను ఐ, బెలతో రాయడం జరుగు తుంది. అగు- అయిన, అయితే, అయి, అయినా. వీటిని ఐన, ఐతే, ఐ, ఐనా అని కూడా రాస్తాం. అందమైన, అర్థమైతే అని సంధిలో కూడా రాయవచ్చు. లేకపోతే అందమయిన, అర్ధమయితే అనేవిధంగా రాయవచ్చు. ఈ రెండు విధాల లేఖనం తెలుగులో ఈ ఉచ్చారణ కలిగిన అన్ని మాటల్లోనూ ఉంటుంది. కైని 'కయి' అనవచ్చు. కైకూడు - కయికూడు, కైకొను - కయికొను, కైదండ - కయిదండ, కైపు - కయిపు, కైవసం - కయివసం, కైవారం - కయివారం, రైక - రయిక, దైవారు - దయివారు, పైరు - పయిర్సు, పైకం - పయికం, పైన - పయిన ఈ విధంగా తెలుగు మాటల్లో ఐ - అయిలు సర్వత్రా ఒకదానికొకటి రాయవచ్చు.
సంస్కృతం నుండి ఇతర భాషల నుండి తెలుగులోకి వచ్చిన మాటల్లో కూడా కొన్ని చోట్ల ఈ రెండు రకాల లేఖనమూ ఉంటుంది. ఇది సంస్కృత పదాల విషయంలో తద్భవాలలో సాధ్యమవుతుంది. ఉదాహరణకు 'కవిత' అనే మాట తెలుగులో 'కయితి అయింది. దీన్ని కైత అని కూడా రాస్తాం.
అన్య దేశ్యాలలో ఖైద్ అనే మాట తీసుకోవచ్చు. దీన్ని 'ఖైదు” అనీ 'ఖయిదు అనీ రాస్తున్నాం, జైదు”, 'కయిదు' అని కూడా రాయవచ్చు. అట్లాగే రైతు - రయితు.
ని 'అయ్'గా రాసినల్లే 'బౌను 'అవొగా రాయడం కూడా ఉంది ఉదా: బెడు - అవుడు, బెదల- అవుదల, బెరా - అవురా, జెను - అవును. 'అగుధాతు రూపాలు 'అవుగా ఏర్పడతాయి. అగు నుండే అవును, అవుట ఏర్చడ్డాయి. వీటి బెను, జెట అని కూడా రాయవచ్చు. కౌగిలి - కవుగిలి అని రాయవచ్చు. ఇటువంటి మాటలెన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని కౌజు - కవుజు, కౌను- కవును, గౌద- గవుద, గౌళి- గవుళి, గౌసెన - గవుసెన, చౌక - చవుక, చౌడు - చవుడు, చౌలం - చవులం, తౌడు - తవుడు, దౌడు - దవుడు, దౌడ - దవడ. తెలుగు మాటల్లో కొన్ని
మనభాషత 21
చోట్ల 'గ - 'వి అవుకుంది. ఉదాహరణకు రగులు - రవులు అవుతుంది, తగులు - తవులు అవుతుంది. ఇటువంటి సందర్భాల్లో “రవులును శాలు” అనీ, 'తవులును తౌలు అనీ రాయడం కూడా జరిగింది. ప్రస్తుతం రగులు, తగులు రూపాలే ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. అరువు తెచ్చుకున్న మాటల్లో కూడా “టో 'అవొ కావడం ఉంది. ఉదాహరణకు సంస్కృతం నుండి వచ్చిన రాహుత్తు తెలుగులో రౌతు అయి రవుతుగా కూడా మారుతుంది. నౌబత్తు - నవుబత్తు అని కూడా వాడుక, ఫౌజ్ తెలుగులో పౌజు అయింది. దీన్నే పవుజు అని కూడా రాశారు. అట్లాగే కౌలుకు “కవులు అన్నరూపం. ఇంగ్లీషు నుండి వచ్చిన 'శెటొను బెటు- అవుటు అని రెండు రకాలుగానూ రాస్తున్నాం. “ఐని 'అయ్గా, 'జౌను 'అవొగా రాయడం సంస్కృత పదాలలో కుదరదు. సంస్కృతంలో అనేక అర్భాలలో వదం మొదట ఉన్న అచ్చుకు వృద్ధి వస్తుంది. అంటే ఇ, ఈలు ఐ అవుతాయి. ఉ ఊలు బె అవుతాయి. ఉదాహరణకు కుంతి కొడుకులు కౌంతేయులు, కురు వంశజులు కౌరవులు. ఉరస్యుడు - జెరసుడు అంటే కన్నకొడుకు. పురుషుడు చేసినది పొౌరుషేయం. విమా నంతో దాటేవాడు వైమానికుడు. ఇంద్రజాలం చేసేవాడు ఐంద్రజాలికుడు. ఈవిధంగా అసం ఖ్యాకమయిన పదాలు తయారవుతాయి. యువ - యౌవనం, కుమార - కౌమారం, మూల - మౌలిక, చేతన- చైతన్య, కుతూహల - కౌతూహల, చిత్ర - చైత్ర, తిల - తైల, దితి - దైత్య, నీల -వైల్య, పుత్ర- పౌత్ర, జిన - జైన, బుద్ధ - బౌద్ధ మొదలైనవి ఇట్లా ఏర్పడ్డవే. వీటిని సాధారణంగా ఐ, బెలతోనే రాస్తాం. మవులిక, చయితన్య, చయి(డత్ర, తయిల, బవుద్ధ అని రాయం. కాని కొన్ని మాటల్లో రెండు రకాల లేఖనం కనిపిస్తుంది. ఉదాహరణకు యౌవనం - యవ్వనం. తెలుగులో ఊయల- ఉయ్యాల, తీయని - తియ్యని, చేయి - చెయ్యి, నేయి - నెయ్యి, నేయడం - నెయ్యడం వంటి వాటి సామ్యం వల్ల ఇది జరిగి ఉండవచ్చు. 'యౌవనరంి అన్నదే సరయిన రూపం. సంస్కృతంలో అయ్, అవ్లతో మొదలయ్యే మాటలను ఐ, బెలతో రాయడం కూడా సరికాదు. ఉదాహరణకు అయస్మాంతాన్ని ఐస్మాంతం అని కానీ అవసరాన్ని జెసరం అని కానీ రాయడం సరయింది కాదు. సంస్కృత పదాలలో ఐ, బెలను యధాతధంగా వాడాలి అయ్ - ఐ, అవ్ - బెలను ఒక దానిబదులు ఒకటీ వాడకూడదు. తెలుగులో రెండు రకాలుగానూ రాయవచ్చు. హై 22 తమనబాష
ఐసర్‌ల ఎక్కడ వాడాలి
తెలుగులో విసర్గ (9) లేదు. సంస్కృత పదాలతో పాటు ఇది తెలుగులో వాడుకలోకి వచ్చింది. విసర్గకు హకారోచ్చారణ ఉంటుంది. సంస్కృతంలో పదాంతంలో ప్రత్యయ రూపంలో దీనికి వాడుక ఎక్కువ. సమాసంలో రెండు మాటలు కలిసినప్పుడు మొదటిమాట చివర ఉన్న విసర్గకు సాధారణంగా లోపం వస్తుంది. ఇది సకారమో, రకారమోగా కూడా మారుతుంది. కొన్ని చోట్ల మార్చు లేకుండా విసర్గ అట్లాగే ఉండిపోవచ్చు.
సంస్కృత పదాలు తెలుగులోకి వచ్చినప్పుడు వాటి చివర ఉన్న విసర్గ లోపిస్తుంది, తెలుగు ప్రత్యయం వచ్చి చేరుతుంది. పదంలో భాగంగా ఉండి మరోరకంగా వాడడానికి వీల్లేని మాటలు మాత్రం చాలా తక్కువ. అటువంటి మాటల్లో ముఖ్యమైంది దుఃఖం. దీనికి బదులుగా దుక్టం, దుక్కం, దుఖ్ఞం అని వ్యవహారం ఉంది. సృజనాత్మక రచనల్లో ఇటువంటి లేఖనం ఉంది. కాని దుః ఖం అన్న రూపమే చాలా (ప్రచారంలో ఉంది.
విసర్గ చివర ఉండే మాటలు కూడా తెలుగులో వాడుతూ ఉన్నాం. వాటిలో పునః, వస్తుతు, స్వతః, బహుశః, ప్రాయశః, అన్యతః మొదలయినవి ముఖ్యమైనవి. "పునః అంటే మళ్ళీ అని అర్థం. మళ్ళీ మళ్ళీ అన్న అర్ధంలో పునః పునః అని వాడతాం. పౌనఃపున్యంగా అని కూడా ప్రయోగిస్తాం. పునఃపరిశీలన, పున॥వ్రయత్నం, పునః ప్రక్షాళన, పునఃపరీక్ష మొదలయిన విధంగా పునః ప్రయోగించవచ్చు.
వస్తుతః అంటే స్వభావరీత్యా అని అర్థం. వాడి గుణం అది. స్వతః అన్నా కూడా అదే అర్ధం. స్వతహాగా అని విసర్షకు బదులు హకారంతో వాడుక ఉంది. స్వభావతః అని కూడా అనవచ్చు.
బహుశః అన్నమాటకు తెలుగులో వాడుక ఎక్కువ. బహుశః అనీ, బహుశా అనీ కూడా రాస్తాం. చాలావరకు అని అర్ధం. ప్రాయశః అన్న మాట కూడా ఇటువంటిదే. తరచుగా అని దీనికి అర్థం.
అన్యతః అంటే మరోవిధంగా అని అర్ధం. సద్యః అంటే వెంటనే అని అర్ధం. సద్యః పర నిర్చృతి అంటే వెంటనే కలిగే నిరతిశయమయిన ఆనందం అని అర్ధం. కావ్యం చదవడం వల్ల సద్యః పరనిర్చృతి కలుగుతుందట. ప్రధమతః మొదటిగా అని అర్ధం. క్రమశః అంటే వరుసగా అని అర్థం. ఈ అర్థంలోనే కమేణ అనీ, (క్రమేపి అని కూడా వాడతాం.
జన్మతః అంటే పుట్టుక నుండీ అని అర్ధం. సర్వతః అంటే అన్ని విధాలా అని అర్ధం. సమాసంలో కొన్నిచోట్ల విసర్ణ యధాతధంగా ఉంటుంది. సాధారణంగా క, ఖ, ప, ఫల ముందు విసర్ణ మారదు. ఇటువంటి సమాసాలు సంస్కృతంలో బాగానే ఉన్నాయి. వాటిని తెలుగులో కూడా అట్లాగే వాడుతున్నాం. తెలుగులో ఇటీవల విస్తృతంగా వాడుతున్న సమాసపదం వయః పరిమితి. చాలా సందర్భాలలో వయోపరిమితి అని రాస్తున్నారు. ఇక్కడ విసర్గకు బదులు “ఓ రాదు. వయఃపరిమితి అనే అనాలి. అట్లాగే వయఃపరిణతి కూడా. వయఃపరిపాకం అనవచ్చు.
మనస్ అన్న మాట కూడా సమాసంలో క, ఖ, వ, ఫల ముందు మనః అవుతుంది. మనః ప్రవృత్తి, మనః పరిణతి, మనః కమలం, మనఃఖేదం, మనఃక్షోభ, మనఃఫలకం మొదలయినవన్నీ మనం సాధార్రణంగా వాడదేవే.
మనబాషతి 23
అంతఃపురం అన్నమాట కూడా మనం ఎక్కువగా వాడేదే. దీనిలాగే అంతఃకరణం కూడా. అంతఃకరణం అన్న మాటను మనస్సు అనే అర్ధంలో వాడుతున్నాం. ఈ రెండూ పూర్తిగా సమా నార్థకాలు కాకపోయినా “వాడి అంతఃకరణంలో ఏముందో, 'వాడి అంతఃకరణాన్ని అడిగితే తెలుస్తుంది" వంటి వాక్యాలలో మనస్సు, అంతరాత్మ అనే అర్ధాలే తోస్తాయి. (ప్రాతఃకాలం అంటే వేకువ సమయం, తెల్లవారుజాము. పొద్దున లేవగానే స్మరించుకోవల సిన వ్యక్తిని ప్రాతన్మరణీయుడు అంటాం. మెప్పుకోలుగా తల పంకించడం శిరఃకంపం చేయడం, మంత్రులందరిలో ముఖ్యుడు శిరః ప్రధాని. తపస్సు వల్ల కలిగిన ఫలం తపఃఫలం. కన్నులకు ఆనందం చక్షుః ప్రీతి. యశస్సు అనే శరీరం కలిగినవాడు యశఃకాయుడు. కీర్తిశేషుడన్నమాట. కీర్తికాయుడు అని కూడా అంటాం. ఇనువముద్ద అయఃపిండం. కాశీఖండం అయఃపిండం అని నానుడి. శ్రీనాధుని కాశీఖండం అయఃపిండం లాంటిదన్న మాట. ఉషస్సమయంలోని కిరణాలు ఉషఃకిరణాలు. పాలు తాగడంపయఃపానం. సముద్రుజ్ణి యాదఃపతి అని కూడా అంటారు. జలచరాలన్ని టికీ రాజని అర్థం. ఛందస్సును ప్రస్తరించడం ఛందఃప్రస్తారం. కొన్ని మాటల్లో విసర్ణతోనూ ప్రయోగం ఉంటుంది. పైమాటతో కలిపి సంధి చేయడమూ ఉంటుంది. మనఃశాంతి అనీ అనవచ్చు. మనశ్శాంతి అనీ అనవచ్చు. అదేవిధంగా దోఃశక్తి - దోశ్ళక్తి భుజబలం అన్నమాట. చతుఃషష్టి అనీ రాయవచ్చు, చతుష్పష్టీ అనీ రాయవచ్చు. నమ స్మారం, తిరస్కారం అన్నవాటిని నమఃకారం తిరః కారం అనీ అనవచ్చు. కాని తెలుగులో నమ సారం, తిరస్కారం అన్నవే వాడుకలో ఉన్నాయి. అహఃపతి అంటే సూర్యుడు. పగలుకు అధిపతి. అహర్చతి అని కూడా అనవచ్చు. గీఃపతి అంటే బృహస్సతి. గీర్పతి, గీప్పతి అని కూడా ప్రయో గించవచ్చు. . కఖ, ప, ఫల ముందు సకారాంత పదాల సకారం విసర్గ కావడం అన్ని చోట్లా జరగదు. ఉదాహరణకు శ్రేయస్+కాముడు శ్రేయస్మాముడు అవుతుంది. (్రేయఃకాముడు కాదు. అట్లాగే అయస్కాంతం, ఐహిష్మారం, భాస్కరుడు, దివస్పతి, సుయశస్ముడు, ధనుష్టండం, నిష్కారణం, దుష్కృతి, దుష్మార్యం, ధనుష్కోటి, చతుష్పథం మొదలయిన మాటలిటువంటివి. ల్ 24 తమవబాష
సున్నా ఎక్కడ
గణితంలో లాగానే మన లిపిలోనూ బిందువుకు చాలా ప్రాముఖ్యం ఉంది. తెలుగులో బిందువు రెండు రకాలు. అర్ధబిందువు, పూర్ణబిందువు. బిందువును అనుస్వారం అని కూడా అంటాం. సున్నసున్నా అనీ అంటాం. మనలిపిలో పూర్వం అర్ధ, పూర్ణ బిందువులకు ప్రత్యేకంగా లిపి చిహ్నా లుండేవికావు. ముద్రణ వచ్చిం తర్వాతే అరసున్నాకి “ల అనే లిపి చిహ్నం ఏర్పడింది. అంతకు ముందు నిండు సున్నానే రాసేవారు. దాని తరువాత ఉన్న హల్లునుద్విరుక్తంగా రాస్తే అది పూర్ణబిందువు. ఉదా; కొండ్డ. అద్విరుక్తంగా రాస్తే అది అర్ధబిందువు. ఉదా: నాండు.
తెలుగు మాటల్లో బిందువు పరుష సరళాలకు ముందే ఉంటుంది. అంటే కచటతప, గజడదబ అనే వర్ణాలకు ముందే ఉంటుంది. వంక, కొంగ, కొంచెం, గుంజ, గంట, కొండ, కంత, కంద, కంప, చెంబు వంటి మాటలలోనే ఉంటుందన్న మాట. ఇవి అయిదు వర్షాల హల్లులు. ప్రతి వర్గంలోనూ ఒక అనునాసికం ఉంటుంది. ఆ హల్లు ముందు ఆ వర్ణ అను నాసికమే వస్తుందన్నమాట. వంక అంటే వబ్మ, గంట అంటే గణ్జ, కొంచెం అంటే కొళ్చొం, కంత అంటే కన్త, కంప అంటే కవ్పు అని. ఈ రెండు రకాలుగానూ రాయవచ్చు. కాని ప్రాచీన కాలంలోనే ఈ అనునాసికాల స్థానంలో బిందువును రాసే సంప్రదాయం ఏర్పడింది. వర్గహల్లుల ముందు ఆయా వర్గాల అనునాసికాల స్థానంలో బిందువును రాయడం ఇవ్చుడు మన భాషలో సార్వత్రికం అయింది.
కచటతప, గజడదబలు తప్ప బిందువు తరువాత ఇతర హల్లులలో ఏది ఉన్నా ఆ మాట తెలుగుమాట కాదని చెప్పాలి. తెలుగులో అనునాసికాలలో న, మ లు మాత్రమే ద్విత్వాలుగా వస్తాయి. ఇటువంటి సందర్భాల్లో పూర్వం శాసనాలలో అంన్న అంమ్మ వంటి లేఖనం కని పిస్తుంది. తక్కిన చోట్ల బిందువును రాసే సంప్రదాయం ప్రభావం ఇది. భాషరాయడం నేర్చుకునే దశలో చాలామంది పిల్లలు అంన, అంమ అని రాయడం గమనించవచ్చు.
సంయమనం, సంయమి వంటి మాటలు సంస్కృతం, సంవత్సరం, సంవాదం కూడా సంస్కృతం మాటలే. సంరంభం కూడా సంస్కృతమే. వంశం, హంసలు కూడా సంస్కృతాలే. సంలబ్ధి కూడా సంస్కృతమే. సంహారమూ సంస్కృతమే
మహాప్రాణవర్ణాలు అంటే ఖ, ఘ వంటి ఒత్తక్షరాలు ఎలాగూ తెలుగులో లేవు కాబట్టి బిందువు తరువాత ఇవి వచ్చినప్పుడు తెలుగుమాటలు కావని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. శంఖం, సంఘం వంటి మాటలు సంస్కృతాలే.
మన భాషను అజంత భాష అనీ, సంగీతానికి చాలా అనుకూలమైన భాష అనీ, తీయని భాష అనీ చెప్పుకుంటూ ఉంటాం. హలంతంగా ఉన్న మాట మీద అచ్చు చేర్చుకొని దాన్ని అజం తంగా మార్చుకుంటాం. అందువల్లే అనేక సంస్కృత పదాలూ, అన్యభాషా పదాలూ ఆ భాషల్లో హలంతాలై ఉండీ తెలుగులోకి వచ్చినప్పుడు అజంతాలైపోతాయి. ఫలమ్ - ఫలము అవుతుంది. ధనమ్- ధనము అవుతుంది. హృదయమ్- హృదయము అవుతుంది. డాక్టర్- డాక్టరు అవు తుంది. జమీందార్, జమీందారు అవుతుంది. అన్యదేశ్యాల మకారాంత శబ్దాలు కూడా అజంతా లవుతాయి. ఉదా: ప్లాటినమ్ - ప్లాటీనము, ఇస్లామ్ - ఇస్తాము, ముస్లిమ్ - ముస్లిము.
నునబాషతి 25
వాడుక భాషలో ఈ మాటలను ముఖ్యంగా మకారాంతాలను మకారాంతాలుగానే ఎక్కువగా వాడుతున్నాం. ఉచ్చారణలోనూ, రాతలోనూ కూడా వీటిని హలంతాలుగానే వాడు తున్నాం. వత్రం, పుష్పం, ఫలం, ప్లాటినం, ఇస్లాం, ముస్లిం అని. ఇతర హల్లుల విషయంలో హలంత అజంత రూపాలు రెండూ వాడుతున్నాం. ఉదా: స్కూల్ - స్కూలు, బెల్ - బెల్లు, పాన్
- పాను, సుల్తాన్ - సుల్తాను.
పూర్వం మన పేర్లు హలంతాలుగా ఉండేవికావు. ఇప్పుడు హలంతాలుగా పేర్లు పెట్టు కోవడం నాగరికం అయిపోయింది. స్త్రీల పేర్లు మాత్రం మనవాళ్ళవి ఇంకా హలంతాలు కాలేదు. మగవాళ్ళ పేర్లు కొంత ఇంగ్లీషు వర్ణక్రమం వల్లా, కొంత బెంగాలీ ప్రభావం వల్లా హలంతాలుగా మారుళున్నాయి.
సుబ్రహ్మణ్యము, సత్యము, రామబ్రహ్మము వంటి పేర్లు కూడా హలంతాలై సుబ్రహ్మణ్యం, సత్యం, రామబ్రహ్మంగా మారిపోయాయి. స్త్రీల పేర్లలో 'ము చివర ఉందేవి హలంతాలయ్యాయి. సూర్యకాంతము - సూర్యకాంతం అయింది. నాగరత్నము - నాగరత్నం అయింది.
సర్వనామాలలో కూడా మేము - మేం అయింది. మనము - మనం అయింది. (క్రియలలో కూడా వచ్చాము- వచ్చాం అయింది. ఉత్తమ పురుష క్రియలన్నీ ఈ విధంగానే హలంతాల య్యాయి. వస్తాం, వస్తున్నాం, రాం, తినర మొదలయినవి. తనము, రికము వంటి (ప్రత్యాయా లలో కూడా చివరి అచ్చు లోపించి తనం, రికం అయ్యాయి.
పదమధ్యంలో ఉండే బిందువు వర్గానునాసికం అయితే పదాంతంలోని బిందువు మకారం మీద అచ్చులోపించడం వల్ల ఏర్పడ్డది. పదాంతంలో అర్థబిందువు ఉండదు. ఆధునికభాషలో అర్ధబిందువుకు ప్రయోగం లేదు. బిందువు అచ్చుకు తరువాతే వస్తుంది. అందువల్ల సున్నాతో మొదలయ్యే మాటలుండవు. కేవలం బిందువు అక్షరం కాదు. దాని ముందున్న వర్ణంతో కలిసి అది అక్షరం అవుతుంది. అందుకే తెలుగువారి లేఖన సంప్రదాయంలో పదంలో బిందువు దగ్గర విరిచి బిందువును తరువాత పంక్తిలో రాయడం కుదరదు. పదాన్ని విరచవచ్చుకాని, అక్షరాన్ని విరవకూడదు.
బ్ 265 త నునభాష
తద్భవాలా = తత్సమాలా
(ప్రపంచంలోని ఏ భాష అయినా ఇతర భాషల నుండి పదాలను అరువు తెచ్చుకోకుండా ఉండదు. అట్లాగే మన భాష కూడా సంస్కృతం, ప్రాకృతం మొదలయిన భారతీయ ఆర్యభాషల నుండీ, తమిళం, కన్నడం వంటి సోదర ద్రావిడ భాషల నుండీ ఎన్నో మాటలు అరువు తెచ్చు కుంది. పన్నెండో శతాబ్దం తర్వాత పర్షియన్, ఆరబిక్ పదాలెన్నో తెలుగులోకి వచ్చి చేరాయి. 15, 16 శతాబ్దాల నుండి పోర్చుగీసు, డచ్చి, (్రెంచి, ఇంగ్రీషు భాషల నుండి చాలా పదాలు వచ్చి చేరాయి. ఎన్ని భాషల నుండి ఎన్ని పదాలు వచ్చినా సంస్కృతభాష మనకందించిన పదజాలంతో పోల్చినప్పుడు వాటి సంఖ్య వెలవెలపోక తప్పదు. ఒక దీర్ణకాల పరిమాణంలో ఆర్యద్రావిడ ప్రజల మధ్య జరిగిన సమ్మేళనం దీనికి ప్రధాన కారణం. ఆర్యసంస్కృతిని ద్రావిడులు సొంతం చేసు కున్నారు. మతం, శాస్త్రాలు, సాహిత్యం ఆ సంస్కృతిలో భాగాలే. గత శతాబ్దం వరకూ మన విద్యా భ్యాసమంతా సంస్కృతంలోనే జరిగింది. అందువల్ల సంస్కృత పదజాలం తెలుగులో అనివార్య మైన భాగమైపోయింది.
సంస్కృత పదాలతో పరిచయం సాధారణమయిన విషయం కాబట్టి తెలుగువారిలో చదువుకున్నవాళ్ళూ, చదువుకోనివాళ్ళూ అన్న భేదం లేకుండా సంస్కృత పదాలను సంస్కృ తంలో మాదిరిగానే ఉచ్చరించగలుగుతారు,. అయినా మనభాషా ధ్వనులకు అనుగుణంగా కొన్ని మాటలు మారివచ్చాయి చాలామాటల మారిన రూపాలూ, మారని రూపాలూ రెండూ వాడుక లో ఉన్నాయి పుణ్యమూ ఉంది, పున్నెమూ ఉంది. ద్యూతం ఉంది, జూదం ఉంది. తెలుగు కవులు రకరకాలుగా తద్భవాలు ఏర్పరచుకున్నారు మృత్యువును మిత్తి చేసుకున్నారు భక్తిని బత్తి చేసు కున్నారు. భాష బాస అయింది. రధం అరదమయింది అయితే ఆధునిక కాలంలో ఈ (ప్రక్రియ చాలా వరకు తగ్గిపోయింది పూర్వం కూడా కేవలం దేశ్యపదాలతోనూ, తద్భవాలతోనూ రాసిన కావ్యాలు అంతగా ప్రచారం పొందలేదు. ఆ భాష పారకులకు కృతకంగా కనిపించింది. ఇది నిజంగా విచిత్రమయిన పరిస్థితే.
తెలుగులో మహాప్రాణవర్దాలు అంటే ఒత్తక్షరాలు లేవు. కాబట్టి అన్యభాషా పదాలలో ఆ ధ్వనులు ఉంటే అవి అల్బప్రాణాలుగా మారడం సహజం. ఖ- క కావాలి, ఘ- గ కావాలి, ఛ- చ కావాలి. రు - జ కావాలి. ఇట్లాగే తక్కినవి కూడా.
కవిత్వ రచనలో ఛందస్సుకు అనుగుణంగా ఉండడానికి అంటే గణాలు, యతి, ప్రాసలు కలవడానికి పదాలను అవసరమైన రీతిలో మార్చుకొనేవాళ్ళు. అట్లాగే శబ్దాలంకార ప్రయోగంలో కూడా ఈ మార్పులు అవసరమయ్యేవి. అందువల్ల వ్యవహారంలో ఉచ్చారణ భేదాలతో పాటు కవులు తమ అవసరాలకనుగుణంగా చేసిన మార్పులతో ఒక పదానికి ఒకటి కంటే ఎక్కువ రూపాలు ఏర్పడే అవకాశం కలిగింది. ఇటువంటి సందర్భాలలో కొన్ని ప్రయోగాలు కవుల రచనల్లో మాత్రమే కనిపించడమూ, సామాన్యుల వాడుకలో లేకపోవడమూ సహజమే.
ఆధునిక వచన రచనలో ఇటువంటి మార్పుల అవసరం లేదు. సృజనాత్మక రచనల్లో వ్యవహారంలో ఉన్న ఉచ్చారణ భేదాలను చూపించవచ్చు. కాని, తక్కిన రచనల్లో (ప్రామాణిక రూపమే, బహుళ ప్రచారంలో ఉన్న రూపమే వాడవచ్చు. కొన్ని మాటలను మన భాషాధ్వని
మందాషా 2
వ్యవస్థకు అనుగుణంగా మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఉదాహర ణకు (ఖరము అనే మాటను తీసుకోవచ్చు ఖరము అంటే గాడిద తెలుగు ధ్వని వ్యవస్థలో లేదు కాబట్టి ఖరము”, “కరము” కావచ్చు. కరము అనే సంస్కృత పదానికి చేయి అని అర్ధం. కరము అనే తెలుగుమాటకు మిక్కిలి అని అర్థం. ఖ-క కావడం వల్ల ఖరము-కరము అనే మాటల భేదం తొలగిపోతూ ఉంది కదా. అందువల్ల ఇక్కడ ఖ-కగా మారడం నష్టమే.
పత్రికలలో విలేకరి, విలేఖరి అనే మాటలు విసృతంగా కనిపిస్తుంటాయి. బహువచనంలో విలేకరులు - విలేఖరులు. విలేఖరుడు వంటి ఏకవచనరూపం కూడా ఉండవచ్చు. ఇక్కడ లిఖ్ అన్నది ధాతువు. అందువల్ల విలేఖరి అనే రూపం ఏర్చడుతుంది. దీనిలో ఖర శబ్దాన్ని విరిచి గాడిదలని చమత్మరించడానికి వీలుంటుందన్న భయంతోనేమో కొంతమంది విలేకరి అనేమాటకు ప్రచారం కలిగించారు. చం(ద్రశేఖర, రాజశేఖర, గుణశేఖర వంటి పేర్లలో కూడా ఈ విధమయిన విరుపునకు అవకాశం ఉంది. అట్లా అని ఈ పేర్లు పెట్టుకోవడం మానలేదు కదా. ఈ భయం తప్పితే విలేఖరిని విలేకరి అనడానికి కారణం కనిపించదు. ఖ-క అయి విలేకరి అనే తద్భవపదం ఏర్పడడంలో అసహజమేమీ లేదు. కాని, ఆధునిక రచనా భాషలో మనం ఇటువంటి తద్భవ రూపాలను ఏర్పరచుకోవడం లేదు విలేఖరి అని రాయడానికి సందేహించ వలసిన అవసరమేమీ లేదు.
వాడుకలో స్థిరపడిపోయిన తద్భవాలను వాడడం మాని వాటి తత్సమరూపాలను వాడ వలసిన అవసరం కూడా లేదు. ఇటువంటి మాటల్లో తత్సమ, తద్భవ రూపాలు రెండింటినీ ఉపయోగించవచ్చు. శృంఖల తెలుగులో సంకెల అయింది. శృంఖల అన్న మాట కంటే సంకెలకే (ప్రచారం ఎక్కువ. అట్లాగే వేత్ర - జెత్తెం. సంధి - సందు. కాష్ట్ర - కట్టె, లాక్ష - లక్క
ముఖం అనే మాటకు మొకం, మొగం అనే రూపాలు, సుఖానికి సుకం, శిఖకు సిక, ఇచ్చకు ఇచ్చ, కధకు కత, వ్యథకు వెత మొదలయిన తద్భవ రూపాలు వాడుకలో ఉన్నప్పటికీ తత్సమ రూపాలకే ప్రచారం ఎక్కువ.
ఆధునిక రచనాభ్యాషలో తత్సమ శబ్దాలకు (ప్రయోగం ఎక్కువ తద్భవాలకు ప్రయోగం తక్కువ అవుతున్నది పూర్వకవులు వాడిన అనేక తద్భవ రూపాలు వాడుకలో నుండి తొలగి పోయాయి.
శ్ 268 అమనబాష
ఎక్కడ అల్పవ్రాణం - ఎక్కడ మహాప్రాణం
సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న మాటల్లో మహాషప్రాణాలు అంటే ఒత్తక్షరాలు ఉంటాయి. మన భాషలో అవిలేవు కాబట్టి ఈ మహాప్రాణాలు అల్బప్రాణాలుగా మారవచ్చు. అంటే ఖ-క కావచ్చు. అయితే ఈ సంస్కృత వదాలతో విసృతమయిన పరిచయం మనకు ఏర్పడింది. అందు వల్ల అటువంటి మార్పులేకుండా వాటిని ఉన్నదున్నట్లుగా వాడడం అలవాటయిపోయింది. కాని చాలా మాటలలో మహాహప్రాణం ఉందో లేదో, ఉంటే మాటలోని ఏ అక్షరం మహాప్రాణమో అన్న విషయంలో సందేహం కలగవచ్చు. ఈ సందేహంవల్ల పొరపాట్లు దొర్లడానికి అవకాశాలు న్నాయి. ఉదాహరణకు బాధ, ఖేదం అనే రెండు మాటలను తీసుకోవచ్చు. కొంతమంది భాద అని రాయడమూ, బేధం అని రాయడమూ కనిపిస్తుంది. ఎవరయినా భాధ, భేధం అని రెండింటికీ ఒత్తులు పెట్టి రాసినా రాయవచ్చు. మనం ఈనాడు రాస్తున్న భాషలో ఇటువంటి పదాలెన్నో ఉన్నాయి. సంస్కృత భాషాజ్ఞానం బాగా ఉన్నవారికి ఇటువంటి మాటలను రాయడంలో సమస్య ఏమీ ఉండదు. కాని శబ్దస్వరూపం తెలియకపోతే వర్షక్రమం విషయంలో అనుమానాలు వస్తూనే ఉంటాయి.
ఈ మాటలను రాయడంలో ప్రధానంగా మూడు రకాల పొరపాట్లు జరగవచ్చు. వీటిలో మొదటిది ఒత్తు అవసరం లేనిచోట పెట్టడం. దీనివల్ల అర్ధ్థభంగం కూడా కలగవచ్చు. ఉదా హరణకు ప్రదానం అనేమాటను ప్రధానం అనిరాస్తే అర్థమే మారిపోతుంది ప్రధానం అంటే ముఖ్యం అని అర్ధం. అదే ప్రదానం అంటే ఇవ్వడం అని అర్ధం. వీటిని ఒక దానికి బదులు ఒకటి వాడడంవల్ల అర్థభంగం కలుగుతుంది. బహుమతి ప్రదానం, పట్టప్రదానం మొదలయిన విధంగా ఈ ప్రదాన శబ్దానికి ప్రయోగం ఎక్కువ. ప్రదాన శబ్దం దద ధాతువునుండి ఏర్పడితే ప్రధాన శబ్దం దధ ధాతువు నుండి ఏర్పడింది. ప్ర - ఉపసర్గ, వప్రకృష్ణమైనదని అర్థం, ఈ రెండు మాటలకు అర్ధంలో ఇంతభేదం ఉంది.
('ప్రబలడం అనేమాటకు తెలుగులో వాడుక ఎక్కువే, “అవినీతి ప్రబలుతోంది, 1వఐలమైన శత్రువు, “కోరిక ప్రబలంగా ఉంది వంటి ప్రయోగాలు చేస్తాం. దీన్ని క్రియగా, విశేషణంగా, క్రియావిశేషణంగా, నామవాచకంగా కూడా వాడతాం. ప్రబలం, ప్రాబల్యం అన్నవి నామవాచక రూపాలు. ఈ మాటను ప్రభలం, ప్రాభల్యం ఆని మహాప్రాణంతో రాయకూడదు.
అవలంభించు అనే మాటలో కూడా మహాప్రాణంలేదు. అవలంభించు అన్న ప్రయోగం సరయింది కాదు. ఆఅవలంబన, ఆలంబన వదాలు కూడా ఇంతే.
విదితం అంటే అవగతం, తెలిసినది. దీన్ని వీధితం అని రాయకూడదు. విధింవబడినది అని అనుకొనే ప్రమాదం ఉంది. విధి అనే మాటనుండి విధ్యుక్త ధర్మం అనే పదబంధం ఏర్పడు తుంది. విధి చెప్పినటువంటి ధర్మం, కర్తవ్యం అని దీనికి అర్థం, దీన్ని విద్యుక్త ధర్మం అనరాదు.
రోదన అంటే ఏడుపు, రోదించు అంటే ఏడ్చు. దీన్ని రోధించు అనిరాస్తే అడ్డుపెట్టు అని అర్థం వస్తుంది. నిరోధించు 'ని' అనే ఉపసర్గ చేర్చడంవల్ల ఏర్పడింది,
వదాన్యుడు అంటే దాత, దీన్ని వధాన్యుడు అని మహాప్రాణంతో రాయకూడదు.
శాకాహారం, శంకుస్థాపన అనే పదాలను చాలా మంది శాఖాహారం, శంఖుస్థాపన అని
మనభాష 29
రాస్తుంటారు. శాకాహారం మాంసాహారానికి వ్యతిరేకం. వెజిటేరియన్ అన్నమాట. శాఖ అంటే కొమ్మ అనే అర్థం ఉంది కాబట్టీ కొమ్మలనుండి అంటే చెట్ల నుండి వచ్చిన ఆహారం అని అనుకో వడం వల్లనేమో దీన్ని శాఖాహారం అనడం సర్వత్రా కనిపిస్తుంది. మన రాష్ట్రంలోని ఏ వెజిటేరి యన్ హోటల్ బోర్టు చూసినా దానిమీద శాఖాహార హోటల్ అన్న ప్రయోగం కనిపించకతప్పుదు. అట్లాగే శంకుస్థాపన కూడా. ఏదైనా కట్టడాన్ని నిర్మించాలని తలపెట్టినప్పుడు శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ శంఖానికి కాని, శంఖువుకుకాని స్థానంలేదు. అయినా ఈ శంకు శబ్దమేమిటో తెలియకపోవడం వల్లా, శంఖ శద్దిం బాగా పరిచితమై ఉండడంవల్లా ఈ పదబంధంలో మొదటి పదం “శంఖ అనుకోవడమే చాలా మంది శంఖుస్థాపన అని రాయడానికి కారణం. ఉచ్చారణలో కూడా మహాప్రాణం లేదు. ఉచ్చారణ అని రాయడం సరికాదు. అట్లాగే జటిలం, జాద్యం సరయినవి. జరిల, జాధ్యం సరికావు. ఒక్కొక్కసారి సమాసంలో ఒక పదంలో మహాప్రాణం ఉంటే తరువాతి మాటలో మహా ప్రాణం లేకపోయినా మొదటిపదం ప్రభావంతో అందులో కూడా మహాహప్రాణం రాస్తూ ఉంటాం. ఉదాహరణకు “ధూపదీప నైవేద్యాలు” అన్న సమాసాన్ని తీసికోవచ్చు ఈ సమాసంలో మూడు మాటలున్నాయి. ధూపం, దీపం, నైవేద్యం ఈ ధూపం ప్రభావంవల్ల ధూపథీప అని రాసే (ప్రమాదం ఉంటుంది. నైవేద్యం కూడా నైవేధ్యం అయినా కావచ్చు. ఇదమిత్ధం అనే పదబంధంలో ఇదమ్, ఇత్ళమ్ అనే రెండు మాటలున్నాయి ఇది ఇది అని అర్థం. ఇదమిళ్ళంగా తేల్చిచెప్పడం లేదు అంటాం. ఇదీ అని కచ్చితంగా తేల్చిచెప్పడం లేదు అని అర్ధం, అస్తవ్యస్తం అంటే గందరగోళం, చిందరవందర, గట్టిగా చెప్పాలన్న ఉద్దేశమేమో అస్థ వ్యస్థం అని రాస్తుంటారు ఇది సరికాదు దశాబ్ది అంటే పదేళ్ళు, శతాబ్ది అంటే నూరేళ్ళు, సహస్రాబ్టి అంటే వెయ్యేళ్ళు. అబ్బశబ్దానికి సంవత్సరమనీ, మేఘమనీ అర్జాలు. అప్ అంటే నీరు. నీరు ఇస్తుంది కాబట్టి మేఘం అబ్దిం దశాబ్టీ మొదలయిన పదాలలో అబ్బి శబ్దానికి సంవత్సరమనే అర్ధం. దశాబ్దికి బదులు దశాబ్ది అని రాస్తే అర్థం మారిపోతుంది అబ్బి అంటే సముద్రం. అందువల్ల ఈ రెండింటినీ ఒకదాని బదులు ఒకటి వాడకూడదు. మనస్తాపంలో మనస్, తాపం అనే రెండు మాటలున్నాయి. కలిపితే మనస్తాపం అవుతుంది మహాప్రాణంతో మనస్థాపం అనిరాయడం సరికాదు. మద్యం, మధ్యం వేరువేరు మాటలు మద్యం అంటే మదిర. దీనికి సుర అనీ, ఇరా అనీ, కాదంబరి అనీ ఇంకా చాలా పేర్లున్నాయి. దీనివల్ల మదిస్తారు కాబట్టి ఇది మద్యం. బాగా పుచ్చు కుంటారు కాబట్టి సుర. దీనివల్ల తిరుగుతారు కాబట్టి ఇర. గోమంత పర్వతంలో కదంబవృక్షం తొర్రలో పుట్టింది కాబట్టి కాదంబరి. మదిరకూ మద్యానికీ ఒకటే వ్యుత్పత్తి. మధ్యం అంటే నడిమిభాగం అని అర్థం. ఇట్లా అల్బప్రాణాలు మహా[ప్రాణాలుగా రాయడం తెలుగు మాటలకూ, అన్యదేశ్యాలకూ కూడా వ్యాపించింది. జాము రూము అయింది. దీటు ధీటు అయింది. దరఖాస్తు ధరఖాస్తు అయింది. వీటిలో మహాప్రాణాలు లేవు. చ్ 30 అమనభాష
మహాప్రాణా'లు తారుమయారు చేయవద్దు
ఒక సంస్కృత పదంలో ఏ వర్ణం మహాప్రాణమో సందేహం కలగడం వల్ల ఒకదానికి బదులు మరోదానికి ఒత్తు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి పొరపాటు మహాషప్రాణాల విషయంలో రెండోరకం. ఇది రెండక్షరాల మాటల్లో కూడా జరగవచ్చు. ఉదాహరణకు బాధ అనే మాటను తీసుకోవచ్చు. ఈ మాటలో 'ధి మహాప్రాణం. కాని కొందరి ఉచ్చారణలో మొదటి అక్షరం మహీ ప్రాణమై “భాద” ఏర్పడుతుంది. ఇది “బాధినుండి ఏర్పడ్డ మాటలన్నింటిలోనూ జరగవచ్చు బాధితుడు, బాధితురాలు. క్రియగా బాధించు. ఇది బాధా శబ్దం. బాధ్భ ధాతువు. విలోదనం అంటే కలియబెట్టడం అని అర్థం. దీనివల్ల కలియబెట్టబడతారు కాబట్టి బాధ బాధ, పీడ, వ్యధ, దుఃఖం, ఆమనస్యం, వ్రసూతిజం అన్న ఆరూ మనఃపీడకూ, కష్టం, కృద్చ్రం, అభీలం అన్నవి శరీర పీడకూ పేర్తంటారు. ఈ తొమ్మిదింటినీ దుఖానికే పేర్లుగా వాడతారు. బాధ్యం, బాధ్యత వంటి మాటలు కూడా ఇటువంటివే
బాధలాగే మవాప్రాణాన్ని తారుమారుచేసే మరోమాట ఖేదం. ఖిదిక్ ధాతువు. కలిసి ఉన్నవాటిని వేరుచేయడం భేదం. సామ, దాన, భేద, దండోపాయాలన్న నాలుగు ఉపాయాలలో భేదం ఒకటి. దీనికి ఉపసర్గలు చేరి విభేదం, ప్రభేదం వంటి మాటలు ఏర్పడతాయి. భేదించు అనే 'క్రియాపదం ఏర్చడుతుంది భేద్యం, అభఖేద్యం, దుర్భేద్యం, భేదకం వంటి చాలా మాటలను ఉత్పన్నం చేసుకోవచ్చు.
మరొకమాట బోధన, బుధ ధాతువు, తెలియడం. దీనినుండే బుద్ధి. బోధకులు అంటే మేలుకొలిపేవాళ్ళు. బోధన అంటే మేలుకొల్పడం, చదువుచెప్పడం, ఉపదేశం చేయడం అన్న అర్థంలో వాడుతున్నాం. బోధకులు అంటే మతప్రచారకులు అనే అర్థం కూడా ప్రచారంలో ఉంది బుధ ధాతువు నుండి వచ్చిన ఎన్నో మాటల్లో సంబోధన, ప్రబోధం, విబుధులు, బుధులు, ఉద్బోధం, బోధి, బుద్ధుడు, సంబుద్ధి మొదలయినవి ముఖ్యమైనవి. బోధించు, సంబోధించు, ప్రబోధించు, ఉద్బోధించు అని క్రియారూపాలు కూడా వాడుకలో ఉన్నాయి.
బంధం అన్నమాటకు కూడా పొరపాటుగా భందం అని రాయవచ్చు బంధ ధాతువు. బంధం అంటే కట్టు. బంధనం అంటే కట్టివేయడం అనీ, కట్టే సాధనం అనీ అర్థం. దిగ్బంధం, దిగ్బంధనం నాలుగువైపుల నుండీ కట్టి వేయడం. ప్రబంధం అంటే ప్రకృష్ణమైన బంధం. మను చరిత్ర వసుచరిత్ర లాంటివి. నిర్బంధం అంటే గట్టిగా బంధించడం, బలాత్మారం. సంబంధం, అనుబంధం మొదలయిన మాటలెన్నో ఈ బంధం నుండి ఏర్చడతాయి. బంధితుడు, బంధితు రాలు, నిర్బంధితుడు, నిర్భంధితురాలు, సంబంధితుడు లాంటి పదాలను ఏర్పరచుకోవచ్చు. బంధించు, నిర్బంధించు, అనుబంధించు మొదలయిన విధంగా క్రియాపదాలుగా వీటిని వాడవచ్చు. బంధువు, బాంధవుడు అన్న మాటలు సగోత్రత్వాన్ని తెలుపుతాయి. బాంధవ్యం దీని నుండి వచ్చింది.
ఛేదనలో ఛిదిర్ ధాతువు. ఛిదిర్ అంటే రెండుగా చేయడం, చీల్చడం, నరకడం. దీనినుండే విచ్చేదన. ఛేదించు అనే క్రియ కూడా ఏర్పడుతుంది.
దగ్ధంలో మొదటి ద కారాన్ని మహాప్రాణంగా రాయకూడదు. ఈ మాటలో దహ ధాకువు.
మనభాషత 31
అందువల్ల మొదటి “ది అల్బ'ప్రాణమే. ఈ ధాతువుకు భస్మీకరణం, బూడిదగా చేయడం అని అర్ధం. దగ్ధం అంటే కాల్చబడినది.
చీభత్సం అన్నమాటను భీభత్సం అనీ భీబత్సం అనీ రాస్తుంటారు. బీభత్సం శృంగారవీర కరుణ అద్భుతహాస్య భయానక బీభత్స రౌద్ర శాంత అనే తొమ్మిది రసాలలో ఒకటి. బీభత్స అంటే నింద. నిందకలిగినది బీభత్సం. మనస్సును కష్టపెట్టేది. జుగుప్స ఈ రసానికి స్థాయాభావం, జుగుప్స అంటే రోత, బీభత్స దృశ్యం అంటే రోత కలిగించే దృశ్యం. అర్జునునికి బీభత్సుడు అని పేరు. ఇది వికృతి అయి వివ్వచ్చుడు అయింది.
దృఢం అంటే బలమైనది. దీనిలో ధాతువు దృహ. దృహ అంటే వృద్ధి. దీని నుందే దార్థ్యం, దారుధ్యం అనే మాటలు వచ్చాయి. బాగా బలమైనది అనే అర్ధంలో సుద్భఢం అని వాడవచ్చు.
సందిగ్ధలో దిహ ధాతువు. సందిగ్ధం అంటే అస్పష్టం, అనుమానం. దీని వ్యతిరేకార్థక పదం అసందిగ్ధం. స్పష్టం, నిశ్చయాత్మకం అని అర్ధం.
స్తంభం అంటే (మ్రాన్సాటు. చేష్ట లేకుండా ఉండడం. కంబం అని కూడా అర్ధం. కంబం అన్నమాట స్తంభానికి వికృతి. స్తంభం అంటే స్థిరంగా ఉండేది. చెట్టు వేళ్ళకూ కొమ్మలకూ మధ్య భాగాన్ని కూడా స్తంభం అంటారు దీన్ని ప్రకాండం అని కూడా అంటారు. పూర్తిగా నిలిచిపోవ డాన్ని స్తంభించిపోయాయని వర్ణిస్తున్నాం స్తంభన అన్నమాట కూడా ఉంది.
స్తబ్ధిం అన్నా కదలికలేకుండా ఉండడమే. స్తబ్ధరోముడు అంటే నిక్కపొడుచుకున్న వెంట్రు కలు కలవాడని అర్థం,
స్వచ్చందం అనేమాటను తనకు తానుగా అన్న అర్ధంలో ఉపయోగిస్తున్నాం ఇతరుల ప్రోద్బలం లేకుండా, బలవంతం లేకుండా అన్న అర్ధంలో వాడుతున్నాం ఇటీవలి కాలంలో స్వచద్భంద సేవాసంస్థల సంఖ్య విస్తృతంగా పెరిగింది. స్వచ్చందం అంటే స్వతంత్రం, ఎటువంటి అడ్డుబాటూ లేకపోవడం, స్వకీయమయిన అభిప్రాయం కలిగి ఉండడం. అస్వచ్భ్చందుడు అన్న మాట కూడ ఉంది. అస్వతంక్రుడని అర్థం. తెలుగులో ఈ మాటకు అంతగా పయోగంలేదు.
మహాహ్రాణాలున్న మాటలను రాయడంలో జరిగే మూడో రకమయిన పొరపాటు మహా 'ప్రాణం ఐదులు అల్బప్రాణం రాయడం. ఇటువంటి సందర్భాలలో వాటిని వికృతులని సరిపెట్టు కోవచ్చు కాని వదం మొత్తం మారనప్పుడు అది సాధ్యంకాదు. ఉదాహరణకు ఛిన్నాభిన్నం అన్నమాటను తీసుకోవచ్చు. చిన్నాభిన్నం అంటే తద్భవం అని సర్దుకోవచ్చు కాని, చిన్నాభిన్నం అనిగాని, ఛిన్నాబిన్నం అనికాని రాస్తే సమర్థించుకోవడం కష్టం. ఈ పదబంధంలోని రెండు మాటలూ మహాప్రాణంతో ఉన్నవే. ఇటువంటి మాటే సాధక బాధకాలు. రెండు మాటల్లోనూ మవాప్రాణం ఉంది. సాధకమూ, బాధకమూ అన్ననూట. అభ్యర్థిలో రెందు మహాప్రాణా లున్నాయి. అభి, అర్ధి కలిసి అభ్యర్థి. విద్యార్థిలోని విద్యలో మహాప్రాణం లేదు కాబట్టి విద్యార్థి అని మాత్రమే అవుతుంది. మధ్యాహ్నం, అధ్వాన్నం ఈ రెండింటిలోనూ ఒత్తక్షరాలే ఉన్నాయి. లబ్బి, లబ్ధం, లోభి, లుబ్బుడు మొదలయిన మాటల్లోనూ మహాస్రాణాలే ఉన్నాయి.
ఈ పొరపాట్లు మన పేర్లలోకి కూడా ఎక్కాయి. జనార్ధన శబ్దంలో మహాప్రాణం లేదు, అట్లాగే మల్లికార్ణునలోనూ మహాప్రాణం లేదు. జనార్థన, మల్లిఖార్జున అని రాయడం చాలా మందికి అలవాటయిపోయింది. ష్
32 అత మనభాష
టకాదుఠత
తత్సమ పదాలలో ట, ర లతో ఉండే మాటలెన్నో ఉన్నాయి అయితే ఈ మాటలలో ట,రల వ్యత్యయం అర్థభేదానికి కారణమవుతుంది అందువల్ల వీటి భేదాన్ని పాటించవలసి ఉంటుంది. ఉదాహరణకు మనం చాలా ఎక్కువగా వాడే షష్టి షష్టి అనే మాటలను తీసుకోవచ్చు షష్టి అంటే అరవై, షష్టి అంటే ఆరు షష్టి పూర్తి, షస్ట్రబ్బపూర్తి అని అరవై సంవత్సరాలు నిండిన సందర్భంగా పండుగ చేసికోవడం మనకు తెలిసిందే
ఇటీవలి కాలంలో ఈ షష్టిపూర్తులు బాగా పెరిగాయి. కొంతకాలం కిందటి వరకు కుటుం బం వరకు మాత్రమే పరిమితమై ఉండిన ఈ ఉత్సవం ఇప్పుడు జనంలో పడి చందాలు పోగు చేయడానికి ఒక సదవకాశం అయిపోయింది. మహాప్రాణం ఉంటే అరవై అనుకొని షష్టి పూర్తి మహోత్సవాహ్వానం అని షత్రికలు పంచడం కూడా కనిపిస్తుంది. కాని షష్టి అంటే ఆరుమాత్రమే.
సంస్కృతపదాలలో ట, ర, డ, ధఢ లు సాధారణంగా సంధిప్రక్రియలో ఏర్పడతాయి. పదంలో భాగంగా ఈ ధ్వనులున్నప్పుడు ఆ పదం సాధారణంగా అరువు తెచ్చుకున్నమాట అయి ఉంటుంది ఇటువంటి పదాలసంఖ్య పరిమితంగానే ఉంటుంది.
కరినం అన్నా కరోరం అన్నా దృఢమైనదని అర్థం. కరినం అన్నమాటను గట్టి అనే అర్ధంతో పాటు కీష్టమన్న అర్ధంలో కూడా వాడుతున్నాం. జరరం అంటే ఉదరం. ఇదీ దృఢమైందే. ఇందు లో మృదువైన వస్తువులు అరుగుతాయి కంఠం అంటే గళం, కుత్తుక, ధ్వనిస్తుంది కాబట్టి కంరం కణధాతువు కమరం అంటే తాబేలు. కురారం అంటే గొడ్డలి కుంరితం అంటే మందగించినది.
కంటకం అంటే సూదిమొన అనీ, క్షుద్రుదైన శత్రువనీ, ముల్లు అనీ, రోమాంచం అనీ అర్ధాలు. కటకం అంటే పర్వత మధ్యప్రదేశం అనీ, కంకణం అనీ, రాష్ట్రమనీ అర్భాలు. మనుచరిత్ర లోని 'కటక చరత్మరేణు కరకంపిత సాలము' అన్న (ప్రయోగంలో దీనికి పర్వత మధ్యప్రదేశమని అర్థం.
పర ధాతువుకు చదవడం అని అర్ధం. దీనినుండే పారం అనే మాట వచ్చింది పరించే వాడు పారకుదు. స్రీ అయితే పారకురాలు. పరించు అని క్రియగా కూడా వాడతాం. మనకు ఘనాపారులున్నారు. స్తోత్రం చేసేవారు స్తోత్రపారులు. పూర్వం తాటాకు పుస్తకాలలో మన కవులు రాసిన పద్యాలలో కొన్నిచోట్ల ఒక్కొక్క ప్రతిలో ఒక్కాక్మరూపం ఉండేది. ప్రతి రాసుకునే వాళ్ళు చేసే పారపాట్ల వల్ల ఇటువంటి పర్యాయరూపాలు ఏర్పడతాయి. వీటిని పారభేదాలు అంటాం, వాచకం అనే అర్థంలో పార్యగ్రంధం, పార్యపుస్తకం అంటున్నాం.
ఉత్కంర అంటే తహతహ. కావాలని కోరుకున్నది లభించడంలో ఆలస్యమైనప్పుడు కలిగే తహతహ. పాఠకులకు ఉత్కంఠ కలిగించే రచనలకోసం వ(త్రికలు పాట్లు పడుతున్నాయి. వార్తలు కూడా అట్లా రాయాలనే ప్రయత్నమూ కనిపిస్తూ ఉంటుంది.
పీరం అంటే ఆసనం, పీట, ఉన్నకస్థలం. ఉన్నతస్థానం నుండి గ్రంధాన్ని పరిచయం చేస్తారు కాబట్టే 'ముందుమాటికు పీరిక అనిపేరు.
ఓష్టం అంటే పెదవి, పెదవుల నుండి పుట్టే ధ్వనులు ఓష్ట్వాలు. ఉ, ఊ, ఒ, ఓలువ, ఫ, ట, భ, మలు ఓష్టాలు.
మనభాషళ 33
అంగుష్టం అంటే బొటనవ్రేలు సష్టురం అంటె కఠినం. కరినుడు అన్న అర్ధంలో నిష్టురుడు అనవచ్చు నిష్టరం ఆడడం కరినమైైన మాట అనడం. తిష్ట వేసుకొని కూర్చున్నాడంటాం స్థిరంగా ఉన్నాడని అర్ధం. వదిలి వెళ్ళడం లేదని భావం. తెలుగులో ఈ మాటకు నిందార్ధమే ఉంది. ప్రతిష్ట అంటే గౌరవం అని అర్ధం. స్థాపించడం అనీ శాశ్వతంగా నెలకొల్పడం అనీ కూడా అర్థం. ఇదే అర్ధంలో (ప్రతిష్టాపన అన్న మాటను వాడు _తున్నాం ్రతిష్టించు, (ప్రతిష్టాపించు, ప్రతిష్ట చేయు అని క్రియగా కూడా దీన్ని వాడుతున్నాం. మంచి క్తీర్తి అన్న అర్థంలో సుప్రతిష్ట అనీ, దృధంగా నెలకొల్పబడ్డవాడు అన్న అర్ధంలో సుప్ర తిస్టితుడు అనీ వాడుకలో ఉంది కాష్ట్ర శబ్దానికి కొయ్య అని అర్ధం అగ్నితో కూడి 'ప్రకాశించేది. ఈ మాటకు ఉత్కర్హ మర్యాద, దిక్కు అని కూడా అర్ధాలున్నాయి. మర్యాద అంటే హద్దు. ఈ అర్ధంలోనే పరాకాష్ట అన్నమాట ఏర్పడింది. పరాకాష్ట అంటే తుదిహద్దు దుష్టు అంటే ఇది చెడ్డది అని అర్ధం. సుష్టు అంటే మంచిది. దీనినుండే సౌష్టవం అన్నమాట ఏర్పడింది రోజూ పత్రికలలో కనిపించేమాట అధిష్టానం. అధిష్టానం అంటే ఆక్రమించడం పైన కూర్చొని ఉండడం. ఇవ్వాళ రాజకీయ పార్టీలలో అన్ని నిర్ణయాలు చేసే అధికారం చేతిలో ఉన్న వారు అధిష్యానవర్గం. కోష్టం అంటే కడుపు, గాదె, లోపలి ఇల్లు. ప్రకోష్టం అంటే ముంజేయి గోష్టం అంటే కొట్టం, గోవులుండే చోటు. గోష్టి అంటే సభ ్రోష్టం అంటే ఎద్దు ధనిష్ట శ్రవిష్ట అన్నవి ధనిష్టా నక్షతం పేర్లు. నిష్తూతి, నిష్టీవనమ్, నిష్టేవనమ్ అన్నవి ఉమ్మివేయడానికి పేరు. వృష్టం అంటే వీపు. వృష్టాస్థి అంటే వెన్నెముక మంజిష్ట అంటే మనోజ్ఞమైన రంగు. పరమేష్టి ఉత్కృష్టమైన స్థానంలో ఉన్నవాడు, భగవంతుడు. నిష్ట అంటే నియతమైన స్థితి కనిష్ట అంటే చిటికెనవేలు. కనిష్టిక అని కూడా అంటాం. అన్నిటికన్న చిన్న తక్కువ అని అర్ధం. కనిష్ణుడు అంటే తమ్ముడు గరిష్ట అంటే మిక్కిలి ఐరువైనది. అన్నిటికన్నా ఎక్కున అన్న అర్ధంలో కూడా వాడుతున్నాం. వరిష్ట అంటే మిక్కిలి విరివి అయినది, డ్రేప్తమైనది. శ్రేష్టం అంటే అతిప్రశస్తమైనది, మిక్కిలి కొనియాడదగింది. (ద్రాఘిష్ట అంటే మిక్కిలి పొడవైంది. హ్రసిష్ట అంటే మిక్కిలి పొట్టిది. బలిష్ట అంటే మిక్కిలి బలమైంది. భూయిస్టం అంటే మిక్కిలి బహుళమైనది. విస్తృతం. సాధిష్టం అంటే మిక్కిలి పదిలమైంది స్థవిష్టం అంటే మిక్కిలి బలిసినది ప్రేష్టం అంటే మిక్కిలి ప్రియమైనది క్షేపిష్టం అంటే అత్యంతవేగం కలది అని అర్ధం. క్షోధిష్టం అంటే అత్యంత క్షుద్రచైనది, బంహిస్టం అంటే మిక్కిలి తరచైనది నేదిష్టం అంటే మిక్కిలి సమీపమైనది. కోపిష్టి మిక్కిలి కోపం కలిగినవాడు. గర్విష్టి మిక్కిలి గర్వం కలిగినవాడు కర్మిష్టి అంటే క్రియాసామర్థ్యం కలిగినవాడు. పాపిష్టి అంటే మిక్కిలి పాపంతో కూడుకొన్నవాడు. బర్హిష్టం అంటే వృద్ధిపొందేది (వ్రష్ట అంటే అగ్రేసరుడు, ముందునడిచేవాడు. బె 34 అమనభాష
'రికారం కాదు... 'ట'కారమే!
అష్ట అంటే ఎనిమిది. బుద్ధునిది అప్పాంగమార్దం. అంటే ఎనిమిది ప్రధాన అంశాలు కలిగిన మార్గం సమ్యగ్దృష్టి సమ్యకృంకల్పం, సమ్యగ్వాక్కు సమ్యకృర్మ, సమ్యగ్దీవనం, సమ్యగావ్య యామం, సమ్యకిస్మృతి, సమ్యక్సమాధి బౌద్ధ ధర్మంలో ఈ ఎనిమిదీ అంగాలయితే ఒక్కోశాన్తం లో ఒక్కోవిధంగా అష్టాంగాలున్నాయి యమ నియమాది అష్టాంగాలు యోగశాస్త్ర సంబంధ మైనవి శల్య శాలాక్యాదులు వైద్యశాస్త్ర సంబంధమైనవి. ఇట్లాగే గాయత్రీ మంత్రానికి సంబం ధించి, చికిత్సకు సంబంధించి, ధర్మానీకి సంబంధించి, సైన్యానికి సంబంధించి, పూజకు సంబం ధించి, రాజ్యానికి సంబంధించి అష్టాంగాలున్నాయి. ఎనిమిది శరీరావయవాలతోనూ చేసే నమ స్మారం సాష్టాంగనమస్కారం
అష్టాగ్నులు, అష్టైశ్వర్యాలు, అష్టకష్టాలు, అష్టకర్మలు, ఆష్టగణపకులు, అష్టలక్ష్ములు, అష్ట దిక్కులు, అష్టదిక్చాలకులు, అష్టదిగ్గజాలు, అష్టనాయికలు, అష్ట ప్రధానులు, అష్టభాషలు ఈ విధంగా అష్ట సంఖ్యతో ఉండే అంశాలెన్నో ఉన్నాయి పూర్వకాలంలో బహుభాషా పండితులను అష్టభాషా పండితులనేవాళ్ళు సంస్కృతం, ప్రాకృతం, శౌరసేని, మాగధి, 'పైశాచి, చూళికా పైశాచి, అపభ్రంశం, తెలుగు అన్నవి ఆ అష్టభాషలు. 'ఓం నమో నారాయణాయ అన్నది అమ్బా క్షరి. పాణిని రచించిన ఎనిమిది అధ్యాయాల వ్యాకరణ (గ్రంధం అష్టాధ్యాయి ఇటీవలి కాలంలో అవధానాలు మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చాయి. అష్టావధానం వాటిలో ఒకరకం
అష్టకం అంటే ఎనిమిది పద్యాల కావ్యభేదం జనార్దనాష్టకం అనే సుప్రసిద్ధ అష్టకకావ్యం ఉంది.
ఇష్టం అంటే యజ్ఞంలో హోమదానాది క్రియ. ఇషు ధాతువు నుండి వచ్చింది. ఇచ్చ, కోరిక అని కూడా అర్ధం. తెలుగులో ఇప్పుడు ఈ అర్థంలోనే వాడుతున్నాం. మనకిష్టమైనవాడు ఇష్టుడు. ఇష్టి అంటే యజ్ఞం, కోరిక అభీష్టం అంటే వాంఛ, మనోరధం.
ఉష్టం అంటే ఒంటె. ఎప్పుడూ ఎండలో తపిస్తుంది కాబట్టి ఉష్టం. ఇదే కారణంవల్ల నిప్పుకోడి ఉప్రపక్షి తెలుగువాళ్ళు ఈ మాటను తిట్టుగా కూడా వాడుతున్నారు.
ఉచ్చిష్టం అంటే ఎంగిలి ఉచ్చిష్ట భోజనం అష్టకష్టాల్లో ఒకటి. 'బాణోచ్చిష్టం జగత్సర్వం) అని నానుడి సంస్కృతంలో బాణకవి వాడని పదమేలేదట.
కృష్ణ శబ్దానికి దున్నిన భూమి అని అర్ధం ్రకృష్ణం అంటే బాగుగా దున్నినభూమి. ప్రకృష్ణ శబ్బాన్ని శ్రేష్టమైన అన్న అర్ధంలో తెలుగులో వాడుతున్నాం ఆకృష్టం అంటే ఆకర్షింపబిడినదని అర్థం. ఉత్కృష్టం అంటే గొప్పది నికృష్ణం అంటే నీచమ్హైంది.
కిష్ట శబ్బానికి పీడింపబడినదని అర్ధం సంక్షిష్టం అంటే మిక్కిలి పీడింపబడినదని అర్ధం. క్లేశం, కష్టం అన్నఅర్థంలో వాడుకున్నాం కష్టం కూడా అంతే చొరరానిది, హింసించేది అని అగ్షం
గ్ చతుష్టయం అంటే నలుగురి సమూహం దుష్టచతుష్టయం సుప్రసిద్ధమే కద్ధా.
త్వష్ట అంటే (బ్రహ్మ. చెక్కేవాడు నిర్మించేవాడు.
విష్టపయ్ అంటే స్వర్గం. త్రివిష్టపమ్ అంటే మూడోస్వర్గం. ఇప్పటి టిబెట్ అన్నమాట
తుష్టి అంటే ఆనందం. సంతుష్టి అంటే సంతోషం. అసంతుష్టి అసంతోషం
నునభాషళి 35
దుష్టం అంటే దోషం కలిగింది. నిర్జుష్టం అంటే దోషం లేనిది. నిర్దిష్ట నిర్దుష్ట అనే రెండు మాటలకూ ఖేదం ఉంది నిర్దిష్టం అంటే నిర్ణీతమైన, కచ్చితమైన అని అర్ధం.
దృష్టం అంటే చూడబడినది. అదృష్టం అంటే కనిపించనిది. ఎవడి అదృష్టం వాడిది అంటే ఎవడి భాగ్యం వాడిది. విధాతరాత అన్నమాట దృష్టి అంటే చూపు. దృష్టాంతం అంటే ఉదా హరణ
ధృష్టుడు అంటే దిట్టకనం కలిగినవాడు. నలుగురు శృంగార నాయకులలో ఒకడు అధ్భ ష్టుడు అంటే దిట్టతనం లేనివాడు, సిగ్గు కలిగినవాడు.
నష్టం అంటే కనపడకుండా పోయింది. కానరానిది.
పుష్టం అంటే పోషింపబడినది దీనినుండే పుష్టి “పౌష్టికాహారం పిష్టం అంటే పిండి. పిష్టకం అంటే పిండితో చేసినవంట. పిష్టపేషణమనే ప్రయోగం ఉంది. పిష్టం అంటే పిండి, పేషణం అంటే పిండికొట్టడం. పిండిని పీండి కొట్టడం ఏమిటి? వృధా అన్నమాట. చెప్పిందే చెప్పడం.
ప్రతిష్టంభన అంటే ప్రలిబంధం, అడ్డుపడడం, కార్యవిఘాతం.
(భష్టం అంటే జారిపడినది భ్రష్టుడు అంటే జారిపడినవాడు. సామాజిక విలువల నుండి దిగజారినవాడు అన్న అర్థంలో వాడుతున్నాం.
ముష్టి అంటే పిడికిలి. పిడికిలితో బిచ్చం వేస్తాం కాబట్టీ ముష్టికి బిచ్చం అనే అర్ధం కూడా తెలుగులో ఏర్పడింది ముష్టివాడు అంటే బిచ్చగాడు. ముష్టిఘాతం అంటే పిడికిలిదెబ్బ ముష్టి యుద్ధం అంటే బాక్సింగ్. బాక్సరును ముష్టియోధుడనీ, బాక్సింగును ముష్టియుద్ధమనీ మనం వాడుకోవచ్చు.
మృష్టం అంటే శోధింపబడినవస్తువు స్వచ్చమైంది శుభ్రమైంది. మృష్టాన్నం అంటే శుభ్ర మైన భోజనం. సంమృష్టం అంటే బాగా శుద్ధిచేసింది.
యష్టి అంటీ కోల, కర్ర. భారయష్టి అంటే కావడిబద్ద. యష్ట అంటే యాగంచేసేవాడు. ఆదేష్ట అంటే యజ్ఞవిషయం బోధించేవాడు.
విష్టి అంటే వెట్టి, వృష్టి అంటే వర్షం. అతివృష్టి అంటీ అవసరమైన దానికంటే ఎక్కువ వర్షం. అనావృష్టి అంటే అవసరమైనదానికంటీ తక్కువ వర్షం వేష్టితం అంటే చుట్టబడినది అని అర్థం. పర్యవేష్టితం, సమావేష్టితం దీనినుండే వచ్చాయి.
వ్యష్టి అంటే విడి. సమష్టి అంటే మొత్తం. రిష్టం అంటే శుభం, అశుభం అని రెండర్థాలూ ఉన్నాయి. అరిష్టం అన్నా అంతే. అరిష్టం అంటే పురుటిల్లు, కుంకుడు, వేప, వెల్లుల్లి, మజ్జిగ, ఆసన్నమరణం అన్న అర్థాలు కూడా ఉన్నాయి.
శిష్టం అంటే మిగిలింది. తక్కిన వాటినుండి విడిగా ప్రత్యేకమైంది. విశిష్టం మిక్కిలి వ్రత్యే కత కలిగింది. వైశిష్ట్రం అంటే ప్రత్యేకత. పరిశిష్టం అన్నా, అవశిష్టం అన్నా మిగిలింది అనే అర్థం,
సృష్టం అంటే నిశ్చయింపబడినది, బహుళమైనది. సృష్టి సృజింపబడేది.
స్పష్టం అంటే వెల్లడి అయినది, స్ఫుటమైనది. దీనికి వ్యతిరేకం అస్పష్టం, విస్పష్టం మిక్కిలి స్పష్టం, హృష్టం అంటే సంతోషించినది. హృ్ష్టి అంటీ సంతోషం.
ఈ మాటలన్నిటిలోనూ 'టికారమే ఉంది. 'ర'కారం లేదు, బ్
36 అమనభాష
అక్షరాలు తారుమారయితే
సంస్కృతం నుండి మనం అరువు తెచ్చుకున్న మాటల్లో ధ, ధలతో ఉండే మాటలెన్నో ఉన్నాయి. అయితే ఈ రెండింటి మధ్యా భేదాన్ని పాటించడంలో పొరపాట్లు దొర్గుతుంటాయి. ఒకదాని ఐదులు ఒకటి రాయడమో, లేకపోతే అన్నిచోట్లా ఒకటీ రాయడమో కూడా పరిపాటి. కొన్నిచోట్ల వీటీని తారుమారు చేయడంవల్ల అర్జభంగం వాటిల్లుతుంది. తక్కినచోట్ల ఉచ్చారణలో భేదం న ర్థభ ల్లు ినచొట్ల ఉచ్చా
ఉదాహరణకు అర్ధ- అర్ధ శబ్దాలను తీసికోవచ్చు అర్ధ అంటే సగం, అర్ధ అంటే కోరబడేది, ధనం, వస్తువు, ప్రయోజనం- శబ్దానికి ఉందే అర్ధం. అర్ధశాస్త్రం అన్నప్పుడు భూమి, బంగారం, ధనం సంపాదించే మార్గం తెలిపేది చాణక్యుని నీతిశాస్త్రం అర్ధశాస్త్రం పదార్థం అన్నప్పుడు వస్తువు. కీర్యద్ధ్థం అన్నప్పుడు కీర్రికోసం అని అర్ధం. శబ్దార్థాలు అన్నప్పుడు పదమూ అది బోధించే విషయమూ. అర్థశాస్త్రం అన్న మాటను ఈనాడు ధన సంబంధమైన విషయాలకు సంబంధించిన శాస్త్రంగా వాడుతున్నారు. అర్ధ సంబంధమైనది ఆర్థికం. అర్ధించు అంటే కోరడం. అర్ధి అంటే అడిగేవాడు. అర్థన అంటే అడగడం. అభ్యర్థి, విద్యార్థి, ప్రత్యర్థి మొదలయిన పదాలన్నీ అంతే. సార్ధకం అంటే ప్రయోజనవంతం. నిరర్ధకం అంటే ప్రయోజన రహితం. సగం అన్న అర్థంలో తప్ప అర్ధ అనే మాటకు ప్రయోగంలేదు కాబట్టీ తక్కిన అన్ని సందర్భాలలోనూ అర్ధ అనే మాటనే వాడాలి.
అధి ఉపసర్గ, అధిక, అధికార, అధిక్షేప, అధిప, అధిపతి, అధిరోహణ, అధిష్టాన, అధ్యక్ష అధ్యాత్మ మొదలయిన పదాలన్నీ ఈ ఉపసర్గతో వచ్చేవే. ఈ పదాల నుండి ఆధిక్యం, ఆధిపత్యం, అధ్యాత్మికం వంటి మాటలు వచ్చాయి. అధస్ అంటే కింద, అధోలోకం అంటే కింద ఉండేలోకం. అధమ, అధర అనే మాటలు అధస్ నుందే వచ్చాయి అధముడు కిందివాడు. అధరం అంటే దిగువన ఉండేది. కింది పెదవి.
ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు అధ్యయనం చేయించే వాళ్ళు. వేదం చదివించే వారని అప్పటి అర్ధం. ఇప్పుడు గురువు, చదువు చెప్పేవాడు అన్న అర్ధంలో వాడుతున్నాం
అధీనుడు అంటే స్వతంత్రం లేనివాడు, పరాధీనుడు. స్వాధీనం అంటీ తన అధీనంలోనే ఉన్నది. స్వాధీనుడు అంటే స్వతంత్రుడు అధునా అంటే ఇప్పుడు. అధునాతనం అంటే ఇప్పటిది దీనినుండే ఆధునికం ఏర్పడింది
అగాధం అంటే మిక్కిలి లోతైనది
అధ్వరం, అవధానం, అనురోధం, అంతర్థానం, అపరాధం, అభిధానం మొదలయిన మాటలన్నింటిలోనూ ధకారమే ఉంది. అంధ శబ్బానికి చూపు లేకపోవడం అని అర్ధం అంధత్వం, ఆంధ్యం, అంధకారం దీనినుండే వచ్చాయి.
అవధి అంటే హద్దు ఆధి అంటే మానసిక వ్వధ.
ఆధార ఆయుధ, ఆరాధన, ఇంధన, ఊర ఓషధి, బెషధ, కంధర, కబంధ, స్మంధ, స్కంధావార, బంధు, బాంధవ, క్రోధ, క్షుధ, గంధ, ప్రధాన, బంధ, ప్రబంధ, బంధన, యోధ, విధ బాధ, బుధ, నిధి, ప్రతినిధి, ప్రాతినిధ్యం, సన్నిధి, నిధన, నిబంధ, నిబంధన, పరిధి,
మనభాషతి 37
పర్షిధాన, సంధి, సంధ్య, 'ప్యాధ, వ్యాధి, వర్ధన, బోధన, ఐధిర, బంధుర, విద్ధి విధాన, విధేయ, విధాత, మధు; మధీప. వశ్తార మధ్య, మాధవ, వంధ్య, బుధ, విబుధ, వధ, వధూ, మూర్ద, మేధా, రాధ, రుధిర, వివిధ, విరోధ, శోధన, సాధారణ, సాధు, సాధ్వి, సుధా, శుధీ, సౌధ, సాధ్య, సాధన, సింధు, సైంధవ, సైరంధ్రి మొదలయిన శబ్బాలన్నింటిలో ధకారమే ఉంది పదాదిలో ధ కారమే ఉంటుంది ధకారం ఉండదు. అందువల్ల ధర, ధరణి, ధర్మ, ధూర్త, ధన, ధాన్య, ధ్వజ, ధార, ధరిత్రి, ధవళ, ధాత, ధాత్రి, ధ్రువ, ధ్వని, ధ్వంస, ధీ, ధీర, ధూళి, ధూసర మొదలయిన మాటలన్నీ ధ కారాదులే. ధర అంటే భూమి అని అర్ధం దృణ్ ధాతువు ధరించేది అని అర్ధం, భూమిని ధరించేది భూధరం. అట్లాగే పయోధరం, మహీధరం. గంగాధరుడు, చక్రధరుడు, గదాధరుడు, విద్యాధరుడు మొదలయిన మాటలన్నీ ఇటువంటివే. కధ అంటే రచింపబడేది. కధ అనేక రకాలు. ఉపరి కధ, ఖండకధ, ఉపకధ, బృహత్మధ. చిన్న కధను కధానిక అంటున్నాం. కూర్చబడినది గ్రంధం. (గ్రధనం అంటే కూర్చడం. (గ్రధితం అంటే కూర్చబడింది, (గ్రంథి అంటే వెదురు కణుపు తిధిలో ధకారం ఉంటుంది. తిధి నుండే _ అతిధి, ఆతిథ్యం వచ్చాయి తధా అంటే ఆవిధంగా, అట్లా, యధా అంటే ఏవిధంగా, ఎట్లా తధ్యం అంటే సత్యం. యధార్థం అన్నాయధాతధం అన్నా సత్యమే యధాతధం అంటే ఉన్నదున్నట్లుగా అన్న అర్ధంలో వాడుతున్నాం తధాగతుడంటే బుద్దుడు. ఏ విధంగా మునులు మోక్షం పొందారో ఆవిధంగా మోక్షం పొందినవాడనీ, మంచిజ్ఞానం కలవాడదనీ అర్థం. తీర్ధం అంటే బావిదగ్గర ఉండే నీళ్ళ తొట్టి, శాస్త్రం, బుషులు సేవించిన జలాశయం, గురువు. తరింపజేసేది కాబట్టి తీర్ధం. పధం అంటే తోవ. పధికుడు అంటే తోవలో నడిచేవాడు త్రిపధగ అంటీ గంగ. మూడు తోవలలో నడబినది. పంధ అన్నా మార్గమే పాంధుడు అంటే బాటసారి. పధ్యం అంటే రోగం లేని మంచిమార్గం పృధు అంటే విపులం, విశాలం, పెద్దది పృధ్వి బహు ప్రయోజనాలను కలిగించేది పృధివి, పార్ధివ శబ్దాలు దీనినుందే వచ్చాయి. పృథక్ అంటే వేరుచేయడం. ప్రధమ అంటే తొలి దీనినుండే (ప్రాధమిక, ప్రాధమ్యం. వృథా అంటే వ్యర్థం, వ్యధ అంటీ బాధ. నిశీధం అంటే అర్లరాథ్రి నిశీధిని అంటే రాత్రి. నేపధ్యం, నైపధ్యం అంటే నేత్రాలకు హితవైనది భూమిక అన్న అర్గంలో వాడుతున్నాం. సమర్ధ, శపధం, వీధి, ణి మిధునం, మథనం, మంధనం, మిధ్యా, మన్మధ రధ, సారధి, మనోరధ, భాగీరధి, భీమరధి మొదలయిన మాటల్లో ధ కారమే ఉంది. కచటతపలకు ధ ఒత్తే ఉంటుంది. గజడదబలకు ధ ఒత్తే ఉంటుంది అశ్వత్ధ, ఉత్ధాన, కపెళ్ళ, సక్థిలలో ధ కారం, ఉద్దారణ, బద్ధ, బుద్ధ, వృద్ధ, ప్రసిద్ధ, సిద్ధ, శుద్ధ, సిద్ధాంత, సర్టి దగ్ధ, దుగ్ధలలో ధ కారం ఉంటాయి సకారంతో ధకారమే ఉంటుంది, ధ కారం ఉందదు. అస్థి, స్థూల, స్థితి, స్థాన, అవస్థ, స్టాలి, ప్రస్థాన మొదలయినవి ఉదాహరణలు. నాధ శబ్దానికి మాత్రం నాధ అన్న రూపాంతరం ఉంది. | శ 368 అినునబాష
శషలు తెలుగులో లేవు
సంస్కృతంలో శ ష స లు మూడూ ఉన్నాయి తెలుగుమాటల్లో స మాత్రమే ఉంటుంది అందుకే శ, షలు ఉన్న సంస్కృత పదాలు తెలుగులోకి వస్తే స గా మారతాయి. ఉదాహరణకు 'ఆశ' ఆస అవుతుంది. 'భాష బాస అవుతుంది తత్సమ శబ్బాలలో ఈ మూడు ధ్వనులకూ భేదం పాటిస్తున్నాం. సంస్కృత పదాలలో వీటిని ఒకదాని బదులు ఒకటి వాడడానికి వీలులేదు. ఉదా హరణకు కొన్ని మాటలు చూడవచ్చు సకలం అంటే భాగాలతో కూడుకొన్నది, అఖండమైనది అంతా, సర్వం అని అర్ధం. శకలం అంటే ముక్క తునుక స, శ ల మార్చువల్ల పూర్తిగా భిన్నమైన అర్ధం ఏర్పడింది. సంకరం అంటే చీపురుతో ఊడ్చిన దుమ్ము విభిన్న వస్తువుల మిశ్రాన్ని సంకరం అని వాడుతున్నాం. శంకర శబ్దానికి శివుడు, ఈశ్వరుడని అర్ధం. సమశబ్బానికి సమానం, తుల్య మని అర్ధమైతే శమ శబ్దానికి శాంతి అనీ, కామక్రోధాదులు లేకపోవడమనీ అర్ధం.
సాల శబ్దానికి కోట అనీ చెట్టు అనీ అర్థం మద్దిచెట్టును కూడా సాలవృక్షం అంటారు. శాల అంటే జనం గుమికూడి ఉండేది, సభ. పాఠశాల, వైద్యశాల, పాంధశాల, పానశాల, యాగశాల, పాకశాల, పశుశాల ఈవిధంగా దీనికి విస్తృతమైన ప్రయోగం ఉంది. స్రుతం అంటే కారినది థుతం అంటే వినబడినది. ఈ విధంగా అర్థభేదాన్ని కలిగించే వర్ధాలు కాబట్టి వీటి భేదాన్ని పాటిం చాలి.
ష కారంతో మొదలయ్యే మాటలు చాలా తక్కువ. షండం అంటే సమూహం, ఆబోతు అనే అర్థాలున్నాయి. షష్టి అంటే ఆరు, షష్టి అంటే అరవై షడ్డం అంటే ఆరుస్థానాలలో పుట్టేది. మయూరధ్వని షట్పదం అంటే ఆరుకాళ్ళు కలిగినది, తుమ్మెద. షట్స్బది అంటే ఆరు పాదాలుండే పద్యం, షడాననుడు, షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలిగిన కుమారస్వామి. షాణ్మాతురుడు అన్నా కుమారస్వామే. ఆరుగురు తల్లులు కలిగినవాడు. ష కారాది పదాలలో ఎక్కువభాగం షట్ (ఆరు) అనే పూర్వపదంతో కూడి ఉండడం గమనించవచ్చు "
సృ శ లతో మొదలయ్యే మాటలలో కొన్నింటిని గుర్తించే అవకాశం ఉంది. ఉదాహరణకు శం'తర్వాకక, ఖ,గఘ,చ,ఛజ,రు,ట,రుడధఢ,త్కధ,ద,ధ, ప,ఫ, ఐ, భలలో ఏదో ఒకటే ఉంటుంది. అంటే శకారం తర్వాత మనం సున్నార్రాసేచోట వర్గానునాసికం మాత్రమే ఉంటుంది. శంకను శజ్మ్క అనీ, శంభును శమ్భు అనీ రాయవచ్చు. 'సం?” తర్వాత ఏ హల్లయినా రావచ్చు. ఉదాహరణకు సంశయం అనే మాటను తీసుకోవచ్చు. శంశయం అని కానీ శంసయం అని కానీ ఉండదు సంయమనం అని ఉండవచ్చు. శంయమనం అని ఉండదు. సంవాదం అని ఉండవచ్చు. శంవాదం అని ఉండదు. సంరంభం అని ఉండవచ్చు కాని శంరంభం అని ఉండదు సంలాపం అని ఉంటుంది కాని శంలాపం అని ఉండదు. సంసిద్ధి ఉండవచ్చు, శంసిద్ధి ఉండదు సంహారం ఉండవచ్చు కానీ శంహారం ఉండదు. అంటే సం' తర్వాత య, ర,ల్కవ, శృష్కస, హ అనే హల్లులు కూడా వస్తాయి కాని 'శం' తర్వాత అవి రావు. తక్కిన సందర్భాలలో శబ్దస్వరూపాన్ని బట్టే తెలుసుకోవాలి. అంసమంటే భుజం. అంశమంటే భాగం.
ఆశంస అంటే కోరిక, తనకు లేని వస్తువును కావాలని కోరుకోవడం, నృశంసుడు అంటే మనుష్యులను పీడించేవాడు ప్రశంస అంటే మెచ్చుకోలు ప్రశస్తం అంటే స్తోత్రం చేయబడేది,
మనభాషత 39
శ్రేష్టమైనది ప్రశస్తి అంటే గొప్పదనం అశని అంటే పిడుగు. అశనిపాతం అంటే పిడుగుపాటు ఆశు అంటే తొందర. ఆశు కవిత్వం అంటే తొందరగా చెప్పే కవిత్వం. అశనం అంటే అహారం నిరశనం అంటే నిరాహారం. తినకుండా ఉండడం. నిరసనం అంటే తిరస్కారం. మన తిరస్కారాన్ని నిరాకృతిని తెలియ చెప్పడం నిరసనను తెలియజేయడం. నిరశనదీక్ష అంటే నిరావారదీక్ష కాస అంటే దగ్గు. కాశ అంటే రెల్లుగడ్డి. దాశుడు అంటే జాలరి. దాసుడు అంటే సేవకుడు నాశం, నాశనం అంటే నశించడం, కనిపించకుండా పోవడం. నాస, నాసిక అంటే ముక్కు నిశ అంటే రాత్రి నిశాటనం అంటే రాహ్రిపూట తిరిగేది, గుడ్లగూబ. నిశితం అంటే పదునైనది. అరగ దీసి సన్నగా, వాడిగా చేయబడింది కాబట్టి నిశితం. పశ్చాత్ అంటే పడమటి దిక్కు దీనినుండే పాశ్చాత్య ఏర్పడింది. పడమటి దిక్కుకు సంబంధించిన అని అర్ధం. ప్రాచ్య అంటే తూర్చుదిక్కుకు సంబంధించిన అని అర్ధం. రాశి అంటే పోగు. ధాన్యరాశి అంటే ధాన్యపు కుప్ప. విసర్జన అన్నమాటకు త్యాగం అని అర్థం. ఉత్సర్జనం అన్నా త్యాగమే విసర్జనం, విసర్జించు అంటే విడిచిపెట్టడం అన్న అర్ధం తెలుగులో బాగా వాడు కలో ఉంది. రవీంద్రనాధ రాగూరు రచించిన ఒక నాటికను బెజవాడ గోపాలరెడ్డిగారు విసర్జన అన్న పేర అనువాదం చేశారు. ఒకప్పుడిది డిగ్రీ తరగతికి పార్యాంశంగా ఉందేది. తెలుగు అధ్యాపకులకీమాట అంతగా నచ్చేదికాదు సృజన అంటే సృష్టించడం. సదృశం అంటే సమాన మైనది సాదృశ్యం అంటే పోలిక అసద్భశం అంటే అసమానమైనది. కీదృశం అంటే ఎటు వంటిది అని అర్థం, తాద్భశం అంటే అటువంటిది అని అర్ధం మాద్భశులు అంటే మావంటి వారు, మాతో సమానమైన వారు అని అర్ధం శుచి, శుక్ర శుక్త శిబిర, శిఖ, శుభ, శీతల, శ్వేత, శోధన, శాఖ, శృంగ, శిఖర, శోభన, శిల, శూర, శీర్ష మొదలయిన మాటలలో శకారం ఉంది. శశము అంటే కుందేలు. శశి అంటే చంద్రుడు శిశువు, శిశిరం, శాశ్వతం, శ్మశానం మొదలయిన మాటల్లో రెండేసి 'శికారా లున్నాయి. స కారం ఇ, ఈ, ఎ, ఏ, ఐలతో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి శ కారమేమోనన్న అను మానం రావచ్చు. సిత, సీత, సికకాతలం, సింహం, సింహాసనం, సింధు, స్వేద, సైంధవ, సైన్య, సైరిక, సేన, సేవక, సేవ వంటి మాటల్లో సకారమే ఉంది శ్వోతనం అంటే కారడం శ్మశానం అంటే శవాలు శయనించే ప్రదేశం. శ్మశువు అంటే గడ్డం మీసాలు. ఇటువంటి రెండు మూడు పదాలు విడిచిపెడితే, పదాదిలో శ కారంతో సంయుక్తాక్షరంలో రెండో హల్తుగా య, రృల,వ,లు మాత్రమే ఉంటాయి. కాని స కారంతో ఇతర హల్లులు కూడా సంయుక్తమవుతాయి స్కంద, స్థలన, స్తుతి, స్థాన, స్నాన, స్పష్ట స్ఫుట, స్మర, స్రవంతి, స్వప్పు స్యందన మొదలయిన మాటలను గమనించవచ్చు. స కార ల కార సంయుక్తం ఉండదు. ళల 40౦ అనునబాష
మన పేర్షు
సంస్కృతం నుండి మాటలు తెలుగులోకి వచ్చినప్పుడు కొన్ని మార్పులు పొందుతాయి. సంస్కృ తమే కాదు ఏ భాష నుండి మరే భాషలోకి పదాలు వెళ్ళినా ఆ భాషా స్వభావానికి అనుగుణంగా కొన్ని మార్పులు పొందితీరుతాయి. సంస్కృతంలో (ప్రతి పదమూ ప్రత్యయాంతమై ఉంటుంది. అంటే పదం చివర ప్రత్యయం ఉంటుంది ఉదాహరణకు ఏదైనా ఒక నామవాచకాన్ని తీసికొన్నా మనుకోండి ఆ నామవాచకం (ప్రధమావిభక్తిలో ఉందా మరేదైనా విభక్తిలో ఉందా, పుంలింగమా, స్రీలింగమా, నపుంసకలింగమా, ఏక వచనంలో ఉందా, ద్వివచనంలో ఉందా, బహువచనంలో ఉందా అన్నదాన్ని బట్టి దాని రూపం ఉంటుంది. విభక్తి లింగం, వచనం తెలిపే ప్రత్యయం పదం చివర ఉంటుందన్నమాట. ఈ ప్రత్యయంతో ఉన్నపదాన్ని తెలుగులోకి యధాతధంగా తెచ్చు కోము కదా. ఆ మాటను తెలుగువాక్యంలో తెలుగు మాటలాగా వాడుకోవాలి. అందుకోసం మాటకు తెలుగు ప్రత్యయం చేర్చుకోవాలి లేకపోతే తెలుగుమాటల రూపం కల్పించుకోవాలి.
సంస్కృతంలో ఒక పదం పుంలింగమా, స్ట్రీలింగమా, నపుంసక లింగమా అనేది పదం స్వరూపం మీద ఆధారపడి ఉంటుంది. అర్ద్జానికి సంబంధం లేదు. దారా అంటే భార్య. ఇది పుంలింగం. భార్య అనేమాట స్ర్రీలింగం. కళత్రం అన్నా భార్యే. ఇది నపుంసకలింగం. వృక్ష శబ్బ్దా నికి చెట్టు అని అర్ధం ఇది పుంలింగం. నాసిక అంటే ముక్కు ఇది స్రీ లింగం. విద్యా అంటే చదువు ఇది స్తీలింగం. మిత్ర శబ్దం నపుంసకలింగం.
తెలుగులో లింగం అర్జాన్ని బట్టి ఉంటుంది పురుషుణ్ణి బోధించే పదాలను మహత్తులనీ, తక్మినవాటిని అమహత్తులనీ అంటాం. సంస్కృతంలో పుంలింగం అయి ఉండీ పురుషుణ్ణి బోధిం చని మాట తెలుగులో అమహత్తే అవుతుంది సంస్కృతంలో నపుంసక లింగమయినా పురుషుణ్ణి బోధించేదయితే తెలుగులో మహత్తు అవుతుంది. ఈ కారణాలవల్ల సంస్కృత పదాలు తెలుగులో మార్పులను పొందుతాయి.
సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన పురుషవాచకశబ్దాల చివర “'దు'ప్రత్యయం చేరు తుంది రాముడు, కృష్ణుడు, భీముడు మొదలయిన పేర్లెన్నయినా చూపవచ్చు. ఇది అకారాంత శబ్బాలలో జరుగుతుంది. 'రామ'కు 'డు' చేరి రామ లో మకారం మీది అత్వం ఉత్వం కావడం వల్ల రాముడు ఏర్పడుతుంది ప్రాచీనకాలపు శాసనాలలో రామండు, ఖీమండు వంటి రూపాలు కూడా కనిపిస్తాయి. పదం చివరి 'అ), *ఉ'గా మారి 'డు” చేరని రూపాలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు పండరంగు.
పూర్వం మనవాళ్ళ పేర్లు అయ/అయ్య, అన/అన్న అపష/అప్ప వంటి అనుబంధ పదాలతో కూడి ఉండేవి నన్నయ, తిక్కన, కేతన, మారన, ఎర్రన, సోమన వంటి మన కవుల పేర్లు ఇందుకు ఉదాహరణలు అధర్వణుడు, భాస్కరుడు, శ్రీనాధుడు, రామభద్రుడు, రామరాజభూష ణుడు వంటి పేర్లు తరువాతి కాలంలో ప్రచారంలోకి వచ్చినా ఇప్పటికీ అయ్య/అన్న/అప్పలతో అంతమయ్యే పేళ్లే ఎక్కువ
కందుకూరి వీరేశలింగం పంతులుగారి 'రాజశేఖర చరిత్ర నవలలోని నాయకుడు రాజ శేబరుడు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో డు ప్రత్యయాంతమయిన పేర్లు పెట్టుకుంటూనే ఉన్నారు
మనబాషత 41
రాముడు, లక్ష్మణుడు, చడక్రధరుడు వంటి పేర్లు కనిపిస్తూనే ఉంటాయి. యనమల రామకృష్ణుడు గారి పేరు ఇందుకు మంచి ఉదాహరణ రామకృష్ణయ్య, రామకృష్ణప్ప, రామకృష్ణరావు, రామ కృష్ణశర్మ, రామకృష్ణమూర్తి, రామకృష్ణశాస్త్రి, రామకృష్ణుడు మొదలయిన విధంగా పేర్లు పెట్టుకో వచ్చు. కాని ఇప్పుడు రామకృష్ణ రామచంద్ర, నారాయణ, కృష్ణ వంటి పేర్లు ఎక్కువగా కనిపిస్తు న్నాయి శ్రీనివాస్, శంకర్, లక్ష్మణ్, ప్రసాద్ వంటి హలంతమయిన పేర్లు కూడా ఎక్కువవు తున్నాయి. ప్రసాద్‌ని అజంతం చేసి ప్రసాదు అంటున్నాం (ప్రసాదం, ప్రసాదరావు, ప్రసాదుడు యొదలయిన వాటికి ముందు సామాన్యంగా “వరి అనేమాట ఉంటుంది వరప్రసాదం, వర (ప్రసాదరావు, వరప్రసాదుదులాగా. ఎవరి వరం? అని ప్రశ్నించుకుంటే సత్యనారాయణ వర ప్రసాద్, కృష్ణవరప్రసాద్, వీరవేంకటసత్య వరప్రసాద్ వంటి పేర్లలో సమాధానం కనిపిస్తుంది. వర లేకుండా కేవలం కృష్ణప్రసాద్, రాంవ్రసాద్, శివప్రసాద్, దుర్గాప్రసాద్ అని కూడా ఉంటాయి. ప్రసాదు అన్న మాటను సంక్షిప్తలేఖనంగా కొంతకాలం కిందట చమత్మరించిన వాళ్ళూ లేకపోలేదు.
ఏది ఏమయినా అయ్య/ అన్న/ అప్ప/రావు/ రెడ్డి.నాయుడు/ శర్మ/ శాస్తి/ మూర్తి/ చౌదరి/ బాబు/ ఆచార్యులు వంటి అనుబంధ వదాలు కాని 'డు” ప్రత్యయం కాని లేని ఇటువంటి పేర్లు మన భాషకు సహజమయినవి కావేమో.
“డు ప్రత్యయం లేకుండా గౌరవార్ధకంగా బహువచన (ప్రత్యయం "లు చేర్చి పేరు పెట్టు కొనే పద్ధతి కూడా ఉంది. శ్రీరాములు, వేంకటేశ్వర్లు, ఆంజనేయులు, శ్రీనివాసులు వంటి పేర్లు ఇటువంటివి
పై మాటలన్నీ పేర్లకు సంబంధించినవి. ఇవి కాకుందా 'డు' ప్రత్యయం చేరేమాటలెన్న్నో ఉన్నాయి. నాయకుడు, భక్తుడు, వీరుడు, ధీరుడు, బుద్ధిమంతుడు, శక్తిమంతుడు, జ్ఞానవంతుడు, సాహసికుడ్డు (బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, వైద్యుడు, ఉపాధ్యాయుడు, అధ్యా పకుడు, ఆచార్యుడు మొదలైనవన్నీ 'దు'ప్రత్యయం చేరి తత్సమాలయిన శబ్బ్దాలే.
మంచినడవడి కలవాడు సచ్చరిత్రుడు, చెడు నడవడి కలవాడు దుశ్చరిత్రుడు. విమర్శ చేసేవాడు విమర్శకుడు. సమీక్ష చేసేవాడు సమీక్షకుడు. సభలో పాల్గొనేవాడు సభ్యుడు. ఇప్పుడు చాలామంది ఈ అర్ధంలో వాడుతూ ఉన్న 'సభికుడు' అన్న మాటకు జూదగాదు అని అర్ధం సభ్యుడు, సదస్యుడు, సభాసదుడు అన్నమాటలు వాడవచ్చు. నటించేవాడు నటుడు. దర్శనం తెలిసినవాడు దార్శనికుడు ఇట్లా అసంబ్యాకంగా పదాలు ఏర్చ్పరచుకోవచ్చు జ
తత్సమాలు ఏర్పడే పధ్ధతి సంస్కృతంలో ఇ కారాంత శబ్దాలు తెలుగులో ఇ కారాంతాలుగానే ఉంటాయి. సంస్కృత (ప్రత్యయం లోపిస్తుందంతే. హరి, గిరి, అక్షి వంటి మాటలు దీనికి ఉదాహరణలు. కపి, కుక్షి కీర్తి, ఖ్యాతి, క్షితి, జాతి, చితి, బుద్ధి, సిద్ధ, మతి, తిధి, వ్యాధి, త్రుటి, శ్రుతి, దృష్టి ముక్తి, సమాధి, వ్యక్తి మొదలయిన శబ్బాలన్నీ ఇటువంటివే.
సంస్కృతంలో దీర్చాంత శబ్దాలు తెలుగులో హ్రస్వాంతాలవుతాయి. రమా రమ అవు తుంది వనితా వనిత అవుతుంది. లక్ష్మీ లక్ష్మి అవుతుంది శిజ, జ్వాల, కధ, విద్య, అన్వేషణ, ఈర్ష్య, అసూయ, ఓషధి, కస్తూరి, కుమారి, కృప, క్రియ, గంగ, చికిత్స, జిహ్వ, జ్యోత్సు టీక, తార, త్రయి, దశ, ధార, నది, నటి, నిశ, నాస, నాసిక, పట్టిక, పద్మ పృధ్వి ప్రజ, ప్రధ, దేవత, మిధ్య, మేదిని, యాచన, యాతన, శాఖ, శోభ, సభ, సంస్థ, సీత, సేవ, సేనాని, హింస, హేష వంటి మాటలన్నీ పదాంతంలో దీర్ధం 'హ్రస్వం కాగా ఏర్పడ్డవే.
సంస్కృతంలో ఏకాక్షర పదాలు దీర్దాంతాలయినా తెలుగులో (హ్రస్వాంతాలుగా మారవు. కామా, శ్రీ, స్తీ హీ, ధీ వంటివి దీర్చాంతాలుగానే ఉంటాయి.
ఉ కారాంత పదాల చివర తెలుగులో 'వు' చేరుతుంది. అంబువు అంటే నీరు. అంశువు అంటే కిరణం. అణువు, అసువు, అశువు, ఆయువు, ఆశువు, ఈర్వ్యాకువు, ఇక్షువు, ఊరువు, బుజువు, కటువు, కాకువు, (క్రతువు, గురువు, చక్షువు, జంతువు, జన్యువు, తంతువు, తనువు, తాలువు, దారువు, ధేనువు, తరువు, పటువు, బంధువు, బిందువు, భీరువు, పశువు, ప్రభువు, మనువు, మధువు, మృదువు, వటువు, వధువు, వస్తువు, లఘువు, శంకువు, శత్రువు, సింధువు, సేతువు, హేతువు మొదలయిన మాటలు 'వుప్రత్యయం చేరగా ఏర్పడినవి పురుష వాచకాలయినప్పుడు వీటిలో కొన్ని మాటలపై *“డు' ప్రత్యయం కూడా చేరుతుంది 'వు' చేరిన రూపమూ, 'డు' చేరిన రూపమూ రెండూ ఉంటాయన్నమాట గురువు - గురుడు, బంధువు - బంధుడు, భీరువు - భీరుడు, వ్రభువు - (ప్రభుడు, శత్రువు - శత్రుడు, విష్ణువు - విష్ణుడు, శంభువు - శంభుడు, వసువు - వసుడు అని రెండు రకాల రూపాలూ వాడుకలో ఉన్నాయి ఆధునిక భాషలో “వు'తో ఉన్న రూపాలే ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి.
గో శబ్దం గోవు అవుశుంది.
సంస్కృతంలో నపుంసకలింగ శబ్దాలు సాధారణంగా మకారాంతాలుగా ఉంటాయి. ఈ మకారం లోపింబీ తెలుగులో 'ము ప్రత్యయం చేరుతుంది. మిత్రమ్ - మిత్రము, దైవమయ్ - దైవము, అపత్యయ్ - అవత్యము. లోచనం, నయనం, నేత్రం, వక్త్రం, కాయం, కారణం, ధర్మం, వదనం, చిబుకం, ఓష్టం మొదలయినవన్నీ ఇంతే, అధునికభాషలో పదాంతంలోని “ములో అచ్చు లోపింపచేయడం వల్ల ఇవి ఏర్పడుతున్నాయి సంస్కృతంలో నపుంసక లింగశబ్దాలు కాక పోయినా తెలుగులో అమహత్తును అంటే పురుషేతరమైన వాటిని బోధించే శబ్దాల చివర ము (ప్రత్యయం చేరుతుంది. ఖద్గః అన్నమాట సంస్కృతంలో పుంలింగం. కాని తెలుగులో అమహత్తు తెలుగులోకి వచ్చినప్పుడు ఈ మాట ఖడ్గం అవుతుంది అట్లాగే ఇదే అర్ధాన్ని ఇచ్చేమాటలు చం(ద్రహాసం, కరవాలం, కృపాణం మొదలయినవి
పణః పుంలింగం. తెలుగులో పణం. అంటే పందెం మయూఖ శబ్దం కూడా
పుంలింగమే. తెలుగులో మయూఖం అంటే కిరణం. మేష శబ్దానికి మేక అని అర్ధం. సంస్కృ తంలో ఇది పుంలింగం తెలుగులోకి వచ్చి మేషం అయింది. లోక శబ్దం పుంలింగం. తెలుగులో లోకం అయింది. అట్లాగే శ్లోకం కూడా వ్యాజశబ్దం కూడా పుంలింగమే. తెలుగులో వ్య్వాజం. ఈ విధంగా సంస్కృతంలో పుంలిం గంలో ఉన్నమాటలు తెలుగులోకి అమహత్తులుగా వస్తాయి. వస్తువులు, జంతువులు, భావాలు తెలిపే మాటలనేకం ఇటువంటివే. తెలుగులో లింగబోధకు అర్ధం (ప్రధానం కాబట్టి ఒక పదాన్ని చూసి ఇది ఏ లింగంలో ఉంది అని సందేహించవలసిన అవసరం లేదు. అర్ధం తెలిస్తే చాలు. క్రియతో అన్వయిస్తుంది కాబట్టి కర్తగా ఉన్న నామవాచకాన్ని గుర్తించడం తెలుగులో కష్టంకాదు కొన్నిమాటలు “మూ ప్రత్యయం చేరీ, చేరకా కూడా వాడుకలో ఉన్నాయి. చరిత్ర - చరిత్రం, చరిత - చరితం, అభిలాష - అభిలాషం, అక్షత - అక్షతం, ఘోష - ఘోషం, భ్రమ
- భ్రమం, విజ్బంభణ- విజ్బృంభణం, వధ- వధం, స్ఫురణ- స్పురణం, హంస- హంసం, అన్వే షణ - అన్వేషణం, ప్రార్ధన - ప్రార్ధనం, ప్రవర్తన - ప్రవర్తనం మొదలయినవి. కాని ఆధునిక భాషలో ఈ మాటలను 'ము' ప్రత్యయం లేకుండానే ఎక్కువగా వాడుతున్నారు వాక్స్ దృక్, త్వక్, బుక్ శబ్దాలు తెలుగులో వాక్కు దృక్కు త్వక్కు బుక్కు అవుతాయి. అవాక్ అవాక్కు అవుతుంది. రాట్ విరాట్స్ స్వరాట్, సమ్రాట్ శబ్దాలు రాట్టు, విరాట్టు, స్వరాట్టు, సమ్రాట్టు అవుతాయి. ఆపత్ ఆపత్తు అవుతుంది. ఆపద కూడా అవుతుంది. ఈషత్ ఈషకత్తు అవుతుంది. కదాచిత్ కదాచిత్తు అవుతుంది. క్షుత్- క్షుత్తు అవుతుంది పరిషద్ పరిషత్తు అవుతుంది. శరద్ శరత్తు అవుతుంది. మృత్, యావత్, సత్, అసత్, సరిత్, హరిత్లు మృత్తు, యావత్తు, సత్తు, అసత్తు, సరిత్తు, హరిత్తులవుతాయి. భిషజ్ భిషక్కు అవుతుంది. గిడుగు రామమూర్తిగారి 'ఆంధ్రపండిత భిషక్కుల భాషాభేషజం” సుప్రసిద్ధం. సకృత్ సకృత్తు అవుతుంది సుహృద్ - సుహృత్తు అవు తుంది. జగత్ జగత్తు అవుతుంది. జగం అనే రూపం కూడా ఉంది. ఉషస్్స, ఓజస్, స్రోతస్, వచస్, వర్చస్, హవిస్, పయస్, వయస్, సరస్ శబ్దాలు ఉషస్సు, ఓజస్సు, ప్రోతస్సు, వచస్సు, వర్చస్సు, హవిస్సు, పయస్సు, వయస్సు, సరస్సు అవుతాయి. మనస్, శిరస్, సదస్ శబ్దాలు మనము/ మనసు/ మనస్సు, శిరము/ శిరసు/ శిరస్సు, సదసు/ సదస్సు అవుతాయి. ఉరస్, వక్షస్, తపస్, తమస్, ఛందస్, తేజస్, నభస్, నమస్, రజస్ శబ్దాలు ఉరము/ ఉరస్సు, వక్షము/ వక్షస్సు, తపము/ తపస్సు, తమము/ తమస్సు, ఛందము/ ఛందస్సు, తేజము/ తేజస్సు, నభము/ నభస్సు, నమము/నమస్సు, రజము/ రజస్సు అవుతాయి. ధనుస్, ఆయుస్లు ధనువు/ ధనుస్సు, ఆయువు/ ఆయుస్సు అవుతాయి భూ భువి అవుతుంది. ద్యు దివి అవుతుంది నౌ నావ అవుతుంది. కర్శృ, జనయిత్ఫ స్రీవాచకాలయినవ్పుడు కర్రి. జనయి(త్రి అవుతాయి వనజముఖీ, వనజముఖ, చంద్రముఖి, చంద్రముఖ అని రెండు రూపాలు ఉండవచ్చు. మీననేత్ర పద్మనేత్ర అన్నని సరయిన రూపాలు. మీననేత్రి, పద్మనేత్రి సరయినవి కావు. ఇక్కడ చేపల వంటి కన్నులు కలిగినది, పద్మము వంటి కన్నులు కలిగినది అని అర్ధం. నేత్ర శబ్దం. నేత శబ్ధానికి నాయ కత్వమని అర్థం. నేత్రి అంటే నాయకురాలు. అభినేత్రి, అధినేత్రి మొదలయిన వాటిలో అర్ధం ఇదే! చె ఓ ఉమనబాష
మేరులోనే ఉంది పెన్పిధి
పేవలో ఏముంది పెన్నిధి అని కొందరంటే పేరులోనే ఉంది పెన్నిధి అంటారు మరికొందరు. రవీంద్రనాథ టాగూరు 'సూక్ష్మ విచారణ” అన్న ఒక హాస్య వ్యంగ్య నాటికలో పేర్తు గురించి పెద్ద చర్చ చేశాడు. అసలు పేరంటే ఏమిటి? అని ప్రశ్న వేసి సాగలాగి 'భాష ద్వారా ఒక స్వతం[త్ర పదార్ధపు అస్తిత్వాన్ని నిర్దేశించడానికి పనికివచ్చే కృత్రిమ సాధనాన్ని నామకరణం అంటారు' అని నిర్వచించి ఈ నిర్వచనంలోని ఒక్కొక్క అంశం గురించీ అనేకతర్మాలు చేయవచ్చునంటాడు అవతలి మనిషి ఈ తర్మం బాధపడలేక పారిపోయేంత వరకూ వస్తుంది.
మనం పెట్టుకునే పేర్లలో ఎక్కువభాగం దేవతల పేర్లు కొన్ని వస్తువుల పేర్లు, మరికొన్ని భావాల పేర్లు. తెలుగు వాళ్ళం ఏ పేరునైనా అమ్మ, అయ్య వంటి అనుబంధ పదం చేర్చి స్త్రీవాచ కంగానైనా, పురుష వాచకంగానైనా వాడుకుంటాం. రమణయ్య - రమణమ్మ, ఎల్లయ్య - ఎల్లమ్మ, నరసయ్య - నరసమ్మ ఈవిధంగా పేర్లు పెట్టుకుంటాం. అక్క - అన్న చేర్చీ కూడా పేర్లు పెట్టుకోవచ్చు. నేటికాలంలో కుమార్ - కుమారి అన్న అనుబంధాలను చేర్చి కూడా పేర్లు పెట్టు కుంటున్నాం.
ఒకే ప్రత్యయంతో స్రీ, పురుష బోధకంగా పేర్లు ప్రాచీనకాలంలో కనిపిస్తాయి. తాతమ్మ పురుషుడి పేరయితే కుగ్రమ్మ స్రీ పేరు. అమ్మ, అండి, ఆలు, పోరి వంటివి శాసనాలలో ఉన్నాయి. ఆధునిక కాలంలో కూడా బాలకృష్ణమ్మ, నాయుడమ్మ వంటి పేర్లు పురుషనామాలుగా ఉన్నాయి.
