Telugu madhuravijayamadhuri - anilvaranasi/indianlanguages GitHub Wiki
॥ మ | జ. గా ల ప ల ॥ అతోవ్జ్ న న్ ష్ గ నంపాదకుడు , | దట్స్ .. [ ం _ గుపుట్ల " ( గ్ ఈ వున య్. శ్కునుత్రో సేకరించిన న! | గు లగ్న సొపు "మాలల కోసం పనే ఆనందంతో ఒం. టం బనజఖాకరిన స శ న మనం ౧ ఈూ. | వ్ శ [న క వో ల ॥ క టక టే ల
రజతోత్సవగ్రంథమాల - తృతీయకుసుమం మధురావిజయమాధురి సంపాదకుడు డా! పుల్లెల శ్రీరామచంద్రుడు శ్రీమతి కె. అరుణా వ్యాస్ ్ట సంస్కృతభాషా ప్రచార సమితి హైదరాబాదు 2004
2 ళ్ తుషు మధురావిజయమాధురి స లో ప్రథమముద్రణ : 2004 వెల ; రూ. 25/- ప్రకాశకులు :; సంస్కృతభాషా ప్రచార సమితి 5-4-743, ర (/. నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్, గ్ర హైదరాబాద్ - 500 001. చంజ్యు గంరాలర అక్షరాల కూర్చు : మ! జ్ య హైదరాబాద్-500 016. ముద్రణ : శ్రీకళాంజలి గ్రాఫిక్స్ విఠల్వాడి, హైదరాబాదు - 500 029.
3 శ్రీః తొలిపలుకు
వివిధవిద్యాసంస్థలను నెలకొల్పి నిర్వహిస్తూన్న జి. పుల్లారెడ్డి చారిటీస్ ట్రస్తుకు అనుబంధసంస్థగా సంస్కృతభాషాప్రచారసమితి హైదరాబాదు నగరంలో, 1978లో స్థాపించబడింది. నాటినుండి ఈ సమితి ఆం(ధ్రప్రదేశంలో సంస్కృత భాషాప్రచారకార్యం అవిచ్చిన్నంగా సాగిస్తూన్నది. సమితి చేపట్టిన (ప్రధాన కార్యక్రమం క్రమబద్ధరీతిలో రూపొందించిన ఏడు సంస్కృతపరీక్షలు నిర్వహించి తద్వారా పాఠశాలా-కళాశాలా విద్యార్థులకు, ఇతర సంస్కృతప్రియులకు సంస్కృతభాషను అభ్యసించడానికి తగిన అవకాశాన్ని కల్పించడం. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశం లోని వివిధవిద్యాస్థానాల్లో ఉన్న దాదాపు 250 కేంద్రాల ద్వారా నిర్వహింప బడుచున్నది.
సమితి పరీక్షానిర్వహణకార్యక్రమానికి అనుబంధంగా గ్రంథప్రచురణ కార్యక్రమం కూడా చేపట్టి నిర్వహిస్తూన్నది. సంస్కృతభాషాసాహిత్యాలకు సంబంధించిన గ్రంథాలమ'తెలుగుభాషద్వారా తెలుగువారికి అందించడం దీని ప్రధానలక్ష్యం..ఈ కార్యక్రమానికి సంస్కృతభాషాశ్రద్ధాలువులనుండి ప్రోత్సాహం లభించడం సమితికి ఆనందజనకం.
ఈ సంవత్సరంలో (2003-9004) రజతోత్సవం జరుపుకొంటూన్న సమితి సుప్రసిద్దులైన సంస్కృతవిద్వద్వొదుషీమణులచేత సంస్కృతసాహిత్యానికి సంబంధించిన, ఆ యా కవులను, వారి కావ్యాలను పరిచయం చేసే ఇరవైయైదు లఘు గ్రంథాలను వ్రాయించి ప్రచురిస్తూన్నది. ఈ సాహిత్యయజ్ఞంలో ఆర్త్విజ్యం వహించినవా రందరికీ మా కృతజ్ఞతలు.
ఈ రజతోత్సవగ్రంథమాలాతృతీయకుసుమంగా గంగాదేవీ విరచిత మధురావిజయమాధురిని రచించి ఇచ్చిన శ్రీమతి అరుణావ్యాస్ గారికీ మా కృతజ్ఞతలు. దీనిని సంస్కృతాభిమాను లందరూ ఆదరించగల రని విశ్వసిస్తున్నాము. సంస్కృతభాషా(పప్రచారసమితి, పుల్లెల శ్రీరామచంద్రుడు హైదరాబాద్. కులపతి
క సంస్కృతభాషా ప్రచారసమితి హైదరాబాదు కార్యనిర్వాహకసంఘసభ్యులు కై శ్రీ 2 పుల్తారెడ్డిగారు, అధ్యక్షుడు 2 మహామహోపాధ్యాయ డా. పుల్లెల శ్రీరామచంద్రుడుగారు, కులపతి 3 డా. కే రాజన్నశాస్రిగారు. ఉపకులపతి 4. త్రీ చలమచర్ల వేంకటశేషాచార్యులుగారు, కార్యదర్శి 5... శ్రీపి. రామకృష్ణగారు, సభ్యుడు 6 శ్రీ ఆర్.రామానుజాచారిగారు, సభ్యుడు 7... శ్రీ పి.వేంకటేశ్వర్లుగారు, సభ్యుడు & శ్రీ బియన్.రెడ్డిగారు, సభ్యుడు 9. శ్రీ ఆకెళ్ల నత్యనారాయణమూర్తిగారు, సభ్యుడు 10. శ్రీ ఆర్.వి. శేషాచార్యులుగారు, సభ్యుడు 11 శ్రీ వై నాగభూషణరెడ్డిగారు, సభ్యుడు 12 శ్రీపి. సుబ్బారెడ్డిగారు, సభ్యుడు
శ్రీః మధురావిజయమాధురి కై
సంన్క్యృతసాహిత్యం విదుషీముణులకు రతనాల గని. వైదికకాలంలో గార్గి మైత్రేయి లాంటి ఆణిముత్యాలలాంటి బ్రహ్మవాదినులు ఉన్నారు. శాన్తపాండితిలో మేటి అవంతి సుందరీవధూటి. తన తర్మంతో శంకరులని విస్శితులను చేసిన అపరసరన్వతి ఉభయ భారతి. తమ కోకిలకూజితాల్లాంటి కవితాగానాలతో కావ్యవనంతాలకి మేలు కొలుపు మొదలైనవారు. ఈ లౌకికనంన్స్యుతవాజ్బయంలో కావ్యరనర్వురుఆం పారించి కమనీయంగా పాఠకులని రసడోలలో ఊగించింది గంగాదేవి.
గంగాదేవితర్వాత ఆడవారి కావ్యాలు వెలుగులోకి వచ్చిన వాటిలో పాండిత్య ప్రకర్ష ఎక్కువై అలంకారికులు చెప్పిన “చిత్రకావ్యాల" కోవకు చేరిపోయాయి ఆ కావ్యాలు. ఈవిడ కవిత్వం అందుకు భిన్నంగా ఎటువంటి శబ్తాడంబరమూ లేకుండా, చిన్న పదాలతో, రమణీయంగా, చెరకునసరంలా కమ్మగా, తియ్యగా ఉంటుంది.
గంగాదేవి రాజకుమారి. తెలుగింటి ఆడపడుచు. ఓరుగల్లులో పుట్టింది క్రీ.శ. 1340 ప్రాంతంలో. మెట్టింది కర్షాటకప్రాంతం. వీరకంపరాయడికి భార్య అయింది. ప్రతాపరుద్రుడి ఆస్టానకవీ, “సౌగంధికాహరణం” అవే (ప్రేక్షకానికి రచయితా అయిన విశ్వనాధుడు ఈవిడకి గురువు. అతనిదగ్గర ఈవిడ సర్వవిద్యలూ నేర్చి సర్వజ్ఞరాలైంది. విశ్వనాధుడు గంగాధరమహాకవి కొడుకు. తన గురుపరంపరమ గురించి రాస్తూ గంగాదేవి అగస్తుడు డెబ్బయి నాలుగు కావ్యాలు రాశాడని చెప్పింది. అగస్తుడు గంగాధరుడికి బావ. విశ్వనాధకవికి మేనమామ. వీరంతా (వ్రతావరుద్రుని ఆస్టానకవులు. ఇతవే “విద్యానాథు"డని చాలామంది అభిప్రాయం. ఇతను తన “నలకీర్తికౌముది”లో దమ యంతిని వర్ణించే వర్దననే నందితిమ్మన అమకరించి “ముక్కుతిమ్మన"గా అవతరించాడట.
మధురావిజయకావ్యంలో తొన్ముది నర్గ లున్నాయి. ఇది ఎంతటి ఉన్నతమైన కావ్యమంటే నరన్వత్తీదేవే స్వయంగా శిల్పినిగా అవతరించి నంస్కృతభాషలో శబ్ద, అర్బ, భావ. రసాలను దండిగా పండిస్తూ ఈ కావ్యాన్ని నిర్మించినట్లు తోస్తుంది. 14వ శతాబ్దంలో మహమ్మదీయుల దాడికి దక్తిణాపధమంతా అట్టుడికిపోయి. నిలువ నీడ లేక, పడరాని పాట్లు పడింది. అలాంటి సమయంలో నడుం బిగించి నే నున్నానని యుద్దరంగంలో ప్రాణాలొడ్తి నిలిచిన ధీరుడు కంవరాజు. అతని చరిత్రే “మధురా విజయము”. ఆ వీరుని భార్యే “ంగాదేవి. మహాభారతంలో వ్యాసమహర్షిలాగా తాను ప్రేక్షకురాలై ప్రత్యక్షంగా చూసినవీ, విన్నవీ, ఆనుభవించినవీ రాసింది కాబట్టి ఈ కథకు
6 మధురావిజయమాధురి ఇంతటి కావ్యగౌరవం దక్కింది. దేశోద్దారకమైన వీరగాథను. కావ్యవస్తువుగా చేసికొని భర్తకీర్తిని శాశ్వతం చేసింది. ఇలాంటి విషయం మనం మునుపెన్నడూ కనీ, వినీ ఎరుగనిది. ఈ కావ్యాన్ని ఆదర్శంగా చేసికొని నకలీకృతులు వచ్చాయి. కాని అవి వీరగాధలు కావు. ఈ కావ్యానికీ వాటికీ హస్తిమశకాంతరము అని చెప్పొచ్చు.
కవి రసజ్ఞుడు కావాలి. కావ్యం విజ్ఞానసర్వస్వపేటిక కావాలి. నాయకుడు లోకోత్తరుడు కావాలి. కథాంశం గొప్పగా ఉండాలి. అందులో చమత్మారాలతోను, చెణుకులతోను సూక్తులు వుందాలనే ఆలంకారికుల అభిప్రాయాలను పూర్తిగా, నిండుగా తీర్చి, వాళ్ళకు షడ్రసోపేతమైన విందు చేసి, వాళ్ళచేత తృప్తిగా ్రేన్పించే మధురరసాన్విత కావ్యరాజం ఇది. చరిత్రనూ కావ్యవస్తువునూ ఇతరులకి సాధ్యపడని చందాన చక్కటి మేలు కలయికతో క్రొమ్మెరుంగులుజిమ్మగా తీర్చిదిద్దిన ఈవిడ కవితానైపుణ్యం చదివితేనే అర్ధమవుతుంది.
ఆనాటి సాంఘికమర్యాదలు, ఆచారాలు, వేషభాషలు, అలంకరణలూ, యుద్ధ పద్ధతులూ, రాచరికస్తీల పద్ధతులూ, అలవాట్లూ, చాలా స్వాభావికంగా వర్ణించింది. ఈ కావ్యమంతా వర్ణనామయమే. 5,6,7? సర్గలలో కేవలం వర్ణనలే కన్పిస్తాయి. మాఘుడు మొ!॥వారు ఇలాగే దీర్చంగా బుతువర్దనలని పూర్తిగా సర్గలో చూపిస్తారు. వర్ణనతోనే చరిత్రలో కాలాన్ని చూపిస్తుంది ఈవిడ. రెండు దండయాత్రలకు పట్టిన కాలవ్యవధి తెలిపింది. చరిత్రాంశాలు కావ్యవర్దనలో ఇమిడి బంగారంలో రతనాలలా మెరుస్తాయి. కాదంబరీకర్త భట్టబాణుడి 'శుకనాసోపదేశం” బుక్కరాజు తనకొడుకు కంపరాజుకి చెప్పిన రాజనీతి ఉపదేశానికి మాతృక అని చెప్పినా ఈవిడ ఉపదేశం చక్కటి ఉదాహరణలతో సాగి చక్కటి ఉపదేశంలా నిలిచింది. ఈవిడ కాళిదాసునీ, మాఘుణ్జీ భారవినీ అనుక రించింది. శ్రీనాథుడి తెలుగుసేతకు మార్గదర్శకురా లయ్యింది.
ఈవిడకి తెలియని ప్రపంచం లేదు. ఎరుగని శాస్త్రాలు లేవు. నేరవలేని కళలు లేవు. ఈమె ఈ కావ్యంలో 22 శ్లోకాలలో కవిస్తుతి, కుకవినింద, ఉత్తమకావ్యస్వరూపము, మొదలైన అంశాలను కావ్యం మొదటే విపులీకరించింది. సంస్కృతకవు లెవరూ ఈ వ్రస్తావనని ఇంత అందంగా, మృదుమధురంగా, నడిపిన వాళ్ళు లేరు. కవులని పొగిడేటప్పుడు వారి కవితారీతులని పొగడటంలో బౌచిత్యం వుంది. విశ్వేశ్వరకవి 16వ శతాబ్దిలో ఈవిడని అదర్శంగా తీసికొని ఈ పద్ధతిని ఇంకా విస్తరింప జేశాడు. అయినా అది శ్లేషమయంగా ఉండి సహజత్వానికి దూరంగా వుండిపోయింది. ఈవిడ సంస్కృత కవులతో బాటు తెలుగుకవి తిక్కనామాత్యుణ్జి కూడా పొగిడింది. మిగతా కొవ్యాలలో ఏదో ఒక అంగవైకల్యంతో శబ్ద, అర్ధ, భావ, రస, మాధుర్యాలు ఏవో ఒక్కటొక్కటిగానే కన్పిస్తూవచ్చాయి. కానీ ఈమె కావ్యం ఎలాంటి అంగవైకల్వమూ లేని స్ఫురద్రూపి. నిండుదనంతో దీపిస్తోంది.
మధురావిజయమాధురి 7 మధురావిజయం “శిశుపాలవధ'లాగ రసప్రధానమైన వర్ణనాప్రాధాన్యం వున్న కావ్యం. నాయకుడైన కంపరాజుని లోకాతీతనాయకుడిగా సృష్టించింది గంగాదేవి. శ్రీ మహావిష్ణువు అవతారమూర్తిగా అభివర్ణించింది. దుష్టశిక్షణ, లోకోద్ధరణ ఇదీ ఈ కావ్యోద్దేశం. వీరం అంగిరసం. శృంగారం అంగమవుతోంది. మహమ్మదీయర్ణాజు సురత్రాణుడు, కాంచీపురరాజు చంపరాజు యుద్ధవర్ణనలు ్రధానరసానికి పోషకాలు. వీరరసానికి స్థాయిాభావం ఉత్సాహం. అది కంపరాజులో పుష్కలంగా ఉంది. కంపరాజుకి శృంగారాన్నీ, తదుద్దీపకాలుగా బుతు, పృష్పాపచాయ, జలక్రీడా, సూర్యోదయ, సూర్యాస్త మయ, చంద్రోదయ వర్ణనలు చేసింది కవయిత్రి. ఉపాంగాలుగా యుద్ధ వర్ణనలలో వోస్య, భీభత్స, భయానకాలు సముచితరీతిని చేసింది. అగస్త్యుడు రాక్షనవధ కోసం రామునకు దివ్యాయుధాల నిచ్చినట్లు మళ్ళీ అగన్వుడే కంపరాజుకి మధురరాజు సురత్రాణుడి సంహారానికి దివ్యాయుధాలు పంపుతాడు. అప్పుడు ఏర్పడిన దేశవిప్లవంలో మధురాపురి దేవత తన దుస్థితి వర్ణించి మహమ్మదీయ సురత్రాణుడి సంవారానికి నాయకుణ్ణి పురికొలిపే సందర్భం కరుణపష్లావితం. ఇలా ఈ కావ్యం నవరసాస్పదంగా శోభిల్లుతోంది. వీరులను లక్షణకర్తలు ధర్మవీరుడు దయావీరుడు, దానవీరుడు యుద్ధవీరుడు అని నాలుగు విధాలుగా విభజించారు. కంపరాజు ధర్మవీరుడూ యుద్ధవీరుడూ కూడా. ఈవిడ కవిత కొత్తపాతలు కలిసి గంగాయమునల సంగమంలా కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల యమునలా పాతదనం మాత్రమే కనిపిన్తుంది. లౌకిక అలౌకిక కవితల విహారస్టలంలా తన కావ్యాన్ని మలిచింది ఈవిడ. ధ్వని : ధ్వని అంటే వ్యంగ్యార్థం ఇలాంటి ధ్వనులతో ఉత్తమకావ్యలక్షణానికి దీటుగా ఉంటే కావ్యం. ఓజః : వ్రసాదగుణాలు : (ప్రసాదం ఓజన్సుతోకూడి ఈ కావ్యానికి (కావ్యతను ఆపాదిస్తుంది. శ్లేష : సంధులవలన పదాలు ఒక దానితో ఒకటి కలిసి ఏకపదమయ్యేటట్లు చెయ్యటం శ్లేష ఇందులో అతి తక్కువ. మాధుర్యము : దీర్ససమాసాలు లేని రచన మధురం. మాధుర్యం లేకపోతే కావ్యమే లేదు. సౌకుమార్యము : వినసొంపుగా ఇంపుగా ఉండి సుతిమెత్తగా ఉండే పదాల కూర్చు. ఇది ఈవిడ సొమ్ము. అర్ధవ్యక్తి : శద్దిం విన్న వెంటనే అర్ధం అవగత మవడం ఇది. ఈ గుణంతో అర్ధగౌరవాన్ని కూడా చతురతతో ఈవిడ సాధించింది.
రి మధురావిజయమాధురి జెజ్బ్వ్రల్యము : వినంధిదోషాన్ని పోగొట్టి రచనకి ఉజ్వలతని సంపాదించి పెట్టింది గంగాదేవి. రీతి : “వైదర్భరీతిసందర్భే కాళిదాసః (ప్రగల్భతే” అనేవారు. తరువాత ఈ గంగాదేవి ఆయనకు వారసురా లైంది. కావ్యంలో గుణాలు నిండుగా ఉందాలి. ఈవిడ కవితలో దోషం వెతికినా కనిపించదు. ఒక్కొక్క శ్లోకమూ అనేకగుణాల పుట్ట. పాకము : గ్రాక్షాపాకం. వెంటనే అర్ధం స్ఫురించినా లోపల తోడే కొద్దీ లోతున్నబావిలా గంభీరమైన భావన ఈవిడది.
అలంకారాలతో ఈవిడచేసే కల్పనలు మనన్సును రంజింవచేస్తాయి. పదస్వారస్యాలకు అంతూపొంతూ లేదు. శబ్దాలంకారాలు కూడా అక్కడక్కడ తళుకు లీనుతాయి. యమకాలు కనబడుతున్నాయి. అక్షరరమ్యత అప్రయత్నంగానే ఈవిడకి అబ్బింది. కొన్ని వర్ణనలు కావ్యసౌందర్యాన్ని ఇనుమడింప జేస్తున్నాయి. “ఘనఘరట్ట పరస్పర ఫఘట్టన .....” అనే పదబంధం తిరగలి తిరగే శబ్దాన్నీ మేఘ గంభీరధ్వనినీ చెబుతోంది. ఇలాగే “కంకణరింజనిస్వనఃా అనే వర్ణన గాజుల గలగలని వ్యక్తీకరిస్తోంది. “తరలితాంగులితాడితవల్లకీ ... గమకభంగితరంగితమంగనాఃొ అనేది వీణాగానాన్నీ దానికి వేసే తాళాన్నీ వ్యక్తపరుస్తోంది. (౬6004 44౧ ౦6) అనే అమెరికను కవి “౯౦- 91/19 16 గిగగాం 018800౧ 01 8626007” కవిత్వం లయాన్వితమైన సౌందర్యసృష్టి” అన్నాడు). ఇలా ఉంటుంది ఈవిడ అనుప్రానవైఖరి. ఈ వద్ధతి మారుడిలోనూ కనిపిస్తుంది. ఇలాగ కావలసిన కావ్యసామాగ్రిని సేకరించుకొని కావ్యలోకంలో చాలకొద్ది ఉత్తమకావ్యాలలో ఒకటిగా తన కావ్యాన్ని నిలిపిం దీవిడ. కాబట్టే ఇది ఉద్దండపండితుల ఆదరాభిమానాలను చూరగొంది. నారాయణకవి అనేకవి సుమతీంద్రమరాధిపతి యైన రాఘవేంద్రుల విజయాన్ని గురించి “రాఘవేంద్ర విజయము” అనే మహాకావ్యం రాశారు. శ్రీరాఘవేంద్రయతీంద్రులు 17వ శతాబ్దివారు. ఈ కావ్యం ముమ్మూర్తులా “మధురా విజయాన్ని” పోలింది. ఆ విధంగా గంగాదేవి తన తర్వాతి కవులకు ఒజ్జబంతి అయ్యింది. వర్ణనలు : ఇందులో రాజవర్డన, వురవర్ణన, దౌహృదవర్ణన, కుమారోదయవర్ణన, బాల్యవర్ణన, యౌవనవర్ణన, దండయాత్రావర్ణన, అశ్వరాజవర్ణన, బుతువర్ణన, వనంతోత్సవవర్ణన, వుష్పావచాయవర్ణన, జల|క్రీడావర్జన, నూర్యాన్తమయవర్ణన, చంద్రోదయవర్ణన, యవనదుర్నయవర్ణన, యుద్ధవర్దన ఉన్నాయి. రాజవర్డన : కల్పనాచాతుర్యం, ప్రతిభావిశేషాలు కనబరిచే వర్ణన రాజవర్ణన. బుక్కరాజు వర్ణన సముచితంగా వుంది. కంపరాజుని లోకాతీతుడిగా విష్ణుమూర్తి అవతారంగా చిత్రీకరించింది. పురవర్ణన : కల్పనాచమత్మొరంలో 'కాదంబరి'ని పోలింది.
మధురావిజయమాధురి ం్రి దౌహృదవర్హన : చూలాలివర్ణన - బుక్కరాజు భార్య దేవాయి చూలాలిగా “రఘువంశం” లోని సుదక్షిణ చూలాలివర్ణనతో కొంత పోలిక. చాలావరకు స్వయంప్రతిభ, కవితా నైపుణ్యం కనబడతాయి.
యౌవనవర్ణ్దన : “కాదంబరి”లోని శుకనాసుని ఉపదేశంతో పోలిక. కవయిత్రి ప్రతిభ వ్యక్త మవుతుంది.
దండయాత్రావర్ణన : గుర్రం వర్ణించదిడుతుంది. ఇది “నైషధం”లో “ఆరామ” దర్శనానికి నలుడు వెళ్ళే సందర్భంలో అతని గుర్రం వర్దనను తలపిస్తుంది. మాఘుడి అశ్వవర్జన ఛాయలుకూడా కానవస్తున్నాయి.
బుతువర్దన : ఇంత సమగ్రంగా బుతువులను వర్ణించినవారు సంస్కృతసాహిత్యంలో లేరు. గ్రీష్మబుతువుతో మొదలుపెట్టి వసంతంతో ఆపేసింది. వసంతోత్సవాని కిది అంగంగా నడిచింది. ఇందులో మన్మధపూజ, డోలావిహారం, వనసంచారం, జలక్రీడా వర్ణన ఉన్నాయి. ఈ బుతువర్ణనలు శృంగారమయమై ఉన్నాయి. అనేకమంది కవుల కవితాఛాయలు, కవిసంప్రదాయాలు, తత్సమయాలు, వరాహనంహిత, కామందకి, కలాశాస్తాది విజ్ఞానవిషయా లెన్నో ఈ కావ్యంలో రూపొందించింది.
జలక్రీడావర్డన : కాళిదాస 'రఘువంశం'లోని జల(క్రీడావర్దననూ భారవి, మాఘం జలక్రీడా వర్జనలను అనుసరించింది.
సూర్యాస్తమయచంద్రోదయవర్ణనలు : “కుమారసంభవం”లోను భారవిమాఘాలలోనూ కనపడే వర్ణనలతో పోల్చతగ్గవి. ప్రతిభకు తగ్గ కల్పనారమణీయత కనిపిస్తుంది. యవనదుర్నయవర్ణన : 'రఘువంశం”లో కుశునితో అయోధ్య దేవత తన దురవస్థ గురించి చెప్పుకున్నట్లు మధురాధిదేవత కంపరాజుతో తన దుస్థితిని చెప్పుకుంటుంది. కల్పన అద్భుతంగా ఉంది.
యుద్ధవర్ణన : ఇది రెండు విధాలు. 1. ఒకటి కాంచీపురరాజు చంపరాజుతో యుద్ధము 2. మధురాపురమహమ్మదీయ సురత్రాణుడితో యుద్ధము. ,
ఈ యుద్ధం అనేక విధాలుగా గంగాదేవి వర్ణించింది. కవయిత్రికి భావనాశక్తి, కవితాశక్తి మాత్రమే కాదు. సత్యభామ కృష్ణుణ్ణి యుద్ధభూమికి అనుసరించినట్లు తాను కంపరాజుని యుద్ధభూమికి వీరపత్నిలా అనుసరించి యుద్దాన్ని ప్రత్యక్షంగా చూసింది. అందుకనే యుద్దాలు యుద్దవర్ణనలు అంతసహజంగా కళ్ళకి కట్టినట్లు వర్ణించిం దామె. యుద్ధవర్దనలలో కావ్యాల సొబగుల్ని స్వయంగా చూడటంచేతే ఆ వర్దనలకి అంత బలం. తాను ప్రీ అయినా మొహమాటపడక శృంగారాన్ని పురుషుడిలాగే వర్డించింది. కొన్ని విషయాలని నిస్సంకోచంగా, నిర్భీతిగా, నిర్హజ్ఞగా రాసింది. ఇన్ని సొగసులున్న తన కావ్యాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది లౌకికసాహిత్యంలో కవయిత్రిగా ప్రథమ
10 మధురావిజయమాధురి త్రాంబూలం అందుకుంది. చదువరులను గురించి చెబుతూ “మంచి కావ్యాలను వినడానికి మంచివాళ్ళని ప్రార్ధించనక్కరలేదు. మంచి వాసనపూలను ఆ(మఘ్రాణించటానికి తుమ్మెదలను పిలవాలా ఏం?” అని చమత్మరించింది. కంపరాజు విజయనగరయువరాజు. కర్నాటకరాజు బుక్కరాజుకూ, అతని పట్టమహిషి దేవాయికీ మొదటికొడుకుగా పుడతాడు. ఇతనికి ఇద్దరు తమ్ముళ్ళు. కంపనుడు, సంగముడు వాళ్ళ పేర్లు. పెద్దవాడయ్యాక తెలుగింటి ఆడపడుచైన గంగాదేవిని కంపరాజు పెళ్ళి చేసుకుంటాడు. ఈవిడ గొప్ప విదుషీమణి. ఆటవికరాజు చంపరాజు. బద్ధవిరోధి. ఇతను కాంచీపురానికి రాజు. మధురాపురరాజు మహమ్మదీయరాజు నురత్రాణుడు. చంవరాజు అతనితో చెలిమి చేస్తాడు. చంపరాజుని యుద్ధంలో హతమారుస్తాడు కంపరాజు. మధురాధిదేవత తన పూర్వపు ఉచ్చస్టితినీ, నేటి దీనస్టితినీ కంపరాయడికి చెబుతూ దీని కంతటికీ కారణం మహమ్మదీయరాజు సురత్రాణుడేనని చెబుతుంది. తరువాత వీరకంపనికీ మహమ్మదీయరాజుకీ ఘఫోరయుద్ధం జరిగి కంపనిచేతిలో మహమ్మదీయ రాజు మరణిస్తాడు. కంపరాజు మధురను ప్రశాంతంగా పాలిస్తాడు. ఇదీ కథాంశం గంగాదేవి తన కావ్యాన్ని ఇష్టదేవతాప్రార్థనతో మొదలు పెట్టింది. మొదట విఘ్నవినాశకుడు వినాయకుడి ప్రార్ధనతో మొదలు పెట్టింది. కల్యాణాయ సతాం భూయాద్ దేవో దంతావలానన: | శరణాగతసంకల్పకల్పనాకల్పపాదప: (మ.వి.1.1.) “కల్పలతలాగా శరణన్నవారి కోరిక లీడేర్చే విఘ్ననాయకుడు మంచి వారికి మంగళాన్ని కల్లించుగాక” ! సత్' అనే శబ్దానికి కవు లని అర్ధం”. సన్ సుధీః కోవిదో బుధ” అని అమరం. కల్యాణశబ్దానికి బంగారమని అర్ధం. కవులకి సంపద వినాయకుడు ఇవ్వాలి. విఘ్నేశ్వరుణ్లి కొవ్యాదిని చాలామంది సంస్కృతకవులు స్తుతించారు. గజాననత్వం. అంటే ఏనుగు ముఖం ఉండటం గణేశుడు ప్రణవస్వరూపు డవటం బోధిస్తోంది. అంటే ఆ తొండం సంస్కృతలిపిలో ఓం లాగ ఉండి ప్రణవనాదాన్ని గుర్తు చేస్తోంది. దేవశబ్దాన్ని దేవతాపర్యాయంగా మాత్రమే కాకుండా '్రభుపర్యాయంగా కూడా చెప్పుకోవాలి. దేవుడు నాయకుడైన కంపరాజు, “సతాం కల్యాణాయ భూయాత్” అతడు మధురానగర మహమ్మదీయరాజు సురత్రాణుణ్జి చంపి, దేశాల్ని రక్షించి, సజ్జనులకి మంచి చేకూర్చా లన్నది కోరిక. “శరణాగతసంకల్ప”... పాదప” అని మూడు నాలుగు
మధురావిజయమాధురి 11 పాదాలతో మధురాపురాధిదేవత శరణుజొచ్చడం ఆమె కోరిక తీర్చడం కోసం అతను మధురావిజయాన్ని చేకూర్చడం వంటి కావ్యోద్దేశం సూచించబడింది.
(స్రపష్పః గ్రీపుంసనిర్మాణమాతృకారూపధారిణౌ |
ప్రపద్యే ప్రతిబోధాయ చిత్ర్రకాశాత్మకా శివౌ | (మ.వి.1-2)
“మగా, ఆదా రూపాలు నిర్మించే బ్రహ్మకి ఆదర్భరూపాలైన చిద్రూపులు పార్వతీ పరమేశ్వరులను విజ్ఞానం కోసం భక్తితో సేవిస్తున్నాను”.
పరమేశ్వరి స్రీల సృష్టి ఇలా వుందాలని తన ఆకారాన్ని అందు కనుగుణంగా ధరించింది. పరమేశ్వరుడు పురుషులకు ఆదర్శంగా రూపం ధరించాడు. బ్రహ్మ వీరి ఆకారాలని చూసే ఆడా,మగా రూపాలని సృష్టి చేశాడు. “మాతృకారూపధారిణౌ” - అంటే వేద స్వరూపులు అని అర్ధం. వేదం ద్వారానే బ్రహ్మసృష్టి తెలియడం జరుగుతోంది. శబ్ద, అర్ధ సంపద లాభాలు ఇక్కడ వ్యంగ్యంగా సూచించబడ్డాయి. శివుడు జ్ఞానప్రదుడు.
మహాకవిముఖాంభోజమణిపంజరశారికామ్ ॥
చైతన్యజలధిజ్యోత్న్నాం దేవీం వందే సరస్వతీమ్ ॥॥ (మ.వి. 1-3)
“మహాకవుల ముఖపద్మాలనే రత్నపంజరాలలో విహరించే గోరువంకయై జ్ఞాన సముద్రాన్ని ఉప్పొంగించే వెన్నెలవంటి సరస్వతీదేవిని ప్రార్ధిస్తున్నాను”.
