Telugu maa vennela vaadaku randi - anilvaranasi/indianlanguages GitHub Wiki
య. ము న... న. వ. న న. పను _ వ! టం హా మనత. తనన నన టా నస ్యగ్య్న నం న సం (స్వీయ కవితా మంజరి లు మ / న. వ. | . థ్. అం మంతం ల స స న నళ నపుడు. ౬ ; మ య. వంపు యం ప నన 4 టయ? స స క ప య త న ఖని నం. న జే. ల న న నామం సనం మను... న్ న. . న య! మం ఈ యే స. ప మన ముల యన | వ నం క శస న ఫి మ నం. ప న నా న య. న సం న. మ య. టల టా న టిం... . మ. మ పం తు న ళ్ న, స. న న సళ సహ ఖ న! మం. న... ఫు. ల. గే | యూ... సాం ష్ న. న్న చన మ | నను చను వ; సుం" సయ. వం టంట మ్. ల హన టం వ వా న్స్ సళ, యా నయన సరా. (౨. కీ స్ గ న. వ. వ న్ టో ల మటల! ము ప. (ల న సం టు స్వ టం ఈం ట్ రా న స టన ము. ౫. . వై సకం స సు సు 1 వత్తు న. =
|
యమం వెన్నెల వందకు రంటె (స్వీయ కవితా మంజరి) (మ శ్రీను! రచన: (సత్యత్రీ) జనపరెడ్డి సత్యనారాయణ,బ.ఎ. రిటైర్డ్ తెలుగు పండెట్ పిరమిడ్ ఎంటర్పైజల్స్ ఫ్లాట్ నెం. 56,57, ఆదర్శనగర్, ఇన్ట్ ఆనంద్ బాగ్, మల్కాజ్గిరి, హైదరాబాద్ - 47.
- ఫోన్ : 27223364
మున వెన్నెల ౨3దకురంటె (కథా సంపుటి) (వివిధ పత్రికలలో ముద్రితమ్ము సా ప్రథమ ముద్రణ: సో ఫిబవరి (బవరి 2003 జగద? (గంధాలల్ప మె భి లాలా ఏవ 1 టా వెల: రూ. 30-00 క (టప న్ గం ఓటే ॥ ప్రతులు : 500 న లో రచయిత : పాద వశష నరో నుత్యత్వే) జనపరెడ్డై సత్వనోరారరణ, వి.ఎ. రిటైర్డ్ తెలుగు పండిట్ ర్స / కాఫీలకు సంప్రదించండి ; గ్ర జనపరెడ్డి రవింద ఫ్లాట్ నెం. 5657, అదర్శ నగర్, ఇన్ట్ ఆనంద్ బాగ్, నుల్కాజ్గిరి, హైదరాబాద్ - 47. ,ఫోన్ : 27223364 జనపరెడ్డి గోపీకృష్ణ అడ్వకేట్ రాంనగర్, కొత్తగూడెం - 507 101. ఖమ్మం జిల్లా జనపరెడ్డి శ్రీనివాస్, కెకె. కాలనీ, ౦౧౦. 30 381, ఇల్లందు, ఖమ్మం జిల్లా. విశాలాంధ్ర బూక్ హైస్, బ్యాంక్ స్ట్రీట్ హైద్రాబాద్ దిసా పుస్తక కెంద్ర, చికడ్సల్లి, హైద్రాబాద్ నవోదయ ఖూక్ హైన్, కాచీగూడ, హైద్రాబాద్ ముద్రణ ః హై బెక్ ఫ్రింటర్న్ 1-1-566/సి, గాంధీనగర్, పఫ్రాదరాబాద్. ఫోన్ : 55614169 “పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలం వారి ఆర్థిక సహాయంతో ముద్రింపబడినది
అంకితం - - శాక. త.
త్రీ జనవరెడ్డి వెంకటేశ్వర్లు వేంకట రత్నమ్మ రాన్నా!
పేమమూర్తిగా, వాత్సల్యశీలిగామంచి సాహితీ అభిమాని, మంచిభాషావేత్తగా, హఊపాధ్యాయునిగా, గొప్ప చిత్రకారునిగా, మంచి వేదాంతిగా,దైవభక్తునిగా, అనుభవం గల కప్ప ఆయుర్వేద వైద్యునిగా, పరిశోధకుడిగా, చిరునవ్వులు చిందిస్తూ, ఎనభై రెండేళ్లు ప్రశాంతమయిన జీవితం గడిపి, మాకెవ్వరికీ చెప్పకుండానే నీ ఇష్టద్రైవమయిన శ్రీకృష్ణ $రమాత్మలో ఐక్యమయినావు- అవూరిగ్రామస్తులందరి చేతా “పెదపంతులుగారు”, “దేవుడు రూష్టారు” అని ఆప్యాయంగా పిలిపించుకునే అదృష్టాన్ని చూరగొన్నావు - మాయందు నీవు చూపిన గ్రేమ, వాత్సల్యం ఎన్నటికీ మర్చిపోలేనిది. నీఫప్రశాంత, ధరహాస వదనం యిప్పటికీ గుర్తుకొస్తూ ఉంటుంది. అది ఎన్నటికీ మరువలేనిది.
అఆ తీపి గుర్తుగా ఈ పుస్తకాన్ని మీకు అమ్మకు ఢ్రేమళో, భక్తితో అంకితమిస్తున్నాను. అమ్మా!
“అమ్మ అనే రెండక్షరాల్లో అభిలాండం నిండిఉంది” అన్న నానుడి- నిజమనడానికి నువ్వే సాక్షి అనిపిస్తుంది మాకు. అంత గొప్ప నాన్నకు తగిన సహధ్మచారిణిగా సహకారం అందినర్హా మా పాలిటి గ్రేవుదేవతగా, మాతృవలూర్తిగా, దైవభొక్తురాలిగా, సాంప్రదాయానుశీలిగాా మీదుమిక్కిలి సహనశీలిగా, అంత మంది సంతానాన్ని వాత్సల్య పూరితంగా పెంచి “మాతృ దేవత” అనిపించుకుంటూ, తొంభై రెండేళ్లు నుంచి మా కనుల ముందు ఉంటూ కనుల విందు చేస్తూ సంతోషపెడుతున్నావు. అంతేగాక, నలఖైనాలుగు మంది (44) మనుమలు, మనుమరాళ్లు, మునిమనుమలు, మునిమనుమరాళ్ళను నీ కన్నులారా చూచుకునే అదృష్టం ఎందరికోగాని ఉండదు. నిన్ను చూడగలిగిన గొప్ప అదృష్టం వాళ్లక్కుడా దక్కింది. ఈ సంతోషం మా అందరకూ కలకాలం ఉండాలని, అలా ఉంచమని, భగవంతుణ్జీ ప్రార్ధిస్తూ , నేను రాసిన ఈ పుస్తకాన్ని మీకు, నాన్నకు అంకిం . _న్నాను. స్వీకరించండి.
= జనపరెడి సత్యవా: లఆంఖ
నామాట
నాలో సాహిత్యాభిలాష, కాల్పనికి శక్తి పాడచూపడానికి మా నాన్నగారే కారకులని చెప్పవచ్చు. ఆయన స్వయంగా రచయిత కాకపోయినా మంచి సాహిత్యాభిమాని, భాషావేత్త. అంకేగాక మంచి చిత్రకారుడు, కళాకారుడు. ఆయన ప్రాథమిక పాఠశాలలో కూడా మంచి లైబ్రరీ ఉండేది. అవి బ్రిటీషు వారి పరిపాలనా రోజులు. అప్పటికి యింకా స్వాతంత్ర్యం రాలేదు. మానాన్న గారే హెడ్ మాస్టరు కావడం వల్ల (గ్రంథాలయానికి కావలసిన పుస్తకాలు తెప్పించుకొనే అధికారం ఆయనకు ఉండేది. ఎక్కువగా చిలకమర్తి, వీరేశలింగం, మనుచరిత్ర, పారిజాతాపహరణం వంటి ప్రబంధాలు, రామకృష్ణ పరమహంస, వివేకానంద, అరవిందుడు వ్రాసిన వేదాంత గ్రంథాలు మొదలైన మంచి గ్రంథాలు తెప్పించేవారు. అంతేగాకుండా చదవటానికి యింటికి కూడా తెచ్చుకునేవారు. అదృష్టవశాత్తు నేను కూడా ఆప్పుస్తకాలు చదివే అవకాశం కలిగించి నారు. నేను చదివే (ప్రాథమిక విద్యే అయినా ఆరోజులలో భాషలో మంచి స్టాండర్గు ఉండేది. పుస్తకాలు కొన్నిచోట్ల అర్ధంకాకపోయినా మానాన్నగార్ని అడిగి తెలుసుకునేవాణ్ని. పుస్తకాలు చదవడంలో మంచి్రోత్సాహం, అర్థవివరణ ఆయన అందించేవారు. అప్పటినుంచే పుస్తక పఠనం మ్మీద ఆశక్తి అభిలాష పెరిగింది. అప్పటినుంచే వయస్సు పెరిగిన కొద్దీ పుస్తక పఠనం మీద అభిరుచి కూడా పెరుగుతూ వచ్చింది. అప్పుడే నాకు అనిపించేది.“నేను కూడా ఈ విధంగా ఎందుకు స్వీయరచనలు చేయగూడదూ?” అని అనిపించేది. ప్రయత్నం, పట్టుదల పెరిగింది. దైవ సంకల్పమో ఏమో కాని ఏదో అంతర్లీనమైన శక్తి బహిర్గతమై రచనకు, కాల్చనిక శిల్పానికి అంకురార్పణ జరిగింది. అది మొదలు పెట్టాను. అప్పుడు నా వయస్సు పన్నెండు సంవత్సరాలు.
అప్పుడు మాఊరులో హైస్కూలు లేనందు వలన విద్యాభ్యాసానికి ఏలూరు రావలసి వచ్చింది. నేనుపుట్టింది పల్లెటూరు కావడం వల్ల ఏలూరు రావడం వల్ల ఆ బస్తీ వాతావరణం నన్ను పూర్తిగా మార్చివేసింది. అక్కడ నాసాహిత్య కృషికి, భాషకి
మంచి పునాది పడింది. అందుకు కారణం అక్కడ ప్రసిద్ధులయిన కవులు, బంగరు మామ పాటల రచయిత కొనకళ్ల వెంకటరత్నం, ఎంకి పాటల నండూరి సుబ్బారావుగారు, మంచి రచయిత అడవి బాపిరాజుగారు, ఆరోజులలో ప్రసిద్ద నవలాకారులైన జంపన చంద్రశేఖర్‌రావు, కొవ్వూరి లక్ష్మినారాయణ గారు, ప్రసిద్ధ నటుడు బందాకనకలింగేశ్వరరావు, ప్రసిద్ధ కూచిపూడి నాట్యచారుడు కోదాడ నరసింహారావుగారు ఉండేవారు. వార్ని కలుసుకోవడం వల్ల మంచి ప్రోత్సాహం సలహాలు యిచ్చేవారు. అంతేగాక నాట్యాచార్యుడు కోదాడ నరసింహారావుగార్కి నేను మూడు నృత్యనాటికలు న్రాసియిస్తే చాలా చోట్ల, తమశిష్యులతోటి, స్టేజీమీద ప్రదర్శించారు. చాలా మంది మన్ననలు పొందాయి ఆ నాటికలు. ఆ కావులు, "స్నేహితులు యింకా రాయమని, ఏవైనా పత్రికలకు పంపమని, ప్రోత్సహమిచ్చేవారు. అప్పటిలో నారచనలు ఏపత్రికలకు పంపే దైర్యం నాకు ఉండేదికాదు. పెద్దవాళ్ల రచనలే వేస్తారుగాని, నా కర్ర రచనలు వేయరు. అవి తిరిగి వస్తే నిరుత్సాహానికి గురికావలసి వస్తుందనే భావన నాకు ఉండేది. అందుకని ఏ పత్రికకు పంపేవాణ్ని కాదు. స్నేహితులకి, సుప్రసిద్ధలకు చూపిస్తూ ఉఊండేవాణ్ధి.
అయితే నేను 9వ తరగతి (అప్పుడు 9వ తరగతిని 4వ ఫారం అనేవాళ్లు) చదివే రోజుల్లో జరిగిన ఒక సంఘటనతో నా రచనా వ్యాసంగం ఒక మంచి, మలుపు తిరిగింది. అది ఏవిటంటే “చంద్రలోకంలో వివోరం” అనే కథను ఆంధ్రవారపత్రికకు, పిల్లల విభాగానికి పంపేను. థైర్యం చేసి పంపేనేగాని నాకు అది అచ్చవుతుందనే నమ్మకం మాత్రం లేదు. అయితే, అదిపంపిన 20 రోజులలో మాయింటికి ఆంధ్రపత్రిక పోస్టులో వచ్చింది. అది విప్పి చూస్తే నా కథ బొమ్మతో సహా అచ్చయి వచ్చింది. అది చూచిన వెంటనే నాకు కలిగిన అశ్చర్యానికి, ఆనందానికి అవధులులేకుండా పోయినాయి. అది ఊహించరాని సత్యం. వెర్రి అవేశం ముంచుకొచ్చింది. ఎందుకంటే, నా రచన ప్రసిద్ధమైన పత్రికలోరావడం,ఎన్నో+ లక్షలమంది నా కధ చదువుతారు. ఎన్నో ఊర్లలో పాఠకులు చదువుతారు. ఎన్నోవేల కాపీలలో నా కథ ఉంటుంది. యిటువంటి ఊహలతో పరవశుణ్ని అయినాను.
ఆకుర్రతనంలో ఆసంఘటన, నన్నెంతో ఆనంద పరచింది. ఆ ప్రోత్సాహంతో అనేక కవితలు, కథలు వివిద పత్రికలకు సంపడం జరిగింది. వాటిలో మూడు వంతులు రచనలు అచ్చయివచ్చేవి. భారతి, ఆంధ్రపత్రిక, ప్రభ భూమి, తెలుగు స్వతంత్ర , స్రవంతి, చిత్రగుప్త వినోదిని మొదలైన పత్రికలు నాకథల్ని అచ్చువేశాయి. తరువాత నా వయస్సు, వికాశం పెరిగిన కొద్దీ ఆకాశవాణి, విజయవాడ, కొత్తగూడెం కేంద్రాల నుంచి, కవితలు, నృత్యనాటికలు ప్రసారం చేశాయి. ఆకాశవాణి కొత్తగూడెం తరపున అనేక కవి సమ్మేళనంలో పాల్గొన్నాను. యింకా పాల్గొంటూనే ఉంటాను. కవితా గోష్టులలో, సమ్మేళనాల్లో పాల్గొనటం నాకు ఎంతో యిష్టం.
నా కవితల్లో, కథల్లో ఎక్కువగా ప్రకృతి వర్ణలు చోటుచేసుకుంటాయి.
ఎందుకంటే నేను పుట్టింది, పెరిగింది. ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన శబరి, గోదావరీ తీరాలు, పచ్చని అడవులు, నది కొండలు, వసంత బుతువుల్లో చిగురించే చెట్టు, పూల జడ వేసుకున్న పెళ్లి కూతురులా శోభించే విరబూసిన చెట్ల సోయగాలు, అంతే కాకుండా నేను ఏలూరులో చదివే రోజుల్లో కూడా ఊరుబయటి పచ్చని వరిపొలాలు, కృష్ణా, గోదావరి కాలవల ప్రక్క గట్లమీద నాటిన సరుగు చెట్లు నీడలు, రహదారీ పడవలు, లాకులు, వరి నాట్లకు పోయే పల్లెపడచుల పాటలు, నా అనుభవంలోనివి గనుక, నా కవితల్లో, కథల్లో ప్రకృతి వర్ణనలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి.
“సొమితి స్వస్త్నం” అనే కవితలో “వెన్నెల్లో గోదావరి” ఎంత సాగసుగా ఉంటుందో స్వీయ అనుభవంతో చిత్రించింది. “మా వెన్నెల వాడకు రండి” అనే కవితలోను, “సరయూ స్వాంతము అనే దానిలోనూ ప్రకృతి వరన కనిపిస్తూ ఉంది. అంతేగాకుండా వాకు చిత్ర రచన మీద ఆశక్తి గలవాడను కావడం వల్ల చాలా కవితల్లో , కథానికల్లో, సన్నివేశాలు చిత్రీకరణలో, చిత్రకారుడు బొమ్మవేసినట్లు చిత్రికరించడం నాకు ఎక్కువ మక్కువ. ప్రకృతి అందాల్ని ఆస్వాదించడం, ఆ అనుభూతి ని మీకు నంచడం అంటే నాకు యిష్టం - అందుకనే ఏమో; కలత నా
(ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై)
కొమ్మలో కొమ్మనై, నును లేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా, ఎట్టయిన
ఇచటనే ఆగిపోనా?-
అనే దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి గేయం అంటే నాకు అత్యంత ప్రీతికరమైనది. నా చిన్నతనం నుంచే అది నా లోనిలచి పోయింది.
ఇక చివరిసారిగా ఈ కవితా సంపుటికి తమ అమూల్యమైన అభిప్రాయం బ్రాసియిచ్చిన ప్రసిద్ధ కవిత పండితులు జ్ఞానపీఠ అవార్డు గ్రహిత డా!! సి.నారాయణ రెడ్డి గారికి మరియు డా! దేవరాజు మహరాజు గారికి కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.
