Telugu mahabharatha neethi kathlau - anilvaranasi/indianlanguages GitHub Wiki

[34 అగ మయమజహాభారత: మై క్రంపాటి రామగోపాలకష మూరి 3 మ. గ శవ. నం త్త ఖు [| వలీ చాడు వ. య. ॥ టు | ౧ గ్ర ల /" వ్రు నై నం తో ॥ న ట్‌ డ్రె వగ | వ... ష్‌ కి ” ణన . క. వ. / భధళళి క ' ౧ న

మహాభారత నీతి కథలు ) తర్మాచార్య, భాషాప్రవీణ డా॥ కంభంపాటి రామగాోపాలకృష్ణమూర్తి ఎం.ఏ., పెహెచ్‌,డి, సుధా బుక్‌ పస్‌ ఏలూరు రోడ్డు, విజయవాడ-2 |

ఉన్‌ - 2001 య్‌ (| "తొ వుహాభారత నీతి కథలు - 1 ం ల ఇంగ చూ వెల:రూ. 60౪-0౦౦ ఛాంటంాచ ల లేం | న శం కో గ్‌ న త క. 1,9 ఓమ్‌ సాయి గ్రాఫిక్స్‌ మరో శాల600 0%. ముఖ చిత్రం : రాము.పి

ఆరాాాంాలా మవాభారతనీతి కథలు -౯ లా శ్రీ జనమజయుిడు. శ్లో! నారాయణం నమనస్కృతం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముధీరయేత్‌ ॥ శ్లో! వ్యాసం వసిష్ట సప్తారం శక్తేపొత్ర మకల్మషం పరాశరాత్మజం వందే శుకాతాతం తపోనిథిమ్‌ 1 శ్లోః శ్రీ వాణీగిరిజా శ్చిరాయు దధథతో వక్షోముఖాంగేషు యే లోకానాం స్థితి మావహస్త్య విహతాం స్రీ పుంసయో గోద్భావాం తే వేదత్ర యమూర్తయ స్త్రీపురుషా స్పంపూజితా వస్సురై ర్ఫ్భూయానుః పురుషోత్తమాంబుజభవ,శ్రీకంధరా శ్రేయసే శ్రీ మహాభారతము మనకు పూజ్యమైన గ్రంథము. దీనిని సంస్కృతమున వ్యాసమహర్షి రచించెను. దీనినే తెలనుగున కవిత్రయము (నన్నయ, తిక్కన, ఎజ్ఞ్జాప్రెగడ్డలు) రచించిరి. ఇది ఇతిహానగ్రంథము. అనగా ,కథ లెక్కువగా కలది అని అర్ధము. అదికాక. దీనికి “పంచమ వేదము” (అయిదవ వేదము,.వేదములేరీతిగా నీతి నియములను బ్లోధించినవో ఆ రీతిగా ఇదికూడ చక్కగా నీతిబోధ చేయునని అర్ధము) అనియు పేరున్నది. ఇందలి పిట్టకథలే కాక ప్రతి పాత్రయు గొప్పవారే! వారందరును మన కాదర్శ వ్యక్తులు. మంచివారేకాని, చెడ్డవాలిట్లా దర్శవ్యక్తులగుదు రందురేమో? వినుడు, మంచివారల కథల చదివికొని మంచి నేర్చుకొన్నట్లే, చెడ్డవారి కథల్తను చదివియైన దుర్గుణముటను వదలవలెను: అందుచే ప్రతి వ్యక్తి యొక్క కధయు తెలిసికొన దగినదే. “=... లోకములో మన మందరి జీవిత చరిత్రలను చదువలేము, వ్రాసిన వారును లేరు. మహాభారత మట్టి రకరకపు వ్యక్తుల చరిత్ర యగుటచే దాని చదివినందున మనకెక్కువ లాభమున్నది. ఆ పుస్తక్కమంతయు చదువుట తేలికయైన పని-కాదు. “చేటభారత” మని సామెత వినని వారుండరు. 'ఆ' కథ ఎన్నాళ్ళు చెప్పినను చదివినను తరగదు. అట్టి కథను చదివి పాత్రల మంచిచెడ్డలను గుర్తుంచుకొనుట కష్టము కాననేనా పాత్రను గైకొని వరుసగా నా శక్తి కాలది వారి చరిత్రల నందించెదను. దీనొ ద్వారా బాలురు సులభముగా భారత పాత్రలను తెలిసికొనగలుగుదరు. అవధరింపుడు. ' " స శ్‌

అబా నుహభారతనీతి కథలు - గా

ఒక్కొక్క గ్రంధమున కొక్కొక్కరు వక్త (దెప్పెడివాడు), శ్రోత (వినువాడు) గా నున్నారు. మనయుద్ధ్రంథములగు భారత, "భాగవత, రామాయణము లిట్లే యున్నవి. అందు మహాభారతము జనమేజయునకు వైశం పాయనుడు చెప్పినట్టున్నది. కాన మనము మున్ముందుగా జనమేజయుని గూర్చి తెలిసికొందము

పంచ పాండవులలో అర్జునునికి, సుభద్రకును పుట్టినవాడు అభిమన్యుడు. అతనికి ఉత్తరకును కొడుకు పరీక్షిత్తు అతనికి మాద్రవతికి జనమేజయుడు పుట్టెను. ఇతడర్జునునికి మునిమనమడగును.

ఆ జనమేజయుడు కురుక్తేత్రములో దీర సత్రము చేయుచుండగా ఒకనాడు దేవలోకపు కుక్క “సరమ”యను దాని కొడుకు “సారమేయుడు” ఆటలకై అక్కడికి వచ్చెను. దానిని చూచి, చిన్నపిల్లల చేషస్టలుగా పనిలేకపోయినను విలాసముగా జనమేజయుని తమ్ములు “శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు” అనువారలు దానిని కొట్టిరి? అది వెంటనే పరుగెత్తుకొనిపోయి తల్లితో చెప్పినది. తల్లియైన సరమ వచ్చి రాజుతో “రాజా! నీ తమ్ములు గర్వముతో నిష్కారణముగా నా కొడుకును కొట్టిరి. ఎంత రాజసోదరులైనను మంచి - చెడ్డల చూడనక్కరలేదా? బీదలమైనంత మాత్రాన మమ్ముకొట్టటయేనా? సాధుజన్తులకు బాధకల్గించిన అవినీతి పరులకు తగిన భయకారణంలైన కష్టములు కలుగును” అని చెప్పి, తిట్టి అంతర్జానమై పోయినది.

దాని మాటలు వినుసరికి జనమేజయున కెంతో ఆశ్చర్యము కలిగినది. చిన్నపిల్లలు చేసిన తప్పులిట్లే పెద్దవారిని చుట్టకొనును. వారేదో వేళాకోలముగా చేయుదురు. కాని అవి నవ్వులు - పువ్వులై విషమించును, జనమేజయునకేమియు తోచలేదు. వెంటనే పురోహితులను, మునులను “దానికి తగిన శాంతి చేయింపు” మని వేడుకొనెను. వారు దీర్ధసత్రము పూర్తియైనాక చేయవచ్చుననిరి. కొన్నాళ్ళ కొదీర్ధ సత్రయాగము పూర్తియైనది.

అప్పుడతడు తగిన పురోహితునకై యెన్నో ముని- యాశ్రమములను వెదకెను.. చివరకు శ్రుతశ్రవనుడను ముని వద్ద కేగి నమస్కరించెను. అతడా రాజును దీవించి వచ్చిన పని యేమని యడిగెను. రాజు జరిగినదెల్ల చెప్పి “అయ్యా! నీ పుత్రుడగు సోమత్రవనుని నాకు పురోహితునిగా పంపుము. అతడు తపోనిష్టగరిష్టుడు. కాన నాకు కావలసిన యజ్ఞయాగములను చేయించి, నా తమ్ములు చేసిన అపరాధమునకు కొంతి చేయగలడు" ' అని ప్రార్ధించెను. శ్రుతశ్రవను “డట్లే” అని అంగీకరించెను. ల.

ావజాలాలాలాలవాలాలా నువాభాఠరతనీతి కథలు -/ నా రాజా సోమశ్రవనుని తీసికొని వచ్చి తగిన సత్కారములు చేసి, అతడు చెప్పనట్లు శాంతి పాష్టిక యాగములు చేసెను. గురువులకు, దేవతలకు, బ్రాహ్మణులకు, బీదలకు, అనాధలకు సంతర్పణములు చేసెను. ఉదంతకుని కథ అంతనొక నాడతని ఆస్థానమునకు ఉదంతకుడను ముని వచ్చెను. అతనికి తక్షకునిపై పగ కలదు. దానికొక కారణమున్నది. ఉదంకుడు పైలుడను మునివద్ద పరిచర్య చేసి, గురుకుల వాసము చేసి విద్యలన్నియు నేర్చెను చదువులన్నియు పూర్తికాగానే గురుదక్షిణలనిచ్చుట ఆ కాలమున మామూలు. అట్టాతడు గురుదక్షిణ కోరుకొనుమనగా, పైలుడు తన భార్యను “కావలసిన పని చెప్పు” మనెను. ఆమె పౌష్యుడను రాజు యొక్క భార్య ధరించెడి కుండలములను నాల్గవనాటికి తెచ్చిపెట్టు” మన్నది. ఆ మాటలతో ఉదంకుడు పౌష్యునింటికి వెళ్ళెను. అతడా మునిని గౌరవించి “కావలసినది కోరు” మనెను. ఉదంకుడు “రాణిగారి కుండలముల నిమ్మ”ని కోరెను రాజు “రాణివద్ద కేగి కుండలములను తెచ్చుకొను” మనెను. ముని లోనికేగెను. కొని, రాణి కన్పడలేదు. తిరిగి వచ్చి రాజుతో ఆ మాట చెప్పగా అతడు “అయ్యా! నేననకూడదు కాని మీయందేదో అపవిత్రత యున్నది అపవిత్రులకు నా భార్య కనిపించదు" అందుచే నీవు సుచివై వెళ్ళుము” అనెను. అట్టాడతడు కాలు చేతులు కడిగికొని, సంధ్య వార్చికొని లోనికేగెను. అక్కడ దేవి అతనికి కనపడినది. ఆమె అతనికి గౌరవ మర్యాదలు . చేసి కుండలములిచ్చుచు “మునీంద్రా! ఇవి చాల ప్రభావము కలవి వీటికై తక్షకుడెప్పుడును తిరుగుచుండును. తరుణము చూచి వీటిని అతడెత్తుకొని పోవును సుమా! జాగ్రత్త!” అని చెప్పినది. అతడు “అతిజాగ్రత్తతో తీసుకొని వెళ్ళుదు” నని తెచ్చుచుండెను. ం దారిలో సంధ్యావందన సమయుమకాగా అతడు పరిశుద్ధమైన ప్రదేశమున కుండలముల నుంచి తాను సంధ్య వార్చుటకై చెరువు వద్ద కేగెను. తక్షకుడు ఆ అవకాశము " చూచుకొన్నాడు. అతడు మాయ పన్ని దిగంబరుడై వచ్చి కుండలముల నెత్తికొని పోవుచుండెను. ఉదంకుడతని చూసి, వెను వెంటనే పరుగెత్తుకొని వెళ్ళి పట్టుకొనజూచెను. కాని, అతడు మాయా వేషముతో పాతాళమునకు పారిపోయెను. [ ఉదంకుడు కూడా పాతాళమున కేగెను. అక్కడ తక్షకుడెక్కడ నుండునో తెలియదు _ కదా ఇక అతనిని తిట్టి లాభము లేదని ఆ రాజ్యమును పాలించెడి శేషుని, వాసుకుని, తక్షకుని, తక్కిన సర్పరాజులను స్తుతించెను అప్పుడొక దివ్యపురుషుడు ప్రత్యక్షమై “నీకు క్‌

అకాల మలావాయలయలాయాయాయయలాం మువవభంరత నీతి కధలు - (లాగా కావలసిన పరమ్మును కోరుకో” మ్మనెను. అంత ఉదంకుడు తనకు జరిగినదంతయును చెప్పి తనకు తక్షకుడు స్వాధీనమగునట్లె చేయుమని వేడెను. అతడు “ఇదిగో నేనెక్కిన గుర్రము చెవిలో నూదుము, దానితో నీకీ పాములన్నియు స్వాధీనమగును” అనెను. ఉదంకుడట్లే యూదెను. “దానితో పాతాళమందంతటను అగ్నిజ్వాలలు (క్రమ్మినవి. పొములన్నిటికి భయము వేసినది. తక్షకుడప్పుడు కుండలములను తెచ్చి ఉదంకున కిచ్చివేసెను.

అవి పుచ్చుకొన్నను ఉదంకునకు సంతోషము కల్గలేదు. ఆనాడే గురుపత్సి కుండ అలములు తెమ్మన్న రోజు ఈ రోజు తీసుకొని వెళ్ళకపోయినచో పడిన శ్రయంతయు వ్యర్థమే అనుకొని దిగులుపడి యుండగా చూచి, దివ్య పురుషుడతని భావము కనిపెట్టి తానెక్కిన గుర్రము నెక్కుమని, కన్ను మూసి తెరచునంతలో సైలుని ఇంటి ముందు దింపెను.

ఆతడు వెళ్ళేసరికి గురువుగారి భార్య సరిగా స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని యున్నది. సమయమైనది “ఇంకను శిష్యుడు రాలేదే అని చూచుచున్నది. అప్పుడు ఉదంకుడు -లోనికేగి కుండలముల నామెకిచ్చెను. ఆమెకు కలిగిన సంతోషమునకు మేరలేదు. గురువుగారు కూడ చాల సంతోషించి, కుశల్కప్రశ్చలు వేసి, జరిగినదంతయు తెలీసికొని దీవించి పంపెను. ఆ రీతిగా గురుకార్యము సాధించునప్పుడు తక్షకుడు తన్నంత చేసెను కదా! దానికి ప్రతిక్రియనెట్లు చేయుదునా? అని ఉదంకుడు జనమేజయుని వద్దక్రు వచ్చెను.

జనమేజయుడా మునికి ప్రత్యుత్ధానము చేసి మర్యాదలు చేసి “మునీంద్రా! నేనేపనిచేసి తమకు సాయము చేయవలెను. పని చెప్పి నన్ను ధన్యుని చేయుడు. హితవు కల వారికకడా పనులు పురమాయింతురు” అని వినయంతోనీ తండ్రిని తక్షకుడొక్క మునిబాలుని మాటపై చంపెను, అతనివంటి రాజునకు చేయవలసినదా అట్టి అపకారము? నీవు దానికి తగిన ప్రతీకారము చేసి తీరవలెను. లేకున్న పిత్యాణమెట్లు తీరును? అనెను, జనమేజయుడు తండ్రీ యెట్లు చనిపోయెనో యెరుగడు. రాజులు త్రాచుపాము పగకలవారు అందుచే ఎవరును చెప్పి యుండరు ఈనాడితడు చెప్పినమాట లాతనికి క్రొత్తగా అనిపించినవి అశ్చర్యంతోను, కోపముతోను అతని కన్నులు నీటితో నిండినవి. ముఖము చెమట పుట్టినది. కనుబొమ్మలదరినవి “ఏమిటి? నా తండ్రిని తక్షకుడను నొక సర్పము చంపినదొ? నాకు తెలియనే తెలియదే? దానికి కారణమేమి జరిగినది సెలవిత్తురా మునీంద్రా!” అని ్రల్చించెను అదంతయు చెప్పుటకే కదా అతడు వచ్చినది! “రాజా వినుము వానికధభయంతయు చెప్పెదను” అని యిట్లు చెప్పసాగెను

  • 6

లా మనోభ్లారతనీతి కథలు -/ బాలా పరీక్షిత్తు కథ

నీ తండ్రియగు పరీక్షిన్మహారాజు ధర్మము నాలుగు పాదముల నడుపుదునని ప్రతిజ్ఞతో అరువదియేండ్లు రాజ్యమేలేను అతని రాజ్యమున ప్రజలే బాధలును పడియెరుగరు, చాలా సుఖముగా నుండువారు వెయ్యి కన్నులతో ప్రజల నేలుచు సుఖ పెట్టుచుండెను.

అట్టుండగా ఒకసారి అతనికి వేటాడవలెనని బుద్ధి పుట్టినది అతడు సేనను, తగిన పరిచారకులను తీసుకొని అడవి కేగెను. అప్పటి తన లక్ష్యసిద్ధి బాణ లాఘవము తెలియునట్ట్లు ఎన్నో మృగముల జంపెను. అదొక వ్యసనము. పేకాట దగ్గర కూర్చున్నవాడు లేచుట కిష్టపడడు పరీక్షిత్తు బాణము వేయగా ఒక మృగమునకు తగలకుండగనే అది తప్పించుకొని పారిపోయినది. అతడు దానిని వెంబడించెను. ఆ మృగమే అతని మృత్యువునకు దారితీసినదనుకొమ్ము ఎంతో దూరము వెంబడించెనే కాని అది మాత్రము దొరకలేదు అతనికి విసుగు రాకపోయినను, అలసట వచ్చినది. దాహము మిక్కుటముగా వేసినది దగ్గరలో అతనికొక ఆశ్రమము కన్పడినది. అది శమీకుడను మౌనవ్రతుని ఆశ్రమము. ఆ ముని ఎవ్వరితోడను మాట్లాడడు. రాజు ఆ మునితో “నా బాణము దూసుకొనిపోయిన మృగమొకటి పరుగెత్తుకొని వచ్చినది. ఇటు వచ్చినదేమో చూచితిరా!” అని ప్రశ్నించెను. దానికాముని జవాబివ్వలేదు. అతడు మాట్ట్లాడడుకదా! చూచుచున్నట్టుండెనేకాని అతడు సమాధిలో నున్నాడు. దానితో మహారాజునకెంతో కోపము వచ్చినది. నే నింతటి వాడను వచ్చి అడుగుచుండగా జవాబైనను చెప్పరాదా? అని అతని మీద పగ సాధింపదలచెను. అతనికెదురుగా చచ్చిన పామొకటి కనబడినది. సరే అని ఆ పామును తన చేతిలోని వింటితో తెచ్చి మహర్షి మెడలో తగిలించి రాజు వెళ్ళిపోయెను.

ఆ శమీక మహర్షికి శృంగియను కొడుకొకడున్నాడు అతడు చిన్నవాడు అయిననేమి? మహాతపశ్ళాలి, ముక్కోపి కూడా. అతడు జపము చేసికొనుచుండగా కృతశుడను ముని శమీకుని మెడలో చచ్చిన పామును చూచి వెళ్ళి శృంగితో “ఓ మిత్రమా! నీ తండ్రి మెడలో రాజు వచ్చి చచ్చిన పామును వేసెనోయి! ఇంతకన్న 'ఘోరముండునా? "పెద్దవాడు చేయవలసిన పనియేనా ఇది?” అనెను. చెప్పుడు మాటలు చెడ్డవి కదా! శృంగికి పట్టరానంత కోపము వచ్చినది. వెంటనే శాపోదకముల నందుకొని “ఏ దుర్మార్గుడు అడవిలో ఇంద్రియ నిగ్రహము కలిగి ఏ జీవులకు బాధ కల్గింపక జపము చేసికొనుచున్న మా తండ్రి మెడలో చచ్చిన పామును వేసెనో అతడు నేడు మొదలేడు రోజులలోగా తక్షకుడను సర్పరాజు కరచి చనిపోవుగాక!” అని శాపమిచ్చిను. ఆ మాట జరిగి తీరవలసినదే. లాలా

యాలాల తుహరతనీతి కథలు - గాలా

అప్పుడు తాను తండ్రి వద్దకు వచ్చి, జపము చేసికొనుచున్న అతని జూచి, పామును మెడలో నుండి తీసిపారవేసెను. ఆ అలజడికి శమీకుడు సమాధి నుండి లేచెను. అప్పుడు శృంగి తండ్రికి నమస్కరించి తాను చేసిన పనినంతను చెప్పెను. అది వినుటతో తండ్రికెంతో పశ్చాత్తాపము కల్గినది. “అరరే, ఎంతపని చేసితవిరా? అతడు చేసినదానికి నేను సైరించినపుడు నీకెందుకంత కోపము? కాక, కోపము తపశ్శాలురమైన మనకు తగునటరా? కోపముతో తపన్సంతయు మంట కలియదా? ఓర్చ్పుండనక్కరలేదా? ఇదా నీవు చేసిన గొప్పపని? ఇంకొక్కటి ఆలోచించితివా? రాజులు మనకు రక్షకులు. వారికి కోపము హెచ్చుగానుండును. కాని మనకుండరాదు. వారి పరిపాలన వలనేకదా మనము హాయిగా తపస్సు చేసికొనుచున్నాము! అదేమయినా గమనించితివా? చిన్నతనపు చేష్టగా చేతిలో కత్తి ఉన్నదని ఆవసరమయిన మొక్కను కోసినట్టుగా రాజునకీ శాపమిచ్చినావు. శాపమిచ్చుటకాదు ప్రజ్ఞ శక్తి యున్నచో శాపమును మరలింపుము. ఆది ఉత్తమమైన పద్ధతి” అని మందలించెను.

అతడట్లు అనుచున్నంతసేపు శృంగ తలెత్తలేదు. ముందర తను చేసినపని చాల బాగున్నదన్సి తండ్రి మెచ్చుకొను ననుకొనెను. కాన్మి విపరీతమైనది. అతడు మరింతగా చీవాట్లు పెట్టెను. బెడ్డ విసురుట తేలికగాని, విసిరినదాని నెవడు మధ్యదారిలో పట్టగలడు? అట్టె అయినదాతని పరిస్థితి.

“తండ్రీ! అవశమయిన కోపంతో శాపము నిచ్చి వేసితిని, కాని ఇప్పుడు నేను

మరల్చ్బలేను నావచన మమోఘము. తగులక దప్పదు. ఇప్పుడునే నేమియు చేయలేను” ' అనుచు పళ్చాత్తాపముతో నేలకేసి చూచుచు నిలువబడెను. అతని క్షమింపక తప్పదుకదా తండ్రికి, శాపము తప్పదని మునికిని తెలియును. - య... అందుచే వెంటన్నే తన శిష్యుని గొరముఖుని పిలిచి “నాయనా, నీవు వెళ్ళి మహారాజునకీ విషయము శెప్పిరా నాయవా! అతడు అవధి తెలిసికాని మోక్షసాధనము లేవైన చేయును. నా నూటగా “వగవవలదని, ముందు జాగ్రత్తపడుమనియు చెప్పుము” అని చెప్పి ఫంపించెను.

గౌరముఖుడు సరీక్షిత్తుకడ కేతెంచెను. పరీక్షిత్తు అతనికెంతో మర్యాదచేసెను. అతడు స్వతః మంచివాడే. కాని కాలము కర్మము కూడినందున అడివిలో అట్ట్లుచేసెనంతే! మునిశిష్యుని వచ్చిన పనేమని యడిగెను. అతడు “మహారాజా! తనురడవికి వచ్చి చచ్చిన పౌమును నూ గురువుగారి మెడలో వేసీరట. దానికి కోపించి మా గురుపుత్రుడు వారము లోపల తక్షకుడు మిమ్ముల కరచునట్లు శపించెను. అది తెలిసి మా గురువులు సంతాసముతో కాకాణి

వయయివవవావావాలాలాలాలాలాం మవీభారత నీతి కథలు - / లాలా ' ఆ విషయమును తమ కెరుక పరచుమని నన్ను పంపినారు. దానికేదైన నుపాయమ్రున్నచో చేసికొనుమని మీకు చెప్పమన్నారు. మంత్రతంత్రము లేని వాడుకొందురో అది మీ జాగ్రత్త!” అని చెప్పి వెడలి పోయెను.

చేసినపని ఎంత తప్పో ఇప్పుడు తెలిసివచ్చినదతనికి, చాల విచారించినాడు. మహర్షి శాపం తప్పదు. కాని పుట్టిన వానికి చావు తప్పదు కదా అని రోగము తగ్గుటకు మందు ప్రచ్చుకొనుట మానుదుమా? అతడు మంత్రులతో ఆలోచించి మంత్రతంత్రజ్ఞులను రప్పించి ముందుగా వంటి స్తంభము మేడ కట్టించి దానికెన్నో రక్షణలు కల్పించి దానిలో కూర్చుండెను. అది తెలిసి పరామర్శింప వచ్చిన మహర్షులతో శుక మహర్షిచే భాగవతమును చెప్పించుకొని వినుచుండెను. ఒక వేళ మంత్రతంత్రములు పనిచేసి బ్రతుకునా బాధయే లేదు. కాక శావము తవ్పక చనిపోయెనా హరాత్తుగా చచ్చుటకంటె తగిన అవకొాశములున్నప్పుడు తానెందుకా సదవకాశములున్న వృధా చేయవలె! భాగవతము విన్నచో స్వర్గము కలుగగలదు అని ఎట్టయినను మంచిదే అనుకొని సిద్ధముగా నుండెను

_ రోజులు గడుచుచున్నవి తక్షకున కా మంత్రాక్షరములు హెచ్చరిక తెలిసినవి. ఏ

కోపములేని వాని నెట్టు చంపునా తక్షకుడు మాత్రము! కాని తప్పనిసరి! తాను చంపుట మాని వేసినచో మహర్షి తన్ను చంపును. అతనిమాట కాతని తపస్సును బట్టియేకదా అంతశక్తి వచ్చినది దానిని తాను దాటుటకు శక్తి చాలదు; తక్షకుడు బయలుదేరినాడు. పరీక్షిత్తు బాగుగా కావలి రక్షణ పెట్టించుకొని కూర్చుండెనాయె. ఎట్లు అతని దగ్గరకు వెళ్ళి కరచుట అని పరిపరి విధముల ఆలోచించు కొనుచు తక్షకుడు వచ్చుచుండెను. "

పూర్వము సర్పముల విషాగ్ని జ్వాలలకు చాలమంది జైలు చచ్చిపోవుచుండగా (బ్రహ్మదేవుడు కళ్యపుడను మహర్షికి సంజీవినీ విద్యనుపదేశించెను. అతడు ఆ మంత్ర ప్రభావముతో సర్బవిషమును తగ్గించుచుండెను. తక్షకుడు పరీక్షిత్తును కరచునన్నమాట అతనికి తెలిసినది. ప్రజారక్షకుడైన మహారాజు చనిపోవుచున్నాడే అని జూలితలచి, అటు వంటివానిని రక్షించినపుడే తనకు మంత్రమున్న ఫలితమనుకాని అతడును బయలుదేరినాడు. ఒక కుటుంబపు యజమాని చనిపోయినచో ఆ కుటుంబమునకు 'మాత్రమే బాధకాని “మహారాజు చనిపోయినచో దేశమునంతకును బాధయే కదా! అదియే కశ్యపుని ఆలోచన మనము మంచి చేయదలచినను దేవుడు దానికి సాయపడవలదా!

దారిలో తక్షకుడును కశ్యపుడను కలిసికొన్నారు. తక్షకుడు ముసలి బ్రాహ్మణ రూపముతో కశ్యపుని చేరి “బాబూ! తమరెక్కడికి వెళ్ళుచున్నారు?” అని ప్రశ్నించెను. లారా

అకానప్తాపపప్తుపమువమావివముణవనాాలలవా వ్రమ్రయ్ణారర్రత నీతి కథలు = లాను ఆతన్యుతన ప్రయాణమును గూర్చి చెప్పెను. తక్షకునకు నవ్వు వచ్చినది “ఓరి పిచ్చవాడా! నీవా తక్షకుని విషమును తగ్గించెడి వాడవు? డబ్బు మీద ఆశ ఉండవచ్చును కాని, అంతటి శక్తి నీ-దగ్గర వుండనక్కరలేదా? నేను ఆ తక్షకుడను ఏదీ నీ శక్తి చూపు. ఇదిగో! ఈ ఎధటనున్న పెద్ద మర్రిచెట్టును కరతును. దీనినెట్లు బ్రతికింతువో చూచెదను” అనెను. కశ్యపుడు దానికి జవాబు మాటలతో నియ్యలేదు. అతడు పనిచేసియే చూపును సరే కరువుమన్నాడు తక్షకుడు మరర్రిచెట్టును కరచినాడు. శాఖోపశాఖలతో తెగపెరిగిన ఆ మర్రిచెట్టు ఒక్క కాటుతో బూడిద అయిపోయినది కశ్యపునికే ఆశ్చర్యము వేసినది. అంతటి 'వెషజ్వాల అతడంత క్రితము చూచి యుండలేదు. వెంటనే అతడు తనమంత్రమును ముమ్మారుచ్చరించి భస్మమును ముట్టుకానుటతో ఆ బూడిద నుండి" అంత చెట్ట కూడ ఒక్కసారిగా లేచినది. ఇప్పుడు తక్షకుని గర్వము అణగారిపోయినది. అంతేకాదు! భయము కూడ వేసేసేది.తసకిక మాటదక్కద్రనిపించినది. అప్పుడు కాళ్ళబేరానికి వచ్చినాడు “మునీంద్రా! మంత్రాల మహిమ చెప్పశక్యము కానిది. కంటికి కనిపించని మంత్రములు కంటికి కనిపిరచని దానిపై పనిచేయును. భాని శక్తి ఇంత అని మనమూహింపలేము నీ విద్య మహామహిమ కలది. నేను ముందర ఏమౌ అనుకొని నవ్వినాను. కాని, అబ్బ! నీవంటి మంత్ర గాని నింతవరకు నే చూచియుండలేదు. నాకు మాట దక్కించుము. ఒక్కటి ఆలోచించుము. నొక్షేమైన పరీక్షిత్తు పై కోపమున్నదా? లేదు, కాని ముని బాబుల మాట 'ప్రకారముపోక తప్పదు. కనుక నీకు కావలసినంత ఛనమిచ్చెదను. వెనుకకు మరలుము' " అని కాళ్ళ, వ్రేళ్ళపడి బ్రతిమాఠెను, కళ్యపు డొలోచించినాడు. భవితవ్యత అట్లె వున్నది. కాని తానిక వెనుకకు మరలవలసినదే. ఆ నిశ్చయానికి వచ్చి తక్షకుని వద్ద నుంచి తగినంత ధనమును బహుమతిగా వుచ్చుకోని అతడక్కడ నుండియే వనుకకు మరలెను. ఏమి లాభము? పరీక్షిత్తు రోజు లట్టున్నవి. అతడు బూడిద చేసన చెట్బపైకి సమిధులకై యొక బ్రోహ్మణుడెక్కి యుండగా క్రింద తక్షక కళ్యపుల కీ వాధోపవాదములు జరిగినవి. పరీక్షలు జరిగినవి. అతడు ఆ తరువాత మరల్తివచ్చి నగరములో చెప్పెను, అందరికిని సువిదితమే. కాని ఎవ్వడును రాజునకు చెప్పలేదు. అంత ధైర్యమెవరికున్నది? అది ఏడవరోజు, రాజునకు ఆదుర్దా హెచ్చుగానున్నది కావలి బందోబస్తుగా నున్నది. ప్రతిక్షణం “గీడచినది” 'అనిపించుచున్నది. అట్లే సూర్యాస్తముయనుగుచున్నది. “ఇంక బాధలేదు! శాపము తస్పినది, దేవతలు కరుణించిరి” అని పరీక్షిత్తు సంతోషించుచున్నాడు.

అానాలవయాయవవావావాలాలావాం మ్రముశరుంరతో నీతి కథలు = ౯ ాాాాాాాాాాాాాాాాాాాానాననానా.

ఇంతలో తక్షకుడు కొందరు నాగకుమారులను ముని బాలకుల వేషములతో “పరీక్షిత్తువద్ద కేగి ఫలములను కాన్కగా నిమ్మని” చెప్పెను. వారల్లె అని చక్కని బాలకులైరి. నిజముగ పుట్టిన పిల్లలయినచో సర్వాంగ సౌందర్యము కలుగవచ్చును. కలుగకపోవచ్చును. కాని వారిది వేషము కదా! చూచుటకు ముద్దు వచ్చుచున్నారు. వేదము, క్రమము, జల, ఘనలు చక్కగా చెప్పుచున్నారు. వారిని చూచుటతో రాజున కానందము కల్గినది. వారిని పిలచినాడు, వారు వచ్చినదందులకే కదా! దగ్గరకు వచ్చి రాజునకు పళ్ళను కానుకగా నర్పించిరి. "

అట్టి ఫలములను కూడ రాజెన్నడు చూచి యెరుగడేమో అతనికేమిటో ప్రతి యొక్క పనియు ఆశ్చర్యము కలిగించుచున్నది. అప్పటికే సమయమైనదని వచ్చిన మునులందరును మెల్ల మెల్లగా జారుకున్నారు. భాగవత పఠన శ్రవణములు పూర్తియైనవి. ఇక మిగిలినవారు లెక్కకున్నారు. వారితో రాజు “అదిగో సూర్యబింబము సగము గ్రుంకినది ఇక కొన్ని క్షణఐములున్నది నా శాపొంతమగుటకు ఇక గట్టెక్కినట్లె! వారము రోజుల నుండి 'ప్రాయోపవేశము చేసితిని గదా ఇక నాకేమి బాధ! ఈ పండు చాలా బాగున్నది తిందునా? అబ్బ! దీన్ని చూచిన తినకుండ నుండలేననిపించుచున్నది” అనుచు వారి యనుమతి తీసికొనకుండగనే తినుటకై అందొక పండును చేతితో చిదిపెను. "

అంతలో అందుండి ఒక నల్లని పురుగు ఊడిపడినది. “అదేమో?” అనుకొనునంతలో లత్తుకరంగులో మెల్ల మెల్లగ అది పెద్ద పోమైనది ఇంకేమున్నది? అది తన మృత్యువే! దానిని చూచుటతోడనే రాజునకు పై ప్రాణములు పైన పోయినవేమో! అది విషజ్వాలలు గ్రక్కుచు అతని నాక్కకాటు వేసినది. .

దానిని చూడగానే పరిజనులెల్లరును మేడ విడిచి పారిపోయిరి. న్నీ తండ్రియు, అతని మేడయు బూడిదయైపోయెను, తరువాత మంత్రి పురోహితాదులు ఉత్తర క్రియలు చేసిరి. అప్పుడు నీకు బాల్యముననే రాజ్యాభిషేకము చేసిరి.

అట్లు తక్షకుడొక ముని బాలుని మాట ప్రకారము నీ తండ్రిని మ్రింగినాడు, నీవు ఆ మాట ప్రకారము వానిని దగ్గము చేయుము వీగ తీర్చుకొననిచో పురుషాకారమేమిటి? నీకు మేము చెప్పనక్కరలేదు. ఆలోచించుకొనుము. సర్భయాగము దీనికి ప్రతిక్రియ” అని ఉదంకుడు చెప్పెను. జనమేజయ మహారాజున కదంతయును తలకెక్కినది, తల కెక్కునట్లు చెప్పినచో ఎక్కకుండునా? అతడు తప్పక చేయుదనని ప్రతిజ్ఞ పట్టెను ఉదంకుడు వెడలిపోయెను. లా

ఆరా నుహూరతనీతికథలు- గాలా జనమేజయునకు చీమలు, జెర్రులు ప్రాకినట్టున్నది. కోపము రాకుండగనే యుండవలెను గాని, వచ్చిన తర్వాత దాని ప్రభావము ఇంతింత అనరానిదిగా నుండును. ఏమి చేయవలెనో కూడా తెలయకుండును. చేసిన పనిలోని మంచి చెడ్డలు తెలిసికొనుటకైనను అవకాశముండదు. ఒక మహర్షివచ్చి తనత ౦డ్రి మరణకారణము చెప్పినాడు. ఇంతవరకు తనకు మంత్రులేల చెప్పలేదో, వారికి తన వజ్ద చాలా చనువు వున్నదే! భయమా, కాదు. అట్టివి చెప్పుట చాడీలు చెప్పినట్టుండునని యెంచి వారు చెప్పుట మానియుందురు. మరి నేడు వారి యెదుటనే కదా ఉదంకుడు చెప్పినది. అగుగాక! దానికి వారే సాక్షులు. వారంతయు నెజింగినదే. ఇక ఎటునుండి ఎటువచ్చుగాక! తాను మాత్రము సర్ప్వయాగము చేసి తీరవలసినదే! అతని నిశ్చయయము దృఢమైనది అది యిక మారదు. అంత దృఢసంకల్పము కలుగునట్లు పురికొల్సినాడు ఉదంకుడు. జనమేయుడు బుత్విక్కులు (యజ్ఞము చేయించువారు) గా నుండకల్లిన మునులను రప్పించెను. వారికి తగిన మర్యాదలు చేసి “అయ్యా! తక్షకుడు తన విషజ్వాలలకు నా తండ్రి నాహుతి చేసినాడని. అతనిని కూడ అట్లె తగులబెట్టి నప్పుడుగాని నా కసితీరదు. చానికేదైన యుపాయము చెప్పుడు” అని ప్రార్ధించిరి. వారు దీర్హముగా ఆలోచించిరి వారెరుగని వేదశాస్తములు లేవు. అయినను ఆలోచించకుండ మాట చెప్పినచో అది తప్పునేమా అను జంకుతో జాగ్రత్తగా విమర్శించిరి. తతడు “రాజా! మేము నిశితముగా పరిశీలించితిమి. ఉన్నది ఒక్క యాగము. దానిపేరు సర్ప్వయాగము అదే నీవు చేయదగినది. అంతేకాదు అది కేవలము నీకొరకే రచియింపబడినట్లు కూడ తెలియుచున్నది. తప్పక చేయుము. నీ కోరిక తప్పక నెరవేరును. శ్రతునిర్మాణము సఫలమగును” అని చెప్పిరి. రాజునకెంతో ఆనందము కల్గినది. తాననుకొన్నదానికి తోడుగా అట్టి యాగము కేవలము తనకోసమనియే సృష్టించబడె ననుటకంటె నెక్కుడు ప్రోత్సాహమేమి కావలెను? తన కోసమని బుషులు కూడ ఒక విశిష్టమైన యాగ క్రమమును పూర్వమే సృష్టించి యుంచిరన్నమాట వారు 'త్రికాలజ్ఞులు, ముందు రాబోవునది వారికి తెలియును. ఇప్పుడు నూత్నముగా సృష్టింపవలెనన్న శ్రమ యెక్కువగును కదా? ఇప్పుడ్తు తానిక చేయవలెను. అదేమిటి? చేసి తీరవలెను. తన నిశ్చయమే సిద్ధానమయినది. ఎంత సంతోషము! మునులతో “అయ్యా! ఇక ఆలస్యమేమిటి? దానికి కావలసీన సంభారములు వరుసగా చెప్పుడు. యజ్ఞశాల, ఇష్టకలు (ఇటుకలు యజ్ఞములలో అగ్నిగుండమును

నపవవవాయాాయాయాలలాలలా మనధభ్రారల నీతి కథలు =/ ాాాాాయావనాల తయారు చేయుటకు కావలసిన ఇటుకలను కాన్ని కొన్ని పరిమాణములలో, ఆకారములతో తీయుదురు. దానిక్షి తగిన శాస్త్ర మున్నది.) పశువులు, పురోడాశము అన్నియునే యే రీతిగా నుండవలెనో చెప్పడు జాగ్రత్తగా పరిశీలింపుడు. ఎక్కడను లోవము రారాదు.' ప్రాయశ్చిత్తమన్నదుండకూడదు. మీరు చెప్పుటయే తడవుగా నాయావచ్చక్తి ధారవోసి కొవలసీన వన్నియు చేకూర్తును” అని ప్రార్ధించెను. వారు తాళపత్ర గ్రంధముల పరీక్షించి బహువిమర్శలు చేసి సంభారముల చేసిరి. యజ్ఞశాలను శాస్త్రోక్తముగా శిల్చులను రావించి బాగుగా తయారుచేయించిరి. ”

అంతయు పూర్తియయినది. ఇంక ఆరంభించుటయే బుత్విక్కులు వచ్చినారు. అప్పుడొక వాస్తు శాస్త్రజ్ఞుడు రాజుతో “మహారాజా! దీని నిర్మాణమును బట్టి యిది కానసాగునట్టు లేదు. ఒక బ్రాహ్మణుడు కారణముగా దీనికి విఘ్నము వచ్చును. దానితో ఆగిపోవును” అని విన్నవించెను. కాని ఆ మాటలు రాజున కా యుత్సాహ సమయమున చెవికెక్కలేదు. అసలు వినపడనేటేదు. అతడు తన పనిని సాగించుచుండెను.

చండభార్గవుడు, పింగళుడు, సార్జరవుడు, కౌత్సుడు మొదలైన మహర్షులు, వ్యాస, పైల, సుమంత, వుక, శౌండిల్య, దేవ, లాసిత, మైత్రేయాదులు సదస్యులుగా యజ్ఞము నారంభించెను. సాక్షాత్తు వ్యాసముని ఉన్నపుడిక - బాధేమున్నది? బుత్వికులు నల్డని వస్త్రములను కప్పుకొని పొగలవలన కన్నులెర్రపడగ్లా అతి జాగరూకతో యజ్ఞమును నడిపించుచుండిరి.

వారి మంత్రము లటెట్టివోకాని “స్వాహా” అనుసరికి పాములు తుట్టలు తుట్టలుగా, మందలు మందలుగా, కట్టలు కట్టలుగా వచ్చి అగ్ని గుండమున పడుచున్నవి. పాపం వాటి కానాటితో ఆయువు తీరుటయేగాక బలవన్మరణమును స్తంప్రాప్రమైనది. రక్షకులు లేరు, బంధు పిత్రాదులతో సహా వచ్చిపడుచున్నవి. కొన్ని నల్లనివి, కొన్ని తెల్లనివి, చిన్నవి, పెద్దవి అన్నియును బ్రహ్మ దండముల దెబ్బలతో అర్భుచు వచ్చి వడుచున్నవి. మంత్రములుచ్చరించగనే ఆ మంత్ర వర్ణములు వాటిని కట్టి తీసికొనివచ్చును. పడుచున్నప్పుడు అవి చేసెడి ఆర్తధ్వని, పడెడి చప్పుడు, కాలునప్పుడు వచ్చు పెటపెటు భూమ్యాకాశముల నిండినవి ఎక్కడ విన్నను ఆ చప్పుడే.

ఎంత ఘోరం, పాపం అయ్యో! అనుకొనువారు కొందరును, కొందరు. “అంతే, అట్లె కావలెను అబ్బబ్బ ఈ పాపంతో పడలేకపోవుచున్నాము, ఏ కలుగులో చూచినను ఇవే. పగ సాధించుకొనుటకై మహారాజు సమర్ధుడు కనుక ఇట్లు చేయిచున్నాడు. కాని యెవరు లా

కారా నాాలవనాలాలావాలాజావాకావలాలా మహాభారత నీతి కథలు - గాలా చేయగలడు? ఇప్పటి కెందరు వన్ని వేలమంది కోట్లమంది చచ్చియుందురు? ఎవరయిన నిట్లు చేయగల్లిరా? “పేదవాని కోపము పెదవుల చేటు” అన్న అబద్దము కాదు అట్లు జరుగవలసినదే” అనియు తలకొకరీతిగా అనుకొనుచుండిరి. లోకులు పలుకాకులు అనేక రీతులుగా అనుకొందురు. ఏపనినైనా విమర్శింపక మానరు. నిశ్చయము కలవారు తమపని తాము చేయవలసినదే!

మరి ఇన్ని పాములొక్కసారిగా ఎందుకు వచ్చినవో ఎరుగుదురా? దానికొక పెద్ద కారణమున్నది. మాతృశాపమ్ను"అదియు చెప్పదను వినుడు.

గరుత్మంతుని జననం

కశ్యప ప్రజావతికి కద్రువ, వినత అను యిద్దరు భార్యలు కలరు. వారు చిరకాలము భర్తను సేవింపగా నతడు వారి సేవకు మెచ్చి మీకేమి కావలెనో కోరుకొమ్మనెను అందు కద్రప తనకు చాలామంది కొడుకులు పుట్టినట్లు కోరినది. వినత తనకిద్దరు తనయులు కలుగనట్టు కోరినది మహర్షి అట్ల అనెను వారు గర్భవతులయిరి. కద్రువకు గర్భము పెరిగి గ్రుడ్డు పుట్టినవి అ గ్రుడ్డు క్రమముగా అయిదు చందల యేండ్డకు విచ్చి శేషుడు, వాసుకి, తక్షకుడు కర్కోటకుడు మొదలయిన చేలకువేలు సర్పంబులయ్యెను.

ఇక వినతకు కూడ రెండే రెండు గ్రుడ్లు పుట్టినవి. ఎన్నాళ్ళయినను అవి చితుకలేదు సవతికి బెడ్డలు కల్లుట, తనకు కల్గకపోవుటతో అమెకెంతో చిన్నతనమనిపించింది అందాక (గ్రుడ్డు చిదిపినది. ఇది యింకను బిడ్డగా మారుచున్నందున తొడలు లేని బిడ్డడు పుట్టెను. అతడే అసూరుడు అతడు పుట్టీపుట్టటంతోడనే తల్లి పై కోపించి “నీవు నన్ను సరిగా 'పేరగనీయక మధ్యలో చిదిపి నా జీవితమును భగ్నం చేసితివి కాన నీవు నీ సవతికి దాసివై అయిడు వందల యేండ్లు బాధపడుదువు. మీరొక్కటి నన్నెట్టును బాధించితివి కాని ఈ శెండవ గ్రుడ్డును మాత్రము చిదపకుము దానిలో నీ దాస్యమును పోగొట్టగలిగిన తేజళ్ళాలి యున్నాడు. థానిని జాగ్రత్తతో రక్షించు” చుని చెప్పి తాను .సూర్యునకు రధసారధిగా వేడలిపోయెను. అతనికి కాళ్ళు లేవుగాని చేతులున్నవి దానికి తగిన పని. నడువ నక్కరలేనిది సౌరదగ్భమాతనికి దొరికినది ఆ చెప్పుటతో బుద్ది వచ్చి ఆమె రెండవ గ్రుడ్డును జాగ్రత్త రక్షించుచున్నది.

. అమ్మృ్మతమునకై దేవానురులు షాలనముద్రమును మధించగా అందుండి ఉచ్చెజ్రవమను'గుగ్రము పుట్టినది. దానిని ఇంద్రుడు తీసికొనెను. ఆ గుర్ర మా సముద్ర తీరమున విహరించు చుండును. - ననన ననన

లనాలవవావాయయయయియాంయణాలజయంాలణాణ మ్రవరర్ధంరలత నీతి కథలు = ౯ నాలా ఒకనాడు కద్రువ వినతలు విహారమునకై పాల సముద్రపు ఒడ్డున కేగిరి. సముద్రపుటలలు చూచి మహానందము పొందింది. అట్టు కొంతసేపు చూచుచుండగా వారికి దూరమున అక్కడున్న గుర్రము కనపడినది'దానిని చూచి కద్రుప వినతతో “చూడవే వినతా! ఆ తెల్లని గుర్రమునకు తెల్లని చంద్రునిలో నల్లని మచ్చవలె వళ్ళంతయు తెల్లగాను న్నను తోకదగ్గర మాత్రము నల్లగానున్నది అది దాని అందములు చెరిపినదే” అన్నది. అది విని నవ్వి వినత “అక్కా! నీవే కన్నులతో చూచితివో కాని మహాపురుషుని క్రీర్తివలె తెల్లగా ప్రకాశించుచున్న గుర్రమును చూచి నల్లగానున్న దందువే?” అన్నది. మాటకు మాట తెగులన్నట్ట్లు వారిద్దరికి వివాదము, పెరిగినది కద్రుప “నేనన్నమాట కాదందువటే ఊరకే మాట అనుట కాదు. పందెము కాయవలెను ఇదిగో విను. దాని తోక దగ్గర నల్లగా ఉన్నచో నీవు నాకు దాసివి కావలెను. లేనిచో నేను దాసినగుదును సరేనా?” - అన్నది వినత యెరుగ్గును. ఆ గుర్రము ఉచ్చెశ్రవము అది పూర్తిగా తెల్లగా ఉన్నదే కాని నల్లన ఎక్కడను లేదని. అందుచే యదార్థము చెల్లక ఓవునా యని “ఓ! నిరాపేక్షముగా నీవు చెప్పిన పందెమున కంగీకరించుచున్నాను. నడు, ఇప్పుడే వెళ్ళి చూచి వత్తము” అన్నది. కద్రువ గుండెలు జారినవి. అప్పుడే వెళ్ళి చూచినచో తన పందెము నెగ్గదు. అది ఆమెకు తెలియును. వేసినదొక యెత్తు. “చెల్లీ! ఇప్పుడు చూచితివా? ప్రొద్దు గ్రుంకినది. ఛీకట్టు వ్యాపించినవి. మనము చాలా దూరము పోవలెను. ఇప్పుడు కాదు రేపు ప్రాద్దుననే వెళ్ళి చూతము. ఇప్పుడైననేమి, రేపైన నేమి? వస్తువు మారదుకదా! ఏమందువు? నీ యిష్టము చెప్పినది. వినతరేపైన నేమి? మోసము జరుగుటక్సు అవకాశము లేదుకదా! అని ఒప్పుకున్నది. ఆ రాత్రి కద్రువ తన 'కొడుకుల నందరిని పిలిచినది. అందరు వచ్చి చేరినారు. కద్రువ “కుర్రలారా! ఈవేళ నేనొక పందెము కాసితిని దానికి మీ సాయమెంతైన నవసరము. మీరు తలచుకొన్నచో పని జరిగితీరును. మీకు, నాకు వినత ఆమె సంతానము కూడ యావజ్జీవ దాస్యము చేయుదురు. మీరు తోడుచేయనిచో నష్టము. మీకే మనమందరమును ఆమెకే సేవచేయవలసి యుండును” అని ఉపన్యసించినది, “వారు అసలు విషయమేమిటి?”

  • అని అడిగిరి అప్పుడామె మెల్లగా జరిగినదంతయు చెప్పి, దాని తోకను నల్గనగునట్లు చేయమన్నది వారందరు నాలోచించిరి, అది అధర్మము కదా! తల్లియగుగాక! తండ్రియగుగాక! ఎవరు చేసినను తప్పు తప్పే కాని ఒప్పు అగునా? అని వారు చేయుట కొప్పుకొనలేదు. ఆమెకు చాల కోపము వచ్చినది, వెంటనే తన సంతానమనియైనను చూడక “మీరందరును నామాట కెదరు చెప్పితిరి కాన ముందు జరగబోవు సర్ట్వయాగమున సమూహముగా సంఘ మరణము నందెదరుగాక!” అని శపించెను. లాటా

లా మహాభారతటీతి కథలు - గాలా కర్కొటకునికి మాతృవాక్య పరిపాలన మాట అటుంచి శాపము లేకుండ చేసికొనుటకై తల్లి చెప్పిన ప్రకారము చేయబుద్ధి వేసింది. “అమ్మా! మాలో ఏ ఒక్కడ్లు చేసినను నీకు మాటదక్కునుగదా! ఇదిగో నేను ఇప్పుడే వెళ్ళి నీ షని నేరవేర్తును” అని చెప్పి ఆమె నొప్పించి వెళ్ళి ఆ గుర్రపు తోకకు చుట్టుకొనియుండెను. కాని తన మాయ- వలన పైకి మాత్రము కన్సడుట లేదు, కద్రువ కోరిక సిద్ధించినది. మిగిలిన రాత్రి సుబముగా నిద్రపోయినది. ఎప్పుడు తెల్లవారునా అని కూర్చుండి తెల్లవారగానే వినతను తీసికొని వెళ్ళినది. ఆమె.యే పొపమ్లు నెరుగదు! దగ్గరకు వెళ్ళి ఎంత చూచినను నలుపే కనపడెను. తనకు పుత్రశాపమే ఆ రూపమున వచ్చినట్టు కన్పడినది. తప్పనిసరియై ఒప్పుకొన్నది వినత, ఇద్దరును ఇంటికి వచ్చినారు అప్పటి నుండి వినత సవతికి దాసియైనది. దానికి అడ్డమైన చొకిరి చేయుటయేగాక దాని పిల్లల నెత్తుకొని మోయవలెను. అదంతయును దాస్యమే ఇట్టు ఐదు వందల యేండ్లు గడచినవి. శాప దినములు పూర్తియైనవి దేనికైనను కాలం, కర్మం కలసి రావలెను కదా! రెండవ గ్రుడ్డు చితికినది. మహారూపంలో గరుత్మంతుడు పుట్టినాడు. బంగారు ఛాయ రెక్కలు, పెద్ద దేహముగల పక్షి. అదొక రెక్కలు కలిగిన పర్వతమువలె నున్నది. పుట్టిపుట్టగానే ఆకాశమున కెగిరి రెక్కలు విదిలించుకొని వచ్చి తల్లికి నమస్కరించెను. దానిని చూచుసరికే కద్రువకు కన్నులు కుట్టినవి. ఎట్టయినను వానిచేత కూడ దాస్యము చేయించుకొనవలెనని అనిపించినదామెకు దగ్గరకు కేకవేసినది “నాయనా! నీ వెరుగవు కాని, మీయమ్మ నాకు దాసీది. అందుచేత నీవు కూడ నాకు దాసీవాడవే! మీయమ్మవచెప్పినదో లేదో నాకు తెలియదు. కాని నాకు చెప్పవలసిన బాద్యత ఉన్నది కనుక ముందుగా చెప్పినాను..తరువాత నీ యిష్టం” అన్నది. అతనికి “ఇదేమిరా బాబు! పుట్టుకతో వచ్చిన జన్మ శని లాగున ఇదొకటి వచ్చిపడినది, అయినను తల్లి చేసిన కర్మ అనుభవింపక తప్పునా? అవశ్యము” అని అంగీకరించెను, అతడు మహాబలశాలియైను మాటకు కట్టుబడి పాములను రెక్కలపై నెక్కించుకొని పోయి అడవులు, పల్లెలు, పట్టణములు త్రిప్పి చూచినాడు..వాటికిష్టమున్న చోట్లెల్ల త్రిప్పి తీసుకొని వచ్చువాడు, వినత కంటే ఇతడే బాగున్నాడని పించింది వారికి. తమకు కామగమనము కల్గిన వాహనమైనాడు. ఇష్టం వచ్చిన చోటికెల్ల ఎగురగలడు. తమకు రెక్కలు లేవను బాధలేదు, క్షణానికొక కోరిక, అక్కడికని ఒకరడిగిన ఇక్కడికని ఇంకొకరడుగుట. మూడవవారు మధ్య వర్తిగా రెండు చోట్లకు తీసికొని వెళ్ళుమనుట గరుత్మంతునికిఆ చాకిరి చేయుట విసుగనిపించినది. నానా తడ

అలలుయయుపాంం నుహాభారతనీతి కథలు = ౯ లాలా

అతడు తక్కువ తిన్నవాడు కాదు వారినందరిని రెక్కలపై నెక్కించుకొని సూర్య మండలము వరకు నెగురువాడు. అక్కడ సూర్యుని వేడికాగ లేక మాడిపోయి ఎండిన తోటకూరకాడలవలె పాములు తుట్టలు తుట్టలుగా క్రిందికి దార్లిపోయినవి. వాటిని చూచినది కద్రువ. ఆమెకేడుపు వచ్చినది. సరదాగా గుర్రమెక్కి వడ్డట్లయినది. ఇతడనుకూలముగా ఉన్నాడనుకొన్నదే కాని, ఇట్లు జరుగునని తలంపలేదు. గడచినదాని కనుకొని లాభంలేదని ఇంద్రుని ప్రార్థించి-చల్లని వాన కురిపించమని వేడినది. అట్టు వాన కురియుటతో ఆ పాములన్నియు లేచినవి. మరల తల్లికడుపున పుట్టినట్లే సంత్తోషించి కద్రువ ఇంకెప్పుడు నట్టిపని చెప్పలేదు. కాని ఏదో పని తల్లీ కొడుకుల కిద్దరికిని చెప్పుచుండెడిది. వారిద్దరు తలవంచుకొని చేయుచుండువారు.

గరుత్మంతునికి దంతయు అసహ్యముగ తోచినది. ఒకనాడు రహన్యంగ తల్లిలో “అమ్మా! మనమీమెకు దాస్యమేల చేయవలసి వచ్చినది? ఎన్నాళ్ళిట్లు చేయవలెను?” అని అడిగినాడు ఆమెకు కన్నుల నీళ్ళు తిరిగినవి చేసినది. తప్పు అని యెరుగును. తన దోషము కొడుకునకు కూడ అంటినది. దానికి హద్దేమున్నది. జీవితమే హద్దు. అంత కష్టమైన మాట యెట్లు చెప్పగలదు? తలవంచుకొని ఎట్లో చెప్పలేక చెప్పలేక చెప్పినది. అతడుకూడ విని చాల విచారించినాడు. “అమ్మా! ఇంత బలముండి కూడ మనము చేతకాని దద్దమ్మల లాగున పనిచేయవలసినదేగా? దీనిని గడచుటకేదైన నుపాయమున్నదా? కొడుకులు పుట్టినందుకు తల్లిదండ్రుల రక్షిపంలేకున్నచో వృధాయేకదా! ఆలోచించుము” అన్నాడు. “నాయనా! అది వారి దయపై ఆధారపడి యుండును. వారి కేదైన హితవైన పనిచేసి దాస్యము మాన్సించుకొనవలెను. నీ అన్ననీ వలన దాన్యవిముక్తి కల్గునని చెప్పి వెళ్ళినాడు. ఏదో నీవే అడిగిచూడుము” అన్నది. గరుత్మంతుడు. వారినే అడగదలచి వెళ్ళెను.

ఆ రోజున కూడ మామూలుగానే పాములతని దగ్గరకు వచ్చినవి, అతడు విచారముతో “అయ్యలారా! మీరు రాజులు, నేను దానుడను. దయయుంచి మా దొస్యము తీరు నుపాయమేదయిన చెప్పుడు. మీకేది కావెలనో కోరుకొనుడు. తెచ్చియిత్తును” అనెను. ఆ మాటల-కా పాములకెంతో సంతోషము కల్గినది “గురుత్మా! నీవు మహాబలశాలివి. నీకు సాధ్యము కానిదేమున్నది? అన్నమట నిలుపుకొమ్ము. మాకు అమృతము తెచ్చి యిత్తువా, నీయొక్క, నీ తల్లియొక్క దాస్యము తీరును. అదే మాకు కావలసినది. యధాశక్తి ప్రయత్నించుము” అన్నవి. గరుత్మంతుడట్లెయని అమృతము తీసికొని రాదలచి ఆ విషయము చెప్పుటకై తల్లివద్ద కేగెను. -

7

వాావావాలంావావావావానా వనభారత నీతి కథలు - లాలా అతని ముఖము చూచుటతోడనే గ్రహించినదామె “ఏదో కార్యసాధన అయినదని' ' అతడు తల్లికి నమస్కరించి “అమ్మా! అమృతము తెచ్చి యిచ్చినచో మనకు దాస్యవిముక్తి యగునని చెప్పినారమ్మా! అందుకై నేనిపుడే స్వర్గమునకేగి అమృతమును తెత్తునమ్మా, దీవింపుము” అని ఆమె పాదములకు మైొక్కెను. ఆమె పట్టరాని ఆనందముతో “మా నాయన అమృతము తెచ్చి నాకు కన్పడవలె. నిన్ను సమస్త దేవతలును రక్షింతురుగాక! వెళ్ళి విజయము.చేకొని రా నాయనా!” అని దీవించినది. అప్పుడతడు “అమ్మా! మనము నేటివరకు దాస్యములో నుండుటచే నాకు దేహమున తగినంత బలము లేదు. నాకు ఆకలి ఎక్కువగా నున్నది. తగిన యాహారము 'పెట్టము. పోయివత్తును” అనెను. ఆమె “దానికేమి నాయనా! నీవు అవతార పురుషుడవు. నముద్రములో నెందరో "రాక్షస నిషాదులున్నారు. వారిని తినుము. అందెపడైనను బ్రాహ్మబుడున్న విడిచి పెట్టము” అన్నది. అతడు “నీవు చెప్పినది బాగుగనే యున్నది. కాని 'బ్రాహ్మణుడెవడో నేనెట్లు తెలిసికొందును? ఉపాయము చెప్పుము” అని ప్రశ్నించెను, ఆమె “నీవు మింగునప్పుడు కంరము మండినచో బ్రాహ్మడున్నట్లు తెలిసికొనుము వెళ్ళిరమ్ము” అని పంపినది. | ల ౮ అతను తల్లివద్ద సెలవు తీసికొని సముద్రమునకేగెను. అందెందరో నిషాదులున్నారు. వారినందరను చూచుటతో అతనికందరిని ఒక్కసారిగా (మ్రింగబుద్ధి వేసినది. ప్రాతాళ బెలమువలె తన నోరుతెరచి అందరి నాక్కసారిగా మ్రింగబోయెను. అంతలో అతని నోరు మండినది. అతనికి తల్లి చెప్పిన మూటలు జ్ఞాపకము వచ్చినవి సరే? వీరిలో నెవడో (బాహ్మఖుడుండి యుండవచ్చుననుకొని గట్టిగా “ఓ- నిషాదులారా! మీలో ఎవరయిన 'బ్రాహ్మబుడున్నచో బయటికి రావచ్చు”నని కేకపెట్టెను.

_ లోపలనుండి ఒకడు “అయ్యా! నేనొక బ్రహ్మడనున్నాను, కాని ఇందు నా భార్య నిషాద ప్రీ యున్నది, దానిని వదలి నేనెట్లు వుత్తను? నేనును దానితోపాటే చచ్చిపోదును” అని జవాబిచ్చెను ఆప్పుడు గరుత్మంతుడు “ఆదా నీ ఆలోచన? పూలతో పాటు దారమును మాత్రం తలలో ధరింపమా? నీతోపాటు నిన్నాశ్రయించిన నిషాదియు రావచ్చును” అనెను బ్రాహ్మణుడు తన ప్రియురాలితో సహా బయటికి వచ్చెను. గరుత్మంతుడు తక్కినవారి సందరినీ మ్రింగివేసెను, కాని ఆ యాహారమతినికి చాలలేదు. "

అక్కడ నుండి వచ్చుచు గంధమాధన పర్వతము పై తపస్సు చేయుచున్నతండ్రివద్దకు వెళ్ళినోడు. అతని పాదములకు నసమ్మరించి తన సంగతినంతయు చెప్పీ “తండ్రీ! త నూ.

అలా మవాభారతనీతి కధలు -/ వాలా నిషాదులనందరిని తిన్నను నా కాకలి తగ్గలేదు. అందుచే తమరు నా కాకలి తగ్గుటకు ఉపాయం చెప్పు” మని ప్రార్దించెను అతడాలోచించి “నాయనా మంచి పట్టుదల కలిగి యున్నావు సంతోషమే! నీకు తగిన ఆహారమైన ఏనుగు, తాబేలు వున్నవి. వాటిని తినుము" ' అనెను అతడు “తండ్రి అవి ఏల ఎట్లు తినదగి యున్నవో సెలవిత్తురా?” అని యడిగెను. అప్పుడు కశ్యప డిట్లు చెప్పెను. “పూర్వము విభావసుడను బ్రాహ్మణుడుండెను. అతడు చదువు సంధ్యలు నేర్చిచాల ధనము గడించెను. అది చూచి ఓర్వలేక అతని తమ్ముడు సుప్రతీకుడు పిత్రారితమును పంచిపెట్టమని తగవు చేసెను. శాని నిజమునకు పిత్రార్దితమేమియు లేదు అంతయు నతని స్వార్దితమే అయినను తుమ్ముడు వచ్చి భాగమిమ్మన్నందులకు కోపించి ముందు వెనుక ఆలోచించక “పో, పో! నీకు భాగం లేదు గీగము లేదు ఏనుగు వై యుండుము” అని శపించెను” సుప్రతీకుడు సహింపలీక “ఓయి అంత అహంకారమా నీవు తాబేలువగుము” అని తిరిగి శాపమిచ్చెను. అట్లు వారిరువురు శాప ప్రతిశాపములచే మూడాముడ ఎత్తు పదామడకై వారము కలిగిన తాబేలుగాను ఆరామడ ఎత్తు, పండైైండామడ విస్తారము కల్గిన ఏనుగుగాను పుట్టినవి. జన్మాంతర వైరానుబంధము వాటికి తగ్గలేదు. అందుచే ఒకదాన్ని మించి ఒకటి పట్టుదలతో పెనుగులాడుచున్నవి అవి నీకు తగిన భోజనము వెళ్ళి తినుము” అని చెప్పెను. గరుత్మంతుడు ఒక్క ఎగురులో వెళ్ళి రెండుకాళ్ళతోను రెంటిని తన్నుకొని పైకెగిరి వాటి నెక్కడ పెట్టుకొని తినుటయా? అన్న ఆలోచనతో వచ్చి ఒక చెట్టుపై వ్రాలెను. అది చాల పెద్దచెట్టు దాని కొమ్మలు తెగ వ్యాపించి యున్నవి. అది ఆపగలదని అతడాగెను. కాని అంత బరువు నా చెట్టుకొమ్మ ఆపలేకపోయినది. ఫెళ పెళ మనుచు అది విరిగిపోయినది. దాని కొమ్ములు ఆధారముగా పట్టుకొని వాలఖిల్యులను మహర్షులును . తలక్రిందులుగా వ్రేలాడుచు తపస్సు చేసికొనుచుండిరి. వారాయుత్సాహం చూచి “ఎవడురా? మేమ నిర్ణనముగా నున్నదోట ఏ బాధయు నుండదని ఇక్కడ (వ్రేలాడచుండగా మా వద్దకు వచ్చి మా తపస్సునకు భంగం చేయుచున్నాడు” అనుటతో గరుత్మంతుడు వారిని ప్రార్ధించి, వారికేమియు బాధ కలుగకుండ. ఆ కొమ్మను ముక్కున కరచుకొని - ఒకదానికొకటి సాయమై బరువైనను - వాటిని మూడింటిని ఎక్కడ పెట్టవలెనో తెలియక అతడు కశ్యపుని వద్ద కేగినాడు. కళ్యపుడు కొడుకు యొక్క పరిస్థితి చూచెను. “అరే, పాపం! ఎంతపని జరిగినది? ' అనుకొని, వాలభిల్యులకు నమస్కరించి, “అయ్యా! అతడు నా కుమారుడు సుపర్జుడు ల.

ఆాాాాంా మహభారతనీతి కథలు - గాలా మహాబల సంపన్నుడు. కనుక మీకు బాధ కల్గకుండ కొమ్మను పట్టుకొన గల్గినాడు. దయచేసి మీరా కొమ్మను వదలి, ఎక్కడికైనను వెళ్లడు. నన్ను దయ జూడుడు” అని ప్రార్ధించెను. వారు దయతలచి కళ్యపుని మీద గౌరవంతోను, గరుత్మంతుని వినయ విధేయతలకు సంతోషించియు ఆ కొమ్మను వదలి హిమవత్పర్వతమున కేగిరి. అప్పుడు గరుత్మంతుడు “తండ్రీ! ఈ కొమ్మనెక్కడ వదలను! వీటి నెక్కడ పెట్టుకొని తినను? సెలవిమ్మ”ని కొమ్మ నోటిలో నున్నందున తడబడు మాటలతో తండ్రి నడిగెను. అత్తడాలోచించి “నాయనా! హిమవత్పర్వతం మీద ఒక శిశరమున్నది. అందు ప్రాణులేవియునిు లేవు, అక్కడ ళు కొమ్మను వదులుము. ఏ ప్రాణికిని బాధ కలుగదు. అది ఇచ్చటికి లక్ష ఆమడల దూరమున్నది పామ్ము” అని పంపెను. అతడు మహాబలశాలి కనుక అంతద్తూరంను కొద్ది క్షణంలలో గడిచి వెళ్ళి కొమ్మునక్కడ పారవైచి ఏనుగును, తాబేలును పూర్తిగో తినెను, దానితో అతనికెంతో బలం వచ్చినది. అప్పుడతడు స్వర్గానికి ప్రయాబమయ్యెను. అతడక్కడ బయలుదేరుటతో దేవలోకములో ఉత్పాతములు పుట్టినవి ఇరిద్రుడు బృహస్పతిని పిలిచి, “గురోత్తమా! ఏమిటిప్పుడీ యుత్స్చాతములు? దీనికి కారణమేమో చెప్పు డనేను. అతడు “గరుత్మంతుడు మాతృదాస్య విముక్తికై అమృతమును తీసికొని వెళ్ళుటకు వచ్చుచున్నాడు. అందులకై యీ ఉత్పాతము లగుచున్నవి” అనెను. ఇంద్రుడు “ఏమిటీ! ఒక్క వక్షి వచ్చి మన అమృతమును పట్టుకొని వెళ్ళునా? దానికంత బలమున్నదా?” అని వికటముగా నవ్వుచు అనెను బృహస్పతి “నీకు జ్ఞానము లేదేమో కాని, అతడు మహా బలశాలి. దానికి జరిగిన కథను చెప్పెదను విను” మని యిట్లు చెప్పెను. " ఇదివరకు కళ్యపుడు పుత్రకామేష్టి చేయుచుండగా నీవు నీకు తగినంత సమిదుల మోపు మోసుకొని వచ్చుచుంటివి. (కశ్యపుని కింద్రుడు కొడుకగును. అందుచే అతడు తండ్రీ యజ్ఞమునకు కావలసిన సంభారములు తెచ్చుచుండెను,) అప్పుడు యజ్ఞానికని వాలఖిల్య మునులు, వారంతయు పోగుచేసి అంగుష్ట ప్రమాణులు (వ్రేైలెడు మనుష్యులు) అందుచే వారు చిన్న చిన్న మోపులు మోయుచుండిరి. నీవు వారిని చూచి నవ్వితివి. వారికది సిగ్గనిపించినది. వెంటనే వారు కోపగించి, యజ్ఞశాలలోనికి వెళ్ళిన తర్వాత “ఇంద్రుడు పుట్టుగాక!” అని మంత్రములతో హోమము చేసిరి, అది తెలియగానే నీవు కశ్యపుని వద్ద శేగి నమస్కరించి “తండ్రీ! ఈ వని యిట్లు జరిగినది” వాలఖిల్యులు నాపై కోపించిరి. నాకు బ్రమ్మదేవుడు ఇంద్రపదవి నిచ్చెను కదా, అది తమ రెరిగినదే? ఇప్పుడు నన్నెట్టు రక్షింతురో?” అని 'ప్రాధేయముగా ప్రార్ధించెను. 20

ఆ మహభారతనీతి కథలు -/ ాాలాలాలాలాలాలాలాాలాాా

అతడాలోచించెను. బ్రహ్మగారు చేసినదానికి ఎప్పుడును తిరుగుండదు. కనుక వాలఖిల్యుని వద్ద కేగి వారిని బ్రతిమాలి తన కొడుకు పక్షికులమున క్రిందుడగునట్లుగా, అటు మహర్షులమాట అసత్యము కాకుండ, ఇటు ఇంద్ర పదవికి పోటీలేకుండ సర్పిచెప్పెను. వారును, కశ్యపుని మాటల నంగీకరించిరి. ఆ మంత్ర మహిమచే - పవిత్రమై పురోడాశము తిన్నందున - పుట్టిన మహానుభావుడే ఇతడు అతనికెంత బలమున్నదో చెప్పజాలము! మనము కొంచెం జాగ్రత్తగా నుండుటయే మంచిది” అని గురువుగా, మంత్రిగా సలహా ఇచ్చెను.

అట్లన్నంతమాత్రాన ఊరుకొనుట రోజధర్మమా? ఇంద్రుడు అమృతమును రక్షించు భటులను పిలిపించి బహు జాగ్రత్తతో నుండవలెనని చెప్పి పంపెను. వారాయుధము లన్నిటిని సిద్ధముగా నుంచుకొని యుద్దసన్నద్దులై యుండిరి.

. అంతలో గరుత్మంతుడు మహావేగముతో వచ్చెను కావలివారతనితో యుద్దమారంభించిరి. అతడు ధూళి తెచ్చి వారి కన్నులలో కొట్టెను వారు కన్నులు కన్పడక బాధ పడుచుండ ఇంద్రుడు వాయుదేవుని తలచుకొనెను. అతడు వచ్చే ఆ ధూళి నంతను రేగగొట్టెను మరల యుద్దంనకు సిద్ధమైన దేవ గణములను రెక్కలతో కొట్టి, కాళ్ళతో తన్ని ముక్కుతో పొడిచి పీడించెను. వారాతని కెదురుగ ఆగలేక పారిపోయిరి.

. అప్పుడు లోనికేగుదుమని చూడగా అక్కడ పెద్ద ఎత్తుగా అగ్నిజ్వాలలు మండుచున్నవి. వాటి నార్చ్పుటకై నదీ జలముల పుక్కిల్తిపట్టి తెచ్చి వాటి నార్చెను. దాని తర్వాత భయంకరమయిన చత్రము గిరగిర తిరుగుచున్నది. గరుడుడు సూక్ష్మ రూపముతో అ చక్రపు టాకుల మధ్య నుండి లోనికి దూరెను అక్కడ రెండు మహాసర్పములున్నవి.

అవి విషము గ్రక్కుచున్నవి. గరుడుడు వాటి నెత్తి మీది కెక్కి త్రొక్కి వాటి మదము ఇచెను. ఆ లోపల నున్నది. అమృతపుకుండ, ఆ యమృత కలశమును పుచ్చుకొని పైగెను. అదంతయు చూచుచున్నారు శ్రీ విష్ణుమూర్తి అతని కమృుత మక్కరలేకయే ఇంత పని చేసినాడే? నిజముగా అక్కరలేకపోయినను అమృతము దొరికినపుడు ఎవడు త్రాగకుండ మానగలడు? అతనికా కోరికయే లేదు. మాతృదాన్య విముక్షియే ఆతని కర్తవ్యము. అతని కర్యాదీక్షకు విష్ణువునకు సంతోషం కలిగినది. “ఓ పక్షింద్రా, నీ కర్యాదీక్షకు మెచ్చుకున్నాను నీకేమి కావలెనో కోరుకొమ్ము” అనెను గరుత్మంతుడా హరికి నమస్కరించి “నాకు సిర్దించవలెన్నుుఎషుడుమ్న నీకు దగ్గర

  • అమృతం తాగకుండగనే అజరామరత్వములు సిద్ధి యా గ్గా 21 హం ను ౯ ఖ న్‌.

వాాలానారాంాటంంా మవాభారతనీతి కథలు - / లాలా నుండి సేవలు చేయవలె” అని కోరుటతో సంతోషించి విష్ణుమూర్తి” నీవు నాకు వాహానముగాను జెండాగాను అగుదువు నీవు కోరిన వరములిచ్చితిని వెళ్లుము” అని వీడ్కొల్సెను. " ఇంతలో ఇంద్రుడు కోపించి చేజేతులార అమృతమును వదలలేక అతనిపైకి వజ్రమునుపయోగించెను. అది మంటలు (గ్రక్కుచు వచ్చుచుండెను. అదిజూచి భయపడక గరుత్మంతుడు “నీవు దేవేంద్రుని ఆయుధమవు. మునివలన పుట్టిన దానవు కాన నీ మంటల వలన నాకేమియు భయం లేదు. ఇదిగో నీకు ఆహారం” అని తన రెక్క నుండి ఒక్క ఈకను తీసి దానికిచ్చెను. అది తిరిగి వెళ్ళిపోయినది. అది ఛూచిన వారెల్లరును మంచి ఈకలు కలవారగుటచే అతనికి 'సుపర్డు' డని పేరు పెట్టిం. ఇంద్రుడు పర్వతముల రెక్కలు తెగగొట్టిన తన వజ్రము వృధాయగుటకు చింతించెను. ఇక తానేమి చేయగలడు? గరుత్మంతునితో స్నేహం చేసికొనెను. “నీకంత బలమున్నదో చెప్పుమని” కోరెను, గరుద్ధుడు “కొండలు, నదులతో సహా భూమినంతను మోయగలను, సముద్రపు నీటిని ఒక్కసారిగా రెక్కలతో పైకి చల్లగలను. ఒక్క క్షణములో మూడు లోకములను తిరిగి రాగలను” అని తన బలం నున్నదున్నట్లు చెప్పుటతో సంతోషించి ఇంద్రుడు “మిత్రమా! నా మాట వినుము "అమృతం మేముంచాలా శ్రమపడి సంపాదించుకొన్నాం దీనిని నితరులు త్రాగరాదు. నీవు దీనినిక్కడ వుంచి వెళ్ళుము. నీకు కోరిన వరమిచ్చెదను వినుము అనెను. “నేనీ అమృతమును తీసికొని వెళ్ళి పాములముందు పెబ్టెదను. అంతటితో నాకు దాన్య విముక్తియగును అప్పుడు నీవు వారు త్రాగకుండగనే మాయదేస్‌ తీసికొనిపామ్ము” అనెను. ఆయు పాయంనకు మెచ్చి నీకేమి వరం కావలయునో కోరుమునగా అతడు “మాకు రాజ్యం నీది కనుక నీ యాజ్ఞ కావలెను” అని కోరుటతో ఇంద్రుడందుల కంగీకరించెను. గరుత్మంతుడు ముందు వచ్చుచుండ ఇంద్రుడు వెనువెనుకనే వచ్చుచుండెను. పాములు ఎప్పుడమృతం వచ్చునా ఎప్పుడు త్రాగుదుమా అని వేచియుండిరి. అంతలో గరుత్మంతుడు వచ్చి నేలపై పెట్టగూడదని దర్చలు వేసి వాటిపై అమృత కలశము నుంచెను వారెల్లరు నోరూటలూరగా త్రాగవచ్చిరి. వారికడ్డువచ్చి గరుడుడు “ఇదిగో, మీరన్నట్టు అమృతము తెచ్చి యిచ్చితిని. మా దాస్యవిముక్తియైనది. మీరన్నట్లు చేసితిని” అనుటతో వారందరు నేకగ్రీకముగా “దాన్యవిముక్తి యైనద”నిరి. అప్పుడు గరుడుడు “అమృతము పవిత్రమైనది. దానిని స్నానం చేయకుండ

అతతయాంావావావా మువాభారత నీతి కధలు - / తతత ముట్టరాదు. వెళ్ళి స్నానం చేసి రండు” అని పంపెను. వారు దగ్గిరకు వచ్చినదేమగునను ధైర్యంతో స్నానమునకేగిరి. తిరిగివచ్చునంతలో ఇంద్రుడా అమృతము నెత్తుకొనిపోయెను. మాయచేసి సంపాదించిన సొమ్ము అల్లే మాయగాపోవును. పాపం పాములు విచారించి ఏమైనా అమృతం అంటుకున్నదేమో అని దర్చలు నాకినవి. దర్చలు వాడిగా నున్నందున

వాటి నాలుకలు రెండు చాలికలైనవి. అప్పటి నుండి దిజహ్వములెనవి గరుత్మంతుడు

సర్పాహారుడయ్యెను. దాస్యవిముక్తి కలిగి వినత ఎంతో సంతోషించినది.. గరుడుడు

విష్ణువునకు వాహనమై వైకుంఠమున కేగెను.