విద్యలకు అధిష్టానదేవత - సరస్వతీదేవత - సరస్వతీదేవి ! 'ముఖాంభోజ' అనడంచేత సుగంధమూ, కోమలత్వమూ మొదలైన గుణాలు తలపింపజేస్తూ కవుల ముఖాల్లో నిత్యం నివసిస్తూ వుంటుందని తెలుస్తోంది. “ముఖే ముఖే సరస్వతీ” అన్నది ఆర్యోక్తి. “ముఖ...పంజరశారికామ్” అనడంవలన కవుల ముఖానికి ఆవిడ భూషణమని వ్యక్తమవుతోంది. వాగ్దేవి కాళిదాసుతో “త్వమేవా£. హం త్వమేవా£. హం త్వమేవా£. హం న సంశయః (నేనే నీవు, నేనే నీవు, నేనే నీవు, ఎంత మాత్రం సందేహం లేదు”) అన్నదట. పిల్లలమర్రి పినవీరభద్రుడు 'వాణి నా రాణి అన్నాడు.
అసాధారణసార్వజ్యం విలసత్సర్వమంగళమ్ |
క్రీయాశక్తిగురుం వందే వత్రిలోచనమివాపరమ్ ॥ (మ.వి.1.4)
“సర్వశుభాలకీ ఆటపట్టు, ఇతరులకి సాధ్యపడని సర్వజ్ఞత కలిగిన క్రియాశక్తి గురువునకు నా నమస్కారం”.
క్రియాశక్తి విజయనగరసా(మ్రాజ్యానికి మూలగురువు. క్రియాశక్తీశు డనేది ఇతని పేరు. మాధవాచార్యులు సూతనంహితలో శివుని అవతారంగా ఇతన్ని పొగిడారు. క్రియాశక్తి పేరు మూలగురువు పరంపరలో వచ్చి చేరుతుంది. ఈవిడ గురువుని అపర
12 మధురావిజయమాధురి శివుడితో పోల్చి “గురుర్దేవో మహేశ్వరః”. అనే మాటను సార్ధకం చేసింది. “త్రిలోచనమ్” అనే పదాన్ని వాడి జ్ఞానచక్షు వీ గురువు అని తెలియజెప్పుతోంది.
తర్వాత కవులని పొగిడింది -
చేతసోజ_స్తు ప్రసాదాయ సతాం ్రాచేతసో మునిః ॥
పృధివ్యాం పద్యనిర్మాణవిద్యాయాః ప్రథమం పడమ్ 14 (మ,వి.1.5)
“పద్యరచనకు భువిలో తొలిమెట్టయిన వాల్మీకిమహర్షి మంచివారి మనస్సులకు అహ్హాదము కల్గించునుగాక!”.
“ముసి? అంటే సంయమనం కలవాడని సూచిస్తోంది. అతను మనస్సు నిర్మలంగా ఉంచుకోగలడు. “నా£_ నృషిః కురుతే కావ్యమ్” (బుషి కానివాడు కావ్యం వ్రాయలేదు). “సధమం పదమ్” అనడంచేత “వాదము” అనే అర్ధంకూడా కల్చ్పించబడుతూ (బ్రహ్మలోకం నుండీ భూలోకంలోకి దిగిన సరస్వతి తన మొదటి అడుగు విశ్రాంతి కోసం ఇతని యందు వుంచిందని తెలియబరుస్తోంది. 'ప్రసాద' అనే పదానికి వాల్మీకికవితలో ప్రసాద గుణం ఉందని చెప్పడం. 'సత్' శబ్దం కవులనీ, మంచివాక్షైన సహృదయులనీ (విమర్శకు లనీ అన్నమాట) తెలుపుతోంది. 'రసో వై సఃి - రసము బ్రహ్మము. అది సహృదయులకి చెందాలనేది కవయిత్రి ఉద్దేశం. తర్వాత వ్యాసుణ్ణి కీర్తిస్తోంది -
వైయాసకే గిరాం గుంఫే పుండ్రేక్షావిన లభ్యతే 1
సద్యస్సహృదయామహ్లాదీ సారః పర్వణి పర్వణి ॥ (మ.వి.1.6)
“వ్యాసుడు రచించిన మహాభారతంలో చెరకులాగ వెంటనే చిప్పిల్లే రసంతో రసహృదయులకి చాలా నంతోషం కలిగిస్తూ రసానందం కణుపు కణుపులోనూ (పర్వం పర్వంలోనూ) నిండి వుంటుంది”.
రామాయణభారతాలు ఇతిహాసాలు. ఇతిహాసమంటే
“దర్మార్థకామమోక్షాణాముపదేశసమన్వితమ్ ।
పూర్వవృత్తకథాయుక్త మితిహానం ప్రచక్షతే!!”.
పురుషార్జాలను వివరిస్తూ పూర్వం జరిగిన కథను వివరించే గ్రంధం ఇతిహాసం. ఇది రెండు విధాలు 1. ఏకనాయకం 2. బహునాయకం. వకనాయకంలో ఒకడే నాయకు దడుంటాడు. “రామాయణం” ఇందు కుదాహరణ. బహునాయకంలో చాలామంది నాయకులుంటారు. *'మహాభారతం” ఇందు కుదాహరణ. 'నహృదయులు అంటే రసానుభూతికి అనువైన రసహృదయం గల రసజ్ఞ్జులు. “ఒప్పుతప్పరయు రసజ్ఞ్జులు” అన్నాడు ఆంధ్రకవితాపితామహుడు అల్లసాని పెద్దన. “పర్వము” అంటే భారత భాగము,
మధురావిజయమాధురి 13 చెరకు కణుపు. పుంద్రేక్షువు అంటే నామాల చెరకు. చెరకుల్లో ఇది శ్రేష్టమైంది”. పుంద్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే” అని దేవీవర్దన. ఈ రసజ్జులు మైమరచిపోయేట్లు వ్యాసుల వారు భారతంలో ప్రతిభాగాన్నీ రసవంతంగా కూర్చారు. ఆ తీపి నామాలచెరకు తీపిని పోలింది. విన్న మాత్రాన, అది తిన్నమాత్రాన రసపుష్టిని కలిగిస్తాయి.
ఈ కవిస్తుతిలో ఆదికవి వాల్మీకిని కీర్తించింది గంగాదేవి. తర్వాత పురాణాలతో వాజ్మయానికి అన్నివిధాల వ్యాప్తి కలిగించిన వ్యాసుడు కీర్తించబిడ్డాడు. మహాభారతము కొవ్యంకూడా. “కవివృషభులు మహాకావ్యమనియు” అంటూ సత్కరించారు.
దాసతాం కాలిదాసస్య కవయ: కే న బిభ్రతి |
ఇదానీమపి తస్యార్ధానుపజీవంత్యమా యతః | (మ.వి. 1.7)
“కవిలోకం అవ్పటినుంచీ ఇప్పటిదాకా ఎవరి అర్భాలని ఊతగా చేసికొని జీవిస్తుందో, అ కాళిదాసుకు దాసులు కానివా ళ్ళెవరు?”
కాళిదాసు రాజు. కవులు సేవకులు, డబ్బిచ్చి వారిని అతను (బ్రతికిస్తున్నాడు. ఇది సేవకపరమైన అర్ధం. కాళిదాసు మహాకవి. అతడు ఉపయోగించిన శబ్దార్ధాలే ఇతర కవులు తమ కావ్యాల్లో వాడి కీర్తి పొందుతున్నా రనేది కవిపరమైన విషయం. కాళిదాసు అనేది అన్వర్ధనామధేయం. పరాశక్తి కాళి ఈతని పరాదేవత. “కవయః కే న బిధభతి” అంటే ఇతని కవితాఛాయలు తన కవితలో కూడ కనపడుతున్నాయని చెప్తోంది. అతని కవిత తరువాతి వాళ్ళకి ఆదర్శ మవటంవల్ల అతను “కవికులతిలకు”డవటం సూచించ దిడింది.
వాణీపాణిపరామృష్టవీణానిక్వాణహారిణమ్ $
భావయంతి కథం వాఇ_న్యే భట్టబాణస్య భారతీమ్ ॥॥ (మ.వి.1.8)
“సరస్వతీదేవి వాయించే వీణ ధ్వనిలాంటి భట్టబాణుని కవితావాణి ఇతరులలో ఊహించలేం”.
సరస్వతీదేవి వీణని 'కచ్చపి' అంటారు. వాద్యాలన్నిటిలోను వీణానాదం శ్రావ్యమైంది. అందుకే భట్టుమూర్తి “కాంభో జీమేళవిపంచికారవసుధాపూరంబు తోరంబుగాన్” అన్నాడు. అందులోనూ సరస్వతీవీణానాదం (శుతిమధురంగా, కర్ణపేయంగానూ వుంటుంది. బాణుని కవితావాణి తియ్యదనంలోనూ, మెత్తదనంలోనూ సంపూర్ణతను సాధించి సరస్వతీ
దేవి వీజానాదమంత కమ్మగా, తీయగా, హాయిగా వుంటుంది. అందుకనే “బాణోచ్చిష్టం జగత్సర్వం” (ప్రపంచమంతా బాణుని ఎంగిలి” - అంటే బాణుడు చదవని శాస్తం లేదు, సాధించని సాహిత్యప్రక్రియా లేదని గూఢార్థం) అన్నారు.
విమర్దవ్యక్తసౌరభ్యా భారతీ భారవేః కవేః 1
ధత్తే వకులమాలేవ విదగ్భానాం చమళ్రియామ్ ॥ (మ.వి.1.9)
14 మధురావిజయమాధురి
“మ్రాగడ్రపూలమాలలాగా నొక్కితే వాసన వెదజల్లే భారవికవి వాక్కు చతురులకు చమత్కారాన్ని అందజేస్తుంది”.
కొద్దిశబ్లాలతోనే విస్తారమైన అర్ధం చెప్పగలగడం అర్ధగౌరవం. ఈ గుణం భారవి కవితలో ఉంది. “అల్పాక్షర అనల్పార్ధరచన” అన్నమాట. ఈ గుణం తెలుగులో తిక్కన గారి కవిత్వంలో ఉంది. “8/8౪1/ 15 1౧6 గాం[6 ౦! ౪1 అంటాడు 5843500218 (సంక్షిప్తత విజ్ఞతకు మూలం). ఇందుకు ఉదాహరణ పొగడపూవును ఇచ్చింది. నలి పేకొద్దీ ఈ పువ్వు సువాసనహెచ్చేటట్లు, పరామర్శించే కొద్దీ రసజ్జులైనవారికి భావవిశేషాలు ఈ కవితలో కనిపిస్తాయి. విశ్వేశ్వరపండితుడు చమ(త్కియ కావ్యసార మంటాడు. “విదగ్ధానాం చమత్రియామ్” అనడంవలన కావ్యమర్శజ్ఞులు కానివారి కిది అర్ధంకాదని అంటోంది గంగాదేవి. అందుకే భారవికవిత నారికేళపాకమని తెలుస్తోంది. “భారవేరర్థ గౌరవమ్” అని ఆర్యోక్తి.
అచార్యదండినో వాచామాచాంతామృతసంపదామ్ ॥
వికాసో వేధసః పత్స్యా విలాసమణిదర్చణః 1 (మ.వి.1.10)
“అమృతసంపదలని ఆరగించిన ఆచార్యదండివాక్కులవికాసం వాగ్దేవి విలాసంగా పట్టుకొన్న రతనాలముద్దుటద్దమనిపిస్తుంది”.
దండి మాటలు అమృతపు సోనలు. అవి సరస్వతీదేవి హావభావాలకు ప్రతి బింబాలు. ఆవిడ లాలిత్య మంతా ఆయనకవిత్వంలో ప్రతిబింబించింది.
“దండినః పదలాలిత్యమ్”. అని లోకోక్తి. “వాచాం వికాసః విలాసమణిదర్చణః” అనడంచేత ఇతను రచించిన “కావాదర్శమూ, దాని గొప్పదనమూ ధ్వనిస్తోంది. ఈ గ్రంథాన్ని రాసి అలంకారశా'స్తాన్ని పరిచయం చేశాడు కాబట్టి 'ఆచార్య దండి' అయ్యాడు. కాబట్టీ ఆవిడ ఇలా పొగిడింది. ఈవిడ ఎంత వైదగ్ధ్యం, వైదుష్యం ఉన్న కవయిత్రి అయినా ఈవిడా ప్రీయే కాబట్టి స్త్రీ సంబంధమైన “రతనాల ముద్దుటద్దాలు గుర్తుకొచ్చాయి ఈవిడకి.
సా కాపి సురభిశ్ళంకే భవభూతేః సరస్వతీ
కర్ణేషు లబ్ధివర్దానాం సూతే సుఖమయీం సుధామ్ ॥ (మ.వి.1.11)
“పండితుల చెవులలో హాయిని నింపే భవభూతివాక్కు అపూర్వమైన ఆవు అని తప్పక ఊహిస్తున్నాను”.
భవభూతి కవితను ధేనువుతో పోల్చింది. ఈ గోవు అమృతపానంవలన కవులు సుఖాలు పొందుతారు. అవు పాలే ఇస్తుంది. ఈ గోవు అమృతాన్నిచే అపూర్వమైన కామధేనువు. 'కాపి సురభిః అనడంతో అనిర్వచనీయమైన సుగంధం, అర్ధగాంభీర్యం భవభూతి వాక్ళుకి వుందని తెలుస్తోంది. “లబ్ధివర్ధానామ్” అక్షరాస్యులనటం తెలుపు తోంది. శ్రీకంఠు డనేది ఇతని నిజంపేరు. భవభూతి అనేది ఆపాదించిన పేరు.
మధురావిజయమాధురి 15 మందారమంజరీస్యందిమకరందరసాబ్బయః: ॥
కస్య నావ్లాదనాయాలం కర్ణామృతకవేర్గిర: 41 (మ.వి.1.12)
“పువ్వుగుత్తులలోంచి స్రవించే తేనె సముద్రాలు అన్నట్లు చెవికి మధురంగా తోచే కవివాక్కు చాలామందికి ఆహ్లాదం కలిగిస్తుంది”.
కల్పవృక్షం పూజించదగిన దేవతావృక్షం. అది కోరినవారికి కోరికలు ఇస్తుంది. ఈ చెట్లో దివ్యమైన సువాసనా, తియ్యదనమూ ఉన్నాయి. అలాగే కర్ణామృతకవివాక్కులు శ్రీకృష్ణుని కీర్తి అనే సువాసననీ, తియ్యదనాన్నీ కలబోసుకొని అమృతసాగరా లైపోయాయి. ఇవి భాగవతులనీ, భక్తులనీ, కవులనీ మురిపిస్తున్నాయి.
ఈ కవి లీలాశుకుడు. ఈతని కావ్యం “కృష్ణకర్ణామృతం”. “కృష్ణ, తవకర్ణామృతం వహతు, కల్పశతాంతరే£_ పి” - చెవులకు అమృతంలాంటి సుఖం కల్గించు కవితలు కలవాడు. అందుకే అందరూ ఆనందిస్తున్నారు. కృష్ణుడే ఆనందిన్తూ వుంటే ఇంక సామాన్యుడి సంగతి చెప్పాలా!
తిక్కయజ్వకవే:ః సూక్తిః కౌముదీవ కలానిధేః
సతృష్టైః కవిఖిః స్వైరం చకోరైరివ సేవ్యతే ॥ (మ.వి. 1.13)
“కళకి ఆటపట్టెన తిక్కనకవిసూక్తిని చం'ద్రకాంతిని చకోరాలలాగా కవులు తనివి తీరా కోర్కెతో ఆస్వాదిస్తారు”.
చకోరాలు వెన్నెల పక్షులు. తిక్కన కవిత్వం వెన్నెలలాగా అందరూ మెచ్చేది. అందరికీ నచ్చేది. పదహైదు పర్వాల సంస్కృతభారతాన్ని ఒక్కచేతిమిదుగా తెనిగించి “నా నేర్చిన భంగి చెప్పి వరణీయుడ నయ్యెద భక్తకోటికిన్” అని నమత్రతో భారతభారతికి నీరాజనా లిచ్చా డీ సోమయాజి. వెన్నెల తింటూ చకోరాలు జీవిస్తాయి. ఈయన కవితని ఊతగా చేసికొని కవులు నాలుగు కాలాలపాటు బతుకుతారు. “కవిభిః స్వైరం సేవ్యతే” అనటం వలన కవులకు కావలసినదంతా తిక్కనకవితలో దొరుకుతుందని అర్ధమవుతోంది. “చకోరైరివ సతృష్టైః” అనడంచేత తిక్కన కవిత్వపటుత్వం వెల్లడవుతోంది. ఈయన కవిబ్రహ్మ. ఈయనని గంగాదేవి సంస్కృతకాష్యంలో పొగడటం రెండు విషయాలను నూచిస్తోంది. ఒకటి గంగాదేవి తెలుగింటి ఆడపడుచు కాబట్టి తెలుగుభాషాఖి మానంచేతనో, ఆయన కవిత్వంలోని అనురక్తిచేతనో తెలుగువాడైన తిక్కనని తలచుకొం దనుకోవాలి. “సూక్తి: కలానిధేః” అనే పదాలు ఆవిడకి ఆయనయందుండే ఆదరాన్ని తెలుపుతున్నాయి. రెండవది ఈయనకి '“ఉభయకవిమిత్రు'డన్న బిరుదు ఉంది. “అమలో దాత్తమనీష నే నుభయకావ్యప్రౌథి బాటించు శిల్పమునం బారగుడం గలావిదుడ” అని తిక్కన తనను గూర్చి తానే “నిర్వచనోత్తరరామాయణం”లో చెప్పుకున్నాడు. కాబట్టి తిక్కన రాసిన సంస్కృతకావ్యాన్ని గంగాదేవి స్తుతించడంలో ఆశ్చర్య మేమి లేదు.
16 మధురావిజయమాధురి
చతుస్సప్తతికావ్యోక్తివ్యక్తవైదుష్యసంపదే |
అగస్త్వాయ జగత్యస్నిన్ స్పృహయేత్ కోన కోవిదః ॥ (మ.వి.1. 14)
“లోకంలో తన పాండితీవైభవం ప్రకటితమయ్యేటట్లు డెబ్బెనాలుగు కావ్యాలు రాసిన అగస్త్యుని ఏ పండితుడు కోరుకోడు?”
అగసుడు విద్వత్మ్కవి. ఈయన చాలా కావ్యాలు రాశాడు. ఈయన కవిత్వాన్ని పండితులు మెచ్చుకుంటారు. ఈయన “నలకీర్తికౌముది”లో దమయంతిని వర్ణిస్తూ ముక్కు మిద రాసిన వర్జన నందితిమ్మన అనుకరించి ముక్కు తిమ్మన అయ్యాడు. “భృంగానవాప్తి ప్రతిపన్నభేదా, కృత్వా వనే గంధఫలీతపో£౬. లమ్ । తన్నాసికా£. భూదనుభూతగంధా! స్వపార్వనేత్రీకృతభృంగసేవ్యా (తుమ్మెదలు రావటంలేదనే బాధతో చంపకపువ్వు తపస్సు చేసి ముక్కు అయి పోయి సువాసనలు వెదజల్లుతూ రెండు వైపులా కళ్ళనే తుమ్మెద లతో సేవ చేయించుకుంటోంది. ) ఇక్కడ చంపకపవ్వు దగ్గరికి తుమ్మెదలు రాకపోవడం కవిసమయం. దాన్ని నందితిమ్మన ఎలా వర్ణించాడో చూద్దాం. “నానాసూనవితాన వాసనల నానందించుసారంగమే లానన్నొల్ల దటంచు గంధఫలి బల్మానం దపంబంది యో ।॥ షానానాకృతి దాల్చి సర్వసుమనస్సౌరభ్యసంవాసియై । పూనెం (బేక్షణమాలికామధుకరీ పుంజంబు లిర్వంకలన్.” విద్యానాధుడే అగస్తుడంటారు. అగస్తుడు ఒక నక్షత్రం. ఈనక్ష్మత్రం ఉదయించగనే నీళ్ళంతా తన మురికిని వదలి స్వచ్చంగా అవుతుంది. ఈ అగస్తుడి కావ్యాలవల్ల పండితుల మనస్సుల్లోని మాలిన్యం పోయి ప్రశాంతంగా ఉంటారు.
స్తుమస్తమపరం వ్యాసం గంగాధరమహాకవిమ్ |
నాటకచ్చద్మనా దృష్టాం యశ్చక్రే భారతీం కధామ్ 11 (మ.వి. 1.15)
“నాటకమనే నెపంతో ప్రత్యక్షంగా చూసేటట్లు మహాభారతకధని ఏ మహానుభావుడు రాశాదో ఆ అపర వ్యాసుడైన గంగాధరమహాకవిని పొగుడుతాను.”
కళ్ళకు కట్టేటట్లు వర్ణించే శక్తి భావనాశక్తి. 5౧2%69062/6 తన "గి [11690౧౧౧౧6 119013 0162గ”* లో కవిభావనాశక్తిని అద్భుతంగా వివరిస్తాడు.
06 ౧౦65 6౫/6, 1౧ & [౧6 109౧2౪ ౧01౧0,
0౦/1, 914౧06 1౧0గ ౧64౪6౧ 10 64గ0, ౧0గ౫
98/10 10 ౧౦2౪6౧;
తీగిరే &5 1గాడర1౧800౧ 600199 10గగ
06 10గ౫౩ 01 1౧1౧058 ౮౧౬౧౦౪౧, ౧6 ౦౪౪9 ౧౧
శలగ5 116౧) 10 5[8095 2౧6 0/63 10 2&1౧/ ౧౦౪౧1౧౦
శీ [002] ౧4౦1460౧ &౧6 2 ౧౧౫౪ (4 1%056గాగాం' [69౧69 0౧9౭౧) శీర ౪. 506౧6 1, 12-18)
(కవిమనస్సు భావనాశక్తితో నిండి ప్రపంచాన్నంతా అన్నికోణాల్లోనూ పరిశీలిస్తూ
మధురావిజయమాధురి 17 వుండి, భావన బలం పుంజుకోగానే అంతవరకు నిర్వికారంగా వున్న జడపదార్ధ మంతటికీ అతని కలం చైతన్యాన్ని ఆపాదించి వాటిలో జీవం తొణికింపజేస్తుంది). భావనాశక్తి మహాకవులకు గానీ సాధ్యం కాదు. ఇది వ్యాసులవారిలో పరాకాష్ట చెందింది. వ్యాసుల వారిలో ఉన్నట్లే గంగాధరుడిలో కూడా కనబడుతుంది. (శ్రవ్యకావ్యంగా వ్యాసభగవానుడు భారతం రాస్తే దృశ్యకావ్యంగా గంగాధరుడు దానిని మలిచాడు. భరతుడి నాట్యశాస్తాన్ని “నాటకం అనే పేరుతో లోకానికి తెలియజేశాడు కవి. కాబట్టి నాట్యశాస్త్రలక్షణాలన్నీ సమగ్రంగా ఈయన కావ్యంలో ఉంటాయి. “కథామ్” అనే శబ్దం వాక్కు అనే అర్ధంలో ఉపయోగించబడింది.
చిరం స విజయీ భూయాద్విశ్వనాథః కవీశ్వరః 1
యస్య ్రసాదాత్సార్వజ్ఞం సమింధే మాదృశేష్వపి (మ.వి. 1.16)
“ఎవరి అనుగ్రహం మాలాంటివారికి కూడా సర్వజ్ఞత్వాన్ని సమకూర్చిందో ఆ కవీశ్వరుడు, విశ్వనాథుడు, ఎప్పుడూ ఉజ్వలంగా వెలుగుతూ ఉండాలి.
విశ్వనాథుడు ఈవిడ గురువు. ఈ విశ్వనాధుడు, ఆ విశ్వనాథుడితో (శివుడితో) సముడు. ఆ విశ్వనాథుడు కవీశ్వరుడు, క్రాంతదర్శి, సర్వజ్ఞుడు. ఈ విశ్వనాథుడూ కవీశ్వరుడే. ఆయన సర్వజ్ఞచూడామణి కాబట్టే తొను సర్వజ్ఞురా లయింది. “మాద్భశేష్వపి” అనడం గంగాదేవివినయం చెబుతోంది. సాటివారిలో తన గురువు మేటిగా ఉండాలని ఈమె ఆకాంక్ష ఈమె భక్తిప్రపత్తులు చూపిస్తోంది. కవులని ఫొగిడాక కావ్యలక్షణాలు చెప్పుకొచ్చిం దీవిడ :
క్వచిదర్ధః క్వచిచ్చబ్దః క్వచిద్భావః క్వచిద్రసః |
యతథైతే సంతి సర్వేఇపి స నిబంధో న లభ్యతే 1॥ (మ.వి. 1.17)
“క్రాన్ని కావ్యాలలో అర్ధం, కొన్ని కావ్యాలలో శబ్దం, కొన్ని కావ్యాలలో భావం, కొన్ని కావ్యాలలో రసం ఇంపుగా ఉంటాయి. కానీ వీటన్నింటితోనూ శోభించే కావ్యం దుర్లభమే”.
కావ్యప్రపంచంలో ఏ కావ్యంలో చూసినా ఏదో ఒక లోపం కనిపిస్తూనే వుంటుంది. సర్వగుణసంపూర్ణత్వం కనిపించదు. అన్ని హంగులూ వున్న కావ్యం దొరకడం చాలా కష్టం. ఇక్కడ “అర్ధం” అంటే 'అర్ధసౌష్టవం” అంళే “ప్రసాదం' మొదలైన గుణాలు. “శబ్దం” అంటే 'పదసౌష్టవం'. “భావం' అంటే రతి మొదలైనవాటి పోషణ. రసం అంటే శృంగారాదుల సంవిధానం. 'స నిబంధో న లభ్యతే' అనడంవలన తన కావ్యంలో ఇవన్నీ వున్నాయనీ చాల కావ్యాలకంటే తన కావ్యం మిన్న అనీ సూచిస్తోంది.
ప్రబంధమిషన్నాత్రోల_పి దోషో నయతి దూష్యతామ్ ।
కాలాగరుద్రవభరం శుక్తిక్షారకణో యధా ॥ (మ.వి.1.18)
15 మధురావిజయమారధురి
“ద్రోషం చిన్నదైనా కావ్యానికి దూష్యత నాపాదిస్తుంది. ఎలాగంటే కాల అగరు ద్రవం ఒక్కశుక్తిక్షారకణంతో చెడిపోవడం లోకంలో తెలిసిన విషయమే”.
“శ్రుక్తికారకణము” అంటే ముత్యపు చిప్పను కొన్ని ఓషధులతో కాలిస్తే బూడిద అవుతుంది. అ భస్మాన్ని ఉడకబెట్టగా వచ్చిన ద్రవాన్ని “శుక్తిక్షారము” లేదా “సున్నము” అంటారు. కణము అంటే చిన్నబొట్టు. “కాలఅగరు” అంటే “కృష్ణఅగరు”. అగరులలో “కృష్ణలగరు"కి సువాసన బాగా వుంటుంది. దానిలో శుక్తిక్షారకణము ఎంత కొంచెం పడినా అది మలమల మాడి సువాసనపోయి అది వికృతరూపం దాలుస్తుంది. అలాగే కావ్యం కూడా. అందులో ఏ మాత్రం తప్పు వున్నా అది హృదయాన్ని సంతోషపెట్టక నొప్పిన్తుంది. అందుకే “అదోషా నగుణౌ సాలంకారౌ శబ్దార్థెకావ్యమ్” అన్నారు లాక్షణికులు. “దోషాలు లేని, గుణాలు అలంకారాలతో కూడిన శబ్బార్ధాలు ఉన్నదీ కావ్యము”.
నిర్గోషాజ.వ్యగుణా వాణీ న విద్వజ్ఞనరంజనీ ।
పతివ్రతా ష్యరూపా స్త్రీ పరిడేత్రే న రోచతే | (మ.వి. 1.19)
“దోషం లేని కావ్యమైనా అందులో గుణం లేకపోతే దాన్ని విద్వాంసులు మెచ్చరు. పతివ్రతయైనా రూపవతి కాని భార్య భర్త కిష్టురాలు కాదు”.
దోషాలు లేకపోతే చాలదు, దానితోబాటు గుణసాహిత్యం, గుణసాన్నిహిత్యం కూడా కావ్యానికి కావాలి. ఉదాహరణ శీలవతియైనా రూపవతికాని భార్య. గంగాదేవి కాలంలో ్రీల రూపానికి (ప్రాధాన్యం ఉండేది. అంతకముందూ ఉండేది. తర్వాతా ఉంది. నెమ్మదిగా స్రీరూపానికి ప్రాముఖ్యం తగ్గి మేధానంపత్తికి విలువ నివ్వడం జరుగుతోంది. అందుకే కావ్యవర్ణనలలో స్రీ ఇప్పుడు అగమ్యగోచరం.
గుణం విహాయ కావ్యేషు దుష్టో దోషం గవేషతే
వనేషు త్వక్తమాకందః కాకో నింబమపేక్షతే ॥॥ (మ.వి.1.20)
“చెడ్డవాడు కావ్యంలో గుణాలను వదలి దోషాలను వెతుకుతాడు. కాకి తోటలో మామిడిచెట్లను వదలి వేపచెట్లను కోరుకుంటుంది”.
కవికి దోషాలగురించి అవగాహన ఉండాలి. అంతేగాని తప్పులెన్నడం, తప్పులు వ్యాపింపచెయ్యడం కూడదు. “తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు”. అతను గుణపక్షపాతిగా ఉండాలి. ఎవడు ఇలా ఉండడో అతను కుకవి. కాకి చేదుగుణానికి నిలయమైన వేపచెట్టుని ఆశ్రయించి మధురమైన మామిడిచెట్టుని త్రోసిరా జంటుంది. ఇక్కడ కాకి స్వీకరించవలసిన దానిని స్వీకరించకుండా నిషిద్ధమైన దానిని స్వీకరిస్తోంది. కుకవి కూడా అంతే.
మాకందము అంటే మామిడి. కం - అంటే సుఖము ద - దదాతి = కంద;
మధురావిజయమాధురి 19 “మాకంద”ా అంటే లక్ష్మికి సుఖప్రదమని అర్దం. “మాకందర్పుని ములుకులు మాకంద ము లగుట జేసి మాకందంబుల్ మా కందములను క్రియ దగ । మాకందాగ్రముల బిక సమాజము నిలిచెన్” (భాగవతము - బమ్మెరపోతన) ఇలా అనడంవల్ల మామిడిచెట్టు మిద కాకి వుండదని కాదు. వేపచెట్టులో వుండే ప్రీతి దానికి మామిడిచెట్టులో వుండక పోవడమే.
చౌర్యార్జితేన కాన్యేన క్రియద్దీవ్యతి దుర్జన: ॥
అహార్యరాగో న చిరం రుచిరః కృ(త్రిమోపలః ॥ (మవి.1.21)
“క్రావ్యాన్ని దొంగలించిన చెడ్డవాడు ఎన్నాళ్ళో కవిగా రాణించలేడు. ఆపాదించిన రంగుతో వున్న కృత్రిమమణి మహామణిగా ఎప్పటికీ వెలుగు లీనదు". _
మహాకవుల కావ్యాలు తమవిగా ప్రకటించుకొని కొందరు తాము మవాకవులుగా లోకాన్ని మోసగిస్తారు. వాళ్ళు నిజంగా కవులమని చెప్పుకునే యోగ్యత లేనివారు. వీళ్ళ ప్రవర్తనే వీళ్ళని లోకానికి పట్టి ఇస్తుంది. కృత్రిమరత్నం పద్మరాగంలాగా మెరవాలని ఎర్రనిరంగు పూసుకున్నా. ఆ రంగూ, లావణ్యమూ ఎన్నాళ్ళో నిలవవు. రత్నం రత్నమే. రాయి రాయే. మహాకవి మవాకవే. కుకవి ఇతడు. కుకవులు రెండురకాలు. ఇతరుల గుణాలను తిట్టి, వాళ్ళకి దోషాలని ఆరోపించి మహాకవులని ఎద్దేవా చేసేవారు ఒక రకం. రెండవ రకం మహాకవుల రచనలనే తమ రచనలుగా చెప్పుకుంటారు.
తార్మికా బహవనస్సంతి శాల్తికాశ్చ సహస్రశః ॥
విరలాః కవయో లోకే సరసాలాపపేశలా: ॥ (మ.వి. 1.22)
“తార్మికు లెంతోమంది వున్నారు. వైయాకరణులు వేలకువేలు వున్నారు. సరస సూక్తులతో రంజింపచేసే మంచి కవులు లోకంలో చాలా తక్కువ”.