నా కవితల్ని తొలిసారిగా తమ తమ పత్రికలలో ప్రచురణగావించి, నాకు 'ప్రోత్సాహిన్సి యిచ్చిన పత్రికాధిపతులకు కూడా కృతజ్ఞతలు అందజేస్తున్నాను. వీటిని అచ్చువేయించడానికి గాను కొంత ఆర్థిక సహకారం అందించిన శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
అలాగే , ఎవ్పుడో రాసిన ఈ నాకవితలు, అచ్చయి వివిధ పత్రికలో (మగ్గిపోతుంటే, ఎంతో పట్టుదలతో, కృషితో వాటిలో కొన్నింటిని పుస్తక రూపంలోనికి తెచ్చిన నాకుమారులు, చిరంజీవులు రవీంద్ర, గోపీకృష్ణ శ్రీనివాస్‌లకు మరియు అన్నీ విధముల సహకరించిన చిరంజీవి బోల్లిముంత వెంకటరమణరావుకు (ేమపూరితమైన ఆశీర్వచనలతో పాటుగా, కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను.
-రచయిత
జ్ఞానపీర అవార్డు గ్రహీత కా చాక్టర్ సి. నారాయణరెడ్డి, ఎం.పి. శే ప. శ ఎం ఏ పి.హాచ్డి. డిలిట్ య. ఆంధ్రపదేశ్ రాష్ట సాంసృతిక మండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తే కళాభవన్, హైదరాబాదు - 500 004. ర్న ఫోన్ (ఆ) 23214603 (ఇ) 23548451 [| ఫాక్స్ (ఆ) 23214603 శా అభిపాయం శ్రీ జనపరెడ్డి సత్యనారాయణగారు దాదాపు అయిదు దశాబ్దాల నుంచి కవితా వ్యాసంగంలో ఉన్నారు. అందువల్ల అన్నితరాల ధోరణలు ఈ కవితాసంపుటిలో ఉన్నాయి. ప్రకృతిపరంగా, ప్రణయ నస్వరంగా, ప్రబోధ బంధురంగా వివిధ పార్వ్వాల్లో ఈ సంపుటిలోని కవితలు రూవుదిద్దు కున్నాయి. ఇందులో వచన నదృశంగా సాగిపోయే వాక్య పరంపరలున్నాయి. అచ్చమైన మాత్రాచ్చందస్సులో ముచ్చట గొలిపే గేయగతులూ వున్నాయి. కవితలతో పాటు కధలూ, నాటికలూ నంగీత రూవకాలు రచించి అపార రచనానుభవం పండించుకున్న సత్యనారాయణగారు ప్రచురిస్తున్న ఈ కవితామంజరికి నా అభినందన. లి (దాగని, నారాయణరెడ్రి
యమస్సి, పిహెచ్డి, మ. 6-83, క్రిషి నిలయం, మధురానగర్ కాలని మ ప నాగవరం - 501 301, సికింద్రాబాద్ ని ఇ-మేయిల్: మహరాజు ఆల్‌లైన్ ఇండియా టైమ్స్.కామ్ క ఫోన్ * 27120534 (6 ఫిభవరి 2003 ఆహ్వానాన్నిఅంగీకరించండి! “మమతల నీడల్లో మంచి ముత్యాలు పరుద్దాం! రండి మా వెన్నెల వాడకు రండి”
- అంటూ నత్యశ్రీ జనవరెడ్డీ నత్యనారాయణ గారు మనల్ని తన కవితలవాడకు ఆహ్వానిన్తున్నారు. ఈ స్వీయ కవితా మంజరిలోని రచనలన్నీ ముప్పయి నలఖై యేళ్ళ క్రితం రాసినవి. అప్పుడే సంపుటి రూపంలో వస్తే వాటి విలువ ఎంతో ఉండేది. ఇప్పుడు ఈ మారిపోయిన కాలంలో, మారిపోయిన కవిత్వం సరసన దీన్ని బేరీజు వేయడం కుదరదు. అనివార్య కారణాల వల్ల విడుదలకు నోచుకోని ఆర్ట్ సినిమా నలఖై యేళ్ళ తర్వాత విడుదలయితే అది “మా వెన్నెల వాడకు రండి' లాగానే ఉంటుంది. అయితే కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ కవి దగ్గర మంచి భాష ఉంది భావుకత ఉంది. సున్నితమైన భావనలు, ప్రకృతి వర్దనలు మనల్ని తన్మయుల్ని చేస్తాయి. తెలుగు కవిత్వ పోకడలన్సీ ఈయన కలంలో గళం విప్పుతాయి,. పద్యకవిత ఉధృతంగా వచ్చిన కాలంలో సత్యశ్రీగారు పద్య కవితలల్లారు” ఎవరు తురిమినారో ఈ సెలయేటి సిరికి / లలిత చలిత నట; లయల హొయలు (చైత్రహేల.33) పద్య కవితా ధోరణిలో కొన్ని వచన కవితలల్త్లారు” సౌమిత్రి నిష్కమణ తోటి ద్వితీయ నయనమ్మును గూడ కోల్పోయి నేను పూర్జాంధుడ నైతి...! (సరయూస్వాంతం:3) కొన్ని చోట్ల గేయకవితా ధోరణిలో కవిత్వం జలజలా ప్రవహింపజేశారు. " “నాగార్జున సాగరం - శ్రీ శైలం సీలేరులు తుంగభద్ర డాము - మన తిరుగు లేని సిరులు కోనసీమ మా గాణులు - వసీవాడి పోని గిరులు మనసింగరేణి గనులు - కురిపించును మణులు (మా తెలుగు తల్లి - 15) ఖమ్మం జిల్లా కొత్తగూడెం కు చెందిన ఈ కవి సింగరేణి గనుల్ని ఎలా మరిచిపోగలరూ? ఈయన రాసిన నృత్యరూపకాలు ఎన్నో ప్రదర్శింప బడ్డాయి. ఒక నృత్య నాటికలో - “నా నింగి టెడదలో ఏ భంగి మున్నదో
ఈ నీలి పొగలలో
ఏ జలములున్నవో” అంటూ విశ్వనాథ కిన్నెరసాని పాటల్ని గుర్తుకు తెచ్చే కవిత్వ హోయల్ని చిలికించారు. కాలక్రమేణా కవితా ధోరణి మారి, వచన కవిత స్థిరపడి బలంగా వస్తున్న రోజుల్లో బహుశా ఈకవి తన ధోరణి కూడా మార్చుకుని ఉంటారు. సాదాసీదా వచనంలో వ్యంగ్యోక్తులు విసిరారు.
“అరవై కిలోల మనిషిక్తి
ఇరవై టన్నుల మస్తిష్కం పెరిగింది మరి” - అంటూ (అమృతంనింపేదెవరు.22)
“గాంధీజీ విగ్రహాలకు గాండీవాలెందుకు తగిలిస్తారు?” (పే.1) అంటూ ఆవేదన చెందారు. దేశకాల పరిస్థితుల్ని అద్భుతంగా చిత్రించిన వాక్యమది.
“రోడ్డు పైనాల మీద రొట్టెలు కాలుస్తుంటాయి ఎండకన్నెలు-వెండి జరీ పట్టుకోక కట్టి పట్టణం చుట్టానస్తుంటుంది” (విజయవాడ 72) అంటూ జీవిత వాస్తవాల్ని కళ్ళకు కట్టించారు.
“నీ ప్రతి పాటలో ఒక దివ్యనాదం ఉంది” అని దేవులపల్లి కృష్ణశాస్త్రికి అచ్ళుతర్పణం చేశారు. తిలక్ అమృతం కురిసిన రాత్రితో (ప్రభావితులై కాబోలు ఈయన “వానవచ్చిన రాత్రి” శీర్షికన కొన్ని అక్షర చిత్రాలు గీశారు, ప్రకృతిలో పరవశించిపోయే ఈ కవి.
“వసుధ కద్దము నింగి నీలము
నింగి కద్దము వసుధ హరితము” (అద్దము 74) అన్న చిన్న మాటతో వాతావరణ సమతుల్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని కవిత్వీకరించి చూపారు.
“చెడ్డ బాలున కేమిటందము/దొడ్డ వానిగ మారుటందము” (45) అంటూ తెలుగు పండితుడిగా పాఠశాల పిల్లల్లో బుద్దిని సాహిత్య జిజ్ఞాసను పెంచి ఒక గురుతరమైన బాధ్యతను నిర్వహించారు జనపరెడ్డి సత్యనారాయణ (సత్యశ్రీ) గారు. ఈయన కవితా రంగంలోనే కాక, కథానికా రంగంలో కూడా మంచి కృషి చేశారు. అందుకు “అడవి మల్లెలు” కథా సంపుటి (అక్టోబరు 2002) ఉదాహరణగా నిలుస్తుంది. 1955-60లో ఈయన రాసిన కథల్ని భారతి. తెలుగు స్వతంత్ర వంటి పత్రికలు ప్రచురించాయి.
ఒక రకంగా సత్యనారాయణ గారు అదృష్టవంతులనే చెప్పాలి. ఈయన రచనల్ని "సేకరించి ఈయన కుమారులు పుస్తకాలుగా ప్రచురిస్తున్నారు. తండ్రి నుండి వారసత్వంగా సాహిత్య స్పూర్తిని పొందిన తనయులు ధన్యులు. వారిని మనసారా అభినందిన్తున్నాను. సాహిత్య కారుడైన ఒక తండ్రికి సంతోషాన్నిచ్చే విషయం ఇంతకన్నా ఏముంటుంది ?
మా వెన్నెల వాడకు రండి
అనే పిలుపు మీదాకా చేరితే
ఆహ్వానాన్ని తప్పక అంగీకరించండి!
వెన్నెల్ని ఆనందించండి! గి ల
రి (ణా, దేనరాజూామనవోరాజూ)
క.సం.కవిత పేరు పేజి నెం. 11 మా వెన్నెలవాడకు రండి 1 2 నరయూస్వాంతం-పండిత భారతి 3౩ 3 సౌమిత్ర స్వప్నం (విరదస్వప్పుం) 8 టే రేపు ఉదయించే సూర్యుడు గం 5 రసోర్మికలు-1 13 6 మా తెలుగుతల్లి. ఆంధ్రప్రదేశ్ 14 7 నాకీ వెలుగుచాలు 16 8 కలలో కరచిన కాలం 17 రి అర్థనారీ శ్వరతత్త్వం 19 10 అమృతం నింపేదెవరు? 21 11 ఈవేళ మాకు నీ పువ్వులొద్దు 23 12 సగటు మనిషి-వెగటు మనిషి 25 13 కన్నె వయస్సు 26 14 దరహాససుందరి 27 15. వానంతహేల 285 168 నిశాపొంధుడు 29 17 బాపు 30 18 అల్లూరిపులి 3 19 చైెత్రహేల 33 20 కలువ కన్నెకల 34 21 పల్లె పిల్ల- వినోదిని 36 22 _ వెన్నెల మడుగులు ఏ7 23 పాప ఏరి 24 అర్థాలు 39 25 రేపటి పౌరులు తి 26 ఓ విద్యార్థి 42 27 ఏమి చేద్దాం (పొడుపు కథ) కత
వలనను క.సం.కవిత పేరు 'పేజినెం 28 ఏమిటందము జేస్ 29 పరం పరం ఉద్ 30 ఓ తెరువరి (విద్యుల్లత) 47 231 ఎందుకు? జరి 32 పూ తోటలో రాణ్ 49 33 వాన వచ్చిన రాత్రి 53 పశ ఆ కవి కవిత్వం-స్వార్ధపు కవిత్వమా? ర్డీ 35 నవ్య కవితా చక్రవర్తికి అశ్రుతర్పణం 56 36 మధుయామిని ర్7 37 అతడు -ఆమే 58 38 ఎందుకో 59 39 ఓ దివ్య స్వప్నమా 60 40 వీధీ దీపం సందేశం 61 41 ఎన్నో చుక్కలు 82 42 నిలచి పాడుచున్నది ఎవరు? 63 జీ3 మానవత 64 44 ఈ మధుర వాసంతహేలం 65 బీర్ పొడు మెలికలు 46 వెన్నల కలలు రక 47 దివ్య సత్తి 67 48 అళశావేదన 68 శ్రి పూలకొమ్మ 70 50 మా విజయవాడ 71 51. నీడల నీడలు ట్ 52 అర్థము 7 53 ౫” చెలీ 76
ాంాంాాాయాాాాలాాా- మావెన్నెల వాడకు రండి
అంతరిక్తపు గవాక్షాన్ని త్రోసుకుని
ఆకాశపుటంచుల్సి చీల్చికుని -
వెండికొండలు కరిగిపాడుతూన్నట్టు
అదిగో! వెన్నెల జలపాతం దిగుతోంది
ఇక్కడ - ఈక్షీరసరోవరం ప్రక్కన
ఈపేట వనమధ్యంలో ఉన్న మావాడకు
ఈసిరివన్నెల మా వెన్నెల వాడకు
ఓ చీకటి మనుష్యుల్లారా
ఓ రేపటి మనుష్యుల్హారా
రండి! రండి! మా వెన్నెల వాడకు రండి!
పాల సముద్రపు కెరటాల గోడల్తా
రాజహంసల రెక్కల గొడుగుల్తా,
అవిగో! గోపురాలు గుడి గోపురాలు - అవి
వెన్నెల నీరద్దుకున్న బసవన్నల మూపురాలు! _
అవే మనిషిని మనిషిగా కొలిచే మానవ దేవళాలు
మనిషికి మనిషి కట్టిన మణిమందిరాలు
ఇక్కడ ప్రతి హృదయం ఒక దివ్య సదనం
ఇక్కడ ప్రతి వదనం ఒక అరుజోదయం
ఇక్కడ వేదం, ఖురాను, బైబిల్ సమ్మిళతంగా పాడుతాయి ఉత్తర దక్షిణ అభ్యాగులకు ఒకే పంక్తిలో విందు జరుగుతోంది పాక్స్ పశ్చిమాల వెలుతురు ఒకే దివ్వెలో వెలుగుతోంది
ఈ వెలుతురు లోకి రండి- ఈ జిలుగును చవిచూడండి ఓ చీకటి మనుష్యుల్లారా! ఓ రేపటి పొరుల్లారా! రండి!! రండి! ఈ వెన్నెల మడుగుల్లో ఈదుళ్ళాటకు రండి! అక్కడ గాంధీజీ విగ్రహాలకు గాండీవాలెందుకు తగ్గి లిస్తారు? అక్కడ ఆ చీకటి దేవత వక్షోజాలకు లక్ష మల్లెల పూజలెందుకు?
మార్ధవం కట్టిన మూడడుగుల గూటిలో
మస్తిష్కం పెరిగిన మనిషి జీవిస్తూ
మగత నిదుర కలల, రంగుటలల శబలతలో
అగ్ని అప్సర నగ్న నృత్యం చూస్తూ,
దాని అడుగులకు మడుగులాత్తే,
ఓ చీకటి మనుష్యులానా! ఓ రేపటి పౌరుల్లారా! మా వాడకు రండి! ఈ వెన్నెల వాడకు రండి!
ఈ మానవదేవళాలను దర్శించండి-
ఇక్కడ మానవకే నైవేధ్యం మమతే పూజా ద్రవ్యం ఇక్కడ ఐక్యతా కంరంంతో మానవత్వం పొలికేక పెడితే- హిమన్నగాలు కరిగిపారుతాయి
పొగమంచు పొత్తిళ్లలో ఒదిగి
మానవత్వపు మాన్యంలో మాణిక్యాలు పండుతాయి మమతల నీడల్లో “మంచి ముత్యాలు పరుద్దాం
ఓ చీకటి మనుష్యులారా! ఓ రేపటి పౌరుల్లారా! రండి! రండి! మా వెన్నెల వాడకు రండి-
సరయూ స్వాంతం తిమిరం వెన్నెల కౌగిలి ఛాయలలోన అయోధ్యా పరీవృత సరయూనదీ తటములవి-- సరయూ నది గలగల పాడు రవములవిగో!
ఆ గల గలలోన లేవులే కిలకిలలు వలవలలు తప్ప- చీకటి జలజలలు తప్ప ఒగపు బరువున జఒరిసిన హృదయవీణ మీటి సరయూ రుురీ పాడుచున్నది శిలలు కరుగ శోకదేవత నిట్టూర్పు సెగలతో రగిలి అయోధ్యా నగరమదిగో రగులుచున్నది నిశారాత్రి స్థబ్బమ్ముగ, నిశబ్దమ్ముగ 1
చుక్కలనంటు అద్భుత రాజ సౌధమ్మున
అది అతిలోక సుందర శయ్యా మందిరము
అదదే శ్రీరామ ఆరామ మందిరమ్ము
అచటి ధవళ, కుడ్య , స్థాపిత, నీలి, పాటల
సేత, హరిత ధూమాది నవవర్ణ వైఢూర్య,
వజ్ర, మరకత, ౩౦పు సొంపు కాంతుటె కాని *
లేవు- తైల జ్వలిత జ్వాలా కాంతులచట. |
ఆ రంగు రంగుల రంగారు రంగమ్మున
విరాజిత మణిమయ బంగారు శయ్య పైన
అదిగో! శయనించి ఉన్నాడు - రఘాద్వహుడు
వడలి వాడిన నీలిగోరింత చండువలెను
మిసిమి వీడిన నీలితామర తూడువలెను
ఆ వాడిన నీలి చెక్కుటద్దాలపైన
బాష్పములు జాలువారిన జాడలేలకో?
ఆ వదనమందున వగపు నీడలెందుకో!