ఆ రీతిగా మాతృశాపం వలన సర్పములకు సంఘమరణం వాటిల్లినది. అదెరిగి ఆదిశేషుడప్పుడే పశ్చాత్తాపం కలిగి హిమవత్పర్వతం మీదికి పోయి ఘోరతపస్సు చెసి (బ్రహ్మను మెప్పించెను. బ్రహ్మ వరములు కోరుకొమ్మనగా “నాకు చావు లేనట్టు వరమిమ్మ" "నెను. బ్రహ్మ “నీవు మహాబలశాలివి కనుక ఎల్లప్పుడును భూభారమును మోయుచుండుమ'" 'ని అనుగ్రహించెను. అతడట్టే భూమినీ మోయుచుండెను. అన్యాయమున పాల్గొననివారికే బాధయు కల్టుగదుకదా!

ఆ యాగమట్లు బ్రహ్మప్రళయముగా జరుగుచుండగగా ఆస్తీకుడను బుషి వచ్చెను. అతడు జనమేజయుని స్తుతించెను. అతడు మెచ్చి నీకేమి కావలెనో కోరుకొమ్మనెను. ఆస్తీకునకు కావలసినదేమున్నది? సర్పయాగం మానుమన్నదొక్కటే అతని కోరిక అపత్యదోషం వచ్చిననుసరే కాని, నేనుమాత్ర మీ యాగమును మానని పట్టపట్టెను.

మరి ఆస్తీకుడెవరో చెప్పవద్దా? అతని కథ కూడా పనిలోపని చెప్పెదను వినుడు.

అటు అమృతం దొరకక దాసీవారు పోయి ఉభయ భ్రష్టులగుటమయే గాక ఉపరి (ఫై పెచ్చుగా) మాతృశాపము వచ్చినదని వాసుకెంతో విచారము కలిగినది. శేషుడు బ్రహ్మవరం పొందినాడు. తానుకూడ మందర పర్వతమునకు త్రాడుగా పనికివచ్చినందున తనకును 'బ్రహ్మ చావులేదని వరమిచ్చియే యున్నాడు. కాని మిగిలిన త్రమ్ములబాధను కన్నులారా చూచుచుండవలసిందేనా? అని విచారించెను. అప్పుడు మిగిలిన పాములు అదెంత పెద్ద కష్టము? మేమా యజ్ఞమును జరుగకుండ ఆపుజేసెదము. విషం క్రక్కుటతో అందరు చత్తురు. ఒకవేళ మిగిలినవారలును పారిపోవుదురు. ఏమియు భయపడవలదు అని బీరములు పల్కిరి. కొందరు బుర్ధిమంతులు “మీ కోతలు చాలు, కట్టిపెట్టడు, మీరన్న వేమియు చేయుటకు వీలైనవి కావు. మంత్రజ్వాలలు మండువేళ మనకేమి చేయదగును? అనిరి. " లా టా

అకా జాానాపాావాాజాయంయలయిం ద్రవకల్టారత నీతి కథలు = లాలా

అప్పుడు. ఏలాపుత్రుడును నాగుడిట్టనెను “మీరేమియు భయపడనక్కరలేదు దీనికి పరిష్కారమొకటున్నది, ఆ శాపమిచ్చిన రోజున నేను నా తల్లియొడిలో నిద్రపోవు చున్నట్టుగా పరున్నోను. అప్పుడు బ్రహ్మవద్దకు దేవత లందరును వచ్చి “తాతా! నిర్ణయగా కద్రువ తన సంత్తానము నందరిని శపించినదే మీరు నివారింపలేదే? అని ప్రశ్నించిరి. దానికి బ్రహ్మదుష్టపర్వతములతో భూమికి భారము హెచ్చినది. వాటిని చంపుటకై నేనట్లూరకుంటిని అంతేకాని ప్రముఖ సర్పములు చాపకుండ మహాసర్ప రాజములకు చెల్లెలయిన జరత్కారువునకు పుట్టిన ఆస్తీకుడను మహర్షి రక్షించును అని చెప్పెను అనుటతో వారెల్లరును అతని నెత్తుకొని “బాగు బాగు మంచిమాట చెప్పితివి. ఇంతకంటె ఇప్పుడీ కష్టదశలో ఊరడించగళల్లిన వాడెవరు? నీవంటి బంధువు మాకింకొకడుండడు” అనుచు అతనిని పాగడిరి,

అప్పుడు జరత్కారువు వద్ద కేగి “చెల్లీ, నీ కడుపున పుట్టబోవు కుమారుడు మమ్ములను రక్షించునటమ్మా, మమ్మెట్లు చల్లగా జూతువో?” అని ఆమెను కార్యావసరముచే పాగడిరి. ఆమెకెప్పుడు పెండ్డియగునా? ఎప్పుడు కొడుకును కనునా? అని వారు వేచియుండిరి.

జరత్మారుని కథ

జరత్కారుడను మహర్షి యొకడుండెను అతడు బ్రహ్మచారి, పెళ్ళియన్నచో అతని కోడలు మంట ఆ సంసార సాగరములో, సంసార పంకముతో మునుగునని గట్టిగా పట్టుబడ్డినవాడు స్వాభ్యాయము శాస్త్రములు పూర్తిగా చదివెను. యాయవార వృత్తిచే జీవించుచ్తు భూమిలో తిరుగుచుండెను. అతనికి సంసారమున దిగినచో పునర్జన్మయెత్తవలసి వచ్చునేమో అని భయము అందుచే ఘోరన్రతములు చేయుచుండెను.

ఒక్కనాడతడొక వనములో సంచరించుచుండగా ఒక పెద్ద గోతిలో ఒడ్డున మెలచిన దుబ్బును పట్టుకొని తలక్రిందుగా వ్రేలాడుచున్న బుషులను చూచెను. ఆ మొక్క కొక్క దుబ్బు మాత్రమే యున్నది తక్కిన వాటినన్నిటిని ఎలుక కొరికి వేసినది. ఆ ఒక్కటియుకూడ పోయెనా! అందరును ఆధోగతీషాలు కానలసినదే జగత్కారువు వారిని చూచి తెలియక పలుకరించెను.

“అయ్యా మీరెవరు? అదేమి ద్రతము? ఇంత ఘోరముగా చేయుచున్నారు? ఈ వ్రత విధానము చెప్పినచో నేను కూడ చేయుదును” అని అడిగెను.

అందుకు వారు “ఇయో్యో! ఇది వ్రతముకాదు నాయనా! మా పాపము మేము సితృదేవతలము మా వంశమున కెల్ల మూల మొక్కడే ఉన్నాడు వాని పేరు జరత్కారువు, నవనవ ననన

లాం నుహాభారతనీతి కథలు -/ నాలా ఆ పాపాత్ముడు వ్రతములు జపములు చేయునుగాని పెళ్ళి చేసికొనడు. ఈ దుబ్బు వాడే. తక్కిన వారందరును చనిపోయిన తర్వాత కాలమను మూషికము దుబ్బుల నన్నింటిని కొరికివేసెను. ఇక వీడుకూడ నేడో రేపో చనిపోవును. అప్పుడా ఎలుక ఈ దుబ్బును కూడా కొరికి వేయును. ఇక మే మీ క్రిందికి కూలవలసినదే” అని కన్నుల నీరు పెట్టుకొనిరి. మరల వారు “అయ్యా! నీ వెవరవోమాకు చుట్టమువలె మాటల నతి శ్రద్ధగా విన్నావు. నీ కెక్కడనైన ఆ దుర్మార్గుడు కనపడినచో మేము పడియెడు అవస్థ చెప్పు బాబూ!” అని పరిపరి విధముల "బతిమాలిరి. అదంతయును తనకధయే అతడు చా లవిచారించెను "వారితో “అయ్యా! నేనే ఆ దౌర్భాగ్యుడను. మీరిట్టి బాధ పడుదురని తెలియక పెళ్ళివలదంటిని. ఆ మాట నిజమే! కాని. ఇప్పుడు నా నిశ్చయము మార్చుకొన్నాను. కాని ఒక్క నియమము. నా పేరుగల పిల్ల ఎక్కడనైనా దొరికినచో నేను పెండ్లి చేసేకొందును” అనుటతో వారు “నాయనా! ఏదో రీతిగా ఒప్పుకున్నావు అంతకంటె కావలసిన దేమున్నది? సంతానము కని, మమ్ము ఊర్బ్వ్యలోకముల కంపుమురా నాయనా?” అని ప్రాధేయ పూర్వకముగా వేడిరి. అతడును వివాహమాడ నిశ్చయించి తన పేరిటి దానిని వెదకుటకై బయలుదేరెను. కార్యసిద్ధియగు వేళ కన్నియును వాటంతటవే సమకూరును. వాసుకి చారులా విషయమును వాసుకి చెవుల వేసిరి అతడు చెల్లెలికి మగనిక్షై ఎదురుచూస్తున్నాడు. ఎంత మేర తిరిగినను జరత్కారువునకు తగిన పిల్ల దొరకలేదు. అతడును తిరుగుచున్నాడు. అంతట వాసుకి తన చెల్లెలిని తోడ్కొని జరత్కారువు వద్దకేగి నమస్కారం చేయించి “అయ్యా మునీంద్రా! ఈమె నా చెల్లెలు 'పేరు'జరత్కారువు నీవు కోరిన కన్య. పెండ్లి యాడుము” అని ప్రార్ధించెను. అతడు పెండ్లి చేసికొని ప్రధమ సమాగమంనాడే ఆమెతో “నీ వెప్పుడైన ఒక్క తప్పు చేసితివా? నిన్ను వెంటనే వదలి వెళ్ళిపోవుదును సుమా! ఇదే నా ప్రతిజ్ఞ” అని చెప్పెను. ఆమె నేటి కిన్నేళ్ళకు మగడన్న వాడు కన్నులబడెనని సంతోషముతో ఒప్పుకొన్నది. ఆమె కత్తి మీద సామువలె బహు జాగ్రత్తగా అఆ అపురూప భర్తకు సేవలు చేయుచున్నది. రేయింబవళ్ళు ఎక్కడ ప్రమాదము వచ్చునో అను భయముతో అడుగులకు మడుగు లొత్తుచున్నది. అంత కరనమైన కాప్పురమెన్నాళ్ళు సౌగును? ఏవంక దోరుకునా? ఎప్పుడు వెళ్ళిపోదునా అని జరత్కారువున్నాడు. ఒకనాడు సాయంకాలము మహర్షిభార్య తొడలపై తలపెట్టుకొని నిద్రించుచుండెను. అంతలో సూర్యాస్తమయము కావచ్చినది. మహర్షికి సాంద్యకృత్యము లుండును గదా! న

ఎలా మహభారతనీతి కళలు - గాలా లేపకపోయినచో కర్మభంగమగునేమో? లేపినచో నిద్రాభంగమగునేమో? ఆమెకు గట్టి సంసయమే వచ్చినది. అతడు మహర్షి- కర్మలోపము రాకూడదని చివరికి నిశ్చయించుకొని అతనిని లేపినది. “ఏమి ఇప్పుడు లేపితివి? అంత హడావిడి ఏమి వచ్చినది?” అని అతడు కనరెను. ఆమె దడదడ వణకుచు “ప్రాద్దు గ్రుంకుచున్నది. నంధ్యోపాననా సమయమగుచున్నది, ఈమకు నియమ భంగమగునేమో అనిలేపితిని” అన్నది. “ఆ౮ ఎంత అవమానము? నేను పరుండియుండగా సూర్యుడస్తమించగలడా? నా మహిమ తెలియక నన్ను సామాన్యుని వలెనే తలచి యింత చులకన చేయుదువా? ఇదిగో! ఇదే మనమనుకున్న (ప్రకారము నిన్ను విడుచుచున్నాను” అని లేచేను. ఆమె కాళ్ళ (వ్రేళ్ళపడి “నాధా! నేను చేసినది తప్పా? ఇంత మాత్రానికే వదులుటా? ఎన్నడెన్నడని కన్పులు కాయలు కాచునట్లు కూర్చున్న నా కొపురము మూన్నాళ్ళ పట్టపగలుతో ఇట్లే అంత మొందినదే. ఇక నాకేది దిక్కు?” అని ఫిలపించుచుండగా అతడు “నేనన్నమాట తప్పను కాని, నీవు మాత్రము విచార్తించనక్కర లేదు. నీ గర్భమున నున్నవాడు మన యిద్దరి వంశముల నుద్ధరించు మహానుభావుడు. నీ కథుపు పండినది అది నీ నా అదృష్టం చాలు అదే నా కోరిక కూడ, ఇక -వెళ్ళుచున్నాను. నీవు గర్భరక్షణ చేయుము” అని వెడలిపోయెను. అప్పుడిక జరత్కారువు ఇంటికి ఫచ్చి తన మగడు చేసినదంతయు తన అన్నలత్లో వివరించి చెప్పినది. వారు తమకు కావలసినది కూడ ఆమె గర్భమే కనుక, కామె నూరడించి గర్భరక్షణ చేసిరి. తొమ్మిది నెలలు నిండినవి. పదన వెలల్లో జగత్కారువు సుపుత్రుని కన్నది. అతడు మహా తేజశ్శాలియై వెలుగొందెను అతడే ఆస్తీకుడు. అతడు చ్యవనుని కొడుకైన సుమతితో పాటు చదివి వేదశాస్త్ర పారంగతుడయ్యెను. క

ఆ యాస్తీకుడు వచ్చి జనమేజయుని స్తుతించి మెస్పించెను. కాని రాజు అతడడిగినట్లు సర్బ్పయాగమును మానదలచలేదు. అతని పట్టుదల అతనిది.

ఈ లోపున తక్షకుడు పుణ్యానికి పోయిన పాపమెదురైనదన్నట్లు తనకే కోపమును లేకపోయినను ముని మాటలను బట్టి పరక్షిత్తును కరచినందుకు తన ప్రాణము మీదికే వచ్చినది. తన నీనాడు రక్షించువారెవరు? ఒకవేళ ఇంద్రుడేమైన రక్తించునేమో అని స్వర్గమున కేగెను. ఇంద్రుడు బృహస్పతి నడిగి తక్షకుడెట్టును చావడని నిశ్చయించుకొని అభయమిచ్చిను.

కింది తోకముల్లో స్వాహాకారములతో హోమములు చేయుచుండిరి. సర్పములెన్నో , వచ్చి పడచున్నవి. కాని తక్షకుడింకను రాలేదు. జనమేజయుడు బుత్విక్కులను ాాాాాాాాాాాలాోాాాాోోోోోాోభడ

వాంవావలంలంాలాంలాం మవాఖభారతనీతి కధలు -/ అబా మహెచ్చరించెను. వారు “తక్షకాయ స్వాహా!” అనిరి. తక్షకుడు రాలేదు. ఆస్తీకుడాక మూల యాగమును మానుమని వేధించుకొని తినుచుండెను. రాజు మాననని పట్టుదల కలిగి “ఓ మహర్చులారా! మీ మంత్రములు మొజువోయినవా! పట్టు తప్పినవా! ఏడీ! తక్షకుడు? వచ్చుటలేదే? ఇక మనముయాగమును మానక తప్పదా? ఏ మాటయు చెప్పరు?” అని అవహేళనగా పల్కుటతో మునులకావేశము కలిగినది. దివ్య దృష్టితో చూచిరి, ఇంద్రుని పీరమునకు చుట్టకొనియున్నాడు. తక్షకుడు సరే అని “మహేంద్ర తక్షకాయ స్వాహా” అని హోమము చేసిరి. ఇంద్రపీరము కదలినది “అమ్మో నాకే ఎదురు వచ్చినదే! వెళ్ళు నాయనా! వెళ్లు నిన్ను రక్షించుట ఇక చాలు” ఇని ఒక్క విసరు విసరి తక్షకు నావలకు పారవేసెను. అతడింక దిక్కులేక మొర్రో యనుచు ఆకాళము మీదికి వచ్చి గిరగిర తిరుగుచుండెను. ఇక = పడిపోవును. "

అంతలో సభ్యులెల్లరును మహర్షి వాక్యము పాటింపుమని చెప్పరి. “తక్షకునకు చావులేదు. కాన రాజా! నీకు మాటదక్కునట్టు యాగమును మాను” మని గట్టిగా చెప్పిరి. దానితో రాజు “తక్షకుడు వచ్చి తన్ను ప్రార్థించినచో మానుదు” ననెను. అంతలో అస్తీకుడు “ఓ తక్షకా!ః అగుమాగుము” అని కేకపెట్టి అతని నక్కడనే ఆపి, “జనమే జయునికి క్షమార్చణ చెప్పుకొను” మని చెప్పెను. అతడట్టే రాజును మన్నింస్తుమని వేడెను. రాజు క్షమించెను. -

అట్టు సర్బ్పకుతము రక్షించెను. కాన ఆస్తీకుని పేరు తలచుకొన్న వారికి పాముల్గ భయముండదని సర్పరాజులు వరమిచ్చినవి.

జనమేజయుడు యధాశక్తిగా బుత్విక్కులకు దక్షిణల నిచ్చి యాగము నసంపూర్తిగా పూర్తి చేసెను. దైవసంకల్పమునకే మనుజు డెదురీదగలడు.

ఒకనాడతడు ఆస్తానమున మంత్రి సామంతాదులతో కూడియుండగా వ్యాసమహర్షి వచ్చెను అతడా మహర్షి కెదురేగి ఆర్హ్యపాద్యాదులనిచ్చి పూజించి “తాతగారూ! మీరు త్రికాలజ్ఞులు కదా! మీరు చెప్పినను వినక, మా తాతలు పరస్పర కలహమునకు దిగి కులక్షయమునకెట్ట్లు ప్రయత్నించిరి? ఆ కధను సవిస్తరముగా చెప్పుడ”ని ప్రార్ధించెను. వ్యాసమహర్షి “నాకు చెప్పుటకవకాశము లేదు. నా శిష్యడైన ఈ వైశంపాయను నిక్కడ దిగవిడచెదను. ఇతను నీకు సంపూర్తిగా భారతమును వినిపించును" అని చెప్పి యొప్పించి తాను వెళ్ళిపోయెను. అక్కడ నుండి వైశంపాయన మహర్షి గురూపదేశము (ప్రకారము జనమేజయునకు వచ్చిన సందేశము వెల్ల తీర్చుచు మహాభారతమును వినిపించెను.

27

బవలాారాయాయయయంయయయయలాలా మునంరత నీతి కథలు = | లాలా

ఈ భారత ప్రారంభమునకు మరొక రీతిగా కూడా నాకధను చెప్పాచుందురు. దానికి మూలమెక్కడున్నదో నాకు తెలియకపోయినను వినోదకరముగ నున్నందున దానిని కూడ చెప్పెదను.

ఒకనాడు వ్యాసమహర్షి జనమేజయుని అస్థానమునకు వచ్చెను. ఆయనను సత్కరించి ఉచితాసనముపై కూర్చుండ బెట్టి రాజు “తాతగారూ! మీరు మూడుకాలముల నెరిగినవారు. మా పెద్దలును కదా! మీరు చెప్పినచో మా తాతలు వినకుందురా? మీరుండి కూడ తగ్గవు రస్పించితిరే కులక్షయమైనది. మీరు కల్పించుకోనందున మీదే లోపమని నా యూహ” అని బొధతో కటువుగా అనెను. ఎంత- కామక్రోధాదులను జయించినను మాటలన్నచో పడుదురా?

అప్పుడు వ్యాసమహర్షి “నాయనా! నీవును నాకు మనువడవే కదా! నా మీద భక్తికి కలవాడవు కదా! ఇదిగో నీకు రాబోవు విషయమొక్కటి చెప్పుచున్నాను. విను, నీ వెంత జాగ్రత్తగా మెలుగుదువో' చూతును ఇక పది సంవత్సరములకు ఈ నగరములోనికి ప౦ఛకళ్యాణి గుర్రమొక్‌టి అమ్మకమునకు వచ్చును. దానివంటి గుర్రము నెవరును కని విని యుండరు. కొని నీవు మాత్రము దానిని కొనవలదు. అది నీకు అర్వణము కాదు (ఇచ్చిరాదు). అప్పుడు నీ మంత్రులు దానిని చూచి ఉండబట్టలేక కొనమని నిన్ను బలవంత పెట్టుదురు. నీవు కొందు. నేను చెప్పుచున్నవి గుర్తున్నదా? కొనుకుము; కాని నీవు మాత్రము మానవు - కొని తీరతావు.”

ఆయన చెప్పిన దంతయును వ్రాయసకాని (రైటరు) చే రాజు వ్రాయించెను.

ఒక వేళ ఆ రీతిగా కొన్నను దానిపై స్వారీ చేయవలదు. ఇది నా మాట! జరిగెడీదేమనగా నీ వెన్నాళ్ళు కొన్న గుర్రము నూరక అట్టే పెట్టదువు? నీ మంత్రుల బలవంతము'పై స్వారీ చేయుదును కాని ఉత్తరముగా మాత్రము చేయవలదు. నీవు దక్షిణముగా ప్రయాణము ్రారంభించిను కళ్ళెము చేతి నుంచి జారి, ఆ గుర్రము నికు లొంగక ఉత్తరముగానే పోవును. అది ఆ రీతిగా వనములు, కొండలు గడచి చాల దూరము పోయి ఒక అడవిలో నిలబడును. అక్కడ ఒక స్త్రీ పుడుఛుదనములో నున్నదుండును: ఆమెను నీవు పలకరింపవలదు; కొని పల్కరింపకుండ ఉండలేవు. ఆమెను వలతువు. ఆమెను పెండ్డాడకోరుదువు. ఆమె సెండ్దియాడుట కొక్క నియమం పెట్టును. ఆమెతో కలసి యజ్ఞము చేసిన తర్వాత గాని నీ కోరిక తీర్చననును నీవామె మాటల కంగీకరింప వలదు. ప్రమాదం వచ్చునుసుమూ! ాలాలనవననానానానాాచత యాం లూ

ఆ మహభారతనతి కథలు - గాలా . నీవు విధి లేక అంగీకరించి గుర్రముపై ఆమె నెక్కించు కొని నగరమునకు తీసుకొని

వత్తువు యజ్ఞము చేయుటకై బుత్విక్కులకై కబురు చేయుదువు నీవు వీలయినంతలో ముసలివారినే పెట్టుము కాని నీకు ముసలివారు మచ్చుకైనను దొరకరు అందరును (18 మంది) పడుచువారే దొరుకుదురు వారు యాగం చేయుచుండ నీవామెతో కలిసి యజ్జదీక్ష పట్టియుందువు అందులో ఒకనాడు వారు సంభాషించు కొనుచు నవ్వుకొందురు నీ భార్య తనను చూచి వారు నవ్విరని చెప్పును కాని-నువ్వు నమ్మవలదు వారెదో సంభాషణలో నవ్వుదురు అయినను నీవు నమ్ముదువు కోపావేశము వచ్చి కత్తిదూసి వారినందరిని ఒక్క పెట్టున నరికి వేయుదువు ఆ యువతి మాయమయి పోవును నీకు శ్వేతకుష్టము (బొల్లి) ' వచ్చును* అని చెప్పి ఇంతవరకు వింటివికదా? జాగ్రత్త ఇది నీ భవిష్యత్తు ఎంత జాగ్రత్తగా మసలుదువోకదా! చూతును” అని చెప్పి వ్యాసుడు వెడలి పోయెను

రాజు ఆ విషయములను జ్ఞాపకము చేయుచుండుటకై యొక యుద్యోగిని నియమించెను అతడు వచ్చి ప్రతిదినము వ్యాసప్రోక్తము చదివి వినిపించుచుండెను ఆ రోజు రానే వచ్చినది అంతయు వ్యాసుడు చెప్పినట్లే జరిగినది అతడు జరుగుననియే కదా చెప్పినాడు అది జరిగితీరును

జనమేజయుని కా రీతిగా భార్య అంతర్థానమైనది తనకు బొల్లి వచ్చినది అప్పుడు ఉభయభ్రష్టుడై విచారముతో కూర్చుండెను వ్యాసమహర్షియు అప్పుడే అతని యెదుట దిగెను అతన్ని చూచి కాళ్ళమీద పడి “మహాత్మా మహర్షీ మీరు చెప్పినది అక్షరాల జరిగినది నేనే బుద్ధి లేక జరిగిన భారత యుద్ధమును గూర్చి మిమ్ము మాటలన్నాను క్షమింపుడు ఇప్పుడు నాకు గతేమిటో చెప్పుడు అని తెగ బ్రతిమాలెను మహర్షి “నాయనా నేను చెప్పలేదా? ఇది అంతయు జరిగెడీదే నేనెరుగుదును నీకు బెంగ అక్కరలేదు మీ తాతల చరిత్రను చెప్పెడి ఆ మహాభారతమును పదునెనిమిది పర్వములను శ్రద్ధతో వినుము. పదునేమ్మిది మందిని చంపిన పాపము కూడ పోవును” అని చెప్పుటతో రాజు తమరు చదివి వినిపింపుడు * అని కోరెను ఆ మహర్షి తన కవకాశముండదని తన శిష్యుడయిన వైశంపాయన మహర్షిని నియమించెను అది మొదలు శ్రద్ధగా రాజు భారతము నంతయు వినెను అతనికి శరీరమంతయు శుభమైనది బొల్లి పోయినది పూర్తియగుసరికి ఒకటి రెండుచోట్ల మాత్రము మచ్చలు దిగబడెను అప్పుడు వ్యాసుడు వచ్చి “నాయనా నీ యనుమానమేదో చెప్పుము నీకు దిగబడిన మచ్చలు కూడ పోవును అనగా రాజు “భీముడు యుద్ధములో ఎగురవేసిన ఏనుగులు క్రింద పడలేదంటిరే పైన ఏట్టుండి పోయినవి నాకదేదో తెలియక బాధగా నున్నది అనుటతో వ్యాసుడు గొప్ప మహిమ

29

వా డడాడాజాయాయయాయాయాలాలాయయి పన ర భీతి బోద్రట్ర ఎ [లాలా కలవాడు, కనుక వాయు స్తంభన చేసెను. ఆకాశమున వాయువు ప్రవాహమువలె వుండును. ఆ ప్రవాహములో పడీ అ సుడిగుండములో ఆ ఏనుగులు తిరుగుచుండెను. అవి వాయువు స్తంభించుటతో క్రింద కూలిపడినవి అప్పుడు వాటిని చూచి, వాటి పరిస్థితిని తెలిసికొనుటతో రాజున కనుమానము తీరినది బొల్లిమచ్చలు పోయినవి ఆ రీతిగా భారతారంభము జరిగినది.

అట్టి మహామహిమ కథ భారతమును విన్నవారికి సకల పాపములు తొలగును సకలైశ్వర్యములు కల్గును,

| సర్వేజనాన్సుఖినోభవన్లు

కన.

వు నుననవావాలాయవయయయలాలవాజయయయమ ప్ర్రమయ్థుంరత నీతి రథధలు = లావాలా నవుషుడు సృష్టికి మొదట బ్రహ్మ కోరిక వలన బ్రహ్మకు “సహాయము చేయు శక్తి కలవారు పుట్టినారు. వారి పేరు ప్రజాపతులు” అందులో కశ్య ప్రజాపతి యొకడు. అతనికిని దక్షకుని కూతురైన అతిధికిని సూర్యుడు పుట్టెను. అతనికొడుకు వైవన్వతమనువు, ఆ మనువు వలన పుట్టినవారే మానవులు. అందులో “ఇల” అను కూతురికిని, చంద్రుని కొడుకైన బుధునికిని పుట్టినవాడు పురూరవుడు. ఆ రీతిగా చంద్రుని వంశమే చంద్ర వంశమని ్రసిద్ధిగాంచినది. సూర్యుని వంశము సూర్యవంశ మైనది. శ్రీరాముడు, హరిశ్చంద్రుడు మొదలైన వారు సూర్య వంశీయులు, ఛర్మ రాజాదులు చంద్రవంశీయులు. +_సుద్యుమ్న చరిత్ర ఈ చంద్ర వంశములో మహామహు లెందరో పుట్టినారు. వారిని గూర్చి విపులముగా తెలిసికొందుము +" వైవస్వతమనువు భార్యయైన ్రద్ధాదేవితోకల్ళిసి పుత్రకామేష్టి చేయుచుండెను? యజ్ఞమున క్రియలను చేయించు పురోహితులు (బుత్విక్కులు), పదునెనమండుగు రుందురు. అందులో మఘుఖ్యమైనవారు ముగ్గురు. ఒకడు అధర్వుడు యజుర్వేద మంత్రములను _చెప్పువాడు మూడవవాడు హోతబ్బుగ్వేద మంత్రములను చెప్పువాడు, వీరు ముగ్గురి పరస్పర సహకారముతో కోరిన దానికి తగినట్లు పోమము చేయుదురు. సంకల్పము బలవత్తరమైనది. ఆ సంకల్పమును బట్టియే మంత్రములు చెప్పుచు హోమం చేయుదురు.

  • శ్రద్ధాదేవి హోత వద్దకేగి నమస్కరించినది. అతడు “అమ్మా! ఇట్లు వచ్చిరేల?” అని యడిగెను. ఆ మెసిగ్గుపడుచు “అయ్యా! నా భర్త కొడుకు పుట్టవలెనని కోరుచు ఈ యజ్ఞం చేయించుచున్నారు. కాని నాకు కూతురే కలగవలెనని యున్నది. మీరు నా కోరిక నెరవేరునట్లు చేయనలెను” అని కోరినది, “అదికాదమ్మా! అట్లు చేయుట తప్పుగదా! మీరిద్దరు కలసి యొకే విషయమైన కోరికతో చేయవలెను. కాని యిట్లు చెరియొక కోరికను పెట్టుకొన్ననెట్టు? ఒకరొక మంత్రమును, మరొకరు మరాక మంత్రం చెప్పుట న్యాయమా? దొనివలన అసలు ఫలితమే చెడినచో కష్టము గదా!” అనుటతో ఆమె “మీర అనుగ్రహింప దలచినచో కాకపోవునా? నా కోరిక మన్నింపవలెను. మగవారికి మగవానిపై కోరిక యున్నట్లు ఆడుదాని్‌ కాడు ఫిల్లపై మక్కువ యెక్కువగా నుండుట సహజము, నా లా

అాజవాాజాంజజంయఆంం మువభారత నీతి కథలు - డా అభిలాష నెరవేరునట్లు మీరు చేయగలరు కనుకనే మిమ్మల్ని వేడితిని. అది మీకు సాధ్యమైన పని, చేయుడు” అని ప్రాధేయపడినది.

అతడామె ప్రార్థనను కాదనలేక పోయెను. అధర్హుడు “ప్రేష (ోహోతర్యజ” అనుట) ఇయ్యగానే హోతతనను యజమానురాలు కోరిన రీతిగా ఆడపిల్ణయే కలుగవలెనని సంకల్పించి పైకి గట్టిగా “వౌషట్‌” అనుచు హోమము చేసెను. అతని లోపలనున్న. అభిప్రాయ మెవరెరుగుదురు?

ఆ రీతిగా పుత్రకామేష్టి పూర్తియైనది జేయించినవాడు వసిష్ట మహర్షి చేసినవాడు మనువు, అయిననేమి? దైన వియోగము విపరీతముగా నున్నది. ఆడు పిల్ల పుట్టెను. ఆమెకు “ఇళ” యని పేరు పెట్టిరి. కోరిన కోరిక సిద్దింపక పోవునా? మనం లోపల నేమనుకున్నను పై కనిన మాటనుబట్టి గదా ఫలితము జరుగుట అట్లే అతడు సక్రమముగా జరిగిన దనుకొనెనేకాని, యధార్ధముగా జరిగిన విషయమాతడెరుగడు.

వెంటనే మనువు బ్రహ్మగారి (పురోహితుని) వద్దకు పరుగెత్తుకొని వెళ్ళెను. వసిష్టముని (బ్రహ్మ మనువు అట్లేల వచ్చెను అని ఆతనికెంతో గౌరవము చేసి వచ్చినపని నడిగెన్సు,

మనువు మునీంద్రా! మీరు యధావిధిగానే చేయించితిమని చెప్పినారు. ఏ లోపము వచ్చినదో కాన, ఆడుపిల్ల పుట్టినది, ఇదేనా చేయవలసినది? నేను కోరిన దొకటి జరిగిన దొకటియునా? అని తన మనసులోని బాధను వెలిగ్రక్కుచు పలికెను.

వసిష్టుడు దీర్ధముగా నాలోచించినాడు. త్రికాలజ్ఞులైన మునులకు తెలియరాని దేమున్నది? అతని దివ్యదృష్టికి గోచరించిన దానాడా హోత చేసిన పని. అయ్యా తమ భార్య కోరి చేయించినదే కాని మా లోపమేమియును లేదు. ఆమె కోరిన రీతిగా హోత హోమము చేయించినాడు. ఫలంకన్పడినది అనుటతో నిర్విణ్డుడై మనవు “అట్టయినచో ఇక నేవెళ్ళ వలసినదేనా? దీని కేమియు నుపాయం లేదా? నా కోరిక ఇట్లు భగ్నము కావలసినదేనా?'

  • అన్ని నిరుత్నాహముతో ప్రాధేయ పూర్వకముగా ప్రార్ధించెను వసిష్టుని మనసు కరిగినది,

తాను చేయించిన దానిలో లోపము వచ్చినపుడు సర్జుకొనవలసిన బాధ్యతయు తనకున్నది. చేయించినది పుత్ర కామేష్టికాని పుత్రికాకామేష్టి కాదుగదా! అతను భగవానుడెన శ్రీహరిని ప్రార్థించెను. బుషి వాక్కులకు భగవానుడు సంతుష్టి చెందినాడు. ఆ యాడు పల్లను మగ శిశువుగా మార్చెను. అప్పుడు మనువునకు కల్గిన యానందమునకు మేరలేదు. ఇదికాదా. పునసృష్టి, దీనిలోనే యెక్కువ ఆనందము, తక్కువ శ్రమతో సిద్ధించినపని యందుకంటె కష్టము హెచ్చినకొలది దానిపై ప్రీతి యెక్కువ యుండుట సహజము. ననననననననన2ై నా

పా మహాభారతనీతి కథలు -/ వా అందులోను మొదటి పని సామాన్యము, ఇది ఇతరులకు సాధ్యము కానిది, దీనిని సాధించి నందులకెంతో సంతోషించెను.

ఆ బాలునికి “సుద్యుమ్ను”డని పేరు, పెట్టిరి అతడు వరప్రసాదమ్మున మగవాడైన వాడు. కనుక చక్కగా పెరిగి సెద్దవాడయ్యెను.

రాజులకు వేటయన్న పరమప్రీతి సుద్యుమ్నుడొకసారి మంత్రి పుంగవులతో కలిసి అడవికి వేటకేగెను. చాలాసేపు సింహశార్జూలాదులను వేటాడి అలసిపోయెను. అతనికి పరివారమునకు కూడా అలసట కలిగినది. అందరును మంచి నీటికై అక్కడికి దగ్గరలో ఒక కొలనుండగా దానిలో మంచి నీరు త్రాగగోరి వెళ్ళిరి ఆ ప్రాంతమునకు వెళ్ళుటతో అందరు

  • నొక్కసారిగా అడువారైపోయిరి, వారేకాదు-వారెక్కిన గుర్రములు కూడ ఆడగుగర్రములై

పోయెను.

*.. వారి కదంతయు నొక అద్భుతముగా నున్నది. ఒకరిని చూచి ఒకరు దెప్పుకొనక్కర లేకుండ అందరు నాడు వారేయైరి. పాపము వారేమి చేయుదురు? ఆదాస్థల ప్రభావము అది కూడ చెప్పెదను.

పూర్వమొకప్పుడు పార్వతీపరమేశ్వరులు యధేచ్చగా విహరింపగోరి ఆ వనమునకు వచ్చిరి పరమేశ్వరునకు పార్వతిపై చాల (ప్రేమ వున్నది. వారి ప్రేమకొక్క ఉదాహరణ చాలు. పరమేశ్వరుడు పార్వతిని విడిచివుండలేక తన సగము శరీరములో ఆమె నుంచుకొనెను. అట్టివారెల్లప్పుడు నొక్క రీతిగా నుండరు. వారి ఇష్టానుసారము తిరుగుదురు. అప్పుడు విడివిడిగా దేహముల ధరించి అడవికి వచ్చిరి. అచ్చట పార్వతి గుడ్డ వదలియుండగా' మహర్షులు వారువచ్చినట్లు తెలిసికొని నమస్కరించ వచ్చిరి. వార్‌కదే సుముహూర్తము దొరికినది? భగవద్దర్శనంనకు. _

వారు వచ్చుటళతో పార్వతికి సిగ్గు వేసినది. మునులది గమనించిరి, మరొక చోటికి వెళ్ళిపోయిరి. అప్పుడు పార్వతి “నాధా! మనకిది చాల బాధగా నున్నది. ఒక్క క్షణం మన మిద్దరమును సుఖంగా నుందమన్నచో ఈ మును లేమిటి? చాల సిగ్గువేసింది, వారికిది సమయమగునా? కాదా? అని యైనను లేదే? తమరు సమర్థులైయుండి కూడ ఊరుకున్నచో నేనేమి చేయగలను? నీ భక్తులెన్ని తప్పులు చేసినను వారిపై కోపించ రాదాయె, మీరేదో ఉపాయమాలోచించినగాని మన జాల” మన్నది.

పరయేశ్వరుడు తలచుకొన్నచో ఏమికాదు? “ప్రియా ఇటు చూడు నీకు హితమయిన పని చేయటానికి కదా నేనున్నది! ఏమి చేయమని నీ కోరిక? ఎవరకిని బాధ లేకుండ ఒక్కటి లాటా

ాాకాలలనాయాలా మహాభారత నీతి కథలు = / లాలా చెప్పెద వినుము. ఈ అడవ్నిలోకి వచ్చిన శ్రతి జీవియు ఆడుదైపోయెను. సరియా!” అని వరమిచ్చెను. అంతే! అప్పటి నుండి యెవరా ప్రదేశమును ప్రవేశించినను ఆడుది కాజొచ్చెను. ఆడువారి యెదుట అడువారికి గుడ్డ లేకున్నను బాధలేదుకదా? దానితో పార్వతీదేవి మనస్పంతుష్టమైనది శివుని కోరిక నెరవేర్చినది. అది దాని కథ! ,

పాపము! ఆ రాజు పరిచరులను స్రీలే నగరమునకు వెళ్ళుటకు హితవు లేక ఆ అడవుల వెంబడి తిరుగుచుండిరి వారికెటు వెళ్ళుటకును తోచకపోయినను తిరగక తప్పదుకదా. మన మెవరికయినను ఒక విచిత్రము సంభవించినప్పుడు కదా, “వారంత జరిగిన తర్వాత నెట్టు జీవించిరి? ఆ సిగ్గుతో చావ లేదా?” అనుకొందుము. కాని అదే మనకు వచ్చీనచో ఏమియు నుండదు. ఎంతటి విపరీతములు - విచిత్రములు వచ్చినను, నహింపవలసినదే! అదే ప్రకృతి ధర్మము - అనుభవింపక తప్పదు.

ఆ ప్రాంతములో బుధుని ఆశ్రమమున్నది. బుధుడు చంద్రుని కొడుకు - అక్కడ తపస్సు చేసికొనుచున్నాడు. అతడు రూపమ్హున తండ్రివలెనే చాల అందమైనవాడు, ఆత్రని చూచుటతో రాజస్ట్రీ (ఇళ అని పేరు)కి కోరిక కల్గినది. ఆమెయు. చాల చక్కగానున్నది. అందుచే అతనికి అమె పై (పేమ పుట్టినది. ఒకరికొకరు 'పేమించుకొన్నప్పుడిక అభ్యంతరమేమున్నది? కాని ఎవరు ముందడుగు వేయటమా? అన్నది ప్రశ్నే బుధుడు సాహసించినాఢు ఆమె చెప్పుటకు సీగ్గిల్లినది.

వారి (ప్రేమ కలాపములు చూచి తక్కిన పరివారము చాటునకు తప్పుకొన్నది. వారికా రహస్య ప్రదేశము చాల అనుకూలముగానైనది. యధేచ్చగా వారు విహరించిరి. వారికొక కుమారుడు కల్గిను. అతని పేరు పురూరవుడు.

అట్లు కొన్నాళ్ళు. గడిచెను ఇక తనకు పూర్వగురువైన వశిష్టుని తలచుకొనెను. తనకు చెన్నప్పుడోసారి మగరూపు రప్పించెను. కనుక ఇప్పుడు కూడ "అతడే మరల పుంస్వ్రమును రస్పించునను నుద్దేశముతో వశిష్ట మహర్షిని తలచెను.

అతడు వెంటనే శిష్యుని రక్షించుటకై అచ్చటికి వచ్చెను. అతని చూచుటకే రాజునకు సిగ్గువేసెను. అయినను “రోగమునకు రొప్పు - సంసారమునకు గుట్టు” న్నట్లు బాధ వచ్చినపుడు చెప్పక తప్పునా? ఇళ గురువుతో తన పరిస్థితిని చెప్పి తనను తిరిగి మగవానిని చేయమని అతని పాదముల పైబడి ప్రార్థించెను.

అట్టి మార్పు తన చేతకాదు. అంతమాత్రాన వదులునా? వశిష్టుడు పరమేశ్వరుని ప్రార్థించెను. శివుడాతనికి ప్రత్యక్షమై “ఏమీ కావలెనో కోరుకొ”మ్మనెను. అతడు తన ల

అవవాంావావాయాటంజజా ముహోభారత నీతి కథలు - లావాలా శిష్యుడైన సుద్యుమునకు మగతనము రప్పింపుమని కోరెను. శివుడాలోచించినాడు. ఒకనాడు తానన్నమాట ఎప్పటికిని అబద్దము కానేరదు. ఇటు వశిష్టుని ప్రార్ధన నంగీకరింపక తప్పదు. అందుచే ఉభయత్ర వీలుగా “ఒక మాసము మగవాడుగాను, ఓ మాస మాడుదిగాను అగు”నని శాావరములను నమముగాపంచెను. అసలు లేనిదాని కన్ననది _మేలుగానే యున్నదని సుద్యుమ్నుడానందించి వసిష్టునకు నమస్కరించి పరివారముతో సహా తన్న రాజ్యమున కేగెను. _ పురూరవుడు క్రమముగా పెరిగి పెద్దవాడగుచుండెను. సుద్యుమ్నుడు ఆ స్థానములోనికి ఒక నెలవచ్చి రెండవ నెల రాకుండ రాజ్యం చేయుచుండెను. దానిక్కారణం క్రమముగా ప్రజలకందరికిని తెలిసినది. వారికదేదో రాజు పై అసంతుపష్టి కలిగినది. కొన్నాళ్ళేయగుగాక ఆడుది అయినవాడు పరిపాలన ఏమిటి? అని .తెలియకున్నను తెలిసినదేమో అనుభ్రాంతితో రాజునకే వారి మొగము చూచుటకు సిగ్గుగ నుండెడిది అట్టి అనుమానమున్నప్పుడు అతడ్నేమి చేయగలడు? ఎట్లో తన కొడుకు పెద్దవాడగుువరకును ఓపికపట్టెను ఇక తనకెందుకని విరక్తి లేకపోయినను అపవాదులు వినలేక సుద్యుమ్నుడు కుమారునికి పట్టముకట్టి తాను తపోవనముల కేగెను, పురూరవుడు మహారాజు పదవి నందెను. పురూరవుని చరిత్ర షోడశ మహారాజులలో పురూరవు డొకడుగా పేరందినాడు. పేరువచ్చుట కాతని ప్రవర్తన అధికార పటిమలేకదా కారణములు. అట్టి సమర్భుడైన చక్రవర్తి యొక్క చరిత్రను చదువుదము. పురూరవుడు మహాబలశాలి. తన బాహుబలముచే రాజుల నందరిని స్వాధీనము చేసుకొని సకల సామ్రాజైక్య చక్రవర్తిమై ప్రజలకు హితువుగా రాజ్యమేలుచుండెను. అతని రాజ్యమున అన్యాయం పేరునకైనను జరుగుటకు వీలులేదు. ప్రజలు ధర్మచరులై సర్వసంపదల ననుభవించుచుండిరి. ఇట్లుండగా నొకప్పుడాతడింద్రుని కోరిక పై దేవదానవ యుద్ధములో పాల్గానెను. అందీతడు విజయమందుటచే దేవలోకంలోని స్రీలు కీర్తన లల్లి పురూరప కీర్తిని పాడుచుండిరి. ఆ పాటలు విన్నది ఊర్వశియను నప్ప్సరస _ ఆమె మనుష్యలోకమునకు వచ్చినది. ఒకప్పుడామె మిత్రావరుణులకు తపోవిఘ్నము కలిగించుటకై వారి యాశ్రమమున కేగినది వారి తపోవిఘ్నంమాట యొట్టున్నను వారామెను ల

బులయలవాాజజసం-- నుహాభారత నీతి కథలు - కొన్ని సంవత్సరములు భూమిలో మానవునితో కాపురం చేయమని శపించిరి. ఆ శాపము తీరుటకై ఆమె కెవరో యొక మానవునితో కాపురము చేయకతప్పదు. అందు సామాన్యులతో అట్టి దివ్యవనిత కాపురం చేయునా తనకు వరుడెవరా? అని చూచినది. కీర్తివిన్నది స్వర్గమునకు రాకపోకలు చేయ గలిగిన పరాక్రమశాలియగు పురూరవు డామెకు నచ్చినాడు. ఒకనా దూర్వశి అతని యంతఃప్పరములోనికి వచ్చినది. అతడప్పుడచ్చట రహస్యములోనున్నాడు. ఆమెను చూచుటతో అతనికెంతో సంతోషము కలిగినది లేచి నిలుచున్నాడు. మొగమంతయు కన్నులు చేసికొని ఆమెకేసి రెప్పార్చక చూచినాడు భార్యకాబోవు యోగమున్నందున ఆమెను చూచుసరి కతనికి ప్రేమ పుట్టినది మనం చెప్పలేం కాని జరగబోవు దానిని మన మనస్సే నిర్ణయించుచుండును ప్రత్యుత్తానము చేసి “ఓ. దేవవనితయా? ఇటువచ్చితివే ఏమి విశేషం? మీవంటి దివ్యవనిత లూరకరారు ఇటురమ్ము ఈ రత్నాసనం 'పై కూర్చుండుము” అని మర్యాదచేసినాడు. వచ్చినది దివ్యాంగన అతడు మర్యాదచేయు స్వభావం కలవాడు ఉన్నది ఏకాంతం 'స్వేచ్చాలాపంలకు'గాని, మర్యాదలకుగాని లోపమేమి కల్గును? ఆమె ఆశీనురాలయినది “కళ్యాణి నీకు చేయవలసిన పనేమిటి? నీకు తోచినన్ని సంవత్సరం లిక్కడ నుండవచ్చును. నాతో సుభింపుము” అన్నాడు స్వాభిప్రాయమును తెలుపుచు, ఆమెకూడా అదే పనిమీద వచ్చినదికదా! అతడును ఆమె యుద్దేశ్యం నెరిగియే అట్లనినాడు ఆమె “దానికేమి, నిన్నెంతమంది కన్యలు వలవరు! అందు నేనొక్కతెను కాన వేను వలచుటలో ప్రత్యేకత లేదు. కాని నాకొక్క నియమమున్నది. ఇవిగో నావద్దనున్న యీ గొర్రెలు రెండును నాకు ప్రాణప్రియులయినవి, వీటిని కాపాడుము వీటిని జాగ్రత్తగా నాకప్పగించవలెను సుమా మేము దివ్యులము నీవు మానవుడవు కదా అయినను. ఈపాటి భేదమంతగా పాటింపతగినది. కాదు. ప్రీతికలవారే స్రీలకు వరులగుదురు. కాని అందు జాతిభేదం గమనింపబడదు. ఇక ఆహారము నేనీ భూమిలో పండిన వస్తువులను తినను దివ్యవస్తువులు తినునలవాటుతో ఇది నాకు సాక్కదు. ఒక్క నెయ్యి మాత్రమే ఆహారముగా తీసికొందును మరొక్కటి సంగమ కాలమున తప్ప వేరే సమయమున నీవు నగ్నముగా కనపడరాదు. అదే మన వియోగమున కవధిగా నెంచవలెను. ఈ నియమములకు నీవంగీకరించినచో అభ్యంతరముండ” దనెను. ॥ అంతనతడు మహానందభరితుడై “ఇవికూడ నొక్క నియమములేనా? ఏ విధమునైనను మనకు కావలసింది కలయిక కాని నియమము లొకలెక్కలోనిది కాదు న.

ఆ మహఫూరతనతి కథలు-/( లా అందును నీవు స్వయముగా “వచ్చినపుడే మానవుడు కోరడు నీ యిష్టము వచ్చినళల్లే విహరింపుము” అని తన యంగీకారమును తెల్పెను. దివ్యస్రీయైన అప్సరస వచ్చి స్వయముగా కోరినపుడు ఒల్లని వెర్రివాడుండునా? కాని మనము కోరినంత మాత్రాన కాదుగదా! ఎదుటివారు సైతమంగీకరింపవలె. ఒకరి నాకరు దుర్లభమైన వారిని కోరుట సులభముగా దొరుకు దానిని నిరసించుటయు పరిపాటి వారిద్దరు నొకరి కొకరు దుర్లభులేయైనందున కోరుకొనగా అదృష్టవశమున భావము లొక్కటై కాలము కలిసివచ్చి కూడిరి.

వారికి రోజులు కాదు - నెలలు, సంవత్సరములును క్షణములవలె గడుచుచున్నవి. పురూరవుని రధమునకు భూమ్యాకాశ పర్వతము లొక్కటే! ఎక్కడయినను అతని గుర్రములు సమాన వేగంతో పర్వెత్తగలవు, ఊర్వశికి మేరు పర్వత ప్రదేశములు, చైత్రరధం (కుబేరుని యుద్యానవనం) మున్నగునవి విహార ప్రదేశములు. అతడు సమర్హుడు గనుక నామె యిష్టానుసార మా కొండలమీదకే తీసికొని వెళ్ళువాడు.-అటువంటి దివ్యమహిమలు కలవాడు కనుకనే అతని నామె వలచినది. వారికి దేనికిలోటు? జోడెడబాయకుండ విహరించుచుండిరి.

స్వర్గంలో ఊర్వశిలేదు. సుధర్మాస్థానమునకు ఏదో చెప్పలేని పెద్దలోటు వచ్చినట్టుంది. ఇంద్రున కేమియు తోచలేదు. ఆమె యెొక్కడున్నదో తెలిసికొన్ని రమ్మని. ఇంద్రుడు గంధర్వుల పంపినాడు. వారు భూలోకమున కలియవెదికిరి, అమెను పురూరవునితో పాటుండగా చూచినారు.

ఆమెను మరల స్వర్గమునకు తీసుకుని వెళ్ళుటకుపాయమేమో అని చూచినారు దానికి సూత్రం ముందే వేసిందిగదా! ఆమె వారు నదే యుపాయమును పన్నినారు.

అది చీకటి రాత్రి. మహారాజు అంతఃపురమున ఊర్వశితో హాయిగా నిర్విచారంగా పరున్నాడు. ఆ కామినీ కాముకులు సుఖంగా కేళీలోలురై. అలసట తీర నిద్రించినారు. వారికి భోగముల కేమిలోటు? మననులు కలిసిన దాంపత్యమున భేదమును రానేరావుకదా! కాని, ఆమె పరాధీన ఒడలమ్ముకొన్నది. ఇంద్రుని మాట ప్రకారం తాను నడపవలసినదే కాని తన యిష్టం వచ్చినట్లు నడుచుటకు వీలులేదు. అందులోను శాపం వరమై కొంత సంబంధమేర్పడుటతో (ప్రేమ హెచ్చినది. కాని విధి దాటరానిది, ఎరిగియు ఆమె యూరకున్నది. ముందుగా తనకేమియు తెలియనియ్య లేదు.

గంధర్వులు వచ్చి ఆ రాత్రి కటిక చీకటిలో ఆ గొర్రెలను మాయం చేసిరి. అవి గోలనారంభించినవి, ఆ ఏడుపు విన్నది ఊర్వశి. “నాధా! నా గొర్రెలనెవరో ఎత్తుకొని వ

యవన నుహాభారత నీతి కథలు - [లాలా పోవుచున్నారు రక్షింపుము! రక్షింపుము!” అని కేకలు పెట్టినది అతడు మంచం మీద నుండియే “నా అంతఃపురమునకు వచ్చి తోలుకొని 'పోజాలిన వాడెవడు? సుఖముగా పండుకొనుము భామినీ” అని యోరడించబోయెను. కాని ఆమె అంతమాత్రమున వూరుకొనునా? “అయ్యో! మీరు "మగవారనుకొన్నాను. నా పుత్రులను (పుత్రులుగా భావించు గొర్రెలను) రక్షింపగలరని తలచి మీవద్ద నుంచితిని. కాని యింత చేతకాని వారను కోలేదు. ఆడుదానివలె ఇంటిలో దూరి పరుంటిరే? ఇదేనా మగతనం ఇక నామీద చేతులను తీసివేయుడు. వెళ్ళిఆ గొర్రెలను రక్షింపుడు” అని పలు విధముల పలవించినది. అన్నిసార్డు చెప్పిన తర్వాతన్తయినా లేవనిచో మూర్ణతగా నుండునని తలచి, పురూరవుడు “ప్రియా! నీవు బాధ పడకుము. నేనుండగా నీ గొర్రెల మీద ఎవడును చేయి వేయ లేడు. చూడుము? ఇదే వెళ్ళి నీ స్వాధీనం చేయుదును. నా పరాశ్రమ మిప్పుడే చూడగలవు" అని తాను నగ్నంగా నున్నట్టు మరచి తటాలున లేచి వెళ్లెను. అతడు లేచుటయే కదాకార్యం కావలసినదా గంధర్వులకు వారు వెంటనే గొర్రెలను విడిచి వెడలిపోయిరి. వాడి అరుపులను బట్టి వెళ్ళి పురూరవు డొక్క క్షణములో ఆ గొరైలను పట్టి తెచ్చుచుండెను. అతడింతసేపైనను తాను దిగంబరుడనను విషయంను గమనింపనేలేదు. గంధర్వులా విషయం నూర్వశికి తెలుపుటకై కొంచెం దగ్గరకు రాగానే జక్కమెరుప్పు మెరిపించిరి. ఆ వెలుతురులో పురూరవుడు నగ్నుడై ఆమెకు కనపడెను ఆమె పెట్టిన హద్దు అయిపోయినది. వెంటనే అమె అంతర్థానమయ్యెను. అతడు గొర్రెలను. తెచ్చి తినను సంతోషంతో వచ్చి “ప్రియా! ఇవిగో నీ ప్రియమైన గొర్రెలు” అనుచు పక్క మీద భార్య లేకుండట చూచి “అయ్యో! ప్రియకామినీ మణీ! ఎక్కడికి పోతివి? నేను వచ్చుసరికే పోతివే? నాతో చెప్పరాదా? ఇదిగో నీవు పోయిన తర్వాత నా ప్రాణములు నిల్వవు నీవు లేనిచో నాకీ దేహంతో పనేమున్నది! ఛీ! ఛీ. పాడు దేహమా, ఇక నీకు సొఖ్యములనుభవించు యోగము లేదు పొమ్ము” అని పిచ్చివానివలె కేకలు పెట్టుచు మొత్తుకొనుచు ఏడ్చెను. - అంత ప్రేమ కలవాడు కనుక అదే స్థాయిలో పెరిగిన ఉన్మాదముతో అతడిట్లు విలపించెను. దృఢతరమైన ్రమే లేని వాడెవడునట్లు బాధపడలేడు. అతని కున్నంత ప్రేమయు నూర్వశికి ఉన్నది. కానీ, ఆమె యేమి చేయగలదు? ఆవల రాజశాసన మట్టున్నది. అయినను ఆమెకు చేతనయినంతలో సాయం చేయదలచి “మహారాజా! శరీరము 'నిడువకుము, నీన్న పురుషుడవు కదా ఇంత అధైర్యమేటికి? నీ వంటి వానికి తగునా? స్త్రీలు నంత లలా

లా మహాభారతనీతి కథలు -/లాాాాలాలాలాలాాాలాాా క్రూరచిత్తము కలవారు. వారి డేమలు క్షణికంబు నీవు వారిని నమ్మిప్రాణం విడుతునందువు. అదేల? స్రీలు క్షణములో ఎంతటి (ప్రేమ పాత్రులయినను భర్తలను గాని, తల్లిదండ్రుల గాని వదలగలరు యధేచ్చముగా పోగలరు, నీవధైర్య పడకుము ఇంద్రియములను స్వాధీన పరచుకొనుము. బెంబేల పడకుము, అని యెన్నో రీతుల-ధైర్యము చెప్పుచున్న ఊర్వశి అతని కన్నుల కగపడినది ఆమెతో పాటు మరి నలుగురు ఆమె చెలికత్తెలు గంధర్వులు కనపడిరి వారిని చూచి అతడు తెల్లబోయి మరింత విలపించెను.

అప్పుడామె “రాజా నీ యందు నాకును (ప్రేమ మెండుగానే యున్నది. కాని యేమి చేయగలను? ఒక్కమాట చెప్పెదను వినుము ఏడాదికొకసారి మన యిద్దరికిని సమాగమము కలుగును. ఏడాది చివరవత్తును. ఇంకను నీకు నా తోడి సంగమం వలన సంతానం కలుగును. అనుటతో ఆమె గర్భవతియై యున్నదని (గ్రహించి వురూరవుడు సంవత్సరాంతమునైన మరల తన ప్రియభార్యను చూడవచ్చును గదా యను ధైర్యంతో నుండెను. కొంత ఆశ యున్నప్పుడు కదా ప్రాణములు నిలుచును. అతడామె యోదార్పుతో పునస్సమాగమమగునను ఆశ, దానికితోడు పుత్రవంతుడ నగుదునను సంతోషంతో ఇంటికి వెడలిపోయెను.

ఏడాదియు రోజులు లెక్క పెట్టుకొనుచు వెళ్ళించెను అనుకొన్ననాడు _ ఎప్పుడు ప్రొద్దు గ్రుంకునా? ఎప్పుడు భార్య వచ్చునా? యన్ని పురూరవుడెదురు చూచుచుండెను. అంతలో మెరవు మెరసినట్లయినది. ఆకాశమున అంత ప్రకాశమేల వచ్చెనా అని చూడగా తన భార్యయే తన నేత్రకాముది ఊర్వశ్షియే వచ్చినది. అమెతో పాటు బాలుడు వున్నాడు. మహారాజున కానా డపరిమితానందము కల్గినది. అతడెన్నో రీతులను భార్యాపుత్రులను ముద్దాడి, బుజ్జగించి ఎన్ని రీతుల చేసినను తనకు కలిగిన సంతోషమును పూర్తిగా కనుపరుప జాలకపోయెను.

సుఖమైన క్షణములు - కాదు. రోజులు - ఇట్టే గడచును. ఆ రోజు అనుకున్నంతసేపు _ పట్టలేదు. ఇట్లే తెల్లవారినది.

రాజునకు ముఖమున విషాదచ్చాయ లలుముకొన్నవి. వాటిని గమనించినది. ఊర్వశి “రాజా! నీకెట్లో వాకును అట్లే వదలిపోవుటకు బాధగా నున్నది. దీనికొక్కటే ప్రతీకార మున్నది నీవీ గంధర్వులను ప్రార్థించుము. వీరు ప్రసన్నులై నీవు నాతో నెల్లప్పుడును కలిసి యుండునట్లు చేయగలరు” అని యుపాయం చెప్పినది. దాంపత్య సుఖ మిద్ధరికిని సమమేకదాొ! తనకు తనై ప్రార్ధించుట బాగుగా నుండదని ఆమె అతనిని ప్రోత్సహించినది. డోలా

ఆపాలా మవఫారతనతికథలు- లా

అతడుపాయం దొరుకుటయే మహా లాభముగా తలచి గంధర్వులనెన్నో రీతుల స్తోత్రం చేసెను. వారతనికొక ఆరణి (అగ్నిని పట్టించునట్టి కర్ర) నిచ్చిరి. అతడు దానినే ఊర్వశి యనుకొని కొన్నాళ్ళు వసంలో తిరిగెను. అంతట త్రేతాయుగం వచ్చినది. అతని కది అగ్నిస్థాలి (అరణి) కాని, ఊర్వశి కాదని తెలిసిపోయినది.

అప్పుడతడు విచారంతో జమ్మిచెట్టు మధ్యలో పుట్టిన రావిచెట్టు కర్రలను తీసుకొని వాటిని మధించెను, 'ఆ రెండు కర్రను తమ దంపతులు (ఊర్వశీ పురూరవు)గా భావించి మధించెను దాని నుండి అగ్నిహోత్రం పుట్టినది. తర్వాత నర్వవేదాత్మకమైన 'ప్రణవముద్భవించినది ఆ అగ్నీ యొక్క ప్రభావము వలన'తన సంకల్పంవలనను అతడు గంధర్వలోకమును పొంది అక్కడ శాశ్వతంగా ఊర్వశి ననుభవింపగల్లెను.

ఇచ్చటనతని కార్గురు పుత్రులు కలిగిరి ఆందాయనను నతనికి స్వర్భావని యను భార్యయందు నహుషుడు మొదలయిన నలుగురు కొడుకులు పుట్టిరి పెద్దవాడయినందున నహుషుడే రాజానార్డుడై చశ్రవర్తియయ్యెను.

నహుషుని చరిత్ర

నహుషుడు బహుబల సంపన్నుడయిన మహారాజు పూర్వకాలమున అశ్వమేధయాగం “చేయు నలవాటుండెడిది. దొని వలననే అతడు పరాక్రమవంతుడని తెలియును. ఏడాదికి యాగం చేయుదుననగా ఈనాడే సంకల్పించి గుర్రమును వదలవలెను అది దాని యిష్టం వచ్చినట్లు దేశములందు తిరుగును ఎవరును పట్టరాదు పట్టుకొనకూడదని కాదు పట్టినవారిని జయించగలశూరులు ద్రానికి రక్షకులై యుండవలెను అట్లు ఒక సంవత్సరం యధేష్టంగా గుర్రం తిరగినంత మేరను పాలించగలిగిన రాజే అశ్వమేధ కావచ్చును ఇంద్రుడగుటకు కావలసిన అర్హతలతో నూరశ్వ మేధయాగములు చేయుట ముఖ్యమైనవి

నహుష చక్రవర్తి సకల భూమండలమును స్వాధీన మొనర్చుకొనెను. అతని మాటకి సృథివిలో నెదురాడగలిగిన వాడెవడును లేడు అట్లు దిగ్విజయం చేసినందుకు తార్కాణముగా నూరశ్వమేధములను చేసెను అక్కడికి ఇంద్రుడగు యోగ్యత అతనికి పట్టినది కాని ఇంద్రపదవిమాత్రమొక్కటే యున్నది దానికి పోటీ లేదు. కొలకర్మ వశమున ఆ ఇంద్రునకు రాజ్యభ్రష్టత్వం వచ్చినప్పుడు కాని యిట్టి ఆర్హతలు కలవారి నాహ్వానింపరు ఈ రెండును వారి యదృష్టం,

ఇట్టీ యదృష్టము నహుషునకు -పట్టింది ఉద్యోగ మొదవినప్పుడు సద్యోమద మొదలవుట మానవ సహజముకదా! అది విదాయవంతునకైనను తప్పనిదే ఇక కేవలము లాలా

ాలానావవాావయవయయయయయ మదనం రంత తతి కథలు కానాల రాజ్యసుఖాను భవమత్తులైన రాజులకేట్టు కల్గకుండును? నహుషుడా పదవిని చిరకాలము నిల్చుకొనలేకపోయెను. అసలు ఇంద్రపదవి యెట్లు కాళీ అయినచో ముందుగా తెల్పెదను. దేవేంద్రు డొకనాడు శచీసమేతుడై నభ నలంకరించి యుండెను. అప్పుడు దేవతలు, సిద్ధులు, గంధర్వులు మొధలైన పదిరకముల దేవతలును కైవారములు సేయుచుండిరి. అప్పుడు దేవగురువగు బృహస్పతి సభకేతెంచెను ఆయనను చూచినను దేవేంద్రుడు లేవలేదు. కనీసము కదలనయినను కదలలేదు అది గమనించినాడు బృహస్పతి. రోజురోజు వచ్చువాడైనను గురువునందు మర్యాద ఉండనక్కరలేదా? వ్రతుత్ధాభి వందనలు ఇంద్రునివంటి ప్రొజ్ఞుడే చేయనిచో మానవుడింకెవరు చేయుదురు? బృహస్పతి కోపం వచ్చి వెంటనే గిరుక్కున తిరిగి తన యింటికి వెడలిపోయెను. అప్పటి కింద్రునికి స్పూర్తి వచ్చినది. తన తప్పు తనకు తెలసి వచ్చింది. “అయ్యో! ఈవేళ నేనింత బుద్ధిమాలినవాడ వైతినేమి? గురుధిక్కారము చేసితినే? నా తప్పానకు నిష్ఫృతియున్నదా? ఛీ! ఛీ! ఇంత తెలివిమాలిన తనమేల నన్నావరించింది? ఓ నభ్యులారా! మీరైన చెప్పితిరి కాదే? ఇప్పుడేమి చేయుదును? ఇంటికేగి బృహస్పతికి నా తప్పునకు క్షమాపణ కోరుకొనవలెను అట్టయినను ఆయన అంగీకరించునో, లేదో?” అని తను చేసిన పనికి పశ్చాత్తాపము నందరికి నెరుకపరచెను. వారేమియు చెస్పలేక యారకుండిరి. వెంటనే రాక్షసులకి విషయము తెలిసినది. ఆపాటి సందు దొరికినది. శుక్రాచార్యుడు వారి గురువు వారెన్ని పాడు పనులు చేసినను గురుధిక్కారము మాత్రమేనాడును చేయలేదు. అందుచే వారిపై గురువుగారికి దయయున్నది. దేవుడు కోపించినను గురువు రక్షింపగలడు! కాని గురువు కోపించిన రక్షింపగలవాడు లేడు. అందుచే గురుధిక్కార మెట్టివారికిని తగదు వారా-శుక్రుని ప్రోద్చలముపై తక్షణమే స్వర్గము మీదికి దండయాత్ర చేసిరి. అందు రాక్షసుల ఎదుట దేవతలాగ లేకపోయిరి వీరి కదివరలో బృహస్పతి ప్రోత్సాహముండెడిది. ఈనాడది లేక పోవుటయే షరాజయమునకు ముఖ్యకారణము వారెన్ని విధముల చూచినను రాక్షసులదే పైచెయ్యి అయినది. దేవతలందరును సలాయన మంత్రమును పరించిరి బ్రహ్మదేవుని వద్దకు పోయి తమగోడు చెప్పుకొనిరి. బ్రహ్మ “మీరు చేసిన గురుధిక్కారమున కిది ప్రతి ఫలము. అనుభవించక తప్పదు ఇప్పుడైనను బుద్ధి తెచ్చుకుని మరొకరినైనను గురువుగా పూజింపుడు” అనెను. దేవతలందరూ లామా

చావవానూంంయామాములయలవాలలాణలలలాలా మ్రపస్యుంరత్ర నీతి కదల్పు (లాలా తలలు వంచుకొనిరి, ఇంద్రుడు “అయ్యా! తప్పు తెలుసుకొంటిమి. కాని, గురువును (ప్రార్ధించుట కవకాశము లేకపోయింది. ఏమి చేయగలము? కరుణింపుము. ఎవరు మాకు గురువుగా నుండుటకు తగినవారో తమరే సెలవిండు” అని ప్రార్ధించెను. బ్రహ్మదేవుడు “విశ్వరూపుడను పేరుగల మహర్షి యున్నాడు, అతడు తపోనిష్టా గరిష్టుడు. అతన్ని సేవించినచో మీ కోరిక భీడేరును” అని సెలవిచ్చెను. వారెల్లరు నంగీకరించిరి. అందరు నా మహర్షి యాశ్రమమునకు వెళ్ళిరి. విశ్వరూపుడు త్వష్టయను ప్రజాపతి యొక్క కుమారుడు. ఉంచ శిలాది వృత్తులచే జీవించును తపము చేసి కొనుచున్నాడు. అతనివద్ద కేగి దేవతలు నమస్కరించిరి. వారందరు నొక్కసారిగా వచ్చుట చూచి ఆ మహర్షి సంతోషముతో వారి కెదురువచ్చి. అర్థ పాద్యాధులిచ్చి కూర్చుండబెట్టెను, అప్పుడా మహర్షి "అయ్యా! దేవతలందరు నొక్కసారిగా నా యాశ్రమమునకు వచ్చి నన్ను ధమ్యుని చేసిరి. మీరు వచ్చినందున నే నానందింపను! మరి మీకే పని చేసి పెట్టవలెనో తెప్పి నన్ను ధన్యుని చేయుడు” అని సవినయముగా ప్రార్ధించెను. వారు ఇంద్రుని ముందిడుకొనిరి. అతడు ముందునకు వచ్చి “మునీంద్రా! మీక్షేరుకలేనిది కాదు మా నోటి వెంబడి చెప్పించవలెనని మీ కోరిక, నరేకానిండు, మేము గుళు-ధిక్కారము చేసితిమి. దానితో రాక్షస్తులు మమ్ము గెల్చిరి. మీరు మాకు గురుపీరము అలంకరించి మా రాజ్యము మాకు వచ్చునట్లు చేయుడు. మీబోంట్లు పురోహితులు (పురః త ముందుగ్యా హితులు = హితవు కోరువారు) అయినప్పుడు మాకు కోరికలు సిద్ధింపక మానునా? మీరీ కార్యమును సకల దేవతా కార్యము కాన తప్పక మన్నింపగోరుచున్నాము. ఈ మీ పాద సేవకులను రక్షింపుడు” అని వేడుకొనెను. - అతడు “ఉంచ శిలాది వృత్తులచే పొట్టనింపుకొను మా బోటివారి కీపనులు తపో విఘ్మములు కలుగజేయును. అయినను మీ వంటి త్రిలోకాధిపతి వచ్చి ప్రార్థించినపుడు కాదన లేక్తున్నాను. మీ కోరిక నెరవేర్తును. ఇదే అంగీకరించు చున్నాను” అని తన సమ్మతిని తెలిపెను. దేవేంద్రుడు కోరిన రీతిగా కొన్ని మంత్రముల నాతని కృపదేశించెను. ఆ మంత్ర ధ్రభావముతో ఇంద్రుడు మరల దేవతల నందరిని సన్నద్దము చేసికొని రాక్షసుల మీదికి థండెతెను. ఈసారి రాక్షస బలము బలహీనమైనది. దేవతా బల ముత్సాహముతో పని చేసినది. విజయము దేవతలకి లభించినది. దానితో దేవత లెల్లరును విశ్వరూపునే గురువుగా భావించుచుండిరి. ననన ననన

తతతతతతవావాంలాలాం మమేాభారతనత కథలు = లావాలా

ఎట్టి చారికిని పక్షపాతము తప్పదు. విశ్వరూపుడు దేవతలకు, రాక్షన్గులకు' కూడా బంధువే. దేవతలు తండ్రి వంక చుట్టాలు కాగా, రాక్షసులాతనికి తల్లి వంక చుట్టాలు. అందుచే రాక్షసుల ప్రార్థనలను కూడా విన్నాడతను. ఇదొక రాజకీయ చతురంగము ఇందు మసలుట బహు కష్టము. అసిధారా వ్రతమే రాజసేవ. ఒక పక్తమువారు చెడుపని బేయగోరుదురు. రెండవ పక్షమువారి కది తెలిసినా తన ప్రాణములకు నీటి చుక్కయే. ఎటైనను బాధగా నుండునది కావునే చాలామంది యీ యుద్యోగమున కంగీకరింపలేక పోయిరి. |

విశ్వరూపుడు పైకి దేవతలకని మంత్రములు చెప్పి లోపల రాక్షసుల కాభాగము ముట్టుగౌకయని సంకల్పించి హోమం చేయించువాడు, సంకల్పం బలవత్తరమైనది కాన అట్లే క్రియ జరుగుచుండెను. అతనికి మూడు తలలున్నవి. అందొకటి సోమమును తాగునది. రెండవది కల్టు త్రాగునది. మూడవది అన్నం తినునదనియు, అతడొక్కొక్క దానితో నాక్కొక్క పని చేసెడి వాడన్నమాట! అట్టి మహర్షియే ద్రోహంనకు జంకలేదు.

హవిర్భాగములు రాక్షసులకు చేరుచున్నవి. దేవతల కాహారము తక్కువైనది. ఇంద్రుడాకీలకమును కనిపెట్టెను. ఆ ద్రోహంనకొక్కటే విరుగుడు. ప్రతి ద్రోహమే ఇంద్రుడాలోచింపక వెంటనే అతని మూడు తలలను నరికి పారవేసెను. బ్రాహ్మణుని చంపినందున ఇంద్రునికి బ్రహ్మ హత్యాదోషము వచ్చినది కాన్సి అతడు సమర్శడు కనుక వెంటనే ఆ పాపమును నాల్గు భాగములు చేసి భూమి, చెట్లు, నదులు స్త్రీలకు పంచెను. తానే బాధయు లేకుండ యధా ప్రకారంగ స్వర్గరాజ్య మేలుచుండెను. గొప్పవారేమి చేసినను సర్దుకొనగలరు గదా.

కొడుకును చంపెనని తెలియుటలో త్వష్టకుకోవం వచ్చినది. తనకు తొనుగా వెళ్లి యింధ్రునితోయుద్ధము చేయజాలడు. మరి ప్రతీకారమెట్లు తీర్చవలెను? అతడు మహా మంత్రవేత్త కత్తి ఎదురుగా చంపినచో, మంత్రము చాటు నుండి చంపును, శక్తిలో కత్తికంటే మంత్రమే హెచ్చైనది. అతడు ఇంద్రుని చంపెడి కొడుకు పుట్టుటకై హోమం చేసెను.

మంత్రం నుచ్చరించునపుడు అతిజాగ్రత్తగా నుచ్చరింపవలెను. ఏపాటి పాఠరపాటుగా నున్నను సంకల్ప మొకటియు, ఫలము వేరొకటియు జరుగును. స్వరలోపము గాని వర్ణలోపంగాని జరుపరాదు. అవి యిట్టి పరిస్థితులలోనే జరుగుట మామూలు.

వ్యష్ట, “ఇంద్ర శత్రువు పుట్టుగాక” అని హోమం చేసెను.