శాన్త్రజ్ఞాన మంటే శా(స్తాలు చదవడం. ఎవరికి వారు ప్రయత్నించడంవల్ల ఇది సాధ్యమవుతోంది. మంచికవిత్వం కేవలం పూర్వజన్మసుకృతంవలనే లభిస్తుంది. అందుకనే మెప్పించడం చాలా కష్టం. ఒక కవి ఇలా అన్నాడు “కవితా వనితా చైవ స్వయమే వాగతా వరమ్ ; ఐలాదాకృష్యమాణా చేత్సరసా విరసా భవేత్” (కవితా వనితా కూడా స్వయంగా రావాలి. బలవంతంతో సరసం విరస మవుతుంది) ఈ మహాకవి ఉద్దేశం సహజంగా కాక ప్రయత్నంతో లభించే కవిత రంజింపచేయదు అని. ౮౦౧౧ గ6813 అనే 19వ శతాబ్దిపు ఆంగ్లకవి ఇలా అంటాడు “౯౨౦౪౧/ 500616 00౧౫౦ 28 ౧౩౧౧ 25 106 182౪65 10 106 17865" (కవిత్వం చెట్లుకు అకులు వచ్చినంత సహజంగా రావాలి). మరొక 19వ శతాబ్దిపు అంగ్లకవి 41112౯ ఈ0౧5*0గగ - గిం61౧/ 5 500౧1206- 0౪3 ౮౪౭500౪ ౮ ఆగాంఠంగ3 (90086496 ౧ ౪2౧౧౮౫1/ అన్నాడు. (ఉప్పెనలా ముంచెత్తే
ణు మధురావిజయమాధురి భావావేశాలని ప్రశాంతచిత్తంతో సమన్వయపరచడం కవిత్వం”) కవి కావడానికి ఆ కవితాదీప్తి కావాలి. అది అందరిలోనూ ఉండదు. ఓం/6 8770౧ అనే ఆంగ్లకవి (౧౦గ౫౭౧౪౦ 140౪6గ6౧| అప్పటి సంగతి - భావకవితో ద్యమం) 12-13 ఏళ్ళవా డయినప్పుడు వాళ్ళ బడి మాస్టారు బైబిలులోని 581౧ ఆ౦గగ-2 లో 1487182096 1౧ 0౬౪౭౧ లోని ౮95౪9 1677910 ౪౭18౯ 1౧10 *1౧6 అనే ఉదంతంపైన కాంపోజిషన్ రాయమన్నాడట. అ కథేమిటంటే జీసస్ క్రైస్ట్ తనతల్లితో ఒక పెళ్ళికి వెళ్తాడు. అందరికీ పంచటానికి అక్కడ వైన్ వుండదు. కొద్దిగా రొట్టెముక్కా వైన్ తీసుకోవడం వాళ్ళ ఆచారం. అప్పు డాయన ఆరు రాతిపీపాలు తెప్పించి వాటిలో నీళ్ళు నింపి ఆ నీటిని చల్లగా చూస్తాడు. ఈ కథ మిద మిగతా పిల్లలు కాంపోజిషన్ సేజీలకొద్దీ రాసేస్తున్నారు. బైరన్ పెన్సిలేమో కదలటం లేదు. మాస్టరుగారు పదే పదే హెచ్చరించడంతో అతను ఆలోచించి ఒకే ఒక్క వాక్యం రాశాడు. "706 ౪216! 524 18 10/6 2౧6 0108866" (నీరు తన ప్రభువుని చూసి సిగ్గుతో ఎరుపెక్కింది). బైరన్ ఒక మహాకవి. మహాకవు లెపుడూ పుడతారు. బలవంతాన తయారు చేయబడరు. కరోతి కీర్తిమర్ధాయ కల్పతే హంతి దుష్ఫృతమ్ ॥ ఉన్మీలయతి చాహ్లాదం కిం న సూతే కవేః కృతిః ॥ (మ.వి. 1.28) “కీర్తిని చేకూరుస్తుంది. ధనాన్ని ఇస్తుంది. పాపాన్ని రూపుమాపుతుంది. ఆనందాన్ని కల్గిస్తుంది. కావ్యం ఇయ్యని దేది?” ఇక్కడ కావ్యప్రయోజనాలని వివరిస్తోం దీవిడ. “కావ్యాలాపాంళ్చ వర్జయేత్” అమె నిషేధం మంచి ఉపదేశాలు చేసే సత్మావ్యాలను గురించి కాదు. కావ్యం యశసే౬_ర్ధకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే సద్యః పరనిర్భతయే కాంతాసమ్మితతయోపదేశయుజే” అన్నారు లాక్షణికులుకావ్యం కీర్తినీ, ధనాన్నీ, వ్యవహారాన్నీ అనర్ధనాశనాన్నీ, చదివిన వెంటనే గొప్ప ఆనందాన్ని మధురోపదేశాన్ని కలగజేస్తుంది కవికీ, సహృదయుడికీ చెందిన సమిష్టిప్రయోజనాలనే కవయిత్రి ఇక్కడ చెప్పింది. మన లాక్షణికులు కావ్యం గురించి చెప్పినట్టు ఆంగ్లరచయిత [18౧015 8౦0౧ పుస్తకాలు ఎలా ఉంటాయో చెప్పాడు. "50/19 000%5 &6 10 8% 129166; 016/3 10 06 5౪44110౪66; &౧౮ 90౧౧6 16౪ 10 06 619466 &౧౮ 61965166. (“కొన్ని పుస్తకాలను రుచిచూడాలి; కొన్నిటిని మింగేయాలి; చాలా కొన్నిటిని మాత్రం నమిలి జీర్ణించుకోవాలి”౫ కావ్యరచనకి కవులనీ కావ్యరస ఆస్వాదనకి సహృదయులనీ ఈమె వెన్నుతట్టి ప్రోత్సహించింది. కవులలాగే సహృదయులూ దుర్లభులే. త్వరగా దొరకరు. “కవిః కరోతి పద్యాని, లాలయత్యుత్తమో జనః | తరుః
మధురావిజయమాధురి 21 ప్రసూతే పుష్పాణి, మరుకెద్వహతి సౌరభమ్” (కవి పద్యాలను రాస్తాడు, సహృదయులు వాటిని ఆదరిస్తారు. చెట్టు పువ్వులను పూస్తుంది. గాలి సువాసనలని వీస్తుంది. “ఉన్నీల యతి” “ఆహ్లాదమ్' అనే పదాలవల్ల మోక్షం కూడ కావ్యప్రయోజనం అని తెలుస్తోంది.
న ్రార్ధనీయస్తత్యావ్య(శుత్యై సహృదయో జనః -
స్వాదుపుష్పరసాస్వాదే కః ప్రేరయతి షట్పడమ్ ॥ (మ.వి.1.24
“మంచి కావ్యాన్ని వినమని సహృదయులని ్రార్థించ నక్కరలేదు. ఇంపైన పూల రసాన్ని పీల్చ్బమని ఎవరు తుమ్మెదను ప్రోత్సహిస్తున్నారు?”
కావ్యమాధుర్యాన్ని ఆదరించి ఆస్వాదించగల రసహృదయుడు సహృదయుడు. వువ్వులోని తేనెలాంటిది కవితామాధుర్యం. తనంతతానుగా తుమ్మెద వూతేనెను తాగుతుంది. “తేటి పూవుందేనియ గొనియెడు పోల్కి అలాగే సహృదయుడు తనంత తానుగా కావ్యానందాన్ని పొందుతాడు. రసజ్ఞులూ, సహృదయులూ (19510613 &౧6 ౧౦౧౧౦19860/5) కోరి ఆనందించి, ఆదరించే మహాకావ్యం “మధురావిజయం” అని గంగాదేవి అభిప్రాయం.
'కావ్య(శుత్యై' అనేచోట “శ్రుతి శబ్దంలో అర్ధగాంభీర్యం వుంది. ఉపదేశాత్మకమైన కావ్యవేదంలా పవిత్రమైనది. అలాంటి కావ్యం “సహృదయజనం” ఆదరిస్తారని ఆవిడ గట్టి నమ్మకం. నిజం కూడా కదా!
క్
ఇక్కడ రాజవర్ణన జరుపుతోంది గంగాదేవి. బుక్కరాజు వర్జన ప్రారంభించింది.
ఆసీత్సమస్తసామంతమస్తకన్యస్తశాసనః |
బుక్కరాజ ఇతి ఖ్యాతో రాజా హరిహరానుజః ॥ (మ.వి.1.26)
“లోకంలో అందరు సామంతరాజులూ తన ఆజ్ఞను శిరసావహిస్తుండగా, హరిహర రాయలకు తమ్ముడైన బుక్కరాజనే రాజు ఉండెను.
రాట్-రాయ-రాజ-రాణ ఈ శబ్దాలన్నీ రాచరికాన్ని తెలుపుతాయి. “సమస్త శాసన?” అనడంచేత ఇతను స(మ్రాట్టు అని తెలుస్తోంది.
యతళ్ళేష ఇవ నాగానం నగానాం హిమవానిన ।
దైత్యారిరివ దేవానాం (ప్రధమః పృథివీభుజామ్ ॥ (మ.వి. 1.27)
“అతను నాగులలో ఆదిశేషువూ, పర్వతాలలో హిమవంతుడూ, దేవతలలో విష్ణువూ, రాజులలో ప్రథముడు”.
శ్రీకృష్ణుడు తన మహిమలను చెబుతూ “ఆదిత్యానామహం విష్ణుః, స్థావరాణాం హిమాలయః, అనంతశ్చాస్మి నాగానామ్” అంటాడు (భగవద్గీత-10వ అధ్యా.) (ఆదిత్యు లలో నేను విష్ణువునీ, పర్వతాలలో హిమాలయాన్నీ, నాగులలో అనంతుణ్ణి” అని) వేయి
22 మధురావిజయమాధురి తలల ఆదిశేషుతో బుక్కరాజుని పోల్చడం అతను రాజుగా భూభారం మోయగలదనీ, వేయిముఖా లున్నాయి కాబట్టి మంచిమాటకారి అని తెలుపుతోంది. హిమవంతుడితో పోలిక ధీరత్వాన్ని, విష్ణువుతో పోలిక పరాక్రమాన్ని చెబుతున్నది. రామాయణంలో రాముడి గురించి చెబుతూ “ధైర్యేణ హిమవానివ, విష్ణునా సదృళో వీర్యే” అంటాడు వాల్మీకి. తిగ్మాంశోరపి తేజస్వీ శీఠాంశోరపి శీతలః । సాగరాదపి గంభీరస్సుమేరోరపి యః స్థిరః ॥॥ (మ.వి.1.28) “అతను సూర్యుడికంటె ప్రకాశమైనవాడు. చంద్రుడికంటే చల్లనివాడు. సముద్రుడి కంటె గంభీరుడు. మేరువుకంటే స్థిరుడు”. రాజుకు తేజస్సూ, మెత్తదనం రెండూ అవసరమే. అగ్ని. సూర్యుడు, చంద్రుడు వీరి అంశాలతో పుడతాడు రాజు, తన చేష్టలతో తనమనసులోని మాట బయట పడకుండా ప్రవర్తించడం గాంభీర్యం. ఇంద్రియాలను చాంచల్యం లేకపోవడం స్థిరత్వం. రాజు జితేంద్రియుడైతే ఇంద్రియాల లాగా ప్రజలను కూడా తన వశంలో ఉంచుకోగలడు. కాబట్టి మేరువు కంటే స్థిరుడు రాజు. రాజు కుండవలసిన లక్షణాలన్నీ బుక్కరాజులో వున్నాయి. “సముద్ర ఇవ గాంభీర్యే, సోమవ(త్రియదర్శన”. అంటుంది రామాయణం రాజుని గురించి. (సముద్రుడిలా గంభఖీరుడు, చంద్రుడిలా చూడ చకృ్కనివాడు) ఇశ్రుతమప్యధిగమ్య యే రిపూన్ వినయంతే చ శరీరజన్మన: జనయంత్యచిరాయ సంపదా మయశస్తే ఖలు చాపలాశ్రయమ్”/ “క్రిరాత్రార్జునీయమ్” 2వ సర్గ. 41వ ళ్లో. శాస్త్రాలను చదివి ఎవరు కామక్రోధాదిశత్రువులను జయించరో వారు శీఘ్రంగానే సంపదలకు చంచలత్వము ఆ(శ్రయించిన అపకీర్తిని కలిగిస్తారు - వాళ్ళ సంపదలు నిలవవు) ప్రసాదాభిముఖే తస్మింశ్చపలాపి స్వభావతః నికషే హేమరేఖేవ, శ్రీరాసీదన పాయినీ” రఘువంశం” 17వ సర్గ. 46 శ్లోకం). (లక్ష్మి స్వభావంచేత చపల ఐనా నిర్మలుడైన ఆరాజునందు ఒక రాతిలోని బంగారుతీగలాగా స్థిరంగా ఉంది]. వివేకమేవ సచివం ధనురేవ వరూధినీమ్ । బాహుమేవ రణోత్సాహే యస్సహాయమమన్యత ॥ (మ.వి. 1.29) “అతనికి యుద్ధప్రయత్నంలో తన వివేకమే మంత్రి. తన చాపమే సైన్యము. తన బాహువే అంగరక్షకుడు”. " "
మధురావిజయమాధురి 20
అతని బాహుబలం అతని అంగరక్షకుడిలాగా యుద్ధంలో అతణ్జీ కాపాడుతుంది. అతను బుద్దిసంపద గలవాడు. అసహాయశూరుడు. 'వివేకమేవ సచినమ్' పరాక్రమానికి నీతిసంపద తోడైనప్పుడే అది ప్రకాశిస్తుంది. ఇక్కడ దిలీపుని వర్ణన గుర్తుతెస్తోంది.
సేనా పరిచ్చద స్తస్య ద్వయ మేవార్థసాధనమ్ |
శా(స్రేష్వకుంఠితా బుద్ధిః మౌర్వీ ధనుషి చాతతా ॥
రఘువంశం” 1వ సర్గ. 19వ ళ్లోకం)
(దిలీపుడికి చతురంగబలమూ ఉపకరణంగానే, అలంకారప్రాయంగానే ఉండేది. కార్యసాధనకి మాత్రం అర్ధనీతిశాస్తాలలో నిరాటకంగా సాగే అతని బుద్ధి, ధనుస్సు సరిపోయేవి”) వివేకమే మంత్రి అంటే ఇతర మంత్రులు లేరని కాదు. మంత్రాలోచన చేయటంలో ఇతరాలోచనలు చేయకుండా సమర్ధవంతంగా నిర్వహించేవాడని అర్ధం.
జిష్ణునా భువనేశేన శ్రీదేన సమవర్తినా |
సాన్నిధ్యం లోకపాలానాం ధరణౌ యేన దర్శితమ్ 11 (మ.వి. 1.30)
“అతను ఇంద్రుడై, వరుణుదై, కుబేరుడై, యముడై దిక్ప్సాలకులంతా భూలోకానికి సన్నిహితు లవటం లోకానికి చూపాడు”.
జిష్ణుడంటే జయించు స్వభావము కలవాడు ఇంద్రుడు. భువనేశుడంటే లోకాలకు ప్రభువు - వరుణుడు. శ్రీదు డంటే సంపద ఇచ్చేవాడు - కుబేరుడు. సమవర్తి అంటే జనులలో సమమైన (ప్రవర్తన కలవాడు - యముడు. ఇం(దద్రుడూ, వరుణుడూ, కుబేరుడూ, యముడూ దిక్పాలకులు - దిక్కులకి అధిపతులు. వీళ్ళ అంశాలతోనే రాజులు పుడతారు. బుక్కరాజు వీళ్ళ అంశలనీ తీసుకుని పుట్టాడు. ఇతను వాళ్ళందరి గుణాలని కలబోసి పుట్టాడు కాబట్టి వాళ్ళందరి కంటే మిన్న
హృదయే చందనాలేపైః కర్ణే మౌక్తికకుండలైః ॥
సతాం ముఖే చ కర్చూరైర్యస్యాభావి యశోభరైః (మ.వి.1.81)
అతని కీర్తి సంపదలు మంచివారి హృదయాలకు మంచిగంధంపూతలు. చెవులకు ముత్యాలపోగులు. ముఖానికి పచ్చకర్పూరం పలుకులు.
కీర్తి తెల్లగా వుండటం కవి సమయం. మంచి గంధంపూత, ముత్యాలపోగు, పచ్చకర్పూరం పలుకు. ఇవి ఉపమాన వస్తువులు. రాజుకీర్తి చందనపూతలాగా మంచివాళ్ళ హృదయాలకి హాయిని చేకూరుస్తున్నది. చెవులకి ముత్యాలపోగుల్లాగా శుభాన్ని కలగ జేస్తోంది. పచ్చకర్పూర పలుకుల్లాగా మాటలలోని కల్మషాన్ని తొలగజేస్తుంది. బుక్కరాజు వేదాలకు భాష్యాలు రాయించాడు. వైదికమతోద్ధరణకి నడుం బిగించాడు. విద్వాంసులని పోషించాడు. భారతీయుల జ్ఞానవిజ్ఞానాలకి జీవితాన్ని అంకితం చేశాడు. అలాంటి రాజు గురించి ఇలా రాయడం సముచితంగా ఉంది.
24 మధురావిజయమాధురి
యస్య కీర్యా ప్రసర్పంత్యా గుణకర్పూరశాలినః |
జగదండకరండస్య క్షౌమకంచులికొయితమ్ (మ.వి. 1.33)
లోకంలో వ్యాపించిన అతని కీర్తి అతని గుణాలనే కర్పూరగుళికలతో శోభించే బ్రహ్మాండానికి తొడిగిన పట్టుగలీబులాగా వుంది. (గలీబు = తొడుగు)
కర్పూరం సువాసనచేత ఆకర్షిస్తుంది. సుగుణాలు కూడా అలాగే ఆకర్షిస్తున్నాయి. ప్రపంచమంతా ఒక భరిణలాగా ఉంది. ఇతని సుగుణాలు అందులో నిండివున్నాయి. అందుకే అవి కర్పూరగుళికలలాగా వున్నాయి. అ కర్పూరం వెదజల్లే పరిమళం నలువైపులా అలముకుంటోంది. సుగుణాలవలన వచ్చిన కీర్తి కూడా అంతే. ఆ కీర్తి (బ్రహ్మాండమంతా ఆఅవరించడం వలన దానికి తొడిగిన తెల్లపట్టు గలీబా అన్నట్లు తోస్తోంది. అతను తన గుణాలచేత సర్వలోకాలను సంతోషపెడుతూ రాజుల్లో ప్రఖ్యాతి గాంచాడని సారాంశం.
పరిపంధినృపప్రాణ పవనాహారదారుణః |
అసృజద్భుజగో యస్య కృపాణ:ః కీర్తికంచుకమ్ 1 (మ.వి. 1.34)
అతని కత్తి శత్రురాజుల ప్రాణా లనే గాలులని తింటూ దారుణంగా తిరుగుతూ కీర్తి అనే కుబుసాన్ని విడిచింది. "
కీర్తి తెల్లగా ఉండి పాము కుబుసంలా ఉంది. కత్తి నల్లగా ఉండి నల్ల త్రాచులా వుంది. శత్రువుల ప్రాణాలు గాలులు. పాములు గాలులని తింటాయి. “వాయుభుక్కులు” శత్రువుల ప్రాణాలను తీసేది కత్తి. గాలులను యథేచ్చగా (గ్రోలేది పాము. అందువలన పదునైనది (దారుణము) కత్తి. గాలి తిని లావై భయంకరమైనది (దారుణము) పాము, కీర్తిని పొందింది కత్తి. కుబుసాన్ని విడిచింది పాము.
యదీయో దక్షిణః పాణిః కృపాణీగ్రహణచ్చ్భలాత్ 1
అశిక్షత విపక్షశ్రీవేణీకర్షణకౌశలమ్ 1 (మ.వి. 1.35)
అతని కుడిభుజం కత్తిపట్టే నెపంతో శత్రురాజుల రాజ్యలక్ష్మి జుట్టుని పట్టుకోవడంలో మెలకువలు అలవరచుకుంటోంది.
అతను కత్తి పట్టగానే శత్రురాజు లతనికి వశ మవుతున్నారు. అతని భుజబలానికి పోలిక ఎవరిలోనూ లేదు. అది శత్రురాజులని జయించటానికి చాలు. కృపాణీగ్రహణము వ్యాజము అనడం పరమార్ధ మిది.
బద్దాస్సభాంగణే యస్య భాంతి స్మ జయసింధురాః |
ఐందీకృతా ఇవాంభోదా జైత్రయాత్రానిరోధినః 11 (మ.వి.1.40)
సభాప్రాంగణంలో బంధించబడిన అతని మదపుటేనుగులు దండయాత్రకు ప్రతి బంధకం కల్లించటం వల్ల పట్టి బంధించిన తొలికారుమబ్బుల్లా ఉన్నాయి.
మధురావిజయమాధురి 25
గంధగజం గజవిశేషం. రాజులంతా గంధపుటేనుగులని కానుకగా తెచ్చారు. వొటితో ఆస్థానమంతా కిక్కిరిసిపోయివుంది. ఏనుగులు నల్లగా ఉన్నాయి. కాబట్టి మేఘాలతో పోలిక. అవి ఆస్థానంలో బంధించబడ్డాయి. ఏనుగులు మదాన్ని స్రవిస్తాయి. మేఘాలు వర్షాన్ని కురుస్తాయి. వర్షాకాలం దండయాత్రకు అనుకూలం కాదు. కాబట్టి మేఘాలు బంధింపబడ్డాయి. అవి వర్షంవల్ల దండయాత్రకు ్రతిబంధం కలిగిస్తాయి. అనేకరాజన్యరథాశ్వసంకులం ; తదీయిమాస్టాననికేతనాజిరమ్ ; నయత్యయుగ్మచ్చ దగంధిరార్టతాం । భృశం నృపోపాయన దంతినాం మదన (“కిరాతార్డునీయమ్” 1వ సర్గ 16వ శ్లోకం) (రాజులు కానుకలుగా ఇచ్చిన ఏడాకుల అరటిపూవు వాసనగల ఏనుగుల మదజలం చాలామంది రాజకుమారుల రథాలతో, గుర్రాలతో క్రిక్కిరిసి వుండే ఆ దుర్యోధనుడి ఆస్థానమందిరాన్ని బాగా తడిపింది). శరత్కాలమే దండయాత్రకి అను కూలం. “సూర్యాతపక్రామణనష్టపంకా భూమిశ్చిరోద్దాటితసాంద్రరేణుః । అన్యోన్యవైరా మర్షాయుతానా | ముద్యోగకాలో£_ ద్య నరాధిపానామ్” రామాయణం - కిష్కింధాకాండ 30వ సర్గ-38 శ్లోకం (సూర్యుడి ఎండ ప్రసరించి బురద ఎండిపోవడంచేత చాలాకాలానికి భూమిపై నుంచీ దట్టమైన దుమ్ము ఎగురుతోంది. ఇది పరస్పరం వైరంతో తలపడే రాజులు యుద్ధం చేసికొనే సమయం)
యస్య సేనాతురంగాణాం ఖురైరుత్ధాపితం రజః ।
అకాండే రాహుసందేహం మార్తాండస్యోదపాదయత్ ॥ (మ.వి.1.41)
అతని దండయాత్రలో పరిగెట్టే గుర్రాల కాలిగిట్టల దుమ్ము ఆకాశానికి లేస్తుంటే అది అకాలంలో ఏర్పడిన రాహువులా సూర్యుడికి అన్పించిందట!
సూర్యమండలంవరకూ ఈరాజు సైన్యం లేపిన దుమ్ము పైకిలేస్తోంది. రాహువు నలుపు. దుమ్ము నలుపు. నల్లటి దుమ్ము సూర్యుడికి రాహువనే భ్రాంతిని కల్గించింది. పర్వదినాలలో గ్రహణం పడుతుంది. జైత్రయాత్రలో బుక్కరాజు సైన్యం చాలా పెద్దదని తెలుస్తోంది. అందులో గుర్రాలు చాలా వేగంగా వెళుతున్నాయి. కంపరాజు వర్ణన :
మహౌజసస్తస్య నిజైర్యశోఖి
రుద్వేలదుగ్గోదధిపూరగౌరై: ॥
'ప్రక్షాళితానీవ తదా ఐభూవు
ర్భృతప్రసాదాని దిశాం ముఖాని ॥ (మ.వి.2.15)
అధికమైన పాలసముద్రప్రవాహంలాంటి తెల్లని ఆ కంపరాజు కీర్తులతో కడిగినట్లు దిశలు నిర్మలంగా వెలిగాయి.
25 మధురావిజయమాధురి
మహాపురుషులు పుట్టినప్పుడు ముందు కలగబోయే శుభాన్ని సూచిస్తూ దేవతలు, లోకాలూ మహానందపడటం వర్ణించబడుతుంది. అలాగే గంగాదేవి కంపరాజు మహాపురుషుడని వర్ణిస్తోంది. అతని తేజస్సు నలుదెసలా వ్యాపించింది. అతని కీర్తి పాలసముద్రప్రవాహంలా తెల్లగా ఉంది (కీర్తి తెల్లగా ఉండటం కవిసమయం). ఆకీర్తి నాలుగువైపులా చుట్టేసి దిక్కులని కడిగేసింది. అందుకే మురికి వదలి అవి నిర్మలంగా వున్నాయి.
కృష్ణావతారం, రామావతారం మొదలైన ఘట్టాలలో ఇలాంటి వర్దనలే ఉన్నాయి. “దిశః ప్రసేదుర్మరుతో వవుశ్శుభాః । ప్రదక్షిణార్చిర్హవిరగ్నిరారదే । బభూవసర్వం శుభశంసి తత్క్షణం । భవో హి లోకాభ్యుదయాయ తాద్భశామ్” (“రఘువంశం” 3 సర్గ. 14వ శ్లోకం) (ఆ నిమిషంలో దిక్కులు నిర్మలంగా అయ్యాయి. గాలులు హాయిగా వీచాయి. హోమాగ్ని మంచిజ్వాలతో హోమాన్ని స్వీకరించింది. అంతా శుభసూచకంగా ఉంది. అట్టి వారి జన్మ లోకశ్రేయస్సుకే కదూ!) (కాళిదాసు సుదక్షిణాదేవికి శిశువు కలగగానే ప్రకృతి అంతా ప్రసన్నమైందని పైవిధంగా చెప్పాడు).
అలక్ష్యరేఖభామయశంఖచక్ర
చృత్రారవిందధ్వజమానచిహ్నా |
ప్రవాలతామ్రాంగులిదర్శనీయౌ
సుజాతపార్న్హీ చరణౌ వహంతమ్ ॥ (మ.వి.2.28)
అతనిపాదాలు అందమైన మునుగాళ్ళతో వుండి చిగురుటాకులను బోలిన వేళ్ళతో చూడటానికి ఇంపుగా రేఖలు దీరిన శంఖచక్రాలతో, పద్మచ్చత్రాలతో, ధ్వజమత్స్యాలతో కన్నులపండువగా వున్నాయి.
సాముద్రికశాస్తం వద్మమత్స్యరేఖలు భాగ్యలక్షణంగానూ, చక్రరేఖలు (వ్రభు లక్షణంగానూ, ఛత్రధ్వజరేఖలు రాజలక్షణంగానూ చెబుతోంది. ఈ వర్ణనవల్ల కంపరాజు మహాపురుషుడని, దేవుని అంశతో జన్మించినవాడనీ, సమర్భడూ, విద్యావంతుడూ, మంచివంశం కలవాడనీ తెలుస్తుంది.
కాలే కలావష్యసురాంతకస్య
'ప్రకాశయంతీ మవతారమన్యమ్ |
అచంచల(శ్రీతటిదభ్రలేఖాం
శ్రీవత్సముద్రామురసా దధానమ్ ॥ (మ.వి.2.29)
కలికాలంలోని విష్ణుమూర్తి అపరావతారం ఇతడే నని లోకానికి తెలియజేస్తూ చెక్కు చెదరని శ్రీతో శోభిల్లు మెరుపుతీగతో వున్న మేఘమాల లాంటి శ్రీవత్సమనేమచ్చ ఒకటి అతని ఛాతీమీద మెరుస్తూ వుంది.
మధురావిజయమాధుర 27 శ్రీవత్సం విష్ణువు ఛాతీమిద పుట్టుమచ్చ. ఆయన ఛాతీలో కుడి వైపుకి మారేడు దళ ఆకారంలో ఉంటుంది. శ్రీవత్సం నలుపు. మేఘమాల నలుపు. కాబట్టి రెండింటికీ పోలిక. విద్యుత్తు పసిమి. శ్రీకూడా అలాంటిదే. అందుకే పోలిక. రామకృష్ణుడు “తో బిట్టువయ్యెనే తులితకాంచనవర్ణ వెలదివెన్నెలగాయు వేల్పునకును”. (పాండురంగ మాహాత్యము - 1 అశ్వాసము. 2ప.) దుష్టశిక్షణ శిష్టరక్షణలో కల్కి కంపరాజూ సములే. కలికి శ్రీ, శ్రీవత్సలు లేవు. కంపరాజు కవి రెండూ ఉన్నాయి. అతని పుట్టమచ్చ కాంతే అతని శ్రీ. కాబట్టి కంపరాజే కల్కి కంటే ఉన్నతుడు. “వదతి మహత్త్వం వత్సః శ్రీయుతో వత్సః శ్రీవత్సః”. కృష్ణదేవరాయలు విష్ణువుని గురించి” సిరి పొల్చుమచ్చ పేరు రమువాని” అంటాడు (ఆముక్తమాల్యద 8 ఆశ్వాసం. 85ప.) విష్ణువక్షస్థలాన్ని శ్రీ, శ్రీవత్సలు వదలరు. కంపరాజువక్షాన్ని శ్రీవత్స వదలదు. అకంపయిష్యత్యయమేకవీరః
సం(గ్రామరంగే సకలానరాతీన్
ఇత్యేవ నిశ్చిత్య స దీర్హదర్శీ
నామ్నా సుతం కంపన ఇత్యకార్నీత్ ॥ (మ.వి.2.34)
దూరదృష్టి గల ఆ రాజు యుద్ధరంగంలో శత్రురాజులను ఎవరిసహాయమూ లేకుండా, ఒంటరిగా, అత నొకడే కంపింపజేస్తాడని నిశ్చయించి కొడుక్కి కంపనుడని పేరుపెట్టాడు.
'కపి-చలనే' అనే ధాతువుకు ణిజంతానికి కృత్యల్యుటో బహులమ్” అని ల్యుట్ ప్రత్యయం ఏర్పడితే 'కంపన' అవుతుంది. నామకరణసందర్భంలో ఇలాగే కాళిదాసు వ్యుత్పత్తి చెబుతూ వుంటారు. రామ ఇత్యభిరామేణ । వపుషా తస్య చోదితః ।; నామధేయం గురుళ్చక్రే । జగత్ర్రథమమంగళమ్” (“(రఘువంశం” 10వ సర్గ. 67వ శ్లోకం). (మనోహర మైన బాలుడి శరీరంచేత ముగ్భుడై దశరథుడు ఆ శిశువుకు రాముడు అని పేరు పెట్టాడు) దీర్హదర్శీ అనడంచేత కాంచీపురం రాజు చంపరాజునీ, మధురాపురరాజు సురత్రాణుణ్ణీ ఇతను ఓడిస్తాడని అతను అలోచించాడట!
స పంచబాణద్విపకేలిదీర్హికాం
ధరానురాగద్రుమపుష్పమంజరీమ్ |
నితంబినీనేత్రచకోరచంద్రికా
మవాపదాస్కందితశైశవాం దశామ్ (మ.వి.3.4)
అతను మన్మథుడనే ఏనుగులరాజు విలాసంగా క్రీడించే దిగుడుబావి, ప్రజల ప్రేమ చెట్టు పూచిన పూలగుత్తి, అందమైన ఆడవాళ్ళ కళ్ళనే చకోరపక్షులకి వెన్నెల అవుతూ, నవయౌవనాన్ని పొందాడు.
28 మధురావిజయమాధురి కంపరాజు యౌవనవంతు డయ్యాడు. అవయవవికాసం ఏర్పడింది. అతను అందగాదైన మన్మధుడికే ప్రేమ కల్లిస్తున్నాడు. ప్రజలు కూడా అతన్ని అభిమానిస్తున్నారు. స్త్రీలు అతన్ని (ప్రేమిస్తున్నారు. “పంచబాణద్విప” అనడం మన్మథుడి నిరంకుశత్వాన్ని తెలుపుతోంది. “పుష్పమంజరీమ్” అనడంవలన యౌవనానికి తగిన ఫలాన్ని అందజేసి భావిలో పొందబోయే మధురావిజయాన్ని స్ఫురింపజేస్తుంది. డెన్మార్మ్రాకుమారుడు 112%161ని “0056౧/66 01 &॥ 0096౧/6/3“ (చూపరులకి దర్శనీయుడు) అనిపిస్తాడు. 5%౧2%69064/6 తన నాటకం *“|41&గ|60 లో (ఉం 11 506069 1 - 154). అధారయద్దర్శితదేహసౌష్టవాం స రాజసూనుస్తనువృత్తమధ్యతామ్ | పరాక్రమత్రాసితచిత్తవృత్తిభి . రృగాధిరాజైరుపదీకృతామివ 11 (మ.వి.3.9)
ఆ రాజు తన పరాక్రమానికి భయపడిన మనస్సులతో సింహాలు తనకు కానుక ఇచ్చాయో అన్నట్లు తన శరీరసౌష్టవాన్ని చూపిస్తూ, ఉందా లేదా అనిపించే గుంద్రమైన సన్నని నెన్నడుముతో అలరారాడు.