ఆ ప్రశాంత చిత్రవర్ణ కాంతురీనెడ్డి ఏ కాంత మందిరమ్ము లోన రఘురాము హంసతల్చమ్ము మోత నిల్చి ఉవిద ఎవరో ఎద ప్రక్కలుకాగ వెక్కి వెక్కి ఏడ్చుచు, రాల్చుచున్నది భాష్పముులు ఆతని చరణాలపైన. ఆ గోరువెచ్చని కన్నీళ్ళ వాన కురియ దిగ్గున మేల్కొంచి నబ్చిక్కులవలోకించి, “ఈ నిశారాత్రి మదీయ చరణమ్ములపైన భాష్పవృష్టి కురియుచున్నది దేమికతమ్ము? ఎవ్వరది? ఇయ్యదెవ్వారి వగపు సవ్వడి? నా నయనమ్ముల కడ్డుకున్నది అనంత చిత్ర వర్ణమిళిత, వివేకహీనమను యవనికొక... కాన కనలేను వాస్తవమ్ము. వినుబెకాని, భూదేవి ఒడి చేరనేగిన భూమిజవా నీవు..? లేక్క నేడు సరయూ యురీ గర్భమ్మునం దాహుతి అయిన ఆనుజుడు సౌమిత్రినా? సవిస్తరమ్ముగ వచియింపుము వాస్తవమ్ము?” అనిన ఆ శోకమూర్తి అణకువతో అన్నదిట్లు; “భవదీయ సుందర మందిర గవాక్షమ్ము నుండి వీక్షించుచు, మదీయ సుందరాకృతి గన్సి మీర ను దినమ్ము విమల గోదావరీ తీర శృంగార దృశ్యములు సాదృళ్యముగ నాలోగని, గడిచిన మీ మధురాతి మధుర గాధల సష్పకి పధమ్మునకు తెచ్చి తన్మయులచేసి, తరించుచున్న సరస సరయూ నదిని నేను... -ఇంత పరిచయమున్నను గుర్తించలేదే నన్ను- యిదేమి లక్ష్మభాగ్రజా...! యిదేమి వైదేహిప్రియా!”
-అనిన రాఘవుడున్నాడు- “ఓ.నదీమ తల్లీ!”
మన్నింపుము మదీయ తప్పిదమ్మును=నాడు
నా భూమిజ నన్ను వీడి, మదీయ హృదయమ్మును
వ్రక్కలు జేసినటుల, ఈ ధరణి వ్రయ్యలుచేసి
మగుడి అ భూమాత ఒడిలోని కేగునపుడె
కోల్పోయితిలే ఒక నయనమ్మును- నేడు,
నాదు కర్కశ హృదయ జనిత దే బహిష్క
రాజ్ఞ శిరమున దాల్చి, నన్వీడి మనలేక,
నీలోన గ్రుంకి ఆత్మాహుతిగొన్న నా అనుజుడు
సౌమిత్రి నిష్క్రమణతోటి ద్వితీయ నయనమ్ము
ను గూడ కోల్పోయి నేను పూర్ణాంధుడనైతి...!!
దానితన నాకన్హోయి కనలేదు...కనలేదు
ప్రత్యక్షము-వీనుల వినుటయెగాని...
కొని వచియింపుము వాస్తవమ్మును వమ్ముచేయక,
నీ వింత వంత పూనుట బహువింత!.. యింత
నిశరాత్రి నీ ఆగమనకతమ్మెయ్యదో?” అనిన సరయూ ర్ఫురీ మగుడి అన్నదిట్టుల- మంజుల మృదుల వినీల మేమములోన దాగిన విద్యుద్దాత మటుల నీ సుందరాకృతి లోన యింతటి జఠిల మెచ్చటదాగినో కదా! ఈ రత్న ఖచిత కుడ్య కుహరమ్మునందుండుట చేత కాబోలు,” అనుజునా హతిగొన్న అగ్రజుడవని మిన్ను ముట్ట అయోధ్యావాసుల ఆందోళన నీ వీనుల కందరాదె? అందినను నీకనుభావమ్మెగా? కాని, రాము తమ్ము వాహితి గొన్న దంచునేడ్చు పౌరుల, భికర దూషణ శాపాదుల భరియింపగ నే నశక్తురాల-కాను “నీలి శిలను' నేను-
నే శిలల కరిగంచు నాక నేను- 7 నేడు, ఊర్మిళా ప్రియు నాహుతిగొన్న మహా పాప భీతిచే నా మానస మంధగ్శి రగిలె సజీవ దహనానుభూతి పీడితను నేను- ఇట్టి దుస్థితికంతకు నీవే కతమ్ము కాన విన్న వింపుమా దోషమ్ము పోవ, వాకు చిత్తశుద్ధిగ ప్రాయశ్చిత్త మార్గమొకటి[” అనిన ఆ ముగ్ధమోహన సౌందర్య శ్రీరామమూర్తి, దరహాస చరిత్రిక లొలికించి నుడి వెనిటుల- “సతత మయోధ్యావాసులకు నీ మధురాంబవు లిచ్చి మన్ననచేయు పుణ్యవతీ సరస సంగీత విమల సరయూ ర్నుబుర్! అవధరింపుము కతమ్ము- “నేడు జముడు యోగిరూపముదాల్చి మదీయ రహస్య మందిరమున బాషణమొక్కటి గుప్తమ్ముగ నుడువనెంచి, మదీయానుజు సౌమిత్రినిాప్రాంగణమ్ము న నిల్చి” ఎవ్వరికినీ ఈ మందిర ప్రవేశార్హత నిషిద్దమ్ముగజేసి, దాని మీరిన కతన ద్వాలికునకు శిరంఖండనమ్ము శిక్షగా నాచే అనగొనుట నీకవగతమ్మెగా, అంతలోన దురిత దూర్వాసుడేతెంచి, “నాకు ఈ మందిర ప్రవేశమ్మవశ్యమ్ము- లేకున్న రఘు వంశాకురమ్ములు నాశనమ్ము శుక్షణ మ్మ” ని శాపమిడబోవ, మా సౌమిత్రి తన వంశ నాశనమ్ముకన్న తాను మడయుట మిన్న, అని, నా శాసనోల్లంఘన చేసిన ఆ ఘటన, నీకు తెలియనిదిగాదు- తప్పిదమ్ము చేసిన తమ్ముని ముప్పుంజూచ్చి, నే శోకించి, వానికీ
శిరంఖండనకు బదులు దేశ బహిష్కారమును తుది పరిష్కారముగ ఆ గాథయ్యు, దాని పర్యవ సాన పరిసమాప్తియు నీ కనుభావమ్మే కదా! నీభుడనే నీ క్షితికి. రాజధర్మమయ్యది నీవును మదీయ దేశవాసివి గాన నీ స్వాంతమ్ము నూరడించు కార్యమదియు రాజధర్మమే అగును- కాన ఓ విమల వాపి వినుము- రేపు 'ప్రాగ్రిశ స్వర్ణారుణకాంతి పుంజములు నీపైచిత్రమ్ములు వేయునపుడు నేను నీలోన గ్రుంకి మదీయానుజు గలసి కొందునిక-ఇదియె ప్రాయశ్చిత్తమ్ము నీకును, నాకును-నమ్ముమరి నిజమ్ము! నిజమ్ము॥] అనిన, ఆ రఘురాము విన్నపము వీనుల విందుకాగ, అతిశయానంద తరంగములు పొంగారగ, “పునీత మయ్యెదను నీ పూర్ణాహుతి కతన మదీయ స్వాంతమ్మునందు ప్రశాంతి విరిసె ఇక వీడితి పాపభితి”-అనుచు సరయూర్వ్సురిఏగినది- కానీ, “మారఘూద్వహంనిగూడ అహుతిగొన్న సరస రురీరూపసరీసృపమ్మిది” -అన్న పౌరనింద బరువు నూహింపలేదు- పాపమా వేత్తీనసరయూ॥!
- పండిత భారతి, జూన్ - జులై 90
సౌమిత్రి స్వప్నం నీలి నింగిలోనించి జారే వెన్నెలల వెండి జలపాతం తనలో కలుపుకుంటూ రంగు రాళ్ళపై నీటుగా మోటుకుంటూ కొండరాళ్ళపై గోటుగా రాసుకుంటూ. కమ్మని సంగీతం తెమ్మెర కందిస్తూ మందంగా అండంగా నెమ్మది పొంగేలా అనతి దూరంలో అదిగో గోదావరి నడుస్తున్నది నడుమే లేని నాగకన్యకలా! చుట్టురా అలముకొన్న నిశ్శబ్దపు కౌగిలిలో ఒడలు మరిచి నిదురించే సుందర వనమధ్యంల వసుంధర వేణీభరంలో ముచ్చటగా ముడిచిన విరిసిన వనమందారం, రఘుముఖ్యుని వాటికలో స్వర్ణ కుటీరంలో మెరిసే వర్ణకుటీరంలో, సుతిమెత్తని నులివెచ్చని చివురుటాకు తల్పంలో ముకుళించిన సితపద్మంలా కలలు జాలు అలలలో కమనీయంగా కదలిపోయే కమ్మని భావం కనిపిస్తూంది. పూదీవలా అల్లిన తియ్యని భావం స్ఫురిస్తున్నది! పండబారిన నిండు జాబిల్లి పెండి వెన్నెల్లో పసిడి తళుకులు అద్దుకున్న గౌతమినది ఇసుక తిన్నెలు చుక్కల లోకంలోనుంచి విరిగిపడిన ముక్కల్లా కనిపించి, ఊరించే కవ్వించే కమనీయ లోకంలో, మై మరిచి, అరమోడ్పు కన్నుగవతో గలగలమని గోదావరి ఎద మీటే మది పొంగు పాట వింటూ ఏవేవో తలపుల వల్లిక లల్గుకుంటున్నాడు “తను”
ఆ దవు దవ్వుల దిగంతాల కీవల, చిక్క శల్యమైన గౌతమీ గర్భంలోనించి చుక్కాని లేని సితపుష్ప తరణీలో సుడి తిరుగుతూ పడుచు ఎవరో పిలుస్తున్నది! పడుచు కిన్నిర రవంలా వినిపిస్తున్నది! - పదేపదే పిలుస్తున్నది! అదేపనిగా అడలుతున్నది... అడవి దేవత మిసిమి ఒడిలో ఒడలు మరిచి నిదురించే అర్ధరాత్రి అదే అడలుతున్నది... అర్ధరాత్రి అదే అడలుతున్నది... అటువైపే, అటువైపే అడుగులు తడబడుతూ తను... వడివడిగా నడుస్తున్నాడు.... వడివడ్గా నడుస్తున్నాడు.... వంపు తిరిగిన గోదావరి సాంపు చూస్తూన్నట్లు పెద్దకొండ ఒకటి వెలిసింది కూర్చున్న రాకాసిలా గౌతమినది గట్టు గట్టున తెట్టు కడుతున్నది మిగల కాగిన పాలమీగడ వన్నెచిన్నెల దోరవెన్సెల! కరిగిన మేఘంలాంటి నీలిపాగల సుడిగుండంలో వడివడిగా విడిపోతున్నది సిరివెన్నెల విరినావ! సుడిగుండపు వడిలో సోలి, పడతి పదేపదే పిలుస్తున్నది అలల లయలతో అద్భుతంగా ఆడుతున్నది గౌతమినది, రంగురంగుల జలకణికలు రువ్వుతున్నది రవ్వలట్లు. పడగ విప్పిన నాగులా నింగినంటిన నీలితరగలో మెరిసి నిలిచిన మెరుపువలె గోదావరీదేవి గోచరిస్తూంది! నడక నేర్చిన మెరపుతీవలా నడిచి వస్తున్నది నాగకన్యలా. ఎదుర్కోలుగా, తనకు ఎదురుగా ఎదుటి గోదావరి ఎగిరెగిరి వస్తున్నది! వడలి వాడిన కలువతూడులా పసిడి పడుచు అదే సొక్కి సోలి గోచరిస్తున్నది గౌతమీ నదీమతల్లి చల్లని హస్తాలతో, సిత పుష్పమాలవంటి చివురుబోణిని గోని గౌతమి అంత, “తన్వి నీది” అంటూ తన్నుచేరి, తన హస్తాలలో వైచి మాయామౌతూన్నది అదే మాయమౌతున్నది గోదావరీ మాత! “తన బాహువల్లరిలోన బందిగా పడి ఉన్న భామ ఎవ్వరోకో...? ముగ్ధ మోహన సౌందర్యవతి ముద్దు మోమున
విడీవిడని కలువ విరిసోయగాల సాగసులల్లిన
అర్ధచంద్రునిబోలు అరమోడ్చు చక్షువులలో-
ఇక్షు ధనుర్ధారి అచ్చు కనిపిస్తున్నది!
“ఎవరికో ఈ లేమ, లేత వెన్నెలల సోన?” అంటూ తను ముఖంలో ముఖం "పెట్టి ముగ్ధ మోహనాంగిని తట్టి, ముగ్గుడై, స్తబ్బడై- .“ఎవ్వరిది? ఎవ్వరిది? ఎవ్వరోకాదిది! తనకూర్మి ఊర్మిళాదేవి! ఘనోర్మిమాల ఊర్మిళాదేవి! పలుకదే! ఉలుకదే? ఒక్కపలుకైన పలుకదే రాణి! అలుక ఏమో తనపై, అతివ అలిగెనేమో తనపై ఎక్కడి అయోధ్య ఇది ఎక్కడి గౌతమి?. ఎక్కడి పర్ణశాల? ఇది ఎక్కడి చోద్యమోమరి, ఇది ఎక్కడి మాయ మంత్రమో మరి”
ఆమె ఎదలో నుండి ఏదో వీజారవంలా వినిపిస్తున్నది.
“నా ఎదలో పూసిన సిత మందారానికి ...
మీ ఎదలో చిందే పన్నీరొలికిన. నాడే
విరిచి విరిచి పలుకుందినా చివురుమోవి
ఆయోధ్యలో నా ముందు అంధకారమే మెండు.
అనుదినము ఈ గౌతమి తీరాల మనము
అర్థరాత్రమునందు- ఈ అడవి మధ్యంలో
అల్లిబిల్లిగా అల్లు అడవి తీవల్లా అల్లుకుందాము” అంటూ ఆలపిస్తూంది అతివ" ఎద అందంగా. తన్నేదో పారవశ్యం ముంచెత్తుతూంది. ఎడదలోనుండి చిమ్మేనులివెచ్చని హాయి, తన ఎదురొమ్ము తాకుతున్నది. ఆమె చెక్కిలెపై చెక్కిలి ఉంచి, చుక్కల లోకం చూస్తున్నాడు తను.
అంతలోనే అకాశం బెదరి ఎదురు పలికినట్టు,
కారు బలిసిన అడివి ఏనుగు ఘీంకారం ఒకటి
అల్గుకున్నది పర్ణశాల పరిసరాలలో!
కలలజాలు అలలపై తిరిగే, వలపు
(ఆ మ వమ తలపుల తరణి తిరుగబడి. దిగ్గున లేచి దిక్కులు చూచాడు తను. చివురుటాకుల శయ్యమీదనించి....! దిక్కు దిక్కున బిక్కుమంటూ కునుకుదీసే కారు కోనల్లో నుండి కారు కోళ్ళవే కూస్తున్నవి. కారు మొయిళ్ళవే అరుస్తున్నవి. తెలతెల్లవారే తరుణం కమ్మి పొగమంచులో నుండి తొంగి చూస్తున్నది. గౌతమో గర్భంలోనికి జాలిగా జారే జాబిల్లి ముఖంలో నుండి, ఊర్మిళాదేవి ఊరిస్తూంటే ఊరికే చూస్తూ ఉండిపోయి పక్కలో నలిగి చెక్కిలి నంటుకున్న పూరెక్కలు దులుపుకున్నాడు సౌమిత్రి జాలిగా!
- ఆంధ్రప్రభ 15-5-66
రపు ఉదయించే సూర్యుడు అరవిచ్చిన అరవిందాలు, ఆముని మకరందాలు వెలుతురు మడుగుల్లో 'జలక్రీడలు” కాంతి దేవత కంట్లో దాక్కున్న పసిడి దివ్వెలు వెతుక్కుంటూ దేవుడి కోట గడియలోకి ఆశాదేవత ముగ్గుల చావడీలోకి కళ్లల్లో కొడగట్టిన వత్తులు వేసుకుని వళ్లంతా ముళ్ల దుప్పటి కప్పుకుని శివం ఎత్తినట్ట్లు-శవం తరిమినట్లు అవురుమనే అమావాస్య సందిట్లో అదిగో మెలికలు తిరుగుతూన్నది శేపటి ఉదయం కోసం రెపరెపలాడే చేచీకటి... అదే మన కటికి దరిద్రుడి ఆశా వాకిలి... నడ్డి విరిగిన అతగాడి పూరిగుడిశెల 'పెరళ్లలో అలిగి వెలగని వెన్నెల బిగికౌగిలింతలో అ కటిక దరిద్రుడి ఆశాశవాల ప్రక్కన ఆ గాజు కళ్లలోనుంచి కారే రక్తపు బొట్లు అతని ఎడారి చెక్కిళ్లను తడుపుత్తూన్నప్పుడు ఏడ్చురాక, ఏడువలేక, వికటంగా నవ్వుతూ నూతీలోపడ్డ కీచురాళ్ల గొంతులో శవాలు ఊపిరి పీల్చుకుంటూన్నట్టు శివరంజని-కాదు..కాదు-శివరంజని రాగమాలపిస్తూన్నప్పుడు పెరటి చింత చెట్టుకు వేళ్ళాడే చిరుగు బొంతల తూట్ల తూగుటుయ్యాలలో ఊగుతూ ముదితనపు పసికందు మూలుగు వేదనతో వడలి నాడి ముడుచుకుని వెన్నంటుకున్న డొక్కల ఎగుర వేతల్లో ఎక్కిళ్ళు పడుతూన్నప్పుడు చెదలు తిన్న అట్ట ముక్కలాంటి అక్కున చేర్చుకుని ఒక్క గ్రుక్కెడైనా ఊపిరి పాయ్యలేని “అమ్మకు నులి వెచ్చని తన కరాలతో ఆ “అమ్మకు కన్నీళ్ళద్దుతూన్నది ఎవరు...? అతడే! కాలం కారు పొగలో చిక్కుకుని నరాలు మెలివేయించుకుంటూన్న రేపు ఉదయించే సూర్యుడు...] - భారతి - అక్టబరు”78
రసోర్మికలు నిన్నటి సంధ్యారాగంలో నాకు ఆమని కనిపించినపుడు నీవు యామినీ లతలా పెరిగి పెరిగి వెన్నెల తరవును అంటిపెట్టుకుని ఉషస్సు కోసం తపస్సు మొదలుపెట్టినపుడు నేను అనుకున్నాను- ఆ మధురయామిని కురిసిన పూదేనియల్లో ఒక అరుణారుణ తరుణం పరిమళిస్తుందని.... కాదంటావా మరి...? కమ్మగా ఒక మాటచెప్పు...! నీ తలపునిడల బరువును మోయలేక నిళ్ళబ్ధంగా నా ఎదలో నింగి ఆవులించినప్పుడు నీ నీలి కలల అలలు సరిగమలు పలికినపుప్పుడు ఆ రసవాహిని గలగలా నవ్వినప్పుడు నేను అనుకున్నాను- ఆరస ర్వురీ ఘఫోషలో నా ఎద కిన్నెరపాడుతోందని.... ఆ వాసంత హేలలోన పసిడి అందె రవళిస్తుందని... కాదంటావా మరి...? కమ్మగా ఒక మాటచెప్పు.... కెంపుల్లాంటి నాలుగు కన్నీటి చుక్కల్లో కటికి చీకటిలాటి నీ రెప్పల కాటుక కలిపి నీ చిక్కిన చెక్కిలి 'కేన్వాసు' పై నీటుగా వేసిన నీ నీడ బొమ్మను చూచి నేను అనుకున్నాను- నీ చలువగుండెలో కాసిని మండుటెండకు నీ గుండెగది తోరణం వాడిపోయిందని.... కాదంటావా మరి....? కమ్మగా ఒక మాట చెప్పు...!