రెడ్డి, రావు, నాయుడు, మూర్తి, శాస్త్రి చౌదరి వంటి అనుబంధ పదాలతో కూడా స్రీ పురుష నామాలు వాడుకలో ఉన్నాయి. స్రీ, పురుష బోధక ప్రత్యయాలు కాని, అనుబంధ పదాలు కాని చేరని పేర్లు కూడా విసృతంగానే ఉన్నాయి. ఇటువంటి పేర్లవల్ల పేరును బట్టీ ప్రీయో, పురుషుదో తెలుసుకోవడం కష్టమవుతుంది. నారాయణ, వెంకటరమణ వంటి పేర్లు సర్ససామాన్యమే
సంస్కృతంలో నపుంసక లింగ శబ్దాలను పేర్లుగా పెట్టుకున్నప్పుడు వాటి చివర 'మూ చేరుతుంది. “రత్న శబ్దం తీసుకుంటే “రత్నము” అవుకుంది. ఇప్పుడు దీన్ని హలంతం చేసి రత్నం అంటున్నాం, రాజరత్నం, వెంకటరత్నం, మణిరత్నం, ఏసురత్నం మొదలయిన పేర్లన్నీ ఇటు వంటివే, 'కాంత' శబ్దం కూడా ఇటువంటిదే, సూర్యకాంతం, లక్ష్మీకాంతం, చంద్రకాంతం వగ యిరా. సత్యం, శివం, సుందరం మొదలయిన శబ్దాలు కూడా అంతే, శివుడు అని 'డు ప్రత్య యంతో కూడా పేరు వాడుకలో ఉంది. వెంకటరత్నం, లక్ష్మీకాంతం వంటి పేర్లు స్త్రీలకూ, పురుషులకూ కూడా వర్తిస్తాయి. మాణిక్యం అన్న పేరు కూడా ఇటువంటిదే.
చం[(ద్రశేఖర, రాజశేఖర, బాలేందు శేఖర, శేఖర శబ్దాలు పుంలింగ శబ్దాలు. అయినా చంద్రశేఖరం, రాజశేఖరం, బాలేందుశేఖరం, శేఖరం అని పేర్లు పెట్టుకుంటున్నాం.
రామ శబ్దం పుంలింగం. రామం అని పేరు పెట్టుకుంటున్నాం, శంకర శబ్దం పుంలింగం. శంకరం అని పేరు పెట్టకుంటున్నాం. వేంకటేశ, రాజేశ, రామేశ శబ్దాలు కూడా పుంథింగ శబ్బాలే. వెంకటేశం, రాజేశం, రామేశం అని పేర్లు పెట్టుకుంటున్నాం.
రామానుజ, సుబ్రహ్మణ్య, సుదర్శన శబ్టాలు కూడా పుంలింగ శబ్టాలే. రామానుజం, సుబ హ్మణ్యం, సుదర్శనం అని పేర్లు పెట్టకుంటున్నాం. నరసింహ శబ్దం కూడా ఇంతే. నరసింహం
మనభాషతి 45
అని పేరు పెట్టుకుంటున్నాం. ఈ పేర్లన్నీ మకారాంతంగా ఎందుకు పెట్టుకుంటున్నాం? ఇది కొంచెం ఆలోచించవలసిన విషయమే నమశ్శివాయ అనే పేరు కూడా ఉంది శివుని కొరకు నమస్కారం అనీ అర్ధం ఈ పేరు పిలవడం వల్ల శివునికి నమస్కారం చేసినట్లవుతుందని ఈ పేరుపెట్టే వారి ఆశయం కావచ్చు. ఇంట్లో పిల్లవాజణ్జి ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు భగవంతునికి నమస్మరించినట్లే అన్న ఆశాభావం దీనికి కారణం కావచ్చు శేఖరం, శంకరం, రామం, వేంకటేశం, రామానుజం, సుదర్శనం, సుబ్రహ్మణ్యం, నర సింహం మొదలయినవి ద్వితీయావిభక్ష్యంత రూపాలు వీటితో నమామి, వందే వంటి క్రియా శబ్దాలుంటాయి. నమస్కరిస్తున్నాను అన్నమాట. క్రియతో కూడా కలిపితే నమశ్చివాయ వంటి వాక్యాలవుతాయివి. వాక్యాన్ని ముక్కలు చేసి ప్రధమా రూపం కాకుండా ద్వితీయాది విభక్ష్యంత రూపాన్ని పేరుగా పెట్టుకుంటున్నామన్నమాట. రాజ్యం, రంజనం నపుంసక లింగ శబ్దాలు. రాజ్యం సాధారణంగా స్త్రీలు పెట్టుకొనే పేరు. రంజనం పురుషులు పెట్టుకొనే పేరు. అవతారం అమహత్తు కాబట్టి రామావతారం, శేషావతారం అని పేర్లు పెట్టుకుంటున్నాం రామరాజభూషణుడు సుప్రసిద్ధ తెలుగుకవి ఈయన అసలుపేరు భట్టుమూర్తి. రామరాజ భూషణుడు అన్నది బిరుదు. అలియరామరాయలకు ఈయన అలంకారం వంటివాడు కాబట్టి రామరాజభూషణుడు అన్న బిరుదం వచ్చింది ఆ కాలంలో ఇటువంటి బిరుదులున్నాయి. వేంకటరాయ భూషణుడనే కవి కూడా ఉన్నాడు. నాగభూషణం అని పేరు పెట్టుకుంటున్నాం. పాము అనే అలంకారమని అర్ధం. నాగభూషణుడు అంటే పాము అలంకారంగా కలిగినవాడు కృష్ణంరాజు వంటి పేర్లలో పూర్వశబ్దం కృష్ణమ్మ, ఇదే కృష్ణము అయి తర్వాత కృష్ణం అయింది బహువచన ్రత్యయంతో స్త్రీ, పురుష నామాలు రెండూ ఉంటాయి. సీతారాములు, రాములు, సుబ్బులు వంటి పేర్లు ఇద్దరికీ ఉంటాయి. చె 46 ఇ నమనభాష
తమదాది సంయుక్తాలు
(ప్రతిభాషలోనూ ధ్వనులుంటాయి లిపి ఉన్న భాషల్లో ఈ ధ్వనులకు లిపి సంకేతాలుంటాయి. ప్రతి భాషలోనూ మనం ఉచ్చరించే ధ్వనులన్నిటికీ లిపి చిహ్హోలుండవు. ప్రధానమయిన వాటికి మాత్రమే ఉంటాయి. ప్రధానమయిన ధ్వనులు అంటే అర్ధభేదక సామర్థ్యం ఉన్నవి. అంటే ఒక ధ్వని బదులు మరో ధ్వనిని ఉచ్చరిస్తే ఆ మాటకుండే అర్ధం మారిపోతుందన్నమాట. తెలుగులో ఆ విధమయిన (ప్రధాన ధ్వనులేమిటని పరిశీలిస్తే పది అచ్చులున్నాయి. అవి అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ,ఎ,వ,ఒ, ఓ పందొమ్మిది హల్గులున్నాయి అవి కృచృట,తుషపష్త్కగ,జ,డ,ద,ుబ,ణ,న, మయ,ర్త్కల్కళ్ళవ,స తక్కిన అచ్చులూ హల్లులూ ఇప్పుడు మనం వాడుతూ ఉన్నవి ఇతర భాషా పదాలతో వచ్చినవి. ఆ పదాలు రాయడానికి అవి కావాలి.
ఈ వర్జాలన్నీ పదంలో అన్ని పరిసరాలలోనూ రావు. కొన్ని పదాదిలో రాకపోవచ్చు. కొన్ని కొన్నిటితోనే సంయుక్తాలు కావచ్చు. తక్కిన వాటితో కలవకపోవచ్చు. తెలుగులో వర్జాలు ఏయే పరిసరాలలో ఎలా వస్తాయో పరిశీలిద్దాం
తెలుగుమాటల్లో ణ, ళ, య పదం మొదట ఉండవు. వు, వూ, వొ, వో కూడా పదం మొదట ఉండవు అంటే పదం మొదట ఉ, ఊ, ఒ, ఓ అని అచ్చుతోనే ఇవి ఉంటాయన్నమాట.
ఒకేమాటలో రెండచ్చులు వరుసగా ఉండవు అంటే అఇతే (అయితే), ఆఉ (ఆవు), ఏఓ (ఏవో) వంటి రూపాలు ఉండవు. రాఇ (రాయి), రేఉ (రేవు) వంటి రూపాలు ఉండవు
మాట మొదట ద్విరుక్తం ఉండదు అంటేక్క గ్గ, చ్చ వంటి వాటితో పదం మొదలుకాదు.
పదాదిలో సంయుక్త వర్చాలు తక్కువ. సంయుక్త వర్ణం అంటే రెండు కాని అంతకంటే ఎక్కువగాని హల్లులు కలిసిన వర్ణం. అయితే తెలుగులో పదం మొదట రెండు హల్లుల సంయు క్తాలు మాత్రమే ఉంటాయి. అంతకంటే ఎక్కువవి ఉండవు. ఆ రెండు హల్గుల్లోనూ రెండో హల్లు ర కారమే అయి ఉంటుంది ఇతర హల్గులుండవు ర కారం రెండో హల్లుగా ఉండే పదాది సంయుక్తాలలో మొదటి హల్లు క, గ, త, దృప్కుబఐ, మ, వలలో ఒకటి అయి ఉంటుంది. ఈ ఎనిమిది హల్లులు తప్ప ఈ సంయుక్తంలో మొదటి హల్లుగా మరే హల్లూ రాదు. దీనినిబట్టి స్తుతి, స్థిత, స్నేహం, క్లేశం, స్యందనం, న్యస్తం, వ్యవసాయం, స్వేదం, స్మరణ, త్వర వంటి మాటలు తెలుగు మాటలు కావని గుర్తించవచ్చు.
తెలుగులో పదాదిలో ఉన్న సంయుక్తాలు కూడా ఒక అచ్చు లోపించడం వల్ల ఏర్పడ్డవే. మోగు - మొరగు వంటి మాటలను చూస్తే ఇది అర్ధమవుతుంది. గ్రుడ్డి - కురుడు, (మాను - మరమయ్ వంటివి మరికొన్ని ఉదాహరణలు ఆధునిక భాషలో ఈ సంయుక్షాలలో ఒక హల్లు లోపిస్తున్నది. సాధారణంగా ఈ హల్లు ర కారమే
కొన్ని మాటలలో ఆధునికభాషలో ర కారం లోపించిన రూపాలనే ఎక్కువగా వాడు తున్నాం. కంప-కంప, క్రక్కు-కక్కు క్రమ్ము-కమ్ము, క్రయ్య-కయ్య, క్రాక-కాక, క్రింద-కింద, క్రిక్కిరియు-కిక్కిరియు, క్రుంకు-కుంకు, క్రుంగు-కుంగు, (క్రుక్కుకుక్కు క్రుమ్మరించు- కుమ్మరించు, క్రుమ్ము-కుమ్ము (క్రుళ్ళు-కుళ్ళు, క్రొంకి-కొంకి, క్రొత్త-కొత్త, ొవ్వు-కొవ్వు క్రోతి-కోతి, గ్రచ్చకాయ-గచ్చకాయ, [గ్రుంత-గుంత, (గ్రుక్కగుక్క గ్రుచ్చు-గుచ్చు, గ్రుడ్డి-గుడ్ది,
మనబాషతి 47
'గ్రుద్దు-గుడ్దు, (గ్రుద్దు-గుద్దు, [గ్రువ్వ-గువ్వ, కత్రంపి-తంపి, త్రట్టు-తట్టు, త్రవ్వు-తవ్వు, ్రాచు- తాచు, జ్రాగు-తాగు, త్రాదు-తాడు, త్రివ్చుట-తిప్పుట, ్రిప్పు-తిప్పు, (తుక్కు-తుక్కు త్రువ్చు- కుప్పు, క్రుట్టె-తుట్టె, క్రుళ్ళు-కుళ్ళు, త్రెగు-తెగు, శైళ్ళు-తెళ్ళు, ్రేన్చు-తేన్చు, [క్రొక్కూతొక్కు తోయు-తోయు, (త్రోలు-తోలు (తోలడం), శ్రోవ-తోవ, ద్రబ్బ-దబ్బ, ద్రిండు-దిండు, ద్రాబ్బు- దొబ్బు, ప్రక్క-పక్క ప్రగ్గం-వగ్గం, ప్రత్తి-పత్తి ప్రాకు-పాకు, ప్రాచి-పాచి, ప్రాత-పాత, ప్రాతు- పాడు, ప్రాక-పాక, ప్రాము-పాము (రుద్దు, ప్రచ్చు-పుచ్చు, (పేగు-పేగు, పేము-పేము, 'పేలు-పేలు, (పేలాలు-పేలాలు, (ప్రేలిక-పేరిక, ప్రార్దు-పొద్దు, 'ప్రాయ్యి-పొయ్యి, ప్రోగు-పోగు (కుప్ప, కమ్మ), బ్రతుకు-బళుకు, (మ్రగ్గు- మగ్గు, (మ్రబ్బు-మబ్బు, (మాకు, (మాను - మాకు, మాను, మ్రాగన్ను-మాగన్ను, మాగు-మాగు, మింగు -మింగు, ముక్క-ముక్క (ముక్కు-ముక్కు (సారహీనం: ముక్కవియ్యంలాగా), మ్రగ్గు-ముగ్గు, మ్రుచ్చు-ముచ్చు, మైక్‌కు-మొక్కు మొగ్గు- మొగ్గు, మైోగు-మోగు, మైోడు-మోడు, వ్రంత-వంత, వ్రేకటి-వేకటి, (వేగు-వేగు, (వేటు-
వేటు, (వేలు-వేలు (వేలాడడం, చేతినేలు). పదాది సంయుక్తాలుగా ఉండే కొన్ని మాటలకు వాడుక తగ్గింది అవి వద్యరచనలో మాత్రమే కనిపిస్తాయి వీటిలో రకార లోపం కనిపించదు. (కంత అంటే తోవ. (క్రమ్మర అంటే మళ్ళీ అని అర్ధం. (క్రమ్మరించు అంటీ మరల్చడం, వెనక్కుతిన్పడం. (క్రియ్యు అంటే జృశించడం, కోలు అంటే తాగడం, క్రోవి అంటే గొట్టం పిల్లంగోవి అని ర కారం లోపించిన రూపంతో వాడు తున్నాం. [గ్రుచ్చు అంటే తవ్వడం. (త్రుంగు అంటే ముక్కలు కావడం, ముగియడం, చావడం. 'ప్రన్న అంటే అందం. ప్రబ్బు అంటే వ్యాపించడం, 'ప్రమ్ము అంటే చుట్టుకోవడం, ్రవ్వ అంటే కుండ, మ్రంగు అంటే 'క్రుంగు. ప్రావ అంటే దోషం. ప్రిదులు అంటే తాలగిపోవు, తగ్గు, సదలు అని అర్ధం, బ్రాతి అంటే ప్రేమ. బందు అంటే లేని నిందను మోపడం. (బిందు అంటే ఇరుకు చోటు. (బ్రుంగు అంటే మునగడం, బ్రుయ్యు అంటే నశించడం. మైంగు అంటే ఎగసివడడం. వీలు అంటే బద్దలు కావడం. (వేత అంటే గొల్ల స్రీ. (వ్రేల్చు అంటే హోమం చేయడం, టవైేల్మి,
'వేలిమి అంటీ హోమం. బ్ తీరి అమనభాష
రకారానికి లోపం ఎక్కడ కొ న్ని మాటలు సమాసంలో మార్పు పొందకుండానే ఉంటాయి. ముఖ్యంగా విశేషణాలుగా వచ్చినప్పుడు విడిగా మార్పు ఉన్నాసమాసంలో మార్పులేకుండానే ఉంటాయి. క్రింద అన్నమాట విడిగా కింద అయింది ఇది సమాసంలో విశేషణంగా క్రి అని క్రీ అనీ ఉంటుంది. ఉదాహరణకు (క్రియ్యూట అంటే క్రింది ఊట. (క్రీ గడుపు అంటే క్రింది కడుపు, పొత్తి కడుపు. క్రీ గోరు, క్రీ నీడ, క్రీ వాడ, క్రీ దొాడవంటి మాటలన్నీ ఇటువంటివే వీటిలో పదాది సంయుక్తంలో రకారం లోసిం చదు క్రిగ్గాలి అంటే తూర్పుగాలి.
క్రీ గన్ను అంటే కటాక్షం, కంటి తుద; క్రీగయి అంటే హస్తాగ్రం. కయి అంటే చేయి. క్రీ అంటే కొన. ఈ మాటల్లోనూ రకానికి లోపం లేదు.
క్రొత్త కొత్త అవుతుంది. సమాసంలో విశేషణంగా వచ్చినప్పుడు క్రొ లో మార్చు ఉండదు. క్రొాంజాయ, (కొంజిగురు, క్రొంజిలుగు, క్రాంజీకటి, క్రాందమ్మి, క్రొందావి, క్రొాంబట్టు, క్రొం బెరుగు, క్రొంబొగ, క్రొత్తమ్మి, క్రొత్తావి, కొన్నన, క్రొన్నుదురు, క్రొన్నెత్తురు, క్రొన్నెల, క్రొమ్మావి, క్రొమ్మించు, క్రొమ్ముడి, క్రామ్మెరుగు, క్రొవ్వాడి, క్రొవ్విరి ఈవిధంగా ఎన్ని సమాసాలయినా నిర్మించుకోవచ్చు. ఈ సమాసాలన్నిబినీ యధాతధంగా వాడుకోవచ్చు. కాని వీటి స్థానంలో కొత్త అన్న విశేషణాన్నే వాడి సమాస నిర్మాణం చేస్తున్నాం కొత్త నెత్తురులాగా.
ప్రాత పాత అవుతుంది. ప్రాయిల్టు, ప్రాగెంపు, ప్రాబలుకు మొదలయిన వాటిలో ప్రాలోని ర కారానికి లోపం లేదు. ఇక్కడ కూడా 'పాతనే విశేషణంగా వాడుతున్నాం.
'ప్రాయి అంటే బియ్యం. బహువచన (ప్రత్యయం "లు చేరితే ప్రాలు అవుతుంది. సమా సంలో రెండోపదంగా వచ్చినప్పుడు ఈ మాటలో ర కారానికి లోపం లేదు. తలంబ్రాలు, సేసబ్రాలు,
క్రాలు అంటే కదలడం. దీనితో కన్ను చేరి క్రాల్గన్ను అవుతుంది. అంటే కదిలే కన్ను. 'క్రాల్ల్గంటి అంటే చంచలాక్షి
ప్రోలు అంటే పట్టణం. ఇది మన ఊళ్ళ పేర్లలో కనిపిస్తుంది. కొన్ని చోట్ల ర కారం లోపించీ ఉంటుంది. కొన్ని చోట్ల లోపించకుండానూ ఉంటుంది. నిడదవోలు, ఒంగోలు, బిక్కవోలు, చందోలు, అయినవోలు, అందోలు మొదలయినవి రకార లోపం వచ్చినవి. చేబ్రోలు, జటప్రోలు, నిడుబ్రోలు మొదలయినవి ర కార లోపం రానివి. రాయప్రోలు సుబ్బారావు గారి ఇంటిపేరు రాయప్రోలు కూడా అంతే.
(క్రంచర, క్రన్న క్రన్నన, క్రమ్మన, క్రచ్చర వీటికి త్వరగా, వేగంగా అని అర్ధం. ఇవి వాడుకలో లేవు క్రుందు అంటే మోగడం, విలపించడం, ఉపద్రవం, ఎక్కువ అని అర్థాలు. దీనికీ వాడుకలేదు. క్రించు - కించు అంటే అల్పుడు, నీచుడు అని అర్థం. ఇది వాడుకలో లేదు కాని, కించపరుచు అని వాడుతున్నాం. తక్కువచేయు, అవమానించు అని అర్ధం. క్రిక్కఅంటే భట్రాజు. ఈ మాటా ఇప్పుడు వాడుకలో లేదు.
'క్రుచ్చు అంటే కూర్చడం. పూలు గుచ్చడం వాడుకలో ఉంది. ఇక్కడ క్రుచ్చడమే, గుచ్చడం కాదు.
మనభాషత 49
క్రేపు అంటే దూడ. ఇక్కడ రకార లోపం లేదు [క్రేవ అంటే పారం, పక్క ఈ మాటలోనూ ర కార లోవం లేదు.
(గ్రక్కున అంటే వెంటనే. త్రచ్చు అంటే చిలకడం,
ప్రగడ అంటే మంత్రి. దీనికి ప్రెగడ, ప్రెగ్గడ అని కూడా రూపాంతరాలున్నాయి. ప్రబలడం అంటే వ్యాపించడం ఈ మాటల్లోనూ రకారలోపం లేదు.
ప్రమిద - పమిద రెండు రూపాలూ వాడుకలో ఉన్నాయి. ప్రోది, ప్రోచులకు పెంచు, పోషించు అని అర్ధం. వీటిలోనూ రకారలోపం లేదు. మైల అంటే ముందు, ఎదుట అని అర్ధం. ఇక్కదా రకారలోపం లేదు (వ్రేపల్లె అంటే గొల్లపల్లె.
(కాలు అంటే కదలు, తిరుగు, (కమ్ము, విజ్బంభించు, ఒప్పు అని అర్థాలు దీనిలో రకారం లోపిస్తే కాలు అవుతుంది. క్రియాపదంగా కాలు అంటే దగ్ధమగు అని అర్ధం. ఈ రెండింటికీ భేదం ఉండదు. ప్రతి అంటే వస్తువు, సదృశ వస్తువు అని అర్ధం. ఇక్కడ రకారలోపం లేదు. ప్రతి లేదు అంటే ఈడు లేదని అర్థం. ప్రతి అంటే నకలు, కాపీ అని కూడా అర్ధం.
(బ్రాయులో రకారం లోపించదు వకారం లోపిస్తుంది. రాయు అవుతుంది. వ్రాయి అంటే రాత. వ్రాలు అన్నారాతే. ఇక్కడ వ కారం లోపించి, రాయి, రాలు కాలేదు వ్రాత మాత్రం రాత అయింది. ర కారం లోపిస్తే వాత అవుతుంది. వ్రాయి, వ్రాతలలో వ కారం లోపిస్తే రాయి, రాతలతో భేదం పోతుంది. వ్రాలులో రకారం పోతే వాలుతో భేదం పోతుంది. వ్రాయిలో ర కారం లోపిస్తే వాయి అవుతుంది వాయి అంటే నోరు. అప్పుడూ భేదం పోతుంది. బహుశా ఈ కారణం వల్లనేనేమో కొందరు (వ్రాయు ధాతు రూపాలన్నింటినీ సంయుక్తాక్షరంతోనే రాస్తున్నారు.
ఆధునిక భాష రాసేవాళ్ళలో కూడా కొందరు 'క్రింద'లో రకారలోపం చేయడంలేదు. అట్లాగే క్రితం.
ప్రాచీన భాషలో వాడుకలో ఉండి, ఆధునిక భాషలో అంతగా వాడుకలోలేని మాటల్లో సంయుక్తం నిలిచింది. అట్లాగే అరువు తెచ్చుకున్న మాటళ్లోనూ సంయుక్తం నిలిచింది
తెలుగులో పదమధ్యంలో కాని, పదాంతంలో కాని సంయుక్తాక్షరాలు తక్కువ. ద్విత్వాలు ఎక్కువ అక్క అన్న అమ్మ, పట్టీ, వల్ల, గడ్డ, వద్ద మొదలయినవి. సంయుక్తాలు అచ్చులోపిం
చడం వల్ల ఏర్పడతాయి. పాల్గొను (పాలుగొను), కల్గిన (కలిగిన్ము పల్కు (పలుకు), అల్మ (అలుకు, చిల్క (చిలుక), చెర్వు (చెరువు) అనునాసిక ద్విత్వం ఉంటుంది. రెండు అనునాసికాల సంయుక్తం ఉండదు, చిన్న కమ్మ, జన్మ ఆమ్నాయం వంటివి సంస్కృత వదాలు. క్రియలలో సకార, తకార సంయుక్తం ఉంటుంది, వస్తే, చేస్తాడు.
(క్రియా పదాలలో పదాంతంలోని అచ్చు లోపించడం వల్ల చెయ్, కొయ్, వెయ్ వంటి యకారాంత రూపాలు కనిపిస్తాయి. కాని చేయి/ చెయ్యి, కోయి/ కొయ్యి, చేయి/ వెయ్యి, ఉంటాయి వంటి అజంత రూపాలే వాడవచ్చు.
ము ప్రత్యయాంత రూపాలను హలంతాలుగా వాడుతున్నాం ఇది నామవాచకాలలోనూ, క్రియలలోనూ కూడా వాడుకలో ఉంది
తెలుగుమాటలలో పదాంతంలో ఇతర హల్గులుండవు తెలుగుమాటల్లో పదాంతంలో దీర్జాచ్చు ఉండదు పదంలో సున్న తర్వాత కచటతప గజడదబలే ఉంటాయి. ఇతర హల్లు లుందవు లేల
50 ఉమనబాష
భాళుల పరస్పర ప్రభావం (ప్రపంచంలో ఏ భాష అయినా మరో భాష నుండి పదజాలాన్ని తీసుకోక తప్పదు. మానవ సమాజాల మధ్య సంబంధాలున్నంతవరకూ ఈ ఇచ్చిపుచ్చుకానే వ్యవహారం సాగుతూనే ఉంటుంది. ప్రాచీన సమాజంలో అనేక భాషలు తెలిసిన వ్యక్తుల సంఖ్య పరిమితంగా ఉండేది. (ప్రస్తుతం రెండు భాషలు మాట్లాడగలిగిన లేదా కనీసం అర్ధం చేసుకోగలిగిన వ్యక్తుల సంఖ్య చాలా ఎక్కువ. చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా మన పాఠశాలల్లో అనుసరిస్తున్న విద్యావిధానం వల్ల మూడు భాషలు నేర్చుకుంటున్నారు. హైదరాబాదు వంటి నగరాల్లో నాలుగు భాషలు వచ్చినవాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే అందువల్ల తెలుగు భాషలో బహుభాషల పదజాలం వచ్చి చేరడానికి అవకాశం ఉంది. చారిత్రకంగా చూసినప్పుడు (ప్రాచీనకాలంలో సంస్కృత (ప్రాకృతాల ప్రభావం విస్తృతంగా ఉందేది. మధ్యయుగాలలో తమిళం, కన్నడం వంటి ఇరుగు పొరుగు భాషల నుండి పదాలు అరువు తెచ్చుకోవడం జరిగింది. పదమూడో శతాబ్దం నుండి ఆరబిక్, పర్షియన్ పదాలు, ఉర్టూ పదాలు, పదహారో శతాబ్దం నుండి ఇంగ్లీషు, పోర్చుగీసు, డచ్చి, (ఫ్రెంచి పదాలు తెలుగు భాషలో చేరాయి. ప్రాచీన కాలంలో సంస్కృత ప్రాకృత పదాలు ఎక్కువగా చేరడానికి సాంస్కృతిక కారణాలు ప్రధానం ఆర్య ద్రావిడ జాతుల సమ్మేళనం ఆర్య (ద్రావిడ భాషల పరస్పర (ప్రభావానికి కారణ మయింది సంస్కృతంలోనూ ఎన్నో ద్రావిడ భాషా పదాలూ, వ్యాకరణ నిర్మాణాలూ చేరాయి ద్రావిడ భాషల్లో మాత్రం సంస్కృత భాషా పదాలు విస్తృతంగా వచ్చి చేరాయి. మతపరమైన సాహిత్యమంతా సంస్కృతంలోనే ఉండడమూ, సంస్కృతం విద్యా మాధ్యమం కావడమూ దీనికి ప్రధానమయిన కారణం. అయితే ఆధునిక కాలంలో కూడా తెలుగులో సంస్కృత భాషాపదాలు విస్తృతంగా చేరుతూనే ఉన్నాయి పరిభాషను కల్పించుకోవడంలో సంస్కృత వదాలను బాగో వాడుకుంటున్నాం. రెండు మూడు శతాబ్దాల కిందట యూరోపియన్ భాషల పదాలు వస్తువులకు సంబం ధించినవి మన భాషలో చేరాయి. పూర్వం సంస్కృతం లాగా ఇప్పుడు ఇంగ్లీషు మనకు విద్యా మాధ్యమం అయింది. ఇది ముఖ్యంగా ఉన్నతవిద్యా రంగంలో జరిగింది శాస్త్ర రంగంలో పరి భాష చాలావరకు ఇంగ్లీషే కేవలం శాస్త్ర సాంకేతిక రంగాలలోనేకాక పరిపాలనా రంగంలోనూ ఇంగ్లీషు మాటలను ఎక్కువగా వాడక తప్పడంలేదు. ఇంగ్లీషు భాష ప్రపంచంలోని భాషలన్నింటి నుండీ పదజాలాన్ని కొల్లగొట్టింది ఇంగ్లీషు ద్వారా ఆ పదజాలం మన భాషలోకీ ప్రవేశించింది ఒక భాష నుండి మరో భాషలోకి పదాలను అరువు తెచ్చుకొనేటప్పుడు పదాలు కొన్ని మార్పులు పొందుతాయి. మూలభాషతో మనకున్న పరిచయాన్ని బట్టి ఈ మార్పులుంటాయి అట్లాగే మూలభాషా ధ్వనులకూ, మన భాషాధ్వనులకూ ఉన్న లారతమ్యాలను బట్టి కూడా ఈ మార్పులుంటాయి. మూల భాషలో ఉన్న ధ్వనులు మన భాషలో లేకపోతే వాటికి మన భాషలో దగ్గరగా ఉన్న ధ్వనులను ఉపయోగిస్తాం. ఉంటే వాటినే ఉపయోగిస్తార్త ఒదవేశయాదాషతో విసృతమయిన పరిచయం ఉంటే ఆ ధ్వని మన భాషలో లేకపోర్తుర్తడస్హమ్య ప్రశిరాతపన్యూ ర ద్ధం మనబాషఠ 51 జ సంజ మమమ, ళ్ ట్? వో
అటువంటి ధ్వనులున్న కొన్ని మాటలు విస్తృత ప్రచారంలో ఉంటే ఆ మాటలతోపాటు ఆ ధ్వనులు కూడా మన భాషలో ప్రవేశిస్తాయి దీనికి తెలుగులో మంచి ఉదాహరణలు కాఫీ, ఫీజు వంటి మాటలు, తెలుగులో సంస్కృతం నుండి ఫ వచ్చింది ఫలం, ఫాలం వంటి మాటల్లో ఇది ఉంది. దీని ఉచ్చారణను 1౫తో సూచించవచ్చు. కాఫీలో ఉన్న ఫ ఉచ్చారణను '['తో సూచించ వచ్చు. ఈ రెండూ వేరువేరు. అయినా ఒకే లిపి సంకేతం ఉపయోగిస్తున్నాం. కాని ఉచ్చారణలో మాత్రం భేదం పాటిస్తున్నాం. వదంలో మార్పు ఉన్నవోట అంటే వర్ణలోపం, వర్జ్ణాగమం, వర్ణ వ్యత్యయం వంటి మార్పు లున్నప్పుడు మనవాళ్ళు ఆ పదాన్ని తద్భవం అన్నారు. వర్ణలోపం అంటే ఏదైనా ఒక వర్ణం లోపిం చడం, వర్ణాగమం అంటే ఒక వర్ణం ఎక్కువగా వచ్చి చేరడం, వర్ద వ్యత్యయం అంటే రెండు వర్గాలు తారుమారు కావడం, ఇటువంటి మార్చులేనప్పుడు కూడా సాధారణంగా పదాంతంలో మార్చు ఉంటుంది. అంటే హలంతమైన పదం అజంతం కావడమో, దీర్ధం హ్రస్వం కావడమో, (హ్రస్వం దీర్దం కావడమో వంటివి. ఆ భాషలో వదాంతంలో ఏదైనా ప్రత్యయం ఉంటే సాధా రణంగా ఆ ప్రత్యయం లోపించి, అవసరమయితే మన భాషా ప్రత్యయం చేరుతుంది సంస్కృత ప్రాకృత భాషా పదాల విషయంలో ఈ రెండు రకాల మాటలనూ మన వాళ్ళు విశ్లేషించారు. వదంలో గణనీయమయిన మార్పు ఉన్నప్పుడు దాన్ని తద్భవమనీ, పదం చివర ప్రత్యయం వంటివి మాత్రమే మారినప్పుడు దాన్ని తత్సమమనీ అన్నారు. ఇతర భాషా పదాల విషయంలో ఇటువంటి విశ్లేషణ చేయలేదు. ఇదే పద్ధతిని అనుసరించి ఇతర భాషల పదాలను కూడా మనం విశ్లేషించవచ్చు. ఉదాహరణకు హాస్పిటల్ అన్న మాటను తీసుకుంటే ఆసుపత్రి అన్నది తద్భవం, హాస్పిటలు అన్నది తత్సమం. ఇంగ్లీషు నుండి మనం అరువు తెచ్చుకున్న మాటల్లో ఏకాక్షర పదాలన్నీ దీర్చాంతాలో, ఐ, బెలతో ముగిసేవో అయి ఉంటాయి. టీక్సీ బ్లూ, గే, షో, షూ, మే లాంటివి సంస్కృతంలోని ఏకాక్షర పదాలలాగానే తెలుగులో దీర్జాంతాలుగానే ఉంటాయి. హై, (క్రై, డై లాంటి వాటిలో మార్చేమీ ఉండదు. ఫ్రీ, ట్రే, టూ, త్రీ, రో, స్లో మొదలయినవన్నీ దీర్దాంతాలే సాధారణంగా అజంతంగా ఉందే మాటలు తెలుగులోకి దీర్భాంతాలుగానే వస్తాయి కాఫీ, పార్టీ, బ్యూరో, శాడీ, గూండా, కూలీ, లోగో, కౌంటీ, కంట్రీ, ఎల్లో, టాబూ, సినిమా, రేడియో, పియానో, బ్రాందీ, విస్కీ టాక్సీ, ఆటో, రిక్షా, లారీ, సారీ, బేబీ పిల్లో, దేటా వంటి మాటలన్నీ దీర్టాంతాలే. జనవరి, ఫిబ్రవరి మాత్రం టహస్వాంతాలు. చ్ 52 అమనభాష
ఇంగ్రీషు యాటలు - కొన్ని సంగతులు ఇంగ్లీషు నుండీ, ఇంగ్లీషు ద్వారా వచ్చిన మాటల్లో అనేక రకాలున్నాయి. అచ్చుతో అంతమయ్యే మాటలను చాలావరకు దీర్జాంతాలుగానే వాడుతున్నాం. థీరీ, స్టూడియో, అంబ్రెల్హా మాస్టరీ, అరోమా, పనోరమా, ఫార్మసీ, మనిష్ట, ట్రీటీ, (ట్రాఫీ, గోరీ, విక్టరీ, మాండేటరీ, కేష్టీరియా, ఫోబియా, ఫార్ములా, అలెర్జీ, అటాప్సీ, ఇండప్టీ, మార్చురీ, ఆర్టిలరీ, ఇమేజరీ, బాటరీ, సరరీ, రెవిన్యూ, లిబర్టీ, ఏరియా, యూరియా వంటి మాటల్లో కౌన్నింటీని కొంతమంది హ్రస్వాంతా లుగా రాస్తున్నారు ధీరీని ధియరి అనీ, ధియరీ అని కూడా రాస్తున్నారు. స్టూడియొ, ట్రాఫి, ఆర్టిలరి అని రాసే వాళ్ళూ ఉన్నారు (ప్రస్తుతం వీటిని దీర్భాంతాలుగా రాయడమే ఎక్కున ప్రచా రంలో ఉంది అల్ర్రా, యాంటీ, మానెటరీ, శానిటరీ వంటి మాటలను విశేషణాలుగా ఉపయోగిస్తున్నాం. వీటిని కూడా దీర్చాంతాలుగానే వాడుతున్నాం. ముఖ్యంగా వివిధ శాస్త్రాల పేర్లకు సంబంధించిన మాటలెన్నో తెలుగులో వాడుకలోకి వచ్చాయి. హిస్టరీ, జాగ్రఫీ, బాటనీ, జువాలజీ, కెమిఫ్టీ, సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, పధాలజీ, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, జియాలజీ, సైటాలజీ, డెంటిట్టీ, ఫార్మకాలజీ, డెర్మటాలజీ, కార్డియాలజీ, ఆఫ్తల్మాలజీ, సైకియాట్రీ, జ్యామెట్రీ, ట్రిగనామెట్రీ, ఆల్జీబ్రాల వంటివి కూడా దీర్జాంతాలుగానే వాడుకలో ఉన్నాయి. అనేక ఆధునిక శా(స్తాలకు సంబంధించిన పరిభాష ముఖ్యంగా గ్రీకు, లాటిన్ భాషల నుండి ఇంగ్లీషు భాషలోకి వచ్చింది ఇంగ్లీషు నుండి తెలుగులోకి కూడా వచ్చింది. ప్లాజ్మా ఫిస్టులా, కార్నియా, హెర్నియా, కిడ్నీ ఆల్టే, +వెర్టెబ్రా, వీనకావా, స్పాచ్యులా, రెటీనా, ప్లాటినా, కరోనా వంటి మాటలెన్నో ఆవిధంగా వచ్చినవే. వీటన్నిటినీ దీర్చాంతాలుగానే వాడుతున్నాం డెమోక్రసీ, మాబోక్రసీ వంటి మాటల్నీ దీర్చాంతాలుగానే రాస్తున్నాం. ఇంగ్లీషు పరిపాలన వల్లనైతేనేం, ఆంగ్రసాహిత్యం ద్వారానైతేనేం, నేటీ అంతర్జాతీయత వల్లనైతేనేం ఎన్నో ఇంగ్లీషు పేర్లు మనవాడుకలోకి వచ్చాయి. కైస్తవమతం స్వీకరించిన తెలుగు వారిలో కొందరు ఇంగ్లీషు పేర్లు పెట్టుకుంటున్నారు. ఈ పేర్లలో కొన్ని ఇంగ్లీషు అయితే మరికొన్ని హీబ్రూ, లాటిన్ ఇతర యూరోపియన్ భాషలకు చెందినవి. వీటిలో కొన్ని అచ్చుతో ఆంత మయ్యేవి. ఆల్టో అనేది జర్నానిక్ పదం అల్లో అంటే ధనిక+వృద్ధ, అలోన్టో అల్ఫాన్లో రూపాంతరాలు. కులీన +సన్నద్ధం అని అర్ధం ఆంద్ర, ఆండ్రూ రూపాంతరాలు, ఆండీ వీటికి సంక్షిప్తరూవం. పురుషత్వం గల అని అర్థం. ఆంటోనీ, ఆంధోనీ రూపాంతరాలు. ఇది రోమన్ కుటుంబనామం. ఆర్బీ అన్నది ఆర్చిబాల్డ్కు సంక్షిప్తరూపం ఆర్చిబాల్డు అంటే పేరుగల+దైర్యం అని అర్థం. ఆ(ే అన్నపేరు జర్మానిక, ఒక విధమైన మంత్రశక్తి గల దివ్యప్యక్తి+రాజు అని అర్థం. బారీ అన్నది ఐరిష్ పదం. ఈటె అని అర్థం. బర్తలోమియో హీబ్రూ పేరు, బీవర్లీ అంటే బీవర్ వీళ్ళలో ఉండేవాడు. బిల్లీ అనేది విలియంకు సంక్షిప్తరూపం. బాబీ అన్నది రాబర్ట్‌కు సంక్షిప్తరూపం. (బూనో అంటే గోధుమరంగు. మనబాషత 53
కారీ ఒక కుటుంబనామం. కాసీ అంటే ధైర్యవంతుడు. కాస్మో గ్రీకుపదం, నగ అని అర్ధం. డేసీ దేనియల్కు సంక్షిప్తరూపం. దేనియల్ హీబ్రూ పదం డేవీ దేవిడ్కు సంక్షిప్త రూపం డానీ డోనాల్డుకు సంక్షిప్త రూపం, ప్రపంచం + శక్తి అని అర్ధం. (డ్రూ జర్యానిక్ పదం, నమ్మకస్తుడు అని అర్ధం. డడ్లీ అంటే మెట్ట పాలం. ఎలిహూ, ఎలిజా పర్యాయపదాలు, హీబ్రూ మాటలు ఎలిషా కూడా హీబ్రూయే. ఎమరీ జర్మానిక్ పదం, (శ్రమించే పాలకుడు అని అర్ధం. ఎనికో హెన్రీకి రూపాంతరం. హెన్రీ జర్మానిక్ పదం దీనికి ఇల్లు+రాజ్యం అని అర్ధం. గారీ అంటే శూలధారి అని అర్ధం
జెఫ్రీ అంటే దివ్యశాంతి. జెరీ జెరాల్డ్‌కు సంక్షిప్త్తూపం గాడ్(శ్రే అంటే దేవుడు+శాంతి. గ్రెగర్ గ్రీక్షుమాట. జాగరూకత అని అర్ధం. గే అంటే అదవి.
హార్హెట్లీ హెరాల్టులక్సుసంక్షిప్తరూపం. హార్వే అంటే సైన్యం+యుద్ధం. హిలరీ అంటే ఆనందంగా ఉండడం. లాటిన్ నుండి వచ్చింది హొరేషియో. హౌరేస్కు పర్యాయరూపం రోమన్ కుటుంది నామం హ్యూగో హ్యూగ్కి పర్యాయరూపం. హంఫ్రీ జర్మానిక్ పదం, ఉన్నతం+శాంతి అని అర్థం. ఇరా ఈసయ్యా హీబ్రూ పదాలు జెడదియ్యా హీబ్రూ పదం జెరమయ్యా కూడా ఆంతే. దీని రూపాంతరమే జెరమీ. జోనా, జెహూ, జెస్సే, జోషువా, జోజయ్యా, జూదా హీట్రూ మాటలు. జో జోసెఫ్‌కు సంక్షిప్తరూపం. జిమ్మీ జేవ్స్కు సంక్షిష్తరూపం. లారీ లారెన్సుకు సంక్షిప్త రూపం.
లియో గ్రీకు నుండి వచ్చింది. సింహం అని అర్ధం లేవీ హీబూ పదం. లూ లూయిస్‌కి సంక్షిప్త రూపం, మాత్యూ హీబ్రూ మాట మీకా మైైకేల్కు సంక్షిస్తరఘూపం మికే కూడా అందే. మన్రో కుటుంబినామం. మాంట్‌గోమరీ కూడా అంతే ముగ్రే కూడా కుటుంబ నామమే. నీరో రోమన్ కుటుంబ నామం నోవా హ్బ్రూ
ఒబాదియా హీబ్రూ పదం. ఒర్లాండో రోలాండ్‌కు పర్యాయరూసం ఓటో జర్మానిక్ పదం, ధనికుడని అర్ధం పెర్సీ, ఫెరీ కుటుంబనామాలు. క్విన్సీ లాటిన్ పదం ఐదవ అని అర్ధం. రామ్సే స్కాండినేవియన్ వదం అటవీ ద్వీపం అని అర్ధం. చాండీ రాండోల్ఫుకు సంక్షిప్తరూసం రే రేమాండ్‌కు సంక్షిప్తం. రాడ్నీ కుటుంబనామం. శాండీ అలెగ్భాండర్ నుండి వచ్చింది. సిడ్నీ కుటుంబినామం. స్టాన్లీ కూడా అంతే టెరీ టెంన్స్కు సంక్షిప్తరూపం. టిమోత్రీ గ్రీకు పదం, సమ్మానం+ దేవుడు అని అర్ధం. యూరయా హీబ్రూ పదం. వాల్లో జర్మానిక్ పదం వెస్లీ కుటుంబ నామం.
హీబ్రూ మాటలన్నీ దాదాపుగా ద్రైవసంబంధమైనవి. కుటుంబ నామాలు చాలావరకు స్థలనామాలు
ఇటీవలి కాలంలో భారతీయుల పేర్లలో కూడా ఇంగ్లీషు పేర్ల సంక్షిపనామాల వంటివి చేరు తున్నాయి. సునీల్ గవాస్మర్, సన్నీగవాన్మర్ అయ్యాడు మొహిందర్ అమర్నాథ్ జిమ్మీ అమర్ నాధ్ అయ్యాడు. అట్లాగే కృష్ణ క్రిస్ఫాఫర్ రెండూ కిట్టూ అయ్యాయి.
బ్ “54 అమనబాష
ఇంగ్రీషు పేర్షేనా
ఇంగ్లీషు వారి పేర్లలో స్రీల పేర్లు ఎక్కువగా అజంతంగా ఉంటాయి. ఈ అజంతమయిన పేర్లన్నీ తెలుగులో దీర్భాంతాలుగా రాయడం పరిపాటి అయిపోయింది. ఇంగ్లీషు పేర్లలో హీబ్రూ, గ్రీకు, లాటిను భాషల నుండి వచ్చిన పేర్లు ప్రెంచి. జర్మను, ఇటాలియను, డేనిషు మొదలయిన యూరోపియను భాషల నుండి వచ్చిన పేర్లు ఎక్కువ.
అవీ అన్నమాట అబిగేల్ అనే హీబ్రూ పదం నుండి వచ్చిన సంక్షిప్త నామం. ఆదా జర్మను నుండి వచ్చింది. దీనికి కులీన అని అర్థం. హీ(బ్రూనుండి వచ్చిన ఆడా అన్న పేరు కూడా ఉంది. దీనికి ఆభరణం అని అర్ధం. ఈ రెండు మాటలకు వర్ణ్షక్రమంలో ఖేదం ఉంది. అడీనా హీబ్రూ మాట, అగాధా గ్రీకుపదం. మంచిది అని అర్ధం. అగీ అన్న పేరు అగ్నెస్, అగాధా అన్న మాట లకు సంక్షిప్తం అగ్నెస్ అంటే స్వచ్చమైన, పవిత్రమైన అని అర్ధం. ఇది గీకు పదం.
అల్బర్జీ అన్నమాట ఆల్బర్జుకు స్త్రీ వాచకం. అల్చినా అల్చినుకు స్రీవాచకం అలధియా (గగ్రీకుమాట, సత్యమని అర్ధం. అలెగ్జాంద్రా అలెగ్జాండరుకు స్రీ వాచకం. అీడా ఆల్రైడుకు ప్రీ వాచకం
అలిషా ఇటాలియను పేరు, అలీస్‌కు పర్యాయరూపం. అలీసా హీబ్రూ పదం, ఆనందం అని అర్ధం. అల్మా లాటిను నుండి వచ్చిన మాట. కరుణ అని అర్ధం అల్ట్రా కూదా లాటిను పదమే దీనికి ఎత్తైన అని అర్ధం. అట్టియా (గ్రీకుపదం. ఆరోగ్యవంతమయిన అని అర్ధం: అత్వరా ఎత్వరా పర్వాయ పదాలు.
అమండా లాటిను పదం, ప్రియురాలు అని అర్ధం. అమీల్యా జర్మానిక్ పదం. ఆమీ అన్నా ప్రియురాలే, ఇది లాటిను పదం
అనస్తాషా అన్నది (గ్రీకుపదం, పునరుత్థానం అని అర్థం.
ఆండ్రియా ఆండ్రూకు స్రీ వాచకరూపం ఏంజెలా, ఏంజెలికా ఏంజెలినా రూపాంత రాలు అనితా అనాకు రూపాంతరం అనా హీబ్రూ హన్నా నుండి వచ్చింది అనబెలా స్కాటీషు పదం. అనమరీ ఆన్. మరీ అనే రెండు పదాల సమాహారం. 'అనీ కూడా అనా రూపాంతరమే అంధియా గ్రీకుపదం. ఆంతోన్యా ఆంతోనీకి స్త్రీ వాచకం ఆద్రే ఇంగ్లీషు మాట కులీన + శక్తి అని అర్ధం అగస్తా అగస్తస్కు స్రీ వాచకం. ఒరోరా లాటిన్ పదం, ఉషస్సు అని అర్ధం. అవీవా హ్బూ మాట, వసంతమని అర్ధం
బార్బరా (గ్రీకుపదం, విదేశీయమని అర్ధం. బాత్షీబా హీబ్రూపదం బీ బీట్రిసుకు సంక్షిప్త రూవం. ఆనందాన్నిచ్చేదని అర్థం. బెకీ రెబాకాకు సంక్షిప్త్రరూపం ఇది హీబ్రూ మాట. బెలిండా అంటే సుందరి బెలా ఇజ బెలాకు సంక్షిప్తరవూపం ఇది ఎలిజబెత్‌కు పర్యాయరూపం బెటీ, బెట్సీ కూడా అంతే బెర్హా అంటే కాంతివంతమైన అని అర్ధం, ఇది జర్మానిక్ పదం. దీని సంక్షిప్త రూపమే బెర్టీ బ్యూలా హీబ్రూ మాట, వివాపొత అని అర్ధం. బియాంకా ఇటాలియను పదం, తెల్లని అని అర్ధం బిడీ, బ్రిడీలు బ్రిడ్దెటుకు సంక్షిప్త రూపాలు. బాబీ బార్బరా, రాబెర్టాలకు సంక్షిప్త రూపం. బోనీ లాటిన్ పదం, మంచి అని అర్ధం. ైండా జర్మానిక్ మాట. ఖద్దజ్వాల అని అర్ధం బనీ బర్నీసుకు సంక్షిప్తం
వంచాషం 55
కమీల్యా, కమిలా, కాండిడా లాటీను పదాలు. కాండీ కాండేసుకు సంక్షిప్తరూపం కారా ఇటాలియను వదం. కార్లా కార్ల్‌కు స్త్రీవాచక రూవం కార్లోటా కార్లట్కు పర్యాయ రూపం. ఇది ఛార్లిస్కు స్రీ వాచకం. కార్మెలా కార్మెలిటీ పర్యాయ పదాలు కారోలా కరోలుకు పర్యాయం. కారీ కరోలిన్‌కు సంక్షిప్తం. కసాం్రా గ్రీకుపదం. కాధీ కాధరిన్కు సంక్షిప్తరూపం సిసీలియా సిసిల్‌కు స్రీ వాచకం సీల్‌యా సిసీలియాకు సంక్షిప్తం. చెరీ చారిటీకి సంక్షిప్తరూపం చికీతా స్పానిష్ పదం. చిన్న అని అర్ధం. క్లోయీ గ్రీకుపదం వికసిత అని అర్థం. క్రిస్టియానా క్రిస్టియన్‌కు స్త్రీ వాచకం. సిండీ సింధియాకు పర్యాయ పదం క్లారా అంటే కాంతివంతమైన అని అర్ధం క్లారిండా క్లారాకు రూపాంతరం. క్లారిసా కూడా అంతే క్లాడియా క్లాద్కు స్త్రీ వాచకం క్లెమీ క్లెమింటీన్కు సంక్షిప్తం. క్లీయో క్షియోపాత్రాకు సంక్షిప్తరూపం. క్షియోపాత్రా అంటే కీర్తి + తండ్రి క్షీయో గ్రీకులో చరిత్రకు అధిష్టాన దేవత. క్లోటిల్డా జర్మానిక్ వదం, ప్రసిద్ధ + యుద్ధం అని అర్థం. కచీతా స్పానిష్ పేరు. కంకార్డియా లాటిను పదం. కానీ కాన్స్టన్స్కు సంక్షిప్తఘూపం కొన్స్వావా స్పానిష్ పదం. కోరా (గ్రీకువదం కార్నీలియా కార్నీలియసుకు స్త్రీ వాచకం కోరీ దీనికి రూపాంతరం. సింధియా గ్రీకుపదం, డెయిజీ ఒక పుష్పం పేరు. స్త్రీల పేర్లూ పురుషుల పేర్లూ ఒకే పదం నుండి వచ్చినవి చాలా ఉంటాయి. డేనియల్, డేవిడ్, ఎడ్విన్, ఎల్బర్ట్, ఫెర్టినాండ్, ఫ్రాన్సిస్, జార్డ్, గిల్బర్ట్, జాన్, క్లాడ్, హెన్రీ, హిలరీ, జస్రిన్, జూలియస్, మార్మస్, పాట్రిక్, పాల్స్ ఫిలిప్, ప్రిస్మస్, రేమాండ్, రోములస్ పురుషుల పేర్లయితే దేనియలా, డవిడా, ఎడ్వినా, ఎల్బర్జా, ఫెర్దినాండా, ్రాన్సిస్కా జార్జియా, గిల్బర్జా, జొవానా, గ్లాడ్యా, హెన్రియటీ, హిలరీ, జస్తినా, జూలియా, మార్సెలా, పాత్రీసియా, పోలా, ఫిలిపా, ప్రిసిలా, రమోనా, రమోలా స్త్రీ పేష్ల డయానా, ఫాస్టినా, ఫ్లోరా, వర్జీనియా, వయోలా, విక్టోరియా, వెరోనికా, మరీనా, నటాలీ, సబీనా, సిల్వియా, స్టెలా, ఉర్సులా మొదలయినవి లాటిన్ నుండి వచ్చాయి దెల్యా, డీడో, దోరా, డొరొతీ, మెలిసా, ఫిలోమెనా, సోఫియా, జెనియా మొదలయినవి గ్రీకు నుండి వచ్చాయి దెబోరా, దెలిలా, దీనా ఎడ్నా, హెస్టిబా, వైలా, మేరీ, సమంతా, సారా, సుసాౌనా, తమారా వంటి పేర్లు హీబ్రూ నుండి వచ్చాయి. డొనా, ఎలెన్నా లియొనారా, సాంధద్రా, థెరిసా వంటి పేర్లు ఇటాలియన్ నుండి వచ్చాయి. నీనా, ఓల్గా, దెరా వంటి పేర్లు రష్యన్ నుండి వచ్చాయి. లిండా, ఎస్మరాల్డా, ఎవిటా, ఫెర్నాందా, ఎల్బర్జ్రా, జానిటా, లోలిటా, మీరాండా వంటివి స్పానిష్ పేర్లు హిల్టా, మెటిల్డా వంటివి జర్మన్ పేర్లు. మార్తా, తభితా వంటివి ఆరమాయిక్. పరిష్క్ స్కాటిష్ పేర్లు కూడా ఉన్నాయి. ఇంగ్లీషులో చాలాపేర్లకు సంక్షిప్త రూపాలుంటాయి. మిలీ మిట్రైడ్కు, మాగ్దా మాగ్గలీనాకు, లెనా హెలెన్‌కు, జెనీ జెనిఫర్‌కు, జాకీ జాక్విలిన్‌కు, లిజా ఎలిజబెత్‌కు, గెటా మార్గరెటాకు సంక్షిప్త రూపాలు ఒక్కొక్క పేరుకు ఒకటికంటే ఎక్కువ సంక్షిప్త నామాలు కూడా ఉంటాయి. గీకు, లాటిను, పర్షియను, సంస్కృతం ఒకే మూల భాష నుండి ఉద్భవించిన భాషలు కొదిట్టి ఈ భాషల్లో స్రీ వాచక శబ్దాల నిర్మాణంలో సామ్యం కనిపిస్తుంది. బి 56 అమనబాష
పేర్తు- కథా కమామిషూ
పేద సంకేతం మాత్రమే. శ్రతి మనిషికీ ఒక పేరు ఉంటుంది. ప్రతి ఊరుకూ ఒక పేరు ఉంటుంది ఆ మనిషినీ, ఆ ఊరునూ గుర్తించడానికి, తక్మినవాటి నుండి వేరు చేయడానికి ఈ పేరు తోడ్పడుతుంది. ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరికీ వేరువేరు పేర్లు ఉండడం సాధ్యంకాదు. ఏ భాషకూ అంత వైపుల్యం లేదు. చైనాలో ఒకే పేరు గలవారు కోటిమందికి పైగా ఉన్నారట. అప్పుడేం చేయాలి? తండ్రి పేరో, తల్లి పేరో, ఇంటిపేరో, ఊరు పేరో ఏదో ఒకటో రెండో ఈ గుర్తింపుకు ప్రమాణాలవుతాయి. అయినా కొన్ని సందర్భాలలో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి.
ఒక మనిషికి ఒక పేరు ఉంటే గుర్తించడం తేలికే కాని చాలా సమాజాలలో ఒకటికంటే ఎక్కువ పేర్లు కూడా ఉంటాయి. లోక వ్యవహారాలకోసం ఒకటి, దైవపరంగా ఒకటి ప్రత్యేకమైన పేర్లు ఉండే సమాజాలూ ఉన్నాయి చాలామందికి ఇంట్లో ఒక పేరు బయట మరో పేరూ ఉంటుంది. కొందరికి ముద్దుపేర్లు ఉంటాయి. మరికొందరికి బిరుదులుంటాయి. కొందరు అసలు పేర్లతో కంటే తరువాత పెట్టుకున్న ఏర్పడ్డ పేర్లతోనే (ప్రసిద్ధమవుతారు. రచయితలు చాలామంది కలంపేర్లతో (ప్రసిద్ధులు. మన చలనచిత్ర నటీనటులలో కొంతమంది పేర్లు చలన చిత్ర రంగంలోకి ప్రవేశించిన తర్వాత పెట్టుకున్న పేర్లు. ఎప్పుడయినా చమత్యారానికి వీరి అసలు పేరు ఉపయోగిస్తే ఎవరూ గుర్తించలేరు కూడా,
సంస్కృతంలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ప్రధానమయిన ప్రాచీన సాహిత్యం. తరువాతి కాలంలో వచ్చిన కావ్య ప్రపంచానికంతా ఈ సాహిత్యం నుండే వస్తువు లభించింది. అందువల్ల ఆ కావ్యాలన్నిటిలోనూ పురాణనామాలే ఉంటాయి మన సాహిత్యంలో ఎక్కువభాగం ఛందోబద్ధం, ఛందోబద్ధ రచనలో ఛందో నియమాలకు అనుగుణంగా ఒక్కొకృసారి పేర్లూ మార్చుకోవలసి రావచ్చు. ఒకే పేరును మాటిమాటికీ వాడడం కంటే దానిక్కూడా పర్యాయ రూపాలు ఏర్పరుచుకుంటే కొంత వైవిధ్యం ఉంటుంది కదా. అట్లాగే ఆ వ్యక్తి నిర్వహించిన కార్యాలను వర్ణించే విధంగానూ కొత్త పేర్లు కల్పించుకోవచ్చు. మన దేవతలకు ఎన్నో పేర్లు. విష్ణుసహస్రనామాలు అందరికీ తెలిసినవే గదా. అట్లాగే శివుడికీ, దేవికీ కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, ఈ దేవతలకు మరెన్నో పేర్షుంటాయి. ఈ దేవతల రూప సౌందర్యాలు, వారు చేసిన ఘనకార్యాలు, భక్తులకు వారు ప్రసాదించే వరాలు, ఆధ్యాత్మికంగా వారిని గురించి భక్తుల కున్న భావాలు ఇవన్నీ ఈ పేర్లలో వ్యక్తమవుతాయి. ఈ పేర్లలో చాలా పేర్లను మనం పెట్టు కుంటున్నాం
పురాణనామాలలో వ్యక్తుల పేర్లు కొన్నిసార్లు గోత్ర సంబంధమయినవిగా ఉంటాయి. గౌతముడు అంటే గౌతమ గోత్రానికి చెందినవాడు. పురాణాలలో ఎందరో గౌతములున్నారు. అట్లాగే భార్గవులు, భారద్వాజులు, వాసిష్టులు మొదలయిన వారు. వివిధ పురాణాలలోనూ, కావ్యాలలోనూ వచ్చే పాత్రలలో సమానంగా కనిపించే పేర్లు అనేక సందేహాలకు తావిస్తాయి. పురాణేతిహాసాలను బట్టి ఆయా రాజవంశాలను పునర్నిర్మించే ప్రయత్నంలో ఆధునికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మనబాషత 5)
ఇం(ద్రుడనేది ఒక పదవి అంటారు, వివిధ కాలాలలో వేరువేరు ఇండద్రులుండాలి అయితే ఏ ఇండ్రుడెవరో గుర్తించడం సాధ్యంకాదు. అందరు ఇంద్రులు చేసిన పనులూ ఇంద్రుడికే అన్వయిస్తాయి. అంటే ఇంద్రులంతా ఒకే వ్యక్తిగా రూపుదిద్దుకున్నారన్నమాట వృ(ర్రుణ్జి చంపిన ఇంద్రుడూ, అహల్య కధలోని ఇంద్రుడూ, పారిజాతాపహరణ కధలోని ఇంద్రుడూ, హిరణ్య కశిపుని కధలోని ఇం[ద్రుడూ ఒకరు కాకపోయినా మన కధల్లో కలగాపులగంగా కలిసిపోయారు. అట్లాగే వ్యాసుదొక్కడేనా అన్న ప్రశ్న కూడా ఉంది
గోత్రం పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, వంశం పేరుతో ప్రసిద్ధులైన వ్యక్తులు పురాణాల నిండా ఉన్నారు భారతంలో ద్రౌపది అంటే తెలియనివారుండరు (ద్రుపదుని కూతురు (ద్రౌపది. కృష్ణ అన్న పేరు కంటే ద్రౌపదే ప్రసిద్ధం. పాండవులు తండ్రి పేర పాండవులుగా (ప్రసిద్ధులయితే, తల్లుల పేర కౌంతేయులు, మాద్రేయులు అవుతున్నారు. కౌరవులన్న పేరు ధృతరాష్ట్రుడి కొడుకు లకే ఎందుకు ప్రసిద్ధమో. పాండవులూ కౌరవులే కదా. అంటే కురువంశం వాళ్ళు. ధార్తరాష్టులు అన్నది తండ్రి పేరుతో ఏర్పడితే కౌరవులు అన్నది వంశం పేరుతో ఏర్పడింది. అర్జునుడు కౌంతేయుడూ, పాండవుడూ, ఇంద్రసుతుడూ కూడా అవుతున్నాడు కుంతి అసలు పేరు పృధ, కుంతి భోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతి అయింది. పృధ కొడుకు కాబట్టి అర్జునుడు పార్గ్మ డయ్యాడు. ధర్మరాజు, ఖీముడూ కూడా పార్భులే అవుతారు కదా. కాని ఈ పేరు అర్జునునికే (ప్రసిద్ధం. ఈ అర్జునుడు మరో జన్మలో నరుడు కృష్ణుడు నారాయణుడు. అందువల్ల అర్జునుడికి నరుడని కూడా పేరు.
పురాణాలలో ప్రసిద్ధ వ్యక్తులందరి విషయంలోనూ ఈ విధంగా ఎన్నో పేర్తుండటం గమ నించవచ్చు.
బి “58 అమనబాష
మేర్షకు అనువాదాలా తెలుగు సాహిత్యం మధ్యయుగాలలో ఇతివృత్తాలను సంస్కృత సాహిత్యం నుందే తెచ్చుకుంది. అందువల్ల మన సాహిత్యంలో పదకొండో శతాబ్దం నుండీ గత శతాబ్దం దాకా భారత రామా యణాలు, పురాణాలు ఆధారంగానే రచనలు ఎక్కువగా వచ్చాయి. దశకుమార చరిత్ర, కేయూర బాహుచరిత్ర, విక్రమార్మ చరిత్ర, భోజరాజీయం, పంచతంత్రం, శుకసప్తతి, హంసవింశతి, సింహాసన ద్వాత్రింశిక వంటివి కధా ప్రధానమైన రచనలు. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, పల్నాటి వీరచరిత్ర వంటి రచనలు పురాణేతిహాస సంబంధమైనవి కావు. ఇటువంటి (గ్రంధాలలో పౌరాణిక పాత్రలు అరుదు. ఇటువంటి రచనలను వదిలివేస్తే తక్కిన రచనలన్నింటికీ ఎంతోకొంత పురాణేతిహాసాల సంబంధం ఉంటుంది. అందువల్ల ఈ రచనల్లో పురాణ పురుషుల పేర్లు ఉండక తప్పదు. కళాపూర్జోదయం వంటి కల్పిత కధాకావ్యంలో కూడా పౌరాణిక పాత్రలు ప్రవేశించాయి. పౌరాణిక పాత్రలకు ఒకటి కంటే ఎక్కువ పేర్లు సాహిత్యంలో కనిపిస్తూ ఉంటాయి. వారికి పెట్టిన పేరు, వంశంవల్ల వచ్చిన పేరు, తల్లివల్ల వచ్చిన పేరు, తండ్రి వల్ల వచ్చిన పేరు, వారు చేసిన కృత్యాలను వర్టించే పేర్లు ఉండవచ్చు. ఆకారాన్ని బట్టి, గుణగణాలను బట్టి పేర్లు ఏర్పడ వచ్చు. అన్నదమ్ముల వల్ల, భార్యవల్ల, భర్తవల్ల, అక్కాచెల్లెళ్ళ వల్ల కూడా పేర్లు ఏర్పడవచ్చు. వివిధ అవతారాలలో చేసిన కృత్యాలవల్ల వచ్చిన పేర్లు ఉండవచ్చు. ఒక్కొక్మసారి తరువాతి అవతారా లలో చేసిన పనులవల్ల వచ్చిన పేర్లు ముందు అవతారాలను వర్ణించేటప్పుడు కూడా దొర్లుతూ ఉంటాయి పేర్తను ఈ విధంగా ఉపయోగించడం వల్ల పద్య రచనలో ఎంతో సౌలభ్యం చేకూరు తుంది అర్జునుడు ఇంద్రుని కొడుకు ఇంద్రతనూజుడు, ఆబండలనందనుడు, ఇంద్రసూనుడు, పురందర సూనుడు, మహేంద్రసూతి, సురేంద్ర కుమారుడు, జంభారి తనూజుందడు ఇట్లా ఇంద్రుడికి ఉన్న పేర్లన్నీ ఉపయోగించి కుమారుడు, పుత్రుడు, సూనుడు, తనూజుడు, నందనుడు వగైరాలతో మనకు అవసరమైన విధంగా వాడుకోవచ్చు. ఛందోనియమాలను పాటించడంలో ఇది చాలా తోద్చడుతుంది వ్యక్తుల పేర్తేకాదు ఊళ్ళ పేర్లలోనూ పర్యాయ వదాల (ప్రయోగం ఉంది. ఉదాహరణకు హస్తినాపురాన్ని కరిపురం అని కూడా ప్రయోగించారు. సంస్కృతంలోని పేర్లను తెలుగులోకి తెచ్చుకొనేటప్పుడు వీటన్నింటినీ ఉపయోగించు కోవచ్చు. తెలుగు కవులు చేసిన మరోపని పేర్లను కూడా తద్భవీకరించుకోవడం ఉదాహరణకు (ద్రౌపది అన్న పేరును తీసుకోవచ్చు దీనిని ద్రోవదిగా కూడా ప్రయోగించారు. కుంతిని గొంతి చేశారు శ్రీ, సిరి అవుతుంది విష్ణువు వెన్నుడు అవుతాడు లక్ష్మి లచ్చి అవుతుంది. తత్సమాలుగా, తద్బవాలుగా తెలుగులో పౌరాణిక పాత్రల పేర్లను వాడడం ఒక ఎత్తు వాటిని అనువాదం చేసుకోవడం మరో ఎత్తు. పేర్లు అనువాదం చేసుకోడం ఏమిటి? ఎట్లా సాధ్యం? అనిపించవచ్చు. గుణాన్ని తెలిపేవి, వ్యుతృత్తి అనువాదానుకూలంగా ఉన్నవి అను వాదం చేసుకున్నారు. కృష్ణ శబ్దానికి నలుపు అని అర్ధం. అందువల్ల కృష్ణుడు అంటే కటివేల్చు అని, కట్టి అని, నల్లని దొర అనీ అనువాదం చేసుకున్నారు. అర్జునుడు కూడా నల్లనివాడే అందుకే అతన్నీ కట్టి అంటారు. “కళ్ళి విక్రమంబు కాల్చనే' అని భారత ప్రయోగం. అయితే ఇటువంటి మనహాషల 5
అనువాద నామాలు అంత ్రచురం కాదు. కాని, తెలుగులో అచ్చ తెలుగు కావ్యాలనే ఒక ప్రక్రియ ఉంది. ఈ కావ్యాలలో తత్సమ శబ్బాలకు (ప్రయోగం ఉండదు. రామాయణ భారత ఇతి వృత్తాలు తీసుకొని వాటిలో రాముడు, సీత, కృష్ణుడు, అర్జునుడు అని పేర్లు రాకుండా రాయడం సాధ్యంకాదు కాబట్టి పేర్లు తత్సృమాలుగా వాడుకోవచ్చుననే సడలింపు ఒకటి చేసుకున్నారు. పేరును యధాతథంగా వాడుకోవచ్చు కాని సమాస రూవంలో ఏర్పడ్డ ప్రత్యేకమైన పేర విషయం ఏమిటి? వాటిని యధాతధంగా తత్సమ రూపంలో ప్రయోగించకూడదు. అందువల్ల మన కవులు వాటిని అనువదించుకున్నారు. సవ్యసాచిని కవ్వడి అని అనువదించారు. పార్వతి అంటే హిమవంళుని కూతురు. హిమవంతుడు పర్వతం కాబట్టి ఆమె పర్వత పుత్రి. దీన్ని అనువదించుకొని గట్టు దొరవట్టి, కొండకూతురు, చలిరాయి కన్నట్టికన్నై వలిగట్టు దొరపట్టి అని వాడుకున్నారు (బ్రహ్మకు నాలుగు ముఖాలుంటాయి. చతుర్ముఖుడని నామాంతరం. తెలుగులో ఇది నలువ అయింది. నలు అంటే నాలుగు వాయి అంటే నోరు. నాలుగు వాయిలు అంటే నాలుగు నోళ్ళు కలిగిన వాడని అర్థం. నాల్మొగంబుల దిట్ట, నలునోళ్ళ దిట్ట, నల్తలయ్య, నాలుగు మొగము లతడు అని అనువదించుకున్నారు (బ్రహ్మ భార్య సరస్వతి. ఆమె వాగ్దేవి అందువల్ల పల్కు ముద్దియ, నుడిచాన, కూతనాతి అని అనువదించుకున్నారు. సీత అంటే నాగేటిచాలు. అందువల్ల ఆమె చాలు పేరింటి ననబోడి చాలు అనే పేరుగల స్తీ. వాల్మికి అంటే పుట్టబుట్టిన దిట్ట. అచ్చ తెలుగు కావ్యాలలో ఇటువంటి పేర్ల అనువాదాలు కొల్లలుగా కనిపిస్తాయి. అయితే జనసామా న్యంలో ఈ అనువాద నామాలకు ప్రచారం తక్కువ. సాహిత్య రచనలకు మాత్రమే పరిమితం. దేశ్వ నిఘంటువులలో కూడా ఇటువంటి కృత్రిమమయిన దేవతా నామాలెన్నో కనిపి స్తాయి. నియమ బాహుళ్ళం ఉన్న రచనలలో ఇటువంటి కృతకత్వం చోటు చేసుకుంటుంది. ఉదాహరణకు రామాయణాన్ని నిరోస్ట్రంగా రాయదలచుకుంటే ఓష్ట్రమ్లైన ధ్వనులు రాని పదా లతో రాయాలి. రాముడులో మకారం ఉంది. ఇది ఓష్టుం. అందువల్ల రాముదనే మాట లేకుండా రామాయణం రాయాలి రామాయణ కావ్యం దశరధ రాజనందన చరిత్ర అయింది. పేరు కేవలం సంకేతం. సంకేతాన్ని అనువదించడం వల్ల ఉద్దిష్టమయిన ఆర్థం తేలికగా గోచరించదు. పేర్లను అనువదించడం ఒక ప్రత్యేక సాహిత్య ప్రక్రియలో అవసరంకోసం చేయడమే తప్ప సహజమైన (ప్రక్రియ కాదు. బ్ “60 ఉమనబాష
పరాయి పేరు
మన ప్రాచీన కావ్యాలలో సంస్కృతం పేర్లు తప్ప ఇతర భాషల పేర్లు తక్కువ. శైవ, వైష్ణవ రచనల్లో తమిళ, కన్నడ నామాలు కొన్ని కనిపిస్తాయి. మన ఆదికవి నన్నయగారి పేరే తెలుగు కాదంటారు. మంచి అన్న అర్ధంలో నన్ని అన్నమాట తెలుగులో లేదనీ అందువల్ల నన్నయగారు తెలుగువారే కాదనీ కొందరు వాదించారు. పద్నాలుగో శతాబ్దం నుండీ శాసనాలలో మహమ్మ దీయుల పేర్లు కనిపిస్తున్నా తెలుగు కావ్యాలలో పదవోరో శతాబ్దం నుండి మాత్రమే కనిపిస్తు న్నాయి. వాటిలో కూడా ఇతివృత్తంలో మహమ్మదీయుల పేర్లు ఉండేది చాలా తక్కున కృష్ణాయ విజయం, ప్రతాపచరిత్ర, రాయవాచకం, నరపతి విజయంవంటి వాటిలో మాత్రమే ఇతి వృత్తంలో ఈ పేర్షుండడానికి అవకాశం ఉంది. బాల భాగవతంలాంటి వాటిలో పీరికలో అళియ రామరాజు మొదలయిన వారు మహమ్మదీయులను ఓడించిన ప్రసక్తి ఉంటుంది. అద్దంకి గంగా ధరుని తపతీ సంవరణోపాఖ్యానము, పొన్నిగంటి తెలగన యయాతిచరిత్ర మహమ్మదీయులకు అంకితమిచ్చిన కావ్యాలు. వీటి ఇతివృత్తాలలో కూడా మహమ్మదీయుల పేర్లు రావడానికి అవ కాశం లేదు. పీరికలో అంకితం సందర్భంలోనే ఈ పేర్లకు స్థానం ఉంది. తపతీ సంవరణో పాఖ్యానం ఇబ్రహీం కుతుబ్న్బాకు అంకితం. యయాతి చరిత్ర అతని సేనాని అమీనుఖానుకు అంకితం. కృతి భర్త వంశాన్ని వర్ణించడం సంప్రదాయం కాబట్టి పీరికలో వారి పేర్లు వస్తాయి.
ఇబ్రహీం కుతుబ్నా న్యాయ పరిపాలన గురించి, ధార్మికతను గురించీ కధలున్నాయి, చాటు పద్యాలు కూడా ఉన్నాయి. ఇభరాము శాహువు, మలికిభరాముడు, మల్మిభరాము, ఇభరాము శాహి అని తెలుగు కవులు ఈయనను పేర్కొన్నారు. ఇది ఒక విధమయిన తద్భవీకరణం. అయితే ఇందులో రామ శబ్దాన్ని తోపింపజేయడం ఒక విశేషం. ఆదిల్షా ఏదులశాహి, ఏదుల శాహువు అయ్యాడు. ఆదిల్‌ఖాన్ ఏదులఖానుడు అయ్యాడు అమీన్‌ఖాన్ అమీనుఖానుడు అయ్యాడు
ఫాజిల్‌ఖాన్ ఫాజీలుఖానుడు, ఉలూఖ్ఖాన్ ఉల్లాఖు ఖానుడు, సిద్దీభ్ఖాను సిద్దీఖుఖానుడు, మలేఖాన్ మలేఖభానుడు, షితాబ్‌ఖాన్ చిత్తాపుఖానుడు అయ్యారు.
షేక్ ఇబ్రహీం షేకీభరాముడు అయ్యాడు. కుతుబ్నా కుతువన మలక అయ్యాడు.
హలంతాలను అజంతాలుగా చేసుకోవడం “డు ప్రత్యయం చేర్చడం నాటి కవుల సంప్ర చాయంగా గుర్తించవచ్చు ఇటీవలి వరకూ “డూ ప్రత్యయం చేర్చే సంప్రదాయం కొనసాగక పోయినప్పటికీ అజంతంగా రాయడమనే సంప్రదాయం కొనసాగింది. అక్బరు, బాబరు, ముమయూను, జహంగీరు, షాజహాను, బెరంగజేబు అనే మన చరిత్ర పుస్తకాలలో ఉంటుంది.
ఈ శతాబ్దం తొలి సగంలో యూరోపియన్ల పేర్ల విషయంలోనూ ఈ సంప్రదాయం ఉంది. షేఖ్సయరు నాటకాల అనువాదాల తొలిదశలో మూడు రకాల వద్ధతులు అవలంబించారు మన వాళ్ళు. ఒక పద్ధతి ఏమిటంటే అసలు పేరునే మార్చివేయడం. ఉదాహరణకు ఒధెల్లో జయ(ద్రధు డవుతాడు ఒకరి అనువాదంలో. మరొకరి అన్తువాదంలో జయదేవుడు అవుతాడు. మరో అను వాదంలో _వీరసేనుడయ్యాడు. కింగ్‌లియర్ మందపాలుడవుతాడు. హామ్లెటు ప్రతావ సింహు డవుతాడు. సిందిలీన్ రత్నావళి అవుతుంది. నాలుగవ హెన్రీ నరసభూపాలుడైతే, ఐదవ హెన్రీ కృష్ణదేవరాయలవుతాడు.
మనభాషతి 61
రెండో వద్ధతిలో జూలియస్ సీజర్ జూలియసు సీజరుడు అవుతాడు. బ్రూటసును బ్రూట సుడు అని అనువదించారు సామాన్యనామం అయిన రోమన్ రోమనుడు అయింది అజంత మయిన పేర్లలో 'డు' ప్రత్యయం చేర్చడం ఉండదు. ఆంటోనీ ఆంతోనీగానే ఉంటాడు.
మూడో పద్ధతిలో హలంత నామాలు అజంతాలుగా మారతాయి. సీజర్ సీజరు, బ్రూటస్ బ్రూటసు, కాసియస్ కాసియసు అవుతారు. ఈ పద్ధతి ఇటీవలి వరకూ ఉంది. కొన్ని సందర్శా లలో ఇప్పుడూ కొనసాగుతూనే ఉంది సంస్కృతం, గ్రీకు, లాటిన్, పర్పియన్ భాషలు ఒకే మూలభాష అంటే ఇండో యూరపియను నుండి ఉద్భవించాయి కాబట్టి పేర్లలో సామ్యం ఉండ వచ్చు. కొంచెం మార్చుకుంటే గ్రీకు పేరు సంస్కృతం అయిపోవచ్చు. అలెగ్జాండర్ ఈ శతాబ్ది తొలిరచనల్లో అలక సుందరుడు కావడంలో ఆశ్చర్యమేమీ లేదు అట్లాగే జర్మనీ తత్వవేత్త మాక్సుముల్లరును మనవారు మోక్షమూలరు అన్నారు.
తెలుగువారిలో క్రైస్తవుల పేర్లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తెలుగుపేరే పెట్టు కోవడం. రెండు యూరోపియన్ పేరో, బైబిల్ సంబంధమయిన పేరో పెట్టుకోవడం. ఈ రెండో రకం పేరు పెట్టుకున్నప్పుడు తెలుగు క్రైస్తవులు సాధారణంగా పురుషులయితే అయ్య, స్రీలయితే అమ్మ అనే అనుబంధ పదం చేర్చుకుంటారు
ధామస్ తామసయ్య, తోమాసయ్య అవుతుంది మైకేల్ మికేలయ్య అవుతుంది. ఇగ్నేషియస్ జేవియర్ ఇన్యాసి శౌారయ్య అయింది. ఇగ్నేషియస్ ఇన్నయ్య అయింది. ఆంటోనీ అంతయ్య అయింది. జోసెఫ్ జోజయ్య అయింది. అగస్టీన్ అగస్తేనయ్య అయింది. అయ్య చేరకుండా ధామస్, మైకేల్, జార్డ్ ఆశ్రైడ్ మొదలయిన విధంగా కూడా ఉంటాయి.
మేరీ పేరుతో మరియమ్మ, మరమ్మ ఏర్పడ్డాయి. మరయ్య అని పురుషనామం కూడా మేరీ శబ్దంతో ఏర్పడింది. తెరిసా తేరేజమ్మ అయింది మేరీరోజ్ మ్యరోజమ్మ అయింది. అగస్తీన్ అగస్తేనమ్మ అయింది. రెజీనా రుజేనమ్మ అయింది. లూర్ధమ్మ, మత్తేనమ్మ, రోజమ్మ, జుస్తేనమ్మ, తామాసమ్మ వంటి పేర్లతోపాటు అమ్మ చేరకుండా మేరీ, ఫాతిమా, ఫిలోమెనా, అన్నమేరీ, మాగ్దలీనా, ఏంజెలా, బ్యూలా, దోరోతీ మొదలయిన పేర్లూ ఉన్నాయి.
ప్రస్తుతం హలంతనామాలను చాలా వరకు హలంతాలుగానే రాసే సంప్రదాయం ఏర్పడు తున్నది. బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్ అనే రాస్తున్నారు కాని క్లింటను, బ్లెయిరు అని రాయడం లేదు.
నే "62 అమనబాష
పరభాషలపై మోజు మాతృభాషకు చేటు
జఒకవ్పుడు కన్నడ రచయితలు తమ సమావేశాలలో ఇంగ్లీషు మాటలు రాకుండా మాట్లాడాలని నియమం పెట్టుకున్నారట. ఏ వక్త అయినా తన ప్రసంగంలో ఎన్ని ఇంగ్లీషు మాటలు వాడితే అన్ని పావలాలు జరిమానా చెల్లించుకోవాలని కట్టడి చేశారు. ఇది ఎన్నాళ్ళు సాగిందో కాని ఈనాడు ఇది సాధ్యమయ్యే పనేనా?
తెలుగు రచయితలు కూడా ఒకప్పుడు ఇటువంటి ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. ఒక సంస్కృతం మాటో ఒక ఇంగ్లీషు మాటో ఉర్జూ మాటో మరో భాషా పదమో దొర్లకుండా ప్రసం గించడం అసాధ్యమయి పోయిందీరోజు. తెలుగే మాట్లాడుతున్నాం, కాని అవసరమయినప్పుడు వాడుకలో నలిగిన అన్యభాషాపదం వాడితే తప్పేమీలేదు. అవసరం లేనవ్చుడు కూడా వాటిని వాడడం వల్ల మన భాష అభివృద్ధి కుంటుపడుతుందనడంలో సందేహం లేదు.
ఇద్దరు తెలుగు వాళ్ళు కలుసుకుంటే ఇంగ్రీషులో మాట్లాడుకుంటారని హాస్యోక్తి. ఇదివరకు హైదరాబాదు నగరంలో ఇద్దరు తెలుగు వాళ్ళు ఉర్జూలో మాట్లాడుకోవడం, ఉర్జూలోనే తిట్టు కోవడం వింత విషయమేమీ కాదు. ఇటీవలి కాలంలో కొంత మార్చు వచ్చినా ఉర్జూలో మాట్లాడు కునే తెలుగువాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. దీనికి ఇంగ్లీషు జోడయిందిప్పుడు. ప్రయివేటు వైద్య శాలలు, ప్రయోగశాలలు, హోటళ్ళు, విద్యాసంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు బాగా పెరిగి పోయింతర్వాత ఇంగ్రీషు మరీ పేట్రేగిపోయింది మనం లోపల అడుగుపెట్టగానే ఒక రిసెష్టనిస్టు తయారు మీకేంకావాలని ఇంగ్లీషులో చాలా మర్యాదగా అడుగుతారు, మన వేషం ఇంగ్లీషు వచ్చిన ముఖంలా కనిపిస్తే, మనం తెలుగులో మాట్లాడినా ఇంగ్లీషులోనే జవాబు చెప్తారు. తెలుగు ఎోనే మాట్లాడవలసిన అవసరం వస్తే ఇంగ్లీషులో చూపించినంత మర్యాద కనిపించదు. వచ్చిన పెద్ద మనిషి రిసెష్షనిస్టు ముందు న్యూనతా భావం పొందక తప్పదు ఇకలోపలికి వెళ్ళి కలవ వలసిన వ్యక్తి ముందు ఏం మాట్లాడతాడు. రిసెప్పనిస్టు బాధ్యత కూడా అదేనేమో,
ఈమధ్య ఒక డయాగ్నష్టిక్ సెంటరుకు పోవలసి వచ్చింది. వరండాలో కూర్చున మూవంతు కోసం ఎదురు చూస్తున్నాం. ఒకామె గదిలోనుండి బయటకు వచ్చి ఏంచేయాలో పాలుపోక తడబడుతూ అటూఇటూ చూసింది. నాపక్కనే కూర్చున్న మా ఆవిడ దగ్గరకు వచ్చి సందేహిస్తూ “యూరిన్ పాప్చేసి రమ్మన్నారండి, అంటే ఏం చెయ్యాలండి అని అడిగింది. ఆమె చెప్పింది వెళ్ళిపోయింది లోవలకు. ఆమెకు ఈమాట చెప్పిన వ్యక్తి పురుషుడు తెలుగులో చెప్పడానికి సందే హించాదేమో. స్త్రీ అయినా తెలుగులో చెప్పి ఉండకపోవచ్చనుకోండి. చెప్పింతర్వాత పేషంటు ముఖంవైపు చూస్తే అమెకు అర్ధమయిందీ లేనిదీ తెలిసేది. కానీ అంత తీరికెక్కడ? ఆమె మళ్ళీ అడగడానికి అవకాశమివ్వకుండా మరో పేషంటు కొన్ని విషయాలు అర్థంకాక పొరపాట్లు కూడా జరగవచ్చు.
మనభాషలో ఒక మాట వాడితే బూతు అదేమాటకు సంస్కృత పదమో, ఇంగ్లీషు మాటో, ఉర్దూ మాటో వాడితే పరవాలేదు వస్తువదే, భావమదే. మన భాషలో అది ఎందుకు బూతు, మరోభాషలో ఎందుకు కాదు? మనకు ఇటువంటి నమ్మకాలు బాగా నాటుకుపోయి ఉన్నాయి. పూర్వకవులు 'సహసానఖంపచస్తన దత్త పరిరంభ .” అంటూ సమాస భూయిష్టంగా రతివర్షన
మనభాషతి 63
చేస్తే సామాన్యులకు అర్థ్ధంకాదుగదా, పండితులకు మాత్రమే అర్ధమవుతుంది పరవాలేదు, అది పండితులకు బూతుకాదేమో. ఇంగ్లీషు వాళ్ళు రాధికా సాంత్వనంలాంటి పుస్తకాలను, నిషేధించి నప్పుడు వాటిని పండితులకోసం ప్రచురణలుగా అచ్చువేసుకోనిచ్చారు. పరిణత బుద్ధులయిన పండితులు వాటీని చదివి చెడిషోరుగదా. పండితులు కానివాళ్ళు వాటిని చదివి అర్థం చేసుకోలేరుకదా. మరి నిషేధం ఎందుకు? ఎవరి తృప్తి వారిది
సంస్కృతం విషయంలో చెప్పవలసిందేమీ లేదు ఏ కొత్త మాట కల్పించుకోవాలన్నా మనం సంస్కృతం మీదే ఆధారపడుతున్నాం. ఇప్పుడు ఇంగ్లీషూ అంతే అనివార్యమయి పోయింది.
ప్రభుత్వ వ్యవహారాలూ, కార్యకలాపాలలోనూ, శాస్త్ర రచనళల్లోనూ, వార్తాప్రసార ప్రచార సాధనాల్లోనూ ఇంగ్లీషు రోజురోజుకూ విస్తరిస్తోంది. కంప్వూటర్లూ, ఆధునిక సాంకేతిక పరి కరాలూ విస్తరించే కొద్దీ ఇది మరీ ఎక్కువవుతుంది. ఇంగ్లీషు భాష విస్తరించడానికి నేటి అంతర్జా తీయ అవసరాలు ఒక ముఖ్యమైన కారణం. సాహిత్యం, సంస్కృతి, కళలు, అసలు జీవితమే అంతర్జాతీయమయి పోతూ ఉన్నప్పుడు భాషలు ఈ (ప్రభావాల నుండి ఎలా బయటపడతాయి.
అందువల్ల మన పత్రికల భాషలో కూదా ఇంగ్రీషు మాటలు ఎక్కువయ్యాయి. వివిధ రంగాలకు సంబంధించిన విషయాలతో నిండి ఉందే ప(త్రికలలో ఇంగ్లీషు మాటల అవసరం తప్పదు మరి. ఈనాడు వత్రికలలో వాడే ఇంగ్లీషు మాటలను అర్ధం చేసుకోవడానికి ప్రత్యేకంగా నిఘంటువులు అవసరమవుతున్నాయంటేనే ఇంగ్లీషు మాటల వాడుక ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఏవో కొన్ని పదాలే అయితే వాటికోసం ప్రత్యేకంగా నిఘంటువు అవసరంలేదు. వేల సంఖ్యలో పదాలు వచ్చి చేరినప్పుడే నిఘంటువు అవసరం ఏర్పడుతుంది. ఒక సామాన్య పొరకుడు తేలికగా అర్ధం చేసుకోవడానికి తగినట్లుగా ఉండవలసిన దినప(త్రికలో వాదే మాట లకు నిఘంటువును చూసుకొని అర్థాలు తెలుసుకోవలసిన అవసరం ఏర్పడడం కూడా వింతే. ఆ పదాలు వాడే వారికీ నిఘంటువు కావాలి, చదివే వారికీ నిఘంటువు కావాలి.
పత్రికలోని ప్రతి అక్షరమూ సామాన్య పారకుడి కోసమే అనడం సమంజసంకాదేమో. పత్రికలోని అనేక అంశాలు ఆయా రంగాలకు సంబంధించిన విశిష్ట పాఠకులకు ఉద్దేశించినవి కాబట్టీ ఈ పరిస్థిథి ఏర్పడిందేమో,
స్ 64 తిమనభాష
కహాలంతాలా? అజంతాలా?
ఆంగ్గ విద్యావిధానం వల్లగాని, ఆధునిక సమాజం అంతర్జాతీయ లక్షణం వల్లగాని ఇంగ్లీషు, ఇతర యూరోపియను భాషల పదాలు మన భాషలోకి వచ్చి చేరాయన్నది మాత్రం వాస్తవం. నిరంతరమూ పెరుగుతూ ఉన్న సాంకేతిక విజ్ఞానం కూడా మనకు ఇంగ్లీషు ద్వారానే సంక్రమిస్తూ ఉంది కాబట్టి ఇంగ్లీషు మాటలను అరువు తెచ్చుకోవడం అనివార్యం. అయితే అవసరంలేని సంద ర్భాలలో కూడా ఇంగ్లీషు మాటల వాడుక హానికరమేననక తప్పదు.
ఇంగ్లీషు, ఇతర యూరోపియను భాషాపదాలను అరువు తెచ్చుకొనేటప్పుడు అవలంబించే పద్ధతులేమిటి? ఇది ముఖ్యంగా పదం చివర ఎట్లా ఉండాలి అన్నదాన్ని బట్టి ఉంటుంది. ఈ మాటలు అజంతమయిన మాటలయితే అజంతాలుగానే తెచ్చుకుంటాం. హలంతమయిన మాటల విషయంలోనే వాటిని అజంతాలుగా చేసుకోవాలా? హలంతాలుగానే ప్రయోగించాలా? అన్న సమస్య వస్తుంది. వాటిని యధాతధంగా హలంతాలుగానే వాదే సంప్రదాయం ఇటీవల కొంత పెరుగుతూ ఉన్నప్పటికీ అజంతాలుగా మార్చుకొనే సంప్రదాయమే కొంత బలంగా ఉంది. విడిమాటను వాడడంలో ఒక పద్ధతి, ప్రత్యయం చేర్చినప్పుడు వాడడంలో మరొక పద్ధతీ కూడా వాడుతున్నారు.
ఇంగ్లీషు మాటలను అజంతాలుగా మార్చుకొంటే అవి పొందే మార్చులేమిటి?
కొన్నిమాటలుక్, గ్, వ్, ర్, చ్, జ్ మొదలయిన విధంగా అసంయుక్తంగా, అద్విరుక్తంగా అంతమవుతాయి. ఈ మాటల చివర ఒత్తులేని హల్లు ఉంటుందన్నమాట. ఉదాహరణకు చెక్, బుక్ అనే మాటలను తీసుకోవచ్చు. ఇవి చెక్కు బుక్కు అవుతాయి. పిక్ళిక్ పిక్నిక్కు అవుతుంది. ఈ మాటలలో చివర ఉన్న హల్లుకు ముందు 'హస్వమయిన అచ్చు ఉంది. ఇటువంటి సందర్భా లలో ఈ హల్లు ద్విర్తుక్తమవుతుంది. అంటే క-క్కఅవుతుంది తక్కిన హల్లులు కూడా అంతే, రగ్ రగ్గు అవుతుంది. రిగ్ రిగ్గు అవుతుంది. మగ్ మగ్గు, లెగ్ లెగ్గు అవుతాయి. సామాన్యంగా లెగ్ వంటి మాటలను వాడవలసిన అవసరం రాదుకాని కొన్ని వ్రత్యేక సందర్భాలలో వాడవలసి వస్తుంది. రెండు, మూడు భాగాలుగా ఉండే క్రీడల్లో సెకండ్ లెగ్, ధర్జ్ లెగ్ అని వాడుతుంటారు. రెండో భాగం, మూడో భాగం అనో రెండో పాదం, మూడోపాదం అనో కూడా వాడవచ్చు. సెట్ సెట్టు అవుతుంది. బెట్ బెట్టు, మార్కెట్ మార్కెట్టు, క్రెడిట్ కెడిట్టు, బ్రాకెట్ బ్రాకెట్టు, సీక్రెట్ సీక్రెట్ట అవుతాయి. క్రికెట్, రాకెట్, లాకెట్, కిట్, జెట్, జాకెట్ మొదలయిన పదాలన్నీ ఇంతే, బ్రెడ్ బెడ్డు అవుతుంది. త్రెడ్ ్రెద్దు అవుతుంది లెడ్ లెడ్డు అవుతుంది. మిత్ మిత్తు అవుతుంది. తకారాంతమయిన పేర్లు కూడా ఇంతే, మాక్బెత్ మాక్బెత్తు అవుతుంది.
మేకప్, మేకప్పు అవుతుంది. కప్ కప్పు, లాకప్ లాకప్పు అవుతాయి. టబ్ టబ్బు అవు తుంది. క్లబ్ క్షబ్బు అవుతుంది పిన్ పిన్ను అవుతుంది. బన్ బన్నుు గన్ గన్ను, జిన్ జిన్ను అవు తాయి బిల్ బిల్లు అవుతుంది. మిల్ మిల్లు అవుతుంది బెల్ బెల్లు అవుతుంది. లవ్ లవ్వు అవు తుంది. ఫర్ ఫర్రు అవుతుంది. సెస్ సెస్సు అవుతుంది. ప్రెస్ ప్రెస్సు అవుతుంది. (డ్రెస్ డైెస్సు అవు తుంది
ఈ హలంత పదాలలో చివరి హల్లుకు ముందు దీర్జం కాని, బిందువు (సున్నా) కాని
ఉన్నట్లయితే ఆ హల్లు ద్విరుక్తం కాదు ఉదాహరణకు లాక్ లాకు అవుతుంది కాని లాక్కుకాదు. గ్రీక్ గ్రీకు అవుతుంది. షాక్ షాకు అవుతుంది. అట్లాగే లింక్ లింకు, బాంక్ బాంకు, టాంక్ టాంకు, రాంక్ రాంకు, జింక్ జింకు అవుతాయి. అదేవిధంగా కింగ్ కింగు, స్టాంగ్ స్త్రాంగు, రింగ్ రింగు, సాంగ్ సాంగు, బ్లీచింగ్ బ్లీచింగు, కౌంటింగ్ కౌంటింగు అవుతాయి. బ్యాగ్ బ్యాగు అవుతుంది. సీట్సీటు, ఓట్ ఓటు, సెంట్ సెంటు అవుతాయి. పాంట్ పాంటు అవుతుంది. ష్షాట్ ప్లాటు అవుతుంది. బ్లేడ్ బ్లేడు, రాడ్ రాడు, లోడ్ లోడు, కోడ్ కోడు అవుతాయి. రోడ్ రోడు కావాలి. కొందరు రోడు అని వాడినా ఎక్కువమంది రోడ్డు అనే వాడుతున్నారు. దీన్ని ఒక ప్రత్యేక రూపంగా గుర్తించవచ్చు.
(బ్రాండ్ బ్రాండు అవుతుంది. లాండ్ లాండు అవుతుంది. సీల్ సీలు అవుతుంది. రీల్ రీలు అవుతుంది. ప్రీన్సిపాల్ ప్రిన్సిపాలు అవుతుంది. క్రేన్ క్రేను, వాన్ వాను అవుతాయి. కార్ కారు అవుతుంది. బార్ బారు అవుతుంది.
హలంత పదంలో చివరి హల్గుకు ముందు ఐ, బెలు ఉన్నా హల్లుకు ద్విత్వం రాదు. అంటే లైన్ లైను అవుతుందే తప్ప లైన్‌ను కాదు లైట్ లైటు, వైట్ వైటు, రైట్ రైటు, మైల్ మైలు, జైల్ జైలు, చైర్ దైరు, సైడ్ సైడు అవుతాయి. బెట్ బెటు అవుతుంది. బ్రౌన్ బ్రౌను, క్రౌన్ క్రాను, బ్లౌజ్ బ్లౌజు, బౌల్ బౌలు, పొన్ పొను అవుతాయి.
ఇంగ్లీషులో పదాంతంలో ద్విరుక్త వర్దాలుండవు. పదమధ్యంలో కూడా కొన్నిచోట్ల వర్ణక్ర మంలో ద్విర్తుక్తత ఉన్నా ఉచ్చారణలో అది తొలగిపోతుంది. తెలుగు వర్ణక్రమంలో రాసేటప్పుడు వాటిని అద్విరుక్తంగానే రాస్తాం.
లిటిల్ అనే ఇంగ్లీషు మాటలో రెండు “టలు ఉంటాయి కాని ఉచ్చారణలో ఒకటే “టి. తెలుగులో రాసినప్పుడు కూడా అద్విరుక్తంగానే రాస్తాం, కెటిల్, బాటిల్స్ సెటిల్ వంటివి దీనికి ఉదాహరణలు, పదాంతంలో కూడా ఇంగ్లీషులో ద్విర్తుక్త హల్గులుంటాయి. కాని వాటి ఉచ్చారణ అద్విరుక్తంగానే ఉంటుంది. మిల్లో రెండు 'ఎలొలు ఉన్నాయి. తెలుగులో మిల్లు అని రాస్తాం. అయితే తెలుగులో “ల్లు రాయడానికి కారణం ఇంగ్లీషులో రెండు “ఎలొలు ఉండడం కాదు. ఒకే “ఎల్ ఉన్నా తెలుగులో ద్విరుక్తంగానే రాస్తాం దీరాన్చు తర్వాత రెండు 'ఎల్లు ఉన్నా తెలుగులో అది అద్విరుక్తంగానే ఉంటుంది. ఉదాహరణకు వాల్ని తీసుకోవచ్చు. తెలుగులో వాలు అవుతుంది, బాల్ బాలు అవుతుంది. ఈ వదాలన్నింటిలోనూ చివర వచ్చి చేరిన అచ్చు *ఉఊ
కావడం గమనార్హం బ్
66 అమనభాష
మరికొన్ని ఇంగ్రషు మాటలు
అక్షరంలో ఒక అచ్చు తప్పకుండా ఉండాలి. కేవలం అచ్చు కూడా అక్షరమవుతుంది. అచ్చుకు ముందు ఒకటి, రెండు లేక మూడు హల్గులుండవచ్చు. అచ్చు తరువాత కూడా ఒకటి, రెండు లేక మూడు హల్గులుండవచ్చు ఇవన్నీ కలిపి ఒకే అక్షరం అవుతుంది ఉదాహరణకు '“అ ఒక అక్షరం. 'కి ఒక అక్షరం. “కార్ ఒక అక్షరం. స్తీ ఒక అక్షరం. 'సాగ్ర్ ఒక అక్షరం
ఇంగ్లీషు మాటల్లో పదాంతంలో సంయుక్తం ఉన్నా సాధారణంగా వచ్చి చేరే అచ్చు ఊఉ ఉదాహరణకు బోర్ట్ బోర్జు అవుతుంది. రికార్డ్ రికార్డు, అవార్డ్ అవార్డు, కార్ట్ కార్డు, ఫార్వర్డ్ ఫార్వర్డు, వార్ట్ వార్డు అవుతాయి. పార్ట్ పార్టు, కోర్ట్ కోర్టు, షర్ట్ షర్టు, ఛార్ట్ ఛార్జు అవుతాయి. రెస్ట్ రెస్టు, ఛెస్ట్ ఛెస్టు అవుతాయి బెల్ట్ బెల్టు, సాల్ట్ సాల్చు అవుతాయి. పల్స్ పల్సు, సెల్ఫ్ సెల్ఫు అవుతాయి. ప్రాంప్ట్ ప్రాంప్ట అవుతుంది. ఆబ్జెక్ట్ ఆబ్జెక్టు, సబ్జెక్ట్ సబ్జెక్టు అవుతాయి.
రెండు కంటే ఎక్కువ అక్షరాలున్న మాటల్లో పదాంతంలో ఉన్న హల్లును బట్టీ అది ద్విరుక్తం కావడమో కాకపోవడమో ఉంటుంది చివరి హల్లుకు ముందు ఉన్న అచ్చు దీర్థమయితే వాల్లు అద్విరుక్తంగానే ఉంటుంది. ఉదాహరణకు రిబేట్ రిబేటు అవుతుంది కాంక్రీట్ కాంక్రీటు అవు తుంది. చలాన్ చలాను అవుతుంది. ష్లాటూన్ ప్లాటూను అవుతుంది. కార్టూన్ కార్టూను అవు తుంది ప్రిన్సిపాల్ (ప్రిన్సిపాలు అవుతుంది. ఇంజినీర్ ఇంజినీరు అవుతుంది.
రెండుకాని, రెండుకంటే ఎక్కువగాని అక్షరాలున్న మాటల్లో చివరి హల్లు “ర కారమయితే దానికి ముందు హ్రస్వాచ్చు ఉన్నా 'రికారం ద్విరుక్తం కాదు. టీచర్ టీచరు అవుతుంది.
మీటర్, మీటరు, సెంటర్ సెంటరు, డైవర్ (దైవరు, లివర్ లివరు, డాక్టర్ డాక్టరు, మేజర్ మేజరు, మైనర్ మైనరు, అటెండర్ అటెండరు అవుతాయి. పదాంతంలో 'నికారం ఉన్నా ద్విర్హుక్తం కాదు. విలన్ విలను అవుతుంది. ఖైర్మన్ ఛైర్మను, స్పెయిన్ స్పెయిను, మిలియన్ మిలి యను అవుతుంది
పదాంతంలో “హి కారంగాని, 'టికారంగాని ఉన్నప్పుడు ద్విరుక్తం కావడం కనిపిస్తుంది. మేకప్ మేకప్పు, లాకప్ లాకప్పు అవుతున్నాయి. మేకపు, లాకపు అని అద్విరుక్తంగా కూడా ఉండ వచ్చు క్రికెట్ క్రికెట్టు, రాకెట్ రాకెట్టు, లాకెట్ లాకెట్టు, సీక్రెట్ సీకైట్టు అవుశాయి.
హలంత శబ్టాల మీద చేరే అచ్చు సాధారణంగా “ఉ అయినప్పటికీ పదాంతంలో తాలవ్య హల్లు ఉన్నప్పుడు *ఇ' వచ్చి చేరుతుంది
పదం చివర య” కారం ఉంటే *ఇు చేరుతుంది. బాయ్ బాయి, టాంప్ టాయి, రాయ్ రాయి అవుతాయి.
చ కార జ కారాలతో ముగిసే మాటల చివర కూడా *౪ు చేరుతుంది. లంచ్ లంచి అవు తుంది బెంచ్ బెంచి అవుతుంది బీచ్ బీచి అవుతుంది లాంచ్ లాంచి అవుతుంది.
గారేజ్ గారేజి, లగేజ్ లగేజి, 'బారేజ్ బారేజి, కాలేజ్ కాలేజి అవుతాయి. రేంజ్ రేంజి అవుతుంది. ఎక్సేంజ్ ఎక్సేంజి అవుతుంది. మైలేజ్ మైలేజి అవుతుంది. లాంజ్ లాంజి అవు తుంది.
సంయుక్త హల్గుతో అంతమయ్యే మాటల్లో కూడా చివరి హల్లు 'చ” కారం కాని 'జుకారం
వవాషా లె
కాని అయినట్లయితే చివర “ఇ చేరుతుంది ఉదాహరణకు సెర్చ్ సెర్చి అవుతుంది. చర్చ్ చర్చి అవుతుంది. రిసెర్చ్ రిసెర్చి అవుతుంది
బెడ్డ్ బడ్డి అవుతుంది. బాడ్జ్ బాడ్జి లాడ్జ్ లాడ్జి, సె్డ్ సద్ది, పెడ్డ్ పెద్ది, జడ్జ్ జడ్జి, ఛార్జ్ ఛార్జి, డిస్పార్ట్ డిస్సార్జి అవుతాయి.
పదాంతంలోని 'జుకారం దంత్యమయితే దీనిమీద “ఇ చేరదు, '“ఉయే చేరుతుంది. ఉదాహరణకు (ప్రైజ్ పైజు అవుతుంది. రిలీజ్ రిలీజు, లీజ్ లీజు, క్రీజ్ క్రీజు, ప్లవర్వాజ్ ప్లవర్ వాజు అవుతాయి.
పదం చివర 'ఇ' చేరిన మాటలలో కొన్నింటిని కొందరు దీర్టాంతాలుగా రాస్తారు. జడ్జీ, బారేజీ, గారేజీ, చర్చీ, బడ్డీ మొదలయిన విధంగా దీర్ధాంతాలుగా రాయడం కనిపిస్తుంది
తెలుగులో తాటాకు లాంటి మాటల్లో 'టి కారం మీద 'ఆ” రాస్తున్నాం. ఈ మాటను విడదీసినప్పుడు తాటి+ఆకు అవుతుంది. 'ట” కారం మీద ఉన్న అచ్చు 'ఇ+అ కలవడం వల్ల వచ్చింది మామూలు 'ఆ ఉచ్చారణకూ దీనికీ భేదం ఉంది. దీనికి తాలవ్యోచ్చారణ ఉంటుంది. ఇంగ్లీషు మాటల్లో 0201 02[ వంటి వాటిలో ఇటువంటి ఉచ్చారణే ఉంది. ఈ మాటలను తెలుగులో రాసేటప్పుడు బ్యాంకు, బ్యాటు అనీ బాంకు, బాటు అనీ రెండు విధాలుగా రాస్తు న్నారు. 'యి కారం తాలవ్యం. ఆ మాటలో అచ్చు తాలవ్యం అని సూచించడానికి 'య'కారాన్ని రాస్తున్నారు. ఈ సంప్రదాయం ప్రాచీన శాసనాలలో కూడా ఉంది. మేకలు వంటి తెలుగు మాటల్నే మ్యాకలు అని రాయడం శాసనాలలో ఉంది. కాబట్టీ 'య' ఒత్తు రాయడంలో దోషమేమీ లేదు. కాని పదం ఉచ్చారణ మనకు తెలిసినప్పుడు ప్రత్యేకమయిన లిపి సంకేతం అవసరం ఉండదు. అందువల్ల బాంకు అని రాస్తే సరిపోతుంది రాంకు, టాంకు అని రాయవచ్చు.
ఇట్లా రాయడం వల్ల కొన్ని మాటల మధ్య భేదం తొలగిపోతుంది. ఉదాహరణకు 944116 00146 అనే మాటల్నితీసుకోవచ్చు ఈ రెండింటినీ బాటిల్ అనే రాయాలి. ఒక మాటకు యుద్ధం అనీ, మరోమాటకు సీసా అనీ అర్థం. ఒకే విధంగా రాసినా సందర్భాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
హ్ 68 అమనబాష
తకదజాలం
ఒక భాషలో పదజాలం ఆ భాష మాట్లాదే సమాజం అవసరాల దృష్ట్యా ఉంటుంది. ప్రపంచం లోని భాషలన్నింటిలోనూ పదాలు సమాన సంఖ్యలో ఉండవు. కొన్ని భాషల్లో చాలా ఎక్కువ పదాలు ఉండవచ్చు. కొన్ని భాషల్లో చాలా పరిమితమయిన సంఖ్యలో పదాలు ఉండవచ్చు. అభివృద్ధి చెందిన సమాజాల భాషలలో పదాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒక సమాజ సంస్కృతిలో వచ్చే మార్పులు, వారికి పరిమితమయిన వస్తువులలో వచ్చిన మార్పులు ఆ సమాజ భాషలో ప్రతిఫలిస్తాయి. పూర్వం వాడుకలో ఉండిన కొన్ని మాటలు నేడు వాడుకలో లేవు. అట్లాగే పూర్వం వాడుకలో లేని మాటలెన్నో భాషలో కొత్తగా ఏర్పడ్డాయి. అంటే భాషలో నిరంతరంగా కొన్ని పాత మాటలుపోయి కొత్త మాటలు వచ్చి చేరుతూ ఉంటాయి.
కొత్త మాటలు ఎలా ఏర్పడతాయి? అరువు తెచ్చుకున్న వదాలను పక్కన పెడితే ఒక్తే భాషలోని పదాలు కూడా ఒకదానికొకటి సంబంధం లేనివిగా ఉండవు. సాధారణంగా ఉన్న పదాల నుండే కొత్త పదాలు పుడుతుంటాయి. ఉన్న పదాలనే వాక్యంలో ఖిన్న భాషా భాగాలుగా ఉపయోగించవచ్చు. పదాన్ని కొంచెం మార్చడం ద్వారా కొత్త పదాన్ని నిర్మించవచ్చు. రెండు మూడు పదాలను కలపడం వల్ల కూడా కొత్త పదం ఏర్పడవచ్చు. అనేక పదాలను కలిపీ పదాన్ని నిర్మించవచ్చు. ఇట్లా ఏర్పడిన పదాలను విశ్లేషించడానికి వాటికి వ్యాకరణ వరిభాషలో వేరువేరు పేర్లు పెట్టుకున్నాం.
వాక్యంలో కర్త, కర్మ, క్రియలుంటాయి. కర్త కర్మలు నామవాచకాలు. అంటే పేర్పు.క్రియ పనిని తెలియజేసే మాట, ఈ నామవాచకాలకూ డక్రియలకూ విశేషణాలూ ఉంటాయి నామ వాచకాలు, విశేషణాలు, సర్వనామాలు, క్రియలు, క్రియావిశేషణాలు మొదలయిన విధంగా పదాలను భాషాభాగాలుగా విభాగం చేస్తూ ఉంటారు. ఇట్లా విభాగం చేసినప్పుడు కొన్ని మాటలు నామవాచకాలూ కావచ్చు, విశేషణాలూ కావచ్చు, (క్రియలూ కావచ్చు. అటువంటి సందర్భంలో వాక్యంలో ఆ మాట నిర్వహించిన పాత్రను బట్టి అది నామవాచకమో, విశేషణమో, క్రియో నిర్ణ యించాలి. “అది పెద్ద ఊరు" అన్నప్పుడు "పెద్ది విశేషణం “ఆయన ఊరికి పెద్ద అన్నప్పుడు "పెద్ద నామవాచకం “దీవం వెలిగింది" అన్నప్పుడు, 'చెలిగింది'లోని వెలుగు క్రియ 'దీపం వెలుగు ఇస్తుంది" అన్నప్పుడు 'వెలుగు' నామవాచకం. ఉన్న మాటలనుండి కొత్త మాటలను కల్పించుకున్నట్లుగానే అవే మాటలను భిన్న భాషా భాగాలుగా కూడా ఉపయోగించుకో వచ్చునన్నమాట.