ఆడవాళ్ళకే కాకుండా సింహంలాంటి నడుము మగవాళ్ళకీ కూడా సౌందర్య పోషకం. కంపరాజుకి అలాంటి నడుము వుంది. అతని పరాక్రమానికి భయపడి సింహాలు తమ నడుముని అతని కీిచ్చాయని భావం. బలవంతుడికి భయపడి అమూల్యమైన కానుక సమర్పించుకొని అతనినుంచి ఆపద తప్పించుకోవడం లోకంలో జరుగుతున్నదే. ఇక్కడా అదే జరిగింది. రాముణ్ణి వర్ణిస్తూ “సుముఖం దుర్ముఖీ రామం! వృత్తమధ్యం । మహోదరీం!” అంటాడు వాల్మీకి. (రామాయణం అరణ్యకాండ 17 సర్గ. 10వ శ్లోకం). (సుముఖం = మంచి ముఖము గలవాడు, వృత్తమధ్యమ్ = సన్నని నడుముకలవాడు - ఇదిరాముడికి చెందుతుంది); దుర్ముఖీ =చెడ్డముఖముకలది; మహోదరీ=పెద్దకడుపు కలది = ఇది శూర్చణఖకు చెందుతుంది). “ఎగుభుజంబులవాడు, మృగరాజమధ్యంబు పుడికి పుచ్చుకొను నెన్నడుమువాడు” అంటాడు అర్జునుడిని గూర్చి చేమకూర వేంకటకవి “విజయ విలాసము” అనే ప్రబంధంలో. ఏనుగు నడకలోని గంభీరతా, సింహం సన్ననడుమూ కవులెప్పుడు వర్ణించేదే. ఈనాటి యువత “జిమ్”లకెళ్ళి "/-5%02066 ర06185“" కోసం ఆపసోపాలు పడుతున్నారు. గాని మన పూర్వీకులకున్న 2651౧640 $8౧596 (సౌందర్య దృష్టి) ఇప్పటి వాళ్ళ కేదీ? పూర్వకవులకీ సౌందర్యం మిద వున్న అవగాహనా, ఆరోగ్యం మోద (శ్రద్ధ ఈ వర్ణనలవల్ల తెలుస్తోంది. సింహమధ్యము కలవాడు రాజగును అంటాడు వరాహమిహిరుడు.
వినిద్రపంకేరుహదామదీర్ధయో
రృశోరుపాస్తే జనితోజ స్య శోణిమా ॥
మధురావిజయమాధురి 29
అనర్గలస్వప్రసరప్రరోధక
(తుతిద్వయీదర్శితరోషయోరివ 4 (మ.వి.3. 13)
విచ్చుకున్న తామరలలాగా పెద్దవైన అతని కన్నులు తాము అడ్డులేకుండా విస్తరించడానికి అద్దుతగిలే రెండు చెవులపైనా కలిగిన కోపమా అనేటట్లు కొనలవద్ద ఎర్రదనం వహించాయి.
మహాపురుషులకు కళ్ళకొనలవద్ద ఎగర్రజీర లుంటాయి. అ ఎగర్రదనానికి కారణం కవయిత్రి కావ్యమర్యాదతో చెబుతోంది. విదుపాటి కళ్ళు వ్యావిస్తోంటే చెవులు అడ్డగిస్తున్నాయట. అందువలన వాటికి వ్యాపించడానికి వీలులేకపోయింది. ఇలా తమ వ్యాప్తికి అడ్డు తగిలిన ఆ చెవులపైన ఆ కళ్ళకి కోపం వచ్చి అవి కొనలలో ఎరుపెక్సాలి. మహాపురుషులకూ పద్నినీజాతి స్త్రీలకూ కళ్ళచివరలు ఎర్రగా ఉంటాయి. “రామో రక్తాంత లోచనః” (రామాయణమ్) విశాలనేత్రాలకి “నేత్రే కర్ణాంతవి(శ్రాంతే” అనే వర్ణనలు నిదర్శనలు. కనుకొనలు ఎర్రగా ఉండి, కళ్ళు పెద్దవిగా ఉంటే అతను భగవంతుడు అవుతాడట.
సహ ప్రతాపేన సమున్నతిం వపు
ర్వలక్షభావం యశసా విలోచనే |
గుడ; పరీణాహమముష్య కంధరా
స్వరేణ గాంఖీర్యమగచ్చదాశయ: 11 (మ.వి.3.16)
అతని దేహం ్రతాపంలాగా తానూ పొడుగైంది. అతని కన్నుదోయి కీర్తితో బాటు తానూ విప్పారింది. అతని మెడ గుణాలతోబాటు తానూ వెడల్ప్బయ్యింది. అతని మనస్సు కంరస్వరంతో తానూ గంభీరతని సంతరించుకొంది.
యౌవనంరాగానే అవయవాలు పుష్టిచేసి కంపరాజు శరీరం బాగా పొడుగైంది, అలాగే అతని పప్రతాపమూ వ్యాపించింది. అతని యౌవనంతో కళ్ళు తెల్లగా అయ్యాయి. కీర్తికూడా తెల్లగా అయ్యింది. సన్మార్గంలో అతను విజయాలు సాధించాడు. కీర్తిని ఆర్జించాడు. కీర్తి తెల్లగా ఉండటం కవిసమయం. యౌవనంలో మెడ వెడల్పయింది. సుగుణసంపదకూడా విశాలమైంది. అప్పుడు అతని కంఠం మేఘధ్వనిలాగా గాంభీర్యాన్ని సంతరించుకొంది. అలాగే అతని మనసు గంభీరతను ఆపాదించుకొంది. “స్వరేణ గాంభీర్యమ్” అనడం త్రిగాంభీర్యానికి సూచన. వాల్మీకి రాముణ్ణి వర్ణిస్తూ “త్రిగంభీరః” అంటాడు. త్రిగంభీరత ఇలా వర్ణించబడింది. “స్వరస్సత్త్వం చ నాభిశ్చ త్రిగంభీరం గురుత్వకృత్” (స్వరంలోను మనస్సులోనూ బొద్డులోనూ గంభఖీరత - బొడ్డులో లోతు - త్రిగంభీరం అంటారు.) “సాలప్రాంశుర్మహాభుజః” మద్దిచెట్టులా పొడుగ్రైనవాడు, ఎత్తైన భుజాలున్నవాడు” అని దిలీపుణ్ణి వర్ణిస్తాడు కాళిదాసు “రఘువంశం”లో.
380 మధురావిజయమాధురి పురవర్ణన :
కమలామోదమధురైః కలహంసకులాకులై:ః
క్రీడాసరోభిస్సహితా మణిసోపానమంజాులైః ॥॥ (మ.వి.1.49)
ఆ రాజధానీపట్టణం తామరపూల సువాసనతోనూ రాయంచల గుంపుతోనూ, రత్నాలు పొదిగిన మెట్లతోనూ అందమైన క్రీడాసరోవరాలతోనూ అలరారుతోంది.
యస్యాం ప్రాసాదశ్చంగేషు లగ్నం మార్తాండమండలమ్ |
సంధత్తే వీక్షమాణానాం సౌవర్జకలశభ్రమమ్ (మ.వి.1.55)
ఆకాశంలో చరించే సూర్యుడు చాలా ఎత్తైన ఆ పట్టణభవనాలలో చిక్కుకొని చూచేవారికి అందులో నిలచిన బంగారు కలశమనే భ్రాంతిని కలిగిస్తున్నాడు.
అద్భుతమైన వర్షన. చలనచిత్రాలలో 511-2౧01[001200% 1600౧16406 ని ఉపయోగించిందా ఈవిడ అన్నట్లున్న వర్ణన. చరించే సూర్యుణ్ణి కెమెరాలో బంధించి, ఆపేసినట్లున్న చిత్రం. ఎంత మనోహరం. ఎంత అత్యాధునికం.
యత్సౌధచంద్రశాలాసు విహరంత్యో మృగేక్షణాః 1
శశాంకమవలంబన్తే ముక్తాకందుకశంకయా ॥ (మ.వి.1.56)
ఆ భవనాలలోని పై అంతస్టుల్లో విహరించే లేడికన్నుల చానలు తమకు చేరువలో వున్న చంద్రుణ్జి చూసి ముత్యాలబంతి అని భ్రమించి ఆడుకోవడానికి చేతిలో తీసు కుంటారు.
ముక్తాకందుక మంటే ముత్యాలబంతి. గుంద్రంగా తెల్లగా ఉంటుంది. చంద్రుడు కూడా అలాగే ఉంటాడు. కాబిట్ట్ స్త్రీలకి భమ కలిగింది. స్రీలు చేతితో చంద్రుణ్ణి అందుకున్నారనటంచేత ప్రాసాదాలు చాలా ఎత్తుగా ఉన్నాయని అర్ధమవుతోంది. స్రీలు బంతులాడటం పూర్వకవులు వర్ణించారు. స్త్రీల పాటలలో “సీతమ్మవారి బంతులాట” చోటు చేసుకుంది.
యత్ర సౌధేషు సంగీతమృదంగప్రతినాదిషు |
అకాండే తాండవారంభం వితన్వంతి శిఖండినః 11 (మ.వి.1.57)
సంగీత, మృదంగనాదాలతో ఆ సౌధాలు మారుమోగుతుంటే కాలం కాని కాలంలో వాటిని మేఘాల శబ్దాలుగా భ్రమించి నెమళ్ళు నాట్యం చెయ్యడం ఆరంభించాయి.
నెమళ్ళు మేఘం శబ్చించగానే నాట్యం చేస్తాయి. వర్షకాలంలో ఇది జరుగుతుంది. కానీ ఈ పట్టణంలో ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సంగీతమృదంగ శబ్దాలు భవనాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి కాబట్టి. అవి మేఘధ్వనులనే భ్రమతో నెమళ్ళు పురివిప్పి నాట్యాలు సలుపుతాయి. “పావకేస్తం మయూరం । పశ్చాదద్రిగ్రహణ
మధురావిజయమాధురి 31 గురుఖిర్లర్జి తైర్షర్తయేథాఃొ ॥ (“మేఘసందేశము” పూర్వభాగము. 44వ ళోకము) (కుమారస్వామి నెమలిని తర్వాత కొండలలో ్రతిధ్వనించడంవల్ల గొప్పవైన ఉరుములచేత నాట్యం చేయిస్తాయి). రామరాజభూషణుడి “వసుచరిత్ర”లో మృదంగధ్వనులకు నెమళ్ళ అట ఇలా వర్ణించబడింది. కంః। అన్నగరినాట్యశాలల
తెన్నగు మురజముల రవళిచే నటియించున్
గన్నియలకన్న మున్నుగ
ఐబన్నగభుక్తతులు దృష్టిపాత్రము లగుచున్.
(వసుచరిత్రము. 1 ఆశ్వాసము 104 పద్యం)
అన్నగరి అంటే ఆ నగరి. మురజము లంటే మృదంగములవంటివి. పన్నగ భుక్కులంటే పాముల్ని తినే భక్షకులు, నెమళ్ళు. ఆంధ్రకవితాపితామహ అల్లసాని పెద్దన కవీంద్రుడు “ముహుముహుర్లుర దభంగతరంగమృదంగనిస్వనస్ఫుటనటనానుకూలపరి ఫుల్లకలాపకలాపి జాలమున్” (మాటిమాటికి పొరిలే అలల మృదంగనాదాలు విస్తరించగా విప్పారిన పురులతో నెమళ్ళ గుంపులు నాట్యానికి అనుకూలంగా వున్నాయి) అన్నారు.
సంధ్యాసు యత్ర నిర్యాంతి జాలేభ్యో ధూపరాజయః |
అంత: ప్రదీపికాలోకచకితధ్వాంతసన్నిభాః ॥॥ (మ.వి.1.61)
సాయంకాలం కిటికీలనుండి బయటకు వెళ్ళే అగరుధూపాల పొగలు లోపలి దీపాల (ప్రకాశానికి భయపడి పరిగెట్టే కటికచీకటిలా వుంది.
సాయంకాలం అక్కడి అడవారు తమజుట్టుని కృష్ణాగరుధూపాలతో సంస్కరించు కొంటూవుంటే కిటికీలనుండి అ పొగలు బయటికి వెళుతున్నాయి. దొంగతనానికి వచ్చిన దొంగలు ఇంట్లోకి వచ్చి, అక్కడ మేలుకొన్న గృహస్థులను చూసి దోవకాని దోవల్లోంచి జారుకుంటారు. అలాగే చీకట్లు కూడా కిటికీలనుంచి పరిగెడుతున్నాయని ధ్వని. “అలోక” “చకిత” “సన్నిభ” శబ్దాలు దీనినే సూచిస్తున్నాయి. సాయంకాలం ఆడవాళ్ళు కేశ సంస్కారానికి సువాసనధూపాలు వేసుకుంటారు. ఇది ప్రసిద్ధం. జాలోద్గీర్డై రుపచితవపుః కేశసంస్కారధూపైః! రృంధుప్రీత్యా భవనశిభిభిర్దత్తనృత్తోపహారః” అన్నాడు కాళిదాసు. మేఘసందేశం పూర్వభాగం 32వ శ్లోకం. (కిటికీలనుండి బయటకు వచ్చే కేశపాశాలను ఆరబెట్టుకొనే పాగలతో దేహపుష్టి నొంది, బంధు'ప్రేమతో భవనాలలోని నెమళ్ల నృత్యాన్ని నీకు కానుకగా సమర్ప్చించుకొంటుండగా ....) గంగాదేవి ఆ పురస్ర్రీలను వర్ణిస్తోంది :
యదంగనాముఖాంభోజలావణ్యాలాభలడ్జిత: |
కలంకచ్చద్మనా చంద్రో వ్యనక్తి వృదయవ్యధామ్ ॥॥ (మ.వి.1.61)
32 మధురావిజయమాధురి
అ పురంలోని ఆడవారి ముఖాలనే తామరల లావణ్యం తనకు లేకపోవటంతో చంద్రుడు సిగ్గుపడి తన మనోబాధను మచ్చ అనే మిషతో వెలిబుచ్చుతున్నాడు.
మనోవ్యథ నల్లనిది అనేది కవిసమయం. అంభోజశబ్దం అర్ధవంతమైనది. ఇది పదానికీ, చంద్రుడికీ కూడా చెందుతుంది. పద్మలావణ్యమూ, చంద్రలావణ్యమూ రెండు ముఖంలో ఉన్నాయి. తనకు లేని లావణ్యానికి చంద్రుడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది దొరకటం లేదు. అది దొరకనందుకు సిగ్గు. అందుకు అది దాచాలని ప్రయత్నం. అదే మచ్చ. చంద్రుడిలా ఆహ్హాదవంతంగానూ, పద్మంలా సౌరభవంతంగానూ ఆ స్త్రీల ముఖాలున్నాయి. వాళ్ళు పద్మినీజాతిస్త్రీ లనేది వ్యంగ్యంగా చెప్పబడింది.
యత్ర స్త్రీణాం కటాక్షేషు యూనాం హృదయపహారిషు |
పుష్పాస్తసంచయే వాంఛాం ముంచతే పంచసాయకః ॥ (మ.వి.1.63)
అక్కడి ఆడపిల్లలు కడగంటి చూపులతో యువకుల హృదయాలను చూరగొంటూ వుంటే పూవింటిదొర అ(స్తాల సేకరణ మానేశాడు.
మన్మథుడు స్రీపురుషులకు (ప్రేమను కలిగిస్తాడు. అందుకు అతను తన అయిదు బాణాలను ఉపయోగిస్తాడు. ఇప్పుడు మన్మధుడు చేయవలసిన పనిని యువతుల క్రీగంటి చూపులే చేస్తున్నాయి కాబట్టి అతను అస్త్రాలను సంపాయించటం మానేశాడు.
మరాలై ర్మంజుమంజీరశింజితాకృష్ణమానసైః
లీలాగతిమివ ప్రాప్తుం సేవ్యంతే యత్ర యోషితః ॥॥ (మ.వి. 1.63)
అ యువతుల మెత్తని కమ్మని మువ్వల రవళులు తమ మనస్సులని ఆకర్షిస్తూ వుంటే హంసలు వాళ్ళ విలాస పోకడలనే నేర్చుకోటానికి వాళ్ళని సేవిస్తున్నాయి.
(స్త్రీల మువ్వల చప్పుళ్ళకీ హంసల అరుపులకీ పోలిక వుంది. అవి కమ్మగా వుంటాయి. ఇవీ అంతే. ఆపురిలో ఆడవాళ్ళు సవిలాసంగా నడుస్తున్నప్పుడు వాళ్ళ అందెలు మెత్తగా కమ్మగా వినవచ్చాయి. అవి చాలా తియ్యగా ఉండి, తమకూజితాలకంటె మధురంగా వుండటంచేత వాటిని నేర్వదలచాయి హంసలు. అలాంటి తియ్యదనం వాళ్ళ విలాసమైన నడకల వల్ల వస్తోంది. ఆ విలాసమైన నడకలు తామూ నేరిస్తే అ కలస్వనాలు తమకూ అలవాడతా యనే పేరాసతో వారిని రోజూ సేవిస్తున్నాయి హంసలు. స్త్రీలు హంసయానలు, హంసవాణులు ఆ హంసలే వాళ్ళని అనుకరించడం విచిత్రం. ముక్కుతిమ్మన “పారిజాతాపహరణం”లో *........ పసిడియందెల రవళి న్రాయంచ లంతంత రాజెలులుం దొనును సత్యభామ సనుదెంచె న్నాధుడుప్పాంగగన్” అన్నాడు. బుక్కరాజు కంపరాజుకి చేసే ఉపదేశము :
గురూపదేశః కిల కథ్యతే బుధై
రకర్మశం కీంచన రత్నకుండలమ్ ।
మధురావిజయమాధురి 3
అమేచకం నూతనమంజనం సతా
మజాతగాత్రక్షయ మద్భుతం తపః ॥ (మ.వి.2.22)
మంచివాళ్ళకి గురువుగారి బోధ కఠినంగా లేకుండా నొప్పి కలిగించని చెవులకు పెట్టుకొనే రతనాల పోగులు. కళ్ళకు పెట్టుకొనే నలుపులేని కొత్తకాటుక. శరీరాన్ని చిక్కేటట్లు చెయ్యని గొప్పతపస్సు.
ఉపదేశం చెవులదాకా వెళుతోంది. రత్నపుపోగులు కూడా అంతే. కాబట్టే ఉపదేశాన్ని రత్నపు కుండలా లన్నారు. రత్నపుపోగులు చెవులకి అలంకారాలు. బోధ అంతఃకరణాన్ని శుద్ధిచేసి ప్రకాశింపడేస్తుంది. కాబట్టీ ఇది నొప్పి కలిగించని చెవిపోగు. కాటుక కంటికి చల్లదనాన్నీ, అందాన్నీ ఇస్తుంది. కాని కంటికి నల్లటి మసిలా అంటు కొంటుంది. ఉపదేశం జ్ఞానమనే కంటికి పెట్టుకొనే మసిలేని కాటుక. ఇది తెలియని విషయాలని తెలియజేస్తుంది. తపస్సు చేసి కోర్కెలు తీర్చుకోవచ్చు. కానీ శరీరం చిక్కుతుంది. ఉపదేశంలో శత్రువులని జయించవచ్చు. కీర్తిని పొందవచ్చు. సంపదలని అనుభవించవచ్చు. కానీ శరీరం కృశించదు. “సతామ్” అనటంవలన వివేకవంతులకే ఈ ఉపదేశమని అర్ధమవుతోంది. “చక్షుష్మంతునకే దీపంబు గాని యంధునకు గొణ యగునే” అని సూచించబడింది. (“కన్నున్నవాడికే దీపంగాని (గ్రుడ్డివానికి ప్రయోజన ముంటుందా?”)
మదాంధకారో హి మహానిశీథినీ
ప్రబోధచంద్రప్రతిరోధకాలికా |
మనోజమత్తద్విపవైజయంతికా
శరీరిణాం శశ్వదలంఘినీ దశా 1 (మ.వి.3.24)
దేహ మున్నవారికి యౌవనమదం కన్నులు గప్పే గొప్ప చీకటిరాత్రి. జ్ఞానమనే జాబిల్లిని కప్పేసే తొలి కారుమబ్బు. మన్మధు డనే మదపుటేనుగుకు అలంకారమైన పతాక. ఎప్పటికప్పుడు ఎంతవారికైనా దాటరాని కష్టదశ.
సర్వానర్ధాలకు యౌవనం కారణం. అది కన్నులు పొడుచుకున్నా కనబడని చీకటి రాత్రిలా ఉంది. కారుమబ్బులవలన చంద్రుడు తెరచాటైనట్లు యౌవనంవలన జ్ఞానం మూసుకుపోతుంది. మన్మధుడు నిగ్రహం లేని ప్రకృతి కలవాడు. మదగజం కూడా అంతే. 5%26469062 అంటాడు "14౫ 52126 02౫/5 ౪౧6౧ | ౪85 ౯99౧ 1౧ ౮606౧౧6౧ 0016 1౧ 01096“. లేత యువప్రాయంలో నావివేకం అపరిపక్వంగా ఉంది. నేను నిర్దాక్షిణ్యంగా ఉన్నాను (4౧10౧౫ 2౧6 0160౧041౧3 4౦11, 506౧6 5).
అశేషదోషాంకురకుంజభూనముయో
మదాంధచేతోమృగబంధవాగురా: 1
మ! మధురావిజయమాధురి కథం ను విశ్వాసపదం మనీషిణాం మనోజమాయాభటశస్త్రికాః స్రియః ॥ (మ.వి.3.27) అన్ని దోషాలు అంకురించే పొదరిళ్ళూ, మదాంధమనన్సు లనే మృగాలని బంధించడానికి పన్నిన ఉచ్చులూ, మన్మథుడనే మాయాయోధుడు ధరించే శస్తాలు అయిన ఆడవాళ్ళని బుద్ధిమంతులు నమ్మకూడదు. పొదరిళ్ళలో పాములూ, దొంగలూ, విటులూ దాక్కుని వుంటారు. కాబట్టీ పొదలు అన్ని బాధలకూ నిలయాలు. యౌవనంలో గుడ్డిదైన మనస్సు మృగంలాగా ఒళ్ళు మరచి పరిగెడితే ఆడవాళ్ళు వలలై ఆ మనస్సును కదలనీయక బంధిస్తారు. మన్నధుడి శస్తాలు ప్రీలే. వీరి కటాక్షలతో ఎంతటి వారినైనా మన్మధుడికి ఊడిగం చేయిస్తారు. అతని యుద్ధం వారే చేస్తూ అతనికి విజయం ఆపాదించి పెడతారు. ఇది మాయాయుద్ధం. మాయా యుద్ధంలో (ఇంద్రజిత్తు యుద్ధంలాగా) తను కన్పించడు. తన శస్తాలు కన్పించి యుద్ధం చేస్తాయి. అలాగే మన్మథుడు చేస్తున్నాడు. ఇతను స్రీల మనస్సులో దాగి వాళ్ళకి ప్రేరణ కల్గిస్తూ వాళ్ళని శస్తాలుగా ఉపయోగిస్తున్నాడు. 'మనోజ' 'అణుమాత్రం మనః”. దానిలో పుట్టి దానినే శత్రువుగా చేస్తున్నాడు. తన మనస్సు తనకు శత్రువని ఎవరూ అనుకోరు. అలా తలచినప్పుదే ఈ విజయం సాధ్యం. అందుకు గురువుగారి ఉపదేశం అవసరమే. స్రీ అయ్యుండి గంగాదేవి స్రీల గురించి ఇలా రాయడం చెప్పుకోతగ్గ విషయం. “ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంతవారలైనా కాంతదాసులే” అన్న త్యాగరాజు గారి భావనకి ప్రతీక పై శ్లోకం. ఉన్నదున్నట్లుగా చెప్పడం గంగాదేవి ప్రత్యేకత, హితాని కుర్వన్నపి నా£_.నురక్తయే జనస్య జల్పన్ పరుషం రుషా నృపః । పయాంసి వర్షన్నపి కిం న భీషణః కరోరవిస్ఫూర్ణధుగర్జితో ఘనః 1 (మ.వి.3.81) ప్రజలకి మేలు చేస్తున్నా కూడా కోపంతో పరుషంగా మాట్లాడిన రాజు ప్రజల మెప్పు పొందడు. చల్లని జల్లు వర్షిస్తున్నా పిడుగులతో భయంకరంగా గర్జించే మేఘం లోకానికి ప్రీతికరం కాదు. కోపంవలన పరుషంగా మాట్లాడడం అలవడుతుంది. దీన్ని “రాక్షసవాక్కు” అంటారు. ఇతరుల మనస్సు నొవ్వకుండా మాట్లాడాలట! దీన్ని “సూన్ఫతవాక్కు” అంటారు. రాజు ప్రజలకెంత మేలుచేసినా పరుషంగా మాట్లాడితే ప్రజల మెప్పును పొందడు. మేఘంతో పోలిక ఇక్కడ చెప్పిం దీవిడ. మేఘం చల్లటి జల్లుని వర్షిస్తే ఆనందపడతారు. అది భయంకరంగా ఉరుమితే జడుసుకుంటారు. “తన కోపమే తన శత్రువ”న్నారు. “సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్” (నిజాన్ని పలుకు, ఇష్టంగా పలుకు) అన్నది ఆర్యోక్తి.
మధురావిజయమాధురి 35 దునోతి దండేన దురుత్సహేన యః ప్రసహ్య రాష్ట్రం పదమాత్మసంపదామ్ ॥ స వృక్షమారుహ్య కుఠారపాతనం కరోతి మూలోద్దలనాయ దుర్మతిః 1 (మ.వి.3.32) తన సంపదల కంతా ఆటపట్టెన దేశాన్ని భరింపరాని అధికారంతో పీడించే రాజు చెట్టెక్కి సమూలంగా చెట్టుని గొడ్డలితో నరుక్కునే బుద్ధిహీను డవుతున్నాడు. రాజు శిక్షతో ప్రజలను మెప్పించడు. తన సంపదకు ప్రజలే పెన్నిధి. ఆశ్రయ మైనవారు. అలాంటి ప్రజలను సంతోషపెడుతూ రాజ్య మేలాలి గానీ శిక్తించకూడదు. అలా చేసేవాడు తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కున్న ట్లవుతుంది. అప్పుడు చెట్టు కొమ్మతో బాటు తానూ పడతాడు. 5046690629 తన $46౧000&౧1 ఈ ౪6౧18 అనే నాటకంలో ఇలా అంటాడు. 7౧6 064110/ 01 గాంగ0) 15 ౧౦ 51/21066 116౧000610 18 1౧6 96౧16 (౧21౧ ౧0౧౫ ౧6౭౪8 ఆ౧౦గ 1౧6 ౧12౦6 06౧69410. 116 1౧/0౧66 గాంగ౧౭౧0౧ 0616! 120 ౧19 00౪/౧ 1115 5060116 5౧0౪5 1౧6 10/09 0 16గ౧౦2| ౧౦౪9౧ 706 21౧0౮16 10 246 2౧6 గ౧౫4|౦౩౧/ +ఈ౧6181౧ 604) 9 16 6926 20౧6 1684! 01 61౧౦9; 601 గ౧6౧౯౫/ 15 200౪8 116 5069217696 54/2౫ 1115 6౧౮౧౦౧66 1౧ 6 ౧6౭గ19 01 క౧05. 11 2110648 10 0౦౮ ౧1౫౫౨61; (46౧0౧౭౧101 ౪6౧౦8”, ఉల ౪ 506౧6 1! 179-190) (దయ ఎంతో ఉన్నతమైనది. అది స్వర్గంనుండి మనందరి పైన ఆహ్ల్హాదమైన వర్షంలా కురుస్తోంది: ఆ దయ సింహాసనాన్ని అధిష్టించిన మహారాజుకి అతని కిరీటం కంటే బాగా నప్పుతుంది. అతని రాజదండం లౌకికమైన ఆధిపత్యాన్నీ, రాచరికపు హోదాన్నీ సూచిస్తూ రాజులకి భయాన్నీ భీతినీ కలిగిస్తోంది. కానీ దయ రాజదండం పరిధిని దాటి వెళ్ళిపోయింది. అది రాజుల హృదయాలని అధిప్టించింది. అది దేవుడికి మారు పేరయ్యింది. ఉపేయుషీం పుణ్యవశేన సంపదం గుణానురోధాదుపభోక్తుమక్షమాః | స్వచాపలేన శ్లథయంతి దుర్ధియో వలీముఖాః పుష్పమయీమివ '్రజమ్ ॥ (మ.వి.8.35)
౫6 మధురావిజయమాధురి
అదృష్టవశాత్తూ తమకు వచ్చిన సంపదలను మంచి నడవడితో చేజిక్కించుకొని అనుభవించడానికి చేతకాక చెడ్డవాళ్ళు ఆ సంపదలను తమ చాపల్యంతో పూలమాలను కోతులలాగా చిన్నాభిన్నం చేసుకుంటారు.
సంపదలు పూర్వజన్మలో చేసిన పుణ్యంవలన లభిస్తాయి. అవి మెరుపులలాగా చలిస్తూ వుంటాయి. రాజు ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోవాలి. బయటి శత్రువులు ఎప్పుడూ బాధిస్తూవుండరు. లోపలి శత్రువులు అరిషడ్వర్గాలు - ఎప్పుడూ బాధిస్తూ వుంటారు. కాబట్టి బయటి శత్రువులకంటే లోపలి శత్రువులను జయించాలి. అలా కాని నాడు వ్యసనాల పాలయి రాజ్యాన్ని త్వరగా కోల్పోతారు. ఇక్కడ కోతులు - పూలమాలిక పోలికను ఇచ్చింది కవయిత్రి. ఎప్పుడూ చలించే మనసున్న కోతులు పూలమాలను సంపాదించి అది ఎవ్వరూ పెట్టుకోడానికి లేకుండా దాన్ని చిందరవందర చేస్తాయి. “గుణలుబ్బ్దాః స్వయమేవ సంపదః”. (కిరాతార్డునీయమ్. 2వ సర్గ. 30వ శ్లోకం). మంచి గుణాలయెడ లోభం కలవి సంపదలు” అన్నాడు భారవి. అనిత్యాళ్ళ త్రవోబావ్యో। విప్రకృష్ణాశ్చ తే యతః । అతస్మ్ఫో£. భ్యంతరాన్నిత్యాన్ ।; షట్పూర్వమజయద్రి పూన్ (రఘువంశం” 17వ సర్గ. 45వ శోకం) (బయట వున్న శత్రువులు దూరంగా వుంటూ రోజూ ద్వేషించరు కాబట్టి అతను లోపల నిత్యమూ ఉండే శత్రువులను మొదట జయించాడు) అంటాడు కాళిదాసు. యుద్ధభేరి వర్ణన :
అథ మందరసంఘట్టక్షోభితాంభోధి మందల: ॥
రరాణ కోణాభిహతో రణనిర్వాణదుందుభి: 4
సముద్రాలు మందరపర్వతంతోటి దెబ్బలాట తమకు సంభవిస్తే క్షోభించినట్లు క్షభిస్తే కోణముతో వాయించాక యుద్ధభేరి గంభీరంగా నినదించింది.
కోణము అంటే ఖేరిని వాయించే సాధనం. “కోణో వీణాదివాదనమ్” అని అమరము. భూమి సప్తద్వీప. ఏడుద్వీపాలలోనూ ఏడు సముద్రాలున్నాయి. యుద్ధభేరి వాయించగా బయలుదేరిన మహాధ్వని ఏడు మహాసముద్రాలు చొచ్చుకొనిపోయి వాటిని క్షోభపెట్టింది. అది మందరపర్వతంతో మథించినప్పుడు కలిగిన ధ్వనితో పోలికను వహించింది. భేరి గంభీరంగా మోగటం రాజుకు విజయసూచకం.
కల్పాంతోద్భాంతచండీశడమరుధ్వానడామరః |
ఉదణ్బంభత గంభీరవియదధ్వని తద్ధ్వనిః ॥ (మ.వి.4.4)
ఆ రణభేరీభాంకారం ప్రళయకాలంలో పరమేశ్వరుడు వాయించే డమరువాద్యంలా భయంకరంగా గంభీరంగా ఆకాశమంతా విస్తరించింది.