- స్రవంతి - జూన్ 1976
మా తెలుగు తల్లి జయోస్తు! జయజయ జయోస్తు... మా కల్పవల్లికి జయోస్తు.... ఓ సుందర దరహాసినీ ఓ మంజుల మృదు భాషిణీ నవరస నిలాసివీ ఓరస పిపాసివీ.... 1జయోస్తు, గోదావరి కృష్టా-పినాకినీ తుంగభద్ర జఉననదులు ప్రవహించే పుణ్యధాత్రి నవనవ లాడే పైరులు వెలసిన నవ్యధాత్రి వరదాయకమౌ వనరులతో అలరుధాత్రి... ॥జయోస్తు॥ కమ్మని కవితలు సాగించిన కవిత్రయమ్ము నీవారే భక్తి రక్తి ఒకమడిలో నాటిన పోతన నీ వాగే 'ప్రజూకవితలు జాలువారించిన వేమన ఎవరోకాదోయి విమల గొంధర్య్వమాలపించిన త్యాగయ నీవాడ్లే ॥జయోస్తు నీది రాయజలేలిన సీమ్సు రతనాల సీశ్ర కొకతీయులు కళలు కరగ పోసిన పీక పలనాటి బొబ్బిలి-బెబ్బులుల క్రిది స్వ రసికతలు, శౌర్యాల్పు కలబోసిన పెను సీమ 1జయోస్తు॥ కవితలల్లిన మొల్ల-తెలుగ్య శిరమునముల్లె అరివీరుల క్షన్గ పిడుగు-ఖడ్గపాల్రి రుద్రమాంబ మూంచొల, చానమ్మలు తని ఎక్కిన వీరపత్చులు వారి అంశతో జనన కందం తెలుగు వనితలు వేనవేలు... *జయోస్తు॥
తెల్ల దొరల మదమణచగ-రణహోమం చేసిననాడు కరిస్వప్నం, తొలి విప్లవం-అల్లూరి నాడు భరతమాత దాస్యం బాపిరి మన పరాఖభి, టంగుటూరి తెలుగువారి మనుగడకై మరణించెను శ్రీరాములు ॥[జయోస్తు॥ కందుకూరి, గురజాడల కనుసన్నలలో మెలిగినాము దుగ్గిరాల, గిడుగు పిడుగు - అడుగులలో నడచినాము తెలుగుజాతి వెన్నుతట్టి -తెరువొక్కటి చూపించిరి మన అభ్యుదయం సాధించిన అమర వీరులే వారూ ॥జయోస్తు॥ శ్రీశైలం, సప్తగిరి, సింహాద్రి, భద్రాద్రి అజంతా, లేపాక్షి-హంపీ, అమరావతులు ఓరుగంటి శిల్పాల - ఓరగంటి నాట్యాలు విశ్వానికి వింతలై-వెలుగొందెను పుంతలై ॥(జయోస్తు॥ నాగార్జునసాగరం-శ్రీశైలం, సీలేరులు తుంగభద్రాడాము-మన తరుగులేని సిరులు కోనసీమ మాగాణులు-వసివాడిపోని గిరులు మన సింగరేణి గనులు-కురిపించును మణులు ॥జయోస్తు॥ అన్నపూర్ణ అన్నపేరు-ఆంధ్రావని కున్నపేరు తెలుగు పిలుపులో చిలుకును తేనె చ్రీనుకులు తెలుగుజాతిలో పలుకును-మనజాతి తెలుపు జిలుగు వెలుగుతో వెలుగును మన తెలుగు వెలుగు ॥1జయోస్తు॥ ఆ ఆంధ్రప్రదేశ్, మే'76 మా వెన్నెల వాడకురండి
నాకీ వెలుగు చాలు మొన్న వాలిన '్రొద్దుకు యింకా తెల్లవారలేదు నిన్న పొడిచిన చుక్కలకు యింకా నొక్కు రాబేడు “నిశగాని నీలిచెక్కిలి మీద నల్లసిరా మరకలు చెరగతేదు మరకతాల సోయగంతో సోగదేలిన అధోభువనాల ఆడపడుచు అప్పుడే “మంచు బొమ్మలు చేస్తే మగత మగతగా ఉంది అరవిచ్చిన అరుణారవింద వదనం మీద అభ్యంగన కురులు “రంగుల స్కెచ్ గీస్తూన్నాయి మండే సూరీడు కుంపటి దగ్గర చలి కాగుతూన్నది- నేనక్కడకు వెళ్ళాను-మరీ దగ్గరగా వెళ్లాను “నీ కళ్లల్లో ఎల్ట సిరాబుడ్డి పగిలిందెందుకు ? నీ నెత్తిమీద ఆ కత్తుల వలయాలేమిటి నీకత్తుకలో మత్తెక్కిన ఆజీరలేమిటి. 1” -ఆమెనన్నడిగింది - అప్పుడు నేనన్నాను "నాకు సూరీడు కావాలి | నాకు సూరీడు కావాలి 1” ఆమె వదనంలో కారుమేఘం సుడి తిరిగింది ఆమె కళ్ళల్లో రుధిరర్వురి ఉప్పాంగింది- చేతిలోని మంచు ముద్దను విసరింది నా ముఖం కాలిసపోయింది-! మండే ఆ కుంపట్ని నా ఎదపైకి రువ్వింది నా ఎదలోని రుధిరం గడ్డ కట్టింది! ఉలికిపాటుతో ఉక్కిరిబిక్కిరైంది నాకు- నా ముఖం నిండా కప్పుకున్న నీలిమఖ్మల్ దుప్పటి జారింది రంగుల వెంటీ లెటర్ నాగదిలో ఇంద్రధనస్సు వేసింది కళ్లనలుపుకు చూస్తే నా గదిలో “అమ్మ” | వేయి సూరీళ్ళ వెలుగులా నవ్వుతూ నా ఎదురుగా మా అమ్మా |! ఇప్పటికి తెల్లవారిందానాయి నా నీకు ?” అమ్మనవ్వింది! అప్పుడు నాకు అనిపించింది- " చాలు! నాకీ వెలుగు చాలు . కలకాలం నాకీ వెలుగే చాలని
- గ్ర ఎకి, మే76
కలలో కరచిన కాలం
శూన్యం చుట్టూ చూపుల వల అల్లుకుంది, సుడిలో చిక్కిన కడవలా భూగోళం తిరుగుతోంది, నక్షత్రాల నారుని నత్తలు తినివేస్తున్నాయి అప్పుడే అప్పుడే నా కలలో కాలం కాటువేసింది- దిగంతాల్లో దివిటీల్లా చీకటి తెరల్ని చీల్చుకుని
చిక్కుపడ్డ ఆశాకిరణాల
కళ్ళల్లో కెంపు కన్నీళ్ళు మెయుస్తున్నాయి
నిద్ర మాత్రలు తెగమ్రింగిన
నిన్నటి నిశా రాత్రి
పిల్లాడు వేసిన బొంగరంలా
నిలబడి నిద్రపోతోంది
కాంతికి, భ్రాంతికీ నడి యూము
ముహూర్తం ఉన్నదని
చీకటి కాటారుల్లో
“దిగుమతి సిగరెట్టు" కాలుస్తూ “చీట్టాట'డకుంటున్నాయి
కారు నలుపు కరువు దయ్యాలు
తప్ప తాగిన తప్పుడు తనం
తత్త్వం పాడుతుంటే
లయ తప్పకుండా లాస్యంతో
లాలిస్తోంది లా వెక్కిన లంచం
అందుకే. అందుకే నేమో నా కలలో కాలం కాటు వేసింది!
అప్పటి నా కలల్లో
వెన్నెల కొలనుల్లో తెల్ల కలువలు పూసేవి
పాగమంచు పాత్తిళ్ళలో ఒదిగి,
పొదుగు చేసేవి పంట పొలాలు
చుక్కల లోకం నుండి సుధా వృష్టి
కురిసేది సువర్ణ మేఘం కరిగి
నింగిలోని నీలి దర్చణం నుంచి
నీటుగా సుందర స్వప్పం వెల్లివిరిసేది-,
అయితే యిప్పుడు,
నా కలలో నాటిన రోజా మొక్కకి
రోజూ బాల్చ్బెడు చమటోడ్చి పోసి,
దోసెడు ఆశా ఎరువు వేసి
ఎముకల గూటిలో ఉన్న
గుండెలా చూచుకుంటున్నా
ఆ గులాబీలు “ఘుప్పు” మండం లేదు-
పైగా గుంటపువ్వ లేస్తున్నవి .
వాటి గుండెల్ని పిండినా పన్నీటి
రుచిలేదు. కన్నీటి రుచి తప్ప.
ముముక్షువుల్లా మునివేళ్ళ మీద
మౌనంగా ఉన్నాయి మరుభూములు
నడిరోడ్డు మీద నాలుక చాచి
నాగనృత్యం చేస్తూంది నల్ల బజారు
ధరల ఎండను చూడలేక నల్లద్దాలు
తగిలించుకుంది నాజూకు బలసిన కీ నీడ-,
అందుకే- అందుకే నేమో నా కలలో కాలం కాటు వేసింది-,
శూన్యంచుట్టూ చూపుల వల అల్లుకుంది
సుడిలో చిక్కిన కడవలా భూగోళం తిరుగుతోంది
అప్పుడే అప్పుడే నా కలలో కాలం కాటు వేసింది!
- స్రవంతి - ఆగస్టు 1975
అర్ధనారీశ్వర తత్త్వం
అమ్మ అనే రెండక్షరాల్లో అఖిలాండం యిమిడి 'ఉంది “అబల' అనే అందమైన పదంలో సబలత సత్యాన్వేషణ చేస్తూంది. “అమ్మలగన్నయమ్మ ఆ యమ్మ ఆమె అభిల జగాలకే “అమ్మ ఏనాటికీ ఆ కొమ్మ-ఈ సృష్టికే పట్టుకొమ్మ ఆమె గుండె పండినప్పుడు-నిండు పున్నమివిరున్తుందె ఆమె గుండె మండినప్పుడు-అగ్నిపర్వతాలు గ్రులుతాయి. ఆమె గుండె కరిగినప్పుడు-కరుణ రసం జాలువారుతుంది అమె గుండె పగిలినపుడు-భూగోళం పగిలి గ్రక్కలౌతుంది కాబట్టీ ఓ నేస్తం- కాస్తంత యోచించు- నీ మీసంమ్మీద చెయ్యితీసి, రోశాన్ని రొంపిలో పూడ్చి యోచించు తన సర్వస్వంలో సగభాగం అర్చిచిన ఆ ఆదిదేవుని స్మరించి, అర్థనారీశ్వర తత్ప్వ్వంలోని తత్త్వం గ్రహించు, అబల ఈనాడు, సబటే కాదు. ఆమె ఈనాడు - 'సుబలి అన్ని రంగాలను విరియిస్తున్న సుబల- అనాది నుండి ఆమె “'సుబలే- ఈ భూభారం మోస్తున్న భూమాత ఎవరు? నీ చదువులకు పదునుపెట్టే, 'చవులతల్లి" ఎవరు? నీకు సిరిసంపదలు కురిపించే ఆ, “సిరి దేవత ఎవరు? ఈ అభిలాండబ్రహ్మాండాలు నిండిన ఆ ఆదిశక్తి ఎవరు? కాబట్టి ఓ నేస్తం కాస్తంత యోచించి, ఒక్కసారి నీ మీసం మ్మీద చెయ్యితీసి
గు
నీ రోషాన్ని రొంపిలో పూడ్చి,
అర్థనారీశ్వర తత్త్వంలోని తత్త్వం గ్రహించు- ఈమె సంసారనందన వన (ప్రాంగణంలో రంగు రంగుల రంగవల్లికలు దిద్దుతూన్న ముద్దుగుమ్మ ఆమె ఈ సృష్టికే పట్టుకొమ్మ
ఆ కాటుక కంట కన్నీరొలికించకు
అమె కంటి పాపల్లో నీ వదనం చూచుకుని నీ జీవితం పన్నీటి మయం చేసుకో
ఆ అదిదేవుని ఒక్కసారి స్మరించు
ఆ అర్ధనారీశ్వర తత్త్వం
ఆదర్శంగా తీసుకో- ఆదర్శంగా తీసుకో-
ఆాంాంాంంయాాాాాా అమృతం నింపేదెవరు? నీ కారు చీకటిని పిండి వెన్నెల కురిపిస్తానంటున్నారాకరు కాదు కాదు వెన్నెలను చిలికి చీకటినే రప్పిస్తానంటున్నారొకరు యిక అయితే మరి “అమ్మడూ” యికనీ వన్నెలు చూచే వారివరున్నారిప్పుడు కరువు దెయ్యపు గొంతు నులిపి కనకం కక్కిస్తానంటున్నారొకడు కాదుకాదు కనకాన్నే పెనవేసుకుని కరువును పుట్టిస్తానంటున్నారింకాకరు అయితే మరి అమ్మడూ యికనీ కడుపును నింపే వారెవరున్నారిప్పుడు- నీ చావుకి సంకెళ్లు వేసి బ్రతుకును పండిస్తానన్నారు ఒకరు కాదు కాదు బ్రతుకుని సమాధిచేసి చావుకిహర్మ్యం నిర్మిస్తాన్నడింకొకరు డ్ సరలు$ ధాలం్య ష్ అయితే మరి అమ్మడు యికనీ ర జ నల మనుగడ చూచేవారెరున్నారిప్పుడు నా గ్ర 6 సిం మ. లి యింత అర్ధరాత్రి నిద్రలేచావెందుకు? ల లో క నీ, తేజోహర్మం చుట్టూ ఈ నీలిమంటేమిటి? పాదా నవ యు. నీ పారాణి పాదాల క్రింద ఆపాడు పాగలేమిటి? మొ -500 9 ఇది పీడకలా? ఒక పాడుకలా? మత్తు మత్తుగా అరచే ఆ
ాంాంాాయాాాాాాాా కత్తుల కుత్తుక లెవరివి? చిత్తుచిత్తుగా త్రాగిన, ఆ మత్తెక్కిన కుత్తుకలెవరివి? అరవై కిలోల మనిషికి ఇరువై టన్నుల మస్తిష్కం పెరిగింది మరి- అందుకే నీకు “ణే” తియ్యాలని ఒక “౮ అంటే, కాదు కాదు యిక వైద్యంతో పనిలేదని ఒక * ౪ " వాదనలో పడ్డాడిప్పుడు- అయితే మరి అమ్మడు యికనీ మందు సీసాలో అమృతం నింపేదెవరు?!
ాాంంాాయాాాాా ఈవేళ మాకు ఈ పువ్వులొద్బు! పువ్వులమ్మో! వువ్వులోయని పువ్వులమ్మె ఓ వానంతికన్యకా నీ కన్నులెందుకు 'కెంపులయినవి నీ వన్నెలెందుకు రంగు తరిగెను? -ఈవేళ మాకు నీ పువ్వులొద్దు జిగిలేని ఆ నవ్వుల పువ్వులొద్దు యివ్వాళ మా, కోవెలకులేచి గుళ్ల విందు పడదు- ఇప్పుడు అ ఎల తుమ్మెద నీ పూదేనియగ్రోలదు- నగిషీ గ్లాసులో మిగిలిన నిషా చుక్కలు చప్పరిస్తుంది- ఇప్పుడు మా మనుష్యుల ఎదరాపిడి పిడుగులలో “పన్నులి భారంతో ఆ పన్నుల వెన్నువిరుగుతోంది నీలాకాశం నిండి నిప్పులు కురుస్తున్నాయి సెలయేళ్ళలో శవాలు పయనిస్తున్నాయి అందుకే-మరి ఏదీ ఎక్కడుందీ వసంతం చెట్టు చిగురుస్తే అది వసంతమా? నీ విరులు విరిస్తే అది వసంతమా? మరి మామోడు వారిన ఎదలకు చివురులు వెయ్యెదామరి! మా బండి గరుకలలకు రంగులు విరియెద్దామరి యిప్పుడు (ప్రతి ఇల్లిల్లూ తిరిగి చూడు ప్రతి యిల్తాలిని అడిగి చూడు- తెల్టారి లేస్తే ప్రతి యిల్లాలితో చల్తారిన పాయ్యి సమ్మె చేస్తుంది- ఒకటిపోయి యింకా మూడైనా రాలేదు- ముష్టి మూడు వేలు మూజ్ఞాలైనా నిలవలేదు- అప్పుడే “అప్పులస్వామి” కోసం ఆరాధనలు మొదలవుతాయి!