ఆ పదం నుచ్చరించుటలోని భేదమున్తుబట్టి అర్ధం మారిపోయినది. ఇంద్రుని చంపువాడు పుట్టవలెనని అతని యుద్దేశ్యం. కాని, స్వరం మారినందుని ఆ పదం లన త్ర నలు

నాారాలారాలార్తాన్తారాలాలణవాముయయయయవివిల ము వదర్తంరల శతి ఈటల = తానా సమాసము మారి “ఇంద్రునిచే చంపబడువాడు” పుట్టినాడు. ఎంత భేదమున్నడో గమనింపుడు.. ఎంత మహామహులకయినను మాట పారపాటు వలన వచ్చు నష్టంలివే. నోరు జారినచో కలిసి రాదుకదా! - వృత్రుడను 'ఘోరరూపుడైన రాక్షసుడు పుట్టినాడు. వాడు పుట్టగానే పెద్దగా ప్రెర్రిగిపోయెను. త్వష్టకు సంతోషమే కలిగినది కాని, ఇంద్రుని గుండె జల్లుమన్నది వృత్రుడు, తండ్రికి నమస్కరించి “తండ్రీ! నేను. చేయవలసిన పని ఏమిటో యానతిమ్ము!” అని పలికెను. త్వష్ట ఇంద్రుడు చేసిన ద్రోహం చెప్పి అతనిని సంహరించుటకే నిన్ను పుట్టించితిని చెళ్ళినంహారింపు" మనెను బలరకలవానికి యుద్ధమను -సరికెంతో ఆనందం కలుగును. ,వొడు సరాసరి స్వర్గం మీదికి యుద్ధమున కేగెను, వానిని చూచుసరికే దేవతలకు గుండెలు దడదడ లాడీనవి. ఎవరును వానియెదుట నిలువలేకపోయిరి మరొక్క విశేషం, వానిమీద శ్రివరయినా బాణం వేసినచో ఆ బాణం వచ్చినంత వేగమున అతడుకూడ వృద్ది నొందును. _అళని దర్పా కోసములు చూచుసరికి దేవతలకు భయము వేసినది. / __ దేవతలండరును విష్ణుమూర్తివద్ద కేగిరి విష్ణువు పాల సముద్రంలో హాయిగా శేష్నేపొన్నుపై పర్గుండెను, దేవతలు .వెళ్ళి స్తో్రతంలు చేయుటతో విష్ణువు దయతో వారిని “మీరు వచ్చినపనేమి” అని ప్రశ్నించెను. వారు “దేవా! వృతుడను ఘోరాకారుడు పుట్టినాడు' ' వాని బలము ముందు మా అందరి బలం కూడ వ్యర్థమయిపోయినది మాకు శరణ్యము నీవె! నీకంటె రక్షకులు లేరు, కరుణ జూడుము” అని ప్రార్థించిరి విష్ణువు వారిపై దయతో “మీ ఆయుధం లతని చంపుటకు పనికిరావు. దానికి మహాబలంకల క్రొత్త ఆయుధం కొవలెను.అది మంత్రబలం కలదైనప్పుడేకాని'లేకున్న పనిచేయదు? అందుచే దధీచియను మహర్శియొక్క వెన్నెముకతో విశ్వకర్మచే ఆయుధం చేయింపు”డని సలహా చెప్పెను? అచ్చట సెలవు తీసుకొని దేవతలు దధీచివద్ద కేగిరి. దధీచి మహర్షి నిశ్చలంగా తపస్సు చేసికొనుచుండెను. దేవతలందరును నాక్కసారిగా వచ్చుట చూచి. వారికి మర్యాదలు చేసి తన వలన కావలసిన పనేమని యడిగెను వారు “షహాత్మా! ఏమని ఛెప్పుదుము మా బాధ? దేవతలమన్న పేరు తప్ప క్షణం క్షణం మాకు బాధలే. ఈ బాథలు తగ్గునట్టి యోగం కనపడదు. మా మహిమ ఎన్నటికిని మీ తపోమహిమను మించదు కదా! మమ్ము రక్షించు బాథ్యత మీ అధీనంన నున్నది. మీరనుగ్రహించినగాని మేము బ్రతకలేం* అనిరి. ॥ “మీరు చెప్పినది యదార్థమే ఇప్పుడు నేనేవి చేయుదును? మీ అందరికిని సాధ్యం కొనిది నా వలన మాత్రం సాధ్యమగునా, మీ యుబ్దేశ్యమేమో చెప్పుడు?” అనెను వాడు ననా ననన

పాపట మవాభారతనతి కథలు -/ లాలా నీళ్ళు నములుచు “మాకు అడుగుటకు నోరు వచ్చుట లేదు, తమ వెన్నెముక కావలెను. దానితో ఆయుధమును తయారు చేసినగాని శత్రుసంహారము కాదని విష్ణుమూర్తి సెలవిచ్చిరి. ఆపైమీ దయ అనిరి;

అతడు మహర్షి దేహాభిమానము లేనివాడు. “నశ్వరమైన ఈ దేహమును మీవంటివారు వచ్చి అడుగునప్పుడు నద్వినియోగము చేయుటకంటె కావలసినదే మున్సది? ఈవేళ కాకపోయిన రేపైనను చావు తప్పదు. అందులకై నాకేమియు విచారములేదు. నేను యోగనమాధిచే ప్రాణములు విడుతును. మీరు మీకు కావలసిన పని చేసికొనుడు” అని తాను యోగము ద్వారా ప్రాణములు. వదలెను. అతని జీవితము కదా ధన్యమైనది! చనిపోయిన తర్వాత ఎందుకు పనికిరాని శరీరమును "దేవతలకు వారి కోరిక పై ముందే యిచ్చినాడు. అదే సమయమెరిగి దానం చేయుట.

ఇవతల పనిముట్టు, చేయువాడున్నాడు. అతని పేరు విశ్వకర్మ అతనిచే మహేర్షి వెన్నెముకతో ఆయుధమును చేయించిరి. దానికి వంద అంచులున్నవి తపోబలము కలదేమో అది ధగధగ మెరిసిపోవుచున్నది. ఆ యాయుధమును చేతపట్టు తోడనే ఇంద్రున కొకవిధమయిన శక్తి వచ్చినది. ఆ యుత్సాహముతో దేవతలనందరిని ప్రోత్సహించి మరల వృత్రాసురుని పైకి యుద్ధమునకేగెను.

వృత్రాసురుడు తక్కువవాడుకాడు. గుడి మింగువానికి లింగమడ్డునా?” అన్నట్లు అతనికి ఇంద్రునే మ్రింగగల శక్తియున్నది. ఇక అతని చేతిలోని ఆయుధ మననెంత? ఇంద్రుని ఆయుధంతోసహా (మ్రింగివేసెను.

దేవతలకీసారి మరింత విచారం వేసినది. ఇదివరలో తమ నాయకుడైన తమతో నుండువాడు. ఇప్పుడు అది కూడ లేకపోయెనే అని వారిబాధ. ఏమిచేయగలరు) లోలోనకుములుచుండిరి.

ఇంతలో లోనికి వెళ్ళిన దేవేంద్రుడు వజ్రపు శక్తిచే నగ చెడక మహోత్సాహంతో నుండెను. ఆ యాయుభముచే వృత్రుని తలను లోపలినుండి కోసివేసెను. కొండ శిఖరమువలె వాని తల క్రిందపడి పోయినది. దేవతా సేనలు సంతోషముతో కేకలు వేసినవి. రాక్షసులకున్న ధైర్యము ఊడిపోయినది. అందరును సికాపికలై పారిపోయిరి.

కాని, బ్రాహ్మణుని చంపినందులకు ఇంద్రునకు బ్రహ్మహత్యాపాతకము వచ్చినది. అది నానారోగ భూయిష్టమయిన ముసలి చండాల రూపముతో వచ్చివణుకుచు “ఇంకెక్కడికి పోదువు ఇదిగో నన్ను చూడుము” అనుచు ఇంద్రుని మీదికి వచ్చినది. ఆతడు నాన నా ాాాాాాాాాాాాాాఢడో లాలా

ర్య రాయాలా నువభారతనీతి కథలు -/-మాాలాలాలాలాలాలాలాలాాా హడలిపోయినాడ్రు. ఇదివరలో వచ్చిన బ్రహ్మహత్యను నల్గురికిని పంచినాడు. ఎన్నిసారులట్లు తమ పాపమును పంచును? ఇక నవకాశము లేదని తాను పరుగెత్తుకొని పుణ్యభూమియగు మేరుపర్చత ప్రోంతమునకుపోయి అక్కడ నొక్క చెరువులో నున్న తామరకాడలో దూరి తపస్సు చేయుచుండెను. పాతక మా ప్రాంతములకు పోవుటకు వీలులేక సరిహద్దులలో కూర్చుండెను. .

ఇక్కడ స్వర్గరాజ్య మరాజకమైనది రాజులేకున్నచో రాజ్యమునకు రక్షణ లేదు. అంధరును రాజులే అయినపు డెవరి యిష్టము వచ్చినట్టు వారు పోవుచుందురు. కాని సరీ అయిన కట్టుబాట్లు లేకుండెను. ఆప్పుడు దేవతలందరు కలసి బృహస్పతిని వేడుకొనిరి ఇతడు గురువు, పురోహితుడు, మంత్రియు కూడ కనుక అతనికి చాల బాధ్యతలున్నవి దేవతలెల్లరు తనీ వద్దకు వచ్చి ప్రార్ధించుటతో అతనికే ఎందుకింత వరకు రస్పించితినా అనిపీరచినధీ త రాజ్యము పై అతనికి అభిమానమున్నది కదా! తానెట్టు కోపించినను బాధలేదు. కాని, రాజ్యము నడకకే లోటు,రప్పించుట. భావ్యము కాదుకదా!

వెంటనే అతడాలోచించినాడు. నూజు యజ్ఞములను చేసి తగిన అర్హత కలిగిన ప్రభావంచే సంపన్నుడు, తపళ్ళాలి, ప్రజ్ఞా ప్రతిభలు కలవాడునైన నహుషుడాతని దృష్టిలో పడ్తినోడు అందరును కలసి నహుషునివద్ద కేగిరి.

“ఛక్రవర్తీ! నీ యాగఫలముననుభవించు సమయము వచ్చినది. దేవరాజ్య మరాజకమైనది. వచ్చి సింహాసనము నధిరోహింపుము, మమ్ముల పరిపాలించుము. ఇంద్రునకు బొధ కలిగి వెళ్ళిపోయినాడు” అని చెప్పుకొనిర. నహుషుడు స్వతః చాల మంచివాఢు త్రన శక్తి తావెరుగును,

దేవతలతో “అయ్యా! మీరందరును కోరుచున్నదానిని కాదనలేదు. కాని, నాకు

. బేవరాజ్య మ్రేలునంళటి శక్రియుండవలదా? మీ ప్రార్థన నవమానించుటకాదు. శక్తి లేకున్నను నేనంగీకర్షించినచో తర్వాత నాకు 'బాధ కాదా! దానికి తగిన శక్తిని నాకు ప్రసాీంచినచో యభ్యంతరము లేదు” అనుటతో మరల దేవతలకదొక సమస్య అయింది “బృహన్చతియున్నాడు కదా బుద్ధిశాలి! దానికేమి, పెద్ద బాధయక్కరలేదు. మన

  • థ్రభావములలోనుండి అతనికి కొంత యిచ్చినచో అతడన్నియు కలసి గొప్ప తేజళ్ళాలి యగును ఘనక్రును భాధ తీరును” అని సలహా చెప్పెను అందరును అంగీకరించిరి.

దేవతలు లోకపాలకులు తమ తమ తేజస్సుల నుండి కొంత భాగమునకు తీసి అతని కిచ్చిరి. అతనికిప్పుడు సరిపోయినంత శక్తి కల్గినది. అతడు స్వర్గమున కేగెను.

లాాననవవవంయాంయంయవలలం మదుర రత నతి కథలు - ౯ లాడు అప్పటికే అతనికి దివ్య శరీరము వచ్చినది. అది కోటి సూర్యప్రభలతో వెలుగుచున్నది. ఆ మహాతేజస్సుతో నతడు దేవరాజ్య పట్టాభిషిక్తుడయ్యెను.

తేజస్సు, ప్రభావము, అధికరాము, ఐశ్వర్యము అన్నియువచ్చినవి. ఇది వరకున్న వినయ విధేయతలు మెల్లగా వెనుక ముఖము పట్టినవి. మదగర్వములు పుట్టి పెరిగినవి. సభలోని కెవరెవరు వచ్చుచున్నారో, ఎవరెవరెంతగా తన్ను గౌరవించు చున్నారో గమనించుచుండెను. అప్పరసలను రప్పించి తనకు తోచునపుడెల్ల నాట్యమాడించును గంధర్వులను రప్పించి పాటలు పాడించును. దానికి వేళాపాళ లేదు. క్రాత్త అధికార ప్రభావమిది చిన్న చిన్న అధికారులే మన్ను మిన్నును అందక మిడిసిపడుదురే ఇక త్రిలోక రాజ్యం హరాత్తుగా చేజిక్కిన నహుషునకు గర్వము వచ్చెననుటలో విశేషమున్నది?

అధికారము గ్రుడ్డిది దానికి వివేక ముండదు. మంచి చెడ్డలనెరుగనీయదు. తగని కోరికలు రేకెత్తినవి. ఇంత అధికారము వచ్చినందులకు ఫలమేమిటి? దేహ సౌఖ్యమును పూర్తిగా అనుభవింప వలెగదా ఎవరు అందమైన తరుణులు యజ్ఞ యాగాదుల వలన స్వాధీనమగు రంభాదులైన అప్పరసలనే కోరినచో, ఇక ఇంద్రుడయినందున వచ్చిన ప్రత్యేక లాభమేమున్నది? ఇంద్రుని భార్య శచీదేవి తానిప్పుడింద్రుడయ్యెను కదా? ఇంద్రుని భార్య యేల కారాదు? అట్లయినప్పుడే తన పదవికి తగిన ఫలితము పొందినట్లు! అని పరిపరి విధముల తలపోసెను. జ _

తాననుకొన్న విషయములను దిగమింగి యూరకొనలేదు. నరాసరి శచీదేవికి కబురంపెను ఆమెకు గడ్డురోజులు వచ్చిపడినవి. ఏమి జవాబియ్యగలదు? మగడు దగ్గరలేడు ఇంతలో రాడు; రాలేడు. అతని పదవియే అన్యాశ్రాంతమైనది. ఆ యధికారియే న్యాయము చేయదగినవాడు కాని అతడే అన్యాయమునకు పాల్పడి నప్పుడామెయే మనగలదు? ఏమన్నను ప్రమాదమే! అతడు మాటలతో ఆమెను వదులునా? కబురు తెచ్చిన వారినే ఏదోరీతిగా సర్దుబాటు చేయమన్నది. _

వారు “అమ్మా! మా లోటుకాదు ఆపాటి చెప్పకుండమెము నీ దగ్గరకు రాలేదు”

అ పని కూడదు. నీ వంటి న్యాయాధికారి యా మాటలాడకూడదు. ఇట్టి దురూహల్లు చేయరాదు” అంటిమి. కాని యేమి లాభము? అతడు వినినకదా! విను వాడిట్టి దురాలోచన చేయునా? పై పెచ్చు మమ్ములనే యెదురు ప్రశ్నలు వేసినాడు. “మీరు గొప్ప "పెద్దమునుష్యులవలె మాట్టాడుచున్నారు. నాకు చెప్పెడు బుద్ది మీకానాడు ఇంద్రుడహల్యను కోరినప్పుడు లేకపోయినదా? ఆనాడతడు చేసినపని మంచిదై. నేను చేయువచ్చుసరెికి జా

అజా ముహభారతనీతి కథలు -/ాాలాలాలాలాాాాా చెడ్డదైనదే? ఇదా మీ న్యాయము? ఒక్కొక్కరి కొక్కొక్క రకము తీర్పులు చెప్పనేర్చిరే?- అని తన నోటికి వచ్చినట్టు నాలుగు కసిరినాడు. మేమేమియు జవాబు చెప్పలేక నీతోనే చెప్పకొందుమని వచ్చితిమమ్మ! ఇదీ పరిస్థితి. తర్వాత నీ యిష్టము. ఇంతకంటే మా వల్లకాదు ఏమి ప్రత్యుత్తరమిత్తురో ఇమ్ము ఆ మాటలే వెళ్ళి చెప్పెదము” అనిరి. అమి భయపడి, వెంటనే బృహస్పత్తి యింటికేగి “గురుదేవా! నీ పాలబడితిని. ఏదో పసువు ముద్దకు “ప్రాణప్రతిష్టచేసి విఘ్నేశ్వరుని చేసినట్లు ఆ- దుర్మార్గునికి పదవినిచ్చి ఇంద్రుని చేయగా నన్నే కోరుచున్నాడు. మీరెట్టు కాపాడుదురో? మీ చిత్తము” అన్నది గురుడు దయతలంచినాఢడు. “అమ్మా భయభులేదు. నా కంరములో ప్రాణమున్నంతవరకు నీకు మానభంగము రానియ్యను ఇదే నీకభయ మిచ్చుచున్నాను, నా ఇంట్‌ వద్దనే యుండు తల్లీ!” అని చేరదీసినాడు.

ఆ విషయము నిముషములో నహుషునికి చేరినది. ఆ వార్త తెచ్చిన వారితో “ఏమి? బృహస్పతి నా.మాటకెదురు తిరిగెనా? తిరిగి మనగలడా? నేను పిలుచుకు రమ్మన్న స్త్రీకి తశానభయమిచ్చుటయా? నా మాటను మన్నింపడన్న మాట. ఇతని యాట యెట్లు సాగునో చూచెదను. మరొకసారి నా మాటగా ఆమెను నాకు స్వాధీనము చేయుమని చెప్పుడు లేకున్న తనకు ముష్పు తప్పదనుడు” అని చెప్పి పరపెను.

ఆ మధ్యవర్తులు బృహస్పతి దగ్గర కేగి “అయ్యా! అతడు చాలగా కోపించు చున్నాడు, మధ్య మామీద కారాలు - మిర్యాలు నూరుచున్నాడు ఇక వెంటనే నీవామెను వదలకున్నచో నీకును-ముప్పు వచ్చును తర్వాత నీ ఇష్టము” అనిరి.

“బుద్ధికి బృహస్పతి” అని యూరకయే అందురా! అతడాలోచించినాడు. అభయ మిచ్చిన అబలను చేజేతులా మరొకరి కప్పగించుట న్యాయము కాదు కాదని బలవంతుడైన రోజున కెదురాడుటయు నుఖప్రదము కాదు. అన్నిటికీ వీలుగా నొక్కటే మందని ఒక యెత్తుపన్ని, శచీదేవికి నచ్చ చెప్పి సహుషుని వద్దకు తీసుకొని వెళ్ళెను.

ఇక నేమున్నది? తనకూ స్వాధీనమైనది శచీదేవి - తన కోరికలు ఫలించినవి - తన పుణ్యము వుచ్చినది; అనుకొన్నాడు నహుషుడు, ఆమెకెంతో గౌరవప్రతిపత్తులు చేసినారు

ఆ మర్యాదలన్నియు అంగీకరించినది.

ఆమె మెల్లగా “దేవేంద్రా!” అన్నది ఆ మాటకే అమృతము త్రాగినట్లు ఊటలూరుచు లొట్టలు వేయుచు ఇంకేమి మాటలాడునో, అమృతము చిందించునో అన్నట్లు ఆమెకేసి రెప్పపాటు లేకుండ చూచుచుండెను ఆమె “త్రిలోక రాజ్యము నీకు హస్తగతమయినది లావా కా

పాం మవధారతనీతి కధలు -£ లాలా నేను నీదాననే. దీనికింత ఆర్భాటమేమిటి? కను గల్గినట్లు చేసికొన వలసిన పనులకింత హంగామా కూడదు. కాని, ఒక్క విషయము దేవరచిత్తమునకు తెలియకపోదు. కాని, కోపించక వినవలయును” అని మెల్లగా సాగదీయుటలో అతడు ఆమె మాట మాటయే అమృత వర్షమని ప్రతి అక్షరమును బహుత్రద్ధగా వినుచున్నాడు. -

“ఆఆ ఎంత మాట! నీవు మాట్లాడుట - నాకు కోపము వచ్చుటయునా? ఒకవేళ - గౌరవ మర్యాదలలో లోటేమైనా నున్నచో చెప్పుము దానికేమి? నేనును క్రొత్తవాడనే కదా!- మరి” అని ఆమె ఒప్పుకానే యున్నట్లు అనుకొని అతడు పలికెను.

“మనము కలీసినచో ఇక విడిపోకూడదు. మనము చూచుకోవలసినదదే. కొన్నాళ్ళు కలియక, కొన్నాళ్ళు విరహం భరింపరానిది. అది మానవులకే కాని దేవతలమైన మనకంత్త గతేమి పట్టినది? హాయిగా ఎల్లకాలమును నిత్యయౌవనముతో సుఖించవలె. కాని యింకను, అపాత ఇంద్రుడు ఉండెనో - ఊడెనో తెలియలేదు అతడును బలవంతుడు కదా. మధ్యలో ఒకనాడు వచ్చెనా! మరల అప్పుడు రసభాన మగును. కావున ఇప్పుడే అదేదో నిష్కృష్టముగా తేల్చుకొని మనము సుఖముగా విహరింతుము ఆరు మాసములు గడువిమ్ము ఈ లోపున ఏ విషయము తేల్చుకొందును” అన్నది.

మాటలు తియ్యగా నున్నవి. ఆమె మాటలు విన్నంత సేపు అతడామె అందమును త్రాగుచునే యున్నాడు. ఆమె మాట కెదురు చెప్పెడి సాహస మతనికి లేదు. స్త్రీలను వీలయినంతలో నరసముగనే వలపించుకొనవలెను. కాని, బలవంతముగా కారాదు బలవంతమైనచ నరనమైనది కూడా విరసవే యగును. అందుచే నాలుగు దినాలాలస్యమైనను, తనకు కూడా ఇంద్రుని విషయము తెలుసుకొనుట ప్రధానము కాన తొందరపాటు లేకుండ గడువునకు వేచి యుండుటయే మేలని తలచి అతడు “సరే అనెను. ఆమె బ్రతుకు జీవుడా అని తన అంతఃపురమున కేగినది.

కాని, అక్కడైనను ఆమెకు మనశ్శాంతి ఏదీ? గురుని రప్పించినది, జరిగినదంతయు చెప్పినది. ఏ ఉపాయం చేతనైనను తన మగని వార్త తేవలెనన్నది అతడు దేవతలనందరిని కూడగట్టుక్టుని రహస్యంగా ఆర్తజన రక్షకుడైన శ్రీహరిని చేరి స్తుతించి తమ రాజుగారి పొట్టు, చెప్పెను. /

హరి చాల నొచ్చుకున్నాడు. “మీరనాలోచితంగా అటువంటి దుర్మార్గున కధికార మిచ్చుటయే పారపాటు. కొరివిపెట్టి నెత్తినగోకికొన్నట్లుగా నేలను పోవు దానిని నెత్తికి రాసికొన్నాను ముంద్యుగనే ఏదో ఉపాయం చూచి ఇంద్రునకు పాప ప్రాయశ్చిత్తము న.

అలలాావాయయయావాలాలాం నునబారత నీతి కథలు = £ లాలా చేయవలసినది. అదెప్పటికైనను తప్పదుకదా” అనెను. వారు దీనముగా “పురుషోత్తమా! మాకు నీకంటె దిక్కెవ్వరును లేరు. ఇప్పుడే రీతిగా ఆ పాపం ఇంద్రునకు పోవునో సెలవిమ్మని ప్రార్ధించెను. శ్రీహరి కరుణించినాడు “మీరు వెళ్ళి ఇంద్రుని పక్షమున ఆశ్వమేధయాగ మొకటి చేయుడు. దానితో నాకు ప్రీతీ కల్గును. అతని పాపం పోవును అదే కర్తవ్యం” అని యుపదేశించెను దేవతలు సంసిద్ధులైరి. ఇంద్రుని పేరు చెప్పి అతడే యజమానుడుగా అతని తరపున తామే అశ్వమేధయాగంను. చేసీరి. ఆ పుణ్య ప్రభావం వలన ఇంద్రునికి 'బ్రహ్మహత్యాదోషం పోయినది. పవిత్రుడైనాడు. దేవతలందరిని తనకు మేలు చేసినందులకును చ్రాల్రా మెచ్చుకొనెను వారి చేదోడుతో అతడు మరలి స్వర్గము నేలుటకై అమరావతి (ఇంద్రన గరం)కు

  • వచ్చెను. అక్కడ నహుషుడు దేదిప్యముగా వెలుగుచున్నాడు. అతనికి సహజమయిన తేజస్సు కంటేచేవతలిచ్చిన తేజస్సు హెచ్చినది దాని ముందు ఇంద్ర తేజస్సెంత? అంద్రున్స
  • ఇంద్రుడు పాప పరివిష్టుడైయుండి ఇప్పుడే విముక్తుడైనాడు. నహుషుని తేజస్సు నత్రడ్చ కనులతో చూడలేకపోయెను. ఇక గెల్బుటన్న దెక్కడ? తన నొకవేళ చూచ నహుసుడేమిచేయునో అని భయపడి అతడే పారిపోయెను. దేవతలందరును తెల్లబోయిరి. తమ ప్రయత్సమంతయును నిష్పలమైనది. ఆ మాటి చెప్పినచో తమ తేజస్సు నతనికికూడా ఇచ్చెడివారేమో? ఇప్పుడేమి చేయుట వ్యా కేమీ తోచక శచీదేవితో “మా శక్తికొలది ప్రయత్సించితిమి. ఇక నీశక్తి చూపుము, న్లీక ఇంద్రుని తేగల శక్తిలేనిచో ఆ బాధలు నీవే! మే మింతకంటె ఏమియు చేయజాలము” అని ఒక్క దండరి పెట్టిరి. ॥ ఇంతకు అమెకు వచ్చిపడినది. ఎవరి బాధ వారిది ఒకరి కొకరు అడ్డుపడు ద్వ రన్నద్రి" కల్ల, ఎవరినివారే రక్షించుకోగల' శక్తి లేనప్పుడితరుల నెట్టు రక్షించగలరు? ఆవ్సె జరిగిన విషయములన్నియు తలచినది. తానే ఏదో రీతిగా సాధింపవలె ననుకొన్నది, మనకు మనకన్న గొప్పవారు! దేవతలు పూజ్యులయినట్లే వారికిని దేవతల్పు న్నారు వారిని పూజించి తము ఇష్టార్ధంలను పొందుచుందురు అందు ఉపశ్రుతియను దేవత్వ్వృన్నన మనమేది యనుకొన్నను అన్నను “తధాస్తు” అనెడీ దేవతలుందు రందురే - ద్రాన్సి కధిష్టాన దేవతయే ఉపశ్రుతి. ఆ దేవతను భక్తిశ్రద్ధలతో పూజలు చేసెను ఆ దేవత తృప్తి పాద. నానన నం

చవవవవవవాలయంయవయయలలాంలాయవిలాం నువోబారత నీతి కధలు -/ నా అమెకు ప్రత్యక్షమయినది ఆమెను రాత్రివేళ పూజించుట నియమం, అట్లు చేసినందున రాత్రికి రాత్రి ప్రత్యక్షమై మూర్తీభవించి కన్పించినది, శచీదేవి ఆమెను తెలిసి కొనలేక “అమ్మా! నీ వెవరవు” అని ప్రశ్నించినది. ఉపశ్రుతి “నేను ఉపశ్రుతి దేవతను? నీవు చేసిన పూజలకు మెచ్చి నిన్ను కరుణింప వచ్చితిని, నీకు కావలసినదేదో తెల్పుము చేసి పెట్టెద” నన్నది. | . “అంత శచీదేవి- దేవి! నాకు కావలసిదేమున్నది? నా మగడెక్కడ నుండెనో తెల్పుము. అంతకన్న నాకే కోరికయు లేదు” అని ప్రార్ధించినది ఉపశ్రుతి “దానికేమి? నాతో కూడ రమ్ము నీకు నీ మగని చూపెదను” అని శచీదేవిని తోడ్కొని బయలు దేరినది. దేవతలలో నందరికిని నన్ని శక్తులు నుండవు. అందుచేతనే కొందరు ఇంద్రుడగుట. కొందరు భటులగుటయు కల్గుచున్నది ఉపతశ్రుతి కున్నంత శక్తి మరి శచీదేవికి లేదాయె. అట్లని అసలు శక్తియే లేనిదా శచీదేవి? ఆమెను దేవతగా పెళ్ళిళ్ళలో రాజులు కొల్తురు. స్వయంవరమైైన తర్వాత పిల్లవరించిన వరునిపై తక్కిన రాజులందరికి కోపముగా నుండును. అతనిని కొట్టవలెనని కొందరు కాని శచీదేవి మహాత్మ్యము వలన వారు వెళ్ళి మూడు రోజులు నిమ్మకు నీరు పోసినట్లు ఊరుకాందురు అటు తర్వాత పిల్లను తీసుకొని వెళ్ళునప్పుడు దారికాసి వారెల్లరు నేకమై నరుని బలము చూత్తురు. ఆ రతిగా మానవులతో రాచకన్నెలను రక్షించు శచీదేవికే కష్టము కల్గినది ఆమెను రక్షించుటకు మరొక దేవత అవసరము కోవలసి వచ్చినది. ఎంతవాశికైనను మరొకరి సహాయ మవసరము కదా!

  • , ఉప్రుతి వెనుక శచీదేవి వెళ్ళుచున్నది. అడవులు, కొండలు, నదులు ఎన్నో దాటి వెళ్ళినది. హిమవత్పర్వతము,,ఎంత ఎత్తయినదో అంత విశాలమైనది. దాని వైశాల్యము - ఎత్తుకూడ ఎంత వున్నవో ఎవరికిని తెలియదు అదొక్కొక్క శిఖరమున కొక్కొక్క పేరున్నదీ. దాని కుత్తరముగా ముంజివంతమని ఒక పెద్ద పర్వతమున్నది ఆ పర్వతము మీద వెయ్యి ఆమడ వైశాల్యమున్న తటాకమున్నది. ఆ తటాకములో ఎన్నో తామర పూవులు వికసించి యున్నవి అవి పంచరంగులతో అందముగా నున్నవి. అందాక్కదాని కాడలో దాగియుస్నాడింద్రుడు.

“సరిగా దానిలోనికే సూక్ష్మరూపమున ప్రవేశించినది. ఉప్రుతి వెన్వెంటనే శచీ దేవియు ప్రవేశించినది, అందున్న మగనిచూచింది అతడు భార్యను -చూచి ఆశ్చర్య షోయినాడు “శచీ! నీ వెట్లు వచ్చితివి? ఇది చాలా రహస్య ప్రదేశము. ఇక్కడున్నట్టు నీకెవరు చెప్పిరి? ఎట్లు తెలెసికొంటివి? అని ప్రశ్న పరంపర ల ధి షల

కిత్‌ాా మ ( నగ ఆ న

లా మవాధారతనతికథలు - (లాలా ఉపతశ్రుతి సాయమువల్ల నేను మిమ్ముల చూడగటల్లితిని. నా బాధలెన్నో మీరు గమనింపరైరి. పూర్వ పుణ్యము కొలది మిమ్ముచూడగల్లితిని. శక్తి కలిగియు మేరిట్లు దాగికొన్నారేల? అక్కడ క్రొత్త దేవేంద్రుడు అబ్బ ఎన్ని పోకడలు పోవుచున్నాడో ఎరుగుదురా? నా తలప్రాణం తోకకు వచ్చింది. ఆతని నెన్నో రీతుల మాయచేసి, ఆ బృహస్పతి ధర్మమా అని నేటివరకు పాతివ్రత్యము చెడకుండా నున్న దానను ఇక కొద్ది రోజులునది గడువు. ఈ లోపలనీవాతని జయింపకున్న నా మాట దక్కదు. వారేమి చేయుదురా?” అని అతని యొడిలో చేరి వలవల విలపించింది.

అతడాపరిస్థితి చూడలేకపోయినాడు. పేరున క్రిందుడు, త్రిలోకరాజ్యాధిపతి కష్టములా

సామాన్యులకు సైతము కలుగనవి. అతనికి విసుగు వచ్చింది. క్రితము జన్మలో ఎంత పాపం చేసిన ప్రాజియో ఇంద్రుడగునను కొన్నాడు. భార్య నూరడించుటకై ప్రయత్నించాడు. ఊరడించినకొలది పెరుగుట విచారము యొక్క ధర్మం,

' “ఖని! నాకు మాత్రం బాధగా లేదా! కాని ఏమి చేయను? అతని ముందు నాకు శక్తి చాలకున్నది. వారందరు గౌరవముగా నాకై అశ్వమేధయాగము చేసినారు. కాని నాకున్న తేజస్సు తక్కువగుటచే ఆ నహుషుని ముందాగలేక 'పోతిని ఇప్పుడేదో రీతిగా అతని తేజస్సుతగ్గిడియుపాయము చూడవలెను లేకున్న నేనచ్చటికి రాలేను” అనెను. శచీదేవి కేదో కొంత యుపాయం చెప్పువాడు తన మగడు కనపడినందుకు సంతోషముగా నున్నన్స, అతని తేజస్సును తగ్గించుట యన్నచో చేతితో తీసివేయుటకు వీలయినదా? అది మరల సమస్యయైనది.

“అందుకు చేయవలసిన పనేమో అది కూడ తమరే సెలవిండు నా శక్తి కొలద్రి చేయుదును. అంతేకాని. నీవే చేయవలయునన్నచో నాకేమియు తోచని ఈ క్లిష్ట పరిస్థితులలో ఆలోచనయే తట్టుటలేదు చెప్పుడు కర్తవ్యమేమి?” అని అడిగింది.

. “థ్రయా ఇట్టి కష్టములు వచ్చినప్పుడు తట్టుకొనుటయే కష్టం. అదే బుద్ధిమంతుల లక్షణము. బెంబేలు పడినందున, కార్య భంగమగును. గాని, కార్యసాఫల్యముకాదు నీవు పూర్తిగా అతని వలచినట్లు శత్రుత్వముచే సాధింపలేము. కార్యసాధన చూడవలెను. అతనికి తియ్య తియ్యగా మాటలు చెప్పి ఒప్పించి మెప్పించుము. అతడెంతటి కార్యమయినను కన్నులు మూసికొని చేసి తీరును. ఆ గ్రుడ్డితనములో వెనుదీయలేడు” అనుటతో శచీదేవి “ఇంతకును చేయవలసిన పనేమో” అంది,

“అబ్బ. అంళ్త కంగారా? అంత కాలవిలంబనము నహింపలేకుంటివే? ఉండవలసీనదే తొందర, కాని పనిబేయుటలో మాత్రము తొందరపడకుము. నీవు చక్కగా 52

వవవవవావయియియలాం మనరంభారత నీతి కథలు =/ పూలా సింగారించుకొని నహుషుని వద్దకేగుము' అనగానే “ఊం1 మీ యాజ్ఞ తప్పునా? తప్పక వెళ్ళుదును” అన్నది శచీ నవ్వుతూ “ఆ నవ్వుట కేమిలే చెప్పెడిడి శ్రద్ధగా వినుము. నీవు ఇంద్రునికి సప్తర్షులు మోయునట్టి పల్లకి పై ఊరేగవలెను. ఇంద్రునికి సప్తర్నులపై అధికారమున్నది. ఆ అధికారమును వినియోగించుకొనలేకపోవుట చేతకానితనము. చక్కగా ఆ పల్లకి పైన ఊరేగునపుడు చూచుటకు నాకీ కన్నులు చాలునా! నీవంటి అధికారి ఎంత హోదాగా వుండవలెను?” అని మాటలతో నతని నుబ్బించుము. అతడు నీమీది మోహముతో నీవు చెప్పినట్లెల్ల చేయును. పూజ్యులయిన మహర్షులచే పల్లకి మోయించుటతో అతని తేజస్సు తగ్గితీరును. అప్పుడు నేను వత్తును” అని యుపాయము చెప్పెను. ఆమె “తు.చ. తప్పకుండ చేయుదు” నని ఇంటి కేగినది.

శచీదేవి నహుషుని ఇంటికేగినది. ఇప్పుడామె తెచ్చుకొన్న సంతోషంతో మంచి హంషారుగా నున్నది. నిజముగా తన కోరిక తీర్చుటకే వచ్చినదనుకొన్నాడా మదాంధుడు. ఎదురుగా వెళ్ళి పట్టరాని ఆనందముతో “ఆమె గడువు లోపలనే వచ్చినదేమో” అనుకొని, “ఒకవేళ, తనపై మోహము బట్టలేక వచ్చినదేమో” అనుకొనుచు ్రశ్న్చలు-జవాబులు తనలో తాను చెప్పుకొనుచు, ఆమె కెన్నోరీతుల మర్యాదలు చేసెను. ఆమెకు తెలియదా వాటి యుద్దేళ్యము.

“ద్రేవేంద్రా! నీవు పరాశ్రమశాలివి. బాహుబలముచే నూజశ్వమేధములు చేసి, ప్రజ్ఞా విశేషము వలన దేవతల తేజస్సును గ్రహించితివి. నీ కెవ్వరు సాటి? ఇంకను గడు వెక్కువ దూరంలో లేదు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూచు చున్నాను. నీ అధికారమునకు, నీ హోదాకు నీవంటివాడు సామాన్య వాహనములు కాదు - సప్తర్డులచే మోయబడునట్టి పల్లకి నెక్కవలెను. ఆ ఇంద్రునకేదీ నీ యంతటి ప్రభావము? అతడందుకే ఎక్కలేక సోయినాడు, అతనికంటె నీ విశేషం చూపవలదా? నీకా సప్తమును లోనైనవారే! వారిపై నీకు అధికారమున్నది! దానిని నిర్వహించుకొను బాధ్యత నీది. ఎట్టు చేయుదువో? నాకు చూడవలెనని ముచ్చటగా నున్నది” అని ముసి ముసి నవ్వులు నవ్వినది. *

నహుషునకా మాటలు చెవికెక్కినవి. అతని కామె నవ్వులు వినుచుండగా ఒడలు తెలియుటలేదు. ఆమె సంతోషమే తను కోరినది కూడ. ఆమె తన నంగీకరించినచో తానెట్టి అధికారమైనను నిర్వహించును. దానికభ్యంతర మేమున్నది? వారు దానికోసమే కదా తన్ను తెచ్చి పెట్టిరి వారి తేజస్సుల నిచ్చిరి. అట్టి సదవకాశమును జారవిడుచుకొను నంతటి వెర్రివాడుండునా? తాకా

అరావావలయనాయయయలయయవవాలాలాలాలాయా మవాభారత నీతి కథలు = ాాానాాాాానాాానవవునాలు

ఉత్సాహముగా “ఇదిగో! చూడు ప్రియా! నీ ఇష్టమే నా ఇష్టము నీవు స్వయముగా వచ్చి చెప్పవలెనా? పావురముచే కబురంపీన చాలదా? నోటితో చెప్పవలెనా? కనుగీటిన చాలదా? రేపీపొటికి నీ నాధుని పల్లకిలో చూడగలవు. దానికి వాహకులు - కాదు - బోయీలు - సప్తర్డులు. ఏడుగురు మహర్షులు, సరియా? అదేకదా నీ కోరిక, ఇంకను కోర్కెలున్నచో చెప్పుము, లోలోపల దాచుకొనుకుము. నీవు మరుగున నున్నచో నా మనసు తహ తహ తగ్గదు. ఏమీ? ఆ ఇంద్రు డెక్కలేక పోయెనే, అట్టి పల్లకిని నేను ఎక్కి చూపింతును. అదే నా గొప్ప తనము! ఆ పాటి అధికారమే లేనిచో ఇక నీ ఇంద్రపదవి ఎందుకు? చూడుము నా శక్తి” అని తన గొప్పదనమును మందహాసముతో చెప్పెను. తన ఎత్తు పారినందులకు శచీదేవి సంతసించినది.

నహుషుడు వెంటనే సస్తర్డులకు కబురంపెను. వారేలకోయని వచ్చిరి. నహుషుడు

వారిని గౌరవింపలేదు. సరికదా, వచ్చీరాగానే “మీరు నాకంటె క్రింది వారని ఎరుగుదురు కదా! నేను చెప్పినట్టెల్ల మీరు చేయవలయును” అని యుప(ర్ర మించుటతో వారి,కదేదో “దెట్ట చెడుకాలమునకు కుక్క మూతిపిందె” లన్నట్లు అతనికి పోగాలము వచ్చినదని మారు మాట్లాడక వినుచుండిరి.

“నా పల్లకిని వారు - వీరు మోయుట బాగుగాలేదు. చక్కగా వేద ఘోష చేయుచు మీరే మోయవలయును, మా శచి ఆ చిన్న కోరిక కోరినది. మీరు తప్పక చేయవలయున్ను. మీరేడుగురే కాదు, ఇంకను మిగిలిన జడధారులు కూడ వచ్చి సిద్ధముగా నుండవలెను, నా

_ పల్లకికి చుట్టున నుండి వచ్చు చుండవలెను. అది మీ కర్తవ్యము ఏమందురు? దీనిక్షి వీ అభిప్రాయం?” అని అధికార గర్వముతో పల్కెను. వారు సవినయముగా “అంతే ప్రభూ! తమ యాజ్ఞను అతిక్రమించుటకు మాకేమి శక్తిగలదు? తమ మాట అక్షరాల జరగవలసినదే అందేమియు సందేహం లేదు అందరమును వచ్చి తమ కొలువు చేయుదుము, మంత్రాలు తాము కోరిన రీతిగా చెప్పాచుందుము. తాము వినవచ్చును” అని విన్నవించుక్షానిరి. “ఊ! వెళ్ళి దానికి వలయు పరికరములతో సిద్ధంగా ఉండు” మని వారిని పంపించెను. అంత తేలికగా వారొప్పుకొందురని అతడనుకోలేదు. కాని, శ్రమ అక్కర లేకుండా తేలికగా వారంగీకరించిరి. ఇది తనకు వభసూచనని యనుకొనెను. అంతేకాని, తనకురాబోవు విపత్తు నాతడోహించలేదు. తన పాపము పండుచున్నదని అనుకోలేదు. అట్లనుకొన్నచో ఎవడైన చెడు పనులను చేయనురికించునా? అంతయు జరిగిన తర్వాత పశ్చాత్తాపపడును. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొనుట పరీపాటియే కదా. కడ

సా మపాభారతనీతి కథలు -/ లాలా

ఆ రోజున సప్తర్షులు పల్లకిని తెచ్చిరి నహుషనికి పిలుపు పెట్టిరి. అతడు ఏ రీతిగా నైనచో శచీదేవికి హితవుగా నుండునో అని పలురకముల దుస్తులను మార్చి. ఆభరణములను మార్చి, సింగారించుకొని వచ్చి పల్లకిలో కూర్చుండెను. మునులు అలవాటు లేకున్నను ఏదో రీతిగా అతనిని మోయుచుండిరి అమరావతి నంతను పల్లకిపై నూరేగుచు నహుషుడు సందర్శించెను. నగరిలోని దేవతలెల్లరును అతనిని చూడలేకపోయిరి. శచీదేవి మేడపైకి వచ్చి చూచినది ఆమె చూడవీలెననియే కదా. అతని ప్రయత్నమంతయును మునులను చురుకుగా నడువుడని అదిలించెను.. తన ఇధికారమును వినియోగించుకొన్నట్లు అతడు శచీదేవికి తలియునట్టు చేయుచుండును. పైకి నవ్వుచు “ఓరి దుర్మార్గుడా! నీ కెంతకొావరము వచ్చినదిరా ఫలితమనుభవింతువుగానిలే? దానికట్టే రోజులు పట్టవు, ఇది మూన్నాళ్ళ ముచ్చటేరా బాబూ! ఈ నడమంత్రపు సిరిదికాని యీ ఒడుదుడుకు - నిన్న నవవలసిన వనేముందిలే అనుకొనుచు అతనిని గమనించి నట్టు ఒక్కసారి అతనికేసి చూచి, చిరునవ్వుతో నవ్వింది. అతడు దానితో ఆనంద సముద్రంలో మునిగి తేలుచుండెను. అట్లు రోజులు గడుచుచున్నవి.

ఇక్కడ -శచీదేవికీ నహుషుడు కాదుగా కావలసినది తన యెత్తు ఇటు నహుషుని పతనముతోపాటు ఆమె ఇంద్రుని తెచ్చుటతో పూర్తికావలె బృహస్పతిగారి యింటి కేగినది. అక్కడ గురువుగా రామెకు మంచి గౌరవాదరములు-చేసి, తాను చేసిన దానికీ ఫలితము లేకున్నందుకు విచారించుచుండెను. శచీదేవి అతనికి నమస్కరించి తన ప్రయత్నమును - వివరించినది.

బృహస్పతి ఆశ్చర్యముతో “ఏమిటి? అంతవరకు వచ్చిందా? అయిన అతనిని పల్లకి నెక్కించితివా పడగొట్టుటకు? నీవు తెలివిగలదానవు. నన్ను సాయము కోరుట కార్యసాధన చేసిన మాట నాకు దక్కించుటకే అనుకొందును. ఇంతకు నేను చేయవలసిన పనేమి మిగిలియున్నది?” అనెను. _ "

శచీదేవి “నా ఎత్తులో ఒక భాగం నహుషుని పతనము - అది నేడో రేపో జరుగును. ఈ లోపుగా తమరు నా భర్తను తెచ్చుటకు ప్రీయత్సింపవలెను. అతని వెదకి తెప్పించి యుంచినచో వెంటనే ఇతని వెనుక అతని కధికారమియ్య వచ్చును” అన్నది. బృహస్పతి “అబ్టేనమ్మా] వెంటనే వెదకించెదను. అదెంత పని? ఇదిగో ఇప్పుడే పంపుదును. నీవు వెళ్ళి సుఖంగా నిశ్చింతగా నుండుము” అని ధైర్యము చెప్పి పంపెను.

అంతట బృహస్పతి అగ్నిహోత్రుని పూజించి సంతోష పెట్టెను. అతడు తనవల్ల కాదగిన' పనేమని యడిగెను. గురుడు జరిగినదంతయును చెప్పి “ఇరద్రుడెచ్చట నుండెనో వెదకి రమ్ము అతనిని తీసికొని వచ్చు లోపల నితడు తేజో విహీనుడు కాగలడు" అని చెప్పి పంపెను.

క5్‌5్‌

వావాలలయావాలాయాలాలయాజయాంయయియయలా వ్రవకరూరత నీతి కథలు = / లాలా అగ్నిహోత్రుడు ప్రీ రూపమున బయలుదేరి లోకము లన్నియు వెదకెను కాని, ఎక్కడను, ఇంద్రుని జాడ అతనికి తెలియలేదు! యింటికి వచ్చి దీనముగా “అయ్యా, నేను శక్తికొలది వెదకితిని కాని, యెక్కడ నాతని జాడ జెలియ రాలేదు. ఒక్కటున్నది, నేను నీటిలో వెదుకజాలను కదా అందుచే అక్కడ మాత్రము వెదుకలేదు. ఎక్కడయినను నీటిలో నుండునేమో? అనుకొందును” అనెను. అప్పుడు బృహస్పతి నీవు సకల జగద్‌వ్యాయప్తివి నీకు చేరరాని చోటున్నదా? జన్మస్థానమని నీట నీ ప్రభావము చెల్లదంటివి అయినను నేను బ్రహ్మమంత్రములతో నీకు త్తీజము కలిగింతును. నీకెందుకను అడ్డుండదు. వెళ్ళుము నీళ్ళలోకూడ వెదకుము అని పంపెను. బృహస్పతి యొక్క మంత్ర ప్రభావంతో నీళ్ళలొ దిగినను బాధలేక సరస్సులు, దిగుడుబావులు, నదులు, సముద్రములు తెగవెదకెను, కడకు ఇంద్రుడున్న సరస్సు చేరెను. అందున్న ఇంద్రుని చూచివచ్చినను సంతోషంతో గిరుక్కున ఇంటికి వచ్చి గురువునకా విషయమును తెల్పెను. ఇదివరలో శచీదేవి చూచివచ్చినను మరల నా చోటు స్పూర్తి లేకుండ పోయింది. అగ్ని తన బుద్దొ బలమున చూచెనుకాన చెప్పగలిగినాడు. ॥ అప్పుడతని వెంట దేవతలు, బృహస్పతియు బయలు దేరిరి అందరును కలిస కొలను దరికేగి ఇంద్రుని నావ్వానించిరి. అతడు తన మరుగువారికి తెలిసిపోయినదని విచారించుచుండెను. అంతట గురువు “ఇంద్రా, నీకు మహామహిమకలదు. దానినంతను మరచియు౮డుట ధర్మముకాదు రమ్ము! దేవేంద్ర పదవి సలంకరింపుము” అనెన్స, ఇంద్రుడు “గురూత్తమా! బ్రహ్మహత్యతో తేజస్సంతయు నశించింది. నేనిప్పుడా నహుషుని శెదురు 'నిల్వలేకుంటిని. ఏమి చేయగలను? తమరే కర్తవ్యము నుపదేశింపుడు అని ప్రార్ధించెను, అంతట గురుడు “దేవేంద్రా బ్రహ్మహత్య నీకెందుకు వచ్చింది! అందు కొంతభాగం శ్రీహరిదే. అతడేకదా కారకుడు. నీ పాలు మేమశ్వమేధ యాగము చేసి తగ్గించితిమి కదా అదిగాక నహుషుని దుర్మార్గములతో అతని తేజన్సణగి పోవుచున్నది. ఇక నీవు జంకనవసరముండదు” అనెను. ఇంతలో అక్కడికి తక్కిన లోకపాలకులు వచ్చిరి వారిని అమరావతిలోని విశేషము లేమిటో చెప్పుమనెను వారిట్లు చెప్పిరి అచట “సహుషుడు పదవీభ్రష్పుడైనాడు” అనిరి “ఆం ఆం నిజమా! పరిహాసమున కనుచున్నారా? అతడు పదవీచ్యుతు డాయెనా ఎట్లు? ఏల అట్లు కావలసివచ్చెను ఏదీ సవి స్తరముగా చెప్పుడు” అని ఆశ్చర్య సంతోషములతో ఇంద్రుడడిగెను వారు చెప్పసాగిరి. నళ

జాలా మసహాభారతనీతి కథలు-/ లాలా

“నహుషుడు తమ దేవిని అనుచు మధ్యలో అపిరి. అది అనక్షూడని మాటకదా అని ఇంద్రుడు “దానికేమిలెండు వింటి నా చరిత్రనంతను చెప్పుము. భయము లేదు” అనెను. వారు “అతడు తమ దేవిని కోరి ఆమెకు హితవుగా సప్తర్డులు మోయునట్టి పల్లకి పై నగరమెల్ల”డల నూరేగుచుండెను” “అవును ఇంతవరకు నేనెరిగినదే తరువాత ఏమి జరిగినది?” అని ఇంద్రుడడిగెను.

“తరువాత నొకనాడతడు పల్గకిలో తిరుగుచుండగా మునులు బ్రాహ్మణులకు మంత్రములు - గోసంప్రోక్షణకు చెప్పబడినవి. అవి మిక్కిలి ప్రమాణములైనవి అనిరి దాని కొప్పుకొనక నహుషుడు “అ మంత్రములు ప్రమాణము కాధు” అనెను. అప్పుడగస్త్యుడు “పూర్వర్పులందరును గౌరవించిన మంత్రములే నీకు ప్రమాణములు కావా?” అని వాదించెను. దానితో కోపించి నహుషుడు కన్నుగానక అగస్త్యుని నెత్తిమీద తన్నెను.

దానితో అగన్య్యునికి కోపం వచ్చింది. “ఓర్‌! దుర్మార్గుడా! నీకెంతపోగరు వచ్చిందిరా? నీ పాపము పండింది. నిన్నింతవరకు తెచ్చుట మాది తప్పుకాని. నీదికాదు. మొదటనే నిన్నధిఃకరించవలసింది. శచీదేవి కావలసి వచ్చిందే! దానికై మునులు పల్లకి - మోయవలసి వచ్చిరా? మాతో నీకు వాదోపవాదములా మంత్రములే ప్రమాణములు కాని నీకు - స్వర్గమునకు నెంత దూరము? పొమ్ము భూమిలో చిరకాలం కొండచిలువవై పడియుండుము” " అని శపించెను.

సహుషుని పాగరంతయు అ క్షణములో అంతరించి పోయినది తాను చేసినదంతయును తప్పని ఇప్పుడు తెలిసి వచ్చింది. ఇక పశ్చాత్తాపం వలన ప్రయోజన మేమున్నది? అయిందేదో అయిపోయింది. తనకిక స్వర్గ రాజ్యములేదు. చేజేతులా జారవిడుచుకున్నాడా స్వర్గరాజ్యమును. ఇక నది లభింపదు సరికదా తనకున్న ఇదివరకటి సుఖము కూడా పోయింది. నేలమీద నడుచువాడు జారినచో పెద్దగా దెబ్బ తగలదు. అదే గోపురమెక్కి జారినచో ఆ పతనమునకు నిష్కృతి యుండదు. ఇప్పుడిక వారు తప్ప దిక్కెవరను లేరు అని పరిపరి విధముల చింతించెను. అంతలో పడిపోవు చున్నాడు.

  • అగస్త్యుని పాదములపైబడి “మహాత్మా! మునీంద్రా నీ పాదములాశ్రయించితిని. తప్పు చేసితిని. కన్ను కానీలేక పోయితిని. క్షమింవుడు. మన్నింపుడు, నాకు శాపావసానం ప్రసాదింవుడు" అని కోరెను, అగస్త్యుని మనస్సు కరిగింది. అతడు మహర్షి కోపము వచ్చెనా వారిముందు లోకము లాగవు దయవచ్చెనా వారి మనస్సు నవనీతం వంటిది. లోకం లన్నింటి నుద్ధరింపగలరు వారికి కోపము రానేరాదు వచ్చినను క్షణంలో పోవును. కాలిపై పడినవారిపై వారికట్లే అనుగ్రహము కలుగును. లా

వవవావావావాయావావా మువాభారత నీతి కధలు - వాలా

  • “రాజా! నీకు శాపావసానం కలుగును. నీ వంశంలో మున్ముందు ద్వాపరాంతమున ధర్మదేవత అంశమున ధర్మరాజు పుట్టును. అతనితోడి సంభాషణతో నీకు శాపవిముక్తి కల్లును అని ఆనుగ్రహించెను. “అయ్యా! నాకు పూర్వజన్మ జ్ఞానము కల్గునట్టును ఎట్టి బలం కలిగిన (ప్రాణులు వచ్చినను నన్ను చేరుసరికి బలహీనములగునట్టును వరం 'ప్రసాదింపు"మనెను. అగన్వుడబ్లేయని కరుణించెను. ఆ రీతిగా నహుషుడు పదవీ భ్రష్టుడై భూలోకమున శేగెను. “నీవిక నిర్భయముగా రావచ్చును” అనిరి.

“ఇంద్రుడు బ్రహ్మానందంతో స్వర్గమునకు వచ్చెను. దేవతలాతనికి స్వాగతమిచ్చిరి. అమరావతీ నగరమెల్ల ఉత్సాహోత్సవములతో జయజయ ధ్వానములతో మారు(మైోగిను. ఇంద్రుడు మరల-బృహస్పతికి అనుగ్రహంచే ఇంద్ర పదవిని స్వీకరించి దేవతల కానందం కలిగించెను.

ఇక పతితుడయిన నహుషుని పరిస్థితి - అదఃపతనమయిన వానికి సుఖమేమున్నది? (ప్రతి దినమును తననోటిముందునకు వచ్చిన ఆహారంను తినుచు, పూర్వజన్మజ్ఞానమున్నను అసహ్యించుకొనుచు, దినములు లెక్కించు కొనుచుండెను. ఎన్నాళ్ళకు తరుగునా యుగ సంవత్సరములు? పాపం శచీదేవిని కోరిన నహుషునికి కొండ చిలువ యోగం పట్టినది. ఎవరి కర్మంను నెవరు తప్పించగలరు?

,. ధర్మ రాజాదులు అరణ్యవాసము చేయుచుండిరి. అందొకనాడు భీముడు వేటకై అడవి కేగెను. అచ్చట ఒక చోట పెద్ద కొండచిలువ అతన్ని పట్టినది. అతడు పదివేల యేమగులు బలము కలవాడు! 'సామాన్యుడు కాడు. అయిన నేమి? కాలమట్లు వచ్చినపుడతని పౌరుషం పనీకి రాలేదు. చిన్న పిల్లవానివలె ఆ పామునకు లొంగిపోయెను.

అపుడతనేకి తోచినది - “ఇదేదో సామాన్యమైన పాము కాదు అద్భుతంగా వున్నది" ' అని అప్పుడాపాముతో “అయ్యా! నీ వెవరవో దివ్యపురుషుడవు, కాకున్నచో నన్ను పట్టలేవు. నేను పాండవులలో ధెండవవాడినయిన భీముడను. నాతోయుద్ధం చేయుటకు యక్షరాక్షస వీరులలో నెవ్వరున్ను చాలరు. కాన నీవెవరవో చెప్పుడు?” అని కోరెను.

. అతడు పామైనను వరప్రసాదం వలన పూర్వస్వాతి కలిగి యుండుటచే తాను నహుషుడుననియు, మునిశాపంవలన అట్టు పాము నైతిననియు చెప్పి, “ప్రశ్నలకు జవాబు చెప్పగలిగినచో నిన్ను వదలుదును. లేకున్న ఇట్టే మింగి వేయుదును” అనెను.

అదివిని. భీముడు “అయ్యా! దైవసంఘటనను పురుషాకొరము మించజాలదు. నేను మహాబలుడవైనను నీజే పట్టు పడితిని కదా, రాజ్యం పోయి అడవుల పాలయిన మా అన్న తమ్ములు నన్నుగానక ఇప్పటి కెంత బాధపడుచుందురో?” అని వారించెను. 58

లాలా మహూరతనటీతి కథలు -/ లాలా

ఇంతలో ధర్మరాజు, భీముడు వెళ్ళి చాలసేపైనను రాకుండుటచే కారణమేమో అని మనస్సుతత్తరపడి అడవిలో వెదకుటకు బయలుదేరెను. అదృష్టవశాత్తు అచ్చటికి వచ్చి ధర్మరాజు పాము నోటిలో నన్ను భీముని చూచెను. “ఆ ఆ(1 ఏమినా తమ్ముడే? భీముడే? ఇట్టున్న వాడేల? అతని బలమంతయు నేమైపోయింది? అని విచారించుచు దగ్గరకు చేరి! “అయ్యా! నీ వెవరవో దివ్వుడవు సామాన్యమైన పాము నా తమ్ముని పట్టజ్ఞాలదు. నీకు నిజముగా ఆకలి మాత్రమే తీరవలెనన్నచో కావలసినంత మృగముల మాంసము నిత్తును ఇతనిని వదలుము” అని ప్రార్థించెను.

అంతట అ పాము తన నిజరూపము చెప్పి “ధర్మ రాజా! నీవు నాకు శాపవిముక్తి చేయగలవు. అది అగస్త్య మహర్షి చెప్పినదే! అయినను నా నియమము ప్రకారం నా ప్రశ్నల

కుత్తరములిమ్ము” అనెను. ధర్మరాజు వెంటనే అంగీకరించలేదు, “మహాశయా! నేను

చెప్పగలనని గట్టిగా చెప్పలేను. అడిగెడివారికి చెప్పెడివారు లోకువ కదా ఒకవేళ నేను చెప్పలేని ప్రశ్చలని నడగవచ్చును అయినను యధాశక్తి ప్రయత్నింతును"” అనెను.

అతని వినయమునకు సంతోషించి నహుషుడు ప్రశ్నల నడిగెను.

ప్రశ్న : బ్రాహ్మణుడెవడు? అతనికి తలియవలసినదేది?

జవాబు ; సత్యము, దమము, క్షమ, శౌచము, తపస్సు, దానము, శీలము కలవాడు. బ్రాహ్మణుడు. సుఖదుఃఖములకైై భ్రాంతి'చెందకపోవుటయే యతని కర్తవ్యము.

ప్రశ్చ : ఆట్టయినచో నీవు చెప్పిన గుణములు శూద్రుని యందున్నను అతడు బాహ్మణుడగునా కాడు?

జవాబు : ప్రమాదవశమున సంకరమైనప్పుడు వర్ణ పరీక్షలకై స్వాయంభువమనుపే ధర్మములను చెప్పెను అవి శూద్రునియందున్నచో అతడు సచ్చూద్రుడగును. అవిలేని నొడు బ్రాహ్మణుడు శూద్రుడే యనబడును. ఏ రీతిగా చూచినను నడవడికయే ప్రధానము. ధనము పోయినచో మరల సంపాదించుకొన వచ్చును. కాని నడవడిక చెడినచో ఇక బాగుపరచుకొనలేరు. కావున ధనముకంటే నడవడికను జాగ్రత్తగా చూచుకొనవలెను.

ప్రశ్న : నరుడెంత అప్రియములు పల్కువాడైనను అసత్యము లాడువాడయినను హింసను మాత్రమాచరింపనిచో అతడుత్తమగతులను పాందునందురు. అదెట్లు సంభవించునో చెప్పుము?

జవాబు దానము, ప్రియోక్తి సత్యము, అహింస అను ఈ నాలుగు సమములే అయినను అహింసయే గొప్పది. దానాది పుణ్యకార్యములు చేయుచు అహింసాపరుడయిన

59

చంవవవాలాంవాయిా- ముహాభారత నీతి కథలు = ౯ాలాలాాలాానాకవవువాాలు వాడు దేవమనుష్య తిరగ్యోనులను మూడు రకముల జాతులలో దేవగతిని పొందును. అట్లు చేయనిచో తిర్యగ్యోని యందు జనించును కాన అహింస ప్రదానము.

అ రీతిగా తన ప్రశ్నలకు చక్కగా జవాబులనిచ్చుటితో నహుషుని శాపము తిరినది. ఆతడు దివ్యశరీరమును ధరించి ప్రత్యక్షమై ధర్మజుని కొనియాడెను, ధర్మరాజు నహుషుని అడిగి వేదాంతళాస్త్ర రహస్యమును తెలిసికొని అతని సెలవు తీసుకొని తమ్ముని తోడుకొని యింటికేగిను.

అట్టు శాపవిముక్తుడై నహుషుడు స్వర్గముచేరి దుర్గుణ రహితుడై స్వర్గ సుఖములనుభవించెను. కావున ఎల్లరును ఉద్యోగ గర్వముతో కన్నుమిన్ను గానక ఉత్తములకవమాన మొనరింపదగదు నిర్రవీగదగదు సద్గుణముల వదలరాదు. అన్నట్లునప్పుడే తమకు కలిగిన సంపదలు చిరస్థాయిలు కాగలవు.

నాళం

అయవావావాలుయయంయాయలాయయాంయయయయయలా మువోదారలో నీతి కథలు = / బాలా షట్బ్పక్రవర్తులలో నాకడును, ఇంద్రపదవి నలంకరించిన వాడునునైన నహుషునకు, ప్రియంవదకును “యతి, యయాతి, సంయాతి, ఆయాతి, ఆయతి, ధ్రువుడు” అను ఆరుగురు పిల్లలు పుట్టిరి. అందరు పిల్లలు సమముగానే పుట్టినను వృద్ధి లోనికి వచ్చుటలో భేదమండకపోదు. ఎవరి సుకృతము వారిది పెద్దవాడయినను యతికి పేరు ప్రతిష్టలు లేవు. రెండవ వాడయిన యయాతియే రాజ్యమునకు వచ్చెను. అతడు మహాబలిశాలి. రాజ్యము వీరభోజ్యము కదా. బలవంతులే కాని రాజ్యము ఏలలేరు. బలహీనునకు రాజ్యము వచ్చెనా చిన్నపిల్లవాని చేతిలోని మిరాయిలా వుండును. కాకులెత్తుకొని పోయినట్టు తక్కినవారా రాజ్యమును తన్నుకొని పోవుదురు. అందుచే రాజ్యాధికారమునకు రాగానే తమ బలమెరుకపరచుటకై దిగ్విజయము చేయుదురు. దానికి సూచకముగా అశ్వమేధ యాగములు చేయుదురు. అట్టి యాగములెన్నో చేసినవాడు యయాతి. అతడు మహా ప్రతాపముతో రాజ్యమేలుచుండెను. కచునికథ దేవతలకు గురువు బృహస్పతి. అతడు మహాబుద్ధిశాలి. అతనికొక కొడుకున్నాడు. అతని పేరు కచుడు. అతడు బుద్ధి బలములో తండ్రికి తీసిపోడు. మంచి అండగాడు. దేవతలకే కష్ట - నిష్టూరములు వచ్చినను మంత్రి - గురువువైన బృహస్పతియే చూచుచుండును. అతనిస్థానే కచుడును చూడవచ్చును. కార్యసాఫల్యము చేయుట సామర్ధ్యమును బట్టికదా యుండును. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. అతనికి చండామార్కదులు పుత్రులున్నారు. ఒక్కతియే కూతురున్నది. ఆమె పేరు దేవయాని. మంచి అందగత్తె. యౌవనవతి, ఆమెకు తండ్రి వద్ద గారమెక్కువ. అతని కామె ఎంత చెప్పిన అంత. గీసిన గీటు దాటడు. సంతానమందు మక్కువున్నప్పుడొక్కొక్కరి మీద అట్టి ప్రేమ కుదురును. ఎందుకు కుదురునన్నది మనము చెప్పలేము, అదొక రుణానుబంధము. దేవదానవులు ఒకే తండ్రి సంతానము కాని, తల్టులు మాత్రమే వేరు, అనగా సవతి తల్లుల బిడ్డలన్నమాట! అదేమి పుణ్యమో వారికెప్పుడును బద్ధవైరమే! ఎవరైనను రాక్షసులను ఈ నా

అడవి ముహభారత నీతి కథలు = / లాలా ద్వేషించుచున్నే యుందురు వారు దుర్మార్గులు. న్యాయమును వారు నేర్చుకొనలేదు. ఆ చెడుపనుల వలననే వారినెవరును గౌరవింపరు. అందరును దేవతల పక్షమునే వహింతురు పాపము! దేవతలు బలం తక్కువవారు. అయిననేమి? వారి పక్షమున విష్ణువున్నాడు అతని సాయమున ఎన్ని యుద్ధములైనను తేలికగా విజయము దేవతలకే లభించుచుండెను దానితో రాక్షసులకు కష్టము తోచినది వారికివరు సహాయుమ చేయుదురు. ఎందుకో దేవతలలో ఈశ్వరుడు, బ్రహ్మ అనిన రాక్షసుల కిష్టము, ఎప్పుడైనను వారిద్దరిని గూర్చియే తపస్సు చేసి వరములు పుచ్చు కొందురు అంతకంటెను అందరికిని ఉపయోగించునది కానశుగ్రాచార్యుని శరణు వేడిరి. అతడు “నేనేమి చేయవలెనో చెప్పుడు? నా అభ్యంతరము లేదు! నా శక్తికొలది ప్రయత్సింతును” అనెను. సమర్శడైన అతడు ప్రీతి పొందినప్పుడే కోరవలెనని “మాకు దేవతల తోడి యుద్ధములలో చాన్సు హెచ్చుగా నున్నది. తమరు సంజీవినీ విద్యను సాధించినచో మాకు విపత్తుండదు దేవతలు అమృతము త్రాగివేసిరి. ఆ బలముతో వారు మా కసాద్యులై యున్నారు. మీరు మాకై సంజీవిని సాధింపవలెను” అని కోరిరి. శుక్రాచార్యుడు ఘోరతపమాచరించి మృత సంజీవనీ విద్యను సాధించెను. ఆ విద్యా ప్రభావము వలన యుద్ధంలో చనిపోయినవారి నందరిని బ్రతికించుచుండెను, దేవతల కది విచారణ కారణమై యున్నది. చావు సిద్ధమై గట్టెక్కినట్లుగా ఒక్క రాక్షసుని చంపి నిలుచుండగా మరల వాడు బ్రతికి యుద్ధమునకు సిద్ధమగుచునాడు ఇక నెట్టు బాధపడుదురు. వారెంత కష్టపడినను రాక్షసబాధ వారికి తగ్గునట్లు కనపడలేదు. దేవతలు ఇందరును కలిసి యుపాయ మాలోచించిరి? తమ వద్ద అమృత మున్నదని ధైర్యమే! రాజులకు కావలసినది తమకుండుటయే కాదు, శత్రువులకు లేకుండుటయే శత్రువులకు లేకుండ తమకు కలిగినప్పుడే విశేషము కాని, తమకు శత్రువులకును సమముగా నున్నచో విశేషమేమున్నది! ఏ రీతిగానైనను మృత సంజీవనీ ఎద్యను తేవలెను. తెచ్చుటలో మరల అతనికి లేకుండ చేయుట ప్రధానము. మిత్రులైనచో సాధించవచ్చును కాని, శత్రువుల వద్ద కేగి వారిదగ్గర నున్న దాని నపహరించుట యెట్లు? అందులోను ఇదేమైన ఎదురుగా కనిపించు వస్తువా? లోపల దాగియు౦డు విద్య. అందును చాల ప్రధానమైనది. అది ఆయన అనుగ్రహము లేనిదే రానే రాదుకదా! అది ఏ రీతిగా సాధింప వీలుపడును? అన్నది అందరూ సమావేశమై విచారణలు సల్నిరి వనాని లా

నాలంనవావాంాంయయాలా.జయంం మువోభారత నీతి కథలు -/ నాకాను.

కచుడు వారి దృష్టిలో పడినాడు. అతనివద్ద విద్యాగ్రహణ విద్య యున్నది. ఆ విద్యా ప్రభావమున అతడితరుల వద్దనున్న విద్యను గ్రహింపగలడు. కాని ఆ విద్య పైకి వచ్చి యుండవలెను. అట్టి సమయము దొరుకుట కూడ కొంచెము కష్టమే! అయినను దాని కనువగునట్టు యుక్తి పన్నవలెను. ఆ విధానమున తను చెప్పి ప్రోత్సహించుటకై వారా కచుని వద్ద కేగిరి.

అతడు చిన్నవాడు; వయస్సు, అందము, చదువు, ప్రజ్ఞ కలవాడు. అతనిని

దేవతలు పాగడిరి. అతడు “నన్ననవసరముగా పొగడనక్కరలేదు. మీరు వచ్చినపనేదో చెప్పు” డనెను. “మాకు మంచి ఉపకారము నీవు చేయవలసి యున్నది. మరెట్లు సాధింతువో?” అనిరి. “అదేదో తెలియకుండ నేనెట్లు మాటనియ్యగలను?” అన్ని అతడనుటతో దేవతలు “నీవు శుక్రాచార్యుని వద్ద.కేగి మృత సంజీవనీ విద్యను తేవలెను. అప్పుడు కాని మనకు సుఖము కల్గదు. ఇది నీవు తప్ప మరెవ్వరును సాధింపలేరు” అనిరి...

“బాగుగానే యున్నది. శుక్రాచార్యునికీ విషయము తెలిసినచో నన్ను బ్రతుకనిచ్చునా? ఆపైన అక్కడి రాక్షసులు దరిచేరనిత్తురా?”

“దానికి తగిన యుపాయము మేము చెప్పుదుముగా! నీవు చిన్నవాడవు. చదువు నేర్చుకొనుటకై వెళ్ళినట్టుగా అక్కడి కేగవచ్చును.”

“అంతమాత్రమున మీకేమి లాభము?”

“అతనికి దేవయాని యను కూతురున్నది. ఆమె అతని (ప్రాణము. నీ వామెను సేవలు చేసి మెప్పించవలయును”

“నా శక్తి కొలది చేయుదును. తరువాత.”

“అప్పుడామె ద్వారా నీపై (ప్రేమ కుదిరిన శక్రుని నుండి సంజీవని విద్యను పరిగ్రహింపవలెను. ఏ రీతిగా సాధింతువో? నీవు తప్పక మాకై' శ్రమపడవలెను” అని ప్రార్థించిరి. అందరు వచ్చి బ్రతిమాలునప్పుడు కాదనలేక అతడంగీకరించి శుక్రాచార్యుని యింటికి ప్రయాణమై వెళ్ళాడు.

వృషపర్వుడు రాక్షసరాజు. అతనికి శర్మష్టయను కూతురున్నది. ఆమె రూపసి, వినయవిధేయతలు కలదియు, అతడు తన సేనల కెప్పుడును అపజయము రాకుండుటకై శుక్రాచార్యుని తన పట్టణముననే యుంచుకొన్నెను. వారికి కావలసిన సేవలు చేయుచుండెను. అతని మీద శుక్రుని కెక్కువ ప్రీతికలదు. అందుచే 'ఆతని కోర్కెను మన్నించిను. డాటా

అవాజజయయాంయాలాలలాలాం ముహోఖారత నీతి కథలు = ౯ అక్కడకు కచుడు వచ్చెను. శుక్రాచార్యు డింటిలోనే యున్నాడు. అతని పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి కచుడు “అయ్యా! నేను బృహస్పతి కొడుకును. నా పేరు కచుడు. తమ వద్ద శిష్యత్వము చేయదలచి వచ్చితిని. విద్యాభ్యాసము చేసికొనుటకు తమ రంగీకరింపవలెను. నన్ను దయ జూడుడు” అని ప్రార్ధించెను. అతనిని చూచుటతో శుక్రునికి దయగలిగినది. రూపము, మాట, వినయము ఒకదానికొకటి వన్నె తచ్చుభున్నది. అతడన్న మాటను కదనుటకు మనస్సాప్పుటలేదు అట్టు వినయము కలవారికిగాని చదువులు రావు శుక్రాచార్యుడు కచునికి చేసిన గౌరవము బృహస్పతికి చేసినట్లే అని అతని కెక్కువ గౌరవమర్యాదలు చేసెను. ఎవరి పక్షము వారికి గౌరవము చేసిన అది వారికి చేసినట్లే కదా! వారి పేరును బట్టియే కదా, మరి వీరికి గౌరవము చేయుట! దానికి తగినట్లివతలవారు కూడా నడచుకొనవలెను అప్పుడు కాని అసలు చేయబుద్ది వేయదు. కచుడు గురుకులవాస మారంభించెను. అతడు నూనూగు మీసాల నూతన యౌవనమున నున్నాడు. కాని వినయమింతింతనరాకుండ నున్నది. గురువుగారు కాని, ఆయన కూతుర్లు కాని యెప్పుడే పని చెప్పినను “మరల చేయుడు” ననక వెంటనే చక్కబెట్టువాడు. అంతేకాదు, ఏ క్షణమున కేది గురువున కవసరమైన పనియో గుర్తుంచుకొని కనుసన్న యెరిగి కార్యనిర్వహణ చేయువాడు “అయ్యో! ఇంత అలసినప్పుడు పని చెప్పునే?” అని కాని విసుగు - కసుగు లెరుగడు, తలవంచుకొని పనిచేయుటయే అతని కర్తవ్యము. గురువు గారి కంటె ఎక్కువ శ్రద్ధీతో దేవయానికి సేవ చేయుచుండెను. అది చాలా ప్రధానమైనది ఆమె మనస్సున కతడునచ్చెనా అతని పని వెంటనే సాధ్యమగును. ఆమెకు హితవుగా ఉప్పన + చప్పున కబుర్లు కాలక్షేపమునకై చెప్పువాడు కోరిన పువ్వులు కోసి తెచ్చియిచ్చువాడు. ఆమె కోరనక్కరలేదు ఆడవిలో పూసిన రంగురంగుల పూలు తెచ్చి ఆమెకు హితవుగా కోసి యిచ్చువాడు. అడుపిల్లలకు కావలసినవి పూలుపండ్లే అంతకంటె అతడామెకు చేయు సేవలేమున్నవి? వారికేమైన లోటా? లేదా పోదా? ఏదో శిష్యుడు గావున పని చేయువాడు. ఆ పనులయినను వారు పురమా యించనక్కరలేదు తనకు తానే పని కల్పించుకొని అవసరమెరిగి చేసి వన్నెతెచ్చుకొనువాడు. అవసరమైన పనులను బందను పడిన గాడిదవలె చేసి వళ్ళు అలయబెట్టుకొనుటయే కాని మెప్పును పొందలేరు. పనిచేయుటలో కూడ మెర్తుగులున్నవి. అతడన్నియు నెరుగును వారికి నచ్చునట్లు చేసి తన్ను మెచ్చుకొనునప్పుడు చిరునవ్వుతో తలవంచుకొని యుండువాడు. 64

లాలా నుహాభారతనీతి కధలు -/ లారా

ఇట్లు కొన్నెళ్ళు గడిచినవి అతడు శుక్రునికి ప్రియశిష్యుడైనాడు. ఏ క్షనమాతడు కన్నడకపోయినను ఏదో పెద్ద లోటున్నట్టు భావించువాడా శుక్రుడు

కచుడు తెలివైనవాడు, దేవయాని కెక్కువ మక్కువ కనబరచువాడు. అతడును పిన్న వయసువాడు ఆమెయు సరి యీడుది. చక్కగా ఆమెతోపాటు కూర్చుండి కబుర్లు చెప్పువాడు. దర్శన స్పర్శనాదులతో ఆమె నలయించువాడు.

కచుడు “ఇదిగో ఈ పువ్వు చూచితివా ఎంత బాగున్నదో” అనుటతో ఆమె “ఆ! మరే, నాకు కోసియిమ్ము” అని కోరునది. అట్టామెకు మెల్లగా కోరికలు పుట్టించి రెచ్చగొట్టి పువ్వులు అందముగా కట్టి అమెకు జడలో పెట్టువాడు అతని చెయ్యి తగులుటతో ఆమెకేదో చెప్పరాని ఆనందము కల్లెడిది. ఆ యానందము కనధిలేదు. ఎంత సేపైనను విసుగులేదు. అతని చూచిన చాలును. ఆమెకు కడుపు నిండెడిది: ఆమెపై తన కంత గ్రేమ నిజముగా లేకున్నను, ఉన్నట్టు నటించువాడు. అతడు కర్యాసాదనకై వచ్చినవాడు ఆమెకా విషయ మెన్నడును చెప్పలేదు. చెప్పినచో రహస్య భంగమగును గదా! ఏదో లభించుచున్నదికదా అని ఆడువారి ప్రేమ దృష్టులలో పడినచో కార్యభంగమగును. బుద్ధిమంతుడెనడనట్లు చేయడు.

కచుడు హోమధేనువుల నడవికి తోలుకొనిపోయి మేపువాడు, సాయంకాల మగుసరికి వాటికి కడుపార మేత పెట్టి ఇంటికి తోలుకొని వచ్చువాడు, ఎక్కడ పచ్చగడ్డి పరకలు కనపడినను జాగ్రత్తగా చేతితో తెంపి ఆ యావులకు పెట్టువాడు అంత శ్రద్ధగా మేపుటచే అతని మీద గురున కనుగ్రహము కలిగినది.

రాక్షసులు బహ్దుమాయలు కలవారు. వారు మాత్రమెంత తెలివితక్కువ వారయినను శత్రువు వచ్చి తమ గురువునింటిలో నుండెనన్న ఎందులకో అని అనుమానింపరా? అది గాక శత్రుపుత్రునిపై వారికేమి (ప్రేమ? ఎట్టు కలుగును? వారికెంతో కష్టముగా నున్నది.

ఒకనాడు సందు చూచుకొని వారందరును కూడి పలుకుకొని అడవికేగిరి. అక్కడ ఆవులను మేపుచున్నాడ్డు కచుడొంటరిగా. అతన్ని చూచి వారి కసితీర వానిని చంపి చెట్టునకు కట్టివేసిరి. వారి దారినవారు వెళ్ళిపోయిరి.

సాయంకాలమయినది పిట్టలు గూటికి చేరుకున్నవి. ఆవులు కూడా ఇళ్ళకు వచ్చినవి. దూడలకు పుష్కలముగా పాలనిచ్చినవి. చీకటి పడినది. కాని కచుడు మాత్రమింటికి

' రాలేదు. దేవయాని అడవి దారి చూచుచునేయున్నది.

నానారకాల

ఆ భువభారతనతికథలు-

ఆమె కేమియు తోచుటలేదు. ఎంతో మదనపడినది కొట్టుమిట్టాడినది. ఆవులింటికి వచ్చినను కచుడు రాలేదు. ఎంత వెనుకపడినను ఈ పాటికి రావచ్చునే? రాకపోవుటకు కారణమేమై యుండును? తన్ను పరీక్షించుటకై అట్లు ఆలపించెనా? కాదు అతడట్లెన్నడును చేసి యెరుగుడు. ఎంత సొమ్యము ఎంత వినయము అతని ముఖము చూడర్సుచో ఒక్క క్షణమైనను తనకు తోచదు. ఆ దినము దుర్దినమే? ఆనాడు చంద్రుడు లేని రాత్రివలెనే యున్నది. కాలుకాలిన పిల్లివలె ఇంటిలోనికి వీధిలోనికి తెగ తిరిగినది. అబ్బే! అతని జొడలేదు.