మధురావిజయమాధురి ళా
శివుడు లయకాలంలో చేసేది ఉద్దతనాట్యం. అవ్చుడు రుద్రుడై డమరువు వాయిస్తాడు. అది విన్న మాత్రంచేత ప్రాణికోటిని చంపే దారుణ ధ్వనిని ఆ డమరువు సృష్టిస్తుంది. ఇప్పటి భేరిధ్వని దానిని పోలి వుంది. భూమిలోనూ అకాశంలోనూ ఈ ధ్వని వ్యాపించింది. కంపరాజు ఎక్కే గుర్రం ఇలా ఉంది :
“'నైషధం'లో నలుడి గుర్రం ఇలాగే వర్ణించబడింది.
సపక్ష ఇవ తార్క్ష్యన్య సజాతిరివ చేతసః |
సఖేవ గంధవాహస్య సంఘాత ఇవ రంహసః ॥ (మ.వి.4.21)
అతని గుర్రం వేగంలో గరుత్మంతునికి చుట్టంలాగా, గాలికి గాఢ స్నేహితుడిలాగు మనస్సుకి ఒకటే జాతి అనేటట్లుగా వేగమంతా ఒక్కచోటే కుప్పపోసినట్లు కన్పించింది.
'సంఘాత ఇవ రంహసః అనడంవలన గరుడుడు మొదలైనవాటి వేగం ఈ గుర్రంలోనే ఉందనీ, వాటన్నిటినీ మించిన వేగం కలదనీ తెలుస్తోంది.
మువుస్స్వజవసంరోధనమితోన్నమితాననవ |
నమస్కుర్వన్నివ పురోవర్తినీం విజయశియమ్ ॥॥ (మ.వి.4.27)
తన వేగానికి ఆటంకం ఏర్పడటంవలన తన ముఖాన్ని మాటిమాటికీ వంచుతూ పైకెత్తుతూ వున్న ఆ గుర్రం తన ఎదుట సాక్షాత్కరిస్తున్న విజయలక్ష్మికి నమస్మరిస్తున్నట్లు తోస్తోంది.
గుర్రం నహజంగా తలను వంచి పైకి లేవనెత్తుతూ వుంటుంది. కాబట్టి విజయలక్షికి నమస్కరిస్తున్నట్లు వుంది. ఉత్తమాశ్వం యోధుడికి యుద్దంలో చాలా సహాయకారి. అది లేకపోవడం యోధుడికి పెద్దలోటు - మరణసద్భశమే. 5024960628 రాసిన "%1౧0 గియ4/6 11” (ఇతను దుర్మార్గుడు) తన గుర్రం చనిపోవడం చూని బెంబేలెత్తుతాడు. అతని అరుపు వినండి. "| 11066 4 ౧౦౭ ఓ4/ 1౧గ౧౦రంగా 10౯ & 1066" (“ఒక గుర్రం ఇయ్యండి! ఒక గుర్రం ఇయ్యండి! నా రాజ్యాన్నే ఇస్తాను.) (600 ౧౮0255 || షర ౪, ౧ 508౧8). ఈవిడ సైన్యాన్ని వర్ణిస్తుంది :
అబద్ధకుథమాతంగమాత్తపర్యాణ సైంధవమ్ ॥
సంవర్శితభటం సద్యస్సమవహ్యత తద్చలమ్ (మ.వి..47)
ఏనుగులపైన అందమైన చిత్రకంబళులు పరచారు. గు(రాలమోద బళ్లాలు అమర్చారు. యోధులు కవచాలు తొడిగారు. ఇలా సైన్యం అప్పటికప్పుడు యుద్దానికి సన్నద్ధమైంది.
38 మధురావిజయమాధురి చతురంగ బలాలలో రథబలం చెప్పలేదు కవయిత్రి. ఆరోజు బహుశా రథ యుద్ధం జరగటం లేదు కాబోలు. అనాడు ఏం జరిగిందో అలాగే యథాతథంగా వర్ణించే “6211960 0౮1001౯ (వాస్తవికదృష్టి 845/1 వాస్తవికతావాదం - 20వ శతాబ్దపువాదం. కవిత్వంలో తొంగిచూసే సందర్భాలు ఎన్నో) ఈవిడకి వుంది. ఉత్తుంగైర్ధజ సంఘాతైర్నిఎుద్ధే గగనాధ్వని నినాయ కృచ్భాత్పాతంగం శతాంగం గరుదాగ్రజః | (మ.వి.4. 15) చాలా ఎత్తైన పతాకాల వరుసలు ఆకాశాన్ని అవరించగా సూర్యుడి రథాన్ని అతికష్టం మిద అనూరుడు నడుపుకుంటూ పోతున్నాడు. సూర్యుని రథసారథి అనూరుడు. సూర్యుడు ఇలా ప్రయాణం చేస్తాడు. “నిమేషార్దేనై కేన ద్వే చ శతే ద్వే సహ్రేద్వే ! క్రమమాణ యోజనానాం । నమో౬స్తు తే నలిన నాధాయ” (సూర్యుడు అర్ధనిమిషానికి ఆకాశంలో రెండువేల రెండువందల యోజనాలు ప్రయాణిస్తాడు) అతని రధానికి ఏడు గుర్రా లున్నాయి “సప్తాశ్వరధమారూధం”. ఇవి చాలా వేగంగా పరిగెత్తితే గాని ఈ దూరాన్ని అందుకో లేవు. అతని గుర్రాల సారథి గరుత్మం తుడి అన్న అనూరుడు. కాని ఈ సైన్యంలో పతాకాలు చాలా ఎత్తెపోయి గుర్రాలు పోవ టానికి వీలులేకుండా దోవంతా “ట్రాఫిక్ జామ్” అయిపోయింది. వాటిని తప్పించుకొని ఏకాస్త సందు దొరికినా తన గుర్రాలని అందులో నడిపిస్తున్నాడు అనూరుడు. పోషితో హయహేషాభిర్చంహితో గజబ్భంహితై: ॥ వర్ధితస్తూర్యనిధ్వానై: కోజి_పి కోలాహలో£_.భవత్ 11 (మ.వి.4.16) అవ్పుడు ఒక వంక గుర్రాలు నకిలిన్తున్నాయి. మరోవంక ఏనుగులు ఘీంకరిస్తున్నాయి. మరోచోట వాద్యనినాదాలు మిన్నుముట్టుతున్నాయి. ఇలా పెరుగుతున్న కోలాహలం అపూర్వమైన ఒక మహాధ్వనిగా తోచింది. గజసేనలూ, రాజసేనలూ మహోత్సాహంతో వున్నాయి. ఇది రాజుకు శుభసూచకం. రజోభిర్ముహురుద్దూతైర్లఘూభవతి భూభరే | కథంచిత్చృతనాభారం చక్షమే ఫణినాం పతిః 1 (మ.వి.4.36) ఆసైన్యం అతని వెంట వెళ్తూవుంటే మాటిమాటికీ పైకి లేచే దుమ్ముచేత భూమి బరువు కొంత తగ్గటంవలన ఆపైన భారాన్ని ఆదిశేషుడు ఎలాగో భరించాడట! ఆదిశేషుడు వేయి తలలవాడు. భూమినుంచి దుమ్ము చాలా పైకి లేచి ఆకాశాన్ని కప్పేసింది. ఆవిధంగా బరువు తగ్గాక ఇంతటి సేనతో వున్న భూమిని భరించ కలుగు తున్నాడు ఆదిశేషుడు. 'ముహురుద్దూత్రె” అనడంవలన సేన అనంతమూ, బలిష్టమూ అని తెలుస్తోంది. ప్రయాణంలో దుమ్ము తప్పకుండా వర్ణించబడాలని లక్షణకర్త లంటారు.
మధురావిజయమాధురి 33 “ఉదంకోపాఖ్యానం”లో నన్నయ్యగారు ఉదంకునిచేత ఆదిశేషు నిలా కీర్తింప జేస్తారు. “బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణ సరస్సరస్వతీ సహిత మహామహీ రమజస్ర సహస్ర ఫణాళిదాల్చి దు । స్స్వహతరమూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయైన య య్యహిపతి దుష్ఫృతాంతకు డనంతుడు మాకు ప్రసన్నుడయ్యెడున్॥
ప్రతాపాదిత్యకీర్తీందు యుగపద్రాసలాలసః 1
పరాగః పరభూపానాముపరాగో£. భవన్నవః (మ.వి.4.37)
ఆకాశమంతా కప్పేసిన అ దుమ్ము శత్రురాజుల ్రతాపమనే సూర్యుణ్తీ కీర్తి అనే చంద్రుణ్జీ ఒకటేసారి మింగటానికన్నట్లు అపూర్వమైన గ్రహణంలా పట్టింది.
దుమ్ము ఇక్కడ రాహువు. అ రాహువు సూర్యుణ్జీ (ప్రతాపాన్నీ) చండద్రుణ్జీ (కీర్తినీ) కమ్మేసింది. శత్రురాజుల కీర్తిప్రతాపాలు చంద్రుడు, సూర్యుడు ఇక్కడ. దుమ్ము లేవగానే శత్రురాజులు ప్రతాపాన్ని కోల్పోతున్నారు. ప్రతాపం పోగానే ఇదివరకూ వాళ్ళకున్న కీర్తి పోయింది. సూర్యుడూ, ప్రతాపమూ ఎర్రగా ఉండటం కవిసమయం. చంద్రుడూ, కీర్తీ తెల్లగా ఉండటం కవిసమయం.
విడేనిరే కరేణూనాం కరశీకరరేణవ:,
ఘనస్య సేనారజసః కరకాకారచాతురీమ్ 1 (మ.వి.4.42)
ఆ సైన్యంలో ఏనుగులు తమ తొండాలతో పై కెగయజిమ్మే నీటితుంపరల నలు సులు మేఘాలకు తెలిసిన వడగళ్ళు కురిసే విధానాన్ని సేనలోని దుమ్ముకి ఆపాదించాయి.
గజసేనని వర్ణిస్తోంది కవయిత్రి. సహజంగా ఏనుగులు తొండాలతో నీళ్ళు పీల్చి ఆకాశంలోకి ఎగజిమ్ముతాయి. వాటి కిది ఒక వినోదక్రీడ. అలాగే ఈ సైన్యంలో ఏనుగులు వినోదిస్తున్నాయి. అవి చిమ్మే తుంపరలు ఆకాశంలో ఎగిరి అక్కడ వ్యాపించి వున్న దుమ్ముతో కలిసి ముద్దలు ముద్దలుగా (వడగళ్ళలాగా) కన్పిస్తూ తటతట మహావేగంతో కిందపడి కొద్దిసేపట్లోనే కరిగిపోతున్నాయి. మేఘంకూడా వడగండ్లవా నప్పుడు వానచినుకు లతో కలిసి వడగండ్లను వరిస్తుంది. ఆ వడగళ్ళూ కొద్దికాలంలోనే కరిగిపోతాయి. ఈ పోలికను బట్టి సైన్యపు దుమ్ముకి ఆ చాతుర్యం కలిగింది (తొండపు తుంపర దుమ్ముతో కలిసి ఏకమై వడగళ్ళ ఆకారం దానికి కలగ జేస్తోంది కాబట్టి) ఆ చాతుర్యం ఏనుగు తొండం తుంపర కలగ చేసినట్లు చెప్పబడింది.
మేఘానికి దుమ్ముతో పోలిక ప్రసిద్ధం. దుమ్ముకు ఆశ్రయాన్ని బట్టి రంగు ఏర్పడు తుంది. వడగళ్ళ వర్షాన్ని ఒక కవి ఇలా వర్ణించాడు. “చిటచిటారవముతో తటతట వడగండ్లు, యువరాజుముఖ్యుల నొదుగ జేయ (“హంసవింశతి” 4-224)
40 మధురావిజయమాధురి కంపరాజు సామ్రాజ్యపతిగా ఎలా ఉన్నాడో చెపుతోంది :
నరపతేః పప్రతీహారమహీం ముహు
ర్విజయదంతిమదోదకపంకిలామ్ !
క్షితిభుజాం భుజభూషణఘట్టన
ప్రసృమరో మణిరేణురశోషయత్ 11 (మ.వి.5.?7)
ఆ రాజు ద్వారం మదపుటేనుగుల మదజలాలతో మాటిమాటికీ బురదౌతూ వుంటే అతన్ని చూడటానికి వచ్చిన సామంతరాజుల భుజకీర్తులు ఒకదాని కొకటి రాసుకొని రాలిన రతనాల ధూళులు నాలుగువైపులకూ పరచుకొని ఆ దుమ్మును ఇంకేటట్లు చేశాయి.
అతన్ని సేవించడానికి సామంతరాజులు తండోపతండాలుగా వస్తున్నారు. వాళ్ళందరూ మదగజాలను అతనికి కానుకగా తెస్తున్నారు. వాటి మదధారలతో ఆ ప్రదేశాలన్నీ మాటిమాటికీ బురదతో నిండుతున్నాయి. అంతలోనే క్రిక్కిరిసి ఎడతెరిపి లేకుండా సేవకు వెడుతున్న ఆ రాజుల గుంపులు ఒకళ్ళ నొకళ్ళు రాసుకొని వెళ్ళటంతోటి వాళ్ళ భుజాలలోని భుజకీర్తుల నుంచీ మణుల రజను రాలి అంతా విస్తరిస్తూవుంది. అందువలన బురద అంతా అణిగిపోతోంది. రాజుకు పాలనలో సహాయకు లవసరం. పంచ అంగాలలో “సహాయా స్పాధనోపాయావా అని సహాయసంపదని చెప్పారు. నీతి
సారం ఇలా అంటోంది “భూపతికి మిత్రవర్గము | ్రాపైనం గాక భూమిభరణము దలమే ; యోపునె ఫణిపతియును ధర ।మోవునకూ గూర్మకుధరములు లేకున్నన్” (సకలనీతిసారము) ఉభయకవిమి(త్రుడు తిక్కనగారిపద్యం ఇదిగో “ఎవ్వాని వాకిటానిభమద పంకంబు, రాజభూషణరజోరాజి నడంగు” (విరాటపర్వము ..... 2ఆ ... 191 పద్యం).
అహరహర్చృపతే:ః పదపీఠికా
తటసముల్లిఖితైరలికస్థలై: 1
పునరివార్చితభాగ్యమయాక్షరై
రజని వైరముచా మవనీభుజామ్ (మ.వి.5.8)
అతని శత్రురాజులు విరోధం వదలి ప్రతిరోజు అతనిపాదపీరం పెట్టేచోట తమ నొనళ్ళను రాసుకుంటూ వుంటే మొదట బ్రహ్మరాసిన రాతలు చెరిగిపోయి కొత్తగా అదృష్ట అక్షర వరుసలు పుట్టాయా అన్నట్లు కొత్తగీతలతో వాళ్ళనొసళ్ళు ఒప్పారివున్నాయి.
ప్రతిరోజూ శత్రురాజులు కంపరాజు పదపీరంపైన తలలు వంచి సాష్టాంగ పడు తున్నారు. తలలు వంచుతున్నప్పుడూ తలలను అటూ ఇటూ కదుపుతున్నప్పుడు పాదపీఠం రాసుకొని వాళ్ళ నొసళ్ళమాద కొత్తగా గీత లేర్పడుతున్నాయి. బ్రహ్మదేవుడు దౌర్భాగ్యాన్ని సూచిస్తూ అంతకు ముందు వాళ్ళనుదట రాతలు రాశాడు. అందుకే వాళ్ళు కంపరాజుకి శత్రువులై మహాకష్టపడ్డారు. ఇప్పుడు కంపరాజుకి నమస్మరించగానే ఆ (బ్రహ్మరాతలన్నీ
మధురావిజయమాధురి త] మారిపోయాయి. ఇప్పుడు అదృష్టరేఖలు అ నొసళ్ళమిద తాండవిస్తున్నాయి. కంపరాజు శత్రువులు కూడా తనని ఆశ్రయిస్తూ వుంటే వాళ్ళకి సంపదలిచ్చి వాళ్ళని ఆదుకుంటాడని అర్ధం. “బ్రహ్మణా. పి సురైరపి । లలాటలిఖితా రేఖా పరిమార్డుం న శక్యతే” బ్రహ్మచేత గొనీ, దేవతలచేతగానీ, నుదుటరాసిన రాతమార్చటం ఎవరితరమూ కాదు. అలాంటి టబ్రహ్మరాతను కూడా కంపరాజు మార్చగలిగా డన్నమాట. *[౯0గ౮౧6 18౪065 1౧6 606" “అదృష్టం ధైర్యవంతుణ్లే వరిస్తుంది” (1/1/%, “4ఉం౧ఆ౮” ౫). (గ్రీష్మబుతువర్షన :
పరుషతొపవిశేషపరిస్థల
దథతురంగమమందగతావివ
అహిమధామ్ని రథాంగసుఖావపహా
మహరగాహత దైర్వవతీం దశామ్ ॥ (మ.వి.5. 18)
సూర్యుడు మవావేగంతో వెడుతూవుంటే అతని గుర్రాలు తీవ్రమైన ఎండ వేడమికి డీలాపడి, మాటిమాటికీ తొట్రుపడటం వల్ల కాబోలు పగళ్ళు చక్రవాక్షాలకు సుఖాన్ని కలిగిస్తూ పొడుగ్గా పరిణమించాయి.
గ్రీష్మంలో పగళ్ళు పెద్దవి ఉంటాయి. సూర్యుడి వేడికి తట్టుకోలేక అతని వాహనాలు ఆలిసిపోయాయి. అందుకని అవి బలహీనాలై నడవలేక తొట్రుపాటుతో అతికష్టంతో
- మెల్లమెల్లగా నడుస్తున్నాయి. ఇందువల్ల సూర్యుని నడకలో మందకొడితనం ఏర్పడింది.
అదే పగళ్ళు పెరగటానికి కారణం. ఇలా దినాలు పెరగటంతో చక్రవాకపక్షులకి ఆనందం అధికమైంది. రాముడిశాపంవలన వాటికి రాత్రులలో విరహం. అవి వగలే కలిసి ఉండగలవు. కాబట్టి దినాలతో బాటు వాటి అనందం కూడా పెరిగింది. కృష్ణదేవరాయలు పొడుగైన పగళ్ళను ఇలా వర్ణించాడు. “పడమరవెట్టనయ్యుడుకుబ్రాశనమొల్లక కూటి పేదలై దిడలిక నూడు నచ్చిలువప్రగ్గములన్ రవియాజ్ఞ మాటికిన్ । ముడియిడ బిచ్చుగుంటు రథము న్నిలుపన్స్మయనంబు సాగమిన్ । జడను వహించె నాగ దివసంబులు దీర్హము లయ్యె నత్తజీన్” (ఆముక్తమాల్యద - 2అ. 49 పద్యం) వర్ష బుతువు :
తత ఇతో విహరత్తటిదంగనా
లలితలాస్యహరిన్మణిమండపైవ
పటుమృదంగరవోపమగర్జితై
ర్నివిడమావిరభూయత వారిదై: 11 (మ.వి.5.25)
తై మధురావిజయమాధురి అ సమయంలో గంభీరంగా ధ్వనించే మద్దెలమోతలాగా ఉరుములతో మిసమిస మని మెరుస్తూ మెరుపుతీగలనే సుందరీ మణుల లలితలాస్యాలకు పచ్చరాళ్ళ మండపాలై మేఘాలు దట్టంగా అకాశాన వెల్లివిరిశాయి. మేఘాలు నల్లనివి. గరుడపచ్చలు ముదురుపచ్చగా ఉంటాయి కాబట్టి నల్లగా కనిపిస్తాయి. కాబట్టి వీటికి పోలిక. నల్లని మేఘాలు విశాలంగా విస్తరించి మరకత మణులతో నిర్మించబడిన రంగస్థలంలో ప్రకాశిస్తున్నాయి. మెరుపులకూ స్రీలకూ పోలిక ప్రసిద్ధము. స్త్రీని తటిల్లతా, విద్యుల్లతా, మెరుపుతీగా అనడం ప్రాచీనకవులనుండీ అధునిక కవులవరకూ అనూచానంగా వస్తున్న సంప్రదాయం. మెరుపులు మాటిమాటికీ లిస్తూ చూడముచ్చటగా వుంటాయి. మెరుపులతో మేఘాలు గంభీరంగా ధ్వనిస్తున్నాయి. అ ధ్వనులు మృదంగధ్వనులను పోలి వున్నాయి. కాబట్టీ నాట్యరంగస్థ్టలమనడం బాగా ఒప్పిందీ, నప్పిందీ కూడా. మృదంగనాదాలకీ మేఘధ్వనులకీ పోలిక వుంది. “ఆవిష్కృతం మేఘమృదంగనాదై । ర్వనేషు సంగీత మివ'్రవృత్తమ్” (రామాయణమ్ కిష్మింధాకాండ. 28వ సర్గ. 36వ శ్లో.) ((మేఘాలనే మృదంగధ్వనులచేత అవిష్కరించబడి సంగీతం మొదలైంది”) అకుపచ్చరంగు వున్న మరకతంలో నలుపూ పసుపూ కలిసి వుంటుంది. కాబట్టి కవులు నల్లదానిగానే భావిస్తారు. స్ఫుటతటిత్తపనీయగుణోజ్వలైః పృథుపయఃకణమౌక్తికసంగిభిః ॥ అభికదంఐకసచ్చ్భవిభిర్దిశా మసితకంచులికాయితముంబుదై: ॥1 (మ.వి.5.26) తళతళమని కాంతులీను మెరపు తీగలు సరిగపోవులలాగా తళుకు లీనుతుండగా, జలజలమని జూలువారు పెద్ద నీటిబీిందువులు చెక్కిన ముత్యాలపోలికను పోలగా, తుమ్మెదల గుంపును పోలిన నల్లని మేఘాలు దేవతాస్రీలు తొడిగిన నల్లని రవికలలాగా ప్రకాశించాయి. దిక్కులని నాయికలుగా కవులు వర్ణించారు. ఆ నాయికలు నల్లని రవికలు తొడిగారు. అ రవికలకు ముత్యాలు కూర్చబడ్డాయి. వాటికి సరిగ పోగులున్నాయి. నీటితో నిండిన ఈ నల్లని మేఘాలు దిక్కులనే వనితలు తొడుక్కున్న నల్లని రవికెలలా ఉన్నాయి. అందులో మెరుపులు సరిగపోగుల్లా తళతళమని మెరుస్తున్నాయి. మేఘాలనుండి జారే నీటిబొట్లు మేఘాలు నల్లగా ఉంటాయి. అందుకే “అసితకంచుకములు” (నల్లనిరవికలు)గానూ, “అలికదంబకసచ్చవులు” (తుమ్మెదలగుంపు)గానూ పోలిక చెప్పబడింది. ఒక ఆంగ్లకవి
మధురావిజయమాధురి తం 1 98౪4 కాం 1ంగిగాగంం్లోం (9జ౧౧0 ౧06 ఇం26౮) 10గ% 206 ౪౫6 ౮00౧ 16 9 06 2444 24400/20౧ 0 0౦6 (౮౦230౮1౧ 11160 (నేను మెరపుతీగయొక్క కాంతిపుంజం ముందుకువచ్చి అకాశంమాద విభ్రమకొలిపే దేవుడి సంతకాన్ని రాయడం చూశాను). గంగాదేవి ప్రకృతినంతా ప్రీమయంగానే భావించి ఆ ప్రకృతికాంతకు ప్రీదుస్తులూ, అభరణాలు తొడిగింది. ఈ లలనామణి ప్రకృతిమాతను స్రీగా భావించి స్రీసొందర్యాన్ని హరితలోహితపాండురరాజత (త్రిదశరాజశరాసనలేఖికా | మరకతోపలవిద్రుమమౌక్తికె ర్విరచితా రశనేవ నభశ్శియః (మ.వి.5.27) అప్పుడు ఆకుపచ్చని ఎర్రని తెల్లని ఇంద్రధనుస్సు ఆకాశలక్ష్మికి పచ్చలతోనూ, పగడాలతోనూ, ముత్యాలతోనూ చేసిన వద్దాణం లాగా ప్రకాశించింది. ఇంద్రధనుస్సులో ఎరుపూ, అకుపచ్చా, తెలుపూ అనే రకరకాల రంగులు వుంటాయి. ప్రీల వడ్డాణాలలో పచ్చలూ పగడాలూ, ముత్యాలు వుంటాయి. కాబట్టే అకాశమనే మహాలక్ష్మి ధరించిన వడ్డాణం లాగా ఇంద్రధనుస్సును వర్ణించింది గంగాదేవి. “నభ శ్రియః” అంటే ఆకాశశోభే ఆకాశలక్ష్మిగా చెప్పారు. గంగాదేవి ఎంత పండితురాలైనా ఆడదే. ఆవిడకీ నగలమిద మోజే మరి. అందుకే ఇంద్రధనుస్సును చూస్తే ఆవిడకి వెంటనే స్రీలు పెట్టుకొనే వద్దాణం గుర్తుకొచ్చింది. ఆకొరంలోకూడా ఇంద్రధనుగ వడ్డాణంలాగా ఉంటుంది. కవయిత్రి కాబట్టి చెప్పే విషయాన్ని వనాల. “టెక్నికలర్'లోనూ చెప్పింది. 19వ శతాబ్సి అంగృకవి ౪/11112గ ౪/0/68*+0గ0 =;6 నితగ0౦ంళ” / ౧౦|| 18209 ౪ ఇంగ |! 56౧06 శీ ౧౯౦0౪ 1౧ ౧6 94/ 50 ౪3 11 ౪౧6౧ ౯౫ 46 06902౧ 501:10౧00౪* ! 2గ 2 ౧౭౧ 5006 | ౪౧6౧ | 39౧౫ 0౧౮౫ ౦6 041౧ ౮8! 16 య6 15 ₹6 12006౯01 968 గా౭గ గీగిర 1! 00౪16 *గ5౧ గా౪/ 68)౫/5 10 08 600౧6 920 10 680% 9 ౧౩౧ 060 (జంగా ఉంగంళంగూ - 187)
తీ మధురావిజయమాధురి
“నేను ఇంద్రధనుస్సును చూడగానే నాగుండె ఆనందంతో గెంతింది. నా చిరు ప్రాయం మొదలైన క్షణాలవి. ఆ తియ్యని జ్ఞాపకం నాతో వుంది. నేను మనిషిగా ఎదిగాక కూడా అ మధురస్మృతి నాతోనే వుంది. నేను ముసలివాణ్ణి అయినా, నేను పోయేంతవరకూ కూడా అది నాతోనే వుంటుంది. బాల్యం భావిమనుగడకి చేయూత నిస్తుంది. నా జీవితమంతా ఇలాంటి సద్భావనలతోనే గడిచిపోనీ”.
రుధిరబిందునభచ్చవిరన్వగాత్
క్షితితలే హరిగోపపరంపరా ।
ఘనఘరట్టపరస్పరఘట్టన
క్షరదిరమ్మదవహ్నికణావళిమ్ ॥ (మ.వి.5.28)
మేఘాలనే తిరగళ్ళు ఒకటితో ఒకటి రాసుకోవటంచేత వెలువడ్డ “వజ్రాగ్నులు” అగ్నికణాలులాగా నెత్తుటి బిందువులులాగా ఎర్రబారిన తమ కాంతులతో మిలమిల లాడుతూ, ఆరుద్రపురుగులు నేలఈనినట్లు అంతటా తామై వెలిసాయి.
ఆరుద్రకార్తెలో పట్టులాంటి (ముఖమలీలాంటి) దేహంతో ఎర్రని పురుగులు బయలుదేరుతాయి. వీటిని ఆరుద్రపురుగు లంటారు. వర్షబుతువులో ఇవి బాగా వస్తాయి. ఇవి ఎర్రగా ఉండటం బట్టి నెత్తుటి బిందువులుగా భూమిపైన కన్పిస్తున్నాయి. మేఘాలు పరస్పరం రాసుకోగా పుట్టే వెలుగుకి “ఇరమ్మద”మని పేరు. దీన్ని “వజ్రాగ్నా అని కూడా అంటారు. నీటివల్ల ఇది ప్రకాశిస్తుంది. రాళ్లూరాళ్ళు రాసుకుంటే అగ్ని పుడుతుంది. అందుకనే మేఘాలని తిరుగళ్ళగానూ మేఘధ్య్వనిని తిరుగలిధ్వనిగానూ, మేఘాన్ని వెలువరించే అగ్నికణాలు రాళ్ళు వెలువరించే అగ్నిరవ్వలుగానూ అవిడ చెప్తోంది. అ అగ్నిరవ్వలలాగా ఆరుద్రపురుగులు ఎర్రగా ఉన్నాయి. వర్షాకాలంలో వాల్మీకి ఆరుద్ర పురుగులని ఇలా వర్ణించాడు. “బాలేంద్రగోపాంతరచిత్రితేవ ! విభాతి భూమిర్నవ శాద్వలేన। గాత్రానువృత్తేన శుకప్రభేణ | నారీవ లాక్షోక్షితకంబలేన” (“రామాయణమ్” కిష్కింధాకాండ. 28వ సర్గ. 24వ శ్లో) “ఈ చిన్న ఆరుద్రపురుగులచేత మధ్య మధ్య చిత్రమైన రంగులతో వున్న పచ్చికబీడులతో భూమి లత్తుక చుక్కలు చల్లిన చిలుకరంగుల కంబళి శరీరంపై కప్పుకొన్న స్రీలాగా ప్రకాళిస్తోంది”.
“ఘనఘరట్టపరస్పరఘట్టన” - మేఘాలనే తిరుగళ్ళు ఒకటితో ఒకటి రాయడం
- కానీ ఘన, ఘరట్టఘట్టన - ఘకారం పదే పదే ధ్వనించింది. తిరుగళ్ళ ధ్వనిని తోపింపజేస్తోంది. దీన్ని ఆంగ్లంలో '0౧౦౧౫౬10౧061& - ఉంగరం 1౧౧1181౧ 30౪౧65' అంటారు. “పదాలు శబ్బాలని అనుకరించడం” అన్నమాట. “తుమ్మెద రమ్మనడం” ఈకోవకి వస్తుంది.
మధురావిజయమారురి త్
వటుపురఃవవవాధిగతభ్రమా
జలముచః కరకోపలకైతవాత్ ః
సలిలరాశిషయస్సహచూషితా
ముదవమన్నివ మౌక్తికసంపహాతిమ్ 11 (మ.వి.5.29)
మేఘాలు తమకెదురుగా వీచే ఐలమైన గాలులతో నుళ్ళు తిరుగుతూ వడగళ్ళవే నెపంతో తాము సముద్రాలలో నీటితోపాటు తాగిన ముత్యాలను వర్నించాయి.
మేఘాలకు ముత్యాలు ఎలా దొరికాయంటే - సముద్రం రత్నగర్భ. మేఘాలు సముద్రంలో నీటిని తాగుతూ ముత్యాలని కూడా తాగాయి. అ నీరు వర్షిస్తూ వాటితో ముత్యాలని వర్షించాయి. మేఘాలు సముద్రజలం తాగడం ప్రసిద్ధం. “ప్రవృత్తమాత్రేణ పయాంసి పాతు । మావర్తవేగాద్రమతాఘనేన । అభాతి భూయిష్టమయం సముద్రః | ప్రమధ్యమానో గిరిణేవ భూయః” ((రఘువంశం” 13వ సర్గ. 14వ శ్లోకం. (మేఘం సముద్రంలోని నీటిని తాగటానికి నీటిదగ్గరికి రాగానే అక్కడి నుడుల వేగానికి తట్టుకోలేక గుండ్రంగా తిరుగుతున్నది. దాన్ని చూస్తూ వుంటే ఈ సముద్రం మందరపర్వతంచేత మధథింపబడుతోందా అన్నట్లు కనబడుతోంది).
అభిమతే సతి వారిధరోదయే
మధురషడ్డమనోహరగీతిభిః
గిరితటీషు ముహం: పరిమండలీ
కృతకలాప మనర్తి శిఖండిభిః | (మ.వి.5.30)
పర్వతసానువుల్లో నెమళ్ళు తమ కిష్టమైన మేఘాలు కన్పించగానే చెవి కింపయిన తమ 'షద్ద'ధ్వనులతో పాడుతూ మాటిమాటికి తమ పింఛాలు విప్పి గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేశాయి.
నెమలి అరుపులని కేక” లనీ అంటారు. వర్నాకాలమేఘం రాగానే సంతోషంగా నెమళ్ళు కేకాధ్వనులతో పురులు విప్పి గుండ్రంగా తిరుగుతూ నాట్యమాడు తున్నాయి. నెమళ్ళలో వననమయురాలు, గిరిమయూరాలు, గృహమయూరాలు అని మూడు తెగలున్నాయి. ఇవి గిరిమయూరాలు. “శిఖండిభిగా అనడంవలన మగనెమళ్ళ నాట్యం తెలుస్తోంది. మగనెమళ్ళే కదా నాట్యం చేసేది! అడనెమళ్ళకు కలావం ఉండదు. మేఘం కనపడగానే నెమళ్ళు అనందిస్తాయి.