ాాాాాాడాాాాా ఈ ధరల ఎండలు మా జీవితవు గొడుగును చీల్చి మానడి నెత్తిన నాట్యం చేస్తున్నాయి నవ్వుతూ అందుకే- మరి ఏద వసంతం? ఎక్కడుందీ వసంతం! చెట్టు చిగురిస్తే అది వసంతమా? మరి నీ విరులు విరిస్తే అది వసంతమా? మామొోడు వారిన జీవితాలకు చివురులు వెయ్యెద్దామరి- యిప్పుడు ప్రతియిల్త్లాలిని అడిగి చూడు- వాళ్లకు నీ పువ్వులు కొనే తీరికేది? కొప్పులో తురుముకునే కోరెకేద్- “చంటాడు చంక దిగడు మా బుజ్జి బజ్ఞుకోదు మా పాపకు పాలు కలపాలమరి బాబిగాడేమో బట్టలు లేవని గోల. చిన్నది చీరలు లేవని చీత్కారం మొదలెట్టింది అమ్మో! మా అమ్మడు అప్పుడే “ఆకు మీద కూర్చుంది" బాబోయ్! మా 'బేబికి' మళ్లీ ఓ బేబీ ఆట! చిన్నమ్మకు ఈ సంతో సీమంతం చెయ్యాలి మరి- అమ్మో! నాకు మళ్లీ మామిడి పిందెల మీద మనసు పోతుందేం ఖర్మ! = యివే వింటావు - యివే కంటావు ఏగడప త్రొక్కినా ఈ గుడ గుడలే వింటావు అందుకే ఈ వేళ మాకు నీ పువ్వులొద్దు- చెట్లు చిగురిస్తే అది వసంతమా? విరులు విరిస్తే అది వసంతమా? మా మోడు వారిన జీవితాలకు చివురులు వెయ్యెద్దామరి,
లాలా 2క సగటు మనిషి-వెగటు మనిషి ఎదనిండుగా నవ్వి ఎన్నాళ్లయిందో కంటినిండా కమ్మనికలగని ఎన్నాళ్లయిందో మండుటెండకు ఎండే నిండు పూరేకులా అడకత్తెరలో అణగిక్కూర్చున్న పోకముక్కలా కొడిగట్టిన మసి దీపవు కొసవెలుగులా కోటికోడె నాగుల పడగ క్రింద శ్రీనీడలో ఒకచోటు చూచుకు బ్రతికే సగటు మనిషిని నేను-అదే ఒక రకపు వెగటు మనిషిని. నాకూ “అతని'కీ మధ్య పెద్ద అఘాతం నాకు 'ఇతని'కీ మధ్య శుద్ధ విఘాతం అతని నివాసం చుక్కల నంటే రెక్కల పర్వతం ఇతని నివాసం దిక్కులు వెదికే మొక్కుల పర్వతం మరినాకో? ఈ చుక్కల దిక్కుల మధ్య మొలచిన చిక్కని చిక్కుల పర్వతం! ఆకలంటే తెలియదంటాడు అతడు మరినేనో? ఆ తెలుపు నలుపు పూసుకుని తెల్లబారిన కనుకోరికలతో రెపరెపడలాడే సగటు మనిషిని నేను- ఒక రకపు వెగటు మనిషని! నా ఊహల ఉషనుకు రెక్కలు మొలిపించుకుని రేపటి ఉదయం కోసం చీకటితో పేచీ పడుతు దోసెడు కన్నీళ్లల్లో- మరో దోసెడు ఆశారుధిరం- కలిపి నా గుండె గదిలో మండే మూస కొరిమిలో కరిగి, నా ఊహాల ఆశల అరవిందపుట చ్పులో పోసి, నా ఊహాల హర్మం వొకి ముంగిట రంగు రంగుల ముత్యాల రంగ వల్లికలల్లుకుందామని- ఆడుతూ పడిగాపులు పడుతూ మేల్కొన్నా, నీలాకాశంలో ఊరికే ఉల్కలు రాలటమే గాని, దిగంతాల్లో దివ్యోషన్సు దిక్కు కనిపించక బిక్కుమంటూ బిక్కమొగముగు వేసుకుని (బతికే వెగటు మనిషిని-అదే ఈ తరపు వెగట మనిషిని.
కన్నెమనస్సు
వెన్న వంటిది కన్నె మనసది వెన్నెలంటిన వెచ్చనగునది- మురిప మనిమెడ్సి చివురు లెత్తుతు మరుల విరులను విరియుచుండును ఇక్షు ధనువును పిండి తీసిన
గోరు వెచ్చని మధుర రసుములు గుండె గదులో నిండి యుండును పొగలు సెగలను రేపుచుండును నింగి నీలపుచెదల లోపల
పండు వెన్నెల పరచి యుండును మొగిలి పాత్తుతో పాత్తు కలుపుకు కెరలు తెరలుగ పరిమిళించును కలల అలలో మునిగి తేలుచు వలప్పు పురిగల తలపులల్డుచు కమ్మకమ్మని బొమ్మలెన్నో చూచుచుండుని రంగుటలలో మంచు ముత్యములొలక బోసిన కన్నె తామర పూల శేక్షద్ది.
కొలను పైగల అందేమేగని, కొలను లోతులు కొలువలేనిది
"వెన్నె వంటిది కన్నె మనసది వెనెలంటిన వెచ్చనగునది
దరహాస నుందరి నీ అధరంపై పూల రధం కదులుతోంది నీ వదనంలో వానవిల్లు వెలుగుతోంది- -ఎవ్వరికోసమో నీ ధరహాసము ఎందులకోసమో నీ మధుహాసము
నీ సన్నజాజి నాసికపై
సంపెంగలు పూసినవే?
పాలనురుగు పరువంలో
నీ దోర వలపు మెరిసినదే?
నీ కెంపు మోవి సాంపును
కొంచం ఎరువిస్తావా సఖీ
నా ఎదలో పూసిన మళల్లెకు
ఆ రంగు వేసుకుంటానే చెలీ!
ఆ ఇక్షు ధనురార్ధరినలా
నీ చక్తువుల్లో దాచావెందుకు
శిక్షో-అది లేక కక్షోమరి-
ఆపేక్షతతో అన్నానే ఓ మది రాక్షి!
నీ చెక్కిలిపై చందమామ చలువున్నది- నీ నడలకు తెలిమొయిలు హోయలున్నది
నీ పాటలలో పువ్వుతేనె పారుతోంది
ఫీ ఆటలలో అట వెలది అగుపిస్తోంది-
వాసంతహేల హేమంతల చిలికిన తుషారాంమృతంచింది, మత్తుగా, గమ్మత్తుగా వనరాణి కనులు విప్పినది. శశింధాటికి “శిరోజాల” చిక్కును రాల్చి లేత చివురంచు చిలుక పచ్చని చీర సింగారించినది నునులేత పూరేకు షోకు చెక్కిళ్లు ముద్దుకున్న రసిక వాసంతరాయుని మోవిముద్రల్లాంటి మోదుగు పూలు విచ్చినవి వన్నెల వన రాణి మోమునిండ- కెంపు చివుళ్ల సొంపుతో వన కన్నెల విరి వాట్టెడ సిరుతో అడవి పులకించి నవ్వినది. అడవి దేవత అందమండటిని తెలుగు తీయదనం వలె తేనె చిందుతూన్నది ఈ నవ వాసంత రుణాన, ఈ మధుమాస పరువాన రుంకారం మ్మాని నాజూగ్గా నడక నేరుస్తూంది.... తెనుగు కానన కొండ సెలఏటి కొంటెపిల్ల... తల్లి ఒడి విడచి, పూసుకు తిరుగుతోంది తుంటరి “గ్నాపిల్లగాణ్ని” గారాబు పూదుమారమ్ము గుబురు తోటల వెంట, పూల బాటల వెంట. పల్లవామృతం గ్రోలి, కర్ణామృతంలా నాంది పలుకుతోంది కోయిలమ్మ తెలుగు నుడికార రూంకార మాలపిస్తోంది బ్రమరబాల
- ఆంధ్రభూమి వీక్షి - 10.4.97
నిశాపాంభథుడు తిమిర వియత్తల కుహరమ్ములోన స్వర్ణారుణ వర్ణచిత్ర మేఘమున నీలితటిల్లత కాంతి రురిలోన నిలచి నిలచి ధరిత్రిపై రాలితిని, -ఎవరునీవు .? కనుపించరావేమి కన్నులారగ నా కన్దోయి ముందు శింజనీరవనాద తరంగములోన మంజుల మృదుల నీలిచ్చాయల వెనుక ఆ నిశరాత్రి మదీయ మందిరముచొచ్చి మమత పూసిన విరులు మైోలరాల్చిదతివి -ఎవరు నీవు. ? నా ఎదలోనె దాగి ఎంత వెదెకినను నా ఊహకందరావు |! కుపిత సాగర గర్భమ్మునందున సుడులు రేపిన నీలి పొగలలోన నిమీలిత నేత్రద్వయమ్ముపైన తారలను పొదగి దర్శనమిచ్చినావు . _ ఎవరునీవు ? నా వెనుళతట్టి లేపినావే. ? కనుపించవేమి నా కనుల పడిముందు అ నిశరాత్రి వెన్నెలను చిదిమి నా ఎదలోని దీపమ్ము వెలిగించినావు శ్వేత మత్తేభమ్మువలె ఏకెంచి తారాపధంపుతటుల చూపినావు _ ఎవరు నీవు..? నా ఎదురు పడవేమి ? ఏ విశ్వాంతరాళ నిశాపొంధుడవు నీవు ?
- స్రవంతి, మార్చి5
తూపు ఆతని సిర కన్నుల భగవంతుని కోవెలలున్నువి ఆ కోవెల లలోన నిర్పాగ్యుల జీవన జ్యోతులున్నవి ఆతని మాటలలోన మృదు మంజుల అలలున్నవి ఆ అలలకు సుమధుర సంగీతపు లయలున్నవి ఆతని టియు నవ్వులలో ఎన్నో సిరులున్నవి ఆ సిరి సంపదలో అతని ఎదదాగున్నది. ఆతని మోహన మూర్తిలో సమ్మోహన రూపమున్నది- ఆ రూపంలో శాంతి దేవత అంశమున్నది అతని అత్మకు రవితేజం తోడున్నది ఆ తేజంలో నవ భారత మిముడున్నది-
లా ఆసడానాము-----------
తవాఫ్ అల్లూలి పులి (యన్యదొరలు పాడుకునే పాట)
పులి బిడ్డవు మహరాజా- ఓ అల్లూరి పులి - రాజా పులి పంజానీ దెబ్బ - భళి భళిరే- ఓ యబ్బా దండమయా! దండ మయామన్నె దొర
గుండె బిగువు- కండ బిగువు ఉన్నదొార- తెల్లవాడి గుండెల్లో - తెలుగు వాడి ఈటె గ్రుచ్చి మన్నె దొరల దేవుడవై - మా పాలిటి రాముడవై ఆకతాయి దొరగాళ్లకు - అడవి సింగమైనావు. తెలుగు తల్లి మెడలోన- ఓ మల్లె మాలవె నావు, తెల్గోని గద్దెదింపు - యుద్ధమే చేసినావు. విల్లంబులు చేతబట్టి- విద్దెలన్ని చూపినావు భూమాత బంధాలను- తెంచుటకే తెగించావు. వీరయోగివైనీవు- వీరన్వర్గమేగినావు
అల్లూరి పేరు వింటె- వెల్లువయ్యె గోదావరి వెన్నెలంత మాటు మణిగి- చీకటయ్యె రహదారి చెట్టు, పుట్ట, గుట్ట కూడ- నీ కధలే చెబుతాయి ఏ దారిన వచ్చేవో - అ 'ఎంగి'లోని ఎముకలిరవ- నిండు చందమామ లాటి - నీసేతే నిన్ను తలచి, నీ కోసం తపస్సు చేసి - నింగిలోనె కలసినపుడు
నీ గుండెలో ఆప్రేమ మూర్తి- నిండి పోయేటందుకని,
రామరాజువల్ల - సీతారామరాజువైనావు 1
పులి రాజులు నీ తోటి - చెలిమి కలిపి తింగేవట!
పుట్టలోని పాముక్కూడ-పడగ బట్టినిలిచేదట
కొండలలో కోయంటె - 'ఓియని పలికే వట!
ఓం కారం-ఘీంకారంతో- అడవంతా అడలేదట
మా పిల్లాపాపకు - నీపేరే పెట్టుకుంటాం-
నీ పటమే మాగుడిలో పెట్టుకుంటాం
తెలుగు వాడి గుండెల్లో - మా మన్ని దొరల గుండెల్లో
నీ రూపే నిలుస్తుంది - నీ పేరు మైగుతుంది- స్రత్వత్రీ స్వీయ కవితా మంజరి)
ఉట కొమ్మలు పూలభారమున కోటి మబణుల్ శిఖ దాల్చుకొన్నలే6 గొమ్మ లతాంగి యోయనగ, గోములు చిందగ సిగ్గు లొల్కు, యా కమ్మని హావముల్ యదను (గ్రమ్మగ, సుందరమౌన వోఢ రా రమ్మను సైగలో కురియు రాగ మదే మొవరాలు చిందగాన ఉ ఆమని వేళలో మధురహాసము డోలికలూగగా నుధా కోమల భావనారసమ్ము కోరిన నవ్యలంకురించగాన్ కాముని చూడ్కులో కనకకాంతులు చిందెను గోముగా, అదే రామరసోదమో విభవరంజిత శ్రీకర శోభమోకదా |! సీ _ ఎవ్వరేర్చ్పరచిరో ఈ చిలుక పచ్చని పందిళ్ళు గగనాన పసిడిగురియ ఎవరు తురిమినారో ఈ వన కన్నెల 30 జండలలో రతనాల చైత్రమాల ఎవరు నేర్చించినారో ఈ సెలయేటి సిరికి లలిత చలితనట; లయలహోయలు ఎవ్వారికల్పనో ఈ వసంతోద్బవ హేలా వినోదము లిలగూర్చ తే॥ తీ॥ డెందమానంద గిర్యగ్రినందె విమల 'ప్రకృతికాంతవీడి, శిరమ్మునంచి, అమర భావనా తరంగమ్ములో భగవదంశ గాంచి పులకింతు దివ్యత కనుల మెరి !
- ఆంధ్రపత్రిక, 30-3-87 ఇ మా వన్నెల వాడకురండి
చిక్కని అడవిలోన చక్కటి కొల నున్నది ఎక్కువ తామరలె - ఒక్కతె కలువకన్నె “అక్కలు” చెడ్డవాళ్లు ప్రక్కకు రానీయరు!। ఒక్కతె ఆడుకొనును చక్కగ పాడుకొనును దినకరుని చురచురకు కనుమూత పగలంత రేరాజు రేయండ రారాజు పూదండ! తుం నిండు పున్నమినాడు పండు వెన్నెల తేడు కొండ చాటును దాటి పిండార బోశాడు చిలిపి నవ్వును చిలికి గిలిగింతలను పెట్ట చలువ వెన్నెల చిందు చందమామను చూచి కలువ కన్నెకు మనస్సు పులకరించెను చాల కలవరించెన్స బాల- పలవరించెను చాల! కలువ కన్నె కెదలోపల చలువ వెన్న చిలికె 'మ్స్వ్వు? సాక్కి సోలి కలువ పువ్వు చక్కనైన కలగన్నద్రి పాల నురుగుల మబ్బు జారి క్రిందకు దిగెను వేడ్కతో కలవమ్మ జడనిండ పూలల్లి జడకుచ్చులను బెట్టి, జలతారుపైటంచు మల్లెమొగ్గల రంగు తెల్ల కోక్రన్సు గట్టి ఎట్ట బుగ్గల కాంతి చిణునవ్యుగా వెలుగ,
న అక
తెలిమబ్బు పడవపై తేలిపోతూ కలువ మెల్ల మెల్లగ చేరె చంద్రలోకంలోకి!
తారకాంగన లంత తరలి వచ్చిరి ఎదురు
బెదురుతూ కలువమ్మ ఎదురు చూపులు చూడ
చందమా మెదురేగి దరహాస చంద్రికలు
కలువపై ప్రసరింప, సిగ్గు బరువున శిరము
మెల్ల మెల్లగ పంచె- వాల్గనుల వంపులో
ఆగె-ముత్యములట్టు ఆనంద బామ్బాలు
మాట మతియును లేక పారవశ్యము జెంది
స్వామి పాదద్వయము తడిపె కన్నులతోటి!
“చెలి లేవె కలువమ్మ! కలువ కన్నుల గుమ్మ
రాజివే యిటనుండి, రాణిపై రాణివే”
అనుచు ,వున్నమజేడు చనువుగా పైక్లితే
పులకరించిన కలువ కులుకు పొంగుచుంగ
శిరము మెల్లగ నెత్తి చెలుని కన్నులలోకి
తనివి తీరగ చూచి హృదయాన నిదురించె! కాకమ్మ బాకాలు, లోకాల మేల్కొలువ తూర్పుదిక్కున ప్రొద్దు తురతురామని ఎక్కె; కలువమ్మ మేల్కాంచి వళ్ళంత విరుచుకొని, “కలగంటి గాబోలు-కల నిజనునుకుంటి! కొలను కాపురమింక దూరమేయనుకొంటి!” అనుచు కలువమ్మెంతో వలవలా ఏడ్బింది! కొంటె సూర్యుని చూపు సూదులైతగలంగ; ముఖమంత ముకుళించి మూతి విరచెను కలువ!