పదంలోని మౌలిక భాగాన్ని ధాతువు అంటాం ఈ ధాతువుకు వివిధ (ప్రత్యయాలు చేర్చి ఎన్నో మాటలను తయారు చేసుకోవచ్చు. కర్ర, కర్మ, (క్రియ అన్న మూడు మాటలకూ ధాతువు ఒక్కటే భార్య, భర్త అన్న రెండు మాటలకూ ధాతువు ఒక్కటే. రెండు, మూడు అన్నది ఇక్కడ ఉదా హరణ కోసమే. ఒక్కొక్క ధాతువునుండి పదులు వందల సంఖ్యలో వదాలు ఉత్పన్నం అవుతాయి కొన్ని భాషల్లో ఈ ప్రక్రియ చాలా విసృతంగా ఉంటుంది. కొన్ని భాషల్లో అంత విస్తృతంగా ఉండదు నిఘంటువులలో ఇటువంటి పదాలన్నీ ఇస్తారు. అట్లాగే పైకి మాట ఒక్కలాగే ఉండి ధాతువు వేరుగా ఉన్నా అ మాటలను వేరుగా ఇస్తారు. ఒకదానికొకటి సంబంధంలేని అర్జాలున్నా
మనబాషళి 60
వాటిని విడిగా ఇస్తారు అయితే భాషలో ఏర్పడే సమాసాలన్నిటినీ పట్టికలో కూర్చడం కాని నిఘంటువులో ఇవ్వడంకాని సాధ్యంకాదు అందువల్ల వాటి కూర్చుకు సంబంధించిన సూత్రాలు వ్యాకరణాలలో ఉంటాయి మన కల్పనా సామర్ధ్యాన్ని బట్టీ, అవసరాన్ని బట్టి పదాలను ఎన్సప్లీ రకాలుగా కలిపి కొత్త పదాలను నిర్మించుకోవచ్చు.
తెలుగులో కొన్ని మాటలను క్రియలుగాను, నామవాచకాలుగాను కూడా ఉపయోగించ వచ్చు. ఉతుకు, ఉరుము, వెలుగు, చదువు, పొంగు మొదలయినవి ఇటువంటివి. అయితే వీటిలో క్రియా పదంగా వాడినప్పుడు, నామవాచకంగా వాడినప్పుడు అర్ధంలో కొంత భేదం కూడా ఏర్పడవచ్చు.
(క్రియాపదం మీద ప్రత్యయాన్ని చేర్చి నామవాచకంగా మార్చుకోవచ్చు అలుగు-అలక, తడు-ఆట, ఎన్ను-ఎన్నిక ఓపు-ఓపిక మొదలయినవి ఇటువంటివి. ఈ మాటల్లో చేరిన ప్రత్య యాలను వ్యాకరణ పరిభాషలో కృత్త్రత్యయాలు అంటారు కృత్తత్యయం చేరిన పదం కృదంతం. ఈ కృదంతం నామవాచకం కాబట్టి ఈ విధంగా ఏర్పడిన నామవాచకాలను కృదంత నామాలంటారు,
నామవాచకం మీద కూడా ప్రత్యయాలు చేరి కొత్త నామవాచకాలు ఏర్పడవచ్చు. గొప్ప- గొప్పఠనం, జూదం- జూదగాడు, చెలి-చెలికత్త, కల్ల-కల్లరి మొదలయినవి ఇటువంటివి. ఇక్కడ చేరిన ప్రత్యయాలను తద్ధిత ప్రత్యయాలంటారు. ఏర్పడిన నామవాచకం తద్ధిత నామం.
రెండుకాని, అంతకంటే ఎక్కువ నామవాచకాలు కాని కలిసి ఏర్పడిన పదాన్ని సమాసం అంటారు. అన్నదమ్ములు, ముక్కంటి, తీపిమాట, ముల్లోకాలు మొదలయినవి సమాసాలు వీటిని సమస్తనామాలు అని కూడా అనవచ్చు రెండు కాని అంతకంటే ఎక్కువ క్రియాపదాలు కలిసి కొత్త పదమేర్చడితే దాన్ని క్రియాసమాసం అంటారు. చేసికొను, తీసివేయు, పగులగొట్టు, చెల్లబెట్టు మొదలయినవి క్రియా సమాసాలు. వీటికి విలక్షణమయిన అర్ధం వచ్చినట్లయితే శబ్ద పల్లవాలు అంటారు.
నామవాచకం మీద క్రియాపదం చేరి కూడా సమాసం ఏర్పడుతుంది విజయం చేయు వంటివి.
రెండుకాని అంతకంటే ఎక్కువకాని పదాలు కలవడం అని అంటున్నా, తెలుగులో రెండు పదాలో మూడు పదాలో కలవడం ఉందికాని సంస్కృతంలో లాగా బహుపదాలు కలిసి సమాసం ఏర్పడదు. ఒకవేళ కష్టపడి మనం అటువంటి సమాసాన్ని తయారుచేసినా కృతకంగా ఉండి వినేవారికి ఎబ్బెట్టుగా ఉంటుంది
ల్ “70 ఉమనబాష
క్రియా? నామవాచకమా?-1
వివిధ భాషా భాగాలకు రూపం ఒక్కటే ఉన్నప్పుడు వ్యాకరణ కర్తలు (వ్యాకర్రలు) వాటిని వేరుగా సూచించడానికి ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. నిఘంటువులలో అయితేవాటిని వేరువేరు ఆరోపాలుగా ఇచ్చి ఆరోపం పక్కన అది ఏ భాషా భాగమో సూచిస్తారు. క్రియ అయితే క్రియ అనీ, నామవాచకం అయితే నామవాచకమనీ, విశేషణమయితే విశేషణమనీ గుర్తిస్తారు.
క్రియా ప్రాతిపదికా నామవాచకమూ ఒక్కలాగే ఉండేటట్లయితే వ్యాకర్తలు క్రియారూపాన్ని మూలరూపంగా తీసుకుంటారు. దానికి ప్రత్యయం చేరి నామవాచకమయిందని చెప్తారు. ఉదా హరణకు అలరు అనే మాటను తీసుకుందాం. క్రియా ప్రాతివదికగా 'అలరు అంటీ ప్రకాశించు అని అర్ధం. విశేషణంగా కూడా ఇదే అర్ధం నామవాచకంగా ఈ మాటకు పుష్పం అనీ, కాంతి అనీ, ఆనందం అనీ అర్థాలు. అలరు అనే (క్రియా ప్రాతిపదికకు 'ఉ' అనే ప్రత్యయం చేరి నామ వాచకం అయిందని వ్యాకర్త చెప్తాడు. అలరు+ఉ=అలరు. తెలుగులో క్రియాప్రాతిపదికలన్నీ ఉకారాంతాలే కాబట్టి క్రియగానూ, నామవాచకంగానూ సమాన రూవం ఉన్న ఏ మాటనైనా ఇట్లాగే వివరించవచ్చు. ఈ అన్ని సందర్భాలలోనూ '*ఉ” అనే ప్రత్యయం వచ్చి చేరిందని చెప్పవచ్చు. వ్యాకరణ ప్రక్రియలో, పద నిర్మాణ వర్జనలో ఇది ఒక సులువు.
“అలుకు అని ఒక మాట ఉంది. ఇల్లు అలుకు, గోడ అలుకు అని క్రియగా వాడవచ్చు. ఇదే అర్ధంలో నామవాచకంగా రెండో అలుకు, మూడో అలుకు అని వాడవచ్చు. అలుకు అంటే భయ పడు అని కూడా అర్ధం ఈ అర్ధంలో నామవాచకంగా భయం అని అర్థం.
“అవుకు” అంటే క్రియగా ఒత్తిడికి లొంగు అని అర్ధం. నామవాచకంగా జంకు, బలహీనత అని అర్ధం. |
“ఇగురు” అంటే క్రియగా ఆవిరైపోవు, నశించు, ఎండిపోవు అని అర్ధం. నామవాచకంగా నీరంతా ఇగిరిపోయేట్లు ఉడికించిన కూర అని అర్ధం. “ఇరుకు అంటే క్రియగా సన్నని వ్రదేశంలో దూరడం అని అర్ధం. నామవాచకంగా సన్నని ప్రదేశం అని అర్థం. విశేషణంగా కూడా ఇదే అర్ధం. ఇరుకు సందు అంటే సన్నని వీధి, వెడల్పు లేని సందు.
“ఉడుకు అంటే అసూయవల్ల కానీ, కోపంవల్లకానీ దుఃఖపడు అని అర్ధం. 'ఉడుకుమోతు తనం దీనినుండే వచ్చింది. ఉడకడం, కోపగించడం అనికూడా అర్థం. వేడివల్ల తుకకుకమనడం అని అర్ధం. నామవాచకంగా ఈ మాటకు వేడి అనీ, ఉడకడమనీ అర్థం. 'ఉతుకు/ఉదుకు” అంటే బట్టలు ఉతకడమని అర్ధం. దీన్ని విస్తరించి తీవ్రంగా కొట్టడానికీ, విమర్శించడానికీ కూడా వాడు తున్నారు నామవాచకంగా “ఈ చీర ఒక్క టఉతుకు కూడా పడలేదు” వంటి వాక్యాలలో ప్రయోగం ఉంది
“ఉబుకు అంటే వాచు, ఉబ్బు అని అర్ధం. నామవాచకంగాా కూడా ఇదే అర్థం ఉరుకు" అంటే దూకడం అనీ, పరిగెత్తడం అనీ అర్థం. “ఒక్క ఉరుకు ఉరికాడు? “ఉరుకులు వరుగులు మీద వచ్చాడు” అన్న వాక్యాలలో ఇది నామవాచకం. “ఉరుము అంటే గర్జించు అని అర్ధం. నామ వాచకంగా మేఘగర్జన అని అర్ధం. “ఉలుకూ అంటే భయపడు, బెదురు అని అర్థం. నామవాచ కంగా ఈ మాటకు ఖయం, బెదురు, జంకు అని అర్ధం “ఎగురుకు క్రియగానూ, నామవాచకం గానూ అర్ధం ఒకటే,
నునభాషతి /1
“ఎచ్చు/హెచ్చు”? అంటే పెరుగు, వృద్ధి చెందు అని అర్ధం. నామవాచకంగా అధికం అని అర్థం వాడుకలో '“ఎచ్చులు పోవడం అంటే సామర్థాన్ని మించి గొప్పకు పోవడమని అర్ధం “ఎదుగుకు క్రియగానూ, నామవాచకంగానూ ఒక్తే అర్ధం “ఎదురు” అంటే వ్యతిరేకించు అని అర్థం. నామవాచకంగా ఎదుట అనీ, ప్రత్యర్థి అనీ సాటి అనీ అర్ధం.
“ఏకు' అంటే దూదిని శుభ్రం చేయడం. విమర్శించు అనే అర్ధం కూడా ఏర్పడింది. నామ వాచకంగా ఏకు అంటే ఏకిన దూది చుట్ట. “ఏకుమేకయింది', *ఏకయి వచ్చి మేకయి కూర్చు న్నాడు మొదలయిన ప్రయోగాలు మన నుడికారంలో భాగాలు. మెత్తగా ప్రమాదరహితంగా మొదలయి ఇప్పుడు వదుల్చుకోలేకుండా తయారవడమన్నమాట
“ఒత్తు అన్న మాటకు అణచు, అదుము, నొక్కుఅని అర్ధం కావ్య భాషలో నిర్బంధించు, పీడించు, ఆక్రమించు, నిందించు, తోము, అద్దు, తుడుచు, సవరించు, ఊదు, వాయించు, పరి శోధించు మొదలయిన అనేక అర్ధాలున్నాయి. నామవాచకంగా అదుముడు, నొక్కుడు అన్న అర్థంతోపాటు బాధ, తుడుపు, దట్టం అనే అర్ధాలు కూడా ఉన్నాయి. ఖ, ఘ, ఛ మొదలయినవి ఒత్తక్షరాలు. ఈ వర్జాలలో మహాప్రాణ లక్షణాన్ని గుర్తించడానికి ఉపయోగించే గుర్తును “ఒత్తు అని అంటాం. అట్లాగా ద్విత్వాక్షరాలలోనూ, సంయుక్తాక్షరాలలోను మొదటి హల్గుకాక ఇతర హల్లులను సూచించే గుర్తులు కూడా ఒత్తులే. క వత్తు. “౧౫” గ వత్తు.
“ఒదుగుకు క్రియగానూ, నామవాచకంగానూ అర్ధం ఒకటే. ఒనరు” అంటే కలుగు అనీ, సొగసు అనీ అర్ధం. నామవాచకంగా దీనికి అనుకూలత, సదుపాయం అని అర్ధం. 'ఒప్పు" అంటే తగు, ఉచితమగు, ప్రకాశించు, ఉత్తమమగు అని అర్థం నామవాచకంగా ఈ మాటకు చక్క దనం, కాంతి, శోభ, రీతి, సమ్మతి అని అర్థాలు. ఒప్పు అంటే సరైనది అని కూడా అర్ధం. ఇక్కడ దీనికి వ్యతిరేకార్ధ పదం “తప్పు”.
'ఒసగు' అంటే ఇచ్చు అని అర్థం నామవాచకంగా కానుక అని అర్థం. ఇప్పుడీ మాటను వాడడం లేదు.
“కట్టు అంటే బంధించు, ధరించు, ఆరోపించు, కూర్చు, నిర్మించు, అడ్డగించు, చెల్లించు, వెఠించు మొదలయిన అర్థాలున్నాయి నామవాచకంగా బంధనం, బంధన సాధనం, మితి, సయమం, కూర్చు, వస్త్రధారణ, నిర్మాణం అని అర్థాలు కందిపప్పు వంటి వాటిని ఉడికించి నప్పుడు వచ్చిన రసాన్ని కూడా కట్టు అంటారు
'కడుగు' అంటే శుభ్రం చేయు దియ్యం మొదలయిన వాటిని కడిగిన నీటిని కూడా కడుగు అంటారు. ఇక్కడ అది నామవాచకం, “కదుము' అంటీ అ(క్రమించు, అదుము. అణచు అని అర్ధం. నామవాచకంగా ఈ మాటకు బొప్పి అని అర్ధం. 'కనరు' అంటే కోపించు ఇది నామ వాచకమయి నప్పుడు కోపం అని అర్హం. *కనలు అంటే మండు, కోపించు. నామవాచకంగా కనలు అంటే కోపం నామవాచకంగా ఈ మాట వాడుకలో లేదు
“కందు' అంటే రంగుమారు, ఎ(ర్రబడు, వాడిపోవు అని అర్థం క్షీణించు, కృశించు, నశించు అనే అర్థాలు కూడా ఉన్నాయి నామవాచకంగా దీనికి మచ్చ అనీ, నలుపు అనీ, దుఃఖం అనీ, లోపం అనీ, సెగ అనీ అర్థాలున్నాయి. బిడ్డ, కొదమ అనే అర్థాలు కలిగిన “కందు” అన్న
నామవాచకమూ ఇదీ ఒకటేనేమో, పుట్టగానే కందినట్లుగా చె 72 అమనబాష
క్రియా? నామవాచకమా?-2 “కప్పు” అంటే ఆచ్చాదించు, మరుగుపరుచు, వ్యాపించు. "కప్పు" నామవాచకం అయినప్పుడు ఆచ్చాదనం, ఇంటిపైకప్పు అని అర్ధం. నలుపు, చీకటి అనే అర్ధంలో మరో కప్పు ఉంది. “కవరు అంటే కాలు, దగ్ధమగు, నామవాచకంగా కాల్పు అని అర్ధం. నూనె, చర్మం, జుట్టు కాలడం.
“కసరు' అంటే తిట్టు, దూషించు అని అర్ధం. నామవాచకమయినప్పుడు కోపం, అసం తోషం, తిట్టు అని అర్జాలు. 'కాగు' అంటే వేడెక్కడం. నామవాచకంగా దీనికి నీళ్ళు, పాలు మొద లయినవి కాచే లోహపాత్ర అని అర్ధం. "కుట్టు" అంటే ఆకులు, బట్టలు మొదలయినవి కుట్టడం, పురుగులు, తేలు వంటివి కుట్టడం, గుచ్చు, పోగులు పెట్టుకోవడానికి చెవులు కుట్టు అని అర్థాలు నామవాచకంగా “కుట్టు అంటే కుట్టడం, కుట్టినదారం, నొప్పి, కుట్టడం వల్ల ఏర్పడ్డ రంధ్రం అని అర్ధాలు,
“కుదుపుకు క్రియగానూ, నామవాచకంగానూ అర్థం ఒకటే. 'కుదురు” అంటే స్థిరపడు, నెలకొను, సరిపడు, బాగుపడు, దొరకు, మాను అని అర్థాలు. నామవాచకంగా దీనికి స్థానం, పాదు, మొదలు, వంశం, ఆధారం, నెలవు, ధైర్యం, వరుస, చుట్టకుదురు అని అర్ధాలు. “కునుకు” అంటే నిద్రవల్ల తూగు అని అర్ధం. దీపం వెలుగు క్రమంగా తగ్గి ఆరిపోవడం అని కూడా అర్ధం. నామవాచకంగా 'కునుకు” అంటే నిద్ర.
“కుందు అంటే దుఃఖించు, చింతించు, తగ్గు, కుంగు, నరకు, ఒక కాలితో నడచు అని అర్ధాలు. నామవాచకంగా దుఃఖం, తక్కువ అని అర్ధాలు. “కురు” అంటే కూయు, అరచు అని అర్ధం. నామవాచకంగా కూత అని అద్ధం. కులుకు” అంటే శరీరాన్ని శృంగారంగా కదిలించు, మురియు, ప్రకాశించు, ప్రకటమగు అని అర్ధాలు. నామవాచకంగా కులుకు అంటే విలాసం, అందం అని అర్ధం “'కూర్ము/కూరుకు' అంటే నిద్రపోవు అనీ, నిద్ర అనీ అర్ధం కొంకు అంటే సందేహించు, భయపడు, సంకోచించు, వెనుదీయు అని అర్ధం. నామవాచకంగా భయం, జంకు, సందేహం, వంకర అని అర్ధాలు.
“కొట్టు” అంటే దెబ్బకొట్టు, మోగించు, చంపు, కూల్చు, వెళ్ళగొట్టు, వగులగొట్టు అని అర్థం. ఎలుకలు కొట్టాయి మొదలయిన సందర్భాలలో కొరికివేయు అని అర్థం, చెట్టు కొట్టారు అన్న ప్పుడు 'నరుకు' అని అర్ధం. నామవాచకంగా ఈ మాటకు దెబ్బ అని అర్ధం.
“కొదుకు అంటే జంకు, వెనుదీయు, మాటలు దిగమింగు అని అర్ధం. నామవాచకంగా సంకోచం అని అర్ధం 'కొరుకు"కు క్రియగానూ, నామవాచకంగానూ ఒకే అర్ధం . “కొసరు” అంటే సంకోచించు, విజ్బంభించు అని అర్థాలు. పక్షులకు సంబంధించి మాటిమాటికి కూయు అని అర్ధం. నామవాచకంగా ఈ మాటకు కోరిక అనీ, సంకోచం అనీ, సరుకులు అమ్మేవాడు కొనే వాడికి ఇచ్చే ఎక్కుప అనీ అర్ధం 'కోరు' అంటే చీరు, గీరు అని అర్థం. నామవాచకంగా గీరిన కొబ్బరి, భాగం, కప్పం అని అర్ధం
'క్రక్కుకక్కు కడుపులోది వెళ్ళగక్కడం. నామవాచకంగా క్రియగా కూడా ఇదే అర్థం. 'క్రందు' అంటే మోగు, ఏడ్చు అని అర్ధం, నామవాచకంగా ఈ మాటకు ఏడ్పు అనీ, పెద్ద ధ్వని అనీ, సందడి అనీ, ఉపద్రవం అనీ, అతిశయం అనీ అర్ధాలు. “క్రుంకు” అంటే మునుగు, అస్తమించు, చనిపోవు, గుచ్చుకొను అని అర్థాలు. నామవాచకంగా అస్తమయం అనీ, స్నానం అనీ అర్ధాలు. 'క్రుమ్ము/కుమ్ము' అంటే పొడచు అని అర్ధం. నామవాచకమయితే పోటు అని అర్ధం.
మనబాషతి /3
'క్రుళ్ళు/ుళ్ళు” అంటే బాధపడు, దుఃఖించు, పాడైపోవు అని అర్థం. నామవాచకంగా ఈ మాటకు అసూయ అనీ, దుఃఖం అనీ అర్ధం.
'కావ్వుకొవ్వు అంటే గర్వించు, ఐలియు అని అర్థం. నామవాచకంగా మదం అనీ, సారం అనీ, పుష్టి అనీ అర్థాలు. శరీరంలోని ఒక ధాతువు క్రొవ్వు పొగరుబోతుల మాటలను కూడా కొవ్వులు అంటారు. 'గిలుబు' అంటే దొంగిలించు, దొంగతనం అని అర్ధాలు. “గిల్లు అంటే క్రియ గానూ, నామవాచకంగానూ ఒక్తే అర్థం గీటు అంటే పళ్ళు నూరడం, కన్ను గిలపటం, నామవాచకంగా దీనికి గీత అనీ, అనాదరం అనీ అర్థాలు
గంటు అంటే కదలు, చెడు, తప్పిపోవు, సంకోచించు, నెట్టు, తోయు అని అర్ధాలు నామ వాచకంగా కదలిక అని అర్థం
'గెంతు/గంతు అంటే దూకు అని అర్థం. (గ్రుద్దుగుద్దు” అంటే పిడికిలితో పొడుచు అనీ, పిడికిలి దెబ్బ అనీ అర్ధం. చదువు అంటే పరించు, అధ్యయనం చేయు, పైకి అప్పచెప్పు అని అర్థం. నామవాచకంగా అధ్యయనం, జ్ఞానం అని అర్ధం. 'చమురు" అంటే నూనె వంటివి రాయడ మనీ, నూనె అనీ అర్థం.
“చాడు” అటే అరగదీయు, (నామం) పెట్టుకొను. నామవాచకంగా ఈ మాటకు బొట్టు పెట్టుకోవడానికి ఉపయోగించే ఒకరకమయిన (ద్రవ్యం అని అర్ధం. *చాపు" అంటే చాచు నామ వాచకంగా దీనికి పొడవు అని అర్ధం. దీర్చాచ్చును కూడా చాపు అంటారు.
క్రియగా “చిక్కు అంటే కృశించు, సంకోచించు, మిగులు, చచ్చు, ఆగిపోవు, దొరుకు, వట్టువడు, లౌంగు, తగులుకొను, ఇమిడి ఉండు అని అర్ధాలు. నామవాచకంగా మెలిక, బంధం, ముడి, పట్టు, ఆపద, బాధ, సంశయం అని అర్ధాలు. “చిటుకు” అనే మాటకు క్రియాపదంగానూ, నామవాచకంగానూ అర్షం ఒకటే “చినుకు” కూడా ఇటువంటిదే. “చినుగు, “చిరుగు” కూడా అంతే. “చిందు” అంటీ ఒలుకు, వ్యాపించు, రాలు, వ్యక్తమగు అని అర్థాలు. నామవాచకంగా
బిందువు, కోపం అని అర్థాలు. చిందు అనేది ఒక నాట్యవిశేషం. ఒక విధమైన పాటకు కూడా చిందు అనే పేరు.
“చుట్టు అంటే తిరుగు, మూగు, ప్రదక్షిణించు అని అర్థాలు. నామవాచకంగా “చుట్టు” అంటే వలయం, తడవ, వైపు, స్రీలు కాలికి పెట్టుకొనే ఆభరణం అని అర్థాలు.
“చెక్కు అంటే దోపు అనీ, సవరించు అనీ, (రాళ్ళు) పొదుగు అనీ ఖండించు అనీ, దోకు అనీ, (బొమ్మలు) చెక్కు అనీ అర్ధాలు. నామవాచకంగా ఈ మాటకు చెక్కిలి, చెక్క చెట్టుపట్ట అని అర్థాలు. పుండు మానేటప్పుడు ఏర్పడే గట్టి పొరను కూడా చెక్కు అనే అంటారు. చెట్టు పట్ట సాన్యుంవల్ల ఈ అర్థం వచ్చిందేమో.
“చెనకు” అంటే తాకు, కొరుకు, మాటలతో రెచ్చగొట్టు అని అర్ధం నామవాచకంగా దెబ్బ, కొరకడం, గిచ్చడం వల్ల ఏర్పదే గుర్తు అని అర్ధం. “చెరలు” అంటే చాలా ఆనందంగా ఉండడం, నామవాచకంగా కూడా ఇదే అర్థం, “చేపు' అంటే పాలు చేపడం. క్రియగానూ, నామవాచకం గానూ అర్థం ఒకటే, “చొక్కు' అంటే పరవశమగు, మోహంపొందు, లొంగు, చచ్చు అని అర్ధాలు.
నామవాచకంగా పారవశ్యం, మోహం, మూర్చ, మత్తు అని అర్ధాలు.
“నోకు/సోకు' అంటే తగులు, ఆవేశించు అని అర్ధం. నామవాచకంగా స్పర్శ, దెబ్బ అని అర్ధాలు. “జంకు” అంటే భయపడు, సంకోచించు, చలించు, క్రుంగు అని అర్థాలు. నామవాచకంగా భయం, సంకోచం అని అర్ధం. హ్
74 తి మవబాష
క్రియా? నామవాచకమా?-3
“డగ్గు తరువాత దగ్గు అయింది. అయితే దగ్గుత్తిక అన్న సమాసంలో మాత్రం డగ్గు మారకుండా అలాగే ఉంది. గద్గ్దదస్వరం అని అర్ధం. క్రియగానూ నామవాచకంగానూ కూడా ఒకే అర్ధం. ప్రాచీన కాలంలో డకారంతో మొదలయ్యే పదాలు చాలావరకు దకారాదులుగా మారాయి. ఇటువంటిదే 'డెప్పు ఇది దెప్పుగా మారింది. ఈ మాటకు ఎత్తి పాడుచు అని అర్థం. క్రియగానూ నామవాచకంగానూ కూడా అదే అర్ధం. “డోకు” అన్నమాట కూడా గడ్డి చెక్కడం అన్న అర్థంలో దోకుగా మారింది కాని కక్కుఅన్న అర్ధంలో డోకుగానే ఉంది. క్రియగానూ నామవాచకంగానూ కూడా ఈ అర్ధంలో ఈ మాటకు వాడుక ఉంది.
“తక్కు అంటే విడుచు, మాను అని అర్ధం. నామవాచకంగా దీనికి మిగులు అని అర్ధం. విశేషణంగా ఇతరం అని అర్ధం. తగులు అంటే తాకు, స్పృశించు అని అర్థం. దీనికి తవులు అన్న రూపాంతరం కూడా ఉంది. దీనికి ఇష్టపడు, వలచు అని కూడా అర్థం ఉంది. జ్వరం తగలడం, తిట్లు తగలడం, తగులుకోవడం వంటి (ప్రయోగాలలో విశేషార్ధాలున్నాయి. “తోవలో ఒక మనిషి తగిలాడు” అన్నప్పుడు ఎదురయ్యాడు, కలిశాడు అని అర్ధం. నామవాచకంగా “తగులుకు అభిలాష్క్య వలవు, సంబంధం, చిక్కు నష్టం అని అర్ధాలు.
“తగ్గు అంటే తక్కువగు, కుంగు, వెనుదీయు, కృశించు అని అర్ధాలు. నామవాచకంగా తక్కువ అని అర్ధం 'తట్టు' అంటే చేతితో మెల్లగా కొట్టు, స్ఫురించు అని అర్ధాలు. ప్రాచీన కావ్యా లలో వాయించు, తోమువంటి అర్థాలు కూడా ఉన్నాయి నామవాచకంగా దద్దురు, పొంగు అని అర్ధం 'తన్ను'కు క్రియగానూ, నామవాచకంగానూ అర్ధభేదం లేదు 'తవ్పు” అంటే తొలగు, వ్యర్థ మగు, అసత్యమగు, చెడు, ఉల్లంఘించు, విఫలమగు, తప్పించుకొను, కోల్పోవు అని అర్ధాలు. నామవాచకంగా నేరం, పావం, అబద్ధం, వైఫల్యం అని అర్థాలు. దయ తప్పడం, రైలు తప్పి పోవడం, నెల తప్పడం వంటి విశేషార్థాలు ఉన్నాయి. తప్పదు అంటే కాకమానదు అని అర్ధం. తప్పనిసరి అని అర్ధం. 'తరటు” అంటే కొరదాతో కొట్టు అనీ, కొరడా అనీ అర్థం. 'తరుగు' అంటే క్రియగాను, నామవాచకంగాను అర్థం ఒకటే. 'తలకు' అంటే భయపడు, జంకు, చలించు అని అర్ధాలు నామవాచకంగా భయం, చలనం, సందేహం, దుఖం అని అర్ధాలు. తసుకు అంటే (పేమ కలిగినట్లు నటించు అని అర్ధం. నామవాచకంగా అసత్యం, టక్కు మోసం అని అర్ధం. 'తాకు' అంటే రాచుకొను, తగులు, కొట్టు, మార్కొను అని అర్థాలు నామవాచకంగా దెబ్బ, పీడ అని అర్థాలు. “తిట్టుకు క్రియగానూ, నామవాచకంగానూ నిందించు అని అర్థం. కావ్యాలలో శాపం అని కూడా అర్ధం ఉంది. 'తిమురు” అంటే తొందరపడు, ఉద్రేకించు, గర్వించు అని అర్థాలు 'తుమ్ముకు క్రియగానూ, నామవాచకంగానూ అర్ధం ఒకటే. 'తురుము' అంటే కొప్పులో పూవులు మొదలయినవి చెరువుకోవడం, జుట్టు ముడివేయడం, సవరించడం, అదిమి దోపడం అని అర్థాలు నామవాచకంగా కొప్పు, జుట్టు ముడి అని అర్థం. కొబ్బరి తురుము కూడా.
“తూగు అంటే బరువు తూగటమనీ, సమానమగు అనీ, సిద్ధమగు అనీ, చలించు, ఊగు అనీ కూరుకువడు అనీ అర్ధాలు. శక్తి కలిగినంత అని కూడా అర్ధం. నామవాచకంగా కునికిపాటు అని అర్ధం “కవిత్వంలో ఒక తూగు ఉండాలి వంటి వ్రయోగాలలో సమత్వం అని అర్ధం,
మనభాషళ 75
“తాణుకూ అంటే క్రీియగా చిందు అని అర్ధం. నామవాచకంగా భయం అనీ, తొట్రుపాటు అనీ అర్ధం. “తొరగు' అంటే విడుచు, కారు అని అర్ధం. నామవాచకంగా కూడా అర్ధంలో మార్పులేదు. “తాలకు” అంటే పొర్పు చిందు, కదులు, వ్యాపించు అని అర్ధాలు. నామవాచకంగా చలనం అనీ, అల అనీ అర్ధాలు.
“క్రుళ్ళు/ుళ్ళు" అంటే సంతోషంతో గంతులు వేయు, ఎగిరిపడు, సంతోషించు, గర్వించు అని అర్థాలు. నామవాచకంగా ఎగసిపాటు అని అర్ధం. త్రొక్కుతాక్కు అడుగుపెట్టు, కాలితో అదుము, దంచు అని అర్ధం. నామవాచకంగా కూడా ఇదే అద్ధం. తొక్కుఅంటే పచ్చడి అనికూడా అర్ధం ఉంది. దంచినది కాబట్టి తొక్కు “దాటు” అంటే క్రియగానూ, నామవాచకంగానూ దాటడ మనే అర్ధం
“దిద్దు అంటే సరిచేయు, బొట్టు వంటివి పెట్టుకొను అని అర్ధం. అక్షరాలు దిద్దు అన్నప్పుడు రాసిన అక్షరంమీద మళ్ళీ రాయడం. నామవాచకంగా సరిచేయడమని అర్ధం. దుముకు/దూకు అంటే గంతువేయు అని అర్థం. నామవాచకంగా గంతు అని అర్ధం. “దూరు” అంటే నిందించు, నింద అని అర్ధం. 'నట్టు' అంటే అడ్డు, ఆలస్యం.
'నడుకు అంటే చలించు, ఒదుగు, జంకు, ఇక్కట్లు పడు, నశించు అని అర్ధం. నామవాచ కంగా కంపం, భయం అని అర్థం, రకు” అంటీ ఖండించు. నామవాచకంగా దీనికి కత్రిదెబ్బ అని అర్థం. “నవ్వుకు క్రియగానూ, నామవాచకంగానూ అర్ధం ఒకటే, “నసుగు” అంటే అస్పష్టంగా మాట్లాడు అని అర్ధం. నామవాచకంగా అస్పష్టమైన మాట “నాటు అంటే గుచ్చు, పాతు, తగులు అని అర్ధం. నామవాచకంగా దెబ్బ, రంధ్రం, కుదురు, వరి మొదలయినవి నాటటం అని అర్థం. “నిండు” అంటే పూర్ణమగు, ముగియు అని అర్ధం. నామవాచకంగా పూర్ణత్వం. 'నింపుకు పూరించు, వ్యాపింపజేయు అని అర్ధం. నామవాచకంగా ఈ మాటకు పూర్ణం, అధికం అనే అర్థంతోపాటు మనోహరం అనే అర్థం కూడా ఉంది.
“నిక్కు అంటే పైకి లేచు, వర్ధిల్లు, ఉబుకు, సాగు, వ్యాపించు, పుట్టు, సంతోషించు, గర్వించు అని అర్ధాలు. నామవాచకంగా బెన్నత్యం, బింకం, అందం అని అర్ధాలు, “నుగ్గు అంటే క్రియాపదంగా నలుగు అని అర్ధం, అయితే క్రియగా దీనికి ప్రయోగం తక్కువ నామవాచకంగా పొడి అని అర్ధం. 'నుచ్చు” అంటే మేకల పొదుగులకు చుట్టూ గుడ్డ కట్టడం ఆ కట్టిన గుడ్డకు కూడా 'నుచ్చు' అనే పేరు. 'నుడుగు' అంటే వచించు, మాట్లాడు అని అర్ధం. నామవాచకంగా మాట, పలుకు అని అర్థం,
'నురుము” అంటె పొడిచేయు, చంపు అని అర్ధం నామ వాచకంగా పొడి అని అర్థం. నెట్టు అంటే గెంటు, తోయు, నిరాకరించు అని అద్ధం. నామవాచకంగా గెంటు, తోపు, తావు అని అర్థం. 'నాక్కు అంటే అదుము, నలుపు అని అర్ధం అదమడం వల్ల కలిగిన ముడతకు, గుంతకు “నొక్కు అని పేరు. నాగులు” అంటే బాధచెందు, వాడిపోవు, నలుగు, వికలమగు అని అర్ధం. నామవాచకంగా దీనికి నొప్పి, బాధ అని అర్థం. “'నాడుగు/ నొడువు' అన్నమాట నుడుగు/ నుడువుకు రూపాంతరం. వచించు, చెప్పు, రచించు, చదువు, స్తుతించు అని అర్ధం. నామవాచ కంగా మాట, పలుకు అని అర్థం. 'నోము' అంటీ నోచు, వ్రతాదులను ఆచరించు, పూజించు అని అర్ధం. నామవాచకంగా వ్రతం అనీ, వ్రతఫలం అనీ అర్థాలు బ్
76 అనునభాష
క్రియా? నామవాచకమా?-4
తెలుగులో నామవాచకాలుగానూ, క్రియలుగానూ వాడుకలో ఉన్నమాటలెన్నో ఉన్నాయి “పగులు” అంటే బద్దలగు, చీలు అని అర్ధం. నామవాచకంగా బీట, చీలిక అని అర్ధం. “వట్టు" అనే మాటకు క్రియగానూ, నామవాచకంగానూ ఎన్నో అర్థాలున్నాయి. స్వీకరించు, ఆక్రమించు, ఆశ్రయించు, ఊదు, ధారణచేయు, ఆలోచించు, నిలుపు, (ప్రతిజ్ఞ పూను, సోకు, అనుసరించు, బలాత్మరించు, మింగు, (గొడుగు వంటివి) వేయు, చాచు, (సాన) పెట్టు, (నీళ్ళు వంటివి) పాత్రలలో నింపు, (పాలు) తాగించు, తాకు, (వేడి) సహించు, (నోము) చేయు, నమ్ము, (ఊపిరి) బిగబట్టు, (కాలం) జరుగు, పీడించు, అంటు, ఇముడు, (మసి) పారు, వ్యాపించు మొదలయిన అర్భాలు ఈ 'పట్టు” అనే క్రియా పదానికి ఉన్నాయి. వివిధార్థాలలో దీన్ని ప్రయోగించవచ్చు. ఇతర క్రియా ధాతువులతో కలిసివచ్చినప్పుడు కూడా ఈ మాట కొత్త అర్థాలను కలిగిస్తుంది. నామవాచ కంగా కూడా దీనికి ఎన్నో అర్థాలున్నాయి. పట్టుదల, గ్రహణం, పూత, నివాస స్థానం, చోటు, సంగతి, ధైర్యం, విషయం, సందర్భం, సమయం, పరిమితి, ప్రాప్తి, రీతి ఊత, కారణం, కధా ఘట్టం మొదలయినవి. సిల్కు అన్న అర్ధంలో ఉన్న పట్టు వేరే మాట
“పండు” అంటే పక్వం కావడం, సిద్ధించు, ఫలించు, సంతానం కలుగు, ముగియు అని అర్థాలు. నామవాచకంగా పండినది, ఫలం అని అర్థం. “పండు” అనే మరో వదానికి శయనించు అని అర్ధం. ఇది కేవలం (క్రియ. పదరు/వదరు అతిగా మాట్లాడు, (ప్రేలు, గొప్పలు చెప్పుకొను అని అర్ధం నామవాచకంగా మాట, కలత, త్వరగా మాట్లాడినమాట, ధ్వని అని అర్ధాలు. “వరుపు' అంటే ప్రసరించు, (ప్రయోగించు, ప్రవహింపజేయు అని అర్ధం. నామవాచకంగా పడడం అనీ, పైకప్పు అనీ, వైశాల్యం అనీ, శయ్య అనీ, రీతి అనీ అర్థాలు. ఈ మాటకు పొడవు అనీ, వెడల్పు అనీ కూడా అర్ధం ఉంది పరువు/పర్వు అనే మాటకు పరిగెక్తు ప్రసరించు, ప్రవహించు, వ్యాపించు, బయల్చడు, పుట్టు, ప్రసిద్ధమగు అని అర్థాలు. నామవాచకంగా వరుగు అని అర్ధం.
“పలుకు అంటే వచించు, నిందించు, ఉచ్చరించు, రచించు, స్తుతించు, జవాబు చెప్పు, కూయు, మోగు అని అర్ధం, నామవాచకంగా మాట, ఆజ్ఞ నింద, సత్యవచనం, కూత అని అర్ధాలు. పలుకు అంటే ముక్క అనీ అర్థం.
“పాతు” అంటే పూడ్చు అనీ, చెట్లు, కొండలు మొదలైనవాటి భూమిలోని మూలం అనీ అర్ధం. 'పిక్కు అంటే వెనుదీయు, దొంగిలించు, మోసంచేయు అని అర్థాలు నామవాచకంగా మోసం, కిటుకు అని అర్ధం. 'పుడుకు/ుణుకు” అంటే మునివేళ్ళతో పట్టుకొను, పిసుకు, నిమురు, చిదుము, కొంచెముగా తీసుకొను, ఇచ్చు అని అర్థాలు. నామవాచకంగా దానం, కానుక అని అర్ధం
“పెట్టు అనే మాటకు చాలా అర్థాలున్నాయి. సందర్భాన్ని బట్టి ఈ అర్థాలు తెలుసుకోవచ్చు. ఇచ్చు, వడ్డించు, చెల్లించు, ఆరోపించు, అమర్చు, అలదు, (నగలు) ధరించు - ధరింపజేయు, (ప్రసవించు, నెలకొల్పు, నియమించు, నాటు, నిర్ణయించు, నిర్మించు, కల్పించు, మూయ, కొట్టు, ఉచ్చరించు మొదలయినవి. 'ఇవ్వాళ బడి పెట్టారు అంటే తెరిచారని అర్ధం. స్కూటర్ చెట్టుకు పెట్టాడు అంటే ఢీ కొట్టడమని అర్ధం. మాట చెవిని పెట్టడమంటే వినడమని అర్ధం. నామవాచ
మనబాషతి //
కంగా 'పెట్టు' అంటే దెబ్బ అని అర్ధం. దానం అని కూడా అర్ధం. పెట్టుపోతలు అంటారు కదా. “వారొక్కడే పది మంది పెట్టు” అన్నప్పుడు పదిమందికి సమానమని అర్ధం
“పెంపు అంటే పోషించు, పోగొట్టు అని అర్థం నామవాచకంగా ఈ మాటకు ఎక్కువ, గొప్పతనం, గౌరవం, (ప్రాశస్త్యం, ఉత్సాహం, ఎత్తు, మనోజ్ఞత, విధం అని అర్ధాలు. 'పొక్కు అంటే దుఃఖించు, బాధపడు, బొబ్బలెక్కు బయటపడు అని అర్థాలు. నామవాచకంగా ఈ మాటకు బాధ, బొబ్బ, జన(శ్రుతి, చెక్కుఅని అర్ధాలు “పొంగు” అంటే ఉబ్బు, పెరుగు, ప్రసరించు, సంతోషించు, విజ్బంభించు అని అర్థాలు. నామవాచకంగా ఉబ్బుడు, విజ్బృంభణం, గర్వం, సంతోషం అని అర్భాలు తదడపర, నుశూచి వంటి వ్యాధికి కూడా పొంగు అని పేరు.
'పొడుగు' అంటే పెరగడమని అర్ధం. క్రియగా ఈ మాటకు అర్ధం ఉన్నప్పటికీ ప్రస్తుతం వాడుకలో ఉన్నట్లు లేదు. నామవాచకంగా ఉన్నతి, దైర్యం అని అర్ధం. 'పొదుగు/పాదుపు' అంటే ఆవరించు, (గ్రుడ్లు) పొదుగు, (రత్నాలు మొ॥వి) పొదుగు అని అర్ధం నామవాచకంగా పసిపిల్లలకు పక్కలో వేసిన గుడ్డకు పొదుగు అని పేరు.
'పొనరు అంటే కలుగు, పొసగు అని అర్ధం నామవాచకంగా పొందిక, ఇంపు అని అర్ధాలు. 'పొంచు'కు క్రియగానూ, నామవాచకంగానూ దాగి ఉండడమనే అర్ధం 'పొందు' అంటే అనుభవించు, కూడు, ఆశ్రయించు, కలుగు అని అర్థాలు. నామవాచకంగా ఈ మాటకు పొందిక పొత్తు, కలయిక, నెలవు, సహాయం, వలపు, పద్ధతి అని అర్ధాలు. “పోరు అంటే యుద్ధం చేయు, ఎదిరించు, కలహించు, ఏడ్చు అని అర్ధాలు. నామవాచకంగా యుద్ధం, కలహం, పిల్లల ఏడుపు, అల్లరి అని అర్థం.
“బళుకు/బదుకు/బితుకు అంటే జీవించు. నామవాచకంగా జీవనం అనీ, జీవనోపాయం అనీ అర్థాలు. 'బెగడు అంటే బెదురు, జంకు, కలతచెందు, దుఃఖించు, వణకు అని అర్ధాలు. నామవాచకంగా భయం అని అర్థం. 'బెణకు/బిడకు' అంటే చలించు అనీ కదలిక అనీ అర్ధం. “బెదరు అంటే భయవడు అనీ, జంకు, భయం అనీ అర్థం. “చెళుకు' అంటే ప్రకాశించు, చలించు,
బెణుకు, భయపడినట్లు నటించు, కలవరమందు, తప్పించుకొను అని అర్ధాలు. నామవాచకంగా ఈ మాటకు కాంతి అనీ, మాటల్లో చమత్మారం అనీ, తీక్షత అనీ అర్ధం. తళుకుబెళుకులు అని వాడుక.
“బొంకు అంటే అబద్ధమాడు అనీ, అబద్ధం, తప్పు అనీ అర్ధాలు. 'బొల్లు అన్నా ఇదే అర్ధం.
'మక్కు అంటే కాంతి విహీనమగు, కృశించు, రూపుచెడు, మగ్గు, మరణించు అని అర్ధాలు. నామవాచకంగా మురికి అని అర్థం. “మచ్చు” అంటే ఆకర్షించు అని అర్ధం. నామవాచకంగా
వలపుమందు అనీ, ఎర అనీ అర్థం. అటక, గీటురాయి, ఒకరకమయిన కత్తి, మురికి అనే అర్ధా లతో నామవాచకరూపంలో “మచ్చు” ఉంది. 'మసరు అంటే పొగరెక్కు మదించు, పొగరు, మదం అని అర్ధం. 'మాటు అంటే మరుగుపరుచు, అణగదొక్కు అంటించు, కన్నాలు లేకుండా బాగుచేయు, పాడుచేయు, కలిగించు అని అర్ధాలు. నామవాచకంగా “మాటు' అంటే మరుగు, చాటు, గొడుగు, అతుకు, రక్షణస్థానం అని అర్థం.
(మూడు అంటే నల్లగా కాలిపోవడం, ఆకలితో కడుపు మాడడం నామవాచకంగా 'మాడు” అంటే మాడిన అన్నం జ్
క్రియా? నామవాచకమా?-5
“మిగులుకు 'మివులు” అన్న రూపం కూడా ఉంది. మిగులు అంటే ఎక్కువగు, అతిశయించు, మీరు, దాటు, విజ్బంభించు, ఉత్కృష్టమగు, వేరగు, శేషించు, నిగుడు అని అర్ధాలున్నాయి. నామ వాచకంగా ఈ మాటకు శేషం, లాభం అని అర్ధాలు “మినుకు” అంటే ప్రకాశించు, గొణుగుకొను అని అర్ధాలు. నామవాచకమయినప్పుడు ఈ మాటకు కాంతి, కిరణం, పలుకు, వేదవాక్కు తాలిబొట్టు అని అర్భాలు మినుకు అంటే ఒకవిధమైన బంగారు నాణెం అని కూడా అర్థం ఉంది కావ్యాలలో దీనికి ప్రయోగాలున్నాయి. ఇప్పుడు బంగారు నాణాలే వాడుకలో లేవు కాబట్టి ఈ అర్ధంలో ఈ మాటకు వాడుకలేదు.
“మించు అనేమాటకు (క్రియాపదంగా, చాలా అర్ధాలున్నాయి. ప్రకాశించు అన్నది ఒక అర్ధం. శోభిల్లు అతిశయించు, అధికమగు, వృద్ధిపొందు, చెలరేగు, వ్యాపించు, ముగియు అని కూడా అర్ధాలు. దాటు, జయించు, తీర్చుకొను అనే అర్ధాలు కూడా ఉన్నాయి. నామవాచకంగా ఈ మాటకు కాంతి, మెరుపు, కిరణం, ఆధిక్యం అని అర్ధాలు,
“ముట్టు” అంటే తాకు, పట్టుకొను, తీసికొను, పొందు, మీటు, ఉపయోగించు, ప్రతిఘ టించు, వ్యాపించు, కరచు, ఆవరించు, కడముట్టు, మొదలంటు, కలుగు, నాటు అని అర్థాలు న్నాయి నామవాచకంగా సాధనం, పదార్ధం, ఎగుమతి, తాకుడు, వద్ధతి అని అర్థాలు. బహిష్టు అని కూడా అర్ధం.
'మునుగు” అంటే స్నానం చేయు, మగ్నమగు, క్రుంగు, క్రుంకు, ఆవృతమగు, లగ్నమగు, నశించు, తీరు, గుచ్చుకొను, పూర్ణమగు అని అర్థాలు నామవాచకంగా స్నానం అనీ మునగడం అనీ అర్థం “మురుగు అంటే కుళ్ళు, మలినమగు, నలుగు అని అర్థాలు. నామవాచకంగా మురికి అని అర్థం.
మూలుగు అనే మాటకు క్రియగానూ, నామవాచకంగానూ అర్థంలో మార్పులేదు. “మెచ్చు” అంటే పొగడు, గౌరవించు, లక్ష్యపెట్టు, గణించు, సంతోషించు అని అర్థాలు. నామవాచ కంగా ఈ మాటకు పొగడ్త అనీ, పొగిదేవాడు అనీ, బహుమానం, సంతోషం, అనురాగం, అద్భుతం అనీ అర్థాలు
'మెట్టు అంటే తొక్కు అణగదొక్కు అడుగుమోపు, తిరుగు, ప్రవేశించు, పాదుకలు తొడుగుకొను, నటించు, వచ్చు అని అర్థాలు, నామవాచకంగా మెట్టు అంటీ తొక్కుడు, కొండ, తిప్ప, సోపానం, ఆశ్రయం, తల, మొత్తం, కాలు, చెప్పు, పాదుక అని అర్ధాలు. సుంకం తీసుకొనే చోటు, బండి అటూ ఇటూ కదలకుండా బండి కింద కట్టే కర్ర, వీణమెట్టు అనే అర్థాలు కూడా ఉన్నాయి. 'మెత్తు' అంటే దట్టంగా పూయు అని అర్ధం. నామవాచకంగా దట్టంగా పూసిన పూత. “మొక్కు అంటే నమస్మరించు, నమస్కారం, మొక్కుబడి అని అర్ధాలు. 'మొట్టుకు క్రియగానూ నామవాచకంగానూ అర్ధభేదమేమీ లేదు. తలమీద పిడికిలితో పొడవడమని అర్థం.
“మొత్తు అంటే కొట్టు, అణచు, నరకు, పగులగొట్టు, మోగించు, గుచ్చుకొను అని అర్ధాలు. నామవాచకంగా దెబ్బ అని అర్థం. '“మొరగు” అంటే మోసగించు, కప్పిపుచ్చు అని అర్ధం. నామ వాచకంగా మోసం, మోసపు మాట అని అర్థం. “మొరుగు” అంటే (కుక్క) అరుచు, ప్రేలు అని
వంద గ
అర్థాలు నామవాచకంగా కూడా (కుక అరుపు, (పప్రలాపం అని అర్థాలు.
“మొక్కు/[మొక్యు అంటే నమస్కరించు అని అర్ధం. నామవాచకంగా నమస్కారం అనీ, దేవుడికి ఇస్తానని నిర్ణయించుకున్న వస్తువు అనీ అర్ధం. “రక్కు అన్న మాటకు క్రియగానూ నామ వాచకంగానూ అర్థం ఒకటే. గీరు, బరుకు అని అర్ధం.
'శువ్వు అంటే విసరు అని అర్ధం ఇది ధ్వన్యనుకరణ శబ్దం కూడా. “లాగు” అంటే ఆకర్షించు, హరించు అని అర్థం. నామవాచకంగా సొమ్ము, విధం, మర్యాద, ఒప్పు అని అర్థాలు. లాగు అనే భక్ష్య విశేషం కూడా ఉందట. 'వట్టు' అంటే ఇంకు, ఎండు, కృశించు, పాలులేనిదగు అని అర్ధాలు. నామవాచకంగా వరుగు అని అర్థం.
'వడకు/వణకు” అంటే కంపించు అని అర్థం. నామవాచకంగా కంపం అనీ, మంచు అనీ అర్ధాలు. 'వనరు అంటే దుఃఖించు, దీనాలాపాలాడు, ఒప్పు, ఉండు అని అర్భాలు. నామవాచ
కంగా దుఖం, వీలు అని అర్థం.
విత్తు అంటే విత్తనములు చల్లు అనీ, విత్తనం అనీ అర్ధం “విసరు” అంటే ఆడించు, తివు, రువ్వు తిను, గాలి ప్రసరింపచేయు, పొడిచేయు, వీచు అని అర్థాలు. నామవాచకంగా వీచడం అనీ, ఆడించడం అనీ, దెబ్బ అనీ, రువ్వడం అనీ అర్ధాలు.
“వెలుగు అంటే ప్రకాశించు, మండు, ఒప్పు, (ప్రసిద్ధికెక్కు ప్రతిఫలించు, చెలదేగు అని అర్ధాలు. నామవాచకంగా కాంతి, కిరణం, ఎండ అని అర్ధాలు.
'సడలు అంటే జారు, వదులగు, తగ్గు, చెడు, రాలు, నశించు, కదలు, విడుచు అని అర్ధాలు. నామవాచకంగా వదులు అని అర్థం
సలుపు అంటే బాధ కలిగించు అని అర్ధం. నామవాచకంగా మంట, పోటు, బాధ అని అర్థం.
“హెచ్చు? అంటే అతిశయించు, మించు, ఉద్రేకించు, విజ్బృంభించు అని అర్ధాలు. నామ వాచకంగా గొప్పతనం, ఆధిక్యం అని అర్థం
చాలా మాటలలో అరసున్నలూ, బండిరాలు ఉంటాయి. వాటినిక్కడ తీసుకోలేదు. అర సున్నలు వదిలివేయడమూ, బండిరా బదులు మామూలురానే వాడడమూ జరిగింది. వదాది సంయుక్తాలలో రకారాన్ని వదిలి వేయడం జరిగింది
ఒకేమాట ఎటువంటి మార్పూ లేకుండా 'క్రియగానూ, నామవాచకంగానూ వాడుకలో ఉండడం గమనార్టం. ఇటువంటి మాటలు తెలుగులో గణనీయంగానే ఉన్నాయి. ఇటువంటి మాటలలో సాధారణంగా నామవాచకంగా కంటే క్రియాపదంగా ఈ మాటలకు ఎక్కువ అర్థ ఛాయలుందడం కూడా మనం గమనించవచ్చు చాలా మాటలను (ప్రాచీన కవులు వాడిన అరా లలో మనం నేడు వాడడంలేదు. అప్పటినుండి ఇప్పటిదాకా ప్రసిదధ్ధమయిన అర్ధం కొనసాగినప్ప టికీ కొన్ని విశేషార్ధాలు అనాటివి నేడు వాడుకలో లేవు. అదేవిధంగా కొన్ని మాటలకు పూర్వంలేని అర్థాలు నేడు వాడుకలోకి వచ్చాయి.
బ్ 80 త మనబాష
ఖావార్దక నామాలు
[క్రియా పదాలను నామవాచకాలుగా మార్చుకోవడానికి వివిధ ప్రత్యయాలను చేరుస్తాం. ఈ ప్రత్యయాలు వివిధ అర్థాలను కూడా కలిగిస్తాయి ఈ ప్రత్యయాలను కృత్చత్యయాలనీ, ఈ (ప్రత్యయాలు చేరి ఏర్పడ్డ నామవాచకాలను కృదంత నామవాచకాలనీ అంటారు
ఏ క్రియాపదాన్నైనా నామవాచకంగా మార్చవచ్చు గ్రాంధిక భాషలో “టి అనే ప్రత్యయం చేరి క్రియాప్రాతిపదికలు నామవాచకాలుగా మారేవి ఉదా" తిను+ట= తినుట, చేయుట, వచ్చుట, పోవుట, వినుట, ఎక్కుట, దిగుట, తాగుట మొదలయినవన్నీ ఇటువంటి నామ వాచకాలు. ॥
ఆధునిక భాషలో ఈ సందర్భంలో చేరే ప్రత్యయం అటం/అడం తిను+అటం= తినటం, చదువు+అటం= చదవటం, పోవు+*అటం= పోవటం, చేయు+అటం= చేయటం. ఏ క్రియా ప్రాతిపదికనయినా ఈ (ప్రత్యయం చేర్చి నామవాచకంగా మార్చుకోవచ్చు. చూపటం/చూవడం, రాయటం/ాయడం, కొట్టటం/కొట్టడం, రాలటం/ాలడం, తూలటం/కూలడం, మారటం/ మారడం, చీలటం/చీలడం మొదలయినవి. కొన్ని క్రీయాప్రాతిపదికల మీద ఈ ప్రత్యయం చేరి నప్పుడు క్రియా ప్రాతిపదికలో సంధివల్ల కొన్ని మార్పులు వస్తాయి. పిలుచు+అటం= పిలవటం, కొలుచు+అటం= కొలవటం, నేర్చు+అటం= నేర్వటం, తెచ్చు+ అటం+ తేవటం, వచ్చు+ అటం= రావటం, కలియు +అటం= కలవటం
'అటం/అడం' ప్రత్యయాన్ని అకర్మక క్రియలమీదా, సకర్మక క్రియలమీదా కూడా చేర్చ వచ్చు నేర్చు+అటం= నేర్వటం, నేర్చు+అటం:= నేర్పటం, మారు+ ఆటం= మారటం, మార్చు అటం= మార్చటం, తీరు+అటం= తీరటం, తీర్చు+అటం= తీర్చటం.
తెలుగులో ఇంచు చేర్చి క్రియా ప్రాతిపదికలను సకర్మకాలుగా, (ప్రేరణార్థకాలుగా మార్చు కోవచ్చు. సంస్కృత పదాలను కూడా “ఇంచు'చేర్చి క్రియలుగా ఉపయోగించుకోవచ్చు. కొట్టు అనేది సకర్మక (క్రియ. దీనిమీద ఇంచు చేరిస్తే కొట్టించు అని (పేరణ క్రియ ఏర్పడుతుంది. నడుచు అన్నది అకర్మక (క్రియ. దీనిమీద ఇంచు చేరిస్తే నడిపించు అని సకర్శక క్రియ ఏర్పడుతుంది. భుజించు, రచించు, జయించు, లయించు, సృజించు, నిర్మించు, ప్రశ్నించు, చర్చించు, వర్షించు, దర్శించు, ప్రకాశించు, (ప్రవేశించు, ఆలోకించు, ద్రవించు, చరించు, గమనించు, ప్రార్థించు, ఆలోచించు, యోచించు, క్షీర్తించు, స్తుతించు, జీవించు, మరణించు, భావించు, (ప్రేరేపించు, దుః ఖించు, శోకించు మొదలయినవన్నీ ఇంచు చేరి క్రియా పదాలుగా ఏర్పడిన సంస్కృతవదాలు. ఈ 'ఇంచుూ చేరిన అన్ని క్రియలమీదా అటం/అడం చేరుతుంది. కొట్టించటం, నడిపించటం, భుజించటం, రచించటం, జయించటం, సృజించటం, నిర్మించటం మొదలయినవి.
ఒక (క్రియా ప్రాతిపదిక మీద మరో అనుబంధ క్రియను చేర్చి కొత్త అర్థాలను సాధించ వచ్చు ఉదాహరణకు “తీయు” అనే అనుబంధాన్ని చేర్చామనుకోండి. వెళ్ళు+తీయు = వెళ్ళదీయు అవుతుంది. అట్లాగే చీలదీయు కూడా. వేయు అనే అనుబంధాన్ని చేరిస్తే కొట్టివేయు, పారవేయు, తినివేయు, మింగివేయు, నెట్టివేయు, తోసివేయు మొదలయిన క్రియలు ఏర్పడతాయి. “పోవు చేరిస్తే తినిపోవు, వెళ్ళిపోవు, రాలిపోవు, జరిగిసోవు వంటి క్రియలు ఏర్పడతాయి. 'కొట్టు' చేరిస్తే
మనభాషతి 651
వెళ్ళగొట్టు, చీలగొట్టు, చిందగొట్టు, చెడగొట్టు, చెల్లగొట్టు, చావగొట్టు మొదలయిన (క్రియలేర్చడ తాయి. "పెట్టు చేరిస్తే కొనిపెట్టు, తీసిపెట్టు, వెళ్ళబెట్టు, చెల్లబెట్టు, మగ్గబెట్టు వంటివి ఏర్పడ తాయి “ఇచ్చు” చేరిస్తే రానిచ్చు, తిననిచ్చు, చేయనిచ్చు వంటివి ఏర్పడతాయి కొను” చేరి చేసికొను, వేడుకొను, మార్చుకొను, వందుకొను వంటివి ఏర్పడతాయి ఇవన్నీ కూడా అటం/ అడం చేరి నామవాచకాలుగా ఏర్పడతాయి. తినివేయటం, మింగివేయటం, వెళ్ళిపోవటం, రాలి పోవటం, చీలగొట్టటం, చెడగొట్టటం, కొనిపెట్టటం, చెల్లబెట్టటం, చేయనివ్వటం, రానివ్వటం, వేడుకోవటం, మార్చుకోవటం వగయిరా.
రెండుకంటే ఎక్కున క్రియాధాతువులు కూడా కలవవచ్చు ఉదా. తీసికొనిపోవు, వెళ్ళ గొట్టివేయు. వీటిని కూడా అటం/అడం చేర్చి నామవాచకాలుగా మార్చవచ్చు తీసికొనిపోవడం, వెళ్ళగొట్టివేయడం మొదలయినవి.
“'అటం/అడం' అనే ప్రత్యయాన్ని భావార్థక ప్రత్యయం అంటాం. భావార్థమంటే క్రియకు ఉండే అర్ధమే.
ఈ 'అటం/అడరికు ముందు 'అకపోవు' చేరిస్తే వ్యతిరేక భావార్థకం ఏర్పడుతుంది అంటే పైన చెప్పిన భావార్ధకాలన్నిటికీ వ్యతిరేకార్థక రూపాలన్నమాట ప్రతి భావార్థకానికీ వ్యతిరేకాద్ధక రూపం ఉంటుంది. పైన చూపిన అన్ని రకాల భావార్థకాలకూ వ్యతిరేకార్థక రూపాలకు ఉదాహర ణలు చూడండి.
తినటం-తినకపోవటం, కొలవటం-కొలవకపోవటం, రావటం-రాకపోవటం, నడిపీం చటం- నడిపించకపోవటం, నిర్మించటం- నిర్మించకపోవటం, వెళ్ళదీయటం -వెళ్ళదీయక పోవటం, మింగివేయటం- మింగివేయకపోవటం, వెళ్ళగొట్టటం - వెళ్ళగొట్టకపోవటం, కొని పెట్టటం- కొనిపెట్టకపోవటం, తిననివ్వటం- తిననివ్వకపోవటం, వండుకొనటం- వండు కొనకపోవటం మొదలయినవి.
“కలుగు అన్నది సామర్థ్యాన్ని బోధించే అనుబంధ క్రియ. చేయగలుగు +అటం= చేయగల గటం అవుతుంది. వ్యతిరేకార్థంలో చేయగలగకపావటం, చేయలేకపోవటం. 'రావటంికు రాక పోవటం అన్న వ్యతిరేకార్థకముంది కదా. దీన్ని క్రియా ప్రాతిపదికమీద చేర్చి అసామరాన్ని బోధించవచ్చు. ఉదా, తినరాకపోవటం ఈ రూపాలన్నీ చూసినప్పుడు ఈ ప్రక్రియ ఎంత విస్తారమయిందో అర్ధమవుతుంది.
చ్ “82 అమనభాష
ఢు - ప్రత్వయం
అటం/అడం లాంటిదే మరో ప్రత్యయం కూడా ఉంది. ఇది “డు ప్రత్యయం. క్రియా ప్రాతిపదికమీద 'డు” చేరిస్తే అది నామవాచకమయిపోతుంది ఉదాహరణకు పేలు/పేలు అనే క్రియా ప్రాతిపదికను తీసుకుందాం. దీనిమీద 'డు' చేరిస్తే పేలుడు/ప్రేలుడు అని అవుతుంది. ఈ పేలుడుకు రెండర్థాలు ఉన్నాయి. ఒకటి వదరడం, వాగడం, దుర్భాషలాడడం, ధ్వనించడం. రెండవది (బ్రద్దలు కావడం/బద్దలుకావడం, వేడికి పగిలిపోవడం, శరీరంమీద పొక్కులు లేవడం. ఈ విధంగా 'డు' ప్రత్యయం చేరి ఏర్పడ్డ నామవాచకాలు అన్ని ప్రాంతాలలోనూ వాడుకలో ఉన్నాయి. అయితే ఆధునిక వ్యవహారంలో స్థిరపడిన కొన్ని రూపాలు అందరూ వాడుకున్నారు కాని, కొన్ని ప్రాంతాలలో ఏ క్రియా పదాన్నయినా ఈ ప్రత్యయం చేర్చి నామవాచకంగా మార్చుకోవచ్చు.
అద్దుడు, అలుగుడు, అడుగుడు మొదలయిన విధంగా వాడవచ్చు. అల్లుడు అన్నరూవం అల్లు అనే క్రియా (ప్రాతిపదికతో ఏర్పడుతుంది. దీనికి అల్లిక అని అర్థం. కూతురు భర్త అన్న అర్ధంలో మరొక అల్లుడు ఉంది దీనికి అల్లువాడు అనే రూపం కూడా ఉంది. వంశాన్ని అల్లే వాడు, కాబట్టి అల్లువాడు, అల్లుడు ప్రాతివదిక ఒకటే. ఆడుడు అంటే ఆడడం. ఆనుడు అంటే అనుకోవడం కోసం పెట్టుకొనే దిండు లేకపోతే దేనికి అనుకుంటే అది. ఆనుకోవడం అనికూడా అర్ధం ఉతుకు ఉతువడు అవుతుంది. బట్టలు-ఉతకడమన్న అర్థంతోపాటు తీవ్రంగా కొట్టడం, విమర్శించడం అనే అర్థాలు కూడా ఉన్నాయి ఇచ్చుతో ఇచ్చుడు ఏర్పడుతుంది. ఊగుతో ఊగుడు ఏర్పడుతుంది అక్కిరాజు ఉమాకాంతంగారు నేటి కాలపు కవిత్వంలో ఊగుడు మాట లని వాడారు ఆయన ఈ మాటను ఆవేశం, పూనకం వచ్చినట్లు కేకలు వేయడానికి సంకేతంగా వాడారు. కట్టు కట్టుడు అవుతుంది కదలు కదలుడు అవుతుంది. కట్టుడు పళ్ళు అన్నచోట కట్టుడు విశేషణంగా ప్రయుక్తమయింది. కొట్టు - కొట్టుడు అవుతుంది వాడు ఒకటీ కొట్టుడు కొడుతున్నాడు. కొరుకు- కౌరుకుడు అవుతుంది. వాడికీ విషయం కొరుకుడు వడటంలేదు అంటాం. గిచ్చుకు “డు' చేరితే గిచ్చుడు అవుతుంది. గిల్లు గిల్లుడు అవుతుంది. గుద్దు గుద్దుడు అవుకుంది. ఈ మాటను కూడా అక్కిరాజు ఉమాకాంతం వాడారు. ఆయన రాయిగుద్దుడు వాదం అంటారు. పిడివాదం అని అర్థం గోకు- గోకుడు అవుతుంది. గోకుడు పెట్టింది అంటారు
చంపు- చంపుడు అవుతుంది. పూర్వం చంపుడు గుడులు అని ఉండేవి. బలులు ఇచ్చే గుళ్ళు అని అర్ధం. చంపుడు కట్ట అంటే వధ్యస్థానం. చింపు- చింపుడు అవుతుంది. చీకు- చీకుడు అవుతుంది చూచు- చూసుడు అవుతుంది. చూపు- చూపుడు అవుతుంది. చూపుడు వేలు, చూపుడు గుర్రం. చెప్పు- చెప్పుడు అవుతుంది. చెప్పుడు మూటలు అన్నప్పుడు పితుర్లు, కొండేలు అని అర్ధం
తిట్టు- తిట్టుడు అవుతుంది తిరుగు- తిరుగుడు అవుతుంది. అందులో ఏదో తిరుగుడు ఉంది అన్నప్పుడు మెలిక అని అర్ధం. తిరుగుడు వచ్చింది అన్నప్పుడు సమస్య వచ్చింది అని అర్ధం తెచ్చు- తెచ్చుడు అవుతుంది. తాకు- తాకుడు అవుతుంది. తప్పు- తప్పుడు అవుతుంది. తప్పుడు మనిషి అంటే దుర్మార్గుడు, ధర్మ విరుద్ధంగా నడిచేవాడు, మాట తప్పేవాడు అని అర్థం.
మనభాషత 83
దిగు- దిగుడు అవుతుంది దిగుడుబావి అని మెట్లు ఉండి బావిలోకి దిగే ఏర్పాటు ఉన్న బావికి పేరు.
నరుకు- నరుకుడు అవుతుంది. నలుగు- నలుగుడు అవుతుంది. పీల్పు- పీల్చుడు, పూను- పూనుడు అవుతాయి. పేర్చు- పేర్చుడు, పొర్లు- పొర్లుడు అవుతాయి. పొడుచు- పొడు చుడు అవుతుంది. పోవు- పోవుడు అవుతుంది. ఇటువంటి మాటలు సాధారణంగా జంటలుగా వస్తూ ఉంటాయి. ఉదాహరణకు “ఈ వచ్చుడూ పోవుడూ ఎందుకు! అక్కడే ఉంటే సరిపోదా! అన్న వాక్యాన్ని తీసుకోవచ్చు. వచ్చు వచ్చుడు అయ్యే సందర్భం ఇది సాధారణంగా అటం/అడం చేరినట్లయితే 'వచ్చుకు బదులు 'రా వస్తుంది. రావటం/రావడం అవుతుంది. డు చేరినప్పుడు మాత్రం వచ్చులో మార్పు ఉండదు. మాగు- మాగుడు అవుతుంది. మాగడం అని అర్ధం. మూగు- మూగుడు అవుళుంది. మునుగు- మునుగుడు అవుతుంది మింగు- మింగుడు అవు తుంది. మింగుడుకు వాచ్యార్ధంలో గొంతులోకి పోవడమనే అర్ధం నీళ్ళు మింగుడు పడడంలేదు. లక్ష్యార్థంలో విషయం అవగాహన కాకపోవడం, సహించలేకపోవడం, అనుకున్న విధంగా కొక మరోవిధంగా జరగడం భరించలేకపోవడం. ముట్టు- ముట్టుడు అవుతుంది. ఇదికూడా అంటు డుతో జంటగా వాడుకలో ఉంది. అంటుడు ముట్టుడు అని రుద్దు- రుద్దుడు అవుతుంది. బండ రుద్దుడు రుద్దుకున్నాడు అంటాం. రుబ్బు- రుబ్బుడు అవుతుంది. మాను- మానుడు అవుతుంది. పుండు మానుడు పట్టింది అంటాం. లాగు- లాగుడు అవుతుంది. లాగుడు బండి. లొంగు- లొంగుడు అవుతుంది. వాడి జీవితంలో లొంగుడన్నదే లేదు. వాగు- వాగుడు అవుతుంది. వాడు వట్టీ వాగుడుకాయ అంటాం నీ వాగుడు కట్టిపెట్టు అంటాం. విరుగు- విరుగుడు అవుతుంది. ఈ విషానికి విరుగుడు లేదు అంటాం దేన్నయినా ఉపసంహరించేది, తిరస్కరించేది. ఈ పనిచేస్తే వాడు చేసిందానికి విరుగుడుగా ఉంటుంది అని వాడుక.
“డు ప్రత్యయం చేరినప్పుడు కూడా క్రియా ప్రాతిపదిక రూపంలో మార్పు రావచ్చు. ఎక్కు ఎగు అవుతుంది. “డు చేరిస్తే ఎగుడు అవుతుంది.దిగుడుతో కలిపి మెరక పల్లాలు/మిట్టి పల్లా లుగా ఉన్న భూమిని ఎగుడుదిగుడుగా ఉంది అంటాం. సమంగా లేని దేనినయినా ఎగుడు దిగుడుగా ఉందని అనవచ్చు. పద్యంలో నడక ఎగుడుదిగుడుగా ఉందని కూడా ప్రయోగం. వేగు వేపు అవుతుంది. వేపుడు- వేపుడు కూర. తోయు కూడా తోపు అవుతుంది. తోపు- తోపుడు, తోపుడుబండి. దించు, దంచు, పెంచులు, దింపు, దంపు, పెంపులవుతాయి దింపు- దింపుడు, దింపుడు కళ్ళం అశ అంటాం. దంపు- దంపుడు, దంపుడు బియ్యం, పెంపు- పెంపుడు, పెంపుడు కొడుకు. నూర్చు- నూర్చుడు అవుతుంది.
“డూ వ్రత్యయం చేరిన కొన్ని మాటలు కేవలం విశేషణాలుగానేకూడా వాడుకలో ఉన్నాయి. ఉంపుదుకత్త, ఉవ్పుడు బియ్యం, పెట్టుడు బట్టలు మొదలయినవి. తెలుగులో నామవాచకమే విశేషణంగా కూడా వాడుకలో ఉంటుంది. ఇవన్నీ నామవాచకాలే, అటం/అడం చేరి ఏర్పడిన రూపాలలాగానే 'డూ చేరే రూపాలు కూడా విస్తృతంగా ఉన్నాయి. వండి పెట్టు - వండి పెట్టుడు అవుతుంది. వండుకొను- వండుకొనుడు అవుతుంది. వ్యతిరేకార్థంలో కూడా రూపాలున్నాయి. ప్రాతిపదికమీద 'అకసోవు” చేరుకుంది. తినుడు- తినకపోవుడు, వచ్చుడు- రాకపోవుడు మొదలైనవి.
సన “ధి అదంధాష
పు - ప్రత్యయం
చాలా విస్తారంగా వాడుకలో ఉన్న కృత్చ్రత్యయాలలో 'పు ఒకటి. ఈ వ్రత్యయాన్ని ఉపయోగించి ఎన్నీ (క్రియాపదాలను నామవాచకాలుగా ఉపయోగించుకోవచ్చు.
క్రియా ప్రాతిపదిక చివర *చు ఉన్నట్లయితే దానిస్థానంలో 'పు వచ్చి చేరుతుంది ఉదాహరణకు అరచు+పు= అరపు అవుతుంది. ఒలుచు ఒలుపు అవుతుంది. ఒలుపు అంటే ఒలవడం. కొలుచు కొలుపు అవుతుంది కొలుచు అంటే కౌలత వేయడం అని అర్ధం. ఈ అర్ధంలో కొలుపు అంటే ధాన్యమని అర్ధం. కొలుచు అంటే ఉపాసించు, ధ్యానించు, సేవించు, నమస్కరించు అనికూడా అర్జాలున్నాయి. ఈ అర్ధంలో కొలుపు అంటే పూజ. అమ్మవారికి కొలు పులు చేయించారంటారు గెలుచు గెలుపు అవుతుంది. చరచు- చరపు అవుతుంది. చరచు అంటే ఉన్న అర్థాలలో అరచేతితో కొట్టు, సాగగొట్టు అన్నవి ముఖ్యమైనవి. ఈ అర్థాలతోనే చరపు అంటే అరచేతితో కొట్టిన దెబ్బ అనీ, రేకు అనీ అర్థాలు ఏర్పడ్డాయి.
తలచు- తలపు అయింది. తలచు అంటే వివేచించు, విచారించు, సంకల్పించు, స్మరించు, ధ్యానించు, గణించు, ప్రస్తావించు అని అర్థాలు. తలపుకు తలచడం, భావం, ఆలో చన, సంకల్పం, వలపు, స్మృతి, మనస్సు, ధ్యానం, అనుకోవడం అని అర్బాలు.
తుడుచు- తుడుపు అయింది తుడుచు అంటే ఊడ్చు, రాచు, ఒత్తు, కడుగు, నిమురు, పోగొట్టు, చంపు అని అర్థాలు. తుడుపు అంటే శుభ్రం చేయడం. రాసిన రాతను చెరపడం కూడా తుడుపే. డస్టర్‌ని తుడుపు గుడ్డ అంటాం.
నిలుచు- నిలుపు అవుతుంది ఆపడం అనీ, స్థాపించడం అనీ అర్థం నొదుచు- నొడుపు అవుతుంది. తప్పులు పట్టడమని అర్ధం పడుచు- పడుపు అవుతుంది. పడుచు అన్నమాటకు కన్య అనే అర్ధంతోపాటు వ్యభిచరించు అనే అర్ధం కూడా ఉంది. ఈ అర్థంలోనే ఇది “పడుపు అనే నామవాచకమయింది. వ్యభిచారం అని అర్ధం
పిలుచు- పిలుపు అయింది. పిలుపు అంటే పిలవడం, ఆహ్వానం పొదుచు- పొడుపు అయింది పొడుపు అంటే సూర్యుడు, చంద్రుడు ఉదయించడం. పొద్దు పొడుపు అంటే సూర్యో దయం, నెలపొడుపు అంటే చంద్రోదయం. పొడుపుగొండ, పొడుపుమల, పొడుపుగట్టు, పొడుపు గుబ్బలి ఇవన్నీ తూర్చుకొండకు పేర్లు పొడుపు అంటే కుమ్మడం అనికూడా అర్థం. కుట్టడమనీ, కాటు అనీ కూడా అర్థాలున్నాయి. పొడుపుకధ అంటే చిక్కుప్రశ్న పొడుపు వేలు అంటే చూపుడు టేలు.
పొలుచు- పొలుపు అవుతుంది. పొలుపు అంటే ఒవ్వు, ఉల్లాసం, జాడ, పెంపు, రూపు, విషయం, రీతి, మర్యాద, పరిమళం, ప్రతాపం అని అర్భాలు. మరచు- మరపు అవుతుంది. వగచు వగపు అవుతుంది. వగపు అంటే దుఃఖం అనీ, కీడు అనీ, విధం అనీ అర్ధాలు. వలచు- వలపు అవుతుంది వలపు అంటే మోహం, కోరిక అని అర్థం. విడుచు- విడుపు అవుతుంది విడుపు అంటే విడిచినది అనీ, త్యాగం, దానం అనీ అర్థాలు. పట్టు విడుపులు అని జంటగా వాడతాం. వెరచు- వెరపు అవుతుంది. వెరపు అంటే భయం అని అర్థం,
పేర్చు- పేర్పు అవుతుంది. పేర్పు అంటే ఒకదానిమీద ఒకటి నిలిపిన వరుస, సమృద్ధి అని
కూడా అర్ధం ఉంది. దాక అని కూడా అర్ధం. ఒకవిధమైన కుండ అన్నమాట మోడ్పు- మోడ్పు అవుతుంది. కైమోడ్పు అని సమాసంగా ఎక్కువ వాడుకలో ఉంది చేతులు జోడించడమని అర్ధం. వేల్చు, వేల్పు అవుతుంది వేల్చు అంటీ హోమం చేయు అనీ, కాల్చు అనీ అర్ధం. వేల్పు అంటే దేవత అని అర్థం. ఊడ్పు- ఊడ్పు, ఏడ్చు- ఏడ్పు, ఓర్చు- ఓర్చు, తీర్చు- తీర్పు, (త్రేన్చు- త్రేన్పు, నూర్చు- నూరు, నేర్చు- నేర్చు, పీల్చు- పీల్చు అవుతాయి కను కాన్సు అయి తర్వాత కాన్పు అవుతుంది. జన్మనివ్వడమని అర్ధం. వాచు- వాపు, చూచు- చూపు, బ్రేచు- శ్రేపు, (ఉతోచు- శత్రోపు అవుతాయి. సైచు- సైపు అవుతుంది. సహనం, ఓర్పు అని అర్ధం. ఏచు- ఏపు అవుతుంది. ఏపు అంటే ఆధిక్యం, అభివృద్ధి, విజృంభణ, గర్వం, విలాసం, విధం అని అర్ధాలు. తాచు-తాపు అవుతుంది. తన్ను అని అర్ధం. కాచు-కాపు అవుతుంది. కాపు అంటీ రక్షణ అని అర్ధం. కాయలు కాయడం అని అర్ధం. “ఈ చెట్టు రెండు కాపులు కాస్తుంది అంటే సంవత్సరంలో రెండుసార్లు కాయలు కాస్తుంది అని అర్ధం. కాచు అంటే వదురుచూచు అనే అర్ధంకూడా ఉంది “వాడికోసం కాపువేశాడు” అన్న వాక్యంలో కాపుకు అర్ధం ఇదే. పట్టుకోవాలనే సంకల్పంతో వేచి ఉందడమన్నమాట దోచు- దోపు అవుతుంది. దోపిడి అని అర్థం. నిలువుదోపు అంటే దేవుడికి శరీరంమీద ఉన్న అన్ని నగలూ ఇవ్వడం. (క్రియా ప్రాతిపదిక చివర “యు” ఉంటే దానికి బదులుగా 'పు' వస్తుంది బలియు- బలుపు, బులియు- బులుపు అవుతాయి. ఇక్కడ ్రాతిపదికలోని ఇ-ఉ అయింది మెరయు- మెరపు, నరయు- నరపు, నెరయు- నెరపు అవుతాయి కదియు- కదుపు అవుతుంది కదుపు అంటే గుంపు. మాయు- మాపు, మోయు- మోపు అవుతాయి. పదాంతంలో ద్విరుక్త చకారం ఉంటే అది ద్విరుక్త పకారం అవుతుంది. “చ్చు” ఉంటే 'ప్పు” అవుతుందన్నమాట. మెచ్చు- మెవ్పు, చొచ్చు- చొప్పు, ప్రాతిపదిక చివర “గు” ఉంటే దానికి బదులు 'పు వస్తుంది మెలగు- మెలపు, ఎరుగు- ఎరుపు, తొడుగు- తొడుపు, ఊగు- ఊపు, ఆగు- ఆపు అవుతాయి. అడ్డూ ఆపూ లేకుండా పోయింది అంటాం. కొన్ని మాటలకు 'పు వచ్చి చేరుతుంది చెడు- చెడుపు, మారు- మార్పు, పూడు- పూడ్చు, తనరు- తనర్పు అవుతాయి. తీరు- తీర్చు అవుతుంది. వంచు- వంపు అవుతుంది. (త్రుంచు- క్రుంపు, ఇంచు- ఇంపు అవుతాయి. ఇంపు అంటే అందం. పనుచు- పంపు అవుతుంది. (క్రియా ప్రొతిపదికల మీద, నామవాచకాల మీద ఇంచుచేరి (క్రియ లేర్చడడం తెలిసిందే. ఈ 'ఇంచు'లో *“చుకు బదులుగా 'పు” రావడం వల్ల మళ్ళీ నామవాచకాలేర్చడతాయి. చాటు- చాటించు- చాటింపు. ఆరగించు- ఆరగింపు, కారించు- కారింపు, తుస్కారించు- తుస్మారింపు, కంటగించు- కంటగింపు, రావించు- రావింపు, బెదిరించు- బెదిరింపు, అదిలించు- అది లింపు. ఈ విధంగా ఎన్ని నామవాచకాలనైనా కల్పించుకోవచ్చు ఖ్
త - ప్రత్యయం
బహుళ ప్రచారం ఉన్న కృత్ప్రత్యయాలలో 'ఈ' ప్రత్యయం ఒకటి. క్రియా ప్రాతిపదిక చివర 'యు' ఉన్నప్పుడు ఆ 'యు*కు లాపం వచ్చి డా౨ స్థానంలో 'తఈ ప్రత్యయం వచ్చి చేరుతుంది.
కాయు- కాత అవుతుంది. కాయు అంటే కాయలు కాయడం. కాత అనేది కాపు అన్న అర్ధంలోనే. కోయు- కోత అవుతుంది. కోయు అంచ ఖండించు, ఛేదించు, నరకు, తుంచు అని అర్ధాలు. ఇంగ్లీషులో “కట్ అనే మాటకు సమానార్థకంగా దీన్ని వాడుతున్నాం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టింతర్వాత దానికి (ప్రతిపక్షాలు కట్ మోషన్స్ వ్రవేశపెట్టవచ్చు. ఈ తీర్మానాలను కోత తీర్మానాలు అంటున్నారు. బడాయి మాటలు మాట్లాడితే కోతలు కోస్తున్నాడంటాం. గొప్పలు చెప్పుకోవడం అన్నమాట. లేతలేత సారకాయలు కోస్తున్నాడని కూడా అంటాం. చేయు- చేత అవుతుంది. వాడి చేతలేమీ బాగోలేవు అన్నప్పుడు వాడుచేసే పనులు అని అర్థం. చేత ఒక విభక్తి (ప్రత్యయం కూడా. అయితే ఈ చేత చేయి నుండి ఏర్పడింది. చేత చేయుట అన్న అర్థంలో వాడుకలో ఉంది. పొడిచేత అంటే పొడిచేయడం. దాడిచేయు- దాడిచేత అవుతుంది.
క ము- కూత అవుతుంది. కోడి కూత, పిల్లికూత వంటివి. పిట్టకొంచెం కూతఘనం అని సామెత. కూత అంటే అరపు, కేక, మొర, ప్రలాపం. కారు కూతలు కూస్తున్నాడు అంటాం. కూత కరణమే కాని రాత కరణం కాదని వాడుక. కూతలేగాని చేతల్లేవనీ అంటాం. కూత నేల అంటే కూత వేటుదూరం, ఒక (క్రోశం. కూతపట్ట అన్నా అర్ధం అదే. గీయు- గీత అవుతుంది. గీత అంటే రేఖ. “వాడి గీత అట్లా ఉంది ఏంచేస్తాం అంటాం. అదృష్టం, నొసటిరాత, విధి అన్న అర్ధంలో ఇక్కడ వాడడం జరిగింది భగవద్గీతలోని గీత సంస్కృతం గీయునుండి ఏర్పడింది కాదు. తీయు- తీత అవుతుంది. తీత అంటే తీయడమనే అర్ధం. 'రెండు తీతలు తీశాడు అన్న ప్పుడు దెబ్బలు కొట్టాడని అర్ధం. తీత అంటే తగ్గడం అనికూడా అర్థం. వరదతీత అంటే వరద తగ్గడం. అకుతీత అన్నప్పుడు ఆకు తెంచి వేయడం అని అర్థం. కాళ్ళతీత అన్నప్పుడు నొప్పి ఆని అర్ధం 'తీయు'ను ఇతర క్రియాప్రాతిపదికల మీద అనుబంధంగా చేర్చవచ్చు. ఉదాహ రణకు వెలికితీయు. ఇటువంటి క్రియా సమాసాన్ని కూడా నామవాచకంగా మార్చుకోవచ్చు. వెలిం తీయు- వెలికితీత అవుతుంది. చీలదీయు- చీలదీత అవుతుంది చేరడీయు- చేరదీత అవు తుంది వంగదీయు- వంగదీత అవుతుంది లొంగదీయు- లొంగదీత అవుతుంది. నిలదీయు- నిలదీత అవుతుంది. కుంగదీయు- కుంగదీత అవుతుంది. ఈ విధంగా మరికొన్ని మాటలను కూడా నిర్మించుకోవచ్చు. క్రియల మీదే కాకుండా నామవాచక పదాలమీద కూడా తీయు” చేరవచ్చు దారితీయులో దాది నామవాచకం. దారితీయు- దారితీత అవుకుంది. అరగదీయు- అగగతీత అవుతుంది. పోయు- పోత అవుతుంది పోత అంటే పోయదం. విడవడం అనికూడా అర్ధం ఉంది. పోత పోయడం లోహాన్ని కరిగించి పాత్రలు, విగ్రహాలు చేయడం. పెట్టుపోతలు అంటే అన్నపానాదికాలిచ్చి పోషించడం. పోతపాలు అంటే తల్లిపాలు కాక పోసే ఇతర రకాల పాలు పోతనీరు అంటే కుండలతో తెచ్చి పెట్టుకున్న నీళ్ళు. భారీవర్నాన్ని కుండపోత వర్షం అంటాం. వడపోయు- వడపోత అవుతుంది. రాలిపోవు- రాలిపోత, తలపోయు- తలపోత అవుతుంది. ఇట్లాగే మరికొన్ని పదాలను కూడా ఏర్చరచుకోవచ్చు.
మనబాషతి 67
మూయు- మూత అవుతుంది మేయు- మేత అవుతుంది మోయు- మోత అవుతుంది. (మైోగు/మోగు- మైత/మోత అవుతుంది. వీటిలో మొదటి మోతకు బరువు మోయడమని అర్థం. రెండవ దానికి మోగడం, ధ్వనించడం అని అర్ధం. పూయు- పూత అవుతుంది. పూచు అన్న అర్థంలో పూత ఒకటి ఉంది. దీనికి పూవులు పూయడమని అర్ధం. పూయు- పూతకు లేవనం అని అర్థం. పూసికొనే గంధం వంటి పరిమళ ద్రవ్యాలను కూడా పూత అనవచ్చు బంగారుపూత పూసిన నగలు వ్రసిద్ధమే కదా నోరు పూత పూచిందని కూదా అంటారు. రోయు- రోత అవుతుంది. రోయు అంటే అసహ్యించుకొను, రోత అంటే అసహ్యం. రోత కలిగించే వదార్థాన్ని కూడా రోత అంటారు. రోత అంటే నింద అనికూడా అర్ధం (వ్రాయు/ రాయు- వ్రాక/రాత అవుతుంది. నేయు- నేత అవుతుంది నాయకుడు అన్న అర్ధం ఉన్న నేత తెలుగుకాదు, సంస్కృతం. నవయు- నవత అవుతుంది. నవయు అంటే కృళించు, క్షీణించు, శ్రమపడు అని అర్ధాలు. నవత అంటీ కష్టం, (శ్రమ క్షయ రోగం అనికూడా అర్థం మెలయు- మెలత అవుతుంది మెలత అంటే స్త్రీ అని అర్ధం. వేయు- వేత అవుతుంది 'చేయు'కు అనుబంధ క్రియగా చాలా ఎక్కువ వాడుక అణచివేయు, అంపివేయు, అమ్మివేయు, తీసివేయు, ఆపివేయు, ఏరివేయు, రాల్చి వేయు, సీల్చివేయు, కూల్చివేయు, తొలిచివేయు, కొట్టివేయు, దిద్దివేయు మొదలైనవి. ఇవన్నీ అణచివేత, అంపివేత, అమ్మివేత, ఆపివేత, కూల్చివేత, తొలిచివేత మొదలైన విధంగా నామ వాచకాలవుతాయి. క్రియాప్రాతిపదిక చివర "గు ఉన్నట్లయితే దాని స్థానంలో కూడా 'త' వస్తుంది. అలగు- అలత అవుతుంది అలసట అనీ, బాధ అనీ అర్థం కలగు- కలత అవుతుంది. కలత ఆంటే క్షోభ. నలగు- నలత అవుతుంది. నలత అంటే ఆలసట, చిన్నరోగం. మడగు-- మడత అవుతుంది మడత అంటే వంచడం, పదాంతంలోని 'చు” స్థానంలో 'త వస్తుంది. నడచు- నడత అవుతుంది నడత అంటే నడవడి కొలుచు- కొలత అవుతుంది, ఈ కొలత పరిమాణం, పొడవు మొదలయిన వాటిని కొలవడానికి ఉపయోగించేది. నెగడు- నెగడ్త, పొగడు- పొగడ్త అవుతాయి. ఈ మాటల్లో ప్రాతిపదిక చివరి అచ్చు మాత్రమే లోపిస్తుంది. నెగడ్త అంటే ప్రసిద్ధి ప్రఖ్యాతి వీటిలాగానే తెగడు- తెగడ్త అవుతుంది. దూషణ అని అర్థం, ఈదు- ఈత, ఊదు- ఊత అవుతాయి ఊత అంటే అధారం ఊత అనే చేపలువట్టే వెదురు సాధనం కూడా ఉంది. ఈను నుండి ఏర్పడిన ఈత కూడా ఉంది ఈతచెట్టు అన్న అర్థం లోని ఈతవేరు. చెందు- చెంత అవుతుంది. చెంత అంటే వద్ద అనీ, సమీపం అనీ అర్ధం. వందు- వంత అవుతుంది. వంత అంటే బాధ. ఇంచు చేరి ఏర్పడే క్రియలెన్నో ఉన్నాయి. ఇవి నామవాచకాలు కావడానికి “చు”కు బదులు “ఈ ప్రత్యయాన్ని చేర్చవచ్చు ఉదాహరణకు ఆను అనే క్రియను తీసుకోవచ్చు. ఆను+ ఇంచు= ఆనించు అవుతుంది 'తఈ' ప్రత్యయం చేరితే ఆనింత అవతుంది అలరు-అలరించు- అలరింత అవుతుంది ఆవులించు- అవులింత అవుతుంది పులకరించు- పులకరింత, పలకరించు-
పలకరింత అవుతాయి. గాలించు- గాలింత అవుతుంది. చికిలించు- చికిలింత అవుతుంది. చెల్లించు- చెల్లింత అవుతుంది. రావించు- రావింత అవుతుంది. వేగిదించు- వేగిరింత అవ తుంది అదిలించు- అదిలింత, ఆరగించు- ఆరగింత అవుతాయి. వెక్కిరించు- వెక్కిరింత అవు తుంది. పుక్కిలించు- పుక్కిలింత అవుతుంది. (ధ్రిల్ అన్న ఇంగ్లీషు మాటకు 'ఇంత చేర్చి (ధ్రిల్లింత అని వాడుతున్నారు. తుళ్ళు- తుళ్ళింత వంటి మాటల సామ్యం వల్ల ఇటువంటి ప్రయోగం వర్చడింది. మన అవసరాన్ని అనుసరించి ఈ విధంగా ఎన్ని మాటలయినా కూర్చుకోవచ్చు బ్ మనబాషతఅ 69
ఇక- ప్రత్యయం
మనం ఎక్కువగా వాడే కృత్త్రత్యయాలలో “ఇకో ఒకటి క్రియా (ప్రాతిపదికకు 'ఇకి చేర్చి నామ వాచకంగా మార్చుకోవచ్చు. “ఆడు” అనే క్రియా ప్రాతిపదికకు అనేక అర్ధాలున్నాయి. కాని “ఇక చేర్చి ఏర్పరచుకున్న నామవాచకం 'ఆడికొకు ప్రతిజ్ఞ అనీ, నింద అనీ అర్ధాలు. 'ప్రస్తుళం నింద అవవాదం అనే అర్ధమే ఎక్కువగా వాడుకలో ఉంది ఆను- ఆనిక అవుతుంది, ఆసి5 అంటే ఆధారం, ఊత. ఇముడు- ఇముడిక అవుతుంది దీనికి ఇమిడిక అన్న రూపం కూడా ఉంది. ఇమిడి ఉండడమని అర్థం, ఊను- ఊనిక అవుతుంది ఊనిక అంటే ఆధారం, ఊత అని అర్థం. భాషాశాస్త్రంలో 50053 అన్న అర్థంలో ఈ మాటను వాడతారు. పదంలో ఏ అచ్చుమీద ఊనిక ఉందన్న దాన్నిబట్టి ఆ పదం అర్థం ఉంటుంది. ఒక విషయం మీద ప్రాధాన్యాన్ని నెలకొల్పడానికి కూడా ఊనిక అనే వ్యవహారం ఉంది. ఇంతకు ముందు వ్యవసాయ రంగంమీద ఉ.న్న ఊనిక ఇప్పుడు పారిశ్రామికరంగంవైపు మళ్ళింది వంటి వాక్యాలలో ప్రాధాన్యమనే అర్ధం.
ఎన్ను- ఎన్నిక అవుతుంది. ఎన్నిక అంటే లెక్కఅనీ, ప్రసిద్ధి అనీ, ఊహ అనీ, సంకల్పమనీ, ఎన్నుకోవడం అనీ అర్ధాలు వాడు ఎన్నికైక్కాడు అంటే ప్రసిద్ధి చెందాడని అర్ధం. వాడు ఎన్నిక చేసిన మనిషి అన్నప్పుడు యోగ్యుడుగా గుర్తించిన మనిషి అని అర్ధం దీనికి అవఖ్యాతి అన్న అర్థం కూడా నిఘంటువులలో ఉందికాని నేటి వాడుకలో లేదు. ప్రసిద్ధి, ఎన్నుకోవడం అన్న అర్భాలలోనే ఈ మాట (ప్రచురంగా కనిపిస్తుంది.
ఏమరు- వఏమరిక అవుతుంది ఏమరు అంటే ఉపేక్షించు, మరచు అని అర్ధాలు. పమరిక అంటే పరాకు, ప్రమాదం అని అర్ధం. ఏమరపు, ఏమరిపాటు అనికూడా నామవాచక రూపాలు న్నాయి. ఏలు- ఏలిక అవుతుంది. రాజు, యజమాని, భర్త అని అర్జాలు. రాజు అన్న అర్ధంలోనే వాదుక ఎక్కువ. ఓపు- ఓపిక అవుతుంది. ఓపు అంటే సమర్ధమగు, బి వడు, సహించు అని అర్థాలు. ఓపిక అంటే ఓరిమి, తాలిమి, విసుగు లేకపోవడం. శక్తి, సామర్ద్వం అనే అర్ధం కూడా ఉంది. ఓము- ఓమీక అవుతుంది ఓము అంటే రక్షించు, కాపాడు అని అర్ధం. ఓమిక అంటే రక్షణ.
కదలు- కదలిక అవుతుంది. కదలిక అంటే చలనం. కలయు- కలయిక అవుతుంది. కలయిక అంటే సంగమం, కూడిక. కుదురు- కుదిరిక అవుతుంది కుదిదిక అంటే అఎిరిక. అమరిక కూడా అమరు అనే క్రియా ప్రాతిపదిక మీద 'ఇకు చేరి ఏర్భడిన రూవమే. వాడికి కుదిరిక లేదు అన్నప్పుడు నిలకడలేదని అర్ధం. ఇది భౌతికంగానూ, మానసికంగానూ కూడా. ఒక ఉద్యోగంలో కుదిరికగా ఉండకపోవచ్చు. ఒక అభిప్రాయం స్థిరంగా ఉండకపోవచ్చు. కుదిరిక అంటే స్వస్థత అనికూడా అర్ధం. కూడు- కూడిక అవుతుంది కూడిక అంటే సంగమం అనీ, పొందిక అనీ అర్ధం. కలపడం అనికూడా అర్ధం
కోరు-కోరిక అవుతుంది కోరిక అంటే కోరడం, ఇచ్చ, వాంఛ. కోరిన విషయం అని కూడా అర్ధం. వరం అనికూడా అర్థం. దీనికి కోరికి, కోరికె అనికూడా రూపాలున్నాయి. చీరు- చీరిక అవుతుంది. చీరిక అంటే చీలిక ముక్క పాయ అని అర్థాలు. చినిగిపోయిన గుడ్డను కూడా చీరిక అంటారు. బీరికలు చారికలు అని జంట పదంగా కూడా వాడుక ఉంది. చీలు- చీలిక అవుతుంది. చీరిక, బద్ద అని అర్ధం. చేరు- చేరిక అవుతుంది. చేరిక అంటే కలిసి ఉండడం, స్నేహం. దగ్గర అని కూడా అర్ధం.
50 తిమనభాష
తెగడు- తెగడిక అవుతుంది. తెగడిక అంటే నింద, ఈసడింపు నమ్ము- నమ్మిక అవుతుంది. నమ్మిక అంటే నమ్మకం, విశ్వాసం. విశ్వాసాన్ని కలిగించే మాట, ప్రమాణం అని కూడా అర్ధం దీనికి నమ్మిగ అనే రూపం కూడా ఉంది. నమ్మిన కాపు అంటే కనిపెట్టుకొని ఉండే బంటు. పూడు- పూడిక అవుతుంది పూడిక అంటే బావులు, కుంటలు మొదలయిన వాటిలో అడుగున నిండి ఉన్న మన్ను. పూను- పూనిక అవుతుంది. పూనిక అంటే ప్రయత్నం. ఉద్దేశం అనీ, ఉద్దేశించిన వని అనీ కూడా అర్ధం ఉంది. పట్టుదల అని కూడా అర్థం. పూనిక అంటే రీతి, విధం అన్న అర్ధం కూడా ఉంది. దీనికి పూనికి అన్న రూపం కూడా ఉంది.
పొందు- పొందిక అవుతుంది పొందిక అంటే కలయిక, చేరిక, స్నేహం, స్వభావం, రీతి, ఒప్పిదం అని అర్థాలు. పొరలు- పొరలిక అవుతుంది. పొరలిక అంటే పొర్లడం. పొాలయు- పొలయిక అవుతుంది పాలయు అంటే వ్యాపించు, సంచరించు, వీచు, కనిపించు, వ్రవేశించు, (ప్రకాశించు, అనుకూలించు, మూగు, కలుగు, అతిశయించు, తొలగు, దగ్గరగు వంటి అర్ధా లున్నాయి. పొలయిక అంటే సంచారం అనీ వ్యాప్తి అనీ అర్ధాలు. పోలు- పోలిక అవుతుంది. పోలిక అంటే సామ్యం, సాద్భశ్యం, రీతి. పోలికి, పోలికె అనే రూపాలు కూడా ఉన్నాయి. బడలు- బడలిక అవుతుంది బదలిక అంటే శ్రమ, అలసట.
మచ్చు- మచ్చిక అవుతుంది మచ్చు అంటే ఆకర్షించు అని అర్ధం. నామవాచకంగా మచ్చు అంటే వశీకరణ జౌషధం జంతువులను వలలో పడేట్లు చేయడానికి పెట్టే ఎరను కూడా మచ్చు అంటారు. ఈ అర్ధంలోనే మచ్చిక దీనికి వలపు అనీ, ఆసక్తి అనీ, భ్రాంతి అనీ, చనవు అనీ అర్ధాలు. మచ్చిక చేసుకోవడం అంటే మాలిమి చేసుకోవడం. దీనికి మచ్చిగ అనే రూపం కూడా ఉంది మొట్టు- మొట్టిక అవుతుంది. మొట్టికాయ అని కూడా వాడుక. పిడికిలితో తలమీద పొడిచిన పొడుపు మొట్టిక(మొటిక అంటే మొలక అనికూడా అర్థం. మొటికలు వేస్తూ ఉంది అంటే మొలక వేస్తూ ఉందని అర్ధం. నిన్నమొన్నటి మొటిక ఆంటే పసివాడని అర్థం నిఘంటు వులలో తునుక అనే అర్ధంకూడా ఉంది. కాని వాడుకలో ఉన్నట్లు లేదు,
ఎంచు- ఎంపిక అవుతుంది. ఇక్కడ (ప్రాతిపదికలోని చకారం పకారమయింది. ఎంపిక అంటే సెలక్షన్. ఒకదానికంటే ఎక్కువ ఉన్నప్పుడు వాటిలో మేలైనదాన్ని ఎన్నడం.
డయ్యు- డప్పిక అవుతుంది. డయ్యుకు దయ్యు అన్న రూపమూ, డప్పికకు దప్పిక అన్న రూసమూ ఉన్నాయి. డప్పి/దప్పి కూడా అవుకుంది. ఇక్కడ ద్విర్తుక్త యకారం, ద్విరుక్త పకారం అయింది. డప్పిక/దప్పిక అంటే దాహం, పిపాస, తాగాలనే కోరిక
పెరుకు- పెరిక అవుతుంది. 'ఇక' చేరే ముందు పదాంతంలో ఉన్న 'కు” లోపించిందన్న మాట. పెరుకు అంటే పీకు, పెల్లగించు, మోయు, మోయించి తెచ్చు అని అర్థాలు ఈ మోయు అనే అర్థంలోనే పెరిక ఏర్పడింది. పెరిక అంటే రెండు పక్కల బరువుందేట్లుగా ధాన్యం పోసి ఎద్దు, గుర్రంవంటి వాటి వీపుమీద వేసే గోనెసంచి. మోకాళ్ళ మీది పెరిక అన్నది జాతీయం. నడవ నీయనిది, కష్టకరం అని అర్ధం పెరికాటం అంటే పెరికలలో ధాన్యం మోయించుకొనిపోయి చేసే వ్యాపారం పెరిక సెట్టి అంటే ఇటువంటి వ్యాపారం చేసే వర్తకుడు
మెలయు- మెలిక అవుతుంది ఇక్కడ చివరి అక్షరం లోపించింది. తాల్చు- తాలిక, తూన్చు- తూనిక అన్నప్పుడూ అంతే. మెలిక అంటే మెలి, పెన. మెలికపడింది అంటే చిక్కు పడిందని అర్ధం తాలిక అంటే మెలిక, చారిక అని అర్ధం. పాలతాలికలున్నాయి కదా. తూనిక అంటే త్రాసుతో తూచడం. చ
మనభాషతి 91
క - ప్రత్వయం
కృత్రృత్యయాలలో 'కొ ఒకటి. క్రియా ప్రాతిపదిక మీద *కు చేరి కృదంత నామవాచకాలు ఏర్పడతాయి. పుట్టు+క= పుట్టక. పుట్టుక అంటే జన్మ. సూర్యచంద్రాదుల ఉదయాన్ని కూడా వారి పుట్టుకగా వర్ణించవచ్చు. పుట్టు గట్టు అంటే ఉదయాచలం, తూర్పుకొండ. వాడుకలో పుటక అని కూడా ప్రయోగం. 'మనిషి పుటక పుట్టిం తర్వాత కొంచెం ఇంగితజ్ఞానం ఉండాలి వంటి వాక్యాలలో ఇటువంటి ప్రయోగం ఉంది. వాడు - వాడుక అవుతుంది. వాడుక అంటే ఉప యోగం అనీ వ్యవహారం అనీ అర్థం అభ్యాసం, అలవాటు అని కూడా అర్ధం ఉంది. పాల వాడుక అంటే క్రమం తప్పకుండా ఒకరిదగ్గరే పాలు పోయించుకోవటం. వేడు- వేడుక అవుతుంది. వేడుక అంటే కుతూహలం, కోరిక, సంతోషం, వినోదం, ఉత్సవం, విలాసం, అవలీల అని అర్థాలు,
వాడికి ఉయ్యాల ఊగాలని వేడుక అన్నప్పుడు కుతూహలం అని అర్ధం. కాంక్ష కోరిక అనే అర్ధంలో కావ్యాలలో ఈ మాటకు ప్రయోగం ఉంది. వేడు అంటే కోరు అని ఒక అర్ధం. ఈ అర్థం వల్లే వేడుక అంటే కోరిక అనే అర్థం ఏర్పడింది. నీకంతా వేడుకగా ఉంది అంటే వినోదంగా ఉందని అర్థం. వేడుక జరుపుకున్నారు అన్నప్పుడు ఉత్సవం జరుపుకున్నారని అర్ధం. వేడు అన్నమాటకు యాచించు, (ప్రార్ధించు అని అర్థాలున్నాయి కాని “వేడుకలో ఈ అర్థాలు లేవు.
పదాంతంలో “గు? ఉన్నప్పుడు దానికి బదులుగా "కి వస్తుంది. అలుగు- అలుక అవు తుంది. అలుక అంటే కోపం. శత్రుత్వం అన్న అర్ధం కూడా ఉంది. పెళ్ళిలో పెళ్ళి కొడుకు అలుక పాన్సు ఎక్కినప్పుడు అలుకకు కోపం నటించడమే అర్ధం. కాసేపు బతిమిలాడించుకొని దిగి రావడం సంప్రదాయం. పెళ్ళిళ్ళలో వేడుక కోసం చేసే ఈ చేష్టలు సీరియస్‌గా మారి ఆడపెళ్ళి వారిని నానా ఇబ్బందులూ పెట్టేవరకూ వచ్చాయి అలక/అల్మ అని కూడా రూపం ఉంది.
ఎరుగు- ఎరుక అవుతుంది. ఎరుక అంటీ జ్ఞానం. ఎరుకగలవాని చరితలుగరచుచు అన్న భారత ప్రయోగానికి జ్ఞానులని అర్ధం. ఎరుక స్మృతి అని కూడా అద్ధం ఎరుక అంటే ఆనవాలు, గుర్తు అన్న అర్ధం కూడా ఉంది. పరిచయం, సోదె అనే అర్ధాలూ ఉన్నాయి ఎరుకసాని అన్న వుడు సోదె చెప్పే స్రీఅని అర్థం. ఎరుకలో అన్నా అదే అర్ధం. ఎరుక/ఎరిక/ఎరికె అనే రూపాలతో తెలియడమనే అర్ధంలో తెలంగాణాలో ఈ మాట చాలా వాడుకలో ఉంది. జోస్యం అని కూడా అర్ధం
కడగు- కదక అవుతుంది. కడక అంటే ప్రయత్నం. ధైర్యం, ఉద్ధతి, చేష్ట రీతి, సంతోషం, ఆధిక్యం అన్న అర్థాలు కూడా ఉన్నాయి కాని నేటీ వ్యవహారంలో ఈ అర్థాలలో ప్రయోగాలు లేవు. కలగు- కలక అవుతుంది. కలక అంటే వ్యాకులత్వం, క్షోభ, కాలుష్యం, కళంకం, జంకు అని అర్థాలు. కండ్లకలక ఒకరకమైన కంటి జబ్బు. తునుగు-తునుక/ తునక/ తున్మ అవుతుంది. ముక్కఠఅని అర్ధం. మునుగు-మునుక/మునక/ మున్మ అవుతుంది. మునుక అంటే మునగడం. స్నానం అని కూడా అర్థం. కాగు- కాక అవుతుంది. కాక అంటే తాపం, బాధ, కోపం అని కూడా అర్ధం. వాడు చాలా కాకమీద ఉన్నాడు అన్నప్పుడు కోపమనే అర్థం. వేడిమి, జ్వరం అని కూడా అర్థాలున్నాయి. బహువచన ్రత్యయంచేరి కాకలుదేరిన యోధుడు అన్న ప్రయోగం ఉంది.
92 అమనబాష
ఆరిజేరిన అని అర్థం. కాకలుతేరిన బంటు జాతీయం. పుటం పెట్టిన లోహంలాంటి వాడని అర్థం. తేరిన బదులు తీరిన అని కూడా వాడుతున్నారు. పోవు- పోక అవుతుంది. పోక అంటే పోవటం. ఈ మాటకు జాడ అని కూడా అర్ధం ఉంది. “వాడు పలు పోకలు పోతున్నాదు' అన్న వృుడు నడకలుఅని అర్ధం అనేకరీతులని అర్ధం. ఈ అర్ధంలో బహువచనంలోనే వాడుక నడవడి, నటన, విలాసం అన్న అర్థాలలో బహువచనంలోనే ప్రయోగం ఉంది. 'అదే సోకగా పోయాడు అన్నప్పుడు ఇక తిరిగి చూడకుండా పోయాడు అని అర్ధం. 'పోయిన పోక జాతీయం. మళ్ళీ తిరిగి రాకుండా పోవటం అని అర్ధం. 'పోయినదే పోక అన్నది కూడా జాతీయమే. నడిచినదే మార్గమని అర్ధం తాను నడిచిందే సరైన తోవ అనడం.
మూగు- మూక అవుతుంది. మూక అంటే సమూహం, గుంపు. కావ్యభాషలో సేన అని కూడా అర్ధం ఉంది. వీగు- వీక అవుతుంది. వీక అంటే ఉత్సాహం, బలం, పరాక్రమం, గర్వం, సాహసం, వ్యాప్తి, బెదార్యం, బెన్నత్యం, రీతి మొదలయిన అర్థాలున్నాయి. వంగు- వంక అవు తుంది. అంటే వంకర, వంపు, వంకరపని, తవ్పు, సెలయేరు అని అర్ధాలు.
పదాంతంలో 'చు' అంటే దాని స్థానంలో 'క వస్తుంది. నడచు- నడక అవుతుంది. నడక అంటే నడవడం, (ప్రవర్తన అని అర్థాలు జీవనోపాయం, వృత్తి అన్నఅర్ధం కూడా ఉంది. మొలచు- మొలక అవుతుంది. మొలక అంటే అంకురం మొలకెత్తిన విత్తనాన్ని కూడా మొలక అంటారు. మూలవ్యాధి, అర్భవ్యాధి అని కూడా అర్థం. విశేషణంగా లేత, చిరుత, చిన్న అని అర్థం. మగ మొలక అంటే మగపిల్లవాడు.
ముదియు- ముదుక అవుతుంది. ముదుక అంటే ముసలివాడు. ముదుక అంటే మోటయి నది, దళసరి అయినది అని కూడా అర్ధం లావు అన్న అర్ధం కూడా ఉంది. ముదుక బియ్యం, సన్నబియ్యం అన్నప్పుడు ముదుకకు లావు అనే అర్ధం.
మురియు- ముక్క అవుతుంది. మురియు అంటే తెగు అని అర్థం, ఊదు, విరుగు అని కూడా అర్ధాలున్నాయి. ముక్క అంటే ఖండం అని అర్థం.