తదను పద్మవనీపరిహాసక
ప్రేదశనాథశరాసవతస్కరః ॥
భుజగభుబ్ముభము(ద్రణభౌరిక
స్పముదభూత్సమయో జలదాత్యయః 11 (మ.వి.5.38)
ఉం మధురావిజయమాధురి
అతర్వాత తామరకొలనులలోనికి పరిహాసము కలిగించే విదూషకుడూ, ఇంద్ర ధనుస్సును దొంగిలించే దొంగ, నెమళ్ళముఖానికి ముద్రవేసే కనకాధ్యక్షుడూ అయిన శరద్బుతువు వచ్చింది.
శరత్తులో తామరలు విపరీతంగా పూస్తాయి. శరత్తులో వర్షాలు పడవు. ఇం(ద్ర ధనస్సు ఉండదు. బంగారు నాణాలను గుడ్డలతో కట్టి కనకాధ్యక్షుడు ముద్ర వేస్తాడు. మేఘగర్ణన వినక వర్షపు లేమివల్ల నోరుకట్టుబడిపోయి కేక వేయక నెమళ్ళు మిన్న కున్నాయి. ఇదీ దీని భావం. “పద్మవనీపరిహాసక” “త్రిదశనాథశరాసనతస్మరఃొ వంటి గడుసు ప్రయోగాలు కవయిత్రి నైపుణ్యానికి సూచికలు.
విధుతకాశసటాభరభాసురః
ప్రకటితోరుజపారుణలోచనః |
వ్యఘటయద్ధనదంతిఘటాస్ఫుర
ద్రవిముఖశ్ళరదాగమకేసరీ ॥ (మ.వి. 5.39)
అకాశంలో తేజోవంతంగా ప్రకాశించే సూర్యబింబం ముఖమై ఒప్పారగా, విప్పారిన 'పెద్దమందారపూలు ఎర్రబారిన కన్ను దోయిలా కన్పించగా, అటూ ఇటూ కదలాడే రెల్లు గడ్డి విదిలించే జూలై, ప్రకాశించే శరత్తు ఒక సింహమై మేఘాలనే ఏనుగులను చెల్లా చెదురు చేసింది.
శరత్తు సింహంగా వర్ణించబడింది. శరత్తులో రెల్లు వికసిస్తుంది. అది తెల్లగా ఉంటుంది. సింహము జూలు ఎజుపుతో కూడిన పసుపు. రెల్లు గాలికి ఇటూ, అటూ కదులుతూంటుంది. కోపంగా వున్న సింహం జూలు విదిలుస్తుంది. ఈ బుతువులో మందారపూలు పూస్తాయి. అవి విచ్చుకొని కోపగించిన సింహం కళ్ళలాగా ఉన్నాయి. సింహం ముఖం తేజోవంతంగా ఉంటుంది. శరత్సూర్యుదు తేజోవంతుడై ప్రకాశిస్తాడు. కాబట్టే సూర్యుడు సింహానికి ముఖమయ్యాడు. శరత్తు తెల్లని హంసగుంపులతోనూ, తెల్లని చంద్రబింబంతోనూ, తెల్ల రెల్లుపూలతోనూ తెల్లగా ఉంది. ఇలా శరత్తు సింహ కాబట్టే ఏనుగులు మేఘాలయ్యాయి. సింహానికి ఏనుగులు శత్రువులు. కోపంతో సింహం మాద పదుతోంటే ఏనుగుల సమూహం చెల్లా చెదరైపోతోంది.
వికచపద్మవిలోచనమాత్మనో
ముఖమవేక్షితుమాత్తకుతూహలా ।
నియతమ(భ్రనిచోలకగర్భత
శృరదకర్షదహర్చతిదర్చణమ్ 1 (మ.వి.5.46)
అ శరద్యువతి వికసించిన తామరపూవులనే కన్నుదోయి కల తన ముఖాన్ని
మధురావిజయమాధురి తౌ చూచే కుతూహలంతో మేఘ మనే గలీబు లోపలినుంచీ పగటిరాజు అనే అద్దాన్ని పైకి తీసింది.
తామరపూవులు శరత్తులో దీప్తిమంతంగా ఉంటాయి. స్రీ 'పద్మలోచన' కాబట్టీ అడదానికి అవి కళ్ళు అయ్యాయి. మేఘం అడ్డుగా వస్తే బయటపడి కాంతు లీనుతూ వెలుగొందుతున్నాడు కాబట్టి సూర్యుడు అద్దంతో పోలిక పొందాడు. గుండ్రంగా ఉండటం, ప్రకాశం కలిగి ఉండటం అనేవి సూర్యుడికీ, అద్దానికీ పోలికలు. మేఘం వస్తాచ్చ్భాదనని పోలివుంది. అందువలనే తొడిగిన గలీబునుండి ఆమె ఆ అద్దం లాగేసినట్లు ఊహించింది. మేఘంతోటి పోలికవల్ల గలేబు నల్లనిది అని తెలుస్తోంది.
దలదయుగ్మదలోదరసౌరభ
ప్రసరపక్ష్మలితా వనవాయవః |
ముహురధఃకృతయంతృనివారణా
నకృషత క్షితిళ్ళన్మదవారణాన్ 4 (మ.వి.ర5.49)
విప్పారిన ఏడాకుల అరటిపూల గర్భాలలోని సువాసనలతో నిండి బరువుగా వచ్చే గాలులు రాజమదపుటేనుగులని ఆకర్షించాయి. వాటిని పీలుస్తూ మైమరచిపోయి ఊరికే తమను అదలించే మావటివాళ్ళ అదిరింపును లెక్కచేయక వాళ్ళని అవి మాటిమాటికీ ఎదిరిస్తున్నాయి.
ఏదడాకుల అరటి శరత్తులో వికసిస్తుంది. దాని సువాసన ఏనుగు మదపు వాసనలా వుంటుంది. శరత్తులో అడవిలోని గాలులు అ పరిమళిన్ని నలువైపులకూ విస్తరింప జేస్తున్నాయి. కాళిదాసు “రఘువంశం”లో ఇలా అంటాడు. “ప్రసవైస్సప్తపర్ద్ణానాం మద గంధిఖి రాహతాః ; అసూయయేవ తన్నాగాః సప్తధైవ ప్రసుస్రువుః రఘువంశం” = తవసర్గ - 23వ శ్లోకం) “ఏడాకుల అరటిపాలవంటి వాసనకలిగి వెగటుగా వున్న ఆ అడవి ఏనుగు మదము వాసన చూసి సైన్యంలోని ఏనుగులు మావటివాడెంత ప్రయత్నిం
వనభువః పరిత: పవనేరితై
ర్నవజపాకుసుమై: కృతదీపికాః |
ప్రథమమేవ నృపస్య నిదేశతో
విజయినస్తురగాన్ నిరరాజయన్ 1 (మ.వి.5.50)
కొత్తగా పుష్పించిన మందారాలు గాలి వీచటంతో అంతా తామేగా తిరుగుతూ చుట్టూ తిరిగే దీపాలలాగా వుంటే రాజు ఆజ్ఞమేరకు శరదృతువు మొదలవగానే తోటలు
శరత్తులో మందారాలు వికసిస్తాయి. గాలి వీస్తోంది. అ గాలికి అవి కిందపడి పైకెగిరి చుట్టూ తిరిగి అ తోటలో అంతా కనబడుతున్నాయి. దీపాలూ, ఎరుపు
డ్రి మధురావిజయమాధురి మందారాలూ ఎరుపే. ఇవి పైకెగరటంవలన దీపాలలాగా ఉన్నాయి. దీవం వేరే, దీపాగ్ని వేరే కాదు. ఈ అగ్ని స్వభావంతోనే ఈ పూలనే హారతులుగొ ఉపయోగించారు. అప్పుడు వనభూములు రాజుగారి ఆజ్ఞతో పురోహితు లయ్యాయి. ఇంక హారతి అనే శాంతికర్మ పూర్తయినట్లే. “ఆరా(త్రిక” మనేటప్పుడు వనభూములు లళఠలు. అ లతలు గాలికి తిరిగే మందారాలతో హారతు లిచ్చే ఆదవాళ్ళలాగా అమరివున్నాయి అనుకోవాలి. ఇక్కడ “విజయినః తురగాన్” అంటే యుద్ధంలో జయంకోసం రాష్ర్రాభివృద్ధికోసం ఏనుగు లకీ, గుర్రాలకీ హారతులిచ్చే ఆచారం వుంది. ఇది రాజులు పురోహితులచేత జరిపిస్తారు. ఇది శాస్త్రంతో కూడుకున్నది. ఈ నీరాజనాన్ని కాళిదాసు ఇలా వర్ణించాడు” “తస్మై సమ్యగ్గుతో వహ్ని ర్వాజినీరాజనావిధౌ! ప్రదక్షిణార్చిర్వ్యాజ్యేన హస్తేనేవ జయం దదౌ” రఘువంశం” 4వ సర్గ. 25ళ్లో.) (రఘుమహారాజు శరత్కాలములో చేయవలసిన గజార్వాది నీరాజనకర్శలో అగ్నికి హోమం చేయగా ప్రదక్షిణంగా తిరుగుతున్న జ్వులల ద్వారా రాబోవు విజయాన్ని అగ్ని సూచించాడు” అని భావం) “నవజపాకుసుమైా అనడంవలన మందారం ఎర్రదనం తెలుస్తోంది. రాజులను హారతులిచ్చి సంభావించడం ఇలా వర్ణించబడింది “అఆదరణీయ రామకథనాంకశుకోక్తులతోడ దీవము । త్రెదువచాలు శోభనపుటారతు లెత్తె సదాగతింగిరి! క్షోదవినోదికిం జిగురుజొంపపుగెంపులపళ్ళెరంబులం। బ్రోది గనర్చు నగ్గలపు మొగ్గలు ముత్తెపుముగ్గు లీనగన్ ॥ (రామరాజభూషణుడు వ్రాసిన “వసుచరిత్ర” అశ్వాసం. 1.153 పద్యం); ఈ మందారం రాజసం చూడండి :
“వేరికొలచు సుమాలు నను ఆరామమున దొరసానినే
వీరులకు జయహార మను మందారమును నే రాణినే” ॥
దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి
సూర్యాస్తమయ వర్ణన :
అథకంపనరేంద్రసుభ్రువాం
ముఖపద్మాన్యనుహార్య పంకతైః |
అపరాధభియేవ భానుమా
నపరక్ష్మాధరకందరామగాత్ 11 (మ.వి.?.1)
తర్వాత సూర్యుడు రాజు భార్యల ముఖపద్మా లను తొమరలతో సమంగా చేసి తప్పు చేశానన్న భయంతో పడమటి కొండగుహలో చొరబడ్డాడు.
రాజు భార్యల ముఖాలు శోభావంతాలైన పద్మాలు. సరస్సులోనివి బురద అంటిన పంకజాలు. ఇలా పోలికలేని వీటిని అసూయాపరుడైన సూర్యుడు రాజు భార్యల ముఖాలు చాలా దీప్తివంతంగా ఉండటం చూసి తన కాంతిని పంకజాలలో వుంచి తాను వాటిని రాజుభార్యల ముఖాలకి సమంగా చేశాడు. ఇలాంటి తప్పుచేసి రాజాపరాధం చేశాడు.
మధురావిజయమాధురి త్ర అదీ రాజు భార్యలవిషయంలో. అందుకే శిక్ష చాలా దారుణంగా ఉంటుందని భయపడి ఆత్మరక్షణకి పడమటి కొండగుహకి పరుగెట్టాడు. ఇక్కడ కవయిత్రి చమత్కృతి పద్మ, పంకజ ప్రయోగాలలో కన్పిస్తోంది. పద్మములు లక్ష్మికి నిలయాలు. ఇవి రాజు భార్యల ముఖాలలో దీప్తిస్తున్నాయి. తాను కూడా ఆ రాజు భార్యలలో ఒకావిడ నన్నది మనం మరువకూడని విషయం అని మనని హెచ్చరించడం ఇది. “పద్మా లక్ష్మీః అస్త్యత్ర' అనేది వ్యుత్పత్తి. సరస్సులోనివి పంకజాలు, బురదలో పుట్టేవి. మలినాలు, కాంతిహీనాలు. “అపరక్ష్మాధర+కందరామ్' - నీచులైన రాజుల వెనక చేరాడని మరొక అర్ధం చెప్పుకోవచ్చు. రాజద్రోహి శత్రురాజులతో చేరి తనను తాను రక్షించుకోడానికి ప్రయత్నిస్తాడు. సూర్యుడూ ఇక్కడ అలాగే చేశాడని అంతరార్థం.
పరిచూషితదీప్తిరంబుజై:
పునరూష్మాణమివాప్తుమౌర్వతః 1
రయవల్లితవాహనో రవిః
పయసాం రాశి మవాప పళ్చిమమ్ ॥ (మ.వి.?.2)
తామరలు తన తేజస్సును నిశ్శేషంగా పీల్చివేశాక సూర్యుడు బడబానలంవలన మళ్ళీ దాన్ని పొందాలనే ఊహతో ఆగకుండా గుర్రాలు వెడుతూ వుండే పడమటి సముద్రంలో తాను ప్రవేశించాడు.
బెర్వుడు - బడవానలము - ఇతను ఊర్వుడనే మహర్షి కొడుకు. ఊర్వుడు తన తొడను మధిస్తే ఇతను అగ్నిమయపురుషుడిలా పుట్టి బ్రహ్మాదుల అనతితో ఆడగుర్రం ముఖంతో సముద్రంలో ఉన్నాడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. సముద్రంలో బడవ (ఆడగుర్రం) ఉంది. దాని ముఖంనుండి అగ్గిని తీసుకొని పైకి వస్తే తామరలు అ కాంతిని తాము తీసుకొని అతణ్జి కాంతిహీనుణ్ణి చేశాయి. ఇతను పద్మినీప్రియు డవటమే కాకుండా లోకబాంధవుడు కూడా. ఇతని ప్రకాశం లేకుండా లోకమే లేదు. లోకం చీకటై పోతుంది. అందుకే చాలా త్వరగా “రయవల్లితవాహనో రవిః” గుర్రాలని నడిపించు కుంటూ అతడు వెడుతున్నాడు.
అపసర్పణసం(భ్రమచ్యుతం
దినలక్ష్య్వాస్తపనీయకుండలమ్ ॥
రవిమండలమాశశంకిరే
వరుణాంతుపురవామలోచనాః ॥॥ (మ.వి.?.3)
వరుణుడి అంతఃపురంలోని స్రీలు అస్తమించే సూర్యబింబాన్ని చూసి దినలక్ష్మి వేగంగా వెళ్ళిపోతూ వుంటే సంభ్రమంతో జారిపడిన ఆవిడ బంగారు చెవికమ్మ ఏమో అనుకున్నాడు.
50 మధురావిజయమాధురి
సూర్యుడు ఎర్రగా గుండ్రంగా వున్నాడు “వరుణాంతఃపురవామలోచనాఃొ అనడం సూర్యుడు పశ్చిమాన్ని క్రుంగటం తెలుపుతోంది. “వామలోచనలు” కదూ (ఆడవాళ్ళు) వాళ్ళకి సహజంగా నగలంటే మోజు ఎక్కువ. మరి కవయిత్రి మాటేమిటి? ఆవిడ కూడా ఆడదేనండోయ్!
ప్రథమాం హరితం ప్రభాకరో
విరహయ్యాత్మని తాపమాప యమ్
అపరాముపగమ్య తం జపహౌొ
హృదయం కః ఖలు వేత్తి రాగిణామ్ | (మ.వి.?7.6)
సూర్యుడు తూర్పుదిక్కు వదలి ఎంతటి విరహాన్ని అనుభవించాడో దాన్నంతా పడమటి కలయికలో మరిచాడు. రాగవంతుల హృదయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు?
ఇక్కడ తూర్పు, పడమరదిక్కులు నాయికలు. సూర్యుడు నాయకుడు. నాయకుడైన సూర్యుడు తూర్పుదిక్కును వదిలి విరహబాధ పడి పడమటి దిక్కును చేరగానే తూర్పు దిక్కును మరచిపోయాట్ట. రాగవంతులంటే ఎగర్రనివారూ, అనురాగం వున్నవారూ. అస్త మించే ఎర్రనివాడు. వీళ్ళు నమ్మదగ్గవారు కారు. వీళ్ళు చంచలస్వభావులు. సూర్యుడు తూర్పున ఉదయించి ప్రకాశవంతుడై పడమటికి చేరి కాంతిహీను డవుతున్నాడు. ఇది నాయికా ప్రణయమూ, విరహమూ, విరాగాలని సూచిస్తోంది. ప్రభాకరు డుంటే లోకాన్ని తేజో వంతంగా చేసేవాడు. అలాంటివాడే ఇలాంటి పనిచేస్తే ఇంక మామూలు మనుషుల సంగతి చెప్పేదేముంది అన్నది అర్జోక్తి. “ప్రధమామ్ - అపరామ్” అనే పదాలను వాడి ఉత్తమనాయికను వదలి నికృష్ణనాయికను పొందాడని నర్మగర్భంగా నూచించింది గంగాదేవి.
పరలోకపథం ్రపేదుషః
పునరావృత్తిమ పేక్ష్య భాస్వతః |
ముకులీభవదంబుజచ్చలా
దకరోదంజలిబంధమబ్షినీ 1; (మ.వి.?.7)
సూర్యుడు వేరే లోకానికి వెళ్తున్నప్పుడు పద్మినీకాంత తామరలు ముదుచుకొనే నెపంతో అతడు మళ్ళీ రావాలని మనస్సులో కోరుకుంటూ నమస్మాగం చేస్తున్నదట!
పద్నినీజాతి్రీలు ఉత్తమజాతిస్రీలు. పతివ్రతలు. పద్మిని అంటే పద్మలత. పద్మినీజాతి ప్రీగా ఇక్కడ చెప్పబడింది. పతివ్రతలు భర్త ఎడబాటును భరించకు. నూయ్యిడు పద్మినీ పత. అతను ఆకాశమార్గాన పరలోకానికి ప్రయాణం చేస్తూంటే పద్మిని చేతులు మోడ్చి ప్రార్టిస్తోంది. అ చేతులు మోడ్చటమే పద్మం ముకుళించడం. ఇక్కడ నాయిక విరహో
స్టంరలా - క స మధురావిజయమాధురి సూ టో వ్ తృంఠిత. “విరహోత్కంఠిత వరుని తడవుసైపలేక వగనాం లు నాలుగు. పద్మిని, చిత్రిణి, హస్తిని, శంఖిని అని. సాయంకొలంవర్ణన :
దినవేషమపాస్య యామినీ
వపుషా కాలనటస్య నృత్యత: ।
దదృశే జగతా పితృప్రసూ
రవి నేపధ్యపటీవ పాటలా ॥ (మ.వి.?. 19)
కాల మనే నటుడు తాను వేసుకున్న పగలనే వేషాన్ని విప్పేసి రాత్రి అనే వేషాన్ని వేసుకొని నాట్యం చేస్తూంటే సంధ్యాకాలం ఆకాశంలో వేసిన ఎర్రని తెరలాగా లోకానికి కనబడింది.
నటుడు వేషాన్ని తీసి మరో వేషం వేసుకొనేటప్పుడు తెరమరుగున వేషధారణ చేసుకుంటాడు. ఆ తెర రకరకాల రంగుల్లో ఉంటుంది. ఇక్కడి తెర రంగు ఎరుపు. పగటి తెలుపునీ రాత్రి నలుపునీ ధరించిన నటునికి తెర ఎర్రనిదైంది. తెరలాగా సంధ్య పగటికీ, రాత్రికీ మధ్య అద్దు. కాలం మనిషి సుఖ దుఃఖాలు తనవి అనుకుంటుంది కాబట్టే కాలానికి నటుడితో పోలిక. ఇక్కడ పగలు పోయి రాత్రి రాబోతోందని సంధ్య సూచిస్తోంది. కాలం పరమేశ్వరస్వరూపం. అతనికి పగలు రాత్రి అనేవి నిజం కాక వేషధారణ అవుతున్నాయి. ఎందుకంటే పరమేశ్వరుడు నిర్గుణుడు కాబట్టి. సంధ్య బ్రహ్మదేవుని శరీరం. ఇక్కడ మనకు మరొక విషయం బోధపడుతుంది. అది గంగాదేవి అపారపాండిత్యం. ఆవిడ తన గురువుగారైన విశ్వనాథుడి దగ్గర నాట్యశాస్త్రం క్షుణ్ణంగా చదివి ఉండటమే కాక రాణిహోదాలో అనేకనాటకాలను స్వయంగా చూసి వుంటుంది, చదివి వుంటుంది. అందుకే ఇంతటి సహజత్వం చిప్పిల్లే వర్ణన.
రవిరథ్యఖురోత్ధితాపర
క్షితిభృద్దెరికరేణుశోణయా |
క్షణమేకమకారి సంధ్యయా
వరుణాశారుణకంచుకభ్రమ: (మ.వి.?.20)
ఆ సంధ్య పడమటి కొండపై సూర్యుడి గుర్రాలు పరుగులెత్తటంచేత వాటి గిట్టలు పెకి రేపిన గైరకధాతుదుమ్మువలన ఎర్రగా వుండి క్షణం సేపు చూచేవారికి వరుణదిక్కు భార్య తొడిగిన ఎగ్రనిరవిక ఇది అనే (భ్రాంతి కలిగించింది.
పర్వతాలలో గైరికధాతువులంటే ఎగర్రనిరాళ్ళు ఉంటాయి. వాటి దుమ్మువలన పడమటి దిక్కు ఎగర్రనైంది. సూర్యాస్తమయంలో సంధ్యారాగం పడమటి దిక్కులో కనిపించి ఆదిక్కు కొంతభాగం ఎర్రనిదిగా కన్పించింది. కాబట్టే పడమటి దిక్కు అనే స్రీ ఎర్రని
52 మధురావిజయమాధురి రవిక తొడిగిందనే భ్రాంతి కలుగుతోంది. వరుణదిక్కు అనే స్రీ ఎర్రని రవిక ధరించి తన భర్త చంద్రుడి కోసం అలంకరించుకొని నిరీక్షిస్తోంది. ఈవిడ వాసవసకజ్జిక అన్నమాట. ఒక కవి సంధ్యను వర్ణిస్తూ “కృమలాప్తహరులరింభాముఖంబులదూలు చరమాద్రి ధాతురజంబువోలె” అన్నాడు. (వరాహపురాణము 4.ఆ.140.ప). మళ్ళీ గంగాదేవి ప్రకృతికాంతని వర్ణిస్తూ పడమటిదిక్కును ఆడదాన్ని చేసి ఎర్రని రవిక ధరింపజేసింది. ఈవిడలోని స్రీలాలిత్యం ఈవిడ ప్రత్యేక సొమ్ము. వియతి వ్యరుచన్ పయోధరాః స్ఫుటసంధ్యాపరిపాటలత్విషః ॥ అచిరావతరద్విభావరీ పదలాక్షాపటలానుకారిణ: 11 (మ.వి.7.21) మేఘాలు పొటమరిచిన సంధ్య ఎర్రని కాంతులు తమలో వ్యాపించగా తొము త్వరలో పుట్టబోతున్న రాత్రిపడతి లత్తుకముద్దల లాగా ఆకాశంలో ్రకాశించాయి. అత్తుక ఎరుపు. మేఘాలు నలుపు. అయినా సంధ్యారాగంతో ఎ(ర్రబారి అవి ఎర్రగా మారాయి. చంద్రుడు రేరాజు. అతను వస్తున్నాడని పాదాలకి రాత్రి లత్తుక అలుముకుంది. ఆమె కన్చించటానికి ముందే లత్తుకతో అలంకరించబడిన ఆమె పాదాలు కనబడుతున్నాయి. నల్లని మేఘాలకు ఎర్రరంగు పట్టినట్లే, రాత్రియువతి నల్లని పాదాలకు ఎర్రని లత్తుకరంగు పట్టింది. కాబట్టే పాదాలకు మేఘాలకు పోలిక. ఉదియాయ తలో దిగంగనా (శవణాకల్పతమాలపల్లవ: 1 రజనీముఖపత్రలేభికా రచనారంకుమదస్తమో&_.౦కురః 11 (మ.వి.?.23) తరువాత చిరుచీకట్లు వెలువడ్డాయి. దిక్కు అనే స్రీ చెవికి భూషణంగా పెట్టుకున్న తమాలచెట్టు చిగురు అన్నట్లు రాత్రియువతి చెక్కిళ్ళలో కాలయువకుడు మకరికా పత్రాలు రాయటానికి తీసుకు వచ్చిన కస్తూరిలాగా ఉంది. ఇక్కడ చీకటి వర్ణించబడుతోంది. తమాల(మ్రాను నల్లగా ఉంటుంది. దాని చిగురుటాకును స్రీలు చెవికి ఆభరణంగా ఛరిస్తారు. దిక్కు అనే స్రీ ధరించిన ఆ తమాలపు అకు అయ్యింది చీకటి. ప్రియులు ప్రియురాళ్ళ చెక్కిళ్ళపై కస్తూరితో మకరికాపత్రరచన చేస్తారు. రాత్రి అనే స్రీ ముఖంలో (చెక్కిళ్ళలో) పత్రికారచన చెయ్యటానికి కస్తూరే చీకటిగా కన్పిస్తోంది. కస్తూరి నలుపు. చీకటి నలుపు. తమాలం నలుపు. గంగాదేవిచేతిలో దిక్కు ఆడదిగా అందంగా రూపొందింది. రాత్రి పడతి అయ్యింది. గంగాదేవి తన కావ్యంలో ఏదో ఒక నెపంతో స్త్రీని అందంగా, ఆహ్హాదంగా వర్ణిస్తోంది. ఇది చెప్పుకోదగ్గ విశేషం.
మధురావిజయమాధురి క
5021980978 కూడ రాత్రిని స్త్రీగా వర్ణిస్తాడు.
00గ౪, ౪౫|| ౧౧4
౧0౪4 9006? 54166 గా౭[౯౦గి, &|| 1౧ 0186 .....
అగ ౪ 010% గాడగ౧॥19. (౧ంగ6౦ 2౧6 ౮౮91 11 ఉం+ 206 906౧6)
“నల్లని హుందాగా వుండే దుస్తులు ధరించి నల్లని ముసుగును ధరించిన ఓ సుకుమారమైన రాత్రి అనే గృహిణీ రా!”
కిము ధూమభరః ప్రశామ్యతో
ద్యుమణిగ్రావగతస్య తేజసః |
ప్రససార దిశస్తమోమిషా
త్మిము మాలత్మమలాలిసంచయ: ॥ (మ.వి.?.24)
అంధకారమనే నెపంతో సూర్యకాంతమణులలోని దీప్తి ఆరిపోశూ పైకిలేచే పాగల దొంతరా, తామరలు ముకుళించుకుపోగా నాలుగు వైపులా తిరిగే గండు తుమ్మెదలదండా అన్నట్లు చీకట్లు నలుదిశలా ఆవరించాయి.
నిప్పు ఆరిపోగానే పొగ బయలుదేరింది. సూర్యకాంతమణులు సూర్యుడి కాంతితో వెలుగుతాయి. అవి సూర్యుడు అస్తమించగానే తమహ్రకాశాన్ని పోగొట్టుకొని ఆరిపోతాయి. కాబట్టి వాటినుండి పొగ బయలుదేరుతుంది. అదేనా ఈ చీకటి? లేదా తామరలు ముడుచుకుపోవడం వల్ల వాటిని వదలి నలువైపులా తిరిగే గండుతుమ్మెదల గుంపా అనేది సందేహం. తుమ్మెదలూ చీకటీ నల్లనివి కనుక సందేహం. అద్భుతమైన వర్ణన.
చీకటి గురించి 5&గ66! 23407 ౧౫6గ696 ఇలా అంటారు.
౧6 9౪౧'5 గగొ ర॥95; ౧6 548/5 ౧౫౩౧ 0౮౪
తి! 0౧6 9౧606 00గ౫6౩ 1౧6 ఆ&గ6; (5.7. ౧౦19౧6౦6 "౧౧8 4గింంగ! సంగగ౧6గ)
“స్తూర్యుడి అంచు మునిగిపోయింది, తారకలు పరిగెట్టేసాయి. ఒక్క ఉదుటున చీకటి వచ్చేసింది”.
నయనాని జనస్య తత్క్షణా
న్నిరుణద్ధి స్మ నిరంతరం తమః 1
రవిదీపభృతా(భ్రకర్పర
చ్యుతకాలాంజనపుంజమేచకమ్ ॥॥ (మ.వి.?.26)
సూర్యుడనే దీపం తన కాంతులని ఆకాశమనే కర్పూరానికి వ్యాపింపజేస్తే అందు లోంచి రాలిన కాటుకమసికుప్పలని పోలిన నల్లని చీకటి దట్టంగా నాలుగు వైపులా ఆక్రమించి జనుల చూపులకు అడ్డు తగులుతోంది.
54 మధురావిజయమాధురి
“కళ్ళు పొడుచుకున్నా కానరాని చీకటి అంటూ వుంటాం. అలాంటి చీకటి ఆకాశంలో బయలుదేరింది. ఆకాశం “కర్పూరం” ఇక్కడ - అంటే కాటుక పట్టే వెడల్పైన పళ్ళెం అన్నమాట. సూర్యుడు తన కాంతితో వెలిగే దీపం. దీపకాంతులతో పళ్ళెంనుంచి మసి అట్టలుగా కట్టి రాలిపడుతుంది. అలాగే ఆకాశం కాటుకని వర్షిస్తోందా అన్నట్లు చీకటి ఆకాశంనుండి బయటకు వచ్చి గభాలున కుప్పలు కుప్పలుగా నిండుతోంది. కాబట్టి పాత్రలోంచి రాలే “కాటుకతో” దీనికి పోలిక. చిమ్మచీకటి ఆకాశంలో బయలుదేరి ఒక్కసారిగా వేగంగా లోకమంతా చుట్టేసిం దనేది అంతరార్థం. ఆకాశం కాటుకను వర్షించడ మనే వర్ణనలు సంస్కృతంలో చాలా ఉన్నాయి. చాలా ప్రసిద్ధమైనది “లింపతీవ తమో£.౦గాని | వర్పతీవాంజన నభః (చీకటి అంగాలకు పూసినట్లుంది. ఆకాశం కాటుకను వర్పిస్తున్నట్లుంది) ఇక్కడ కవయిత్రి “అంజన” మనకుందా '“కాలాంజన” మని చీకటిలోని సాంద్రతని ఎక్కువచేసి చూపింది.
"0 19% 001 6006! 64౧4౧688 ౪151016) ($4/10గ, ౧౭౧2౮156 1091 800% - (0) “క్రాంతిలేదు - చీకటే కన్పిస్తోంది” అంటాడు 14110౧ తన కావ్యంలో.
ఆవపత్కిము కాలకర్షక
స్తిమిరాంభఃకలుషే నభస్తలే 1
విమలా ముడుబీజమండలీం
నవచంద్రాతపసస్యసిద్ధయే 1 (మ.వి.?.29)
ఆ సమయంలో కాలమనే రైతు వెన్నెల అనే పైరు పండించటం కోసం చీకటి అనే నీటితో కలుషితమైన ఆకాశం అనే పొలంలో విమలమైన నక్షత్రాలనే విత్తులని నాటాడని తోస్తుంది.
రాత్రివలన వెన్నెల ఏర్పడుతుంది. రైతువల్ల పంట పండుతుంది. అందుకని కాలాన్ని రైతన్నారు. కాలం పరమేశ్వరునిస్వరూపం అతని సేద్యం-సంకల్పమైన ఇచ్ళ- వలన వెన్నెల కాస్తోంది. రైతుకృషి - వ్యవసాయంవల్ల- పైరు పండి-ప్రజలు జీవిస్తున్నారు. వెన్నెల దేవతలకీ, చకోరాలకీ, వృక్షాలకీ ఆహార మవుతోంది. వారు దీనివలన జీవిస్తున్నారు. అమృతాంధసులు దేవతలు. అమృతద్యుతి చంద్రుడు. చంద్రుని కాంతి చంద్రిక. చంద్రికాపాయులు చకోరాలు. దట్టమైన చీకటిలో నక్షత్రాలు కలిసి ఆకాశంలో మెరుస్తున్నాయి. చీకటి ఆకాశమంతా పూయబడింది. విత్తడానికి ముందు భూమిని నీటితో తడుపుతారు. అందులో విత్తులు నాటుతారు. ఆకాశంలో విత్తిన విత్తనాలు నక్షత్రాలు. పైరు వెన్నెల. భూమిలో విత్తనాలు అంకురించి పైరవుతాయి. విత్తనాలు పాల్లులేనివి అయితేనే పంటకు ఉపయోగపడతాయి. నక్షత్రాలు విమలాలు అయితే వెన్నెల అవుతాయి. ఇక్కడ గంగాదేవి చెప్పదలచుకున్నది ఏమిటంటే కాలం ముల్లోకాలని ఆహ్హాదపరచటానికి చంద్రకాంతిని వెదజల్లి లోకాన్ని దీప్తిమంతం చేయదలిచింది.