ఏదో మోనము జరిగినది. రాక్షసులు మాయలాండ్రు వారిని నమ్ముటకు వీలులేదు. కేవలము వారిని మాత్ర మన నేల? అడవికి వెళ్ళెను కదా కచుడు! అచట ఏ మృగములు అతనిని తమ పొట్టన పెట్టకొన్నవో పాములేమైనా కరువ లేదు కదా! అబ్బ ఎన్ని వికల్పములు జవాబిచ్చువారెవరు? బ్రతికి యున్నచో ఇంత ప్రొద్దు పోవు వరకు రాకుండునా ఏదో ఘోరము జరిగినది - అని నిశ్చయించుకున్నదా దేవయాని.

ఇంటిలో తన కొక్కదానికి కాలు నిలువలేదు తండ్రి వద్దకు పరుగెత్తుకొని వెళ్ళినది. శుగ్రాచార్యుడామె కంగారు చూచిన్నాడు “ఏమ్మా అమ్మాయీ! అంత కంగారు పడుచుంటివేమి? ఏమి బాధ కల్గినది? నాకు చెప్పరాదా? అంత బాధ ఎందులకమ్మా?” అని బుజ్ఞగించుచు అడిగినాడు.

“నాన్నా! అతడు ఇంకను ఇంటికి రాలేదు. నాకేమియు తోచుటలేదు. ప్రొద్దు గ్రుంకి చాల సేపయినది. ఆవులు సెందల కడనే వచ్చి వేసినవి. వేళకు వచ్చి అవి దూడలకు, మనకును పాలిచ్చినవి. అగ్నిహ్వత్ర విధానములు పూర్తియైనవి. అన్నియు బాగుగనే జరిగినవి. కాని, కచుడు మాత్రమింత సేపైనను రాలేదు. మరే క్రూర మృగములైన (మింగినవో? ఏ పాములైన కరచీనవో? రాక్షసబాధయే కల్గెనో? ఆ ఘోరారణ్యమునకు పోవును. చెప్పినను వీనడు. తండ్రీ! చూడుము! దివ్యదృష్టి కలవాడవు, నీకు తెలియని దేమున్నది?” అని ప్రార్థించినది. ప్రేమ ఆంత చేయును.

ఆమె మీది మమకారముతో తనకు కేవలము అంతగా కచునిపై గ్రేమ లేకున్నను, కూతురి నూరడించుటకై దివ్య దృష్టితో చూచెను, ఆక్కడ రాక్షసులు చంపిన కచుడగపడినాడు. “అమ్మా! నీ వన్నంతయు జరిగినది. రాక్షసుఆతనిని చంపివేసిరి” అనుటతో ఆమె “ఆం చంపివేసీరా? అయ్యో! అతడు వారికే మపకారము చేసినాడు? అంత నిష్కారణ వైరమా?

నాన్నా! రక్షింపుము! అతన్ని రక్షింపుము! ఆతడును నీ శిష్యుడే కదా!” అని కాళ్ళ వ్రేళ్ళపడి ననన ననన ననన

జాంాా మనోఖారతనీతి కథలు -/ లాలా బ్రతిమాలినది ఆమె. మనస్సు కరిగి వెంటనే తనవద్దనున్న విద్యను తలచుకొనెను. విద్య మూర్తీభవించి యెదురుగా వచ్చి నమస్కరించినది. “సెలవేమో చెప్పు” మని జరిగినది. శుర్రుడు “నీవు వెంటనే వేళ్ళి అడవిలో చచ్చియున్న కచుని తోడ్కొనిరమ్ము అని పంపెను.

ఆ విద్య వెళ్ళి కచుని బ్రతికించి కట్టువిప్పి తీసికొని వచ్చినది. అతడా రీతిగా బ్రతుకు గల్గినందుల కెంతయో సంతోషించెను. ఇంటికి రాగానే గురువుగారికి పాదాభివందనము చేసినాడు. శుక్రుడతనిని దీవించెను. దేవయాని మొగమంత కన్నులు చేసికొని “వచ్చితివా?' " అని ప్రీతిపూర్వకముగా-పల్కరించినది. అతడు చిర్నగవుతో “నీవు తలచుకొన్నచో నాకేమి (ప్రమాదము రాగలదు!” అనుచు ఆమె. చేసిన ఉపకారమునకు కృతజ్ఞత చూపెను. బుద్ధిమంతునకు చూడని విషయములు కూడ చాల తేలికగా తెలియును. ఆమె మనస్తత్వ మాతని కర్థమయినది. ఆమె బలవంతముపై గాని గురువంతటి పనికి పూనుకొనడని అతడెరుగును. అందుచే ఆమె (్రేమకు కృతజ్ఞతాభివందనము చేసి మెప్పంచెను.

“శ్రేయాంసి బహువిఘ్నాని” (మంచి కెన్నియో విఘ్నములు) అని సూక్తి. కచుడొకసారి చచ్చి బ్రతికినాడు. అంతటితో చావలేదని రాక్షసుల కాతనిపై పగ యెక్కువైనది వారి బెంగ వారిది మరి అతడు వచ్చినది అందుకోసమే కదా! ఎవరి పనిలో వారు, జాగ్రత్తగా నుందురు. అయినను ప్రమాదము రాక తప్పదు. అది దైవఘటన. ఆ ఘటన ఘటనాచతురుడొక్క. దైవము మాత్రేమే కదా! కచుడు మామూలుగా అడవికి వెళ్ళినాడు. అతడు గోవుల మేపుటకు కాదు వెళ్ళినది, దేవయాని పువ్వులు కోసికొని రమ్మని పంపినది. అతడెప్పుడయిన ఒకవేళ తప్పిజారి శక్రుని మాటనయినా కదని జాగుసేయునేమో కాని అమె మాటను మాత్రమెన్నడును కాదనలేదు. అందుచేతనే ఆమె కాతని గ్రేమ బలమైనది. అది ఆమెలో నున్నదే కాని, యెన్నడును వ్యక్తము చేయలేదు. ఆడవారు వారి'ప్రేమనంత తేలికగా పైకి చెప్పుదురా? గ్రహించవలెనంతే.

సమయము దొరికినది రాక్షసులకు ఈసారి చంపి వదలదలచలేదు. శుక్రుడొకసారి 'బ్రతికించెనుగదా! ఎన్నిసార్ల్ణయిను బ్రతికించును అతనికేమి? కాని ఖర్చులేదాయె. అందులకై వారు గట్టిగా ఆలోచించి అతనిని చిత్రవధ చేసిరి. ఆ పైన శుభ్రముగా బూడిద యగునట్టు తగులబెట్టిరి. ఆ బూడిద నా రోజున శుక్రాచార్యుడు త్రాగెడు కల్లులో కలిపిరి. అతడు తాగివేసెను కల్టులో కలిపిన బూడీద నతడేమి గుర్తింపగలడు?

కొంత దివ్యదృష్టి కలవాడు కదా శుక్రుడు! అతని కేల తిలియకుండును?” అని ప్రశ్నించవచ్చును. కాని దివ్యదృష్టికూడ ఉపయోగించుకొనక పోయినచో ఎల్లప్పుడును అపపడ

అంటా ముహాహారత నీతి కధలు - [లాలా కనబడు చుండదు. ఉపయోగించుకొనకపోయినచో పరికరమున్నంత మాత్రాన పని "జరిగిపోవునా? “అమ్మయ్య! ఈ దెబ్బతో శని వదిలినది. ఇక కచుడు మరల బ్రతకలేడు. పీడ తగ్గినది కాక కుర్రవాడు వీడా మన కన్నులు గప్పి సంజీవని విద్యను పట్టుకొని పోవువాడు? కసితీరా చిత్రవధ చేసినాము. ఇక ఆ రూపములో వానిని చూడము. శత్రుశేషము లేదు అనుకొనిరి చారు తమ యుసయోగమునకై తెచ్చుకొన్న విద్య శత్రువునకు వినియోగించినది,* ఎవరికేది అచ్చివచ్చునో మనము చెప్పజాలమ్ము గదా, ఎరికైనను చెడు నలవాటు (దురలవాటు) చెడ్డదే! తప్పు తప్పు కాక ఒప్పగునా? శుణ్రాచార్యునకు సైతము నురాపాన మెంతపని చేసినదో చూడుడు అప్పుడే యేమయినది? ఇంకను ముందున్నది దాని ప్రభావము. దేవయాని యెంతసేవు “కచుడు వచ్చును పూలు తెచ్చును వాటిని తానలంకరించుకొన అతని కింపుగా నుండవచ్చును” అని యెన్నో భావనలు చేసికొన్నది చాలా సేపయినది. అతడింకను తిరిగిరాలేదు. అతడెన్నడునే పన పూర్తిచేయనిదే అతనికి నిద్రపట్టదు. అతడు రానందున ఆమె కేమియును తోచలేదు. అతడు వచ్చు దారివంక తెగ. చూచినది. అమె కన్నులు కాయలు కాచినవి కాని అతని జాడయే మాత్రము చూపెట్టలేదు. అమెకు నిశ్చయమైనది “ఇది కూడా రాక్షస కృత్యమే” అని తాను కన్య ఆపై అబల. ఏమీ చేయగలదు? ఎంతకాలమని అతనిని రక్షించును? నిజముగా తాను రక్షింపగలదా? అతనిమీద పంచప్రాణములు పెట్టుకొని తొనుండగా అతనికే బాధలు వచ్చి పడుచున్నవి ఈరడ్రి కల్లు త్రాగిన మైకములో నున్నాడు. తన మాటను వినిపించుక్షాను పరిస్థితిలో లేడు. తన బాధ అరణ్యరోదనమైనది. తొనొంటరిగా కూర్చుండి కొంతసేపేద్చినది. అప్పటికి తండ్రికి తెలివివచ్చిన దనుకొన్నది, తండ్రి వేద్దకు వచ్చినది. సగము మైకము _ సగము తెలివిగా నున్నాడతడు ఆమె “తండ్రీ! కచుడు నాకు పువ్వులు తెచ్చుటకై యడవి కేగినాడు ౫ “బాగుగనే యున్నది నీవ్సు క్రూడ్రా వెళ్ళుము ” “అదికాదు పృవ్వులకని _ పంపితిన్సి” “బాగున్నది పువ్వులకని - పంపితివి. ఏమి చేసితివి?” “నా నెత్తి చేసితిని. ఇంకను మత్తేనా?” ననన

అరారాావావవామాయాలలాలాలాం నుహాభారత నీతి కధలు -/ లలా

“మత్తుకాదు. నిజమే! వాటితో నా నెత్తినెట్లు చేసితిని?”

“నా కచుడు రాలేదు అన్నాను కాని, నీ నెత్తిలేదు నా నెత్తియును లేదు.”

“ఊ: కచుడా - రాలేదా - అదే దారిన స్వర్గమునకు వెళ్ళియుండును. అంతే! వాళ్ళదదే దారిగా ఇంకేమి?”

“అదేంటి తండ్రీ! అతడు నీకు ప్రియ శిష్యుడు, అంగిరనుని మనుషుడు, బృహస్పతికి సుపుత్రుడు, రూపవంతుడు, బ్రహ్మచర్యాశ్రమ నియమముల చక్కగా పాటించువాడునైన కచుని గూర్చి యిట్టి మాటలా నీ వనదగినవి? అట్టివాడు నిష్కారణముగా రాక్షసులచే చంపబడగా నూరుకొానుచుందునా?”

“నూరుకొనక యేమి చేయుదువు? అతడేదో వారి కపకారము చేసియుండును. లేకున్న ఎందులకట్లు పగసాధింతురు?”

“ఏమియు చేయలేదు అతని శీలమును నేనెరుగుదును చాల మంచివాడు అతని గూర్చి యేమియు అనకుము.”

“నా కెందుకు? ఏమియు అననులే. వెళ్ళుము.”

“ఆ కచుడు వచ్చువరకు నేను మాత్ర మన్నము ముట్టను. నీకు నేను కావలఫినచో అతని జాడ తెలిసికొని తీసికొనరమ్ము, లేకున్న నీకు కూతురుండదు.”

“అమ్మా! నీ వంతటి పట్టుపట్టనేటికి? నీ ముద్దు చెల్లింపకుందునా? నా కూతురువైన నీవు కోరిక తీరక చావలసినంత దుర్గతి యేమి? ఇదిగో ఒక్క క్షణంలో అతడిచ్చటికి వచ్చును చూడుము.”

అని శుక్రాచార్యుడు దివ్యదృష్టిని చూచెను. ఏక్కడ ఉన్నాడు? లోకాలోక పర్వతమధ్యమున పదునాల్గు లోకములలో నెక్కడను అతడు లేడు. మరల గాలించిను. అతనిని రాక్షసులు చంపి బూడిదగా కాల్చినారు, కల్టులో కలిపి తనకిచ్చినారు. అరే ఎంత ప్రమాదము జరిగినది? కల్గెంత పని చేసినది? ఇంత జరుగునని నేననుకొనలేదు.

“ఎన్ని జన్మలలో చేసిన పుణ్యమయినను ఒక్కసారి త్రాగినంతనే నాశనమై పోవును. మర్యాద పోవును. మంచి చెడ్డలను తెలియనియ్యదు. భా! ఛా! ఇంత దుష్టమైనది. మరొకటి లేదు. నా దివ్యజ్ఞానము,' తెలివితేటలు నశించి పోయినవే! కల్లులో కలిసి యిచ్చినంత మాత్రాన నా ప్రియశిష్యుని త్రాగివేసితినే! ఎంత ఘోరము?” అని తనను తాను నిందించుకొనెను. కల్లు త్రాగినందువలన కలుగు దుష్పలితములకు విచారించెను లాలా టాటా

అుయియాకాయయయయాయాంయి గ్ర సషాంరలత నీతి కథలు = / లాం

అంతటితో అతనికి దానిపై కోపము తీరలేదు. తాను బాధపడుట ఉదాహరణముగా ఇంకెవ్వరును దానిని ముట్టరాదనిపించినది. అంతే కదా! ఒక మహాత్ముడు తానేదైనా చెడు పని చేసి భంగపోయినచో ఆ చెడు త్రోవలో ఇంకెవ్వరును పడకుండ కాపాడజూచును, తక్కువవారి కట్టి యుదార భావము ఉండబోదు. కొందరు “ఆయన చేసిన పని మంచిదా?" "అని ప్రశ్నింతురు. మంచిది కాదు కనుకనే అతడది కూడనిదని అందరికిని తలియజెప్పెను. అది అనుభవము మీద చెప్పిన మాట, మనమా మంచి మాటను పాటించినచో బాగుపడుదుము.

అంతేకాదు. ఇది మంచిది కాదు అని ముట్టకుము అన్నంత మాత్రాన అట్లు నడిచెడి ప్రకృతి కాదు జనులది. అందుచే ఆ పని చేసినందున వచ్చు చెడు ఫలితమును చెప్పి యొప్పించవలెను. పుణ్యం - పాపములన్న భయముండుట ప్రతి వానికిని సహజం! జగత్తంతయు నా పుణ్య పాపములతోనే కదా జరుగుచున్నది. అందుచే శుక్రాచార్యుడపడు (బ్రాహ్మణులు మొదలెవ్వరైనా నీ కల్లును త్రాగిరేని మహాపాపం కల్గి అధోగతి పాలగుదురుగాక! ఇదే దీనికి హద్దు కల్సించుచున్నాను. ఈ క్షణము మొదలట్ట్లు కల్గు త్రాగరాదు” అని శపించును. కల్టు త్రాగుట మహాపాపంగా' శాసీంచెను. అప్పటి నుండి అది పంచ మహాపతకములలో నొక్షటైనది.

ఇక్కడికి కల్గుమీద కోపించుటయైనది. ప్రకృత మదికాదుగా, కడుపులో నున్న కచుని బతికించవలెను, అది తప్పనిసరియైన కృత్యము తాన సంజీవనీ విద్యచే అతని బ్రతికించెను.

బూడిదయై పోయిన కచుడు లోపలి నుండియే “ఓ గురోత్తమా! నీ దయ వలన శరీరము, ప్రాణము, బలమును వచ్చినవి. కాని, నేను నీ కడుపులో నుండి యెట్లు బయటి ప్రపంచంలోనికి రాగలను? నాకు బయటికి వచ్చు ఉపాయం చెప్పుడు” అని ప్రార్ధించెను.

శుక్రుని కేదొక పెద్ద సమస్యయైనది. ఆడుదియైనచో భగవంతుడు కల్పించిన ప్రసూతి మార్గముండును. తాను మగవాడాయె, మంటుల నా కచుని బయటికి వెలువరచును? సుదీర్ధముగా ఆలోచించినాడు. మార్గమేమియు దొరకలేదు. తన పొట్ట పగులుటయే మార్గం. అంతకంటె వేరు మార్గమగుషడదు. అట్టయినచో తన ప్రాణము? అందులక్రై అతని కిస్తుడయినను సంజీవని చెప్పక తప్పదు... చాలా క్లిష్ట సమస్యయే వచ్చినది. కచునకు శత్రువులు చేసినపని కార్యసాధన కుపయోగించినది. ఎప్పుడేపని యెందు కుపయోగించునో చెప్పలేము. ఒకప్పుడు మంచిచెడ్డకగును. చెడుమంచికగును. అట్లే కచునకది యుపకరించినది లాలా

ానాసాపటాలా నువాభారతనీతి కథలు -/ లాలా

అంత తప్పనిసరి లేకున్నచో శుక్రుడు చెప్పువాడు కాడు. అప్పుడు కచునకు సంజీవని నుపదేశించి “వెలికి రాగానే నన్ను బ్రతికింపు” మనెను. కచుడు తేలుకడుపు పగిలి తేలు పిల్లలు పుట్టునట్లు, ఉదయగిరి నుండి నిండు చంద్రుడుదయించినట్లు శుక్రుని కడుపు చీల్చుకొని బయటికి వచ్చెను.

బయటికి గురుభక్తి యున్నది. ఉదారుడు కనుకనే ఇవతలికి రాగానే చచ్చిపడియున్న గురుని చూడలేక వెంటనే బ్రతికించెను. దాని మహిమతో శుక్రుడు రెట్టింపు కాంతి కల్గిశోభించెను. అతడు తన విద్య తన కుపయోగించునని యెన్నడు ననుకోలేదు. కాని, ఏ సమయమున కేమి జరుగునో ఏమి చెప్పగలము? అదే ఆశ్చర్యము! గురువు శిష్యుని, శిష్యుడు గురువును అభినందించుకొనిరి.

దేవయానికి కల్గిన ,సంతోషమునకు మేరయేలేదు. అతడు కూడ ఆమెకు ప్ర్రియమగునట్టు ఎన్నో మాటలు చెప్పి ఉత్సాహమును రెట్టింపు చేసెను.

కాలము నడచుచున్నది. దేవయాని కచులు ప్రేమతో మెలగుచుండిరి. ఆ ప్రేమ ఒక్కరికే ఉన్నదికాని యిద్దరికిని వున్నదికాదు. ఆమెయైనను. పైకెన్నడును చెప్పలేదు. అతడామె భావమును కనిపెట్టినను తాను వచ్చిన పనిని మాత్రమే సాధించుకొని పోదలచెను. అందుచే ఆమెను తాను ప్రేమించలేదు. ఇక తాను చూపిన (ప్రేమ సోదరీ ట్రేమ. అన్ని రకములయిన (ప్రేమలునాకే రీతిగా నుండును. మనమర్ధము చేసికొనలేము. దేవయానికి తనకు, తాను చూపిన (ట్రేమమునకది ప్రతిఫలమే అనుకొనుచుండెను. కాని, అతని భావము వేరని అనుకొనలేదు. అందుచేతనే అతని ప్రియము కోరి రెండు సార్లును బ్రతికింపచేసినది. *

ఆరోజున కచునకు ప్రయాణదినము, తానువచ్చిన పని నెరవేరి చాలరోజులైనది కాని, వెంటనే వెళ్ళిపోవుట భావ్యము కాదని, కొన్నాళ్ళపాటు గురుశుత్రూష చేయుచు గురునికి నచ్చియుండెను. తనమీద గురునకు ప్రియము కల్గునట్టు చేసెను. ఆనాడిక తాను వెళ్ళెదనని గురునకు తెలియపర్చెను. అతడు, శిష్యులు వచ్చి చదువుకొని వెళ్ళుట మామూలే కనుక ఏవో అప్పటికి తగినబుద్దులు చెప్ప వెళ్ళుట కంగీకరించెను. కచుడు అతనికి పాదాభివందన మాచరించి, దేనయానికి తెల్పుటకై లోనికేగెను.

దేవయాని అట్లాతడు వెళ్ళిపోవునని కలనయినను తలంపలేదు. అందుచే ఆమాటి వినవడుసరికి పిడుగుబాటు పడ్డట్టయి మొద్దువారిపోయినది. మెల్లగా తెప్పరిల్లినది కచా! నిన్ను నేనెంతగా (్రేమించితినో నీ కర్టముకాలేదు. ఇన్నాళ్ళ నుండి పెంచిన (ప్రేమంత నొక్కసారిగా నీ మీదనే లగ్నమయనది నా గ్రేమను కాదనకుము.”

71

వాలయాయయయియవివలంలలలంయిలా పమమాభారత నీతి కథలు - లాలా కచుడు : “నీవు నన్ను ప్రేమించితివా?” “అదేమిమాట తెలివితక్కువ వానివలె అమాయకముగా ఆ ప్రశ్చయేమిటి ఇంత చదువుకొన్నవాడవు నడుచువాడవు అ పాటి తెలిసికొనలేవా?” “లేక్రమి నీవు నన్ను ప్రియముగా చూచుచుంటివని తెలిసికొంటిని” నీవు విపరీతముగా మాట్టాడకుము. నేను పరిశుద్ధయైన కన్యను. నీవు బ్రహ్మచారివి నేను నిన్నిదివరకే వరించితిని. మన్మధుడు మధ్యవర్తిగా ఇదివరకే వివాహము చేసికొని 'నంగీకరించితిని. శుక్రుని వలన సంజీవనిని శ్రహించినల్లె, నన్నును పరిగ్రహించుము. అది నాకెంతో ప్రియమైన పథి అంతేకాదు. నాకు హితమైన పని చేసినచో నా తండ్రి నీ గురువు చాల సంతోషించును. అట్లు చేయుము ” అట్టనుటతో చెవులు మూసికొని “హర హర! ఎంత మాటాడితివి? గురువులు శిష్యులకు తండ్రితో సమానులు. గురుపుత్రివి నీవు సహోదరివి నేను నిన్నింతవరకు మఖట్లే ప్రేమించితిని కాని మరొకరీతి మాట్టాడదగదు. మనం లోక మర్యాదను దాటరాదు అది మహాపాతకము కలిగించును. ఆ మాట నిక దలపెట్టకుము” అని కసరెను ఇట్టు తన (ప్రేమ విఫలమగునని యామె యూహింపలేక పోయినది. తాను_ .. ప్రేమించుటయే గొప్ప అదృష్టమని అతడనుకొనునని తలచినది, తాను వలచినమీద కూడ అతను తిరస్కరించుననుకొనలేదు. ప్రతివారును తొమే గొప్పవారమనుకొనుట పరిపాటి. అందులో నా రాక్షస గురువయిన శుభ్రాచార్యుని కూతురునని దేవయానికున్న గర్వమింతిం తనరానిది. ఆమె (ప్రేమించుటయేనా ప్రధానము? అతడు మాత్రము వలవనక్కరలేదా పాపము! ఆ వెర్రిబాగులపిల్ల ముగ్ధ కనుక అంతటి ముందు దృష్టి కలిగి ఆలోచించలేదు తన కోరిక విఫలమయినది. ఎన్నో విధముల బ్రతిమాలినది లాభము భేకపోయినది ఆమె కోడలు చిర్రుమన్నది అంతటి డ్రేమకూడ కోపముగా మారినది. ఎంత హెచ్చుగా ్రేమింతురో అది విఫలమైనవుడు అదే స్థాయిలో కోపము వచ్చును.' అందును వారు మాట అన్నచో జరిగి తీరునంతటి శక్తి గలవారగుటచే వారి కోపము వృధాకాదు. వెంటనే ఆమె “నీవు సంజీనికై వచ్చి నాపై ప్రేమ చూపి'ఊటలూరించితివే! ఇంత మాయచేయుదువా? ఇంత తియతీపుల నన్నలయింతువా ఇదేనా న్యాయము? ఇక నీ మనసు కరగదుగదా కానిమ్ము! నీకు నా యుసురు తగులకపోదు మాయచేసి సంపాదించిన విద్య నీకెట్లు ఫలించును? నా కోరికను విఫలము చేసితివి. కాన నీ కోరిక కూడ విఫలమైపోవుగాక, నీకీ విద్య ఫలించదు పొమ్ము” అని శపించినది. న ళా లాం

వడావావాంవాంవాంంాలాలాలా మువోభారతో నీతి కథలు = / లావాలా

కచుడు ప్రతిభశాలి. అతనికి ఫమయస్స్ఫూర్తి యున్నది. అంత తెలివైనవాడు కనుకనే దేవతలతని పంపిరి. ఆమె ఆ రీతిగా శపించిన వెంటనే “సరే నాకీవిద్య ఫలించకసోవచ్చును కాని నేనుపదేశించిన వారికి ఫలించునులే. దానితో నాకే బాధయు కలుగదు” అని తన కష్టం ఫలించునట్లు చేసికొనెను.

అంతటితో ఊరకొనినచో అతని పగమాత్రమెట్టు తీరును? ప్రతీకారము చేయవలెనని చేతకాని వానికి సైతముండునే! అతనివంటి సముర్భడైన వాని కుండుట అబ్బురమా! నీవు ధర్మవిరోధము కలుగునట్లు నన్నుకోరి నేనుకూడ నీవలె అన్యాయమునకు పాల్పడనందులకు వృధాగా శపించితివి కాని నిన్ను భ్రాహ్మఖుడు పెండ్డి చేసికొనకుండుగాక” అని శపించి ఆమెకేసియైన చూడక స్వర్గమునకు లేచిపోయెను. పాపము! ఆమె ఏమియు చేయలేక తన కోరిక విఫలమగుటకు తోడు శాపము నచ్చుటతో మనసున నెంతో బాధపడినది,

కచుడు స్వర్గమును చేరుటతో దేవతలందరు నతని కెదురువచ్చి స్వాగతమిచ్చి యెంతో మర్యాద చేసిరి. కార్యావవసరములను బట్టి మర్యాదలు జరుగుచుండును.. తెలివయినవాడు వాటిని లెక్కసేయడు అతడు తనకు జరిగినదెల్ల చెప్పి దేవతలకా సంజీవనీ విద్య నుపదేశించెను. అది వారికి ఫలించినది వారి కోరిక తీరినది.

వృషపర్వునికి శర్మిష్టయను కూతురున్న దంటినిగదా ఆమెకు దాసీలు వెయ్యిమంది ఉన్నారు. రాజకుటుంబములలో కన్యలకు వేరుగా అంతఃపురముండును. దానికి చేరి యుద్యానవనముండును అందులో కొలనుండును. ఆ చుట్టుప్రక్కలకు మగవారు వచ్చు _సావకాశముండదు, కాని ఒక్కొక్కప్పుడు వారికి తోచినప్పుడు దగ్గరగా వనములో సైతం విహారమునకేగుదురు. అది వారి యిష్టము కన్యకలు, వయనులోని వారు ఎన్ని విహారము లైనను చేయుదురు. దాసీలు వారివెంట నుండి యెట్లు కావలెనన్న నట్టు చేయుచుందురు. ఒకనాడు శర్మిష్ట దాసీలు వెంటరాగా దేవయానిని తోడ్కొని వనవిహారమున కేగినది. దేవయానిక శర్మిష్టకును స్నేహ మెక్కువగానే యున్నది. ఇద్దరి కిద్దరే. ఒకరు రాజపుత్రిక, ఒకరు గురుపుత్రిక, సమానమైన హోదాలో కొంతసేపు పువ్వులు కోసికొని కాయలు కోసికొని సరదాగా విహరించిరి.

ఆ వనములో కూడ ఒక కొలనున్నది. అందు పద్మములు, కలువలు చాల అందముగా నున్నవి. కొంత సేపు విహరించుసరికి వారికి చెమట పట్టినది. వారికి జలకము లాడబుద్ధి వేసినది. ఆడువారికి గుడ్డలు వదలి నీళ్ళు పాసికొనుట చెడు నలవాటు. వారందరును తమ గుడ్డల నా గట్టుపై పెట్టి చాలసేపు సరదాగా జలక్రీడ లాడిరి. నానన

లాలాజల వువకభారత నీతికథలు లా అంతలో సుడిగాలి వీచినది, ఆ గాలికి గుడ్డలన్నియు కలగా పులగమై పోయినవి. అయినను విలువైనవి శర్మిష్థా దేవయానులవే, గాలి వచ్చినదను హడావిడిలో వా గట్టెప్కిలి. ఒళ్ళు తుడుచుకున్నారో లేదో కాని, గుడ్డలు కటకొనిరి. శర్మిష్ట ఆ కంగారులో దేవయాని చీర కట్టుకున్నది. అప్పుడు దేవయాని 'పైకివచ్చి తన చీరకై వెదకికొన్నది. అది లేదు. పరికించి చూచిసది. శర్మిష్ట కట్టుకొన్నట్లు గమననించినది. అక్కడ మిగిలియున్న దొక్క శర్మిష్ట కోకమాత్రమే]! “ఈదిగో నా చీర ఉందిగా కట్టకోగ “ఏమిటి? ఫీ చీర . | నేను కుట్టకొనపీలెనా?” “ఏమి ఇంత ఇది? నేను నీ చీర కట్టకోలేదా?” “నేను. నీవు సమానమా? నీ తండ్రికి నా తండ్రి గురువు; పూజ్యుడు, బ్రాహ్మణుని ఫిల్లను నీవు కట్టి విడిచిన బట్టను వేనెటు కట్టుడుము?” రా న! క్‌ “ఓహోహో! ఏమి గొప్పకు పోవ్చచ్చంటై ని? స్పెద్ద ప యింటికి వచ్చినగాని జరుగదు. 1 శీ పోదా కలదానవే? నీ తంధద్రికి నా ర్యంలో ఎ రోజు నా యింటికి వచ్చి పంచాంగము చెప్పి ఏ కటల స్ట్‌ వెళ్ళిన గాని పాయ్యిలో పిల్లిలేవదు. గొప్పలు చూచిన యు పట్టు నీవు నా సద్ధ చెప్పక్సమ్సు. నాక లేని నీకు వచానదేమి!” నీవు బుద్ధిలేక చేసినంత మౌత్రాన నన్సన్స చె మ “బనోను! స దందాను న! చేయవలయును. ళ్‌ శ బు చెప్పిన పనులు చేయుచుండు ని శం మరు నేర్చిన దానవ, ఇంటికి వచ్చి, దీవించి, గొప్పలా? దాలు చాలులే పడరక్స్సృం ఆ గ్‌ దగ్గరనా? అతని కూతురివైన నీకు “ఏమిటి? వేను వదరు చుంటిన్నా నీవ స “ఏమి చేయగలనో చూడ్తున్ను ౫ న్నేమి చేయగలవృ?” అసి మెను ప్రడ్సు స్తం . ॥ నోడు సూత్ర న మొ శ పడవేసి గ్ర లతో నూతిలో ప్రష్యన్న్న దేవయాని కట చెలులకాబ్మప్రంచినది. శర్మిష్ట దిశ గర్యపడుచ్లు ఇంట్రో తన చైల్వలతి స శ క గినది ఆ పయస్టున్చ్య దు వెన్సక (న్‌ పట్టు వెగ్గినందులకు

  • యత్రూత్రి రొజ్యమ్న్య కావన్వ్వ్య న లాలోచించనియ్యదు గదా! ముల తమృక్ట్వ్యః ఆతన్లినై అతడు వేటకేగ న్‌ 06 ప్రాద్దువై్చ్యని క్రడ్దా 4

ఎట ముహభారతనీతి కథలు -/ లాలా తెలియుట లేదు. ఆ వ్యసన మట్టిది సేన తనకు చాల దూరమ్మున నున్నది. వారెవరు నతని సమర్థింపలేకపోయిరి. తానొక్కడును విశ్రమింప గోరి కొండొక సేపు కూర్చుండెను. అతనికి దాహము మిక్కుటముగా వేయుచుండెను. తనకు చెరువెక్కడ నున్నదో చూచిపెట్టుటకైనను సేవకులు దగ్గరలేరు

అతడే బయలుదేరి కొలనును వెదకుచు వెళ్ళెను. అక్కడికి దరిదాపులో చుయ్యి కన్పడినది. బ్రతుకుజీవుడా అని అతడు నూతివద్ద కేగెను. తీరా తొంగిచూచు సరికి లోపల స్రీ కనిపించినది.

ఆమెకు గుడ్డలేదు! కన్నీరు ధారగా చనుకుదురుపై పడునట్లు ఏడ్చుచున్నది. ఎవరైన ఆ దారి వెంబడి వత్తురా? ఎవరైన తన్ను పైకి తీయుదురా? అని ఎదురు చూచుచున్నది ఆమె అట్లు దిగంబరయై యున్ననేమి?,ముఖము కళలతో ప్రకాశించుచున్నది. వరణుని పై కోపించి భూలోకములో నివసింపగోరి పైకి వచ్చుచున్న జలదేవతవలె నున్నది. అతడామెను చూడగానే విచారించి సానుభూతితో .. “నీవెవరవు? ఇట్లు వంటరిగా నూతిల్లో ఏలపడితివి? ఇందులకు కారణమోమో చెప్పుము?” అని ప్రశ్నించెను.

ఆమె అదివర కెన్ని యోసారులా అడవిలో అతనిని చూచియున్నది కనుక వెంటనే అతని నానవాలు నట్టినది. తాను గుడ్డ లేక య్నుది. వచ్చినవాడు మహారాజు అతనితో మాటాడక తప్పదు. పాపము! అట్టి పరిస్థితిలో ఏమిచేయును?

“ఓ రాజా! నేను శుక్రాచార్యుని కూతురును, నా తండ్రి తన నంజీవినీ విద్యాప్రభావమున దేవదానవ యుద్ధములో చచ్చిన రాక్షసులను బ్రతికించునంతటి శక్తి కలవాడు. ప్రమాదము వచ్చి నూతిలో పడిపోతిని. ముందు కట్టగుడ్డనిచ్చి నన్నుద్దరింపుము' ' అన్నది. _

అతడామె మాటలకెంతో దయతలచెను. ఆమె కట్టుకొనుటకై తన కండు వానిచ్చెను. ఆమె దానిని లోనుండియే కట్టుకొన్నది. అతడు తన కుడిచేతి నందియ్యగా ఆమె అతని చేయి పట్టుకొని పైకి వచ్చినది. భూతల్నరాజ్యము నంతను భరింపగల ఆ మహారాజు ఆ కన్యను పైకి తీయుటలో విశేష మేమున్నది? అతడు ఆమెను చూచినను బ్రాహ్మణ కన్యయని చెప్పినందున వివాహం మాట నెత్తక సామాన్యముగా జనులను రక్షించు స్వభావముతో నామెను రక్షించెను. ఆమె అతనికి కృతజ్ఞతను తెల్పినది. అతడు తన రాజ్యన కేగెను.

దేవయానికి శర్మిష్టపై కంట పూర్తిగా నున్నది కోపము. ఆమె బయటికి వచ్చెనన్న మాట తప్ప పట్టణములోని కేగదలచ లేదు. వనములోనే కూర్చున్నది. నా న

లాలా మహాభారతనీతికథభలు-గాాోొ అమెకు జరిగిన అవమానమును విన్నది ఘూర్ణిక యను పేరు కల ఆమె పరిచారిక ఆమె దేవయానికై వెదుకుచు వనములో తిరుగుచున్నది. కొంతసేపటి కామె దేవయానిని చూచినది. ఆమెను చూచుసరికి దేవయానికి విచారము పెరుగును కదా ఘార్డిక దేవయాని నూరడించినది. జరిగినదెల్ల చెప్పమని బుజ్జగించి అడిగినది. ఆమె చెప్పలేక చెప్పలేక చెప్పినది. ఆడుది, చిన్నదియు కదా, ఎట్లు చెప్పగలదా జరిగిన విషయమును? ఒక మగవాడు. అందులోను మహారాజు తన్ను బట్టలేని దాని చూచెనని చెప్పగలదా? ఎంత సిగ్గుగా నుండును? అయినను (ప్రాణప్రియమయిన చెలికత్తెతో చెప్పుటకే ఆమెకెంతో బాధ అనిపించినది. ఎట్టయినను శర్మిష్టపై పగదీర్చుకొనదలచినది చెలికత్తె “అది మనకు సాధ్యము కాదమ్మా? ఎందుకా పట్టుదల? వలదు” అన్నది కాని దేవయాని వినలేదు. సాధించెదను, సాధించి తీరెదను. నీవు పోయి నా తండ్రితో నాకు జరిగిన అవమానమును చెప్పుము, అఇతడేమనునో చూబెదను” అని చెప్పి పంపెను.

ఆమె వెళ్ళి శుక్రాబార్యునితో జరిగినదంతయు చెప్పినది. అళడుక కొపోద్రిక్తుడై “ఏమి? ఆమె గురుకన్యయని యైన చూడక అంత అవమానము చేసెనా? ఎంత పాగర్రు వచ్చినది? నా నత్తా, దానికి తెలియలేదే? ఇప్పుడు నా కూతురెచట నున్నది?” అనుటత్రో “ఆమె వనములోనే విచారముతో కుములుచు కూర్చున్నది” అని ఘార్షిక చెప్పినది, కోపముతో కనుబామ లదిరినవి. కన్ను లెగ్రనైనవి. కన్నుల నీరు గ్రమ్మినవి, చరచర దేవయాని యున్నచోటికి వచ్చెను.

తండ్రిని చూచుటతో ఆమె బావురుమన్నది అతనికేమి చేయవలెనో తోచలేదు. ఏమైనను చేయగలడు? కాని, ఏ సమయమున కేది చేయవలయునన్న దాతనికి తెలియును. అతడు ప్రత్యేకముగా రాజనీతిని “శుత్రనీతి” యను పేర వ్రాసిన మహాపండితుడు. ప్రతిభాశాలి, వ్రయుటయేకాదు. వ్రాసినట్లు తాను నడుచుకొనీ, రాజులను నడిపించిన ధీరుడు. అతనికి సమయజ్ఞత లేదా?

కూతురికి బుద్దులు చెప్పనారంభించెను.

“అమ్మాయీ! ఆమె చేసినదంతయు, తప్పే. నేను మాత్ర మెరుగునా? నీకు చేసిన అపకారము నాకు కాదా! నీవును నేనును వేరా? కాని, మనము రాజాశ్రితులము, అది రాచపిల్ల, పడుచుది ఏదో తెలియక పడుచుదనపు గర్వముతో నీ కవమానము చేసినది. కాని అంతమాత్రాన మనము తొందరపడరాదు. కోపము మేలుకాదు. ఎంతెంతో దక్షిణలిచ్చి 76 నా

వనవవవవయయాంయయయాయమమలంలాలా మ్రవమర్తూూరత నీతి కధలు = ౯ కాలు నియమముతో యజ్ఞములు చేసినవానికంటె కోపము లేనివాడు వెయ్యిరెట్లు మేరుగు, కోపము కర్తవ్యమును తెలియనియ్యదు. క్షణకాలములో వచ్చు నష్టము లెరుగనియ్యదు, అప్పుడు శాంతివహించెనా. అంతయు సుఖమే]! లేదా అంతయు కష్టమే! నీవే ఆలోచించుము. ఆమె చేసిన పనిలో మనకేమియు నష్టము లేదుకదా! తల్లీ ఓర్పు వహింపుము. ఈపాటి సహింపుము కోపించినను కోపగించనివాడు తన్ను తిట్టినను విననివాడువలె ప్రతివచన మియ్యనివాడు బాధ పడికూడ ప్రతీకారము చేయదలంపని వాడును ధర్మజ్ఞులు కానకోపము లేకుండటయే తెలివయని పని ఈసారికి క్రమింపుము” అని శర్మిష్ట తరపున తన కూతురిని తానే బ్రతిమాలినాడు శూక్రుడు.

ఆమె అంత తేలికగా వినుట్టిద్రికాదు. ఆమేకు చిన్నప్పటినుండి అంత ఎక్కువగా శు(క్రుడు గొరము నేర్పినాడు. “అదికాదు తండ్రీ నాకు ఓర్చు వుండుటను గూర్చియే నీవు చెప్పుచుంటివికాని ఆమె కుండవలసిన మంచి లక్షణములను గూర్చి నీవు చెప్పలేదుకదా నీవు ఆశ్రితుడవు కదా! నీకు వారివలన కావలసిన దానికంటె వారికి నీవలన కావలసీన యెక్కువది. ఎవరయినను ప్రయత్నించి యెంత ధనమునయిన నాఖ్యములయిన సంపాదించగలడేమో కాని చచ్చినవాని నెవడు బ్రతికింపగలడు నాయనా! అది నీ కొక్కడికే తగును. అట్టి నిన్నే హితుడవై అన్ని పనులను పూసికొని చేయునట్టి నిన్నే అవమానింప జూచిన వివేకి విహినులను కొలుచుట యేటికి? నిష్పయోజనము. ఒకవేళ ఓర్పు కలిగిన నీవు వానిని సేవించుచుండ దలచినను నాకేమాత్రం హితవు లేదు. నేనిక ఆ పట్టణము త్రొక్కను. ఇదే పోవుచున్నాను. నీవు వెళ్ళి వార్ని క్షేమమును కోరినవాడవు కనుక వారినే 'సీవించుము. ఇక నాతో' నీకేమిపని?” అని విసురుగా అనవలసినవి నాలుగు అని వదలినది

శుక్రునకు నషాళమంటినది. అంతయినను అతనికి కోపము రాలేదు. కాని కూతురిపై అతనికున్న మమకారముతో ఆమెను వద్దలలేక “అమ్మా నాకు నీవు తప్ప ఇంకెవరున్నారీ ప్రపంచములో నా ప్రాణములన్నియు నీ మీదనే పెట్టుకొన్నాను. నీవెక్కడికి'పోయినా నేను అక్కడికేవత్తును” అనుచు ఆమె వద్దనే వుండిపోయెను. _ ఈ విషయమంతయు అప్పుడే ఇతిశ్రీగా వృషపర్వునికి తెలిసిపోయినది. అతనిగుండె దడడీడలాడినది. కేవలము పసుపు అక్షతలు కలుపువాడేయైనచో అతడు నిస్సాకారము చేసెడివాడే. కాని అతనియందున్న అద్భురశక్తికి దాసోహం చేయక ఎంతవారికిని తప్పదు, అతడు వెళ్ళిపోయిన తనకే ప్రాణము పోయినట్టు అతడు వెంటనే వెళ్ళి కాళ్ళు - కడుపు నవవ భా లలన వాం

మహాభారతనీతి కధలు - లాలన పుచ్చుకొని బ్రతిమాలి వారినిద్దరను పురములోనికి యధాప్రకారము తేదలచి వారున్న చోటికి పరుగుపరుగున వెళ్ళెను. వచ్నీ వచ్చుటళోనే గురువుగారి కాళ్ళపై బడెను, అతడు వృషపర్వుని లేవనెత్తెను వృషపర్వుడు “గురూత్తమా? ఏమిటిది? ఈ రాజ్యము మీదికాదా! మీరు దయతలచి రక్షింపకున్నచో ఈ రాక్షసులీపాటీకి యమప్పరి కతిథులై పోకుందురా? మేమింత హాయిగా జీవించుట మీ దయా దృష్టి చేతనే కదా! మీ ఆసరా చూచుకొనియే కదా, మాకింత గర్వం వచ్చినది! నా ఏనుగులు, గుర్రములు, ధనాగారములు ఒకటన నేల? నీ రాజ్యమంతయు నీదే, నీవు సంపాదించినది నీది కాదా? దీనికై మీరింత కోపించుట భావ్యము గాలేదు. మేమందరము మీ దోసులము, మీరు మా దాసులమనుట ప్రారపాటు పిల్లలు చేసన తప్పులను తండ్రులు మన్నింపకున్న ఇక సైరించు వారెవరు? మన్నించుము. మమ్ముల "క్షమింపుము. నీకేమి కావలెనో కోరుము ఇచ్చెదను” అనెను. శుక్రాచార్యుడు అతని సవినయోస్తుల కెంత్రో సంతోషించెను. మాటకు మాట కెగులుక్షాని, అనుకూలంగా నడచుకొన్నదలచినప్పుడికి శ్పచ్చ యేమ్మున్నది. అతడాలోచించి, నాకేమియు_అక్కరలేదు. నేను నీ ధన మాసించి వచ్చినవాడన్సు కాను ఇక నాకున్న సర్వస్వం ఈ పిల్లయే! దాని యిష్టమే నా యిష్టం” అనెను *.. వృషపర్వుడు “అమ్మా గురుప్పత్రీ నీకేమి కావలెనో చెప్పుము. చేసి తీరెదను, మాపై అలుగకుము. నీవ చల్లగా చూచినకాని, మేము మనలేమమ్మా” అని ఆమెను బుజ్జగించెను. అతని మాటలతో ఆమెలోని క్రోపన్సు తగ్గినది తానిక కావలసినది కోరవచ్చును ఆమెకు కావలసినది ఫ్రతి క్రియగా పగ తీర్చుకొనుటయే! అంతకంటే కేవలం భీష్మించుకొని కూర్చున్నంతమాత్రోన అయ్యడిదేమున్నది? అందుచే మెల్లగా “న్ల కూతురైన శర్మిష్ట తన చెయ్యమంది సరిచారికలతో సహా వాకు దాసి కావలెను” అన్నది వృషపర్వుడు. “అంతేనా? అదెంతటి పని? మేమందరము న్సీ దాసులము కాదా! ఆమె యేలకాదు? ల్లదివరకు దాసియైన దోనవే దాసిగా కోరితివి, ఇదిగో ఈ క్షణముననే రిప్పించి నీ కాళ్ళ ముందు పడవైచెదను. ఆమె.నీ ప్రాద దాసియైై యుండును” ఆని భటుల ద్వారా కూతురుని రప్పించెను, మనం ధనం సంపొదింపవలెను. క్రాన్సి _దొనిని అవసరం వచ్చినపుడు వాడు కావలెను. పెళ్ళిము - పిల్లల పోషింపవలెను. 'అయినన్సు మనల రక్షించుక్రొనవలసి నచ్చినపుడ్లు వారి వారి నుపయోగించుకొనవలెను, మనము పోషించునవి మన సౌఖ్యమునకే న.

ావవవయాంయాంయాయాజాశాయిలయిమంం ప్ర్రమద్ధుంరత్రో నీతి కధలు = ౯ ాాాాాాాాాలానాననానాా కదా! కూతురుని దాసిగా చేసి వృషపర్వుడు రాక్షస రాజ్యమును నిలబెట్టినాడు. కోరలు | తీసిన పామువలె శర్మిష్ట దేవయాని చెప్పుచేతలతో నుండె కన్నుసన్నలు మెలగుచు చాకిరీ అంతయు చేయుచున్నది అదంతయు ఆమెకు బుద్ధి వచ్చి కాదు తండ్రి మాట కెదురు తిరిగెనా యిక ప్రాణములపై ఆళ వదలుకొనవలసినదే రాజ ధర్మమే అట్టిది. అటుపై అతడు రొక్షసుడు రాజులకు తల్లి - పిల్ల భేదము లేదు. దేవయానికి కసి తీరినది. శర్మిష్టచే అన్ని వనులు చేయించుచున్నది. కసరుకొనక ఆమె దేవయానికి కాళ్ళు కడిగి నెత్తిమీద చల్లుకొనుచున్నది ఆమె కట్టువిడుపు గుడ్డ ఉతికి ఆరవేయుచున్నది. ఆశ్రయమును బట్టియే గర్వము కల్గును, తండ్రి శక్తిని బట్టి దేవయాని కంత పొగరు కల్గినది. అన్నంతయు చేసినది, పగ తీర్చుకొన్నది. కాని ఆమె పగ అంతటితో తీరునది కాదు. యావజ్జీవము తనకు దాస్యము చేయించుకొనుటకై సంకల్పించినది. పైన భగవంతుడు లేడా? దైవ సంఘటన యెట్టున్నదో? మన మనుకొన్నట్లే జరుగునా? అది వసంతకాలము! చెట్టన్నియు ప్రాతయాకులు రాల్చినవి. క్రొత్త చిగుళ్ళు తొడిగినవి. మొగ్గలు - పువ్వులు పక్కగా పుల్లముగా తీగె అలంకరించుకొన్నట్టున్నవి. అవే ఉద్యానవన విహారమున కనువైన రోజులు ఎవరు విహారములు చేయుదురు? పడుచుతనములో ఉండి హంషారుగా తిరుగువారు కాక ముసలివారికి విహారము లేమిటి? దేవయాని శర్మిష్టమొదలయిన వేయమంది దాసీలు అడుగులకు మడుగులొత్తుచు వెనుకఠాగా ఉద్యానవనమునకుబయలుదేరినది. వారందరు నించుమించు ఈడుజోడు వారే! అందరును ఉత్సాహముగా పువ్వులు కోసికొనితలలో తురుముకొనిరి, మొగ్గలు కోసి వాటి అందమును తిలకించు చుండిరి, చిగుళ్ళను శ్రుంపుచుండిరి, కొంతసేపేదో కాల క్షేషమునకై ఇది కాదని లృది, అది కాదని ఇదిగా వనమంతయు తిరిగిరి.

అ వనమ్ము ప్రక్కనే ఒక సెలయేరున్నది. అది చిన్న యేరేయైనను ఇసుక తిన్నెలు ఇటునటు విశాలముగా నున్నవి. ఇప్పటికి చల్లబడినందున వారందరును ఆ ఇసుక తిన్నెలపై కూర్చుండిరి. ఎవరికి తోచినుట్ల వార్తు నరస సల్టాపములు పరిహాసములు చేసికొనుచుండిరి,

వారందరును పుల్లముగా' చందనము, కుంకుమ వూసికొనిరి. కొప్పుల నిండుగా పూలు పెట్టుకొనిరి పచ్చకర్పూరము తోడి తాంబూలములు వేసికొనిరి. వారి గుడ్డలు అగరధూపవాసనలచే గుబాళించుచున్నవి. ఈ అన్నిటి సువాసన కలసిన గాలికా ఉద్యానవనమంతయు గుప్పుమనుచున్నది. ఆ వాసనతో ఎంత దూరముననున్న వారికి 'సైతమా గుబాళించిన చోటికి రాబుద్ధి వేయుచున్నది. న.

డా అనాడు కూడ యయాతి వేటకై ఆ వనమునకు వచ్చి ఆ సువాసన తగిలి వచ్చినట్లుగౌ విశ్రాంతికై అచ్చటికే వచ్చెను అతడు అతిథియైనాడు. వారాతనికి తగు మర్యాదలు చేసిరి. అతడు సపర్యలనంది వారవరో తెలిసికొన గోరెను. దేవయాని అందరికంటె నెమ్మదిగా ఆమె వేషమును బట్టియే శిలియుచున్నది. ఆమె నతడానవాలు పట్టెను. కాని, ఆ వేళ రూప వేషములు వేరు, ఈ వేషభాషలు వేరు. అందుచే వారిని “అమ్మాయీ! మీరెవరు? ఎవరి వారలు? మీ కులగోత్ర నామము లేవియో చెప్పుదురో?” అని ప్రశ్నించెను - అప్పుడు దేవయాని ముందునకు వచ్చి “రాజా! నీవు నన్ను ముందే యెరుగ్తుదువు ఇదిగో ఈమె వృషపర్వుని కూతురు పేరు శర్మిష్ట ఆమెనాకెన్నడును సేవలు చేయుచుండును. తక్కినవారు వెయ్యిమంది కూడ నా దాసీలే. అని వారి నెరుక పరచినది. అంతటితో ఆమె కోరిక తీరలేదు. అతడు తన చేయి పట్టిననాడే అతన్ని వరించినది. తన కెట్టును కచశాపము వలన బ్రాహ్మణుని వివాహ యోగము లేదు, కదా. తన్ను దిగంబరినిగ చూచినవాడు గుణగణములు కలవాడు నా రాజు. అతనిని వలచుట ఆమెకు యుక్తముగానే తోచినది అందుచే చిరుసిగ్గుతో - “రాజా! నీ విదివరకు నూతిలోపడీన నన్ను కుడిచేతితో పట్టుకొని పైకి లేవనెత్తితివి.

  • అనాడే సూర్యుడు సాక్షిగా నా పాణిగ్రహణము చేసితివి అది నీవు మరచితివేమో కాని, నాకు మాత్రము మరపురాదు. నన్ను పెండ్లి చేసికొనుము. నాతోపాటు ఈ వెయ్యి మందితో సహా ఈమె కూడ నీకు దాసీ యగును. నా గ్రేమను వ్యర్థము సేయకుము. నిన్నానాటి నుండీ వలచియున్నదానను” అని పలికెను. అతడాలోచించినాడు పిల్ల పడుచుదే! కాని బ్రాహ్మణది యగుటచే తాను వరింపకూడదనియే ఆనాడా యుద్దేశ్యమే పెట్టుకొనలేదు. మంచి చెడ్డయును పుణ్యపాప భీతి లేకపోయినచో ఇక లోకమెట్ల జరుగును? ఆ కాలపు రాజులు అధర్మమున కొడిగట్టువారు కారు తన్ను వలచిన దేవయానితో అతడు మెల్లగా ఇట్లనెను. “కళ్యాణీ! నీవు బ్రాహ్మణ కన్యనంటివి. నేను క్షత్రియుడను కదా! మన కిద్దరకును వివాహమెట్లు పానగును? బ్రాహ్మణాది వర్ణముల వారికి క్షత్రియాది కన్యకల వివాహ మాడుట శాస్త్ర సమ్మతమై యున్నది. కాని, ఇట్లు విపరీతము లేదే! ప్రజలందరిని ధర్మమార్గమున నడనవలసిన నేనే అధర్మ మార్గమున బట్టినచో ఇక లోకమెట్టు నడచును? అందుచే అట్టి కోరిక కోరవలదు” అనీ బ్రతిమాలుచున్నట్టుగా అనెను. లాలా

లా మహధారతనీతి కథలు - లాలా

దేవయాని తలచినంత చేసితీరెడి రకము కాని తేలికగా వదులునది కాదు. “రాజా! అదా నీ సందేహము! నా తండ్రి మీద నీకు నమ్మికయున్నది. అతడు ధర్మశ్వావేత్త కదా! అతడు చెప్పినచో అంగీకరింతువా” అందును సందియమున్నదా?” అని సూటిగా ప్రశ్నించెను. ఆ మాట కతడేమనగలడు? “ఆ. ఎంత మాట? శుశ్రాచార్యులవారు చెప్పినచో వినని వారుందురా? తప్పక విందును” అనెను.

వెంటనే దేవయాని తన తండ్రికి కబురంపినది. అతడు అమె మాట ప్రకారము అచ్చటికి వచ్చెను. శుక్రుడు గ్రహము లన్నిటిలోకి చాల ప్రకాశవంతమయిన గ్రహము. అతని వెలుగుతో వనమెల్ల వెన్నెల కాసినట్లు వెలిగెను.

అట్లు కాంతి పుంజమును వెదజల్లుచు వచ్చుచున్న శుశ్రాచార్యుని చూచి తాను

_ ధన్యుడైనట్లు తలచె నా రాజు లేచి యెదురుగా పోయి ఆయనకు నమస్కరించెను. అతడు

రాజును లేవనెత్తి దీవించెను. రాజు తలవంచి భక్తితో చేతులు కట్టుకొని నిలువబడెను. తరువాత వరుసగా దేవయాని, శర్మిష్టతక్కిన వారు నమస్కరించిరి. అక్కడికి నమస్కారములు పూర్తియైనవి.

_ అప్పుడు దేవయాని తండ్రితో “ఇతడే నన్నానాడు సూతినుండి యుద్ధరించిన రాజేంద్రుడు. ఆనాడే నా కర గ్రహణము చేసినాడు. ఒకరు పట్టిన చేతితో మరొకరి చేతినెట్టు పట్టుదును? నీవు చెప్పినచో ఇతడంగీకరింతు ననెను. కొన నా కితనితో పరిణయ మగునట్లను గ్రహింపుము” అని కోరినది.

కచుని శాపము సంగతి ఆమె చెప్పలేదు. కాని శుక్రుడు దివ్యదృష్ట్యా చూచి తెలిసికొన్నాడు. అతనికంతయు కరతలా మలకమైనది, ఆవళ్యము జరగనున్నదదే అని నిశ్చయించి “రాజేంద్రా! నీవీమెనె పెండ్డాడుము. నీకు ధర్మ లోపము రాదు. అదినా శాసనము. ఇరుగో వీరందరు నీమె చెలులు. వీరినందరిని కూడ నీమెతో పాటు తీసికొని వెళ్ళుము. శర్మిష్ట రాజకుమారి ఆమెను నా కూతురితో సమముగా చూడుము. ఒక్క పడక విషయమున మాత్రము సామ్యము పనికిరాదు. సుమా! నా కూతురిని గేుమగా చూడుము” అని చెప్పి యొప్పించెను. అతడంగీకరించి ఆమెను పెండ్డాడెను మామగారి మాటల కొడంబడి వారినందరిని తోడుకొని యయాతి తన రాజ్యమున కేగెను. ఇదివరకు కూతురుని వదలి యుండలేనన్న శుక్రుడు, ఇప్పుడొక్కడే అచ్చట ఉండిపోయెను. అది తప్పనిసరియైన వియోగము. అందుకాక్షేపణ యుండదు, దానికి కాదనుటకు వీలులేదు. ఒకయ్య చేతిలో పెట్టినాక అతని యిష్టము కదా! ఆ తర్వాత మనింట నుండునా మనపిల్ల మాత్రము? అని సర్దుకొని యెట్లో శుక్రుడు సహించియుండెను. లా హా

లా మహాభారతనీతి కథలు - యయాతి దేవయానితో యౌవన సుఖము లనుభవించుచుండెను ఆమెకే రీతిగాను లోటురాకుండ రాజు చూచుచుండెను. శర్మిష్థ కూడ మెలకువతో సేవలు చేయుచుండెను అంతఃపురములో చక్కని మేడలో దేవయాని యున్నది ఆమె చెప్పన ప్రకారము ఉద్యానవన సమీపమున ఒక్క యిల్లు కట్టించి అందులో శర్మిష్టను ఆమె చెలులను వుండుమని రాజు అజ్ఞాపించెను. మరి రాణితో సమముగా శర్మిష్ట కెట్లు మర్యాదలు కల్గును అదే భేదము, “.... బేవయాని గర్భతియై యదువను కొడుకును కన్నది. మలి చూలునకు తుర్వసుడను పుత్రుని గన్నది. ఆమెకు ముద్దుముచ్చట లన్నియు తీరుచున్నవి. శర్మిష్టయి దేవయాని తోడియీడుదే అమెకును “నాకా మాత్రము మగడక్కరలేదా? ఈ యౌవనము అడవిని కాచిన వెన్నెల కావలసిదేనా తోటిది భర్తతో సుఖముగా కాపురము చేయును. పుత్రులను కనుచుండుగా నేనిట్లు చూచుచుండవలసిన దానినైతినే ఎంత అదృష్టము. పుట్టి పెట్టినదో దేవయాని నోములు నోచక ఊరికే మంచి కలుగవలెనన్న కలుగునా, నా అవయవ సౌందర్యము చూచ్చిఆదరించు వారెవ్వరు? ఈ దేహము అడవిలో పూచినపువ్వువలె నశింపవలసినదే దేవయాని అదృష్టవంతురాలు ఆమెకెవరు సాటి వత్తురు ఆమె అతడు పతిగా కావలెనని కోరినది. అట్లే పెండ్డాడి తీరినది నాకును యయాతిని ెండ్తాడవలెనని కోరిక యున్నది కాని యేమిలాభము ఎట్టు ఫలించును. నాకుండగనే నరియా అతడంగీకరింపవలదా ఈ శుక్రాచార్యుడు చెప్పి మరీ పంపినాడు గీసినగీతలు దొటినచో అతడు బ్రతుక నిచ్చునా అయినను చూచెదను ఏదో రీతిగా రాజును చేపట్టినా యౌవనమును సఫలము చేసికొందును” అని పరిపరి విధముల తన భావిజీవితమును గూర్చి ఆలోచించినది ఎన్నో యెత్తులు వేసికొన్నది దేనికయినను రోజులు కలిసిరావలెగదా. శర్మిష్ట అదృష్టము పండినది ఒకనాడామె వంటరిగా ఉద్యానవనములో విహరించుచున్నది యయాతి కానాడా యుద్యానవన శోభను చూడబుద్ధి వేసినది. అతడొంటరిగా వచ్చెను చెట్ల వరసల వెంట దిరుగుచుండెను శర్మిష్ట ఒకచోట వంటరిగా అళనికి కన్పడింది. _ ఆమెనంతవరకు ఎన్నడును కన్నెత్తి చూడలేదు. ఎంతటి మగవాడైనను భార్యయెదుట పరస్త్రీని కన్నెత్తి చూడజాలడు చూచినచో ఆ యింటిలో నికపోరే. అంతేకాక శుక్రుడు యయాతిని శర్మిష్టను చూడరాదని నిషేధించెనయ్యె ఇకవెట్టు చూచును ఆనాడెవరును లేరు చూడవచ్చును. చూచుటకేమి ఆమె పరాధీన కాదు తమ యధీనములో నున్నదే మిసమినలాడు యౌవనమున నుంది. అనా ఘ్రాత పుష్పము తనుతప్ప ఆమె దృష్టి న న న

వాలా చముహభారతనీత కథలు -/౯ లా కానినవారు నుండి యుండరు. అతడొకింత సాపేక్షగా చూచెను. ఎట్టు చూడవలెనో మాత్రము చెప్పలే. ము కాని ఆ వయస్సే ఆ చూపులను నేర్చును దానికి మన్మధుడు గురుడు అని నేర్చుకొానవలసిన పనిలేదు. ఆమె ఆ చూపుల నందుకొన్నది ప్రతిగా చూచినది. చూచుటయే కాదు - సమయానికి తగినట్టు చేతులు జోడించుకొని, ఒయ్యారంగా నిలుచుండి, “దేవా, తమరు నా యేలిన దొరసాని యగు దేవయానికి భర్తలు కాన నాకును భర్తలే! ఇది ధర్మమార్గమే. ఆలు, బిడ్డలు, దాసి అన్న వీరందరు నొక్కటే కదా! నీవామెను పరిగ్రహించుటతో నన్నును పరిగ్రహించినట్టయినది కావున నాపై కరుణింపుము. నన్ను దయ చూడుము బుతుమతినై యున్నాను. పుత్రుని ప్రసాదింపుము” అని ప్రార్థించినది. అతడు తటపటాయించినాడు. “తరుణీ! నీవన్నదంతయు యదార్ధము. సందేహం లేదు కాని ఒక్క విషయం నీ వెరుగుదువో ఎరుగవో కాని నాకామె నిచ్చునాడు శుక్రాచార్యుడు నిన్ను పడక విషయమై, పరిహరింపుమని నొక్కి చెప్పినాడు. అప్పుడు దాని కంగీకరించి ఇప్పుడు నేనెట్లు అబద్దమాడగలను? అసత్య దోషం అన్నిటికంటె బాధాకరమైనదికదా!” అనెను. అతనికీనీ లోపల ఇష్టముగానే యున్నది. నరవరులు నూతన ప్రియులు గదా. 'ఆమెయు తక్కువ తిన్నదికాదు. మాటకు మాట బదులు చెప్పగలదు. అవన్నియు ప్రశ్ళోత్తరములుగ్గా ముందే అనుకొని యున్నదేమో? “దేవా! తమకు నేను చెప్పజాలినదానను కాను. కాని, “వివాహ విషయమై అసత్యమాడినను దోషములే” దని శాస్త్ర ప్రమాణమున్నది. నీవు వివాహమునకై కదా శుక్రునకు మాట యిచ్చితివి! ఆదేమి దోషములోనిది కాదు. అంగీకరింపుము” అని కోరినది. అతడు మునివచన ప్రమాణ మున్నదనుటలో నిశళ్ళ్శంకముగా భయము వీడి ఆమె కోరిక తీర్చెను. ఇద్దరి కోరికయు తిరినది. ఆమె యెంత తమితో రాజును కలిసినదో కాని గర్భవతి యైనది. ఆమె కడుపు పండినది. తొలిచూలు మగ పిల్లవాడు కలిగినాడు, వానికి ద్రుహ్యుడని పేరు పెట్టిరి. అలవాటయిన తర్వాత తప్పునా? అది వారి వశమా? అట్టు వారు కలియుచునే యుండిరి. మహారాజు తలచుకొన్నచో సానకాశమే దొరకదా? ఒకనాడు దేవయాని శర్మిష్టి యింటి కేగినది. అక్కడ ఆడుకొనుచున్న పిల్లవాని చూచినది. ఆమె ఒళ్ళు చిరచిరలాడినది. “ఏమే! నీవు చాల మంచిదాన- వనుకొన్నాను. పెండ్డికాని కన్యవు కదా! నీకెట్లా పిల్లవాడు కట్గెనే? ఇదేమి తప్పే?” అని బుగ్గలు నొక్కుకొనుచు శర్మిష్ట నడిగినది. ఆమె తడపుకొనకుండ “దేవీ! నే నొకనాడు బుతుమతి నై కో

వనాల మువోభారతనీతి కధలు -/ాాాతతపతపాలాం యుండగా ఒక్క మహా తపశ్శాలి నా కడకువచ్చి ఈ పుత్రుని ప్రసాదించెనమ్మా! వానిని చూచుకొనుచు కాలక్షేపము చేయుచున్నాను” అని మెల్లమెల్లగా తలవంచుకొని సిగ్గుతో చెప్పినది. ఆడువారి కబద్దమాడు విషయమై చెప్పనక్కరలేదు “ఆడుది అబద్దమాడినచో గోడ కట్టినట్లును, మగవాడబద్ద మాడినచో తడికె అల్లినట్టును” అని సామెత యూరకపోవునా? ఆమె మాట చక్కగా అతికినది. నిజమే కాబోలును అనుకొని దేవయాని తన యింటికి పోయినది.

యయాతి శర్మిష్ట కలియుచునే యున్నారు. వారికి “అనుడు, పూరుడు” అని మరియిద్దరు పుత్రులు పుట్టినారు. ఆమె యెంత నేర్చరియో చూడుడు. ముగ్గురు పుట్టినను

-.. దేవయానికి తెలియకుండ చేసినది.

ఆ రహస్య మెన్నాళ్ళు దాగును? ఒకనాడు శర్మిష్ట కొడుకులు చిన్నపిల్లలు సరదాగా హాయిగా తండ్రీముందాడు కొనుచుండిరి వారినెంతో (ప్రేమతో అతడు చూచుచుండెను. అంతలో అచ్చటికి "దేవయాని శర్మిష్ట మొదలయిన దాసీ వర్గకముతో సహా వచ్చినది. రాజునకు ముందాడుచున్నఆ బిడ్డలను చూచినది. మరొకరి పిల్లలనంత ట్రేమ్‌గా చూచుట. అసంభవమని తలచి నీరెవరని రాజు నడిగినది. అతడు జవాబియ్యలేదు. తప్పుడు వారినే పిలిచి మీ తల్లిదండ్రులెవరు? అని ప్రశ్శించినది. చిన్నపిల్లలు వారికేమి తెలియును? 'ఇడుగో మా తండ్రి” అని యయాతిని, 'ఈమెయే మా తల్లో అని శర్మిష్టను చూసిరి వారి రహస్యము కొంచెము కూడ బట్టబయలయినది.