వచ్చు అనే ప్రాతిపదిక మీద “క (ప్రత్యయం చేరినప్పుడు వచ్చు “రా” అవుతుంది. రా+క= రాక. రాక అంటే రావటం. కావ్యాలలో దాడి అన్న అర్థంలో కూడా ఈ మాట కనిపిస్తుంది. రాక అనే సంస్కృత పదంజఒకటి ఉంది దీనికి పూర్ణచంద్రుడున్న పున్నమి అని అర్థం, కళతుకు అనేమాటకు గతుకు అనే రూపాంతరం ఉంది. తినడం అని అర్ధం. దీని నుండే గటక/గట్కఅనే మాట వచ్చిందని అంటారు. పిండితో చేసిన జావను గటక అంటారు, అంబలి అని అర్ధం. లేపనం చేయడానికి నూరి ఉడికించిన పిండి అన్న అర్థం కూడా ఉంది.
ఖల్ మనభాషళ 93
అ, అకం - ప్రత్యయాలు పదం చివర ఉ ఉన్న కొన్ని మాటలకు “అ” ప్రత్యయం చేర్చడం ద్వారా నామవాచకాలు ఏర్పడ తాయి. పదం చివర ఉన్న ఉ'లోపిస్తుంది. దాని స్థానంలో “అ” చేరుతుంది ఉదాహరణకు ఉదిలు
- ఉదిల అవుతుంది. ఉదిలు అంటే కదలు అని అర్ధం. ఉదిల అంటే చలనం. పరితాపం అని కూడా అర్ధం. ఉదిల కొను అని వాడుక భయంతో వణకడం అనీ, తొందరపడడం అనీ, వ్యాపీం చడం అనీ, పరితపించడం అనీ అర్థాలు. కట్టు- కట్ట అవుతుంది కట్టు (క్రియ, నామవాచకం కూడా. దీనికి చాలా అర్థాలున్నాయి. “కట్టు క్రియా ప్రాతిపదికకు 'అ' ప్రత్యయం చేరిస్తే కట్ట ఏర్పడుతుంది. కట్ట అనే మాటకు రెండు అర్థాలున్నాయి. వేటినైనా కలిపి కట్టిన సముదాయం కట్ట, పుస్తకాల కట్ట మొదలైనవి. చెరువు గట్టును కూడా కట్ట అంటారు. చెరువుకట్ట నిరోధించడానికి అడ్డుగా కట్టినది కట్ట. అడ్డుకట్ట, ఆనకట్ట. అడ్డుకట్ట అన్నది ఆలంకారికంగా కూడా వాడవచ్చు. 'వాడి విజృంభణకు అడ్డుకట్ట వేశాడు వంటివి ఇటువంటివి. కాయు- కాయ అవుతుంది. మూడు '“కాయు”లు ఉన్నాయి. ఒక “కాయు'కు ప్రసరించు అని అర్ధం. ఎండకాసింది, వెన్నెల కాసింది అన్న వాటిలో అర్ధం ఇదే. రెండో 'కాయు' రక్షించు అని అర్థం. మూడో 'కాయుకు “పుట్టు అని అర్థం ఈ అర్ధంలోనే కాయ నామవాచకమైంది. కాయ అంటే చెట్టో, తీగో కాసే కాయ. వీణకు అమర్చిన సొరకాయను కూడా కాయ అంటారు. రాపిడివల్ల శరీరంలో గట్టిపడిన భాగాన్ని కాయ అంటారు 'ఆమె కడుపులో నాలుగు కాయలు కాశాయి అన్నప్పుడు సంజానమని అర్ధం జూదం ఆడేటప్పుడు ఉపయోగించే సారె మొదలైన వాటిని కూడా కాయ అంటారు. పందెం కాయలు అని వాడుక చెడిపోయిన ధాన్యాన్నీ కాయ అంటారు. కాయా, పొల్లూ లేని వడ్లు అని వాడుక. కాయ నుండే పుట్టే ధాన్యాన్ని కాయ ధాన్యం అంటారు. మినుములు, పెసలు వంటివి కాయ ధాన్యాలు, వడ్లు గడ్డి ధాన్యం. ఒకరకమైన కంటి జబ్బుకు కూడా “కాయి అని పేరు “వెళ్ళిన పని కాయా? వండా? అన్నప్పుడు కాయ అంటే విఫలమనీ, వండు అంటే సఫలమనీ అర్ధం. ఎదురుచూసి కళ్ళు కాయలు కాచా యంటారు. లెంపకాయ వేశాడు అంటే చెంపదెబ్బ కొట్టాడని అర్ధం తల, మెడలకు కాయచేర్చి తలకాయ, మెడకాయ అని కూడా అంటారు. పిల్లకాయ అనీ వాడుక లెంపకాయలాగే మొట్టి కాయ. గీరు- గీర అవుతుంది గీర అంటే గీత అని అర్ధం. ఈ మాటకు గర్వం అనే విశిష్టార్ధం కూడా ఏర్పడింది. (గుక్కుగుక్కు- గ్రుక్క/గుక్క అవుతుంది. గుక్క అంటే మింగడం అని అర్థం. గొంతులో పట్టే (నీటి) ప్రమాణం. గుక్క అంటే ఊపిరి అని కూడా అర్ధం. “పద్యమంతా ఒక్క గుక్కలో అప్పజెప్పివేశాడు” అన్నప్పుడు శ్వాస అనే అర్ధం. చేదు- చేద అవుతుంది. చేదు అంటే తోడు అని అర్ధం. చేద అంటే నీళ్ళు చేదే పాత్ర దగ్గరు- దగ్గర అవుతుంది. దగ్గరు అంటే సమీ పించు, దగ్గర అంటే సమీవం. దగ్గర తీయడం అంటే చేరదీయడం. దొంగు- దొంగ అవుతుంది దొంగు అంటే దొంగిలించు. దొంగ అంటే చోరుడు, దొంగి లించేవాడు. మోసం, మాయ, నటన అని కూడా విశేషణంగా ఈ మాటకు అర్ధముంది. దొంగ నిద్ర పోతున్నాడు అంటే నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడని అర్ధం. దొంగ భక్తి చూపిస్తున్నాడంటే లేని "వ అమనవాష
భక్తిని నటిస్తున్నాడని అర్ధం దొంగ ఊబి అంటే కింద లోతు తెలియకుండా ఉండే బురద. దొంగ పొద్దు, దొంగరేయి అంటే అర్ధరాత్రి దొంగతనానికి అనుకూలంగా ఉండే సమయం దొంగబీగం అంటే మారుతాళం
తునియు- తునియ అవుతుంది. తునియు అంటే తెగు అని అర్థం. తునియ అంటే తెగి నది, ముక్క తూరు- తూర అవుతుంది తూరు అంటే సన్నగా తుంపరరాలు అని అర్ధం. శూర అంటే వానబొట్టు, జల్లు సన్నతూర పట్టింది అంటే ముసురు పట్టిందని అర్ధం. దున్ను- దున్న అవుతుంది దున్ను అంటే దుక్కిచేయు అని అర్ధం. దున్న అంటే మహిషమని అర్థం. దున్నేది కాబట్టి దున్న
పిడుచు- పిడుచ అవుతుంది. పిదుచు అంటే పిండు అనీ ముద్దలాగా అదుము అనీ అర్థం. పిడుచ అంటే ముద్ద, పిడుచకట్టు అంటే దప్పికతో తడి ఆరిపోయి ముద్దలాగా కావడం. వెచ్చు- వెచ్చ అవుతుంది. వెచ్చ అంటే వేడి, జ్వరం.
'అ ప్రత్యయం చేరినప్పుడు, కొన్ని మాటల్లో చివరి అక్షరం లోపిస్తుంది ఉదాహరణకు నడచు- నడ. నడ అంటే నడక, నడత. ననుచు- నన అవుతుంది. ననుచు అంటే పూచు అని అర్ధం నన అంటే పూవు, చిగురు, మొగ్గ అని అర్థాలు.
పొగయు- పొగ అవుతుంది. పొగ అంటే ధూమం. ఆవిరి అనికూడా అర్థం. పాగతోట పొగాకు తోట. పొగకన్ను అంటే శివుడి మూడోకన్ను. మొరగు- మొర అవుతుంది. మొరగు అంటే మోసంచేయు అని అర్ధం. మొర అంటే ఆర్తనాదం. మొర పెట్టుకోవడం అంటే తమ కష్టాలు చెప్పుకోవడం మొరపెట్టడం అంటే పెద్దగా ధ్వనిచేయడం. దీనికి మొగ్ర అన్న రూపాం తరం కూడా ఉంది.
విలుచు- వెల అవుతుంది. విలుచు అంటే కొను అని అర్థం. వెల అంటీ ధర. మనం కొనే వస్తువుకు చెల్లించే మూల్యం. వెలుగు- వెల్ల అవుతుంది. వెల్ల అంటే తెలుపు. వెల్లదనం అంటే తెల్లగా పాలిపోవడం. వెల్ల అంటే సున్నం అని కూడా అర్ధం. “ఇంటికి వెల్ల వేశారు అంటాం చెమరు- చెమ్మ అవుతుంది. చెమ్మ అంటే తడి, ఊట. కన్ను చెమ్మగిల్లింది అంటాం.
'అకం' అన్నది మరొక కృదత్చ్రత్యయం. ఈ ప్రత్యయాన్ని కూడా చాలా మాటల మీద చేర్చి నామవాచకాలను ఏర్పరచుకోవచ్చు ఉదాహరణకు “అద్దు మీద “అకం' చేరిస్తే అద్దకం అవు తుంది. అద్దకం అంటే బట్టలకు రంగువేయడం. అల్లు- అల్లకం అవుతుంది. అల్లకం అంటే అల్లిక నమ్ము- నమ్మకం అవుతుంది. నమ్మకం అంటే విశ్వాసం పూను- పూనకం అవుతుంది. పూనకం అంటే దేవత ఆవేశించటం. అమ్ము- అమ్మకం అవుతుంది. అమ్మకం అంటే విక్రయం, అమ్మడం.
అకం చేరినప్పుడు పదాంతంలోని చకారం పకారం అవుతుంది. అనుచు- అంచు- అంపకం అవుతుంది. అంపకం అంటే పంపడం, అంపకాలు పెట్టడమంటాం. పంచు- పంపకం అవుతుంది. పంచడం అని అర్ధం. పంపు కూడా పంపకం అవుతుంది. పంపడమని అర్ధం. పెంచు- పెంపకం అవుతుంది. పెంచడం, పోషించడమని అర్ధం. కొందరి వాడుకలో ఈ ప్రత్యయానికి చాలా వాడుక ఉంది. కొనకం, తినకం, చేసకం లాగా ఎన్నో పదాలు వాడతారు.
ష్ మనభాషత 95
ఇ- ప్రత్యయం
కృృత్చ్రత్యయాలలో 'ఇ' ఒకటీ ఎదురు" అనే క్రియా ్రాతిపదికకు “ఇ' ప్రత్యయం చేరితే ఎదిరి అవుతుంది ఎదిరి నామవాచకం. ఎదిరి అంటే అన్యుడు, ఇతరుడు అని అర్ధం ప్రతిపక్షి విరోధి అనే అర్ధం కూడా ఉంది. ప్రస్తుతం ఈ అర్ధంలోనే 'ఎదిరికి వాడుక ఎక్కువగా ఉంది. కూయు- కూయి అవుళుంది. కూయి అంటీ కూత, అరపు, మొర నంగు- నంగి అవుతుంది. నంగు అంటే ముక్కుతో మాట్లాడు అని అర్ధం నంగి అంటే ముక్కుతో పలికే మాట అనీ, అస్పష్టమైన మాట అనీ అర్థం “వాడు నంగి నంగిగా మాట్లాడతాడు”, 'నీ నంగి మాటలు కట్టిపెట్టు వంటి ప్రయో గాలున్నాయి. నత్తు- నత్తి అవుళుంది నత్తు అంటే తడబడుతూ మాట్లాడు అని అర్ధం, నత్తి అంటే మాట్లాడేటప్పుడు మాటలో మొదటి అక్షరాన్నే ఒకటికంటే ఎక్కువసార్లు ఉచ్చరించడం, ఆగి ఆగి కష్టంమీద మాట్లాడడం. బాల్యంలో ఆత్మన్యూనతా భావంవల్ల, భయంవల్ల నత్తి వస్తుందంటారు.
పిండు- పీండి అవుతుంది, పిండు ఆంటే పాలు పిదుకు అని అర్ధం. రసం కారేటట్లుగొ పిసకడం కూడా పిండటమే. బట్టలు ఉతకటాన్ని కూడా పిండడమని అంటున్నారు. చెవి మెలి పెట్టడాన్ని చెవి పిండడం అంటారు ఆలంకారికంగా దీన్ని విసృతపరిచి వాడడం కూడా ఉంది. “చెవులు పిండి వసూలు చేశాడంటాం. పిండి అంటే ధాన్యం, పప్పులు మొదలైనవి విసరి చేసిన పొడి అని అర్ధం.
మిక్కిలు- మిక్కిలి అవుతుంది. మిక్కిలు అంటే అతిశయించు అని అర్థం. మిక్కిలి అంటే ఎక్కున. మిక్కిలి కన్ను అంటే మూడో కన్ను, మిక్కిలి చూపు అని కూడా కావ్యాలలో వాడారు. మిక్కిలి కంటివేల్పు అంటే త్రినేత్రుడు, శివుడు. అచ్చతెలుగు కావ్యాలలో శివుడు అనడానికి ఈ మాటను ఎక్కువగా వాడారు. వాము-వామి అవుతుంది. వామి అంటే గడ్డికుప్ప. ఏ వస్తువుల నైనా కుప్పగా అమర్చినప్పుడు వామి అనవచ్చు.
కొన్ని మాటల చివర 'ఇ ప్రత్యయం చేరినప్పుడు చివరి అక్షరం లోపిస్తుంది. ఉదాహర ఇకు '“ఉరలు” అనే మాటను తీసికోవచ్చు “ఉరలు" మీద *ఇ చేర్చినప్పుడు లు లోపిస్తుంది. అప్పుడు ఉర+ఇ= ఉరి అవుతుంది. ఉరలు అంటే పడు, వలలో చిక్కు కూలు, దొర్హు, విడిపోవు, పగులు మొదలయిన అర్థాలున్నాయి. ఉరి అంటే ఉచ్చు జంకువులు, పక్షులను వట్టుకోవడానికి వన్నేది. ఈ ఉరినే మనుషుల మెడకు వేసి చంపడాన్నే ఉరి తీయడం అంటున్నాం.
కసరు, గురుచు, నలగు, ముడుచు, ముదియు, మిడియు, మొగియు, వెలచు మొద లయిన మాటలు ఉరలు వంటివి. కసరు-కసి అవుతుంది. కసరు అంటే కోపపడు అని అర్థం. కసి అంటే కోపం. గురుచు- గురి అవుతుంది. గురుచు కు గురించి రూపాంతరం. గురి అంటే లక్ష్యం. గురి అంటే విశ్వాసం, నమ్మకం అన్న అర్ధం కూడా బాగా వాడుకలో ఉంది. “డాక్టరు మీద గురి ఉంటే జబ్బు తొందరగా తగ్గుతుంది", 'గురువు మీద గురి ఉండాలి". గురి అంటే నిదర్శనం అనీ, సాక్షి అనీ, నిర్ణయం అనీ, ఉపాయం అనీ, హద్భ అనీ, గిరి (గుండ్రంగా గీసిన గీత) అనీ మచ్చ అనీ కూడా అర్ధాలున్నాయి. నలగు- నలి అవుతుంది, నలగు అంటే బాధపడు, పీడ నొందు, నశించు అని అర్ధం. నలి అంటే బాధ, పొడి, ఎండుగడ్డి, చిరు తిండి, అందం, పేమ, ఉత్సాహం, శక్తి అన్న అర్ధాలున్నాయి.
96 అనునభాష
ముడుచు- ముడి అవుతుంది. ముడుచు అంటే ముకుళింపజేయు, మూటకట్టు, నిలువ చేయు, దొంగిలించు, ముడివేయు, తలలో పెట్టుకొను, కొప్పుపెట్టు, కనుబొమలు ముడివేయు, కట్టు అని అర్జాలు. ముడి అంటే మూట అనీ; దారం, తాడు వంటి వాటి ముడి అనీ అర్ధం మూట అన్న అర్ధం కూడా కట్టి ముడివేయడం వల్ల వచ్చిందే. కోపం, గాఢమైన ఆలోచన కలిగినప్పుడు కనుబొమలు ముడివేయడం ఉంది. ముడివేసినట్లుండే కొన్ని అక్షరాల ఒత్తులను కూడా ముడులంటారు. ]- మామూడి,్నా- నాముడి. ఎద్దు మూపురాన్నీ ముడి అంటారు. చెట్లు మొద లయిన వాటి బుడిపెను కూడా ముడి అంటారు. దానికీ దీనికీ ముడివేశారు అన్నప్పుడు లంకె చేశారు, షరతు పెట్టారు అని అర్ధం. బహువచనంగా ముళ్ళువేయడం అంటే తగాదాలు పెట్టడం. ముళ్ళమారి అంటే తగాదాలు పెట్టే వ్యక్తి. ముళ్ళ పేరు అంటే ఒక రకమయిన గొలుసు
ముదియు- ముది అవుతుంది ముదియు అంటే ముసలితనం రావడం. ముది అంటే ముసలితనం అనీ, ముసలివాడు, ముసలిది అనీ అర్ధాలు. మిడియు- మిడి అవుతుంది. మిడి అంటే గర్వం, ఉన్నతం, పైకి ఉబికినది, తీక్షమైనది అని అర్థాలు. మిడిగుడ్దు అంటే పైకి ఉబికిన కంటిగుడ్లు. మిడిగుడ్లవాడు అన్నది ఈ అర్ధంలోనే. మిడిదల అంటే పెద్ద తల మిడినాగు అంటే ఎగిరెగిరి పదే పాము. మిడిపంద్లు అంటే ఎత్తుపండ్లు మిడిమేలం అంటే గర్వం. మొగియు- మొగి అవుతుంది మొగియు అంటే వ్యాపించు, పూను అని అర్ధాలు. మొగి అంటే పూనిక, తడవ, మొత్తం, రీతి, మొవ్వు, పూర్వం, ఎదుట అని అర్జాలు. ఒక్కమొగిన మీదపడ్డారు అన్నప్పుడు ఒక్క తడవ, ఒక్కసారిగా అని అద్దం సైన్యం మొగిలో నిలిచాడు అంటే అగ్రభాగాన, ముందు అని అర్ధం. వెలచు- వెలి అవుతుంది వెలచు అంటే శుభపరచు అని అర్ధం. వెలి అంటే వెలుపల, వెలుపలి ప్రదేశం, బహిష్కారం అని అర్థాలు. బయలు, బహిష్కారం అన్న అర్జాలు రెండూ 'ప్రచురంగానే ఉన్నాయి
పదాంతంలో ద్విరుక్తయకారం కాని, ద్విరుక్త చకారం కాని ఉన్నట్లయితే అది పకారంగా మారుతుంది. అంటే య్య- చ్చ లు ప్ప అవుతాయి ఉదాహరణకు డయ్యు- డప్పి అవుతుంది. డయ్యుకు దయ్యు రూపాంతరం అట్లాగే డప్పికి దప్పి రూపాంతరం. డయ్యు అంటే అలసిపోవు, బలహీనపడు, కృశించు, తగ్గు, చెడు అనే అర్థాలున్నాయి. డప్పి అంటీ (శ్రమ, క్తీణత్వం, దాహం అని అర్థాలు. నొచ్చు- నాప్పి అంటే బాధ. నొప్పిని బహువచనంలో వాడితే నొప్పులు. దీనికి ప్రసవవేదన అన్న ప్రత్యేక అర్ధం కూడా ఉంది పుచ్చు- పుప్పి అవుతుంది. పుచ్చు అంటే చెడిపోవు అని అర్ధం. 'నీ పుణ్యం పుచ్చింది అన్నప్పుడు మాత్రం పరిపక్సానికి వచ్చింది అని అర్ధం. పుప్పి అంటే పుచ్చిపోయినది
బ్ మనభాషతి 97
మాపకం - మారకం సమాజం అభివృద్ధి చెందే కొద్దీ ఆ సమాజం మాట్లాదే భాషా అభివృద్ధి చెందుతుంది. భాష అభివృద్ధి చెందడమంటే ఏమిటి? ఆ భాష మాట్లాడే ప్రజల భావ వ్యక్తీకరణ శక్తి అభివృద్ది చెందడమే. మన విజ్ఞానం పెరుగుతూ ఉంది. మనం నిర్మిస్తున్న వస్తుజాలం పెరుగుతూ ఉంది. ప్రకృతిలో మనం గుర్తిస్తూ ఉన్న వస్తువుల సంఖ్యా పెరుగుతూనే ఉంది. ప్రకృతికీ మనిషికీ ఉండే సంబంధాలు, మనిషికీ మనిషికీ మధ్య, సమాజానికీ సమాజానికీ మధ్య ఉందే సంబంధాల స్వరూ పంలో అనేక మార్పులు కలిగాయి ఇదంతా భాషలో ప్రతిబింబించవలసిందే. ప్రపంచంలోని ఏ భాష అయినా సమర్ధవంతంగా ఆ భాష మాట్లాడే వ్యక్తుల అవసరాలను తీర్చగలుగుతుంది. ప్రతిభాషా వ్యవస్థలోనూ ఈ అభివృద్ధికి అవసరమయిన పెరుగుదలకు అనుగుణమయిన నిర్మాణం ఉంటుంది. పదజాలాన్ని విసృతపరచుకొనే ప్రక్రియలు 'ప్రతిభాషలోనూ ఉంటాయి. ఒక పదాన్ని వాక్యంలో వివిధ భాషా భాగాలుగా ఉపయోగించుకోవచ్చు ఒకేమాటను నామవాచకంగా వాడవచ్చు. విశేషణంగా వాడవచ్చు. క్రియగా వాడవచ్చు. నామవాచకాన్ని క్రియగా మార్చుకోవచ్చు. క్రియనూ, నామవాచకాన్నీ కూడా విశేషణంగా మార్చుకోవచ్చు. క్రియా ప్రాతిపదికలను నామవాచకాలుగా మార్చుకొనే ప్రక్రియ చాలా విస్తారమయిన ప్రక్రియ ఎన్నయినా కొత్తమాటలను తయారు చేసుకోవడానికి ఉపయోగపడే (ప్రక్రియ. తెలు గులో క్రియను నామవాచకంగా మార్చుకోవడానికి ఉపయోగపడే ప్రత్యయాలు చాలా ఉన్నాయి. కొన్ని ప్రత్యయాలు ఈ ప్రక్రియలో ఏ విధంగా ఉపయోగపడుతున్నదీ గమనించే ఉంటారు. ఇంతకుముందు అకం అనే ప్రత్యయం చేరి ఏర్పడే రూపాలు చూశాం. అమ్మకం, వంటకం, పంపకం వంటి మాటలు ఈ (ప్రత్యయం చేరడం వల్ల ఏర్పడతాయి 'అకం' చేరి ఏర్పడ్డ మరో రెండు మాటలు మాపకం, మారకం. సంస్కృతంలో ఒక మాపకం ఉంది. జ్వరమాపకం అంటాం కదా. జ్వరాన్ని కొలిచే సాధనం అన్నమాట. అగ్నిమాపక దళం అని వాడుతున్నాం ఇక్కడ మాపకం సంస్కృతం కాదు. సంస్కృతమే అయితే అగ్నిని కొలిచే దళం అని అర్థం వస్తుంది. అగ్నిమాపకదళం అంటే మంటలను ఆర్పేదళం అని అర్థం. మాయు- మాపు= మాపకం. మాపు అంటే నశింపజేయు అని అర్ధం. మాపకం అంటే నశింప జేసేది. అగ్ని మాపకం అంటే అగ్నిని నశింపజేసేది. అయితే అగ్ని సంస్కృతం, మాపకం తెలుగు. రెండూ కలిసి సమాసం అయ్యాయి. తెలుగు వ్యాకరణాలు ఈ సమాసాన్ని ఒప్పుకోవు. దీన్నిదుష్ట సమానం అనీ వైరి సమానం అనీ అంటారు. అయినా సమాసంగా స్థిరపడి పోయింది.
మారకం అన్న మాటను మార్పిడి అన్న అర్ధంలో వాడుతున్నాం. విదేశీ మారకద్రన్యం అని సమాస రూపంలో ఈ మాట చాలా ఎక్కువగా వాడుకలో ఉంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ అని అర్థం. విదేశీ, ద్రవ్యం అనే రెండు సంస్కృత పదాల నడుమ మారకం ఇరికింది.
ఈ రెండు మాటలతో మరో సమస్య కూడా ఉంది. సంస్కృత పదాలు సమాసంలో పూర్వ పదంగా వచ్చినప్పుడు వాటిమీద ఉన్న ప్రత్యయం లోపిస్తుంది. వనము, కన్య అనే మాటలను కలిపితే వననకన్య అవుతుంది. భోజనం సమాసంతో మొదటి మాట అయితే భోజన అవుతుంది. ఉదాహరణకు భోజన సమయం. తెలుగుమాటల చివర ఉందే 'ము' ఆ విధంగా లోపించదు.
ళా
అమ్మకం - అమ్మక కాదు. వంటకం వంటక కాదు. అట్లాగే మాపకం, మారకం మాపక, మారక అని మారవు అందువల్ల కూడా అగ్నిమాపకదళం అన్న సమాసం ఏర్పడదు. మాపకపు దళం అనీ, మారకపు ద్రవ్యం అనీ అనవలసి ఉంటుంది.
ఎవరు వాడుకలోకి తెచ్చారో మొత్తానికి రెండూ స్థిరపడిపోయాయి. సంస్కృత పదాల సమాస నిర్మాణ పద్ధతుల ప్రభావం వల్ల ఇటువంటి సమాసాలు ఏర్పడ్డాయి. అయితే సాధ్యమయి నంతవరకు భాషా స్వభావానికి విరుద్ధముయిన ఇటువంటి సమాసల నిర్మాణం ప్రోత్సపించ ద్రగింది కాదు. సహజం కాదు కాబట్టే వీటి సామ్యంతో మరిన్ని సమాసాలు ఇటువంటివి ఏర్పడ
దు.
(క్రియా ప్రాతిపదికలను నామవాచకాలుగా మార్చే ప్రత్యయాలలో 'టి ఒకటి. ఆడు, పాడు మొదలయిన క్రియా ప్రాతిపదికల మీద ట ప్రత్యయం వస్తుంది ఆడు- ఆట అవుతుంది. పాడు- పాట అవుతుంది. ఊరు- ఊట అవుతుంది. ఊట అంటే ఊరిన ద్రవం. ఊట అంటే సారం అనీ, బలం అసీ కూడా అర్ధం ఉంది చెమరు- చెమట అవుతుంది.
తీడు- తీట అవుతుంది. తీడు అంటే పదునుపెట్టు, నులిపెట్టు, చీల్చు, (పండ్లు) కొరుకు, చిమ్ము అని అర్జాలున్నాయి తీట అంటే దురద, కండూతి. తోడు- తోట అవుతుంది ట్రిమ్మరు- త్రిమ్మట, క్రిప్పట అవుతుంది. వేసరు- వేసట అవుతుంది. వేసట అంటే అలయిక, అలసట. వనరు- వనట అవుతుంది వనట అంటీ దుఃఖం.
వండు- వంట అవుతుంది. మండు- మంట అవుతుంది. తునియు- తుంట అవుతుంది. తుంట అంటే ముక్క
చెరగు మీద ట ప్రత్యయం చేరినప్పుడు చె తరవాత ఉన్న వర్ణాలన్నీ లోపిస్తాయి. చె లోని ఎత్వం దీర్హమవుతుంది దీన్నే వ్యాకరణ పరిభాషలో చెప్తే తొలి అచ్చు మీది వర్దాలకు లోపమూ, ఆ తొలి అచ్చుకు దీర్జమూ వస్తుంది. అంటే చెరగు- చేట అవుతుంది చెరిగే సాధనం చేట అదేవిధంగా ముడుచు- మూట అవుతుంది.
దూటు అనే క్రియా ప్రాతిపదిక మీద 'డ' ప్రత్యయం చేరుతుంది దూటు అంటే పొడుచు, కుమ్ము, దీనినుండి దూడ ఏర్పడింది. తల్లిపాలు తాగేటప్పుడు పొదుగును ముట్టెతో కుమ్ముతుంది కాబట్టి అది దూడ.
చ్ మనభాషతి 99
దిద్దుబాటు - మెచ్చుకోలు కొన్ని ప్రత్యయాలు చేరినప్పుడు పదంలో మొదటి అక్షరంలోని అచ్చు దీర్ధమవుతుంది. దాని తరువాతి అక్షరాలు లోపిస్తాయి. చెడు + టు= చేటు అవుతుంది ఇటువంటివే పదు- పొటు, వేయు- వేటు, పొడుచు- పోటు మొదలయినవి. పడు అన్నది అనుబంధ క్రియగా కూడా వస్తుంది. తిరుగబడు, ఏర్పడు, తడబడు, మారుపడు, ఒడబడు వంటివి పదు అనుబంధంగా చేరిన క్రియలు పడు క్రియాపదాల మీద, నామవాచకాల మీద కూడా అనుబంధంగా వస్తుంది. కొన్నిచోట్ల పాటు అనేది చేరి నామవాచకాలు ఏర్పడతాయి నగు- నగుబాటు అవుతుంది. లొంగు- లొంగుబాటు అవుతుంది జరుగు- జరుగుబాటు అవుతుంది. చెల్లు- చెల్లుబాటు అవుతుంది. నగు అంటే నవ్వు నగుబాటు అంటే నవ్వులపాలు కావడం. ఎగతాళికి గురికావడం జరుగుబాటు అన్నప్పుడు జీవిక అని అర్ధం చెల్లుబాటు అంటే అధికారం సాగడం మరో ప్రత్యయంతో చెల్లుబడి అనే రూపం కూడా ఉంది. చెల్లుబాటు వంటిదే సాగుబాటు. రెండింటికీ అర్ధం ఒకటే. కొన్నిమాటల్లో పాటు వచ్చి చేరిందనడం కంటే 'టు ప్రత్యయం వచ్చి చేరిందని చెప్పడం ఉచితంగా ఉంటుంది. ఏర్పడు- ఏర్పాటు అవుతుంది వేరుపడు- వేర్పాటు అవుతుంది. తెగబడు
- తెగబాటు అవుతుంది. ఒదబదు- ఒడబాటు అవుతుంది. ఒడంబడిక అని అర్ధం. తిరుగబడు- తిరుగుబాటు అవుతుంది. పొరబడు- పొరపాటు అవుతుంది చిక్కుపడు- చిక్కుపాటు అవు తుంది. కట్టుబడు - కట్టుబాటు అవుతుంది. నియమం అని అర్ధం. తడబడు - తడబాటు అవు తుంది. దిద్దు- దిద్దుబాటు అవుతుంది. జి.యస్ వరదాచార్యులు గారు ఈ పేరుతో శీర్షికను నిర్వ హించారు కదా తప్పులను, పొరపాట్లను సరిదిద్దడం, వెసులు - వెసులుబాటు అవుతుంది. తీరిక అవకాశం అని అర్థం వీలు అన్న అర్ధం కూడా ఉంది గగుర్చు - గగుర్పాటు అవుతుంది జారు- జారుపాటు అవుతుంది జారుపాటు అంటే పొరపాటు. జారడం అనీ, నెమ్మది అనీ కూడా అర్ధం ఉంది తొట్రు- తొట్రుపాటు అవుతుంది. తొట్రుపాటు అంటే తడబాటు తొట్రు అంటే జారడం. ఇదే అర్ధంలో జీరుకుపాటు అనే మాట కూడా ఉంది. అడ్డు - అడ్డపాటు అవుతుంది. నిరోధం అని అర్ధం అడ్డుపాటు అనీ అవుతుంది. ఆటంకం అని అర్ధం, తోడ్పడు - తోడ్పాటు అవుతుంది సహాయం, సహకారం అని అర్ధం. మారుపడు - మార్చాటు అవుతుంది సాపడు - సాపాటు అవుతుంది సాపాటు అంటే భోజనం. విన్నబదు - విన్నబాటు అవుతుంది. వివర్ణత అని అర్ధం తీరు - తీరుబాటు అవుతుంది. మరో ప్రత్యయంతో తీరుబడి అని కూడా అవుతుంది. తీరిక, సావకాశం అని అర్ధం. సంస్కృత పదాల మీదకూడా పదు అనుబంధంగా చేరుతుంది. వాటిలో కొన్ని *“టు' చేరి నామవాచకాలవుతాయి. ఉదాహరణకు భంగపడు అనే మాటను తీసికోవచ్చు ఇది భంగపాటు అవుతుంది వైఫల్యం చెందడం, అవమానం పాలుకావడం అని అర్ధం ఏడబాయు - ఎడబాటు అవుతుంది వియోగం అని అర్ధం ఉదురు - ఉదుటు అవు 100 తిమనభాష
తుంది. ఉదుటు అంటే ఉద్ధతి, గర్వం అని అర్ధం.
కొనుట నుండి కోలు అనే మాట వచ్చింది బహువచన ప్రత్యయం లు చేరి ఏర్పడి ఉండవచ్చు. కొనుట+ లు= కోలు.
కోలు చేరి కూడా కొన్ని నామవాచకాలు ఏర్పడతాయి. అమ్ము - అమ్ముకోలు అవుతుంది. అమ్మకం అని అర్దం. కొను- కొనుగోలు అవుతుంది కొనడం అని అద్ధం.
అద్దు- అడ్డగోలు అవుతుంది. అ(ప్రసక్తంగా అని అర్ధం ఒక పద్ధతి లేకుండా. వాడు అడ్డ గోలుగా సంపాదించాడంటాం అద్దులేకుండా కావచ్చు. ఒప్పు- ఒప్పుకోలు అవుతుంది. అంగీ కారం అని అర్దం. ఆడు- ఆడికోలు అవుతుంది. ఆడు అంటే నిందించు అని ఒక అర్ధం. అడి కోలు అంటే నింద.
ఎల- ఎలగోలు అవుతుంది ఎలగోలు అంటే మొదటి పని అని అర్ధం. మొదటి యుద్ధం అని కూడా అర్ధం ఎలగోలు దళం అంటారు. సైన్యంలో ముందుండే భాగం. కాల్బలం, కోలా హలం అనీ, సంకుల సమరం, దొమ్మి అనీ కూడా అర్ధం ఉంది. కలుపు- కలుపుకోలు అవు తుంది. కలుపుకోలుతనం అని తనం చేర్చి గుణంగా వాడవచ్చు కలుపుకోలు అంటే కలివిడి. కలిసిపోవడం.
చెప్పు- చెప్పుకోలు అవుతుంది. చెప్పుకోలు విశేషణంగా వాడుకలో ఉంది. చెప్పుకొనే మాటలు. తెచ్చు- తెచ్చికోలు అవుతుంది. ఇదీ విశేషణమే. తెచ్చికోలు కోపం. నిజంగా లేక పోయినా తెచ్చిపెట్టుకున్నది. నటన
మెచ్చు- మెచ్చుకోలు అవుతుంది వేడు- వేడుకోలు అవుతుంది ప్రార్ధన అని అర్ధం. వీడు ఆ వీడుకోలు/షీడ్మ్కోలు అవుతుంది.
దల అనే అనుబంధం కూడా చాలా మాటల మీద చేరుతుంది. ఒప్పు- ఒప్పుదల అవు తుంది అంగీకారం అని అర్ధం. పెరుగు- పెరుగుదల అవుకుంది తరుగు- తరుగుదల అవు తుంది. ఎదుగు- ఎదుగుదల అవుతుంది
విడుచు - విడుదల అవుతుంది. పెంచు పెంపుదల అవుతుంది.
బ్ మనభాషతి 101
ఉంకువన - ఈవి - అరువు భాషలో ఆ భాష మాట్లాడే ప్రజల అవసరాలనుబట్టి మాటలుంటాయి. సమాజం అభివృద్ది చెందేకొద్దీ సమాజ అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అవసరాలతోపాటు భాషలో పదాలూ పెరుగుతాయి. కాల పరిణామంలో భాషలోని ఎన్నో పదాలు వాడుకలోనుంచి తొలగి పోతాయి. అట్లాగే ఎన్నో పదాలు కొత్తగా వచ్చి చేరతాయి మాటలను పెంచుకోవడానికి, అంటే కొత్త మాటలను కల్పించుకోవడానికి మనభాషలో ఎన్నో మార్గాలున్నాయి. అవకాశాలున్నాయి. అవసరానికి తగిన పదాన్నో పదబంధాన్నో తయారుచేసుకొనే ప్రయత్నం చేయవచ్చు. గత కాలంలో ఏదైనా ఇంగ్లీషు మాటో, హిందీ మాటో మరొకటో మనభాషలోకి తెచ్చుకోవ డంలో కొంత ఆలోచన ఉండేది. సాధారణంగా వీలయితే మన భాషలో ఒక పదాన్ని కల్పించు కోవడం, లేకపోతే ఒక పదబంధాన్ని కల్పించుకోవడం చేసే వాళ్ళం లేకపోతే ఆ మాటను అనువదించుకొనేవాళ్ళం ఈ ప్రయత్నంలో సంస్కృత పదాలను సంస్కృత పదనిర్మాణ పద్దతు లను మనం విస్తారంగా ఉపయోగించుకున్నాం. కాని ఇటీవలి కాలంలో కొత్త మాటలు కల్పించు కొనే ప్రయత్నం తగ్గించి అన్యదేశ్య పదాలను యధాతధంగా వాడుకోవడం ఎక్కువైంది. దీనివల్ల మన వ్యవహారంలో దేశ్యపదాలు తగ్గి అన్యదేశ్యాల సంఖ్య ఎక్కువవుతుంది పూర్వం సంస్కృత పదాలు విస్తృతంగా చేరి సంస్కృతం తల్లీ తెలుగు పిల్లా అనే అభి (ప్రాయం ఏర్పడింది. ఇప్పుడీ అన్యదేశ్యాలు. పదాలు అవసరమయినవ్పుడు అరువు తెచ్చుకోవ డంలో తప్పు లేదు కాని అవసరంలేకుండా కూడా అన్యదేశ్యాలను వాడడం ఉచితం కాదు. కృష్ణానది మీద బ్రిడ్జి కట్టారు, అనడం కంటే వంతెనకట్టారు అంటేయేం భాషలో ఉన్న పద నిర్మాణ పద్ధతుల్ని ఉపయోగించుకోవడం మానివేస్తే కొత్త మాటలు ఏర్పడవు. సాధ్యమయినంత వరకూ మన భాషలో పద నిర్మాణ పద్ధతులను ఉపయోగించి కొత్తే మాటలు కల్పించుకోవాలి. అవరమయితే భాషలో ఈనాడు వాడుకలో లేని మాటలను కూడా మళ్ళీ వాడుకలోకి తీసుకురావచ్చు నేటి అవసరానికి అనుగుణంగా వాటిని వాడుకోవచ్చు. ఉంకించు అనేమాట ఒకటి ఉంది ఉంకించు అంటే పూను, యత్నించు అని అర్ధం. దీనిమీద 'వ' అనే ప్రత్యయం చేరి ఉంకువ అనేమాట ఏర్పడింది ఈ మాటకు నివాసస్థానం అనీ, నిలకడ, స్టెర్యం అనీ అర్ధం. ఉంకువకు కన్యాశుల్కం అని కూడా అర్ధం ఉంది. ఓలి అని కూడా అంటారు ఉంకువ అంటే కానుక అని కూడా అర్ధం. ఉంకించుకు పర్యాయపదంగా ఊకించు అనేమాట ఉంది ఊకు- ఊకించు. దీనిమీద 'వి చేరి ఊకువ అవుతుంది ఊకున అంటే ఆధారం, ఆశ్రయం, నెలవు 'వి ప్రత్యయం చేరి ఏర్పడే నామవాచకాలు చాలా ఉన్నాయి ఎక్కు అంటే అధిష్టించు, పైకిపోవు, ప్రసరించు, అధికమగు, సంభవించు, నెరవేరు, ఎదుర్శొను, స్పష్టమగు వంటి అర్దాలు న్నాయి. కాని ఎక్కువ అంటే అధిక్యం అనిమాత్రమే అర్ధం ఇటువంటిదే ఎగు అనే క్రియాపదం. దీనికి అనుబంధ క్రియలను చేర్చి అనేక రకాలుగా వాడవచ్చు. ఎగగట్టు అంటే పైకి కట్టడం. ఎగగొట్టు అంటే తీర్చవలసిన అప్పును తీర్చకపోవడం ఎగగొలుపు అంటే పులికొల్పడం. ఎగగ్రోలు అంటే పీల్చడం ఈ విధంగా ఎగజల్లు, ఎగజేవు, ఎగజోపు, ఎగదట్టు, ఎగదన్నుు 102 అమనబాష
ఎగదీయు, ఎగద్రోయు, ఎగబడు, ఎగబట్టు, ఎగబారు, ఎగబీల్చు, ఎగబెట్టు, ఎగబోయు, ఎగబాకు వంటి అనేక క్రియారూపాలు ఏర్పడతాయి. ఈ మాటలన్నింటిలోను 'ఎగూకు పైకి అనే అర్ధం. ఎగును విశేషణంగా కూడా వాడతాం. ఎగుబుజంబులవాడు అని వర్ణిస్తారు కదా. ఎగు+వ ఎగువ అవుతుంది. ఎగువ అంటే మీదు. అవతలి భాగం. ఇటువంటిదే దిగువ. దిగువ అంటే క్రిందు ఇవతలిభాగం. ఎక్కువలాంటిదే తక్కువ.
కొద- కొదవ అవుతుంది. కొదవ అంటే కొరత, లేమి, తక్కువతనం, సంశయం, తప్పు. చాటు అంటే డపవ్పువంటివి వాయించి అందరికీ తెలియజేయడం, వెల్లడించడం. చాటువ అంటే (ప్రఖ్యాతి, ప్రసిద్ది చాటువ అంటే ఉదాహరణం, దృష్టాంతం అనికూడా అర్ధం
చేరు- చేరువ అవుతుంది. చేరు అంటే సమీపించు. చేరువ అంటే సమీపం, దగ్గర. చేరువ అంటే కలయిక అనే అర్ధం కూడా ఉంది. సేన అనే అర్థం కూడా ఉంది. మనుష్యుల గుంపును కూడా చేరువ అంటారు
తెగు- తెగువ అవుతుంది తెగువ అంటే సాహసం బెదార్యం, దాతృత్వం అని కూడా అర్ధం. నిర్ణయం అనీ, వాడి అనీ కూడా అర్థాలున్నాయి. తెట్టు- తెట్టువ అవుతుంది తెట్టువ అంటే తెట్టె, సమూహం, స్థానం. తీరు-తీరువ అవుతుంది. పన్ను అని అర్ధం. నీటితీరువ అంటాం.
నడచు- నడవ అవుతుంది. నడవ అంటే తలవాకిలికి నడిమి వాకిటికీ మధ్య ఉండేచోటు. నడవ అంటే సేతువు అని కూడా అర్ధం ఉంది. మరో అర్ధం దారి. తెరువు, త్రోవ, దారి, తెన్ను సరవి, చనుప, నడవ, చొప్పు, జాడ, డొంక ఈ మాటలన్నీ మార్గం అన్న అర్ధంలో వాడుకలో ఉన్నాయి నిలుచు- నిలువ అవుతుంది. నిలువ అంటే నిలిచిన వస్తువు. డబ్బు నిలువ, ధాన్యపు నిలువలు అని వాడుతున్నాం.
విలుచు- విలువ అవుతుంది. విలుచు అంటే కొను విలువ అంటే వెల, మూల్యం, ధర ఈ విలువను వస్తువు వెల అన్న అర్ధంలోనే కాకుండా నైతిక విలువలు, మానవ విలువలు, సామాజిక విలువలు అని విస్తరించి వాడుతున్నాం.
వి అని మరో ప్రత్యయం ఉంది ఈ అంటే ఇచ్చు. దీనికి వి చేరితే ఈవి అవుతుంది ఈవి అంటే దాతృత్వం. తనియు- తనివి అవుతుంది. తృప్తి అని అర్ధం. తెలియు- తెలివి అవుతుంది. జ్ఞానం అని అర్ధం
వు అనే ప్రత్యయం చేరి అరుచు- అరువు అయింది. అరువు అంటే తరువాత ఇచ్చే పద్ధతిలో చేసే అప్పు. ఉరు- ఉరువు అవుతుంది. తగినదని అర్ధం. ఉలియు- ఉలివు అవుతుంది శబ్దమని అర్ధం. ఎరియు- ఎరివు అవుతుంది. తాపం, బాధ అని అర్ధం కొలుచు- కొలువు అవు తుంది ఆస్థానం అని అర్ధం. ఉద్యోగమని ఇప్పుడు వాడుక. తగు- తగవు అవుతుంది తగినది, న్యాయం, కలహం, తీర్పు, మేలు, కానుక, రీతి అని అర్థాలు. తదయు-- తడవు, తొడుగు- తొడవు, నగు- నగవు/వ్వు, నెరయు- నెరవు, నెలయు-నెలవు, బిగియు-బిగువు అవుతాయి. పుట్టు - పుట్టువు అవుతుంది. జన్మ అని అర్ధం. చచ్చు- చావు అవుతుంది పూచు- పూవు అవుతుంది (ప్రచ్చు-పుర్వుగీప్రువ్వు అవుతుంది. పురుగు అని అర్ధం.
చ్ చమునభాషతి 103
మరికొన్ని కృత్ప్చత్యయాలు తెలుగులో కృత్త్రత్యయాలు చాలా ఉన్నాయి. అందుకే వ్యాకర్తలు వీటిని ప్రయోగాల నుండి తెలుసుకోవాలంటారు. ఐడి అన్నది ఒక ప్రత్యయం. వచ్చుకు బడి చేరిస్తే రాబడి అవుతుంది. దిగుకు ఐడి చేరిస్తే దిగుబడి అవుతుంది. అమ్ము- అమ్ముబడి అవుతుంది రాబడి వంటిదే వరుం బడి. నిలుచుకు కడ చేరిస్తే నిలుకడ/నిలకడ అవుతుంది. వచ్చు+కడ- రాకడ అవుతుంది. పోవు+కడ-పోకడ అవుతుంది. పన్ను+గడ- పన్నుగడ అవుతుంది. పన్ను గడ అంటే యుక్తితో చేసిన ఏర్పాటు. మను-మనుగడ అవుతుంది. మనుగడ అంటే బతుకు, జీవనం. విరుగు- విరు గడ/విరగడ అవుతుంది. పీడావిరగడయిందంటారు ఉడుగు అంటే మాను, విడుచు, త్యజించు అని అర్దం. దీనికి కువ ప్రత్యయం చేరిస్తే ఉడుకువ అవుతుంది. ఉడుకువ అంటే విభ్రాంతి, ఊరట, తెరపి. ఎరుగు- ఎరుకువ అవుతుంది. ఎరుకువ అంటే తెలివి, జ్ఞానం. తేగు- తేకువ అవుతుంది. తేగు అంటే వణకు అని అర్ధం. తేకువ అంటే భయం, జంకు, ధైర్యం, గర్వం, ఉత్సాహం, దృఢ సంకల్పం, బింకం, వివేకం, మర్యాద, హద్దు, ఓర్పు, సమగ్రత, రీతి మొదలైన అర్థాలున్నాయి. వేగు-వేకువ అవుతుంది వేకువ అంటే తెల్లవారుజాము. అమి ప్రత్యయం భావార్థంలోనూ వస్తుంది. వ్యతిరేకార్ధంలోనూ వస్తుంది. కూడు+అమి- కూటమి అవుతుంది. కూటమి అంటే చేరిక, చెలిమి, కలయిక ఓడు-ఓటమి అవుతుంది. ఓటమి అంటే అపజయం. ఒంటు-ఒంటమీ అవుతుంది. ఇక్కడ వ్యతిరేకార్ధం వచ్చింది. ఒంటు అంటే అనుకూలించు, సరిపడు. ఒంటమి అంటే వైరం, పగ. ఒవ్వు అన్నా, సరిపడు, గిట్టు అని అర్ధం. ఒవ్వమి అంటే గిట్టకపోవడం, ద్వేషం. వ్యతిరేకార్థంలో 'అమి” ప్రత్యయం విస్తృతంగా వస్తుంది. తిను-తినమి, వచ్చు- రామి, వెళ్ళు-వెళ్ళమి, గిట్టు-గిట్టమి, చదువు- చదవమి, కను- కనమి, విను- వినమి, కొట్టు- కొట్టమి, వండు- వండమి మొదలైన విధంగా ఏ క్రియాప్రాతి పదికనయినా వ్యతిరేక క్రియానామంగా మార్చుకోవచ్చు. ఒత్తుకు ఇడి ప్రత్యయం చేరితే ఒత్తిడి అవుతుంది ఒరయు, రాయులు ఒరపిడి, రాపిడి అవుతాయి. తాకు- తాకిడి అవుతుంది. దోచు- దోపిడి అవుతుంది మార్చు-మార్చిడి అవు తుంది. విను-వినికిడి అవుతుంది. కలయు- కలివిడి అవుతుంది. కట్టు-కట్టిడి అవుతుంది. క్రూరం అనీ, దిట్ట అనీ అర్ధం. కలుగుకు వ్యతిరేకార్థంలో “లే అనే రూపం ఉంటుంది. దీనిమీద అడి ప్రత్యయం చేరి లేవడి అవుతుంది. నడచుకు 'అడి' ప్రత్యయం చేరితే నడవడి అవుతుంది. ముట్టు-ముట్టడి అవుతుంది. ముట్టు అనేమాటకు తాకు, పట్టుకొను, తీసికొను, మీటు, వ్యాపించు, కరచు, బాధించు, ఆవ రించు మొదలైన అర్ధాలున్నాయి. ముట్టడి అన్నప్పుడు ఈ ఆవరించు, చుట్టుకొను అన్న అర్ధం వస్తుంది. చుట్టుముట్టి నిర్బంధించడం కట్టు కట్టడి అవుతుంది. కట్టడి అంటే నియతి, కట్టుబాటు. కట్టడి కట్ట అంటే చెలియలి కట్ట ఓర్చుకు 'ఇమి” ప్రత్యయం చేరితే ఓరిమి అవుతుంది. కలుగు- కలిమి అవుతుంది. 104 అమనభాష
కూర్చు- కూరిమి అవుతుంది తాల్చు-తాలిమి/తాల్మి అవుతుంది. ఓర్పు, ధైర్యం అని అర్ధం
కమియుకు “ఇలి' ప్రత్యయం చేరితే కమికిలి అవుతుంది కమికిలి అంటే పట్టిలి ఈ మాట కూడా పట్టుకు 'ఇలి' (ప్రత్యయం చేరగా ఏర్పడ్దదే. చేతివేళ్ళు వంచిన పుడిసిలి అని అర్ధం. పుడుకుకు “ఇలి' చేరి పుడికిలి/పుడిసిలి ఏర్పడుతుంది. కమికిలి, పట్టిలి, పుడిసిలి సమానార్ధకాలు. వెక్కు- వెక్కిలి అన్నా అర్ధం ఒకటే. ఏద్చేటప్పుడు వచ్చే ధ్వని. వెక్కిళ్ళు అని బహువచన రూపంలో దీనికి వాడుక ఎక్కున.
కాచుకు 'అలి' ప్రత్యయం చేరితే కావలి అవుతుంది కుడుచుకు ఇతి చేరితే కుడితి అవుతుంది. పాతుకు 'దు' చేరితే పాదు అవుతుంది. పంచుకు 'గ ప్రత్యయం చేరితే పంగ అవు తుంది. నోచుకు 'ము' చేరితే నోము అవుతుంది. ఉమియుకు 'మ్ము' చేరితే ఉమ్ము అవుతుంది. పులియుకు '“ఉ' చేరితే పులుసు అవుతుంది. వినుకు 'కలి' చేరి వినుకలి అవుతుంది. పిండుకు “టు' చేరితే పిట్టు అవుతుంది.
దబ్బు అంటే బొంకు. దబ్బుకు “అరి ప్రత్యయం చేరితే దబ్బర అవుతుంది. అసత్యమని అర్ధం. ఇరియుకు "కు ప్రత్యయం చేరితే ఇరుకు అవుతుంది. చెడుకు “గు ప్రత్యయం చేరితే చెడుగు అవుతుంది. “ట్టి ప్రత్యయం చేరితే చెట్ట అవుతుంది చెడుపుకు “ఎ ప్రత్యయం చేరితే చెడిపె అవుతుంది. బీర్రుకు “సు ప్రత్యయం చేరితే బిరుసు అవుతుంది. తినుకు “డి ప్రత్యయం చేరితే తిండి అవుతుంది. చేయుకు “దము” చేరితే చెయ్డుము అవుతుంది. చేష్ట అని అర్ధం. దూటుకు 'డ' చేరితే దూడ అవుతుంది. దూటు అంటే కుమ్ము అని అర్ధం. తెరచుకు 'పి' చేరితే తెరపి అవుతుంది. విరామం అని అర్ధం.
(తచ్చుకు “అను చేరితే త్రచ్చన అవుతుంది ్రచ్చన అంటీ చిలకడం. వడ్డించు- వడ్డన అవుతుంది వీచు- వీవన అవుతుంది. దువ్వుకు 'ఎన' చేరితే దువ్వెన అవుతుంది. పోచుకు “గు చేరితే పోగు అవుతుంది తూరుకు 'అరి ప్రత్యయం చేరితే తువ్వర/శుప్పర అవుతుంది. తసుకు అంటే మోసం. దీనికి అరి చేరితే తసుకరి అవుతుంది. టక్కులాడు, టక్కులాడి అని అర్ధం.
తారు అంటే సంచరించు, అటూ ఇటూ తిరుగు. దీనికి 'అసం' చేరితే తారసం అవుతుంది. తారసం అంటే సమీపించినది, తటస్థించినది, సమీపం అని అర్ధం రాయు (వ్రాయు)- రాయసం అవుతుంది రాయసం అంటే లేఖ అని అర్ధం లేఖకుడు అనీ అర్ధం. రాజుల దగ్గర లేఖక పదవిలో ఉన్న రాయసాలు కొందరు (ప్రముఖ స్టానాలు సంపాదించి మంత్రుల స్థాయిని పొందారు
కొలుచుకు 'ది” చేది కొలది అవుతుంది. చేయు- చెయిది, పాతు-పాది, ప్రోచు- ప్రోది, విడియు- విడిది అవుతాయి చనుకు “వి చేరి చనుప అవుతుంది. చనుప అంటే తోవ. చాచు- చాప అవుతుంది కినియుకు “ఉకి చేరి కినుక అవుతుంది. నాకు- నాలుక అవుతుంది.
ఎడయుకు “అం” చేరితే ఎడం అవుతుంది. తిరియు- తిరిపం అవుతుంది. మురియు- మురిపం అవుతుంది. ఉబ్బు- ఉబ్బరం అవుతుంది
గ్ మనభాషతి 105
ఖిన్న ప్రత్యయాలు - ఖన్నార్ధాలు (క్రియా ప్రాతిపదికలను నామవాచకాలుగా మార్చుకొనే ప్రక్రియలో తెలుగులో ఎన్నో ప్రత్యయా లను వాడుతున్నాం. ఒక్కొక్క ప్రత్యయం ఎన్నో ప్రాతిపదికల మీద చేరి అనేక నామవాచక పదాలను నిర్మించుకోవడంలో తోద్బడుతుంది. ముఖ్యంగా అటం/అడం, డు వంటి ప్రత్యయాలు ఏ క్రియా ధాతువు మీదనయినా చేర్చుకొనే అవకాశం ఉన్నవి అనటం, తినటం, రావటం, పోవటం - అనుడు, తినుదు, వచ్చుడు, పోవుడు ఈ విధంగా ఈ ప్రత్యయాలకు ప్రయోగ విస్తృతి ఉంది భాషలో ఇది చాలా ఉపయోగకరమయిన ప్రక్రియ. ఒక ప్రత్యయం అనేక క్రియా ప్రాతిపదికల మీద చేరినట్లుగానే వేరువేరు ప్రత్యయాలు ఒకే (క్రియా ప్రాతిపదిక మీద కూడా చేరవచ్చు. వేరువేరు ప్రత్యయాలు చేరినప్పుడు అర్ధంలో మార్పు ఉండవచ్చు. ఉండకపోవచ్చు. అంటే ఒకటికంటే ఎక్కువ ప్రత్యయాలు ఒకే అర్ధాన్ని బోధించ వచ్చు. వేరు అర్భాల్నీ బోధించవచ్చు. అల్లు అనే క్రియా ప్రాతిపదికకు అకం అనే ప్రత్యయం చేరితే అల్లకం అవుతుంది ఇక ప్రత్యయం చేరితే అల్లిక అవుతుంది అర్ధంలో మార్పు లేదు. నమ్మకం, నమ్మిక కూడా ఇటువంటివే. విలుచు అన్న ప్రాతిపదిక నుండి ఏర్పడ్డ మాటలు విలువ, వెల. ఈ రెండింటికీ భేదమూ ఉంది పోలికా ఉంది ధర అనే అర్ధంలో ఈ రెండు మాటలూ వాడవచ్చు. కాని వీటిని అన్ని సందర్భాలలోనూ ఒకదాని బదులు మరొకటి వాడడానికి వీలులేదు. నేటి సమాజంలో నైతిక విలువలు పడిపోతున్నాయి అన్న వాక్యంలో విలువలు అన్న మాటకు బదు లుగా వలలు అన్న మాటను వాడటం కుదరదు. మొలచు నుండి మొలక, మొక్క అన్న మాటలు ఏర్పడ్డాయి. మొలక మొక్క కంటే చిన్నది. వంచు నుండి వంపు, వంక, వంకర ఏర్పడ్డాయి. వంపు, వంకరలకు అర్ధంలో పోలిక ఉంది. అయితే ఆలంకారికంగా వంకను వాడినట్లు వంపును వాడడానికి వీలులేదు వాగూ వంకాలో వంకకు బదులు వంపు వాడలేం ఈ పుస్తకానికి ఏ వంకా లేదు అంటే లోపం లేదని అర్ధం. అమ్మాయికి వంకపెట్టడానికి వీల్లేదు అన్నా అంతే. లోపం చూపించడానికి వీళ్లేదని అర్ధం. ఇక్కడా వంపు వాడడానికి వీల్లేదు వంకకు మిష అని అర్ధం ఉంది. ఈ అర్ధంలో వంపును వాడడానికి వీల్లేదు. కాయు నుండి కాపు, కాత, కాయ ఏర్పడ్డాయి. కాపు, కాత సమానార్ధకాలు. కాయకు అర్థంవేరు. నడచు నుండి నడ, నడక, నడత, నడవ, నడవడి ఏర్పడ్డాయి. నడ, నడక, నడత, నడవడి వీటిని ప్రవర్తన అన్న అర్థంలో వాడవచ్చు నడ, నదకలను నడచు ధాత్వర్ధంలో కూడా వాడవచ్చు. నడత, నడవడులను అట్లా వాడదానికి వీలులేదు. నదవ అంటే దారి. అది తక్కిన వాటికి భిన్నమైనది. ముదియు నుండి ముది, ముదిమి, ముదుక, ముదుసలి వంటి మాటలు ఏర్పడ్డాయి. ముది, ముదిమి అన్న మాటలకు వార్ధక్యం అని అర్ధం. ముదుకు ముదుసలి అన్న మాటలకు వృద్ధుడని అర్ధం. ముదుసలి మొగుడు అని ముదుసలిని విశేషణంగా కూడా వాడవచ్చు. ముది వగ్గు అని ముదిని కూడా విశేషణంగా వాడవచ్చు మోయు నుండి మోపు, మోత ఏర్పడ్డాయి. రెండింటికీ కొద్ది అర్ధభేదం ఉంది నిలుచు నుండి నిలుపు, నిలువ, నిలుకడ ఏర్పడ్డాయి. నిలుపు అంటే ఆపుదల. నిలువ అంటే నిలిచిన వస్తువు. “ధాన్యం నిలువ తగినంతగా ఉంది" అనవచ్చు. షా
డబ్బు నిలువ, నీటి నిలువ అనవచ్చు నిలుకడ అంటే స్థిరత్వం. చేరు నుండి చేరువ, చేరిక ఏర్పడ్డాయి. చేరువ అంటే సమీపం. చేరిక అంటే సమీపం అన్న అర్థంతోపాటు కలిసి ఉండటం, స్నేహం, వలపు అన్న అర్భ్జాలూ ఉన్నాయి.
ముడుచు నుండి ముడి, మూట ఏర్పడ్డాయి. ముడికి మూట అన్న అర్థమూ ఉంది. కాని గ్రంథి అన్న అర్జానికి ఎక్కువ వాడుక. వెంట్రుకలు, తాడు, దారం, బట్ట మొదలయిన వాటిని ముడివేయదం, కనుబొమలు ముడివేయడం కూడా. (వ్రాయుశాయు నుండి వ్రాత/ాత, రాయసం ఏర్పడ్డాయి. రాయసం అంటే రాసేవాడు.
వండు నుండి వంట, వడ్డన, వంటకం అన్న మాటలు ఏర్పడ్డాయి. వంట అంటే వండే ప్రక్రియ. వంటకం అంటే వండిన పదార్ధం వడ్డన అంటే వడ్డించడం
చెడు నుండి చెరుపు, చెడుపు, చెడుగు, చేటు, చెట్ట, చెడ్డ, చెడిది, చెడిపె వంటి మాటలు ఏర్పడ్డాయి. చెరుపు, చెడుపు ఒకటే చేటు, చెట్ట, చెడ్డలకు కీడు అని అర్ధం. అయితే చెట్ట, చెడ్డ లను విశేషణాలుగా ఉపయోగించవచ్చు. చేటును అట్లా విశేషణంగా వాడలేం. చెడిది అంటే కీడు, ఆపద, అశుభం అని అద్ధం చెడిపె/చెడిప అంటే దుష్ప్రవర్తన గల స్రీ అని అర్ధం. చెడుగు అంటే దుష్టం అనే అర్దంతోపాటు ధూర్తుడు అనే అర్ధం కూడా ఉంది అశుభకార్యం, చెడ్డ్దమాట అని కూడా అర్ధం. క్రూరమనే అర్థమూ ఉంది
కూడు నుండి కూడిక, కూటమి అనే మాటలు ఏర్పడ్డాయి కూడిక అంటీ కలయిక, కలపడాన్ని కూడిక అంటున్నాం. ఈ అర్ధంలో కూటమికి వాదుకలేదు. కలయిక, పొందు అన్న అర్ధంలో రెండు మాటలూ సమానమే. తటస్థ రాజ్యాల కూటమి అన్నప్పుడు కూటమికి సమూహం అని అర్ధం. ఈ ధాతువునుండే వచ్చిన కూటము అన్న మాటకూ కూటమి అనే అర్ధం ఉంది. ఈ మాటకు చావడి, సభాభవనం అన్న అర్ధం కూడా ఉంది. మరోమాట కూటువ. కూటువ అంటే గుంపు, కూటమి. ఇదే ధాతువు నుండి ఏర్పడ్డ ఇంకోమాట కూడలి నదులు కాని, దారులుకాని కలసినచోటు. కూడుదల అంటే లాభం. ఈ విధంగా కృత్ప్రత్యయాలు భాషలో పద సంపద పెరగడానికి తోడ్పడతాయి
బ్ మనభాషళి 10/7
తధద్ధితనామాలు
[క్రియల నుండి నామవాచక పదాలను నిర్మించుకున్నట్లే నామవాచకం నుండి కూడా మరో నామవాచకాన్ని నిర్మించుకోవచ్చు. ఈ ప్రక్రియ రెండు రకాలుగా జరుగుతుంది. నామవాచక పదం మీద ఏదైనా ప్రత్యయాన్ని చేర్చి మరో నామవాచకాన్ని తయారుచేసుకోవడం ఒక పద్ధతి. నామవాచకం మీద మరో నామవాచకాన్ని చేర్చి కొత్త మాటను నిర్మించుకోవడం రెండో పద్ధతి. వీటీలో మొదటి పద్ధతిలో చేరే ప్రత్యయాలను తద్దిత ప్రత్యయాలనీ, తయారయ్యే నామవాచకా లను తద్ధితనామాలనీ వ్యాకరణాలు వ్యవహరిస్తాయి. రెండో పద్ధతిలో తయారయ్యే మాటలు సమాసాలు.
తద్ధిత ప్రత్యయాలు నామవాచకాల మీదా చేరవచ్చు. విశేషణాల మీద కూడా చేరవచ్చు. తద్ధిత ప్రత్యయం చేరడంవల్ల ఏర్పదే పదాలకు అర్ధంలో మార్పు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అంటే కొన్ని ప్రత్యయాలు చేరినప్పుడు పదానికి ఉందే అర్ధంలో మార్పు ఉండదు. కొన్ని (ప్రత్యయాలు చేరినప్పుడు పదానికి ఉన్న అర్ద్జానికి సంబంధం ఉన్న విశిష్టాద్ధం ఏర్పడుతుంది.
ఒక వస్తువు ఉందనుకోండి ఆ వస్తువుకు ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని లేదా స్వభా వాన్ని మనం విడిగా గుర్తించవచ్చు. అయితే ఆ వస్తువుకు ఒకటికంటే ఎక్కువ ధర్మాలు కూడా ఉండవచ్చు. ఈ ధర్మాలన్నింటినీ విడివిడిగా చెప్పిందానికంటే ఆ వస్తువునే పేర్కొనడం తేలికగా ఉంటుంది. సమగ్రంగానూ ఉంటుంది భీముడు ఒక పౌరాణిక వ్యక్తి. శక్తికీ, పరాక్రమానికీ, భోజన పరాక్రమానికీ, వంటకీ ప్రసిద్ది. ఖీమునితనం అన్నప్పుడు ఈ లక్షణాలన్నీ చెప్పినట్లే. భీముడిలో సందర్భాన్నిబట్టి ఒక లక్షణాన్ని గుర్తించడానికిగాని, అన్ని లక్షణాలనూ గుర్తించడానికి గానీ ఈ భీమునితనం అన్నమాటను ఉపయోగించవచ్చు. “తనం” అన్న ప్రత్యయాన్ని వస్తువు ధర్మాన్ని బోధించడానికి ఉపయోగిస్తాం వ్యక్తుల లక్షణాన్ని ఉద్దేశించినప్పుడు ఆ వ్యక్తుల పేరుమీద 'తనం' చేర్చి వాడవచ్చు. గాంధీతనం/గాంధీగారితనం అనవచ్చు ఆయనలో ఇంకా కొంత గాంధీతనం మిగిలి ఉంది అంటే ఆ వ్యక్తిలో ఇంకా గాంధీగారి లక్షణాలు/స్వభావం ఉందని అర్థం ఇటువంటి సందర్భాల్లో వ్యక్తిలోని ప్రధాన లక్షణమే గోచరిస్తుంది. రావణుడితనం ఉంది అంటీ రాక్షసత్వం వంటి చెడు లక్షణమే ముందు తోస్తుంది. దుర్యోధనుడి తనం అన్నా అంతే ధృతరాష్ట్రుడి తనం అన్నప్పుడు ధర్మానికి వ్యతిరేకంగా నడిపించే పుత్ర ప్రేమ స్ఫురిస్తుంది. రామునితనం అంటే ఒక ఉత్తమ మానవుడన్న అర్ధం స్ఫురిస్తుంది సందర్భాన్ని బట్టి పితృవాక్య పరిపాలన, ధర్మపాలన, ఏకపత్సీవ్రతం, శరణాగత రక్షణ వంటి వాటిలో ఏదైనా స్ఫురించవచ్చు లక్ష్మణునితనం అంటే అన్నగారి అడుగుజాడల్లో నడిచే తమ్ముని స్పభావం స్ఫురిస్తుంది.
చిన్నతనం అంటే చిన్నవాడి లక్షణం. ఈ మాటను రెండు రకాలుగా వాడుతున్నాం. వయసునుబట్టి చిన్నతనం ఒకటి. వయసు తక్కువ కాబట్టి అనుభవంలేదు, లోకం తెలియదు అందువల్ల అమాయకుడు/ అమాయకురాలు అన్న అర్ధం ఒకటి. మరొకటి అల్పత్వం. అమర్యా దను అనుభవించడం. ఆయనకు చాలా చిన్న తనం కలిగింది. అన్నప్పుడు ఇదే అర్ధం బాల్యం అన్న అర్ధంలోనూ వాడుతున్నాం. నా చిన్నతనంలో అంటే నా బాల్యంలో అని అద్ధం
పెద్దతనం అంటే పెద్దవాడి లక్షణం వృద్దాప్యం అని ఒక అర్ధం పరిపక్వత అని మరొక
108 అతిమనభాష
అర్ధం. ఈ పరిపక్వత వయస్సులో మాత్రమేకాదు. ఆలోచనలోనూ, స్వభావంలోనూ, (ప్రవర్తన లోనూ కూడా. పెద్దతనం పెత్తనం అయి యాజమాన్యం, అధికారం అన్న అర్ధం ఏర్పడింది. చిలిపివాడి స్వభావం చిలిపితనం. అట్లాగే అల్లరితనం. పిరికివాడి స్వభావం పిరికితనం. ముసలివాడి లక్షణం ముసలితనం. ముసలివాడు అంటే ఇక్కడ కేవలం పురుషుడు కాదు. వృద్ధుడు, వృద్ధురాలు ఇద్దరి లక్షణమూ ముసలితనమే. ఇటువంటివే కొంటెతనం, మొండితనం, గయ్యాళితనం, కుర్రతనం, గరువతనం, గడుసుతనం, పెంకితనం, మంచితనం, చెడ్డ్దతనం, లేకితనం, వెకిలితనం, మకిలితనం, మకురుతనం, ఆడతనం, మగతనం మొదలైనవి. చలాకీగా ఉందే వ్యక్తి లక్షణం చలాకీతనం. పేదవాడి లక్షణం పేదతనం. అట్లాగే బీదతనం. దొంగ లక్షణం దొంగతనం. శరీరావయవ లోపాన్నీ వ్యక్తీకరించవచ్చు. కుంటితనం, గుడ్డితనం ఇటువంటివి.
వయో, గుణ వాచకాలలాగానే రంగు రుచులను తెలిపే మాటలమీదా 'తనం' ప్రత్యయం వస్తుంది. నల్లదనం, తెల్లదనం, ఎర్రదనం, పచ్చదనం, పుల్లదనం, తియ్యదనం, కమ్మదనం మొదలయినవి.
ఒజ్జ అంటే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడి లక్షణం ఒజ్జతనం. వెజ్డు అంటే వైద్యుడు. అతని లక్షణం వెజ్జ్డుతనం. ప్రస్తుతం వృత్తులకు సంబంధించిన ఇటువంటి ప్రయోగాలు అంతగా వాడుకలో లేవు. పనివాడు, ఆటగాడు వంటి మాటలమీద కూడా తనం చేరుతుంది. పనివాడి తనం అన్నప్పుడు పనివాడు అన్నమాటకు ఒక పనిలో నేర్చు కలిగినవాడని అర్ధం. పనివాడితనం అంటే నైపుణ్యం అని అర్ధం. పనితనం అన్నా అర్థం ఇదే.
క్రియాజన్య విశేషణాలమీద కూడా 'తనం' చేర్చవచ్చు. వాడిది తెలిసినతనమూ కాదు తెలియని తనమూ కాదు అనవచ్చు లేదా తెలిసీ తెలియని తనం అనీ అనవచ్చు.
ఇతర తద్ధిత ప్రత్యయాలు చేరి నామవాచకాలయిన మాటలమీద కూడా “తనం' చేర్చ వచ్చు. తిరుగుబోతు, ఆశబోతు, కుళ్ళుబోతుల నుండి తిరుగుబోతు తనం, ఆశబోతుతనం, కుళ్ళుబోతుతనం ఏర్పడతాయి. ఇటువంటివే తగవులమారితనం, ఏడుపుగొట్టుతనం, కలుపు కోలుతనం, నేర్పరితనం, మాటకారి తనం, మోసకారితనం మొదలయినవి.
లెక్కలేనితనం, సిగ్గులేనితనం అని వ్యతిరేక క్రియాజన్య విశేషణాలతోనూ వాడవచ్చు. కొన్ని తత్సమ పదాలమీద కూడా 'తనం' చేరుతుంది. బుద్ధిమంతతనం ఇటువంటిదే. 'తనం' చాలా విస్తృతంగా వాడే తద్దిత ప్రత్యయం.
చ్ మనభాషతి 109
త్వార్థ, స్వార్ధ ప్రత్యయాలు
తనంలాంటి తద్దిత ప్రత్యయాలే రికం, ఇమి, న, ఇక, పు. రకం చిన్న పెద్ద వంటి మాటలమీద వస్తుంది. చిన్నరికం, పెద్దరికం, చుట్టరికం, దొంగరికం, పేదరికం, బీదరికం, రాజరికం, అత్తరికం, కోడంట్రికం, కోడరికం, తొత్తరికం, వెజ్జరికం, కన్నెరికం మొదలైనవి రికం చేరి ఏర్పడే మాటలు. కన్నెరికం అంటే కన్యాత్వం. ఈ మాటకు మరో అర్ధం కూడా ఏర్పడింది. వారకన్యల ప్రథమ సంగమం అన్న అర్ధంలో కావ్యాలలో ఈ మాటను ప్రయోగించారు, కన్నెరికం పెట్టడం అని కూడా అంటారు. ఇటువంటి మాటలకు ప్రయోగం క్రమంగా తగ్గిపోతుంది. మరికొన్ని తిట్లు కూడా ఈ ప్రత్యయంతో వాడుకలో ఉన్నాయి. పెంపరికం అంటే పోషకత్వం.
పేరు, కడు వంటి మాటలమీద ఇమి ప్రత్యయం చేరి తద్ధితనామాలు ఏర్పడతాయి. పేరు+ఇమి= పేర్మి పేర్మిఅంటే పెంపు, అభివృద్ధి, గొప్పతనం. కడిమి అంటే బలం, పరాక్రమం, గొప్పతనం. (మ్రుచ్చు అంటే దొంగ. [ముచ్చిమి అంటే దొంగతనం. మేలు+ఇమి= మేలిమి. మేలిమి అంటే శ్రేస్టత. మేలిమిని విశేషణంగా వాడి మేలిమి బంగారం అంటారు. కేవలం మేలిమి అన్నా మంచి బంగారమే. మేలిమిగట్టు అంటే బంగారుకొండ, మేరు పర్వతం. మగకు ఇమి చేరిస్తే మగటిమి అవుతుంది. శౌర్యం, పరాక్రమం, పౌరుషం. మగటిమి, మగతనం, మగ పంతం మొదలయిన మాటలు సమానార్ధకాలు. చెలికి ఇమి చేరిస్తే చెలిమి అవుతుంది. చెలిమి అంటే స్నేహం, అనురాగం పేద అన్నమాటకు పూర్వరూపం పేదరు. దీనికి ఇమి చేరిస్తే పేద రిమి అవుతుంది. పేదరిమి అంటే దారిద్ర్యం, లేమి. మరో అర్ధం పిరికితనం. పోడిమి అంటే అందం, ఆదరం, చిహ్నం, సుఖం అని అర్ధం. పోణిమి అనికూడా అనవచ్చు. పదును అన్న అర్ధంలో వాడిమి, ఉష్ణం అన్న అర్ధంలో వేడిమి ఉన్నాయి. ,
రంగు, రుచులను బోధించే విశేషణాల మీద 'ని ప్రత్యయం వచ్చి తద్ధితనామాలు ఏర్పడతాయి. తెల్ల+న= తెల్లన. ఇదేవిధంగా నల్లన, పచ్చన, ఎర్రన. తియ్య+న= తియ్యన. ఇట్లాగే పుల్లన, కమ్మన, చప్పన. చామన అంటే నలుపు. చామనచాయ అంటే నలుపురంగు. ఆకుపచ్చ కూడా. ఒయ్యకు 'న' చేరిస్తే ఒయ్యన అవుతుంది. ఒయ్యన అంటే తిన్నగా, మెల్లగా. ఒయ్యనొయ్యన అనికూడా వాడవచ్చు. మెలమెల్లగా, క్రమక్రమంగా అని అర్ధం. పద్యాలలో ఈ మాటను వాక్యాలంకారంగా కూడా వాడతారు. అంటే పద్యంలో పాదపూరణ కోసం వాదే మాట. చెప్పుకోదగిన అర్ధమేమీ ఉండదు. ఒప్పిదంగా, తగినట్లుగా, బాగుగా వంటి అర్ధాలిస్తుంది. అల్లకు “న చేరిస్తే అల్లన అవుతుంది. మెల్లకు 'న' చేరిస్తే మెల్లన అవుతుంది. రెండింటికీ ఒకే అర్ధం. మెల్లదనమని అర్ధం, చక్క అంటే రుజువు, తిన్ననిది, అందమైనది అని అర్ధం. దీనికి 'న ప్రత్యయం చేరిస్తే చక్కస ఏర్పడుతుంది. చక్కన అంటే మనోహరం, సుందరం, స్పష్టం, వంకర లేకుండా తిన్నగా ఉండేది, మంచిది అని అర్థాలు, తిన్నన అంటే తగినటువంటిది, సూటి, స్వస్థత, సౌమ్యత అని అర్ధాలు. తిమ్మన అన్నమాట కూడా ఉంది. తిమ్మ అనేమాటకు 'నః చేరిస్తే ఇది ఏర్పడుకుంది. తిమ్మ అంటే స్వాస్థ్రం, నెమ్మది. తిమ్మన అంటే స్వస్థత, చక్కనైనది, మనోజ్ఞమైనది. పారిజాతాపహరణం రాసిన నంది తిమ్మన పేరులోని తిమ్మ శబ్దం ఇదే.
వేక అంటే బరువైనది, పెద్దది. వ్రేకన అంటే బరువు, భారం. విన్న అంటే కాంతిహీనం,
110 అనునభాష
వివర్ణమైనది. విన్నదనం, విన్నబాటు, విన్నబారు, విన్నబుచ్చు, విన్నబోవు వంటి మాటల్లో దీనికి ప్రయోగం ఉంది. విన్నన అంటే వైవర్ణ్యం, కాంతిహీనత. తక్కువ, వెలితి అన్న అర్ధం కూడా ఉంది.
ఇక ప్రత్యయం క్రియా ప్రాతిపదికల మీద ఎక్కువగా వస్తుంది. నామవాచకాలమీద తక్కువ. అగ్గలం అంటే ఎక్కువ, పెంపు, ఉత్సాహం, పూనిక. అగ్గలిక అంటే విజృంభణం, అతి శయం, ఉత్సాహం, పూనిక. అగ్గలికం అని కూడా అనవచ్చు.
ఒమ్ము అంటే సరిపడు. ఒమ్మిక అంటే పొందిక. పొలుపు, అందం. రంగు రుచులను బోధించే విశేషణాల మీద 'పు' ప్రత్యయం చేరుతుంది. తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు రంగులు. పులుపు రుచి,
ఇక ప్రత్యయం నామవాచకాల మీద చేరినప్పుడు అర్ధభేదం లేనిమాటలు చాలా ఏర్పడ తాయి. అంటే ప్రత్యయం చేరకముందు ఉన్న అర్ధమే చేరిన తరువాత కూడా ఉంటుంది. ఇటు వంటి ప్రత్యయాన్ని స్వార్ధంలో వచ్చిన ప్రత్యయమని వ్యాకర్తలు చెప్తారు. స్వ+అర్ధం అన్నమాట. అరమర అన్నమాటకు శంక, జంకు, సందేహం అని అర్ధం. అరమరిక అన్నా అదే అర్ధం. ఆము అంటే గర్వం, మదం. ఆమిక అన్నా అదే అర్ధం. అల్లిబిల్లి- అల్లిబిల్లిక గండి-గండిక, నడవడి- నడవడిక, నివ్వాళి-నివ్వాళిక, పొత్తి-పొత్తికు మాన-మానిక్క, మెలి-మెలిక, వాలు-వాలిక ఇటువంటివే. గండిక అంటే రంధ్రం. నివ్వాళిక అంటే ఆరతి, నీరాజనం, దీపం. పాత్తిక అంటే గుడ్డముక్క మరొక పొత్తిక కూడా ఉంది. ఇక్కడ పొత్తు+ఇక అని విభాగం. ఇక్కడ కూడిక, కలయిక అని అర్ధం. మానిక అంటీ నాలుగు సోలల పాత్ర. ధాన్యం, నేయి వంటివాటిని కొలవడానికి ఉపయోగించే పాత్ర వివిధ ప్రాంతాలలో మానికలు వేరువేరుగా ఉన్నాయి. చిన్న మానిక్క పెద్ద మానిక అనికూడా రెండు విధాలున్నాయి. ఇది పరిమాణాన్ని బట్టి చేసిన విభాగం. మెలిక అంటే పెన. హారం మెలికపడింది అంటాం. చిక్కుఅనే అర్ధంకూడా వచ్చింది. ఆలంకారి కంగా “వాడు ఏదో మెలిక పెట్టే ఉంటాడు” అని వాడతాం. మనకు తెలియని చిక్కు ఏదో పెట్టి ఉంటాడని అర్ధం. మెలిక వేశాడని కూడా ప్రయోగం. నాలిక అంటే పొడుగు. వాడి అయినది అని కూడా అర్థం ఉంది.
ఉక అనే ప్రత్యయం ప్రధానంగా స్రీ వాచక శబ్దాలమీద కనిపిస్తుంది. చిరుతుక, మెలతుక, నాతుక్క సడతుక, మడతుక, పొలతుక, వెలదుక మొదలైనవి. నిష్పు= నిప్పుక, ఎమ్ము-ఎమ్ముక/ ఎముక అవుతాయి. స్త్రీ వాచకంగా దీనికి ఆధునిక భాషలో అంతగా వాడుకలేదు. చెలికాడు, చెలికత్తె అన్నమాటల్లో కాడు, కత్తె అన్న ప్రత్యయాలు స్వార్ధంలోనే వస్తాయి. కల్లరీదు, మొక్కలీడు అన్నమాటల్లో 'ఈ' ప్రత్యయం వచ్చింది. వీటికి ఆధునిక భాషలో వాడుక తక్కువ.
బా మనభాషతి 111
మతుబర్ధక ప్రత్యయాలు
మతుబర్ధం అంటే కలవాడు, కలది అనే అర్ధం. కలవాడు కలది అనే అర్ధం ఇచ్చే ప్రత్యయాలు మతుబర్ధక ప్రత్యయాలు. శ్రీమంతుడు, ధీమంతుడు, ధైర్యవంతుడు వంటి మాటల్లో ఈ ప్రత్యయం ఉంది. సంస్కృతంలో ఈ ప్రత్యయం ఏవిధంగా వస్తుందో తెలుగులో ఆవిధంగా వచ్చే (ప్రత్యయాలు మతుబర్ధక ప్రత్యయాలు. తెలుగులో కాడు, కత్తె అనేవి ఇటువంటి ప్రత్యయాలే.
చెలిమికాడు అంటే చెలిమి కలిగినవాడు, స్నేపొతుడు. చెలిమికత్తె అంటే చెలిమి కలిగిన స్రీ, స్నేహితురాలు. అందగాడు- అందం కలవాడు, అందగత్తె అందం కలిగిన ప్రీ. ఇట్లాగే ఆట గాడు, ఆటగత్తె. ఇటీవలి కాలంలో క్రీడాకారుడు, క్రీడాకారిణి అన్న మాటలకు ఉన్న ప్రాచుర్యం ఆటగాడు, ఆటగత్తె అన్న మాటలకు కనిపించడంలేదు. ఆటగాడు బహువచన రూపంలో కొంచెం ఎక్కువగానే వాడుకలో ఉంది. మన ఆటగాళ్ళు, క్రికెట్ ఆటగాళ్ళు, ఫుట్‌బాల్ ఆటగాళ్ళు మొదలయిన విధంగా వాడుతూ ఉన్నాం. ఆటగాడు అని వకవచనంలో కూడా వాడుక ఉంది. ఆటగాడికి ఉండవలసిన లక్షణం, ఆటగాడికి ఇవ్వవలసిన సౌకర్యాలు అన్నవిధంగా ఎక్కువగానే వాడుతున్నాం. కాని స్త్రీ వాచకంగా అటగత్తె అన్న మాటను చాలా అరుదుగా వాడుతున్నారు. ఏక వచనంలోనయినా అప్పుడప్పుడూ ఎవరయినా వాడుతున్నారేమోకాని బహువచన రూపంలో ఆటగత్తెలు అని మాత్రం వాడుతున్నట్లు లేదు. ఆటగత్తె అంటే అదేదో కొంచెం తక్కువ మాటగా తోస్తున్నదేమో. కాడు, కత్తె ప్రత్యయాలను చాలా విస్తృతంగా వాడవచ్చు. పూర్వం వాడారు కూదా. కాడు/గాడు, కత్తెగత్తె వాడితే ఏదో గౌరవం తగ్గిపోయినట్లు భావిస్తున్నాం. అందువల్ల వాటిని మాని ఆ సందర్భాల్లో సంస్కృత పదాలు వాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. జూదగాడు వంటిచోట్ల మాత్రం ఈ 'ప్రత్యయాన్ని ధారాళంగా వాడుతున్నాం. జూదగాడికి సమాజంలో గౌరవం లేదుకాబట్టి ఆ మాట వాడడానికి సందేహించవలసిన అవసరం లేదేమో.
కొన్నిమాటల్లో కాడు/కత్తె (ప్రత్యయాలు బాగా స్టిరపడిపోయాయి. అక్కడ మాత్రం మరోమాటకోసం వెదుక్కోవడంలేదు. ముఖ్యంగా విలుకాడు, వేటకాదులకు మాత్రం సంస్కృత పదాలను వాడడంలేదు. ధానుష్ముడు వంటి మాట ఉన్నా విలుకాడు వదానికే ప్రచారం ఎక్కువ.
బేరగాడు అన్నమాట కూడా ఇటువంటిదే. దీనికి వాడుక బాగానే ఉంది. నేస్తగాడు, నేస్తకత్తె అంతగా వాడుకలో లేకపోయినా దురర్థమేమీ లేదు. అందగాడు లాగా సొగసుకాడు అనికూడా వాడవచ్చు. అందకత్తెలాగా సొగసుకత్తె,
పూర్వం అడపకాడు, అడపకత్తై అనేమాటలకు వాడుక ఉండేది. అడపం అంటే తాంబూలం పెట్టుకొనే పెట్ట, సంచి. ఆకులు, వక్కలు, సున్నం మొదలయిన తాంబూల సామగ్రి ఉంటుంది ఇందులో. పూర్వం రాజులకు, ధనవంతులకు వెనక ఈ పెట్టె పట్టుకుని ఉండే పరిచారకులుందేవారు. తాంబూలం చుట్టి ఇవ్వడం వాళ్ళ పని. శాసనాలలో అడపం అనే మాటకు తాంబూలం అందించే సేవకుడు అన్న అర్ధంకూడా ఉంది. రాయసం వంటిమాట కావచ్చు. ఇప్పుడు ఈ మాటలకు అవకాశమే లేదు. అందువల్ల ప్రయోగమూ లేదు. అందం అనే మాటకు తెలుగులో చాలా పర్యాయపదాలున్నాయి. కాని వాటి వాడుక తక్కువ. ఎమ్మె అనేది అటువంటి మాటల్లో ఒకటి. అందం అనీ, విలాసం అనీకూడా ఈ మాటకు అర్ధం. ఎమ్మెకాడు
అంటే అందగాడనీ, విలాసవంకుడనీ అర్థం. విలాసం అన్న అర్థంలో తెలుగులో ఓయారం/ ఒయ్యారం అనేమాట ఉంది. దీనికీ కాడు/కత్తె చేర్చి వాడవచ్చు.
కటారి, కొల్ల, చేరువ, చొరవ, జట్టు, జాజర, తిండి, తేర, దొద్ద, నీటు, వగ, వెచ్చం, కొందెం, పేర్మి, మాలిమి, పొత్తు మొదలయిన మాటలకు కూడా కాడు/కత్తె ప్రత్యయాలు చేర తాయి. కాని వీటికి ఆధునిక భాషలో ముఖ్యంగా రచనా భాషలో వాడుక తక్కువ. గొప్పవాడు, గొప్ప ప్రీ అన్న అర్ధంలో మొనగాడు, మొనగత్తె అన్నమాటలను వాడవచ్చు. ఈ రెండు మాటలు జనవ్యవహారంలో విరివిగానే ఉన్నా, రాతలో తక్కువగానే కనిపిస్తాయి.
అర్ధభేదం లేకుండా కూడా ఈ ప్రత్యయం కొన్ని మాటల్లో వస్తుంది. చెలికాడు, చెలికత్తె
_ ఇటువంటివి. చెలి అన్నా చెలికాడన్నా అర్ధం ఒకటే. చెలి అన్న మాటకు స్నేహితుడు, స్నేహితు రాలు అనికూడా అర్థం. లింగభేదం లేదు. చెలి అంటే స్రీ తన్న అర్థంకూడా ఉంది. చెలి- చెలి కాడు, చెలి- చెలికత్తె వీటికి అర్ధభేదం లేదు. ఇటువంటీదే ఒంటరి అన్నమాట. దీనిమీద కూడా కాడు/కత్తె చేర్చి ఒంటరిగాడు, ఒంటరిగత్తె అనవచ్చు.
మతుబర్ధంలో 'ఈ' అన్న ప్రత్యయం కూడా ఉంది. కన్నడం+ఈ+డు- కన్నడీడు అవుతుంది. అంటే కర్ణాటకుడు. ఇట్లాగే మన్నెము+ఈడు- మన్నీడు. మన్నెం కలవాడు. భూస్వామి, సామంతుడు, అధిపతి అని అర్థం. సుంకీడు అంటే సుంకరి. 'ఈ ప్రత్యయంతో ఇప్పుడు వాడుకలో ఉన్నమాటలు తక్కువ.
“అరి అన్న ప్రత్యయం కూడా మతుబర్ధంలో వస్తుంది. చదువు- చదువరి, కల్ల-కల్లరి, జూదం- జూదరి, టక్కుటక్కరి, తగవు- తగవరి, తీర్చు- తీర్చర౦, తెంపు- తెంపరి, తెరువు- తెరవరి, నేర్చు- నేర్పరి, సిగ్గు- సిగ్గరి, సుంకం- సుంకరి, జాలం- జాలరి వంటి మాటలు వాడుకలో ఉన్నాయి.
“ఇ ఓయారము వంటి మాటల మీద వస్తుంది. ఓయారం- ఓయారి, కడలు- కదలి, కడలు అంటే అల. అల ఉందేది కాబట్టీ కడలి సము(్రం. అట్లాగే బండారి, బేహారి, మిటారి వంటి మాటలు.
కుల వాచకంగా 'త' అనే ప్రత్యయం ఉంది. సీని బోధించే ఈ పప్రత్యయాన్ని ఇవ్చుడు వాడడం లేదు. ఆడి/ఆడు అనే ('ప్రత్యయాలూ ఎక్కువగా వాడుకలో లేవు, వగలాడి, వగలాడు వంటివి.
ళ్ మనభాషతి 113
అభావాది అర్థాలు లేనిది, లేనివాడు అన్న అర్ధంలో వచ్చే ప్రత్యయాలను అభావార్థక ప్రత్యయాలు అంటారు. “ఇడి' అన్నది తెలుగులో అభావార్థక ప్రత్యయం. సిగ్గు+ఇడి= సిగ్గిడి. సిగ్గులేనివాడు అని అర్థం. ముక్కు-ముక్కిడి, ముక్కులేనివాడు. వాలు+ఇడి= వాలిడి. తోకలేని కోతి. వెరవు+ఇడి= వెరవిడి. వెరవు అంటే ఉపాయం. వెరవిడి అంటే ఉపాయం లేనివాడు. మానం అంటే కొలత. చాంద్రమానం, సౌరమానం అంటాం కదా. కాలమానం అని కూడా అంటాం. ఈ మానార్థంలో తెలుగులో వచ్చే ప్రత్యయం ఎడు. కొలతను సూచిస్తుందన్న మాట. జాన+ఎడు= జానెడు. జాన పొడవైన అని అర్ధం. బెత్తశఎడు= బెత్తెడు. వేలు+ఎడు= వేలెడు. వేలెడు, జానెడు, బెత్తెడు అన్న మాటలను జాతీయాలుగా కూడా వాడతాం. పొట్టీ అల్పమైన అని అర్ధం. మూర+ఎడు= మూరెడు, బార+ఎడు= బారెడు అవుతుంది. బారెడును పొడవైన అన్న అర్ధంలో కూడా వాడతాం. జాన, బెత్తె రెండూ కలిపి జానాబెత్తెడు అని కూడా వాడతాం. ఈ మాటకూ పొట్టి, అల్పమైన అనే అర్ధం. 'జానాబెత్తెడు లేడు” అంటాం. పొడవును సూచించడానికే కాక పరిమాణాన్ని సూచించడానికి కూడా ఎడు (ప్రత్యయాన్ని వాదతాం. గిద్ద+ఎడు= గిద్దెడు. సోలెడు, అరసోలెడు ఇటువంటివే. మానిక+ఎడు= మానెడు అవుతుంది. పుట్టీ+ఎదు= పుట్టెడు అవుతుంది. పుట్టెడు అన్నమాటను ఎక్కువ పరిమాణంలో అన్న అర్ధంలో కూడా వాడ వచ్చు. చాలా, మిక్కిలి అన్న అర్ధంలోనూ వాడవచ్చు. 'ఆయన పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు అంటాం. ఐండి+ఎడు= బండెడు. బందెడు అన్నమాటను కూడా ఎక్కువ అన్న అర్థంలో వాడతాం. తూము+ఎడు= తూమెడు అవుతుంది. లొడిత+ఎదు= లొడితెడు అవుతుంది. గంప+ఎడు= గంపెడు. గంపెడు పిల్లలు అని వాడుక. గంటె, గిన్నె గ్లాసు, చెంబు, బిందె, కుండ, తొట్టి బాన, పెట్టె మొదలైన మాటలన్నింటి పైనా ఎడు ప్రత్యయం వస్తుంది. గంటెడు, గిన్నెడు, గ్లాసెడు, చెంబెడు, బిందెడు, కుండెడు, తొట్టెడు, బానెడు, పెట్టెడు. కొంచెం అన్న అర్ధంలో చిటికెడు అంటాం. చిటిక+ఎడు అన్నమాట. పిడికిలి+ఎడు= పిడికెడు అవుతుంది. 'పిల్లికి పిడికెడు బిచ్చం వేయడు” అంటారు. పిడికెడు అన్నది కూడా కొంచెం, తక్కువ అన్న అర్థంలో వాడుకలో ఉంది. దోసిలి+ఎడు = దోసెడు అవుతుంది. పుడిసిలి+ఎడు= పుడిసెడు అవుతుంది. దోసిలి అన్నప్పుడు రెండు చేతులు దగ్గరగా పెట్టి దొన్నాలాగా చేయడం అయితే పుడిసిలి అన్నవ్హుడు ఒక్క చేతినే దొన్నెలాగా చేయడం. సీసా, చెంచా వంటి మాటలమీద కూడా “ఎడు ప్రత్యయం చేరుతుంది. అయితే సీసెడు, చెంచెడు అన్న వాడుక తక్కువగా కనిపిస్తుంది. సీసాడు, చెంచాడు అన్న వాడుక ఎక్కువ. ఈ మాటలు దీర్భాంతాలు కావడం వల్ల ఇటువంటి రూపాలు ఏర్పడి ఉండవచ్చు. డబ్బా+ఎడు కూడా డబ్బాడు అవుతుంది, లోతును కొలిచే సందర్భంలో బంటి, కొలది ప్రత్యయాలు వస్తాయి. మోకాలిబంటి, నడుముబంటి, మెడబంటి, మొలబింటి, రొమ్ముబింటి, మడమలబంటి అని వాడతాం. బంటీ లాగానే కొలది కూడా. కాని ఆధునిక భాషలో దీనికి అంత విస్తృతిలేదు. పిండికొద్దీ రొట్టె వంటి సామెతలలో స్థిరపడిపోయింది. ఆలంకారికంగా మొలబంటి కూరుకుపోయాడు వంటి 114 అ మనభాష
ప్రయోగాలున్నాయి.
మనిషి స్వభావాన్ని శీలాన్ని బోధించడానికి పోతు, మారి అన్న (వ్రత్యయాలను వాడు తున్నాం. బాగా తినే స్వభావం కలిగినవాడు తిండిపోతు. అత్యాశ ఉన్నవాడు ఆశపోతు. అసూయా(గ్రస్తుడు కుళ్ళుబోతు. ఒళ్ళు తెలియకుండా తాగేవాడు తాగుబోతు. తిరిగే స్వభావం కలిగినవాడు తిరుగుబోతు. ఈ తిరుగుబోతు అన్న మాటకు శీలం లేనివాడు అన్న అర్థంకూడా ఏర్పడింది. ఎక్కువగా మాట్లాడేవాడు వదరుబోతు. ఈ శతాబ్దం ఆరంభంలో వదరుబోతు అన్నపేరుతో సంఘ విమర్శనాత్మకమైన వ్యాసాలు వచ్చాయి. పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి సాక్షి వ్యాసాల లాంటివి ఇవి ఉడికే స్వభావం కలిగినవాడు ఉడుకుబోతు. ఊరికే ఉడు క్కుంటాడన్నమాట. ఎక్కువగా నిదురపోయేవాడు నిదురబోతు. గర్విష్టి పొగరుబోతు.
మారి అన్న ప్రత్యయం తగువు, చిక్కువంటి మాటలమీద వస్తుంది. సాధారణంగా బహు వచన రూపం మీద వస్తుంది. తగువులమారి, చిక్కులమారి, తంపులమారి, పోట్లమారి. బాగా కోపస్వభావం ఉన్నవాడు మంటమారి. కావ్యాలలో ఈ మాటకు ప్రయోగాలున్నాయి. ఆధునిక భాషలో అంతగా వాడుతున్నట్లు కనిపించదు. జిత్తులమారి అన్నమాటకు మాత్రం వాడుక ఎక్కువ. ఏ కధలోనైనా నక్కవస్తే చాలు జిత్తులమారి నక్క అనే అంటాం. కొండేలు చెప్పేవాడు కొండేలమారి/కొండెములమారి. పితూరీల మారి అని కూడా అనవచ్చు. తెగపొగిదే వాడిని పొగడ్రలమారి అనవచ్చు. తిట్టేవాడిని తిట్లమారి అనవచ్చు.
పోతు, మారి అన్న ఈ రెండు ప్రత్యయాలూ తాచ్ళీల్యార్థంలో, అంటే అటువంటి శీలం, స్వభావం కలవాడు అన్న అర్ధంలో వచ్చేవి. అయితే వీటితో వచ్చె మాటలు చాలావరకు దురర్థం లోనే కనిపిస్తున్నాయి. ఈ శీలం ప్రశంసావహమైంది కాదు. తిరస్కార ధోరణిలో మాట్లాడే మాట లివి.
తెలుగులో ప్రీవాచకంగా సాని అన్న ప్రత్యయం ఉంది. విడిగా ఈ మాటకు వేశ్య అన్న అర్ధం ఏర్పడింది. సానిది అనికూడా అంటారు. దొర అన్నమాటకు చేర్చినప్పుడు ఈ మాటకు గౌరవార్థమే ఉంటుంది. దొరసాని అని యజమానురాలిని అంటారు. తెల్లవాళ్ళలో మగవారిని దొరలు అన్నట్లుగానే, ఆడవాళ్ళను మనవాళ్ళు దొరసానులనే అనేవాళ్ళు. పూర్వం పెద్దింటి ఆడపడుచులు పేరుచివర సాని చేర్చుకొనేవాళ్ళు. వెయ్యేళ్ళ కిందట విరియాల కామసాని గూడూరుల్లో శాసనం వేసింది. పిల్లలమర్రిలో ఎరుక సానమ్మ శాసనం వేయించింది. తెలుగు దేశంలో ఇప్పటికీ ఇంటిపేరులో సాని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. పెమ్మసాని, కొమ్మసాని, ముద్దసాని, తలసాని ఇటువంటివే. సాని స్వామిని శబ్దం నుండి ఏర్పడిందంటారు. హీనయాన బౌద్ధంలో బౌద్ధసన్యాసులను స్వాములనీ, సన్యాసినులను స్వామినులని పిల్చేవారనీ ఈ బౌద్ధ సన్యాసినులలో (ప్రబలిన దుశ్ళీలంవల్లే స్వామిని శబ్దానికి వేశ్య అనే అర్థం వచ్చిందనీ అంటారు. స్వామి/సామి శబ్దాన్ని ఇప్పటికీ పేర్లలో వాడుతూనే ఉన్నాం. దాని గౌరవం అట్లాగే ఉంది. సాని శదిం మాత్రం అటు గౌరవార్థంలోనూ, ఇటు నిందార్థంలోనూ వాడుకలో ఉంది.
చ్ మనభాష 115
అరువు ప్రత్యయాలు
తద్ధిక (ప్రత్యయాలు చేర్చి నామవాచకాలు తయారుచేసుకొనే ప్రక్రియ అన్ని భాషల్లోనూ ఉంది. వివిధ భాషల మధ్య సంబంధాలు, వఠస్పర వ్రభావానికి కారణమవుతాయి. మాటలు అరువు తెచ్చుకోవడం అన్ని భాషలూ చేసేపనేే ఈ అరువు తెచ్చుకోవడంలో ఆ భాషల్లోని కృదంత నామాలూ, తద్ధితనామాలూ కూడా వస్తాయి. ఉదాహరణకు జమీందారు వంటి మాటను తీసు కోవచ్చు. జమీందారు అంటే భూస్వామి. ఈ “దారు” అన్నది కలవాడు అన్న అర్ధంలో వచ్చింది. వతన్దారు వంటి మాట కూడా ఇటువంటిదే. తెలుగులోకి *దారు' ప్రత్యయంతో చాలా మాటలు వచ్చాయి. తహసీలుదారు, కౌలుదారు, ఖిలేదారు, ఫౌజుదారు, దుకాణదారు, మిరాసీదారు ఇటువంటివి. ఈ మాటల్లోని 'దారు' తెలుగు మాటలకు కూడా వ్యాపించింది.
తెలుగు మాటల్లో కొనుగోలుదారుడు, అమ్మకందారుడు, పెట్టుబడిదారుడు, వొ డకం దారుడు, దోపిడిదారు మొదలయినవి దారు ప్రత్యయం చేరి ఏర్పడ్డవే. కొనుగోలుదారు, అమ్మకం దారు, వాడకందారు అని 'డు' చేర్చకుండా కూడా వాడవచ్చు. ప్రీ వాచకంగా 'దారిణి' వస్తుంది. జమిందారిజి వంటివి. సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న మాటలమీద కూడా ఈ (ప్రత్య యాన్ని చేర్చివాడుతున్నాం. వ్యవసాయదారుడు, వినియోగదారుడు, వాటాదారుడు మొదలయిన మాటలిటువంటివి.
పెత్తందారు అని పెత్తనం మీద దారు చేర్చి పెత్తనం కలిగినవాడు అన్న అర్ధంలో వాడు తున్నాం.
అనుయాయి, సహాయకుడు, సమర్ధకుడు అన్న అర్ధంలో మద్దతుదారుడు అని వాడు తున్నాం. ఈ మాట మదద్దార్. ఇందులోని ప్రత్యయం గార్”. కాని తెలుగులో ఈ మాటలో అది దారు అయిపోయింది. తెలుగులో చేరిన ఇంగ్లీషు మాటలమీద కూడా ఈ 'చారు' చేరిన రూపాలున్నాయి. ఉదాహరణకు సపైదారును తీసుకోవచ్చు. దీనికి పర్యాయపదం మరో అరువు మాట సరఫరా, దీనిమీదా దారు చేర్చి సరఫరాదారుడు చేసుకున్నాం. ఇట్లాగే దేశ్యాలు, అన్యదేశ్య పదాలన్నింటిమీద ఈ దారు ప్రత్యయాన్ని చేర్చి మాటలు తయారుచేసుకోవచ్చు. ఉదాహరణకు ఈ తయారు అనే మాటనే తీసుకోవచ్చు. తయారీదారు అని వాడవచ్చు. పితూరీదారు, లల్టి దారుడు, కబ్బాదారు, పంపకందారు, భూమిదారుడు, ఫ్యాక్టరీదారుడు మొదలయినవి. “దారు వంటి ్రత్యయాలకు విస్తృతి ఉంటుంది. అంటే ఇంతకుముందు వాడుకలోకి వచ్చిన మాటలతోనేకాక కొత్త కొత్త మాటలతో చేర్చి వాడుకొనే అవకాశం ఉంటుంది.
యజమాని అన్న అర్ధంలో స్వంతదారు అనేమాట కూడా వాడుకలోకి వచ్చింది. ఈ కారు స్వంతదారుడు ఫలానా అనవచ్చు. అవసరం అయితే ఇంటిదారుడు, కొట్టుదారుడు, గిన్నెదారు అనికూడా వాడవచ్చు.
మదద్గార్లోని గార్ అన్న ప్రత్యయం కూడా తెలుగులోకి వచ్చింది. దీన్ని గౌరవ వాచకంగా వాడుతున్నాం. మాస్టరుగారు, అయ్యగారు, అమ్మగారు, అన్నగారు, పంతులుగారు వంటివన్నీ గారు ప్రత్యయం చేరినవే. గౌరవ నాచకంగా మనం వాదే ప్రత్యయం బహువచన (ప్రత్యయం. అట్లాగే బహువచన సర్వనామం కూడా గౌరవ వాచకమే. మేము, మీరు, వారు మూడూ గౌరవ
116 అ మనభాష
వాచకాలే. విశేషణాలు, విశేష్యాలతో చేర్చడానికి వీలయింది వారు. ఆయన చాలా పెద్దవారు, గొప్పవారులాగా. అయ్యవారు అని ఉపాధ్యాయులకు వాడుతున్నాం. స్రీ దేవతను అమ్మవారు అంటాం. ఈ కారణంగానే మసూచికానికీ, తడపర, వంచలవంటి వాటికి అమ్మవారు పోసిం దనడం. శాసనాలలో తిమ్మరుసు అయ్యవారు అన్నవిధంగానే ఉండేది. ఇప్పుడు గారు తెలుగులో గౌరవ వాచకంగా స్థిరపడి పోయింది.
“కోరు” అనే మరో (ప్రత్యయం కూడా ఇట్లా వచ్చిందే. దగాకోరు, పుండాకోరు వంటి మాల రోత ప్రత్యయం తెలుగులోకి వచ్చింది. అబద్ధాలకోరు బాగా వాడుకలో ఉన్నమాట. మాటల కోరు. తగాదాలకోరు అని కూడా అనవచ్చు.
జమీందారు లక్షణం జమీందారీ. బాధ్యత అన్న అర్థంలో జవాబుదారీ అన్నమాట వాడు కలో ఉంది.' వీటి సామ్యంతో తెలుగులో పెత్తందారీ అనేమాట ఏర్పడింది.
సంస్కృతంలో జటాధారి అనే మాట తెలుగులో 'జడదారి అయింది. తెలుగులో విశేష ణంగా వాడే మాయదారిలోని దారికి జడదారిలోని దారికీ ఏమైనా సంబంధం ఉందోలేదో. కోపదారి అన్నమాట కూడా ఉంది.
సంస్కృతంలో "కార వ్రత్యయం ఒకటి ఉంది. కుంభకారుడు అంటే కుమ్మరి. కుండలు చేసేవాడు. కలంకారీ వంటి మాటల్లో పనితనం అన్న అర్థంలో ఈ (ప్రత్యయం కనిపిస్తుంది. తెలుగులో మాటకారి అన్న మాటలో ఈ కారి నేర్చరి అన్న అర్ధంలో వచ్చింది. మోసకారి, దోసకారి వంటి మాటలలో ఉన్న 'కారి'కీ దీనికీ భేదం ఉంది. ఈ రెండు మాటల్లో నేర్పరితనం ఏమీలేదు. మాటకారి పద్ధతిలో ఆటకారి, పాటకారి అని కూడా వాడవచ్చేమో.
మరొక (ప్రత్యయం “నామా” కవులునామా, రాజీనామా, కరారునామా, చిరునామా వంటీ మాటల్లో ఈ ప్రత్యయం ఉంది. ఈ ప్రత్యయం ఇంగ్లీషు “విల్ మీద చేరి తెలుగులో వీలునామా అన్నమాట ఏర్పడింది.
భాషలో పదసంపదను పెంచుకోవడానికి కృత్, తద్ధిత ప్రత్యయాలు చాలా తోడ్పడతాయి. వీటికి నూతన పద సృజనశక్తి అద్భుతంగా ఉంటుంది.
చ్ మనభాషతి 117
అపత్యార్ధక కమ్రత్వయాలు
తెలుగులో లాగానే సంస్కృతంలో కూడా తద్ధిత ప్రక్రియ విస్తారంగా ఉంది. తద్ధిత ప్రత్యయాలు అనేక అర్థాలలో వస్తాయి. ఈ ప్రక్రియా వల్ల ఎన్నో కొత్త పదాలను నిర్మించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎన్నో సంస్కృత పదాలు తద్ధిత ప్రత్యయాలు చేరి ఏర్పడ్డవి తెలుగులోకి కూడా వాడుకలోకి వచ్చాయి. దాదాపు సంస్కృతంలో ఆ ప్రత్యయానికి ఏ అర్ధం ఉంటుందో తెలుగులో ఆ ప్రత్యయం చేరిన మాటకు కూదా అదే అర్థం ఉంటుంది.
మనం కోట్లమందిమి ఉన్నాం. ఇంతమందికీ విడివిడిగా కొత్త పేర్లు సాధ్యమయ్యేవి కావు. ఒకే పేరు చాలా మందికి ఉంటుంది. చైనాలో ఏదో పేరు కోట్లమందికి ఉంటుందట. ఒకే కుటుంబంలో కాని, (గ్రామంలోకాని ఒకే పేరు ఉన్న వ్యక్తులు ఉంటే వాళ్ళను వేరుచేసి గుర్తించడం ఎలా, తండ్రి పేతు ఉపయోగించవచ్చు. ఫలానా ఆయన కొడుకు అని. ఇప్పుడు తమిళంలో బాగా వాడుకలో ఉన్న పద్ధతి ఇది. వ్యక్తిపేరుతో తండ్రి పేరు కూడా ఉంటుంది. శ్రీనివాసన్ వెంకట రాఘవన్ అంటే శ్రీనివాసన్ కుమారుడయిన వెంకటరాఘవన్ అని అర్ధం. రామనాధన్ కృష్ణన్ ఆంటే రామనాథన్ కుమారుడు కృష్ణన్ అని అర్ధం. పూర్వం తెలుగువాళ్ళలోనూ ఈ సంప్రదాయం ఉంది. (ప్రోలయ వేమారెడ్డి అంటేప్రోలయరెడ్డి కొడుకు వేమారెడ్డి. కాటయ వేమారెడ్డి అంటే కాటయరెడ్డి కొడుకు వేమారెడ్డి. పేదకోమటి వేమారెడ్డి అంటే పెద కోమటి రెడ్ది కొడుకు వేమా రెడ్డి. ప్రోలయ వేమారెడ్డి రెడ్డిరాజ్య స్థాపకుడు. కాటయ వేమారెడ్డి కాళిదాసు నాటకాలకు వ్యాఖ్యా నాలు రచించినవాడు, రాజమండ్రి రెడ్డి రాజ్యస్థాపకుడు. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో శ్రీనాథుడు విద్యాధికారి, సర్వజ్ఞుడని ప్రసిద్ధి కాంచిన పండితుడు. ఈ పేరులో మరో సంజ్ఞ కూడా ఉంది. పెదకోమటిరెడ్డి అంటే ఈ కుటుంబంలో మరో కోమటిరెడ్డి ఉన్నాడన్న మాట. అతను చినకోమటిరెడ్డి అయి ఉండాలి. పెద్ద, చిన్న పొట్టి, పొడుగు, కుంటి, తెల్ల, ఎర్ర, నల్లవంటి విశేష ణాలు కూడా పేరుముందు చేరి మనిషిని గుర్తుపట్టడానికి సహాయపడతాయి. తండ్రి పేరును చేర్చుకున్నట్లే తల్లి పేరూ చేర్చుకోవచ్చు. శాతవాహనులు ఇక్ష్వాకులూ ఇట్లా తల్లిపేరు పెట్టుకున్న వాళ్ళే. గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి గౌతమి కుమారుడు అని ఆర్థం. మాధరీపుత్ర వీరపురుష దత్తుడు ఇటువంటి పేరే.