మధురావిజయమాధురి 5 అందుచేత నక్షత్రాలని ముందు పుట్టించింది. ఇంక కొద్దిసేపట్లో వెన్నెల విరియబోతోం౬ అని చెప్పడం అన్నమాట.
జననీముపలభ్య యామినీ
మధికప్నేహదశాళివర్తితా:
దివసస్య లయం ప్రపేదుషో
గృహదీపా ముహురర్భకా ఇవ ౫ (మ.వి.7.32)
పగలు అనే తండ్రి వేరే లోకానికి వెళ్ళినప్పుడు. ఇంటిదీపాలు రాత్రి అవే తల్లిచగర వుండి తండ్రిని పోగొట్టుకొన్న పసిపిల్లలాగా మాటిమాటికీ అత్యంతపేమతో ఆమెచేత పెంచబిడ్డాయి.
“అధికస్నేహం” అంటే దీపం పరంగా “ఎక్కువ నూవె అవీ. తల్తివరరగా “వాలా ప్రేమ” అనీ అర్ధం. 'దశ' అంటే దీపపరంగా "వత్తి అవీ, తల్షివంంగా "ఉవికి. అవస్థ అనీ అర్ధం. తండ్రి నూర్యుడు వెళ్ళిపోగానే తండ్రిలేని పిల్లలయ్యాయి. దీపాలు. రాత్రి తల్లి పిల్లలను స్నేహంతో (నూనెతో) బాగా పెంచుతుంది. పగలు గదమౌాచే రాత్రి “గ్యవా దీపాఖొ అనటంచేత చంద్రప్రకాశం కల రాత్రుల కివి అర్భకులలాగావే కన్పించ వచ్చు. “ముహు” అనడం గృహిణులు ఇళ్ళల్లో దీపాల్లో మాటిమాటికీ మావె పోయడుు వత్తిని పెద్దదిచేసి కాంతిమంతం చేయడం సూచిస్తోంది. గంగాడేవి ముల్దని వన్తువేదే లేదని దీనివల్ల తెలుస్తోంది. మధ్యతరగతి గృహిణి ఏం చేస్తుందో చూసే ఎక్స్-రే కళ్ళు ఆవిడవి. ఏ వర్ణనా. చిత్రణా కూడా అవిడ చేతిలో వాస్తవికతని సంతరించుకొని 20వ శతాచ్దిపు ౧228166 (వాస్తవికతావాదు)ని గుర్తుకు తెస్తుంది.
ఉడుపుష్పకరంబితం తమః
కచభారం దధతీ నిశీథినీ
అచిరాదియమవ్వపాలయ
తృుముదస్మేరముఖీ విశాకరమ్ 1 (ము.వి.?.33)
రాత్రి అనే లలన చీకటి తనకు జుట్టుకాగా నక్షత్రాలు అందులో తురిమిన పెరుగు ముద్దలవంటి తెల్లనిపూలై ప్రకాశిస్తూవుండగా వికసించిన కలువపూలు చిరునవ్వులుగా ముఖంలో చిందులాడగా త్వరగా వచ్చి చంద్రు డనే భర్తకోసం ఎదురుచూస్తోంది.
ఇక్కడ నిశాకరుడు చంద్రుడు. నిశ అతని భార్య. అందుకవే భర్తరాకకోనం అలంకరించుకొని ఎదురుచూస్తోంది. చీకటి ఆకాశాన్ని కప్పేసింది. నక్షత్రాలు ఆకాశంలో నలుపు. నక్షత్రాలు తెలుపు. పూలు తెలుపు. కలువలు తెలుపు. చిరునవ్వు తెలుపు. గంగాదేవి పదే పదే స్రీసహజమైన ఆసక్తిని అలంకరణలోమా, వగలలోనూ చూవడం
56 మధురావిజయమాధురి ఒక ఎత్తు. 20వ శతాద్దిపు తొలిసగంలో ఆంధ్రదేశంలో “భావకవితాఉద్యమం” మొదలైంది. 19వ శతాబ్దపు ఆంగ్ల గంగాడ౧|10 నిం61౧/ కి దాదాపు తెలుగురూప మిది. పై వివరణ చదివితే గంగొదేవిలో ఎంత భావుకత ఉందో అర్ధమవుతుంది. చాలా అందమైన ఊహ. నాయిక వాసవసజ్జిక. అత్యంతరమణీయమైన వర్ణన. తెంగ౧ 626 అంటాడు - గీ 1౧11౧0 0 0920౮0/ 13 & )0౪ 108౪69౧ 13 10౪6110653 1౧౦92585; 1 ౪ ౧౮౪౪ ౧859 1౧10 ౧౦1౧1౧౦౧౪5; (౮౦౧౧ 62, “౬£౧౮/౧౧౧”) “అందమైన దెప్పుడూ ఆహ్లాదమైనదే. దాని ఆకర్షణ పెరుగుతూనే ఉంటుంది. ఆ అందం లేకపోవడమంటూ జరగదు”. చం(ద్రోదయవర్ణన : తరలాలసతారకం ముఖం కలయంతీ శరకాందపాండరమ్ | విగలత్తిమిరాంబరా ఐభౌ హరిదైంద్రీ హరిణాంకగర్భిణీ 11 (మ.వి.?. 35) తూర్పు దిక్మనే స్తీతన గర్భంలో చంద్రుణ్తి ధరించి గర్భవతి కాబట్టి మంద గమనంతో అటూ ఇటూ తిరిగే నక్షత్రాలతో రెల్లుదుబ్బులాంటి తెల్లనైన ముఖంతో తొలగిపోతున్న చీకటి అనే వస్త్రంతో ్రకాళిస్తోంది. తూర్పుదిక్కు చంద్రుణ్జి తనలో తాల్చింది. అ సమయంలో ఊరికే కదులుతూ నక్షత్రాలు కనివిన్తున్నాయి. ఆవిడముఖం పాలిపోయింది. గర్భిణీస్తీకి చూవు మందగించడం, చూపులో చంచలత్వం ఉంటుంది. తూర్పుదిక్కు ముందరి భాగం ఈవిడ ముఖం. నక్షత్రాలు ఈవిడ కనుగ్రుడ్డు. కంటి(గ్రుడ్దు గుండ్రంగా చలిస్తూ వుంటుంది. అసలే ఆడవాళ్లు “చంచలాక్షులు” కదా! వస్త్రం జారిపోయినట్లు చంద్రాగమనంతో చీకటి విచ్చిపోతూ జారిపోతూంది. గర్భిణీస్తీకి “గర్భగౌరవం” వలన కట్టిన చీర నిలవకుండా పోతోంది. గంగాదేవి గర్భిణి అయిన దేవాయిని కూడా ఇలా వర్ణించింది. గంగాదేవి వర్జనలలో ్రీసహజలాలిత్వమే కాకుండా, స్రీలను గురించిన వర్దన లుండటం గమనించ వలసిన విషయం. ఆవిడ మహారాజ్డి. కవయిత్రీ అయినా ఆవిడా ఆడదీ పై పెచ్చు మాతృ మూర్తి అనే విషయం సమయం వచ్చినప్పుడల్లా గుర్తుచేయకుండా వదలిపెట్టదు. ఇక్కడ కూదా '19215/ [600౧1066' (వాస్తవికతాధోరణి)ని ఉపయోగించి యధాతథంగా, గర్భిణిని కళ్ళకు కట్టించింది.
మధురావిజయమాధురి ర్” పరిరభ్య ధృఢం చిరాగగః
ప్రధమాశాసుదృశా - నిశాపతిః |
శ్రధయత్యయమంశుభిర్నఖై
స్తిమిరశ్రేణిమయీం ప్రవేణికామ్ 1 (మ.వి.?.43)
చంద్రుడు చాలా కాలానికి రావడంచేత తూర్పుదిశస్త్రీని గట్టిగా కౌగిలించుకొని చీకటి దొంతరలనే చిక్కుకట్టిన ఆవిడ జడను చేతి గోళ్ళతో మెల్లిమెల్లిగా చిక్కు తీస్తున్నాడు.
ప్రవాసిగా దేశాంతరం వెళ్ళి చాలాకాలం తరువాత తిరిగి వచ్చిన చంద్రుడు తన కోసం ఎదురుచూస్తూ తలనైనా దువ్వుకోని భార్య చిక్కుపట్టిన జడలోని చిక్కుని గోళ్ళతో నెమ్మదిగా తీస్తున్నాడు. చంద్రుడు ఇక్కడ నాయకుడు. తూర్పుదెస ఇక్కడ నాయిక. అతని అస్తమయం (ప్రవానం. అతని ఉదయం పునరాగమం. నలువైవులా ఉఊడవుగా అలుముకున్న చీకటి చిక్కులు పట్టిన ఆవిడ జడ. మెల్లమెల్లగా నలుదెసలా ప్రసరించే కిరణాలు అతని గోళ్ళు. లాలిస్తూ, ముద్దగా, గోముగా, అవిడ చిక్కును విడదీస్తున్నాడు. చీకట్లు విడిపోవడం చిక్కు విడిపోవడం. పడమర చంద్రాగమనం, అతని కిరణప్రసారం చేతులతో నాయకుడు నాయికను కౌగిలించుకోవడంలా వర్ణించబడింది.
ఈ వర్ణనను బట్టి ఈ నాయిక ్రోషితభర్తృక. “దూరదేశంగతే కాంతే, భవేశ్రోషిత భర్త్శృకా” - “కాంతుడు దూరదేశానికి వెడితే ఆవిడ ప్రోషితభర్శ్యక అవుతుంది”. రావణ గృహంలోని సీతను వర్ణిస్తూ .... “ఏకవేణీధరా దీనా, త్వయి చింతాపరాయణా (రామాయణం” సుందరకాండ 65 సర్గ, 13 శ్లోకం)” ఒకటే జడను ధరించిన దీనురాలు, నీయందే ఆలోచన కలిగివున్నది” - ప్రియులు ప్రవాసం నుండి వచ్చి ప్రోషితభర్శృకల జుట్టుని ముడవడం ప్రసిద్ధమైనది. ప్రోషితభర్శృక భర్త ప్రవాసానికి వెళ్ళినప్పు డిలా వుండాలని శేషము వేంకటపతి రాశాడు - “అలకలు దువ్వరాదు, సరసాన్నములన్ భుజయింప రాదు మై కలపము లందరాదు తిలకంబు రకంబుగ దిద్దరాదు సొమ్ములు గయిసేయరాదు సుమముల్ ధరియింపగరాదు సాధ్వియౌ। నళినదళాయతాక్షికిని నాధుడు చెంగటలేక యుండినన్” +తారాశశాంకము” - 2 ఆశ్వాసము - 126 పద్యము). అతిసుకుమారమైన శృంగారాన్ని అతిలలితంగా వర్ణించింది గంగాదేవి. క£రం2/ గ11౧ నింం అనే అమెరికన్ కవి.
541౪6 10౪66 ౪4110 2 10౪48
1021 ౪45 ౧౧0౧౦ 68౧ & 10౪6
! 2౧6 ౧౧౭66! ఓ66
(౬6092! గ|1౧ ౧౦౭, “ఉగ౧గ౧1091 ౬66”)
“మేమిద్దరమూ, నేనూ అనబెల్లీ, అపూర్వమైన ప్రేమతో ప్రేమించుకున్నాము.”
58 మధురావిజయమాధురి
ఈ వాక్యం భారతదేశంలోని అనేకభాషల్లో ప్రతిధ్వనించింది. ఇందులోని సున్నిత, సుకుమారభావం అలాంటిది మరి!
అలినీలమయస్తమోమయం
శ్రవిలాప్యోదయరాగవపహ్పినా &
కలయత్యయమో షథళ్వరవ
కలధౌతం శుచి కౌముదీమిషాత్ ॥ (మ.వి.?.45)
ఈ ఓషధుల రాజైన చంద్రుడు ఉదయరాగ మనే నిప్పులో తుమ్మెదలాగా నల్లనైన చీకటి అనే ఇనుమును కాచి కాచి కరగించి కరగించి వెన్నెల అనే పరిశుద్ధమైన వెండిని చేస్తున్నాడు.
ఓషధీశ్వరుడు చంద్రుడు. ఇనుము నల్లగా ఉంటుంది. చీకటి కూడా నల్లగా ఉంటుంది. కాబట్టీ చీకటి ఇనుములాగా చెప్పబడింది. చంద్రుడు ఆకాశంలో ఉదయించేటవ్వుడు ముందు అరుణకాంతి ఏర్పడుతుంది. అదే ఉదయరాగం. ఉదయరాగమనే అగ్నితో చీకటి అనే ఇనుమును సిద్ధరసంలో కాచి, కరగించి, వెన్నెల అనే వెండిగా తయారు చేస్తున్నాడు.
పరుసవేది సిద్ధరసం. అది సప్తధాతువులనీ బంగారంగా మారుస్తుంది. ఇతను ఓషధీశ్వరుడు అవడంవల్ల ఇనుమును వెండిగా చేస్తున్నాడు. “అనేన రసేన సంపర్కే సతి సప్తధాతవః సువర్ధాని భవంతి” (ఈ రసంతో సప్తధాతువులూ బంగారం అవుతాయి.) శుచి అంటే వెన్నెలతో పోలిక. “కలధౌతము” అంటే బంగారమూ, వెండీ, రెండూను. గంగాదేవికి తెలియని శాస్త్రం లేదు. ఆవిడకి పరుసవేదుల గురించి తెలుసు. ఓషధీశ్వరుడి గురించి తెలును. అవిడ చరించే విజ్ఞాన నర్వన్వం అనిపిస్తుంది. "4/414109
ఆ౧౦/౦|౦౧6౮12”.
అలివిభ్రమమంతరేతి య
న్న విధోస్తనృగలక్ష్మ కింత్వయమ్ |
పురజిద్రధచక్రతార్డితో
ఐహల:ః కజ్ఞలలేపకాలిమా ॥ (మ.వి.?.50)
ఈ చంద్రుని మధ్య తుమ్మెద తిరుగుతున్నట్టు నల్లని కాంతితో కనిపించేది జింక గుర్తు కాదు. త్రిపురారియైన శివుని రధానికి చక్రంగా వున్నప్పుడు ఇరుసుకందెన పూసుకొనడంవలన ఏర్పడిన నలుపురంగే అది.
పూర్వం త్రిపురాసురులను చంపేటప్పుడు శివుడు చంద్రసూర్యులను రథచక్రాలుగా చేసుకున్నాడు. అలాగ వాళ్ళని చంపాడు. చక్రం వేగంగా తిరగటానికి బండిఇరుసుకు కందెన రాస్తారు. కందెన నల్లగా ఉంటుంది. అదే చక్రానికి అంటింది. అదే నల్లని
మధురావిజయమాధురి 59 మచ్చగా చంద్రుడిలో కనిపిస్తోంది. “ఇరుసున కందెన బెట్టక పరమేశుని బండియైన బారదు సుమతీ” (“సుమతిశతకము” - 30వ పద్యము) త్రిపురసంహారాన్ని వర్ణిస్తూ శ్రీనాథుడు “భీమఖండం”లో ఇలా రాశాడు - జలరాశిమేఖలావలయంబు రధథమయ్యె రవియు జందురుడుచక్రంబులైరి శారదాజీవితేశ్వరుడు సారథియయ్యె (తుతులునాలుగును వారువములయ్యె (బ్రణవమంత్రైకాక్షరము ప్రతోదంయ్యె దారకావీథి పతాకమయ్యె, రత్నసానుధరాధరము ధనుర్లత యయ్యె నాగప్రధానుండు. నారి యయ్యె గంధవాహంబు లేడును గలులు గాగ విలయకాలానలజ్వాల ములికి గాగ . లచ్చిచనుదోయి కుంకుమంబచ్చనయుగ బాలమున్నీటియల్లుండు బాణ మయ్యె” ఒక రాత్రివేళ ఒక స్త్రీ దివ్యకాంతితో ప్రకాశిస్తూ నగలు తీసేసి వణుకుతున్న శరీరంతో, చిందరవందరగా ముఖంపై జీరాడే వెంట్రుకలతో మానిన చీరతో, నిట్టూరుస్తూ, ఏడుస్తూ, కంపరాజు భవనానికి వస్తుంది. అప్పుడు కంపరాజు “ఓ తల్లీ! ఇంత రాత్రివేళ నువ్వు నా భవనాని కెందుకు వచ్చావు? నీ కీ బాధ లెలా కలిగాయి? నాకు వివరాలు చెప్పు. నేను చేయవలసిన సహాయం చేస్తాను” అన్నాడు కరుణగా. అప్పు డావిడ ఆనందించి - “ఓ రాజా! నేను మధురాపురి అధిష్టానదేవతను. నీవు లోకాన్ని ఉద్ధరించడానికై జన్మించావు. (ద్రవిడదేశం తురుష్కుల పాలవడం చేత నేను పడరాని పాట్లు పడుతున్నాను”. అంటూ ఇలా చెప్పింది. ఈ దృశ్యం “రఘువంశం”లో “అయోధ్యాపురిదేవత” కుశుడి దగ్గర తన దీనస్టితిని చెప్పుకుంటూ తనని ఉద్ధరించమని వేడుకోవడం గుర్తుకు తెస్తుంది. అధిరంగమవాప్తయోగనిద్రం హరిముద్వేశణయతీతి జాతభీతిః | పతితంముహురిష్టకానికాయం ఫణచక్రేణ నివారయత్యహీ(్ధః ॥ (మ.వి.8.2) శ్రీరంగస్వామి శేషతల్పంలో పడుకొని శ్రీరంగంలో యోగనిద్రని మొదలు పెట్టాక, అ దేవదేవుడిపై జారిపడే ఇటుకల గుంపు అ స్వామికి బాధకల్పిస్తుందనే భయంతో
వీ! మధురావిజయమాధురి ఆదిశేషుడు తన వేయిపడగలను అడ్డుపెట్టి నిద్రాభంగం కాకుండా ఇప్పు డతన్ని కాపాడుతున్నాడు. మధురాపురాధిదేవత తురుష్కులవలన దేవాయాలకీ, దేవతలకీ వాటిల్లిన దుస్ఫితిని వర్డిస్తూ శ్రీరంగం గురించి చెప్తోంది. దేవాలయమంతా దిక్కులేకుండా కూలడానికి సిద్ధంగా ఉంది. అందశో నుంచి ఇటుకలు రాలుతూ శ్రీరంగనాథుడిపై పడుతున్నాయి. యె-గనిద్రలో శ్రీరంగనాథుడికి బాధ కలుగుతుందని అతనికి ఏకాంతభక్తుడైన ఆదిశేషుడు ఆ ఇటుకలకు తన తలలు అద్దుపెట్టి ఆయనను కాపాడుతున్నాడు. భూలోకవైకుంఠమైన శ్రీరంగం మహమ్మదీయుల పాలైంది. జనం లేని అడవి అయ్యింది. నేడో రేపో అది కూలటానికి సిద్ధంగా ఉంది. దాన్నెవరూ చూడటం లేదు అనేది తాత్పర్యం. ఈ మధురాధి పురదేవత దీనాలాపం కంపరాజు హృదయాన్ని కరిగించింది. శ్రీరంగం సాక్షాత్ వైకుంఠం. కావేరీతీరంలో ఉంది. సప్తావరణాలు ఉన్నాయి. శ్రీరంగస్వామి స్వరూపం ఇలా వర్ణించబడింది ....” కాంచితె మనోజకించిదాకుంచి తాంఘీయుగ మిలారమలొత్తగానొత్తిగిల్లి కటి నొక కరంబు సాచియొక్కటి తలాడ నమర బవళించి యున్నరంగప్ప నిపుడు” (చంద్రభానుచరిత్ర - 2 ఆశ్వాసం - 116 పద్యం). _ తతతంత్వనుఘూర్ణదూర్ణ్జనాభం వనవేదండవిమర్దినీమవస్థామ్ విరతాన్యపరిచ్చదప్రపంచో భజతే హంత గజ(ప్రమాధథినాథః ॥॥ (మ.వి.8.3) గజాసురసంహారకు డైన మహాదేవుడు ఈరోజు తన పరివారాన్ని వదలి ఒంటరి వాడై సాలెపురుగులు తనపై పాకుతూ గూళ్ళు అల్లుతూ వుంటే అడవి ఏనుగులు దంతాలతో కుమ్ముతూ తనకి ఒత్తిడి కలిగిస్తే కాలం తెచ్చే దురవస్థని అనుభవిస్తున్నాడు. జంబుకేశ్వరం శివక్షేత్రం. అది శ్రీరంగానికి దగ్గరగా ఉంది. ఆ మహాదేవుని దున్ఫితి ఇలా వుంది. మహమ్మదీయుల బాధలవల్ల గుడులు వదలి అర్చకులు దేశాంతరాలు వెళ్ళారు. జనం లేకపోవడంతో అడవి ఏనుగులు విచ్చలవిడిగా తిరుగు తూన్నయి. శివలింగాన్ని తమ దంతాలతో కుమ్ముతున్నాయి. సాలెపురుగులు పైన పాకుతూ గూళ్ళు పెడుతున్నాయి. “గజప్రమాథినాథ” అంటే గజసంహారకుడు శివుడనే కాకుండా గజనాశకుడు కూడా అతనే అని స్ఫురింపజేస్తోంది. అందుకనే ఏనుగులు శివుడిపై పగ సాధిస్తున్నాయి అని తాత్పర్యం. మహేశ్వరుడు ఊరుకోవడం విశేష మని వెబుతోంది. ఈ జంబుకేశ్వరంలోని శివలింగం ఎప్పుడూ కావేరీజలంలో మునిగి వుంటుంది.
మధురావిజయమాధురి 61
ఘుణజగ్ధకవాటసంపుటాని
స్ఫుట దూర్వాంకుర సంధిమండపాని ।
శ్లధగర్భగ్భహాణి వీక్ష్య దూయే
భృశమన్యాన్యపి దేవతాకులాని ॥ (మ.వి.8.4)
ఇతరదేవాలయాలు కూడా గర్భాలయాలు విరిగి పడుతుండగా పెచ్చుపెరిగిన లేతపచ్చికతో మండపాలు నిండిపోగా వడ్రంగి పిట్టలు కొట్టడంవల్ల తలుపులు బిగువు సడలిపోగా, ఈరోజు వర్ణించలేని దుస్థితిని అనుభవిస్తున్నాయి. వాటి దుస్థితి చూసి చాలా దుఃఖంతో మునిగి తేలుతున్నాను.
అప్పటి మహమ్మదీయరాజుల దౌర్దన్యంవలన దేవాలయాలు పాడుపడిపోయాయి. ఈ వర్ణనను బట్టి మహమ్మదీయపాలన చాలాకాలం ద్రవిడదేశంలో ఎదురులేకుండా సాగిం దనుకోవాలి.
ముఖరాణి పురా మృదంగఘోషై
రభితో దేవకులాని యాన్యభూవన్ ।
తుములాని భవంతి ఫేరవాణాం
నినదైస్తాని భయంకరైరిదానీమ్ ॥ (మ.వి.8.5)
పూర్వం మద్దెలల మధురగంభీరధ్వనులతో మారుమోగిన దేవాలయాలు ఇప్పుడు భయంకరమైన నక్కఊళలతో ఆగకుండా ఎప్పుడూ ్రతిధ్వనిస్తున్నాయి.
పూర్వం దేవాలయాలలో వారకాంతల నృత్యాలు, భక్తుల సంగీతాలూ జరుగుతూ ఉండేవి. ఇప్పు డవి జరగకపోవడమే కాకుండా నక్కల కూతలతో భయంకరంగా ఉన్నవి. దీన్ని బట్టీ మహమ్మదీయులు గుళ్ళని హింసకి ఆలవాలంగా చేసారని మాంసాలతో నింపారనీ తెలుస్తోంది. కాబట్టీ మంసాహారులైన నక్కలు స్వేచ్చగా తిరుగుతున్నాయి.
సతతాధ్వరధూమసౌరభఖై; ప్రా
గ్నిగమోద్దోషణవద్భిరగ్రహారైః |
అధునా£_జని విస్రమాంసగంధై
రధికక్షీబతులుష్క్మసింహనాదైః (మ.వి.8.?7)
పూర్వం ఎడతెగని యాగధూమాలతో సువాసనలు వెదజల్లుతూ, వేదఘోషలు అకాశా న్నంటిన అగ్రహారా లిప్పుడు రక్తమాంసాల దుగ్గంధాలతో, మద్యపానంతో మదించి ఒళ్ళెరగని మహమ్మదీయుల పెడబొబ్బలతో నిండివున్నాయి.
బ్రాహ్మణ అ(గ్రహారాల దుస్థితి వర్ణించబడింది. అగ్రహారాలు ఆక్రమించి వాటిలో తా ముంటూ మద్యమాంసాలతో వాటిని అపవిత్రం చేసి తమ దుశ్చర్యలకు ఆటపట్టుగా
ఇ మధురావిజయమాధురి చేశారు మహమ్మదీయులు. పోషణకోసం రాజులు బ్రాహ్మణుల కిచ్చే గ్రామాలని అ(గ్రహారా లంటారు. యజ్ఞాలు చేసుకుంటూ రాజు లిచ్చిన [గ్రామంలో (బ్రాహ్మణు లుండటాన్ని కాళిదాసు ఈ విధంగా వర్ణించాడు. “గ్రామేష్వాత్మవిసృష్టేషు । యూపచిహ్నేషు యజ్వనామ్!। అమోఘాః (ప్రతిగృహ్ధంతా। వర్వ్యానుపదమాశిషవ” (“రఘువంశం” 1వ సర్గ. 44వ శ్లోకం). (తా మిచ్చిన బ్రాహ్మణాగ్రహారాలను యూపస్తంభాల గుర్తులతో తెలిసికొని, యజ్ఞం చేసిన సోమయాజుల ఆశీర్వాదాలని, సత్కారాన్ని తీసుకొని ఆలస్యం చెయ్యకుండా వెళ్ళారు). బ్రాహ్మణులకు నివాస స్థానం కల్పించటం సప్తసంతొనాలలో ఒకటి. “బ్రహ్మ ప్రతిష్టా సంతానం । తటాకో వనమేవ చ । కృతి ర్దేవాలయశ్సైవ | నిక్షేప స్పప్తసంతతిః”.
రమణీయతరో బభూన యస్మిన్
రమణీనాం మణీనూపురప్రణాదః |
ద్విజశ్ళంఖలికాఖల(త్కియాభిః
కురుతే రాజపథస్స్వకర్ణశూలమ్ 1 (మ.వి.8.9)
అప్పుడు స్రీల రతనాల గజ్జెల గల గల ధ్వనితో చెవులపండగ చేస్తూ మనోహరమైన మధురాపురి రాచబాట ఇప్పుడు బ్రాహ్మణుల సంకెళ్ళ ఖలఖలమనే ధ్వనులతో చెవులు పగులుతున్నాయి.
పూర్వం స్రీలు ప్రియులని అభిసరిస్తూ మధురాపురి రాజమార్గంలో వెళ్ళేవారు. వాళ్ళు వెడుతూవుంటే వాళ్ళు అలంకరించుకొన్న రతనాల మువ్వలు ఘల్లుఘల్లుమని శ్రావ్యంగా మోగేవి. ఇప్పుడు మహమ్మదీయులు రాచబాట ద్వారా వైదికకర్మనిష్టులైన (బ్రాహ్మణులని పట్టుకొని తీసుకొస్తున్నారు. వాళ్ళ కాళ్ళకి కట్టిన ఇనుపగొలుసులు ఖంగు ఖంగుమని మోగుతున్నాయి. “అప్పు డనుభవించిన ఆనందానికీ, ఇప్పుడనుభవిస్తున్న దుఃఖానికీ పోలిక లేదు” అని బాధపడుతోంది మధురాపురాధిదేవత.
ఇక్కడ వేశ్యాభిసారికలు వర్ణించదిడ్డారు. వాళ్ళు రతనాల మువ్వలు పెట్టుకుంటారు. అయోధ్యాపురదేవత తన' బాధని కుశుడితో ఇలాగే చెప్పుకుంటుంది. “నిశాసు భాస్వత్కల నూపురాణాం ! యస్సంచరో£. భూదభిసారికాణామ్ | నదన్ముఖోల్మావిచితామిషాఖి । స్స వాహ్యతే రాజపథశ్శివాభిః” (రఘు. 16-12) (రాత్రులందు అఖభిసారికలు రత్ననూపుర ధ్వనులతో ఏ రాజమార్గంలో వెళ్ళారో ఇప్పుడు నోళ్ళలో శృశానపు కొరువులు పెట్టుకొని కూతలు పెడుతూ మాంసం కోసం వెదుకుతున్న ఆదనక్కలు ఆ రాజమార్గంలో వెళు తున్నాయి). రావణుడు మునులను హింసించినట్లు ఇక్కడ మహమ్మదీయులు వెదకి వెదకి శ్రోత్రియకుటుంబాలను హింసించి వైదికకర్మలయిన యజ్ఞయాగాలను రూపు మాపారు. మధురతో పాటు దక్షిణదేశాన్ని ఉద్ధరించడానికి మహమ్మదీయరాజవగ జరిపాడు కంపరాజు.
మధురావిజయమాధురి గ! పరితస్తతతంతువాయతంతు
వ్యతిషంగాజ్ఞనితాని జాలకాని ॥
పురోగపురసాలభంజికానాం
దధతే చీనపటావగుంఠనత్వమ్ 11 (మ.వి.8.10)
అన్నిచోట్లా సాలీళ్ళు తాము తమ దారాలతో అల్లిబిల్లిగా అల్లిన తెరలు మధు రాపురపు వెలుపలిద్వారాల వద్ద వున్న సాలభంజికలకు చీనాంబరాలతో మేలిమును గులుగా అలరారుతున్నాయి.
సాలభంజిక అంటే దంతంతో కానీ, గుడ్డతో కానీ, రత్నాలతో కానీ, చెక్కతో గానీ తయారు చేసిన బొమ్మ. సాలీళ్ళు సన్నని దారాలతో అల్లిన అల్లికలు సన్నని వస్తాలుగా కన్పిస్తున్నాయి. రాచకన్యలు పరపురుషులను చూడకూడ దనుకొని మేలిముసుగు వేసుకుంటారు. అలాగే ఇవి కూడా వున్నాయని వర్ణించబడింది. పురద్వారాల దగ్గరి బొమ్మలకి సాలీళ్ళ గూళ్ళు పట్టాయి. దాన్ని దులిపి బాగుచేసేవాళ్ళే కరువైపోయారు. ఇంక ఆ బొమ్మల అందాలు మెచ్చుకొనే వారు లేరని వేరే చెప్పాలా! గంగాదేవిలా స్పందించే భావుకత అందరకీ వుండొద్దూ!
శ్రులిరస్తమితా నయః ప్రలీనో
విరతా ధర్భకధా చ్యుతం చరిత్రమ్ |
సుకృతం గతమాభిజాత్యమస్తం
కిమివాన్యత్కలిరేక ఏవ ధన్యః ॥ (మ.వి.8.16)
వేదాలు మరుగున పడిపోయాయి. నీతి నశించింది. ధర్మం మాట మచ్చుకైనా వినపడటంలేదు. శీలం పతనమైంది. పుణ్యం వెళ్ళిపోయింది. కులీనత నామరూపాలు లేకుండా పోయింది. ఇక చెప్పవలసిన దేముంది? కలి కృతకృత్యుడై ఈ దేశంలో తన ప్రభావాన్ని ఎదురులేకుండా చూపిస్తున్నాడు.