పల్లె పిల్ల నీకాళ్ల తోడాల యింపయిన చప్పుళ్లు నీచేతి గాజులా గలగలా చప్పుళ్ళు మరువలేనే పిల్ల! మరచిపోదామన్న లేతాకు పచ్చపై లేడికన్నుల చీరె పండుమామాడికాయ పసిడి పైటంచు బిగువైన రవికపై మిసమిసాలాడంగ, గుసగుసాలాడెనే నామనసు నీతోటి! చెరగినా పాపిట్లో చెదరినా నీ జుత్తు గిరగిరా తిరిగెనే చిరుగాలి తరగలో నీ చెవుల దుద్దులా తెల్లరాళ్లాకాంతి అలసి నా చెక్కిళ్లు నదుముకొని ముద్దాడ, అడిగెనే నా మనసు వ్యధతీర్చ్పమనుచు! నీరెండలో మెటిసె నీ ముక్కుపుడక నిగనిగాలాడిందె నీ నుదురు చెమట పాలములోనూ పాట పొందిగ్గ పాడావు పాటలో భావాలు పరుగు పరుగునరాగ, భావించె నా మనుసు భావాలు నాకనుచు! అలసి అలసీ నీవు అప్పుడే కటక, అల్లరిగ చూసెనే నీ వలపు కళ్లు! అలసినా నీ కళ్ల అందాలు పోలేదు, అలపులో నీ కళ్లు అందమే నాకు! నీపైన మనసుతో నిన్నడిగితే, నిలచి చూచీనీవు గిరుక్కునా తిరగంగ, కొరకొరా చూసిందే నీ కొప్పుపువ్వు! కోపమెందుకె ఛామ! కోరితే నిన్ను?
- వినోదిని, జున్ 54
వన్నెల మడుగులు గగానానికెగసాయి రంగారువిరులు గలగలా రాలాయి బంగారు మణులు ఏటేట వచ్చేటి కన్నుల్ల వెలుగు మాయింట కొచ్చింది వెన్నెల్ల మడుగు మాయింటి వాకిట్లో చిరుమల్లెచెట్టు విరబూసి విరుటలెల్ల విరజిమ్ముతోంది. వడివడిగ రారమ్మ వడినింపుకొాందాము వేవేగ రారమ్మ యెదనింపుకొందాము మాయింటి ముందెన్నా మాణిక్య్కలతలు మామేడ మీదొక్క వజ్రాల మొలక "పెనవేసి కలవేసి పెరిగి పూసింది రంగు రంగుల పూలు రతనాల పూలు! జలజలా ముత్యాల వాన కురిసింది పగడంపు రవ్వలా జల్లు విరిసింది వెలుగు-వెన్నెల వెలుగు ఏరుపారింది కటికి చీకటిరాత్రి పరుగులెత్తింది 1!
- ఆంధ్రప్రభ, 19 10 60 మా వెన్నెల వాడకురండి
పాప
సెలయేటి కెరటాల
గల గలల రవళివతె నీటి మేఘము కురియు నీటీ తుంపరుల వలె
-నవ్వెలా నేర్పావు ?
నువ్వెలా నేర్చావు ళ్గి చుక్కల్లో రేరాజు బిక్క మొగమును వేయు మల్లె మొగ్గకు సిగ్గు వెల్లు వలె రప్పించు
-చక్కదన మెక్కడిది. ?
సామర్థ్య మొక్కడిది ? “కొయంటె, “కొ యంటు కొమ్మపై కోయిలను సామ్మసిల్లగ జేయు కమ్మ కమ్మని రాగ
-మెన్నాళ్లు నేర్చావు ?
ఎన్నాళ్లు నేర్చావు 9
- ఆంధ్రప్రభ, మే'55్
అరాలు ళా మీ గుండె గడియారం పన్నెండు కొడితే సగం ఎండిందని అర్థం మీ నరాల గిలిగింతకు పలితకేశం ఫక్కుమంటే మీ కోడెకారు శొంటెతనం కొండెక్కుతోందని అర్థం మీ తలలో మెలికల నుడి అల్లిక మొదలయితే మీ తలపుల తలుపులకు తాళం పడ్డదని అర్థం మీ నిలువుటద్దం ముందు మీ కళ్ళే మిమ్మల్ని వెక్కిరిస్తూంటే మీ కంటిపాప రంగస్థలంలో మెరిసే ఆ రంగు దీపాలు ఆరినవని అర్జం మీలోని “దైవం' నిద్ర మేల్కొని “నింగిలో నీలిమే నీ" వని చెబిలే “నీ నా మంత్రజపం" నీడలో నీదన్నది పట్టెడు చోటేనని అర్థం |! ఎ అంధ్రజ్యోతి, 3370 చూ వెన్నెల వాడకురండి
రేపటి పౌరులు ప్రతి బాలుని కన్నులలో ఉన్నది ఒక ప్రగతి పధం ప్రతి బాలిక వన్నెలలో ఉన్నది ఒక కాంతిరధం. రేపటి పౌరులు మీరు శేపటి పాలకులే మీరు స్వతంత్ర భారతి ఒడిలో పెరిగే స్వతంత్ర భావనా తరంగ డోలలు మీరు విశ్వమాతనందన వనంలో చిగురించే చిగురుటాకులు మీరు. -ఇప్పుడు గతుకులప్పె, అతుకుల రధం నడుస్తోంది దాని అతుకుతీసి, చప్పటి బ్రతుకుల గతుకుతీసి మల్దెల బాటలపైై, మళ్లీ ఒక క్రాంతి రధం నడపండి నవసమాజ నిర్మాఖానిక్షి నాందీవచనం పలకండి ఉత్తర దక్షిణ అభాగ్యుతులకు ఒకే విస్తరిలో వందు చేయండి పటి! పాక్సశ్చి మాల వెలుతురు బక్త దివ్వెలో పాదగండి . రేపటి ఇదిగో! నేస్తం, ఒక్ష వౌస్తవం చెబుతాను విను- అదిగో మనమళల్లెల పాదలో దాగున్నది నల్లధనం కొల్లలుగాతిన్సి, తెగబలిసిన చిజ్సుత్రప్పలి ఎందరో బడుగుల జీవితాలు, దాని కెల్లని కోజక్రు బల్రి ఉత్తుత్త బెదరింపులనది _ చెత్త కుప్పలోక్షి తోస్తుంద్సి మత్తెక్కిన దాని మదం -_ మీ మర తుపాక్సులే తీర్చాలి ॥రేపటి॥ ఇదిగో! నేస్తం, ఇట్టుచ్చూడ్సు బ్ర మూల ఎవరిదా గోడు! తోడూ, నీడా కూడు, గూడూ లేక్ర్సుండ్రా గోడు 'గోడుమని శృతి స్వీయ ఇవిన్షా మంజరి
గోలపెడుతున్నదా - ఎముకలగూడు
అటువంటి వాడికే - నీ తోడు కావాలి
అటువంటి వాడికే - నువ్వో గూడు కట్టాలి
అటువంటి వాడికే - నువ్వోక గాడుగుపట్టాలి 1రేపటి॥ అదిగో! అటుచూడు - అతడు ఒక మహామామానవతా వాది అతని పూజామందిరంలో - పెద్ద గాంధీ పటం అయితే - అతని శయ్యమందిరంలో “పెద్ద బ్రాందీ ఘటం! ఆగటాల, ఘటాలు పరాపంచలు చెయ్యాలి మీరు ఇది వయస్సు మళ్లే సమాజం - మీది వయస్సు త్రుళ్లే సమాజం నేపటి పౌరులు మీరు - రేపటి పాలకులే మీరు క్రమ శిక్షణ మీకు రక్ష - అక్రమ శిక్షణ మీకు కక్షలు కాదు మీకు పరీక్ష - త్రొందరి క్రమ శిక్షణీ మీకు రక్షణ లెండి! లెండి! నవనవోన్నిర్హిత - నవ్యతభావనామిళీ దివ్యపధం వెదకండి ! -దేదీష్యంగొ వెలగండి |!
_ తెలుగు విద్యార్ధి: డిసింబరు'79
ళ్ విద్యార్ధి! ఓ విద్యార్థి 1 “భావితరాల వరాల పౌరులు మీరు భరతమాత ఒడిలో పెరిగే పసిమొగ్గలు మీరు మో కళ్లల్లో భరతమాత ఆలయమున్నది మో వదనాలలో శాంతి దేవత నిలయమున్నది మో పలుకులలో విద్యాదరి పసిడి వీణారవమున్నది మో చేతులలో చామంతులు బాటలున్నవి అవే మన భావితరాల కోటలవుతవి”
- మల్లె పువ్వుల్లోని తెల్లధనం, ఎజ్జ గులాబీలోని చక్కదనం, మందారంలోని మెత్తదనం, అదే మీలో తరగని ధనం ఇది నేనంటున్నది కాదు. మన “చాచా' చెప్పిన మాటలు ఉత్తుత్త మాటలు కావవి ఉత్తమోత్తమ బంగారు బాటలనవి | ఇప్పుడు మీకు కావలసింది సచివాలయం కాదు మహోన్నత శిఖరాల మరో ఆలయం ఉన్నది అది మనిషిని మనిషిగా దిద్దే మహాలయం అదే మున అందరికి పూజ్యమైన విద్యాలయం -మోకిప్పుడే రాజకీయాల చిక్కులెందుకు ? మోకిప్పుడే రాచరికపు మెప్పులెందుకు 9? మో రా రొంపిలో దిగకండి.... మో రా కంపులో పడకండి..
ఇది నేనంటున్నది కాదు / మన “చాచా చెప్పిన మాలు ఉత్తుత్త మాటలు కగం ఉత్తమోత్తమ బంగారు బాటలు నమత-మమత మన లక్ష్యం ఘనత - జనత మన ధ్యేయం శౌర్యం - ధైర్యం మన ఊపిరి తెలివి - బలిమి మన (ప్రాణం కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంది చీకటి ముచ్చు వళ్ళు జాస్తే కళ్ళు తెరుస్తుంది అకలి చిచ్చు ..! మీ పుస్తకాల్లో కెక్కిన - మీ కలాల్లో బంధించిన ఆ విజ్ఞానామృతపథం-అదే మహాకాంతి రధం .. పరీక్షలు లేవని మురవకండి మీ జీవితమే ఒక పరీక్ష- యక్ష ప్రశ్నలను తలదన్నే శఎకప్రశ్నలున్న పెద్ద పరీక్ష ఆ అక్షరాల్లోని ఇక్తురసం మీ చక్తువుల్లో చిందినప్పుడే- అప్పుడే మీకు రక్త - అదే భావితరాల తరాలకు “లక్ష వరాల రక్త .! ఇవి “చాచా ” చెప్పిన మాటలు కావు ఇవి నేనంటున్నది ! నిజంగా మీ భవితవ్యం కోరే నేనంటున్నది-ఒజ్జగా బుజ్జగించినేనంటున్నది! _ తెలుగు విద్యార్థి
ఏమి చేద్దాం చంద్రబింబం జారిపోయి, సూర్యబింబం కాలిపోయి చక్కలన్నీ ఒక్క పెట్టున తుప్పులా మసిబారిపోయి కొత్త చంద్రుడు, కొత్త సూర్యుడు కొత్తకొత్తగ పుట్టుకాస్తే, చుక్కలన్నీ చిగురువేసుకు చిక్కచిక్కని గుబురులైతే పచ్చపచ్చని , వెచ్చవెచ్చని దివ్యకాంతులు చిమ్ముతూంటే నవ్యపదములు చూవుతూంటే నింగిపై కెగచూచి వింతగ కళ్లు చాలక తేలవేస్తూ తిరిగి పాతవె కోరుకుంటూ మూల చీకటి కోనలోపల కుక్కిమంచపు గూనిలోపల చేరగిలబడి చివుకు ముదుసలి నాయనమ్మల భోరుమంటే ఏమి చేస్తావు? ఏమి చేస్తావు?
- ఆంధ్రప్రభ వీక్లి 25 167
ఏమిటందము? మండు టెండకు ఏమిటందము నీ రెండ కన్నెగ మారుటందము మొండి చీకటి కేమిటందము వెండి వెలుగుగ మారుటందము ముండ్ల పాదలకు ఏమిటందము విరుల పాన్పుగ మారుటందము కారు మబ్బున కమిటందము తేనెవానలు కురియుటందము ఎండు మోడున కేమిటందము చివురులెత్తుటె దానికందము పీడకలలకు ఏమిటందము రంగుటలలుగ మారుటందము పెంకి పాపకు ఏమిటందము మంకు వదలుటె మంచి అందము చెడ్డ బాలున క్రేమిటందము దొడ్డవానిగ మారుటందము = ఆంధ్రజేళ
టాం పరంపర ఎలుగెత్తిన నీ నాదంతో నలు పెక్కిన నీ ఖేదంతో ఇట రోషం పెరుగును బిక శేషం మిగులును కరుకెక్కిన నీ జాలంతో గరుకెక్కిన నీ గాలంతో ఇట మానం చచ్చును అట మీనం వచ్చును పొగరేగిన నీ భావంతో 'సెగలారని నీ జీవంతో ఇట ద్వేషం బూరును అట శుష్మం బాడును నీ విడచిన నిట్టుర్చులతో నీ వదలిన వడగాల్పులతో ఈ లోకం రగులును పై నాకం వెలుగును .।! = స్నేహలత, 9-60
ఇతేరువరి గ్రహాల పైన గృహాలు కడదామని చుక్కల చెక్కిలి పైన మక్కువ పెరిగిందని చందమామ చల్ల దనంలో చల్లని నీడుందని ఆకాశం పొలిమేరల్లో అమృతం కురుస్తోందని అందాకా నీ పయనం, యీ పరుగు లెందుకు తెరువరీ? ఎన్నటికీ ఆకాశం నీ సందిట్టోకి రాదు-సాగర గర్భంలో నీ సోలిగూడు నిలువదు రోదసి శూన్యంలో రోజాలు ఘుమాయించవు రోజూ అయ్యే సూర్యోదయంలో ఏ మోజూ లేదనుకోకు నీ ప్రక్కనే వున్న నిజం నిగ్గులు తేలుతోంది నీలో నిదురిస్తున్న నిటలాక్షున్ని మేల్కొలుపు నీ మస్తిష్కపు మాయాజాలం ఈ మత్తెక్కిన మానవ పులుల పంజాలపై విసురు మనిషికీ మనిషికీ నడుమ - మమతల వంతెన నిర్మించు ముందు మన భూ గ్రహంలో మనుగడ సాధించు మంచికీ మనుగడకు నడుమ - మంచె వేసి వంచన రాకుండా చూడు ఒక సామాన్యుడి మాన్యంలో మాణిక్యాలు పండించు మరొక దరిద్రుడి ఆశాకోవెలలో ఆరని దీపాలు వెలిగించు
ఎ విద్యుల్లత
ఎందుకు?
హే! భగవాన్! ఒకని ఎడదకు వెలుగు లెందుకు? ఒకని ఎడదకు అలుగులెందుకు- ఒకని పాన్చున పువ్వులెందుకు ఒకని పొన్పున రవ్వలెందుకు? ఒకని కనులకు అమర మెందుకు ఒకని కనులక్రు తిమిరమెందుకు? ఒకని వొక్కున పురుష మెందుక్సు? ఒకని వాక్కున పరుషమెందుకు? ఒకని అధరమందున మధుర మెందుకు ఒకని అధర మందున రుధిరమెందుక్సు. ఒకని గళ్వ్స్వ హార మెందుకు ఒకని గళమున్ల భార మెందుకు] ఒకని ప్రధమ సొంపులెందుక్సు? ఒకని పదమ్సన్స వంపు లెందుక్సు?
గ్రేత్మక్రి స్వియ కవితా మంజరి
ఫూతోటలో రాణి (నృత్యరూపకం) (అది ఒక పూదోట - అనేక పూల కనువిందు చేస్తుంటాయి - రాణి పూదోటలో ప్రవేశించింది పూలన్నీరాణికి స్వాగతం పలుకుతున్నాయి) స్వాగతం సుస్వాగతం అందాల రాణికి స్వాగతం అరవిందాక్షికి స్వాగతం అనంద వాణికి స్వాగతం అదినీల వేణికి స్వాగతం ॥స్వాగతం॥ చరణం రంగుల రంగుల పువ్వులము ఎన్నో రకాల పూవులము కనులకు విందులు చేయుచు పరిమళాలనే పంచుదుము ॥స్వాగతం॥ గులాబి రాణి ముందుకొచ్చింది- గులాబీని నేను - ముద్దుల గులాబీని నేను ఈ తోటకు నేవే అందాల రాణిని “ఘుం? ఘుం” మనే గుభాళింలేతో “ఘం” మెత్తించే అందాల గుమ్మను నీ నల్లని వాట్టెడకే - పలువన్నెలు రప్పిస్తా స్వీకరించవమ్మా నన్నే స్వీకరించవమ్మా | రాణి ఎన్నో అందాలు నీకున్నా- అహంకారివేనీవు అణకువ లేదు- మెలకువ లేదు బహుగర్వపోతువె నువ్వు న
. నీ అందాలు నాకొద్దుపోవే- నీడంబాలు చాలించుకోవే- మల్లెపువ్వు ఉఊల్లమునే పొంగించు - మల్లెపువ్వులం మీచల్లని పాన్చులపై - తేనె జల్లులం మత్తు మత్తు వాసనతో - మంత్రించే మల్లెలం స్వీకరించవమ్మా - మము స్వీకరించవమ్మా రాణ్ అందం చందం లేకున్నా = రంగుల పాంగులేకున్నా, మత్తు జల్లి చిత్తు చేయు- మదన వతులు మీరు- మరులు గొల్చి, మతిని చెరచు - మంత్రగత్తెలు మీరు. నా కొద్దునాకొద్దు మీరు - తగ్గించు కొండిక జోరు- మందారం, మందారాన్ని నేను - ముద్దుల మందారాన్ని నేను- పగడాల వంటి రేకుల ఉన్న - జగదేక సుందరి నేను నీ కొప్పుకే మెప్పు కూర్చే- ఒప్పుల కుప్పును నేను స్వీకరించవమ్మా - నన్నే స్వీకరించవమ్మా- రాణ్, ఎజ్జని మేనునీకున్నా - ఉత్తవెగ్రి దానివే నీవు ఎన్నో హంగులు నీకున్నా - చురుకుదనం గుండుసున్నా- వంకర టింకర రేకులతో - వంకీలు తిరిగిపోతావు- నీ అందాలు నాకొద్దుపోవే - నీ డంబాలు తగ్గించుకోవె! బంతిపువ్వు బంగారు వన్నెల - బంతిపువ్వును నేను రంగారు బిగువుల - రంగేళి రవ్వను అందాలు చూపించు = హుందాల విరబోణీని, స్వీకఠించవమ్మా - నన్నే స్వీకరించవమ్మా!