ఇప్పటికీ మన ఊళ్ళలో ఈ సంప్రదాయం బలంగానే ఉంది. రామయ్యగారి వెంకయ్య, గోవిందమ్మగారి కృష్ణారెడ్డి వంటి వాడుక అందరికీ తెలిసిందే. మరో భేదక లక్షణం ఇంటిపేరు. ఇంటిపేరు సాధారణంగా మన ఊరుపేరో, మన కుటుంబంలో (ప్రసిద్ధమైన వ్యక్తి పేరో, మనం అవలంబించిన వృత్తో, చేసిన పనో మరొకటో అయి ఉంటుంది.
తెలుగులో మనం అవలంబించే ఈ వద్ధతులు సంస్కృతంలో తద్ధిత ప్రత్యయాల ద్వారా కూడా నెరవేరతాయి. అపత్యం, సంతానం అన్న అర్థంలో సంస్కృతంలో వివిధ ప్రత్యయాలు న్నాయి. ఈ ప్రత్యయాలు చేరినప్పుడు పదస్వరూపంలో కొన్ని మార్పులు కూడా వస్తాయి. ప్రాచీన కావ్యాలలోనూ, ఇతర సాహిత్య, సాహిత్యేతర రచనల్లోనూ ఇటువంటి తద్ధితనామాల సంఖ్య బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడున్న పేర్లతో తద్ధిత నామాల నిర్మాణం అరుదు.
సాధారణంగా అవత్యార్థంతో పాటు, ఆ వంశం వాడు అన్న అర్ధం కూడా వస్తుంది.
వసుదేవుని కొదుకు వాసుదేవుడు. రఘువు కొడుకు రాఘవుడు. రఘువు కొడుకేకాదు రఘు వంశం వారినెవరినైనా రాఘవుడనవచ్చు. అట్లాగే కురువు కొడుకుగాని కురువంశం వాడుకాని కౌరవుడు. పురువు కొడుకు పౌరవుడు. మను సంతానం మానవులు. యదు సంతానం యాద వులు. దశరథుని కొడుకు దాశరధుడు. భృగువు కొడుకు భార్గవుడు. భృగు వంశంవాడూ భార్దవుడే. భార్గవ రాముడు అంటే పరశురాముడు. కశ్యపుని సంతానం కాశ్యపులు. వృథ కౌడుకు పార్టుడు. కుంతికి పృధ అని పేరు. అందుకే అర్జునునికి పార్టుడని పేరు. పాండురాజు సంతానం పాండవులు. ఈ మాటల్లోని ప్రత్యయం 'అ.
“ఆయన' అనే ప్రత్యయం శకట, యుగంధర వంటి మాటలమీద చేరుతుంది. శకటుని కొడుకు శాకటాయనుడు. యుగంధరుని కొడుకు యౌగంధరాయణుడు. ద్వీపుని కొడుకు ద్వైపాయనుడు. అట్లాగే వాత్సాయనుడు, దాక్షాయణుడు, ద్రోణాయనుడు వంటివి.
“ఇ అనే ప్రత్యయం చేరి దాక్షి ఏర్పడుతుంది. దక్షుని కొడుకు, దశరథుని కొడుకు డాశరథి. అట్లాగే మరుతుని కొడుకు మారుతి. పవనతనయుడు పావని. సుమిత్ర కొడుకు సౌమిత్రి. పణినుని కొడుకు పాణిని, పాణిని సంస్కృత భాషకు గొప్ప వ్యాకరణం రచించాడు. గంగ కొడుకు గాంగేయుడు. భీష్ముడు. రాధ కొడుకు రాధేయుడు. వినత సంతానం వైనతేయులు. అత్రి కొడుకు ఆశ్రేయుడు. ఇక్కడ ప్రత్యయం “ఏయి. కద్రూ కొడుకులు కాద్రవేయులు. సర్పాలు. వినత సంతానం వైనతేయులు. దితి సంతానం దైతేయులు. రాక్షసులు. అదితి సంతానం ఆదితేయులు.
దితి సంతానం దైత్యులు. అదితి సంతానం ఆదిత్యులు. పరాశరుని కొడుకు పారాశర్యుడు. శకుని సంతానం శాక్యులు. ఇక్కడ ప్రత్యయం 'యి.
ఈ ్రత్యయాలను ఇప్పుడు నూతన వదకల్పనకు వాడనప్పుడు వీటి ప్రయోజనం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతుంది. మనం పెట్టుకొనే పేర్లలో ఇటువంటివి ఇప్పుడూ ఉన్నాయి. రాఘవయ్య అన్న పేరు ఏమిటి. ఈ పేరును రాముడన్న ఉద్దేశంతో పెట్టుకుంటున్నాం. పార్ధ సారధి అని పేరు పెట్టుకుంటున్నాం. పార్గుడంటే అర్జునుడని తెలియాలి కదా! మనం పెట్టుకొనే పేర్లు ఎలా వర్పద్తాయో వాటి అర్థమేమిటో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రావీన సాహిత్య పరనానికి ఉపయోగపడుతుంది.
జ్ మనభాషతి 119
ఖైవ బలైష్టవాదులు తెలుగులో తద్ధిత ప్రత్యయాలను చేర్చి కొత్త నామవాచక పదాలను తయారుచేసినట్లుగానే సంస్కృతంలోనూ ఎన్నో మాటలను తయారు చేసికోవచ్చు. ఆవిధంగా తయారయిన మాటలన్నీ తెలుగులో యథాతథంగా వాడం. అయినా తెలుగులో మనం వాదే సంస్కృత పదాల వాడుకలో "తద్ధిత నామవాచకాల సంఖ్య అల్బమేమీకాదు. సంస్కృత పదాల వాడుకలో తద్ధిత నామాలూ, కృదంత నామాలూ కూడా చేరతాయి. మన అవసరాలను అనుసరించి సంస్కృత నామవాచక పదానికి తద్ధిత ప్రత్యయం చేర్చి వాడుకుంటున్నాం. ఇటువంటి సందర్భాలలో కొన్నిసార్లు సంస్కృత మర్యాదకు భిన్నంగా తెలుగులో కొన్ని సంస్కృత నామాలు ఏర్పడుతున్నాయి. సంస్కృ తంలో ఒక అర్ధంలో ఒక ప్రత్యయం వస్తూ ఉంటే మనం మరో ప్రత్యయాన్ని తగిలించడమో, సంస్కృతంలో అప్పటికే తద్దికనామంగా రూపొందిన దానికి మనం అనవసరంగా మరో (ప్రత్యయం తగిలించేడమో కూడా చేస్తూ ఉంటాం. ఇటువంటప్పుడు ఒకేమాటకు ఒకే అర్థంలో ఒకేసారి రెండు ప్రత్యయాలను చేర్చడం జరుగుతుంది. ప్రత్యయాలు చేరినప్పుడు వదంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి. వాటిని కూడా గుర్తించవలసి ఉంటుంది తెలుగులో సంస్కృత పదాలు వాడే వాళ్ళందరికీ సంస్కృత భాషరాదు. అట్లా రావాలను కోవడం కూడా సరికాదు. అవసరం లేదు. సంస్కృత భాషతో బాగా పరిచయం ఉన్న తెలుగు వాళ్ళు తెలుగులో ఏదయినా సంస్కృత పదాన్ని వాడినట్లయితే ఆ పద నిర్మాణంలో సంస్కృత వ్యాకరణ సూత్రాలను గుర్తిస్తారు. దాన్ని తెలుగులోకి తెచ్చుకోవడంలోని సంప్రదాయాన్ని గుర్తి స్తారు. అటు సంస్కృత పదనిర్మాణ పద్ధతిగాని, ఇటు తెలుగు సంప్రదాయాన్ని కాని సరిగ్గా గుర్తిం చకపోతే ఏర్పడే పదాలు హేతుబద్ధంగా ఉండవు. అట్లా హేతుబద్ధంగా ఉండాలా, ఉండకపోతే నష్టం ఏమిటి? ప్రచారంలో ఉన్నాయి కదా అట్లాగే వాడుకుంటే సరిపోదా? వంటి ప్రశ్నలుత్సన్న మవుతాయి. ఆధునికులే కాదు మన పూర్వ కవులు కూడా ఎన్నో సంస్కృత పదాలను సంస్కృత వ్యాకరణ మర్యాదకు భిన్నంగా ప్రయోగించారు. వాటిలో కొన్ని వాడుకలో స్థిరపడ్డాయి. కొన్ని” వాడుకలో లేకుందా తొలగిపోయాయి. వాడుకలో స్థిరపడిన వాటిని యధాతధంగా వాడుకో వచ్చు. వ్యాకరణాలలో వాటికేవో వివరణలివ్వవచ్చు. లేకపోతే కొత్త వ్యాకరణ సూత్రాలను ఏర్పరచుకోవచ్చు. అయితే మనం పొరపాటుగా వాడిన పదాన్ని ఆధారం చేసుకొని మరెన్నో రూపాలను కూడా తయారుచేసుకోవచ్చు. ఇదంతా మన అవసరం మీద ఆధారపడి ఉంటుంది. మన అవసరానికి అనుగుణంగా అంతకుపూర్వం ఎప్పుడూ లేని కొత్తమాటలూ, కొత్తపద బంధాలూ మనం తయారుచేసుకుంటూనే ఉన్నాం. మన సృజనాత్మకశక్తి అద్భుతమైనది. ఎవ రైనా ఒక నూతన కల్పన చేసినవ్వుడు, ఆ కల్పన ఆ భాష మాట్లాదే పదిమందికీ ఆమోద యోగ్యమైనప్పుడు అభ్యంతరమేమీ ఉండకూడదు. ఒక్కొక్కసారి ఈ నూతన కల్పన మన ప్రశంస లను పొందుతుంది కూడా. నూతనత్వమూ, వైవిధ్యమూ అంగీకరించవలసినవే కాక, తప్పనిసరి కూడా, అయినా హేతుఐద్ధం కానప్పుడు, కేవలం మనకు తెలియకపోవడం వల్ల చేసిన పొరపాటు
అయినప్పుడు అటువంటి కల్చ్పనలను పరిహరించవచ్చు. వాటికి ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు
ఇది మరింత అవసరం. వైవిధ్యం కోసమో, నూతనత్వం కోసమో, అవసరం కొద్దీనో ఉద్దేశ పూర్వకంగా ఒక ప్రయోగం చేయడంవేరు. అది ఒక్కోసారి ఆమోదాన్ని పొందవచ్చు, పొందకనూ పోవచ్చు. తెలియక చేయడం వేరు. రచయితలయిన వారు ఈ రెండోదాన్ని పరిహరించవచ్చు.
సంస్కృతంలో సంబంధార్థంలో వచ్చే తద్ధిత ప్రత్యయం_అన్ ఈ ప్రత్యయంతో ఎన్నో మాటలు ఏర్పడతాయి. సాధారణంగా తద్ధిత ప్రత్యయాలు చేరినప్పుడు ఆదివృద్ధి వస్తుంది. అంటే పదం మొదట ఉన్న అచ్చుకు వృద్ధి వస్తుంది. అచ్చుతో మొదలయ్యే మాట అయితే ఆ అచ్చుకు వృద్ది. హల్లుతో మొదలయ్యే మాట అయితే మొదటి హల్లు మీద ఉన్న అచ్చుకు వృద్ధి. వృద్ధి అంటే అ, ఆ లకు బదులుగా “ఆ' రావడం; ఇ, ఈ, ఏ, ఐ లకు ఐదులుగా 'బు రావడం; ఉ, ఊ, ఓ, బె లకు బదులుగా 'బౌ రావడం; బు, బూ లకు బదులుగా 'ఆర్ రావడం. వృద్ధి మాత్రమేకాక ప్రత్యయాన్ని బట్టీ, పదాదిలో ఉన్న వర్షాలను బట్టీ మరికొన్ని మార్పులు కూడా వస్తాయి.
శివ అన్న మాటమీద 'అన్ొ ప్రత్యయం వస్తే ఆది వృద్ధి వచ్చి శైవ అవుతుంది. శైవం అంటే శివ సంబంధమైనది. శైవుడు అంటే శివుణ్ణి సేవించేవాడు. శైవమకానికి సంబంధించినవాడు. అట్లాగే విష్ణు శబ్బం కూడా. విష్ణు సంబంధమైనది వైష్ణవం. విష్ణువును సేవించేవాడు వైష్ణవుడు. దేవ సంబంధమైనది దైవం, గ్రీష్మ సంబంధం గైష్మం. .
తిల సంబంధమైనది తైలం. తిలలంటే నువ్వులు. వాటినుండి తీసేది తైలం. ఒకప్పుడు మనం వాడింది నువ్వులనూనె. అది నూనెకు సామాన్యవాచి ఆయిపోయింది. ఇప్పుడు వేరుశనగ నుండి తీసినా, కుసుమల నుండి తీసినా దేన్నుండి తీసినా తైలమనే అంటున్నాం. ఆసలు నూనె అన్నమాట కూడా 'నూనేయి' అంటే నువ్వుల నుండి తీసిన నేయి నుండి ఏర్చడింది. అదీ జైలం లాగానే సామాన్యవాచి అయింది.
జిన సంబంధమైనది జైనం. బుద్ధ సంబంధమైనది బౌద్ధం. స్మృతి సంబంధమైనది స్మార్తం. ఈ పద్ధతిలోనే క్రీస్తుకు సంబంధించినది అన్న అర్థంలో క్రైస్తవం అన్నమాట ఏర్పడింది.
బ్ మనబాషతి 121
పాయసం- దేశీయం- సనాతనం పయస్ అంటే పాలు, పాలకు సంబంధించింది అంటే పాలతో చేసింది, పాలతో వండింది పాయసం. వరమం అన్నం పరమాన్నం. శ్రేష్టమైన అన్నం పరమాన్నం. అంటే పాలతో వండిన అన్నం డ్రేష్టమైనది. అందుకే దీనికి పరమాన్నం అని పేరు. పాయసం పరమాన్నం ఒకటే. సరళ దేవదారు వృక్షాల పాలనుండీ పుట్టిన దాన్ని కూడా పాయసం అంటారు. పాగవేయడానికి ఉవ యోగించే సరళ దేవదారు వృక్షాల బంక,
పురమునకు చెందినవారు పౌరులు. పురవాస్తవ్యులు. నగరంలో నివసించే వారు నాగరి కులు. పౌరులనే మాటను ఇప్పుడు సిటిజన్ అన్న అర్థంలో వాడుతున్నాం. నాగరం అంటే నగరంలో పుట్టింది.
(గ్రీష్మ బుతు సంబంధమయింది (గైష్మం. హేమంత బుతు సంబంధమయింది, హేమంతం. శిశిరానికి చెందింది శైశిరం. వసంతానికి చెందింది వాసంతం. పవన సంబంధం పావనం. ఈ మాటలన్నిటిలో చేరిన తద్ధిత ప్రత్యయం “అ.
దక్షిణ దేశానికి సంబంధించిన వాడు దాక్షిణాత్యుడు. పశ్చాత్ అంటే పడమటికి సంబం ధించింది, పాశ్చాత్యం. నియతంగా ఉందేది నిత్యం. అమా అంటే సమీపం. సమీపంలో ఉండే వాడు అమాళ్యుడు. రాజు పకృనే ఉండి మంద్రాలోచన చెప్పేవాడు. ఈ మాటల్లో (ప్రత్యయం “త్య.
దేశానికి సంబంధించి దేశీయం. ప్రాంతానికి సంబంధించింది (ప్రాంతీయం. స్వ అంటే తన. తనకు సందింధించింది స్వీయం. స్వకీయం కూడా. పరునికి సంబంధించింది పరకీయం. భారతదేశానికి సంబంధించింది భారతీయం. రాష్ట్రానికి సంబంధించింది రాష్టియం, రాష్ట్రీయం. రాజుకి సంబంధించింది రాజకీయం. వీటిలో ప్రత్యయం “ఈయ.
అస్మత్ మీద ఈయ చేరితే అస్మదీయం. మాయాబజార్ సినిమాలో ఈ అస్మదీయులుతో పాటు తస్మదీయులు అనేమాట (ప్రచారం లోకి వచ్చింది. అస్మదీయులంటే తనవాళ్ళు. తస్మదీయులంటే పరాయివాళ్ళు, ఎదుటివాళ్ళు, (ప్రత్యర్థులు అన్న అర్ధంలో వాడారు. తస్మదీయులనే మాటేదీ లేదు. అస్మదీయులు సామ్యంతో ఈ తస్మదీయులు వచ్చిందన్నమాట. యుష్మత్- యుష్మదీయం అవుతుంది. నీకు సంబంధించింది. మత్-మదీయం, నాకు సంబంధించింది. తత్ నుండి తదీయం ఏర్పడుతుంది. దానికి సంబం ధించింది. యత్ నుండి యదీయం, ఎవరికి సంబంధించింది. త్వత్ నుండి త్వదీయం ఏర్పడదు తుంది. నీకు సంబంధించింది. భవత్- భవదీయం అన్నా అదే అర్ధం. త్వదీయం అనేమాటకు తావకం, తావకీనం అనే రూపాలు కూడా ఉన్నాయి. మదీయం అనేమాటకు మామకం, మామకీనం అనే రూపొలున్నాయి. అస్మదీయానికి అస్మాకం, అస్మాకీనం అనే రూపాలున్నాయి. యుష్మదీయానికి యౌష్మాకం, యౌష్మాకీణం అని రూపాలున్నాయి. యౌష్మాకం, యౌష్మాకీణం అనే మాటలకు తెలుగులో అంతగా వాడుకలేదు. సాయంకాలం అన్న అర్ధంలో సాయంతనం అన్నమాట ఉంది మనం తెలుగులో సాయం (త్రం అనేమాట వాడతాం. సాయంతనమే సాయంత్రమయిందేమో. చిరంతనం అంటే చిరకాలం నుండి ఉన్నది. అంటే చాలాకాలం నుండి ఉన్నది. అట్లాగే దోషాతనం, దివాతనం. దోషా అంటే
రాత్రి. దివా అంటే పగలు. (ప్రాక్-తనం ప్రాక్తనం. అధునా అంటే ఇప్పుడు. దీనినుండే అధు నాతనం. అద్య అంటేవర్తమానం. దీనినుండే అద్యతనం. ఇదానీం అంటే ఇప్పుడు. దీని నుండి ఇదానీంతనం. తదానీం అంటే అప్పుడు. దీనితో తదాసీంతనం. సదా అంటే ఎల్లప్పుడు. దీనితో సదాతనం,. సనా అంటే నిత్యం. దీనితో సనాతనం. నాశనం లేకుండా ఎల్లప్పుడూ ఉండేది. సదా తనం అన్నాసనాతనం అన్నా, నిత్యం అన్నా శాశ్వతం అన్నా అర్థం ఒకటే. పురా అనేమాటను భిన్నార్ధాలలో ఉపయోగించవచ్చు. పురాకు తన చేరితే పురాతనం. పాఠది అని అర్థం. పురాణం, పురాతనం, చిరంతనం, ప్రతనం, ప్రత్నం అన్నీ ఒకే అర్ధంలో వాడుకలో ఉన్నాయి.
నూతనం, నూత్నం అంటే కొత్తది. దీనికే నవ్యం, నవం, నవీనం పర్యాయ రూపాలు.
హ్యస్ అంటే నిన్న దీనినుండి వ్యస్తనం. శ్వస్ అంటే రేపు. దీనినుండి శ్వస్తనం. ఈ మాటలు తెలుగులో వాడుకలో లేవు.
అపరాష్టం, పూర్వాష్టాం నుండి అపరాష్టాతనం, పూర్వాష్ణాతనం ఏర్చడతాయి. పూర్వా హ్టాం అంటే అహస్సు పూర్వభాగం. అపరాష్ట్లాం అంటే అహస్సు కడపటి భాగం. మధ్యాహ్నం అంటే అహస్సు మధ్యభాగం. పూర్వాహ్జాన్నే ప్రాహ్హం అని కూడా అంటారు. ఈ మూడు భాగా లనూ త్రిసంధ్యలంటారు. ఈ మూడు మూడు కాలాలు, మూడింటినీ కలిపి త్రిసంధ్యం అంటారు.
అధస్ అంటే కింద. దీనికి తన ప్రత్యయం చేరిస్తే అధస్తనం ఏర్పడుతుంది. సద్యస్ అంటే అప్పుడు. దీనికి 'తన' చేరిస్త సద్యస్తనం. ప్రాతస్ అంటే ప్రభాతం, ఉదయం. దీనినుండి ప్రాత స్తనం.
ఈ మాటలలో కొన్నిటికి ఇతర ప్రత్యయాలు కూడా చేరతాయి. ఉదాహరణకు అపరాహ్లా తనాన్ని అపరాష్టికం అనీ, అపరాహ్హకం అనీ కూడా అనవచ్చు. సంధ్యకు 'అ' ప్రత్యయం వచ్చి సాంధ్యం అవుతుంది.
చ్ మనభాషతి 123
రైనికం - ఐహికం
ఒకే కాలపరిమితిలో జరిగే విషయాలుంటాయి. ఆ కాల పరిమితిని తెలియజేయడానికి “ఇక ప్రత్యయం వస్తుంది. రోజుకు ఒక్కసారి జరిగేది దైనికం. దిన పరిమితమైనది. మన దిన వత్రిక లన్నీ దైనికాలే. నెలకు పరిమితమయింది అంటే మాసానికి పరిమితమయింది మాసికం. రెండు, మూడు వంటి సంఖ్యావాచకాలు చేర్చి కూడా దీన్ని వాడవచ్చు. ద్విమాస పరిమితమైంది ద్వైమా సికం, త్రి మాస పరిమితమైంది త్రైమాసికం, షట్ మాస పరిమితమైంది షాణ్మాసికం. త్రైమాసిక, షాణ్మాసిక పరీక్షలు (ప్రసిద్ధమే కదా. ఏడాదికి పరిమితమైంది వార్షికం. వర్షం అంటే సంవత్సరం. _ వర్ష పరిమితం అన్నమాట. అట్లాగే సంవత్సర కాలానికి పరిమితమయితే సాంవత్సరికం. అబ్దం అన్నా సంవత్సరమే. దీనితో ఆబ్బికం ఏర్పడుతుంది. మాసికం, ఆబ్దికం వంటి మాటలు ్రత్వేక అర్ధాలతో స్థిరపడడం వల్ల సాధారణార్ధంలో వీటిని వాడడంలేదు. మాసికం అనగానే నెలనెలా చేసే పిండ పితృయజ్ఞం అనేఅర్ధమే తోస్తుంది. అట్లాగే అబ్బికం అన్నా ప్రతి ఏడాదీ చేసే పిక యజ్ఞమే. సాంవత్సరికం అన్నమాటకు కూడా దాదాపు ఈ అర్ధమే స్థిరపడిపోయింది. వార్షికం అన్నమాట మాత్రం సాధారణార్ధంలో ఉంది. వార్షిక పరీక్షలు, వార్షిక ఆదాయం, వార్షిక బడ్జెటు, వార్షికోత్సవం మొదలయిన విధంగా వార్షిక పదానికి విసృతమయిన వాడుక ఉంది. అహ్న పరిమితం ఆహ్నికం. కాల పరిమితం కాలికం. తత్కాల పరిమితం తాత్కాలికం. అధునా అంటే ఇప్పటికి సంబంధించింది ఆధునికం.
“ఇక ప్రత్యయం వివిధ అర్థాలలో వస్తుంది. ఇహా అంటే ఇక్కడ. ఇహానికి సంబంధించింది ఐహికం. ఈ లోకానికి సంబంధించింది. అట్లాగే లౌకికం. పరలోకానికి సంబంధించింది పాఠ లౌకికం. అధ్యాత్మ సంబంధం ఆధ్యాత్మికం. పరమార్ధానికి సంబంధించింది పారమార్ధికం.
ధర్మ సంబంధమైనది ధార్మికం. ధర్మగుణం కలిగినవాడు ధార్మికుడు. ఈ మాటకు మత విశ్వాసం కలిగిన వాడన్న అర్ధం కూడా ఏర్పడింది. అధర్మ సంబంధం అధార్మికం. అస్తి అంటే ఉంది అనీ, నాస్తి అంటే లేదనీ అర్ధం. అస్తి నుండి ఆస్తిక అన్నమాటా, నాస్తి నుండి నాస్తిక అన్న మాటా ఏర్పడ్డాయి. ఆస్తికుడు అంటే పరలోకం ఉందనేవాడు. నాస్తికుడు అంటే పరలోకం లేదనే వాడు.
వేదానికి సంబంధించింది వైదికం. వైదిక కర్మకాండ అంటే వేదంలో చెప్పిన కర్మకాండ. వృత్తి వార్తికం అవుతుంది. వ్యాకరణాది శాస్త్రాలలో సూత్ర వివరణ వృత్తి,
తర్మం చదువుకున్నవాడు తార్మికుడు. పురాణ సంబంధమైనది పౌరాణికం. పురాణం చెప్పే
వాడు పౌరాణికుడు. ఇతిహాస సంబంధమైనది ఐతిహాసికం. ఇతిహాసం చెప్పేవాడు ఐతిహాసి కుడు. చరిత్ర సంబంధమైనది చారిత్రికం. చరిత్ర రచయిత చారిత్రికుడు,. అలంకార సంబంధ మైనది ఆలంకారికం. అలంకార శాస్త్రం ఉంది. అలంకార శాస్త్రం అంటే సాహిత్య శాస్త్రం. కావ్య లక్షణాలు చెప్పే శాస్త్రం ఇది. కావ్యంలో ఉండే అన్ని విషయాలూ ఈ శాస్త్రంలో చర్చకు వస్తాయి. ఇటువంటి శాస్త్రాన్ని రచించే వాళ్ళు ఆలంకారికులు లక్షణం అన్నది ఒక విషయాన్ని గుర్తించే చిహ్నం. శాస్త్రాలన్నీ ఏదో ఒక పదార్థ లక్షణాన్ని వివరించేవే. అందువల్ల లక్షణ నిరూపకులయిన వండితులు లాక్షణికులు. అలంకార, వ్యాకరణాది శాస్త్రజ్ఞుల విషయంలో లాక్షణిక శబ్దాన్ని
వాడతాం.
జ్యోతిష్యం తెలిసినవాడు జ్యౌతిషికుడు. ముహూర్తం తెలిసినవాడు మౌహూర్తికుడు. కృతాంతం అంటే దైవం. కృతాంతం తెలిసిన వాడు కార్తాంతికుడు. జ్యౌతిషికుడు అన్నా మౌహూర్తికుడు అన్నా కార్తాంతికుడు అన్నా జోస్యుడే. తంత్రం తెలిసిన వాడు తాంట్రికుడు. మంత్రం తెలిసినవాడు మాంత్రికుడు. తంత్రం అంటే మత ధర్మాన్ని విస్తరింపచేసేది. గాయతి మొదలయిన వేద మంత్రాలు మంత్రాలు. రహస్యాలోచనకు కూడా మంటత్రమని పేరు. దీనినుండే మంత్రాంగం, మంత్రి, మంత్రాలోచన వంటి మాటలు ఏర్పడ్డాయి. మంత్ర తంత్ర శబ్దాలకు మాంత్రిక, తాంత్రిక శబ్బాలకూ కొంత దురర్థం కూడా ఏర్పడింది.
మృదంగం వాయించేవాడు మార్దంగికుడు. వీణ వాయించే వాడు వైణికుడు.
నౌ అంటే నావ. నావ నడిపేవాడు నావికుడు. హలం అంటీ నాగలి. హలంతో పొలం దున్నేవాడు కాబట్టి హాలికుడు, రైతు. బమ్మెర పోతన పేర ప్రసిద్ధంగా ఉన్న పద్యం “బాల రసాల సొల...'లో హాలికులైననేమి అంటాడు: పోతనగారి ఇతివృత్తాన్ని తీసుకొని 'వాలికుడు” అన్న పేర ఒక చారిత్రిక నవల కూడా వచ్చింది. పధం అంటే తోవ, బాట, దారి. పధంలో నడిచేవాడు పధికుడు, బాటసారి. ఇంద్రజాలం చేసేవాడు ఐంద్రజూలికుడు.
(శ్రమచేసేవాడు శ్రామికుడు. పరిశ్రమకు సంబంధించింది పారిశ్రామికం. కర్మ అంటే చేయడం, పని. కర్మ చేసేవాడు కార్మికుడు. ఈ మాటలకు ఆధునిక కాలంలో చాలా వ్యాప్తి వచ్చింది. కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు కార్మికులు. శ్రమించి జీవించే వర్గం వారినందరినీ శ్రామికులంటున్నాం. పరిశ్రమ అంటే ఇండస్ట్రీ: పరిశ్రమ కలిగినవాడు, యజమాని, పెట్టుబడి దారు, పారిశ్రామికుడు.
మనస్ సంబంధమైంది మానసికం. దేహ సంబంధమైంది దైహికం. అర్ధ సంబంధమైంది ఆర్థికం. సమాజ సంబంధమైంది సామాజికం, సంఘ సందింధం సాంఘికం. సామాజికుడు అన్నమాటను అలంకార శాస్త్రాలలో సహృదయుడయిన ప్రేక్షకుడు అన్న అర్ధంలో ఉపయోగిం చారు. పశు సంబంధం పాశవికం. పశువుకు జ్ఞానంలేదు, అది అనాగరికం. అటు వంటి పశువు ప్రవృత్తి మనిషిలో ఉంటే దాన్ని పాశవిక ప్రవృత్తి మానవునిలో ఉండదగనిది అంటున్నాం. పక్ష నుండి పాక్షికం ఏర్పడింది. ఒకే పక్షం నుండి చూడడం వల్ల ఏదైనా అసమ(గ్రంగా దర్శన మిస్తుంది. అసమగ్రతకూ, పక్షపాత దృష్టికీ ఇది సంకేతం. ఇచ్చా నుండి ఐచ్చికం ఏర్పడింది. తన ఇష్టాన్ని అనుసరించి అన్నమాట. ఆప్షనల్ అన్నమాటకు సమానార్థకంగా వాడుతున్నాం. పార్య- పార్యికం, అంగ- ఆంగికం, దేవ- దైవికం, (ప్రేమ- (ప్రేమికుడు, సత్త్వ- సాత్త్వికం, భౌతికం, సార్వత్రికం, నైతికం, స్థానికం వంటి అసంఖ్యాకమైన వదాలు ఈ “ఇక ప్రత్యయంతో ఏర్చ్భడు తున్నాయి.
బ్ మనభాషళి 125
మహిమ -రాజ్యం మనవాళ్ళు అప్టెశ్వర్యాలంటూ ఉంటారు. అష్ట అంటే ఎనిమిది అనీ, ఐశ్వర్యం అంటే విభూతి అనీ అందరికీ తెలిసిన విషయమే. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, (ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం అనేవి ఎనిమిది ఐశ్వర్యాలు. వీటిలో మొదటి నాలుగింటిలోనూ ఉన్న తద్ధిత (ప్రత్యయం “ఇమన్. ఈ ప్రత్యయం చేరి అమూర్త నామవాచకాలేర్చడతాయి. గుణ సంబంధ మయిన పదాలనేకం ఏర్పడతాయి. అణువు స్వభావం అణుత్వం, సూక్ష్మత్వం. దీని మీద “ఇమ” చేరి అణిమ అవుతుంది. అట్లాగే మహా్ అంటే పూజింపబదేది. దీని నుండే మహిమ. అట్లాగే గురుత్వం చేత గరిమ, లఘుత్వం చేత లఘిమ. పటుత్వం పటిమ. నేర్చరితనం, దిట్టతనం. ప్రియభావం (ప్రేమ. ప్రేమ సంతోషింపజేసేది. ప్రీతి, స్నేహం. దృఢ శబ్దం నుండి ద్రఢథిమ ఏర్పడింది, బలం. మధురశద్దం నుండి మధురిమ. తియ్యదనం, ఇష్టమైనది. నీల శబ్దం నుండి నీలిమ. నలుపు అని అర్ధం. జడ శబ్దం నుండి జడిమ. జడత్వం అని అర్ధం, భావార్థంలోనూ మరికొన్ని అర్థాలలోనూ 'య' (ప్రత్యయం వస్తుంది. రాజు భావం రాజ్యం. సారధి నుండి సారథ్యం ఏర్పడుతుంది. అధిపతి నుండి ఆధిపత్యం విరూపభానం వైరూవ్యం. ధీరుడి భావం ధైర్యం. కవి నుండి కావ్యం ఏర్పడింది. పురోహితుడి నుండి పౌరోహిత్యం. నిపు ణుడి భావం నైపుణ్యం. అట్లాగే గంభీర శబ్దం నుండి గాంభీర్యం దూత భావం దౌత్యం. దూత చేసే వని కూడా దౌత్యం. శూరుడి లక్షణం శౌర్యం. ప్రవీణుడి లక్షణం ప్రావీణ్యం. స్థిరశబ్దిం నుండి స్టెర్యం ఏర్పడింది. ధైర్యస్ట్యాలని జంటపదాలుగా వాడుతూ ఉంటాం. వయస్ శబ్ధం నుండి వయస్కుడు. వయస్కుడు అంటే సమాన వయస్ముడన్నమాట. సమానవయస్కుల మధ్య స్నేహభావం ఉంటుంది. అందువల్ల వయస్కుడంటే స్నేహితుడని అర్థం. దండ శబ్దం నుండి దండ్యం. దండ్యం అంటే దండింపదగింది. ఇటువంటిదే వధ్యం. వధ నుండి ఏర్పడింది. చంపదగింది అని అర్ధం. తులా నుండి తుల్యం ఏర్పడింది. సమానం అని అర్థం. మూల శబ్దం నుండి మూల్యం ఏర్పడింది. మూలంతో సమానమైనది అని అర్ధం, వెల, - వథి నుండి పథ్యం. జబ్బు చేస్తే పధ్యం పెడతారు. ఆయా రోగాలలో తినదగింది, తిన దగంది అని నియమం. రోగంలేని మార్గంలో మంచిది. హృత్ నుండి హృద్యం. హృదయానికి అంగీకారమైంది. మనోహరమైనదన్నమాట. ధర్మ శబ్దం నుండి ధర్యం. అంటే న్యాయంగా సంపాదించింది. ద్రవ్యం అంటేమంచి పదార్థం. వొంద దగినది అని అర్ధం. సఖుని భావం సఖ్యం. సఖ్యమంటే స్నేహం. సఖ్యం సాప్తపదీనం అని వాడుక. కలిసి వడడుగులు నడిస్తే స్నేహం ఏర్పడుతుందన్నమాట. ఈశ్వరుని భావం ఐశ్వర్యం. ఐశ్వర్యం అన్న మాటను ఇప్పుడు ధన సంపద అన్న అర్థంలో ఎక్కువగా వాడుతున్నాం. సుభగుని భావం సౌభాగ్యం. భాగ్యవంతుడి లక్షణం. ముఖంతో సమానమయింది ముఖ్యం, ముఖం శరీరంలో (ప్రధానమయింది. దీనివంటిది
ముఖ్యం. ప్రధానమయిందని అర్ధం. ప్రధాన శబ్దం నుండి ప్రాధాన్యం. అట్లాగే ప్రముఖ శబ్దం "నుండి ప్రాముఖ్యం. మూఢుని భావం మౌధ్యం. దుర్దనుని భావం దౌర్జన్యం. దీనుని భావం దైన్యం. వంశ శబ్దం నుండి వంశ్యుడు అన్నమాట ఏర్పడింది. ఆ వంశంలో పుట్టినవాడని అర్థం. సూర్య వంశ్యుడు, చంద్ర వంశ్యుడు అంటాం. దేశంలో పుట్టింది దేశ్యం. రహస్ అంటే ఏకాంత స్ధలం, ఏకాంతస్థలంలో అంటే ఎవరూ లేనిచోట పుట్టింది రహస్యం. ఆదిలో పుట్టింది ఆద్యం. అంతంలో పుట్టింది అంత్యం, ఆద్యంత్యాలు అని జంటగా వాదతాం. సజాతి నుండి పుడితే సజాత్యం. విజాతి నుండి పుడితే విజాత్యం. చకుకం నుండి పుట్టిన వాడు చాళుక్యుడు. నన్నయను పోషించిన రాజరాజ నరేంద్రుడు తూర్పు చాకుక్య వంశానికి “చెందిన రాజు. చాళుక్య వంశమూల పురుషుడు బ్రహ్మ చుళుకం నుండి ఉద్భవించాడట. చుళుక మన్నమాటకే చళుకమన్న రూపాంతరం ఉంది. ఈ చకుక శబ్బం నుండే చాళుక్య అన్నమాట ఏర్పడింది. దంతముల నుండి పుట్టింది దంత్యం. కంఠం నుండి పుట్టింది కంఠ్యం, మూర్ధం నుండి పుట్టింది మూర్ధన్యం. సభ నుండి సభ్యుడన్న మాట ఏర్పడింది. సభికుడు అన్నమాటకు జూదం అడించేవాడు అని అర్ధం. సభ కలిగినవాడన్నమాట. సభ అన్నమాటకు ఆస్థానం అనీ, సజ్జనుడనీ, సమూహ మనీ, శాల అనీ, జూదం అనీ అర్థాలు. ఇప్పుడు సభికుడు అన్న మాటకే ఎక్కువ ప్రచారం కని పిస్తుంది. సభాసదులు, సభాస్తారులు, సభ్యులు, సామాజికులు అన్న మాటలు సభలో ఉండేవారికి వాడేవి. గో సంబంధమైంది గవ్యం. గోవు అవయవాలలో దేన్నైనా గవ్యం అనవచ్చు. పాలు మొదలయిన వాటిని కూడా గవ్యం అనవచ్చు. పయస్ అంటే పాలు. పాల నుండి ఏర్పడ్డ పెరుగు, మజ్జిగ, వెన్న నెయ్యి వీటిని పయస్యం అనవచ్చు. రధాలు నడిచేవి కాబట్టి రథ్యం. పాదాలు కడుగుకోవటానికి ఇచ్చే నీరు పాద్యం. అతిధి కోసం ఇచ్చేది ఆతిధ్యం. అర్హం అంటే పూజ. పూజకోసం నీళ్ళు అర్ధ్యం. “నౌ అంటే నావ. నావతో దాటదగింది నావ్యం. హలంతో దున్నకగింది హల్యం. ఈ విధంగా “యి ప్రత్యయంతో అనేక శబ్దాలు ఏర్పడతాయి. ఖ్ మనభాషతి 127
జాడ్యాదులు గుొుణవాచకాలయిన మాటలకు కర్మం, భావం అనే ఆర్భాలలో 'య' ప్రత్యయం వస్తుంది. జడ శబ్దం మీద ఈ ప్రళయం వస్తే జాడ్యం, జడుడు చేసే పని కాని జడుని లక్షణం కాని కావచ్చు. అట్లాగే మూఢ శబ్దం. దీనీ నుండి మౌధ్యం ఏర్పడుతుంది. మూర శబ్దం నుండి మౌర్ధ్యం ఏర్పడు తుంది.
ఉష్ణ శబ్దిం బెస్ట్రం అవుతుంది. శీత శబ్దం శైత్యం అవుతుంది. నీల శబ్దం నుండి నైల్యం ఏర్పడుతుంది. అప్పుడు అరుణ నుండి ఆరుణ్యం ఏర్పడుతుంది. జాద్యం, మౌధ్యం, శైత్యం, నైల్యం తెలుగులో ఎక్కువగా వాడే మాటలే.
(బ్రావ్మణ్యం అనేమాట కూడా వింటూ ఉంటాం. (బాహ్మణ సమూహం అని దీనికి ఒక అర్ధం. బ్రాహ్మణుడు చేసే పని, (బ్రాహ్మణుని భావం అని కూడా అర్ధాలు. చోరుడు చేసే వని చౌర్యం. బాలుడి భావం బాల్యం. అలసుని లక్షణం ఆలస్యం. గృహస్టుని భావం గార్హస్థ్యం. పండి తుని లక్షణం పాండిత్యం. తరతమ భావం తారతమ్యం. భేదం అనే అర్ధంలో ఈ మాటను వాడు తున్నాం. ఎక్కువా తక్కువా అన్న భావంలో వాడుతున్నాం
విషమ శబ్దిం నుండి వైషమ్యం ఏర్పడింది. వైషమ్యం అంటే విషమత్వం. సమానంగా ఉండకపోవడం, హెచ్చుతగ్గులుగా ఉండడం, మిట్టపల్లాలుగా ఉండడం, కరుకుదనమనీ, అన్యా యం అనీ, కష్టం, దుఃఖం అనీ, ఒంటరితనం అనీ కూడా దీనికి అర్జాలు ఏర్పడ్డాయి. కాని తగువు, భేదాభిప్రాయం, విరోధం అన్న అర్ధంలో ఎక్కువగా వాడుతున్నాం. విరోధ శబ్దం నుండి వైరుధ్యం ఏర్పడింది.
మావాత్యం, మావాత్యం గొప్పతనం, మహిమ అన్న అర్ధంలో వాడుకలో ఉన్నాయి. లవణ శబ్దం నుండి లావణ్యం ఏర్పడింది. లవణం అంటే సుందరమని అర్ధం. అందువల్ల లావణ్య శబ్బానికి సౌందర్యం అని అర్ధం. సౌందర్యం సుందర శబ్దం నుండి ఏర్పడింది.
వత్సల శబ్దం నుండి వాత్సల్యం ఏర్పడింది. ఏక నుండి ఐక్యం ఏర్పడుతుంది. సుఖ శబ్దం తో సౌఖ్యం ఏర్పడుతుంది. ధీరుడి భావం ధైర్యం. అయితే వీరుడి భావం వైర్యం కావాలి కాని, వీర్యం అని వాడుక
సేనాపతి లక్షణం సైనాపత్యం, బృహస్పతి నుండి బార్జస్పృత్యం ఏర్పడింది. అదేవిధంగా గృహపతి పదం నుండి గార్టప్రత్యం ఏర్పడింది.
ఆస్తికుడి నుండి ఆస్తిక్యం. నాస్తికుని నుండి నాస్తిక్యం. నాగరుని నుండి నాగర్యం ఏర్ప డ్దాయి. సమ్రాట్ భావం సామ్రాజ్యం.
విశిష్ట శబ్దం నుండి వైశిష్ట్యం ఏర్పడుతుంది. విశద నుండి వైశద్యం, విరల నుండి వైరల్యం ఏర్పడతాయి. వైశద్యం అంటే స్పష్టత. వైరల్యం అంటే అరుదుగా ఉండడం. వివర్ణ నుండి వైవర్హ్యం ఏర్పడుళుంది. వైవర్జ్యం అంటే రంగు మారడం. విశారద శబ్దం నుండి వైశారద్యం ఏర్పడుళుంది. వైశారద్యం అంటే నేర్పు, దక్షత.
వివిధ శబ్దంనుండి వైవిధ్యం ఏర్పడుతుంది. అట్లాగే విపుల నుండి వైపుల్యం. విశాల నుండి
- వైశాల్యం. విముఖ శబ్ధం నుండి వైముఖ్యం ఏర్పడుతుంది. విలక్షణ నుండి వైలక్షణ్యం ఏర్పడు 28 త మనభాష
తుంది. ప్రత్యేకత్వమని అర్ధం. విపరీత నుండి వైపరీత్యం ఏర్పడుకుంది. విఫల నుండి వైఫల్యం, సఫల నుండి సాఫబ్యం ఏర్పడతాయి.
సమ శబ్దం నుండి సామ్యం ఏర్పడుతుంది. సమానత్వం అని అర్థం. పోలిక, తుల్యత్వం అన్న అర్ధంలో వాడుతున్నాం. అదేవిధంగా సమాన శబ్దం నుండి సామాన్యం అన్నమాట ఏర్ప డింది. సదృశ నుండి సాదృశ్యం ఏర్పడింది. సాదృశ్యం అన్నా పోలికే. పరుష నుండీ పారుష్యం, కరిన నుండి కారిన్యం ఏర్పడతాయి. సోదర శబ్దం నుండి సౌదర్యం. సోదరత్వమని అర్ధం.
సయుజ్ శబ్దం నుండి సాయుజ్యం ఏర్పడుతుంది. ముక్తి అని అర్ధం. వణిజ్ శబ్దం నుండి వాణిజ్యం ఏచ్చడింది.
కుశల నుండి కౌశల్యం ఏర్పడింది. అట్లాగే చపల నుండి చాపల్యం. యజమాన నుండి యాజమాన్యం.
ఈ 'యి ప్రత్యయం స్వార్ధంలో కూడా వస్తుంది. చతుర్వర్ణ- చాతుర్వర్హ్యం అవుతుంది. సేనా శబ్దం సైన్యం అవుతుంది. అర్ధం ఒకటే. సన్నిధి సాన్నిధ్యం అవుతుంది. అట్లాగే సమీప - సామీప్యం అవుతుంది. ఉపమ నుండి బెపమ్యం ఏర్పడుతుంది. ఐతిహ నుండి ఐతిహ్యం ఏర్ప గింది. భేషజ నుండి ఖైషజ్యం. ఐతిహ్యం అంటే ఈవిధమైన పరంపర ఉన్నదని అర్థం. అంటే పరంపరగా చెప్పుకుంటున్నారని అర్ధం. ఖైషజ్యం అంటే మందు అనీ, రోగం కుదర్చడమనీ అర్థం. రోగం కుదర్బడమనే మాట తెలుగులో జాతీయంగా బుద్ధి చెవ్చడమనే అర్ధంలో వాడుకలో ఉంది. కాని, ఇక్కడ మాస్రం నిజంగానే రోగం మాన్చడమే.
చేతన- చైతన్యం అవుతుంది. (త్రిలోక త్రైలోక్యం అవుతుంది. పరంపర నుండి పారం పర్యం ఏర్పడుతుంది. కరుణ నుండి కారుణ్యం ఏర్పడుతుంది. వ్యాకరణంబో ఆనంతర్యార్థం అని ఒక అర్థం ఉంది అనంతరం అన్న అర్ధంలో వచ్చేదన్నమాట. (గ్రాంధిక భాషలో 'డున్' చేరుతుంది ఈ అర్థంలో. వక్త రాగానే సభ మొదలయింది వంటి వాక్యాలు ఆధునిక భాషలో ఆనంతర్యార్థానికి ఉదాహరణలు. మాలా శబ్దం నుండి మాల్యం. మణిక శబ్దం నుండి మాణిక్యం ఏర్పడ్డాయి. ఈ విధంగా ఎన్ప్నీ మాటలను తయారు చేసుకోవచ్చు.
బ్ మనభాషలి 129
మమత -మమత్వం సంస్కృత వదాలతో మనం తెలుగులో వాడే తద్ధిత ప్రత్యయాలలో చాలా ముఖ్యమైనవి “త్పూ, “దా అవి ఖావార్థంలో వస్తాయి. భావార్థం అంటే వస్తువులో ఉందే ధర్మం. ఈ అర్ధంలో సంస్కృ తంలో చాలా ప్రచారంలో ఉన్న ప్రత్యయం 'త్వ. అందువల్లే తెలుగు వ్యాకరణాలలో భావార్శానికి త్వార్ధమని కూడా పేరు. సంస్కృతంలో 'త్వ' అన్న ప్రత్యయం ఏ అర్ధంలో వస్తుందో ఆ అర్థంలో వచ్చే తెలుగు ప్రత్యయాలను త్వార్ధక ప్రత్యయాలని తెలుగు వ్యాకర్రలు చెప్తారు. తనం, రికం వంటివి త్వార్ధక లేక భావార్థక ప్రత్యయాలు తెలుగులో. ఏ నామవాచకానికైనా భావం ఉండక తప్పదు. అందువల్ల మనుష్యుల పేర్లతో సహా అన్ని నామవాచకాల మీదా భావార్థక (ప్రత్యయా లను వాడవచ్చు. తెలుగులో ధృతరాష్ట్రుని తనం అన్నామనుకోండి. ధృతరాస్షునిలోని విశేష లక్షణాలన్నీ వస్తాయి. ధృతరాష్రుడిలో అంధత్వమూ ఉంది. కొడుకు మీద గుడ్డి ప్రేమా ఉంది. దేన్నయినా మనం లక్ష్యంగా పెట్టుకోవచ్చు. అట్లాగే మంచితనం అన్నామనుకోండి. మంచివాడిలో ఉండే ధర్మం అని అర్ధం. సంస్కృత పదాలలో కూడా ఈ అర్ధంలో వేరు, వేరు ప్రత్యయాలు వాడుకలో ఉన్నాయి. తెలుగులో తనం, రికం, ఇమి, న, ఇక్క పు వంటి అనేక ప్రత్యయాలు ఈ అర్థంలో వస్తాయి కదా, అట్లాగే సంస్కృతంలోనూ. ఇంతకుముందు జాడ్యం వంటి మాటల్లో వచ్చిన 'య” ప్రత్యయం కూడా భావార్థకమే. 'త్వ, 'త' ప్రత్యయాలను దాదాపు అన్ని నామవాచకాల మీదా భావార్థంలో వాడవచ్చు. రాముని భావం రామత్వం. కృష్ణుని భావం కృష్ణత్వం. సీతా నుండి సీతాత్వం అవుతుంది. సంస్కృతంలో తద్ధిత ప్రత్యయం వచ్చింతర్వాతి రూపమే వాడుతున్నాం కాబట్టీ సీతాత్వం వంటివి అట్లాగే వాడవలసి ఉంటుంది. తా ప్రత్యయం సంస్కృతంలో దీర్భాంతమే. అయితే తెలుగులో సంస్కృతంలో దీరాంత పదాలన్నీ హ్రస్వాంతాలవుతాయి కదా. అందువల్ల ఈ ప్రత్యయం చివర ఉన్న మాటలు కూడా (హ్రస్వాంతాలవుతాయి. సంస్కృతంలో మమ శబ్దం మీద 'తా (ప్రత్యయం వచ్చి మమతా అని ఏర్పడుతుంది. తెలుగులో ఇది మమత అవుతుంది. మమత అన్నా మమత్వం అన్నా అర్ధం ఒకటే. నాది అన్న భావం. తనది అనుకున్న దాని మీద మనిషికి ప్రేమ ఉంటుంది. అందుకే మమత్వం అంటే (ప్రేమ అన్న అర్ధం ఏర్పడింది. గర్వం, స్వాభిమానం, అహంకారం అన్న అర్భాలు కూడా నిఘంటువులలో ఉన్నాయి కాని వాడుకలో మమత్వం, మమత అన్న మాటలకు అభిమానం, (ప్రేమ అన్న అర్ధాలే విస్త్రృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఒకే మాట మీద ఒకే అర్ధంలో వివిధ ప్రత్యయాలు చేరవచ్చు. దానివల్ల వివిధ రూపాలు ఏర్పడతాయి. అధిక అన్నమాటతో అధికత, అధికత్వం, ఆధిక్యం ఏర్పడతాయి. మృదు అనే మాటను తీసుకుంటే మృదుత్వం, మృదుత, మార్దవం, (మదిమం అన్న మాటలు ఏర్పడతాయి. అట్లాగే లఘుత్వం, లఘుత, లఘిమం, లాఘవం. 130 తిమనభాష
దృఢత్వం, దృధత, ద్రఢిమ, దార్థ్యం అన్నమాటలు దృఢ శబ్దం నుండి ఏర్పడుతున్నాయి. అట్లాగే మధురశబ్దం నుండి మధురత్వం, మధురత, మధురిమ, మాధుర్యం ఏర్పడుతున్నాయి. జడ శబ్దం నుండి జడత్వం, జడత, జడిమ, జాద్యం. అలాగే మూర్ధత్వం, మూర్ధత, మౌర్ధ్యం. మూఢ నుండి మూఢత్వం, మూధత, మౌధ్యం. (ప్రౌఢ నుండి ప్రాధత్వం, ప్రొధత. ప్రాఢథిమ అని కూడా వాడుతున్నాం కాని ఇది సరయిన రూపం కాదంటారు. గురు- గురుత్వం, గురుత, గరిమ అవుతుంది. రసిక నుండి రసికత్వం, రసికత, రాసిక్యం ఏర్పడతాయి. వటు నుండి పటుత్వం, పటుత, పటిమ ఏర్పడతాయి. అల్బత్వం- అల్బత, కవిత్వం- కవిత, సాధుత్వం- సాధుత, ధార్మికత్వం- ధార్మికత, సార్థకత్వం- సార్థకత- సార్ధక్యం, కృతార్ధత్వం- కృతార్ధ్థత, అలసత్వం- అలసత- ఆలస్యం ఇలా అసంఖ్యాకంగా పదాలు ఏర్పడుతున్నాయి. ఒకేమాటకు ఒకే అర్ధంలో ఒకేసారి రెండేసి ప్రత్యయాలు చేర్చి కూడా మనం ప్రయో గిస్తున్నాం. ఇది అవసరం కాదు. ఏక అన్న మాట మీద భావార్థక ప్రత్యయాలు చేరిస్తే ఏకత్వం, ఏకత, ఐక్యం అనే మాటలు ఏర్పడతాయి. కొందరు ఐక్యత అని వాడుతున్నారు. ఇటువంటి రూపం ఏర్పడదు. 'య' ప్రత్యయం భావార్థంలోనే వచ్చింది. 'త' ప్రత్యయం కూడా భావార్థకమే. ఈ రెండు ప్రత్యయాలూ ఒకే మాటలో వాడవలసిన అవసరం లేదు. ఏకఠ అనవచ్చు లేదా ఐక్యం అనవచ్చు. ఐక్యత సరయినది కాదు. ఇట్లాగే మాధుర్యత, వాత్సల్యత. మాధుర్యం, వాత్సల్యం అంటే సరిపోతుంది ప్రస్తుతం మనం వాడుతున్న మాటల్లో ప్రాధాన్యత, ప్రాముఖ్యత అన్నమాటలు ఇటు వంటివే. వీటిని చాలా ఎక్కువగా వాడుకున్నారు. ప్రాధాన్యం ప్రధాన శబ్దం నుండి ఏర్పడింది. ప్రాముఖ్యం (ప్రముఖ శబ్బం నుండి ఏర్పడింది. ఇవి చాలు. వీటిమీద మళ్ళీ “ఈ చేర్చవలసిన అవసరం లేదు. ఆధిక్యత అన్న ప్రయోగం కూడా ఇటువంటిదే. అధికత్వం, అధికత, ఆధిక్యం అని వాడవచ్చు. ఆధిక్యం మీద మళ్ళీ 'ఈ' ప్రత్యయం అవసరం లేదు, పౌకుమార్యత, చావల్యత, వైదుష్యత, వైశాల్యత మొదలయిన మాటలు ఇటువంటివే. స్రీత్వం, పురుషత్వం, స్థిరత్వం, వీరత్వం, సభ్యత్వం, ద్విత్వం ఇలా ఎన్ని మాటలయినా సిద్ధం చేసుకోవచ్చు. జాగ్రత్ మీద 'త” వచ్చి జాగ్రత్త అవుతుంది. జాగ్రత సరయిన రూపం కాదంటారు. ఖ్ మనభాషతి 131
అహంకారం - అహంభావం య, త్వ, త ప్రత్యయాలలాగానే కార, భావ అన్న ప్రత్యయాలు కూడా భావార్థంలో వస్తాయి. మమ శబ్దాన్ని తీసుకుంటే 'ఈ' ప్రత్యయం వస్తే మమత అవుతుంది. “త్వ ప్రత్యయం వస్తే మమత్వం అవుతుంది. కార ప్రత్యయం చేరిస్తే మమకారం అవుతుంది. మమత, మమత్వం, మమకారం మూడింటికీ అర్థం ఒకటే. అహం అంటే నేను, అహంత, అహంత్వం అంటే నేను అన్న భావం. అహం మీద కార, భావ (ప్రత్యయాలు రెండింటినీ వాడవచ్చు. అహంకారం, అహంభావం అని పదాలు ఏర్పడ తాయి. అహంకారం అంటే నేను అన్న అభిమానం, గర్వం. అహంకారం అంటే క్రోధం అన్న అర్ధం కూడా తెలుగులో ఉంది. పూర్వకవులు ఈ అర్థంలో వాడారు. సంస్కృతంలో ఈ అర్థం లేదు, ప్రస్తుతం గర్వం అన్న అర్ధంలోనే ఈ మాటకు ప్రయోగం ఎక్కువ. ఈ మాటతో అహంకారి అన్నమాట ఏర్పడుతుంది. గర్వికుడు అని అర్ధం. క్రియగా అహంకరించు అనికూడా ప్రయోగం. అహంకృతి, అహాంక్రియ అని కూడా అహంకార పదానికి రూపాంతరాలున్నాయి. అహంభావం అన్నా గర్వమే. పురుషత్వం, పురుషకారం, పుంస్త్వం, పుంభావం అని వాడవచ్చు. వీటన్నిటినీ మగతనం అన్న అర్థంలో వాడవచ్చు. పురుషకారం అంటే పురుష ప్రయత్నం అనికూడా అర్థం. స్త్రీత్వం, పురుషత్వం వంటి మాటలను సుకుమారత్వం, ప్రొధత్వం అన్న అర్థాలలో వాడుతున్నాం. పురుష కారమన్న మాటా ఇటువంటిదే. పురుష శబ్దం సమాజంలో మగవాడి ఆధిక్యానికి చిహ్నంగా వాడడం జరుగుతున్నది. ఉద్యోగం పురుష లక్షణం వంటి వాక్యాలు కూడా ఇటువంటి భావాన్నే వ్యక్తం చేస్తున్నాయి. పౌరుషం వంటి మాటలు సామాన్యార్థ్ధంలోకి వచ్చాయి. ఆమెకు చాలా పౌరుషం ఉందనవచ్చు, అభిమానం అని అర్థం. పురుషకారం అన్నమాటను కూడా పురుషుని పరంగా తీసికోకుండా మానవ ప్రయత్నంగా తీసికోవచ్చు. తీసుకోవాలి. మానవ (ప్రయత్నం అన్న అర్ధంలో పురుష కారాన్ని దైవికంకు వ్యతిరేకంగా వాడవచ్చు. స్త్రీ పురుష న్యూనాధిక్యాలను సూచించే మాటలు భాషల్లో స్థిరపడి ఉన్నాయి. వీటిని కొన్ని సందర్భాలలో వాడడం మాని వేయవచ్చు. లేకపోతే స్త్రీకీ, పురుషుడికీ సమానంగా వర్తింపజేసి సామాన్యార్థంలో వాడవచ్చు.
పుంభావం అన్నమాటను తెలుగులో ఎక్కువగా పుంభావ సరస్వతి అన్న పదబంధంలో వాడుతూ ఉంటారు. ఈ మాట కేవలం పురుషులకే వర్తిస్తుంది. సరస్వతి ప్రీ. సరస్వతికి పురుష రూపమే పుంభావ సరస్వతి. మూర్తీభవించిన పాండిత్యం అని అర్ధం. ఈ మాటను కొంచెం అతిగానే వాడుతున్నామేమో అనిపిస్తుంది. ముఖ్యంగా సాహిత్య సభలలో ఈ మాటను దురువ యోగం చేస్తున్నారు. పొగిడి సంతోషించే వాళ్ళూ, పొడిగించుకొని సంతోషించే వాళ్ళూ కూడా ఆలోచించవలసిన విషయం ఇది.
'భావి ప్రత్యయాన్ని విస్తృతంగా వాడుకోవచ్చు. ఏ మాటమీదనయినా ఆ భావము అన్న అర్ధంలో వాడవచ్చు. శత్రుభావం అంటే శత్రువనే భావం, అట్లాగే మిత్రభావం, పుత్రభావం, పుత్రికాభావం, పితృభావం, మాతృ్ళభావం, (్రాతృభావం మొదలయినవి.
తూష్టీమ్ అంటే ఊరక, మిన్నక అని అర్ధం, విడిగా తెలుగులో ఈ మాటకు వాడుక లేదు.
కవాషా
కాని “భావ ప్రత్యయం చేరి తూష్టీంధావం అనేమాట మాత్రం వాడుకలో ఉంది. మిన్నకుందడం అని అద్ధం. మౌనంగా ఉండడం. లెక్కచేయకుండా ఉండడమన్న అర్థం కూడా ఉంది. అంటే పట్టించుకోకుండా ఊరకుండడమే. ఒక రకమయిన తిరస్మార భావం కూడా ఇందులో ఉంది.
స్వభావం అంటే తన భావమే. తనతనం అన్న మాట, ఆయా వస్తువులకు ఉండే లక్షణం.
వ్యాకరణాలలో ప్రకృతి భావం అనే మాటను వాడుతారు. ఇక్కడ ప్రకృతి అంటే ప్రాతి పదిక. అర్ధం ఉన్నటువంటి శబ్దం, విభక్తి ప్రత్యయాదులు చేరకముందున్న శబ్ద రూవం. (ప్రకృతి భావం అంటే అటువంటి లక్షణం.
తిరు అంటే అడ్డంగా, తిరస్కారం అంటే అనాదరం, పాటించకపోవడం, అవమానించడం. తిరస్కారం అంటే మాయంకావడం అన్న అర్ధం కూడా ఉంది. తిరస్మరిణి విద్య ఉంది కదా. తిరస్మ రిణి అంటే ఇతరుల కంటికి కనిపించకుండా ఉండడం, ఇదొక మంత్ర విద్య అన్నమాట. తిర స్మారం అంటే తెగడ్త, నింద అని కూడా అర్థం ఉంది. తిరస్కృతి, తిరస్క్రియ అనికూడా అనవచ్చు,
పురస్కారం అన్నమాట కూడా ఇటువంటిదే. తిరః అంటే అడ్డంగా అన్నట్లుగానే పుర పురతః అంటే ముందర అని అర్ధం. పురస్కారం అంటే ముందు ఉంచడం. అంటే [ప్రాధాన్యం ఇవ్వడం, పూజించడం. పురస్కారం అంటే సమ్మానం, బహుమతి, అవార్డు అన్న అర్థం ఇప్పుడు (ప్రచురంగా ఉంది. జ్ఞానపీర పురస్కార (గ్రహీత ఆచార్య సి,నారాయణరెడ్డిగారు అంటున్నాం. పురస్కృతి, పురస్క్రియ అన్నా ఇదే అర్ధం. ధిక్ అంటే నింద. దీనిమీద కార ప్రత్యయం చేరిస్తే ధిక్కారం అవుతుంది. ధిక్ అని తెలుగులో విడిగా ప్రయోగం లేదు కాని ధిక్కారం మాత్రం వాడుకలో ఉంది. ఒక పౌరాణిక చిత్రంలోని వాక్యం “ధిక్కారమును సైతునా' బాగా (ప్రచారంలో ఉండింది. ధిక్కారం అంటే తిరస్కారమే. ధిక్కృతి, ధిక్షియ అనికూడా అనవచ్చు.
ఛీత్మారం, పూత్కారం, హాహాకారం వంటి మాటలున్నాయి. ఛీత్కారం అంటే చీదరించు కోవడం. ఫూత్మారం అంటే ఊదిన ధ్వని. హాహాకారం అంటీ ఆర్తనాదం.
ఓ మనభాషత 133
స్పాతకం - శతకం తద్ధిత ప్రత్యయాలు వివిధ అర్భాలలో వస్తాయి. ఒకే అర్ధంలో అనేక ప్రత్యయాలు వచ్చినట్లుగానే ఒకే ప్రత్యయం అనేకార్థాలలోనూ వస్తుంది. ఆ విధంగా అనేకార్థాలలో వచ్చే ప్రత్యయాలలో “కొ ప్రత్యయం ఒకటి.
పీత అంటే పసుపు రంగు. పట్టు పీతాంబరాలు అంటాం కదా. పీతకం అంటే పసుపు రంగు వేసింది. పసుపు పచ్చనిది. ఇక్కడ పీత వర్దం వేసిన, కలిగిన అన్న అర్ధంలో క ప్రత్యయం వచ్చింది. ధేనుకు “క చేరితే ధైనుకం అవుతుంది. ధేనువుల సమూహం అని అర్ధం.
ధనుస్ అనే పదం మీద "క ప్రత్యయం చేరి ధానుష్క ఏర్పడుతుంది. ధానుష్కుడు అంటే విలుకాడు. ధనుస్సుతో తిరిగేవాడన్న మాట.
ఇటీవలి కాలంలో “అమ్మకాలు” బాగా జరుగుతున్నాయి. ఇంగ్రీషు మాట సేల్ అన్నది ఈ
అర్ధంలో బాగా వాడుకలోకి వచ్చింది. చాలారకాల వస్తువులకు వాటి ధరను బట్టి ఒక్కో సమూ హంగా ఏర్పాటు చేయడం కూడా కనిపిస్తుంది. అక్కడ అయిదు రూపాయలనో, వది రూపాయ లనో బోర్డు "పెడతారు. వేరే ధర చెప్పేపనిలేదు. ఆ వస్తువులన్నీ అదే ధర అని అర్ధం. ఈ ధరకు కొన్న వస్తువు అన్న అర్థంలో కూడా “క ప్రత్యయం వస్తుంది. పంచకం అంటే అయిదు రూపా యలకు కొన్న వస్తువు. బహుకం అంటే చాలా డబ్బు పోసి కొన్నది. పంచాశత్మం అంటే యాభై రూపాయలకు కొన్నది. (త్రైంశత్కం అంటే ముప్పై రూపాయలకు కొన్నది.
క్వచిత్ అంటే అక్కడక్కడ, కదాచిత్ అంటే అప్పుడవ్వుడు. క్వాచిత్మం అంటే అక్కడక్కడ
జరిగేది. చెదురుమదురుగా అని అర్ధం. కాదాచిత్మం అంటే అప్పుడప్పుడూ జరిగేది. అంటే అరుదుగా జరిగేదని అర్ధం. కాధంచిత్మం అంటే కష్టం మీద జరిగేది. సులువైంది కాదని అర్ధం.
(భ్రాత్ళ, మాళ్ళ, పిళ్ళ వంటి మాటల మీద *కి ప్రత్యయం చేరుతుంది. అప్పుడు దాని నుండి వచ్చినది అని అర్థం. (భ్రాత్భృకం అంటే సోదరుని నుండి వచ్చింది. మాతృకం అంటే తల్లి నుండి వచ్చింది. పైత్ళృకం అంటే తండ్రి నుండి వచ్చింది
పధికుడు అంటే బాటసారి, మార్గంలో పోయేవాడు. పథి అన్న మాట మీద "కి ప్రత్యయం చేరింది. కేశకుడు అంటీ కేశరచనా తత్పరుడు. ఎప్పుడూ జుట్టు దువ్వుకుంటూ ఉండేవాణ్ణి ఈ పేదుతో పిలవచ్చేమో.
అంశం అంటే భాగం, వంతు అంశకుడు అంటే భాగం కలిగినవాడు. పాలివాడన్న మాట. దాయాది. శీత శబ్దం మీద 'క' ప్రత్యయం చేరితే శీతకుడు అవుతుంది. శీత శబ్దానికి చల్లని అని అర్థం. శీతకుడు అంటే సోమరి అని అర్ధం. ఉష్ణకుడు అంటే చురుకయిన వాడని అర్థం. వేడిగా ఉండడం చురుకుదనానికీ, చల్లగా ఉండడం సోమరితనానికీ లక్షణాలన్నమాట. తూసష్టీం శీలకుడు అంటే ఊరకుండే స్వభావం కలిగినవాడు.
“క ప్రత్యయానికి నిందార్థం కూదా ఉంది. అశ్వకం అంటే నింద్యమయిన అశ్వం. తక్కువ రకంది. అట్లాగే గ్రామటిక అంటే కుగ్రామం. ఈ అర్ధంలో “పాశ అన్న(ప్రత్యయం కూడా ఉంది. భిషక్సాశుడు అంటే నింద్యుడయిన వైద్యుడు.
హరిణం అంటే లేడి. దానిమీద జాలి కలిగితే హరిణకం అనవచ్చు. చిన్నలేడి అన్న
134 అ మనబాష
అర్థమూ ఉంది. పాపం లేడి అన్న అర్థమూ ఉంది. కొంచెం అన్న అర్ధంలో కూడా “కి ప్రత్యయం వస్తుంది. తైలం అంటే నూనె. తైలకం అంటే కొంచెం నూనె. అట్లాగే జాతి అన్న అర్ధంలోనూ ఈ ('ప్రత్యయాన్ని వాడవచ్చు. సింహకం అంటే సింహజాతికి చెందింది. శరభకం అంటే శరభ జాతికి చెందింది.
సదృ్భృశమయినది అన్న అర్ధంలోనూ 'క ప్రత్యయం వస్తుంది. స్థూలకం అంటే స్థూల సదృశం. అణుకం అంటే అణుసద్భశం. చంచత్కం అంటే కదులుతూ ఉన్నట్లున్నది, బృహత్మ్కం అంటే పెద్దదిగా ఉన్నట్లున్నది. పానకం అంటే పాన సద్భశం. తాగేది. పత్రిక అంటే షత్రసదృశం.
“క ప్రత్యయం స్వార్థంలో కూడా వస్తుంది. అంటే ధాతువుకు ఉన్న అర్ధంలోనే అని భావం. బాల శబ్దానికి ఉన్న అర్ధమే “క ప్రత్యయం చేర్చిన తరువాత ఏర్పడే బాలక శబ్బానికీ ఉంటుంది. బాలుడు అన్నా బాలకుడు అన్నా అర్ధం ఒకటే. స్నాకుడు- స్నాతకుడు, అధ్యయనం పూర్తి చేసిన వాదని అర్ధం. ఇప్పుడు మన కళాశాలల్లో డిగ్రీ పూర్తి చేసినవాణ్ణి స్నాకకుడు అనవచ్చు. డిగ్రీపై చదువును స్నాతకోత్తరం అంటున్నాం. జాతం- జాతకం, మృతుడు- మృతకుడు, ప్రకీర్ణం- పకీర్ణకం ఇటువంటివి.
మాలా శబ్దం నుండి మాలిక ఏర్చడింది. పద్యంలో నాలుగు పాదాలుంటే మాల అనీ, అనేక పాదాలుంటే మాలిక అనీ అంటాం. ఉత్పలమాల అంటే నాలుగు పాదాల ఉత్పలమాల. ఉత్చలమాలిక అంటే చాలా పాదాలుందే ఉత్పలమాల వృత్తం. దండ అన్న అర్ధంలో మాల అన్నా మాలిక అన్నా భేదం లేదు. అట్లాగే మండపం - మండపిక, గమనం- గమనిక, ఖండం- ఖండిక, అంకురం- అంకురిక, అవతారం- అవతారిక అవతరణం- అతవరణిక, పల్యంకం- పల్యంకిక,
పొట్టిది, చిన్నది అన్న అర్ధంలోనూ 'కో ప్రత్యయం వస్తుంది. వృత్తకం అంటే పొట్టిచెట్టు. వంశకం చిన్న వెదురు మొక్క వేణుకం అన్నా ఇదే అర్ధం. వల్లవిక అంటే చిగురుటాకు.
పరిమాణార్ధంలోనూ, సంఘార్ధంలోనూ కూడా 'ళ ప్రత్యయం వస్తుంది. ఏకకం అంటే ఒక్కటి. ద్వికం అంటే రెండిటి సమూహం. అట్లాగే (త్రికం, చతుష్కం, పంచకం, షట్కం, సప్తకం, అష్టకం, నవకం, దశకం, శతకం, సహ(ప్రకం. ఈ మాటలన్నీ మనం నిత్యం వాడుతూ ఉన్నవే. అష్టకం, శతకం వంటివి కావ్యభేదాలు కూదా. అష్టకం అంటే ఎనిమిది వద్యాల కావ్యం. జనార్దనాష్టకం వంటివి ప్రసిద్ధ అష్టకాలు. శతకం అంటే వంద పద్యాల రచన. తెలుగువారిలో శతకం అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.
అశ్వకం అంటే గుర్రంలాగా ఉన్న బొమ్మ, గజకం అంటే ఏనుగులాగా ఉన్న బొమ్మ. పిష్టం అంటే పిండి. నువ్వుల పిండి. పిష్టకం అన్నాపిండే. పిష్టకం అంటే పిండివంట అని కూడా అర్ధం.
చ్ మనభాషతి 135
ప్రాబీనం - వాజ్బయం (ప్రాక్ అంటే తూర్పు. దీని మీద 'ఈన' ప్రత్యం చేరితే ప్రాచీనం అవుతుంది. ప్రాచీనం అంటే తూర్పుదిక్కున పుట్టింది. తూర్పు దిక్కున ఉన్నది. ముందటిది. పురాతనమైనది అని కూడా అర్థం. కాని తెలుగులో పురాతనమైన అన్న అర్ధంలో ఈ మాటకు ప్రాచుర్యం ఉంది కాని తూర్పు దిక్కున పుట్టినది అన్న అర్ధంలో అంతగా వాడుకలోలేదు. ప్రాచీనం అంటే కంచె అన్న అర్ధం కూడా ఉంది. కంపకోట. గ్రామానికి ముందు వేసిన కంప. తూర్పుదేశంలో పుట్టిన ఒక వృక్ష విశేషానికి కూడా ప్రాచీన అని పేరు. అగురుసొంటి అంటారు.
ప్రత్యక్ అంటే వడమటి దిక్కు దీనిమీద 'ఈని (ప్రత్యయం చేరితే ప్రతీచీనం అవుతుంది.
పడమటి దిక్కున పుట్టింది ప్రతీచీనం. ఇదేవిధంగా అవాచీనం. అవాక్ అంటే దక్షిణం. దక్షిణ దిశలో పుట్టింది అవాచీనం. ఉదక్ అంటే ఉత్తరం. ఉత్తర దిశలో పుట్టింది ఉదీచీనం.
వరాజ్ మీద “ఈన' ప్రత్యయం చేరిస్తే పరాచీనం అవుతుంది. అవతలిముఖం అని అర్థం.
పరాచీనుడు అంటే పెడమొగం పెట్టినవాడు. పరాజ్ముఖుడు. దీనికి భిన్నమయినది అర్వాక్స్ అర్వాక్ నుండి అర్వాబీనం. ఇవతలి ఒడ్డున పుట్టినది. పరాజ్ అవతలి ఒడ్డు. అర్వాక్ ఇవతలి ఒద్దు. అర్వాచీనం అనే మాటను కాలవాచకంగా వాడుతున్నాం. ఇటీవలిది అని అర్ధం. పరాశీనం అంటే రాబోయే కాలంలో జరిగేది. అర్వాచీనం అంటే నవీనం. ్రాచీనానికి వ్యతిరేకంగా ఈ మాటను వాడుతున్నాం. అర్వాచీనం అంటే కిందిది అన్న అర్ధం కూడా ఉంది. కాని ఇటీవలిది అన్న అర్థంలోనే తెలుగులో ఈ మాటను ఎక్కువగా వాడుతున్నాం.
సమ్యక్ అంటే సత్యం. సమీచీనం అంటే సత్యమైనది. పరిశుద్ధమైనది. అర్జమైనది. తగిన దన్నమాట. సధ్ర్యక్ కలిసి నడిచేవాడు. సహచరుడు. సధ్రీచీనుడు అంటే ఇదే అర్ధం. స్రీచీనం అంటే కలిసి నడవడం అని అర్ధం.
“తిర్యక్కు “ఈనః ప్రత్యయం చేరిస్తే తిరళశ్చీనం. అంటే అడ్డంగా నడవడం. తిరశ్చీనుడు అంటే అడ్డంగా నడిచేవాడు.
'మయి అనే ప్రత్యయాన్ని ప్రాచుర్యం అన్న అర్ధంలో ఉపయోగిస్తారు. వాక్ మీద మయ ప్రత్యయం చేరితే వాబ్బయం ఏర్పడుతుంది. వాక్కులతో నిండినది. వాగ్రూపమయింది. భాషా సంపన్నమయినది. సాహిత్యం, సారస్వతం, వాబ్బయం అన్న మాటలను సమానార్ధంలో ఉపయో గిస్తున్నాం. అన్నమయం అంటే అన్నంతో నిండినది. జలమయం అంటే నీటితో నిండింది. వరదలలో అంతా జలమయమయి పోయిందంటాం. జ్యోతిర్మయం అంటే వెలుగుతో నిండినది. ఏ మాటమీదనయినా ఉపయోగించి వాడడానికి అవకాశం ఉన్న ప్రత్యయం ఇది. అంధకార మయం, అంటే చీకటితో నిండినది. అయోమయం అన్నమాటను విస్తృతంగా వాడుతున్నాం. అయస్ అంటే ఇనుము. అయోమయం అంటే ఇనుముతో చేసింది. కొరుకుడు పడనిది, అర్ధం కానిది అన్న ఆలంకారికమయిన అర్ధం ఈ మాటకు ఏర్పడింది. మృణ్మ్యయం అంటే మట్టితో చేసింది. మృణ్మ్యయపాత్ర అంటే మట్టిపాత్ర. స్వర్వమయం, సువర్షమయం, హిరణ్మ్యయం మొద లయినవి బంగారంతో చేసినవి.
చిన్మయం జ్ఞానంతో నిండి ఉండడం. తన్మయం అంటే తత్ - దానిమయం. దానితో
హూ
లయమయిన అంతఃకరణ (ప్రవృత్తి కలిగినటువంటిది. దానితో ఐక్యమైనది.
గోమయం అంటే పేడ. అమ్మయం అంటే జలమయం. అప్ అంటే నీరు.
ఈ 'మయ'తో ఎన్నో మాటలు ఏర్పడతాయి. కిరణ్మయి లాంటి పేర్లు వాడుకలో ఉన్నాయి. మృణ్మయ్, హిరణ్మయ్ లాంటి పేర్లు బెంగాలీలలో చాలా ప్రచారంలో ఉన్నాయి. దయామయుడు, కరుణామయుడు బాగా వాడుకలో ఉన్నమాటలు. “మయి ప్రత్యయం తెలుగులో వాడుకలో ఉన్న సంస్కృత (ప్రత్యయాలలో ముఖ్యమైంది. సంస్కృత పదాలమీద సంస్కృత పద్ధతిలో చేరే సంస్కృత ప్రత్యయాలు కొన్ని, కొన్ని ప్రవ్య్యయాలను సంస్కృతంలో వాడే వద్ధతికి భిన్నంగా కూడా తెలుగులో వాడడం ఉంది. అయితే తెలుగుమాటల మీద సంస్కృత ప్రత్యయాలు వాడడం సాధారణంగా అరుదైన విషయం. అన్నమాచార్య కీర్తనలో “పదివేల శేషుల పడగల మయము” అని ఉంది కదా! పడగలు అన్నది తెలుగుమాట. దీనిమీద మయము అన్న ఈ మయ ప్రత్య యాన్ని వాడాడు అన్నమయ్య.
ముళ్ళమయం, బాధలమయం, కష్టాలమయం, నీళ్సృమయం, పొదలమయం, పుస్తకాల మయం, చీకటిమయం మొదలయిన విధంగా తెలుగులో మయ (ప్రత్యయానికి విస్సృతమయిన వాడుక ఉంది.
ఖండ (వ్రత్యయాన్ని సమూహం అన్న అర్ధంలో వాడతారు. కనులఖండం అంటే కమల ముల సమూహం. పద్మినీ ఖండం అంటే పద్మసమూహం. కుముదఖండం అంటే కుముదముల సమూహం. కుముదం అంటే తెల్లకలువ. కైరవిజీ ఖండం అన్నా తెల్ల కలువల సమూహమే. వీటిని ఆయా పుష్పాల కొలనుల సమూహంగా కూడా చెవ్చవచ్చు.
ఈ అర్థంలోనే 'కాండి ప్రత్యయం కూడా వస్తుంది. పూర్వకాండం/పూర్వకాండ, తృణకాండం/ తృణకాండ, కర్మకాండం/కర్మకాండ మొదలయిన మాటల్లో కాండ సమూహార్థం.
ఖండ, కాండల లాగానే స్కంధ ప్రత్యయం కూడాసమూహార్థాన్నే బోధిస్తుంది. నరస్మంధం అంటే మానవ సమూహం); కరి స్కంధం అంటే ఏనుగుల సమూహం. తురంగ స్మంథం అంటే గుర్రాల సమూహం,
బ్ మనభాషతి 137
బ్వీపకల్పం- నామధేయం కొంచెం తక్కువ అన్న అర్ధంలో కల్ప, దేశ్య, దేశీయ అనే ప్రత్యయాలు వస్తాయి. ద్వీపం అంటే నాలుగు వైపుల నీరున్న భూమి. చుట్టూ నీరున్నది. దీనికి కల్చ ప్రత్యయం చేరిస్తే ద్వీపకల్పం అవుతుంది. అన్ని వైపులా నీరుండి ఒక వైపున మాత్రం భూమి ఉన్న ప్రదేశం. భారతదేశం ఒక ద్వీపకల్పం. అంటే ద్వీపలక్షణాన్ని అన్వ్నయించినప్పుడు దానికంటే కొంచెం తక్కువయినది అన్న మాట.
విద్వాంసుడు అంటే సర్వమూ తెలిసిన వాడు. విద్వత్ శబ్దానికి కల్ప ప్రత్యయం చేరిస్తే విద్వత్మ్కల్పుడు అవుతుంది. విద్వత్మల్పుడు అంటే కొంచెం తక్కువగా పండితుడు. ఇంచు మించుగా పండితుడు. పూర్తి పండితుడు కాడన్నమాట. అట్లాగే మృతకల్పుడు. మృతుని కంటే కొంచెం తక్కువవాడు. చావొక్కటే తక్కువ తప్ప తక్కిన అన్ని విషయాలలోనూ చచ్చిన వాడితో సమానమన్నమాట.
పితృకల్చుడు అంటే తం(డ్రి కంటే కొంచెం తక్కువ. తండ్రి తరువాత తండ్రి అంతటివాడు. పిళృకుల్యుడు, పిళృసమానుడు అని వాదుతూ ఉంటాం. ఇది కూడా దాదాపు అటువంటి ప్రయో గమే. మిత్రకల్పుడు అంటే మిద్రునికంటే కొంచెం తక్కువ వాడు. భ్రాతృకల్పుడు, శత్రుకల్పుడు మొదలయిన విధంగా ఈ ప్రత్యయాన్ని వాడవచ్చు.
దేశ్య దేశీయ ప్రత్యయాలు కూడా ఇంతే. విద్వతృల్పుడులాగానే విద్వద్దేశ్యుడు. విద్వద్దేశీ యుడు. అర్థం సమానమే.
చణ, చంచు/చుంచు ప్రత్యయాలు దానిచేత ప్రసిద్దుడు అన్న అర్ధంలో వాడుకలో ఉన్నాయి. విద్యాచణుడు అంటే విద్యచేత ప్రసిద్ధడయినవాడు. యాత్రాచణుడు అంటే యాత్రల చేత ప్రసిద్ధుడయిన వాడు. బోధనాచణుడు అంటే బోధనచేత ప్రసిద్దుడయిన వాడు. అదేవిధంగా రచనాచణుడు, పరిపాలనాచణుడు మొదలయిన ప్రయోగాలు చేయవచ్చు. విద్యాచంచువు/ విద్యాచుంచువు అన్నా విద్యచేత ప్రసిద్ధుడనే అర్ధం. కావ్యాలలో దీనికి ప్రయోగాలున్నాయి గానీ, నేటి వాడుకలో అంతగా కనిపించదు.
“చర” అన్నప్రత్యయం ముందే జరిగిపోయింది అన్న అర్ధంలో వస్తుంది. శ్రుతచరం అంటే ఇంతకు పూర్వమే విన్నటువంటిది. జ్ఞాతచరం అంటే ముందే తెలిసినటువంటిది. ఆధ్యచరుడు అంటే పూర్వం ఆధ్యుడుగా ఉన్నవాడు. ఆధ్యుడు అంటే సంపన్నుడు. “బృహతృధిను రచించిన గుణాధ్యుడున్నాడు కదా. గుణంచేత సంపన్నుడన్న మాట. ధనాధ్యుడులాంటి పదాలిటువంటివే.
పరిమాణం అన్న అర్ధంలో ద్వయస, దఘ్న మాత్ర అనే (ప్రత్యయాలు వస్తాయి. ఊరు ద్వయసం అంటే తొడల వరకు ఉన్న లోతు. అట్లాగే ఊరు దఘ్నం. జాను ద్వయసం అంటే మోకాలిలోతు. జాను దఘ్నం అన్నా అదే అర్ధం. కంర దఘ్నం అంటే గొంతులోతు. వక్షోమాత్రం అంటే రొమ్ములోతు. అట్లాగే ఊరుమాత్రం, జానుమాత్రం.
(ప్రశంసార్థంలో “రూపి ప్రత్యయం వస్తుంది. పటరూపం అంటే మంచి వన్హ్రం. యుక్త రూపం అంటే తగినది, యోగ్యమైనది. విద్వద్రూపుడు మంచి విద్వాంసుడు. “ఏక శబ్జానికి ఆకి (ప్రత్యయం చేరితే ఏకాకి అవుతుంది ఒంటరి అని అర్ధం.
ధేయ అన్న ప్రత్యయం స్వార్ధంలో వస్తుంది. అంటే అర్ధంలో మార్చు ఉండదు. మీ నామ ధేయం ఏమిటి? అన్నా మీ నామం ఏమిటి? అన్నా అర్ధం ఒకటే. నామ శబ్దం మీద ధేయ (ప్రత్యయం చేరి నామధేయం ఏర్పడుతుంది. భాగం, భాగధేయం అన్నా ఒకటే. అంశం అనీ, అదృష్టం, భాగ్యం అనీ అర్థాలు. భాగధేయం అంటే పన్ను అన్న అర్థం కూడా ఉంది. అట్లాగే రూవం అన్నా రూపధేయం అన్నా అర్ధం ఒకటే. నామధేయుడు అంటే పేరుకలవాడు. భాగ ధేయుడు అంటే భాగం కలవాడు.
('హస్వార్ధంలో '5ఈ ప్రత్యయం వస్తుంది. కుటి అంటే గుడిసె. కుటిరం/ుటీరం అన్నా గుడిసే. గుడిసె కంటే కూడా చిన్నదన్న అర్థంలో వాడవచ్చు. ఇదే విధంగా తూణి/చూణీరం, శమి /శమీరం. తూణి అంటే అమ్ములపొది. శమి అంటే జమ్మిచెట్టు, శమీరం అంటే చిన్న జమ్మిచెట్టు.
“'సం' మీద కట చేరి సంకటం అవుతుంది. సంకటం అంటే ఇరుకైనది అని అర్థం. ఇరు కయిన దారి, సమ్మర్దం కలిగిన చోటు అని అర్ధాలు, కాని తెలుగులో సంకటం అంటే కష్టం అన్న అర్థమే ఎక్కువ ప్రచారంలో ఉంది. సంకటపడటం అంటే ఇబ్బంది పడడం, కష్టవడడం, బాధ పడదం. ప్రకటం అంటే (ప్రసిద్ధమైనది. వ్యక్తం, కనిపించేది అన్న అర్ధంలో ఎక్కువగా వాడు తున్నాం. ప్రకటించు అంటే వెల్లడి చేయడం. ప్రకటనం అంటే ప్రకటించడం. ఉత్కటం అంటే అధికమైనది. ఉత్కటంగా ఉంది అంటే అధికంగా ఉందని అర్ధం.
'ని' మీద బిడ చేరితే నిబిడం అవుతుంది. నిబిడం అంటే దట్టమైనది. గట్టిది అని అర్ధం. నిబిడీకరించు అంటే దట్టంగా దృఢంగా చేయడం. నిబిరీసం అన్నా ఇదే అర్థం.
“తర” ప్రత్యయం చేరి అల్పత్వాన్ని బోధిస్తుంది. అశ్వం అంటే గుర్రం. అశ్వతరం అంటే అశ్వత్వం అల్పంగా ఉన్నటువంటిది. అశ్వతరం అంటే కంచరగాడిద. వత్సతరం అంటే దూడ కంటే పెద్దది. వత్సం అంటే దూడ. వత్సత్వం తక్కువగా ఉన్నది దానికంటే కొంచెం ముదురు వయస్సు కలిగినది. ఇటువంటిదే ఉక్షతరం. ఉక్షం అంటే తరుణ వయస్సులో ఉన్న ఎద్దు. దాని కంటే పెద్దవయస్సు ఉన్న ఎద్దు ఉక్షతరం. బుషభం అన్నా ఎద్దే ఎద్దు బరువులు మోయగలిగిన శక్తి కలిగినటువంటిది. బుషభతరం అంటే బరువులు మోసే శక్తి తక్కువగా ఉన్నది. అంటే ఇంకా బరువులు మోసే వయస్సు రానిది - గిత్త,
బ్ మనభాషఖత 139
జాతీయీకరణం
అభూత తద్భావార్థం అని ఒకటుంది. లేనిది అవడం అని అర్ధం. ఇంతకు ముందు లేనిది, లేక మరో రూపంలో ఉన్నది ఉనికిలోకి రావడం, మరో రూపాన్ని పొందడం. ఈ అర్థంలో సంస్కృ తంలో కృ, భూ ధాతువుల కృదంత రూపాలు వస్తాయి. భూతం, భవనం, కృతం, కరణం వంటివి నామవాచకాల మీద చేరతాయి. లక్ష్య శబ్దం మీద భూతం చేరిస్తే లక్షీభూతం అవుతుంది. లక్ష్యం కానిది లక్ష్యం కావడమని దీనికి అర్ధం. అదేవిధంగా లక్ష్మీకృతం. కృశీభూతం అంటే కృశం కానిది కృశం కావడం. కృశీకృతం కూడా ఇటువంటిదే. రాశీభూతం అంటే రాశి కానిది రాశి కావడం, రాశీకృతం అంటే రాశిగా చేయబడినది. అట్లాగే భస్మీభూతం. భస్మం కానిది భస్మం కావడం. భస్మీక్ళృతం అంటే భస్మంగా చేయబడినది.
గంగా శబ్దం మీద ఈ ప్రత్యయాలను చేర్చినప్పుడు గంగీభూతం, గంగీకృతం ఏర్పడ తాయి. అట్లాగే శుచి- శుచీభూతం, శుచీకృతం అవుతుంది. చక్షు శబ్బం- చక్షూ భూతం, చక్షూ కృతం అవుతుంది.
ఆధునిక భాషలో వివిధ శా(స్తాల రచన జరుగుతూ ఉంది. అట్లాగే పత్రికా భాషలో ఇంగ్లీషు నుండి ఎన్నో మాటలు వచ్చి చేరుతూ ఉన్నాయి. ఎన్నో మాటలను అనువదించుకోవలసి వస్తూ ఉంది. ఈ సందర్భంలో ఈ కరణ, భవన (ప్రత్యయాలు చాలా ఉపయోగపడుతున్నాయి. వీటిని విసృతంగా వాడుతున్నాం.
ఘనీభవనం అంటున్నాం. ఘనం కానిది అంటే ఘన పదార్థం కానిది ఘన పదార్ధంగా మారడం.
ఘనీభవనం చెందడంతోపాటు ఘనీభవించు అని క్రియగా కూడా దీన్ని వాడుతున్నాం. ఇటువంటిదే ద్రవీభవనం. బాప్పీభవనం, (ద్రవీభవనం, ఘనీభవనం వంటి మాటలు విద్యార్థులకు బాగా పరిచితమయిన మాటలు. వాళ్ళ సైన్సు పుస్తకాలలో వీటి ప్రయోగం ఎక్కువ. వక్రీభవనం అన్నమాట కూడా వాడుకలో ఉన్నదే. వంకర కావడం.
కరణం చేరి ఇప్పుడు తెలుగులో వందల పదాలు వాడుకలోకి వచ్చాయి. బాంకుల జాతీయీకరణంతో జాతీయీకరణం అన్న మాటకు బాగా ప్రచారం వచ్చింది.
నేషనలైజేషన్ జాతీయాకరణ అయింది. ఇటువంటి ఇంగ్లీషు మాటలన్నీ కరణం చేరి తెలుగులో ఏర్పడుతున్నాయి. ఇటీవలి కాలంలో గ్లోబలైజేషన్ అన్న మాట వాడుకలోకి వచ్చింది. దీన్ని ప్రపంచీకరణంగా కొందరు వాడుతున్నారు.
ఆధునీకరణం అంటే ఇప్పటి రూపంలో లేనిదాన్ని ఇప్పటిదిగా చేయడం. నవీకరణం అన్న మాట కూడా ఇటువంటిదే.
విపులీకరణం అంటే విపులం చేయడం వివరించడం అన్న అర్ధంలో వాడుతున్నాం. ఇటు వంటివే విశదీకరణం, స్పష్టీకరణం. ఒకటిగా లేని వాటిని ఒకటిగా చేయడం ఏకీకరణం. ఏకీ కృతం, ఏకీభూతం అని కూడా వాడవచ్చు. కేంద్రీకరణం ఒక చోట కేంద్రీకృతం కానిదాన్ని కేంద్రీ కృతం చేయడం. దీనికి వ్యతిరేకార్థంలో వికేంద్రీకరణ అని వాడుతున్నాం. అధికార వికేంద్రీకరణ అన్న పదబంధానికి మంచి వ్యాప్తి ఉంది. పారిశ్రామికీకరణ, వైజ్ఞానికీకరణలు కూదా వ్యాప్తిలో
440 ఆ మనభాష
ఉన్న మాటలే. ఫలదీకరణ అంటే ఫలాలనిచ్చేదిగా చేయడం. సంతానవంతం చేయడం.
విలీనీకరణం అన్నమాట కూడా పత్రికలలో బాగా వాడుకలో ఉంది. విడిగా ఉన్నదానిని మరొక దానిలో కలపడం. దూరీకరణం అంటే దూరం చేయడం. (ధ్రువీకరణం (ధ్రువం చేయడం. స్థిరకరణం అంటే స్థిరం చేయడం.
సినిమాలలోనూ, సాహిత్యంలోనూ చిత్రీకరణ అన్నమాటను వాడుతున్నాం. అట్లాగే దృళ్యీ కరణ. మాయం చేయడం అన్న అర్థంలో అద్భశ్యీకరణం అని వాడవచ్చు.
(గ్రామాలు, నగరాలుగా మారడం, (గ్రామాల నుండి జనం నగరాలకు వలసపోవడం నగరీ కరణం. ఇటువంటిదే సంప్రదాయీకరణం. సంప్రదాయం కాని దాన్ని సంప్రదాయం చేయడం. సంప్రదాయం నుండి తొలగిపోయి మార్పు పొందిన జీవన విధానాన్ని మళ్ళీ సంప్రదాయ విధా నాలలోకి పరివర్తింపచేసే ప్రయత్నాన్ని సంప్రదాయీకరణ ప్రయత్నం అనవచ్చు. వెస్టర్నయి జేషన్ని పాశ్చాత్యీకరణం అనవచ్చు. లోకలైజేషన్‌ను 'ప్రాంతీయీకరణ, స్థానీకరణ అనవచ్చు.
ఇప్పుడు చాలా (ప్రాంతాలలో పాలశీతలీకరణ కేంద్రాలున్నాయి. పాశ్చరైజేషన్కు ఇది తెలుగు. వర్గీకృతం కానిదాన్ని వర్గీకృతం చేయడం వర్గీకరణం. విభాగాలుగా విభజించడం. వ్యక్తీకరణ వ్యక్తం కాని దాన్ని వ్యక్తం చేయడం,
వక్రీకరణం అన్నమాటకు దురర్ధం చెప్పడమని అర్ధం. ఇది ఆలంకారికమయిన అర్థం. వంకర చేయడం అన్నది మాటలకు అర్ధాన్ని వంకరగా చేయడంగా ఇక్కడ అర్థం చెవ్పుకోవాలి.
వ్యాకరణంలో కూడా తాలవ్యీకరణం, తద్భవీకరణం, నామీకరణం వంటివి వాడుకలో ఉన్నాయి. తాలవ్యం కానిది తాలవ్యం అవడం తాలవ్యీకరణం, మూలద్రావిడంలోని “క తెలుగు లో *“చిగా మారడం, కిళి చిలుక అయింది. కయి చేయి అయింది. కెరయ్ చెరువు అయింది. తద్భవం కాని మాట తద్భవంగా మారడం తద్భవీకరణం. నామవాచకం కానిది నామవాచకంగా మారడం నామీకరణం. ఒక వాక్యాన్ని మరో వాక్యంలో నామవాచకంగా చేయడం నామీకరణం. ఈ అర్ధంలో నామ్నీకరణం అన్నమాట వాడుకలోకి వచ్చింది. కాని నామీకరణం సరైన రూవం.
ఒక భాష నుండి మరో భాషలోకి అనువాదం చేయడం భాషాంతరీకరణం. మతాంతరీ కరణం ఇటువంటిదే. ఆం(ధ్రీకరణం అంటే ఇతర భాషలో ఉన్న రచనను తెలుగుగా చేయడం. అట్లాగే సంస్కృతీకరణం. మతాంతరీకరణంలో ష్టైందవీకరణం, క్రైస్తవీకరణం వంటివి వాడ వచ్చు.
ఆయుధీకరణ, నిరాయుధీకరణ వంటివి కూడా వత్రికలలో బాగా వ్రచారంలో ఉన్నాయి. అటవీకరణ అని కూడా అనవచ్చు.
ఇతర భాషా పదాల మీద కూడా ఈ ప్రత్యయాన్ని చేర్చి వాడుతూ ఉన్నాం. అటువంటి వాటిలో ముఖ్యమైంది (ప్రైవేటీకరణ. వలన అన్న తెలుగుమాట మీద కూడా దీన్ని చేర్చి వలసీ కరణం అని వాడుతున్నారు. అట్లాగే పరాయీకరణం. ఇస్లామీకరణ అన్నమాట కూడా ఇటు వంటిదే,
పొలిటిసైజేషనన్న మాటను రాజకీయీకరణం అంటున్నాం, ఒక రచనను నాటకంగా పరివర్రనం' చేయడం నాటకీకరణం. ఈ చిధంగా అనేక పదా లను నిర్మించుకోవచ్చు. బ్ మనభాషతి 141
బుద్దిమంతుడు రాముడు బుద్ధిమంతుడు. ఏ వ్యక్తినయినా వినయం కలిగినవాడని చెప్పడానికి ఉదాహరణంగా ఈ వాక్యం వాడుతూ ఉంటాం. ఒక్కోసారి ఈ వాక్యంలో కొంత వ్యంగ్యాన్ని కూడా జోడిస్తూ ఉంటాం. ఈ బుద్ధిమంతుడులో ధీశక్తి కంటే మనకు మంచితనం, అణగిమణగి ఉండే లక్షణం, పెద్దలు చెప్పిన మాటను శిరసావహించే గుణం ప్రధానంగా కనిపిస్తాయి. ఈ మాటలో మత్ అనే (ప్రత్యయం వచ్చింది. ఈ ప్రత్యయం ఏ అర్ధంలో వస్తుందో ఆ అర్ధాన్ని మత్వర్ధం అనీ, మతుబర్థం అనీ అంటారు. కలిగినది, కలవాడు అన్నది ఈ (వ్రత్యయానికి సాధారణార్ధం. బుద్ధిమంతుడు అంటే బుద్ధి కలిగినవాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఎవడియందు బుద్ధి కలదో వాడు. సంస్కృ తంలో బుద్ధిమత్, బుద్ధిమాన్ అని ఉంటాయి. హిందీలో కూడా బుద్ధిమాన్, శక్తిమాన్ వంటి (ప్రయోగాలు ఎక్కువ. తెలుగులో మాన్‌తో ఉండే మాటలు తక్కువ. సంస్కృతంలోనే ఏర్పడి తెలుగులోకి వచ్చినమాటలు కొన్ని ఇటువంటివి ఉంటాయి. ఉదాహరణకు భగవానుడు, హను మానుడు వంటివి కొంత వాడుకలో ఉన్నాయి. భగవంతుడు, హనుమంతుడు అన్నవి ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. సాధారణంగా ఇ కారాంత శబ్దాల మీద మత్ ప్రత్యయం మత్గానే ఉంటుంది. బుద్ధి మంతుడు, శక్తిమంతుడు, ధీమంతుడు, శ్రీమంతుడు మొదలయినవి. అప్పుడప్పుడూ శక్తివంత మయిన బాంబు ప్రేలుడు” వంటి ప్రయోగాలు కనిపిస్తూ ఉంటాయి. శక్రిమంతమయిన సరయిన ప్రయోగం. అట్లాగే కీర్తిమంతుడు, నీతిమంతుడు. సూర్యుడు కాంతిమంతుడు. అదేవిధంగా స్తుతి మంతం, ద్యుతిమంతం. ద్యుతి అంటే కాంతి. దీప్తిమంతం అని కూడా అనవచ్చు. అట్లాగే భూమి మంతుడు. సరస్సు ఊర్మిమంతం. ధృతిమంతుడు అంటే ధైర్యం కలవాడు. గోవులు ఎక్కువగా ఉన్నవాడు గోమంతుడు. జ్యోతిస్ అంటే కాంతి, ప్రకాశం, దీనిమీద మత్ చేరితే జ్యోతిష్మంతం, జ్యోతిష్మంతుడు అవుతుంది. ఇటువంటిదే ఆయుష్మంతం, ఆయు ష్మంతుడు. గరుత్ మీద మత్ చేరితే గరుత్మంతుడు అవుతుంది. గరుత్ అంటే రెక్క గరుత్మంతుడు అంటే రెక్కలు కలవాడు. గరుత్మంతం అనేది పక్షి వాచకం. ఏ పక్షి అయినా గరుత్మంతమే. కాని “గరుత్మంతుడు అన్న పేరు విష్ణువు వాహనమైన గరుడునికే స్థిరపడింది. అట్లాగే కకుద్మంతం. మూపురం కలిగింది. జ్ఞాన, విద్యా వంటి శబ్దాల మీద మత్ చేరినప్పుడు దీనిలోని మకారం వకారమవుతుంది. జ్ఞానవంతం, విద్యావంతం. జ్ఞానవంతుడు, విద్యావంతుడు. లక్ష్మీ శబ్దం మీద కూడా మత్ వ్రత్యయంలోని మకారం వ కారమవుతుంది. లక్ష్మీవంతం. అట్లాగే చమూవంతం. చమూ అంటే సైన్యం. చమూవంతం అంటే సైన్యవంతం. శీలవంతం, శీలవంతుడు. పదం చివర అకారం కానీ, ఆ కారం కాని ఉంటే మత్-వత్ అవుతుంది. అర్ధవంతం అర్థం కలిగినమాట. అర్థవంతమయిన పని అన్ననవ్హుడు సార్ధ్థకమయిన పని అని అర్ధం. ఇంగ్లీషులో మీనింగ్ ఫుల్ అన్న మాటకు ఇది సమానార్థకం. అదృష్టవంతుడు అంటే అద్భష్టం కలిగిన వాడు. ఉత్సాహవంతుడు అంటే ఉత్సాహం కలిగినవాడు. 142 అ మనభాష
సౌరభవంతం అంటే సొరభం కలిగినది. అనలపంతం, అనిలవంతం, ఉదన్వంతం మొద లయిన విధంగా వాడవచ్చు. అనలం అంటే నిప్పు, అనిలం అంటీ గాలి, ఉదకం అంటే నీరు.
ధనవంతుడు, బలవంతుడు, కులవంతుడు, ప్రజ్ఞావంతుడు, ప్రతిభావంతుడు మొదలయి నవి తెలుగులో బాగా వాడుకలో ఉన్న మాటలే.
హిమవంతుడు అంటే హిమం- మంచు కలిగినవాడు. హిమాలయ వర్వతం. సుఖ వంతం, దుఃఖవంతం, ధర్మవంతం అని కూడా వాడవచ్చు. రూపవంళం, రూసవంతుడు అని వాడవచ్చు.
యశస్సు కలిగినవాడు యశస్వంతుదు. భాస్వంతుడు అంటే కాంతిమంతుడు. తేజస్వం తుడు అంటే తేజస్సు కలవాడు. తేజోవంకుడు వంటి ప్రయోగాలు కూడా అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. కాని తేజ స్వంతుడు సరయిన రూపం.
జాంబవంతుడు రామాయణ భారతాదులలో ఒక పాత్ర,
రాజస్వంతం అంటే మంచిచాజు ఉన్న దేశం. రాజవంతం అంటే రాజున్న దేశం.
విద్యుత్ కలిగినది విద్యుత్వంతం. మెరుపు కలిగింది. దీన్నే తటిత్వంతం అని కూడా అన వచ్చు.
ఈ మత్ ప్రత్యయం బహుళ ప్రచారంలో ఉండడం వల్ల తెలుగులో వనిమంతుడు వంటి మాటలేర్చడ్డాయి. పని తెలుగు. దీనిమీద మత్ ప్రత్యయం సంస్కృతం, నేర్పరి, నిపుణుడు అన్న అర్ధంలో వనిమంతుడు అని వాడుతున్నాం.
చా మనభాషల 143
ధన్వి - రూవ్యం
“ఇ ప్రత్వయం చేర్చడం వల్ల కూడా మత్వర్ధ రూపాలేర్చడతాయి. ధన్వన్ అనేమాట మీద “ఇ చేరితే ధన్వి అవుతుంది. ధన్వి అంటే ధనుస్సు కలిగినవాడు, విలుకాడు, ధానుష్ముడు. శిఖ కలి గింది శిఖి. శిఖ అంటే చుంచు. చుంచు కలిగింది కాబట్టి నెమలి శిఖి. శిఖ అంటే జ్వాల అని కూడా అర్థం. జ్వాలలు కలిగింది అగ్ని, శిఖి అంటే నెమలి అనీ, అగ్ని అనీ అర్ధం. అట్లాగే కేకి, కేకారవం కలిగింది కాబట్టి కేకి నెమలి.
శాఖలు కలిగినటువంటిది శాఖి. కొమ్మలున్నది చెట్టు. దంతాలున్నది దంతి, ఏనుగు. హస్తం అంటే తొండం ఉన్నది హస్తి. మనీష కలవాడు మనీషి మనీష అంటే బుద్ధి, తెలివిడి, మనీషి అంటే పండితుడు. కపటం కలవాడు కపటి. శ్రేషస్ముయిన ధనం ఉన్నవాడు శ్రేష్టి. అట్లాగే శాస్ర, పరదేశి, స్వదేశి, విదేశి. కర్మ కలవాడు కర్మి. అట్లాగే జన్మి, సుఖం కలిగినవాడు సుఖి. దుః ఖం కలిగినవాడు దుఃఖి. హలం ఆయుధంగా కలిగినవాడు హలి, బలరాముడు. శీలంగా కలవాడు శీలి. పరనశీలి, రచనాశీలి అని వాడవచ్చు.
అర్ధ- అర్ధి అవుతుంది. విద్యను అర్ధించేవాడు విద్యార్థి. ధాన్యం అర్ధించేవాడు ధాన్యార్థి. తన వద్ద లేని దానిని కోరేవాడు.
బలం కలిగినవాడు బలి. ఉత్సాహం కలిగినవాడు ఉత్సాహి. వివేకం కలవాడు వివేకి, వ్యతిరేకార్థంలో అవివేకి. అట్లాగే ఉద్రేకి సాహసం కలవాడు సాహసి. అదే విధంగా కోపి. కురూపి, బహురూపి మొదలయినవి ఇటువంటివే.
దండం కలవాడు దండి. ఇక ప్రత్యయంచేరి దండికుడు కూడా అవుతుంది. ధనం కల వాడు ధని, ధనికుడు. కుటుంబం కలవాడు కుటుంబి, కుటుంబికుడు. ప్రయాణం చేసే వాడు ప్రయాణి, ప్రయాణికుడు. కుటుంబికుడు, ప్రయాణికుడు అన్న మాటలను కుటుంబీకుడు, ప్రయాణీకుడు అని రాస్తూ ఉండడం చూడవచ్చు. కుటుంబికుడు, ప్రయాణికుడు సరయిన రూపాలు,
నౌ శబ్దం నుండి నావి, నావికుడు ఏర్పడతాయి. మాయ నుండి మాయి, మాయికుడు ఏర్పడతాయి.
మేధా, మాయా వంటి మాటల మీద 'వి' ప్రత్యయం వస్తుంది. మేధ కలవాడు మేధావి. అట్లాగే మాయావి. తపస్వి, యశస్వి, తేజస్వి, వర్చస్వి వంటి మాటలన్నీ 'వి (ప్రత్యయం చేరి ఏర్పడ్డవే. ఊర్జస్వి అనికూడా వాడవచ్చు.
ఇత (ప్రత్యయం తారకా, పుష్ప, కుసుమ వంటి మాటలమీద చేరుతుంది. తారకితం అంటే తారకలు కలిగినది. నక్షత్రాలు కలిగింది ఆకాశం. తారకితం అంటే ఆకాశం. తరంగితం అంటే తరంగాలు కలిగింది. తిలకితం అంటే తిలకం కలిగినది. కుసుమితం అంటే పూవులు పూచినటు వంటిది. జ్వరం నుండి జ్వరితుడు. జ్వరం కలిగినవాడు జ్వరితుడు. దీక్ష వహించినవాడు దీక్ష తుడు. ఫలితం అంటే పండ్లు పండిన చెట్టు అని కూడా అర్ధం. గర్వితుడు అంటే గర్వంకలవాడు.
ఇల ్రత్యం కూడా మత్వర్థంలో వచ్చే ప్రత్యయమె. పంకం నుండి పంకిలం ఏర్పడు తుంది. పంకిలం అంటే బురద కలది. పాపపంకిలం అనే సమాసాొన్ని ఎక్కువగా వాడుతుంటాం,
144 అమనభాష
పిచ్చిలం అంటే చిక్కనైనది. ఫేనిలం అంటే ఫేనం - నురుగు కలది. గంధిలం అంటే గంధం కలది,
వాక్ మీద “మి ప్రత్యయం వచ్చి వాగ్మి అవుతుంది. వాగ్మి అంటే చక్కగా మాట్లాడగలిగిన వాడు. మంచివాక్కు కలవాడు. మాటకారి. నులినంలో '“ఇని ప్రత్యయం, మురికి కలిగింది మలినం. మలీమసం అన్నా ఇదే అర్ధం.
“ల ప్రత్యయం చాలా మాటలమీద వస్తుంది, జంఘాలశాస్త్రిలో “ల' వ్రత్యయమే. జంఘా లం అంటే వేగంగా పోయేది. జంఘాలుడు అంటే వేగంగా నడిచేవాడు. జంఘ అంటే కాలిపీక్క జంఘాలుడు అంటే పిక్కబలం ఉన్నవాడు. శుండాలం అంటే ఏనుగు, తొండం కలిగింది.
శీతలం అంటే చల్లదనం కలిగింది. అట్లాగే మృదులం, సురభిళం, బహుళం, శ్యామలం, పేశలం, పృధులం, మంజులం మొదలయిన మాటలు. పేశలం అంటే మృదువైనది. కుసుమ పేశలం అంటాం. కేరళలోని ళకకారం కూడా “లి ప్రత్యయమే. కేరం అంటే కొబ్బరిచెట్టు. కొబ్బరి చెట్లు కలిగినది కాబట్టి కేరళ/ీరళం.
మధురం, కుంజరం వంటి మాటల్లో “ర ప్రత్యయం. మధువు/యూధుర్యం కలిగినది మధురం. తియ్యనిది. కుంజాలు కలిగింది కుంజరం. కుంభస్థలానికి దిగువన ఉందే గుంతలు కుంజాలు.