“చ్యుతం చరిత్రమ్” అనడంవలన (స్ర్తీల పాతివ్రత్యం చెరచడం, పురుషులను లోభపెట్టి దేశద్రోహులుగా చేయడం, తమ బానిసలుగా చేసుకోవడం, మొదలయినవి తెలుస్తున్నాయి. “ఆభిజాత్యమస్తం” అనడంవలన హిందువులను దిలవంతంగా మహమ్మ దీయలుగా మతంమార్చిడీ చేయడం, గోమాంసభక్షణలతో వేధించడం అర్ధం అవుతోంది. “విరతా ధర్మకథా” అనడంచేత యజ్ఞయాగాదులు ధ్వంసంచేసి వైదికనిష్టులని కర్మ భ్రష్టులుగొ చేయడం తెలుస్తోంది. 'కథా' అనే మాటవల్ల ధర్మం అనేమాట పలకడం కూడా తప్పయినట్లు తోస్తూ వుంది. “నయః (ప్రలీన” అనడంచేత అంతటా కుటిలత్వమే కాని మంచి ప్రవర్తనే కనపడటం లేదని తెలుస్తోంది. 'సుకృతం గతమ్' అనడంవలన ప్రజలు పాపాలే చేస్తున్నారని అర్ధమవుతోంది. “శ్రుతిరస్తమితా” అనడంవలన వేద
64 మధురావిజయమాధురి విదులయిన పండితులని వెదికి వెదికి బాధించటం, నిశ్ళేషంగా వాళ్ళని చంపటం కనబడుతోంది. దీన్ని పోలిన శ్లోకం 'రఘువంశం'లో అజవిలాపంలో ఉంది. “ధృతి రస్తమితా రతిశ్చ్యుతా 1 విరతం గేయమృతుర్నిరుత్సవః ।; గతమాభరణ(ప్రయోజనం పరిశూన్యం శయనీయమద్య మే” (రఘువంశం” 8వ సర్గ. 66వ శ్లోకం) “ధైర్యం సడలింది. ఇచ్చ, గానం, బుతువిలాసం, ఆభరణప్రయోజనం అన్నీ పోయాయి. నాశయ్య శూన్య మైంది”.
తర్వాత మధురాపురాధిదేవత ఒక కత్తిని కంపరాజు కిచ్చింది.
అధ తం కలధౌతకోశతస్సా
కరలగ్నత్సరురుచ్చఖాన ఖడ్గమ్ |
అచిరోజ్షితకంచుకానుబంధ
స్ఫుటకాలోరగభోగసామ్యభాజమ్ | (మ.వి.8.18)
తర్వాత ఆవిడ పడిని చేతిలో పట్టుకొని వెండిఒరనుండి కత్తిని తీయగా అది వెంటనే కుబుసాన్ని విడిచిన నల్లత్రాచులాగా కనబడింది.
, వెండిఒర తెల్లగా పొడుగ్గా ఉంటుంది. పాము కుబుసం కూదా తెల్లగా పొడుగ్గా ఉంటుంది. కాబట్టి పోలిక. అలాగే నల్లత్రాచు నలుపు. రెండూ పొడవైనవి కాబట్టి పోలిక. కాబట్టే వెండిఒరనుండీ తీసిన కత్తి కుబుసం విడిచిన పాములాగా దీప్తివంత మైందని చెప్పడం. కత్తితో పాముపోలిక ప్రసిద్ధం. “అచిరోజ్షిక” అనడంచేత అప్పుడే కుబుసం విడిచిన పామని చెబుతోంది గంగాదేవి. చాలా తేజంగా ఉంటుంది కదా! అలాగే కత్తికూడా తేజంగా ఉందని చెప్తోంది. కత్తి తేజంగా, కాంతిమంతంగా ఉందని చెబుతూ 504%69064/6 ఇలా అంటాడు.
“860 ౪౧ ౪70౪! 0౧౦౧1 540763, 107 6 66౪ ౪ ౧౫9 6౧”
(“011610 - శీల |! 506౧6 2-58)
“మో మెరిసే కత్తులను వెనక్కి తియ్యండి. అవి మంచుకి తుప్పుపడ్తాయి”. (మంచు నీటి బిందువులకే మాసిపోయేంత (ప్రకాశవంతంగా తేజోవంతంగా ఉన్నాయి ఆ కత్తులు. 5044630646 మన కాళిదాసులాగా మకుటాయమానమైన కవిత్వం రాశాడు),
క్షయకాలకరాలభ(ద్రకాలీ
గలకాలొగరుకరమాయమానై: ।
మహసాం ప్రసరైరదీపహార్యం
కిమపి ధ్వాంతమివ ప్రకాశయంతమ్ ॥ (మ.వి.8. 19)
ప్రళయకాలంలో భయంకరాకారంతో తాండవించే భద్రకాళి కంఠాన్ని అలరిన
మధురావిజయమాధురి జ్ నల్లని కృష్ణ అగరుద్రవంతో పోలికగా స్వంతప్రకాశంతో దీపకాంతులు పోగొట్టలేని ఒక అపూర్వమైన కారుచీకటిలాటి ఖడ్గం ప్రకాశించింది.
అ కత్తి నల్లని కాంతులు నాలుగువైపులా ప్రసరిస్తున్నాయి. అ నల్లని కాంతులు చీకట్లను పోలివున్నాయి. కాబట్టి అవికూడా చీకట్లే. కానీ ఆ చీకట్లకీ భేదం ఉంది. అది దీపకాంతులతో పోతాయి. ఇవి పోవు. అందుకే ఇవి కొత్తచీకట్లు.
భద్రకాళి దుర్గమూర్తి అవతారం. ఈవిడ నలుపు. ప్రళయకాలంలో ఈవిడ భయంక రాకారంతో సంహారానికి బయలుదేరుతుంది. కాలఅగరు నలుపు. అలాంటి నల్లటి కాళి కంఠంలో నల్లని అగరుమరింత నలుపు. అంతటి నలుపుతో కత్తి. పైగా దీప్తి మంతంగా మెరుస్తోంది కూడా!
ప్రణయాగతచోలపాంద్యలక్ష్మీ
శవణేందీవరమాభికాయమానామ్ ।
విరచయ్య పురః కృపాణమేషా
పునరప్యాహ పురందరాభమేనమ్ (| (మ.వి.8.22)
కంపరాజు గుణాల కిష్టపడి (ప్రేమతో అతన్ని వరించడానికి వచ్చిన చోళ పాండ్య రాజలక్ష్ములు చెవిపోగులుగా ధరించిన కలువపూలమాలిక ఇది అన్నట్లు ఈ కత్తిని అ పురాధిదేవత ఇంద్రసముడైన అతని ముందుంచి అతనితో ఇలా అంది.
అడవాళ్ళు చెవులకు అలంకారాలుగా కలువపూలను ధరిస్తారు. పాంద్య, చోళ, రాజ్యలక్ష్ములు కంపరాజును ప్రేమించి అతనిని అభిసరిస్తూ కర్ణాలంకారంగా నల్లని కలువ మాలను ధరించినట్లుగా ఆ కత్తి కనిపిస్తోంది.
అభిసారికలలో “తమిస్రాభిసారిక”గా ఇక్కడ రాజ్యలక్ష్మి చెప్పబడింది. చీకట్లో తమని గుర్తించకుండా నల్లని అలంకారాలు చేసుకొనే వారు తమిస్రాభిసారికలు. అలాగే ఈవిడకూడా నల్లకలువ మాల ధరించింది. గంగాదేవి చమత్కారంగా చోళరాజ్యం, పాంద్యరాజ్యం కూడా మహమ్మదీయపాలనలో ఉన్నాయని చెప్తోంది. “పురందరాభమ్” అనడంచేత కంపరాజు ఈ కత్తిని ధరించడానికి అర్హడని తెలుస్తోంది.
ఈ కలువబాల సొబగు చూడండి :
“వెలియరో నే కలువను నల్లకలువను
న న్నలల ఊచును తల్లికొలను
కలికిచెవి జూకానులే
వెన్నెలదొర బాకానులే” (దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి)
ఈ మధురావిజయమాధురి గంగాదేవి యుద్ధవర్ణన =
సంగ్రామదేవతాపొంగవి(భ్రమభ్రాంతిదాయినః 1
మిధో ధనుర్ధరైర్ముక్తాః పేతుశ్శాతముఖాళ్ళరాః (మ.వి. 4.56)
ఒకరితో నొకరు ఆ విలుకాళ్ళు ఒకరిమిద ఒకరు వేసుకునే బాగా పదునున్న మొనలున్న బాణాలు యుద్ధదేవత విలాసంగా చూసే కడకంటి చూపులనే భ్రాంతిని కలిగిస్తూ వాళ్ళపై పడ్డాయి.
ఈ యుద్ధవర్ణనలో సహజత్వం, ౪6గ91గ|||666 (వాస్తవం అనిపించడం) బాగా కనబడుతుంది. గంగాదేవి కంపరాయజణ్లీ, సత్యభామ కృష్ణుణ్ణి యుద్ధభూమికి అనుసరించి నట్లు యుద్ధభూమికి అనుసరించి యుద్దాన్ని ప్రత్యక్షంగా చూసింది. అందుకే ఆవిడ యుద్ధవర్దనలు జీవం పోసుకుని మనముందు కొస్తాయి.
ప్రీల క్రీగంటి చూపులకూ బాణాలకూ పదునులో పోలిక వుంది. యుద్దాధిదేవత తన నెవరు బాగా సేవిస్తున్నారా, ఎవరికి విజయం చేకూర్చనా అని చూస్తోంది. ఆ వాలుచూపులే తూపు లవుతున్నాయి. ఆడవాళ్ళ వాలుచూపులని తూపులనటం నాటి ప్రాచీన కవులనుంచీ నేటి చలనచిత్రకవులవరకూ నడుస్తున్న సంప్రదాయం. విభ్రమ- విశేష భ్రమము-ఎక్కువగా అటూ ఇటూ చూపులు తిరుగుతూన్నా యంటోంది కవయిత్రి. వీరులు ఇరువాగులాసములు. ఒకరితో ఒకరు తీసిపోకుండా పోరాడుతున్నారు. *..... పశ్య నీలోత్చ లద్వంద్వాన్నిస్సరంతి శితాశ్ళరాః” (“చూడు. నల్లకలువద్వయంనుంచి వాడియ్రైన బాణాలు వస్తున్నాయి” - “కువలయానందము”)
క్షతజార్హాః ప్రవీరాణాం ప్రేంఖంత్యః ఖడ్గలేఖికాః ॥
జీఘత్సతః కృతాంతస్య జిహ్వా ఇవ విరేజిరే ॥ (మ.వి.4.57)
యుద్ధభూమిలో ఆ వీరుల రక్తంతో తడిసిన కత్తులదొంతర తళతళలాదుతూ యముడు లోకాన్ని తినేయాలని చాచిన నాలుకలలాగా ్రకాశించాయి.
ఈ యుద్ధవర్ణన లన్నీ భయానకాలూ, భయంకరాలు, భీభత్సాలుగానూ ఉంటాయి. యముడి ఆకారమే భయంకరమైతే నాలుక చాచి దాన్ని ఆడిస్తున్న యముడి ఆకారం భయానకం. దీన్నిబట్టి వీరులంతా అతిభయంకరాకారంతో యుద్ధరంగంలో విజ్బంభిం చడం, ఆగకుండా కత్తులు రుళిపించడం అర్ధమవుతోంది. గంగాదేవి మనం ముందే అనుకున్నట్టుగా యుద్దాన్ని చూసింది కాబట్టి ఆవిడవర్ణనలు చలనచిత్రంలా కళ్ళముందు కదులుతాయి.
వేదండశుండహర్య్యాగ్రమాస్థితాస్సచమ(త్రియమ్ ॥
ఆద్రియంత కబఐంధానాం రక్తం నక్తంచరస్రియః (మ.వి.4.60)
మధురావిజయమాధురి 67 రాక్షసవనితలు ఏనుగుతొండాలనే భవనాలని ఎక్కి తలలు తెగిన మొండాలనుంచి కారే రక్తాన్ని విలాసంగా తాగుతున్నారు.
ఏనుగుతొండాలు నరకబడి రాసులు రాసులుగా ఆకాశమంత ఎత్తువుండే భవనాలని తలపింపజేస్తున్నాయి. తెగిన మొండాలు ఆకాశమంత ఎగిరిపడుతున్నాయి. ఆ తొందా లలో విహరిస్తున్న రాక్షసస్రీలు అంతయెత్తుకు ఆ తొండాలు వచ్చేవరకు ఆగి ఆగి ఆ రక్తాన్ని తాగుతున్నారు. అవి అప్పటికప్పుడు తెగిన వవటంవలన ఆ రక్తం వేడిగా ఉంది కూడా!
ఇక్కడ భీభత్స, భయానకద్భశ్యం వర్ణించబడింది. ఈవిడ దీన్ని 6౧6౧౫౭|0౦/20౧10 1600౧01466 లో చూపిస్తోంది. 01%6గ4(0720010 1600౧10౮66 అంటే 61056-౪9 (దగ్గరగా చూపడం) [0గ౮౩౧౦1 (దూరంగా చూపడం) 1149[040% (గతాన్ని చూపడం) వీటిని ఈ పద్ధతి అంటారు. చలనచిత్రంలో ఉపయోగించే ఈ పద్ధతి 20వ శతాద్దిపు ఆధునిక ఆంగ్ల కవితా రీతులలో ప్రాముఖ్యం సంతరించుకొంది. ప్రసిద్ధి చెందింది కూడా. 7.5. ౬౯101 అనే 20వ శతాబ్దపు ఆంగ్లకవి “4/2518 ఓ2౧6" లో ఈ 1800౧100 ఉపయోగించారు. గంగాదేవి 14వ శతాబ్దిలో ఈ పద్ధతి చూసింది. 01096-౪౧ లో మొందాలు తెగడం, అవి ఎగిరిపడుతూంటే 200గ-16౧9 ని పైకి పోనిస్తూ రాక్షసప్రీలు కూర్చుని ఆ రక్తాన్ని త్రాగడం - ప్రతి చిన్న వివరణా, ఇస్తూ చలనచిత్ర రీలుని మన కళ్ళముందు నడిపినట్లు వర్ణన నడిపింది. రాక్షసస్త్రీలు అంటే అనాగరిక ఆటవిక స్రీలు అయ్యుంటారు. నే నీమధ్య దూరదర్శన్‌లో ఒక 140౧0౦1016 జాతికి చెందిన అనాగరిక మానవుడు పరిగెడుతున్న ఎలుగుబంటిని కత్తితో పొడిచి, నిలువునా కోసి, పడుకో బెట్టి, రక్తంతో మాంసాన్ని అలాగే తినడం చూశాను.
పోతరాజు గారి ఈ 0॥16౧4[00/20010 1600౧10606 పద్యం చూడండి.
“ఇంతింతై వటుడింతయై, మరియు తా నింత, నభోవీధిపై
నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రుని కంతయై, ధ్రువునిపై నంతై, మహర్వాటిపై
నంత్రె, సత్యపదోన్నతుం దడగుచుబ్రహ్మాండాంతసంవర్ధియై” (భాగవతం)
ఏ 200౧ [6౧5 కూడా పట్టలేని వర్ణన ఇది. నెమ్మదినెమ్మదిగా మనకళ్ళముందే పెరిగిపోతూ విశ్వాన్నాక్రమించేశాడు పోతన్నగారి వటువు. ప్రతిపదంమాద లైటుని (00౪5 చేసి 01056-౪0 లో చెప్పిన ఆణిముత్యంలాంటి పద్యం. పేర్లు ఆంగ్లేయులు పెట్టారు గానీ మనకీ బెక్నిక్కులు కరవటండీ!
తిక్కనగారి పద్యం చూడండి. 13వ శతాబ్దికే ఆయనకీ టెక్నిక్ తెలుసు. నాటకీయత సలక్షణంగా భాసించే పద్యం. కృష్ణుడు రాయబారానికి వెడుతూంటే తన ముడిని గ్రక్కున
అ మధురావిజయమాధురి జారవిడిచి రోషంగా ఇలా అంటుంది (ద్రౌపది “ఇవి దుస్ససేనువళ్ళం దవిలి సగము (దైవ్విపోయి, దక్కినయవి, కౌరవులకడ దీరు మాటల యవసరమున దలపవలయు నచ్యుతవీనిన్” (ఉద్యోగపర్వము. తృతీయాశ్వాసము 115-116) అంటూ కృష్ణుడికీ, మనకూ చూపిస్తోంది ఆవిడ. తిక్కనగారు 0098-00లో ఆవిడ జుట్టుని చూపిస్తున్నారు ఆ పదాల కూర్చుచేత. అద్భుతమైన వర్ణన. కోపంతో బుసలుకొట్టే ద్రౌపది చేతితో జుట్టుతో సాక్షాత్క రిస్తోంది మనకి. తిక్కనగారిది అల్పాక్షర అనల్పార్ధరచన. ఆయన నాటకాలు రాయక పోవడం తెలుగువాళ్ళ దౌర్భాగ్యం. పూతానుకారిణ: కేచిత్ క్షితౌ నిపతితాస్తత: ॥ క్రోష్టుర్భయేన ధావంత: కర్దాటాన్ పర్యహాసయన్ ॥ (మ.వి.4.64) కొందరు తమ ప్రాణాలు రక్షించుకునేటందుకు శవాలతోబాటు తాము కూడ శవాలుగా నేలమోద పడుక్కొని వుంటే నిజంగా శవాలని (భ్రమించి నక్కలు తమను తినడానికి వచ్చినపుడు ఆశ్చర్యంతో లేచి భయంగా పరుగులు పెట్టారట. ప్రాణరక్షణకై చేసే వీరి వికారపు చేష్టలూ వీరి పిరికితనమూ శూరులైన ప్రతివీరులకు నవ్వు తెప్పిస్తుందని గంగాదేవి ఊహ. అలాగే మనకుకూడా నవ్వు తెప్పిద్దామని ఇక్కడ హాస్యపు గుళికను మింగించింది. నక్కలకు భయపడి పరిగెత్తేవారిని కంపరాజు సైనికులు తరమలేదు. అది కంపరాజు ధార్మికత్వాన్ని తెలియజేస్తుంది. ఛాయామేవాత్మనః కేచిద్దావన్లో ఖీతిభావితాః ॥ అరాతిశంకయా కష్టం దప్టాంగులి వవందిరే ॥ (మ.వి.4.66) కొందరేమో పరుగెడుతూ తమనీడలను చూసుకుంటూ శత్రువులనే భ్రమతో భయపడి బాధతో దిగులుతో వేళ్లు కొరుక్కుంటూ తమ నీడలకి తామే నమస్కరిస్తున్నారు. ద్రవిడవీరులకి తమనీడలను చూసి పరవీరులనే (భ్రాంతికలిగి వాళ్ళనుంచి తప్పించుకొనే ఉపాయం తోచక వ్రేళ్ళు కొరుక్కొని, తటాలున లేచి, నమస్కరించి, శరణు కోరారు. ఇక్కడో ముఖ్యవిషయం గమనించాలి. తెలుగులో 'తననీడకు తానే భయపడటం” అనే సామెత ఉంది. గంగాదేవి తెలుగింటి ముద్దులగుమ్మ ఆ సామెతను గుర్తు తెచ్చుకొనిపై శ్లోకం రాసి వుండాలి. భ్రశ్యత్రాలఫలాకారై: ప్రాకారాద్బాణపాతితైః రణశ్రీకందుకభ్రాంతిర్విదధే వీరమూర్ధభిః ॥ (మ.వి.4.71) ఆ యుద్ధంలో ్రాకారాలనుండి రాలుతున్న తాటిపళ్ళలాగా కిందపడుతున్న తలలు యుద్ధలక్ష్మి ఆడుకుంటూ విసిరివేసిన బంతులనే భావం చూపరులకి కల్గించింది. తాటిపళ్ళతో తలలకి పోలిక వుంది.
మధురావిజయమాధురి ౪
అగ్రే నిపేతుర్చుపతేర్తావాణో యంత్రవిచ్యుతాః 1
దుళ్లేణాతరదానార్థం దూతాః సం(ప్రేషితా ఇవ ॥ (మ.వి.4.72)
శత్రురాజులు యంత్రాలతో విసిరే పెద్ద పెద్ద రాళ్ళు దుర్గం తాను కంపరాజుకు కప్పం చెల్లించడానికి పంపిన దూతలలాగా ఆ రాజు ఎదుట పడ్దాయి.
“ఆతరము' అంటే నదులు దాటదానికీ ఓడకిచ్చే మూల్యం. శిలాయంత్రాలతో యుద్దాలు అప్పుడు సుప్రసిద్ధం కావడం ఈ వర్ణన తెలుపుతోంది. రామాయణంలో శీలా యంత్రాలు వర్ణించారు.
ధానుష్మముక్తబాణాగ్నిజ్వలితోర్పగృహావలిః
విజయారాత్రికం తస్య మూర్హేవాద్రిరథధారయత్ ॥1 (మ.వి. 4.73)
అప్పు దా పర్వతంమిద వున్న ఇళ్ళవరుసలు విలుకాళ్ళ బాణాగ్నులకి కాలి వెలుగుతూ వుంటే పర్వతము ఆ కంపరాజుకి విజయహారతిని తలపై ధరించిందా అన్నట్లు ప్రకాశిస్తోంది.
పర్వతాలపై ఇళ్ళు కట్టుకొని నివసిస్తున్నారు ద్రవిడరాజులు. ఆ ఇళ్ళను కర్నాటక రాజులు తమ బాణాలతో కాల్చేశారు. ఆ మంటతో పర్వతశిఖరం మండుతోంది. ఆ మంటలు నలువైపులా గుండ్రంగా తిరుగుతున్నాయి. అది కంపరాజు విజయానికి నీరాజన మిస్తోందా అన్నట్లు కనిపిస్తోంది.
అహంపూర్వికయా వీదేష్వభితో యుద్ధకాంక్షిషు ॥
ప్రత్యగ్రహీ న్మహీపాల శ్చంపం సింహ ఇవ ద్విషమ్ ॥॥ (మ.వి.4.78)
ఆఅ చంపరాజుతో యుద్ధం చేస్తానని నే నంటే నేనని అనేకమంది వీరులు వచ్చాక కంపరాజు ఏనుగుమోద లంఘించే సింహంలాగా అతనిమిద పడ్డాడు.
కక్ష్వావిభక్తవపుషోశ్చారీభిశ్చరతోస్తయో: ॥
పళ్యద్భిః స్సౌష్టవందేవైరనిమేషత్వమాదృతమ్ ॥॥ (మ.వి.4.80)
తాము ధరించిన దట్టీలే తమ దేహాల్లోని పూర్వఉత్తరభాగ భేదాలని విభజించి చూపేటట్లు గుండ్రంగా ఒక పాదంతో వాళ్ళిద్దరూ తిరుగుతూ ఉంటే, వారి శరీర సౌష్టవాన్ని దేవతలు కన్నులార చూసి తమ కళ్ళకు రెప్పపాటు లేకపోవడాన్ని తాము వేనోళ్ళ పాగుడుకున్నారు.
ఒకటే పాదంతో తిరగడం చారీభ్రమణం అంటారు. అలా తిరగడంలో ఇది శరీరంలో ప్రైభాగము, ఇది శరీరంలో క్రిందభాగము అని వాళ్ళు వేసుకున్న దట్టీలవల్లనే అర్ధమవుతుంది. ఈ ్రమణాలలో 'సవ్యము, 'అపసవ్యము', 'అర్ధభ్రమణము” అనే
గు మధురావిజయమాధురి భేదా లున్నాయి. “చారిభీః” అనే బహువచనం వీటినే సూచిస్తోంది. ఈ వీరులు యుద్ధంలో నిపుణులని తెలుస్తోంది.
యావత్కృపాణేన విపాట్య కుంభం
నివర్తతే సత్వరమశ్వవారః |
తావధృహీత్వాస్య తురంగమం(ఘ్ర్యో
రాస్ఫాలయామాస గజస్తముర్వ్యామ్ ॥ (మ.వి.9.5)
ఆశ్వికు డొకడు ఒక ఏనుగు కుంభస్థలంపై కొట్టి వేగంగా తిరిగి వెళ్ళేలోపుగా ఆ ఏనుగు అతని గుర్రం కాళ్ళని తొండంతో పట్టుకొని చుట్టుచుట్టి గిరగిర తిప్పి నేలపై కొట్టి అతనితో పాటు ఆ గుర్రాన్నీ చంపేసింది.
'సత్వరమ్ -నివర్తతే' అనడంవలన ఈ ఆశ్వికుడు ఈ ఏనుగుని చూడలేదు. అది కోపంతో తన కుంభం పగలడం కూడా లెక్క చెయ్యకుండా అతన్ని వెంటాడి మహావేగంతో వావానంతో బాటు అతనిని నేలమట్టం చేసింది. అద్బుతమైన వర్ణన. మళ్ళీ 1౧6గ౧1౦౦/200౧16 1800016066 ఇక్కడ ఉపయోగించింది. 10౧9 5[౧0( లో ఆ ఆశ్వికుడు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి వెళ్ళిపోవడం, ఆ కుంభస్థలానికి దెబ్బ, ఏనుగుమోద 16౧9 కాసేపు ఆగినట్లు అది గుర్రాన్ని చుట్టచుట్టి అంటే 1056-౮౧ 1600౧16406. సినిమారీలు మన కళ్ళముందు కదులుతోంది.
జీఘత్సయా2_౦త: పతగైః ప్రవిష్టైః
ప్రస్పందమానం కుణపం ద్విపస్య |
సమిపమాసాద్య సజీవబుద్ధా
వ్యసుం సతృష్టోః_పి జహౌ సృగాల: 11 (మ.వి.9.?)
ఆ యుద్ధభూమిలో ఒక నక్క ఏనుగు శవాన్ని చూసి లోభంతో దాన్ని తినాలని దగ్గరకు వెళ్ళి అంతకుముందు దాన్ని తినే ఉద్దేశంతో లోపలి కెళ్ళిన పక్షులతో ఆ శవం అటూ ఇటూ కదులుతూంటే అది బతికివున్నదన్న భ్రమతో దాన్ని వదలి ఎక్కడికో వెళ్ళింది.
ఇక్కడ భీభత్సభయానకాల మేళవింపు వర్ణించబడింది. ఏను గొకటి ప్రాణాలు పోగొట్టుకొని పడివుంది. కుంభస్థలం బద్దలవడంచేత అక్కడ రంధ్రం పడింది. గద్దలు ఆ రంధ్రంలో దూరి మాంసం తింటున్నాయి. అందువలన అది కదులుతూంది. నక్క ఆ శవాన్ని తినాలనుకొని అది కదలడం చూసి పారిపోయింది. కన్నులముందు కదలాడే చలనచిత్రదృశ్యంలా వుంది ఈ వర్ణన. గ6౭|5గ 1600౧10606 (వాస్తవికతాపద్ధతి) కన్పిస్తుంది.
మధురావిజయమాధురి 71 తేన ద్విపాస్తోమరిణా విఖిన్నాః
కుంభస్థలైరుజ్హితమౌక్తికౌమై: 1
క్రౌంచస్య జహ్రుర్గుహశక్తిఘాత
ప్రకీర్ణహంసప్రకరస్య శోభామ్ | (మ.వి.9.18)
ఆ వీరుడు తోమరాన్ని పట్టుకొని ఏనుగు కుంభస్టలంమోద వేస్తే అది తెగి ఆగకుండా ముత్యాలు వెదజల్లుతూ పూర్వం కుమారస్వామి తన శక్తి ఆయుధంతో తనను పగల గొట్టగా అటూ ఇటూ పరుగులు పెట్టిన హంసలతోడి క్రౌాంచపర్వతంలా ప్రకాళించింది.
పూర్వం కుమారస్వామి శక్తి ఆయుధంతో క్రౌంచపర్వతం నడిమి విభాగాన్ని పగల గొట్టాడు. అప్పుడు హంసలు అక్కడినుండి నలువైపులా ఎగిరి మేరుపర్వతానికి వెళ్ళాయి. హంసలు తెల్లగా గుండ్రంగా ఉంటాయి. ముత్యాలూ తెల్లగా గుండ్రంగా ఉంటాయి. ్రౌంచపర్వతమూ, ఏనుగు కుంభస్థలాలూ ఎత్తెనవి. కుమారస్వామి శక్తి ఆయుధమూ, కంపరాజు తోమరమూ శక్తిమంతమైనవి. కుంభస్థలంనుండి ముత్యాలు ఎగిరిపడతాయి. క్రౌంచపర్వతం నుండి హంసలు ఎగిరి పడతాయి. ఇవీ పోలికలు.
న జమదగ్వ్యేన న రాఘవేణ
తథా న భీమేన న చాఇర్జునేన
ఆపాదితస్తేన యథా సమాకే
హర్నో మహర్షే కలహప్రియస్య ॥ (మ.వి.9.22)
కలహప్రియుదైన నారదమునికి ఆరోజు యుద్ధంలో కంపరాజు కలగజేసిన ఆనందం పూర్వం ఆ యా యుద్దాలలో పరశురాముడుగానీ, రాముడుగానీ, భీముడుగానీ అర్జునుడుగానీ, మరి ఎవ్వరుగానీ ఏనాడూ కలిగించలేదు.
పై వర్ణనవలన రాముడు మొదలైన వారందరికంటే, కంపరాజులో యుద్ధనైపుణ్యం ఎక్కువగా ఉన్నట్లు గంగాదేవి చెబుతోంది. తన భర్తను నాయకుణ్ణి చేసి కావ్యం రాసింది కాబట్టి తన భర్త లోకాతీతుడు. ఇలా పూర్తిగా అన్నిహంగులూ ఉండి ఎదురులేని మనిషిని "న10౧1౦ 16681“ (ప్లాటో యొక్క ఆదర్శవంతుడు) అంటారు. నారదుణ్ణి కలహప్రియుణ్జి చేసింది తెలుగువాళ్ళే నేమో! గంగాదేవీ తెలుగింటి ఆడపడచే కదా! కలహాశనుడు, కలహ భోజనుడని తెలుగువాళ్ళే అంటా రనుకుంటాను.
తతస్తులుష్కాన్ యుధి కాందిశీకా
నాలోక్య విస్ఫారితఘోరశార్బ్ల: |
కంపక్షితీంద్రం యవనాధిరాజః
ప్రత్యగ్రహీ ద్వ(త్ర ఇవామరేంద్రమ్ 1॥ (మ.వి.9.28)
72 మధురావిజయమాధురి
కంపరాజు తన సైన్యాన్ని చెదరగొట్టగా పరిగెట్టడం చూసి మహమ్మదీయరాజు (సురత్రాణుడు) భయంకరంగా ధనువుని చాలనం చేసి దేవేంద్రుడిపైన ఉరికే వృత్రాసు రిడిలా కంపరాజుపైకి ఉరికాడు.
వృత్రాసురుడు త్వష్ట్రప్రజాపతి కొడుకు. విశ్వరూపుణ్తి ఇంద్రుడు చంపితే త్వష్ట
స కేరలప్రాణమరుద్భృజంగాన్
వన్యావనీంద్రద్రుమదావవహ్నీన్
అం(ధ్రాంధకారక్షయతిగ్మభాసో
బాణానముంచద్యవనే నరేంద్రః ॥॥
కంపరాజు ఆ మహమ్మదీయరాజుపై కేరళుల ప్రాణాలనే గాలులను కబళించిన పాములై, అటవికరాజులనే చెట్లను కాల్చివేసిన కారుచిచ్చులై, ఆం(్రుల చీకట్లను పోగొట్టిన నూర్యకిరణాలై ప్రకాశించిన బాణాలు ప్రయోగించాడు. ఇందువలన కంపరాజుకు చారిత్రకంగా కేరళదేశంతోనే కొకుండా ఆంధ్రరాజులతో కూడ యుద్దాలు కలిగి వాళ్ళను ఇతడు జయించాడని అర్ధమవుతోంది. చంపరాజును, కేరళదేశీయులు ఎదిరించి ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రులు స్నేహితులు. గంగాదేవి ఆంధ్రుల ఆడపడుచు మరి! రామాయణంలో ఆంధ్రశబ్దం వాదారు. “తథైవాంధ్రాశ్చ పుండ్రాశ్ళ”.
ప్రశాంతదావేన వసంతలక్ష్మీ
ర్లతోపరాగా గగనస్థలీవ ;
కలిందజామర్దితకాలియేవ
దిగ్దక్షిణా.. సీత్ క్షతపారసీకా 1 (మ.వి.9.41)
మహమ్మదీయుడు నళించాక దక్షిణదిశ గ్రహణం విడచిన ఆకాశంలాగా భగభగ మండి చల్లారిన కార్చిచ్చుతోడి వనలక్ష్మిలాగా, శ్రీకృష్ణుడి పాదఘట్టనతో పొగరణగిన కాళియుడిలాగా ప్రశాంతంగా ఉంది.
సిం! గా౭గు!6 ౧౦? 16 9666 గాంగ౧ంగాంగి5
9౫ ౧౧౧౦69, 902% 0౪11/6 115 ౧౦౪6గ౮! గ/06.
(5౧8%99098/6 - 500౧6913) రాజకుమారుల పాలరాళ్ళ సువర్దశిలాఫలకాలు ఈ అద్భుతకవిత్వాన్ని మించవు. స్టళకకయ్య (గందాలూ ఇతి శమ్. ఖీ (్‌ా, మట.
/
ఇ రాన్ షు
/ (/ - డల ప్రీ గే
11 భీ లు | ః [ న్ గ
టీ | ట్ శ ఖో కా [వై ల |
| గి న్న కా చో
_ శి క ననన ల