అప్పుడిక తప్పించుకొనుటకు మార్గము లేకపోయినది. దేవయాని కెంతో కోపము వచ్చినది. వారనుకొన్నట్టు జరుగలేదు సరికదా తానే తీసికొనివచ్చి శర్మిష్టను తన మగని కప్పగించనట్టయినడి ఆమె వచ్చి యిట్లు తనతో పాలు పంచుకొనునని ఆమె తలంపలేదు. వెంటనే గిరుక్కున తిరగి రాణి వాసమున కేగినది. అక్కడ తన పుత్రుల దీసికొని తండ్రి యింటి కేగినది . అతడంత హరాత్తుగా చీరాకుగా, దీనముగా వచ్చిన పుత్రికను చూచి “ఇదేమమ్మా! ఎమి జరిగినది” అని దగ్గరకు తీసిక్షాన్సి బుజ్జగించినాడు. ఆమె తండ్రి కడుపులోనికి తల దూర్చి, బావురమని యేడ్చి “తండ్రీ శర్మిష్ట నాకు తీరని అపకారము చేసినది, ఆమె ననుట యేటికిలే! నా మగడే ఆమెకు లోకువైనాడు. చూచిత్తివా _ యెంత ఘోరము జరిగినదో'

అని జరిగిన కథనంతను చెప్పినది. అతడు “ఇంకెందుకమ్మా చెప్పనక్కరలేదు తెలిసిపోయినది. అతని పడుచుదనప్పు మదమట్టున్నది. నా మాట పాటింపడేమి? చూచెదను ల్‌ న

ఆ మహధారతనీతి కధలు -/ లాలా

  • ఇదిగో. ఓ రాజా! నీవు గర్వముతో కన్నుగానక నా కూతురి కవమానము చేసితవి కాన నీకు ముసలితనము వచ్చుగాక!” అని శపించెను, ఆమె వెనువెంట ఏమి యుపద్రవము జరుగునో యని యయాతియు వచ్చెను అతనికి శుక్రుని మాట తోడనే ముసలి తనము వచ్చి ఆవరించినది. వళ్ళు వణికినది చూపు సన్నగిల్లినది. చేతులు చెప్పినట్టె వినుటలేదు చివులు వినపడుట లేదు. ఒక్క క్షణములో అతడు ముసలివాడై పోయాడు. ఒంట్లో ఓపిక ఉన్నంతసేపే మన ప్రయోజకత్వము కాని, దేవాద్వా ముసలితనము . కళ్చీ చేతులు కాళ్ళు పట్టు తప్పినప్పుడు మనమేమి చేయగలము? వెర్రి మొగము వేసికొని చూడవలసినదే అతడు మామగారితో “అయ్యా ఏదో తెలియక తప్పుచేసితిని. ఆమె బుతుమతిటై నన్ను పుత్రార్ధిటై. కోరినది. అట్టి నమయమున కూడనిచో (భూణహత్యాదోషము వచ్చునని పెద్దలు చెప్పుదురుకదా అందుకు జంకి అంగీకరించితిని. దానికై తమరింత కోపించినచో నేనేమి చెప్పుకొందును? దేవయానితో భోగములతో నాకింకను తనివి తీరలేదు మీరెట్టు అనుగ్రహింతురో” అని బ్రతిమాలుకొనెను. ఎన్ని అన్నను భార్య భార్యయే. ఆమె అంత కోపగించినను ఆ ముసలి మగని చూచి సహింపలేక పోయినది. దుంపగడ్డ వంటి మగడు క్షణములో ముసలి పరుగైెపోయినాడు. ,అ రూప మెక్కడ? క్షణములో ఎంత మార్పు వచ్చినది? కాన అతడన్న మాటలో ఇటు పైనైనను తనపై (ప్రేమగా వుండునట్లే యున్నది అని తలచి ఆమె తండ్రిని వేడుకొన్నది. “తండ్రీ! నీవు కోపావేశమున నా మగని నాకుకూడ అనుభవించుటకు పనికిరాని వానిగా చేసితివి ఇట్లు మూలచ్చేదము చేయదగునా? మరల పడుచుదనము వచ్చునట్లను గగ్రహింపుము. ఈ వాలకము నేను చూడలేను” అని తన బాధను వెలిబుచ్చినది అది వినుటతో శుక్రునికి మనస్సు కరిగినది. తాను చేసినది తప్పే అనిపించినది అయినను తీరా శాసమిచ్చిన తర్వాత ఇప్పుడిక దానిని మరలించుట యెట్లు? అతని వాక్యమమోఘము కదా ఏదో ఉపాయ మాలోచించినాడు. “రాజా! నీకు నేన్నట్లు ముసలితనము తప్పదు కాని, నీ విటుపైన జాగ్రత్తగా నడచుకొందునని చెప్పుచుంటివి, కాన నీ కొడుకులలో ఎవరయిన నీ ముసలితనమును తీసికొని పడుచుదనము నీకిచ్చినచో నీ కోరిక తీరును. ఆ రీతిగా మార్చుకొనుటకు హక్కు నిచ్చుచున్నాను. నీ తర్వాత వాడే రాజ్యాధికారి యగునుగాక!” అని శాపమును నడలించెను సరే, గ్రుడ్డిలో మెల్లవలె ఉన్నది కదా అని సంతోషించి, దేవయానితో సహా యయాతి ఇంటికి వెళ్ళెను. కొ

ఎలా మవోభారతనీతి కథలు- గా ఇంటికి చేరగానే కొడుకుల నందరిని పిలిపించెను. తనకు జరిగిన దంతయు చెప్పెను. “నాయనలారా! కొన్నాళ్ళు మీ యౌవనమును నాకు బదులిండు మరల మీది మీకిచ్చివైతును” అని కోరెను. వారిలో యదు, తుర్వను, ద్రుహ్యు, అనువులు “నాయనా! ఎట్లు మాటాడితివి? నీకదేటి కోరిక? ఇన్నాళ్ళు అనుభవించినేను విషయ తృప్తి నీకులేదే! నూనూగు మీసాల నూత్నయౌవనములో నున్న మాకెట్టుండును? మిసమిసలాడు మా పడుచుదనమును నీకిచ్చి త్త పాడు ముసలితనమును మేము పుచ్చుకొనవలెనా? నీవంటివాడు కోరవలసినదికాదు మే మెవరమును అట్టిపని చేయజాలము. ఏదో కాలము మీటి. వచ్చినచో అనుభవింపక తప్పదు. కాని, చేజేతుల ఏరికోరి పుచ్చుకొను నంతటి వెర్రివాడెవడైన నుండునా? ఆ విషయమెత్తకుము” అనిరి దానితో అతనికి పట్టరానంత కోపము కల్గినది. తాను కనిపెంచి పెద్ద చేసిన కుమారులిట్లు తన మాటను కాదందురని అతడనుకొనలేదు. అట్లు క్లిష్టపరిస్థితి వచ్చినపుడు కాని మంచిచెడ్డలు తెలియవు కదా! అప్పుడాఖరువాడు పూరువు “తండ్రీ, ఇదిగో! నా యావనమును నీకిచ్చుచున్నాను. నీచిత్తము వచ్చినన్నాళ్ళనుభవింపుము నీ కోరిక తీరుటయే నా కభిమతము” అనెను ఆ మాటతో అతనికెంతో సంతోషము కల్గినది అనుకూల, ప్రతికూల వాక్యముల వలనగదా సంతోష కోపములు కల్గుట అతడు, పెద్దవారిలో యదువును “నీ వంశములోనివారు రాజార్హులు కాకుందురుగాక!” అనియు, తుర్వసుని “నీ వంశంలోనివారు ధర్మాధర్మ వివేకము లేనివారై సంకర వర్ణములకు కిరాతులకు రాజులగుదురుగాక[” అనియు, ద్రుహ్యుని “నీ వంశంలోని వారు ఓడచే దాటదగు నంతటి ద్వీపమునకు రాజు లగుదు” రనియు. అనువును “నీ వంశంలోనివారు ముసలితనం రాకుండ పిన్నృతనముననే చనిపోవుదు" రనియు శపించెను. అందుచేతనే ఆ యదువంశంలోనివారైన యాదవులలో జన్మించిన శ్రీకృష్ణుడు సహితం కంసుని చంపగానే తనకు రాజాగ్టధికారం లేనందున మాతామహుండైన ఉగ్రసేన పట్టము కళ్చెను. అట్టు వారి మాట శాశ్వతముగా పాటింపబడెడిది. వ్‌ ఇక తనకుపకారముగా తారుణ్యమునిత్తునన్న పూరుని వద్ద నుండి పడుచుదనము తీసికొని వెయ్యేండ్లు భార్యలతో సుఖముగా కాలము వెళ్ళించెను. న్‌ న ననన

వాయవ్యం మ్రవోదూరత నీతి కథలు = ౯ వాన అప్పటికతనికే విసుగు కలిగినది. వాని యౌవనమును నేను తీసికొనుట న్యాయముకాదు అనిపించి, చిన్న కొడుకును పిలిచి అతని పడుచుదనము నతనికిచ్చి, తన ముదిమిని తను స్వీకరించెను. దానితోపాటు రాజ్యమును కూడ పూరునకిచ్చెను జనులందరిని రావించి అతనికే సట్టాభిషేకమును చేసెను. అంతట ప్రజలు “రాజా! నీది అన్యాయము పెద్దవాడు సమర్శడై యుండగా నీ యిష్టము వచ్చినట్టు చిన్నవానికి రాజ్యము నిచ్చితివి ఇది న్యాయమా? అన్యాయము చేసినంత మాత్రమున చెల్లునా” అని వారించిరి. అతడు వారికి ప్రత్యుత్తర మీయజాలడా? “వీడు నా మాటను తిరస్కరించెను. తల్లిదండ్రుల మాటను ధిక్కరించినవాడు ప్రిత్యమైన ధనమున కధికారి కాదని శాస్త్రము చెప్పుచున్నది. అందుచే ఇతనికి రాజ్యమురాదు నాయుత్తరాధికారి నా కిష్టము చేసిన వూరువే” అనినిశ్చయించి వారల నొప్పించెను. దానితో సప్రమాణముగా నున్నందున వారలంగీకరించిరి వారి సమక్షముననే రాజ్యమంతయు పూరువుకిచ్చి, యదువు మొదలైనవారికి కొండ నేలలు, పర్రనేలలు మున్నగు వాటి మీద అధికారమిచ్చెను. తొనిక వేదవేదాంగ పారతులైన బ్రాహ్మణులతో అడవికి తపస్సునక్రై వెళ్ళి పోయెను. అచ్చట కొన్నియేళ్ళు కందమూల ఫలములను తినుచు ఘోరముగా తపస్సు చేసెను అతని తపస్సునకు మెచ్చి ఇంద్రుడు విమానము పంపెను. యాయాతి విమానమునెక్కి దేవలోకము గుండా బ్రహ్మలోకమున కేగెను. ఆక్కడ కొన్నివేల సంవత్సరములుండెను. తరువాత నొకప్పుడతడు ఇంద్రలోకమునకు వచ్చిను అచ్చట ఇంద్రుడతనికి ప్రత్యుత్థానాభివాదములు మర్యాదలు చేసి అతనినడిగి ఎన్నో ధర్మములు తెలిసికొనెను. “అంతటితో అతనిని వదలక “రాజు! నీవే పుణ్యములు చేసితివి” ఇట్లు బ్రహ్మలోకమున చాలాకాలము సుఖమనుభవించితివే” అని ప్రశ్నించెను. యయాతి గర్వముతో “నేను చాలాకాలము ఘోర తపము చేసితిని నేను చేసినట్లు మరెవ్వరును తపస్సు చేయజాలరు ఏ మహర్షితపస్సు కూడ నా తపస్సు ముందు తీసికట్టే' ' అనితన్ను తాను పాగడుకొనెను. దానితో అతని మహిమ తగ్గి పోయినది ఇంద్రుడు “రాజా! నీ వాత్మస్తుతి చేసికొన్నావు. పరనింద చేసితివి కావున నీవిక పుణ్యలోకములలో ఉండతగవు పొమ్ము” అనెను. త లాలా

యా మవిధారతనతికథలు- గాలా అప్పుడు యయాతికి తెలిసివచ్చినది “దేవేంద్రా! తెలియక తప్పు చేసితిని క్షమింపుము మరల భూలోకమున కెగలేను సల్గోకమున నుందును అందుకు తగినట్టుగా నీవు దయజూడుము” అనికోరెను. దేవేంద్రుడతని మొరను విని దయ తలచెను. యయాతి స్వర్గభ్రప్పుడై సల్టోకమునకు వచ్చెను అతని దౌహిత్రులు “అష్టకుడు, ప్రవర్గనుడు, వసుమంతుడు, బెసీవరుడు, శిబి” అను నైదుగురును అక్కడనే యుండిరి వారు తమ వద్దకు వచ్చిన తమ తాతను చూచి “అయ్యా మీరెవరు? ఇట్లు పై నెక్కడినుండి వచ్చుచున్నారు?” అని కుశల ప్రశ్నలు వేసిరి అప్పుడతడు తన కధనంతయును చెప్పెను. అది విని వారు “తాతా. మేము నీ దౌహిత్రులము తలనని తలంపుగా బాగుగానే కలిసితిమి అని సంతోషంతో అతనికి సత్కారములు చేసిరి తరువాత అతడు సకల ధర్మాగమవేత్త కనుక అతనివలన వారు జీవుల గర్భోత్పత్తి ప్రకారము వర్ధాశ్రమ ధర్మముల పరిస్థితులు వివరముగా తెలిసికొనిరి. అన్నియు తెలిసికొని “తాతా! మాకు సద్గతి కలుగునా?” అని ప్రశ్నింపగా యయాతి “నాయనలారా, మీకు పుణ్యలోకము కల్గును” అని తనకు తెలిసినంత వరకు చెప్పెను! వారుతమ పుణ్యలోకములో కొంత పాలతనికిచ్చి తమతో పాటతనిని కూడ స్వర్గలోకమునకు తీసికొని వెళ్ళిరి. సజ్జన సహవాసమున సద్గతులు కల్గును కదా! ఆ రీతిగా యయాతి మరల స్వర్గసాఖ్యముల ననుభవింపకల్గెను. న 88

నవ. మమభారతనతి కధలు = ౯న భరతుడు ఎవని పేరు మీద మన దేశము “భరతఖండ” మని, “భరతవర్ష్శమని, “భారత దేశి "మని పేరు పొందినదో, ఎవని వంశీయులైనందున కౌరవ పాండవులు భారతులైరో అట్టి భరతుని గూర్చి తెలిసికొందము. ం ఆ మహానుభావుని పుట్టుకను 'గూర్చియే మనకు విపులముగా భారతము నుండి తెలియును, అందు చరిత్ర ఎంతవరకున్నదో అంతవరకైనా తెలిసికొనుట యుక్తము కదా! యయాతికి కల్గిన సంతానములో నల్గురు తండ్రి నెదిరించి రాజ్యాధికారమును పోగొట్టుకొనిరి కదా! ఇక ఆఖరువాడైన పూరువు మాత్రము తండ్రి యిష్టానుసారము నడచి న్యాయముగా పితృధథనమున కర్చుడైనవాడు. అతని వంశములో అతని తర్వాత పుట్టిన రాజశ్రేష్టుల చరిత్ర “రాజ్యమేలి” రనుట కంటే ఎక్కువగా ఏమియులేదు. వారిని గురించి మనకెందుకులెండు! కిలులుడు, రధంతరియను దంపతులకు ముద్దు బిడ్డడు దుష్యంతుడు. ఇతడే భరతుని తండ్రి. అతడు చిన్నతనముననే బాల్యక్రీడలలో అడవికి పోయి లేడిపిల్లలను లాగికొని వచ్చునట్ట్లుగా - సింహపు పిల్లలను, పెద్ద పులి పిల్లలను గూబలు నులిమి లాగికొనువచ్చు వాడు. అతని బలము చూచుసరికి ప్రజల కాశ్చర్యము వేసెడిది. ఆ బలమూ వీర్యము వలన నైజముగా వుట్టుకతో వచ్చునదేకాని మందుల వలన కల్గినదికాదు. అంతేకాదు, చెట్లతో సహా కొండలను పెరికి వేసి మరొక పర్వతము మీదికి గిరివడ వేయువాడు. అతనితో నెవరును పట్టుపట్ట గలుగువారు కారు. సాటి లేని పరాశ్రమముతోను, ధెర్యసాహసములతోను ఆ రాజన్య బాలుడు పెరుగు చుండెను. రాజపుత్రులకు విద్యాబుద్ధులతో పాటు ధైర్యసాహసము లలవడవలెను. వాటికే పాటిలోటు కల్గినను రాజ్యము నిలువదు అందుచే చిన్నప్పటి నుండి వారికి బలపరాభక్రమములు పెంపాందునట్ట్లు చేయుదురు. బలమన్నది నేర్చిన వచ్చునది కాదు. స్వతహాగా నుండవలెను. దానికి వర్థకముగా కూడా లేకపోలేదు. కాని నిజమైన పుట్టకయే ఉత్తేజమని తోచును. పులిపిల్ల పులిపిల్లయే! పిల్లిపిల్ల పిల్లిపిల్లయే! మనమేమి చేసినను మార్పు రానేరాదు. - యౌవనము వచ్చుటతో నతడు యువరాజయ్యెను. క్రమేణ రాజయ్యెను రాజైనవాడెసనికి వాడు దిగ్విజయము చేసి రాజులకు తన బలమును చూపవలెను, అట్లు శాంశకకననన క కన కక “89

ఆం మహాభారతనీతి కధలు - [లా చేయకున్న అతడును పండిత పుత్రుడే యగును. దానివలన రాజ్యమును నిలబెట్టుకొన నేరడు. అంత చేసినను ఎప్పుడాతడు శక్తిహీనుడగునో అప్పుడు శత్రువు లొక్కుమ్మడి రాజ్యము నపహరింతురు అందుచే ముందుగానే దుష్యంతుడు శత్రువులైనను కాకపోయినను ఒక్కసారి వారికెల్ల తన బల పరాశ్రమముల దెల్పెను వినమ్రులై తలవంచిన వారిని వదిలివేసెను కొంచెము తలెత్తిన వారిని చంపివేసెను, బిర్రబిగిసిన వారితల లెగురగొట్టెను. ఏ యుద్ధములో నయినను అతనికి విజయమే కాని, పరాజయమన్న మాటేలేదు బాహుబలం కలవారికి జయమే కాని పరాజయ మేటికి కల్గును? అతని రాజ్యమునకు నరిహద్దులు వేరేలతేవు. విక్కులకు చివళ్ళయందు దిగ్గజములుండునే అవే రాజ్యపు టెల్లల నుండు సర్వేరాళ్ళు అనగా అతని రాజ్యం ఈ మూలనుండి ఆ మూలకున్న దన్నమాట! అంతటికి తానే రాజైనను పరిపాలించు సామంతరాజు లెందరో తనక్రింద నుందురు, వారందరి నుండి పన్నులు (కప్పము) తీసికొనుచుండును. అంత విశాల సామ్రాజ్యమును ఎక్కడయినన్లు అధర్మ కార్యములు రాకుండ అతడు చూచుచుండును. దానితో రోగం - రొచ్చు, అతివృష్టి అనావృష్టి మొదలయిన దోషము లేవియును వచ్చుటలేదు. ఎవరి పనులు వారు సక్రమముగా చేసికొనుచున్నచో దేవతలు కూడా మనల జాగ్రత్తగా చూతురు. అదెరిగి మెలకువగా నా రాజు పరిపాలన చేయుచుండెను. ఏ బాధయు లేక అతని రాజ్యమెంతో హాయిని గొల్బుచుండెను. ఎట్టీ ధర్మాత్ములయినను వేటాడువారు. వేట వ్యసనము లోనిదే యైనను దానివలన కొన్ని మంచి లాభము లున్నవి వాటిని పురస్కరించుకొని అది రాజులకు తప్పనిదైనది. బాణములు వేయువారికి కదలని వస్తువును కొట్టుట ప్రజ్ఞకాదు. పరుగెత్తుదున్నమృగములను కొట్టుటయే నేర్చులో లెక్క, ఆందులో అడవిలో మృగములు చంపుదురను భయముతో ముళ్ళ పాదలు దాటి పరుగు లెత్తుచుండు. అవి పోవు దారిని గుర్తించి బాణం వేయవలెను. వాటికొక మార్గ ముండదు కదా! అట్టు పరుగెత్తు వాటిని కొట్టువాడే లక్ష్యశుద్ధి కలవాడు. అందులోను లేళ్ళు మిక్కిలి చురుకైనవి. అవి ఉన్నట్లే ఉండి ఇట్టే పరుగెత్తి పోవును. అవి ఎవరికిని అపకారులు కాకపోయినను మాంసమునకై కాక లక్ష్యశద్ధికై మాత్రమే వాటిని వేటాడుతారు. ఇక క్రూరమృగములు - అవి అడవులలో పెరగ 'ప్రక్కలనున్న ఊళ్ళ మీదపడి జనులకు బాధ కల్గించెడివి. వారు వచ్చి మొరపెట్టుకోగా రాజులు వేటకు బయల్టేరే వారు “90 లా

వవాయాయాలాయాయాాటా మహవాభారతనీతి కథలు -/ బాలా సింహ శరభాది క్రూరమృగములను చంపుట మాటలతో పని కాదు. ఆ మధ్య తెల్లదొరలు వాటిని చంపవలెనన్న చెట్లపై అరపలు కట్టుకొని నానాపాట్ట్లుపడి ఏ ఒక్కదానినో రెండింటినో కొట్టేవారు. మన దేశపు రాజులు మొన్నమొన్నటి వరకు కూడ కత్తితోను బల్లెముతో పొడిచి పెద్దపులులను అడవి పందులను చంపుతారు. వారి వేట చూచి దొరలాశ్చ్ళర్యపోయెడి వారట. ఇప్పుడేమియును లేవు వేటకు ముందుగా కొందరు భటులు వెళ్ళి పులులను, సింహాలను లేపువారు. డప్పులు-డవాళ్ళు వాయించి అల్లరులు చేయుటతో అవి లేచి పరుగు నారంభించెడివి. అప్పుడు రాజు, సైనికులకు ఎవరికి తోచినట్లె వారడ్డుపడి చంపుట పరిపాటి మరి అడవులలో రధము లెట్లు తిరుగునో తెలియదు కాని వేటకు కూడా రథము పై నెక్కియే చేయువారు బహుశ రధము పై నెక్కి అడవి సరిహద్దుల వరకును వెళ్ళి అక్కడ నుండి గుర్రంలపై అడవిలోనికి ప్రవేశించువారని తోచును. దానికి తగిన గుర్రములు వారివద్దనుండెడివి. రౌతుకొలది గుర్రం కదా! రౌతు సింహంను ధైర్యంగా చంపగలిగిన వాడైనచో గుర్రమునకు మాత్రమేమి భయం? నిర్భయంగా _ అవికూడా పరుగులెత్తి సింహంలమీదికి సైతమురికెడివి. దుష్యంతుడు మిక్కిలి వేగం కల్గిన గుర్రములు పూన్చిన రథమునెక్కి అడవికేగెను! అతని వెనుక నెందరో మంత్రి పురోహితాదులు, కాల్బలము నుండిరి. ఆ పురోహితులు" " కేవలం పెళ్ళిళ్ళలో మంత్రాలు చదివెడువారుక్రాదు. సమయం వచ్చి సచో కత్తిచేతపట్టి " యుద్ధరంగమున కురుకగల థైర్యశాలురు, అట్టివారు కనుకనే వేటకు రాజుతో పాటుగా సాయంగా వెళ్ళిరి. లేకున్నచో వారెందుకు? _ అక్కడ అతడు సింహంలను పొడిచి కవ్వించి, మీదకి వచ్చుచుండగా బల్లెంతో పొడిచి చంపెను. పాదలు దూకుచున్న లేళ్ళకాళ్ళనొక్క బాణంతో కొట్టి తన లక్ష్య శుద్ధిని చూపెను. అదిచూచి సైనికులాశ్చర్యపడిరి. ఆడవి యేనుగులను పెద్దపులులను కవ్వించి చంపి తన బలంను కొనియాడజేసెను వారుకూడ వారి శక్తికి తగినట్టు క్రూరమృగంలను వేటాడిరి. వేటకు దిగినప్పుడే అందరును 'కలిసియుందురు. కాని తరువాత తరువాత ఎవరికి వారే వేర్రపోదురు. అట్టయినను కొందరు గుర్రపు రౌతులు మాత్రమతని ననుసరించియే యుండిరి. కాలినడకను వచ్చు వారలు వెనుకకు దిగపడిరి. తనవెంట వచ్చు మంత్రి పురోహితులతోపాటు అ రాజ మృగముల వేటాడుతూ చాలా దూరం వెళ్ళెను. అక్కడ కేగు లా

లాలా మహభారతనీతి కథలు-[లాాాా సరికి కందరికి అలసట కలిగినది. అక్కడ మృగముల యొత్తిడియుతగ్గినది. వారికి విశ్రమింపదలచిరి.

అదియుక సెలయేటి గట్టు అక్కడ చెట్టు పాదలు, అన్నియు పుష్పించి యున్నవి.

-వాటి నువానన గాలిద్వారా చాలా దూరంనకు వేయుచున్నది అది అత్యంత మనోహరంగానున్నది,

ఆ ఘోరారణ్యం దాపున అట్టి సుందర వనముండుట చాలా చోద్యంగా నున్సది. అది దేవేంద్రుని భాండవ వనమును, కుబేరుని బైత్రరధంను మరపించుచున్నది. అవి భూలోకంలో లేవను లోటు తీరుటకై బ్రహ్మదీనిని సృష్టించెనేమో అని రాజు అనుకొనెను దాని అందమును ప్రక్కవారితో పాగుడుచు రాజా వనంలోకి ప్రవేశించెను.

మనలో ఒక మర్యాద ఉన్నది. ఎవరయినను గొప్ప వారు మన యూరిలోనికి కొత్తగా వచ్చినప్పుడు వారికి చక్కగా పూలదండలు వేసి మర్యాదలు చేయుదురు. పూర్వం ఇప్పటివలెనే పురంలోని స్రీలు మేడలపై నుండి పువ్వులు చల్లెడివారు దీవన లిచ్చెడివారు. ఆ మర్యాదలా క్రొత్త అడవిలోని కేగిన రాజునకు గూడ జరిగినవి క్రింద నుండి వెళ్ళుచున్న రాజుమీదకి పైనున్న లతలనుండి గాలికి కదలి పువ్వులు రాలిపడినవి. అది మేడలపై నుండి స్త్రీల చేతుల నుండి పడినట్లే యున్నది, ఆ పడునప్పుడు వాటిమీద వ్రాలిన తుమ్మెద రగురును జుమ్మనుచున్నవి. ఆ రుంకారమే దీనంగా వినిపించినది అదృష్టవంతున కెక్కడీ కేగనను మర్యాదలన్నియు జరుగునుకదా! అదొక శుభసూచకమని రాజావనములోనికి ప్రవేశించెను. సెలయేటి మీద నుండి వచ్చిన గాలులతని శ్రమను పోగొట్టినవి,

ఆ వనములో గోరింటలు పుల్లముగా పూచియున్నవి, అశోక్ష వృక్షములు గుజ్జుగా చిగుళ్ళు పట్టియున్నవి సురపాన్నల్సు పాన్నలు పూచ్చి పరిమళించుచున్నవి అరటితోటల మీద నుండి కమ్మని గాలి తగులుచున్నది వాటినన్నిటిని చూచుచు, నీనుల విందుగో కోకిలల, చిలుకల పాటల వినుచు అతడు ముందున కేగెను,

చూరమునకే అది తపోవనమని తెలియుచున్నీది, తపోవనవ్పునగ్గా తపస్సు చేయుచున్నజ్ఞ మహర్షులున్నవనము వారు నిత్యమును అగ్నిహోత్రములోరెండుపూటల నెయ్యి మొదలైన వస్తువులను హోమము చేయుదురు. అని సుగంధ ద్రవ్యములు కాన వాటిపాగ కూడ పరిమళించుచునే యుండును అగరువత్తులపొగ స్సువాస్తనగ్గా నుండును గదా! ఆ పాగకొమ్మలకు ప్రాకినది. పాగ దూరినందున ఆ కొమ్మలు చిగర్చనే లేదు, అది చూచినాడు దుష్యంతుడు, ఇట్టి సువాసన వేయు పాగ యున్నందున అదే తష్రోవనముని అథడు ననన న న మ

వం. నువాభారతనీతి కథలు =! లాలా నిర్ణయించెను. అందులోను అంతటి ఘోరారణ్యమునకు దగ్గరగా నున్నందున ఎవరో దిన్యమహర్షి అక్కడ ఉండి యుండవచ్చునని అతడూహించెను. అతని యూహ అబద్ధమేల యగును? అదే కణ్వాశ్రమము.

ఆ తపోవనములోనికి ప్రవేశించినాడా దుష్యంతుడు అతనికేదో చెప్పరాని ఆనందము కలిగినది మనకు రాబోవు సుజాసుఖములను మన మనస్సే చెప్పును. అతని హృదయం రాబోవు సుఖమును సూచించినది.

పూర్వము మహర్షుల ఆశ్రయములున్న చోటికేగి విద్యార్థులు చదువుకొనెడివారు. వారిది గురుకులవాసము, వేదము “మూలము, పదము, క్రమము, జట, ఘన” అను భాగములతో నున్నది. కొందరు విద్యార్థులు కలిసి ఒక్కొక్క భాగమును గట్టిగా చదువుచున్నారు. మరికొందరు స్వాహాకారములు చేయుచు అగ్నిహోత్రములలో హోమములు చేయుచున్నారు. మరొకచోట కొందరు గుమికూడి వేదార్ధమును, శబ్బార్ధములను చర్చించుచున్నారు వారి శాస్త్రార్ధములలో నిర్ణయములు పక్షపాతం లేకుండా జరుగుచున్నవి. మరికొందరు యజ్ఞాలు చేయించు విధానాన్ని నేర్చినవారు చక్కగా ప్రయోగాలను చేయుచున్నారు అన్నియు తీరిన వృద్ధమునులు చక్కగా సుష్టుగా వేదమంత్రాల పారాయణ చేయుచుండిరి అదంతయు వినుసరికి దుష్యంతునికి గంగతీరాననున్న నరనారాయణక్షేత్రం (ఐదరీనారాయణం) జ్ఞప్తికి వచ్చినది.

రాజులాజ్ఞాపించి ఎవరినయినను చెడుపని చేయకుండ నియమింపగలరు కాని చేయకుండ చూచుట వారివలన కాదు రాజాజ్జను మీరి నుసమెన్ని చేయుచున్నాము? ఎందుచేత? అవన్నియు రాజదృష్టిని పడకుండునుగాక! మనకు ధైర్యమే నేను చెప్పునది వతి ఒక్కడును రాజాజ్ఞమీరునని కాదు ఏదోరీతిగా చేయు నిషేధములను మానవమాత్రులయిన రాజు లాపలేరు ఇక మహర్షులో నీ అధికారమును లేనివారే, కాని వారు మనోనిగ్రహము కలవారు కనుక వారి నివాస ప్రాంతమంతయు వారి ప్రభావము కలిగి యుండును, అది దివ్య మహిమ.

పారికి కామక్రోధములు లేవు. అట్లే యాశ్రమ ప్రాంతములో కూడ ఉండరాదు. సహజ విరోధము కలిగిన జంతువులు కూడ అచ్చట చాలా ప్రేమతో కలిసి మెలిసి తిరుగుచుండును వాటి విరోధము కారణము లేనిదే కాని మహర్షి ప్రభావం వలన వాటి విరోధం పోవును.

“ఏ గూటి చిలక లాగూటి పల్కు పల్కును” అన్నట్టు అక్కడి చిలుకలకు సామవేదములు బాగుగా వచ్చినవి అని చెట్టుకొమ్మల మీద కూర్చుండి పాడుచుండగా 93 |

అనాలా నువాభారతనీతి కథలు -/ లన ఏనుగులు కదలక మెదలక వినుచున్నవి. పైన ఎండకాయుచున్నందున ఏనుగులు తాండములతో నీరు తెచ్చుకొని వంటిమీదికి చల్లుకొనుచున్నవి. ఆ చల్లగాలికి సింహపుపిల్లలు వచ్చి వాటి నాడచేరి విశ్రమించినవి అదెంత విచిత్రం! అదొకటి - మరొకటి వినుడు. మనం ప్రతిదినం భూతబల్నులు వేయవలెను. బలియనగానే జీవహింసయని తలపరాదు. దేవతలను గురించి కాని, ప్రాణులను గూర్చిగాని ఉచితంగా నిచ్చు పదార్ధములనే బలి అందురు. ప్రతి గృమస్ఫ కూడ ప్రతిదినం అతిదులకు పెట్టవలెను. అతిధియనగా ఏదో గగ్రామాంతరం పోవుచు వచ్చినవాడు ఆ కాలమున హోటళ్ళు లేవు కనుక ఆ రీతిగా ప్రతి యజమానుడు పెట్టు అలవాటులో నున్నందున ఏ బాధలేకుండ తేలికగా ప్రతివానికి (బ్రాహ్మణుడు మనవాడు అనక) భోజనం దొరికెడిది అదొక నియమం. అట్లే కాకులకు, పిల్టులకు, ఎలుకలకు కూడ బలి (అన్నం) వేయవలెను. మనం .పరములుబ్బుని చెప్పవలసి వచ్చినప్పుడు “కాకినైనను మెతుకు విడవడు” అందుము అది గృహస్తులకొక పెద్ద నియమం. ఆ రీతిగా మహర్షులు తప్పక బలివేయువారు ఆ బలివేసిన అన్నప్పు ముద్దలను తగవులాడకుండ పిల్లులు, ఎలుకులును కలిసి తినుచున్నవి. ఆ పరస్పర మైత్రిచూచుటతో తసవలన క్రాన్సి అద్భుతం చేయగలుగుచున్నారని మహర్షుల శక్తికి దుష్యంతుడెంతో ఆశ్చర్యపడెను, అక్కడివారు శాజు వచ్చెనని మర్యాదగా పలుకరించిరి, ఆయన వారిని కులపతి యెవరని ప్రశిర్నచెను, అచ్చట ప్రధాన మహర్షినే “కులపతి” యందురు. అతడే అశ్రమాధిపతి, వారు -కణ్వమహర్షి' అని చెప్పిరి, దుష్యంతుడాతని శేరు ప్రతిష్టలు వినియుండెను. కాని యెన్నడును చూడలేదు. అందుచే లోనక్షగ మహర్షి దర్శనం చేసి రాదలచెను. అంతవరకు వచ్చిన తరువాత కనపడకుండ వెళ్ళినచో బాగుండునా? - ॥ " తనతో వచ్చిన మంత్రులను పురోహితులను తానువచ్చు వరకు నచ్చటనే యుండు మని ఆశ్రమం వెలుపలనుంచెను. కాన్సి ఆశ్రమంలోని కేగునపుడు వారిని వీరిని తీసుకొని వెళ్ళినచో ఎవరి వలన ఏ లోపం వచ్చినను ప్రమాద్రమే। మహర్ములకు కోపం రానేందు వచ్చినచో వారి మాటయే శాపమగును. అందుచే అతడిష్పుడే వత్తన్సని ఆశ్రమంలోని కేగెను ఆశ్రమంలో శకుంతల ఒక్కతెయే యున్నది, ఆమె ల్రోన్సిక్ర వచ్చుచున్న దుష్వంతుని చూచినది. అతడు మహారాజని అతని ముఖం చూడగానే తెలియురున ఆయు రాజకుమారియే కనుక దాంపత్య మనుకూలంగా నుండునని ఆమె మన్న ఆ తెలియకుండగనే యుద్బోధించినది అతని అందచందమూలామె మనము ప్‌ నావా

అలాగా మవాభారతనీతి కథలు -/ నాలా క్రొత్తవానిని చూచుటతో కొంచెం కంగారును తొందర కల్గును. అందులోను లోపల మరికొన్ని భావములు దాచతగినవి వున్నప్పుడు మర్తికొంత సంబరం కల్గును. శకుంతల క్రొత్తగా వచ్చిన అతిధికి మర్యాద చేయుటకై హడావిడిగా లేచి వెళ్ళినది. కాళ్ళు కడిగికొనుట నీరు (పాద్యము) చేతులు కడిగికొనుటకు నీరు (అర్హ్యము) తెచ్చి ఇచ్చినది అది మర్యాద. అలసిసాలసి బయటనుండి వచ్చిన వాని కానీరిచ్చుటతో కొంత విశ్రాంతి కల్గును. ఆపైన కుశల ప్రవ్నలు, ఆగిన ఆసనం ఏ (దర్భాసనమో) వేసినది అతడు కూర్చున్నాడు. ఆమె అప్పుడు “మహారాజులకు కుశలమా?” అని కుశల ప్రశ్న వేసినది. అతడామెకేసి తేరిపార చూచినాడు. మనస్సేలకో ఆమె మీదికి పోయినది కాని మహర్షి పుత్రిక యగుటచే వరింపరానిదని తనకుతాను సంబాళించుకొనెను, + శకుంతల “మీరెవరు?” అన్న ప్రశ్చ కతడు తన కులగోత్రనామములు చెప్పి, “మే మిచ్చటికి వేటకై వచ్చితిమి, సరే! దగ్గరకు వచ్చితిమి కదా అని కణ్వమునీంద్రులను చూచి పోదలచి వచ్చినారము. వారెక్కడికి వెళ్ళియుందురు” అని దర్జాకు లోటులేకుండ ప్రల్నించెను. ఆమె మర్యాద నెరిగిన పిల్ల. అయినింటి పిల్లలలోని విశేషమే ఆది ఆమె “మా తండ్రిగారిపుడే అడవికి పళ్ళు తెచ్చుటకై వెళ్ళినారు. ఇప్పుడే వత్తురు. వారిని సందర్శించి పోవచ్చును. ఒక్కింత సేపు విశ్రమింపుడు"” అన్నది. అమెయొక్క వినయ విధేయతలకు, ఆ మాటలలోని పొంద్లికకు, మాధుర్యమును అతని కెంతో ఆనందం కలిగినది. ఆమె కన్యకయని వెంటనే తెలసినందున అతడామెతో “కణ్వమునీంద్రులు జితేంద్రియులు, ఊర్ధ్వరేతస్కులని విన్నాము. మరి, నీవు వారి కూతురు వెటయితివి? అని ఆకాంక్షతో ప్రశ్నించెను. అతని మనస్సామె పైకి పోవుటతో అతసికేదో అనుమానము కలిగినది. “ఈమె ముని కన్యకయే యైనచో నా మనస్సు అధర్మ మార్గమున ప్రవర్తింపనేరదు. ఈమెయేమని చెప్పునో?” అన నంశయం నిర్భయమున కలిగినది. , శకుంతల “నే నాయన పెంపుడు కూతురునుగాని, సాక్షాత్తు కలిగిన కన్యనుకాను నా జన్మగాత నొక్కనాడొక్క మునీంద్రుడు నా తండ్రి నడుగగా ఆయన ఇట్లు చెప్పినారు. అదే చెప్పెదను! వినుడు” అని చెప్పనారంభించెను. శకుంతల జన్మగాథ జన్మతః రాజర్షియెైనను, తపస్సుచే బ్రహ్మర్షియైన విశ్వామిత్రు నెరుగుదురు గదా! అతడొకసారి ఘోర తపస్సు చేయుచుండెను అతనికి పట్టుదల హెచ్చు, ఎన్ని దిక్కులకు న ననన

మహాభారత నీతి కధలు = లాలా చ రపమాచరించినను ఏదో యొక విఘ్నము వచ్చుచునే యుండెను. అతడు విసుగుకొనలేదు. ఒకసారికంటె హెచ్చుగా పట్టుదలతో తపస్సు చేయుచుండెను. అతని తపోగ్ని జ్వాలలు స్వర్గమును కలత పెట్టినవి. అందరికంటె భయపడువాడు ఇంద్రుడు అతడు చెడగొట్టు వాడనుటకంటె పరీక్షించువాడన్న బాధలేదు. ఆ పరీక్ష కాగినవాడే మహా తపశళ్శాలి యగును. దానికికాన్టలసిన పరికరం లతనివద్ద నున్నవి. వాటిని (ప్రయోగించి చూచెను. అతడు (ఇంద్రుడు) మేనకను పిలిచినాడు. అతడు పిలువగానే ఆమె గుండె గుభేలుమన్నది. పై అధికారులు కబురంపినచో ఏదో తగినంత పని యున్నదన్నమాటే. అసలు పెద్ద పని యున్నప్పుడు గొని క్రిందవారికేసి దృష్టినైన పెట్టరు..అది ఆమె ఎరుగును. అతని కెదురుగా వచ్చి నమస్కరించినది, అతడు మర్యాదగా “మేనకా. ఆరిదంలో నిన్ను మించగల వారు మన నగరిలో లేరు” అని అందుకొనగానే “ఇదేదో పెద్దయెత్తే” అనుకొని అమె యేమియు నెరుగనట్లు “ఊ” కొట్టి వినుచున్నది “నీవు తలచుకొన్నచో కాదు. ఒక్కసారి కన్ను గీటినచో గీటునంతవరకునా? నీవు కన్నుల పడినంతనే చలింపని వాడెవడు? రాళ్ళు కూడ కరిగి తీరును నీ రూపము నీ నేర్చు, నీ ఆటపాటలు మదురాతి మధురములు. నిత్యము వినుచున్నను నాకే క్రొత్తగా కనిపించును ఏమందువు?” అని ఒక్కసారి తన మాటల నామె వినుచున్నదో? లేదో? అని మధ్య నొక్కసారి పలుకరించెను. ఆమె తవంచుకొనియే “ఏలినవా రతంగా అనవలెనా? నేను దృష్టికి వచ్చుటయే సాక్షీ మరీ లేని మాటలందురా? నా అదృష్టము పండినది. నా సుకృతము పరిపక్వము కానిచో ప్రభువులు పిలుతురా?” అని సాధక బాధకములు దెల్పుచు శ్లేషగా అన్నది, అతడావులించిన ప్రేవులు లెక్కపెట్టె ధీరుడు త్రిలోకాధికారి కాపాటియైన తెలియదా? “మేనకా నీవు చక్కన్ని అందగత్తెవు. నిన్ను బ్రహ్మ ప్రత్యేకముగా సృష్టి చేసినాడు విశ్వామిత్రుని ఎరుగుదువు కదా! బ్రహ్మసృష్టికి ప్రతి సృష్టి చేసిన ముని అతడు. ముక్కుమూసికొని మరల తప మారంభించినాడు. అతని నెట్టయిన నీ వలలో వేసిక్రానవలె నీవు తలచుకొన్నచ్రో కానిదేమున్నది ఏదో రీతిగా నీవాతని తపస్సునకు విఘ్నం కలిగింపనిచో సాకీ దేవరాజ్యం దక్కదు సుమీ! నాకు మాట దక్కించు భారం నీపై నున్నది. ఏమిచేతునో?” అని నయమున భయమున బ్రతిమాలి భామాలినచ్చచెప్పెను, ఆమె మాత్రం తటాలున వప్పుకొనునా, మునుల మీదికి పోవుట మాటలతో పనికాదు. త్రాచుపాముతో చెలగాటమే! తటపటాయించుచూ ఇంద్రునకు నమస్కరించి న్‌ ననన

లాడ మహభారతనతి కథలు -/ లాలా “దేవేంద్రా! తమరు ప్రభువులు. నేను పరాధీనను. నేనేమన్నను దేవర వారి కన్యధా తోచునేమో కాని మన్నించి నా మనవి ఆలకింపుడు.

ఆ ముని మహాకోపిష్టి మహా తపస్వి ప్రభావ నంపన్నుడు అతని పేరు తల పెట్టినంతనే దేవతలందరు హడలి పోదురు అట్టి ముక్కోపి వద్దకు నన్నంపుట మీకు న్యాయమా? ఒకింత ఆలోచింపుడు అతడు కోపంతో దృష్టిబరపెనా? కుల పర్వతములతో సహా భూమి చలించపవలసినదే సముద్రం లింకవలసినదే? మూడు లోకములను గిరగిర తిరగవలసినదే. అతడున్న ప్రాంతములో సైతం గాలికూడ చలింపదే అట్టి పరమకోపముని వద్దకు నన్నంపుదురా? అడవారన్న అతనికెంత? ఏమి చేయుదును? మీ యాజ్ఞ మీరినచో నాకు ఇక్కడనే శాపం తప్పదు. మహర్షి కోపించినా అచ్చటను తప్పదు. ఎట్టయినను తప్పని దానికి రాకార్యం కూడ మానుట యేటికీ? వెళ్ళుదునులెండు. వెళ్ళినా శక్తి కొలది ప్రయత్సింతును. సాద్యమయ్యేనా మంచిదే! కాకున్న మీదే భారము” అని అతనివద్ద సెలవు తీసికొన్నది.

ఉద్రేకమును పుట్టించుటకు కొన్ని ఉన్నవి. పైరగాలి పువ్వులు, తుమ్మెదల రుంకారములు, కోయలకూతలు. వెన్నెల ఇందులో ఒక్కొక్కటియే మనస్సునకు హాయి కలిగింపజేసి ఉత్సాహమును రేకెత్తించును. ఇక అవన్నియు కలిసినచో చెప్పెడిదేమున్నది? ఇంద్రు డాజ్ఞాపించినందున ఇవన్నియు మేనకకు సహాయముగా వచ్చినవి. ఒక్కసారిగా విశ్వామిత్రుడున్న వనమంతయు చిగిర్చినది చక్కగా పూచినది. పూల వాసన యెంతో దూరమునకే గుభాళించుచున్నది. పైరుగాలి చల్లగా వీచుచున్నది అదేమో కాని ఏ మూల నుండి వచ్చినను గాలి హాయినివ్వదు. ఆ పైరు గాలియైనను మరొక కాలమున సుఖంగా 'నుండదు ఒకటి వచ్చినప్పుడు అన్నియు నమకూడినవి. కోకిలలు మామిడి పూత తిని కంరం బొంగురువోగా “కుహూ” అని కూయుచున్నవి. అనుకరించిన కొలది మరింత కోపముతో' గుడ్డెర్ర చేయుచు మరింత గట్టిగా కూయుచున్నవి. దైవకృతమగుటచే కాబోలు వనంతర్హువాక్కసారిగా ఆ వనం నలముకొన్నది. " మేనక దిగివచ్చినది, ఆమె దుస్తులపైకి వ్రతవ్యయవమున స్పష్టము మెరయుచు కన్పడుచున్నది. పతనపు తెరవలె నున్నదా చీర మల్లెమొగ్గలగుత్తి నొకదానినొకోసి జడలోనొక ప్రక్కన పెట్టుకొన్నది దానిమీద వ్రాలితుమ్మెదలు శ్రుతి వేయేచున్నవి ఆమె సన్నగా కోకిల కంరముతో ఏమో తెలియకుండ రాగాలాపన మారంభించినది. పక్షుల కలకల ధ్వనులు గజ్జెల మైతగా హావభావములు వ్యక్తీకరించుచు తక్కుచు తారచు వయ్యారంగా నాట్యము చేసినట్లు అతని ప్రాంతమున తిరుగుచున్నది. లాలా

“లాలా మహాభారతనీత కథలు- గాలా అతడామెకేని ఒక్కసారి కన్నువిప్పి చూచినాడు సమయము మించిపోకుండా ఆమెకూడ అరమోడ్పు కన్నులతో ఒక్క క్రీగంటి ప్రసారం విసిరినది మన్మధ బాణమందురు. అదేదో కాదు ఆమె చూపే! ఆ చూపులో ఎంత కారిన్యమున్నదో కాని అది వెళ్ళి సరాసరి హృదయమునకు నాటుకొన్నది. విశ్వామిత్రుడు ఒక్కింత చలించెను, అయినను గట్టిగా కన్నులు మూసికొని ధ్యాన నిమగ్నుడయ్యెను. ధ్యానమేమి? మేనకయే కన్చించుచున్నది మనస్సామె పైకి పోయినది అది తిరుగుట లేదు. అతడు శక్తి కొలది ప్రయత్నించినాడు. తను గెలవలేక పోయినాడు. ఆమె"వద్ద కొక్కసారిగా వెళ్ళి కౌగలించుకాన బుద్ధి వేసింది తాననుకొననే కాని వెళ్ళినంత -మాత్రాన అమె యొప్పుకొనునా?'ఆమె యెందు కిక్కడికి వచ్చినది? తనను వలపించుటకే కదా? ఒకవేళ కానిచో తాను చులకన కాడా? మనస్సులో భావము లెన్నోరీతుల పరుగులెత్తినవి అతడిక నీలువలేక పోయినాడు జపము, ధ్యానమును ఎట్టున్లు నడచుటలేదు. అతడు మెల్లగా కదిలినాడు. , మేనక అదంతయున్ను గ్రమనించుచునే యున్నది. ఆమె వచ్చినది అందుకేకదా! అతని మనోభావములు ముఖంపైకి కనపడుచున్నవి. అతడావలేక పోవుచున్నాడు. ఆమె మెల్లగా పాటలతో నాట్యం చేయుచు అతని దగ్గరకు చేరినది. ఒక్కసారి అతనికి తగులునట్టు నిలబడినది. పైట ఎగిరి అతనికి తగిలినది. అదెంతో హాయి అనిపించినది. అ అనిర్వచనీయ (చెప్పలేని) ఆనందముతో అతడొక్కసారి పరవశుడైనాడు. ఆమె మరి ఒకటి రెండుసార్లు తగిలినది. నిప్పులపై నెయ్యి పోసినట్టయింది. ఇందాకటి సుఖమిప్పుడు లేదు. ఒళ్ళు భగభగ ' మండింది. ఆ మంట కొక్కటే మరదు ఆమె శరీరమును కౌగలించుకొనుటయే. విశ్వామిత్రుని భింకము సడలింది. పూర్తిగా జారిపోయినది. ఆమెను వెనుదగిలినాడు. ఆమె అతనికి దొరికినట్లే దొరుకుచు, ఇట్టే తప్పించుకొనుచు చంటిపిల్లవానిని బెలిపించినట్లు బెలిపించుచు దూరముగా మల్లెపాదల చాటునకు తీసికొనిపోయినది. ల్‌ థి ఆతని కొక్కొక్క క్షణ మొక్కొక్క యుగమువలె గడుచుచున్నది సహింపలేకున్నాడు, అమాంళంగా ఆమెను రెండు చేతుల నందిటలోనిక్రి తీసికొన్నాడు. ఆమె కన్నులు మూసికొని, తలవంచుకొని యూరకున్నది, ఆతని గడ్డము, మీసములు చూచుసరికి ఆమెకు భయము వేసినదేమో! నన ననన న

అంటా భువభారతనీతి కథలు -/ డా ఇద్దరికి రోజుల, నెలలు, సంవత్సరములు తేలికగా గడిచిపోయినవి. మహర్షికి తపస్సు మాట గుర్తురాలేదు ఒక్క క్షణమైనను ఆమెను వదలడు. స్నాసంధ్యావందనములు భగవంతుని కొప్పచెప్పెను. ఆమెతో పాటు ఈదులాడుటయే తప్ప అఘమర్షణ స్నాములు లేవు ఆమె రూవమునే ధ్యానించుట, ,ఆమె పేరును జపించుట అంతయు మేనకామయమైనది. ప్రేమ కుదరవలెను. కోని అట్టు కాకుండునా? ఇనుప గోచీలు బిగించుకొని, ఆకు - అలము తిని, అరణ్యవాసము చేయు మహర్షి విశ్వామిత్రుడే అట్లు స్రీ ముఖమును చూచి చలించి తన్మయుడై ప్రపంచము చెరుగక సంచరింపగా ఇంకెవ్వరు ఏకాగ్రతగా నిలువగలరు? ఉప్పు పులుసు తినెడీ వారి కింద్రియ " నిగ్రహం సాధ్యమగునా? వీలుపడకో, గౌరవమునకు భంగమనియో ““అభానేవిరక్తి”గా ఊరకొనుటయే వారి విరక్తి " మేనక గర్భవతియైనది గ్రుడ్డిలో మెల్ల ఏమనగా దేవతా స్రీలకు ఏడు ఘడియలే (రమారమి 3 గం.) గర్భము. ర్రసవించగానే సంతానము నిక్కడనే వదలి వెళ్ళిపోవుదురు. గర్భము వచ్చుటతో ఆ కొద్దికాలమునకే విశ్వామిత్రునకామె పై విరక్తి గలిగినది. అతనికి తాను చేసిన పొరపాటు తెలిసినది. నాలుక కరచుకొన్నాడు. మేనక ఒక కూతురిని కన్నది. ఆ సంతానమును దేవలోకమునకు తీసుకొని వెళ్ళరాదు. వారికక్కడ పుట్టనందుకు శిక్షగొ అక్కడ ఓటింగు హక్కుండదేమో! వారికి కూడ పౌరసత్వపు హక్కులు తెలియునను కొందురు. మేనక ఆ పుట్టిన బెడ్డను పుట్టగానే మాలినీ నదీతీరమున్న. ఇసుకతిన్నె పై ఆకులు పరుపుగా వేసి పరుండబెట్టి దేవలోకమునకు వెళ్ళిపోయెను. విశ్వామిత్రునకు (ప్రేమపుట్టినది మేనకపై కాని, పిల్లపై కాదుకదా! ఆతనికీ . కన్యయెందుకు? తల్లియే ప్రీతిలేకుండ గ్రుక్కెడు పాలయిన నియ్యక వదలి వెళ్లిపోవునపుడు, ఇక తండ్రి రక్షించునా! అతడు చేయునదేమియు లేకపోయినను కనీసము రక్షింపనయిన తలంపక వెంటనే తపోవనమునకై మరొక దిక్కున కేగెను. ఇక ఆ పిల్ల సంగతి. ఆ పసిపిల్ల కదులుచు లేచి ఏడువ నారంభించినది. ఆయువు కలవానికి భగవంతుడే ఏదో రక్షకుల చూపించును. ఆ చుట్టు ప్రక్కలనున్న పక్టులామెను చూచి జాలిగొన్నవి ఎండ తగలకుండ రెక్కల నడ్డు పెట్టినవి. క్రూర మృగములు రాకుండ కాపాడుచున్నవి. ఏ పూడేనెనో తెచ్చిమెల్లగా నోటిలో ఉగ్గు పెట్టినట్లు పోసి ఆమెకు ప్రాణము నిల్చినవి, _ _ ఇంతలో సమిధలు, దర్చలు తెచ్చుకొనుటక్రై మేము శిష్యులతో సహాఆ ప్రాంతమున కేగితిమి. ఆ కన్యను చూచితిమి భూమికి దిగివచ్చిన చంద్రరేఖవలె ఆ ఇసుకతిన్నెలో న

లా మహాభారతనీతి కథలు -/లాలాాాాాాాాాాాాాాాాా మెరయుచున్నదా పిల్ల, దానిని చూచుసరికి మాకెంతో దయ కల్గినది, జాలి వేసినది. దగ్గరకు వెళ్ళి ఆ పిల్ల నెత్తుకొని ఆశ్రమమునకు తీసికొనివచ్చితిమి. శకుంతలములచే (పక్షులచే) రక్షింపబడినది కాన ఆమెకు “శకుంతల” అని పేరు పెట్టితిమి మరి కన్నవాడు, అన్నము పెట్టినవాడు; భయము నుండి రక్షించినవాడు అను ముగ్గురును స్రీలకు గురువులు (తండ్రులు), ఇక పురుషులకు వీరుగాక ఉపనయనము చేసిన వాడును, చదువు చెప్పినవాడును మొత్తమైదుగురు తండ్రి వరుసలోనివ్నారు. కావున భయము నుండి రక్షించుట వలనే మే మామెక్తు తండ్రివరుసలోని వారమైతిమి” అని కణ్వ మహాముని ఆనాడు ప్రశ్నించిన మహర్షి చెప్పగా నేను విన్నాను రాజా! ఇది నా జన్మగాధ!”

  • అన్నది శకుంతల. ఆ కధనంతను ఆతి ద్ధగా విన్నాడు దుష్యంతుడు. “అదీ సంగతి! నా మనస్సు కోరుటతోడనే నాకనుమానము కలిగినది. కాని మునికన్యయేమో అని అనుమానముతో ,మున్ముందుగా వాకీమెపై స్పృహ లేకపోయినది. కాని యిష్పుడీమె జన్మగాధను చెప్పుట వలన రాచబిడ్డయని తేలగానే నా మనస్సువ్విళ్ళూరుచున్నది మరి ఈమె అంగీకరించునో, లేదో?” అనుకొనుచు ఆమె ముఖము కేసి చూచెను. ఆమె కూడ కధ చెప్పినంతసేపును చాలా ప్రశాంతముగా చెప్పి, ఆఖరునకు వచ్చుసరికి తన భావితలచుకొని “ఇదంతయు విన్న మీదట అతడు నన్ను వరించునా? వరించనచో నేనేమీ చేయవలేను! అతడు తగిన వరుడులాగుననే అగుపడుచున్నాడు. తండ్రిగారితో చెప్పకుండగనే వివాహమెట్టు చేసికొందును? ఈయన నా తండ్రి వచ్చువరకు నుండును గదా! ఒకవేళ వెళ్ళిపోయినను నా తండ్రితో చెప్పినచో ఇతనికే సన్నిచ్చి వివాహము చేయగలడు! కాని, నా తండ్రితో చెప్పుట ఎట్టు? నాకు సాహసము చాలదు. నేనే చెప్పవలెనా? ఎవరిచేతననునైనను చెప్పింతును. అదియు అక్కరలేదు అతడే తెలిసికొనగలడు. నేను ప్రేమించినట్లు తెలిసికొని నన్ను ధూషింపడు గదా! ఏమో దూషింపడు ఇతడు కులీనుడని విని యుంటినిగదా!” అని పరిప్రరి విధముల సంకల్పమును వికల్పములతో ముడిపెట్టుచు వితర్శించు కొనుచున్నది. లోపల సెండ్డిభావముదయించుటతో అతనికేసి చూడలేకపోవుచున్నది. తన లోపలనున్న భావము ననుసరించియే కన్నులు నడచును. గట్టిగా చూచినచో అతడేమను కొనునో? ఏమియు ననుకొనడు, కాని తన లోపలి భావము ననుసరించియే తనకు తోచుట మామూలు, అందుచే అతనికేసి చ్తూచుసరికి రెప్పలు కిందకి పడుచున్నవి. భ్‌ ననన న న

వలా నుహభారతనీతి కథలు -/ లాలా అతడదంతయు గమనించాడు. ఇద్దరికిని సమముగానే (ప్రేమ కలిగినది. ఇక ఆలస్యమెందుల కనిపించినదతనికి. .

“పిల్లా! నీ రూపమునకు, అందమునకు ఈ నారచీర లేమి బాగున్నవి? అందమంతయు ఈ పర్ణశాలలో ఉండుటతో అడవిని కాచిన వెన్నెలవలె నున్నది. ఇదేమియు బాగాలేదు. నీవీ మునిపల్లెలో నుండుటేల? నాకు భార్యవు కమ్ము నాతో కూడి రాజ్యసుఖము లనుభవింపుము. నా రాజ్యము చాల పెద్దది. మాకు బంగారుచష్టాలు చేసిన మేడలున్నవి. మణులు పొదివిన భవనములున్నవి, ఆ మేడలపైకి చంద్రకిరణములు నరాసరి పడుచుండును. ఆ వెన్నెల ఆ చలపరాళ్ళెంతో సుఖముగా నుండును, అక్కడ విహరంచుట నీబోటి దానికి తగినదికాని, ఇదేమిటి? నీవు “ఊ” అన్నచో ఒక్క క్షణంలో మనకు వివాహమైపోవును” అన్నాడు దుష్యంతుడు.

ఆమె తల వంచుకొనియే “అంత ఒక్క క్షణములో ఎట్టగునో! పెద్దలుండ నక్కరలేదా?” అన్నది సన్నగా.

“అక్కరలేదు, పెళ్ళిళ్ళలో రకాలున్నవి. “బ్రహ్మం, దైవం, ఆర్హం, (ప్రాజాపత్యం, రాక్షసం, గాంధర్వం, సపైశాచం” అని ఎనిమిది రకాలు. వీటిలో నీవనుకొన్నట్లు పెద్దలు చేయవలసినవి కొన్ని రాక్షసమనగా రుక్మిణి కృష్ణులకైనదే, అట్టిది పిల్ల పిల్లవాడు అంగీకరించి పెద్దలంగీకరింపకున్నను చేసికొనెడిది. మరి పిల్ల అంగీకరింపకపోయినను బలవంతముగా లాగికొని చేసుకొను పెళ్ళి పైశాచపము. ఇక గాంధర్వ వివాహము నెప్పుడయిన వింటివా? అది మనకు చాలా ఉపయుక్షమైనది వధూవరులంగీకరించిన చాలును. ఇంకెవరును మధ్యవర్తులుండవలసిన అవసరము లేదు, వెంటనే పెళ్ళి అయిపోవుటయే, కానీ ఖర్చులేదు. క్షఖమాలస్యము లేదు. క్షత్రియుల కిది ధర్మయుక్తమయినవి. మనకా? ఒకరి మీద ఒకరికి (ప్రేమ కుదిరినది కదా! ఇంకను అలస్యము చేయనేల? వెంటనే అంగీకరింపుము” అని చెప్పెను.

ఆమె అతని ఉపన్యాసమంతయును విన్నది. ఆమె కింతలో ఇంతవరకు వచ్చునని తోచలేదు. సిగ్గు తెగ పెనవేసుకొని వచ్చుచున్నది. ఎప్పుడు పెళ్ళి యగునా - అని కంగారాక ప్రక్క తటాలున ఒప్పుకొనలేకపోయింది.

మెల్లగా అతనితో “మీరన్నది బాగుగనే యున్నది. కాని, మా తండ్రిగారు చాల మంచివారు. దయాస్వరూపులు ఇప్పుడే వత్తురు ఇంతలా మనకింత హడావిడి యెందుకు? ఆయనయే మనకు యధాశాస్తముగా వివాహము జర్తుష్తమలవ్వుతిదేకరచునేమో అని

_ న జట 2, 648 ల తో శ

పా చువాభారతనీతి కథలు -గాాాలాాలాలాాాా అనుమానింపకుము. నేనన్నచో ఆయనకెంతో ముద్దు నా మాట నెన్నడును త్రోసిపుచ్చరు నే చెప్పెదనుగా?” అన్నది.

అతనికి పారపార అగుటలేదు. ఎట్టయిన ఆమె న్తాప్పించవలె ననిపించినది.

క్షణకాలము కూడా సైపలేకున్నాడు “ఓసీ! తెలివి తక్కువపిల్లా? ఇదా నీ అనుమానము? నేను చెప్పినది శాస్త్రవిహితము కాదనుకొన్నావా? నేను రాజును, న్యాయము ధర్మశాస్త్రము నాకు క్షుబ్బముగా తెలియును. అధర్మ మార్గములో అడుగుపెట్టమన్నను పెట్టను, ఇదిగో చూడు? ఇందులో ఒక ధర్మసూక్ష్మమున్నది.

“ఎవనికి వాడు చుట్టము ఎవనికి వాడే. ఉద్దరించుకొనువాడు, ఎవనికి వాడు స్వయముగా దానము చేసికొనవచ్చును” ఇది శాస్త్రవిహితము. మరొకటి! మరొక విషయములో పెద్దలసమ్మతి త్రీసికొనవలెగాని, వివాహ విషయములో ఎవరి యిష్టం వారిదే. దానికి పెద్దలెందుకు! నీవు వినవు గానినేచెప్పిన గాంధర్వ వివాహమునకు మంత్రములు లేవు. అతిరహస్యముగా జరిగెడిదే! దాని పద్ధతి అద్ధి ఏమి? ఆలోచించక ఇప్పుడైన నంగీకరింతువా, ఈ రీతిగా పూర్వం ఎందరో రాజకన్యలు వివాహమైనారు. వారందరిని పెద్ద లంగీకరించిర కూడా, అందుచే సంకోచించవలసిన అవసరమేమియు లేదు” అని గట్టిగా నొక్కి చెప్పెను.

అతని మాటలలో పడినద్రామె, ఆ మాటలు నిష్కపటంగానే యున్నవి నమ్మినది. వివాహమును వెంటనే చేసికొనదలచినది కాని, ఒక్క అభ్యంతరము చెప్పినది. ఆమె దృష్టి ఆ క్షణములో పాదరసము వలి ప్రనరించినది.

ఆడువారికి సమయోచితముగా మాటలాడుశక్తి స్వతహాగానే యుండును. అది ఒకరు.నేర్పినందున వచ్చునది కాదు. అంత తమకములో నుండు సమయములో కూం తన భావియేమీటని ఆలోచించినది. “రాజులకు చాలమంది భార్యలుందురు. అందు సంతాన మెందరికున్నను. పెద్ద భార్య కొడుకే రాజార్చుడగును. లేదా, తండ్రి యిష్టమొచ్చిన వారికియ్యవచ్చును. రాజ్యమెప్పుడును స్వార్డితమే! తనకు బలం లేనిచో వెంటనే పోవును గదా? ఇప్పుడు తానెట్టయినను తన కుమారుడే అనంతాధికారి యగునట్లు చేసుకొనవలెనని

తలచినది., |

సన్నగా “రాజా! నీ కోరిక నా కోరికయు ఒకలైనప్పుడు వినాహమున కెట్టి అభ్యంతరమును లేదు కాని నీవు నా మీద చూపెడి యీ (ప్రేమ శాశ్వతమై యుండవలెను నాకు కల్గెడి పుత్రుడే యువరాజు కావలెను. ఇట్లు నీవు వరమొసగినచో మనకు వివాహమగును'

  • అన్నది. అట్టంగీకరింపకున్నచో లేదనియే కదా దాని భావము. అంత సిద్ధమైన విషయములో కనన న

చలావావాలవయయయయయయాయాలాలాంలయలా మువోభారలత నీతి కథలు = / లా కూడ ఆడవారిపట్టు అట్టుండును. మగవాడైనచో అంతగట్టిగా పట్టుపట్టలేడు, పట్టి నిలుపుకొనలేడు. ఏదో రీతిగా వంగును స్త్రీ స్వభావ మట్టిదికాదు. ఎంత మృధువుగా ఉండునను కొందుమో అంతకంత కరినము లేకున్న ఆమె అప్పుడట్ట్లు నిష్కర్నముగా అడుగ గలదా! అతని ప్రేమ యొక్క స్థాయి కూడ కనిపెట్టి అని యుండును.

అతడేమి చేయును? తానంగీకరింపకున్నచో ఇంతవరకు తనకు సంతానము కలగలేదు ఆమె అట్టి కోరిక యుండుట వలనైనను చక్రవర్తి పుత్రుడుదయింప వచ్చునను ఆశ నంకురించినది.

“అట్లే! ఈపాటి భాగ్యమున కభ్యంతరమా! ఇది కోరవలెనా? మనకట్టి చక్రవర్తి కాగల పుత్రుడు పుట్టవలెనే కాని యువరాజును చేయకుందునా? తప్పక చేయుదును” అని ఆమెను మెప్పించి. ఒప్పించెను.

పెండ్లి యేమున్నది? అయిపోయినది వారిద్దరు కలియుటయే పెళ్ళి డానకదే ఫలితముకూడ పెండ్లి ఫలము కూడ వెంటనే కల్గినది.

అతడొక్కంత సేపుండి “శకుంతలా? నేను వెళ్ళి వత్తును, ఆశ్రమ ద్వారమున నా మంత్రులున్నారు నేను వచ్చి చాలాసేపైనది. వారు నాక్షై ఎదురు చూచుచుందురు. ఇకపోవలెను, అని “మరి, నేను మా నగరము కేగగానే నిన్ను తీసుకొని వచ్చుటకు రాజలాంఛనములతో నా మంత్రులను, వురోహితులను పంపుదును. కణ్వమహర్షల వారివద్దకే పంపుదునులే! నీవు వారి వెంటనే రావచ్చును. వెళ్ళివత్తును” అని చెప్పాచుండగనే ఆమెకు తెలియకుండగనే కన్నుల వెంట నీరు ప్రవహించినది. ”

ఆ సంబంధముతో స్వర్వము మారిపోయినది. ఇక ఆ యాశ్రమము తనది కాదు అది పుట్టిల్లు. తనది హస్తినా నగరము. తానా అంతఃపురములో నుండవలసిన రాజస్ర్రీ ఆయినది. తన మగని విడిచి తా నిప్పుడెన్నాళ్ళి అడవిలో వుండవలెనో? ఇన్నాళ్ళు, ఎన్నాళ్ళ నుండి అక్కడ వ్నుది? అదేమియు ఆమెకు బరువు కాలేదు. ఇక ఇప్పుడొక క్షణమైనను వుండలేదు.

కన్నుల నీరు కార్చుచు “మీరెప్పుడు పంపుదురో? తీరా అక్కడికి వెళ్ళిన తరువాత నామాట మరువరు గదా! నా పని యేమగునో ఆలోచింవుడు మీరు మహారాజులు! మీకేమి? నేను అబలను, నా మాటను జ్ఞప్తిలో నుంచుకొనుడు” అని అతనికేసి అదే ఇదిగా చూచుచు అన్నది. నానా నానా తంత

లాటా మేవభారత నీతి కథలు - [లాలా అతడు మెల్లగా ఆమెను తన రొమ్మున కాన్చుకొని చెక్కెల నుండి కారెడి కన్నీటిని కానగోటితో తుడిచి, పైటతో ఒత్తి, “వెర్రిపిల్లా అంత వెంటనే మరుతుననుకొంటివా! అంతకృతఘ్పుడనుకొంటివే! బయపడుకుము గట్టిగా ఒకటి రెండు రోజులోపిక పట్టము. నేటికి మూడవ నాటికి నీవు మన అంతఃపురములో నుందువు. విచారింపకుము వెళ్ళి వత్తును” అని ఆమె నూరడించి అతడు మెల్లగా జారుకొనెను. ఆమె ఆ క్షణకాలం సంగతిని జ్జికి తెచ్చుకొనుచు. ఒక్కింత సేపటిలో తనలో ఎంత మార్పు వచ్చినదో ? అని ఆశ్చర్యపడుచు, అతడు తన-ప్రియుడు వెడలు చుండెనని విచారముతో ఆ వంక కన్నార్పక చూచుచు అట్టే నిలబడెను; ॥ దుష్యంతుడు కనుచూపు మేర దాటిపోయెను. శకుంతల మెల్లగా ఇంటిలోని కేగినది తనకు జరిగిన దంతయు గుర్తు తెచ్చుకొన్నది “తానెంతో తెలివయినపని చేసినది, తన మగని తానే వెదకుకొన్నది అందులోను తనకొడుకే యువరాజగును. వెర్రిభ్రమ! తనకు పుత్రుడు పుట్టిన తర్వాత కదా! అసలు పెండ్దియాడుట మంచిదో? చెడ్డదో? తన తండ్రి ఈ పాటికే రావలసినది? ఇప్పుడో ఇక్సనో వచ్చును. ఆయన ఏమనునో? అంగీకరించునా? ఇన్నాళ్ళు తనను పెంచి పెద్ద చేసిన అభిమానమైనను లేకుండ తానిట్టు స్వతంత్రించనదే! అది తగునా? రాజు తగునని చెప్పెను కదా! అతడు కార్యార్థి - అట్టు చెప్పక మరెట్లు చెప్పును? తానే గోతిలో పడినదేమో! ఆం! కాదు. సర్వము కల్లకాదు కదా! మహర్షి సత్తా తెలియనివాడా రాజు తేడా వచ్చినచో మహర్షి శపించును. అవును, ముందు తాను పెండ్దాఢునప్పుడు అక్కరలేని మమర్షి ఇప్పుడెందుకు వచ్చును? రాకపోడు. అయనకట్టి పట్టింపులేదు. అయినను ముందు చేయవలసిన దేమిటి? మహర్షిరాగానే తానే చెప్పవలెనా? అళడే తెలిసికొనువా? ఎట్లు తెలిసికొనును? తానే మొగము పెట్టుకొని చెప్పును?” అని యేమేమో మంచి చెడ్డ ఆలోచించుచు కూర్చున్నిది. కర్మము చాలక ముని కోపిరీచునేమో అని భయపడుచున్నది. అయినను ధైర్యమున్నది అంతరాత్మ ఫరవాలేదని ఉద్చోధించుచున్నది. అంతలో కణ్యమహర్షికందమూల ఫలములను పుచ్చుకొని అడవి నుండి ఆశ్రమమున కేతెంచెను, అతడు శకుంతల వాలకమును చూచినాడు ఆమెలోని మార్పును గమనించెను. ఆ మార్చేమిటో అతడు 'బ్రహ్మచారియైనను కనిపెట్టెను. ఆమె నడుగుట బాగుండదని తానే దివ్యదృష్టి ద్వారా చూచెను, జరిగినదంతయు స్పష్టముగా తెలిసినది. అందుచేతనే ఈమె ఇంత సిగ్గుపడుచున్నది? అన్సుక్రొని లోనికేగినాడు. లా

వనననావయంవవాలాంంలాలాా మవాఖభారతనీతి కథలు -౯ లాలా

శకుంతలను పిలిచి “అమ్మాయీ! నీవు చేసినపని నాకు తెలిసినది మరేమియు బయము లేదు. నేను చేయవలసిన పని నీవే చేసినావు. ఆ విధానము ప్రసిద్ధమైనదే. నీవు చేసిన పని మంచిదే కాని చెడ్డది కాదు. అంతేకాక్క నేను భవిష్యత్తు నాలోచించితిని. నీకు గర్భము వచ్చినది. నీకు పుట్టబోవువాడు. వంశోద్దారకుడు, మహాబలశాలి, చక్రవర్తియు నగును. నీవింక బెంగటిలవద్దు, సుఖముగా, హాయిగా, నిర్విచారముగా నుండుము” అనెను, క్షే _

ఆమెకు ధైర్యము చిక్కినది. తానెంత అనాలోచితముగా చేసినను; తన తండ్రి అంగీకరించినాడు కేవలము అంగీకారమే కాక తన నభినందించినాడు. తనకు రాబోవు సుభమును సైతము చెప్పినాడు. అంతకంటె కావలసినదేమున్నది! ఆమెకెంతో ఆనందము కలిగినది. తండ్రినెట్టు ప్రత్యభినందింపవలెనో - ఆమెకు తెలియలేదు. చిరునవ్వు నవ్వుచు, తలవంచుకొని అట్లే ఉండిపోయినది. అదే అభినందన,

రోజులు గడిచినవి, గర్భము వ్యక్తమైనది, మహారాజు గారి వద్ద నుండి మాటైనను వచ్చుట లేదు. ఆ రోజున చెప్పిన మాటలన్నియు నేమైపోయెనో? ఇంత ఆదమరపా? ఇంత అన్యాయమా? ఏదేమైనను తనకిక్కడ వచ్చు లోటేమియు లేదు. కనుక ఆమె నిర్విచారముగా యున్నది. తాను రహస్యముగా చేసిన పనని సైతం ప్రత్యక్షముగా చూడగలిగిన నమర్దుడు తన తండ్రి. మరొకరైనచో అపవాదుకైనను బయపడి ఆమెను వదలివేయనలసినదే ఆమె ఎన్నెన్నో భావించుకొనుచు తర్లడ్రి యిచ్చిన - దీవనప్రకార మామె పుట్టబోవు పుత్రుని భాగ్యభోగ్యముల తలచుకొని యూరడిల్డుచున్నది.

. రాజుగారు దగ్గర లేనప్పుడు ఆయనకు ప్రతినిధిగా పురోహితులు సంస్కారములు చేయవచ్చును. అట్లే యిహ్పాడిక్కడ కజ్వమునీంద్రులే పుంసవనసీమంతాది గర్భసంస్కారములు చేసెను. గర్భరక్షణకై కొన్ని మంత్రములు చెప్పి హోమములు చేయుధురు. అవి నేడు సీమంతం గాజులు పట్టించుట అను క్రియలుగా దిగబడినవి మరి నాలుగురోజులు పోవుసరికి కవికూడ మాసిపోవునేమో!

అమె రమారమి మూఢు సంవత్సరములు గర్భము మోసినది. ఏనుగు ఏడేళ్ళు ఆ గర్భం ధరించేనట।! పుట్టబోవు వారి సత్తాను. బట్టికూడా కొన్ని చోట్ల చాలాకాలం మోయుట కన్పడును.

ఆ శకుంతల ప్రసవించినది. పిల్లవానిజాతక మిదివరకే మహర్షి చూచియుండెను. కాన నేడు క్రొత్తగా చూడవలసిన యవసరము లేదు, అదికాక అప్పుడు శుభసూచనలైనవి లలనా ఠంక

యా మహభారతనీతికథలు- లాలా గాలి చల్లగా వీచింది. అగ్నులు 'ప్రదక్షిణముగా జ్వాలలు త్రిప్పినవి. అనుభానుభూతి అ ఏల్దని గొప్పదనమును సూచించెను. పిల్లడు పుట్టగానే కణ్వమహర్షి పురుటింటి కీవల కూర్చుండి జాతకర్మ చేసెను, జాతకర్మయనగా పుట్టిన బాలున కేవిధమైన బాలారిష్టములు గాని గాలి - ధూళి సోకుటవంటి అవత్తులు గాని ఎన్నెమ్మ కొట్టువంటి బాధలుగాని రాకుండా చేయు హోమములు అవి తవుడు, తెల్ల ఆవాలు కలిపి చేయుదురు, ఆ ద్రవ్యములను హోమము చేసినచో ఆ పాగ తగిలినంతలో గాలి ౨ ధూళి వగయిరా వృండనేరవు పదిరోజులు చేయవలెను పదునొకండవ రోజున పురుటిశుద్ధి కాగోనే పదిరోజుల అశౌచము పోవుటకుగాను పుఖ్యాహామనువై దికకర్మ చేసెను. ఆనాడే తండ్రి పేరు పెట్టవలెను. పుట్టినవాని కేదోయొక 'పేరు లేనిచో మలి వ్యవహార మెట్టు జరగవలెను? అదే నామకరణం. తండ్రి సన్నిధానం లేనందున అన్నిటికిని కణ్యమునీంద్రులే శ్రద్ధవహించిరి. మనమైనచో ఏదోయొక పేరు పెట్టుదుము. దేవుని పేరు తాతగారి పేరు పెట్టటయు మామూలుకాని. మహర్షిపెట్టనపుడు భావినాలోచించి తగిన పేరు పెట్టెను. “భరతు"డని, అనగా భూమిని భరించువాడని యర్థము, అతడు శాశ్వతకీర్తి నార్థించగల మహాపురుషుడు కావలసి యున్నాడు అందుచేత అతనికా పేరుంచెను. భరతుడు చిన్ననాటి నుండి దురుసైనవాడే, అతని శౌర్య సాహసములు మరెవ్వరికిని రొవు. తోటి వారందరును ముని పిల్లలు వారు స్వతస్పిద్ధంగా శాంతిగుణ ప్రధానులైన మునుల బిడ్డలు వారి తల్టులు అమాయకమైన తపస్వినులు. కాని, భరతుడో రాజసముట్టిపడునట్టి దుష్యంతుని విడ్డడు. పులిపిల్ల పులి పిల్ణయే! అటు శకుంతలయో శాంతించినను లోపల రాజసముకల విశ్వామిత్రుని బిడ్డ వారిద్దరికిని పుట్టిన బాలుడెట్సీ వాడగును? మనవారెందరో ఎన్నోళకముల వివరింతురు కాని, తల్లిదండ్రుల పోలికలు రొకీ తప్పదు. స్ట దుష్యంతుడు చిన్నతనంన ఫింహశార్జూలముల పంతేగా ఇతడు మాత్రం తీసిపోవున? సింహపు పిల్లలను లాగుకొని వచ్చి పళ్ళు చూప్తమని నోరు తెరుచువాడు. ముని పిలలు హడలిపోయి పారిపోవువారు పెద్దపులులను తోలుకొని వచ్చి ఆశ్రమ ప్రాంతములో నున్న చెట్లకు మాము ఎలుగు బంట్లను మందమందగా తోలుకొని వచ్చి నిలద్రోలువాద: అ లు సట్సి వచ్చువాడు ఎంతెంత చెట్లనైనను తోనో స్టులపై రూర్చుండీ తోలుక్‌ నషి ర్త యువాడు, చాల సులభముగా అసొధ్య నాలాలో

హాం మువభారతనీతి కళలు -/ లారా పనులు చేయువాడు పూవు పుట్టగానే తావివేయును కదా! విత్తొకటి చేసీన చెట్టాకటి మొలుచునా? అతని చురుకుదనం అందరిని ఆకర్షించినది.

ఎంత అల్లరి చేయుచున్నను నమహర్షులకా బాలుని బాల్యక్రీడలు ఆనందం నిచ్చుచున్నవి. అయినను వారా బాల భరతునకు మారు పేరు పెట్టినారు. “నర్వదమను' ' డని, అనగా అన్నిటిని అదమాయించి తన స్వాధీనములోనికి తెచ్చుకొన గలడని అర్థము వారు మారు పేరు పెట్టినను భగవంతుని అష్టాత్తర శత నామాలలాగున సహ్రనామాల లాగున సార్థకములై వారి గొప్పతనమునే సూచించును కాని ఆక్షేపణ దానిలో నిసుమంతయు గోచరించదు అదే దానిలోని విశేషము.

బాలునికైదేండ్లు వచ్చినవి. ఎన్నాళ్ళును అల్లరే కాదు చదువు నేర్చుకొనవలెను. అది బాలుని ప్రధానము కాని ఆ వయసులో ఆడుకొనవలెననియే ఉండునుకాని, చదువు కొన బుద్ధి వేయదు. అట్టి వయస్సుననే వారి బుద్ధిని చక్కగా; మెల్లగా చదువువైపునకు మరల్బ వలెను, అందు 'పెద్దవారికెంతో ఓర్పుండవలెను పెద్దవారు రూడొ వారితోపాటు చదివినప్పుడు కాని వారికిని చదువ బుద్ధి వేయదు. అట్టి శ్రద్ధ తీసుకొనవలసినది తల్లిదండ్రులు.

ఆ యాశ్రమమున ఎందరో బాలురు చదువుచుండీరి. బాలురన నేల?. పెద్దవారు కూడ చదువుచునే యుందురు. చిన్ని పిల్లలది చదువైనచో, పెద్దనారిది వ్యాసంగము, వాదమున వారిని చూచుట లో బాలురుకు సైతం అట్లు చదువవలెనని మనసున కోరిక లువ్విళ్ళూరును ఆ కోరిక ధృఢతరమై వోరిని చదువు మాననియ్యదు. ,

కణ్వమహర్షి తన వద్దనే అదృష్టవశమున వున్న భరతుని కక్షరాభ్యాసము చేసి విద్యలను బోధించెను. అతని చురుకుతనము దేహబలమువలె చౌల గొప్పది. దానిలో కూడ చాలామంది అతని! సాటి రాలేకపోయిరి. గురువుగారు చెప్పుట తడవుగా ఇతడు గ్రహించుచుండెను. ప్రతి విద్యలోను అతనికి చక్కని పాండిత్య మలవడినది. పెద్దలు ఆహా! ఏమి బుద్ధికుశలథ! చక్కని ప్రవేశము కలిగినది” అని పాగడజ్‌ చ్చిరి.

తక్కిన విద్యను [మునిబాలకునిలో పాటు చెప్పి ధనుర్విద్యనతనికి ప్రల్యేకముగా చెప్పెను, దానిలో కూడా అతడు' సిద్ధహస్తుడయ్యెను. మరి కజ్వమనా అపా విద్యలన్స నేర్చెనో? వాల్మీకి నేర్వలేదొ కుశలవులకు బోధించుటకు? వారికి నేర్చు

అవసరమ్సు లేదు వాటంతటవే అన్ని విద్యలును వారికి వచ్చును. సనాలు అతనికి జబ్బు మదిరినది. చూపులలో ఏదో చిప్పలేని గౌరవము, హుందా హాం

పాంకదారుతనముతో అతడు మాట్టాడినప్పుడు అతనితో నెవడైనను మాట్లాడనేలేడు. ఇక వాదించుట మాట చెప్పనేల? బాణమెక్కు పెట్టెనా వదలకుండ ఉపసంహరించలేదు. వదలెనా వ్యర్థమై యెన్నడును పోలేదు. అన్నిట కుశలడైన పుత్రుని చూచుకొని శకుంతల ఎంతో మురియుచున్నది. కణ్యమహర్షి భరతుని చూచినాడు. అతని వయస్సు యౌవన రాజ్యమున కనువుగా నున్నది. ఇతని పౌరుషమునకు తోడు అతని వినయము చూడముచ్చటగా నున్నది. ఆ భరతుని, ఆ శకుంతలను చూచూసరికి కణ్యునకు మనస్సులో ఏదో బాధ కలిగినది. ఈమె రాజ్యభోగముల ననుభవింపదగినది ఇక్కడ నుండేబేల? తాను కూడా “రాజిన్నాళ్ళు ఆఅలసించు” నని అనుకొనతేదు. కాన్‌ ఏ కారణము వలన ఇటు జరిగియుండునో? అతడోకవేళ మరువలేదు కదా! తనకే అనుమానము.. బాధయు కలిగినపుడిక శకుంతలతో అనకుండ ఎట్టుండగలడు?' వారు మాట్లాడుట గూఢముగా నుండును. ఆ మాటల కర్ధమూహింపవలసినదే కాని, తేలికగా తెలియదు. కణ్యమహర్షి ఒకనాడు శకుంతల వద్ద కేగెను. ఆమె మహర్షి రాగానే లేచి నిలబడినది. ఆ రోజున ఆమెకేమిట్లో మహర్షిముఖము చూచేసరి కానందము, విషాదవ

  • విషాదము, భయమును కల్గుచున్నవి, ఆయన ముఖములో అ న్నియును గోచరించుచున్నవి. ఆమెను కూర్చుండమని కణ్వమహర్షి ఇట్లు చెప్పసాగెను. మహర వహమి! నీవు చాల ఆదృష్టవంతురొలవు. మంచి భర్తను పాందితివి. అతడు మేన నొ వత్తునని వెళ్ళి చిరకాలమైనది, ఇంతవరకు కబురయినను, చేయలేదు. ఏమి నురగ నీ మాట మం ప్రచు. వేను సంతోషంితవని తెలియదో? లేక రాజ్యసుఖముల అనరాదు, మనవల్ల న్‌ స ప నిషురుము? అలం తప్పుచేసినను వారినేమియు వచ్చిన | ల వొడి వారేనున్నను మారుమాటాడ్రరాదు. ఇట్టు ఎవరి వలన లోటు చ్చినను పిల్ల నిచ్చినందుకు మనవ లోకువకదమ్మా! క ఎంత పతివ్రతయైనను పుట్టింట్రత బ్య | పురవురుషనితో మాట్లాడరాదు. అము భర్త్ష చదు. ఎంత దగ్గరవారయినను కనుక స్రీ భర్త యింటనే య ట్రీ భర్తయే స్రీకి రక్షకుడు ఉాల హితవయిన వాడును నలుగురు నేదో అపవాదు అను గొని ఫట్టింటిలో నుండకూడదు. అట్లున్నచో నర్చు, నీవు అదపష ళా న ్ఫష్టము కొలడి మంచి భర్తను పొందితివి. యువరాజుకాగల పుత్రుడును కన్నావు నీవేమియు బెంగటిలవం దు ౨ణు వాం నన న

ను ఇష్యలునే తగిన సమయమైనది. కనుక నీవు వుత్రుని తీసుకొని వెళుచువుగాని నా కస తోడువత్తురు” అని చెప్పుచుండగనే ఆయన కంఠము బొంగురు వోయినడి స్నేరాగుటలేదు అయినను నెట్లో కన్పీటి నాపుకొనెను. చూ కవల పెద్దలను సేవింపవలెను. అక్కడ అత్తమామలను నాక్షిటె గౌరముగా రాజుల న్ను నీ భర్త గురువులను ఇక్కడి మహర్షులను చూచినట్లు చూడవలెను. చెలిక్రై ౦దరో భార్యలుందురు. వారు నీకు సవతులు కదా! వారిపై కోఫింపరాదు కనిపై త్తెలవలె వారినెంతో ప్రేమగా చూడవలెను. పరిజనులను చాలదొక్షిణ్యముతో శనట్టుడుండవలెను. ఇట్లు చేసినప్పుడే అడుపిల్లలు పుట్టింటికి మెట్టినిండికిని - పేరు వ. రు. లేదా వారికులమునకు కళంకమైన వారగుదురు. నీ వెట్లు జాగ్రత్తగా చేయ పేరుతెత్తువో తల్లీ” అని బుద్దులు చెప్పి "లేపే పభముపూర్తము: ప్రయాణము దగు” నని చెప్పెను ఆమె మారుమాటాడక అంగీకరించిన. వ్యు “దు వచ్చినాడు. శకుంతలోనాయనా! లేపు మనము నీ తండ్రిగారి దర్శనమున్లై వ మా అన్నది. అతని కామాట రుచించలేదు. జమ్మి? ఇప్పుడేమంత పారొవిడీ క్‌ ళీ ది? నీ వంతగా భర్తను చూడవలెనని యున్నచో నీవాక్కతివే వెళ్ళుము కొని, వేను ప్రైరోము రామ్మా! నా కిక్కదనే సుఖముగా నున్నది. వవిత్రమైన ఈ దూశ్రమమును కంచు! ఇంత ప్రశాంతత మరెచ్చటను కానరాదు” అనెను. ఆ మాటలు వినగొ / ఇళనినీ కష్టంగానే యున్నను పుత్రవాత్సల్యముల పై తీపితో కష్టపెట్టుకొనక శరుంలల ని దగ్గరగా తీసుకున్నది. తల నిమిరినదిః చెక్కిళ్ళు శొక్కినది. [కేమి కా రా న( ఉని కన్నులలోనికి చూచుచు “నాయనా! నీవు మహారాజో బడల యనా! వుట్టిన తర్వత వారికి నీ గొ! అరణ్యములో ముసలితనమునే నీకు పురులు జ్యమ్సు నా ములవలనిన ఈదు ఈ యౌడులో నీ వ నొప్పగించి, వచ్చి నివసింతువుగొ: ని ఇది రొజ్యి కరించునా? ఎప్టాడీ ట్లనరాదురా తండ్రీ! * శ ఎప్పుడు సింహాసన మలం రించునా: కన్నుల ండ్రీ! “నా చిట్టితండీ ఎఖ వోసనముపై కూర్చుండేగొ, ప్టలేలీతో చూతునా? అన పుట్టుడొళేలో నుంటినిరొ: నీవు సీం వ్‌ అక్ష రట వచ్చి వారి కిరటములను నీ పాద 0 యులకు నివ్వాళ్ళు లిచ్చుణుండీ చూడ్ర్యత్రన అందు పాదివిన మాణీక్యకాంతుల స అ పరాల్సరుకు భగవానుడీ నొటి కన్పక్స్యల న అలిలాషరా! అదెప్పుడు వరన నూరు పలుకరారు. గుళువ అనుజ్ఞ జ్ర ల కల్పించినాడు. లొత్‌ గొకి న్యా జ్జగించెను. అ మాతృమూ్తి ప్రేమల ము అని ముద్దుగొ నయము మృళంతో తడబడీనట్లానందమునే త వాక్యములతో భరతుని వనన అ ' 109

మంలాయంయయాయాలా నముహాఖారత నీతి కధలు - (రావులు మునిగిపోయినది! అంతటి యువరాజుకాగల యువకుడును ఆమె యొడిలో చిన్నబాలుడై పోయెను. మాతృప్రేమ యెంత వయస్సులో నున్నను పుత్రుని బాలుని చేయును కదా!