కృషీవలుడు, దంతావళం, రజస్వల వంటి మాటల్లో ప్రత్యయం 'వలి. హృదయాలువు అంటే మంచి మనస్సు కలిగినవాడు. ఇక్కడ ప్రత్యయం “అలు. దయాళువు, కృపాళువు అంటే దయ కలిగినవాడు.
రూప్యంలో 'య' ప్రత్యయం. రూపాయికి మూలం ఇదే. రూవ్యం అంటే ముద్రితమయిన నాణం.
బ్ మనభాష 145
తరతమ ప్రత్యయాలు
ఎవరైనా తమ స్థాయికి ఎంచి వ్యవహరిస్తే తరతమ భేదాలు తెలియకుండా ్రవర్తిస్తున్నా డంటాం. అంటే తాను ..వరితో వ్యవహరిస్తున్నాడో అతను తనకంటె పెద్దవాడన్న గౌరవం బేకుండా ్రవర్తిస్తున్నాడన్న మాట. ఎక్కువ తక్కువలు లేకుందా, చిన్నా పెద్ద తెలియకుండా అని అర్థం. అట్లాగే తారతమ్యం అనే మాటను కూడా వాడుతూ ఉంటాం. దానికీ దీనికీ తారతమ్యం ఏమిటి? మొదలయిన విధంగా. ఇక్కడ భేదం అని అర్ధం. తర, తమ అనేవి ప్రత్యయాలు. పోలి కలో వచ్చే ప్రత్యయాలు ఇవి. రెండు వస్తువులలో ఒకదాని అతిశయాన్ని అంటే గొప్పదనాన్ని తెలపడానికి తర ప్రత్యయాన్ని వాడతాం. అనేక వస్తువులలో ఒకదాని అతిశయాన్నిి డ్రేష్టత్వాన్ని తెలపడానికి ఉపయోగించే ప్రత్యయం తమ. ఇంగ్లీషులో & అనేది తరతో సమానమయింది. టో అనేది తమతో సమానమయింది. 113%, [12%ల 1182%66లాగా వాడతాం. ఘనం, ఘనతరం, ఘనతమం అని వాడవచ్చు. తెలుగులో కూడా ఇటువంటి భేదాన్ని సూచించే పద్ధతి ఉంది. కంటే, లో అనే ప్రత్యయాలు తరతమ భేదాన్ని సూచించడానికి తెలుగులో ఉపయోగపడతాయి.
అతని కంటె ఇతను పొడుగు అన్నప్పుడు తర భేదం. క్రికెట్ ఆటగాళ్ళలో టానీగ్రేగ్ పొడుగు అంటే తమ ఖేదం. అయితే అందరికంటే ఆయన పెద్దవాడు, అందరిలో ఆయన పెద్ద వాడు అన్న విధంగానూ, మా ఇద్దరిలో ఆయన పెద్దవాడు అన్న విధంగానూ కూడా తెలుగులో వాడుక ఉంది.
తర, తమ ప్రత్యయాలు సంస్కృత ప్రత్యయాలు. విశేషణాల మీద, నామవాచకాల మీద కూడా ఈ ప్రత్యయాలు వస్తాయి. నిమ్నతరం, నిమ్షతమం; లఘుతరం, లఘుతమం; సూక్ష్మ తరం, సూక్ష్మతమం; సుందరతరం, సుందరతమం; శీతలతరం, శీతలతమం; క్లేశతరం, క్లేశ తమం; సుఖతరం, సుఖతమం; దుఃఖతరం, దుఖతమం; ఉచ్చైస్తరం, ఉచ్చైస్తమం - ఈ విధంగా తరతమ ్రత్యయాలను చేర్చి మాటలను తయారు చేసుకోవచ్చు.
రాజకీయ నాయకుల ఉపన్యాసాలు వింటే వాళ్ళెప్పుడూ జనం మీద గురుతరమైన బాధ్య తను మోపుతూ ఉండడం గమనించగలం. బరువైన బాధ్యత అన్నమాట. గురుతరం అన్న మాటను ఇతరులకు ఉపదేశాలిచ్చేటప్పుడు ఎక్కువగానే వాడుతూ ఉంటారు.
ఈ తర, తమ ప్రత్యయాల అర్థంలోనే ఈయస్, ఇస్ట అనే ప్రత్యయాలను కూడా వాడుతూ ఉంటాం. గరీయసం అంటీ బరువైనది, గొప్పది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న రామాయణ వాక్యంలో ఈ గరీయస్ ఉంది. జనని జన్మభూమి స్వర్గం కంటే కూడా గొప్పవి. మహీయసం అన్నా గొప్పదనే అర్ధం. మహత్ శబ్దం మీద ఈయస్ ప్రత్యయం చేరింది. గరీ యస్‌లో గురు శబ్దం. అదేవిధంగా లఘు శబ్దం మీద ఈయస్ చేరిస్తే లఘీయస్ అవుతుంది. శ్రేయసం అంటే మంగళకరమైనది. నిశ్తేయసం అని ఉపసర్గతో కూడా వాడవచ్చు. నిశ్చేయసం అంటే ముక్తి మోక్షం అని కూడా అర్ధం ఉంది.
ఈయస్ ప్రత్యయంతో సంస్కృతంలోఅనేక వదాలు ఏర్పడుతున్నా తెలుగులో వాటి వాడుక విరళమే. ఇష్ట ప్రత్యయంతో తెలుగులో చాలా సంస్కృత పదాలు వాడుకలో ఉన్నాయి. కనిష్టం అంటే అతి చిన్నది. గరిష్టం అంటే అతి పెద్దది. కనిష్టడు వయస్సు చేత మిక్కిలి
146 అతమనభాష
చిన్నవాడు. చివరి తమ్ముడు. కనిష్ట సోదరుడు, కనిష్ట పుత్రుడు అని విశేషణంగా వాడతాం. అట్లాగే కనిష్ట పరిమితి, గరిష్ట పరిమితి అని కూడా వాడతాం. కనిస్టిక అంటే చిటికెన వేలు.
తెలుగులో కనీసం అన్న మాట సంస్కృత కనీయస్ నుంచే వచ్చింది. కనాకష్టం అన్నది కనిష్టం నుంచి వచ్చిందేమో. కనిష్టుడులాగానే గరిష్టుడనీ వాడవచ్చు. అయితే దీన్ని విడిగా కాకుండా విద్యాగరిష్టుడు వంటి సమాసాలలో రెండో మాటగా వాడతాం. కనిష్టం అన్న మాటకు సమానార్థకాలుగా అల్పిష్టం, అణిష్టం అన్న మాటలను కూడా వాడవచ్చు.
స్వాదిష్టం అంటే మిక్కిలి రుచికరమైనది. (ద్రాఘిష్టం అంటే చాలా పొడవైంది. ్రాసిస్టం అంటే మిక్కిలి పొట్టిది క్షోదిష్టం అంటే మిక్కిలి క్షుద్రం. 'ప్రేష్టం అంటే చాలా ప్రియమైనది. వరిష్టం అంటే మిక్కిలి విరివి అయినది.
జ్యేష్టుడు అంటే అన్ను పెద్దవాడు. గ్రేష్టం అంటే చాలా ప్రశస్తమైంది. గ్రేష్టుడు అంటే (ప్రశంసనీయుడు, కొనియాడదగిన వాడు, ఉత్తముడు.
కర్మిష్టుడు అంటే క్రియయందు నేర్చరి. క్రియా నిపుణుడు. ద్రఢిష్టం అంటే మిక్కిలి దృఢ మైనది.
భూయిస్టం అంటే మిక్కిలి బహుళమైనది. లోవభూయిష్టం అంటే ఎన్నోలోపాలతో కూడు కున్నది. అట్లాగే దోషభూయిష్టం.
చాలా గొప్పది అని చెప్పడానికి కూడా తరతమ (ప్రత్యయాలు ఈయస్, ఇష్ట ప్రత్యయాలు చేరిన మాటలమీద చేరతాయి. శ్రేష్టకరం, క్రేష్టమం మొదలయిన విధంగా వాడవచ్చు. తర, తమ ్రత్యయాల వాడుక ఎక్కువ కాబట్టే తెలుగు మాటల మీద కూడా వీటిని చేర్చడం అక్క డక్కడా కనిపిస్తుంది. మేల్తరం, మేల్తమం వంటి వాడుక ఉంది. శ
మనభాషతి 147
సంస్కృత సంఖ్యా వాచకాలు తెలుగు సంఖ్యావాచక వదాలతోపాటు చాలా సందర్భాలలో మనం సంస్కృత సంభ్యావాచక పదాలనుకూడా వాడుతూ ఉంటాం. అంకెలలో తెలుగు అంకెలు వేయడం ఈనాడు దాదాపు పూర్తిగా మానివేశాం. ఆరబిక్ అంకెలు వాటితోపాటు అంకెలలో తేడా అవసరమయినప్పుడు రోమన్ అంకెలూ వాడుతున్నాం. ఉపవిభాగాలు సూచించవలసి వచ్చినప్పుడు రోమన్ అంకెలూ పూర్వం అఆ ఇఈలు వాదేవాళ్ళు. ఇప్పుడు ఎబిసిడిల వాడకం ఎక్కువయిపోయింది. కనీసం తెలుగు అంకెలు, వరుసగా తెలుగు అక్షరాలు నేర్చుకోవలసిన, నేర్చ్వవలసిన, వాడవలసిన అవ సరం ఉంది. ప్రస్తుతం మనం వాడుతున్న కాలండరు కూడా మనది కాదు. అయితే సకల శుభాశుభ కార్యాలకు, పండగలు పబ్బాల నిర్ణయానికి మాత్రం పంచాంగం వాడుతున్నాం. వంచాంగం వాడుకవల్ల తప్పనిసరిగా సంస్కృత సంఖ్యావాచకాలను ఉపయోగించవలసిన అవసరం ఏర్చ డుతూ ఉంది. సంస్కృత సమాసాలతో సంఖ్యావాచక పదాలను వాడినప్పుడూ సంస్కృత సంఖ్యా వాచకాలను వాడవలసి వస్తుంది. తెలుగుమాటల బదులు సంస్కృతం మాటలు వాడే అలవాటు కూడా మనకు ఉంది కదా. ముఖ్యంగా శైలీపరమయిన విశిష్టతకోసం ఆ విధంగా వాడుతూ ఉంటాం. అప్పుడూ సంస్కృత సంఖ్యావాచక పదాల అవసరం ఉంటుంది. తెలుగు వ్యాకరణా లలో విభక్తులు చెప్పవలసి వచ్చినప్పుడూ ఏడు వరకు సంస్కృత సంఖ్యావాచక పదాలను వాడుతున్నాం. మనం సంస్కృత సంఖ్యావాచక పదాలను వాడుతున్నప్పటికీ అది ఒక పరిమిత స్థాయిలో మాత్రమే వాడుతున్నాం. పెద్ద సంఖ్యలను వాడవలసి వచ్చినప్పుడు మాత్రం తెలుగు మాటలనే వాడవలసివస్తుంది. సంస్కృత పదాలతో ఎక్కువ మందికి పరిచయం ఉండదు, ఏక అంటే ఒకటి. దీనికి పూరణ వాచక రూపం (ప్రధమం. (ప్రధమం అంటే మొదటిది. దీనికే ఆదిమం అన్నది పర్యాయ వాచకం. అగ్రిమం అని కూడా అనవచ్చు తెలుగులో మొదటిది అన్నమాటకు సమానంగా ప్రథమం, ఆదిమం, అగ్రిమం అన్న సంస్కృత పదాలను వాడవచ్చు. ద్వి అంటే రెండు. ద్వితీయం అంటే రెండవది. అద్వితీయం అనేమాటను వాడతాం. అద్వి తీయం అంటే రెండవది కానిది, అంటే మొదటిది. అద్వితీయుడు అంటే మొదటివాడు, సాటిలేని వాడు. త్రి అంటే మూడు. తృతీయం అంటే మూడవది తృతీయుడు అంటే మూడోవాడు. చతుస్ అంటే నాలుగు. చతుర్ధం అంటే నాలుగోది. దీనికి తురీయం, తుర్యం అని రూపాంతరాలున్నాయి. చతుర్ధ పురుషార్ధం అనడానికి బదులు తురీయ పురుషార్ధం అని కూడా అనవచ్చు. నాలుగో పురుషార్ధం మోక్షం అన్నమాట. పంచ అంటే అయిదు. పంచమం అంటే అయిదవది. పంచముడు అంటే అయిదోవాడు. షట్ అంటే ఆరు. షష్టం అంటే ఆరవది. సప్త అంటే ఏడు. సప్తమం అంటే ఏడవది. అష్ట అంటే ఎనిమిది. అష్టమం అంటే ఎనిమిదవది. నవ అంటే తొమ్మిది. నవమం అంటే తొమ్మిద వది. దశ అంటే పది. దశమం అంటే వదవది. అల్లుడికి దశమ(గ్రహం అని పేరు కదా. తెలుగులో పది తరువాతి సంఖ్యలను పదకొండు, పన్నెండు అని లెక్కిస్తాం. అంటే వదికి 148 ఆ మనభాష
ఒకటి కలిపితే పదకొండు. పదికి రెండు కలిపితే పందైెండు, ఇదే పన్నెండు అయింది. సంఖ్యలో అంకెలు వేసిన క్రమంలోనే అంటే ఎడమవైపు సంఖ్యావదాన్ని ముందుగా, కుడివైపు సంఖ్యా పదాన్ని తరువాత వాడతాం. వేలు, వందలు, పదులు, ఒకట్ల వరుస పాటిస్తాం. సంస్కృతంలో అట్లాకాదు. ఒకట్టు, పదులు, వందల వరుసలో ఉంటుంది. ఏకాదశ అంటే పదకొండు. ఏకా దశం అంటే పదకొండవది. ద్వాదశి అంటే పన్నెండు. ద్వాదశం అంటే పన్నెండవది. త్రయోదశ అంటే పదమూడు. వప్రయోదశం అంటే పదమూడవది. చతుర్దశ అంటే పధ్నాలుగు. చతుర్ధశం అంటే వధ్నాలుగవది.
ఇంతవరకు మన తిధులకు సరిపోతాయి. తిధులలో మొదటి నాలుగు వికృతులు, ప్రధమ పాడ్యమి. ద్వితీయ విదియ. తృతీయ తదియ. తదీయకు తద్దె అని రూపాంతరం. అట్ల తద్దె ఉంది కదా. చతుర్ధి చవుతి. చౌతి, చవితి అని కూడా వాడుక ఉంది. చతుర్ధి చవితి రెండూ వాడుకలో ఉన్నాయి. తక్కిన వాటికి తత్సమ రూపాలే వాదుకలో ఉన్నాయి. పంచమి, షష్టి సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి అని.
పంచదశ అంటే పదిహేను. పంచదశం అంటే పదిహేనవది. షట్దశ అంటీ షోడశ అవుతుంది. షోడశ ఆంటే పదహారు. షోడశం అంటే పదహారవది. మనకు షోడశ మహారాజు లున్నారు. అష్టాదశ అంటే పద్దెనిమిది. అష్టాదశం అంటే వద్దెనిమిదవది.
పందొమ్మిదిని చెప్పడానికి రెండు పద్ధతులున్నాయి. అష్టాదశలాగానే నవదశ అనడం ఒక పద్ధతి. నవదశం అంటే పందొమ్మిదవది. ఇరవయికి ఒకటి తక్కువ అని చెప్పడం రెండో పద్ధతి. ఏ కోన వింశతి అంటే ఒకటి తక్కువ ఇరవై. ఏక అంటే ఒకటి. ఊన అంటే తక్కువ. వింశతి అంటే ఇరవై. ఊన వింశతి అని కూడా అనవచ్చు.
బ్ మనభాషత 149
తఖంశతి నుండి మహాభూరి దాకా
వింశతి అంటే ఇరవై. వింశం అన్నా వింశతి తమం అన్నా ఇరవయ్యవది. తెలుగులో హంస వింశతి అని కథాకావ్వం కూడా ఉంది. అయ్యలురాజు నారాయణామాత్యుడు రచించిన ఈ కావ్యంలో హంస చెప్పిన ఇరవయి కధలున్నాయి. నాటి ప్రజల జీవనాన్ని గురించి తెలుసు కోవడానికి ఇటువంటి కధా కావ్యాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వింశతి తరువాతి సంఖ్యలు ఏకదశ ద్వాదశ లాగానే ఉంటాయి. ఏక వింశతి అంటే ఇరవై ఒకటి. ద్వావింశతి అంటే ఇరవై రెండు. వంచ వింశతి ఇరవై అయిదు. భేతాళ పంచవింశతి అని ఇరవై అయిదు కథల కథాకావ్యం ఉంది. ఇరవై తొమ్మిదిని నవ వింశతి, ఏకోన త్రింశత్, ఊన (త్రిశంత్, ఏకాన్న త్రింశత్ అనవచ్చు. నవ వింశత్ అంటే తొమ్మిది+ఇరవై. ఏకోన త్రిశంత్ అంటే ఒకటి తక్కువ ముష్ఫయి. తక్మినవీ ఇంతే. త్రింశత్ అంటే ముప్ఫై. ద్వాత్రింశత్ అంటే ముప్ఫై రెండు. తెలుగులో కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక అనే కధాకావ్యం రచించాడు. ద్వాత్రింశిక అంటే ముప్ఫై రెండు కలది. అంటే ఇందులో ముప్ఫై రెండు కధలుంటాయి.
చత్యారింశత్ అంటీ నలై. నవ త్రింశత్ అన్నా వకోన చత్వారింశత్ అన్నా ఊన చత్వా రింశత్ అన్నా ముప్ఫై తొమ్మిది. వందదాకా ఈవిధంగా సాగుతుంది. పంచాశత్ అంటే యాఖై. షష్టి ఆంటే అరవై. షష్టి వష్టి అనే మాటలకు అర్ధభేదం ఉంది. షష్టి అంటే ఆరు. షష్టి అంటే అరవై. షష్టి పూర్తి అంటే అరవయ్యేళ్ళు నిండినప్పుడు చేసుకొనే పండగ. అరవయ్యేళ్ళు బతకడం కష్టమయిన రోజుల్లో ఈ పండగ చేసుకోవడం మొదలుపెట్టి ఉంటారు. తరువాత బతికిన కాల మంతా అధిక లాభమే. తరువాత ప్రతి పదేళ్ళకీ ఒక్కోపండగ చేసుకుంటున్నాం.
చళుషష్టి అంటే అరవై నాలుగు. చతుష్నప్టి కళలు అనేమాట ఎక్కువ వాడుకలో ఉంది. కళలు అరవై నాలుగే అయితే అవి ఏ అరవై నాలుగు అనే విషయంలో అభిప్రాయ భేదాలు న్నాయి. ఈ అరవై నాలుగుకు సంబంధించి ఏదెనిమిది రకాల పట్టికలున్నాయి. ఇవి అసంఖ్యాకం అనేవాళ్ళూ ఉన్నారు. కళలు ఎన్ని అయినా చతుష్షష్టి అన్నది రూఢి అయిపోయింది.
సప్తతి అంటీ దెబ్బై. పాలవేకరి కదరీపతి అనేకవి శుకసప్తతి అనే కధాకావ్యం రాశాడు. ఇందులో చిలుక చెప్పిన డెబ్బై కధలుంటాయి. షష్టి పూర్తిలాగానే సప్తతి తమ జయంతి కూడా జరుపుకుంటారు.
అశీతి అంటే ఎనఖై. అశీతితమం అంటే ఎనభయ్యవది. పద్మనాయకులలో సింగమనేనికి అశీతి వరాల సింగమనేడు అనిపేరు. నవతి అంటే తొంభై. షణ్ఞావతి అంటే తొంబై ఆరు.
శతం అంటే నూరు. శతతమం అంటే నూరవది. నూటికంటే ఎక్కువ సంఖ్యను తెలువ వలసిన అవసరం వచ్చినప్పుడు ఉత్తర, అధిక అనేమాటలను వాడతారు. అష్టోత్తర శతం అంటే నూట ఎనిమిది. అష్టశతం, అష్టాధికశతం అనికూడా అనవచ్చు. ఉపనిషత్తులు నూట ఎనిమిది. తెలుగు శతకాలలో పేరుకు శతకం అంటే నూరు పద్యాల రచన అన్న అర్ధమే అయినా సాధార ణంగా నూట ఎనిమిది పద్యాలుంటాయి.
ద్విశతి అంటే రెండు వందలు. త్రిశతి అంటే మూడు వందలు. విశ్వనాధ సత్యనారాయణ గారు వరలక్ష్మీ త్రిశతి రచించారు. సప్తశతి అంటే ఏడు వందలు. గాధాసప్తశతి సుప్రసిద్ధమైన
150 తమనభాష
రచన. దీనికి శాలివాహన సప్తశతి అనికూడా పేరు. అనేకమంది కవులు కవయిక్రులు చెప్పిన రసవంతమయిన ఏడువందల ప్రాకృత శ్లోకాలు ఈ (గ్రంథంలో ఉన్నాయి. శ్రీనాధుడు దీన్ని తెలుగులోకి అనువదించాడు. కాని ఇప్పుడు లభ్యంకావడంలేదు. ఆధునికుల్లో రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు అనువదించారు.
సహస్రం అంటే వేయి. అష్టోత్తర సహస్రం అంటే ఒకవేయి ఎనిమిది. శతతమం అంటే నూరవది. సహస్రతమం అంటే వెయ్యవది. తెలుగులో వెయ్యి వరకు సంఖ్యలకు పేర్లున్నాయి. ఆపైన సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్నవే. నూరు వేలు లక్ష నూరు లక్షలు కోటి. నూరు కోట్లు అర్చుదం. పది అర్చుదాలు ఒక న్యర్చుదం. వది న్యర్చుదాలు ఒక ఖర్వం. పది ఖర్వాలు ఒక మహాఖర్వం, పది మహాఖర్వాలు ఒక పద్మం. పది పద్మాలు ఒక మహాపద్మం. పది మహాపద్నాలు ఒక క్షోణి. పది క్షోణులు ఒక మహా క్షోణి. పది మహాక్షోణులు ఒక శంఖం. వది శంఖాలు ఒక మహాశంఖం. పది మహాశంఖాలు ఒక క్షితి. పది క్షితులు ఒక మహాక్షితి. పది మహాక్షితులు ఒక క్షోభం. పది క్షోభాలు ఒక మహాక్షోభం. పది మవాక్షోభాలు ఒక నిధి. పది నిధులు ఒక పర్వం. పది పర్వాలు ఒక పరార్థం. పది వరార్థాలు ఒక అనంతం. వది అనంతాలు ఒక సాగరం. పది సాగరాలు ఒక అవ్యయం. పది అవ్యయాలు ఒక అచింత్యం, వది అచింత్యాలు ఒక అమేయం, పది అమేయాలు ఒక భూరి. వది భూరులు ఒక మహాభూరి. మహాభూరి ఆంటీ ఒకటి తర్వాత ముప్ఫై నాలుగు సున్నాలు,
మహాపద్మనందుడికి ఆ పేరు అంత ధనం కూడబెట్టడం వల్లనేనంటారు. మహాపద్మం అంటే కోటి కోట్లు, ఈ సంఖ్యలన్నీ భారతీయుల అభివృద్ధి స్థాయికి నిదర్శనం. లో
మనవాళ్ళ కాలగణనం కూడా విస్మయూవహంగా ఉంటుంది. ఇదంతా ఒకప్పటి కాలం భారతదేశంలో జరిగిన వివిధ శాస్త్రాల అభివృద్ధికి అద్దం పడుతుంది. జ
మనభాషతి 151
సంకేతాలు
మనకు సంఖ్యల ప్రాధాన్యం చాలా ఉంది. చాలా సంఖ్యలు సంకేతాలుగా వాడుకల్లో ఉన్నాయి. వీటిని వివరించే సంకేత పదకోశాలు కూడా ఉన్నాయి. ఛందస్సు, అలంకారశాస్త్రం, మతం, తత్వ శాస్త్రం, భాషలు, పదార్థాలు అవీ ఇవీ అనిలేదు సర్వ విషయాలకూ సంబంధించి రూఢమైన సంఖ్యలున్నాయి. పూర్వం సంఖ్యలను చెప్పడానికి కూడా సంకేతాలను ఉపయోగించేవాళ్ళు. సూర్యుడు, చంద్రుడు, భూమి మొదలయినవి ఒకటికి సంకేతాలు. నేత్రాలు రెండు, మూర్తులు ముగ్గురు, సముద్రాలు నాలుగు, బాణాలు అయిదు, రుచులు ఆరు, స్వరాలు ఏడు, వసువులు ఎనిమిది మంది, రసాలు తొమ్మిది, ఆకాశం శూన్యం. ఇవేకాదు ఒక్కొక్క అంకెకూ ఒకటికంటే ఎక్కువే సంకేతాలున్నాయి. హిమకరాంగవియత్శశి అంటే హిమకరుడు చంద్రుడు- ఒకటీ అంగాలు- ఆరు, వియ్, ఆకాశం- శూన్యం, శశి చంద్రుడు- ఒకటి. సంస్కృత లేఖన పద్ధతిలో దీన్ని తిరగవేస్తే ఆ సంవత్సరం వస్తుంది. హిమకరాంగ వియత్శశి అంటే 1061. ముని వసునిధి అంటే మునులు ఏడుగురు- సప్తర్షులు, వసువులు అంటే ఎనిమిది, నిధులు తొమ్మిది. తిరగవేస్తే 987. ఇట్లా సంఖ్యలకు వస్తువులు సంకేతాలుగానూ, మళ్ళీ వస్తువులకు సంఖ్యలు సంకేతాలు గాను వాడతారు. ఉదాహరణకు త్రయి మూడు. మూడు వేదాలన్నమాట. ఇది చాలా విస్తృత మయిన (ప్రక్రియ.
కొన్ని కొన్ని అంశాలు నిశ్చితంగా ఉండవు. ఉదాహరణకు సప్తవ్యసనాలూ ఉన్నాయి, అష్ట వ్యసనాలూ ఉన్నాయి. దశ వ్యసనాలూ ఉన్నాయి, అష్టాదశ వ్యసనాలు కూడా ఉన్నాయి. షట్బక్ర వర్తులు, ద్వాదశ చక్రవర్తులు, షోడశ చదక్రవర్తులూ ఉన్నారు అట్లాగే అష్టాంగాలు ఇరవై రకా లున్నాయి.
మన ఛందస్సులో ద్విపద అంటే రెండు పాదాల పద్యం. (త్రిపద అంటే మూడుపాదాల పద్యం. తెలుగులో అంతగా వాదుకలోబేదు. తెలుగుపద్యాలు సాధారణంగా చతుష్పాదులు. వృత్తాలన్నింటినీ మరోపాదం కలిపి పంచపాదులుగా రాయవచ్చు. సి.నారాయణరెడ్డి గారి (ప్రపంచ పదుల్లాంటివి. ఆరు పాదాల పద్యం షట్పద. కన్నడంలో ఈ పద్యానికి వాడుక ఎక్కువ. ఎనిమిది పాదాలుంటే అష్టపది. జయదేవుని అష్టపదులు సువ్రసిద్ధం కదా.
కావ్య భఖేదాలలో కూడా ఒక పద్యం నుండి అనేక పద్యాలదాకా వివిధ సంఖ్యలతో కొన్ని కావ్యాలేర్చదతాయి. ఉదాహరణకు అష్టకం అంటే ఎనిమిది పద్యాల రచన. శతకం అంటే నూరు వద్యాల రచన.
ద్వయం అంటే రెండిటి సమూహం, త్రయం అంటే మూడింటి సమూహం, చతుష్టయం అంటే నాల్గింటి సమూహం, అట్లాగే ద్వికం, త్రికం, చతుష్కం, పంచకం, షట్కం, సప్తకం, అష్టకం, నవకం, దశకం వగైరా. ద్వితయం, (్రితయం, పంచతయం, షట్టయం అనికూడా అన వచ్చు.
కవిద్వయం అని నోరి నరసింహతశాస్త్రిగారి నవల. శ్రీనాధ పోతనల ఇతివృత్తం ఆధారంగా ఈ నవల రచించాడు. తెలుగు వారిలో కవిత్రయం అంటే తెలియని వారుండరు. మనకు నన్నయ, తిక్కన, ఎర్రనల లాగా కన్నడంలో పంప, పొన్న రన్నలతో రత్త్మత్రయం ఉంది. సంస్కృ
తంలో పాణిని, కాత్యాయనుడు, పతంజలి మునిత్రయం. తెలుగు వ్యాకరణంలో నన్నయ, అధర్వణుడు, అహోబల పండితుడు ఆచార్యత్రయం.
కొన్ని మాటలు సంకేతాలయినా అవి చెప్పే సంకేతాలకు ప్రాధాన్యం పోయి స్థూలంగా ఒక రూధ్యర్థం ఏర్పడుతుంది. ఉదాహరణకు తాపత్రయం అనే మాటను తీసుకోవచ్చు. తాపత్రయం అంటే ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధి.దైవికం. కాని ఈ మాటను వాడేటప్పుడు వీటి స్పృహ ఉండదు. వాడు మహా తాపత్రయ పడిపోతున్నాడు అంటాం. తపీంచిపోవడం, తొందరపడి పోవడం అన్న అర్ధంలో వాడుతున్నాం. దుష్టచతుష్టయం భారత కథలో సుప్రసిద్ధం. కాని నలుగురు దుష్టులు కలిస్తే వారిని దుష్ట చతుష్టయం అని వ్యవహరిస్తాం. వాడి మొహం చూస్తేనే పంచమహాపాతకాలూ చుట్టుకుంటాయని అంటూ ఉంటారు. ఈ అయిదూ ఏమిటన్నది తెలిసి వాడవలసిన అవసరమేమీలేదు. ఘోరమైన పాపం అన్న అర్థం సరిపోతుంది. పంచ మహాపాత కాలు అంటే- బంగారం దొంగిలించడం, సురాపానం, (బ్రహ్మహత్య, గురుపళ్నీ సంగమం అనే నాలుగు పాతకాలూ, ఈ పాతకాలు చేసిన వాడితో స్నేహం అన్న అయిదో పాతకం. మరో విధంగా బ్రహ్మహత్య, భ్రూణహత్య, బాలహత్య, గోహత్య, స్రీహత్య,
(త్రికరణ శుద్ధిగా అన్న మాటకు మనస్సు, వాక్కు కర్మ ఈ మూడింటి పరంగానూ పవిత్రంగా అని అర్ధం. నిజాయితీగా అన్న అర్ధంలో వాడుతున్నాం. పంచభక్ష్య వరమాన్నాలు అన్నమాటను కూడా మనవాళ్ళు ఎక్కువగా వాడతారు. పంచభక్ష్యాలు అంటే భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పేయం. వివిధ వంటకాలతో చక్కని విందు అన్న అర్ధంలో వాడుతున్నాం. పంచాంగం అంటే తిధి, వార, నక్షత్ర, యోగ, కరణాలను తెలిపేది.
సప్త వ్యసనాలు అన్నమాట కూడా ఇటువంటిదే. స్తీ మద్యం, వేట, జూదం, వాక్సారుష్యం, అర్ధదూషణం, దండపారుష్యం అన్నవి సప్త వ్యసనాలు. అన్ని రకాల దురలవాట్లూ అని నేటి అర్ధం. అష్టకష్టాలు అన్న మాటా ఇటువంటిదే. దేశాంతరం, భార్యావియోగం, అవత్మాల బంధు దర్భనం, ఉచ్చిష్ట భక్షణం, శత్రుస్నేహం, పరాన్న ప్రతీక్షణం, భంగం, దారిద్ర్యం అన్నవి అష్ట కష్టాలు. అనేకరకాల కష్టాలు, దుర్చ్భరమయిన కష్టాలు అన్న అర్థంలో వాడుతున్నాం. అష్టైశ్వ ర్యాలూ ఇలాంటిదే. దాసీజనం, భృత్యులు, పుత్రులు, మిత్రులు, బంధువులు, వాహనం, ధనం, ధాన్యం అన్నవి ఎనిమిది ఐశ్వర్యాలు. మహాసంపన్నత అన్న అర్ధంలో వాడుతున్నాం. ఇట్లా ఎన్నో సంకేతాలు.
బ్ మవభాషతి 153
స్తే ప్రత్యయాలు యౌటలను పురుష బోధకాలుగాను, స్రీ బోధకాలుగానూ వాడే పద్ధతి భాషలన్నిటిలోనూ ఉంటుంది. పురుష బోధక ప్రత్యయం చేరితే ఆ మాట పురుషుణ్ణి బోధిస్తుంది. స్త్రీ బోధక ప్రత్యయం చేరితే స్రీని బోధిస్తుంది. తెలుగులో అమ్మ, ఆలు, ఆడి వంటి ప్రత్యయాలు చేరి స్రీ బోధక పదాలు ఏర్పడతాయి. పెద్దమ్మ, పేదరాలు, వగలాడి లాంటి... సంస్కృతంలో ఈ (ప్రక్రియ విస్తారంగా ఉంది. అయితే సంస్కృతంలో స్త్రీ లింగ శబ్దాలన్నీ స్రీ వాచకాలు కావు. వాక్య నిర్మా ణంలో వాటి ప్రయోజనం ఉంటుంది. తెలుగులో సంస్కృత పదాలను వాడేటవ్చుడు ప్రీ బోధక శబ్దాలు తప్ప తక్కిన వాటికి తేడా ఏమీ ఉండదు. ఉదాహరణకు ఆయన మాటల్లో చాలా చాతుర్యం ఉంది అనీ అనవచ్చు, ఆయన మాటల్లో చాలా చాతురి ఉంది అనీ అనవచ్చు. చాతురీ అన్న స్త్రీ ప్రత్యయాంత శబ్దానికి తెలుగులో (ప్రత్యేకత ఏమీలేదు. చాతుర్యం, చాతురి రెండూ తెలుగులో అమహత్తులే, పాండిత్య స్ఫోరకం అనీ, పాండితీస్పోరకం అనీ అనవచ్చు. బెచిత్యం- బెచితి, నైపుణ్యం- నైపుణి, మాధుర్యం- మాధురి, వైదగ్ధ్యం- వైదర్ది, పారం పర్యం- పారంపరి వంటీవి ఇటువంటివి- శైలి, మైత్రి, సామగ్రి వంటివి స్త్రీ ప్రత్యయాంతాలుగానే తెలుగులోకి వచ్చాయి. కూతురు, భార్య అన్న అర్ధంలో స్రీ ప్రత్యయం చేరి పదాలేర్చడతాయి. కైకయ రాజు కూతురు కైకేయి, విదేహరాజు కూతురు వైదేహి, పాంచాల రాజు కూతురు పాంచాలి. సత్రాజిత్తు కూతురు సాడ్రాజితి, భీమ్ముని కూతురు ఖభైష్కి (రుక్మిణి), భీముని కూతురు ఖైమి. గాంధార రాజు కూతురు గాంధారి. గా ఇంద్రుని భార్య ఐంద్రి, రుద్రుని భార్య రౌద్రి, బ్రహ్మ భార్య (బ్రాహ్మి, గోపుని భార్య గోపి. ఇంద్రుని భార్యను ఇంద్రాణి అని కూడా అనవచ్చు దీనిలాగే రుద్రాణి, శర్వాణి, భవాని, శడ్రాణి, మృడాని, బ్రహ్మాణి, వరుణాని. విష్ణు వంటి ఉ కారంత శబ్దాల మీద 'వి ఆగమంగా వస్తుంది. విష్ణువు భార్య వైష్ణవి, శంభుని భార్య శాంభవి. అట్లాగే మాధవి, వాసవి మొదలయినవి. కూతురు, భార్య అన్న ఈ రెండు సంబంధాలు గాక సోదరి, అత్త, కోడలు వంటి సంబం ఛాలను బోధించడం వాక్యరూపంలో తప్ప సాధ్యపడదు. ఇంద్రాణి, మాధవి వంటివి పేర్లుగా వాడుతున్నామే తప్ప వాటిని ఇంద్ర, మధు సంబంధమైన వాటిగా మనం వాడడం లేదు. కావ్యా లలో ఈ మాటల ప్రయోగాలు ఎక్కువ. ఒకే వ్యక్తిని బోధించడానికి అసలు పేరుతో పాటు, దేశం, తండ్రి, వంశం, భర్త, విశిష్ట గుణగణాల వంటి వాటి సంబంధంతో ఎన్నో పేర్లు కావ్యాలలో వాడుకలో ఉన్నాయి. కృష్ణ పాంచాలి, ద్రౌపదిలాగా. పతి అంటే భర్త, దీని స్త్రీ వాచక పదం పత్ని. ఏకపత్ని వీరపత్ని సవత్ని అని సమాసంలో వాదవచ్చు. జనన శబ్దం నుండి జనని ఏర్పడుతుంది. సాధు శబ్దం నుండి సాధ్వి, ప్రభు శబ్దం నుండి ప్రభ్వి ఏర్పడతాయి. నేళ్ళ వదం నుండి నేత్రి ఏర్పడుతుంది. నేత్రి అంటే నాయకురాలు. జనయితృ నుండి జనయిత్రి, కవయిత్ళ నుండి కవయిత్రి. కవి నుండి కవయిత్రి రాలేదు. రచయిత నుండి రచ యి(త్రి రాలేదు. కర్షృ నుండి కర్రి వచ్చింది. దాత్ఫ నుండి దాత్రి. దాత్రి అంటే దానశీల. 154 తమనబాష
మాతృ శబ్దం నుండి మాత్రి వర్పడదు. పితృ- పిత అయినట్లుగా మాత్చ- మాత అవు తుంది. దుహితృ నుండి దుహిత ఏర్పడింది. కూతురు అని అర్ధం.
'ఈ' ప్రత్యయం చేరి చాలామాటలు ఏర్పడతాయి. గౌర- గౌరీ, లక్ష్మి- లక్ష్మీ అవుతాయి. తెలుగులోకి వచ్చినప్పుడు గౌరి, లక్ష్మి అని అవుతాయి. పుత్ర- పుత్రి, నద- నది, దేవ- దేవి, తాపస- తాపసి, ఛాత్ర- ఛాత్రి, దూత-దూతి, నట- నటి, విట- విటి, చేట- చేటి, తరుణ- తరుణి, రమణ- రమణి, సుకుమార- సుకుమారి, అనుచర- అనుచరి, గాయన-- గాయని, నర్తక- నర్తకి, భిక్షుక- భిక్షుకి, పితామహ- పితామహి, మాతామహ- మాతామహి, నర- నారి మొదలయిన మాటలన్నీ "ఈ ప్రత్యయం చేరి ఏర్చడ్డవే. విద్వాంసురాలు విదుషి.
యశస్విని, స్వామిని, రాగిణి ఇటువంటివే. రాగిజీ అంటీ అనురక్తురాలు. సంగీతంలో ఒక (ప్రధాన రాగం నుండి పుట్టిన రాగం అన్న అర్ధం కూడా ఉంది. రాగరాగిజి అన్నవ్రయోగం కూడా ఉంది.
పక్షులు, జంతువులలో ఆడపక్షులు ఆడ జంతువులను సూచించడానికి కూడా 'ఈి ప్రత్యయం చేరుతుంది. సింహ- సింహి అవుతుంది, మృగ- మృగి అవుతుంది. హంస- హంసి, చక్రవాక- చ(క్రవాకి, మయూర- మయూరి, భుజంగ- భుజంగి, మహిష- మహిషి వ్యాఘ- వ్యాఘ్రి, కురంగ- కురంగి, విహంగ- విహంగి, నాగ- నాగి అవుతాయి. నాగి అంటే ఆడ ఏనుగు
మన కావ్యాలలో స్త్రీ వర్షన చాలా ప్రధానంగా ఉంటుంది. స్త్రీకి పర్యాయ వాచక పదాలు కొల్లలు, అవయవ వాచకాలయిన పదాలతో స్త్రీ వాచక వదాలెన్నో కావ్యాలలో దర్శనమిస్తాయి. ముఖ శబ్దంతో చంద్రముఖి, పద్మముఖి ఏర్పడతాయి. చం[ద్రముఖ, పద్మముఖ అని కూడా వాడ వచ్చు. లతాంగి అనవచ్చు లతాంగ అనీ అనవచ్చు. సుదంతి అనీ అనవచ్చు, సుదంత అనీ అన వచ్చు. అట్లాగే బింబాధరి/ బింబాధర. దొండపండు వంటి అధరం (కింది పెదవి) కలిగిన స్రీ. బింబోష్టీ/ బింబోష్ట కూడా అంతే. మృగనయని/యృగనయన,; కంర, గాత్ర, ఉదర వంటి పదాలతో కూడిన చాలా మాటలు ఏర్పడతాయి.
పద్మనేత్ర, కమలనేత్ర, మృగనేత్ర మొదలయినవి అకారాంతాలుగానే ఉంటాయి. వద్శవేతి వంటి ప్రయోగాలు తెలుగు కావ్యాలలో అక్కడక్కడా కనిపిస్తాయి. అక్ష శబ్దం అక్షిగానే ఉంటుంది. జలజాక్ష్మి మీనాక్షి మృగాక్ష్మి చంచలాక్షి మొదలయినవి,
కోమల/ కోమలి, మనోహర/ మనోహరి రెండు రూపాలూ ఉన్నాయి.
పంతులు గారి భార్యను పంతులమ్మ అనవచ్చు. ఉపాధ్యాయురాలినీ పంతులమ్మ అన వచ్చు. సంస్కృతంలోనూ కొన్ని పదాలు ఇంతే, ఉపాధ్యాయి అంటే ఉపాధ్యాయుని భార్య. ఉపా ధ్యాయురాలూ కూడా. ఉపాధ్యాయ అంటే ఉపాధ్యాయురాలు మాత్రమే. ఆచార్యాని అంటే ఆచార్యుని భార్య. ఆచార్య అంటే ఉపాధ్యాయురాలు.
మత్ (ప్రత్యయం చేరిన మాటల మీద 'ఈ' ప్రత్యయం చేరి స్రీ వాచక వదాలు ఏర్పడతాయి. బుద్ధిమతి, సరస్వతి, జ్ఞానవతి, యశస్వతి, ఆయుష్మతి, గర్భవతి మొదలయినవి.
జ్యేష్ట బాల, సుత తనయ, ధీర, ప్రియ, అబల వంటివి “ఆ ప్రత్యయం చేరినవి, క (ప్రత్యయం చేరిన మాటల్లో దానికి ముందు అకారం ఇకారం అవుతుంది. బాలక- బాలిక్క గాయిక, నాయిక, పరిచారిక, పుత్రిక వంటివి.
బ్ మనభాషతి 155
ఉపసర్గలు భాషలో కొత్త పదాలను కల్పించుకోవడమన్నది చాలా ముఖ్యమయిన (ప్రక్రియ. ఏ భాష అయినా అభివృద్ధి చెందడమన్నది ఈ పదకల్పనా (ప్రక్రియ మీదే ఆధారపడి ఉంటుంది. (ప్రతిభాషకూ ఈ సామర్థ్యం ఉంటుంది. అయితే పదకల్పనలో భాషలు ప్రత్యేకమయిన విధానాలను అవలం బిస్తాయి. ఈ విషయంలో తెలుగుకూ, సంస్కృతానికీ భేదం ఉంది. కృత్తద్ధితాలూ, సమాస నిర్మాణం వంటివి రెండు భాషలకూ సమానమే. కాని సంస్కృతంలో ఉపసర్గలు ఒక విశిష్టమైన ప్రక్రియ.
పద నిర్మాణంలో ధాతువు మూలం. ధాతువుకు ఒక అర్ధం ఉంటుంది. దానికి ప్రత్యేక అర్దాలు కల్పించడానికి ఉపసర్దలు చేరతాయి. ఉపసర్గ ధాతువుకు ముందు చేరుతుంది. హృా అనేది ధాకువు. దీనికి బలవంతమని అర్థం. సంహారం, విహారం, ఆహారం, (ప్రహారం వంటి మాటలన్నీ ఈ “హృ ధాకువునుండే ఏర్పడుతున్నాయి. ఈ మాటలన్నిటికీ అర్థాలు వేరు. ఈ వేరు వేరు అర్ధాలు, సం, వి, ఆ, ప్ర మొదలయిన ఉపసర్గలు చేరడంవల్ల ఏర్పడుతున్నాయి. కాబట్టి సంస్కృతంలో ఉపసర్దలు చేరి వివిధ అర్థాలలో పదాలు ఏర్పడడం అన్నది చాలా విస్తృతమయిన వ్రక్రియ.
సంస్కృతంలో ఇరవై రెండు ఉపసర్గలున్నాయి. అవి “ప్ర, పరా, అప సం, అను, అవ, నిస్, నిర్, దుస్, దుర్, వి, ఆజ్, ని, అధి, అపి, అతి, సు, ఉత్, అభి, (ప్రతి, పరి, ఉప". ధాతువులకు ఈ ఉపసర్దలుచేరి ఎన్నో మాటలు ఏర్పడతాయి.
“వ్ర అనే ఉపసర్గను శీసికుంటే ప్రయోగం, ప్రవాదం వంటి మాటలెన్నో దీనితో ఏర్పడతాయి. యోగం అనే మాటకు యుక్త, కూర్చడం, నిగ్రహం వంటి అనేకార్థాలున్నాయి. ప్రయోగం అంటే వాడడం, కూర్చడం, అర్చణం వంటి అర్థాలున్నాయి. (ప్రయోగం అన్నమాటను ఇంగ్లీషు ఎక్స్‌పరిమెంట్‌కు సమానార్థకంగా కూడా వాడుతున్నాం. విషప్రయోగం చేశారు, అజ్వస్తాలను ప్రయోగించారు, బల(ప్రయోగం చేశారు, నాటకప్రయోగం జరిగింది వంటి వాక్యాలలో ప్రయోగ శబ్దానికి అర్ధద్భాయలున్నాయి. నాటక ప్రయోగంలో ప్రయోగానికి ప్రదర్శన అని అర్ధం. ఈ (ప్రయోగ శబ్దం నుండి ప్రయోక్త- ప్రయోగించేవాడు అన్న వదం ఏర్పడింది. ప్రయోగి అన్నా ఇదే అర్ధం. ప్రయోగ్యం, ప్రయోజ్యం, ప్రయోజనం, ప్రయోజకుడు మొదలయిన మాటలు ఈ విధంగా ఏర్చడ్డవే. నాటకాల వరిభాషలో ప్రయోగాతిశయం అనే మాట ఉంది.
సాధారణంగా ఈ “ప్రా అనే ఉపసర్గకు మిక్కిలి అని అర్ధం. కంపం, కంపనం అన్న మాటలకు “ఫ్ర చేరి ప్రకంపం, వ్రకంపనం ఏర్పడతాయి. మిక్కిలి వణకడం అని అర్ధం. ప్రకంవ నాలు కలిగాయి అని ప్రయోగం. కాండం- ప్రకాండం అవుతుంది. చెట్టు బోదె అని అర్ధం. వేళ్ళ దగ్గరినుండి కొమ్మలదాకా ఉండే వృక్షభాగం. ప్రకోపం అంటే తీవ్రమైన కోపం. ఉద్రేకం, అతిశయం అని కూడా ఆర్థం.
ప్రక్రియ అంటే మంచిపని, చేయదగినపని, పని విధానం అని అర్ధం. క్షాళనం- 'ప్రక్షా శనం అవుతుంది. బాగా కడగడమని అర్ధం. శుద్ధి చేయడం.
(ప్రఖ్యాతి అంటే మిక్కిలి ప్రసిద్ధి చెందినది. (ప్రఖ్యాతి అంటే కీర్తి ప్రగాఢం అంటే ఎక్కువ.
156 తమనభాష
ప్రఘోష అంటే పెద్ద ధ్వని. తప్తం అంటే వేడి చేయబడింది. 'ప్రతస్తం బాగా వేడి చేసింది. ప్రతాపం అంటే కూడా వేడి అనే అర్ధం. పరాక్రమం, శక్తి అనే అర్జ్థాలూ ఉన్నాయి.
ప్రదక్షిణం అంటే దక్షిణం, కుడివైపుకు తిరగడం. దేవతల చుట్టూ తిరగడాన్నే ప్రదక్షిణ చేయడం అంటున్నాం. ఎక్కువగా తిరగడం అన్న అర్థంలో 'ప్రదక్షిణకు చాలా ప్రాచుర్యం వచ్చింది.
(ప్రదర్శనం అంటే విశదపరచిచూపడం. (ప్రదానం అంటే గొప్పదానం. వ్రదాత అంటే గొప్ప దాత. ప్రస్తుతం (ప్రదానం అంటే ఇవ్వడం అనీ, ప్రదాత అంటే ఇచ్చేవాడనీ ప్రయోగం. బహుమతి ప్రదానం జరిగింది అంటున్నాం. బహుమతి (ప్రదాత అన్నప్పుడు బహుమతిని నెల కొల్చి ఇచ్చేవాడితోపాటు, సభలో బెపచారికంగా బహుమతిని అందించే వ్యక్తీ స్ఫురిస్తున్నాడు.
పితామహుడు అంటే తాత. ప్రపితా మహుడు అంటే ముత్తాత. ('ప్రప్రపితామహుడు అంటే ముత్తాత తండ్రి. పౌత్రుడు అంటే మనుమడు. ప్రపౌొత్రుడు అంటీ మునిమనుమడు. ప్రపుల్లం అంటే బాగా వికసించింది. ప్రబంధం అంటే 'ప్రకృష్ణమైన బంధం. కావ్యమనీ-అడ్థర. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వర్ణనాప్రధానంగా వచ్చిన కావ్యాలను ప్రబంధాలు అంటున్నాం. బలం- ప్రబలం అవుతుంది. చాలా బలం కలిగింది అనీ, గొప్పదనీ, ముఖ్యమైనదనీ అర్థం. ఎక్కున అని కూదా అర్ధం. (ప్రబలసాక్ష్యం అంటే చాలా బలమైన సాక్ష్యమని అర్థం. బాధకం అంటే బాధిం చేది. ప్రబాధకం ఎక్కువగా బాధించేది.
(ప్రబోధం అంటే చక్కగా బోధించడం, వివరించడం, మెలకువ అనీ, జ్ఞానం అనీ కూడా అర్ధాలున్నాయి. ప్రబోధనం అన్నా ఇదే అర్ధం. 'ప్రబోధించు, ప్రబోధితుదు, ప్రబోధకుడు దీని నుండి ఏర్పడ్డవే.
ప్రభాస అంటే మిక్కిలి కాంతి. 'భా' అనే ధాతువుకు కాంతి అని అర్థం. ఈ ధాతువు నుండి భాస శబ్దం ఏర్పడింది. భానుడని సంస్కృతంలో గొప్ప నాటకకర్త ఉన్నాడు. ప్రభేదం అంటీ విభ జించడం, వేరుపర వడం. చిన్న చిన్న విభాగాలు చేయడం, ('ప్రమత్తుడు అంటే మిక్కిలి మత్తు పొందినవాడని అర్ధం. ఏమరుపాటు కలిగినవాడనీ అర్థం. దీనికి వ్యతిరేకార్థంలో అప్రమత్తుడు, అప్రమత్తం అని వాడుతున్నాం. జాగరూకుడు, జాగరూకత అని అర్ధం.
ప్రమోదం అంటీ ఎక్కువ సంతోషం. ప్రయత్నం అంటే మిక్కిలి యత్నం. ప్రలోభం అంటే మిక్కిలి లోభం. ప్రోషితుడు అంటే దేశాంతరానికి పోయినవాడు. శృంగార నాయికల్లో ప్రోషిత భర్శ్యక అని ఒక నాయిక ఉంది. భర్ర దేశాంతరంలో ఉంటే బాధపడే నాయిక ఈమె. ప్రవాదం అంటే ఎక్కువగా వ్యాపించినమాట. (ప్రభువు అంటే స్వామి. (ప్రభవం అంటే పుట్టుక, ప్రభూతం అంటే పుట్టినది. ప్రసన్నం అంటే నిర్మలం, తేట అయినది, సంతుష్టి కలిగింది. (ప్రసన్నం చేసు కోవడం అంటే సుముఖత కలిగేట్లు చేసుకోవడం, సంతోషింపజేయడం. (వ్రకృష్ణం అంటే గొప్పది. ప్రజననం అంటే పుట్టుక. ప్రకర్ష అంటే అతిశయం. (ప్రకారం అంటే పోలిక, ప్రకిరణం అంటే చెదరినది. (ప్రజ్వలనం అంటే మండడం. ప్రగతి అంటే ముందుకు పోవడం, అభివృద్ది
మనభాషతి 157
చకరాకాసప్ట - అపవాదం
పరాజయం, పరాక్రమం వంటి మాటలను మనం ఎక్కువగానే వాడుతూ ఉంటాం. ఈ మాటల్లో ముందు ఉన్న 'పరా' అన్నది ఉపసర్గ. ఈ “పరా” అన్న ఉప సర్గకు వెనుక అనీ, వ్యతిరేకం అనీ, పోవడం అనీ, అత్యంతం అనీ అర్థాలు. ఈ ఉపసర్గ చేరి ఎన్నో మాటలు ఏర్పడుతున్నాయి.
పరాకరణం అంటే నిరాకరణ. పరాక్రమం అంటే శౌర్యం, బలం, ప్రయత్నం. క్రము అనే ధాకువుకు పరా అనే ఉపసర్గ చేరినప్పుడు ఏర్పడినమాట. క్రము ధాతువుకు పాద విక్షేపమని అర్ధం. పరాక్రమించడం అన్న అర్ధంలో పరాక్రాంతి అన్న మాటనూ వాడవచ్చు. ఇక్కడ కూడా అదే ఉపసర్గ. పరాక్రమ, పరాక్రమవంతుడు, పరాక్రమశాలి, పరాక్రాంతుడు అన్న మాటలకు పరాక్రమం కలవాడు అని అర్ధం.
పరాగతం అంటే మృత్యువు. పరాగమం అన్నా మృత్యువే. పరాగమం అంటే శత్రువుల దండయాత్ర అని కూడా అర్ధం ఉంది. పరావృత్తం అంటే వెనక్కుమరలినది. పరావర్తనం అంటే వెనుకకు మరలడం. భౌతికశాస్త్రంలో ఎక్కువగా వాడేమాట కాంతి పరావర్తనం, పరావర్తం అన్నా ఇదే అర్థం. పరావృత్తం, పరూవృత్తి, పరాగమం, పరాగతం అన్న మాటలను వెనుకకు మరలినది అన్న అర్ధంలో వాడవచ్చు.
మూమర్శ అంటే వివేచన, స్మరణ. (గ్రంధాలయాల్లో పరామర్శ (గ్రంథాలు అని కాటలాగులో ఒక విభాగం ఉంటుంది. ఇంగ్లీషులో రెఫరెన్సు అన్న అర్ధంలో ఈ పరామర్శను వాడడం జరి గింది. ఆట్లాగే క్షేమ సమాచారాలను విచారించడం కూడా పరామర్శే. బాగా వివేచించడం. పరా మృష్టం అంటే చక్కగ్గా వివేచింపబడిందని అర్ధం. *మృశ' ధాతువు. విమర్శలో కూడా ఇదే
ధాతువు.
పరాభవం అన్నా పరాభూతి అన్నా అవమానం. పరాహతం బాగా కొట్టబడింది, వెనుకకు కొట్టబడింది అని అర్థం,
పరాజయం అంటే ఓటమి. ఇక్కడ “పరాకు వ్యతిరేకార్థం. “జయంికు వ్యతిరేకం వరా జయం. పరూజిళుడు అంటే ఓడిపోయినవాడు. పరాజిప్ణువు అంటే ఓడించినవాడు, ఓడిపోయిన వాడు అని రెండర్థాలూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్కువ, వ్యతిరేకం అన్న రెండర్ధాలలోనూ 'పరాను ఉపయోగించామన్నమాట.
హాసువు అంటీ చనిపోయినవాడు. ఇక్కడ 'పరా'కు పోవడమని అర్థం. అసువులు
పూధీనుడు అంటే అస్వతం[క్రుడు. ప్రాధాన్యం లేనివాడు. పలాయనంలో కూడా 'పూ" అన్న ఉవసర్గే ఉంది. 'అయ' ధాతువుకు గతి అని అర్ధం. దక్షిణాయనం, ఉత్తరాయణాలలో ఉన్న దిదే. పరిగెత్తడం, పారిపోవడం అని అర్థం. పారిపోవడం అన్న అర్ధంలోనే తెలుగులో ఈ .మాటను ఎక్కువగా వాడుతున్నాం. పలాయనం చిత్తగించాడు అంటాం.
వరాక్తాష్ట్ర అంటే తుది హద్దు. కాష్ట్ర అంటే మేర అనీ, అతిశయం అనీ అర్ధం. పరాకాష్ట అంటే అంతకు మించింది లేదన్నమాట.
“అపి అన్న ఉవసర్గతో మనం ఎన్నో మాటలు వాడుతున్నాం. ఇది తెలుగు మాటలకు కూడా వ్యాపించింది. ఈ ఉపసర్గకు విపరీతం/వ్యతిదేకం, గతితప్పడం, చెడ్డ అనే అర్థాలున్నాయి. కొన్నిచోట్ల అర్ధ భేదం లేకుండా కూడా ఇది వస్తుంది.
1568 అమనభాష
అపకీర్తి అపఖ్యాతి, అపయశం, అపజయం, అపషప్రథ, అవరాగం మొదలయిన మాటల్లో అప వ్యతిరేకార్ధంలో వస్తుంది. అహూగం అంటే ద్వేషం. అవచ్చాయ అంటే అశుభమయిమ.నీద,
అపగుణం అంటే గుణం లేనిది. అపఘనం అంటే మబ్బు లేనిది. ఘనం అంటే మబ్బు. ఘనశ్యాముడు అంటే మేఘశ్యాముడు. మబ్బులాగా నల్లనయిన వాడు. అపక్రమం అంటే క్రమం తప్పడం. అపనయం అంటే నీతిలేకపోవడం. అపనయం అంటే తొలగించడమన్న అర్థం కూడా ఉంది. అపభయం అంటే భయం లేకపోవడం. అపవ్యయం అంటే వ్యయం లేనిది. అక్షయం అన్నమాట. అపాశ్రయం ఆశ్రయం లేకపోవడం. అపార్ధం అంటే అర్ధం లేకపోవడమూ, దురర్ధ మూనని కూడా అర్థం. ॥
అపద్రవ్యం అంటే చెడ్డ వస్తువు. అపమృత్యువు అంటే చెడ్డచావు. అపవాదం అంటే చెడ్డ వాదం అంటే నింద. వ్యాకరణంలో ఒక అపవాదం ఉంది. వ్యాకరణంలో సామాన్య విధికి వ్యతి రేకమయినది. అపకారం, అపకృతి అంటే చెడ్డపని. వాని, కీడు, ద్రోహం. అవవ్యయం అంటే చుర్వ్యయం. అపశకునం అంటే చెడ్డ శకునం,
అపమార్గం అంటే తప్పుతోవ. అపాధ్వం అన్నా అదే అర్ధం. అపనామం అంటే తప్పు పేరు. అపప్రయోగం అంటే తప్పు వ్రయోగం. అపరాధం అంటే తప్పు, వేరం. అపచారం అంటీ పెద్దలపట్ల చేసే తవ్చు. అపశబ్దం అంటే తప్పు మాట. అప స్వరం తప్పు స్వరం. అపకర్షణం, అవనయనం, అపనోదనం, అవసరణం, అపసారణం అంటే తొలగించడం. ఆపస్మారం, అప స్మరణం, అపస్మృతి అంటే స్మృతి తొలగడం. అపాదానం అన్నా తాలగడమే. వ్యాకరణంలో కార కాలలో అపాదాన కారకం ఒకటి. చెట్టు నుండి కాయను కోయడం అంటే చెట్టు నుండి డాన్ని తొలగించడం అన్నమాట. ఇది అపాదాన కారకం.
అపవర్గం అంటే మోక్షం. అపకర్ష్న అంటే తగ్గించడం. అర్భాపకర్ష అంటే అర్థం తగ్గడం. ఉత్కర్షకు ఇది వ్యతిరేకం.
అవపదిశం అంటే రెండు దిక్కుల మధ్య ప్రదేశం, అయిమూల., అపచయం అంటే పూలు మొదలయినవి కోయడం. తెలుగు (ప్రబంధాలలోని వర్ణనలలో పుష్టాపచయ వర్ణన ఒకటి. అపదేశం అంటే మిష అన్యాపదేశంగా మట్లాడడం అంటాం.
అపసర్పణం అంటే గూఢచర్య అని అర్ధం. అపసవ్యం అంటే జందాన్ని కుడిభుజం మీదుగా ఎడమచేతి కిందికి వేసుకోవడం. -
అపస్నానం అంటే చనిపోయిన జ్ఞాతులు మొదలయిన వారికోసం చేసే స్నానం. మృతు నికి చేయించే స్నానం.
అపహాస్యం ఆంటే ఎగతాళి, వెకిలినవ్వు, అపహస్తం అంటే గెంటడం కోసం మెడమీద వేసినచేయి. అపహ్నవం అంటే కప్పిపుచ్చడం. దీన్ని అలంకారంగా వాడతాం. అపాంగం అంటే అంగహీనమనీ, కడకన్ను అనీ అర్ధం. కంటిచివర. అపాంగ వీక్షణం అంటే కడకంటి చూపు.
అపచ్యుతం, అవభ్రంశం, అవక్షయం, అపమార్దనం, అపభ్రష్టం, అపవిద్ధం, అపహరణం వంటి మాటలలో గుర్తింపదగిన అర్ధభేదం లేదు. హరణం అన్నా దొంగిలించడమే. అపహరణం అన్నా దొంగిలించడమే. అపహర్త అంటే దొంగ. హర్త అన్నా దొంగే. సుభాషితాలలో విద్య గురించి చెప్తూ హర్తకు కాదు గోచరము అన్నాడు.
నిందకు తెలుగు మాట దూదు. అవదూదు అంటే అపనింద, అట్లాగే నమ్మకం, నమ్మిక, నెవం, పాడి అన్న మాటలు తెలుగు మాటలు. 'అవితో అపనమ్మకం, అవనమ్మిక్క అవనెవం, అపపాడి వంటి మాటలు ఏర్పడ్డాయి. ళ్
మనభాషతి 159
సంకోచం - సంకలనం
మన ప్రబంధాలలో 'సుఖ సంకథా వినోదంబున నుండ వంటి ప్రయోగాలు కనిపిస్తాయి. ఇక్కడ సంకధ అంటే సంభాషణ. పరస్పరం మాట్లాడుకోవడం. సుఖంగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా అని అర్ధం. ఆ సమయంలో ఎవరో రావడమో, లేకపోతే ఒకళ్ళు మరొకరిని ఏదో అడగ డమో జరుగుతుంది. సంకధ అన్న మాటలో 'సం' ఉపసర్గ. ఈ “సం? ఉపసర్గతో వందలాది వదాలు వర్చడతాయి. ఈ ఉప సర్గకు మిక్కిలి అనీ, చక్కగా అనీ అర్ధం. సమ(గ్రం అని కూడా అర్ధం. సంకధలో లాగే సంభాషణలో కూడా 'సం” ఉపసర్గ. సంజల్బం, సంలపవనం, సంలావం, సంవాదం అన్నా సంభాషణే.
సంకటం అన్నమాటను ఇబ్బంది, కష్టం అన్న అర్థాలలో వాడుతున్నాం. సంకటం ఆంటే ఇరుకయిన చోటు అని అర్థం. సంకుచితం అన్నా ఇరుకయినది అనే అర్ధం. ఈ మాటను ఆలం కారికంగా వ్యక్తి మనస్తత్వాన్ని ఆలోచనలను వర్ణించడానికి కూడా వాడుతున్నాం. సంకుచిత మనస్తత్వం, సంకుచితమైన ఆలోచనలు అని ఆలోచనలోని ఇరుకుతనాన్ని వ్యక్తం చేస్తున్నాం. సంకోచం అన్నా ఇదే అర్థం, ముడుచుకోవడం, భయం, జంకు అని కూడా అర్ధం. అర్ధ పరి ణామంలో అర్ధ సంకోచం ఒకటి. అర్ధ వ్యాకోచానికి అర్ధ సంకోచం విరుద్ధమైనది. వ్యాకోచం విస్తృతి. సంకోచం పరిమితం. వత్రం అన్నమాటకు ఆకు అని అర్ధం. తాటి ఆకు మీద రాసేవాళ్ళు పూర్వం. అది షత్రమయింది. తాటాకు బదులు కాగితం వచ్చింది. కాగితానికీ పత్రం అనే పేరు ఏర్పడింది. చివరికి ఇప్పుడు అప్పుతీసుకుని శాసిచ్చే ప్రామిసరీ నోటు అన్న అర్థం పత్రానికి ఏర్పడింది. బుణపత్రం అన్నా కేవలం పత్రం అన్నా అదే అర్ధం. పత్రం రాసిచ్చాను అంటాం కదా. ఆకు అన్న విస్తృతార్ధం నుండి బుణపథత్రం అన్న సంకుచితార్థంలోకి పరిణామం జరిగింది. ఇటువంటి సంకోచాన్ని అర్ధ సంకోచం అంటాం. చీర, ఆరాధ్యుడు, వస్తాదు వంటి మాటల్లో కూడా అర్ధ సంకోచం జరిగింది. పూర్వం చీర అంటే వస్రమని అర్ధం. ఇప్పుడు స్త్రీలు ధరించే వస్తమయింది. కోక అన్న మాటలోనూ ఇటువంటి మార్చే జరిగింది. శ్రీనాథుడు “కోక చుట్టితొనన్నాడు.
సంకరం అంటే కలయిక. వర్దసంకరం వంటి సమాసాలలో దీనికి ఎక్కువ వాడుక, చీపురుతో ఊడ్చి పోగుచేసిన దుమ్మును కూడా సంకరం అంటారు. సంకర్షణం అన్నా కలపడ మనే అర్థం. ఈ మాటకు దున్నడం అన్న అర్ధం కూడా ఉంది. బలరాముడికి సంకర్షణుడు అని పేరు. నాగలి ధరించేవాడు కదా. నాగలితో దున్నే వాడన్నమాట.
సంకలనం, వ్యవకలనం అన్నమాటలు గణితశాస్త్రంలో వాడుతున్నాం. సంకలనం అంటే కూడిక. పోగు చేయడం. సంకలం అన్నా ఇదే అర్ధం. కవితా కధా సంకలనాలు ఈ అర్ధంలోనే. సంకల్పం అంటే మనోనిశ్చయం, కోరిక సంకల్పం చెప్పుకోవడం అంటే కోరిక చెప్పుకోవడమే. సంకల్పసిద్ధి అంటే కోరిన కోరిక తీరడం. సంకీర్ణం అంటే నానావిధమయినది. వ్యాపించినటు వంటిది. కలసిపోయినది. సంకులం అంటే కలవరవడినది అని అర్ధం సంకులపడడం అంటే కలవరపడడం. గుంపు, దొమ్మి అనే అర్ధం కూడా ఉంది. సంకుల సమరం అంటే దొమ్మి యుద్ధం. అనేకమంది ఒక్కసారిగా యుద్ధం చేయడం. సంక్తీర్తనం అంటే సోత్రం. పొగడడం.
160 అమంభాష
సంస్తుతి, సంస్తవం, సంశ్లోకం మొదలయిన మాటలకు కూడా స్తోత్రమనే అర్ధం.
సంక్రందనుడు అంటే ఇంద్రుడు. శత్రువులను మొర పెట్టీంచేవాడు. ఆక్రందనంలోని 'కందనమే ఈ మాటలోనిది.
సంక్షిష్టం అంటే గాయపడడం. నలగగొట్టదబిడడం. సంక్షయం అంటే సంపూర్ణ నాశనం, ధ్వంసం.
సంక్షిప్తం అంటే పోగుచేయబడినది అని అర్ధం. తగ్గింవబడినది అని కూడా అర్థం. ఈ అర్ధంలోనే ఎక్కువగా వాడుతున్నాం. సంక్షేపం అన్నా ఇదే అర్ధం.
సంక్షోభం అంటే చిత్తక్షోభ. కలత. సంచలనం అన్నా కలతే సంచలనవార్త అని వాడు తున్నాం. కలత కలిగించే వార్త అయి ఉండాలి. ఇంగ్లీషులో సెన్సేషనల్ అన్నమాటకు సమానార్థ కంగా దీన్ని వాడుతున్నాం. సంగతం, సంగతి కూడిక. సంగతం అంటే చక్కగా పౌసగినది, తగినది అన్న అర్ధం కూడా ఉంది. సంగమం అన్నా కూడికే.
సంగీతం అంటే చక్కగా పాడబడినది. సంగూఢం - సంగుప్తం అంటే చక్కగా దాచ బడినది. సంజ్వరం అంటే అధికతాపం. సంతాపం, సంతపనం మిక్కిలి బాధపెట్టడం. సం్రాప్తం అంటే చక్కగా పొందబడినది. సంభారం అంటే చక్కగా భరించడం. ఈ మాటకు సామగ్రి అని కూడా అర్ధం.
సంఘర్షణ- సంఘట్టన అంటే రాపిడి, ఒరపిడి. సంచయం, సంచయనం అంటే పోగు చేయడం. అస్థి సంచయనం అన్న సమాసంలో దిన్ని ఎక్కువగా వాడుతున్నాం.
సందర్భం అంటే సమయం. సందర్శనం అంటీ చూడడం. సంతర్పణ, సంతుష్టి సంతోషం అన్న మాటలకు తృప్తని అర్ధం. సంతర్పణ చేయడం అంటే తృప్తి పరచడమని అర్థం.
సంపృక్తం, సంయుక్తం, సంయోగం కలయిక, సంపుటం అంటే బరణి అనీ, గ్రంథమనీ అర్ధం. సంప్రదానం మంచి ఈవి. దానం చేయడం. వ్యాకరణంలో కారకాలలో సంప్రదాన కారకం ఒకటి. సం్రోక్షణం అంటే చల్లడం. పూజలలో వాడతాం. సంవాసం అంటే సహవాసం. సంక్లిష్టం అంటే చక్కగా కలపబడింది. వాక్యభేదాలలో సంశ్లిష్టవాక్యం ఒకటి. అనేక వాక్యాలను జక వాక్యంగా కలపడం. సంశ్లేషం అంటే కౌగిలింత. సంస్కారం అంటే చక్కబరచదం. సంస్కృతం అంటే చక్కబరచినది. సంస్కృత భాషకు ఆ పేరు ఈ విధంగానే వచ్చింది. సంస్కారం వంటిదే సంస్కృతి.
సంహారం అంటే చంపడమూ, పోగుచేయడమూ. వేణీ సంహారంలో జుట్టు ముదవడం అని అర్థం.
సన్నిధి, సన్నిధానం సామీవ్యం. సన్నిధిలోనూ సన్నిధానంలోనూ 'సం' ఉపసర్గ చేరింది. సమాగమం అంటే కలయిక. సముఖం అంటే ఎదురు. సముద్యోగం అంటే మహాప్రయత్నం. సమ్మతం అంటే అంగీకారం. సమ్మోహనం అంటే ఆకర్షణ. సమ్రాట్టు అంటే చక్రవర్తి, ఈ మాట ల్లోనూ ఉపసర్గ 'సం'యే.
బ్ మనభాషళి 161
అనుక్షణం - అనూరాభథ భయం అనుక్షణం వెంటాడుతూనే ఉంది అంటాం. ఇక్కడ అనుక్షణం అంటే క్షణక్షణం, (ప్రతిక్షణం అని అర్థం. అనుక్షణంలో 'అను' ఉపసర్గ. ఈ ఉపసర్గకు ఈ మాటలో మళ్ళీ మళ్ళీ అని అర్ధం. అనుక్షణంలాగానే అనుదినం. వ్రతిరోజూ అని అర్ధం, అనుదినం, అన్వహం అన్నా అదే అర్ధం. అనువాసరం అన్నా ప్రతిరోజూ అనే అర్ధం. అనుమాసం అంటే ప్రతినెలా అని అర్థం. శబ్దాలంకారాలలో అనుప్రాస అన్న అలంకారం ఉంది. పోతనగారు ఈ అలంకారం వ్రయో గించడంలో (ప్రసిద్ధులు. ఒకే హల్గుగాని, హల్లుల సంయోజనం కాని మళ్ళీమళ్ళీ వస్తే అది అను ప్రాసాలంకారం అవుతుంది. అనుష్రాస అన్న మాటలోని “అను ఉపసర్గే. అనురణనం అంటే నిరంతరమూ (మైోగుతూ ఉండడం. అనుచింత, అనుచింతన, అనుచింతనం అంటే ఆలో చించడం, ఎడతెగకుండా ఆలోచించడం. అనులాపం అంటే ఎడతెగకుండా సంభాషించడం. విమర్శ రంగంలో అనుశీలన అన్నమాటను వాడుతూ ఉంటారు. అనుశీలనం అంటే నిరంతర అభ్యసనం. నిరంతర ఆచరణ. అనుసంతతి అంటే ఎడతెగని క్రమం, అవిచ్చిన్న పరంపర. అను స్యూతం అన్నమాట కూడా ఉంది. అనుస్యూతంగా వస్తూ ఉన్నది అంటాం. ఎడతెగకుండా అని అద్ధం. వరుసగా కూర్చడం, కలిపి కుట్టడం అన్నమాట. అనూచానం అన్న మాటను కూడా ఇదే అర్థంలో వాడుతూ ఉన్నాం. సంప్రదాయంగా, తరతరాలుగా అన్న అర్ధంలో ఈ మాటను వాడు తున్నాం. అనూచానుడు అంటే వినయం కలిగినవాదనీ, గురుముఖంగా సాంగవేదాధ్యయనం చేసినవాడని అర్ధం. అనుసేవి అంటే ఎప్పుడూ సేవించేవాడనీ, ఎప్పుడూ ఆచరించేవాడనీ అర్థం. రామానుజుడు లక్ష్మణుడు. భరత శత్రుఘ్నులు కూడా రామానుజులే అయినా లక్ష్మణుడికి ఈ పేరు రూఢం. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకుదైన రామానుజుడూ సువ్రసిద్ధుడే. ఈ పేరులోని అనుజ శబ్దానికి తరువాత పుట్టినవాడని అర్ధం. అనుజుడు, అనుజన్ముడు అనుభ్రాత తమ్ముడిని సూచించే మాటలు. అదే స్తీ వాచకం అంటే చెల్లెలయ్యేటట్లయితే అనుజ, అనుజన్మ, అనుజాత అంటాం. అనుమాసం అంటే తరువాతి నెల. అనుప్రయోగం అంటే తరువాత ప్రయోగించడం. అనురాధ అన్న నక్షత్రం ఉంది. ఇరవయ్యేదు నక్షత్రాలలో ఇది పదిహేడోది. రాధ తరువాతిది అనురాధ. రాధ నక్షశ్రానికే విశాఖ అని పేరు. అనురాధను అనూరాధ అని కూడా అంటారు. ఈ మాటల్లో 'అను' ఉవసర్గకు తరువాత అని అర్ధం, అనుకాలం అంటే కాలానికి తగినటువంటిది అని అర్ధం. దేశకాలానుగుణంగా నడచుకో వాలి అంటుంటారు. దేశానికి, కాలానికి తగిన విధంగా, అర్హమైన రీతిలో అని అర్ధం. అను రూవం అంటే రూపానికి తగినది అని అర్థం. ఈ మాటల్లో “అనుకు అర్హమైంది, తగినది అని అర్ధం. అన్వర్థం అంటే అర్ధాన్ని పొందినటువంటిది అని అర్ధం. సార్ధకం అన్నమాట. అన్వర్థ నామ ధేయుడు అంటాం, పేరులో ఏముందో దాన్ని పొందినవాడు. అనుభవం అంటే ప్రత్యక్ష జ్ఞానం. అనుభూతి అన్నా అద్దే అర్థం, అనుభోగం అనికూడా అనవచ్చు. అనుభోగం అంటే మాన్యక్షేశ్రం, ఈనాం అని కూడా అర్ధం ఉంది. అనుపాతకం అంటే మహాపాతకాన్ని పోలిన పాతకం. దొంగతనం, హత్యవంటి పాపాలు. 2న
ఇటువంటి అనుపాతకాల సంఖ్య వివిధ (గ్రంథాలలో భిన్నభిన్నంగా ఉంది. మనుస్మృతిలో ముప్పయి అయితే విష్ణు స్మృతిలో ముష్ఫయి అయిదు అని ఉంది. అనుగర్జితం అంటే ప్రతిధ్వని. ధ్వనిని పోలిన ధ్వని. అనునాదం అన్నా ఇదే అర్ధం. ఈ మాటల్లో “అనుకు పోలిన అని అర్థం. అనుజీవి అంటే ఆశ్రయించుకొని జీవించేవాడు, ఆశ్రితుడు. అనుజీవ్యుడు ఆశ్రయింపదగిన వాడు, యజమాని, ప్రభువు. ఈ మాటల్లో 'అను'కు ఆశయం అని అర్ధం. అనుకల్పం అంటే మొదట కావలసిన పదార్థం దొరకనప్పుడు దానికి బదులుగా ఉపయోగించే మరో పదార్థం. ఇది ప్రత్యామ్నాయం మాత్రమే, మొదటిదే ముఖ్యం. రెండోది ప్రధానం కాదుకాని వని గడుపు కోవడానికి ఉపయోగపడుతుంది. అనుశస్త్రం అంటే శస్త్రానికి బదులుగా వాడేది. అన్వాచయం అంటే ఒక ముఖ్యమైన పనిచెప్పి, దానితోపాటే మరో అముఖ్యమైన పనిని కూడా చెప్పడం. బడికి వెళ్ళి పిల్లవాణ్ణి తీసుకురండి, అట్లాగే ఒక కిలో పంచదార కూడా తెండి అనడం. ఈ అప్రధాన మయిన రెండో పనికి అన్వాచితం అని పేరు.
అనునాసికం అంటే ముక్కుతో పలికే ధ్వని. ఈ ధ్వనిని ఉచ్చరించడంలో సాధారణ ప్రయ త్నంతోపాటు ముక్కును కూడా ఉపయోగిస్తాం. అనుపానం అంటే మందుతోపాటు పుచ్చుకొనేది. అనుమరణం అంటే సహగమనం. ఈ మాటల్లో “అనుకు తో, కూడా అని అర్ధం,
అనుక్రమణి, అనుక్రమణిక అన్న మాటలను పుస్తకాలలో విషయ సూచిక అన్న అర్థంలో వాడుతున్నాం. ఇక్కడ వరుస అని అర్ధం. అనుజ్యేష్టుడు అంటే వరుసలో పెద్దవాడి తరువాతి వాడు, అంటే రెండోవాడు.
"అనువాదం అన్నమాటను భాషాంతరీకరణం అన్న అర్థంలో వాడుతున్నాం. ఒక భాషలోని విషయాన్ని మళ్ళీ మరోభాషలో చెప్పడం. అనువాదం అంటే మళ్ళీ చెప్పడమే. గురువు చెప్పం దాన్ని మళ్ళీ చెప్పడం అనుప్రవచనం. అన్వీక్ష అంటే మళ్ళీ ఆలోచించడం, వెదకడం. అన్వేషణ అన్నా వెదకడమే. అనుకరణం అంటే మళ్ళీ చేయడం, అనుకర్త అంటే అనుకరించే వాడు. అనుద్యూతం అంటే మళ్ళీ ఆడిన జూదం. “అనుకు ఒక ప్రధానమైన అర్థం అనుసరించి అని. అనుకూలం అంటే కూలాన్ననుసరించి, కూలం అంటే తీరం, ఒడ్డు. తీరం వెంబడే అని అర్ధం. అనుగుణం అన్నమాట. అనువర్తనం అంటే అనుసరించి నడచుకోవడం. అనుచరుడు అంటే అనుసరించి నడచుకొనేవాడు. అనుయాయి అన్నా అనుసరించేవాడే. వల్లవి వెంటనే పాబేది అనుపల్లవి. అనుభావం అంటే ముఖంలో భావాలను తెలిపేది. అనువథం అంటే అనుకూల మయిన మార్గం. అనులోమం అంటే క్రమాన్ని అనుసరించి ఉండేది. విలోమం దీనికి వ్యతిరేకం అనుగ్రుతం అంటే వేద సంప్రదాయాన్ని అనుసరించి వచ్చింది. అనువతనం, అనుపాతం అం ఒకదాని వెనుక ఒకటి పడడం. అనువనం అంటే వనసమీపం అని అర్థం. అనుకనీయుడు అని ఒకమాట ఉంది. కనీయుడు అంటే కనిష్ణడు. అనుకనీయుడు అంటే కనిష్ణునికంటే ముందు వాడు. ఐదుగురు కొడుకులుంటే అందులో నాలుగోవాడు. కనిష్టునికి దగ్గరగా ఉన్నవాడు. అనులేపం అంటే పూత. అనుక్తీర్తనం అంటీ కీర్తనం. అనురాగం అంటే (ప్రేమ. అనుశాసనం అంటే ఆజ్ఞ, అనుసంధానం అంటే కూర్చడం, అనుస్మరణం అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఈ మాటల్లో అనుచేర్చడం వల్ల ఏర్పడే విశిష్టార్ధమేమీ ఉండదు.
అనుకంప అంటే దయ. కొంచెం కదిలింపచేస్తుంది కాబట్టి అనుకంవ. జ్ మనభాషత 163
కఐవివతంనుడు - అవమానం
సంస్కృతంలో శ్రేస్టకావాచక శబ్దాలెన్నో ఉన్నాయి. కవి వృషభుడు అంటే కవి శ్రేష్టుడు. అట్లాగే కవి వతంసుడు అనికూడా అనవచ్చు. ఈ వతంస శబ్దం శ్రేష్టకా వాచకం. పండితావతంసుడు అంటే పండిత శ్రేష్టుడు. ఇక్కడ అవతంసుడు అని రూపం. అవతంసం అంటే కర్ణాభరణం, శిరో భూషణం. కుండలాలు ధరించడం, కిరీటం పెట్టుకోవడం గొప్ప ఆ ఆభరణాలూ గొప్పవే. తసి ధాతువుకు అలంకారం అని అర్ధం. దీనికి “అవి అన్న ఉపసర్గ చేరి అవతంసం అన్నమాట ఏర్చ డింది. అవతంసం అనీ అనవచ్చు. వతంసం అనీ అనవచ్చు. కొన్ని మాటల్లో “అవలో “అ” లోపిం చవచ్చు. అవధానం అన్నమాటకు కూడా వధానం అన్నరూపం ఉంది. అవధానం అంటే ఏకా (గ్రత. అవధాని అంటే అవధానం కలవాడు. వధాని అని కూడా అనవచ్చు. తెలుగుదేశంలో అవ ధానం, అవధాని సు్రసిద్ధమైన పదాలు. రకరకాల అవధానాలున్నాయి. సాహిత్యంలో అష్టావ ధాన, శతావధాన, సహ(ప్రావధానాలున్నాయి. నేత్రావధానం, నాట్యావధానం కూడా ఉన్నాయి. ఏకాగ్రత ప్రధానమయిన ఏ విషయంలోనయినా అవధానం చేయవచ్చు. కొన్ని కొత్త అవధాన ప్రక్రియలు వెలిశాయి. ఇంకా వెలుస్తాయి. కొంతమంది పేర్లలో కూడా ఈ అవధాని చేరిపో యింది రెడ్డి శాస్త్రిలాగా. పేరు చివర అవధాని ఉన్నంత మాత్రాన అవధాని కాకపోవచ్చు.
దేశ నాయకులు మరణించినప్పుడు జాతీయ పతాకాన్ని కొంచెం కిందికి దించుతారు.
దీన్ని అవనతం చేయడం అంటారు. అవనతం అంటే వంగినది. ఈ మాటలోని 'అవి ఉవసర్గకు వంగడం అని అర్ధం. అవాగ్రం అన్నా అవనతం అనే అర్ధం. అవక్రమం అంటే కిందికి దిగడం. అవతరణం, అవతారం, అవతీర్ణం, అవరోహం, అవరోహణం ఈ మాటలన్నిటికీ కిందికి దిగడ మనే అర్ధం. గంగావతరణం అంటీ గంగ ఆకాశం నుండి కిందికి దిగడం. అవతారం అన్న మాటను దేవుడు కిందికి దిగి మానవ రూపమో మరో రూపమో ధరించడం అన్న అర్ధంలో వాడు తున్నాం. అవరోహణ క్రమం అంటే క్రిందికి దిగే విధానం. దీనికి వ్యతిరేకం ఆరోహణ (క్రమం, పైకి ఎక్కే విధానం. మనం వాడడం లేదుకాని అవమూర్చుడు అనేమాట కూడా ఉంది. తల దించినవాడు అని అర్థం.
“అవి ఉపసర్గతో వాడే మాటల్లో చాలా ప్రచారంలో ఉన్నమాట అవమానం. మానం అంటే గౌరవం. సమ్మానంలో కూడా ఇదే. మన ధాతువుకు తెలియడం అని అర్ధం. నలుగురికీ తెలిసి ఉండడం గౌరవమేకదా. అవమానంలో “అవి విరుద్ద్ధార్ధంలో వచ్చింది. గౌరవానికి విరుద్ధం అగౌరవం. అట్లాగే అవమానం. పరాభవం, అగౌరవం అని అర్ధం. అవమర్యాద. అవలక్షణం అంటే చెడు లక్షణం. అవరూపం అంటే చెడురూవం. అవకరం అంటే చెడ్డపని, అవగుణం అంటీ తప్పు, దోషం. అవజ్ఞ, అవజ్ఞానం అన్నా అవమానమే. అవజ్ఞ చేశాడు అంటే అవమానించాడు అని అర్థం, అవగీతం అంటే వికృతంగా పాడినపాట.
గణన చేయడం అంటే లెక్కించడం. లక్ష్యపెట్టడం. అవగణనం అంటే లక్ష్య పెట్టక పోవడం. అవక్షేపం, అవక్షేపణం అంటే నిందించడం, ఎగతాళి చేయడం. అవశకునం అంటీ అపశకునం, అవదాయం అంటీ తప్పుడు ఆట. జూదంలో మోసం చేయడం. ఒక పందెం పడితే మరో వందెనుని బుకాయించడం వంటిది.
164 అమనభాష
అవదాహం అంటే తాపాన్ని పోగొట్టేది. వట్టివేరుకు అవదాహమని పేరు. అవక్రియ అంటే చేయవలసినటువంటి/ విహితమయిన క్రియలు చేయకపోవడం. క్వణం అంటే మోత. అవ క్వణం అంటే అపస్వరం, అపధ్వని.
అవకర్ణనం అంటే వినడం. అయితే ఈ వినడంలో అనాదరం ఉన్నా అవకర్ణనం అనే అంటారు. ఇక్కడ 'అవికు అనాదరమని అర్ధం. అవహేల అన్నా అనాదరమే. అవహేళన అని వాడతాం. అనాదరణ, వెక్కిరింత అని అర్ధం,
అవగతం అయింది అంటే తెలిసింది, అర్థమయింది అని అర్ధం. అవగతి, అవగమం అన్నమాటలకు తెలివి, తెలియడం అని అర్ధం. అవగాహం అంటే తెలిసికోవడం అని అర్థం. అవ గాహన అన్నమాటను ఎక్కువగా వాడుతున్నాం, అవగాహన చేసికోవడం అంటే తెలిసికోవడం.
క్రిన్నం అంటే తడిసినది. అవక్షిన్నం అంటే బాగా తడిసినది. అవసానం అంటే సమాప్తి. చావు. అవసానదశ అంటాం.
చాలా మాటల్లో అర్థంలో గణనీయమయిన విశేషం లేకుండానే 'అవ' చేరుతుంది. ఆప్తి అంటే పొందడం. అవాప్తి అన్నా పొందడమే. కర్షనం అంటే కత్తిరించదం. ఆవకర్తనం అన్నా కత్తి రించడమే కుంచనం అంటే ముడుచుకోవడం. అవకుంచనం అన్నా ముడుచుకోవడమే.
అవకుంరనం, అవగుంరనం అంటే ముసుగు. గుంఠనం అంటే కప్పడం. అవగుంరితం అంటే ముసుగు వేసినది, కప్పినది అని అర్ధం. క్రందనం అంటే ఏడుపు. అవశక్రందనం అన్నా ఏడుపే.
అవకాశం అంటే ఎడం. రెండిటి మధ్య ఉందే ఎడం, తెరపి. ఒక ప్రదేశానికీ మరో 'ప్రదేశా నికీ మధ్య ఉండే ఎడం కావచ్చు. ఒక కాలానికీ మరో కాలానికీ మధ్య ఉండే ఎడం కావచ్చు. ఈ రెండో అర్ధంలో ఎక్కువగా వాడుతున్నాం. అవకాశం కల్పించుకొని రండి అంటే వీలు చేసుకొని రండి అని అర్ధం. తెరపి చేసుకొని రమ్మని అర్థం. ప్రస్తుతం ఇంగ్లీషులో ఆపర్చ్యూనిటీ అన్న మాటకు సమానార్థకంగా ఈ మాటకు వాడుక ఎక్కువగా కనిపిస్తుంది. ఇది జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు సంభావ్యం అన్న అర్ధం కూడా ఉంది. అవక్రయం అంటే వెల, అద్దె. అన (గ్రహం, అవగ్రహణం అంటే అడ్డపాటు, అవగ్రహం అంటే వానకరువు అనికూడా అర్థం. గ్రవా విరోధం వల్ల వానపడకపోవడం.
సంస్కృతంలో రెండు మాటల మధ్య ౬. అనే గుర్తును చూస్తుంటాం. ఈ గుర్తుకు అవ గ్రహం అని పేరు. ఆ గుర్తు స్థానంలో ఉచ్చారణలో స్వల్బ విరామం ఇవ్వాలన్నమాట. అవ[గ్రవాన్ని వ[గ్రహం అనికూడా అనవచ్చు.
ఘాతం అంటే దెబ్బ, అవఘాతం అన్నా దెబ్బే. అవదారితం అంటే చీల్చబడిందని అర్థం. అవదాహం అంటే తాపాన్ని పోగొట్టేది అన్న అర్ధంతోపాటు వేడిమి అన్న అర్థం కూడా ఉంది. ఇక్కడ దాహానికీ, అవదాహానికీ అర్ధభేదం లేదు. అవబోధం అంటే మేలుకోవడం, తెలిసికోవడం. అవరోధం అంటే అడ్డు. అవలీల అంటే చులకన. లీల అన్నా అదే అర్థం. లీలగా ఎత్తాడు. తేలికగా, కష్టం లేకుండా అని అర్థం. అవలేపం అంటే పూత.
యజ్ఞయాగాదులలో యజ్ఞ సమాప్తిలో చేసే స్నానం అవళ్ళథ స్నానం. అవభ్ళధ స్నానం చేస్తే యజ్ఞం పూర్తి అయినట్లు, దీక్షావతం పూర్తవుతుంది. య్
వనాల
నిరశనం- నిరసనం, నిర్దిష్టం- నిర్దుష్టం నిస్, నిర్ అనే ఉపసర్గలు రూపాంతరాలు. నిర్ అనేది అచ్చుల ముందు వస్తుంది. హల్లుల్లో గ, ఘ,జ,రు,డుఢ,దుధున, బ,భమ,య,ర,ల,వృుహలముందు కూడా నిర్ వస్తుంది. తక్కిన హల్లుల ముందు నిస్ వస్తుంది. ఈ ఉపసర్గ చేర్చినప్పుడు కూడా భిన్నార్ధాలు వస్తాయి. చాలా ఎక్కువగా కనిపించే అర్ధం మాత్రం అభావార్థం. అంటే లేనిది అని అర్ధం. నిరంకుశం అంటే అంకుశం లేనిది. అద్దులేనిదన్నమాట. నిరంకుశుడు అంటే అడ్డులేని వాడు. నిరంకుశ పరిపాలన, నిరంకుశ పరిపాలకుడు అని ఎక్కువగా వాడుతుంటాం. నిరం జనం అంటే అంజనం లేనిది. అంటీ కాటుక లేనిది. నిరంజనుడు అంటే పరమాత్మ. నిరంతరం అంటే అంతరంలేనిది. ఎడం లేకుండా ఎల్లప్పుడూ అని అర్ధం. నిరత్యం అంటే అపాయం లేనిది. నిరపాయం అనీ అనవచ్చు. అత్యం అంటే అపాయం. అనునాసికం అంటే ముక్కుతో పలికే ధ్వని. నిరనునాసికం ఆనునాసికం లేనటువంటిది. అపరాధి అంటే నేరం చేసినవాడు. నిరపరాధి నేరం చేయనివాడు, అపరాధం చేయనివాడు. నిరపేక్ష అంటే అపేక్ష లేనిది. ఆయన నిరపేక్షంగానే ఈ పని చేసిపెట్టాడు అన్నప్పుడు ఏమీ కోరకుండానే పనిచేసి పెట్టాడని అద్ధం. నిరర్గళం అన్నా అడ్డులేకుండా అనే అర్ధం. అనర్గళంగా ఉపన్యసించాడు అన్నట్లుగానే నిరర్గళంగా మాట్లాడాదనవచ్చు. నిరర్ధకం అంటే వ్యర్ధం. అవకాశం అంటే ఎడం, ఖాళీ. నిరవకాశం అంటే ఎడంలేకుందా. నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది అంటాం. అవధి అంటే మేర, హద్దు. నిరవధికం అంటే అవధి లేనటువంటిది. ఇన్ని రోజులు, ఇంత సమయం అని నిర్ణయించనిది. పరీక్షలు నిరవధికంగా వాయిదా వేశారు అంటాం. ఫలానా రోజువరకు అన్న అవధిని నిర్ణయించలేదన్నమాట. నిరవశేషం అంటే అవశేషం లేకపోవడం. సంపూర్ణంగా అని అర్ధం. నిరవలవంబం అంటే అవలంబం లేనిది. ఆధారం లేనిదన్నమాట. అవలంబం అన్నమాటను అవలంబించు అనే క్రియగా ఎక్కువగా వాడుతున్నాం. నిరశనం, నిరసనం అన్న రెండు మాటలూ తెలుగులో ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. అయితే వీటిని ఒకదాని బదులు ఒకటి వాడడం కూడా అక్కడక్కడా కనిపిస్తూ ఉంటుంది. అశనం అంటే భోజనం. నిరశనం అంటే భోజనం లేకుందా ఉండడం, ఉపవాసముండడం. నిరశనదీక్ష అంటే నిరావారదీక్ష నిరసనం అంటే తోసివేయడం, నిరాకరించడం, తిరస్కారం మొదలయిన అర్థాలున్నాయి. చంపడం, ఉమ్మువేయడం అన్న అర్థాలు కూడా ఉన్నాయి కాని ఈ అర్థాలలో మనం ఈ మాటను వాడడంలేదు. ఎదుటివాడి అభిప్రాయాన్ని ఖండించడం, వ్యతిరేకాభిప్రా యాన్ని వ్యక్తపరచడం నిరసనం. నిరసన తెలుపుతూ నిరశనదీక్ష చేపట్టవచ్చు. నిరశన వ్యక్తం చేశారు అనడం సరికాదు. నిరసన వ్యక్తం చేశారు అనాలి నిరహంకారి అంటే అహంకారం లేనివాడు. నిరాకారం అంటే ఆకారం లేకపోవడం. నిరా ఘాటం అంటే అడ్డులేకపోవడం. నిరాటంకం అన్నా అదే అర్ధం. నిరాడంబరుడు అంటే ఆడం బరం లేనివాడు. నిరాధారం అంటే ఆధారం లేనిది. నిరాధారమయిన ఆరోపణలు చేస్తున్నా రంటాం. నిరాయాసం అంటే ఆయాసంలేనిది, అనాయాసం. నిరాయుధుడు, నిరాశయుడు ఆయుధం లేనివాడు, ఆశ్రయం లేనివాడు. నిర్మలం అంటే మాలిన్యం లేనిది, మచ్చలేనిది, స్వచ్చమైనది. నిర్మక్షికం అంటే ఈగలు లేనిది. నిర్భ్వయం అంటే భయం లేకపోవడం. నిర్జనం అంటే జనంలేనిది. నిర్ణరులు అంటే దేవ తలు. జర అంటే ముసలితనం లేనివారు. నిర్వ్యాజం అంటే కపటం లేనిది, సహజమైనది, శుద్ధ 166 అమనబాష
మైనది. నిర్వ్యాపారం అంటే వ్యాపారం లేకపోవడం, వ్యాపారం అంటే పని. వాడు నిర్వ్యా పారంగా ఉన్నాడు అంటే పనిలేకుండా ఉన్నాడని అర్ధం.
నిశ్శేషం అంటే శేషం లేకుండా ఉండడం. సంపూర్ణంగా అని అర్ధం. నిశ్చేష్ట అంటే చేష్టలేక పోవడం. నిశ్శబ్దం, నిష్ఫలం, నిస్సంశయం, నిస్సంకోచం, నిస్సందేహం, నిస్సందిగ్ధం, నిష్కారణం ఇటువంటివి. నిష్కామం అంటే కోరిక లేకపోవడం. నిస్తేజం అంటే తేజం లేకపోవడం. నిర్జేరుకం అంటే హేతువు లేనిది. నిర్దేకుకమైన విమర్శలు చేశారు అన్నప్పుడు కారణం లేకుండా, ఆధారం లేకుండా అని అర్థం. నిర్లజ్జ అంటే లజ్జలేకపోవడం.
నిరాకులం అంటే మిక్కిలి కలత చెందినది అని అర్థం. మిక్కిలి వ్యాప్తమైనది అని కూడా అర్ధం. ఆకులం అన్నమాటకు కలత చెందినది అనీ వ్యాపించినది అనీ అర్ధం. ఈ మాటలో 'నిరొ ఉపసర్దకు అతిశయం, ఎక్కువ అని అర్ధం. నిర్జూఢం అంటే మిక్కిలి గూఢమైనది. నిర్జోష అంటే మహాధ్వని. నిర్దళనం అంటే పూర్తిగా చీల్చడం.
నిర్ధాతం అంటే బాగా కడగబడినది. నిర్బంధం అంటే గట్టీగా బంధించడం. బలాత్కారం. నిర్భగ్నం అంటే ముక్కలు చేయబడినది. నిర్భరం అంటే నిండినది, తీవ్రమైనది, అధికం అని అర్ధాలు. నిర్ణయం అంటే సంపూర్ణ విజయం. నిర్మాణం అంటే సృష్టి కూర్చు. నిర్ముక్తుడు అంటే సన్యాసి, సంసారాది బంధాలను విడిచిపెట్టినవాడు. నిష్పీడనం అంటీ ఏసకడం. నిష్టరం అంటే గట్టిదని అద్ధం. నిష్టురాలు ఆడారు అన్నప్పడు పరుష వచనాలని అర్ధం. నిష్యూరం అని వాడుతూ ఉంటారు.
నిర్వాణం అంటే ఆరిపోయినది, అస్తమించినది అని అర్థం. నిర్యాణం అంటే వెడలడం అని అర్ధం. శరీరం నుండి (ప్రాణవాయువు బయటికిపోవడం. మరణం, ముక్తి, నిర్వాణం అన్న ప్పుడు దుఃఖాదులు తొలగిపోవడం. శాంతమవడం. బుద్భని అస్తమయాన్ని మహా పరినిర్వాణం అంటారు. నిశ్షేయసం అంటే ముక్తి నిర్చ్ఫృరం అంటే సెలయేరు, కొండవాగు.
నిర్చాకం అంటే దెబ్బ. నిర్ణయం, నిశ్చయం, నిర్ధారణలు స్థూలంగా ఒకే అర్థంలో వాడుకలో ఉన్నాయి. నిర్దేశం అంటే ఆజ్ఞ
నిర్గిష్టం అంటే చూపబడింది, ఏర్పరచినది, అజ్ఞాపించబడినది, చెప్పబడింది. నిర్టుష్టం అంటే దోషం లేనిది. ఈ రెండు మాటలను కూడా ఒకదాని బదులు ఒకటి పాడుతూ ఉండడం అక్కడక్కడా కనిపిస్తుంది.
నిష్కృతి అంటే ప్రాయళ్చిత్తం.
“నిర్ ఉపసర్గతో వచ్చిన మాటలకు కొన్నిటికి రెండర్థాలు ఉంటాయి. ఉదాహరణకు నిర్వచనం అంటే వచనం లేనిది. తిక్కన నిర్వచనోత్తర రామాణం నిర్వచన కావ్యం. కేవలం పద్యాలే ఉంటాయి. వచనం ఉండదు. ఈ మాటకు నిర్వచనం ఏమిటి అన్నప్పుడు ఆ్యూన్ని వివ రించి చెప్పడం అని అర్ధం. నిరుక్తం అంటే నిర్వచనమే. అయితే ఇక్కడ వచనం లేకపోవడమన్న అర్థం ఉండదు. వివరించి చెప్పడమనే అర్ధం. వేదంలోని మాటలకు అవయవార్శాన్ని వివరించి చెప్ప గ్రంధం యాస్కుడు రచించిన నిరుక్తం.
“'నిరొకు దాటినది అనే అర్ధం కూడా ఉంది. నిర్దశం అంటే పదిని దాటీనది. నిస్త్రింశం అంటే ముప్ఫైని దాటినది.
నిష్కాసం అంటే వెళ్ళగొట్టడం. నిష్మాసితుడు అంటే వెళ్ళగొట్టబడినవాడు. వ్యాసుడు కాశి నుండి నిష్కాసితుడు. నిష్రమణం అంటే బయటికిపోవడం.
'నిస్ను తెలుగుమాటలకు, అన్యదేశ్యాలకు చేర్చి వాడడం కూడా కనిపిస్తుంది. ఇటువంటి మాటల్లో నిస్సిగ్గు, నిష్పూచీ అన్నమాటలకు చాలా వ్యాప్తి ఉంది. ల్
నమునభాషతల 167
దుర్యోధన, దుశ్చాసనులు మవాభారతంలో కౌరవులు వందమంది. వందమంది పేర్లూ తెలుసుకోవాలంటే భారతం చూడక తప్పదు. అయితే కౌరవుల్లో దుర్యోధనుడు, దుశ్శాసనుడు తెలియని వాళ్ళు మాత్రం ఉండరు. దుష్టదతుష్టయంలో ఇద్దరు వీళ్ళు. కీచకునిలాగా దుశ్శాసనుడి పేరూ దుర్మార్గానికి 'ప్రఖ్యాతమయిపోయింది. దుర్మార్దులయిన రాజకీయ నాయకుల్ని కీచకులు, దుశ్శాసనులూ అనడం పరిపాటి. తమిళనాడు శాసనసభలో డియంకె సభ్యులు జయలలిత కొంగులాగినప్పుడు వాళ్ళను దుశ్శాసనులుగా అభివర్ణించడం జరిగింది దుర్యోధనుడి నేతృత్వంలోనే దుశ్శాసనుడు నడచుకొన్నా దుశ్శాసనుడికి వచ్చినంత చెడ్డపేరు దుర్యోధనుడికి రాలేదు. దురభిమాని అనితవ్ప దుర్యోధనుడిలో చాలామందికి కొన్ని సల్లక్షణాలు గోచరిస్తాయి. తెలుగువారికి దుర్యోధనుడంటీ ఇష్టమే. మనవాళ్ళు ఏకపాత్రాభినయం చేయాలంటే దుర్యోధనుణ్ణే ఎన్నుకుంటారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు అనగానే మనకు ఏదో చెడు వినిపిస్తుంది. కృష్ణుడి వల్లా పాండవ వక్షపాతం వల్ల కౌరవులది అన్యాయమని అనుకుంటాం. అందువల్ల వాళ్ళు చెడ్డ్దవాళ్ళు. వాళ్ళ పేర్లలోని దుర్, దుస్ చెడుని బోధిస్తున్నట్లనిపిస్తుంది. ఏ అమ్మానాన్నా మాత్రం పిల్లలకు చెడు అర్థమిచ్చే పేర్ల పెట్టకుంటారు. అందువల్ల దుర్యోధనుడు, దుశ్శాసనుడు చెడ్డపేక్తేమీ కాదు. ఈ పేర్ల ముందున్న దుర్, దుస్ ఉపసర్గలు. దుర్యోధనుడు అంటే యుద్ధం చేయ శక్యంకానివాడు. అంటే అతనితో ఎవరూ యుద్ధం చేయలేరు అని. అంత వీరుడని పేరు పెట్టుకున్నారు. దుశ్శాస నుడు అంటే శాసింపశక్యం కానివాడు. అతనినెవరూ శాసించలేరన్నమాట. ఈ అన్నదమ్ము లింతటి వాళ్ళు కావాలని తల్లిదండ్రుల కోరిక. దుస్, దుర్-నిస్, నిర్లాంటివి. నిస్ వచ్చే పరిసరాల్లో దుస్ వస్తుంది. అంటే కఖ చఛ టర తథ పఫ శషసల ముందు దుస్ వస్తుంది. తక్కినచోట్ల అంటే అచ్చులముందూ, ఇతర హల్లుల ముందూ దుర్ వస్తుంది. దుస్, దుర్లు (ప్రధానంగా చెడు అన్న అర్ధంలోనే వస్తాయి. అందుకే దుర్యోధనుడు, దుశ్శాసనుడు అన్నప్పుడు చెడు తోస్తుంది. జలియన్‌వాలాబాగ్ దురంతం అందరికీ గుర్తుండేదే. ఇక్కడ దురంతం అంటే చెడుగా అంతమయినది, అమంగళంగా అంతమయినది విషాదాంతం, ట్రాజెడీ. దురదృష్టం అంటే చెడ్డ అదృష్టం. దుర్భాగ్యం అన్నా అదే అర్ధం. దురభిమానంలో అభిమానం అంటే గర్వం. దురఖి మానం ఉన్నవాడు దురభిమాని. దురభిమానాన్ని దుర్గర్వం అనికూడా అనవచ్చు. దురహంకారం కూడా ఇటువంటిదే. దురవస్థ అంటే చెడ్డ స్థితి దురాక్రమణ అంటే చెడ్డ ఆక్రమణ, అన్యాయ మయిన ఆక్రమణ. దురాచారం అంటే దుష్ట ఆచారం. దురాచారమన్నమాట రాగానే ఇప్పుడు తోచేది వరకట్న దురాచారం. దుర్మరణం అంటే చెడ్డచావు. దురాళ్ళుడు చెడ్డవాడు. దురాశ చెడ్డ ఆశ. దురాశయం సదాశయానికి వ్యతిరేకం. దుర్ష్ణయం అన్నా దుర్నీతి అన్నా చెడ్డనీతి. దుర్గతి, దుర్దశ, దుస్థితి ఒకటే. దుర్గంధం దుళ్వాసన ఒకటే. దుష్మర్మం, దుష్కృతం, దుష్కియ, దుష్కృతి ఒకటే. చెడ్డపని అని అర్ధం దుష్కాలం అంటే చెడ్దకాలం. ప్రళయం అని కూడా అర్ధం. దుశ్ళకునం అంటే అపశకునం. దుర్నిమిత్తం అన్నా అదే. దుశ్చరితం అంటే చెడ్డ నడవడి. దుష్ప్రకృతి దుస్స్వభావం ఒకటే. దుస్స్వప్నం అంటే చెడ్డ 168 అతమనబాష
కల. దుర్దినం అంటే చెడ్డరోజు. మబ్బు కమ్మిన రోజు. దుర్దివసం అన్నా అదే అర్థం. దురతిక్రమం అంటే దాటరానిది. దుర్గంఘం అన్నా దుస్తరం, దురత్సయం అన్నా అదే అర్థం. దుర్వారం అంటే వారింపరానిది. దురవబోధం అంటే తెలుసుకోవడం కష్టమైనది. పారం దురవబోధంగా ఉంది అంటే అర్ధంకాకుండా ఉందని. దుర్గమం పోవడానికి కష్టమైనది. పోలేని స్థలం. దుర్గం అన్నా అదే. అందుకే కోటకు దుర్గం అనిపేరు. దుర్ణయుడు అంటే జయింపరాని వాడు. దుర్భరం అంటే భరింపరానిదె. దుర్భేదం అంటే భేదింపరానిది. దుర్భేద్యం అన్నా అదే. సుకరానికి వ్యతిరేకం దుష్మరం. దుస్సహం అంటే సహింపరానిది, దుర్చలుడు అన్నప్పుడు “దుర్కు అల్బమని అర్ధం. దుర్చలుడు అంటే అల్బబలం కలవాడు. దుర్భిక్షం అంటే భిక్షలేనిది. ఇక్కడ “దుర్కు అభావం అని అర్థం. లేకపోవడం. మనకు తినడానికే లేకపోతే భిక్ష ఎక్కడవేస్తాం. భిక్ష దొరకని ససుయం కరువుకాలం. అందువల్ల దుర్శిక్షం అంటే కరువు అని అర్ధం. దుర్మర్యాద అంటే మర్యాద లేకపోవడం. దుర్వినీతుడు అంటే వినయం లేనివాడు. దుర్మితుడు అంటే శత్రువు. దురోదరం అంటే జూదం. దుర్మూల్యం అంటే ఎక్కువ వెల అని అర్ధం. ఉండవలసిన దానికంటే ఎక్కువగా ధర ఉన్నా దుర్మూల్యం అనే అంటారు. అన్యాయమయిన వెల అన్నమాట. దుర్గతుడు అంటే పేదవాడు. ఇక్కడ '“దురొకు అసంపత్తి అని అర్థం. దుగ్గతుడు అంటే సంపత్తిలేనివాడు.