రాణ్ బంగారు రంగున్నా - నీకు బడాయి జాస్తేలే! హుందాలునీకున్నా - హుళ్లక్కినీ చలువ- బజారులో పెడికే - దిగజారునీ విలువ- నాకొద్దు నాకొద్దు నువ్వు - నీడంబాలు చాలించి తగ్గు- మొగిలిపువ్వు పసిడి వన్నెలతో పరిమళించు మొగిలిపువ్వును- సుగంధాలుచిందించే - ఒక ప్రబందాన్ని నేను నామోజుగొలిపే రేకులతో - మెగిలిజడనే వేసుకో స్వీకరించవమ్మా! నన్నే స్వీకరించవమ్మా- రాణ్ పరిమళాలు ఎనున్నా - పసిడి వనాల వన్నున్నా నీయింటి చుట్టూ ముళ్లపాదలె - నీ వంటికంతా ముళ్ల బరువె- నాగులతో చెలిమిచేసే - నంగనాచివే నువ్వు- నీచెలిమి నాకొద్దుపోవే- నీకలిమి నువ్వుంచుకోవె- గడ్డిపువ్వు (పల్లవి) -పేదనమ్మా! నిరుపేదనమ్మా వేదనేనా - వేదమమ్మా చరణం గుడ్డి గవ్వకు పనికిరాని - గడ్డి పువ్వును నేను తల్లీ! అందమేమిో లేకున్నా - అహంకారం నాకు లేదు- రంగులేమీ లేవు తల్లి - పొంగులేవీ లేవు తల్లీ పరిమళాలను చిందకున్నా - పవిత్రమైనది నా మన్త్ర బొడ్గరయ 6గంఛాలరై ॥/పెదనమ్మా॥ నో ఎం ౫ ఖా ౯ ల శం ఏ దేవత సేవకైనా- నోచుకోను నేను తల్లీ! వ జై నా దిక్కు మొక్కులేని - 'పేదరాలిని నేను తల్లీ! కే మతా
(2 ను నీ మక్కువను నాకు చూపి - నీమమతలు నాకు చూపి, స్వీకరించవమ్మా - నన్నే స్వీకరించవమ్మా ॥) పెదనమ్మా॥
రాణి (దయ వెల్లువగా ప్రవహించింది)
గడ్డి పువ్వువేగాని - చాల దొడ్డదానివే నువ్వు. !
అధికులమనే అహంకారులు అసలు గిట్టరు నాకు-
అందాలు కాదు - ఆభరణం - అణకువ వినయాలే నిజమైన ఆభరణం.
దిక్కు మొక్కు పేదల - అక్కున చేర్చుటనా ధ్యేయం-
స్వీకరింతునమ్మా- నిన్నే స్వీకరింతునమ్మా!!
(రాణి గడ్డి పువ్వుని స్వీకరించింది ఆదరంతో)
రాణి నిర్ణయం అన్ని పువ్వులకు నచ్చింది.
(అన్ని వువ్వులు సంతోషంతో) కోరస్
ఓహో |! రాణీ!
పేదల పాలిటి వాణీ!
నిజం నిజం! నిజం! నీవన్నది నిజం...
దిక్కు మొక్కులేని పేదల
అక్కున చేర్చుట అందరి ధ్యేయం!
- నిజం 1 నిజం! నీవన్నది నిజం
నీవన్నది నిజం
సూచన ఈ సంగీత నృత్య నాటిక అనేక ప్రదర్శనలు యివ్వబడి పలువురి మన్ననలు పొందింది అంతా ఆడపిల్లలే వేయాలి వాళ్ళకి ఏ పువ్వురంగు ఉంటే ఆ రంగు డ్రనసు (లంగా+ఓజీ) ఉండాలి. యిది లోగడ ఆకాశవాబి+ విజయవాడ (తారీఖు గుర్తులేదు) వేశారు. అభిరుచులున్నవాళ్లు ప్రదర్శస్తే సంతోషిస్తాను)
ఆాలాలాాాయోాాాాాలాాా మాన వచ్చిన భాత్రి (అక్షర చిత్రాలు) ఆకాశాన తిమిర దేవత తలపు నీడల్లో చిమ్మ చీకట్లో, చివుకుముసలిలా కూర్చుని మేఘాల చేకుముకి రాళ్లతో కొడుతూ నిప్పు రాజేస్తూన్నాడు. నిలకడ లేని నీటి దేవుడు. 2 జిలుగంచుపైటంచు జిగేల్ మనేలా మెరపు జవ్వని మెలితిరిగి నర్తిస్తూంటే, తప్పత్రాగిన గాలి దేవుడు ఈలవేస్తూ తూలుతూ తప్పట్లు చరుస్తూ, దరవు వేస్తున్నాడు తన్మయత్వంలో 3 నీలి బల్బునిట్టూర్పులు క్రమ్మిన వెచ్చటి గదిలో ప్రయత్వమస్తన్యం నడుము ముఖం, కూర్చుకున్న ఓ మరుడు సైడు కాల్వ సంగీతంతో, ప్రక్క మడుగు మాండు కరాగంకరిసి మతిపోయేలా తికమకపెడుతూ తీయనికలల్ని తినివేస్తూంటే కసి తీరేలా కటికితిట్లు తెట్టేస్తున్నాడు 7. భూదేవి తొడిగిన రవికటద్దాల లాంటి నీలపునీటి గుంటల్లో మేఘంతిని వేస్తూన్న మొరికి చంద్రుడు ముఖం చూచుకుని, సిగ్గుతో మబ్బుచాటున (మ్రగ్గే తరుణంలో నలిగి మాగిన మొగిలి జడ ఊపిరి తీపితో నిండిన గదిలో “మదిర” గ్రోలి మత్తెక్కిన ఓ మదనుని చక్తువుల్లో ఇక్షుర సంచిండుతోంది ర్ గుడి కప్పులు పడికార్చే కన్నీటి కల్మషంతో ఆభ్యంజనం ఆచరిస్తూ పుడిసెడు దీపపు చెమ్మాలో కొడిగట్టే తడి వత్తిని తగు మాత్రం ఎగవత్తుతు తను మాత్రం తంటాలు పడుతూన్నది- ఊరిపాలిమేర గ్రామదేవత- ఖైదు చేసిన ఆ రాతి దేవత!
ఆ కవి కవిత్వం - స్వార్ధపు కవిత్వమా? (ఇది ఒక బిచ్చగాని కవిత - అతని జోలెలో నుంచి జూరిపడెతే తీసి చదివాను-
మరూ చదవండి మరి)
ఎందుకు రాస్తారు?
యిక
మీరెందుకు కోస్తారు?
అస్థి పంజరాల మని అడుకునే వాళ్లమని
సందుల్లో పందుల మని, గొందుల్లో కుక్కలమని
మాకెన్నో పేర్లు పెట్టి, మీరెన్నోసార్లు దెప్పి
అక్షరాలో బందిస్తారే? పుస్తకాల్లో కెక్కిస్తారేణ
మోకేదో ఉద్రేకం ఉందని మోకేదో ఉద్దశ్యం ఉందని
మాపై నెందుకు రాస్తారు?మాపై నెందుకు కోస్తారు.
మీ కలల్లో కనిపించిన మో కలాల్లోకి ఎక్కివచ్చిన
మీ ఊహాప్రేయసులు - మీరూహించిన ప్రకృతులు
మిమ్మల్ని వదిలేసాయా మిమ్మల్ని విదిలించాయా
యిప్పుడు మా జీవితాల్ని చప్పటి మా జీవితాల్ని
వల్లించి, “వర్షించి, వర్షించి, వల్లించి
మీ మహాోద్దేశ్యాలకు , మీ మనోద్రేకాలకు
పనికొచ్చే వస్తువుగా, పనిచేసే వస్తువుగా
అక్షరాలలో బందిస్తూ, పుస్తకాల్లో కక్కిస్తూ,
కరువులేని మా జీవితాన్ని, పరువులేని మా జీవితాన్ని
ఎందుకు చాటుతారు? ఎందుకు ఏకుతారు?
మీరు చిత్రించిన మా జీవితాల్ని కల్పిన ఆ జీవితాల్ని,
విన్నవాళ్లు కన్న వాళ్లూ కన్నవాళ్లు, విన్నవాళ్లు
కంటతడిని పెడతెరనా? కడుపుకింత పెడతారనా?
పాండా మీ కవితాశక్తుల్ని, మీ కలం సూక్తుల్ని, మెచ్చుకుంటారు - పైగా వెలయిచ్చి కొంటారు- మీ ఆకలి కవిత్వాన్ని తిని ఆరగించుకుందామన్నా మాకు అది కొరకు పడుతుందా? లభ్యమవుతుందా? మీరా కవి కవిత్వం రాస్తే మీకు అందె వేస్తుంది లోకం అందువల్ల మా కెం లాభం, అందువల్ల మాకేం భోగం? అయితే ఎందుకు రాస్తారు - యిక ఎందుకు కోస్తారు? అస్థి పంజరాల మని - అడుక్కునే వాళ్లమని సందుల్లో పందుల మని, గొందుల్లో కుక్కలమని మాకెన్నో పేర్లు పెట్టి - మీరెన్నో సార్లు దెప్పి పుస్తకాల్లో కెక్కిస్తార? అక్షరాల్లో బందిస్తారే?
- 22-8-54
నవ్య కవితా చక్రవర్తికి అశ్రుతర్పణం ఓ కవితా చక్రవర్తీ, నీవు నవ్య భావ కవితా సామ్రాట్టువు. నవ్య సాహితీ దేవళంలో మూలవిరాట్టువు. ఇట నవ్య కవితాలోకాన ఒక కవితా మార్తాండుని అస్తమయం, అటు సాహితీ గగనాన మరో ద్రుపతారలా ఒక సముజ్వల కవితా సూర్యో దయం జరిగింది “ఊర్వశి నీ హృదయ విపించి విరాటినప్పుడు తెలుగు కవితా కన్య లలిత చరిత నటలయల హోయలు చిలికింది నీవు “కృష్ణ పక్షంలో” “శుక్ల పక్షం విరియించినపుడు ఆంధ్ర కవితామ తల్లికి వెన్నెల పందిరి వెలసింది నీ ప్రతిపాటలో ఒక దివ్యనాదం ఉంది నిజానికి ఒక్కనాదమే కాదని, ఒక దివ్య భావనా వేదం నీ ప్రతి అక్షరంలో ఇక్షురసం వహిస్తోంది ప్రతి భావనాశబలత లో ఒక రంగుల చిత్రం విరుస్తుంది. ఎనఖై వసంతాలు పైగా చూచి ఎన్నో సాహితీ పూలను పూయించి పువ్వులో పువ్వువైనావు - ఆకులో ఆకువైనావు- నీకమ్మని గొంతు మూగబోయిన, నీ గుండెనుమీటినావు- నీ ఎదకిన్నెరవళిలో - ఎన్నో వెన్నెల పాటలు పాడినావు ఏదీ అ ఎదకిన్నెర? మరి లేదా ఆ వెన్నెల నేమిగిల్బి ఆ ఓర్వలేని భగవంతుడు మాకు కృష్ణ పక్ష మేమిగిల్చి ఒక వ్యక్తిగా , ఒక తెలుగు సాహితీ వేత్తగా, మీదు మిక్కిలి నేనర్పించిన ఈ నాకవిత నేను మలిచిందికాదు) నాలోని ప్రతీ అణువు, ఆజ్రోశిస్తూ, సదేపదే పలికిన భావం - అది నీపై గల పూజ్యానుభావం- అంతకన్నా నా యదలో ఏముందని? యింత లేసి నాకన్నులు రాల్చే దేముందని? ఎన్నెన్నో కన్నీటి బొట్టు- అవన్నీ నీ అమర నవ్యసాహితీ చరణాలకు వేనర్చించే పన్నీటి బొట్టు- (ఈశే+ శ్రీదేవులవల్లి కృష్ణళాస్రీకి ఆయన శ్రద్ధాంజులి కార్య క్రమంలో నోనర్పించిన ఆశ్రతర్చణం)
మభు యామిని నీలాకాశపు నీడ క్రింద ఈనిశీదం పునీత పాగల కరిగిన కలలా కలసి కలసి "పెనవేసుకు మెలి చేసుకుపోతే = అదె యామిని యద పొంగే మధుయామిని నీ తల హేమంత శిశిర నిసిత ప్రశాంత శాంత కుసుమవనీ వనసీమల సుమసౌరభ సుధ వాహిని = అదె యామిని యద పొంగే మధుయామిని కడలి అలలపై కరిగి ఏటి మలుపుతో విరిగి తరగతరగతో, తిరిగి సిరివెన్నెల రుచిచిందే = అదె యామిని యద పొంగే నుధుయామిని దూరదూర తీరాలలో తారాడే చలి చీకటి నులివెచ్చటి బిగి కౌగిట పడి వారిగే, సుడి తిరిగేదే _ అదె యామిని యద పొంగే మధుయామిని నీలాకాశపు నీడ క్రింద ఈ నిశీదంపు నీలి పాగల కరిగిన కలలా కలసి కలసి పెనవేసుకు మెలివేసుపోతే = అదె యామిని యద పొంగే మధుయామిని
అతడు=-ఆమె అతడు ఈ పండు వెన్నెల పందిట్లో ఈ పడతి వన్నెల కౌగిట్లో స్వర్గమేదో ఉందంటా చూచి వద్దాంరమ్మంటా అమె జాజి పందిరి నీడల్లో ఆ మోజు గొలిపే జాడల్లో పరువమేదో పరచిందంటా. పరుగు పరుగన పదమంటూ అతడు బుసలు గొట్టే వయస్సునాది కసిరి కొట్టే సాగసునీది రెండు కలపి రేయి పగలుగ అంటుకుందాం జంట గుందాం ఆమె నా కన్ని సొగసు కానుకెడతా నీ వన్నె మొసం తోడు పెడతావా ఈ చిన్న దుంటే వెన్నిలెందుకురా నా కన్నె వయసే నీండు పున్నమిరా
ఎందుకో
ఎందుకో నాకీ కలలు ఎందుకో నాకీ అలలు
ఇంధ్ర ఛాపమువిచ్చి
ఇన్ని రంగులు విరిసె
చంద్ర దీపం వెలిగి
పసిడిచ్చాయలు వచ్చె నయనాలు పలికినవి అనురాగ సుధలెన్నో ఆధరాలు సలికినవి మధురాల కధలెన్నో
నా నింగిబెడదలో
థి భంగిమున్నదో
ఈ నీలి పాగలలో
ఏ జాల మున్నదో మరుల విరులకు తావి మగత నిదురలు రేప కలలు మెలికలలోన అలలు గలగల నవ్వు-
-ఎందుకో నాకీ కలలు
ఎందుకో నాకీ అలలు
ఓ దివ్య స్వప్నమా! ఓ మధుర స్వస్నమా ఈ కమ్మని రేయిలోన కరగిపో నామదిలోన- కలువ పువ్వుల ఓడలోన కాంతి దేవత నీడలా కమ్మ తెమ్మెర తరగతో సుడులు తిరిగే కడలిలా పసిడి మొయిలు మెరిసినట్లు వాన విల్లు కరిగినట్లు ఆ పొంగిన రంగుటలలు నా యదలోనే నిలచునటుల నీలా కాశవు నీడలోన నీలి నీలి వెన్నెల లోన సొమ్మసిల్లె సోలునటుల - మరి సోగకన్నులు విరియునటుల ఇక్షురసమును చిందించు ఒక దివ్యచక్షువు వోలె దివి నుండి దిగజారు జలతారు జలపాతమై- ఓ దివ్య స్వప్ప్నమా। ఓ మధుర స్వప్నమా! ఈ కమ్మని రేయిలోన కరిగి పో నా మదిలోన-
వీధి దీపం.:సలదేశం
అదిగోః అల్లట,, అ.;పడుచున్నది. ఒంటి స్తంభపు అద్దాల మేడలోన అలిగి కూర్చున్న అందాల రాణిలా మా సందు మలుపున ఒక వీధి దీపం
దొంగల దొరల తేడా తెైలియదు-
ధనికుల బీదల భేదం తెలియదు
అందరి పైతన, నవ్వుల వెలుగును
చిందిస్తూండును చిలిపి చిలిపిగా నడి రూమైనా నదరదు బెదరదు లొంగదు గాలి ఈల పాటలకు చీకటిదెయ్యపు చేతుల కందక దవుదవ్వుల నుంచే దర్శన మొసగును
దారులు, గీరులు, నూతులు, గోతులు
ఏ వైనా అది ఎంచి చూపును
చూపు చుండునది వెలుగు బాటలు నన్ను చూచి నేర్చుకోండి, నాలాగే మీరు కండి- నన్ను నేను కాల్చుకుంట, వెలుగుబాట నడిపింతును స్వార్ధత్యాగం చేసుకు, సాగిపొండి మున్ముందు కనుచు సందేశమ్మిచ్చుచుండు అదిగో, ఆ వీధి దీపం
ఎన్నో చుక్కలు చుక్కలు చుక్కలు ఎక్కడ చూచిన ఎంతో చక్కని చక్కని చుక్కలు అమావాన్య చీకట్లోన విచ్చుకున్న నీలి గొడుగున పచ్చల కుచ్చులు పాదిగినట్లు అవి గవిగో ఎన్నో చుక్కలు. మా పాప అలిగితే కన్నీటి చుక్కలు పూతేనె ఒలికితే పన్నీటి చుక్కలు మా బాబు బువ్వతో సిరినేతి చుక్కలు మేఘాలు కరిగితే మరినీటి చుక్కలు రంగేళి ముగ్గుల్లో రతనాల చుక్కలు చెల్లాయి గౌనుపై పగడంపు చుక్కలు మా అమ్మకోకపై మందార చుక్కలు నా ముద్దు నొసటి పై తిలకంపు చుక్కలు చుక్కలు చుక్కలు ఎక్కడ చూచిన ఎంతో చక్కని చుక్కని, చుక్కలు
నిలచి పాడుచున్నది ఎవరు? ఈ మొగిలి పొదలలో ఈ నీలి పాగలలో ఎగిసి పిలుచుచున్నది ఎవరు? నిలచి పాడుచున్నది ఎవరు? సిరివెన్నెల తలపులోన విరిసిన మరుమల్లెలట్లు మలయమారుతపుటకు అలసిని ఎద పలకునట్లు తరుణవసంత సుమశోభ తెరలు తెరచి మురియునట్లు చివురుటాకు తల్పమ్మున కెంపులిరులు నవ్వునట్లు- ఒక సుందరమనోమందిరమున దివ్యకాంతులేవో వెలయునట్లు ఆ కాంతి పుంజముల భ్రమణమ్మున చిత్రాచ్భ్చాయలేవో తిరుగునట్లు మందార మోవితో మంతనమ్మాడు మృదు మంజులదర హాసమధురమట్లు సుధాలోకవాసిని, సోగకన్నుల వెలయు ముగ్ద మోహనం సౌందర్య స్వర్ణ కిరణమట్లు-
మానవత సిరి మల్లెలా విరియాలని మరి చల్లదనం కురియాలని పదే పదే కోరుకో 'పై అంచుకు చేరుకో- పచ్చని వెన్నెల నీవైతే వన్నెలు విచ్చును నీలోనే నింగిలా పొంగులేక నీవుంటే నిండు దనం చిలచి పోవు నీలోనే చీకటి కోణాలు పోవ చిజు దీపం 'ఒకటి చాలు ద్వేషం ప్రాణాలు తీయ దరహాసం ఒకటి చాలు మమతలొనే ఉన్నది, సమత సమతలో దాగున్నది మమత నుతాలొద్దు - గతాలొద్దు లేనిపోని హద్దు లొద్దు- ఎద నిండుగ సుధలు నింపి ఎదగి చూడు - వెదకి చూడు అనురాగ సృటంచులలో అగుపించును మానవత సిరిమల్లెలా విరియాలని మరి చల్లదనం కురియాల,.. పదే పదే కోరుకో పై అంచుకు చేరుకో
ాాాయాాాాలాోా ఈ మభుర వాసంత హేల ఈ మధుర వాసంతహేల ఎంత శోభ ఎంత శోభ విరి కన్నెల వన్నెలు విరిసినట్లు తెలివెన్నెిల పూవులు పూసినట్లు పగడపు పెదవుల సిరివిచ్చినట్లు పరువపు మెరికలు ఎదకదలినట్లు -చివురు చివురునా మణిదీపం గుబురు, గుబురు ఆమని రూపం ఈ మధుర వాసంత హేల ఎంత కోభ, ఎంత శోభ కన్నె తరువుల జడల నిండా ఎన్నెని పూలు వన కిన్నెరుల జడల నిండా ఎన్నెని మణులు సిరిపచ్చలు పొదిగిన ఈ పచ్చదనం పరువం నిండిన ఎదకేదో వెచ్చదనం ఈ మధుర వాసంత హేల ఎంత శోభు ఎంత-శోభ ఓ రంగుటలల సుందర స్పప్ప్షంలా ఈ రంగు రంగుల హంగులేమిటో మత్తెక్కిన మదనుని మధురహాసంలా ఈ మధుర భావనోర్మికా మధుమాసం మ్మెందుకో- చివురు చివురునా మణిదీపం గుబురు, గుబురు ఆమని రూపం ఈ మధుర వానంత హేల ఎంత శోభు ఎంత శోభ 8173
పొణతు మెలికలు
ఆమె కనుల నింగిలో ఒక మెర్గపు మెరిసిన నా గుండె లోపల ఈ ఊరుములెందుకో?