ఆ రోహు ప్రయాణం, అంతవరకు నారచీరలు కట్టుకొనియే కాలక్షేపము చేయుచున్నదా శకుంతల, ఈనాడామె మహారాణి కాబోవుచున్నది. కణ్యమహర్షి సర్వజ్ఞుడు, వారికి లోకజ్ఞానం వున్నదో లేదో అని మనం కుతుర్క పడనవసరం లేదు మహా తపశ్శాలురకు తెలియనిదే మున్నది? "

మహారాణికి తగిన ముత్యములు గుప్పిన పట్టుచీర కట్టించి అఅంకారముల పెట్టించెను. ఆమెకా నూతనాభరణమృులతో ఒక కొత్త అందము వచ్చినది. ఆమెకేదో అదంతయు క్రొత్తగా నున్నది భరతుడు యువరాజు దుస్తులు ధరించినాడు. విల్లముల చేదొళ్చినాడు. మూర్తీభవించిన రాజసంవలె నున్నాడు. కాని సొత్వికం వెనుక రాజనం నీడగా అగపడుచ్చుది,

కణ్యమహర్షిశకుంతల అత్తవారింటికి పంపు సందడిలో తెగ బెంగటిల్లెను, “అమ్మా! వెళ్ళీరావమ్మ! మమ్ము మరువకు సుమా! అక్కడి మాటలలో “సరణ్యవాసమే మంచి”దని చెప్పకుము. అది గొప్ప అనుకొని అక్కడివారు కోపింతురు అత్తవారినే పాగడవలెను. వారి సంపదలే దేవేంద్ర భోగము లనవలెనమ్మాగ అనుచుండగనే ఆయన కంఠం నుండి మాటరాలేదు, ప్రయాణ సమయమున కన్నీరు పెట్టరాదని అతడు దుఃఖమును దిగమింగి మెల్లగా మాట్ట్లాడబోయెన్సు,

ఇ గ్రహం గలవాడు జితేం। ద్రియుడు, ఆ పిలను కనీసం కనవైనను లేదు. ఏదో ముద్దుగా పంబన్‌ ప్రా న పళ బాధవడుచు 1 ఇక సంసారుల వి నిక వదల వలసి వచ్చునని అంతగా మొ గటిసారిగ వదలవలసి వచ్చీన ఎన చరకు పెంచిన కన్యలను అదే

పుడెంతగా విచారింతురో కదా. అది అనుభవించ ఆబనదే కాని చెప్పుట కలవికాదు,

వ అత్తవారింటి కేగునప్పుడు సట్టుపక్కలవారితో చెప్పుదురు అని పరిపాటి, మరి అడవిలో ఎవరుందురు? శకుంతలకు చాల ప్రియమైన చై టు తీగలు నునవి, కఖుయడు వాటితోనే ఓ తీగలారా, వృక్షములారా, మా శకుంతల అత్తవ్రార్రర్వ కేగ్సు సై తమ న అలనటనై నను గమనింపక మీకు నీరు ప్రగ్సడ్షి స్త హితవైనను ॥శ క క్‌ కొనగోటితో త్రుంపునవికాదు మీక్సు మొదటిసారిగా వ్వ వట చిగురు లయ ఇగిపుడు ఆమె చెలికత్తెలతో

న

వయయంవాయయయయాలాలడాం మ్రవరూరలత నీతికథలు = బాను సహా ఉత్సవము చేసిక్ఞానెడిది. మిమ్ములను తల్లివలె పెంచిన మా శకుంతల ఈనాడు అత్తవారింటి కేగుచున్నది. మీరందరును సెలవిండు” అని చెప్పెను. చెట్టు మీద కోయిల లొక్కసారిగా గొంతెత్తి కూసినవి. అదే వనదేవతల అనుమోదం అయినట్లు తేలిసినది. శకుంతల కూడ వెళ్ళలేకపోయింది. నాలుగడుగులు వేసి మరల వెనుకకు వచ్చి తండ్రికి నమస్కరించుకొనునట్టుగా ఆయన కడుపులోనికి తలచానిపి విచారించినది. పాదముల నాన్నుకొని వందన మాచరించినది. మరల నాలుగు మూడడుగులు వేసి వెనుకకు వచ్చి మునులతో “అదిగో! మా తండ్రినెట్టు చూతురో. జాగ్రత్త సుమా” అని అప్పగించినది. కదలలేక కదిలినది, అప్పుడు మునుల భార్యలు “ఎంత సేపమ్మా వెనుకముందులు? అబ్బో! ఇటువంటివారే అత్తవారింటి కేగిన తరువాత ఇక పుట్టింటివారి మాటే తలపెట్టరు. వెళ్ళి రావమ్మా!” అని కసరిరి, కణ్వమహర్షి వెర్రిగా చూచుచుండెను. అప్పుడు శకుంతల మరల వొక్కసారి నమస్కరించినది. అతడు దీవించినాడు వెనుకకు తిరిగి చూచుచు ఎట్లో అతి కష్టము మీద శకుంతల ప్రయాణము సాగించినది. ఇద్దరు ముగ్గురు ముని శిష్యులు కూడ శకుంతల వెంట నుండిరి. వారందరును చురుకుగా ప్రయాణం సాగించి హస్తి నానగరం 'ప్రవేశించిరి. వారికదే మొదటిసారి పట్టణమును ప్రవేశించుట, వారికా పట్టణ జీవితం అసహ్యం వేసినది. ఎక్కడను వేదశాస్త్రముల, (ప్రనంగములు చర్చలు వినబడవు అగ్నిహోత్ర హోమధూమములు లేవు. అగరు ధూపధూమములే గుష్పుమనుచున్నవి. ఎవరి ముఖాన చూచిననుకంగారే; ఏదో తెలియని అపారిశుద్ధ్యమే కాననగుచున్నది. నిష్కల్మషమైన అరణ్యకాజీవితమునకు వారికెంతో భేదమగపడినది. ఎట్లో తమ గురువాజ్ఞను నిర్వహించుటకై సహించి వచ్చుచుండిరి. కాని రావలెనని లేదు. . - " అందరును రాజసభను చేరినారు తపశ్ళాలురు వచ్చిరనుటతో మహారా-. చేపలికి వచ్చుటకు నాజ్జ నిచ్చినాడు. లోపలికి వెళ్ళి రాజును చూడగానే దీవించినారా _ఎనిశిష్యు* మహారాజు చుట్టును సామంతులు, మంత్రులు, పురోహితపండితులు కూర్చుండి దేవసభవలె అనందం కల్గించుచున్నదా సభ వారిని కూర్చుండుమని చెప్పెనేకాని, రాజ శకుంతలకు తగిన, మర్యాదనేమియు చేయలేదు. ఆమె వచ్చెడి దారిలో ఎన్నో గాలిమేడలు కట్టకొన్నది. అవన్నియు నిక్కడికి చేరుటతో మటుమాయమైనవి, ఆదరణమే లేదు. ఎదురుగా లేచివచ్చుటలేదు. “అయ్యో! వచ్చితివా? నేను మరచితినే!” ని సానుభూతి లేదు సంతోషం లేదు. కనీసము తనను పల్కరించనైనను యాం ా

ఆ నమువభారతలీతికధలు-(ాలాాాాా లేదు ఆమె తెల్లబోయినది ఇప్పుడిక తనకేమి దిక్కు? ఆతనిలో ఏమియు చలనము లేదే! ఎరుగడా చిరకాలమై చూచుటచే మరచెనా? అనాడన్న మాటలేమిటి. ఈనాటి చేష్టలేమిటి అసలిన్నాళ్ళు తానూరుకొనుటయే తప్పేమో? ఆనాటికి ఈనాటికి పోలికయే లేదు. ఎంత ఉపకారము చేయునట్లు కన్పించినను రాజులను మాత్రమెన్నడును నమ్మరాదు వారికి క్రొత్త మీదనున్న అభిరుచి పాతదానిపై నుండదు అని ఎన్నో రీతుల వగచినది. ఎంత విచారించినను లాభమేమున్నది? నిద్రపోయెడు వారిని లేపవచ్చును కాని మేల్కొని యుండి నిద్రనటించు వాని వెవడు లేపగలడు? పూర్తిగా మరచినచో జ్ఞప్తికి తెప్పించవచ్చును కాని మరచినట్లు నటించెడి వానికెవ్వడేమి చెప్పగలడు? అయినను యింతవరకు వచ్చిన తర్వాత వెనుకకుపోయి చేసెడిదేమున్నది? తనకు జరిగిన అనుభవములను చెప్పి చూచిన పప్పుకొనునేమో, అని ఆమె కాశ కల్గినది. " రాజా! నీవొకసారి వేటకని వచ్చి 'కణ్వాశ్రమములో నున్న నన్ను గాంధర్వవిధిని 'పెండ్దాడి నాకొక పరమిచ్చితివి అది జ్ఞప్తితెచ్చుకొనుము చూడుము, ఈ బాలుడెంత అందముగా తేజక్ళాలియై యున్నాడో చూడుము. ఇతడు కౌరవ కులోద్ధారకుడు. నీవిచ్చిన వరమును తలచుకొని ఇతనికి.యువరాజు పట్టాభిషేకము చేయుము” అని జాపకము చేయునట్లు విన్నవించింది. - న దుష్యంతుడామెను చూడగానే అంతయు జ్ఞాపకము వచ్చినది. కాని చెట్టంత పిల్ల వాని తీసుకొని వచ్చిన పిల్లను చేపట్టినచో జనులందరు నేమనుకొందురు? “ఇతడు రాజు కనుక అందమైన పిల్లరొగానే ఆమె కొడుకును తన కొడుకే అని పరిగ్రహించి ఆమెను పట్టినా - అధికారులు రాజులు నేమిచేసినను చెల్లును” అని పోదురు. ఆ భయంతో దుష్యంతుడు తన యుద్దేశమును తనలోనే మ్రింగున్ను, బ్రాని పైకి ఏమియు తెలియని వాడు వలె ఆమెకేసి చూసినాడు. జా | ష్‌ అంత గంభీరభావముండుట ధీరోదాత్తులకేగాని సాధ్యము కాదు... వెనరవు? ఎక్కడి ఉట వు? ఎక్క దానివో నాకేమియు తెలియదు, ఏమిటీ అసభ్య సంభాషణలు? లు విన్నచో ఎవరైన ఏమనుకొందురు” వెళ్ళుము. ఎక్కడ ను డ్‌కే వెళ్ళుము” నిషరణమా + ఎక్కడ నుండి వచ్చితివో అక్క ళ్ళుము' నిష్కర్షుముగా పల్కెను. ఆ మాట్రల్పు పిడుగు పాటువలె ఆమె చెవృలపడినవి. ఆమె నిశ్చేష్టురాలైనది కన్సుల వై ణ్‌ వాల్చినది, తన్న “+ కస్పకు ప్రవహించింది కస్నులెర్రనయినవి | చు వారెవరు? తనకు త్రానే ఛ్‌ ఊ లో గట్టిగా బుద్ధివచ్చునట్లు చెప్పదలచినది. రేడించుక్పుది. రాజు

అరావనావాయవవాయయియయింయాంం వ్రుద్రద్ధుంరత్ర నీతి కలు = నాలా “రాజా! తెలిసియుండి కూడా నీవు తెలియని వాడివలె పల్కుచుంటివే! నేను నీవే కదా యెరుగుదురనియా నీ ధైర్యం, ధార్మికులు రహస్యమయినంత మాత్రాన మారుపల్కనేరరు. మనమెంతో రహస్యంగా చేసినను మనం చేసెడి పనుల నన్నిటిని చూచెడి సాక్షులెందరో ఉందురు. వేదములు, పంచభూతములు, ధర్మం, సంధ్యలు, అంతరాత్మ యముడు, చంద్రసూర్యులు, పగలు, రాత్రి ఇవన్నియు ఎల్లపుడును పరిశీలించుచునే యుండును, వీటినన్నిటిని కాదని యెవడు రహన్యముగా వనిని చేయగలడు? నీవు వాకిచ్చిన వరము లన్నియు నెరుగును. నన్ను వృధాగా అవమానింపక అనుగ్రహించుము. ఒక్కింత ఆలోచించుము. అదీగాక పతివ్రతయై, గుణవతియైన భార్య నవమానించిన దుర్మార్గునకు ఇహపరము లుండవు. అనుకూలవతియగు భార్య కలవాడు గృహస్థ సౌఖ్యములను పూర్తిగా పొందగలుగును. పుత్రవంతుడై ఆనందముల ననుభవింపగలడు. భార్య పురుషునకెంతో ఉపకారమైనది పురుషార్థము లయిన ధర్మార్ధ కామ మోక్షములను సాధింపవలెనన్నచో భార్య యుండవలెను. నడవడికను తీర్చిదిద్దునది భార్యయే. భార్యలేని వానికి సంసారమే లేనందున వంశమెట్లు నిలుచును? సద్గతి యెట్లు కలుగును” గౌరవం రావలెనన్న భార్య యండగావలె. మనస్సున కానందము పుట్టించునది భార్యయే. ఎటువంటి ఆపదలుకాన్స, విపరీత పరిస్థితులుగాని వచ్చినచో భార్య తప్ప మరెవ్వరు పురుషునకు తోడగుదురు? , ఇంకొకటి - తన నీడ చూచుకొని తానానందించుట మనుజునకు సహజము. పురుషునకు పుత్రుడే ప్రతిబింబం, తన రూప గుణములు ప్రతిఫలించిన పుత్రుని చూచి పురుషుడెంతో ఆనందించును. పున్నామ నరకంనుండి రక్షించువాడు కానపుత్రుడనబడును. ఆ పుత్రుడు సదాచార సంపన్నుడయినచో మాతృ పితృపక్షముల రెండిటిని ఉద్ధరించును. ఇతడు నీ పుత్రుడగునో కాదో ఒక్కసారి చూచుకొనుము. దీపం నుండి వెలిగించిన మరొక దీపము వలె ప్రకాశించుచున్నాడు. ఇదంతయు బుద్ది పూర్వకంగా (తోసిపుచ్చకుము. పుత్రనొక్కషారిగా కౌగలించు కొనుము. ఎంత ఆనందము కల్గునో చూడుము. ముత్యాలహారము వేసికొన్నందున గాని, పచ్చకర్పూరపు పొడి చల్గుకొన్నందున గాని మంచిగంధం పూసికొన్నందున గాని, వెన్నెల 'సేవించినందున గాని యిట్టి ఆనందం కల్గునా? అవి తగిలిన చోటవే కాని పుత్రుని కౌగలించుకొన్నందున ఒళ్ళంతయు చల్లబడును. అపరిమితానందము కలుగును. ఇట్టి ఆనందుమును చేజేతుల ద్రోచకుము. ఇతడు మనకు వంశాంకరుడగునని ఇతడు పుట్టిన నాడాకాశవాణి మునులందరును వినుచుండగా పల్కినది. 113

లా మమభారత నీతి కథలు - [లాలా అదిగాక ఆనాడు నాకిచ్చిన వాగ్దానము మరచితివా? సత్యవాక్య పరిపాలన వలన సత్యమనెంత మహిమయున్నదో గమనించితివా? నూతులు వంద త్రవ్వించుటకంటె ఒక్క దిగుడు బావిని త్రవించుట మంచ్చిది. వంద దిగుడు బావులకంటె యజ్ఞము మేలు. వంద యజ్ఞములొక్క ఎక్కునకు సమానములు. ఒక్క సత్యవాక్యము వంద మంది కొడుకులతో సమమైనది. అంతేకాదు! వేయి అశ్వమేధ యాగముల ఫలితమును ఒక్క సత్యవాక్య మహిమయున్నవై పే ముల్గు మైొగ్గినది. అగ్రత గొప్పది సత్యవాక్యము. పుణ్యక్షేత్రముల దిరుగుటకాని, సమస్త వేధశాస్తములను చదువుట కాని ఒక్క సత్యంతో సరి రానేరావు ఇది నా మాట అనుకొందువేమో? కాదు, మహర్షి వాక్యము అందుచే జాగ్రత్తగా ఆలోచించి, ఆనాడు నాతో కజ్వాశ్రమమున్‌ అన్నమాటలు గుర్తుతెచ్చుకాస్‌ నన్ను కరుణింపుము. 'నేను విశ్వామిత్రునకును, మేనకకును జన్మించిన దానను నన్న సత్యవాదినిగొ తలపకుము. అధర్మమునకు నేనెవ్వుడును పాల్పడను, ఒక్క రవ్వ ముందు వెనకలాలోచించుకొనుము' అని యెన్నో రీతుల నచ్చచెప్ప చూచినది. అతడెరుగక పోయినగద్దా తెలియ జెప్పుట? ఎరిగి యుండి నటించుచున్నాడని

  • ముందే చదివితిమి కదా! అందుచే “ఓ కళ్యాణీ! నీవు పదిమాటలు మాట్తాడకుము. వీవెక్కడ? నేనెక్కడ? నీవెవరనో? నిన్ను నేనెరుగనే_మన యిద్దరికీ నౌక జొడుకా? చాల బాగున్నది విన్నవారందరు నవ్విపోదురు దీనితో నిన్నాకతెనే కాదు లోకులు ప్రీల నందరిని అబద్ధాలకోరు” లని పోదురు సుమా! ఆ బాలుని చూడుము? ఎంత పెద్దగా ఆజానుబాహువై యున్నాడో? ఇంత పెద్ద వానిని నా కొడుకని తెత్తువా? చాలు చాలు! ఇటువంటి మాటలు నీవు పలుకగల్లినను, మేము మాత్రం వినలేం. సీ యాశ్రమమునకు నీవు వెడలిపామ్ము!" అని అతి కఠినముగా, నిర్ణయగా పల్కెను, వున ఎంతవరకును ధైర్యముగా నున్న శకుంతలకింక నిల్చుట కోర్పు చాలలేదు' ్సై దహిం యినది. “అయ్యో! నను పుటిన లే. ఇప్పుడీరీతిగా భర్త విడువ దలచెనా? ఒ:8ననవలదీన ఇసదురులు వి నో చేసికొన్నంతయు అనుభవింపక తప్పునా?” అనుక్రొన్సన్స ఎన్నో రీతుల మననుులో కుమిలి కుమిలి పొంగి పొరలి వచ్చు దుఃఖముతో జలజల కన్నీరు వచ్చుచుండగా ఏట ధైర్యరకో మెల్లగా ఫైటతో ఒత్తుకున్నది. ఇంక లాభం భేదని నిశ్చయం చేసికొని మఠలి పోదామని గిరుకున్న వెనుకకు తెరిగినది. “ ఆంతవరకు భగవంతుడామెను ప నేమోయని దైవమునకును తోచెనేమో! మదు వంచిన కార్యం విషమిం దై ఆకాశవాణి “ఓ రాజా! పరమ పతివ్రతయగు పోయా

అవవావాయయాయావాలాా మనాఖారతనీతి కథలు -/ లాలా నీ శకుంతల సత్యమే చెప్పినది. ఈతడు మీ యిద్దరకును పుట్టిన నుపుత్రుడే! అందేమియను సంశయింప వలసిన విషయం లేదు. తప్పక నీవీ బాలుని స్వీకరించి యువరాజును చేయుము ఈమెను పరిగ్రహింపుము!” అని పల్కినది.

ఆ మాటలందరికిని వినబడీనవి “నభ్యులరా, ఈమె నాచే మున్ను వివాహమాడబడినదే! అది నాకు గుర్తున్నది. ఈమెను కణ్వాశ్రమములో నుండగా గాంధర్వ విధానమున పరిగ్రహించితిని కాని, అందు దేవతలు తప్ప మరెవ్వరును సాక్షులు లేరు. అందుచే నేనిప్పుడు సాహసించినచో లోకాపవాదం వచ్చునేమో అని భయపడి అట్లంటిని. ఇప్పుడాకాశ వాణి పలుకగా అందరును విన్నారు కదా?” అని తన తప్పు నొప్పుకొని దైవపరీక్ష

. చేసిన తర్వాత వారి.నాదరించిను. ”

అతడు మాత్రం కొడుకును ముమ్మూర్తులా తన 'పోలికల్నో నున్నవానిని

బుజ్జగించకుండ ఉండగలడా! అతనిని దగ్గరకు తీసికొని కౌగలించుకొని పుత్రాలింగన _ సౌఖ్యము నన్తుభవించెను. శకుంతలా మహాదేవిని రాణిగా స్వీకరించి అంతఃపురమున కంపెను.

తరువాత శుభముహూర్తమున భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేసెను. అతడు తండ్రి చాటున నుండి తండ్రికి కుడిభుజమై చేదోడువాదోడుగా నుండి వ్రజలయనురాగమును చూరగొనెను.

పుత్రుడు సమర్శడైనట్లు తెలిసీకొని దుష్యంతుడాతని భుజస్కంధముల పైననే నకల భూభారం నుంచి తాను భార్యలతో సహా తపోవనమున కేగెను. వారికెన్నో రాజ్య సుఖము లనుభవించగాను తుదకు విసుగువుట్టెఢిది. అంతేకాని కొడుకులకు కోపం వచ్చి తమ్ములాగి చంపువరకు రాజ్యమును పట్టుకొని ద్రేలాడువారు కాదు అట్లు పుత్రులకు రాజ్యమొప్పజెప్పినప్పుడే పుత్రుల వలన ఆనందము లేకున్న వారాగర్భ విరోధులే యగుదురు కదా! కాక భారతీయులగు మహారాజు లెల్లరును మునలితనమున యోగము ద్వారా శరీరమును విడుచునట్టి విరాగులు - యోగులునైవా వరే.

భరతడుడట్లు తండ్రిచే పట్టిభిషిక్తుడై ప్రజల కనుకూలముగా రాజ్యమేలెను. కేకయరాజు పుత్రియగు సునందను “పెండ్డాండి గంగ్లా యమునా ,తీరములందెన్నో యూగములను చేసెను. అతని పేరు మన దేశమునకు “భారతదేశ మని, అతడే వంశకర్త యగుటచే అసంశమునకు “భరతవంశ” మని పేరు వచ్చినది. మన మందరము కూడ 'భారతీయులమైతిమి. లాలాలాోోాోోాక్‌ |

బాం మహధారతనీతి కథలు - గాలా శంతనుడు భరతుడు వంశకర్తయై తన పేరు శాశ్వతమగునట్లు భరత ఖండము నేలెను కదా. అతని వంశములో సునందా ప్రతీపులకు 'దేవాపి, శంతనుడు బాహ్హీకుడు" అను ముగ్గురు కొడుకులు పుట్టిరి వారిలో దేవాఫియను జ్యేష్టుడు చిన్న తనముననేవైరాగ్యము' కలిగి తపస్సు చేసికొనుటకై తపోవనముల కేగెను. తత్తము విచారించిన వారికి రాజ్యభోగములతో ప్రయోజనమేమున్నది? ఇవన్నియు తాత్కాలిక సౌఖ్యము లిచ్చునవే కాని శాశ్వత సౌఖ్యము లిచ్చునని కావు. ఇవే కాదు బాగుగా ఆలోచించినచో స్వర్గములో నున్నవని చెప్పుకొను సౌఖ్యములు కూట అంతే! దాని తత్త్వము తెలిసికొనుట ఎవరికో కాని కలగదు అదృష్టవశాత్తు దేవాపి కట్టి భాగ్యము లభించినది, + ఎడ్డవాడు కాదన్నప్పుడు రాజ్యాధికారము తరుపాత వానికి వచ్చును. ఆ రీతిగొ శంతనుడు రెండనవాడైనను రాజ్యాధికారియైనాడు. అట్లు రాజ్యాధికారమే కాక దివ్య స్రీయగు గంగకూడ అతనికి భార్యయగుట సంభవించినది. - దీనికంతకును తగిన కారణము లేకపోలేదు. మహామహుల చరిత్ర అతిని గూఢములు మనం జాగ్రత్తగా తెలిసి కొనిన గాని అవి తెలియన. మ

... ఇక్ష్వాకు వంశీయుడయిన మహాభిషుడను రాజు వెయ్యి అశ్వమేధములను వంద రాజనూయములను చేసెను, బ్ర వుణ్యవలములతో అతడు న్వర్ణ్గసౌఖ్యముల ననుభవించుచుండెను. +"

_. అంత్‌ ఒకనాడు దేవతలు, దేవర్షులను (ట్రహ్మలోకమున కేగిరి బ్రహ్మను సేవించుకొనుటకై గంగా దేవి వచ్చినిది. గంగా దేవి అనగా - నీరుగా ప్రవహించున దామె చరరూపము. దాని కదిష్టాన దేవత గంగాదేవి. మనమిందులో దేనిని సేవించినను ఒక్కటే. ఒక్కొక్క సమయమున ఆమె ఒక్కొక్క రూపములో నుండును. అప్పుడు స్త్రీ రూపమున ఆమె బ్రహ్మలోకమునకు వచ్చినది,

ఆమె దివ్య, రూసమామె కోరకకాలది వచ్చినది. కోన వెంటనే వచ్చిన రూపమెంతో మనోహరముగా నుండును కదా) ఆ రూపమక్కడివారందరికి నద్భుతము వేసినది. అంతలో గాలి వీచినది ఆమె కట్టుకున్న బట్ట పై కెగిరినది. తొడలు ధగ ధగ మొరయుచు నానా

అయమయాయాయయయయావావావాలాలాలాలంలలా వ్రవీభారత నీతికథలు = నా కన్పడినవి. అందరును అ దృశ్యమును చూచిరి. కాని వారెల్లరును ఇంద్రియ నిగ్రహం కలవారు కనుక వెంటనే తమ దృష్టులను మరల్చుకొనిరి. తత్త్వ గ్రాహియైన వాడెవ్వడు తప్పు పనులను బుద్ధి పూర్వకముగా చేయును! కాక మోహం మాత్రాన లాభమ్తేమున్నది?” వారికి" స్త్రీల పైననే చూచినంత లేదాయె. అన్ని కోరికలును ఉడిగియున్నవారు వారు. మహాభీషుడు సౌఖ్యానుభమునకై వైళ్లినవాడు. ఇతడంతకు ముందట్టి అపురూప సౌందర్యమును చూచియుండలేను. అతడు తన మనస్సును వెనుకకు మరల్చు కొనలేక పోయెను. ప్రమాదం వచ్చినప్పుడు నిర్ధారించుకొనుటయే ధైర్యశాలి లక్షణం కాలం - కర్మం కూడుసరికి ఎంతటి వారైనను పారపాటు పడవలసినదే. అది విధి! ఆతని అదైర్యమున్ను బ్రహ్మ గమనించినాడు. అతనికెంతో కోపం వచ్చింది. సరస సరాగములకు వేళపాళ ఉండనక్కరలేదా! తన యిష్టము వచ్చినట్లు ప్రవర్తించుటయేనా? ఆ పాటి మంచి - చెడ్డ లెరుగని యతడు దేవలోకమున నుండదగినవాడుకాడు అనుకొని, వెంటనే “ఓయీ! నీవు చపలచిత్తుడవు , నీవు చేసిన పనికి ఫలితంగా భూలోకమున జన్మించుము” అని శపించెను. - దానితో అతని పొగరణిగి పోయినది. ప్రతివాడును సుఖమును కోరునుగదా! అందు దుఃఖం కలియరాదు. అందుచేతనే దేవతలకు మనుష్యులగుదు రన్నచో భయం. ఇష్టం లేనిదే శాపం = వారికీ రోజులెట్లు గడుచునా - అని యుండును. అళడు వెంటనే ఆలోచించుకొని బ్రహ్మదేవుని పాదోలపై బడి “దేవ దేవా! పితామహా. ఏదో పారపాటు వచ్చినది, మన్నింపుము. రాజర్నులలో ఉత్తముడని పేరుపొందిన ప్రతీపునకు పుత్రుడుగా పుట్టునట్లనుగ్రహింపుము. అక్కడైనను నోకు పాపచింతన లేకుండునట్టు దయసేయుము" " అని ప్రార్థించెను. బ్రహ్మదేవుడతని కోరికను మన్నించెను. అతడు క్రిందికి దిగుచుండెను. గంగాదేవికి కూడ మహాభిషుని రూపమును చూచుసరికి మనస్సు లాగినది. మనస్సు చంచలం కదా! అయ్యో! తనను కోరినందున అతని కింత శాపం తగిలినదే! అని వగచినది. అతనిమీద తనకు డ్రేమ కల్గినందున అతనికి కలుగు బాధను విని తాను సహింపలేకపోయినది. తానుకూడ అతనికి భార్యయై అతనికి కొంత సౌఖ్యమును చేకూర్చదలచినది. దానితో అతని కోరిక నేరవేరును; తన ప్రేమ సఫలమగును. అట్లు సహకరించుట తనకు మంచిదని ఆమె భావించినద్యి స్వేచ్చగా కోరుకున్నప్పుడేదియును బాధాకరం కానేరదు కదా! -

  • ప్రతీపుడు సునందాసహితుడై రాజ్యసుఖములను తనివి తీర అనుభవించెను. అతడనుభవించని ఆనందమేలేదు ఒక్క పుత్రగాత్ర పరిష్వంగం మాత్రం చవిచూడని దైనది.
  • 117

జాం నుహాభారతనీతి కథలు - గానా పుత్రులు లేనిచో సంసారం నిస్సారమే కదా! కొంతకాలమగు సరికి కాపురం పై విసుగు జనింపక మానదు. తినగా తినగా తేనెయైనను వెగటుగా నుండుట సహజం. అందులో యౌవన సుఖములమాట చెప్పెడిదెమున్నది? అతడే రీతిగా నయినను తనకు పుత్రోత్పత్తియగునేమో అని గంగాతీరమునకేగి తపస్సు చేయుచుండెను. అప్పుడొకనాడు గంగాదేవి స్త్రీ రూపమునవచ్చి అతని కుడి తొడ “పై కూర్చున్నది? ఆమె దివ్య శరీరం ధగధగ మెరయుచున్నది చూపులతో ఏదో కోరిక శన్సడుచున్నది. నిండు యౌవనముతో మిసమిసలాడుచున్నది. ఆ రాజర్షి అంతవరకామె నా రూపముతో చూచి యెరుగడు. కాక ధర్మాత్ముడు మరొకడైనచో అట్లు కూర్చున్న స్త్రీని ప్రశ్నించునా! అతడు “ఓ లతాంగి! నీవెవ్వరవు? ఎందుకిచ్చటికి వచ్చితివి? నేనితర స్రీని . ముట్టకొనవే! అది అధర్మముకదా? నీ వేల నన్నట్టి అధర్మమునకు దింపెదవు? అని సూటిగా ప్రశ్నించెను. దానితో ఆమె కలవరపడినది. వనిత తనంత తాను వలచి వచ్చినచో ఇంత చులకన కదా! అనుకొని “రాజా! నీ అందచందముల కలరి నిన్ను వరింపగోరి వచ్చితిని, నన్ను పరిగ్రహింపుము” అని చకితదృష్టులతో చూచుచు పల్కినది. అతడు పెదవి కరచుకుని “ఎంత పని చేసితివి? యధావిధిగా పెండ్లాడిన భార్యను తప్పనే నితర స్రీలను కన్నెత్తియైనను చూచుట కిష్టపడను కదా! అదెరిగి యుండి కూడ నీవు నా వరించితివేల, అదిగాక, భార్య కాగోరుదానవు. భార్య కూర్చుండదగిన యెడమ పై కూర్చుండక ఏమమ్మా! నాతో సరసములాడుదువా? అన్నట్టుగా కౌడుకులు కూర్చుండ దగిన కుడి తొడపై కూర్చుంటివేల? ఇక మనకు సంబంధము తగదు ధర్మ వరసైన అందుచే నీవు నా - కుమారునకు భార్యవు కాగలవు” అని ఆమెను సర్ది

  • అమె అట్టు కావై యున్నదని అంతర్జానమై వెళ్ళిపోయినది. క్ర వే శ్రసువాత సువందవాదేవీ సహితుడై యెన్నో బ్రతములు, నోములు చేసెను. లీవు భావమున అతనికి ముగ్గురు కొడుకులు పుట్టిరి. అందులో మధ్యవాడే అతడు సోదరుంల్రో శాపగ్రస్తుడైన ఘహాభిషుడు. శాపవశాత్తు అవతరించినవాడు కనుక వచ్చి వేసి” సఖ ముడై పెరుగుభుండెను. చిన్నతనముననే అతనికి విద్యలన్నియు చది[ క న సంస్కారము వలన విద్యలు సులభముగ్నాపట్టబడును గదా! అతని చినచో చక్రవర్తి యగు యోగము అతనికే యున్నట్లు గోచరించుచుండెను కేటి

ఎ మవహేాభారతనతి కధలు -/ తతా కొని, పెద్దవాడుండగా ఎట్టు కాగలడు? కాలము భవితవ్యమును తీర్చును. పెద్దవాడు దేవాపి తపోవనముల కేగెను. ఇక సర్వదా తగినవాడొక్క శంతనుడే. ప్రతీపుడు కూడ కోరినదే అది. అతడు శంతనునకే యువరాజ్య పట్టాభిషేకము చేసెను. .

అతనికి పెండ్లి యీడు వచ్చినది. ఎందరో కన్యల నిత్తుమని వచ్చుచున్నారు. యువకుడు కన్నెల నెన్నుకొనుటలో సమర్ధుడేైయైనను-యౌవన వశమున దృష్టి సరిగా పని చేయదు. అందుచే సంబంధ బాంధవ్యములలోని మంచి చెడ్డలను పరికించవలసిన బాధ్యత తల్లిదండ్రులది. ప్రతీపునకా బాధ్యత తెలియును. -

అతడొకనాడు పుత్రుని పిలిచి “నాయనా! నా రోజులు సుఖముగా గడచినవి. ఇక కావలసిన దేమియును లేదు! రాజ్యభారము వహింపగలిగిన పుత్రుడవు పుట్టినావు చాలు. నాకు పుణ్యలోకములు కలిగినవి. నీవు ధర్మముగా రాజ్యమేలుము.

_మరొక్కమాట! నా కొకనాడొక నుందరమైన దివ్య కన్యక భాగీరధీతీరమున కన్పడినది. ఆమె అందచందములు కలది నేనారోజున ఆమెతో “నా పుత్రుని వరింతువుగాని' _ " మని చెప్పితిని. ఆమె యొప్పుకొన్నది కావున నీవు గంగా తీరమున నెవతెయైన సుందరి కనిపించినచో మారు మాటాడక వివాహము చేసికొనుము. ఆమె కోరినట్టు నడువుము. ఆమె యొక్క కులశీలంబ్దు లడుగవలసిన పని లేదు. జ్ఞాపక ముంచు కొనుము సుమా!

  • అని బుద్దులు చెప్పి దాను తపోవనమునకు కేగెను,

శంతనుడు మహారాజతై ధర్మము తప్పక రాజ్యమేలు చుండెను. రాజులకు వేట శాస్త్రవిహితమైన వినోదం..దాని వలన 'ఎన్నో లాభములున్నవి. ఆందుచే అది కవల హింసా కర్యమైనను నిషేధింపబడలేదు. శంతనుడాకనాడు వేటకై అడవికేగెను. అతని శరాలాఘవమునకు తోడి వారెల్లరు నచ్చెరువందిరి. భ్రూరమృగములు సైతమతని జూచుసరికే భయపడి పారిపోవ జొచ్చినవి. తక్కిన క్షుద్రమృగముల మాట చెప్పనేల?

కొంతసేపా వినోదము నడచినది.' అతడొక మృగమును తరుముకొనుచు గంగానదీ ప్రాంతము వరకు వెళ్ళెను. భటు లతని ననుసరించి రాలేకపోయిరీ. ఒక్కొక్క పనికి ప్రత్యేకముగా ఫలితముండును. దానిని మనమూహింప లేము కాని జరుగుచునే యుండును. అతనికి దాహము వేసినది రేవులోనికి దిగి మంచి నీరు త్రాగి ఒక చెట్టు నీడను విశ్రమించెను.

ఆ ప్రాతంలో దివ్య కన్యక ఆగపడినది. ఆమె అందం చాల అద్భుతంగా నున్నది? తానిది వరకెందరిని చూడలేదు. కాని ఒక్కరును అంత అందముగా లేరు. అమె వన దేవతయో. దేవతా కన్యయో. నాగ కన్యయో అయి యుండవలెను. ఆమె ప్రత్యవయవము ననన ననన

యాం మవభారతనీతకభలు-గాాాాోోోోా మనస్సును చలింప చేయుచున్నది. తానెంత నిబ్బరంగా నుందామను కున్నను అతడుండలేకపోయెను. ఆమె కేసి తదేక దృష్టితో చూచెను ఆమెయు చూసినది. ఇద్దరి చూపులును కలిసినవి. కన్నులలో భావములను తెల్పునంతటి శక్తియున్నది. వారిరువురు నొకేసారిగా ప్రమే మూర్తులైనారు. అదే విశేషము! ఒక్కరే ప్రేమించినచో రసాభాసమే! ఇద్దరును శ్రేమించి కన్నులతో మాట్లాడి కొన్నందున ఒకరినొకరర్థము చేసికొనిరి. ఇక మొగమాటము మాని శంతనుడు “పిల్లా! నీ వెవరవు? ఇచ్చట నొంటరిగౌ నుండుటకు కారణమేమి? నాతో చెప్పవచ్చు నన్నచో చెప్పుము” అని మెల్లగా ప్రీకి కలుగునట్లు ప్రశ్నింపదలచెను. కాని, సాహసము చాలలేదు అంతట ఆమెయే అతని భావమును కనిపెట్టి సంతోషముతో “రాజా! ఏమి అట్లు చూచుచుంటిని నన్ను భార్యగా గ్రహింపగోరుచున్నావా? బాగున్నది నాకును ఇష్టమే కొన్‌ నాకు కొన్ని ప్రతిజ్ఞలు చేయవలెను అందుకు నీ వాప్పుకున్నచో నా అభ్యంతరమేమియు నుండదు అన్నది అతనికి నోరూరినది ఆమెయే ముందు పల్కరించినపుడు తనకేల? ఎంతే కఠినమైన శపధములనయినను సరే తానొప్పుకొన వలసి అవసరము తనదా? శ్రవలము ఆమెదా? సరే అడుగు” అన్నాడు. | అమె “రాజా! నేనేపని చేసినను నీవు దానికి వ్యతిరేకముగా మాట్లాడరాదు: నివారింపనుకూడదు. అట్లు సాగి నన్నాళ్ళు నీకును నాకును సంతోషముగొ కాపురము నడుచును ఎప్పుడు నన్ను నివారింతువో అప్పుడే మన కిద్దరికి వియోగము కలుగును. అందుకు నీ కంగీకారమేనా? అని నొక్కి అడిగినది అతడు త్రికరణశుద్ధిగా ఆమె చెప్పినట్లు ఆమె పని కడ్డురాకుండుట కంగీకరించెను ఆడుదానిపై ప్రేమ లేకుండ నుండవలెగొని. ప్రీతి పుట్టినచో ఎవడు ఆమె చేతిలో కీలుబొమ్మకాక యుండగలడు? అంతటి మహారాజ కిక్కురుమనుకుండా వప్పుకొనెను. ఆమెయు అంగీకరించినది సరే ఇద్దరును అంగీకరిో నప్పుడిక అభ్యంతర మెవరిది? ఆమె మానుష స్రీ వేషముతో అతనితోపాటు రాజ్యమున వచ్చినది. తో దాంపేన్‌ అక్కడామెకు దివ్యోవ భోగములతో ప్రాసాదము కట్టించి శంతనుడామెలో దొంగ సౌఖ్యము లనుభవించు చుండెను. ఆమెకు గర్భము వచ్చినది. అతడు తొలిచూలుకగొ సు. ఎంతో ముచ్చటతో ఎన్నో గర్భరక్షణలు చేయించెను. ఎన్నో ముద్దుముచ్చటలు త్‌ో డు తామ్మిది నెలలు నిండినవి పదయవ మాసమున అమె చక్కని పుత్రుని కన్నది. ఆ బౌ 120

నాం. మవారతనీతి కళలు “గాలా సతి జస్సుతో ధగధగలాడుచు వజ్రముల మించియున్నాడు. రాజు కన్నులార చూచెను తొను ధన్యుడనయితి ననుకొనెను. ' గుగయ్న ల్‌ యానందమెంత ేపు? ఆమె ఫిల్దల పిడుగు, ఆ బాలునెత్తుకొని తిన్నగా వదనక డ్‌ వు నది మహారాజెందులకో అని అమెను నివారింపరాదు కనుక ద్దనక వెనుకనే వెళ్ళెను గంగా ప్రవాహము పెల్లుబికి కెరటములతో గట్టుకు కొట్టుచు వారె నాహ్వానించు చున్నట్టున్నది. అక్కడ ఆమె యేమిచేయబోవునో? శంతనుడు కన్నులప్పగించి చూచుచున్నాడు. ఆమె హృదయమెంత కటికదోకాని, ఆ నెత్తురుకందును తటాలున గంగా ప్రవాహ మధ్యమునకు విసరినది ఆ బాలుడు కేరుమని యేడ్భుచుచు గంగలో కలిసిపోయెను. మగవానికి మగువ కావలెను. కొని మగసంతానముకూడ అంతగా అక్కరలేదని -పించునేమో లేకున్న కన్నులార చూచుచు అతడెట్టూరకుండును? వచ్చినపనియైనది ఆమె గిరుక్కున వెనుకకు తిరిగి అతనితొ సరస సల్గొపములాడుచు ఇంటి మొగము పట్టినది. అతడేదో పరధ్యానముగా ప్రత్యుత్తర మిచ్చుచుండునే కాని మనస్సు కుదురుగా లేదు. యధార్థతః అతడు చాలా చింతించెను, కొని పల్లెత్తుమాట జారెన్నా యిక'ఆ' భార్య తనకు దక్కదు. భార్య యున్నచో రేపి పాటికి మరల పుత్రుని కనవచ్చును అను ధైర్యముతో అతడామెతో పొటు కేరింతలు కొట్టుబు ఇల్లు చేరెను. మరల కొన్నాళ్ళకామె గర్భవతియైనది. రాజునకు కొద్దిగా ఆనందము కల్గినది. కోని ఆమె నదిలో పారవేయు కుండనున్నప్పుడుగదా అని కాలమును నిరీక్షించు చుండెను. రోజులు గడిచినవి, "పుత్రుడే పుట్టినాడు. అయిననేమి లాభము? ఆమె క్రితముసారి ॥ లాగుననే ఆ పుత్రుని కూడ తీసికొనిపోయి గంగలో పారవేసినది. వల దనునా మరి ఆమె యుండదు. నాలుక చివరివరకు వచ్చినను అతడేమియు మాట్లాడలేక పోయెను. ఇట్టు మొత్తమేడుగురు బాలురను పొట్టను బెట్టుకొన్నదాయువతి. అదేమి కర్మమో ఏసారి కాసారే వద్దనబోయి. లాజూరకుండుట - ఆమె తనపని తాను చేసికొనుటయు జెరిగినది, ఈసారి యిక గట్టిగా వట్టుపట్టవలెనని రాజు తలచినాడు. ల మరల నామె గర్భవతియైనది. తొమ్మిది నెలలు నిండినవి. చక్కగా సకాలమున పుత్రుని కన్నది. అతడు దివ్యతేజశ్ళాలియై వెలుగుచున్నాడు. గంగమ్మ కోక నడుమునకు బిగ గట్టుక్షాని పిల్ల వానిని చేతులలోనికి తీసికొని బయట్లేరినది. అతనికి కోపమాగలేదు.

  • ఇంతకును వానికి నూకలున్నందున ధైర్యముగా రాజు - నాద్‌ లాలా

సా మవాఖారత నీతి కథలు - | “జ వనితా నీ వెంతయో సుకుమారమయిన దానవు నీకింత కరిన హృదయము నా భగవంతుడెట్లు సృజించెనో తెలియరాకున్నది ఎవరయినను బిడ్డలకై జపములు , చేయుదురు, తపములు చేయుదురు" నోములు, వ్రతములు చేయుదురు కాని యిట్లు తీరి కూర్చుండి వారంతట వారు పుట్టిన బంగారము వంటి బిడ్డలను, పసికందులను నీటిలో పాఠరవేయుదురా నీకు హృదయములేదా? నీకు మాతృత్వమే కలుగలేదా? పశువులు సైతము సహజమయిన మాతృత్వముతో బిడ్డల నాదరించునే! అపాటియైన నీకు వాత్సల్యము నీ బిడ్డలపై కల్గలేదా? ఇప్పటికేడుగురైనారు. చేజేతుల వారినెట్ట్లు గంగపాలు చేస్తితివి? ఇక నేను సహింపలేను ఇప్పటికే తెలివి తక్కువ చేసితినని వగచుచుంటిని ఈ బాలుని చంపవలదు ఆగుము అని నిరోధించెను _ ఆమె వెంటనే నిజస్వరూపముదాల్చి “రాజా నేను గంగను వీరినిట్ట్లు పుట్టగానే పొట్టన బెట్టుకొనుటకు తగినంత కారణమున్నది లేకున్ననేనుమాత్ర మాడుదానిని కానా? కడుపుతీపి నెరుగనా? ఎట్టు చంపుదును? అది నే ముందు వారికిచ్చిన వాగ్దానము వా రష్టవసువులు వారికి వశిష్ట శాపము తగిలినది దానివలన తేజోవిహీనులై వచ్చుచు దారిలో నన్నుచూచి “అమ్మా నీవు మనుష్యునకు భార్య కాగోరుచుంటివి కదా! మేము మనుష్యులమై _వుట్టవలెను. మరొకరి కడుపున పుట్టలేము నీ కడుపున పుట్టెదము, నీవు మాత్ర మొక్కటి చేయవలెను తల్లీ! పుట్టగానే మమ్ము తీసుకొని వెళ్ళి గంగలో పారవేయవలెను లేకున్న ఆ భూ లోకంలో చిరకాల ముండలేమమ్మా! ఎట్టు కరుణించితివో ' అని పల్కిరి! వారి కోరికను మన్నించితిని. . కొని నాది మాత్రం మాతృహృదయం కాదా? వారితో అప్పుడు నేను “ఓ వసువులారా, మీరెంత వేడినను,నేను చేయగలను. అయినను స్రీలకు గొడ్డుతనం కంటే ఎక్కువ బాధను - కలిగించున దీ కడుపుశోకం, మీరు నన్నే నా బిడ్డలను చంపు మనుచున్నారు. ఇంతకన్న 'ఘోరకర్మ మరొక్కటియుండునా? ఆయినను మీ బాధ మీది. ఆది పోవుటకై మీరట్లు చెప్పితిరి కాని నా దొక్కమ్నాట, ఎనమండుగురు బిడ్డల కన్నందుకు ఒక్క కొడుక్రైనను నాకు దిగపడవలెను లేకున్న నేనా బాధను నహింపలేను. మీ రెవరుందురొ చూచుకొని ఒక్కరు మాత్రం భూలోకంలో మరి పది వేలేండులుండునట్టు చూచుకొనుడు అంతకంటె నాకు కానలసిన దేదియును లేదు” అని కోరితిని వారాలొంచుకొనినారు. ల్లీ, నీవు చెప్పినది సమంజసంగానే యున్నది, దానికి మేము మాత్రం కాదందుమా? మా భవితవ్యమట్టున్నందున నీ వట్టికోరికను కోరితివి. నీ 22

. కోరికను మాత్రం కాదనలగమా? కానిమ్ము]! మాలో ఆఅఖరివాడయిన ప్రభాసుడు మా అందరి తేజస్సులలో నాల్గ్లవభాగం తీసికొని మహా తేజశ్ళాలియై శౌర్య 'ధైర్యములతో చిరకాలం భూలోకమున నుండును” అని వారిలో ఒక్కడు మాత్రం చిరంజీవి యగునట్లు ఒప్పుకొన్నారు. -

కావున ఓ రాజా! ఇతడు చిరంజీవియై నీకును, నాకును పేరు తెచ్చును. విచారింపకుము నేను మాత్రం మన మనుకున్న మాట ప్రకారం వెళ్ళిపోవుచున్నాను సెలవిమ్మ”న్నది గంగాదేవి అప్పుడు శంతనుడు “అదా కథ కానిమ్ము? మరి, దేవతా భేదములైన పసువులను వసిష్టుడేల శపించెను? ఆ కథను కూడ సవిస్తరంగా చెప్పుము” అనికోరెను. ఆమె యిట్లు చెప్పసాగినది.

పసువుల శాప కథ

వరుణుడను మహర్షి తపః ప్రభావంచే నాక్కకొడుకును కనెను. అతడు గొప్ప తేజశ్ళాలియై విరక్తుడయి ప్రజలందరును తన్నుకొనియాడునట్ట్లుగా మేరు పర్వతమున కేగి అచ్చట తపస్సు చేసికొనుచుండెను.

అతనికి నందినీ ధేనువు కోరిన కోరికలనెల్ల ఇచ్చుచు సేవలు చేయుచున్నది. ఆ నందిని దక్ష్తప్రజాపతికి కూతురైన సురభికి - కళ్యపు ప్రజాపతికి పుట్టిన' బిడ్డ్ణయే. అందుచే చాల మహిమ కలది. అదా మహర్షికి హోమధేనువైయున్నది.

ఇట్టుండగా నొకనాడు పనుపు లెనమండుగురును భార్యా సమేతులై మేరు. పర్వతము మీదికి విహారమునకు వచ్చిరి. కొంతసేపు విహారములయినవి. వారా వనములో తీరుగుచున్న హోమధేనువును చూచినారు. దోని మంచితనమునకు వారెంతో సంతోషించినారు. "

అందులో ఎనిమిదవ పసుపు ప్రభానుడు ఆతని భార్య భర్తతో “నాథా! ఈ నందిని చాలమహిమ కీలది. దీనిపాలు త్రాగినచో మనుజులు పదివేలేండ్లు ముసలితనము, రోగము లేకుండ జీవింతురట! ఎంత'!గొప్పదిది నాకు ఉశీనగరరాజ కూతురు “జితవతి యను కన్య స్పేహితురాలై యున్నది. ఆమె ఇష్టమే నా ఇష్టము నేను దేవతాస్త్రీనై యుండి ఆమెకు చేయగల ఉపకారమేమున్నది? దీని నేరీతియైనను తీసికొని పోయి, దీని పాల నామెకిచ్చినచో నా కోరిక నెరవేరును ఈ నా ముద్దు చెల్లింపడా” కోరినది.

వసువులందర్వును దానికి “సె” అనిరి. ప్రభాసుడా యావు నెత్తుకొని పోయెను. వసిష్టునకు హోమసమయమైనది. అవు రాలేదు. అదెక్కడికిని పోవునది కాదే - ఈనాడేమి . ననన ఖాన ననన

పా నుహధారతనీతి కథలు - గాలా జరిగినదో అని అతడు యోగదృష్యా చూచెను. వసువు లెత్తుకొని పోయినట్టు గమనించి కోపోద్రిక్తుడై వారి నెల్లరను “మనుషులై పుట్టుదురుగాక!” అని శపించెను వారికది వెంటనే తెలిసినది. వారందరును హోమధేనువుతో సహా వచ్చి వసిష్టుని పాదముల పైబడి “మునీంద్రా! తెలియక నీ యెడ తప్పు జేసితిమ్బి మన్నింపుము. మానవులమై చిరకాల ముండలేము కరుణింపుము” అని కోరిరి. మహర్షుల చిత్తమెంతో మెత్తనయినది. వార్షికి కోపప్రసాదములు కలిసియే యుండును. అతడు వారి ప్రార్ధనతో “మనసు కరిగి “మీరు కోరినట్టు వర మొసగుచున్నాను. కాన్క అపకఠాథ మెక్కువగా చేసినందున పప్రభానుడు మాత్రము చిరకాలముండి తీరును. ద్రోహము తలపెట్టినవాడు కనుక అతనికి సంతానమునీడదు!” అని శాపమును సవరించెను. కావున నో రాజ్ఞా? ఇతడే ఆ ప్రభాసుడు. ఇతడు చిరంజీవి యగును. నీవేమీ . పెంచగల వితనిని.చేను పెంచి పెద్దచేసి నీ కప్పగింతునులే!' అని చెప్పి ఆ బాలుని తీసికొని గంగ అంతర్థానమయిపోయెను. | శంతనుని కా గంగాదేవి మాట లర్దము కాలేదు. ఆమె వెడులునన్న మాట వినపడుట తోనే అతనికి మనస్సు చెదిరినది. సుఖపడిన రోజులన్నియు ఎన్నో తెలియకుండ, లెక్కలేకుండ ఇట్లే ఒక్క క్షణములాగున వెళ్ళిపోయినట్టని పించినది. ఇట్లు కానైన యున్నది. ఇప్పుడు తాను చేయునదేమి? ఇంటి కేగుటయే తప్పదని తనకు తానే ధైర్యము తెచ్చుకొని అతడిల్లు చేరెను. కష్టసుఖములు కావడి కుండలు, దశ చక్రపుటంచువలె క్రిందికి పైకి తిరుగు చుండును. అందువలన బుద్ధిమంతుడెన్నడును విచారింపడు. సుఖదుఃఖము లేవియును చిరకాలముండవు. అది ప్రకృతియని కెలిసినప్పుడిక విచారమేటికి? అతడు భార్యా పుత్రవియోగ మేక కాలమున కలిగినను ధైర్యముతో రాజ్యమేలు చుండెను. సధర్మముగా మంచివారికి మంచివాడై, దుర్దనులకు కంటకుడై అతడు రాజ్యమేలు చున్నందున అతని కీర్తి భూమండల మంతట వ్యాపించెను, ప్రజలెల్లరు నతనిపై ననురక్తులై యుండిరి? అదే అతని మనస్సున కానందము నిచ్చుచున్నది. తాను చేయుపని ప్రజామోదమును పొందినపుడెంతో ఆనందము కలుగుటలో వింతయే మున్నది? ఒక్కనాడతడు వేటకై గంగాతీరమున నున్ననడవికేగెను. అతడు తనమీద విరహముచే చిక్కిపోయి అనగొ.అంతకంతకు ప్రవాహము తగ్గిపోవుచున్న గంగానదిని చూచెను. అట్లు క్షణక్షణము తగ్గుటకు కారణమేమో తెలిసికొన బుద్ధి పుట్టినద, అతడా గట్టు వెంబడని కొంత దూరమెగువకేగెను. " న 2డ

నానవానవనావవయయయయయయయయలా మ్రవద్య్టుంరలో నీతి కథలు -/ అతత అక్కడ నాక బాలుడు పదునయిదు పదునారేండ్డవాడు బాణములు వేయుట నేర్చుకొనుచుండెను. అతని కిసుకతిన్నెలు చాలినవి కాదేమో బాణములతో గంగా ప్రవాహమునకూ సేతువును కట్టుచుండెను. అతని నేర్పెట్టిదో కాని బాణపు గట్టుదాటి నీరు క్రిందికి దిగుటలేదు. అంత అద్భుతముగా బాణములను వేయగల శూరు నతడెన్నడును చూచి యుండలేదు. అతని కాశ్చర్యము వేసినది. అనాడు తనకు గంగకు కలిగిన పుత్రుడీపాటి కింతవాడు కావచ్చును. కాని అతని నామె తీసికొని పోయినది. ఏమి చేసినదో? అతడేమి చేయుచున్నాడో? తన కా పుత్రునెత్తుకొని లాలించు భాగ్యము లేదు కదా! తన పుత్రుని విద్యా పాటవము చూచుకొను అదృష్టము పట్టలేదు కదా! తానంతే నోచెను. వాని కెవరు కర్తలు? అని యేమేయో తలపోయు చుండెను. అతడు తన కొడుకుయైనను, ఎప్పుడో పుట్టిననాడే కాని మరల చూడనందున గుర్తుపట్టలేక అతడు ఇన్ని విధముల మనస్సులో బాధపడు చుండెను. ఎవరైన నేమి? చూడముచ్చటగా నున్నందున ఆ బాలుని విద్యాకాశలమును చూచుచుండెను. అతని భావమును కనిపెట్టినది గంగాదేవి. అనాడా బాలుని అక్కడకి పంపినది కూడ ఆమెయే, పెంచి పెద్ద చేసినది ఇక నా బాలుని తండ్రి కొప్పగించవలెనను కొన్నది. స్రీ రూపముతో వచ్చి అతని యెదుట విలువబడినది. దివ్యభూషణములతో చక్కగా మెరయుచున్న కొడుకును కుడిచేతితో పట్టుకుని దగ్గరకు తీసికొని వచ్చినది. ఆమెను చూడగానే శంతనుకెంతో ఆనందము కల్గినది అతని కొడలు పరవశమైనది. అతడు తన కొడుకేనా? అంత అదృష్టమా! తనంత పెట్టి పుట్టెనా? అని మనస్సుతో ఎన్నో ఉత్సాహపూరితమైన భావముల నూహించుచుండెను. గంగానది అతనికి కొడుకును చూపుచు “రాజా ఇడుగో నీ కొడుకితడు పెద్దవాడైనాడు. వసిష్టునితో సమముగా "వేదములు శాస్త్రములు చదివినాడు ధర్మ శాస్త్రములో నితనికి శుక్రబృహన్పతులు సాటివత్తురేమో? అస్త్ర విద్యలో పరశురాము డొక్కడితనికి సాటివచ్చునేమోకాని, మరెవ్వరును నిలువలేరు. వేదాంత విజ్ఞానములో నసనత్కుమారాది మహా మునులతో సమమైైనవాడు, వయనున ఇంతగా కన్చించినను విద్యాకాశలములో ,నితడు చాలా ్రొఢుడైనాడు, నా బాధ్యత తీరినది. ఇతనిని స్వీకరింపుము. జాగ్రత్తగా రక్షించుకొనుము” అని చెప్పి, అతనికా కుమారు నప్పగించి, ఆమె అంతర్భానమైపోయినది. శంతనుని యానందమునకు మేరలేదు. గంగయిక తనకు దక్కక పోయినను తన సుఖజీవితమున కానవాలుగా ఆ కుమారుడు దిగపడినాడు. అంతే చాలు! అతని నా

అావాంంయంాాంయాయిల దుదళభారత నీతి కథలు = లా కౌగలించుకొని అతడు తనివిచెంద లేదు. తన మంత్రులకు, ప్రజలకు చూపించెను. వారెల్లరు నట్టి మహాపౌరుషశాలియైన యువరాజును చూచి ఎంతో ఆనందించిరి. వారి అనుమతిపై శంతనుడా గాంగేయునకు యువరాజ్య పట్టాభిషేకము చేసెను. అతడు మహాపరాక్రమ శాలియగుటచే శంతనునకెంతో చేదోడై ఆనందము కల్గించెను. ఏదయినా వినోదించవలెనన్న కొడుకుతో సంభాషించును ఒకే విషయమున ఆరితేరిన తండీ. కొడుకుల సంభాషణ ఎంతో ఆనందదాయకముగా నుండును. దానికి సరియైన కాలక్షేపమీక నుండబోదు. అట్లు నాలుగు సంవత్సరములు గడచినవి. శంత్సను డొక్కనా డడవికి వేటకేగెను. అది యమునా తీరము. అతనికి క్రొత్త ప్రదేశమే అది. అయినను వేటకెక్కడైననేమి? కొంతసేపు-వేటాడి అతడు బడలిక చెందెను. ఇక నీటి దరికి వళ్ళుదమను కొన్నంతలో అతని కపరిమితమైన నువాసన వేసినది అంతటి పరిమళమును తానంతవరకెన్నడు నామ్రాణించలేదు. అదేమో తెలిసికొన గోరి యమునగట్టననే వెళ్ళెను అక్కడ నాకకన్య యున్నది, ఆమె నుండి వచ్చిందా పరిమళము, అతడదెట్లు వచ్చెనా అని ఆశ్చర్యపడెను. తాను వినియున్న యోజనగంధి ఆమెయే యైయుండునని నిశ్చయించి అతడామెను పరిణయ మాడగోరెను. ఆమె ముందుగా మత్స్యగంధియై తర్వాత యోజనగంధియైనది. దానికి చాలా కథ యున్నది. అది కూడా వినుడు. - పూర్వము చేదిదేశమును వసు మహారాజేలు చుండెను. అతడు చాలా అందమైనవాడు

  • బలపరాక్రమములు కలవాడును. అతడొకసారి అడవికి వేటకై వెళ్ళెను. అక్కడకు దగ్గరగా నున్న మహర్షి యాశ్రమమునకు మునులను చూచిరాదలచి వెళ్ళెను. అది ప్రశాంతమైన తపోవనము, విరోధము విద్వేషము అక్కడ మచ్చుకయినను లేవు. ఎంత నాగరికతయున్నవేమి? పట్టణములు - పల్లెలు కలుషపూరితములు, ద్రోహచింత జంతువులకు సైతము లేక హాయిగానున్న అక్కడి జనులను చూచి అతనికి అసూయ కలిగినది. తా నెంతటి మహారాజైనను అక్కడి మహర్షులవలె ప్రజలు ధర్మమార్గమున నుంచగలడా? ముందు తనకున్నదా మన స్మృప్తి! అదంతయు తరచుగా అతనికి వైరాగ్యమిట్టే కలిగినది. సంసారము పై అసహ్యము వేసినది. అతడు శస్త్రసన్యాసము చేసి తపోనిష్టను పూని జపము చేయుచుండెను, అతని తపోనిష్ట అసిధారా ప్రతముగా నడచుచున్నది. ఆ తపోజ్వాలల్తాకాశము నాక్రమించినవి, దేవతలు తల్టడిల్లిరి. దేవేంద్రుడు సరాసరి అతనివద్దకువచ్చి అతన్ని లాలా

వాలా మమదభారత నీత కథలు - ౯ లాలా గౌరవించెను. దేవేంద్రుడంతటివాడు వచ్చినపుడు వనువూరకొనిన బాగుండునా?

  • ప్రత్యుత్థానాభివాదములు చేసివచ్చిన ప్రయోజనమేమని యడిగెను. అంతట దేవేంద్రుడతని వినయ విధేయతల కలరి రాజర్షి నీవు మహా ధర్మమూర్తివి. వర్ణధర్మములను సక్రమముగా నడిపించుచు రాజ్యమేలుటకంటే ధర్మాచరణము వేరేయున్నదా? ఆపాటిదానికి రాజ్యము మాని నీవంటి "మహా రాజు ముక్కు మోసికొని తపశ్శాలియైనచో నిక రాజ్యమేలు వారెవరు? నీకేమియు పుణ్యార్దనమున లోటురాదు నీ తపస్సునకు మెచ్చితిని. నీతో నేను స్నేహము చేయుచున్నాను. నా వద్దకు వచ్చుచు పోవుచుండుము. తపస్సు చాలించి రాజ్య మేలుము అదే తపస్సు కదా! నీ కందుకు తగినట్లు దేవత్వమిచ్చుచున్నాను. నీవు న్వర్గమునకు రావచ్చును. దేవలోకమునకు రాకపోకలు చేయుటకయి నీకు బంగారు విమానం నిచ్చుచున్నాను. అది కామగతి గలది నీవు కోరిన చోటికి క్షణములో వెళ్ళియుండున్లు. ఇదిగో కమల మాలిక దీని ధరించినచో ఎట్టి ఆయుధములయినను తిరిగిపోవును. ఇదెన్నటికిని వాడదు. దీనిని నీవు ధరించుము. ఇదిగో ఈ దిద్యమయిన వెదురుబెత్తం దీనిని చేతిలో ధరించినందున దుష్టశిక్షణ, శిష్టరక్షణలు తేలికగా చేయగల్గుదువు. న్యాయము నులభముగా నిర్ణయింప వీలగును కావున వీటినన్నిటిని చేకొనుముూ అని ప్రియముగా పలికి వాటినన్నిటిని సగౌరవంగా నతనికి బహూకరించెను. వసువు “దేవేంద్రా! నీవు చెప్పుటకంటె నాకేమి కావలెను? నీవు చెప్పినట్టు చేయుదును. త్రిలోకాధిపతివి నీవు వా హితవు కోరక యుందువా? ధర్మమూర్తివగు నీవధర్మ నిరతుడవగుదువా? నీవు చెప్పినట్లె నడుపుదును” అనియొప్పుకొని అతడు తపన్సు మాని రాజ్యంనకు వచ్చి ప్రజారక్షణ చేయుచుండెను. అతనికి ఇంద్రదత్తమైన వాటితో దర్శ పరిపాలన సాగుచున్నది. ఆ దివ్య విమానము నెక్కి అతడు తోచినప్పుడెల్ల స్వర్గంనకు వచ్చుచు పోవుచుండెను. దేవేంద్రుడతని నిగర్వళ్వమున కెంతో మెచ్చుకొని గౌరవాదరములను చేయుచుండెను. విమానం పైన తిరుగునాడగుటచే అతనికి “ఉపరిచడు”డని బిరుదు వచ్చినది. ఆ వనమాలికను ధరించి వేణుయపష్టికి (వెదురు బెత్తమునకు) పూజలు చేసి ఇంద్రోత్సవము నేటేట చేయువాడు ఇంద్రుని దయవలన గదా తనకంత అదృష్టము స్టట్టినది. తొనతనికి ప్రతీఫలముగా పూజలు చేయుట యుక్తముకదా! యుత్పవములతో నింద్రున కెంతో మెప్పు కలిగెడిది. అంతేకాదు ఇంద్రోత్సవము చేసినచో రాజుల కాయుర్చృద్ధి; నంతానాఖివృద్ధి జరుగును ప్రజలకు నట్లే సకాల వర్ష్వములతో సస్యసంపదభివృద్ధి జరుగును. " నా 2

ఆం మువభారతనీతి కథలు - గా ఆ ఉపరిచర వసు మహారాజునకు బృహద్రధుడు, మణి వాహనుడు, సౌబలుడు, యదువు, రాజస్యుడునను నయిదుగురు కొడుకులు పుట్టిరి. వారు పెరిగి పెద్దవారయి యువరాజులగుటయే గాక వేర్వేరు రాజ్యముల నేలుచుండిరి వసురాజా రీతిగా తన

  • సంతాన మభివృద్ధిలోకి వచ్చినందుల కెంతో ఆనందించుచు మహోత్సాహంతో రాజ్యము నేలుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడొక విచిత్ర సంఘటన జరిగినది అతని రాజధానియైన
  • అధిష్టాపురమునకు దగ్గరగా శుక్తిమతియను నది ప్రవహించుచుండును. దాని నీరే రాజ్యమునకు జీవధార, ఒకసారి నదులన్నియు. దేవతా రూపముతో బ్రహ్మవద్ద కేగి వచ్చుచుండగా కోలాహలుడను పర్వతకుమారుడు దాని యొయ్యారమును చూచి కామించెను. అతడు హిమవంతునికి సుపుత్రుడు. శుక్తిమతీ సౌందర్యమతని నాకర్షించినది. ఆ రోజు అతడెంతో _ విరహబాధపడెను. ఇక తాళలేక రాత్రి కాగానే శుక్తిమతి యింటి కేగెను. శుక్తిమతి కా భావం కల్గలేదు. అతడు. పెద్దయింటివాడు కదా. ఎందుకో వచ్చెననుకొనెను. మామూలుగా గౌరవించి పీఠము వేసి కూర్చుండబెట్టెను. కుశల ప్రశ్నలు వేసి వచ్చిన పనేమో 'సెలవిమ్మని అడిగెను. ఆతడు వచ్చిన పని చాలా పెద్దది అంత తేలికగాచెప్పునా! మెల్లగా ఆమె వాలకమును చూచుచు 'నీవు చేయు మర్యాదలకు ఆనందం కల్గినది నిన్ను చూచినది మొదలు నా మనన్సు నిన్ను చూడగోరుచునే యున్నది. నా హృదయ వేదన నిన్ను కలిసినగాని తీరదు. ఎట్లు కటాక్షింతువో?” అన్నాడు. ఆమె అనుకొన్నది వేరు జరుగుచున్నది వేరు. ఇట్టడుగునని తాననుకొనలేదు. అయినను ఏదో సాకుచెప్పి తప్పించుకొనవలెనే కాని, దురుసుగా కాదనలేదు కదా, “అయ్యా! తమరు గొప్పవారు. నో వంటి అల్చులు కోరదగునా? ఎంత శ్రమపడినను నీరు కొండెక్కునా? నరకాన్ని వారితో ప్రేమ కలాపాలు ఏమిటి? ఈనాడన్నను మీకు నాకు సంటంధమెట్లుకుదురును?” అని మెల్లగా తప్పుకొన జూచినది. కాని అతడు వదలునా? ఆమె నీటి రూపం దాల్చి పారిపోగా అతడును పర్వత రూపమున ఆమె నడ్డగించెను. కొండంతవాడు వచ్చి అడ్డు తగులగా ఆడుది ఆమె యేమి చేయగలదు? అనుకొన్నంతయు జరిగినద్రి, _ ఇదంతయు లోపల జరిగిన విషయము, బయటికి ప్రజలకు బాధ కలుగజేసినది మరొకటి, నదికి కొండ అడ్డుగా పడుటతో నీరంతయు గట్లు పారలినది. ఎగువనున్న ఊళ్లు నన తన న ననన

ఆం మహభారతనీతి కథలు -/ లాం వరద దెబ్బలపాలైనవి. సస్యములు పాడైనవి అదేదో అకాల ప్రళయమువలె నున్నదని ప్రజలు దానికి ప్రతీకారం చేయలేక మహారాజుతో మొర పెట్టుకొనిరి, అతడును నెరుగడు జరిగిన పరిస్థితిని. అయినను వచ్చిన ఆపత్తును తొలగింపవలసిన బాధ్యత అతనిదేకదా! చతురంగ సేనా సమన్వితుడై కొండున్న చోటికేగెను. 'సేనలా కొండనేమి చేయగలవు? పిండి గుండగా ఎగుర గొట్టుటకు వీలయినదా అది! అందుచే రాజు మవి ప్రతాపవంతుడు కనుక కాలిగోటితో కొండను మీటెను. అంతే!' శ్రీరాముని కాలిగొటిమిటుతో దుందుభి అస్థిపంజరము పోయినట్లు కొండ ప్రక్కకుపోయి పడినది ఆ దెబ్బతో కోలాహలుడు హడలిపోయినాడు. ఇంద్రుడు వజ్రం చేపట్టికాని చేయలేనిపని నతడు కాలిగోటితోనెరవేర్చెను. అప్పటినుండి కోలాహలుడు మహారాజునకు క్రీడా పర్వతమాయెను. - ఆ సంగమం వలన శుక్తిమతి. గర్భవతిలైకీనది. ఆమెకొక కొడుకు, ఒక కూతురును కల్గిరి. ఆ బాలునికి “వసుపదుడు” అనియు, బాలకు “గిరిక యనియు పేరు 'పెట్టిరి. ఆ పిల్ల లిరువురును పెరిగి పెద్దవారైరి. కోలాహలుడు తన తప్పునకు క్షమాపణగా కొడుకు నతనికి దాసుడుగా నప్పగించ్చి కూతురు నాతని భార్యగా స్వీకరింపుమని కోరెను. అతడు కూడ ఆ కోలాహలుని మన్నించి గిరికాదేవిని ధర్మపత్నిగా స్వీకరించి, భావమరిదయిన వసుపదుని తనకు సేనాపతిగా చేసికొనెను. ఆమె ఒకప్పుడు బుతుస్నాత అయినది సరిగా అప్పుడే అతని పితరులు మాంనం తెచ్చి ఆమెకు పెట్టమని. యాజ్ఞాపించిరి. అతడు వారి మాటను తీసివేయక అడవికేగి వేటాడుచుండెను. కాని అతని మనన్సంతయును గిరిక పయిననే యున్నది. ఆమే రూపమును, పలుకులు మాధుర్యమును, ఆమె కన్నులలోని కరకు తనమును, దేహక్షాంతిని ముఖముమీది ఎగిరెడి.ముంగురులను ఆ చిరునవ్వును అదే ఇదిగా తలచుకొనుచు భావించుచు ఏదోయా త్రికంగా వేటాడు చుండెను.

మనస్సే ఉత్సాహ విచారములకు కారణమయినది. అదే ప్రధానముగా మానవునకు శక్త్యశక్తులు కలుగుచుండును. ఎంత బలశాలియయినను ఉత్సాహముగా లేనిచో కించిత్తయినను పని చేయజాలడు. సంతోషం సగం బలమన్సదే! సగం బలమనగా ఉన్నదానిలో సగమైక్కువ వచ్చునని కాని, ఉన్నదాని కంటె సగం తగ్గిపోవునని కాదు. అతనికా మనఃప్రవత్తివనల రేతఃస్కలనమైనది బుత్తుస్నాత అయిన భార్యను కలియ

129 ”

అలా మహూరత నీతి కథలు -/ాాలాలాాలాాాాాాా వలసినరోజది. అతడమోఘవీర్యుడు దీనిలో చాల తెలిసికొనవలసినదున్నది. అతనంతటివాడు రేజస్సును వృధాపోనీయడు. అందుచేత వెంటనే ఆ వీర్యమును గట్టిగా బాగానున్న ఆకులలోకట్టి, వేటకయి తెచ్చిన డేగకు కట్టి తన భార్యకు పంపెను. అది తీసికొని వెళ్ళుచున్నది.

=ఆ డేగ క్రమశిక్షణ పొందినది. అందుచేత సక్రమముగా అందించునని అతని యుద్దేశ్యము. అదియు అట్లే చేయదలచుకున్నది. కాని మధ్యలో మరొక అవాంతరము జరిగినది. మరొక డేగ దానికడ్డు తగలినది. ఆ మూట మాంసమేమో అని అది ఆశపడనది. అందుచే అది దానితో పోరాడ మొదలిడింది

డేగల దెబ్బలాట జాగ్రత్తగా జర్దుగునా? కాళ్ళగోళ్ళతో పాడుచుకొనుట ముక్కులతో పాడుచుకొనుట, రెక్కలతో కొట్టుకొనగా ఒడలు తెలియకుండ పొడుచుకొనుచున్నని. ఆసందడిలో ఆ యాకులటమూ చినిగినది. దానిలోని వీర్యము చిదవలుగా క్రింద పడిపోయినది..అవి పోరాడిన ప్రదేశమునకు క్రింద యమునానది యున్నది. అందులో నున్న ఒక చేప నోరు తెరుచుక్షొని యుండి ఆ వీర్యముతో కలిపిన నీటిని త్రాగినది ఆ శక్తి యెట్టిదోకాని ఆ చేప వెంటనే గర్భము దాల్చినది అది అమోఘ వీర్యము లక్షణము.