- దురితం అంటేపాపం. నిందితమయిన నడత కలిగినది. దుర్వర్హం అంటే బంగారం కంటే నికృష్టమైన వర్ణం కలిగినది. ఇక్కడ దుర్వర్ణం అంటే వెండి. దుర్, దుస్ ఒకటి కంటే ఎక్కువ అర్థాలలో కూడా చేరతాయి. ఉదాహరణకు దుర్వాదం అంటే అపవాదం అని ఒక అర్ధం. చెడ్డవాదం అని మరొక అర్థం. చెడ్డవాదం అంటే అశాస్త్రీయ మయిన వాదం అన్నమాట. దుర్మేధసుడు అంటే మందబుద్ధి కలవాడని ఒక అర్ధం. దుష్టబుద్ధి కలవాడని మరొక అర్ధం. దుర్విద్యుడు అంటే దుష్టమయిన విద్య కలవాడు అనీ, విద్యలేనివాడు అనీ అర్థాలు. దుర్మనస్ముడు అంటే వ్యాకులమయిన మనస్సు కలిగినవాడు, చెడ్డ మనసు కలిగిన వాడు అని అర్థాలు. దుర్గతి అంటే దౌర్భాగ్యం అనీ, దారిద్ర్యం అనీ అర్థాలు. దురుత్తరం అంటే దొటరానిది అని అర్ధం. చెడ్డ ఉత్తరం అని కూడా అర్ధం. దురుక్తం అంటీ పరుషోక్తి అనీ, చెడ్డమాట అనీ అర్ధాలు. చ్ మనభాషతి 169
విచక్షణ - విచారణ జయ విజయులు అనేవాళ్ళు విష్ణువు ద్వారపాలకులు. శాపంవల్ల వీళ్ళే రావణ కుంభకర్ణులూ, హిరణ్యాక్ష హిరణ్య కశిపులూ వగయిరాగా జన్మనెత్తడమూ విష్టువు అవతారాల చేతిలో మృతి పొంది వైకుంఠం చేరడమూ అందరికీ తెలిసిందే. జయం అంటే గెలుపు. జయుడు అంటే గెలుపు కలిగినవాడు, జయించేవాడు.' విజయుడు అన్నమాటలో జయ శబ్దానికి ముందు '*వి' వచ్చి చేరింది. దీనికి విశేషమయిన జయం అని అర్ధం. అంటే మిక్కిలి జయం, గొప్ప జయం అని అర్ధం. విజయుడు అంటే గొప్ప జయం కలిగినవాడు. అందుకే అర్హునుడు విజయుడు. చేమ కూర వేంకటకవి 'విజయవిలాసం'లో విజయుడు అర్జునుడే కదా. "వి ఉపసర్గచేరి సంస్కృతంల్లో కొన్ని వందల మాటలు ఏర్పడతాయి. ఈ మాటల్లో ఎన్నో తెలుగులోనూ వాడుకలో ఉన్నాయి. “వి ఉపసర్గ కూడా తక్కిన ఉపసర్గల లాగానే కొన్ని అర్ధభేదాలతో వస్తుంది. అంటే ఈ ఉవసర్గ చేరినప్పుడు ఒకే మాటకు ఒకటికంటే మించిన అర్జాలూ రావచ్చు. ఒక మాటతో కలిపితే ఒక అర్థమూ, మరో మాటతో కలిపితే మరో అర్ధమూ రావచ్చు. వి ఉపసర్ద చేరినప్పుడు కలిగే ప్రధానమైన అర్జాలలో మిక్కిలి, అతిశయం, ఎక్కువ అన్న అర్థం ఒకటి. కంపం అంటే కదలిక. వికంపం అంటే మిక్కిలి కదలిక చంచలం. వికంపం అంటే ఉబికేది అని కూడా అర్ధం. కరాళం అంటే భయంకరం. కరాళ వక్రుడు అంటే భయంకరమయిన నోరు కలిగినవాడు. కరాళానికి “వి” చేరిస్తే వికరాళం అవుతుంది. అంటే మిక్కిలి భయంకర మయినదని అర్థం. చలం, చలనం అంటే కదలడం. అచలం అంటే కొందకదా కదలనిది అని అర్థం. అదే విచలం, విచలనం అంటే మిక్కిలి కదలిక. ఆయన విచలిత హృదయుడు అంటాం. అంటే బాగా చలించిన గుండె కలిగినవాడు. కలత చెందినవాడు. శ్లీన్నం అంటే తడిసినది. విక్షిన్నం అంటే మిక్కిని తడిసినది. అట్లాగే క్లిష్టం అంటే జాధింపబిడింది. విక్షిష్టం అంటీ మిక్కిలి బాధింవబడింది. వికాసం అన్నా వికసనం అన్నా విప్పారడం, విరియడం,. వృద్ధి అనికూడా అర్ధం. వ్యాప్తి అనీ చెప్పవచ్చు. వికసితం అంటే వికసించినది. వికస్వరం అంటే వికసించే స్వభావం కలిగినది. విక్రమం అంటే అడుగు, అంగ. విక్రమణం అంటే విష్ణువు అంగ. 'క్రము' అనే ధాతువుకు పాదవిక్షేపం, అడుగుపెట్టడం అని అర్ధం. విష్ణువు త్రివిక్రముడు. మూడు అంగలు వేసినవాదు. మూడు అడుగులతో ముల్లోకాలనూ ఆక్రమించిన వాడు. విక్రమం అంటే పరా(క్రమమనీ అర్థం. విక్రముడు అన్నా విష్ణువనే అర్ధం. విక్రమాదిత్యుడు, విక్రమార్కుడు అని భట్టి విక్రమార్మ కథలలో సుప్రసిద్ధుడయిన ఉజ్జయినీ రాజు. తెలుగులో జక్కన “విక్రమార్మ చరిత్రము అనే కావ్యం రాశాడు. ఈ కావ్యంలో ఇతదే నాయకుడు. వి(క్రమాదిత్యుణ్ణి కూడా వీక్రముడు అంటారు. ఈ 1'క్రము ధాతువు నుండే క్రాంతి అన్నమాట కూదా. విక్రాంతం అంటే దాటబడినదని అర్ధం. ఆక మించినది అని అర్ధం. గెలిచినది, బలమైనది అన్న అర్భాలూ ఉన్నాయి. అందువల్ల విక్రాంతుడు అంటే వీరుడు, యోధుడు అని అర్థం. విక్రాంతి అంటే అడుగువేయడం, వరాక్రమం. గుర్రం నడకను కూడా వి(క్రాంతి అంటారు. గూధం అంటే దాచబడినది, రహస్యం. విగూధం అన్నా రహస్యమే. ఘాతం అంటీ 170 అ మనబాష
చంపడం ఘాతుకం అనివాడుతూ ఉంటాం. విఘాతం అంటే నాశనం. అయితే తెలుగులో విఘాతం అన్న మాటను అడ్డంకి అన్న అర్ధంలో ఎక్కువగా వాడుతున్నాం.
ఘాతం అంటే దెబ్బ అన్న అర్ధం కూడా ఉంది. ఈ అర్ధంలో విఘాతం అంటే పెద్ద దెబ్బ.
విచక్షణుడు అంటే సూక్ష్మదృష్టి గల వాడు, దూరదృష్టి కలవాడు అని అర్థం. నీతి విచక్ష ణుడు అని ప్రయోగం ఉండే, పండితుడు, విద్వాంసుడు. బుద్ధిమంతుడు, వివేకం కలిగినవాడు,
_ నేర్పరి అని అర్ధం, విచక్షణ శబ్దానికి నేర్చు, పాండిత్యం అని అర్ధం చెప్పుకోవాలి. విచక్షణ అనే
మాటకు విశేషంగా చెప్పడం అని మరొక అర్ధం. ఈ అర్ధంలోనే ఈ మాటను ఎక్కువగా వాడు తున్నాం. జాతి విచక్షణ అన్నప్పుడు జాతిని వేరుచేసి చెప్పడం. విచక్షించు అంటే విమర్శించు అని అర్ధం, ఇంగ్లీషులో డిస్రిమినేషన్ అన్నమాటకు సమానార్థకంగా విచక్షణను వాడుతున్నాం. డిస్మిమినేషన్ అన్నా వివేకం అనే అర్థం. ఒక వ్యక్తి, ఒక జాతి, ఒక వర్గం వీటికి వ్యతిరేకంగా నీ వివేకాన్ని ఉపయోగించడం. దక్షిణాఫ్రికాలో అపార్తీడ్ అంటారు. నల్లవాళ్ళను వేరుగా చూడడం, వేరుచేసి చూడడం, దీన్ని జాతి విచక్షణవాదం అంటున్నాం. ఈ అర్థంలో వివక్ష అనే మాటను కూడా వాడుతున్నారు. వివక్ష అంటే చెప్పాలనే కోరిక. విజిగీషలాంటిది. జిగీష అన్నా విజిగీష అన్నా గెలవాలనే కోరిక. వర్ణ వివక్షలాంటి ప్రయోగాలు అర్ధవంతమయినవి కావు. వివక్షించడం అంటే చెప్పాలని కోరుకోవడం, వివక్షితం అంటే మనం ఏం చెప్పాలన్తుక్రున్నామో అది. ఉద్దేశం అన్నమాట. వివక్షువు అంటే మాట్లాడాలన్న కోరికున్నవాడు. మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నవాడు. విచక్షణకు బదులుగా వివక్షను వాడడం సరయింది కాదు. విచక్షణరహితంగా అన్నప్పుడు వివేక రహితంగా అని అర్ధం ఈ మాటలను వాడడంలోనూ విచక్షణ చూపించాలి.
విచారం అన్నమాటను బాధ, దుఃఖం అన్న అర్థాలలో వాడుతున్నాం. కాని “చర ధాతు వుకు గతి అని అర్ధం. మరో “చర ధాతువుకు సంశయం అని అర్ధం. ఈ సంశయమన్న ఆర్థం లోనే విచారం వంటి మాటలు ఏర్పడ్డాయి. విచారించడం అంటే పరీక్షించడం, పరిశోధించడం; సంశయనివృత్తికోసం ఈ పరిశీలన. అందువల్ల విచారం అనే మాటకు పరీక్ష వరిశోధన, సత్యం తెలుసుకోవడానికి చేసే పరిశీలన అని అర్థం. ఆలోచన, వివేకం, సందేహం అన్న అర్ధాలూ ఉన్నాయి. దూరదృష్టి అన్న అర్ధం కూడా ఉంది. విచారణ అన్నా విచారమే. విచారకుడు అంటే విచారించేవాడు, న్యాయాధికారి. విచారణీయం అంటే విచారింపదగింది. విచారశీలుడు అంటే వివేకి. విచారించు అన్నప్పుడు పరిశీలించడం అనీ, ఆలోచించడం అనీ, పరామర్శించడం అనీ, సంతాపించడం అనీ అర్ధాలున్నాయి. పరామర్శించడం అన్న అర్ధంలో ఈ మాట కొన్ని'ప్రాంతాల లోనే వాడుకలో ఉంది. విచారపడు అన్నప్పుడు మాత్రం దుఃఖవడు, సంతాపం చెందు అని అర్ధం, ,ఆ విధంగా తెలుగులో విచారం అన్న మాటకు సంతావం, దుఖం అన్న అర్థం ఏర్పడింది.
జ్ఞానం అంటే తెలివి. విజ్ఞానం అన్నా తెలివే. అయితే లౌకిక జ్ఞానం విజ్ఞానంగా వ్యవ హృతం. జ్ఞానం అంటే (బ్రహ్మజ్ఞానం. విజ్ఞానం అంటే దానికి భిన్నమయిన జ్ఞానం. ఈ అర్థంలోనే విజ్ఞానశాస్త్రం, విజ్ఞాన శాస్త్రజ్డుడు, విజ్ఞాని, వైజ్ఞునికుడు మొదలయిన మాటలు ఏర్పడ్డాయి. జ్ఞాపన అంటే తెలియజేయడం. విజ్ఞాపన, విజ్ఞప్తి అంటే మనవి, విన్నపం. ల
దళనం అంటే ఛేదనం. విదళనం అంటే మిక్కిలి ఛేదించడం. విదారణం అన్నా ఛేదనమే. విదూరం అంటే మిక్కిలి దూరం. వినీతి, వినమం అంటే అడకువ. విమోచన, విముక్తి, విమోక్షణ ఒకే అర్ధంలో వాడుకలో ఉన్నాయి. జ్
మవభాషతి 171
వినియోగం - విమర్శ వినియోగం అన్నమాటను ఉపయోగం, ప్రయోజనం అనే అర్ధంలో ఎక్కువగా వాడుతున్నాం. వినియోగదారుల సంఘాలున్నాయి కదా. ఒక వస్తువు లేదా సేవను ఉపయోగించుకొనేవాళ్ళు వినియోగదారులు. వీనియోగం అన్నమాటకు విడదీయడం, ఉద్యోగం, విఘ్నం, అన్న అర్థాలు కూడా ఉన్నాయి. రాజులవద్ద గురువు, మహాప్రధాని, మాండలికులు, సామంతులు, సేనాపతి మొదలయిన డెట్బైరెండు వినియోగాల వారుండేవారట. ఇక్కడ వినియోగం అన్నమాటకు ఆ(ితుడు, పరివారజనం అని అర్థం. తిక్కనగారు భారతాన్ని 'తెనుగుబాస వినిర్మింప దివురుటి అన్నారు. వినిర్మించడం ఆంటే సృజించడం. భారతాన్ని తెలుగులో నిర్మించడం, సృజించడం తిక్కనగారు చేసినపని. వినాశం/వినాశనం అంటే పూర్తిగా నశించడం. వినాశనుడు అంటే లయకారుడయిన శివుడు. వినిహతం అంటే మిక్కిలి కొట్టబడినది, చంవబడినది అని అర్ధం. పూర్తిగా జయింవబడి నది అని కూడా అర్ధం. ఉత్పాతం అనే అర్ధం కూడా ఉంది. నూతనం అంటే కొత్తది. నూత్న్శనూతన విశేషణాలుగా వాడతాం. ఈ మాటకు “వి ఉపసర్గను చేర్చి వినూత్న అని విశేషణంగా వాడుతున్నాం. నూత్న వినూత్న పరికరాలు వంటి ప్రయోగోలలో నూత్చ్య వినూత్న రెండింటినీ విశేషణాలుగా వాడుతున్నాం. నూత్నం అంటేనే అభినవం. వినూత్నం అంటే మరింత కొత్తది. విన్యాసం అంటే ఉంచడం, కూర్చు, రచన అని అర్థం. నాట్యంలో హస్త విన్యాసం, పాద విన్యాసం అని వాడతాం. సమూహం, నివాసస్థలం అన్న అర్థాలు కూడా ఉన్నాయి. విపరిణామం అంటే మారడం. విపర్యస్తం అంటే తారుమారైనది. విరుద్ధమైనది. విపర్యాసం అంటే మార్చు, ప్రతికూలత, వినిమయం, తప్పు. విబుధుడు అంటే పండితుడు. దేవత అనీ, చంద్రుదనీ కూదా అర్థం. విబోధం అంటే మెల కువ, తెలివి. విభక్తం అంటే భాగాలుగా చేయబడింది అని, వంచబడింది అనీ అర్ధం. విభక్త కుటుంబం అంటే భాగాలు పంచుకొని విడిపోయిన కుటుంబం. విభక్తి అంటే విడదీయడం. దాయభాగం. వ్యాకరణంలో ప్రాతివదికాదులకు చేరే ప్రత్యయం విభక్తి. పంచుకుంటారు కాబట్టీ సోదరులను విభక్తులు అనవచ్చు. విభజనం అంటే విభజించడం వేరుకావడం. విభాగం అంటే భాగం, పంపకం, అంశం, ముక్క మత్తుడు అంటే మదించినవాడు. విమత్తుడు అంటే బాగా మత్తెక్కినవాడు, మదించిన వాడు. విమర్దనం అంటే చంపడం, పొడి చేయడం. విమర్శ అనే మాటను చాలా ఎక్కువగా వాడుతున్నాం. విమర్శ అంటే పరిశీలన, సమీ క్షణం. యుక్తియుక్తంగా వాదించడం, సాహిత్య రంగంలో ఈ అర్ధమే ప్రచారంలో ఉన్నా వ్యవహారంలో తప్పు పట్టడం, తిట్టడం అన్న అర్థంలో స్థిరపడిపోయింది. ఆయన తీవ్రంగా విమర్శించారు అన్నప్పుడు పరిశీలన వంటి అర్ధానికి అవకాశం లేదు, నిందించడమనే అర్థం. విముగ్ధుడు, విమూఢుడు అన్న మాటలకు బొత్తిగా తెలివిలేనివాడని అర్థం. వ్యాకులత చెందినవాడని కూడా అర్ధం, విమోహం మిక్కిలి మోహం. 172 అమనభాష
విరచన అంటే ఏర్పాటు, కల్పన, సృజించడం, గ్రంథ రచన. నన్నయ విరచితం అంటే నన్నయచేత రచింపబడింది. విలక్షణం అంటే విశేష లక్షణాలు కలిగినటువంటిది, అసాధారణ మయినది. భిన్నమయినది.
వివాహంలో “వహి ధాతువు. పొందడం అని అర్థం. విశేషంగా పొందబడదేది. వివాహం అంటే పెండ్లి పూర్వం ఇది ఎనిమిది రకాలు. (బ్రాహ్మం, దైవం, అర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం. దాదాపు ఈ విధానాలన్నీ న్యాయసమ్మతంగానో, అసమ్మతంగానో ఎంతో కొంత జరుగుతూనే ఉన్నాయి.
వికల్పం అంటే సంశయం. కలగడం, కలగకపోవడం. వ్యాకరణంలో ఎక్కువగా వాడే మాట. వికల్చం, వైకల్చికం, విభాష, వైభాషికం అన్నవి వ్యాకరణంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఒక వ్యాకరణ సూత్రం వర్తించిన రూపమూ, వర్తించని రూపమూ రెండూ ఉండేటట్లయితే ఆ సూత్రం వికల్పంగా వర్తించినట్లు. వికల్పం అంటే కల్పన అని కూడా అర్థం. మరో వికల్పం లేదా అన్నప్పుడు విధం, పద్ధతి అని అర్ధం. ఊహ, భావన అనికూడా అనవచ్చు. వికారం అంటే మార్చు. ఇదే అర్ధంలో వికృతం, విరూపం అన్న మాటలను కూడా వాడవచ్చు. ప్రకృతి వికృతు లున్నాయి కదా. ప్రకృతి సహజం, మూలం. వికృతి మార్చు పొందిన రూపం. తెలుగు వ్యాకర జాలలో ప్రకృతిని తత్సమం అన్న అర్ధంలోనూ వికృతిని తద్భవం అన్న అర్థంలోనూ వాదతారు. సంస్కృతం నుండి తెలుగు పుట్టిందని భావించేవాళ్ళు తెలుగునే వికృతి అనడమూ ఉంది.
వికిరణం,వికీర్ణం అంటే వ్యాప్తి అని అర్థం. వితతం అంటే విస్తరించినది అని అర్థం. విగ శితం అంటే చెదరినది. విక్షేసం అంటే తొలగించడం. విక్షిప్తం అంటే తొలగించబడినది. విత రణం అంటే దానం. తరణం అంటే దాటడం వితరణం నరకాన్ని దాటిస్తుంది కాబట్టీ వితరణం. వితీర్ణి అన్నా వితరణమే.
విధురం అంటే కార్యభారం లేనిది. భయం, అపాయం, వాని అనికూడా అర్భాలున్నాయి. విధురుడు అంటే భార్య పోయినవాడు.
వికర్షణ అంటీ దూరంగా లాగడం. ఆకర్షణకు వ్యతిరేకం. వికృష్ణం అంటే దూరంగా లాగబడింది. విప్రకర్న అంటే దూరం.
విప్రలంభం, విషప్రయోగం, వియోగం, విరహం సమానార్థకాలు. ఎడబాటు అని అర్థం. శృంగారం సంయోగం వియోగం అని రెండు రకాలు. ఈ వియోగ శృంగారాన్నే విప్రలంభ శృంగారం, విప్రయోగ శృంగారం అనికూడా అనవచ్చు. ప్రలంభం అంటే లాభం పొందడం. విప్రలంభం అంటే వంచించడం అనికూడా అర్ధం. కలహం అనికూడా అర్థం ఉంది. విప్రలబ్ధి అన్నప్పుడు ఈ వంచించడమన్న అర్ధమే ఉంది. ఎనిమిది రకాల శృంగార నాయికల్లో విప్రలబ్ధి ఒకతి. ఒక సంకేతాన్ని ఏర్పరచి. వస్తానని మాట ఇచ్చిన (ప్రియుడు రాకపోవడం వల్ల బాధపడే నాయిక. ప్రియునిచేత వంచింపబడిన నాయిక వివ్రలణ్ధ. ప్రయోగం అన్న మాటకు సంయోగం, కూడిక అన్న అర్ధం ఉంది. విప్రయోగం దానికి వ్యతిరేకం. ఎడబాటు. యోగం అంటే కూడిక. వియోగం అంటే ఎడబాటు. రహం అంటే కూడిక. విరహం అంటే ఎడబాటు.
విక్షతం అంటే గాయపరచబడింది. విక్షోభం అంటే కలవరపాటు. కల్లోలం, గందరగోళ పరిస్థితి అన్న అర్ధంలో విక్షోభం అన్నమాట ప్రచురంగా ఉంది. మానసిక విక్షోభం అన్నప్పుడు
మనభాషత 173
కలత అని అర్ధం. విచికిత్స అంటే సంశయం. విచ్చేదం, విచ్చేదనం నరకడం. విచ్చిన్నం అంటే నరకబడినది. విచ్చిత్తి అంటే నరకడం. విభజించడం అనికూడా అర్థం. కనపడకపోవడం, సమాప్తి చెందడం అన్న అర్థమూ ఉంది. విచ్చేదం అంటే విఘాతం, ఆటంకం అన్న అర్థం కూడా ఉంది. వంశం అంతం కావడం, అంత టితో ఆగిపోవడాన్ని కూడా విచ్చేదం అంటారు. విచ్యుతం అంటే భ్రష్టం. విఘ్నం అంటే కార్యం చెడడం, ఆటంకం. విఘ్న నాయకుడు, విఘ్నేశ్వరుడు అని గణపతికి పేర్లు. విఖండితం అంటే ఖండింపబడింది. విఖ్యాతి అంటే గొప్ప కీర్తి, విచర్చితం అంటే పూయబడింది. విజ్బంభణ అంటే వ్యాపించడం, చెలరేగడం. విత్రాసం అంటే భయం, విద్వేషం అంటే పగ. విజితుడు అంటే ఓడిపోయినవాడు. విజితాత్ముడు అంటే తనను తాను లోబరచుకొన్నవాడు. విమాత అంటే సవతి తల్లి. విజాతి అంటే వేరే జాతి. విదేశం అంటే అన్యదేశం. వీటినుందే విజాతీయుడు, విదేశీయుడు అన్న మాటలు వచ్చాయి. బ్ 174 త మనభాష
ఖగ్రహం - వివాహం
“వి ఉపసర్గకు వ్యతిరేకార్థం కూడా ఉంది. ఈ ఉవసర్గను చేర్చినవ్చుడు వ్యతిరేకార్థం ఏర్పడు తుంది. విజనం అంటేజనం లేనటువంటిది. విజన పథం అంటే మనుష్యులు లేని త్రోవ. వికచం అంటే వెంట్రుకలు లేనిది. ఇక్కడ కచ ధాతువుకు బంధనం అని అర్థం. క్రయం అంటే కొనడం. విక్రయం అంటే అమ్మడం. (క్రయ విక్రయాలు అంటే కొనడం, అమ్మడం. విక్రయ అన్నా విక్రయికుడు అన్నావ్యాపారి. విక్రేత అంటే అమ్మేవాడు. పణ ధాతువుకు వ్యవహారం అని అర్థం. (ద్రవ్య వినిమయం. విపణం అంటే అమ్మడం. విపణి అంటే అంగడి, అంగడి వీధి.
విగుణం అంటే గుణాలు లేనటువంటిది.
విగ్రహం అంటే శరీరం అని అర్థం. విశేషంగా ఆత్మచేత (గ్రహింపబడింది కాబట్టి విగ్రహం, యుద్ధంలో శత్రువులను పట్టుకుంటారు కాబట్టీ విగ్రహం అంటే యుద్ధం. శత్రువుకు యుద్ధ రూపమైన అపకారం విగ్రహం. పంచతంటత్రంలో ఇది ఒకటి. మిత్రలాభం, మి(త్రభేదం, సంధి - విగ్రహం, లబ్ధినాశం, అసం(పేక్ష్య కారిత్వం అన్నవి ఈ అయిదు. సంస్కృతంలో విష్ణు శర్మ రచించిన పంచతంత్రం ప్రపంచ వ్రసిద్ధమై అనేక భాషలలోకి అనువదితమయింది. తెలుగులో దూబగుంట నారాయణకవి “పంచతంత్రము” పద్యకావ్యం. చిన్నయసూరి వచనంలో నీతిచంద్రికగా మిత్రలాభ, మిత్రభేదాలను రచించాడు. చిన్నయసూరి విశిష్టమయిన శైలివల్ల తెలుగులో ఇది విస్తృత (ప్రచారం పొందింది. సంధి విగ్రహాలు ఒకే తంత్రంగా పంచతం(త్రంలో కనిపిస్తాయి. రాజాస్థానాలలో సంధి వి(గ్రహి అనే అధికారి ఒకడుండేవాడు. రాజనీతికి సంబం ధించి ఆరుగుణాలు పేర్కొంటారు. అవి (1) సంధి, (9) విగ్రహం, (3) యానం, (4) ఆసనం, (5) ద్వైధం, (6) ఆశ్రయం. వీటిలో విగ్రహం యుద్ధమే. ఇది మూడు రకాలు. (1) ప్రకాశే యుద్ధం, (2) కూట యుద్ధం, (3) పార్షి యుద్ధం. ప్రకాశ యుద్ధమంటే ఎదురుపడి చేసే యుద్ధం. కూట యుద్ధం అంటే కపటయుద్ధం. పార్షి అంటే మడమ. పార్షియుద్ధం అంటే మడమ తొక్కే యుద్ధం. వెనుక నుండి ముట్టడించడం.
విస్తృతి, విస్తారం, విగ్రహం, వ్యాసం అన్నవి విరివి అన్న అర్ధంలో సమానార్థకాలు. విసృతి విస్తారాలలో స్తృజ్ అనే ధాతువుకు ఆచ్భాదనమని అర్థం. విశేషంగా ఆచ్చ్భాదించడం. విగ్రహం అంటే విశేషంగా (గ్రహించడం. వ్యాసం అంటే అనేక రకాలుగా ఉండడం. ఆస అన్న ధాతువుకు ఉపవేశనం, ఉండడం అని అర్ధం. ఆ విధంగా ఈ మాటలకు వ్యాప్తి విరివి అని అర్ధం ఏర్పడింది. విస్తార పదమే శబ్ద సంబంధమయినప్పుడు విస్తరం అవుతుంది. +
ఘటనం అంటే కూర్చడం. విఘటనం అంటే విడగొట్టడం. విఘట్టనం అన్నా ఇదే అర్థం. వికర్మం అంటే అన్యాయకార్యం అనీ, నిషిద్ధ కార్యమనీ అర్థం. వికల్మషం అంటే కల్మషం లేక పోవడం. విచక్షుడు అంటే కళ్ళు లేనివాడు, గుడ్డివాడు. విచేతనం అంటేచేతనం లేనిది. జర అంటే ముసలితనం. విజరం అంటే ముసలితనం లేనిది.
వితంతువు అంటే తంతువు లేనటువంటిది. ఇక్కడ తంతువు అంటే మంగళసూత్రం. తంతువు అంటే నూలు. నూలు అన్న ఈ సామాన్యార్థం ఉన్న తంతువుకు మంగళసూ(త్రమన్న విశిష్టార్ధం ఏర్పడడం వల్ల వితంతువు అంటే విధవ అన్న అర్థం ఏర్పడింది. సూత్రం తెగింది, తాడు తెగింది వంటి ప్రయోగాల అర్ధం అందరికీ తెలిసిందే. ఉత్తర భారతదేశంలో ఈ వితంతు
మనభాషత 175
శబ్దం వాడుకలో లేకపోవచ్చు. వాళ్ళకు మంగళసూత్రం లేదు కదా. విధవ అంటే ధవుడు/భర్త లేని హర థ్రీ వితంత్ర అంటే తీగలు లేనిది. అయితే తెలుగులో నిస్తంత్రి అన్న మాటకున్న (ప్రచారం దీనికి లేదు. తధ్యం అంటే సత్యం. వితధ్యం అంటే అసత్యం. వితధం అన్నా అసత్యమే. వినాయ కుడు అంటే గణపతి, బుద్ధుడు, గరుత్మంతుడు, గురువు అని అర్భాలు. పోగొట్టేవాడు, శిక్షించే వాడు, హితాన్ని బోధించేవాడు.
వరణం అంటే ఆచ్చాదన, కప్పు అని అర్ధం. వివరణం అంటే ఆచ్చాదన లేకుండా, కప్పు లేకుండా. విశదం అని అర్ధం. వివరం అన్నా వివరణమనే అర్ధం. వివరంగా చెప్పమన్నప్పుడు అర్థమిదే. వివరం అంటే రంధ్రమన్న మరో అర్ధం కూడా ఉంది.
విపక్షం అన్నమాట ఇటీవల కొంత వాడుకలోకి వచ్చింది. తెలుగులో ప్రతిపక్షం అన్నమాటకున్న ప్రచారం దీనికి లేదు. ప్రతికూలమైన వర్గం అని అర్థం.
వధం అంటే త్రోవ. విపధం అంటే చెడ్దత్రోవ, తప్పుత్రోవ. విప్రయాణం అంటే పారిపోవడ మని అర్థం.
విప్రతిపత్తి అంటే పరస్సరం విరోధం. విప్రియం అయిష్టం. విఫలం అంటే వ్యర్థం. వ్యర్థం అంటే అర్థంలేనిది. ఈ మాటల్లో “వి” వ్యతిరేకార్ధాన్నిస్తుంది. విమలం, వియోగం, విరక్తి వంటి మాటలిటువంటివే. విమలం అంటే మాలిన్యం లేనిది, స్వచ్చమైనది, తెల్లనైనది. యోగం అంటే కలయిక. వియోగం అంటే ఎడబాటు. విరక్తి అంటే రక్తి లేకపోవడం. విరాగం అన్నా ఇదే అర్థం.
విమానం అంటే అనేకార్థాలున్నాయి. మానం అంటే గౌరవం కాబట్టి విమానం అంటీ అగౌరవం, అవమానం అన్న అర్థం కూడా ఏర్పడింది. మానం అంటే కొలత అన్న అర్థమూ ఉంది. అందువల్ల విమానం అంటే పరిమాణం అన్న అర్ధం ఏర్పడింది. గమనంలో పక్షితో పోలిక ఉంది కాబట్టి విమానం అంటే దేవతలు ఆకాశంలో విహరించే వాహనం. ఆ మాటనే ఇప్పుడు విమానంగా వాడుతున్నాం. వాహనం కాబట్టి దీనికి గుర్రమన్న అర్థమూ ఏర్పడింది. ఏడంతస్తుల మేడను కూడా విమానం అంటారు. విమానం అంటే దేశాంతరవాసం. వివాసితుడు అంటే దేశ (భ్రప్పుడు.
విశేషంగా వహించడం వివాహం. ఈ వివాహం బ్రాహ్మం, దైవం, ఆర్నం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని ఎనిమిది రకాలు. పురాణాల్లో ఈ అన్ని రకాల వివా వోలూ కనిపిస్తాయి. అయితే వీటిలో అన్నీ ఆనాడైనా ప్రచురంగా ఉన్నవికావు. చివరి నాలుగు రకాల వివాహాలూ మంచివి కావని మనుస్మృతి నాదే చెప్పారు. పైశాచం అధనుం అని కూడా చెప్పారు. కన్యాశుల్కం పిల్లను అమ్ముకోవడమేననీ, అది పాపమనీ, ఈ పాపం చేసినవారు అథోగతి పాలవుతారనీ మనుస్మృతి చెప్పింది. విలోమం అనులోమానికి వ్యతిరేకం. విపరీతం, విపర్యయం, విపర్యాయం, విపర్యాసం వీటన్నిటికీ తలక్రిందులు అని అర్ధం. వ్యతిరేకంలోనూ 'వి ఉవసర్గ ఉంది. విదూషకుడు అంటే మలినంగా చేసేవాడు, దూషించేవాడు, చమత్మారి. సంస్కృత నాటకాలలో ఉందే పాత్ర, తన రూపం, వేషం, ప్రవర్తనల ద్వారా నవ్వు పుట్టించే పాత ఇది. తిండి యావ చూపిస్తూ ఉంటాడు.
విపంచి అంటే స్వరాలను విస్తరింపజేసేది. విచిత్రం, వివిధం అన్నప్పుడు 'వి' ఉవసర్గకు నానా అని అర్ధం. వివిధం అంటే నానా విధాలు. చ
176 ఉమనబాష
ఆచంద్ర తారార్కం
పూర్వం శాసనాలు వేసిన రాజులు ఆ శాసనాల ద్వారా తాము చేసిన దానం ఆ చంద్ర తారార్మం నిలిచి ఉండాలని కోరుకునేవారు. ఈ ఆకాంక్షను శాసనంలో వ్యక్తంచేసేవారు. రాజులూ, కవులూ, కళాకారులూ ఆచంద్ర తారార్మమయిన కీర్తిని పొందాలని కాంక్షించే వారు కీర్తి కాంక్ష ఏకాలంలోనూ ఉందేదే. ఆచం(ద్ర తారార్కం అంటే చంద్రుడూ, నక్షత్రాలూ, సూర్యుడూ ఉందేంత వరకూ అని అర్ధం. సూర్యచంద్రులూ, నక్షత్రాలూ శాశ్వతంగా ఉండేవని నమ్మకం. కాబట్టి తాము చేసిన కార్యం శాశ్వతంగా నిలిచిపోవాలని వారి భావం. ఆరవి సుధాకర తారకం, ఆఖరకర జలజారి తారకం మొదలయిన విధంగా సూర్యచంద్రాదులకు వర్యాయపదాలను కూడా వాడ వచ్చు. ఆచంద్రార్మం అని కేవలం సూర్యచంద్రులను, ఆచంద్ర తారకం అని చంద్రుణ్ణి నక్షత్రా లనూ, ఆరవితారకం అని కేవలం సూర్యుజ్జి, నక్షత్రాలనూ కూడా పేర్కొంటారు. ఈ మాటలలో మొదట ఉన్న “ఆ - “ఆజ్ అనే ఉపసర్గ. ఇక్కడ పర్యంతం, హద్దు అని ఈ ఉవసర్గకు అర్ధం. ఆకల్పం అంటే కల్పం ఉన్నంతవరకు, కల్ప పర్యంతం అని అర్థం. ఆమరణాంతం అంటే మరణం వరకూ అని అర్ధం. ఆమరణ నిరాహారదీక్ష బాగా వాడుకలో ఉన్న (ప్రయోగం.
అజన్మం అంటే పుట్టుక నుండీ అని అర్ధం. ఆజన్మ బ్రహ్మచారి అంటే పుట్టిన నాటినుండి (బ్రహ్మచారిగా ఉన్నవాడు. ఆపాదం అంటే పాదాలు మొదలుకొని అని అర్థం. అపాద మస్తకం అంటే పాదాల నుండి మస్తకం వరకు అని అర్ధం. ఆమూలం అంటే మూలంనుండీ అని అర్ధం. ఆమూలా(గ్రం అంటే మొదటినుండి చివరిదాకా అని. పూర్వం దినపత్రిక అంతా చదివానన చానిక్తి ఆంధ్రపత్రిక నుండి అమృతాంజనం దాకా అనేవాళ్ళు. ఆంధ్రపత్రిక అన్న పేరుతో మొదలుపెట్టి అమృతాంజనం అడ్వర్ద్ణయిజుమెంటు దాకా ఏమీ వదలకుండా అక్షరాక్షరం చది వారన్నమాట. ఆమూలా(గం సమగ్రంగా వపరిశీలించారంటాం. ఆబాల గోపాలం వచ్చారు అన్నప్పుడు పిల్లల నుండి గోపాలుర దాకా అందరూనని అర్థం.
శాసనాలలో ఈ '౪' లేకుండానే శశితారకంబుగా అనీ, దినేశ సుధాకర తారకంబుగా అనీ, వారి జాప్త చంద్రతారముగా అనీ కూడా ప్రయోగించారు. ఆగర్భ శ్రీమ్లంతుడు, ఆగర్భ శత్రువు వంటి ప్రయోగాలెన్నో ఉన్నాయి. గర్భంలో ఉన్నప్పటి నుండీ, పుట్టకముందు నుండీ అని అర్ధం. .
తాత్కాలికం అంటే ఆ సమయానికి మాత్రమే సంబంధించింది. ఆకాలికం అంటే పుట్టిన వెంటనే నళశించేది. ఇక్కడ “ఆజ్ ఉపసర్గకు కొంచెం అని అర్థం. ఆకులం అన్నమాటకు ఇంచు కంత కూడి ఉందేది అని అర్థం. వ్యాకులం అన్న అర్థం కూడా ఉంది. వ్యాకులంలో కూడా వి+ ఆకులం అని “వి అనే ఉపసర్గ చేరింది. 'ఆజొ ఉపసర్గకు మొత్తం, అంతటా అన్న అర్థం కూడా ఉంది. ఆ అర్ధంలో ఆకులం అంటే వ్యాప్తి అని అర్ధం. ఆపక్వం అంటే కొంచెం ఉడికినది. ఆపాకం అన్నా అదే అర్థం.
మొత్తం, అంతటా అన్న అర్థంలో '“ఆబ్ొకు చాలా ప్రయోగాలున్నాయి. ఆకరం అన్న మాటలో ఇదే అర్థం. ఆకరం అంటే గని, సమూహం, నెలవు అని అర్ధాలు, రత్నాకరం అంటే రత్నాలకు ఆకరమయినది, సముద్రం. శబ్ద రత్నాకరం అంటే శబ్దసాగరం, తెలుగు భాషకున్న
అకారాది నిఘంటువులలో ముఖ్యమైనది శబ్ద రత్నాకరం. దీన్ని బహుజనపల్లి సీతారామా చార్యులుగారు రచించారు. ఈయనే ప్రొాధవ్యాకరణం కూడా రచించారు.
అకాశం అంటే సూర్యచం(ద్రాదులు ప్రకాశించేది. దేనియందు సూర్యచంద్రాదులు
-(ప్రకాశిస్తారో అది ఆకాశం. కాళ్ళధాతువుకు కాంతి, వెలుగు అని అర్ధం. 'ఆజొకు అంతటా అని అర్థం. ఆకీర్ణం అంటే వ్యాప్తం, చిమ్మబడినది అని అర్థం. జనాకీర్ణం అంటే జనంతో నిండి ఉన్నది; అంతటా జనం ఉన్నది అని అర్ధం.
అఖువు అంటే అంతటా తవ్వేది. ఎలుక అని అర్థం. కన్నాలువేసి దొంగతనాలు చేసే కాలం లో దొంగకు కూడా ఆఖువు అన్న పేరుందేది.
ఆచ్చేదనం అంటే పూర్తిగా ఛేదించడం అని అర్థం. ఆచ్చిన్నం అంటే పూర్తిగా ఛేదించ బడింది.
ఆతపం అంటే ఎండ, అంతటా తపీంపచేస్తుంది కాబట్టీ ఎండకు ఆతపం అని పేరు. చంద్రుడి వెన్నెలను కూడా చంద్రాతపం అని అంటారు కావ్యాల్లో. విరహులను తపింపజేసేది కాబిట్టీ ఇది ఆతపం కావచ్చు.
ఆపద అంటే అంతటా పొందబదేది. ఆపత్తి, ఆపత్తు అన్నాఅదే అర్ధం. విపత్తు అని అర్థం. అపూరణం అంటే అంతటా నిండినది. ఆపూర్ణం, ఆపూర్తి అని కూడా అనవచ్చు. ఆపూరం అంటే (ప్రవాహం. అప్తావం అంటే అంతటా తదవడం. స్నానమనీ, మునగడమనీ అర్ధం. ఆభరణం అంటీ ఆంతటా భరింపబడేది. నగ. ఆఅభూషణం అన్నా ఆభరణమే. ఆసారం అంటే అంతటా పడేది. ధారాపాతంగా వర్షించేది, జడివాన.
“ఆజ్” ఉపసర్గకు మిక్కిలి, అధికమైన అనికూడా అర్ధం ఉంది. ఆకంపనం అంటే మిక్కిలి వణకడం. ఆక్రందం, ఆక్రందనం అంటే బిగ్గరగా ఏడ్వడం, పెద్ద పడుపు. జనుల ఆక్రందనాలు మిన్నుముట్టాయి వంటి ప్రయోగాలు సర్వసాధారణం. ఆ(క్రందనం అంటే బొబ్బరింత అన్న అర్థం కూడా ఉంది. దాడి చేసేముందు చేసే పెద్ద ధ్వని. ఆక్రందుడు అంటే మిత్రుడు. దండెత్తిపోయే రాజుకు వెనుక ఉండే శత్రువుకు వెనుక ఉన్నవాడు ఆక్రందుడు. అడక్రందికుడు అంటే ఆర్త రక్షకుడు.
ఆక్రుష్టి అంటే పెద్దగా పిలవడం, ఆక్రోశం, ఆక్రోశనం అన్న మాటలకు తిట్టు, నింద అని అర్థం ఉంది. పెద్దగా అరవడం అనికూడా అర్థం. రక్షణకోసం పెద్దగా అరవడం ఆక్రోశం, ఆక్రో శనం. ఆక్రోశం, ఆక్రోశించు నామవాచకంగానూ, (క్రియగానూ కూడా వాదుకలో ఉన్న మాటలు, పీన అంటే బలిసిన. ఆపీనం అంటే బాగా బలిసినది అని అర్ధం. బంధం అంటే కట్ట. ఆబంధం అంటే గట్టి కట్టు. ఆబద్ధం అంటే గట్టిగా కట్టబడింది.
భీరుడు అంటే పిరికివాడు. ఆభీరుడు అంటే మిక్కిలి పిరికివాడు.
ఆఘాతం అంటే దెబ్బ. విద్యుదాఘాతం అంటే ఎలక్ట్రిక్ షాక్,
ఆఖం, ఆఖరం, ఆఖనం, ఆఖానం అంటే గడ్డపార. ఆఖనికం అంటే గడ్డపార అన్న అర్థం
తోపాటు పంది, ఎలుక అన్న అర్భాలూ ఉన్నాయి. ఆఖనికుదు అంటే కన్నపు దొంగ, బ్ గాళవాన్న
ఆశ్రమం - ఆగ్రహం
(శ్రమకు తపస్సు అని అర్థం. ఆశ్రమంలో తపోనిష్టులవుతారు కాబట్టి ఇది ఆశ్రమం. శ్రము ధాతువు. ఈ ధాతువుకు తపస్సు, ఖేదం అర్థాలు. భారతీయ సంవ్రదాయంలో చతురాశ్రమాలు సుప్రసిద్ధం. నాలుగు ఆశ్రమాలలో మొదటిది బ్రహ్మచర్యం. 'బ్రహ్మ అంటే వేదం. వేదాధ్యయన వ్రతాన్ని కూడా (బ్రహ్మ అంటారు. ఈ బ్రహ్మ వ్రతాన్ని ఆచరించేవాడు (బ్రహ్మచారి. నాలుగువిధాల (బ్రహ్మచారులున్నారు. గాయత్రీ (బ్రహ్మచారి, ('ప్రాజాపత్య (బ్రహ్మచారి, వైదిక బ్రహ్మచారి, నైప్టీక (బ్రహ్మచారి. గృహస్థుడు అంటే గృహం కలిగినవాడు. ఇక్కడ గృహం అంటే భార్య. గృహస్థులు కూడా నాలుగు రకాలు. వార్తా వృత్తి శాలిన వృత్తి యాయావరుడు, ఘోరసన్వాాసి. వనంలో ఉండే వాడు వానప్రస్థుడు. వానప్రస్థులు కూడా నాలుగు రకాలు. బెదుంబరుడు, ఖేనసుడు, సంవ్రక్షాళి, పౌర్టముడు. నాలుగో ఆశ్రమం భిక్షు/న్యాసి. యాచించి జీవించేవాడు. ఈ సన్వాాసి కూడా నాలుగు విధాలు. కుటీచకుడు, బహూదకుడు, హంసకుడు, పరమ హంసకుడు. మనిషి జీవితంలో ఇవి నాలుగు దశలు. ఇదొక వ్యవస్థీకృత జీవితం.
ఆముక్తం అంటే విడిచిపెట్టబడినది. శ్రీకృష్ణదేవరాయల ్రాఢ ప్రబంధం ఆముక్తమాల్యద. పెట్టుకొని విడిచిన మాలను "భగవంతునికి ఇచ్చినది ఆముక్తమాల్యద. గోదాదేవి. తమిళంలో చూడికుడుత్తనాచ్చియార్ అంటారు.
ఆభాస అంటే కాంతి, ప్రతిబింబం అన్న అర్ధాలతోపాటు అవాస్తవం అన్న అర్థం కూడా ఉంది. అలంకార శాస్త్రాలలో రసాభాసం గురించి ఉంటుంది. శృంగార రసాభాసం, వీరరసా భాసం అన్నట్లుగా అన్ని రసాలకూ ఈ ఆభాసం ఉంటుంది. ఉదాహరణకు శృంగార రసాభాసాన్ని తీసికుంటే యువతీయువకులలో ఒకరికే అనురాగం ఉండి రెండవవారికి లేకపోతే రసాభాసం అవుతుంది. జంతువులు, పక్షుల శృంగారాన్ని వర్ణించడమూ, మనకు పూజనీయులయిన వారి శృంగారాన్నీ వర్ణించడమూ కూడా శృంగార రసాభాసమే. అనుచితమయినదంతా రసొభాసమే. ప్రస్తుతం రసాభాస అన్నమాటను గందరగోళం చెడిపోవడం అన్న అర్థంలో వాడుతున్నాం. సభ అంతా రసాభాస అయిపోయింది, కార్యక్రమం రసాభాస అయింది అనడం మామూలే. రసాభాస చేశారు అన్నప్పుడు పాడుచేశారు, గొడవచేశారు అని అర్ధం. ఆఖ్య అంటే పేరు. దీనితో పిలు స్తారు కాబట్టి ఆఖ్య. మనుచరిత్రలో ప్రవరాఖ్యుడున్నాడు కదా, ప్రవరుడు అన్నపేరు గలవాడన్న మాట. ఆభ్యాత అంటే చెప్పేవాడు. వ్యాఖ్యాతలో ఆభ్యాతకు 'వి ఉవసర్గ చేరింది. ఈ మాటలో రెండు ఉపసర్గలున్నాయన్న మాట. ఆఖ్యానం అంటే చెప్పబడేది, కథ. ఆఖ్యానకం అంటే చిన్న కథ. ఆఖ్యాయిక అన్నది ఒక గద్యకావ్య భేదం. ఇందులో వాస్తవంగా జరిగిన కథ ఉంటుంది. బాణభట్టు హర్షచరిత్ర ఆభ్యాయిక.
ఆగ్రహం అంటే పట్టుదల. గాంధీగారి సత్యాగ్రహంలోని ఆగ్రహానికి అర్ధం ఇదే. అయితే తెలుగులో ఈ అర్ధంలో ఈ మాట వాడుకలో లేదు. మన వాడుకలో ఆగ్రహం అంటే కోపం. కావ్యాల్లో కూడా ఈ అర్ధంలోనే ఆగ్రహాన్ని ఉపయోగించారు.
ఆచమనంలో నీళ్ళు తాగుతారు కాబట్టి ఆచమనం. ఆచరణం అంటీ నదవడి అని అర్ధం, ఒక పని చేయడం కూడా ఆచరణం, ఆచారం అంటే పరంపరగా వచ్చే వాడుక. ఆజేవం అన్నా
మనభాషతి 179
ఆజీవనం అన్నా ఆజీవిక అన్నా జీవికే, (బ్రతుకుతెరువు. రూపాజీవ అంటే రూపమే జీవన సాధనంగా కలిగినది. శస్త్ర జీవుడు అంటే శస్త్రమే సాధనంగా కలవాడు. ఆతర్చణం అంటే తృప్తి పరచడం. ఆదర్భం అంటే అద్దం. దీనిలో తన నీడ కనిపిస్తుంది కాబట్టి ఆదర్శం. అట్లాగే చూసి నేర్చుకోదగింది కూడా ఆదర్భమే. అద్దం అన్న అర్ధంలో కాక నేర్చుకోదగింది అన్న అర్ధంలోనే దీనికి తెలుగులో వాడుక ఎక్కువ.
ఆదీపనం అంటే మండించడం, పురికొల్బడం. ఈ మాటకు అలంకరించడం అన్న అర్థం కూడా ఉంది. అయితే ఆదీపకుడు అన్నమాటకు ఇళ్ళు తగులబెట్టేవాడు అని అర్ధం. ఆదేశం అంటే ఆజ్ఞ, ఆదేష్ట అంటే ఆదేశించేవాడు. యజ్ఞంలో బుత్విజులను నియమించేవాడు అదేష్ట యజ్ఞం చేసేవాడు, యజమాని,
ఆధారం అంటే కట్టకట్టి నీళ్ళు నిలిపిన ప్రదేశం.
ఆ(మేడితం అంటే రెండుమూడు సార్లు పలికిన మాట. ఎక్కువగా చేసినది అని కూడా అర్థం. వ్యాకరణాలలో ఆమ్రేడితం అన్నమ్హాట్టక్షు రెండుసార్లు పలికినమాటలో రెండవది అని అర్థం. 1మేడ్బ' ధాతువుకు ఉన్మాదం,పిచ్చి అన్ని అర్ధం. ఒకేమాట మాటిమాటికీ అనడం పిచ్చివాడి లక్షణం అన్న అభిప్రాయంతో ఆ(మేడితం అన్నమాటకు ఈ అర్ధం వచ్చింది.
ఆయుధం - దీనితో యుద్ధం చేస్తారు కాబట్టి ఆయుధం. ఆప్పచ్చ అంటే కుశల(వ్రశ్చ
ఆపణం అంటే అంగడి. ఇక్కడ వ్యవహారం జరుగుతుంది.
ఆపానం/ఆపానకం అంటే అనేకులు ఒక్కచోట కూడి కల్లుతాగడం. ఆసవం అంటే చెరకు నుండి తీసిన కల్లు. ద్రాక్షాసవం అని కూడా అంటారు. ఇక్కడ ద్రాక్ష నుండి తీసిన కల్లు.
ఆశంక అంటే సంశయం. ఆశంస అంటే కోరిక ఆశయం అంటే ఇల్లు. ఆశ్లేషం అంటే కౌగిలింత.
“ఆజ్ ఉపసర్గకు వ్యతిరేకార్థం కూడా ఉంది. దత్తం అంటే ఇవ్వబడింది అని అర్థం. ఆదత్తం అంటీ తీసికొనబడింది అని అర్ధం. హిందీలో ఆదాన్ ప్రదాన్ అనే మాట ఇచ్చిపుచ్చుకోవడం అన్న అర్ధంలో వాడుకలో ఉంది. ఇందులో ఆదాన్ అంటే తీసుకోవడం, ప్రదాన్ అంటే ఇవ్వడం. భాషా శాస్త్రంలో పదాదానం అన్న పరిభాష ఉంది. అంటే పదాలు అరువు తెచ్చుకోవడం. ఆదాత అంటే తీసికొనేవాడు. దాత అంటే ఇచ్చేవాడు కదా. ఆదేయం అంటే తీసికొనదగింది. దాయం అంటే విభజన చేయదగిన ధనం, దాయాదులు అంటే ఆ విధంగా ధనం పంచుకొని తినేవాళ్ళు. ఆదాయం అంటీ రాబడి.
యాతాయాతాలు అని ఒక ప్రయోగం ఉంది. ఇందులో యాతం అంటీ పోవడం. ఆయాతం అంటే రావడం, యాతాయాతాలు అంటే రాకపోకలు. బ్ 180 అ మనభాష
నిపుణుడు - నిదానం
కొమ, కామన అన్నమాటలకు ఇచ్చ, కోరిక అని అర్ధం. వీటికి “ని ఉపసర్గను చేర్చినప్పుడు తీవ్రమయిన ఇచ్చ అనే అర్ధం కలుగుతుంది. ఈ ఉపసర్గకు మిక్కిలి, అధికం అన్న అర్థంలో వాడుక ఉంది. నిదాఘం అంటే వేడి. దీనిలో జనం అధికమయిన తాపం పొందుతారు కాబట్టి ఇది నిదాఘం. వేసవిని నిదాఘం అనవచ్చు. వేడి వలన చెమట పుడుతుంది కాబట్టి నిదాఘం అన్నమాటకు స్వేదం అన్న అర్ధం కూడా ఉంది. నిపాకం అంటే ఎక్కువగా ఉదకడం. నిపుణుడు అన్నమాటను నేర్చరి అన్న అర్ధంలో వాడుతున్నాం. నిపుణుడు అంటే (ప్రకృష్ణమయిన వీణ కలవాడు. ఈ మాటకు రూఢివల్ల నేర్చరి అన్న అర్ధం ఏర్పడింది. నిపుణుడు అంటే మిక్కిలి శుభ కర్మనుచేసేవాడు. నిపుణ శబ్దం నుండే నైపుణ్యం ఏర్పడింది. నిభం అంటే మిక్కిలి (ప్రకాశించేది. సదృశం, సమానం అన్న అర్ధం కూడా ఉంది.
నిరతి/నిరతం అంటే అత్యంత ఆసక్తి అని అర్ధం. అయితే తెలుగులో నిరతం అన్నమాటకు ఎల్లప్పుడూ అన్న అర్ధంలో (ప్రయోగం ఎక్కువ. ముఖ్యంగా నిరతాన్నదాత వంటి ప్రయోగాలలో ఈ అర్ధం కనిపిస్తుంది. నిశాతం అంటే మిక్కిలి వాడి అయినది. నిశితం అంటే వాడి చేయబడి నది. పదునుపెట్టిన ఖడ్గం. నిశిత పరీక్ష నిశిత విమర్శ, నిశిత పరిశోధన మొదలైన విధంగా నిశిత శబ్దాన్ని విశేషణంగా వాడుతున్నాం. తీవ్రమయిన, సూక్ష్మమయిన, వాడి అయిన అన్న అర్భాలలో వాడుతున్నాం. నిహీనుడు అంటే మిక్కిలి నీచుడు అని అర్ధం. నిరూఢి అంటే మిక్కిలి ప్రసిద్ధి ఈ మాటకు ప్రావీణ్యం అన్న అర్ధంకూడా ఉంది. నితంబం అంటే పిరుదు. నితాంతం అంటే అధికం.
నికటం అంటే ఎడం లేనిది. సమీపంలో ఉన్నది. నివిష్పుడు అంటే కూర్చున్నవాడు, దండు విడిసినవాడు. ఇక్కడ సమీవం అని అర్ధం.
నికేతనం, నికార్యం, నికాయ్యం, నివసతి, నివసనం, నివాసం, నివేశనం, నిలయం ఈ మాటలన్నిటికీ ఇల్లు అని అర్ధం. సారస్వత నికేతనం.
నికారణం, నిశారణం, నిబర్దణం, నిషూదనం, నిహింసనం, నివాననం అన్నమా టలకు చంపడమని అర్థం. నిధనం అంటే చావు.
నికరం అంటే రాశి, న్యాయంగా ఇచ్చిన డబ్బు, నిధి. నికర ఆదాయం అని వాడుక ఇంగ్లీషులో నెట్ ఇన్కమ్ అన్న అర్ధంలో ఈ మాటను వాడుతున్నాం. చివరకు తేలిన ఆదాయం అన్నమాట. నికరం అన్నమాటకు గుంపు అన్న అర్థమూ ఉంది. నికాయం అన్నా గుంపే. నిచయం, నిచాయం అన్నా సమూహమే. నివహం అన్నా సమూహమే.
నికృతం అంటే అవమానించబడడం. నికృష్ణం అంటే హీనం. దుష్టకార్యం. నికృష్ణుడు అంటే హీనుడు.
ని ఉపసర్గకు అభావ్వార్ధం కూడా ఉంది. అంటే లేనిది అని అర్థం. నివాకువు అంటే మాటలు లేనివాడు. నివాతం అంటే గాలిలేనిది. గాలి చొరరానిది, సురక్షితమయినది. నియుద్ధం అంటే ఆయుధాలు లేని, యుద్ధం, బాహుయుద్ధం. నియోధనుడు అన్నా నియోద్ధ అన్నా బాహు యుద్ధం చేసేవాడు. నివర అంటే అవివాహిత అయిన స్తీ నికర్షణం అంటే దున్నని నేల. నివాస
మనభాషత 161
స్థలం. నిధనుడు అంటే డబ్బులేనివాడు.
- నివారణం, నివర్తనం, నివృత్తి, నివృత్తం అంటే మరలడం, తొలగించడం, విరమించడం. సందేహం నివృత్తి చేసుకోవడం అంటాం. నిశ అంటే రాత్రి. పనులు చేయడం మానడం కాని, తగ్గడంకాని జరుగుతుంది కాబట్టి నిశ “ని ఉపసర్గకు పూర్తిగా అని కూడా అర్ధం. నిలయం అంటే పూర్రిగా లయంకావడం. నిలీనం అంటే నిశ్శేషంగా లీనం కావడం. నిబంధం అంటే కట్టు. మలమూత్రాలను కట్టివేయడం కూడా నిబంధం. పోతనగారు నిరయంబైన, నిబంధమైన... అని ప్రయోగించారు. నిరయం అంటే నరకం. నరకం వస్తే రానీ, మలమూత్రాలు కట్టువడితే పడనీ వమయినా మాట తప్ప నంటాడు బలి చక్రవర్తి నిబంధం అంటే సంకెల అని కూడా అర్ధం. నిర్మించడం, ఏర్పాటు, రచన అనే అర్థాలున్నాయి. హిందీలో నిబంధ్ అంటే వ్యాసం అని అర్థం. ఈ అర్ధంలో తెలుగులో వాడుక లేదు. నిబంధన అంటే నియమం అన్న అర్ధం తెలుగులో ఎక్కువ ప్రచారంలో ఉంది. నిఖిలం అంటే సర్వం అని అర్ధం. నిపానం అంటే మొత్తం తాగడం. నీళ్ళతొట్టి, పాలు పితికే కుంద. నికషం అంటే ఒరయిక్క ఒరగల్లు. గీటురాయి. పరీక్ష అన్న అర్ధంలో కూడా వాడు తున్నారు. నివేశం అంటే తుల్యం. నికుంజం అంటే పొదరిల్లు. నికుంభం అంటే ఏనుగు. నికు రుంబం అంటే సమూహం. శ్రీనాధునికి ఇష్టమయిన మాట ఇది. సరస సద్గుణ నికురుంబ శార దాంబ వంటి ప్రయోగాలెన్నో చేశాడు. నిక్షణం, నిక్వాణం అంటే ధ్వని, నిక్షిప్తం అంటే పాతబడినది. నిక్షేపం అంటే నిధి. కదల కుండా స్థిరంగా ఉండేది అన్న అర్ధంవల్ల నిక్షేపం అంటే సురక్షితంగా, భద్రంగా ఉండడమన్న అర్ధం ఏర్పడింది. ఆయనకేం నిక్షేపంగా కాలక్షేపం చేస్తున్నాడు అంటాం నిఖననం అంటే తవ్వడం. నిగళం అంటే సంకెల నిగూఢం అంటే గుప్తం. నిగూహనం అంటే దాచడం అని అర్ధం. నిగ్రహం, నిగ్రహణం అంటే అడ్డగించడం, చెరపట్టడం. నిఘర్నం, నిఘర్షణం అంటే రాపిడి. నిడీనం అంటే పక్షులు ఆకాశం నుండి కిందికి దిగడం. నిజంఅంటే తన అనీ, నిత్యం అనీ అర్థం. నిచోళం అంటే పరుపుమీద పరిచే వస్త్రం. నిదర్శనం అంటే చూపించేది, నిరూపించడం ఉదాహరణం, దృష్టాంతం అని కూడా అర్ధం. నిదానం అంటే ముఖ్య కారణం. దీనిచేత కార్యం పుట్టించబడుతుంది కాబట్టి నిదానం. చక్కగా విచారించడం. రోగనిదానం అంటే రోగానికి మూలకారణం. తెలుగులో నిదానం అంటే మెల్లగా, జాగ్రత్తగా అన్న అర్ధం ఏర్పడింది. నిద్రలో ఇంద్రియాలు అణగి ఉంటాయి కాబట్టి నిద్ర. నిద్రాణం అంటే ని(దించేది. నిద్రా ళువు అంటే నిద్రపోతు. నిపతనం, నిపాతం, నిపాతనం అంటే కిందికి పడడం. వ్యాకరణంలో ఒక నిపాతం ఉంది. వ్యాకరణ సూత్రానికి విరుద్ధంగా విధించిన శబ్దం నిపాతం. నిమంత్రణం అంటే పిలుపు. నిమజ్జనం అంటే మునగడం, లీనం కావడం. నిమిత్తం అంటే కారణం, చిహ్నం. నియోగం/నియోజనం అంటే అధికారంలో నియమించడం. నియోగం అనే మాటకు 182 అమనభాష
పరివారం అన్న అర్ధం కూడా ఉంది. ఇది తెలుగులో మాత్రమే. పూర్వం సంతానప్రాప్తికి అవలం బించే మార్థాలలో నియోగం ఒకటి. నియోగి అంటే అధికారి. (బ్రాహ్మణులలో ఒక తెగ వారికే ఈ పేరు ఉంది తెలగాణ్యులు, ఆరువేల నియోగులు, నందవరీకులు మొదలయిన భేదాలున్నాయి నియోగుల్తో,
నిరోధం అంటే అడ్డగింత. నివేదన తెలియజేయడం. నివేదించుకోవడం అన్నప్పుడు తెలుపుకోవడం అని అర్ధం. నివేదన అంటే సమర్పణ అన్న అర్థమూ ఉంది. ఈ అర్థంలోనే నైవేద్యం, దేవతలకు సమర్పించదగింది.
నియమం, నియామం, నియతి, నియమనం సమానార్థకాలు. నియమం అంటే వ్రతనిష్ట అనికూడా అర్థం. నియమస్టుడు అంటే వ్రతనిష్టలో ఉన్నవాడని అర్థం.
జ్ మనభాషతి 153
అధికారం - అధిష్టానం “అధి అనే ఉపసర్గ ప్రధానంగా అధికం అన్న అర్ధాన్నిస్తుంది. అధికర్మం అంటే గొప్పకార్యం. ఈ మాటకు అధికారం అన్న అర్ధం కూడా ఉంది. అధికృత్యం అన్నా ఇదే అర్ధం. అధి[క్రియ, అధికృతి, అధికారం ఈ మాటలన్నీ ఒకే అర్ధంలో వాడుకలో ఉన్నాయి. అధికారం అంటే అధ్యక్షత, దొర తనం, స్వామ్యం. అధికారం అంటే అర్హత అన్న అర్థమూ ఉంది. ఆశ్రయం అన్న అర్థం కూడా ఉంది. అధికారి అంటే అధికారం ఉన్నవాడు. అందరి మీద నియోగింపబడినవాదు. అధికరణం అన్నా అధికారమన్న అర్ధం ఉంది. అధికారంలో ఉంచడాన్నీ అధికరణమనవచ్చు. న్యాయ విచారణ స్థలాన్నీ అధికరణం అనవచ్చు. అధికరణం అంటే ఆధారం కూడా. వ్యాకరణాలలో కారక ప్రకరణంలో చెప్పే కారక భేదాలలో అధికరణ కారకం ఒకటి. ఇక్కడ ఆధారమనే అర్థం. మూడురకాల ఆధారం చెప్తారు. ఒకటి బెషశ్లేషికం. బెషక్లేషికం అంటే సమీప సంబంధం. ఘట మందు జలమున్నది అని ఉదాహరణ. రెండవది వైషయికం. విషయ సంబంధం. మోక్షమందిచ్చ కలదు అని ఉదాహరణ. మూడవది అభివ్యాపకం, అంతటా వ్యాపించి ఉండడం అన్నింటియం దీశ్వరుడు కలడు అని ఉదాహరణ, మొదటిదానిలో నీటికి ఆధారం కుండ. రెండవదానిలో ఇచ్చకు ఆధారం మోక్షం. మూడవదానిలో ఈశ్వరుని అభివ్యాప్తికి ఆధారం అన్నీ. ఆధారమయిన వస్తువుకు సప్తమీ విభక్తి వస్తుందని వ్యాకరణం చెప్తన్నది. అయితే అధునిక భాషలో ఈ సప్తమీ విభక్తి ప్రత్యయానికి బదులు షష్టీ విభక్తి ప్రత్యయం 'లో వాడుతున్నాం. అధికారం, అధికరణం అన్న రెండు మాటలనూ లక్షణ [గ్రంధాలలో పరిచ్చేదం, ప్రకరణం అన్న మాటలకు పర్యాయంగా కూడా ప్రయోగించారు. గ్రంధ భాగం అన్నమాట. ఆ భాగంలో ఆ ప్రత్యేక విషయానికి సంబంధించిన నియమాలుంటాయి అధికరించు అని క్రియగా నేర్చు, వహించు, ప్రధానంగా చేసికొను అన్న అర్థాలలో వాడవచ్చు. అధిక్రమం అంటే ఎక్కడం, దండెత్తడం. అధిక్షేపం అంటే నింద, తిరస్కారం. స్థాపన, (ప్రేరణ అన్న అర్థాలు కూడా ఉన్నాయి కాని ప్రచారంలో లేవు. అధిక్షేపించడం అంటే నిందిం చడం, ధిక్కరించడం, ఆక్షేసించడం. అధిగమం అంటే పొందడం. అధిగమించు అంటే పొందు, ధరించు, చదువు, తెలిసికొను, ప్రవర్తించు, చొచ్చు మొదలయిన అర్భాలున్నప్పటికీ దాటడం అన్న అర్ధం ప్రచారంలో ఉంది. ఈ సమస్యను అధిగమించడం ఎలా? వంటి వాక్యాలలో ఈ అర్ధమే ఉంది. కష్టాలను, అవరోధాలను అధిగమించవలసి ఉంటుంది. అధి కామం అంటే తీవ్ర వాంఛ. అధిగుణం అంటే గొప్ప గుణం. గుణం అంటే వింటినారి అని కూడా అర్ధం. ఈ అర్ధంలో అధిగుణం అంటే ఎక్కుపెట్టబడినది అని అర్ధం. అధిజిహ్వ అంటే "కొండనాలుక. అధి జిహ్వం అంటే పాము. ఎక్కువ నాలుకలు ఉన్నది. ఇక్కడ పాముకు రెండు నాలుకలు కాబట్టి అధిజిహ్వం. అధిజ్యం అంటే ఎక్కుపెట్టిన విల్లు జ్యా అంటే వింటినారి. కాల (క్రమాన శిథిలమవుతుంది కాబట్టి దీనికి జ్యా అని పేరు. అధి దంతం అంటే పంటి మీద మొలిచిన పల్లు దంతం అంటే పల్లు, పన్ను అన్నమాట సరయింది కాదు. కన్ను-కళ్ళు, పల్గు-వళ్ళు కన్ను సామ్యంవల్ల ఏకవచనంలో వన్ను ఏర్పడింది. 184 తి మనభాష
అధిదేవత అంటే అభిమాన దేవత, సర్వాధిపతి. అధినాథుడు అంటే సర్వాధికారి. అధిపతి అన్నా అధిపుడు అన్నా అధిభువు అన్నా (ప్రభువు. అధి పురుషుడు అంటే పరమేశ్వరుడు. అధిభూతం అంటే పరమాత్మ. అధిపతి నుండే ఆధిపత్యం.
అధి మంధనం అంటే నిప్పుకోసం కర్రను క్రచ్చడం. అరణి అని కూడా అర్థం. అగ్ని పుట్టే కట్టె. అధిమాత్రం అంటే ఎక్కువ ప్రమాణం ఉన్నటువంటిది. అధిమాసం అంటే అధిక మాసమే. అధియోధుడు అంటే గొప్ప వీరుడు. మేటిజోదు. అధిరథుడు అంటే రధం మీద ఉన్నవాడు.
అధిరాజు, అధిరాట్టు, అధీశుడు, అధీశ్వరుడు చక్రవర్తికి పర్యాయపదాలు. అధిరాజ్యం అంటే గొప్పరాజ్యం. అధిరోహణం అంటే ఎక్కడం. సింహాసనం అధిరోహించాడు, ఎవరెస్టు శిఖరం అధిరోహించాడు వంటి వాక్యాలు ఉదాహరణలు. అధిరోపణం అంటే ఎక్కించడం, అధి రోహిజి అంటే నిచ్చెన, మెట్లవరుస.
అధివాసం అంటే ఉనికిపట్టు. అధ్యశనం అంటే ఎక్కువగా తినడం. అధ్యస్థి అంటే ఎముక మీద పెరిగిన ఎముక.
అధివిన్న అంటే పెద్ద భార్య. అధివేదం అంటే భార్య ఉండగా మరో స్త్రీని పెళ్ళిచేసికోవడం. బహుభార్యాత్వం నేరమయిన ఈనాడు ఈ మాటల అవసరం లేదు. అధిశ్రయం అంటే ఆథయం. అధిశయణి అంటే పొయ్యి. అధిశ్రయణం అంటే పొయ్యిమీద వండడం.
అధిష్టాత అంటే అధ్యక్షుడు, నియామకుడు, అధి దేవత. అధిష్టానం అంటే దగ్గరగా ఉండడం, ఉనికిపట్టు, ఆశ్రయం, (ప్రాభవం, ఏలుబడి. అధిష్టానవర్గం అన్నమాటను వత్రికలలో ఎక్కువగా వాడుతున్నారు. రాజకీయ పార్టీలలో అన్ని నిర్ణయాలు చేసే అధికారం చేతిలో ఉన్న వారు అధిష్టానవర్గం. ప్రాభవం కలిగిన, అధికారం కలిగిన వర్గం.
అధ్యక్షుడు అందరిమీదా వ్యాపించి ఉండేవాడు. పనులు కనుపెట్టి చూస్తూ ఉండేవాడు. అధ్యక్ష శబ్దం నుండి ఆధ్యక్షం ఏర్పడింది. అధ్యయనం అంటే చదవడం. అధ్యవసాయం అంటే ప్రయత్నం.
అధ్యాత్మం అంటే ఆత్మ స్వభావం. అధ్యాత్మ రామాయణం ఉంది. అధ్యాత్మ రామాయణ కీర్తనలూ ఉన్నాయి. పరమాత్మకూ జీవునికీ సంబంధాన్ని రామ కథారూవంలో చెప్పిన రచన అధ్యాత్మ రామాయణం. అధ్యాత్మ విద్య అంటే (బ్రహ్మవిద్య, అధ్యాత్మ నుండే ఆధ్యాత్మిక అనే విశే షణం ఏర్పడింది.
అధ్యాపనం అంటే వేదం నేర్చడం, చదువు చెప్పడం. అధ్యాపకుడు చదువు చెప్పేవాడు.
అధ్యుష్టం అంటే ఒంటెలు లాగే బండి. అధ్యూఢుడు అంటే శివుడు. అధ్యేషణ అంటే అధిక ప్రార్ధన. అధ్యూఢం అంటే సమృద్ధి.
అధ్యాహారం అంటే ఊహా, తర్మం. లేనిదానిని ఊహించి తెలుసుకోవడం అధ్యాహారం.
“అపి అనే ఉపసర్గతో ఏర్పడే పదాల వాడుక తెలుగులో చాలా తక్కువ. దీనికి కూడా ఎక్కువ అనే అర్ధం ఉంది. అపిధానం అంటే మిక్కిలి మరుగువరచేది, మూత, అపిధానం అన్నా తిరోధానం అన్నా అర్ధం ఒకటే. అపిహితం అన్నా అపిధానమే. అపినద్ధం అంటే కట్టబడినది. కట్టిన వస్త్రం. ధరించబడినది.
స్ మనభాషతి 185
అతిక్రమం - అతిపరిచయం సంస్కృతంలో 'అతి ఒక ఉపసర్గ. ఇది మాటగా తెలుగులో చాలా వ్యాప్తిలోకి వచ్చింది. అతిగా తినవద్దు, అతిగా మాట్లాడవద్దు మొదలయిన వాక్యాలలో క్రియా విశేషణంగా ఎక్కువగా అన్న అర్థంలో “అతొని వాడుతున్నాం. వాడు మరీ అతైపోయాడు, మరీ అంత అతి పనికి రాదు, అతికి పోతే ఇలాగే అవుతుంది వంటి వాక్యాలు తరచుగా వినబడుతూ ఉండేవే, అతిపెద్ద నగరం, అతిచిన్న వాక్యం అని విశేషణంగా కూడా దీనికి వాడుక ఉంది. ఎక్కువ అన్న అర్ధంలో “అతికి విసృతమయిన వాడుక ఉంది. ఉపసర్గగా “అతి” ఎక్కువ, మీరడం, దాటడం అన్న అర్ధాలు ఇస్తుంది. ఉదాహరణకు అతి కాయుడు అంటీ పెద్ద శరీరం కలవాడు. అసాధారణమయిన కాయం అన్నమాట. రావణాసు రుని కొడుకుల్లో ఒకడు అతికాయుడు. అతికధ అంటే మితిమీరిన వర్ణన, అధిక ప్రసంగం. అతికథం అంటే అధికంగా వర్ణించ బడింది అని ఒక అర్థం. మరో అర్ధం కధ నుండి దాటిపోయింది అని. నశించిపోయింది అని కూడా అర్ధం. వాడి కధ ముగిసింది అంటాం కదా. కధ ముగియడం అంటే నాశనమవడం. అతి కథం అన్నమాటకు ఈ అర్థమూ ఉంది. కర్షణ అంటే రాపిడి. అతికర్షణ అంటే మిక్కిలి రాపిడి. అతికష్టం అన్నా అతికృచ్చ్ర్యం అన్నా మిక్కిలి కష్టం అని అర్థం. అతికృతి ఆంటే మితిమీరి చేసిన పని. అతికృతం అన్నా అదే అర్ధం. అతికేసరం అంటే ఎక్కువ కేసరాలున్నది. అతికేశరం అనికూడా అనవచ్చు. కేసరాలకు కింజల్కాలని కూడా పేరు. అతికేసరం అంటే గొజ్జంగి. గొజ్జంగి నీరు పన్నీరు. అతిక్రమం, అతిక్రమణం అంటే దాటడం, ఉల్లంఘించడం. సమయాతిక్రమణం జరి గింది అన్నప్పుడు వేళ దాటింది అని అర్ధం. కాలాతిక్రమం, వేకాతిక్రమం అని కూడా అనవచ్చు. అతిక్రాంతం అంటే అతిక్రమించినది అని అర్ధం. మర్యాదాతి[క్రమం అంటే హద్దు మీరడం. అనాదరం చేయడం. అతిక్రూరం అంటే మిక్కిలి క్రూరం. వక్రగతి కలిగిన క్రూర (గ్రహం అని కూడా అర్ధం. ఈ అర్థంలో శని అంగారకుడు. అతిక్షిప్తం అంటే దూరంగా చిమ్మబడినది. అతిగందం అంటే పెద్ద చెంపగలిగినది. గండం అంటీ చెంప. గండ స్థలం అని కూడా అంటాం. కపోలం అనీ, చెక్కిలి అనీ కూడా అర్థం. అతి గంధం అంటే ఎక్కువ వాసన కలిగినటువంటిది. గంధకానికీ ఈ పేరు ఉంది. చంవకానికీ ఈ పేరు సరిపోతుంది. చంపకం అంటే సంపెంగ. సంపెంగ మొగ్గకు గంధ ఫలి అని పేరు. అతిగవుడు అంటే గోవునతిక్రమించిన వాడు. మూర్చడని ఒక అర్థం. వాక్కులకు అగో చరుడు, పరమాత్మ అని మరొక అర్ధం. గహనం అంటే అడవి అని అర్ధం. దుష్టమృగాలచేత కలచబడేది కాబట్టి గహనం. గహ్వరం అంటే కొండబిలం. దుష్ట మృగాలతో కూడి ఉండడంచేత అడవిలో (ప్రవేశించడమూ కష్టమే. కొండబిలంలోకి ప్రవేశించడమూ కష్టమే. అతిగహనం, అతిగహ్వరం అంటే మిక్కిలి చొరరానిది అని అర్ధం. గహనం అంటే చౌరరానిది అన్న అర్ధంతోపాటు తెలిసికొనలేనిది అన్న 1586 అమనభాష
అర్ధం కూడా ఉంది. అతిగహనం అన్నప్పుడు అర్ధం చేసుకోవడానికి చాలా కష్టమయినది అని అర్ధం. గహ్వరం అంటే గుహ అన్న అర్ధంతోపాటు కపటం అన్న అర్ధం కూడా ఉంది. మిక్కిలి లోతైనది, చారరానిది అని అతిగహనానికి అర్ధం చెప్పుకోవచ్చు.
అతిగ్రహం అంటే గ్రహింపశక్యం కానిది, తెలిసికోలేనిది. విస్తారంగా గ్రహించేది అన్న అర్ధం కూడా ఉంది. ఆ విధంగా (గ్రహించేది ఇంద్రియాలు కాబట్టి అతి[గ్రహం అంటే ఇంద్రియం. అతి[గ్రహం అంటే సరిగా గ్రహించడం కూడా.
అతిఘం అంటే మిక్కిలి హింసించేది. ఆయుధమనీ, కోపమనీ అర్ధం. అతిచారం అంటే మేరమీరి ప్రవర్తించడం.
అతిజాగరం అంటే ఎల్లప్పుడూ మేలుకొని ఉందేదె. నల్లకొంగ అట. అతిజాతుడు అంటే తండ్రికంటే ఎక్కువ అయిన వాడు. అతితారం అంటే పెద్ద ధ్వని. తార అంటే అత్యుచ్చ స్వరం. అందువల్ల తారస్థాయి అనాలి. తారా అంటీ నక్షతం. తారస్థాయిలోని తార వేరు, చుక్కఅన్న అర్ధ మున్నతారవేరు. నక్షత్రమన్న అర్ధంలోనే తారాస్థాయి అని ఏర్పడుతుంది. తారస్థాయి అన్నప్పుడు అత్యుచ్చ స్వరస్థాయి అని అర్ధం కాబట్టీ తారాస్థాయి కాదు.
అతితీవ్రం అన్నా అతి తీక్షణం అన్నా ఒకటే.
అతిదేశం అంటే ఒకదాని ధర్మాన్ని వేరొక దానిలో ఆరోపించడం. అతి ధన్వుడు అంటే మిక్కిలి గొప్ప విలుకాడు. అతిధృతి అంటే అత్యంత ధైర్యం. ఒక ఛందస్సు పేరుకూడా అతిధృతి. ఈ ఛందస్సులో పాదానికి పందొమ్మిది అక్షరాలుంటాయి. శార్టూలం, మేఘ విస్ఫూర్దితం, తరల వృత్తాలు ఈ ఛందస్సులో పుట్టినవే.
అతినిద్రుడు అంటే మిక్కిలి నిద్రపోయేవాడు. నిద్రలేనివాడినీ అతినిద్రుడనవచ్చు. అతిపత్తి అంటే జరిగిపోవడమనీ, జరగకపోవడమనీ కూడా అర్ధం. కాలాతిపత్తి అంటే కాలం గడచి పోవడం, క్రియాతిపత్తి అంటే వని జరగకపోవడం.
అతివత్రం పెద్ద ఆకు కలిగినటువంటిది. టేకు చెట్టు వంటిది. అతివథం అంటే మార్గాన్ని అతిక్రమించింది. అతిపంథ అంటే మంచి మార్గం.
అతి పరిచయం అంటే మితిమీరిన చనువు.
అతి పరిచయాదవజ్ఞా, సంతత గమనాదనాదరోభవతి
మలయే భిల్లపురంధ్రి, చందన తరుకాస్ట్ర మింధనం కురుతే,
అని ఒక చాటు పద్యం ఉంది. అతి పరిచయం వల్ల అవజ్ఞ కలుగుతుంది. బంధువుల ఇంటికి అరుదుగా వెళ్ళడం, వెళ్ళినవ్పుడు ఒకరోజో, రెండు రోజులో ఉండడం వారికి సంతోష కరంగా ఉంటుంది. అదే మాటిమాటికీ వెళ్ళి రోజుల తరబడి తిష్టవేస్తే వాళ్ళకు ఇబ్బందికరం గానూ ఉంటుంది. అనాదరం కలగకమానదు. మలయ పర్వతం మీద ఉన్న భిల్ల స్రీలు గంధపుచెక్కతో వంట చేస్తారు. ఎక్కువ లభిస్తుంది కాబట్టి వారికి గంధపు చెక్కవిలువ తెలియదు. అలభ్యమయిన వస్తువు మీద ఉందే ప్రీతి, గౌరవం తేలికగానూ, చవకగానూ దొరికే వస్తువు మీద ఉండదు కదా. అతి సమీపంలో ఉండడం కూడా గౌరవాన్ని తగ్గిస్తుంది.
పరోక్షం అంటే కన్నుల ముందు ఉండకపోవడం. ప్రత్యక్షం అంటే కన్నుల ముందు ఉండడం. అతి పరోక్షం అంటే చూపుకు చాలా దూరంలో ఉండడం. అతి పరోక్షం అంటే కను క్నోలేనిది. బ్
మనభాషతి 167
అతిరథుడు - అతివాదం “అతి ఉపసర్గ ఎక్కువ, అతిక్రమించి అన్నరెండు అర్భాలలోనూ ప్రయుక్షమవుతుంది. అతిభారం అంటే ఎక్కువ బరువు. అతిభారగం అంటే కంచరగాడిద. దీన్ని వేసడం అని కూడా అంటారు. ఎక్కువ బరువును మోస్తుంది కాబట్టీ అతిభారగం. అతిప్రసక్తి, అతి ప్రసంగం అంటే మిక్కిలి మాట్లాడడం, అత్యాంతసక్తి. ఎడతెగని కూడిక అని కూడా అర్ధం. అతిప్రశ్చం అంటే మర్యాద మీరిన ప్రశ్న. (ప్రశ్నకు జవాబు చెప్పినా మరీమరీ అడగడం. అతిభోజనం అంటే తిండిపోతుతనం. అతిభూమి అంటే కడపటి హద్దు. వృద్ధి-ప్రవృద్ధి- అతిప్ర వృద్ధం. అతిప్రవృద్ధుడు అంటే చాలా ఎక్కువగా పెరిగినవాడు. పొగరుబోతు అని కూడా అర్థం. అతిపాతం అంటే (క్రమం తప్పి తొలగిపోవడం. అతిమానుషం, అతిమర్ష్యం ఈ రెండు మాటలకు అర్ధం ఒకటే. మనుష్యశక్తికి మించినది అని అర్ధం. దైవికమైనదని అర్ధం, ఎవరైనా మానవశక్తికి మించిన గొప్పకార్యం సాధించినప్పుడు వారు అతి మానుషమయిన కార్యం నిర్వహించారంటాం. మనుష్యులకు సాధ్యం కానిపని చేశారన్నమాట. అతిమాత్రం అంటే అధికం. అతిమాత్రమైన తెలివిని చూపించాడు అంటే గొప్ప తెలివిని చూపించాడని, అతిమానం అంటే దురభిమానం, గర్వం అని అర్ధం. ఇక్కడ వ్యతిరేకార్థం. అతి మారుతం అంటే పెద్దగాలి. తుఫాను. అతిమిత్రుడు అంటే అత్యంత స్నేహితుడు. అతిమృత్యువు అన్నవ్వుడు మృత్యువును జయించినవాడని అర్ధం. రక్తం అన్న మాటకు ఎగ్రనిది, రాగం అంటే (ప్రేమ కలిగినది అని అర్ధం. అతిరక్తం అంటే మిక్కిలి ఎర్రనిది, మిక్కిలి (పేమకలది. అతిరథ మహారథులన్నది జాతీయమయిపోయింది. అతిరధుడు అంటే అనేకమంది రధి కులతో ఒంటరిగా పోరాడగల యోధుడు. మహారధుడు అంటే పది వేలమంది విలుకాళ్ళతో అస హాయుడుగా పోరాడే మహాయోధుడు. సమరధుడంటే ఒక విలుకానితో పోరాడేవాడు. అర్ధ రథుడు ఈ ముగ్గురికంటే తక్కువవాడు. భీష్ముడు కర్టుజ్జి అర్ధరధుడిగా వర్గీకరించాడు. కర్ణుడు అలిగి భీష్ముడు చనిపోయేవరకు యుద్ధం చేయనన్నాడు. ఇవ్చుడు అతిరధ మహారథులన్న మాటను గొప్ప నాయకులు అన్న అర్ధంలో వాడుకున్నాం. అతిరభసం అంటే అతివేగం. అతిరాత్రం అంటే జ్యోతిష్టామంలో ఒక భాగమయిన యజ్ఞం. అతిరేకం అంటే అధికం, హెచ్చు. దీనినుందే అతిరిక్తం. అతిర్తిక్తం అంటే హెచ్చినది. మితిమీరినది, గొప్పది అని అర్ధం. వ్యతిరిక్తమన్న అర్ధం కూడా ఉంది. రిక్తం అంటే శూన్యం, వ్యర్ధం అన్న అర్ధం ఉంది. రిక్తహస్తుడు చేతిలో ఏమీలేనివాడు. అతిర్తిక్తం అంటే మిక్కిలి శూన్య మైనది అని కూడా అర్ధం. అతీివక్త అంటే ఎక్కువగా మాట్లాడే వాడు, వదరుబోతు. మాటలమారి. అతివర్తనం అంటే మితిమీరి ప్రవర్తించడం. అతివర్తులం అంటే మిక్కిలి వర్తులమయినది, గుంఢడ్రనైనది. 188 అ నునభాష
అతివాదం అంటే వాదాన్ని అతిక్రమించింది. అధికవాదం. ఈ మాటకు పరుషవాక్యం అనీ, అతిశయోక్తి అనీ కూడా అర్ధం ఉంది. మన రాజకీయ పరిభాషలో మితవాదం అతివాదం అన్నమాటలు స్థిరపడిపోయాయి. ఈ శతాబ్దం ప్రారంభంలో కాంగ్రెసు పార్టీలోనే మితవాదులు, అతివాదులు అని రెండు వర్గాలుండేవి. గోపాలకృష్ణ గోఖలే వంటివారు మితవాదులు, తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్ వంటివారు అతివాదులు, ఈ అతివాదుర్నే జాతీయ వాదులని కూడా అనేవారు. ఇది తర్వాత రాజకీయ పార్టీల వర్గీకరణానికి వ్యాపించింది. మిత వాద పార్టీలు అతివాద పార్టీలు అని. తరువాతి కాలంలో రాజకీయ పక్షాలలో విఖేదా లేర్పడినవ్వుడు సంప్రదాయవాదులు మితవాదులుగానూ, వారికి వ్యతిరేకులు అతివాదులుగానూ గుర్రింపు పొందారు. తర్వాత అతివాదులంటే తీవ్రవాదులు, ఉగ్రవాదులన్న అర్ధం ఏర్చడింది. అతివాద రాజకీయాలన్నమాటా ఏర్పడింది.
అతివృష్టి అంటే మిక్కుటమయినవాన. అధికవర్నం. దీనికి వ్యతిరేకం అనావృష్టి. వానలేక పోవడం. ఈ రెండు మాటలనూ వానకే కాక ఇతర సందర్భాలలోనూ వాడుతున్నాం. సమతౌల్యం లేని విషయాలలో, స్థిరత్వం లేని సందర్భాలలో అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అంటాం. అతివేలం అంటే మేర మీరినది.
అతివ్యాప్తి అంటే మితిమీరి వ్యాపించడం. లక్షణశాస్తాలలో అతివ్యాప్తి, అవ్యాప్తి అన్న రెండు మాటలు కనిపిస్తాయి. అతివ్యాప్తి అంటే లక్ష్యం కాని దానికి కూడా లక్షణం వర్తించడం. అవ్వ్యాప్తి అంటీ లక్ష్యం అయిన దానికి కూడా లక్షణం వర్తించకపోవడం. మనం ఒక నిర్వచనం చెప్తే ఆ నిర్వచనానికి అతివ్యాప్తి అవ్యాప్తి దోషాలుండకూడదు.
అతిశయం అంటే అధికం. అన్నింటినీ దాటినటువంటి బెన్నత్యం. అతిశయోక్తి అలం కారం కూడా ఉంది. వాస్తవం కంటే చాలా ఎక్కువగా వర్ణించడం. ఇది అందంగా ఉంటే అలం కారం అవుతుంది. అతిశయం అంటే గర్వం అన్న అర్థం కూడా ఏర్పడింది. వాడికి చాలా అతిశయం అన్నప్పుడు గర్వమనే అర్థం. దీనికి అతిశయనం అన్న రూపాంతరం కూడా ఉంది. అతిశయనం అంటేమితిమీరి పరుండడం అని కూడా అర్థం. అతిసర్గం అంటే నిత్యం అనీ, దానం అనీ అర్థం.
అతిసారం అంటే ఎక్కువగా విరేచనాలు అయ్యే జబ్బు. అతిసారవ్యాధి. అతిసారవ్యాధితో బాధపడుతున్నవాడు అతిసారి, అతిసారకి.
అతిసౌరభం అంటే మిక్కిలి పరిమళం. అతిస్నేహం అంటే మిక్కిలి (పేమ. అతిస్పర్భుడు అంటే పిసినారి, లోభి, అథముడు.
అలంకారశా(స్తాలలో నవ్వు ఆరురకాలని చెప్పారు. స్మితం, హసితం, విహసితం, అవహ సితం, అపహసితం, అతిహసితం అన్నవి ఈ ఆరు రకాల హాసాలు; వీటిలో మొదటి రెందూ ఉత్తములలోనూ, తరువాతి రెందూ మధ్యములలోనూ, చివరి రెండూ అధములలోనూ చూపిం చాలి. శరీరం కంపించేటట్లు నవ్వడం అతిహసితం. పొట్టచెక్కలయ్యేట్లు నవ్వడం అంటామే అది అతిహసితం.
అతీంద్రియం అంటే ఇంద్రియాలకు గోచరించనిది. అతీంద్రియ శక్తులు అంటాం.
మనభాషతి 150
ఇంద్రియాలకు మించినటువంటి శక్తులు అని అర్ధం.
అత్యంకుశం అంటే అంకుశానికి లొంగనిది. అత్యంతగతుడు అంటే మళ్ళీ తిరిగి రాకుండా పోయినవాడు. అత్యంతగామి అంటే ఎక్కువగా నడిచేవాడు. వేగంగా నడిచేవాడినీ అత్యంతగామి అనవచ్చు.
అత్యంతం మనం చాలా ఎక్కువగా వాడేమాట. అత్యంత అని విశేషణంగా దీన్ని ప్రచు రంగా వాడుతున్నాం. అత్యంతం అంటే అంతంలేనిది, అధికం.
అత్యంతవాసి అంటే శాశ్వతంగా గురువు దగ్గరే నిలిచి ఉందే శిష్యుడు. అత్యగ్ని అంటే అగ్నిని అతిక్రమించింది, జబ్బువల్ల కలిగే అధికమయిన ఆకలిని కూడా అత్యగ్ని అంటారు. అత్యమ్లం అంటే మిక్కిలి పుల్లనిది. అందువల్ల చింతచెట్టుకు కూడా ఈ పేరు వచ్చింది. అత్యయం అంటే అతిక్రమించడం, అపాయం, దోషం, దుఖం, బాధ.
అత్వాచారం అంటేవిహితాచారాలను విడిచినది, అనుచితమయిన (ప్రవర్తన, మత విరుద్ధంగా నడవడం, ఉల్లంఘన, మిక్కుటమయిన ఆచారం. నేటి పత్రికలలో స్త్రీలపై అత్యా చారం అన్న సందర్భంలో ఎక్కువగా వాడుతున్నారు. హత్య, అత్యాచారం రెండూ_ కలిసి అక్క డక్మడా హత్యాచారం అన్న(వప్రయోగమూ కనిపిస్తుంది. అత్యాశ అంటే పేరాస. అత్యహితం అంటే మహాభయం, సాహసం. అత్యుక్తి అంటే అతిశయంగా చెప్పడం.
లి 190 అమనభాష
స్వాగతం - సురభి తెలుగులో మంచి అనే విశేషణాన్ని ఏ పదం ముందయినా చేర్చి వాడినట్లుగా సంస్కృతంలో సు అనే ఉపసర్గను మంచి అన్న అర్ధంలో విస్తృతంగా వాడవచ్చు. ఈ ఉపసర్గను మంచి, మిక్కిలి అన్న రెండు అర్థాలలో ఎక్కువగా వాడుతున్నాం. మనం (ప్రతి సభలోనూ వాడే పదం స్వాగతం. ఇందులో ఆగతం అనే మాటకు సును చేర్చాం. మంచి ఆగమనం అని అర్ధం. కుశలప్రశ్న వేయడం. ఈ స్వాగతంలో ఒక 'సు' ఉపసర్గ ఉంది కాబట్టి దానికి మరో “సు చేర్చి సుస్వాగతం చేయవలసిన అవసరంలేదు. పైగా సుస్వాగతం అన్న మాటను ఒక ప్రత్యేక సందర్భంలో వాడే సంప్రదాయం ఉంది కాబట్టి, దాన్ని మామూలు సందర్భాలలో వాదకపోవడం మంచిది. సుకృతం అంటే మంచిపని. విడిగా ఈ మాటను ఎక్కువగా వాడం కాని, పూర్వజన్మ సుకృతం అని సమాస రూపంలో మాత్రం బాగా వాడుకలో ఉంది. గత జన్మలో చేసిన మంచి పనుల ఫలితం అని అర్థం. సుకర్మం అన్నా మంచివనే. సుకర్ముడు అంటే విశ్వకర్మ అని అర్ధం. సుకరం అంటే సులభం. ఈ రెండు మాటల్లోనూ 'సు* ఉంది. సుకర అంటే సాధువయిన అవు. సుఖాన్ని కలిగించేది. సులభం చక్కగా లభించేది. ఈ రెండు మాటల నుండీ సౌకర్యం, సౌలభ్యం ఏర్చడ్డాయి. సుకుమారం అంటే మెత్తనిది, మృదువయినది. సుఖం అంటే అశుభాన్ని పోగొట్టేది, ఇంది యాలను సంతోషపెట్టేది. సుగమం అంటే సుఖంగా పొందదగింది, సుకరమూ, స్తులభమూ. సుగతుడు అంటే మంచి జ్ఞానం కలవాడు. బుద్ధనికి సుగతుడని పేరు. సుగ్భహీతం అంటే బాగుగా (గ్రహింవబడింది. సముచితమైనది. సుగృహీత నామధేయుడని వాడుతూ ఉంటాం. పేరుకు తగినవాడని అర్ధం. సార్ధక నామధేయుడని కూడా అంటాం. సుగ్రీవం అంటే మంచి మెడ కలిగినది. సుగ్రీవుడు అంటే మంచి మెడ కలిగినవాడు. సుగంధి అంటే మంచి గంధం, వాసన కలిగినది. సుచరిత్ర అంటే మంచి నడవడిక కలిగిన స్రీ. పతివ్రత. పేర్లలో ఈ 'సు ఉవసర్గకు ఎక్కువ వాడుక. సుదతి అంటే మంచి దంతాలు కలిగిన స్త్రీ, సుజాత అంటే ఉన్నత వంశంలో పుట్టిన స్రీ, సుశీల అంటే మంచి గుణం కలిగినది. సుభద్ర అంటీ సురక్షితం. సుమతి అంటే మంచి బుద్ధి కలిగినది. సుమధ్య అంటే మంచి నడుము కలిగినది. సుకేశిని మంచి కేశాలు కలిగినది. సుస్మిత అంటే మంచి చిరునవ్వు కలిగిన ప్రీ, సులోచన అంటే మంచి కన్నులు కల స్త్రీ, ఈ విధంగా ఎన్నో పేర్లు ఈ ఉపసర్గతో ఏర్పడ్డవే, స్త్రీల పేర్లలాగానే ఈ ఉపసర్గతో పురుషుల పేర్లు కూడా అసం ఖ్యాకంగా ఏర్పడతాయి. సుచిరం అంటే చాలాకాలం. సురుచిరం అంటే మిక్కిలి కాంతివంతమైనది. సుజన్మం అంటే మంచి పుట్టుక. సుజనుడు అంటీ మంచి వ్యక్తి సాధువు. సుతంత్రి అంటే మంచి తీగెలు కలిగినది. ఇంపైన శబ్దాన్ని కలిగించే వాద్యం. సుతనువు అంటే మంచి శరీరం కలిగిన వాదు. సప్త పాతాకాలలో ఒక్షటి సుతలం, సుదర్శనం అంటే మంచి దర్శనం కలిగినది. విష్ణువు ఆయుధం సుదర్శన చక్రం, సుత్రాముడు అంటే ఇంద్రుడు, లోకాలను బాగా'రక్షించేవాడని అర్థం. సుదాయం అంటే మనభాషతి 191
పెళ్ళిలో కూతురుకూ, అల్లుడికీ ఇచ్చే వస్తువు.
సుదూరం అంటే మిక్కిలి దూరం. సుదీర్హం అంటే మిక్కిలి పొడవైనది. సుదీర్షమైన ప్రసం గం అంటాం. సుదృఢం అంటే మిక్కిలి గట్టిది. సుదుర్లభం అంటే మిక్కిలి దుర్లభం. లభించనిది.
సుధర్మ అంటే మంచి ధర్మం కలిగినది. దేవసభకు సుధర్మ అనిపేరు.
సుధ అంటే సుఖంగా తాగబడేది, అమృతం. బాగా పుచ్చుకుంటారు కాబట్టి కల్లుకు సుర అని పేరు.
సుధీ అంటే మంచి మేధాశక్తి ఉన్నవాడు, విద్వాంసుడు. సుందరం అంటే మిక్కిలి సంతోష పెట్టేది. సుపంథ అంటే మంచిమార్గం.
సుపర్డుడు అంటే మంచి రెక్కలు కలవాడు, గరుత్మంతుడు. సురులు అంటే బాగా ప్రకాశించేవారు, హవిస్సులను స్వీకరించేవారు. శుభాన్ని చెప్పేవారు, చక్కగా కోరిన కోర్కెలు తీర్చేవారు. సుపర్వులన్నాఇదే అర్ధం. సుమనస్సులు అంటే మంచి మనస్సు కలవారు. సుపార్యం అంటే మంచి పార్య్వములు కలిగినది, జువ్విచెట్టు. సుప్రతీకం అంటే మంచి అవయవాలు కలిగి నది. అష్టదిగ్గజాలలో సుప్రతీకం ఒకటి. ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమం, సుప్రతీకం అన్న ఎనిమిదీ అష్టదిగ్గజాలు.
దేశం పాడిపంటలతో సుభిక్షంగా ఉందంటాం. ఆహార సమృద్ధి ఉండడం. సుప్రతిష్ట అంటే కీర్తి అని ఒక అర్ధం. స్థాపన అని మరొక అర్ధం. ఆయన సుప్రతిష్టితుడు అంటే కీర్తి కలిగినవాడని అర్థం. సుబోధం అంటే మంచివార్త, హితవు. స్పష్టంగా తేలికగా అర్ధమయ్యేది, తెలిసేది అన్న అర్థంలో ఎక్కువగా వాడుతున్నాం.
సుముఖం అంటే అనుకూలమైనది. సురభి అంటే సువాసనగల వస్తువు. వసంత బుతు వుకు సురభి అని పేరు ఉంది. శుభకార్యాలు ఆరంభించే బుతువు కాబట్టి సురభి:
సుశ్రుతం అంటే చక్కగా వినబడేది. సుశ్రుతుడు సుప్రసిద్ధ ఆయుర్వేద విద్వాంసుడు. అతని వైద్యశాస్త్ర గ్రంధాన్ని సుశుతం అంటారు.
స్వర్గం అంటే బాగా ప్రకాశించేది. సువర్ణం అంటే మంచి వర్ణం కలిగినది. బంగారం అని అర్థం.
సువాసిని అంటే పేరంటాలు. వితంతువులను పూర్వ సువాసినులు అంటుంటారు. సుషమ అంటే శ్రేష్టమైన కాంతి. స్వస్తిక అంటే శుభం కలిగించే ఇల్లు. తూర్పు వాకిలి ఉన్న ఇల్లు,
సుహృత్తు, సుహృదుడు, సుహృదయుడు అంటే మిత్రుడు.
జ్ 192 అమవభాష
ఉత్తరం - ఉదాసీనం
అనేక పదాల కల్చనలో ఉపయోగపడే ఉపసర్గలలో “ఉతొ ఒకటి. ఈ ఉపసర్గ చాలా ఆర్థాల నిస్తుంది. వాటిలో ఒక ముఖ్యమైన అర్థం ఊర్జ్వం, పైకిలేవడం. ఉచ్చం అంటే పైకి పెరిగేది. ఉచ్చం నీచం అని రెందు మాటలు వాడుతూ ఉంటాం. రెండింటినీ కలిపి ఉచ్చనీచాలు ల్లని కూడా వాడతాం. ఉచ్చం అంటే పొడవైనది. ఉచ్చం నీచం పైది కిందిది. ఉచ్చక్షువు అంటే కళ్ళు పైకెత్తినది అని అర్ధం. కళ్ళు పోయినది, గుడ్డిది అన్న అర్ధం కూడా ఉంది.
ఉచ్చరణం అంటే మీదికి పోవడం. ఉచ్చరించడం పైకి పలకడం అనికూడా అర్థం. ఉచ్చారణం, ఉచ్చారం అని కూడా అనవచ్చు. ఉచ్చారణ అంటున్నాం. ఉచ్చిత్రం అంటే పైన చిత్తరువులు రచించిన వస్త్రం. ఉచ్చిరుడు అంటే ఎత్తిన తల కలవాడు. తల ఎత్తుకొని ఉన్నవాడు.
ఉత్మరం అంటే పైకి లాగినది. ఉత్మర్న అంటే శ్రేస్టత్వం, అతిశయం అని అర్ధం. ఉత్కృష్టం అంటే శ్రేష్టం.
ఉత్మీర్ణం అంటే పైకి చిమ్మబడినది. ఉల్యేణం అంటే ఎగజిమ్మడం.
ఉత్తరం అనేమాటకు చాలా అర్థాలున్నాయి. ఉత్తరం అంటే మీదిది అని అర్ధం. ఉత్తరం అన్నది ఒక దిక్కు ఈ దిక్కునందు సూర్యుడు ఉత్తరాయణం చేత మీదికి వస్తాడు. మేరువు మొద లయిన వాటిని దాటుతాడు కాబట్టి ఉత్తరం. ఉత్తరం అంటే గ్రేష్టమని కూడా అర్ధం. లోకోత్తరుడు వంటి మాటల్లో ఈ అర్థం-ఉంది. ఉత్తరం అంటే తరువాతిది అనికూడా అర్థం. సమాసంలో పూర్చపదం ఉత్తరపదం అంటాం. తరువాతి మాట అని అర్థం. దక్షిణ హస్తం అంటే కుడిచేయి. దక్షిణ అన్నమాటకు కుడి అని అర్థం ఉంది. దక్షిణకు వ్యతిరేకం ఉత్తర. ఎడమ అని అర్థం. అష్టో త్తర శతం అన్నప్పుడు నూటికి పైన ఎనిమిది, నూటికి ఎనిమిది ఎక్కువ అని అర్థం. శరీరంలో పైభాగాన్ని ఉత్తర కాయం అంటారు. కాయం అంటే శరీరం. ఉత్తర అంటే పైది.
ఉత్తరం అంటే సమాధానం అని కూడా అర్ధం. అడిగిన శంకను దీనితో దాటుతారు కాబట్టి ఉత్తరం, అడిగిన దానికి చెప్పే జవాబు. సంశయం దీని వల్ల తీరుతుంది.
ఉత్తర పూర్వపదంగా చాలా మాటలు వర్చడతాయి. వ్యవహారంలో నాలుగు పాదాలుం టాయి. వాటిలో ఒకటి ఉత్తరపాదం. పూర్వపక్షం, ఉత్తరం, క్రియ, తీర్చు అన్న నాలుగు పాదా లలో పూర్వపక్షం అంటే వ్యాజ్యెం తేవడం, ఉత్తరం అంటే ప్రతివాది సమాధానం, క్రియ అంటే సాక్ష్యం వినడం, తీర్చు అంటే నిర్ణయం చెప్పడం.
ఉత్తర పక్షం అంటే కృష్ణపక్షం. వాదంలో పూర్వపక్షానికి వ్యతిరేకం ఉత్తరపక్షం. పూర్వపక్షం ఖండన. ఉత్తరపక్షం సిద్ధాంతం. ఉత్తరకాండ అంటే రామాయణంలో ఏడో కాండ. ఉత్తర వటం అన్నా ఉత్తరీయం అన్నా పైపంచె.
ఉత్తరక్రియ అంటే అపరకర్శ. మరణానంతరం మృతులనుద్దేశించి చేసే కార్యం. ఉత్తర మీమాంస అంటే వేదాంత శాస్త్రం. పూర్వ మీమాంస, ఉత్తర మీమాంసలలో పూర్వ మీమాంస కర్మకాండ, ఉత్తర మీమాంస జ్ఞానకాండ.
ఉత్తరపూర్వ దిశ అంటే ఈశాన్యం. ఉత్తర దిక్కుకూ తూర్పు దిక్కుకూ మధ్యనున్న మూల. ఉత్తర పశ్చిమం అంటే వాయవ్యం. ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తర దిక్కుగా ప్రయాణించే
మనభాషళ* 193
అరు నెలల కాలం.
ఉత్తరం అంటే లేఖ అని కూడా అర్ధం. ఉత్తర ప్రత్యుత్తరాలు అంటే లేఖ, (ప్రతి లేఖలు. ఉత్తర వయస్సు అంటే ముసలితనం.
ఉత్తరాధికారం అంటే దాయాదిత్వం. వారసత్వం. ఉత్తరాధికారి అంటే దాయాది. ఉత్తరోత్తరం అంటే తరువాత్తరువాతది.
ఉత్పతనం అంటీ పైకి ఎక్కడం, ఎగరడం. ఉత్పతం అన్నా ఇదే అర్ధం. పైకి ఎగిరేది పక్షి కాబట్టీ పక్షికి ఉత్సతం అని పేరు. ఉత్స్చలం అంటే పైకి వచ్చేది. ఉత్పలం అంటే కలువ అని అర్థం. పద్మమని కూడా అనవచ్చు. నీలోత్సలం అంటే నల్లకలువ. ఉత్పలమాల అంటే కలువదండ. తెలుగు వృత్తాలలో ఉత్సలమాల వృత్తానికి చాలా ప్రచారం ఉంది.
ఉత్పశ్యుడు అంటే మీదుగా చూసేవాడు. ఉత్సాతం అంటే పైకిపోవడం. గొప్ప ఉత్పాతాన్ని మహోత్సాతం అంటారు. ఉత్పాతం అంటే శుభ అశుభాలను సూచించే మవాభూత వికారం, ఉత్పాతాలు మూడు రకాలుగా ఉంటాయి. సూర్య[గ్రహణం, చంద్రగ్రహణం వంటివి దివ్యాలు. ఉల్మాపాతం వంటివి అంతరిక్ష సంబంధాలు. భూకంపం వంటివి భౌమాలు. అంటే భూమికి సంబంధించినవి.
ఉ(త్రాసం, ఉత్చాసనం అంటే ఎత్తి పొడుపు. ఉద్ర్చ్రేక్షణం అంటే పైకి చూడడం. ఊహించడం అనికూడా అర్ధం. ఉ్రేక్ష అంటే ఊహ. అలంకారాలలో ఉ(త్రేక్షాలంకారం ఒకటీ.
ఉదర్చి అంటే పైకి ఎగసే జ్వాలలు కలిగినది. అగ్ని అని అర్ధం. ఉదాసీనుడు అంటే పైన కూర్చుండేవాడు. ఈ ఉదాసీనుడు ఉపకారమూ చేయడు, అపకారమూ చేయదు. శత్రువూ కాదు, మిక్రుడూ కాదు. ఉదాసీనుడు వహించే వైఖరి ఉదాసీన వైఖరి. పట్టించుకోకపోవడం. మనకు పక్క నుండే రాజు శత్రువు. ఈ శత్రువుకు అవతల ఉండేవాడు మనకు మిథ్రుడు. ఆ మిత్రునికి అవతల ఉండేవాడు ఉదాసీనుడు. శత్రు మిత్ర దేశాలకు ఆవల ఉపకార అపకారాలు చేయక ఊరకుండే వాడు ఉదాసీనుడు.
ఉద్గమం అంటే పైకిపోవడం. ఉద్దమనం అన్నా అదే అద్ధం. ఉద్దతి అన్నా అర్ధమదే. ఉద్బంధకుడు అంటే వేలాడదీసేవాడు. ఉరితీసేవాడు. ఉద్వర్తం, ఉద్వర్తనం అంటే పైకి పోవడం అని అర్ధం. నీతిమీరిన వర్తనం కలిగినది అనికూడా అర్థం.
ఉద్వీక్షణం అంటే మీదికి చూడడం. ఉద్వేల్లితం అంటే మీదికి చిమ్మబడినది. ఉత్సర్పం అంటే పైకి పాకడం.
ఉత్సవం అంటే నీరు వంటి వాటిలో పైకి తేలడం. ఈ మాటకు దాటడం అని కూడా అర్ధం. నీటిమీద తేలుతుంది కాబట్టి పడవకు ఉత్స్సృవం అని కూడా పేరు.
ఉదీచి అంటే ఉత్తరదిశ. ఉదీచీనం అంటే ఉత్తర దిక్కున ఉన్నది. ఉదీచ్యం అన్నా ఉత్తర దిక్కున ఉన్న వస్తువనే అర్థం.
చ 194 అమనభాష
ఉత్మంఠ - ఉద్ధరణ ఉత్ళానం అంటే పైకి లేవడం. ఈ మాటకు నిలవడం, మేల్కోనడం అని కూడా అర్థం. కార్తీక శుక్ల పక్షంలోని ఏకాదశిని ఉత్ధాన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశినాడు శ్రీ మహావిష్ణువు నిద్రనుండి మేల్కొంటాడు కాబట్టి ఈ ఏకాదశికి ఉత్చాన ఏకాదశి అని పేరు వచ్చింది. ఉత్భావకం అంటే లేవదీసేది. ఉద్ధితం అంటే లేచినది. ఉత్ధానం అన్నమాటకు పుట్టుక అన్న అర్ధం కూడా ఉంది. ఉత్కంఠ అంటే తహతహ. పైకి వచ్చిన శోకం. ఉత్కత, ఉత్సుకం అన్నా తహతహ అనే అర్ధం, ఉద్దతమయిన శోకం, ఇష్ట వస్తుప్రాప్తి కోసం పొందే వేగిరపాటు. ఉత్కంర కలిగినది ఉత్కంకిత, ఉత్కంరఠితం. కావ్యంలో శృంగార నాయికలు ఎనిమిది విధాలుగా ఉంటారు. అష్టవిధ శృంగార నాయికలు అని వాడుక, స్వాధీనపతిక, ఖండిత, అభిసారిక, కలహాంతరిత, వివ్రలబ్ధి, ప్రోషిత భర్చృక, వాసక సజ్జిక, విరహోత్మంఠిత అన్న అష్టవిధ శృంగార నాయికలలో విరహోత్కం రిత చివరిది. ప్రియుడు రావడానికి పూనుకుని కూడా ఏ కారణం చేతనో సమయానికి రాన వ్పూడు, అతను రాకపోవడం వల్ల బాధపడే, దుఃఖించే నాయిక విరహోత్మంఠిత. విరహం చేత శోకించేది. ఉత్మత అంటే ఉత్కంర. ఉత్కం అంటే కుతూహలం కలిగింది, ఉవ్విళ్ళూరేది. ఉత్కంరం అంటే ఎత్తిన మెడ కలది అని కూడా అర్ధం. ఉత్కలిక అన్నా ఉత్కంర అన్న అర్ధం ఉంది. ఇక్కడ కల ధాతువుకు సంఖ్య అని అర్ధం. ఉత్మలిక అంటే మొగ్గ అనీ, హేల, విలాసం అనీ కూడా అర్ధం. కలిక్క ఉత్కలిక అని ఛందో భేదా లున్నాయి. ఉదాహరణ కావ్యంతో ఈ ఛందస్సులుంటాయి. వీటిని గేయ రూవమయిన గద్యా లన్నారు. కళికకు ఎనిమిది పాదాలుంటాయి. కళిక పాదంలో ఎన్ని మాత్రలుంటాయో వాటిలో సగం ఉత్మళిక పాదంలో ఉంటాయి. ఇదీ ఎనిమిది పాదాలుంటుంది. సంస్కృతంలో గద్య కావ్యాలు నాలుగు రకాలు. ముక్తకం, వృత్తగంధి, ఉత్కలికాప్రాయం, చూర్ణకం అని. దీర్ధసమాస బహుళమయిన రచన ఉత్మలికాప్రాయం. సమాసాలూ, కటువైన అక్షరాలూ ఉంటాయి. ఉత్సాహం అంటే ఉద్దతమైన సహనం. పప్రయాసను ఓర్వడం, శ్రమించడం. ఒక మహా కార్యాన్ని నిర్వహించాలనే కోరికతో ఆ పనికి పూనుకోవడం. ఉత్సాహం అన్న మాటకు (ప్రయత్నం, అభిలాష, శుభం అన్న అర్థాలున్నాయి. ఛందస్సులో ఉత్సాహం అన్న పేరుగల వృత్తం ఉంది. అలంకార శా(స్తాలలో నవరసాలున్నాయి. ఈ రసాలకు స్థాయి భావాలుంటాొయి. శృంగార రసానికి రతి స్థాయి భావం. అట్లాగే వీరరసానికి ఉత్సాహం స్థాయి భావం. ఉత్మర్హం అంటే ఎత్తిన చెవులు కలది. ఉత్కమం అంటే అతీక్రమించడం అని అర్ధం. మీదికి కాని, వెలికి గాని పోవడం. ఉ(త్మమణం, ఉ(్యాంతి, ఉత్రామం, ఉత్మమం సమానార్థకాలు. ఉత్కులుడు అంటే కులమర్యాదలు దాటినవాడు, కులభ్రప్టుడు. ఉత్కూలం అంటే కూలాన్ని దాటి ప్రవహించేది. ఉత్తటం అన్నా అంతే. గట్టును దాటి పారడం. ఉత్తమం అంటే అత్యంత ఉత్కృష్టమైనది. శ్రేష్టమైనది, గొప్పది. అధమానికి వ్యతిరేకం. ముఖ్యమైనది అని కూడా అర్థం. ఉత్తమాంగం అంటే తల. అన్నిటికంటే శ్రేష్టమైనది ఉత్తమం. వ్యాకరణంలో పరిభాషగా ఉత్తమం అనే మాటను వాడతారు. రెందుకంటే ఎక్కువ అక్షరాలున్న మాటలో చివరి అక్షరానికి ఉత్తమం అని పేరు. నునభాషతి 195
ం ఉత్తరణం అంటే దాటడం. ఉత్తారం అంటే దాటించడం. ఉత్తారణం అంటే దాటించ డమూ, దాటించినదీ కూడా. ఈ దాటించడం (ప్రవాహాన్ని దాటించి అవతలి ఒడ్డుకు చేర్చడమూ కావచ్చు. ఆపద నుండి కాపాడడమూ కావచ్చు. తెలుగులో గట్టెక్కించాడన్న జాతీయం ఉంది కదా. ఒడ్డున పడేయడం అనికూడా అంటారు. కష్టం తప్పించడం. ఉత్తీర్ణం అంటే దాటబడినది. కృతార్థం. ఉత్తీర్ణత, ఉత్తీర్ణుడు బాగా వాడుకలో ఉన్న మాటలు. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడంటే కృతార్ణుడయ్యాడన్నమాట. పాస్ కావడం.