నా గుండెలోతున
వాయుగుండం రేగినప్పుడు
మరి ఆమె కనులకు
ఆ మునురు లెందుకో ఆమె మరులతోటలో సిరిమల్లెల్లు విరిసినపుడు మరి ఆతారలెందుకు నన్ను తట్టిలేపును....
అమె శశివదనమందున
బింబమెక్కటి ముదముగొలిపిన
మరినా తిమిరసదనంలో
వెన్నెలెందుకు కురియు చుండును- ఆమె పిలుపుకు రాగ మేదో తెరలు తెరలుగ అలరినప్పుడు ఈ పాడు మెలికలు...?
= 19-2-76 ఇ
వెన్నెల కలలు కను పాపలలో నిన్ను దాచి కనుకొాలకులలో మిన్ను నింపి వన్నె వన్నెకలలెన్నో కంటున్నా కాచి కాచి కథలెన్నో కడుతున్నా లేత వెన్నెలొచ్చినా ఏ పూలు కనులు విచ్చినా నీ వదనం నీ సదనం పద పదాన అగుపించును ఏ గాలి ఈల వేసినా' ఏతోట చిగురు తొడిగినా నీ పరువం, నీగరువం నిగనిగలై అగుపించును జలజలమని రుడివాన కురిసినా గలగలమని సేలవిరు పాడినా నీ నవ్వులె- అమువ్వలె కిలకిల మని రవళించును విరిసిన కలలు వచ్చినా గిరగిరమని అలలు రేగినా నీ తలపులె - నీ వలవులె క్షణ క్షణాన మురిపించును. కను పాపలలోన నిన్ను దాచి కను కొలకులలో మిన్ను నింపి వన్నె వన్నెల కల లెన్నో కంటున్నా కాచికాచి కధలెన్నో కడుతున్నా 7-2-76
ఓ ప్రియా! నూరు యుగాల నుంచి నువ్వు తెలుసు. వేరుగా నీ మధుర గాథలూ తెలుసు. నీరి తారక మిసిమి వెలుగులో నువ్వు మిసరిన బాట తెలుసును నింగి నీలపు లోతుటరమున నువ్వు పొడిన పాట తెలుసును. -అవుడు (్రేమించానులే నిన్ను యిప్పుడు మళ్లీ మమతగాన్నాను అవని భారము హృదిని ఎత్తుకు కనుల కొలికిలో కడలి నిలువగ ఎదురు చూచిన ప్రతిక్షణమ్మును విశదమవ్వని వియత్తలమున మమత తీరని మరుల నుడిలో అంది అందని అనుగుకోర్కెతో -అపుడు (ప్రేమించానులే నిన్ను యిప్పుడు మళ్లీ మమతగొన్నాను ఎదను మంటలు రగులు కొలుపుకు తిమిర లోకపు తలుపు తెరచుకు తలపు దివ్వెల పసిడి వెలుగులో కలమొలకలు మదిని నాటకు గండశిలతో కడలిచిలికిన నురుగుతరగవై కరిగిపోవుచు
-అపుడు ఢ్రేుమించానులే నిన్ను యిప్పుడు మళ్లీ మమతగొన్నాను యుగయుగాల నీ యోగ నిద్రలో మరుపురాని వని నీ మరుల ముద్రలు తుహిన పాతపు, వహ్షిఘాతపు జ్వాలా జ్వరిత కృత జడల ప్రకృతి కాగిలింతకు తున్తునకనైతిని తునకతునకను అతుకు కుంటెనె -అపుడు గ్రేమించానులే నిన్ను యిప్పుడు మళ్లీ మమతగొన్నాను ఓ ప్రియా! నూరు యుగాల నుంచీ నువ్వు తెలుసు నేరుగానీ మధురగాఖలూ తెలుసు నరితారక మిసిమి వెలుగులో నువ్వు మనందిన బాట తెలుసును. నింగినీలపు లోతు టురమున నువ్వు పాడిన పాట తెలునును. = 21-6-67
ఆశావేదన ఓ ప్రభూ! నా కనుపాపలలోన దాచుకొంటిని నిన్ను చూడు-మిటుచూడు- చూడు నాకనులలోనికి అందునీ రూపమెకందువు- నిజమ్ము చూడు - నిజమ్ము ఎండిన నా ఎదపై వ్రాలి వినుము నీ చెవియెగ్గి నిత్యము నీ కథలె గాన మాలపించుచు నిదురపోదక్షణమ్ము- నిజమ్మది - నిజమ్ము- నీ కరుణ కిరణములు సోకినా కనుల తడితో నీవు చిత్రించిన, నా చెక్కిలిపై వర్ణచిత్రాల తడి యింకను ఆరిపోలేదులే - ఆరిపోదు. లేవెన్నైల నిశరాత్రి శశి మంచుపాగలు చింది. నీరి పొగల అలలసుడులలో చిక్కి సొక్కి శిథిల జీర్ణశిలా ప్రతిమనైతొ ప్రభూ-చూడు! మొన్న వేకువ మేల్కొన్న నా కన్నులు మిన్నులను వెదకు చున్నది నిన్ను వీడి సాక్కిన నా ఎడంద రాలేదు రయమ్మున, నీవె పరుగు పరుగును రమ్మురా ప్రభూ ఈ మరుల నురుగులు నీ ఎదపై కరుగనిమ్ము నా కన్నులపడి -ఒక్క తరారి కలలైనను కాంతును నీరూపము కనులు మూసి నేను కాంచికాంచినీ శుభచరణమ్ముల మల జలకణమ్ములై జాలువరెదరమ్ము ప్రభూ॥। = 29-11-67
(ఇది ఒక బుజ్జి పాపకు కలిగిన సందేహం - వాళ్ల అమ్మను ఇలా అడుగుతుంది) యింత చక్కని పూలు యిన్ని రంగుల పూలు ఎవరు సృష్టించారమ్మ ఎవరు రప్పించారమ్మ ఏలోకమును చూచి ఈలోకమే తెంచి సాయగమ్ములు చిందు చేయ కనులకకు విందు ఆకు చాటున మణిగి అమ్మ వొడి దిగిరావు ఏ అట పాటలు లేక అవి ఏట్లో గడుపునే? నేను ముస్తాబైతినా పూరెమ్మనంటుంటావు మరి ఆ పూరెమ్ముకవరమ్మ ఆ పువ్వులను తురిమేది? నేను పూరెమ్మ నొకనాడు మీ ఊరేమిటన్నాను, ఏ ఉలుకు పలుకునే లేక నా ఒడినింపె వొయ్యారముగ. యింత చక్కని పూలు యిన్ని రంగుల పూలు ఎవరు సృష్టించారమ్మ ఎవరు రప్పించారమ్మ
మా విజయవాణ మా విజయవాడ కర్థం ఆంధ్రత్వానికి అద్ధం. తెనంగునుతనం కొంగున ముడివేసుకున్న పడుచుయిది. వసుందర వేణీభరంలో ముడిచిన ఒక సుందర “శ్రీనగర"మ్మిది ముపొద్దులా రైలుబళ్లు ముచ్చటలాడే రైళ్ళరచ్చబండ- ప్రతి నిత్యం పచార్లు కొచ్చిన భారతదేశం కనిపిస్తుందిక్కడ రవ్వల వడ్డాణంలో రైలు బ్రిడ్జి అమరింది కృష్ణమ్మకు- కృష్ణాబ్యారేజీ సై ఎప్పుడు మ్యూరేజి సందడే సందడి. వైలు బళ్ళకన్నా లారీలు రణం చేస్తుంటాయి ఎప్పుడూ వేయి కరముల రేనికిది వేసవిరాజధాని; అందుకనే రోడ్డుపై నాల మీద రొట్టెలు కాలుస్తుంటాయి ఎండ కన్నెలు. వెండి జరీ పట్టుకోక గట్టి పట్టణం చుట్టోస్తుంటుంది. పచారు కొచ్చిన మిట్ట మధ్యాహ్ననపు పట్టమహిషి అతిధుల దాహం తీర్చి తీర్చి అతి నాజూగ్గా తయారవుతుంది వేసవిలో తన్వి కృష్ణవేణి. కనకదుర్గమ్మ కనులెగ్రజేస్తుందని కాబోలు. అంత కృష్ణమ్మ హద్దు మీరి రాదు ఊరి సరిహద్దు దాటి ఊరూరా విందు తెలుగు వారి వీనుల విందు చేద్దామని ఇక్కడే కూర్చుని ఎక్కడికెక్కడికో నేరుగా అచ్చ తెనుగు తేనెలుచిందిస్తుంది తెను ఆకాశవాణి కాళేశ్వరుని కాలాబజారుకు చాలా విలువే వుంది మరి- సిమెంటు పొడరద్ది-సినిమాతారలా సింగారించుకుని గవర్నరుపేట సెంటరులో గస్తీ తిరుగుతూంటుంది ముస్తాబైన బస్తీ ముద్దు ముద్దుగా మునిమాపులో- అందుకే విజయుడు వేంచేసిన వాడ. మా విజయవాడ వాడని విజయమాల - ఇది మా అచ్చతెలుగు - విజయవాడ మా విజయవాడకు అర్థం-ఆంధ్రత్వానికి అద్ధం తెలుగు తనం కొంగున ముడివేసుకున్న నాజుకు పడుతుంది. వసుందర వేణీభరంలో ముడిచిన ఒక సుందర “శ్రీనగరమ్మిది. - 30-11-67
నీడల సీడలు పండు పండిన అబద్దంతో పచ్చి నిజం కలిస్తే పడుతుంది కాఠిన్యపు కాగిలింతలలో కారుణ్యంతల వాల్చేసింది _ ఈ ఏటి పరుగు పందెంలో సూర్యుణ్ని కసిగా కట్టేస్తూంది కాలం కాలాన్ని నుసిగా కాల్చేస్తుంది కాఠిణఖ్యం అందుకని- మరచెడిన భూగోళం నుంచి శూన్యంలోకి చూస్తు ఉంటే చుక్కల్లే మినుక్కు మంటుంది చిక్కని నిజం కలస్న అబద్దం. వదలు వదలుగా ఉన్నకారుణ్యపు మరబిగిస్తే మళ్లీ రాదనుకునే భయం మనల్ని పీడిస్తుంది. అర్ధరాత్రి ఆరిపోయిన చంద్రబింబంలో కొడగట్టినను సితాలుక్కు పాగల్‌లో నుంచి కనిపిస్తూ ఉంది కలల్లో కల్గ్లోలం- రోజూ పరుగులు తీసే సూరీడికి అతిగా దాహం వేస్తుందని సముద్రాన్ని దోసిట్లో యిమిడి గుట్టుగా గుటకేస్తున్నాడు కసిగా అందుకేనేమో పండు పండిన అబద్దంతో పచ్చిని కుస్తీ పడుతుంది కారిన్యపు కౌగిలింతలలో కారుణ్యం తల వాల్చేసింది. = 27-10-65
ట్ వలపు కద్దము కలత నిదురలు తలపు కద్దము మూగ బాసలు మనిషికద్దము మనిషి చేష్టలు మమత కద్దము మానవత్వము ఆంక్ష కద్దము అభినివేశము కాంక్ష కద్దము హృదయ వేగము. ఆశకద్దముమోహపాశము వెళతలకద్దము అలకమెలకలు వయసు కద్దము తలపు మొలకలు సొగసు కద్దము సోగకన్నులు. వసుధ కద్దము నింగి నీలము నింగి కద్దము వసుద హరితము.
- 26-11-68
నా చెలి! నీటుగా నా చెరపాడవే గోటుగా నెమ్మిటె ఆడవే ఆటతో పాడునే నామది. పాములాగాడెనె నీ జడ పడగలా లేచెనే పయ్యదా పరవసించేనుదే నా ఎదా అందెలోమోగెనే హాయిగా ఆలపించావులే నీ కథా ఆలకించానులే ఆ కథా మోహమో స్నేహమోకోపమో మోజులో దాహమో తాపమో సరసమో విరసమో తేల్చవేసూటిగా. న గలంధాల లోక్ ఫక్ య సరంం” జ్ 13953 త చే 4 షు సు న ఖ్ హైద “బాడ్ వటి రీ చూ వెన్నెల వాడకురండి
జీవితసంగ్రహం
భద్రాచలం తాలూకా, శబరి, గోదావరి సంగమస్థానమైన, కూనవరం నా పుట్టిన స్థలం. నా జనన తేదీ 28-4-1934. తెలుగు సాహిత్యంలో | ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ.డిగ్రీ తీసుకున్నాను. వృత్తి ||. కొత్తగూడెం “శ్రీరామచంద్ర హైస్కూలులో సీనియర్ తెలుగు పండిట్‌గా పనిచేసి రిటైర్ అయినాను. నా సాహితీ కృషి, భారతి, ఆంధ్రపత్రిక, జ్యోతి, ప్రభ, స్రవంతి, మొదలయిన పత్రికలలో నూట ఏబైకి పైగా, కవితలు, కథలు సంగీత రూపకాలు, నాటికలు ప్రచురింపబడ్డాయి. ఆకాశవాణి కొత్తగూడెం, విజయవాడ రేడియో కేంద్రం నుండి అనేక కవితలు, కధానికలు, సంగీత రూపకాలు, నాటికిలు, ప్రసారం చేయబడ్డాయ:-అనేక---... కవితా గోష్టులలో' సాహితీ సదస్సులలో పాల్గొన్నాను. చిత్రలేఖనం లో ప్రవేశం ఉంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి, సి. నారాయణరెడ్డి గార్ల రచనలంటే . అభిమానం. న అటా...