అంతవరకే ఆ కథతో మన కవసరము. ఆ కథనే “వసుచరిత్ర రామరాజభూషణుడు (వ్రాసినాడు: -

పదవమాసము వచ్చినది, ఇక ్రసవించు రోజులు నీటిలో ప్రసవించినచో ఏమయ్యెడిదో? కాని భగవంతుడన్నిటిని తగినట్టు సమకూర్చునుగదా! అప్పుడొక జాలరి తనవృత్తి ప్రకారమాన్నాడు చేపలవేట కేగి వలవేయగా అతనికాచేప దొరికినది అది చాలా లావుగా నున్నందున జాగ్రత్తగా ఇంటికి తీసికొని వెళ్ళి దానిని కోసెను. దాని కడుపు నుండి ఒక మగశిశువు, ఒక ఆడశిశువును. పుట్టిరి. అతడాశ్చర్యముతో ఆ యిద్దరి బాలురను దాశరాజు (పల్గెరాజు)న కప్పగించెను,

_ ఆ చేపకూడ నిజమయిన చేపకాదు బ్రహ్మ శాపకారణముగా అరదిక యను నప్పరస చేసయినది దాని కడుపున మానవులు పుట్టట్లయే దానికి శాపావధి. అట్టు జరిగినందున అదీ శాపమోక్షము పొంది దేవలోకమున కేగెను.

ఇకనీ బిడలసంగతి - ఆ బాలుడు మళ్య్యరాజును పేర ప్రసిద్ధడయి మత్స్యదేశము నేలెను.

ఆ కన్యను దాశరాజు గారాబముగా 'పెంచుచుండెను. చేప కడుపులో నుండి

పుట్టినందున - ఆ బిడ్డ చేపకంపు కొట్టినదనేమో - ఆమె “మత్స్య గంధి' యని పేరు పెట్టిరి.

ఆమె మహారాజు వీరోత్పన్న కావున సహజమయిన రాజసముతో తేజస్సుతో మెరయుచున్నది.

  • 130

చుానవవవావానయయిలులయియింయయల మ్రదుళదంరత తతి కథలు = (కనను

అతనికెన్నో పడవలున్నవి. అందులో రేవుపడవ అతనిదే అదే ప్రధానమైనది. ఆ రేవు పడవను నడుపమని కూతురిని నియోగించినాడు. ఆమె అతని మాట ప్రకారం రేవు పడవ నడుపుచున్నది.

.... అందమయిన వారే పనిచేసినను అందమే! ఆమెను చూచి ముగ్గుడు కాని మానవుడు లేడు వాడు-వీడు అననేల? ఒకనాడు పరాశర మహర్షి ఆ దారిన వచ్చెను అతడు వశిష్టమహర్షికి మనుమడు. శక్తియను మహర్షికి కొడుకును. మహా తపశ్ళాలి, కామజ్రోధాదులను జయించినవాడు. ఈ మూడు లోకాలలో నాయన నెరుగని వారు లేరు అతని తపస్సునకు జడిసి పాపములు పటాపంచలయినవి అతి నిష్టాగరిష్టుడు తీర్థయాత్రలకై బయలు దేరినాడు పాపము! ఎంతవాడైన నేమి? రేవులోనున్న సత్యవతిని చూచినాడు.

వెంకటనే ఈమె యెవతెయా? అని యోగదృష్ట్యా చూచినాడు. జెలిసినది ఆమె జన్మ క్రమమంతయును,. ఆమె అయోనిసంభవ - రాజర్షి బీజోత్సన్న- తనకు తగిన కన్యయే అని నిశ్చయించుకానినాడు. ఇక బాధ లేదని ఆమె ప్రత్యవయవమును సావకాశముగా, సాపేక్షగా పరిశీలించినాడు. ఆ చూపులలోని ముగ్ధ మధురత్వము, శరీరములోని అసంస్కార చారుత్వము అతని నాకర్షించినవి. కృత్రిమమైన సౌందర్యమెంత "సేపుండును? ఆమె సహజసుందరి సానపట్టని ముత్యమువలె ప్రకాశించుచున్నది. అతని కెంతసేవు చూచినను తనివి తీరలేదు.

ఆమెకు సిగ్గు హెచ్చగుచున్నది. ఎవరో పురుషుడు, మహర్షి తనకేసి అదే యిది ఏమిటా చూచుట? తాను వలదనలేదు. అతడేమనునో? పోనీ! అని తాను కూడ చూడలేదు. కోరిక కలదు లేదు అన్నమాట అటుంచి, తనకు సిగ్గాయె. అందుచే అతని దృష్టికి మౌనముగా చూపులతో జవాబియ్య లేకున్నది.

అతడు సాహిసంచి ఆమె సిగ్గును వదలించదలచుకొన్నాడు. ఇదివరకటి ఇంద్రియని గ్రహమంతయు నేమైనదో? ఈమేలో నున్నదో, అతని కర్మలో నున్నదో, - ఆ లోపము; చెప్పలేము. అతడే సాహసించి ముందడుగు వేసెను.

“పిల్లా! నీ వెవరవు? ఇంత అందమైన దానవు. నీవీ యూడ నడుపుచుంటి వేల? నాకు నీతో కలియవలెననియున్నది. ఏమందువు?” అని తన అభిప్రాయమును వెల్లడించిను.

ఆమెకు క్రొత్తయే - అతనికి క్రొత్తయే కాని యిద్దరును రసికులే. అవును - కాదు అని చెప్పదలుతురుకాని, అఘాయిత్యమునకు పూనుకొనునట్టివారు కారు. ఎవరో ఒకరు ముందుకు దిగినచో అభిప్రాయము తెలియుట ఎట్టు? ఆమె వెంటనే ఒప్పుకొనుటకు గాని, తా

అంవాలనాయవవలయయట మహాభారత నీతి కథలు -౯లాాాాాకనవాలనవవాముు కాదని త్రోసిపుచ్చుటకు గాని జంకినది. అతడు మహర్షి కాదన్నచో శపించునేమో! అంగీకరించుటకు తాను తండ్రిచాటు పిల్లకదా. ఆడువారికి తెలివి తేటలు స్వతః పుట్టును. వారికవి నేర్వవలసిన అవసరము లేదు. అసలు తెలివి తేటలన్నవి పుట్టుకతో రావలెనుకాని, నేర్చుకున్నచో వచ్చెడివికావు, ఒక వేళ నేర్చుకొన్నచో అవి నేర్చుకాన్నట్లే యుండును ఆమెకు కంగారేమున్నది? తమాయించుకొని “అయ్యా నీకు నేనెట్లు నచ్చితినో కాని ఈ శరీరపువాసన చూడుడు. చేపలకంపు అబ్బ దీనిని మీరెట్టు సహింపగలరు? తమవంటి వారికిది లోత పుట్టింపదా? ఆపైన నేను పల్లెదానను. మీ కులమెక్కడ?" మా కులమెక్కడ? దేనిక్రైనను తగియుండవలదా? అసదృశముగా నున్నచో బాగుండునా? మరొక్కటి నేను కన్యకను. తరిడ్రిచాటు హీనను. నన్ను మీరు కోరి నా కన్యత్వ భంగము చేసినచో నేనింక ఏ మొగము పెట్టుకొని యింటి కేగుదును? మంచి మర్యాద లుండవలదా? నలుగురిలో నగుబాటు కాదా! ఇట్టు మీరు కోరుట సమంజసమైనదేనా!” అని మెల్లగా ఆయనకు వ్యతిరేకభావం ప్రకటించినది.

“కళ్యాణి! నీవన్నదంతయు సమంజసంగా నున్నది. నేను కూడ యిదంతయు నాలోచించితిని. నీవు పల్లెదానవని నీ యూహ? అది అసత్యం నీకు నీ జన్మరహస్యం తెలియదు. నేను చెప్పెదను వినుము. నీ వుపరిచర వసువను రాజర్నీ కూతురవు. సత్కుల ప్రసూతవు నేను యోగదృష్టితో చూచి తెలిసికొన్నాడను నీవొక వేళ పెరిగిన దోషమునకై చేప కంపునకు కదా జంకినచో నామాట వినుము - ఇదే నీకు దివ్యమైన పరిమళమబ్బునట్లు వఠం ప్రసాదించుచున్నాను. నీ శరీర సువాసన లొక యామడ వరకు వ్యాపించును, అనుటతో ఆమె శరీఠం నుండి సువాసనపై కుబికి ఆ రేవు ప్రాంతాన్ని గుప్పుమనిపించెను.

అక్కడిత్తో ఆమెకొక విచారం తగ్గింది. ఇక కన్యాత్వ భంగంమాట ఉన్నది. అతడు మహర్షికాన “నీ కన్యాత్వమున కేమియు భంగంరాకుండ చూచు బాధ్యత నాదినా వరమేమిటో యెరుగుదువా? నీకా దోషమేమియు నుండదు. అని నొక్కి చెప్పుటతో మునుల ఘటనాఘటన పారీబులని నమ్మి యూరకున్నది.

అతడు పడవనెక్కెను. ఇసుకతిన్నె దగ్గరకు పడవను చేర్చీనదామె. అట్టయినను మరొక అభ్యంతరం వచ్చినది. “మునీంద్రా! ఇట్టి పట్టపగటివేళ సూర్యుడట్టు ప్రకాశించు చుండగ్లా నాకు సిగ్గుగదా” అన్నదామె. అతడు మహా తపశ్శాలి కనుక “ఓసీ! అదా యుద్దేశ్యము? కానిమ్ము! ఇదే లోకమునంతను చీకటి చేయు చున్నాను” అని తలచుకొన్నంత మాత్రాన కారు చీకటి క్రమ్మినది. రాత్రి వేళకూడ అంత చీకటి కాదేమోకూడ, ననన ననానాాాం2

సా మహభారతనీతి కథలు =! ాాలాాలాాలాలాలాలాా

ఆమెకు కోరినవాటినన్నింటిని నతడు కల్పించెను. ఇక చెప్పదలచినను అభ్యంతరమే దియును లేదు. ఆమె కోరినవి, సోమాన్య విషయములు కావు. అతడు కనుక అన్నిటిని కల్పింపగలిగెను. మరాకడైనచో ఆమెను కోరవచ్చునుగాని అట్లు నిర్మింపగలడా అదే వారికినీ మనకును గల భేదము. అది గుర్తింపక ప్రతివాడును “ఆ మహర్షి చేయలేదా? ఈ మహర్షి చేయలేదా?” అందురు అంతే శాన్సివారి మహిమల సంపాదింపగలగవద్దా? అందుకు శక్తిచాలదు. ఊరికే సాటి మాత్రము తెచ్చుకొనగలరు.

పరాశరునికోరిక తీరినది అతడు కోరినది కేవలమా మెనుకాదు పుత్రసంతానమును, ఆమెకు సద్యోగర్భము వచ్చినది. అనగా ఏడుగడియల (3గ)లో గర్భము పూర్ణముగా పెరిగి ప్రసవించు నన్న మాట అట్టొక సుతుని కన్నదామె. ఆబాలుడు దండకమండలువులతో పుట్టెను. అతనికి పుట్టుకతోనే జ్ఞానము వచ్చినది. అతనికి నల్లగా నున్నందున కృష్ణుడనియు, ద్వీపమున పుట్టినందున కృష్ణ దైపాయను. డనియు పెరిడిరి. పరాశరుడు తన కోరిక తీరినందున వెంటనే వెడలిపోయెను.

ఇక కృష్ణద్వైపాయనుడు తపస్సు చేయగోరి తల్లికి నమస్కరించి అమ్మా! నేను తపస్సు చేసికొనటకయి వెడలుచుంటిని. తమరు తలచుకొన్నప్పుడు వత్తును” అని చెప్పియొప్పించి వెడలిపోయెను. చూడుడు! వారి వైరాగ్యము అంతగా స్వాధీనమయిన పిల్లను మరొకడయినచో తనతో కూడ తీసికొని వెళ్ళక్తుండునా! లేదా మరల మఠల రొకుండునా? కాని, ఆ మహర్షి కోరిన దొక్కసుత ప్రనూతి మాత్రమే: అది 'ప్రసవించినది ఆంతే! ఇంక నతడు వెనుకకు తిరగి చూడలేదు, పుట్టిన బాలునికైన వ్యామోహం లేదు. విత్తాకటి వేసిన చెట్టాకటి మొలచునా? అతడా క్షణములో పెరిగి పెద్దవాడై స్వయం పోషకుడయ్యెను! సామాన్యులలో అయినచో చచ్చిచెడి గర్భస్రావం చేసికొనవలసినదే! అంతభేదముండును.

ఆ రీతిగా తండ్రి కొడుకుల జాగ్రత్తగా సర్దుకొనగా ఆమె 'కన్యాత్వభంగము కానందులకే కాక, అట్టి యుత్తమ వురుష సంపర్కముని కెంతయో సంతసించి యింటికి వచ్చినది. అట్లు సత్యవతి మత్స్యగంధియై యోజనగంధియైనది. ఆమెను చూచినచో ఎవరికి మనస్సు చల్తిపందు?

శంతన మహారాజామె పేరు - కథ విని యుండెను?. అందుచే ఆమె సువాసన తెలియుటతో పసికట్టి ఆమెను పల్కరించి దాశరాజు పిల్లను వేడుటక్రై పల్లెశేగెను.

శంతనుడు వచ్చుచున్నాడని యెరిగి దాశరాజు మహోత్సాహంతో నతనికి ఎదురు సన్నాహములు చేసి సగౌరవంగా తన యింటికి తోడ్కాని వెళ్ళెను అచ్చట నున్నత పీఠము

133

నాయిలాలాయిలా నునోభారత నీతి కథలు = అలానా. పై కూర్చుండబెట్టి “రాజేంద్రా! మీ వంటివారు వచ్చుట వలన నా గృహము పవిత్రమైనది. ఈ దాసున కేదైన పని చెప్పి కృత్తకృత్యుని చేయుడు” అని సవినయముగా పల్కెను. రాజు మాటలు వినిన తరువాత నేమనునోకాని, ముందు మాత్రం చాల చక్కగా చెప్పినాడు. ఆ మర్యాదకే అతడు సంతోషించి “దాశరాజు! నీవు మాకు పరమాస్తృడవు. నీకు చెప్పకూడని దేమున్నది? కాక చల్లకు వచ్చి ముంత దాచనేల? నీ కన్య యున్నదే - ఓడ "నడుపు నట్టియోజనగంధి- ఆమె ఫైనా మనస్సు లగ్నమైనది. నాకామెను భార్యగానిప్పింపుము" అని కోరెను పిల్లను కోరునప్పు డెంతటివాడైనను తక్కువయే కదా! ఇప్పుడు దాశరాజు ఏమనునో చూతము? అతనికి మహారాజు తన కాళ్ళ ముందునకు వచ్చెను కదా అని ఆనందమే కల్గినది. ఆ సంతోషముతోనే అతడు “రాజేంద్రా! మీవంటి వారితో సంబంధము మావంటి వారికి సామాన్యంగా లభ్యమగునా? ఆడుపిల్ల పుట్టుకతోనే వరుని కియ్యదగి యుండును. అది లోకమర్యాద. మేము వెదుక వలసినదానికి వొదులు వరులుగా తామే వచ్చుట మా కన్య అదృష్టము! కాని, నేనడిగిన దియ్యగలిగినచో తమకీ కన్యనిచ్చుట కేపాటి యభ్యంతరము నుండదు' అనెను, శంతనుడు “నీవు కోరునట్టి వస్తువియ్యదగినది నేనియ్య గలిగినదియు నైనచో తప్పక యిత్తును అంతే కాని, ముందుగా 'యిత్తువా?” అన్నచో నేనేమి చెప్పగలను? నీవు. మాట వోటు పోవృనేమో అనుభయము కలవారట్లే అందురు. ఏదో ముందు కార్యావసరమునుబట్టి అనివేయుట, తర్వాత వీలుకొలది చూచుట మర్యాద కానేరదు. మాటకు మరొక్కడు సాక్ష్యముండనక్కరలేదు. వారు మహారాజులయినను సత్యవ్రతులేకాన్ని వదరబోతులుకారు అందుకిదే తార్కాణము. తాను మహారాజుకదా! ఏమన్న చెల్లదు? “ఓ ఇత్తును” అనెనా? తాను మోహించిన కన్యావిషయమే కానచ్చును కాని మాట జారరు అలోచించీయే చెప్పుదురు. అప్పుడు దాశరాజు ' మహారాజా! మా పిల్ల చాలా అందగత్తె అనికాని, గుణఐగణములు. కలదని కాని నేను చెప్పనక్కరలేదు: నాకొకం చిన్న కోరిక యున్చది. నా కుమార్తెకు వుట్టిన పుత్రుడే మహారాజు కావలెను: అట్ట్లుమూటియ్య గలిగినచో వా అభ్యంతర మేమియును లేదు" అవెన్ను, " శంతన కది వినరానిదయినది. తానిదివరకే భీష్ముని యువరాజుగా చేసినాడు కొక అతడు మహాబలళాలి సమర్శుడును. యువరాజును చేయుట మహారాజుగా చేయుటకే. హాహా

జా మునాభారతనీతి కథలు -/ బాలా ఇప్పుడు తాను చేసినదానికి తానే విరుద్ధముగా ఎట్టు చేయును? అట్లు చేసెదనని మాట యిచ్చుటకుకూడా తనకు శక్తిలేదు కావున యదార్థముగా “దాశరాజా! నా కుమారుడు భీష్ముడు యువరాజై యున్నాడు అందుచే ఆ కోరిక తీర్చలేను మరొకటేదయినా కోరుము అనెను. “కావలసిన దియ్యలేక మరొకటి కోరుకొనుట యేటికి? నాకేమి కావలెను? అదితప్ప' నాకు కోరవలసిన దేమియును లేదు తమరియ్యగలిగినఛో కన్యనిత్తును లేకున్న లేదు. నా నిశ్చయమిది” అని కచ్చితముగా చెప్పివేసెను.

శంతనుని కేమియును తోచలేదు. తనకుతానై మాటనియ్యలేదు. అందుచే ఇక అక్కడ ఉండి లాభము లేదని తిన్నగా ఇంటికి వచ్చి ఏ రీతిగానయినను కార్యము సాధింప వలెనవి యున్నది దానికి తన కుమారుడంగీకరింపవలెను అతడొప్పుకొనునో? లేదో? ఏదో రీతిగా వప్పించవలెను. దానికి తగినట్టు యుక్తిగా చెప్పదలచి శంతనుడుండెను.

శంతన మహారాజు సభకు వచ్చుట మానెను. అతని యారోగ్యము నరిగాలేదు. రోగమేమో తెలియదు. మనోవ్యాధికి మందులేదు. అతన్ని కెప్పుడును సత్యవతి మీదనే యున్నది దృష్టి ఆమె దనకు లభించుట యెట్లు? అదే అతని యూహ, దానితో అతడు కృంగి కుములుచుండెను. మంత్రుల కావిషయము తెలిసినది. కాని భీష్మునకు చెప్పుట కెవరును సాహసింపలేదు అంతమాత్రాన ఆ బాధ తెలియక మానునా?

భీష్మునకు తండ్రి సభకు వచ్చుట మానెనని తెలిసినది అతని మనస్పాందోళన పడినది. మహాబలవంతుడు ధైర్యశాలియైన తండ్రికేల బాధ కల్గెనో? అదేమై యుండును? తొనెన్నడును తండ్రిగీచిన గీటు దాటువాడు కాడు; ఎన్నడును పల్లెత్తుమాటైన అని యెరుగడు. ఈనాడేలకో అతడు తనకు కల్గిన బాధను తనకు చెప్పలేదు. పోనీ? ఆయన.- చెప్పనిచో తాను వెళ్ళి తెలుసుకొనవచ్చును గదా! పంతమేమియును లేదు. ఎన్ని విధాల ఆలోచించినను కారణం తెలియనందున అతడే వెళ్ళదలచెను. న

శంతనుడొంటరిగా పరున్నాడు. భీష్ముడాతని యొద్దకు వచ్చెను. పాదములకు వంగి నమస్కరించెను. కొడుకు భక్త్‌ నిష్కల్మషము తండ్రికది తెలియును. అతడాకుమారుని దీవించినాడు. కాని ముఖములో ఉత్సాహము లేదు.

భీష్ముడు “తండ్రీ! తమ రక్షణతోనున్న ప్రజానీకమునకు సైతము యే లోపము. లెక యున్పదే - ఏ బాధయు వచ్చుటలేదే - తమ కేల బాధ కల్గినది? శత్రుబాధయా? నేనెరిగి నంతవరకు ఏమూల అట్టి బాధయే కన్పడదు ప్రజలలో ధర్మలళోపమందుమా? అదియును కానరాదు. అధర్మముచేసి మన పరిపాలనలో నిక వాడు బ్రతుకగలడా? రాజద్రోహమున ననన

అవవాయయయనావాలాలలయయలాంయాయయయాయాలా మదకరత నీతి కథలు =? ాాాాాాాారవావానానక శెవడైన తలపెట్టెనా? అసంభవము ఈ భీష్ముడు సజీవుడై యుండగా నీ యొడల పైనీగ వ్రాలుటకయినను వీలులేదు. మరి కారణమేమో సెలవిత్తురా తండ్రీ? అని సవినయముగా ప్రశ్నించెను.

శంతనుడెంతో 'సేపాలోచించెను. తనంటివాడయిన కుమారుని ముందు తన

“'ప్రేమకలాపము విషయమై తానెట్టు ప్రస్తావించవలెను ఎంత పెద్దవాడయినను ఆ పని సిగ్గుగనే ఉండును. కొంతసేపటికొక రీతిగా చెప్ప నిశ్చయించుకొనెను.

“నాయనా! నీవు మహాబలిశాలివి. అస్త్రశస్త్ర విద్యలలో నారితేరినవాడవు. నీకు సాటియగు మేటి వీరుడీ లోకమున లేడు? నీ బలమును నే నెరుగుదును కాని ఓంటి కోడుకు ఒక కన్ను ఉండియు లేనట్లే అనుట వింటివో, లేదో? అందుచే నీకు తోడుగా మరికొందరి పుత్రులను కనదలచితిని ధర్మజ్ఞ్జులయిన మునులు “అగ్నిహోత్రము, సంతానము వేదములు ఎడతెగకుండ నడుపవలె! నందురు. భార్యలేనిచో అగ్నిహోత్రము చేయరాదు కదా? సంతానమున కెడబాటు వాటిల్లెనుకదా!

మరొక్కటి నీవు శస్త్రా శస్త్ర కోవిదుడవేయైనను యుద్ధములలో జయాపజయము లనిశ్చితములు కదా! అంతే కాదు యుద్ధవీరులకు మరణము సీత్యసన్నిహితము కదా? కాదని జడిచి వీరుడిండ్లలో దాగగలరా? మనకివి తప్పనివి; అందులకై నాకు పునర్వివాహము చేసికొన సంకల్పము కలిగెను, అదెట్టు నెరవేరునా? అనియే నా విచారము” అని సగము నగము చెప్పి వదల్సివేసెను,

గౌంగేయుడు 'ఈమ చిత్తము? నేను _కాదందునా? ఏ విధమునైనను తమ చిత్తమునకు సంతోషము కలిగింపజేయుటయే నా కర్తవ్యము” అని చెప్పి - తండ్రికి నమస్కరించి వెడలిపోయెను. తండ్రీ యేమి చేయునో అని యూరకొనెను.

అతడు కార్యమును, సాధించి చెప్పెడి శూరుడు మాటలు చెప్పువాడుకాడు, మంత్రులతోను, పురోహితులతోను రహస్యమున కలిసెను. 'ఆర్యులారా! మా తండ్రిగారి కోరిక'ఏదో మీకు తెలియునా? ఇన్నాళ్ళు దాచుట ఏటికి? నా మనస్సు నెరుగరా? మీ రన్నచో నేను కాదందునా? నా చెవిన వేయరాదా? ఇంతవరకు నేమియు తెలియదే? చెప్పుడు. సంగతేమిటో వివరముగా చెప్పుడు" అని వారిని కోరెను,

వారు “యువరాజా! ఇది తమకు వినుటకింపుగా నుడునది కాదు. అందుచే మేమిన్నాళ్ళు చెప్పలేదు. వివహయుక్త వయన్సు వచ్చిన కొడుకును వదలి, తండ్రియే ముందుగా వివాహ సంసిద్ధు డగుచుండెనన్న ఎవరు హర్చింతుర్గు? కాక సమానమైన ననన నా.

దాానడావడడాలామలాయంవాండాణాశాయాంయయయలాా మదురరూారల తతి కలు = లాలా వయస్సు కలవారితో ఇష్టా గోష్టులలో చెప్పదగినవి కాదుకదా! అందుచే ఊరకొనవలసి వచ్చినది” అనిరి. అతనికి విషయము తెలిసినది. “సరే! వివాహ ప్రయత్నము చేయుచుండెను? బాగున్నది ఇందునా అభ్యంతర మేమున్నది? నాతో చెప్పుట ఏటికి? వారు సర్వస్వతంత్రు లుకదా!” అనెను భీష్ముడు.

“కాదోయి! నీవు యువరాజై యుండగా రాజింకొకతెవెట్టు చేపట్టును? రాజ్యమున కుత్తరాధికారివి నీవు కదా! రాజ్యమును చూచి కదా ఎవతె వలచినను? నీ అంగీకారము కావలెను. అందులకై అడ్డంకి కభథిగి ఆగిపోయియున్నదినిరి, “ఓ౮ ఆదా? దానికి మాత్రము నేను కాదందునా? కానిండు! నేనే యొప్పించి వివాహము చేయింతును. అ కన్యాదాత ఎవరు? మీరెరిగినచో సెలవిండు” అని చెప్పగోరెను. వారు “దాశరాజు, మనకు దగ్గరలోనే యమునానది యొడ్డున నున్న పల్లెలో నాతడుండును” అని నివానముతో నహా చెప్పిరి,

ఇక ఆలస్యమనవసరమని గాంగేయుడు వెంటనే తగు పరివారము తోడ్కొని దాశరాజున్న పల్లెకేగిను. యువరాజు వచ్చు చుండెనని తెలిసి దాశరాజతని కెదురు వచ్చి తగు మర్యాదలు చేసి - అతనిని తన నివాసమునకు తోడ్కొని పోయి, ఉచితాననము పై కూర్చుండ బెట్టెను. అప్పుడు గాంగేయుడు పురోహితుల ద్వారా తాను వచ్చినపని నాతనికి తెలిపెను.

దాశరా జాశ్చర్యచకితు డయ్యెను మొగమంత కన్నులు చేసికొని అద్భుతముగా “గాంగేయా! నీవు సహృదయుడవుకావున తండ్రికై కన్యను వేడవచ్చితివి. లోకములో ఇట్టిది జరుగుట అరుదు. నీవు ధర్మశీలుడవు! అర్భానర్థముల నెరిగిన వాడవు. సకలకార్య సమర్భుడవు. నీకు నేను జెప్ప వలసిన పని లేదు. ఒక్క సంగతి వినుము. అవనరము వచ్చినపుడు చెప్పక తప్పదు. ఈ కన్య ఉపచరవసువు యొక్క వీర్యమున పుట్టినదని ఎరుగుదువు కదా! అతడు వచ్చి యీమెను శంతనునికే కాని మరియొకని కీయవలదని చెప్పియున్నాడు. అందుచే ఆ మధ్య దేవలుడను మహర్షివచ్చి నన్ను కన్య నిమ్మని కోరినను నేను నిరాకరించితిని. ఇక ఎప్పుడు శంతనుడు వచ్చునా? అని ఎదురు చూచుచున్నాను ఇంతలో అతడు రానేవచ్చెను. ఇక అభ్యంతర మేమిటని అడిగెదవేమో వినుము - సాపత్స్య దోషమున్నది కదా? అది నీ వలన పోగొట్టుదగినది. అది కదా పోయినచో నాకు కన్యనిచ్చుట కేమియు ఆటంకముండదు” అనెను. గాంగేయు డాలోచించకుండ “దాశరాజు! ఇదా, నీ సంకోచం? నేను నీ కన్యాపుత్రులకు రాజ్యము రాకుండా అడ్డు వత్తుననియా? ఓ సభ్యులారా! మీరందరును వినుడు! నేనొక చనన శం7 ననన

జా మనోఖభారత నీతి కథలు = నాయాలు ప్రతిజ్ఞ చేయుచున్నాడను. ఇదే నా తండ్రి వివహమునకయి నేను రాజ్యభాగమును "వదులుకొనుచున్నాడను. ఆమెకు కలిగిన కుమారునికే రాజ్యము నిచ్చెదను!” అని ప్రతిజ్ఞాపూర్వకంగా మాటనిచ్చెను సభ్యులెల్లరు మాట ఇచ్చిరి. కాని, దాశరాజునకు మాత్రం సంతోషం కలుగలేదు. అది గమనించినాడా దేవవ్రతుడు “ఏమి దాశరాజా! ఇంకను నీ సందేహమేమిటి? మనస్సులో వుంచుకొనక పైకి చెప్పి నన్ను కృతకృత్యుని చేయుము” అని దీనంగా పల్కెను అప్పుడతడు “సత్యనవ్రతా! నీవు ధీరుడవు, సత్యప్రతిజ్ఞగల వాడవు ధర్మవేత్తవు కాన నీ వొకవేళ నీ తండ్రికయు రాజ్యభాగమును వినర్జించినను నీ కొడుకులు రాజ్యమును వదులుదురా? వారికి నీ తండ్రి పై నీకున్నంత ప్రేమ యుండునా? అప్పుడే వైన తగవులు వచ్చినచో తీర్చగలవారెవరు? ఎందులకీ పోరాటముల తోడి సంబంధము?” అనెను. అతని భావమును కనిపెట్టినాడు గాంగేయుడు ఆవులించిన ప్రేగులు లెక్క పెట్టగల థీశాలియతడు తన వ్యవహారం మూలాన ఇంత శ్రమ పడవలసి వచ్చెను కాని తొనను కొన్నది ఆరు మూడయినను మూ డారయినను సాధించు పట్టుదల కలవాడతడు. దాశరాజు కనుమానం తీరునట్ల్టుగా “ఓ సభాసదులారా. నేను వివాహమాడిన తరువాత కదా సంతానము కలుగుట! దానివలన కదా దాశరాజు దౌహిత్రులకు భయము కలుగునది. నేను నా తండ్రి సుఖమును కోరి దాశరాజు కోరిన ప్రకారం ఇదే వివాహమాడుట మానుచున్నాను యావజ్జీవ బ్రహ్మచర్య వ్రతమును పాటింతును” అని ప్రతిజ్ఞ పట్టుటతో దేవతలు, బుషులును సంతోషించిరి. ఆతని భీష్మ ప్రతిజ్ఞకు తార్కాణముగా అతనికి “భీష్ముడని బిరుదమిచ్చిరి దేవతలు పుష్ఫవృష్టిని కురిపించిరి. దాశరాజు మహానందముతో ఇక మారు మాటాడక సత్యవతి నాతని కిత్తునని పలికి సారె చీరలతో భీష్ముని యధీనము చేసెను. అతడొ రీతిగా కార్యమును సాధించి తండ్రి కిష్టము చేయుటకయి తనకు కాబోవు తల్లిదైన నత్యవతిని బంగారు రథము నెక్కించుకొని మహోత్సాహముతో తన పరివారమెల్లరును వెన్వెంట వచ్చుచుండగా హస్తినాపురమున కేతెంచెను, దారిలో జనులెల్లరును నతడు చేసిన భీష్మప్రతిజ్ఞ నెరిగి అతనిని పాగడసాగిరి, పట్టఐములోని - వారెల్లరును వారికి స్వాగతమిచ్చిరి. శంతనున కావార్తనప్పుడే యెవరో చెప్పిరి. అతడు బ్రహ్మానంద మనుభవించుచు వారి కెదురయ్యెను. భీష్ముడు సత్యవతిని తోడ్కోనివచ్చి తండ్రికి పాదొభివందనము చేసి “తండ్రీ? ఇదిగో! తమరు- నాన తం రం

నాలాల మహాథధారతనీతి.కథలు - ౯ లాను కోరుకొనిన రీతిని మా తల్లిని తీసికొని వచ్చితిని. స్వీకరింపుడు” అని ముక్తపరిగ్గా చెప్పెను. రాజు సగము సిగ్గుతో మురియుచు “నాయనా! నీయట్టి కొడుకు లభించుట నా యదృష్టము. నీవుకాక మరెవరు తండ్రికయి తన వివాహమును మానుకొనగలడు? నీ భీష్మ ప్రతిజ్ఞను విన్నాను. నీకు స్వచ్చంద మరణము (ఇష్టము వచ్చినపుడు చనిపోవుటను) వరముగా నిచ్చుచున్నాను” అని కన్నుల నీరు సెట్టుకొనెను. ఆ కన్నీరు సంతోషంతో వచ్చినదో విచారముతో వచ్చినదో ఎవరెరుగుదురు? అప్పుడాతనికి కలిగని భావము, నాతడెరుగు? చూచువారెల్లరు నొక్కక్షణ మా తండ్రి కొడుకులకేసి చూచుచు వుండి పోయిరి. పురోహితు నిర్ణయించిన సుముహూర్తమున సత్యవతీ శంతనుల వివాహమైనది. ఆ దాంపత్యమున కిద్దరు నపరిమితానందము ననుభవించిరి శంతనుడు మహాప్రీతితో నామెను ముద్దుచేసి లాలించుచు డ్రేమడోలికల నూగునట్లు చేసెను. మహారాజును చెట్టపట్టి మహారాణియైనది దాశసురాజపుత్రి ఎవరి కే క్షణమున కే యోగము పట్టునో యెవరికెరుక? ॥ ఆ దంపతులకు కడుపుపంటగా శంతనుడన్న మాట నెరవేరునట్లు ఇద్దరు కొడుకులు పుట్టిరి. వారి పేరులు చిత్రాంగద విచిత్రవీర్యులు! వారి పుట్టుకతో భీష్మునకెక్కువ సంతోషము కల్గినది. వారు పుట్టకపోయినచో తన మాటెట్లు చెల్లును? ఇప్పుడు తొను పైనుండి వారిచే రాజ్యము చేయించవచ్చును. వారి నతిగారాబముగా నా తల్లిదండ్రులు పెంచుచుండిరి. విద్యాబుద్ధులు నేర్పించుచుండిరి. వయసునకు మిన్నగా వారు విద్యాభ్యాసము చేయుచుండిరి, కాలము మన వశములో నుండదు. శంతనునకు కాలము -సమీపించినది. అత డెరుగును. తనకు మృత్యువు ప్రాప్తించినదని. చిన్న కొడుకులని దగ్గరకు చేర్చుకొని, భిష్ముని పిలిచి, “నాయనా. నేను వెళ్ళిపోవుచున్నాను. వీరికిక తండ్రివైనను, అన్నవైనను నీవే! ఏ రీతిగా వీరిని వృద్ధిలోనికి రప్పింతువో! ఆ భారముంతయు నీదే. నీ తల్లి ఆడుది. అమె రాజ్యవిషయమున నేమియు చేయజాలదుకదా! వీరిని నీ కడుపులో పెట్టుకొని రక్షింపవలెను' "అని చెప్పుచు కన్నుల నీరు గ్రక్కుకొనెను. భీష్ముడు “తండ్రీ! నీ వేమియు విచారించకుము. వీరికే రాజ్యమొప్పగింతును. నాశక్తికాలది వీరిని రక్షింతును బెంగటిల్లకుము” అని ఎన్నో విధముల తండ్రికి ధైర్యము చెప్పెను. అతని మనో ధైర్యము నెరిగినవాడగుటచే శంతనుడు నిశ్చంతగా ప్రాణముల విడిచెను. నాధం ననన.

ఆలా మహాభారతనతి కథలు - లాలా పాపము! సత్యవతి ఎన్నో వరముల కోరినను సౌభాగ్యవతిగా జీవితమును గడుపలేకపోయినది. ఆమెకా వైధవ్యయోగముండగా నెవరు తప్పించగలరు? యోజనగంధి యైన నేమి? దశయోజనగంధియైన నేమి? ఆమె ఆ రీతిగా భరృృవియోగ దుఃఖభారముతో క్రుంగి కృశించినను పుక్రులసంరక్షణకై ప్రాణముల నిల్పుకొన్నది. భీష్ముడు తాను మాట యిచ్చిన ్రీకారము. తండ్రి కుత్తర శ్రియలు చేసిన అనంతరము చిత్రాంగదుని - ఆతనికి రాజ్యము చేయు నంతటి సామర్థ్యము లేకున్నను. పట్టాభిషిక్తుని చేసెను, అతనికి ప్రతినిధిగా త్తానే రాజ్యకార్యముల నిర్వహించుచుండెను పరాశ్రమశాలియగు తా నూరకున్నచో నతనికి రాజ్యము దక్కదని తాను కల్పించుకొనెను. కాని రాజ్యశచే కాదు. నిగ్రహానుగ్రహ సమర్శడైనను శంతన మహారాజు చూడుడు. ఎన్ని కష్టములను భవించెనో? ఇంద్రియ నిగ్రహము లేనందున ప్రతి వ్యక్తియు కష్టపడవలసి వచ్చును. శాపము తీరుటతో నతడు మరల దేవలోకమున కేగి, స్వర్గసొఖ్యము లనుభవించెను. 140

లావాలా మ్రవనుంరలతో నుతి కథలు = ౯ నాము మడు ]

మన భారత భూమి కడుపున నెందరో మహావీరులు పుట్టి కన్ను మూసినారు. వారి వీరచరిత్రను, ధర్మప్రవర్తనను విన్నచో మన కొడలు పులకరించక మానవు. అందు చాలమంది దివ్యమహిమలు కలవారే దివ్యాస్త్రకోవిదులై యుద్ధ రంగమున వెన్నుచూపని వీరాగ్రణులు. వారి శౌర్యపరాశక్ర మములలో శతాంశము. కాదు సహస్రాంశమైన మనమీనాడు చూడలేకపోయినను, కనీసము అట్టి మహావీరులు మన భూమిని పుట్టిరని తెలిసికొనుట కూడ మనకుత్సాహోద్రేకములను పుట్టింపక మానదు. "

భారతమంతలోను “ఏక్‌ లడకా హై-ఏక్‌ బూఢాహై' అని ఒక తురుష్కుడన్నట్లు వీర యువకులలో నభిమన్యుడును, తల నెరిసిన ముదుసలి వీరులలో భీష్ముడును వీరాగ్రేసరులు. అందు భీష్ముని చరిత్రను కెలిసికొందుము.

దేవతలలో వసువు లొకరకమువారు. వారెనమండుగు రొకనాడు భార్యలతో కూడి. దేశము తిరుగుచు భూలోకమునకు వచ్చిరి అది వశిష్టుని ఆశ్రమ ప్రాంతము. పారా తపోవనములో విహరించిరి. అక్కడ మేయుచున్నహోమధేనువును చూచిరి. అది దక్షప్రజాపతి కూతురయిన. సురభికి, కశ్యప మునీంద్రునకు కల్గిన సంతానము కోరికల నియ్యగల్లిన ధేనువు. దానిని చూచుటతో వారిలో నెనిమిదవవాడగు ప్రభానుని భార్య “నాథా ఈ ఆవును చూచితిరా! ఎంతబాగున్నదో! ఇది పైకి బాగుండుటయేకాదు; దీని "పాలు త్రాగినచో మనుజలకు పదివేలేండ్లు రోగము + రొచ్చును ముసలితనము నుండవని విన్నాను. నాకు "స్నేహితురాలు ఊశీరుడను రాజు కూతురు జితవతి యనునది యున్నది. ఆమెకు హితువు చేయవలెనని కోరుచుండును. కావున నా ముద్దు మన్నించి యీ హోమధేనువు నెట్టయిన ఆమెకియ్యవలెను' అని కోరినది అతడందులకు అన్నల అంగీకారమునక్రై చూచెను. వారందరును 'దానికేమి మిత్రులకాపాటి చేయవలదా? తప్పక చేయవలసినదే' అనిరి,

అతడా (ప్రోత్సాహముతో నా ధేనువు నెత్తుకొని పోయెను. వారు నతనితోనే వెడలిరి. *.._ సాయంకాలమగుసరికి హోమధేనువింటికి రాలేదు. హోమధేనువనగా 'హోమమునకు పనికివచ్చు పాల నిచ్చునది' అని యర్థము మహర్షులు. వాటి పాలను హోమము చేయుడురు కాని త్రాగరు అందుచే వారది హోమధేనువనజెల్లును. అది సమయమునకు రానిచో కర్మలోపము వచ్చును. అందుచే ముని తబ్బిబై యోగదృష్టా చూచెను, వసువు లెత్తుకొనిపోయినట్లు గోచరించినది. వెంటనే మహోగ్రుడై “ఓరీ దుర్మాదాంధులారా! ఏమియు ననన ళా ననన

వవాాలాలానాాలాా మహాభారతనీతి కధలు -/ లాలా నపకారము తలంపని మా బోంట్లకే హాని తలిపెట్టదరటరా! మనుష్యులై పుట్టుదురుగాక! అని శపించెను. | అన్ని జీవులవి జన్మలే కాని, అందులో పుణఖ్యపాపముల తారతమ్యమునుబట్టి పుట్టుకలు మారుచుండును. దేవతలు కేవలము సుఖముననుభవించువారు. వారికి యౌవనము నిత్యం. ఎప్పుడు చూచినను వారు ముప్పది యేండ్డున్నట్లే యుందురట, కామచార కామ భోగములు వారి దైనిక చర్యలు అందుచే అట్టివారికి మనుష్యజన్మశిక్షయే, తక్కిన జంతువుల దృష్టా మనుష్యు లెక్కువయినను, దేవతల దృష్ట్యా తక్కువవారే, అందుచే వారికి మనుష్యులై పుట్టుదురన్నచో మహాభయము. వసువులకా శాపమ్ము వెంటనే తెలిసినది. “గిరుక్కున వెనుకకు తిరిగి 'మొగ్రో” అనుచు వసిసష్టుని పాదములపైబడిరి. “మహాత్మా! తెలియక తప్పుచేసితిమి. మన్నింపుము”. మేము చిరకాలము భూమిలో నుండునట్లు శాపముపహరింపుము” అని వేడుకానిరి, మహర్షుల చిత్తము కరుణారస పూరితము. ఎంత కోపము వచ్చినను వెంటనే అదంతయు పోయి శాంతించును. వశిష్టుని మనస్సు కరిగినది. “మీకు బుద్ధి వచ్చినందున మన్నించితిని. మీరేడుగురు పుట్టగానే మరలివత్తురు, కాని ఈ చివరివాడు మాత్రము తప్పెక్కువ చేసినవాడు. కనుక చిరకాల మక్కడ నుండును. అంతేకాక భార్య, సంతానము లేకయుండును” అని గ్రుడ్డిలోమెల్ల అన్నట్లు. శాపమును సడలించెను. వారదే వరముగా భూలోకమునకు దిగుచుండిరి. వారు నిస్తేజస్కులై వచ్చుచుండగా దారిలో వారికి గంగాదేవి కనపడినది. ఆమె వారిని చూచి “ఓ వసువులారా! ఏమి యిట్లు తేజస్సు చెడియున్నారు?” అని అడిగినది. వారు జరిగినదంతయు చెప్పి “అమ్మా! మేము మరొకరి కడుపున పుట్టలేము. నీకడుపున పుట్టెదము. మమ్ము పుట్టగానే మాత్రము చంపనలెను సుమా, అది మాత్రం . మరువవలదు. భూమిలో చిరకాల ముండలేము” అని బ్రతిమాలిరి. ఆమె వారి మాటలు విన్నది. “నేను మీ కోరిక పై మనుష్య స్తీనై, ఒక మానవునకు భార్యనై మిమ్ముల కందును. కొని కన్నకడుపున బిడ్డలందరును చనిపోయిన నెంత విచారమో ఎరుగుదురా? అందులో దైవం ద్వారా పోవుకాక, చేతులార చంపుట మహాకష్టము. ఒక్కడయిన టబ్రతుకనిచో అట్టికష్టము నాకు తీరదు” అన్నది, వారాలోచించిరి. “ఆమ్మా మాలో అందరి తేజస్సులలోను నాల్నవవంతునిచ్చి ఈ ప్రభాసుని చిరంజీవిగా జేయుదుము,. అతని వలన నీ కోరిక తీరును” అని ఆమె నొప్పించిరి. ఆమె అంగీకరించినది. శంతను డొకనాడు వేటకైవచ్చి గంగాతీరమున విశ్రమింపగా అతనికొక స్త్రీ అగపడినది. ఆతడామెను చూచి మోహించి తన్ను పెండ్డాడమని కోరెను. ఆమె “నా ఇష్టము వచ్చినట్లు 142

నవవవవవవవావావావావావా మహాభారతో నీతి కథలు = £ ాాాాానాానాకరలాని నేను చేయు పనులకు నీవెప్పుడు- నడ్డము రారాదు. నన్ను పల్లెత్తుమాట. అనరాదు. అట్టన్నచో వెంటనే నేను వెడలిపోదును. అట్లు నీ వొప్పుకున్నచో వత్తునన్నది. అతనికి తండ్రి ఆ విషయము చెప్పియున్నందున అతడడ్డు మాట్టాడక అంగీకరించెను. ఆమె అతనికి భార్యయైనది.

ఆమె తొలిచూలు కన్నది మహారాజునకు పుత్రుడు పుట్టెనని పట్టకాని ఆనందము

కల్గను. కాని అదెంత సేపు? ఆమె పుట్టీపుట్టగనే కొడుకు నొడ్రీలో వేసికొని తీసికొని వెళ్ళి గంగలో పారవేసినది. పండువంటి పిల్లవాని నటుల పారవేయుట కామెకు చేతులెటుల వచ్చెనో ఈమెకు బిడ్డలన్న నింత కోపమేటికో? అయినను తానేమైన మాటజారెనా ఆ పిల్ల యిట్టె మాయమైపోవును. ఆ భయముతో అతడేమియు మాటాడక, కన్నులప్పగించి చూచుచు దుఃఖమును దిగమింగి యూరకొనెను. భార్యపై నున్నంత పేమ సంతానముపై నుండదేమో! సందిగ్బార్థమును బట్టి సిద్ధమైన దాని నెవడు విడువగలరు? వారి కాపురము సాగుచున్నది

గంగాదేవి గర్భవతియై బెడ్డలకనుచు, పాఠరవేయు చుండెను. అట్టేడుగురిని పారవేసినది. ఎనిమిదవసారి మరలా పుత్రుని కన్నది, ఈ బాలుడందరికంటె తేజశ్ళాలియై వెలుగొందుచున్నాడు. ఆమె మామూలుగా బిడ్డ నొడిలోనికి తీసికొని ప్రయాణమైనధి రాజు చూచినాడు ఆమె వెడలుచున్నది. అతడాగలేక పోయినాడు. “ఓయి! అగుమాగుము! నీవు ఆడు దానవుకావా? కడుపు తీపిలేదా? ఎంతమందిని నీ పొట్టను పెట్టకొందువు ఈ బాలునొక్కవైనను దిగబెట్టుము ఈ బాల హసనమునకు హద్దులేదా నీ మనస్సు మారదా ఎన్నాళ్ళని ఓపిక పట్టుదును” అని నాలుగు దులిపి వదలెను ఆమె “రాజా! మనమనుకొన్న షరతు ప్రకారమునే చేయుపనికి నీవడ్డము వచ్చినందున నేనిదే పోవుచుంటిని నేను గంగను ఏదో కారణవశమున నిట్లు నీకు భార్యను కావలసి వచ్చినది. వీరు వసువులు శాప కారణముగా నా కడుపున పుట్టిరి. నన్ను వారు కోరినందున నేనిట్ట్లు చేసితిని” అని శాపాది కారణములు సవిమర్శగా చెప్పెను.

“నీ వీ బాలుని పెంచలేవు “అడుదాని చేతిడబ్బు - మగవాని చేతిబిడ్డ” ముందుకురావు నే నీతని తీసికొని వెళ్ళి పెంచి పెద్దచేసి నీకప్పగింతును” అని చెప్పి ఆమె వెడలిపోయెను. తనకు బిడ్డను పెంచెడి బాధ తప్పినను చంటిపిల్ల వాని ముద్దు ముచ్చటలు చూచుకొని ఆనందించు భాగ్యము లేనందు కాతనికి విచారమే వేసినది అతడింటికివచ్చి రాజ్యమును జాగ్రత్తగా పరిపాలించుచుండెను. -= తక

ఎ మవాభారతనీతి కథలు - లాలా

కొన్నేళ్ళు గడిచినవి శంతనుడొకనాడు వేటకయి గంగాతీరమున కేగెను. తన విరహముచే చిక్కిపోవుచున్నట్లు గంగా ప్రవాహము తగ్గిపోవుచున్నది. దానికి కారణమేమో అని అతడు కొంచె మెగువకేగెను. అచ్చట నొక బాలుడు బాణములతో గంగ కడ్డు గట్టువేసి బాణసాధన చేయుచున్నాడు. కొడుకుమాట నిల్పుటకయి యాగినట్టు గంగ క్రిందికొక నీటిబొట్టు కూడా దిగు లేదు. అది చూచినాడు శంతనుడు.

అతనికి తన కొడుకుమీదికి దృష్టిపోయినది. తన కొడుకున్నచో ఈపొటి కింత వాడయ్యెడువాడు కదా! ఎట్టున్నాడో? ఎట్టు పెరుగుచున్నాడో? అని ఆలోచించు చుండగా గంగాదేవి స్రీ రూపమున ఆ బాలుని తీసికొని వచ్చినది. బాలునికి దివ్యాభరణములు నలంకరించినది. రాజు చూచుచుండెను.

“రాజా! ఇతడు మన పుత్రుడు. విద్యలనిటిలోను ఆరితేరినాడు. పరశురామునివద్ద అస్త్రవిద్యలు నేర్చినాడు. రాజనీతిలో శుక్రాచార్యున కీడుజోడైనవాడు. వేదశాస్త్రములలో వసిష్టునంతటివాడు. వీనిని తీసికొని వెళ్ళుము” అని యొప్పగించినది ఆ బాలుని కౌగిలించుకొని శంతనుడెంతో ఆనందించినాడు "

అతనికి “దేవద్రతు”డని పేరు పెట్టెను. అతని బాహుబలమును, నేర్చునుచూచి ప్రజామోదముతో ఆతనిని యువరాజుగా చేసెను. తండ్రికి చేదోడై రాజులనెల్ల జయించే తన ప్రతాపమును నలుదిక్కుల వ్యాపింపజేసెను అతని పేరు మారు మైోగినది.

ఇది యిట్టుండగా ఒకనాడు శంతనుడు వేటకేగి, సత్యవతిని చూచి ప్రేమించెను. దాశరాజును “తనకు కన్యని'మ్మని కోరగా అతడు “నా కన్యకు పుట్టిన కొడుకే రాజ్యము నేలవలెను. అట్టి వరము లిచ్చినచో నేను నీకు కన్యనిత్తుననెను. శంతనుడు తనకు తానుగా అట్టిమాట నియ్యలేక పోయెను ఇంటికి మరలివచ్చి పరుండెను,

, అతనికెంతో మనోవేధనగా నున్నది. దానికి కోరిక తీరుటకన్న వేరే మందులేదు. రాజస్థానమునకు వచ్చుట మానెను. అది తెలిసినది భీష్మునకు, “అంత బాధ యేమి కల్లెనా తన తండ్రికి” అని తెలిసికొనుటక్రై తండ్రివద్ద కేగెను. తండ్రికి వందనముచేసి “ఆ . మనోవేదనకు కారణమే” మని యడిగనె. /

శంతనుడు తన మనోభావమును సాక్షాత్తుగా చెప్పలేక వేరురీతిగా “నాయనా! ఒక్క కొడుకున్న వాడు సంతాపము లేనివాడును సమానమని చెప్పగా విన్నాను. అదిగాక అగ్నిహోత్రములు వేదములు సంతానము నెడ తేగక యుండవలెనని పెద్దలు చెప్పుదురు. కావున నీకు తోడుగా మరికొందర బిడ్డల కనదలచితిని. న తత లాం

అవా మనవాభారతనతి కథలు = లావు

మరొక్క విషయ మాలోచించుము. నీవు శస్త్రాస్త్ర కోవిదుడవు, నీకు యుద్ధమన్న మహాప్రీతి. యుద్ధమున మృత్యువు నిత్య సన్నిహితము కదా! అందుచే నాకు మరికొందరు పుత్రులు కావలెనని మనసువ్విళ్ళూరుచున్నది” అని చెప్పి యూరకుండెను. దేవవ్రతుని కదంతయు నర్థమైనది తండ్రివద్ద సెలవు తీసికొని వెళ్ళినాడు

అతడు తన యభిప్రాయము నేమియును చెప్పలేదే అని శంతను డనుకొన్నాడు. కాని దేవప్రతుడు మాటలతో జవాబిచ్చువాడు కాడు. అతడు కార్యవాది. వెళ్ళి పని సాధించి చెప్పును. అదెరిగినను తండ్రికి స్వవిషయమైనందున మనస్సు నందిగ్ధమగుచున్నది.

గాంగేయుడు మంత్రుల వద్దకేగి “తండ్రిగారికి నచ్చిన కన్య యెవతాయా” అని ప్రళ్నించెను. వారు జరిగినదెల్ల చెప్పిరి. “ఈ విషయము నాకు చెప్పితిరే కాదే! చెప్పి యున్నచో ఇంత వరకు రప్పింతునా? ఇప్పుడైననేమి? నాతో రండు. దాశరాజు వద్దకేగి కన్యను తీసికొని వత్తము” అనెను. వారెల్లరు ప్రయాణమైరి.

దాశరాజు భీష్మునకు స్వాగతమిచ్చెను. భీష్ముడు దాశరాజు చేయు మర్యాదలను స్వీకరించి తాము వచ్చిన పనిని తెలియ చేసెను. అతడు “యువరాజా! మీ రెరుగని ధర్మములు లేవు అర్భానర్థములు లేవు. మా దౌహిత్రులకెట్ట్లు శత్రుబాధ కల్గదో అట్లు చేయు”మనెను. “ఆదా, నీ సందేహము! నేను నా తండ్రి నుఖము కోరి రాజ్యమును వదులుకొనుచున్నాను. దానికి మహారాజు లెల్లరును సాక్షులు” అనెను. దాశరాజున కింకను అనుమానము తీరలేదు “నీవు నీ తంగ్రికై రాజ్యత్యాగము చేయవచ్చును. కాని 'నీ సంతానము రాజ్యమును వదల గలుగునా? వారికి నీ తండ్రీ దూర్రమగును కదా! విరోధము లేకుండగనే యుండవలెగాని ఉన్నచో పుట్టక మానదు” అని ననుటతో గాంగేయుడు “దొశరాజా! ఇదే సమస్త దేవతా సాక్షిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా తంగ్రికై నేను వివాహమాడను యావజ్జీవ (బ్రహ్మచర్యమును థరింతును” అనెను.

ఆ భీష్మ ప్రతిజ్ఞ కందరును ఆశ్చర్యపడిరి. దేవతలు పుష్ప వృష్టి కురిపించిరి. దేవదుందుభులు మోగినవి ప్రజలెల్లరు నతని భిష్మ ప్రతిజ్ఞ చేయుటచే “భీష్ము"డనిరి. వారి జయజయ ధ్వానములు మిన్నుముట్టినవి.

దాశరాజిక మాట్లాడకుండ సంతోషముతో సత్యవతిని తీసికొని వచ్చి భిష్మునకు ఇచ్చెను. అతడు తన తల్లి కాబోవు సత్యవతీ దేవిని రాజమర్యాదలతో రథము పై నెక్కించుకొని మంత్రివర్గము వెనుక వచ్చుచుండగా హస్తినాపురికి వచ్చెను.

ఆ వర్తా అప్పుడు పట్టణమంతయు వ్యాపించెను, పురజనులెల్లరు భీష్మునికి స్వాగత మిచ్చి యుత్సవము చేసిరి. శంతనుడు తన కోరికను, స్వార్ధమును, వదలి తీర్చిన కుమారుని

145

ఎ మహూరతనతికథలు- గాాలాాలాలాలాాలాా జెదురేగి కౌగిలించుకొనెను. అతడు సత్యవతిని తండ్రీకి అర్చణము చేసెను. అంత మహా కార్యమును నిర్వహించి నందులకు సంషించి శంతనుడు భీష్మునకు అవధ్యత్వమును (ఎవరిచేతను చావబడకుండటను), స్వచ్భంద మరణమును (తన యిష్టము వచ్చినపుడు. చచ్చునట్టును) వరము లిచ్చెను, శంతనుడు సత్యవతిని వివాహమాడి ఆమె వలన చిత్రాంగద, విచిత్ర వీర్యులను కుమారులను కనెను దానితో శంతనునకు, భిష్మునకు మాట దక్కినద్ని అతడు కుమారులకై-వివాహ మాడినందున అతనికిని వారిని రక్షింతునని మాటయిచ్చి యున్నందున అనలు తమ్ములే లేనిచో తానెట్లు ప్రతిజ్ఞను నిర్వహించుకొనగలుగును? ఆ రీతిగా - భీష్మునకు సంతోషము కల్గినది.

ఆ బాలులిద్దరును విద్యాబుద్ధులు గరచుచుండిరి. వారి బాల్యము చూచిెనే కాని వారి రాజ్యాధికారమును చూచు భాగ్యమా తండ్రికి లేకపోయెను. శంతనుడు రోగగ్రస్తుడై పెద్ద కుమారునికి తన చిన్న కుమారుల నొప్పగించి చనిపోయెను. వారింకను చిన్నవారై ఆసంస్కారులైనందున్న భీష్ముడే తండ్రికి సంస్కారములు చేసెను. సత్యవతి భర్తతో పాటు (ప్రాణములు వీడదలచినను పెద్దలు నివారించుటచే ఆగిపోయెను.

భీష్ముడు చిత్రాంగదునే - చిన్నవాడైనను - రాజునుగా జేసి అతనికి ప్రతినిధిగా రాజ్యము నేలుచుండెను. రాజు బలహీనుడయినచో పరహస్త గతమగునని తానే రాజ్యకార్యముల నెల్ల నిర్వహించుచుండెను. క్రమముగా తమ్మునికి తగిన విద్యా సంస్కారముల జెప్పించిను. _

చిత్రాంగదుడు యువకుడయ్యెను. అతనికి బాహు బలముతో పాటు మదము

“హెచ్చెను. దానితో కన్నుగానక దేవదానవ మనుష్య గంధర్వాదులమీదకి జంకు లేకుండ యుద్ధమునకు పోవుచుండెను. బలమున్నను ఎట్టివానికైనను నొడలు తెలియక పోవుట సామాన్యము. అందునను యౌవనము, అధికారమును తోడయినపుడు చెప్పెడి దేమున్నది? అతడి మిడిసిపాటు లోకమునకు కంటకమయినది. జనుల యుసురు తగులకపోదు.

ఒకనాడు చిత్రాంగదుడను గంధర్వరాజాతని మదమణచదలచి భీష్ముడూరీలో లేని సమయము చూచి వచ్చి చిత్రాంగదుని యుద్ధమున కాహ్వానించెను. ఒళ్ళు తీటపట్టియున్న యతనికి యుద్ధ మెన్నడు దొరుకునా? అనియున్నది. ఆ పిలుపు వినగానే ఒక్క అడుగులో యుద్ధభూమి కేగెను. గంధర్వుడు మాయాకుశలుడు అతనితో నీ కుర్రగాడేమి యుద్ధము చేయగలడు? యౌవన బలగర్వము కన్ను కన్పడ నియ్యదుగదా. మాయ ప్రయోగించి గంధర్వరాజు భూపతికుమారుని చంపివేసెను. దానితో అతని మదమణగినది. తత

ఎలా మవాభారతనీతి కథలు = వు భీష్ముడు వచ్చి తల్లి నోదార్చి తమ్మునికి సంస్కారము చేసి చిన్నతమ్మునే విచిత్రీవీర్యుని రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేసెను. అతడు నప్పటికి యువకు డయ్యెను. అతనికి పెండ్లియీడు వచ్చినది పెండ్లి చేయవలసిన బాధ్యత భీష్మునిదే. మంచి సంబంధము చూచి వివాహము చేయదలచెను. అంతలో కాశీరాజు తన కూతుం డైన “అంబ అంబాలిక, అంబిక” అను ముగ్గురకును స్వయంవరము చాటించెను. ఆ చాటింపు వినుటతో భీష్మునకు వెళ్ళబుద్ధి వేసినది. తానొక్కడే రధముపై కాశి కేగెను. స్వయంవర మనగా కన్య తన కిష్టమువచ్చిన వరుని కోరుకొనును. అందుకై దేశములోని రాకుమారులనెల్ల. కాశీరాజు రప్పించెను. కోరిక యున్నవారెల్లరును వచ్చిరి. రాజులలో నదాక పరిపాటి. ఎంత శత్రువులయినను స్వయంవర వేళ నొకచోటికి వత్తురు. వచ్చుటయేకాదు. పెండ్లికొడుకుతప్ప తక్కినవారందరు నొకటగుదురు కాని అందరికిని కన్యాదాత యుపచారములు చేయవలసినదే, మరి ఎవరల్టుడగునో ఎవరి కెరుక? భీష్మున కుపచారములు బాగుగానే జరిగినవి. అతడు స్వయంవర మండపములోనికి వచ్చి ఆ కన్యలను ముగ్గురును బలాత్కారముగా రధము పై నెక్కించి రాజులతో “ఓ రాజశ్రేష్టులారా! మీరందరును వ్యయ వరమునకు వచ్చిన ధీరులు. మీరందరును ఛభూచుచుండగా ఇదిగో నేనీ కన్యలను నా తమ్మునిక్రై కొనిపోవు చున్నాను. పౌరుషం కలవారు నాకడ్డు రావచ్చును. క్షత్రియులకు గాంధర్వ రాక్షస వివాహములు ధర్మములే కాన నేను చేయుచున్నాను” అని కేకవేసి రథమును నడిపించెను. రాజపుత్రలెల్లరు నా మాటలను వినిరి. కాని ముందడుగు వేయుట కెవరును సాహసింపలేదు. ఒకరికొకరు పౌరుషములు తెల్చుకొని “మన మింతమంది యుండగా వొక్కడు వచ్చి కన్యనెత్తుకొని పోవుచుండ చూచుచు నూరకొనవలెనా? నడువుడు, యుద్ధమునకు సిద్ధంకండు!” అని యుద్రేకము రప్పించుకొని యుద్ధరంగమునకు దిగిరి. భీష్ముని రధమును చుట్టుముట్టురి. భీష్కు డొక్కడేయయినను అందరికి సన్నిరూపులై శరపఠరంపరలతో వారిని హడలగొట్టెను. వారాతని ధాటి కోర్వలేక పారిపోయిరి. అందరు పారిపోయినను సాల్వుడు కోపంతో నారిమైోయించుచు వచ్చి “ఓ బ్రహ్మచారీ! పోకు, పోకుము నన్ను గెలిచిన తర్వాతకదా నీకు జయమువచ్చుట! నిల్వుము, నిల్వుము” అని కేకలు వేసెను. భీష్ముడు రథ మాపెను. ఇద్దరికిని "ఘోరయుద్ధము జరిగినది. భీష్ముడు సాల్వుని ధనువ్చను తెగగొట్టి రధమును నుగ్గుచేసి, సారథిని చంపి పారద్రోలెను. అతడిక గతిలేక కాలికి బుద్ధి చెప్పెను. లాభా

ఆలా మహాభారతనీతి కథలు- గాలా అతడు అంబను వరించినాడు జ మోహముతో అతడు వారిని వారింప వచ్చినాడు. విపరీతము జరిగినది అతడు చేయునది లేక ఇంటి మొగము పట్టెను

భీష్కు డట్లు విజయము, చేకొని బాలికాత్రయముతో హస్తినానగరము చేరెను. పొరులెల్లరు వారికి స్వాగతమిచ్చిరి. అతడా కన్యల నంతఃపురమున ప్రవేశ పెట్టించెను. బ్రాహ్మణుల పిలిపించి వివాహ సుముహూర్తము పెట్టించెను. అప్పుడంబ “నేనిదివరకే సాల్వుని మోహించియున్నాను. అదెరిగి నా తండ్రి మా వివాహమున కంగీకరించి, నన్నాతని కిచ్చియున్నాడు నీ తమ్మునిమీద నాకు ప్రేమే లేదు” అని చెప్పినది అది విని భీష్ముడు (బ్రాహ్మణ సమక్షములో ఆమెతో “నీవు నీ యిష్టము వచ్చినట్లు వెళ్ళవచ్చును. కాని మరల వచ్చినచో నేనంగీకరించువాడను కాను” అని చెప్పి. ఆమె నొప్పించి సాల్వుని వద్దకు పంపివేసెను,

అంబాలిక అంబిక లట్టి అభ్యంతర మేమియును చెప్పలేదు వారిని మంచి ముహూర్తము చూచి తన తమ్మునకు వివాహము చేసెను. విచిత్రవీర్యుడా భార్యలతో యౌవన సౌఖ్యముల ననుభవించు చుండెను.

ఇంబ సాల్వునివద్ద కేగినది. అతడు “నిన్ను భీష్ముడు జయించుకొనెనుగదా! నా కెందుకు? బలముతో జయింపలేని కన్యను వీనొల్డను? వెళ్ళిపామ్మనెను ఆమె సరాసరి భీష్ముని వద్దకు వచ్చినది. కాని అతడు “నీవు వెళ్ళెడినాడే చెప్పితిని ఆనొడక్కరలేదని, ఈనాడు కావలెనన్నచో పెండ్లి వచ్చుట కంత తేలికగా లేదు; పొమ్మని నిరాకరించెను ఆమెకు భీష్మునిపై పగ సాధింప బుద్ధి వేసినది. అతనిని గెలువగల్లిన రాజు లెవరు నామె దృష్టిలో లేరు. అంధుచే అడవికిపోయి, అక్కడవున్న మునులతో తన బాధ చెప్పుకొన్నది. వారు “తల్లీ! నీపని రాజులు చేసి ఫెట్టవలసినది మావల్లకాదు వెళ్ళు” మనిరి కాని ఆమె సాధింపదలచి తపస్సునకు దిగెను. అంత అక్కడకు హోత్రవాహుడను రాజర్షి వచ్చెను. అతడామె విషయము తెలిసికొనెను, అతడామెకు తల్లిదండ్రియే అందుచే (ప్రేమతో ఆమె కథ _ అంతయు విని “పరశురాముని సేవించినచో పని జరుగు”ననెను ఆ పనిని చేరుట యొట్టా యని అలోచించుచుండగా అక్కడికే శిష్యులతో సహా పరశురాముడు వచ్చెను హోత్రవాహుడేతని యొద్దకేగి నమస్కరించి, తన మనుమరాలి కధను చెప్పి, ఆమె నెట్టయిన భీష్ముడు తమ్మునికయి చేసికొనునట్లు చేయమని చెప్పెను, అతడనాలోచితముగా “అదెంతపని” నేను చెప్పిన వినకుండునా?” లని హస్తినాపుర ప్రాంతమునకు వెళ్ళి సరస్వతీ తీరమున విడిసెను.

పరశురాముడు వచ్చెనని విని, భీష్ముడు-పురోహితులతో సహా వచ్చి, అతని కెంతో మర్యాదగా పూజలు చేసెను. వచ్చిన పనేమని యడిగెను. అప్పుడతడు. “ఈమెను నాతో

యా నువోభారతనీతి కభీలు -/ లాలన బలాత్కారముగా తెచ్చితిని కదా, పామ్మనుట న్యాయమా? ఇంక నయినను తమ్మునికిచ్చి పెండ్లి చేయుము” అనెను. అందుకు భీష్ముడు “నేనీమెను సాళ్వునివద్దకు పంపితిని కదా! ఈమె అతని భార్య నన్ననకుము ఇది న్యాయము కాదు” అని తన అనంగీకారమును చూపెను పరశురామునకు తాను చెప్పినమాట వినలేదని యెంతో కోపము వచ్చినది భిష్మునకు కోపము హెచ్చినది. “అయ్యా!నాకు గురుడవు. నామీద కోపింపకుము న్యాయ మాలోచించుము” అని మెల్లగనే చెప్పెను. కొని వరశురాముడు వినలేదు “నివు మాటలతో నన్నూ రడింపదలచితివేమో? అదేమియును కుదరదు. ఈమెను స్వీకరింతువా సరే! తేకున్ననా బాణాగ్ని జ్వాలలకు గురియగుదువు జాగ్రత్త” అని బయపెట్టెను. భీష్ముడు రాచబిడ్డ అతనికి మాత్రము కోపము పట్టుదలయు తక్కువా? “గురువని యింతసేపూరకుంటిని నన్న ధర్మమునకు పాల్పడమందువా ఇవా నీవు చెప్పు నీతులు గర్వముతో కారాకార్య వివేకము లేక చెప్పుచుంటవి ఒడలు తెలియకున్నచో శిక్షింతును జాగ్రత్త” అని రాజసముతో జవాబిచ్చెను ఆ మాట అగ్గిమీద గుగ్గిలమైనది పరశురాముడు మండిపడి “ఊ! ఇక సంశయమేటికి? రా రమ్ముఆ యుద్ధమునకు సిద్ధము కమ్ము” అనిన, “ఏమి యుద్ధమునకు రావలెనా? బ్రాహ్మణుడు గురువునైనవానిపై కోపింప నేటికని యింతసేపు ఓపికపట్టితిని పట్టుము. ఆయుధముల చేపట్టుము. తక్కిన రాజుల గెల్బుటకాదు. నేనున్నచో ఆనాడే నీ మదమణిచి యుండెడివాడను రమ్ము! నేనొక్కడినే వత్తును, నీవిచ్చిన అస్త్రవిద్యలు నాకు సహాయమున్నవి. చాలు ఇక సైన్యముతో పని లేదు” అని బెప్పి అతనికి నమస్కరించి ఇంటికేగెను రాజుల కదొక మర్యాద యుద్ధములో సైతము నమస్కారములు మామూలుగానే నడచును. , ఇంటికేగి తల్లియైన సత్యవతికి నమస్కరించి- బ్రాహ్మణాశీర్వాదములు తీసికొన కురుక్షేత్రమునకు వచ్చెను ఊరిలో వీరిద్దరును యుద్ధము చేసినచో నగరమంతయు మాడిపోవలసినదే. అందుచే దూరాన యుద్ధభూమి నేర్పాటుచేసి కొనిరి. అప్పుడు గంగాదేవివచ్చి భీష్మునికి ప్రత్యక్షమై అతని నడిగి జరిగిన కధనంతను తెలిసికొన్నది అతని మీద కోపబడినది. అటు పరశురామునివద్ద కేగినది. “అయ్యా! మీరు మా పిల్లవానికి గురువులు కొడుకులపై తండ్రులకు కోపింపదగునా?” అని యెన్నో రీతుల బ్రతిమాలినది. అతడును మెత్తపడలేదు ఇక లాభము లేదని వెడలిపోయినది సిద్ధులు విద్యాధరులు మున్నగు వారెందరో వారి యుద్ధమును చూడవచ్చిరి. తం

ాంజా నుసోభారతనీతి కథలు - కాం అంతట భీష్ణుడు “గురూత్తమా! తమకు రధములేదు. కాన నేను కూడ రధము దిగియే యుద్ధము చేయుదు” ననగా అతడు మంత్రశక్తిదే దివ్యరధమును పుట్టించి దానిపై కెక్కెన్తు అప్పుడు ముందరగా పరశురాముడు బాణములు వేయగా భీష్ముడా బాణములను తన మీదికి రాకుండునట్టు కాచుకొనెను ఇద్దరికిపోరు ఘోరంగా సాగినది మధ్యలో నొకసారి పరశురాముడు మూర్చపోగా భీష్ముడెంతో విచారించెను “తనకస్త్రములనిచ్చిన గురునిమీదే తానది ప్రయోగించి అతనికే భంగపాటు తేవలసి వచ్చెగదా” అని అంతలో పరశురాముడు మరల తెప్పరిల్లి లేచి దివ్యాస్త్రములు ప్రయోగింప నారంభించెను. దానికి ప్రత్యస్త్ర్రములను భీష్ముడు ప్రయోగించెను. గరువువద్ద కొన్ని రహూస్యములుండును వాటినెప్పుడును శిష్యుల కియ్యరు. ఇట్టి ఘట్టములు వచ్చునేమో అని వారి భయము, మధ్యలో పరశురాముడేదో అస్త్రము ప్రయోగించెను. అదేదో తెలియక ఉపసంహరింపలేక భీష్ముడా దెబ్బతో రథముపై మూర్చప్రోయెను. ఒక్క క్షణంలో మరల తెప్పరిల్లి అంబ హడలిపోవునట్టు శరవర్షముతో పరశురాముని ముంచెత్తెను. అతనికి కోపం హెచ్చినది అతడు భీష్ముని సారధిని చంసివేసెను, ' వెంటనే గంగాదేవి వచ్చి సారధ్యం చేయనారంభించినది అది కొంత సేపటికిగాని భీష్మునకు తెలియ లేదు. అప్పుడే భీష్ముడు గురుని దెబ్బలకు మూర్చపోగా వసువులు బ్రాహ్మణ రూపంలో వచ్చి అతని కుపచారములు చేసిరి అప్పటికి ప్రొద్దు క్రుంకినది. అప్పటి కిరువది రెండు రోజులు గడిచినది. ఇంకను యుద్ధ మేమూలకును రాలేదు జయాపజయములు నిర్ణయ మగువరకు ఒకరికొకరు తీసిపోరు. కాన వెనుకకు తగ్గువారు కారు ఆనాటిరాత్రి తెల్లవారుజామున భీష్మునకు కలవచ్చినది అందు వసువులు వచ్చి “భీష్మా! నీవును మేము నొక్కటే! నీకు భయపడవలసిన అవసరం లేదు. ఇదిగో ఈ మంత్రమును పరిగ్రహింపుము అదే భార్గవుని గెల్బుఅస్త్ర ము” అని చెప్పియిచ్చి వెడలిపోయిరి. అతడా ధైర్యంతో మరునాడుదయం మరల యుద్ధ భూమికి వచ్చెను. పరశురాముడు నవ్వును “నిన్న సగము చచ్చితివి, ఈ రోజున పూర్తిగా చత్తువులే రమ్మునీ గర్వం తగ్గింతును' ' అనుచు యుద్ధమారంభించెను. ఆనటి కిద్దరకును విసుగుప్పుట్టినది. ఏదో ఈ రోజున తేల్చుకొానదలచినవారు పరశురాముడిక లాభంలేదని బ్రహ్మాస్త్రము వేసెను భీష్ముడు కూడ బ్రహ్మస్త్రం వేసెను ఆ రెండస్త్రములును మధ్యలో ఢీకొని మంటలు మండుచున్నవి అప్పుడే సమయమని భీష్ముడు మోహనాస్త్రమును సంధింపపోయెను. అంతట నారదుడు వచ్చును “ఆం ఆం క డా

వవవావావలయయావాయయంయాల వ్రనతభంరత నతి కథలు = లా ఆగు మాగుము ఆ యస్త్రమును సంధింపకుము. గురునకే అవమానము తలపెట్టితివా? ఇదేనా గురుభక్తి” అని చెప్పి “అదిగో చూడుము! దేవతలు నీకు బుద్ది చెప్ప వచ్చినారు” అని చూపెను

భీష్ముడు తలపైకెత్తి చూచుసరికి రాత్రి కలలో వచ్చిన వారే వచ్చి యేమియు నెరుగనట్టు “ఆర్యా, ఇది దివ్యాస్త్రం, దీనిని గురువుగారిపై ప్రయోగింపరాదు. నారదుడు జైలోక్య పూజ్యుడు ఆయన మాటను పాలింపుడు” అని చెప్పిరి. దానితో భీష్ముడు సమ్మోహనాస్త్రం వేయుట మాని బ్రహ్మస్త్రమింకను దీపించునట్టు చేసెను.

అప్పుడు పరశురాముడు తానోడి పోయినట్లు తెలిసి కొన్నను అవమానంతో మాటాడకయుండెను అంతట అచ్చటికి జమదగ్ని మహర్షి వచ్చి “నాయనా ఇతడు వనువుల లోనివాడు. ఇతని గెలువ నెవరికిని శక్యము కాదు కాక బ్రాహ్మణులకు కోపము తగుటయ్యా? నారాయణ మిత్రుడగు నరుడు జన్మాంతరమున అర్జునుడై పుట్టి యితని చంపగలడు. అతనికి తప్ప మరెవ్వరికిని నితని గెలువ వీలు కాదు. ఇత డసాధ్యుడు. కోపము, మత్సరము తగ్గింపుము” అని యెన్నో రీతుల చెప్పి అతని నూరడించిరి. మరల భీష్ముని వద్దకు వచ్చి పరశురామునితో చెప్పిన సంగతులను చెప్పి, “నీవు కూడ కోపము తగ్గించుకొనుము” అని బ్రతిమాలిరి, భీష్ముడు తగ్గెను. వారుభయులను ఉపశమింప జేసి, బ్రహ్మస్త్రముల నుపసంహరింపజేసిరి, తరువాత భీష్ముని వద్దకు వచ్చి “అయ్యా! అతడు నీకు గురువు. పూజ్యుడును. నీవితనికి నమస్కరించి అతని దీవన లందుము” అని హితవు చెప్పిరి అంతలో అక్కడీకి గంగా దేవియు వచ్చినది.

అతడెంతటి యుదారుడో గమనింపుడు. వెంటనే వారి వెనుకనే గురునివద్ద కేగెను. పరశురామునితో నారదాదులు “ఇడుగో నీ శిష్యుడు దేవవ్రతుడు. న్యాయము తప్పి నడువ లేక నీతో యుద్ధమునకు దిగెనే కాని, నీకు విరోధి కాడు. కరుణింపుము” అని చెప్పుటతో భీష్ముడు గురువుగారికి సాష్టాంగ నమస్కారము చేసెను. గురువుగారు కూడ సంతోషించి, అతనిని లేవదీసి, “నాయనా! దిగ్విజేతవు కమ్ము!” అని దీవించెను. అంబతో “ఇతడు నన్ను గెలిచెను ఇక నీకు దిక్కున్న చోట చెప్పకొనుము” అని చెప్పి పంపెను, అట్టు పరశురాముని "సైతము గెల్బినాడా భీష్ముడు ఆ అంబయే తపన్సు చేసి సాధించి శిఖండియై పుట్టినది.