ఉత్పధం అంటే పథాన్ని అతిక్రమించడం. అంటే మార్గాన్ని దాటిపోవడం. నడవవలసిన
మార్గంలో నడవకపోవడం, తవ్వుతోవలో నడవదడమన్నమాట. అన్యాయమార్గం. ఉద్ధరణం వెలికి తీయడం, పైకి ఎత్తడం. ఉద్ధారణం అన్నా ఇదే అర్ధం. ఉద్ధరణ, ఉద్ధారణ అనివాడతాం. ఉద్ధారం అనికూడా అనవచ్చు. ఉన్నయం అన్నా పైకెత్తడమే. ఉన్నాయం అన్నా అంతే. ఉన్నమనం అన్నా పైకి ఎత్తడమే. ఉద్ధరించడం. ఎర్రనగారు 'అరణ్యపర్వ శేషోన్నయ మాచరించి అన్నారు. అరణ్యపర్వ శేషాన్ని ఉద్ధరించి అని అర్ధం. వేదాల తిరువేంగళాచార్యులు గారు ఈ (ప్రయోగాన్ని ఆధారం చేసుకొనే ఎర్రన అరణ్య పర్వూన్ని పూరించలేదు, శేషోద్ధరణమే చేశారని వాదించారు. అరణ్య పర్వంలో కొంత భాగం పాడయిపోతే ఆ భాగాన్ని ఎర్రన ఉద్ధరిం చాడు అని ఆయన వాదం. ఉద్ధరించడం ఆంటే రక్షించడం అని కూడా అర్ధం. ఉద్ధర్త, ఉద్దా రకుడు అంటే ఉద్ధరించేవాడు. ఉద్ధారం అంటే మరొక అర్ధం కూడా ఉంది. దాయపు సొత్తులో జ్యేష్పనికి ఎక్కువ భాగం ఇస్తారు. జ్వ్యేష్టునికి లభించే ప్రత్యేక భాగాన్ని ఉద్ధారం అంటారు. యుద్ధంలో అవతలి పక్షాన్ని కొల్లగొట్టడం వగైరా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో లభించిన
ధనంలో ఆరోవంతు రాజుకు చెందుతుంది. దీన్నికూడా ఉద్ధారం అనే అంటారు. ఉద్ధరణి అంటే నీళ్ళు ఎత్తి చేతిలో పోసుకోవడానికి ఉపయోగించే సాధనం. ఉద్ధృతం, ఉద్ధృతి అంటే ఉద్ధరింపబడింది. పైకి ఎత్తబడినది అని అర్ధం. కాని ఈ మాటను 'వరద ఉద్ధృతంగా ఉంది' వంటి వాక్యాలలో వాడుతున్నారు. విజృంభణ, చెలరేగు అన్న అర్థం ఈ మాటకు లేదు. బహుశా ఉద్ధతి సామ్యం వల్ల ఈ మాటకు ఇటువంటి ప్రయోగం ఏర్పడి ఉండ వచ్చు. ఈ వాక్యం మహాభారతం నుండి ఉద్ధృతం అంటాం. మహాభారతం నుండి ఎత్తి తీసి
కొన్నది అని అర్థం. కోట్ చేయడం అన్న అర్ధంలో ఉద్ధరించు అని వాడుతున్నాం. స్
196 తిమనభాష
ఉద్దేశం - ఉద్దేశ్యం
నౌ అభిప్రాయం అదికాదు అని చెప్పడానికి కొందరు నా ఉద్దేశ్యం ఇది కాదు అంటుంటారు. ఈ సందర్భంలో ఉద్దేశం అన్నమాటను వాడడం సముచితంగా ఉంటుంది. ఉద్దేశం అంటే లక్ష్యం, గురి, ఉపదేశం, అభిప్రాయం, అభిలాష అని అర్ధాలు. ఉత్ అంటే ఎత్తయిన అన్న అర్థమూ ఉంది కాబట్టీ ఉద్దేశం అంటే ఎత్తయిన (ప్రదేశమనీ, జేష్టమయిన ్రదేశమనీ కూడా అర్ధం. గురిగా చేయదగినది, వివరింపదగినది, ఉపదేశింపదగినది, అభిలాషకు అభిప్రాయానికి విషయ మయిన వస్తువు ఉద్దేశ్యం. ఉద్దేశం - ఉద్దేశ్యం రెండు మాటలకు అర్ధం వేరు. అందువల్ల వీటిని ఒక దాని స్థానంలో ఒకదాన్ని వాడకూడదు. ఉద్దిష్టం అంటే కోరబడింది, ఉద్దేశింపబడింది.
ఉద్దీపనం అంటే జ్వలించడం, ప్రకాశించడం. ఈ మాటకు పురికొల్ప్బడం అని కూడా అర్థం. ఉద్దీపింపజేయడం అంటే ప్రకాశింపజేయడం. ఉద్దీప్తం అంటే వెలిగినది అని అర్ధం. రేగినది అన్న అర్థమూ ఉంది. (క్రోధం ఉద్దీప్తమయింది అని వాడవచ్చు. ఉద్యోతం అంటే ప్రకా శింపజేసేది. ఉత్తేజం అంటే ఉద్దీపనమని అర్ధం. ఈ మాటకు (ప్రేరణ, సాన పట్టడం అన్న అర్భాలు కూడా ఉన్నాయి. ఆయన చాలా ఉత్తేజకరంగా మాట్లాడాడు అన్నప్పుడు (ప్రేరణ కలిగేట్లుగా మాట్లాడాడని అర్థం.
ఉత్పత్తి అంటే పుట్టడం. ఉత్స్పాదం, ఉద్భవం, ఉద్భవనం అన్న మాటలు వర్యాయపదాలు. ఉత్పాదన, ఉత్పాదనం అంటే పుట్టించడం, ఉత్పాద్యం అంటే పుట్టింపదగింది. ఉత్పాదకం అంటే పుట్టించేది. ఉత్పన్నం అంటే పుట్టినది. ఉత్పన్నభక్షి అని ఒక మాట ఉంది. వీడు కష్టపడి జీవించేవాడు. ఎప్పుడు దొరికింది అవ్చుడు తినేవాడు.
ఉత్ ఉపసర్దకు బిగ్గరగా అన్న అర్ధం ఉంది. ఉ(్రోశం అంటే మొరపెట్టడం. బిగ్గరగా పిలవబడినది ఉత్రుష్టం. ఉత్కృష్టం అంటే శేష్టం. ప్రధానమైనది.
ఉత్స్వనం అంటే పెద్ద ధ్వని. ఉదగ్రం అంటే ఎత్తయినది. గొప్పది, పెద్దది. ఈ మాటకు భయంకరమయినది అన్న అర్ధం కూడా ఉంది. ఉదీర్ణం అంటే గొప్పది.
ఉద్దీతి అంటే గట్టిగా పాడడం, సామగానం చేయడం. ఉద్దోష అంటే గట్టీగా చాటడం. (క్రియాపదంగా ఉద్దోషించారు అని వాడుతున్నాం.
ఉద్దూతం అంటే గట్టిగా పిలవబడదినది. ఈ మాటకు చెదరగొట్టబడినది అన్న అర్థం కూడా ఉంది. ఉన్ముఖరం అంటే పెద్దగా మోగేది. ఉత్మీర్తనం అంటే బిగ్గరగా పలకడం,
ఉత్కు అధికం అన్న అర్థం కూడా ఉంది. ఉత్కటం అంటే మిక్కిలి తీక్షణమైనదని, పెద్దదని, బలమ్హైనదని అర్ధాలు. తాపం అంటే వేడి. ఉత్తాపం అంటే మిక్కిలి వేడి. ఉత్తారం అంటే మిక్కిలి ధ్వని,
ఉద్దంతురం అంటే మిక్కిలి పొడవైనది. విపరీతమైన ఎత్తు పల్లాలుండడం కూడా ఉద్దం తురమే. ఉద్దంతురం అంటే ఎత్తుపళ్ళు కలిగిందని కూడా అర్థం, ఉద్దాంతం అంటే మిక్కిలి అణచ బడింది,
ఉద్బలుడు అంటే చాలా బలం కలిగినవాడు. ఉన్మయూఖం అంటీ మిక్కిలి మెరిసేది. ఉత్సృభ అంటే మిక్కిలి కాంతి. ఉచ్చండం అంటే మిక్కిలి వేడి అయినది. మిక్కిలి ఉగ్రమయినది.
మనభాషళ 197
ఉత్తరంగం అంటే లేచిన తరంగాలు కలిగినది. తటాలున ఎగిరివదేది. ఉత్తుంగం అంటే ఎత్తయినది ఉద్దాఢం అంటే అధికం, ఎక్కువ.
ఉత్కృతి అంటే గొప్ప పని. కృతి అంటే కావ్యం అనికూడా అర్ధం అందువల్ల ఉత్కృతి గొప్ప కావ్యం, రచన అని అర్ధం. ఉద్దంధం అన్నా గొప్ప పుస్తకమే. ఉత్ర్రబంధం అన్నా గొప్ప (గ్రంథమే.
ఉద్దాటన అంటే పైకి లాగడం. హిందీలో ఈ మాటను ప్రారంభోత్సవం అన్న అర్ధంలో వాడుతున్నారు. పైకిలాగడం అన్న అర్ధంవల్ల నీళ్ళు చేదే సాధనానికి కూడా ఉద్దాటన అని పేరు వచ్చింది. ఉద్దాకం అంటే దెబ్బ. ఈ మాటకు ఆరంభం అన్న అర్థమూ ఉంది. నాటకంలో ఉళ్ళా త్యకం అన్న అంగం ఉంది. ప్రధమాంక ఆరంభ విధానాన్ని ఇది సూచిస్తుంది. ప్రస్తావన నుండి తొలి అంకంలోకి (ప్రవేశించే పద్ధతులలో ఇది ఒకటి. ప్రస్తుతానికి సంబంధించని సంభాషణను ఆధారం చేసుకొని ప్రస్తుతానికి సంబంధించే అర్ధాన్ని అన్వయిస్తూ పాత్ర ప్రవేశం చేస్తుంది. విశాఖదత్తుడు ముద్రా రాక్షసంలో ఉద్దాళ్యకాన్ని ప్రయోగించాడు. ఈ నాటక ప్రస్తావనలో సూటి ధారుడు “క్రూర [గ్రహమయిన ఆ కేతువు అసంపూర్ణ మండలుడయిన చంద్రుణ్ణి బలవంతంగా మింగాలనుకుంటున్నాడు” అని అంటాడు. అప్పుదు 'ఆ ఎవడురా వీడు నేనుండగానే' అని విని పిస్తుంది. 'ఆ ఎవడురా వీడు నేనుండగానే చంద్రగుప్తుని బలాత్కారంగా ఆక్రమించదలచే వాడూ అంటూ ప్రధమాంకంలో చాణక్యుడు ప్రవేశిస్తాడు. సూ(త్రధారుని మాటల్లోని చంద్రుణ్ణి చంద్ర గుస్తనిగా భావించాడు చాణక్యుడు.
ఉపోద్దాతం అంటే కధా ప్రారంభం. 'ముందుమాటిను కూడా ఉపోద్దాతమంటున్నాం. ఉద్దహణం అంటే పైకెత్తి పట్టుకోవడం. ఉదద్ధీవుడు అంటే మెడ సైకెత్తినవాడు. ఎవడు మెడ పైకెత్తుకొని ఉంటాడు? గర్వి, గర్వం కలిగినవాడన్నమాట.
ఉద్ధరణం, ఉద్ధట్టనం ఈ రెండింటికీ ఒరపిడి అని అర్ధం. ఉల్పీడం, ఉత్పీడనం అన్నా రాపిడే.
ఉద్దండం అంటే ఎక్కువ అనీ, భయంకరమనీ అర్ధం. ఉద్దండం అన్నమాటకు నేటి వ్యవ హారంలో ఎక్కువ ప్రచారం లేకపోయినా ఉద్దండుడు అన్నమాటను మాత్రం విసృతంగానే వాడు తున్నారు, ఈ మాటను ప్రశంసాత్మకంగానూ, వ్యంగ్యంగానూ వాడతారు.
ఉద్దాముడు అన్నమాట కూడా ఉంది. భయంకరుడని అర్ధం. ఉద్దాముడు స్వతం[త్రుడు. ఎటువంటి కట్టూ లేనివాడు. గర్వికుడు, గంభీరుడు. ఉద్ధతి, ఉద్ధతం అన్నమాటలు కూడా గర్వించినది, అణకువ లేనిది అన్న అర్ధంలో వాడుకలో ఉన్నాయి. ఉద్ధతుడు అనికూడా వాడు తున్నాం. ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు, ధీరలలితుడు, ధీరశాంతుడు అని నాయకులు నాలుగు రకాలు. నాయకుడిలో ధీరోదాత్త లక్షణమూ, ప్రతి నాయకుడిలో ధీరోద్ధత లక్షణమూ కనిపిస్తుంది సాధారణంగా. భీముడు, దుర్యోధనుడు వంటి వారిని నాయకులుగా చేస్తే ధీరోద్ధత నాయకు లవుతారు. శ్రీరాముడు, ధర్మరాజు వంటివారు ధీరోదాత్తులు. *
ఉన్మాదం అంటే ఎక్కువ మదం. ఉన్మాదం కలవాడు ఉన్నాది. ఉన్నాదికే మరో రూపం ఉన్మత్తుడు. వెర్రైత్తినవాడు. ఉమ్మెత్త మదాన్ని కలిగిస్తుంది కాబట్టీ దానికి ఉన్మత్త అని పేరు.
బ్ 198 అమనభాష
ఉత్పత్తి - ఉద్యోగం
“టీత్ ఉపసర్గకు ్రేష్టమన్న అర్ధం వస్తుంది. ఉత్తంసం అంటే శ్రేష్టమని అర్థం. ఉత్తంసుడు అంటే (థ్రేష్టుడు. ఉత్తంసం అంటే శిరోభూషణమని కూడా అర్థం. ఉద్భటుడు అన్నా గ్రేష్టుడనే అర్థం. ఉద్భటం అంటే (శ్రేష్టం. సంస్కృతంలో ఉద్భటుడనే కవి ఉన్నాడు. భక్తుడూ ఉన్నాడు. ఇతని కధే ఉదృటారాధ్య చరిత్రం. ఉన్నానుం అంటే ఉత్కృష్టమయిన పేరు.
ఉత్మరం అంటే పొడవైనదని అర్ధం. రాశి, గుంపు అన్న అర్థం కూడా ఉంది. ఉద్ధురం అంటే నిండినది. దృఢమనీ, దట్టమనీ కూడా అర్ధం. ఉదురమనే మాటకు బరువు దించినది అన్న అర్థమూ ఉంది. ఇక్కడ వ్యతిరేకార్థం. ఇటువంటిదే ఉన్నిద్రం అనేమాట. నిద్రలేనిది అని అర్థం. ఉచ్చక్షువు అంటే కన్నులు లేనిది, గుడ్డిదని అర్థం. ఉచ్చంఖలం అంటే శృంఖలం లేనిది. కట్ట లేనిది. ఉన్మజ్ఞనం అంటే తేలడం. ఉన్నార్గం అంటే తప్పుతోవ.
లంచం అన్నమాటకు ఉత్కోదం అనే పర్యాయపదం ఉంది. లంచం పుచ్చుకొనేవాణ్డి లంచగొండిని ఉత్కోచకుడు అనవచ్చు.
ఉత్భాతం అంటే పెల్లగింపబడినది. ఉళ్ళచితం అంటే తాపబడినది. ఉత్మంపం అన్నా ఉత్కంపనం అన్నా వణకడం. ఉత్మర్తనం అంటే తెంచడం, కత్తిరించడం. ఉత్మేశం అంటే వ్యధ, ఉత్క్మషణం అంటే దున్నడం. ఉత్మారం అంటే తూర్చెత్తడం. ధాన్యాన్ని ఎత్తుగా రాశిపోయడాన్ని కూడా ఉత్కారం అంటారు. ఉత్కాసనం ఒక విధమయిన దగ్గు. శ్లేష్మం పడిపోయే దగ్గు. కీలితం అంటే మేకు/మేకులు కొట్టబడినది. ఉత్మీలితం అంటే మేకులు కొట్టబడింది అన్న అర్థం ఉంది. ఉత్మూజం అంటే కూత. ఉత్కూటం అంటే గొడుగు. ఉద్ద్ధుపనం అంటే పొగవేయడం. ఉద్బాప్పం అంటే కన్నీరు కార్చేది. ఉద్భాసం అంటే కాంతి.
భూ ధాతువుతో ఏర్పడే మాటలకు “ఉత్' చేర్చి చాలా మాటలు తయారు చేయవచ్చు. ఉద్భవం అంటే పుట్టుక. ఉద్భావం అని కూడా అనవచ్చు. ఉద్భవనం, ఉద్భావనం అన్నా పుట్టుక అనే అర్ధం. ఉద్భూతం అంటే పుట్టినది. ఉద్భూతి అన్నా అదే అర్ధం.
ఉత్పత్తి అన్నా పుట్టుకే. ఉత్పాదన అంటే పుట్టించడం. ఉత్పాద్యం అంటే పుట్టింపదగింది. ఉత్పత్తి ఉత్సాదన అన్న మాటలకు నేడు చాలా వాదుక ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు, పారి (శ్రామిక ఉత్పత్తులు అని వాడుతున్నాం. 'ప్రొడక్ట అన్న ఇంగ్లీషు మాటకు సమానార్థకంగా ఈ మాటను వాడుతున్నాం. విద్యుదుత్సాదన అంటున్నాం. ఉత్పాదకం అంటే పుట్టించేది. ఉత్పత్తి ఉత్పాదన అన్న ర0డు మాటలను పుట్టుక, పుట్టించుట అన్న అర్భాలలో వాడవచ్చు.
వివాహం లాంటిదే ఉద్వాహం. ఈ మాటలో “వహి అన్నది ధాతువు. ఈ ధాతువుకు మోయడం అని అర్ధం. ఉద్వహం, ఉద్వాహం, ఉద్వహనం, ఉద్వాహనం ఈ మాటలన్నింటికీ పెళ్ళి అని అర్థం. దీనినుందే ఉద్వహ అన్నమాట ఏర్చడింది. ఉద్వహ అంటే కూతురు. ఉద్వ హుడు అంటే వంశం మొదలయినవి క్షయం పొందకుండా ఉద్దరించేవాడు, ముఖ్యుడు. బధ ధాతువుకు తెలియడం అని అర్ధం. ఉద్పోధం, ఉద్బోధనం అంటే మేలుకోవడం. ఉద్బోధకం అంటే మేలుకొల్చేది. ఉద్బుద్ధం అంటే మేలుకున్నది. ఉద్బోధించు అని క్రియగా ఈ మాటను తెలుగులో ప్రచురంగా వాడుతున్నాం
ఉద్భేదం, ఉద్భేదనం అంటే చీల్చడం అని అర్ధం. ఉద్భిన్నం అంటే చీల్చబడినది. ఉద్భిదం అంటే చెట్టు, పొద, లత, గడ్డి మొదలయిన వాటిలో ఏదైనా. భూమిని ఛేదించుకొని, (వక్క
మనభాషత 199
లించుకొని పుడతాయి ఇవి. అందువల్ల వీటికి ఉద్భిదాలని పేరు. ఉద్భిత్తు అని కూడా అనవచ్చు. ఉద్భిజ్ఞం అని కూడా అనవచ్చు.
ఉద్యతి, ఉద్యతం అంటే పైకెత్తబడినది. యత్నించినది అనికూడా అర్ధం. ఉద్యమం అన్నా అదే అర్ధం. ఉద్యమం అంటే ప్రయాస అనీ అర్ధం. ప్రయత్నం. మూవ్మెంట్ అన్న ఇంగ్లీషు మాటకు సమానార్థకంగా ఈ మాటను విస్తృతంగా వాడుతున్నాం. ఉద్యోగం అన్నమాటను కూడా ఉద్యమానికి సమానార్థకంగా వాడవచ్చు. క్రియగా ఉద్యమించారు, ఉద్యోగించారు సమా నార్థకాలు. ప్రారంభించారు అని అర్ధం. ఉద్యోగం అంటే ఉత్సాహం అన్న అర్ధమూ ఉంది. కాని (వ్రయత్నం, పూనిక, వని, పాటుపడడం అన్న అర్థాలలో వాడుక ఎక్కువ. జాబ్, ఎంప్తాయ్మెంట్ అన్న ఇంగ్లీషు మాటలకు సమానార్థకంగా విసృత ప్రచారంలో ఉంది. హిందీలో ఈ మాటను పరిశ్రమకు సమానార్థకంగా వాడతారు. లఘు ఉద్యోగ్ అంటే చిన్న పరిశ్రమ. ఉద్యోగి అంటే వ్యాపారం/పనికలవాడని అర్థం. తెలుగులో ఎంప్లాయీ అన్న అర్థంలో వాడుళున్నాం. ఉద్యో గస్టుడు అని కూడా అంటాం. ఉద్యుక్తం అంటే పూనినది అని అర్ధం,
ఉద్యాపన అంటే విడిచిపెట్టడం. (వ్రతాలు, పూజలు ముగించడాన్ని ఉద్యాపనం అంటారు. ఉద్యాపన చేయు అని క్రియగా కూడా వాడతాం. ఉద్యాపితం అంటే ముగింపబడింది. ఉద్వాపం అంటే పారవేయడం, వేళ్ళతోసవో పెకలించటం. ఉద్వాసం, ఉద్వాసనం అంటే తొలగించడం. ఉద్వాసం అన్నమాటకు ఊరినుండిగాని, ఇంటినుండిగాని వెళ్ళగొట్టడం అని అర్ధం. ఉద్వాసన చెప్పడం అని వాడతాం. వెళ్ళగొట్టడం, ఉద్యోగం నుండి తొలగించడం అని అర్ధం. ఉద్వాస్యం అంటీ ఉద్వాసం చేయదగింది. ఉద్రేకం అంటే అతిశయమనీ, విజృంభణమనీ అర్ధం. ఉద్వేగం అంటే భయం, వణకు, వేగంగా పోయేది.
ఉ(ద్భమం అంటే చుట్టూ తిరగడం. ఉద్వేష్టం, ఉద్వేష్టనం అంటే చుట్టుకోవడం. ఉన్నతి, ఉన్నతం అంటీ ఎత్తయినది. ఉద్వేలం అంటే వేలను దాటినది. వేల అంటే గట్టు. ఉచ్చాస్త్రం అంటే శాస్త్రాన్ని మీరినది. ఆంటే శాస్ర విరుద్ధం.
ఉద్యానం అంటే విహారం కోసం వెళ్ళడం. విహారం కోసం వెళ్ళీ తోటకూడా ఉద్యానమే. ఉద్యానవనం అని కూడా అంటాం.
ఉచ్చయం అంటే పూవులు మొదలయినవి కోయడం. ఉచ్చయం అంటే సమూహం కూదా. సముచ్చయం అనికూడా అంటాం. ఉచ్చాటం, ఉచ్చాటనం అన్న మాటలకు పెల్లగిం చడం, స్వన్థానం నుండి వెళ్ళగొట్టడం అని అర్థం. ముఖ్యంగా పిశాచాదులను వెళ్లగొట్టడం అన్న అర్ధంలో ఈ మాట బాగా వాడుకలో ఉంది.
ఉచ్చిత్తి ఉచ్చిన్నం అంటే నిర్మూలనం, నిర్మూలితం ఉచ్చిష్టం అంటే తినగా మిగిలింది. 'బాణోచ్చిష్టం జగత్సర్వం" అని నానుడి. దిండును ఉచ్చ్ళీర్షకం అంటారు. తలను ఎత్తుగా ఉంచేది. ఉచ్చ్వసనం, ఉచ్చ్వాసం గాలిని లోపలికి పీల్చడం. (గ్రంధంలో (ప్రకరణాన్ని కూడా ఉచ్చ్వాసం అంటారు.
ఉజ్జీవకుడు అంటే జీవింపజేసేవాడు. ఉజ్ఞ్వలం అంటే జ్వలించేది. ఉన్మార్ణనం అంటే తుడిచివేయడం. ఉన్మిశ్రం అంటే సంకీర్ణం. ఉన్మీలనం అంటే కన్ను తెరవడం. ఉన్ముక్తం అంటే విడువబడినది. ఉన్ముఖం అంటే ఎదురు చూచేది. సిద్ధమైనది. ఉన్నూలం, ఉన్మూలనం అంటే అడుగంట చెరచేది. ఉన్నేషం, ఉన్మేషణం అంటే వికసించడం, ఉన్మోచనం అంటే విడవడం,
బె 200 అఖమనబాష
అభ్యాగతుడు - అభిసారిక
ఉపసర్గలు అనేకార్థాలను కలిగిస్తాయి. ఒకే అర్ధంలో అనేక ఉపసర్గలూ వస్తాయి. “అభి ఒక ఉపసర్గ. ఇది చేరినప్పుడు కూడా కొన్ని అర్ధ విశేషాలు కలుగుతాయి. కొన్ని సందర్భాలలో అర్ధ భేదం లేకపోవడమూ గమనించవచ్చు.
అభిక్రమం అంటే ఎదుర్కోవడం. ఎదురుగా నడవడం. ఇది శత్రువులకు ఎదురుగా పోవడం. యుద్ధ యాత్ర. ఇక్కడ “అభి ఉపసర్గకు 'ఎదురు' అని అర్థం. అభిక్రమణం, అభిక్రాంతి అన్న మాటలకు కూడా ఇదే అర్ధం. అభిగంత అంటే ఎదురుగా పోయేవాడు. అభిగతం అంటే ఎదుర్మోబడింది. అభిగమం అన్నా అభిగమనం అన్నా ఎదురుగా పోవడమని అర్ధం. అభిగ మించు అని క్రియగా కూడా దీన్ని వాడవచ్చు. అభిగమ్యం అంటే ఎదురుగా పోదగింది. అభి గామి, అభిగాముకుడు అంటే ఎదురుగా పోయేవాడు. అభిగ్రహం, అభిగ్రహణం అన్నా ఎదు రుగా పోవడమనే అర్ధం. యుద్ధంలో ఎదురుగా పోవడమే. అయితే (గ్రహధాతువుకు తీసుకోవడ మని కూడా అర్ధం కాబట్టి అభిగ్రహణానికి ఎదురుగా పుచ్చుకోవడమనే అర్థమూ వచ్చింది. చూస్తూ ఉండగానే దొంగతనం చేయడం. దారికొట్టడం.
అభిచారం, అభిచరణం అంటే హింసాకర్మ. శత్రువులను హింసించడం కోసం చేసే కర్మ ఇతరులను తిరస్కరించడం కోసం ఆచరించే కర్మ అధర్వణ వేదంలో చెప్పిన హోమాదికర్మ. దీనికి ఫలం హింస. పిశాచాదులను వదిలించదానికి చేసే కర్మను కూడా అభిచారం ఆంటారు. ఇటువంటి కర్మకాండ మీద ప్రపంచమంతటా నమ్మకాలున్నాయి. ఏదో ఒకవిధి ప్రతి దేశంలోనూ ప్రచారంలో ఉంది. జనంలో ఉన్న నమ్మకాలను ఆధారంగా చేసుకొని మోసం చేసే వారూ ఎందరో ఉన్నారు. ఈ అభిచారకర్మ చేసేవాణ్ణి అభిచారి అనీ, అభిచారకుడు అనీ అంటారు. అభి చారం వల్ల కలిగే జ్వరాన్ని అభిచార జ్వరం అంటారు.
అఖిడీనం అంటే ఎదురుగా ఎగరడం.
అభినయం అంటే అర్దాన్ని వ్యక్తం చేసేది. హృద్దతమయిన భావ సూచన. నాట్యంలో దీన్ని వాడతారు. అభినయం నాలుగు విధాలుగా ఉంటుంది. ఆంగికం, ఆహార్యం, వాచికం, సాత్త్వికం. ఆంగికం అంటే అంగచలనం వల్ల భావవ్యక్తీకరణ. ఆహార్యం వేషం. వాచికం భాషణ. స్వేదబాష్పాదులు సాత్త్వికాలు. సాత్త్వికాఖినయం క్లిషుయింది. అభినయించు అంటే నటీంచు. అభినేత అంటే నటుడు. రంగ స్థలానికి వర్తించే ఈ మాటలను సాధారణ సందర్భాలలోనూ వాడుతున్నాం.
అఖభినిర్ముక్తుడు, అభ్యుదితుడు అని రెండు మాటలున్నాయి. సూర్యుడస్తమిస్తూ ఉన్నప్పుడు నిద్రపోతూ ఉండే (బ్రాహ్మణుడు అఖినిర్ముక్తుడు. సూర్యుడు ఉదయించినష్టుడు నిద్రపోతూ ఉండే (బ్రాహ్మణుడు అభ్యుదితుడు. ఇప్పుడు వాడదలిస్తే ఈ మాటలు ఎవరికయినా వాడవచ్చు.
అభినిర్యాణం అంటే ఎదురుగా కదలిపోవడం. దండెత్తడం, సైన్యంతో సవా శత్రువు మీదికి దండెత్తిపోవడం, అభిషేణనం. అభినీతం అంటే ఎదురుగా తేబడినది. యోగ్యమైనది. అభి పతనం అంటే ఎదురుగా పోవడం. అఖి పత్తి అన్నా అదే ఆర్థం.
అభిభవం, అభిభవనం అంటే ఆక్రమించడం, తిరస్కారం, ఈ మాటకు పరాజయం అన్న
మనభాషతి 201
అర్ధంకూడా ఉంది. అభిభవించు అంటే అవమానించు అని అర్థం. ఈ అర్ధంలో అభిభావి, అభి భావికుడు, అభిభావుకుడు అన్న మాటలను వాడవచ్చు. అభిభూతి అంటే అవమానం, పరా భవం. అభిభూతుడు అంటే పరాభవింపబడిన వాడు. గర్వికుడై శత్రురాజు చేతిలో ఓడిపోయిన వాడు.
అభిమనస్ముడు అంటే కార్యానికి అభిముఖమయిన మనస్సు కలవాడు. ఈ పని చేయాలి అని అనుకూల మనస్సు కలిగిన వాడు. అభిముఖం అంటే ఎదురుగా ఉన్నది. అభిముఖంగా ఉంది అంటే ఎదురుగా ఉంది అనీ, అనుకూలంగా ఉందనీ అర్ధం. అభిముఖుడు అంటే అను కూలుడు. అభిముఖం నుండే ఆభిముఖ్యం అన్నమాట ఏర్పడింది. అభిముఖ్యం అంటే అను కూలత, ఆనుకూల్యం.
అభియానం అంటే ఎదురుగా పోవడం. దీనినుండే అభియాత, అభియాతి అనే మాట లేర్చడ్డాయి. శత్రువని అర్ధం. అభియోగం అనేమాటకు ఎదురుగా రావడమని అర్ధం. అభియోగం అంటే వ్యాజ్యెం, నేరంమోపడం అన్న అర్థాలు ఇప్పుడు ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. శత్రువును ఎదిరించడం, ముట్టడి అన్న అర్ధం కూడా ఉంది. పూనిక, ఆసక్తి పట్టుదల, శపధం అన్న అర్భాలూ ఉన్నాయి. పాండిత్యం అన్న అర్ధమూ ఉంది. అభియోజనం అన్నా అదే అర్థం. అభి యోగి, అభియోక్త అంటే ఎదిరించేవాడు, నేరం మోపేవాడు. అభియుక్తుడు అంటే ఎదుర్కొన బడినవాడు.
అభిలంఘనం అంటీ దాటడం, మీద పడడం. అభివర్తనం అంటే ఎదురుగా రావడం, అభి వర్తి అంటే ఎదురుగా వచ్చేవాడు.
అభిసంపాతం అంటే యుద్ధం. ఎదురెదురుగా వచ్చి తాకుతారు కాబట్టి అభిసంపాతం. అభ్యామర్తం అన్నాయుద్ధమే. అభ్యాగమం అన్నా యుద్ధమే. అభ్యాగమనం అనికూడా అనవచ్చు. ఈ మాటలకు ఎదురుగా రావడమన్న అర్థమూ ఉంది. అభ్యాగతుడు అనేమాట దీనినుండే ఏర్ప డింది. అభ్యాగతుడు అంటే వచ్చినవాడు. తిధి, పర్వం, ఉత్సవం మొదలయిన సందర్భాలలో వచ్చేవాడు. అతిథి, అభ్యాగతుడు అనే రెండు మాటల్ని కలిపి అతిధి అభ్యాగతులని వాడుతూ ఉంటాం. అభ్యాగతుడు రావడానికి ఒక సందర్భం ఉంటే అతిధికి అటువంటి సందర్భం ఉండదు. అనుకోకుండా ఊడిపడతాడు. అతిధి అంటే ఎప్పుడూ తిరిగేవాడు. అతిధిని ఆవేశి కుడు, ఆగంతువు అనికూడా అంటారు. ఆవేశికుడు అంటే తన ఇంటి నుండి వచ్చినవాడు. ఆగం తువు అంటే వచ్చినవాడు. ఇప్పుడు అభ్యాగతుడనే మాట అతిథి అభ్యాగతులన్న ద్వంద్వ సమా సంలో తప్ప విడిగా ఎక్కువగా వాడుకలో లేదు. ఈ రెండు మాటలకూ భేదాన్ని కూడా పాటిం చడం లేదు.
అభిసరణం అంటే సంకేత స్థానానికి పోవడం. అభిసారిక అంటే అభిసరించే స్త్రీ. అష్టవిధ శృంగార నాయికలలో అభిసారిక ఒక నాయిక. స్వాధీనపతిక, ఖండిత, అభిసారిక, కలహాంత రిత, విప్రలభ్ధి, ప్రోషిక భర్తృక, వాసక సజ్జిక, విరహోత్కంఠిత అని శృంగార నాయికలు ఎనిమిది రకాలు. ప్రియుని తన వద్దకు రప్పించుకొనేది, తానే ప్రియుని వద్దకు మోది అభిసారిక. అభి సారికలు మూడు విధాలు. జ్యోత్సాఖిసారిక వెన్నెలలో అభిసరించేది. తెల్లని దుస్తులు, తెల్లని పూలు, గంధం, తెల్ల ముత్యాల హారాలు ధరించి ఈమె అభిసరిస్తుంది. తమోఖభిసారిక చీకటిలో
అభిసరించేది. నల్లని దుస్తులు, నల్ల కలువలు మొదలయినవి ధరించి అఖభిసరిస్తుంది. ఈమెనే తమి(స్రాభిసారిక అనికూడా అంటారు. దివసాభిసారిక అందరూ ఏవో పనులలో మునిగి ఉండగా ఏదో ఒక వంక పెట్టుకొని అభిసరించేది. ఈ అభిసారికలు స్వీయలూ కావచ్చు, పరకీయాలూ కావచ్చు, సామాన్యలూ కావచ్చు. సామాన్య అయినప్పుడు ఉజ్వలాభిసారిక అనికూడా అంటారు, అభిసారికను అభిసారిజి అని కూడా అనవచ్చు. అఖిసారం, అభిసారణం అనేమాటలకు నాయకుడు నాయికను గాని, నాయిక నాయకుని గాని సంకేత స్థానానికి రప్పించుకోవడం అని అర్థం. అఖిసారి అంటే అభిసరించేవాడు. ఎదురుగా పోయేవాడు, ఎదుర్శొనేవాడు. అభిసరుడు, అభిసారుడు అంటే అనుచరుడని అర్థం. అభ్యుత్థానం అంటే లేవడం, ఎదురు రావడం, పెరగడం. ఎవరయినా వచ్చినప్పుడు లేచి ఎదురు వెళ్ళి ఆహ్వానించడం అభ్యుత్ధానం. చ్ మనభాషతి 203
అభిజ్ఞుడు - అభిజ్ఞానం “అభి ఉపసర్గకు సమీపం అన్న అర్థం కూడా ఉంది. అభిగామి, అభిగాముకుడు అంటే సమీపించేవాడు. అభినిధనం అంటే చావుకు సిద్ధంగా ఉన్నది. అభిపత్తి అంటే సమీపించడం. అభి పన్నుడు అంటే సమీపించినవాడు. అభ్యగ్రం అంటే సమీపంలోనిది, అభ్యర్దం సమీప దేశం లేదా సమీప కాలం. అభ్యుపగతి, అభ్యుపగతం అంటే సమీపించినది అని అర్ధం. అభిగమం, అభి గమనం అంటే సమీపించడం, అభిగతం అంటే సమీపించబడినది. అభిగంత అంటే సమీపించే వాడు.
“అభికి అంతటా అన్న అర్థమూ ఉంది. అభిచరించడం అంటే అంతటా తిరగడం. అఖి చరుడు అంటే అంతటా తిరిగేవాడు. అభిజ్ఞులు అన్నమాటను విసృతంగా వాడుతున్నాం. ఇందులో “జ్ఞా అంటే తెలియడం. అభిజ్ఞుడు అంటే అంతటా వస్తుతత్వాన్ని ఎరిగినవాడు అని అర్ధం, బాగా తెలిసినవాడు, నిపుణుడు, పండితుడు. అభిజ్ఞుల ఉవాచ అంటాం. ఆ విషయం బాగా ఎరిగినవారు చెప్పారని అర్ధం. అభిప్రవర్తనం అంటే అంతటా ప్రవర్తించేది. అభిప్రవృత్తం అంటే అంతటా వ్యాపించినది.
అభిప్షవం అంటే అంతటా వెల్లివిరియడం. ప్లవ శబ్బానికి తెప్ప అనీ, కప్ప అనీ, నీరుకోడి అనీ, తుంగముస్త అనీ అర్థాలున్నాయి. దాటించేది, గంతులు వేసేది, నీటిలో తేలేది. ప్రవ శబ్దానికి క్రూరకర్మకోసం పోయేవాడు, నిషాదుడన్న అర్ధం కూడా ఉంది. విప్లవం అన్నప్పుడు దేశోపద్రవం అన్న అర్థం ఉన్నట్లుగానే అభిప్లవం అన్నా ఉపద్రవం అన్న అర్ధం ఉంది. అభిఫ్తతం అంటే అంతటా తడపబడింది అనీ, అంతటా వ్యాపించినది అనీ అర్థం.
అభిరక్ష అంటే పూర్తిగా రక్షించడం. అభిరక్షణం అన్నా అదే అర్ధం. అభిరక్షకుడు అంటే పూర్తిగా రక్షించేవాడు. అభిరక్షితుడు అంటే రక్షింపబడేవాదు.
అభిలీనం అంటే అణగి ఉన్నది అన్న అర్థంతోపాటు వ్యాప్తం అన్న అర్థమూ ఉంది. అభి వ్యాపకం అంటే అంతటా వ్యాపించేది. అభివ్యాప్తి అంటే అంతటా వ్యాప్తి చెందడం. ఈ మాటను విసృతంగా వాడుతున్నాం.
అభిసంచారి అంటే అంతటా తిరిగేవాడు. అభిసంచారం అంటే అంతటా తిరగడం.
'అభికి మిక్కిలి అనికూడా అర్థం. అభితాపం అంటే మిక్కిలి*వేడి. అభినమ్రం అంటే మిక్కిలి వంగినది అని అర్ధం. వంగడం విధేయతకు కూడా చిహ్నం. అందువల్ల అభినమ్రం అంటే మిక్కిలి విధేయమైనది అనికూడా అర్థం.
అభిరతి అంటే అత్యంత ఆసక్తి. అభిరతుడు అంటీ అత్యంతాసక్తి కలిగినవాడు. అభిరాట్టు అంటే సామ్రాట్ట,. మిక్కిలి ప్రకాశించేవాడు. అభిరామం అంటే మిక్కిలి ప్రియమైనది, మనోహర మైనది. దీనినుందే అభిరామ, అభిరాముడు అనే మాటలు ఏర్పడ్డాయి. సుగుణాభిరాముడు అని వాడతాం.
రుచి అంటే కాంతి. ఈ మాటకు అత్యాసక్తి అనీ, ఇచ్చ అనీ కూడా అర్ధం. అభిరుచి అంటే అత్యంతమైన రుచి, అత్యంత ఆసక్తి, అత్యంత ప్రీతి అని అర్ధం. రుచిరం అంటే కాంతిమంత మైనది, అందమయిన వస్తువు. అభిరుచిరం అన్నా మనోహరమయిన వస్తువు,
అభివిఖ్యాతం అంటే మిక్కిలి ప్రసిద్ధమైనది. అభిశోకం అంటే మిక్కిలి దుఃఖం, అభిశోచం, అభిశోచనం అన్నా అదే అర్ధం. అభిష్పంగం అంటే అత్యాసక్తి, మిక్కిలి కలయిక. అభిసంతాపం
204 త మనభాష
అంటే మిక్కిలి బాధ. అభిస్సురితం అంటే పూర్తిగా వికసించినది.
అభీక్ష్యం అంటే మాటిమాటికీ అనీ, ఎల్లప్పుడూ అనీ అర్థం. అభ్యధికం అంటే మిక్కిలి అధికం, చాలా ఎక్కువ.
'ఘృ' ధాతువుకు కరగడం అనీ, చల్లడం అనీ అర్ధం. అఖి చేరినప్పుడు అభిఘారం అనే మాట ఏర్పడుతుంది. అభిఘారణం అనికూడా అనవచ్చు. కొంచెం నేయి వేయడం. అభిఘ రించు అని క్రియగా కూడా వాడవచ్చు. అన్నంమీద కొంచెం నేయి వేయడం. సంస్కారార్థం హవ్యం మొదలయిన వాటిమీద కొంచెం నేయి చల్లడం. |
అభిజనం అన్నమాటకు పరిజనం అన్న అర్ధం ఉంది. దీనిలో పుడతారు కాబట్టి అఖిజనం అంటే వంశం అన్న అద్ధమూ ఉంది. అభిజనవంతుడు అంటే మంచి వంశంలో పుట్టినవాడు. అభిజాతి, అభిజాతుడు అన్న మాటలకు ఇదే అర్ధం. వీటినుండే అభిజాత్యం అన్న షదం ఏర్చ డింది. అభిజాత్యం అంటే ఉత్తమ వంశంలో పుట్టడం. వాడికి చాలా ఆభిజాత్యం ఉంది అన్న, ప్పుడు మంచి వంశంలో పుట్టానన్న అహం ఉంది అని అర్థం. కొన్నిసార్లు కేవలం గర్వం అన్న అర్ధంలోనూ వాడుకలో ఉంది. అభిజాతం అంటే మనోహరం, మధురం. అఖిజనుడు అంటీ నేర్పరి.
అభిజిత్తు అనేది ఒక నక్షత్రం. ఆ నక్షత్రంలో పుట్టినవాడిని కూడా అభిజిత్తు అనవచ్చు. విష్ణువన్న అర్థమూ, గెలిచేది అన్న అర్థమూ కూడా ఉన్నాయి. ఈ'మాటకు అభిజిన్ముహూర్తం అనికూడా అర్ధం. అభిజిన్ముహూర్తం అంటే సూర్యోదయం నుండి ఎనిమిదవ ముహూర్తం. వగలు పధ్నాలుగు గడియలు దాటింతర్వాత రెండు గడియల కాలం.
'జ్ఞా ధాతువుకు తెలియడం అని అర్ధం. అభిజ్ఞ అంటే గుర్తు పట్టడం, స్మరణం, అఖభిజ్ఞానం అంటే గుర్తు. మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతల నాటకంలో అభిజ్ఞానం గుర్తే, దుష్యం తుడు శకుంతలకు గుర్తుగా ఇచ్చిన ఉంగరం. ఈ నాటకంలో దుష్యంతుని వ్యక్తిత్వాన్ని కాపాడింది ఈ ఉంగరమే. అభిజ్ఞాపకం అంటే గుర్తు తెచ్చేది.
అభిధ అంటే సంకేతం, పేరు. అభిధ, లక్షణ, వ్యంజన అన్నవి శస్ద శక్తులు సంకేతిత మయిన అర్ధాన్ని బోధించే శబ్ద శక్తి అభిధ. శబ్బానికీ దానికి ఉండే ఆగ్గానికీ పరస్పర సంబంధాన్ని నిర్ణయించడం సంకేతం అభిధాశక్తి చేత చెప్పబడే అర్థం అభిధేయం. అభిధానం అన్నా పేరే. అభిధాంతరం అంటే మారుపేరు. ప్రతిబింబం, సాటి. వాడు దానానికి మారుపేరు అంటామే అట్లా. అభిధాయకం అన్నా అభిధాయి అన్నా చెప్పేది అని అర్థం.
అభిధ్య అంటే కోరిక పరధన విషయమయిన కోరికకు అభిధ్య అని పేరు.
అభినందం, అభినందనం అంటే సంతోషమనీ, పొాగడడమనీ, ప్రోత్సహించడమనీ అర్థం. అభినందన అని విరివిగా వాడుతున్నాం. అభినందించు అని క్రియగా కూడా బాగా ప్రచారంలో ఉంది. ప్రశంసించు అని అర్థం. అభినంది అంటే అభినందించేవాడు, అభినందింపబడిన వాడూ కూడా. అభినందనుడు అంటే అభినందించేవాడు. అభినందితుడు అంటే అభినందింవబడిన వాడు. అభినంద్యం అన్నా అభినందనీయం అన్నా అభినందింపదగింది. అభినందితం అంటే అభినందింపబడినది.
అభినియోగం, అభినివేశం అంటే వట్టుదల. ఒక పనిని తప్పకుండా చేయాలనే పట్టుదల, అభినివిప్పుడు అంటే అభినివేశం కలవాడు. అభినివేశం అన్నమాటకు అభిలాష అన్న అర్థం కూడా ఉంది. అభినియుక్తుడు అన్నా పట్టదలకలవాడనే అర్ధం. య్
మనభాషత 205
అభినవం - అభియానం
అభి చేరినప్పుడు కొన్ని మాటలకు ప్రత్యేకార్థమేమీ కలగకపోవచ్చు. అభి కంపనం అంటే వణకడం. కంపనం అన్నా వణకడమే. అభికాంక్ష అంటే కోరిక. కాంక్ష అన్నా, కోరికే. అభి కాంక్షితం అంటే కోరబడినది. అభికాంక్షి అంటే కోరేవాడు. అభికామం అన్నాకోరికే. అభి[క్రందం అంటే కూత.
అభి[క్రోశం అంటే మొర. అభిక్రోశకుడు అంటే మొరపెట్టేవాడు. అభిఖ్య అంటే ప్రకాశం, అభిఖ్య అంటే పేరు. అభిఖ్యానం అంటే చెప్పడం. ఈ మాటకు కీర్తి అని, ప్రసిద్ధి అని కూడా అర్ధం. అభిఖ్యాతం అంటే చెప్పబడినది, (ప్రసిద్ధమైనది. అభిఖ్యాతుడు అంటే ప్రసిద్ధుడు. ఖ్యా అంటే పలుకబిడునది. అందువల్ల అభిఖ్య అంటే పేరు.
అభిగర్దనం అంటే గర్జించడం. అభిగీతం పాడబడినది. అభిగుప్తి అంటే రక్షణ. అఖిగోప్త అంటే రక్షకుడు. అభిఘర్షణం అంటే రాపిడి, నూరడం. అభిఘాతం అంటే కొట్టడం, నాశనం చేయడం. అభిఘాతి అన్నా అభిఘాతకుడు అన్నా కొట్టేవాడు, నాశనం చేసేవాడు అని అర్థం, అభిఘ్రాణం అంటే మూర్మొనడం, వాసన చూడడం.
అభితప్తం అంటే కాల్బబడినది. అభితర్చణం అంటే తృప్తిపడడం. అభితాడనం అంటే కొట్టడం. అభిదర్శనం అంటే చూడడం. అభిద్రవం అంటే ఆక్రమణ, పరిగెత్తడం. అభిద్రుతం అంటే ఆక్రమింపబడినది. అభి[ద్రోహం అంటే ఆక్రోశం, నింద, అపకారం, కీడు తలవడం. అఖి ధర్షణం అంటే పీడించడం, చరచడం. భుజాలు చరచుకోవడాన్ని కూడా అభిధర్న్షణం అన వచ్చు. అభిదర్శణం అంటే దయ్యం సోకడమన్న అర్ధం కూడా ఉంది. అభిధర్షణుడు అంటే రాక్షసుడు. అభిధావనం అంటే ఆక్రమించడం, అభిధావకుడు అంటే ఆక్రమించేవాడు.
అభినవం అంటే కొత్తది. నవం, నవ్యం, నూతనం, నూత్నం, నవీనం, అభినవం ఈ మాట లన్నిటికీ కొత్తదనే అర్ధం. కొనియాడబడుతుంది కాబట్టి అభినవం. “అభినవిను విశేషణంగా ఎక్కువగా వాడుతున్నాం. కొన్నేళ్ళ కిందట తమిళనాడు అసెంబ్లీలో కొందరు శాసన సభ్యులు జయలలిత పట్ల ప్రవర్తించిన తీరును అభినవ దుశ్శాసన పర్వంగా పత్రికలు అభివర్ణించాయి. ఆ శాసన సభ్యుల్ని అభినవ దుశ్శాసనులని కూడా పేర్కొన్నాయి. కొన్ని సందర్భాలలో అభినవ శబ్దాన్ని మంచి అర్ధంలో వాడినా ఎక్కువగా నిందార్థంలోనే వాడుతున్నారు. అభినవ కుంభకర్ణుడు లాగా - అభినవ ఆయం అంటే కొత్త రాబడి. అభినవోద్భిదం అంటే మొలక. అభినిర్భృతం అంటే నెరవేరినది అని అర్థం. అభినిర్బ్భత్తి అన్నా అదే అర్ధం. అభినిప్పత్తి అంటే ఉత్పత్తి, పుట్టుక. అభి నిష్పన్నం అంటే పుట్టినది. అభినుతి అంటీ పొగడ్త. అభినుతం అంటే పొగడబడినది. అభిను తించు అంటే పొగడడం, అభిప్రాయం అంటే పొందినది, ఆశయం అని అర్ధం. తలపు, ఉద్దేశం, భావం, తాత్పర్యం అని కూడా అర్థం. అభిప్రీతి అంటే సంతోషం. అభి'ప్రేతం అంటే ప్రియమైనది, కోరబడినది. సమ్మతం అని కూడా అర్థం, అభిభాషణం అంటే మాట్లాడడం. (ప్రసంగం అని కూడా అర్ధం. ఆయన అభిభాషించారు అంటాం. అభిభాషి అంటీ మాట్లాడేవాడు.
అభిమంత్రం, అభిమం(ఉతణం అంటే పిలుపు అని అర్థం. మంత్రించడం అన్న అర్థం కూడా
206 మనభాష
ఉంది. అభిమంత్రించు అన్నప్పుడు మంత్రించడమనే అర్ధం. అభిమం(త్రకుడు, అభిమం[త్రయిత అంటే అభిమంత్రించేవాడు. అభిమంధత్రితం అంటే అభిమం(త్రింపబడినది అని అర్థం.
అభిమతం అంటే అభీష్టం, కోరిక, సమ్మతం అని కూడా అర్ధం. అభిమతి అన్నా అదే అర్ధం. అభిమతుడు అంటే ప్రియుడు, భర్త అని అర్ధం. అభిమర్గం, అభిమర్దనం అంటే రాపిడి, బాధ. అభిమర్భం, అభిమర్శనం అంటే స్పర్శ. అభిమర్శకుడు అంటే స్పృశించేవాడు. అభిమానం అంటే (పేమ. డబ్బో, బలమో ఉండడం వల్ల ఏర్పడే గర్వం. ధన ఐల కులాదుల వల్ల కలిగే అతిశయమన్న మాట. తనను తాము ఉత్కష్టునిగా తలపించేది అభిమానం. అహంకారమన్న మాట. ఈ అభిమానం చెడ్డదయితే దురభిమానం అవుతుంది. ఆత్మగౌరవం అన్న అర్ధంలోనూ వాడుతున్నాం. అభిమాన ధనుడు అని ప్రయోగం. అభిమానవంతుడు అని కూడా వాడతాం. అభిమాని అన్నా అదే అర్ధం. అభిమానం కలవాడు. అభిమాని అంటే (ప్రేమ కలవాడని కూడా అర్ధం. ఇక్కడ అభిమానానికి (ప్రేమ అని అర్ధం. అభిమానులూ, అభిమాన సంఘాలూ ఈ ఆర్థం లోనే. అభిమానానికి మరొక అర్ధం కూడా ఉంది. ప్రియురాలి అలక అభిమానం.
అభిమృష్టం అంటే శుద్ధి చేయబడినది. అభిరుతం అంటే కూత, ధ్వని. అభిరూపం అంటే మంచిరూపం. అనురూపమని కూడా అర్థం. తగినటువంటిది, మనోహరమైనది. అభిరూపుడు అంటే చంద్రుడనీ, శివుడనీ, విష్ణువనీ, మన్మధుడనీ అర్ధాలు. పండితుడన్న అర్థమూ ఉంది. అభిలక్షితం అంటే చూపబడినద్ది, గుర్తు కలది. అభిలాష అభిలషణం అంటే కోరిక. అభిలషితం అంటే కోరబడినది, కోరిక. అభిలషణీయం అంటే కోరదగింది. ఆభిలషమాణం అంటే కోరబడు చున్నది. అభిలషించడం అంటే కోరడం. అభిలాషకుడు, అభిలాషుకుడు, అభిలాషి అన్నమాట లకు కోరేవాడని అర్ధం. అయితే వ్యక్తి స్వభావం చేతనే కోరేవాడు అయినప్పుడు ఈ మాటలను వాడతారు. సాధారణంగా కూడా వాడవచ్చు. అభిలూత అంటే ఒకరకమయిన సాలె పురుగు. అభివర్షనం అంటే వర్ణించడం, పొగడడం. అభివర్ణించారు అని క్రియగా ఈ మాటను ఎక్కువగా వాడుతున్నాం. అభివర్ష్యం, అభివర్జనీయం అంటే వర్జింపదగింది. అభివర్జితం అంటే వర్ణింప బడింది.
అభివర్షణం అంటే కురవడం, అఖివర్షి అంటే వర్షించేది. అభివర్షించు అంటీ వానకుర వడం. అభివందనం అంటే నమస్కారం. అభివాదం, అభివాదనం అన్నా నమస్కారమే. దీనిచేత ఆశీర్వదింపబడుతుంది కాబట్టి అభివాదం. గోత్రనామం చెప్పి మొక్కడం సంప్రదాయం. అఖి వాదకుడు అంటే నమస్కరించే వాడు. నమస్కరించే స్వభావం ఉన్నవాడు. అభివాద్యుడు, అఖి వాదనీయుడు అంటే నమస్మరింవదగినవాదు.
అభివినీతుడు అంటే మంచి నడవడి కలవాడు. అభివృద్ధి అంటే పెరుగుదల. అభివేష్టించు అంటే చుట్టుకొనడం. అభివ్యక్తం అంటే స్పష్టం. అభివ్యక్తి అంటే బయటపడడం, స్ఫుటంకావడం, ప్రతిబింబం. అభివ్యాహారం, అభివ్యాహరణం అంటే చెప్పడం. అభిశంక అంటే సంశయం, భమ, భయం. అభిశంకితం అంటే సందిగ్ధం.
అభిశంసనం అంటే దూషించడం, నిందమోపడం, నేరారోవణ. అభిశంసి, అభిశంస కుడు అంటే దూషించేవాడు, నేరం మోపేవాడు. ప్రస్తుతం చట్టసభల్లో అభిశంసన తీర్మానాలు
మనభాషత 207
ప్రవేశపెడుతున్నారు. అభిశాపం, అభిశాపనం అంటే శాపం, తిట్టు. అది అతనికి గొప్ప అభిశాప మయింది వంటి వాడుక ఉంది. లేని నేరం మోపడం అఖిశావం. అట్లాగే అభిశప్తి, అభిశస్తుడు అంటే లేని నేరం మోపబడినవాడు. అభిషంగం, అభిషంజనం అన్నా ఈ అర్థం ఉంది. అభిషవం, అభిషవణం అంటే పిండడం. అభిషేకం అంటే తడపడం, స్నానం. పట్టాభిషేకం అంటే పట్టం కట్టడం. అభిషిక్తుడు పట్టం కట్టబడినవాడు. అభీష్టం, అభీప్సితం అంటే కోరిక. అభ్యంగం అంటే తలంటు. శరీరానికి నూనె రాయడం. అభ్యంజన స్నానం అంటాం. నూనె రాసి తలంటు కోవడం. అభ్యంతరం ఆంటే లోపలిది అనీ ఆటంకం అనీ అర్థం. అభ్యంతర మందిరం అంటే లోపలి మందిరం. ప్రస్తుతం అడ్డు అన్న అర్ధంలోనే దీన్ని ఎక్కువగా వాడుతున్నాం. అభ్యర్థన అంటే (ప్రార్ధన. అభ్యర్థి అంటే కోరేవాడు, యాచించేవాడు. అభ్యసనం అంటే నేర్చుకోవడం. అభ్యాసం అంటే అవృత్తి అలవాటు, సాధన. అభ్యాసి అంటే సాధన చేసేవాడు. అభ్యుదయం అంటే ఉదయం, వృద్ధి, శుభం, ఇష్టప్రాప్తి ఉత్సవం.
ళ్
208 ఉఅమనభాష
ప్రుతిజంబం - ప్రత్యాహారం
మనం విస్తృతంగా వాదే ఉపసర్గలలో “ప్రతి ఒకటి. అన్ని ఉపసర్గలలాగానే దీనికీ వివిధ అర్థాలున్నాయి. విశిష్టముయిన అర్ధమేమీ లేకుండా కూడా ప్రయోగాలున్నాయి. 'వ్రతికి ఉన్న అర్థాలలో ఒక ముఖ్యమైన అర్ధం సాద్భశ్యం, సమానత్వం, పోలిక, సాటి. ఉదాహరణకు ప్రతి కృతి అన్న మాటను తీసికోవచ్చు. కృతికి ప్రతి ఉవసర్గగా చేరింది. ప్రతికృతి అంటే ప్రతిగా చేయ బడినది. ఒకదానిని చూచి దానికి సమానంగా పోలినట్లు చేసిన వస్తువు. కొన్ని సందర్భాలలో నకలు, కాపీ అన్న మాట కూడా దీనికి సరిపోతుంది. రాతితోకాని, కొయ్యతోకాని, మట్టీతోకాని మరేదైనా వదార్థంతోకాని చేసిన బొమ్మ. ఒకదానికి దీటుగా నిర్మించబడిన వస్తువు ప్రతిమ. 'ప్రతిమానం అని కూడా అనవచ్చు. అదే ్రతియైన బింబం అంటే ప్రతిభింబం అవుతుంది. ప్రతిగా ప్రయత్నించి నిర్మించింది కాబట్టి ప్రతియాతన అవుతుంది. ప్రతియైన ఛాయ కాబట్టీ ప్రతిచ్భాయా. ప్రతిగా పెట్టబడేది, బదులుగా పెట్టేది కాబట్టి ప్రతినిధి. (ప్రతికృతి, ప్రతిమ, ప్రతి మానం, ప్రతిబింబం, ప్రతియాతన, ప్రతిచ్భాయ, ప్రతినిధి అన్న ఈ మాటలన్నీ ప్రతిమను బోధి స్తాయి. ఇవన్నీ సమానార్థకాలయినప్పటికీ కొంత అర్థ భేదంతోనూ, భిన్న సందర్భాలలోనూ వాదడం జరుగుతుంది.
'ప్రతికృతి చిత్రం కూడా కావచ్చు. చిడ్రానికి నకలు కూడా కావచ్చు. ప్రతిబింబం అద్దం లోనో, నీటిలోనో కనబడుతుంది. ఏదైనా రూపాన్ని ప్రతిఫలించే వస్తువేదైనా వ్రతీబింబాన్నిస్తుంది. (ప్రతిమ అన్న మాటను వి[గ్రహం అన్న అర్ధంలోనే ఎక్కువగా వాడుతున్నాం. వ్రతిచ్భాయ ప్రతి బింబం వంటిదే. ప్రతినిధి మనం ఎక్కువగా వాదేమాట. అయితే ప్రతిమ అన్న అర్థంలో దీన్ని మనం వాడటంలేదు. ఒక దానికి బదులుగా నిలిచేది అన్న అర్థంలో వాడుతున్నాం. ప్రజా వతి నిధి అన్నప్పుడు (ప్రజలకు బదులుగా ఉండేవాడు. రిప్రజెంటేటీన్ అన్న ఇంగ్లీషు మాటకు సమానంగా దీన్ని వాడుతున్నాం. ఏనుగు కుంభస్థలానికి దిగువ భాగాన్ని ప్రతిమానం అంటారు.
ప్రతికాశం అంటే తుల్యం, సమానం అని అర్ధం. ప్రతిద్వంద్వి ఆంటే సాటియయినవాడు, సమానుడు. ఏదైనా పోటీలో ఒకరితో సమానంగా స్పర్ధించేవాడు (ప్రతిద్వంద్వి. ్రతిఫలనం అంటే ప్రతిబింబించడం. ప్రతిఫలితం అంటే ప్రతిబింబించినది. (ప్రతిబంధువు అంటే బంధువుతో సమానుడయినవాడు. బంధువుకాకపోయినా బంధువువంటివాడు.
'ప్రతిబలుడు అంటే సమానమయిన బలం కలవాడు. సమానబలుడు. (ప్రతి యాతన అంటే తుల్యమయిన యాతన. ప్రతిమానం అంటే మాదిరి అన్న అర్థంకూడా ఉంది. ప్రతిరూపం (ప్రతికృతి వంటిదే. నకలు. ్రతిరూపకం అన్నా అదే అర్థం. సమాన రూపం కలది అని. (ప్రతిబింబంలాగే విగ్రహం అన్న అర్థమూ ఉంది. అనురూపమయినది, తగినది అనికూడా అర్థం, ప్రతిబింబ వాదం అని ఒక వాదం ఉంది. ఈ వాదం లక్ష్యం జీవుడు ఈశ్వరునికి ప్రతిబింబం అని నిరూపించడం. ్రతిమూర్తి అన్నా ప్రతిరూపమే.
ప్రతివర్షికుడు అంటే సమానుడు, సద్భశుడు అని అర్ధం. ప్రతి వస్తువు అంటే తుల్యవస్తువు. ప్రతివస్తూపమ అని ఒక అలంకారం ఉంది. ఈ అలంకారంలో రెండు వాక్యాలుంటాయి. ఒక వాక్యం రెండో వాక్యానికి ప్రతిగా ఉంటుంది. అంటే సమానంగా ఉంటుంది. 'తాపం చేత సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. చాపంచేత శూరుడు రాజిల్లుతున్నాడు అని ఈ అలంకారానికి
మనభాషఅ 209
ఉదాహరణ. ఈ వాక్యాలలో ్రకాశించడమన్నా, రాజిల్లడమన్నా అర్ధం ఒకటే. సూర్యుడు ఎండ చేత, శూరుడు విల్లుచేత ప్రకాశిస్తున్నారన్నమాట. ఈ రెండింటి ధర్మం ఒక్కటే. అర్ధం ఒక్కటే మాటలు వేరు. వ్రకాశించు, రాజిల్లు అని రెండు మాటలు వాడడం జరిగింది. భిన్న ధర్మాలుంటే అలంకారం మారుతుంది. అవ్పుడు దృష్టాంతాలంకారమవుతుంది. “చంద్రుడే కాంతిమంతుడు. నీవీ క్రీరమంతుడవు అంటే దృష్టాంతం. కాంతిమంతత్వం, కీర్త మంతత్వం భిన్నధర్శాలు. బింబ వ్రతిబింబ రూపంలో ఉన్నాయి. “విద్వాంసుని పరిశ్రమ విద్వాంసునికే తెలుస్తుంది. వంధ్యకు (వ్రసవవేదన తెలియదుకదా' అంటే ప్రతివస్తూపమ.
ప్రతి సంఖ్య అంటే చక్కగా లెక్కపెట్టడం. సరిగా, సమానంగా లెక్కించడం.
ప్రతిసర్గం, ప్రతిసృష్టి సమానార్థకాలు. సమానమయిన సృష్టి అని అర్ధం. సృష్టికి ప్రతిసృష్టి చేశాడంటాం. సమానమయిన, సాటి అయిన సృష్టి. పురాణానికి అయిదు లక్షణాలుంటాయి. సర్గం, ప్రతిసర్గం, వంశం. మన్వంతరం, వంశానుచరితం అన్నవి ఆ అయిదు లక్షణాలు. వీటిలో (ప్రతిసర్గం ఒకటి. సర్షం అంటే (ప్రపంచ ఉత్పత్తి అనీ, ప్రతిసర్జం అంటే (బ్రహ్మాదులు చేసిన సృష్టి అనీ అర్ధం.
ప్రతిస్పర్ధ అంటే పోటీ. ప్రతిస్పర్థి అంటే పోటీపదేవాడు. (ప్రతి హస్తకుడు అంటే ప్రతినిధి. ప్రత్యాకారం అంటే ఒర. ఖడ్ధాదులకు ఉపయోగించేది. సమానమైన ఆకారం ఉంటుందనేమో.
'ప్రతికి ఉన్న మరొక అర్ధం తీసికోవడం. ప్రతిగ్రహం అంటే తీసికోవడం, దానం పుచ్చు కోవడం.. దానం తీసుకునే వస్తువును కూడా ్రతిగ్రహం అనవచ్చు. వెనుక ఉండే సేన అని కూడా అర్థం. రాజు తాను ఉన్నచోట ఈ సైన్యాన్ని చేపట్టి ఉంటాడు ముందు సైన్యం పోరాడుతూ ఉంటే వెనుక రెండు వందల ధనుస్సుల దూరంలో రాజుతోపాటు ఉండే సైన్యం ప్రతిగ్రహం. ప్రత్యాసారం అని మరోమాట ఉంది. ఇదీ సైన్యానికి సంబంధించిందే. చిందరవందరయిన ైన్యాన్ని కూర్చుకొని వచ్చే సేన 'ప్రత్యాసారం. ప్రతిగ్రాహం అన్నా దానం పుచ్చుకోవడమే. ప్రతి (గ్రాహ్యం అంటే పుచ్చుకొనతగింది. ప్రతిగ్రహించు అని క్రియగా వాడవచ్చు. (ప్రతి (గ్రహీత అంటే దానం పుచ్చుకొనేవాడు. భర్తను కూడా ప్రతిగ్రహీత అనవచ్చు. కన్యాదానం పుచ్చుకుంటాడు కదా. ప్రతి గ్రాహకుడు అన్నా దానం పుచ్చుకొనేవాడే.
(ప్రతిదానం అంటే కుదువపెట్టుకున్న వస్తువును తిరిగి ఇవ్వడం. ప్రతిదేయం అంటే కుదువ, తాకట్టు. తీసికొని మళ్ళీ ఇవ్వవలసిన వస్తువు (ప్రతిపన్నం అంటే పొందబడినది, తెలియ బడినది. ప్రతిపాదనం అంటే దానమనీ, నిరూపణమనీ అర్ధం ప్రతిపాదకం అంటే ఇచ్చేది, నిరూపించేది, (ప్రాపకం. ప్రతిపాదితం అంటే ప్రతిపాదింపబడింది. ప్రతిపాద్యం అంటే ప్రతిపా దింపదగింది. (ప్రతిపాదయిత అంటే వ్రతిపాదించేవాడు.
'ప్రతిశయం అంటే ప్రాపు, ఆశ్రయం. ఇంటిని ప్రతి శయం అంటారు. (ప్రతిశయం అంటే సభ అన్న అర్ధంకూడా ఉంది, ఉనికిపట్టు. ప్రత్యాదానం అంటే తిరిగి తీసికోవడం. (ప్రత్యాహరణం అన్నా అదే అర్ధం. ప్రత్యాహృతం అంటే తిరిగి తీసికోబడింది. ప్రత్యాహారం అన్నా తీసికోవడమే. విషయాల నుండి ఇంద్రియాలను మరలించడం కూడా ప్రత్యాహారం. వ్యాకరణంలో ప్రత్యాహార సూత్రాలున్నాయి. మొదటి చివరి వర్దాలతో వాటి మధ్యనున్న వర్జాలను కూడా (గ్రహించడం ప్రత్యాహారం. ఉదాహరణకు 'అఇ ఉణ్ అనే సూత్రం ఉందనుకుంటే అణ్ అన్నది ప్రత్యాహారం. అణ్ అంటే అఇజి అని (గ్రహించాలి. బ్
210 అ మనభాష
ప్రతిషేధం - ప్రతికూలం (ప్రతిహతుడు అంటే చంపబడినవాడు. ఇక్కడ హింస అని అర్థం. ప్రతిహతం అంటే మారుదెబ్బ పడినదనీ, తోసిపుచ్చబడిందనీ, అడ్డగింపబడిందనీ అర్థం. ఈ అడ్డగించడం అన్న అర్థంలోనే వ్యతిరేకార్థంలో అ(ప్రతిహతం అన్నమాట చాలా వాడుకలో ఉంది. అద్దులేనిది అని అర్ధం. అడ్డ గింపలేనిది. అప్రతిహతుడు అంటే అడ్డగింపబడనివాడు. ప్రతిఘాతం అన్నా ప్రతిఘాతనం అన్నా చంపడమని అర్ధం. ప్రతిఘాతం అంటే అడ్డగించడమన్న అర్థమూ ఉంది. (ప్రతిఘాతి అంటే వగ తీర్చుకొనేవాడు.
(ప్రతి సంవేదకుడు అంటే సవిస్తరంగా ఎరిగించేవాడు. ఇక్కడ ప్రతికి వ్యాప్తి అని అర్థం. (ప్రతిఖ్యాతి అంటే ప్రసిద్ధి.
ప్రతిక్షిప్తం అంటే అడ్డగింపబడింది. ఇక్కడ ్రతికి వారణం, అడ్డగించడమని అర్థం. (ప్రతినివర్తనం అంటే నివారణం. మనకు ఇష్టమయిన వస్తువు నుండి నివర్రించడం. వ్రతిబాధకం అంటే అడ్డగించేది. ప్రతిబాధి అన్నా ఇదే అర్ధం. (ప్రతిబంధం అంటే అడ్డగింపు. వాడికేమీ ప్రతి బంధాలు లేవు, అంటే అడ్డగించే విషయాలేమీ లేవని అర్ధం. అడ్డంకులు లేవన్నమాట. ప్రతి బంధకం అంటే అడ్డగించేది. నేను నీకేమీ ప్రతిబంధకం కాదలుచుకోలేదు అన్నప్పుడు అవరోధం కాదలచుకోలేదని అర్ధం. ప్రతిబంధనం అంటే అడ్డగింత. ప్రతిబంధి ఆంటే అద్దగించేది. వతి బద్ధం అంటే కట్టబడినది అని అర్థం. ప్రతియోగం అంటే కూడా అడ్డగించడమనే అర్ధం. ప్రతి యోగి అంటే అడ్డగించేవాడు. విరోధి.
ప్రతిరోధం అంటే అడ్డగించడం. ప్రతిరోధం అంటీ ముట్టడి అనీ, బలాక్కారంగా దొంగి లించడమనీ కూడా అర్ధం. ప్రతిమధనం అన్నా అడ్డగించడమే. వ్రతిరోధకుడు అంటే అడ్డగించే వాడు. ఎదిరించేవాడు, ముట్టడించేవాడు. వ్రతిరోధి అన్నా ఎదిరించేవాడనే అర్ధం. ఈ మాటకు బందిపోటు దొంగ అన్న అర్ధం కూడా ఉంది. (ప్రతిరుద్ధం అంటే అడ్డగింపబడింది. ముట్టడింప బడింది. ప్రతిరోధనం లాగే ప్రత్యవరోధనం కూడా.
'ప్రతివారణం అంటే నివారణమని అర్థం. ప్రతిషేధం అంటే నివారించడం, నిషేధం. నిరాకరించడమని కూడా అర్ధం. నిరోధించడమనీ అర్ధం. ప్రతిషేధం అని ఒక అలంకారం కూడా ఉంది. ప్రసిద్ధమైన నిషేధాన్ని మళ్ళీ చెప్పడం (ప్రతిషేధాలంకారం. యుద్ధం జరుగుతూ ఉంది. ఒక వీరునితో తలపడుతున్నాడొక జూదరి. వీరుడంటున్నాడు 'జూదరీ! ఇది జూదం కాదు, వొడి అయిన బాణాలతో ఆడే అటి అని. జూదం యుద్ధం కాదన్నది ్రసిద్ధమయిన విషయం. అందరికీ తెలిసిందే. అయినా, 'ఇది జూదంకాదు యుద్ధం అని చెప్తన్నాడు. అందువల్ల ఇతి ప్రతి షేధాలంకారం. జూదరికి జూదంలోనే నేర్పు తప్ప యుద్ధలో నేర్పులేదని వ్యంగ్యం. యుద్దానికి వస్తానన్న పిల్లవాణ్ణి చూచి “ఇది యుద్ధం, గోలీలాట కాదు' అన్నట్లు. ప్రతిషేధనం అంటే నిషేధం, నిరాకరణ, నివారణ. 'ప్రతిషిద్ధం అంటే నిషేధించబడింది. వ్రతిషేధకుడు అంటే నిరోధించేవాడు, నివారించేవాడు. ప్రతిషేద్ధ అన్నా ఇదే అర్ధం. ప్రతిష్టంభనం అంటే అడ్డగింత. ప్రతిష్టంభన అన్న మాట చాలా వాడుకలో ఉంది. చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడింది అంటాం. అడ్డు ఆటంకం ఏర్పడిందన్నమాట. అభివృద్ధి లేక ఆగిపోయాయని అర్థం. స్తంభనకు ప్రతిచేరి ప్రతిష్టంభన
ఏర్పడింది.
ప్రతిసేర అంటే యవనిక తెర. అడ్డంగా కట్టబడేది కాబట్టి ప్రతిసీర. 'ప్రతికి ముఖ్యమైన అర్భాలలో శ్నాక్రటి విరోధమన్నది. ఈ అర్థంలో పతికి చాలా విసృతంగా వాడుక ఉంది. ఉదా హరణకు కూలం అంటే ఒడ్డు. అనుకూలం అంటే కూలాన్ని అనుసరించి. దీనికి వ్యతిరేకం ప్రతి కూలం. ్రతిస్పర్థియైన కూలం కలిగినది. ప్రతికూలం అంటే అనుకూలం కానిది, అనను కూలం. ప్రతికూలుడు అంటే వ్యతిరేకి. అనుకూలంగా లేనివాడు. ప్రతికూల పవనాలు వీస్తు న్నాయి అంటాం. వ్యతిరేకంగా పరిస్థితి ఉందని అర్ధం. ప్రతిద్వంద్వి అన్నా ప్రతికూలుడనే అర్థం. వ్యతిరేకంగా పోటీచేసేవాడిని కూడా ప్రతిద్వంద్వి అంటాం,
(ప్రతికుంజరం అంటే శక్రువయిన ఏనుగు. ప్రతినాయకుడు అంటే నాయకునికి వ్యతిరేక మయినవాడు. నాటకంలో నాయకుడు, ప్రతినాయకుడు ఉంటారు. ఇంగ్లీషులో విలన్ అన్న మాటకు ఇది సమానం. ప్రతి ప్రయాణం ప్రయాణానికి వ్యతిరేకం. తిరిగిరావడమని అర్ధం. ప్రతి ' ప్రస్థానం అంటే పోయి శత్రుపక్షంలో చేరడం, రామాయణంలో విభీషణుడు చేసినపని. యజ్ఞం లో ప్రతి ప్రస్థాత అన్న ఒక బుత్విక్కు ఉంటాడు. అధ్వర్యునికి సహాయం చేసే బుత్విక్కుల్లో ప్రతి ప్రస్థాత ఒకడు.
ప్రతిభటుడు ఎదురుపక్షం వాడు. శత్రువు. ప్రతిస్పర్థి కూడా. ప్రతిమల్లుడు అన్నా శత్రువే, 'ప్రతిరధుడు అన్నా వ్యతిరేకి అనే అర్ధం. ప్రతియోధుడు, ప్రతిరథుడు, ప్రతివీరుడు సమానార్ధకా లయిన పదాలు.
'ప్రతిసమం అంటే సమంకానిది, సదృశంకానిది. విసదృశం. ప్రతిసారి అంటే విరుద్ధంగా పోయేది. ప్రతిసేన అంటే శత్రుసేన. (ప్రత్యర్ధి అంటే మనకు ప్రతికూలంగా కోరేవాడు.
ప్రతిపక్షం అంటే విరుద్ధపక్షం. అధికారంలో ఉన్న పక్షాన్ని అధికార పక్షం అనీ, అధి కారంలో లేనిపక్షం, అధికార పక్షానికి ప్రత్యర్థిపక్షాన్ని ప్రతిపక్షం అనీ అంటున్నాం. విపక్షం అని కూడా అంటున్నారు. ప్రతిపక్షి అంటే ్రతికూలుడు. (ప్రతిపక్షంలోనివాడు.
'ప్రత్యవాయం అంటే విపరీతాచరణం. ఆచరించవలసిన దానికి విరుద్ధంగా ఆచరించడం. (ప్రత్యాఖ్యానం అంటే ఎదురు చెప్పడం. నిరాకరించడం, తొలగద్రోయడం, ఖండించడం. ప్రత్యా ఖ్యాతం అంటే నిరాకరింపబడింది, తోసిపుచ్చబడింది. విరుద్ధంగా మాట్లాడినది. ప్రత్యాగమనం అంటే తిరిగిరావడం. ప్రత్యాగతి అని కూడా అనవచ్చు. ప్రత్యాదేశం అంటే విరుద్ధంగా నియో గించడం. ్రత్యాదిష్టం అంటే విరుద్ధంగా నియోగించబడింది. ప్రత్యాలీఢం అంటే భూమిని
స్పృశించేది. ఎడమకాలు ముందుకు చాచి కుడికాలు వెనుకకు పెట్టడం ప్రత్యాలీఢధం. ఇది ఆలీధానికి వ్యతిరేకం. ఆలీఢం అంటే కుడికాలు ముందుకు చాచి ఎడమకాలు వెనుకకు ఉంచడం, విలుకాడు నిలబడే పద్ధతులలో ఇవి రెండు. రెండు కాళ్ళూ సరిగా నిలిపితే సమపద మనీ, రెండుకాళ్ళ మధ్య జానెడు ఎడం ఉండేట్లు నిలబడితే విశాఖం అనీ, రెండు కాళ్ళను మండ లాకారంగా నిలపడం మండలం అనీ అంటారు ప్రత్యుత్థానం అంటే వచ్చిన వారిని ఆహ్వా నించడంకోసం ఎదురు వెళ్ళినట్లుగా లేవడం (ప్రత్యుత్ధితుడు అంటే (ప్రత్యుత్ధానం చేసినవాడు. (ప్రత్యుదాహరణం అంటే ఒక ఉదాహరణకు వ్యతిరేకంగా చెప్పే మరొక ఉదాహరణ. చ్ నా
ప్రతిధ్వని - ప్రతిభ “ఫ్రతికి మారు, బదులు అన్న అర్ధం ఉంది. ప్రతికరం అంటే బదులు చేయడం. ఒకడు చేసిం దానికి బదులుగా, సమాధానంగా మరొకడు చేయడం. ప్రతికర్మం అన్నా ఇదే అర్ధం. ప్రతికారం అన్నా అదే. ప్రతీకారం అనీ అనవచ్చు. మారుచేత, పగతీర్చుకోవడం. చికిత్స కూడా ఒక రకంగా (ప్రతికారమే. ప్రతిక్రియ అన్నా ప్రతికృతి అన్నా ఇదే అర్ధం. తగిన సమాధానం అన్నమాట. ప్రతి కర్తవ్యం అంటే తిరిగి చేయదగిన పని. ప్రతికృతం అంటే బదులుగా చేయబడినది. ప్రతికర్ర (ప్రతికారి అంటే బదులుగా చేసేవాడు. పగతీర్చుకొనేవాడు. ప్రతికారం చేసేవాడు. శత్రువు.
'ప్రతిగర్దన అంటే గర్జనకు మారుగర్దన. ప్రతిఘటన అంటే మారొడ్డటం. ఎదురు తిరిగి నిలవడం. ప్రతిఘటించు అని క్రియగా కూడా వాడతాం. ప్రతిఘం అంటే మారుదెబ్బ. ప్రతి ఘాతం అన్నా అదే. (ప్రతిఘాతి అంటే పగతీర్చుకొనే వాడు. చికీర్ష అంటే చేయాలనే కోరిక. (ప్రతి చికీర్ష అంటే ఐదులు చేయాలనే కోరిక. ప్రతిధ అంటే ప్రతీకారం. వ్రతివిధి, ప్రతివిధానం అంటే మారుసేత, నివారణోపాయం.
(ప్రతిధ్వని అంటే ఒక ధ్వని కాగా దానికి ప్రతిగా వచ్చే ధ్వని. ఇంగ్లీషులో రిసౌండు అన్నమాటకు సమానార్ధకం. అయితే దీన్ని ఆలంకారికంగా కూడా ఉపయోగిస్తాం. ఒకరు చెప్పిన మాటల్నే మరొకరు కూడా అనుసరిస్తే, అంటే చిలకపలుకులు వలికితే దాన్నీ ప్రతిధ్వని అంటాం. సొంతగొంతుక లేకపోవడం. ్రతిధ్వానం, ప్రతిశబ్దం, (ప్రతినాదం అన్నమాటలు ్రతిధ్వనికి సమానార్ధకాలు. (ప్రతిరవం అనికూడా అనవచ్చు. ప్రతిరవం అంటీ కలహం, (ప్రతికూల శబ్దరి అనికూడా అర్థం.
ప్రతిపూజనం అంటే ఎదురుపూజ, ఎదుటి వాడు మనకు చేసిన పూజకు మారుగా మనం ఎదుటివాడిని పూజించడం. పరస్పర పూజ. ప్రతి ప్రణామం అంటే ప్రణామానికి ప్రణామం. ప్రతి నమస్కారం కూడా ఇంతే. మనకు నమస్కరించిన వానికి మనం నమస్కరించడం. వ్రత్యభివాదం అన్నా ఇదే అర్థం.
ప్రతి ప్రశ్న అంటే ప్రశ్నకు మారు ప్రశ్న జవాబు అని కూడా అర్థం.
(ప్రతి ప్రహారం అంటే మారుదెబ్బ. దెబ్బకు దెబ్బ అన్నమాట. ప్రతిఫలం అంటీ తగినఫలం. చేసిన పనికి అనుగుణమైన ఫలం.
(ప్రతిభాష అంటే మారుపలుకు. ఎదుటివాడి వలుకులకు బదులు చెవ్సడం. వ్రతియశ్నం అంటే మారుయత్నం. ప్రతియానం అంటే తిరిగిపోవడం, మరలిపోవడం, ప్రతియుద్ధం అంటే ఎదుర్కోవడం. ప్రతియోధనం అనికూడా అనవచ్చు.
('ప్రతివచనం, ప్రతి వచస్సు, ప్రతివాక్యం, పవ్రతివాదం అంటే మారుమాట, సమాధానం, వ్యతిరేకంగా చెప్పేమాట (గ్రతివాది అంటే వాదానికి ఎదురు వాదం చేసేవాడు. న్యాయస్థానం భాషలో వాది అంటే వ్యాజ్యం తెచ్చినవాడు. ఎవరిమీద వ్యాజ్యం వచ్చిందో వాడు వ్రతివాది. ప్రతి వాది అంటే శత్రువన్న అర్ధం కూడా ఏర్పడింది. మన వాళ్ళలో (ప్రతివాది భయంకరం అన్న ఇంటి పేరున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతివాదించు అని క్రియగా కూడా ప్రయోగం ఉంది. (వ్రత్యుక్తి అంటే సమాధానం. ప్రత్యుక్తం అంటే బదులు చెప్పబడింది.
ప్రతివైరం అంటే పగతీర్చుకోవడం. ప్రతివ్యూహం అంటే వ్యూహానికి ప్రతిగా పన్నిన వ్యూహం. వ్యూహ 'ప్రతివ్యూహాలంటాం,
మనభాషతి 213
('ప్రతిశయనం అంటే ఎదురుగా పడుకోవడం. కోరిన కోరికలు తీరడం కోసం భగవంతుని ముందు ఆహారాదులు మాని పరుండదాన్ని కూడా (ప్రతిశయనం అంటాం. ప్రతిశయనం చేసే వాడు ప్రతి శయితుడు.
వ్రతిశాపం అంటే శాపానికి మారుగా శాపం ఇవ్వడం. ప్రతిసందేశం అంటే సందేశానికి మారుసందేశం. ప్రతిహాసం అంటే మారు నవ్వు ఎదుటివాడు నవ్వితే మనమూ నవ్వడం. ్రతీక్ష ప్రతీక్షణ అంటే ఎదురు చూడడం. ప్రతీక్షితుడు అంటే ఎదురుచూడబడిన వాడు. గౌరవింపబడిన వాడు. (ప్రతీక్షుడు ఆంటే ఎదురుచూచేవాడు. ప్రతీక్ష్యుడు అంటే ఎదురుచూడదగినవాడు.
వ్రత్యభియోగం అంటే మారు అభియోగం. ఒకడు మనమీద అభియోగం మోపితే వాడి మీద మనం అభియోగం మోపడం. (ప్రత్యాఘాతం అంటే మారుదెబ్బ. ప్రత్యాహతం మారుదెబ్బ తగిలినది.
ప్రత్యుజ్జీవనం అంటే చచ్చిబతకడం, బతికించడం,. పునర్జీవనం అన్నమాట. (ప్రత్యుత్తరం అంటే మారు సమాధానం. ప్రత్యుత్సన్నం అంటే మరల పుట్టింది. అప్పటికి స్ఫురించింది అని కూడా అర్ధం. ప్రత్యుత్చన్నమతి అంటే సమయానికి తగిన ఆలోచన కలిగేవాడు.
(ప్రత్యుపకారం అంటే మారు ఉపకారం. చేసిన ఉపకారానికి బదులు మళ్ళీ ఉపకారం చేయడం. ప్రత్యుపదేశం అంటే ఉపదేశానికి మారు ఉపదేశం.
ప్రతిజిహ్వ అంటే కొండనాలుక.
(ప్రతిజ్ఞ అంటే ఒక పనిచేస్తానని గట్టిగా చెప్పడం, ఒట్టు. ప్రతిజ్ఞానం అంటే అంగీకారం. ప్రతిజ్ఞాతం అంటే ప్రతిజ్ఞ చేయబడినది. (ప్రతిజ్ఞాతవ్యం, ప్రతిజ్హేయం అంటే ప్రతిజ్ఞ చేయదగినది. 'ప్రతిజ్ఞాహాని, ప్రతిజ్ఞా సన్యాసం అంటే ప్రతిజ్ఞ తప్పడం. (ప్రతిశుతం అంటే ప్రతిజ్ఞ,
(ప్రతి తరం అంటే తెడ్డు. దాటించేది. ప్రతి దృష్టాంత సమం అంటే పనికిమాలిన జవాబు. ప్రతిపాలనం అంటే రక్షించడం, (ప్రతిపాలకుడు అంటే రక్షకుడు.
ప్రతిభ అంటే స్ఫూర్తి బుద్ధి కాంతి. 'నవనవోన్మేషశాలినీ ప్రజ్ఞాప్రతిభామతా?, ఎప్పటి కప్పుడు కొత్త ఊహలు తోచే బుద్ధి. కావ్యహేతువుల్లో ప్రతిభ ముఖ్యమైంది. 'ప్రతిభాసం, ప్రతిభా సనం ఆంటే తటాలున తోచడం.
ప్రతిముఖం అంటే అభిముఖం. ప్రతివేశం అంటే పొరుగిల్లు, ప్రతిశీర్నకం అంటే తాకట్టు,
ప్రతిష్ట అంటే స్థానం, క్తీర్తి నెలకొల్చ్బడం. (ప్రతిష్ట అంటే ప్రసిద్ధం అన్న అర్ధమూ ఉంది. ప్రతిష్టాపనం అంటే నిలపడం. ప్రతిష్టించు, ప్రతిష్టాపించు అని క్రియగా కూడా వాడతాం. ప్రతిహారి, ప్రతీహారి అంటే కావలివాడు. ప్రత్యామ్నాయం అంటే బదులుగా నియమింపబడదేది. ప్రతినిధి. (ప్రత్యేకం అంటే వేరువేరు. ప్రత్యవేక్షణం అంటే ముందు వెనుకలు చూడడం.
“వతి చేరినప్పుడు అర్ధభేదంలేని సందర్భాలు కూడా ఉన్నాయి. (ప్రతిగర్హితం అంటే నిందింపదిడినది. ప్రతిజాగరం అంటే మేలుకోవడం. ప్రతి నవం అంటే కొత్తది. ప్రతినియమం అంటే వ్యవస్థ.
(ప్రతి మళ్ళీ మళ్ళీ అన్న అర్ధంలోనూ వస్తుంది. దినదినం అన్న అర్ధంలో ప్రతిదినం. అట్లాగే ప్రతి సంవత్సరం. “ప్రతిని తెలుగులో ఈ అర్థంలో విశేషణంగా చాలా ఎక్కువగా వాడుతున్నాం. ప్రతిరోజు, ప్రతినెల, ప్రతివాడు, ప్రతిఒక్కరూ, ప్రతిమాట, ప్రతిసారీ, (ప్రతిరోడ్డు మొదలైన విధంగా అన్ని రకాల మాటలకూ దీన్ని విశేషణంగా వాడుతున్నాం. ఖ్
214 అమనభాష
వరివాలన - పరిమళం
కళ. ఉపసర్గ కూడా ఎక్కువ మాటల్లో వాడేదే, దీనికీ చాలా అర్భాలున్నాయి. అతిశయం అన్నది ఒక అర్ధం. ఉదాహరణకు కృశం అంటే చిక్కినది. దీనికి ముందు “పరి చేరిస్తే పరికృశం అవు తుంది. పరికృశం అంటే మిక్షిలి చిక్కినదని అర్ధం. అట్లాగే పరికోవం. పరికోవం అంటే మిక్కిలి కోపం. పరిక్షేశం అంటే గొప్ప బాధ. పరిక్షిష్టం అన్నా మిక్కిలి క్లేశమనే అర్ధం. క్వణనం అంటే మోగడం, ధ్వని. పరిక్వణనం ఆంటే పెద్ద ధ్వని. పరిక్షామం అంటే మిక్షిలి చిక్కినది. బాగా తాగి మత్తెక్కినవాణ్ణి పరిక్షీబుడు అంటారు. ఖిన్నుడు అంటే దుఃఖం పొందినవాడు. వరిఖిన్నుడు అంటే చాలా దుఃఖం పొందినవాడు, గొప్ప దుఃఖం. గర్హణం అంటే నిందించడం. పరి గర్హణం అంటీ తీవ్రంగా నిందించడం. గహనం అంటే చౌరరానిది. అడవి అని కూడా అర్థం. గహనమయిన విషయం అంటే తేలికగా అంతుబట్టని విషయం. పరిగహనం అంటే మిక్కిలి గహనమయినది.
గూఢం అంటే రహస్యం. దాచబడినదని అర్ధం. పరిగూఢం అంటే మిక్కిలి రహస్యం. గ్లాని అంటే బడలిక, పరిగ్లాని అంటే ఎక్కువ బడలిక. పరిగ్గానం అంటే చాలా బడలిక పొందినటు వంటిది. పరిఘోష అంటే మవాధ్వని. తాపం అంటే వేడిమి. పరితాపం అంటే మిక్కిలి వేడిమి. ఆయన పరితపించాడు అన్నప్పుడు చాలా బాధపడ్డాడని అర్ధం. తుష్టి అంటే తృప్తి అనీ, సంతోష మనీ అర్ధం. పరితుష్టి అంటే గొప్ప తృప్తి, గొప్ప సంతోషం. పరితోషం అన్నా అదే అర్థం. వరి తోషణం అంటే తృప్తి పరచడం, సంతోషపెట్టడం. పరితుష్పుడు, పరితోషి పరితృప్తుడు అంటే మిక్కిలి తృప్తి, సంతోషం పొందినవాడు. పరితోషించడమంటీ సంతోషించడం.
పరిత్రస్తం అంటే మిక్కిలి భయం చెందినది. పరిదీప్తం అంటే బాగా వెలిగినది. వరిదృఢం అంటే చాలా గట్టిది.
వరిపూజ అంటే గొప్పపూజ. గొప్పపూజను, ఆదరాన్ని పొందిన వాడు పరిపూజితుడు. పరిపూజన, పరిపూజనం అని కూడా అనవచ్చు.
వరిపాలన అంటే మంచి పాలన. పరిపాలితం అంటే చక్కగా పాలింపబడినది. పరిపాల కుడు అంటే పరిపాలన చేసేవాడు.
పరిపూతం అంటే మిక్కిలి శుద్ధమయినది, పవిత్రమైనది అని అర్థం. పరిపూరణం అంటే చక్కగా నిండించడం. పరిపూర్ణం చక్కగా నిండినది. నిండయినది. పరిపూర్ణత అంటే నిండు తనం. పరిపూర్తి అంటే పూర్తిగా నిండడం, సంపూర్తి సమృద్ధి, సమాప్తి.
పరిష్ఫచ్ళ అంటే చక్కగా ప్రశ్నించడం. పరిప్రశ్న అన్నా అదే అర్థం. పరిపోషితుడు అంటే చక్కగా పోషింపబడినవాడు. పరిపేలవం అంటే మిక్కిలి పేలవం.
పరిప్రాప్తి అంటే చకృగా పొందడం. పరిప్రేషణం అంటే పూర్తిగా వంపివేయడం. వరిప్రే ష్యుడు అంటే పంపదగినవాడు, సేవకుడు. పరిభుక్తం అంటే చక్కగా భుజింపబడింది. పరిభోక్త అంటే చక్కగా భుజించేవాడు. చక్కగా అనుభవించేవాడు, పరిపాలకుడు.
పరిమితం అంటే మిక్కిలి మితం. పరిమితి అంటే హద్దు, పరిమందం అంటే మిక్కిలి మెల్ల నిది
వరిమళం అంటే గంధం, మనోహరమయిన వాసన. నానావిధ [ద్రవ్యాలను మెదవడం
వల్ల పుట్టే జన మనోహరమయిన సువాసన. ధరింపబదేది కాబట్టి పరిమళం. కుంకుమాదుల గంధం.
పరిమోక్షం అంటే పూర్తి విమోచన. విడుదల, తప్పించుకోవడం. పరిమోక్షణం అంటే విడుదల. పరిమోహనం అంటే ఆకర్షించడం. మిక్కిలి మోహపెట్టడం. మ్లానం అంటే వాడినది. పరివ్లానం అంటే మిక్కిలి వాడిపోయినది.
పరిరక్షణం అంటే చక్కగా రక్షించడం. పరిరక్షితం అంటే చక్కగా రక్షింపబడింది, ఈ అర్థంలోనే పరిరక్షకుడు. పరి లఘువు చాలా తేలిక. పరిలుష్తం అంటే బాగా లోపించినది.
పరివర్ధనం అంటే చక్యగా పెరగడం. పరివర్ధితం అంటే చక్కగా పెంచబడింది పరివాహం అంటే పొంగిపార్లేది, నది. వరిశోధన అంటే మిక్కిలి శోధించడం. రిసెర్చి అనే ఇంగ్లీషు మాటకు సమానార్థకంగా వాడుతున్నాం. పరిశీలనం కూడా ఇటువంటిదే. పరిశీలించు, పరిశోధించు అని (క్రియలుగా కూడా వాడతాం. పరిశోషం బాగా ఎండడం, వాడిపోవడం. పరిశుష్కం అంటే బాగా ఎండినది. వాడిపోయినది. పరిశూన్యం అంటే పూర్తిగా లేనిది, వచ్చిది.
పరిశ్రమ అంటే మిక్కిలి శ్రమ, పరిశ్రమ అంటే వ్యాయామం అని కూడా అర్ధం. పరిశ్రమ అన్నమాటను ఇండస్ర్టీ అన్న ఇంగ్లీషు మాటకు సమానంగా వాడుతున్నాం.
పరిశ్రాంతి అంటే మిక్కిలి ఆయాసం. మిక్కిలి విశ్రాంతి అని కూడా అర్థం. గట్టి ప్రయత్న మన్న అర్ధం కూడా ఉంది. వరిశ్రాంతం అంటే మిక్కిలి ఆయాసం చెందింది, ఊరట చెందింది.
పరిసమాప్తం అంటే పూర్తిగా సమాప్తి చెందింది. చక్కగా ముగిసింది. పరిసమాప్తి అని కూడా అనవచ్చు. పర్యాస్తం అంటీ కూడా సమాప్తి అనే అర్ధం. పర్యాప్తి అన్నా అదే అర్థం. పర్యాప్తం అంటే యధేస్టమని కూడా అర్ధం. హ్యూప్తి అన్నా ఈ అర్ధం ఉంది.
పరిస్ఫుటం అంటే మిక్కిలి స్ఫుటమయినది. తేటతెల్లం. చక్కగా వికసించినది. పరిస్రవం అంటే ప్రవహించడం. పర్యాయం అంటే క్రమం తప్పకుండా రావడం.
ప్యూయోక్తి అని ఒక అలంకారం కూడా ఉంది. సూటిగా చెప్పకుండా మరోవిధంగా చెప్పడం. రాహువు భార్య సౌందర్యాన్ని నిష్ఫలం చేసిన విష్ణువుకు నమస్కారం అని ఉదాహరణ. ఆమె సౌందర్యం నిష్ఫలం కావడానికి కారణం రాహు మరణం. దానికి కారణం విష్ణువు, రాహువును చంపిన విష్ణువుకు నమస్కారం అని చెప్పడానికి ఐదులు కవి ఇట్లా చెప్పాడు. మీరు ఇక్కడే ఉండండి నేను పూజ చేసి వస్తాను అని నాయికా నాయకులను విడిచి స్నేహితురాలు వెళ్ళిపోయింది. నాయికా నాయకులకు ఏకాంతం కల్పించడానికి స్నేహితురాలు ఏర్పరుచుకున్న నెపం. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడానికి అవకాశం కల్పిస్తూ మరోపని కల్పించుకొని అవత లికి పోవడం మామూలే కదా.
బా 216 ఆ మనబాష
ఉపాసన - ఉపేంద్రుడు
“ఉప' ఉపసర్గల్లో చివరిది. ఇదికూడా అనేక అర్థాలలో వస్తుంది. దగ్గర, చిన్న అధికం, పోలిక మొదలైన అర్భాలలో “ఉపాచేరుతుంది. ఉపసర్ణ అన్నమాటలోనూ ఈ “ఉపి ఉంది. బహుపద నిర్మాణానికి, సృజనకు అధారమిది.
ఉపకంరం అంటే కంఠానికి సమీపంలో ఉన్నదని అర్ధం. దగ్గరగా ఉన్నదని కూడా అర్థం. సమీపకాలం, సమీపడేశం అన్న అర్ధంలో ఈ మాటను వాడవచ్చు. కనిష్టిక అంటే చిటికెన వేలు. దానికి సమీపంలో ఉండేది ఉంగరపువేలు, అనామిక, దీన్ని ఉప కనిస్టిక అంటారు. ఉపకన్య అంటే చెలికత్తె. ఉపక్రమణం అంటే ప్రారంభించడం. ఉవగక్రమణి, ఉపక్రమణిక అంటే పీఠిక ఉప(క్రమించు అని (క్రియగా కూడా వాడతాం. ఉపగతి అంటే సమీపించడం. ప్రాప్తి జ్ఞానం అని కూదా అర్ధం. ఉపగమం అన్నా ఇదే అర్ధం. ఉపగాత అంటే తోడుగా పాడేవాడు. ఉపగీతి అన్నది ఒక గీత భేదం. ఉపగ్రహణం అంటే పట్టుకోవడం. ఉపగ్రాహ్యం అంటే దగ్గర పెట్టుకోదగింది
ఉవచక్షుస్సు, ఉపనేత్రం అంటే కళ్ళజోడు. ఉపతటం అంటే తట సమీవంలో. ఉవదశం అంటే పదికి దగ్గరగా ఉన్నది. తొమ్మిదికాని, వదకొండు కాని. ఉవద్రష్ట్ర అంటే దగ్గర ఉండి చూసేవాడు. యజ్ఞ నిర్వహణంలో మంచిచెడ్డలు కనిపెట్టి చూసే బుత్విక్కు
వ్యాకరణంలో ఉపధ అన్న పరిభాష ఉంది. పదంలో చివరి వర్దానికి ముందు ఉండే వర్ణం. ఉపధానీయం అంటే దగ్గరగా ఉంచదగింది, తలగడ. ఉపధావనం అంటే వెంటవడదం, మననం చేయడం,
ఉపనతం అంటే సమీపించినది, వంగినది అని అర్ధం. ఉపనతి అన్నా ఇదే అర్థం. ఉప నయనం అంటే దగ్గరకు తేవడం. ఉపనయనం అంటే వడుగు. వేదం చదివించడానికి పిల్లవాడి గురువు దగ్గరకు పంపటంకోసం చేసే సంస్కారం. ఉపనయం అనీ అనవచ్చు. ఉపనాయం, ఉప నాయనం అనికూడా అనవచ్చు. వడుగయినవాడు ఉపనీతుడు. ఉపనేతవ్యుడు అంటే ఉపనయ నార్హుడు.
ఉపన్యాసం అంటే దగ్గర ఉంచడం. ఇల్లడ పెట్టడం. ఒక విషయాన్ని విస్తరించి చెప్పడం కూడా ఉపన్యాసమే.
ఉపపదం అంటే ఒక పదానికి ముందు అవ్యవహితంగా ఉండే పదం. పేరుకు వెంటనే తగిలి ఉందే బిరుదులాంటిది కూడా ఉవవదమే. శర్మ, శాస్త్రి, వర్మ లాంటివి.
ఉపబంధం అంటే గట్టిగా ఉండడంకోసం వేసే రెండో ముడి. ఉపయాచకుడు అంటే దగ్గరకు వచ్చి యాచించేవాడు. ఉపవక్త అంటే వక్తకు సహాయం చేసేవక్త, ఉప వ్యాఖ్యానం అంటే వ్యాఖ్యానం చాలని చోట రాసే వ్యాఖ్యానం. ఉపశాఖ అంటే శాఖ నుండి పుట్టిన శాఖ. ఉప శిష్యుడు అంటే శిష్యునకు శిష్యుడు, ప్రశిష్యుడు. ఉవసత్త దగ్గర ఉండే సేవకుడు. ఉపసదనం గురువుల దగ్గర కూర్చోవడం, శిష్యుడు కావడం, ఉవస్థితం అంటే దగ్గర ఉన్నది. ఉపాంతం అంటే అంతానికి దగ్గరగా ఉన్నది.
ఉపాధ్యాయుడు అంటే అధ్యాపకుడు. ఇతని దగ్గరకు పోయి చదువుకుంటాం కాబట్టి ఉపాధ్యాయుడు. వేదం చదివించేవాదు.
సమీపంలో ఉండి సేవచేయడం ఉపాసన, అగ్ని సమీపంలో ఆచరించే అనశనవ్రతం ఉపవాసం, ఇప్పుడు తినకపోవడమే ఉపవాసం అయింది.
వ్యాకరణంలో ఉత్తమం అంటే రెండక్షరాలకంటే ఎక్కువ అక్షరాలున్న మాటలో చివరి
మవభాషతి 21/7
అక్షరం. ఉపోత్తమం అంటే ఉత్తమానికి ముందున్నది.
ఉప అంటే చిన్న అన్న అర్థం ఉంది. ఉపకీచకులు అంటే కీచకుని తమ్ములు. ఈ అర్ధంలోనే ఉపేంద్రుడు. ఇంద్రుని తమ్ముడు, విష్ణువు. సుందోపసుందుల్లో ఉపసుందుడు సుందుని తమ్ముడు. ఉపాఖ్యానం అంటే ప్రధాన కథలో నేపథ్యం చెప్పడానికి వచ్చే అవాంతర కధ.
కుల్య అంటే కాలువ. ఉపకుల్య అంటే చిన్న కాలువ. ఉపనది పెద్ద నదిలో కలిసే చిన్ననది. ఉవగ్రంథం అంటే పెద్ద గ్రంధానికి అనుబంధంగా రచించిన చిన్నగ్రంథం. ఉపగణం అంటే చిన్న గణం. [గ్రహం చుట్టూ తిరిగే చిన్నగ్రహం ఉపగ్రహం. ఉపరధ్య అంటే చిన్నదారి.
ఉపపురం అంటే పేట. అష్టాదశ పురాణాలతో పాటు మనకు ఉపపురాణాలు కూడా ఉన్నాయి. పురాణాలు వ్యాసకృతాలు. ఇతర మునులు రచించినవి ఉపపురాణాలు. దశవిధ రూపకాలతో పాటు నాటిక, త్రోటకం, గోష్టి మొదలైన 18 రకాల ఉపరూపకాలున్నాయి.
ఉపమంత్రి అంటే చిన్న మంత్రి. ఉపాధ్యక్షుడు, ఉపప్రధాని మొదలైన మాటలెన్నో వాడుతున్నాం. దాదాపు అన్ని పదవులకీ ఈ ఉపపదవులు తప్పవు.
ఉపనాయిక అంటే నాయిక కంటే కొంచెం తక్కువ. ఉపపాతకం అంటే చిన్నపాపం, ఉపరత్నం అంటే తక్కువ రకపు రత్నం. ఉపనక్షత్రం అంటే అశ్విని మొదలైన నక్షత్రాలకుండే ఇరవయ్యేడేసి చిన్న నక్షత్రాలలో ఒకటి. ఉపాహారం అంటే చిరుతిండి. ఉపధర్శ్మం అంటే అప్రధానమైన ధర్మం. అవైదిక ధర్మం.
“ఉపి పోలికను కూడా తెలుపుతుంది. ఉపభూషణం అంటే భూషణం లాంటిది. ఉత్తరీయం లాంటివి ఉపభూషణాలు. ఉపమ అంటే ఇతర వస్తువు దేనితో పోల్బబడునో అది. అలంకారాలన్నిటిలో ముఖ్యమైనది ఉపమాలంకారం. ఉపమానం, ఉపమేయం, ఉపమావాచకం, సమాన ధర్మం అన్న నాలుగు భాగాలుంటాయి ఉపమాలంకారంలో. 'ఉపమా కాళిదాసస్య' అని నానుడి. ఉపమాలంకారానికి కాళిదాసు ప్రసిద్ధుడు. ఉపమాత అంటే దాది. మాత్ళ సమానురాలు. ఉపవేదం అంటే వేద సదృశమైనది. బుగ్వేదానికి ఆయుర్వేదం ఉపవేదం, యజుర్వేదానికి ధనుర్వేదం, సామవేదానికి గాంధర్వవేదం, అధర్వవేదానికి స్థాపత్య, శస్త్ర వేదాలు ఉపవేదాలు. ఉపాంగం అంటే వేదాంగ సదృశం. మీమాంస, న్యాయశాస్త్రం, పురాణం, ధర్మశాస్త్రం ఉపాంగాలు.
ఉపతప్తం అంటే మిక్కిలి తపింపజేసేది. ఇక్కడ 'ఉపికు ఎక్కున అని అర్ధం.
ఉపనిధి అంటే మరొకని వద్ద దాచిన నిధి. అందులో ఏముందో, దానిరూపం ఏమిటో, ఎంత ఉందో చెప్పకుండా దాచేది. ఉపనిక్షేపం అంటే చెప్పి, చూపించి దాచేది. ఉపనిధిగా దాచినవాడు ఉవనిధాత.
ఉవజ్ఞ అంటే మొదటిసారి చెప్పినది. ఇతరుల ఉపదేశం లేకుండానే మొట్టమొదట కలిగే జ్ఞానం. ఉపజ్ఞాతం అన్నా అదే.
ఉపదిక్కు అంటే విదిక్కు మూల. ఉపాదానం అంటే తీసికోవడం. ఉపహాసం అంటే పరిహాసం.
ఒకేమాటకు ఒకటికంటే ఎక్కువ ఉపసర్గలను కూడా ఒకేసారి చేర్చవచ్చు. అభినివేశంలో
అభి, ని అనే ఉపసర్గలున్నాయి. ఉపసంహారంలో ఉప, సం అనే ఉపసర్గలున్నాయి. దురా గ్రహంలో దుర్, ఆజ్ అనే ఉపసర్గలున్నాయి. సుపరిపాలనలో సు, పరి అనే ఉపసర్గలున్నాయి. పరినిర్వాణంలో పరి, నిర్ అనే ఉపసర్గలున్నాయి. సంస్కృతంలో ఉవసర్గలు అనేక వదాల కల్పనకు ఉపయోగపడుతున్నాయి. 2168 అమునభాష
4 క్ష ఆను శ లతో ॥ టై
లన దాక్టర్ డి.చంద్రశేఖర రెడ్డి న. 1-8-1949న జననం ( మాటలో మృదుత్వం, మనసు స్నేహార్టం నా న తెలుగు కావ్య పీఠికలపై పిహెచ్.డి పట్టం శ్లః ను పాతికేళ్ళుగా బోధనే సర్వస్వం వ పరిశోధన విద్యార్థులకు
మో పదేళ్ళుగా మార్గదర్శకత్వం .
నన సాహితీ క్షేత్రాన నిర్విరామ వ్యవసాయం న నన దువ్వూరి రామిరెడ్డిపై నిశిత పరిశీలనం వ. .. తెలుగువాచకాలకు కరృత్వం, సంపాదకత్వం . నమ షం. “మన జాతి నిర్మాతలికు అక్షర నీరాజనం . .. . చు | సాహిత్య వ్యాసాల సంకలనం . మ ము “సంహిత . న అనువాద కవితల పుస్తకం వ ( . “బలవంతులు” వ. నటనను... ప్రచురితం. 1.