ఆ రాజకుమారిక లిద్దకు నందమైనవారు; తరుణులు; స్వయంవర లబ్బలు; - అతడా నూత్న యౌవనమున నున్నవాడు, అందగాడును, అన్నగారా రీతిగా బ్రహ్మచారియై రాజ్య తంత్రములనెల్ల చూచుచుండ నతనికేమి రాజ్యచింత? న్యాయమునకు రాజైనవాడు నా తక లా

ాాననానామనాయలనాయియయలయిా ముహవాభారతనీతి కథలు - లు బాధ్యతా రహితుడై యుండరాదు; కాని అక్కడి పరిస్థితులను బట్టి క్రొత్తగా కాపురానికి వచ్చిన భార్యతో పగలో - రాత్రియో తెలియకుండ రోజులను క్షణములవలె వెళ్ళించుచుండెను.

అతికాముకత మహాదోషము, మనవారందువలననే పగలు భార్యతో మాట్టాడరాదని, కనీసము కన్నెత్తియైనను చూడరాదని నిషేధించినారు. ఏకశయన మెప్పుడు నిషిద్దమే. అవి ఆచోరములు కావు. ఆరోగ్య సూత్రములు. దీనివలన పొపం వచ్చునా? అది నలుపా? తెలుపా? అన్నవి ప్రశ్నలు కావు మన శరీరారోగ్యం భంగము కాకుండటకయి పెద్ద లట్టి కట్టుబాట్లను పెట్టిరి మనము నిస్సారముగా వాటిని త్రోసిపుచ్చుచుంటిమి దాని ఫలితం చెడుగే! అట్టు జాగ్రత్తగా నడిచినవారు చిరంజీవుటై బ్రతికినంత కాలము నారోగ్య భాగ్యముతో హాయిగా జీవించిరి

విచిత్రవీర్యునకా యువతులే లోకము, వేరు రాజకార్యముల ప్రసక్తియే లేదు వారి కనుకొలకుల చూపులలో, శృంగారరస సంభాషణలతో, ఒయ్యారంపు మాటలలో మరగి యొడలెరుగక క్రీడా పర్వతముల మీదా, ఉద్యానవనములలోను, అంతఃపుర దీర్ధికలలోను విహరించ్చి, ఆతి ప్రణయమున హద్దు లేకుండ విహరించినందున శుష్కించి శుష్కించి భూలోకము వాసెను,

ఇట్టు బుద్ధిపూర్వకంగా స్వయంకృతాపరాధములచే కొడుకు లిద్దరును తన కన్నులయెదుట ప్రాణముల విడువగా తల్లి సత్యవతి దుఃఖసముద్రమున మునిగి పోయినది ఆమె మగడు పోయిన విచారమును కొడుకుల జూచుకొను సంతోషముతో వెనుకకు నెట్టి ఏదో సంతోషముగా కాలమును వెళ్ళించుచున్నది. భగవంతు డామెపట్ల వ్యతిరేకయైయుండగా ఆమె మాత్రమేమి చేయును? సరే! అతని భార్యలమాట చెప్పనక్కరయే లేదు. మూన్నాళ్ళ పట్టపగలుగా వారి సుఖజీవితము ముగిసినది తన కడుపున నొక్క కాయయైనను కాయలేదు.

భీష్ముడా తమ్మునికికూడా పరలోక క్రియలు తన చేతులతో చేసి తల్లిని మరదండ్రను ఊరడించి, తానెంత దుఃఖముతో నున్నను రాజ్యము నరాజకము కానీక వెయ్యి కన్నులతో మెలకువగా చూచుచుండెను. కష్టములు కల్గినవేళ ఆ విచారముతో తాత్కాలిక వైరాగ్యం కలిగి మనము జీవిత కర్తవ్యములను మానితిమా? ఇక ఆ పనులు కొనసాగవు. కొందరా ఆవేశంలో ఎంతయినా చేయుదురు తరువాత ఆ వేడి చల్దారినాక నాలుక కరచుకొందురు. ఆ పనులు నెరవేరుటతై ్రాకులాడుదురు. కాని చేతులు కాలిన తర్వాత అకులు పట్టినట్టగును. గత జల సేతు బంధనమువంటి ఆ పని నెవరు మెచ్చుకొందురు? లలా క2 లా

అరావవవవవవావావావాంాంంం వువఖారత నీతి కథలు =! లాలా సకలధర్మవేత్త రాజనీతి నిపుణుడైన భీష్ముడు దుఃఖముతో నొకమూల మనన్సు బాధపడుచున్నను రాచకార్యములను సక్రమంగానే నడుపుచుండెను. అన్నియు యధాప్రకారముగా జరుగుచున్నవి. కాని కులంలో మనస్సంతుప్టి లేదు. సత్యవతీ దేవి విచారమున కంతులేదు తనకు పుట్టబోవు కుజ్జిలకై తన తండ్రి భీష్మునిచే పెండ్లి మాన్పించెను. కాని, యీనాడు తన వంశము నిర్మూలమైనది. దానికిక సంతతిలేదు. ఎట్టయినను భీష్మునే యొప్పించి కులవిచ్చేదము కాకుండ చూడవలయునని తలచినది. భీష్ముని పిలిచినది. అతడు వచ్చి మర్యాదగా తల్లికి వందనము చేసి కూర్చున్నాడు. ఆమె “నాయనా! నీవు సకల ధర్మ శాస్త్రవేత్తవు. ఇప్పుడు భారములన్నియు నీమీద పడినవి. అటు రాజ్యభారం, ఇటు కులము నిలువవలసిన బాధ్యత. ఒకమూల పితృదేవతలకు పిండవిచ్చేదము కాకుండ చూడవలసిన విధి - ఇవన్నియు ఒకదానిమీద నొకటిగా నీ మీద పడినవి. నీ వేరీతిగా సమర్ధించుకొందువో నాయనా! కురువంశము నంతకును నీవొక్కడవే మిగిలినవాడవు. నీవే ఈ వంశమును నిలుపవలెను. రాజ్యమును పాలించుట ఎంత ప్రధానమైనదో సంతానమును కనుటయు నంతే ప్రధానమైనది. బ్రహ్మ మొదలు నీవరకు నెడతెగకుండ వచ్చు కురువంశమును నిలువబెట్టుము తండ్రీ!. నీవుండగా నీవంశమిప్పుడు విచ్చిన్నమగుట ధర్మమా? పరికించుము? అని సాధక - బాధకములను నవిమర్శముగా చెప్పినది. భీష్ముడు భిష్మప్రతిజ్ఞ చేసెను. కొంచెము నందు దొరికినచో ఏదోరీతిగా తానే రాజునుకదా అని నలుగురిచే అబద్దము లాడించి తన యిష్టం వచ్చినట్ట్లు సుఖమును మాత్రమే కోరి చెడుపని చేయువాడు కాడు మాట చెప్పెనా? ధర్మమైన మాటనే చెప్పును, అందుకే అతని పేరినాటికిని నిలిచి యున్నది. అంతేకాదు సృష్టిలో నెన్నడునాతని పేరు మరువ దలచినను పోదు. + అతడు ధైర్యంగా “అమ్మా! నే నాడు చేసిన ప్రతిజ్ఞను మరచితివా? ఆడి తప్పువాడ ననుకొంటివా? నా కపఖ్యాతి తేవలదు. పట్టిన వ్రతమును మానుటకు నేనంత తెలియని వాడనా? అగ్గివేడిని, చంద్రుడు చల్లదనాన్ని సూర్యుడు తేజస్సును విడుతురుగాక! కాని, నా పట్టిన వ్రతమును మాత్రము విడువను. భూమి, నీరు, నిప్పు మున్నగు మహా భూతములు వాటి గుణముల విడుచునా! నా తంగ్రికై తమకు శుల్కముగానే చేసిన ప్రతిజ్ఞ విడువరానిదే మీరంటిరే “నీ వెరుగని ధర్మములు లేవని” - అ మాట తథ్యము! శంతనుని వంశము విచ్చేదము కాకుండునట్లు ఆపద్ధర్మముగా ఉన్న క్షత్రియ ధర్మమేదో చెప్పెదను వినుము. ననన లనననవకకప == వవ

అరలలనమలాంయవవవావాలాలయ ద్ర్రవారత నీతి కథలు = నాలాలు పూర్వము పరశురోముడు రాజులందరిని గర్భములో నున్నవారితో సహా చంపగా వారి భార్యలందు బ్రాహ్మణులే సంతానము కనిరి. అదిగాక దీర్ధ్హతముడను మహర్షి వలన బలియను మహారాజు సంతానము బడసెను. అట్లే మన విచిత్ర వీర్యుని భార్యలందు సంతానము పాందునట్టి యుపాయము నాలోచించుము”. అని చెప్పాటతోతాను చేయకున్నను చక్కని యుపాయము చెప్పినందున సత్యవతి యెంతో సంతోషించినది. అప్పుడామె కొక్క ఆలోచన తట్టినది తనకొక్క కొడుకుండగా కన్యాత్వమున పుట్టినవాడు! తలచుకొనగానే వచ్చెదనని వెళ్ళినాడు. తలచినంత మాత్రాన వచ్చునుకాని ఆ విషయమున ముందుగా భీష్మునీ నాప్పించవలె ననుకొన్నది. తనకు వ్యాసుడు పుట్టిన కధనంతయు చెప్పినది. “అతనిని నీవు తలచుకొన్నచో వచ్చును. నీ తమ్ముని భార్యలదు సంతానమును పుట్టించు”మని కోరుమన్నది. తమ్ముడు అంగీకరించి తక్షణమే వ్యాసుడున్న దిక్కువైపు లేచి నిలిచి మొక్కెను. అతని భావన వేదవ్యాసునకు తెలిసినది. వెంటనే వచ్చి అక్కడ వ్రాలెను. మహర్షులు మనోనియమము కలవారు. ఒక్క మనస్సును స్వాధీనము చేసికొన్నచో దాని శక్తి వలన మనస్స్ఫులన్నియు వెంటనే అతనికి స్వాధీనమగును. మూడు కాలములును సమానమగును, దానితో వారికెవరు తమ్ము తలచుకొన్నను వెంటనే తాము తలచుకొన్నట్లే తలియను వారికి స్వ-పర భేదము లేదు వారి శక్తులు మరెవ్వరికిని రావు. వేదవ్యాసుడువచ్చి నిలువబడుటతో తల్లియైన సత్యవతి ఎప్పుడో కన్ననాడేకాని మరలచూడని ప్రథమ పుత్రుని మహా ప్రేమతో కౌగలించుకొనుచు ఆ ్రేమాతి రేకముతో ఆమెకు స్తన్యం లుబ్బిధారలుగా ప్రవహించినవి. కన్నుల నుండి ఆనందాశ్రువులు జాలునారినవి వ్యాసమహర్షి తన తల్లికన్నులు తుడిచి పాదములకు మైొక్కెను భీష్ముడప్పుడు పురోహితుల ద్వారా యధావిధిగా ఆ మహర్షికి పూజలు చేసెను. రత్నాసనము వేయించెను. దానిపై వ్యాసమహర్షి కూర్చున్నారు. అంతట సత్యవతి “కుశలమా నాయనా! ఎన్నాళ్ళయినది నిన్ను చూచి? ఒక్కసారియైన ఈ తల్లిమొగము చూడరాదా నాయనా! నన్ను మరచితివా? ఇప్పుడు పెద్దపని యుండి నిన్ను పిలిపి౦చితిని ఇదుగో ఇతడు భీష్ముడు, శంతనుని కుమారుడు. ఇతడు తండ్రికి హితవుగా (బ్రహ్మచర్య వ్రతంతో రాజ్యమేలుచుండెను. ఇతడు పట్టిన 'ప్రతిజ్ఞనీ వెరుగనిదా తరువాత నీ తమ్ములిద్దరును చనిపోగా నా వంశం విచ్చేదము కావచ్చినది అదియు నీ వెరిగినదేకదా! నీ విప్పుడు నీ తమ్ముని భార్యలందు సుతులను గని వంశము నుద్దరింపుము నీ ధర్మమా నాక నాం

పా ముహభారతనీతి కథలు -! బాలా అని కులము నిలిచెనా మేమును. రాజు కలిగింనందున మా ప్రజలు నెంతో ఆనందింతురు. భీష్ముడుకూడ ఈ విషయమై యొప్పుకొనియే యున్నాడు” అని చెప్పినది. అతడా మాటను పరికించినాడు “అమ్మా! నీవు చెప్పినట్లు చేయుదును. ఇది పురాణచోదితమైన ధర్మమే కాని ధర్మస్టితిగా సత్సంతానం కలుగుటయు వీరొక్క సంవత్సరం వ్రతం చేయవలెను. అట్లు చేసినచో సత్పుత్రులు పుట్టుదురు" అని చెప్పెను సత్యవతి “ఏదో రీతిగా త్వరగా సంతానం కలుగు నుపాయం చేయుము. మా ప్రజలకు రాజు లేకున్నచో నిమిషమొక యుగంవలె గడుచును అలసింపకుము. కార్యభారమును మరువకుము నీ వసుగ్రహించు కుమారులు పెద్దవారగువరకు ఇతడే రాజ్యం చేయుగాక!” ' అని భీష్ముని రాజ్యం చేయననుజ్ఞ యిచ్చినది. ఆమె కోడండ్రను వ్రతవిధానముగా పరిశుద్ధముగా నుండునట్లు చేసినది. ఏడాది గిరుక్కున తిరిగివచ్చినది. ఆనాడు సత్యవతి కోడలైన అంబికవద్దకేగి “అమ్మాయీ! ఈనాడు నీవద్దకు నీ బావ వ్యాసుడు వచ్చును. ఇది ధర్మకార్యము సుపుత్రుని కని రాజ్యమును నరాజకం చేయుము వంశమును నిలబెట్టాము” అని చెప్పి యొప్పించినది ఆనాడు (బ్రాహ్మణులకు దేవర్షి ప్రీతిగా సంతర్పణములు చేసెను. రాత్రియైనది అంబిక అత్తగారి యాజ్ఞపై పడకగది కేగినది. అందామె కిష్టం లేదు. అది ప్రతము ముందుగా తెనే ,పుచ్చుకొనునప్పుడు తెగ త్రాగుదురా? ఒక్క చుక్కను నాకుదురా? అట్లె వతాంగముగా దేవర్డునిగలయబోవుచున్న ఆ పూబోడి భావిలో తనకెట్టి సుతుడు కలుగునో అని ఆలోచించుచు వేచియున్నది. సమయమైనది వేదవ్యాసులు లోనికి వచ్చెను. అతని నెరసిన గడ్డము, మీసము, జడలు చూచినది. అతడేమిట్లో ఆటవికుడు తనకాతని చూడమనస్సు పుట్టలేదు. తప్పదుకాన ఆమె కన్నులు రెండును మూసికొని పరున్నది. వ్యాసుడు తల్లి యాజ్ఞ ప్రకారము వచ్చి ఆమెకు గర్భోత్పత్తి యగునట్లు చేసి వెడలెను. సరిగా గది వెలుపలనేయున్నది. సత్యవతీ మొగమంతయు కన్నులు చేసికొని “నాయనా! ఎట్టి పుత్రుడు పుట్టను?” అని ప్రశ్నించినది అతడు “అమ్మా! మహాబలశళాలియైన కొడుకు పుట్టును, కాని తల్లి చేసిన దోషముచే అతడు వుట్టంధు డగును” అని భావిఫలమును చెప్పెనాతడు. అ మాటను వినుటతో సత్యవతి మనస్సు చివుక్కుమన్నది. తాను రాజు పుట్టవలెనని ప్రయత్నము చేయగా గ్రుడ్డివారు పుట్టనా? అయ్యో! తన కోడలు తన ప్రయత్నమునంతను వృధా చేసినదే అని వగచినది మరల కొడుకును బ్రతిమాలినది. ఆ నాననా కక లా నాం

అ రాాంాడాంజాటాట నుహభారత నీతి కథలు - గాలా పని అతడు కోరినదికాదు ఆమె బలవంతము పై చేయు చుండెనంతే! అతడెట్టకేలకు నంగీకరించెను.

సత్యవతి అంబాలికను వప్పించి పంపినది. ఆమెయు వ్యాసుడు తన దగ్గరకు వచ్చుటళో అతని వేషమునకు భయపడి వెలవెలబోవుచు అట్లె పరున్నది. వ్యాసమహర్షి ఆమెకు కూడ గర్భోత్పత్తియగునట్టుచేసి యావలకు వచ్చెను సత్యవతి అక్కడ కాచుకొనియే యున్నది. రాగానే కొడుకును ఫలితమేమని యడిగినది. అతడు “అమ్మా! మహాబలశాలియే యైనను తల్లి దోషముచే పాండుదోషము కలవాడు పుట్టును” అని చెప్పెను.

ఆ రీతిగా ఇద్దరును రాజ్యపాలనమున కనర్చ్హులేలైనందున నత్యవతి పశ్చాత్తాపపడినది మరల వ్యాసుని సుపుత్రుని ప్రసాదింపుమని కోరినది అతడంగీకరించినాడు సత్యవతి కోడలిని బతిమాలి యొప్పించినది కాని ఆమెకు మనసొప్ప లేదు అత్తగారితో అంగీకరించినట్టు మాట్టాడినది. ఆమె వెళ్ళిన తర్వాత దాసీదానిని పిలిచి తనకు బదులుగా వెళ్ళుమని చెప్పినది. ఆమె తనకట్టి అదృష్టము లభించుచున్నందుల కెంతో సంతోషించినది. గదిలోనికి సముఖముగా వెళ్ళినది. వ్యాసమహర్షి ఆమెకు పుత్రుని ప్రసాదించినాడు. మామూలుగా సత్యవతివచ్చి పుట్టబోవు పుత్రునిగూర్చి ప్రశ్ళించినది వ్యాసుడు “అమ్మా! నీతిశాస్త్రవేత్తయగు బాలుడుదయించును కాని అతడు దాసీపుత్రుడు. అనుటతో తన 'ప్రయత్నమంతయు దైవకృప విపరీతముగా నున్నందున ఆ రీతిగా పరిణమించినదని సత్యవతి వాపోయినది. వ్యాసుడు తన వచ్చినపని యైనదని తపోవనము కేగినాడు.

వారికి పుట్టినవారే ధృతరాష్ట్రుడు, పాండురాజు ఆ దాసీపుత్రుడే విదురుడు. వారిని తేన కుమారుల కన్న నెక్కువగ్గా గౌరవించి భీష్ముడు పెంచుచుండెను. వారికి రజోచిత ములయిన విద్యల చెప్పించెను. వారు విద్యలన్నిటి యందు నేర్చరులైరి భీష్ముడు తానిచ్చినమాట ప్రకారమా అంబికేయుడగు ధృతరాస్ట్రునకు రాజ్యాభిషేకము చేసెను. తాను, విదురుడును, అతనికి సహాయులై రాజ్యమును రక్షించుచుండిరి.

ధృతరాష్ట్రడు యౌవనవంతుడయినాడు. భీష్ముడతనికి తగిన సంబంధమును చూచి చేయదలచెను సంతానము తక్కువగా నున్నచో ఎన్నో ఇబ్బందులు వచ్చినవని చాలామందిని కనెడి కన్యను చేయ నిశ్చయించెను. కన్యల జాతకములను తిరుగవేసెను. గౌంధార దేశపురాజు సుబలుని కూతురయిన గాంధారి శివుని పూజించి నూటొక్కమంది కొడుకులు పుట్టునట్లు వరము పాందెనని తెలిసి, ఆమెను వివాహము చేసినచో బాగుండునని తలచి ముదుసలులైన (బ్రాహ్మణులను కన్యనడిగి తెమ్మని పంపెను. నా

అలా మవసారత నీత కథలు -/ వారు వెళ్ళి సుబలుని ధృతరాష్టునకు కన్యనిమ్మని కోరిరి. అతడు “తప్పక యిత్తును” అని మాట యిచ్చెను. తక్కిన బంధువులందరు నా మాట విని “అయ్యో! ఇదేమి సంబంధము? అవయనములలో ప్రధానమైనకన్నే లేనివానికా పిల్లనిచ్చుట? బాగుగా లేదని యెన్నో రీతుల ఆక్షేపణ లారంభించిరి. కొని గాంధారి మాత్రం “నన్నిదివరకే తండ్రి అతనికిచ్చినాగడ) ఇక నేను రెండవారిని 'పెండ్లాడను సఫరపురుషు నిక చూడను" అని కన్పులకు గంతలు కట్టుకొని కూర్చుండెను. ఆమె పట్టుదలకు తండ్రి సంతోషించి తండ్రి తన ,కుమారుడైన శకునిని వెళ్ళి ఆమెను ధృరాష్ర్రునకిచ్చి పెండ్లి జరిపి రమ్మనెను, ఆమెతోపాటు వచ్చిన ఆమెతోబుట్టువులను, మరి పదిమంది నొక్క ముహూర్తముననే ధృతరాష్ట్రుడు పెండ్డాడెను, వారుగాక మరి వంద మందిని గాంగేయుడు తెచ్చి ధృతరాష్టునకిచ్చి పెండ్లి చేశను. పాండురాజుకూడ వేదశాస్త్రములలోను, ధనుర్విద్యాది రాజ విద్యలలోను ఆరితేరెను. అతనికి కూడ తగిన సంబంధము చూచి వివాహము చేయదలచెను. ఆ రోజులలో కుంతి భోజుడు తన సెంపుడు 'కూతురయిన కుంతీదేవి (పృథు)కి స్వయంవరము చాటించెను. దానికి వెళ్ళి పాండు రాజమెను వివాహమాడెను. మద్రరాజపుత్రియైన మాద్రిని భీష్ముడతనికి పెండ్లి చేసెను. ఆ పాండురాజు దిగ్విజయము చేసి ధనరాసులు తెచ్చి భీష్మునకు, అన్నగారికి నప్పగించువాడు అతని మంచి తనము నందరును మెచ్చుకొనిరి.

_ తర్వాత పాండురాజు పంచపుత్రులను కని, శాపవశమున చనిపోయెను. ధృతరాష్ట్రునికి నూటొక్కమంది కొడుకులు పుట్టిరి. అతడు తమ్ముని కొడుకులను తన నారితో పాటుగా పెంచుచుండెను. వారికి చదువుకొను నీడు వచ్చినది.

తగిన గురువును వెదకవలెను గదా! ఆ విచారము ముపలివారిదే! చిన్నతనమున అజ్ఞానము వలస తిరుగాడెడి బాలకులను వదలి వేసినచో వారు చెడిపోదురు. తగిన సమయమున జాగ్రత్త వహింపవలెను. భీష్ముడు బ్రతికియున్నందున తమ్ముల బాధ్యత వారివెనుక వారి సంతానము బాధ్యత, తర్వాత మనుమల బాధ్యత అతనిమీద పడినవి. సుళీక్షితుడై పండితుడైనవానిని గురువుగా నెన్ను కొనవలెనని తలచుచుండెను.

ఒకనాడు కౌరవ పాండువులు బంతియాటాడుచు నూతిలో పడిన బంతిని పైకి

తీయలేక తబ్బిబ్బగుచుండిరి. అప్పుడొక బ్రాహ్మణుడు వచ్చి తన బాఐ విద్యా కౌశలముతో

బాణముల నొకదాని వెనుక.నొకదానిని గ్రుచ్చి త్రాడుగా జేసి బంతిని పైకితీసి యిచ్చెను.

ఆ కధను వినగానే భిష్ముడు అతనిని రావించి “మహాత్మా! మీరెవరు! ఇట్లేల వచ్చితిరి?” అని 157

లాయయలాయయయయయయలలాలాలా మహేఖట్రారల నీతి కథలు -/ాలాాాాాాలాలాాాానున

  • ప్రశ్నించెను. అతడు నా పేరు ద్రోాణుడందురు. ధనుర్విద్యలో నారితేరినవాడను. దరిద్రముచే బాధపడుచు నా బాల్య స్పేహితుడని ద్రుపదుని ధనమడుగబోగా నతడు విరసించెను అందుచే దైన్యమయిన యాచనావృత్తిని మాని ఏదో రీతిగా బ్రతకదలచి వచ్చితిని” అని . చెప్పెను.

భీష్ముడు వెదుకబోయినతీగ కాలికి తగిలినట్లు సంతోషించి, అతని కుటుంబ భరణమును తానే చేయుదునని, వగవ వలసిన అవసరము లేదని చెప్పి తన మనుమలను చూపి “మహాత్మా! వీరు నా మనుమ కుర్రలు వీరికి ధనుర్విద్యల నేర్పుడు. వీరిని నీవారిగొచేకొని రక్షింపుము” అని యొప్పగించెను. అతడు తన శక్తికొలది వారి కస్త్రశస్త్ర విద్యల నేర్చుచుండెను. భీష్ముడతనిని గౌరవముతో 'జూచుచునెప్పుడు నేలోపమును రొకుండ జూచుచుండెను.

చిన్నప్పటి నుండి పాండవులు బుద్ధిమంతులై యుండుటయు, కౌరవులు దుష్టబుద్దులై యుండుటయు జూచి భీష్మునకు పాండవుల పై నైజముగా గ్రేమ కుదిరెను. కాని పాండవులు దేశములుపట్టి పోవుటచే భీష్ముడు హస్తినాపురియందే యుండుటచే దుర్యోధనాదులతో కొంత నెక్కువ సంబంధము కుదిరెను.

కౌరవు లెన్నో రీతుల పాండవుల జంపజూచినను చావక బ్రతికి బయటపడుటయే గాక స్వయంవరమున ధనుర్విద్యా కాశలము చూపి, కౌరవులకు చేతకానిది సాధించి ద్రౌపదిని పెండ్డాడిరి. అదివిని దుర్యోధనుడు మండిపడెను. వారికెంతో అపకారము చేయదలచెను. అప్పుడు భీష్ముడు దుర్యోధనునితో “పాండవులతో యుద్ధము చేయుటకు నా మనసంగీకరింపదు. వారు తండ్రి తాతలనాటి నుండి వచ్చు రాజ్యమున కర్టులైనవారే కనుక వారి కర్ణరాజ్యమి'మ్మని హితవు చెప్పెను. అతడు వినక కర్ణాదులతో కలసి దురాలోచనలు చేయుచుండగా ధృతరాష్ట్రునితో చెప్పి యొప్పించి విదురుని పంపిద్రుపదుని నింటనున్న పాండవులను రప్పించెను. వారికి సగపాలు రాజ్యము నిచ్చి, ధర్మరాజును రాజ్యమున కభ్గిషేకము చేసెను.

తరువాత ధర్మరాజు ఇంద్రప్రస్థపురం రాజధానిగా తనపాలు రాజ్యం నేలుచు రాజనూయ యాగమును మిత్రుల కృష్ణుని ప్రోత్సాహమున చేయ సంకల్పించెను దానికి వలయు సంబారములను భీమాదులు తెచ్చి సిద్ధపరచిరి.

ఆ రాజసూయములలో అగ్రపూజ ముఖ్యమైనది దాని కందరిని మించిన వారికి “నిర్ణయించి పూజచేయవలెను. అట్టి సకల గుణ గణోపేతు డెవడా అని ధర్మరాజు న

పా మహాభారతనీత కథలు -/ కు భెష్మునడిగెను అతడు “యజ్ఞస్వరూపుడు, కర్త, భోక్తయైనవాడు పరమేశ్వరుడు శ్రీకృష్ణుడుండగా నీకనుమానమేల వచ్చినది” అర్ధ్యము నతని కిమ్ము దానివలన నీకు యజ్ఞఫలం సంటప్రాప్తించును” దాని నాదరించి ధర్మరాజు శ్రీకృష్ణుని పూజించగా సహించలేక శిశుపాలుడు లేచి ధర్మరాజును, భీష్ముని తిట్టి దూషించెను. అంతట భీష్ముడు “ల్రాహ్మణులలో విద్యావృద్భడు, రాజులలో శార్యవృద్దుడు, వైశ్యులలో ధనవృద్దుడు, శూద్రులలో వయోవృద్ధుని పూజింపవలెను ఇక్కడ అన్ని విధముల కృష్ణుడే వృద్దుడయినవాడు శిశుపాలుడేమియు తెలియనివాడు. అతని వాగుడు కేమికాని నీవు చేసిన పనియే మంచిది” అని దర్మరాజుతో చెప్పెను. భీముడు శిశుపాలుని మాటలకు నహింపక అతని చంపబోగా భీష్ముడు శిశుపాలుని జన్మవృత్తాంతమును చెప్పి “అతడు శ్రీకృష్ణుని చేతిలో కాని చావడు అదే అతని గర్వం ఇప్పుడే అతనికి కాలం సమీపించినదిలే. నీవు కంగారుపడక్తుము” అని భీముని కోవమును తగ్గించెను. కృష్ణుడు శిశుపాలుని సంహరించెను. ధర్మరాజు శకునితో జూదమూడుచున్నప్పుడు భీష్మద్రోజాదు లక్కడనే యుండిరి. అందరును చూచుచుండగనే దుళ్ళాననుడు ద్రౌపది వలువల నూడ్చుచుండెను. అప్పుడు వికర్ణుడు “ద్రౌపది వేసిన ప్రశ్నకు జావాబియ్యక ఊరకున్నచో త దోషం 'సభ్యులదే” అనుటతో భీష్ముడు నీ ప్రశ్చమునకు తగిన ప్రత్యుత్తరం నొక్క ధర్మరాజు తప్ప మరెవ్వడు నియ్యలేడు. దాని తెలిసికొనుట కెవ్వరికిని శక్తి లేదు. అది చాలా గహనమైనది దాని దుష్పలితమును కౌరవులు త్వరలోనే పొందుదురులే” అని ద్రౌపది నూరడించెను, పారడవు లరణ్యవానం పూర్తిచేసుకొని అజ్ఞాతవానం చేయుచున్నారు. అప్పుడు దుర్యోధనుడు గురు భీష్మాదులతో మంతనము లాడుచుండెను. “ఏ కీతిగానైన పాండవుల నిప్పుడు కనుగొన్నచో మరల వారు అరణ్యాజ్ఞాతవాసములు చేయవలసి వచ్చును. అందుకు తగిన యుపాయమేమైన చెప్పుడు” అని భీష్మునడిగెను. అతడు “నాకు కౌరవ పాండవలుభయులును సనమమే. వారు కష్టపడుట నేచూచి సహించలేను. కాని యిప్పుడు ప్రత్యేకంగా నన్ను చెప్పమన్ని ఇతడు కోరినందునీ చెప్పక తప్పదు. తెలిసి చెప్పకపోవుట నా మతం కాదు. ఏ దేశం నందు ప్రజలు ధర్మనిరతులై యుందురో ఎచ్చట ఆవులు పుష్కలముగా పాలనిచ్చుచుండునో ఆ దేశమున ధర్మరాజున్నట్లు నిశ్చయించుకొనవచ్చునని. ధర్మరాజాదుల వెధకుటు కుపాయమును చెప్పెను. తొను కౌరవులవద్ద నుండి తినుచున్నందున అట్లు ధర్మమను పేరుతో ఒకరికి - తన యిష్టులకు ల నాానననాాాాాలాక9::: లలా

వవయవాడాలాం నవభారత నీతి కథలు - లు బాధ కలిగించు నుపాయము చెప్పవలసినదా తాతగారికి, తిండి మొగమాట మెంత పనినైన చేయించును గదా!

పాండవులు విరాటుని నగరమున నున్నటుల చారుల ద్వారా వార్తలు వచ్చినవి. కీచకుడు చనిపోవుటతో అతని చంపినవాడు భీముడే అయియుండునని నిర్ణయింపబడినది. కౌరవ సేనలు సర్వసిద్ధములై గోగ్రపూణము కేగినవి. దక్షిణ గోగ్రహణమైన వెంటనే ఉత్తర గోగ్రహణము.జరిగినది. ఉత్తర గోగ్రహణము చేసిన మూలకే భీష్మాదులతో సహా కురుసేన నడచినది. అర్జునుడు బృహన్నల పేరిట విరాట నగరమున నున్నందున ఉత్తరునకు సారిధిగా యుద్ధభూమికి వచ్చెను. కాని తీరాకౌరవ సేనని చూచుసరి ఉత్తరుడు హడలి పారిపోగా, అర్జును డాతనికి ధైర్యం చెప్పి తానే రధికుడుగా మారి 'అతనిని సారధి చేసెను. శమీవృక్షమ్లు పై వాని అస్త్రములను తీసికొనుటకై అర్జునుడు వెళ్ళుచుండగా చూచి 'దోబుడానవాలు_పట్టెను.

గురుభీష్ములు పాండవ పక్షపాతము కలవారు. ద్రోణునికి పాండవులు బయట పడుదురేమో అని భయము వేసినది. భీషు]నితో “వీడెవరో చెట్టు పేరుతో (అర్జునుడు - మద్దిచెట్బ) భయము లేకుండ వచ్చుచున్నాడు. అహంకారమే కాని మర్యాద (హద్దు) ఎరుగడేమో?” అన్నాడు. అందులోని రహస్యము నెరిగి భీష్ముడు “ఆచార్యా, మీకట్లి అనుమానమెందులకు? శత్రువులకు స్వాధీనమగు హద్దు (అజ్ఞాతవాసము) దాటితిమి. ఇక శత్రుభయం మనకు (పాండవులకు) లేదు” అనెను. ఆ మాటలోని అంతరార్థము తెలిసి కొన్నా డాచోర్యుడు.

ఆ అర్జునుని చూచుటతో కౌరవ సేనలో కలకలము బయల్టేరినది. ఆకలితో గుహలో పచార్జు చేయుచున్న సింహము ఏనుగుల ఘీంకారమును విని మీదపడునటు వస్తపడు వచ్చి పడుచున్నారని ద్రోబుడు చెప్పుటతో కర్గున కుత్రోశము వచ్చినది! చేయ చ్చి 1 మన కోరిక తీరినట్టే మరల వారు అరణ్యాజ్ఞాతవాసములు

లువలసినదే” అని ప్రముఖులనగా భీష్ముడు లెక్కచూచి “అధిక మాసములతో సహా విన్నటితోనే పదమూడు సంవత్సరములు నిండినవి, ధర్మపరులయిన పాండవు లీపాటి చూడకుండరారు. క్రాక్ర _

వచ్చినవాడు ఫల్గును; డవళ్యము గెల్తుమనంగరాదు; రా

అచ్చికినై పెనంగిన బలంబులు రేండును గెల్వనేర్చునే?

హెచ్చగుంగుందగుందొడరు టెల్లవిధంబుల కోర్చుటట్టుగా

కిచ్చందలంచి యొక్క మెయినిత్తఖిం బొందగుచేత యుండగున్‌. వ నయనం 160

అలవావాయలయాయయయాాంల మ్రనునలారతో నీతికథలు = కానాల “అర్జునుడు వచ్చినాడు. మనమే గెల్తుమని' చెప్పలేము. ఒక వస్తు లాభమునకై . యుద్ధముచేసిన సైన్యములు రెండును గెల్బుట సంభవింపనిది జయమగుగాక!. అపజయమగుగాక! ఏదయినను సహింపవలెను. లేదా ఇప్పుడే ఆలోచించుకొని సంధియైనను చేసికొనవలెను అన్నాడు. నేను మాత్రము రాజ్యభాగమియ్యను పొందన్నది కుదరదు. " యుద్ధమే” అన్నాడు రారాజు “సరే!” అని తక్కినవార లాప్పుకొనిరి. అర్జునుడు యుద్ధమునకువచ్చి భీష్మాచార్యుల పాదముల వద్దకు రెండు బాణములు చెవులవద్దకు రెండు బాణముల వేసెను, అవి ప్రణామమును. కుశల ప్రశ్నకు తెల్పునవి. అందుకు వారు సంతోషించిరి. అర్జునుడు దుర్యోధనుని మీదికి రథము తోలించగా భీష్ముడు “ఇతనితో నిష్పుడెవరును నాగ లేదు దుర్యోభనునకు సాహాయ్యముగా పోవలె” నని చెప్పి సేన నామూలకు పంపెను. తాటిచెట్టు ధ్వజముపై గలవాడు భీష్ముడని అర్జునుడు ఊత్తరునకు తెల్పి “తాతగారితో నేను ముందుగా యుద్ధము చేయరా”దని చెప్పెను. తరువాత వరుసగా కర్ణ ద్రోణ, కృపాచార్యులతో యుద్ధము చేసి భీష్మునితో అర్జునుడు కలియబడెను, ం ఆ తాత మనుమల యుద్ధమును చూడముచ్చటగా దేవతలు సైతం చూచిరి. అర్జునుడు భీష్ముని విల్లు త్రుంచగా అతడు జటలు లాగుటచే కోపించిన సింహంవలె గర్జించి కోపించి అర్జునునిపై కురికి శరపరంపరలు వేసెను. కాని అర్జునుడు వాటినెల్ల దారి మధ్యలోనే ముక్క ముక్కలు చేసి భీష్ముని మూర్చ పోగొట్టెను సారధి రధమును మరొకచోటికి తోలుకొని పోయెను. చిట్టచివరకు అర్జునుడందరి తలపాగలను ఉత్తరునిచే తెప్పించెను. కాని భీష్ముని తలపాగ మాత్రము తీయిచంలేదు. అతనికా యస్త్రోప నంహారము తెలియ్యును. అందుచే వారిజోలికి పోవలదని చెప్పెను. అతడు విరాట నగరమునకు మరలిపోగా భీష్ముడు దుర్యోధనునితో “నాయనా! ఇక మనము మన నగరికి పోదము. ప్రాణము. తీయక తలపాగ లూడదీసుకొని మనల వదలినాడు. ధర్మాళ్ళ్కుడు. కాదూ అర్జునుడు” అని చెప్పుటతో రారాజు తెల్లమొగము వేసికొని ఇంటికి మరలెను. ” ఎన్నోసారులు భీష్ముడు దుర్యోధనునకు హితవు చెప్పెను. సంధియే కర్తవ్యమని, నరనరాయణాం శసంభూతులైన శ్రీ కృష్ణార్జునుల తేజోమహిమ నెట్టివారును గెలువలేరని యెన్నో విధముల చెప్పెను. దుర్యోధను డాతని హితోక్తులను పెడచెవిని పెట్టవాడు. సంజయునిద్వారా రాయబారము వచ్చిన తరువాత దుర్యోధనుడు తోను చెప్పిన మాటలు విననప్పుడు భీష్ముడు “నీవు చెప్పినమాట నేపాటియు పాటించవు. కౌరవులు.పోయెడికాలము ననగా ననన

అలజజాాఆయాంంయాలడా మహాభారత నీతి కధలు - లాలా దాపురించినది. ఇళ రేపు “వారు చచ్చిరి, వీరు చచ్చిరి” అను మాటల నీ చెవులతోనే

విందువుగానిలేనీ కాదుర్మార్గులయిన శకుని కర్ణ దుశ్ళాసనులు చెప్పెడి మాటలేకాని నా_ మాటలు రుచించవులే” అని పరుషముగా పల్కుటతో పాపము! ధృతరాష్షుడు కోపించి “ఏమయ్యా ఏమిటా మాటలు? నిండు నభలో ఇట్టిమాటేనా నీ వాడదగినవి?” అని మందలించినట్లనెను భీష్ముడు దానికి “నేన్న మాటలే నీకు కష్టము కలిగించను, కాని నీవాని చేష్టలు చూచితివా? వారిలో శతాంశమైనను పోలడు వారిని గెల్తునని బీరములు పల్కును వారిలో ఒక్కొక్కడనేక యుద్ధాలలో గెల్బినారు, అంతెందుకు గోషయాత్రలో ఉత్తరగోగ్రహణ కాలమున ఒక్క అర్జునుడు వచ్చి చావగొట్టినపుడు ఇతడు తమ్ములు. ఆ కర్ణుడు నేమి చేయగలిగినారు? పనేమిటో తెలియక నోటికి వచ్చినట్ట్లు ప్రేలుచుండును నీవు వాటినన్నిటిని చెవియొగ్గి వినుచుందువు” అని ధృతరాష్ట్రుని మందలించెను ద్రోణాచార్యుడు “రాజా! భిష్మునకు మీపై కోపమా] మీరందరు నతని సంతొనంలోని వారు కారా? అతని మాటను వినుడు కులధ్వరసము కాకుండునట్టు చేయుడు” అని చెప్పెను. రాజరాజు యుద్ధమునకే నిశ్చయించినాడు. అతని యూహ “తనకు కర్గుడు బోణుడు, భీష్ముడు మున్నగు మహాబలశాలులుండిరిగదా” అని, కాని వారందరును మహా బలశాలురే ఎంత బలమున్నదో అంతకంత కోపమాశ్చర్యము లున్నవి ఒకరికొకరికి పడదు. ఒకనాడు దుర్యోధనుడు తమ సైనికుల బలములు చెప్పు చుండగా "కర్ణుడు “నేనాక్కడనే వీరందరు చూచుచుండగా పాండవులను తరుమాడుదును” అనెను భీష్ముడు “ఏహో! మాటలకేమి ఊరక నోటికి వచ్చినట్టు ప్రేలుట కాదు, కార్యము సాధింపవలె నీవలన నెంతగునో ఎరుగుదుములే! పొండవులు.కూలుదురా? కౌరవులే కూలుదురు నీ నోటిచే టెందుకులే! ఒక వేళ ఇంద్రుడు శక్తి యిచ్చెను కదా అని కాని సర్బృముఖబాణమున్నదని ॥ కాని గర్వింపకుము వాటిని శ్రీకృష్ణుడు ధ్వంసము చేయును” అని చెప్పి ధృతరాష్ట్రునితో జ్ఞాతులు కలిసియున్నచో లాలించునుకాని తగవు లాడినచో ఏ పనియు సాగదు ఇదివరకొకసారి మేమందరము కలిసీ అడవి కేగితిమి, అక్కడ చేరరానిచోట తేనెపట్టున్నది దాని తేనె త్రాగినచో జరారోగములుండవని అక్కడివారు చెప్పిరి. అది విని కొందరు కోయలు దాని నందుకొనుటకై ప్రయత్నించి ఒకరినొకరు త్రోసికొని చివరి కందరును చచ్చిరి, అట్లే ఎవరికివారు రాజ్యమేలవలెనను కొనువారేకాని రాబోవు బాధలను చూచుకొనరు

అదే తెలివితక్కువ” అనుటతో ధృతరాస్ట్రడు కొడుకును మందలించెను.

నాడో

నానారాాంవావానాయయయయియయలయియలల మ్రద్రుతరంరల్ర బ్రతి కథలు ల అాాాాాాాాాాాాాారాకానవావవావానమనన కర్ణున కామాటలు వినునరికి కోపం వచ్చినది, “ఇదిగో నేనిదే ప్రతిజ్ఞ చేయుచున్నాను. యుద్ధములో భీష్ముడు చచ్చు వరకు నేను అస్త్రశస్త్రములను ముట్టను. ఇక నీ కే రీతిగా నా సహాయ ముండునే చూతును”" అని అక్కడ నుంచి లేచి పోయెను. అది చూచి నవ్వి భీష్ముడు “అంతేకాక, కర్టుడింకేమి చేయగలడు? ఇతడు గట్టిగా తలచుకొన్నచో పాండవులు బ్రతకగలుగుదురా? ఇదిగో నా మాట విను ఈ మహావీరులందరు చూచుచుండగా నేను కొన్ని వేలమంది మహావీరులను చంపెదను. తర్వాత కర్ణుని యుద్ధము చూతువుగాని” అని తను చేయుపని చెప్పెను. ఆ మాటలు ద్భుర్యోధ్యనునికి రుచింపలేదు. అతనికి కర్ణుని మీదనున్న మక్కువ తాతగారి పై లేదు అతడు కూడ లేచిపోయెను. శ్రీకృష్ణుడు రాయబారమునకు వచ్చుచుండెనని విని దుర్యోధనుడు కృష్ణుని బంధింపదలంపగా భీష్ముడు, ధృతరాష్ష్రునితో నీ కొడుకు ప్రాణం మీదికి వచ్చునట్టి పని చేయ జూచుచున్నాడు. ఇది మనకు మేలుకాదు. కృష్ణుని కట్టుట ఇతనికి సాధ్యమా? అట్టి చెడుకార్యము తలచినందున ఇతనికి నాశనము కల్గును” అని అక్కడి నుండి లేచిపోయెను. కృష్ణుడు సభలోనికివచ్చి రాయబారము నడుపునపుడు భీష్ముడు “నీ తండ్రి చెప్పినట్లు చేయుము మన వంశము పవిత్రమగునట్లుగా ఆ శ్రీహరి కృష్ణుడు వచ్చి చెప్పుచున్నప్పుడు వినకుండుట భావ్యముకాదు చేటు వచ్చును. అతడు చెప్పినట్లు వినుము. మనకు మేలు కలుగును” అని చెప్పి దుర్యోధనుని ఒప్పించజూచెను. కాని అతడు వినలేదు. కృష్ణుని కట్టుటకై ప్రయత్నములు చేసెను. కృష్ణుడది గమనించి విశ్వరూపమును ప్రదర్శించెను. దానిని చూడగల్గిన పుణ్యాత్ములలో భీష్ముడొకడు. భగవానుడు తనమీద భక్తి కల్గిన వాడగుటచే భీష్మునకు తన విశ్వరూపమును చూడగల్గునట్లు దివ్యదృష్టి నిచ్చెను. దాని సాహాయ్యమున నతడు శ్రీ భగవానుని కన్నులారా చూచి ధన్యుడయ్యెను. తరువాత ఉభయ సైన్యములును సిద్ధములైనవి దుర్యోధనుడు భీష్మునితో “తాతగారూ! మీరు పెద్దలు, మన సేవలో ఎవరెవరేయే తరహాలోని వారో చెప్పుడు” అని కోరెను. అతడు తనను గూర్చి మాత్రము చెప్పుకొనక, తక్కిన యోధుల తరతమ భేదములను చెప్పెను. అందాతడు కర్దుని మాత్రము 'అర్ధరథుడని చెప్పెను, అతిరధుడు, 'సమరథుడు, సమరథ్గక్రేష్టుడు, మహారథుడు. అతిర్రథోత్తముడు, అర్ధరథుడు అను భేదములు -వారి బలాబలములబట్టి యున్నవి. కర్ణునట్లు నిర్ణయించుటతో అతనికెంతో కోపము వచ్చినది “హితుడని నిన్ను నమ్మవచ్చునా? నాపై రారాజునకు ఫ్రమే లేకుండునట్లు రత డడ

వవవంవోాంయయాయడాంయాంయాజజాయి. (వర్ధా రప శ్రగ్రి బో్టరద్ర. అ ాాారానాకాడాాయనావవాలాంను చేయజూతువా? ఏళ్ళు ముదిరినవి. మతి తప్పుచున్నది అందుచే నోటికి వచ్చినట్లు మాట్టాడితివేమో?” అనుటతో భీష్ముడు కోపించి “నేనింతవరకు నెన్నడు నా బలమును గూర్చి చెప్పుకొనలేదు. నీవీనాడు చెప్పించుచున్నావు,. నా బలమెంతటిదో నీ గురువైన పరశురాము డెరుగును. ఇంకను ఎందరో రాజు లెరుగుదురు. లేదా, కత్తి చేతితో నుండెను కదా! రమ్ము! యుద్ధములో నా బలమెరుగుదువుగాని. సందేహ మేటికి?” అని అనవలసిన నాలుగు ననివేసెను. దానితో అతడు నోరు మూసికొనెను. తరువాత దుర్యోధనుని కోరికపై పాండవ 'సైన్యములోని వీరుల బలా బలముల కొలది వారి తారతమ్యమును చెప్పెను. అందు కృష్ణార్ణును లింతవారని చెప్పలేనని చెప్పెను. అదిగాక! నే చెప్పినవారే కాక యింక నెందరో మహావీరులున్నారు. వారినందరిని పేర్కొనుటకు సమయం చాలదు” అని చెప్పి “ఇందరు మహావీరులును నా ముందరికి వచ్చి నిలువజాలరు. కాని ఒక్క శిఖండి మాత్రం నాకు జంకడు. దానికి కారణమున్నదని దుర్యోధనుని కోరికపై అతని జన్మవృత్తాంతమును చెప్పి “నేను స్త్రీయె తర్వాత పురుషుడైనవాని మొగము యెప్పుడు చూడనని ప్రతిజ్ఞ పట్టినందున అతని మొగము చూడ”నని చెప్పెను. అంతటితో ఆగక దుర్యోధనుడు “పాండవ సేనని తము రెన్నాళ్ళలో చంపగలరు? ద్రోజూదు లెన్నాళ్ళలో చంపగలరు?” అని యడుగగా, నతడు “నా ఛక్షినే చెప్పుదును. తక్కినవారు వారో వారి శక్తి సామర్థ్యములను చెప్పుదురు. నేనొక్కరోజు వేయిమంది చొప్పుననే యుద్ధముచేయు రోజులలో నా వంతుగా పదివేలమంది మహావీరులను చంపుదును. పేన నడుపగలను. ఇక పాండవసేన మొత్తం నొక్క నెలలో చంపగలను” అనెను. కర్టుడు మాత్రం “నేనైదు రోజులలో చంపగల”ననగా. భీష్ముడు వికటంగా నవ్వి “వాయనా! నీకు తోచినట్లు పల్కుము; మన రాజు వద్ద నీకడ్డేమున్నది? ఇక్కడ అర్జుడున్నచో నీ బండారం బయటపడెడిది” అని మాటలోనే అతని మాటను ఖండించెను. ఈ రీతిగా ఏలకో భీష్మకర్జుల కిద్దరికి పడెడిది కాదు.

  • ఈ కథనంతను చారులద్వారా విని, పాండవులు తూడ తమ శక్తి సామర్థ్యములను చెప్పిరి అందర్జునుడు “నేనొక్క నిమిషంలో నందరిని భస్మం చేయగలను, అది పాటవతాస్త్ర శక్తి కాని ఆ యస్త్రము నేయుపయోగించినచో తక్కిన అస్త్రముల ప్రయోజనము మేముండును) తక్కిన వీరుల బలమేమి కన్చడును? భీష్మునికి దాని శక్తి తెలియదు. అది రహస్యం” అనీ చెప్పెను. అనగా భీష్ముడెరుగని డొక్క సాశుపోతాస్త్రమే అన్నమాట,

నక న

వాడా మహాధారతటీత కథలు -/ లాలా

అది యుద్ధం మొదటి రోజు కౌరవ సైన్యం బదునొకండక్షాహిణులు - పొండవ 'సైన్య మేడక్షాహిణులు - మొత్తం పదునెన్మిదక్షాహిణు లున్స్పది, కౌరవ సేనకు ప్రథమ "సేనాపతి భీష్ముడే. ప్రాద్దుననే సేనలు వచ్చి యుద్ధభూమిలో నిలువబడినవి. ఇప్పుడు భీష్ముడు “ఓ మహావీరులారా! క్షత్రియులకు యుద్ధం స్వర్గమునకు దారియే పూర్వపు రాజు జెంతోమంది యుద్ధనిహతులై వీరస్వర్గము నందిరి. రోగము వచ్చి చచ్చుట కంటె వేరే పాపం లేదు. రాజులకు యుద్ధభూమియే పుణ్యం పండెడి పంట భూమి, మీరుత్సాహంతో +

. పనిచేయుడు!” అని ప్రోత్సహించెను.

పాండవ సైన్యమును వచ్చినది. ధర్మరాజు ముందుగా రథం దిగి భీష్ముని వద్ద కేగెను. అతని పాదములకు నమస్కరించి “అయ్యా! మీతో యుద్ధం చేయవలసి వచ్చినది. నా కనుజ్జ్ఞయిండు” అని కోరెను. భిష్ముడు “నీవు న్యాయమెరిగి వచ్చితివి కనుక దాని లేకున్న శాపమిచ్చి యుండువాడను. భయము లేదు. నీ కోరిక ఏమి?” అనుటతో ధర్మరాజు “మిమ్ము యుద్ధమున గెల్బెడి సుపాయము చెప్పుడు” అనెను. భీష్ముడు నవ్వి “నన్ను గైల్బ్చుట దేవతలకు సైతము సాధ్యం కాని పని” అనుటతో “అందుచేతనే కదా అడిగినది" ' అని ధర్మజుడు మాటలో మాట కలిపెను, “ఆది అట్టు అడిగినచో చెప్పకుందునా? తీవ్ర యుద్ధం మానినప్పూడు గాని నన్నెవరు నెదిరింపజాలరు” అని చెప్పెను, అట్లు తను పడెడి రీతిని చెప్పెడి వారుందురా?

భిష్ముడు సేనాపతియై మొదటి రోజున మానుష వ్యూహము పన్నియు, రెండవ రోజున శ్రాంచవ్యూహము పన్నియు, మూడవనాడు గరుడ వ్యూహము పన్నియు యుద్ధం చేసెను. .

అందులో సమమైన ఉజ్జీలతో యుద్ధము చేయుటకు సరదాగా ఉండును. బలము కలిగి, సమయము వచ్చిన ఎవడు చూపకుండ నుండగలఢు? రెండవ, నాడు భీష్మార్డునులు గట్టిగొనే యుద్ధము బేసిరి మూడవరోజున శ్రీకృష్ణుడర్ణునుని పురికొల్ఫగా అతడు భీష్మునికి తన ప్రతాపమును చూపుదునని అతనిమీవికి కలియబడెను, భీష్ముడు మహాపరాశక్రమశళాలి. మునలివాడైనను అతని నెవ్వరును ఎదిరింపనేలేరు. అతని బాణపు దెబ్బల కర్టునుడేకాక కృష్ణుడే ఆగలేకపోయెను. అతనికి కోపము వచ్చినది చక్రము చేతబట్టి అమాంతముగా. భీష్ముని మీది కురికను అంతట భూమి అదరినది. భుజము 'పై పీతాంబరము చెంగుక్రిందికి తూలినది సింహనాదం చేయుచు భీష్ముని మీదికి మదపుటేనుగు మీదికి సింహమువలె ఉరికెను, న ాంక లూ

ఆ నువఫూరతనీతి కథలు - లాలా శ్రీకృష్ణుని రౌద్రము చూచి ఉభయ సైన్యముల వారును హడలిపోయిరి. పులిని చూచిన లేళ్ళువలె కౌరవ సేనలోనివారు వెనుకకు పారిపోయిరి. భీష్ముడు నెదరు-బెదరు లేక “కృష్ణ! రారమ్ము నన్ను కృతార్ణుని చేయుము. నీ యిష్టం వచ్చినట్లు నన్ను గెల్వుము" ' అని అతనికి స్వాగతమిచ్చెను. అర్జునుడు వచ్చి బ్రతిమాలుటతో కృష్ణుడు వెనుకకు మరలెను, నాల్గవనాడు మేఘమాలాకారమున, అయిదవనాడు మకర వ్యూహమున సేనను సిద్ధపరచెను. భీష్ముడారవనాడు ్రౌాంచవ్యూహమును బన్నించెను. ఏడవనాడు మండల వ్యూహము, ఎనిమిదవనాడు, కూర్మవ్యూహమును మోహరించెను తొమ్మిదవనాడు యుద్ధమునకు రాగానే దుర్యోధనుడు “మనతాతగారు పాండవులను చంపి, మనకు రాజ్యమిచ్చెదనన్నారు. ఈనాడు మనమందరము నాతనికి సాయమగుద” మని పురి కొల్పెను అది విని కూడ లెక్క సేయక భీష్ముడు సర్వతోభద్ర వ్యూహం పన్ని యుద్ధం చేయుచుండెను,

, దుర్యోధనుని మాటలతో భీష్మునంతవానికుత్రోశము వచ్చినది. ఆనాడు మదపు లేనుగు ఉద్యానవనములోని కెగబడి విరచునట్లు పాండవ సేనలను చిన్నాభిన్నము చేయుచుండెను. అతని ధాటి కాగలేక వీరులు పారిపోవుచుండిరి. అది చూచి అర్జునుడు రథము నాతనివైప్తు మరలింపుమని కృష్ణునితో చెప్పి యుద్ధమారంభించెను.

అర్జునుడు మహోద్రేకముతో భీష్మునితో కలియబడి పోరు ఘోరముగా చేయుచుండెను. కొంతసేపగుసరికి అర్జునుని కాయానము భీష్ముని కుత్సాహము వచ్చినవి. అది కృష్ణుడు సహించలేకపోయినాడు ఏ రీతిగానైనను నీనా డర్జునుని రక్షించి తీరుదుననుచు చేతిలోని పగ్గములను కాడికట్టు పై నుంచి తోలుకర్ర (కొరడా) అక్కడనే పెట్టి అమాంతముగా (క్రిందికురికి పైనున్నపచ్చని పటము జారుచుండగా భూమి కంపించునట్లు భీష్ముని మీదికి వెళ్ళుచుండెను, అప్పుడు కౌరవ సేనలోని వారెల్లరు “భీష్ముడు చచ్చెనోయి” అని కేకలు వేయనారంభించిరి.

భీష్ముడు మాత్రము చిరునవ్వు నవ్వుచు “మహాత్మా! పుండరీకాక్షారమ్ము! వేగమే రమ్ము! నీవు చంపినచో నాకు యిచ్చట శాశ్వతకీర్తి ఆముష్మికమున సద్గతియు వచ్చును, నాపై దయజూడుము నీ యిష్టము వచ్చినట్లు చేయుము” అని తలనొగ్గెను వెనుకనేవచ్చి అర్జునుగ్రాత్రన్స చేతులు పట్టుకొని “బావా నేను యుద్ధం చేయనని ప్రతిజ్ఞచేసి ఇప్పుడు నీవే మాటతస్పిన్స మర్యాదగా నుండునా? రథమెక్కుము; ఇప్పుడు భీష్మునిపాటు చూతువుగాని ననన నన న

అానవావాంంవాావాాట మవాభారతనీతి కథలు - ౯ లాకు రావయ్యా! నాకు మాట దక్కించుము” అని బ్రతిమాలెను అప్పుడు కృష్ణుడు వెనుకకు తగ్గెను. అప్పటికే ప్రాద్దుగుంక వచ్చినది. కృష్ణార్జును లలసియున్నారు. బీమసేనాదులు హడలిపోయిరి. అందుచే ఇక నారోజునకు భీష్ముడు యుద్ధమును మానెను. ఆనాడా యుద్రేకములోనే పదివేలమంది మహారథులను చంపెను ధర్మజాదులను హడలగొట్టెను. వారిది ధర్మయుద్ధము పగలు యుద్ధము చేసికొనుట; రాత్రి బంధువులను పరామర్శించుకొనుటయు వారికా రోజులలో దైవికకృత్యమైనది యుద్ధము మానినది మొదల మరల (్రారంభించువరకు వారుబంధువులే. తొమ్మిదవనాటి రాత్రి దర్మరాజాదులు గుమిగూడిరి, ఆనాటి యుద్ధములో ధర్మరాజునకు హడలు పుట్టినది. కృష్ణునితో “అయ్యా! తాగారిముందు బ్రతుకు లేము. రేపెట్లు ప్రొద్దుగుంకునో తెలియకుండనున్నది. నీవాదుకొనవలె” ననెను. దాని కతడు “నీవు వెళ్ళి భీష్ముని చనిపోవు నుపాయమడుగుము” అని ప్రోత్సహించెను ధర్మరాజు “భీష్ముడు యుద్ధమునకు ముందుగా “దుర్యోదనుని తరపున యుద్ధము చేయుటకును నాకు హితవొక్కటి చేయుటకును మాటయిచ్చి యున్నాడు దానిని పురస్కరించుకొని యీ రాత్రియె పోయి అడుగుదును” అని అతడప్పుడే భీష్ముని వద్దకు వెళ్ళెను. అంత యుద్ధము చేసినను అతనికే అలపు సాలపు లేదు. ధర్మరాజు తమ్ములతో సహా వచ్చి నమస్కరింపగా భీష్ముడు వారలను చూచి “ఏమి? యిష్పుడు మీఠందరును వచ్చితిరేమి? ఎంత దుష్కరమైనను మీకు చేసి పెట్టెదను చెప్పుడు" అనెను. =... ధర్మరాజు దీనముగ్గా “తాతగారూ! మా సేవలకు భయము తగ్గు మార్గమేదయిన నున్నచో సెలవిండు” అనగా అతడు “నన్ను గెల్చినచో అంతయును సాధ్య మగును” అనెను. ధర్మరాజు మంచి "ఉఊపాయమే చెప్పిరి. ఆరుద్రుడు త్రిశూలము చేబట్టి వచ్చినను. మిమ్మెదిరింపలేడు. కావున ఏదైన ఉపాయము మీరే చెప్పవలె"నని యడిగెను. భీష్ముడు చిరునవ్వు నవ్వుచు “అదా నీకు కావలసినది? నే నాయుధములు వాడుట మానినప్పుడు కాని యెవడును జయింపలేడు, నాకొ నియమమున్నది “ఆయుథము విచిడినవానినిజెండా దింపినవానిని స్త్రీని, స్త్రీగా కొంతకాలమున్న వానిని స్రీ నామము కలవానినీ త్రలగుడ్డ విడిచినవానిని అన్నదమ్ములు లేనివానిని స్త్రీని, పుత్రులు లేనివానిని చూచినచో వాని కెదురు నిలబడి యుద్ధము చేయును. మీలో శిఖండి వున్నాడే అతడు ముందు ప్రీమైవుట్టి తర్వాత మగవాడయినవాడేకదా వానిని ముందుంచుకొని అర్జునుడు యుద్ధము చేసినచో 67 లాం

అలాావావాాాంణంాయాలా మపారత నీతి కథలు - (లాలా నన్ను గెల్బుటకు వీలగును. తర్వాత కౌరవులను గెలువ వచ్చును” అని యుపాయము చెప్పెను. బ్రశుకుజీవుడా అని పాండవులు మెల్లగా వారి గుడారముల కేగిరి అట్టు తాము చచ్చు నుపాయము చెప్పెడి శూరు తెవరయిన నుందురా? అభిమానమే యుండుగాక! మరి పది కాలముల షాటు బ్రతుకవలెనని యుండునుకాని బుద్ధిపూర్వకముగా ఎవడయినను చచ్చుట కిచ్చిగించునా? అంతటిధీరుడా దేవవ్రతుడు. మరునాడు పొండవులు శిఖండిని ముందిడుకొని సైన్యములను పన్ని యుండిరి. భీష్ముడు ఎరిగియున్నందున నే విచారము లేక యుద్ధభూమికేగెను. అతని నెదుర్కొని శిఖండి మూడు బాణములతో కొట్టెను. అప్పుడతడు చిరునవ్వు నవ్వుచు వెనుదిరిగి - ఎవ్వతెనేని ధాత సృజియించెందగన్‌ మగవానింగా(గ నా కొవ్వమిండేసి యట్టి నిను మగ్మలినేయంగనొల్ల నాపయి గ్రొవ్వెసలార నీవు శరకోటి వెసం బరిగించిలేని నే . నవ్వుదుంయయని కోపము మనంబునళబుట్టదసూ శిఖండినీ, అనుటతో ఆశ్రడ్రు' నవ్వి “భీష్ముని కొట్టనారంభించెను. అప్పుడిక భీష్ముడు దుర్యోధనుని పరిచి “నీకు పదివేలమందని చంపుదునని మాట యిచ్చితిని అట్లు చేసితని నీ బుణము శీరీనది వాక పోగాలము వచ్చినది ఇక ఏలకో నా యుత్సాహము తరుగుచున్నది. ఫౌండవులు మానవ్వల చేతిలో చచ్చు వారుకారు అయినను నా యోపినకొలది యుద్ధం చేసెద” ననెను భీష్ముని రక్షింపవలెనని ద్రోణాదివీరు లెందరో వచ్చి కాచుచుండిరి. కాని ద్దైవమ్సు చిపరీతమైనప్పుడు వారేమి చేయగలరు? చుట్టుముట్టిన వీరులను పారద్రోలి అర్జునుడు భ్రీషని ప్రై ఇఖండిని ముందిడుకొని వెళ్ళెను భీష్కు డాతని చూడనందున వెనుదిరిగి యృద్ధమారంభించెను. అప్పుడర్ణునుడు శిఖండి బాణములతో పాటు తన బాణములను వేయుచుండగా భీష్ముడు “ఇవి అర్జునుని బాణములే, లేకున్న ఇంతగాటముగా సాట్టవ” అనుచు నొచ్చుచుండెను, ఎంతసేపని-సైపగలడు? సాయంకాలము కావచ్చినది. భీష్కుడా బాజము లాలి నిండుగా నాటి సూర్యుడస్తాదకి చేరునట్లు వెనక్కు పడెను. అతడు క్రిందికి పడ్షిపుకుండ ఊతగా బాణము లాపినవి. దేవతలాత డెక్కడ దక్తిణాయనమున చిపోన్యన్తో అని భయపడగా భీష్ముడు “నా తండ్రీ యిచ్చిన వరప్రభావమున నా గజములు నా స్వాధీనంలో నున్నవి. నేనుత్తరాయణం వచ్చు వరకు చనిపోవను” అనెను. త్‌ల్పు సంశోషంతో వెళ్ళిపోయిరి. త్‌ న

రాలా మహాభారత టీతి కథలు - తా | భీష్ముడు పడెనన్న వార్త పిడుగుపాటుగా తెలిసి మూర్చపోయెను. ఒకరననేల? కౌరవ సేనలోని వారెల్లరును కన్నీరు కార్చిరి. అంతటి మహాయుద్ధమున సేనను పదిరోజులట్లు రక్షించిన మేటివీరుడతను అతనికై విచారించుట గొప్పకాదు.

సాయంకాలమైనది. యుద్ధమాపబడినది. ఇరు సేనలవారు కవచములు తిసివేసి వారు - వీరనక అందరు నేకమ్లై భీష్ముని చుట్టియుండిరి అందరును ధనుర్పాణములవిడిచిరాగా అర్జును డొక్కడు మాత్రము ధనువు చేబట్టి వచ్చెను. అది గర్వము వలనకాదు; దానితో పనియున్నది.

అప్పుడు తనకు నమస్కరింప వచ్చినవారి నభినందించి, భీష్ముడు తలను మోపుకొనుటకు తలగడ లేదనగా రాజు తలగడలు తెప్పించుటకై భటుల పంపెను. ఆదిచూచి చిరునవ్వుతో భీష్ముడర్జునుని పిలిచెను. అతని భావమెరిగి కన్నుల నీరు పెట్టుకొనుచు తలగడగా నుండునట్లు మొనలు పైకుండునట్ట్లు భాణములవేసెను. అవ్ల శరతల్పమునకు సరియైన తలగడయైనవి. అందులకు గాంగేయు డానందీంచెన్ను

తరువాత నతడు “నేనుత్తరాయణము వచ్చువరకు జీవించును నన్ను రక్షించుట కెవరివైన నియమించుము” అని చెప్పగా దుర్యోధనుడు తగినవారిని నియమించెను. శల్య చికిత్స చేయువారు వచ్చి చికిత్స చేసెదమనగా వలదని భిష్ముడు వారిని పంపివేసెను. అంతలో అతనికి దాహమైనది. ఆ మాట చెప్పుటతో దుర్యోధనుడు మంచినీరు తెచ్చుటకై భటులనంపెను. భీష్ముడు నవ్వి “శరతల్పముపై నున్నప్పుడు భూజలముతప్ప మరి యేనీరు త్రాగరాదు” అనెను అందరు నొకరిమొగ మొకరు చూచుకొనిరి అంత అర్జునునికేసి చూచి “బాణములబాధ హెచ్చుగా నున్నది. మంచినీ రిమ్ము” అనుటతో అతడు పర్జన్యమంత్రముతో అభిమంత్రించి బాణమును భూమిలోనికి వేసెను. దానితో భూమి నుండి నీటిధారవచ్చి భీష్ముని నోటిలో పడినది. అదిచూచి కౌరవులాశ్చర్యపడిరి. అదిత్రాగి భీష్ముడానందించెను. అర్జునునితో “నాయనా! నీవు నరుడవని, కృష్ణుడు నారాయణుడని యెరుగుదను. నీతో వైరము వలదని యెంతజెప్పినను ఇతడు వినడుగదాగ” అని. దుర్యోధనునితో “రాజా! ఇప్పుడై నను నీవు వీరితో సంధి చేసి కొనుము. మిగిలినవారైనను బ్రతుకుదురు” అని చెప్పెను. ఇదివరకు వినని వాడి వేళ వినునా? కాని విన్నట్టుగా నటించెను. ఎవరిదారిని వారు పోయిరి.

అందరును వెళ్ళిన తర్వాత ఎవరును లేని సమయము చూచి కర్ణుడు వచ్చెను. అతడు వచ్చి భీష్ముని పాదములకు నమస్కరించెను. “అయ్యా! కోపము మాని నన్ను న

ఆ నువారతనీతి కథలు -(ాా మనింపుము” అని వేడెను అంతట భీష్ముడతని కౌగిలించుకొని, రక్షకులను కూడ పొమ్మని, ఏకొంతమున “నిన్ను చూచి కోపింతు ననుకొంటివా? నాకు నీమీద నెప్పుడును కోపము లేదు నిష్థూరమైన మాటలతో నిన్ను చూచి మంచి దారిలో పెట్టుటకై శిక్రసేయుదు, నంతేకాని ఆది కోపమనుకొనకుము” అని చెప్పి, అప్పుడతనితో “నీవు కుంతీపుత్రుడవు కాని రాధేయుడవు కావు నాకీ విషయము రహస్యముగా వ్యాస మహర్షి తెల్పియున్నాడు నీ ముఖవర్చస్సు నాకట్లే తోపించినది ఇప్పుడు అందరితోను సంధి చేసికొనుమని చెప్పితిని వారంగీకరించిరి, నీవు కూడ సంధి కొప్పుకొనుము” అనుటతో - కర్గుడు నేనిదివరకెన్నో ద్రోహములు వారికి చేసితిని ఇప్పుడు సంధి అన్నచో వారెట్లంగీకరింతురు కాన దుర్యోధనునికి యుద్ధము చేయుదునని మాట ఇచ్చి తిరుగవచ్చునా? సేవా ధర్మము నిర్వహించునట్లుగా శత్రువుల జయించుటకై నా కనుజ్ఞయిమ్ము” అని కోరెను. అతని కోరికను భీష్ముడు సంతోషించి “నాయనా, నీ పరాక్రమము నేనెరుగుదును, నీ భుజబలమే గదా దుర్యోధనుని కరత బలం నిచ్చినది. వెళ్ళి యుదాత్తముగా రారాజును శేది హీతవో అది చేయుము అనుమానము లేకుండుము నేనిదే ఆజ్ఞను యిచ్చుచున్నాడనుి అనుటతో భీష్ముని యౌదార్యమున కెంతో సంతోషించి వెళ్ళిపోయెను పదునెన్మిది రోజులలో భారతయుద్ధము పూర్తియైనది ధర్మరాజు పట్టాభిషిక్తు డయ్యెను. ఒకనాడు శ్రీకృష్ణుడు ధర్మ రాజాదులతో భీష్ముడున్న చోటికి - కురుక్షేతమునక్తు

  • వచ్చెను, అచ్చట వ్యాసనారదవాలభిల్యాది మహర్షులు భీష్ముని చుట్టును కూర్చుండి ఏదో సద్గోస్టి చేయుచుండిరి, అంతట శ్రీకృష్ణుడు రాగానే భీష్ముడెన్నో రీతుల భగవంతుని స్తోత్రం చేసెను అతడు సంతోషించెను ఉత్తరాయణము వచ్చిన తరువాత నీవు నీలోకమున కేగవచ్చునని” చెప్పి, “ఇతడు చాల విచారముగానున్నాడు. ఇతనికి ధర్మోపదేశము చేయు” ' మనెను, భీష్ముడు “దేవా ఒక మూల బాణముల బాధ హెచ్చుగా నున్నది మనస్సు దాధితమై వశము తప్పి యుండగా నేనెట్లు ధర్మములు చెప్పుదును? ' అని చెప్పెను. శ్రీ కృష్ణుడాపాటి యుపశాంతి చేయలేడా! మరేమియు ఫరవాలేదు నేను మీక్సు మూడు వరము లిచ్చుచున్నాను. ఒకటి బాణముల బాధయుండదు రెండు. ఆకలి, దప్పిక బాధలుండవు, మూడు నీవేది చెప్పుచుంటినో ఆ విషయము నీకు స్పష్టముగా దివ్యజ్ఞానముల వలన తెలియ్సన్సు. ధర్మరాజునకు ధర్మముల నుసదేశింపు”మని చెప్పి శ్రీకృష్ణుడు వెడలిపోయెను అతనితో పాటందరును వెడలిరి. క నన న న

వ తన్తనాాలునననానమన మహాభారత నీతి కథలు - ౯ ాాాాాానాాననానాలలా. మరునాడు మరల శ్రీకృష్ణాదులతో ధర్మరాజు వచ్చెను. కృష్ణుడు తనకు నమస్కరించిన భీష్ముని కుశల (ప్రశ్నలు వేసెను. అతడు “*నీదయ వలన నాకే భయమును లేదు. కానీ నీవు చెప్పక ధర్మములను నన్ను చెప్పామనుట యేటికి మహాత్మా! అనుటతో కృష్ణుడు “చంద్రుడు చల్లనివాడని చెప్పనక్కరలేదు అట్లే నాకు ధర్మములు తెలియుననుట విశేషం కాదు. నీకా క్రీర్తి దక్కింపగోరి అట్టు చేసితిని చెప్పుము అతడు వినును మీ సంవాద రూపమున లోకులెల్లరును ధర్మముల నెరుగుదురు” అని నియోగించెను. ఆనాడు మైదలు ప్రతిదినము ధర్మరాజు వచ్చి అడుగుచుండుట భీష్ముడు చెప్పుటయుగా వెన్నో ధర్మప్రవచనములు జరిగినవి వారి సంభాషణలో లేని ధర్మములు లేవనియే చెప్పవలెను. ఉత్తరాయణము వచ్చినది. ధర్మరాజ దెరిగి శ్రీకృష్ణునితో వచ్చి భీష్మునకు నమస్కరించి “తాతగారూ! మాఘ మాసము వచ్చినది సూర్యుడుత్తర దిశకు మరలినాడు తమకు సమయమైన"”దని చెప్పెను శ్రీకృష్ణుడు. “నీకై వసువులెదురు చూచుచున్నారు. వెళ్ళివారిని సంతోషపెట్టు"మని యనుజ్ఞనిచ్చెను. భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించి “మ్రా పాండవులకు నీవే ' గతి రక్షించుచుండు ' మని యప్పగించెను. పాండవులతో “అనృశంన్యము (కరినముగా లేకుండుట) సతయమును నిత్యం పాటింపుడు బుత్విక్కులను ఆచార్యులను వృద్ధులను పూజింపుడు” అని ధర్మముప దేశించెను తానిదివరలో రాజులను గెల్చి తెచ్చిన ధనమును (బ్రాహ్మణులకు దానము చేసెను. ప్రాణధారణకాలమున మాఘశుద్ధ నప్తమి మొదలు రోజు కొక్కొక్క ప్రాణముగా పంచప్రాణములు నయిదురోజులు వదలెను ప్రాణవాయువు తగ్గిన ప్రదేశమున బాణము. లూడి పోవుచుండుట చూచి అందరు నాశ్చర్యపడిర్ని చివరి రోజున మాఘశుద్ధ ఏకాదశినాడతడు కపాల భేదనము చేసికొని కొంతమేర పెద్ద తేజస్సువలె పైకి వెళ్ళి ఆకాశమున నింక కనపడకుండ వెళ్ళిపోయెను. ఆ రీతిగా అతడు స్వచ్చంద మరణము కలవాడై తన యిష్టము వచ్చిననాడు (ప్రాణములను పోగొట్బకున్నం దులకు దేవతలు సంతోషముతో పూలవాన కురిపించిరి దుందుభులు మైోగినవి. దర్శరాజు, ధృతరాష్ట్రడును పాదములవైపు సకుల సహదేవులు తలవైప్నపట్టి భీమార్జునులు చామరములు వీచుచు యుయుత్సుడు గొడుగు పట్టుకొని రాగా భీష్ముని భౌతిక దేహమును తీసికొనివెళ్ళి శ్రోతాగ్నితో అగ్ని సంస్కారం చేసి నేతితో మంటలు మండించి అహుతి యగునట్టు చేసిరి. అది రాజమర్యాదలతో సంస్కారము తరువాత నందరును గంగకేగి భీష్మునకు తిలోదకములిచ్చిరి అప్పుడు గంగ స్రీ రూపమున వచ్చి తన ననన ననన

పుత్రుడు పోయినందునకెంతో విచారించినది. ఆమెను వ్యాసుడు నూరడించెను దానితో గంగాదేవి దుఃఖము తొలగి సంతోషించినది. శ్రీకృష్ణాదులందరు నిండ్లకేగిరి భీష్ముడవతార పురుషుడై సకల దర్శవేత్తయై మహా పరాశ్రమశాలియై పేరొందిన చాడు ఇట్టి మహానుభావుని చరిత్ర భారతీయులకెంతయు నాదర్శప్రాయమైనది తంగడ్రికై ఎవడు తన సుఖమును వదలగలడు? అట్టి పితృభక్తి పూరితుడతను అందుచేతనే అతడు 'దేవవ్రతుడు సత్యవ్రతుడు నైనాడు పరమాత్మను సందర్శించిన ధన్యుడైనాడు. అట్టి వీరుల గన్నది మన భారతమాత మనము కూడ ఆమె కడుపున పుట్టినవారమే. వ్‌ ఆ్‌ంథధౌల థి లలి ఖా న న లా ల! గ్లో ఫా... థో జగ్‌ 21583 . . లో చు. వాద్ర ఏఏ ల తల నాలు. “ 172

(మ శ ప. ; న్‌ క షట్షైభ్రటదామోహంకమా్తి న కంథంపాటి రామగోషాలకృన్ణ మార్తి వం సి. | శ | . టైన్‌ ్గ్‌ గ ష్‌ క శస ప్న మహాభారత! “త్లోర్రైషపనలా.. | ఈ సు జో (. క్ర. ఉక. త న (/ మా పి పటే ఏలూరు రోడ్‌, విజయవాడ-2